sloka
stringlengths
77
449
verse
int64
1
78
chapter
int64
1
18
audio
stringlengths
59
63
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి । తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ।। 21 ।।
21
7
https://www.holy-bhagava…udio/007_021.mp3
యః యః — ఎవరెవరైతే; యాం యాం — ఏ ఏ; తనుం — రూపంలో; భక్తః — భక్తుడు; శ్రద్ధయా — విశ్వాసముతో; అర్చితుం — పూజించాలని; ఇచ్ఛతి — కోరుకుంటారో; తస్య తస్య — వానికి; అచలాం — దృఢమైన; శ్రద్ధాం — నమ్మకం; తాం — దానిలో; ఏవ — ఖచ్చితంగా; విదధామి — అనుగ్రహించెదను; అహం — నేను.
BG 7.21: భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను.
పరమేశ్వరుడి ఆరాధన యందు విశ్వాసం అనేది మనకు అత్యంత ప్రయోజనకరమైన విశ్వాసం, అది నిజమైన జ్ఞానం ద్వారానే లభిస్తుంది. కానీ, ప్రపంచంలో మన చుట్టూ చూసుకుంటే, దేవతలను ఆరాధించే అసంఖ్యాకమైన భక్తులు కూడా కనబడుతుంటారు, వీరు తమ భక్తిలో దృఢమైన మరియు నిస్సంకోచమైన విశ్వాసంతో ఉంటారు. వీరందరూ నిమ్న స్థాయి ఆరాధనపై ఇంత గట్టి నమ్మకం ఎలా పెంపొందించుకున్నారు అని, మనం అనుకోవచ్చు. శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చూపిస్తున్నాడు. దేవతలపై విశ్వాసం కూడా తానే కలిగిస్తున్నాడు అని అంటున్నాడు. జనులు భౌతిక ప్రాపంచిక కోరికలను నెరవేర్చుకోవటానికి దేవతల ఆరాధన చేయటం చూసినప్పుడు, ఆయనే వారి విశ్వాసాన్ని బలపరిచి వారి భక్తిలో సహాయపడుతాడు. దేవతలకు తమంతతామే భక్తులలో తమపట్ల విశ్వాసం పెంచే సామర్థ్యం లేదు. జనులలోనే స్థితమై ఉన్న పరమాత్మయే వారిలో శ్రద్ధని ప్రేరేపిస్తాడు. 15.15వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు, ‘నేను సర్వ భూతముల హృదయములలో స్థితుడనై ఉన్నాను, నా నుండే జ్ఞాపక శక్తి, విజ్ఞానము, మరియు విస్మృతి వస్తాయి.’ పరమేశ్వరుడైన భగవంతుడు, దేవతల మీద శ్రద్ధని ఎందుకు కలుగ చేస్తాడు, ఆ శ్రద్ధ సరియైనది కాదు కదా, అని ఎవరైనా అడుగవచ్చు. ఇది ఎలాంటిదంటే, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆట బొమ్మలపై, అవే నిజమైన పాపాయిలు అన్నట్టుగా, ప్రేమ చూపించటాన్ని అనుమతిస్తారు. బొమ్మలపై ఉన్న తమ పిల్లల వాత్సల్యం, నిజానికి అమాయకత్వం అని తల్లిదండ్రులకి తెలుసు, అయినా సరే, బొమ్మలపై ప్రేమ చూపిస్తూ ఆడుకోవటానికి వారికి అనుమతిస్తారు. ఇది ఎందుకంటే, ఇలా చేయటం వలన పిల్లలకి కరుణ, వాత్సల్యం, ప్రేమించటం వంటి గుణాలు పెంపొందుతాయి, అవి వారికి పెద్దయ్యాక ఉపయోగపడతాయని, తల్లి తండ్రులకి తెలుసు. అదే విధంగా, జీవాత్మలు, భౌతిక వస్తు సంపద కోసం దేవతారాధన చేసినప్పుడు, ఈ అనుభవం వారి ఆత్మ ఉద్ధరణకు మున్ముందు ఉపయోగపడుతుందనే ఆశతో, భగవంతుడే వారి శ్రద్ధ/విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఆ తరువాత, ఏదో ఒక రోజు జీవాత్మ, భగవంతుడే పరమపురుషార్థము అని తెలుసుకుని ఆ పరమేశ్వరునికి శరణాగతి చేస్తుంది.
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే । లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ ।। 22 ।।
22
7
https://www.holy-bhagava…udio/007_022.mp3
స — అతడు; తయా — ఆ యొక్క; శ్రద్ధయా — శ్రద్ధతో; యుక్తః — అనుగ్రహింపబడి; తస్య — వారి యొక్క; ఆరాధనమ్ — ఆరాధన; ఈహతే — నిమగ్నమవ్వటానికి ప్రయత్నిస్తూ; లభతే — పొందును; చ — మరియు; తతః — దాని నుండి; కామాన్ — కోరికలు; మయా — నా చేత; ఏవ — మాత్రమే; విహితాన్ — అనుగ్రహింపబడి; హి — ఖచ్చితముగా; తాన్ — అవి.
BG 7.22: శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ, నిజానికి ఆ ప్రయోజనాలని సమకూర్చి పెట్టేది నేనే.
లభతే అంటే ‘వారు పొందెదరు’ అని. దేవతల యొక్క భక్తులు, వారు కోరుకున్న వాటిని ఆయా దేవతల ఆరాధనతో, పొందుతారు; కానీ నిజానికి వాటిని ప్రసాదించేది భగవంతుడే, దేవతలు కాదు. భౌతిక ప్రయోజనాలను సమకూర్చి పెట్టే అధికారం దేవతలకు లేదు అని, భగవంతుడు అనుమతించినప్పుడే, వాటిని దేవతలు ఆయా భక్తులకు అనుగ్రహిస్తారు అని ఈ శ్లోకం స్పష్టంగా చెపుతున్నది. కానీ, మిడిమిడి జ్ఞానంతో ఉన్న జనులు వారు ఆరాధించే దేవతల ద్వారానే ఇవి వస్తున్నాయి అని అనుకుంటారు.
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ । దేవాన్దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ।। 23 ।।
23
7
https://www.holy-bhagava…udio/007_023.mp3
అంత-వత్ — నశించిపొయెడి; తు — కానీ; ఫలం — ఫలము; తేషాం — వారిచే; తత్ — అది; భవతి — ఉండును; అల్ప-మేధాసాం — తెలివి తక్కువ వారు; దేవాన్ — దేవతల వద్దకు; దేవ-యజః — దేవతలను ఆరాధించేవారు; యాంతి — వెళ్లెదరు; మత్ — నా యొక్క; భక్తాః — భక్తులు; యాంతి — వెళ్లెదరు; మాం — నా దగ్గరకు; అపి — కానీ.
BG 7.23: కానీ ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు, అదే సమయంలో, నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు.
ప్రాథమిక పాఠశాల అవసరమే, కానీ, విద్యార్థులు దానిని ఏదో ఒక రోజు మించి పోవాలి. ఒకవేళ ఏదేని విద్యార్థి ప్రాథమిక పాఠశాలలో అవసరానికి మించి ఉండ తలచితే, టీచర్ దానిని హర్షించదు, అంతేకాక ఆ విద్యార్థికి జీవితంలో ముందుకెళ్ళటానికి శిక్షణ ఇస్తుంది. అదే విధంగా, దేవతలను ఆరాధించదలిచే ప్రారంభ దశలో ఉన్న భక్తుల యొక్క విశ్వాసాన్ని, 7.21వ శ్లోకం లో చెప్పినట్టు, శ్రీ కృష్ణుడు బలపరుస్తాడు. కానీ, భగవద్గీత ఆనేది ప్రాథమిక దశ విద్యార్థుల కోసం కాదు, కాబట్టి ఆయన అర్జునుడిని ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని అర్థం చేసుకొమ్మని చెప్తున్నాడు: ‘మనిషి, తను ఆరాధించే వస్తువునే పొందుతాడు. దేవతలను ఆరాధించేవారు, మరణించిన పిదప ఆయా దేవతల లోకాలకి వెళ్తారు. నన్ను ఆరాధించే వారు, నా దగ్గరికి వస్తారు.’ అని. దేవతలే నశ్వరమైన వారు కాబట్టి వారి ఆరాధన ద్వారా లభించిన ఫలాలు కూడా నశించిపోయేవే. కానీ, భగవంతుడు నిత్యుడూ, శాశ్వతుడూ కాబట్టి ఆయన ఆరాధన వల్ల లభించేవి కూడా నిత్యమైనవి, శాశ్వతమైనవి. భగవంతుని భక్తులు ఆయన యొక్క నిత్య, శాశ్వత సేవను మరియు ఆయన నిత్య ధామమును పొందుతారు.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః । పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ ।। 24 ।।
24
7
https://www.holy-bhagava…udio/007_024.mp3
అవ్యక్తం — రూపము లేకుండా ఉండి; వ్యక్తిమ్ — ఒక వ్యక్తిత్వాన్ని కలిగి; ఆపన్నం — పొంది; మన్యంతే — అనుకుంటారు; మామ్ —నన్ను; అబుద్ధయః — తెలివి తక్కువ వారు; పరం — సర్వోన్నత; భావమ్ — స్వభావము; అజానంతః — అర్థం చేసుకోకుండా; మమ — నా యొక్క; అవ్యయమ్ — తరిగిపోనిది; అనుత్తమమ్ — సర్వోత్కృష్టమైన.
BG 7.24: పరమేశ్వరుడైన నన్ను, శ్రీ కృష్ణుడిని, ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని, అల్ప జ్ఞానము కలవారు అనుకుంటారు. అక్షరమైన, సర్వోత్కృష్టమైన ఈ నాయొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు.
భగవంతుడు నిరాకారుడు మాత్రమే అని కొందరు జనులు గట్టిగా వాదిస్తారు, మరికొందరు, పరమేశ్వరుడు కేవలం సాకార రూపం లోనే ఉంటాడని అంతే గట్టిగా వాదిస్తారు. ఈ రెండు దృక్పథాలు కూడా పరిమితమైనవి మరియు అసంపూర్ణమైనవే. భగవంతుడు సర్వశక్తిమంతుడు మరియు సంపూర్ణుడు, కాబట్టి, ఆయన నిరాకారుడు మరియు సాకారుడు కూడా. ఇది 4.6వ శ్లోక వ్యాఖ్యానంలో కూడా వివరించబడింది.భగవంతుని వ్యక్తిత్వము యొక్క రెండు కోణాలు ఒప్పుకున్న వారికి, ఒక్కోసారి, మరి ఈ రెంటిలో ఏది మూల రూపం అన్న మీమాంస కలుగుతుంది. సాకార రూపం నుండి నిరాకర తత్త్వం ఉద్భవించినదా లేక నిరాకార తత్త్వం నుండి సాకార రూపం ఉద్భవించినదా అని? తన దివ్య మంగళ స్వరూపమే ఆది మూలమని చెప్తూ శ్రీ కృష్ణుడు ఈ వివాదాన్ని పరిష్కరిస్తున్నాడు - అది నిరాకార బ్రహ్మం నుండి వ్యక్తమయినది కాదు. భగవంతుడు తన దివ్య మంగళ స్వరూపంతో అనాదిగా దివ్య లోకాల్లో ఉన్నాడు. నిరాకర బ్రహ్మన్ అనేది ఆయన అలౌకిక శరీరము నుండి ఉద్భవించే కాంతి.పద్మ పురాణం ఇలా పేర్కొంటున్నది:యన్నఖేందురుచిర్బ్రహ్మా ధ్యేయం బ్రహ్మాదిభిః సురైఃగుణత్రయమతీతం తమ్ వందే వృందావనేశ్వరం(పాతాళ ఖండ 77.60)‘భగవంతుని దివ్య మంగళ స్వరూపము యొక్క కాలి గోళ్ళ నుండి జనించే కాంతినే, జ్ఞానులు బ్రహ్మన్ గా ఆరాధిస్తారు’నిజానికి ఆయన సాకార మరియు నిరాకార తత్త్వాల మధ్య ఏమీ తేడా లేదు. వీటిలో ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అని ఉండదు. నిరాకార బ్రహ్మన్ లో కూడా, భగవంతుని అన్ని శక్తులు మరియు సామర్థ్యాలు తప్పకుండా ఉంటాయి, కానీ అవి అవ్యక్తము. ఆయన వ్యకిగత సాకార రూపంలో, తన నామాలు, రూపము, లీలలు, గుణములు, ధామాలు, మరియు పరివారము అన్ని తన దివ్య శక్తి ద్వారా ప్రకటించబడి వ్యక్త మవుతాయి.మరి అలాంటప్పుడు, భగవంతుడిని ఒక సామాన్య మానవుడిగా ఎందుకు జనులు అనుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం తదుపరి శ్లోకం లో వివరించబడినది.
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః । మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ।। 25 ।।
25
7
https://www.holy-bhagava…udio/007_025.mp3
న-అహం-ప్రకాశః — నేను కనిపించను; సర్వస్య — అందరికీ; యోగ-మాయా — భగవంతుని మహోన్నత (దివ్య) శక్తి; సమావృతః — కప్పివేయబడి; మూఢః — మూర్ఖులు; అయం — ఈ యొక్క; న — కాదు; అభిజానాతి — తెలుసుకోవటం; లోకః — జనులు; మాం — నన్ను; అజమ్ — పుట్టుకలేని వాడను; అవ్యయం — మార్పుచెందని.
BG 7.25: నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పుచెందని వాడినని తెలుసుకోలేరు.
7.4వ మరియు 7.5వ శ్లోకాలలో తన శక్తులలో రెంటిని వివరించిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు తన మూడవ శక్తి అయిన యోగ-మాయా శక్తిని ఉదహరిస్తున్నాడు. ఇది ఆయన అత్యున్నత శక్తి. విష్ణు పురాణం ఇలా పేర్కొంటున్నది:విష్ణు శక్తిః పరా ప్రోక్తా క్షేత్రజ్ఞాఖ్యా తథాఽపరాఅవిద్యా కర్మసంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే. (6.7.61)‘పరమేశ్వరుడైన శ్రీ విష్ణు మూర్తికి మూడు ముఖ్యమైన శక్తులు ఉన్నాయి - యోగమాయ, ఆత్మలు మరియు మాయ.’ జగద్గురు కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:శక్తిమాన్ కీ శక్తియాఁ, అగనిత యదపి బఖానతిన్ మహన్ ‘మాయా’, ‘జీవ’, అరు ‘పరా’, త్రిశక్తి ప్రధాన(భక్తి శతకము, 3వ శ్లోకము)‘సర్వోత్కృష్ట శక్తిమంతుడైన శ్రీ కృష్ణుడికి అనంతమైన శక్తులు ఉన్నాయి. వీటిలో, యోగమాయ, ఆత్మలు, మరియు మాయ అనేవి ప్రధానమైనవి.’ఆ, యోగమాయా దివ్య శక్తి, భగవంతుని యొక్క సర్వ-శక్తిమంతమైన సామర్థ్యము. దీని ద్వారానే, తన యొక్క దివ్య లీలలను, దివ్య ప్రేమానందమును, మరియు దివ్య ధామమును వ్యక్త పరుస్తాడు. ఆ యొక్క యోగమాయ శక్తి ద్వారానే భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు, మరియు తన దివ్య లీలలను ఈ భూలోకం లో కూడా ప్రకటిస్తాడు. ఇదే యోగమాయా శక్తి చే తనను తాను మన నుండి గోప్యం గా ఉంచుకుంటాడు. భగవంతుడు మన హృదయంలోనే కూర్చుని ఉన్నా, ఆయన మనలోనే ఉన్న అనుభూతి మనకు తెలియదు. మనకు ఆయన దివ్య దర్శనం చూడగలిగే అర్హత లభించేవరకు, ఆయన దివ్యత్వాన్ని యోగమాయ మననుండి కప్పివేసి ఉంచుతుంది. కాబట్టి, మనం ఈశ్వరుడిని ప్రస్తుతం ఆయన సాకార రూపంలో చూసినా, ఆయనే భగవంతుడని గుర్తు పట్టలేము. ఎప్పుడైతే యోగమాయా శక్తి తన కృప మనపై చూపిస్తుందో, అప్పుడే మనకు భగవంతుడిని చూసి, గుర్తుపట్టగలిగే దివ్య దృష్టి లభిస్తుంది.చిదానందమయ దేహ తుమ్హారీ, బిగత బికార జాన అధికారీ(రామచరితమానస్)‘ఈశ్వరా, నీకు దివ్య మంగళ స్వరూపము ఉంది. ఎవరి హృదయములు పవిత్రమైనవో వారు మాత్రమే నిన్ను నీ కృప ద్వారా తెలుసుకోగలరు.’ఈ యోగమాయా శక్తి, నిరాకారమైనది మరియు ఒక రూపంలో కూడా వ్యక్తమవుతుంది, రాధ, సీత, దుర్గ, కాళి, లక్ష్మీ, పార్వతి మొదలైన రూపాలలో. ఇవన్నీ యోగమాయ శక్తి యొక్క దివ్య మంగళ స్వరూపాలే, ఇవన్ని కూడా వైదిక సాంప్రదాయంలో, విశ్వానికే మాతృ మూర్తిగా పూజించబడ్డాయి. వీరు మాతృగుణాలైన, సున్నితత్వము, వాత్సల్యము, క్షమ, కృప, మరియు అకారణ ప్రేమలను ప్రసరిస్తారు. మనకు ఇంకా ముఖ్యముగా, జీవాత్మలకు దివ్య కృప ప్రసాదించి, ఆధ్యాత్మిక అలౌకిక జ్ఞానాన్ని అందించటం ద్వారా వాటికి భగవంతుడిని తెలుసుకోగలిగే శక్తిని వీరు ప్రసాదిస్తారు. కాబట్టి, బృందావన భక్తులు, ‘రాధే రాధే, శ్యామ్ సే మిలా దే’, ‘ఓ రాధా, దయచేసి నీ కృపని అనుగ్రహించి, శ్రీ కృష్ణుడిని కలుసుకోవటానికి సహాయం చేయుము.’ అని పాడుతుంటారు.ఈ విధంగా యోగమాయ రెండు పనులూ చేస్తుంది — ఇంకా అర్హత సాధించని జీవాత్మల నుండి భగవంతుడిని దాచిపెడుతుంది మరియు శరణాగతి చేసిన జీవాత్మలకు తన కృప ప్రసాదించి, దానితో వారు భగవంతుడిని తెలుసుకునేటట్టు చేస్తుంది. ఈశ్వరుడి విముఖంగా ఉన్నవారు మాయచే కప్పివేయబడుతారు, వారు యోగమాయ కృపకు దూరమైపోతారు. ఈశ్వరుడికి సన్ముఖంగా ఉన్నవారు, మాయ నుండి విముక్తిపొంది, యోగమాయ సంరక్షణలోకి వస్తారు.
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున । భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ।। 26 ।।
26
7
https://www.holy-bhagava…udio/007_026.mp3
వేద — తెలుసును; అహం — నేను (నాకు); సమతీతాని — జరిగిపోయిన (భూతకాలం); వర్తమానాని — ప్రస్తుతం జరుగుతున్న (వర్తమాన కాలం); చ — మరియు; అర్జున — అర్జునా; భవిష్యాణి — జరగబోయే (భవిష్యత్ కాలం); చ — మరియు; భూతాని — సమస్త ప్రాణులు; మాం — నన్ను; తు — కానీ; వేద — తెలుసుకొనుట; న కశ్చన — ఎవరూ లేరు.
BG 7.26: అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు; కానీ నేను ఎవరికీ తెలియను.
భగవంతుడు సర్వజ్ఞుడు. తాను ‘త్రికాల-దర్శి’ అని ఇక్కడ ప్రకటిస్తున్నాడు – జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి (భూత-వర్తమాన-భవిష్యత్) అన్నీ ఆయనకి తెలుసు. మనకు, కొద్ది గంటల క్రితం మనం ఏమి ఆలోచించామో మనకే గుర్తుండదు. కానీ, అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలో, ప్రతి సమయంలో, విశ్వంలో అనంతమైన జీవుల యొక్క ఆలోచనలు, మాటలు, మరియు పనులు, అన్నీ భగవంతునికి గుర్తు ఉంటాయి. ఇవే ప్రతి జీవాత్మ యొక్క ‘సంచిత కర్మలు’ అంటే (అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మల రాశి). కర్మ సిద్ధాంత రూపంలో ఫలాలను/న్యాయాన్ని జీవులకు అందించటానికి భగవంతుడు దీని లెక్క గణిస్తాడు. అందుకే, తనకు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు అంటున్నాడు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః (1.1.9)‘భగవంతుడు అన్నీ తెలిసినవాడు, సర్వసాక్షి మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు జ్ఞాన మయము”.తనకు అన్నీ తెలిసినా, తాను మాత్రం ఎవ్వరికీ తెలియను అని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భగవంతుడు తన మహిమలు, కీర్తి, శక్తులు, గుణములు, మరియు వ్యాప్తి లలో అనంతుడు. మన బుద్ధి పరిమితమైనది, కాబట్టి అది సర్వేశ్వరుడైన భగవంతుడిని అర్థం చేసుకోలేదు. సకల వేద శాస్త్రాలు ఇలా పేర్కొంటున్నాయి.నైషా తర్కేణ మతిరాపనేయా (కఠోపనిషత్తు 1.2.9)“భగవంతుడు మన బుద్ధి యొక్క తర్కమునకు అతీతుడు”యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ (తైత్తిరీయ ఉపనిషత్తు 2.9.1)‘మన మనస్సు మరియు వాక్కు భగవంతున్ని చేరుకోలేవు.’రామ అతర్క్య బుద్ధి మన బానీ, మత హమార అస సునహి సయానీ(రామచరితమానస్)‘భగవంతుడు, వాదనతో లేక భాషణతో లేక మనోబుద్ధులతో, విశ్లేషించబడలేడు’ఒకే ఒక వ్యక్తిత్వం భగవంతుడుని తెలుసుకొనగలదు, అది భగవంతుడే. ఆయన ఏదేని ఒక జీవాత్మపై తన కృప చూపాలనుకుంటే, తన బుద్ధిని ఆ అదృష్ట జీవాత్మకు ప్రసాదిస్తాడు. భగవంతుని శక్తిని కలిగి ఉన్న ఆ సౌభాగ్యవంతమైన జీవాత్మ అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రకారంగా, భగవంతుడిని తెలుసుకోగోరే ప్రక్రియలో కృప అనేది అత్యంత ప్రధానమైనది. ఈ విషయం 10.11వ మరియు 18.58వ శ్లోకాలలో ఇంకా విశదంగా వివరించబడినది.
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత । సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ।। 27 ।।
27
7
https://www.holy-bhagava…udio/007_027.mp3
ఇచ్ఛా— ఇష్టము (కోరిక); ద్వేషా — ద్వేషము; సముత్థేన — ఉద్భవించును; ద్వంద్వ — ద్వంద్వముల; మోహేన — భ్రాంతి నుండి; భారత — అర్జునా, ఓ భరత వంశస్థుడా; సర్వ — అన్నీ; భూతాని — ప్రాణులు; సమ్మోహం — మోహము(భ్రమ) లోనికి; సర్గే — పుట్టుక నుండి; యాంతి — ప్రవేశించెదరు; పరంతప — శత్రువులను జయించేవాడా.
BG 7.27: ఓ భరత వంశస్థుడా, రాగ, ద్వేషములనే ద్వంద్వములు, మోహము (భ్రాంతి) నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది.
ఈ ప్రపంచం అంతా ద్వంద్వముల మయం — పగలు-రాత్రి; శీతాకాలం-ఎండాకాలం; సంతోషం-దుఃఖం; ఆనందం-బాధ. అన్నిటికన్నా పెద్ద ద్వంద్వములు పుట్టుక-మరణములు. ఇవి ఒక జంట లాగా ఉంటాయి — పుట్టుక సంభవించగానే మరణం ఖచ్చితంగా ఉంటుంది; మరణం మరల పుట్టుకను కలిగిస్తుంది. జననం-మరణం అనే ఈ రెండు చివరల మధ్య ఉండేదే జీవితం. ఈ ద్వంద్వములు జీవన ప్రయాణంలో విడదీయలేని భాగాలుగా ఉంటాయి. భౌతిక దృక్పథంలో, మనకి ఒకటి నచ్చుతుంది మరియు ఇంకోటంటే రోత పుడుతుంది. ఈ ఇష్టము-ద్వేషము అనేవి ద్వంద్వముల యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం కాదు, నిజానికి, అవి మన అజ్ఞానం నుండి ఉద్భవించినవే. మన తప్పుదారిలో ఉన్న బుద్ధి, భౌతిక సుఖాలు మనకు మంచివి అని ఒక నిశ్చయంతో ఉంది. బాధ అనేది మనకు హానికరమైనది అన్న నిశ్చయంతో కూడా ఉన్నాము. భౌతిక ప్రాపంచిక భోగాలు, ఆత్మపై ఉన్న భౌతిక మాయను మరింత మందంగా చేస్తాయి, అదే సమయంలో, ప్రతికూల పరిస్థితులకు మాయను నిర్మూలించి, మనస్సును ఉద్ధరించే శక్తి ఉంది, అని తెలుసుకోలేకున్నాము. ఈ యొక్క భ్రాంతికి మూల కారణం అజ్ఞానమే. ఆధ్యాత్మిక పురోగతికి నిదర్శనం ఏంటంటే, వ్యక్తి రాగ-ద్వేషాలకు, ఇష్టా-అయిష్టాలకు అతీతంగా ఎదిగి, ఆ రెంటినీ భగవంతుని సృష్టిలో ఉన్న విడదీయలేని తత్త్వాలుగా స్వీకరిస్తాడు.
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ । తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః ।। 28 ।।
28
7
https://www.holy-bhagava…udio/007_028.mp3
యేషాం — ఎవరివైతే; తు — కానీ; అంత-గతం — పూర్తిగా నశించిపోయి; పాపం — పాపములు; జనానాం — జనులకు; పుణ్య, కర్మణాం — పుణ్య కార్యములు; తే — వారు; ద్వంద్వ — ద్వంద్వముల; మోహ — మాయ; నిర్ముక్తః — విముక్తి నొంది; భజంతే — పూజింతురు; మాం — నన్ను; దృఢ-వ్రతాః — దృఢ సంకల్పముతో.
BG 7.28: పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు.
2.69వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు - అజ్ఞానులు ఏదైతే రాత్రి అనుకుంటారో, జ్ఞానులు దానిని పగలు అనుకుంటారు. ఎవరికైతే భగవత్ ప్రాప్తి కోసం అభిలాష మేల్కొల్పబడిందో, వారు కష్టం/బాధ అనేదాన్ని ఆధ్యాత్మిక పురోగతి మరియు స్వార్థ త్యాగం కోసం వచ్చిన అవకాశంగా స్వీకరిస్తారు. ఆత్మని మరింత మరుగున పరిచే భోగాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. అందుకే, వారు సుఖాల కోసం ప్రయాస పడరు లేదా కష్టాలను ద్వేషించరు. ఇటువంటి జీవాత్మలు, ఎవరైతే తమ మనస్సులను రాగ-ద్వేష ద్వంద్వముల నుండి విముక్తి చేసుకున్నారో, వారు భగవంతుడిని స్థిరమైన దృఢ సంకల్పముతో ఆరాధించగలరు.
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే । తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ।। 29 ।।
29
7
https://www.holy-bhagava…udio/007_029.mp3
జరా — ముసలితనము నుండి; మరణ — మరియు మృత్యువు; మోక్షాయ — విముక్తి కోసము; మాం — నన్ను; ఆశ్రిత్య — ఆశ్రయించినవారు; యతంతి — పరిశ్రమించెదరు; యే — ఎవరైతే; తే — వారు; బ్రహ్మ — బ్రహ్మన్; తత్ — అది; విదుః — తెలుసుకొనుట; కృత్స్నం — సర్వమూ; అధ్యాత్మం — ఆత్మ (తమని తాము); కర్మ — కర్మ; చ — మరియు; అఖిలం — సమస్తము.
BG 7.29: ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ, నన్ను ఆశ్రయించిన వారు, బ్రహ్మంను, తమ ఆత్మ తత్త్వమును, సమస్త కర్మ క్షేత్రమును తెలుసుకుంటారు.
7.26వ శ్లోకంలో చెప్పినట్టుగా, భగవంతుడు మన సొంత బుద్ధి బలంచే తెలియబడడు. కానీ, ఆయనకు శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులౌతారు. అప్పుడు ఆయన కృప చేత ఆయనను తెలుసుకోగలుగుతారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొన్నది:నాయమాత్మా ప్రవచనేన లభ్యోన మేధయా న బహునా శ్రుతేనయమేవైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం (1.2.23)‘ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కానీ, బుద్ధి బలం చేత కానీ, రకరకాల ఉపదేశాలు వినటం వలన కానీ భగవంతుడిని తెలుసుకోలేము. కేవలం ఎప్పుడైతే ఆయన ఒకరిపై తన కృప ప్రసాదిస్తాడో, అప్పుడే ఆ భాగ్యశాలియైన జీవాత్మ ఆయనను తెలుసుకోగలదు.’ మరియు ఎప్పుడైతే వ్యక్తికి భగవత్ జ్ఞానం లభిస్తుందో, అతనికి సర్వమూ ఆయన సంబంధముగా తెలియబడుతుంది. వేదములు ఇలా పేర్కొంటున్నాయి : ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, ‘నీకు భగవంతుడు తెలిస్తే, నీకు అన్నీ తెలుస్తాయి.’కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు ఆత్మ-జ్ఞానమే అత్యున్నత లక్ష్యం అనుకుంటారు. కానీ, ఎలాగైతే సముద్రపు నీటి చుక్క అనేది సముద్రములోని ఒక అతి చిన్న భాగమో, ఆత్మ-జ్ఞానము అనేది బ్రహ్మ-జ్ఞానములో ఒక అతి చిన్న భాగము. నీటి బిందువు గురించి తెలిసిన వారికి, సముద్రము యొక్క లోతు, వైశాల్యము, మరియు శక్తి తెలిసినట్టు కాదు. అదే విధంగా, ఆత్మ గురించి తెలిసినవారికి భగవంతుని గురించి తెలిసినట్టు కాదు. కానీ, భగవంతుని గురించి తెలిసినవారికి అప్రయత్నంగానే భగవంతుని లోనే ఉన్న సమస్త అంగాలు తెలిసిపోతాయి. కాబట్టి, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో – ఆయనని, ఆత్మని, మరియు సమస్త కర్మ క్షేత్రమును – ఆయన కృపచే తెలుసుకుంటారు, అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః । ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ।। 30 ।।
30
7
https://www.holy-bhagava…udio/007_030.mp3
స-అధిభూత — సమస్త పదార్థ క్షేత్రానికీ పాలకుడు; అధిదైవం — దేవతల పరిపాలకుడు; మాం — నన్ను; స-అధియజ్ఞం — సర్వ యజ్ఞములకు ఈశ్వరుడు; చ — మరియు; యే — ఎవరైతే; విదుః — తెలుసుకుంటారో; ప్రయాణ — మరణ; కాలే — సమయంలో; అపి — కూడా; చ — మరియు; మాం — నన్ను; తే — వారు; విదుః — తెలుసుకుంటారు; యుక్త-చేతసః — నా యందే స్థితమై ఉండి.
BG 7.30: సమస్త అధిభూత (పదార్థ క్షేత్రము), అధిదైవ (దేవతలు), మరియు అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.
శరీరాన్ని విడిచి పెట్టే సమయంలో ఎవరైతే తనను స్మరిస్తారో వారు తన దివ్య ధామాన్ని చేరుకుంటారు అని శ్రీ కృష్ణుడు తదుపరి అధ్యాయంలో చెప్తాడు. కానీ, మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవటం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మరణం అనేది అత్యంత బాధాకరమైన అనుభవం. అది రెండువేల తేళ్ళు ఒకేసారి కుట్టిన రీతిగా ఉంటుంది. ఇది ఎవరి మనస్సు లేదా బుద్ధికి సహింపశక్యము కానిది. మరణం సంభవించకముందే మనస్సు, బుద్ధి పని చేయటం ఆగిపోతుంది మరియు వ్యక్తి స్పృహ తప్పిపోతాడు. మరి మరణ సమయంలో భగవంతుడిని ఎలా గుర్తుంచుకోగలము? ఇది కేవలం శారీరక సుఖాల మరియు బాధలకు అతీతంగా ఉన్నవారి వల్లనే సాధ్యమౌతుంది. ఇటువంటి వారు స్పృహతోనే శరీరాన్ని విడిచి పెడతారు. శ్రీ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే తననే అధిభూత, అధిదైవ మరియు అధియజ్ఞములకు యజమాని అని తెలుసుకున్న వారు మరణ సమయంలో కూడా పూర్తి భగవత్ స్పృహలోనే ఉంటారు, అని. ఇది ఎలాగంటే యదార్థమైన జ్ఞానము సంపూర్ణ భక్తికి దారి తీస్తుంది – మనస్సు సంపూర్ణముగా భగవంతుని లోనే నిమగ్నమవుతుంది. ఆ కారణముగా, అది శారీరక స్థాయిలోని కోరికల, బాధల నుండి విడిపోతుంది మరియు ఇటువంటి జీవాత్మ శారీరక స్పృహలో ఉండదు. అధిభూత, అధిదైవ మరియు అధియజ్ఞములు అనే పదములు తదుపరి అధ్యాయంలో వివరించబడ్డాయి.
అర్జున ఉవాచ । కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ । అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ।। 1 ।। అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన । ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ।। 2 ।।
1
8
https://www.holy-bhagava…/008_001-002.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; కిం — ఏమిటి?; తత్ — అది; బ్రహ్మ — బ్రహ్మన్; కిం — ఏమిటి? అధ్యాత్మం — జీవాత్మ; కిం — ఏమిటి? కర్మ — కర్మ సిద్ధాంతము; పురుష-ఉత్తమ — శ్రీ కృష్ణ, సర్వోత్కృష్ట పరమ పురుషుడు; అధిభూతం — కనిపించే భౌతిక జగత్తు; చ — మరియు; కిం — ఏమిటి? ప్రోక్తం — చెప్పబడును; అధిదైవం — దేవతల ప్రభువు; కిం — ఏమిటి? ఉచ్యతే — అనబడును? అధియజ్ఞ — సమస్త యజ్ఞముల యజమాని; కథం — ఏ విధంగా?; కః — ఎవరు? అత్ర — ఇక్కడ; దేహే — శరీరంలో; అస్మిన్ — ఇది; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా; ప్రయాణ-కాలే — మరణ సమయంలో; చ — మరియు; కథం — ఎలా; జ్ఞేయః — తెలుసుకోబడును; అసి — నీవు; నియత-ఆత్మభిః — దృఢ సంకల్పముతో ఉన్న వారిచే.
BG 8.1-2: అర్జునుడు పలికెను: ఓ పరమేశ్వరా, బ్రహ్మన్ (పరమ సత్యము) అనగా ఏమిటి? అధ్యాత్మము (ఆత్మ) అనగా ఏమిటి?, మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదైవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము?
7వ అధ్యాయం ముగింపులో, శ్రీ కృష్ణుడు బ్రహ్మన్, అధిభూత, అధ్యాత్మ, అధిదైవ మరియు అధియజ్ఞ అన్న పదాలను పరిచయం చేసాడు. అర్జునుడికి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అందుకే ఈ రెండు శ్లోకాలలో ఏడు ప్రశ్నలను సంధించాడు. వీటిలో ఆరు ప్రశ్నలు శ్రీ కృష్ణుడు పలికిన పదాల గురించే. ఏడవ ప్రశ్న మరణ సమయం గురించి. శ్రీ కృష్ణుడు తానే ఈ విషయాన్ని 7.30వ శ్లోకంలో ప్రస్తావించాడు. ఇక ఇప్పుడు అర్జునుడు, మరణ సమయంలో భగవంతుడిని ఎలాగుర్తుంచుకుని స్మరించాలో తెలుసుకోగోరుతున్నాడు.
అర్జున ఉవాచ । కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ । అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ।। 1 ।। అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన । ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ।। 2 ।।
2
8
https://www.holy-bhagava…/008_001-002.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; కిం — ఏమిటి?; తత్ — అది; బ్రహ్మ — బ్రహ్మన్; కిం — ఏమిటి? అధ్యాత్మం — జీవాత్మ; కిం — ఏమిటి? కర్మ — కర్మ సిద్ధాంతము; పురుష-ఉత్తమ — శ్రీ కృష్ణ, సర్వోత్కృష్ట పరమ పురుషుడు; అధిభూతం — కనిపించే భౌతిక జగత్తు; చ — మరియు; కిం — ఏమిటి? ప్రోక్తం — చెప్పబడును; అధిదైవం — దేవతల ప్రభువు; కిం — ఏమిటి? ఉచ్యతే — అనబడును? అధియజ్ఞ — సమస్త యజ్ఞముల యజమాని; కథం — ఏ విధంగా?; కః — ఎవరు? అత్ర — ఇక్కడ; దేహే — శరీరంలో; అస్మిన్ — ఇది; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా; ప్రయాణ-కాలే — మరణ సమయంలో; చ — మరియు; కథం — ఎలా; జ్ఞేయః — తెలుసుకోబడును; అసి — నీవు; నియత-ఆత్మభిః — దృఢ సంకల్పముతో ఉన్న వారిచే.
BG 8.1-2: అర్జునుడు పలికెను: ఓ పరమేశ్వరా, బ్రహ్మన్ (పరమ సత్యము) అనగా ఏమిటి? అధ్యాత్మము (ఆత్మ) అనగా ఏమిటి?, మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదైవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము?
7వ అధ్యాయం ముగింపులో, శ్రీ కృష్ణుడు బ్రహ్మన్, అధిభూత, అధ్యాత్మ, అధిదైవ మరియు అధియజ్ఞ అన్న పదాలను పరిచయం చేసాడు. అర్జునుడికి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అందుకే ఈ రెండు శ్లోకాలలో ఏడు ప్రశ్నలను సంధించాడు. వీటిలో ఆరు ప్రశ్నలు శ్రీ కృష్ణుడు పలికిన పదాల గురించే. ఏడవ ప్రశ్న మరణ సమయం గురించి. శ్రీ కృష్ణుడు తానే ఈ విషయాన్ని 7.30వ శ్లోకంలో ప్రస్తావించాడు. ఇక ఇప్పుడు అర్జునుడు, మరణ సమయంలో భగవంతుడిని ఎలాగుర్తుంచుకుని స్మరించాలో తెలుసుకోగోరుతున్నాడు.
శ్రీ భగవానువాచ । అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే । భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ।। 3 ।।
3
8
https://www.holy-bhagava…udio/008_003.mp3
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; అక్షరం — నాశనము లేనిది; బ్రహ్మ — బ్రహ్మన్; పరమం — సర్వోన్నత; స్వభావః — స్వభావము; అధ్యాత్మమ్ — ఆత్మ తత్త్వము; ఉచ్యతే — పిలవబడుతుంది; భూత-భావ-ఉద్భవ-కరః — ప్రాణుల భౌతిక వ్యక్తిత్వానికి సంబంధించిన కర్మలు మరియు వాటి వృద్ధి; విసర్గః — సృష్టి; కర్మ — ఫలాపేక్ష క్రియలు; సంజ్ఞితః — చెప్పబడును.
BG 8.3: శ్రీ భగవానుడు పలికెను: సర్వోన్నతమైన, నాశములేని తత్త్వమునే బ్రహ్మన్ అందురు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకు మరియు వాటి అభివృద్దికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు.
సర్వోత్కృష్ట తత్త్వమునే బ్రహ్మన్ అంటారు (వేదాల్లో భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు వాటిలో బ్రహ్మన్ ఒకటి). అది దేశ, కాల మరియు కారణ, కార్య చక్రానికి అతీతమైనది. ఇవి భౌతిక జగత్తు యొక్క గుణములు, కానీ బ్రహ్మన్, భౌతిక జగత్తుకి అతీతమైనది. అది విశ్వంలో జరిగే పరిణామాల చేత ప్రభావితం కాదు మరియు అది అనశ్వరమైనది. కాబట్టి, అది అక్షరం అని వివరించబడినది. బృహదారణ్యక ఉపనిషత్తు 3.8.8లో, బ్రహ్మన్ అనేది ఇదే విధంగా నిర్వచించబడినది. ‘పండితులు బ్రహ్మన్ అంటే అక్షరము (నాశము లేనిది) అని చెప్తారు. అది 'పరం' (సర్వోత్కృష్టమైన) అనికూడా పరిగణించబడుతుంది, ఏలనన, దానికి మాయ మరియు జీవాత్మల కన్నా ఉన్నతమైన గుణములు ఉంటాయి.’ భగవత్ మార్గమే 'అధ్యాత్మ' అనబడుతుంది, మరియు ఆత్మస్వరూప శాస్త్రం కూడా అధ్యాత్మ అనబడుతుంది. కానీ ఇక్కడ ఆ పదం, వ్యక్తి యొక్క ఆత్మతత్త్వం కోసమే ఉపయోగించబడినది, దీనిలోనే ఆత్మ, శరీరము, మనస్సు, మరియు బుద్ధి సమ్మిళితమై ఉన్నాయి. కర్మ అంటే ఆత్మచే చేయబడిన పనులు, ఇవి ప్రతి జీవి యొక్క ప్రతి జన్మ యందున్న ప్రత్యేకమైన జీవన పరిస్థితులను నిర్దేశిస్తాయి. ఈ కర్మలే జీవాత్మను సంసార చక్రంలో త్రిప్పుతుంటాయి.
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ । అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ।। 4 ।।
4
8
https://www.holy-bhagava…udio/008_004.mp3
అధిభూతం — సతతమూ మారుతూ ఉండే భౌతిక సృష్టి; క్షరః — నశించెడి; భావః — స్వభావము; పురుషః — ప్రాకృతిక సృష్టిని కలిగిఉన్న భగవంతుని విశ్వ రూపము; చ — మరియు; అధిదైవతమ్ — దేవతల ప్రభువు; అధియజ్ఞః — సమస్త యజ్ఞముల అధిపతి; అహం — నేను; ఏవ — ఖచ్చితముగా; అత్ర — ఇక్కడ; దేహే — శరీరములో; దేహ-భృతాం — దేహములో ఉన్న; వర — ఓ, సర్వోత్తముడా.
BG 8.4: దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా, నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే అదిభూత అంటారు; సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము అంటారు; సర్వ భూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము, అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు, అని పిలువబడుతాను.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము - అనే ఈ పంచ భూతముల సంయోగంతో ఏర్పడిన ఈ చిత్రవిచిత్ర రంగురంగుల విశ్వమునే - అధిభూత అంటారు. సమస్త భౌతిక సృష్టిని తనగానే కలిగిఉన్న పరమేశ్వరుని యొక్క విశ్వ రూపమైన విరాట్ పురుషుడినే అధిదైవము అంటారు, ఎందుకంటే ఆయన దేవతలకు (విశ్వములో వేరు వేరు విభాగాలను నిర్వహించే వారు) అధిపతి. సర్వోత్కృష్ట దివ్య మంగళ స్వరూపుడైన, శ్రీ కృష్ణుడు, పరమాత్మ రూపంలో సర్వ ప్రాణుల హృదయంలో నివసించే వాడు, అధియజ్ఞ మని చెప్పబడుతాడు. అన్ని యజ్ఞములు ఆయన ప్రీతి కొరకే చేయబడాలి. ఈ విధంగా ఆయనే, సమస్త యజ్ఞములకు అధ్యక్షుడు మరియు అన్ని కార్యములకు ఫలములను ప్రసాదించే వాడు. ఈ శ్లోకము మరియు ఇంతకు క్రితం శ్లోకము కలిసి అర్జునుడి ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాయి; ఇది పదముల పరిభాషకి సంబంధించినది. తదుపరి కొన్ని శ్లోకములు మరణ సమయము గురించి ఉన్న ప్రశ్నకు సమాధానం చెపుతాయి.
అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ । యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ।। 5 ।।
5
8
https://www.holy-bhagava…udio/008_005.mp3
అంత-కాలే — మరణ సమయంలో; చ — మరియు; మామ్ — నన్ను; ఏవ — మాత్రమే; స్మరన్ — స్మరిస్తూ; ముక్త్వా — విడిచిపెట్టుట; కలేవరమ్ — శరీరము; యః — ఎవరైతే; ప్రయాతి — వెళ్ళునో; సః — అతడు; మత్-భావం — భగవత్ స్వభావము; యాతి — పొందును; న అస్తి — లేదు; అత్ర — ఈ విషయంలో; సంశయః — సందేహము.
BG 8.5: మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.
తదుపరి శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఏమంటాడంటే, ఒక వ్యక్తి యొక్క తదుపరి జన్మ ఆ వ్యక్తి మరణ సమయంలో అతని యొక్క అంతఃకరణ స్థితిని బట్టి మరియు వ్యక్తికి దేనిపై మనస్సు ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది, అని పేర్కొంటాడు. కాబట్టి మరణ సమయంలో ఎవరైనా - భగవంతుని అలౌకిక నామాలు, గుణములు, రూపములు, లీలలు, మరియు ధామములు - వీటిపై నిమగ్నమై ఉంటే, భగవత్ ప్రాప్తి లక్ష్యం పొందుతాడు. శ్రీ కృష్ణుడు ఇక్కడ 'మద్ భావం' అన్న పదం వాడుతున్నాడు, అంటే ‘భగవంతుని వంటి స్వభావము’. ఈ విధంగా, మృత్యు సమయంలో, వ్యక్తి అంతర్గత దృక్పథం భగవంతుని యందే నిమగ్నమై ఉంటే, అతను భగవంతుడినే పొందుతాడు, మరియు స్వభావములో భగవంతుని లాగానే అవుతాడు.
యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ । తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః ।। 6 ।।
6
8
https://www.holy-bhagava…udio/008_006.mp3
యం యం — ఏదైతే; వా — లేదా; అపి — కూడా; స్మరన్ — స్మరిస్తూ; భావం — భావములను; త్యజతి — విడిచి పెట్టి; అంతే — చివరికి; కలేవరమ్ — శరీరము; తం — దానిని; తం — దానిని; ఏవ — నిజముగా; ఏతి — పొందును; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; సదా — ఎల్లప్పుడూ; తత్ — అది (ఆ యొక్క); భావ-భావితః — తలంపుల లోనే నిమగ్నమై ఉండి.
BG 8.6: మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తుచేసుకుంటాడో, ఓ కుంతీ పుత్రుడా, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును.
మనము ఒక చిలుకకి, ‘గుడ్ మార్నింగ్!’ అని పలకటానికి తర్ఫీదు ఇవ్వటంలో సఫలం అవ్వచ్చు. కానీ, దాని గొంతు గట్టిగా పట్టుకుంటే అది కృత్రిమముగా నేర్చుకున్న దాన్ని మర్చిపోయి దాని యొక్క సహజ గొంతుతో 'కావ్!' మంటుంది. అదే విధముగా, మృత్యు సమయంలో, సహజంగానే మన మనస్సు, జీవితం మొత్తం అలవాటుగా తయారు చేసుకున్న ఆలోచనల ప్రవాహంలోనే పరుగు పెడుతుంది. మన ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవటానికి సమయం, మనం సామాను సర్దుకున్న తరువాత కాదు; ముందు జాగ్రత్తతో సరియైన ప్రణాళిక, ఏర్పాటు అవసరం. మరణ సమయంలో ఏదైతే మన ఆలోచనలలో ప్రధానంగా ఉంటుందో, అదే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పేది ఇదే. వ్యక్తి యొక్క రోజువారీ అలవాట్లు మరియు సాంగత్యముల ప్రకారం, తను బ్రతికున్నంత కాలం దేని గురించి తలంచాడో, ధ్యానం చేసాడో సహజంగానే ఆప్రకారంగానే వ్యక్తి యొక్క చివరి తలంపులు ఉంటాయి; పురాణాలలో భరత మహారాజు వృత్తాంతం ఈ విషయం స్పష్టంగా అర్థమయ్యేలా విశదీకరిస్తుంది. ప్రాచీన భారతదేశంలో, భరతుడు ఒక శక్తిమంతమైన రాజు, కానీ భగవత్ ప్రాప్తి సాధన కోసం, అడవిలో తపస్విలా జీవిస్తూ, తన రాజ్యాన్ని త్యజించాడు. ఒక రోజు, గర్భంతో ఉన్న ఒక జింక, ఒక పులి గాండ్రింపు విని నీటిలోకి దూకటం చూసాడు. ఆ భయానికి, గర్భంతో ఉన్న జింక ఒక జింక-పిల్లని ప్రసవించింది. ఆ జింక పిల్ల నీటిలో తెలియాడటం చూసి భరతుడు జాలిపడి దానిని రక్షించాడు. అతను దానిని తన కుటీరముకి తీసుకువెళ్ళి దానిని పెంచటం మొదలుపెట్టాడు. అపారమైన వాత్సల్యంతో దాని యొక్క ఉల్లాసమైన ఆటపాటలను చూస్తూ ఉండేవాడు. దాని కోసం గడ్డి తెచ్చేవాడు, దానిని వెచ్చగా ఉంచటం కోసం దానిని ఆలింగనము చేసుకునేవాడు. క్రమక్రమంగా ఆయన మనస్సు భగవంతుని నుండి దూరంగా వచ్చి, ఆ జింకపై నిమగ్నమయింది. ఈ అనుబంధం ఎంత గాఢంగా అయ్యిందంటే రోజంతా ఆ జింక గురించే ఆలోచించేవాడు. ఇక ఆయన మరణించే సమయంలో, ఆ జింక ఏమైపోతుందో అని చింతిస్తూ, దానిని ప్రేమతో పిలిచాడు. పర్యవసానంగా, భరత మహారాజు, ఆయన తదుపరి జన్మలో, ఒక జింకగా పుట్టాడు. కానీ, ఆయన ఏంతో ఆధ్యాత్మిక సాధన చేసి ఉండటం వలన, ఆయన చేసిన తప్పు యొక్క అవగాహన ఉండింది, కాబట్టి జింకగా ఉన్నా సరే, ఆయన, అడవిలో సాధు జనుల ఆశ్రమాల దగ్గరే నివసిస్తూ ఉండేవాడు. చివరికి, ఆయన తన జింక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత, ఆయనకి తిరిగి మానవ శరీరం ఇవ్వబడింది. ఈ సారి, ఆయన ఒక గొప్ప ఋషి జడభరతుడు అయినాడు మరియు తన సాధన పూర్తి చేస్తూ భగవత్ ప్రాప్తి సాధించాడు. ఈ శ్లోకం చదివిన తరువాత, ఎవరూ కూడా, అంతిమ లక్ష్యాన్ని సాధించటం కోసం, భగవంతుడిని మరణ సమయంలో ధ్యానం చేస్తే సరిపోతుందిలే అని అనుకోకూడదు. జీవితాంతం అభ్యాసం చేయకుండా, ఇది ఖచ్చితంగా అసాధ్యం. స్కంద పురాణం ప్రకారం మృత్యు సమయంలో భగవంతుడిని స్మరించటం చాలా కష్టం. మరణం చాలా బాధాపూరితమైన అనుభవం, ఆ సమయంలో వ్యక్తి యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం వైపే మనస్సు మొగ్గు చూపుతుంది. మనస్సు భగవంతుని గురించి స్మరించాలంటే వ్యక్తి యొక్క ఆంతర స్వభావం అయన యందే లీనమై ఉండాలి. ఆంతర స్వభావం అంటే మనోబుద్ధుల లోపల నివసించి ఉండే స్మృతి. ఏదేని ఒకదాన్ని నిరంతరం ధ్యానించుతూ ఉంటేనే అది ఆంతర స్వభావంగా వ్యక్తమౌతుంది. కాబట్టి, భగవత్ స్మృతి లోనే ఉండే ఆంతర స్వభావాన్ని పెంపొందించుకోవటానికి, భగవంతుడు మన జీవతంలో ప్రతి క్షణం గుర్తుంచుకోబడాలి, జ్ఞప్తికితెచ్చుకోబడాలి మరియు ధ్యానించబడాలి. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో పేర్కొంటున్నాడు.
తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ । మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ।। 7 ।।
7
8
https://www.holy-bhagava…udio/008_007.mp3
తస్మాత్ — కాబట్టి; సర్వేషు — అన్నీ; కాలేషు — సమయాల్లో; మామ్ — నన్ను; అనుస్మర — స్మరించుము; యుధ్య — యుద్ధము చేయుము; చ — మరియు; మయి — నాకు; అర్పిత — శరణాగతి చేసి అర్పించి; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; మామ్ — నన్ను; ఏవ — ఖచ్చితంగా; ఏష్యసి — నీవు పొందుతావు; అసంశయః — సందేహము లేకుండా.
