text: పేల్చివేతకు ముందు పుంగ్యె-రి స్థలం శాటిలైట్ చిత్రం భారీ పేలుళ్లు జరగడాన్ని తాము ప్రత్యక్షంగా చూశామని పుంగ్యె-రి వద్ద ఉన్న విదేశీ పాత్రికేయులు తెలిపారు. దక్షిణ కొరియా, అమెరికాలతో దౌత్య సంబంధాల్ని మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఈ అణుపరీక్షల స్థలాన్ని మూసేస్తామని ఉత్తర కొరియా ఈ యేడాది ప్రారంభంలోనే స్పష్టం చేసింది. అయితే, 2017 సెప్టెంబర్‌లో జరిగిన చివరి పరీక్ష తర్వాత ఇది పాక్షికంగా ధ్వంసమైందనీ, దాంతో అది పనికి రాకుండా పోయిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న పర్వతాల్లో ఉన్న పుంగ్యె-రి స్థలాన్ని ధ్వంసం చేసే సందర్భంగా స్వతంత్ర పర్యవేక్షకులెవరినీ ఉత్తర కొరియా అనుమతించలేదు. గురువారం ఏం జరిగింది? ఎంపిక చేసిన 20 మంది విదేశీ పాత్రికేయుల సమక్షంలో వరుసగా జరిగిన పేలుళ్ల ద్వారా మూడు సొరంగాల్ని పేల్చివేశారు. రెండు పేలుళ్లు ఉదయం జరిగాయని, నాలుగు పేలుళ్లు మధ్యాహ్నం జరిగాయని తెలుస్తోంది. పేలుళ్ల సందర్భంగా ఆ స్థలానికి వెళ్లేందుకు అనుమతి పొందిన విదేశీ పాత్రికేయులలో స్కై న్యూస్‌కు చెందిన టామ్ చెషైర్ ఒకరు. "మేం కొండపైకి ఎక్కాం. ఈ పేల్చివేతను కేవలం 500 మీటర్ల దూరం నుంచి గమనించా" అని ఆయన చెప్పారు. "వాళ్లు మూడు, రెండు, ఒకటి అంటూ కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఆ తర్వాత చాలా పెద్ద పేలుడు సంభవించింది. మా వైపు బాగా దుమ్ము వచ్చింది. బాగా వేడిగా అనిపించింది. ఇది చెవులు చిల్లులు పడేంత పెద్ద శబ్దం" అని తెలిపారు. ఈ సొరంగాల్ని అనేక వైర్లతో కనెక్ట్ చేసినట్టు టామ్ చెప్పారు. ఈ పరీక్షా స్థలం ప్రత్యేకతలేంటి? మంటాప్ పర్వతం దిగువన నిర్మించిన పలు సొరంగాల్లో ఉత్తర కొరియా 2006 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు అణు పరీక్షలు నిర్వహించింది. ఉత్తర కొరియాలో ఇదే ప్రధానమైన అణుపరీక్షా స్థలం. ప్రపంచంలో క్రియాశీలంగా ఉన్న అణుపరీక్షా స్థలం కూడా ఇదొక్కటే. పరీక్ష చేసే పరికరాలను సొరంగాల చివరి భాగాన పాతిపెడతారు. వాటిని ఒక హుక్‌తో కలుపుతారు. టన్నెల్ వెనుక భాగాన్నంతా నింపేస్తారు. ఆ విధంగా రేడియోధార్మిక లీకేజి ఏదీ జరగకుండా చేసిన తర్వాత దాన్ని పేల్చివేస్తారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియా తమ దేశంలోని ఏకైక అణుపరీక్షల స్థలం వద్ద ఉన్న సొరంగాల్ని పేల్చివేసినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఈ చర్య చేపట్టిందని భావిస్తున్నారు. text: ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనూ సుమారు నాలుగో వంతు భూభాగం ఎడారిగా మారిపోయే ప్రమాదం ముంచుకొస్తోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. బెంగళూరులోని 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ, అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లు 2003 నుంచి 2005, 2011 నుంచి 2013 మధ్య రెండు వేర్వేరు కాల వ్యవధుల్లో రిమోట్ సెన్సింగ్ డేటా ఉపయోగించి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2013 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం, తెలంగాణలో 31.4 శాతం, కర్నాటకలో 36.24 శాతం భూభాగం ఎడారీకరణ ముప్పులో ఉంది. తెలుగు రాష్ట్రాలు మొక్కల పెంపకం, జల సంరక్షణ చర్యలు విస్తారంగా చేపడుతూ ప్రమాద నివారణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎడారీకరణ అంటే..? నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, జీవభౌతిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఉత్పాదక భూమి అనుత్పాదకంగా మారిపోవడమే ఎడారీకరణ. ప్రకృతి సిద్ధంగా జరిగే మార్పులు, మనుషులు.. రెండూ ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ప్రపంచంలోని మూడోవంతు భూభాగం ఎడారీకరణ ప్రమాదంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ కంబాటింగ్ డిజర్టిఫికేషన్(యూఎన్‌సీసీడీ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల హెక్టార్ల భూమి ఎడారీకరణ ప్రభావానికి లోనయింది. దీనికితోడు, మృత్తికా క్రమక్షయం కారణంగా ఏటా 530 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి, 80 లక్షల టన్నుల వృక్ష పోషకాలను నేల కోల్పోతోంది. భూక్షీణత వల్ల ప్రత్యక్షంగా 25 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణం, గనుల తవ్వకం వంటి కారణాల వల్ల వ్యవసాయం, చెట్ల పెంపకానికి భూమి లభ్యత తగ్గిపోతోంది. వర్ధమాన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్యను విధాన లోపాలు మరింత తీవ్రం చేస్తున్నాయి. ఫలితంగా ఎడారీకరణ మరింత వేగవంతమవుతోంది. కారణాలేమిటి? భారత్‌లోని 57 శాతం భూభాగంలో సాగు ప్రాంతం ఎడారీకరణ వల్ల పెను సంక్షోభాలకు గురవుతోంది. దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయని 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ నివేదిక చెబుతోంది. ఉపాంత భూములను(వ్యవసాయానికి అనుకూలం కానివి) వ్యవసాయానికి వినియోగిస్తుండడం.. నేల, నీటి పరిరక్షణ చర్యలు తగినంతగా లేకపోవడం.. పరిమితికి మించి సాగు చేయడం, జల యాజమాన్యం సక్రమంగా లేకపోవడం.. భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఎడారీకరణకు ప్రధాన కారణాలని నివేదికలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో: 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2003-05 మధ్య 22,67,728 హెక్టార్ల ప్రాంతం ఎడారీకరణ ముప్పును ఎదుర్కోగా 2011-13 నాటికి అది 22,98,758 హెక్టార్లకు చేరింది. సుమారు పదేళ్ల కాలంలో 0.19 శాతం మేర ఎడారీకరణ పెరిగినట్లు తేలింది. ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఎడారీకరణ జరుగుతుండగా, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 2003-05తో పోల్చితే 2011-13 నాటికి అడవుల విస్తీర్ణం పెంచగలిగారు. ప్రభుత్వాలు చేపట్టిన అటవీ సంరక్షణ చర్యల వల్ల 4,190 హెక్టార్ల మేర అడవులు పెరిగాయి. కానీ, ఇతర కారణాల ప్రభావం వల్ల ఎడారీకరణ వేగాన్ని నియంత్రించలేకపోయారు. తెలంగాణలో: తెలంగాణ ప్రాంతంలో 2003-05 మధ్య 36,58,486 హెక్టార్ల భూభాగం ఎడారీకరణ ముప్పును ఎదుర్కోగా 2011-13 నాటికి అది 35,98,856 హెక్టార్లకు తగ్గింది. అంటే ఈ పదేళ్ల కాలంలో తెలంగాణలో 0.52 శాతం మేర భూభాగం ఎడారీకరణ ముప్పు నుంచి బయటపడింది. ప్రస్తుత నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఎడారీకరణ ముప్పు ఉండగా, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. కర్నాటకలో: కర్నాటక రాష్ట్రంలో 2003-05 మధ్య 69,40,943 హెక్టార్ల భూభాగం ఎడారీకరణ ముప్పును ఎదుర్కోగా 2011-13 నాటికి అది 69,51,000 హెక్టార్లకు పెరిగింది. బెలగావి, గుల్బర్గా, తుముకూరు, బీజపుర్ జిల్లాల్లో ఎడారీకరణ ప్రభావం అధికంగా ఉంది. పెరుగుతున్న మానవ ప్రమేయం వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కార్చిచ్చులు, వ్యవసాయ విధానాలు, జలయాజమాన్య లోపాలు, భూగర్భజలాల మితిమీరిన వినియోగం, పారిశ్రామికీకరణ, గనుల తవ్వకం వంటివి ఎడారీకరణకు ప్రధాన కారణాలు. ప్రకృతి సిద్ధమైన కారణాలతో పాటు, మానవ సంబంధిత కారణాల వల్ల కూడా ఎడారీకరణ వేగవంతమవుతోంది. అధ్యయనం జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ పదేళ్ల కాలంలో మానవ ప్రమేయం వల్ల కలిగిన నష్టం పెరుగుతున్నట్లు స్పష్టమైంది. * ఆంధ్రప్రదేశ్‌లో 2003-05 మధ్య 20,565 హెక్టార్లలో మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు ఏర్పడగా 2011-13 నాటికి అది 20,833 హెక్టార్లకు చేరింది. * తెలంగాణలో 2003-05 మధ్య 14,592 హెక్టార్లలో మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు తలెత్తగా 2011-13 నాటికి అది 16,982 హెక్టార్లకు చేరింది. *కర్నాటకలో 2003-05 మధ్య 18,704 హెక్టార్ల విస్తీర్ణం మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు ఎదుర్కొనగా 2011-13 నాటికి అది 20,876 హెక్టార్లకు పెరిగింది. ప్రమాద తీవ్రత అంచనా ఇలా.. హైరెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా, జియో కంప్యూటింగ్ విధానాలను వినియోగించి ఎడారీకరణ స్థాయి, తీవ్రతను తెలుసుకుంటున్నారు. నిర్ణీత కాల వ్యవధుల్లో ఈ అంచనాలు రూపొందిస్తూ ఎడారీకరణ పరిస్థితులను గమనిస్తున్నారు. భూమిపై పూర్వ పరిస్థితులను పునరుద్ధరించే క్రమంలో చేపట్టాల్సిన చర్యలకు సన్నద్ధమవడానికి ఇది తోడ్పడుతుంది. ఈ విధానాల సహాయంతో అడవుల క్షీణత, భూక్రమక్షయం, లవణీకరణ వంటివన్నీ అంచనా వేస్తారు. ఎడారీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో జీవభౌతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి దీని ప్రభావాన్ని అంచనా వేస్తారు. దక్షిణ భారతదేశంలో సమగ్ర అధ్యయనం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ ఎడారీకరణపై సునిశిత అధ్యయనం చేసింది. మొత్తం 4,66,836 చదరపు కిలోమీటర్ల పరిధిలో వీరి అధ్యయనం సాగింది. దేశ విస్తీర్ణంలో ఇది 14.2 శాతానికి సమానం. అధ్యయనం చేసిన ప్రాంతం పరిధిలో దక్కన్ పీఠభూమి.. పశ్చిమ, తూర్పు కనుమలు.. తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. దీంతో మూడు వేర్వేరు నైసర్గిక స్వరూపాల్లో ఈ అధ్యయనం చేసినట్లయింది. తీరప్రాంతంలోని తక్కువ సారవంతం గల ఇసుక భూములు, డెల్టాలోని సారవంతమైన నేలలు, లాటరైట్, నల్లరేగడి, ఎర్ర నేలలు వంటివన్నీ ఈ ప్రాంతాల్లో ఉండడంతో వివిధ రకాల నేలలనూ అధ్యయనం చేసినట్లయింది. ఈ ప్రాంతాల్లో వార్షిక కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా 16 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతుంటాయి. అంతేకాకుండా, అధ్యయన ప్రాంతంలోని 47.83 శాతం భూమి వ్యవసాయానికి వినియోగిస్తుండగా, 20.5 శాతం భూమిలో అడవులున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవి పంటల కాలంలోని వివరాలనూ సేకరించి అధ్యయనం చేశారు. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఎడారి అంటే భారతదేశంలో గుర్తొచ్చే పేరు థార్. భారతదేశ మొత్తం భూభాగంలో 5 శాతం ప్రాంతాన్ని ఆక్రమించిన ఈ ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో 60 శాతం వైశాల్యాన్ని తానే మింగేసింది. text: అయితే, శిలలను చర్చిలుగా మార్చే కళ 500 ఏళ్ల కిందటే మరుగునపడిందని చాలా మంది అంటుంటారు. కానీ.. అది నిజం కాదు. ఇప్పటికీ ఇథియోపియాలో ఏకశిలా చర్చిలు తయారవుతున్నాయి. ఇక్కడ ఉన్న సెయింట్ జార్జ్ చర్చి ఇథియోపియాలోని అత్యద్భుత వారసత్వ కట్టడాల్లో ఒకటి. 12వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న 11 ఏకశిలా చర్చిలలో ఒకటి. ఈ పురాతన చర్చిల కారణంగానే.. ఈ ప్రాంతాన్ని ఇథియోపియా దేశీయ క్రైస్తవ కేంద్రమని అంటారు. చరిత్రకు సాక్ష్యాలు.. ఈ ఏకశిల చర్చిలు జెరూసలెం వెళ్లేందుకు అనుమతి లేని క్రైస్తవ పర్యాటకుల కోసం కొత్త జెరూసలెంను నిర్మించాలన్న అప్పటి రాజు లాలిబెలా ఆదేశాలతో ఈ చర్చి లను రూపొందించారు. దాంతో ఇప్పటికీ అనేక మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అయితే.. బండరాళ్లను చర్చిలుగా మార్చే కళ 500 ఏళ్ల క్రితమే కనుమరుగైందని చాలా మంది విద్యావేత్తలు చెబుతుంటారు. 2013లో లాలిబెలాలోని సెయింట్ మేరీస్ చర్చిని సందర్శించి మౌనం వహిస్తున్న అప్పటి జర్మనీ అధ్యక్షుడు జోకిమ్ గౌక్ కానీ.. స్థానిక చర్చి నిర్వాహకుడు గెబ్రెమెస్కెల్ లాంటి డజన్ల కొద్ది మంది ఆ కళను సజీవంగా కొనసాగిస్తూనే ఉన్నారు. గెబ్రెమెస్కెల్ మరో ముగ్గురితో కలిసి నాలుగేళ్లలో నాలుగు చర్చి లను రూపొందించారు. "ఇది దేవుని కోరిక. క్రైస్తవ స్పూర్తితో ఈ పనిచేస్తున్నాం. ఈ డిజైన్ల కోసం ఎవరి నుంచీ ప్రణాళికలు.. సూచనలనూ తీసుకోలేదు" అని ప్రస్తుతం శిలలను తొలిచి చర్చిలుగా మార్చేస్తున్న శిల్పి గెబ్రెమెస్కెల్ టెస్సెమ అంటున్నారు. ఈ కళాత్మక నిర్మాణాలపై దేశంలోని చరిత్రకారులతో కలిసి.. అమెరికా.. బ్రిటన్ దేశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ బృందం 20 అధునాతన చర్చిలను కనుగొంది. "ఇక్కడి చర్చిలకు వెళ్తున్నాం. వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న శిల్పులతో మాట్లాడుతున్నాం. వారి వ్యక్తిగత అనుభవాలను తెలుసుకుంటున్నాం" అని టొరొంటో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైకేల్ గెర్వెర్స్ తెలిపారు. లాలిబెలా నేటికీ ఇథియోపియాలో ప్రముఖ యాత్రాస్థలంగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయ కళను సజీవంగా కాపాడుకుంటే... ఈ ఆకర్షణ కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర ఇథియోపియాలోని లాలిబెలా.. ప్రాచీనకాలంనాటి అద్భుత చర్చిలకు నిలయం. 12వ శతాబ్దం నాటి ఈ చర్చిలను ఆనాటి రాజు లాలిబెలా ఆదేశాలతో కళాకారులు భారీ శిలలను తొలిచి సృష్టించారు. text: ఆరు రకాల గబ్బిలాల జన్యు నిర్మాణ క్రమాల గుట్టును తాము విప్పగలిగామని చెప్పారు. కరోనావైరస్ వాటి శరీరాల్లో ఉన్నా, గబ్బిలాలు ఎందుకు జబ్బుపడటం లేదన్న రహస్యాన్ని ఈ సమాచారం ద్వారా తెలుసుకోవాలని పరిశోధకులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనావైరస్, భవిష్యతులో రాబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉందంటున్నారు. గబ్బిలాలపై తమ పరిశోధనల్లో గుర్తించిన జన్యు క్రమాలు వాటికి ‘ప్రత్యేకమైన వ్యాధినిరోధక వ్యవస్థ’లు ఉన్నట్లు సూచిస్తున్నాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్ ప్రొఫెసర్ ఎమ్మా టీలింగ్ చెప్పారు. ‘‘వైరస్‌లకు గబ్బిలాల్లో కనిపిస్తున్న వ్యాధి నిరోధక ప్రతిస్పందనలను మనుషుల్లోనూ తీసుకురాగలిగితే, వాటిని మనం తట్టుకోవచ్చు’’ అని బీబీసీతో అన్నారు. ‘‘అది ఇప్పటికే పరిణామం చెంది ఉంది. మనం కొత్తగా కనుక్కోవాల్సింది లేదు. అయితే, అలాంటి ప్రతిస్పందనలు ఎలా తేవచ్చొన్నది మనం తెలుసుకోగలగాలి. దానికి తగ్గట్లు ఔషధాలు తయారుచేయాలి’’ అని వివరించారు. ప్రొఫెసర్ టీలింగ్ బ్యాట్1కే ప్రాజెక్ట్‌ సహ వ్యవస్థాపకురాలు. ప్రస్తుతం జీవిస్తున్న మొత్తం 1,421 జాతుల గబ్బిలాల జన్యు క్రమాలను ఆవిష్కరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘‘గబ్బిలాల్లో పరిణామం చెందిన జన్యు పరిష్కారాలను మనుషుల్లో ఎలా రాబట్టుకోవాలన్నది గుర్తించేందుకు ఈ జన్యు క్రమాలే దారి’’ అని టీలింగ్ అన్నారు. కోవిడ్-19 గబ్బిలాల్లో మొదలై, వేరే జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. సార్స్, మెర్స్, ఎబోలా లాంటి వ్యాధులు కూడా ఈ తరహాలోనే మనుషులకు వ్యాపించాయి. గబ్బిలాలను వాటి ఆవాసాల్లో, సహజ రీతిలో బతకనిస్తే... మనుషులకు పెద్దగా ప్రమాదమేమీ ఉండదని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రకృతి సమతౌల్యానికి గబ్బిలాలు చాలా ముఖ్యం. మొక్కల్లో పరాగ సంపర్కానికి కొన్ని రకాలు ఉపయోగపడతాయి. మరికొన్ని కీటకాలను తింటాయి. పరిశోధనల్లో ఏం తేలింది? అధునాతన సాంకేతికత సాయంతో ఓ అంతర్జాతీయ పరిశోధక బృందం గబ్బిలాల జన్యు క్రమాన్ని, వాటిలోని జన్యువులను గుర్తించేందుకు పనిచేసింది. గబ్బిలాల జన్యుక్రమాలను మరో 42 క్షీరదాల జన్యుక్రమాలతో పోల్చి చూసి, జీవ వ్యవస్థలో వాటి స్థానాన్ని గుర్తించింది. కుక్కలు, పిల్లులు, సీల్ చేపల వంటి మాంసాహార జీవ జాతులతో, పాంగోలిన్, తిమింగళాలు, గిట్టలుండే జంతువులతో గబ్బిలాలకు దగ్గరి సంబంధం ఉందని పరిశోధకులు కనిపెట్టారు. జన్యుక్రమంలో గబ్బిలాల్లో ప్రత్యేకంగా పరిణామం చెందిన ప్రాంతాలను గుర్తించారు. ఇవే వాటి ప్రత్యేక సామర్థ్యాలకు కారణమవుతుండొచ్చు. ప్రతిధ్వనులను గుర్తించడం ద్వారా పూర్తి చీకట్లోనూ తిరిగే సామర్థ్యం గబ్బిలాలకు ఉంది. దీనికి కారణమని భావిస్తున్న జన్యువులను కూడా పరిశోధకులు గుర్తించారు. ఎగిరే క్షీరదాలు కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌ను ఎలా తట్టుకుంటున్నాయన్నది తమ పరిశోధన ఫలితాలతో గుర్తించే అవకాశముందని పరిశోధకులు అంటున్నారు. చాలా వైరల్ ఇన్ఫెక్షన్లలో మరణానికి స్వయంగా వైరస్ కారణం కాదు. ఆ వైరస్‌కు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందించే తీరు తీవ్రంగా ఉండటంతోనే సమస్య వస్తూ ఉంటుంది. గబ్బిలాల్లో ఇది నియంత్రణలో ఉంటుంది. వాటికి ఇన్ఫెక్షన్ సోకినా, వ్యాధి లక్షణాలేవీ కనిపించవు. ఈ పరిశోధన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రాణాంతక వైరస్‌ల నుంచి తట్టుకునే ‘అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి’ గబ్బిలాలకు ఎలా వస్తుందో, వాటి జన్యు క్రమ నిర్మాణం ద్వారా తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. text: అత్యుత్తమ విద్యా వ్యవస్థ, తల్లులకు సముచిత స్థానం, లింగ సమానత్వం.. ఇవి తమ పౌరులకు ఫిన్‌లాండ్ ఇచ్చిన కానుకలు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఫిన్‌లాండ్ ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇటీవలె ఫిన్‌లాండ్ వందో స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలకూ అనుసరణీయమైన ఆరు అత్యుత్తమ ఫిన్‌లాండ్ విధానాలివి. ఫిన్‌లాండ్‌లో పుట్టిన దాదాపు ప్రతి శిశువుకూ ఈ బాక్సే తొలి మంచం ప్రతి బిడ్డకీ ఓ డబ్బా గతంలో ఫిన్‌లాండ్‌లో పుట్టిన ప్రతి వెయ్యిమంది పసి పిల్లల్లో 65మంది చనిపోయేవారు. గతేడాది ఆ సంఖ్య 2. శిశు మరణాల రేటు తక్కువ ఉన్న దేశాల్లో అదీ ఒకటి. దీనికి కారణం తల్లయిన మహిళలకు అక్కడ లభించే ప్రత్యేక కార్డ్ బోర్డ్ బాక్సులే. దాదాపు ఎనభై ఏళ్లకు ముందు ఫిన్‌లాండ్‌లో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా తల్లయిన వాళ్లకు ఓ బేబీ కేర్ కార్డ్ బోర్డ్ బాక్స్‌ని ఇవ్వడం మొదలుపెట్టింది. పసిపిల్లల సంరక్షణకు ఉపయోగపడే వస్తువులతో పాటు స్లీపింగ్ బ్యాగ్స్, బయటి వాతావరణంలో వేసుకోవాల్సిన దుస్తులూ, డైపర్స్, చిన్న పరుపు లాంటి రకరకాల ప్రొడక్ట్స్ అందులో ఉంటాయి. ఫిన్‌లాండ్‌లో పుట్టిన దాదాపు ప్రతి శిశువుకూ ఆ బాక్సే తొలి మంచం. దాని కారణంగానే అక్కడ శిశు మరణాల సంఖ్య భారీగా తగ్గిందని ఫిన్నిష్ ప్రభుత్వం చెబుతుంది. దాంతో ఇప్పుడు అనేక ఇతర దేశాలూ ఆ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఫిన్‌లాండ్‌లో ఏడాదిపాటు ప్రసూతి సెలవులు లభిస్తాయి తల్లులకు భరోసా అమ్మలకు అత్యుత్తమ దేశం ఫిన్‌లాండేనని ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే సంస్థ తేల్చింది. వాళ్లకు అందే ప్రత్యేక శిశు సంరక్షణ బాక్స్‌తో పాటు ఇతర కారణాలూ ఫిన్‌లాండ్‌కి ఆ గుర్తింపు రావడానికి సాయపడ్డాయి. ఫిన్‌లాండ్‌లో ప్రసూతి సెలవులు ఏడాది పాటు లభిస్తాయి. పిల్లలకు మూడేళ్లు నిండే వరకూ తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరికి ఇంటి దగ్గర ఉండి వాళ్లను చూసుకునే వెసులుబాటు ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి వారికి నెలకు దాదాపు రూ.33వేల రూపాయలు సంరక్షణ భ‌ృతి కింద అందుతాయి. లింగ సమానత్వం విషయంలో ‘గ్లోబల్ జెండర్ గ్యాప్‌’ నివేదిక ప్రకారం ఫిన్‌లాండ్‌ది గతేడాది రెండో స్థానం. ఉద్యోగం చేసే తల్లులకు ఫిన్‌లాండ్ మూడో అత్యుత్తమ దేశమని ‘ది ఎకనమిస్ట్’ మ్యాగజీన్ పేర్కొంది. ఆ దేశ పార్లమెంటులో 42శాతం మంది మహిళా ప్రతినిధులున్నారు. అక్కడి మరో విశేషమేంటంటే.. తల్లులతో పోలిస్తే తండ్రులే చదువుకునే వయసున్న పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ తేల్చిన విషయమిది. అక్కడ ప్రీ స్కూల్ నుంచి పీజీ వరకు చదువంతా ఉచితం ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ’ టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు.. అందరికీ ఆమోదయోగ్యమైన విద్యా వ్యవస్థ ఫిన్‌లాండ్ సొంతం. ‘ప్రోగ్రామ్ ఫర్ ది ఇంటర్నేషనల్ అసెస్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్’(పిసా) నిర్వహించే పరీక్షల ఫలితాల ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ఫిన్‌లాండ్‌దే. సైన్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ప్రతిభ చూపించే ఒకే ఒక్క దేశం ఫిన్‌లాండ్ అని అంచనా. సైన్సులో విద్యార్థుల ప్రతిభలో ఆ దేశానిది 5వ స్థానం. అందరికీ నచ్చే మరో అంశమేంటంటే.. అక్కడ ప్రీ స్కూల్ నుంచి పీజీ వరకు చదువంతా పూర్తిగా ఉచితం. అవినీతి అత్యల్పం అవినీతికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసే ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్’ నివేదికల ప్రకారం అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ గత ఐదేళ్లుగా ముందు వరసలోనే ఉంది. సరస్సుల దేశం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు ఫిన్లాండ్. అక్కడ దాదాపు 1.8లక్షల సరస్సులున్నాయి. సుమారు నలభై వేల దీవులున్నాయి. వీటికి తోడు అక్కడి భూభాగంలో 75శాతం అటవీ ప్రాంతమే. యూరప్‌లో మరే దేశంలోనూ అంత పచ్చదనం లేదు. లెనిన్ మ్యూజియం బోల్షెవిక్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్‌కు ప్రత్యేకంగా మ్యూజియం ఉన్న దేశంగా కూడా ఫిన్‌లాండ్ ప్రత్యేకత సంతరించుకుంది. లెనిన్, స్టాలిన్‌లు తొలిసారి 1905లో దక్షిణ ఫిన్‌లాండ్‌లోని తాంపేరె నగరంలోనే కలుసుకున్నారు. ఈ మ్యూజియాన్ని ముగ్గురు సోవియట్ నాయకులు.. కృశ్చేవ్, బ్రెజ్నేవ్, గోర్బచేవ్‌లు సందర్శించటం కూడా విశేషం. భారీ సంస్థలెన్నో.. పూర్వ వైభవం కోల్పోయినా, ఇప్పటికీ ఆ దేశానికి చెందిన నోకియా సంస్థ లక్ష మందికి ఉపాధినిస్తోంది. 130 దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎస్సెమ్మెస్ సేవల్ని అందించే తొలి సెల్‌ఫోన్‌ని 1993లో ఆ దేశమే తయారు చేసింది. ప్రపంచంలో అతి పెద్ద నౌకలు ఫిన్‌లాండ్‌లోనే తయారవుతాయి. వీడియో గేమ్‌లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కూడా అక్కడ భారీగా ఉన్నాయి. కేవలం 50 లక్షల జనాభా ఉన్న ఫిన్‌లాండ్ ఎన్నో అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తూ ఇతర దేశాలకు కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోంది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నోకియా 1100 ఫోన్, యాంగ్రీ బర్డ్స్ గేమ్.. ఇవి ఫిన్‌లాండ్ ప్రపంచానికి ఇచ్చిన బహుమతులు. text: గోల్ కొట్టిన ప్ర‌తిసారీ క్రీడాకారులు హ‌త్తుకొని వేడుక‌లు చేసుకొనే బ‌దులు.. మోచేయి, మోచేయి తాకిస్తున్నారు ద‌క్షిణ కొరియా కేలీగ్ కూడా గ‌త‌వారం మొద‌లైంది. బెలార‌స్‌, నిక‌రాగ్వాలోని కొన్ని చిన్న లీగ్‌లూ ఎప్ప‌టిలానే జ‌రుగుతున్నాయి. అయితే క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి భ‌యం మొద‌లైన రెండు నెల‌ల్లో మొద‌లైన ప్ర‌ఖ్యాత‌ ఫుల్‌బాల్ లీగ్ మాత్రం బుండెస్‌లీగానే. ఇంత‌కీ ఫుట్‌బాల్ ఎలా ఆడుతున్నారు? క్రీడాకారులు ఎలా సామాజిక దూరం పాటిస్తున్నారు? శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎప్ప‌టిక‌ప్పుడు కొల‌వ‌డం, డిస్ఇన్ఫెక్టెంట్ బాల్స్‌ మైదానానికి వ‌చ్చేట‌ప్పుడు క్రీడాకారులు సామాజిక దూరం పాటించేందుకు వేర్వేరు బ‌స్సుల‌ను ఉప‌యోగిస్తున్నారు. క్రీడాకారులు, క్రీడా సిబ్బంది.. ఇలా అంద‌రూ త‌మ‌కు కేటాయించిన హోట‌ళ్ల‌లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనావైర‌స్ ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. బ‌స్సు దిగిన వెంట‌నే ఫేస్ మాస్క్‌లు వేసుకొని మైదానంలోకి అడుగుపెడుతున్నారు. మీడియా ప్ర‌తినిధుల‌తోపాటు ఇత‌రుల‌ కోసం శరీర ఉష్ణోగ్ర‌త‌ల‌ను కొలిచే కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రేక్ష‌కులను ఎవ‌రినీ రానివ్వ‌డం లేదు. గ్రౌండ్ ప‌రిస‌రాల్లో ఎవ‌రూ గుమిగూడే అవ‌కాశం లేకుండా పోలీసులు గ‌స్తీ కాస్తున్నారు. మైదానంలోకి కేవ‌లం 213 మందినే అనుమ‌తిస్తున్నారు. వీరిలో క్రీడాకారులు, కోచ్‌లు, బాల్ బాయ్స్‌ల సంఖ్య 98కి మించ‌కుండా చూస్తున్నారు. మ‌రో 115 మంది.. భ‌ద్ర‌తా సిబ్బంది, వైద్యులు, మీడియా ప్ర‌తినిధులు. స్టేడియం బ‌య‌ట భ‌ద్ర‌తా సిబ్బంది, సాంకేతిక సాయం అందించేవారి సంఖ్య మ‌రో 109 మంది వ‌ర‌కు ఉంటోంది. గేమ్ మొద‌ల‌య్యే ముందు, మ‌ధ్య‌లో ఒక‌సారి డిస్ఇన్ఫెక్టెంట్ల‌తో ఫుట్‌బాల్స్‌ను శుభ్రం చేయిస్తున్నారు. ఆర్‌బీ లీప్‌జిగ్‌లో చేతులు శుభ్రం చేసుకోవాలంటూ సూచిస్తున్న బోర్డు సామాజిక దూరం ఇలా.. అద‌న‌పు క్రీడాకారులు, కోచ్‌లు మాస్క్‌లు వేసుకొని సామాజిక దూరం పాటిస్తూ బెంచీల్లో కూర్చుంటున్నారు. కొన్నిసార్లు మ‌ధ్య‌లో ఒక వ‌రుస‌ను ఖాళీగా వ‌దిలేస్తున్నారు. హెడ్ కోచ్‌ల‌ను మాత్రం మాస్క్‌లు లేక‌పోయినా అనుమ‌తిస్తున్నారు. వారు ఇచ్చే సూచ‌న‌లు క్రీడాకారుల‌కు విన‌ప‌డాలి కాబట్టి వారికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి కాదు. