inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు, కుక్క సింహమగునె గోదావరికిబోవ విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తిరుపతికి పోయినా తురక దాసరికాలేడు. కాశికి పొయినా పంది ఏనుగు కాలేదు. గోదావరిలో మునిగినా కుక్క సింహము కాలేదు. అలానే ఎన్ని ఘనకార్యాలు చేసినా నీచుడు ఉత్తముడు కాలేడు.
5
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె? తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనస్సులో భక్తి ఉంటే తీర్థయాత్రలు చేయడం వృధా. అలానే మనస్సులో భక్తి లేకుండా తీర్థయాత్రలు చేయడం వృధానే.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు మూర్ఖునకు బుద్ది ముందుగాబుట్టును విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఎలగైతే తుమ్మచెట్టుకు పుట్టూకతోనే ముల్లుంటాయొ, అలానె ముర్ఖునికి చెడ్డబుద్ది పుట్టుకతో ఉంటుంది. కావున మూర్ఖుడు ఎంతవాడైనా జాగ్రత్తగా ఉండటం మేలు.
5
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో హరి మిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి యత్యుత కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!ఆశ్వ మేధ యాగము చేసిన వారికి ఏ పదవి దక్కునో, ఏమో గాని, మిమ్ము నమ్మి తలచిన వారికి మీ సాన్నిధ్యము[కైవల్యము] దక్కుట కష్టమా?కాదు. లభించియే తీరునని అర్ధము.కృష్ణ శతకం.
3
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: బ్రహ్మ దేవునివశమే తెలియనివారికి చెప్పడంసులువు.బాగాతెలిసినవారికి చెప్పడంఅతిసులువు.ఏదో కొద్దిగాతెలుసుకుని తనకేఅంతా తెలుసనుకుని ఎదటివారి మాటవిననివారికి బ్రహ్మకూడా చెప్పలేడు.భర్తృహరి.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు సొరిది భాండమందు సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తెలిపే వాడెవడు? తెలుసుకునే వాడేవడు? సృష్టి రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది నీటి కుండలో సూర్యబింబం లాంటిది. దాన్ని చూసి సూర్యుడని పొరబడరాదు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తేలుకు తోకలో విషము ఉంటుంది, పాముకు కోరలలో విషము ఉంటుంది కాని మూర్ఖునికి ఒళ్ళంతా విషమే. కాబట్టి తెలివితక్కువ మూర్ఖుడు మన మిత్రుడైనను వానితో జాగ్రత్తగా మసలడం మంచిది.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయిదేవుడైన రాసులు మ్రింగడా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఆత్మ, పరమాత్మ అనేవి మన దేహంలొ ఉన్నాయి కాని రాళ్ళలో ఉన్నాయనుకోవడం మన భ్రాంతి. రాయిలో దెవుడుంటే మనం పెట్టిన నైవెద్యాలు తింటాడు కదా?
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే "ఆనందో బ్రహ్మ" అని అన్నారు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: జంధ్యం మెల్లో వేసుకుని తనకి శూద్రత్వం పొయి బ్రహ్మణత్వం వచ్చిందనుకోవడం బుద్దిహీనత. మనస్సుని స్థిరంగా ఉంచుతూ ఙానం సంపాదించకపోతే ఎన్ని జంద్యాలు వేసుకున్నా ఏమి లాభం.
2
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి.
3
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను.
1
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.
1
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు.
4
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు నిన్ను అనుదినము సేవించుచు ’నన్ను దయతో చూడుము’ అని ప్రార్ధింతురు. వాస్తవము ఆలోచించగా ఇట్లు ప్రార్ధించుట పనిలేని పని. నీవు భక్తుని నియమనిష్ఠలు, శ్రద్ధయు, విశ్వాసము, భక్తియందలి నిర్మలత్వము ఎంత ఎట్లుండునో అంత ఫలము వారికి లభించును. అల్పసేవతో అధికఫలము లభించదు. అట్లే నిర్మల భక్తితో చిత్తనైష్కర్మ్య యోగముతో నిన్ను సేవించనిదే ఎవరికిని వారికిష్టమగు సుఖములు లభించవు.
6
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య న్విశదముగ కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా!