BG 8.7: కాబట్టి, సర్వ కాలముల యందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు-బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో, నీవు తప్పకుండా నన్నే పొందుదువు; ఈ విషయంలో సందేహం లేదు.
ఈ శ్లోకం యొక్క మొదటి పాదం, భగవద్గీత యొక్క ఉపదేశ సారాంశము. దీనికి మన జీవితాన్ని దివ్య మైనదిగా చేసే శక్తి ఉంది. కర్మ యోగ యొక్క నిర్వచనం కూడా ఇందులోనే పొందుపరచబడి ఉంది. శ్రీ కృష్ణుడు అంటున్నాడు – ‘నీ మనస్సుని నా యందే లగ్నం చేయుము, మరియు శరీరంతో నీ ప్రాపంచిక కర్తవ్యాన్ని చేయుము.’ ఈ సూత్రం అన్ని రంగాల వారికీ వర్తిస్తుంది - డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, గృహిణులు, విద్యార్థులు, మరియు మిగతా అందరికీ కూడా. అర్జునుడికి సంబంధించినంత వరకు, అతను ఒక క్షత్రియుడు, మరియు ఆయన ధర్మం యుద్ధం చేయటమే. కాబట్టి, అతను, మనస్సుని కృష్ణుని యందు ఉంచి తన కర్తవ్యాన్ని చేయాలని ఉపదేశించబడుతున్నాడు. కొంతమంది తాము ఆధ్యాత్మిక జీవితం అవలంబిస్తున్నాము అన్న మిషతో తమ ప్రాపంచిక విధులని ఆలక్ష్యం చేస్తారు. మరికొంత మంది ప్రాపంచిక పనుల నెపంతో ఆధ్యాత్మిక సాధనను నిర్లక్ష్యం చేస్తారు. ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక వ్యవహారములకు సమన్వయం కుదరదు అని జనులు అనుకుంటారు. కానీ, భగవంతుని సందేశం మన సంపూర్ణ జీవితాన్ని పవిత్రముగావించటమే.ఈ విధమైన కర్మ యోగము అభ్యాసము చేసినప్పుడు, ప్రాపంచిక పనులు ఏవీ నిర్లక్ష్యం చేయబడవు ఎందుకంటే శరీరము వాటిలోనే నిమగ్నమై ఉంటుంది. కానీ, మనస్సు భగవంతుని యందే నిమగ్నమవటం వలన ఈ పనులు వ్యక్తిని కర్మ బంధాలలో పెనవేయవు. ఏవైతే పనులను వాటిపై మమకారాసక్తితో చేస్తామో, అవే మనలను కర్మ బంధాలలో పెనవేస్తాయి. ఎప్పుడైతే పని అనురాగ/ఆసక్తి రహితంగా ఉంటుందో, ప్రాపంచిక న్యాయము కూడా మనలను ఆ పనులకు అపరాధిగా పరిగణించదు. ఉదాహరణకి, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే అతన్ని కోర్టులో హాజరుపరిచారనుకోండి.న్యాయమూర్తి అడుగుతాడు, ‘నీవు ఆ మనిషిని చంపావా?’అతను ఇలా సమాధానమిస్తాడు, ‘అవునండి, వేరే సాక్ష్యం ఏమీ అవసరం లేదు, నేనే చంపానని ఒప్పుకుంటున్నాను.’‘మరి అప్పుడైతే నీకు శిక్ష పడాలి!’‘లేదు, యువర్ ఆనర్, మీరు నన్ను శిక్షించలేరు.’‘ఏం ఎందుకు?’‘నాకు అతనిని చంపాలని ఏమీ ఉద్దేశ్యం లేదు. నేను వాహనాన్ని రోడ్డుపై సరియైన దిశలోనే నడుపుతున్నాను, వేగ పరిమితికి లోపలే ఉన్నాను, నా దృష్టి ముందుకే కేంద్రీకరించి ఉంది. నా బ్రేకులు, స్టీరింగ్, అన్నీ సరిగ్గాన్నే ఉన్నాయి. ఆ మనిషి ఒక్కసారిగా నా వాహనం ముందుకు ఉరికి వచ్చాడు. నేనేమి చేసేది?’ఆయన తరఫు న్యాయవాది అతనిలో చంపాలనే ఉద్దేశ్యం ఏమీ లేదు అని నిరూపించినప్పుడు, న్యాయమూర్తి అతనిని ఎటువంటి శిక్ష లేకుండానే విడిచి పెడతాడు.బాహ్య ప్రపంచంలో కూడా మనం ఆసక్తి/మమకారం లేకుండా చేసే పనులకి మనలను దోషులుగా పరిగణించరు అని ఈ పై ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తోంది. ఇదే సూత్రం కర్మ సిద్ధాంతానికి కూడా వర్తిస్తుంది. అందుకే, మహా భారత యుద్దంలో, శ్రీ కృష్ణుడి ఉపదేశాన్ని పాటిస్తూ, అర్జునుడు యుద్ధ రంగంలో తన విధిని నిర్వర్తించాడు. యుద్ధం ముగిసేటప్పటికి, అర్జునుడు ఎలాంటి పాపమును చేయనట్టే, అని శ్రీ కృష్ణుడు పరిగణించాడు. ప్రాపంచిక లాభం కోసం లేదా కీర్తి కోసం గనక మమకార/ఆసక్తితో అర్జునుడు ఆ యుద్ధం చేసి ఉంటే అతను కర్మ బంధాలలో చిక్కుకుని ఉండేవాడు. కానీ, అతని మనస్సు శ్రీ కృష్ణుడితో అనుసంధానమై ఉన్నది, స్వార్థ పూరిత ఆసక్తి లేకుండా ఈ లోకంలో తన ధర్మ/విధులు నిర్వర్తిస్తూ ఉండటంచే ఆయన చేసేది సున్నాతో గుణించబడుతున్నది. ఒక లక్ష సంఖ్య నైనా సున్నాతో గుణిస్తే వచ్చేది సున్నానే.కర్మ యోగానికి సంబంధించిన షరతు ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. మనస్సుని నిరంతరం భగవంతుడిని స్మరించటంలో నిమగ్నమై ఉంచాలి. మనస్సు ఒక్కక్షణమైనా భగవంతుడిని మర్చిపోతే, మరుక్షణం అది మాయ యొక్క సైన్యం లోని యోధుల దాడికి గురౌతుంది – కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, ద్వేషము వంటి నకారాత్మక భావోద్వేగాలు. అందుకే, దానిని ఎల్లప్పుడూ భగవంతునితో అనుసంధానం చేసి ఉంచాలి. తరచుగా జనులు తాము కర్మ మరియు యోగ చేస్తున్నాము కాబట్టి తమని తాము కర్మయోగులము అనుకుంటారు. రోజులో చాలా భాగము వారు కర్మ చేస్తారు, మరియు కొద్ది నిముషాలు వారు 'యోగం' చేస్తారు (భగవంతునిపై ధ్యానము). కానీ, ఇది కాదు శ్రీ కృష్ణుడు చెప్పిన కర్మయోగ నిర్వచనము. ఆయన ప్రకారం 1) కర్మలు చేస్తూనే ఉన్నా మనస్సు మాత్రం భగవంతుని స్మరణ యందే నిమగ్నమై ఉండాలి. 2) భగవంతుని స్మరణ అప్పుడప్పుడూ కాకుండా రోజంతా నిరంతరంగా జరుగుతూనే ఉండాలి.సంత్ కబీర్ తన ప్రముఖ కావ్యంలో దీనిని ఇలా వ్యక్తపరిచాడు:సుమిరన్ కీ సుధి యోఁ కరో, జ్యాఊఁ గాగర్ పనిహారబోలత్ డోలత్ సురతి మేఁ, కహే కబీర విచార్‘ఒక గ్రామీణ మహిళ తన నెత్తిపై ఉన్న నీటి కుండని ఎలా గుర్తుంచుకుంటుందో అలాగే భగవంతుడిని గుర్తుంచుకొనుము. ఆమె తోటివారితో మాట్లాడుతూ ఉంటుంది, బాటలో నడుస్తూ ఉంటుంది, కానీ ఆమె మనస్సు ఆ పైనున్న కుండపైనే ఉంటుంది.’తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు కర్మ యోగ అభ్యాసము యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు.
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా । పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ।। 8 ।।
8
8
https://www.holy-bhagava…udio/008_008.mp3
అభ్యాస-యోగ — యోగ అభ్యాసము చేత; యుక్తేన — సర్వదా స్మరణలోనే నిమగ్నమై; చేతసా — మనస్సుచే; న అన్య గామినా — వేరే ఎటూ వెళ్లక; పరమం పురుషం — సర్వోత్కృష్ట పురుషుడు; దివ్యం — దివ్యమైన; యాతి — పొందును; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; అనుచింతయన్ — నిరంతర చింతన.
BG 8.8: అభ్యాసముతో, ఓ పార్థా, నిరంతరంగా మనస్సుని, ఎటూ పోనీయక, పరమేశ్వరుడైన నన్ను స్మరించుట యందే నిమగ్నం చేస్తే, నీవు తప్పకుండా నన్ను పొందగలవు.
మనస్సుని సర్వదా భగవంతుని యందే ధ్యానంలో నిమగ్నం చేయమని చెప్పిన ఉపదేశం, భగవద్గీతలో ఎన్నో సార్లు పదే పదే చెప్పబడింది. కొన్ని శ్లోకాలు ఇక్కడ చూడండి:అనన్య-చేతాః సతతం (8.14)తేషాం సతత-యుక్తానాం (10.10)మయ్యేవ మన ఆధత్స్వ (12.8)అభ్యాసము అంటే - మనస్సుకి భగవంతుని యందే ధ్యాస ఉంచే శిక్షణ మరియు అలవాటు చేయటం. ఇటువంటి అభ్యాసము ఏదో ఒక స్థిరమైన నిర్దిష్ట సమయాల్లో కాకుండా అవిచ్ఛిన్నంగా (నిరంతరంగా) రోజువారీ పనులతో పాటుగా చేయాలి.ఎప్పుడైతే మనస్సు భగవంతునితో అనుసంధానం అవుతుందో, ప్రాపంచిక విధులలో ఉన్నా అది శుద్ధి అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనం మనస్సుతో చేసే ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి, మనం శరీరంతో చేసే పనులు కావు. భక్తిలో నిమగ్నమవ్వాల్సింది మనస్సు మాత్రమే, మరియు శరణాగతి చేయాల్సింది కూడా మనస్సే. మరియు భగవత్ ధ్యాసలో మనస్సు నిమగ్నమవ్వటం పరిపూర్ణమయితే, మనకు భగవత్ కృప అందుతుంది. భగవంతుని కృప ద్వారానే, వ్యక్తి భౌతిక బంధాల నుండి విముక్తి పొందుతాడు, మరియు అనంతమైన దివ్య ఆనందాన్ని, దివ్య జ్ఞానాన్ని మరియు భగవంతుని దివ్య ప్రేమని పొందుతాడు. అటువంటి జీవాత్మ, ఈ శరీరముతోనే భగవత్ ప్రాప్తిని పొందుతుంది, మరియు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, భగవత్ సన్నిధానాన్ని చేరుకుంటుంది.
కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాంసమనుస్మరేద్యః । సర్వస్య ధాతారమచింత్యరూపమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ।। 9 ।। ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।। 10 ।।
9
8
https://www.holy-bhagava…/008_009-010.mp3
కవిం — కవి (సర్వజ్ఞుడు); పురాణమ్ — ప్రాచీనమైన; అనుశాసితారమ్ — శాసించేవాడు; అణోః — పరమాణువు కంటే; అణీయాంసమ్ — సూక్ష్మమైన; అనుస్మరేత్ — ఎల్లప్పుడూ స్మరిస్తూ; యః — ఎవరైతే; సర్వస్య — అన్నింటి యొక్క; ధాతారమ్ — ఆధారము; అచింత్య — ఊహింపశక్యము కాని; రూపమ్ — దివ్య రూపము; ఆదిత్య-వర్ణం — సూర్యుని వంటి ప్రకాశంతో; తమసః — అజ్ఞానపు చీకటి కి; పరస్తాత్ — అతీతంగా; ప్రయాణ-కాలే — మరణ సమయంలో; మనసా — మనస్సు; అచలేన — దృఢమైన; భక్త్యా — అత్యంత భక్తితో స్మరిస్తూ; యుక్తః — ఏకమై; యోగ-బలేన — యోగ బలముతో; చ — మరియు; ఏవ — నిజముగా; భ్రువోః — రెండు కనుబొమల; మధ్యే — మధ్యలో; ప్రాణమ్ — ప్రాణములు; ఆవేశ్య — కేంద్రీకరించి; సమ్యక్ — సంపూర్ణముగా; సః — అతడు; తం — అతనికి; పరం పురుషమ్ — సర్వోత్కృష్ట పరమేశ్వరుడు; ఉపైతి — లభించును; దివ్యమ్ — దివ్యమైన.
BG 8.9-10: భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.
భగవంతునిపై ధ్యానం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామము, లేదా ఆయన పరివారము – వీటిపై ధ్యానము చేయవచ్చు. ఇవన్నీ భగవంతునికి సంబంధించినవే, ఆయన కన్నా అభేదములే. మన మనస్సుని వీటిలో దేనిపైన అయినా అనుసంధానం చేస్తే మనస్సు భగవత్ ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది మరియు పరిశుద్ధి చెందుతుంది. కాబట్టి వీటిలో దేనినైనా లేదా అన్నింటినైనా మన ధ్యాన విషయంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ధ్యానం చేసుకోగలిగే భగవంతుని ఎనిమిది గుణములు వివరించబడ్డాయి.కవి అంటే కావ్యకర్త లేదా జ్ఞాని; దాని విస్తరింపుచే, సర్వజ్ఞుడు అని కూడా చెప్పవచ్చు. 7.26వ శ్లోకంలో పేర్కొనబడినట్టు, భగవంతుడికి భూత, వర్తమాన, మరియు భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు.పురాణ అంటే, ఆదిరహితము మరియు అత్యంత ప్రాచీనము అని. భగవంతుడే, సమస్త భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయములకు ఆదిమూలము, కానీ, ఆయన మాత్రం మరొక దేనినుండో రాలేదు మరియు ఆయన కన్నా ముందు ఉన్నది ఇక ఏమీ లేదు.అనుశాసితారం అంటే పరిపాలించేవాడు. భగవంతుడు ఈ విశ్వం నిర్వహించబడటానికి ఉన్న నియమనిబంధనలను సృష్టించేవాడు; ఆ విశ్వం యొక్క వ్యవహారాలను తనే స్వయంగా మరియు ఆయన నియమించిన దేవతల ద్వారా అజమాయిషీ చేస్తాడు. ఈ విధంగా, ప్రతీదీ ఆయన ఆధీనంలోనే ఉంటుంది.అణోరణీయాన్ అంటే సూక్ష్మాతి, సూక్ష్మమైనది. ఆత్మ అనేది భౌతిక పదార్థము కంటే సూక్ష్మమైనది, కానీ, భగవంతుడు ఆత్మలోపల స్థితుడై ఉంటాడు, కాబట్టి ఆత్మ కన్నా సూక్ష్మమైనవాడు.సర్వస్య ధాతా అంటే, అన్నింటికీ ఆధారమైనవాడు, అన్ని అలలకు ఆధారమైన సముద్రము అయినట్టుగా.అచింత్య రూపా అంటే, ఊహకందని స్వరూపము ఉన్నవాడు అని. మన మనస్సు కేవలం భౌతిక రూపములు మాత్రమే గ్రహింపగలదు కాబట్టి భగవంతుడు ఈ భౌతిక మనస్సు కంటే అతీతుడు. కానీ, ఆయన కృప చేస్తే, తన యోగమాయా శక్తి చేత ఆయన మన మనస్సుని దివ్యమైనదిగా చేస్తాడు. అప్పుడు మాత్రమే, ఆయన కృప చేత, ఆయన మన ఊహకు అందుతాడు.ఆదిత్య వర్ణ అంటే, ఆయన సూర్యుని వలె తేజోవంతుడు.తమసః పరస్తాత్ అంటే అజ్ఞానపు చీకటి కంటే అతీతుడు. ఎలాగైతే ఒక్కోసారి మబ్బులు సూర్యుడికి అడ్డు వచ్చినా, సూర్యుడు ఎప్పటికీ మబ్బులచే కప్పివేయబడలేడో, అదేవిధంగా, భగవంతుడు కూడా, ఈ లోకంలో మాయతో కాంటాక్ట్ అయినా, భౌతికశక్తి మాయచే ఆయన, కప్పివేయబడలేడు.భక్తి ప్రక్రియలో, మనస్సు భగవంతుని యొక్క రూపము, గుణములు, లీలలు వంటి వాటి పైనే నిమగ్నమౌతుంది. కేవలం భక్తిని మాత్రమే చేస్తే దానిని శుద్ధ భక్తి అంటారు. దానిని అష్టాంగ యోగ తో పాటుగా చేస్తే దానిని యోగ-మిశ్ర భక్తి (అష్టాంగ యోగ సాధనతో కలిపి చేసే భక్తి). పదవ శ్లోకం నుండి పదమూడవ శ్లోకం వరకు శ్రీ కృష్ణుడు యోగ మిశ్ర భక్తి ని వివరిస్తున్నాడు.భగవద్గీత యొక్క ఒక అధ్బుతమైన గుణం ఏమిటంటే అది చాలా రకాల ‘సాధన’ లను పేర్కొన్నది; ఎన్నో రకాల వైవిధ్యం, వేరు వేరు రకాల ఆచారాలు, కుంటుంబాలు, వ్యక్తిత్వాల నుండి వచ్చిన మనుష్యులను అక్కున చేర్చుకున్నది. పాశ్చాత్య విద్యావంతులు గురువు సహాయం లేకుండా హిందూ వేద శాస్త్రాలను చదవటానికి ప్రయత్నిస్తే, వారు చాల సార్లు ఎన్నో రకాల మార్గాలు, ఉపదేశాలు, మరియు తత్త్వ కోణాలచే అయోమయానికి గురి అవుతారు. కానీ, ఈ వైవిధ్యం నిజానికి ఒక వరం. అనంతమైన పూర్వ జన్మ సంస్కారాల వలన మనందరికీ వేర్వేరు స్వభావాలు, అభిరుచులు ఉంటాయి. ఒక నలుగురు, బట్టలు కొనటానికి వెళితే, వారందరూ వేర్వేరు రంగుల, వేర్వేరు ఫాషనుల, వేర్వేరు రకాల వాటిని ఎంచుకుంటారు. ఒకవేళ కొట్టులో ఒకే రకం రంగు, ఒకే రకం రూపము ఉన్న బట్టలు ఉంటే, అది మానవులలో అంతర్గతంగా ఉన్న వైవిధ్యాన్ని తృప్తి పరచలేదు. అదే విధంగా, ఆధ్యాత్మిక పథంలో కూడా, జనులు ఎన్నో రకాల సాధనలు పూర్వ జన్మలలో చేసి ఉండవచ్చు. వైదిక శాస్త్రాలు ఆ వైవిధ్యాన్ని గౌరవిస్తాయి, అదే సమయంలో ‘భక్తి’యే వీటన్నిటినీ ఉమ్మడిగా ఉంచి ఒక్కటిగా కట్టివేసే త్రాడు అని నొక్కిచెప్పాయి.అష్టాంగ యోగములో, ప్రాణశక్తి, వెన్నెముకలో సుషుమ్నా నాడి గుండా పైకి లేపబడుతుంది. అది, మూడవ కన్ను (ఆంతర కన్ను) స్థానమైన, కనుబొమల మధ్యకు తేబడుతుంది. తదుపరి, ఆ పరమేశ్వరుడైన భగవంతుని యందే గాఢమైన భక్తితో కేంద్రీకరించబడుతుంది.
కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాంసమనుస్మరేద్యః । సర్వస్య ధాతారమచింత్యరూపమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ।। 9 ।। ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।। 10 ।।
10
8
https://www.holy-bhagava…/008_009-010.mp3
కవిం — కవి (సర్వజ్ఞుడు); పురాణమ్ — ప్రాచీనమైన; అనుశాసితారమ్ — శాసించేవాడు; అణోః — పరమాణువు కంటే; అణీయాంసమ్ — సూక్ష్మమైన; అనుస్మరేత్ — ఎల్లప్పుడూ స్మరిస్తూ; యః — ఎవరైతే; సర్వస్య — అన్నింటి యొక్క; ధాతారమ్ — ఆధారము; అచింత్య — ఊహింపశక్యము కాని; రూపమ్ — దివ్య రూపము; ఆదిత్య-వర్ణం — సూర్యుని వంటి ప్రకాశంతో; తమసః — అజ్ఞానపు చీకటి కి; పరస్తాత్ — అతీతంగా; ప్రయాణ-కాలే — మరణ సమయంలో; మనసా — మనస్సు; అచలేన — దృఢమైన; భక్త్యా — అత్యంత భక్తితో స్మరిస్తూ; యుక్తః — ఏకమై; యోగ-బలేన — యోగ బలముతో; చ — మరియు; ఏవ — నిజముగా; భ్రువోః — రెండు కనుబొమల; మధ్యే — మధ్యలో; ప్రాణమ్ — ప్రాణములు; ఆవేశ్య — కేంద్రీకరించి; సమ్యక్ — సంపూర్ణముగా; సః — అతడు; తం — అతనికి; పరం పురుషమ్ — సర్వోత్కృష్ట పరమేశ్వరుడు; ఉపైతి — లభించును; దివ్యమ్ — దివ్యమైన.
BG 8.9-10: భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.
భగవంతునిపై ధ్యానం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామము, లేదా ఆయన పరివారము – వీటిపై ధ్యానము చేయవచ్చు. ఇవన్నీ భగవంతునికి సంబంధించినవే, ఆయన కన్నా అభేదములే. మన మనస్సుని వీటిలో దేనిపైన అయినా అనుసంధానం చేస్తే మనస్సు భగవత్ ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది మరియు పరిశుద్ధి చెందుతుంది. కాబట్టి వీటిలో దేనినైనా లేదా అన్నింటినైనా మన ధ్యాన విషయంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ధ్యానం చేసుకోగలిగే భగవంతుని ఎనిమిది గుణములు వివరించబడ్డాయి.కవి అంటే కావ్యకర్త లేదా జ్ఞాని; దాని విస్తరింపుచే, సర్వజ్ఞుడు అని కూడా చెప్పవచ్చు. 7.26వ శ్లోకంలో పేర్కొనబడినట్టు, భగవంతుడికి భూత, వర్తమాన, మరియు భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు.పురాణ అంటే, ఆదిరహితము మరియు అత్యంత ప్రాచీనము అని. భగవంతుడే, సమస్త భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయములకు ఆదిమూలము, కానీ, ఆయన మాత్రం మరొక దేనినుండో రాలేదు మరియు ఆయన కన్నా ముందు ఉన్నది ఇక ఏమీ లేదు.అనుశాసితారం అంటే పరిపాలించేవాడు. భగవంతుడు ఈ విశ్వం నిర్వహించబడటానికి ఉన్న నియమనిబంధనలను సృష్టించేవాడు; ఆ విశ్వం యొక్క వ్యవహారాలను తనే స్వయంగా మరియు ఆయన నియమించిన దేవతల ద్వారా అజమాయిషీ చేస్తాడు. ఈ విధంగా, ప్రతీదీ ఆయన ఆధీనంలోనే ఉంటుంది.అణోరణీయాన్ అంటే సూక్ష్మాతి, సూక్ష్మమైనది. ఆత్మ అనేది భౌతిక పదార్థము కంటే సూక్ష్మమైనది, కానీ, భగవంతుడు ఆత్మలోపల స్థితుడై ఉంటాడు, కాబట్టి ఆత్మ కన్నా సూక్ష్మమైనవాడు.సర్వస్య ధాతా అంటే, అన్నింటికీ ఆధారమైనవాడు, అన్ని అలలకు ఆధారమైన సముద్రము అయినట్టుగా.అచింత్య రూపా అంటే, ఊహకందని స్వరూపము ఉన్నవాడు అని. మన మనస్సు కేవలం భౌతిక రూపములు మాత్రమే గ్రహింపగలదు కాబట్టి భగవంతుడు ఈ భౌతిక మనస్సు కంటే అతీతుడు. కానీ, ఆయన కృప చేస్తే, తన యోగమాయా శక్తి చేత ఆయన మన మనస్సుని దివ్యమైనదిగా చేస్తాడు. అప్పుడు మాత్రమే, ఆయన కృప చేత, ఆయన మన ఊహకు అందుతాడు.ఆదిత్య వర్ణ అంటే, ఆయన సూర్యుని వలె తేజోవంతుడు.తమసః పరస్తాత్ అంటే అజ్ఞానపు చీకటి కంటే అతీతుడు. ఎలాగైతే ఒక్కోసారి మబ్బులు సూర్యుడికి అడ్డు వచ్చినా, సూర్యుడు ఎప్పటికీ మబ్బులచే కప్పివేయబడలేడో, అదేవిధంగా, భగవంతుడు కూడా, ఈ లోకంలో మాయతో కాంటాక్ట్ అయినా, భౌతికశక్తి మాయచే ఆయన, కప్పివేయబడలేడు.భక్తి ప్రక్రియలో, మనస్సు భగవంతుని యొక్క రూపము, గుణములు, లీలలు వంటి వాటి పైనే నిమగ్నమౌతుంది. కేవలం భక్తిని మాత్రమే చేస్తే దానిని శుద్ధ భక్తి అంటారు. దానిని అష్టాంగ యోగ తో పాటుగా చేస్తే దానిని యోగ-మిశ్ర భక్తి (అష్టాంగ యోగ సాధనతో కలిపి చేసే భక్తి). పదవ శ్లోకం నుండి పదమూడవ శ్లోకం వరకు శ్రీ కృష్ణుడు యోగ మిశ్ర భక్తి ని వివరిస్తున్నాడు.భగవద్గీత యొక్క ఒక అధ్బుతమైన గుణం ఏమిటంటే అది చాలా రకాల ‘సాధన’ లను పేర్కొన్నది; ఎన్నో రకాల వైవిధ్యం, వేరు వేరు రకాల ఆచారాలు, కుంటుంబాలు, వ్యక్తిత్వాల నుండి వచ్చిన మనుష్యులను అక్కున చేర్చుకున్నది. పాశ్చాత్య విద్యావంతులు గురువు సహాయం లేకుండా హిందూ వేద శాస్త్రాలను చదవటానికి ప్రయత్నిస్తే, వారు చాల సార్లు ఎన్నో రకాల మార్గాలు, ఉపదేశాలు, మరియు తత్త్వ కోణాలచే అయోమయానికి గురి అవుతారు. కానీ, ఈ వైవిధ్యం నిజానికి ఒక వరం. అనంతమైన పూర్వ జన్మ సంస్కారాల వలన మనందరికీ వేర్వేరు స్వభావాలు, అభిరుచులు ఉంటాయి. ఒక నలుగురు, బట్టలు కొనటానికి వెళితే, వారందరూ వేర్వేరు రంగుల, వేర్వేరు ఫాషనుల, వేర్వేరు రకాల వాటిని ఎంచుకుంటారు. ఒకవేళ కొట్టులో ఒకే రకం రంగు, ఒకే రకం రూపము ఉన్న బట్టలు ఉంటే, అది మానవులలో అంతర్గతంగా ఉన్న వైవిధ్యాన్ని తృప్తి పరచలేదు. అదే విధంగా, ఆధ్యాత్మిక పథంలో కూడా, జనులు ఎన్నో రకాల సాధనలు పూర్వ జన్మలలో చేసి ఉండవచ్చు. వైదిక శాస్త్రాలు ఆ వైవిధ్యాన్ని గౌరవిస్తాయి, అదే సమయంలో ‘భక్తి’యే వీటన్నిటినీ ఉమ్మడిగా ఉంచి ఒక్కటిగా కట్టివేసే త్రాడు అని నొక్కిచెప్పాయి.అష్టాంగ యోగములో, ప్రాణశక్తి, వెన్నెముకలో సుషుమ్నా నాడి గుండా పైకి లేపబడుతుంది. అది, మూడవ కన్ను (ఆంతర కన్ను) స్థానమైన, కనుబొమల మధ్యకు తేబడుతుంది. తదుపరి, ఆ పరమేశ్వరుడైన భగవంతుని యందే గాఢమైన భక్తితో కేంద్రీకరించబడుతుంది.
యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః । యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ।। 11 ।।
11
8
https://www.holy-bhagava…udio/008_011.mp3
యత్ — ఏదైతే; అక్షరం — వినాశము చెందనిది; వేద-విదః — వేద పండితులు; వదంతి — వివరిస్తారు; విశంతి — ప్రవేశిస్తారు; యత్ — ఏదైతే; యతయః — గొప్ప ఋషులు; వీత-రాగాః — మమకార-ఆసక్తి లేకుండా; యత్ — ఏదైతే; ఇచ్చంతః — కోరుతూ; బ్రహ్మచర్యః — బ్రహ్మచర్యము; చరంతి — ఆచరిస్తారు; తత్ — అది; తే — నీకు; పదం — లక్ష్యము; సంగ్రహేణ — క్లుప్తంగా; ప్రవక్ష్యే — నేను వివరిస్తాను.
BG 8.11: వేద పండితులు ఆయనను నాశము (క్షయము) చెందని వాడు అని చెప్తారు; ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తముగా విశదపరుస్తాను.
వేదములలో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలవబడ్డాడు. వాటిలో కొన్ని: సత్, అవ్యాకృత్, ప్రాణ్, ఇంద్ర, దేవ, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, మరియు పురుష్. ఎన్నో చోట్ల, భగవంతుని నిరాకార తత్త్వాన్ని సూచించేటప్పుడు, ఆయన 'అక్షర' అన్న పేరుతో కూడా పిలవబడ్డాడు. అక్షర అంటే 'నాశము లేనిది' అని అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్ఠతః (3.8.9)‘అక్షరుడైన వాని బ్రహ్మాండమైన శక్తి చేతనే సూర్యుడు, చంద్రుడు తమ స్థానాల్లో నిలుప బడుతున్నారు.’ ఈశ్వరుని నిరాకార తత్త్వాన్ని పొందటానికి, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో, యోగ-మిశ్ర-భక్తిని వివరిస్తున్నాడు. సంగ్రహేణ అంటే ‘క్లుప్తంగా’ అని అర్థం. మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఈ మార్గాన్ని, ఆయన క్లుప్తంగా మాత్రమే వివరిస్తున్నాడు ఎందుకంటే ఈ మార్గము అందరికీ అనుకూలమైనది కాదు.ఈ మార్గంలో వ్యక్తి చాలా తీవ్రమైన నియమనిష్ఠలను పాటించాలి, ప్రాపంచిక కోరికలని వదిలి వేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మరియు ఖచ్చితమైన ఇంద్రియనిగ్రహము అలవర్చుకోవాలి. బ్రహ్మచర్యము ద్వారా వ్యక్తి యొక్క శారీరక శక్తి సంరక్షించబడి, ఆ తరువాత సాధన ద్వారా అది ఆధ్యాత్మిక శక్తిగా మార్చబడుతుంది. ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకోవటానికి, బ్రహ్మచర్యాన్ని పాటించే సాధకుడు, తన జ్ఞాపక శక్తిని మరియు బుద్ధి కుశలతను పెంచుకుంటాడు. ఈ విషయం ఇంతకు పూర్వమే 6.14వ శ్లోకంలో వివరంగా చెప్పబడినది.
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ । మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమ్ ఆస్థితో యోగధారణామ్ ।। 12 ।।
12
8
https://www.holy-bhagava…udio/008_012.mp3
సర్వ-ద్వారాణి — అన్ని ద్వారములు; సంయమ్య — నియంత్రించి; మనః — మనస్సు; హృది — హృదయ స్థానములో; నిరుధ్య — కేంద్రీకరించి; చ — మరియు; మూర్ధ్ని — మూర్ధ స్థానములో (తల); ఆధాయ — స్థిత పరిచి; ఆత్మనః — ఆత్మ యొక్క; ప్రాణం — ప్రాణము; ఆస్థితః — స్థితమై ఉండి; యోగ-ధారణామ్ — యోగ ఏకాగ్రత
BG 8.12: శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి, మనస్సుని హృదయ స్థానము యందే నిలిపి, ప్రాణములను మూర్ధ్న్యా (తల) స్థానములోకి లాగి, వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానములో స్థితుడై ఉండవలెను.
సంసారము (ప్రాపంచిక వస్తువిషయములు) మన మనస్సులోకి ఇంద్రియముల ద్వారా ప్రవేశిస్తాయి. మనం మొదట భౌతిక వస్తువిషయములను చూస్తాము, వింటాము, స్పర్శిస్తాము, రుచి చూస్తాము, మరియు వాసన చూస్తాము. తరువాత, మనస్సు వాటి మీద ఆలోచిస్తూ ఉంటుంది. నిరంతర చింతన, అనురాగాన్ని/మమకారాన్ని సృష్టిస్తుంది, ఇది సహజంగానే మనస్సులో మరిన్ని ఆలోచనలని పునరావృత్తం చేస్తుంది. ధ్యానమును అభ్యాసము చేసే వారు, ఈ విషయాన్ని ఆలక్ష్యం చేస్తే, నిగ్రహింపబడని ఇంద్రియములు పుట్టించే నిరంతర ప్రాపంచిక తలంపులతో పోరాడాల్సి వస్తుంది. కాబట్టి, శరీర ద్వారాలని కావలికాయమనే ఉపదేశాన్ని శ్రీ కృష్ణుడు ఇక్కడ ఇస్తున్నాడు. 'సర్వ-ద్వారాణి-సంయమ్య' అంటే 'శరీరము లోనికి ప్రవేశానికి ఉండే అన్ని దారులను నియత్రించుట' అని. ఇది, ఇంద్రియములను తమ స్వాభావిక బాహ్య ప్రవృత్తి నుండి నియంత్రించుటను సూచిస్తుంది. 'హృది నిరుధ్య' అంటే, 'మనస్సుని హృదయ స్థానము యందు కట్టివేయుట' అని అర్థం. ఇది భక్తి యుక్త భావనలను మనస్సు నుండి అక్కడ స్థితుడై ఉన్న అక్షర పరమేశ్వరుని దిశగా మరల్చమని సూచిస్తుంది. యోగ-ధారణామ్ అంటే 'అంతఃకరణమును భగవంతుని యందే ఏకీకృతం చేయుట' అని. ఇది, సంపూర్ణ ఏకాగ్రతతో ఆయన మీదే ధ్యానం చేయటాన్ని సూచిస్తున్నది.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ । యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ।। 13 ।।
13
8
https://www.holy-bhagava…udio/008_013.mp3
ఓం — ఈశ్వరుని నిరాకార తత్వాన్ని సూచించే పవిత్ర శబ్దం; ఇతి — ఈ విధంగా; ఏక-అక్షరం — ఒకే అక్షరంతో ఉన్న; బ్రహ్మ — పరమ సత్యము; వ్యాహరన్ — జపిస్తూ; మాం — నన్ను (శ్రీ కృష్ణుడు); అనుస్మరన్ — స్మరిస్తూ; యః — ఎవరైతే; ప్రయాతి — వెళ్లిపోతారో; త్యజన్ — విడిచిపెడుతూ; దేహం — శరీరము; సః — అతడు; యాతి — పొందును; పరమాం — అత్యున్నతమైన; గతిం — లక్ష్యము.
BG 8.13: పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమ గతిని పొందును.
ప్రణవము అని కూడా పిలవబడే ఈ పవిత్రమైన ఓం-కారము, శబ్ద రూపములో ఉన్న బ్రహ్మన్ (పరమేశ్వరుని యొక్క నిర్గుణ నిరాకార తత్వము) ను సూచిస్తుంది. కాబట్టి, భగవంతుని లాగానే నాశములేనిదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ, శ్రీ కృష్ణుడు, అష్టాంగ-యోగ సాధనా పద్ధతిలో ధ్యానము చేసే విధానాన్ని చెప్తున్నాడు కాబట్టి; మనస్సుని కేంద్రీకరించటానికి, నియమనిష్ఠలను, బ్రహ్మచర్యమును పాటిస్తూ ‘ఓం’ కారముని జపిస్తుండాలని అంటున్నాడు. వేద శాస్త్రాలు "ఓం" కారమును ‘అనాహత నాదము’ అని కూడా చెప్తాయి. ఈ శబ్దము సమస్త సృష్టి యందు వ్యాపించి ఉంటుంది, దీనితో అనుసంధానం అయ్యే యోగులకు ఇది వినపడుతుంది.బైబిల్ ఇలా పేర్కొంటున్నది, ‘ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.’ (In the beginning was the Word, and the Word was with God, and the Word was God.” John 1:1). వేద శాస్త్రాలు కూడా భగవంతుడు మొట్టమొదట శబ్దమునునే సృష్టించాడు అని, శబ్దము నుండి ఆకాశమును సృష్టించి, ఆ తరువాత మిగతా సృష్టి చేయటానికి పురోగమించాడు అని పేర్కొంటున్నాయి. ఆ మూల శబ్దమే ‘ఓం’. ఈ కారణంగా, వైదిక తత్త్వంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. దీనిని 'మహా వాక్యము', అంటే వేదముల సర్వోన్నత శబ్దము అని అంటారు. దీనినే బీజ మంత్రము అని కూడా అంటారు, ఎందుకంటే అది తరచుగా హ్రీం, క్లీం వంటి వాటిలాగా వేద మంత్రాల ప్రారంభంలో జత చేయబడుతుంది. ఈ ఓంకార నాదములో మూడు అక్షరములు ఉంటాయి: అ.... ఉ....మ. ఓం-కారము యొక్క సరియైన జప పద్ధతిలో, మొదట ‘అ’ కారమును నాభి స్థానము నుండి, గొంతు-నోరు తెరిచి జపిస్తారు. ఇది, గొంతు మధ్యనుండి వచ్చే ‘ఉ’ కారములో విలీనమవుతుంది. ఈ ప్రక్రియ ‘మ’ కారమును పెదవులు మూసి అనటంతో పూర్తవుతుంది. ఈ మూడు భాగాలు అ.... ఉ....మ.. లకు ఎన్నో అర్థాలు మరియు వ్యాఖ్యానాలు ఉన్నాయి. భక్తులకు ‘ఓం’ అనేది భగవంతుని నిరాకార తత్త్వానికి ఉన్న పేరు.ఈ ప్రణవ నాదము, అష్టాంగ యోగములో ఉన్న ధ్యాన విషయము. భక్తి యోగ మార్గములో, భక్తులు, భగవంతుని యొక్క నామములు అయిన రామ, కృష్ణ, శివ మొదలైన పేర్ల మీద ధ్యానం చెయటానికి మొగ్గు చూపుతారు; ఎందుకంటే ఈ భాగవన్నామములలో భగవంతుని పరమానందము యొక్క మరింత తియ్యదనము ఉంటుంది. ఈ తేడా, బిడ్డ గర్భంలో ఉండటానికి మరియు ఒళ్లో ఉండటానికి ఉన్న లాంటిది. ఒళ్లో ఉన్న బిడ్డ, గర్భంలో ఉన్న బిడ్డ కంటే , ఎంతో ఎక్కువ తియ్యని అనుభూతిని ఇస్తుంది.మన ధ్యానము యొక్క అంతిమ పరీక్ష మరణ సమయమే. మృత్యువు యొక్క తీవ్ర బాధ లో కూడా, అంతఃకరణమును భగవంతుని యందే నిలుపగలిగిన వారు ఈ పరీక్షలో విజయం సాధించినట్టు. అటువంటి వ్యక్తులు, శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత, అత్యున్నత లక్ష్యాన్ని పొందుతారు. ఇది చాలా క్లిష్టమైనది మరియు దీనికి ఒక జీవిత కాలపు అభ్యాసము అవసరం. ఇక తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇటువంటి ప్రావీణ్యము సాధించటానికి ఉన్న సునాయాస మార్గాన్ని ఇస్తున్నాడు.
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః । తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ।। 14 ।।
14
8
https://www.holy-bhagava…udio/008_014.mp3
అనన్య-చేతాః — మనస్సు ఎటూ చలింపక; సతతం — ఎల్లప్పుడూ; యః — ఎవరైతే; మాం — నన్ను; స్మరతి — స్మరించునో; నిత్యశః — నిరంతరమూ; తస్య — అతనికి; అహం — నేను; సులభః — సులభముగానే లభింతును; పార్థ — అర్జునా, ప్రిథ తనయుడా; నిత్య — ఎల్లప్పుడూ; యుక్తస్య — నిమగ్నమై; యోగినః — యోగులలో.
BG 8.14: ఓ పార్థా, అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు, నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి.
భగవద్గీత అంతటా శ్రీ కృష్ణుడు చాలా సార్లు భక్తిని వక్కాణించాడు. ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు నిర్గుణ నిరాకార భగవత్ తత్త్వంపై ధ్యాసను వివరించాడు. అది మాధుర్యరహితమే కాక చాలా క్లిష్టమయినది కూడా. కాబట్టి ఇక్కడ ఒక సులువైన ప్రత్యామ్నాయమును ఇస్తున్నాడు; అదే ఆయన యొక్క సగుణ సాకార రూపము పై ధ్యానము - కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు మొదలగు వాటిపై. ఆయన దివ్య మంగళ స్వరూపము యొక్క నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారము, అన్నీ ఇందులో భాగమే.భగవద్గీత మొత్తంలో ఇదొక్కటే చోట శ్రీ కృష్ణుడు తాను సులభుడను అని అన్నాడు. కానీ, ఆయన పెట్టిన ఒక షరతు ఏమిటంటే, అనన్య-చేతాః , మనస్సు కేవలం ఆయన యందు మాత్రమే నిమగ్నమై ఉండాలి, వేరే దేని మీద ఉండవలదు. ఇక్కడ, అనన్య అన్న పదం చాలా ముఖ్యమైనది. భాషా పరంగా దీని అర్థం, న-అన్య అంటే 'వేరే ఇతరమైనది ఏదీ కాకుండా'. మనస్సు అనేది భగవంతుని యందు మాత్రమే నిమగ్నమవ్వాలి, వేరే ఏ ఇతర మైన వాటి మీదా కాకూడదు. ఈ 'అనన్య' అనే నియమము భగవద్గీతలో చాలా సార్లు పదేపదే చెప్పబడింది.అనన్యాశ్ చింతయంతో మాం (9.22)తం ఏవ శరణం గచ్ఛ (18.62)మాం ఏకం శరణం వ్రజ (18.66)అనన్య భక్తి అనే విషయం ఇతర శాస్త్ర/పురాణాల్లో కూడా ఉద్ఘాటించబడినది.మాం ఏకం ఏవ శరణం ఆత్మానం సర్వ-దేహినామ్(భాగవతం 11.12.15)‘సమస్త ప్రాణులకు పరమాత్మ నైన నాకు మాత్రమే శరణాగతి చేయుము.’ఏక భరోసో ఏక బల ఏక్ ఆస విస్వాస (రామచరితమానస్)‘నాకు ఉన్నది ఒకేఒక్క ఆధారం, ఒకేఒక్క బలము, ఒకేఒక్క విశ్వాసము, ఒకేఒక్క ఆశ్రయము - అదే శ్రీ రామచంద్రమూర్తి’అన్యాశ్రయాణామ్ త్యాగో ఽనన్యతా(నారద భక్తి దర్శన్, 10వ సూత్రము)‘మిగతా అన్ని ఆశ్రయములను విడిచిపెట్టి కేవలం భగవంతునికే చెందిన వాడివి అవ్వుము.’అనన్య భక్తి అంటే, వేరే ఏ ఇతరమైనదీ లేకుండా, మనస్సు కేవలం ఆ దివ్య మంగళ స్వరూపము యొక్క - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు మరియు పరివారము - లలోనే నిమగ్నమై ఉండాలి. దీనిలో ఉన్న తర్కం చాలా సరళమైనది. సాధనా యొక్క లక్ష్యం మనస్సుని పరిశుద్ధి చేయటమే, ఇది కేవలం మనస్సుని అత్యంత పవిత్రమైన భగవంతునికి అనుసంధానం చేయటం ద్వారానే సాధ్యము. కానీ, మనం మనన్సుని భగవత్ ధ్యానం ద్వారా శుద్ది చేసినప్పటికీ, మరల దానిని ప్రాపంచికత్వంలో ముంచి మలిన పరిస్తే, మరిక ఎంత కాలం ప్రయత్నించినా, మనము దాన్ని శుద్ధి చేయలేము.చాలా మంది చేసే తప్పు సరిగ్గా ఇదే. వారు భగవంతుడిని ప్రేమిస్తారు, కానీ, అదే సమయంలో, ప్రాపంచిక వస్తువులను, మనుషులను కూడా ప్రేమిస్తూ వాటితో అనురాగం పెంచుకుంటారు. దీనితో, సాధన ద్వారా పొందిన లాభమంతా ప్రాపంచిక మమకారాసక్తి వలన నష్టమైపోతుంది. బట్టని శుద్ధి చేయటానికి దానిపై సబ్బు రాస్తూ, అదే సమయంలో దానిపై దుమ్ము వేస్తుంటే, మన శ్రమ అంతా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, కేవలం భక్తి కాదు, ఆయన పట్ల అనన్య భక్తి మాత్రమే మనం ఆయనను సులభంగా పొందేటట్లు చేస్తుంది అని.
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ । నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిమ్ పరమాం గతాః ।। 15 ।।
15
8
https://www.holy-bhagava…udio/008_015.mp3
మామ్ — నన్ను; ఉపేత్య — పొందిన తరువాత; పునః — మళ్లీ; జన్మ — పుట్టుక; దుఃఖ-ఆలయమ్ — ఈ దుఃఖములకు నిలయము లో; అశాశ్వతమ్ — తాత్కాలికమైన; న — ఉండదు; ఆప్నువంతి — పొందిన; మహా-ఆత్మానః — మహాత్ములు; సంసిద్ధిమ్ — పరిపూర్ణత; పరమాం — సర్వోత్కృష్టమైనది; గతాః — సాధించి.
BG 8.15: నన్ను పొందిన పిదప, మహాత్ములకు, ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు, ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు.
భగవత్ ప్రాప్తి పొందితే వచ్చే ఫలితం ఏమిటి? భగవత్ ప్రాప్తిని పొందిన వారు ఈ జనన-మరణ చక్రం నుండి విడుదల పొంది, భగవంతుని దివ్య ధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా వారు, తిరిగి, దుఃఖములకు నిలయమైన ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవలసిన అవసరం లేదు. పుట్టేటప్పుడు, నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఎంతో బాధా కరమైన స్థితిని అనుభవిస్తాము. తదుపరి పసి బిడ్డలుగా, మనకున్న అవసరాలను మనం వ్యక్త పరచలేకుండా ఉండి, ఏడుస్తాము. యుక్తవయస్సులో శారీరక అవసరాల కోసం తంటాలుపడాల్సి వస్తుంది, దీనితో మానసిక క్షోభ అనుభవిస్తాము. వైవాహిక జీవితంలో దాంపత్య భాగస్వామి యొక్క విలక్షణస్వభావాలని భరించాలి. ముసలితనం చేరుకున్నప్పుడు, శారీరక దౌర్భల్యములను అనుభవించాలి. జీవితం మొత్తం - మన స్వంత శరీరము-మనస్సుల నుండి జనించే బాధలు, ఇతరుల ప్రవర్తన, ప్రతికూల పరిస్థితుల - నుండి జనించే కష్టాలను అనుభవించాలి. చివరికి, మన మృత్యు కాలంలో పడే యాతనని కూడా అనుభవించాలి. ఈ మొత్తం దురవస్థ అర్థరహితమేమీ కాదు; భగవంతుని బృహత్పథకంలో దీనికి ఒక ప్రయోజనం ఉంది. భౌతిక ప్రపంచమే మన శాశ్వత స్థానం కాదు అన్న విషయాన్ని బోధపరుస్తాయి. అది భగవంతునికి విముఖమై ఉన్న మనలాంటి జీవాత్మలను సంస్కరించే ప్రదేశం వంటిది. ఇక్కడ మనం దుఃఖం అనుభవించక పొతే, భగవంతునికై అభిలాషను ఎన్నటికీ పెంపొందించుకోలేము. ఉదాహరణకి, మనం నిప్పులో చెయ్యి పెడితే రెండు పరిణామాలు జరుగుతాయి - చర్మం కాలిపోవటం ప్రారంభమౌతుంది మరియు నాడీ వ్యవస్థ, మండే యాతన యొక్క అనుభూతిని మెదడులో కలుగచేస్తుంది. చర్మం కాలిపోవటం మంచిదికాదు, కానీ ఆ బాధ యొక్క అనుభూతి మంచిదే. మనం ఈ బాధను అనుభవించకపొతే మనం చేతిని మంట నుండి వెనక్కు తీయము, దీనితో అది మరింత ఎక్కువ చెడిపోతుంది. నొప్పి/బాధ అనేది ఏదో తప్పు జరుగుతున్నది, దానిని సరిదిద్దాలి - అన్న దానికి సూచకం. అదే విధంగా, భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే బాధ - మన అంతఃకరణ లోపభూయిష్టంగా ఉంది మరియు మనకు భౌతిక దృక్పథం నుండి భగవంతునితో ఏకత్వం దిశగా పురోగతి అవసరం - అన్న విషయాన్ని సూచిస్తున్నది. చిట్టచివరికి, మన పరిశ్రమతో మనం దేనికైతే అర్హత సంపాదించామో, అదే మనకు లభిస్తుంది. ఎవరైతే భగవంతునికి వ్యతిరేక దిశలో ఉండిపోతారో వారు ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు; అదే సమయంలో, ఎవరైతే భగవంతుని పట్ల అనన్య భక్తిని సాధిస్తారో వారు ఆయన దివ్య ధామాన్ని చేరుకుంటారు.
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున । మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ।। 16 ।।
16
8
https://www.holy-bhagava…udio/008_016.mp3
ఆ-బ్రహ్మ-భువనాత్ — బ్రహ్మలోక పర్యంతమూ; లోకాః — లోకములు; పునః-ఆవర్తినః — పునర్జన్మకు లోబడి; అర్జున — అర్జునా; మామ్ — నన్ను; ఉపేత్య — పొందిన పిదప; తు — కానీ; కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి పుత్రుడా; పునః-జన్మ — మళ్లీ పుట్టుట; న విద్యతే — ఉండదు.
BG 8.16: బ్రహ్మలోక పర్యంతమూ, ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో, నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు, ఓ అర్జునా. కానీ నా ధామమునకు చేరిన పిదప, ఓ కుంతీ పుత్రుడా, ఇక మరల పునర్జన్మ ఉండదు.