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు అద‌న‌పు క్రీడాకారులు మాస్క్‌లు తీసేసి గట్టిగా అరుస్తున్నారు. మ‌రోవైపు ప్లేయ‌ర్‌ల‌ను మార్చేట‌ప్పుడు కూర్చోడానికి వ‌చ్చే క్రీడాకారుడు మాస్క్ తెచ్చుకుంటున్నారు. హ‌త్తు కోవ‌డానికి బ‌దులు.. మోచేత్తో సంబరాలు శ‌నివారం ఆడిన ఆరు గేమ్‌ల‌లోనూ ఆట మాత్రం మునుప‌టిలానే ఉంది. మొద‌ట ఎవ‌రు 16 గోల్స్ వేస్తే వారే గేమ్ సొంతం చేసుకున్న‌ట్లు. కానీ గోల్ కొట్టిన ప్ర‌తిసారీ హ‌త్తుకొని వేడుక‌లు చేసుకొనే బ‌దులు.. మోచేయి, మోచేయి కొట్టుకుంటున్నారు. అయితే, హోఫెన్‌హీమ్‌పై హెర్తా బెర్లిన్ క్రీడాకారులు గెలిచిన‌ప్పుడు సంబరాలు మునుప‌టిలానే క‌నిపించాయి. కానీ హెర్తా క్రీడాకారుల‌కు ఎలాంటి జ‌రిమానా విధించ‌లేదు. ఎందుకంటే హ‌త్తుకోకుండా ఉండ‌టం అనేది ఇక్క‌డ కేవ‌లం మార్గ ద‌ర్శ‌కం మాత్ర‌మే. నిబంధ‌న కాదు. బెంచీల్లో ఉత్సాహం నింపేందుకు కేవ‌లం ప‌దుల సంఖ్య‌లో మాత్ర‌మే ప్ర‌జ‌లు క‌నిపించ‌డంతో.. ప్లేయ‌ర్లు, మేనేజ‌ర్లు మాట్లాడుకునేవి, బాల్ తన్నేట‌ప్పుడు వ‌చ్చే సౌండ్లు కూడా టీవీ చూసేవారికి వినిపిస్తున్నాయి. క్రీడాకారులు, మేనేజ‌ర్ల‌ను ఇంట‌ర్వ్యూలు చేసేట‌ప్పుడు సామాజిక దూరం పాటించేలా చూసేందుకు రిపోర్ట‌ర్లు.. మైక్‌ల‌కు అద‌నంగా క‌ర్ర‌లు, రాడ్డుల‌ను క‌డుతున్నారు. మ్యాచ్‌ల అనంత‌రం ఇంట‌ర్వ్యూల‌ను వీడియో కాన్ఫెరెన్స్‌ల్లో చేస్తున్నారు. ప్రేక్ష‌కులు రావ‌డం లేదా? స్టేడియంల బ‌య‌ట జ‌నాలు లేకుండా చూసేందుకు జ‌నాలు త‌క్కువ‌గా ఉండే ప్రాంతాల‌ను గేమ్‌లు ఆడేందుకు ఎంచుకుంటున్నారు. "చాలా ఆశ్చ‌ర్యంగా అనిపించింది. మా అంచనాల ప్ర‌కారం... అభిమానులు బాగానే వ‌స్తార‌ని అనుకున్నాం. కానీ సిటీ మ‌ధ్య‌లో జ‌రిగిన మ్యాచ్‌కు స్టేడియం బ‌య‌ట చాలా కొంచెం మంది మాత్రమే కనిపించారు"అని డార్ట్‌మండ్ పోలీసుల అధికార ప్ర‌తినిధి ఓలివ‌ర్ పీలెర్ తెలిపారు. "పోలీసులు, న‌గ‌ర ప‌రిపాల‌నా విభాగం ప‌దేప‌దే చేసిన అభ్య‌ర్థ‌న‌లకు మంచి ఫ‌లితం వ‌చ్చిన‌ట్టు అనిపించింది. జ‌నాలు ఎక్కువ‌గా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది". అయితే ఈ ఫుట్‌బాల్ నిర్వ‌హ‌ణ విష‌యంలో అంద‌రూ సంతోషంగా లేరు. "గోల్ కొట్టిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకోక‌పోతే.. ఏదోలా అనిపిస్తుంది" "ఈ రోజు చాలా వింత‌గా అనిపించింది. నాకు భావోద్వేగాలు కొంచెం ఎక్కువ‌గా ఉంటాయి. గోల్ కొట్టిన వెంట‌నే క్రీడాకారుణ్ని హ‌త్తుకొని అభినందించాల‌ని అనుకుంటాను. ఈ రోజు నేన‌ది చేయ‌లేక‌పోయా"అని ఫార్చునా డ‌సెల్‌డార్ఫ్ మేనేజ‌ర్ యూవ్ రోస్ల‌ర్ వివ‌రించారు. "అసలు ఎలాంటి శ‌బ్దాలూ లేవు. గోల్ కొట్టిన‌ప్పుడు, బాల్ పాస్ చేసిన‌ప్పుడు, మంచి స్కోర్ వ‌చ్చినప్పుడు.. అంతా నిశ్శ‌బ్ద‌మే. ఇది చాలా వింత‌గా అనిపించింది"అని డార్ట్‌మండ్ కోచ్ లూసీన్ ఫార్వే అన్నారు. "ప్రేక్ష‌కులు మ్యాచ్‌లు చూడ‌టానికి రాక‌పోవ‌డం బాధాక‌రం. మేం వారిని చూడ‌లేక‌పోతున్నాం. క‌ల‌వ‌లేక‌పోతున్నాం’’ అని ఫ్రీబ‌ర్గ్ కోచ్ క్రీస్టియ‌న్ స్ట్రీచ్ వ్యాఖ్యానించారు. "ఈ ప‌రిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండ‌దు. అయితే ప్రేక్ష‌కులు రావ‌డం లేద‌నో లేక వారిని చూడ‌లేక‌పోతున్నామ‌నో నాణ్య‌త‌లో రాజీప‌డం". మ‌రోవైపు సోష‌ల్ డిస్టెన్సింగ్ నిబంధన‌లు పాటించ‌కుండా సంబరాలు చేసుకోవ‌డాన్ని హెర్తా బెర్లిన్ అధినేత బ్రూనో ల‌బ్బాడియా స‌మ‌ర్థించారు. "ఇది ఫుట్‌బాల్ ఆట‌లో భాగ‌మైపోయింది. అయినా మేం చాలాసార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నాం. సంబ‌రాలు జ‌రుపుకోక‌పోతే ఏదో పోయిన‌ట్లు అనిపిస్తుంది". కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జ‌ర్మ‌నీ ఫుట్‌బాల్ ప్రీమియ‌ర్ లీగ్ బుండెస్‌లీగా శ‌నివారం ప్రారంభ‌మైంది. క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌ల న‌డుమ దీన్ని మొద‌లుపెట్టారు. ఇక‌పై జ‌ర‌గ‌బోయే ప్రీమియ‌ర్ లీగ్‌లు ఎలా ఉండ‌బోతున్నాయో దీన్ని చూస్తే అర్థమ‌వుతోంది. text: రాబర్ట్, టిఫనీ విలియమ్స్ దంపతుల బీబీ అండ్ టీ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఏడాది మే 31వ తేదీ వీరి ఖాతాలోకి బ్యాంకు పొరపాటున 1,20,000 డాలర్లు డిపాజిట్ చేసింది. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు. నిజానికి ఆ డబ్బులను ఒక పెట్టుబడి సంస్థకు బదిలీ చేయాల్సి ఉండగా పొరపాటున వీరి ఖాతాలో జమ చేశారని పోలీసులు చెప్పారు. అయితే తమ ఖాతాలోకి డబ్బులు ఎలా వచ్చాయో విలియమ్స్ దంపతులకు తెలీదు. కానీ ఖాతాలో డబ్బులు చూడగానే ఖర్చు చేయటం మొదలుపెట్టారు. ఆ డబ్బులతో ఒక ఎస్‌యూవీతో పాటు ఇతర వస్తువులూ కొనుగోలు చేశారని పోలీసులు చెప్తున్నారు. బ్యాంకు సిబ్బంది జూన్ 20వ తేదీన తమ పొరపాటును గుర్తించారు. వెంటనే విలియమ్స్ ఖాతాలో నుంచి డబ్బును వెనక్కు తీసుకుని సరైన ఖాతాలోకి పంపించారు. అయితే.. అప్పటికే ఆ దంపతులు దాదాపు 1,07,000 డాలర్లు (దాదాపు రూ. 77 లక్షలు) ఖర్చు పెట్టేశారని పోలీసులు చెప్పారు. బ్యాంకు సిబ్బంది వీరిని సంప్రదించినపుడు.. ''తన దగ్గర ఆ డబ్బులేవీ లేవని వారికి అన్నీ ఖర్చు పెట్టేశామని చెప్పారు'' అని పోలీసులు ఫిర్యాదులో పేర్కన్నట్లు సీబీఎస్ న్యూస్ తెలిపింది. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి చెల్లించటానికి ఒక ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తామని విలియమ్స్ చెప్పారు. అయితే.. ఆ తర్వాత ఆ దంపతులు మళ్లీ బ్యాంకు సిబ్బందితో మాట్లాడలేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో బ్యాంకు డబ్బును ఈ దంపతులు చోరీ చేశారంటూ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బుతో ఒక చెవర్లే ట్రావెర్స్ ఎస్‌యూవీతో పాటు రెండు కార్లు, ఒక క్యాంపర్, ఒక రేస్ కారు, ఇతర గృహోపకరణాలు కొనుగోలు చేశారని ఫిర్యాదులో వివరించారు. అంతేకాదు.. స్నేహితులకు 15,000 డాలర్లు సాయం కూడా చేశారని చెప్పారు. దర్యాప్తు అధికారులు జూలైలో ఈ దంపతులతో మాట్లాడినపుడు.. తమ బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు తమవి కావని తమకు తెలుసునని రాబర్ట్ (36), టిఫనీ (35) అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ డబ్బులు రాకముందు వీరి ఖాతాలో సగటున 1,000 డాలర్లు బ్యాలెన్స్ ఉండేది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. ''క్లయింటు గోప్యతా ప్రమాణాల దృష్ట్యా ఈ అంశం వివరాల గురించి మేం వ్యాఖ్యానించలేం. మా క్లయింట్ల మీద ప్రభావం చూపే ప్రతి అంశాన్నీ సత్వరం పరిష్కరించటానికి ప్రయత్నిస్తాం'' అని బీబీ అండ్ టీ బ్యాంక్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు పంపిన ఒక ప్రకటనలో చెప్పింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన దంపతుల ఖాతాలోకి అనుకోకుండా 1.20 లక్షల డాలర్లు వచ్చిపడ్డాయి. అవి ఎలా వచ్చాయో వారికి తెలీదు. కానీ వెంటనే అందులో లక్ష డాలర్లు ఖర్చు పెట్టేశారు. వాళ్లు డబ్బులు దొంగిలించారని బ్యాంకు కేసు పెట్టింది. text: ఎన్టీఆర్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై కథానాయకుడిగా... రాజకీయాల్లో ప్రజానాయకుడిగా తనదైన ముద్రవేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. జాతీయస్థాయి రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించారు. అయితే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీకి పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు. ఆయనను ఓడించి జాయింట్ కిల్లర్‌గా తెలుగు రాజకీయాల్లో నిలిచిన వ్యక్తి జక్కుల చిత్తరంజన్‌దాస్‌. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ఓబీసీ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎన్టీఆర్‌పై కల్వకుర్తిలో పోటీ చేసినప్పటి విషయాలను బీబీసీతో పంచుకున్నారు. 'జైపాల్ రెడ్డి సూచన.. ఎన్టీఆర్ ఆమోదం' ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989లో ఎన్నికలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావించారు. ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహించేలా తనకు అచ్చొచ్చిన హిందూపురంను ఎంచుకున్నారు. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలనే సమస్య వచ్చింది. జైపాల్ రెడ్డి సూచన మేరకే కల్వకుర్తి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని చిత్తరంజన్ దాస్ చెప్పారు. ''అప్పుడు జైపాల్ రెడ్డి జనతా పార్టీలో ఉండేవారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జనతా పార్టీ, టీడీపీ కలిసి పోటీలోకి దిగాయి. జైపాల్ సూచన మేరకే ఎన్టీఆర్ మా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు'' అని చిత్తరంజన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు బరిలోకి దిగడంతో కల్వకుర్తి నియోజకవర్గం ఆ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించించుకుంది. కాంగ్రెస్ నుంచి ఎవరు? కల్వకుర్తి నియోజక వర్గంలో ఎన్టీఆ‌ర్‌కు పోటీగా చిత్తరంజన్ దాస్‌ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అప్పటికి ఆయనకు ఒక్క ఎన్నికల్లో గెలిచిన అనుభవం మాత్రమే ఉంది. ''1985లో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడే తొలిసారిగా నాకు కల్వకుర్తి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. వారి నమ్మకాన్ని నిలబెట్టాను. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి లింగారెడ్డిపై గెలిచాను. అందుకే 1989 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నావైపే మొగ్గు చూపింది'' అని చిత్తరంజన్ చెప్పారు. విద్యార్థి దశ నుంచే తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘కచ్చితంగా గెలుస్తాననుకున్నా’ 'నాకు వ్యతిరేకంగా బరిలో ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పటికే ఆయన నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా దేశ రాజకీయాల్లోనూ ప్రముఖంగా ఉన్నారు. కానీ, ఆయనపై కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉండేది' అని చిత్తరంజన్ పేర్కొన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత అనంతరాములు అన్ని విధాలుగా సహకరించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ''ఎన్టీఆర్‌పై నేను పోటీకి రాలేదు. ఆయనే నాతో పోటీకి వచ్చారు. అప్పటికే కల్వకుర్తిలో బాగా పనిచేశా. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలుపిస్తుందని నమ్మా'' అని చిత్తరంజన్ చెప్పారు. అటు రాజీవ్... ఇటు ఎన్టీఆర్ ఎన్టీఆర్ పోటీకి దిగడంతో కల్వకుర్తి నియోజకవర్గం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ.. చిత్తరంజన్ తరఫున ప్రచారం చేసేందుకు కల్వకుర్తికి వచ్చారు. స్వయంగా తానే పోటీ చేస్తుండటంతో ఎన్టీఆర్ ఆ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ''నేనే కాదు నా చెప్పును నిలబెట్టినా ప్రజలు గెలిపిస్తారని ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ చెప్పేవారు. ఆయన ప్రచారానికి జనాలు విపరీతంగా వచ్చేవారు. నాకున్న వనరులతో నేను ప్రచారం చేసుకున్నాను'' అని చిత్తరంజన్ చెప్పారు. ఎన్టీఆర్ ఓటమి... అధికారంలోకి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 287 సీట్లలో పోటీ చేసి 181 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 74 సీట్లకే పరిమితిమైంది. కమ్యూనిస్టు పార్టీలు 14 సీట్లు, బీజేపీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్టీఆర్ హిందూపురంలో గెలిచినప్పటికీ కల్వకుర్తి నియోజకవర్గంలో ఓడిపోయారు. కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్‌కు 54,354 ఓట్లు వస్తే ఎన్టీఆర్‌కు 50,786 ఓట్లు వచ్చాయి. ఎన్టీఆర్‌పై 3,568 ఓట్ల మెజార్టీతో చిత్తరంజన్ గెలిచి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. 'చరిత్రకెక్కింది... మంత్రి పదవి దక్కింది' 'నా గెలుపుతో సీఎంను ఓడించిన రికార్డు దక్కింది. మొదటి నుంచి గెలుస్తాననే అనుకున్నా. నా నమ్మకాన్ని ఓటర్లు వమ్ముచేయలేదు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. నిజాయితీగా పనిచేశా. పైగా మా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కాంగ్రెస్ కూడా కల్వకుర్తిలో బలంగా ఉండేది. స్థానికుడ్ని గెలిపిస్తేనే అందుబాటులో ఉండి పనులు చేస్తారని ఓటర్లు భావించారు. అందుకే వారు ఎన్టీఆర్‌ను కాదని నన్ను ఎన్నుకున్నారు ' అని తన విజయానికి గల కారణాలను చిత్తరంజన్ వివరించారు. గెలిచాక దిల్లీకి వెళ్లి రాజీవ్ గాంధీని కలిస్తే ఆయన అభినందించారని చెప్పారు. ''నాతో పాటు చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆ ఎన్నికల్లో గెలిచారు. మా ప్రభుత్వమే ఏర్పాటైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కేబినెట్‌లో నాకు మంత్రి పదవి దక్కింది'' అని చిత్తరంజన్ తెలిపారు. ‘కల్వకుర్తి ప్రజల విజయం’ ఎన్టీఆర్ నా చేతిలో ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని చిత్తరంజన్ పేర్కొన్నారు. 'రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్ ఇద్దరూ గొప్ప నేతలు. వ్యక్తిగత విమర్శలు పెద్దగా చేసుకునేవారు కాదు. పార్టీల నిర్ణయాలు, పాలన వైఫల్యాలపైనే అప్పుడు విమర్శలుండేవి' అని తెలిపారు. మనం నిజాయితీగా పనిచేస్తే మన ప్రత్యర్థి ఎంత పెద్దవారైనా ప్రజలు మనల్నే గెలిపిస్తారని చెప్పడానికి కల్వకుర్తి విజయం ఒక ఉదాహరణ అని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''ఎన్టీఆర్ నా చేతిలో ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఆయన సీఎంగా ఉన్నప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడూ అడ్డుకోలేదు'' అని ఆయనపై గెలిచిన చిత్తరంజన్ దాస్ బీబీసీతో అన్నారు. జెయింట్ కిల్లర్ ... చిత్తరంజన్ దాస్ text: ఫ్రాన్స్‌తో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను ఆయన దూకుడుగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అవ్యవస్థీకృత రంగానికి, మధ్యతరగతికి కొత్త బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలపై అనర్గళంగా మాట్లాడారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానన్న తన ఎన్నికల హామీపై ఆత్మరక్షణలో పడిపోయారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ప్రధానాంశమైన వ్యవసాయం గురించి పొదుపుగా మాట్లాడారు. గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. మోదీ ప్రతీ సందర్భాన్ని ఎన్నికల శంఖారావం పూరించేందుకు బాగా ఉపయోగించుకుంటారు. లోక్‌సభలో ఆయన ప్రసంగం, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న రీతిలో సాగింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. నామమాత్రపు లాభాలు ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాంటి ఇతర ఆర్థిక వ్యవస్థలను పెద్ద నోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) దెబ్బతీశాయి. ఈ అంశం, వ్యవసాయ సంక్షోభం గురించి మోదీ తన ప్రసంగంలో దాదాపు చివర్లో మాట్లాడారు. ఈ అంశాల్లో తనను తాను సమర్థించుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని, వీటి గురించి వివరంగా మాట్లాడి అనవసరంగా ఇబ్బందుల్లో పడకూడదని ఆయన అనుకున్నారని ఇది సూచిస్తోంది. గ్రామీణ, ఇతర ఆర్థిక వ్యవస్థలపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ చూపించిన ప్రభావమే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం. అయినప్పటికీ, ఈ రెండు నిర్ణయాలను మోదీ ప్రశంసిస్తారు. ఈ నిర్ణయాలు ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయనే విషయాన్ని అంగీకరించలేదు. గ్రామీణ, ఇతర ఆర్థిక వ్యవస్థలపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ చూపించిన ప్రభావమే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం. అదే సమయంలో ఆయన కాంగ్రెస్‌ను తప్పుబట్టారు. రైతు రుణాల మాఫీ లాంటి సాధ్యంకాని హామీలను కాంగ్రెస్ ఇస్తోందని విమర్శించారు. వ్యవసాయోత్పత్తులకు బీజేపీ ప్రభుత్వాల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ కనీస మద్దతుధరలు చెల్లిస్తున్నాయని చెప్పారు. రుణమాఫీలు దళారులు కుంభకోణాలకు పాల్పడేందుకు అవకాశమిస్తాయన్నారు. రైతులకు కనీస ఆదాయం అందించేందుకు బడ్జెట్‌లో ప్రకటించిన పథకం రైతు సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని మోదీ చెప్పారు. ఈ పథకంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని, నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఛత్తీస్‌గఢ్‌లో, కొంత వరకు రాజస్థాన్‌లో ఆ పార్టీ విజయానికి తోడ్పడిందనే విషయాన్ని ప్రధాని మరిచిపోయినట్లున్నారు. మోదీ తన ప్రసంగంలో 'నవ భారత్‌'పై దృష్టి కేంద్రీకరించారు. నమ్మకం, ఆశ, పట్టుదలే ఆలంబనగా ఉండే నవ భారతం అన్ని సవాళ్లను అధిగమిస్తుందని, అవినీతిని పారదోలుతుందని చెప్పారు. అవినీతి చెదల వంటిదని, దీనిని సత్వరం నిర్మూలించకపోతే వ్యవస్థలను లోపలి నుంచి నాశనం చేస్తుందని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు కూడా మోదీ ప్రసంగాల్లో ఇదే అంశం ప్రధానంగా ఉండేది. కాంగ్రెస్‌పై, గాంధీ-నెహ్రూ కుటుంబ అనువంశిక పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. వారసత్వ రాజకీయాల నుంచి అవినీతిని వేరు చేయలేమనేది ఆయన ఆలోచన. కాంగ్రెస్‌ను విమర్శించే క్రమంలో సమకాలీన భారత చరిత్రను రెండు దశలుగా విభజించి, కేలండర్‌లో వ్యవహరించే 'బీసీ(క్రీస్తుపూర్వం)', 'ఏడీ(క్రీస్తుశకం)' అనే మాటలకు మోదీ వ్యంగ్యంతో కూడిన భాష్యం చెప్పారు. బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ (కాంగ్రెస్‌కు ముందు) అని, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ (కాంగ్రెస్ కుటుంబ వారసత్వం తర్వాత) అని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్‌ను రద్దుచేయాలని మహాత్మా గాంధీ చెప్పారని, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' కావాలని మహాత్ముడు కూడా కోరుకొన్నారని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన 'అచ్చే దిన్(మంచి రోజులు)' నినాదానికి కొత్త ఓటర్లు బాగా స్పందించారు. ఆయనకు పెద్దయెత్తున ఓట్లు వేశారు. రానున్న ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కొత్త ఓటర్ల మనసు గెలుచుకోవడంపై మోదీ దృష్టి సారించారు. గత నాలుగున్నరేళ్లకు పైగా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ పరిస్థితులను చూసింది. ప్రైవేటు రంగంలో ప్రభుత్వం నేరుగా, తరచుగా జోక్యం చేసుకొంటోంది. 'చిన్న ప్రభుత్వం, అధిక పాలన' అనే బీజేపీ ప్రకటనలకు ఇది విరుద్ధమైనది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీతో చిన్న, మధ్యతరహా తయారీ రంగం, అవ్యవస్థీకృత రంగం దెబ్బతిన్నాయి. పర్యవసానంగా ఉపాధి సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ పాలనకు, తన పాలనకు మధ్య పోలిక పెడుతూ, తాను చెప్పదలచుకొన్నదంతా చెప్పేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధికారాన్ని ఆస్వాదిస్తూ రాజకీయాలు చేసిందని, తాను, తన ప్రభుత్వం సేవాభావంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కేవలం ఫోన్ కాల్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పెద్దయెత్తున డబ్బును పార్టీ సన్నిహితులకు ఇప్పించిందని మోదీ ఆరోపించారు. ఒక కుటుంబ సభ్యుడు (కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రానుద్దేశించి) లెక్కాపత్రంలేని సంపదను అన్ని చోట్లా పోగేశారని విమర్శించారు. రఫేల్ ఒప్పందాన్ని కాంగ్రెస్ మధ్యవర్తులు, (సోనియా) కుటుంబ సంబంధీకులు సన్నిహితులకు కట్టబెట్టాలనుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలతో కూడిన 'మహా కూటమి'ని 'మహా కల్తీ కూటమి'గా ప్రధాని మోదీ అభివర్ణించారు. (చిత్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ) ప్రతిపక్షాలతో కూడిన 'మహా కూటమి'ని 'మహా కల్తీ కూటమి'గా ప్రధాని అభివర్ణించారు. కాంగ్రెస్ మాదిరే ఇందులోని పార్టీలు కూడా స్వీయ ప్రయోజనాల కోసమే జట్టు కట్టాయనే అర్థంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీల తీరే అంతని చెప్పారు. 2019 ఎన్నికల్లో మోదీ ప్రచారం ప్రధానంగా ఏ అంశం చుట్టూ తిరగనుందో గురువారం నాటి ప్రసంగంతో స్పష్టమైపోయింది. ఆయన తనను నిజాయతీపరుడిగా, భారత్‌ను అవినీతిరహితంగా ఉంచగలిగిన, అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాయకుడిగా ప్రజలకు చూపించుకొనే ప్రయత్నం చేయనున్నారు. దర్యాప్తు సంస్థలు దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులపైనా, వారి కుటుంబ సభ్యులపైనా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికలను అవినీతికీ, నిజాయతీకి మధ్య సమరంగా చూపిస్తే పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల పట్టణ ప్రాంతాల్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులను అధిగమించగలమని బీజేపీ ఆశిస్తోంది. మరి గ్రామాల సంగతి? గ్రామీణ భారత సమస్యలకు మోదీ ప్రసంగంలో సరైన సమాధానమే లేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రధాని నరేంద్ర మోదీ 16వ లోక్‌సభలో తన చివరి ప్రసంగంలో కాంగ్రెస్ అవినీతిపై, గాంధీ-నెహ్రూ కుటుంబంపై పెద్దయెత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. భారతదేశ ఏకైక నైతిక సంరక్షకులుగా తనను, తాను ప్రాతినిధ్యం వహించే భారతీయ జనతా పార్టీని ప్రజలకు చూపించేందుకు ప్రయత్నించారు. text: ఈ సినిమా ఆర్ఎంఎస్ టైటానిక్ అనే పేరున్న ఓ పెద్ద ఓడకు సంబంధించిన కథ. ఇంగ్లాండ్ లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు తన మొదటి యాత్రపై బయలుదేరిన ఈ నౌక 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ భారీ మంచు శకలంతో ఢీకొని మునిగిపోతుంది. ఈ ప్రమాదంలో 1500కి పైగా స్త్రీలు, పురుషులు, పిల్లలు మృతి చెందారు. టైటానిక్ మునిగిపోవడానికి ముందు కొద్ది గంటల్లో ఏమేం జరిగిందన్న విషయంపై అనేక అపోహలు, కథలు నేటికీ ప్రచారంలో ఉన్నాయి. అయితే 1997లో జేమ్స్ కేమరాన్ దీనిపై తీసిన 'టైటానిక్' సినిమా చాలా బాగా నడిచింది. ఆస్కార్ సహా అనేక అవార్డులు గెల్చుకున్న ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. సినిమాలో ఏం జరిగింది? ఈ సినిమా నిర్మాణానికి చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేశారు. అలాగే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా చాలా ఎక్కువే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషయంపై చాలా మందికి విభేదాలున్నాయి. సినిమా చివరలో హీరో జాక్ తన ప్రాణాలర్పించి హీరోయిన్ రోజ్‌ను రక్షించడం కొందరికి మింగుడు పడలేదు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓడ మునిగిపోయాక అనుకోకుండా జాక్, రోజ్‌లకు ఒక బల్లచెక్క లభిస్తుంది. ఇద్దరూ దానిపై కూర్చొని తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే సముద్రంలో మంచునీటిలో ఎక్కువ సేపు ఉండడం చాలా ప్రమాదకరం. కానీ ఇద్దరూ దానిపైకి ఎక్కితే అది మునిగిపోతుంది. ఆ బల్ల పెద్దదిగా, ఇద్దరు ఎక్కడానికి అనువుగానే ఉంటుంది. కానీ అది ఇద్దరి బరువును ఆపలేదు. అయితే చాలా ఏళ్లుగా అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నేమిటంటే రోజ్‌తో పాటు జాక్ కూడా నిజంగానే ప్రాణాలతో బయటపడలేకపోయేవాడా? నిజంగానే ఆ చెక్కబల్ల (తలుపు) ఇద్దరి ప్రాణాల్ని కాపాడేందుకు అనువుగా లేదా? ఈ సినిమాను నిర్మించిన జేమ్స్ కేమెరాన్‌ ఈ ప్రశ్నను ఎన్నో సార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దానికి సమాధానం ఇప్పుడు వెల్లడైంది. 'వానిటీ ఫేర్' అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా జేమ్స్‌ను 'టైటానిక్‌'లో జాక్ కోసం రోజ్ ఆ చెక్క బల్లపై కాస్తంత స్థలం ఎందుకు ఇవ్వలేకపోయిందని అడిగారు. జాక్‌ను ఎందుకు కాపాడలేదు? ఈ ప్రశ్నకు ఆయన చాలా నింపాదిగా జవాబిచ్చారు. "దీనికి సూటిగా జవాబు చెప్పాలంటే.. స్క్రిప్ట్‌లో 147వ పేజీలో జాక్ చనిపోతాడు అని ముందే రాసేశాం. ఇది కళా దృష్టితో తీసుకున్న నిర్ణయం" అని కేమెరాన్ చెప్పారు. "ఆ తలుపు ఒక్క రోజ్‌ బరువును మాత్రమే ఆపేంత పెద్దది. ఇద్దరి బరువును ఆపలేదు. 20 ఏళ్ల తర్వాత కూడా ఇదే విషయంపై చర్చించుకోవడం నాకు చిన్నపిల్లల పోట్లాటలా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా చాలా ప్రభావితం చేసిందనడానికీ, జనాలకు జాక్ ఎంతగా నచ్చేశాడంటే అతని మరణాన్ని తట్టుకోలేకపోయారనడానికీ ఇది నిదర్శనం" అని కేమెరాన్ చెప్పారు. సముద్రగర్భంలో అందమైన రహస్యం కేమెరాన్ తన జవాబును ఇలా కొనసాగించారు: "ఒకవేళ జాక్ ప్రాణాలతో మిగిలిపోతే ఈ సినిమా అర్థరహితంగా తయారయ్యేది.. ఈ సినిమా మరణానికీ, వియోగానికీ సంబంధించినది. కాబట్టి జాక్ చనిపోవాల్సిందే. ఈ సినిమాలో చూపినట్టయినా చనిపోవాలి లేదంటే ఓడ శకలం ఏదైనా అతని మీద పడడం వల్లనైనా అతడు మరణించాలి. దీనికే కళ అని పేరు. కొన్ని అంశాల్ని కళా దృష్టితో మాత్రమే రాస్తుంటాం. భౌతిక కారణాల వల్ల కాదు." 'ఫిజిక్స్ కాదు, కళనే కారణం' జేమ్స్ కేమరాన్‌ను అడిగిన తదుపరి ప్రశ్న - సాధారణంగా మీరు భౌతికశాస్త్రపరమైన అంశాల విషయంలో చాలా కచ్చితంగా ఉంటారని చెబుతారు కదా... దీనికి ఆయన ఈ విధంగా జవాబిచ్చారు, "నిజమే, ఉంటాను. అందుకే దాదాపు రెండు రోజుల పాటు నేను ఆ నీళ్లలో ఆ చెక్క బల్లపై చాలా మందిని కూర్చోబెడుతూ అనేక ట్రయల్స్ వేశాను. అలా దానిని కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే మోసేంతగా, రోజ్ కూర్చోవడానికి అనువుగా ఉండేలా చేశాను. ఆ చల్లటి నీటిలో రోజ్ మరో మూడు గంటల కూర్చోవాలి. అదే సమయంలో అది మునిగిపోవద్దు." "మరో గంట తర్వాత తనను రక్షించడానికి లైఫ్ బోట్ వస్తుందనే విషయం జాక్‌కు తెలియదు. అతడు చనిపోతాడు. ఈ సినిమాలో మీరు చూసిన ముగింపు ఇదే. అయితే ఈ కథలో ఒక్కరే ప్రాణాలతో బయటపడాలనే విషయంలో మాత్రం నేను అప్పుడూ ఇదే నమ్మాను. ఇప్పటికీ అదే నమ్ముతున్నాను" అని కేమరాన్ అన్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టైటానిక్.. ఒక భయంకరమైన ఓడ ప్రమాదం మధ్యలో ఓ యువ ప్రేమ కథను హృద్యంగా చిత్రించిన సినిమా. ఈ విషాదాంత సినిమాలో తన ప్రియురాలిని రక్షించడం కోసం ప్రియుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఆ ప్రియురాలు చివరి దాకా ఆయన ప్రేమలోనే మునిగితేలుతూ జీవితం గడిపేస్తుంది. text: మరి బీరువా నిండా పేరుకుపోయిన పాత వాటినేంచేస్తారు? వాటిని చూసి చూసి పడేయలేక.. ఆక్స్‌ఫామ్ లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేస్తారు. 2017లో తమ చారిటీ స్టోర్‌కు ఇలాంటి బట్టలు రావడం రెండు శాతం పెరిగిందని ఆక్స్‌ఫామ్ సంస్థ చెబుతోంది. What is the future of used clothing now that no one wants our used clothes anymore? ఆ సంస్థలు వాటిలో 10-20% బట్టలను మాత్రమే తమ చారిటీ షాపుల ద్వారా అమ్ముతున్నారు. తక్కిన వాటిని భారత్, పాకిస్తాన్, ఉగాండా, హంగేరి లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటిని ఆయా దేశాల్లోని సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లో అమ్ముతారు. ఈ సెకండ్‌ హ్యాండ్ దుస్తుల మార్కెట్‌కు ఈ మధ్య కాలంలో డిమాండ్ తగ్గుతోంది. ఎందుకు? ఎగుమతుల్లో తగ్గుదల.. ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ దుస్తుల ఎగుమతుల విలువ 400 కోట్ల అమెరికా డాలర్లు. కానీ ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఈ దుస్తుల ఎగుమతి, దిగుమతులు, ఆ దుస్తుల విలువ గణనీయంగా తగ్గాయి. అమెరికా, ఇంగ్లండ్ దేశాల నుంచి సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులను వచ్చే ఏడాది నుంచి నిలిపేస్తున్నట్టు రువాండా, కెన్యా, ఉగాండా, టాంజానియా, దక్షిణ సూడాన్‌లు ఇప్పటికే ప్రకటించాయి. ''మా దేశంలో దుస్తుల పరిశ్రమలను స్థాపించి, అభివృద్ధి చేసుకోనున్నాం..'' అని రువాండా అధ్యక్షుడు గత జూన్‌లో అన్నారు. సెకండ్‌ హ్యాండ్ ఎగుమతుల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది.. ఈ దేశాలు తీసుకున్న నిర్ణయం తమ సెకండ్ హ్యాండ్ దుస్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికా భావిస్తోంది. రువాండా, ఉగాండా, టాంజానియా దేశాలతో ఈ వ్యాపార సంబంధాలపై వేసవిలో సమీక్షిస్తామని తెలిపింది. రాస్ బ్యార్రీ రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే ఒక్కసారిగా డిమాండ్ తగ్గిపోవడం కావచ్చు ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలూ.. అమ్ముడుపోని దుస్తులను కొనాలని ఇంగ్లండ్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. ఎల్.ఎమ్.టి టెక్స్‌టైల్ సంస్థ గత ముప్ఫై సంవత్సరాలుగా ఇంగ్లండ్‌లో ఈ వ్యాపారం చేస్తోంది. ఈ వ్యాపారం చేస్తున్నవారు ప్రస్తుతం ఎక్కువ లేరని సంస్థ యజమాని రాస్ బ్యార్రీ చెబుతున్నారు. బాగా వాడిన, తక్కువ వాడిన దుస్తులను వాటి నాణ్యతను బట్టి వివిధ రకాలుగా వేరు చేస్తారు. మళ్లీ వాటిని ఒక్కో బ్యాగు 45 కేజీలు వుండేట్లు ప్యాక్ చేస్తారు. ఒక్కో సంచిని 5-150 పౌండ్ల ధరకు విదేశీ కొనుగోలుదారులకు అమ్ముతారు. బ్రాలు, ఫుట్‌బాల్ కిట్లు ఎక్కువగా అమ్ముడు పోతాయని రాస్ బ్యార్రీ చెబుతున్నారు. కుప్పలుగా వచ్చి పడే దుస్తులను వేరు చేయడం ఓ పెద్ద పని. వీటిలో ఏది బాగుందో.. ఏవి బ్రాండెడ్ దుస్తులో వేరు చేయడానికి ఎలాంటి పరికరాలూ లేవు. అందుకు తగిన సిబ్బంది అవసరం. గత ఐదేళ్లలో దాదాపు 60-70 కంపెనీలు తమ వ్యాపారాలను మూసేశాయి. కానీ తాము ఇంకా కొనసాగుతున్నామని, వీటికి డిమాండ్ తగ్గడంతో తన సిబ్బందిని 100 మంది నుంచి 20 మందికి కుదించాల్సి వచ్చిందని రాస్ బ్యార్రీ చెప్పారు. మరోవైపు ఇంగ్లండ్‌లో వేతనాలు కూడా ఎక్కువేనని తెలిపారు. అయితే.. ఈ వ్యాపారంలో కాస్త నిలదొక్కుకోవడానికి మరో మార్గం ఉందంటున్నారు. ఈ దుస్తుల్లో నాణ్యమైన వాటిని ఎన్నుకుని, వాటిని దుస్తుల నుంచి ఒట్టి గుడ్డలుగా మార్చుకోవాలి. తిరిగా ఆ గుడ్డలతో మళ్లీ నాణ్యమైన దుస్తులను తయారు చేయవచ్చు. ఇలాగే.. తమ వద్దకు వచ్చిన వాటిలో నాణ్యమైన దుస్తులను ఎన్నుకుని, వాటితో సూట్‌లను తయారు చేసేందుకు ఆక్స్‌ఫామ్ కంపెనీ మార్క్స్ అండ్ స్పెన్సర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నిరంతరం మారే ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు ఎన్నెన్నో డిజైన్లు.. కొత్త మోడల్, కొత్త డిజైన్ మార్కెట్లోకి రావడమే ఆలస్యం.. మరుక్షణమే వాటిని కొనేందుకు అమెరికా, ఇంగ్లండ్, ఇటలీ, కెనడా లాంటి దేశాల ప్రజలు ఎగబడుతున్నారు. text: పోస్ట్ of Twitter ముగిసింది, 1 కాగా ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకు? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ అంతరిక్ష నౌక నింగికి దూసుకెళుతుంది. సెప్టెంబర్ 6-7 తేదీల నాటికి అది చంద్రుడిని చేరుతుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగిస్తున్న అంతరిక్ష వాహనం చంద్రయాన్-2. సాఫ్ట్‌ల్యాండింగ్ అంటే.. ఏదైనా గ్రహం లేదా అంతరిక్షంలోని గ్రహ శకలం ఉపరితలం మీద దిగే వాహనం ఏమాత్రం దెబ్బతినదు. చంద్రయాన్-2 విజయవంతమైతే.. చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. అంతేకాదు.. చంద్రయాన్-2 చంద్రుడి నుంచి చాలా చాలా సమాచారం కూడా భూమికి పంపిస్తుంది. ఎలా? చంద్రయాన్-2లో మూడు ముఖ్యమైన పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటర్. ఇది చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. మరొకటి ల్యాండర్. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది. అలా దిగిన తర్వాత ఈ ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. అది చంద్రుడి మీద అన్వేషణ చేస్తుంది. ఈ రోవర్ తను గుర్తించిన సమాచారాన్ని ల్యాండర్‌కు పంపిస్తుంది. ల్యాండర్ ఆ సమాచారాన్ని ఆర్బిటర్‌కు చేరవేస్తుంది. ఆర్బిటర్ దానినంతటినీ భూమికి పంపిస్తుంది. ఈ అంతరిక్ష నౌకలో భారతదేశం 13 పరిశోధన పరికరాలు అమర్చింది. ఇవికాక.. నాసా పంపించిన మరొక పరికరాన్ని కూడా ఇది మోసుకెళుతుంది.. ఉచితంగా. ఈ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవానికి అతి సమీపంగా వెళ్లనున్నాయి. ఇంతకుముందు చంద్రుడి మీద దిగిన మిషన్లన్నీ.. చంద్రుడి మధ్య రేఖ మీద దిగాయి. ఏ అంతరిక్ష నౌక కూడా చంద్రుడి ధృవం సమీపంలో దిగలేదు. కాబట్టి చంద్రయాన్-2 ద్వారా కొంత కొత్త సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నారు. భారత్ గతంలో చంద్రుడి పైకి చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయంతమైంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొదటి అంతరిక్ష వాహనం అది. అతి తక్కువ వ్యయంతో ఈ మిషన్‌ను విజయవంతం చేయటం అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది. ఆ కార్యక్రమానికి భారత్ సారథ్యం వహించగా.. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్‌లు కూడా అందులో పాలుపంచుకున్నాయి. నిజానికి చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించారు. కానీ పది నెలల తర్వాత అందులో పరికరాలు విఫలమయ్యాయి. అయితే అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది ఇస్రో. భారతదేశ జాతీయ పతాకాన్ని ఈ అంతరిక్ష నౌక చంద్రుడి మీదకు తీసుకెళుతోంది. దీంతో ఇది జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా కూడా మారింది. అంగారక గ్రహం మీద, ఆస్టరాయిడ్ల మీద సాఫ్ట్ ల్యాండింగ్‌ ప్రయోగానికి.. చంద్రుడి మీదకు మనిషిని పంపించటానికి కూడా తాజా ప్రయోగం తలుపులు తెరుస్తుంది. భారతదేశం సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. కానీ ఇది అంత సులభం కాదు. ఇది రాకెట్ సైన్స్. భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3.84 లక్షల కిలోమీటర్లు. చంద్రుడి మీద గురుత్వాకర్షణ లేదు. వాతావరణమూ లేదు. భారత్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నమిది. ఉపరితలం మీద దిగటానికి ప్యారాచూట్ ఉపయోగించటానికి వీలులేదు. కాబట్టి సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కష్టమైన పని. గతంలో ఇందుకోసం చేసిన ప్రయోగాల్లో సగం విఫలమయ్యాయి. అంతా కంప్యూటర్ల నియంత్రణలో ఉంటుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు చాలాసార్లు వాయిదా పడింది. చంద్రయాన్-1 ప్రయోగించినపుడు.. 2014లో చంద్రయాన్-2ను ప్రయోగించాలని నిర్ణయించారు. అప్పుడు రష్యా కూడా జతకలిసింది. చంద్రుడి మీద దిగే ల్యాండర్‌ను ఆ దేశం అందిస్తుందని అనుకున్నారు. కానీ.. రష్యా అంతరిక్ష కార్యక్రమంలో పలు సమస్యలు తలెత్తటంతో అలా జరగలేదు. దీంతో భారత్ సొంతంగా ల్యాండర్‌ను తయారుచేయాలని నిర్ణయించుకుంది. అందువల్లనే ఇంత ఆలస్యమైంది. 'పేలోడ్' అనే మాట మీరు విని ఉంటారు. ఆ మాటకు అర్థం.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు తీసుకెళ్లే శాస్త్రీయ పరికరాలు. ఆర్బిటర్‌లో హై క్వాలిటీ కెమెరా ఒకటి ఉంది. చంద్రుడి మీది పలుచటి వాతావరణాన్ని విశ్లేషించే ఒక పరికరం కూడా ఉంది. భూకంపాల మాదిరిగానే చంద్రుడి మీద కూడా చంద్రకంపాలు వస్తుంటాయి. కాబట్టి దానిని కూడా విశ్లేషించటం జరుగుతంది. ప్రోబ్ తరహా పరికరం కూడా ఒకటి ఉంటుంది. దానిని చంద్రుడి ఉపరితలం కిందికి పంపిస్తారు. దానిద్వారా చంద్రుడి మీద ఉష్ణోగ్రతల గురించి తెలుసుకోవచ్చు. ఇక చంద్రుడి మీద మట్టి గురించి చెప్పే మరొక పరికరం కూడా ఉంటుంది. భారత అంతరిక్ష ప్రయోగాలకు దేశంలో యూపీఏ అయినా, ఎన్‌డీఏ అయినా ప్రతి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని.. కాబట్టే ఇండియా దగ్గర అంత ఎక్కువ సంఖ్యలో రాకెట్లు ఉన్నాయని ప్రముఖ సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా చెప్తారు. అంతేకాదు.. ఈ మిషన్‌కు మరో ప్రాధాన్యత కూడా ఉంది. ఇద్దరు మహిళలు - మిషన్ డైరెక్టర్ రితూ కారిధాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్యలు ఈ మిషన్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని తిరిగి జూలై 22వ తేదీ సోమవారం చేపడతామని మరొక ట్వీట్‌లో పేర్కొంది. text: భారత్‌లోని కోటిన్నర కేసుల్లో నాలుగోవంతు మహారాష్ట్రలోనే ఉన్నాయి దేశంలో మృతుల సంఖ్య కూడా గత 24 గంటల్లో మున్నెన్నడూ లేనంతగా పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 2,104 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకూ సుమారు 1.6 కోట్ల కోవిడ్ కేసులు నమోదైనట్టు లెక్క. కరోనా సంక్రమిత కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానానికి చేరుకుంది. ఇక, ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో యూపీలో 34,379 కొత్త కేసులు నమోదయ్యాయి. 195 మంది చనిపోయారు. దాంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య 10,541కి చేరింది. దేశంలో ఓ పక్క కోవిడ్ కేసులు నిరవధికంగా పెరుగుతూ ఉంటే, మరో పక్క ఆక్సిజన్ కొరత ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. దేశ రాజధాని దిల్లీలో తీవ్ర ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కోవిడ్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించింది. "ఇది చాలా దారుణం. భారతదేశం అంతటా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కేంద్రం ఏమి చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాం" అని జడ్జ్ అన్నారు. ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు ఆక్సిజన్ కొరతకు సంబంధించి కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జ్ పై వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కర్మాగారాల నుంచి అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ సమయానికి ఆక్సిజన్ అందక దేశవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆక్సిజన్ కొరత వలన ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తెలుసుకోవడం సాధ్యం కాదు. ఆక్సిజన్ కావాలంటూ వస్తున్న అభ్యర్థనలతో సోషల్ మీడియా నిండిపోయింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లోని ఆస్పత్రులన్నీ కూడా రోగులతో నిండిపోయాయి. పడకలు దొరకక ఆస్పత్రి వెలుపలే జనం పడిగాపులు కాస్తున్నారు. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన మహరాష్ట్రలో గురువారం సాయంత్రం నుంచి కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశారు. ఇప్పటికే ఏప్రిల్ 14 నుంచి మహారాష్ట్రలో పాక్షిక లాక్‌డౌన్ అమలులో ఉండగా ప్రస్తుతం అదనపు ఆంక్షలను ప్రకటించారు. మహమ్మారి ప్రారంభం నుంచి కూడా మహారాష్ట్ర కోవిడ్ హాట్‌స్పాట్‌గానే ఉంది. దేశంలో నాలుగొంతుల కోవిడ్ కేసులు అక్కడినుంచే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 1,80,000 కోవిడ్ మరణాలు నమోదు కాగా, మహారాష్ట్రలో 67,468 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగానే ఉంది. దిల్లీలోని ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ కొరత కూడా పెరుగుతోంది. ఇంతలా కరోనా సంక్రమణలు పెరిగిపోవడానికి కారణమేంటి? గత నెల రోజులుగా ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, హరిద్వార్‌లో వేలాదిమంది కుంభమేళాలో పాల్గొనడం, భారతదేశంలో కనిపిస్తున్న కొత్త వేరియంట్.. కేసుల పెరుగుదలకు కారణాలుగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. దేశంలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారింది. మహారాష్ట్రలో 61 శాతం శాంపిల్స్‌లో ఇండియన్ వేరియంట్ కనిపించిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. ఇవే కాకుండా, కొన్ని రాష్ట్రాల్లో భారీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం వైరస్ వ్యాప్తికి దోహదమైంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాలు ఆపలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్కడ ప్రచారయాత్ర చేశారు. దేశంలో నెమ్మదిగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా కోవిడ్ వ్యాప్తికి ఒక కారణమని విమర్శకులు అంటున్నారు. ఇప్పటివరకు ఇండియాలో 130 మిలియన్ వ్యాక్సీన్ డోసులను ఇచ్చారు. ఫైజర్ వ్యాక్సీన్‌ను ఇండియాలో పంపిణీ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ గురువారం ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, ఇప్పటికే వ్యాక్సీన్ కొరత ఉండడంతో, రెండో దశ వ్యాక్సినేషన్ ఎంతవరకు సఫలమవుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 3,14,835 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా నమోదైన అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య ఇదే. text: డిజెబిలిటీ రైట్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కొంతమంది తల్లులను ఇంటర్వ్యూ చేసింది. వైకల్యంతో పిల్లలు పుడితే తమ కుటుంబీకులు దాన్నొక అవమానంగా భావిస్తారని వారంటున్నారు. కెన్యాలో అంగవైకల్యం గల పిల్లల జీవితాలపై బీబీసీ ఆఫ్రికా కరెస్పాండెంట్ ఆన్ సోయ్ అధ్యయనం చేశారు. కష్టాలతో నిండిపోయిన జీవితం ఈ పిల్లాడిది. వైకల్యంతో బతుకుతోన్న ఈ పిల్లాడి పేరు మేషాక్ కిప్చుంబా. ఎంత మంచి చికిత్స అందించినా ఇతని జీవితం మాత్రం కష్టంగానే సాగుతోంది. ‘‘నా కొడుకుని చంపేయాలని నాపై ఒత్తిడి తెచ్చారు...’’ కెన్యాలోని గ్రామీణ ప్రాంతంలో వైకల్యంతో జన్మించడం శాపం లాంటిది. అటువంటిది కిప్చుంబా ఇంకా బతికుండడమే అతడి అదృష్టం. అతని బంధువులకు కుదిరితే గనుక అతను శిశువుగా ఉన్నప్పుడే చంపేసేవారు. ‘‘నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. నా స్నేహితురాలు నాకు ఆశ్రయం కల్పించింది. కానీ మూడు వారాల తరువాత, ఆమె నా బిడ్డ తినే ఆహారంలో యాసిడ్ పోసి చంపెయ్యమని సలహా ఇచ్చింది. నేను నా బిడ్డను చంపుకోదలుచుకోలేదు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను’’అని కిప్చుంబా తల్లి ఫ్లోరెన్స్ చెబెట్ చెప్పారు. అప్పటి నుంచి ఫ్లోరెన్స్ ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే ఈ దేశంలో ఫ్లోరెన్స్ ఒక్కరే కాదు. ఆమె లాంటి మహిళలు మరెందరో ఉన్నారు. గ్రామీణ కెన్యాలో మహిళలు వైకల్యంతో పుట్టే పిల్లలను చంపెయ్యాలనే ఒత్తిళ్లను ఎదుర్కుంటున్నారు. అయితే ఒత్తిళ్లను ఎంతమంది ఎదిరిస్తున్నారు, ఎంతమంది తలొగ్గుతున్నారన్న విషయం తెలీదు. శిశుహత్యల మూలాలు మాత్రం కెన్యాలో చాలా పురాతనమైనవి. ‘‘మా పెద్దలు ఎన్నో చిత్ర హింసలు పెట్టేవారు. సాధారణ జీవితం గడపలేరని భావించి శిశువులను చంపేసేవారు. శిశువును బయట పడేసేవారు. పస్తులుంచి చంపేసేవారు. ఆ తరువాత పాతిపెట్టేవారు’’అని టింఫైయాన్ ఎనోలే కాయిపా అనే మహిళ వివరించారు. అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్లు తమ పిల్లలను తమ దగ్గర ఉంచుకునే వారు కాదు. నైరోబిలోని ‘కంపాషనేట్ హ్యాండ్స్’ ఒక శిశు సంరక్షణ కేంద్రం. ‘‘ఒక డే కేర్ కేంద్రం మొదలుపెడదామని ముందర భావించాను. కానీ ఒక్క వారంలోనే పదకొండు మంది అనాథ పిల్లలు చేరారు. నెల రోజుల్లోనే ఈ సంఖ్య 30కి చేరుకుంది’’ అని కంప్యాషనేట్ హ్యాండ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనే ఎంజేరి తెలిపారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల సంఖ్య ప్రస్తుతం ఇక్కడ 86. అయితే ఇక్కడి పరిస్థితులు వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రతి నెలా తన లాంటి పరిస్థితులు ఎదుర్కున్న కొందరు మహిళలను ఫ్లోరెన్స్ కలుస్తారు. వారిలో ఒకరు లైడియా. తన బిడ్డ మణికట్టులో సూదులు గుచ్చాలని ఆమెను ఒత్తిడి చేశారు. ఆలా చేస్తే నెమ్మదిగా బిడ్డ చనిపోతుంది. అలా చేస్తే ఎవరికీ తెలియదని కూడా అన్నారని ఆమె చెబుతున్నారు. ఈ మహిళలందరూ ఇప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వైకల్యంతో జన్మించిన చిన్నారులు ప్రపంచంలో చాలా దేశాల్లో వివక్షను ఎదుర్కుంటున్నారు. అయితే కెన్యాలో పరిస్థితి మరీ దారుణం. చాలా ప్రాంతాల్లో వైకల్యంతో పుట్టిన పిల్లలను చంపెయ్యాలంటూ వారి తల్లులను ఒత్తిడి చేస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ అంటోంది. text: బాలికపై ఆ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఈ వ్యవహారంలో బాధితురాలినీ శిక్షించారు. ఆమెను కూడా కొట్టి ఊరంతా తిప్పారు. ఇదంతా బాధితురాలి కుటుంబ సభ్యులే చేశారని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో, పోలీసులు వెంటనే దర్యాప్తు చేశారు. ఇద్దరినీ ఊరేగిస్తున్న సమయంలో కొందరు 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు అందరినీ అరెస్ట్ చేశామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ భాగ్వానీ బీబీసీతో చెప్పారు. "ఈ కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారో, అందరినీ అదుపులోకి తీసుకున్నాం. అంటే, మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశాం. ఇదంతా చేసింది బాలిక కుటుంబంలోని వారే. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశాం" అని భాగ్వానీ చెప్పారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఘటన అలీరాజ్‌పూర్, జోబట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఛోటీ ఖట్టాలీలో జరిగింది. అక్కడ ఒక 16 ఏళ్ల బాలికను 21 ఏళ్ల యువకుడితో కలిపి తాడుతో కట్టేసి, వారిని ఊరంతా తిప్పారు. బాలిక, యువకుడు ఇద్దరూ గుజరాత్‌లో పనిచేసేవారు, వారు తర్వాత తిరిగి తమ గ్రామాలకు వచ్చారు. తర్వాత యువకుడు ఆ అమ్మాయిని కలవడానికి వాళ్ల ఊరొచ్చాడు. అదే సమయంలో ఆ యువతి ఇంట్లో వాళ్లు అతడిని పట్టుకున్నారు. బాలికతో కలిపి తాడుతో కట్టేసి ఇద్దరినీ ఊరేగించారు. ఈ మొత్తం ఘటనను మొబైల్లో చిత్రీకరించిన వాళ్లు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మైనర్ అయిన బాధితురాలు ఝీరీ గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఒక యువకుడిపై కేసు పెట్టింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరినీ తాడుతో కట్టేసి కొట్టి ఊరేగించడంపై మరో కేసు నమోదైంది. అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి అప్పటికే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. రెండో ఫిర్యాదులో ఉన్న నిందితులు అందరినీ అరెస్ట్ చేశారు. వీరందరినీ యువతి సమీప బంధువులుగా గుర్తించారు. వారందరిపైనా కొట్టడం, అవమానకరంగా ప్రవర్తించడం, హత్యాయత్నం లాంటి కేసులు నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ భాగ్వానీ, మిగతా పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. "బాధితురాలికి యువకుడు చాలాకాలంగా తెలుసు. వాళ్లకు గుజరాత్‌లో ఉన్నప్పుడే పరిచయం ఉంది. ఆమెను కలవడానికే యువకుడు గ్రామానికి వచ్చినపుడు ఈ ఘటన జరిగింది" అని ఆయన తెలిపారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ రిపోర్ట్ ప్రకారం ఆదివాసీలు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లా దేశంలోని అత్యంత పేద జిల్లాల్లో ఒకటి. పేదరికంతోపాటూ అక్షరాస్యతలోనూ ఈ జిల్లా చాలా వెనకబడి ఉంది. ఇక్కడి జనాభా ఎక్కువగా జీవనోపాధి కోసం గుజరాత్‌లోని ఫ్యాక్టరీలు లేదా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఆదివాసీ సమాజం వారు ఇంతకు ముంద కూడా, ఈ ప్రాంతంలోని మహిళలకు ఘోరమైన శిక్షలు విధించినట్లు కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదివాసీ సమాజాలు తమ కంటూ ప్రత్యేకంగా స్థానిక కట్టుబాట్లు చేసుకుంటున్నాయి. ఏం జరిగినా వాటి ప్రకారమే శిక్షలు కూడా విధిస్తుంటాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలు ఎక్కువగా ఉండే అలీరాజ్‌పూర్‌లో ఒక ఘటన చోటుచేసుకుంది. ఒక బాలికను, మరో యువకుడితో కలిపి తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతోపాటూ, వారిద్దరినీ ఊరంతా ఊరేగించారు. text: నౌదీప్ కౌర్ సోనిపత్ పోలీసులు పంజాబ్ ముక్తసర్‌కు చెందిన నౌదీప్ కౌర్‌ను జనవరి 12న అరెస్ట్ చేశారు. ఆమెపై కుండలీ ఇండస్ట్రియల్ ఏరియాలో హత్యాయత్నం, అక్రమ వసూళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. హరియాణా కుండలీ ఇండస్ట్రియల్ ఏరియాలో వేతన బకాయిల కోసం పోరాడుతున్న కార్మికులతో కలిసి నౌదీప్ కౌర్ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పోలీసులు ఆమెను అక్కడినుంచే అరెస్ట్ చేశారు. నౌదీప్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 148, 149, 186, 332, 379-బి, 307(హత్యాయత్నం) ప్రకారం ఈ కేసులు నమోదయ్యాయి. పోలీసులపై ఆమె కర్రతో దాడి చేశారని కూడా ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు, గత ఏడాది డిసెంబర్ 28న సోనిపత్‌లోని కుండలీ పోలీస్ స్టేషన్‌లోనే ఆమెపై ఒక కేసు నమోదైంది. ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని, వారిపై దాడి చేశారని అప్పట్లో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. నౌదీప్ కౌర్ ప్రస్తుతం హరియాణాలో కర్నాల్ జైల్లో ఉన్నారు. డిసెంబర్ 28, జనవరి 12న నమోదైన కేసుల్లో ఆమెకు బెయిల్ లభించింది. ఇప్పుడు ఫిబ్రవరి 22న హత్యాయత్నం కేసులో ఆమె వేసిన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. ఈ కేసులో సోనిపత్ జిల్లా సెషన్స్ కోర్టు గత సోమవారం ఆమెకు బెయిల్‌ మంజూరు చేయలేదని నౌదీప్ కౌర్ లాయర్ హరిందర్ సింగ్ బైంస్ చెప్పారు. ఫోర్ట్ వర్త్‌లో కరెంటు లేక చీకటిలోనే ఒక మహిళ టెక్సాస్ పడిపోయిన ఉష్ణోగ్రతలు, చుక్కలు చూపిస్తున్న కరెంటు బిల్లులు అమెరికాలోని టెక్సాస్‌లో గత వారం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో కొందరి కరెంట్ బిల్లులు చుక్కలనంటాయని, వాటిని టెక్సాస్ ప్రభుత్వమే చెల్లించాలని హూస్టన్ మేయర్ డిమాండ్ చేశారు. "భారీగా వచ్చిన కరెంటు బిల్లులన్నీ టెక్సాస్ ప్రభుత్వానికి వెళ్లాలి" అని మేయర్ సిల్విస్టర్ టర్నర్ సీబీఎస్ న్యూస్‌తో అన్నారు. పోయిన వారం కొన్ని రోజులు వాడినందుకే తమ కరెంట్ బిల్లులో 16 వేల డాలర్లు అనదపు చార్జీలు వచ్చాయని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చలి మైనస్ 18 డిగ్రీలకు చేరింది. టెక్సాస్‌లో గత 30 ఏళ్లలో లేనంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతాకాలంలో మంచు దుప్పటి కప్పేసే టెక్సాస్‌లో సాధారణంగా శీతాకాలం వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. కానీ, ప్రస్తుత అసాధారణ వాతావరణం వల్ల అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో 70 మంది చనిపోయారు. అతి శీతల ఉష్ణోగ్రతల నుంచి టెక్సాస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. టెక్సాస్‌లో కరెంటు కోతల వల్ల లక్షల మంది సతమతం అవుతున్నారు. విద్యుత్ సరఫరాను చాలావరకూ పునరుద్ధరించినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో 30 వేల మంది ఇంకా కరెంటు లేకుండానే ఉన్నారని poweroutage.us చెప్పింది. చలిలో చిక్కుకుపోయిన వారికి ఆహారం అందిస్తున్న వలంటీర్లు సేవింగ్స్‌తో కరెంటు బిల్లు కట్టారు "కరెంటు బిల్లు 16 వేల డాలర్లకు పైగా రావడంతో, దాన్ని కట్టడానికి నా సేవింగ్స్ మొత్తం ఖర్చు చేశాను" అని డల్లాస్‌లోని అమెరికా మాజీ సైనికుడు విటెరన్ స్కాట్ విల్లోబీ న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు. వాతావరణం వల్ల ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా వ్యవస్థ లేదని సీబీఎస్‌తో మాట్లాడిన మేయర్ టర్నర్ ఆరోపించారు. "ఇవన్నీ ఊహించగలిగేవే. నేను 2011లో కూడా ఇదే చెప్పాను. చుక్కలనంటేలా ఉన్న ఈ కరెంటు బిల్లులు చెల్లించాల్సింది వినియోగదారులు కాదు, ఈ వారం ఇలా జరగడంలో వాళ్ల తప్పేం లేదు" అన్నారు. భారీగా వచ్చిన కరెంటు బిల్లులు చెల్లించడానికి టెక్సాస్, ఫెడరల్ ప్రభుత్వాలు సాయం చేయాలని ఫోర్ట్ వర్త్ మేయర్ బెస్టీ ప్రైస్ కూడా సీబీఎస్‌తో అన్నారు. ఆకాశాన్నంటిన కరెంటు బిల్లులతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ అధికారులను ఆదేశించారు. "అతి శీతల వాతావరణం వల్ల పెరిగిన కరెంటు బిల్లుల నుంచి టెక్సాస్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది" అని ఆయన తమ ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో అన్నారు. టెక్సాస్‌లో పెను విపత్తు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం ప్రకటించారు. ఆయన ప్రకటనతో సహాయక చర్యలకు ఫెడరల్ ప్రభుత్వం మరిన్ని నిధులు అందనున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కార్మికుల హక్కుల కోసం గళమెత్తిన 23 ఏళ్ల నౌదీప్ కౌర్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు(ఫిబ్రవరి 22) పంజాబ్, హరియాణా హైకోర్టులో విచారణ జరగనుంది. నౌదీప్ కౌర్ నెలకు పైగా జైల్లో ఉన్నారు. text: ఈ ఘటన గురించి సామాజిక కార్యకర్త ఫిరోజ్ పింజారీ బీబీసీతో మాట్లాడారు. "మేం వేరే పనిమీద హాస్టల్‌కు వెళ్లాం. కానీ, అక్కడకు వెళ్లాక మాకీ విషయం తెలిసింది. బట్టల్లేకుండా డాన్స్ చేసేలా తమను బలవంతం చేశారని ఆ అమ్మాయిలు మాకు చెప్పారు. ఆ హాస్టల్‌లోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ మేం దూరం నుంచే వీడియో తీసి కలెక్టర్‌కు అప్పగించాం" అన్నారు. జలగావ్ కలెక్టర్ అభిజిత్ రావుత్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. అమ్మాయిలతో బట్టలు విప్పించి డాన్స్ చేస్తున్నారని ఏ వీడియోలో ఆరోపించారో, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో క్లిప్ బీబీసీ దగ్గర కూడా ఉంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి మెట్ల దగ్గర కిటికీలో నుంచి సామాజిక కార్యకర్తతో మాట్లాడుతూ కనిపిస్తుంది. కార్యకర్తతో "నా ముఖం చూపించకండి" అంటుంటారు. తర్వాత కార్యకర్త ఆమెతో "చూపించం, మీరు చెప్పండి, మీ సమస్యను మేం కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం" అంటుంటారు. హాస్టల్ నిర్వహణపై విమర్శలు ఈ వీడియోలో బాలిక ముఖం కనిపించదు. కానీ, ఆమె మాటలు వినిపిస్తుంటాయి. "మమ్మల్ని దాదాపు బట్టలు లేకుండా డాన్స్ చేయాలని బలవంతం చేస్తున్నారు. మాకు ఎలాంటి తిండి పెడుతున్నారంటే, అది కూడా చెప్పుకోలేం. ప్రభుత్వం నుంచి సరుకులు తీసుకుంటున్నా, మాకు సరైన ఆహారం పెట్టడం లేదు. అమ్మయిల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీళ్లు(హాస్టల్ నిర్వాహకులు) వాళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను పిలిపిస్తుంటారు" అని ఆమె ఆరోపించారు. ఈ వీడియోలో ఆ అమ్మాయి హాస్టల్ నిర్వహణ గురించి విమర్శలు గుప్పించారు. మరోవైపు బాలికల నుంచి విమర్శలు రావడంపై ఈ మహిళా హాస్టల్ అధికారి రంజనా జోపే మీడియాతో మాట్లాడారు. "హాస్టల్లో ఎలాంటి తప్పుడు పనులు జరగడం లేదు. వీడియోలో వైరల్ అయిన ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదు. ఆమె ఇక్కడ గర్భవతులుగా ఉన్న అమ్మాయిలను కొట్టింది కూడా" అన్నారు. వీడియో రికార్డింగ్ బయటికి రావడంతో సామాజిక కార్యకర్తలు హాస్టల్‌కు రావడానికి తాము అనుమతించలేదని కూడా రంజనా జోపే చెప్పారు. "మాకు ఈ సమాచారం అందగానే హాస్టల్‌కు వెళ్లాం. ఆ అమ్మాయితో మాట్లాడాం. ఆమె భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదు. కలెక్టర్ ఈ ఘటనపై దర్యాప్తు కమిటీని వేశారు" అని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయ్ సింగ్ పరదేశీ అన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు జలగావ్ సామాజిక కార్యకర్త ఫరీద్ ఖాన్ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడారు. "మంగళవారం సాయంత్రం మేం దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మేం ఆ హాస్టల్‌కు వెళ్లి, బయటకు వస్తున్నప్పుడు బాలిక మమ్మల్ని పిలిచి తన బాధలు చెప్పుకుంది. చాలా మంది అమ్మాయిల బాయ్‌ఫ్రెండ్స్ రాత్రిళ్లు ఆ హాస్టల్లోనే ఉంటారని కూడా ఆమె చెప్పింది. మేం దీనిపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాం" అన్నారు. జలగావ్‌క చెందిన మంగళా సోన్‌వాలే అనే మరో సామాజిక కార్యకర్త హాస్టల్లో ఉన్న అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదనడాన్ని ప్రశ్నించారు. "ఒక అమ్మాయి మానసిక స్థితి సరిగా ఉండకపోవచ్చు. కానీ, అక్కడ మిగతా బాలికల పరిస్థితి ఎలా ఉంది. హాస్టల్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఆమె ఒక్కరే మాట్లాడలేదు, తనతోపాటూ మిగతా బాలికలు కూడా అదే ఫిర్యాదు చేశారు" అన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై చాల మంది స్పందిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనిపై జోరుగా చర్చ నడిచింది. విపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ అసెంబ్లీలో ఈ ఘటనపై మాట్లాడారు. "ఈ ఘటన గురించి సమాచారం అందింది. తర్వాత, వీడియో కూడా బయటికొచ్చింది. ఈ కేసులో పోలీసులు అమ్మాయిలను బట్టల్లేకుండా డాన్స్ చేసేలా బలవంతం చేస్తున్నారు. మనం ఈ మొత్తం అంశంలో సున్నితత్వాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అన్నారు. ఇదే అంశంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ కూడా మాట్లాడారు. "జలగావ్ ఘటనను అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అది చాలా తీవ్రమైన విషయం. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సభలో దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. నేను కూడా స్వయంగా దీనిపై దృష్టి పెడుతున్నా. ఆరోపణలు నిజమని తేలితే, దోషులపై కఠిన చర్యల తీసుకుంటాం. ఎవరినీ వదలం. విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతుంది" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్ర, జలగావ్‌లోని ఒక ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను బట్టలు విప్పించి మగవాళ్ల ముందు డాన్స్ చేసేలా బలవంతం చేశారని కొందరు సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. text: జననం: 1962 జూన్ 20న తెలంగాణలోని సూర్యాపేట విద్య: బీఎస్‌సీ వృత్తి: భారత వాయుసేనలో పైలట్‌గా పనిచేశారు. మిగ్ 21, మిగ్ 23 యుద్ధ విమానాలకు పైలట్‌గా ఉన్నారు. 1990లో రాష్ట్రపతి భద్రతా వ్యవహారాల బాధ్యతలు నిర్వర్తించారు. వివాహం: ఉత్తమ్‌కుమార్ వాయుసేనలో ఉండగానే ఆర్కిటెక్ట్ పద్మావతితో 1990లో వివాహమైంది. రాజకీయ ప్రవేశం... 1994లో వాయుసేన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం జరిగిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి పోటీచేశారు కానీ విజయం సాధించలేకపోయారు. అనంతరం 1999, 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు కోదాడ నుంచి గెలిచారు ఉత్తమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి, అంచనాల కమిటీకి చైర్మన్‌గా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ తరఫున చర్చలు... తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2011లో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్ తరఫున హాజరయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కూడా హుజూర్‌‌నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా నాలుగోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. 2015 ఫిబ్రవరిలో టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలను ఉత్తమ్‌కు అప్పగించింది. భార్య కూడా అసెంబ్లీకి... ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పద్మావతి మొదటిసారే విజయం సాధించారు. ఉత్తమ్, పద్మావతి - భార్యాభర్తలిద్దరూ ఒకే సభలో ఎమ్మెల్యేలుగా ఉండటం విశేషం. మరో విశేషమేమిటంటే.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2016లో విడుదలైన ‘టెర్రర్’ అనే సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అందులో ఆయన పోషించిన పాత్ర ముఖ్యమంత్రి. కొంత కాలం కిందట ఆయన ఒక శపథం కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తాను గడ్డం తీయనన్నారు. ఇటీవల.. ‘డిసెంబర్ 12వ తేదీన గడ్డం తీస్తా’నని ధీమాగా చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా నడుస్తున్నారు. కాంగ్రెస్‌ను ఆగర్భ శత్రువుగా భావించే తెలుగుదేశం పార్టీతో సహా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రజాసమితి, సీపీఐ తదితర పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి.. టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నలమంద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. అనే కన్నా కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటే చాలా మందికి తెలుస్తుంది. భారత వాయుసేనలో యుద్ధ విమాన పైలట్‌గా పనిచేసిన ఉత్తమ్‌కుమార్.. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీకి సారథిగా ఉన్నారు. text: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొంగడట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఆయన శనివారం ట్విటర్‌లో తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి హోదాలో 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా కరీంనగర్ జిల్లాలో పవన్‌కు కరెంట్ షాక్ తగిలింది. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘‘2009 ఎన్నికలకు ప్రచారం చేస్తున్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను’’ అని పేర్కొన్నారు. ‘‘సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి, అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను’’ అని పవన్ ఈ ట్వీట్‌ ద్వారా తెలిపారు. జనవరి 22వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తూ.. ‘‘నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31వ తేదీన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. తొలి సభ్యత్వం ఆయనే స్వీకరించారు. ‘‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. ఇవి దేశ పటిష్టతకు మూలాలు. ఇవే జనసేన సిద్ధాంతాలు’’ అని గతంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పార్టీ నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ యాత్ర చేపట్టనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. text: నేరస్థులు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు ధర్మాసనంలో సభ్యులు. నేర అభియోగాలు నమోదైన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ ధర్మాసనం మంగళవారం (సెప్టెంబర్ 25న) ఇచ్చిన తీర్పులో వెలువరించింది. నేర చరిత్రను ప్రజలకు తెలపాలి ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసే తమ అభ్యర్థుల నేర చరిత్రను ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా పార్టీలు తమ తమ వెబ్‌సైట్ల ద్వారా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా స్థానిక పత్రికలు, ఛానెళ్ల ద్వారా కూడా ప్రచారం చేయాలని తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమపై నమోదైన నేర సంబంధ కేసుల వివరాలను, నేర చరిత్రను, పెండింగ్ కేసులను ఆయా రాజకీయ పార్టీలకు సమర్పించాలి. ఇలా ప్రజలందరికీ నేర చరిత్ర గల అభ్యర్థుల వివరాలను పారదర్శకంగా అందించటం వల్ల ఓటర్లు తగిన అవగాహనతో అభ్యర్థులను ఎంచుకోగలుగుతారని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయాల్లో పెరుగుతున్న నేరస్తులు నేర చరిత్రగల రాజకీయ నాయకులు దేశానికి ఇబ్బంది అని సుప్రీంకోర్టు తెలిపింది. అధికారంలో ఇలాంటి వాళ్లు ఉండటం ప్రజాస్వామ్య మూలాలకే ప్రమాదమని, రాజకీయాలు, అవినీతిని నేరమయం చేయటం జాతీయ, ఆర్థిక ఆందోళనగా మారిందని వివరించింది. ఇది స్వీయ వినాశక వ్యాధి అని, యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగట్లేదని కోర్టు అభిప్రాయపడింది. రాజకీయాల్లో నేర ప్రవృత్తి స్థాయిలు క్రమంగా, స్థిరంగా పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తగిన చర్యలు తీసుకుని రాజకీయాల్లో నేరపూరిత ధోరణులకు అడ్డుకట్ట వేయాలని తెలిపింది. దేశం ఎదురుచూస్తోంది.. కాగా, నేర అభియోగాలు నమోదైన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పని చేయాల్సింది పార్లమెంటేనని తెలిపింది. నేరస్తులపై అనర్హత వేసే చట్టం కోసం దేశం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పార్లమెంటు తరపున సుప్రీంకోర్టు చట్టం చేయలేదని.. (నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే చట్టం చేసేలా) పార్లమెంటు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1)(ఈ) ప్రకారం చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటుకు ఉందని వెల్లడించింది. ‘‘రాజ్యాంగాన్ని కాపాడే వారిగా, మేం (సుప్రీంకోర్టు) ఈ పని చేయాలని మిమ్మల్ని (పార్లమెంటును) అడగొచ్చు’’ అని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరాలు రుజువై, శిక్ష పడిన నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అయితే, నేర అభియోగాలు ఎదుర్కొంటున్న, క్రిమినల్ కేసులు నమోదైన వారిని కూడా అనర్హుల్ని చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ తీర్పు నిరాశాజనకం.. ప్రజాస్వామ్యానికి మేలు చేయదు - ఏడీఆర్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరాశాజనకంగా ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రతినిధి జగ్దీప్ చొకర్ అన్నారు. చట్టంలో పేర్కొన్న నిబంధనలను మాత్రమే సుప్రీంకోర్టు పాటించిందని, చట్టం స్ఫూర్తిని మరచిందని చెప్పారు. ఈ తీర్పు ఇవ్వటంలో సుప్రీంకోర్టు ప్రగతిశీలకంగా వ్యవహరించలేదని అన్నారు. దేశంలో రాజకీయాల్లో నేర ప్రవృత్తి గురించి అందరికీ తెలుసునని, కాబట్టే ఈ పిటిషన్ దాఖలైందని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం చట్టాల్లో లోటు ఉంటే, ప్రజా ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, చట్టం తయారయ్యే వరకు మార్పులు, చేర్పులు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి మేలు చేయదని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కేవలం క్రిమినల్ కేసులు నమోదైనంత మాత్రాన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై పార్లమెంటే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. text: మీరు ఒకసారి 3 లేదా 5 రూపాయలు ఇచ్చి వాటిని కొంటే, ఇంకోసారి కొనకుండానే వస్తువులు తీసుకుని వచ్చేస్తుంటారు. కానీ చండీగఢ్‌లో ఒక వ్యక్తి బాటా షోరూంలో 3 రూపాయలకు క్యారీ బ్యాగ్ కొన్నాడు. కానీ, దానిపై అతడు దానిపై వినియోగదారుల ఫోరంకు వెళ్లాడు. ఫోరం బాటా కంపెనీకి 9 వేలు జరిమానా విధించింది. అందులోంచి బాధితుడికి 4 వేల రూపాయల పరిహారం లభించింది. తరచూ షోరూంలో కొన్న సామాన్లు పెట్టుకోడానికి క్యారీ బ్యాగ్ కోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వద్దని మీరు చెబితే మీ సామాన్లు పెట్టుకోడానికి ఎలాంటి బ్యాగ్ ఇవ్వరు. చండీగఢ్‌ వాసి దినేష్ ప్రసాద్ రతూడీ 2019 ఫిబ్రవరి 5న బాటా షోరూంలో 399 రూపాయలకు బూట్లు కొన్నారు. కౌంటర్ దగ్గర క్యారీ బ్యాగ్ కోసం ఆయనను డబ్బులు అడిగారు. దినేష్ ఇవ్వనని చెప్పారు. క్యారీ బ్యాగ్ ఇవ్వడం కంపెనీ బాధ్యత అన్నారు. అయితే, చివరికి ఏ ప్రత్యామ్నాయం లేక ఆయన ఆ క్యారీ బ్యాగ్ కొనాల్సి వచ్చింది. దానితో కలిపి ఆయన బిల్లు మొత్తం 402 రూపాయలైంది. డబ్బు వసూలు చేయడం అన్యాయం ఆ తర్వాత దినేష్ దీనిపై చండీగఢ్‌లోని జిల్లా స్థాయి వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశారు. బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేయడం సరి కాదన్నారు. ఆ ఫిర్యాదుపై విచారణ తర్వాత వినియోగదారుల ఫోరం దినేష్ ప్రసాద్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బ్యాగ్‌కు వినియోగదారుడి నుంచి 3 రూపాయలు వసూలు చేయడం తప్పని చెప్పింది. దినేష్‌ ఎదుర్కున్న మానసిక, శారీరక వేధింపులకు 3 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా బాటా కంపెనీకి సూచించింది. దానితోపాటు కేసు ఖర్చులను భర్తీ చేయడానికి మరో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలన్న ఫోరం.. బాటా కంపెనీకి శిక్షార్హమైన పరిహారంగా వినియోగదారులకు న్యాయ సహాయం చేసే ఖాతాలో మరో రూ.5 వేలు జమ చేయాలని ఆదేశించింది. వినియోగదారులందరికీ డబ్బు తీసుకోకుండా క్యారీ బ్యాగ్ ఇవ్వాలని, వ్యాపారంలో అన్యాయంగా ఉండే పద్ధతులు పాటించవద్దని ఫోరం బాటా కంపెనీని హెచ్చరించింది. కానీ, చాలా మంది వినియోగదారులు సామాన్లతోపాటు క్యారీ బ్యాగ్‌కు కూడా డబ్బు చెల్లిస్తుంటారు. కానీ అది తక్కువ మొత్తం కావడంతో కోర్టు వరకూ వెళ్లరు. కానీ ఇప్పుడు ఈ కేసులో తీర్పు వినియోగదారుల పక్షంలో రావడం చాలా ముఖ్యమైన విషయంగా చెబుతున్నారు. బ్యాగ్ ద్వారా ప్రచారం ఫోరం తన ఆదేశాలలో "క్యారీ బ్యాగ్‌పై రాసిన బాటా కంపెనీ పేరుపై ఫోరం అభ్యంతరం వ్యక్తం చేయడం" చాలా ప్రత్యేకం. దినేష్ ప్రసాద్ వకీల్ దేవేంద్ర కుమార్ దాని గురించి చెప్పారు. "బ్యాగ్‌పైన బాటా కంపెనీ పేరు రాసుంది. మనం దాన్ని తీసుకుని వెళ్లినపుడు అది కంపెనీకి ప్రచారం అవుతుంది. ఒక విధంగా కంపెనీ తన ప్రచారం కోసం మన నుంచి డబ్బు తీసుకుంటోంది" అని మేం కోర్టుకు చెప్పాం. అన్నారు. వినియోగదారుల ఫోరం పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. దానిని ప్రచారం చేసే పద్ధతి అనే చెప్పింది. ఫోరం తన ఆదేశాలలో "ఫిర్యాదులో చెప్పిన క్యారీ బ్యాగ్‌ను మేం చూశాం. దానిపై ఉన్న బాటా ప్రకటనలో 'బాటా సర్‌ప్రైజింగ్‌లీ స్టైలిష్' అని రాసుంది. బాటా స్టైలిష్ అని ఈ ప్రకటన చెబుతోంది. వినియోగదారుడిని ఆ ప్రకటనకు ఏజెంటులాగా ఉపయోగించుకుంటోంది" అని రాసింది. అది కంపెనీల బాధ్యత వినియోగదారుల హక్కుల కార్యకర్త పుష్పా గిరిమాజి కూడా వినియోగదారులకు ఉచితంగా క్యారీ బ్యాగ్ ఇవ్వడం కంపెనీల బాధ్యత అని చెప్పారు. "మనం ఏవైనా సామాన్లు కొన్నప్పుడు వాటిని అలాగే చేతిలో పట్టుకుని వెళ్లలేం కదా. అందుకే బ్యాగ్ ఇవ్వడం అవసరం. తర్వాత మనం అన్ని సామాన్లు కొంటున్నప్పుడు, క్యారీ బ్యాగ్ ఇవ్వడం షాపు వారి బాధ్యత కూడా. దానికోసం డబ్బులు తీసుకోవడం తప్పు" అన్నారు. పుష్ప దీనిని కంపెనీ సంపాదనకు ఒక మార్గం అని చెప్పారు. "ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించినప్పటి నుంచి కంపెనీలు డబ్బులు తీసుకుని క్యారీ బ్యాగ్‌లు ఇచ్చే పద్ధతి మొదలైంది. మనం కూరగాయలు కొన్నప్పుడు లేదా చిన్న చిన్న సామాన్లు కొన్నప్పుడు వాటికోసం బ్యాగ్ తీసుకెళ్లడానికి ఏ సమస్యా ఉండదు. కానీ ఖరీదైన సామాన్లు కొంటున్నప్పుడు బ్యాగ్ కోసం డబ్బులు తీసుకోవడం సరికాదు. ఇది డబ్బులు సంపాదించే ఒక పద్ధతైపోయింది" అన్నారు. అయితే, ఈ ఫిర్యాదుపై "తాము పర్యావరణం రక్షించడానికే అలా చేస్తున్నామని" బాటా చెప్పింది. కానీ, "అలాంటప్పుడు కంపెనీ క్యారీ బ్యాగ్ ఉచితంగానే ఇవ్వాలని" ఫోరం సూచించింది. కంపెనీ పేరు రాసుంటే ఈ కేసులో క్యారీ బ్యాగ్‌పై కంపెనీ పేరు రాసుండడం వల్ల అది ప్రచారం కేసుగా మారింది. బ్యాగ్‌పై కంపెనీ పేరు లేకుంటే, అది మామూలు పేపర్ బ్యాగ్ అయ్యుంటే కంపెనీ డబ్బు తీసుకోవచ్చా? అలాంటప్పుడు కూడా డబ్బులు తీసుకోవడం తప్పే అని పుష్ప అంటారు. "ఏ షోరూంలో అయినా లోపలికి బ్యాగ్ తీసుకెళ్లడం అనుమతించరు. దానివల్ల బ్యాగ్ ఎక్కడకు తీసుకెళ్లచ్చో, ఎక్కడకు తీసుకెళ్లకూడదో తెలీదు. చాలాసార్లు జనం తమతో బ్యాగ్ తీసుకుని కూడా వెళ్లరు. అందుకే బ్యాగ్ ఉచితంగానే ఇవ్వాలి" అన్నారు. "ఒక వినియోగదారుడు న్యాయం కోసం ఇలా చేయడం చాలా మంచి విషయం. దీని ప్రభావం మిగతా కంపెనీలపై కూడా పడుతుంది. వేరే కేసులో కూడా దీనిని సందర్భంగా తీసుకోవచ్చు. దానివల్ల క్యారీ బ్యాగ్ కోసం కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని నిరూపితమవుతుంది" అన్నారు పుష్ప. దీనిని ఆపడం ఎలా కంపెనీలు అలా డబ్బు వసూలు చేయకుండా అడ్డుకోడానికి కోర్టు ఆదేశాలతోపాటు ప్రజల అభ్యంతరాలు కూడా అవసరమే అని పుష్ప తెలిపారు. "జనం షోరూం వెళ్లి క్యారీ బ్యాగ్ ఇస్తారా, ఇవ్వరా? అని అడగడం మొదలు పెడితే, దానిని బట్టే షాపింగ్ చేస్తే, కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. అయితే కోర్టు ఇచ్చే ఇలాంటి ఆదేశాలు కూడా వాటిపై చాలా ప్రభావం చూపిస్తాయి" అని ఆమె చెప్పారు. అయినా దినేష్ ప్రసాద్ రతూడీ కేసులో బాటా కంపెనీ రాష్ట్ర స్థాయిలో కూడా అపీల్ చేసుకోవచ్చు. అడ్వకేట్ దినేష్ ప్రసాద్ కూడా "కంపెనీ ఈ కేసును ముందుకు తీసుకెళ్తే మేం కూడా వెళ్తాం. కానీ ప్రస్తుతం వినియోగదారుల ఫోరం ఆదేశాలతో సంతోషంగా ఉన్నాం" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏదైనా షోరూంలో సామాన్లు కొన్న తర్వాత మీరు కౌంటర్ దగ్గరికి వెళ్లినపుడు తరచూ క్యారీ బ్యాగ్ కొనుక్కోమని చెబుతుంటారు. text: "నేను ఎదుర్కొన్న వేధింపులు మరే అమ్మాయికీ ఎదురు కాకూడదనే ధైర్యం చేసి ఆ విషయాలు బయట పెట్టాను. అమ్మాయిలెవరైనా అవసరమైతే గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాటం చేయాలి" అని ఆమె వివరించారు. 'గజల్ శ్రీనివాస్ రాసలీలలు' అని పేర్కొంటూ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేశారు. మరోవైపు గజల్ శ్రీనివాస్.. బాధితురాలిని సొంత బిడ్డలాగా భావించానని అన్నారు. "నేను భుజానికి ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నా. ఆ రోజు థెరపిస్ట్ రాలేదు. దీంతో నేను చేస్తా అంది. నేను ఏనాడూ కూడా ఆమెనలా దురాలోచనతో చూడలేదు'' అని మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. కేశిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ 'సేవ్ ది టెంపుల్' అన్న పేరిట స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్నారు. అదే సంస్థలో 'ఆలయ వాణి' పేరిట ఒక రేడియో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం పని చేస్తున్న మహిళ గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 29న ఫిర్యాదు చేశారు. ఈ మహిళ బీబీసీతో మాట్లాడారు. గజల్ శ్రీనివాస్ తనను బలవంతంగా లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, మసాజ్ చేయాలి అని బలవంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అదే సంస్థలో పని చేస్తున్న మరో మహిళ పార్వతి ద్వారా తనపై 'ఒత్తిడి' తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనీ వివరించారు. "నేను అలా చేయలేను, ఉద్యోగం మానేస్తా అని ప్రాధేయపడ్డా. ఈ విషయం ఎవరితో చెప్పినా.. తన పలుకుబడి ఉపయోగించి కేసులలో ఇరికిస్తానని గజల్ శ్రీనివాస్ బెదిరించారు" అని ఆ మహిళ తెలిపారు. 'వేధింపులు భరించలేకే ఎలాగైనా.. ఈ విషయం అందరికీ తెలియాలని రహస్యంగా కెమెరా పెట్టి రికార్డు చేశాను' అని బాధితురాలు చెప్పారు. "చివరికి ఏదేమైనా సరే అని రిస్క్ తీసుకున్నా. ఎందుకంటే గజల్ శ్రీనివాస్ ఒక ముసుగులో జీవిస్తున్న వ్యక్తి. ఆ విషయాన్ని ఎవరికి చెప్పినా నన్ను నమ్మరు. అందుకే ఆధారాలతోనే అతని బాగోతం బయట పెట్టాలని ఇలా చేశా. ఇవాళ అదే నన్ను కాపాడింది" అని వివరించారు. అయితే.. బాధితురాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని, తానెప్పుడూ అసలు ఇటువంటి పనులకు ఒత్తిడి చేయలేదని ఈ కేసులో రెండో నిందితురాలు, పనిమనిషి పార్వతి చెప్పారు. "నేను ఇరవై సంవత్సరాలుగా శ్రీనివాస్ గారి ఇంట్లో పని చేస్తున్నా. ఏనాడూ అలాంటి పనులు అయన చేయలేదు. అసలు నేను ఎందుకు ఆ అమ్మాయిని ఒత్తిడి చేస్తా?" అని పార్వతి అన్నారు. బాధితురాలు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పార్వతి 'అక్యూజ్డ్ నెంబర్ 2'. పంజాగుట్ట పోలీసులు మంగళవారం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జుడీషియల్ కస్టడీ కింద చంచల్‌గూడ జైలుకు తరలించారు. "గజల్ శ్రీనివాస్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తాం. ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న వారు మరెవరైనా ఉంటే మమ్మల్ని ఆశ్రయించవచ్చు'' అని పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. బాధితురాలు ఈ సంస్థలో ఉద్యోగం మొదలు పెట్టి ఎనిమిది నెలలు అవుతోందని, రెండు నెలలుగా లైంగిక వేధింపులు మరింత ఎక్కువయ్యాయి అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు విజయ్ కుమార్ వివరించారు. ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. text: బిలియన్ల కొద్దీ వ్యాపారం జరిగే అవకాశం ఉంది కాబట్టి భారీ ఫార్మా సంస్థలు వెంటనే దీనికి వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో పడి ఉంటాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, వాస్తవ పరిస్థితి అలా లేదు. అంతర్జాతీయ వ్యాక్సిన్ మార్కెట్ ఈ ఏడాది రూ. 4.29 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ లాభాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం. ‘‘మహమ్మారిగా మారిన వ్యాధి చికిత్సకు ఉపయోగపడే లేదా నివారించే వ్యాక్సిన్‌ను విజయవంతంగా తయారుచేయడం చాలా కష్టం. చాలా సమయం, డబ్బు ఇందుకు వెచ్చించాల్సి వస్తుంది. విజయవంతమైన సంస్థలకు కూడా పెద్దగా డబ్బులేమీ రావు. కొందరు పెట్టుబడిదారులు ఆశించినట్లుగా బిలియన్ల కొద్దైతే అసలు రావు’’ అని అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ ఇన్వెస్టర్, లోన్కార్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాడ్ లోన్కార్ అన్నారు. అంతర్జాతీయ వ్యాక్సిన్ రంగంలో ఫైజర్, మెర్క్, గ్లాక్సో‌స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే), సనోఫి, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి భారీ సంస్థల ఆధిపత్యం నడుస్తోంది. స్టాటిస్టా అనే డేటా అనలిసిస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... గత ఏడాది రూ. 3.86 లక్షల కోట్ల మేర వ్యాక్సిన్ల అమ్మకాలు జరిగాయి. 2014తో పోలిస్తే ఇది రెండింతలైంది. ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్ ఫ్లూ, హెపటైటిస్, ఎబోలా వ్యాధుల వ్యాప్తి పెరగడం వల్ల అమ్మకాల్లో ఇంత వృద్ధి నమోదైంది. ‘‘కరోనావైరస్ సవాలును స్వీకరించేందుకు సంస్థలు పోటీపడతాయని అందరూ అనుకుంటుంటారు. కానీ, టాప్-4 సంస్థల్లో ఏవీ పెద్దగా ఆసక్తి చూపలేదు’’ అని ఆమ్‌స్టర్‌డామ్‌లోని యూనివర్సిటీ మెడికల్ సెంటర్ గ్రోనింగెన్‌కు చెందిన డాక్టర్ ఎలెన్ టీ హోయెన్ అన్నారు. కోవిడ్-19 ఇప్పటికే వెయ్యికిపైగా మందిని బలి తీసుకుంది. కొన్ని చిన్న సంస్థలే దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. హెచ్‌ఐవీకి ఔషధాలు రూపొందించే గిలీడ్ సంస్థ రెమ్‌డెసివిర్ అనే ఔషధాన్ని పరీక్షించనున్నట్లు ప్రకటించింది. అబ్‌వీ అనే సంస్థ రెండు హెచ్ఐవీ ఔషధాల కలయికతో రూపొందించిన కాలెట్రాను చైనాలో రోగులపై పరీక్షిస్తోంది. ఇదివరకు ఉన్న ఔషధాల ఆధారంగానే ఈ రెండు పరీక్షలు జరుగుతున్నాయి. ‘‘గిలీడ్ లేదా అబ్‌వీ లాంటి పెద్ద సంస్థ ఇదివరకున్న ఔషధాలను కొత్త వ్యాధిని నయం చేసేందుకు ఉపయోగించేలా తీసుకురావొచ్చు. కానీ, స్టాక్ మార్కెట్ కోణంలో చూస్తే, దీని వల్ల కలిగే ప్రయోజనమేమీ ఉండదు’’ అని లోన్కార్ అన్నారు. స్వచ్ఛంద సంస్థలు కోవిడ్-19 ఔషధాల తయారీ దిశగా ఫార్మా సంస్థలను కదిలించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి స్వచ్ఛంద సంస్థల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నవాటిలో కోఅలైషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనోవేషన్స్ (సీఈపీఐ) ఒకటి. భారత్, నార్వే తదితర దేశాలతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, వెల్‌కమ్ ట్రస్ట్ వంటి సంస్థలు కలిసి సీఈపీఐని స్థాపించాయి. ఇనోవియో ఫార్మాసూటికల్స్, మోడర్నా సంస్థల వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఈపీఐ చేయూతను అందిస్తోంది. కోవిడ్-19కు ఔషధాన్ని తయారుచేసేందుకు సీఈపీఐకి తమ సాంకేతికతను అందుబాటులో ఉంచేందుకు భారీ సంస్థల్లో ఒకటైన జీఎస్‌కే అంగీకారం తెలిపింది. అమ్మకాలను అనుమతించడం కన్నా ముందు వ్యాక్సిన్లను సుదీర్ఘంగా పరిక్షించాల్సి ఉంటుంది. వేల మందిపై పరీక్షలు చేయాల్సి ఉంటుంది. 