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దాత ఇతరులతో పోటీ పడకుండా తనకు తోచిన సహయమేదో ముందుగానే ఇస్తాడు. అది ఎంతైనా కావొచ్చు. కాని లోభి ఎంత వేడుకొన్న కొంచమైనా సహయం చేయడు. నీరు మన దాహం తీరుస్తుంది కాని, మలము తీర్చదు కదా?
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: అనుకున్న వెంటనే దానము చేయకుండా "రేపు రేపు" అంటూ జాప్యము చేస్తాడు మూర్ఖుడు.రేపు అన్నది అసత్యమని తెలుసుకోలేడు.రేపు అన్నది రావచ్చు రాకపోవచ్చు. రేపు తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకే తెలియదు. కాబట్టి చేసే దానాన్ని వాయిదా వేయకుండా తక్షణమే చేయడం మంచిది.
5
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం )
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు చందనతరునందు సర్పమున్నట్లయా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: గంధపు చెట్టుమీద ఉండే పాము ఎలాగైతే గంధము వాసన పీల్చడానికి వచ్చిన వాళ్ళను బెదరగొట్టి వెల్లకొడుతుందో, అదే విధంగా మూర్ఖుడు, దానం చేసే దాత వద్దన చేరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశ్రయం సంపాదించి ఇంక ఎవరినీ అతని వద్దకు చేరనీయడు.
5
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగన్
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము: ధనము ఖర్చగుటకు మూడు మార్గములు.దానము చేయుట,అనుభవించుట,దొంగలెత్తుకొని పోవుట. ధనవంతులు దానముచేయక,తామనుభవింపక ధనము కూడబెట్టిన కడకు దొంగలపాలవును.భర్తృహరి సుభాషితములు.
4
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: మేఘములు సముద్రమునకుబోయి ఆవిరిరూపమున నీటినిదెచ్చి వర్షించును.అట్లే దానబుద్ధి ఉన్నవాడు మరొకచోటతెచ్చి ఇచ్చును.
2
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే గానలలోననేమిటికిగాక యభోజ్యములౌటభాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: అడవులలో బూరుగు చెట్లు కాసి పండినప్పుడు కోసి ఆదూది వాడక గాలికి ఎగిరిపోయి వృధా అయినట్లు సంపదలు దానము చేయక వృధా అగును.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలుచెడు నరుండు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మూర్ఖుడు ఎక్కువధనము సంపాదించి ఇంకొకళ్ళకి దానం చేకుండా ఉంచి, దాన్ని నేలలో పాతిపెట్టో వ్యర్ధంగా ఖర్చుపెట్టో నాశనం చేస్తాడు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యక అపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనా నలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం. చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అని ప్రయోగం. పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే. తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని.
6
['tel']
క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌ మానవతుల కిది ధర్మము గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!
ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి.
1
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! అనుదినము నీ ఆలయ సమీపమున ప్రవహించు సువర్ణముఖీ నదీతీరమున ఉన్న మామిడితోట నడుమనున్న అరుగు పై పద్మాసనమున కూర్చుండి నిష్థాపూర్వకముగ ధ్యానమున నిన్ను దర్శ్ంచుచు చిత్తమునందు ఆనందమును అనుభవించ కలిగినచో అదియే వాస్తవమగు ఆనందము. అదియే సత్యమగు సుఖము. అంతేకాని లక్ష్మీవిలసనములచే ధనసాధ్యములగు భ్రాంతి కల్పితములగు భోగములతో కలుగు ఆనందము ఆనందమా?
1
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా మేరుపర్వతము స్వయముగ బంగారుకొండ. దానికి రత్నసానువు అను పేరు సార్ధకమగును. దేవ వృక్షములగు కల్పవృక్షము మొదలగు ఐదు వృక్షములును, కామధేనువును, వివిధమహారత్నములును మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించునది ఆ పర్వతము. అట్టి మేరువు త్రిపురాసురసంహారివగు నీకు విల్లు. నవనిధులకును అధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు. సముద్రమునకు బిడ్డ యగు లక్ష్మికి పతి శ్రీమహావిష్ణువు నిన్ను అర్చించువారందరిలో ముఖ్యుడు. ఇట్లు ఏ విధముగ చూచినను నీతో సమానులగు దేవులు ఎవ్వరును లేరు. మహాదేవా! అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే! మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు?