వేద శాస్త్రములు, భూలోకం కన్నా నిమ్న స్థాయిలో ఏడు లోకాలున్నాయని వివరించాయి - అవి - తళ, అతళ, వితళ, సుతళ, తలాతళ, రసాతళ, పాతాళ లోకాలు. వీటినే నరకములు అంటారు. భూలోకంలో మొదలిడి ఇంకా పైన కూడా మొత్తం ఏడు లోకాలు ఉన్నాయి - భూః , భువః , స్వః , మహః , జనః , తపః , సత్యః అనేవి ఇవి. ఈ పై వాటిని స్వర్గము లేదా దేవ లోకాలు అంటారు. వేరే మత సాంప్రదాయాల్లో కూడా ఏడు స్వర్గాలు ఉన్నట్లుగా సూచించబడినది. జుడాఇసం లో ఏడు స్వర్గాల పేర్లు, తాల్మడ్ (Talmud) లో చెప్పబడ్డాయి; దీనిలో అరబోత్ (Araboth) అనేది అన్నిటికన్నా ఉన్నతమైనదిగా చెప్పబడింది (Psalm 68.4 కూడా చూడండి). ఇస్లాం ధర్మంలో కూడా ఏడు స్వర్గాలు చెప్పబడ్డాయి – దీనిలో ‘సాత్ వాఁ ఆస్మాన్’ sātvāñ āsmān (ఏడవ ఆకాశం) అత్యున్నత మైనదిగా ఎంచబడింది. ఈ వివిధ రకాల అస్తిత్వ స్థాయిలనే వేర్వేరు లోకాలు అంటాము. మన విశ్వంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కెల్లా ఉన్నతమైనది బ్రహ్మ దేవుని ధామము, బ్రహ్మ-లోకం, అంటారు. ఈ లోకాలన్నీ మాయ యొక్క పరిధిలోనే ఉన్నాయి మరియు ఈ లోకాల్లో నివాసము ఉంటున్నవారు జన్మ మరణ చక్రం లోనికి గురౌతూనే ఉంటారు. శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం శ్లోకంలో వీటిని దుఃఖాలయం మరియు అశాశ్వతం అని చెప్పి ఉన్నాడు. దేవతల అధిపతి అయిన ఇంద్రుడు కూడా, ఒకానొక రోజు మరణించాల్సిందే. మన పురాణాల కథనం ప్రకారం: ఒకసారి ఇంద్రుడు, దేవశిల్పి విశ్వకర్మ - ను ఒక అతి పెద్ద రాజభవనం నిర్మించమని పురమాయించాడు. ఎన్నటికీ పూర్తికాని ఆ నిర్మాణ పనికి అలసిపోయిన విశ్వకర్మ భగవంతుడిని ప్రార్థించాడు. భగవంతుడు అక్కడికి వచ్చి ఇంద్రుడిని ‘ఎంత పెద్ద భవనమో! ఎంత మంది విశ్వకర్మ దీనిలో నిమగ్నమైనారు?’ అని అడిగాడు. ఈ ప్రశ్నతో ఇంద్రుడు ఆశ్చర్య పడి, ఇలా బదులిచ్చాడు, "ఒక్కడే విశ్వకర్మ ఉన్నాడు అనుకున్నాను కదా." భగవంతుడు నవ్వి ఇలా అన్నాడు, ‘ఈ పద్నాలుగు లోకాలతో ఉన్న బ్రహ్మాండం లాగానే, అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి దానిలో ఒక ఇంద్రుడు, ఒక విశ్వకర్మ ఉన్నాడు.’ ఆ తర్వాత ఇంద్రుడు చీమల లైన్లు తన వైపు నడుస్తూ రావటం గమనించాడు. ఇంద్రుడు ఆశ్చర్యంతో ఇన్ని చీమలు ఎక్కడ నుండి వచ్చాయో అని అడిగాడు. భగవంతుడు ఇలా అన్నాడు, ‘ఒకప్పుడు పూర్వ జన్మలలో ఇంద్రుడిగా ఉండి, ఇప్పుడు చీమ శరీరంలో ఉన్న అన్ని జీవాత్మలను ఒకసారి పిలిచాను’ అని. ఇంద్రుడు వాటి అపారమైన సంఖ్య చూసి ఆశ్చర్యచకితుడైనాడు. కొద్దిసేపు తరువాత, లోమేశ ఋషి అక్కడకు వచ్చాడు. ఆయన తలపై ఒక గడ్డి చాప పెట్టుకుని ఉన్నాడు; ఆయన ఛాతీపై ఒక వెంట్రుకల వలయం ఉంది. ఆ వృత్తం నుండి కొన్ని వెంట్రుకలు ఊడిపోయి ఉండి అక్కడక్కడా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇంద్రుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి, మర్యాదగా ఇలా అడిగాడు, ‘అయ్యా, మీరు ఎందుకు ఇలా గడ్డి చాపను నెత్తి మీద మోస్తున్నారు? ఇంకా, మీ ఛాతీ మీద వెంట్రుకల వలయం యొక్క అర్థం ఏమిటి?’ అని’. లోమేశ ఋషి ఇలా బదులిచ్చాడు, ‘నాకు చిరాయువుగా ఉండే వరం ఉంది. ఈ బ్రహ్మాండంలో ఒక ఇంద్రుడి పదవీకాలం అయిపోగానే, ఒక వెంట్రుక ఊడిపోతుంది. అందుకే వృత్తంలో ఖాళీలు ఉన్నాయి. నా శిష్యులు నేను ఉండటానికి ఒక ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు, కానీ జీవితం తాత్కాలికమైనది అనుకుంటున్నాను, కాబట్టి ఎందుకు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం? నేను ఈ గడ్డి చాపను పెట్టుకుంటాను, ఇదే నన్ను ఎండ, వాన నుండి రక్షిస్తుంది. రాత్రి పూట దీనిని నేలపై పరుచుకుని పడుకుంటాను.’ ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై , ‘ఈ ఋషికి ఎంతో మంది ఇంద్రుల మేర జీవితకాలం ఉంది, అయినా ఈయన జీవితం తాత్కాలిక మైనదే అనుకుంటున్నాడు. ఇక నేను మాత్రం ఎందుకు ఇంత పెద్ద రాజభవనం నిర్మిస్తున్నాను? అని అనుకున్నాడు.’ అతని అహంకారం నశించిపోయింది మరియు విశ్వకర్మను పంపించివేసాడు. ఈ కథలు చదువుతున్నప్పుడు, విశ్వనిర్మాణశాస్త్రం గురించి భగవద్గీత చెప్పిన అద్భుతమైన లోతైన విషయాల పట్ల విస్మయం చెందకుండా ఉండలేము. 16వ శతాబ్దం వరకు కూడా, నికోలాస్ కోపర్నికస్ అనే ఆయనే, మొదటి పాశ్చాత్య శాస్త్రవేత్త సరియైన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని (heliocentric theory) ప్రతిపాదించి, సూర్యుడే నిజానికి విశ్వానికి కేంద్రము అని చెప్పాడు. అప్పటివరకు, మొత్తం పాశ్చాత్య ప్రపంచం, భూగ్రహమే విశ్వానికి కేంద్రము అనే నమ్మికతో ఉండేది. ఖగోళ శాస్త్రంలో, తరువాత వచ్చిన పురోగతి, సూర్యుడు కూడా విశ్వానికి కేంద్రము కాదు అని తెలియ చెప్పింది; సూర్యుడు కూడా మిల్కీ వే అనబడే పాలపుంత (galaxy) యొక్క కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు అని చెప్పింది. మరింత పురోగతి జరిగిన పిదప, శాస్త్రవేత్తలు, ఇలాంటి మిల్కీ-వే లాంటి పాలపుంతలు (galaxies) మరెన్నో ఉన్నట్టు, ప్రతిదానిలో మన సూర్యుడు వంటి ఎన్నెన్నో నక్షత్రాలు ఉన్నట్టు తెలుసుకున్నారు. దీనితో పోలిస్తే, వైదిక వాఙ్మయంలో, ఐదువేల సంవత్సరాల క్రితమే, ఈ భూమి, భూః లోకమని, ఇది స్వర లోకం చుట్టూ పరిభ్రమిస్తున్నదనీ, మరియు ఈ రెండింటి మధ్య భువర్లోకం ఉందని చెప్పింది. కానీ, స్వర లోకం కూడా నిలకడగా లేదు, అది జనలోకం యొక్క గురుత్వాకర్షణలో స్థితమై ఉంది, ఈ రెంటి మధ్య ఆకాశంలో మహర్లోకం ఉంది. కానీ, జనలోకం కూడా స్థిరంగా లేదు; అది బ్రహ్మలోకం (సత్య లోకం) చుట్టూ పరిభ్రమిస్తున్నది. ఈ రెంటి మధ్యలో తపోలోకం ఉన్నది.; అని పేర్కొన్నది. ఇది పైనున్న ఏడు లోకాలను వివరిస్తున్నది; ఇదే ప్రకారంగా ఏడు క్రింది లోకాలు ఉన్నాయి. ఇప్పుడు గమనిస్తే, ఐదు వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడిన ఈ లోతైన అవగాహన అత్యద్భుతం అనిపిస్తుంది. ఈ అన్ని పద్నాలుగు లోకాలు కూడా మాయ ఆధీనంలోనే ఉన్నట్టు ఈ శ్లోకం శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు, కాబట్టి వాటిలో నివాసం ఉండేవారు జనన-మరణ చక్రానికి గురిఅవుతుంటారు. కానీ, భగవత్ ప్రాప్తి పొందినవారు, ఈ మాయ యొక్క బంధము నుండి విడుదల చేయబడుతారు. మృత్యు సమయంలో, ఈ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత, వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు. అక్కడ వారు దివ్య శరీరాలు పొందుతారు, సదా (శాశ్వతముగా) భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటారు. ఈ విధంగా వారు ఈ భౌతిక ప్రపంచంలో మరల జన్మించవలసిన అవసరం లేదు. కొంత మంది మహాత్ములు మాయా నివృత్తి పొందిన తరువాత కూడా తిరిగి వస్తారు, కానీ, వారు ఇతరులను కూడా మాయా బంధముల నుండి విముక్తి చేయటానికే వస్తారు. మానవ జాతి యొక్క కళ్యాణం కోసం, అవతరించిన మహాత్ములు మరియు ప్రవక్త (గురువు) లు ఈ కోవకు చెందినవారే.
సహస్రయుగపర్యంతమ్ అహర్యద్బ్రహ్మణో విదుః । రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ।। 17 ।।
17
8
https://www.holy-bhagava…udio/008_017.mp3
సహస్ర — వెయ్యి; యుగ — యుగము; పర్యంతం — వరకూ; అహః — ఒక రోజు; యత్ — ఏదైతే; బ్రహ్మణః — బ్రహ్మ యొక్క; విదుః — తెలుసుకొనుము; రాత్రిం — రాత్రి; యుగ-సహస్ర-అంతాం — వెయ్యి యుగములు ఉంటుంది; తే — వారు; అహః-రాత్ర-విదః — అతని రాత్రి పగలు తెలిసినవారు; జనాః — జనులు.
BG 8.17: వెయ్యి చతుర్యుగము (మహాయుగము) ల కాలము, బ్రహ్మ దేవునికి ఒక రోజు (కల్పము) అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యదార్థాన్ని అర్థం చేసుకున్నట్టు.
వైదిక ప్రామాణంలో కాలం యొక్క కొలతలు కూడా విస్తారమైనవి. ఉదాహరణకి, కొన్ని పురుగులు రాత్రి పూట పుడతాయి — అవి పెరుగుతాయి, పునరుత్పత్తి చేస్తాయి, గుడ్లు పెడతాయి, మరియు వృద్ధాప్యంలోకి వస్తాయి, ఇవంతా ఒక్క రాత్రి లోనే జరిగిపోతాయి. పగటి పూట అవన్నీ వీధి దీపం కింద చనిపోయిపడి ఉండటం మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ పురుగులకు, మీ జీవిత కాలం మొత్తం కలిపి మానవులకు ఒక రాత్రి మాత్రమే అని చెప్తే, వాటికి అది నమ్మశక్యంగా ఉండదు.ఇదే విధంగా, వేదముల ప్రకారం, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతల ఒక పగలు ఒక రాత్రి, భూలోకంలో ఒక సంవత్సరం అవుతుంది. దేవతల యొక్క ఒక సంవత్సరం, 30 రోజులు x 12 నెలలు, భూలోకంలో 360 సంవత్సరాలకు సమానం. దేవతల 12,000 సంవత్సరాలు, భూ లోకంలో ఒక మహాయుగం (నాలుగు యుగాల చక్రం) అవుతుంది; అంటే 4,320,000 సంవత్సరాలు. (12,000 దేవతా సంవత్సరాలు X 360 భూలోక సంవత్సరాలు)ఇటువంటి 1000 మహా యుగములు బ్రహ్మ దేవుడికి ఒక పగలు. దీనినే కల్పము అంటారు, ఇది కాలాన్ని కొలవటానికి ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ప్రమాణం. బ్రహ్మ యొక్క ఒక రాత్రి కూడా ఇంతే సమయం ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం, బ్రహ్మ దేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. భూలోక లెక్క ప్రకారం ఇది 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు.ఈ ప్రకారం వైదిక శాస్త్రం ప్రక్కరం కాలం యొక్క ఈ క్రింది విధంగా ఉంది:కలి యుగము : 432,000 సంవత్సరాలు.ద్వాపర యుగము : 864,000 సంవత్సరాలు.త్రేతా యుగము : 1,296,000 సంవత్సరాలు.సత్య యుగము : 1,728,000 సంవత్సరాలుఇవన్ని కలిపి ఒక మహా యుగం అంటే 4,320,000 సంవత్సరాలు.వెయ్యి మహాయుగములు బ్రహ్మ దేవుని ఒక పగలు, కల్పము అంటే అదే : 4,320,000,000 ల భూలోక సంవత్సరాలు. ఇంతే సమయం బ్రహ్మ దేవుని రాత్రి. ఇది ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే నిజంగా పగలు, రాత్రిని అర్థం చేసుకున్నట్టు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.ఈ సమస్త విశ్వం యొక్క వ్యవధి బ్రహ్మ గారి జీవిత కాలం అయిన 100 సంవత్సరాలు: 311 ట్రిలియన్ 40 బిలియన్ భూలోక సంవత్సరాలు. బ్రహ్మ కూడా ఒక జీవాత్మనే, ఆ పదవిని పొంది, భగవంతుని పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూఉంటాడు. కనుక, బ్రహ్మ కూడా జనన-మరణ చక్రం లోనే ఉంటాడు. కానీ, మహోన్నతమైన పరిణితి పొంది ఉండటం వలన, ఆయన జీవిత కాలం తరువాత ఆయన జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయబడి, భగవంతుని ధామాన్ని చేరుకుంటాడు అని ఆయనకు హామీ ఉంది. ఒక్కోసారి, సృష్టి సమయంలో బ్రహ్మ పదవి నిర్వహించటానికి ఏ జీవాత్మకి కూడా అర్హత లేకుంటే, భగవంతుడే బ్రహ్మ అవుతాడు.
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే । రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ।। 18 ।।
18
8
https://www.holy-bhagava…udio/008_018.mp3
అవ్యక్తాత్ — అవ్యక్తము నుండి; వ్యక్తయః — వ్యక్తమైనవి; సర్వాః — సమస్త; ప్రభవంతి — ఉద్భవించును; అహః-ఆగమే — బ్రహ్మ యొక్క పగలు అయినప్పుడు; రాత్రి-ఆగమే — బ్రహ్మ యొక్క రాత్రి ప్రారంభమైనప్పుడు; ప్రలీయంతే — విలీనమైపోతాయి; తత్ర — దానిలో; ఏవ — నిజముగా; అవ్యక్త-సంజ్ఞకే — ఆ అవ్యక్తము అనబడే దాంట్లోకి.
BG 8.18: బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ తమ అవ్యక్త రూపంలోకి లీనమై పోతాయి.
మహాద్భుతమైన విశ్వ క్రీడలో, వివిధ లోకాలు వాటి యొక్క గ్రహ వ్యవస్థలు మళ్లీ మళ్లీ - సృష్టి, స్థితి, ప్రళయ చక్రానికి గురిఅవుతూనే ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగలు అయిపోయేటప్పటికి, అంటే ఒక కల్పము యొక్క 4,320,000,000 సంవత్సరములలో, మహర్లోకం వరకు ఉన్న అన్ని గ్రహ వ్యవస్థలు నాశనం చెందుతాయి. దీనినే నైమిత్తిక ప్రళయం (పాక్షిక లయము) అంటారు. శ్రీమద్భాగవతంలో, శుకదేవుడు పరీక్షిత్తుకి ఇలా చెప్పాడు, ‘ఎలాగైతే ఒక పిల్లవాడు పగలు ఆడుకునేటప్పుడు బొమ్మలతో నిర్మాణాలు చేసి, పడుకునేటప్పుడు వాటిని మళ్లీ తీసేస్తాడో, అదే విధంగా, బ్రహ్మ లేచినప్పుడు ఈ విశ్వ-గ్రహాల వ్యవస్థని వాటి యందు జీవ రాశులని సృష్టించి, పడుకునే ముందు వాటి అన్నింటిని లయం చేస్తాడు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల జీవన కాలం ముగిసే సమయానికి, సమస్త విశ్వము లయం చేయబడుతుంది. ఈ సమయంలో మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచ-మహాభూతములు, పంచ-తన్మాత్రలలో విలీనమవుతాయి. పంచ తన్మాత్రలు అహంకారములో విలీనమవుతాయి. అహంకారము మహాన్ (మహత్తు) యందు విలీనమవుతుంది, మరియు, మహత్తు ప్రకృతిలోకి విలీనము అవుతుంది. ప్రకృతి అనేది భౌతిక శక్తి, మాయ - యొక్క సూక్ష్మ రూపము. మాయ - దాని యొక్క ఆదిమ రూపంలో, అప్పుడు వెళ్లి మహా విష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీనినే ప్రాకృతిక ప్రళయం లేదా మహా ప్రళయం అంటారు. తిరిగి మహా విష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో, ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపు ప్రసరిస్తాడు, కేవలం ఆయన దృష్టి సారించినంతనే, అది ఆవిష్కరించటం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహాన్ వస్తుంది: మహాన్ నుండి అహంకారము వస్తుంది; అహంకారము నుండి పంచ-తన్మాత్రలు సృష్టించబడుతాయి; పంచ-తన్మాత్రల నుండి పంచ-మహాభూతాలు సృష్టించబడుతాయి. ఈ ప్రకారంగా , అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడుతాయి. ఆధునిక కాల శాస్త్రవేత్తలు, మిల్కీ-వే లో, 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి అని అంచనా వేశారు. ఈ మిల్కీ-వే లాగా, ఈ విశ్వంలో ఒక బిలియన్ పాలపుంతలు ఉన్నాయి. ఈ విధంగా, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, మన విశ్వంలో 1020 నక్షత్రాలు ఉన్నాయి. వేదాల ప్రకారం, మన విశ్వం వంటివి, వేరు వేరు పరిమాణాలలో, లక్షణాలతో అసంఖ్యాకమైన విశ్వములు ఉన్నాయి. ప్రతి సారి, మహావిష్ణువు శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు, అనంతమైన విశ్వములు ఆయన శరీర రోమకూపాల్లోంచి వ్యక్తమవుతాయి; మరియు ఆయన శ్వాస వదిలినప్పుడు, సమస్త విశ్వములు లయమై పోతాయి. అంటే, 100 సంవత్సరముల బ్రహ్మ జీవనకాలం, మహా విష్ణువు యొక్క ఒక శ్వాసకాలం మేర ఉంటుంది. ప్రతి విశ్వమునకు ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, మరియు ఒక శంకరుడు ఉంటారు. కాబట్టి, అసంఖ్యాకమైన బ్రహ్మలు, విష్ణువులు మరియు శంకరులు, అసంఖ్యాకమైన విశ్వాలలో ఉంటారు. అన్నీ విశ్వముల యొక్క సమస్త విష్ణువులు కూడా శ్రీ మహా విష్ణువు యొక్క విస్తరణలే.
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే । రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ।। 19 ।।
19
8
https://www.holy-bhagava…udio/008_019.mp3
భూత-గ్రామః — వివిధములైన సమస్త జీవరాశి సముదాయము; సః — ఇవి; ఏవ — నిస్సందేహముగా; అయం — ఈయొక్క; భూత్వా-భూత్వా — పదేపదే పుడుతూ; ప్రలీయతే — లయమవును; రాత్రి-ఆగమే — రాత్రి పూట రాగానే; అవశః — నిస్సహాయంగా (వాటి ప్రమేయం లేకుండానే); పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; ప్రభవతి — వ్యక్తమవుతాయి; అహః-ఆగమే — పగలు మొదలవగానే.
BG 8.19: బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవ రాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది, మరియు బ్రహ్మరాత్రి ప్రారంభమవగానే అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మపగలు మొదలవగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి.
వేదములు నాలుగు రకాల ప్రళయములను పేర్కొన్నాయి.నిత్య ప్రళయం: రోజువారీ మనం గాఢ నిద్రలోనికి జారిపోయినప్పుడు, మనలోని స్పృహ లయమైపోవటాన్ని నిత్య ప్రళయం అంటారు.నైమిత్తిక ప్రళయం: బ్రహ్మ యొక్క పగలు అయిపోయే సమయంలో, మహర్లోకం వరకూ ఉన్న అన్ని లోకాలు లయమై పోయే ప్రక్రియని నైమిత్తిక ప్రళయం అంటారు. ఆ సమయానికి ఆయా లోకాల్లో నివసిస్తున్న ఆత్మలన్నీ అవ్యక్తమైపోతాయి. అవి విష్ణుమూర్తి దేహంలో అచేతన అవస్థలో ఉంటాయి. తిరిగి బ్రహ్మగారు ఈ లోకాలని సృష్టించినప్పుడు, వీటికి తమ తమ పూర్వ జన్మ కర్మల ప్రకారంగా పుట్టుక లభిస్తుంది.మహా ప్రళయం: ఇది బ్రహ్మ యొక్క జీవన కాలం ముగిసినప్పుడు జరిగే సమస్త విశ్వం యొక్క లయము. ఈ సమయంలో, విశ్వంలోని అన్ని ఆత్మలు మహా విష్ణువు యొక్క దేహంలో అవ్యక్తస్థితిలోనికి వెళ్తాయి. వాటి యొక్క స్థూలశరీరాలు మరియు సూక్ష్మశరీరాలు లయమైపొతాయి కానీ కారణ శరీరాలు ఉండిపోతాయి. తదుపరి సృష్టి క్రమం జరిగినప్పుడు, వాటికి మళ్లీ తమతమ కారణ శరీరాల్లో దాచిఉన్న సంస్కారాలు మరియు కర్మల బట్టి, వాటికి జన్మ ఇవ్వబడుతుంది.ఆత్యంతిక ప్రళయం: ఆత్మ చిట్టచివరికి భగవంతుడిని చేరుకున్నప్పుడు, అది జనన- మరణ చక్రం నుండి శాశ్వతంగా విడుదల చేయబడుతుంది. ఆత్యంతిక ప్రళయం అంటే జీవుడిని సనాతనముగా కట్టివేసిన మాయా బంధనములు వీడిపోవటం.
పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః । యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ।। 20 ।।
20
8
https://www.holy-bhagava…udio/008_020.mp3
పరః — అలౌకికమైన; తస్మాత్ — దాని కన్నా; తు — కానీ; భావః — సృష్టి; అన్యః — వేరొక; అవ్యక్తః — అవ్యక్తము; అవ్యక్తాత్ — అవ్యక్తమున కంటే; సనాతనః — సనాతనమైన (శాశ్వతమైన); యః — ఎవరైతే; సః — అది (ఆ యొక్క); సర్వేషు — అన్ని; భూతేషు — ప్రాణులు; నశ్యత్సు — నాశనము చెందినా; న, వినశ్యతి — నాశనము చెందదు.
BG 8.20: ఈ యొక్క వ్యక్తమయిన మరియు అవ్యక్తమయిన సృష్టి కంటెను అలౌకికమైన మరియొక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్ని నశించిపోయినా, ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు.
భౌతిక లోకాల యొక్క నిజ స్వరూపము మరియు వాటి యొక్క తాత్కాలిక స్వభావము వెల్లడించిన తరువాత, శ్రీ కృష్ణుడు తదుపరి ఇక ఆధ్యాత్మిక కోణ పరిధి గురించి మాట్లాడుతున్నాడు. అది భౌతిక శక్తి కన్నా అతీతమైనది, మరియు అది భగవంతుని దివ్య యోగమాయా శక్తిచే సృష్టించబడినది. మిగతా అన్ని భౌతిక లోకాలు నాశనమైపోయినా అది మాత్రం వినాశము చెందదు. భగవంతుని సమస్త సృష్టిలో, దివ్య ఆధ్యాత్మిక ధామము 3/4వ వంతు అని, భౌతిక లోకములు 1/4వ వంతు అని శ్రీ కృష్ణుడు 10.42వ శ్లోకం లో చెప్తాడు.
అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ । యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 21 ।।
21
8
https://www.holy-bhagava…udio/008_021.mp3
అవ్యక్తః — అవ్యక్తము; అక్షరః — నిత్యమైనది (నాశములేనిది); ఇతి — ఈ విధముగా; ఉక్తః — అనబడుతుంది; తం — అది; ఆహుః — చెప్పబడును; పరమాం — సర్వోత్కృష్టమైన; గతిమ్ — గమ్యము; యం — ఏదైతే; ప్రాప్య — చేరుకున్న పిదప; న, నివర్తంతే — తిరిగి రారు; తత్ — అది; ధామ — ధామము (నివాసము); పరమం — సర్వోత్కృష్టమైన; మమ — నా యొక్క.
BG 8.21: ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము, మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక (మర్త్య) లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము.
ఆధ్యాత్మిక లోకంలోని దివ్య ఆకాశాన్నే పరవ్యోమము అంటారు. భగవంతుని వేర్వేరు స్వరూపముల యొక్క శాశ్వతమైన దివ్య ధామములు అక్కడ ఉంటాయి. ఉదాహరణకి : గోలోకము (శ్రీ కృష్ణుని ధామము), సాకేత లోకము (శ్రీ రామచంద్రుని ధామము), వైకుంఠ లోకము (నారాయణుని ధామము), శివ లోకము (సదాశివుని లోకము), దేవీ లోకము (దుర్గా మాత ధామము), మొదలగునవి. ఈ లోకాల్లో, సర్వేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో, తన నిత్య పరివారముతో నిత్యమూ నివసిస్తుంటాడు. ఈ యొక్క భగవంతుని స్వరూపాలన్నీ ఒకదానికి ఒకటి అభేదములే; ఇవి అన్నీ ఒకే భగవంతుని వేర్వేరు రూపములు మాత్రమే. ఏ రూపాన్ని ఆరాధిస్తే, భగవత్ ప్రాప్తి పొందిన తరువాత, ఆ భగవత్ స్వరూపము యొక్క ధామానికి చేరుకుంటారు. దివ్య శరీరము తీసుకున్న తరువాత, ఆత్మ, భగవంతుని దివ్య కార్యకలాపాలలో, దివ్య లీలలలో ఇక శాశ్వతంగా (నిత్యమూ) పాలుపంచుకుంటుంది.
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా । యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ।। 22 ।।
22
8
https://www.holy-bhagava…udio/008_022.mp3
పురుషః — సర్వోత్కృష్ట దివ్య పరమ పురుషుడు; సః — అతడు; పరః — అత్యున్నతుడు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; భక్త్యా — భక్తి ద్వారా; లభ్యః — పొందగలము; తు — వాస్తవముగా; అనన్యయా — వేరేది ఏమి లేకుండా; యస్య — ఎవరికైతే; అంతః-స్థాని — లోపల స్థితమై ఉండి; భూతాని — ప్రాణులు; యేన — ఎవరిచేత నయితే; సర్వం — సమస్తమూ; ఇదం — ఇది; తతమ్ — వ్యాపింపబడి ఉన్నదో.
BG 8.22: సర్వోత్కృష్ట పరమ పురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వ వ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్నా, ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడుతాడు.
ఆధ్యాత్మిక అంతరిక్షంలో తన దివ్య-ధామములో నివసించే భగవంతుడు, స్వయంగా ఆయనే, మన హృదయములో కూడా స్థితుడై ఉన్నాడు; ఆయన భౌతిక ప్రపంచంలో ప్రతి పరమాణువులో కూడా నిండినిబిడీ కృతమై ఉన్నాడు. భగవంతుడు అంతటా సమానంగా ఉన్నాడు; సర్వ-వ్యాప్త బ్రహ్మము ఏదో ఇరవై-ఐదు శాతమే ఉంటాడు, సాకార రూప భగవానుడు వంద శాతం ఉన్నట్టు అని చెప్పలేము. ఆయన అంతటా నూటికి నూరు శాతం ఉన్నాడు. కానీ, ఆ యొక్క సర్వ-వ్యాప్త భగవానుని అస్తిత్వం మనకు ఎటువంటి ఉపయోగకారిగా ఉండదు ఎందుకంటే దాని యొక్క అనుభూతి మనకు కలుగదు. శాండిల్య ముని ఇలా పేర్కొన్నాడు:గవాం సర్పిః శరీరస్థం న కరోత్యంగ పోషణం(శాండిల్య భక్తి దర్శనం)‘ఆవు శరీరంలోనే పాలు ఉంటాయి, కానీ నీరసంగా, అనారోగ్యంతో ఉన్న ఆవుకు అవి ఏమీ ఉపయోగపడవు.’ అదే పాలను ఆవు నుండి తీసి, పెరుగుగా మార్చి, ఆ పెరుగుని మిరియాల పొడితో కొద్దిగా కలిపి దానికే తినిపిస్తే , అది ఆవుని నయం చేస్తుంది.అదే విధంగా, సర్వ-వ్యాపి భగవంతుని ఉనికికి, మన భక్తిని రంజిల్లచేసే అన్యోన్యత ఉండదు. మొదట మనం ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఆరాధించి మన హృదయములో స్వచ్ఛత (అంతఃకరణ శుద్ధి) పెంపొందించుకోవాలి. అప్పుడు మనం భగవత్ కృపని ఆకర్షించగలము, ఆయన కృపచే మన, ఇంద్రియమనోబుద్దుల యందు తన యొక్క యోగమాయా శక్తిని ప్రవేశపెడతాడు. మన ఇంద్రియములు అప్పుడు దివ్యమైనవి అవుతాయి మరియు అప్పుడు మనము భగవంతుడిని సగుణసాకారంగా కానీ లేదా సర్వ-వ్యాప్త తత్త్వంలో కానీ, ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలము. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, తాను భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడుతాను అని పేర్కొంటున్నాడు.భక్తి యొక్క ఆవశ్యకతని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో పదేపదే నొక్కిచెప్పాడు. 6.47వ శ్లోకంలో, తనయందు భక్తి తత్పరతతో నిమగ్నమైనవారు అందరికంటే ఉత్తములు అని చెప్పిఉన్నాడు. ఇక్కడ, చాలా స్పష్టంగా ఆయన ‘అనన్య’ అన్న పదం వాడుతున్నాడు, అంటే భగవంతుడిని తెలుసుకోవటం ‘వేరే ఏ ఇతర మార్గం ద్వారా కుదరదు’ అని. చైతన్య మహాప్రభు దీన్ని చాలా అద్భుతంగా చెప్పాడు:భక్తి ముఖ నిరీక్షక కర్మ యోగ జ్ఞాన(చైతన్య చరితామృతం, మధ్య లీల 22.17)‘కర్మ, జ్ఞాన, మరియు అష్టాంగ యోగములు అన్నీ భగవత్ ప్రాప్తి మార్గములే అయినా, వీటన్నిటికి తమ సాఫల్యం కోసం భక్తి యొక్క ఆధారం అవసరం.’జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ ఇదే విషయాన్ని చెప్పారు:కర్మ యోగ అరు జ్ఞాన సబ, సాధన యదపి బఖాన్పై బిను భక్తి సబఇ జను, మృతక దేహ బిను ప్రాన్(భక్తి శతకం, 8వ శ్లోకం)‘కర్మ, జ్ఞాన మరియు అష్టాంగ యోగములు భగవత్ ప్రాప్తికి మార్గములే అయినా, వాటితో పాటు భక్తిని సమ్మిళితం చేయకపోతే, అవన్నీ ప్రాణం లేని మృత శరీరాల వంటివే.’ పలు రకాల వేదశాస్త్రములు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నాయి:భక్త్యాహమేకయా గ్రాహ్యః శ్రద్ధయాత్మా ప్రియః సతామ్(భాగవతం 11.14.21)‘కేవలం నన్ను విశ్వాసం, ప్రేమతో పూజించే నా భక్తులకు మాత్రమే నేను పొందబడుతాను’మిలహిం న రఘుపతి బిను అనురాగా,కిఏ జోగ తప జ్ఞాన బిరాగా(రామచరితమానస్)‘అష్టాంగ యోగము ఆభ్యాసము చేసినా, నియమనిష్ఠలు పాటించినా, జ్ఞానాన్ని సముపార్జించినా, మరియు వైరాగ్యం పెంపొందించుకున్నా, అయినాసరే, భక్తి లేకుండా భగవంతున్ని ఎవరూ పొందలేరు.’
యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః । ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ।। 23 ।। అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ । తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ।। 24 ।। ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ । తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ।। 25 ।। శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే । ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః ।। 26 ।।
23
8
https://www.holy-bhagava…/008_023-026.mp3
యత్ర — ఎక్కడైతే; కాలే — సమయము; తు — ఖచ్చితంగా; అనావృత్తిం — తిరిగి రాని; ఆవృత్తిం — తిరిగి వచ్చుట; చ — మరియు; ఏవ — నిజముగా; యోగినః — ఒక యోగి; ప్రయాతః — దేహము విడిచి వెళ్ళిపోయిన పిదప; యాంతి — పొందును; తం — అది; కాలం — సమయము; వక్ష్యామి — నేను వివరించెదను; భరత-ఋషభ — అర్జునా, భరత వంశీయులలో శ్రేష్ఠుడా; అగ్నిః — అగ్ని; జ్యోతిః — వెలుగు; అహః — పగలు; శుక్లః — శుక్ల పక్షము; షట్-మాసాః — ఆరు నెలలు; ఉత్తరాయణమ్ — ఉత్తరాయణము; తత్ర — అక్కడ; ప్రయాతాః — దేహము విడిచి వెళ్ళిపోయిన; గచ్ఛంతి — వెళ్ళును; బ్రహ్మ — బ్రహ్మన్; బ్రహ్మ-విదః — బ్రహ్మమును ఎరిగినవారు; జనాః — జనులు; ధూమః — పొగ; రాత్రిః — రాత్రి; తథా — మరియు; కృష్ణః — కృష్ణ పక్షము; షట్-మాసః — ఆరు నెలలు; దక్షిణాయనమ్ — దక్షిణాయనము; తత్ర — అక్కడ; చాంద్ర-మసం — చంద్రుని యొక్క; జ్యోతి — వెలుగు; యోగీ — ఒక యోగి; ప్రాప్య — పొందును; నివర్తతే — తిరిగి వచ్చును; శుక్ల — ప్రకాశవంతమైన; కృష్ణే — చీకటి; గతీ — మార్గములు; హి — నిజముగా; ఏతే — ఈ యొక్క; జగతః — భౌతిక ప్రపంచము యొక్క; శాశ్వతే — శాశ్వతంగా (నిత్యమై); మతే — అభిప్రాయము; ఏకయా — ఒక ; యాతి — వెళ్ళును; అనావృత్తిమ్ — తిరిగి రాకుండా; అన్యయా — వేరే దాని చే; ఆవర్తతే — తిరిగి వచ్చును; పునః — మరల.
BG 8.23-26: ఈ లోకం నుండి వెళ్లి పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని, ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో, శుక్ల పక్షంలో, పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మ కాండలని ఆచరించేవారు, దక్షిణాయన ఆరు మాసాల్లో, కృష్ణ పక్షంలో, ధూమ్ర కాలంలో, రాత్రిపూట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవారు - స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత, తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ రెండు, ప్రకాశవంతమైన మరియు చీకటి, మార్గాలూ ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది.
ఈ శ్లోకాలలో శ్రీ కృష్ణుడు చెప్పినది, 8.2వ శ్లోకంలో అర్జునుడు అడిగిన, ‘మృత్యు సమయంలో నీతోనే ఏకమై ఎలా ఉండవచ్చు?’ అన్న ప్రశ్నకు సంబంధించినదే. రెండు మార్గాలు ఉన్నాయి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు – తేజోవంతమైన మార్గము మరియు అంధకారముతో ఉన్న మార్గము. ఇక్కడ, నిగూఢమైన అర్థంతో ఉన్న ఈ వాక్యాలలో, వెలుగు-చీకటి విషయపరంగా, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవటానికి అద్భుతమైన ఉపమానాన్ని మనం గమనించవచ్చు. ఉత్తరాయణ కాలము, శుక్ల పక్షము, పగటి పూట – ఇవన్నీ వెలుతురు/ప్రకాశాన్ని సూచించేవే. వెలుతురు జ్ఞానానికి సూచిక. చీకటి అజ్ఞానానికి సూచిక. దక్షిణాయన కాలము, కృష్ణ పక్షము, రాత్రి పూట – ఇవన్నీ అంధకారానికి సూచకములు. ఎవరికైతే అంతఃకరణ భగవంతుని యందే స్థితమై ఉందో, ఇంద్రియ భోగాల నుండి విడిపోయిందో, వారు తేజోవంతమైన మార్గంలో (విచక్షణా బుద్ధి మరియు జ్ఞానము) వెళ్తారు. భగవత్ ధ్యాస లోనే స్థితమై ఉండటం వలన వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు మరియు ఈ సంసార చక్రం నుండి విముక్తి చేయబడుతారు. కానీ, మనస్సు ఈ భౌతిక ప్రపంచము యందే మమకారాసక్తితో ఉన్నవారు, అంధకార మార్గంలో (అజ్ఞానము) వెళ్తారు. శారీరక దృక్పథంతోనే గడిపే జీవితంలో చిక్కుకోనిపోయి, మాయలో భగవంతుని నుండి విముఖమై, వారు, జనన మరణ చక్రములో పడి తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ వారు వైదిక కర్మకాండలను చేసి ఉంటే, వారు తాత్కాలికంగా స్వర్గాది లోకాలకు వెళ్ళినా, తిరిగి భూలోకం లోకి రావలసినదే. ఈ ప్రకారంగా, మరణించిన పిదప అందరు మానవులు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దానిని అనుసరించాల్సిందే. ఇక, వారి వారి కర్మల అనుగుణంగా, వారు ప్రకాశవంత మార్గంలో పయనిస్తారా లేక చీకటి మార్గంలో పయనిస్తారా అనేది వారి పైనే ఆధారపడి ఉంటుంది.
యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః । ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ।। 23 ।। అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ । తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ।। 24 ।। ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ । తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ।। 25 ।। శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే । ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః ।। 26 ।।
24
8
https://www.holy-bhagava…/008_023-026.mp3
యత్ర — ఎక్కడైతే; కాలే — సమయము; తు — ఖచ్చితంగా; అనావృత్తిం — తిరిగి రాని; ఆవృత్తిం — తిరిగి వచ్చుట; చ — మరియు; ఏవ — నిజముగా; యోగినః — ఒక యోగి; ప్రయాతః — దేహము విడిచి వెళ్ళిపోయిన పిదప; యాంతి — పొందును; తం — అది; కాలం — సమయము; వక్ష్యామి — నేను వివరించెదను; భరత-ఋషభ — అర్జునా, భరత వంశీయులలో శ్రేష్ఠుడా; అగ్నిః — అగ్ని; జ్యోతిః — వెలుగు; అహః — పగలు; శుక్లః — శుక్ల పక్షము; షట్-మాసాః — ఆరు నెలలు; ఉత్తరాయణమ్ — ఉత్తరాయణము; తత్ర — అక్కడ; ప్రయాతాః — దేహము విడిచి వెళ్ళిపోయిన; గచ్ఛంతి — వెళ్ళును; బ్రహ్మ — బ్రహ్మన్; బ్రహ్మ-విదః — బ్రహ్మమును ఎరిగినవారు; జనాః — జనులు; ధూమః — పొగ; రాత్రిః — రాత్రి; తథా — మరియు; కృష్ణః — కృష్ణ పక్షము; షట్-మాసః — ఆరు నెలలు; దక్షిణాయనమ్ — దక్షిణాయనము; తత్ర — అక్కడ; చాంద్ర-మసం — చంద్రుని యొక్క; జ్యోతి — వెలుగు; యోగీ — ఒక యోగి; ప్రాప్య — పొందును; నివర్తతే — తిరిగి వచ్చును; శుక్ల — ప్రకాశవంతమైన; కృష్ణే — చీకటి; గతీ — మార్గములు; హి — నిజముగా; ఏతే — ఈ యొక్క; జగతః — భౌతిక ప్రపంచము యొక్క; శాశ్వతే — శాశ్వతంగా (నిత్యమై); మతే — అభిప్రాయము; ఏకయా — ఒక ; యాతి — వెళ్ళును; అనావృత్తిమ్ — తిరిగి రాకుండా; అన్యయా — వేరే దాని చే; ఆవర్తతే — తిరిగి వచ్చును; పునః — మరల.
BG 8.23-26: ఈ లోకం నుండి వెళ్లి పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని, ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో, శుక్ల పక్షంలో, పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మ కాండలని ఆచరించేవారు, దక్షిణాయన ఆరు మాసాల్లో, కృష్ణ పక్షంలో, ధూమ్ర కాలంలో, రాత్రిపూట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవారు - స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత, తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ రెండు, ప్రకాశవంతమైన మరియు చీకటి, మార్గాలూ ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది.
ఈ శ్లోకాలలో శ్రీ కృష్ణుడు చెప్పినది, 8.2వ శ్లోకంలో అర్జునుడు అడిగిన, ‘మృత్యు సమయంలో నీతోనే ఏకమై ఎలా ఉండవచ్చు?’ అన్న ప్రశ్నకు సంబంధించినదే. రెండు మార్గాలు ఉన్నాయి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు – తేజోవంతమైన మార్గము మరియు అంధకారముతో ఉన్న మార్గము. ఇక్కడ, నిగూఢమైన అర్థంతో ఉన్న ఈ వాక్యాలలో, వెలుగు-చీకటి విషయపరంగా, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవటానికి అద్భుతమైన ఉపమానాన్ని మనం గమనించవచ్చు. ఉత్తరాయణ కాలము, శుక్ల పక్షము, పగటి పూట – ఇవన్నీ వెలుతురు/ప్రకాశాన్ని సూచించేవే. వెలుతురు జ్ఞానానికి సూచిక. చీకటి అజ్ఞానానికి సూచిక. దక్షిణాయన కాలము, కృష్ణ పక్షము, రాత్రి పూట – ఇవన్నీ అంధకారానికి సూచకములు. ఎవరికైతే అంతఃకరణ భగవంతుని యందే స్థితమై ఉందో, ఇంద్రియ భోగాల నుండి విడిపోయిందో, వారు తేజోవంతమైన మార్గంలో (విచక్షణా బుద్ధి మరియు జ్ఞానము) వెళ్తారు. భగవత్ ధ్యాస లోనే స్థితమై ఉండటం వలన వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు మరియు ఈ సంసార చక్రం నుండి విముక్తి చేయబడుతారు. కానీ, మనస్సు ఈ భౌతిక ప్రపంచము యందే మమకారాసక్తితో ఉన్నవారు, అంధకార మార్గంలో (అజ్ఞానము) వెళ్తారు. శారీరక దృక్పథంతోనే గడిపే జీవితంలో చిక్కుకోనిపోయి, మాయలో భగవంతుని నుండి విముఖమై, వారు, జనన మరణ చక్రములో పడి తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ వారు వైదిక కర్మకాండలను చేసి ఉంటే, వారు తాత్కాలికంగా స్వర్గాది లోకాలకు వెళ్ళినా, తిరిగి భూలోకం లోకి రావలసినదే. ఈ ప్రకారంగా, మరణించిన పిదప అందరు మానవులు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దానిని అనుసరించాల్సిందే. ఇక, వారి వారి కర్మల అనుగుణంగా, వారు ప్రకాశవంత మార్గంలో పయనిస్తారా లేక చీకటి మార్గంలో పయనిస్తారా అనేది వారి పైనే ఆధారపడి ఉంటుంది.
యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః । ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ।। 23 ।। అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ । తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ।। 24 ।। ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ । తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ।। 25 ।। శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే । ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః ।। 26 ।।
25
8
https://www.holy-bhagava…/008_023-026.mp3
యత్ర — ఎక్కడైతే; కాలే — సమయము; తు — ఖచ్చితంగా; అనావృత్తిం — తిరిగి రాని; ఆవృత్తిం — తిరిగి వచ్చుట; చ — మరియు; ఏవ — నిజముగా; యోగినః — ఒక యోగి; ప్రయాతః — దేహము విడిచి వెళ్ళిపోయిన పిదప; యాంతి — పొందును; తం — అది; కాలం — సమయము; వక్ష్యామి — నేను వివరించెదను; భరత-ఋషభ — అర్జునా, భరత వంశీయులలో శ్రేష్ఠుడా; అగ్నిః — అగ్ని; జ్యోతిః — వెలుగు; అహః — పగలు; శుక్లః — శుక్ల పక్షము; షట్-మాసాః — ఆరు నెలలు; ఉత్తరాయణమ్ — ఉత్తరాయణము; తత్ర — అక్కడ; ప్రయాతాః — దేహము విడిచి వెళ్ళిపోయిన; గచ్ఛంతి — వెళ్ళును; బ్రహ్మ — బ్రహ్మన్; బ్రహ్మ-విదః — బ్రహ్మమును ఎరిగినవారు; జనాః — జనులు; ధూమః — పొగ; రాత్రిః — రాత్రి; తథా — మరియు; కృష్ణః — కృష్ణ పక్షము; షట్-మాసః — ఆరు నెలలు; దక్షిణాయనమ్ — దక్షిణాయనము; తత్ర — అక్కడ; చాంద్ర-మసం — చంద్రుని యొక్క; జ్యోతి — వెలుగు; యోగీ — ఒక యోగి; ప్రాప్య — పొందును; నివర్తతే — తిరిగి వచ్చును; శుక్ల — ప్రకాశవంతమైన; కృష్ణే — చీకటి; గతీ — మార్గములు; హి — నిజముగా; ఏతే — ఈ యొక్క; జగతః — భౌతిక ప్రపంచము యొక్క; శాశ్వతే — శాశ్వతంగా (నిత్యమై); మతే — అభిప్రాయము; ఏకయా — ఒక ; యాతి — వెళ్ళును; అనావృత్తిమ్ — తిరిగి రాకుండా; అన్యయా — వేరే దాని చే; ఆవర్తతే — తిరిగి వచ్చును; పునః — మరల.
BG 8.23-26: ఈ లోకం నుండి వెళ్లి పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని, ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో, శుక్ల పక్షంలో, పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మ కాండలని ఆచరించేవారు, దక్షిణాయన ఆరు మాసాల్లో, కృష్ణ పక్షంలో, ధూమ్ర కాలంలో, రాత్రిపూట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవారు - స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత, తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ రెండు, ప్రకాశవంతమైన మరియు చీకటి, మార్గాలూ ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది.
ఈ శ్లోకాలలో శ్రీ కృష్ణుడు చెప్పినది, 8.2వ శ్లోకంలో అర్జునుడు అడిగిన, ‘మృత్యు సమయంలో నీతోనే ఏకమై ఎలా ఉండవచ్చు?’ అన్న ప్రశ్నకు సంబంధించినదే. రెండు మార్గాలు ఉన్నాయి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు – తేజోవంతమైన మార్గము మరియు అంధకారముతో ఉన్న మార్గము. ఇక్కడ, నిగూఢమైన అర్థంతో ఉన్న ఈ వాక్యాలలో, వెలుగు-చీకటి విషయపరంగా, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవటానికి అద్భుతమైన ఉపమానాన్ని మనం గమనించవచ్చు. ఉత్తరాయణ కాలము, శుక్ల పక్షము, పగటి పూట – ఇవన్నీ వెలుతురు/ప్రకాశాన్ని సూచించేవే. వెలుతురు జ్ఞానానికి సూచిక. చీకటి అజ్ఞానానికి సూచిక. దక్షిణాయన కాలము, కృష్ణ పక్షము, రాత్రి పూట – ఇవన్నీ అంధకారానికి సూచకములు. ఎవరికైతే అంతఃకరణ భగవంతుని యందే స్థితమై ఉందో, ఇంద్రియ భోగాల నుండి విడిపోయిందో, వారు తేజోవంతమైన మార్గంలో (విచక్షణా బుద్ధి మరియు జ్ఞానము) వెళ్తారు. భగవత్ ధ్యాస లోనే స్థితమై ఉండటం వలన వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు మరియు ఈ సంసార చక్రం నుండి విముక్తి చేయబడుతారు. కానీ, మనస్సు ఈ భౌతిక ప్రపంచము యందే మమకారాసక్తితో ఉన్నవారు, అంధకార మార్గంలో (అజ్ఞానము) వెళ్తారు. శారీరక దృక్పథంతోనే గడిపే జీవితంలో చిక్కుకోనిపోయి, మాయలో భగవంతుని నుండి విముఖమై, వారు, జనన మరణ చక్రములో పడి తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ వారు వైదిక కర్మకాండలను చేసి ఉంటే, వారు తాత్కాలికంగా స్వర్గాది లోకాలకు వెళ్ళినా, తిరిగి భూలోకం లోకి రావలసినదే. ఈ ప్రకారంగా, మరణించిన పిదప అందరు మానవులు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దానిని అనుసరించాల్సిందే. ఇక, వారి వారి కర్మల అనుగుణంగా, వారు ప్రకాశవంత మార్గంలో పయనిస్తారా లేక చీకటి మార్గంలో పయనిస్తారా అనేది వారి పైనే ఆధారపడి ఉంటుంది.
యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః । ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ।। 23 ।। అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ । తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ।। 24 ।। ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ । తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ।। 25 ।। శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే । ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః ।। 26 ।।
26
8
https://www.holy-bhagava…/008_023-026.mp3
యత్ర — ఎక్కడైతే; కాలే — సమయము; తు — ఖచ్చితంగా; అనావృత్తిం — తిరిగి రాని; ఆవృత్తిం — తిరిగి వచ్చుట; చ — మరియు; ఏవ — నిజముగా; యోగినః — ఒక యోగి; ప్రయాతః — దేహము విడిచి వెళ్ళిపోయిన పిదప; యాంతి — పొందును; తం — అది; కాలం — సమయము; వక్ష్యామి — నేను వివరించెదను; భరత-ఋషభ — అర్జునా, భరత వంశీయులలో శ్రేష్ఠుడా; అగ్నిః — అగ్ని; జ్యోతిః — వెలుగు; అహః — పగలు; శుక్లః — శుక్ల పక్షము; షట్-మాసాః — ఆరు నెలలు; ఉత్తరాయణమ్ — ఉత్తరాయణము; తత్ర — అక్కడ; ప్రయాతాః — దేహము విడిచి వెళ్ళిపోయిన; గచ్ఛంతి — వెళ్ళును; బ్రహ్మ — బ్రహ్మన్; బ్రహ్మ-విదః — బ్రహ్మమును ఎరిగినవారు; జనాః — జనులు; ధూమః — పొగ; రాత్రిః — రాత్రి; తథా — మరియు; కృష్ణః — కృష్ణ పక్షము; షట్-మాసః — ఆరు నెలలు; దక్షిణాయనమ్ — దక్షిణాయనము; తత్ర — అక్కడ; చాంద్ర-మసం — చంద్రుని యొక్క; జ్యోతి — వెలుగు; యోగీ — ఒక యోగి; ప్రాప్య — పొందును; నివర్తతే — తిరిగి వచ్చును; శుక్ల — ప్రకాశవంతమైన; కృష్ణే — చీకటి; గతీ — మార్గములు; హి — నిజముగా; ఏతే — ఈ యొక్క; జగతః — భౌతిక ప్రపంచము యొక్క; శాశ్వతే — శాశ్వతంగా (నిత్యమై); మతే — అభిప్రాయము; ఏకయా — ఒక ; యాతి — వెళ్ళును; అనావృత్తిమ్ — తిరిగి రాకుండా; అన్యయా — వేరే దాని చే; ఆవర్తతే — తిరిగి వచ్చును; పునః — మరల.
BG 8.23-26: ఈ లోకం నుండి వెళ్లి పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని, ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో, శుక్ల పక్షంలో, పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మ కాండలని ఆచరించేవారు, దక్షిణాయన ఆరు మాసాల్లో, కృష్ణ పక్షంలో, ధూమ్ర కాలంలో, రాత్రిపూట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవారు - స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత, తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ రెండు, ప్రకాశవంతమైన మరియు చీకటి, మార్గాలూ ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది.
ఈ శ్లోకాలలో శ్రీ కృష్ణుడు చెప్పినది, 8.2వ శ్లోకంలో అర్జునుడు అడిగిన, ‘మృత్యు సమయంలో నీతోనే ఏకమై ఎలా ఉండవచ్చు?’ అన్న ప్రశ్నకు సంబంధించినదే. రెండు మార్గాలు ఉన్నాయి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు – తేజోవంతమైన మార్గము మరియు అంధకారముతో ఉన్న మార్గము. ఇక్కడ, నిగూఢమైన అర్థంతో ఉన్న ఈ వాక్యాలలో, వెలుగు-చీకటి విషయపరంగా, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవటానికి అద్భుతమైన ఉపమానాన్ని మనం గమనించవచ్చు. ఉత్తరాయణ కాలము, శుక్ల పక్షము, పగటి పూట – ఇవన్నీ వెలుతురు/ప్రకాశాన్ని సూచించేవే. వెలుతురు జ్ఞానానికి సూచిక. చీకటి అజ్ఞానానికి సూచిక. దక్షిణాయన కాలము, కృష్ణ పక్షము, రాత్రి పూట – ఇవన్నీ అంధకారానికి సూచకములు. ఎవరికైతే అంతఃకరణ భగవంతుని యందే స్థితమై ఉందో, ఇంద్రియ భోగాల నుండి విడిపోయిందో, వారు తేజోవంతమైన మార్గంలో (విచక్షణా బుద్ధి మరియు జ్ఞానము) వెళ్తారు. భగవత్ ధ్యాస లోనే స్థితమై ఉండటం వలన వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు మరియు ఈ సంసార చక్రం నుండి విముక్తి చేయబడుతారు. కానీ, మనస్సు ఈ భౌతిక ప్రపంచము యందే మమకారాసక్తితో ఉన్నవారు, అంధకార మార్గంలో (అజ్ఞానము) వెళ్తారు. శారీరక దృక్పథంతోనే గడిపే జీవితంలో చిక్కుకోనిపోయి, మాయలో భగవంతుని నుండి విముఖమై, వారు, జనన మరణ చక్రములో పడి తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ వారు వైదిక కర్మకాండలను చేసి ఉంటే, వారు తాత్కాలికంగా స్వర్గాది లోకాలకు వెళ్ళినా, తిరిగి భూలోకం లోకి రావలసినదే. ఈ ప్రకారంగా, మరణించిన పిదప అందరు మానవులు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దానిని అనుసరించాల్సిందే. ఇక, వారి వారి కర్మల అనుగుణంగా, వారు ప్రకాశవంత మార్గంలో పయనిస్తారా లేక చీకటి మార్గంలో పయనిస్తారా అనేది వారి పైనే ఆధారపడి ఉంటుంది.
నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన । తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ।। 27 ।।
27
8
https://www.holy-bhagava…udio/008_027.mp3
న — కాదు; ఏతే — ఈ రెండూ; సృతీ — మార్గములు; పార్థ — అర్జునా, ప్రిథ తనయుడా; జానన్ — తెలుసుకొని; యోగీ — ఒక యోగి; ముహ్యతి — మోహమునకు లోను అగుట; కశ్చన — ఏ విధమైన; తస్మాత్ — కాబట్టి; సర్వేషు కాలేషు — ఎల్లప్పుడూ; యోగ యుక్తః — యోగములో స్థితమై ఉండి; భవ — ఉండుము; అర్జున — అర్జునా.
BG 8.27: ఈ రెండు మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు, ఓ పార్థా, ఎన్నటికీ మోహమునకు గురి కారు. కాబట్టి, సర్వదా (అన్ని సమయాల్లో) యోగములో స్థితుడవై (భగవంతునితో ఏకమై) ఉండుము.
తమ మనస్సులని భగవంతునితో ఏకం చేయటానికి పరిశ్రమించే వారినే యోగులు అంటారు. తాము భగవంతుని యొక్క అణు-అంశములము అని తెలిసి ఉండి, మరియు ఇంద్రియ సుఖాసక్తమైన జీవనం యొక్క నిరర్థకతని అర్థం చేసుకుని, తాత్కాలికమైన ఇంద్రియ సుఖానుభూతులకన్నా, భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవటానికి వీరు ప్రాముఖ్యత ఇస్తారు. ఈ విధంగా వారు ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరిస్తారు. మాయామోహితులైన వారు, ఈ తాత్కాలికమైన ప్రపంచాన్నే శాశ్వతమనుకుని, తాము ఈ శరీరమే అనుకుని, ఈ లోకపు దురవస్థలనే ఆనందములనుకుని, చీకటి మార్గాన్ని అనుసరిస్తారు. ఈ రెండు మార్గాల ఫలితములు పూర్తి విరుద్ధంగా ఉంటాయి; ఒకటేమో మోక్షానికి దారి చూపిస్తుంది; మరొకటి, భౌతిక అస్తిత్వము యొక్క నిరంతర యాతనకి దారి తీస్తుంది. ఈ రెండు మార్గాల యొక్క తారతమ్యము తెలుసుకొని, ఒక యోగి అయ్యి, తేజోవంతమైన మార్గాన్ని అనుసరించమని , అర్జునుడిని శ్రీ కృష్ణుడు అర్థిస్తున్నాడు. ఆయన ఇక్కడ ‘సర్వేషు కాలేషు’, ‘అన్ని సమయాల్లో సర్వదా’ అన్న పదాలు వాడుతున్నాడు. మనలో చాలో మందిమి ఈ ప్రకాశవంత మార్గాన్ని కొంత కాలం అనుసరించి, తిరిగి చీకటి మార్గములోకి మఱలిపోతాము. ఎవరైనా ఉత్తర దిశగా వెళ్ళ దలచి, ఉత్తర దిశగా వెళ్ళిన ప్రతి మైలుకి, దక్షిణ దిశగా నాలుగు మైళ్ళు వెళితే, ఆ మనిషి ఏంతో శ్రమ పడినా, చివరికి తను బయలు దేరిన ప్రదేశం నుండి దక్షిణ దిశలో ఉండిపోతాడు. అదే విధంగా, ప్రకాశ మార్గాన్ని దినములో కొద్ది సేపు అనుసరిస్తే అది మన పురోగతికి హామీ ఇవ్వలేదు. మనం సరియైన దిశలో ముందుకు పోతూనే ఉండాలి మరియు తప్పుడు దిశలో పోవటం ఆపివేయాలి; అప్పుడే మనం పురోగతి సాధించవచ్చు. అందుకే, ‘అన్ని సమయాల్లో యోగిగా ఉండుము’ అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ । అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ।। 28 ।।
28
8
https://www.holy-bhagava…udio/008_028.mp3
వేదేషు — వేదముల అధ్యయనములో; యజ్ఞేషు — యజ్ఞములు ఆచరించుట యందు; తపఃసు — తపస్సు యందు; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; దానేషు — దానములు ఇచ్చుట యందు; యత్— ఏదైతే; పుణ్యఫలం — పుణ్య ఫలము; ప్రదిష్టమ్ — లభించునో; అత్యేతి — దానిని మించిన; తత్-సర్వం — అది అంతా; ఇదం — ఇది (ఈ యొక్క); విదిత్వా — తెలుసుకొని; యోగీ — ఒక యోగి; పరం — సర్వోన్నతమైన; స్థానమ్ — ధామము; ఉపైతి — సాధించును; చ — మరియు; ఆద్యమ్ — సనాతనమైన.
BG 8.28: ఈ రహస్యం తెలిసిన యోగులు - వైదిక కర్మ కాండల ఆచరణ, వేదాధ్యయనము, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దానధర్మాలు చేయుట - వీటన్నిటి పుణ్య ఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు. ఇటువంటి యోగులు పరమ పదమును పొందెదరు.
మనము వైదిక కర్మకాండలు-యజ్ఞాలు చేయవచ్చు, జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు, నియమనిష్ఠలను పాటించవచ్చు, మరియు దానధర్మాలు చేయవచ్చు, కానీ, భగవంతుని యందు భక్తితో నిమగ్నమవ్వకపోతే, మనం ఇదంతా చేసినా, ప్రకాశవంత మార్గంలో లేనట్టే. ఇవన్నీ భౌతిక ప్రాపంచిక మంచి పనులు భౌతిక ప్రతిఫలాలనే ఇస్తాయి, కానీ, భగవంతునిపై భక్తి అనేది భౌతిక బంధముల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. ఈ ప్రకారంగా రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:నేమ ధర్మ ఆచార తప గ్యాన జగ్య జప దానభేషజ పుని కోటిన్హ నహిం రోగ జాహిఁ హరిజాన‘నీవు, మంచి నడవడిక, ధర్మాచరణ, తపస్సు, యజ్ఞములు, అష్టాంగ యోగము, మంత్ర జపములు, మరియు దానధర్మాలు చేయవచ్చు. కానీ, భగవంతుని యందు భక్తి లేకుండా, మనస్సుకి పట్టిన భౌతిక-ప్రాపంచిక వస్తు విషయాసక్తి అనే రోగము వదలదు.’ఈ ప్రకాశావంత మార్గాన్ని అనుసరించే యోగులు జగత్తు నుండి తమ మనస్సుని తీసివేసి, భగవంతుని యందే నిమగ్నం చేస్తారు, ఈ విధంగా వారు నిత్య శాశ్వత సంక్షేమాన్ని పొందుతారు. ఈ విధంగా వారు, మిగతా అన్ని పద్ధతులు అవలంబించే వారి కన్నా మరింత ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుతారు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
శ్రీ భగవానువాచ । ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే । జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ।। 1 ।।
1
9
https://www.holy-bhagava…udio/009_001.mp3
శ్రీ భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు ఇలా పలికెను; ఇదం — ఇది; తు — కానీ; తే — నీకు; గుహ్య-తమం — అత్యంత గోప్యమైన; ప్రవక్ష్యామి — నేను నీకు చెప్పెదను; అనసూయవే — అసూయా రహితుడవు; జ్ఞానం — జ్ఞానము; విజ్ఞాన — అనుభవ జ్ఞానము; సహితం — సహితముగా; యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకొన్న పిదప; మోక్ష్యసే — నీవు విముక్తుడవు చేయబడుతావు; అశుభాత్ — భౌతికసంసార బాధలు.
BG 9.1: శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, నీకు నామీద అసూయ లేదు కాబట్టి, ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను; ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతికసంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు.
విషయ ప్రారంభంలోనే, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశం వినటానికి ఉన్న అర్హతని తెలియచేస్తున్నాడు. ‘అనసూయవే’ అంటే అసూయ లేనివాడు అని అర్థం. అర్జునుడికి తన మీద అసూయ లేదు కాబట్టి ఈ ఉపదేశం తాను అర్జునుడికి చెప్తున్నాడు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. కృష్ణ భగవానుడు దీని గూర్చి ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ భగవంతుడు తన కీర్తిని తానే ఎంతో అమితముగా ఇప్పుడు చెప్పుకోబోతున్నాడు. ‘అనసూయవే” అంటే ‘ఏవగించుకొనని వాడు’ అని కూడా అర్థం ఉంది. శ్రీ కృష్ణుడు తనను తానే పొగుడుకుంటున్నాడని ఆయన పట్ల ధిక్కారంతో ఉండేవారు, ఇటువంటి సందేశం విన్నా ఏమాత్రం ప్రయోజనం పొందరు. సరికదా, ‘చూడండి ఈ పొగరుబోతు వాడిని, తన గురించి తానే పోగుడుకుంటున్నాడు’ అని తలంచి, ఇంకా హాని కలుగచేసుకుంటారు. గర్వం మరియు దురభిమానము వలన ఇటువంటి ధోరణి జనిస్తుంది మరియు అది ఒక వ్యక్తి యొక్క భక్తి పూర్వక పూజ్యభావాన్ని దెబ్బ తీస్తుంది. భగవంతునికి తనకంటూ కావలసినది ఏమీ లేదు, కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యం జీవాత్మల సంక్షేమం కోసమే అన్న సామాన్య విషయాన్ని కూడా, ఈర్ష్యతో ఉన్న జనులు, అర్థం చేసుకోలేరు. జీవుల భక్తిని ఇనుమడింపచేయటానికే తన కీర్తిని తాను చెప్పుకుంటాడు, అంతేకానీ, మనకున్న అహంభావమనే ప్రాపంచిక దోషము ఆయనకు లేదు. అర్జునుడు ఉదారుడు, విశాలహృదయము కలవాడు, ఈర్ష్య అనే దోషము లేనివాడు కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పబోయే దానికి అర్జునుడు సంపూర్ణంగా అర్హుడే. రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మ జ్ఞానాన్ని తెలియచెప్పాడు; అది దేహము (శరీరము) కన్నా వేరైన విలక్షణమైన తత్త్వము. అది గుహ్యమైన అంటే రహస్యమైన జ్ఞానము. ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయాల్లో, తన శక్తిసామర్థ్యముల యొక్క జ్ఞానాన్ని వివరించాడు; అది 'గుహ్యతరం' అంటే మరింత రహస్యమైనది. తొమ్మిదవ మరియు ఇంకా తదుపరి అధ్యాయాలలో శ్రీ కృష్ణుడు పవిత్రమైన తన భక్తి జ్ఞానాన్ని తెలియచేస్తాడు, ఇది గుహ్యతమము, అంటే అత్యంత రహస్యమైనది.
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ । ప్రత్యక్ష్యావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ।। 2 ।।
2
9
https://www.holy-bhagava…udio/009_002.mp3
రాజ-విద్యా — అన్ని విద్యలకెల్లా రారాజు; రాజ-గుహ్యం — అత్యంత రహస్యమైనది; పవిత్రం — పవిత్రమైనది; ఇదం — ఇది; ఉత్తమం — సర్వోన్నతమైనది; ప్రత్యక్ష — ప్రత్యక్ష్యముగా గమనించగలిగినది; అవగమం — నేరుగా అనుభవించగలిగినది; ధర్మ్యం — పవిత్రమైనది; సు-సుఖం — సులువైనది; కర్తుం — అభ్యాసము చేయటానికి; అవ్యయం — శాశ్వతమైనది.
BG 9.2: ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమయినది. ఇది విన్న వారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.
రాజ అంటే రాజు/ప్రముఖుడు/ముఖ్యుడు అని అర్థం. శ్రీ కృష్ణుడు, తాను ఉపదేశించే జ్ఞానం యొక్క సర్వోత్కృష్ట స్థాయిని వక్కాణించటానికి ‘రాజ’ అన్న ఉపమానం వాడుతున్నాడు.విద్యా అంటే ‘శాస్త్రము లేదా జ్ఞానము’. తన ఉపదేశాన్ని విశ్వాసము, మతము, అభిప్రాయము, ఆచారము, లేదా నమ్మకము అని ఆయన అనటంలేదు. తను అర్జునుడికి చెప్పబోయేది, అన్ని శాస్త్రాలలో కెల్లా రారాజు అని ప్రకటిస్తున్నాడు.గుహ్య అంటే, ‘రహస్యము’ ఈ జ్ఞానము అత్యంత గోప్యమైనది కూడా. ఎంపికా స్వేచ్ఛ ఉన్నచోటే ప్రేమ సాధ్యమవుతుంది కాబట్టి కావాలనే భగవంతుడు తను నేరుగా సునాయాసముగా కనబడకుండా తనను తాను దాచి ఉంచుకుంటాడు; దీని ద్వారా ఆత్మకు భగవంతుడిని ప్రేమించాలా లేదా అనే స్వేచ్ఛ ఇస్తాడు. ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. మనం ఆయనను ప్రేమించాలని భగవంతుడు కోరుకుంటాడు, అందుకే మనకు ఆయనను కోరుకోవాలా లేదా అన్న స్వేచ్ఛను ఇస్తున్నాడు; దాన్ని మన ఇష్టానికే వదిలివేస్తున్నాడు. కేవలం మనం ఎంచుకున్న మార్గం వలన కలిగే పరిణామాలను మాత్రం తెలియచెప్తాడు, మరియు ఏ మార్గం అవలంబించాలనే స్వేచ్ఛను మనకే వదిలివేస్తాడు.పవిత్రం అంటే పవిత్రమైన/స్వచ్ఛమైన అని. భక్తి యొక్క జ్ఞానము అత్యంత పవిత్రమైనది ఎందుకంటే అది అల్పమైన స్వార్థముచే కళంకితం కానిది. అది భగవంతుని దివ్య ప్రేమ బలిపీఠము యందు ఆత్మ సమర్పణకి ప్రేరణ ఇస్తుంది. భక్తుడి యొక్క పాపములు, బీజములు మరియు అవిద్యను భక్తి సాధన, నాశనం చేస్తుంది. పాపములు అంటే జీవుడి అనంతమైన పూర్వ-జన్మల నుండీ ఉన్న పాపరాశి. నిప్పు గడ్డిమూటని భస్మం చేసినట్టు, పాపరాశినంతటినీ భక్తి దహించివేస్తుంది. బీజములు అంటే మనస్సులో ఉన్న మాలిన్యములు, ఇవి పాపపు పనులు చేయటానికి ఉన్న మూల కారణం. ఈ బీజములు ఉన్నంతకాలం, కేవలం పూర్వ జన్మల పాపపు కర్మరాశిని నిర్మూలిస్తే సరిపోదు. ఎందుకంటే పాపపు పనులు చేయాలనే కోరిక హృదయంలో ఉండిపోతుంది మరియు వ్యక్తి తిరిగి పాపపు పనులు చేసే అవకాశం ఉంటుంది. భక్తి, హృదయాన్ని పవిత్రం చేస్తుంది, పాపాల యొక్క మూల బీజాలైన – కామము, క్రోధము, మరియు లోభములను నాశనం చేస్తుంది. కానీ, ఈ బీజముల నాశనం కూడా సరిపోదు. హృదయం మలినమవటానికి ఉన్న అసలు కారణం అవిద్య (అజ్ఞానం), దీనిచే మనలని మనం ఈ దేహమే అనుకుంటాము. ఈ యొక్క తప్పుడు అనుసంధానం వలన, ఈ శరీరమే మనము అనుకుంటాము, దానితో శారీరక కోరికలను సృష్టించుకుని, అవే మనకు సంతోషాన్ని ఇస్తాయి అనుకుంటాము. ఇటువంటి భౌతిక ప్రాపంచిక కోరికలు తీర్చుకోవటం అనేది, మరింత కామ, క్రోధ, లోభములు, ఇంకా ఇతర మలినముల వృద్ధికి దారి తీస్తుంది. మనస్సు పరిశుద్ధి చేయబడినా, అజ్ఞానము/అవిద్య ఉన్నంత కాలము, అది మరలా మాలిన్యమైపోతుంది. భక్తి అనేది అంతిమంగా - ఆత్మ మరియు భగవంతుని యొక్క అనుభవపూర్వక జ్ఞానానికి దారి తీస్తుంది, అది భౌతిక ప్రాపంచిక అస్తిత్వము యొక్క అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. భక్తి యొక్క ప్రయోజనములు ‘భక్తి రసామృత సింధు’ అనే పుస్తకంలో ఇలా వివరించబడ్డాయి: క్లేశస్తు పాపం తద్బీజం అవిద్యా తే త్రిధా (1.1.18) ‘భక్తి అనేది మూడు విషాలను నాశనం చేస్తుంది – పాపములు, బీజములు, అవిద్య”. ఈ మూడు సంపూర్ణముగా నాశనమైనప్పుడే హృదయం అనేది నిజముగా, శాశ్వతముగా పవిత్రమైనట్టు.ప్రత్యక్ష అంటే ‘నేరుగా/ప్రత్యక్షముగా అనుభవించదగినది’ అని. విశ్వాసంతో వేసే మొదటి అడుగుతో, భక్తి శాస్త్రము యొక్క అభ్యాసము, ప్రారంభమవుతుంది మరియు భగవంతుని ప్రత్యక్ష్య అనుభవమును ఫలితముగా ఇస్తుంది. వేరే శాస్త్రముల కంటే ఇది భిన్నమేమీ కాదు, వాటిలో కూడా ఒక ప్రయోగాన్ని ఓ సిద్ధాంతంతో ప్రారంభించి దానిని నిరూపించబడ్డ ఫలితాలతో ముగిస్తాము.ధర్మ్యం అంటే ‘ధార్మికమైన’ అని. భౌతిక ప్రాపంచిక కోరికలరహితంగా చేసే భక్తి అత్యంత పవిత్రమైన పని. గురుసేవ వంటి ధర్మకార్యముల వలన అది నిరంతరం పెంచిపోషించబడుతుంది.కర్తుం సుసుఖం అంటే, ‘ఆచరించటానికి చాలా సులువైనది.’ భగవంతుడికి మన నుండి ఏమీ అవసరం లేదు; మనం ఆయనను ప్రేమించటం నేర్చుకుంటే, ఆయనను చాలా సహజంగానే పొందవచ్చు.ఇది సర్వోత్కృష్ట శాస్త్రము మరియు ఆచరించటానికి కూడా సులువైనది అయినప్పుడు, జనులు దీనిని నేర్చుకోవటానికి ఎందుకు మొగ్గు చూపరు? శ్రీ కృష్ణుడు దీన్ని తదుపరి వివరిస్తాడు.
అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప । అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ।। 3 ।।
3
9
https://www.holy-bhagava…udio/009_003.mp3
అశ్రద్దధానాః — విశ్వాసము లేని జనులు; పురుషా — (అటువంటి) మనుష్యులు; ధర్మస్య — ధర్మము యొక్క; అస్య — ఇది; పరంతప — అర్జునా, శత్రువులను జయించేవాడా; అప్రాప్య — పొందకుండా; మాం — నన్ను; నివర్తంతే — తిరిగి వచ్చెదరు; మృత్యు — మరణము; సంసార — భౌతిక అస్తిత్వము; వర్త్మని — మార్గములో.
BG 9.3: ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు, ఓ శత్రువులను జయించేవాడా. వారు పదేపదే జనన-మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు.
ఇంతకు క్రితం రెండు శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు జ్ఞానోపదేశము అందిస్తానని హామీ ఇచ్చి, దాని యొక్క ఎనిమిది గుణములను వివరించాడు. ఇక్కడ ఇది ‘ఈ ధర్మము’ అని చెప్పబడినది, అంటే భగవంతుని యెడల ప్రేమపూర్వక భక్తి పథము. జ్ఞానము ఎంత అద్భుతమైనదైనా, మార్గము ఎంత ప్రభావశీలమైనదైనా, దాని ప్రకారంగా నడుచుకోవటానికి నిరాకరించేవానికి అది నిరర్థకమైనది. ఇంతకుక్రితం శ్లోకంలో చెప్పినట్టు, భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవం తరువాత వస్తుంది; ప్రారంభంలో, ఈ ప్రక్రియ మొదలు పెట్టటానికి విశ్వాసంతో కూడిన మొదటి అడుగు అవసరం. భక్తి రసామృత సింధు (1.4.15) ఇలా పేర్కొంది: ఆదౌ శ్రద్ధా తతః సాధుసంగో ఽథ భజనక్రియా, ‘భగవత్ ప్రాప్తి కోసం కావలసిన మొదటి అడుగు విశ్వాసము/శ్రద్ధ. అప్పుడు వ్యక్తి, స్సత్సంగములలో (ఆధ్యాత్మిక కార్యక్రమాలు) పాలుపంచుకోవటం మొదలు పెడతాడు. ఇది వ్యక్తిగత భక్తి అభ్యాసమునకు దారి తీస్తుంది.’ తరచుగా జనులు, తాము దేనినైతే ప్రత్యక్ష్యంగా గ్రహింపగలుగుతామో దాన్ని మాత్రమే నమ్ముతాము అని అంటూఉంటారు, అంచేత, భగవంతుని అనుభవం తక్షణమే అవ్వదు కాబట్టి, ఆయనను నమ్మరు. కానీ, నిజానికి ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూడక పోయినా, ఎన్నో విషయాలను నమ్ముతాము. ఒక న్యాయమూర్తి ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి తన తీర్పు ఇస్తాడు. న్యాయమూర్తి గనక తను ప్రత్యక్షంగా చూసినదే నమ్ముతాను అంటే, సమస్త న్యాయ వ్యవస్థ విఫలమై పోతుంది. ఒక దేశాధ్యక్షుడు తనకు దేశ నలుమూలల నుండీ అందే నివేదికల ఆధారంగా దేశాన్ని పరిపాలన చేస్తాడు. తన దేశంలో ఉన్న అన్ని గ్రామాలని, నగరాలని దర్శించటానికి వెళ్లి చూడటం ఆయనకు అసాధ్యమైన పని. ఇక, తను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఆ నివేదికలను నమ్మను అంటే, తన దేశాన్ని ఎలా పరిపాలించగలడు? కాబట్టి, ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా, నమ్మకము/విశ్వాసము అనేది ప్రతి మెట్టులో చాలా ముఖ్యము. బైబిల్ దీనిని చాలా చక్కగా పేర్కొన్నది: ‘మేము నమ్మిక/విశ్వాసం ఆధారంగా నడుస్తాము, అంతేగానీ కంటికి కనిపించే దాని ఆధారంగా కాదు’, (We walk by faith, and not by sight. 2 Corinthians 5:7). భగవత్ ప్రత్యక్షానుభవము గురించి ఒక అందమైన కథ ఉంది: ఒకానప్పుడు ఒక రాజు, ఓ సాధువుతో ఇలా అన్నాడు, ‘నేను భగవంతుడిని నమ్మను ఎందుకంటే నేను ఆయనను చూడలేకున్నాను.’ అని. ఆ సాధువు, ఒక ఆవును రాజు గారి సభకు తెమ్మని అడిగాడు. రాజు గారు ఒప్పుకుని తన సేవకులని ఒక ఆవుని తెమ్మని ఆదేశించాడు. సాధువు ఆవు పాలను పితకమని అభ్యర్థించాడు. రాజు గారు మరల తన సేవకులని సాధువు చెప్పినట్టు చేయమన్నాడు. సాధువు అడిగాడు, ‘ఓ రాజా! మీ ఉద్దేశంలో ఇప్పుడే తీసిన ఈ పాలలో వెన్న ఉందని అనుకుంటున్నారా’ అని అన్నాడు. వెన్న ఉందని తనకి పూర్తి నమ్మకం ఉంది అని రాజు గారు అన్నాడు. ఆ సాధువు అన్నాడు, ‘పాలల్లో మీరు ఇప్పుడు వెన్న చూడటం లేదు కదా, వెన్న ఉందని ఎలా నమ్ముతున్నారు? అన్నాడు. రాజు గారు అన్నాడు , ‘మనకు ఈ సమయంలో కనబటటం లేదు ఎందుకంటే పాలల్లో మొత్తం వెన్న వ్యాప్తమై ఉంది, కానీ దానిని చూడాలంటే ఒక పద్ధతి ఉంది. ఈ పాలను పెరుగుగా చేసి, ఆ పెరుగుని చిలికితే, వెన్న అప్పుడు కనబడుతుంది.’ అని అన్నాడు. ఆ సాధువు అన్నాడు, ‘పాలల్లో వెన్న లాగ భగవంతుడు అంతటా ఉన్నాడు. ఈ సమయంలో భగవంతుడిని చూడలేకపోయినా, భగవంతుడు లేడు అనే నిశ్చయానికి మనం తొందరపడి రాకూడదు. ఆయనను చూడటానికి ఒక పక్రియ ఉంది; మనకు విశ్వాసము ఉండి, ప్రక్రియను చేపడితే, మనకు భగవంతుని ప్రత్యక్ష అనుభూతి లభిస్తుంది మరియు భగవత్ ప్రాప్తి పొందుతాము.’ భగవంతుని మీద నమ్మకం అనేది మానవులు అనాయాసంగా అనుసరించే సహజమైన ప్రక్రియ కాదు. మనకు ఇవ్వబడిన స్వతంత్ర-చిత్తమును ఉపయోగించుకొని, భగవంతునిపై నమ్మకం కలిగి ఉండాలనే దృఢమైన నిర్ణయానికి రావాలి. కౌరవుల సభలో, దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్ర చేయటానికి ప్రయత్నించినప్పుడు, శ్రీ కృష్ణుడు ఆమె చీరను పొడిగించి, ఆమెను అవమానము, సిగ్గు నుండి కాపాడాడు. అక్కడున్న కౌరవులందరూ ఆ అద్భుతాన్ని చూసారు, కానీ, శ్రీకృష్ణుని సర్వశక్తిత్వము పై నమ్మికను ఉంచటానికి తిరస్కరించారు, నిజాన్ని అర్థంచేసుకోలేకపోయారు. పరమేశ్వరుడైన భగవానుడు ఈ శ్లోకంలో ఏమి చెప్తున్నాడంటే, ఆధ్యాత్మిక పథం పై విశ్వాసం అవసరం లేదు అని నిర్ణయించుకున్న వారు, దివ్య జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోతారు మరియు జనన-మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు అని.
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా । మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ।। 4 ।।
4
9
https://www.holy-bhagava…udio/009_004.mp3
మయా — నా చేత; తతమ్ — వ్యాపింపబడి; ఇదం — ఇది; సర్వం — సమస్త; జగత్ — జగత్తు; అవ్యక్త-మూర్తినా — అవ్యక్త రూపంలో; మత్ స్థాని — నా యందు; సర్వ-భూతాని — సర్వ ప్రాణులు; న — కాదు; చ — మరియు; అహం — నేను; తేషు — వాటి యందు; అవస్థితః — స్థితుడై.
BG 9.4: ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడనుకాను.
భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఆ తరువాత, ఈ ప్రపంచమంతా బాగానే నడుస్తున్నదా లేదా అని ఆ సప్త లోకాల పై నుండి తొంగి చూస్తుంటాడనే సిద్ధాంతాన్ని వైదిక తత్త్వము ఒప్పుకోదు. వైదిక శాస్త్రాలు అన్నీ భగవంతుడు లోకంలో సర్వ వ్యాపి అని పదేపదే ప్రతిపాదించాయి:ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11)‘ఉన్నది ఒకటే భగవంతుడు; ఆయనే అందరి హృదయములో స్థితుడై ఉన్నాడు; ప్రపంచంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు.’ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్(ఈశోపనిషత్తు 1)‘భగవంతుడు లోకంలో అంతటా ఉన్నాడు’పురుష ఏవేదం సర్వం, యద్ భూతం యచ్చ భవ్యం(పురుష సూక్తం, ఋగ్వేదం)‘భగవంతుడు ఇప్పటి వరకు ఉన్న అన్నింటిలో వ్యాప్తమై ఉన్నాడు మరియు ఇకముందు ఉండే అన్నింటిలో వ్యాపించి ఉంటాడు’భగవంతుడు సర్వ వ్యాపి అన్న విషయాన్ని పలువిధాలుగా అర్థం చేసుకుంటారు. కొంతమంది తూర్పు దేశ తత్త్వవేత్తలు, ఈ లోకము, భగవంతుని పరిణామమే (transformation) అని నమ్ముతారు. ఉదాహరణకి, పాలు అనేవి ఒక కల్మషములేని పదార్థము. పుల్లని పదార్థ సంపర్కంచే అది పెరుగు గా మారుతుంది. అంటే, అది మారినప్పుడు, పెరుగు అనేది పాల యొక్క పరిణామమే. ఈ ప్రకారంగా, పరిణామ వాద ప్రవక్తలు, భగవంతుడే ఈ జగత్తు లాగ మారిపోయాడు అని చెప్తారు.మరికొందరు తత్త్వవేత్తలు, ఈ జగత్తు వివర్తము (ఒక వస్తువును ఇంకోలా తప్పుగాఅనుకోవటం) అంటారు. ఉదాహరణకి, చీకట్లో ఒక తాడుని పాములా అనుకోవచ్చు. వెన్నెలలో మెరిసే నత్తగుల్లని వెండిగా పోరపాటుపడవచ్చు. అదే విధంగా, వారు అనేదేమిటంటే, ఉన్నదంతా దేవుడే, ఈ లోకం లేదు అని; మనం జగత్తుగా చూసేదంతా నిజానికి బ్రహ్మమే, అని.కానీ, 7.4వ మరియు 7.5వ శ్లోకాల ప్రకారం ఈ జగత్తు పరిణామము కాదు, వివర్తమూ కాదు. అది భగవంతుని యొక్క మాయా శక్తి అనే భౌతిక శక్తి ద్వారా సృష్టించబడినది. జీవాత్మలు కూడా భగవంతుని శక్తి స్వరూపమే, కానీ వారు ఆయన యొక్క ఉత్కృష్ట స్థాయి, జీవ శక్తి. కాబట్టి ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్న అన్ని జీవులు రెండూ భగవంతుని శక్తి స్వరూపములే మరియు ఆయన వ్యక్తిత్వము లోని భాగములే. అయినా, తను సర్వ భూతములకు అతీతుడను (వాటి యందు పరిమితమై వసించను) అని చెప్తున్నాడు; అంటే పరిమితమైన వాటి యందు, అనంతమై ఉన్నది, ఇమిడి ఉండలేదు. ఇది ఎందుకంటే ఆయన ఈ రెండు శక్తి స్వరూపాల మొత్తం కన్నా ఎంతో ఎక్కువైనవాడు. ఎలాగైతే సముద్రము ఎన్నో అలలను విడుదల చేస్తుంటుందో, మరియు ఈ అలలన్నీ సముద్రము లోని భాగములే అయినా, సముద్రము అనేది ఈ సమస్త అలల మొత్తానికన్నా ఎంతో ఎక్కువే. అదే విధంగా, జీవులు మరియు మాయ భగవంతుని వ్యక్తిత్వంలోని భాగమే, అయినా, ఆయన వాటికన్నా ఉన్నతుడు, అతీతుడు.
న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ । భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ।। 5 ।।
5
9
https://www.holy-bhagava…udio/009_005.mp3
న — లేవు; చ — మరియు; మత్-స్థాని — నా యందు స్థితమై; భూతాని — సర్వ ప్రాణులు; పశ్య — తిలకించుము; మే — నా యొక్క; యోగం-ఐశ్వరం — దివ్యమైన శక్తి; భూత-భృత్ — సమస్త జీవరాశుల సంక్షేమం చూసేవాడు; న — కాదు; చ — అయినా; భూత-స్థః — లో నివసిస్తూ; మమ — నా యొక్క; ఆత్మా — ఆత్మ; భూత-భావనః — సమస్త ప్రాణుల సృష్టికర్త.
BG 9.5: అయినా సరే, ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము! నేనే సమస్త ప్రాణుల సృష్టి కర్తను మరియు నిర్వాహకుడను అయినా, నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితము కాను.
ఇంతకు క్రితం శ్లోక వ్యాఖ్యానంలో చెప్పబడిన — మాయా శక్తి మరియు జీవ శక్తి — అనే ఈ రెండు శక్తులకు అతీతంగా, భగవంతునికి ఒక మూడవ శక్తి ఉంది. ఇదే యోగమాయా శక్తి, దీనినే ఈ శ్లోకంలో దివ్యశక్తి అని సంబోధించాడు. యోగమాయ అనేది భగవంతుని యొక్క సర్వ-శక్తివంతమైన శక్తి స్వరూపము. దానిని కర్తుం-అకర్తుం-సమర్థః , అంటారు అంటే, ‘అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది’ అని. ఆయన వ్యక్తిత్వానికి మనం ఆపాదించే అద్భుతమైన విషయాలకు మూలశక్తి ఇదే. ఉదాహరణకి, భగవంతుడు మన అందరి హృదయములో ఉన్నాడు, అయినా మనకందరికీ అయన తెలియరావటం లేదు. ఇది ఎందుకంటే అయన దివ్య యోగమాయ శక్తి ఆయన నుండి మనలను దూరంగా ఉంచుతుంది.అదేవిధంగా భగవంతుడు కూడా తనను తాను మాయా ప్రాబల్యం నుండి దూరంగా ఉంచుకుంటాడు. భాగవతంలో, వేదములు భగవంతుడిని ఇలా కీర్తిస్తాయి:విలజ్జమానయా యస్య స్థాతుమీక్ష్యాపథే ఽముయా (2.5.13)’‘మాయ అనేది భగవంతుని ముందు నిలబడటానికి కూడా సిగ్గు పడుతుంది.’ భగవంతుడు, భౌతిక ప్రాకృతిక శక్తి, మాయలో వ్యాప్తమై ఉన్నా, దానికి అతీతంగా ఉండటం ఒక అద్భుతం కాదా? ఇది కూడా, తన నిగూఢమైన యోగమాయ శక్తి ద్వారానే సాధ్యం.ఒకవేళ ప్రపంచం భగవంతుడిని ప్రభావితం చేయగలిగితే, అప్పుడు ఈ లోకం క్షయమై పోయినా లేదా వినాశనము చేయబడ్డా, ఆయన యొక్క స్వభావము మరియు వ్యక్తిత్వము కూడా కృశించిపోవాలి. కానీ, ఈ ప్రపంచంలో జరిగే అన్ని మార్పులు చేర్పులూ జరుగుతున్నా కూడా భగవంతుడు తన నిజ-అస్తిత్వంలోనే స్థితుడై ఉంటాడు. అందుకే, వేదములు భగవంతుడిని 'దశాంగుళీ' అంటే 'పది వేళ్ళు' అన్న పేరుతో పిలుస్తాయి. ఆయన ఈ ప్రపంచంలోనే ఉన్నాడు, అయినా సరే దానికి పది వేళ్ళు దూరంగా అతీతంగా ఉంటాడు - దానిచే తాకబడకుండా.
యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ । తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ ।। 6 ।।
6
9
https://www.holy-bhagava…udio/009_006.mp3
యథా — ఎలాగైతే; ఆకాశ-స్థితః — ఆకాశంలో స్థితమై; నిత్యం — ఎల్లప్పుడూ; వాయుః — వీచేగాలి; సర్వత్ర-గః — అంతటా వీస్తూ; మహాన్ — బ్రహ్మాండమైన శక్తితో; తథా — అదే విధంగా; సర్వాణి-భూతాని — అన్ని ప్రాణులు; మత్-స్థాని — నాయందే స్థితమై ఉండి; ఇతి — ఈ విధముగా; ఉపధారయ — తెలుసుకొనుము.
BG 9.6: అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా, ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదే విధంగా, సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి.
నాలుగవ శ్లోకం నుండి ఆరవ శ్లోకం వరకు, శ్రీ కృష్ణ భగవానుడు, 'మత్-స్థాని' అన్న పదాన్ని మూడు సార్లు వాడాడు. దీని అర్థం ఏమిటంటే ‘సమస్త జీవ రాశులు ఆయన యందే ఆశ్రయం పొందిఉన్నాయి’ అని. అవి వేరు వేరు శరీరాలు మార్చుతూ, భౌతిక పదార్థంతో మమేకమైపోయినా సరే, వాటిని ఆయన నుండి వేరు చేయలేము. ఈ జగత్తు అంతా ఆయన యందే ఎలా స్థితమై ఉందో అవగతం చేసుకోవటం కొంచెం కష్టమే. గ్రీకు పురాణంలో, గ్లోబుని ఎత్తి పట్టుకున్న అట్లాస్ దృశ్యం మనకు కనబడుతుంది. గ్రీకు పౌరాణిక కథల్లో, మౌంట్-ఒలింపస్ దేవతలకు వ్యతిరేకంగా, టైటాన్స్ తో పాటు, అట్లాస్ యుద్దం చేసాడు. దానికి శిక్షగా, అతడు శాశ్వతంగా భూమిని, స్వర్గమును (రెంటినీ ఒక స్తంభంచే వేరుచేస్తూ) తన భుజాల మీద మోస్తూ ఉండమని శపింపబడ్డాడు. సమస్త ప్రాణులను నిలబెట్టుతున్నాను అని శ్రీ కృష్ణుడు అన్నప్పుడు ఆయన అన్న అర్థం ఇది కాదు. సమస్త విశ్వసృష్టి , వ్యోమాకాశంలో స్థితమై ఉంటుంది మరియు ఆకాశమనేది భగవంతుని శక్తి చే సృష్టించబడింది. ఈ విధంగా, సమస్త ప్రాణులు ఆయనయందే స్థితమై ఉన్నాయి అని చెప్పవచ్చు. అర్జునుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి వీలుగా, ఇప్పుడు ఇక సర్వేశ్వరుడైన భగవానుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆకాశం నుండి వేరుగా గాలికి వేరే ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. గాలి నిరంతరం, ఉధృతి తో వీస్తూ ఉంటుంది, అయినా, అది ఆకాశంలోనే ఆశ్రయమై ఉంటుంది. అదే విధంగా, ఆత్మలకు భగవంతుని కంటే వేరుగా అస్తిత్వం లేదు. అవి కాలంలో, దేశంలో మరియు చైతన్యంలో - తాత్కాలికపు శరీరాల్లో - కొన్నిసార్లు వేగంగా , కొన్ని సార్లు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి, అయినా అవి ఎల్లప్పుడూ భగవంతుని యందే స్థితమై ఉంటాయి. ఇంకో దృక్కోణం నుండి చూస్తే, సమస్త విశ్వంలో ఉన్నదంతా భగవంతుని ఆధీనములో ఉన్నదే. అదంతా ఆయన సంకల్పం ప్రకారం సృష్టించబడుతుంది, నిర్వహించబడుతుంది, మరియు నాశనం చేయబడుతుంది. ఈ విధంగా కూడా, అన్నీ ఆయన యందే స్థితమై ఉన్నాయి అని చెప్పవచ్చు.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ । కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ।। 7 ।। ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః । భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ।। 8 ।।
7
9
https://www.holy-bhagava…/009_007-008.mp3
సర్వ-భూతాని — సమస్త ప్రాణులు; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; ప్రకృతిం — ఆదిమ భౌతిక శక్తి; యాంతి — విలీనమవును; మామికామ్ — నా యొక్క; కల్ప-క్షయే — కల్పాంతరమున; పునః — మరల; తాని — వాటిని; కల్ప-ఆదౌ — కల్ప ప్రారంభమున; విసృజామి — వ్యక్తపరిచెదను; అహం — నేను; ప్రకృతిం — భౌతిక ప్రకృతి శక్తి; స్వాం — స్వయంగా నాదైన; అవష్టభ్య — ఆధీనములో ఉంచుకొని; విసృజామి — ఉత్పత్తిచేస్తాను; పునః పునః — మళ్లీ మళ్లీ; భూత-గ్రామం — విభిన్న రకాలైన (జీవరాశులు); ఇమం — ఇవి; కృత్స్నమ్ — సమస్తము; అవశం — వాటి ప్రమేయం లేకుండానే; ప్రకృతేః — ప్రకృతి; వశాత్ — వశమున.
BG 9.7-8: కల్పాంతరమున (ఒక కల్పము చివరన), సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక (భౌతిక) శక్తిని అధీనంలో ఉంచుకొని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మరల మరల సృష్టిచేయుచున్నాను.
శ్రీ కృష్ణుడు, క్రితం కొన్ని శ్లోకాలలో, సమస్త ప్రాణులు తనలోనే నివసిస్తున్నాయని వివరించి ఉన్నాడు. ఈ వాక్యాలు ఈ తదుపరి సందేహాన్ని కలిగించవచ్చు: ‘మహాప్రళయం సంభవించినప్పుడు, సమస్త జగత్తు లయం అయిపోయినప్పుడు, ఈ ప్రాణులన్నీ ఎక్కడికి పోతాయి?’ అని. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఈ శ్లోకంలో ఇవ్వబడుతున్నది. ఇంతకు క్రితం అధ్యాయంలో, 8.17వ నుండి 8.19వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు, సృష్టి, స్థితి, మరియు లయము ఒక చక్రం లాగ ఎలా సంభవిస్తుంటాయో వివరించాడు. ఇక్కడ, కల్ప-క్షయ అంటే, ‘బ్రహ్మ దేవుని యొక్క జీవన కాలం ముగిసే సమయము’ అని అర్థము. బ్రహ్మ దేవుని జీవనకాలమైన వంద-సంవత్సరములు ముగిసేటప్పటికి, అంటే, భూలోకంలో 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరములు అయ్యేటప్పటికి, సమస్త విశ్వ సృష్టి లయమైపోతుంది మరియు అది అవ్యక్త స్థితి లోనికి వెళ్ళిపోతుంది. పంచ మహాభూతములు, పంచ తన్మాత్రలలో విలీనమైపోతాయి; పంచ తన్మాత్రలు అహంకారంలో విలీనమైపోతాయి; అహంకారము మహాన్ లో విలీనమైపోతుంది; మహాన్, ప్రకృతిలో విలీనమైపోతుంది; ప్రకృతి అంటే ఆదిరూపమైన మూల భౌతిక శక్తి; మరియు ప్రకృతి వెళ్లి పరమేశ్వరుడైన మహా విష్ణువు ఉదరములో స్థితమై పోతుంది. ఆ సమయంలో, భౌతిక సృష్టిలో ఉన్న సమస్త జీవాత్మలు కూడా వెళ్లి భగవంతుని శరీరంలో విరామంలో, అచేతనావస్థ స్థితిలో ఉంటాయి. వాటి స్థూల మరియు సూక్ష్మ శరీరాలు తమ మూలమైన, మాయలో విలీనమైపోతాయి. కానీ, కారణ శరీరము ఉండిపోతుంది. (ఈ మూడు రకముల శరీరముల గురించి 2.28వ శ్లోక వ్యాఖ్యానంలో వివరంగా చెప్పబడింది). ప్రళయ కాలం అయిపోయినప్పుడు, భగవంతుడు ఈ జగత్తుని మరల సృష్టించినప్పుడు, భౌతిక శక్తి, ఇక ఇందాక చెప్పిన దాని వ్యతిరేక దిశలో విచ్చుకోవటం ప్రారంభిస్తుంది: ప్రకృతి-మహాన్-అహంకారము-పంచ తన్మాత్రలు-పంచ మహాభూతాలు. అప్పుడు, అచేతనావస్థలో, కేవలం కారణ శరీరాలతో ఉన్న ఆత్మలు, తిరిగి జగత్తులోకి ప్రవేశపెట్టబడుతాయి. వాటివాటి కారణ శరీరాల అనుగుణంగా, వాటికి ఆయా సూక్ష్మ, స్థూల శరీరాలు ఇవ్వబడుతాయి, మరియు ఈ విశ్వంలో వివిధ రకాలైన జీవ స్వరూపాలు సృష్టించబడుతాయి. ఈ జీవ స్వరూపాలు, వేర్వేరు లోకాలలో వేర్వేరు స్వభావాలతో ఉంటాయి. భూలోకంలో భూమి మరియు నీరు ప్రబలమైన శరీర మూలకాల గా ఉన్నట్టు, కొన్ని గ్రహాల్లో, అగ్ని అనేది ప్రబలమైన మూలకముగా ఉంటుంది. కాబట్టి, శరీరములు తమ సూక్ష్మతత్వంలో మరియు తమ శక్తి సామర్థ్యాలలో వివిధ రకాలుగా ఉంటాయి. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని అసంఖ్యాకమైన జీవ రూపాలు అని పేర్కొన్నాడు.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ । కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ।। 7 ।। ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః । భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ।। 8 ।।
8
9
https://www.holy-bhagava…/009_007-008.mp3
సర్వ-భూతాని — సమస్త ప్రాణులు; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; ప్రకృతిం — ఆదిమ భౌతిక శక్తి; యాంతి — విలీనమవును; మామికామ్ — నా యొక్క; కల్ప-క్షయే — కల్పాంతరమున; పునః — మరల; తాని — వాటిని; కల్ప-ఆదౌ — కల్ప ప్రారంభమున; విసృజామి — వ్యక్తపరిచెదను; అహం — నేను; ప్రకృతిం — భౌతిక ప్రకృతి శక్తి; స్వాం — స్వయంగా నాదైన; అవష్టభ్య — ఆధీనములో ఉంచుకొని; విసృజామి — ఉత్పత్తిచేస్తాను; పునః పునః — మళ్లీ మళ్లీ; భూత-గ్రామం — విభిన్న రకాలైన (జీవరాశులు); ఇమం — ఇవి; కృత్స్నమ్ — సమస్తము; అవశం — వాటి ప్రమేయం లేకుండానే; ప్రకృతేః — ప్రకృతి; వశాత్ — వశమున.
BG 9.7-8: కల్పాంతరమున (ఒక కల్పము చివరన), సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక (భౌతిక) శక్తిని అధీనంలో ఉంచుకొని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మరల మరల సృష్టిచేయుచున్నాను.
శ్రీ కృష్ణుడు, క్రితం కొన్ని శ్లోకాలలో, సమస్త ప్రాణులు తనలోనే నివసిస్తున్నాయని వివరించి ఉన్నాడు. ఈ వాక్యాలు ఈ తదుపరి సందేహాన్ని కలిగించవచ్చు: ‘మహాప్రళయం సంభవించినప్పుడు, సమస్త జగత్తు లయం అయిపోయినప్పుడు, ఈ ప్రాణులన్నీ ఎక్కడికి పోతాయి?’ అని. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఈ శ్లోకంలో ఇవ్వబడుతున్నది. ఇంతకు క్రితం అధ్యాయంలో, 8.17వ నుండి 8.19వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు, సృష్టి, స్థితి, మరియు లయము ఒక చక్రం లాగ ఎలా సంభవిస్తుంటాయో వివరించాడు. ఇక్కడ, కల్ప-క్షయ అంటే, ‘బ్రహ్మ దేవుని యొక్క జీవన కాలం ముగిసే సమయము’ అని అర్థము. బ్రహ్మ దేవుని జీవనకాలమైన వంద-సంవత్సరములు ముగిసేటప్పటికి, అంటే, భూలోకంలో 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరములు అయ్యేటప్పటికి, సమస్త విశ్వ సృష్టి లయమైపోతుంది మరియు అది అవ్యక్త స్థితి లోనికి వెళ్ళిపోతుంది. పంచ మహాభూతములు, పంచ తన్మాత్రలలో విలీనమైపోతాయి; పంచ తన్మాత్రలు అహంకారంలో విలీనమైపోతాయి; అహంకారము మహాన్ లో విలీనమైపోతుంది; మహాన్, ప్రకృతిలో విలీనమైపోతుంది; ప్రకృతి అంటే ఆదిరూపమైన మూల భౌతిక శక్తి; మరియు ప్రకృతి వెళ్లి పరమేశ్వరుడైన మహా విష్ణువు ఉదరములో స్థితమై పోతుంది. ఆ సమయంలో, భౌతిక సృష్టిలో ఉన్న సమస్త జీవాత్మలు కూడా వెళ్లి భగవంతుని శరీరంలో విరామంలో, అచేతనావస్థ స్థితిలో ఉంటాయి. వాటి స్థూల మరియు సూక్ష్మ శరీరాలు తమ మూలమైన, మాయలో విలీనమైపోతాయి. కానీ, కారణ శరీరము ఉండిపోతుంది. (ఈ మూడు రకముల శరీరముల గురించి 2.28వ శ్లోక వ్యాఖ్యానంలో వివరంగా చెప్పబడింది). ప్రళయ కాలం అయిపోయినప్పుడు, భగవంతుడు ఈ జగత్తుని మరల సృష్టించినప్పుడు, భౌతిక శక్తి, ఇక ఇందాక చెప్పిన దాని వ్యతిరేక దిశలో విచ్చుకోవటం ప్రారంభిస్తుంది: ప్రకృతి-మహాన్-అహంకారము-పంచ తన్మాత్రలు-పంచ మహాభూతాలు. అప్పుడు, అచేతనావస్థలో, కేవలం కారణ శరీరాలతో ఉన్న ఆత్మలు, తిరిగి జగత్తులోకి ప్రవేశపెట్టబడుతాయి. వాటివాటి కారణ శరీరాల అనుగుణంగా, వాటికి ఆయా సూక్ష్మ, స్థూల శరీరాలు ఇవ్వబడుతాయి, మరియు ఈ విశ్వంలో వివిధ రకాలైన జీవ స్వరూపాలు సృష్టించబడుతాయి. ఈ జీవ స్వరూపాలు, వేర్వేరు లోకాలలో వేర్వేరు స్వభావాలతో ఉంటాయి. భూలోకంలో భూమి మరియు నీరు ప్రబలమైన శరీర మూలకాల గా ఉన్నట్టు, కొన్ని గ్రహాల్లో, అగ్ని అనేది ప్రబలమైన మూలకముగా ఉంటుంది. కాబట్టి, శరీరములు తమ సూక్ష్మతత్వంలో మరియు తమ శక్తి సామర్థ్యాలలో వివిధ రకాలుగా ఉంటాయి. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని అసంఖ్యాకమైన జీవ రూపాలు అని పేర్కొన్నాడు.
న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ । ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ।। 9 ।।
9
9
https://www.holy-bhagava…udio/009_009.mp3
న — ఏవీ కాదు; చ — అలా; మామ్ — నాకు; తాని — అవి; కర్మాణి — కర్మలు; నిబధ్నంతి — బంధించివేయును; ధనంజయ — అర్జునా, సిరి సంపదలను జయించే వాడా; ఉదాసీన-వత్ — తటస్థముగా; ఆసీనమ్ — స్థితుడవై ఉండి; అసక్తం — ఆసక్తి రహితంగా; తేషు — అవి; కర్మసు — పనులు (కర్మలు).
BG 9.9: ఓ సిరి-సంపదలను జయించే వాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా, ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను.
ప్రాకృతిక శక్తి నిజానికి జడమైనది, అచేతనమైనది. దానికి జీవప్రాణానికి మూలమైన చైతన్యము లేదు. మరైతే అది జగత్తుని సృష్టి చేయటం వంటి అద్భుతమైన పనిని ఎలా చేయగలదు అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. రామాయణము దీనిని చాలా చక్కగా వివరిస్తున్నది:జాసు సత్యతా తేం జడ మాయా, భాస సత్య ఇవ మోహ సహాయా‘భౌతిక శక్తి చైతన్యరహితమైనది. కానీ, దానికి భగవంతుని నుండి ప్రేరణ లభించినప్పుడు, అది చైతన్యవంతమయినట్టుగా ప్రవర్తించటం ప్రారంభిస్తుంది.’ ఇది వంటింట్లో పటకారు లాగా పనిచేస్తుంది. అది ప్రాణం లేని వస్తువు. కానీ, వంటవాని చేతిలో ఉంటే, దానికి చలనం వచ్చి, ఏంతో వేడిగా ఉన్న గిన్నెలు లేపుతూ, అద్భుతమైన పనులు చేస్తుంటుంది. అదే మాదిరిగా, స్వయంగా, భౌతిక శక్తికి ఏ పనీ చేయగలిగే శక్తి లేదు. భగవంతుడు ఈ జగత్తుని సృష్టించటానికి సంకల్పించినప్పుడు, ఆయన తన యొక్క భౌతిక శక్తి వైపు చూస్తాడు మరియు దానిని చైతన్యవంతం చేస్తాడు.ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, సృష్టి ప్రక్రియ అంతా ఆయన సంకల్పము మరియు ప్రేరణ వల్లే జరుగుతున్నా, ఆయన మాత్రం భౌతిక శక్తి వలన జరిగే అన్ని పనులకు అతీతంగా, వాటిచే ప్రభావితం కాకుండా ఉంటాడు. తన యొక్క హ్లాదినీ శక్తి (ఆనందమును ప్రసాదించే శక్తి) వలన, సర్వ కాలములలో ఆనందముతో, ప్రశాంతంగా ఉంటాడు. అందుకే వేదములు ఆయనను ‘ఆత్మా రాముడు’ అంటాయి, అంటే, ‘బాహ్యమైన ఎలాంటి సహాయం లేకుండానే, తనలో తానే రమిస్తూ ఉండేవాడు.’ అని అర్థం. తాను ప్రభావితం కాను అని వివరించిన పిదప, భగవంతుడు ఇక తాను అకర్తను, పర్యవేక్షకుడను అని వివరిస్తున్నాడు.