2002, 2003ల్లో సార్స్ వ్యాప్తి చెందింది. అయితే దానికి వ్యాక్సిన్ కూడా తయారు కాకముందే ఆ వ్యాధి వెళ్లిపోయింది. ఇప్పటికీ సార్స్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేదు. ఎబోలా‌కు తొలి వ్యాక్సిన్‌ను మ్రెక్ తయారుచేసింది. 2015లో పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో దాన్ని అందించారు. అప్పటికి అది లైసెన్స్ లేని ఔషధమే. కానీ, అవసరం రీత్యా అక్కడి ప్రభుత్వం దాన్ని అనుమతించింది. అమెరికాలో గత ఏడాదే దానికి అనుమతి లభించింది. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన మరో ఎబోలా వ్యాక్సిన్ 2019లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అందుబాటులోకి వచ్చింది. ‘‘నేను ఔషధ సంస్థల కోసం పనిచేయను. వాటి అభిమానిని కాదు. కానీ ఎబోలా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు వాళ్లు చాలా డబ్బు ఖర్చు చేశారు. ఇందులో మరో ప్రశ్నకు తావు లేదు’’ అని రోనాల్డ్ క్లెయిన్ అన్నారు. 2014-15లో అమెరికా ఎబోలా రెస్పాన్స్ కోఆర్డినేటర్‌గా ఆయన పనిచేశారు. దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది కాబట్టే, అనుమతుల కోసం కొన్నేళ్లపాటు వ్యాక్సిన్లు వేచిచూడాల్సి వస్తోంది. ఔషధానికి అనుమతి లభించిన తర్వాత కూడా ఇలా జాప్యం జరగొచ్చు. 2009-10ల్లో స్వైన్ ఫ్లూ వ్యాపించినప్పుడు గ్లాక్సో‌స్మిత్‌క్లైన్ తయారు చేసిన పాండెమ్రిక్స్ వ్యాక్సిన్‌ను 60 లక్షల మందికి ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆ వ్యాక్సిన్ అమ్మకాలను ఉపసంహరించుకున్నారు. దాని వల్ల కొందరికి నార్కెలెప్సీ (అతినిద్ర) సమస్య వస్తున్నట్లు తెలిసింది. ‘‘కోవిడ్-19కి వ్యాక్సిన్ తయారుచేస్తామని పెద్ద సంస్థలేవీ ప్రకటించకపోవడం తీవ్ర అసహనం కలిగిస్తోంది. నైపుణ్యం ఉండి కూడా అలా మిన్నకుండిపోకూడదు. అవసరం ఉన్నప్పుడు రంగంలోకి దిగాలి’’ అని యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫాకీ అన్నారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఇంకో ఏడాదైనా సమయం పట్టొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అది కూడా ఏదైనా పెద్ద సంస్థ రంగంలోకి దిగితేనేనని అన్నారు. 18 నెలల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ రావొచ్చని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. ఇది వరకు ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఫార్మా సంస్థలు స్పందించి వ్యాక్సిన్లు రూపొందించినా... అవి అందుబాటులోకి వచ్చేలోపే సంక్షోభాలు సమసిపోయాయి. పరిశోధన, అభివృద్ధి కోసం చేసిన వ్యయాలు సంస్థలకు భారంగా మిగిలాయి. ‘‘దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా చాలా సంస్థలు, పెట్టుబడిదారులు ఇందులోకి దిగడం లేదు’’ అని లాన్కార్ అన్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రాణాంతక కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచమంతటినీ భయపెడుతోంది. ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్-19 అని పేరు కూడా పెట్టింది. text: కరోనా మహమ్మారి, జాతి అసమానతల నుంచి అమెరికా సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కార్మికులకు కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తానని, పర్యావరణ భద్రత, ఆరోగ్యం పొందే హక్కు, అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కీలకంగా భావిస్తున్న ఆ 8 అంశాలు ఇవే. నేషనల్ టెస్ట్ అండ్ ట్రేస్ ప్రోగ్రాం ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అత్యంత కఠినమైన సమస్య కరోనా మహమ్మారి. దీనిని అధిగమించేందుకు బైడెన్ చేపట్టబోతున్న తక్షణ చర్య దేశంలో అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు చేయించడం. 'నేషనల్ కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోగ్రాం' ఏర్పాటు కోసం ఆయన లక్ష మందిని కూడా నియమించాలని అనుకుంటున్నారు. కరోనా పరీక్షలు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో కనీసం 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. గవర్నర్లు అందరూ ఆయా రాష్ట్రాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని చెబుతున్నారు. కనీస వేతనాలు, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తక్షణ చర్యల్లో భాగంగా చిన్న వ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు, కుటుంబాలకు నేరుగా అందించే నగదు సాయాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు చేపడతానని బైడెన్ భరోసా ఇచ్చారు. వీటిలో సామాజిక భద్రత చెల్లింపులుగా నెలకు అదనంగా 200 డాలర్లు చెల్లించాలనే ప్రతిపాదన, ట్రంప్ పాలనలోని పన్నుల్లో కోతలు, ఫెడరల్ రుణాల్లో 10 వేల డాలర్ల విద్యార్థుల రుణమాఫీ ఉన్నాయి. డెమోక్రాట్లకు మద్దతుగా ఉన్న రెండు రాష్ట్రాల్లో యువత, కార్మికులను సంతోష పెట్టే లక్ష్యంతో బైడెన్ తీసుకొచ్చిన విస్తృత ఆర్థిక విధానాలను 'బిల్డ్ బ్యాక్ బెటర్ ప్లాన్' అని పిలుస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వం కనీస వేతనాలను గంటకు 15 డాలర్లుగా చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. 2020లో ఇది పార్టీకి ప్రచారాంశంగా కూడా మారింది. ఆయన 'గ్రీన్ ఎనర్జీ' కోసం 2 ట్రిలియన్ డాలర్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడం వల్ల, ఆ రంగంలోని కార్మికులకు సహకారం లభిస్తుందని చెబుతున్నారు. కొత్త రవాణా ప్రాజెక్టుల కోసం 'బై అమెరికన్' చట్టాలను అమలు చేయడానికి కట్టుబడి ఉండడంతోపాటూ అమెరికా వస్తువులను కొనడానికి 400 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను ఖర్చు చేస్తామని బైడెన్ వాగ్దానం చేశారు. ఉత్పత్తి, సేవలు, పరిశోధనలు, సాంకేతిక రంగాల్లో ప్రభుత్వం 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని బైడెన్ ప్రణాళికలో ఉన్నాయి. న్యాయ సంస్కరణలు, మైనారిటీలకు గ్రాంట్లు ఈ ఏడాది జాతి వివక్ష వ్యతిరేక ఆందోళనలతో అమెరికా అట్టుడికింది. దేశంలో జాత్యహంకారం ఉందని చెప్పిన ఆయన, మైనారిటీలకు అండగా నిలిచేందుకు విస్తృతంగా చేపట్టే ఆర్థిక, సామాజిక కార్యక్రమాల ద్వారా దానిని కచ్చితంగా ఎదుర్కోవచ్చని అంటున్నారు. 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మైనారిటీలకు వ్యాపారపరంగా సహకారం అందించడం ఆయన 'బిల్డ్ బ్యాక్' కార్యక్రమంలో ఒక కీలక అంశంగా ఉంది. ఇక వివిధ నేరాల్లో న్యాయం విషయానికి వస్తే 1990లో 'నేరాల విషయంలో కఠినంగా ఉంటారని' తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు ఆ ఇమేజిని వదిలించుకుంటున్నారు. బైడెన్ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న విధానాల్లో జైలు శిక్షలను తగ్గించడం, న్యాయ వ్యవస్థలో జాతి, లింగ, ఆర్థిక అసమానతలను రూపుమాపడం లాంటివి ఉన్నాయి. విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించాలని కూడా ఆయన భావిస్తున్నారు. జైలు శిక్షలు తగ్గించడం, కనీస శిక్షలను తొలగించడం, గతంలో నమోదైన గంజాయి కేసులను కొట్టివేయడం, మరణ శిక్షకు అంతం పలికేలా రాష్ట్రాలను ప్రోత్సహించాలని బైడెన్ అంటున్నారు. ప్రపంచ పర్యావరణ ఒప్పదంలో తిరిగి చేరడం వాతావరణ మార్పులను ముంచుకొస్తున్న ముప్పుగా చూడాలని బైడెన్ చెబుతున్నారు. పారిస్ ఒప్పందంలో తిరిగి చేరడం ద్వారా ఉద్గారాలను అరికట్టడంలో మరింత వేగంగా పనిచేసేలా, మిగతా ప్రపంచాన్ని కూడగడతానని అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 2005 స్థాయిల ఆధారంగా 2025 నాటికి 28 శాతం గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి అమెరికా కట్టుబడి ఉంది. కానీ, డోనల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది. కొత్త హరిత ఒప్పందం గురించి చెప్పని బైడెన్, తన పార్టీలోని లెఫ్ట్ వింగ్ ముందుకు తెచ్చిన వాతావరణం, ఉద్యోగాల ప్యాకేజీ కోసం గ్రీన్ టెక్నాలజీస్ రీసెర్చిలో 1.7 ట్రిలియన్ డాలర్ల ఫెడరల్ పెట్టుబడులు పెడుతున్నారు. వాటిలో కొన్ని ఆయన మరో పదేళ్లలో ఖర్చు చేయబోయే ఆర్థిక ప్రణాళిక నిధులలో కూడా కలుస్తాయి. 2050 నాటికి అమెరికా జీరో ఉద్గారాలకు చేరుకోవాలని ఆయన భావిస్తున్నారు. గత ఏడాది 60కి పైగా దేశాలు దీనికి వాగ్దానం చేశాయి. కర్బన ఉద్గారాలు అత్యధికంగా విడుదలయ్యే మరో రెండు దేశాలైన చైనా, భారత్ దీనిలో ఇంకా భాగం కావాల్సి ఉంది. బైడెన్ ఆర్థిక ప్రణాళికలోని ఈ పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను తయారు చేయడంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి. అమెరికా ప్రతిష్ఠను పునరుద్ధరించడం, చైనాతో ఒప్పదం అధ్యక్షుడిగా తాను మొట్టమొదట జాతీయ సమస్యలపై దృష్టి పెడతానని బైడెన్ చెప్పారు. మిత్ర దేశాలతో, ముఖ్యంగా నాటో కూటమితో అమెరికా సంబంధాలను సరి చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు. అమెరికా ఇచ్చే నిధుల్లో కోతపెట్టి అణచివేస్తానని నాటో కూటమిని ట్రంప్ పదే పదే బెదిరించారు. దారుణమైన పర్యావరణం, వాణిజ్య పద్ధతులకు చైనా జవాబుదారీగా ఉండాలని కూడా బైడెన్ చెప్పారు. అయితే, ఏకపక్షంగా విధించే సుంకాలకు బదులు, చైనా నిర్లక్ష్యం చేయలేని విధంగా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో ఒక అంతర్జాతీయ కూటమిని ఆయన ప్రతిపాదించారు. అయితే, దీనిపై ఆయన అస్పష్టతతో ఉన్నారు. ఒబామా కేర్‌ను విస్తరించడం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు తను ఆమోదించిన 'పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్' పథకాన్ని కూడా విస్తరిస్తానని, ఈ పథకం ద్వారా 97 శాతం మంది అమెరికన్లకు బీమా వర్తించేలా చేస్తానని బైడెన్ చెప్పారు. తమ పార్టీలోని లెఫ్ట్ వింగ్ సభ్యుల 'యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్; ప్రతిపాదనను ఆయన ఆపివేసినా, 'పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్' అమెరికన్లు అందరికీ చేరే ఆప్షన్ ఇస్తానని బైడెన్ మాటిచ్చారు. ఈ బీమా వృద్ధులు వైద్య ప్రయోజనాలు పొందే అర్హత వయసును 65 నుంచి 60కి తగ్గిస్తుంది. ఫెడరల్ బడ్జెట్ లెక్కలు వేసే కమిటీ, బైడెన్ ఈ పథకం కోసం పదేళ్లలో 2.25 ట్రిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ట్రంప్ విధానాల రద్దు అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మొదటి వంద రోజుల్లోనే ట్రంప్ విధానాలను తిప్పికొడతానని బైడెన్ వాగ్దానం చేశారు. వాటిలో అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో తల్లిదండ్రులను వారి పిల్లల నుంచి వేరు చేయడం, ఆశ్రయం కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య పరిమితులను ఉపసంహరించడం, ఎన్నో మెజారిటీ ముస్లిం దేశాలకు ప్రయాణాలు చేయడంపై ఉన్న నిషేధానికి తెరదించడం లాంటివి ఉన్నాయి. పిల్లలుగా ఉన్నప్పుడు అక్రమంగా అమెరికాలోకి చేరుకుని, ఒబామా పాలనా విధానాల ప్రకారం దేశంలో ఉండడానికి అనుమతి పొందిన 'డ్రీమర్స్'ను కాపాడుతానని కూడా బైడెన్ వాగ్దానం చేశారు. ఫెడరల్ విద్యార్థి ఆర్థికసాయం అందుకోడానికి కూడా వారు అర్హులేనన్నారు. యూనివర్సల్ ప్రీ-స్కూల్, ఫ్రీ కాలేజ్ విస్తరణ మిగతా చెప్పుకోదగిన మార్పుల్లో, పార్టీలో ఆదరణ పొందిన విద్యార్థి రుణాల మాపీ, ట్యూషన్ లేని ఉచిత కాలేజీల విస్తరణ, యూనివర్సల్ ప్రీ-స్కూల్ యాక్సెస్ లాంటి ఎన్నో బారీ విద్యా విధానాలకు బైడెన్ మద్దతు పలికారు. ట్రంప్ పాలనలో పన్ను కోతలను రద్దు చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని వీటికి ఖర్చు చేస్తారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నానని అధికారికంగా ప్రకటించినపుడు, రెండు అంశాల్లో, అంటే దేశాన్ని నిర్మించే కార్మికులకు అడగా ఉంటానని, దేశంలో ప్రజల మధ్య విభజనలను తగ్గించే విలువలకు కట్టుబడి ఉంటానని జో బైడెన్ చెప్పారు. text: ఇప్పటివరకూ చైనాలో సెక్స్ వర్కర్లను, వాళ్ల క్లయింట్స్‌ను.. 'ఎడ్యుకేషన్ సెంటర్స్' అనే నిర్బంధ కేంద్రాల్లో రెండేళ్ల వరకూ ఉంచేవారు. అక్కడ వారితో చైనా బలవంతంగా ఆట బొమ్మలు, ఇతర వస్తువుల తయారీ పనులు చేయించేదని ఆరోపణలున్నాయి. ఈ విధానానికి డిసెంబర్ 29 ఆఖరి తేది. ఇకపైనా చైనాలో వ్యభిచారం నేరమే. అయితే, పట్టుబడిన సెక్స్ వర్కర్లకు, వాళ్ల క్లయింట్స్‌కు 15 రోజుల వరకు నిర్బంధం, రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటిదాకా ఉన్న 'కస్టడీ అండ్ ఎడ్యుకేషన్' విధానం 20 ఏళ్లకుపైనే కొనసాగింది. ఈ విధానం 'మంచి సామాజిక వాతావరణం, ప్రజా భద్రత'ను కొనసాగించడంలో ఎంతగానో ఉపయోగపడిందని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షిన్‌హువా ఓ కథనంలో పేర్కొంది. అయితే, కాల గమనంలో ఈ విధానం అనుచితమైందిగా మారుతూ వచ్చిందని రాసింది. చైనా 'కస్టడీ అండ్ ఎడ్యుకేషన్' విధానం ప్రభావశీలతను ప్రశ్నిస్తూ 2013లో ఆసియా కేటలిస్ట్ అనే ఎన్జీవో ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. అందులో రెండు నగరాలకు చెందిన దాదాపు 30 మంది సెక్క్ వర్కర్ల ఇంటర్వ్యూలు ఉన్నాయి. నిర్బంధంలో ఉన్న వాళ్లు 'ఎడ్యుకేషన్ కేంద్రాల్లో' చాకిరీనే చేయాల్సి వచ్చిందని, విడుదలయ్యాక ఉపయోగపడే నైపుణ్యాలేవీ వాటిలో వాళ్లు నేర్చుకోలేకపోయారని ఆ నివేదిక పేర్కొంది. విడుదలైన వెంటనే వాళ్లందరూ తిరిగి వ్యభిచారంలోకే దిగారని తెలిపింది. 2013లో హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ సెక్స్ వర్కర్లు, వాళ్ల క్లయింట్స్, పోలీసులు, నిపుణులను ఇంటర్వ్యూ చేసి ఓ నివేదిక ఇచ్చింది. నేరాలను బలవంతంగా అంగీకరింపజేసేందుకు సెక్స్ వర్కర్లను పోలీసులు కొట్టినట్లు అందులో పేర్కొంది. బలవంతంగా నిర్బంధ కేంద్రాల్లో పనిచేయించే విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని, సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడే దిశగా పడిన చిన్న అడుగని ఆసియా కేటలిస్ట్ డైరెక్టర్ షెన్ టింగ్‌టింగ్ అన్నారు. చిన్న చిన్న నేరాలకు 'లేబర్ క్యాంపుల ద్వారా పునర్విద్య అందించే' విధానాన్ని 2013లో చైనా రద్దు చేసింది. అయితే, వ్యభిచారంలో పట్టుబడ్డ వారి కోసం ఏర్పాటు చేసిన 'కస్టడీ అండ్ ఎడ్యుకేషన్' విధానాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చింది. అయితే, ఇప్పటికీ 'పునర్విద్య' విధానాన్ని చైనా పూర్తిగా వదులుకోవడం లేదు. తీవ్రవాదాన్ని అరికట్టేందుకు షింజియాంగ్ ప్రాంతంలో స్వచ్ఛంద ఎడ్యుకేషన్ క్యాంపులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముస్లిం వీగర్లను ఈ కేంద్రాల్లో బంధించి, మతం వదలాలని చైనా బలవంతం చేస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సెక్స్ వర్కర్లతో బలవంతంగా చాకిరీ చేయించే విధానానికి చైనా ముగింపు పలికింది. text: సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. రైతుల ప్రతినిధులతో ముంబైలోని శాసనసభ భవనంలో సమావేశమయ్యారు. అనంతరం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ‘‘రైతుల డిమాండ్లన్నిటికీ మేం ఒప్పుకున్నాం. ఈ మేరకు వారికి విశ్వాసం కల్పించటానికి లిఖితపూర్వకంగా లేఖ అందించాం’’ అని పేర్కొన్నారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 మరోవైపు.. ‘‘రైతుల డిమాండ్లలో చాలా వాటికి మేం అంగీకరించాం. రాతపూర్వకంగా హామీ ఇచ్చాం’’ అని మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ బీబీసీకి తెలిపారు. అటవీ భూమి బదలాయింపు హక్కుల అంశాన్ని ఆరు నెలల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతులు, ఆదివాసీలకు రుణ మాఫీ సమస్యలను పరిశీలించటానికి అఖిల భారతీయ కిసాన్ సభ నుంచి ఇద్దరు ప్రతినిధులతో ఒక కమిటీని నియమిస్తామని చెప్పింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. రైతు సంఘంతో చర్చలు జరపటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు, ఆదివాసీలు చేస్తున్న డిమాండ్లన్నిటినీ పరిగణనలోకి తీసుకోవటానికి సుముఖంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ రుణ మాఫీ, నదుల అనుసంధానం పథకాన్ని ఆదివాసీ గ్రామాలను దృష్టిలో ఉంచుకుని పునర్‌వ్యవస్థీకరించటం, ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధరగా చెల్లించాలన్న స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయటం తదితర డిమాండ్లతో రైతులు ఈ ఆందోళన చేపట్టారు. నదుల అనుసంధానం పథకాన్ని.. గిరిజన గ్రామాలను గమనంలో ఉంచుకుని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయటానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మాటిచ్చింది. వేలాది మంది రైతులు, ఆదివాసీలు మార్చి 6వ తేదీన నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 11వ తేదీకి ముంబై చేరుకున్నారు. వీరు ఆరు రోజుల పాటు 180 కిలోమీటర్లు పైగా నడిచారు. ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన రైతులంతా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రైలు ఏర్పాటుచేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. రైతుల ఆందోళన, ప్రభుత్వ హామీలపై ఎవరేమన్నారు? ‘‘మహాత్మా గాంధీ ఇదే రోజున సత్యాగ్రహం ప్రారంభించారు. మా డిమాండ్లను ఆమోదించకపోయినా, అమలు చేయకపోయినా ఆ తర్వాతి రైతు ఉద్యమం ఆజాద్ మైదాన్ నుంచి మొదలవుతుంది’’ అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ‘‘ముంబైలో రైతుల భారీ ర్యాలీ ప్రజల శక్తికి అద్భుతమైన ఉదాహరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్దయ వైఖరికి వ్యతిరేకంగా ఈ రైతులు, ఆదివాసీల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోంది’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల డిమాండ్లను అమలు చేయటం, తన హామీలను నెరవేర్చటం చాలా ముఖ్యం. రైతులు మరోసారి రోడ్డెక్కకుండా ఉండాలంటే ప్రభుత్వం తన హామీలను అమలు చేసి చూపించాలి’’ అని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వ్యాఖ్యానించారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్రలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాసిక్ నుంచి ముంబై వరకూ లాంగ్ మార్చ్ చేపట్టిన వేలాది మంది రైతులు ఆదివారం రాత్రి ముంబై నగరానికి చేరుకున్నారు. వారి డిమాండ్లను చాలా వరకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించటంతో ఈ రైతులు సోమవారం ఆందోళన విరమించారు. text: శిశువు: నాడు, నేడు హానికర బ్యాక్టీరియా వల్ల రక్తం ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం(సెప్టిసీమియా), కీలకమైన ప్లేట్‌లెట్లు ప్రమాదకరస్థాయిలో పడిపోవడంతో విషమ పరిస్థితిలో ఉన్న ఈ శిశువును అక్టోబరు మధ్యలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. నెలలు నిండకుండానే పుట్టిన ఈ శిశువు ఇప్పుడు బరువు పెరిగిందని, శ్వాస తీసుకోవడం, ప్లేట్‌లెట్ల సంఖ్య సాధారణంగా ఉన్నాయని ఆమెకు చికిత్స అందించిన పీడియాట్రిషన్ రవి ఖన్నా బీబీసీతో చెప్పారు. ఆమె తల్లిదండ్రులెవరో ఇప్పటికీ తెలియదు. నిర్దేశిత వ్యవధి తర్వాత చిన్నారిని ఎవరైనా దత్తత తీసుకొనేందుకు అధికార యంత్రాంగం అనుమతించనుంది. చిన్నారి ప్రస్తుతం యూపీలోని బరేలీ జిల్లాలో పిల్లల సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంది. ప్రసవ సమయంలో మరణించిన తన ఆడశిశువును ఒక గ్రామస్థుడు పూడ్చిపెడుతుండగా, ఈ శిశువు బయటపడింది. మూడు అడుగులు తవ్విన తర్వాత తన పార తగిలి భూమి లోపలున్న ఓ మట్టి కుండ పగిలిపోయి, శిశువు ఏడుపు వినిపించిందని గ్రామస్థుడు చెప్పారు. కుండను బయటకు తీసి చూస్తే లోపల పసిపాప కనిపించిందని ఆయన తెలిపారు. ఈ శిశువు ఇప్పుడు బరువు పెరిగిందని, శ్వాస తీసుకోవడం, ప్లేట్‌లెట్ల సంఖ్య సాధారణంగా ఉన్నాయని డాక్టర్ రవి ఖన్నాచెప్పారు శిశువును మొదట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత మెరుగైన సదుపాయాలున్న డాక్టర్ రవి ఖన్నా చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. 30 వారాలకే ఈ శిశువు పుట్టి ఉండొచ్చని, ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు 1.1 కేజీ బరువే ఉందని ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్పుడు శిశువు శరీరం ముడతలు పడినట్లుగా కనిపించింది. త్వరగా వేడిని కోల్పోయేది. రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉండింది. ఈ నెల 3న బరేలీ జిల్లా అధికారులకు చిన్నారిని అప్పజెప్పామని, అప్పుడు 2.57 కేజీల బరువు ఉందని డాక్టర్ రవి ఖన్నా గురువారం తెలిపారు. ఇప్పుడు తను డబ్బాపాలు తాగుతోందని, పూర్తి ఆరోగ్యంతో ఉందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. అక్టోబర్లో ఈ శిశువును భూమిలోపల మట్టిపాత్రలో ఎంతసేపు లేదా ఎన్ని రోజులు పూడ్చిపెట్టారనేది తెలియదు. ఆమె ఎలా ప్రాణాలు నిలబెట్టుకొని ఉండొచ్చనేది మాత్రమే తాము అంచనా వేయగలమని వైద్యులు పేర్కొన్నారు. శిశువును మట్టికుండలో సజీవంగా పాతిపెట్టిన ప్రదేశం ఇదే మూడు, నాలుగు రోజుల ముందు శిశువును పూడ్చిపెట్టి ఉండొచ్చని, ఆమె తన 'బ్రౌన్ ఫ్యాట్‌'తో ప్రాణాలు నిలుపుకొని ఉండొచ్చని డాక్టర్ రవి ఖన్నా చెప్పారు. పిల్లలు పుట్టినప్పుడు వారి ఉదరం, తొడ, చెంప భాగాల్లో కొవ్వు ఉంటుంది. దీని సాయంతో అత్యవసర పరిస్థితుల్లో కొంత సమయం వారు ప్రాణాలు నిలబెట్టుకోగలరు. మరికొందరు నిపుణులు భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు, మూడు గంటలపాటు శిశువును పూడ్చి పెట్టి ఉండొచ్చని, కాపాడకపోతే మరో గంట లేదా రెండు గంటలు మాత్రమే ఆమె బతికేదని వారు చెప్పారు. శిశువుకు మట్టికుండ లోపలి 'ఎయిర్ పాకెట్' నుంచి ఆక్సిజన్ లభించి ఉండొచ్చని లేదా వదులుగా ఉన్న భూమి పొరల గుండా కొంత ఆక్సిజన్ అంది ఉండొచ్చని, ఈ కుండ ఎక్కువ సాంద్రతతో కూడిన మట్టితో తయారుకాకపోవడం కూడా కలసివచ్చి ఉండొచ్చని వారు అంచనా వేశారు. పసిపాపను సజీవంగా పూడ్చిపెట్టిన కేసులో పోలీసులు అక్టోబరులో గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం చూస్తున్నారు. ఈ నేరంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉండొచ్చని, ఈ కేసు గురించి బాగా ప్రచారం జరిగినా, శిశువు తమ సంతానమేనంటూ ఎవరూ ముందుకు రాలేదని పోలీసులు చెప్పారు. శిశువును సజీవంగా పూడ్చిపెట్టడానికి కారణాలపై అధికారులు ఎలాంటి ఊహాగానాలూ చెయ్యలేదు. స్త్రీ-పురుష నిష్పత్తిలో అత్యధిక వ్యత్యాసమున్న దేశాల్లో భారత్ ఒకటి. సామాజికంగా మహిళలు చాలాసార్లు వివక్షను ఎదుర్కొంటుంటారు. ఆడపిల్లలు ఆర్థికంగా భారమని అనుకొనేవారు ఉంటారు. ఇలాంటి వారు ప్రత్యేకించి పేద వర్గాల్లో ఎక్కువగా ఉంటారు. చట్టవిరుద్ధంగా పనిచేసే లింగ నిర్ధరణ కేంద్రాల్లో పరీక్షలు చేయించి గర్భస్థ శిశువు ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయించడం, లేదా పుట్టిన తర్వాత చంపేయడం చాలాసార్లు జరుగుతుంటాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు రెండు నెలల క్రితం భూమిలో మూడు అడుగుల లోతులో ఒక మట్టికుండలో బయటపడ్డ పసిపాప ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. text: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య(ముందు వరుసలో కుడివైపు వ్యక్తి) కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవల స్వగ్రామం నుంచి విజయవాడలోని కోవిడ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు. రాజయ్య గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని కుటుంబీకులు తెలిపారు. స్వగ్రామం సున్నంవారిగూడెంలో రాజయ్య మృతదేహం మూడు సార్లు ఎమ్మెల్యే.. నిరాడంబరుడు సీపీఎంకు చెందిన ఆయన 1999, 2004, 2014లో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నిరాడంబరుడిగా, ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన నిత్యం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. రాజయ్య అంతవరకు ప్రాతినిధ్యం వహించిన భద్రాచలం నియోజకవర్గంలోని అత్యధిక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చాయి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వారావు పేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి. వీటిలో భద్రాచలం నియోజకవర్గం నుంచి వేరయిన నాలుగు మండలాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో.. పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. ఈ ఏడు మండలాల్లోని 211 గ్రామాల బదలాయింపునకు సంబంధించి కేంద్రం చట్టం కూడా చేసింది. దీంతో అప్పటివరకు భద్రాచల నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నవారిలో అత్యధికులు రంపచోడవరం నియోజకవర్గ ఓటర్లుగా మారారు. మరికొందరు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చారు. దాంతో రాజయ్య 2019 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి పోటీ చేశారు. ప్రజాపోరాటాలలోనే.. సున్నం రాజయ్య ఓ సందర్భంలో నియోజకవర్గ ప్రజల సమస్యలపై హైదరాబాద్‌లోని సచివాలయానికి వెళ్లినప్పుడు చిత్రమైన అనుభవం ఎదుర్కొన్నారు. వెంట గన్‌మేన్ లేకపోవడం, ఆయన ఆటోలో సచివాలయానికి రావడంతో ఎమ్మెల్యేగా గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను గేట్ వద్ద అడ్డుకున్నారు. ఆ తర్వాత తాను ఎమ్మెల్యేనని ఐడీ కార్డ్ చూపించిన తర్వాత మాత్రమే సున్నం రాజయ్యని సెక్రటేరియేట్ లోకి అనుమతించారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఆందోళనలో ఆమరణ దీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కూడా ప్రజాసమస్యలపై ఎన్నో పోరాట్లో పాల్గొన్నారు. సున్నం రాజయ్య పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాటం చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులను కూడా ఎదుర్కొన్నారు. బాధితులకు పునరావాసం కోసం గత నెలలో కూడా ఆయన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాజయ్య మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు పనిచేసిన సున్నం రాజయ్య మరణించారు. text: కనీసం విలువైన ఖనిజ నిక్షేపాల ఆచూకీ కూడా లభించలేదు. కానీ స్థానిక మీడియా మాత్రం అదిగో.. ఖనిజాలు.. ఇదిగో గుప్త నిధులు అంటూ కథనాలు ప్రసారం చేసింది. మరి కోటలో అసలు ఏముంది.. తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆ విశేషాలతో ఈ రియాల్టీ చెక్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన రాజకోటలో దాదాపు నెల రోజులుగా రెవెన్యూ.. పోలీసు అధికారుల పర్యవేక్షణలో మైనింగ్ శాఖ తవ్వకాలు జరుపుతోంది. జియెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు కూడా అత్యాధునిక స్కానింగ్ పరికరాలతో రెండు రోజులపాటు కోట అంతటినీ పరిశీలించారు. నిధి నిక్షేపాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పాతాళగంగలో ఉబికివస్తున్న నీటిని పూర్తిగా తోడటానికి వీలుకాకపోవటంతో అక్కడ సర్వే చేయలేకపోయామని, తమ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని మాత్రమే గురువారం జీఎస్ఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో అధికారులు అయితే.. తాజాగా స్థానిక మీడియాలో మాత్రం చెన్నంపల్లి కోటలో నిక్షేపాల ఆచూకీ దొరికిందని.. విలువైన సంపద బయటపడనుందని వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. మైనింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ నటరాజన్ ఈ విషయాన్ని దృవీకరించారని ఓ ఛానల్ ప్రసారం చేసింది. దాంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలింది. మైనింగ్ ఏడీ నటరాజన్, తహశీల్దారు గోపాలరావు, కొందరు గ్రామ కమిటీ సభ్యులను బీబీసీ సంప్రదించింది. వాళ్లంతా మీడియాలో వస్తున్న కథనాలను కొట్టిపారేశారు. అంతా అవాస్తవమని చెప్పారు. విలువైన ఖనిజాలు ఎలా ఉంటాయని స్థానిక విలేఖర్లు అడిగితే, అవి ఎలా ఉంటాయో వివరించానేగాని, తాను ఎలాంటి ప్రకటనా చేయలేదని నటరాజన్ స్పష్టంచేశారు. ఇక్కడ తవ్వకాలు రహస్యంగా జరపటంలేదని, అంతా పారదర్శకంగానే జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రకటనలేవైనా చేస్తే బహిరంగంగా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులకూ చెప్తాం కదా? అని ఆయన ప్రశ్నించారు. తాజాగా కోటలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ మాంత్రికుడు వచ్చి కోట బురుజులో పూజలు చేసినట్లుగా చెన్నంపల్లి గ్రామస్థులు చెబుతున్నారు. మరి ఈ పూజలు ఎవరు చేయించారు? ఎందుకు చేయించారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజలు జరిగిన సమయంలో మైనింగ్ అధికారులతో పాటు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది కోటకు వెళ్లకపోవటం ఈ అనుమానాలకు తావిస్తోంది. కోటలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు పూజలు చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై తహశీల్దారు, ఆర్డీవోలను బీబీసీ సంప్రదించగా.. ఆ సమయంలో తామంతా జన్మభూమి కార్యక్రమంలో ఉన్నామని, పూజలు జరిగిన విషయం తమకు తెలియదని చెప్పారు. పూజలకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలకు మీడియా వారినే వివరణ అడగాలని ఆర్డీవో ఓబులేసు చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో ఇప్పటివరకూ రెండు, మూడు చోట్ల తవ్వకాలు జరిపారు. అయినప్పటికీ గుప్తనిధుల జాడమాత్రం బయటపడలేదు. text: చైనా ప్రీమియర్ లీ కికియాంగ్‌తో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ రాజకీయాలు, ఆర్థికవ్యవస్థ, విశ్వవిద్యాలయాలు తదితరాల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా సమాయత్తమవుతోంది. ఇందులో మరో ప్రశ్న ఎదురవుతోంది. తనకు అతిపెద్ద ఆర్థిక మద్దతుదారైన చైనాను నొప్పించకుండా, చైనీస్ ఆస్ట్రేలియన్లను నొప్పించకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది చిక్కుముడిగా ఉంది. ఈ నేపథ్యంలో, చైనా ప్రాబల్యంపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న చర్చ జాతివివక్ష కోణంలోకి మారిపోయే ఆస్కారముందా? ఆస్ట్రేలియా పట్ల చైనీస్ ఆస్ట్రేలియన్లందరి విధేయతను ప్రశ్నించేందుకు దేశంలో కొన్ని మూకలు బయల్దేరినట్లు అనిపిస్తోందని ఎరిన్ చ్యూ బీబీసీతో వ్యాఖ్యానించారు. ఆమె లాబీ గ్రూప్ ఏసియన్ ఆస్ట్రేలియా అలయన్స్ సహవ్యవస్థాపకురాలు. ఎరిన్ చ్యూ ఆస్ట్రేలియాలో పుట్టారు. ఆమె రచయిత. ఆమె మలేసియా-చైనీస్ సంతతి కార్యకర్త కూడా. చైనా ప్రభావంపై ఆందోళనకర సమాచారం అందుతోందని ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ చెప్పారు రాజకీయ కార్యకలాపాల్లో విదేశీ జోక్యాన్ని నివారించేందుకు చట్టం తెస్తామని నిరుడు ఆస్ట్రేలియా ప్రకటించినప్పుడు ఆస్ట్రేలియాపై చైనా ప్రభావం అతిగా ఉందా అనే చర్చ తారస్థాయికి చేరింది. చైనా ప్రభావంపై ఆందోళనకర సమాచారం అందుతోందని ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ వెల్లడించారు. రహస్యంగా, బలప్రయోగంతో జరిగే కార్యకలాపాలను తమ చట్టాలు లక్ష్యంగా చేసుకొంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో చదువుతున్న చైనా విద్యార్థులు, వ్యాపారం చేస్తున్న చైనీయులు, ఇతర చైనీస్ ఆస్ట్రేలియన్లకు చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ)తో సంబంధాల గురించి ఆస్ట్రేలియాలో భయాందోళనలు పెరిగిపోయాయి. లక్షన్నర మంది చైనా విద్యార్థులు ఆస్ట్రేలియాలో ప్రస్తుతం దాదాపు లక్షన్నర మంది చైనా విద్యార్థులు చదువుకొంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో చైనీయులు తైవాన్ లాంటి సున్నితమైన అంశాలపై చర్చను ప్రభావితం చేస్తున్నారనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. దక్షిణ పసిఫిక్ దేశాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపైనా ఆస్ట్రేలియా ఓ కన్నేసి ఉంచింది. దేశంలోని చైనీయులపై, చైనా సంతతివారిపై అలముకొన్న అనుమానాలతో వీరిని వేలెత్తి చూపుతున్నారని, లక్ష్యంగా చేసుకొంటున్నారని ఎరిన్ చ్యూ విచారం వ్యక్తంచేశారు. 'విదేశీ ప్రభావం'పై ఆస్ట్రేలియాలో చర్చ జరగడం అసమంజసమేమీ కాదని ఆమె స్పష్టంచేశారు. అయితే 'చైనా', 'చైనీయులు' అంతా ఒక్కటేననే అపోహ ఆస్ట్రేలియన్లలో ఉందని, ఇది బాధాకరమని వ్యాఖ్యానించారు. చైనీయుల్లో చాలా మంది తొలిసారి బంగారం వెలికితీత కోసం 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియాకు వచ్చారు నాడు బంగారం వెలికితీతలో ఘర్షణలు చైనీయులపై ఆస్ట్రేలియాలో వ్యతిరేకత ఈనాటిది కాదు. ఇది 1850లు, 1860ల నుంచే ఉంది. అప్పట్లో బంగారం అన్వేషణ, వెలికితీత కాలంలో జాతివివక్షతో కూడిన ఘర్షణలు కూడా జరిగాయి. వందల మంది చైనీయులు గాయపడ్డారు. ఎంతో మంది చైనీయులను బంగారు గనుల నుంచి వెళ్లగొట్టారు. ఈ ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాలకులు కఠినమైన వలస నిబంధనలు తీసుకొచ్చారు. నాటి 'శ్వేతవర్ణ ఆస్ట్రేలియా' వలస విధానం దేశానికి అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ విధానం 1901 నుంచి 1973 వరకు వివిధ రూపాల్లో కొనసాగింది. 'జాతివివక్ష కోణం ఉంది' చైనా ప్రభావంపై జరుగుతున్న చర్చ జాతివివక్ష కోణాన్ని సంతరించుకోలేదనే వాదనను ఎరిన్ చ్యూ కొట్టిపారేశారు. చైనీస్-వ్యతిరేక భావజాలాన్ని ఎన్నడూ చూడనివారే ఈ వాదనను అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా విద్యావేత్త క్లైవ్ హామిల్టన్ నిరుడు విడుదల చేసిన 'సైలెంట్ ఇన్వేజన్: హౌ చైనా ఈజ్ టర్నింగ్ ఆస్ట్రేలియా ఇన్‌ టు ఎ పప్పెట్ స్టేట్' పుస్తకంతో చైనా ప్రభావంపై చర్చ విస్తృతస్థాయిలో ఊపందుకొంది. ఆస్ట్రేలియాపై చైనా నిశ్శబ్దంగా దండయాత్రను సాగిస్తోందని, ఆస్ట్రేలియాను తోలుబొమ్మగా మార్చుకుంటోందనే అర్థం వచ్చేలా ఈ పుస్తకానికి పేరు పెట్టారు. వేల మంది చైనా ఏజెంట్లు ఆస్ట్రేలియాలో భాగమైపోయారని ఈ పుస్తకం ఆరోపిస్తోంది. చైనా లేదా చైనా అండదండలున్న సంస్థలు, వ్యక్తులు తమపై పరువునష్టం కేసు వేయొచ్చని చెబుతూ ఒక ప్రచురణ సంస్థ పుస్తకం ప్రచురణ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించింది. హామిల్టన్‌ను, ఆయన పుస్తకాన్ని ఎరిన్ చ్యూ తీవ్రంగా విమర్శించారు. తనపైన, తనలాంటి ఇతర కార్యకర్తలపైన జాతివివక్షతో కూడిన చాలా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చాయని ఎరిన్ చ్యూ చెప్పారు. చైనా ప్రచారకురాలు అంటూ హామిల్టన్ కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. 'చైనా', 'చైనీయులు' అంతా ఒక్కటేననే అపోహ ఆస్ట్రేలియన్లలో ఉందని ఎరిన్ చ్యూ వ్యాఖ్యానించారు 'జాతివివక్ష'పై హెచ్చరికలు చైనా విస్తృతస్థాయి అధికారిక కుట్ర జాతివివక్ష కోణాన్ని తీసుకుంటోందని చైనా సంబంధ అంశాల్లో విశేష పరిజ్ఞానమున్న 80 మంది విద్యావేత్తలు ఇటీవల హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆస్ట్రేలియాను ఒక సామంత రాజ్యం స్థాయికి మార్చాలనే ఉద్దేశం చైనాకు ఉందని కొందరు భావిస్తున్నారని చెప్పారు. ఆస్ట్రేలియా జాతివివక్ష నిరోధక కమిషనర్ టిమ్ సౌట్‌ఫోమ్మాసేన్ కూడా ఈ నెల్లో చేసిన ఒక ప్రసంగంలో జాతివివక్ష గురించిన ఆందోళనలను ప్రధానంగా ప్రస్తావించారు. చైనా ప్రభుత్వం పట్ల ఉండే వ్యతిరేకత చైనీస్ ఆస్ట్రేలియన్లందరినీ ఆస్ట్రేలియన్లు అనుమానించేలా చేసే ఆస్కారం ఉందని ఆయన హెచ్చరించారు. చైనా మూలాలున్న ఆస్ట్రేలియన్లు దేశంలో 12 లక్షల మంది ఉన్నారని, ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే అది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. 'ఆ ఆధారాల లేవు.. ముప్పుపైనే ఆందోళన' చైనా ప్రభావంపై చర్చ జాతివివక్ష రంగు పులుముకుందనే వాదనను మెల్‌బోర్న్‌లోని స్విన్‌బర్న్ యూనివర్శిటీలో చైనా వ్యవహారాల నిపుణుడైన ప్రొఫెసర్ జాన్ ఫిట్జ్‌గెరాల్డ్ తోసిపుచ్చారు. 80 మంది విద్యావేత్తల లేఖను ఖండిస్తూ విద్యావేత్తల బృందం ఒకటి లేఖ విడుదల చేసింది. ఈ బృందంలో జాన్ కూడా ఉన్నారు. జాతివివక్ష ఉందనే ఆధారాల కంటే జాతివివక్ష ముప్పు గురించే ఎక్కువ ఆందోళన వ్యక్తమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ''అమెరికా గురించో, భారత్ గురించో మీడియాలో వచ్చే సంచలనాత్మక శీర్షికలు జాతివివక్ష కిందకు రావు.. అదే విధంగా చైనా గురించి వచ్చే సంచలనాత్మక శీర్షికలు కూడా జాతివివక్ష కిందకు రావు. ఈ శీర్షికలు ఒక దేశాన్ని లేదా ఆ దేశంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే. శరీర రంగు ఆధారంగా చూపే వివక్షే జాతివివక్ష కిందకు వస్తుంది'' అని చెప్పారు. చైనా తీరుపైనా ఆరోపణలు చైనా ప్రభావంపై చర్చకు జాతివివక్ష రంగు అంటడంలో చైనా తీరుపైనా ఆరోపణలు ఉన్నాయి. చైనా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా, వారిని చైనా వ్యతిరేకులనో, జాతివివక్ష చూపుతున్నారనో చైనా ప్రభుత్వం ఆరోపిస్తోందని ఆస్ట్రేలియా మేధోసంస్థ లోవీ ఇన్‌స్టిట్యూట్‌లో చైనా వ్యవహారాల నిపుణుడు రిచర్డ్ మెక్‌గ్రెగర్ పేర్కొన్నారు. ఈ కారణంగా, కనీసం చర్చించాలన్నా ఈ అంశం సంక్లిష్టంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ''చైనీయులను చంపేయండి'' అంటూ సిడ్నీలోని ఒక విశ్వవిద్యాయలయంలో రాసిన రాతలపై నిరుడు చైనీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది చైనా విద్యార్థులపై దాడులు ఒకవైపు చైనా ప్రభావంపై చర్చ జరుగుతుండగా, మరోవైపు చైనా మూలాలున్నవారిపై దాడులు జరిగాయి. 2017 ఆగస్టులో కాన్‌బెర్రాలోని ఒక విశ్వవిద్యాలయం తరగతి గదిలో నలుగురు చైనీస్ విద్యార్థులపై, ఒక ట్యూటర్‌పై మరో విద్యార్థి బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశాడు. ఆ ఐదుగురికి గాయాలయ్యాయి. అక్టోబరులో కాన్‌బెర్రాలో ఇద్దరు చైనా ఉన్నత పాఠశాల విద్యార్థులపై దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో ఏదీ జాతివివక్షతో కూడిన దాడి కాదని పోలీసులు చెప్పారు. ఈ ఏడాది మేలో సిడ్నీలోని ఒక వీధిలో ఒక వ్యక్తి ఏడుగురిని గాయపరిచాడు. బాధితులు ఆసియావాసులని, వారు ఆసియన్లు అయినందునే అతడు దాడి చేశాడని పోలీసులు ఆరోపించారు. అతడిని అరెస్టు చేశారు. 'అధికార స్థానాల్లో దక్కని అవకాశం' ఆస్ట్రేలియా జనాభాలో 5.6 శాతం మంది చైనీస్ ఆస్ట్రేలియన్లేనని, కానీ అధికార స్థానాల్లో వారికి అవకాశాలు దాదాపు లేవని ప్రముఖ రచయిత, జర్నలిస్టు బెంజమిన్ లా చెప్పారు. ఆస్ట్రేలియాలోని నాలుగు అతిపెద్ద రంగాలైన గనులు, విద్య, పర్యాటకం, వ్యవసాయంలలో చైనాపై ఆస్ట్రేలియా చాలా ఎక్కువగా ఆధారపడుతోంది. తమకు వ్యతిరేకంగా జరిగే పరిణామాలకు ప్రతిస్పందనగా చైనా చర్యలు చేపడితే పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళన కూడా ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియా: ఇంగ్లిష్ రాకపోతే పౌరసత్వం ఇవ్వం ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇటీవలి నెలల్లో ఆస్ట్రేలియా ఒక సంక్లిష్టమైన సమస్యతో ఇబ్బందిపడుతోంది. తను నమ్మే విలువలకు కట్టుబడి ఉంటూనే, పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎలా ఎదుర్కోవాలనేదానిపై ఆస్ట్రేలియా సతమతమవుతోంది. text: ఇందుకోసం విదేశీ పర్యటకులు తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది. తొలి విడతలో 49 దేశాల పర్యటకులకు మాత్రమే వీసాలు జారీ చేయనుంది. తమ దేశంలో ఉండే కఠినమైన వస్త్రధారణ నిబంధనలను కూడా మహిళా పర్యటకుల కోసం కొంత సడలించింది. ఈ నిర్ణయం తమ దేశానికి చరిత్రాత్మకమని సౌదీ అరేబియా పర్యటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ అన్నారు. యాత్రికులు, వ్యాపారులు, ప్రవాస కార్మికులకు మాత్రమే ప్రస్తుతం సౌదీ వీసాలు ఇస్తారు. పర్యటక రంగంలో విదేశీ పెట్టుబడులపైనా ఆ దేశం ఆశలు పెట్టుకుంది. 2030 నాటికి పర్యటక ఆదాయం 3 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని కోరుకుంటోంది. అందం చూడవయా.. ''మా దేశ పర్యటనకు వచ్చే యాత్రికులు ఆశ్చర్యపోవడం ఖాయం. అయిదు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, కట్టిపడేసే ప్రకృతి అందాలు, ఉత్తేజాన్నందించే స్థానిక సంస్కృతి వంటివన్నీ పర్యటకులకు కనువిందు చేస్తాయ''ని ఖతీబ్ చెప్పారు. విదేశాల నుంచి పర్యటనకు వచ్చే మహిళలు సౌదీ మహిళల మాదిరిగా ఒళ్లంతా కప్పుకొనేలాంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని, అయితే, సభ్యమైన దుస్తులు ధరించడం మాత్రం అవసరమని ఆయన చెప్పారు. ఒంటరి మహిళలు పర్యటనకు రాకూడదన్న నిబంధనలు కూడా ఏమీ లేవని చెప్పారు. మా సంస్కృతిని గౌరవిస్తేనే ''మా సంస్కృతి ప్రత్యేకం. దాన్ని మా అతిథులు, స్నేహితులు కూడా మా సంస్కృతిని గౌరవిస్తారన్న నమ్మకం ఉంది. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం.. దుస్తులు మాత్రం సభ్యమైనవి వేసుకోవాల'న్నారాయన. ముస్లిమేతరులు మక్కా, మదీనాలు సందర్శించడానికి వీలు లేదని.. అలాగే మద్యం కూడా నిషిద్ధమని తెలిపారు. ఇటీవల తమ చమురు కేంద్రాలపై జరిగిన దాడులకు భయపడి పర్యటకులు రారన్న అనుమానాలు తమకు లేవన్నారు. ‘మీకే భయం లేదు’ ''ప్రపంచంలోని భద్రమైన నగరాల్లో సౌదీ నగరాలూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దాడులు మాపై ప్రభావం చూపిస్తాయనుకోం'' అన్నారాయన. పర్యటకానికి తెర తీస్తూ తీసుకున్న ఈ నిర్ణయం క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సంస్కరణల్లో భాగమని... సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థపై పూర్తిగా చమురుపైనే ఆధారపడే పరిస్థితిని మార్చడానికి ఈ సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు. జమాల్ ఖషోగ్జీ హత్యతో... కొత్త పర్యటక విధానంలో భాగంగా 2030 నాటికి దేశీయ, విదేశీ పర్యటకుల సంఖ్య 10 కోట్లకు పెరగాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, పర్యటక రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పనా లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య, ఇటీవల మహిళా హక్కుల కార్యకర్తలపై దాడుల వంటి కారణాలతో సౌదీ అరేబియా అప్రతిష్ఠ మూటగట్టుకుంది. మరోవైపు సౌదీ 2017లోనే భారీ పర్యటక ప్రాజెక్ట్ ప్రకటించింది. ఎర్ర సముద్రంలోని 50 దీవులను పర్యటక రిసార్టులుగా మార్చాలన్నది ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అందులో భాగంగానే రియాద్ సమీపంలోని క్విదియా దీవిలో పనులు మొదలయ్యాయి. బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డనర్ విశ్లేషణ.. సౌదీ అరేబియా పర్యటకానికి తెర తీయడం ఇదే తొలిసారి కాదు. 2000 సంవత్సరంలో అసిర్ ప్రావిన్స్‌లోని పర్వతాల్లో పర్యటకుల కోసం పారా గ్లైడింగ్, రాక్ క్లైంబింగ్ నిర్వహించేలా ఫ్రాన్స్ శిక్షకులను నియమించుకుంది. కానీ, 9/11 దాడుల తరువాత అన్నీ పక్కనపెట్టేసింది. ఆ దాడుల్లో 15 మంది సౌదీ దేశస్థుల ప్రమేయముంది. అయితే, దేశీయ, ఆధ్యాత్మిక పర్యటకం ఎలాంటి ఢోకా లేకుండా సాగింది. హజ్ యాత్ర కోసం ఏటా 30 లక్షల మంది వస్తున్నారిక్కడికి. సౌదీలో బాగా వేడిగా ఉండే, పొడి వాతావరణానికి దూరంగా అసిర్ పర్వతసానువుల్లోకి కానీ, ఎర్ర సముద్ర తీరానికి కానీ వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ.. అక్కడ కూడా కాక్ టైల్ వంటివి ఆశించొద్దు. ఎందుకంటే అది సౌదీ అరేబియా. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆర్థికవ్యవస్థ మొత్తం చమురుపైనే ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడేందుకు గాను సౌదీ అరేబియా పర్యటక ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. text: '117 మంది ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు' అంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఓవైపు అంటుండగా.. 'కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉంది.. వారి మద్దతుతోనే విశ్వాస పరీక్షలో నెగ్గుతా' అని సీఎం యడ్యూరప్ప నమ్మకంగా చెబుతున్నారు. వీరిలో ఎవరి మాట నిజం..? కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగానే ఉన్నారా? లేదంటే కొందరు యడ్యూరప్పను బలపరుస్తారా? అన్నది చర్చనీయమవుతోంది. అంతేకాదు.. తన రాజకీయ జీవితంలో అయిదోసారి బలపరీక్ష ఎదుర్కొంటున్న యడ్యూరప్ప విఫలమైతే ఏమవుతుందన్నదీ చర్చకొస్తోంది. ఈ పరీక్షలో గెలవలేకపోతే.. కరచాలనం చేస్తున్న జేడీఎస్ నేత కుమారస్వామి, కాంగ్రెస్ నేత పరమేశ్వర సీఎంగా కొనసాగాలంటే.. పదకొండేళ్లలో అయిదోసారి యడ్యూరప్ప తొలిసారి 2007 నవంబరులో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. జేడీఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పటికీ 8 రోజుల్లోనే జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన విశ్వాసపరీక్ష ఎదుర్కొన్నారు. బలం నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లు సాధించడంతో యడ్యూరప్ప మళ్లీ సీఎం అయ్యారు. అయితే, 3 సీట్లు తక్కువ కావడంతో 2008 జూన్‌లో విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. అందులో ఆయన పాసయ్యారు. అనంతరం 2010 అక్టోబరులోనూ యెడ్డీకి ఫ్లోర్ టెస్టు తప్పలేదు. కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో అప్పటి గవర్నరు హెచ్‌ఆర్ భరద్వాజ్ విశ్వాస పరీక్షను ప్రతిపాదించారు. అయితే.. ప్రస్తుతం నియమితులైన ప్రోటెం స్పీకర్ బోపయ్యే అప్పుడూ ప్రోటెం స్పీకరుగా పనిచేసి సభ నుంచి 16 మంది సభ్యత్వం రద్దు చేసి గట్టెక్కేలా చేశారు. కానీ, గవర్నరు ఆ పరీక్ష ఫలితాన్ని తిరస్కరిస్తూ మళ్లీ కొద్ది రోజులకే విశ్వాస పరీక్ష నిర్వహించారు. అందులో ఆయన బలం నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన అయిదోసారి బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశమంతా కర్ణాటక వైపే చూస్తోంది. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప నెగ్గితే ఏమవుతుంది? నెగ్గకపోతే ఏమవుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. text: నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలోని ఒక పులి జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ- ఎన్‌టీసీఏ) ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా పులులను లెక్కించింది. 16 పెద్దపులి ఆవాస రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని అన్ని అడవుల్లో నాలుగేళ్లకోసారి ఈ గణన జరుగుతుంది. పులులతోపాటు ఇతర వన్యప్రాణులను కూడా లెక్కిస్తారు. నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో అత్యాధునిక కెమెరాలు తీసిన ఫొటో లెక్కింపు విధానం వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, పులులతోపాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు. ఐదు పద్ధతుల్లో వీటి గణాంకాలను సేకరిస్తారు. అటవీ సిబ్బంది నడక మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే, వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. గాజు పలకపై పులి పాదముద్ర ఆకారాన్ని గీస్తున్న సిబ్బంది పగ్ మార్క్ విధానంలో అయితే సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు. మెుదట ఒక గాజుపలకపై స్కెచ్ పెన్‌తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్‌ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. 15 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డ కట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది. పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినదీ నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు. సేకరించిన పులి మలాన్ని డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపుతారు అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్‌లోని 'సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)'కి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు. వెంట్రుకలు, గోళ్లకు పరీక్షలు అడవి జంతువులు చెట్లకు, రాళ్లకు పాదాలను, శరీరాన్ని రుద్దుతుంటాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు, శరీరంపై దురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయి. అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడి పడిపోతుంటాయి. అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించగలుగుతారు. సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధరిస్తారు. అత్యాధునిక కెమెరాల వినియోగం 2014 నుంచి ఎన్‌టీసీఏ వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను వాడుతోంది. వీటిని వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో ఎదురెదురుగా చెట్లకు అమరుస్తారు. ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంచే ఈ కెమెరాలు 24 గంటలూ వాటంతటవే పనిచేస్తాయి. చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించి ఫొటోలు తీస్తాయి. నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో అత్యాధునిక కెమెరాలు తీసిన ఫొటో జంతువుల కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు పని ప్రారంభిస్తాయి. వీటిలో నమోదైన సమాచారాన్ని రోజూ సేకరిస్తారు. చిత్రాల్లోని జంతువుల ఎత్తు, చారలు, నడకను పరిగణనలోకి తీసుకొని వాటి సంఖ్యను లెక్కగడతారు. ఇలా వివిధ పద్ధతుల్లో సేకరించిన ఆధారాలను, నివేదికలను ఎన్‌టీసీఏ అధికారులు ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో ఉన్న భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ)కు పంపుతారు. డబ్ల్యూఐఐ అందించే నివేదిక ఆధారంగా ఎన్‌టీసీఏ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపుతుంది. ఆ శాఖ దీనిని పార్లమెంటుకు సమర్పిస్తుంది. దేశవ్యాప్తంగా పులుల సంఖ్యలో పెరుగుదల 2006లో ఏర్పాటైన ఎన్‌టీసీఏ ఇప్పటికి మూడుసార్లు దేశవ్యాప్తంగా వన్యప్రాణుల గణన నిర్వహించింది. ప్రస్తుతం జరుగుతున్నది నాలుగో గణన. 2006తో పోలిస్తే 2014 నాటికి దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరిగింది. 2006 సంవత్సరానికి పులుల సంఖ్య 1,411గా ఉండగా, 2010 నాటికి 1,706కు, 2014 నాటికి 2,226కు చేరినట్లు ఎన్‌టీసీఏ తన నివేదికలో తెలిపింది. నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యం నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పరిస్థితి? దేశంలోని అతిపెద్ద అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో 2006లో 95 పులులు ఉండేవి. 2010లో వీటి సంఖ్య 72కు, 2014 నాటికి 68కి తగ్గింది. 2009లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యధిక ప్రాంతం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చింది. గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం కూడా ఇందులో విలీనమైంది. ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ ఉంది. నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యంలోని 1,193.68 చదరపు కిలోమీటర్లు విలీనం కావడంవల్ల 2,444.14 చ.కి.మీ. కోర్ ఏరియా, 1,283.36 చ.కి.