1
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: రామా! పట్టుదలతో నావంటి దీనుల నెందరినో రక్షించితివి.ద్రౌపది కోరగానే చీరలు ఆక్షయముగా నిచ్చితివి.నామొర వినవేమి?
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: బండరాజు కొడుకు దుండగుడు. మిత్రుడు కొంటెవాడు. మంత్రేమో శక్తిలేనటువంటి వాడు. కొండముచ్చుకు కోతి దొరికినట్లు అందరు బాగానే కుదిరారు.
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్ సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తాము అధికులమనిపించుటకు ధనము సంపాదించుటకు ఎన్నియో మార్గములు కలవు. వానిలో రాజుల యుద్ధమొక తంత్రముగ వాడుదురు. కోట రాజులకు ఆత్మరక్షణ సాధనము. రాయబారములు ఒక ఉపాయము. జనులకు దొంగతనము, కులవృత్తులు సాధనములు. కవులు, పండితులు, కళలు నేర్చినవారికి రాజాశ్రయము చక్కని మార్గము. ఓడవ్యాపారము అన్ని సాధనములలో గొప్పది. మంత్రోపాసనతో సిద్ధి పొందినవారు ఎన్నియో అద్భుత కార్యములను సాధింవచ్చును. పైన పేర్కొన్న ఏఒక్క సాధనము ఫలించినా మహాఫలము లభించును. కానిచో ఫలము లభించకపోగా ఉన్న ధనము కాని ప్రాణము కాని పోవును. కాని నీ సేవ అట్టిది కాదు. నిన్ను ఎట్లు ఎంతగా సేవించినను నీ అనుగ్రహము కలుగును మరియు మహాఫలము తప్పక సిద్ధించును. లౌకిక ప్రయోజనములను సాధించు ఉపాయములు ఒకప్పుడు హానికరములు కావచ్చును, కాని శివపూజ అట్టిది కాదు. మహాఫలప్రద దాత.
4
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా దుర్జనుల సంహరింపను నర్జునునకు బ్రేమసారధైతివి కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: కృష్ణా! ముల్లోకాలకీ ఆధారమైన నీవు దుర్జనులైన రాజ సమూహములను చంపదలచినవాడవై ఆకారణముగా అర్జనుడికి ప్రేమతోసారధివై సంగ్రామము నడిపితివికదా!'పార్ధసారధి'అనిపేరుపొందావు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దుష్టులు తాము చేసేవి చెడ్డపనులైనా కాని మంచి పనులేనని వాదిస్తూ ఉంటారు.పైగా అలాంటి పనులు చేయకూడదు అని చెప్పినవారిని తిడతారు. ఈ విధమైన వారికి దూరంగా ఉండటం మేలు.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మూర్ఖులు తమమీద బరువు పడెవరకు వచ్చె ఆపద గురించి ఆలొచించరు. ఒక వేళ ఎదన్నా సమస్య వచ్చిందా, దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు. ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు, శిక్షించి దారిలోకి తేవడమే సరియైన పద్దతి.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో దేవుడున్నాడని మ్రొక్కేవారు అసలు దేవుణ్ణి గాంచలేక తిరుగుతుంటారు. ఇలాంటివాళ్ళు ఎంత తిరిగినా దైవత్వం మోక్షం కలుగుతుందా?
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదులును చూడు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు.
4
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్ గోవర్ధన గిరి యెత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: శ్రీకృష్ణా!తనకుపూజ చేయలేదను కోపముతో దేవేంద్రుడు వడివడిగా రాళ్ళవాన కురిపించగా గోవుల్ని,గోపాలకుల్ని కాపాడడంకోసం నువ్వు గోవర్ధన పర్వతాన్ని చేతితో ఎత్తిపట్టావుకదా!కృష్ణశతకం.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: గారడివాడు ఇతరులను మోసగించుతాడు కాని తన మాయలో తానెప్పుడు పడిపోడు. అలాగే దేహతత్వమేరిగిన యొగి మొహావేశాలలో చిక్కడు.
