story_id
int64 2.44M
2.54M
| headline
stringlengths 1
363
| article
stringlengths 35
14.6k
|
---|---|---|
2,481,002 | బుమ్రాకు విశ్రాంతి! | కుల్దీప్–అక్షర్ మధ్య పోటీ27 నుంచి బంగ్లాతో రెండో టెస్టున్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023–25 అంచెలో భాగంగా టీమిండియా ఆడే పది టెస్టుల్లో మొదటిదాన్ని ఘన విజయంతో ముగించింది. బంగ్లాదేశ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 280 పరుగుల తేడాతో నెగ్గి డబ్ల్యూటీసీ టేబుల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. ఇక శుక్రవారం నుంచి కాన్పూర్లో చివరిదైన రెండో టెస్టు జరుగుతుంది. వాస్తవానికి ఈ పది టెస్టుల్లో రోహిత్ సేన సగం మ్యాచ్లను గెలిచినా ఫైనల్లో చోటు ఖాయమే. బంగ్లాతో రెండో టెస్టు తర్వాత స్వదేశంలో కివీస్తో మూడు టెస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా టూర్కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఆత్మవిశ్వాసంతో సిరీస్ను ఆరంభించేందుకు, సొంత గడ్డపై మిగిలిన మూడు టెస్టులను గెలిచి ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటోంది.కాన్పూర్ పిచ్ను అనుసరించి ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే జట్టుకు ఓ పేసర్ దూరం కావాల్సిందే. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇస్తే ఇబ్బంది లేదు. కానీ తను ఆడితే మరో పేసర్ ఆకాశ్ దీప్పై వేటు పడే చాన్సుంది. ఇక మూడో స్పిన్నర్ కోసం తుది జట్టులో కుల్దీప్, అక్షర్ల మధ్య పోటీ ఏర్పడనుంది. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో కుల్దీప్ 19 వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ అతడి వైపే మొగ్గు చూపవచ్చు. మరోవైపు జట్టులో ఇప్పటికే అశ్విన్, జడేజా రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారు కాబట్టి అక్షర్ బ్యాటింగ్ సామర్థ్యం పెద్దగా అవసరపడదు.ఎర్ర మట్టితో తయారుచేసిన చెన్నై పిచ్పై బంతి బాగా బౌన్స్ కావడంతో పేసర్లు ఎక్కువగా లాభపడ్డారు. నాలుగో రోజు మాత్రమే స్పిన్కు అనుకూలించింది. అయితే కాన్పూర్లో మాత్రం నల్ల మట్టి పిచ్ సిద్ధంగా ఉండనుంది. ఇక్కడ బంతి తక్కువగా బౌన్స్ అవడంతో పాటు స్పిన్కు అనుకూలిస్తూనే ఫ్లాట్గా ఉండనుంది. దీంతో బ్యాటర్లు, స్పిన్నర్లకు ఇద్దరికీ లాభమే. అలాగే దీనికి తగ్గట్టుగా ఇరు జట్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. |
2,481,003 | ఎస్ఎంఈ ఐపీఓల్లో మాయ | మర్చంట్ బ్యాంకర్లే సూత్రదారులు... నిగ్గు తేల్చిన సెబీ దర్యాప్తు!న్యూఢిల్లీ: ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓ) భారీగా సబ్స్క్రిప్షన్ కావడం వెనక పెద్ద దందానే నడుస్తోంది. కొన్ని సంస్థలు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్ల (హెచ్ఎన్ఐ) సాయంతో మర్చంట్ బ్యాంకర్లే ఈ దందా నడిపిస్తున్నట్టు సెబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ సంస్థలు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో ఐపీఓ షేర్లకు దరఖాస్తు చేయడం, తీరా షేర్ల కేటాయింపు సమయానికి తమ బిడ్స్ వెనక్కి తీసుకుంటున్నట్టు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని సెబీ అధికార వర్గాలు చెప్పాయి. ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ చూసి ఇష్యూ బాగుందనే భావనతో రిటైల్ మదుపరులూ భారీగా దరఖాస్తు చేసి మోసపోతున్నట్టు సెబీ దర్యాప్తులో తేలింది. ఈ దందాలో పాత్ర ఉన్న ఆరు మర్చంట్ బ్యాంకర్లని సెబీ ఇప్పటికే గుర్తించింది. 15 శాతం ఫీజు: సెబీ నిబంధనల ప్రకారం ఏ మర్చంట్ బ్యాంకింగ్ సంస్థా, కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో ఒకటి నుంచి మూడు శాతానికి మించి ఫీజుగా వసూలు చేయకూడదు. అయితే ఈ ఆరు మర్చంట్ బ్యాంకులు, ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ దందా నడిపినందుకు తమ క్లయింట్ల నుంచి ఐపీఓ నిధుల్లో 15 శాతం వరకు ఫీజుగా వసూలు చేస్తున్నట్టు తేలింది. దీంతో త్వరలోనే ఈ మర్చంట్ బ్యాంకర్లపై సెబీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎస్ఎంఈల ఐపీఓల్లో ఏదో మాయ జరుగుతున్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెబీ ఈ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చినట్టు భావిస్తున్నారు. |
2,481,004 | సెన్సెక్స్ @ 85,000 | ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్లో సరికొత్త గరిష్ఠాలకు ఎగబాకాయి. సెన్సెక్స్ తొలిసారిగా 85,000, నిఫ్టీ 26,000 మైలురాయిని తాకాయి. కానీ, ఇన్వెస్టర్లు ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 234.62 పాయింట్లు పెరిగి 85,163.23 వద్ద ఆల్టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి సూచీ 14.57 పాయింట్ల నష్టంతో 84,914.04 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఒక దశలో 72.5 పాయింట్లు ఎగబాకి 26,011.55 వద్ద సరికొత్త ఆల్టైం గరిష్ఠాన్ని నమోదు చేసినప్పటికీ, చివర్లో 1.35 పాయింట్ల లాభంతో 25,940.40 వద్ద క్లోజైంది. మార్కెట్ భవిష్యత్ గమనంపై స్పష్టత లోపించడంతో ఇన్వెస్టర్లు రికార్డు గరిష్ఠాల వద్ద లాభాలను స్వీకరిస్తున్నారని ఈక్విటీ నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో సగం లాభపడ్డాయి. టాటా స్టీల్ షేరు 4.29 శాతం వృద్ధితో సూచీ టాప్ గెయినర్గా నిలిచింది. పవర్గ్రిడ్ 2.65 శాతం రాణించగా.. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ ఒక శాతానికి పైగా పెరిగాయి. హెచ్యూఎల్ షేరు మాత్రం అత్యధికంగా 2.56 శాతం క్షీణించింది. మెటల్ షేర్లు జిగేల్ చైనా తన ఆర్థిక వ్యవస్థకు, స్థిరాస్తి మార్కెట్కు ఊతమిచ్చేలా ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు అదనపు ఉద్దీపనలను ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లకు సానుకూలంగా పరిణమించింది. దేశీయంగా లోహ రంగ షేర్లకు గిరాకీ పెరిగింది. నేషనల్ అల్యూమినియం షేరు ఏకంగా 6.16 శాతం ఎగబాకగా.. టాటా స్టీల్ 4 శాతానికి పైగా పుంజుకుంది. హిండాల్కో, ఎన్ఎండీసీ, వేదాంత, సెయిల్ షేర్లు మూడు శాతానికి పైగా రాణించాయి. బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 2.78 శాతం పెరిగింది. |
2,481,006 | దీప్తికి రూ. కోటి అందజేసిన సీఎం | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో దీప్తికి ఆర్థిక సహాయంతోపాటు కోచ్ రమేష్కు రూ. 10 లక్షల చెక్కును సీఎం అందించారు. దీప్తికి గ్రూప్–2 ఉద్యోగం, ఆర్థిక సహాయం, వరంగల్లో 500 గజాల స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఈ నెల 7న అధికారుల్ని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగా రెండు వారాల్లో ఆర్థిక సహాయం అందించినందుకు సీఎంకు దీప్తి కృతజ్ఞతలు తెలిపింది. |
2,481,007 | విస్తరణ బాటలో రామ్రాజ్ కాటన్ | వచ్చే రెండేళ్లలో కొత్తగా 200 స్టోర్లుహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారతీయ సాంప్రదాయ, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తున్న రామ్రాజ్ కాటన్ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కంపెనీ దక్షిణ భారత్లో 300కు పైగా షోరూమ్స్ను నిర్వహిస్తోంది. కాగా విస్తరణలో భాగంగా వచ్చే రెండేళ్ల కాలంలో షోరూమ్స్ను 500కు చేర్చాలని చూస్తున్నట్లు రామ్రాజ్ కాటన్ చైర్మన్ కేఆర్ నాగరాజన్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం రామ్రాజ్ 82 షోరూమ్స్ను నిర్వహిస్తుండగా వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 28 స్టోర్స్ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రామ్రాజ్ కాటన్ నాలుగు వేలకు పైగా వెరైటీలతో ప్రపంచంలోనే అతిపెద్ద ధోవతి ఉత్పత్తిదారుగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా షర్టింగ్, నిట్వేర్ విభాగంతో పాటు చీరల విభాగంలోకి కూడా కంపెనీ ప్రవేశించిందన్నారు. ప్రస్తుతం రామ్రాజ్ కాటన్ తమిళనాడులో 10, బెంగళూరులో ఒక ప్లాంట్ను నిర్వహిస్తోందని నాగరాజన్ తెలిపారు. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామని, అయితే ఇందులో రూ.300 కోట్లు ఇప్పటికే ఖర్చు చేయగా, వచ్చే మూడేళ్ల కాలంలో మిగిలిన రూ.700 కోట్ల మొత్తాలను పెట్టుబడులుగా పెట్టనున్నట్లు నాగరాజన్ తెలిపారు. |
2,480,988 | ఇరానీ కప్నకు జురెల్, సర్ఫరాజ్ | న్యూఢిల్లీ: వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్తోపాటు పేసర్ యశ్ దయాళ్ను భారత టెస్ట్ టీమ్ నుంచి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవాళీ టోర్నీ ఇరానీ కప్ కోసం రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో మంగళవారం ప్రకటించిన రెస్టాఫ్ ఇండియా జట్టులో జురెల్, యశ్కు చోటు కల్పించగా.. ముంబై టీమ్కు సర్ఫరాజ్ను ఎంపిక చేశారు. అయితే, ఈ నెల 27 నుంచి కాన్పూర్లో బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్ట్ తుది జట్టులో చోటుదక్కకపోతేనే ఈ ముగ్గురినీ విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది. వచ్చే నెల ఒకటి నుంచి ఐదు వరకు లఖ్నవూలో జరిగే ఇరానీ కప్లో రంజీ చాంప్ ముంబైతో రెస్టాఫ్ జట్టు తలపడనుంది. కొంత కాలంగా రెడ్ బాల్ క్రికెట్కు దూరమైన ఇషాన్ కిషన్తోపాటు ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలో అదరగొట్టిన రికీ భుయ్, శాశ్వత్ రావత్, ప్రసిద్ద్ కృష్ణ, సాయి సుదర్శన్లకు కూడా రెస్టాఫ్ టీమ్లో చోటు దక్కింది. కాగా, రహానె సారథ్యంలోని ముంబై జట్టులో శ్రేయాస్ అయ్యర్, పృథ్వీషా ఆడనున్నారు. టెస్టు జట్టు నుంచి విడుదల? |
2,480,989 | ఒక్క ఫుట్బాల్ స్టేడియంతో ఏటా రూ. 81 వేల కోట్లా! | లండన్: ఒక్క ఫుట్బాల్ స్టేడియాన్ని నిర్మిస్తే.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి రూ. 81,733 కోట్ల తోడ్పా టు లభిస్తుందంటూ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ చేసిన అధ్యయనం ఎంతో ఆసక్తికరంగా మారింది. తాజాగా మాం చెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్నకు చెందిన ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం, చుట్టుపక్కల ఆధునికీకరణ వ్యయ భారాలకు సంబంధించిన నివేదికను క్లబ్ బయటపెట్టింది. దాదాపు రూ. 22,392 కోట్లతో లక్ష సీట్ల సామర్థ్యం కలిగిన కొత్త స్టేడియాన్ని నిర్మించాలా? లేదా 74 వేల సీట్ల కెపాసిటీ కలిగిన ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానాన్ని ఆధునీకరించాలా? అనేదానిపై మాంచెస్టర్ క్లబ్ సమాలోచన చేస్తోంది. అయితే, ఈ స్టేడియం కారణంగా 92 వేల కొత్త ఉద్యోగాలు, 17 వేల నూతన గృహాలు నిర్మితం కావడంతోపాటు ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య 20 లక్షల మేర పెరుగుతుందన్నది సర్వే సంస్థ అంచనా. ప్రస్తుత మాంచెస్టర్ స్టేడియం |
2,480,990 | అందరూ మహిళలే | దుబాయ్: టీ20 ఉమెన్ వరల్డ్కప్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన ప్యానెల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. మొత్తం 13 మంది మ్యాచ్ అఫీషియల్స్లో 10 మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రెఫరీలు ఉన్నారు. భారత్నుంచి తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ రెఫరీగా, వ్రింద రాఠీ అంపైర్గా వ్యవహరించనున్నారు. వచ్చే నెల 3 నుంచి యూఏఈ వేదికగా పొట్టికప్ జరగనుంది. కాగా, గత నాలుగు మెగా టోర్నీలకు పనిచేసిన క్లైరీ పొలోసక్కు ప్యానెల్లో అత్యధిక అనుభవం ఉంది. జింబాబ్వేకు చెందిన సారా డామ్బనేవనాకు తొలిసారి టీ20 వరల్డ్కప్లో అంపైరింగ్ చేసే చాన్స్ దక్కనుంది. వ్రింద రాఠీ |
2,480,991 | బంగారం భగ ధగ! | అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ న్యూయార్క్: ఫెడ్ రేట్ల తగ్గింపుతో పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంంలో బులియన్ ధరలు క్రమంగా కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర మరో 18 డాలర్ల మేర పెరిగి 2,646 డాలర్లకు చేరుకుంది. ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర సైతం అర శాతానికి పైగా పెరిగి 2,666 డాలర్లకు ఎగబాకింది. కాగా, దేశీయంగా బంగారం ధర ఇప్పటికే రూ.77,000కు చేరువైంది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.76,950కి చేరుకుంది. కిలో వెండి రూ.90,000 ధర పలికింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర 28 శాతం వరకు పెరిగింది. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించడంతో పాటు ఇజ్రాయెల్– లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతుండటం బులియన్ డిమాండ్ను ఎగదోస్తున్నాయని వారన్నారు. |
2,480,998 | హైదరాబాద్లో ఇంటెల్ ఏఐ, గేమింగ్ జోన్ | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్లో తొలి ఏఐ, గేమింగ్ జోన్ను ప్రారంభించింది. విశాల్ పెరిఫెరల్స్ భాగస్వామ్యంతో ఈ జోన్ను ప్రారంభించినట్లు ఇంటెల్ డైరెక్టర్, హెడ్ సిస్టమ్స్ రాహుల్ మల్హోత్రా, సీనియర్ మేనేజర్ అరుణ్ రాఘవన్ తెలిపారు. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఈ జోన్ను డిజైన్ చేసినట్లు విశాల్ పెరిఫెరల్స్ డైరెక్టర్ విశాల్ హిసారియా పేర్కొన్నారు. ఇంటెల్కు చెందిన కటింగ్ ఎడ్డ్ టెక్నాలజీలను వినియోగించటంతో పాటు ఆసక్తి కలిగిన విద్యార్ధులకు ప్రొగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్లో తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు తోడ్పాటునందించనున్నట్లు విశాల్ తెలిపారు. ఈ ఇంటెల్ ఏఐ, గేమింగ్ జోన్ను విద్యార్ధులు పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లో రెండో గేమింగ్ జోన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. |
2,480,992 | పంత్.. ఓ అద్భుతం: అక్రమ్ | కరాచీ: ఘోర ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ కొనియాడాడు. ‘రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరికైనా కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఇక ఆటగాడికైతే మరింత కష్టంగా ఉంటుంది. కానీ పంత్ అలా కాదు. నిజంగా తను మిరాకిల్ కిడ్. అతడిని యువతరం ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్లోనూ ప్రభావం చూపి ఇప్పుడు టెస్టుల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఆసీస్తో టెస్టు సిరీస్లోనూ తను కీలకం కానున్నాడు’ అని అక్రమ్ ప్రశంసించాడు. |
2,480,993 | ‘బాక్సింగ్ డే’ టిక్కెట్లకు ఫుల్ గిరాకీ | మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో ఈ ఏడాది చివర్లో జరిగే బాక్సింగ్ డే టెస్టు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా డిసెంబరు 26న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఈ నాలుగో టెస్టు ఆరంభం కానుంది. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. 2018/19తో పోలిస్తే ఈసారి తొలి రోజు అమ్మకాలే మూడింతలు పెరిగాయట. అలాగే రెండు నుంచి నాలుగు రోజుల మధ్య గమనిస్తే ఐదున్నర రెట్లు ఎక్కువగా ఇరు జట్ల ఫ్యాన్స్ టిక్కెట్లను కొనుగోలు చేశారని సీఏ ఎగ్జిక్యూటివ్ జీఎం జోయెల్ మారిసన్ తెలిపాడు. |
2,480,994 | రెండో టెస్టుపై కాన్పూర్లో నిరసన | కాన్పూర్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆ దేశ క్రికెట్ జట్టుతో టెస్టు సిరీస్ను రద్దు చేయాలని పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా కాన్పూర్లో ఈనెల 27నుంచి జరిగే రెండో టెస్టును అడ్డుకునేందుకు సోమవారం అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ కార్యకర్తలు స్టేడియానికి వెళ్లే రోడ్డుపై హోమాన్ని నిర్వహించారు. అయితే అదే రోజు 20 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బంగ్లాతో అక్టోబరు 6న జరిగే టీ20 మ్యాచ్ను అడ్డుకునేందుకు గ్వాలియర్ బంద్ను నిర్వహించనున్నట్టు హిందూ మహాసభ ప్రకటించింది. |
2,480,995 | విజేత జీవన్ జోడీ | న్యూఢిల్లీ: భారత టెన్నిస్ జోడీ జీవన్ నెడుంజెరియన్, విజయ్సుందర్ ప్రశాంత్ చైనాలో జరిగిన హాంగ్జౌ ఓపెన్లో డబుల్స్ విజేతగా నిలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–విజయ్ ద్వయం 4–6, 7–6(5), 10–7తో జర్మనీ జంట కాన్స్టాంటిన్–హెండ్రిక్ను ఓడించి ఏటీపీ టైటిల్ను అందుకుంది. కాగా, చైనాలోనే జరిగిన చెంగ్డూ ఓపెన్లో మరో భారత ఆటగాడు యుకీ భాంబ్రీ–అల్బానో (ఫ్రాన్స్) జోడీ డబుల్స్లో రన్నరప్గా నిలిచింది. జీవన్ |