మీ. బఫర్ ఏరియా కలిపి నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ విస్తీర్ణం 3,727.5 చదరపు కిలోమీటర్లకు చేరింది. పులులు నివాసం ఉండే ప్రధాన ప్రాంతాన్ని కోర్ ఏరియా అని, సంచరించే అవకాశమున్న ప్రాంతాన్ని బఫర్ ఏరియా అని వ్యవహరిస్తారు. తెలంగాణలో 20 పులులు ఇక తెలంగాణలో పెద్ద పులులు 20కి పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కవ్వాల్, ఆమ్రాబాద్ రెండు అభయారణ్యాలున్నాయి. ఆమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ నల్లమలలోనే ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన తరువాత అది తెలంగాణలో భాగమైంది. ప్రస్తుత గణనలో సేకరించిన పాదముద్రలు, మల విసర్జితాల ఆధారంగా తెలంగాణలో 20కి పైగా పులులు ఉండొచ్చని తెలంగాణ అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. శివప్రసాద్, డీఎఫ్‌వో, నంద్యాల 'పులుల పునరుత్పత్తికి అనుకూలంగా నల్లమల' 2014 తర్వాత నుంచి పులుల పునరుత్పత్తికి నల్లమలలో అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఫలితంగా పులుల సంఖ్య పెరుగుతోందని నంద్యాల డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) శివప్రసాద్ తెలిపారు. నల్లమల ప్రాంతంలోని నంద్యాల, ఆత్మకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలో వంద బేస్ క్యాంపులు ఉన్నాయని, అక్కడ రాత్రింబవళ్లు అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వేటగాళ్ల నుంచి పులులకు రక్షణ దొరుకుతోందని ఆయన చెప్పారు. జంతువుల వేట, కలప స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు వివిధ ప్రదేశాల్లో కందకాల తవ్వకం లాంటి చర్యలు చేపడుతున్నామని శివప్రసాద్ తెలిపారు. గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం కేంద్రంగా పులులు రుద్రవరం, అహోబిలం మీదుగా కడప జిల్లాలోని శేషాచలం కొండలైన ప్రొద్దుటూరు, సిద్దవటం వరకు పులుల సంతతి పెరుగుతోందని ఆయన తెలిపారు. నల్లమలలో గతంతో పోలిస్తే పులుల సంఖ్య పెరిగినట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అభయారణ్యాల్లో పులులను ఎలా లెక్కిస్తారు? వయసును ఎలా నిర్ధరిస్తారు? ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడతారు? నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో... text: సాధారణంగా మొబైల్‌కు 'అలర్ట్' వచ్చినప్పుడు వాటిని నివారించేందుకు మార్గం ఉంటుంది. అయితే, ఈ 'అలర్ట్'ను నివారించే మార్గం లేదు. ఫోన్‌ను ఆఫ్ చేయడం లేదా నెట్ వర్క్ కనెక్షన్‌ను తొలగిస్తేనే ఈ అలర్ట్‌ను అందుకోలేం. కొంతమంది ఈ సందేశాన్ని ట్రంప్ అలర్ట్‌గా అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ ప్రమేయం ఇందులో లేదు. ట్రంప్ ముఖ్యమైన హెచ్చరికను పంపిస్తే వెంటనే దాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(ఫెమా) దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఈ అలెర్ట్ వ్యవస్థను క్షిపణుల ప్రయోగం, ఉగ్రవాద చర్యలు, ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసేందుకు ఏర్పాటు చేశారు. ''ఇది నేషనల్ వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ప్రయోగత్మక పరీక్ష. ఎలాంటి చర్యలు అవసరం లేదు'' అని ఒక సౌండ్‌తో హెచ్చరిక సందేశం ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయింది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 30 నిమిషాల వ్యవధిలో వివిధ మొబైల్ నెట్‌వర్క్ సంస్థల నుంచి ఈ అలర్ట్‌లు ఫోన్లకు వచ్చాయి. ఇలాంటి అలర్ట్‌లను పంపే ప్రక్రియను మూడేళ్లలో కనీసం ఒక్కసారైన పరీక్షించాలని 2015లో అమెరికా చట్టం తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ 'అలర్ట్' ప్రయోగాత్మక పరీక్షను సెప్టెంబర్‌లోనే నిర్వహించాలి. కానీ, ఉత్తర, దక్షిణ కరోలినాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితులను నివారించేందుకు దీన్ని వాయిదా వేశారు. అలర్ట్ తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రజలు దీనిపై చర్చించారు. కొందరు ఈ వ్యవస్థపై ఫిర్యాదు చేస్తే మరికొందరు ఇందులోని లోపాల గురించి మాట్లాడారు. కొందరు తమకు ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదని చెప్పారు. ‘ట్రంప్ అలర్ట్’ మెసేజ్ చట్టపరంగా సవాళ్లు ప్రజల రక్షణ ప్రమాదంలో పడినప్పుడే అధ్యక్షుడు ఈ వ్యవస్థను ఉపయోగించేలా కాంగ్రెస్ పరిమితులు విధించింది. అంతేకాదు, చివరి క్షణంలో హెచ్చరిక సందేశాన్ని నిలువరించే అవకాశాన్ని కూడా ఈ వ్యవస్థ కల్పించింది. అయినా కూడా ఇలాంటి 'అలర్ట్'లు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవస్థ తమ స్వేచ్ఛా హక్కులను కాలరాస్తోందని జర్నలిస్టు, లాయర్, ఫిట్‌నెస్ శిక్షకుడితో కూడిన ఓ బృందం 'ఫెమా'పై ఫిర్యాదు చేసింది. ఈ అలర్ట్స్ పిల్లల్లో ఆందోళన కలిగిస్తాయని ఆ వ్యాజ్యంలో ఆరోపించింది. అయితే, బుధవారం ఉదయం ఈ కేసును విచారించేందుకు న్యూయార్క్ న్యాయమూర్తి నిరాకరించారు. జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాల కాలంలోనే ఈ వ్యవస్థ అభివృద్ధి చేశారని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలోని 20 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు 'ప్రెసిడెన్షియల్ అలర్ట్'లు వచ్చాయి. గతంలో ఉపయోగించని అత్యవసర సమాచార వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా తెలుసుకోడానికి 'ఈ అలర్ట్'ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. text: అయితే, ఈ ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) చేస్తున్న విచారణలపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహ్తగీ వాదనలు వినిపించారు. "ఈ నలుగురు నిందితులనూ పెట్రోల్ బంక్ దగ్గర బాధితురాలి స్కూటర్‌తో పాటు ఉండటాన్ని గుర్తించారు. వాళ్లు పెట్రోల్ కోసం ఆ బంకుకు వెళ్లారు. వాళ్ల గుర్తింపు విషయంలో ఎలాంటి అనుమానం లేదు. బాధితురాలి మొబైల్, ఛార్జర్, పవర్ బ్యాంక్‌లను సేకరించడానికి నేరం జరిగిన ప్రదేశానికి వారిని తీసుకెళ్లారు" అని రోహ్తగీ కోర్టుకు స్పష్టం చేశారు. వారిపై గతంలో ఏమైనా నేరాలున్నాయా అని ఈ సందర్భంగా సీజేఐ ఎస్ఏ బాబ్డే ప్రశ్నించారు. "వారిని ఉదయం 5-5.30 గంటల సమయంలో అక్కడకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వారి చేతులకు సంకెళ్లు లేవు. దీంతో వాళ్లు పోలీసుల ఆయుధాలను లాక్కున్నారు. వాటిపై పోలీసులపై దాడికి దిగారు, ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. లాక్కున్న పిస్టల్‌తో నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్చి వచ్చింది" అని రోహ్తగీ వివరించారు. "మీరు రివాల్వర్ ఎందుకు తీసుకెళ్లారు? వాళ్లు పోలీసులపై పిస్టల్‌తో కాల్పులు జరిపారు, కానీ పోలీసులెవరికీ గాయాలు కాలేదా?" అని సీజేఐ బాబ్డే తిరిగి ప్రశ్నించారు. పోలీసులకు పిస్టల్ కాల్పుల వల్ల గాయాలు కాలేదు అని దీనికి సమాధానంగా రోహ్తగీ చెప్పారు. ఇద్దరు పోలీసుల నుంచి ఓ నిందితుడు తుపాకులు లాక్కొని, కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో వారంతా మరణించారని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాధితురాలి శరీరం దహనమవుతున్న విషయాన్ని ఓ పాలవ్యాపారి ముందుగా గుర్తించారని రోహ్తగీ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరగాలని ఆయన అన్నారు. గతంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని దీనికోసం నియమించారని, అయితే ఆయన విచారణ ప్రక్రియను పర్యవేక్షణ చేయగలరు గానీ, విచారణ చేయలేరు అని రోహ్తగీ చెప్పారు. మాకు విచారణ గురించి ఆందోళన లేదు, దాని ఫలితాన్ని సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ లేదా కమిటీ నిర్థరిస్తుంది అని బాబ్డే స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను మీరు క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తే, ఇక మేం చేయాల్సింది ఏమీ లేదు. కానీ, వాళ్లు అమాయకులు అని మీరంటే మాత్రం, ప్రజలకు నిజాలు తెలియాల్సిందే, విచారణ జరగాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవాలను అంచనా వేయాలని మేం కోరుకోవట్లేదు. విచారణ జరగనివ్వండి, దాన్ని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. దీనిపై, "ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం దీన్ని సూమోటో కేసుగా తీసుకుని విచారణ ప్రారంభించింది. మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అందువల్ల సమాంతర విచారణ కుదరదు" అని రోహ్తగీ సమాధానమిచ్చారు. "పోలీసులుగా మీరు చేసే విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. మేం పోలీసుల చర్యలపైనే విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నాం" అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఆ ఘటనలో పోలీసులు ఏం చేశారు, నిందితులు ఏం చేశారు అనేది మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. వారికి మేం ప్రత్యేకంగా పరిగణించట్లేదు. డిసెంబర్ 6 ఉదయం ఆ నలుగురు నిందితులూ ఎలా చనిపోయారో, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటో వెల్లడయ్యేందుకు మేం ఓ విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నాం. ఈ కమిషన్‌కు రిటైర్డ్ జడ్జి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తారు. బొంబాయి హైకోర్టు జడ్జి రేఖా ఎస్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఈ బృందం హైదరాబాద్ నుంచే విచారణను నిర్వహిస్తుంది, వీరికి తెలంగాణ ప్రభుత్వమే అవసరమైన సౌకర్యాలతోపాటు భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఆరు నెలల్లో విచారణ పూర్తిచేసి, నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై తదుపరి ఆదేశాలిచ్చే వరకూ మరే ఇతర కోర్టు గానీ, అథారిటీ గానీ విచారణ జరపజాలదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో తెలంగాణ హైకోర్టులో, ఎన్‌హెచ్ఆర్సీలో దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ నిలిచిపోనుంది. బుధవారం నాడు ఏం జరిగింది? హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య నిందితుల ‘ఎన్‌కౌంటర్‌’ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. 'దిశ' కేసులో నిందితుల ‘ఎన్‌కౌంటర్‌’లో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసును రిజిస్టర్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, విచారణ జరపాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ ఈనెల9వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావనకు వచ్చింది. ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారణకు స్వీకరించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జడ్జి చేత విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జస్టిస్ బాబ్డే ప్రతిపాదించారని బీబీసీ ప్రతినిధి సుచిత్ర మొహంతి తెలిపారు. ఇందుకోసం జస్టిస్ పీవీ రెడ్డి పేరును పరిశీలించగా.. ఈ కేసు విచారణ చేపట్టేందుకు ఆయన నిరాకరించారని జస్టిస్ బాబ్డే వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’ కేసు విచారణను అప్పగించేందుకు ఇతర రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను పరిశీలిస్తామని తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని గురువారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కమిషన్‌కు ఆరు నెలల గడువును నిర్దేశించింది. text: మోదీ, జిన్‌పింగ్ ఏకపక్ష నిర్ణయాలతో పరిస్థితులను చేయిదాటకుండా సంయమనం పాటించాలంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావ్‌ లిజియన్‌ భారత్‌కు విజ్జప్తి చేయడంతో ఇది మరింత వేడెక్కింది. ఇరుదేశాలు రాయబార మార్గాల ద్వారా చర్చలు జరపుతున్నాయంటూ లిజియన్‌ మే 21న ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నట్లు ప్రభుత్వ మీడియా పీపుల్స్‌ డైలీ వెల్లడించింది. ఒకపక్క భారత్‌ నేపాల్‌ల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగానే, భారత్‌ చైనాల మధ్య వివాదం మొదలైంది. అయితే ఇది సమస్యను పక్కదోవ పట్టించడానికి, కీలకమైన అంశాల నుంచి పక్కకు తప్పించడానికి వేస్తున్న ఎత్తుగడగా భారత్‌లోని కొన్ని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇది భారత్‌ వ్యూహాత్మక ఎత్తుగడ: చైనా మీడియా ''రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఏదో యాదృచ్ఛికంగా జరిగగింది కాదు, ఒక వ్యూహాత్మక ఎత్తుగడ'' అని చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. ''చైనా సైనికులను భారత సైనికులు ఉద్దేశపూర్వకంగా కవ్విస్తున్నారు'' అని ఆ పత్రిక రాసింది. భారత్‌ ఈ విధానాలను ఆపకపోత రెండు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఒకపక్క చైనా ఆర్ధికరంగం వెనకబడటం, కరోనా విషయంలో చైనాను ఏకాకిని చేసే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో సరిహద్దు వివాదాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది'' అని చైనా ప్రభుత్వ అనుకూల పత్రిక 'ది డైలీ' రాసింది. ఇది చైనా సామ్రాజ్యవాదం: భారత మీడియా ఇటు భారతీయ మీడియా ఇరుదేశాల సరిహద్దు వివాదంపై విస్తృతమైన కవరేజ్‌ ఇచ్చింది. సరిహద్దుల్లో చైనా ఒత్తిళ్లకు భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గ వద్దన్న అభిప్రాయాన్ని వివిధ పత్రికలు రాశాయి. సరిహద్దుల్లోని ఒక వివాదాస్పద ప్రాంతం విషయంలో మొదలైన ఘర్షణలో ఇరుదేశాల సైనికులు గాయపడటం, వైద్యం కోసం వారిని అక్కడి నుంచి తరలించాల్సింనంత పరిస్థితి ఏర్పడటంతో సరిహద్దు వివాదంపై చర్చ మొదలైంది. ''సరిహద్దుల్లో చైనా దుందుడుకు పోకడలు భారత్‌పై ఒత్తిడి తీసుకురావడం కోసం వేస్తున్న ఎత్తుగడ'' అని హిందీ దినపత్రిక జాగరణ్‌ రాసింది. కరోనావ్యాప్తి విషయంలో తనకు ఎదురవుతున్న సవాళ్లు, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వస్తున్న ప్రశ్నల నుంచి భారత్‌ను దూరంగా పెట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నంగా జాగరణ్‌ ఈ వ్యవహారాన్ని అభివర్ణించింది. ''రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఇవాళ కొత్తది కాదు. చైనా తన సామ్రాజ్యవాద విధానాలను ఎప్పుడూ దాచుకోదు. ఇండియాపై పట్టు సాధించేందుకు దాని సరిహద్దుల్లో ఉన్న దేశాలను ఉసిగొల్పుతుంది'' అని మరో హిందీ డైలీ 'జన్‌సత్తా' వ్యాఖ్యానించింది. ''చైనా ఒత్తిడిని భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది'' అని 25వ తేదీన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ''ది టైమ్స్‌ ఆఫ్ ఇండియా'' రాసింది. ''చైనా ఆధిపత్యం ఉన్న ఆసియా విధానాలు పెనుముప్పులాంటివి. అందుకే తైవాన్‌ సహా తనతో భావసారూప్యం ఉన్న దేశాలతో కలిసి భారత్‌ బహుళపక్ష విధానాల కోసం పని చేయాలి'' అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ''కోవిడ్‌ సమస్య నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో వివాదాలను కొనసాగించకుండా చైనా తన తాజా వైఖరిని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అని ఆంగ్ల దినపత్రిక ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'' రాసింది. ''కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ తరహాలో ఆలోచించడం అత్యంత ముఖ్యం '' అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయంటూ చైనా మీడియాలో విస్తృతమైన కథనాలు వెలువడుతున్నాయి. లద్దాక్‌లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంలో భారత్‌ తన సరిహద్దుల వెంబడి నిబంధనలకు విరుద్ధంగా అనేక సైనిక పోస్టులను ఏర్పాటు చేస్తోందని అవి ఆరోపిస్తున్నాయి. text: ఆధునిక ఒడిశాకు ఆయనను రూపశిల్పిగా కూడా భావిస్తారు. అంతే కాదు పట్నాయక్‌ చేసిన ఒక సాహసం ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖుడిని చేసింది. ఇండోనేసియాకు స్వతంత్రం రావడంలో బిజూ పట్నాయక్ కీలక పాత్ర పోషించారు. భారత స్వతంత్ర పోరాటంలో జవహర్‌లాల్ నెహ్రూ, బిజూ పట్నాయక్ మధ్య స్నేహం చాలా విశ్వసనీయమైనదని భావిస్తారు. పురాతన కాలం నుంచీ భారత్, ఇండోనేసియా మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అందుకే నెహ్రూ ఇండోనేసియా స్వతంత్ర పోరాటంపై కూడా ఆసక్తి కనపరిచేవారు. కుటుంబంతో ఇండోనేసియా తొలి అధ్యక్షుడు సుకర్ణో స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ వలసవాదానికి వ్యతిరేకంగా ఉండేవారు. ఇండోనేసియాకు డచ్ వారి నుంచి విముక్తి అందించడానికి సాయం అందించే బాధ్యతలను ఆయన బిజూ పట్నాయక్‌కు అప్పగించారు. ఇండోనేసియా యువకులను డచ్ వారి నుంచి కాపాడాలని నెహ్రూ బిజూ పట్నాయక్‌కు చెప్పారు. దాంతో ఆయన ఒక పైలెట్‌గా 1948లో ఓల్డ్ డకోటా విమానం తీసుకుని సింగపూర్ మీదుగా జకార్తా చేరుకున్నారు. ఇండోనేసియా స్వతంత్ర పోరాటం చేసేవారిని కాపాడేందుకు బిజూ పట్నాయక్ అక్కడకు చేరుకున్నారు. కానీ పట్నాయక్ విమానం ఇండోనేసియా గగనతలలోకి ప్రవేశించగానే డచ్ సైన్యం దానిని కూల్చేయడానికి ప్రయత్నించింది. జవహర్ లాల్ నెహ్రూతో బిజూ పట్నాయక్ దాంతో పట్నాయక్ విమానాన్ని హడావుడిగా జకార్తా దగ్గరే దించేశారు. అక్కడ ఆయన జపాన్ సైన్యం దగ్గర మిగిలిన ఇంధనాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత తిరుగుబాటు జరుగుతున్న చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించారు. అక్కడ ప్రముఖ విప్లవకారులైన సుల్తాన్ షహర్యార్, సుకర్ణోలను తనతో విమానంలో తీసుకుని బిజూ పట్నాయక్ దిల్లీ చేరుకున్నారు. వారితో నెహ్రూ రహస్యంగా సమావేశం అయ్యేలా చూశారు. ఇందిరాగాంధీతో బిజూ పట్నాయక్ ఆ తర్వాత స్వతంత్ర ఇండోనేసియాకు డాక్టర్ సుకర్ణో తొలి అధ్యక్షుడు అయ్యారు. పట్నాయక్ సాహసకార్యానికి గౌరవంగా ఇండోనేసియా ఆయనకు తమ దేశ పౌరసత్వం అందించింది. ఆయనకు ఇండోనేసియా అత్యుత్తమ పురస్కారం 'భూమి పుత్ర' ఇచ్చి గౌరవించింది. ఈ పురస్కారం విదేశీయులకు కూడా ఇస్తారు. అయితే, 1996లో ఇండోనేసియా 50వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బిజూ పట్నాయక్‌కు ఇండోనేసియా అత్యున్నత జాతీయ పురస్కారం 'బెటాంగ్ జసా ఉటమ్' కూడా ప్రకటించారు. ఆ దేశ తొలి రాష్ట్రపతి సుకర్ణో కుమార్తెకు పేరు పెట్టింది కూడా బిజూ పట్నాయకే. ఆయనకు పాప పుట్టిన రోజు భారీ వర్షం కురుస్తోంది. మేఘాలు గర్జిస్తున్నాయి. దాంతో బిజూ పట్నాయక్ ఆమెకు మేఘావతి అనే పేరు కూడా పెట్టమని చెప్పారు. మేఘావతి సుకర్ణోపుత్రి ఇండోనేసియాకు ఐదవ అధ్యక్షురాలుగా(2001 నుంచి 2004 వరకు) పనిచేశారు. బిజూ పట్నాయక్ ఎయిర్ కనెక్టివిటీతో భారత్, టిబెట్‌ను జోడించాలని కూడా ప్రయత్నించారు. 1951లో టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకోక ముందే ఆయన ఆ ప్రయత్నం చేశారు. కానీ భారత ప్రభుత్వం నుంచి ఆయనకు పూర్తి సహకారం అందకపోవడంతో విఫలం అయ్యారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మార్చి 5 బిజూ పట్నాయక్ జయంతి. బిజయానంద్ పట్నాయక్‌ను జనం ప్రేమగా బిజూ పట్నాయక్ అని పిలుచుకుంటారు. స్వాతంత్ర సమరయోధుడుగా, సాహసాలు చేసిన పైలెట్‌గా, పెద్ద రాజకీయవేత్తగా బిజూ పట్నాయక్ గురించి అందరికీ తెలుసు. text: మిలో యియానోపోలోస్, అలెక్స్ జోన్స్, లూయీ ఫరాఖాన్ ముగ్గురినీ ఫేస్‌బుక్ నిషేధించింది మితవాద కుట్ర సిద్ధాంత వెబ్‌సైట్ ఇన్ఫోవార్స్ నిర్వాహకుడు అలెక్స్ జోన్స్, ఆ వెబ్‌సైట్ బ్రిటన్ ఎడిటర్ పాల్ జోసెఫ్ వాట్సన్, బ్రీట్‌బార్ట్ మాజీ న్యూస్ ఎడిటర్ మిలో యియానోపోలోస్‌లు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని ఫేస్‌బుక్ ఆరోపించింది. యూదు వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తీకరించిన నేషన్ ఆఫ్ ఇస్లామ్ నాయకుడు లూయీ ఫరాఖాన్‌ను కూడా ఫేస్‌బుక్ తొలగించనుంది. బ్రిటన్ ఫస్ట్ వంటి బ్రిటన్‌లోని నిషిద్ధ ఇస్లామిక్ వ్యతిరేక గ్రూపులను ఈ సోషల్ నెట్‌వర్క్ ఇప్పటికే బ్యాన్ చేసింది. తాజా నిషేధం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వర్తిస్తుంది. ఫేస్‌బుక్ నిషేధించిన వ్యక్తుల్లో లారా లూమర్ కూడా ఉన్నారు ''హింస, విద్వేషాలను ప్రోత్సహించే లేదా పాలుపంచుకునే వ్యక్తులు, సంస్థలను వాటి సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా మేం ఎల్లప్పుడూ నిషేధిస్తూనే ఉన్నాం'' అని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ''నియమనిబంధనలను ఉల్లంఘించే వారిని సమీక్షించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ అకౌంట్లను తొలగించాలన్న నిర్ణయానికి మేం నేడు వచ్చాం'' అని వివరించింది. శ్వేతజాతి ఆధిపత్యవాది పాల్ నెహ్లెన్, ఇస్లామ్ వ్యతిరేక కార్యకర్త లారా లూమర్‌లు కూడా ఈ నిషేధం ఎదుర్కొంటున్నవారిలో ఉన్నారు. ట్విటర్ తనను నిషేధించటాన్ని వ్యతిరేకిస్తూ లారా లూమర్ గత నవంబర్‌లో న్యూయార్క్‌లోని ట్విటర్ భవనం వద్ద తన చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. అయితే.. వీరి అకౌంట్లను నిషేధిస్తున్నట్లు ఫేస్‌బుక్ ముందస్తుగా హెచ్చరించటం మీద విమర్శలు వచ్చాయి. అలా ముందుగా హెచ్చరించటం వల్ల వీరు తమ ఫాలోయర్లను ఇతర వేదికలకు మళ్లించటానికి అవకాశం ఇచ్చినట్లు అయిందన్నది విమర్శకుల వాదన. శ్వేతజాతి ఆధిపత్యవాది పాల్ నెహ్లెన్ (కుడివైపు) రెండుసార్లు రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో పోటీ చేశారు అలెక్స్ జోన్స్ తన మీద ఫేస్‌బుక్ విధించబోతున్న నిషేధం గురించి గురువారం నాడు ఫేస్‌బుక్ వేదికగానే కొంత సేపు ప్రసారం నిర్వహించారు. ''నన్ను నిషేధించబోతున్నారు. ఈ అకౌంట్ అదృశ్యమయ్యే ముందుగా నా మెయిలింగ్ లిస్ట్‌కి సైన్ అప్ చేయండి'' అంటూ యియానోపోలోస్ తన ఫాలోయర్లను ఉద్దేశించి రాశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ రెండిటిలోనూ ఈ వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల ప్రాతినిధ్యాలకూ నిషేధం వర్తిస్తుందని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరికి ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పాటు చేసిన పేజీలు, గ్రూపులు, అకౌంట్లు అన్నిటినీ తొలగిస్తామని, నిషేధిత వ్యక్తి పాల్గొంటున్నట్లుగా తమకు తెలిసిన కార్యక్రమాల ప్రొమోషన్‌ను అనుమతించబోమని వివరించారు. ఈ యూజర్లను నిషేధించటంలో హేతుబద్ధతను ఫేస్‌బుక్ ఒక ఈమెయిల్‌లో వివరించింది: ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ తాను ''ప్రమాదకర వ్యక్తులు''గా పరిగణిస్తున్న కొందరు ప్రముఖులపై నిషేధం విధిస్తోంది. text: 2015లో షియోమి భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది 'ఫ్లాష్ సేల్స్' పేరుతో నిమిషాల వ్యవధిలో అనేక ఫోన్లను ఆన్‌లైన్‌లో అమ్మేస్తోంది షియోమి. తాజాగా సోమవారం రెడ్‌మీ నోట్ 8 మోడల్ ఫోన్లు 15 నిమిషాలలోనే అమ్ముడుపోయాయి. ఆఫ్‌లైన్ దుకాణాల్లోనూ షియోమి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొత్త మోడల్ ఫోన్లను తొలుత ఆన్‌లైన్‌లోనే అమ్ముతోంది ఈ సంస్థ. అందుకే, దీని అమ్మకాలలో సగానికి పైగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. "షియోమి బ్రాండ్ ఫోన్లకు ఆన్‌లైన్‌లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది" అని టెలికం పరిశోధనా సంస్థ కన్వర్జెన్స్ క్యాటలిస్ట్ భాగస్వామి జయంత్ కోళ్ల అన్నారు. 2015లో భారత మార్కెట్లో షియోమి అడుగు పెట్టినప్పుడు, ఆఫ్‌లైన్ దుకాణాలను ఏర్పాటు చేయలేదు. తన ఉత్పత్తులను నేరుగా ఆన్‌లైన్‌లో అమ్మడంపైనే దృష్టి పెట్టింది. దాంతో దుకాణాల నిర్వహణ, పంపిణీ ఖర్చులు తగ్గడంతో ఫోన్‌లు చౌక అయ్యాయి. "ఆరంభం నుంచే ఆన్‌లైన్‌లో ఆదరణ సంపాదించడంతో దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీదారుగా నిలబడేందుకు షియోమికి సులువైంది" అని జయంత్ అంటున్నారు. ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్, సగానికి పైగా చైనా కంపెనీల నియంత్రణలో ఉంది. ఆ సంస్థలకు ఇక్కడ 45 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. "పేదల ఐఫోన్" "ఒకప్పుడు "పేదల ఐఫోన్"గా పేరు తెచ్చుకున్న షియోమికి ప్రస్తుతం భారత మార్కెట్లో 28 శాతం వాటా ఉంది. 2016లో మూడు శాతం మాత్రమే ఉండేది. ఐఫోన్‌ మాదిరి డిజైన్‌తో ఫోన్‌లను తీసుకురావడంతో షియోమి ఫోన్లకు 'పేదల ఐఫోన్' అన్న పేరు ప్రచారంలోకి వచ్చింది. అందుకు ఆ సంస్థ విమర్శలు కూడా ఎదుర్కొంది" అని భార్గవ చెప్పారు. షియోమి ఫోన్లు ఐఫోన్‌ మాదిరిగా కనిపించడమే కాదు, ఐఫోన్లలో ఉండే పలు ఫీచర్లను, హార్డ్‌వేర్‌లను కూడా అందించింది. ఐఫోన్‌ ధరలో మూడో వంతు ధరకే ఈ ఫోన్లు దొరుకుతున్నాయి. దాంతో తక్కువ ధరకే మెరుగైన ఫోన్ వస్తోందన్న భావన ఏర్పడింది. ఉదాహరణకు రెడ్‌మి శ్రేణి ఫోన్లను చూస్తే, 64 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లు రూ. 9,999 నుంచి రూ.17,999 లోపే దొరుకుతున్నాయి. "అందరూ ఐఫోన్‌ కావాలని కోరుకుంటారు, కానీ దానిని కొనేందుకు ఆర్థిక స్తోమత సరిపోదు. అప్పుడు, తమ కొనుగోలు శక్తి పెరిగే దాకా ఐఫోన్‌ను పోలిన ఇలాంటి ఫోన్లతో సరిపెట్టుకుంటారు" అని జయంత్ వివరించారు. భారతీయ వినియోగదారులు తరచూ "ఖరీదైన స్మార్ట్‌ఫోన్"కు అప్‌గ్రేడ్ అవుతున్నారని తమ సంస్థ చేసిన పరిశోధనలో తేలిందని ఆయన చెప్పారు. చాలామంది ఆదాయం పెరిగిన వెంటనే యాపిల్ లేదా శాంసంగ్ లాంటి ఫోన్లను కొంటున్నారని తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం దేశీయ బ్రాండ్లకు 4జీ దెబ్బ 4జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనకబడటంతో భారత స్వదేశీ మొబైల్ బ్రాండ్లు నెమ్మదిగా పతనమయ్యాయి. షియోమి వాటా పెరగడానికి అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. "ఒకప్పుడు మైక్రోమాక్స్‌ లాంటి స్వదేశీ బ్రాండ్లు దేశీయ మార్కెట్‌లో ముందుండేవి. కానీ, భారత్‌లో 4జీ ప్రవేశపెట్టిన తర్వాత 2016, 2017లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది" అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థకు చెందిన టెక్నాలజీ విశ్లేషకుడు నెయిల్ షా చెప్పారు. "భారత్‌లో 4జీ అందుబాటులోకి వచ్చే నాటికే, చైనా కంపెనీలు 4జీ సదుపాయం ఉన్న చౌక ఫోన్లను విజయవంతంగా తయారు చేయగలిగాయి. దాంతో భారత మార్కెట్‌లోకి శరవేగంగా ఆ ఫోన్లను ప్రవేశపెట్టగలిగాయి. చూస్తుండగానే అనేక మంది 3జీ నుంచి 4జీ ఫోన్లకు మారిపోయారు. ఫలితంగా భారతీయ బ్రాండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి" అని షా వివరించారు. అయితే, భారత పోటీ మార్కెట్‌లో ఏ సంస్థ కూడా సుదీర్ఘకాలం పాటు ఆధిపత్యం కొనసాగించలేదు అన్నది వాస్తవం. మార్కెట్‌లో 28 శాతంగా ఉన్న షియోమి వాటా గత ఏడాది నుంచి పెరగడంలేదు. కాబట్టి, దాని వేగం తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. ఇక కొరియా దిగ్గజం శాంసంగ్ కూడా దానికి దగ్గరలో 25 శాతం వాటా కలిగి ఉంది. కొత్తగా రియల్‌మి లాంటి ఇతర చైనా కంపెనీలు కూడా భారత వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రెడ్‌మి ఫోన్లు భారత్‌లో బాగా అమ్ముడుపోతున్నాయి "కొన్నేళ్ల క్రితం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్ల వాటా మూడు నుంచి నాలుగు శాతం ఉండేది. ఇప్పుడు అది పెరిగింది" అని షియోమి ఇండియా డైరెక్టర్ మను జైన్ ఈ ఏడాది జూలైలో ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చౌక ఫోన్లతో పాటు, ప్రీమియం మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. కానీ, రూ.20 వేల నుంచి 30 వేల శ్రేణి షియోమి ఫోన్లు, యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో పోటీ పడలేకపోతున్నాయి. ప్రీమియం మార్కెట్‌లో యాపిల్, శాంసంగ్‌లతో పోటీ పడాలంటే అత్యాధునిక ఫీచర్లతో, కొత్త ఉత్పత్తులను తీసుకురావాలని లేదంటే చైనా కంపెనీలు చౌక ఫోన్ల అమ్మకాలకే పరిమితం అవ్వాల్సి వస్తుందని జయంత్ అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొన్నేళ్ల వ్యవధిలోనే చైనా టెక్నాలజీ సంస్థ షియోమి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుకుంది. 