6
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: రామా!తల్లి,తండ్రి,గురువు,దైవం,దాత,సఖుడునీవేఅనినమ్మిన నన్నుపాపములు నాచేచెడుచేయించుచున్నవికాపాడు.గోపన్న
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దొంగ మాటలు మాట్లడే వారికి మోక్షము కలుగదు.చేత కాని అటువంటి మాటల వలను వాళ్ళె నష్టపోతారు. అలాగే మనస్సులో దుర్గుణాలు ఉన్న వాళ్ళు గురువులకింద పనికిరారు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న తాముచేయు పనులు దగులుకోకుందురా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: దొంగతనాలు, ద్రోహాలు చేసి ఎవరికీ తెలియదని మనుషులు అనుకుంటారు. కాని ఎప్పటికైనా వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణమీనుడనవలె విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నీచమైన దాంభికులు గురువులమని నీచమంత్రములు చెప్పి మోసగిస్తుంటారు. అట్టి వారు గుణవిహీనులు. వారిని నమ్మరాదు. మనకు ఆత్మశుద్ది లేకుండా అటువంటివారు చెప్పె మాటలు ఎన్ని విన్నా మోక్షము లభించదు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయజ్యమెందునా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పెద్దవాల్ల మని గొప్పలు చెప్పుకొని రాజుల దగ్గర, దొరల దగ్గర ఉండి అందరి మీద చాడిలు చెబుతూ ఉంటారు. అలాంటి వాల్లకు ముక్తి ఎలా కలుగుతుంది.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మాములు మనిషైన గొఱ్ఱెల కాపరి కూడ తోడేలు తన మందమీద పడితే దానిని చంపో బెదరగొట్టో పశువులను కాపాడుకుంటాడు. అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన తత్వం.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ? అమ్మవారి పేర నందఱు దినుటకా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అమ్మోరు ఆటలమ్మ అని జబ్బులకి పేర్లు పెట్టి, అవి తగ్గటానికి అమ్మవారికి జంతువులని బలి ఇస్తూ ఉంటారు. ఇదేమి మాయ తెగులోకాని, ఇవన్ని చేసేది అమ్మ వారి పేరు చెప్పి అందరు తినడానికే.
4
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: కుల పర్వతాలు 7 మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత, ఋక్ష, పారియాత్రము అనేవి కులపర్వతాలు సముద్రాలు 7 దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల అనేవి సప్తసముద్రాలు కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా, ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా వారి ధైర్యాన్ని విడనాడరు అని భావం.
5
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే నోలి భుజించి ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థి తిన్
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: తనకు గుప్పెడు మెతుకులు వేస్తే వాడిముందర తోకాడిస్తూ నిలబడటమో నేలమీద పొర్లుతూ కాలితో తన పొట్టకేసి చూపించడమో చేస్తుంది కుక్క. కాని ఏనుగు అలా కాదు.... ఠీవిగా నిలబడి మావటి వాడు ఆప్యాయంగా అందించే మేతను లాలింపు ద్వారా గ్రహిస్తూ ధైర్యదృక్కులతో చూస్తూంటుంది. కవినిశిత పరిశీలనకు ఇది మచ్చు తునకగా చెప్పవచ్చు. ఉత్తములు నీచ చేష్టలు చేయరని దీని భావం.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ధనికుడైన వాడు తప్పు చేసినా, చెడ్డ వాడైనా, విరొధియైనా, నిందితుడైనా సరే జనులు వాడి చెప్పింది చేస్తూ వాణ్ణె తృప్తిపరుద్దామనుకుంటారు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీదగు నీవి విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహ బుద్దితో తన మిత్రులకి కూడ హాని తలపెడతానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలంటి వాని వలలో పడి మోసపోకూడదు. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి.
