Datasets:
inputs
stringlengths 135
2.43k
| targets
stringlengths 111
2.26k
| template_id
int64 1
18
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో
ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం:
దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ! | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో
కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై
బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము:
ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే
భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా
రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా | ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం:
భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ
లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై
దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ! | ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం:
రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు
చేరవలయు బ్రతుకజేయు నతడు
ఆ విభీషణునకు నతిగౌరవంబీడె
భూతలమున రామమూర్తి వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా? | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్
కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై
దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ! | ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం:
స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై
దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ | ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం:
గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అండజవాహన వినుబ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్
గొండల నెత్తితివందురు
కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా? | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను
అంతరంగ మెఱుగ నార్యుడగును
అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అంతరంగమంద అపరాధములుచేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
లోకంలో కొంతమంది మనుస్సులో చెడ్డభావాలు పెట్టుకొని పైకి మంచివారిలాగా ప్రవర్తిస్తారు. ఈవిషయాన్ని మనుష్యులు గుర్తించలేక పోయిన భగవంతుడు మాత్రం గుర్తిస్తాడు. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అంతరంగమందు సపరాధములు చేసి
మంచివానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం:
జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ
చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము:
శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా! | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే
యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం:
శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా! | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అందరానిపం డదడవి వెన్నెల బైట
నుండు జూడ బెద్ద పండుగాను
పండుపడిన జెట్టు బట్టంగలేరయా!
విశ్వధాభిరామ వినురవేమ | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా
నందముగ కూర్మరూపున
మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా! | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము:
లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం.
విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అందెల బాదములందును
సుందరముగా నిల్చినావు సొంపమరంగా
సుందర మునిజనసన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము:
పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!కృష్ణ శతక పద్యం. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము:
ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా
రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా
రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము:
శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బాఱని గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ! | ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం:
అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి.
ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి.
‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అక్షమాలబూని యలసటజెందక
కుక్షినింపుకొనుట కొదువగాదు
పక్షి కొంగరీతి పైచూపు లేదొకో!
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
జపమాలలు ధరించి దొంగ జపాలు చేసేది భక్తి ఎక్కువై కాదు, కడుపులు నింపుకోవడానికి. ఇది ఎలాంటిది అంటే చేపలను మెక్కడానికి కొంగ నీళ్ళలో పైకి చూస్తూ ఉంటుంది కదా అలాంటిది. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అక్షరాశివెంట అడవులవెంటను
కొండరాల గోడు గుడవనేల
హ్రుదయమందు శివుడుండుట తెలియదా?
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
దెవుడుని వెతుక్కుంటూ దైవ గ్రంధాలను అడవులను కొండలను పట్టుకుని తెగ తిరుగుతూ ఉంటారు కాని మనలో ఉన్న దెవుణ్ణి మాత్రం గుర్తించలేరు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అగణిత వైభవ కేశవ
నగధర వనమాలీ యాది నారాయణ యో
భగవంతుడ శ్రీమంతుడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం:
లెక్కలేనంత వైభవము గల కేశవా, కొండ నెత్తిన వాడా,పూమాలలు ధరించే ఆదినారాయణా, భగవంతుడా, లక్ష్మిగలవాడా, జగత్తుని కాపాడువాడా!రక్షించు.రక్షించు.రక్షించు. కృష్ణా! | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ
జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము,
విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు. | ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం:
ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు,
మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు,
ఇతరులరహస్యాలను కాపాడటం,
పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం,
తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక
ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా
ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా
ఆ పనులకు అవసరమైనవి అందించడం ఈ గుణాలున్న
వాడు మంచి మిత్రుడని భావం. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు గోప్యంబుదాచు బోషించు గుణము
విడువడాపన్ను లేవడి వేళనిచ్చు
మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు | ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం:
పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస
ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా
ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ! | ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము:
బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె
య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్
గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా | ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము:
మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై
యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం:
శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం
చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో
పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్
క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్ | ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము:
ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం
పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా ఔతాయి అని భావం. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అతి నిద్రావంతునకును
నతి పానికి నిరశనునకు నతి కోపునకున్
ధృతిహీనున కపకృతునకు
జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అతి బాల్యములోనైనను,
బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స
ద్గతిమీఱ మెలఁగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా! | ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అతిధి రాకచూచి యడలించి పడవైచి
కఠిన చిత్తులగుచు గానలేరు
కర్మమునకు ముందు ధర్మము గానరో
విశ్వదాభిరామ వినురవేమ | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము:
ఇంటికి అతిధి రాగనే అదిలించి కసిరి పొమ్మని చెప్పే మూర్ఖులు తమ ధర్మాన్ని గుర్తించరు. మనకు మంచి కర్మలు కలగాలంటే ముందు ధర్మం ఆచరించాలి కదా? | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె,
సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె,
సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె,
దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె,
యితర కామంబు గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె,
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర! | ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము:
ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ! | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అతిహితమగునట్టు లాడిన మాట
సంతసించు రెల్ల సత్పురుషులు
అధికభాషణంబు లాయాసదంబులు
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఉత్తమమైన వాళ్ళు ఎవరైన మిక్కిలి హితముగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. కాని అర్ధం లేకుండా అధిక ప్రసంగములు చేస్తే వారికి నచ్చదు. మనము ఉత్తములుగా ఉండి అర్ధరహితమైన సంబాషణలను ఖండించాలి. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే
పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా. | ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము:
భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో
మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే
యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా | ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం:
ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అనువు గాని చోట అధికులమనరాదు
కొంచె ముండు టెల్ల కొదువ గాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా?
