sloka
stringlengths
77
449
verse
int64
1
78
chapter
int64
1
18
audio
stringlengths
59
63
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
అర్జున ఉవాచ । స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ । స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ।। 54 ।।
54
2
https://www.holy-bhagava…udio/002_054.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; స్థిత-ప్రజ్ఞస్య — స్థిరమైన బుద్ధి కలవాడు; కా — ఏమి; భాషా — మాట్లాడును; సమాధి-స్థస్య — భగవత్ ధ్యాసలో ఉండి; కేశవ — శ్రీ కృష్ణ, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా; స్థిత-ధీః — జ్ఞాని; కిం — ఏమిటి; ప్రభాషేత — మాట్లాడును; కిం — ఎలా; ఆసీత — కూర్చుండును; వ్రజేత — నడుచున; కిం — ఎలా?
BG 2.54: అర్జునుడు పలికెను : ఓ కేశవా, భగవత్ ధ్యాస యందే స్థిరముగా ఉన్న (స్థితప్రజ్ఞుని) వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? ఎలా కూర్చొనును? ఎలా నడుచును?
'స్థిత-ప్రజ్ఞ' (స్థిర బుద్ధి కలవాడు), 'సమాధి-స్థ' (ధ్యానంలోనే నిమగ్నమైనవాడు) అన్న బిరుదునామాలు జ్ఞానోదయమైన వారికి వర్తిస్తాయి. శ్రీ కృష్ణుడి నుండి నిజమైన యోగ స్థితి (సమాధి) గురించి విన్న తరువాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్నని అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోగోరుతున్నాడు. అంతేకాక, అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి, ఎలా వ్యక్తమగునో అని అడుగుతున్నాడు. ఈ శ్లోకంతో మొదలిడి అర్జునుడు శ్రీ కృష్ణుడిని పదహారు ప్రశ్నలు అడుగుతాడు. జవాబుగా, శ్రీ కృష్ణుడు కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం, తపస్సు, మరియు ధ్యానం వంటి వాటి యొక్క నిగూఢ రహస్యములను తెలియపరుస్తాడు. ఆ పదహారు ప్రశ్నలు ఇవే: భగవత్ ధ్యాస నందే స్థిరముగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణములెవ్వి? (శ్లోకం 2.54) సకామ కర్మల కన్నా జ్ఞానమే శ్రేష్ఠమన్నప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? (శ్లోకం 3.1) ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఎవరో చేపించినట్టుగా, పాపిష్టి పనులను చేయటానికి ఎందుకు ప్రేరేపింపబడతాడు? (శ్లోకం 3.36) వివస్వనుడి తరువాత చాలా కాలానికి పుట్టావు కదా నీవు, మరి అతనికి ప్రారంభంలో ఈ శాస్త్రం చెప్పావంటే దాన్ని నేనెలా అర్థం చేసుకోవాలి? (శ్లోకం 4.4) కర్మ సన్యాస మార్గాన్ని ప్రశంసించావు, మళ్లీ భక్తితో పని చేయటాన్ని కూడా ప్రశంసించావు. దయచేసి ఈ రెంటిలో ఏది శ్రేష్ఠమయినదో నిర్ణయాత్మకంగా చెప్పుము? (శ్లోకం 5.1) ఓ కృష్ణా, మనస్సు అత్యంత చంచలమైనది, కల్లోలమైనది, దృఢమైనది, మరియు మొండిది. దీనిని నిగ్రహించుట వీచేగాలిని నిరోధించటం కన్నా కష్టమని అనిపిస్తున్నది. (శ్లోకం 6.34) ఈ మార్గంలో విశ్వాసంతో బయలుదేరినా, నిగ్రహించబడని కోరికలతో మనస్సు భగవంతుని నుండి మరలిపోయి, ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణత చేరుకోలేక, విజయం సాధించ లేకపోయిన యోగి పరిస్థితి ఏమిటి? (శ్లోకం 6.37) బ్రహ్మన్ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి ? అధిభూత అంటే ఏమిటి ? ఆధిదైవం అంటే ఎవరు? ఆధియజ్ఞ అంటే ఎవరు, తను ఈ శరీరంలో ఎలా ఉంటాడు? ఓ, మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా, దృఢ సంకల్పంకల వారు మరణ సమయంలో నీతో ఎలా ఏకమవ్వచ్చు? (శ్లోకం 8.1-2) సమస్త లోకాల్లో వ్యాపించి ఉండగలిగే, నీ యొక్క దివ్యమైన ఐశ్వర్యము గురించి తెలియ పరుచుము. (శ్లోకం 10.16) నీ విశ్వ రూపాన్ని చూడ గోరుతున్నాను, ఓ పరమ పురుషా. (శ్లోకం 11.3) సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే, అలాంటి నీ గురించి తెలుసుకోగోరుతున్నాను, నీ తత్త్వం, కార్యములు నన్ను సమ్మోహితున్ని చేస్తున్నాయి. (శ్లోకం 11.31) నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించేవారిలో ఎవరు యోగంలో ఎక్కువ శ్రేష్ఠులు? (శ్లోకం 12.1) ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్షేత్రం అంటే ఏమిటి మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానం యొక్క స్వభావం ఏమిటి మరియు జ్ఞాన విషయం ఏమిటి? (శ్లోకం 13.1) త్రిగుణములకు అతీతమైన వారి లక్షణాలు ఏమిటి, ఓ ప్రభూ? వారు ఎలా ప్రవర్తిస్తారు? వారు త్రిగుణముల బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలిగారు? (శ్లోకం 14.21) వేదాల్లో చెప్పిన ఆదేశాలను ఖాతరు చేయకుండా (కానీ) భక్తితో పూజించే వారి పరిస్థితి ఏమిటి? (శ్లోకం 17.1) సన్యాసం అంటే ఏమిటి, అది త్యాగం (కర్మ ఫలాలని త్యజించటం) కంటే ఎలా వేరైనది? (శ్లోకం 18.1)
శ్రీ భగవానువాచ । ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ । ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ।। 55 ।।
55
2
https://www.holy-bhagava…udio/002_055.mp3
శ్రీ భగవాన్ ఉవాచ — పరమేశ్వరుడైన భగవంతుడు ఇలా పలికెను; ప్రజహాతి — త్యజించి (విడిచి పెట్టి); యదా — ఎప్పుడైతే; కామాన్ — స్వార్థ కోరికలు; సర్వాన్ — అన్నీ; పార్థ — అర్జునుడా, ప్రిథ తనయుడా; మనః-గతాన్ — మనస్సు యొక్క; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — మాత్రమే; ఆత్మనా — పరిశుద్ధ మనస్సుతో; తుష్టః — సంతుష్టుడై; స్థిత-ప్రజ్ఞః — స్థితప్రజ్ఞుడు; తదా — అప్పుడు; ఉచ్యతే — అందురు.
BG 2.55: భగవానుడు పలికెను: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.
శ్రీ కృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు జవాబు చెప్పటం ఇక్కడ నుండి మొదలుపెట్టి, ఈ అధ్యాయం చివరి వరకు చెప్తాడు. ఒక రాయి, భూమి వైపు గురుత్వాకర్షణ శక్తిచే గుంజబడినట్టు, ప్రతి 'అంశము' సహజంగానే తన పూర్ణ భాగం వైపు ఆకర్షింపబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశము. అంటే, జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క ఒక భాగం, అందుకే అది సహజం గానే ఆనందం కోసం అభిలాషిస్తుంది. అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించటానికి కృషి చేసినప్పుడు, దానిని ‘దివ్య ప్రేమ’ అని అంటారు. కానీ, తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరిచి, తనను తాను శరీరమే అనుకుని, జగత్తు నుండి శారీరక ఆనందాన్నిఆస్వాదించటానికి ప్రయత్నించినప్పుడు దానిని ‘కామము’ అంటారు.ఈ ప్రపంచం 'మృగ తృష్ణా' అని ఆగమ గ్రంథాలలో చెప్పబడింది, అంటే 'జింకలకు అగుపించే ఎండ మావి' వంటిది అని అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్య కిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి మృగమునకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదనుకుని దాహం తీర్చుకోవడానికి పరుగుపెడుతుంది. కానీ అది దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతుంటుంది. దాని అల్పబుద్ధి తాను ఓ భ్రాంతితో పరుగిడుతున్నట్టు తెలుసుకోలేదు. ఆ దీనమైన జింక, లేని నీళ్ళ కోసం వెంటపడుతూ చివరికి నీరసంతో ఆ ఎడారి ఇసుకపై మరణిస్తుంది. ఈ విధంగానే, భౌతిక శక్తి అయిన 'మాయ' కూడా ఆనందం అనే భ్రాంతిని కలుగచేస్తుంది, మనం ఆ లేని ఆనందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవటానికి పరుగులు పెడుతున్నాము. కానీ, మనం ఎంత ప్రయత్నించినా, ఆనందం మన నుండి దూరమయిపోతున్నది. గరుడ పురాణం ఇలా పేర్కొంటున్నది:చక్రధరోఽపి సురత్వం సురత్వలాభే సకలసురపతిత్వంభవ్తిరుం సురపతిరూర్ధ్వగతిత్వం తథాపి ననివర్తతే తృష్ణా(2.12.14) ‘ఒక రాజు, ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు; చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు; ఒక దేవత, స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు; ఇంద్రుడు, సృష్టికర్త బ్రహ్మ దేవుడు అవ్వాలని కోరుకుంటాడు. అయినా, భౌతిక భోగముల కొరకు ఉన్న తృష్ణ, తృప్తితీరదు.’కానీ, మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా తిప్పివేయటం నేర్చుకుని మరియు ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి, తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ, స్థిత ప్రజ్ఞుడు అవుతాడు. కఠోపనిషత్తు మరింత ముందుకెళ్ళి, ఆశ/కోరికలను త్యజించినవాడు భగవంతునిలా అవుతాడు అని పేర్కొంటున్నది:యదా సర్వే ప్రముచ్యంతే కామా యేఽస్య హృది శ్రితఃఅథ మర్త్యోఽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే (2.3.14)‘హృదయం నుండి అన్ని స్వార్థ కోరికలు తొలగించిన పిదప, భౌతిక సంకెళ్ళు వేయబడ్డ జీవాత్మ, జన్మమరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది మరియు సద్గుణములలో దేవుని వలె అవుతుంది.’ స్థిత-ప్రజ్ఞుడు అంటే, అన్ని స్వార్థ కోరికలను, ఇంద్రియ లౌల్యములను త్యజించి, ఆత్మ యందే సంతుష్టి నొందినవాడు, అని శ్రీ కృష్ణుడు ఈ పై శ్లోకం లో వ్యక్తీకరించాడు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః । వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। 56 ।।
56
2
https://www.holy-bhagava…udio/002_056.mp3
దుఃఖేషు — దుఃఖముల నడుమ; అనుద్విగ్న-మనాః — మనస్సులో ఉద్వేగమునకు లోను కాని వాడు; సుఖేషు — సుఖములలో; విగత స్పృహః — పొంగిపోని వాడు; వీత — లేకుండా; రాగ — మమకారం; భయ — భయము; క్రోధః — కోపము; స్థిత-ధీః — జ్ఞానోదయం అయినవాడు; మునిః — ముని; ఉచ్యతే — అనబడును.
BG 2.56: దుఃఖముల నడుమ కలతచెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము, మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, స్థిత-ప్రజ్ఞులైన మునుల లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు : 1) వీత రాగ - సుఖములకోసం ప్రాకులాడుట విడిచిపెడతారు, 2) వీత భయ - వారు భయ రహితులు, 3) వీత క్రోధ - వారికి కోపము ఉండదు. జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన, కామము, క్రోధం, లోభం, ఈర్ష్య, మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలని రానివ్వడు. అప్పుడే మనస్సు సర్వోత్కృష్ట అస్తిత్వం పై చింతన మరియు భగవత్ ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించటానికి అనుమతినిస్తే, భగవత్ ధ్యాస ఆగిపోయి, ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది. చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది. ప్రస్తుత బాధ కన్నా, పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇకముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే మనస్సు ఈ రెంటినీ వదిలి వేసి, ప్రస్తుత వేదనని తట్టుకొవటానికి ప్రయత్నిస్తే, బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. చరిత్రలో, బౌద్ధ సన్యాసులు, ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకొచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు. ఇదే విధంగా, బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు, అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది మరియు మళ్ళీ మనస్సు భగవత్ ధ్యాస నుండి పక్కకు పోతుంది. కాబట్టి, సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల పట్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసినవాడు స్థిత ప్రజ్ఞుడైన ముని. ఇంకా, అటువంటి యోగి, భయము, కోపము వంటి భావోద్వేగాలకి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు. ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది.
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ । నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 57 ।।
57
2
https://www.holy-bhagava…udio/002_057.mp3
యః — ఎవరైతే; సర్వత్ర — అన్ని పరిస్థితులలో; అనభిస్నేహః — మమకారం/ఆసక్తి లేకుండా; తత్-తత్ — వాటి వాటి; ప్రాప్య — పొంది; శుభ — మంచి; అశుభమ్ — చెడు; న, అభినందంతి — హర్షింపడు; న, ద్వేష్టి — ద్వేషింపడు; తస్య — అతని; ప్రజ్ఞా — జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమైనది.
BG 2.57: ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని.
రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ప్రఖ్యాత బ్రిటిష్ కవి, 'స్థిత ప్రజ్ఞత' గూర్చి ఉన్న ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని తన ఈ 'If' అనే ప్రసిద్ధమైన కావ్యంలో పొందుపరిచాడు. ఆ కవిత నుండి కొన్ని పంక్తులు ఇవిగో:If you can dream—and not make dreams your master;If you can think—and not make thoughts your aim,If you can meet with Triumph and DisasterAnd treat those two impostors just the same…If neither foes nor loving friends can hurt you,If all men count with you, but none too much:If you can fill the unforgiving minuteWith sixty seconds’ worth of distance run,Yours is the Earth and everything that’s in it,And—which is more—you’ll be a Man, my son! ఈ పద్యం యొక్క ప్రజాదరణ ద్వారా, శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ జ్ఞానోదయ స్థితిని చేరుకోవాలనే సహజమైన తపన జనులకు ఎంతగా ఉందో తెలుస్తోంది. శ్రీ కృష్ణుడు విశదీకరించిన జ్ఞానోదయ స్థితినే ఒక ఆంగ్ల కవి ఎలా చెప్పాడనే ఆశ్చర్యం మనకు కలుగవచ్చు. నిజానికి జ్ఞానోదయ వాంఛ అనేది ఆత్మ యొక్క అంతర్గత స్వభావం. అందుకే, ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో, ప్రతి ఒక్కరూ, తెలిసినా తెలవకపోయినా దానిని కోరుకొంటారు. శ్రీ కృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా, దానిని ఇక్కడ వర్ణిస్తున్నాడు.
యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః । ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 58 ।।
58
2
https://www.holy-bhagava…udio/002_058.mp3
యదా — ఎప్పుడైతే; సంహరతే — ఉపసంహరించి; చ — మరియు; అయం — ఇది; కూర్మః — తాబేలు; అంగాని — అంగములు; ఇవ — ఆ విధంగా; సర్వశః — పూర్తిగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియ వస్తు-విషయముల నుండి; తస్య — అతని; ప్రజ్ఞా — దివ్య జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమవును.
BG 2.58: తాబేలు దాని అంగములను తన పైచిప్ప లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.
ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు, విషయములను ఇచ్చి ఇంద్రియముల ఆర్తిని తీర్చటానికి ప్రయత్నించటం అనేది నేతిని పోసి మంటను ఆపటానికి ప్రయత్నించటం వంటిది. క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా, రెండింతల ఉదృతితో అది మళ్ళీ పైకి లేస్తుంది. కాబట్టి, కోరికలు అనేవి అవి తీర్చబడినప్పుడు సమసిపోవు; అవి మరింత ప్రబలంగా తిరిగొస్తాయి, అని శ్రీమద్భాగవతం పేర్కొంటున్నది:న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి ।హవిషా కృష్ణ-వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే (9.19.14)‘ఎలాగైతే నేతిని సమర్పించటం వల్ల, అగ్ని ఆరిపోకపోవటమే కాక, ఇంకా ఎక్కువ ఎగసి పడుతుందో, ఇంద్రియ వాంఛలను తీర్చటం ద్వారా ఆ కోరికలు చల్లారిపోవు.’ఈ కోరికలను మన ఒంటి మీద కలిగే దురదతో పోల్చవచ్చు. దురద చాలా అసౌకర్యంగా ఉండి, గోక్కోవాలనే తీవ్ర వాంఛను కలుగ చేస్తుంది. కానీ, గోకటం సమస్యని పరిష్కరించదు. కొద్ది సమయం పాటు ఉపశమనం ఉన్నా, మళ్లీ ఇంకా ఎక్కువ ఉధృతితో తిరిగి వస్తుంది. దీనికి బదులుగా, దురదను కొంచెం సేపు సహించగలిగితే, దాని పోటు తరిగిపోయి, క్రమంగా క్షీణించిపోతుంది. దురద నుండి విముక్తి కావటానికి ఉన్న రహస్యం ఇదే. ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది. మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేకానేక వాంఛలను కోరుతాయి, మనము వాటిని నెఱవేర్చుతూ ఉన్నంతవరకూ నిజమైన ఆనందం, ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది. కానీ, మనం ఆ కోరికలన్నిటినీ త్యజించటం నేర్చుకుని, భగవంతుని యందే ఆనందాన్ని వెతుక్కుంటే, మనస్సు ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి.కాబట్టి, జ్ఞానోదయమైన ముని, వివేకముతో మనస్సు ఇంద్రియములను జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది. ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను, తలను లోపలికి తీస్కొని తనను తాను సంరక్షించుకుంటుంది. ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత, తన అంగములను, తలను బయటకు తీసి ముందుకు సాగిపోతుంది. జ్ఞానోదయమయిన జీవాత్మ, మనస్సు, ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి, పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తుంది.
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః । రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59 ।।
59
2
https://www.holy-bhagava…udio/002_059.mp3
విషయాః — ఇంద్రియ విషయములు; వినివర్తంతే — నిగ్రహించు; నిరాహారస్య — స్వీయ సంయమం పాటించి; దేహినః — జీవాత్మకి; రస-వర్జం — రుచి తరిగిపోవుట; రసః — రుచి; అపి — కూడా; అస్య — అతనికి; పరం — పరమాత్మ; దృష్ట్వా — తెలుసుకున్న పిదప ; నివర్తతే — తరిగి పోవును.
BG 2.59: సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా కానీ, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును.
ఉపవాస సమయంలో, ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదే విధంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, భోగ విషయ/వస్తువులపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి ఎందుకంటే కోరికల బీజం మనస్సులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు, ఆయా కోరికలు తిరిగి వస్తాయి.ఈ కోరికల మూల బీజం ఏమిటి? జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అణు-అంశము, అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం, ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించేవరకూ జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్పశక్తిచే ఇంద్రియములను నియంత్రించవచ్చు, కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు. కానీ, జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై, దివ్య ఆనందాన్ని పొందినప్పుడు, తాను అనంతమైన జన్మలనుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:రసోవై సః రసమ్ హ్యేవాయం లబ్ధ్వా ఽనందీ భవతి (2.7.2)‘భగవంతుడు పూర్ణ-ఆనందమయుడు. జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు, ఆ ఆనందంలో తనివి తీరుతుంది.’ ఆ తర్వాత సహజంగానే నిమ్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవత్ భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది.ఈ విధంగా భగవద్గీత, కేవలం కోరికలను అణచివేయమని చెప్పలేదు, నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే అందమైన మార్గాన్ని ఉపదేశించింది. రామకృష్ణ పరమహంస మాహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పాడు , ‘భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపై ప్రేమ; మరియు నిమ్నస్థాయివి వాటంతట అవే వీగిపోతాయి’ (‘Devotion is love for the highest; and the lowest shall fall away by itself.’)
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః । ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60 ।।
60
2
https://www.holy-bhagava…udio/002_060.mp3
యతతః — స్వీయ-నియంత్రణ అభ్యాసం చేసేటప్పుడు; హి — దానికి; అపి — కూడా; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; పురుషస్య — పురుషుని యొక్క; విపశ్చితః — బుద్ధి విచక్షణ కలవారు; ఇంద్రియాణి — ఇంద్రియములు; ప్రమాథీని — అల్లకల్లోలమైన; హరంతి — లాక్కోనిపోవును; ప్రసభం — బలవంతంగా; మనః — మనస్సుని.
BG 2.60: ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ-నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.
ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి, తెంపరితనం మెండుగా ఉన్నవి, కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు, కామ క్రోధాదులతో కూడిన, భోగములను కోరే తమ ఇంద్రియములను మచ్చికచేసుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి, అలా చెయ్యకపోతే అవి గొప్ప సాధకులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి, పట్టాలు తప్పేలా చేయగలవు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి, శ్రీమద్భాగవతంలో, ఒక చక్కని కథ ఉంది: (9వ స్కంధము, 6వ అధ్యాయం) పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు, దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. 'సౌభరి సంహిత' అనే ఒక గ్రంధం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూసాడు. ఆ దృశ్యం అతని మనో-ఇంద్రియములను చలింపచేసింది, మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధనని పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో, అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి యాభై మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై యువరాణులలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు. మాంధాత మహారాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు, ‘ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే!’ అని. ఆ రాజుకి, సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు, కాబట్టి ఈయన కోరికని నిరాకరిస్తే, ముని తనను శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది. ఎటూతోచని పరిస్థితిలో, రాజు ఇలా అన్నాడు, ‘ఓ పుణ్యపురుషా! మీరు అడిగినదానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను, వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే, ఆమె భార్యగా మీదవుతుంది’ అని. రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు, అని. రాజుగారి ఉద్దేశ్యం అర్థంచేసుకున్న సౌభరి, తాను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం, తన యోగ శక్తిని ఉపయోగించుకుని అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళి కనపడినప్పుడు, ఆ యాభై మంది రాకుమార్తెలు అందరూ అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుఁడైయున్న ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇప్పుడు, యాభై మంది తోబుట్టువులు ఒకే భర్తని పంచుకోవటం చేత, తమలో తాము తగవు పడతారేమో అని ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగశక్తిని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగిస్తూ, అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినవి. సౌభరికి ప్రతి భార్యతో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా సంతానం కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది. ఒక రోజు, సౌభరి తన అసలు స్పృహలోకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు: ‘అహో ఇమం పశ్యత మే వినాశం’ (భాగవతం 9.6.50) ‘ఓ మానవులారా! మీలో ఎవరైతే, భౌతిక విషయముల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్లారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి - నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడెక్కడ ఉన్నాను. నేను యాభై శరీరాలు సృష్టించుకున్నాను, మరియు యాభై స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా, ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు, సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని, ఆ దిశలో వెళ్ళవద్దు అని హెచ్చరిస్తున్నాను.’
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః । వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 61 ।।
61
2
https://www.holy-bhagava…udio/002_061.mp3
తాని — వాటిని; సర్వాణి — అన్నీ; సంయమ్య — లోబరచుకొని; యుక్త — ఐక్యమై; ఆసీత — కూర్చొని; మత్-పరః — నా యందు (శ్రీ కృష్ణుడు); వశే — వశమునందు; హి — నిజముగా; యస్య — ఎవరి యొక్క; ఇంద్రియాణి — ఇంద్రియములు; తస్య — వారి; ప్రజ్ఞా — పరిపూర్ణ జ్ఞానము; ప్రతిష్ఠితా — స్థిరంగా ఉండును.
BG 2.61: ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.
ఈ శ్లోకంలో 'యుక్తః' (కూడియున్న) అన్న పదం 'భక్తితో లీనమైన' అనే అర్థంతో ఉన్నది, మరియు ‘మత్ పరః’ అంటే 'శ్రీ కృష్ణుడి పట్ల’. 'ఆసీత' అన్న పదాన్ని ఉపమానముగా 'నెలకొని లేదా స్థితమైఉండి' అని అర్థం చేసుకోవచ్చు. చంచలమైన మనస్సు, ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వాటిని సరియైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియచేస్తున్నాడు, అదే భగవత్ భక్తిలో నిమగ్నమవుట.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే । సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।
62
2
https://www.holy-bhagava…udio/002_062.mp3
ధ్యాయతః — చింతన చేయుట; విషయాన్ — ఇంద్రియ విషయములు; పుంసః — వ్యక్తికి; సంగః — సంగము (మమకారాసక్తి); తేషు — వాటి పట్ల (ఇంద్రియ విషయములు); ఉపజాయతే — కలుగును; సంగాత్ — సంగము (మమకారాసక్తి) నుండి; సంజాయతే — ఉత్పన్నమగును; కామః — కోరికలు; కామాత్ — కోరికల నుండి; క్రోధః — కోపము; అభిజాయతే — ఉద్భవించును.
BG 2.62: ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది.
క్రోధం, లోభం, కామము, మొదలగునవి వైదిక వాఙ్మయంలో మానసిక రోగాలు అని పరిగణించబడ్డాయి. రామాయణం ఇలా పేర్కొంటున్నది : మానస్ రోగ కచ్చుక మై గాయేహహిఁ సబ కేఁ లఖి బిరలేన్హ పాయే ఈ శ్లోకం ఏం సూచిస్తోందంటే, మనకందరికీ శారీరక వ్యాధులు అంటే ఏమిటో తెలుసు —ఏదో ఒక్క శారీరక జబ్బుకి కూడా మనిషిని రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది— కానీ మనము ప్రతి నిత్యం చాలా మానసిక రోగాలతో సతమతమౌతునట్టు మనకు తెలియట్లేదు. మనము కామ, క్రోధ, లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించక పోవటం వలన మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. మనస్తత్త్వశాస్త్రము అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం, అది ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం సూచిస్తుంది. కానీ, పాశ్చాత్య మనస్తత్త్వశాస్త్రము సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండూ కూడా అసంపూర్తిగా ఉండి, మనస్సు యొక్క వాస్తవ తత్త్వవివరణకి, గుండుగుత్తంగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది.ఈ శ్లోకంలో ఇంకా తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు మనస్సు యొక్క పనితీరుమీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పించాడు. మనం ఏదేని ఒక వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే, మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఉదాహరణకి, ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు, అమాయకంగా అందరూ కలిసి పని చేసుకుంటున్నారనుకుందాం. ఒక రోజు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి యందు ఏదో గమనించి ఇలా అనుకుంటాడు, ‘ఆమె నాదవుతే ఏంతో బాగుంటుంది’ అని. ఈ ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన, అతని మనస్సుకి ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతో, తను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, తన మనస్సు నిరంతరం ఆమె వైపే వెళ్తుండటం వలన చదవలేక పోతున్నానని చెప్తాడు. మేమందరం తరగతిలో ఆ అమ్మాయితో కలసి పని చేస్తున్నాము, మాకెవరికీ ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని, అతని స్నేహితులు వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్రని చెడగొట్టుకొని, ఇంకా తన చదువును పాడు చేసుకుంటున్నాడు? ఎందుకంటే, అతను, ఆ అమ్మాయిలో సుఖం ఉంది అని పదేపదే అనుకోవటం వలన అతని మనస్సుకు ఆమెతో మమకారానుబంధం ఏర్పడింది.ఇప్పుడు ఆ అనురాగం, దానిమటుకే అయితే అంత హానికరమేమీ కాదు అని అనిపిస్తుంది. కానీ, ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది. ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది. ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్టు తాగితే ఉండే ఆహ్లాదము మీదికే మనస్సులో తలపులు పదేపదే తిరుగుతుంటుంది, అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి. ఈ ప్రకారంగా, మమకారం అనేది కోరికలకు దారి తీస్తుంది.ఒకసారి కోరిక పుడితే, అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది - లోభము (అత్యాశ) మరియు క్రోధము. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. ‘జిమి ప్రతిలాభ లోభ అధికాఈ’ (రామచరితమానస్) ‘కోరికలను తీర్చుకుంటే అది అత్యాశకు దారి తీస్తుంది.’ కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము:యత్పృథివ్యామ్ వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియఃన దుహ్యంతి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే(భాగవతం 9.19.13) ‘ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు, మరియు భోగ వస్తువులు లభించినా సరే, వ్యక్తి తృష్ణ చల్లారదు. కాబట్టి, దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకొని, తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి.’మరోపక్క, కోరికలు తీర్చుకోవటంలో ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపాన్ని కలుగ చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. అది కోరికల నెరవేర్పుకు ఆటంకం కలగటం నుండి వస్తుంది; కోరిక మమకారబంధం నుండి వస్తుంది; మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదేపదే చింతన చేయటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు-విషయముల మీద పదేపదే చింతన చేయటం అనే సాధారణ క్రియ, లోభము, క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారి తీస్తుంది. తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, క్రోధము యొక్క పరిణామాలను విశదీకరిస్తాడు.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః । స్మృతిభ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।
63
2
https://www.holy-bhagava…udio/002_063.mp3
క్రోధాత్ — క్రోధము నుండి; భవతి — ఉత్పన్నమగును; సమ్మోహః — విచక్షణ కోల్పోవుట; సమ్మోహాత్ — విచక్షణా రాహిత్యం నుండి; స్మృతి — జ్ఞాపక శక్తి; విభ్రమః — భ్రమ; స్మృతి-భ్రంశాత్ — స్మృతి భ్రమ వలన; బుద్ధి-నాశః — బుద్ధి నశించును; బుద్ధి-నాశాత్ — బుద్ధి నష్టం వలన; ప్రణశ్యతి — వ్యక్తి పతనమగును.
BG 2.63: కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.
ఉదయం పూట పొగమంచు సూర్య కాంతిని కప్పివేసి తగ్గించినట్టు, కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేసి, దానికి తరువాత చింతిస్తారు, ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి, భావోద్వేగాలచే కప్పి వేయబడుతుంది. జనులు అంటారు, ‘అతను నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమైంది?’ అని. నిజానికి ఏమైందంటే, క్రోధం వలన విచక్షణా జ్ఞానం లోపించింది అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది. బుద్ధి మబ్బుకమ్మినప్పుడు అది స్మృతి (జ్ఞాపక శక్తి) భ్రంశను కలుగ చేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి, భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాడు. అక్కడి నుండి ఇక అధో-పతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగచేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి, అదే నశించినప్పుడు, వ్యక్తి సర్వ నాశనమైపోతాడు. ఈ విధంగా, దైవత్వం నుండి అధార్మికతకు పతనం అయ్యే ప్రక్రియ, ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది.
రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ । ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ।। 64 ।।
64
2
https://www.holy-bhagava…udio/002_064.mp3
రాగ — మమకారము/అనురక్తి; ద్వేష — ద్వేషము; వియుక్తైః — లేకుండా; తు — కానీ; విషయాన్ — ఇంద్రియ విషయములు; ఇంద్రియైః — ఇంద్రియములచే; చరన్ — వాడుతున్ననూ; ఆత్మ-వశ్యైః — మనస్సుని అదుపు చేస్తూ; విధేయ-ఆత్మా — మనస్సుని నియంత్రణ చేయువానికి; ప్రసాదం — భగవత్ కృప; అధిగచ్ఛతి — లభించును.
BG 2.64: ఇంద్రియ వస్తు-విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.
వినాశనానికి దారి తీసే అధోపతనమంతా ఇంద్రియ వస్తు-విషయములలో ఆనందం ఉన్నదని చింతించటంతో ఆరంభమవుతుంది. ఇప్పుడు, దాహం వేయటం శరీరానికి ఎంత సహజమో, ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది. ‘నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను’ అని అనుకోవటం అసంభవం, ఎందుకంటే అది ఆత్మకి అసహజము. అప్పుడు ఉన్న సులభమైన పరిష్కారం ఏమిటంటే, ఆనందాన్ని సరియైన దిశలో అంటే భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపు పదేపదే మననం చేస్తే, మనం ఆ భగవంతునితో అనురక్తి, మమకారబంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు; పైగా అది శుద్ధి చేస్తుంది. పరమాత్మ పూర్తి పరిశుద్ధమైన వాడు, మనం మనస్సుని పరమాత్మతో అనుసంధానం చేస్తే మన మనస్సు కూడా పవిత్రమౌతుంది. ఈ విధంగా, శ్రీ కృష్ణుడు మనలను కోరికలను, మమకారాన్ని త్యజించమన్నప్పుడు, అతను భౌతిక/ప్రాపంచిక మమకారాన్ని, కోరికలను మాత్రమే త్యజించమన్నట్టు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక (ఈశ్వరసంబంధమైన) మమకారం, కోరికలు త్యజించకూడదు, నిజానికి అవి మెచ్చదగినవి. వాటిని అలవర్చుకోవటం, పెంచుకోవటం అంతఃకరణ శుద్ధి కోసం అవసరం. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే, అంతఃకరణ అంత శుద్ధి అవుతుంది. నిర్గుణ, నిరాకర అద్వైత బ్రహ్మం యొక్క ఉపాసనని ప్రతిపాదించే జ్ఞానులు, అన్ని మమకార-బంధాలను త్యజించమని చెప్పినప్పుడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. కానీ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు, ‘ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో వారి మనస్సుని నాయందే ఉంచుతారో, వారు మూడు ప్రకృతి గుణములకు అతీతులై, పరబ్రహ్మ స్థాయిని చేరుకుంటారు.’ (భగవద్గీత 14.26). శ్రీకృష్ణుడు పదేపదే అర్జునుడిని తన మనస్సుని భగవంతుని యందే నిలుపమని ఇక ముందు శ్లోకాలలో (శ్లోకం 8.7, 8.14, 9.22, 9.34, 10.10, 11.54, 12.8, 18.55, 18.58, మరియు 18.65 మొదలగునవి ) విజ్ఞప్తి చేయుచున్నాడు. రాగ ద్వేషాలు ఒకే నాణానికి ఉన్న రెండు పక్కలు. ద్వేషం అంటే వేరేఏమిటో కాదు, అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధంలో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదేపదే ఎలా జ్ఞప్తికి వస్తుందో, అదే విధంగా ద్వేషంలో ఆ యొక్క ద్వేషింపబడే వస్తు/విషయం పదేపదే గుర్తుకు వస్తుంది. కాబట్టి, అనురాగము, ద్వేషము రెండూ కూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగ చేస్తాయి-అవి దాన్ని మైల పరిచి ప్రకృతిలో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి. మనస్సు రాగ-ద్వేషములకు అతీతంగా ఉండి, అది భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు, వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆయొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత, మనస్సుకు ఆయా వస్తువులను వాడుతున్నా, ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అనురక్తి ఉండదు. ఈ ప్రకారంగా, మనందరి లాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా, మరియు చూస్తున్నా, స్థిత ప్రజ్ఞుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటాడు.
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే । ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ।। 65 ।।
65
2
https://www.holy-bhagava…udio/002_065.mp3
ప్రసాదే — భగవత్ కృపతో; సర్వ — అన్నీ; దుఃఖానాం — దుఃఖములూ; హానిః — వినాశనం; అస్య — అతని; ఉపజాయతే — వచ్చును; ప్రసన్న-చేతసః — ప్రశాంత మైన చిత్తంతో; హి — నిజముగా; ఆశు — త్వరగానే; బుద్ధిః — బుద్ధి; పర్యవతిష్ఠతే — స్థిరముగా నిలుచును.
BG 2.65: భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలిగిపోయే పరమ శాంతి లభిస్తుంది, మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రము గానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది.
కృప (అనుగ్రహం) అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోనికి వరద లాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి. తన కృప ద్వారా, సత్-చిత్-ఆనంద స్వరూపుడైన భగవంతుడు, తన దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం మరియు జ్ఞానంలో ఓలలాడిస్తుంది. భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో, ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి అన్నీ దుఃఖాలకు అతీతుడై, అతని మనస్సు శాంతినొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో, భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలం అని, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం అని, బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది. దీనికి పూర్వం, వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ధి దీనిని ఒప్పుకుంది, కానీ ఇప్పుడు, పరమ శాంతి యొక్క మరియు దివ్య ఆనందపు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. దీనితో ఎటువంటి సందేహానికీ తావు లేకుండా బుద్ధి భగవంతుని యందే స్థిరముగా నిలుస్తుంది.
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా । న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ।। 66 ।।
66
2
https://www.holy-bhagava…udio/002_066.mp3
న-అస్తి — ఉండదు; బుద్ధిః — బుద్ధి; అయుక్తస్య — ఐక్యము కాని; న — కాదు; చ — మరియు; అయుక్తస్య — ఐక్యము కాని; భావనా — ఆలోచనలో; న — ఉండదు; చ — మరియు; అభావయతః — ఐక్యమవని వారు; శాంతిః — శాంతి; అశాంతస్య — అశాంతితో ఉన్నవారికి; కుతః — ఎక్కడ; సుఖం — సుఖము.
BG 2.66: కానీ, మనస్సు-ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి, స్థిరమైన బుద్ధి కానీ, నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు; మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు?
ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన సారాంశాన్ని, ఈ శ్లోకం మొదట వ్యతిరేకంగా చెప్పి, తదుపరి అది తప్పని సూచించటం ద్వారా, బలపరుస్తున్నది. ఆగ్లంలో చెప్పాలంటే, ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు ‘Know God; know peace.’ (భగవంతుడిని తెలుసుకో; శాంతిని పొందు) అన్నాడు, ఇప్పుడు ‘No God; no peace.’ (భగవంతుడు లేకపోతే శాంతి లేదు) అంటున్నాడు. మనస్సుని, ఇంద్రియములను నియంత్రణ చేయటం నేర్చుకోని వాడు భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా, నిమ్న స్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు, అలాంటి వ్యక్తి, పుష్పం లోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్టుగా, ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు.రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతంభాస్వానుద్వేష్యతి హసిష్యతి పంకజశ్రీఃఏవం విచింతయతి కోశగతే ద్విరేఫేహా హంత హంత నళినీం గజ ఉజ్జహార (సూక్తి సుధాకరం)ఈ ప్రఖ్యాత సంస్కృత శ్లోకం ఒక తేనెటీగ కథను చెపుతుంది. ఒక తేనెటీగ ఓ తామర పూవుపై, దాని మకరందాన్ని గ్రోలుతూ, కూర్చొని ఉంది. సూర్యుడు అస్తమించే కొలదీ, ఆ పూవు రెక్కలు మూసుకోసాగాయి. కానీ, ఆ తేనెటీగ తన ఇంద్రియ సుఖాలను అనుభవించటంలో ఎంత ఆసక్తితో ఉందంటే దానికి ఎగిరిపోబుద్ధికాలేదు. అది ‘ఇంకా పువ్వు మూసుకుపోవటానికి సమయం ఉంది. ఇంకొంచెం మకరందం ఆస్వాదించనీ’ అని అనుకుంది. అదే విధంగా, మరణానికి ఖచ్చితమైన సూచికగా ముసలితనం వచ్చినా, మనం ప్రాపంచిక భోగాలను అనుభవించటంలోనే నిమగ్నమై ఉంటాము.ఈలోగా, చీకటి అయింది, తామర పూవు పూర్తిగా మూసుకుపోయింది, అందులో ఆ తేనెటీగ చిక్కుకుపోయింది. అది ఇలా, ‘పోనీలే! ఈ రాత్రికి ఈ నాకు ఇష్టమైన పువ్వులోనే ఉంటాను, రేప్పొద్దున్న పూరేకులు విచ్చుకున్నప్పుడు, నేను ఎగిరిపోతాను’ అనుకుంది. ‘కాష్ట భేదో నిపుణోపి సంగృహీ కుణ్థితో భవతి పద్మ విభేదే”, “ఒక తేనెటీగకి చెక్కకొయ్య తొలిచే శక్తి ఉంటుంది. కానీ, చూడండి, ఇంద్రియ విషయములపై ఉన్న మమకారం చూడండి, చెక్కని కూడా తొలిచే సామర్థ్యం ఉన్న తేనెటీగ, ఈ సుకుమారమైన తామర రేకులలో చిక్కుకుపోయింది.’ కాసేపట్లో, ఒక ఏనుగు వచ్చి తామరను కాండం నుండి తెంపి దాన్ని మింగేసింది. తేనెటీగ ఆ తామరపువ్వుతో సహా కలిసి ఆ ఏనుగు కడుపులోకి వెళ్ళిపోయింది. తేనెటీగ అనుకుంది, ‘నా ప్రియమైన తామర ఎటో పోతోంది, దానితో పాటే పోవటం నాకు సంతోషమే’ అని. కాసేపటి తరువాత అది చనిపోయింది.ఇదే విధంగా, మనం మానవులం కూడా ఇంద్రియములను తృప్తి పరచటం లోనే నిమగ్నమై ఉండి, భగవంతుని భక్తిలో పాల్గొనమని సాధువులు చెప్పిన సందేశాన్నిపట్టించుకోము. చిట్టచివరికి, మృత్యువు రూపంలో కాలమే మనలను కబళిస్తుంది. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో, వారిని మాయ తన మూడు ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది, అని ఇక్కడ శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భౌతిక వాంఛలు ఎక్జిమా దురద వంటివి, ఎంత తీర్చుకుంటే అంత తీక్ష్ణమవుతాయి. ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో ఎలా ఉండగలము?