4
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్ వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మోక్షలక్ష్మీరాజ్యము గోరు నీ భక్తులు, రాగులిచ్చు తుచ్చములగు లక్ష్మిని కోరి రాజసేవ చేయుటకిష్ఠపడరు. రాజాశ్రయము కోరి వారి దర్శనము కోరిన వారి పాట్లు చూసేవ వారు రాజుల సేవ చేయరు. ఆ పాట్లెట్లుండుననగా, రాజ దర్శనమునకు పోవు వారు త్రోవలో దుర్గములు, ప్రాకారములు ద్వారా పోవలయును. అట్టి ప్రదేశములలో కంచుకులను రక్షకులుందురు. వారు వీరి యోగ్యత గణించక, కంచుకములతో త్రోయుచు శరీరభాగములంచు గాయములు చేయుదురు. దుర్భాషలు కూడ పలుకుదురు. వీరు ఆ కంచుకులను బ్రతిమాలి బామాలి రాజ దర్శనము చేయవలెను. దేవా నీ దర్శమునకై ఇన్ని పాట్లు పడవలసిన పనిలేదు. నిర్మలమగు భక్తితో సేవించినవారిని వారు భక్తితో సమర్పించిన మారేడుదళముతో సంతృప్తినొంది అనుగ్రహింతువు. ఇహమున సుఖములిచ్చుటయే కాక పరమున మోక్షసామ్రాజ్యము ప్రసాదింతువు.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: గుమ్మానికి తలుపులు, గడియలు ఉన్నట్లే, మాటకు నియమాలు రక్షణగా పనిచేస్తాయి.ధర్మం గ్రహించి జాగ్రత్తగా మాట్లాడి మెప్పు పొందాలి గాని, విచ్చలవిడిగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పాపాత్ములు ధనము కూడబెట్టి వాటిని దానం చేయకుండా ఇంకొక ఆలోచనలు లేకుండా అలానే దాచి పెట్టుకుంటారు. మీరు పోయెటప్పుడు ధనము మీ వెంట రాదు అది గుర్తుపెట్టుకుని దానం చేయడం మొదలుపెట్టాలి.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తేనెని సమకూర్చిన ఈగ దానిని పరులపాలు చేసినట్లుగా, నరుడు చాల కష్టపడి ధనము సంపాదించి, దానిని ధర్మము చేయక చివరకు ఇతరుల పాలు చేస్తాడు. కాబట్టి తనకు సరిపడిన ధనాన్ని ఉంచుకుని మిగిలిన దాన్ని పరులకివ్వడం పుణ్యుని లక్షణం.
6
['tel']
క్రింద ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు
ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి తాత్పర్యం: దేవునిదయవుంటే వీధిలోపడేసినా డబ్బుపోదు.లేకపోతే ఇంట్లోమూల జాగ్రత్తచేసినా పోతుంది.అడవిలో రక్షణ,బలములేకున్నా దైవబలంతో మనిషిబతుకుతాడు. లేకపోతే ఇంట్లోఉన్నాచస్తాడు.భాగవతం.పోతన.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు, విశ్వధాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ధనము లేని చోట ధైర్యం ఉండదు, ధైర్యం లేని చోట ధనము ఉండదు.కాబట్టి మనిషి ధనాన్ని ధైర్యాన్ని రెంటిని సాధించాలి.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.
6
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ బోరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: ఒకానొక బట్టతలవాడు, మిట్టమధ్యాహ్నం సూర్య తాపం భరించలేక అందులోనూ మరీ ముఖ్యంగా మాడుతున్న శిరస్సును కాపాడుకోవటానికి దగ్గర్లో ఓ చెట్టూ కనబడక తాటిచెట్టును చూశాడు. అదీ కొద్దిపాటి నీడలో తలదాచుకోవాలనుకొని దాని క్రిందికిచేరాడు అది వేసవికాలం కావడంతో చాల ముగ్గిన తాటిపండు ఒకటి దైవికంగా సరిగ్గా అప్పుడే వానితలపై పడింది వెంటనే వాడితల బ్రద్దలైపోయింది. దైవబలం చాలకపోతే ఇలాగే జరుగుతుందిమరి.
5
['tel']
క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు, వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన జేసెడి వారికి బరమ సుఖము భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం: ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం!
5
['tel']
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!
ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎవరికైనా కన్నతల్లిని మించిన వారుండరు. ఐతే, ఇదే సమయంలో లోకంలో ప్రతి ఒక్కరికీ మరొక అయిదుగురు తల్లులు ఉంటారు. వారినీ కన్నతల్లి మాదిరిగానే తప్పక గౌరవించాలి. వారెవరంటే రాజు భార్య, గురు పత్ని, అన్న భార్య (వదిన), కులకాంత, భార్య తల్లి (అత్త). వీరంతా కన్నతల్లితో సమానమన్నమాట.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును? నీరుచొరమి లోతు నిజముగా దెలియదు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: నీటిలోతు తెలియాలంటే ఎలాగైతే దానిలో దిగిన వానికి మాత్రమే తెలుస్తుందో అలానే దానం యొక్క విలువ దాతకు మాత్రమే తెలుస్తుంది.