విశ్వదాభిరామ వినురవేమ. | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా! | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అనువుగాని చోట అధికుల మనరాదు
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా ?
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము:
విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అనువుగాని మీఱ మదిని నానంద మందెడి
నరుడు పరుడుగాడె నయముగాను
మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా?
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎంతటి కష్టంలో కూడ ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి మనస్సుతో ఆనందం అనుభవించువాడే పరమాత్ముడు కూడ. అలాగే మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే ముక్తి అనేది కలుగదు. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అనువుగానిచోట బనిగొని జూదము
నాడి యాడి యెడి యడవి సొచ్చు
ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అన్న మిడుట కన్న నధిక దానంబుల
నెన్నిచేయ నేమి యెన్న బోరు
అన్న మెన్న జీవనాధార మగువయా
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేమి యేన్నఁబోరు
అన్న మెన్న జీవనాధార మగునయా
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా!
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము:
అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అన్ని జాడలుడిగి ఆనందకాముడై
నిన్ను నమ్మజాలు నిష్టతోడ
నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన!
విశ్వదాభిరామ వినురవేమ | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము:
అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన.
అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు.
బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు.
ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే.
నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు.
ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే.
అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కువ లేదయా
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము,
జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ! | ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు.
బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు.
ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని
తపమున్ దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ | ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం:
అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అభిజాత్యముననె యాయువున్నంతకు
దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక
మురికి భాండమునను ముసరునీగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము:
తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి:
అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు
వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి
యురు దయాఢ్యులమేను పరోోపకార
కలన రాణించు గంధంబు వలన గాదు | ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము:
చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అమృత సాధనమున నందఱు బలిసెద
రమృత మెంచి చూడ నందలేరు
అమృతము విషమాయె నదియేమి చిత్రమో
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం
జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము:
శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్
దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని
ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము:
శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
జయ్యన గలుగుచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము:
శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అరయ దఱచు కల్లలాడెది వారింట
వెడల కేల లక్ష్మి విశ్రమించు?
నీరమోటుకుండ నిలువనిచందాన
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అరయ నాస్తియనక యడ్డుమాటాడక
పట్టుపడక మదిని దన్ను కొనక
తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ! వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో "యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే
కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం
గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా! | ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము:
భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య
జనన మరణ సంఖ్య జాతి సంఖ్య
దీనినెఱిగి యోగి ధీరుడై యుండును
విశ్వధాభిరామ వినురవేమ | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అఱుత లింగముండ నదియెఱుంగగలేక
పర్వతంబుబోవు బానిసీడు
ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్
వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా
తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా
ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా | ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము:
పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు
ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు
తిరిపెమిడెడు కటికదేబెలెల్ల
నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ
జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు
అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అల్ల జగన్నాధుకు రే
పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయు
దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా! | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము:
కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ
ఒడల బూతిపూసి యుందురెపుడు
ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె
ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే
ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా | ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము:
రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా! | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం
స్తవనీయు, దేవశృతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా ! | ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము:
ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠపరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
అస్థిరమగు మేని కదరిపాటుల బొంది
పెక్కు విధములందు బెంచి బెంచి
అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
మనిషికి ఈ శరీరం మీద మక్కువ చాలా ఎక్కువ. ఎంతో వ్యయప్రయాసలు కోరి పెంచి పొషించిన ఈ దేహం తుదకు అగ్ని పాలో నక్కలపాలో అవుతుందన్న విషయం గ్రహించరు. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
ఆకలిగొని వచ్చెనని పరదేశికి
పట్టెడన్నమైన బెట్టలేడు
లంజెదానికొడుకు లంజెల కిచ్చును
విశ్వధాభిరామ వినురవేమ | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి:
ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు
శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ
స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం
గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ | ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం:
ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
ఆకుమీదివ్రాత యందఱికిదెలియు
చేతిలోనివ్రాత జెప్పవచ్చు
తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా?