2,480,987 | ఉత్పత్తి, అమ్మకాలూ పెంచుకున్నాం: ఎన్ఎండీసీ | న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరాని (2023–24)కి సంబంధించి తమ కంపెనీ మంచి పనితీరు కనబరిచినట్టు ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ చెప్పారు. కంపెనీ 66వ ఏజీఎంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఎన్ఎండీసీ 4.5 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసి, 4.44 కోట్ల టన్నుల ఖనిజాన్ని విక్రయించినట్టు తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇనుప ఖనిజం ఉత్పత్తి 10 శాతం, అమ్మకాలు 16 శాతం పెంచుకున్నట్టు తెలిపారు. దీంతో రూ.21,294 కోట్ల ఆదాయంపై రూ.5,632 కోట్ల నికర లాభం ఆర్జించినట్టు ముఖర్జీ తెలిపారు. |
2,480,890 | మూసీ నిర్వాసితులకు | మూసీ రివర్ బెడ్లోని 1600 ఇళ్ల తొలగింపు షురూఆ తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలు కూడా..నిర్వాసిత కుటుంబాలు 16 వేలు ఉంటాయని అంచనాఅర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపుబుధవారం నుంచి ఇంటింటికీఅధికారుల బృందంఔటర్ లోపల చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ నిర్ధారణశంషాబాద్ నుంచి ఫ్యూచ ర్ సిటీకి మెట్రోపై రూట్ మ్యాప్ దసరా వరకు మెట్రో విస్తరణపై డీపీఆర్ రూపకల్పనమూసీ రివర్ ఫ్రంట్, మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరీవాహక ప్రాంతంలో పదివేల కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందని.. సుమారు 16 వేల కుటుంబాలుండొచ్చని అంచనా వేస్తున్నారు. వీళ్లందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, అధికారుల బృందం బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతలో రివర్ బెడ్లోని 1600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెప్పారు. తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలను తొలగిస్తామన్నారు. కాగా మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు, నాలాల వద్ద ఉంటున్న పేద కుటుంబాల వివరాలను కూడా సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క పేద కుటుంబం కూడా మిగతా 11వ పేజీలో... |
2,480,869 | రుణమాఫీ! | రూ.4250 కోట్లు అవసరమని అంచనా.. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్నెలాఖరుకల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దసరాలోపు నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్లో తప్పులు దొర్లడంతో పెండింగ్లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి నాలుగో విడతలో రుణమాఫీ చేయనున్నారు. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా.. ఈ నెలాఖరువరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. దసరా పండుగలోపు 4.25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మంది రైతులకు రూ.17,934 కోట్ల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డులు లేని రైతులకు, కుటుంబ నిర్ధారణ కానివారికి, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకాల్లో తప్పులు దొర్లిన రైతులకు.. రుణమాఫీ చేయకుండా పెండింగ్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4.28 లక్షల మంది ఉండగా, ఆధార్, ఇతర సాంకేతిక సమస్యలున్న రైతులు 1.26 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపి 5.54 లక్షల మంది రైతుల ఖాతాలు పెండింగ్లో పెట్టారు. ‘పంట రుణ మాఫీ (సీఎల్డబ్ల్యు)యాప్’ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు (ఏవోలకు) బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 4 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి, సెల్ఫీలు దిగి, రైతు నుంచి డిక్లరేషన్ తీసుకొని, యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లో 90 శాతం పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో 70 శాతం నుంచి 80 శాతం పూర్తయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు.. 4.28 లక్షల మంది రైతుల్లో 3.10 లక్షల మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తయింది. ఆధార్ మిస్ మ్యాచింగ్ అయిన 1.26 లక్షల మంది రైతుల్లో ఇప్పటివరకు లక్ష మంది రైతుల మిగతా 12వ పేజీలో... |
2,480,870 | మిల్లర్ ఆస్తుల జప్తు | కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగివ్వకపోవడమే కారణంరూ. 5.67 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. జనగామ జిల్లాలో ఘటనక్రిమినల్ కేసు, రెవెన్యూ రికవరీ యాక్ట్కు కలెక్టర్ ఆదేశంమహబూబాబాద్ జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్ఫోర్స్ దాడులురూ.9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపుదేవరుప్పుల, గూడూరు, సెప్టెంబరు 24: కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న ధాన్యానికి తగినట్లు బియ్యం తిరిగి ఇవ్వని ఓ మిల్లర్పై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే కాదు.. ఆయన, ఆయన కుటుంబ ఆస్తులనూ జప్తు చేశారు. వాటిపై ఎటువంటి లావాదేవీలను అనుమతించవద్దని జిల్లా సబ్ రిజిస్ట్రార్లకు పౌర సరఫరాల శాఖ జిల్లా మిగతా 9వ పేజీలో... |
2,480,871 | రూ.159 కోట్లు | సర్కారుకు చెప్పకుండానే మహదేవ్పూర్ ఈఈ–1 తిరుపతిరావు ఇచ్చేశారుసదరు కంపెనీ నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి సమాచారం లేదువరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయాంసెకనుకు 4.25 మీటర్లు వస్తుందనుకుంటే 12–14 మీటర్లుజస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇంజనీర్ల వెల్లడినేడు ఇరిగేషన్ కార్పొరేషన్ అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వానికి చెప్పకుండానే రూ.159 కోట్ల బ్యాంకు గ్యారెంటీల సొమ్మును నిర్మాణ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చేశారు. ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారా!? లేదా!? అన్న సమాచారమూ ఈఎన్సీ కార్యాలయానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జరుపుతున్న విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా మంగళవారం ఐదుగురిని ప్రశ్నించింది. వీరిలో ప్రస్తుత, మాజీ అధికారులు ఉన్నారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీకి మిగతా 3వ పేజీలో... |
2,480,872 | నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు | పిడుగులు పడి నలుగురి మృతి పలు జిల్లాల్లో దంచికొట్టిన వానబంగాళాఖాతంలో అల్పపీడనంఈ నెల 27 వరకు ఎల్లో అలర్ట్ (ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 26, 27 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 వరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం మిగతా 3వ పేజీలో... |
2,480,873 | 15 లక్షల రేషన్కార్డుల రద్దు? | వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం!వచ్చేనెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణసిటిజన్ 360 ద్వారా అర్హుల గుర్తింపుఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేర్వీటి ఆధారంగానే కొత్త రేషన్కార్డుల జారీ |
2,480,874 | రేవంత్ కుటుంబం దోపిడీ | కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యలేదనే కక్షతో పేదల ఇళ్ల కూల్చివేతకేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారుఅరికెపూడికి కండువా కప్పిన సన్నాసెవరు? ఏపీలో బాబు.. వారంలోనే పింఛన్ల పెంపుఇక్కడ పది నెలలైనా రేవంత్కు చేతకాలే వైద్య ప్రవేశాలపై మొద్దునిద్ర వీడేదెప్పుడు?రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ధ్వజం |
2,480,875 | రేవంత్రెడ్డి.. కోర్టుకు రండి! | ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టుహైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులందరూ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ కేసు విచారణకు జెరూసలేం మత్తయ్య మినహా మిగిలిన వారెవరూ మిగతా 11వ పేజీలో... |
2,480,876 | ఎన్నారై కోటా.. ఓ మోసం | డబ్బులు దండుకునే ఎత్తుగడ: సుప్రీంకోర్టువైద్యకళాశాలల్లో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేతన్యూఢిల్లీ, సెప్టెంబరు 24: విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది పూర్తిగా మోసమని, దీనికి తక్షణమే ముగింపు పలకాల్సి ఉందని పేర్కొంది. ప్రతిభావంతులను కాదని డబ్బు మిగతా 2వ పేజీలో... |
2,480,877 | కర్ణాటక సీఎంకు షాక్ | ముడా స్కాంలో సిద్దరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హైకోర్టు ఓకేగవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేతసిద్దూ రాజీనామాకు బీజేపీ డిమాండ్నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంహైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్? |
2,480,879 | వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం | ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదలరేపటి నుంచి వెబ్ ఆప్షన్లు |
2,480,880 | రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా | చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదంరాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలంజాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా కృష్ణయ్య? |
2,480,881 | ఇరిగేషన్ శాఖలోకి 677 మంది ఏఈఈలు | 31 మంది ఐఐటీ, 83 మంది ఎన్ఐటీ పట్టభద్రులురేపు నియామక పత్రాలివ్వనున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్1800మంది లష్కర్ల నియామకంపైనా ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి |
2,480,878 | దసరాకు మంత్రివర్గ విస్తరణ? | ఏఐసీసీ నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖర్గేనలుగురి పేర్లు ఇప్పటికే ఖరారు మరో ఇద్దరి పేర్లపై కుదరని ఏకాభిప్రాయంసీఎం రేవంత్ వెళ్లి చర్చించాక తుది జాబితా |
2,480,882 | ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు | మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే |
2,480,883 | శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేసేస్తున్నారు! | ఇన్ఫ్లో అంతంతమాత్రమేపోటాపోటీగా తెలంగాణ, ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి3 వారాల్లో 52.61 టీఎంసీల తరుగుదల |
2,480,884 | సీఎంఆర్ చేయలేం | సర్కార్కు నల్లగొండ రైస్ మిల్లర్ల లేఖ |
2,480,866 | కశ్మీరంలో ఎన్నికల సమరం | పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది! ఈ దశలో మొత్తం 26 నియోజకవర్గాల నుంచి 239 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు! 25.78 లక్షల మంది ఓటర్లు బుధవారం వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల నిమిత్తం భారీ ఎత్తున మోహరించిన భద్రతాసిబ్బంది ఉనికితో.. ఒకరకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది! ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా చూస్తోంది. సాధారణంగా ఎన్నికలనగానే.. సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పనవంటివి ప్రధాన పార్టీల కీలక హామీలుగా ఉంటాయి! కానీ, కల్లోల కశ్మీరంలో ఎన్నికల హామీలు అందుకు భిన్నం. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరణ, రాష్ట్ర హోదా తిరిగి కల్పించేందుకు కృషి వంటివి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల ప్రధాన హామీలుగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, రాజకీయ ఖైదీల విడుదల, ఇండియా–పాకిస్థాన్ మధ్య చర్చలకు ప్రోత్సహించడం, జమ్ముకశ్మీర్లో భూయాజమాన్య హక్కులను స్థానికులకు పరిమితం చేయడం, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ రద్దు వంటి హామీలు కూడా ఆయా పార్టీల మ్యానిఫెస్టోల్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 గురించి ఏం మాట్లాడట్లేదుగానీ.. జమ్ముకశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ ఇస్తోంది. ఇక.. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లాను కంగుతినిపించిన ఇంజనీర్ రషీద్కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ ప్రధాన హామీ.. జైళ్లల్లో ఉన్న కశ్మీరీ రాజకీయ ఖైదీలను విడిపించడమే. వీరందరికీ భిన్నంగా.. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరుస్తున్న పదిమంది స్వతంత్ర అభ్యర్థుల ప్రధాన హామీలు మాత్రం వీటికి భిన్నంగా ఉండడం విశేషం. ఆ పది మందీ.. మహిళా సాధికారత, ఉద్యోగాలనే ప్రధాన అంశాలుగా చేసుకుని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. జమ్ము ప్రాంతంలో బీజేపీకి పట్టున్నా.. ఎక్కువ సీట్లుండే కశ్మీర్లో ఆ పరిస్థితి లేదు.పెరిగిన ఓటింగ్..ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో జమ్ముకశ్మీర్లోని 5 లోక్సభ స్థానాల్లో కలిపి 58.46 శాతం ఓట్లు నమోదైన సంగతి తెలిసిందే. ఇది గడిచిన 35 ఏళ్లలో అక్కడ నమోదైన అత్యధిక పోలింగ్! 2019తో పోలిస్తే 2024లో కశ్మీర్ లోయలో ఏకంగా 30% మేర ఓటింగ్ పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో సైతం మొదటి విడత పోలింగ్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఉగ్రవాదుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయపడే పరిస్థితి ఉండేదని.. సామాన్యప్రజలు బయటకు వచ్చి ఓటేయలేకపోయేవారని.. దీనివల్ల ఎన్నికల్లో పోటీ వాతావరణం కొరవడి ఎన్సీ, పీడీపీ వంటి పార్టీలదే పైచేయిగా ఉండేదని రాజకీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయితే, కొన్నాళ్లుగా జమ్ముకశ్మీర్లో పరిస్థితి మారిందని.. 2020లో జరిగిన డీడీసీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేశారని వారు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లోని ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వడమే ఇందుకు కారణం. ‘‘నా జీవితంలో మొదటిసారి 2020లో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఓటేశాను. లోయలోని అన్ని పార్టీలూ తొలిసారి బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని స్థానికుడు ఒకరు తెలపడం గమనార్హం. ఆ ఎన్నికల్లో ఆ కూటమికి 110 సీట్లొచ్చాయని.. కానీ, ఇప్పుడవే పార్టీలు విడిపోయి పోటీ చేస్తున్నాయని.. ఈ అనైక్యత అంతిమంగా బీజేపీకే ఉపయోగపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మినహా ఎవరు అధికారంలోకి వచ్చినా పాలన సజావుగా సాగదని.. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ సర్కారును ఇబ్బంది పెట్టినట్టుగానే, జమ్ముకశ్మీర్లో కూడా అక్టోబరు 8న ఫలితాల తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని మోదీ సర్కారు ఇబ్బంది పెడుతుందన్న ఆందోళన చాలా మందిలో ఉంది. – సెంట్రల్ డెస్క్ |
2,480,867 | కర్ణాటక సీఎంకు హైకోర్టు షాక్ | ● గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్ కొట్టివేత● సిద్దూ రాజీనామాకు బీజేపీ డిమాండ్● నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీబెంగళూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. గవర్నర్ ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సిద్దరామయ్య వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సిద్దరామయ్య భార్య పార్వతి అక్రమమార్గంలో ముడా నుంచి 14 ఇంటి స్థలాలు పొందారని, ఆమె నుంచి ముడా సేకరించిన భూమి కంటే వీటి విలువ ఎన్నో రెట్లు అధికమని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం, ప్రదీప్కుమార్, స్నేహమయి కృష్ణ గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్.. సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్దరామయ్య హైకోర్టులో వేసిన పిటిషన్పై జస్టిస్ ఎం.నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నెలరోజులపాటు విచారించి మంగళవారం తీర్పు ఇచ్చింది. సిద్దరామయ్య పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించడం సమంజసమైనదని తీర్పులో స్పష్టం చేసింది. సీఎం కుటుంబసభ్యులు లబ్ధి పొందిన విషయం కావడంతో విచారణ జరగాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు రావడంతో కర్ణాటక రాజకీయాలలో కలకలం ఏర్పడింది. బెంగళూరు నగర పర్యటనలో ఉన్న సిద్దరామయ్య హుటాహుటిన అధికారిక నివాసం కావేరికి చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు ఎంబీ పాటిల్, శివరాజ్ తంగడిగ, కృష్ణబైరేగౌడ, బైరతి సురేశ్ తదితరులు కూడా హుటాహుటి కావేరికి చేరుకున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కావేరికి చేరుకుంటున్నారు. ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్ కూడా బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. హైకోర్టు తీర్పు మేరకు సీఎం ప్రాసిక్యూషన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని సూర్జేవాలా భరోసా ఇచ్చారు. న్యాయపోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. తద్వారా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అధిష్ఠానం పరోక్షంగా సందేశమిచ్చింది. నేడు హైకోర్టు లేదా సుప్రీంలో పిటిషన్..సిద్దరామయ్య పిటిషన్ను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తిరస్కరించడంతో ఆయన హైకోర్టు ఉన్నత ధర్మాసనం లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఏకసభ్య ధర్మాసనం తీర్పు అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి, మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్తో ఫోన్లో చర్చించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సాధ్యమైనంత త్వరగా పిటిషన్ దాఖలు చేయాలని భావిస్త్తున్నట్టు సమాచారం. సిద్దరామయ్య తరఫున బుధవారం పిటిషన్ వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం అధికారిక నివాసం ‘కావేరి’ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాజీనామా కోరుతూ మైసూరులో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. తన అధికారిక నివాసం కావేరి వద్ద విలేకరులతో మాట్లాడుతున్న సిద్దరామయ్య |