1
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖమును,సంతోషమును కలిగించును. ఇదిసుమతీ శతక పద్యము.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి.
4
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నినుదలతు భక్త వత్సల కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!నందుని ముద్దుల కుమారుడిగా పెరిగి మందర గిరిని చేతధరించి మునిగణములచే హరీ!మాధవా!విష్ణూ!అని స్తుతింప బడిన సుందరాకారా నిన్ను తలచు[ధ్యాన్నించు]చున్నాను.కృష్ణ శతకం
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు విశ్వధాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కుక్కను లోంగ దీసుకొవడానికి ఎలగైతే దాని బోను దగ్గర మెతుకులు చల్లుతామో, అదే విధంగా ధనాన్ని సంపాదించడానికి మనుషులు నక్క వినయాన్ని చూపుతూ తీయ్యగా మాట్లాడతారు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తన దగ్గర ఉన్న మాంసపు ముక్కతో తృప్తి చెందక, నదిలోన చెపను చూసిన వెంటనే, నక్క తన దగ్గరున్న మాంసపు ముక్కను జాగ్రత్తగా ఒడ్డున పెట్టి చేపను పట్టుకోవడానికి నదిలోకి దిగుతుంది. ఈ లోపులో గ్రద్ద ఒడ్డున ఉన్న మంసాన్ని తన్నుకుపోతుంది, చేప నక్క చూపునుంచి చేజారిపోతుంది. అదేవిధంగా లోభి అత్యాశకి పొయి ఉన్నదంతా నష్టపోతాడు. కాబట్టి మనదగ్గరున్న దానితో సంతృప్తి పడటం మేలు.
1
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసు బాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు. శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు.
4
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకందము కలిగించు వస్త్రము ఏనుగుతోలుదుప్పటము కదా! కాలకూట మహావిషము నీ ఆహారము కదా! బ్రహ్మదేవుని తలపుర్రె నీవు అన్నము తినుటకుపయోగించు గిన్నె కదా! నీ కంఠహారము భయంకరమగు సర్పము కదా! మంచిది. ఇటువంటి లక్షణములు కలవని తెలిసీ పురుషోత్తముడగు విష్ణువు తన మానసమును నీ పాదపద్మములందు నిలిపెను కదా! అనగా సర్వదేవోత్తముడవగు మహాదేవుడవయిన నీ పరికరములేమి అయిన ఏమి? అందులకే విష్ణువే నిన్ను ఆరాధించుచుండగా నేను కూడ నిన్నే ఆశ్రయించి సేవింతును.
3
['tel']
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్ సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!
ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును.
6
['tel']
క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు భళిర! నే నీ మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావము: పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ!
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మనిషి జాగ్రత్తగా ఉన్నట్లు నటిస్తుంటాడు లేదా తను జాగ్రత్త పడ్డానని ఊహించుకుంటూ ఉంటాడు కాని లోకములో మనిషికి జాగ్రత్త అరుదుగా ఉంటుంది. బయట జరిగే సంఘటనలు ఏవీ మనిషి ఆధీనంలో ఉండవు జాగ్రత్త పడటానికి, అసలు జాగ్రత్తగా ఉండగలిగే మనిషే పరమాత్మ. కాబట్టి అతి జాగ్రత్తకు పొయి జీవితాన్ని ఆస్వాదించడం మానుకోవద్దు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మామూలు నరుడైనా గాని, దేవుడైన నారాయణుడైనా గాని, మహ గొప్ప తత్వవేత్తైనా గాని ఎలాంటివారైనా ఈ శరీరానికి మరణమున్నదని తప్పక గ్రహించాలి. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని పరులకొరకు కొంత పాటుపడాలి. ఎవరూ ఇక్కడ శాశ్వతము కాదు.
5
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంతజెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: నవరసములతోడ భావములతో అలంకారములతో కవిత్వ ప్రసంగములు,మనోహరములగు పాటలు పాడుటయు తెలివి లేనివానికి[వాటియందు ఆసక్తి లేనివారికి]చెప్పడం చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లేబద్దెన.
6
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతులతో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: సభలోపలను,తల్లిదండ్రులతోనూ,అధికారులతోనూ,పరస్త్రీలతోనూ,బ్రాహ్మణోత్తములతోనూ పరిహాసములు[ఎకసక్కెము]లాడరాదు.ఈపద్యములో నవ్వకుమీఅంటే వెటకారాలు,వెక్కిరింతలు చేయకూడదని.