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
ఆకులమీద వ్రాసింది ఎవరైనా చదవవచ్చు. అలాగే చేతిలోని రెఖలబట్టి ఊహించి చెప్పవచ్చు కాని మన నుదిటిమీద బ్రహ్మ వ్రాసిన రాత చదవడం ఎవరితరమూ కాదు. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
ఆకులెల్ల దిన్న మేకపోతులకేల
కాకపోయెనయ్య కాయసిద్ది
లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా? | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
ఆకొన్నకూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ | ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం:
ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు. ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయ బోకుము
కార్యా లోచనము లొందజేయకు
మాచారము విడువ బోకుమయ్య కుమారా! | ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము:
నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్,
బ్రాజ్ఞతను గలిగి యున్నన్,
బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా! | ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము:
ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం
దానం భోగో మిత్రసంరక్షణం చ
యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః
కోऽర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ? | ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం:
గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి
1. దుష్టశిక్షణ నైపుణ్యం
2.. గొప్పకీర్తి
3. బ్రాహ్మణాదరణ
4. భోగాలను అనుభవించే గుణం
6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం
6. శరణన్నవారిని రక్షించడం
వీటిలో ఏది లోపించినా
అలాంటి రాజును
కొలవడం వృథా అంతేకాదు
దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. అని భావం | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
ఆడదానిజూడ నర్ధంబు జూడగ
బమ్మకైన బుట్టు దిమ్మతెగులు
బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము:
ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన) | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు
ధీరవృత్తి కలిగి తిరుగబోరు
రూపుకుదరనుంచి రూఢిగావింతురు
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
నిజమైన ఙానులు తాము గొప్ప వాళ్ళమని గర్వపడరు. ధీరులైయున్నను తిరగరు. ప్రశాంతముగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
ఆదండకావనంబున
గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ
నాదండ కావరమ్మీ
వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము:
కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!కృష్ణ శతక పద్యము. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు?
చెప్పలేడుగాని తప్పుబట్టు
త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా?
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
మంచివారు చేసె పనులకు అర్ధం మూర్ఖుడు తెలుసుకోలేడు కాని వాటిని చెడకొడతానికి మాత్రం అన్ని వేళళా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే చేసే ప్రతి మంచి పనిలోనూ కూడ తప్పులు పడుతూ ఉంటాడు. జాగ్రత్తగా పేర్చిన కుండలను కుక్క త్రోసి పడగొట్టి చిరాకు చేస్తుంది కాని తిరిగి వాటిని పేర్చలేదు కదా? | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
ఆదివరాహుడవయి నీ
వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడఁగ
మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా! | ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం:
మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు.
ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. | 2 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
ఆనుకూల్యము గల అంగన కలిగిన
సతికి పతికి పరమ సౌఖ్యమమరు
ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం:
ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన.
ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి.
భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది.
అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ "But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం.
ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు.
ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి.
ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం.
ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
ఆపదల వేళ బంధులరసిజూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ | ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము:
ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.ఎప్పుడు కార్యసాధకుల వలనే ఉండాలి. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి:
ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం:
శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు "తారకము" అని అందురు. మరియొక నామము "నాదము". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు "బిందువు" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము "కలలు" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు శక్తి అను అంశములుగ చూడవలయును. ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము. | 5 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
ఆర్యులైనవార లనుభవరూఢిని
దెలియజెప్పుచుంద్రు తేటపడగ
గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా?