2,480,854 | ఎన్నారై కోటా.. ఓ మోసం | (మొదటి పేజీ తరువాయి)ఇచ్చేవారికి దొడ్డి దారిన ప్రవేశాలు కల్పించడానికి ఇది అవకాశం ఇస్తోందని మౌఖికంగా వ్యాఖ్యానించింది. చట్టవ్యతిరేకమైన ఈ పద్ధతిని సమర్థించలేమని తెలిపింది. వైద్య కళాశాలల ప్రవేశాల్లో ఎన్నారై కోటాపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను కొట్టివేస్తూ పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఎన్ఆర్ఐ అభ్యర్థికి ఇచ్చిన నిర్వచనాన్ని విస్తరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 20న నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఎన్ఆర్ఐల దూరపు బంధువులు కూడా సీట్లు పొందడానికి అర్హులేనని తెలిపింది. తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, కజిన్స్ తదితరుల ‘సంరక్షణ’లో ఉన్నారన్న కారణం చూపి సీట్లు పొందే అవకాశం ఉంది. అయితే దుర్వినియోగానికి దారి తీస్తుందని పేర్కొంటూ హైకోర్టు దానిని కొట్టివేసింది. ఇది ఎన్నారైకోటా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు భారతదేశంలో తమ పిల్లలను చదివించడానికి ఈ కోటాను ప్రవేశ పెట్టారని గుర్తు చేసింది. నిజమైన ఎన్నారై విద్యార్థులే దీని ప్రయోజనం పొందాల్సి ఉందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, మరో ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం విచారణ జరిపింది. పంజాబ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నారై అభ్యర్థి విషయంలో హిమాచల్ ప్రదేశ్, యూపీ ఇతర రాష్ట్రాలు కూడా ఎప్పటి నుంచో ‘విస్తృత నిర్వచనా’న్నే ఉపయోగిస్తున్నాయని తెలిపారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ ‘‘ఈ వాదనను తిరస్కరిస్తున్నాం. ఈ మోసానికి మూత పెట్టాల్సిన అవసరం ఉంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సంపూర్ణంగా సరైనవే. ఈ ఎన్నారై కోటా వ్యవహారం మోసం తప్ప ఇంకేమీ కాదు. పంజాబ్ ప్రభుత్వ చర్యలను చూడండి. ఆగస్టు 9న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసింది. 19న దాని గడువు ముగిసింది. 20న నోటిఫికేషన్ ఇచ్చి ‘సంరక్షకుల’ నిర్వచనాన్ని విస్తరించింది. దాని దుష్పరిణామాలను పరిశీలించండి. మూడు రెట్లు అధికంగా వచ్చిన అభ్యర్థులకు సీట్లు రావు. దొడ్డిదారిలో మాత్రం కొందరు ప్రవేశిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నారైల బంధువులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటారా? ఇది సొమ్ము పిండుకునే చర్య కాకపోతే ఇదేమిటిది? విద్యా వ్యవస్థను ఏమి చేయాలనుకుంటున్నారు? ఏ కేసును పరిశీలిస్తున్నారో న్యాయమూర్తులకు తెలుసు. అందరికీ తెలిసిన విషయాన్నే హైకోర్టు పరిశీలించింది’’ అని అన్నారు. నిజమైన ఎన్నారైలకే సీట్లు ఇవ్వాలని, ఈ సందర్భంలోనూ మెరిట్ను విస్మరించకూదంటూ గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. జస్టిస్ పార్టీవాలా మాట్లాడుతూ ‘‘ఈ కోటా కింద దరఖాస్తు చేసిన వారంతా భారతీయులే. పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మల వంటి చుట్టరికాల పేర్లు చెప్పి దరఖాస్తు చేస్తున్నార’’ని అన్నారు. ‘విస్తృత నిర్వచనాన్ని’ ‘డబ్బు పిండే ఎత్తుగడ’గా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతకుముందు ఓ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిమన్యు భండారి వాదనలు వినిపిస్తూ 700 మార్కులకుగాను 637 మార్కులు వచ్చిన అభ్యర్థికి సీటు రాలేదని, కానీ 202 మార్కులు వచ్చిన వారికి ఎన్నారై కోటాలో ప్రవేశం లభించిందని చెప్పారు. పంజాబ్లో ప్రతి ఒక్కరికీ ఎన్నారై బంధువులు ఉంటారని, వారి పేరుతో సీట్లు పొందే ప్రమాదం ఉందని తెలిపారు. దీనికి ముగింపు పలకాల్సి ఉందని కోరారు. పంజాబ్లోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా కింద 185 సీట్లు ఉండడం గమనార్హం. |
2,480,855 | లెబనాన్పై గాజా తరహా దాడులు! | ● ఇజ్రాయెల్ దాడుల్లో 15 మంది దాకా హిజ్బుల్లా టాప్ కమాండర్ల మృతి.. 558కి పెరిగిన మొత్తం మరణాలుటెల్అవీవ్/బీరుట్, సెప్టెంబరు 24: మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..! వెరసి లెబనాన్లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. లెబనాన్ విషయంలోనూ ఇజ్రాయెల్ గాజా తరహా పద్ధతులనే అనుసరిస్తోంది. తొలుత హమాస్ ఉగ్రవాదులకు పౌరులు ఆశ్రయం ఇస్తున్నారని, పౌరుల ఇళ్ల కింద నుంచి హమాస్ సొరంగాలున్నాయని అప్పట్లో ఆరోపించిన ఇజ్రాయెల్.. ఇప్పుడు లెబనాన్లో పౌరుల ఇళ్లలో హిజ్బుల్లా క్షిపణులు, రాకెట్ లాంచర్లు ఉన్నట్లు వెల్లడించింది. స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మా యుద్ధం హిజ్బుల్లాపైనే. దయచేసి సాధారణ పౌరులంతా సముద్ర తీరానికి వెళ్లగలరు’’ అని సోమవారం కోరారు. ఆ తర్వాత కాసేపటికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అధికారులు పౌరుల ఇళ్లలో క్రూయిజ్ క్షిపణులు, వార్హెడ్ల నిల్వల వీడియోలను విడుదల చేశారు. లెబనాన్పై ఆదివారం నుంచి క్షిపణి, వైమానిక దాడులు ముమ్మరమయ్యాయి. ఈ దాడుల్లో మరణాల సంఖ్య 558కి చేరుకున్నట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దహియా ప్రాంతంలో హిజ్బుల్లా క్షిపణి విభాగం చీఫ్ ఇబ్రహీం కబిసీ టార్గెట్గా జరిపిన దాడుల్లో పది దాకా అపార్ట్మెంట్లు కుప్పకూలగా.. ఇబ్రహీంతోపాటు.. హిజ్బుల్లా అనుబంధ సంస్థ లెబనాన్ నెట్వర్క్ చీఫ్ అల్–మయాదీన్, మరో 13 మంది కమాండర్లు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజుల దాడుల్లో దాదాపు 1,700 చదరపు కిలోమీటర్ల మేర ప్రభావం కనిపించిందని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలోనూ తొలినాళ్లలో ఈ తరహాలోనే దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఆ తర్వాత భూతల దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే..! కాగా, బీరుట్ సహా.. దక్షిణ లెబనాన్కు చెందిన పలు పట్టణాల ప్రజలు రాత్రికిరాత్రే సముద్ర తీరప్రాంతాలు సిడోన్, బాల్బెక్కు చేరుకున్నారు. వాహనాల ఇంధనం, బేకరీల్లో ఆహార ఉత్పత్తులు నిండుకున్నాయి. ఒకట్రెండ్రోజుల్లో ఆకలికేకలు మొదలవుతాయని ఐక్య రాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేస్తోంది. |
2,480,856 | ట్రాములకు టాటా | సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన బెంగాల్ సర్కారుకోల్కతా, సెప్టెంబరు 24: కోల్కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా వాహనాలతో పోలిస్తే ట్రాములు నెమ్మదిగా నడవడంతో రోడ్లపై రద్దీ పెరుగుతోందని, ప్రజలు వేగవంతమైన రవాణా సదుపాయాలు కోరుకుంటున్న ఈ సమయంలో వాటిని ఇంకా కొనసాగించడం సరికాదని, అందుకే ఆ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించామని బెంగాల్ రవాణా మంత్రి స్నేహాశీస్ వెల్లడించారు. అయితే, మైదాన్–ఎస్ప్లనేడ్ మార్గంలో మాత్రం ట్రాము సేవలు కొనసాగుతాయమన్నారు. ప్రస్తుతం దేశంలో కేవలం ఒక్క కోల్కతాలోనే ట్రాములు నడుస్తున్నాయి. బ్రిటిష్ హయాంలో 1873లో ఇక్కడ మొదట గుర్రాలతో నడిచే ట్రాములు ప్రారంభమయ్యాయి. తర్వాత ఇంజన్లు వచ్చాయి. అయితే, ట్రాము సర్వీసులను నిలిపివేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడానికి ట్రాము ప్రేమికులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు, ట్రాముల నిర్వహణపై కలకత్తా హైకోర్టులో పిల్ పెండింగ్లో ఉంది. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని నడిపే అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు ఇటీవల రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. |
2,480,857 | హరియాణా యువత ఎందుకు ‘డంకీ’లవుతున్నారు? | ● బీజేపీకి రాహుల్గాంధీ ప్రశ్నన్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని రాహుల్గాంధీ ఆరోపించారు. ఫలితంగా హరియాణా వంటి రాష్ట్రాల్లో యువత విదేశాల బాటపట్టి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇటీవల ఆయన అమెరికా వెళ్లినప్పుడు హరియాణా నుంచి అమెరికా వలస వెళ్లినవారితో మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. హరియాణాలో ఉపాధి దొరకనందునే తాము అమెరికా వలస వచ్చి కష్టాలు పడుతున్నట్లు వారు రాహుల్గాంధీకి చెప్పారు. ‘‘హరియాణా యువత ఎందుకు డంకీలుగా మారుతున్నారు...? అని రాహుల్గాంధీ ‘ఎక్స్’లో పెట్టిన తన పోస్టులో ప్రశ్నించారు. అక్రమ వలసదారులపై షారుక్ఖాన్ నటించిన డంకీ సినిమాతో ఈ పదం జనం నానుడిలోకి వచ్చింది. ‘‘బీజేపీ తెచ్చిన నిరుద్యోగ సమస్యతో లక్షలాది మంది తమవారికి దూరంగా విదేశాల్లో కష్టాలు పడుతున్నారు’’ అని ఆరోపించారు. తాను తిరిగి స్వదేశానికి వచ్చాక హరియాణాలో వారి కుటుంబాలను కలిసినప్పుడు వారి కళ్లలో ఎంతో వేదన కనిపించిందన్నారు. పదేళ్లలో దేశ యువతకు బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలోని యువత విదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేస్తామని, ఇది తమ నిర్ణయమని స్పష్టం చేశారు. |
2,480,858 | చైనా, భారత్ మధ్య నలిగిపోం | ● శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే వ్యాఖ్య● ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణంకొలంబో, సెప్టెంబరు 24: చైనా, భారత్ మధ్య నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే అన్నారు. భౌగోళిక రాజకీయ వైరాల్లోకి శ్రీలంకను లాగకుండా తటస్థ విదేశాంగ విధానం అవలంబిస్తామని ఓ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి ప్రభుత్వం ఏ అధికార కేంద్రంతోనూ చేతులు కలపదన్నారు. చైనా, భారత్లు రెండూ శ్రీలంకకు విలువైన స్నేహితులేనని, ఇరు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాగా, శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. మంగళవారం ఆమెతో దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి (58).. శ్రీలంక చరిత్రలో మూడో మహిళా ప్రధాని. సిరిమావో బండారు నాయకే (1994–2000) తర్వాత ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణే. మరో ఇద్దరు ఎన్పీపీ నేతలు మంత్రులుగా నియమితులయ్యారు. దీంతో దిశనాయకేతో పాటు మొత్తం నలుగురితో క్యాబినెట్ కొలువుదీరింది. కాగా, అధ్యక్షుడు దిశనాయకే శ్రీలంక పార్లమెంట్ని మంగళవారం రద్దు చేశారు. నవంబరు 14న ఎన్నికలు జరుగుతాయని గెజిట్ జారీ చేశారు. |
2,480,859 | ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు! | ● అందుకే గోహత్యను నిషేధించటం లేదు ● హిందువుల పవిత్రతను దెబ్బ తీయడానికే తిరుపతి లడ్డూ కల్తీ: అవిముక్తేశ్వరానంద్ లక్నో, సెప్టెంబరు 24: నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గోహత్యను నిలిపివేయని ప్రధాని, రాష్ట్రపతి అసలు హిందువులే కాదన్నారు. ఇప్పటి వరకూ ఆ అత్యున్నత పదవులను అధిష్ఠించిన వారెవరూ హిందువులు కాదని, కాబట్టే, దేశంలో గోహత్య ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు. యూపీలో మహంత్ యోగి సీఎంగా ఉన్నప్పటికీ.. గొడ్డు మాంసం(బీఫ్) ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నాయన్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై శంకరాచార్య స్పందిస్తూ.. గొడ్డు కొవ్వు కలిగి ఉన్న ప్రసాదాన్ని కోట్లాదిమంది భక్తులకు పంచటం విచారకరమన్నారు. హిందువుల పవిత్రతను దెబ్బతీసే కుట్ర అని వ్యాఖ్యానించారు. దీనిపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. |
2,480,853 | వరుస రైలు ప్రమాదాల వేళ ‘రైల్ రక్షా దళ్’ | న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తొలిసారి ‘రైల్ రక్షా దళ్’ను ఏర్పాటు చేసింది. ప్రమాద సమయాల్లో సత్వరం ఘటనా స్థలికి చేరుకుని సహాయం అందించే సామర్థ్యం ఈ రైల్ రక్షా దళ్కు ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా వాయువ్య రైల్వే జోన్లో ప్రవేశ పెట్టామని, త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని చెప్పారు. కవచ్ పనితీరును పరిశీలించేందుకు మంగళవారం జైపూర్ వెళ్లిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రమాద సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను వాడుకుంటున్నామని ఇకపై రైల్ రక్షా దళ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అలాగే ఇటీవల రైళ్లను పట్టాలు తప్పించే కుట్రతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే ట్రాక్లపై హానికర వస్తువులు పెడుతున్నారని, రైలు పట్టాలను తొలగించడం.. రాళ్లు రువ్వడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ చర్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఈ ప్రమాదాలను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నామని, ఇందులో ఎన్ఐఏకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. |
2,480,863 | ఆరేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచార యత్నం | ● ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్యఅహ్మదాబాద్, సెప్టెంబరు 24: ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కారులోనే ప్రతి రోజూ బడికి వెళ్లేది. 55 ఏళ్ల వయసు ఉన్న ఆ ప్రిన్సిపాల్ గురువారం చిన్నారిని బడికి తీసుకువెళ్తూ కారులోనే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేశాడు. గుజరాత్లోని దహోద్ జిల్లా తురానీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను చంపిన నిందితుడు శవాన్ని కారులోనే ఉంచి డోర్ లాక్ చేశాడు. సాయంత్రం 5.30 గంటలకు శవాన్ని ప్రహరీ పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. ఆ పాప ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను ప్రశ్నించగా.. ఆమెను ఇంటి వద్ద దించి వేసి వేరే పనిమీద వెళ్లిపోయానని చెప్పాడు. మరుసటి రోజు కూడా చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్ను విచారించగా అసలు విషయం చెప్పాడు. |