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ । హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ।। 10 ।।
10
9
https://www.holy-bhagava…udio/009_010.mp3
మయా — నా చేత; అధ్యక్షేణ — నిర్దేశం; ప్రకృతిః — భౌతిక ప్రాకృతిక శక్తి; సూయతే — అస్తిత్వంలోకి తేబడుతుంది; స — రెండూ; చర-అచరం — చేతనమైనవి-అచేతనమైనవి; హేతునా — కారణము; అనేన — ఈ యొక్క; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; జగత్ — భౌతిక జగత్తులో; విపరివర్తతే — మార్పుకి లోనగును.
BG 9.10: నా యొక్క నిర్దేశంలో పని చేస్తూ, ఈ భౌతిక శక్తి, సమస్త చరాచర భూతములను జనింపచేయును, ఓ కుంతీ పుత్రుడా. ఈ కారణం వలన, భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును (సృష్టి, స్థితి, మరియు లయములు).
ఇంతకు క్రితం శ్లోకంలో వివరించబడినట్టు, భగవంతుడు తానే స్వయంగా జీవ స్వరూపముల సృష్టిలో పాలుపంచుకోడు. తన యొక్క వివిధములైన శక్తులు మరియు వివిధ పనుల కోసం నియమింపబడిన జీవాత్మలు, ఆయన ఆధీనంలో ఆయా పనులు చేస్తుంటాయి. ఉదాహరణకి, ఒక దేశ రాష్ట్రపతి తన ప్రభుత్వం లోని అన్ని పనులను తానే స్వయంగా చేయడు. ఆయన కింద అనేక విభాగాలు, వాటి పనులు నిర్వహించే అధికారులు ఉంటారు. అయినా, అయన ప్రభుత్వము యొక్క జయాపజయములను ఆయనకు ఆపాదిస్తారు. ఇది ఎందుకంటే, తన అధికార పరిధిలో ప్రభుత్వ అధికారులను తనే పురమాయిస్తాడు కాబట్టి. అదే విధంగా, ప్రప్రథమంగా పుట్టిన బ్రహ్మ మరియు భౌతిక శక్తి, ఈ యొక్క సమస్త జీవరాశుల సృష్టిని నెరవేర్చుతారు. వీరు భగవంతుని అనుమతి ప్రకారమే పని చేస్తారు కాబట్టి ఆయనను సృష్టి కర్త అని కూడా అంటారు.
అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ । పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ।। 11 ।।
11
9
https://www.holy-bhagava…udio/009_011.mp3
అవజానంతి — నిర్లక్ష్యము చేసెదరు; మాం — నన్ను; మూఢా — తెలివితక్కువవారు; మానుషీం — మనుష్య; తనుం — రూపము; ఆశ్రితమ్ — తీసుకున్న; పరం — దివ్యమైన; భావమ్ — వ్యక్తిత్వము; అజానంతః — తెలుసుకోనివారై; మమ — నేను; భూత — సకల ప్రాణులు; మహేశ్వరమ్ — మహేశ్వరుడు.
BG 9.11: నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు.
మంచి ఉపాధ్యాయులు ఒక్కోసారి తమ విద్యార్థులను వారి నిర్లక్ష్య ధోరణి నుండి బయటకు లాగి లోతుగా ఆలోచింపచేయటానికి, కఠినమైన పదాలు ఉపయోగిస్తుంటారు. ఇక్కడ శ్రీ కృష్ణుడు 'మూఢ' అన్న పదం వాడాడు, అంటే 'తెలివితక్కువ వాడా' అని అర్థం, దీనిని తన సాకార రూపాన్ని తిరస్కరించిన వారిని ఉద్దేశించి వాడాడు.భగవంతుడు నిరాకారుడు మాత్రమే, సగుణసాకార రూపంలో రాలేడు అని చెప్పేవారు, భగవంతుడు సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు అనే నిర్వచనానికి విరుద్ధంగా చెప్పేవారే. పరమేశ్వరుడే, ఈ యొక్క వివిధ స్వరూపాలు, ఆకృతులు, రంగులతో నిండిన జగత్తును సృష్టించాడు. ఆయనే ఈ అసంఖ్యాకమైన జీవ స్వరూపాలను సృష్టించే అద్భుతమైన కార్యం చేసినప్పుడు, తన కోసం ఒక రూపాన్ని సృష్టించుకోలేడా? లేదా, భగవంతుడు ఇలా చెప్పాడా? ‘నాకు ఒక వ్యక్తిగత స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి లేదు, నేను కేవలం నిరాకార కాంతిని మాత్రమే’ అని. ఆయన ఒక సాకార స్వరూపం తీసుకోలేడు అని చెప్పటం, ఆయనను అసంపూర్ణుడుగా చేస్తుంది.మనం, అతిచిన్న ఆత్మలము కూడా ఒక రూపాన్ని కలిగి ఉంటాము. ఎవరైనా, భగవంతుడు ఒక రూపాన్ని కలిగి ఉండడు అంటే, ఆయనకు మనుష్యుల కంటే తక్కువ శక్తి ఉంది అన్నట్టే. దేవుడు దోషరహితుడు మరియు సంపూర్ణుడు అవ్వటానికి, తన వ్యక్తిత్వానికి ఈ రెండు గుణాలు ఉండాలి — సాకార రూపము మరియు నిరాకార తత్త్వము. వైదిక గ్రంథాలు ఇలా పేర్కొన్నాయి:అపశ్యం గోపాం అనిపద్యమానమా(ఋగ్వేదం 1.22.164; 31వ సూక్తం)‘గోపాలకుల కుటుంబంలో అవతరించి, ఎప్పటికీ వినాశము లేని, బాలుని రూపంలో, నాకు ఆ భగవంతుని దర్శనం అయింది.’ద్విభూజం మౌన ముద్రాఢ్యమ్ వన మాలినమీశ్వరం(గోపాల తాపని ఉపనిషత్తు 1.13)‘పరమేశ్వరుడు అడవి-పూల మాలని ధరించి, తన వేణువుని ఊదుతాడు, తన చేతులతో మనోహరంగా మౌన ముద్ర వేసి ఉంటాడు’గూఢం పరం బ్రహ్మ మనుష్య-లింగం(భాగవతం 7.15.75)‘అత్యంత నిగూఢమైన జ్ఞానం ఏమిటంటే, భగవంతుడు మనుష్య రూపం స్వీకరిస్తాడు అని తెలుసుకోవటం’యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతిః(భాగవతం 9.23.20) ‘ఆ కాలంలో, సర్వ-ఐశ్వర్యములు కలిగి ఉన్న సర్వోత్కృష్ట భగవానుడు, నరుని వంటి రూపంలో అవతరించాడు’ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహఃఅనాదిరాదిర్ గోవిందః సర్వకారణ కారణం(బ్రహ్మ సంహిత 5.1) ఈ శ్లోకంలో, బ్రహ్మ గారు శ్రీకృష్ణుడిని ఈ విధంగా ప్రార్థించారు, ‘సనాతనుడూ, సర్వజ్ఞుడు, సచ్చిదానందుడూ అయిన శ్రీ కృష్ణుడి స్వరూపాన్ని నేను పూజిస్తాను. ఆయన ఆది-అంత్యము లేని వాడు మరియు సర్వ కారణ కారకుడు.’కానీ, భగవంతుని యొక్క వ్యక్తిగత స్వరూప విషయంలో మనం గుర్తు ఉంచుకోవలసినది ఏమిటంటే, అది దివ్య మైనది (దివ్య మంగళ స్వరూపము), అంటే భౌతిక స్వరూపాల్లో కనిపించే దోషములకు అతీతమైనది. భగవత్ స్వరూపము సత్-చిత్-ఆనందము - అది నిత్యము, జ్ఞానవంతము మరియు దివ్య ఆనందముతో నిండి ఉన్నది.అస్యాపి దేవ వపుషో మద్-అనుగ్రహస్యస్వేచ్ఛా-మయస్య న తు భూత-మయస్య కో ఽపి(భాగవతం 10.14.2) ఈ శ్లోకంలో, బ్రహ్మ దేవుడు శ్రీ కృష్ణుడి ని ఇలా ప్రార్దిస్తున్నాడు. ‘ఓ భగవన్, మీ శరీరము పంచ-మహాభూతములతో చేయబడలేదు; అది దివ్యమైనది. మరియు మీరు ఈ రూపంలో మీ అభీష్టం ప్రకారమే, నావంటి జీవులపై కృప చేయటానికి, అవతరించారు.’భగవత్ గీత నాలుగవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ‘నేను జన్మ రహితుడనై ఉండి కూడా, సమస్త ప్రాణులకు స్వామినై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా శక్తి చే, నా దివ్య స్వ-స్వరూపంలో కనిపిస్తుంటాను.’ (4.6). అంటే, భగవంతుడు ఒక స్వరూపాన్ని కలిగి ఉండటమే కాక ఈ లోకంలోకి అవతార రూపంలో దిగివస్తుంటాడు, అని అర్థం.మనందరం ఆత్మలము, అనాదిగా ఈ లోకంలో జన్మలు తీసుకుంటూనే ఉన్నాము. భూలోకంలో ఇంతకు క్రితం భగవత్ అవతారము అయినప్పుడు కూడా మనం మానవ రూపంలోనే ఉండి ఉండవచ్చు. మనము ఆ అవతారాన్ని కూడా చూసి ఉండవచ్చు. కానీ, భగవంతుని స్వరూపము దివ్యమైనది మరియు మనకు ఉన్నవి ప్రాకృతిక కళ్ళు. కాబట్టి, మనం మన కళ్ళతో ఆయనను చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించలేకపోయాము.భగవంతుని దివ్య స్వభావము ఎలాంటిదంటే, ఆయన దివ్యత్వము ఒక్కో మనిషికి వాని-వాని ఆధ్యాత్మిక శక్తి మేర అర్థం అవుతుంది. సత్త్వగుణము ప్రధానముగా ఉండేవారు, ఇలా అనుకుంటారు, ‘శ్రీ కృష్ణుడు ఒక అసాధారణ మనిషి. చాలా సామర్థ్యం ఉన్నవాడే కానీ, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా కాడు.’ రజోగుణ ప్రభావంతో ఉన్నవారు, ‘అంత ప్రత్యేకమైనవాడేమీ కాదు, మన లాంటి వాడే’ అంటారు. తమోగుణ ప్రధానంగా ఉన్నవారు ఆయనను చూసినప్పుడు ఇలా అనుకుంటారు, ‘ఆయన అహంకారి మరియు చెడునడవడిక కలవాడు, మనకన్నా ఘోరమే.’ అని. కేవలం భగవత్ ప్రాప్తి పొందిన మహాత్ములు మాత్రమే ఆయనను భగవంతునిగా గుర్తిస్తారు, ఎందుకంటే వారికి భగవత్ కృపచే ఆ దివ్య దృష్టి లభించింది. కాబట్టి, ఎఱుకలేని భౌతిక దృక్పథంలో ఉన్న ఆత్మలు అయన ఈ లోకంలో అవతారం తీస్కున్నప్పుడు ఆయనను తెలుసుకోలేరు.
మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః । రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ।। 12 ।।
12
9
https://www.holy-bhagava…udio/009_012.mp3
మోఘ-ఆశాః — వ్యర్థమైన ఆశలు కలవారు; మోఘ-కర్మాణః — వ్యర్థమైన కర్మలను చేయువారు; మోఘ-జ్ఞానాః — గందరగోళ జ్ఞానము కలవారు; విచేతసః — భ్రమకు లోనయ్యి; రాక్షసీమ్ — రాక్షస; ఆసురీం — నాస్తిక; చ — మరియు; ఏవ — తప్పకుండా; ప్రకృతిం — భౌతిక శక్తి; మోహినీం — మోహమునకు గురై; శ్రితాః — ఆశ్రయింతురు.
BG 9.12: భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసుర, నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో, అభ్యుదయం/సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి, వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది.
భగవంతుని సాకార రూపం గురించి ఎన్నో రకాల నాస్తిక ప్రతిపాదనలు ఈ లోకంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. భగవంతుడు మానవ రూపంలో దిగిరాలేడని కొందరు ప్రకటిస్తారు. అందుకే శ్రీ కృష్ణుడు దేవుడు కాదు అని, కేవలం ఒక యోగి మాత్రమే అని అంటారు. మరికొందరు, శ్రీ కృష్ణుడు 'మాయా-విశిష్ట' బ్రహ్మ అంటారు, అంటే, భౌతిక శక్తి సంపర్కం వలన వచ్చే ఒక తక్కువ స్థాయి దివ్య వ్యక్తిత్వము అని అర్థం. మరికొందరు, శ్రీ కృష్ణుడు, బృందావన గోపికలతో తిరిగిన ఒక సత్ప్రవర్తనలేని పోకిరీ అని అంటారు. ఈ శ్లోకం ప్రకారం, ఈ అన్ని సిద్ధాంతాలు తప్పే, మరియు వీటిని నమ్మే వారి బుద్ధి, భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనయ్యి ఉంది. ఇటువంటి అవైదికమైన సిద్ధాంతాలని నమ్మేవారు, ఆసురీ స్వభావం కలిగినవారు అని కూడా శ్రీ కృష్ణుడు అంటున్నాడు. పరమేశ్వరుని సాకార స్వరూపంపై, దైవీ భావన లేనందున, వారు ఆయన పట్ల భక్తిలో నిమగ్నమవ్వలేరు. మరియు, నిరాకార బ్రహ్మం పట్ల భక్తి అత్యంత క్లిష్టమైనది కావటం వలన, అదికూడా చేయలేరు. అ ఫలితంగా శాశ్వతమైన సంక్షేమ మార్గాన్ని వారు కోల్పోతారు. క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయ్యి, వారి యొక్క శాశ్వత సంక్షేమం పట్ల ఆశలు నిష్ఫలమైపోతాయి.
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః । భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ।। 13 ।।
13
9
https://www.holy-bhagava…udio/009_013.mp3
మహా-ఆత్మానః — మాహాత్ములు; తు — కానీ; మాం — నన్ను; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; దైవీం-ప్రకృతిం — దివ్య శక్తి; ఆశ్రితాః — ఆశ్రయింతురు; భజంతి — భక్తిలో నిమగ్నమౌదురు; అనన్య-మనసః — అనన్య చిత్తముతో; జ్ఞాత్వా — తెలుసుకొని; భూత — సమస్త సృష్టి; ఆదిమ్ — ఆది మూలము; అవ్యయమ్ — నశించిపోనిది.
BG 9.13: కానీ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే, శ్రీ కృష్ణ పరమాత్మనే, సమస్త సృష్టికి ఆది-మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నంచేసి వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.
శ్రీ కృష్ణుడి ఉపదేశ విధానం ఎలా ఉంటుందంటే, ఒక విషయం గట్టిగా చెప్పాలంటే, పూర్తి విరుద్ధమైన ఉపమానములు చూపిస్తాడు. మోహమునకు గురై, భ్రమకు లోనైన వారి గురించి వివరించిన పిదప ఇక ఇప్పుడు మహాత్ముల గురించి మాట్లాడుతున్నాడు. భౌతిక ప్రాపంచిక జీవితం అనేది, మాయా (భౌతిక శక్తి) మోహితులై నిద్ర పోయేవారు అనుభూతిచెందే ఒక దీర్ఘమైన కల. వీరితో పోల్చితే, తమ అజ్ఞానం నుండి మేల్కొని, భౌతిక దృక్పథాన్ని ఒక పీడ-కల లాగా ప్రక్కకి తోసివేసిన వారే మహాత్ములు అంటే. భౌతిక శక్తి, మాయ, పట్టు వీడిపోయి, వారు ఇప్పుడిక దివ్య యోగమాయ శక్తి ఆశ్రయంలో ఉన్నట్టు. ఇటువంటి జ్ఞానోదయమైన మహాత్ములు, భగవంతునితో తమకున్న నిత్య సంబంధము యొక్క ఆధ్యాత్మిక యదార్థాన్ని గుర్తించినవారు. ఎలాగైతే భగవంతునికి రెండు రకాల అస్తిత్వములు ఉన్నవో — నిరాకార తత్త్వము మరియు సాకార రూపము — ఆయన యోగమాయ శక్తికి కూడా రెండు అస్తిత్వములు ఉంటాయి. అదొక నిరాకార శక్తి, కానీ అది కూడా, ఒక సాకార స్వరూపంలో రాధ, సీత, దుర్గ, లక్ష్మి, కాళి, పార్వతి మొదలగు రూపాల్లో వ్యక్తమవుతుంది. ఎలాగైతే, కృష్ణుడు, రాముడు, శివుడు, నారాయణుడు మొదలైనవారంతా ఒకే భగవంతుని ఒక్క అభేద స్వరూపాలో, ఈ దివ్య శక్తి స్వరూపాలు కూడా భగవంతుని దైవీ శక్తి యొక్క నిజరూపాలే, మరియు ఒకదాని నుండి ఒకటి అభేదములే. బ్రహ్మ వైవర్తక పురాణం ఇలా పేర్కొంటున్నది: యథా త్వం రాధికా దేవీ గోలోకే గోకులే తథా వైకుంఠే చ మహాలక్ష్మీ భవతి చ సరస్వతీ కపిలస్య ప్రియా కాంతా భారతే భారతీ సతీ ద్వారవత్యాం మహాలక్ష్మీ భవతీ రుక్మిణీ సతీ త్వం సీతా మిథిలాయాం చ త్వచ్ఛాయా ద్రౌపదీ సతీ రావణేన హృతా త్వం చ త్వం చ రామస్య కామినీ ‘ఓ రాధా, నీవే గోలోక (శ్రీ కృష్ణుడి దివ్య ధామము) మరియు గోకుల (ఐదువేల సంవత్సరాల క్రితం ఆయన అవతరించినప్పుడు భౌతిక జగత్తులో శ్రీ కృష్ణుడి ధామము) దివ్య దేవతవు. నీవే వైకుంఠములో (విష్ణు మూర్తి ధామము) మహాలక్ష్మిగా ఉన్నావు. నీవే కపిల దేవుని (భగవంతుని అవతారాల్లో ఒకటి) సహచారిణివి. నీవే ద్వారకలో రుక్మిణీదేవిగా ఉన్నావు (శ్రీ కృష్ణుని భార్య). నీవు మిథిలా నగరంలో సీతగా అవతరించావు. పాండవుల సతి ద్రౌపది, నీ నీడ యొక్క స్వరూపము వంటిది. నీవే రావణాసురిడిచే సీతాదేవిగా అపహరింపబడ్డావు, నీవే శ్రీ రామచంద్ర ప్రభువు సతీమణివి" ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, మహాత్ములు భగవంతుని యొక్క దివ్య శక్తి యొక్క శరణు పొంది ఉంటారు, అని అంటున్నాడు. దీనికి కారణమేమంటే, భగవత్ కృప, జ్ఞానము, ప్రేమ, మొదలైనవన్నీ భగవంతుని దివ్య శక్తులే, మరియు అన్నీ కూడా భగవంతుని యోగమాయా శక్తి అయిన రాధాదేవి యొక్క దాసీలే. కాబట్టి, యోగమాయ కృపవలన, మనకు భగవంతుని యొక్క దివ్య ప్రేమ, జ్ఞానము మరియు కృప లభిస్తుంది. భగవత్ కృప లభించిన మహాత్ములు, దివ్య ప్రేమ ప్రసాదించబడి ఉంటారు, మరియు అవిచ్చిన్నంగా నిరంతరం భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉంటారు.
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః । నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ।। 14 ।।
14
9
https://www.holy-bhagava…udio/009_014.mp3
సతతం — ఎల్లప్పుడూ; కీర్తయంతః — భగవత్ కీర్తిని, మహిమలని పాడుతూ; మాం — నన్ను; యతంతః — శ్రమిస్తూ; చ — మరియు; దృఢవ్రతాః — దృఢసంకల్పముతో; నమస్యంతః — వినమ్రతతో నమస్కరిస్తూ; చ — మరియు; మాం — నన్ను; భక్త్యా — ప్రేమయుక్త భక్తి; నిత్య-యుక్తాః — నిత్యమూ ఏకమై ఉండి; ఉపాసతే — ఆరాధిస్తారు.
BG 9.14: ఎల్లప్పుడూ నా దివ్య లీలలను/మహిమలను గానం చేస్తూ, దృఢ-సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.
మహాత్ములు తన పట్ల భక్తితో నిమగ్నమౌతారని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వారు భక్తి ఎలా చేస్తారో వివరిస్తున్నాడు. భక్తులు తమ భక్తి సాధన కోసం, భక్తిని పెంపొందించుకోవటం కోసం, కీర్తనల పట్ల ఎంతో ఆసక్తితో ఉంటారు అని అంటున్నాడు. భగవంతుని కీర్తిని గానం చేయటమే కీర్తన అంటారు, దీనిని ఈ విధంగా నిర్వచిస్తారు : నామ-లీలా-గుణాదీనాం ఉచ్చైర్-భాషా తు కీర్తనం (భక్తి రసామృత సింధు 1.2.145). ‘భగవంతుని యొక్క నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారము యొక్క మహిమలని పాడటమే కీర్తన అంటారు’ కీర్తన అనేది భక్తిని సాధన చేయటానికి ఉన్న అత్యంత ప్రభావమైన పనిముట్టు. అది మూడు రకాల భక్తి విధానాలని కలిగి ఉంటుంది, శ్రవణం (వినటము), కీర్తనం, మరియు స్మరణం. మన లక్ష్యం భగవంతునిపై మనస్సుని లగ్నం చేయటమే; అది కీర్తనం మరియు శ్రవణంతో పాటుగా చేస్తే ఇంకా సులువవుతుంది. ఆరవ అధ్యాయంలో చెప్పినట్టు, మనస్సు అనేది గాలి వలె చంచలమైనది, మరియు సహజంగానే ఒక ఆలోచన తరువాత ఇంకో ఆలోచనకి తిరుగుతూనే ఉంటుంది. శ్రవణము మరియు కీర్తనము జ్ఞానేంద్రియాలను భగవత్ దృక్పథంలో నిమగ్నం చేస్తాయి, మనస్సుని పదేపదే దాని తిరుగుడు నుండి వెనక్కు తీస్కు రావటానికి అవి సహాయం చేస్తాయి. కీర్తన ప్రక్రియ వలన ఇంకా చాల వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తరచుగా జనులు జపము (పూసల మాల సహాయంతో భగవత్ నామమును లేదా మంత్రమును జపించుట) లేదా ధ్యానము ద్వారా భక్తిని ఆచరించే ప్రక్రియలో, వారు నిద్రని ఆపుకోలేరు. కానీ, కీర్తన అనేది ఎంతో నిమగ్నమై చేసే పని కాబట్టి అది సహజంగానే నిద్రని తరిమివేస్తుంది. అంతేకాక, కీర్తన అనేది ధ్యాస మరల్చే అన్యమైన శబ్దాలను దరిచేరనివ్వదు. కీర్తనలో అందరూ కలసి పాలుపంచుకోవచ్చు. దానితో పాటుగా, మనస్సుకి కావలసిన మార్పు/కొత్తదనము, కీర్తనలో ఉండే భగవత్ నామాలు, గుణాలు, లీలలు, ధామాలు వంటి వాటి ద్వారా దానికి లభిస్తాయి. మరియు కీర్తనలో పెద్దగా గొంతెత్తి పాడటం వలన ఆ యొక్క భగవత్ నామము యొక్క దివ్య ప్రకంపనలు మొత్తం వాతావరణాన్ని మంగళప్రదంగా, పవిత్రంగా చేస్తాయి. ఇవన్నీ కారణాల వలన, కీర్తన అనేది భారతీయ యోగులలో అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి మార్గముగా ఉంది. ప్రఖ్యాత భక్తియోగ మహాత్ములందరూ – సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, గురు నానక్, కబీర్, తుకారం, ఏకనాథ్, నార్సి మెహత, జయదేవుడు, త్యాగరాజు, మరియు ఇతరులు – గొప్ప కవులు. వారు ఎనెన్నో భక్తి గీతాలను రచించారు మరియు వాటి ద్వారా కీర్తనం, శ్రవణం, మరియు స్మరణం లో నిమగ్నమైనారు. వేదశాస్త్రాలు, ఈ కలి యుగంలో, భక్తికి, కీర్తన ప్రక్రియని అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సులువైన మార్గముగా ప్రత్యేకంగా ప్రశంసించాయి. కృతే యద్ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరికీర్తనాత్ (భాగవతం 12.3.52) ‘సత్య యుగంలో భక్తికి అత్యుత్తమ మార్గము, భగవత్ ధ్యానము ఉండేది. త్రేతా యుగములో, యజ్ఞ యాగాదులను భగవత్ ప్రీతి కోసం ఆచరించటం ఉండేది. ద్వాపర యుగంలో, విగ్రహారాధన అనేది సిఫారసు చేయబడ్డ పద్ధతి. ఈ ప్రస్తుత కలి యుగంలో, అది కేవలం కీర్తన మాత్రమే’ అవికారీ వా వికారీ వా సర్వ దోషైక భాజనః పరమేశ పదం యాతి రామ నామనుకీర్తనాత్ (అధ్యాత్మ రామాయణం) ‘నీవు సకామ భావముతో ఉన్నా లేదా నిష్కామ భావనతో ఉన్నా, నీవు దోషరహితుడవైనా లేదా లోపభూయిష్టుడవైనా, నీవు గనక శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క నామసంకీర్తన చేస్తే, నీవు పరమ పదమును చేరుకోగలవు’ సర్వ ధర్మ బహిర్భూతః సర్వ పాపరతస్థథా ముచ్యతే నాత్ర సందేహో విశ్నోర్ణమానుకీర్తనాత్ (వైశంపాయన సంహిత) ‘పరమ పాపిష్ఠుఁలైనా మరియు ధార్మికత ఏమాత్రమూ లేనివారైనా, వారు విష్ణుమూర్తి యొక్క నామ గానము చేయటం వలన రక్షింపబడుతారు, ఇందులో సందేహం లేదు.’ కలియుగ కేవల హరి గున గాహా, గావత నర పావహిం భవ థాహా (రామచరితమానస్) ‘ఈ కలి యుగంలో మోక్షానికి ఒక ఉపాయం ఉంది. భగవంతుని కీర్తిని గానం చేస్తూ మనము భవ సాగరాన్ని దాటివేయవచ్చు.’ కానీ, కీర్తన ప్రక్రియలో, మనం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, శ్రవణం మరియు కీర్తనము సహాయకులే, ప్రధానమైనది భగవత్ స్మరణ. ఒకవేళ మనం అది విడిచి పెడితే, కీర్తన అనేది మనలను పరిశుద్ధి చేయదు. కాబట్టి, తన భక్తులు తమ మనస్సులని ఆయన స్మరణలో నిమగ్నం చేసి, కీర్తన చేస్తుంటారని, శ్రీ కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు. వారు అంతఃకరణ శుద్ధికై దృఢ సంకల్పముతో దీనిని ఆచరిస్తుంటారు.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే । ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ।। 15 ।।
15
9
https://www.holy-bhagava…udio/009_015.mp3
జ్ఞాన-యజ్ఞేన — జ్ఞాన సముపార్జన అనే యజ్ఞము; చ — మరియు; అపి — కూడా; అన్యే — ఇతరులు; యజంతః — పూజిస్తారు; మాం — నన్ను; ఉపాసతే — ఆరాధిస్తారు; ఏకత్వేన — అభేదభావ ఏకత్వముతో ; పృథక్త్వేన — వేరుగా; బహుధా — పలు రకముల; విశ్వతః-ముఖమ్ — విశ్వ రూపము.
BG 9.15: మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.
సాధకులు (ఆధ్యాత్మిక అభ్యాసము చేసేవారు), పరమ సత్యాన్ని చేరుకోవటానికి భిన్నభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం భక్తుల గురించి చెప్పాడు. వారు, ఆయన నిత్య అంశములుగా, సేవకులగా భగవంతుని చరణారవిందముల వద్ద భక్తితో శరణాగతి చేస్తారు. ఇక ఇప్పుడు సాధకులు అనుసరించే మరికొన్ని వేరే పద్ధతులను వివరిస్తున్నాడు. జ్ఞాన యోగమును అనుసరించేవారు తమను తాము భగవంతునికి అభేదమే అని పరిగణించుకుంటారు. వారు ‘సోహం’ (నేను అది), ‘శివోహం’ (నేను శివుడను) మొదలైన సూత్రాలపై లోతుగా ధ్యానం చేస్తుంటారు. అద్వైత బ్రహ్మముగా, ఆ సర్వోత్కృష్ట అస్తిత్వము యొక్క ప్రాప్తియే, వారి యొక్క సర్వోన్నత లక్ష్యం; దానికి శాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందము వంటి గుణములు ఉన్నా, రూపములు, గుణములు, స్వభావములు, మరియు లీలలు ఉండవు. శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే అటువంటి జ్ఞాన యోగులు కూడా తనను, నిరాకార, సర్వవ్యాప్త తత్త్వంలో ఆరాధిస్తారు అని అంటున్నాడు. వీరితో పోల్చితే, పలు రకాల అష్టాంగ యోగులు మొదలైనవారు ఉన్నారు, వారు తమను తాము భగవంతుని కంటే వేరుగా పరిగణించుకుంటారు మరియు అదే ప్రకారంగా ఆయనతో అనుసంధానం అవుతారు. ఇంకా కొందరు ఈ కంటికి కన్పించే వ్యక్తమైన విశ్వాన్ని భగవంతునిగా ఆరాధిస్తారు. వైదిక తత్త్వములో దీనిని 'విశ్వ రూప ఉపాసన' అంటారు. పాశ్చాత్య తత్త్వశాస్త్రం లో దీనిని పాన్థీఇసమ్ (Pantheism) అంటారు; ఇది గ్రీకు పదాలైన ‘pan’ (పాన్) అంటే సమస్తము మరియు ‘theos’, ‘థియోస్’ అంటే భగవంతుడు, అన్న పదాల నుండి వచ్చింది. దీని యొక్క ప్రఖ్యాత ప్రతిపాదకుడు, స్పినోజా (Spinoza) అనే ఆయన. ఈ జగత్తు భగవంతునిలో భాగమే కాబట్టి దాని పట్ల దైవీ భావము తప్పేమీ కాదు, కానీ అది అసంపూర్ణము. అటువంటి భక్తులకు, పరమేశ్వరుని యొక్క ఇతర విభూతుల పట్ల జ్ఞానం ఉండదు, ఉదాహరణకి బ్రహ్మన్ (భగవంతుని అద్వైత సర్వ-వ్యాప్త అస్తిత్వము), పరమాత్మ (సర్వ భూతముల హృదయములో కూర్చుని ఉన్న పరమాత్మ), మరియు భగవంతుడు (భగవంతుని వ్యక్తిగత దివ్య మంగళ స్వరూపము). మరైతే ఇన్ని రకాల భిన్న పద్ధతులు ఒకే దేవుడిని ఎలా ఆరాధిస్తాయి? శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకాలలో దీనికి సమాధానం చెప్తున్నాడు.
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ । మంత్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ।। 16 ।। పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః । వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ।। 17 ।।
16
9
https://www.holy-bhagava…/009_016-017.mp3
అహం — నేను; క్రతుః — వైదిక క్రతువు; అహం — నేను; యజ్ఞః — యజ్ఞము; స్వధా — నైవేద్యం; అహం — నేను; అహం — నేను; ఔషధం — ఔషధము; మంత్రః — వేద మంత్రము; అహం — నేను; అహం — నేను; ఏవ — మరియు; ఆజ్యం — నెయ్యి; అహం — నేను; అగ్నిః — అగ్ని; అహం — నేను; హుతం — సమర్పించే కార్యము; పితా — తండ్రి; అహం — నేను; అస్య — దీని యొక్క; జగతః — జగత్తు యొక్క; మాతా — తల్లి; ధాతా — నిలిపేవాడను; పితామహః — తాత; వేద్యం — జ్ఞానము యొక్క లక్ష్యం; పవిత్రం — పవిత్రం చేసేవాడిని; ఓం-కార — పవిత్ర శబ్దము ఓం; ఋక్ — ఋగ్వేదము; సామ — సామ వేదము; యజుః — యజుర్వేదము; ఏవ — కూడా; చ — మరియు.
BG 9.16-17: నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును, మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే. నేనే ఔషధ మూలికను, మరియు నేనే వేద మంత్రమును. నేనే (ఆజ్యము) నెయ్యి; నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి, నేనే తండ్రిని; జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడుని నేనే. నేనే పవిత్రమొనర్చేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును, మరియు యజుర్వేదమును నేనే.
ఈ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తన యొక్క అనంతమైన వ్యక్తిత్వానికి గల వేర్వేరు స్వరూపములను కొద్దిగా చూపిస్తున్నాడు. క్రతువు అంటే యజ్ఞము, అంటే, వేదములలో చెప్పబడిన అగ్నిహోత్ర యజ్ఞము వంటివి. ఇది స్మృతులలో చెప్పబడిన వైశ్వ దేవ యజ్ఞములు వంటివి. ఔషధము అంటే వైద్యానికి ఉపయోగించే మొక్కలలోని వ్యాధి నయం చేయగలిగే సామర్థ్యము. సృష్టి అనేది భగవంతుని నుండి ఉద్భవిస్తుంది, అందుకే ఆయన దాని పితా (తండ్రి). సృష్టికి ముందు, ఆయన అవ్యక్తమైన భౌతిక శక్తిని తన ఉదరము యందు ఉంచుకుంటాడు, కాబట్టి ఆయన జగత్ సృష్టికి మాతా (అమ్మ). ఆయనే ఈ విశ్వ సృష్టిని నిర్వహించేవాడు, పోషించేవాడు, అందుకే ఆయన దాని ధాతా (సంరక్షకుడు). ఆయనే, సృష్టికర్త బ్రహ్మ దేవుని తండ్రి, అందుకే ఆయన సమస్త విశ్వమునకూ పితామహుడు. వేదములు భగవంతుని నుండి ఉద్భవించాయి. రామాయణము (రామచరితమానస్) ప్రకారం - జాకీ సహజ స్వాస శృతి చారీ – ‘భగవంతుడు వేదములను తన శ్వాస ద్వారా వ్యక్తపరిచాడు.’ ఇవి భగవంతుని యొక్క జ్ఞాన శక్తి స్వరూపాలు, అందుకే అవి ఆయన యొక్క అనంతమైన వ్యక్తిత్వంలో ఒక భాగమే. ఈ నిజాన్ని శ్రీ కృష్ణుడు అద్భుతంగా - తనే వేదములు అని చెప్పటం ద్వారా – పేర్కొంటున్నాడు.
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ । మంత్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ।। 16 ।। పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః । వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ।। 17 ।।
17
9
https://www.holy-bhagava…/009_016-017.mp3
అహం — నేను; క్రతుః — వైదిక క్రతువు; అహం — నేను; యజ్ఞః — యజ్ఞము; స్వధా — నైవేద్యం; అహం — నేను; అహం — నేను; ఔషధం — ఔషధము; మంత్రః — వేద మంత్రము; అహం — నేను; అహం — నేను; ఏవ — మరియు; ఆజ్యం — నెయ్యి; అహం — నేను; అగ్నిః — అగ్ని; అహం — నేను; హుతం — సమర్పించే కార్యము; పితా — తండ్రి; అహం — నేను; అస్య — దీని యొక్క; జగతః — జగత్తు యొక్క; మాతా — తల్లి; ధాతా — నిలిపేవాడను; పితామహః — తాత; వేద్యం — జ్ఞానము యొక్క లక్ష్యం; పవిత్రం — పవిత్రం చేసేవాడిని; ఓం-కార — పవిత్ర శబ్దము ఓం; ఋక్ — ఋగ్వేదము; సామ — సామ వేదము; యజుః — యజుర్వేదము; ఏవ — కూడా; చ — మరియు.
BG 9.16-17: నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును, మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే. నేనే ఔషధ మూలికను, మరియు నేనే వేద మంత్రమును. నేనే (ఆజ్యము) నెయ్యి; నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి, నేనే తండ్రిని; జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడుని నేనే. నేనే పవిత్రమొనర్చేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును, మరియు యజుర్వేదమును నేనే.
ఈ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తన యొక్క అనంతమైన వ్యక్తిత్వానికి గల వేర్వేరు స్వరూపములను కొద్దిగా చూపిస్తున్నాడు. క్రతువు అంటే యజ్ఞము, అంటే, వేదములలో చెప్పబడిన అగ్నిహోత్ర యజ్ఞము వంటివి. ఇది స్మృతులలో చెప్పబడిన వైశ్వ దేవ యజ్ఞములు వంటివి. ఔషధము అంటే వైద్యానికి ఉపయోగించే మొక్కలలోని వ్యాధి నయం చేయగలిగే సామర్థ్యము. సృష్టి అనేది భగవంతుని నుండి ఉద్భవిస్తుంది, అందుకే ఆయన దాని పితా (తండ్రి). సృష్టికి ముందు, ఆయన అవ్యక్తమైన భౌతిక శక్తిని తన ఉదరము యందు ఉంచుకుంటాడు, కాబట్టి ఆయన జగత్ సృష్టికి మాతా (అమ్మ). ఆయనే ఈ విశ్వ సృష్టిని నిర్వహించేవాడు, పోషించేవాడు, అందుకే ఆయన దాని ధాతా (సంరక్షకుడు). ఆయనే, సృష్టికర్త బ్రహ్మ దేవుని తండ్రి, అందుకే ఆయన సమస్త విశ్వమునకూ పితామహుడు. వేదములు భగవంతుని నుండి ఉద్భవించాయి. రామాయణము (రామచరితమానస్) ప్రకారం - జాకీ సహజ స్వాస శృతి చారీ – ‘భగవంతుడు వేదములను తన శ్వాస ద్వారా వ్యక్తపరిచాడు.’ ఇవి భగవంతుని యొక్క జ్ఞాన శక్తి స్వరూపాలు, అందుకే అవి ఆయన యొక్క అనంతమైన వ్యక్తిత్వంలో ఒక భాగమే. ఈ నిజాన్ని శ్రీ కృష్ణుడు అద్భుతంగా - తనే వేదములు అని చెప్పటం ద్వారా – పేర్కొంటున్నాడు.
గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ । ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ।। 18 ।।
18
9
https://www.holy-bhagava…udio/009_018.mp3
గతిః — సర్వోత్కృష్ట లక్ష్యము; భర్తా — భరించు/పోషించు వాడను; ప్రభుః — ప్రభువు; సాక్షీ — సాక్షి; నివాసః — నివాసము; శరణం — ఆశ్రయము; సు-హృత్ — స్నేహితుడు; ప్రభవః — మూల ఉత్పత్తి స్థానం; ప్రలయః — లయము; స్థానం — నివాస స్థానము; నిధానం — విశ్రాంతి స్థలము; బీజం — విత్తనము; అవ్యయమ్ — నాశము చెందనిది.
BG 9.18: నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును, మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము; నేనే శాశ్వతస్థానమును మరియు సనాతన బీజమును.
ఆత్మ అనేది భగవంతుని యొక్క అణు-అంశము కాబట్టి, దాని యొక్క అన్ని అనుబంధాలూ/సంబంధాలూ ఆయనతోనే. కానీ, భౌతిక శారీరక దృక్పథంలో, మన శారీరక సంబంధీకులనే మనము తండ్రి, తల్లి, సఖి/సఖుడు, బిడ్డ మరియు స్నేహితుడు అని అనుకుంటాము. వారి పట్ల మమకార ఆసక్తులతో వారినే పదేపదే మన మనస్సులోకి తెస్తాము, దీనితో భౌతిక దృక్పథంలో మరింత బంధించివేయబడుతాము. కానీ, ఈ ప్రాపంచిక బంధువులు ఎవ్వరూ కూడా మనకు, మన ఆత్మ పరితపించే దోషరహిత సంపూర్ణ ప్రేమను ఇవ్వలేరు. దీని వెనుక రెండు కారణాలున్నాయి. మొదటగా, ఈ అనుబంధాలు తాత్కాలికమైనవి, మరియు మనం వెళ్లిపోయినప్పుడో లేదా వారు వెళ్ళిపోయినప్పుడో, విడిపోవటం అనేది తప్పదు. రెండోది, వారు బ్రతికున్నంత కాలం కూడా, ఆ అనుబంధం స్వార్థంపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అది స్వార్థ ప్రయోజనం నేరవేరినంత మేర ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఈవిధంగా, ప్రాపంచిక ప్రేమ యొక్క గాఢత మరియు పరిధి రోజంతా అనుక్షణం మారుతూ ఉంటుంది. ‘నా భార్య చాలా మంచిది... అంత మంచిది కాదు.... ఫరవాలేదులే ... ఆమె ఇంత ఘోరమా’, ఇలా, జగన్నాటకములో ప్రాపంచిక ప్రేమ యొక్క చాంచల్యము ఇంతగా ఉంటుంది. మరో పక్క, భగవంతుడు జన్మ జన్మల నుండి మనతోనే ఉన్న బంధువు. ఒక జన్మ నుండి ఇంకో జన్మకి, ఏ జీవరాశి రూపంలో ఉన్నా, భగవంతుడు మనతోపాటే ఉన్నాడు మరియు మన హృదయంలోనే స్థితమై ఉన్నాడు. అందుకే ఆయన మన శాశ్వత బంధువు. అంతేకాక, ఆయనకు మననుండి ఏమీ స్వప్రయోజనము అవసరం లేదు; ఆయనే దోషరహితుడు మరియు సంపూర్ణుడు. ఆయన మనలను నిస్వార్థంగా ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయన కేవలం మన శాశ్వత సంక్షేమం మాత్రమే కోరేవాడు. అందుకే శాశ్వతుడు, నిస్వార్థుడూ అయిన భగవంతుడు మాత్రమే మన నిజమైన బంధువు. ఈ విషయాన్ని మరో దృక్కోణం నుండి అర్థంచేసుకోవాలంటే, సముద్రము మరియు దాని నుండి వచ్చే అలలను ఉపమానంగా చూడండి. రెండు ఒకదానిచెంతనే ఉన్న అలలు కలిసి కొంతకాలం ప్రయాణిస్తాయి, మరియు ఏదో గాఢమైన అనుబంధము ఉన్నట్లుగా, ఉల్లాసముగా ఒకదానితో ఒకటి ఆడుకుంటాయి. కానీ, కొంచెం దూరం వెళ్ళిన తరువాత, ఒకటి సముద్రం లోనికి జారిపోతుంది, మరికాసేపట్లో ఇంకోటి కూడా కలిసిపోతుంది. వాటికి తమ మధ్యలో ఏదైనా అనుబంధం ఉందా? లేదు, అవి రెండూ సముద్రం నుండి జనించాయి మరియు వాటి సంబంధం సముద్రము తోనే. ఇదే విధంగా, భగవంతుడు ఒక సముద్రం వంటి వాడు మరియు మనమందరమూ దాని నుండి ఉద్భవించే అలలము. మనము మన శారీరక సంబంధీకులపై అనురాగం పెంచుకుంటాము; కానీ మరణ సమయంలో అందరిని విడిచి తదుపరి జన్మలోకి ఒంటరిగానే వెళ్తాము. యదార్థమేమంటే, జీవాత్మలకు ఒకదానితో ఇంకోదానికి సంబంధము లేదు, కేవలం భగవంతునితోనే ఉంది; మనమందరమూ ఎక్కడ నుండీ జనించామో, ఆ పరమేశ్వరుడితోనే. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు మనలను శారీరక దృక్పథం మరియు దానితోపాటుగా వచ్చే ప్రాపంచిక బంధువుల పట్ల అనురాగం భావముల నుండి పైకి తీసుకువస్తున్నాడు. ఆత్మ కోణం నుండి చూస్తే, భగవంతునితోనే మనకు అన్నీ సంబంధాలు; ఆయనే మన స్నేహితుడు, తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, మరియు సఖి/సఖుడు. ఈ విషయం అన్ని వేద శాస్త్రాలలో చెప్పబడింది. దివ్యో దేవ ఏకో నారాయణో మాతా పితా భ్రాతా సుహృత్ గతిః నివాసః శరణం సుహృత్ గతిర్ నారాయణా ఇతి (సుబాల శృతి, 6వ మంత్రము) ‘శ్రీమన్నరాయణుడే, జీవుని యొక్క - అమ్మ, నాన్న, సఖి/సఖుడు, మరియు గమ్యము’ మోరె సబఇ ఏక తుమ్హ స్వామీ, దీనబంధు ఉర అంతరయామి (రామచరితమానస్) ‘ఓ శ్రీ రామచంద్ర ప్రభూ, నీవే నా స్వామివి, పతితపావనుడివి, మరియు హృదయము తెలిసినవాడివి.’ భగవంతునితో మనకున్న నిత్య సంబంధము యొక్క పరిమాణము తెలుసుకున్న తరువాత మనము మన మనస్సుని ఆయన యందే అనుసంధానం చేయటానికి పరిశ్రమించాలి. దానిచే, మనస్సు పవిత్రం చేయబడుతుంది మరియు మనం ‘మామేకం శరణం వ్రజ’ అన్నటువంటి పూర్తి శరణాగతి షరతుని నెఱవేర్చినట్టు అవుతుంది; ఇది భగవత్ కృపని ఆకర్షించటానికి ఆవశ్యకమైనది. ఈ యొక్క అనన్య సంకల్పము సాధించటానికి మన ప్రస్తుత మమకారాసక్తులను అన్నింటిని ఖండించాలి మరియు వాటి స్థానాన్ని భగవత్ అనుబంధముచే భర్తీచేయాలి. అందుకే, రామచరితమానస్ ప్రకారం: సబ కై మమతా తాగ బటోరీ, మమ పద మనహి బాంధ బరి డోరీ ‘మనస్సుకి ఉన్న సమస్త ప్రాపంచిక అనుబంధాల తాళ్ళని ఖండించి వేయుము; ఆ తాళ్ళతో ఒక తాడు తయారు చేసి, దానిని భగవత్ చరణారవిందము వద్ద కట్టివేయుము.’ మన మనస్సుని ఆయనకు కట్టి వేయటానికి సహాయపడటానికి, ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఆత్మ యొక్క సర్వ-సంబంధములు భగవంతునితోనే అని అర్జునుడికి చెప్తున్నాడు.
తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ । అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ।। 19 ।।
19
9
https://www.holy-bhagava…udio/009_019.mp3
తపామి — వేడిని ప్రసరించు; అహం — నేను; అహం — నేను; వర్షం — వాన; నిగృహ్ణామి — నిలువరించు; ఉత్సృజామి — పంపించుట; చ — మరియు; అమృతం — అమరత్వం; చ — మరియు; ఏవ — కూడా; మృత్యుః — మరణము; చ — మరియు; సత్ — శాశ్వతమైన ఆత్మ; అసత్ — నశ్వరమైన భౌతికపదార్థములు; చ — మరియు; అహం — నేను; అర్జున — అర్జునా.
BG 9.19: నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను, మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జునా, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా.
భగవంతుడు మొదట ఈ విశ్వమును సృష్టించినప్పుడు, ఆయన మొట్టమొదట బ్రహ్మను సృష్టించి, ఆయనకే తదుపరి సృష్టి చేయటం అప్పగించాడు, అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సూక్ష్మమైన ప్రాకృతిక శక్తి నుండి సమస్త భౌతిక పదార్థమును, జీవ రాశులను సృష్టించే పని ఎలాచేయాలని బ్రహ్మ గారు అయోమయానికి గురయ్యాడు. ఆ తర్వాత భగవంతుడు అతనికి జ్ఞానాన్ని తెలియచేసాడు, దానినే చతుశ్లోకీ భాగవతము (నాలుగు శ్లోకముల భాగవతము) అంటారు, దీని ఆధారంగా బ్రహ్మగారు సృష్టి కార్యమును ప్రారంభించాడు. దాని యొక్క మొదటి శ్లోకం స్పష్టంగా ఇలా పేర్కొంటున్నది: అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్ పరం పశ్చాదహం యదేతచ్చ యోఽవశిశ్యేత సోఽస్మ్యహం (భాగవతం 2.9.32) శ్రీ కృష్ణుడు బ్రహ్మ గారికి ఇలా చెప్తాడు: ‘ఉన్నదంతా నేనే. సృష్టికి ముందు నేనొక్కడిని మాత్రమే ఉన్నాను. ఇక ఇప్పుడు సృష్టి ప్రారంభమైనది కాబట్టి బాహ్యంగా వ్యక్తమైన ఈ జగత్తు అంతా నా స్వరూపమే. ఇదంతా లయమై పోయిన తరువాత, నేను మాత్రమే ఉంటాను. నేను కానిది వేరే ఏమీ లేదు.’ ఈ పై యదార్థము మనకు సూచించేదేమిటంటే మనం ఈశ్వర ఆరాధనకు వాడే ద్రవ్యములు కూడా ఈశ్వరుడే. పవిత్ర గంగా నదిని పూజించేటప్పుడు జనులు, శరీరం క్రింది భాగం వరకు మునిగి, దోసిట్లోకి నీరు తీసుకుని మరల గంగ లోనికే పోస్తారు. ఈ ప్రకారంగా, గంగమ్మ ను అరాధించటాకి వారు గంగా నీటినే ఉపయోగిస్తారు. అదే విధంగా, ఉన్నదంతా భగవంతుడే కాబట్టి, ఆయనను ఆరాధించటానికి వాడే ద్రవ్యము కూడా ఆయన కంటే అభేదమే. ఈ విధంగా, ఇంతకు క్రితం 16వ మరియు 17వ శ్లోకాలలో చెప్పబడినట్టు, శ్రీ కృష్ణుడు, తనే - వేదము, యజ్ఞ అగ్ని, ఓం కారము, ఆజ్యము, మరియు సమర్పించే కార్యము - అని తెలియచేస్తున్నాడు. మన భక్తి యొక్క భావ, స్వరూప పద్ధతి ఏదైనా, ఆయన కానిది ఏమీ మనము ఆయనకు ఇవ్వలేము. ఐనప్పటికీ, మనకున్న ప్రేమ భావమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది కానీ, మనం సమర్పించే ద్రవ్యము కాదు.
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే । తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమ్ అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ।। 20 ।।
20
9
https://www.holy-bhagava…udio/009_020.mp3
త్రై-విద్యాః — కర్మ కాండల శాస్త్రము (వైదిక క్రతువులు); మాం — నన్ను; సోమ-పాః — సోమ రసాన్ని త్రాగేవారు; పూత — పవిత్రులై; పాపాః — పాపములు; యజ్ఞైః — యజ్ఞముల ద్వారా; ఇష్ట్వా — పూజింతురు; స్వః-గతిం — స్వర్గాధిపతి లోకానికి దారి; ప్రార్థయంతే — ఆశించెదరు; తే — వారు; పుణ్యం — పుణ్యము; ఆసాద్య — పొందెదరు; సుర-ఇంద్ర — ఇంద్రుని యొక్క; లోకం — లోకము; అశ్నంతి — భోగించి; దివ్యాన్ — దైవీ; దివి — స్వర్గములో; దేవ-భోగాన్ — దేవతల భోగములు.
BG 9.20: వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గుచూపేవారు, నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞ శేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి, పవిత్రులైన వీరు, స్వర్గ లోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్య కర్మల ఫలంగా, వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు, మరియు, దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు.