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
నిజమైన జీవితానుభవం కలిగినవారు తమ అనుభవములను స్పష్టంగా చెప్పగలరు. కాని ఇతరులావిధంగా చెప్పలేరు. తమకు లేని అనుభవాలని కల్పించి చెప్పేవారు బుద్దిహీనులు. అసలు గురుతే తెలియని వాడు గురిని చూపుట సాధ్యమా? | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త
ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా
మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ
సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము:
శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి
వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు
కుక్క తోకఁబట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము:
తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
ఆలినమ్మి భువిని నాచారహీనుడై
ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు
ఆడి తప్పకుండ కాడుకాచినవాడు
వాడె పరమ గురుడు వసుధ వేమ. | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం:
ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి:
ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి
వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు
కుక్కతోకబట్టి గోదావరీదును
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము:
భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే. | 6 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే
వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం
గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు. | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:
ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! | ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో! | 1 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:
ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన
పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు
తవిలిలోన గలదు నవనీత మిట్లురా
విశ్వదాభిరామ వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము:
ఆవు పాలను పిదికి, వేడి చేసి, తోడు వేస్తె ఎలాగైతె వెన్న, పెరుగు, మజ్జిగ దొరుకుతాయొ అలానే ఆత్మను శొధిస్తే కొత్త సంగతులు అవగతమవుతాయి. | 4 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి:
ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి
నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన
విశ్వదాభిరామ! వినుర వేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము:
ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు. | 3 | ['tel'] |
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి:
ఆశ పాపజాతి యన్నింటికంటెను
ఆశచేత యతులు మోసపోరె
చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన
విశ్వదాభిరామ! వినురవేమ! | ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం:
ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు. | 2 | ['tel'] |
Summary
aya-telugu-poems
is an open source dataset of instruct-style records generated by webscraping a Telugu poems website. This was created as part of Aya Open Science Initiative from Cohere For AI.
This dataset can be used for any purpose, whether academic or commercial, under the terms of the Apache 2.0 License.
Supported Tasks:
- Training LLMs
- Synthetic Data Generation
- Data Augmentation
Languages: Telugu Version: 1.0
Dataset Overview
aya-telugu-poems
is a corpus of more than 5k records generated by webscraping of the Telugu poetry website. This Dataset can be used for the following three tasks:
- Given the poem and type of poetry, explain the meaning of the poem.
- Given the meaning and the type of poetry, generate the corresponding poem.
- Given the partial poem and type of poetry, generate the rest of the poem.
Intended Uses
While immediately valuable for instruction fine tuning large language models, as a corpus of instruction prompts, this dataset also presents a valuable opportunity for synthetic data generation in the methods. For example, prompt-completions could be submitted as few-shot examples to a large open language model to generate additional poems and their explanations.
Dataset
Load with Datasets
To load this dataset with Datasets, you'll just need to install Datasets as pip install datasets --upgrade
and then use the following code:
from datasets import load_dataset
ds = load_dataset('SuryaKrishna02/aya-telugu-poems')
Purpose of Collection
Telugu is a low-resource language where there are no poetry instruct-style dataset to the best of my knowledge. This was created as a part of Aya Open Science Initiative from Cohere For AI to make sure Telugu is well represented in the space of AI/ML. Unlike other datasets that are limited to non-commercial use, this dataset can be used, modified, and extended for any purpose, including academic or commercial applications.
Sources
- Telugu Padyaluu Website: Performed webscraping from Telugu Padyaluu Website which consists of following 11 different types of poetry.
- వేమన శతకం
- శ్రీ కాళహస్తీశ్వర శతకం
- భాస్కర శతకం
- దాశరథి శతకం
- కృష్ణ శతకం
- సుమతీ శతకం
- భర్తృహరి సుభాషితాలు
- కుమార శతకం
- నరసింహ శతకం
- కుమారీ శతకం
- పోతన పద్యాలు
- Next, performed some pre-processing of the data like removing unwanted characters and similar poems by calculating the similarity score from the scraped data.
- Finally, converted the scraped data into Instruct-style prompts and completions.
Data Fields
inputs
: Prompt or input to the language model.targets
: Completion or output of the language model.template_id
: Id of the template used ininputs
andtargets
.template_lang
: ISO code of the language used in theinputs
andtargets
where tel refers to Telugu.