2
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్దిశయన యదుకుల వీరా ననుగావుకరుణ వెలయగ కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: నారాయణా,పరమేశ్వరా,భూదేవిని ధరించినవాడా,నీలిరంగు దేహముకలవాడా,దుష్టులను శిక్షించువాడా, పాలసముద్రమందు పవళించువాడా,యదువంశవీరా నన్ను కరుణతో కాపాడు కృష్ణా!
6
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ!
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్ల పడనేల? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: నాసిక చివర దృష్టి నిలిపి, ఆలొచనలన్ని త్యగించి, నిశ్చలంగా మనసును అదుపులో ఉంచుకొనిన సమస్త ప్రపంచము అర్దమవుతుంది. ఈ యోగము సాధ్యమయితే కాశికి కంచికి వెళ్ళవలసిన పని లేదు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎప్పుడైనా నిండుకుండలు తొణకవు. బాగా నీటితో వుండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి. కానీ, నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి. ఇదే విధంగా, అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ, సజ్జనులు తక్కువగా, విలువైన రీతిలోనే మాట్లాడుతారు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.
6
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: నిజము తెలిసి ఉన్నప్పుడు మంచి వాడు ఆ నిజమునే మాట్లాడాలిగాని పరుల కోసం దాచి పెట్టకూడదు. ఎంత బ్రతిమిలాడినను ఒకరికోసం తను నిజం మాట్లాడడము అనే అలవాటు తప్పకూడదు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: నిజమైనా అబద్దమైనా ఆ నీలకంఠునికి తప్పకుండా తెలుస్తాయి. మనం నిజం చెప్పకుంటే నీతి అనేది తప్పినట్టె. కాబట్టి నిజం చెప్పడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నిజం చెప్పే వాళ్ళు ఈశ్వరునితో సమానం.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజముపల్కకున్న నీచచండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నిజము చెప్పెవాడెప్పుడు మంచి మనస్సు కలవాడై ఉంటాడు. పైగా నీతిపరుడు కూడ. కాబట్టి నిజము మాట్లాడేవారిని ఎల్ల వేళలా గౌరవించాలి. అబద్దం మాట్లాడెవాడు మాత్రం పరమ చండాలుడు.
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను. మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొఱకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను. తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను. నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొఱపెట్టుకున్నను వినకున్నావు. ఎందుకు ప్రభూ.
2
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను నిందించిన దక్షుని విషయమున అతనిని దండించితివి కదా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! అట్టిధర్మరక్షకుడవగు నీవు నీ పాదపద్మములను ఆరాధించు సేవకులను తుచ్ఛమగు మాటలతో దూషించు దుర్మార్గులను దండించకపోగా వారిని వృద్ధిలో నుండునట్లు చేయుచున్నావే! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! ఒక వేళ నీవు వేరు నీ భక్తులు వేరను భేద భావమున ఉన్నావా! అట్లు కానిచో నీ భక్తులకు కలుగుచున్న ఈ నిందలను అవమానములను నీవు సహించగలవా?
6
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును.
5
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్ విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు. దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు. ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనార్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు. వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవయిపునకు రావలయును కదా. కాని అట్లు వచ్చుటలేదు.
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు మరి ఎవ్వరిని విశ్వసించను. అన్నలు, తమ్ములు తల్లియు తండ్రియు, గురుడు ఇతరులెవ్వరును ఆపదలందు నాకు సాయపడువారు లేరు. నా తండ్రీ నిన్నే విశ్వసించి ఆశ్రయించిన నన్ను ఈ సంసారదుఃఖసాగరమునుండి దాటించి యెప్పుడు అఖండానందామృతసముద్రమున తేలియాడునట్లు చేయుదువో కదా!
2
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! చిత్తతత్వమునకు ఆధారమగు పద్మమునందు విహరించుచు మత్తమయి యందు తుమ్మెద యగు నీ సగుణరూపమును కన్నులార చూచి, సేవించి తరించవలెనని కోతికగ ఉన్నది. కాని అది యెట్టిదియో నాకు తెలియదు. మునుపు కొందరు వివిధరూపములతో నిన్ను భావించి సేవించిరని తెలియుచున్నది. మోకాలు, ఆడుదాని స్తనము, కుంచము, మేకపెంటిక వీనిలో ఏది నీ సగుణరూపమో నాకు తెలియకున్నది. నా ఈ సందేహమును పోగొట్టి వాస్తవమగు నీ సగుణరూమును నాకు చూపుము. కన్నులార కాంచి నిన్ను సేవింతును.