ఇంతకు పూర్వం, 9.12వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు - నాస్తిక, ఆసురీధోరణులతో ఉండి విశ్వాసం లేని మరియు ఆసురీస్వభావం కలవారి మనఃప్రవృత్తిని, మరియు అలాంటి వారు ఎదుర్కునే పరిణామాలని చెప్పిఉన్నాడు. ఆ తరువాత తన యందు ప్రేమయుక్త భక్తితో నిమగ్నమైన మహాత్ముల యొక్క స్వభావాన్ని వివరించాడు. ఇక ఇప్పుడు ఈ శ్లోకంలో మరియు తదుపరి శ్లోకంలో, తన భక్తులు కాని వారు, కానీ నాస్తికులు కూడా కాని వారి గురించి చెప్తున్నాడు. వారు వేదాలలోని కర్మ కాండలను చేస్తుంటారు. ఈ వైదిక కర్మ కాండలనే త్రై-విద్యా అని అంటారు. త్రై-విద్యా శాస్త్రముచే ఆకర్షితులై మోహితులైనవారు యజ్ఞములు మరియు ఇతర క్రతువుల ద్వారా, ఇంద్రుడు వంటి దేవతలను పూజిస్తారు. వారు పరమేశ్వరుడినే పరోక్షంగా పూజించినట్టు ఎందుకంటే దేవతలు ప్రసాదించిన ఆయా బహుమతులు నిజానికి ఈశ్వరుడిచే ఇవ్వబడినవే అన్న నిజాన్ని గ్రహించలేరు. కర్మ కాండలు మంచి పనులే అయినా అవి భక్తిగా పరిగణించబడవు. కర్మ కాండలను నిర్వహించేవారు జనన-మరణ చక్రం నుండి విముక్తి పొందరు. వారు ఈ భౌతిక జగత్తులోనే ఉన్న ఉన్నతమైన లోకాలకు, అంటే స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వంటి వాటికి వెళతారు. అక్కడ, వారు అద్భుతమైన దేవతా-భోగాలను అనుభవిస్తారు, అవి ఈ భూలోకంలో లభించే ఇంద్రియ సుఖాలకన్నా ఎన్నో రెట్లు సుఖదాయకంగా ఉంటాయి. ఈ తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు స్వర్గాది లోక భోగములలో ఉన్న దోషమును చూపిస్తాడు.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి । ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే ।। 21 ।।
21
9
https://www.holy-bhagava…udio/009_021.mp3
తే — వారు; తం — అది; భుక్త్వా — భోగించిన తరువాత; స్వర్గ-లోకం — స్వర్గ లోకము; విశాలం — విశాలమైన; క్షీణే — తరిగిపోయిన తరువాత; పుణ్యే — పుణ్యము; మర్త్య-లోకం — భూలోకము; విశంతి — తిరిగొస్తారు; ఏవం — ఈ విధంగా; త్రయీ-ధర్మం — మూడు వేదముల యొక్క కర్మ కాండ భాగము; అనుప్రపన్నాః — అనుసరించిన; గత-ఆగతం — పదేపదే వచ్చి పోతుండటము; కామ-కామాః — భోగ వస్తువుల పట్ల కోరిక; లభంతే — పొందురు.
BG 9.21: స్వర్గ లోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్య ఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మ కాండలను ఆచరించే వారు భూలోకానికి పదేపదే వచ్చి పోతుంటారు.
స్వర్గలోకముల యందుండెడి సుఖభోగములు తాత్కాలికమైనవి, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అక్కడికి పంపించబడిన జీవులకు, స్వర్గ లోక భోగములు అనుభవించిన తరువాత వారి పుణ్యం అంతా ఖర్చయిపోతుంది, అప్పుడు వారు, తిరిగి భూలోకానికి పంపించబడుతారు. ఈ విధంగా స్వర్గాది లోకములు పొందినా కూడా, దాని వల్ల ఆత్మ యొక్క సనాతన అన్వేషణ నెరవేరదు. మనందరమూ అనంతమైన పూర్వ జన్మలలో ఎన్నో సార్లు అక్కడికి వెళ్లి వచ్చాము, కానీ అనంతమైన ఆనందం కోసము ఆత్మకున్న కోరిక తీరలేదు. అన్ని వైదిక శాస్త్రాలు ఈ విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి: తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చాలితః (భాగవతం 11.10.26) ‘స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు.’ స్వర్గహు స్వల్ప అంత దుఖదాఈ (రామచరితమానస్) ‘స్వర్గ ప్రాప్తి అనేది తాత్కాలికమైనది మరియు తర్వాత దుఃఖాలను తెచ్చేది.’ ఎలాగైతే ఫుట్‌బాల్ బంతి, మైదానం అంతటా ఒక చోటి నుండి ఇంకో చోటికి తన్నబడుతుందో, మాయ అనేది, జీవాత్మను, భగవత్ విముఖం అవటం చేత అలాగే తంతున్నది. కొన్ని సార్లు నిమ్న లోకాలకు వెళుతోంది, కొన్నిసార్లు ఉన్నత లోకాలకు వెళుతుంది. ఈ క్రింది మరియు పై లోకాల్లో తనకు లభించిన ఈ బహు విధములైన రూపములలో కేవలం మానవ రూపం మాత్రమే భగవత్ప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది. అందుకే దేవతలు కూడా, భగవత్ ప్రాప్తికై ప్రయత్నించటానికి మానవ-జన్మ కోసమే పరితపిస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. దుర్లభం మానుషం జన్మ ప్రార్థయతే త్రిదశైరపి (నారద పురాణం) ‘మానవ శరీర జన్మ చాలా చాలా అరుదు (దుర్లభము). దేవతలు కూడా దీన్ని కాంక్షిస్తారు.’ అందుకే శ్రీ రామచంద్రుడు కూడా అయోధ్యావాసులకి ఇలా ఉపదేశం ఇచ్చాడు. బడే భాగ మానుష తను పావా, సుర దుర్లభ సబ గ్రంథంహి గావా (రామచరితమానస్) ‘ఓ అయోధ్యావాసులారా, మీరందరూ మానవ జన్మ లభించినందుకు ఏంతో ఏంతో అదృష్ట వంతులు, ఇది చాలా చాలా దుర్లభమైనది మరియు స్వర్గలోకవాసులు కూడా కోరుకునేది.’ దేవతలే ఈ మానవ జన్మను ఇంతగా కోరుకుంటున్నప్పుడు మరి ఇక మనం మాత్రం ఆ స్వర్గలోకాలకి పోవాలని కోరుకోవటం ఏమి ప్రయోజనం? అందుకే, మనం పరమేశ్వరుడిపై భక్తి ద్వారా భగవత్ ప్రాప్తికై నిమగ్నమవ్వాలి.
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే । తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ।। 22 ।।
22
9
https://www.holy-bhagava…udio/009_022.mp3
అనన్యాః — ఎల్లప్పుడూ; చింతయంతః — స్మరిస్తూ; మాం — నన్ను; యే — ఎవరైతే; జనాః — జనులు; పర్యుపాసతే — కేవలం (నన్నే) పూజింతురో; తేషాం — వారి యొక్క; నిత్య-అభియుక్తానాం — సదా నా యందే నిమగ్నమై ఉన్నారో; యోగ — ఆధ్యాత్మిక సంపత్తిని అందిస్తాను; క్షేమమ్ — ఆధ్యాత్మిక సంపత్తిని రక్షిస్తాను; వహామి — మోస్తాను; అహం — నేను.
BG 9.22: ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను.
నిస్సహాయ స్థితిలో ఉండి తన మీదే పూర్తిగా ఆధారపడి ఉన్న అప్పుడే పుట్టిన పసి బిడ్డని, ఏ తల్లి కూడా వదిలిపెట్టేయలేదు. ఆత్మ యొక్క సర్వోన్నత, నిత్య శాశ్వత తల్లి ఆ భగవంతుడే. ఈ శ్లోకంలో భగవంతుడు తనకు అనన్య శరణాగతి చేసిన ఆత్మలకు అమ్మ లాంటి హామీ ఇస్తున్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన పదాలు 'వహామి అహం' అంటే, ‘నేనే స్వయంగా నా భక్తుల భారాన్ని మోస్తాను’ అని, ఇది, ఒక వివాహితుడు తన భార్యా, పిల్లల యొక్క భారాన్ని మోసినట్టుగా అన్నమాట. భగవంతుడు రెండింటిని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు — మొదటిది యోగము - అంటే తన భక్తులకు లేని ఆధ్యాత్మిక సంపదని తనే ప్రసాదిస్తాడు. రెండవది క్షేమము - తన భక్తులకు అప్పటికే ఉన్న ఆధ్యాత్మిక సంపదలని తను సంరక్షిస్తాడు. కానీ, దీనికి ఆయన పెట్టిన షరతు ఏమిటంటే, అనన్య శరణాగతి. దీనిని కూడా మళ్లీ తల్లి-బిడ్డల ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక నవజాత శిశువు పూర్తిగా తన తల్లి మీదనే ఆధారపడి ఉంటుంది; ఆమే శిశువుకు కావలసినవన్నీ చూసుకుంటుంది. బిడ్డ ఏమైనా కావాలంటే కేవలం ఏడుస్తుంది; అమ్మనే బిడ్డను శుభ్రంచేయటం, అన్నంపెట్టడం, స్నానం చేపించటం వంటి పనులన్నీ చేస్తుంది. కానీ, బిడ్డకి ఐదు సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు, కొన్ని పనులు తనంత తానే చేసుకుంటుంది. ఆ మేరకు తల్లి తన పనులు తగ్గించుకుంటుంది. ఇంకా, అదే బిడ్డ యుక్త వయస్సు వచ్చి, అన్ని బాధ్యతలూ తనే తీస్కున్నప్పుడు, అమ్మ తన బాధ్యతను ఇంకా తగ్గించుకుంటుంది. ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చి, ‘మన అబ్బాయి ఏడి?’ అని అడిగితే, అమ్మ, ‘స్కూలు నుండి ఇంకా ఇంటికి రాలేదు. స్నేహితులతో కలిసి సినిమాకి పోయాడేమో’ అంటుంది. ఆమె యొక్క వైఖరి ఇప్పుడు వాడి పట్ల ఉదాసీనంగా ఉంటుంది. కానీ, ఇదే పిల్లవాడు ఐదు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు, స్కూలు నుండి రావటం పది నిముషాలు ఆలస్యం అయితే, అమ్మ-నాన్న చింతించటం మొదలుపెడతారు, ‘ఏమయిందో? వాడు చిన్నవాడు. వాడికేమీ ప్రమాదం జరగలేదు కదా. ఒకసారి స్కూల్‌కి ఫోన్ చేసి కనుక్కుందాం.’ అని అనుకుంటారు. ఈ ప్రకారంగా పిల్లవాడు మరింత బాధ్యతలు తీసుకున్నకొద్దీ, ఆ తల్లి తన బాధ్యతని త్యజిస్తూ ఉంటుంది. భగవంతుని చట్టము కూడా ఇలాగే ఉంటుంది. మన సొంత స్వేచ్చా చిత్తముతో ప్రవర్తిస్తూ, మన కర్మలను చేసేది మనమే అని అనుకున్నప్పుడు, మన సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్నప్పుడు, భగవంతుడు తన కృపని ప్రసాదించడు. కేవలం మన కర్మలను నోటు చేసుకుంటూ ఫలములను ఇస్తుంటాడు. మనం పాక్షికంగా ఆయనకు శరణాగతి చేసి, పాక్షికంగా భౌతిక ఆధారాలపై ఆధారపడినప్పుడు, భగవంతుడు కూడా తన కృపను పాక్షికంగా ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటామో, 'మామేకం శరణం వ్రజ' , భగవంతుడు తన పూర్తి అనుగ్రహముని ప్రసాదించి, మనకు ఉన్నవాటిని సంరక్షిస్తూ, మనకు లేని వాటిని సమకూరుస్తూ, మన పూర్తి బాధ్యతను తను స్వీకరిస్తాడు.
యేఽప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః । తేఽపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ।। 23 ।।
23
9
https://www.holy-bhagava…udio/009_023.mp3
యే — ఎవరైతే; అపి — అయినా కూడా; అన్య — వేరే ఇతర; దేవతా — దేవతలను; భక్తాః — భక్తులు; యజంతే — పూజిస్తారో; శ్రద్ధయా-అన్వితాః — విశ్వాసంతో; తే — వారు; అపి — కూడా; మాం — నన్ను; ఏవ — మాత్రమే; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; యజంతి — పూజిస్తారు; అవిధి-పూర్వకం — తప్పుడు పద్ధతిలో.
BG 9.23: ఓ కుంతీ పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు. కానీ, అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు.
పరమేశ్వరుడిని ఆరాధించే వారి యొక్క స్థానాన్ని వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక, భౌతిక లాభాల కోసం నిమ్న స్థాయి దేవతలను ఆరాధించే వారి యొక్క పరిస్థితిని వివరిస్తున్నాడు. వారు కూడా శ్రద్ధతోకూడి ఉంటారు, వారి విన్నపములను దేవతలు తీర్చుతారు కావొచ్చు, కానీ వారి యొక్క అవగాహన అసంపూర్ణముగా ఉంటుంది. దేవతలు కూడా తమ శక్తిసామర్థ్యాలను భగవంతుని నుండే పొంది ఉంటారు అని వారు అర్థం చేసుకోలేకున్నారు. కాబట్టి, వారు కూడా పరమేశ్వరుడైన భగవంతుడినే పరోక్షంగా ఆరాధించినట్టు. ఉదాహరణకి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక పౌరుని ఫిర్యాదుని తీర్చాడనుకోండి, ఆయనను పరోపకారి అనరు. ఆయన కేవలం ప్రభుత్వం తనకు ఇచ్చిన తన పరిధిలోని అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. అదే విధంగా, అందరు దేవతల సమస్త శక్తి సామర్థ్యాలు కూడా ఆ భగవంతుడు నుండి వచ్చినవే. కాబట్టి, ఉన్నత స్థాయి జ్ఞానం కలవారు ఈ పరోక్ష మార్గంలో వెళ్ళరు; వారు సమస్త శక్తులకు మూలమైన ఆ భగవంతుడినే పూజిస్తారు. పరమేశ్వరుని పట్ల సమర్పింపబడిన ఇటువంటి ఆరాధన సమస్త సృష్టిని తృప్తి పరుస్తుంది: యథా తరోర్ మూల నిషేచనేన తృప్యంతి తత్ స్కంధభుజోపశాఖాః ప్రాణోపహారాశ్చ యథేంద్రియాణాం తథైవ సర్వార్హణమ్ అచ్యుతేజ్యా (భాగవతం 4.31.14) ‘మనము ఒక చెట్టు యొక్క మొదట్లో వేర్లకు నీరు పోస్తే, దాని కాండము, కొమ్మలు, చిగుర్లు, ఆకులు మరియు పువ్వులు అన్నీ పోషింపబడుతాయి. మనం మనం నోటితో ఆహారం తీసుకుంటే, అదే ప్రాణ వాయువులను మరియు ఇంద్రియములను పోషిస్తుంది. అదే విధంగా, పరమేశ్వరుడైన భగవంతుడిని పూజిస్తే, దేవతలతో సహా, ఆయన సమస్త అంశములు, పూజింపబడ్డట్టే.’ కానీ, మనం చెట్టు వేర్లను నిర్లక్ష్యం చేస్తూ, ఆకులకు నీరు పోస్తే, ఆ చెట్టు నశించిపోతుంది. అదే విధంగా, దేవతలకు చేయబడిన ఆరాధన, తప్పకుండా భగవంతుడిని చేరుతుంది. కానీ, అటువంటి భక్తుడికి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగవు. తదుపరి శ్లోకంలో ఇది మరింత వివరించబడినది.
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ । న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ।। 24 ।।
24
9
https://www.holy-bhagava…udio/009_024.mp3
అహం — నేను; హి — నిజానికి; సర్వ — అన్ని; యజ్ఞానాం — యజ్ఞములు; భోక్తా — భోక్త; చ — మరియు; ప్రభుః — ప్రభువు; ఏవ — మాత్రమే; చ — మరియు; న — కాదు; తు — కానీ; మాం — నన్ను; అభిజానాతి — తెలుసుకుని; తత్త్వేన — దివ్య తత్త్వమును; అతః — కాబట్టి; చ్యవంతి — పడిపోతారు (సంసారములో తిరుగుతారు); తే — వారు.
BG 9.24: సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే.
శ్రీ కృష్ణుడు ఇప్పుడు దేవతల ఆరాధన చేయటంలో ఉన్న లోపాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. పరమేశ్వరుడైన భగవంతుడు ఇచ్చిన శక్తి వలన వారికి భౌతిక వరాలను ఇచ్చే సామర్థ్యం ఉంటుంది, కానీ వారు తమ భక్తులను జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయలేరు. వారు తమ దగ్గర ఉన్నవి మాత్రమే వేరే వారికి ఇవ్వగలరు. దేవతలు సైతం సంసార చక్రము నుండి విముక్తి కానివారే అయినప్పుడు, వారు తమ భక్తులను ఎలా విముక్తి చేయగలరు? అదే సమయంలో, ఏవరికైతే సరైన జ్ఞానం ఉందో, వారు తమ సంపూర్ణ భక్తిని భగవంతుని చరణారవిందాల యందే సమర్పిస్తారు; మరియు వారి భక్తి పరిపక్వత చెందినప్పుడు వారు మర్త్యలోకాన్ని దాటి దివ్య ధామానికి చేరుకుంటారు.
యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః । భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోఽపి మామ్ ।। 25 ।।
25
9
https://www.holy-bhagava…udio/009_025.mp3
యాంతి — వెళ్లెదరు; దేవ-వ్రతా: — దేవతలను పూజించేవారు; దేవాన్ — దేవతలలో; పితౄన్ — పితృ దేవతల వద్దకు; యాంతి — వెళతారు; పితృ-వ్రతాః — పితృ దేవతలను పూజించేవారు; భూతాని — భూతప్రేతముల వద్దకు; యాంతి — పోతారు; భూత-ఇజ్యాః — భూతప్రేతములను ఆరాధించేవారు; యాంతి — వెళ్లెదరు; మత్ — నా యొక్క; యాజినః — భక్తులు; అపి — మరియు; మామ్ — నా వద్దకు.
BG 9.25: దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.
ఎలాగైతే ఒక గొట్టంలోని నీరు, ఆ గొట్టం అనుసంధానం చేయబడిన ట్యాంక్ స్థాయి వరకే పైకి వస్తాయో, భక్తులు తాము దేనిని పూజిస్తారో దాని స్థాయి వరకే ఉన్నతిని సాధించగలరు. ఈ శ్లోకంలో, శ్రీకృష్ణుడు వేరువేరు అస్తిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలను, వివిధ రకములైన గమ్యములను తెలియచేయటం ద్వారా వివరిస్తున్నాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతి సాధించటం కోసం మనము ఆ పరమాత్మనే ఆరాధించాలి అని తెలుసుకోవటం కోసం ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అగ్ని వంటి వారిని ఆరాధించేవారు స్వర్గాది లోకాలకు వెళతారు. ఆ తర్వాత వారి యొక్క పుణ్య ఫలములు తరిగిపోయిన తరువాత వారు స్వర్గము నుండి పంపించి వేయబడుతారు. పితృలు అంటే పూర్వీకులు. వారి పట్ల కృతజ్ఞతా భావన ఉండటం మంచిదే, కానీ వారి సంక్షేమం కోసం అతి-చింతన నష్టదాయకమైనది. పితృ దేవతలను (పూర్వీకులను) పూజించేవారు, మరణించిన పిదప తమ పూర్వీకుల లోకాలకు వెళతారు. తామస గుణ ప్రధానంగా ఉన్నవారు, భూతప్రేతములను పూజిస్తారు. పాశ్చాత్య ప్రపంచంలో, ‘విచ్-క్రాఫ్ట్’ ఉంది; ఆఫ్రికాలో ‘బ్లాక్ మాజిక్’ ఉంది; భారత దేశంలో ‘వామ-మార్గ తాంత్రికులు’ ఉన్నారు, వారు భూతప్రేతములను ఆవాహనచేస్తారు. ఇటువంటి పనులలో పాల్గొనే వారు, వారి తదుపరి జన్మలో, భూతప్రేతములలో జన్మిస్తారు, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. సర్వోన్నత భక్తులు ఎవరంటే, తమ మనస్సులను పరమేశ్వరుడైన భగవంతుని యందే నిమగ్నం చేసేవారు. 'వ్రత' అనే పదానికి అర్థం ‘సంకల్పము మరియు ప్రయత్నము’ అని. భగవంతుని ఆరాధనకై దృఢ సంకల్పము చేసి మరియు ఆయన భక్తి యందే నిశ్చలబుద్ధితో ఉన్న, ఇటువంటి ధన్యులైన జీవులు, తదుపరి జన్మలో ఆయన దివ్య ధామానికి చేరుకుంటారు.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి । తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 26 ।।
26
9
https://www.holy-bhagava…udio/009_026.mp3
పత్రం — ఆకు; పుష్పం — పువ్వు; ఫలం — పండు; తోయం — నీరు; యః — ఎవరైతే; మే — నాకు; భక్త్యా — భక్తితో; ప్రయచ్ఛతి — సమర్పిస్తారో; తత్ — అది; అహం — నేను; భక్తి-ఉపహృతం — భక్తితో సమర్పించబడినట్టి; అశ్నామి — ఆరగింతును; ప్రయత-ఆత్మనః — పవిత్రమైన మనస్సు ఉన్నవ్యక్తి.
BG 9.26: నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.
పరమేశ్వరుడిని ఆరాధించటం వలన కలిగే ప్రయోజనాలను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, అది ఎంత సులువైనదో వివరిస్తున్నాడు. దేవతల మరియు పితృదేవతల ఆరాధనలో, వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ, భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన దాన్ని ఏదైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి, కానీ ఇక్కడ కూడా అది ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ శ్లోకపాదాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వాని (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు. ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో, శ్రీ కృష్ణుడు భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. తనకు సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా ఇచ్చామో అనేదే అయనకు ముఖ్యం. ఈ విధంగా 'హరి భక్తి విలాస్' ఇలా పేర్కొంటుంది: తులసీ దళ మాత్రేణ జలస్య చులుకేన చ విక్రీణీతే స్వం ఆత్మానం భక్తేభ్యో భక్త-వత్సలః (11.261) ‘భగవంతునికి నిజమైన ప్రేమతో, ఒక తులసి ఆకు మరియు మీ దోసిట్లో పట్టేంత నీరు సమర్పిస్తే, బదులుగా ఆయన తననే మీకు సమర్పించుకుంటాడు, ఎందుకంటే ఆయన ప్రేమకు వశమైపోతాడు.’ అఖిలాండకోటిబ్రహ్మాండ నాయకుడు, అనిర్వచనీయమైన మహాద్భుత గుణములు కలవాడు, ఎవరి సంకల్ప మాత్రం చేతనే అనంతమైన బ్రహ్మాండాలు సృజించబడి, లయమై పోతుంటాయో, అలాంటి ఆయన తన భక్తునిచే నిజమైన ప్రేమతో సమర్పించబడిన అత్యల్పమైన దాన్ని కూడా స్వీకరిస్తాడు అంటే అదెంత అద్భుతమైన విషయం. ఇక్కడ 'ప్రయతాత్మనః' అన్న పదం వాడబడింది, అంటే, ‘కల్మషములేని పవిత్ర హృదయం (మనస్సు) తో ఉన్న వారు సమర్పించే దానిని స్వీకరిస్తాను’ అని. శ్రీమద్భాగవతంలో కూడా సరిగ్గా ఇదే భగవద్గీత శ్లోకం ఉంది. సుదాముని ఇంట్లో అటుకులు తినేటప్పుడు, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః (10.81.4) ‘నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను.’ భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడల్లా, తన దివ్య లీలలలో ఈ గుణమును ప్రదర్శిస్తాడు. మహాభారత యుద్ధం ముందు, శ్రీ కృష్ణుడు, కౌరవులు, పాండవుల మధ్య సంధి కుదిర్చే ప్రయంత్నంలో హస్తినాపురం వెళ్లినప్పుడు, దుష్టుడైన దుర్యోధనుడు గర్వంతో యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేసాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఆ ఆతిథ్యం తిరస్కరించి, ఒక సామాన్యమైన విదురాని కుటీరానికి వెళ్ళాడు, ఆమె ఎప్పటినుండో తన ఇష్టదైవాన్ని సేవించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. కృష్ణుడు ఇంటికి రావటంతో విదురాని అమితంగా సంతోషపడింది. ఆమె దగ్గర ఇవ్వటానికి కేవలం అరటి పండ్లే ఉన్నాయి, కానీ ప్రేమభావనలో ఆమె బుద్ధి ఎంతగా అయోమయం అయిపోయిందంటే, ఆమె పండు పడేసి, తొక్కలు ఆయనకు తినిపించింది కూడా తెలియలేదు. ఐనప్పటికీ, ఆమె భక్తిని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలు తిన్నాడు.
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ । యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 27 ।।
27
9
https://www.holy-bhagava…udio/009_027.mp3
యత్ — ఏదైనా సరే; కరోషి — నీవు చేసేది; యత్ — ఏదైతే; అశ్నాసి — నీవు భుజిస్తావో; యత్ — ఏదైతే; జుహోషి — యజ్ఞాగ్నిలో సమర్పిస్తావో; దదాసి — బహుమతిగా ఏది దానం (బహూకరించుట) చేసినా; యత్ — ఏదైతే; యత్ — ఏదైనా; తపస్యసి — ఆచరించే తపస్సులను; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; తత్ — వాటిని; కురుష్వ — చేయుము; మద్ అర్పణం — నాకు సమర్పించినట్టుగా.
BG 9.27: నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.
ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీ కృష్ణుడు అన్ని పదార్థాలను తనకు అర్పించమన్నాడు. ఇక ఇప్పుడు అన్ని పనులను/క్రియాకలాపములను తనకే అర్పించమంటున్నాడు. ఏ సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నా, ఏ శాఖాహార ఆహారాన్ని భుజిస్తున్నా, ఏ మత్తుపదార్థరహిత పానీయాలని త్రాగుతున్నా, ఏ వైదిక కర్మలు ఆచరిస్తున్నా, ఏ వ్రతాలు, నిష్ఠలు ఆచరిస్తున్నా, అవన్నీ కూడా, మానసికంగా పరమేశ్వరుడైన భగవంతునికే అర్పించాలి. తరచుగా జనులు భక్తిని దైనందిన జీవితం కంటే వేరుగా చూస్తారు, మరియు భక్తి అంటే వేరేగా కేవలం గుడి లోపలే చేయాలి అనుకుంటారు. కానీ, భక్తి అనేది గుడి లోపల మాత్రమే చేసేది కాదు; అది జీవితం లోని ప్రతి క్షణం ఆచరింవలసినదే. నారద మహర్షి భక్తిని ఈ విధంగా నిర్వచించాడు: నారదస్తు తదర్పితా ఖిలాచారతా తద్విస్మరణే పరమవ్యాకులతేతి (నారద భక్తి దర్శనము, 19వ సూత్రము) ‘భక్తి అంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పితం చేయటమే, మరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే.’ పనులను ఆయనకు అంకితం చేసి మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చివేస్తే దానినే అర్పణం అంటారు. ఇటువంటి దృక్పథం, భౌతికమైన ప్రాపంచిక పనులను, దివ్యమైన భగవత్ సేవగా సంపూర్ణముగా మార్చివేస్తుంది. స్వామీ వివేకానంద, పని పట్ల ఈ దృక్పథాన్నే వ్యక్తీకరించాడు: ‘ఏ పనీ లౌకికమైనది కాదు. ప్రతీదీ భక్తి మరియు సేవయే’ (No work is secular. Everything is devotion and service.) సంత్ కబీర్ ఇదే విషయాన్ని తన పద్యాల్లో చెప్పాడు: జహాఁ జహాఁ చలూఁ కరూఁ పరిక్రమా, జో జో కరూఁ సో సేవా జబ సోఁవూ కరూఁ దండవత్, జానూఁ దేవ న దూజా ‘నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను.’ చాలా మంది జనులు ఈ క్రింది శ్లోకాన్ని, దాని మహత్వం తెలియకుండానే దేవాలయాల్లో ఈ శ్లోకం పఠిస్తారు: కాయేన వాచా మనసేంద్రియైర్ వా బుద్ధ్యాత్మనా వానుసృత-స్వభావాత్ కరోతి యద్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్ తత్ (భాగవతం 11.2.36) ‘శరీరంతో కానీ, మాటలతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియములతో కానీ, లేదా బుద్ధితో కానీ, తన వ్యక్తిగత స్వభావం అనుగుణంగా, చేసే వాటన్నిటినీ, శ్రీమన్నారాయణుడికే అర్పించాలి.’ కానీ, ఈ సమర్పించటం, అంతా పని అయిపోయిన తరువాత, వైదిక క్రతువులలో చేసినట్టు ‘శ్రీ కృష్ణాయ సమర్పణమస్తు’ అని అనటం ద్వారా చేయటంకాదు. ఆ సమర్పణ అనేది పని చేస్తూ ఉన్నప్పుడే, ఇదంతా భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్న అంతర్గత భావనతో చేయాలి. అన్ని కార్యకలాపములను తనకే అర్పించమని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు అలా చేయటం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇక వివరిస్తున్నాడు.
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః । సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ।। 28 ।।
28
9
https://www.holy-bhagava…udio/009_028.mp3
శుభ-అశుభ ఫలైః — మంచి మరియు చెడు ఫలితములచే; ఏవం — ఈ విధంగా; మోక్ష్యసే — నీవు విముక్తి చేయబడుతావు; కర్మ — కర్మల; బంధనైః — బంధముల నుండి; సంన్యాస-యోగ — స్వార్థ చింతన త్యజించి; యుక్త-ఆత్మా — మనస్సు నాయందే లగ్నం చేసి; విముక్తః — విముక్తి చేయబడి; మామ్ — నా వద్దకు; ఉపైష్యసి — చేరుకుంటావు.
BG 9.28: అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు.
అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, ప్రతి ఒక్క పని కూడా లోపాలతో కూడి ఉంటుంది. మనం భూమిపై నడుస్తున్నప్పుడు, తెలియకుండానే ఎన్నో వేల అతిచిన్న ప్రాణులను చంపేస్తాము. మన వృత్తికి సంబంధించిన విధి నిర్వహణలో ఎంత జాగ్రత్తగా ఉన్నా, వాతావరణానికి హాని చేయటమో లేక వేరే వారి మనస్సు బాధపెట్టడమో జరుగుతుంది. కేవలం, ఒక కప్పు పెరుగు తిన్నా, వాటిలో నివసించే జీవరాశులను నాశనం చేసిన పాపం తగులుతుంది. కొన్ని మతాల్లో ఈ యొక్క అసంకల్పిత హింసని తగ్గించటానికి నోటికి ఒక గుడ్డ అడ్డం పెట్టుకుంటారు. ఇది కూడా మన శ్వాస వలన కలిగే జీవరాశుల వినాశనాన్ని పూర్తిగా నిలువరించలేదు. మన స్వార్థ ప్రయోజనం తీరటం కోసం మనం పనులు చేసినప్పుడు, తెలిసినా, తెలియకపోయినా మన పాపాలకు మనం దోషులమే. కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం వాటి యొక్క ఫలితములు అనుభవించవలసినదే. మంచి పనులు కూడా బంధన కారకమే ఎందుకంటే, అవి ఆత్మని స్వర్గ లోకాలకి వెళ్లి అ ఫలములను భోగించేటట్టు చేస్తాయి. ఈ విధంగా, మంచి మరియు చెడు కర్మలు కూడా ఈ జనన-మరణ చక్రం లో ఉండిపోయేటట్టే చేస్తాయి. కానీ ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు సమస్త కర్మ ఫలితములు నశింపచేయటానికి ఒక సరళమైన పరిష్కారం చూపిస్తున్నాడు. ఆయన 'సన్యాస యోగము' అన్న పదం వాడుతున్నాడు, అంటే స్వార్థమును త్యజించమంటున్నాడు. ఆయన అనేదేమిటంటే, మనం ఎప్పుడైతే మన పనులను భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తామో, మనం మంచి మరియు చెడు, ఈ రెండింటి కర్మ ఫల సంకెళ్ల నుండి విముక్తి పొందుతాము. ఇటువంటి దృక్పథంలో ఉండేవారిని, యోగ యుక్తాత్మా (హృదయంలో భగవంతునితో ఏకమై ఉండటం). ఇటువంటి యోగులు, ఈ శరీరంలో ఉండగానే, జీవన ముక్తులు అవుతారు. మరియు, ఈ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టిన పిదప, వారు దివ్య దేహాన్ని మరియు దివ్య భగవత్ ధామంలో నిత్య శాశ్వత సేవని పొందుతారు.
సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః । యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్ ।। 29 ।।
29
9
https://www.holy-bhagava…udio/009_029.mp3
సమః — సమానముగా; అహం — నేను; సర్వ-భూతేషు — సమస్త ప్రాణుల యందు; న — ఎవరూ కాదు; మే — నాకు; ద్వేష్యః — విరోధులు; అస్తి — ఉండును; న — కాదు; ప్రియః — ఇష్టమైన వారు; యే — ఎవరైతే; భజంతి — ప్రేమతో ఆరాధించేవారు; తు — కానీ; మాం — నన్ను; భక్త్యా — భక్తితో; మయి — నా యందే నివసిస్తారు; తే — అటువంటి జనులు; తేషు — వారి యందు; చ — మరియు; అపి — కూడా; అహం — నేను.
BG 9.29: నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావం తో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను.
దేవుడనేవాడు ఉంటే ఆయన సంపూర్ణ దోషరహిత న్యాయమూర్తిగా ఉంటాడని మనందరమూ అంతర్లీనంగా నమ్ముతాము; అన్యాయమైన భగవంతుడు ఉండలేడు. లోకంలో అన్యాయంచే పీడించబడేవారు ఇలాంటి మాటలు అంటుంటారు , ‘ఓ, కొటీశ్వరుడా, నీ దగ్గర ధన బలం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మన వివాదాన్ని భగవంతుడే పరిష్కరిస్తాడు. ఆయన అంతా చూస్తున్నాడు, నిన్ను తప్పక దండిస్తాడు. నీవు తప్పించుకోలేవు.’ అని. ఇటువంటి మాటలు వింటే, ఆ చెప్పేవాడు, భగవంతుని మీద అత్యంత దృఢ విశ్వాసం ఉన్న ఋషి/ముని కాకపోయినా, సామాన్య మానవులకు కూడా భగవంతుడు సంపూర్ణ న్యాయమైన వాడు అని గట్టి నమ్మకం ఉందని తెలుస్తుంది. కానీ, శ్రీ కృష్ణుడు చెప్పిన ఇంతకు క్రితం శ్లోకం, భగవంతుడు తన భక్తుల పట్ల పక్షపాతంతో ఉంటాడా అన్న సందేహాన్ని కలుగ చేస్తుంది; ఎందుకంటే, మిగతా అందరూ కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటే, భగవంతుడు తన భక్తులను దాని నుండి విముక్తి చేస్తాడు. ఇది మరి ఆయన పక్షపాత దోషానికి సూచిక కాదా? శ్రీ కృష్ణుడు దీనిని స్పష్టపరచాలానే ఉద్దేశంతో, ఈ శ్లోకాన్ని 'సమోఽహం' అన్న పదంతో మొదలు పెడుతున్నాడు, అంటే, ‘లేదు లేదు నేను అందరి పట్ల సమంగా ఉంటాను, కానీ, నా దగ్గర అందరికీ సమానంగా వర్తించే చట్టం ఉంది, దాని పరంగానే నేను నా కృపని ప్రసాదిస్తాను’ అని. ఈ సూత్రం, ఇంతకూ క్రితం 4.11వ శ్లోకంలో చెప్పబడింది: ‘నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే, ఓ అర్జునా.’ వాన నీరు భూమిపై సమానంగా పడుతుంది. అయినా, వ్యవసాయ క్షేత్రాలలో పడే బిందువు, ధాన్యంగా మారుతుంది; ఎడారి ముళ్లపొదపై పడే బిందువు ముల్లుగా మారుతుంది; మురుగు గుంటలో పడే బిందువు మురుగు నీరు అవుతుంది; మరియు ఆల్చిప్పలో పడే బొట్టు, ముత్యంగా మారుతుంది. పడే వానకి ఎలాంటి పక్షపాతం లేదు, అది నేలపై తన కృపని సమానంగానే చూపుతుంది. వాటి ఫలితాలలో ఈ యొక్క తేడాకి వాన బిందువులు బాధ్యత కాదు, వాటిని అందుకునే వాటి క్షేత్ర స్వభావాల్లో తేడాయే కారణం. అదే విధంగా, భగవంతుడు ఇక్కడ అనేదేమిటంటే, ఆయన సమస్త ప్రాణుల యందు సమానమైన కృప చూపిస్తున్నాడు, అయినా, ఆయనను ప్రేమించని వారు, వారి మనస్సులకు సరియైన పాత్రత లేకపోవటంచే ఆయన కృప యొక్క ప్రయోజానాలను అందుకోలేకున్నారు. మరైతే, మనస్సులు అపవిత్రంగా ఉన్న వారు ఏమి చేయవచ్చు? శ్రీ కృష్ణుడు ఇక తదుపరి భక్తి యొక్క పవిత్రమొనర్చే శక్తిని తెలియచేస్తున్నాడు.
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ । సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ।। 30 ।।
30
9
https://www.holy-bhagava…udio/009_030.mp3
అపి — అయినా; చేత్ — ఒకవేళ; సు-దురాచారః — పరమ పాపిష్టులు; భజతే — పూజిస్తే; మామ్ — నన్ను; అనన్య-భాక్ — అనన్య భక్తి; సాధుః — సాధువు; ఏవ — నిజముగా; సః — ఆ వ్యక్తి; మంతవ్యః — పరిగణించబడాలి; సమ్యక్ — సరియైన; వ్యవసితః — నిశ్చయంతో; హి — నిజముగా; సః — ఆ వ్యక్తి.
BG 9.30: పరమ పాపిష్ఠివారు అయినా సరే, నన్ను అనన్య భక్తితో పూజిస్తే, వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.
పరమేశ్వరుని పట్ల భక్తి అనేది ఎంత శక్తి వంతమైనది అంటే, అది అత్యంత పాపిష్ఠి వారిని కూడా సంస్కరిస్తుంది. మన శాస్త్రాలలో, అజామీళుడు మరియు వాల్మీకి ఉదాహరణలు, ఇందుకు నిదర్శనం. వీరి కథలు అన్నీ భారతీయ భాషలలో తరచుగా చెప్పబడుతుంటాయి. వాల్మీకి యొక్క పాపములు ఎంత బలీయంగా ఉండేవంటే, ఆయన శ్రీ రామచంద్రుని నామంలో ఉన్న ‘రా...మ...’ అని ఉన్న రెండు శబ్దాలు కూడా పలకలేక పోయాడు. అతని పాపాలు ఆ దివ్య నామాన్ని పలకటానికి అవరోధంగా వచ్చాయి. కాబట్టి, ఆయన గురువు ఆయనను భక్తిలో నిమగ్నం చేయటానికి ఒక ఉపాయం ఆలోచించి, ఆయనని “మ.. రా..” అని ముందు వెనుకలుగా అనమని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, పదేపదే “మరా మరా మరా....” అంటూఉంటే, అది అనాయాసంగా , “రామ రామ రామ..” అన్న శబ్దాన్ని కలుగచేస్తుంది. ఆ ఫలితంగా, వాల్మీకి వంటి పాపాత్ముడు కూడా, అనన్య భక్తి ద్వారా, మాహాత్ముడైన ఋషిగా మార్పు చెందాడు. ఉలటా నాము జపత జగు జానా, బాల్మీకి భఏ బ్రహ్మ సమానా (రామచరితమానస్) ‘పాపాత్ముడైన వాల్మీకి కూడా, భగవంతుని నామము యొక్క అక్షరాలని తారుమారుగా జపము చేసి, మహర్షిగా మారిపోయాడు అన్న విషయానికి ఈ ప్రపంచమంతా సాక్షి.’ కాబట్టి, పాపాత్ములు కూడా శాశ్వతంగా దండింపబడరు. మనిషిని సమూలంగా మార్చగలిగే భక్తి యొక్క శక్తి ద్వారా, శ్రీ కృష్ణుడు ప్రకటించే విషయం ఏమిటంటే, పరమ పాపాత్ములు కూడా ఒకసారి భగవంతుడిని అనన్య భక్తితో ఆరాధించటం ప్రారంభిస్తే, వారిని ఇక పాపిష్ఠి వారిగా పరిగణించకూడదు. వారు ఒక పవిత్రమైన నిర్ణయం తీస్కున్నారు కాబట్టి, వారి యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశయం వలన, వారిని ధర్మాత్ములుగానే పరిగణించ వలసి ఉంటుంది.
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి । కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ।। 31 ।।
31
9
https://www.holy-bhagava…udio/009_031.mp3
క్షిప్రం — త్వరగానే; భవతి — అగును; ధర్మ-ఆత్మా — ధర్మాత్ముడిగా; శశ్వత్-శాంతిం — శాశ్వతమైన శాంతి; నిగచ్ఛతి — పొందును; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడు; ప్రతిజానీహి — ప్రకటించుము; న — ఎన్నటికి కాదు; మే — నా యొక్క; భక్తః — భక్తుడు; ప్రణశ్యతి — నశించుట.
BG 9.31: త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము.
కేవలం సరియైన నిర్ణయం తీసుకున్నంత మాత్రాన భక్తులు ధర్మాత్ములుగా ఎందుకు పరిగణించబడాలి? వారు అనన్య భక్తి మార్గంలో, భగవంతుని యందు దృఢ-విశ్వాసంతో ప్రయాణించటం కొనసాగిస్తూనే ఉంటే, వారి హృదయములు పవిత్రమౌతాయి మరియు వారు శీఘ్రముగా ధార్మిక గుణాలను పెంపొందించుకుంటారు, అని శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. దైవీ గుణములు భగవంతుని నుండే ఉద్భవిస్తాయి. ఆయన సంపూర్ణ దోషరహితుడు, సత్యసంధుడు, కరుణామయుడు, ప్రేమమూర్తి, దయాళువు మొదలైన గుణాలు కలవాడు. మనము ఆయన యొక్క అణు-అంశములము కాబట్టి, మనం కూడా ఆ దైవీ గుణముల పట్ల ఆకర్షితులమౌతాము. కానీ, ధర్మాత్ములమయ్యే పద్ధతి ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యముగా ఉంది. చిన్నపటినుండి మనం విన్నాము, సత్యమే పలకాలి, ఇతరులకు సేవ చేయాలి, కోపము విడిచిపెట్టాలి వంటివి, కానీ మనం ఇంకా ఆ ఉపదేశాలని ఆచరణలోకి తేలేక పోతున్నాము, ఎందుకంటే, మన మనస్సు కల్మషములతో అపవిత్రంగా ఉంది. మనస్సు పరిశుద్ధం కాకుండా, మన వ్యక్తిత్వంలోని దోషాలు పూర్తిగా, శాశ్వతంగా నిర్మూలించబడలేవు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్, దైవీ గుణములు పెంపొందించు కోవటం కోసం ఉన్న తిరుగు లేని సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. సత్య అహింసా ఆది మన! బిన హరి భజన న పాయ జల తే ఘృత నికలే నహీఁ, కోటిన కరియ ఉపాయ (భక్తి శతకం, 35వ శ్లోకం) ‘బట్ట మీద ఉన్న నూనె మరకలు ఎంత ప్రయత్నించినా, నీటిచే తొలగించబడలేవు, అదే విధంగా, సత్యసంధత, అహింస, మరియు ఇతర సు-గుణములను, భగవంతుని పట్ల భక్తితో నిమగ్నమవకుండా పొందలేము.’ మనస్సు పరిశుద్ధి అయినప్పుడు ఈ గుణములు ప్రకటితమవుతాయి; మరియు మనస్సు యొక్క శుద్ధి (అంతఃకరణ శుద్ధి) అనేది, దాన్ని పరమ పవిత్రమైన భగవంతుని పై లగ్నం చేయకుండా, అవ్వదు. అంతేకాక, శ్రీ కృష్ణుడు అర్జునుడిని, తన భక్తులు ఎన్నటికీ నశించరు, అని ధైర్యంగా ప్రకటించమంటున్నాడు. ఆయన ఈ విషయంలో, ‘జ్ఞానులు నశింపరు’ లేదా ‘కర్మీ (కర్మ కాండలు చేసేవారు) లు నశింపరు’ అని అనటం లేదు. ఆయన ఈ వాగ్దానాన్ని తన భక్తుల పట్ల మాత్రమే చేస్తున్నాడు; వారు ఎప్పుడూ పాడైపోరు అని అంటున్నాడు. ఈ విధంగా ఆయన, 9.22 శ్లోకంలో చెప్పిన దానిని పునరుద్ఘాటిస్తున్నాడు - తన పైనే ఆధార పడిన వారి మరియు తనపట్ల అనన్య భక్తితో ఉన్నవారి యొక్క యోగక్షేమములు తనే స్వయంగా చూసుకుంటాను అని. శ్రీ కృష్ణుడు, ఈ విషయం ప్రకటించమని, అర్జునుడిని ఎందుకు అడుగుతున్నాడు? తనే ప్రకటించవచ్చుగా? అన్న విషయం కొంత నిగూఢమైనదిగా అనిపించవచ్చు. దీనికి కారణం ఏమిటంటే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భగవంతుడు తను ఇచ్చిన మాటను తప్పుతాడు, కానీ తన భక్తుని మాటని ఎన్నటికి తప్పేటట్టు చెయ్యడు. ఉదాహరణకి, మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టనని శ్రీ కృష్ణుడు శపథం చేసాడు. కానీ, ఎప్పుడైతే తన పరమ భక్తుడైన భీష్ముడు, మరుసటి రోజు తను అర్జునుడిని సంహరిస్తాను లేదా కృష్ణుడిచే ఆయుధం పట్టిస్తాను అని శపథం చేశాడో, భీష్ముని మాటనే నెగ్గించటానికి శ్రీ కృష్ణుడు తన స్వంత శపథాన్ని పక్కన పెట్టాడు. ఈ విధంగా, తను చెప్పిన దాని యొక్క బలాన్ని పునరుద్ఘాటించటానికి, శ్రీ కృష్ణుడు ‘అర్జునా, నా భక్తుడు ఎప్పటికి నశింపడు అని, నీవు చెప్పుము, ఎందుకంటే నీ మాట ఎప్పటికి నిలుస్తుంది అని నేను హామీ ఇస్తాను.’ అని అంటున్నాడు.
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః । స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽ పి యాంతి పరాం గతిమ్ ।। 32 ।।
32
9
https://www.holy-bhagava…udio/009_032.mp3
మాం — నా యందే; హి — నిజముగా; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; వ్యపాశ్రిత్య — ఆశ్రయమును పొంది (శరణుజొచ్చి); యే — ఎవరైతే; అపి — అయినా సరే; స్యుః — అయినా కూడా; పాప యోనయః — నిమ్న స్థాయి జన్మ; స్త్రియః — స్త్రీలు; వైశ్యః — వైశ్యులు; తథా — మరియు; శూద్రః — కార్మికులు; తే అపి — వారు కూడా; యాంతి — వెళ్లెదరు; పరాం — పరమ (సర్వోన్నత); గతిం — గమ్యమును.
BG 9.32: వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా, నన్నుశరణుజొచ్చిన వారంతా పరమ పదమును పొందుతారు.
ధార్మిక కుటుంబాలలో జన్మించే భాగ్యశాలి జీవులు (జీవాత్మలు), చిన్నతనం నుండే మంచి విలువలు మరియు ధార్మిక జీవనము యొక్క శిక్షణ పొందుతారు. ఇది వారి పూర్వ జన్మల పుణ్య ఫలం. అదే సమయంలో, మరి కొందరు జీవులు - తాగుబోతులు, నేరగాళ్ళు, వ్యసనపరులు, మరియు నాస్తికుల కుంటుంబాలలో పుట్టే దురదృష్టం ఉంటుంది. ఇది కూడా, తమ తమ పూర్వ జన్మలలో ఉన్న పాప ఫలితమే. ఇక్కడ శ్రీకృష్ణుడు అనేదేమిటంటే, ఈ జీవి అయినా వాటి వాటి జన్మ, లింగ, కుల, లేదా జాతి భేదము లేకుండా ఎవరైనా భగవంతుడిని సంపూర్ణముగా ఆశ్రయిస్తే, వారు సర్వోత్కృష్ట లక్ష్యమును పొందుతారు, అని. అందరికీ అందుబాటులో ఉండే భక్తి మార్గము యొక్క గొప్పదనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇతర మార్గాల్లో అర్హత కొరకు చాలా కఠిన నియమాలు ఉంటాయి. జ్ఞాన యోగ పథంలో, అర్హత కొరకు, జగద్గురు శంకరాచార్య ఈ విధంగా పేర్కొన్నాడు: వివేకినో విరక్తస్య శమాదిగుణ శాలినః ముముక్షోరైవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతా మతాః ‘వివేకము, విరక్తి, నియంత్రించబడిన మనో-ఇంద్రియములు, మరియు మోక్షము కొరకు తీవ్ర వాంఛ — ఈ నాలుగు లక్షణాలు కలవారు మాత్రమే — జ్ఞాన యోగ మార్గాన్ని అవలంబించటానికి అర్హులు.’ కర్మ కాండ (వైదిక క్రతువులు) మార్గములో, ఆరు నిబంధనలు పాటించబడాలి: దేశే కాల ఉపాయేన ద్రవ్యం శ్రద్ధా సమన్వితమ్‌ పాత్రే ప్రదీయతే యత్తత్ సకలం ధర్మ లక్షణమ్‌ ‘కర్మ కాండలు సాఫల్యం చెందటానికి ఆరు నిబంధనలు పాటించబడాలి — సరియైన స్థానము, సరియైన సమయము, సరైన పద్ధతి మరియు దోషరహిత మంత్ర ఉచ్చారణ, స్వచ్ఛమైన ద్రవ్యమునే ఉపయోగించుట, యజ్ఞము చేపించే అర్హత కలిగిన బ్రాహ్మణుడు, మరియు ఆ క్రతువు మీద పూర్ణ విశ్వాసము - ఇవన్నీ ఉండాలి.’ అష్టాంగ యోగ మార్గములో కూడా, కఠినమైన నియమాలు ఉన్నాయి: శుచౌ దేశే ప్రతిష్ఠాప్య (భాగవతం 3.28.8) ‘సరియైన ఆసనంలో నిశ్చలంగా కూర్చుని, హఠ యోగమును ఒక పవిత్రమైన ప్రదేశంలో చేయండి.’ వీటన్నిటితో పోలిస్తే, భక్తి యోగము ఎంత సులువంటే, ఎవరైనా, ఏ సమయంలో నైనా, ఏ ప్రదేశంలో నైనా, ఏ పరిస్థితిలో అయినా, ఏ పదార్థముతో నైనా, అది చేయబడవచ్చు. న దేశ నియమస్తస్మిన్ న కాల నియమస్థథా (పద్మ పురాణం) ఈ శ్లోకం ఏం చెప్తున్నదంటే, భగవంతుడికి మనము భక్తితో ఆరాధించే సమయము, ప్రదేశముతో సంబంధము లేదు. ఆయన కేవలం మన హృదయంలోని ప్రేమనే చూస్తాడు. అన్ని ఆత్మలు (జీవులు) భగవంతుని బిడ్డలే. ప్రేమతో తన దగ్గరికి వస్తే అందరినీ తన చేతులు చాచి స్వీకరించటానికి ఆయన సుముఖంగా ఉన్నాడు.
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా । అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ।। 33 ।।
33
9
https://www.holy-bhagava…udio/009_033.mp3
కిం — ఏమిటి? పునః — అప్పుడు; బ్రాహ్మణాః — మునులు; పుణ్యాః — పుణ్యాత్ములు; భక్తాః — భక్తులు; రాజ-ఋషయః — మహాత్ములైన రాజులు; తథా — మరియు; అనిత్యం — తాత్కాలికమైన; అసుఖం — సుఖం లేని; లోకం — ప్రపంచము; ఇమం — ఈ యొక్క; ప్రాప్య — పొందిన తరువాత; భజస్వ — భక్తిలో నిమగ్నమవ్వుము; మాం — నా యందు.
BG 9.33: ఇక పుణ్యాత్ములైన రాజులు, మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి, తాత్కాలికమైన మరియు సుఖంలేని ఈ ప్రపంచం లోకి వచ్చాక, ఇక, నా యందు భక్తి తో నిమగ్నమవ్వుము.
అత్యంత అసహ్యకరమైన పాపాత్ములు కూడా భక్తి మార్గంలో విజయం సాధిస్తారని హామీ ఉన్నప్పుడు, మరిక ఉన్నతమైన జీవాత్మలకు ఇంకా ఎందుకు సందేహం? అనన్య భక్తి మార్గం ద్వారా పరమ పదాన్ని పొందవచ్చని, రాజులు మరియు మునులు, ఇంకా ఎక్కువ సంపూర్ణ విశ్వాసంతో ఉండాలి. శ్రీ కృష్ణుడు ఇలా సూచిస్తున్నాడు, ‘నీ వంటి ధర్మాత్ముడైన రాజు, ఈ జగత్తు అనిత్యమని మరియు దుఃఖాలకు నిలయమని, అన్న జ్ఞానంలో స్థితుడై ఉండాలి. అనంతమైన నిత్య ఆనంద స్వరూపుడనైన, నా పట్ల దృఢ సంకల్పంతో, భక్తిలో నిమగ్నమై ఉండుము. లేనిచో, సాధుపురుషుల మరియు రాజుల కుటుంబములో జన్మ, మంచి విద్య, మరియు అనుకూలమైన భౌతిక పరిస్థితులు ఇవన్నీ వ్యర్థమై పోయినట్టే.’