2,480,850 | 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టుల నోటిఫికేషన్ | ● తుది గడువు 21.. నవంబరు 30న రాత పరీక్ష● కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్ ● నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ బోర్డు ● 15 రోజుల్లో 3 నోటిఫికేషన్లు.. 3967 పోస్టుల భర్తీ హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్యశాఖ నుంచి 15 రోజుల వ్యవధిలో మూడో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. మంగళవారం బోర్డు కార్యదర్శి గోపికాంత్రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11న 1284 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులతో ఒకటి, గతవారం 2050 స్టాఫ్నర్సుల పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 3నోటిఫికేషన్ల ద్వారా 3,967 పోస్టుల భర్తీకానున్నాయి. అభ్యర్థులు అక్టోబరు 5 నుంచి 21వ తేదీ (సాయంత్రం ఐదింటి దాకా) వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి కోరారు. పొరపాట్లు ఉంటే అక్టోబరు 23–24 తేదీల మధ్య ఎడిట్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. నవంబరు 30న రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)లో, ఇంగ్లిషులోనే ఉంటుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్ కల్పించారు. ఇందుకు సర్కారీ దవాఖానాల్లో పనిజేస్తున్నట్లు ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్ను జత చేయాల్సివుంటుంది. అలాగే అభ్యర్థులు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు రిజిష్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్దులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్లు ఇచ్చారు. ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్మ్యాన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు(ఆర్టీసీ, మునిసిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల వయోపరిమితిని సడలింపునిచ్చారు. పోస్టుల్లో 95 శాతం స్థానికులకేనని స్పష్టం చేసింది. 80 మార్కులకు రాత పరీక్ష, పాయింట్ల ఆధారంగాపోస్టులను వంద పాయింట్ల ప్రాతిపదికన భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజ్ కింద కలుపుతారు. అభ్యర్ధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్దతిలో పనిజేస్తే వెయిటెజ్ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం 6 మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లోనైతే ప్రతి 6నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. దరఖాస్తు సమయంలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ను అప్లోడ్చేయాలని బోర్డు పేర్కొంది. వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. ఆ పోస్టులివే..: మొత్తం 633 పోస్టులుండగా అందులో 446 ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో, మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు ఆస్పత్రుల్లో, మరో రెండు పోస్టులు హైదరాబాద్ ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిలో ఉన్నాయి. జోన్ వన్లో 79, జోన్ రెండులో 53, మూడులో 86, నాలుగులో 98, ఐదులో 73, ఆరులో 154, ఏడో జోన్లో 88 పోస్టులున్నాయని మెడికల్ బోర్డు తెలిపింది. కాగా హైదరాబాద్ జోన్ అయిన ఆరులో అత్యధికంగా 154 పోస్టులుండగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జోన్ అయిన రెండులో కేవలం 53 పోస్టులే ఉన్నాయి. పరీక్షా కేంద్రాలు: ఎల్టీ పోస్టులకు రాష్ట్రంలో 13 చోట్ల పరీక్ష కేంద్రాలుంటాయని మెడికల్ బోర్డ్ పేర్కొంది. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట పట్టణాలను పరీక్షా కేంద్రాల కింద ఎంపిక చేశారు. విద్యార్హతలు: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ చేసిన అభ్యర్థులే అర్హులని మెడికల్ బోర్డు వెల్లడించింది. అభ్యర్థులంతా దరఖాస్తు చేసే సమాయానికి తప్పనిసరిగా తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిష్ట్రేషన్ చేసుకొని ఉండాలని పేర్కొంది. స్థానికులకు 95 రిజర్వేషన్ ఫార్మాసిస్టు పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లలోని అభ్యర్థులకే 95 శాతం పోస్టులను కేటాయిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. జోన్1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు... జోన్2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్5వీలో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. జోన్6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్7లో పాలమూరు, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. |
2,480,851 | రూ.159 కోట్లు | (మొదటి పేజీ తరువాయి)సంబంధించి నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీల సొమ్మును ఎవరు విడుదల చేశారు? దానికి ముందు అండర్ టేకింగ్ ఏమైనా తీసుకున్నారా!?’’ అని ఈఎన్సీ (జనరల్) కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ను కమిషన్ ప్రశ్నించింది. దీనికి ఆయన జవాబిస్తూ.. ‘‘2020 అక్టోబరు 13వ తేదీన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) సమావేశం జరిగింది. బ్యాంకు గ్యారంటీల విడుదలకు సంబంధించి అందులో చర్చించాం. రూ.159 కోట్ల బ్యాంకు గ్యారంటీని మహదేవ్పూర్ ఈఈ–1 సీహెచ్ తిరుపతిరావు విడుదల చేశారు. ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు’’ అని వివరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్ టే కింగ్ తీసుకున్నారా? అని కమిషన్ ప్రశ్నించగా.. దీనిపై ఈఎన్సీ (జనరల్) కార్యాలయానికి ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో ముడిపడిన సమాచారం కావాలని విజిలెన్స్ శాఖ లేఖ రాసిందా? అని ప్రశ్నించగా.. రాసిందని జవాబిచ్చారు. తాను చేరేనాటికే బ్యారేజీల నిర్మాణం పూర్తయిందని రామగుండం మాజీ ఎస్ఈ కరుణాకర్ చెప్పారు. ఎస్ఈగా 2022 ఫిబ్రవరి 25న చేరానని, అదే ఏడాది జూలైలో మూడు బ్యారేజీలకు భారీగా వరదలు వచ్చాయని, సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాయని, దీనిపై నిర్మాణ సంస్థలకు లేఖలు రాశానని వివరించారు. బ్యారేజీల ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ (ఓఅండ్ఎం) గడువు ఎప్పటి వరకూ ఉందని కమిషన్ ప్రశ్నించగా.. బ్యారేజీలు పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు డిఫెక్ట్ లయబులిటీ కాలం; ఆ తర్వాత మూడేళ్లపాటు ఓఅండ్ఎం ఉంటుందని వివరించారు. సుందిళ్ల బ్యారేజీ అంచనాలను ఎవరు సిద్ధం చేశారని చెన్నూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–2 బి.విష్ణుప్రసాద్ను కమిషన్ ప్రశ్నించగా.. నిర్మాణ అంచనా వ్యయాన్ని వ్యాప్కోస్ తయారు చేసిందని బదులిచ్చారు. సుందిళ్ల నిర్మాణం చేపట్టే ముందు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు ఏమైనా చేశారా...? అని ప్రశ్నించగా... ఎన్ఐటీ వరంగల్తో చేయించామని సమాధానమిచ్చారు. డిజైన్లు/డ్రాయింగ్లను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ తయారు చేశారని విష్ణుప్రసాద్ తెలిపారు. బ్యారేజీ డ్యామేజీకి కారణాలు ఏమిటని కమిషన్ ప్రశ్నించగా.. ‘‘వరద ప్రవాహ వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాం. ప్రతి సెకనుకు 4.25 మీటర్ల వరద వస్తుందని అంచనా వేయగా.. 12–14 మీటర్ల వరద వచ్చింది. అందుకే బ్యారేజీ దెబ్బతింది’’ అని వివరించారు. బ్యారేజీల్లో సీపేజీలను గుర్తించి 2019 డిసెంబరు 16న సెంట్రల్ వాటర్, పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు లేఖ రాయగా.. 2020 డిసెంబరు 22న ఆ సంస్థ ప్రతినిధులు సుందిళ్లకు వచ్చి అధ్యయనానికయ్యే అంచనాలను అందించారని తెలిపారు. |
2,480,852 | నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు | (మొదటి పేజీ తరువాయి)అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు దంచికొట్టాయి. వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే, రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో 8.95, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 8.53, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో 8.35, నాగర్కర్నూల్ జిల్లా వంగూరులో 7.8, రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్మెట్ మండలం తాటివనంలో 7.78, మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో 7.2 నిర్మల్ జిల్లా భైంసాలో 7.4 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు ముంచెత్తడంతో మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో మంఖాల్, హర్షగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కేశంపేట మండలం సంగెంలో పెంకుటిల్లు కూలిపోయింది. కొందుర్గు మండలంలోని ఎంకిర్యాల– తంగళ్లపల్లి మధ్య మట్టి రోడ్డు మళ్లీ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నవాబుపేట్–కొందర్గు మధ్య ఎంకిర్యాల వాగు తెగిపోవడంతో ఆగిర్యాల, ఎంకిర్యాల, కాస్లాబాద్, కాస్లాబాద్తండా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. పిడుగులు పడి నలుగురి మృతిభద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం బూరుగుగుంపులో పిడుగుపడి కట్టం నాగశ్రీ (20), సున్నం అనూష (18) మృతి చెందారు. గాయపడిన మిగతా ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన రైతు కృష్ణకుమార్ (30) పిడుగుపడి చనిపోయాడు. మరో ఘటనలో నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచలో లక్ష్మిబాయి(67) సోమవారం అర్ధరాత్రి పిడుగుపాటు శబ్దానికి భయపడి.. గుండెపోటుతో మృతి చెందింది. కట్టం నాగశ్రీ, అనూష, కృష్ణకుమార్, లక్ష్మీబాయి (ఫైల్) |
2,480,845 | విద్యుత్తు నియంత్రణ మండలి నియామకాల్లో పారదర్శకత ఏదీ? | ● వెబ్సైట్లో వివరాలేవీ? : అభ్యర్థుల ఆరోపణలుహైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీ ఈఆర్సీ) నియామకాల్లో పారదర్శకత లోపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈఆర్సీలో నియామకాల కోసం గత మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది. 11 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు అర్హులు చాలా మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలకు ఒకరోజు ముందే మెయిల్లు పంపించి, ఉద్దేశపూర్వకంగా ఇంటర్వ్యూలకు హాజరుకాకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెబ్సైట్లో పొందుపరచలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. |
2,480,846 | నేడు పాడి రైతులకు రూ. 60 కోట్లు విడుదల | హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పాడి రైతులకు బకాయిలున్న పాల బిల్లుల్లో రూ. 60 కోట్లు బుధవారం విడుదల చేయనున్నట్లు విజయ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. ఈ చెల్లింపులతో ఆగస్టు 15 నాటికి రైతులకున్న బకాయిలు పూర్తవుతాయని తెలిపారు. ఇక నెల రోజుల బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. |
2,481,400 | భోజనం బాగుందా.. | ●జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు సంక్షేమ హాస్టళ్ల బాటపడుతున్నారు. విద్యార్థులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా, ఎక్కడ చదువుకుంటున్నారు, మీకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి.. అనే విషయాలను ఆరా తీస్తున్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నారు. తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు, విద్యార్థులు లేవనెత్తిన సమస్యలతో ప్రత్యేక అధికారులు కలెక్టర్కు నివేదిక అందజేస్తున్నారు. హాస్టళ్లలో ప్రధాన సమస్యలను ఫొటోల రూపంలో సమర్పిస్తున్నారు. కాగా, విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా, నిర్వహణ భారాన్ని కిందిస్థాయి సిబ్బంది, వంట మనుషులకు అప్పగిస్తున్న వార్డెన్ల పనితీరును కూడా తెలియజేస్తున్నారు. దీంతో గతంలో హాస్టళ్లకు నెలకోసారి చుట్టపుచూపుగా వచ్చివెళ్లే కొంతమంది వార్డెన్లు రెండు వారాలుగా విద్యార్థుల సేవలో ఉంటున్నట్టు తెలుస్తోంది. జ్వరం, దగ్గు, తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులను దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆదేశాలతో వసతిగృహాల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తుండడం సంతోషకరమైన విషయం.హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన, నిరుపేద విద్యార్థులు ఉండే వసతి గృహాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతానికి కంటే అదనపు సౌకర్యాలను కల్పిం చి, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక అధికారులు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి సమస్యలను తెలుసుకుంటున్నారు. జిల్లాలో బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 30 వరకు ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లు 13, ఎస్టీ హాస్టళ్లు 4ఉన్నాయి. ఆయా వసతి గృహాలన్నిం టిలో కలిపి సుమారు 9,460 మంది విద్యార్థులు ఉంటున్నారు. అధికారులు వారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు.సీజనల్ వ్యాధులపై ఆరాజిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఆరుగురు అధికారులను హాస్టళ్ల తనిఖీ కోసమే ఇటీవల ప్రత్యేకంగా నియమించారు. ఇందులో జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఆశన్న, యాదయ్య, కోటాజీతోపాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సురేందర్, జీఎంఐడీసీ అఽధికారి పవన్కుమార్ ఉన్నారు. వారు నెలరోజులుగా తమకు కేటాయించిన వసతిగృహాలకు వెళ్తున్నారు. తనిఖీల సమయంలో ప్రధానంగా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. కూరలు రుచిగా ఉంటున్నాయా.. తాగునీటి సరఫరా, టాయిలెట్ల పరిస్థితి ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుతున్నారా, లేదా పరిశీలిస్తున్నారు. వార్డెన్లు రోజూ వస్తున్నారా, పరిశుభ్రతను పట్టించుకుంటున్నారా.. అనేది ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, విద్యార్థులతో పాటు వార్డెన్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. భోజనం వండేందుకు కావాల్సిన బియ్యం సకాలంలో వస్తున్నాయా, కూరగాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. పెండింగ్ బిల్లులున్నాయా.. అని అడుగుతున్నారు. |
2,481,401 | రెమ్మలు.. | వేలుభార్య ప్యాకింగ్, భర్త, కొడుకులు విక్రయం• గంజాయి స్మగ్లింగ్లో ఆరితేరిన కుటుంబం• ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా దందా• రెండేళ్లుగా ఇదే వ్యాపారంలో..• హెచ్న్యూకు చిక్కిన అనంతయ్య ఫ్యామిలీ• పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): పార్సిల్ చూస్తే.. టిఫిన్ సెంటర్లో దోశ మాదిరిలా ఉంటుంది. విప్పితే రెండు గంజాయి రెమ్మలు ఉంటాయి. పోలీసుల తనిఖీల నేపథ్యంలో విక్రయదారులు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. కిలోల లెక్కన కాకుండా, 20 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారు. ఈనెల 22న హెచ్న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) పోలీసులకు చిక్కిన అనంతయ్య ఫ్యామిలీని పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక పార్సిల్ ఖరీదు రెండు వేలుఆటోడ్రైవర్ అనంతయ్య, అతని భార్య నీరజ, కొడుకు రవికాంత్, ఆదిలాబాద్ నుంచి గంజాయి సరుకు సరఫరా చేస్తున్న గంగన్నలను హెచ్న్యూ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆదిలాబాద్కు చెందిన గంగన్న మహారాష్ట్ర, చత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద మేలురకం గంజాయిని సేకరించి దాన్ని నగరంలోని ప్రధాన స్మగ్లర్లకు సరఫరా చేస్తున్నాడు. ధూల్పేటలో ఉంటున్న రజినీ చెల్లెలు, మరిది గంజాయి విక్రయాల్లో ఆరితేరారు. గంగన్న వారికి గంజాయి సరఫరా చేసేవాడు. గంజాయి దందా లో సులభంగా డబ్బు సంపాదించొచ్చు అని చెల్లెలు ద్వారా గుర్తించిన రజినీ తాము కూడా అదే దందా చేయాలని నిర్ణయించుకుంది. అందుకు భర్త, మిగతా 8వ పేజీలో.. |
2,481,402 | నైపుణ్య శిక్షణ తప్పనిసరి | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. సత్వరమే స్పోకెన్ ఇంగ్లీష్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ లాంటి కనీస నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. అప్పుడే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు, విద్యారంగ సవాళ్లు, పరిష్కారాలు, అభివృద్థికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఉస్మానియా వర్సిటీ పరిపాలనా భవనంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు క్యాంపస్, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. వర్సిటీలో మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు, అడ్మిషన్లు, మెస్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, పరిశోధన, నిధుల కొరత, బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలు, నియామకాలపై విస్తృతంగా చర్చించారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పవర్పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవ పరిస్థితిని వివరించారు. పరిమితమైన వనరులతో అద్భుతాలు సృష్టించేలా ఆలోచనలు ఉండాలని, విద్యార్థులు, యువతలో నైపుణ్యాల ద్వారానే ఇది సాధ్యమని ఈ సందర్భంగా మురళి అన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మొత్తంలో మూడో వంతు కూడా ప్రైవేటు పాఠశాలల్లో సగటున ఒక్కో విద్యార్థిపై ఖర్చు జరగటం లేదని, అయినప్పటికీ ప్రభుత్వ విద్యావ్యవస్థ కుంటుపడిందని వెల్లడించారు. ఈ సందర్భంగా క్యాంపస్, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు సంబంధిత సంస్థలపై వివరణాత్మక నివేదికలను సమర్పించారు. తక్షణమే ఉద్యోగ నియామకాల అవసరంపై ఏకాభిప్రాయం వెల్లడించారు. కార్యక్రమంలో ఓయూ మిగతా 8వ పేజీలో.. |