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే । తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ।। 67 ।।
67
2
https://www.holy-bhagava…udio/002_067.mp3
ఇంద్రియాణాం — ఇంద్రియముల యొక్క; హి — నిజముగా; చరతాం — తిరగటం; యత్ — ఏదేని; మనః — మనస్సు; అనువిధీయతే — ఎల్లపుడూ నిమగ్నమై ఉండునో; తత్ — అది; అస్య — వాని; హరతి — హరించును; ప్రజ్ఞాం — బుద్ధిని; వాయుః — వీచేగాలి; నావం — నావ; ఇవ — ఎలాగైతే; అంభసి — నీటిలో.
BG 2.67: ఎలాగైతే బలమైన వీచేగాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.
కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది - భగవంతుడు మన ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారుచేసాడు. ‘పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూః ’ (2.1.1). కాబట్టి, అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువుల పట్ల ఆకర్షితమౌతాయి, మరియు వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమయినా, దానికి మనస్సుని తప్పు త్రోవ పట్టించే శక్తి ఉంది.కురంగ మాతంగ పతంగ భృంగమీనాఃహతాః పంచభిరేవ పంచఏకః ప్రమాదీ స కథం న హన్యతేయః సేవతే పంచభి రేవ పంచ (సూక్తి సుధాకరం) ‘జింకలు మధురమైన స్వరములకు ఆకర్షితమవుతాయి. వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి, వాటిని సంహరిస్తాడు. తేనెటీగలకు సుగంధంపై మమకారం; అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు, పుష్పము మూసుకొనిపోయి, అవి దానిలో చిక్కుకుపోతాయి. చేపలు ఆహారంపై ఉన్న మక్కువ వలన బేస్తవారి ఎరని మింగే ప్రయత్నంలో దొరికిపోతాయి. పురుగులు దీపం వెలుగుకి ఆకర్షితమవుతాయి; అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి. ఏనుగు యొక్క బలహీనత దాని స్పర్శ సుఖం. వేటగాడు దీనిని ఆసరాచేసుకుని ఆడ ఏనుగుని ఎర లాగా వాడి, మగ ఏనుగుని గుంతలోనికి వచ్చేటట్టు చేస్తాడు. ఆడ ఏనుగుని స్పర్శించటం కోసం గుంతలోనికి వెళ్ళిన మగ ఏనుగు ఇక బయటికి రాలేదు, మరియు అది వేటగానిచే సంహరింపబడుతుంది. ఈ ప్రాణులన్ని, ఏదో ఒక ఇంద్రియం వలన, తమ మృత్యువు వైపు లాగబడుతాయి. మరి ఇక అన్ని ఇంద్రియ భోగాలను అనుభవించే మనుష్యుడి గతి ఏమౌను?’ ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, మనస్సుని తప్పు ద్రోవ పట్టించే ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు.
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః । ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 68 ।।
68
2
https://www.holy-bhagava…udio/002_068.mp3
తస్మాత్ — కాబట్టి; యస్య — ఎవనిదైతే; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; నిగృహీతాని — నిగ్రహింపబడినవో; సర్వశః — సంపూర్ణముగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియ విషయముల నుండి; తస్య — వానికి; ప్రజ్ఞా — ఆధ్యాత్మిక జ్ఞానము; ప్రతిష్ఠితాః — స్థిరముగా ఉండును.
BG 2.68: కాబట్టి, ఓ అర్జునా, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియవిషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును.
జ్ఞానోదయమైన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు, పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని నియంత్రిస్తారు, మరియు ఆ మనస్సు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు. కానీ, భౌతిక మైన స్థితిలో దీనికి విరుద్ధంగా అవుతుంది: ఇంద్రియములు మనస్సుని తమ దిశగా గుంజుతాయి; మనస్సు బుద్ధిని వశపరచుకొంటుంది; బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది. ఈ విధంగా, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే, ఇంద్రియములు నిగ్రహింపబడుతాయి; ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో, బుద్ధి దివ్య జ్ఞాన పథం నుండి ప్రక్కకి తొలగదు.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ । యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।। 69 ।।
69
2
https://www.holy-bhagava…udio/002_069.mp3
యా — ఏదైతే; నిశా — రాత్రి; సర్వ-భూతానాం — అన్ని ప్రాణులకు; తస్యాం — దాని యందు; జాగర్తి — మేల్కొని ఉండు; సంయమీ — ఆత్మ నియంత్రణ/సంయమం కల; యస్యాం — దేనిలో అయితే; జాగ్రతి — మేల్కొని ఉండు; భూతాని — ప్రాణులు; సా — అది ; నిశా — రాత్రి; పశ్యతః — చూచును; మునేః — ముని.
BG 2.69: అన్నీ ప్రాణులూ దేన్నయితే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్నీ ప్రాణులకూ ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.
శ్రీ కృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ప్రయోగించాడు. జనులు తరచుగా ఈ శ్లోక పదాలని ఉన్నదున్నట్లుగా తీసుకొని, తాత్పర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకానొక కాలంలో 'ఖడే శ్రీ బాబా' (నిల్చునే ఉండే యోగి), అనే ఆయన ఉండేవాడు. ఆయన శిష్యులు, ఆయన ఒక గొప్ప ముని అని చెప్పేవారు. అతను ముప్పై-ఐదు సంవత్సరములు నిద్ర పోలేదు! తన గదిలో బాహుమూలాలలో వేలాడే తాడు ఆధారంగా నిలబడే ఉండేవాడు. నిటారుగా నిలబడే ఉండటానికి తాడుని సహాయంగా వాడేవాడు. ఇలాంటి హానికరమైన నిష్ఠని ఆచరించటానికి ప్రేరణ ఏమిటని అడిగినప్పుడు, ఈ భగవత్ గీత శ్లోకాన్ని ఉదహరించేవాడు. ‘అన్ని ప్రాణులు రాత్రిగా చూసేదానిని, జ్ఞాని పగలుగా చూస్తాడు.’ అని. దీనిని అభ్యాసం చేయటానికి, రాత్రి పూట నిద్ర పోవటం మానేసాడు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు! అంత సేపు నిలబడే ఉండటం వలన, అతని పాదాలు, పిక్కలు వాచిపోయినాయి; అలా నిలబడే ఉండటం తప్ప ఇంకా ఏమీ చేయలేక పోయేవాడు. శ్రీ కృష్ణుడి మాటలకు నిజమైన అర్థం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. లౌకిక దృక్పథం లోనే ఉండేవారు భౌతిక వస్తు, విషయముల భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయమనుకుంటారు అంటే ‘పగలు’, మరియు ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి అంటే ‘రాత్రి’ అనుకుంటారు. మరో పక్క, దివ్య జ్ఞానంతో కూడిన వివేకవంతులు, ఇంద్రియ భోగాలని, ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు, కాబట్టి వాటిని ‘రాత్రి’ (చీకటి) గా పరిగణిస్తారు. ఇంద్రియ వస్తు/విషయముల నుండి దూరంగా ఉండటమే ఆత్మ ఉద్ధరణకి అవసరం అని భావించి దానిని ‘పగలు’ (వెలుగు) గా పరిగణిస్తారు. ఈ అర్థంలో పదాలను వాడటం ద్వారా, శ్రీ కృష్ణుడు, యోగులకు ఏదైతే రాత్రి అయిందో అది ప్రాపంచిక మనస్తత్వ జనులకు పగలు; ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తుందో అది యోగులకు రాత్రి - అని అంటున్నాడు.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ।। 70 ।।
70
2
https://www.holy-bhagava…udio/002_070.mp3
ఆపూర్యమాణమ్ — అన్నీ దిశలనుండీ నిండి; అచల-ప్రతిష్ఠం — కలవరపడని; సముద్రం — సముద్రము; ఆపః — నీరు; ప్రవిశంతి — వచ్చినా; యద్వత్ — ఎలాగో; తద్వత్ — అలాగే; కామాః — కోరికలు; యం — ఎవరికైతే; ప్రవిశంతి — వచ్చునో; సర్వే — అన్ని; సః — ఆ వ్యక్తి; శాంతిమ్ — శాంతి; ఆప్నోతి — పొందును; న — కాదు; కామ-కామీ — కోరికలను సంతృప్తి పరుచుకునేందుకు కృషి చేసేవాడు.
BG 2.70: ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపర్చుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.
ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్నా, సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే విలక్షణమైన సమర్థత ఉంది. ప్రపచంలోని అన్ని నదులు సముద్రాలలోనికి వచ్చి పోర్లిపోతుంటాయి, కాని సముద్రం మాత్రం పొంగదు, తరగదు. శ్రీ కృష్ణుడు 'ఆపూర్యమాణమ్' (అన్ని దిశల నుండి నిండిన) అన్న పదాన్ని వాడాడు, అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు. అదే విధంగా, జ్ఞానోదయమైన ముని, శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా, లేదా అవేమీ లేకపోయినా సరే, ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు. కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు.
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః । నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 71 ।।
71
2
https://www.holy-bhagava…udio/002_071.mp3
విహాయ — త్యజించి; కామాన్ — ప్రాపంచిక కోరికలు; యః — ఎవరైతే; సర్వాన్ — అన్నీ; పుమాన్ — వ్యక్తి; చరతి — ఉండునో; నిఃస్పృహః — అత్యాశ లేకుండా; నిర్మమః — నేను, నాది అన్న భావన లేకుండా; నిరహంకారః — అహంకారము లేకుండా; సః — అతను; శాంతిం — నిజమైన శాంతి; అధిగచ్ఛతి — పొందును.
BG 2.71: ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, మరియు అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.
ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతని భంగం చేసే వాటిని వివరించి, వాటిని త్యజించమని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు.భౌతిక/ప్రాపంచిక వాంఛలు: మనము ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే, ఆ తరుణమే, లోభము, క్రోధముల ఉచ్చులోకి వెళ్తాము. ఎలాగైనా మనము చిక్కుకు పోయినట్టే. కాబట్టి అంతర్గత ప్రశాంతతకి దారి, కోరికలను తీర్చుకోవటంలో లేదు, వాటిని నిర్మూలించుకోవటంలో ఉంది.అత్యాశ/దురాశ/లోభము: అసలుకి, భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవటమే. అంతేకాక, అదొక అంతులేని పరుగు. అభివృద్ధిచెందిన దేశాలలో చాలా కొద్ది మందికి మాత్రమే తిండికి, బట్టలకు లోటు ఉంది, అయినా వారు అశాంతితో ఉంటారు; ఇది ఎందుకంటే వారిలో తృష్ణ/అత్యాశ ఇంకా తీరలేదు. ఈ విధంగా, సంతృప్తి అనే సంపత్తి కలిగినవారే గొప్ప ఐశ్వర్యవంతులు.అహం/అహంకారము: మనుష్యుల మధ్య వచ్చే చాల మటుకు పొట్లాటలు ఈ ‘అహం’ వల్లనే జనిస్తాయి. ‘వాట్ దే డోంట్ టీచ్ యు ఎట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్’ (What They Don’t Teach You At Harvard Business School) అనే పుస్తకం రాసిన మార్క్ హెచ్ మకోర్మాక్ (Mark H McCormack) అనే రచయిత ఇలా అన్నాడు : ‘చాలా వరకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ , (సంస్థలలో ఉన్నతస్థాయి అధికారులు), రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార బుడగలు.’ గణాంకాలు పరిశీలిస్తే, చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణం, వారికి పనిలో నైపుణ్యం లేక కాదు, వ్యక్తుల మధ్య సమస్యల వలన. అహంకారాన్ని పెంచి పోషించు కోకుండా, దానిని త్యజించటంలోనే ప్రశాంతతకి మార్గముంది.స్వామిత్వం/నాది అనే భావన: ‘నాది’ అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది, ఎందుకంటే ఈ భూగోళం అంతా భగవంతునిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లి పొతాము. మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకుంటాము?
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి । స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ।। 72 ।।
72
2
https://www.holy-bhagava…udio/002_072.mp3
ఏషా — ఈ విధమైన; బ్రాహ్మీ స్థితిః — భగవత్ ప్రాప్తి నొందిన దశ; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; న — కాదు; ఏనాం — ఇది; ప్రాప్య — పొందిన తరువాత; విముహ్యతి — భ్రమకు లోనుకాడు; స్థిత్వా — స్థిరముగా ఉండి; అస్యాం — దీనిలో; అంత-కాలే — మరణ సమయంలో; అపి — కూడా; బ్రహ్మ-నిర్వాణం — మాయ నుండి విముక్తి; ఋచ్ఛతి — పొందును.
BG 2.72: ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.
'బ్రహ్మన్' అంటే దేవుఁడు, మరియు 'బ్రాహ్మీ స్థితి' అంటే భగవత్-ప్రాప్తి నొందిన స్థితి. జీవాత్మ అంతఃకరణ శుద్ది (మనస్సు, బుద్ధిని కలిపి ఒక్కోసారి అంతఃకరణ అని అంటారు) సాధించిన పిదప, 2.64వ శ్లోకంలో చెప్పబడినట్టు, భగవంతుడు తన దివ్య కృపని ప్రసాదిస్తాడు. ఆయన కృపచే, దివ్య జ్ఞానాన్ని, దివ్య ఆనందాన్ని మరియు దివ్య ప్రేమని ఆ జీవాత్మకి ప్రసాదిస్తాడు. ఇవన్నీ, భగవత్ ప్రాప్తి సమయంలో భగవంతునిచే ప్రసాదించబడే దివ్యమైన శక్తులు.అదేసమయంలో, జీవాత్మను మాయా బంధనం నుండి దేవుడు విడిపిస్తాడు. 'సంచిత కర్మలు' (అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మ రాశి) నశిస్తాయి. 'అవిద్య', అంటే, భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మలలో నుండి లోపలున్న అజ్ఞానం, పోగొట్టబడుతుంది. భౌతిక ప్రకృతి ‘త్రి-గుణము’ ల యొక్క ప్రభావం అంతరించి పోతుంది. భౌతిక అస్తిత్వంలో ఉన్న త్రి-దోషములు ముగుస్తాయి. పంచ-క్లేశములు, అంటే ప్రాపంచిక బుద్ధి యొక్క ఐదు దోషాలు నశిస్తాయి. పంచ-కోశములు భస్మమైతాయి. ఆ సమయం నుండీ, జీవాత్మ శాశ్వతంగా మాయా బంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది.ఎప్పుడైతే జీవాత్మ ఈ భగవత్ ప్రాప్తి దశ సాధిస్తుందో, అది 'జీవన్ ముక్త', అనబడుతుంది, అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తి సాధించినట్టు. తరువాత మరణ సమయంలో, ముక్త జీవాత్మ అంతిమంగా తన భౌతిక శరీరాన్ని త్యజించి భగవంతుని పరమ పదాన్ని చేరుకుంటుంది. ఋగ్వేదం ఇలా పేర్కొంటున్నది.తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః (1.22.20)‘ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తరువాత, అది ఎల్లప్పుడూ భగవంతునితో కూడి ఉంటుంది. ఆ తరువాత, అజ్ఞానపు మాయ జీవాత్మను ఎన్నటికీ వశము చేసుకోలేదు.’ మాయ నుండి శాశ్వతమైన ముక్తి కలిగిన స్థితిని 'నిర్వాణం', 'మోక్షం' అని అంటారు. ఫలితంగా, ముక్తి అనేది భగవత్ ప్రాప్తి ద్వారా సహజంగానే వచ్చే పరిణామం.
అర్జున ఉవాచ । జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన । తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ।। 1 ।। వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే । తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ।। 2 ।।
1
3
https://www.holy-bhagava…/003_001-002.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; జ్యాయసీ — ఉన్నతమైనది; చేత్ — ఒకవేళ; కర్మణః — సకామ కర్మల కంటే; తే — నీకు; మతా — అనిపిస్తే; బుద్ధిః — బుద్ధి; జనార్దన — జనుల బాగోగులు చూసుకునేవాడా, కృష్ణా; తత్ — అప్పుడు; కిం — ఎందుకు; కర్మణి — పనులు; ఘోరే — ఘోరమైన; మామ్ — నన్ను; నియోజయసి — చేయమంటున్నావు; కేశవ — కృష్ణ, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా; వ్యామిశ్రేణ ఇవ — నీ యొక్క అనేకార్థక/అస్పష్టమైన; వాక్యేన — మాటలతో; బుద్ధిం — బుద్ధి; మోహయసి — భ్రమకు లోనగుచున్నది; ఇవ — ఆ విధంగా; మే — నా యొక్క; తత్ — కాబట్టి; ఏకం — ఒకటే; వద — దయచేసి చెప్పుము; నిశ్చిత్య — నిశ్చయముగా; యేన — దేనివలన; శ్రేయః — అత్యున్నత శ్రేయస్సు; అహం — నేను; ఆప్నుయాం — పొందవచ్చు.
BG 3.1-2: అర్జునుడు ఇలా పలికెను : ఓ జనార్దనా, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమైనదయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము.
మొదటి అధ్యాయం అర్జునుడి దుఃఖము, శోక-విచారము ఉప్పొంగే పరిస్థితిని కలిగించి, శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వటానికి ఒక కారణం సృష్టించింది. రెండవ అధ్యాయంలో, మొదట, పరమాత్మ నిత్య శాశ్వతమైన ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు. తరువాత అర్జునుడికి తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి, తన విధిని నిర్వర్తించటం ద్వారా కీర్తిని, ఉత్తమ లోకాలని పొందవచ్చని చెప్పాడు. తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని అర్జునుడిని ప్రేరేపించిన పిదప శ్రీ కృష్ణుడు ఒక ఉన్నతమైన తత్త్వాన్ని తెలియచేసాడు — అదే కర్మ యోగ శాస్త్రం — అర్జునుడిని కర్మ ఫల త్యాగం చేయమన్నాడు. ఈ పద్ధతిలో, బంధనం సృష్టించే కర్మలు, బంధ నాశనం చేసే కర్మలుగా మారతాయి. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని ఆయన 'బుద్ధి యోగము' అన్నాడు. అంటే, అతని ఉద్దేశ్యం ఏమిటంటే, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా అచంచలమైనదిగా చేసుకున్న స్థిర బుద్ధి ద్వారా, మనస్సుని, ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. కర్మలను త్యజించమని చెప్పలేదు, కానీ, ఆ కర్మల (చేసే పనుల) నుండి వచ్చే ఫలాలపై ఆసక్తిని త్యజించమన్నాడు. అర్జునుడు శ్రీ కృష్ణుడు చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు, కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమమైనదయినప్పుడు, తను ఈ భయంకరమైన యుద్ధం చేయటమనే కర్తవ్యాన్ని ఎందుకు చేయాలి అనుకున్నాడు. అందుకే ఇలా అన్నాడు, ‘విరుద్ధమైన విషయాలు చెప్పటం ద్వారా నా బుద్ధిని అయోమయానికి గురి చేస్తున్నావు. నీవు కరుణామయుడవని నాకు తెలుసు, నన్ను అయోమయానికి గురి చేయడం నీ ఉద్దేశం కాదు, కావున నా సందేహాన్ని నివృత్తి చేయుము.’ అని.
అర్జున ఉవాచ । జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన । తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ।। 1 ।। వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే । తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ।। 2 ।।
2
3
https://www.holy-bhagava…/003_001-002.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; జ్యాయసీ — ఉన్నతమైనది; చేత్ — ఒకవేళ; కర్మణః — సకామ కర్మల కంటే; తే — నీకు; మతా — అనిపిస్తే; బుద్ధిః — బుద్ధి; జనార్దన — జనుల బాగోగులు చూసుకునేవాడా, కృష్ణా; తత్ — అప్పుడు; కిం — ఎందుకు; కర్మణి — పనులు; ఘోరే — ఘోరమైన; మామ్ — నన్ను; నియోజయసి — చేయమంటున్నావు; కేశవ — కృష్ణ, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా; వ్యామిశ్రేణ ఇవ — నీ యొక్క అనేకార్థక/అస్పష్టమైన; వాక్యేన — మాటలతో; బుద్ధిం — బుద్ధి; మోహయసి — భ్రమకు లోనగుచున్నది; ఇవ — ఆ విధంగా; మే — నా యొక్క; తత్ — కాబట్టి; ఏకం — ఒకటే; వద — దయచేసి చెప్పుము; నిశ్చిత్య — నిశ్చయముగా; యేన — దేనివలన; శ్రేయః — అత్యున్నత శ్రేయస్సు; అహం — నేను; ఆప్నుయాం — పొందవచ్చు.
BG 3.1-2: అర్జునుడు ఇలా పలికెను : ఓ జనార్దనా, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమైనదయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము.
మొదటి అధ్యాయం అర్జునుడి దుఃఖము, శోక-విచారము ఉప్పొంగే పరిస్థితిని కలిగించి, శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వటానికి ఒక కారణం సృష్టించింది. రెండవ అధ్యాయంలో, మొదట, పరమాత్మ నిత్య శాశ్వతమైన ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు. తరువాత అర్జునుడికి తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి, తన విధిని నిర్వర్తించటం ద్వారా కీర్తిని, ఉత్తమ లోకాలని పొందవచ్చని చెప్పాడు. తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని అర్జునుడిని ప్రేరేపించిన పిదప శ్రీ కృష్ణుడు ఒక ఉన్నతమైన తత్త్వాన్ని తెలియచేసాడు — అదే కర్మ యోగ శాస్త్రం — అర్జునుడిని కర్మ ఫల త్యాగం చేయమన్నాడు. ఈ పద్ధతిలో, బంధనం సృష్టించే కర్మలు, బంధ నాశనం చేసే కర్మలుగా మారతాయి. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని ఆయన 'బుద్ధి యోగము' అన్నాడు. అంటే, అతని ఉద్దేశ్యం ఏమిటంటే, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా అచంచలమైనదిగా చేసుకున్న స్థిర బుద్ధి ద్వారా, మనస్సుని, ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. కర్మలను త్యజించమని చెప్పలేదు, కానీ, ఆ కర్మల (చేసే పనుల) నుండి వచ్చే ఫలాలపై ఆసక్తిని త్యజించమన్నాడు. అర్జునుడు శ్రీ కృష్ణుడు చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు, కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమమైనదయినప్పుడు, తను ఈ భయంకరమైన యుద్ధం చేయటమనే కర్తవ్యాన్ని ఎందుకు చేయాలి అనుకున్నాడు. అందుకే ఇలా అన్నాడు, ‘విరుద్ధమైన విషయాలు చెప్పటం ద్వారా నా బుద్ధిని అయోమయానికి గురి చేస్తున్నావు. నీవు కరుణామయుడవని నాకు తెలుసు, నన్ను అయోమయానికి గురి చేయడం నీ ఉద్దేశం కాదు, కావున నా సందేహాన్ని నివృత్తి చేయుము.’ అని.
శ్రీ భగవానువాచ । లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ । జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ।। 3 ।।
3
3
https://www.holy-bhagava…udio/003_003.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — భగవంతుడు పలికెను; లోకే — లోకములో; అస్మిన్ — ఈ యొక్క; ద్వి-విధా — రెండు విధముల; నిష్ఠా — నిష్ఠ/విశ్వాసము; పురా — ఇంతకు పూర్వము; ప్రోక్తా — చెప్పబడినవి; మయా — నా (శ్రీ కృష్ణుడు) చేత; అనఘ — పాప రహితుడా; జ్ఞాన-యోగేన — జ్ఞాన మార్గము ద్వారా; సాంఖ్యానాం — ధ్యాన నిష్ఠ యందు ఆసక్తి కలవారికి; కర్మ-యోగేన — కర్మ యోగము ద్వారా; యోగినాం — యోగులకు.
BG 3.3: భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్-ప్రాప్తికి (జ్ఞానోదయము) ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి: ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము; మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము.
2.39వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక సిద్ధి కొరకు రెండు మార్గములను ఉపదేశించెను. మొదటిది విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని మరియు అది శరీరము నుండి ఎలా వేరైనదో తెలుసుకోవటం. శ్రీ కృష్ణుడు దీనిని 'సాంఖ్య యోగం' అన్నాడు. తత్త్వ-విచారణ దృక్పథం ఉన్నవారు, మేధో విశ్లేషణ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే ఈ మార్గం వైపు మొగ్గు చూపుతారు. రెండవది, భగవంతునిపై భక్తి భావనతో పని చేయటం లేదా 'కర్మ యోగము'. శ్రీ కృష్ణుడు దీనినే, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు 'బుద్ధి యోగం' అని కూడా అంటాడు. ఈ రకంగా పని చేయటం, అంతఃకరణాన్ని శుద్ది చేస్తుంది, మరియు నిర్మల మనస్సులో, జ్ఞానం సహజంగానే వృద్ధినొంది, అది జ్ఞానోదయ స్థితి వైపు దారితీస్తుంది. ఆధ్యాత్మిక పథంలో ఆసక్తి ఉన్నవారిలో, ధ్యానము/విశ్లేషణ పట్ల మొగ్గు చూపే వారు ఉంటారు, మరియు, కర్మలు/పనుల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి, ఆత్మకి భగవత్ ప్రాప్తి అభిలాష ఉన్నప్పటినుండీ ఈ రెండు మార్గాలు ఉన్నాయి. తన ఉపదేశం అన్నీ రకాల జనులకూ ఉద్దేశించబడింది కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ రెంటినీ గురించి వివరిస్తున్నాడు.
న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే । న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ।। 4 ।।
4
3
https://www.holy-bhagava…udio/003_004.mp3
న — కాదు; కర్మణామ్ — కర్మలను; అనారంభాత్ — చేయకుండా; నైష్కర్మ్యం — కర్మ ఫలముల నుండి విముక్తి; పురుషః — వ్యక్తి; అశ్నుతే — పొందుట; న — కాదు; చ — మరియు; సన్న్యసనాత్ — సన్యాసము వల్ల; ఏవ — మాత్రమే; సిద్ధిం — సిద్ధిని (పరిపూర్ణత); సమధిగచ్ఛతి — పొందుట.
BG 3.4: మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మ బంధము (ప్రతిక్రియ) ల నుండి విముక్తి పొందజాలడు. అలాగే, కేవలం బాహ్య (భౌతిక) సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు.
ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగికి (కర్మ మార్గాన్ని ఆచరించేవారికి) ఉద్దేశించబడినది, రెండవ పాదం సాంఖ్యయోగికి (జ్ఞాన మార్గాన్ని ఆచరించేవారికి) ఉద్దేశించబడినది. మొదటి పాదంలో, శ్రీ కృష్ణుడు, ఉత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు, అంటున్నాడు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది, మరియు మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక, భౌతిక కర్మ మాదిరిగానే, అది కూడా కర్మ బంధాలలో కట్టివేస్తుంది. నిజమైన కర్మ యోగి, కర్మ ఫలాలపై మమకార, ఆసక్తులు లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి. దీనికి, బుద్ధి యందు జ్ఞానాన్ని వృద్ధిపొందించుకోవటం అవసరం. కాబట్టి, కర్మ యోగములో కూడా తత్త్వజ్ఞానం అవసరం. రెండవ పాదంలో, శ్రీ కృష్ణుడు - ఉత్తగా ప్రపంచాన్ని త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్య యోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు - అని అంటున్నాడు. భౌతిక ఇంద్రియార్థ విషయ-వస్తువులను త్యజించినా, మనసులో మలినాలు ఉన్నంత కాలం నిజమైన జ్ఞానం కలుగదు. పూర్వపు చింతలను పదేపదే ఆలోచించటం మనస్సుకు ఉన్న లక్షణం. అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారై, కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా అదే పథంలో ప్రవహిస్తాయి. పాత అలవాటు ప్రకారంగా, ప్రాపంచికముగా మలినమైన మనస్సు - ఒత్తిడి, ఆందోళన, భయము, ద్వేషము, ఈర్ష్య, మమకారం వంటి - అనేకానేక ప్రాపంచిక భావావేశాలకు లోనగుతూనే ఉంటుంది. ఈ విధంగా, కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసంతో సంపూర్ణ జ్ఞానోదయం అనేది మలిన మనస్సులో ప్రకాశించదు. దానితో పాటుగా దానికి అనుగుణమైన, అంతఃకరణ (మనోబుద్ధులు) శుద్ది చేసే చర్యలు ఉండాలి. కాబట్టి, సాంఖ్య యోగములో కూడా కర్మలు అవసరమే. తత్త్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి, ఉత్త మానసిక అభిమానమే అని మరియు భక్తి లేకుండా ఉన్న తత్త్వజ్ఞానం, మేధస్సుతో చేసే ఊహాగానాలే అని చెప్పబడింది. కర్మ యోగము మరియు సాంఖ్య యోగము రెంటిలో కూడా కర్మలు, జ్ఞానం రెండూ అవసరమే. వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంది, అదే ఈ రెండు మార్గాల్లో ఉన్న భేదం.
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ । కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ।। 5 ।।
5
3
https://www.holy-bhagava…udio/003_005.mp3
న — కాదు; హి — నిజముగా; కశ్చిత్ — ఎవరూ కూడా; క్షణం — క్షణ కాలము; అపి — కూడా; జాతు — ఎప్పటికిని; తిష్ఠతి — ఉండుట; అకర్మ-కృత్ — కర్మ చేయకుండా; కార్యతే — చేయబడును; హి — తప్పకుండా; అవశః — నిస్సహాయంగా; కర్మ — పని; సర్వః — అన్నీ; ప్రకృతి-జైః — భౌతిక ప్రకృతి జనితములైన; గుణైః — గుణముల చేత.
BG 3.5: ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి, అన్ని ప్రాణులు తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే (త్రి-గుణములు) ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును.
కొంత మంది కర్మ అనగా వృత్తి ధర్మము మాత్రమే అనుకుంటారు, అంతేకానీ రోజువారీ పనులైన తినటం, త్రాగటం, నిద్రపోవటం, నడవటం, మరియు ఆలోచించటం వంటివి కూడా కర్మ అని అనుకోరు. కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు, ఏమీ పనులు చేయటం లేదు అనుకుంటారు. కానీ, శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే అన్ని పనులనూ శ్రీ కృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు. అందుకే, ఒక్క క్షణమైనా పూర్తి క్రియా రహితంగా ఉండటం సాధ్యం కాదని అర్జునుడికి చెప్తున్నాడు. ఊరికే కూర్చున్నా సరే, అదొక క్రియ; పడుకుంటే, అది కూడా ఒక క్రియ; మనం నిద్ర పొతే, మనస్సు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది; గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి, మనుష్యులకు పూర్తి క్రియా రహిత స్థితి అసాధ్యము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు, ఎందుకంటే ఈ యొక్క శరీరము-మనస్సు-బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రిగుణముల (సత్వ-రజో-తమో గుణములు) చేతనే ఏదో ఒక పని చేయటానికి ప్రేరేపింపబడుతుంది. శ్రీమద్ భాగవతంలో ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది.న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మ-కృత్కార్యతే హ్యవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్ (6.1.53)‘ఎవ్వరూ కూడా ఏ పనీ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు. ప్రతివారూ తమ ప్రకృతి గుణములచే ప్రేరేపింపబడి అప్రయత్నంగా కర్మలు చేస్తారు’
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ । ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ।। 6 ।।
6
3
https://www.holy-bhagava…udio/003_006.mp3
కర్మ-ఇంద్రియాణి — కర్మేంద్రియములు; సంయమ్య — నిగ్రహించి; యః — ఎవరైతే; ఆస్తే — ఉంటారో; మనసా — మనస్సులో; స్మరన్ — ఆలోచిస్తూ; ఇంద్రియ-అర్థాన్ — ఇంద్రియ వస్తు/విషయములు; విమూఢ-ఆత్మా — అవివేకులు; మిథ్యా-ఆచారః — కపటులు; సః — వారు; ఉచ్యతే — అని చెప్పబడతారు.
BG 3.6: బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా, మనస్సులో మాత్రం ఇంద్రియ విషయముల పైనే చింతన చేస్తూ ఉండే వారు తమని తామే మోసం చేసుకునే వారు, అలాంటి వారు కపటులు అనబడుతారు.
సన్యాస జీవన శైలికి ఆకర్షింపబడి, తరచుగా జనులు, తమ వృత్తిని విడిచిపెడతారు, కానీ, తరువాత వారు తెలుసుకునేదేమిటంటే, సన్యాసంతో పాటుగా, దానికి కావలిసిన, ఇంద్రియ విషయముల మీద మానసిక/మేధో వైరాగ్యం వారికి లేవు అని. ఇది, బాహ్యంగా ఆధ్యాత్మిక శైలిని ప్రదర్శించినా అంతర్గతంగా తుచ్ఛమైన మనోభావాలతో జీవించే ఒక మిథ్యాచార/కపట స్థితికి దారితీస్తుంది. కాబట్టి, ఒక కపట సన్యాసిగా జీవించటం కన్నా, బాహ్య ప్రపంచపు పోరాటాలని ఎదుర్కుంటూ కర్మయోగిగా జీవించటమే మేలు. జీవితంలోని సమస్యల నుండి పారిపోయి తొందరపడి అపరిపక్వముగా సన్యాసం తీసుకోవటం, పరిణామక్రమం లో జీవాత్మ యొక్క ఉద్ధరణ/పురోగతికి మంచిది కాదు. సంత్ కబీర్ వ్యంగ్యంగా ఇలా అన్నాడు.మన న రంగాయే హో,రంగాయే యోగీ కపడాజటవా బఢాఏ యోగీ ధునియా రమౌలే,దహియా బఢాయే యోగీ బని గయేలే బకరా ‘ఓ సన్యాస యోగీ, నీవు కాషాయ వస్త్రాలు ధరించావు కానీ, నీ మనస్సుకి వైరాగ్యం అనే రంగుని అద్దటం విస్మరించావు. నీవు పొడుగాటి జటలని పెంచావు మరియు శరీరమంతా బూడిద వ్రాసుకున్నావు (వైరాగ్యానికి చిహ్నంగా). కానీ హృదయంలో భక్తి లేకపోతే బాహ్యంగా ఉన్న గడ్డం, నీవు మేక లాగా కనిపించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.’ బాహ్యంగా ఇంద్రియ విషయములను త్యజించినా, మనస్సులో మాత్రం వాటి గురించే ఆలోచిస్తూ ఉండే వారు కపటులు అని, తమని తామే మోసం చేసుకునే వారు, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు.పురాణాలలో ఈ విషయాన్ని తేటపరచటానికి తవ్రీతుడు, సువ్రీతుడు అనే ఇద్దరు సోదరుల కథ ఉంది.గుడిలో శ్రీమద్భాగవతం ప్రవచనం వినటానికి ఈ సోదరులు ఇద్దరూ ఇంటి నుండి నడుచుకుంటూ బయలు దేరారు. దారిలో పెద్ద వర్షం మొదలవటంతో వారు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక భవనం లోకి పరిగెత్తి వెళ్లారు. వారి ఖర్మకి అదొక వేశ్యా గృహం. అక్కడ అగౌరవమైన మహిళలు కొందరు అతిధుల వినోదం కోసం నృత్యం చేస్తున్నారు. పెద్దవాడైన తవ్రీతుడు దిగాలుపడి బయటకు వచ్చి వర్షంలోనే గుడికి నడుచుకుంటూ వెళ్లి పోయాడు. చిన్నవాడైన సువ్రీతుడు, వర్షంలో తడవకుండా ఉండటం కోసం కాసేపు అక్కడే ఉండటంలో తప్పు లేదనుకున్నాడు.తవ్రీతుడు గుడికి చేరుకొని ప్రవచన శ్రవణం కోసం కూర్చున్నాడు, కానీ మనసులో మాత్రం విచారంగా ఉన్నాడు, ‘అయ్యో, ఇది ఎంత బోరింగ్ గా ఉంది! పెద్ద తప్పు చేసానే; ఆ వేశ్యాగృహం దగ్గరే ఉంటే బాగుండేది; నా సోదరుడు అక్కడ విలాసంగా భోగాలను అనుభవిస్తుండవచ్చు.’ అని అనుకున్నాడు. అటుపక్క సువ్రితుడు ఇలా అనుకుంటున్నాడు, ‘ఈ పాపిష్టి గృహంలో ఎందుకున్నాను? నా సోదరుడు ఎంత పవిత్రుడో; తన బుద్ధిని భాగవత జ్ఞానంతో శుద్ది చేసుకుంటున్నాడు. నేను కూడా ధైర్యం చేస్కొని వర్షంలో అయినా అక్కడికి చేరుకోవాల్సి ఉండేనేమో. నేనేమన్నా ఉప్పుతో చేయబడ్డానా, కొంచెం వానకే కరిగిపోవటానికి.’ అని.వాన ఆగిపోయిన తరువాత ఇద్దరూ ఒకరి దిశగా మరొకరు బయలుదేరారు. వారు కలుసుకోగానే, ఒక పిడుగు పడి ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. యమ దూతలు తవ్రీతుడిని నరకం తీసుకెళ్ళటానికి వచ్చారు. తవ్రీతుడు ఫిర్యాదు చేసాడు, ‘మీరు ఏదో పొరబడ్దారనుకుంటాను. నేను తవ్రీతుడిని. ఆ వేశ్యా గృహంలో ఇందాక కూర్చున్నవాడు నా సోదరుడు సువ్రీతుడు. వాడిని నరకానికి తీసుకు వెళ్ళండి.’ అని.ఆ యమ దూతలు ఇలా బదులిచ్చారు, ‘మేమేమీ పోరబడలేదు, అతను వర్షం నుండి తప్పించుకోవటానికి అక్కడ కూర్చున్నాడు, కానీ భాగవత ప్రవచనం దగ్గర ఉండటాని కోసం తహతహ లాడాడు. అదేసమయంలో, నీవు కూర్చోని ప్రవచనం వింటున్నా, నీ మనస్సు వేశ్యా గృహం కోసమే తపించింది.’ అని.శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వెల్లడించిన విధంగానే తవ్రీతుడు చేసాడు; అతను బాహ్యంగా ఇంద్రియ విషయములను త్యజించినా, మనస్సులో వాటి గురించే ఆలోచించాడు. ఇది సరియైన పరిత్యాగం కాదు. తదుపరి శ్లోకం సరియైన సన్యాస విధానాన్ని పేర్కొంటుంది.
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున । కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ।। 7 ।।
7
3
https://www.holy-bhagava…udio/003_007.mp3
యః — ఎవరైతే; తు — కానీ; ఇంద్రియాణి — ఇంద్రియములు; మనసా — మనస్సు చే; నియమ్య — నియంత్రణ; ఆరభతే — మొదలు పెట్టి; అర్జున — అర్జునా; కర్మ-ఇంద్రియై: — కర్మేంద్రియముల తో; కర్మ-యోగం — కర్మ యోగము; అసక్తః — అనాసక్తుడై; సః — వారు; విశిష్యతే — ఉత్తములు.
BG 3.7: కానీ, అర్జునా, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి, కర్మేంద్రియములతో మమకార/ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మ యోగులు, నిజంగా ఏంతో శ్రేష్ఠులు.
'కర్మ యోగం' అన్న పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది. దీనిలో రెండు ప్రధానమైన విషయములు ఉన్నాయి: 'కర్మ' (వృత్తి ధర్మాలు) మరియు 'యోగ' (భగవంతునితో సంయోగం). కాబట్టి, కర్మ యోగి అంటే, తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ మనస్సును భగవంతుని యందే నిలిపేవాడు. అలాంటి కర్మ యోగికి, అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, కర్మ బంధాలు అంటవు. ఇది ఎందుకంటే, వ్యక్తిని కర్మ సిద్ధాంత బంధానికి కట్టిపడేసేది, కర్మ ఫలాలపై ఆసక్తియే కానీ చేసే కర్మలు కావు. కర్మ యోగికి కర్మ ఫలాల పై మమకారం ఉండదు. మరోపక్క, ఒక కపట సన్యాసి, క్రియలను త్యజించినా, మమకారం విడిచిపెట్టడు, కాబట్టి కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు.గృహస్తు జీవనంలో ఉండీ, కర్మ యోగము ఆచరణ చేసే వాడు, మనస్సులో ఇంద్రియ విషయములపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా ఏంతో ఉత్తముడు అని శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్, ఈ రెండు స్థితులను చాలా అందంగా తేటతెల్లం చేసారు.మన హరి మేఁ తన జగత్ మేఁ, కర్మయోగ్ తెహి జానతన హరి మేఁ మన జగత్ మేఁ, యహ మహాన అజ్ఞాన(భక్తి శతకము, 84వ శ్లోకం) ‘శరీరం జగత్తులో, మనస్సు భగవంతునిలో ఉంచి ప్రపంచంలో వ్యవహారాలు చేయటమే కర్మ-యోగం అని తెలుసుకోండి. శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ, మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండటమే కపటత్వం (మహా అజ్ఞానం) అని తెలుసుకోండి’
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః । శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ।। 8 ।।
8
3
https://www.holy-bhagava…udio/003_008.mp3
నియతం — నిరంతరంగా; కురు — చేయుము; కర్మ — వేద విహిత కర్మలు; త్వం — నీవు; కర్మ — కార్యములు; జ్యాహః — శ్రేష్ఠమైన; హి — తప్పకుండా; అకర్మణః — క్రియా రాహిత్యం కంటే; శరీర — శరీరము యొక్క; యాత్రా — నిర్వహణ; అపి — కూడా; చ — మరియు; తే — నీ యొక్క; న ప్రసిద్ద్యేత్ — సాధ్యము కాదు; అకర్మణః — పనులు చేయకుండా.