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు । మామేవైష్యసి యుక్త్వైవమ్ ఆత్మానం మత్పరాయణః ।। 34 ।।
34
9
https://www.holy-bhagava…udio/009_034.mp3
మత్-మనాః — సదా నన్నే స్మరించుము; భవ — ఉండుము; మత్ — నా యొక్క; భక్తః — భక్తుడు; మత్ యాజీ — నన్ను పూజించు వాడవు; మామ్ నమస్కురు — నాకు నమస్కరింపుము; మాం ఏవ — నన్నే ఖచ్చితముగా; ఏష్యసి — చేరుకుందువు; యుక్త్వా — నాతోనే ఏకమై; ఏవం — ఈ విధంగా; ఆత్మానం — నీ మనస్సు మరియు శరీరము; మత్-పరాయణః — నాకే అర్పితమై ఉండి.
BG 9.34: ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము, మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు.
ఈ అధ్యాయంలో మొత్తం, భక్తి మార్గము యొక్క మహత్వం చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు అర్జునుడిని తన భక్తుడిగా అవ్వమని ప్రార్థించటం ద్వారా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. తనను పూజించటం ద్వారా, తన దివ్య మంగళ స్వరూపముపై మనస్సుతో ధ్యానం చేయటం ద్వారా, స్వచ్ఛమైన వినయవిధేయతలతో తనకు నమస్కరించటం ద్వారా, తన మనస్సుతో నిజమైన యోగములో భగవంతునితో ఏకమై ఉండమని అర్జునుడికి చెప్తున్నాడు. ‘నమస్కురు’ (వినయంతో ప్రణమిల్లటం) అనేది, భక్తి ఆచరణలో అహంకార లక్షణములు ఏవైనా జనిస్తే, వాటిని నిర్మూలిస్తుంది. ఈ విధంగా, గర్వము లేకుండా, హృదయము భక్తిలో మగ్నమై, మన యొక్క సమస్త ఆలోచనలు, కార్యకలాపములు భగవంతునికే సమర్పించాలి. ఈ రకమైన భక్తి యోగ ఏకత్వము తప్పకుండా భగవత్ ప్రాప్తిని పొందిస్తుంది అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు; దీని పై ఎలాంటి సందేహమూ ఉండకూడదు.
శ్రీ భగవానువాచ । భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః । యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ।। 1 ।।
1
10
https://www.holy-bhagava…udio/010_001.mp3
శ్రీ భగవానువాచ — భగవంతుడు పలికెను; భూయః — మరల; ఏవ — నిజముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; శృణు — వినుము; మే — నా యొక్క; పరమం — దివ్యమైన; వచః — ఉపదేశమును; యత్ — ఏదైతే; తే — నీకు; అహం — నేను; ప్రీయమాణాయ — నీవు నా ప్రియ సఖుడవు; వక్ష్యామి — చెప్తాను; హిత-కామ్యయా — నీ మంచిని కోరి.
BG 10.1: శ్రీ భగవానుడు ఇలా పలికెను : నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము, ఓ గొప్ప బాహువులు కలవాడా. నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి, నేను నీకు దాన్ని తెలియపరుస్తాను.
తన మహిమలను వినటంలో అర్జునుడి గాఢమైన ఆసక్తిని చూసి శ్రీ కృష్ణుడు సంతోషపడ్డాడు. ఇప్పుడు, అతని ఆనందాన్ని మరింత పెంచటానికి మరియు ప్రేమయుక్త భక్తి పట్ల ఉత్సాహాన్ని ఇనుమడింపచేయటానికి, తన యొక్క అధ్బుతమైన వైభవాలను మరియు అనన్యమైన గుణములను ప్రకటిస్తాను అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. ఆయన ‘ప్రీయమాణాయ ’ అన్న పదాలు వాడుతున్నాడు, అంటే, ‘నీవు నా యొక్క ప్రియమైన సఖుడవు, అందుకే ఈ అత్యంత విశేషమైన జ్ఞానాన్ని నీకు తెలియపరుస్తున్నాను’ అని.
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః । అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ।। 2 ।।
2
10
https://www.holy-bhagava…udio/010_002.mp3
న — కాదు; మే — నా యొక్క; విదుః — తెలుసు; సుర-గణాః — దేవతలు; ప్రభవం — మూలస్థానము; న — కాదు; మహా-ఋషయః — మహర్షులు; అహం — నేను; ఆదిః — ఆదిమూలము; హి — నిజముగా; దేవానాం — దేవతల; మహా-ఋషీణాం — మహర్షుల; చ — మరియు; సర్వశః— అన్ని రకాలుగా.
BG 10.2: దేవతలకు గానీ, మహర్షులకు గానీ నా మూల స్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే.
ఒక తండ్రికి తన కుమారుల పుట్టుక మరియు జీవితం తెలుస్తుంది, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూస్తాడు. కానీ, తన తండ్రి యొక్క పుట్టుక మరియు బాల్యము ఆయన కొడుకులకు తెలియదు, ఎందుకంటే అవి వారి పుట్టేటప్పటి కంటే ముందే జరిగిపోయినవి. అదే విధంగా, దేవతలు మరియు ఋషులు భగవంతుని మూల స్థానము యొక్క నిజ స్వరూపమును అర్థం చేసుకోలేరు ఎందుకంటే భగవంతుడు వీరు జన్మించటం కంటే ముందునుండే ఉన్నాడు. కావున, ఋగ్వేదము ఇలా పేర్కొంటున్నది: కో అద్ధా వేద క ఇహ ప్రావోచత్, కుత ఆ జాతా కుత ఇయం విసృష్టిః అర్వాగ్ దేవా అస్య విసర్జనాయ, అథా కో వేద యత ఆబభూవ (10.129.6) ‘ఈ జగత్తులో ఎవరికి మాత్రం స్పష్టత ఉంది? ఎవరు చెప్పగలరు ఈ విశ్వం ఎక్కడ నుండి జనించిందో? ఎవరు చెప్పగలరు ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో? దేవతలు అనేవారు సృష్టి తరువాత వచ్చారు. కాబట్టి, ఈ విశ్వం ఎక్కడినుండి ఉద్భవించిందో ఎవరికి తెలుసు?’ అంతేకాక, ఈశోపనిషత్తు ఇలా చెప్తుంది: నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ (ఈశోపనిషత్తు 4) ‘భగవంతుడు దేవతలకు అవగతం కాడు, ఎందుకంటే ఆయన వారి కంటే ముందు నుండే ఉన్నాడు.’ అయినా, తన ప్రియమిత్రుని భక్తిని పెంపొందించటానికి, ఇటువంటి నిగూఢమైన జ్ఞానం ఇప్పుడు శ్రీ కృష్ణుడిచే ఇవ్వబడుతున్నది.
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ । అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ।। 3 ।।
3
10
https://www.holy-bhagava…udio/010_003.mp3
యః — ఎవరైతే; మామ్ — నన్ను; అజమ్ — జన్మరహితుడను; అనాదిం — ఆదిరహితుడను; చ — మరియు; వేత్తి — తెలుసుకొందురో; లోక — ఈ లోకము యొక్క; మహా-ఈశ్వరం — మహేశ్వరుడను; అసమ్మూఢః — చిత్తభ్రాంతికి లోనుకానివాడు; సః — వారు; మర్త్యేషు — మానవులలో; సర్వ-పాపైః — సర్వ పాపముల నుండి; ప్రముచ్యతే — విముక్తి పొందును.
BG 10.3: నేను జన్మరహితుడను మరియు ఆది(మొదలు) లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడుతారు.
తనను ఎవ్వరూ తెలుసుకోలేరు అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు కొంతమందికి తాను తెలుసు అని అంటున్నాడు. తను చెప్పిన దానికే విరుద్ధంగా చెప్తున్నాడా? లేదు, ఆయన అర్థం ఏమిటంటే, స్వంత ప్రయత్నం ద్వారా ఎవ్వరూ భగవంతుడిని తెలుసుకొనజాలరు, కానీ భగవంతుడే ఎవరి మీద అయినా కృప చేస్తే, ఆ భాగ్యశాలి జీవాత్మ ఆయనను తెలుసుకోగలుగుతుంది. కాబట్టి, భగవంతుడిని తెలుసుకోగలిగిన వారంతా ఆయన దివ్య కృప ద్వారానే అది సాధించగలిగారు. ఈ అధ్యాయం యొక్క 10వ శ్లోకంలో కృష్ణుడు చెప్పినట్టు: ‘నా యందే భక్తితో లగ్నమై ఉండే మనస్సు కలవారికి, నా దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాను; దానితో వారు సునాయాసముగా నన్ను పొందుతారు.’ ఇక్కడ, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, ఆయనే సర్వోన్నత దేవాది దేవుడు అని తెలుసుకున్న వారు ఇక భ్రమకు లోను కారు. ఇటువంటి భాగ్యశాలియైన జీవాత్మలు, తమ పూర్వ మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి విడుదల చేయబడుతారు మరియు ఆయన పట్ల ప్రేమయుక్త భక్తిని పెంపొందించుకుంటారు. జీవాత్మలకు మరియు తనకు ఉన్న భేదాన్ని చెప్పటం కోసం, శ్రీ కృష్ణుడు తానే సర్వలోక మహేశ్వరుడను అని ప్రకటిస్తున్నాడు. ఇదే విషయం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా చెప్పబడింది: తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామ దేవం భువనేశమీడ్యం (6.7) ‘భగవంతుడు సమస్త నియామకులకే నియామకుడు; ఆయనే సర్వ దేవతలకు దేవుడు. ఆయన ప్రియతములందరికి ప్రీతిపాత్రుడు; ఆయనే ఈ జగత్తుని ఏలేవాడు, మరియు భౌతిక ప్రకృతి శక్తికి అతీతమైనవాడు.’
బుద్ధిర్ జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః । సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ।। 4 ।। అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః । భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ।। 5 ।।
4
10
https://www.holy-bhagava…/010_004-005.mp3
బుద్ధిః — బుద్ధి; జ్ఞానం — జ్ఞానము; అసమ్మోహః — ఆలోచనలో స్పష్టత; క్షమా — క్షమా గుణము; సత్యం — సత్యసంధత; దమః — ఇంద్రియ నిగ్రహణ; శమః — మనో-నియంత్రణ; సుఖం — సుఖము; దుఃఖం — దుఃఖము; భవః — జన్మ; అభావః — మరణము; భయం — భయము; చ — మరియు; అభయం — ధైర్యము; ఏవ — నిజముగా; చ — మరియు; అహింసా — అహింస; సమతా — సమత్వము; తుష్టిః — తృప్తి; తపః — తపస్సు; దానం — దానము; యశః — కీర్తి; అయశః — అపకీర్తి; భవంతి — జనించును; భావాః — భావములు/గుణములు; భూతానాం — మనుష్యులలో; మత్తః — నా నుండి; ఏవ — మాత్రమే; పృథక్-విధాః — విభిన్న రకాల.
BG 10.4-5: బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణ, సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు, భయము-ధైర్యము, అహింస, సమత్వ-బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి-అపకీర్తి మొదలగు - మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి.
ఈ రెండు శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తన పరమేశ్వర తత్త్వాన్ని మరియు సమస్త సృష్టిపై ఉన్న తన సంపూర్ణ ఆధిపత్యాన్ని నిరూపించటం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ, ఒక్కో మనిషిలో వేర్వేరు పాళ్ళల్లో కనిపించే ఇరవై రకాల భావాలను/గుణాలను పేర్కొంటున్నాడు. మానవ జాతిలో ఉద్భవించే వివిధ భావాలు, ఉద్వేగాలు, చిత్తవృత్తులు అన్నీ తన నుండే వస్తాయి అని ప్రకటిస్తున్నాడు. బుద్ధి అంటే సరియైన దృక్పథంలో విషయ-వస్తువులను విశ్లేషించ గల సామర్థ్యము. జ్ఞానము అంటే ఏది ఆధ్యాత్మికము ఏది భౌతిక ప్రాపంచికమో వేరు చేయగల విచక్షణ. అసమ్మోహం అంటే అయోమయము/భ్రమ లేకుండుట. క్షమా అంటే మనకు హాని చేసిన వారిని క్షమించగలిగే సామర్థ్యము. సత్యం అంటే అందరి జనుల సంక్షేమం కోసం నిజాన్ని ధైర్యంగా ప్రకటించుట. దమము అంటే ఇంద్రియములను వాటి వస్తువిషయముల నుండి నిగ్రహించుట. శమము అంటే మనస్సుని నియంత్రించి నిగ్రహించుట. సుఖం అంటే ఆనందము, ఉల్లాసముల యొక్క అనుభూతి. దుఃఖము అంటే కష్టము మరియు వేదన యొక్క అనుభూతి. భవః అంటే 'నేను ఉన్నాను' అనే భావము. అభావః అంటే మరణము యొక్క అనుభవము. భయ అంటే రాబోయే కష్టాల మీద భయము. అభయ అంటే భయము నుండి విముక్తి. అహింస అంటే మనసా, వాచా, కర్మణా ఏ ప్రాణిని కూడా బాధ పెట్టక పోవటం. సమతా అంటే అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక్కలాగే ఉండటం. తుష్టి అంటే కర్మ ఫలంగా ఏది లభించినా దానితో తృప్తి చెందుట. తప అంటే వేద విహితముగా ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం స్వచ్ఛందం గా చేసే నిష్ఠలు. దానం అంటే పాత్రత/అర్హత కలిగిన వారికి ఇచ్చే దానము. యశము అంటే మంచి గుణముల చేత వచ్చే కీర్తి. అయశము అంటే చెడు గుణముల వలన వచ్చే అపకీర్తి. వ్యక్తులలో ఈ గుణములు కేవలం తాను అనుమతించిన మేర వ్యక్తమవుతుంటాయని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కాబట్టి, ఆయనే సర్వ ప్రాణుల యొక్క మంచి మరియు చెడు స్వభావముల మూలము. ఇది విద్యుత్కేంద్రము ద్వారా సరఫరా చేయబడిన విద్యుత్-శక్తి వివిధ రకాల ఉపకరణాలచే ఉపయోగించబడటం వంటిది. ఒకే విద్యుత్ శక్తి వేర్వేరు ఉపకరణాల ద్వారా ప్రసరించినప్పుడు వేరువేరు ఫలితములను ఇస్తుంది. ఒక దాంట్లో శబ్దాన్ని, మరోదాంట్లో వెలుగుని, మూడో దాంట్లో వేడిమిని పుట్టిస్తుంది. వేర్వేరు రకాలుగా వ్యక్తీకృతమయినా, వాటి మూలాధారం ఒక్కటే, అదే విద్యుత్కేంద్రము నుండి ఇవ్వబడిన విద్యుత్ శక్తి. అదే విధంగా, మన పూర్వ, ప్రస్తుత జన్మల పురుషార్థాన్ని (మన స్వేచ్చాచిత్తమును ఉపయోగించుకుని చేసే పనులు) బట్టి, భగవంతుని చే ఇవ్వబడిన శక్తి మనలో మంచిగానో లేదా చెడుగానో వ్యక్తమవుతుంది.
బుద్ధిర్ జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః । సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ।। 4 ।। అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః । భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ।। 5 ।।
5
10
https://www.holy-bhagava…/010_004-005.mp3
బుద్ధిః — బుద్ధి; జ్ఞానం — జ్ఞానము; అసమ్మోహః — ఆలోచనలో స్పష్టత; క్షమా — క్షమా గుణము; సత్యం — సత్యసంధత; దమః — ఇంద్రియ నిగ్రహణ; శమః — మనో-నియంత్రణ; సుఖం — సుఖము; దుఃఖం — దుఃఖము; భవః — జన్మ; అభావః — మరణము; భయం — భయము; చ — మరియు; అభయం — ధైర్యము; ఏవ — నిజముగా; చ — మరియు; అహింసా — అహింస; సమతా — సమత్వము; తుష్టిః — తృప్తి; తపః — తపస్సు; దానం — దానము; యశః — కీర్తి; అయశః — అపకీర్తి; భవంతి — జనించును; భావాః — భావములు/గుణములు; భూతానాం — మనుష్యులలో; మత్తః — నా నుండి; ఏవ — మాత్రమే; పృథక్-విధాః — విభిన్న రకాల.
BG 10.4-5: బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణ, సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు, భయము-ధైర్యము, అహింస, సమత్వ-బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి-అపకీర్తి మొదలగు - మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి.
ఈ రెండు శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తన పరమేశ్వర తత్త్వాన్ని మరియు సమస్త సృష్టిపై ఉన్న తన సంపూర్ణ ఆధిపత్యాన్ని నిరూపించటం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ, ఒక్కో మనిషిలో వేర్వేరు పాళ్ళల్లో కనిపించే ఇరవై రకాల భావాలను/గుణాలను పేర్కొంటున్నాడు. మానవ జాతిలో ఉద్భవించే వివిధ భావాలు, ఉద్వేగాలు, చిత్తవృత్తులు అన్నీ తన నుండే వస్తాయి అని ప్రకటిస్తున్నాడు. బుద్ధి అంటే సరియైన దృక్పథంలో విషయ-వస్తువులను విశ్లేషించ గల సామర్థ్యము. జ్ఞానము అంటే ఏది ఆధ్యాత్మికము ఏది భౌతిక ప్రాపంచికమో వేరు చేయగల విచక్షణ. అసమ్మోహం అంటే అయోమయము/భ్రమ లేకుండుట. క్షమా అంటే మనకు హాని చేసిన వారిని క్షమించగలిగే సామర్థ్యము. సత్యం అంటే అందరి జనుల సంక్షేమం కోసం నిజాన్ని ధైర్యంగా ప్రకటించుట. దమము అంటే ఇంద్రియములను వాటి వస్తువిషయముల నుండి నిగ్రహించుట. శమము అంటే మనస్సుని నియంత్రించి నిగ్రహించుట. సుఖం అంటే ఆనందము, ఉల్లాసముల యొక్క అనుభూతి. దుఃఖము అంటే కష్టము మరియు వేదన యొక్క అనుభూతి. భవః అంటే 'నేను ఉన్నాను' అనే భావము. అభావః అంటే మరణము యొక్క అనుభవము. భయ అంటే రాబోయే కష్టాల మీద భయము. అభయ అంటే భయము నుండి విముక్తి. అహింస అంటే మనసా, వాచా, కర్మణా ఏ ప్రాణిని కూడా బాధ పెట్టక పోవటం. సమతా అంటే అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక్కలాగే ఉండటం. తుష్టి అంటే కర్మ ఫలంగా ఏది లభించినా దానితో తృప్తి చెందుట. తప అంటే వేద విహితముగా ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం స్వచ్ఛందం గా చేసే నిష్ఠలు. దానం అంటే పాత్రత/అర్హత కలిగిన వారికి ఇచ్చే దానము. యశము అంటే మంచి గుణముల చేత వచ్చే కీర్తి. అయశము అంటే చెడు గుణముల వలన వచ్చే అపకీర్తి. వ్యక్తులలో ఈ గుణములు కేవలం తాను అనుమతించిన మేర వ్యక్తమవుతుంటాయని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కాబట్టి, ఆయనే సర్వ ప్రాణుల యొక్క మంచి మరియు చెడు స్వభావముల మూలము. ఇది విద్యుత్కేంద్రము ద్వారా సరఫరా చేయబడిన విద్యుత్-శక్తి వివిధ రకాల ఉపకరణాలచే ఉపయోగించబడటం వంటిది. ఒకే విద్యుత్ శక్తి వేర్వేరు ఉపకరణాల ద్వారా ప్రసరించినప్పుడు వేరువేరు ఫలితములను ఇస్తుంది. ఒక దాంట్లో శబ్దాన్ని, మరోదాంట్లో వెలుగుని, మూడో దాంట్లో వేడిమిని పుట్టిస్తుంది. వేర్వేరు రకాలుగా వ్యక్తీకృతమయినా, వాటి మూలాధారం ఒక్కటే, అదే విద్యుత్కేంద్రము నుండి ఇవ్వబడిన విద్యుత్ శక్తి. అదే విధంగా, మన పూర్వ, ప్రస్తుత జన్మల పురుషార్థాన్ని (మన స్వేచ్చాచిత్తమును ఉపయోగించుకుని చేసే పనులు) బట్టి, భగవంతుని చే ఇవ్వబడిన శక్తి మనలో మంచిగానో లేదా చెడుగానో వ్యక్తమవుతుంది.
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా । మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ।। 6 ।।
6
10
https://www.holy-bhagava…udio/010_006.mp3
మహా-ఋషయా — మహర్షులు; సప్త — ఏడుగురు; పూర్వే — అంతకు పూర్వము; చత్వారః — నలుగురు; మనవః — మనువులు; తథా— మరియు; మత్ భావాః — నా నుండే ఉద్భవించారు; మానసాః — మనస్సు; జాతాః — పుట్టారు; యేషాం — వారి నుండి; లోకే — ప్రపంచములో; ఇమాః — వీరందరూ; ప్రజాః — ప్రజలు.
BG 10.6: సప్త ఋషులు, వారి పూర్వం నలుగురు మహాత్ములు, మరియు పద్నాలుగు మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకం లోని సమస్త ప్రజలు అవతరించారు.
తానే విశ్వములోని సమస్త వస్తు విషములకు ఎలా మూల ఉత్పత్తి స్థానమో చెప్పటం ఇక్కడ శ్రీ కృష్ణుడు కొనసాగిస్తున్నాడు; ఇంతకు ముందు ఇరవై గుణస్వభావాలని పేర్కొని ఉన్నాడు; ఇప్పుడిక ఇరవై ఐదు ఉన్నత మహాత్ములను పేర్కొంటున్నాడు. వీరే – నలుగురు కుమార ఋషులు, ఏడుగురు ఋషులు, మరియు పద్నాలుగు మనువులు. తన నుండే వచ్చిన సమస్త విశ్వము యొక్క వంశపారంపర్య విధానం కూడా క్లుప్తంగా చెప్పాడు. బ్రహ్మదేవుడు, విష్ణు మూర్తి (భౌతిక జగత్తు యొక్క నిర్వహణ బాధ్యత కోసం ఉన్న భగవంతుని స్వరూపం) యొక్క హిరణ్యగర్భ శక్తి నుండి జన్మించాడు. బ్రహ్మాగారి నుండి నలుగురు మహాత్ములు జనించారు, వారే, సనక్, సనందన్, సనత్, మరియు సనాతన్. వీరినే నలుగురు కుమారులు అంటారు. మన బ్రహ్మాండంలో ఈ నలుగురు కుమారులు బ్రహ్మ దేవునికి అందరి కంటే ముందు పుట్టిన సంతానం. వారు బ్రహ్మ దేవుని మనస్సు నుండే (అలైంగిక పద్ధతిలో) జన్మించారు కాబట్టి, వారికి తల్లి లేదు. వారు నిత్య ముక్తులైన జీవాత్మలు మరియు యోగ శాస్త్రములో నిష్ణాతులు కాబట్టి ఇతరులకు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షప్రాప్తికి సహాయం చేయటానికి వారికి శక్తి ఇవ్వబడింది. కుమారఋషుల తరువాత సప్త ఋషులు వచ్చారు. వీరే మారీచ, అంగీర, అత్రి, పులస్త్య, పులహ, క్రతు, మరియు వసిష్ఠులు. వీరికి మనుష్య జనాభాని పెంపొందించమనే పని ఇవ్వబడింది. ఆ తరువాత పద్నాలుగు మనువులు వచ్చారు, స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తమస, రైవత, చక్షుష, వైవస్వత, సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్ర-పుత్ర, రోచ్య మరియు భౌత్యక. వారికి మనష్య జాతిని దేవతాలోకాల నుండి నిర్వహించే మరియు వైదిక ధర్మాన్ని నిలిపి సంరక్షించే అధికారం ఇవ్వబడింది. మనం ప్రస్తుతం ఏడవ మనువైన వైవస్వత మనువు కాలం లో ఉన్నాము. ఈ కాలాన్ని అందుకే వైవస్వత మన్వంతరము అంటారు. ఈ ప్రస్తుత కల్పంలో (బ్రహ్మ దేవుని పగలు) ఇంకా ఏడుగురు మనువులు ఉంటారు. విశ్వమును నిర్వహించటానికి దేవ లోకాలలో చాల మంది దేవతలు ఉంటారు. వీరందరూ బ్రహ్మ యొక్క పుత్రులు, మనుమలు; బ్రహ్మ గారు విష్ణు మూర్తి నుండి పుట్టాడు, విష్ణు మూర్తి కూడా శ్రీ కృష్ణుని యొక్క అభేదమైన వ్యాప్తి స్వరూపమే. కాబట్టి, శ్రీ కృష్ణుడే అందరు మూల పురుషులకీ మూల పురుషుడు (ప్రపితామః) అని చెప్పవచ్చు.
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః । సోఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ।। 7 ।।
7
10
https://www.holy-bhagava…udio/010_007.mp3
ఏతాం — ఈ; విభూతిం — మహిమలు; యోగం — దివ్యమైన శక్తులు; చ — మరియు; మమ — నా యొక్క; యః — ఎవరైతే; వేత్తి — తెలుసుకుంటారో; తత్త్వతః — యదార్థముగా; సః — వారు; అవికల్పేన — అచంచలమైన; యోగేన — భక్తి యోగములో; యుజ్యతే — ఏకమై పోతారు; న —లేదు; అత్ర — ఇక్కడ; సంశయః — సందేహము.
BG 10.7: నా మహిమలను (విభూతులను) మరియు దివ్య శక్తులను యదార్థముగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.
విభూతి అన్న పదం విశ్వములో ప్రకటితమయ్యే, భగవంతుని యొక్క గొప్ప శక్తులను సూచిస్తుంది. యోగము అన్న పదం ఈ అద్భుతమైన శక్తులతో భగవంతుని యొక్క సంబంధాన్ని సూచిస్తుంది. మనం ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క అద్భుతమైన వైభవాల పట్ల అవగాహన పెంచుకుంటామో, మరియు మనకు ఆయన మహిమలపై నమ్మకం కలుగుతుందో, మనం సహజంగానే ఆయన భక్తి లో నిమగ్నమౌతాము, అని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. భగవంతుని వైభవం పట్ల జ్ఞానము, భక్తుల యొక్క ప్రేమని పెంచుతుంది మరియు వారి భక్తిని ఇనుమడింపజేస్తుంది. ఈ తదుపరి ఉదాహరణలో తెలియపరిచినట్టు జ్ఞానానికి మరియు ప్రేమకి ప్రత్యక్ష్య సంబంధం ఉంది. మీ స్నేహితుడు మీకొక నల్లని గులక రాయి వంటి దాన్ని చూపించాడనుకోండి. మీకు దాని గొప్పదనం గురించి ఏమాత్రం అవగాహన లేదు అందుకే దాని మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉండదు. మీ స్నేహితుడు అంటాడు, ‘ఇది ఒక సాలగ్రామ శిల, ఒక మహాత్ముడు దీనిని నాకు బహుమతిగా ఇచ్చాడు’ అని. సాలగ్రామ శిల అంటే, విష్ణుమూర్తి స్వరూపంగా పూజించబడే ఒక ప్రత్యేకమైన శిలారాయి. సాలగ్రామ శిల యొక్క ప్రాశస్త్యం తెలిసినప్పుడు, ఆ రాయి ఒక సాలగ్రామమని తెలిసినప్పుడు, దాని పట్ల మీ యొక్క గౌరవము పెరుగుతుంది. ఒకవేళ మీ స్నేహితుడు ఇలా ఇంకో విషయం చెపితే, ‘నీకు తెలుసా, ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం, ఒక గొప్ప మహాత్ముడైన స్వామి రామానందచే ఆరాధించబడినది అని?.’ ఈ విషయం విన్న మరుక్షణం, ఆ రాయి పట్ల మీ యొక్క గౌరవం మరింత పెరుగుతుంది. ప్రతి సారీ, ఈ రాయి పట్ల జ్ఞానమే దాని మీద గౌరవాన్ని పెంపొందించుతున్నది. అదే విధంగా, భగవంతుని పట్ల సరియైన అవగాహన/జ్ఞానము అనేది ఆయన పట్ల భక్తిని పెంపొందించుతుంది. ఈ విధంగా, అనంతమైన బ్రహ్మాండాల పనితీరులో ప్రకటితమయ్యే భగవంతుని అద్భుతమైన వైభవాన్ని విశదీకరించిన పిదప, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, ఎవరైతే ఈ జ్ఞానము యందు స్థితులై ఉంటారో, వారు అచంచలమైన భక్తితో ఆయన తోనే ఏకమై ఉంటారు, అని.
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే । ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ।। 8 ।।
8
10
https://www.holy-bhagava…udio/010_008.mp3
అహం — నేను; సర్వస్య — సమస్త సృష్టి యొక్క; ప్రభవః — మూల ఉత్పత్తి స్థానము; మత్తః — నా నుండే; సర్వం — సర్వమూ; ప్రవర్తతే — ప్రవర్తిల్లును (నడుచుట); ఇతి — ఈ విధముగా; మత్వా — తెలుసుకొని; భజంతే — ఆరాధిస్తారు; మాం — నన్ను; బుధాః — వివేకవంతులు; భావ-సమన్వితః — అత్యంత విశ్వాసము మరియు భక్తి తో కూడి.
BG 10.8: నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ నడుస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.
శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని ‘అహం సర్వస్య ప్రభవో’ అని అనటంతో ప్రారంభిస్తున్నాడు, అంటే ‘నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమును మరియు సర్వ కారణ కారణమును’ అని. ఈ విషయాన్ని 7.7వ, 7.12వ, 10.2-3వ, మరియు 15.15వ శ్లోకాలలో, భగవద్గీత లో చాలా సార్లు చెప్పాడు. ఇతర పురాణ/ఇతిహాసాలలో కూడా ఇది గట్టిగా పేర్కొనబడినది. ఋగ్వేదము ప్రకారం: యం కామయే తమ్ తమ్ ఉగ్రం కృష్ణోమి తం బ్రహ్మాణం తమ్ ఋషిం తమ్ సుమేద్సం (10.125.5) ‘నేను ప్రేమించే వారిని అత్యంత మహానీయులుగా చేస్తాను; వారిని పురుషులుగా లేదా స్త్రీలగా చేస్తాను; వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను; ఏదేని జీవాత్మను బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను.’ ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు దృఢ విశ్వాసం పెంచుకుని మరియు ప్రేమయుక్త భక్తితో ఆయనను ఆరాధిస్తారు. ఈ విధంగా శ్రీ కృష్ణుడు ఈ భౌతిక జగత్తుకి మరియు ఆధ్యాత్మిక జగత్తుకి, రెండింటికీ కూడా సర్వేశ్వరుడు. కానీ, కేవలం ఈ సృష్టి నిర్వహణయే భగవంతుని యొక్క ప్రధానమైన కార్యము కాదు. చైతన్య మహాప్రభు ఇలా పేర్కొన్నాడు: స్వయం భగవానేర కర్మ నహే భార-హరణ (చైతన్య చరితామృతము, ఆది లీల 4.8) ‘శ్రీ కృష్ణుడు తానే స్వయంగా ఈ భౌతిక విశ్వముల యొక్క సృష్టి, స్థితి, మరియు లయములో నిమగ్నం కాడు.’ శ్రీ కృష్ణుడి ప్రధాన కార్యము ఏమిటంటే, ముక్తి/మోక్షము సాధించిన జీవులతో తన దివ్య ధామము గోలోకములో ప్రేమ యుక్త నిత్య లీలలలో నిమగ్నమవ్వటమే. భౌతిక సృష్టి నిమిత్తం, ఆయనే కారణోదక్షాయి విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు, ఆయననే మహావిష్ణువు అని కూడా అంటారు. ఈ విధంగా, అనంతమైన భౌతిక విశ్వములను కలిగి ఉన్న ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్యానికి ఉన్న భగవంతుని స్వరూపమే మహావిష్ణువు. మహా విష్ణువునే ప్రథమ పురుషుడు అని కూడా అంటారు (భౌతిక జగత్తులో భగవంతుని యొక్క ప్రథమ స్వరూపము). ఆయన కారణ సముద్రంలో దివ్య నీటిలో ఉంటూ అనంతమైన బ్రహ్మాండాలను తన శరీర రోమ కూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద గర్భోదక్షాయి విష్ణు స్వరూపంలో వ్యాప్తించి ఉంటాడు, ఆయననే ద్వితీయ పురుషుడు అంటారు. (భౌతిక ప్రపంచంలో రెండవ స్వరూపము). గర్భోదక్షాయి విష్ణు నుండి బ్రహ్మ జన్మించాడు. ఆయనే సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తాడు – విశ్వము యొక్క విభిన్నములైన స్థూల, సూక్ష్మ పదార్థాలని, ప్రకృతి నియమాలని, గ్రహాలూ, పాలపుంతలూ, వాటిపై నివసించే జీవరాశులు మొదలైనవన్నీటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి బ్రహ్మని విశ్వ సృష్టి కర్త అని అంటూ ఉంటారు, నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త. గర్భోదక్షాయి విష్ణు ఇంకొంత వ్యాప్తి నొంది, తానే, క్షీరోదక్షాయి విష్ణుగా రూపాంతరం చెంది, ప్రతి బ్రహ్మాండం యొక్క పై భాగంలో, క్షీర సాగరంలో నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువు నే తృతీయ పురుషుడు అంటారు. (భౌతిక జగత్తు లో భగవంతుని యొక్క మూడవ రూపాంతరము). విశ్వం పైన ఉంటాడు అంతేకాక, తానే పరమాత్మ రూపంలో సర్వ ప్రాణుల హృదయములో, వాటి కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరైన సమయంలో కర్మ ఫలాలని అందచేస్తూ ఉంటాడు. అందుకే ఆయనను విశ్వ స్థితికారకుడు అంటారు. ఇక్కడ చెప్పబడిన విష్ణు మూర్తి స్వరూపాలన్నీ శ్రీ కృష్ణుడి కన్నా అభేదములే. అందుకే, ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక సృష్టి ఆయన నుండే వచ్చాయి అని అంటున్నాడు. శ్రీ కృష్ణుడినే ‘అవతారీ’ (అన్ని అవతారముల మూలము) అని కూడా అంటారు. శ్రీమద్ భాగవతము ప్రకారం : ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం (1.3.28) ‘భగవంతుని సమస్త స్వరూపాలు శ్రీ కృష్ణుడి రూపాంతరాలే లేదా ఆయన రూపాంతరాల రూపాంతరాలే; ఆయన మాత్రం స్వయం భగవానుడు.’ అందుకే, ద్వితీయ స్థాన సృష్టికర్త అయిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ విధంగా స్తుతించాడు: యస్యైకనిశ్వసిత కాలమథావలంబ్య జీవంతి లోమవిలజా జగదండనాథాః విష్ణుర్మహాన్ సఇహయస్య కలావిషేశో గోవిందమాది పురుషం తమహం భజామి (బ్రహ్మ సంహిత 5.48) ‘అనంతమైన బ్రహ్మాండాలు — ప్రతి ఒక్క దాంట్లో ఒక శంకరుడు, బ్రహ్మ, మరియు విష్ణువు ఉన్నటువంటివి – శ్రీ మహా విష్ణువు శరీర రోమ కూపాల్లోంచి ఆయన శ్వాస తీసుకున్నప్పుడు సృజించబడుతాయి; మరియు ఆయన శ్వాస విడిచినప్పుడు ఆయనలోకే లయమై పోతాయి. అటువంటి శ్రీ మహా విష్ణువు మూల స్వరూపమైన శ్రీ కృష్ణుడిని నేను పూజిస్తాను.’ శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు భక్తులు తనను ఎలా భజిస్తారో వివరిస్తున్నాడు.
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ । కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ।। 9 ।।
9
10
https://www.holy-bhagava…udio/010_009.mp3
మత్-చిత్తః — నా యందే మనస్సు లగ్నం చేసి; మత్-గత-ప్రాణాః — నాకే తమ జీవితాలని అర్పించి (శరణాగతి చేసి); బోధయంతః — భోదిస్తూ (భగవంతుని దివ్య జ్ఞానముతో); పరస్పరం — ఒకరికొకరు; కథయంతః — చెప్పుచూ; చ — మరియు; మాం — నా గురించి; నిత్యం — నిత్యమూ; తుశ్యంతి — సంతుష్టి; చ — మరియు; రమంతి — (వారు) ఆనందింతురు; చ — మరియు.
BG 10.9: వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమునూ అనుభవిస్తుంటారు.
మనస్సు యొక్క స్వభావమేమిటంటే దానికిష్టమైన దానిపై అది లగ్నమై పోతుంది. ఆయన యందు గాఢమైన అభిమానం పెంచుకోవటం వలన భగవంతుని భక్తులు ఆయనను గుర్తుచేసుకుంటూ స్మరించటంలో నిమగ్నమై పోతారు. ఆయన పట్ల భక్తియే వారి జీవితానికి ఆధారంగా ఉంటుంది, దాని నుండే వారి జీవిత పరమార్థం, లక్ష్యం, బ్రతుకేందుకు శక్తిని పొందుతారు. ఒక చేపకు నీరు ఎలా అవసరమో వారికి భగవత్ స్మరణ అలా అవసరము అని భావిస్తారు. వ్యక్తుల హృదయానికి ఏది ఇష్టమైనదో తెలుసుకోవాలంటే వారు తమ మనస్సు, శరీరము మరియు సంపదను దేనికి అంకితం చేస్తారో దాని బట్టి తెలుసుకోవచ్చు. బైబిల్ ఇలా పేర్కొంటుంది: ‘నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును’ (For where your treasure is, there your heart will also be.) (మత్తయి Matthew 6:21). వ్యక్తుల మనస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే వారి చెక్కుపుస్తకం మరియు క్రెడిట్ కార్డు లావాదేవీలు చూస్తే సరిపోతుంది. ఒకవేళ వారు ఖరీదైన వాహనాల కోసం డబ్బు ఖర్చు పెడుతుంటే వారి మనస్సు వాటిపై ఉన్నట్టు. ఒకవేళ వారు విలాసవంతమైన సెలవులపై బాగా ఖర్చు పెడుతుంటే, అదే వారికి బాగా నచ్చే విషయమన్నట్టు. ఒకవేళ వారు ఆఫ్రికాలో ఎయిడ్స్ జబ్బుతో ఉన్న పిల్లలకై విరాళం దానం చేస్తుంటే, ఆ విషయమే వారి యొక్క మనస్సులో ఉన్నట్టు. తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల ప్రేమ అనేది, వారి పట్ల సమయము, డబ్బు వెచ్చించే వైనంతో మనకు తెలుస్తుంది. ఇదే విధంగా, భక్తుల యొక్క ప్రేమ అనేది వారి భగవంతునికే అంకితమయ్యే తీరుతో ప్రకటితమవుతుంది. శ్రీ కృష్ణుడు మద్-గత-ప్రాణాః, అంటే, ‘నా భక్తులు వారి జీవితాన్ని నాకే అంకితం చేస్తారు’ అని అర్థం. ఇటువంటి శరణాగతి నుండి తృప్తి లభిస్తుంది. భక్తులు తమ కార్యకలాపముల ఫలితాన్ని తమ ప్రియమైన భగవంతునికే సమర్పిస్తారు కాబట్టి, వారు ప్రతి సందర్భము/పరిస్థితి ఆయన నుండే వస్తున్నది అని భావిస్తారు. కాబట్టి, వారు అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులను రెంటినీ కూడా భగవత్ సంకల్పముగా చూస్తారు, మరియు ఈ రెంటిలో కూడా సమత్వ-బుద్ధితో ఉంటారు. భగవంతుని పై భక్తుల యొక్క ప్రేమ, పైన పేర్కొన్న రూపాలలో వ్యక్తమయినా, అది వారి పెదవులపై కూడా ప్రకటితమవుతుంది. వారికి భగవంతుని వైభవము, ఆయన నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు భక్తుల గురించి మాట్లాడుకోవటం అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. ఈ ప్రకారంగా భగవంతుని వైభవాల, కీర్తన మరియు శ్రవణ ప్రక్రియలలో వారు ఆనందం అనుభవించటమే కాక, దానిని ఇతరులతో కూడా పంచుకుంటారు. తమలో తమ ఆధ్యాత్మిక పురోగతి కోసం, భగవంతుని దివ్య జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ, ఒకరికి ఒకరు సహకరించుకుంటారు (బోధయంతి). భగవంతుని లీలలు, వైభవము గురించి మాట్లాటడం మరియు పాడటం భక్తులకు పరమ సంతృప్తిని (తుశ్యంతి) మరియు ఆనందాన్ని (రమంతి) కలుగ చేస్తుంది. ఈ విధంగా తలచుకోవటం, వినటం మరియు జపించే ప్రక్రియల ద్వారా వారు భగవంతుడిని ఆరాధిస్తుంటారు. ఇదే త్రివిధా భక్తి అంటే – శ్రవణం, కీర్తనం, మరియు స్మరణం. 9.14వ శ్లోక వ్యాఖ్యానం లో ఇది ఇంతకు క్రితం వివరించబడినది. తన భక్తులు తనను ఎలా ఆరాధిస్తారో చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, తను, వారి భక్తికి ఎలా ప్రతిస్పందిస్తాడో ఇప్పుడిక చెప్తాడు.
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ । దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ।। 10 ।।
10
10
https://www.holy-bhagava…udio/010_010.mp3
తేషాం — వారికి; సతత-యుక్తానాం — ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో; భజతాం — భక్తిలో నిమగ్న మయ్యే వారికి; ప్రీతి-పూర్వకం — ప్రేమతో; దదామి — నేను ఇస్తాను; బుద్ధి-యోగం — దివ్య జ్ఞానము; తం — అది; యేన — దేనివల్ల అయితే; మాం — నా వద్దకు; ఉపయాంతి — వచ్చెదరు; తే — వారు.
BG 10.10: మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు.
మన సొంత తెలివితేటలతో భగవంతుని యొక్క దివ్య జ్ఞానమును అందుకోలేము. మనకెంత తెలివితేటలు ఉన్నా, చివరికి మన బుద్ధి మాయచే తయారుచేయబడినది అని ఒప్పుకోవలసినదే. కాబట్టి, మన ఆలోచనలు, కుశలత, మరియు వివేకము, భౌతిక ప్రాపంచిక జగత్తుకు మాత్రమే పరిమితము. భగవంతుడు మరియు ఆయన యొక్క దివ్య జగత్తు, మన భౌతికమైన బుద్ధికి అతీతమైనవి. వేదములు దృఢముగా ఈ విషయాన్నినొక్కి వక్కాణించాయి. యస్యా మతం తస్య మతం మతం యస్య న వేద సః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం (కేనోపనిషత్తు 2.3) ‘తమ బుద్ధిచే భగవంతుడిని తెలుసుకుంటాము అనుకునేవారికి భగవంతునిపై ఎటువంటి అవగాహన లేదు. భగవంతుడు తమ బుద్ధి పరిమితికి అతీతమైన వాడు అని తెలుసుకున్న వారే ఆయనను నిజముగా అర్థం చేసుకున్నట్టు.’ బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: స ఏష నేతి నేత్యాత్మా గ్రిహ్యోః (3.9.26) ‘తమ బుద్ధి ఆధారంగా, స్వంత ప్రయత్నంచే భగవంతుణ్ణి ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.’ రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది: రామ అతర్క్య బుద్ధి మన బానీ, మత హమార అస సునహి సయానీ ‘శ్రీ రామచంద్ర భగవానుడు మన బుద్ధి, మనస్సు మరియు మాటల సామర్థ్యానికి అతీతుడు.’ మరిక, భగవంతుడిని తెలుసుకునే విషయం మీద ఉన్న ఈ వాక్యాలన్నీ కూడా, ఆయనను తెలుసుకోవటం అసాధ్యమని స్పష్టంగా చెప్తుంటే, మరిక భగవత్ ప్రాప్తి అనేది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఇక్కడ భగవత్ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవచ్చో తెలియచేస్తున్నాడు. భగవంతుడే తన దివ్య జ్ఞానాన్ని జీవాత్మకు ప్రసాదిస్తాడు, అప్పుడు ఆయన కృప లభించిన ఆ భాగ్యశాలియైన జీవాత్మ ఆయనను తెలుసుకోగలుగుతుంది. యజుర్వేదము ఇలా పేర్కొంటున్నది. ‘తస్య నో రాస్వ తస్య నో ధేహీ’, ‘భగవంతుని చరణారవిందముల నుండి జనించే అమృతంలో ఓలలాడకుండా, ఎవ్వరూ కూడా ఆయనను తెలుసుకోలేరు.’ ఈ విధంగా, భగవంతుని గురించి ఉన్న యదార్థమైన జ్ఞానము, మన తెలివితేటల కసరత్తు వలన రాదు, ఆయన కృపచే మాత్రమే వస్తుంది. తన కృపకు పాత్రుడిని ఏదో ఇష్టమొచ్చినట్టు ఎంచుకోను, తనపై భక్తితో మనస్సుని ఐక్యం చేసినవారికే అది ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఇక తదుపరి, ఒకసారి మనకు భగవత్ కృప లభించిన తరువాత ఏమవుతుందో ఇక చెప్తున్నాడు.
తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ।। 11 ।।
11
10
https://www.holy-bhagava…udio/010_011.mp3
తేషాం — వారికి; ఏవ — మాత్రమే; అనుకంపా-అర్థమ్ — నా కారుణ్యము చే; అహం — నేను; అజ్ఞాన-జం — అజ్ఞానముచే జనించిన; తమః — చీకటి; నాశయామి — నాశనం చేయుదును; ఆత్మ-భావ — వారి హృదయము నందు; స్థః — నివసిస్తున్న; జ్ఞాన — జ్ఞానమనే; దీపేన — దీపముతో; భాస్వతా — ప్రకాశిస్తూ.
BG 10.11: వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను.
ఈ శ్లోకంలో, భగవత్ కృప అంటే ఏమిటో మరింత వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఇంతకు పూర్వం, ఎవరైతే తన పట్ల ప్రేమతో మనస్సును నిమగ్నం చేస్తారో మరియు తననే తమ యొక్క ప్రణాళికలలో, తలంపులలో, మరియు కార్యకలాపములలో ప్రధానమైన విషయముగా ఉంచుకుంటారో వారికి తన కృపను అందిస్తాను అని చెప్పిఉన్నాడు. ఇప్పుడు, ఎవరికైనా తన కృప లభించినప్పుడు ఏమవుతుందో చెప్తున్నాడు. వారి హృదయములో ఉన్న చీకటిని, జ్ఞానమనే దీపముచే నశింపచేస్తాను అని అంటున్నాడు. అజ్ఞానము తరచుగా చీకటితో పోల్చబడుతుంది. కానీ, భగవంతుడు ఉదహరించే ఈ జ్ఞాన దీపము అంటే ఏమిటి? ప్రస్తుతం మన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి అన్నీ కూడా ప్రాకృతికమైనవే, కానీ భగవంతుడు దివ్యమైన వాడు. కాబట్టి మనం ఆయనను చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము, లేదా ఆయనతో ఏకమై లేము. ఎప్పుడైతే భగవంతుడు తన కృపని ప్రసాదిస్తాడో, తన దివ్యమైన యోగమాయా శక్తిని ఆ జీవాత్మపై కరుణిస్తాడు. దానినే శుద్ధ-సత్త్వము అని (దివ్యమైన సత్త్వ గుణము) అంటారు, ఇది మాయా సత్త్వ గుణము కంటే వేరైనది. మనకు ఆ శుద్ధసత్త్వగుణ శక్తి లభించినప్పుడు, మన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి దివ్యమైనవిగా అయిపోతాయి. దీనినే సరళంగా చెప్పాలంటే, ఆయన కృప చేత, భగవంతుడు తన దివ్యమైన ఇంద్రియములని, దివ్య మనస్సుని, మరియు దివ్య బుద్ధిని ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు. ఈ దివ్య ఉపకరణాలను కలిగి ఉన్నపిదప, ఆ జీవాత్మ, భగవంతుడిని చూడగలుగుతుంది, భగవంతుడిని వినగలుగుతుంది మరియు భగవంతునితో ఏకమవ్వగలుగుతుంది. కాబట్టి, వేదాంత దర్శనం పేర్కొన్నట్టు: విశేశానుగ్రహశ్చ (3.4.38). ‘భగవంతుని కృపచే మాత్రమే ఎవరికైనా దివ్య జ్ఞానము కలిగేది.’ ఈ ప్రకారంగా, తన యొక్క దివ్య శక్తియే, శ్రీ కృష్ణుడు ఉదహరించే దీపము. భగవంతుని దివ్య శక్తి యొక్క కాంతిచే భౌతిక శక్తి యొక్క చీకటి పటాపంచలైపోతుంది.
అర్జున ఉవాచ । పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ । పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ।। 12 ।। ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా । అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।
12
10
https://www.holy-bhagava…/010_012-013.mp3
అర్జునః ఉవాచ — అర్జునుడు పలికెను; పరం — సర్వోత్కృష్ట; బ్రహ్మ — బ్రహ్మం; పరం — సర్వోత్కృష్ట; ధామ — ధామము; పవిత్రం — పవిత్రం చేసే; పరమం — సర్వోత్కృష్ట; భవాన్ — నీవు; పురుషం — పురుషుడవు; శాశ్వతం — నిత్యమైన; దివ్యం — దివ్యమైన; ఆది-దేవం — ఆది దేవుడివి; అజమ్ — జన్మ రహితుడువి; విభుం — గొప్ప/మహిమగల; ఆహుః — (వారు) ప్రకటించారు; త్వం — నీవు; ఋషయః — ఋషులు; సర్వే — అందరూ; దేవ-ఋషిః-నారదః — దేవర్షి నారదుడు; తథా — మరియు; అసితః — అసితుడు; దేవలః — దేవలుడు; వ్యాసః — వ్యాసుడు; స్వయం — స్వయముగా; చ — మరియు; ఏవ — నిజముగా; బ్రవీషీ — నీవే ప్రకటిస్తున్నావు; మే — నాకు.
BG 10.12-13: అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.
వేదశాస్త్రాల పై వ్యాఖ్యానం చేసేవారు, శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు సర్వోన్నత భగవానులు కారు అని చెప్తుంటారు. సర్వోత్కృష్ట అస్తిత్వము, ఒక నిర్గుణ, నిరాకార తత్త్వమని, అదే రూపములను తీసుకుని మరియు అవతారములుగా ప్రకటితమవుతుందని, అందుకే ఈ అవతారాలు భగవంతుని నుండి ఒక మెట్టు దూరమైనవనీ చెపుతుంటారు. కానీ, అర్జునుడు ఈ అభిప్రాయాలను త్రిప్పికోడుతూ, శ్రీ కృష్ణుడే తన సాకార రూపంలో, సర్వోన్నతమైన సర్వ కారణ కారకుడు అని చెప్తున్నాడు. ఇంతకు పూర్వపు నాలుగు శ్లోకాలు విన్న తరువాత అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయి పట్ల సంపూర్ణ నమ్మకం కలిగింది; మరియు తనలో ఇప్పుడు కలిగిన దృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెప్తారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహాత్ములైన మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడు, అసితుడు, దేవలుడు, మరియు వ్యాసుడు వంటి వారు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు మరియు సర్వకారణ కారకుడు అని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక పద్యం ఉంది, అందులో ఎంతో మంది శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు. నారద మహర్షి ఇలా అంటాడు: ‘శ్రీ కృష్ణుడు సర్వ జగత్తులకి సృష్టికర్త మరియు అందరి మదిలోని భావాలను ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరి దేవతల ప్రభువు.’ (శ్లోకం 68.2). మార్కండేయ ముని ఇలా పేర్కొన్నాడు: ‘శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం మరియు నియమనిష్ఠల సారం. ఆయనే సమస్తమునకూ భూత-వర్తమాన-భవిష్యత్తు.’ (శ్లోకం 68.3) భృగు మహర్షి ఇలా అన్నాడు: ‘ఆయన దేవ దేవుడు మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపము.’ (శ్లోకం 68.4). వేద వ్యాస ఋషి ఇలా పేర్కొన్నాడు: ‘ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువు, నీవే ఇంద్రుడికి మరియు ఇతర దేవతలకి అధికారాన్ని/శక్తిని ప్రసాదించావు.’ (శ్లోకం 68.5). అంగీర మహర్షి ఇలా అన్నాడు: ‘శ్రీ కృష్ణుడే సర్వ ప్రాణుల సృష్టికర్త. ముల్లోకాలు ఆయన ఉదరము యందే ఉన్నాయి. ఆయనే సర్వోత్కృష్ట భగవానుడు.’ (శ్లోకం 68.6). మహాభారతంలోనే మరోచోట, అసిత మరియు దేవల మహర్షులు ఇలా ప్రకటించారు: ‘ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడిని సృష్టించిన వాడు శ్రీకృష్ణుడు.’ (మహాభారత వనపర్వం 12.50). ఈ మహోన్నతమైన ప్రామాణికమైన మహాత్ములని ఊటంకిస్తూ అర్జునుడు - ఇప్పుడు శ్రీ కృష్ణుడే, తానే సర్వ కారణ కారకుడను అని చెప్పటం ద్వారా - స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు అని అంటున్నాడు.