2,481,403 | దక్షిణ కొరియాకు జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు | హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మూసీనదికి పూర్వ వైభవం తీసుకువస్తూ.. పర్యాటక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరింత ముందుకెళ్తోంది. నది అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధులనూ భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూసీని ఎలా అభివృద్ధి చేయాలి? తద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? తదితర అంశాలపై జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు వారిని అధ్యయన యాత్రకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని హన్నదిని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, ఉన్నతాధికారులతో కూడిన బృందం పరిశీలించనుంది. ఇందుకు సంబంధించి మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దసరా అనంతరం ఎమ్మెల్యేల బృందం దక్షిణ కొరియాకు వెళ్లనుంది. మూసీ నది ప్రవహించే రాజేంద్రనగర్, బహదూర్పురా, చార్మినార్, మలక్పేట, అంబర్పేట, ఉప్పల్, మేడ్చల్ తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలను దక్షిణ కొరియా పర్యటనకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఆగస్టులో సీఎం రేవంత్ దక్షిణ కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. |
2,481,389 | వర్షం పడితే బయటకు రావొద్దు | • పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి• వరద నీళ్లున్న ప్రాంతాలకు వెళ్లకండి: ఆమ్రపాలిహైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు పడినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరవాసులను కోరారు. పిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి రాకుండా కుటుంబసభ్యులు చూసుకోవాలన్నారు. రోడ్లపై వరదనీరు నిలిచి ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగే అవకాశమున్న దృష్ట్యా.. ఇళ్లలోనే ఉండడం మంచిదని పేర్కొన్నారు. మంగళవారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వెంటనే ఆమె స్పందించారు. జోనల్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడారు. మాన్సూన్ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేసేలా చూడాలని, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఉండాలని, మ్యాన్హోల్, క్యాచ్పిట్ మూతలు తెరవవద్దని సూచించారు. |
2,481,390 | టైమ్ అంటే టైమే.. | • సమయానికి దుకాణాలను మూసేయాల్సిందే• రూల్స్ అతిక్రమిస్తే వ్యాపారులపై చట్ట ప్రకారం చర్యలు • సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిఽధిలో దుకాణాలు, ఫుడ్ కోర్టులు, వ్యాపార సముదాయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్షాపులు.. కచ్చితమైన సమయపాలన పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రిపూట సమయానికి దుకాణాలు మూసివేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని జోన్ల డీసీపీలు, డివిజన్ ఏసీపీలు, పోలీస్స్టేషన్ ఎస్హెచ్వోలకు ఆదేశాలు జారీ చేశారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్టు తెలంగాణ.. నిబంధనల ప్రకారం దుకాణ యజమానులు పాటించాల్సిన నిబంధనలు ఇవీ..ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకుక్లాత్స్టోర్స్, జువెల్లరీషాప్స్, సూపర్మార్కెట్లు, ఎలక్ట్రానిక్షాప్స్, సెల్ఫోన్ షాప్స్, కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, బుక్స్టాల్స్ తదితర దుకాణాలు మద్యం దుకాణాలు: ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు బార్లు: జీహెచ్ఎంసీ పరిధితో పాటు.. చుట్టూ 5 కి.మీ. లోపు విస్తీర్ణం వరకు ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు, వారాంతాల్లో (శుక్ర, శని) – ఉదయం 10 నుంచి రాత్రి 1:00 వరకు పుడ్కోర్టులు: ఉదయం 5 నుంచి రాత్రి 1 వరకు.. షాప్స్ అండ్ మిగతా 8వ పేజీలో.. |
2,481,392 | ఉస్మానియా.. ఐపీ హౌస్ఫుల్ | • రోగులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రి ఐపీ విభాగం • పడకలు 1168.. చికిత్స పొందుతున్నది 1800 మంది • తీవ్రంగా వేధిస్తున్న డాక్టర్లు, నర్సుల కొరత 8 |
2,481,083 | పోలీస్, రవాణా శాఖలదే నిర్లక్ష్యం | • డ్రంకెన్ డ్రైౖవ్ కేసులలో వారిదే బాధ్యత, • సామాజిక కార్యకర్త రమణ్జిత్ సింగ్ పంజాగుట్ట, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్న డ్రంకెన్ డ్రైవర్ల విషయంలో పోలీస్, రవాణా శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, మోటార్ వెహికిల్ యాక్ట్ను సక్రమంగా అమలు చేయడం లేదని సామాజిక కార్యకర్త రమణ్జిత్ సింగ్ ఆరోపించారు.మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాది ఎం.కె పాషాతో కలిసి ఆయన మాట్లాడారు. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల విషయంలో పోలీస్, రవాణా శాఖల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని దాఖలు చేశానని ఆయన తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని ఈనెల 20న విచారణకు స్వీకరించిందని ఆయన తెలిపారు. పిటిషన్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్లకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఈ వ్యాజ్యంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రతీ సంవత్సరం సగటున 2.25 లక్షల డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు అవుతున్నాయని గణాంకాలు తెలువుతున్నాయని తెలిపారు. చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సులు సీజ్ చేయడం లేదన్నారు. |
2,481,084 | మీ పర్సు మా దగ్గరుంది! | • పోగొట్టుకున్న వారు రావాలంటున్న సుల్తాన్బజార్ పోలీసులుమంగళ్హాట్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మీ పర్సు పోయిందా..? అయితే వెంటనే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కు రండి అంటున్నారు పోలీసులు. కోఠిలో పర్సు పోగొట్టుకున్న వారు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. విలువైన బంగారంతో పాటు నగదు ఉన్న పర్సు మా దగ్గరుందన్నారు. అయినా పర్సు ఎవరిదనే దానిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు సీఆర్ఫీసీ 102 కింద కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజ్ పక్కనే ఉన్న సులబ్ కాంప్లెక్స్ ఫూట్పాత్పై మంగళవారం హ్యాండ్ పర్స్ కనిపించింది. సాని కు లు పర్సును తెరి చి చూడగా అందు లో మూడున్నర తులాల బంగారం, వెయ్యి రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించి సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు. రాత్రి వరకు తమ పర్సు పోయిందని ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు ప్రకటన చేశారు. పర్సు పోలీస్ స్టేషన్ లో ఉందని, పోగొట్టుకున్న వారు సంప్రదించాలని ఎవరూ రాకుంటే ీ కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. |
2,481,085 | అంబేడ్కర్ వర్సిటీలో ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి భూ కేటాయింపు | • పదెకరాలను ఖరారు చేయాలని ఆదేశంహైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్లోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి (జేఎన్ఎఫ్ఏయూ) కేటాయించాలంటూ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ మేర కు ఇరు యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖ రాశారు. ఐదెకరాల లోపు విస్తీర్ణంలోనే ప్రస్తుతం మసబ్ట్యాంక్లో జేఎన్ఎఫ్ఏయూ ఉన్నదని, అందులో కొంత మేరకు ఉన్నత విద్యా మండలి వినియోగించుకుంటుందని లేఖలో పేర్కొన్నారు. ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, అర్భన్ ప్లానింగ్ కోర్సులతో ప్రత్యేకమై ఈ యూనివర్సిటీ దేశంలోనే ఒకటని, భవిష్యత్తు అవసరాల అనుగుణంగా కోర్సు లు పెంచాల్సిన అవసరముందని, ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా జేఎన్ఎఫ్ఏయూ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయించిందని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా భూ కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్కు ఆదేశాలిచ్చారు. అయితే ఈ నిర్ణయం పట్ల ఇప్పటికే అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అన్నీ ఉద్యోగ సంఘాల నాయకులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్న విషయం విదితమే. |
2,481,082 | మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, ఏఐజీ ఆస్పత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ను ప్రారంభించింది. ఏషియన్ మెడికల్ ఫౌండేషన్, యుసి బ్రెస్ట్ ఫౌండేషన్, ఏఐజి ఆస్పత్రుల భాగస్వామ్యంతో గ్రాన్యూల్స్ ట్రస్టు నేతృత్వంలోని ఈ కార్యక్రమం వెనుకబడిన కమ్యూనిటీలలో క్యాన్సర్ గుర్తింపు, చికిత్సను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేవలను అందించడం, ఉచిత ఔషధ పంపిణీని చేయటం ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్లో మార్పులకు ప్రయత్నిస్తుందన్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ను గుర్తించడానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, యుసీ బ్రెస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రజ్ఞ చిగురుపాటి తదితరులు పాల్గొన్నారు. |
2,480,963 | పచ్చనిచెట్లపై మున్సిపల్ గొడ్డలి వేటు | నార్సింగ్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మణికొండ మున్సిపాలిటీ షేక్పేట్, కోకాపేట్ రేడియల్ రోడ్డులో బీఆర్సీ వద్ద ట్రాఫిక్కు అంతరాయంగా ఉన్నాయంటూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రెండు భారీ చింతచెట్లను మున్సిపల్ సిబ్బంది మంగళవారం నరికేశారు. సాధారణంగా వృక్షాలు అడ్డువస్తే వాటికి ఐల్యాండ్ నిర్మించి ఆ పక్కన ఉన్న స్థలం నుంచి రోడ్లు వేస్తారు. ఇక్కడ కూడా రోడ్లకు సరిపోయినంత ఫుట్పాత్ స్థలం ఉన్నా చెట్లు నరికి రోడ్డు వెడల్పు చేయాలనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక్కడే దారిపొడవున ఉన్న ఫుట్పాత్ అక్రమాలను తొలగించకపోవడాన్ని పర్యావరణ ప్రేమికులు తప్పుపడుతున్నారు. పైగా రియల్ఎస్టేట్ మోజులో ఉన్న ఇక్కడ నాయకులు చెట్ల నరికివేతకు అడ్డు చెప్పకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. |
2,480,964 | ‘బీసీ కార్పొరేషన్ చైర్మన్’లకు సత్కారం | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): బహుజనుల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమనడానికి రేవంత్ ప్రభుత్వం వివిధ పదవులు, నియామకాల్లో బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యమే నిదర్శనమని వక్తలు కొనియాడారు. గత ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వారికి దక్కాల్సిన నిధుల కేటాయింపులోనూ అన్యాయం చేసిందని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు ఆరోపించారు. తమ సమస్యలను ఆనాటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా, పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలకు సమాన అవకాశాలు కాంగ్రెస్ మాత్రమే కల్పించగలదనే నమ్మకంతో, ఆ పార్టీ గెలుపు కోసం బీసీ ఫెడరేషన్ కులాల సమితి పనిచేసిందని చెప్పారు. ఇచ్చిన వాగ్దానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 36 మంది బీసీలను వివిధ కార్పొరేషన్లకు సారథులుగా నియమించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞలు తెలియజేయడానికి సబ్బండ వర్గాల సంబరం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ ఫెడరేషన్ కులాల సమితి నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రవీంద్రభారతి వేదికగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులను సత్కరించారు. |
2,480,965 | చింతకుంట పార్కులో విరిగిపడ్డ చెట్లకొమ్మలు | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): అత్తాపూర్ డివిజన్ కాంతారెడ్డినగర్కాలనీ సమీపంలోని చింతకుంట జీహెచ్ఎంసీ పార్కులో శనివారం కురిసిన వర్షానికి చెట్లకొమ్మలు విరిగి వాకింగ్ ట్రాక్పై పడ్డాయి. రెండున్నర నుంచి మూడెకరాల్లో ఉన్న చింతకుంట పార్కులో అనేక మంది వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. విరిగిపడ్డ చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు కార్పొరేటర్ మోండ్ర సంగీతగౌరీశంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె చెప్పినా బయోడైవర్సిటీ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పార్కుకు వచ్చే వాకర్లు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చింతకుంటపార్కులో వాకింగ్ ట్రాక్ పై అడ్డంగా పడ్డ చెట్లకొమ్మలు |
2,480,966 | శాస్త్రీయ సంగీతం, లలిత కళలు సంస్కృతికి నిదర్శనం | రవీంద్రభారతి, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): శాస్త్రీయ సంగీతం, నృత్యరీతులు, లలితకళలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ సహకారంతో నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 49వ అఖిలభారత సంగీతం, నృత్య పోటీలు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన కళాకారులు పోటీలో పాల్గొన్నారు. కూచిపూడి, భరతనాట్యంతో పాటు పలు శాస్త్రీయ కళల్ని ప్రదర్శించారు. దీంతో పాటు శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో సంగీత పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ట్రెజరరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ వసుంధర హాజరై కళాకారులను సత్కరించి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నవ్యనాటక సమితి 66ఏళ్లుగా సాంస్కృతిక సేవలో నిమగ్నమవడం అభినందనీయమన్నారు. జాతీయస్థాయిలో శాస్త్రీయ కళల్లో పోటీలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాధువీమాల, మీనాక్షి, సుధామాలవిజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. |
2,480,967 | కొమండూరి రామాచారికి కిన్నెర–బాలు పురస్కారం ప్రదానం | రవీంద్రభారతి, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెచ్చిన గాయకుడు రామాచారి అని రిటైర్డ్ ఐఏఎస్ డా.కేవీ రమణాచారి అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలు వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిన్నెర–బాలు పురస్కారాన్ని ప్రముఖ గాయకుడు రామాచారికి ప్రదానం చేశారు. ముఖ్యఅతిథి డా.కేవీ రమణాచారి రామాచారి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లిటిల్ మ్యూజిక్ అకాడమీ స్థాపించి ఎందరో చిన్నారులకు సంగీత శిక్షణ ఇచ్చి బాలు నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో అధికశాతం విజేతలుగా నిలిపిన ఘనత రామాచారిది అని గుర్తు చేశారు. ఎంతోమంది కళాకారులను సినీ, కళారంగానికి అందించారని అభినందించారు. సాహితీవేత్త ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ బాలు మధుర గాయకుడు మాత్రమే కాదు నటుడు, సహృదయుడని అన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే గుణం బాలుదని అన్నారు. కార్యక్రమంలో రఘురాం, రాధాకృష్ణ, భోగరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. |
2,480,968 | ఫలక్నుమా పాత రైల్వేఓవర్ బ్రిడ్జికి పగుళ్లు | • పరిశీలించిన అధికారులు చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఫలక్నుమా పాత రైల్వే ఓవర్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి పగుళ్లు ఏర్పడ్డాయి. జోనల్ కమిషనర్ టి.వెంకన్నతో పాటు ట్రాఫిక్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జి పై నుంచి బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఛత్రినాక చౌరస్తా, లాల్దర్వాజ మోడ్ మీదుగా దారి మళ్లించారు. రైల్వే అధికారులు టిప్పర్ల ద్వారా మట్టిని పక్కనే నిర్మాణంలో ఉన్న కొత్త బ్రిడ్జి పిల్లర్ పక్క నుంచి మట్టి పోసి దానిపై ఇసుక బస్తాలు వేసుకుంటూ బ్రిడ్జి పైకి తీసుకొస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి భారీ వాహనాలు కూడా రాకపోకలు సాగించేలా చూస్తామని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ లక్ష్మణ్, ఫలక్నుమా ఇన్స్పెక్టర్ మోహన్రావు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు. |