Templates
For the creation of instruct-style prompts and completions from the scraped data, the following three templates categories with total of 18 different templates were used:
Given the poem and type of poetry, explain the meaning of the poem.
template_id inputs targets 1 క్రింద ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి:\n{{Poem}}
ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి తాత్పర్యం:\n{{Meaning}}
2 క్రింద ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి భావం ఇవ్వండి:\n{{Poem}}
ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి భావం:\n{{Meaning}}
3 క్రింద ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి భావము ఇవ్వండి:\n{{Poem}}
ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి భావము:\n{{Meaning}}
4 క్రింద ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి:\n{{Poem}}
ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి తాత్పర్యము:\n{{Meaning}}
5 క్రింద ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి అర్ధం ఇవ్వండి:\n{{Poem}}
ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి అర్ధం:\n{{Meaning}}
6 క్రింద ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి అర్ధము ఇవ్వండి:\n{{Poem}}
ఇచ్చిన {{poetry_type}}లోని పద్యానికి అర్ధము:\n{{Meaning}}
Given the meaning and the type of poetry, generate the corresponding poem.
template_id inputs targets 7 క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా {{poetry_type}} శైలిలో పద్యం రాయండి:\n{{Meaning}}
ఇచ్చిన తాత్పర్యం వచ్చే {{poetry_type}} శైలి పద్యం:\n{{Poem}}
8 క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా {{poetry_type}} శైలిలో పద్యం రాయండి:\n{{Meaning}}
ఇచ్చిన భావం వచ్చే {{poetry_type}} శైలి పద్యం:\n{{Poem}}
9 క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా {{poetry_type}} శైలిలో పద్యం రాయండి:\n{{Meaning}}
ఇచ్చిన భావము వచ్చే {{poetry_type}} శైలి పద్యం:\n{{Poem}}
10 క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా {{poetry_type}} శైలిలో పద్యం రాయండి:\n{{Meaning}}
ఇచ్చిన తాత్పర్యము వచ్చే {{poetry_type}} శైలి పద్యం:\n{{Poem}}
11 క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా {{poetry_type}} శైలిలో పద్యం రాయండి:\n{{Meaning}}
ఇచ్చిన అర్ధం వచ్చే {{poetry_type}} శైలి పద్యం:\n{{Poem}}
12 క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా {{poetry_type}} శైలిలో పద్యం రాయండి:\n{{Meaning}}
ఇచ్చిన అర్ధము వచ్చే {{poetry_type}} శైలి పద్యం:\n{{Poem}}
Given the partial poem and type of poetry, generate the rest of the poem.
template_id inputs targets 13 క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని {{poetry_type}} శైలిలో పూర్తిచేసి రాయండి:\nతాత్పర్యం:\n{{Meaning}}\n\nఅసంపూర్ణమైయిన పద్యం:\n{{Partial Poem}}
పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది:\nపద్యం:\n{{Poem}}
14 క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని {{poetry_type}} శైలిలో పూర్తిచేసి రాయండి:\nభావం:\n{{Meaning}}\n\nఅసంపూర్ణమైయిన పద్యం:\n{{Partial Poem}}
పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది:\nపద్యం:\n{{Poem}}
15 క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని {{poetry_type}} శైలిలో పూర్తిచేసి రాయండి:\nభావము:\n{{Meaning}}\n\nఅసంపూర్ణమైయిన పద్యం:\n{{Partial Poem}}
పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది:\nపద్యం:\n{{Poem}}
16 క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని {{poetry_type}} శైలిలో పూర్తిచేసి రాయండి:\nతాత్పర్యము:\n{{Meaning}}\n\nఅసంపూర్ణమైయిన పద్యం:\n{{Partial Poem}}
పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది:\nపద్యం:\n{{Poem}}
17 క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని {{poetry_type}} శైలిలో పూర్తిచేసి రాయండి:\nఅర్ధం:\n{{Meaning}}\n\nఅసంపూర్ణమైయిన పద్యం:\n{{Partial Poem}}
పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది:\nపద్యం:\n{{Poem}}
18 క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని {{poetry_type}} శైలిలో పూర్తిచేసి రాయండి:\nఅర్ధము:\n{{Meaning}}\n\nఅసంపూర్ణమైయిన పద్యం:\n{{Partial Poem}}
పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది:\nపద్యం:\n{{Poem}}
Personal or Sensitive Data
This dataset contains public information. To our knowledge, there are no private person’s personal identifiers or sensitive information.
Language
Telugu
Known Limitations
- The Dataset is scraped from the poetry website and the contents of this dataset may reflect the bias, factual errors and sensitive matters.
- Although there is utmost care taken to keep the dataset as monolingual, there might be some records that may contain English Language along with Telugu.
Contributors
- Downloads last month
- 49