అర్జున ఉవాచ । పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ । పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ।। 12 ।। ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా । అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।
13
10
https://www.holy-bhagava…/010_012-013.mp3
అర్జునః ఉవాచ — అర్జునుడు పలికెను; పరం — సర్వోత్కృష్ట; బ్రహ్మ — బ్రహ్మం; పరం — సర్వోత్కృష్ట; ధామ — ధామము; పవిత్రం — పవిత్రం చేసే; పరమం — సర్వోత్కృష్ట; భవాన్ — నీవు; పురుషం — పురుషుడవు; శాశ్వతం — నిత్యమైన; దివ్యం — దివ్యమైన; ఆది-దేవం — ఆది దేవుడివి; అజమ్ — జన్మ రహితుడువి; విభుం — గొప్ప/మహిమగల; ఆహుః — (వారు) ప్రకటించారు; త్వం — నీవు; ఋషయః — ఋషులు; సర్వే — అందరూ; దేవ-ఋషిః-నారదః — దేవర్షి నారదుడు; తథా — మరియు; అసితః — అసితుడు; దేవలః — దేవలుడు; వ్యాసః — వ్యాసుడు; స్వయం — స్వయముగా; చ — మరియు; ఏవ — నిజముగా; బ్రవీషీ — నీవే ప్రకటిస్తున్నావు; మే — నాకు.
BG 10.12-13: అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.
వేదశాస్త్రాల పై వ్యాఖ్యానం చేసేవారు, శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు సర్వోన్నత భగవానులు కారు అని చెప్తుంటారు. సర్వోత్కృష్ట అస్తిత్వము, ఒక నిర్గుణ, నిరాకార తత్త్వమని, అదే రూపములను తీసుకుని మరియు అవతారములుగా ప్రకటితమవుతుందని, అందుకే ఈ అవతారాలు భగవంతుని నుండి ఒక మెట్టు దూరమైనవనీ చెపుతుంటారు. కానీ, అర్జునుడు ఈ అభిప్రాయాలను త్రిప్పికోడుతూ, శ్రీ కృష్ణుడే తన సాకార రూపంలో, సర్వోన్నతమైన సర్వ కారణ కారకుడు అని చెప్తున్నాడు. ఇంతకు పూర్వపు నాలుగు శ్లోకాలు విన్న తరువాత అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయి పట్ల సంపూర్ణ నమ్మకం కలిగింది; మరియు తనలో ఇప్పుడు కలిగిన దృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెప్తారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహాత్ములైన మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడు, అసితుడు, దేవలుడు, మరియు వ్యాసుడు వంటి వారు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు మరియు సర్వకారణ కారకుడు అని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక పద్యం ఉంది, అందులో ఎంతో మంది శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు. నారద మహర్షి ఇలా అంటాడు: ‘శ్రీ కృష్ణుడు సర్వ జగత్తులకి సృష్టికర్త మరియు అందరి మదిలోని భావాలను ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరి దేవతల ప్రభువు.’ (శ్లోకం 68.2). మార్కండేయ ముని ఇలా పేర్కొన్నాడు: ‘శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం మరియు నియమనిష్ఠల సారం. ఆయనే సమస్తమునకూ భూత-వర్తమాన-భవిష్యత్తు.’ (శ్లోకం 68.3) భృగు మహర్షి ఇలా అన్నాడు: ‘ఆయన దేవ దేవుడు మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపము.’ (శ్లోకం 68.4). వేద వ్యాస ఋషి ఇలా పేర్కొన్నాడు: ‘ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువు, నీవే ఇంద్రుడికి మరియు ఇతర దేవతలకి అధికారాన్ని/శక్తిని ప్రసాదించావు.’ (శ్లోకం 68.5). అంగీర మహర్షి ఇలా అన్నాడు: ‘శ్రీ కృష్ణుడే సర్వ ప్రాణుల సృష్టికర్త. ముల్లోకాలు ఆయన ఉదరము యందే ఉన్నాయి. ఆయనే సర్వోత్కృష్ట భగవానుడు.’ (శ్లోకం 68.6). మహాభారతంలోనే మరోచోట, అసిత మరియు దేవల మహర్షులు ఇలా ప్రకటించారు: ‘ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడిని సృష్టించిన వాడు శ్రీకృష్ణుడు.’ (మహాభారత వనపర్వం 12.50). ఈ మహోన్నతమైన ప్రామాణికమైన మహాత్ములని ఊటంకిస్తూ అర్జునుడు - ఇప్పుడు శ్రీ కృష్ణుడే, తానే సర్వ కారణ కారకుడను అని చెప్పటం ద్వారా - స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు అని అంటున్నాడు.
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ । న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ।। 14 ।।
14
10
https://www.holy-bhagava…udio/010_014.mp3
సర్వం — అంతా; ఏతత్ — ఇది; ఋతం — నిజము; మన్యే — నేను నమ్ముతున్నాను; యత్ — ఏదైతే; మాం — నాకు; వదసి — నీవు చెప్పినది; కేశవ — శ్రీ కృష్ణ, కేశి అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడా; న — కాదు; హి — నిజముగా; తే — నీ యొక్క; భగవన్ — పరమేశ్వర; వ్యక్తిం — వ్యక్తిత్వము; విదు — తెలుసుకోగలరు; దేవాః — దేవతలు; న — కాదు; దానవాః — దానవులు (అసురులు).
BG 10.14: ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యదార్థ స్వరూపమును తెలుసుకోలేరు.
శ్రీ కృష్ణుడి దివ్య వైభవమును మరియు అనంతమైన ఔన్నత్యమును క్లుప్తముగా శ్రద్ధతో విన్న పిదప, అర్జునుడికి ఇంకా వినాలనే తపన పెరిగింది. శ్రీ కృష్ణుడు ఇంకా తన వైభవములను చెప్పాలని ఆశతో, తనకు పూర్తి విశ్వాసం కలిగిందని భగవంతునికి నమ్మిక కలిగిస్తున్నాడు. ‘యత్’ అన్న పదం వాడటంలో అర్జునుడి ఆంతర్యం ఏమిటంటే, శ్రీ కృష్ణుడు ఏడవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు చెప్పినదంతా యదార్థమనే అతను నమ్ముతున్నట్టు అని. శ్రీ కృష్ణుడు చెప్పినదంతా నిజమే మరియు అది ఎటువంటి ఊహాకల్పిత వివరణ కాదు అని వక్కాణిస్తున్నాడు. శ్రీ కృష్ణుడిని భగవాన్ అని సంబోధిస్తున్నాడు, అంటే పరమేశ్వరా అని అర్థం. భగవాన్ అన్న పదం దేవీ భాగవత పురాణం లో ఈ క్రింది విధంగా చెప్పబడింది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యోశ్చైవ షణ్ణాం భగవాన్నిః ‘భగవాన్ అంటే ఈ ఆరు ఐశ్వర్యములను అనంతమైన పరిమాణంలో కలిగి ఉన్న వాడు అని - శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము, మరియు వైరాగ్యము.’ దేవతలు, దానవులు, మానవులు వీరందరూ పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. వారు సంపూర్ణ భగవత్ తత్త్వాన్ని తెలుసుకోలేరు.
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ । భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ।। 15 ।।
15
10
https://www.holy-bhagava…udio/010_015.mp3
స్వయం — నీవే స్వయముగా; ఏవ — నిజముగా; ఆత్మనా — నీ చేతనే; ఆత్మానం — నీవే; వేత్థ — తెలుసుకొనబడతావు; త్వం — నీవు; పురుష-ఉత్తమ — సర్వోత్కృష్ట పరమ పురుషుడు; భూత-భావన — సర్వ భూతములను సృష్టించినవాడా; భూతేశ — అన్నిటికీ ప్రభువైన వాడా; దేవ-దేవ — దేవతలకే దేవుడు; జగత్-పతే — జగత్తుకే ప్రభువువి.
BG 10.15: ఓ పురుషోత్తమా, సకలభూతముల సృష్టికర్త అయినవాడా, సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే ! నిజానికి, నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు.
శ్రీ కృష్ణుడు సర్వోత్కృష్ట పరమ పురుషోత్తముడు అని వక్కాణిస్తూ, అర్జునుడు ఆయనను ఇలా సంబోధిస్తున్నాడు: భూత-భావన: సమస్త ప్రాణుల సృష్టికర్త, విశ్వ పిత. భూతేశ: సర్వ భూతముల ప్రభువు, అత్యున్నత నియామకుడు. జగత్-పతే: సమస్త సృష్టికి స్వామి. దేవ-దేవ: దేవతలకు దేవుడా. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇదే విషయాన్ని పేర్కొన్నది: యస్మాత్ పరం నాపరమస్తి కించిద్ (3.9) ‘భగవంతుడిని ఎన్నటికీ అధిగమించలేము; ఆయన అన్నింటికీ అతీతుడు.’ భగవంతుడు ఎవ్వరి చేతనూ తెలుసుకోబడలేడు అని ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడింది. ఇది స్పష్టంగా తర్కబద్ధమైనదే. సమస్త జీవులు (జీవాత్మలు) పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు, కానీ భగవంతుడు అనంతమైనవాడు, కాబట్టి ఆయన వారి బుద్ధి పరిధికి అతీతమైనవాడు. ఇది ఆయనను ఏమీ తక్కువ చేయదు; సరికదా ఆయనను ఉన్నత స్థితిలో నిలబెట్టుతుంది. పాశ్చాత్య తత్త్వవేత్త అయిన F.A. జాకోబి ఇలా పేర్కొన్నాడు : ‘మనం తెలుసుకోగలిగే దేవుడు, దేవుడే కాడు.’ కానీ, ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, తుదకు, భగవంతుడేమిటో తెలిసినవాడు ఒక్కడున్నాడు, అతను స్వయాన భగవంతుడే. ఈ విధంగా, శ్రీ కృష్ణుడికి మాత్రమే తానెవరో/తానేమిటో తెలుసు, మరియు ఒకవేళ తానే తన శక్తులను ఏదేని జీవాత్మకి ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలి జీవాత్మ కూడా ఆయనను తెలుసుకోగలుగుతుంది.
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః । యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ।। 16 ।। కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ । కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ।। 17 ।।
16
10
https://www.holy-bhagava…/010_016-017.mp3
వక్తుం — విశదపరుచుటకు; అర్హసి — దయచేయుము; అశేషేణ — సంపూర్ణముగా; దివ్యాః — దివ్యమైన; హి — నిజముగా; ఆత్మ — నీ స్వంత; విభూతయః — విభూతులను; యాభిః — దేనిచేత నయితే; విభూతిభిః — విభూతులు; లోకాన్ — సమస్త లోకములలో; ఇమాన్ — ఇవి; త్వం — నీవు; వ్యాప్య — వ్యాపించి; తిష్ఠసి — స్థితుడవై ఉండి; కథం — ఏ విధముగా; విద్యాం అహం — నేను ఎలా తెలుసుకోగలను; యోగిన్ — యోగమాయా అధిపతి; త్వాం — నీవు; సదా — ఎల్లప్పుడూ; పరిచింతయన్ — ధ్యానిస్తూ; కేషు — దేని; కేషు — దేని; చ — మరియు; భావేషు — రూపములలో; చింత్యః అసి — స్మరించబడాలి; భగవన్ — పరమ దివ్య మంగళ స్వరూపా; మయా — నా చేత.
BG 10.16-17: నీవు ఏఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో, వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వరా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను? మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను, ఓ భగవంతుడా?
ఇక్కడ ‘యోగమ్’ అంటే యోగమాయ (భగవంతుని దివ్యమైన శక్తి), మరియు యోగి అంటే యోగమాయ యొక్క యజమాని. శ్రీ కృష్ణుడు, భగవానుడు అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడి విభూతులు(అలౌకిక ఐశ్వర్యములు) ఏఏ విధముగా ఈ జగత్తులో ప్రకటితమవుతాయో, ఇంకా చెప్పబడని వాటిని, ఇప్పుడు తెలుసుకోగోరుతున్నాడు. సమస్త జగత్తుని నియంత్రించి నిర్వహించేవాడిగా శ్రీకృష్ణుడి మహిమలను మరియు ఆయన అత్యున్నత స్థాయిని గురించి వినాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు, ‘నాకు నిశ్చలమైన భక్తి పెంపొందటానికి/ప్రసాదించబడటానికి నీ దివ్య విభూతులను తెలుసుకోగోరుచున్నాను. కానీ, నీ కృప లేకుండా, నీ వ్యక్తిత్త్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము. కాబట్టి, దయచేసి నామీద కృపతో, నిన్ను అర్థంచేసుకొనుటకై, నీ యొక్క మహిమలను తెలియచేయుము.’
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః । యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ।। 16 ।। కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ । కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ।। 17 ।।
17
10
https://www.holy-bhagava…/010_016-017.mp3
వక్తుం — విశదపరుచుటకు; అర్హసి — దయచేయుము; అశేషేణ — సంపూర్ణముగా; దివ్యాః — దివ్యమైన; హి — నిజముగా; ఆత్మ — నీ స్వంత; విభూతయః — విభూతులను; యాభిః — దేనిచేత నయితే; విభూతిభిః — విభూతులు; లోకాన్ — సమస్త లోకములలో; ఇమాన్ — ఇవి; త్వం — నీవు; వ్యాప్య — వ్యాపించి; తిష్ఠసి — స్థితుడవై ఉండి; కథం — ఏ విధముగా; విద్యాం అహం — నేను ఎలా తెలుసుకోగలను; యోగిన్ — యోగమాయా అధిపతి; త్వాం — నీవు; సదా — ఎల్లప్పుడూ; పరిచింతయన్ — ధ్యానిస్తూ; కేషు — దేని; కేషు — దేని; చ — మరియు; భావేషు — రూపములలో; చింత్యః అసి — స్మరించబడాలి; భగవన్ — పరమ దివ్య మంగళ స్వరూపా; మయా — నా చేత.
BG 10.16-17: నీవు ఏఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో, వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వరా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను? మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను, ఓ భగవంతుడా?
ఇక్కడ ‘యోగమ్’ అంటే యోగమాయ (భగవంతుని దివ్యమైన శక్తి), మరియు యోగి అంటే యోగమాయ యొక్క యజమాని. శ్రీ కృష్ణుడు, భగవానుడు అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడి విభూతులు(అలౌకిక ఐశ్వర్యములు) ఏఏ విధముగా ఈ జగత్తులో ప్రకటితమవుతాయో, ఇంకా చెప్పబడని వాటిని, ఇప్పుడు తెలుసుకోగోరుతున్నాడు. సమస్త జగత్తుని నియంత్రించి నిర్వహించేవాడిగా శ్రీకృష్ణుడి మహిమలను మరియు ఆయన అత్యున్నత స్థాయిని గురించి వినాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు, ‘నాకు నిశ్చలమైన భక్తి పెంపొందటానికి/ప్రసాదించబడటానికి నీ దివ్య విభూతులను తెలుసుకోగోరుచున్నాను. కానీ, నీ కృప లేకుండా, నీ వ్యక్తిత్త్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము. కాబట్టి, దయచేసి నామీద కృపతో, నిన్ను అర్థంచేసుకొనుటకై, నీ యొక్క మహిమలను తెలియచేయుము.’
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన । భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ।। 18 ।।
18
10
https://www.holy-bhagava…udio/010_018.mp3
విస్తరేణ — విస్తారముగా; ఆత్మనః — నీ యొక్క; యోగం — దివ్య మహిమలు; విభూతిం — విభూతులు (గుణములు/ఐశ్వర్యములు); చ — మరియు; జనార్దన — శ్రీకృష్ణా, జనుల బాగోగులు చూసుకునేవాడా; భూయః — మరలా; కథయ — వివరించుము; తృప్తిః — తృప్తి; హి — ఎందుకంటే; శృణ్వతః — వింటూఉంటే; న అస్తి — ఉండదు; మే — నాకు; అమృతం — అమృతము.
BG 10.18: విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము, ఓ జనార్దనా. నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివితీరదు.
అర్జునుడు ఇక్కడ ‘...అమృతము వంటి నీ మాటలను వింటుంటే,’ అనటానికి బదులుగా ‘....నీ అమృతమును వింటుంటే,’ అన్నాడు. ‘అటువంటి నీ మాటలు’ అన్న భాగాన్ని విడిచిపెట్టాడు. ఇది సాహిత్యంలో 'అతిశయోక్తి' అనే ప్రక్రియ, దీనిలో ఉపమాన వస్తువుని విడిచిపెడతారు. శ్రీ కృష్ణుడిని జనార్దనా అని కూడా సంబోధించాడు, అంటే ‘ఆర్తులైన జనులు ఉపశమనం కోరి వెళ్ళే సహృదయుడు’ అని. భగవంతుని మహిమల్ని వివరించే కథలు, ఆయనను ప్రేమించే వారికి అమృతము వంటివి. అమృతతుల్యమైన శ్రీ కృష్ణుడి మాటలని ఇప్పటివరకు తన చెవులతో త్రాగుతున్నాడు, ఇక ఇప్పుడు , ‘భూయః కథయ’ అంటే ‘ఇంకోసారి...! నీ దివ్యలీలలను వినాలనే నా దాహం ఇంకా తీరలేదు.’ అని అంటూ ఆయన్ను ఉత్సాహపరుస్తున్నాడు. దివ్యామృతము యొక్క స్వభావము ఇది. అది ఒకపక్క తృప్తి పరుస్తూనే ఉంటుంది అదే సమయంలో ఇంకా ఇంకా కావాలనిపింపజేస్తుంది. నైమిశారణ్య ఋషులు, సూత మహాముని నుండి శ్రీమద్భాగవతం వింటున్నప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు: వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే యచ్ఛృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే (1.1.19) ‘శ్రీ కృష్ణుడి భక్తులకు, ఆయన దివ్య లీలలను ఎంత విన్నా తనివితీరదు, విసుగనిపించదు. ఈ లీలామృతం ఎలాంటిదంటే అది అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది.’
శ్రీ భగవానువాచ । హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః । ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ।। 19 ।।
19
10
https://www.holy-bhagava…udio/010_019.mp3
శ్రీ -భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; హంత — సరే; తే — నీకు; కథయిష్యామి — నేను వివరిస్తాను; దివ్యాః — దివ్యమైన; హి — నిజముగా; ఆత్మ-విభూతయః — నా యొక్క దివ్య విభూతులు; ప్రాధాన్యతః — ప్రధానమైన; కురుశ్రేష్ఠ — కురు వంశస్థులలో గొప్పవాఁడు; న, అస్తి — లేదు; అంతః — అంతము; విస్తరస్య — విస్తారమైన మహిమలు; మే — నా యొక్క.
BG 10.19: శ్రీ భగవానుడు పలికెను : ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను, ఓ కురు శ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు.
అమర కోశం (ఎంతో ఆదరణ పొందిన ప్రాచీన సంస్కృత నిఘంటువు) , విభూతి అన్న పదాన్ని ‘విభూతిర్ భూతిర్ ఐశ్వర్యం’, శక్తి మరియు ఐశ్వర్యము (power and wealth), అని నిర్వచించింది. భగవంతుని శక్తులు మరియు ఐశ్వర్యములు అనంతమైనవి. నిజానికి ఆయన గురించి ఉన్నవన్నీ అనంతములే. ఆయనకు అనంతమైన రూపములు ఉన్నవి, అనంతమైన నామములు, అనంతమైన ధామములు, అనంతమైన అవతారములు, అనంతములైన లీలలు, అసంఖ్యాకమైన భక్తులు ఇలా ఎన్నెన్నో. కాబట్టి, వేదములు ఆయనను అనంతుడు అంటాయి. అనంతశ్చాత్మా విశ్వరూపో హ్యకర్తా (శేతాశ్వాతర ఉపనిషత్తు 1.9) ‘భగవంతుడు అనంతుడు మరియు అసంఖ్యాకమైన రూపములలో ఈ విశ్వములో ప్రకటితమౌతాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించేదయినా, ఆయన అకర్త.’ రామచరితమానస్ (రామాయణం) ఇలా పేర్కొంటున్నది: హరి అనంత హరి కథా అనంతా ‘భగవంతుడు అనంతుడు మరియు ఆయన తన అనంతమైన అవతారాలలో చేసే లీలలు కూడా అనంతములు.’ వేద వ్యాస ఋషి మరింత లోతుగా ఇలా పేర్కొన్నాడు: యో వా అనంతస్య గుణాననంతాన్ అనుక్రమిష్యన్ స తు బాల-బుద్ధిః రజాంసి భూమేర్ గణయేత్ కథంచిత్ కాలేన నైవాఖిలశక్తి ధామ్నః (భాగవతం 11.4.2) ‘భగవంతుని మహిమలను లెక్కించగలము అని అనుకునే వారు అల్ప బుద్ధులు. ఈ భూమిపై ఉన్న ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చు కానీ, భగవంతుని యొక్క అనంతమైన మహిమలను గణించలేము.’ కాబట్టి, శ్రీ కృష్ణుడు ఇక్కడ తన విభూతులలోని అతికొద్ది భాగాన్ని మాత్రమే వివరించబోతున్నాను అని అంటున్నాడు.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః । అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ।। 20 ।।
20
10
https://www.holy-bhagava…udio/010_020.mp3
అహం — నేను; ఆత్మా — ఆత్మ; గుడాకేశ — అర్జునా, నిద్రను జయించిన వాడా; సర్వ-భూత — సర్వ ప్రాణుల యొక్క; ఆశయ-స్థితః — హృదయములో కూర్చుని; అహం — నేను; ఆదిః — మొదలు; చ — మరియు; మధ్యం — మధ్యము; చ — మరియు; భూతానాం — సర్వ భూతముల; అంతః — తుది (అంతము); ఏవ — కూడా; చ — మరియు.
BG 10.20: ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము, మరియు అంత్యము.
శ్రీ కృష్ణుడు, తాను జీవుడికి ఏమీ అంత దూరంగా లేను అని ప్రకటిస్తున్నాడు, నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది. వేదములు అంటున్నాయి: య ఆత్మని తిష్ఠతి , ‘భగవంతుడు మన ఆత్మలో యందు స్థితమై ఉన్నాడు.’ అందులో కూర్చుని ఆ ఆత్మకు జీవశక్తి మరియు నిత్యశాశ్వత గుణము ప్రసాదిస్తాడు. ఆయన శక్తిని ఉపసంహరిస్తే, మన ఆత్మ కూడా జడమైపోతుంది మరియు నశించిపోతుంది. ఈ ప్రకారంగా, మనం జీవాత్మలము, మన స్వీయ శక్తి చేత నిత్యులము మరియు చైతన్యవంతులము కాలేదు, పరమ చైతన్య వంతుడు మరియు సనాతనుడు అయిన భగవంతుడు మనలోనే (జీవాత్మ లోనే) ఉండి, తన శక్తిని మనకు ప్రసాదించటం చేత అలా ఉండగలుగుతున్నాము. కాబట్టి శ్రీ కృష్ణుడు సమస్త ప్రాణుల హృదయములో తాను స్థితుడనై ఉన్నాను అని అంటున్నాడు. మన ఆత్మ భగవంతుని శరీరము, ఆయనే మన ఆత్మకి పరమాత్మ. భాగవతం ఇలా పేర్కొంటున్నది: హరిర్హి సాక్షాద్భగవాన్ శరీరిణామాత్మా ఝషాణామివ తోయమీప్సితం (5.18.13) ‘భగవంతుడు సర్వ ప్రాణుల ఆత్మ కు ఆత్మ.’ మరల భాగవతంలో, గోపికలు తమ సొంత బిడ్డలను వదిలి పసివాడైన శ్రీ కృష్ణుడిని చూడటానికి వెళ్ళటం గురించి శుకదేవ పరమహంస చెప్పినప్పుడు, పరీక్షిత్తు, ఇది ఎలా సాధ్యమని అడిగాడు: బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే ఇయాన్ ప్రేమా కథం భవేత్ (10.14.49) ‘ఓ బ్రాహ్మణా, అందరు తల్లులూ తమ సొంత బిడ్డలపట్లనే మమకారంతో ఉంటారు. మరి గోపికలకు, తమ సొంత బిడ్డల పైన కూడా లేకుండా, ఈ యొక్క శ్రీ కృష్ణుడి పట్ల ఇంత గాఢమైన అనురక్తి ఎలా ఏర్పడింది?’ శుకదేవ పరమహంస ఇలా బదులిచ్చాడు: కృష్ణమేనమవేహి త్వమాత్మానమఖిలాత్మనాం (భాగవతం 10.14.55) ‘శ్రీ కృష్ణుడు విశ్వములోని సర్వ ప్రాణులకు పరమాత్మ అని దయచేసి అర్థంచేసుకోండి. మానవ జాతి మేలు కోసం, తన యోగమాయా శక్తి ద్వారా ఒక మనుష్య రూపంలో అవతరించాడు.’ శ్రీ కృష్ణుడు ఇంకా ఏమంటున్నాడంటే, తానే సమస్త జీవ భూతముల మొదలు, మధ్య, తుది (ఆది-మధ్య-అంతము) అని. అవి ఆయన నుండే ఉద్భవించాయి, కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే జీవరాశియంతా ఆయన శక్తి చేతనే సంరక్షించి కొనసాగింపబడుతున్నది, కాబట్టి ఆయనే మధ్యము. మరియు మోక్షము పొందిన వారు ఆయన యొక్క దివ్య ధామమునకు వెళ్లి, ఆయన సన్నిధిలోనే నిత్యశాశ్వతంగా నివసిస్తారు. అందుకే భగవంతుడే అన్ని ప్రాణులకు తుది. వేదములలో ఇవ్వబడిన భగవంతుని యొక్క నిర్వచనాలలో, ఒకటి ఈ క్రింద పేర్కొనబడినది: యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, యత్ప్రయంత్యభిసంవిశంతి (తైత్తిరీయ ఉపనిషత్తు 3.1.1) ‘ఎవని నుండి సర్వ ప్రాణులు ఉద్భవించాయో వాడే భగవంతుడు; ఎవని యందు సర్వ ప్రాణులు ఆధారపడి స్థితమై ఉన్నాయో వాడే భగవంతుడు; ఎవని లోనికి సర్వ ప్రాణులు ఏకమై పోతాయో వాడే భగవంతుడు.’
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ । మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ।। 21 ।।
21
10
https://www.holy-bhagava…udio/010_021.mp3
ఆదిత్యానాం — అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో; అహం — నేను; విష్ణుః — విష్ణు మూర్తి; జ్యోతిశాం — ప్రకాశవంతమైన వస్తువులలో; రవిః — సూర్యుడు; అంశు-మాన్ — తేజోవంతమైన; మరీచిః — మరీచి; మరుతాం — మరుత్తులలో; అస్మి — నేను; నక్షత్రాణాం — నక్షత్రములలో; అహం — నేను; శశీః — చంద్రుడను.
BG 10.21: అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని; ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.
పురాణాల ఆధారంగా మనం తెలుకునేదేమిటంటే కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు — అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా ఆయనకు పన్నెండుగురు దేవతలు జన్మించారు, వీరే - ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వనుడు, పుష, సవిత, త్వష్ట, మరియు వామన అనే వారు. వీరిలో వామనుడు అనే ఆయన విష్ణు మూర్తి యొక్క అవతారము. ఈ విధంగా, ఆదిత్యులలో (అదితి యొక్క పన్నెండుగురు పుత్రులు) విష్ణువుగా (వామన స్వరూపంలో) తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని కృష్ణుడు పేర్కొంటున్నాడు. ప్రకాశవంతమైన వాటిలో సూర్యుడు సర్వోన్నతుడు. రామచరితమానస్ ఇలా పేర్కొన్నది: రాకాపతి షోడస ఉఅహిం తారాగన సముదాఇ సకల గిరిన్హ దవ లాఇఅ బిను రబి రాతి న జాఇ ‘రాత్రి పూట అన్ని దీపాలు, ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి, చంద్రుడు కూడా ఉన్నా - అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించటానికి సరిపోవు. కానీ, సూర్యుడు ఉదయించిన మరుక్షణం రాత్రి చీకటి తొలగిపోతుంది.’ సూర్యుని శక్తి అలాంటిది, అది తన విభూతి అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. తదుపరి ఆయన రాత్రిపూట ఆకాశం గురించి చెప్తున్నాడు. ఒక ప్రఖ్యాత నానుడి ఉంది, ‘వెయ్యి నక్షత్రాల కన్నా ఒక్క చంద్రుడు మేలు’ అని. రాత్రి పూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, తారాగణములలో తానే చంద్రుడను అంటున్నాడు, అదే శ్రీ కృష్ణుడి విభూతిని చక్కగా ప్రకటిస్తుంది. పురాణములలో ఇంకా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, కశ్యపుడు తన రెండవ భార్య అయిన దితి ద్వారా దైత్యులకు (అసురులు) తండ్రి అయ్యాడు. కానీ, దైత్యుల తరువాత కూడా దితి తనకు, ఇంద్రుడి (దేవతల ప్రభువు) కన్నా శక్తిశాలి అయిన ఇంకొక పుత్రుడిని కోరింది. తన బిడ్డని గర్భంలోనే ఒక సంవత్సర కాలం ఉంచుకుంది. అది తెలుసుకున్న ఇంద్రుడు ఒక వజ్రాయుధంతో ఆ పిండమును ఎన్నో ముక్కలుగా చేసాడు, కానీ అది చాలా భ్రూణములగా మారింది. ఇవి మరుత్తులైనాయి, అంటే ఎంతో ప్రయోజనము చేసే ఈ విశ్వంలో ప్రసరించే నలభైతొమ్మిది రకాల వాయువులు. వీటిలో ప్రధానమైనవి అవహము, ప్రవహము, నివహము, పుర్వహము, ఉద్వహము, సంవహము, మరియు పరివహము. వీటిలో ముఖ్యమైన పరివహమునకు ఇంకో పేరు మరీచి అని కూడా ఉంది. వాయువులలో, తన విభూతి, మరీచి రూపంలో వ్యక్తమవుతున్నదని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః । ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ।। 22 ।।
22
10
https://www.holy-bhagava…udio/010_022.mp3
వేదానాం — వేదములలో; సామ-వేదః — సామ వేదము; అస్మి — నేను; దేవానాం — దేవతలలో; అస్మి — నేను; వాసవః — ఇంద్రుడు; ఇంద్రియాణాం — ఇంద్రియములలో; మనః — మనస్సు; చ — మరియు; అస్మి — నేను; భూతానాం — ప్రాణులలో; అస్మి — నేను; చేతనా — చైతన్యమును.
BG 10.22: నేను వేదములలో సామ వేదమును, దేవతలలో ఇంద్రుడను. ఇంద్రియములలో మనస్సును; ప్రాణులలో చైతన్యమును.
నాలుగు వేద విభాగాలు ఉన్నాయి — ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, మరియు అథర్వవేదము. వీటిలో, సామ వేదము అనేది, విశ్వమును నిర్వహించే దేవతలలో ప్రకటితమయ్యేటటువంటి, భగవంతుని యొక్క మహిమలని వివరిస్తుంది. సామ వేదము సంగీత పరంగా అత్యంత మనోహరమైనది మరియు భగవంతుడిని స్తుతించటంలో పాడబడుతుంది. అది అర్థం అయినవారికి చాలా మనోహరంగా ఉంటుంది మరియు వినేవారిలో భక్తిని పెంపొందిస్తుంది. వాసవ అనేది, దేవతల ప్రభువైన ఇంద్రుడికి ఉన్న ఇంకొక పేరు. కీర్తి, శక్తి, మరియు హోదాలో ఆయనకు సరితూగే జీవి లేదు. ఎన్నో జన్మల పుణ్య కార్యముల ఫలముగా ఏదేని జీవాత్మకి ఇంద్ర పదవి ఇవ్వబడుతుంది. ఈ విధంగా, ఇంద్రుడు భగవంతుని యొక్క దేదీప్యమానమైన విభూతికి సూచిక. మనస్సు కూడి ఉంటేనే ఐదు ఇంద్రియములు సరిగ్గా పని చేస్తాయి. ఒకవేళ మనస్సు ఎటోవెళ్ళిపోతే, ఇంద్రియములు సరిగ్గా పనిచేయలేవు. ఉదాహరణకి, చెవులకు ఇతరులు చెప్పేది వినపడుతున్నా, కానీ, వారు మాట్లాడుతున్నప్పుడు మనస్సు ఎటో వెళ్ళిపోతే, వారు చెప్పేది మనకు అవగతం కాదు. కాబట్టి, మనస్సు అనేది ఇంద్రియములకు రారాజు. తన శక్తిని అది నిరూపిస్తుంది అని శ్రీ కృష్ణుడు దాని గురించి చెప్తున్నాడు; మరియు భగవద్గీతలో మున్ముందు, మనస్సు అతి ప్రధానమైన ఆరవ ఇంద్రియము అని పేర్కొంటాడు. (15.7వ శ్లోకం). చైతన్యము అనేది ఆత్మ యొక్క గుణము, అది జడ పదార్థం కంటే వేరైనది. బ్రతికున్న మనిషికి మరియు చనిపోయిన వ్యక్తికి ఉన్న తేడా ఏమిటంటే - బ్రతికున్న వానిలో ఉన్న చైతన్యం ఉంటుంది మరియు చనిపోయిన వానిలో చైతన్యం ఉండదు. ఆత్మ యందు చైతన్యము అనేది భగవంతుని దివ్యమైన శక్తి వలన ఉంటుంది. కాబట్టి, వేదములు ఇలా పేర్కొంటాయి: చేతనశ్చేతనానాం (కఠోపనిషత్తు 2.2.13) ‘చైతన్యవంతమైన వాటిలో చైతన్యము భగవంతుడే.’
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ । వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ।। 23 ।।
23
10
https://www.holy-bhagava…udio/010_023.mp3
రుద్రాణాం — రుద్రులలో; శంకరః — శివుడు (శంకర భగవానుడు); చ — మరియు; అస్మి — నేను; విత్త-ఈశః — ఐశ్వర్య దేవత మరియు దేవతల కోశాధికారి; యక్ష — యక్షులు; రక్షసామ్ — రాక్షసులలో; వసూనాం — వసువులలో; పావకః — అగ్ని; చ — మరియు; అస్మి — నేను; మేరుః — మేరు పర్వతము; శిఖరిణామ్ — పర్వతములలో; అహం — నేను.
BG 10.23: రుద్రులలో నేను శంకరుడను; అసురులలో కుబేరుడను; వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతమును.
శివుని పదకొండు స్వరూపములే రుద్రులు - హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృసకపి, శంకర, కపర్ది, రైవత, మృగవ్యధ, సర్వ, మరియు కపాలి. పురాణాలలో వీరిని వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో పిలిచారు. వీటిలో, శంకరుడు విశ్వములో శివుని మూల స్వరూపము. యక్షులకు (పాక్షిక దేవగణములు) సంపదని ప్రోగుచేసి దాచుకోవటం మహా ఇష్టం. వారి నాయకుడు కుబేరుడు, సంపదకు ప్రభువు మరియు దేవతల కోశాధికారి. ఆయన భగవంతుని విభూతిని ఈ విధంగా రాక్షసులలో ప్రకటిస్తున్నాడు. అష్ట (ఎనిమిది) వసువులు ఉన్నారు — భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, మరియు నక్షత్రములు. ఇవి విశ్వము యొక్క స్థూల నిర్మాణమునకు మూలము. వీటిలో అగ్ని అనేది వేడిమిని మరియు శక్తిని మిగతా వాటికి అందచేస్తుంది. అందుకే శ్రీ కృష్ణుడు అది తన ప్రత్యేకమైన విభూతిగా చెప్తున్నాడు. మేరు అనే పర్వతము స్వర్గాది లోకాల్లో తన యొక్క సహజ ప్రకృతి సంపదకి కీర్తి గడించింది. దానినే అక్షముగా కలిగి ఎన్నో ఖగోళ గ్రహాలు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయని నమ్ముతారు. శ్రీ కృష్ణుడు అందుకే దానిని తన విభూతిగా చెప్తున్నాడు. సంపద అనేది ఒక ధనవంతుడిని ఎలా గొప్పగా చూపిస్తుందో, ఈ మహిమలన్నీ భగవంతుని విభూతులను ప్రకటిస్తున్నాయి.
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ । సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ।। 24 ।।
24
10
https://www.holy-bhagava…udio/010_024.mp3
పురోధసాం — పురోహితులలో; చ — మరియు; ముఖ్యం — ముఖ్యులు; మాం — నన్ను; విద్ధి — తెలుసుకొనుము; పార్థ — అర్జునా, ఓ ప్రిథ పుత్రుడా; బృహస్పతిమ్ — బృహస్పతి; సేనానీనాం — సేనాపతులలో; అహం — నేను; స్కందః — కార్తీకేయుడు; సరసాం — జలాశయాల్లో; అస్మి — నేను; సాగరః — సముద్రము.
BG 10.24: ఓ అర్జునా, పురోహితులలో నేను బృహస్పతిని; సేనాపతులలో నేను కార్తికేయుడను; మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొనుము.
పురోహితులు పూజాది కర్మ కాండలను దేవాలయాల్లో మరియు ఇళ్ళలో చేస్తుంటారు. స్వర్గలోకంలో బృహస్పతి ప్రధాన పురోహితుడు. అందుకే ఆయన పురోహితులలో కెల్లా అతిముఖ్యుడు. అందరు పురోహితులలో యందు తాను బృహస్పతిని అని ఇక్కడ శ్రీ కృష్ణుడు అంటున్నాడు. కానీ, శ్రీమద్భాగవతంలో 11.16.22వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పురోహితుల్లో తాను వశిష్ఠుడను అని అన్నాడు. ఈ రెండు చోట్ల ఆయన భిన్నముగా ఎందుకు చెప్పాడు? ఇది సూచించేదేమిటంటే, మనం ఆ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఆ వస్తువులో ప్రకటితమయ్యే భగవంతుని విభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీ కృష్ణుడు ఉదహరిస్తున్న అన్ని మహిమాన్వితమైన వస్తువు/వ్యక్తులనూ మనం ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. ప్రాధాన్యత వస్తువుకి కాదు, ఆ వస్తువులో ప్రకటితమయ్యే భగవంతుని విభూతికి ఇవ్వాలి. శివుని పుత్రుడైన కార్తికేయుడు, దేవతల సేనాధిపతి, ఆయనకే స్కందుడు అని కూడా పేరు. అందుకే ఆయన సమస్త సేనాపతులకు అధ్యక్షుడు, మరియు భగవంతుని విభూతిని చక్కగా ప్రకటిస్తున్నాడు. అంతేకాక, ప్రవహించని జలాశయాల్లో, తానే గంభీరమైన మహా సముద్రమును అని కూడా శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
మహార్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ । యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ।। 25 ।।
25
10
https://www.holy-bhagava…udio/010_025.mp3
మహా-ఋషీణాం — మహర్షులలో; భృగుః — భృగు మహర్షిని; అహం — నేను; గిరాం — శబ్దములలో (మంత్ర); అస్మి – నేను; ఏకం అక్షరం — ఏకాక్షరమైన 'ఓం' కారమును; యజ్ఞానాం — యజ్ఞములలో; జపయజ్ఞః — భగవన్నామములను భక్తితో నిరంతరం జపించే యజ్ఞము; అస్మి — నేనే; స్థావరాణాం — స్థావరములలో (కదలని వాటిలో); హిమాలయః — హిమాలయములు.
BG 10.25: మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన 'ఓం' కారమును. జపములలో (యజ్ఞములలో) భగవన్నామమును మరలమరల జపించటమే నేను; స్థావరములలో హిమాలయమును నేను;
అన్ని పండ్లు మరియు పూలు ఒకే నేల నుండి పెరిగినా, వాటిలో అత్యంత శ్రేష్ఠమైన వాటిని మాత్రమే ప్రదర్శనకు ఉంచుతారు. అదే విధంగా, ఈ విశ్వములో వ్యక్తమయిన లేదా అవ్యక్తమయిన ప్రతీదీ కూడా భగవంతుని విభూతియే, కానీ వాటిలో ఉన్న ప్రధానమైన వాటిని వేరుగా ఆయన వైభవముగా చూపిస్తారు. స్వర్గాది లోకములలో ఉన్న ఋషులలో భృగు మహర్షి ప్రత్యేకమైన వాడు. ఆయన జ్ఞాన- యశో-భక్తి సంపన్నుడు. విష్ణు మూర్తి తన వక్ష స్థలం మీద ఆయన పాద గుర్తు కలిగి ఉన్నాడు. భృగు మహర్షి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులను పరీక్షించటం అనే, పురాణాలలో చెప్పబడిన ఒక దివ్య లీల పర్యవసానంగా ఇది జరిగింది. శ్రీ కృష్ణుడి విభూతి ఆయన ద్వారా చక్కగా ప్రకటితమవుతున్నది. భగవంతుణ్ణి నిరాకార రూపంలో ఆరాధన చేసేవారు, ‘ఓం’ కారపు ధ్వనిపై ధ్యానం చేస్తుంటారు, ఇది భగవంతుని ఇంకొక విభూతి. శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితమే 7.8వ మరియు 8.13వ శ్లోకాలలో, ‘ఓం’ కారము పవిత్రమైన శబ్దము అని చెప్పి ఉన్నాడు. అది 'అనాహత నాదము' (ఈ జగత్తు మొత్తం వ్యాపించి ఉన్న శబ్ద ప్రకంపన). తరచుగా ‘ఓం’ కారము వేద మంత్రముల ప్రారంభంలో పవిత్రత కోసం ఉచ్చరించబడుతుంది. ఈ యొక్క "ఓం" కారము నుండే గాయత్రీ మంత్రము ప్రకటించబడినది అని అంటారు, మరియు గాయత్రీ మంత్రము నుండే వేదములు ప్రకటితమయినాయి. హిమాలయములు ఉత్తర భారత దేశంలో ఉన్న పర్వత శ్రేణులు. యుగాల నుండి అవి కోట్లమంది భక్తులలో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించాయి. వాటి వాతావరణం, పర్యావరణం మరియు ఏకాంతము, ఆధ్యాత్మిక పురోగతి కోసం సాధనకు ఏంతో అనుకూలముగా ఉంటాయి. అందుకే, ఏంతో మంది మహర్షులు హిమాలయములలో వారి సూక్ష్మ శరీరాలలో, వారి స్వీయ పురోగతి కోసం మరియు మానవ జాతి సంక్షేమం కోసం తపస్సు ఆచరిస్తూ నివసిస్తుంటారు. అందుకే, ప్రపంచంలో ఉన్న ఎన్నెన్నో పర్వత శ్రేణులలో కంటే హిమాలయములే భగవంతుని యొక్క వైభవాన్ని చక్కగా ప్రదర్శిస్తున్నాయి. యజ్ఞము అంటే మనలను ఆ భగవంతునికి అంకితం చేసుకునే ప్రక్రియ. అన్ని యజ్ఞములకంటే సరళమైనది భగవంతుని పవిత్ర నామములను జపించటమే. దీనినే జప యజ్ఞము అంటారు; అంటే నిరంతరం భక్తితో భగవంతుని దివ్య నామాలను పదే పదే అంటూ ఉండటమే. కర్మకాండ విధాన యజ్ఞములు ఆచరించటానికి, ఏంతో నిష్ఠగా పాటించవలసిన ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ, జప యజ్ఞములో, ఎలాంటి నియమాలు లేవు. దాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు, మరియు అది మిగతా రకాల యజ్ఞముల కన్నా పవిత్రమైనది. ఈ ప్రస్తుత కలి యుగంలో, భగవంతుని నామ జపం చేయమని మరింత దృఢంగా చెప్పబడింది. కలియుగ కేవల నామ ఆధారా, సుమిరి సుమిరి నర ఉతరహిఁ పారా (రామచరితమానస్) ‘కలి యుగంలో భగవంతుడి నామ జపము మరియు స్మరణము భవ సాగరాన్ని దాటటానికి ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనము.’
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః । గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ।। 26 ।।
26
10
https://www.holy-bhagava…udio/010_026.mp3
అశ్వత్థః — రావి చెట్టు; సర్వ-వృక్షాణాం — సమస్త వృక్షములలో; దేవ-ఋషీణాం — దేవర్షులలో; చ — మరియు; నారదః — నారదుడు; గంధర్వాణాం — గంధర్వులలో; చిత్రరథః — చిత్రరథుడు; సిద్ధానాం — అందరు సిద్దులలో; కపిలః మునిః — కపిల ముని.
BG 10.26: వృక్షములలో నేను రావి చెట్టును; దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను, సిద్దులలో నేను కపిల మునిని.
రావి చెట్టు క్రింద కూర్చునే వారికి అది చల్లని ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. అది ఊడల ద్వారా విస్తరిస్తుంది కాబట్టి అది పెద్దదిగా ఉండి మరియు చల్లటి నీడను ఎక్కువ వైశాల్యంలో అందిస్తుంది. బుద్ధుడు ఒక రావి చెట్టు క్రిందనే ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు. వేద వ్యాసుడు, వాల్మీకి, ధ్రువుడు, మరియు ప్రహ్లాదుడు వంటి ఎంతో మంది మహాత్ములకు దేవర్షి నారదుడు గురువు. ఆయన ఎల్లప్పుడూ భగవంతుని వైభవాలను కీర్తిస్తూ, దైవ కార్యములను ముల్లోకాలలో చేస్తుంటాడు. కావాలనే కలహాలను సృష్టిస్తాడనే ఖ్యాతి కలవాడు; కొన్ని సార్లు ఆయనను జనులు గొడవలు సృష్టిస్తాడని అపార్థం చేసుకుంటారు. కానీ, కీర్తి గడించినవారి అంతఃకరణ శుద్ధికోసమే, వారిచుట్టూ కలహములు సృష్టిస్తాడు, అది వారి ఆత్మ-పరిశీలన మరియు పరిశుద్ధికే దారితీస్తుంది. గంధర్వ లోకంలో అద్భుతంగా పాడే వారు ఉంటారు వారిలో ఉత్తమ గాయకుడు చిత్రరథుడు. సిద్ధులు అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించిన యోగులు. వీరిలో కపిల ముని సాంఖ్య శాస్త్ర తత్త్వమును తెలియపరిచాడు మరియు భక్తి యోగ విశిష్టతని ఉపదేశించాడు. (ఇది శ్రీమద్భాగవతం 3వ స్కందములో వివరించబడినది). ఆయన ఒక భగవత్ అవతారము, అందుకే తన వైభవాన్ని ప్రకటిస్తున్నాడని ఆయనను శ్రీ కృష్ణుడు ఇక్కడ ఉదహరించాడు.
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ । ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ।। 27 ।।
27
10
https://www.holy-bhagava…udio/010_027.mp3
ఉచ్చైఃశ్రవసమ్ — ఉచ్చైఃశ్రవము; అశ్వానాం — అశ్వములలో (గుఱ్ఱములలో); విద్ధి — తెలుసుకొనుము; మాం — నన్ను; అమృత-ఉద్భవమ్ — అమృత సముద్రము చిలకటం నుండి ఉద్భవించినదైన; ఐరావతం — ఐరావతము; గజ-ఇంద్రాణాం — భద్రగజములలో; నరాణాం — మనుష్యులలో; చ — మరియు; నరాధిపమ్ — రాజు.
BG 10.27: గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన, ఉచ్చైఃశ్రవమును. భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును.
తన వైభవాన్ని/మహిమని తెలియపరచటానికి ప్రతి విభాగములో అత్యద్భుతమైన వాటిని పేరుపేరునా చెప్పటం కొనసాగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఉచ్చైఃశ్రవసము అనేది దేవలోకాల్లో ఉన్న రెక్కల గుఱ్ఱము, అది దేవరాజైన ఇంద్రుడికి చెందినది. అది తెల్లని రంగులో ఉంటుంది మరియు విశ్వములో అత్యంత వేగవంతమైన గుఱ్ఱము. అది దేవతల మరియు అసురుల సముద్ర మధన లీలలో ఉద్భవించినది. ఐరావతము అనేది ఇంద్రుని వాహనముగా ఉండే ఒక తెల్లని ఏనుగు. దానినే అర్ధ-మాతంగము అని కూడా అంటారు, అంటే ‘మేఘాలలో ఉండే ఏనుగు’.
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ । ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ।। 28 ।।
28
10
https://www.holy-bhagava…udio/010_028.mp3
ఆయుధానాం — ఆయుధములలో; అహం — నేను; వజ్రం — వజ్రాయుధమును; ధేనూనామ్ — ఆవులలో; అస్మి — నేను; కామ-ధుక్ — కామధేనువు; ప్రజనః — సంతానోత్పత్తికి కారణములలో; చ — మరియు; అస్మి — నేను; కందర్పః — మన్మథుడను (కామ దేవుడు); సర్పానాం — సర్పములలో; అస్మి — నేను; వాసుకిః — వాసుకి.
BG 10.28: ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును. సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడను (మన్మథుడు) నేనే; సర్పములలో వాసుకిని నేను.
పురాణములలో చెప్పబడిన మహాముని దధీచి చేసిన త్యాగము చరిత్రలో సాటిలేనిది. ఒకసారి వృత్తాసురుడు అనే రాక్షసుని చేత దేవ రాజైన ఇంద్రుడు స్వర్గలోకము నుండి తరిమివేయబడ్డాడు. అప్పటివరకు ఉన్న ఏ ఆయుధము చేత కూడా సంహరింపబడని వరం ఆ రాక్షసుడికి ఉంది. ఎటూ పాలుపోక, ఇంద్రుడు శివుడిని సహాయం అర్థించాడు, శివుడు ఆయనను విష్ణుమూర్తి దగ్గరకు తీసుకెళ్ళాడు. దధీచి ముని బొమికలతో తయారుచేయబడే వజ్రాయుధము మాత్రమే వృత్తాసురున్ని చంపగలదు అని విష్ణుమూర్తి ఇంద్రునికి తెలియచెప్పాడు. ఇంద్రుడు అప్పుడు, వజ్రాయుధం తయారీకి ఆయన బొమికలను ఉపయోగించుకోవటం కోసం దధీచి మునిని తన ప్రాణ త్యాగము చేయవలసినదని ప్రార్థించాడు. దధీచి ఆ విన్నపాన్ని మన్నించాడు కానీ, మొదట అన్ని నదుల వద్దకు తీర్థయాత్ర వెళ్ళదలచాడు. దధీచి ముని తన కోరిక నెరవేర్చుకోటానికి, ఇంద్రుడు, సమస్త పుణ్య నదుల నీటిని నైమిశారణ్యమునకు వెంటనే తెచ్చాడు. అనంతరం దధీచి యోగ ప్రక్రియ ద్వారా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన బొమికల నుండి తయారు చేసిన వజ్రాయుధము ఉపయోగించి వృత్తాసురిడిని ఓడించాడు. దీనితో ఇంద్రుడు స్వర్గాధిపతి పదవిని తిరిగి పొందాడు. శ్రీ కృష్ణుడు కావాలనే ఇక్కడ, విష్ణు మూర్తి దగ్గర ఎల్లప్పుడూ ఉండే చక్రము, గద కంటే కూడా, ఆ వజ్రాయుధమునే భగవంతుని వైభవమునకు (విభూతికి) సూచికగా ఉదహరిస్తున్నాడు. మైథున క్రియ అనేది, సత్-సంతానం కోసం మాత్రమే చేసినప్పుడు అది అపవిత్రమైనది కాదు అని కూడా ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. సంతానోత్పత్తి ద్వారా మానవ జాతిని కొనసాగించటానికి అవసరమైన స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ శక్తికి కామదేవుడు (మన్మథుడు) కారణము. ఈ లైంగిక వాంఛకు మూలము భగవంతుని యందే ఉంది, మరియు దీనిని ఇంద్రియ లౌల్యం కోసం దుర్వినియోగం చేయకూడదు, కేవలం మంచి సంతానం పొందటం కోసమే ఉపయోగించుకోవాలి. 7.11వ శ్లోకంలో కూడా, శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం కాని లైంగిక వాంఛ, తానే అని శ్రీ కృష్ణుడు ప్రకటించి ఉన్నాడు.