2,480,969 | తిరుమల లడ్డూ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి : వీహెచ్ | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దౌర్భాగ్యమని, సీబీఐ విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. హిమాయత్నగర్లోని టీటీడీ వేంకటేశ్వరస్వామిని ఆయన మంగళవారం దర్శించుకున్నారు. అక్కడే దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో లడ్డూ తయారీ ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రపంచంలోనే వెంకన్న లడ్డూకు పవిత్రత ఉంటుందని, అలాంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణమని అన్నారు. గతంలో వైసీపీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉందని, తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, తాను చేసే దీక్షతో అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలని అన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని, లేకపోతే ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. |
2,480,951 | విద్యార్థులు సామాజిక సేవ చేయాలి | మదీన, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవపై కూడా ఆసక్తి కనబరచాలని హుసేనిఆలం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పియ చిన్నమ్మ అన్నారు. మంగళవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు స్పై కెమెరా, ట్రాఫిక్ నిబంధనలు, బాలికా శిశువు సంరక్షణ తదితర అంశాలపై రూపొందించిన అవగాహన కార్యక్రమాలను నాటిక రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎం.ప్రణీత, జెస్సె లింగం, డాక్టర్ శోభారాణి, లత, అనురాధ, ఎస్.అనిత, శ్రీదేవి, శైలజ పాల్గొన్నారు. కాగా, జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘అల్జీమర్స్ డే’ నిర్వహించారు. మతిమరుపు, దాని దుష్పరిణామాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీదేవి, శోభ, జువాలజీ లెక్చరర్లు ఎం.ప్రణీత, ఎస్.అనిత, కె.శైలజ, ఈశ్వర్ పాల్గొన్నారు. |
2,480,952 | పైప్లైన్ పనులను వేగవంతం చేయండి | కార్వాన్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): టోలిచౌకి రుమాన్ హోటల్ ప్రాంతంలో ఎన్పీ–2 పైప్లైన్ మరమ్మతులకు గురైంది. విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొహియుద్దీన్ మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్పీ–2 పైప్లైన్ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహ్మద్ నషీరొద్దీన్, అరూన్ఫరాన్, మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. |
2,480,953 | వ్యవసాయ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఎన్ఎస్ఎస్ డే నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగించవద్దని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలోని చెత్తచెదారాన్ని శుభ్రం చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తాము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్లాష్ మాబ్, లఘు నాటికను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి.నరేందర్రెడ్డి, వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. |
2,480,954 | తాజ్మహల్ హోటల్ భోజనంలో జెర్రి! | మంగళ్హాట్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఆబిడ్స్ తాజ్మహల్ హోటల్లో భోజనం చేస్తోన్న ఓ వినియోగదారుడి ప్లేట్లో జెర్రి ప్రత్యక్షమైంది. అశోక్కుమార్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆ హోటల్లో అన్నం తింటుండగా పప్పులో జెర్రి కనిపించడంతో ఆందోళనకు గురై విషయాన్ని హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. పాలకూరలో జెర్రి వచ్చినట్టుంది.. ఏం కాలేదు కదా.. అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని అశోక్ తెలిపారు. మేం కూడా ఉదయం పప్పు తిన్నాం.. మాకు ఏం కాలేదు.. ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని వినియోగదారులతో వాగ్వాదానికి దిగారు. జెర్రి ఉన్న పప్పు గిన్నెను లాక్కుని బయట పడేశారు. జెర్రి వచ్చిన విషయం తెలిసి అప్పటికే భోజనం ఆర్డర్ చేసిన వారు పప్పు తినలేదు. హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో అశోక్ ఆన్లైన్లో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం హోటల్ను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పప్పు నమూనా సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. కిచెన్తోపాటు ఇతర ప్రాంతాల్లో అపరిశుభ్రత ఉందని గుర్తించారు. హోటల్కు నోటీసులు జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. |
2,480,955 | విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం అందజేత | చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు బండ్లగూడ మండల స్థాయి ఆటల పోటీలు శంషీర్గంజ్లోని శారద విద్యాలయ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభం కానున్నాయి. పోటీలో పాల్గొనే విద్యార్థులకు ఫిజికల్ డైరెక్టర్ వి.శ్రీనునాయక్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమానికి బండ్లగూడ ఉప విద్యాశాఖ అధికారి ఎస్.లక్ష్మణ్సింగ్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సీహెచ్ నారాయణ, పి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. |
2,480,956 | ఐఐఆర్ఆర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్లోని జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఐఆర్ఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సునీత కోట ఆధ్వర్యంలో సంస్థ ఆవరణలో ఉద్యోగులు మంగళవారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, హరిహర క్షేత్రం ఆవరణను శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సునీత కోట ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఐఐఆర్ఆర్కు చెందిన జస్వంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. |
2,480,957 | బాలికకు లైంగిక వేధింపులు | • సైబర్ నేరగాడి అరెస్టుహైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): బాలికను లైంగికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని అరెస్టు చేశారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్కట్టకు చెందిన అఖిల్ అనే యువకుడు స్నాప్చాట్లో బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మాయమాటలు చెప్పి వీడియోకాల్స్ చేసేవాడు. అలా బాలిక నగ్నచిత్రాలు, వీడియోలు క్యాప్చర్ చేసి వాటిని స్నాప్చాట్లో పోస్టు చేసి లైంగికంగా వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేని బాలిక తల్లిదండ్రులతో కలిసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. డీసీపీ కవిత ఆదేశాలతో ఏసీపీ చాంద్పాషా పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మధులత టీమ్ రంగంలోకి దిగి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. |
2,480,958 | సీసీ రోడ్డు పనులు ప్రారంభం | నార్సింగ్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్ మున్సిపాలిటీ 6వ వార్డు వెస్ట్రన్ మెడోస్ టౌన్షిప్లో సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ పత్తి శ్రీకాంత్రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. |
2,480,950 | హాస్టల్ కేర్టేకర్పై కేసు నమోదు | రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): చెరీస్ హాస్టల్ కేర్ టేకర్ సునీతపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. హాస్టల్ కేర్టేకర్ కొడుతున్నదని, తాము హాస్టల్కు వెళ్లమని 16 మంది విద్యార్థినులు గత శుక్రవారం రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రంగారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఎస్ఐ సునీతపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. |
2,481,351 | ‘ఎక్స్’లో ట్రాఫిక్పై ఫిర్యాదులు | • స్పందించిన సీవీ ఆనంద్హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ‘సర్.. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్తో చాలా అవస్థలు పడుతున్నాం. రోడ్డును ఇరువైపులా ఆక్రమించడంతో పాటు, ఏకంగా కొంతమంది రోడ్డు సెంటర్ పాయింట్ వరకూ వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. – ఇది ఓ నెటిజన్ ఎక్స్ (ట్విటర్)లో సిటీ సీపీ సీవీ ఆనంద్కు చేసిన ఫిర్యాదు• సర్.. రోడ్డు మొత్తం ఆక్రమణకు గురైంది. చూడండి.. ఇలా ఉంటే వాహనదారులు ఎలా వెళ్లాలి అంటూ సీపీకి మరో ఫిర్యాదు.ఇలా అనేక మంది నగరవాసుల నుంచి (నెటిజన్లు) ఎక్స్లో సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు నెట్టింట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో నగర పోలీస్ కమిషనర్ స్పందించారు. మెరుగైన ట్రాఫిక్ను ప్రజలకు అందించడానికి ప్రయత్నిస్తామని, వెంటనే చర్యలు చేపడతామని సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ రోప్ను పునః ప్రారంభిస్తాంరోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి రోడ్డు ఆక్రమణలు, అక్రమ పార్కింగ్లపై ఉక్కుపాదం మోపడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. గతంలో అమల్లోకి తెచ్చిన ఆపరేషన్ రోప్ను పునః ప్రారంభిస్తాం. వెంటనే ట్రాఫిక్ యంత్రాంగాన్ని ఆదేశించి అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం. రోడ్డు ఆక్రమణలు లేకుండా చేసి మెరుగైన ట్రాఫిక్ మూమెంట్ను అందిస్తాం. – ఎక్స్లో నగర సీపీ సీవీ ఆనంద్టైమ్ అంటే టైమే..(5వ పేజీ తరువాయి) ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనల ప్రకారం ఫుడ్ కోర్టులు (ఈటరీస్).. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఐస్క్రీమ్స్ పార్లర్స్, బేకరీస్, టిఫిన్ సెంటర్లు, కాఫీషాప్లు, టీస్టాళ్లు, పాన్షాప్లు వంటివి గతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 12 వరకు సమయపాలన పాటించేది. ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనలు సడలించి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు పొడిగించిందని స్పష్టం చేశారు. సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండా ఎవరైనా ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. |
2,481,330 | మహిళలకు సామాజిక భద్రత, స్వేచ్ఛ లేదు | బర్కత్పుర, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మహిళలపై హింస బాగా పెరిగిందని.. సామాజిక భద్రత, నిజమైన స్వేచ్ఛ ప్రస్తుతం లేకుండా పోయాయని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘అధికమవుతున్న దోపిడీ–ఆర్థిక సంక్షోభం–అణచివేత ’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. ‘నేడు దేశంలో వర్గహింస, లైంగిక హింస విపరీతంగా పెరిగింది. నిర్భయ, దిశ, కోల్కత్తాలలో జూనియర్ డాక్టర్ హత్య ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు పొదుపు చర్యలు చేపట్టడం పాలకులకు పరిపాటిగా మారిపోయింది. విద్య, వైద్యం సంక్షేమాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తుండడం ఆందోళనకరం. చైనాలో నూటికి 60 మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే, మనదేశంలో ఆ సంఖ్య 24 మందే. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గ్లోబల్ ప్రచారం జరుగుతోంది. ఈ అంకెల గారడీ వెనుక ఎంత డొల్లతనం ఉందో ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. మహిళల్లో చైతన్యం పెరిగి మానవ సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది’ అని కె.శ్రీనివాస్ ఆకాంక్షించారు. పీవోడబ్ల్యు జాతీయ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ మహిళలు సంఘటితంగా ఎదురించి బలమైన ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ‘మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు–కర్తవ్యం’ అన్న అంశంపై పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, స్వరూప, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు మల్లు లక్ష్మి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధి కృష్ణకుమారి, అరుణ తదితరులు ప్రసంగించారు. ఈ సదస్సుకు చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ శ్రీదేవి అధ్యక్షత వహించగా జ్యోతి, రాధ తదితరులు పాల్గొన్నారు. |
2,481,331 | మత్తుకు దూరంగా ఉంచే ఔషధం పుస్తకం | అఫ్జల్గంజ్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాల ద్వారా సామాజిక రుగ్మతలను తొలగించి జ్ఞానసమాజాన్ని నిర్మించే అవకాశముందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు పుస్తకాలు ప్రధాన ఔషధమని పేర్కొన్నారు. మంగళవారం అఫ్జల్గంజ్ కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 55వ ఎన్సీసీ వార్షికోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించి సేవలు ఎలా అందుతున్నాయో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ చైర్మన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో గ్రంథాలయాల పాత్ర కీలకం. రాష్ట్రవ్యాప్తంగా ‘పుస్తక వైద్యులు’ అనే కార్యక్రమంలో పుస్తకాలను శుభ్రపరచడం, గ్రంథాలయాల్లో పరిశుభ్రతను పాటించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను త్వరలో సీఎం రేవంత్రెడ్డికి అందజేస్తానని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్కు పురాతన గ్రంథాలు, అతిచిన్న పుస్తకాలను చూపించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇన్చార్జి కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఐఏఎస్ అధికారి పల్లవి, డిప్యూటీ డైరెక్టర్ హరిశంకర్తోపాటు పెద్దసంఖ్యలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు జానపద కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు. |
2,481,332 | సృజనాత్మకతకు అంతరిక్షమే హద్దు | • ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ రవీంద్రభారతి, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): సృజనాత్మకతకు అంతరిక్షమే హద్దు అని, ఎంచుకున్న రంగంలో అత్యున్నతస్థాయికి ఎదగాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలుగు రీజియన్ మళయాళీ అసోసియేషన్, హైదరాబాద్ ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ‘స్పేస్ టూన్’ పేరిట కార్టూన్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఇస్రో చైర్మన్తోపాటు పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై కార్టూన్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ యువకుడిగా ఉన్నప్పుడు తాను కార్టూన్లు వేసేవాడినని, కార్డూన్లకుండే చమత్కారం ఎంతో ప్రియమని పేర్కొన్నారు. భారత్ అతితక్కువ కాలంలో తక్కువ బడ్జెట్తో విజయాలు సాధిస్తున్నదని, దీనికి కారణం మన శాస్త్రవేత్తలేనని చెప్పారు. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సోమనాథ్ సమాధానమిచ్చారు. అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కార్టూన్ అంటే మూడక్షరాలే కానీ ఆ కార్టూన్లో కనిపించే మూడు గీతల్లోనే ముప్పై అర్థాలు దాగి ఉంటాయని చెప్పారు.ప్రముఖ కార్టూనిస్ట్ కె.శంకర్ పిళ్లై, ఆర్కె.లక్ష్మణ్, ఇ.పి.ఉన్నీ లాంటి ఎందరో కార్టూనిస్టులు ఈ రంగాన్ని సుసంపన్నం చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీటీఆర్ఎంఏ అధ్యక్షుడు లిబి బెంజుమన్, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సుధీర్నాథ్, హైదరాబాద్ ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి మృత్యుంజయ, కార్టూనిస్టులు సుభాని, నర్సింగ్, వెంకటేష్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేశ్ ప్రత్యేకంగా వేసిన కార్టూన్ను సోమనాథ్కు అందజేశారు. |