BG 3.8: కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి, ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచి పెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.
మనస్సు, బుద్ధి భగవత్ ధ్యాసలో పూర్తిగా నిమగ్నమైపోయేంతవరకూ, కర్తవ్య ధోరణితో బాహ్యమైన భౌతిక పనులను చేయటం వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది. కాబట్టి, మనోఇంద్రియముల నియంత్రణ నిమిత్తం వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి. నిజానికి, సోమరితనం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతిపెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పబడింది:ఆలస్య హి మనుష్యాణాం శరీరస్థో మహాన్ రిపుఃనాస్త్యుద్యమసమో బంధుః కృత్వా యం నావసీదతి‘సోమరితనం అనేది మనుష్యులకు ప్రధాన శత్రువు, అది వారి శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది. పని అనేది వారికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు లాంటిది, అది పతనం నుండి కాపాడుతుంది.’ సాధారణ క్రియలైన తినటం, స్నానం చేయటం, మరియు ఆరోగ్యం కాపాడుకోవటం వంటి వాటికి కూడా పని చేయాలి. ఈ తప్పనిసరి చర్యలను ‘నిత్య కర్మలు’ అంటారు. ఈ విధమైన ప్రాథమిక శరీరనిర్వహణా కార్యకలాపాలు విస్మరించడం పురోగతికి సంకేతం కాదు. అది శరీరము, మనస్సులను కృశింపచేసి, బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం. మరో పక్క, చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరము ఆధ్యాత్మిక పథంలో ఎంతో సహకారంగా ఉంటుంది. కాబట్టి జడత్వం/అలసత్వం అనేది భౌతిక పురోగతికి కానీ, ఆధ్యాత్మిక పురోగతికి కానీ మంచిది కాదు. మన ఆత్మ ఉద్ధరణ కోసం, మన మనస్సు-బుద్ధి ఉన్నత స్థితికి వెళ్ళటానికి, అంతఃకరణ శుద్ధికి సహకరించే మన విధులను మనం నిర్వర్తించాలి.
యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః । తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ।। 9 ।।
9
3
https://www.holy-bhagava…udio/003_009.mp3
యజ్ఞ-అర్థాత్ — యజ్ఞం కోసం; కర్మణః — కర్మల కంటే; అన్యత్ర — వేరే; లోకః — ఈ భౌతిక ప్రపంచం; అయం — ఈ యొక్క; కర్మ-బంధనః — కర్మ బంధనము; తత్ — దాని; అర్థం — కోసం; కర్మ — కర్మలు (చర్యలు); కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; ముక్త-సంగః — ఫలాసక్తి రహితంగా; సమాచర — సరిగ్గా చేయుము.
BG 3.9: పనులని ఒక యజ్ఞం లాగా, భగవత్ అర్పితంగా చేయాలి, లేదా, ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఓ కుంతీ పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా, ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము.
కత్తి అనే వస్తువు, బందిపోటు చేతిలో ఉంటే అది జనులను భయభీతులను చేయటానికి లేదా చంపటానికి ఆయుధమవుతుంది, అదే ఒక శస్త్ర చికిత్స వైద్యుడి దగ్గర ఉంటే, జనుల ప్రాణాలు కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు అలాగే శుభకరమైనదీ కాదు – దాన్ని వాడే విధానం బట్టి దాని ప్రభావం ఉంటుంది. షేక్స్పియర్ అన్నట్టుగా : ‘మంచి లేదా చెడు అన్నది ఏమీ లేదు, అంతా మన ఆలోచనలోనే ఉంది’,(For there is nothing good or bad, but thinking makes it so.) అదే ప్రకారంగా, పని అనేది మంచిదా చెడ్డదా అని చెప్పలేము, మానసిక దృక్పథం బట్టి అది ఉన్నతికి కారకం కావచ్చు లేదా బంధన కారకం అవ్వచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని ఈ భౌతిక జగత్తులో బంధన కారకమవుతుంది. కానీ ఒక యజ్ఞం లాగా (భగవత్ అర్పితంగా), ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని, మాయా బంధాలనుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. కర్మలు/పనులు చేయటం అనేది మన యొక్క సహజ స్వభావం కాబట్టి ఈ రెంటిలో ఏదో ఒక దృక్పథంతో పని చేయాలి. మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏదో ఒక పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము.కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే, మన ఇంద్రియ మనస్సుల సంతృప్తి కోసం పని చేయవలసి వస్తుంది. అలా కాకుండా, పనులను యజ్ఞంలాగా చేస్తే, మనం సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూసి, అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాము. శ్రీ రామ చంద్రుడి పూర్వీకుడైన రఘు మహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శం చూపించాడు. రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు, దానిలో తనకున్న సంపదనంతా దానం చేయవలసి ఉంటుంది.స విశ్వజితం ఆజహ్రే యజ్ఞం సర్వస్వ దక్షిణంఆదానం హి విసర్గాయ సతాం వారిముచాం ఇవ(రఘువంశము 4.86)‘మేఘములు పృథ్వి నుండి నీటిని గ్రహించటం, వాటి స్వప్రయోజనం కోసం కాకుండా, మళ్లీ ఈ పుడమి పైనే వర్షించటం కోసమే అన్నట్టుగా, ఒక మహారాజుగా తను పన్నుల రూపంలో ప్రజలనుండి సంపాదించినదంతా తన భోగాల కోసం కాకుండా, భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు. కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా భగవత్ ప్రీతి కోసం తన ప్రజా సేవలో వినియోగించాలని నిర్ణయించాడు.’యజ్ఞం పరిపూర్తి అయిన తరువాత రఘువు తనకున్నదంతా తన ప్రజలకు దానం చేసేసాడు. ఆ తర్వాత, ఒక యాచకుడిగా చిరుగు వస్త్రాలతో, మట్టి పాత్ర పట్టుకుని, తిండి కోసం యాచించటానికి బయలుదేరాడు. ఓ చెట్టు క్రింద విశ్రాంతి తీస్కుంటుండగా, కొంత మంది ఇలా మాట్లాడుకోవటం విన్నాడు. ‘మన మహారాజు ఏంతో దయకలవాడు. తన కున్నదంతా దానం చేసాడు’ అని.రఘువు తన పొడగ్త విని చాలా బాధ పడి ఇలా అన్నాడు. ‘మీరు ఏం మాట్లాడుకుంటున్నారు?’ అని.వారు ఇలా అన్నారు, ‘మేము మా రాజు గారి గొప్పతనం చెప్పుకుంటున్నాము. ఆయనంత దానశీలురు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు.’రఘువు దీనికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ‘ఇంకెప్పుడూ అలా అనకండి. రఘువు ఏమీ ఇవ్వలేదు.’వారు అన్నారు, ‘ఏం మనిషివి నువ్వు మా రాజు గారిని విమర్శిస్తున్నావు? రఘు మహారాజు తన సంపాదనంతా దానం చేసాడని అందరికీ తెలుసు.’రఘువు అన్నాడు ‘వెళ్లి మీ రాజుని అడగండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని? ఆయన ఉత్త చేతులతో పుట్టాడు. కదా? మరి ఆయనది ఏం ఉందని ఆయన ఇచ్చినట్టు?’కర్మ యోగ దృక్పథం అంటే ఇదే, ఈ దృక్పథంలో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తుగా మనం చూస్తాము మరియు ఇదంతా భగవత్ ప్రీతి కోసమే ఉందనుకుంటాము. అప్పుడు మనం మన విధులను మన ఇంద్రియ/మనస్సుల తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసం చేస్తాము. విష్ణు మూర్తి ప్రచేతసుడికి ఈ విధంగా ఉపదేశించాడు:గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణామ్మద్వార్తా యాతయామానం న బంధాయ గృహా మతాః(భాగవతం 4.30.19) ‘పరిపూర్ణ కర్మ యోగులు, తమ ప్రాపంచిక/సాంసారిక విధులను నిర్వర్తిస్తూనే ఉన్నా, వారి అన్ని కర్మ ఫలాలకు నేనే భోక్తయని తెలుసుకుని, తమ పనులన్నిటినీ, నాకు యజ్ఞములా చేస్తుంటారు. వారికున్న ఎంత కొంచెం తీరిక సమయంలో నైనా నా కీర్తి/లీలలను శ్రవణం, కీర్తనం చేస్తుంటారు. అలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్నా, వారు చేసే పనుల కర్మ బంధాలలో చిక్కుకోరు.’
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః । అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 10 ।।
10
3
https://www.holy-bhagava…udio/003_010.mp3
సహ యజ్ఞాః — యజ్ఞములతో పాటుగా; ప్రజాః — ప్రజలను; సృష్ట్వా — సృష్టించెను; పురా — ప్రారంభంలో; ఉవాచ — పలికెను; ప్రజా-పతిః — బ్రహ్మ దేవుడు; అనేన — దీని ద్వారా; ప్రసవిష్యధ్వమ్ — వృద్ది పొందుము; ఏషః— ఇవి; వః — మీకు; అస్తు — అగుగాక; ఇష్ట-కామ-ధుక్ — సర్వ అభీష్టములను తీర్చునది.
BG 3.10: సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి, ఇలా చెప్పాడు, ‘ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి.’
ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములు భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగములే. అన్ని అంశములూ సహజంగానే తమ మూలభాగం నుండి గ్రహిస్తాయి మరియు దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడు భూమికి నిలకడ కలిగించి, ప్రాణుల జీవనానికి అవసరమైన వేడిమి, వెలుగును ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి మన పోషణ కోసం ఆహారం తయారు చేయటమేగాక నాగరిక జీవన శైలి కోసం ఎన్నో ఖనిజాలను తన గర్భంలో ఉంచుకుంది. వాయువు మన శరీరంలో జీవశక్తిని కదిలిస్తుంది మరియు శబ్దతరంగ శక్తి ప్రసరణకు దోహద పడుతుంది. మనం మానవులం కూడా భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలి, మనం నడిచే నేల, మనం తాగే నీరు, మనం పొందే వెలుతురు - ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలే. మన జీవన నిర్వహణ కోసం వీటన్నిటినీ వాడుకుంటున్నప్పుడు, వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా ఉంటాయి. విధింపబడిన కర్తవ్యములను భగవత్ సేవ లాగా చేయటం ద్వారా ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో మనము తప్పకుండా పాలుపంచుకోవాలి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఆయన మననుండి కోరుకొనే యజ్ఞం అదే. ఒక చేతిని ఉదాహరణగా తీస్కొండి. అది శరీరంలో ఒక అంతర్గత భాగం. దానికి కావలసిన పుష్టి — రక్తము, ప్రాణవాయువు (ఆక్సిజన్), పోషకాలు మొదలగునవి - శరీరం ద్వారా అందుతాయి, తిరిగి అది శరీరం కోసం అవసరమైన పనులు చేస్తుంది. ఒకవేళ చేతికి తను చేసే సేవ భారంగా/చికాకుగా అనిపించి, శరీరం నుండి తెగి విడిపోదామని నిర్ణయించుకుంటే, తనను తాను కొన్ని నిమిషాలు కూడా నిలుపుకోలేదు. తన శరీరం పట్ల తాను చేసే యజ్ఞం వల్లనే చెయ్యి యొక్క స్వ-ప్రయోజనం కూడా నెరవేరుతుంది. అదే విధంగా మన జీవాత్మలం కూడా పరమాత్మ యొక్క సూక్ష్మ అంశములమే, మరియు ఈ మహోన్నత వ్యూహ పథకంలో మన పాత్ర మనకుంది. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే, మన స్వ-ప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది. సాధారణంగా 'యజ్ఞం' అన్న పదం అగ్ని హోమంతో చేసే ప్రక్రియను సూచిస్తుంది. భగవద్గీత లో 'యజ్ఞం' అంటే భగవంతునికి సమర్పితంగా చేసే వేద విహిత కర్మలు/విధులు అన్నీ కూడా దానిలోకి వస్తాయి.
దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః । పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ।। 11 ।।
11
3
https://www.holy-bhagava…udio/003_011.mp3
దేవాన్ — దేవతలు; భావయతా — ప్రీతి చెందుతారు; అనేన — వీటి ద్వారా (యజ్ఞములు); తే — వారు; దేవాః — దేవతలు; భావయంతు — సంతోషిస్తారు; వః — మీరు; పరస్పరం — ఒకరినొకరు; భావయంతః — తృప్తి పరుచుకొంటూ; శ్రేయః — శ్రేయస్సు; పరం — గొప్ప/పరమ; అవాప్స్యథ — పొందెదరు.
BG 3.11: మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.
ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు. ఈ దేవతలు భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు, అవే స్వర్గాది ఉన్నత లోకాలు. దేవతలు అంటే భగవంతుడు కారు; వారూ మనవంటి ఆత్మలే. ప్రపంచ వ్యవహారాలు నడిపించటానికి నిర్దిష్ఠమైన పదవులలో ఉంటారు. ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోండి. అందులో ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి, హొమ్ మంత్రి వంటి వారు ఉంటారు. ఇవన్నీ పదవులు అన్నమాట, మరియు పరిమిత కాలం వరకు, కొంత మంది ఎంపిక చేయబడిన వారు, ఈ పదవులను నిర్వహించటం జరుగుతుంది. పదవీ కాలం ముగిసిన తరువాత, ప్రభుత్వం మారుతుంది మరియు ఆయా పదవులలో ఉన్న వారు కూడా మారతారు. ఇదే విధంగా, ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయటానికి అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఇంద్రుడు, వంటి పదవులు ఉన్నాయి. గత జన్మలలో చేసిన పుణ్య కార్యముల ఫలముగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవులలో ఉండి, విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి. వీరే దేవతలు.దేవతలను సంతృప్తి పరచటానికి, వేదాలు ఎన్నో రకాల కర్మకాండలను, ప్రక్రియలను చెప్పాయి. ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు పూవులకు, ఫలములకు, ఆకులకు, కొమ్మలకు, చిగురులకు తప్పకుండా ఎలా చేరుతుందో, అదే విధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని ప్రీతి కోసం చేసినప్పుడు, అప్రయత్నపూర్వకంగానే దేవతలు కూడా సంతోషిస్తారు. స్కంద పురాణం ఇలా పేర్కొంటున్నది:అర్చితే దేవ దేవేశే శంఖ చక్ర గదాధరేఅర్చితాః సర్వే దేవాః స్యుర్ యతః సర్వ గతో హరిః‘దేవదేవుడు శ్రీ మహా విష్ణువుని పూజించినప్పుడు, మనం అప్రయత్నపూర్వకంగానే అందరు దేవతలను పూజించినట్టే, ఎందుకంటే, వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు.’ ఈ ప్రకారంగా, యజ్ఞాన్ని చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది. అలా ప్రీతి నొందిన దేవతలు, భౌతిక ప్రకృతి మూల-భూతములను జీవులకు అనుకూలంగా మార్చటం ద్వారా తిరిగి వారికి సంపత్తి/సౌభాగ్యాన్ని కలిగిస్తారు.
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః । తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ।। 12 ।।
12
3
https://www.holy-bhagava…udio/003_012.mp3
ఇష్టాన్ — కోరిన; భోగాన్ — జీవిత అవసరములు; హి — తప్పకుండా; వః — మీకు; దేవాః — దేవతలు; దాస్యంతే — అనుగ్రహించెదరు; యజ్ఞ-భావితాః — యజ్ఞముచే తృప్తి చెంది; తైః — వారిచే; దత్తాన్ — ఇవ్వబడిన వాటిని; అప్రదాయ — నివేదించకుండా; ఏభ్యః — వారికి; యః — ఎవరైతే; భుంక్తే — అనుభవిస్తారో; స్తేనః — దొంగలు; ఏవ — వాస్తవముగా; సః — వారు.
BG 3.12: యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు, జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటిని ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని, తిరిగి నివేదించకుండా, తామే అనుభవించే వారు, నిజానికి దొంగలే.
ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే, మనకు వర్షం, గాలి, పంటలు, చెట్లూచేమలు, ఖనిజములు, సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నిటిని పొందిన మనం మానవులం వారికి ఋణపడి ఉన్నాము. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు; మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు. దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది, ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు. ఈ విధంగా, మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈవిశ్వం మనకు సహకరించటం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది. కానీ, ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా, మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే, శ్రీ కృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అంటున్నాడు. తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతుంటారు, ‘నేను నీతిగా బ్రతుకుతున్నాను; ఎవరినీ కష్టపెట్టను; నేనేమీ దొంగిలించను; కానీ నేను భగవంతుడున్నాడని నమ్మను, దైవారాధనను నమ్మను. నేనేమైనా తప్పు చేస్తున్నానా?’ అని. ఈ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చెయ్యట్లేదు కానీ భగవంతుని దృష్టిలో దొంగలే. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి యజమానిని గుర్తించకుండా, అక్కడి సోఫాలో కూర్చొని, ఫ్రిడ్జిలో నుండి ఆహారం తిని, బాత్రూం వాడుకొని, ఇలా ఉంటున్నామనుకోండి. మనం ఏమీ తప్పు చేయలేదనుకోవచ్చు, కానీ చట్టం దృష్టిలో మనం దొంగగా పరిగణించబడుతాము; ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు. ఇదే విధంగా మనం ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి, ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు. ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే, ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే. భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు, తన గురువైన చాణక్య పండితుడిని ఇలా అడిగాడు, ‘వైదిక వాజ్మయం పరంగా, పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి?’ అని. చాణక్య పండితుడు ఇలా సమాధానం చెప్పాడు ‘రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే, అంతకన్నా ఇంకేమీ కాదు. తన రాజ్య పౌరులకి భగవత్ ప్రాప్తి పథంలో సహాయం చేయటమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం.’ ఒక రాజు, వ్యాపారి, రైతు, శ్రామికుడు, ప్రతి వ్యక్తీ, ఎవరైనా సరే, భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా, తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి.
యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః । భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ।। 13 ।।
13
3
https://www.holy-bhagava…udio/003_013.mp3
యజ్ఞ-శిష్ట — యజ్ఞ శిష్టాన్నమును (భగవత్ నివేదన చేయగా మిగిలిన అన్నము); అశినః — భుజించేవారు; సంతః — సత్పురుషులు; ముచ్యంతే — విముక్తి చేయబడతారు; సర్వ-కిల్బిషైః — అన్ని రకాల పాపముల నుండి; భుంజతే — ఆస్వాదించుట; తే — వారు; తు — కానీ; అఘం — పాపములు; పాపాః — పాపాత్ములు; యే — ఎవరైతే ; పచంతి — వండుదురో (అన్నమును); ఆత్మ-కారణాత్ — తమ స్వీయ భోగం కోసమే.
BG 3.13: యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే, ఆధ్యాత్మిక చింతనగల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు.
వైదిక సాంప్రదాయంలో, అన్నము (ఆహారము) ను భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథం తోనే వండేవారు. ఆహార పదార్థాలన్నీ కొంచెం కొంచెం ఒక పళ్ళెంలో ఉంచి, భగవంతుడిని వాటిని స్వీకరించమని శాబ్దిక లేక మానసిక ప్రార్థన చేస్తారు. అలా నైవేద్యం చేసిన తరువాత, ఆ పళ్ళెంలో ఉన్న ఆహారం 'ప్రసాదం' గా పరిగణించబడుతుంది. ఆ పళ్ళెంలో, ఇంకా పాత్రలలో ఉన్న ఆహారం, భగవత్ అనుగ్రహముగా పరిగణించబడి, ఆ దృక్పథంలోనే భుజించబడుతుంది. ఇతర మత సాంప్రదాయములు కూడా ఇటువంటి ఆచారాల్ని పాటిస్తాయి. క్రైస్తవ ఆచారంలో ‘యూకారిస్ట్ ధార్మికానుష్ఠానం’ (sacrament of the Eucharist) ఉంది, దీనిలో బ్రెడ్డు మరియు వైన్ లను మొదట నివేదించి పవిత్రం చేసిన తరువాతే, అవి స్వీకరించబడుతాయి. ముందుగా భగవంతునికి నైవేద్యం చేయబడిన ప్రసాదం తినటం మనలను పాపములనుండి విముక్తి చేస్తుంది, ఈ ప్రకారంగా, నివేదన చేయకుండా అన్నం తినేవారు పాపం చేస్తున్నట్టే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మనం మాంసాహారాన్ని భగవంతునుకి సమర్పించి ఆ శేషాన్ని ప్రసాదం లాగా స్వీకరించవచ్చా? దీనికి సమాధానం ఏమిటంటే వేదములు, మానవులకు శాకాహార భోజనమునే నిర్దేశించాయి, అంటే ధాన్యం, దినుసులు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు వంటివి. వైదిక సంస్కృతియే కాక, ప్రపంచ చరిత్రలో, అన్నీ సంస్కృతుల్లోఆధ్యాత్మిక ఉన్నతి నొందిన ఎందరో జీవులు, ఉదరాన్ని జంతువుల స్మశానంగా చేసే, మాంసాహారాన్ని తిరస్కరించారు. వారిలో చాలా మంది మాంసాహార కుటుంబాలల్లో జన్మించినా, ఆధ్యాత్మిక పథ పురోగతిలో వారు శాకాహారం వైపే మొగ్గు చూపారు. శాకాహారాన్ని సమర్థిస్తూ కొంతమంది ప్రఖ్యాత తత్త్వవేత్తల మరియు వ్యక్తుల మాటలను ఈ క్రింద చూడండి.జీవ ప్రాణులకు ప్రాణభయం కలిగించకుండా ఉండటానికి, శిష్యుడిని మాంసాహారం భుజించకుండా ఉండనీ... సాధువులు భుజించే ఆహారమే వివేకవంతులైన వారికి భోజనంగా ఉండాలి; దానిలో మాంసం ఉండదు— బుద్ధుడు నీవు సహజంగానే అలాంటి ఆహారం తినటానికి అనుగుణంగా తయారుచేయబడ్డావు అని అనుకుంటే, నీవు దేనిని తినాలనుకుంటున్నావో దానిని స్వయంగా చంపు. కాకపోతే, నీకున్న సహజసిద్ధ ఉపకరణములతో మాత్రమే. కత్తి, దుడ్డుకర్ర, ఎలాంటి గొడ్డలి వంటి వాటి సహాయం లేకుండానే ఆ పని చేయుము.— రోమ్ నగరపు ప్లూటార్క్, ‘ఆన్ ఈటింగ్ ఫ్లెష్’, అనే వ్యాసంలో ‘మనుష్యులు జంతువులని వధించినంత కాలం, వారు ఒకరినొకరు చంపుకుంటూనే ఉంటారు. హత్య, బాధ వంటి బీజములు నాటేవారికి ప్రేమ, ఆనందము వంటి ఫలాలు అందవు’— పైథాగోరస్ ‘అహింస అనేది అత్యున్నతమైన ఆదర్శాలకు దారితీస్తుంది, అదే పరిణామ క్రమ ప్రధానోద్దేశం. అన్ని జీవప్రాణులను హింసించటం ఆపేంతవరకూ, మనమందరమూ అనాగరికులమే.’— థామస్ ఎడిసన్ వ్యక్తి నిజంగా మరియు తీవ్రంగా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటే, ప్రప్రథమంగా ఆయన దూరంగా ఉండవల్సిన విషయం, మాంసాహారం. ఎందుకంటే … దాని వినియోగం ఒక నీతిబాహ్యమైన చర్య, ఎందుకంటే నైతిక విలువలకు విరుద్ధంగా చేయవల్సిన ఓ పనితో కూడుకుని ఉంటుంది – అదే చంపటం.— లియో టాల్ స్టాయ్ నేను నా వయసుకు తగ్గట్టుగా ఉంటాను. ఇతరులే వారి వయస్సుకంటే ఎక్కువ ముసలిగా కనిపిస్తారు. ఇక శవాలను తినే వారికి ఇంతకంటే ఏమి ఆశించగలం?— జార్జ్ బెర్నార్డ్ షా నిజంగానే మానవుడు మృగరాజు, ఎందుకంటే క్రూరత్వంలో జంతువులను మించిపోయాడు. ఇతరుల చావుపై మనం బ్రతుకుతున్నాము. మనం శ్మశానాలమే! అందుకే నేను చిన్నతనం నుండే మాంసాన్ని త్యజించాను....— లియోనార్డో డా విన్సికసాయి వాడి మాంసం మన జీవితానికి అసలేమైనా అవసరమా అని మనం సందేహించాలి... సభ్యత అంటే మనిషి కసాయివాడు ఇచ్చే మాంసాన్ని తినాలనే నియమం ఎక్కడా లేదు.— ఆడమ్ స్మిత్పొలంలో చచ్చి పడిఉన్న గొర్రె లేదా పశువు, తినరాని మాంసంగా పరిగణించబడుతుంది. అదే విధమైన కళేబరం మాంస విక్రయ కొట్టులో వ్రేలాడదీయబడి, ఆహారంగా అందించబడుతుంది!— జే. హెచ్. కెల్లాగ్శాఖాహార జీవన శైలి, కేవలం మానవుల ప్రవ్రుత్తి పై చూపే ప్రభావం చేతనే, మానవ సమాజంలో ఎంతోమందికి శ్రేయస్కరంగా ఉంటుంది, అని నా అభిప్రాయం.— ఆల్బర్ట్ ఐంస్టీన్ఆధ్యాత్మిక పురోగతిలో ఎక్కడో ఒక స్థాయిలో, మన శారీరక అవసరాల కోసం మనం తోటి జీవజంతువులను చంపటం ఆపేయాలి, అనే ఆవశ్యకత వస్తుంది, అని నా నిశ్చిత అభిప్రాయం.— మహాత్మా గాంధిఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇంకా చెప్పాలంటే చెట్లు, చేమలలో కూడా ప్రాణం ఉంటుంది అంటున్నాడు, మరియు మన ఇంద్రియ భోగం కోసమే వాటిని తింటే ప్రాణహాని వల్ల కలిగే కర్మ బంధాలలో చిక్కుకుంటాము. ఈ శ్లోకంలో ఉపయోగించబడిన పదం 'ఆత్మ-కారణాత్', అంటే ‘తన స్వంత భోగం కోసమే’. కానీ యజ్ఞంలో భగవత్ నివేదన చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించినప్పుడు, ఆ దృక్పథం మారుతుంది. మన శరీరాన్ని భగవంతుని సొత్తుగా, దాన్ని భగవంతుని సేవకోసం ఉపయోగించటానికి మన సంరక్షణలో ఉంచబడినట్టు పరిగణిస్తాము. అనుమతించబడిన ఆహారాన్ని, ఆయన అనుగ్రహంగా శరీర పోషణ కోసము స్వీకరిస్తాము. ఈ మనోభావంతో ఆ ప్రక్రియ అంతా పవిత్ర మవుతుంది. భరత ముని ఇలా పేర్కొంటున్నాడు:వసుసతో క్రతు దక్షౌ కాల కామౌ ధృతిః కురుఃపురురవా మద్రవాశ్చ విశ్వదేవాః ప్రకీర్తితాః‘మనకు తెలియకుండానే ఆహారం వండే ప్రక్రియలో, రోకలి, అగ్ని, రుబ్బే యంత్రములు, నీటి కుండలు మరియు చీపురు వంటి వాటి వాడకంతో ఎన్నో ప్రాణులు హింసించబడుతాయి. తమ కోసమే ఆహారం వండుకునే వారు ఈ పాపంలో చిక్కుకుంటారు. కానీ యజ్ఞం అనేది పాప ఫలితాన్ని నిర్మూలిస్తుంది (శూన్యీకరిస్తుంది).’
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః । యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।
14
3
https://www.holy-bhagava…udio/003_014.mp3
అన్నాత్ — అన్నము నుండి; భవంతి — జీవించి ఉండుట; భూతాని — ప్రాణులు; పర్జన్యాత్ — వర్షముల వలన; అన్న — ధాన్యము/అన్నము; సంభవః — ఉత్పత్తి; యజ్ఞాత్ — యజ్ఞములు చేయటం నుండి; భవతి — కలుగును; పర్జన్యః — వాన; యజ్ఞ — యజ్ఞము; కర్మ — నిర్దేశింపబడిన కర్తవ్యములు (విహిత కర్మలు); సముద్భవః — జనించును.
BG 3.14: సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల (విహిత కర్మలు) ఆచరణచే యజ్ఞము జనిస్తుంది.
ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమగును. ధాన్యం భుజించబడి రక్తముగా రూపాంతరం చెందుతుంది. రక్తము నుండి, వీర్యము జనించును. వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు, వీటిచే ప్రీతినొందిన దేవతలు వర్షాలు కురిపిస్తారు. అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముధ్భవమ్ । తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ।। 15 ।।
15
3
https://www.holy-bhagava…udio/003_015.mp3
కర్మ — కర్తవ్యములు; బ్రహ్మ — వేదములలో; ఉద్భవం — ప్రకటితమయ్యెను; విద్ధి — తెలుసుకొనుము; బ్రహ్మా — వేదములు; అక్షర — నాశము కాని వాని నుండి (భగవంతుడు); సముధ్భవమ్ — నేరుగా వ్యక్త మయ్యెను; తస్మాత్ — కాబట్టి; సర్వ-గతం — సర్వ వ్యాపి అయిన; బ్రహ్మ — భగవంతుడు; నిత్యం — ఎల్లప్పుడూ; యజ్ఞే — యజ్ఞము యందే; ప్రతిష్ఠితమ్ — ప్రతిష్ఠితుడై ఉండును.
BG 3.15: మానవుల విహిత కర్మలు (కర్తవ్యములు) వేదములలో చెప్పబడ్డాయి, మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి, సర్వ-వ్యాపియైన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.
వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి: అస్య మహతో భూతస్య నిఃశ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాంగిరసః (బృహదారణ్యక ఉపనిషత్తు 4.5.11). ‘నాలుగు వేదములు - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - అన్నీ సర్వోత్కృష్ట భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి.’ ఈ సనాతనమైన వేదములలో, మనుష్యుల విధులను ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు, ఏ విధంగా తయారుచేయబడ్డాయంటే వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుష్యులు నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకుని, తమని తాము - తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్త్వ గుణానికి - ఉద్ధరించుకోవటం నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగా ఆయనకే అంకితం చేయమని నిర్దేశింపబడ్డాయి. కాబట్టి, భగవంతుని అర్పితముగా పవిత్రం చేయబడిన విధులు, దైవికంగా, భగవత్ సంబంధముగా ఉండి, భగవంతునితో అభేదంగా ఉంటాయి.యజ్ఞం అంటే స్వయంగా భగవంతుడే అని తంత్ర సారము, పేర్కొంటున్నది:యజ్ఞో యజ్ఞ పుమాంశ్చైవ యజ్ఞాశో యజ్ఞ యజ్ఞభావనఃయజ్ఞభుక్ చేతి పంచాత్మా యజ్ఞేశ్విజ్యో హరిః స్వయంభాగవతం (11.19.39)లో శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో ఇలా అంటాడు: యజ్ఞోఽహం భగవత్తమః, ‘నేను, వసుదేవుని పుత్రుడను, నేనే యజ్ఞమును.’ వేదములు ఇలా చెప్తున్నాయి: యజ్ఞో వై విష్ణుః ‘యజ్ఞం అంటే స్వయంగా విష్ణు మూర్తియే.’ ఈ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తూ, ‘భగవంతుడు ఎల్లప్పుడూ యజ్ఞ క్రియ లోనే స్థితుడై ఉంటాడు’ అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకం లో చెప్తున్నాడు.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః । అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ।। 16 ।।
16
3
https://www.holy-bhagava…udio/003_016.mp3
ఏవం — ఈ విధంగా; ప్రవర్తితం — నడయాడే ; చక్రం — చక్రము; న-అనువర్తయతి — అనుసరించడో (కర్తవ్యమును చేయడో); ఇహ — ఈ జీవితంలో; యః — ఎవరైతే; అఘ-ఆయుః — పాపపు జీవితం; ఇంద్రియ-ఆరామః — ఇంద్రియముల ఆనందం కోసము; మోఘం — వ్యర్థముగా; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సః — వారు; జీవతి — బ్రతుకుతారు.
BG 3.16: వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు; అట్టి వారి జీవితము వ్యర్థం.
చక్రం అంటే ఇక్కడ ఒక సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామాలు అని. ధాన్యముల నుండి వర్షముల వరకు జరిగే పరిణామం 3.14వ శ్లోకంలో వివరించబడింది. ఈ విశ్వం అనే చక్రంలో అందరు సభ్యులూ తమ విధులను నిర్వర్తించి దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు. మనం కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాము కాబట్టి, మనం కూడా మనకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తించాలి. ఈ పరంపరలో మన మానవులకు మాత్రమే తాము చేసే పనులను, స్వీయ-స్వేచ్ఛ ద్వారా ఎంచుకోనే అవకాశం కల్పించబడింది. కాబట్టి మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహద పడొచ్చు లేదా ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవటానికి సమస్యాత్మకంగా ఉండవచ్చు. మానవ సమాజం విశ్వంలో అంతర్గత భాగంగా జీవించటానికి తమ బాధ్యతను స్వీకరించినప్పుడు, భౌతిక అభ్యుదయం వెల్లివిరుస్తుంది మరియు అది ఆధ్యాత్మిక పురోగతికి కూడా కారణమగుతుంది. ఇటువంటి కాలాలు మానవాళి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రలో స్వర్ణ యుగాల్లా ఉంటాయి. దీనికి విరుద్ధంగా, ఎప్పుడైతే మానవజాతి యొక్క ప్రధాన విభాగం సార్వత్రిక వ్యవస్థను ఉల్లంఘించటం ప్రారంభిస్తుందో, మరియు విశ్వ వ్యవస్థలో అంతర్భాగంగా తమ బాధ్యతని తిరస్కరించిన తరుణంలో, భౌతిక ప్రకృతి శిక్షించటం ప్రారంభిస్తుంది, దానితో శాంతి, సౌభాగ్యాలు సన్నగిల్లుతాయి. వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న అన్ని ప్రాణులను క్రమశిక్షణతో ఉంచి, నేర్పించి మరియు ఉద్ధరించాటానికే ఈ ప్రకృతి యొక్క చక్రం, భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యజ్ఞంలో, తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ద్వారా పాలుపంచుకొనని వారు తమ ఇంద్రియములకు బానిసలై, పాపపు జీవితాన్ని గడుపుతారు అని శ్రీ కృష్ణుడు అర్జునునికి విశదీకరిస్తున్నాడు. కానీ, భగవంతుని చట్టానికి కట్టుబడి వ్యవహరించినప్పుడు, వారు పవిత్ర హృదయులై మరియు భౌతిక మలినములు అంటకుండా ఉంటారు.
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః । ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే ।। 17 ।।
17
3
https://www.holy-bhagava…udio/003_017.mp3
యః — ఎవరైతే; తు — కానీ; ఆత్మ-రతిః — ఆత్మ యందే రమించునో; ఏవ — తప్పకుండా ; స్యాత్ — ఉండునో; ఆత్మ-తృప్తః — ఆత్మయందే తృప్తిగా ఉండునో; చ — మరియు; మానవః — మానవుడు; ఆత్మని — ఆత్మ యందే; ఏవ — తప్పకుండా; చ — మరియు; సంతుష్టః — తృప్తినొంది; తస్య — అతనికి; కార్యం — కర్తవ్యము; న-విద్యతే — ఉండదు.
BG 3.17: కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయులై, ఆత్మ యందే సంతుష్టులుగా ఉందురో, వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు.
బాహ్య వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే ఆత్మ యందు రమిస్తూ సంతుష్టులుగా ఉండగలరు. ప్రాపంచిక కోరికలే మన బంధానికి మూలకారణం, ‘ఇది ఇలాగే అవ్వాలి, అది కాకూడదు.’ వంటివి. శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో తదుపరి (3.37వ శ్లోకంలో), కోరికలే సమస్త పాపాలకి మూల కారణమనీ, అందుకే వాటిని త్యజించాలి అని, పేర్కొంటున్నాడు. ఇంతకు క్రితం చెప్పినట్టు (2.64వ శ్లోక వ్యాఖ్యానంలో), మనస్సులో గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా శ్రీ కృష్ణుడు కోరికలను త్యజించమన్నప్పుడు, ఆయన ప్రాపంచిక కోరికల గురించి చెప్తున్నట్టు, అంతేకాని ఆధ్యాత్మిక పురోగతి కోసం, లేదా, భగవత్ ప్రాప్తి కోసం ఉన్న కోరికలు కాదు.మరి, అటువంటప్పుడు, అసలు భౌతిక ప్రాపంచిక కోరికలు ఎందుకు జనిస్తాయి? మనల్ని మనం ఈ శరీరమే అనుకుంటే, మన శారీరక, మానసిక వాంఛలే మన ఆత్మ కోరుకునేవి అని అనుకొంటాము, ఇవి మనలను మాయా ప్రపంచంలోకి గిరగిరా విసిరివేస్తాయి. సంత్ తులసీదాస్ ఇలా వివరిస్తున్నాడు:జిబ జిబ తే హరి తే బిలగానో తబ తే దేహ గేహ నిజ మాన్యో,మాయా బస స్వరూప్ బిసరాయో తేహి బ్రమ తే దారుణ దుఃఖ పాయో‘జీవాత్మ తానే భగవంతుని నుండి విడివడిన కారణంగా, అప్పుడు భౌతిక శక్తి దానిని మాయలో కప్పివేసింది. ఈ మాయ వల్ల తనను తాను శరీరమే అనుకొంటూ, తనను తాను ఆత్మనని మరిచి పోయి ఉండటం చేత, దారుణమైన దుఃఖాలను అనుభవిస్తున్నది.’జ్ఞానోదయమైన వారు, ఆత్మ అనేది భౌతికమైనదికాదని, దివ్యమైనదని అందుకే నాశనములేనిదని తెలుసుకుంటారు. నశ్వరమైన ప్రాపంచిక వస్తువులు ఏవీ నిత్యమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు, కాబట్టి ఆ ఇంద్రియ వస్తు-విషయములపై ఉండే యావ, మూర్ఖత్వమే అవుతుంది. ఈ విధంగా ఆత్మ-జ్ఞానులైన మహాత్ములు తమ మనస్సుని భగవంతుని యందే సంయోగం చేసి తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు.ప్రాపంచికంగా బద్ధులైన జీవాత్మలకు నిర్దేశించబడిన కర్మలు (విధులు), జ్ఞానోదయమైన వారికి వర్తించవు; ఎందుకంటే వారు ఆయా కర్మల లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి. ఉదాహరణకు కళాశాల విద్యార్ధిగా ఉన్నంత వరకు ఆ విశ్వవిద్యాలయం యొక్క నియమాలు పాటించాలి, కానీ ఒకసారి ఉత్తీర్ణుడై పట్టభద్రుడైన తరువాత ఆ కళాశాల నియమాలు ఇక అప్రస్తుతమైనవే. అలాంటి ముక్త జీవుల గురించి, ఇలా చెప్పబడింది: ‘బ్రహ్మవిత్ శృతి మూర్ధ్నీ’, ‘ భగవంతునితో సంయోగం నొందిన వారు వేదముల శిరస్సుపై నడుస్తారు’, అంటేవారు ఇక వేదములలో చెప్పిన నియమములను పాటించవల్సిన అవసరం లేదు.మరో ఉదాహరణ చూడండి. ఓ పురోహితుడు ఒక అబ్బాయిని, అమ్మాయిని వివాహ వేడుక నిర్వహించటం ద్వారా ఒక్కటి చేస్తాడు. ఒకసారి ఆ వేడుక అయిపోయిన తరువాత, ‘ఇక మీరు భార్యా-భర్తలు; నేను వెళుతున్నాను’ అంటాడు. ఆయన పని అయిపోయింది. ఒకవేళ భార్య ఇలా అంటే, ‘అయ్యగారూ, పెళ్ళప్పుడు మీరు మాతో చేపించిన ప్రమాణాలను మా ఆయన పాటించటంలేదు.’ అని అంటే, ఆ పురోహితుడు ఇలా జవాబు ఇస్తాడు. ‘ఇది నా పరిధిలోని విషయం కాదు, నా ధర్మ మీ ఇద్దరినీ వివాహంతో ఒక్కటిగా చేయటమే, మరియు ఆ పని అయిపోయింది.’ అని.వేదముల అంతిమ లక్ష్యం జీవాత్మను పరమాత్మ దగ్గరికి చెర్చటమే. ఒకసారి జీవాత్మ భగవత్-ప్రాప్తి నొందిన తరువాత, వేద నియమాలు వర్తించవు; ఆ జీవాత్మ వాటి అజమాయిషీ పరిధిని దాటి పోయింది.