5
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్ తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్ చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా శాస్త్రములు, వాటినెరగిన వారు, అనుభవము కలవారు, పండితులు చెప్పు వచనములు ఏమనగా "శివనామము అగ్ని అని అనదగినిది; దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలిసియో తెలియకయో దూరమునుండి యైన వినినంత మాత్రముచేత కూడ అది కొండలంత పాపములను దూదికుప్పలను అగ్ని కాల్చినట్లు కాల్చును. ఇట్టి నిశ్చితవచనములు ఉండగా మానవులు ’నిన్ను అర్చించుటచే మోక్షము లభించును’ అన్న విషయమున సంశౌయింప పనిలేదు.
2
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్ గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవనిపై నీ కరుణ కలుగునో వాడు తన జీవన నిర్వహణమునకై ఏ నీచప్రభువులను, ధనికులను సేవలకై వారి భవనములలో ప్రవేశించవలసిన పనిలేదు. కృపణత్వమును (దైన్యము) ప్రకటించవలసిన పనిలేదు. ఏ కపట వేషము వేయలసిన పనిలేదు. శివ భక్తినే కాని ఇతరమతములను ఆదరించడు, స్వీకరించడు, ఏ కష్టమగు రీతులతో తన చిత్తము చీకాకు చెంది చెడిపోడు. తన జీవన దశలో స్థిరచిత్తుడై వర్తించును. తద్వారా ఉత్తమగతిని పొందును.
6
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను నీ సేవకుడనుగాక ముందు మనకొక ఏకాభిప్రాయము కుదురుటకు ఒక మాట చెప్పుచున్నాను వినుము. నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవింతును. ప్రతిఫలముగ జీతము కోరను, గుఱ్ఱములు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, సంపదలు అక్కరలేదు. ఎందుకనగా వానియందు నాకు ఇఛ్చలేదు. కాని నా చిత్తమందుండి నన్ను భాధించు ఆరుమంది శతృవులకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు) మాత్రం నన్ను అప్పగించవలదు. అంతయే చాలును. ఇంతచేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే.
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ పంచయందు పడియుండి, నీ అనుగ్రహము మరియు ఆశ్రయము లభించినచో అది మాత్రమే చాలును. భిక్షాన్నము లభించినచో చాలును. మహానిధి లభించు అవకాశమున్నను కీటకములవలె క్షుద్రులగు రాజులను సేవించజాలను, ఇష్టపడను. నీవు నన్ను సేవకునిగా స్వీకరించు దయ నాపై కలిగినచో నన్ను ఆశాపాశములతో చుట్టి బంధించకుము. సంసారసుఖములకై యత్నించుచుండునట్లు చేయకుము.
2
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ నామమును నా నామముగా ధరించియున్నాను. నీ నామమే నా ధ్యేయముగా గ్రహించుచున్నాను. నీ పాదతీర్ధమును త్రావుచుందును. నీవు నమిలి ఉమిసిన తాంబూలము భక్తితో గ్రహించుచుందును. నీకు నివేదించిన ఆహారపు పళ్లెరములో లభించిన ప్రసాదమును తినుచుందును. ఇట్లు అనేక విధములుగ పుత్రుడనైన నన్ను నీ బిడ్డగనే ఉండనిమ్ము. మరియొకరెవరికి పుత్రుడనవను. తండ్రి తన పుత్రుని విడువదగదు కదా!
1
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు మాంసము తినుటయందిష్టమున్న నీచేత నున్న లేడిని ఇంకొక చేతనున్న గండ్రగొడ్డలితో కోసి ఆ మాంసమును తలనున్న గంగాజలముతో నుదుటనున్న నేత్రాగ్నియందు పాకముచేసి ఇంకొక బ్రహ్మకపాలములో భుజించు అవకాశము ఉండగా ఆ బోయవాని చేతి ఎంగిలిమాసమును తినుట నీకు తగునా!
4
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.
2
['tel']