2,481,333 | ఉస్మానియా.. ఐపీ హౌస్ఫుల్ | మంగళ్హాట్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి) సీజనల్ జ్వరాలు, ఇతర వ్యాధులు, ప్రమాదాలతో వస్తున్న బాధితులతో ఉస్మానియా ప్రభుత్వాస్పత్రి ఇన్పేషెంట్ విభాగం కిటకిటలాడుతోంది. 1,168 పడకల సామర్థ్యం గల ఆస్పత్రిలో ప్రస్తుతం 1800 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఫలితంగా రోగులకు సరిపడా పడకలు లేక నేలపైనే వైద్యం అందిస్తున్నారు. ఓపీ భవనం మొదటి అంతస్తులోని వార్డులు కూడా నిండిపోయాయి. ‘ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ రోగులు అడ్మిట్ కాలేదు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతోనే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఉస్మానియా అధికారులు పేర్కొన్నారు. బదిలీ సరే.. కొత్తవారేరీ ? ఓపీ భవనంలోని పరీక్ష కేంద్రాల్లో రక్త నమూనాలు సేకరించేందుకు, ఇతర పరీక్షలు చేసేందుకు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. పెద్దసంఖ్యలో రోగులు రావడంతో వారిని కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సిబ్బంది చాలడం లేదు. ఎక్స్రే, ఈసీజీ సెంటర్ల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కాగా, ఉస్మానియా నుంచి బదిలీపై వెళ్లిన 110 మంది స్టాఫ్నర్సుల స్థానంలో కొత్తవారు ఇప్పటివరకు రాకపోవడంతో వైద్యసేవల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. వైద్యులు కూడా బదిలీపై రాకపోవడంతో పీజీలు, హౌస్సర్జన్లతో నెట్టుకురావాల్సి వస్తోందని ఆసుపత్రి వర్గాలు వాపోయాయి. |
2,481,334 | దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు | • ఎమ్మెల్సీ కోదండరాం రాంనగర్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ,గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్ అండ్ వర్కర్స్, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కోదండరాంను ఘనంగా సత్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు, ఆరోగ్యకార్డులు, పీఆర్సీ తదితర విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, దసరా వరకు తీపికబురు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 317 జీవో బాఽధితులకు న్యాయం చేయాలని..కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం రేవంత్రె డ్డి ఉద్యోగులతో చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు తిప్పర్తి యాదయ్య, శ్రీపాల్రెడ్డి, చావ రవి, జ్ఞానేశ్వర్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. |
2,481,335 | వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి | • కమిషనర్ ఆమ్రపాలి హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. మంగళవారం అడిషనల్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల సమయంలో నీరు నిలిచే చోట శాశ్వత పరిష్కారం చూపాలని, ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక అందజేయాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ కమర్షియల్గా ఉండి, రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్న యజమానులకు నోటీసులు జారీచేసి ట్యాక్స్ రివిజన్ చేపట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు. మరో సమీక్షలో నగరంలో కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. వైద్యారోగ్యశాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని..యాంటీ లార్వల్, ఫాగింగ్ విస్తృతం చేయాలని పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్లో కమిషనర్ ఆకస్మిక పర్యటన వర్షాల నేపథ్యంలో కమిషనర్ ఆమ్రపాలి ఎల్బీనగర్ జోన్లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. శానిటేషన్ నిర్వహణ, రోడ్లపై పాట్హోల్స్ తదితర వాటిని పరిశీలించారు. సరూర్నగర్ నుంచి ఎల్బీనగర్, నాగోల్ రోడ్ మీదుగా ఉప్పల్ భగాయత్, ఉప్పల్ స్టేడియం రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్డు మరమ్మతులు, శానిటేషన్పై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. |
2,481,347 | రెండు రెమ్మలు.. రెండు వేలు | (5వ పేజీ తరువాయి) ఇద్దరు కొడుకుల సహకారం తీసుకుంది. గంగన్న ఆదిలాబాద్ నుంచి సరుకు హైదరాబాద్కు తెచ్చిన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా అనంతయ్య ఎంజీబీఎస్కు వెళ్తాడు. ఆయన్ను ఒక చుట్టంలా ఇంటికి తీసుకెళ్తాడు. సరుకు లెక్క చూసుకొని గంగన్నకు డబ్బులిచ్చి, మర్యాద చేసి పంపిస్తారు. ఆ తర్వాత రజినీ గంజాయి రెమ్మలను జాగ్రత్తగా తీసుకొని రెండు మూడు రెమ్మలను కలిపి దోశ ప్యాకింగ్లా చేస్తుంది. గంజాయి రెమ్మ విరగకుండా, నలగకుండా జాగ్రత్త తీసుకుంటుంది. భర్త, కుమారులకు..ఆ ప్యాకింగ్లను భర్త, ఇద్దరు కుమారులకు అందజేస్తుంది. పెద్ద కొడుకు క్యాబ్డ్రైవర్ కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులతో మంచి పరిచయాలు ఉన్నాయి. తమ వద్ద మేలు రకం గంజాయి ఉందని చెప్పి గుట్టుగా విక్రయిస్తున్నారు. అలా తండ్రి, ఇద్దరు కొడుకులు నగరంలోని పలు ప్రాంతాల్లో కస్టమర్స్కు ఒక్కో పార్శిల్లో రెండు లేదా మూడు రెమ్మలు పెట్టి రెండు వేలకు విక్రయిస్తున్నారు. నాణ్యత, బరువులో తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డిమాండ్ను బట్టి రూ. 3వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేజీ మేలు రకం గంజాయిని రూ.10వేల చొప్పున కొనుగోలు చేస్తున్న నిందితులు.. దాన్ని విక్రయించడం ద్వారా రూ.40వేలు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. రెండేళ్లుగా ఫ్యా మిలీ మొత్తం ఇదే దందా కొనసాగిస్తుండడం గమనార్హం. |
2,481,336 | మేఘాలయలో డిప్యూటీ మేయర్ బృందం | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మేఘాలయ పర్యటనలో ఉన్న డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి బృందం మంగళవారం షిల్లాంగ్ మునిసిపల్ బోర్డును సందర్శించింది. పాలన, పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రత, నీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, మురుగు జలాల నిర్వహణ, పచ్చదనం, తక్కువ ఖర్చులో గృహ నిర్మాణం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సేవల అమలు, అధునాతన సాంకేతిక వినియోగం, ప్రజలతో మునిసిపల్ సంస్థల అనుసంధానం విధానాన్ని బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రపుల్ల బోరో వివరించారు. మేఘాలయలోని వివిధ మునిసిపల్ సంస్థలు అనుసరిస్తున్న నమూనాలు, పట్టణ ప్రణాళిక వ్యూహాలు, ప్రజాసేవల విభజన పద్ధతులను పరిశీలించారు. |
2,481,337 | నివాసాలు మునుగుతాయని చెరువుకట్ట ధ్వంసం | నార్సింగి, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): తమ ఇళ్లల్లోకి నీళ్లు వస్తాయని భావించిన కొందరు ఏకంగా చెరువు కట్టను ధ్వంసం చేశారు. గండిపేట మండలం మంచిరేవులలో దాదాపు ఎకరన్నర విస్తీర్ణంలో మల్లన్నకుంట చెరువు ఉంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు చెరువు పూర్తిగా నిండింది. దీని పరిసర ప్రాంతాల్లోని విల్లాలు, ఇళ్లల్లోకి నీళ్లు చేరుతాయని భావించిన కొందరు చెరువు కట్టలో కొంతభాగాన్ని తవ్వేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వెంటనే చేరుకొని ధ్వంసం చేసిన ప్రాంతంలో మట్టిపోసి అడ్డుకట్ట వేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. |
2,481,338 | క్షేత్రస్థాయిలో వాటర్బోర్డు ఎండీ పర్యటన | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానమార్గాల్లో రోడ్డు తవ్వితే వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని, సొరంగం తవ్వేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్థం చేయాలని వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అమీర్పేట మెయిన్రోడ్, శ్రీనగర్కాలనీ ఆటోస్టాండ్ జంక్షన్లో మురుగునీటి సమస్యను పరిశీలించారు. సివరేజీ ఓవర్ ఫ్లోతో నీరంతా సెల్లార్లోకి వస్తోందని స్థానికులు ఎండీకి ఫిర్యాదు చేశారు. కృష్ణానగర్ సీబ్లాక్కు వెళ్లిన ఆయన సివరేజీ నెట్వర్క్ పైపులైన్ను పరిశీలించారు. అత్యధిక ఫిర్యాదులు వచ్చే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే సనత్నగర్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్వాల్వ్ టెక్నాలజీని ఎండీ పరిశీలించి దాని పనితీరు, నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. |
2,481,339 | ‘తిరుమల లడ్డూ అపవిత్రం దారుణం’ | ఖైరతాబాద్, సెప్టెంబర్ 24(ఆంధ్రజ్యోతి): భక్తులు అతిపవిత్రంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడడం దారుణమని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆక్షేపించింది. లడ్డూ అపవిత్రతపై మంగళవారం కమిటీ ప్రతినిధులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. తిరుపతి– తిరుమలతోపాటు అన్ని హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలివ్వకుండా నిషేధం విధించాలని కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కల్తీ వ్యవహారంపై లోతుగా విచారించి దోషులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. |
2,481,350 | 28న నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక | అల్వాల్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న నగరానికి రానున్నారు. శామీర్పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించే ‘కళామహోత్సవ్’ను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యం లో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని నియమించడంతోపాటు పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రపతి పర్యటనకు సంబంఽఽధించి ఏర్పాట్లపై మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ అఽధికారులతో సమీక్షించారు. డ్రోన్లు, పారా గ్లైడ్స్ ఎగురవేత నిషేధంరాష్ట్రపతి టూర్ నేపథ్యంలో నల్సార్ యూనివర్సిటీ, రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో డ్రోన్లు, పారా గ్లైడ్స్, మెక్రో ఎయిర్క్రాఫ్ట్లను ఎగురవేయాడాన్ని నిషేధించినట్టు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. |
2,481,329 | జానీమాస్టర్ కస్టడీ పిటిషన్పై తీర్పు నేటికి వాయిదా | రంగారెడ్డి జిల్లా కోర్టులు/సైదాబాద్, సెప్టెంబర్ 24(ఆంధ్రజ్యోతి): అత్యాచారం కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ కస్టడీ పిటిషన్పై తీర్పు బుధవారానికి వాయిదా పడింది. నిందితుడిని మరోసారి విచారించి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉన్నదని, ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, నిందితుడి తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలుకు కొంత సమయమివ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆయేషా పరామర్శ చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ను ఆయన భార్య ఆయేషా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం తప్పుడు కేసు నమోదు చేసి జానీమాస్టర్ను జైలులో పెట్టారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవనని, కానీ జనసేనకు అండగా ఉంటామని చెప్పారు. |
2,481,346 | నైపుణ్య శిక్షణ తప్పనిసరి | (5వ పేజీ తరువాయి) రిజిస్ట్రార్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్, యూజీసీ డీన్ మల్లేశం, ప్రిన్సిపల్స్ వీరయ్య, శ్రీరాములు, జె. రవికుమార్, చంద్రశేఖర్, రవీంద్రనాథ్ మూర్తి, శ్రీనివాసులు, భీమా, లక్ష్మణ్ నాయక్, సయ్యదా తలత్ సుల్తానా, రమేష్, రాధికాయాదవ్, అనురాధ, రామ్ షెపర్డ్ తదితరులు పాల్గొన్నారు.పలు సమస్యలపై వినతిఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా ప్రకటించి ఉస్మానియా పరిధిని తగ్గించారని, కోఠి మహిళా కళాశాలను తిరిగి ఉస్మానియాకు అప్పగించి నూతన ప్రాంగణంలో మహిళా వర్సిటీని ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ చైర్మన్ మురళిని కోరారు. ఓపీఎస్, సీపీఎస్ వర్తింజేయడం కోసం ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగులకు ఆరోగ్య బీమా స్కీంను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటించాలని, పాలకమండలిలో బోధనేతర సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. టైంస్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మురళి హామీనిచ్చారు. |
2,481,341 | త్వరలో ప్రముఖ ఆలయాలకు విజయ డెయిరీ ఉత్పత్తులు | • సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తార్నాక, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): పాడిరైతుల శ్రేయస్సే లక్ష్యంగా కృషి చేస్తానని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. సంస్థ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన మంగళవారం లాలాపేటలోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్రలో పాడిరైతుల శ్రేయస్సు కోసం సీఎం రేవంత్రెడ్డి ఒకేదఫాలో రూ.50 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలో బాసర, వేములవాడ, భద్రాద్రి, యాదాద్రి వంటి ప్రముఖ దేవాలయాలకు పాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. |
2,481,342 | 28న కల్వకుర్తిలో బీసీ మహాధర్నా | పంజాగుట్ట, సెప్టెంబర్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కల్వకుర్తిలో ఈనెల 28న తలపెట్టిన బీసీ మహాధర్నా కరపత్రం, లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, సినీనటి, నిర్మాత బత్తిని కీర్తిలతగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. |
2,481,345 | 100 వ్యాపార సంస్థలకు ఆహార భద్రతపై కేఎఫ్సీ శిక్షణ | హైదరాబాద్సిటీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): సహ్యోగ్ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది హైదరాబాద్లో 100 రెస్టారెంట్, ఫుడ్ జాయింట్స్ వ్యాపారవేత్తలకు ఆహార భద్రత, పరిశుభ్రత, కస్టమర్ సేవలు వంటి అంశాలపై శిక్షణను ఇవ్వనున్నట్లు కేఎఫ్సీ ఇండియా సంస్థ జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఎన్ఆర్ఏఐతో కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఫుడ్సేఫ్టీ తెలంగాణా కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ స్థానిక రెస్టారెంట్లు నగర ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుండటం వల్ల అవి అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఆచరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. |
2,481,349 | రేపటి నుంచి గోల్ఫ్ టోర్నమెంట్ | కార్వాన్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్జీఏ), ప్రొఫెసనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 29 వరకు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో 126 మంది పాల్గొంటారని పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజాన్ని ప్రోత్సహించడానికి గొప్ప వేదికను అందించే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్తో అనుబంధం కలిగి ఉండడం సంతోషకరమన్నారు. |
2,481,348 | నాగ్పూర్ ‘వందేభారత్’ వేళల్లో స్వల్ప మార్పు | హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 24(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. మార్గమధ్యలో చంద్రాపూర్ స్టేషన్కు సాయంత్రం 5.33 గంటలకు చేరుకుంటున్న ఈ రైలు అక్టోబర్ 3 నుంచి 10 నిమిషాలు ఆలస్యంగా (5.43గంటలకు) చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. |