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన । న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ।। 18 ।।
18
3
https://www.holy-bhagava…udio/003_018.mp3
న — ఉండదు; ఏవ — నిజముగా; తస్య — అతనికి; కృతేన — కర్తవ్య నిర్వహణ వలన; అర్థః — ప్రయోజనము; న — కాదు; అకృతేన — విధులు నిర్వర్తించకుండా; ఇహ — ఇక్కడ/ఈ లోకమున; కశ్చన — ఏదైనా; న — ఉండదు; చ — మరియు; అస్య — ఆ వ్యక్తికి; సర్వ-భూతేషు — సమస్త ప్రాణుల తోనూ; కశ్చిత్ — ఏదైనా; అర్థ — అవసరము; వ్యపాశ్రయః — ఆధార పడటానికి.
BG 3.18: ఇటువంటి ఆత్మ-జ్ఞానులైన వారు తమ విధులను (కర్మలను) చేయటం వలన కానీ, చేయకపోవటం వలన కానీ, వారికి వచ్చేది, పోయేవి (లాభనష్టాలు) ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధార పడవలసిన అవసరమూ లేదు.
జ్ఞానోదయమైన మహాత్ములు అలౌకిక ఆత్మ స్థాయిలో ఉంటారు. వారి యొక్క ప్రతి పని కూడా భగవత్ సేవలో అతీంద్రియమైనదే. కాబట్టి శారీరక స్థాయిలోనున్న, ప్రాపంచిక జనులకు, వారి వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం సూచింపబడిన విధులు, ఆత్మజ్ఞానులకు వర్తింపవు. ఇక్కడ కర్మకి, భక్తికి ఉన్న తేడా గుర్తించాలి. ఇంతకు క్రితం శ్రీ కృష్ణుడు కర్మల (విధింపబడిన ప్రాపంచిక విధులు) గురించి మాట్లాడాడు, వాటిని భగవత్ అర్పితంగా చేయమన్నాడు. అంతఃకరణ శుద్దికి, మనస్సుని ప్రాపంచిక మలినములకు అతీతంగా చేయటం కోసం ఇది చాలా ఆవశ్యకం. కానీ జ్ఞానోదయమయిన జీవాత్మలు, పరిశుద్ధ మనస్సు కలిగి, భగవంతుని యందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకున్నారు. ఇటువంటి మహాత్ములు నేరుగా భక్తియందే, అంటే ధ్యానం, అర్చన, కీర్తన, గురు సేవ వంటి పూర్తి ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నమై ఉంటారు. ఇటువంటి జీవాత్మలు తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే అది పాపం అనిపించుకోదు. వారు కావాలనుకుంటే ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు కానీ వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. చరిత్రలో చూస్తే, సత్పురుషులు రెండు రకాలుగా ఉంటారు, 1) ప్రహ్లాదుడు, ధృవుడు, అంబరీషుడు, పృథువు, మరియు విభీషణుడు వంటి వారు, వీరు అతీంద్రియ స్థాయి చేరుకున్న తరువాత కూడా తమ విధులను నిర్వర్తించారు. వీరు కర్మ యోగులు — బాహ్యంగా తమ విధులను చేసినా అంతర్గతంగా తమ మనస్సు భగవంతుని యందే చేర్చిన వారు. 2) శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, మరియు చైతన్య మహాప్రభు వంటి వారు, వీరు తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచి పెట్టి, సన్యాస జీవితాన్ని తీసుకున్నారు. వీరు కర్మ సన్యాసులు, వీరు బాహ్యంగా, అంతర్గతంగా కూడా శారీరికంగా, మనస్సుతో, భగవత్ భక్తిలోనే నిమగ్నమయ్యారు. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి, జ్ఞానోదయమైన మునులకు ఈ రెండు పద్ధతులలో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంది, అని చెప్తున్నాడు. ఇక తదుపరి శ్లోకంలో, ఈ రెంటిలో, ఏది అర్జునుడికి అనువైనదో శ్రీ కృష్ణ పరమాత్మ పేర్కొంటాడు.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర । అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ।। 19 ।।
19
3
https://www.holy-bhagava…udio/003_019.mp3
తస్మాత్ — కాబట్టి; అసక్తః — ఆసక్తి రహితుడవై (మమకారము లేకుండా); సతతం — ఎల్లప్పుడూ; కార్యం — కర్తవ్యమును; కర్మ — పని; సమాచర — నిర్వర్తించుము; అసక్తః — ఆసక్తి రహితుడవై (మమకారం లేకుండా); హి — నిజముగా; ఆచరన్ — ఆచరిస్తూ; కర్మ — పని చేయుము; పరం — ఆ పరమాత్మ; ఆప్నోతి — పొందును; పూరుషః — వ్యక్తి.
BG 3.19: కాబట్టి, మమకారాసక్తులను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము, ఏలనన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.
3.8వ శ్లోకం నుండి 3.16వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు, జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయి చేరనంత వరకూ, వారి వారి విహిత (చేయవలసిన) కర్మలను చేస్తుండమనే చెప్పాడు. 3.17వ మరియు 3.18వ శ్లోకాలలో, జ్ఞానోదయమైన మహాత్ములు విధింపబడిన కర్మలను చేయనవసరం లేదు అన్నాడు. కాబట్టి అర్జునుడికి ఈ రెంటిలో ఏ మార్గం యోగ్యమయినది? శ్రీ కృష్ణుడి సిఫారసు, అతన్ని కర్మ యోగిలా ఉండమనే, కర్మ సన్యాసం తీసుకోవద్దనే. దీనికి గల కారణాన్ని 3.20వ శ్లోకం నుండి 3.26వ శ్లోకం వరకూ వివరిస్తాడు.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః । లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ।। 20 ।। యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః । స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 21 ।।
20
3
https://www.holy-bhagava…/003_020-021.mp3
కర్మణా — విహిత కర్మలు చేయటం వలన; ఏవ — మాత్రమే; హి — తప్పకుండా; సంసిద్ధిం — పరిపూర్ణ సిద్ధి; ఆస్థితాః — పొందెను; జనక-ఆదయః — జనక మహారాజు, ఇంకా ఇతర రాజులు; లోక-సంగ్రహం — లోక హితము కోసము; ఏవ అపి — మాత్రమే; సంపశ్యన్ — దృష్టిలో ఉంచుకొని; కర్తుం — చేయటానికే; అర్హసి — నీవు తగిఉన్నావు; యత్ యత్ — ఏదైతే; ఆచరతి — చేస్తారో; శ్రేష్ఠ — శ్రేష్ఠులు; (మహాత్ములు); తత్ తత్ — అది మాత్రమే; ఏవ — తప్పకుండా; ఇతరః — ఇతరులు (సామాన్యులు); జనః — జనులు; సః — వారు; యత్ — దేనినైతే; ప్రమాణం — ప్రమాణముగా; కురుతే — చేయుదురో; లోకః — ప్రపంచము; తత్ — దానిని; అనువర్తతే — అనుసరించును.
BG 3.20-21: తమ ధర్మములను (విహిత కర్మలను) నిర్వర్తించటం ద్వారానే, జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి, నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.
జనక మాహారాజు, తన రాజ ధర్మాలను నిర్వర్తిస్తూనే, కర్మయోగం ద్వారా సిద్దిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా, కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. ఇంకా చాలా మంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా చేసారు. మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను/నడవడిక చూసి మానవాళి ప్రభావితమౌతుంది. అటువంటి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనులు అనుసరించడానికి మార్గదర్శకమౌతారు. ఈ విధంగా, సమాజంలో ఉండే నాయకులకు, తమ నడవడిక (మాటలు, చేతలు, ప్రవర్తన) ద్వారా, జనసామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో, సహజంగానే మిగతా సమాజం కూడా నీతిప్రవర్తన, నిస్వార్థం మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ, ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో, మిగతా సమాజం కూడా, వారికి అనుసరించే ప్రమాణం లేక, స్వార్థ పూరితంగా, అనైతికతతో, మరియు ఆధ్యాత్మిక అనాసక్తతతో దిగజారి పోతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిల్పటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయి చేరుకుని, వేద విహిత కర్మలు చేయనవసరం లేకున్నా, అవి చేయటం వలన, వారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయటంలో ఒక ఆదర్శం/ఉదాహరణ చూపినట్టు ఉంటుంది. సమాజంలో ఒక గొప్ప నాయకుడు కర్మ సన్యాసి అయి, పనులను విడిచిపెడితే, అది ఇతరులకు ఒక అయోమయ దృష్టాంతం చూపినట్టు అవుతుంది. ఆ నాయకుడు, పరిపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథంలో ఉండి, విహిత కర్మలను త్యజించి, పూర్తిగా ఆధ్యాత్మిక పథంలో నడవటానికి అర్హుడై ఉండవచ్చు. కానీ, సమాజంలో మిగతావారు, వారి దృష్టాంతం చూపి, దానిని, పని తప్పించుకోవటానికి (పలాయనవాదం) ఉపయోగించవచ్చు. ఇలాంటి పనితప్పించుకునేవారు, మహోన్నత కర్మ సన్యాసులైన, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కాచార్యులు మరియు చైతన్య మహాప్రభు వంటి వారి చర్యలను ఉదహరిస్తుంటారు. వారి ఉత్కృష్టమైన అడుగు జాడల్లో నడవబోయి, ఈ వేషగాళ్ళు కూడా, కావలసిన చిత్త శుద్ధి సాధించకుండానే, ప్రాపంచిక విధులను త్యజించి ‘సన్యాసం’ తీసుకుంటారు. భారత దేశంలో ఇలాంటి సాధువులు వేలమంది ఉంటారు. వారు కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు - కానీ దానికి అనుగుణమైన అంతర్గత జ్ఞానోదయం, ఆధ్యాత్మికానందం లేకుండానే, మహాత్ములైన సన్యాసులని అనుకరిస్తుంటారు. బాహ్యంగా సన్యసించినా, వారి స్వస్వభావమే వారిని ఆనందాన్వేషణకి పురిగొల్పుతుంది. భగవంతుని దివ్యానంద ప్రాప్తి లేని కారణంగా నీచస్థాయి భోగాలైన మత్తు/నిషా పదార్థాలతో మునిగిపోతారు. ఈ విధంగా వారు, ఈ క్రింద ఉదహరించిన శ్లోకంలో చెప్పినట్టుగా, గృహస్తులుగా ఉన్న వారి కంటే తక్కువ స్థాయికి దిగజారి పోతారు. బ్రహ్మ జ్ఞాన జాన్యో నహీఁ, కర్మ దియే చ్చితకాయ, తులసీ ఐసీ ఆత్మా సహజ నరక మహ్ జాయ సంత్ తులసీదాసు ఇలా అన్నాడు: ‘దివ్య జ్ఞానంచే ప్రకాశితమైన అంతర్గత మహోన్నత వ్యక్తిత్వం లేకుండా, ప్రాపంచిక విధులను త్యజించిన వాడు నరకానికి దగ్గరి మార్గంలో ప్రయాణించినట్టు.’ అలా కాకుండా, ఒక గొప్ప నాయకుడు కర్మ యోగిగా ఉంటే, ఆయనను అనుసరించేవారు కనీసం తమ కర్మలను చేస్తూ, బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. ఇది వారికి తమ మనస్సుని, ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకొనటానికి మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశ చేరుకోవటానికి దోహదపడుతుంది. కాబట్టి, సమాజానికి ఒక ఆదర్శం చూపటానికి శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ యోగం అభ్యాసం చేయమంటున్నాడు. ఇక తన సొంత ఉదాహరణని దీనిని విశదీకరించటానికి చెప్తున్నాడు.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః । లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ।। 20 ।। యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః । స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 21 ।।
21
3
https://www.holy-bhagava…/003_020-021.mp3
కర్మణా — విహిత కర్మలు చేయటం వలన; ఏవ — మాత్రమే; హి — తప్పకుండా; సంసిద్ధిం — పరిపూర్ణ సిద్ధి; ఆస్థితాః — పొందెను; జనక-ఆదయః — జనక మహారాజు, ఇంకా ఇతర రాజులు; లోక-సంగ్రహం — లోక హితము కోసము; ఏవ అపి — మాత్రమే; సంపశ్యన్ — దృష్టిలో ఉంచుకొని; కర్తుం — చేయటానికే; అర్హసి — నీవు తగిఉన్నావు; యత్ యత్ — ఏదైతే; ఆచరతి — చేస్తారో; శ్రేష్ఠ — శ్రేష్ఠులు; (మహాత్ములు); తత్ తత్ — అది మాత్రమే; ఏవ — తప్పకుండా; ఇతరః — ఇతరులు (సామాన్యులు); జనః — జనులు; సః — వారు; యత్ — దేనినైతే; ప్రమాణం — ప్రమాణముగా; కురుతే — చేయుదురో; లోకః — ప్రపంచము; తత్ — దానిని; అనువర్తతే — అనుసరించును.
BG 3.20-21: తమ ధర్మములను (విహిత కర్మలను) నిర్వర్తించటం ద్వారానే, జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి, నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.
జనక మాహారాజు, తన రాజ ధర్మాలను నిర్వర్తిస్తూనే, కర్మయోగం ద్వారా సిద్దిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా, కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. ఇంకా చాలా మంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా చేసారు. మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను/నడవడిక చూసి మానవాళి ప్రభావితమౌతుంది. అటువంటి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనులు అనుసరించడానికి మార్గదర్శకమౌతారు. ఈ విధంగా, సమాజంలో ఉండే నాయకులకు, తమ నడవడిక (మాటలు, చేతలు, ప్రవర్తన) ద్వారా, జనసామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో, సహజంగానే మిగతా సమాజం కూడా నీతిప్రవర్తన, నిస్వార్థం మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ, ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో, మిగతా సమాజం కూడా, వారికి అనుసరించే ప్రమాణం లేక, స్వార్థ పూరితంగా, అనైతికతతో, మరియు ఆధ్యాత్మిక అనాసక్తతతో దిగజారి పోతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిల్పటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయి చేరుకుని, వేద విహిత కర్మలు చేయనవసరం లేకున్నా, అవి చేయటం వలన, వారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయటంలో ఒక ఆదర్శం/ఉదాహరణ చూపినట్టు ఉంటుంది. సమాజంలో ఒక గొప్ప నాయకుడు కర్మ సన్యాసి అయి, పనులను విడిచిపెడితే, అది ఇతరులకు ఒక అయోమయ దృష్టాంతం చూపినట్టు అవుతుంది. ఆ నాయకుడు, పరిపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథంలో ఉండి, విహిత కర్మలను త్యజించి, పూర్తిగా ఆధ్యాత్మిక పథంలో నడవటానికి అర్హుడై ఉండవచ్చు. కానీ, సమాజంలో మిగతావారు, వారి దృష్టాంతం చూపి, దానిని, పని తప్పించుకోవటానికి (పలాయనవాదం) ఉపయోగించవచ్చు. ఇలాంటి పనితప్పించుకునేవారు, మహోన్నత కర్మ సన్యాసులైన, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కాచార్యులు మరియు చైతన్య మహాప్రభు వంటి వారి చర్యలను ఉదహరిస్తుంటారు. వారి ఉత్కృష్టమైన అడుగు జాడల్లో నడవబోయి, ఈ వేషగాళ్ళు కూడా, కావలసిన చిత్త శుద్ధి సాధించకుండానే, ప్రాపంచిక విధులను త్యజించి ‘సన్యాసం’ తీసుకుంటారు. భారత దేశంలో ఇలాంటి సాధువులు వేలమంది ఉంటారు. వారు కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు - కానీ దానికి అనుగుణమైన అంతర్గత జ్ఞానోదయం, ఆధ్యాత్మికానందం లేకుండానే, మహాత్ములైన సన్యాసులని అనుకరిస్తుంటారు. బాహ్యంగా సన్యసించినా, వారి స్వస్వభావమే వారిని ఆనందాన్వేషణకి పురిగొల్పుతుంది. భగవంతుని దివ్యానంద ప్రాప్తి లేని కారణంగా నీచస్థాయి భోగాలైన మత్తు/నిషా పదార్థాలతో మునిగిపోతారు. ఈ విధంగా వారు, ఈ క్రింద ఉదహరించిన శ్లోకంలో చెప్పినట్టుగా, గృహస్తులుగా ఉన్న వారి కంటే తక్కువ స్థాయికి దిగజారి పోతారు. బ్రహ్మ జ్ఞాన జాన్యో నహీఁ, కర్మ దియే చ్చితకాయ, తులసీ ఐసీ ఆత్మా సహజ నరక మహ్ జాయ సంత్ తులసీదాసు ఇలా అన్నాడు: ‘దివ్య జ్ఞానంచే ప్రకాశితమైన అంతర్గత మహోన్నత వ్యక్తిత్వం లేకుండా, ప్రాపంచిక విధులను త్యజించిన వాడు నరకానికి దగ్గరి మార్గంలో ప్రయాణించినట్టు.’ అలా కాకుండా, ఒక గొప్ప నాయకుడు కర్మ యోగిగా ఉంటే, ఆయనను అనుసరించేవారు కనీసం తమ కర్మలను చేస్తూ, బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. ఇది వారికి తమ మనస్సుని, ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకొనటానికి మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశ చేరుకోవటానికి దోహదపడుతుంది. కాబట్టి, సమాజానికి ఒక ఆదర్శం చూపటానికి శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ యోగం అభ్యాసం చేయమంటున్నాడు. ఇక తన సొంత ఉదాహరణని దీనిని విశదీకరించటానికి చెప్తున్నాడు.
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన । నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ।। 22 ।।
22
3
https://www.holy-bhagava…udio/003_022.mp3
న — లేదు; మే — నాకు; పార్థ — అర్జునా; అస్తి — ఉండటము; కర్తవ్యమ్ — కర్తవ్యము ; త్రిషు — ఈ మూడు; లోకేషు — లోకాల్లో; కించన — ఏమాత్రమయినా; న — లేదు; అనవాప్తం — పొందదగినది; అవాప్తవ్యం — సాధించ వలసినది; వర్తే — చేయుచున్నాను; ఏవ — ఇంకా; చ — మరియు; కర్మణి — కర్మ యందు.
BG 3.22: ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు, అర్జునా, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినదీ లేదు. అయినా నేను చేయవల్సిన విధులను చేస్తూనే ఉంటాను.
మనమందరమూ ఎందుకు పని చేస్తున్నామంటే మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి. మనమందరమూ అనంతానంద సముద్రమైన భగవంతుని అణు అంశములము, కాబట్టి మనమందరమూ ఆనందాన్ని వెతుక్కుంటున్నాము. మనకు ఆ పరిపూర్ణ/నిష్కలంకమైన ఆనందం ఇంకా లభించలేదు కాబట్టి మనకు అసంతృప్తి, అసంపూర్ణత ఉన్నాయి. కాబట్టి, మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. కానీ, ఆనందం అనేది భగవంతుని శక్తులలో ఒకటి, ఆయనకు మాత్రమే అది అనంతమైన పరిమాణంలో ఉంటుంది. అయిన తనకు తానే సమగ్రమైన పరిపూర్ణుడు మరియు ఆయనకు బాహ్యమైనది ఏమీ అవసరం లేదు. అందుకే, ఆయనను ఆత్మారాముడు (తనలో తానే రమించువాడు), ఆత్మ-రతీ (తన పట్ల తానే ఆకర్షితమైయ్యే వాడు) మరియు ఆత్మ-క్రీడ (దివ్య లీలలను తన స్వరూపం తోనే చేసేవాడు) అంటారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కర్మలు(పనులు) చేస్తే, దానికి ఒకే ఒక కారణం ఉండవచ్చు — అవి తన కోసము కాదు; ఇతరుల సంక్షేమం కోసమే. ఈ విధంగా, తన సాకార స్వరూపంలో శ్రీకృష్ణుడిగా, ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా, లోక హితార్థం పని చేస్తున్నానని, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన కర్మలు చేసినప్పుడు కలిగే లోక హితం, ఇక తదుపరి వివరిస్తున్నాడు.
యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః । మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 23 ।।
23
3
https://www.holy-bhagava…udio/003_023.mp3
యది — ఒకవేళ; హి — నిజముగా; అహం — నేను; న — కాదు; వర్తేయం — ప్రవర్తించు; జాతు — ఎప్పటికీ; కర్మణి — విహిత కర్మలు ఆచరించటంలో; అతంద్రితః — జాగ్రత్తగా; మమ — నా యొక్క; వర్త్మ — దారిని; అనువర్తంతే — అనుసరిస్తారు; మనుష్యాః — అందరు మనుష్యులు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సర్వశః — అన్ని విధములుగా.
BG 3.23: నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థా, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు.
భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా, తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా, వృష్ణి వంశంలో అవతారమెత్తాడు. ఒకవేళ శ్రీ కృష్ణ పరమాత్మయే తన వేదవిహిత కర్మలను చేయకపోతే, అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకొంటూ, ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించటంచే దోషుడనవుతాను అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ । సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ।। 24 ।।
24
3
https://www.holy-bhagava…udio/003_024.mp3
ఉత్సీదేయుః — నాశనమగును; ఇమే — ఇవన్నీ; లోకాః — లోకములు; న, కుర్యాం — నేను చేయకపోతే; కర్మ — కర్తవ్యమును; చేత్ — ఒకవేళ; అహం — నేను; సంకరస్య — అసాంస్కృతిక జనుల; చ — మరియు; కర్తా — బాధ్యుడను; స్యామ్ — అగుదును; ఉపహన్యామ్ — నాశనమగును; ఇమాః — ఇవన్నీ; ప్రజాః — ప్రాణులు.
BG 3.24: నేను నా కర్తవ్యములను చేయకపోతే, ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను, మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.
శ్రీ కృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు, ఆయన రాజ వీరుల కుటుంబీకునిగా, సమాజంలో అన్నివిధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే, ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని, మిగతా జనులు, ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు. శ్రీ కృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే, ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు, కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి, శ్రీ కృష్ణుడు దానికి దోషుడు అనబడుతాడు. ఈ విధంగా, తను చేయవలసిన విధులను చేయకపోతే, సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమౌతాయి అని శ్రీ కృష్ణుడు, అర్జునుడుకి వివరిస్తున్నాడు. అదే విధంగా, అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని ప్రపంచ ప్రఖ్యాతినొందాడు, అతను ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే తన ధర్మ బద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే, ఏంతో మంది ఉన్నతమైన ఇతర వీరులు, యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచి పెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతని నాశనం చేసి, ధర్మాత్ములు, అమాయకులు అయిన ప్రజల వినాశనానికి కారకమవుతుంది. అందుకే, సమస్త మానవ జాతి కళ్యాణం కోసం, తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చచెప్పుతున్నాడు.
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత । కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ।। 25 ।।
25
3
https://www.holy-bhagava…udio/003_025.mp3
సక్తాః — ఆసక్తి/మమకారంతో; కర్మణి — కర్తవ్య కర్మలు; అవిద్వాంసః — అజ్ఞానులు; యథా — ఎట్లయితే; కుర్వంతి — చేస్తారు; భారత — భరత వంశీయుడా (అర్జునా); కుర్యాత్ — చేయవలెను; విద్వాన్ — విద్వాంసులు (జ్ఞానులు); తథా — అదే విధముగా; అసక్తః — ఆసక్తిరహితుడవై; చికీర్షుః — ఆశించి; లోక-సంగ్రహమ్ — లోక హితము కోసము.
BG 3.25: అజ్ఞానులు కర్మ ఫలముల యందు ఆసక్తి/మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా, ఓ భరత వంశీయుడా, జ్ఞానులు కూడా (లోకహితం కోసం), జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి.
ఇంతకు పూర్వం, 3.20వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, 'లోక-సంగ్రహం ఏవాపి సంపశ్యన్' అంటే 'జనుల సంక్షేమం దృష్ట్యా' అనే పద ప్రయోగం చేసాడు. ఈ శ్లోకం లో, లోక-సంగ్రహం చికీర్షు, అంటే 'ప్రపంచ సంక్షేమం కోరి' అని. ఈ విధంగా, జ్ఞానులు మానవ జాతి ప్రయోజనం కోసం ఎప్పుడూ కర్మలు చేయాలని శ్రీ కృష్ణుడు మరొకసారి ఉద్ఘాటించాడు.ఇంకా, ఈ శ్లోకంలో 'సక్తాః అవిద్వాంసః' అన్న పదాలు, శారీరక దృక్పథంలోనే ఉండి, ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలిగున్నా, శాస్త్రవిహిత వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉన్న జనుల కోసం వాడబడింది. వారు అజ్ఞానులు/అవివేకులు అనబడుతారు ఎందుకంటే, వారికి పుస్తక జ్ఞానం ఉన్నా, వారు భగవత్ ప్రాప్తియే అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోరు. అలాంటి అమాయకులు, బద్ధకము, శంక లేకుండా, తమ కర్తవ్యమును జాగ్రత్తగా శాస్త్రోక్తము గా నిర్వర్తిస్తారు. వైదిక ధర్మాలను, కర్మ కాండలను చేయటం వలన వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం వస్తుందని వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఉన్నతమైన భక్తి యందు శ్రద్ధ కలగకుండానే, అలాంటి వ్యక్తులకు విహిత కర్మల పట్ల ఉన్న నమ్మకాన్ని పోగోడితే, వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పబడింది :తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా ।మత్కథాశ్రవణాదౌ వా శ్రద్ధా యావన్న జాయతే(11.20.9)‘ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలుగనంత వరకు, భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకు, కర్మలను ఆచరిస్తూనే ఉండవలెను.’ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో, అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో, భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా, సమాజానికి ఆదర్శం చూపటానికి చేయాలి. అంతేకాక, ప్రస్తుతం అర్జునుడున్న పరిస్థితి ఒక ధర్మ యుద్ధం. కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ వీరునిగా తన కర్తవ్యం నిర్వహించాలి.
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ । జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ।। 26 ।।
26
3
https://www.holy-bhagava…udio/003_026.mp3
న — కూడదు; బుద్ధి-భేదం — బుద్ధి యందు కలత; జనయేత్ — కలిగించుట; అజ్ఞానామ్ — అజ్ఞానులకు; కర్మ-సంగినామ్ — కర్మఫల ఆపేక్ష కలవారికి; జోషయేత్ — చేయటానికి స్ఫూర్తినివ్వవలెను; సర్వ — అన్నీ; కర్మాణి — విహిత కర్మలను; విద్వాన్ — జ్ఞానులు; యుక్తః — జ్ఞానోదయం అయినవారు; సమాచరన్ — బాగుగా ఆచరించుచూ.
BG 3.26: కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా, ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని, జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా, జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ, అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను.
గొప్ప వ్యక్తులు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, ఎందుకంటే సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి, అజ్ఞానులను మరింత పతనానికి గురి చేసే ఎలాంటి మాటలను, చేతలను జ్ఞానులు చేయరాదని శ్రీ కృష్ణుడు అభ్యర్థిస్తున్నాడు. జ్ఞానులకు అజ్ఞానుల పట్ల కరుణ కలిగితే, వారికి అత్యున్నత జ్ఞానం - భగవత్ ప్రాప్తి జ్ఞానం - ప్రసాదించవచ్చని కొందరు వాదించవచ్చు. శ్రీ కృష్ణ భగవానుడు ఈ వాదాన్ని నిర్వీర్యం చేస్తూ, 'న బుద్ధి భేదం జనఏత్’ అన్నాడు, అంటే, అజ్ఞానులకి అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చెప్తూ, వారి విధులను విడిచి పెట్టమని ఎన్నటికీ చెప్పరాదు, అని. సాధారణంగా, ప్రాపంచిక దృక్పథంలో ఉన్న ప్రజలు కేవలం రెండు పద్ధతులనే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫలాసక్తితో కష్టపడి పనిచేస్తారు లేదా అన్ని పనులనీ శ్రమతో కూడినవి, కష్టతరమైనవి ఇంకా పాపిష్టివి అని వాటన్నిటినీ విడిచి పెట్టడానికి చూస్తారు. ఈ రెంటిలో, తప్పించుకునే పద్ధతి కన్నా, ఫలాసక్తితో పని చేయటమే ఏంతో మేలైనది. కాబట్టి, వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు, అజ్ఞానులకు కూడా తమ విధులను చక్కగా శ్రద్ధతో నిర్వర్తించేలా, స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకుల పడి కలతచెందితే, వారికి అసలు పని చేయటం మీదే విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒకపక్క పనులు ఆపి, మరోపక్క జ్ఞానం వృద్ది చెందక , అజ్ఞానులు రెంటికీ చెడిపోతారు. మరి జ్ఞానులు, అజ్ఞానులు కూడా తమ వైదిక ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే , వారి మధ్య ఉన్న భేదం ఏమిటి ? ఇలాంటి ప్రశ్నను ముందే ఊహించి, శ్రీ కృష్ణుడు తదుపరి రెండు శ్లోకాలలో దీనిని వివరిస్తున్నాడు.
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః । అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।
27
3
https://www.holy-bhagava…udio/003_027.mp3
ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.
BG 3.27: అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.
ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి. ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త. మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది. కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పని చేస్తాయి.
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః । గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ।। 28 ।।
28
3
https://www.holy-bhagava…udio/003_028.mp3
తత్త్వ-విత్ — సత్యమును ఎరిగినవాడు; తు — కానీ; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; గుణ-కర్మ — గుణములు మరియు కర్మలచే; విభాగయోః — తారతమ్యము గుర్తించును; గుణాః — ఇంద్రియ-మనస్సు రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; గుణేషు — ఇంద్రియ గ్రాహ్య వస్తువుల రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; వర్తంతే — ప్రవర్తిల్లును; ఇతి — ఈ విధంగా; మత్వా — తెలుసుకొని; న, సజ్జతే — ఆసక్తితో ఉండరు.
BG 3.28: ఓ మహా బాహువులున్న అర్జునా, జ్ఞానులు, ప్రకృతి-గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే (ఇంద్రియములు, మనస్సు వంటి రూపంలో ఉన్న) గుణముల (ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో) యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు.
ఇంతకు పూర్వ శ్లోకం ఏం చెప్పిందంటే, 'అహంకార విమూఢాత్మా' (అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు) తామే కర్తలము అనుకుంటారు. ఈ శ్లోకం తత్త్వ-విత్ (సత్యమును ఎరిగినవారు) ల గురించి చెపుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకున్న వారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛ పొంది, తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు, బదులుగా, ప్రతి కార్యకలాపం కూడా మూడు గుణముల కదలిక వల్లనే జరుగుతున్నాయని తలుస్తారు. ఇటువంటి, భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇలా అంటారు: ‘జో కరఇ సో హరి కరఇ, హోతా కబీర్ కబీర్’ - ‘భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ జనులు నేను చేస్తున్నాననుకుంటున్నారు’
ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు । తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ ।। 29 ।।
29
3
https://www.holy-bhagava…udio/003_029.mp3
ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; గుణ — గుణములచే; సమ్మూఢాః — భ్రమకు లోనై; సజ్జంతే — ఆసక్తుడై; గుణ-కర్మసు — కర్మ ఫలముల యందు; తాన్ — వారు; అకృత్స్న-విదః — జ్ఞానము లేని జనులు; మందాన్ — అవివేకులు; కృత్స్న-విత్ — జ్ఞానులు; న విచాలయేత్ — కలవరపరచరాదు.
BG 3.29: గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనయిన వారు, వారి కర్మ ఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ, ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఇది తెలియని అజ్ఞానులను కలవర పరచరాదు.
మరి జీవాత్మ అనేది గుణములు, వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనదే అయితే మరి అజ్ఞానులు ఇంద్రియ వస్తు/విషయముల పై మమకారాసక్తులు ఎందుకు అవుతారు? అని సందేహం రావచ్చు. వారు ప్రకృతి గుణములచే భ్రమకు లోనై వారే కర్తలము అని అనుకుంటున్నారు అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ప్రకృతి యొక్క త్రి-గుణములచే పూర్తిగా సమ్మోహితులై, వారు ఇంద్రియ, శారీరక, మానసిక ఆనందం కోసమే పని చేస్తుంటారు. వారు కర్మలను ఒక కర్తవ్యంగా, ఫలాపేక్ష లేకుండా చేయలేరు. కానీ, కృత్స్న-విత్ (జ్ఞానులు) లు, అంతగా విషయ జ్ఞానం లేని వారి మనసులను కలవర పెట్టరాదు. అంటే, జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై ‘ నీవు ఆత్మవి, శరీరం కాదు కాబట్టి కర్మ అర్థరహితమైనది, దాన్ని విడిచిపెట్టు ’ అని బలవంతగా రుద్దటానికి ప్రయత్నించరాదు. వారు అజ్ఞానులకి తమ విహిత కర్మలని చేస్తుండమని ఉపదేశిస్తూ, నెమ్మదిగా మమకార/ఆసక్తి అతీత స్థితిని చేరుకోవటానికి సహకరించాలి. ఈ ప్రకారంగా, ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్న వారికి, అదిలేని వారికి ఉన్న తేడాని వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదు అనే గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు.
మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా । నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ।। 30 ।।
30
3
https://www.holy-bhagava…udio/003_030.mp3
మయి — నా యందు; సర్వాణి — సమస్త; కర్మాణి — కర్మలను; సంన్యస్య — పూర్తిగా అర్పించి; అధ్యాత్మ-చేతసా — భగవంతుని యందే ధ్యాస ఉంచి; నిరాశీః — కర్మ ఫలములపై యావ/ఆశ లేకుండా; నిర్మమః — నాది అన్న భావన లేకుండా; భూత్వా — ఉండి; యుధ్యస్వ — యుద్ధం చేయుము; విగత-జ్వరః — మానసిక జ్వరం లేకుండా
BG 3.30: అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి, పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశ, స్వార్ఠ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడివై, యుద్ధం చేయుము!
తనదైన సహజ శైలిలో, శ్రీ కృష్ణుడు ఒక విషయం పై పూర్తి అర్థవివరణచేసి, చివరికి దాని సారాంశం చెప్తాడు. ‘అధ్యాత్మ-చేతసా’ అంటే ‘తలంపులన్నీ భగవంతుని యందే ఉంచి’ అని అర్థం. సన్న్యస్య అంటే ‘భగవంతునికి సమర్పితముకాని అన్ని క్రియలను విడిచి’ అని. నిరాశీః అంటే ‘కర్మ ఫలములపై యావ/ఆశ లేకుండా’ అని. అన్ని పనులను ఈశ్వర అర్పితముగా చేయటము అంటే, నాది అన్న భావన విడిచి, స్వలాభం కోసం కోరికలను, దురాశను, శోకాన్ని త్యజించాలి. మునుపటి శ్లోకాల్లో ఉన్న ఉపదేశ సారాంశం ఏమిటంటే - ప్రతివారు నిజాయితీతో ఇలా మననం చేయాలి, ‘నా ఆత్మ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అణుఅంశము. ఆయనే అన్నిటికీ భోక్త, యజమాని. నా పనులన్నీ ఆయన ప్రీతి కోసమే, అందుకే నేను నా విధులను యజ్ఞం లాగ భగవత్ అర్పితముగా చేయాలి. నేను యజ్ఞంలాగా చేసే పనులన్నిటికీ ఆయనే శక్తిని ఇస్తున్నాడు. అందుకే నాచే చేయబడే పనులకు నేను క్రెడిటు(కీర్తి) తీసుకోవద్దు.’
యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః । శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః ।। 31 ।।
31
3
https://www.holy-bhagava…udio/003_031.mp3
యే — ఎవరైతే; మే — నా; మతం — బోధనలు; ఇదం — ఈ యొక్క; నిత్యం — ఎల్లప్పుడూ; అనుతిష్ఠంతి — పాటిస్తారో; మానవాః — మానవులు; శ్రద్ధా-వంతః — గాఢమైన విశ్వాసంతో; అనసూయంతః — అసూయారహితులై; ముచ్యంతే — ముక్తులవుతారు; తే — వారు; అపి — కూడా; కర్మభిః — కర్మ బంధాలనుండి.
BG 3.31: పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో, అసూయ లేకుండా, నా ఈ బోధనలను పాటించే వారు కర్మ బంధముల నుండి విముక్తులౌతారు.
చాలా అందంగా, దేవదేవుడు తను వివరించిన సిద్ధాంతాన్ని 'మత' (అభిప్రాయం) అన్నాడు. అభిప్రాయం అనేది వ్యక్తిగత దృక్పథం, సూత్రం అంటే ఒక సార్వత్రిక వాస్తవం. అభిప్రాయాలు అనేవి బోధకుల బట్టి మారవచ్చు, కానీ సూత్రం అదే ఉంటుంది. తత్త్వవేత్తలు మరియు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను సూత్రాలుగా చెప్తారు. కానీ గీతలో తను చెప్పిన సూత్రాన్ని భగవంతుడు తన అభిప్రాయం అన్నాడు. తన ఉదాహరణతో మనకు వినయాన్ని, మర్యాదను నేర్పుతున్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం పిలుపు నిచ్చిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు, భగవద్గీత యొక్క ఉపదేశాలను విశ్వాసంతో స్వీకరించి వాటిని జీవితంలో శ్రద్ధగా పాటిస్తే కలిగే శ్రేయస్సుని సూచిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకొని మన జీవితాలను మార్చుకోవటమే, మనుష్యులుగా మనకున్న విశేషధర్మం. ఈ విధంగా, మన మానసిక జ్వరాలు (కామం, క్రోధం, లోభం, ఈర్ష్య, భ్రమ, మరియు ఇతర మానసిక వ్యాధులు మొదలైనవి) ఉపశమిస్తాయి. ఇంతకు పూర్వ శ్లోకంలో, అన్ని కార్యములనూ తనకే అర్పితము చేయమని శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. కానీ, ఈ ఉపదేశం పట్ల, భగవంతుని మీద విశ్వాసం లేని వారి నుండి అవహేళన ఎదురవ్వచ్చు మరియు భగవంతునిపై ఈర్ష్య కలవారి నుండి తిరస్కారం ఎదురవ్వచ్చు. కాబట్టి, దృఢవిశ్వాసంతో ఈ ఉపదేశాన్ని స్వీకరించవలసిన అవసరాన్ని శ్రీ కృష్ణుడు నొక్కిచెప్తున్నాడు. నమ్మకంతో ఈ ఉపదేశాన్ని పాటించేవారు కర్మ బంధాలనుండి విముక్తులౌతారు. మరిక, నమ్మకం లేని వారి గతి ఏమౌతుంది? వారి పరిస్థితి ఇక తదుపరి వివరించబడింది.
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ । సర్వజ్ఞాన విమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ।। 32 ।।
32
3
https://www.holy-bhagava…udio/003_032.mp3
యే — ఎవరైతే; తు — కానీ; ఎతత్ — ఈ యొక్క; అభ్యసూయంతః — లేని దోషాలు వెతుకుతూ; న, అనుతిష్ఠంతి — పాటించరో ; మే — నా యొక్క; మతం — ఉపదేశము; సర్వ-జ్ఞాన — అన్ని రకాల జ్ఞానం లో; విమూఢాన్ — భ్రాంతి నొంది; తాన్ — వారు; విద్ధి — తెలుసుకుంటారు; నష్టాన్ — భ్రష్టులైన వారు; అచేతసః — విచక్షణా జ్ఞానం లేని వారు.
BG 3.32: కానీ, జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.
శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది. కానీ, మన ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది, కాబట్టి ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ, దాని ప్రయోజనాన్ని కానీ అన్నిసార్లూ అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోగలిగితే, అత్యల్ప జీవాత్మలమైన మనకు, మహోన్నత దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది? అందుకే, భగవద్గీత యొక్క దివ్య ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకం/విశ్వాసం అనేవి చాలా అవసరం. ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోలేదో, అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ (తప్పులు వెతుకుట) చేసే బదులుగా, మన బుద్ధిని సమర్పించాలి. ‘శ్రీ కృష్ణుడు అంతటి వాడు చెప్పాడే, అయితే అది తప్పకుండా సత్యమే అయిఉంటుంది, నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రస్తుతానికి దీనిని ఒప్పుకొని, ఆధ్యాత్మిక సాధన చేస్తా. సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తరువాత భవిష్యత్తులో నేను అర్థం చెసుకోగలను’; అన్న దృక్పథమే శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది. జగద్గురు శంకరాచార్య, శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు : గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధా, ‘గురువు మరియు శాస్త్రముల మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ.’ చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు : శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ (చైతన్య చరితామృతము, మధ్య లీల, 2.62) ‘ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా, గురువు, దైవము పట్ల బలమైన నమ్మకమే, శ్రద్ధ.’ బ్రిటిష్ కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇలా అన్నాడు : ‘నిరూపించలేనప్పుడు, విశ్వాసము ద్వారానే నమ్మకాన్ని అలవరచుకో’. కాబట్టి, శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవటమే కాక, నిగూఢమైన అర్థం కాని భాగాలని, భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ, నమ్మకంతో విశ్వశించటమే. కానీ, అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. ఈ అహంకారం వలన, దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో, దానిని తప్పు అని తిరస్కరిస్తుంది. శ్రీ కృష్ణుడి ఉపదేశాలు, జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ, జనులు దానిలో తప్పులు పడుతుంటారు, ఉదాహరణకి ‘దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు? ఆయన దురాశ కలవాడా? అహంకారి ఏమో, అర్జునుడిని తననే పూజించమంటున్నాడు?’ ఇలాంటి వారిని శ్రీ కృష్ణుడు 'అచేతసః' అంటే ‘విచక్షణా జ్ఞానం లేని వారు’ అంటున్నాడు, ఎందుకంటే వారికి – ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది; మంచేదో, చెడేదో; ధర్మానికి, అధర్మానికి; సృష్టికర్తకి, సృష్టింపబడిన వానికి; సర్వోన్నత యజమానికి, సేవకునికీ; తేడా తెలియదు. అలాంటి వారు ‘తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు’, ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి, జనన-మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు.
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి । ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।। 33 ।।
33
3
https://www.holy-bhagava…udio/003_033.mp3
సదృశం — దానికి తగినట్లుగా; చేష్టతే — క్రియలను చేయును; స్వస్యాః — తమంత తామే; ప్రకృతే — ప్రకృతి గుణములు; జ్ఞానవాన్ — జ్ఞానులు; అపి — కూడా; ప్రకృతిం — సహజ స్వభావం; యాంతి — అనుసరించుట; భూతాని — అన్ని ప్రాణులు; నిగ్రహః — నిగ్రహించి; కిం — ఏమి; కరిష్యతి — చేసెదరు.
BG 3.33: వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?
శ్రీ కృష్ణుడు మళ్లీ, అకర్మ కన్నా కర్మయే శ్రేష్ఠమనే విషయం సూచిస్తున్నాడు. జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపింపబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు. పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా, అనంతమైన పూర్వ జన్మ సంస్కారాలని (వారి ధోరణులు, అభిప్రాయాలు), ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ (అసంఖ్యాక పూర్వ జన్మల నుండీ పేరుకుపోయిన సంచిత కర్మ ఆధారంగా, ఈ జన్మ సమయంలో కేటాయించబడ్డ విధి) ని, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. ఆ అలవాట్ల, స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ వైదిక శాస్త్రాలు అన్నీ పనులను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే, అదొక అయోమయమైన/అస్థిర మైన పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాంటి అసహజమైన అణచివేత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అలవాట్ల, సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుండే ఆధ్యాత్మిక పురోగతి మొదలుపెట్టాలి; ఇది చేయాలంటే మన ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని అర్థం చేసుకుని, అంగీకరించి అక్కడినుండి మెరుగుపరుచు కోవాలి. జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అణుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు. చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చూసుకోకుండా, తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి, ఇది మానవ సమాజంలో కనిపించటం అరుదు. ఒక ఆవుకి తన దూడ మీద ఎంత మమకారం ఉంటుందంటే, దూడ ఒక్క క్షణం కనిపించక పోయినా ఆవు ఆందోళనకి లోనవుతుంది. మానవులెవరికీ సాధ్యం కాని అమితమైన విశ్వాస గుణాన్ని కుక్కలు ప్రదర్శిస్తాయి. అదే విధంగా, మనం మానవులం కూడా మన సహజ స్వభావంచే నడిపింపబడుతాము. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి, శ్రీ కృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు, ‘నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది (భగవద్గీత 18.59)’; ‘నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఆలోచనే నిన్ను ఆ పని చేయటానికి ప్రోద్బలం కలిగిస్తుంది (భగవద్గీత 18.60)’. మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ ప్రాప్తి దిశగా మార్చటం ద్వారా, మరియు, మన విధులను రాగ ద్వేష రహితంగా, భగవత్ సేవ రూపంగా చేయటం ద్వారా, ఆ సహజ స్వభావాన్ని పవిత్రమొనర్చుకోవాలి.
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ । తయోర్న వశమాగచ్చేత్తౌ హ్యస్య పరిపన్థినౌ ।। 34 ।।
34
3
https://www.holy-bhagava…udio/003_034.mp3
ఇంద్రియస్య — ఇంద్రియములకు; ఇంద్రియస్య-అర్థే — ఇంద్రియ వస్తు/విషయముల యందు; రాగ — మమకారం/ఆసక్తి; ద్వేషౌ — ద్వేషము; వ్యవస్థితౌ — ఉండును; తయోః — వాటికి; న — కూడదు; వశమ్ — వశపడుట; ఆగచ్చేత్ — లోనగుట; తౌ — అవి; హి — తప్పకుండా; అస్య — వానికి; పరిపన్థినౌ — శత్రువులు.
BG 3.34: ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు/విషయములపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు.
శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం, మనస్సు-ఇంద్రియములు తమ సహజ గుణాలచే నడిపింపబడుతాయి అని చెప్పి ఉన్నా, ఇప్పుడు వాటిని మచ్చిక చేసుకొనే అవకాశాన్ని చూపిస్తున్నాడు. మనకు ఈ భౌతిక శరీరం ఉన్నంత కాలం, దాని నిర్వహణ కోసం, ఇంద్రియ విషయములను ఉపయోగించుకోవాలి. శ్రీ కృష్ణుడు మనలను, అవసరమైన వాటిని వినియోగించుకోవటం ఆపమని అనటంలేదు; వాటి మీద మమకారం, ద్వేషం నిర్మూలించటానికి ప్రయత్నించమంటున్నాడు. ఖచ్చితంగా, పూర్వ జన్మ సంస్కారములు, అన్ని ప్రాణులమీద తీవ్ర మైన ప్రభావాన్ని చూపుతాయి, కానీ ఈ భగవద్గీతలో చెప్పబడిన పద్ధతి పాటిస్తే, ఈ పరిస్థితిని సరిదిద్దటంలో విజయాన్ని పొందవచ్చు. ఇంద్రియములు సహజంగానే తమ ఇంద్రియ వస్తు/విషయముల వైపు పరుగుతీస్తాయి, వాటి పరస్పర సహచర్యం సుఖ-దుఃఖ అనుభూతులను కలుగచేస్తుంది. ఉదాహరణకి, రుచి అనుభవించే నాలుక (రసాంకురములు) మధురమైన పదార్థములు తగిలినప్పుడు ఆనందాన్ని, చేదు పదార్థములు తగిలినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనస్సు పదేపదే ఈ వస్తు/విషయముల ద్వారా వచ్చే సుఖ, దుఃఖాలని స్మరిస్తూ ఉంటుంది. సుఖాలని కలుగ చేసే వాటి మీద చింతన మనస్సుకి వాటి మీద మమకారం, ఆసక్తి కలుగ చేస్తుంది; అదేవిధంగా దుఃఖ హేతువుల మీద చింతన ద్వేషాన్ని కలుగ చేస్తుంది. ఈ రాగ, ద్వేషముల రెంటిలో దేనికీ వశము కాకూడదు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. మన ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు మనకు అన్ని రకాల అనుకూల, ప్రతికూల (ఇష్ట, అయిష్ట) పరిస్థితులు ఎదురవుతాయి. అనుకూల పరిస్థితుల కోసం ప్రాకులాడకుండా అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోకుండా ఉండటానికి అభ్యాసం చేయాలి. మనోఇంద్రియముల ఇష్టా-అయిష్టములకు మనం బానిసలమైపోకుండా ఉంటే మన నిమ్న స్వభావాన్ని అధిగమించినట్టే. కర్తవ్య నిర్వహణ లో సుఖ, దుఃఖాల పట్ల ఉదాసీనతో, అనాసక్తతో, తటస్థంగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్వభావంతో పని చేయటానికి నిజంగా స్వేచ్ఛ పొందుతాము.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ । స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।।
35
3
https://www.holy-bhagava…udio/003_035.mp3
శ్రేయాన్ — ఉత్తమమైనది (మంచిది); స్వ-ధర్మః — తన స్వంత ధర్మములు; విగుణః — లోపాలతో కూడి ఉన్నా; పర-ధర్మాత్ — ఇతరుల ధర్మము కంటే; సు-అనుష్ఠితాత్ — చక్కగా ఆచరింపబడిననూ; స్వ-ధర్మే — తన సొంత ధర్మములను చేయటంలో; నిధనం — మరణం; శ్రేయః — మంచిది; పర-ధర్మః — ఇతరుల ధర్మములు; భయ-ఆవహః — భయము కలిగించును.
BG 3.35: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.
ఈ శ్లోకం లో 'ధర్మ' అన్న పదం నాలుగు సార్లు వాడబడింది. 'ధర్మ' అన్న పదం హిందూ మతంలో, బౌద్ధ మతంలో తరచుగా వాడబడుతుంటుంది. కానీ అది ఆంగ్ల భాషలోకి అనువదించటానికి అత్యంత క్లిష్టమైన పదం. Righteousness, good conduct, duty, noble quality, మొదలైన ఆంగ్ల పదాలు ఆ పదం యొక్క కొంత అర్థాన్ని మాత్రమే వివరిస్తాయి. 'ధర్మ' అన్న పదం 'ధృ' అన్న ధాతువు నుండి వచ్చింది, అంటే, ధారణ్ కరనే యోగ్య, అంటే ‘మనకు తగిన బాధ్యతలు, విధులు, ఆలోచనలు మరియు చర్యలు’ అని. ఉదాహరణకు, జీవాత్మ యొక్క ధర్మ భగవంతున్ని ప్రేమించటమే. మన అస్తిత్వానికి ఉన్న మూల సూత్రము ఇదే. ఇక్కడున్న పూర్వప్రత్యయము ‘స్వ’ అంటే ‘సొంత లేదా వ్యక్తిగత’ అని, ఆ ప్రకారంగా, ‘స్వ-ధర్మ’ అంటే మన వ్యక్తిగత ధర్మ, మనకున్న ప్రస్తుత జీవనంలో ఉన్న సందర్భము, పరిస్థితి, పరిపక్వత, మరియు వృత్తిని బట్టి ఉండే ధర్మం. జీవన సందర్భం/పరిస్థితి మారినప్పుడు, ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు, స్వ-ధర్మము అనేది మారవచ్చు. తన వృత్తి ధర్మాన్ని చేయమనటం ద్వారా, అర్జునుడిని స్వ-ధర్మం పాటించమని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. వేరే వారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తను చేసేది మార్చవద్దని అంటున్నాడు. మరోకరిలా నటించటం కన్నా మనం మన లాగే ఉండటం ఏంతో ఆనంద దాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కానీ అది ప్రమాదభరితమైనది. అది మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇంద్రియమనోబుద్దులలో ఘర్షణకి దారితీస్తుంది. ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి, ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయటం కన్నా స్వంత ధర్మములు నిష్ఠగా చేయటంలో మరణించినా సరే, అదే మంచిది అని శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నాడు.
అర్జున ఉవాచ । అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః । అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ।। 36 ।।
36
3
https://www.holy-bhagava…udio/003_036.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; అథ — మరి అప్పుడు; కేన — దేని వలన; ప్రయుక్తః — ప్రేరేపింపబడును; అయం — ఒక వ్యక్తి; పాపం — పాపములు; చరతి — చేయును; పూరుషః — వ్యక్తి; అనిచ్ఛన్న-అపి — ఇష్టంలేకున్ననూ; వార్ష్ణేయ — వృష్ణి వంశస్థుడా, శ్రీ కృష్ణా; బలాత్ — బలవంతముగా; ఇవ — అయినట్లు; నియోజితః — చేయును.
BG 3.36: అర్జునుడు ఇలా అడిగాడు: ఓ వృష్ణి వంశీయుడా (శ్రీ కృష్ణా), ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఏదోశక్తి చేపించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును?
శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వ శ్లోకంలో రాగ ద్వేషాల ప్రభావాలకు లోను కావద్దు అని చెప్పి ఉన్నాడు. అర్జునుడు అలాంటి దివ్యమైన జీవనాన్ని గడపాలనుకుంటున్నాడు, కానీ ఆ ఉపదేశం పాటించటం అతనికి కష్టతరంగా అనిపిస్తోంది. కాబట్టి, అతను శ్రీ కృష్ణుడిని, మానవ సంఘర్షణను సూచించే ఒక వాస్తవిక సందేహం అడుగుతున్నాడు. అర్జునుడు అంటున్నాడు, ‘ఉన్నతమైన ఆదర్శం చేరుకోవటానికి మనకు అడ్డుగా ఉన్న శక్తి ఏమిటి? రాగ ద్వేషాలకు వశమైపోయేలా చేసేది ఏమిటి?’ అని. పాపపు పనులు చేసేటప్పుడు మనందరికీ, ఇది తప్పుఅనో లేదా పశ్చాత్తాపమునో కలిగించే ఒక మనఃసాక్షి ఉంటుంది. భగవంతుడు సర్వ సుగుణములకు నిలయము అన్న నిజం మీద మనఃసాక్షి స్థితమై ఉంటుంది, మరియు ఆయన అంశము అయినట్టి మనకు కూడా సుగుణములకు, మంచితనానికి ఆకర్షితమయ్యే సహజ స్వభావం ఉంటుంది. జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనము, మనఃసాక్షికి స్వరాన్ని ఇస్తుంది. కాబట్టి, దొంగతనం చేయటం, మోసం చేయటం, దూషించటం, లాక్కోవటం, హత్య చేయటం, హింసించటం మరియు అవినీతి అనే లాంటివి, తప్పు అని తెలియదు, అని సాకులు చెప్పలేము. మన సహజ-జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులు అని మనకు తెలుసు, అయినా మనం ఏదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా ఈ పనులు చేస్తుంటాము. ఆ బలీయమైన శక్తి ఏమిటో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు.
శ్రీ భగవానువాచ । కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః । మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ ।। 37 ।।
37
3
https://www.holy-bhagava…udio/003_037.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను; కామః — కోరిక; ఏష — ఇది; క్రోధః — కోపము; ఏష — ఇది; రజః-గుణ — రజో గుణము; సముధ్భవః — ఉత్పన్నమయిన; మహా-అశనః — అన్నిటిని కబళించే; మహా-పాప్మా — అత్యంత పాపిష్టి; విద్ధి — తెలుసుకొనుము; ఏనం — ఇది; ఇహ — ఈ ప్రాపంచిక లోకంలో; వైరిణమ్ — శత్రువు.
BG 3.37: సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను: రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే (కోరికలు, వాంఛలు), తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకొనుము.
వేదములు 'కామము' అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల కోసమే కాక మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతాయి. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతమౌతుంది — డబ్బుల కోసం యావ, వస్తువుల కోసం ఆశ, కీర్తి/ప్రతిష్ఠ లపై ఆశ, అధికారం కోసం తపన; మొదలగునవి. ప్రతి యొక్క ప్రాణికి స్వ-సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమయే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామముగా మారుతుంది. ఏవిధంగానైతే జీవాత్మ, భౌతిక శక్తితో అనుసంధానమై, తనను తాను ఈ శరీరరమే అనుకుంటుందో, అదే విధంగా దాని యొక్క యొక్క భగవంతునిపై ప్రేమ, రజో గుణ సాంగత్యం కారణంగా 'కామము' గా మారుతుంది. దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి, కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన (అంటే కామము) కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైనది. ప్రాణాంతక క్యాన్సర్ మనలోనే ఉన్నట్లుగా, ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ 'కామమే', పాపానికి మూల కారణం అని శ్రీ కృష్ణుడు నిర్ధారించాడు. ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువులు తృప్తిని/ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి, రజో గుణము, ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది, ఈ భ్రమలో, వాటిని పొందటానికి మనిషి ఆశ పడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ/లోభముకి దారి తీస్తుంది. మానవుడు ఈ మూడింటి ప్రభావంచే పాపాలు చేస్తాడు — కామము, లోభము మరియు క్రోధము. లోభము అంటే తీవ్రతరమైన కోరిక. కోపము అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి, శ్రీ కృష్ణుడు కామమే (లేదా కోరికలే) అన్ని అరిష్టాలకు మూల కారణం అని ముద్ర వేసాడు.
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ । యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 38 ।।
38
3
https://www.holy-bhagava…udio/003_038.mp3
ధూమేన — పొగ చేత; ఆవ్రియతే — కప్పబడునో; వహ్నిః — అగ్ని; యథా — ఏ విధంగా; ఆదర్శః — అద్దము; మలేన — దుమ్ము చేత; చ — మరియు; యథా — ఎలాగైతే; ఉల్బేన — గర్భాశయముచే; ఆవృతః — ఆవరింపబడునో; గర్భః — పిండము (భ్రూణము); తథా — అదే విధముగా; తేన — దానిచే (కోరిక); ఇదం — ఇది; ఆవృతమ్ — కప్పివేయబడును.
BG 3.38: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాయశముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కప్పివేయబడుతుంది.
ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్ధిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ధి యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగచే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్త్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం – సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ముచే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ధిపై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది. ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది: ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తెకీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక, చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉండిపోయాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితిలో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో కూడా ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్త్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు. ఈ కథలోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తుని సూచిస్తుంది; ఇక్కడ అడుగడుగుకీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రిని సూచిస్తాయి, అవి నిరంతరం మన ఆయుష్షుని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాస్వాదనను సూచిస్తుంది; మన బుద్ధి యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోతూ, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగిపోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి, అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు.
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా । కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ।। 39 ।।
39
3
https://www.holy-bhagava…udio/003_039.mp3
ఆవృతం — కప్పివేయును; జ్ఞానం — జ్ఞానము; ఏతేన — దీనిచే; జ్ఞానినః — జ్ఞానుల యొక్క; నిత్య-వైరిణా — నిత్య శత్రువు; కామ-రూపేణ — కామము (కోరికలు) అనే రూపంలో; కౌంతేయ — అర్జునా, కుంతీదేవి పుత్రుడా; దుష్పూరేణ — తృప్తి పరచలేని; అనలేన — అగ్నిలాగ; చ — మరియు.
BG 3.39: అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా, ఎప్పటికీ తృప్తిపఱుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది, ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది, ఓ కుంతీ పుత్రుడా.
ఇక్కడ, కామము యొక్క హానికరమైన స్వభావాన్ని శ్రీ కృష్ణుడు మరింత స్పష్టంగా చెప్తున్నాడు. కామము అంటే ‘కోరిక’, దుష్పూరేణ అంటే ‘తృప్తిపఱుపరాని’ అనల అంటే ‘ఎన్నటికీ చల్లారనిది’ అని అర్థం. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకొని, దాన్ని తీర్చుకోవటానికి ఉసిగొల్పుతుంది. కానీ, ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే, అది అంత ఉధృతితో మండుతుంది. బుద్ధుడు ఇలా పేర్కొన్నాడు:న కహాపణ వస్సేన, తిత్తి కామేసు విజ్జతిఅప్పస్సాదా కామా దుఖా కామా, ఇతి విఞ్ఞాయ పణ్డితో (ధమ్మపద, 186వ శ్లోకం)‘కోరిక అనేది ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేదు. దుఃఖానికి మూల హేతువు అని తెలుసుకొని వివేకవంతులు దాన్ని త్యజిస్తారు.’ కానీ ఈ రహస్యం అర్థం చేసుకోలేనివారు, కోరికలను తీర్చుకోవటానికే వృధా ప్రయాసతో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు.
ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే । ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ।। 40 ।।
40
3
https://www.holy-bhagava…udio/003_040.mp3
ఇంద్రియాణి — ఇంద్రియములు; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; అస్య — దీని యొక్క; అధిష్ఠానం — నివసించే స్థానం; ఉచ్యతే — అని చెప్పబడుతుంది; ఏతైః — వీటిచే; విమోహయతి — భ్రమకు లోనగును; ఏషః — ఈ; జ్ఞానం — జ్ఞానము; ఆవృత్య — మరుగుపరుచును; దేహినమ్ — జీవాత్మను.
BG 3.40: ఇంద్రియములు, మనస్సు, బుద్ధి - ఇవి కోరికల మూల స్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది, వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది.
కామము నివసించే స్థానాలను వెల్లడి చేయటం ద్వారా శ్రీ కృష్ణుడు ఇప్పుడు వాటిని నియంత్రించే పద్ధతి ఒకటుందని వివరిస్తున్నాడు. ముట్టడి చేసే ముందుగా శత్రువు యొక్క కోటని గుర్తించాలి. ఇంద్రియములు-మనస్సు-బుద్ధిలలో నుండి కామము తన ఆధిపత్యాన్ని జీవాత్మపై చలాయిస్తుంది. ఈ కామ ప్రభావంచే ఇంద్రియ వస్తు/విషయములను ఇంద్రియములు కోరతాయి, ఇంద్రియములు మనస్సుని పిచ్చిపట్టేటట్టు చేస్తాయి, మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది, అప్పుడు బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోతుంది. బుద్ధి మసకబారినప్పుడు, వ్యక్తి చిత్త భ్రాంతికి లోనయ్యి కామానికి వశుడై, దాన్ని తీర్చుకోవటానికి ఏదైనా చేస్తాడు. ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి — అనే పరికరములు తమంత తామే చెడ్డవి కాదు. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించటానికి ప్రసాదించబడ్డాయి. కానీ మనమే కామానికి, వాటిపై ముట్టడి చేసి వశపరుచుకునే అనుమతినిచ్చాము. ఇప్పుడు అవే ఇంద్రియమనోబుద్దులను మన ఉద్ధరణ కోసం వినియోగించుకోవాలి. తదుపరి శ్లోకంలో అది ఎలా చేయాలో శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.
తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ । పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ।। 41 ।।
41
3
https://www.holy-bhagava…udio/003_041.mp3
తస్మాత్ — కాబట్టి; త్వం — నీవు; ఇంద్రియాణి — ఇంద్రియములను; ఆదౌ — మొదట్లోనే; నియమ్య — నియంత్రించి; భరత-ఋషభ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా; పాప్మానం — పాపిష్టిదైన; ప్రజహి — సంహరింపుము; హి — నిజముగా; ఏనం — ఇది; జ్ఞాన — జ్ఞానము; విజ్ఞాన — అనుభవ జ్ఞానమును; నాశనం — నశింపచేసేటటువంటిది.
BG 3.41: కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణ లోనికి తెచ్చి, జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము (కోరికలు) అనే శత్రువును నిర్మూలించుము.
అన్ని అరిష్టములకు మూలకారణ మైన కామాన్ని ఎలా అధిగమించాలో ఇక శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. కామము మానవ అత్మోద్దరణకు ఎంతో హానికరమైనది. కామము యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తింపచేసిన శ్రీ కృష్ణుడు మొదట ఈ ఇంద్రియముల కోరికలను నిగ్రహించమంటున్నాడు. వాటిని పెంచుకోవటం మన దుఃఖాలకు మూలకారణం, వాటిని నిర్మూలించుకోవటం శాంతికి మార్గం. ఈ క్రింది ఉదాహరణని గమనించండి. రమేష్, దినేష్ అనే ఇద్దరు సహ-విద్యార్థులు హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు. ఒక రోజు రాత్రి 10 గంటలకు రమేష్‌కి సిగరెట్టు తాగాలనే కోరిక కలిగింది. అతను అన్నాడు, ‘నాకు బాగా సిగరెట్టు తాగాలనిపిస్తోంది.’ అని. దినేష్ అన్నాడు, ‘చాలా రాత్రయింది. సిగరెట్టు గురించి మర్చిపోయి పడుకో’ అని. రమేష్ అన్నాడు ‘కాదు... కాదు... నేను పొగాకు పీల్చనిదే నిద్ర పోలేను’ అని. దినేష్ నిద్ర పోయాడు, కానీ రమేష్ సిగరెట్టు కోసం బయటికి వెళ్ళాడు. అప్పటికే దగ్గరి కొట్లు మూసేశారు. చివరికి అతనికి సిగరెట్టు దొరికి, ధూమపానం చేసి హాస్టల్ కి తిరిగి రావటానికి రెండు గంటలు పట్టింది. ఉదయాన్నే దినేష్ అతన్ని అడిగాడు, ‘రమేష్, ఎన్నింటికి పడుకున్నావు రాత్రి?’ ‘మధ్యరాత్రి.’ ‘నిజంగా! అంటే నువ్వు సిగరెట్టు కోసం రెండు గంటలు వ్యాకుల పడి, నీ ధూమపానం అయిన తరువాత మళ్లీ నువ్వు 10గంటలకు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితికి చేరుకున్నావు.’ అని. ‘అంటే, నువ్వనేదేమిటి’ అన్నాడు రమేష్. ‘చూడు, 10 గంటలప్పుడు నీకు సిగరెట్టు మీద ఎలాంటి కోరిక లేదు, అప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. తర్వాత నీకు నీవే వాటి మీద కోరిక పుట్టించుకున్నావు. 10 గంటల నుండి మధ్యరాత్రి వరకు సిగరెట్టు కోసం పరితపించావు. చివరికి ధూమపానం చేసిన తరువాత, నీకునీవే పుట్టించుకున్న వాంఛ తీరింది, ఇక నిద్ర పోయావు. అదే నేను ఎలాంటి కోరికలు పుట్టించుకోలేదు, ఇక 10 గంటలకే ప్రశాంతంగా పడుకున్నాను.’ ఈ విధంగా, శారీరక ఇంద్రియ వస్తు/విషయముల కొరకై కోరికలను మనమే సృష్టించుకుంటాం, తరువాత వాటిచే ఉద్విగ్నతకు లోనవుతాము. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తరువాత మనంతమనమే సృష్టించుకున్న రోగం నిర్మూలించబడుతుంది, దాన్నే మనము ఆనందం అనుకుంటాము. కానీ, మనలని మనము జీవాత్మగా పరిగణించుకుంటే, మరియు ఆత్మ ఆనందమే మన లక్ష్యం అయితే, ఈ ప్రాపంచిక కోరికలను త్యజించటం సులువౌతుంది. తన ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చుకోమని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఆ విధంగా వాటిలో వసించే కామాన్ని నిర్మూలించవచ్చు. దీనిని సాధించటానికి, తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగ్గా, భగవంతుడు మనకు ప్రసాదించిన ఉన్నతమైన పరికరములను వాడుకోవాలి.
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః । మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।
42
3
https://www.holy-bhagava…udio/003_042.mp3
ఇంద్రియాణి — ఇంద్రియములు; పరాణి — ఉన్నతమైనవి; ఆహుః — అనబడును; ఇంద్రియేభ్యః — ఇంద్రియముల కంటే; పరం — ఉన్నతమైనవి; మనః — మనస్సు; మనసః — మనస్సు కంటే; తు — కానీ; పరా — ఉన్నతమైనది; బుద్దిః — బుద్ధి; యః — ఏదైతే; బుద్ధే — బుద్ధిని మించి; పరతః — మరింత ఉన్నతమైనది; తు — కానీ; సః — అది (ఆత్మ).
BG 3.42: స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.
ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన పరికరముల వివిధ స్థాయిలను, శ్రీ కృష్ణుడు విశదీకరిస్తున్నాడు. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారయింది; దానికన్నా ఉన్నతమైనవి ఐదు జ్ఞానేంద్రియములు (రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దముల అనుభూతిని గ్రహించేవి); ఇంద్రియముల కన్నా మించినది మనస్సు; మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణా శక్తి కలిగిన బుద్ధి; కానీ ఈ బుద్ధి కన్నా మించినది దివ్య ఆత్మ. ఈ అధ్యాయపు చిట్టచివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మనము కామాన్ని కూకటి వేళ్ళతో పీకివేయటానికి ఇక ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా । జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ।। 43 ।।
43
3
https://www.holy-bhagava…udio/003_043.mp3
ఏవం — ఈ విధంగా; బుద్ధేః — బుద్ధి కంటే; పరం — ఉన్నతమైనది; బుద్ధ్వా — తెలుసుకొని; సంస్తభ్య — వశపరుచుకొని; ఆత్మానం — నిమ్నస్థాయి అస్తిత్వాన్ని (ఇంద్రియ-మనస్సు-బుద్ధి లను); ఆత్మనా — ఉన్నత స్థాయి అస్తిత్వం చేత (ఆత్మ); జహి — సంహరింపుము (నిర్మూలింపుము); శత్రుం — శత్రువు; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; కామ-రూపం — కోరికలనే రూపంలో; దురాసదమ్ — బలీయమైన.
BG 3.43: ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వాన్ని (ఇంద్రియమనోబుద్ధులను), నీ ఉన్నత అస్తిత్వంచే (ఆత్మ శక్తి ద్వారా) వశపరుచుకొనుము, మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము.
ముగింపుగా శ్రీ కృష్ణుడు, కామమనే (కోరికలు) శత్రువుని ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నాడు. ఆత్మ అనేది భగవంతుని అంశము కాబట్టి, అది దివ్యమైనది. అంటే, అది కోరుకునే దివ్య ఆనందం దివ్య వస్తువు ద్వారానే లభ్యమౌతుంది, ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవే. ఈ భౌతిక వస్తు/విషయములు, ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనని తీర్చలేవు, కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవటం నిష్ప్రయోజనమైన పని. మనం ప్రయత్న పూర్వకంగా, మన బుద్ధికి ఈ ప్రకారంగా ఆలోచించటానికి తర్ఫీదు ఇవ్వాలి. ఆ తరువాత దానిని మనస్సు, ఇంద్రియములను నియంత్రించటానికి వినియోగించాలి.కఠోపనిషత్తులో ఈ విషయం, ఒక రథం ఉదాహరణ ద్వారా చాలా అద్భుతంగా వివరించబడింది.ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తుబుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ ।ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః (1.3.3-4)ఐదు గుర్రాలచే గుంజబడే ఒక రథం ఉంది అని ఉపనిషత్తులలో చెప్పబడింది; ఆ గుర్రాలకు నోటియందు పగ్గాలున్నాయి; ఆ పగ్గాలు రథ సారథి చేతిలో ఉన్నాయి; ఆ రథం వెనుక భాగంలో ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. అసలైతే, ఆ ప్రయాణికుడు, రథ సారధికి దిశానిర్దేశం చేయాలి; సారధి అప్పుడు పగ్గాలతో గుర్రాలకి దిశానిర్దేశం చేయాలి. కానీ, ఇక్కడ, ప్రయాణీకుడు నిద్రపోతున్నాడు, కావున గుర్రాలు తమ ఇష్టానుసారం ఉన్నాయి.ఈ ఉపమానంలో, రథం అంటే శరీరం; గుర్రాలు అనేవి ఐదు ఇంద్రియములు; గుర్రాల నోటియందు ఉన్న పగ్గాలు, మనస్సు; రథ సారధి, బుద్ధి; వెనుక కూర్చున్న ప్రయాణీకుడు, శరీరంలో ఉన్న జీవాత్మ. ఇంద్రియములు (గుర్రాలు) భోగాలని కోరతాయి. మనస్సు (పగ్గాలు) ఇంద్రియములపై (గుర్రాలపై) నియంత్రణ చేయటం లేదు. బుద్ధి (సారధి) పగ్గాల (మనస్సు) లాగుడుకి వశమైపోయింది. కాబట్టి భౌతికంగా బద్ధుడైఉన్న స్థితిలో, అయోమయానికి గురై ఉన్న జీవాత్మ, బుద్ధిని సరియైన దిశలో నడిపించలేదు. ఈ స్థితిలో, రథం ఎట్లా పోవాలి అన్న విషయాన్ని ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది, కానీ అవి దానికి సంతృప్తిని ఇవ్వలేవు. ఈ రథంలో కూర్చునిఉన్న జీవాత్మ (ప్రయాణికుడు) ఈ ప్రకారంగా అనాది నుండి భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు.కానీ, ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైన స్వభావం పట్ల మేల్కొని, చురుగ్గా వ్యవహరిస్తే, అది బుద్ధిని సరైన దిశలో పెట్టవచ్చు. అప్పుడు బుద్ధి, తక్కువ స్థాయి అస్తిత్వాలైన మనస్సు, ఇంద్రియములను సరిగ్గా నియంత్రిస్తుంది - అప్పుడే రథం శాశ్వత సంక్షేమం దిశగా కదులుతుంది. ఈ విధంగా, తక్కువ స్థాయి అస్తిత్వాన్ని (ఇంద్రియములు, మనస్సు, బుద్ధి) నియంత్రించటానికి ఉన్నతమైన ఆత్మ (జీవాత్మ) ను తప్పకుండా వినియోగించాలి.
శ్రీ భగవానువాచ । ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ । వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ।। 1 ।।
1
4
https://www.holy-bhagava…udio/004_001.mp3
శ్రీ భగవానువాచ — పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు పలికెను; ఇమం — ఈ యొక్క; వివస్వతే — సూర్య భగవానునికి; యోగం — యోగ శాస్త్రము; ప్రోక్తవాన్ — ఉపదేశించాను; అహం — నేను; అవ్యయం — సనాతనమైన; వివస్వాన్ — సూర్య భగవానుడు; మనవే — మనువుకు, మానవ జాతి యొక్క మూల పురుషుడు; ప్రాహ — చెప్పెను; మనుః — మను; ఇక్ష్వాకవే — ఇక్ష్వాకుడుకి, సూర్య వంశపు మొదటి చక్రవర్తి; అబ్రవీత్ — బోధించెను.
BG 4.1: పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.
అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా కేవలం తెలియపరిస్తే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు దాని విలువని తెలుసుకొని, గౌరవించాలి మరియు ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే వారు తమ జీవిత నడవడికలో దానిని ఆచరించటానికి కావలసిన పరిశ్రమ చేస్తారు. అర్జునుడికి తను అనుగ్రహించే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశ్వసనీయత, ప్రాముఖ్యతని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు స్థిరపరుస్తున్నాడు. తను ఉపదేశించే ఈ జ్ఞానం, కేవలం అర్జునుడిని యుద్ధం కోసం ప్రేరేపించే సౌలభ్యం కోసం, అప్పటికప్పుడే పుట్టించింది కాదు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు మొట్టమొదట వివస్వానుడికి, అంటే సూర్య భగవానుడికి, ఇదే యోగ శాస్తాన్ని బోధించాడు. అతను మానవ జాతికి మూలపురుషుడైన మనువుకి, మనువు దానిని సూర్య వంశ ప్రథమ రాజైన ఇక్ష్వాకుడికి బోధించారు. ఇది జ్ఞాన సముపార్జన యొక్క అవరోహణ క్రమం; ఈ పద్ధతిలో జ్ఞానంపై సంపూర్ణ ప్రామాణ్యము కలిగిన వారు దానిని తెలుసుకోగోరిన వారికి ఆపాదిస్తారు. దీనికి భిన్నంగా, ఆరోహణ క్రమ జ్ఞాన సముపార్జన పద్ధతిలో, విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి స్వంత ప్రయత్నం ద్వారా పరిశ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆరోహణ క్రమ పద్ధతి కఠినమైనది, లోపభూయిష్టమైనది మరియు చాలా సమయం తీసుకుంటుంది. ఉదాహరణకి ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) నేర్చుకోవాలంటే, ఆరోహణ క్రమ పద్ధతిలో ప్రయత్నించవచ్చు - ఈ పద్ధతిలో మన సొంత తెలివితో ఆయా సూత్రాలను ఊహకల్పన చేసి ఒక అభిప్రాయానికి రావచ్చు; లేదా అవరోహణ పద్ధతిలో నేర్చుకోవచ్చు – ఈ పద్ధతిలో మనం ఫిజిక్స్ బాగా తెలిసిన ఒక ఉపాధ్యాయుడిని ఆశ్రయిస్తాము. ఆరోహణ క్రమ పద్ధతి చాలా సమయం తీసుకుంటుంది, నిజానికి ఈ రకమైన అధ్యయనానికి ఒక జీవిత కాలం సరిపోకపోవచ్చు. తుదకు తేలిన విషయాలు నిజమైనవో కాదో కూడా మనకు నమ్మకముండదు. పోల్చి చూస్తే, అవరోహణ క్రమ పద్ధతితో ఫిజిక్స్ యొక్క నిగూఢ రహస్యాలు మనకు తక్షణమే తెలుస్తాయి. మన ఉపాధ్యాయుడికి ఫిజిక్స్‌లో సంపూర్ణ జ్ఞానం ఉంటే ఇది చాలా సులువౌతుంది – ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధతో విని దాన్ని జీర్ణం చేసుకోవటమే మన పని. ఈ యొక్క అవరోహణ క్రమంలో ఉన్న జ్ఞాన సముపార్జన ప్రక్రియ సులువైనది మరియు దోషరహితమైనది. ప్రతి సంవత్సరం కొన్ని వేల స్వయం-సహాయక (self-help) పుస్తకాలు విపణిలో విడుదలవుతాయి. అవి, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆయా రచయితల యొక్క పరిష్కారాలను వివరిస్తాయి. ఈ పుస్తకాలు, ఒక పరిమితిలో సహాయపడవచ్చు, కానీ ఇవి ఆరోహణ క్రమ పద్ధతిలో పొందిన జ్ఞానం ఆధారంగా వ్రాయబడ్డాయి కాబట్టి అవి లోపభూయిష్టమయినవి. ప్రతి కొన్ని సంవత్సరాలకీ, ఏదో ఒక కొత్త సిద్ధాంతం వచ్చి ఆ సమయంలో ఉన్న సిద్ధాంతాలని పక్కకి నెడుతుంది. ఈ యొక్క ఆరోహణ పద్ధతి అనేది పరమ సత్యాన్ని తెలుసుకోవటానికి పనికిరాదు. దివ్య జ్ఞానాన్ని స్వీయ-పరిశ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. అది భగవంతుని యొక్క శక్తి, ఎలాగైతే అగ్ని ఉన్నప్పటి నుండీ దాని వెలుగు, వేడిమి ఉంటాయో, అది (దివ్య జ్ఞానం) భగవంతుడు ఉన్నప్పటి నుండీ ఉంది. భగవంతుడు మరియు జీవాత్మ రెండూ కూడా సనాతనమైనవి, అలాగే జీవాత్మను భగవంతునితో కలిపే యోగ శాస్త్రము కూడా సనాతనమైనదే. దీని కోసం ఏదో ఊహించి, కొత్తకొత్త సిద్ధాంతాలను తయారుచేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యక్షసత్యం యొక్క అద్భుతమైన తార్కాణం, ఈ భగవద్గీతయే. ఇది చెప్పబడి యాభై శతాబ్దములు దాటినా, తనలో ఉన్న శాశ్వత/సనాతన జ్ఞాన ప్రజ్ఞతో, ఇది ఇప్పటికీ మన దైనందిన జీవితంలో ఉపయోగపడుతూ, జనులను ఆశ్చర్య చకితులను చేస్తున్నది. తాను అర్జునుడికి తెలియజేసే ఈ యోగ విద్య జ్ఞానం, సనాతనమైనది మరియు ప్రాచీన కాలంలో అవరోహణ క్రమంలో గురువు నుండి శిష్యుడికి పరంపరగా అందించబడింది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః । స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ।। 2 ।।
2
4
https://www.holy-bhagava…udio/004_002.mp3
ఏవం — ఈ విధంగా; పరంపరా — పరంపరలో; ప్రాప్తమ్ — అందుకున్న; ఇమం — ఈ (శాస్త్రము); రాజ-ఋషయః — రాజర్షులు; విదుః — అర్థం చేసుకున్నారు; సః — అది; కాలేన — దీర్ఘ కాల గతిలో; ఇహ — ఈ లోకంలో; మహతా — చాలా; యోగః — యోగము; నష్టః — తరిగిపోవుట; పరంతప — అర్జునా, శత్రువులను తపింప చేయువాడా.
BG 4.2: ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది (క్షీణించి పోయినది).
దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవరోహణ క్రమంలో అందుకునేటప్పుడు, శిష్యుడు భగవత్-ప్రాప్తి తెలిపే శాస్త్రాన్ని గురువు గారి నుండి అర్థంచేసుకుంటాడు, ఆ గురువు తన గురువు నుండి ఇలాగే అందుకున్నాడు. ఈ విధమైన సాంప్రదాయం లోనే రాజర్షులైన నిమి, జనకుడు యోగ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సంప్రదాయం, ఆది-జగద్గురువైన భగవంతునితోనే మొదలయ్యింది.తేనే బ్రహ్మ హృదాయ ఆది-కవయే ముహ్యంతి యత్ సూరయః(భాగవతం 1.1.1) ఈ శ్లోకం ప్రకారం, భగవంతుడు సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని, ప్రప్రథమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో తెలియపరిచాడు, ఆయన నుండి ఈ సంప్రదాయం కొనసాగింది. ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, సూర్యభగవానుడైన వివస్వానుడికి కూడా తాను ఈ జ్ఞానాన్ని తెలియపరిచినట్టు చెప్పాడు, ఆయన నుండి కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. కానీ, ఈ భౌతిక ప్రపంచ స్వభావం ఎలాంటిదంటే, కాల క్రమంలో ఈ జ్ఞానం లుప్తమైపోయింది. ప్రాపంచిక మనస్తత్వంగల, కపటులైన శిష్యులు, తమ కళంకిత దృక్పథం పరంగా జ్ఞానాన్ని అన్వయిస్తారు. కొలది తరాల్లోనే ఆ జ్ఞానం యొక్క ప్రాచీన స్వచ్ఛత మలినమైపోయింది. ఇలా జరిగినప్పుడు, తన అకారణ కరుణచే, భగవంతుడు ఆ సందేశాన్ని మానవ జాతి సంక్షేమం కోసం తిరిగి సుస్థిరపరుస్తాడు. ఆ పనిని తానే ఈ లోకంలో స్వయంగా అవతరించి గానీ లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా గానీ చేస్తాడు.భారత చరిత్రలో ఐదవ మూల జగద్గురువైన, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు సనాతన జ్ఞానాన్ని ఇప్పటి కాలంలో తిరిగి ప్రతిపాదించి స్థిరపరిచిన, భగవత్-ప్రేరణ నొందిన, ఈ కోవకి చెందిన మహాత్ములు. పవిత్ర కాశీ నగరంలో, ఐదువందల మంది వేద-పండితులతో కూడిన అత్యున్నత సంస్థానమైన, కాశీ విద్వత్ పరిషత్తు, కేవలం ముప్పైనాలుగు సంవత్సరాల ప్రాయంలోనే జగద్గురువు అన్న బిరుదునిచ్చి వారిని సత్కరించింది. వారు ఆ విధంగా, భారత చరిత్రలో జగద్గురు శంకరాచార్య, జగద్గురు నింబార్కాచార్య, జగద్గురు రామానుజాచార్య, మరియు జగద్గురు మధ్వాచార్యుల తరువాత ‘జగద్గురువు’ అన్న బిరుదు నొందిన ఐదవ వారయ్యారు. భగవద్గీత యొక్క నిగూఢమైన భావాన్ని, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు నాకు తెలియచేసిన ప్రకారంగా, ఈ యొక్క గీతా వ్యాఖ్యానం వ్రాయబడింది.
స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః । భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ।। 3 ।।
3
4
https://www.holy-bhagava…udio/004_003.mp3
సః — అది; ఏవ — తప్పకుండా; అయం — ఇది; మయా — నా చేత; తే — నీకు; అద్య — నేడు; యోగః — యోగ శాస్త్రము; ప్రోక్తః — తెలియచెప్పబడుతున్నది; పురాతనః — ప్రాచీనమైన; భక్తః — భక్తుడువి; అసి — నీవు; మే — నా యొక్క; సఖా — సఖుడివి (మిత్రుడివి); చ — మరియు; ఇతి — కాబట్టి; రహస్యం — రహస్యము; హి — నిజముగా; ఎతత్ — ఇది; ఉత్తమం — శ్రేష్ఠమైనది.
BG 4.3: అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన, ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.
తను అర్జునుడుకి చెప్పే ఈ ప్రాచీన యోగ శాస్త్రము సాధారణంగా అందరికీ తెలియని రహస్యమని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచడానికి రెండు కారణాలుంటాయి: ఒకటి, రహస్యం కేవలం తనకే తెలిసుండాలనే స్వార్థం. రెండోది, ఆ సత్యాన్ని సమాచార దుర్వినియోగం నుండి కాపాడటానికి. ఈ యోగ విద్య ఒక రహస్యంగా ఉండటానికి, ఈ రెండు కారణాలు కాక, వేరే కారణం ఉంది, అదేమిటంటే, అది అర్థం చేసుకోబడటానికి అర్హత ఉండాలి. ఆ అర్హతే, 'భక్తి' అని ఈ శ్లోకంలో తెలియచేయబడింది. భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశం కేవలం పాండిత్యానికో లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవటానికి లొంగదు. దీనికి భక్తి అవసరం; ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయని నిర్మూలించి, ఆయన అణు-అంశములగా, ఆయన సేవకులుగా మనల్ని మనం పరిగణించుకునేలా చేస్తుంది. అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవటానికి తగిన విద్యార్థి, ఎందుకంటే అతను భగవంతుని భక్తుడు. భగవంతునిపై భక్తిని, క్రమంగా ఉన్నతమైన ఈ ఐదు భావాలుగా మనం అభ్యాసం చేయవచ్చు: 1) శాంత భావం : మనల్ని పాలించే చక్రవర్తిగా భగవంతుడిని ఆరాధించటం 2) దాస్య భావం : భగవంతుడిని మన స్వామిగా, మనం ఆయన దాసుడిగా భావంచటం 3) సఖ్య భావం : భగవంతుడిని మన మిత్రునిగా పరిగణించటం 4) వాత్సల్య భావం : భగవంతుడిని మన బిడ్డగా భావించటం 5) మాధుర్య భావం : మన ఆత్మ-సఖునిగా భగవంతుడిని ఆరాధించటం. అర్జునుడు భగవంతుడిని తన మిత్రునిగా ఆరాధించాడు, కాబట్టి శ్రీ కృష్ణుడు అతనితో తన మిత్రునిగా, భక్తుడిగా సంభాషిస్తున్నాడు. భక్తి నిండిన హృదయం లేకుండా, భగవద్గీత యొక్క సందేశాన్ని వాస్తవరూపంలో అర్థం చేసుకోలేరు. భగవత్ భక్తి లోపించి ఉన్నటువంటి పండితులు, జ్ఞానులు, యోగులు, తపస్వులు వంటి వారు రాసిన భగవద్గీత భాష్యాలు చెల్లవని ఈ శ్లోకం సూచిస్తున్నది. ఈ శ్లోకం ప్రకారం, వారు భక్తులు కారు కాబట్టి, వారు అర్జునుడికి చెప్పబడిన ఈ మహోన్నత జ్ఞానం యొక్క నిజమైన భావాన్ని అర్థం చేసుకోలేరు; కావున వారి భాష్యాలు అసంపూర్ణంగా మరియు/లేదా అసంబద్దంగా ఉంటాయి.
అర్జున ఉవాచ । అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః । కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।
4
4
https://www.holy-bhagava…udio/004_004.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; అపరం — తరువాతిది; భవతః — మీ యొక్క; జన్మ — జన్మ (పుట్టుక); పరం — ఇంతకు ముందే; జన్మ — జన్మ (పుట్టుక); వివస్వతః — వివస్వతుడు (సూర్య దేవుడు); కథం — ఎట్లా; ఏతత్ — ఇది; విజానీయాం — నేను అర్థం చేసుకోవాలి; త్వం — నీవు; ఆదౌ — ప్రారంభంలో; ప్రోక్తవాన్ — ఉపదేశించుట; ఇతి — ఈ విధంగా.
BG 4.4: అర్జునుడు ఇలా అన్నాడు : నీవు వివస్వానుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
శ్రీ కృష్ణుడి మాటల్లో, పైకి అగుపిస్తున్న పొంతనలేని ఘటనల వల్ల అర్జునుడు అయోమయానికి గురౌతున్నాడు. సూర్య భగవానుడు సుమారుగా సృష్టి ప్రారంభం నుండీ ఉన్నాడు, కానీ, శ్రీ కృష్ణుడు ఈ మధ్యనే ఈ లోకంలో పుట్టాడు. ఒకవేళ శ్రీ కృష్ణుడు దేవకీవసుదేవుల తనయుడైతే, ఆయన చెప్పినట్టు, ఈ యొక్క యోగ విద్యని వివస్వానుడికి (సూర్య భగవానుడు) చెప్పాడనే విషయం అర్జునుడికి పొసగలేదు, అందుకే అతను ఇలా అడుగుతున్నాడు. అర్జునుడి ప్రశ్న, భగవంతుని దివ్య అవతార విషయం మీద వివరణని అడుగుతోంది, మరియు శ్రీ కృష్ణుడు దీనికి తదుపరి శ్లోకాలలో బదులిస్తున్నాడు.
శ్రీ భగవానువాచ । బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున । తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 5 ।।
5
4
https://www.holy-bhagava…udio/004_005.mp3
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; బహూని — చాలా; మే — నావి; వ్యతీతాని — గడిచినవి; జన్మాని — జన్మలు; తవ — నీవి; చ — మరియు; అర్జున — అర్జునా; తాని — అవి; అహం — నాకు; వేద — తెలుసు; సర్వాణి — అన్నీ; న — కాదు; త్వం — నీకు; వేత్థ — తెలుసు; పరంతప — అర్జునా, శత్రువులను తపింపచేయువాడా.
BG 4.5: శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి, ఓ అర్జునా. నీవు వాటిని మరిచిపోయావు, కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఓ పరంతపా.
తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఒక దేశ రాష్ట్రపతి ఒక్కోసారి కారాగారానికి చూడడానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు, కానీ మనకు జైల్లో రాష్ట్రపతి కనపడితే, ఆయన కూడా ఖైదీనే అని తప్పుగా భావింపము. ఆయన కేవలం తనిఖీ చేయటానికే ఇలా వచ్చాడు అని మనకు తెలుసు. ఇదే ప్రకారంగా, భగవంతుడు ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటాడు, కానీ అతని దైవీ గుణాలు, దివ్య శక్తులు ఏమాత్రం తగ్గవు. ఈ శ్లోకంపై తన భాష్యంలో శంకరాచార్యులు ఇలా అంటారు: యా వాసుదేవే అనీశ్వరాసర్వజ్ఞాశంకా మూర్ఖానాం తాం పరిహరన్ శ్రీ భగవానువాచ (4.5వ శ్లోకంపై శారీరక భాష్యం) అంటే ‘శ్రీ కృష్ణుడు భగవంతుడేనా అని ఏ మూర్ఖులకైనా సందేహం ఉంటే, దానిని ఖండించటానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు.’ నమ్మకం లేని కొంత మంది, శ్రీ కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు; మనలాగే భుజించాడు, త్రాగాడు, నిద్రపోయాడు; కాబట్టి ఆయన భగవంతుడు అవ్వటానికి అవకాశం లేదు అని వాదించవచ్చు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, జీవాత్మకి, భగవంతునికి ఉన్న తేడాని స్పష్టంగా వివరిస్తున్నాడు; తను ఎన్నో సార్లు ఈ ప్రపంచంలో అవతరించినా ఆయన సర్వజ్ఞుడుగానే ఉంటాడు, అదే సమయంలో జీవాత్మ యొక్క జ్ఞానం మాత్రం పరిమితమైనది. జీవాత్మకి, పరమాత్మ అయిన భగవంతునికి చాలా పోలికలున్నాయి - రెండూ సత్-చిత్-ఆనందములే (సనాతనమైనవి, చైతన్యవంతమైనవి, మరియు ఆనంద స్వరూపాలు). కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి. భగవంతుడు సర్వ-వ్యాపి, జీవాత్మ తను ఉన్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది; భగవంతుడు సర్వశక్తివంతుడు, కానీ జీవాత్మకి తనను తాను మాయా మొహం నుండి కూడా భగవంతుని కృప లేకుండా విడిపించుకునే శక్తి లేదు; భగవంతుడు ఈ ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు, ఆత్మ ఈ నియమాలకు బద్దుడై ఉంటుంది; భగవంతుడు సమస్త సృష్టికి ఆధారభూతమైనవాడు, జీవాత్మకు కూడా ఆయనే ఆధారం; భగవంతుడు సర్వజ్ఞుడు, కానీ జీవాత్మ ఒక్క విషయం పైన కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు. శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఈ శ్లోకం లో ‘పరంతప’ అంటున్నాడు, అంటే ‘శత్రువులను వశపరుచుకునే వాడా’ అని. ఆయన భావం ఏమిటంటే, ‘అర్జునా, నీవు ఎంతో మంది బలీయమైన శత్రువులను సంహరించిన వీర యోధుడవు. నీ మనస్సులో కలిగిన సందేహం ముందు ఇప్పుడు ఓటమిని అంగీకరించకు. నేను ఇప్పుడు నీకిచ్చే జ్ఞాన ఖడ్గంతో దానిని నిర్మూలించి, వివేకవంతుడవై ఉండుము.’ అని.
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ । ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ।। 6 ।।
6
4
https://www.holy-bhagava…udio/004_006.mp3
అజః — పుట్టుక లేని; అపి — అయినా సరే; సన్ — ఉండి; అవ్యయ ఆత్మా — నాశములేని; భూతానామ్ — సమస్త ప్రాణులకు; ఈశ్వరః — స్వామి; అపి — అయి కూడా; సన్ — ఉండి; ప్రకృతిం — ప్రకృతి; స్వామ్ — నా యొక్క (స్వీయ); అధిష్ఠాయ — స్థితుడనై ఉండి; సంభవామి — నేను వ్యక్తమవుతాను; ఆత్మ-మాయయా — నాయొక్క యోగమాయా శక్తి చేత.
BG 4.6: నేను పుట్టుకలేని వాడిని అయిఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను.
భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడు అన్న అభిప్రాయాన్ని చాలా మంది జనులు అస్సలు ఒప్పుకోరు. వారు నిరాకార, సర్వ-వ్యాప్త, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే ఎక్కువ సానుకూలతతో ఉంటారు. భగవంతుడు ఖచ్చితంగా ఆశరీరుడు, నిరాకారుడే కానీ అంతమాత్రాన, ఆయన అదేసమయంలో ఒక రూపము తీసుకోలేడు అని కాదు. భగవంతుడు సర్వ శక్తివంతుడు కాబట్టి ఆయనకి తన సంకల్పంచే ఒక స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా భగవంతునికి రూపం ఉండదు అంటే ఆ వ్యక్తి భగవంతుడిని సర్వశక్తిమంతునిగా ఒప్పుకోవట్లేదు అని అర్థం. కాబట్టి ‘భగవంతుడు నిరాకారుడు’ అంటే అదొక అసంపూర్ణ ప్రతిపాదన అవుతుంది. అదే విధంగా, ‘భగవంతుడు ఒక సాకార రూపం లోనే అవతరిస్తాడు’ అంటే, అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వ శక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి రెండు అస్తిత్వాలు ఉన్నాయి - వ్యక్తిగత స్వరూపం మరియు నిరాకార అస్తిత్వం. కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా చెపుతున్నది:ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవ అమూర్తం చ (2.3.1)‘దేవుడు రెండు రకాలుగా ఉంటాడు - నిరాకర బ్రహ్మంగా మరియు సాకార భగవంతునిగా కూడా’. ఆ రెండు అస్తిత్వాలూ ఆయన వ్యక్తిత్వానివే.నిజానికి, జీవాత్మకి కూడా తన అస్తిత్వానికి రెండు కోణాలుంటాయి. అది నిరాకారం కాబట్టి శరీరాన్ని మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు, అది కనిపించదు. కానీ, అది ఒక శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది - ఒక సారి కాదు, అసంఖ్యాకమైన సార్లు - ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరమౌతూ. అతిచిన్న ఆత్మకే ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు, సర్వ శక్తిమంతుడైన భగవంతునికి ఆ శక్తి ఉండదా? లేదా దేవుడు ఇలా ఏమైనా అన్నాడా? ‘నాకు ఒక రూపంలో వ్యక్తమయ్యే శక్తి లేదు కాబట్టి నేను నిరాకార కాంతిని మాత్రమే’ అని. ఆయన దోషరహితుడు, పరిపూర్ణమైనవాడు అవ్వాలంటే ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా అయ్యిఉండాలి.తేడా ఏమిటంటే, మన స్వరూపం (శరీరం) భౌతిక శక్తి, 'మాయ', తో తయారు చేయ బడితే, భగవంతుని రూపం ఆయన దివ్య 'యోగమాయా' శక్తిచే సృష్టించబడుతుంది. కాబట్టి అది దివ్యమైనది, భౌతిక దోషాలకి అతీతమైనది. పద్మ పురాణం లో ఈ విషయం చక్కగా వర్ణించబడినది.యస్తు నిర్గుణ ఇత్యుక్తః శాస్త్రేషు జగదీశ్వరఃప్రాకృతైః హేయ సంయుక్తైః గుణైర్హీనత్వముచ్యతే‘ఎక్కడెక్కడైతే వేద శాస్త్రాలు దేవునికి ఒక రూపం లేదు అని పేర్కొంటాయో, అవి సూచించేదేమిటంటే, ఆయన స్వరూపము, భౌతిక శక్తి యొక్క కళంకములకు అతీతమైనది అని; పైగా అది దివ్య మంగళ స్వరూపము, అని అర్థం’
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।
7
4
https://www.holy-bhagava…udio/004_007.mp3
యదా-యదా — ఎప్పుడెప్పుడైతే; హి — నిజముగా; ధర్మస్య — ధర్మము యొక్క; గ్లానిః — క్షీణత; భవతి — సంభవించునో; భారత — అర్జునా, భరత వంశీయుడా; అభ్యుత్థానమ్ — పెరుగుట; అధర్మస్య — అధర్మము యొక్క; తదా — అప్పుడు; ఆత్మానం — నన్ను; సృజామి — సృజింతును (ప్రకటించుకుందును); అహం — నేను.
BG 4.7: ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.
ధర్మము అంటే నిజానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, పురోగతికి సహకరించే, విహిత కర్మలే; దీనికి విరుద్ధమే అధర్మం. అధర్మం ప్రబలినప్పుడు, ఈ లోక సృష్టికర్త, నిర్వహణాధికారి అయిన భగవంతుడు, స్వయంగా జోక్యం చేసుకొని, దిగివచ్చి, మరల ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే అవతారము అంటారు. ఈ అవతారం అన్న పదం సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి (‘Avatar’) తీసుకోబడింది, ఇప్పటికాలంలో దీనిని సాధారణంగా కంప్యూటర్‌లో జనుల చిత్రపటాలను సూచించే అర్థంలో వాడుతున్నారు. కానీ, ఈ భాష్యంలో ఈ పదాన్ని, దాని యొక్క నిజమైన అర్థంలో, అంటే భగవంతుని అవతారమును సూచించటానికే వాడుదాము. శ్రీమద్భాగవతంలో ఇటువంటి ఇరవై నాలుగు అవతారముల గురించి చెప్పబడింది. కానీ, భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేద శాస్త్రములు పేర్కొంటున్నాయి.జన్మకర్మాభిధానాని సంతి మేఽoగ సహస్రశఃన శక్యంతే ఽనుసంఖ్యాతుం అనంతత్వాన్ మయాపి హి(భాగవతం 10.51.37)‘అనాది కాలం నుండి ఉన్న అనంతమైన భగవత్ అవతారములను ఎవరూ గణించలేరు.’ క్రింద చెప్పబడినట్టు, ఈ అవతారములు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి:1. ఆవేశావతారములు: ఒక జీవాత్మ యందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టి మరియు ఆ జీవాత్మ ద్వారా కార్యకలాపాలు చేయటం. నారద ముని ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ. బుద్ధుడు కూడా ఒక ఆవేశావతార ఉదాహరణ.2. ప్రాభవావతారములు: భగవంతుడు ఒక సాకార రూపంలో వచ్చి, తన దివ్య శక్తులలో కొన్నింటిని ప్రదర్శించిన అవతారములు ఇవి. ప్రాభవావతారములు కూడా రెండు రకాలు.భగవంతుడు కొద్ది సేపు మాత్రమే ప్రకటితమై, తన కార్యాన్ని పూర్తిచేసి, వెళ్లిపోయేవి. హంసావతారము దీనికి ఒక ఉదాహరణ, దీనిలో కుమార ఋషులకు కనిపించి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు.భూలోకంలో చాలా ఏళ్లు కొనసాగే అవతారములు. పద్దెనిమిది పురాణాలను మరియు మహాభారతాన్ని వ్రాసి, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన వేద వ్యాసుడు, ఇటువంటి అవతారమే.3. వైభవావతారములు: తన దివ్య రూపంలో దిగివచ్చి తన మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారములు వైభావావతారముల ఉదాహరణలు.4. పరావస్థావతారములు: భగవంతుడు తన సమస్త దివ్య శక్తులను తన దివ్య స్వరూపంలో వ్యక్తపరిచినవి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నృసింహావతారము - పరావస్థావతారముల ఉదాహరణలు.ఈ వర్గీకరణ వల్ల, ఏదో ఒక అవతారం మరో అవతారం కంటే ఎక్కువ అని చెప్పినట్లు కాదు. తనే ఒక అవతారమైన వేద వ్యాసుడు పద్మ పురాణంలో ఈ విధంగా చెప్పాడు: సర్వే పూర్ణాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరమాత్మనః ‘భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క అన్ని దివ్య శక్తులతో నిండి ఉంటాయి; అవన్నీ సంపూర్ణమైనవి, దోషరహితమైనవి.’ కాబట్టి, మనము ఒక అవతారము ఎక్కువది ఇంకో అవతారము తక్కువది అని తేడా చూపకూడదు. ప్రతి అవతారంలో, దేవుడు ఆ అవతారంలో తను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి. అందుకే, ఈ వ్యత్యాసములను వివరించటానికే పై వర్గీకరణ చేయబడింది.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ । ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।
8
4
https://www.holy-bhagava…udio/004_008.mp3
పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు.
BG 4.8: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.
పూర్వ శ్లోకం లో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు: 1) దుష్టులను సంహరించుట కొరకు 2) సాధు జనులను రక్షించుట కొరకు 3) ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ, వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.సాధు జనులను రక్షించుట కొరకు: పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.దుష్టులను సంహరించుట కొరకు: భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది?ధర్మాన్ని స్థాపించుట కొరకు: అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.మరైతే, ఈ శ్లోకంలో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ది నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరమైనది. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది, మరియు ఎంతో మధురమైనది.ఈ విధంగా, ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీలో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుష్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమోహనముగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. శ్రీరామచంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ‘తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు.’ కాబట్టి, ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే :ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి భగవత్ దివ్య ధామము నుండి దిగివచ్చిన జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేరు. కాబట్టి, భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే.ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.ఇది, ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థం. అదే సమయంలో, ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగానే అర్థం చేసుకోవటంలో కూడా తప్పు లేదు.
జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః । త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున ।। 9 ।।
9
4
https://www.holy-bhagava…udio/004_009.mp3
జన్మ — పుట్టుక; కర్మ — కార్యములు; చ — మరియు; మే — నా యొక్క; దివ్యమ్ — దివ్యమైనవి; ఏవం — ఈ విధంగా; యః — ఎవరైతే; వేత్తి — తెలుసుకుంటారో; తత్త్వతః — పరిపూర్ణముగా; త్యక్త్వా — విడిచిపెట్టిన పిదప; దేహం — దేహమును; పునః-జన్మ — మరల పుట్టుక; న-ఇతి — ఉండదు; మాం — నన్నే; ఏతి — చేరును; సః — అతడు; అర్జున — అర్జునా.
BG 4.9: నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థంచేసుకుంటారో, ఓ అర్జునా, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు, వారు నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు.
ఈ శ్లోకాన్ని ఇంతకు క్రితం శ్లోకం యొక్క పూర్వోత్తర సంబంధంతో అర్థం చెసుకోవాలి. భగవంతునిపై ప్రేమ పూర్వక స్మరణ ద్వారా మన మనస్సు శుద్ది అవుతుంది. ఈ భక్తి నిరాకార బ్రహ్మన్ పై ఉండవచ్చు లేదా సాకార రూపంపై గాని ఉండవచ్చు. నిరాకార బ్రహ్మన్‌పై ఉండే భక్తి, చాలా మందికి అగోచరమైనది మరియు అస్పష్టమైనదిగా ఉంటుంది. భక్తి పూర్వక ధ్యాన సమయంలో దేని మీద ధ్యాస ఉంచాలి లేదా దేనితో అనుసంధానమవ్వాలి అనేది వారికి తెలియదు. అదే సమయంలో, ఒక స్వరూపంతో ఉన్న భగవంతునిపై భక్తి, సులువైనది మరియు ఆచరణీయమైనది. అలాంటి భక్తికి, భగవంతుని వ్యక్తిత్వంపై దివ్య భావనలు అవసరం. శ్రీ కృష్ణుడి పట్ల భక్తిలో నిమగ్నమవ్వాలంటే, ఆయన నామములు, రూపము, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారము పై భగవత్ భావ ప్రేమను పెంచుకోవాలి. ఉదాహరణకి, భగవంతుడు విగ్రహాలలో ఉన్నాడనే దైవీ భావాల వలన, రాతి విగ్రహాలను ఆరాధించటంతో జనులు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు. ఈ భావాలే భక్తుల మనస్సులను పవిత్రం చేస్తాయి. మూలపురుషుడైన మనువు ఇలా అన్నాడు.న కాష్ఠే విద్యతే దేవో న శిలాయాం న మృత్సు చభావే హి విద్యతే దేవస్తస్మాత్భావం సమాచరేత్ ‘భగవంతుడు కట్టెలో లేడు, రాతిలో లేడు. భక్తితో కూడిన హృదయంలో ఉన్నాడు. కాబట్టి, విగ్రహాన్ని ప్రేమ పూర్వక భావంతో ఆరాధించుము.’అదేవిధంగా, శ్రీకృష్ణ పరమాత్మ పట్ల భక్తిలో నిమగ్నమవ్వాలంటే, ఆయన లీలలు దివ్యమైనవి అన్న భావన కలిగి ఉండాలి. మహాభారతము మరియు భగవద్గీతలపై ఉపమాన-అలంకారముగా వ్యాఖ్యానం చెప్పిన భాష్యకారులు, శ్రీ కృష్ణుడి పట్ల భక్తిపై విశ్వాసాన్ని నాశనం చేసి తీవ్ర అన్యాయం చేసినట్టే. ఈ శ్లోకం లో, శ్రీ కృష్ణుడు, మన భక్తిని పెంపొందించుకోవటానికి, తన లీలల యందు దివ్య భావన కలిగి ఉండటం యొక్క అవసరాన్ని ఉద్ఘాటించాడు.ఇలాంటి దివ్య భావనలు పెంపొందించుకోవటానికి, భగవంతుని కర్మలకు, మన కర్మలకు ఉన్న తేడాని అర్థం చేసుకోవాలి. భౌతికంగా బద్దులైన జీవాత్మలమైన మనకు ఇంకా దివ్య ఆనందం లభించలేదు, అందుకే మన ఆత్మ యొక్క తపన ఇంకా తీరలేదు. అందుకే, మన కర్మలన్నీ స్వార్థ ప్రయోజనం కోసమే, ఇంకా, స్వీయ తృప్తి కోసమే. కానీ, భగవంతుని కర్మలలో ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆయన తన స్వీయ వ్యక్తిత్వపు అనంతమైన ఆనందంలో సంపూర్ణ తృప్తితో ఉంటాడు. ఏవో పనులు చేసి ఇంకింత ఆనందం పొందవలసిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి, భగవంతుడు ఏ పని చేసినా అది భౌతికంగా బద్దులైన జీవాత్మల సంక్షేమం కోసం చేసేదే. అటువంటి, ఆయన చేసే దివ్య క్రియాకలాపములనే ‘లీలలు’ అంటారు. అదే సమయంలో, మనం చేసే క్రియలను ‘పనులు’ అంటారు.అదే విధంగా, భగవంతుని జన్మ కూడా దివ్యమైనది, మరియు మనలాగా కాకుండా, ఆయన పుట్టుక భౌతికంగా ఒక తల్లి గర్భం నుండి కలుగలేదు. దివ్యపరమానంద భరితుడైన భగవంతునికి ఒక తల్లి గర్భంలో తలక్రిందులుగా ఉండవలసిన అవసరం లేదు. భాగవతం ఇలా పేర్కొంటున్నది:తమ్ అద్భుతం బాలకం అంబుజేక్షణంచతుర్భుజం శంఖ గదార్యుదాయుధం (10.3.9)‘శ్రీ కృష్ణుడు తన జన్మ సమయంలో దేవకీవసుదేవుల ముందు ప్రకటితమైనప్పుడు, ఆయన తన నాలుగు భుజాల విష్ణు రూపంలో ఉన్నాడు.’ ఈ నిలువెత్తు స్వరూపం ఖచ్చితంగా దేవకీ గర్భంలో ఉండి ఉండదు. కానీ, ఆమెకు తాను గర్భంలోనే ఉన్నాననే భావన తెప్పించటానికి, తన యోగమాయా శక్తి చేత, దేవకీ దేవి గర్భాన్ని వ్యాకోచింప చేస్తూ ఉన్నాడు. చివరికి, తాను ఆమెలో ఎప్పుడూ లేనని తెలియచేస్తూ, బయట నుండి ప్రకటితమయ్యాడు. ఆవిరాసీద్ యథా ప్రాచ్యాం దిశీందుర్ ఇవ పుష్కలః(భాగవతం 10.3.8) ‘రాత్రి పూట ఆకాశంలో సంపూర్ణ ప్రకాశంతో చంద్రుడు ప్రకటితమైనట్టుగా, శ్రీకృష్ణ పరమాత్మ దేవకీవసుదేవుల ముందు ప్రత్యక్షమయ్యాడు.’ ఇదే భగవంతుని జన్మ యొక్క దివ్య స్వభావం. మనము ఆయన జన్మ మరియు కర్మలు దివ్యమైనవి అన్న విశ్వాసం పెంచుకుంటే, మనము సునాయాసంగా ఆయన సాకార స్వరూపం పట్ల భక్తిలో నిమగ్నమై, సర్వోత్క్రుష్ట గమ్యమును చేరుకుంటాము.
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః । బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ।। 10 ।।
10
4
https://www.holy-bhagava…udio/004_010.mp3
వీత — లేకుండా; రాగ — మమకారాసక్తి; భయ — భయము; క్రోధాః — కోపము; మత్-మయా — పూర్తిగా నాయందే మనస్సు లగ్నం చేసి; మామ్ — నన్ను; ఉపాశ్రితాః — ఆశ్రయించి; బహవః — పెక్కు మంది; జ్ఞాన — జ్ఞానము యొక్క; తపసా — జ్ఞానాగ్నిచే; పూతాః — పవిత్రులై; మత్-భావం — నా దివ్య ప్రేమ; ఆగతాః — పొందినారు.
BG 4.10: మమకారాసక్తి, భయము, మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి, ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు, మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు.
ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణ పరమాత్మ, ఎవరైతే ఆయన యొక్క జన్మ, కర్మ(లీల)ల దివ్యత్వాన్ని యదార్థంగా తెలుసుకుంటారో వారు ఆయననే పొందుతారు అని చెప్పి ఉన్నాడు. అన్నీ యుగాల్లో ఎంతో మంది మానవులు ఈ పద్ధతిలో భగవత్-ప్రాప్తి పొందినారు అని ఇప్పుడు దృఢపరచుతున్నాడు. వారు భక్తి ద్వారా తమ మనస్సులను ప్రవిత్రమొనర్చుకుని ఈ లక్ష్యాన్ని సాధించారు. శ్రీ ఆరోబిందో దీనిని చక్కగా వివరించాడు: ‘భగవంతుడిని నీ హృదయమనే దేవాలయంలో ప్రతిష్ఠచేయాలనుకుంటే, దాన్ని పవిత్రంగా ఉంచుకొనుము’ (You must keep the temple of the heart clean, if you wish to install therein the living presence). బైబిలు ఇలా పేర్కొంటుంది: ‘పరిశుద్ధ హృదయముగలవారు ధన్యులు, ఎందుకంటే వారు భగవంతుణ్ణి చూస్తారు. (మత్తయి 5.8)’ (Blessed are the pure in heart, for they shall see God.” (Matthew 5.8))మరిప్పుడు, మనస్సు ఎలా పరిశుద్ధమౌతుంది? మమకారానురాగాలు, భయము, మరియు కోపము త్యజించి మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయటం వల్ల ఇది సాధ్యం. నిజానికి భయానికి, కోపానికి రెంటికీ కూడా కారణం మమకారాసక్తియే. మనం మమకారం పెంచుకున్న వస్తు/విషయం మన నుండి దూరమౌతుందేమో అన్న భావనే భయాన్ని కలుగచేస్తుంది. మనం మమకారం పెంచుకున్న వస్తు/విషయాన్ని పొందటంలో ఏదైనా అడ్డువచ్చినప్పుడు క్రోధము జనిస్తుంది. అందుకే, మమకారానుబంధమే మనస్సు మలినమవటానికి మూల కారణం.ఈ మాయా ప్రపంచం ప్రకృతి యొక్క త్రి-గుణములచే సమ్మిళితమై ఉంటుంది – సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. అన్ని వస్తువులు, వ్యక్తిత్వాలు కూడా ఈ మూడు గుణముల పరిధిలోకే వస్తాయి. మన మనస్సుని ఏదోఒక భౌతిక వస్తువు లేదా వ్యక్తి తో అనుబంధం చేస్తే, మన మనస్సు కూడా త్రిగుణములచే ప్రభావితమవుతుంది. బదులుగా, అదే మనస్సుని, త్రిగుణములకు అతీతుడైన భగవంతుని యందు లగ్నం చేస్తే, అలాంటి భక్తి మనస్సుని పవిత్రం చేస్తుంది. కాబట్టి, మనస్సుని కామము, క్రోధము, లోభము, అసూయ, మరియు భ్రమ వంటి దోషముల నుండి పరిశుద్ధం చేయాలంటే, దానికి కావాల్సిన దివ్యౌషధం, ప్రాపంచిక వస్తు విషయముల నుండి మనస్సుని తొలగించి, దాన్ని భగవంతుని యందు లగ్నం చేయటమే. కాబట్టి, రామాయణం (రామచరితమానస్) లో ఇలా పేర్కొనబడినది:ప్రేమ భగతి జల బిను రఘురాఈఅభిఅంతర మల కబహుఁ న జాఈ ‘భగవంతుని యందు భక్తి లేనిదే, మనస్సుకి ఉన్న మలినం తొలగదు.’ జ్ఞాన-యోగాన్ని ఎంతో ప్రచారం చేసిన శంకరాచార్యుల వారు కూడా ఇలా పేర్కొన్నారు:శుద్ధయతి హి నాంతరాత్మా కృష్ణపదాంభోజ భక్తిమృతే(ప్రబోధ సుధాకర)‘శ్రీ కృష్ణపరమాత్మ పాదారవిందాల యందు భక్తిలో నిమగ్నమవ్వకుండా, మనస్సు పరిశుద్దమవ్వదు.’శ్రీ కృష్ణుడు తన కృపాకటాక్షములు ప్రసాదించటానికి, ప్రాపంచిక మనసున్న వారి కంటే, తన యందే మనస్సు లగ్నం చేసిన వారిపట్ల పక్షపాతం చూపిస్తున్నాడా అని, ఈ శ్లోకం చదివిన తరువాత ఒక సందేహం రావచ్చు. దేవదేవుడు దీనిని తదుపరి శ్లోకంలో నివృత్తి చేస్తున్నాడు.
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 11 ।।
11
4
https://www.holy-bhagava…udio/004_011.mp3
యే — ఎవరు; యథా — ఏ విధంగా నైతే; మాం — నాకు; ప్రపద్యంతే — శరణాగతి చేస్తారో; తాం — వారిని; తథా — ఆ విధంగా; ఏవ — ఖచ్చితంగా; భజామి — ప్రతిస్పందిస్తాను (అనుగ్రహిస్తాను); అహం — నేను; మమ — నా యొక్క; వర్త్మ — మార్గము; అనువర్తంతే — అనుసరిస్తారు; మనుష్యాః — మానవులు; పార్థ — అర్జున; సర్వశః — అన్ని విధములా.
BG 4.11: నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా, తెలియకపోయినా, అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, ఓ ప్రిథ తనయుడా (అర్జునా).
తనకు శరణాగతి చేసిన వారందరికీ తన అనుగ్రహంతో ప్రతిస్పందిస్తానని ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. భగవంతుని ఉనికిని తిరస్కరించిన వారికి, ఆయన కర్మసిద్ధాంత రూపంలో కలుస్తాడు – వారి హృదయాల్లోనే కూర్చుండి, వారి కర్మలను నోట్ చేస్కుంటూ, వాటి ఫలితాలను ఇస్తుంటాడు. కానీ, ఇలాంటి నాస్తికులు సైతం ఆయన సేవ చేయకుండా తప్పించుకోలేరు; వారు భగవంతుని భౌతిక శక్తికి సేవ చేయాల్సిందే, మాయ ఎన్నో స్వరూపాల్లో వ్యక్తమవుతుంది – సంపద, భోగాలు, బంధువులు, కీర్తి, మొదలగునవి. మాయా శక్తి, వారిని కామ, క్రోధ, లోభ గుణములతో బంధించివేస్తుంది. అదే సమయంలో మరోపక్క, ప్రాపంచిక భౌతిక ఆకర్షణల నుండి తమ మనస్సుని పక్కకి మరల్చి, భగవంతుడే తమ లక్ష్యము, ఆశ్రయముగా బ్రతికేవారి అన్ని అవసరాలను, తల్లి తన బిడ్డ బాగోగులు చూసుకున్నట్లుగా, ఆయనే చూసుకుంటాడు.శ్రీ కృష్ణుడు ‘భజామి’ అన్న పదం ఇక్కడ వాడాడు, అంటే ‘సేవ చేయటం’. శ్రీ కృష్ణుడు, ఆయనకు శరణాగతి చేసిన వారి యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మను నాశనం చేస్తాడు, మాయా బంధనము నుండి విముక్తి చేస్తాడు, భౌతిక సంసార చీకటి తొలగిస్తాడు, దివ్యానందాన్ని, దివ్య జ్ఞానాన్ని మరియు దివ్య ప్రేమని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుడిని నిస్వార్థంగా ప్రేమించటం నేర్చుకుంటాడో, తను స్వయంగా వారి ప్రేమకు బానిసైపోతాడు. శ్రీ రాముడు హనుమతో ఇలా అన్నాడు:ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపేశేషస్యేహోపకారాణాం భవాం ఋణినో వయమ్(వాల్మీకి రామాయణం) ‘ఓ హనుమా, నీవు చేసిన ఒక సేవ (ఉపకారం) యొక్క ఋణం తీర్చుకోవటానికే నా జీవితాన్ని నీకు ఇచ్చేయాలి. నీచే చేయబడిన మిగతా అన్ని భక్తి యుక్తసేవలకు, నేను నీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.’ ఈ విధంగా, భగవంతుడు తనను శరణువేడిన అందరినీ అదే విధంగా కాపాడి, ఆదుకుంటాడు.భగవంతుడు ఇంత పరమ దయాళువు అయినప్పుడు, కొందరు అన్య దేవతలను ఎందుకు పూజిస్తారు? తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః । క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ।। 12 ।।
12
4
https://www.holy-bhagava…udio/004_012.mp3
కాంక్షంతః — కోరికతో; కర్మణాం — ప్రాకృతిక కర్మలు; సిద్ధిం — విజయం; యజంతే — పూజిస్తారు; ఇహ — ఈ లోకంలో; దేవతాః — దేవతలను; క్షిప్రం — త్వరగానే; హి — నిజముగా; మానుషే — మానవ సమాజంలో; లోకే — ఈ లోకంలో; సిద్ధి — సిద్ధించును; భవతి — కనిపించును; కర్మ-జా — భౌతిక క్రియాకలాపముల వలన.
BG 4.12: ఈ లోకంలో భౌతిక(ప్రాకృతిక) కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి.
ప్రాపంచిక లాభాల కోసం ప్రయత్నించే వారు, వరముల కోసం, దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ప్రసాదించే వరాలు ప్రాకృతికమైనవి మరియు తాత్కాలికమైనవి. భగవంతుడు ఆయా దేవతలకు ప్రసాదించిన శక్తి ద్వారానే వారు ఆ వరాలను ఇవ్వగలుగుతున్నారు. ఈ విషయం పై ఒక చక్కటి ఉపదేశం చెప్పే కథ ఉంది: ఒకసారి సంత్ ఫరీద్, అక్బర్ చక్రవర్తి కొలువుకి వెళ్ళాడు. (భారత చరిత్రలో అక్బర్ ఒక శక్తిమంతుడైన రాజు). అక్బర్ ప్రక్క గదిలో పూజలో ఉండగా, అతను కొలువులో రాజు గారి కోసం వేచి ఉన్నాడు. ఏం జరుగుతోందో అని ఫరీద్ ఆ గదిలోకి తొంగి చూసినప్పుడు, అక్బర్, ఇంకా శక్తివంతమైన సైన్యం, మరింత కోశాగార నిధి, మరియు యుద్ధ విజయం కోసం భగవంతుడిని అడగటాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. రాజుగారి ఆరాధనకి భంగం కలిగించకుండా, ఫరీద్, రాజ కొలువుకి తిరిగి వచ్చేసాడు. తన పూజ పూర్తయిన తరువాత, అక్బర్, ఆయన చెప్పేది వినటానికి వచ్చాడు. ఆ మహోన్నత వ్యక్తిని ఏమైనా కావాలా అని అడిగాడు. ఫరీద్ ఇలా బదులిచ్చాడు, ‘నా ఆశ్రమ నిర్వహణ కొరకు నాకు కావలసిన సామాగ్రిని అడగటానికి చక్రవర్తిగారి దగ్గరకు వచ్చాను. కానీ, చక్రవర్తి కూడా ఆ భగవంతుని వద్ద యాచకుడే అని తెలుసుకున్నాను. కాబట్టి నేరుగా భగవంతుడినే కాకుండా, మహారాజుని ఏదో కావాలని అడగటం ఎందుకు?’ అని. భగవంతుడు తమకు ప్రసాదించిన శక్తి ద్వారానే దేవతలు వరాలు ఇస్తుంటారు. సరైన జ్ఞానం లేని వ్యక్తులు వారిని ఆశయిస్తారు, కానీ నిజంగా వివేకవంతులు ఈ మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళటంలో అర్థంలేదు అని తెలుసుకొని, తమ తమ కోరికల నివృత్తి కోసం ఆ సర్వ శక్తివంతుడైన భగవంతుడినే ఆశ్రయిస్తారు. జనులు విభిన్న రకాలుగా ఉంటారు, కొందరికి ఉన్నత స్థాయి ఆశయాలు ఉంటాయి, మరికొందరికి నిమ్న స్థాయివి ఉంటాయి. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు నాలుగు రకాల కర్మ, గుణముల గురించి వివరిస్తాడు.