2,480,827 | ‘జే గ్యాంగ్’ ఆట కట్టు! | ● ఏపీ బ్రూవరీస్ కార్యాలయంలో తనిఖీలు● మాజీ ఎండీ గది తెరిచిన అధికారులు● మద్యం కేసులో కీలక ఆధారాల సేకరణ● తాజా సాక్ష్యాధారాలతో మరో కేసు ● తాడేపల్లి దోపిడీ త్వరలో వెలుగులోకి..(అమరావతి – ఆంధ్రజ్యోతి)వైసీపీ వందిమాగధుల మద్యం దోపిడీ బయటికి వస్తోంది. ఐదేళ్ల పాటు జగన్ పాలనలో పేదోడిని దోచిన కుట్రకోణం వెలుగులోకి వస్తోంది.. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి వెంటనే మాట మార్చిన మోసగాడి గుట్టు బయట పడుతోంది.. స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా లిక్కర్ లేకుండా చేస్తానంటూ నాసిరకం మద్యాన్ని స్టార్ హోటళ్ల ధరలకు విక్రయించిన వంచకుడి బండారం బయట పడుతోంది.. జే బ్రాండుతో పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లో అవినీతి మద్యం కంపు ముక్కుపుటలు అదిరేలా వస్తోంది.. మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకూ... సరఫరా నుంచి విక్రయాల దాకా.. అన్నీ గుప్పిట పెట్టుకుని జగన్ గ్యాంగ్ సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో నిమగ్నమైన ఏపీ సీఐడీ మంగళవారం కీలక ముందడుగు వేసింది. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి మూలమైన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిపై మూడు నెలల క్రితం దొంగతనం కేసు నమోదైంది. ప్రసాదంపాడులోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రాత్రి పదింటికి ఎవరో కారులో ఫైళ్లు, కొన్ని బాక్సులు పట్టుకెళుతున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదుచేసింది. అప్పట్లోనే దీనిపై తనిఖీలు చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం సమాచారాన్ని సేకరించి అసలు సూత్రధారులు, వేలకోట్ల కమీషన్లు పొందిన వారికి ఉచ్చు బిగించేందుకు సంసిద్ధమైంది. అన్నింటికీ ప్రధాన సాక్షి అయిన వాసుదేవ రెడ్డి కోసం వెతికిన సీఐడీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి న్యాయపరమైన అడ్డంకుల్లేకుండా జాగ్రత్త పడ్డ దర్యాప్తు అధికారులు, అదే సమాచారంతో తాజాగా సోదాలకు దిగారు. మంగళవారం సాయంత్రం ప్రసాదం పాడులోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు చేరుకున్న సీఐడీ బృందాలు గతంలో సీజ్ చేసిన వాసుదేవ రెడ్డి కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఆయన గదిలో ఫైళ్లు, కంప్యూటర్లు, ఇతరత్రా కీలక ఆధారాలు సేకరించాయి. దర్యాప్తు అధికారులే నివ్వెరపోయేలా...వాసుదేవ రెడ్డి గదిలో జరిపిన తనిఖీల్లో కొత్తగా లభ్యమైన సమాచారం సీఐడీ అధికారులనే నివ్వెరపాటుకు గురిచేసినట్టు సమాచారం. ‘నాడు ప్రభుత్వమే ఇంత నాసికరం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిందా.? అని వారంతా ఆశ్చర్యపోయారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు, సన్నిహితులు, అనుయాయులు కోటరీగా ఏర్పడి ఇతర యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీస్, బ్రూవరీస్ను కైవసం చేసేసుకున్నారు. అప్పటినుంచి జనంపైకి జే బ్రాండ్ల మద్యం వదిలారు. దీనివెనుక వేల కోట్ల కుంభకోణం పథక రచన ఉన్నట్లు సీఐడీ అధికారులు పసిగట్టారు. ఈ బ్రాండ్లు అమ్ముడుపోవు అని అడిగే వ్యాపారుల్లేకుండా మద్యం దుకాణాలన్నీ నాడు ప్రభుత్వమే తన చేతిలో పెట్టుకుంది. కొనుగోలు దారులు ఏది అడిగినా మేమిచ్చిందే తీసుకో.. అంటూ ప్రాణాంతకమైన జె బ్రాండ్ల సీసాలు ఇవ్వడంలో అవినీతిని గుర్తించారు. అత్యంత నాసిరకమైన రసాయనాలతో తయారు చేసిన నాటు సారా కన్నా హాని కరమైన మద్యం విక్రయించి లక్షలాది మంది ఆరోగ్యంతో ఆడుకున్న వారికి సంకెళ్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. కీలక ఆధారాలతో కొత్తగా ఎఫ్ఐఆర్!రాష్ట్రంలో 2019 జూన్ నుంచి మద్యం తయారు చేసిన కంపెనీలు ఎవరి చేతుల్లోకి బలవంతంగా వెళ్లాయనేది సీఐడీ గుర్తించింది. ‘జే బ్రాండ్ల’న్నీ జగన్ అనుయాయుల కంపెనీలకు చెందినవేనని రుజువు చేసే పక్కా ఆధారాలు సేకరించింది. వాటికి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చి ప్రాణాంతక రసాయనాలతో మద్యం తయారు చేయించిన వైనాన్ని పసిగట్టింది. ఇతర నాణ్యమైన మద్యం లభించకుండా చేసి దోపిడీ చేసిన తీరును అంచనా వేసింది. అనుమతులిచ్చే స్థానంలో నాడు ఉన్న వాసుదేవరెడ్డి జే బ్రాండ్లు, లేబుళ్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. దీనివెనుక తాడేపల్లి నుంచి వచ్చిన ఒత్తిళ్ల మర్మాన్ని చేధించింది. నాసిరకం మద్యాన్ని జగన్ అనుయాయుల కంపెనీల నుంచే బేసిక్ ధర కన్నా ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు పెట్టిన కన్నాన్ని గుర్తించింది. బేసిక్ ధర ఎక్కువగా చెల్లించడం వల్ల ఏపీ బేవరేజెస్కు వాటిల్లిన భారీ నష్టాన్ని కూడా సీఐడీ అంచనా వేసింది. తనిఖీల్లో భాగంగా.. ప్రసాదంపాడులోని ఏపీ డిస్టలరీస్ అండ్ బ్రూవరీస్ కార్యాలయంలో గతంలో పనిచేసిన సిబ్బందిని పిలిచి ఏమి జరిగిందో కూపీ లాగారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎఫ్ఐఆర్ను సీఐడీ నమోదుచేసింది. అయితే, ఎవరు నిందితులు.. పెట్టిన సెక్షన్లు.. లభ్యమైన సాక్ష్యాలు.. ఇతరత్రా వివరాలు బయటికి చెప్పడం లేదు. తమకు లభించిన ఆధారాల మేరకే బాధ్యులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వెల్లడయ్యే మరిన్ని సాక్ష్యాల ఆధారంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. |
2,480,828 | తెలంగాణలో రేవంత్ కుటుంబం దోపిడీ | ● గాంధీకి కండువా కప్పిన సన్నాసి ఎవరు? ● చంద్రబాబు వారంలోనే పింఛన్లు పెంచారు● పది నెలలైనా రేవంత్కు చేతనైతలేదు● కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ధ్వజంహైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్రెడ్డి కుటుంబం దోచుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అయ్యప్ప సొసైటీలో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, కమీషన్లు, సెటిల్మెంట్ల దందా నడిపిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గతంలో తనతో చెప్పారని తెలిపారు. సీఎం, ఆయన బంధువులు చేస్తున్న దౌర్జన్యాలతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్న కారణంతో వారిపై రేవంత్రెడ్డి సర్కారు పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. హైడ్రా పేరుతో పేదల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘హైడ్రాకు అందరూ సమానమని చెబుతూనే.. సీఎం రేవంత్రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి మాత్రం ముందుగా నోటీసులిచ్చారు. పేదల ఇళ్లను మాత్రం పిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా కూలుస్తున్నారు’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను కూలగొట్టాలని సవాల్ విసిరారు. పేదల ఇళ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని, బాధితులకు అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ కనిపిస్తూనే ఉంటారు. ఆయన ఆనవాళ్లు చెరిపేయడం మీ వల్లకాదు చిట్టినాయుడూ’’ అని వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్యేల బతుకు బస్టాండే..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల బతుకు బస్టాండ్ అయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘మనం మనోడు కాదంటున్నాం. కాంగ్రెస్ వాళ్లూ మావాడు కాదంటున్నారు. దీంతో వాళ్లు ఎటూ కాకుండా పోయారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’’ అని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారన్న మంత్రి శ్రీధర్బాబు.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి, దౌర్భాగ్యుడు ఎవరో చెప్పాలన్నారు. వృద్ధులకు పింఛన్ పెంచుతామని ఇచ్చిన హామీని ఏపీలో సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే అమలు చేశారని కేటీఆర్ తెలిపారు. ఇక్కడ రేవంత్కు మాత్రం చేతెనైతలేదని విమర్శించారు. ఇక వైద్య విద్య ప్రవేశాలకు నిర్ణీత గడువు ముగుస్తోందని, ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడెదెప్పుడంటూ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. కాగా, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిననే విషయాన్ని మరిచిపోయారంటూ కేటీఆర్ విమర్శించారు. అమృత్లో అవినీతి జరిగిందని ముందుగా చెప్పింది బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అని, కానీ.. ఆయన ఇప్పుడు దొంగపిల్లిలా కళ్లు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. తాము మొత్తం ఆధారాలతో బయటపెట్టాక చిల్లర మాటలెందుకని, సీవీసీకి సిఫారసు చేయడమెందుకని ప్రశ్నించారు. |
2,480,829 | శ్రీశైలం జలాశయం ఖాళీ చేసేస్తున్నారు! | ● ఇన్ఫ్లో అంతంతమాత్రంగా ఉన్నా పోటాపోటీగా జల విద్యుత్ ఉత్పత్తి● తెలంగాణ, ఏపీ వైఖరితో 3 వారాల్లో 52.61 టీఎంసీల తరుగుదలహైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జలాశయాల్లో నీటిని తొలుత తాగునీటికి, ఆ తర్వాతే సాగునీటికి, చివరిలో జల విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాలనేది నిబంధన. అయితే వరదలు తగ్గి.. ఇన్ఫ్లో లేనప్పటికీ తెలుగు రాష్ట్రాలు పోటీపడి శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి, పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటి తరలింపుతో జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. ఈ నెల 9న 206.10 టీఎంసీల నీటి నిల్వ ఉండగా... మంగళవారం ఉదయం 163.2 టీఎంసీలు మాత్రమే ఉంది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా మూడు వారాల్లో 52.61 టీఎంసీలను ఖాళీ చేసేశారు. నవంబరు దాకా ప్రాజెక్టులకు వరద ప్రవాహం ఉంటుందని సమాచారం ఉన్నా... కచ్చితంగా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తితేనే దిగువన ఉన్న శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పాదనకు వినియోగించుకోవాలి. ఆల్మట్టి నుంచి కేవలం 12 వేల క్యూసెక్కులు, ఆ దిగువన ఉన్న నారాయణపూర్ నుంచి 14,307 క్యూసెక్కుల ఔట్ ఫ్లో మాత్రమే ఉంది. జూరాల నుంచి 18,355 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉన్నా ఒక్కచుక్క కూడా శ్రీశైలం జలాశయంలోకి చేరకుండానే మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క చుక్క కూడా రావడం లేదని ఆంధ్రప్రదేశ్ జలవ నరుల సమాచార వెబ్సైట్లో గణాంకాలు చూపిస్తుండటం గమనార్హం. వచ్చిన ఇన్ఫ్లోను వచ్చినట్లే పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి నుంచి మళ్లిస్తుండటం గమనార్హం. భారీగా ఇన్ఫ్లో ఉన్న సమయంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కానీ ఇన్ఫ్లో అంతంతమాత్రంగా ఉన్నప్పుడు పోటీపడి జల విద్యుత్ ఉత్పత్తి చేయడం విమర్శలకు తావిస్తోంది. శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి ఏపీ ఇప్పటిదాకా 766.41 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ ఇప్పటిదాకా 1,057 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 52 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం నుంచి సాగర్కు 44 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వచ్చింది వచ్చినట్టే దిగువకు వదిలిపెట్టారు. ఆ దిగువన ఉన్న పులిచింతలకు 37 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 36 వేల క్యూసెక్కులు వదిలిపెట్టారు. దాంతో ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళవారం 43 వేల క్యూసెక్కులు సముద్రం దిశగా వెళ్లిపోయాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించి.. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలను పెంచుకోవాలని రైతులు కోరుతున్నారు. |
2,480,830 | ప్రాణాలైనా ఇస్తా | ● సనాతన ధర్మానికి హానిపైమౌనం సరికాదు● లౌకికవాదం వన్వే కాదు టూ వే● దానికి భంగం కలిగితే నిలదీస్తా:పవన్విజయవాడ(వన్టౌన్), సెప్టెంబరు 24: సనాతన ధర్మానికి హాని కలిగితే ఎటువంటి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ‘‘చేతులెత్తి నమస్కరిస్తున్నా.. సనాతన ధర్మానికి హాని జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు’’ అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంలో వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి క్షమాపణలు కోరుతూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. అందులోభాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం గుడి మెట్ల మార్గాన్ని నీళ్లు పోసి కడిగి శుభ్రం చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి విషయంలో కల్తీ జరిగింది. ఈ విషయంపై హిందువులందరూ కలిసికట్టుగా మాట్లాడాలి. దీనిపై మౌనం మంచిది కాదు.’’ అని పవన్ చెప్పారు. మాజీ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యికన్నా పందికొవ్వే ఖరీదైనదని, ఎవరైనా రాగిలో బంగారం కలుపుతారా అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ప్రకాష్రాజ్, కార్తి గుర్తుంచుకోండి..నటుడు ప్రకాష్రాజ్ సున్నిత అంశాల విషయంలో తెలుసుకుని మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకాష్రాజ్ తనకు మంచి మిత్రుడని, అతనిపై ఎంతో గౌరవం ఉందని, అయితే సనాతన ధర్మ పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడటం కూడా తప్పే అని ప్రకాష్ రాజ్ చెబితే ఎట్లా అని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో జోకులు వేయడం సరికాదని తమిళ నటుడు కార్తిని ఉద్దేశించి అన్నారు. ‘‘సినీ ఫంక్షన్లో లడ్డూ సున్నిత అంశం అంటూ (కార్తి) సరదాగా మాట్లాడారు. అలా అనొద్దు. నేను నటులను గౌరవిస్తా. మీరు ఒకటికి వందసార్లు ఆలోచించుకుని మాట్లాడండి’’ అని అన్నారు. |
2,480,836 | మిల్లర్ ఆస్తులు జప్తు | (మొదటిపేజీ తరువాయి)మేనేజర్ లేఖ రాశారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదుకు కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్పహాడ్ గ్రామంలోని శ్రీసాయిరాం మోడ్రన్ బిన్నీ రైస్ మిల్ యజమాని పల్లా చంద్ర శేఖర్ రెడ్డి 2022–23; 2023–24 సంవత్సరాల్లో 1987.560 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. కేవలం 143.038 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి పంపిణీ చేశారు. దీంతో ఈనెల 12న కొడకండ్ల డిప్యూటీ తహసీల్దార్ దేవా (పౌర సరఫరాలు) రైస్ మిల్లును తనిఖీ చేశారు. జరిమానా, వడ్డీతో కలిపి కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన రూ.5.67 కోట్ల విలువైన 1774 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు లేవని గుర్తించారు. వాటిని పక్కదారి పట్టించి ఉంటారని నివేదించారు. ఈ నేపథ్యంలోనే, రైస్ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా రైస్ మిల్లర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను గుర్తించి రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రారంభించాలని దేవరుప్పల తహసీల్దారుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దేవరుప్పుల పోలీసులకు జిల్లా పౌర సరఫరాల డీఎం అతిరామ్ ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తులపై ఎటువంటి లావాదేవీలను అనుమతించవద్దని జిల్లా సబ్ రిజిస్ట్రార్లకు లేఖ రాశారు. అప్పరాజుపల్లి రైస్ మిల్లుపై టాస్క్ఫోర్స్ దాడులుమహబూబాబాద్ జిల్లా అప్పరాజుపల్లి రాజరాజేశ్వర రైస్మిల్లుపై పౌర సరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై ఓఎస్డీ ప్రభాకర్, డీఎస్వో ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగాయి. 2022–23 రబీ సీజన్లో అప్పరాజుపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లుకు 19,456 క్వింటాళ్ల ధాన్యం అప్పగించారు. మిల్లు బాధ్యులు ఒక్క గింజ కూడా కస్టమ్ మిల్లింగ్ కింద పౌర సరఫరాల శాఖకు అప్పగించలేదు. అలాగే, 2023–24 ఖరీఫ్ సీజన్లో మరో 32,240 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇచ్చారు. ఇందులో 21,900 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో లేదని గుర్తించారు. 2022–23 రబీ సీజన్లో ఇచ్చిన ధాన్యం విలువ రూ.4.15 కోట్లు; 2023–24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి రూ.5.41 కోట్లు.. మొత్తం రూ.9.56 కోట్లు ఉంటుందని తేల్చారు. మిల్లు యజమాని భూక్య నవీన్పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పారు. |
2,480,831 | రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా | చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదంఅమరావతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బీసీ సంఘం నాయకుడు, ఏపీలోని వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. సోమవారమే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా లేఖను అందజేయగా.. మంగళవారం ఆయన ఆమోదం తెలిపారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు. వైసీపీ నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. దీంతో, వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11 నుంచి ఎనిమిదికి తగ్గింది.జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా కృష్ణయ్య?హైదరాబాద్: ఆర్.కృష్ణయ్య తదుపరి అడుగు చర్చనీయాంశమైంది. ఆయన్ను మోదీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీసీల హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని రెండ్రోజుల కిందట జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు ఆయన్ను కోరాయి. అంతకుముందే బీజేపీ జాతీయ అగ్ర నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓటుబ్యాంకు మరింత పెంచుకోవచ్చన్న అంచనాల్లో భాగంగా వారు ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, ర అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆయన్ను జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమిస్తారనడానికి సంకేతాలని బీజేపీ వర్గాలు అంటున్నాయి. |