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః । తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।।
13
4
https://www.holy-bhagava…udio/004_013.mp3
చాతుః-వర్ణ్యం — నాలుగు రకాల వృత్తి ధర్మములు; మయా — నా చే; సృష్టం — సృష్టింపబడ్డాయి; గుణ — గుణముల; కర్మ— పనుల; విభాగశః — విభాగముల ప్రకారము; తస్య — దాని యొక్క; కర్తారం — సృష్టికర్త; అపి — అయినా సరే; మాం — నన్ను; విద్ధి — తెలుసుకొనుము; అకర్తారమ్ — అకర్తయని; అవ్యయమ్ — మార్పులేని.
BG 4.13: జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.
వేదములు జనులను నాలుగు రకాల వృత్తులవారీగా విభజించాయి, ఇవి వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ వారి పుట్టుకను బట్టి చేసినవి కావు. ఇటువంటి వైవిధ్యం ప్రతి సమాజంలోనూ ఉంటుంది. సమత్వమే ప్రధానమైన సూత్రముగా ఉండే కమ్యూనిష్టు దేశాల్లో కూడా మానవులలో ఉండే నానావిధత్వమును తొలగించలేము. కమ్యూనిష్టు పార్టీలో మూల సిద్ధాంతకర్తలుగా ఉండే తత్త్వవేత్తలు, దేశాన్ని కాపాడే సైనిక దళాలు, వ్యవసాయం చేసుకునే రైతులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు; వీరంతా ఉంటారు. వైదిక శాస్త్రం ఈ వైవిధ్యాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో విశదీకరించింది. దాని ప్రకారం, భౌతిక శక్తి మూడు గుణములతో సమ్మిళితమై ఉంటుంది : సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము. బ్రాహ్మణులు అంటే సత్త్వ గుణం ప్రధానంగా ఉన్నవారు. వారికి స్వాభావికంగా బోధన మరియు భగవత్ ఆరాధన అంటే మొగ్గు చూపుతారు. క్ష్యత్రియులు రజో గుణ ప్రధానముగా ఉండి, స్వల్పంగా సత్వ గుణం మిళితమై ఉంటారు. వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు. వైశ్యులు రజో గుణము మరియు కొంత తమో గుణము మిళితమై ఉంటారు. కాబట్టి వారు వ్యాపారము మరియు వ్యవసాయం ప్రధానంగా ఉంటారు. తరువాత, శూద్రులు, వీరు తమో గుణ ప్రధానంగా ఉంటారు. వీరు శ్రామిక వర్గముగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది జన్మతహా వచ్చినవి కావు లేదా మార్చలేనివి కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది జనుల స్వభావము మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భగవంతుడు ఈ ప్రపంచ వ్యవస్థకి సృష్టికర్త అయినా, ఆయన అకర్తగా ఉంటాడు. ఇది వర్షము వంటిది. అడవిలో వర్షపాతం అంతటా సమానంగా పడినా, కొన్ని విత్తనాల నుండి పెద్ద మర్రి చెట్లు వస్తాయి, మరికొంత విత్తనాల నుండి అందమైన పుష్పములు పూస్తాయి, మరివేరే వాటినుండి ముళ్ళపొదలు వస్తాయి. ఆ వర్షం అన్నిటిపట్ల పక్షపాతం లేకుండా సమంగా కురుస్తుంది, ఈ వ్యత్యాసానికి బాధ్యత దానిది కాదు. ఇదే విధంగా, భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు, కానీ ఆ శక్తితో వారు ఏమి చేస్తారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారి చర్యలకు భగవంతుడు కారణం కాదు.
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా । ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ।। 14 ।।
14
4
https://www.holy-bhagava…udio/004_014.mp3
న — కాదు; మాం — నన్ను; కర్మాణి — కర్మలు; లింపంతి — అంటవు; న — కాదు; మే — నేను; కర్మ-ఫలే — కర్మ ఫలములను; స్పృహా — కోరుట; ఇతి — ఈ విధంగా; మాం — నన్ను; యః — ఎవరైతే; అభిజానాతి — తెలుసుకుందురో; కర్మభిః — కర్మ ఫలితములయందు; న — కాదు; సః — ఆ వ్యక్తి; బధ్యతే — బద్ధుడగుట.
BG 4.14: కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈవిధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో చిక్కుకోరు.
భగవంతుడు సంపూర్ణ-పవిత్రుడు, ఆయన ఏది చేసినా అది మంగళప్రదమైనది మరియు పవిత్రమైనది అవుతుంది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:సమరథ కహుఁ నహిం దోషు గోసాఈ,రబి పావక సురసరి కీ నాఈఁ ‘అపవిత్రమైన వ్యక్తులు లేదా వస్తువుల సంపర్కం వలన కూడా, పరిశుద్ధమైన వ్యక్తిత్వములు దోషములచే ఎప్పుడూ కళంకితులు కారు. ఉదాహరణకి సూర్యుడు, అగ్ని, గంగా నది వంటివి.’ సూర్యరశ్మి, మూత్రపు నీటి కుంటపై పడితే సూర్యుడు కలుషితం కాడు. సూర్యుడు తన పరిశుద్ధ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఆ అశుద్ధమును కూడా శుద్ధి చేస్తాడు. అదే విధంగా, అగ్నిలో అపవిత్రమైన పదార్థములు సమర్పించినా, అది తన స్వచ్ఛత నిలుపుకుంటుంది – అగ్ని స్వచ్ఛమైనది, మనం ఏది దానిలో వేసినా అది కూడా శుద్ధమైపోతుంది. ఇదే విధంగా, ఎన్నో మురికి కాలువలు పవిత్ర గంగా నదిలో కలుస్తుంటాయి, కాని గంగా నది మురికి కాలువ అయిపోదు – గంగా నది పవిత్రమైనది, అంతేకాక, ఆ మురికి కాలువలన్నిటినీ గంగా నదిగా మార్చివేస్తుంది. అదే విధంగా, భగవంతుడు కూడా తను చేసే కర్మల వలన కళంకితుడు కాడు.చేసే పనుల వలన వచ్చే ఫలములను తన భోగం కోసం చేస్తే ఆ కర్మలు వ్యక్తిని కర్మబంధములలో పెనవేస్తాయి. కానీ, భగవంతుని చర్యలు స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు; ఆయన ప్రతిఒక్క చర్య కూడా జీవులపై కరుణతో చేసినదే. కాబట్టి, ఆయనే ఈ జగత్తునంతా ప్రత్యక్షంగానో, పరోక్షం గానో అజమాయిషీ చేస్తూ మరియు ఈ వ్యవహారంలో ఎన్నో పనులు చేసినా, ఆయనకి కర్మ ప్రతిచర్యలు అంటవు. తను ఈ కర్మ ఫల బంధాలకు అతీతుడనని శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు.భగవత్-ప్రాప్తి నొందిన ఋషులు కూడా భౌతిక శక్తికి అతీతులుగా అవుతారు. వారి యొక్క అన్ని కార్యక్రమాలు, భగవత్ ప్రేమచే ప్రేరేపితమౌతాయి కనుక అటువంటి పరిశుద్ధ మనసున్న సత్పురుషులు కర్మ ఫల బంధములలో చిక్కుకోరు. శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది:యత్పాదపంకజ పరాగ నిషేవ తృప్తాఃయోగ ప్రభావ విధుతాఽఖిల కర్మ బంధాఃస్వైరం చరంతి మునయో ఽపి న నహ్యమానాఃతస్యేఛ్చయాత్త వపుషః కుత ఏవ బంధః (10.33.35)‘భగవంతుని పాదారవింద ధూళి సేవలోనే సంపూర్ణ తృప్తి పొందే భక్తులను ప్రాపంచిక క్రియాకలాపములు ఎన్నటికీ కళంకితం చేయవు. యోగబలముచే కర్మ-ఫల బంధముల నుండి తమను తాము విడిపించుకున్న వివేకవంతులైన మునులను కూడా ప్రాపంచిక క్రియాకలాపములు కళంకితం చేయవు. మరింక, తన స్వ-సంకల్పము చేతనే అలౌకిక రూపమును ధరించే భగవంతునికి ఈ బంధములు ఉండే ప్రశ్నేఎక్కడిది?’
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః । కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ।। 15 ।।
15
4
https://www.holy-bhagava…udio/004_015.mp3
ఏవం — ఈ విధంగా; జ్ఞాత్వా — తెలుసుకొని; కృతం — చేయబడెను; కర్మ — కర్మలు; పూర్వైః — ప్రాచీన కాలంలో; అపి — నిజముగా; ముముక్షుభి: — మోక్షము ఆకాంక్షించే వారు; కురు — చేయవలెను; కర్మ — కర్తవ్యము; ఏవ — నిజముగా; తస్మాత్ — కాబట్టి; త్వం — నీవు; పూర్వైః — ప్రాచీన మునుల యొక్క; పూర్వ-తరం — ప్రాచీన కాలంలో; కృతం — చేసినారు.
BG 4.15: ఈ సత్యమును తెలుసుకొని, ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా, తమ కర్మలను ఆచరించారు. కాబట్టి, ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ, నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము.
భగవత్ ప్రాప్తి కోసం ఆశించే మునులకు భౌతిక లబ్ధిపై ఆసక్తి ఉండదు. మరైతే ఎందుకు ఈ ప్రపంచంలో వారు కర్మలను చేస్తారు? ఎందుకంటే, వారు భగవత్ సేవ చేయ గోరుతారు, భగవంతుని ప్రీతి కోసం పనులు చేయటంలో స్ఫూర్తిపొందుతారు. తాము భక్తితో చేసే సంక్షేమ కార్యాల యొక్క కర్మ బంధనాలు తమకు అంటవు, అన్న విశ్వాసాన్ని, ఇంతకు క్రితం శ్లోకం యొక్క జ్ఞానం, కలిగిస్తుంది. భగవత్ స్పృహ లేకుండా, భౌతిక ప్రాపంచిక బద్దులైన జీవులు పడే బాధల పట్ల కరుణ కలిగి, చలించి, వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పాటు పడుతారు. బుద్ధుడు ఒక సారి ఇలా అన్నాడు ‘జ్ఞానోదయమైన తరువాత నీవు రెండు పనులు చేయవచ్చు - ఏమీ చేయకుండా ఉండు లేదా ఇతరులకు జ్ఞానోదయ ప్రాప్తికి సహాయపడు.’ కాబట్టి, స్వార్థ ప్రయోజనం ఏ మాత్రము లేని యోగులు, మునులు కూడా, భగవత్ ప్రీతి కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. భక్తితో పని చేయటం కూడా భగవత్ కృపకి పాత్రులవటానికి దోహద పడుతుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడిని అదే చేయమంటున్నాడు. కర్మ బంధనము కలిగించని పనులను ఆచరించమని అర్జునుడికి చెప్పిన భగవంతుడు ఇక ఇప్పుడు కర్మ తత్త్వాన్ని విశదీకరిస్తున్నాడు.
కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః । తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ।। 16 ।।
16
4
https://www.holy-bhagava…udio/004_016.mp3
కిం — ఏమిటి? కర్మ — కర్మ; కిమ్ — ఏమిటి? అకర్మ — అకర్మ; ఇతి — ఈ విధంగా; కవయః — వివేకవంతులు; అపి — కూడా; అత్ర — ఈ విషయంలో; మోహితాః — తికమక పడుతుంటారు; తత్ — అది; తే — నీకు; కర్మ — కర్మ; ప్రవక్ష్యామి — విశదీకరిస్తాను; యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకున్నచో; మోక్ష్యసే — నిన్ను నీవు విముక్తుడిని చేసుకోవచ్చు; అశుభాత్ — అశుభముల నుండి.
BG 4.16: కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను, దీనిని తెలుసుకోవటం ద్వారా, నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు.
మానసిక ఊహాగానాల ద్వారా ధర్మ సూత్రములను నిశ్చయించలేము. ఏంతో తెలివైన వారు కూడా శాస్త్రములు మరియు మునులు చెప్పే మాటలలో ఉండే పరస్పర విరుద్ధ మాటలతో తికమక పడుతుంటారు. ఉదాహరణకి, వేదములు అహింసను ప్రభోదించాయి. ఆ ప్రకారంగా, మహాభారతంలో, అర్జునుడు అలా ఉండదలిచి హింసను వద్దనుకుంటాడు కానీ శ్రీ కృష్ణుడు అతడిని హింసాయుతంగా ఉండే యుద్ధం చేయటంలోనే ధర్మము ఉందంటాడు. ధర్మము అనేది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటే, ఏదేని నిర్దిష్ట పరిస్థితిలో ధర్మము ఏమిటి అని తెలుసుకోవటం చాలా జటిలమైనది. యమధర్మరాజు (మృత్యు దేవత) ఇలా పేర్కొన్నాడు :ధర్మం తు సాక్షాద్భగవత్ ప్రణీతంన వై విదుర్ ఋషయో నాపి దేవాః (భాగవతం 6.3.19) ‘చేయదగిన పని ఏమిటి మరియు చేయకూడని పని ఏమిటి? దీనిని నిర్ణయించుకోవటం గొప్ప ఋషులకు, దేవతలకు కూడా చాలా క్లిష్టమైన విషయం. ధర్మము స్వయంగా భగవంతుని చే సృష్టించబడింది, మరియు ఆయన మాత్రమే దానిని యదార్థముగా ఎఱుగును.’ శ్రీ కృష్ణుడు అర్జునునితో తాను ఇప్పుడు గోప్యమైన కర్మ, అకర్మ విజ్ఞానాన్ని తెలియపరుస్తాను అని అంటున్నాడు; దీని ద్వారా అర్జునుడు భౌతిక బంధములనుండి తనను తాను విడిపించుకోవచ్చు.
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః । అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ।। 17 ।।
17
4
https://www.holy-bhagava…udio/004_017.mp3
కర్మణః — చేయవలసిన (విహిత) కర్మలు; హి — నిజముగా; అపి — కూడా; బోద్ధవ్యం — తెలుసుకొనుము; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; చ — మరియు; వికర్మణః — నిషిద్ధ కర్మలు; అకర్మణః — అకర్మలు; చ — మరియు; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; గహనా — గంభీరమైనది; కర్మణః — పనుల; గతిః — నిజమైన మార్గము.
BG 4.17: కర్మ, వికర్మ, మరియు అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి – వీటి గురించి ఉన్న యదార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.
పని అనేది శ్రీ కృష్ణుడిచే మూడు రకాలుగా వర్గీకరించబడినది – కర్మ, వికర్మ మరియు అకర్మ.కర్మ: ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్దికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు.వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకరమైన పనులు; ఇవి హాని కారకమైనవి మరియు ఆత్మ అధఃపతనానికి దారితీసేవి.అకర్మ: ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మను బంధించవు.
కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః । స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ।। 18 ।।
18
4
https://www.holy-bhagava…udio/004_018.mp3
కర్మణి — కర్మ; అకర్మ — అకర్మ యందు; యః — ఎవరైతే; పశ్యేత్ — చూసేదరో; అకర్మణి — అకర్మ; చ — మరియు; కర్మ — కర్మ; యః — ఎవరైతే; సః — వారు; బుద్ధి-మాన్ — వివేకవంతులు; మనుష్యేషు — మనుష్యులలో; సః — వారు; యుక్తః — యోగులు; కృత్స్న-కర్మ -కృత్ — సమస్త కర్మలను చేయువారు.
BG 4.18: ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా, వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు.
అకర్మలో కర్మ: ఒక రకమైన అకర్మ పద్ధతిలో జనులు తమ సామాజిక విధులను భారమైనవిగా తలిచి వాటిని సోమరితనంతో వదిలివేస్తారు. భౌతికంగా కర్మలను వదిలి పెట్టినా, వారి మనస్సు ఇంద్రియ వస్తు-విషయముల పైనే చింతన చేస్తుంది. అటువంటి మనుష్యులు ఏమీ చేయనట్టు కనపడ్డా, వారి సోమరితనం నిజానికి పాపపు పని. అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయను అన్నప్పుడు, శ్రీ కృష్ణుడు అలా చేయటం పాపము అన్నాడు, అలాంటి అకర్మ వలన నరకలోకాలకు వెళ్ళవలసి వస్తుంది అని వివరించాడు.కర్మలో అకర్మ: కర్మ యోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది. వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా, కర్మ ఫలములను భగవంతునికే అంకితం చేస్తూ పని చేస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, వారు కర్మ బంధాలలో చిక్కుకోరు, ఎందుకంటే వారు తమ భోగాన్ని ఆశించరు. భారత చరిత్రలో ఏంతో మంది మహారాజులు - ధ్రువుడు, ప్రహ్లాదుడు, యుధిష్ఠిరుడు, ప్రిథువు, మరియు అంబరీషుడు - తమ రాజధర్మాలను తమ శక్తానుసారం నిర్వర్తించారు, అదే సమయంలో ప్రాపంచిక వాంఛల యందు వారి మనస్సు లేదు కాబట్టి వారి పనులు అకర్మ గా పరిగణించబడ్డాయి. ఈ అకర్మకే ఉన్న మరో పేరు 'కర్మ యోగము', ఇదే విషయం ఇంతకు క్రితం రెండు అధ్యాయాలలో కూడా విస్తారంగా చర్చించబడింది.
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః । జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ।। 19 ।।
19
4
https://www.holy-bhagava…udio/004_019.mp3
యస్య — ఎవరైతే; సర్వే — సమస్త; సమారంభాః — క్రియాకలాపములు; కామ — భౌతిక సుఖముల వాంఛ; సంకల్ప — సంకల్పము; వర్జితాః — రహితములై (త్యజించినవారై); జ్ఞాన — ఆధ్యాత్మిక జ్ఞానమనే; అగ్ని — అగ్నిలో; దగ్ధ — కాలి భస్మమై; కర్మాణం — కర్మలు; తం — వానిని; ఆహుః — అందురు; పండితం — పండితుడని; బుధాః — జ్ఞానులు.
BG 4.19: ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేసారో అట్టివారు, జ్ఞానోదయమైన మునులచే, పండితులు అనబడుతారు.
జీవాత్మ అనేది, ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశము కాబట్టి, సహజంగానే తనుకూడా ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది. కానీ, భౌతిక శక్తితో ఆవరింపబడిన జీవాత్మ, తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానంలో, భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి కర్మలు చేస్తుంటుంది. ఈ వ్యవహారములు మనోఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మ బంధములలో పెనవేస్తాయి. కానీ, జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, తను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు-విషయముల ద్వారా లభించదని, ప్రేమ పూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది. ‘నీవు ఏం చేసినా, ఏం తిన్నా, యజ్ఞ హోమంలో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, ఓ కుంతీ పుత్రుడా, వాటన్నిటిని నాకు అర్పితముగా చేయుము.’ (భగవత్ గీత 9.27). ఈ విధంగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులు త్యజించి, అన్ని కర్మలను భగవంతుడికే అంకితం చేస్తుంది, ఈ పనులు ఎలాంటి కర్మ బంధనాలను కలుగచేయవు. ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలిభస్మమై పోయాయని చెప్పబడుతాయి.
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః । కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః ।। 20 ।।
20
4
https://www.holy-bhagava…udio/004_020.mp3
త్యక్త్వా — త్యజించి; కర్మ-ఫల-ఆసంగం — కర్మ ఫలముల పై ఆసక్తి; నిత్య — ఎల్లప్పుడూ; తృప్తః — తృప్తితో; నిరాశ్రయః — దేనిమీద ఆధారపడే అవసరం లేకుండా; కర్మణి — కర్మలలో; అభిప్రవృత్తః — నిమగ్నమై; అపి — అయినా కూడా; న — కాదు; ఏవ — నిజముగా; కించిత్ — ఏ కొంచము కూడా; కరోతి — చేసినట్టు; సః — అతను.
BG 4.20: ఇటువంటి జనులు, తమ కర్మ ఫలములపై ఆసక్తి/మమకారం త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు-విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నా, వారు ఏమి చేయనట్టే.
బాహ్యంగా కనిపించే దానిబట్టి కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము. మనస్సు యొక్క స్థితి, ఆ పని కర్మనా లేదా ఆకర్మనా అని నిర్ణయిస్తుంది. జ్ఞానోదయమైన వారి మనస్సు ఎప్పుడూ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమై ఉంటుంది. భక్తితో భగవత్ సంయోగంలో సంపూర్ణ తృప్తితో ఉండి, భగవంతుడినే వారు ఆశ్రయించి ఉంటారు మరియు బాహ్య మైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితిలో వారి అన్ని పనులు అకర్మగా పరిగణించబడుతాయి. ఈ విషయాన్ని విశదీకరిస్తూ పురాణాలలో ఒక మధురమైన కథ ఉంది: బృందావన గోపికలు ఒక సారి ఒక ఉపవాస వ్రతం చేసారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దుర్వాస మహామునికి ఆరగింపు చేయమని శ్రీ కృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు. గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలు దేరారు, కానీ యమునా నది ఆ రోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడూ కూడా వారిని నది దాటించటానికి ఒప్పుకోలేదు. గోపికలు శ్రీ కృష్ణుడిని ఏదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు. ఆయన అన్నాడు, ‘యమునా నదికి చెప్పండి, ఒకవేళ శ్రీ కృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీకు దారి ఇవ్వాలి అని’. గోపికలు నవ్వటం మొదలు పెట్టారు, ఎందుకంటే వారు శ్రీ కృష్ణుడు తమపై ప్రేమవ్యామోహ మోజుతో ఉండేవాడు అనుకున్నారు, కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న ప్రశ్నే తలెత్తదు అని. ఎదేమైనా, వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు, ఆ నది వారికి దారి ఇచ్చింది, మరియు వారు వెళ్ళటానికి ఒక పూల వంతెన కూడా అగుపించింది. గోపికలు ఆశ్చర్య చకితులయ్యారు. వారు దుర్వాస ముని ఆశ్రమానికి వెళ్లారు. వారు తయారు చేసిన రుచికరమైన భోజనమును స్వీకరించమని ఆయనను ప్రార్థించారు. ఆయన సన్యాసి కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు, దీనితో గోపికలు నిరాశ చెందారు. దీనితో, వారిని సంతృప్తి పరచదలిచిన దుర్వాసుడు తన యోగ శక్తితో వారు తెచ్చినదంతా భుజించాడు. అంత పదార్థాన్ని ఆయన తినటం చూసి గోపికలు ఆశ్చర్య పోయారు, కానీ తాము వండిన శ్రమకు ఆయన న్యాయం చేసాడని సంతోషపడ్డారు. గోపికలు ఇప్పుడు దుర్వాస మహామునిని, యమున దాటటానికి సహాయం చేయమన్నారు. ఆయన అన్నాడు, ‘యమునా నదికి చెప్పండి, ఒకవేళ దుర్వాసుడు దూబ్ గడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే, ఆ నది దారి ఇవ్వాలని’. గోపికలు మళ్లీ నవ్వటం మొదలెట్టారు, ఎందుకంటే వారు ప్రత్యక్షంగా దుర్వాసుడు ఎన్నో భోజనార్హపదార్థములతో ఉన్న భోజనం చేయటం చూసారు. అయినా, వారికి ఆశ్చర్యం గొలిపేలా, వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్థించినప్పుడు, యమునా నది మరలా వారికి దారి ఇచ్చింది. గోపికలు శ్రీ కృష్ణుడిని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు - భగవంతుడు, మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపములలో నిమగ్నమై ఉన్నట్టు అనిపించినా, అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, వారు ఏమీ చేయనట్టే లెక్క. గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్నా, శ్రీ కృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి. అలాగే, గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసినా, అంతర్గతంగా ఆ మహాముని మనసు దూబ్ గడ్డిని మాత్రమే రుచి చూసింది. ఈ రెండు కూడా, కర్మలో అకర్మని విశదీకరించే ఉదాహరణలు.
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః । శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 21 ।।
21
4
https://www.holy-bhagava…udio/004_021.mp3
నిరాశీః — ఆశలు లేకుండా; యత — నియంత్రించి; చిత్త-ఆత్మా — మనస్సు మరియు బుద్ధి; త్యక్త — త్యజించి; సర్వ — అన్ని; పరిగ్రహః — నాది అన్న భావమును; శారీరం — శారీరక; కేవలం — కేవలము; కర్మ — పనులు; కుర్వన్ — చేస్తూ; న, ఆప్నోతి — ఎప్పుడూ పొందదు; కిల్బిషమ్ — పాపము.
BG 4.21: ఆశారహితుడై ఉండి, ఏదీ నాది అన్న భావన లేకుండా, మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవానికి, శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు.
ప్రాపంచిక న్యాయ శాస్త్ర ప్రకారం కూడా, అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన హింసాత్మక సంఘటనలు శిక్షించదగిన నేరంగా పరిగణించబడవు. ఎవరైనా సరియైన దారిలో వాహనం నడుపుతూ, సరియైన వేగంతో, కళ్ళతో జాగ్రత్తగా రోడ్డు వైపే దృష్టి పెట్టి ఉన్నప్పుడు, ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి వాహనం ముందు పడిపోయి చనిపోతే, వాహనదారునికి చంపటానికి లేదా హాని చేయటానికి ఎలాంటి ఉద్దేశం లేదని నిరూపించినప్పుడు, న్యాయస్థానం కూడా దానిని నేరంగా పరిగణించదు. మనసు యొక్క ఉద్దేశము అనేది ప్రధానం, కర్మ కాదు. అదే విధంగా, భగవత్ స్పృహలో పనులు చేసే సాధువులు, అన్ని పాపాల నుండి విముక్తి చేయబడుతారు, ఎందుకంటే వారి మనస్సు మమకార రహితంగా మరియు 'ఇది నాది' అన్న భావన లేకుండా ఉంటుంది; మరియు వారి ప్రతి ఒక్క చర్య కూడా భగవత్ ప్రీతి కోసమే అన్న దివ్య ప్రేరణతో ఉంటుంది.
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః । సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ।। 22 ।।
22
4
https://www.holy-bhagava…udio/004_022.mp3
యదృచ్ఛా— అప్రయత్నముగానే లభించిన; లాభ — లాభము; సంతుష్టో — తృప్తి; ద్వంద్వ — ద్వంద్వములకు (సుఖ-దుఃఖములవంటి); అతీతః — అతీతుడు; విమత్సరః — అసూయా రహితుడై; సమః — సమత్వముతో; సిద్దౌ — జయమునందు; అసిద్దౌ — అపజయమునందు; చ — మరియు; కృత్వా — కర్మలను చేయుచూ; అపి — ఉన్నాసరే; న, నిబధ్యతే — బంధింపబడడు.
BG 4.22: అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వంద్వములకు (సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటివి) అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధి తో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.
ఒకే నాణానికి రెండు పక్కలు ఉన్నట్టు, భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు - పగలు, రాత్రి; తీపి-చేదు; వేడిమి-చల్లదనం; వాన-కరువు మొదలగునవి. అందమైన పువ్వు ఉన్న గులాబి మొక్కకి, వికృతమైన ముల్లు కూడా ఉంది. జీవితం కూడా తన వంతు ద్వంద్వములను తెస్తుంది – సుఖము-దుఃఖము; గెలుపు-ఓటమి; కీర్తి-అపకీర్తి. శ్రీ రామచంద్రమూర్తి సైతం, తన దివ్య లీలలలో, అయోధ్యకి మహారాజుగా పట్టాభిషేకం అయ్యే ఒక్కరోజు ముందు వనవాసానికి పంపివేయబడ్డాడు. ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, ఎవ్వరూకూడా ద్వంద్వములు లేకుండా, కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు. మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూపోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు, అనుకూల-ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెంటినీ సంతోషంగా స్వీకరిస్తాము.
గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః । యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ।। 23 ।।
23
4
https://www.holy-bhagava…udio/004_023.mp3
గత-సంగస్య — భౌతిక ప్రాపంచిక ఆసక్తిరహితంగా ఉండి; ముక్తస్య — ముక్తులైనవారు; జ్ఞాన-అవస్థిత — ఆధాత్మిక జ్ఞానంలో స్థితులై; చేతసః — ఎవరి బుద్ధయితే; యజ్ఞాయ — భగవత్ అర్పితముగా; ఆచరతః — ఆచరిస్తూ; కర్మ — పని; సమగ్రం — సంపూర్ణముగా; ప్రవిలీయతే — విముక్తి పొందుతారు.
BG 4.23: అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని, యజ్ఞం (భగవత్ అర్పితము)గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడుతారు.
ఇంతకు క్రితం ఐదు శ్లోకాల యొక్క సారాంశాన్ని, శ్రీ కృష్ణ పరమాత్మ, ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. సమస్త కర్మలను భగవత్ అర్పితము చేయటమనేది, ఆత్మ, శాశ్వతమైన భగవంతుని దాసునిగా తెలుసుకొన్న ఫలితంగా జరుగుతుంది. చైతన్య మహాప్రభు అన్నాడు: జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్య-దాస్ (చైతన్య చరితామృతము, మధ్య లీల 20.108) ‘జీవాత్మ స్వ-స్వభావ రీత్యా భగవంతుని దాసుడు.’ ఈ జ్ఞానంలో స్థితులై ఉన్నవారు తమ సమస్త కర్మలను ఆయనకు అర్పితముగా చేస్తారు మరియు వారి పనుల వలన జనించే పాప ప్రతిక్రియల నుండి విముక్తి చేయబడుతారు. ఇటువంటి జీవాత్మలు ఎలాంటి దృక్పథం పెంపొందించుకుంటారు? శ్రీ కృష్ణుడు, తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ । బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ।। 24 ।।
24
4
https://www.holy-bhagava…udio/004_024.mp3
బ్రహ్మా — బ్రహ్మన్; అర్పణం — యజ్ఞము యందు ఉపయోగించే గరిటె (స్రువము) మరియు ఇతర అర్పితములు; బ్రహ్మా — బ్రహ్మన్; హవిః — హోమద్రవ్యము; బ్రహ్మా — బ్రహ్మన్; అగ్నౌ — యజ్ఞాగ్ని యందు; బ్రహ్మణా — అతనిచే; హుతమ్ — సమర్పించి; బ్రహ్మ — బ్రహ్మన్; ఏవ — నిజముగా; తేన — దానిచే; గంతవ్యం — పొందబడును; బ్రహ్మ — బ్రహ్మన్; కర్మ — సమర్పణ; సమాధినా — సంపూర్ణముగా భగవత్ ధ్యాసలోనే ఉన్నవారు.
BG 4.24: సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమైన వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.
నిజానికి ఈ ప్రపంచపు వస్తువులన్నీ భగవంతుని మాయ అనే భౌతిక శక్తి ద్వారా తయారుచేయబడ్డాయి. శక్తి అనేది శక్తిమంతునికి అభేదమైనది మరియు అదేసమయంలో ఆయన కంటే వేరైనది కూడా. ఉదాహరణకి, వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి. అది అగ్ని కంటే వేరైనది అనుకోవచ్చు ఎందుకంటే అది అగ్నికి బాహ్యంగా ఉంటుంది. దానిని అగ్నిలో భాగమే అనికూడా అనుకోవచ్చు. కాబట్టి సూర్య కిరణాలు కిటికీ గుండా లోపటికి వచ్చినప్పుడు, జనులు, ‘సూర్యుడు వచ్చాడు’ అని అంటారు. ఇక్కడ సూర్య కిరణాలను సూర్యుడిని ఒక్కలాగే చూస్తున్నారు. శక్తి అనేది శక్తివంతునికి కన్నా వేరైనది మరియు ఆయనలో భాగమే కూడా.ఆత్మ కూడా భగవంతుని శక్తి రూపమే — అది ఆధ్యాత్మిక శక్తి, దానినే జీవ శక్తి అంటారు. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు 7.5వ శ్లోకంలో వివరించాడు. చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు:జీవ-తత్త్వ శక్తి, కృష్ణ-తత్త్వ శక్తిమాన్గీతా–విష్ణుపురాణాది తాహాతే ప్రమాణ(చైతన్య చరితామృతము, ఆది లీల, 7.117) ‘శ్రీ కృష్ణుడు శక్తిమంతుడు, ఆత్మ అతని శక్తి. భగవద్గీత, విష్ణు పురాణం మొదలైన వాటిలో ఈ విషయం చెప్పబడింది.’ ఈ విధంగా ఆత్మ అనేది ఏక కాలంలో భగవంతుని నుండి వేరైనది కాదు మరియు భగవంతుని కన్నా భేదమే. కాబట్టి భగవంతుని యందే మనస్సు నిమగ్నమైనవారు, ఈ జగత్తుని అంతా భగవంతునితో ఒక్కటిగా, ఆయనకన్నా అభేదమైనదిగా చూస్తారు. శ్రీమద్ భాగవతం ప్రకారం:సర్వ-భూతేషు యః పశ్యేద్ భగవద్-భావమాత్మనఃభూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః (11.2.45)‘భగవంతుడినే అంతటా చూసేవాడు, అందరిలో భగవంతుడినే చూసేవాడే, అత్యుత్తమ భాగవతుడు (ఆధ్యాత్మికవేత్త).’ భగవంతుని యందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు, యజ్ఞము ఆచరించే వాడు, యజ్ఞ ద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ, ఇవన్నీ భగవంతుని కంటే అభేదమైనవే.ఎలాంటి దృక్పథంతో యజ్ఞం ఆచరించాలో వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ లోకంలో జనులు చిత్తశుద్ధి కోసం ఆచరించే వివిధ రకాల యజ్ఞాలని వివరిస్తున్నాడు.
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే । బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ।। 25 ।।
25
4
https://www.holy-bhagava…udio/004_025.mp3
దైవమ్ — దేవతలు; ఏవ — నిజముగా; అపరే — ఇతరులు; యజ్ఞం — యజ్ఞము; యోగినః — ఆధ్యాత్మిక సాధకులు; పర్యుపాసతే — పూజిస్తారు; బ్రహ్మ — పరమ సత్యము యొక్క; అగ్నౌ — అగ్ని లో; అపరే — వేరేవారు; యజ్ఞం — యజ్ఞము; యజ్ఞేన — యజ్ఞము చే; ఏవ — నిజముగా; ఉపజుహ్వతి — సమర్పణ.
BG 4.25: కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు.
యజ్ఞ ప్రక్రియ అనేది భగవత్ దృక్పథంలో భగవంతునికి నివేదనగా చేయబడాలి. కానీ, వివిధ జనుల అవగాహనలో ఎంతో అంతరం ఉంటుంది కాబట్టి యజ్ఞాన్ని ఎన్నో రకాలుగా భిన్నమైన దృక్పథాలతో చేస్తుంటారు. తక్కువ స్థాయి జ్ఞానం ఉన్నవారు, భౌతిక ప్రయోజనాల కోసం, దేవతలకు నివేదన సమర్పిస్తుంటారు. మరికొందరు యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన వారు వారినే భగవంతునికి సమర్పించుకుంటారు. దీనినే ఆత్మ-సమర్పణ లేదా ఆత్మాహుతి లేదా తమ ఆత్మను భగవత్ అర్పితము చేయటం అంటారు. యోగి శ్రీ కృష్ణ ప్రేమ్ దీనిని చక్కగా వివరించాడు: ‘ఈ గందరగోళ జగత్తులో, ఎవరైనా దివ్యప్రేమాగ్నిలో ఆత్మాహుతి చేస్తే, కృప అనే ఒక విస్ఫోటం సంభవిస్తుంది, ఎందుకంటే నిజమైన ఆత్మాహుతి ఎప్పటికీ వ్యర్థం కాదు’ (In this world of dust and din, whenever one makes ātmāhutī in the flame of divine love, there is an explosion, which is grace, for no true ātmāhutī can ever go in vain.) కానీ, భగవంతునికి ఆత్మ సమర్పణము చేసే విధానము ఏమిటి? దీనిని భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేయటం ద్వారా చేయవచ్చు. ఇలాంటి శరణాగతి ఆరు అంశములతో కూడి ఉంటుంది; ఇవి 18.62వ శ్లోక వ్యాఖనంలో వివరించబడ్డాయి. ఇక్కడ శ్రీ కృష్ణుడు జనులు ఆచరించే వివిధ రకాల యజ్ఞములను గూర్చి వివరిస్తున్నాడు.
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి । శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।
26
4
https://www.holy-bhagava…udio/004_026.mp3
శ్రోత్ర-ఆదీని — వినికిడి ప్రక్రియ వంటి; ఇంద్రియాణి — ఇంద్రియములు; అన్యే — ఇతరులు; సంయమ — నిగ్రహించి; అగ్నిషు — యజ్ఞాగ్నిలో; జుహ్వతి — సమర్పణ; శబ్ద-ఆదీన్ — శబ్దము మొదలైన; విషయాన్ — ఇంద్రియ తృప్తి నిచ్చే వస్తు-విషయములు; అన్యే — మరి కొందరు; ఇంద్రియ — ఇంద్రియముల; అగ్నిషు — అగ్నిలో; జుహ్వతి — సమర్పణ.
BG 4.26: మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.
అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో అగ్ని అనేది సంకేతాత్మకమైనది. ఆత్మ-నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది. ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న రెండు పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియములను తిరస్కరించటం, ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలను ఆపివేస్తారు. సంకల్పబలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి, అంతర్ముఖంగా ఉంచుతారు. దీనికి వ్యతిరేకమైనది భక్తి యోగ అభ్యాసము. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి వాడతారు. ఇంద్రియములు ఇక భౌతిక సుఖములు ఆనందించటానికి పనుముట్లగా వాడబడవు; సర్వత్రా భగవంతుని దర్శించటానికే అవి పరిష్కృతం చేయబడతాయి. 7.8వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అంటాడు, ‘రసోఽహం అప్సు కౌంతేయ ’ అని, ‘అర్జునా, నీటి యందు రుచిని నేనే అని తెలుసుకో.’ ఈ ప్రకారంగానే, భక్తి యోగులు, అన్ని ఇంద్రియముల ద్వారా భగవంతుడిని దర్శించటానికే అభ్యాసం చేస్తారు.- చూసే, వినే, రుచిచూసే, భావించే, ఆఘ్రాణించే అన్నిటిలో కూడా. ఇటువంటి భక్తి యజ్ఞము హఠయోగ మార్గం కన్నా సులువైనది; పాటించటానికి ఆహ్లాదకరమైనది, మరియు ఈ మార్గం నుండి పతనమవటానికి తక్కువ అవకాశం కలది. ఒకవేళ ఎవరైనా సైకిలు తొక్కుతూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళటం ఆగటానికి బ్రేకులు గట్టిగా వేస్తే, వారు పడిపోయే అవకాశం ఉంటుంది; కానీ దీనికి బదులుగా సైకిలు తొక్కేవాడు తన హేండిల్‌ని కుడి పక్కకో, ఎడమ పక్కకో తిప్పితే, సైకిలు సునాయాసంగా ముందుకు వెళ్ళటం ఆగిపోతుంది మరియు సమతుల్యత తోనే ఉంటుంది.
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే । ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ।। 27 ।।
27
4
https://www.holy-bhagava…udio/004_027.mp3
సర్వాణి — అన్ని; ఇంద్రియ — ఇంద్రియములు; కర్మాణి — కార్య కలాపములు; ప్రాణ-కర్మాణి — ప్రాణ వాయువు యొక్క అన్ని కార్యములు; చ — మరియు; అపరే — ఇతరులు; ఆత్మ-సంయమ-యోగాగ్నౌ — నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో; జుహ్వతి — పరిత్యాగము; జ్ఞాన-దీపితే — జ్ఞానముచే ప్రేరేపింపబడింది.
BG 4.27: కొందరు, జ్ఞానముచే ప్రేరణ నొంది, తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటిని మరియు తమ ప్రాణ శక్తిని కూడా, నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు.
కొందరు యోగులు విచక్షణావివేక మార్గాన్ని అనుసరిస్తారు, అంటే జ్ఞాన యోగం, దీనిలో వారు జ్ఞాన సహకారంతో ఇంద్రియములను ప్రాపంచిక వ్యవహారాల నుండి వెనుకకు మరల్చుతారు. హఠయోగులు ఇంద్రియములను సంకల్ప శక్తితో బలవంతంగా నిగ్రహిస్తే, జ్ఞానయోగులు ఇదే లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన వివేకమంతమైన విచక్షణ అభ్యాసం ద్వారా సాధిస్తారు. ఈ ప్రపంచం యొక్క మిథ్యా స్వభావాన్ని గురించి మరియు తాము ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము కన్నా వేరైన అస్తిత్వమని గాఢ ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఇంద్రియములు బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించబడుతాయి మరియు మనస్సు ఆత్మ యందు ధ్యానం లోనే నిమగ్నం చేయబడుతుంది. ఆత్మ మరియు పరమాత్మ అభేదమనే ప్రతిపాదనలో ఆత్మ-జ్ఞానం యందే స్థితులై ఉండటమే వారి లక్ష్యం. ఈ ధ్యానంలో సహకరించటానికి వారు 'తత్త్వమసి' (నేను అది) (ఛాందోగ్య ఉపనిషత్తు 6.8.7) మరియు 'అహం బ్రహ్మాస్మి' (నేను ఆ పరమాత్మనే) (బృహదారణ్యక ఉపనిషత్తు 1.4.10), మొదలైన సూత్రాలను జపిస్తుంటారు. జ్ఞానయోగ అభ్యాసం చాలా కష్టమైన మార్గం, దీనికి చాలా నిష్ఠ మరియు సుశిక్షితమైన బుద్ధి అవసరం. శ్రీమద్ భాగవతం (11.20.7) ఇలా పేర్కొంటున్నది: నిర్విణ్ణానామ్ జ్ఞానయోగః ‘వైరాగ్య స్థితి యొక్క ఉన్నత దశలో ఉన్నవారికి మాత్రమే, జ్ఞానయోగ మార్గంలో విజయం సాధ్యము.’
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే । స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ।। 28 ।।
28
4
https://www.holy-bhagava…udio/004_028.mp3
ద్రవ్య-యజ్ఞాః — తన సంపదను యజ్ఞంగా సమర్పించి; తపః-యజ్ఞాః — కఠినమైన నిష్ఠలను యజ్ఞముగా సమర్పించి; యోగ-యజ్ఞాః — ఎనిమిది అంచెల యోగాభ్యాసమును యజ్ఞముగా చేసి; తథా — ఈ విధముగా; అపరే — ఇతరులు; స్వాధ్యాయ — వేద శాస్త్రాలను అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుని; జ్ఞాన-యజ్ఞాః — ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ది చేసుకోవటాన్ని యజ్ఞంలా సమర్పించి; చ — మరియు; యతయః — ఈ యొక్క సాధువులు; సంశిత-వ్రతాః — నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ.
BG 4.28: కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.
మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తులలో, ఆశయాలలో, మరియు సంస్కారాలలో (పూర్వజన్మల నుండి వచ్చే ప్రవృత్తులు) వేర్వేరుగా ఉంటారు. యజ్ఞములు అనేవి కొన్ని వందల రకాలుగా ఉంటాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నాడు. అవి భగవంతునికి అర్పించినప్పుడు అంతఃకరణ శుద్ధికి, ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడుతాయి. ఈ శ్లోకంలో ఆచరణయోగ్యమైన ఇటువంటి మూడు యజ్ఞాల గురించి పేర్కొంటున్నాడు.ద్రవ్య యజ్ఞం. కొందరు ధనమును సంపాదించి దాన్ని భగవత్ కార్యాల కోసం దానం చేయటం వైపు మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా, తాము సంపాదించే ధనంతో భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ విధంగా, వారు తమకు డబ్బు సంపాదించాలనే ఉన్న స్వభావాన్ని భక్తితో భగవత్ అర్పితముగా సమర్పణ చేస్తారు. జాన్ వెస్లీ అనే ఆంగ్ల ప్రబోధకుడు మరియు మెథడిస్ట్ చర్చి స్థాపకర్త , తన అనుయాయులకు ‘సాధ్యమైనంత సంపాదించండి. సాధ్యమైనంత పొదుపు చేయండి. సాధ్యమైనంత దానమివ్వండి’ (Make all you can. Save all you can. Give all you can.) అని చెప్పేవాడు.యోగ యజ్ఞం. భారత తత్త్వశాస్త్రములో యోగ దర్శనమనేది, ఆరుగురు మహోన్నత మునులచే వ్రాయబడ్డ ఆరు తత్త్వ సిద్ధాంతాలలో ఒకటి; జైమిని మీమాంస దర్శనం వ్రాసాడు. వేద వ్యాసుడు వేదాంత దర్శనం వ్రాసాడు. గౌతముడు న్యాయ దర్శనం వ్రాసాడు. కణాదుడు వైశేషిక దర్శనం వ్రాసాడు, కపిలుడు సాంఖ్య దర్శనం, మరియు పతంజలి యోగ దర్శనం వ్రాసాడు. పతంజలి యోగ దర్శనం లో ఆధ్యాత్మిక పురోగతి కోసం, శారీరక ప్రక్రియలతో మొదలుపెట్టి, మనస్సుని జయించటం వరకు, 'అష్టాంగ యోగము' అనే ఎనిమిది అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై దీనిని ఒక యజ్ఞంలా ఆచరిస్తారు. కానీ, పతంజలి యోగ దర్శనం స్పష్టంగా ఏమి చెపుతుందంటే:సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్ (2.45)‘యోగంలో సంపూర్ణత(సిద్ధి) సాధించాలంటే, నీవు ఖచ్చితంగా భగవంతునికి శరణాగతి చేయాల్సిందే’. ఈ అష్టాంగ యోగం వైపు మొగ్గు చూపేవారు భగవంతుడిని ప్రేమించటం నేర్చుకున్నప్పుడు, వారి యోగాభ్యాసమును యజ్ఞముగా, భక్తి అనే అగ్నిలో సమర్పిస్తారు. ‘జగద్గురు కృపాలుజీ యోగ్’ ఇలాంటి యోగ విధానానికి ఒక ఉదాహరణ. దీనిలో అష్టాంగ యోగ యొక్క శారీరక ఆసనాలు భగవత్ యజ్ఞంలా చేయటంతో పాటు, భగవన్నామములను కూడా జపిస్తారు. ఇటువంటి యోగాసనాల, భక్తి సమ్మేళనము సాధకుని యొక్క శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక పరిశుద్ధతకి దారి తీస్తుంది.జ్ఞాన యజ్ఞం. కొంతమంది మనుష్యులు జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేద శాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని మరియు భగవంతుని పై ప్రేమని పెంపొందించుకోవటానికి ఈ స్వభావం చక్కగా సరిపోతుంది. సా విద్యా తన్మతిర్యయా (భాగవతం 4.29.49) ‘భగవంతునిపై భక్తిని పెంపొందించేదే నిజమైన జ్ఞానం.’ ఈ విధంగా అధ్యయన పరంగా మొగ్గు చూపే సాధకులు జ్ఞాన యజ్ఞంలో నిమగ్నమౌతారు. దీనిని భక్తి భావంతో పెనవేసినప్పుడు అది ప్రేమపూర్వక భగవత్ ఐక్యతకు దారితీస్తుంది.
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే । ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।। అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి । సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ।। 30 ।।
29
4
https://www.holy-bhagava…/004_029-030.mp3
అపానే — లోనికి వచ్చే శ్వాస; జుహ్వతి — సమర్పణ; ప్రాణం — బయటకు వెళ్ళే శ్వాస; ప్రాణే — బయటకు వెళ్ళే శ్వాస యందు; అపానం — లోనికి వచ్చే శ్వాస; తథా — ఇంకా; అపరే — మరికొందరు; ప్రాణ — బయటకు వెళ్ళే శ్వాసలో; అపాన — మరియు లోనికి వచ్చే శ్వాస; గతీ — కదలిక; రుధ్వా — నిలిపి; ప్రాణ-ఆయామ — శ్వాశని నియంత్రించి; పరాయణాః — పూర్తిగా నిమగ్నులై ; అపరే — మరికొందరు; నియత — నిగ్రహించి; ఆహారాః — ఆహార స్వీకరణ; ప్రాణాన్ — ప్రాణ వాయువులు; ప్రాణేషు — జీవ శక్తి; జుహ్వతి — సమర్పణ; సర్వే — సమస్త; అపి — కూడా; ఏతే — ఇవి; యజ్ఞ-విదః — యజ్ఞము తెలిసినవారు; యజ్ఞ-క్షపిత — యజ్ఞకార్యములచే పరిశుద్ధి చేయబడుతూ; కల్మషాః — మలినముల నుండి.
BG 4.29-30: మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు.
కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు, ప్రాణాయామం అంటే ‘శ్వాస యొక్క నియంత్రణ’ అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో ఈ క్రిందివి ఉంటాయి :పూరకము: శ్వాసను ఊపిరితిత్తుల లోనికి తీసుకోనే ప్రక్రియ.రేచకము: ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ.అంతర కుంభకము: గాలి పీల్చుకున్న తరువాత ఊపిరి బిగబట్టడం. లోనికి వెళ్ళే శ్వాస లో బయటకు వచ్చే శ్వాస ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.బాహ్య కుంభకము: ఊపిరి విడిచి పెట్టిన తరువాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచటం. బయటకు వెళ్ళే శ్వాసలో లోనికి వచ్చే శ్వాస, ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.ఈ రెండు కుంభకములు క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణ లోనే వీటిని అభ్యాసం చేయాలి, లేదా అవి హాని చేయవచ్చు. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు, ఇంద్రియములను నియంత్రించటానికి, మనస్సుని కేంద్రీకరించటానికి ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తరువాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని యజ్ఞ పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు.ప్రాణం అంటే నిజానికి శ్వాస కాదు; చేతనాచేతన వస్తువులన్నిటిలో, శ్వాస యందు వ్యాపించి ఉన్న సూక్ష్మమైన జీవ శక్తి అది. వైదిక శాస్త్రాలు, శరీరంలో ఐదు రకముల ప్రాణముల గురించి చెప్పాయి - ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములు - ఇవి శారీరక ప్రక్రియలను నియంత్రిచటానికి పని చేస్తాయి. వీటిలో 'సమాన' మనేది జీర్ణ వ్యవస్థని నడిపిస్తుంది. కొందరు ఉపవాసం వైపు మొగ్గు చూపుతారు. తీసుకునే ఆహారం మనిషి యొక్క ప్రవర్తన మరియు నడవడిక మీద ప్రభావం చూపుతుందని తెలిసి, వారు ఆహారాన్ని తీసుకోవటాన్ని నియంత్రిస్తారు. ఈ విధమైన ఉపవాసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా భారత దేశంలో అనాదిగా ప్రాచుర్యంలో ఉంది, ఇది కూడా ఒక యజ్ఞ రూపంగా ఇక్కడ పేర్కొనబడినది. ఆహారం తగ్గించినప్పుడు, ఇంద్రియములు నీరసించిపోతాయి, దీనితో జీర్ణ వ్యవస్థను నడిపే 'సమానము' తనను తానే నిర్వీర్యం చేసుకోవటం జరుగుతుంది. కొందరు చేసే యజ్ఞం ఈ విధంగా ఉంటుంది.జనులు ఈ విధమైన ఎన్నో రకాల నిష్ఠలను పరిశుద్ధత/పవిత్రత కోసం చేస్తుంటారు. మనోఇంద్రియముల వాంఛలను తీర్చాలనే కోరికలే అంతఃకరణ మాలిన్యానికి దారి తీస్తాయి. భౌతిక వస్తువుల సుఖాన్ని కోరే మనోఇంద్రియముల యొక్క సహజ స్వభావాన్ని నియంత్రించటమే ఈ అన్ని వ్రతాల/నిష్ఠల ప్రధాన ప్రయోజనం. ఎప్పుడైతే ఈ నిష్ఠలన్ని భగవత్ అర్పితముగా చేయబడుతాయో, వాటి ఫలితంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. (అంతఃకరణ అంటే మనోబుద్ధులతో కూడిన అంతర్గత వ్యవస్థ).
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే । ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।। అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి । సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ।। 30 ।।
30
4
https://www.holy-bhagava…/004_029-030.mp3
అపానే — లోనికి వచ్చే శ్వాస; జుహ్వతి — సమర్పణ; ప్రాణం — బయటకు వెళ్ళే శ్వాస; ప్రాణే — బయటకు వెళ్ళే శ్వాస యందు; అపానం — లోనికి వచ్చే శ్వాస; తథా — ఇంకా; అపరే — మరికొందరు; ప్రాణ — బయటకు వెళ్ళే శ్వాసలో; అపాన — మరియు లోనికి వచ్చే శ్వాస; గతీ — కదలిక; రుధ్వా — నిలిపి; ప్రాణ-ఆయామ — శ్వాశని నియంత్రించి; పరాయణాః — పూర్తిగా నిమగ్నులై ; అపరే — మరికొందరు; నియత — నిగ్రహించి; ఆహారాః — ఆహార స్వీకరణ; ప్రాణాన్ — ప్రాణ వాయువులు; ప్రాణేషు — జీవ శక్తి; జుహ్వతి — సమర్పణ; సర్వే — సమస్త; అపి — కూడా; ఏతే — ఇవి; యజ్ఞ-విదః — యజ్ఞము తెలిసినవారు; యజ్ఞ-క్షపిత — యజ్ఞకార్యములచే పరిశుద్ధి చేయబడుతూ; కల్మషాః — మలినముల నుండి.
BG 4.29-30: మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు.
కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు, ప్రాణాయామం అంటే ‘శ్వాస యొక్క నియంత్రణ’ అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో ఈ క్రిందివి ఉంటాయి :పూరకము: శ్వాసను ఊపిరితిత్తుల లోనికి తీసుకోనే ప్రక్రియ.రేచకము: ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ.అంతర కుంభకము: గాలి పీల్చుకున్న తరువాత ఊపిరి బిగబట్టడం. లోనికి వెళ్ళే శ్వాస లో బయటకు వచ్చే శ్వాస ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.బాహ్య కుంభకము: ఊపిరి విడిచి పెట్టిన తరువాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచటం. బయటకు వెళ్ళే శ్వాసలో లోనికి వచ్చే శ్వాస, ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.ఈ రెండు కుంభకములు క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణ లోనే వీటిని అభ్యాసం చేయాలి, లేదా అవి హాని చేయవచ్చు. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు, ఇంద్రియములను నియంత్రించటానికి, మనస్సుని కేంద్రీకరించటానికి ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తరువాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని యజ్ఞ పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు.ప్రాణం అంటే నిజానికి శ్వాస కాదు; చేతనాచేతన వస్తువులన్నిటిలో, శ్వాస యందు వ్యాపించి ఉన్న సూక్ష్మమైన జీవ శక్తి అది. వైదిక శాస్త్రాలు, శరీరంలో ఐదు రకముల ప్రాణముల గురించి చెప్పాయి - ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములు - ఇవి శారీరక ప్రక్రియలను నియంత్రిచటానికి పని చేస్తాయి. వీటిలో 'సమాన' మనేది జీర్ణ వ్యవస్థని నడిపిస్తుంది. కొందరు ఉపవాసం వైపు మొగ్గు చూపుతారు. తీసుకునే ఆహారం మనిషి యొక్క ప్రవర్తన మరియు నడవడిక మీద ప్రభావం చూపుతుందని తెలిసి, వారు ఆహారాన్ని తీసుకోవటాన్ని నియంత్రిస్తారు. ఈ విధమైన ఉపవాసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా భారత దేశంలో అనాదిగా ప్రాచుర్యంలో ఉంది, ఇది కూడా ఒక యజ్ఞ రూపంగా ఇక్కడ పేర్కొనబడినది. ఆహారం తగ్గించినప్పుడు, ఇంద్రియములు నీరసించిపోతాయి, దీనితో జీర్ణ వ్యవస్థను నడిపే 'సమానము' తనను తానే నిర్వీర్యం చేసుకోవటం జరుగుతుంది. కొందరు చేసే యజ్ఞం ఈ విధంగా ఉంటుంది.జనులు ఈ విధమైన ఎన్నో రకాల నిష్ఠలను పరిశుద్ధత/పవిత్రత కోసం చేస్తుంటారు. మనోఇంద్రియముల వాంఛలను తీర్చాలనే కోరికలే అంతఃకరణ మాలిన్యానికి దారి తీస్తాయి. భౌతిక వస్తువుల సుఖాన్ని కోరే మనోఇంద్రియముల యొక్క సహజ స్వభావాన్ని నియంత్రించటమే ఈ అన్ని వ్రతాల/నిష్ఠల ప్రధాన ప్రయోజనం. ఎప్పుడైతే ఈ నిష్ఠలన్ని భగవత్ అర్పితముగా చేయబడుతాయో, వాటి ఫలితంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. (అంతఃకరణ అంటే మనోబుద్ధులతో కూడిన అంతర్గత వ్యవస్థ).
యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ । నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ।। 31 ।।
31
4
https://www.holy-bhagava…udio/004_031.mp3
యజ్ఞ-శిష్టా అమృత-భుజః — వారు యజ్ఞఅవశేష అమృత తుల్య ఆహారమును భుజింతురు; యాంతి — వెళ్తారు; బ్రహ్మ — పరమ సత్యము; సనాతనమ్ — సనాతనమైన; న — కాదు; అయం — ఇది; లోకః — లోకము; అస్తి — ఉండును; అయజ్ఞస్య — యజ్ఞము చేయని వానికి; కుతః — ఎట్లా; అన్యః — వేరే (లోకము); కురు-సత్-తమ — కురు వంశజులలో ఉత్తమమైన వాడా.
BG 4.31: యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి, పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురు వంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు, ఈ లోకంలో గాని, పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు.
ఇంతకు క్రితం పేర్కొన్నట్టు, భగవంతుని ప్రీతి కొరకు చెయ్యాలనే భావన కలిగిఉండటమే, యజ్ఞము యొక్క రహస్యం; పిదప యజ్ఞ శేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఉదాహరణకి, భగవత్ భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదన చేసిన తరువాతనే దాన్ని స్వీకరిస్తారు. ఆహారాన్ని వండిన తరువాత దానిని ఆయన ముందు ఉంచి భగవంతుడిని దానిని స్వీకరించమని ప్రార్థిస్తారు. వారి మనస్సులో భగవంతుడు స్వయంగా వచ్చి ఆ ఆహారాన్ని భుజించినట్టుగా భావిస్తారు. ఈ నివేదన అనంతరం పళ్ళెంలో ఉన్న శేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇటువంటి అమృతతుల్యమైన ప్రసాదము మనలను జ్ఞానోదయం, పరిశుద్ధత, మరియు ఆధ్యాత్మిక పురోగతి దిశగా తీసుకెళ్తాయి.ఇదే భావనలో భక్తులు భగవంతునికి బట్టలు సమర్పించిన తరువాతే వాటిని ఆయన ప్రసాదంలా తొడుక్కుంటారు. వారు ఆయన విగ్రహాన్ని తమ ఇంటిలో పెట్టుకుని, ఆ ఇల్లు దేవాలయం అన్న భావనలో ఆ ఇంట్లో నివసిస్తారు. ఎప్పుడైతే వస్తువులు లేదా పనులు భగవంతునికి యజ్ఞంగా సమర్పించినప్పుడు, ఆ శేషం, అంటే ప్రసాదం, ఆత్మకి అమృతతుల్యమైన అనుగ్రహము వంటిది. మహా భక్తుడైన ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి ఇలా చెప్పాడు:త్వయోపభుక్త-స్రగ్-గంధ-వాసోఽలంకార-చర్చితాఃఉచ్చిష్ఠ-భోజినో దాసాస్ తవ మాయం జయేమ హి(భాగవతం 11.6.46) ‘మీకు మొదట నివేదించబడిన వస్తువులనే నేను భుజిస్తాను, ఆఘ్రాణిస్తాను, ధరిస్తాను, వాటి యందే నివసిస్తాను, వాటి గురించే మాట్లాడుతాను. ఈ విధంగా, నివేదింపబడిన శేషాన్ని మీ ప్రసాదంగా స్వేకరించటం వలన నేను మాయని సునాయాసంగా జయిస్తాను.’ యజ్ఞాన్ని ఆచరించని వారు కర్మ-ఫల బంధాలలో చిక్కుకొనే ఉండి మాయ పెట్టే యాతన అనుభవిస్తూనే ఉంటారు.
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే । కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ।। 32 ।।
32
4
https://www.holy-bhagava…udio/004_032.mp3
ఏవం — ఈ విధముగా; బహు-విధా — వేరు వేరు విధములైన; యజ్ఞాః — యజ్ఞములు; వితతాః — విశదీకరించబడ్డాయి; బ్రహ్మణః — వేదముల; ముఖే — నోటి ద్వారా; కర్మ-జాన్ — కర్మల నుండి జనించినవి; విద్ధి — తెలుసుకొనుము; తాన్ — వారు; సర్వాన్ — అందరూ; ఏవం — ఈ విధముగా; జ్ఞాత్వా — తెలుసుకొని; విమోక్ష్యసే — నీవు మోక్షమును పొందుతావు.
BG 4.32: ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది.
వేదముల ఒక అధ్బుతమైన లక్షణం ఏమిటంటే అవి ఎన్నో విభిన్నరకాల మానవ స్వభావాలను గుర్తించి వాటికి సరిపోయే విధానాలను సూచిస్తాయి. ఈ విధంగా రకరకాల మనుష్యులకు రకరకాల యజ్ఞములు వివరించబడ్డాయి. వీటన్నిటికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం ఏమిటంటే, ఇవన్నీ భక్తితో భగవత్ అర్పితముగా చేయబడాలి. ఈ అవగాహనతో వేదములలో చెప్పబడిన వివిధ రకాల ఉపదేశాలతో తికమక పడకుండా, తనకు సరిపోయే యజ్ఞ విధానాన్ని నిర్వర్తిస్తూ, భౌతిక బంధాల నుండి విముక్తి పొందవచ్చు.
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప । సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।
33
4
https://www.holy-bhagava…udio/004_033.mp3
శ్రేయాన్ — శ్రేష్ఠమైనది; ద్రవ్య-మయాత్ — భౌతిక సంపత్తి/ద్రవ్యములతో కూడిన; యజ్ఞాత్ — యజ్ఞము కంటెను; జ్ఞాన-యజ్ఞః — జ్ఞానముతో ఆచరింపబడే యజ్ఞము; పరంతప — శత్రువులను జయించేవాడా, అర్జునా; సర్వం — అన్నీ; కర్మ — పనులు; అఖిలం — సమస్త; పార్థ — అర్జునా, ప్రిథ పుతృడా; జ్ఞానే — జ్ఞానములో; పరిసమాప్యతే — పరిసమాప్తమగును.
BG 4.33: ఓ శత్రువులను లోబరుచుకొనే వాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును.
శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఇంతకు క్రితం వివరింపబడిన యజ్ఞములను సరియైన దృక్పథంలో పెడుతున్నాడు. శారీరకమైన భక్తి యుక్త కర్మలు చేయటం మంచిదే అయినా అవి సరిపోవు అని అర్జునుడుకి చెప్తున్నాడు. పూజాది క్రియలు, ఉపవాసాలు, మంత్ర జపాలు, తీర్థ యాత్రలు, ఇవన్నీమంచివే, కానీ వాటిని జ్ఞాన యుక్తంగా చేయకపోతే, అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే కానీ మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి అవి సరిపోవు.చాలా మంది జనులు భగవన్నామాన్ని పూసలమీద జపిస్తుంటారు, శాస్త్రాలు వల్లెవేస్తుంటారు, పవిత్ర ధామాలని సందర్శిస్తుంటారు మరియు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు; ఇటువంటి భౌతిక/శారీరక క్రియల తోనే భౌతిక బంధాలనుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో ఇవన్నీ చేస్తుంటారు. కానీ, సంత్ కబీర్ ఈ భావాన్ని నిర్ద్వందంగా త్రోసిపుచ్చాడు.మాలా ఫేరత యుగ ఫిరా, ఫిరా న మన కా ఫేర్కర్ కా మనకా డారి కే, మనకా మనకా ఫేర్‘ఓ ఆధ్యాత్మిక సాధకుడా, నీవు జప మాలలు చాలా కాలం నుండి తిప్పుతున్నావు, కానీ మనస్సు యొక్క చాంపాల్యం తరగలేదు. ఇక ఇప్పుడు ఆ పూసలు పక్కన పెట్టి మనస్సు యొక్క పూసలు తిప్పు.” జగద్గురు కృపాలు జీ మహారాజ్ ఇలా అన్నారు:బంధన్ ఔర్ మోక్ష్ కా, కారణ్ మన హి బఖాన్యాతే కౌనిఉ భక్తి కరు, కరు మన్ తే హరిధ్యాన్ (భక్తి శతకం, 19వ శ్లోకం)‘మోక్షానికి, కర్మ బంధనానికి కారణం మనస్సు మాత్రమే. ఏ విధమైన భక్తి చేసినా, నీ మనస్సుని మాత్రం భగవంతుని యందే లగ్నం చేయుము.’జ్ఞాన సముపార్జనతో భక్తి పూర్వక భావాలు పెంపొందుతాయి. ఉదాహరణకి, మీ పుట్టిన రోజు వేడుక జరుగుతోందనుకోండి, మరియు అతిధులు వచ్చి మీకు బహుమతులు ఇస్తున్నారనుకోండి. ఎవరో వచ్చి మీకు ఒక పాత సంచి ఇచ్చారు. మీకు వచ్చిన ఇతర గొప్ప బహుమతులతో పోల్చితే, ఇదేదో పనికిమాలినదే అనుకోని దాని వైపు చిరాగ్గా చూస్తారు. ఆ వ్యక్తి మిమ్ములను ఆ సంచిలో చూడమన్నాడు. మీరు సంచి తెరిస్తే దానిలో రూ.2000 నోట్లు ఒక వంద ఉన్నాయి. మీరు వెంటనే ఆ సంచిని హత్తుకుని ‘అబ్బా, ఇదే నాకొచ్చిన అత్యుత్తమ బహుమానం!’ అనుకుంటారు. ఆ సంచిలో ఉన్నవి ఏమిటో అన్న జ్ఞానం, ఆ సంచి అంటే ప్రేమని పెంపొందించింది. ఇదే విధంగా, భగవంతునిపై మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించు కోవటం వలన మన భక్తి భావన వృద్ధిచెందుతుంది. కాబట్టి, జ్ఞానంతో కూడిన యజ్ఞముల ఆచరణ అనేది భౌతిక వస్తువులతో కూడిన యాంత్రికమైన యజ్ఞము కంటే ఉన్నతమైనదని శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక ఇప్పుడు జ్ఞాన సముపార్జన పద్ధతిని వివరిస్తున్నాడు.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ।। 34 ।।
34
4
https://www.holy-bhagava…udio/004_034.mp3
తత్ — సత్యమును; విద్ధి — నేర్చుకొనుటకు ప్రయత్నించుము; ప్రణిపాతేన — ఆధ్యాత్మిక గురువుని చేరుకొని; పరిప్రశ్నేన — వినయ పూర్వక ప్రశ్నలతో; సేవయా — సేవ చేసి; ఉపదేక్ష్యంతి — ఉపదేశము చేయగలరు; తే — నీకు; జ్ఞానం — జ్ఞానము; జ్ఞానినః — జ్ఞానులు; తత్త్వ-దర్శినః — పరమ సత్యమును తెలుసుకొన్నవారు.
BG 4.34: ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు.
యజ్ఞము అనేది జ్ఞానముతో కూడి చేయాలన్న విషయం విన్నతరువాత, సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా సముపార్జించుకోవాలి? అని. శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు: 1) ఆధ్యాత్మిక గురువు దరిచేరండి 2) ఆయనని వినయంతో అడగండి 3) ఆయనకి సేవ చేయండి.పరమ సత్యము అనేది మన స్వంత ఆలోచన/విచారణ ద్వారా అర్థమయ్యే విషయం కాదు. భాగవతంలో ఇలా పేర్కొనబడినది:అనాద్యవిద్యా యుక్తస్య పురుషస్యాత్మ వేదనంస్వతో న సంభవాద్ అన్యస్ తత్త్వ-జ్ఞో జ్ఞాన-దో భవేత్(11.22.10) ‘ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మల పాటూ అజ్ఞానంచే కప్పివేయబడి ఉంది. అవిద్యచే ఆవరింపబడి ఉండటంచే, బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి.’ఆధ్యాత్మిక పథంలో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని, వైదిక గ్రంథాలు పదేపదే మనకు ఉపదేశిస్తున్నాయి.ఆచార్యవాన్ పురుషో వేదః (ఛాందోగ్య ఉపనిషత్తు 6.14.2)‘గురువు ద్వారా మాత్రమే నీవు వేదములను అర్థం చేసుకొనగలవు’. పంచదశీ ఇలా పేర్కొంటున్నది:తత్పాదాంబురు హద్వంద్వ సేవా నిర్మల చేతసాంసుఖబోధాయ తత్త్వస్య వివేకో ఽయం విధీయతే (1.2)‘గురువు గారిని స్వచ్ఛమైన మనస్సుతో, సందేహములు విడిచి సేవించండి. తదుపరి ఆయన మీకు శాస్త్ర జ్ఞానాన్ని మరియు వివేచనాత్మకత ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు.’ జగద్గురు శంకరాచార్య ఇలా పేర్కొన్నాడు: యావత్ గురుర్న కర్తవ్యో తావంముక్తిర్న లభ్యతే, ‘గురువుకి శరణాగతి చేయకుండా నీకు భౌతిక మాయ నుండి ముక్తి లభించదు.’జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోనికి చేర్చటం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపలలో ఒకటి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా విభిన్నమైనది. ప్రాపంచిక విద్యకోసం గురువు పట్ల అత్యంత గౌరవ భావం అవసరం లేదు. ఆ విద్య కోసం కేవలం బోధకుని ఫీజు/రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు, లేదా దాన్ని ఏదో ఫీజు చెల్లించి కొనుక్కోలేము. శిష్యుడు ఎప్పుడైతే వినయము, నమ్రత పెంపొందించుకుంటాడో, శిష్యుని సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమౌతాడో, గురుకృపచే అది శిష్యుని హృదయంలో ప్రకటించబడుతుంది. అందుకే ప్రహ్లాద మహారాజు అన్నాడు:నైషాం మతిస్తావద్ ఉరుక్రమాంఘ్రింస్పృశత్యనర్థాపగమో యదర్థఃమహీయసాం పాదరజోఽభిషేకంనిష్కించనానాం న వృణీత యావత్ (భాగవతం 7.5.32) ‘మనలను మనం ఒక మహాత్ముని పాద ధూళిలో తడిపివేసుకోకపోనంతవరకు, మనం అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము.’ కాబట్టి, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, గురువు గారిని మర్యాదతో చేరుకొని, పరమ సత్యము గురించి వినయంతో అడిగి, సేవ ద్వారా ఆయనకు ప్రీతి కలిగించ వలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు.
యద్ జ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ । యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ।। 35 ।।
35
4
https://www.holy-bhagava…udio/004_035.mp3
యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకున్న పిదప; న — కాదు; పునః — మరల; మోహం — భ్రాంతి; ఏవం — ఈ విధముగా; యాస్యసి — నీవు పొందుదువు; పాండవ — అర్జునా; యేన — దీని చేత; భూతాని — ప్రాణులు; అశేషాణి — సమస్తము; ద్రక్ష్యసి — నీవు చూచెదవు; ఆత్మని — నా యందు (శ్రీ కృష్ణునిలో); అథో — అంటే; మయి — నాలో.
BG 4.35: ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జునా, నీవు మరల మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో, నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు.
ఏ విధంగానైతే సూర్యుడిని చీకటి కప్పివేయలేదో, అదే విధంగా, మాయ అనేది ఎన్నటికి కూడా ఒకసారి జ్ఞానోదయమైన జీవాత్మని వశపరుచుకోలేదు. ‘తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః’ (ఋగ్వేదం) ‘భగవత్ ప్రాప్తి నొందిన, భగవంతుడిని ఎఱిగిన వారు ఎప్పటికీ ఆ భగవత్ ధ్యాసలోనే ఉంటారు.’మాయ యొక్క భ్రాంతిలో, మనం ప్రపంచాన్ని ఆ భగవంతుని కంటే వేరైనదిగా చూస్తాము; తోటి వారు మన స్వార్థ ప్రయోజనం కోసం సహకరిస్తున్నారా లేదా హాని చేస్తున్నారా అన్న దాని మీద మనం వారితో స్నేహం లేదా శతృత్వం పెంచుకుంటాము. జ్ఞానోదయం ద్వారా వచ్చే దివ్య ఆధ్యాత్మిక వివేకము, మనం ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని మార్చి వేస్తుంది. జ్ఞానోదయమైన మాహాత్ములు ఈ ప్రపంచాన్ని భగవంతుని శక్తి స్వరూపంగా దర్శిస్తారు, మరియు వారికి లభించినదంతా ఆ భగవత్ సేవ లోనే ఉపయోగిస్తారు. అందరు మనుష్యులు ఆ భగవంతుని అంశలే అని భావించి అందరి పట్ల దైవీ భావన కలిగి ఉంటారు. ఈ విధంగా హనుమంతుడు అన్నాడు:సీయా రామమయ సబ జగ జానీ, కరఉఁ ప్రనామ జోరి జుగ పానీ(రామచరితమానస్) ‘నేను శ్రీ రామచంద్ర మూర్తి మరియు సీతమ్మ తల్లి స్వరూపాలను అందరిలో చూస్తాను, కాబట్టి అందరికీ, చేతులు జోడించి నా వందనములు సమర్పిస్తాను.’
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః । సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 36 ।।
36
4
https://www.holy-bhagava…udio/004_036.mp3
అపి — అయినా సరే; చేత్ — ఒకవేళ; అసి — నీవు; పాపేభ్యః — పాపాత్ములు; సర్వేభ్యః — అందరిలో; పాప-కృత్-తమః — పరమ పాపిష్టి; సర్వం — అందరిలో; జ్ఞాన-ప్లవేన — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమనే పడవతో; ఏవ — ఖచ్చితంగా; వృజినం — పాపము; సంతరిష్యసి — నీవు దాటిపోగలవు.
BG 4.36: పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు.
భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహా సాగరం వంటిది, దీనిలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే అలలు మనలను అటూ ఇటూ త్రోసి వేస్తుంటాయి. భౌతిక శక్తి, అందరినీ మూడు రకాల క్లేశములకు (కష్టాలకు) గురి చేస్తుంది: ఆదిఆత్మిక: తన స్వంత శరీరం, మనస్సు పెట్టే బాధలు; ఆదిభౌతిక – ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు; ఆదిదైవిక – వాతావరణ మరియు పర్యావరణ సంబధిత పరిస్థితుల బాధలు. ఈ యొక్క భౌతిక బద్ద స్థితిలో, జీవాత్మకి ఎలాంటి ఉపశమనం ఉండదు, మరియు ఈ బాధలు భరిస్తూ అనంత జన్మలు గడిచిపోయినవి. మైదానంలో ఒక ఫుట్-బాల్ అటూ ఇటూ తన్నబడినట్టుగా, ఆత్మ, తన యొక్క పుణ్య, పాప కర్మానుసారం, స్వర్గాది లోకాలకు పంపబడుతుంది, నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది, మరియు తిరిగి భూలోకంలోకి తీసుకు రాబడుతుంది.ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం ఈ భౌతిక భవ సాగరాన్ని దాటటానికి ఒక పడవని ఇస్తుంది. అవివేకులు కర్మలు చేసి వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్ యజ్ఞముగా చేయటం ద్వారా జ్ఞానులు ముక్తి సాధిస్తారు. ఈ విధంగా, జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయటానికి సహకరిస్తుంది. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్ నరఃసోఽధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం (1.3.9)‘భవ సాగరాన్ని దాటటానికి మరియు భగవత్ ధామాన్ని చేరుకోవటానికి, నీ బుద్ధిని దివ్య జ్ఞానంతో ప్రకాశింపచేయుము; అప్పుడు ఆ ప్రకాశిత బుద్ధితో, చంచలమైన మనస్సుని నియంత్రించుము.’
యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున । జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।। 37 ।।
37
4
https://www.holy-bhagava…udio/004_037.mp3
యథా — ఎలాగైతే; ఏధాంసి — కట్టెలను సమిధ్ధః — జ్వాలలతో; అగ్నిః — అగ్ని; భస్మ-సాత్ — భస్మముగా; కురుతే — చేయునో; అర్జున — అర్జునా; జ్ఞాన-అగ్నిః — జ్ఞానమనే అగ్ని; సర్వ-కర్మాణి — భౌతిక కర్మల యొక్క అన్ని ప్రతిక్రియలను; భస్మ-సాత్ — భస్మముగా; కురుతే — చేయును; తథా — అదే విధముగా.
BG 4.37: ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటిని భస్మము చేయును.
ఒక చిన్న నిప్పు తునక కూడా మహా జ్వాలగా మారి, ఒక పెద్ద కొండంత మండే పదార్థాన్ని భస్మం చేయవచ్చు. 1666 వ సంవత్సరంలో లండన్ మహానగరంలో వ్యాపించిన మంటలు (the Great Fire of London), ఒక బేకరీలో చిన్న జ్వాలగా మొదలయ్యింది, కానీ అది పెరుగుతూ, చివరికి 13,200 ఇండ్లు, 87 చర్చిలు మరియు చాలమటుకు నగరంలోని కార్యాలయాలను కాల్చివేసింది. మనందరికీ కూడా అనంత జన్మల నుండి చేసిన పుణ్య,పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకొనిపోయి ఉంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు, అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధము తెలుసుకోవటం మనలను శరణాగతి దిశగా తీస్కువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు.
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే । తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ।। 38 ।।
38
4
https://www.holy-bhagava…udio/004_038.mp3
న — కాదు; హి — నిజముగా; జ్ఞానేన — దివ్య జ్ఞానముతో; సదృశం — సమానముగా; పవిత్రం — పవిత్రమైన; ఇహ — ఈ లోకంలో; విద్యతే — ఉండును; తత్ — అది; స్వయం — స్వయముగా; యోగ — యోగాభ్యాసము; సంసిద్ధః — పరిపూర్ణత సాధించినవాడు; కాలేన — కాలక్రమములో; ఆత్మని — హృదయములో; విందతి — పొందును.
BG 4.38: ఈ లోకంలో, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమొనర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ది సాధించిన తరువాత, కాల క్రమంలో ఈ జ్ఞానం, సాధకుని హృదయంలో పొందబడుతుంది.
ఒక వ్యక్తిని పవిత్రమొనర్చి, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి, ముక్తిని ప్రసాదించి, మరియు భగవంతుని దగ్గరకు చేర్చే శక్తి, జ్ఞానానికి ఉన్నది. కాబట్టి అది మహోన్నతమైనది మరియు అత్యంత పవిత్రమైనది. కానీ రెండు రకాల జ్ఞానం మధ్య వ్యత్యాసం తెలుసుకోవటం అవసరం, ఒకటి సైద్ధాంతిక పుస్తక జ్ఞానం మరొకటి, ఆచరణాత్మక విజ్ఞానం.వేద శాస్త్రాలను చదవటం మరియు గురువు గారి ప్రవచనాలను వినటం ద్వారా ఒక రకమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ, ఈ పుస్తకజ్ఞానం సరిపోదు. ఎప్పుడూ వంటశాల (కిచెన్) లోకి వెళ్ళకుండా, వంటల పుస్తకాన్ని బట్టీపట్టినట్టు అన్నమాట. ఇటువంటి వంటల పుస్తక జ్ఞానం మన ఆకలిని తీర్చటానికి ఉపయోగపడదు. అదేవిధంగా, గురువు గారి దగ్గర నుండి - ఆత్మ, భగవంతుడు, మాయ, కర్మ, జ్ఞానం, మరియు భక్తి విషయములను నేర్చుకోవచ్చు, కానీ ఆ మాత్రం చేత ఎవరూ భగవత్ ప్రాప్తి నొందిన మాహాత్ములు కారు. ఎప్పుడైతే ఆ పుస్తక జ్ఞానం ప్రకారంగా సాధన చేస్తారో అది వారి అంతఃకరణ శుద్ధి చేస్తుంది. అప్పుడు, ఆత్మ తత్త్వము మరియు దానికి భగవంతునికి ఉన్న సంబంధము, హృదయంలో అంతర్గతంగా ప్రకటితమవుతుంది.పంతజలి మహర్షి ఇలా పేర్కొన్నాడు:శ్రుతానుమానా-ప్రజ్ఞాభ్యాం అన్య-విషయా విశేషార్థత్వాత్(యోగ దర్శనం 1.49) ‘యోగ అభ్యాసము ద్వారా అంతర్గతంగా పొందిన విజ్ఞానం అనేది శాస్త్రముల అధ్యయనం ద్వారా పొందిన పుస్తక జ్ఞానం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనది.’ ఇటువంటి అంతర్గత విజ్ఞానము అత్యంత పవిత్రమయిన మహోన్నతమైనదని శ్రీ కృష్ణుడు కొనియాడుతున్నాడు.