'చౌక ఫోన్లు, మెరుగైన ఫీచర్లు' అంటూ భారత మార్కెట్‌లో శరవేగంగా దూసుకెళ్లిన ఈ సంస్థ ప్రయాణం గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి కృతికా పతి, టెక్నాలజీ మార్కెట్ విశ్లేషకులతో మాట్లాడారు. text: అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా, ఆ ఆస్పత్రి బయటే ప్రణయ్‌ని కిరాతకంగా నరికి చంపి నాలుగు రోజులయింది. కళ్ల ముందే భర్తను చంపేస్తుంటే గుండెలవిసేలా రోదించింది అమృత. ‘నా ప్రణయ్‌ని చంపేశారు’ అంటూ ఇంకా రోదిస్తూనే ఉంది. చాలా బలహీనంగా కనిపిస్తోంది. కానీ, ధైర్యంగా కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఆవేదన.. ఆక్రోశం.. ఆగ్రహం.. ఆమె కళ్లలో కలగలిసిపోయాయి. ప్రణయ్‌తో తన చిన్ననాటి స్నేహం గురించి.. ఆనాటి తీపి గుర్తుల గురించి చెప్తున్నపుడు.. కన్నీళ్లు ఉప్పొంగినా వాటిని కళ్లను దాటి రానివ్వలేదు. ‘‘నన్ను తల్లిలా చూసుకున్నాడు. నా కోసం వంట చేసేవాడు.. తినిపించేవాడు. నా జీవితంలో ఒక భాగమైపోయాడు.’’ తన భర్త ప్రణయ్ గురించి అమృత చెప్పిన మాటలివి. పెరుమాళ్ల ప్రణయ్ వయసు 24 సంవత్సరాలు. అమృత వర్షిణి వయసు 21 సంవత్సరాలు. ఇద్దరిదీ చిన్ననాటి స్నేహ బంధం. అది ప్రేమ బంధమైంది. కానీ.. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో.. వారిద్దరి కులాలు వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. అబ్బాయిది ‘కింది’ కులం. అమ్మాయిది ‘అగ్ర’ కులం. వారి ప్రేమను అమ్మాయి తండ్రి కాదన్నాడు. ఈ ప్రేమికులు ‘పెద్దల’ను ఎదిరించారు. కులాన్ని ధిక్కరించారు. పెళ్లితో ఒకటయ్యారు. ఆగ్రహించిన ‘పెద్దలు’ అబ్బాయిని చంపించేశారు. ‘‘చిన్ననాటి నేస్తాన్ని పెళ్లాడటానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. జీవితాంతం కలిసుండటానికే పుట్టాం’’ అంటూ.. ప్రణయ్, తన చిన్ననాటి ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి ఇంగ్లిష్‌లో ఈ వాక్యం రాసింది అమృత. ఫోన్ చూసుకుంటూ, తన గదిలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అని చూస్తూ గాభరాగా కనిపిస్తోందామె. ప్రణయ్‌ని ఎలా కలిశారన్న ప్రశ్న అడిగినప్పుడు మాత్రం ఆమె ముఖంలో నవ్వు వికసించింది. ‘‘మా స్కూల్లో ఒక ఏడాది సీనియర్. నేను 9వ తరగతిలో ఉన్నపుడు.. ప్రణయ్ 10వ తరగతిలో ఉన్నాడు. అప్పుడే మా ప్రేమ మొదలైంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఫోన్లో చాలా సేపు మాట్లాడుకునే వాళ్లం’’ అని చెప్పింది. ‘‘ఈ పాపాయి మా ప్రేమకు గుర్తు’’ అంటూ తన చేతితో పొట్టపై మృదువుగా తడుముతూ చెప్పింది. ‘‘నా బిడ్డ నాకు దక్కింది. ఈ బిడ్డ ప్రణయ్ లాగే నన్ను తనకి దగ్గరగా ఉంచుతుంది’’ అంది. ఒకరినొకరం చూసుకోవడానికి పారిపోవాల్సి వచ్చేది... అమృత ప్రణయ్‌లది ఎప్పుడూ సుఖాంతమైన కథ కాదు. పెళ్లికి ముందు వారు ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు. దెబ్బలు తిన్నారు. ‘‘ఇది చాలా చిన్న పట్టణం. మా తల్లితండ్రులకు మా ప్రేమ గురించి తెలిసిపోవడంతో ఇకపై నేను ప్రణయ్‌ని కలవకూడదని హెచ్చరించారు. కానీ అది నన్ను ఆపలేకపోయింది. నేను అతని కులం, ఆర్థిక స్తోమత చూడలేదు. మేం ఒకర్నొకరు ఇష్టపడ్డాం.. ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్నాం. అదే మాకు ముఖ్యం’’ అని చెప్పింది అమృత. ఆమె ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగా 2016 ఏప్రిల్లో మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. దీంతో అమృతను ఆమె తల్లితండ్రులు ఇంట్లో నిర్బంధించారు. ‘‘మా బాబాయ్ ప్రణయ్‌ని బెదిరించాడు. నన్ను డంబెల్స్‌తో కొట్టాడు.. ఇదంతా నా కన్న తల్లి, మరో 20 మంది కుటుంబ సభ్యులు, చుట్టాల మధ్య జరిగింది. నా తరఫున నుంచోడానికి ఎవరూ ముందుకు రాలేదు. నన్ను గదిలో బంధించారు. ప్రణయ్ వేరే కులం వ్యక్తి.. అందునా ఎస్‌సీ కావడంతో నేను ప్రణయ్‌ని మర్చిపోవాలన్నారు’’ అని వివరించింది. ‘‘నా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇతర కులాల వారితో ఫ్రెండ్షిప్ చేయనిచ్చేది కాదు. నన్ను గదిలో బంధించినప్పుడు నాకు రోజూ పచ్చడి అన్నం పెట్టేవాళ్లు. మా బాబాయ్ ప్రణయ్‌ని మర్చిపోవాలంటూ నన్ను కొట్టేవాడు. నా చదువు మాన్పించేశారు. నాకు ప్రణయ్‌తో మాట్లాడే అవకాశం లేకపోయింది. నన్ను నడిపించింది ప్రణయ్ మీద ఉన్న ప్రేమే’’ అంటూ ధృఢంగా చెప్పింది అమృత. 2018 జనవరి 30న అమృత ప్రణయ్‌లకి పెళ్ళయ్యే వరకూ ఆమె ప్రణయ్‌ని చూడలేదు. ‘‘నాకు ఆరోగ్య సమస్యలుండేవి. నేను ఆసుపత్రిలో డాక్టర్లు లేదా అక్కడి స్టాఫ్ ఫోన్లు తీసుకుని ప్రణయ్‌తో మాట్లాడేదాన్ని. ఆ కొన్ని క్షణాలే మమ్మల్ని నడిపించాయి. మొత్తానికి మేము ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అక్కడైతే పెళ్లికి చట్టబద్ధమైన పత్రాలుంటాయని. అంతకుముందు గుళ్లో జరిగిన మా పెళ్లికి ఎటువంటి పత్రాలూ లేకపోవడంతో మా తల్లితండ్రులు నన్ను బంధించగలిగారు. కానీ ఈసారి మేం మా పెళ్లి కోసం పోరాడాలనుకున్నాం’’ అంది అమృత. ప్రణయ్ కుటుంబానికి ఈ పెళ్లి గురించి తెలియదు. పెళ్లైన వెంటనే వారు హైదరాబాద్ వెళ్లారు. అక్కడైతే సురక్షితంగా ఉండొచ్చనుకున్నారు. ‘‘మేం హైదరాబాద్‌లో నెలన్నర ఉన్నాం. కానీ మా గురించి ఎంక్వైరీ చేయడానికి మా నాన్న గూండాలను పంపాడు. దీంతో మేం కుటుంబానికి దగ్గరగా ఉండడం సురక్షితం అని భావించి మిర్యాలగూడ వచ్చేసి ప్రణయ్ వాళ్ల ఇంట్లో ఉన్నాం. మేం పెద్ద చదువులకు విదేశాలకు వెళ్లాలనుకున్నాం. కానీ ఈలోపే నేను గర్భవతినయ్యా. అది మాకు ఎంతో సంతోషకరమైన విషయం. బిడ్డ పుట్టేంత వరకూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. బిడ్డ పుట్టాక చదువుల కోసం కెనడా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం’’ అని అమృత చెప్పింది. ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ.. ‘‘ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాను. నడుము నొప్పిగా ఉంది. ప్రణయ్‌ని పిలిచాను. ‘కన్నా వస్తున్నా’ అన్న ప్రణయ్ పిలుపు ఇంకా నా మదిలో వినిపిస్తూనే ఉంది. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. హాస్పిటల్‌కి ఆలస్యం అవుతుందని ప్రణయ్ ఏమీ తినలేదు’’ ఉబికివస్తున్న బాధను దిగమింగుకుని చెప్తోంది అమృత. ‘‘డాక్టర్ దగ్గర ఉన్నపుడే మా నాన్న డాక్టర్‌కి ఫోన్ చేశారు. అబార్షన్ గురించి ఏం నిర్ణయం తీసుకుందని ఆడినట్లు అక్కడే కూర్చున్న మాకు అర్ధం అయ్యింది. ఇంకా రాలేదని డాక్టర్ ఫోన్ పెట్టేశారు. ఈ లోపు నా ఫోన్‌కి మా నాన్న ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తలేదు. మేం హాస్పిటల్ బయటకు వచ్చాం. నేను ఎదో చెప్తున్నా.. కానీ ప్రణయ్ సమాధానం ఇవ్వలేదని తిరిగి చూసేటప్పటికి.. ఒక వ్యక్తి ప్రణయ్ మీద కత్తితో దాడి చేస్తున్నాడు. మా అత్తగారు ఆ వ్యక్తిని తోసేశారు. నేను హాస్పిటల్ లోపలికి పరుగెత్తాను. కాసేపటి తరువాత నాకు అనుమానం వచ్చి మా నాన్నకి ఫోన్ చేసి ‘ప్రణయ్‌ని ఎవరో చంపే ప్రయత్నం చేశార’ని చెప్పాను. కానీ అయన మాత్రం నాకెందుకు ఫోన్ చేశావ్ అన్నారు" అని వివరించింది అమృత. అయితే, తన తండ్రిని అనుమానించటానికి కారణం ఉందని చెప్పింది. ‘‘కొద్ది రోజుల కిందట మా నాన్నకి ఒక చిన్న ఆపరేషన్ అయ్యింది. నాన్నని కలవాలని మా అమ్మ బలవంతం చేశారు. కానీ వెళ్ళటం ఇష్టం లేక.. నేను, ప్రణయ్ బెంగళూరు వెళ్తున్నామని అబద్ధం చెప్పాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఒక వ్యక్తి ప్రణయ్ వాళ్ల ఇంటికి వచ్చి ‘బయట ఉన్న కారు అద్దెకి ఇస్తారా?‘ అని అడిగాడు. ఆ వ్యక్తి హిందీలో ఆరా తీశాడు. ఆ రోజు మా మామగారు సమాధానం చెప్పి పంపించారు. హాస్పిటల్ బయట ప్రణయ్‌ని చంపింది కూడా ఆ వ్యక్తే. అందుకే నాకు వెంటనే అనుమానం వచ్చింది. మా అమ్మ కూడా నాకు రోజూ ఫోన్ చేసి మాట్లాడేది. తెలిసో తెలియకో మా సమాచారం మా నాన్నకి చెప్పేది. నాకు జరిగిన అన్యాయానికి మా కుటుంబమే కారణం’’ అంది అమృత. ‘జై భీం’.. ‘ప్రణయ్ అమర్ రహే’ అనే నినాదాలు వారి ఇంటి బయట వినిపిస్తున్నాయి. దళిత బహుజన సంఘాలు, మహిళా సంఘాల వారు తమ సంఘీభావం తెలిపేందుకు ప్రణయ్ ఇంటికి వస్తున్నారు. తనకు మద్దతు అందుతున్నందుకు సంతోషంగా ఉంది అంటోంది అమృత. తను అప్పుడే ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ అనే ఒక పేజీని ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసింది. ‘‘ప్రణయ్ అంటుండేవాడు... ప్రేమించుకున్న వారికి కులం అన్నది అడ్డు గోడ కాకూడదని. మేం కులం పేరుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేను న్యాయం కోసం పోరాడతాను. ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటమే తక్షణ కర్తవ్యం’’ అని అమృత తన నిర్ణయాన్ని దృఢంగా వ్యక్తంచేసింది. ప్రణయ్ తల్లిదండ్రులైన తన అత్తమామలకు, తన బిడ్డకు కూడా ప్రమాదం ఉందని అమృత ఆందోళన వ్యక్తంచేస్తోంది ప్రణయ్ తల్లి హేమలత, తండ్రి బాలస్వామి, తమ్ముడు అజయ్ గుండె పగిలిన బాధలో ఉన్నారు. అజయ్ మాత్రం అమృతకు కావాల్సిన సపర్యలు చేస్తున్నాడు. వదినని ఒంటరిగా ఒక్క క్షణం కూడా వదలకుండా ఆమె అవసరాలు చూసుకుంటున్నాడు. ‘‘అజయ్ ఇప్పుడు నా తమ్ముడు. ఇది నా ఇల్లు. నా పుట్టబోయే బిడ్డ ఇక్కడికే వస్తుంది’’ అంటూ పక్కనే ఉన్న తన అత్త హేమలతను ఓదారుస్తూ చెప్పింది అమృత. కులరహిత సమాజం కోసం పోరాటం కొనసాగిస్తానంటున్న అమృత.. తన భవిష్యత్తు గురించి మాత్రం కాస్త భయంగా ఉందని అంటోంది. ‘‘నా బిడ్డకు కానీ, నా అత్త మామలకు కానీ ఏమైనా హాని తలపెడతారేమో అన్న అనుమానం ఇంకా ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేసింది. కానీ తన ఆర్థిక స్వతంత్రత.. పుట్టబోయే బిడ్డ ఆలనా పాలనా ఎలా అన్నది మాత్రం ఒక ప్రశ్నే. అత్తగారు మామగారు సొంత కూతురులా చూసుకుంటామంటున్నా.. డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయిన అమృత భవిష్యత్తు ఏమిటన్నది కాలమే చెప్తుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాను. నడుము నొప్పిగా ఉంది. ప్రణయ్‌ని పిలిచాను. 'కన్నా వస్తున్నా' అన్న ప్రణయ్ పిలుపు ఇంకా నా మదిలో వినిపిస్తూనే ఉంది. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. హాస్పిటల్‌కి ఆలస్యం అవుతుందని ప్రణయ్ ఏమీ తినలేదు'' ఉబికివస్తున్న బాధను దిగమింగుకుని చెప్తోంది అమృత. text: క్రూర జంతువులు ఈయనకు నేస్తాలు! కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులే కాదు.. క్రూర జంతువులుగా భావించే చిరుతలు.. హైనాలు.. పాములు కూడా మనుషులతో ఎంతో ప్రేమగా మెలుగుతాయన్న విషయం అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. అది యానిమల్ ఆర్క్. ఆదివాసీల సంక్షేమం కోసం గడ్చిరోలి జిల్లాలోని మారూమూల హేమల్కాస గ్రామంలో 44 ఏళ్ల క్రితం(1972లో) డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, తన సన్నిహితులకో కలిసి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన బాబా ఆమ్టే కుమారుడు అని ఇవాళ ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు, తండ్రి నుంచి వచ్చిన సేవా వారసత్వాన్ని కొనసాగించడమే కాదు, దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశ్ ఆమ్టే. నగరాల నొదిలి తన మెడికల్ పరిజ్ఞానాన్ని ఆదివాసీలకు ఉపయోగించడానికి గడ్చిరోలి ప్రాంతాన్ని కార్యక్షేత్రంగా మలుచుకున్న సేవాజీవి. తాను ఎంచుకున్న రంగంలో తాను ఎంచుకున్న పరిధిలో నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే అరుదైన కోవకు చెందిన మనిషి. అడవి బిడ్డలకే కాదు, అదే అడవి జీవులకు, అందులోనూ క్రూరమృగాలుగా పిలుచుకునే వాటికి సైతం నాన్నగా మారారు. కళ్లు తెరవకముందే తల్లికి దూరమైన జంతువుల కూనలను చేరదీసి సంరక్షించేందుకు 1973లో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. దాదాపు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ జంతుశాలలో అనేక రకాల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. 1991లో దానికి జంతు సంరక్షణ కేంద్రంగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఈ సంరక్షణ కేంద్రంలో దాదాపు 100 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి పాములతో చిన్నారులస్నేహం ప్రస్తుతం చిరుతలు, హైనాలు.. జింకలు.. బ్లూ బుల్స్.. ఎలుగు బంట్లు.. మొసళ్లు.. నక్కలు.. ఉడుములు.. పాములు.. నెమళ్లు.. గుడ్ల గూబలు.. ఇలా దాదాపు 100 రకాల జంతువులు.. పక్షులు ఉన్నాయి. చిరుత పులులు, హైనాలు క్రూర జంతువులన్న భయం చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రకాశ్ ఆమ్టే మాత్రం వాటితోనే స్నేహం చేస్తారు. రోజూ వాటి మధ్యే తిరుగుతారు. పాములతో చిన్నారులు సరదాగా ఆడుకుంటారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఏనాడూ ఈ జంతువులు తమపై దాడి చేయలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర పెంపుడు జంతువుల్లాగే ఇవి కూడా మనుషులతో ఎంతో ప్రేమను చూపిస్తాయని అంటున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం చేస్తున్న సేవకు గుర్తింపుగా ప్రకాశ్ ఆమ్టేను రామన్ మెగసెసె అవార్డు వరించింది. అడ్డంకిగా మారుతున్న ప్రభుత్వ నిబంధనలు అయితే, 2009లో కేంద్ర అటవీ శాఖ ప్రవేశపెట్టిన నిబంధనలు ఈ జూ నిర్వహణకు అడ్డంకిగా మారుతున్నాయి. ఆ నిబంధనల ప్రకారం వన్యప్రాణులను తాకడం నిశిద్ధం. అలా చేసిన వారు శిక్షార్హులవుతారు. అందుకే, ప్రకాశ్ ఆమ్టేకు 2017 అక్టోబర్‌లో సెంట్రల్ జూ అథారిటీ నోటీసులు పంపింది. అధికారులను ఎన్ని సార్లు కలిసినా ఫలితం లేదని ప్రకాశ్ ఆమ్టే చెబుతున్నారు. ఈ విషయంపై సెంట్రల్ జూ అథారిటీ అధికారులను బీబీసీ సంప్రదించగా.. జూ నిర్వాహకులకు జారీ చేసిన నోటీసును మాత్రమే చూపించారు. ఇతర వివారాలేవీ వెల్లడించలేదు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్రలోని మారుమూల ఆదివాసీ గ్రామంలో ఓ ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రం ఉంది. text: గ్రామీణ భారతదేశంలో సర్వే చేసిన ఇళ్లలో నాలుగో వంతు పైగా ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమం తర్వాత భారతదేశంలోని గ్రామాలు నూటికి నూరు శాతం బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తమయినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెలలో ప్రకటించిన నేపథ్యంలో.. ఈ నివేదిక వివాదాస్పదంగా మారింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ 150వ జయంతి అయిన ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలనే ఆకాంక్ష ప్రధాని మోదీకి చిరకాలంగా ఉంది. కొత్త నివేదిక ఏం చెప్తోంది? ఎన్‌ఎస్‌ఓ నివేదికను 2018 జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 1,00,000 పైగా ఇళ్లను సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్న ఇళ్లు 71.3 శాతం... అంటే మూడు వంతుల కన్నా తక్కువే ఉన్నాయని ఆ నివేదిక గుర్తించింది. అలాగే, మరుగుదొడ్డి అందుబాటులో ఉన్న ఆ గ్రామీణ ఇళ్లలో 3.5 శాతం ఇళ్లు వాటిని ఉపయోగించటం లేదని కూడా తెలిపింది. మరుగుదొడ్డి లేని గ్రామీణ ఇళ్లు కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇతర రాష్ట్రాలకన్నా ఇంకా దారుణంగా ఉందని కూడా ఈ నివేదిక స్పష్టంచేస్తోంది. ఉదాహరణకు.. ఒడిషాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం పైగా ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంతేకాదు, మరో ప్రభుత్వ నివేదిక అయిన 2018-19 జాతీయ వార్షిక గ్రామీణ పారిశుధ్య సర్వే నివేదికలో వెల్లడించిన గణాంకాలకు కూడా ఎన్ఎస్‌ఓ నివేదిక భిన్నంగా ఉంది. దేశంలోని గ్రామీణ ప్రాంత ఇళ్లలో 93.3 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నాయని పారిశుధ్య సర్వే నివేదిక చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో గాంధీ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, తన ''స్వచ్ఛ భారత్'' మిషన్‌లో భాగంగా భారతదేశ గ్రామాలు తాము బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తమయ్యాయని నిర్ధారించినట్లు ప్రకటించారు. ఆయన పట్టణ భారతదేశాన్ని కలపలేదు. పట్టణ ప్రాంతాల్లో ఇంకా సుమారు 50 ప్రాంతాలు తమను తాము బహిరంగ మలవిసర్జన విముక్త ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉందని తాజా అధికారిక సమాచారం చెప్తోంది. ఎన్ని మరుగుదొడ్లు కట్టారు? ప్రభుత్వ నిధులు ఉపయోగించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మరుగుదొడ్లు కట్టారనేది నిజం. బీజేపీ ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం 2017-18 లో పతాక స్థాయికి చేరింది. ఆ ఏడాదిలో దాదాపు మూడు కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించారు. గ్రామీణ ప్రాంతంలో మరుగుదొడ్ల సదుపాయం 2018 అక్టోబర్ నాటికి 95 శాతానికి చేరిందని స్వచ్ఛ భారత్ (క్లీన్ ఇండియా) వెబ్‌సైట్ పేర్కొంది. ఇది 71 శాతానికి కొంచెం ఎక్కువగా ఉందంటూ ఎన్‌ఎస్ఓ 2018 జూలై - డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన సర్వే ద్వారా వేసిన అంచనా కన్నా ఇది చాలా ఎక్కువ. అయితే.. 2012లో నిర్వహించిన తన గత సర్వే కన్నా పరిస్థితి చాలా మెరుగుపడిందని ఎన్‌ఎస్ఓ నివేదిక పేర్కొంది. అప్పుడు గ్రామీణ ప్రాంతంలో కేవలం 40.6 శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులో ఉండేది. అయితే.. ఇటీవలి సర్వేలో భాగంగా ప్రభుత్వ ప్రయోజనాలు అందటం గురించి అడిగిన ఒక ప్రశ్న తర్వాత వెంటనే నేరుగా.. మరుగుదొడ్డి అందుబాటు గురించిన ప్రశ్న అడగటం జరిగిందని ఆ నివేదిక చెప్తోంది. ''ప్రభుత్వ పథకాల ద్వారా అదనపు ప్రయోజనాలు పొందటానికి దోహదపడుతుందనే భావనతో.. ఈ ప్రశ్నలకు వ్యతిరేక సమాధానం ఇచ్చే స్వాభావిక పోకడ ఉండివుండొచ్చు'' అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ఆధారం: స్వచ్ఛ భారత్ మిషన్ డాటా బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన స్థాయిలు.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావటానికి ముందు నుంచే కొన్నేళ్లుగా తగ్గుతున్నాయి. అయితే అధికారిక గణాంకాలు ఏం చెప్తున్నా కానీ.. బహిరంగ మలవిసర్జన ఇంకా కొనసాగుతోందని చెప్పటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. బహిరంగ మలవిసర్జన విముక్తమంటూ 2018 ఫిబ్రవరిలో ప్రకటించిన 11 రాష్ట్రాల్లో ఒకటైన హరియాణా నుంచి బీబీసీ హిందీ అక్టోబర్ నెలలో రాసిన ఒక కథనంలో.. ఒక గ్రామంలో 200 మందికి పైగా జనం బహిరంగ మలవిసర్జనకు వెళుతున్నారని గుర్తించారు. ఈ ఏడాది ఆరంభంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ - నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఒక అధ్యయనం.. గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతం మంది ఇంకా బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని అంచనా వేసింది. బహరంగ మలవిసర్జన తగ్గుదల ఆధారం: ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ డాటా అందులో మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న నాలుగో వంతు ఇళ్లు కూడా ఉన్నాయి. జనం తమకు మరుగుదొడ్డి అందుబాటులో ఉన్నా కూడా బహిరంగ మలవిసర్జన కొనసాగించటానికి పలు కారణాలున్నాయి: గ్రామీణ పారిశుధ్యం విషయంలో తను చేసిన ప్రకటనలను భారత ప్రభుత్వం ఇంతకుముందు సమర్థించుకుంది. బహిరంగ మలవిసర్జన కొనసాగుతోందని చెప్పిన కొన్ని స్వతంత్ర అధ్యయనాలు అనుసరించిన విధివిధానాలను ప్రశ్నించింది. మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటు అత్యధిక స్థాయిలో ఉందంటూ 2018-19 జాతీయ గ్రామీణ పారిశుధ్య సర్వే.. ప్రపంచ బ్యాంకు, యూనిసెఫ్ సహా నిపుణులు ఆమోదించిన విధివిధానాలను పాటించిందని కూడా ప్రభుత్వం ఉటంకించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నివేదిక నుంచి నిర్ధారణలకు రావటం సరికాదని స్టాటిస్టిక్స్ (గణాంక) మంత్రిత్వశాఖ, తాగునీరు, పారిశుధ్యం విభాగం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ''పారిశుధ్య విస్తరణను గణనీయంగా తక్కువ చేసి చెప్పటానికి కారణం అయివుండవచ్చు'' అంటూ.. ఆ సర్వే స్వయంగా ప్రత్యేకంగా ప్రస్తావించిన పరిమితులను ఉటంకించాయి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన అలవాటు నుంచి విముక్తమయ్యాయంటూ భారత ప్రభుత్వం చేసిన ప్రకటనతో.. ఒక అధికారిక నివేదిక విభేదిస్తోంది. text: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత దేశంలో తొలిసారిగా 1951-52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నాయి. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు నియమితులయ్యారు. అయితే, కొన్నాళ్లకే ప్రకాశం పంతులు పాలనను మిత్రపక్షాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నాయి. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఆ తీర్మానం నెగ్గడంతో 14 నెలలు కూడా గడవకముందే ప్రభుత్వం పడిపోయింది. దాంతో, రాష్ట్రంలో కొన్ని నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన తర్వాత 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. మద్రాస్, ఆంధ్రా కలిసి ఉన్న మ్యాపు 167 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 29 నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేవారు. అంటే, మొత్తం 196 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయన్నమాట. ఆ ఎన్నికల్లో 581 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రంలో 1.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 60.14 శాతం పోలింగ్ నమోదైంది. సీపీఐ, కాంగ్రెస్‌లు ప్రధానంగా పోటీపడ్డాయి. కాంగ్రెస్ 142 స్థానాల్లో పోటీ చేసి 119 చోట్ల గెలుపొందింది. 170 మంది స్వతంత్రులు బరిలో నిలవగా, 22 మంది విజయం సాధించారు. జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీ 45 చోట్ల అభ్యర్థులను నిలపగా, 13 మంది గెలుపొందారు. అత్యల్పంగా 34 ఓట్ల (0.11 శాతం) తేడాతో పీపీ షేక్ మొహమ్మద్ నిజామి మీద పీఎస్‌పీ అభ్యర్థి జి. బూసన్న గెలుపొందారు. నిజామీకి 12,973 ఓట్లు పడగా, బూసన్నకు 13,007 ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి టీఎన్ వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన బెజవాడ గోపాల రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాల్ రెడ్డి నిజానికి ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకే కొనసాగాలి. కానీ, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల పదవీ కాలం 1962 వరకు ఉండడంతో (తెలంగాణ ప్రాంతంలో 1957లో ఎన్నికలు జరిగాయి) ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు. అంటే, వారు ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఆనాటి అనుభవం 1955 ఎన్నికల్లో ఓటు వేసిన విశాఖపట్నానికి చెందిన సుశీల అప్పటి అనుభవాలను బీబీసీ తెలుగుతో పంచుకున్నారు. "ఇప్పటిలా నాయకులు ఓటర్లను డబ్బులు, మద్యం సీసాలతో ప్రలోభాలు పెట్టేవారు కాదు. చాలా సాదాసీదాగా ప్రచారం చేసేవారు. నాయకులు ఇంటింటికీ వచ్చి తమకు ఓటు వేయాలని కోరేవారు. ఇంత హడావుడి ఉండేది కాదు. నాయకులు చాలా తక్కువ ఖర్చు చేసేవారు. సైకిళ్లకు జెండాలు కట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసేవారు. కొద్ది మంది మాత్రమే జీపుల్లో కనిపించేవారు. ఓట్లు వేసేందుకు డబ్బాలు పెట్టేవారు. కాగితం (బ్యాలెట్ పేపర్) మీద నచ్చిన అభ్యర్థి మీద చుక్క పెట్టి ఆ డబ్బాలో వేసేవాళ్లం" అని ఆమె వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటి? text: ఆసియా-అమెరికన్ల కన్నా కొంచెం తక్కువ అర్హతలున్నప్పటికీ శ్వేత జాతి, నల్లజాతి, హిస్పానిక్ దరఖాస్తుదారులకే హార్వర్డ్ వర్సిటీ ప్రాధాన్యం ఇస్తోందని స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్ (ఎస్ఎఫ్ఎఫ్ఏ) అనే సంస్థ ఆరోపణ. 'మనిషి నచ్చడం' అనే తరహా వ్యక్తిగత లక్షణాల మీద ఆసియా-అమెరికన్ల దరఖాస్తుదారులకు నిరంతరం తక్కువ ర్యాంకులు ఇస్తోందని చెప్పింది. అయితే ఈ ఆరోపణను హార్వర్డ్ తిరస్కరించింది. ఆసియా-అమెరికన్ల అడ్మిషన్లు పెరిగాయని చెప్తోంది. యూనివర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం హార్వర్డ్‌లో చేరిన విద్యార్థుల్లో 22.2 శాతం మంది ఆసియన్-అమెరికన్లు ఉన్నారు. ఆఫ్రికన్-అమెరికన్లు 14.6 శాతం, హిస్పానిక్/లాటినోలు 11.6 శాతం, అమెరికా ఆదివాసీలు/పసిఫిక్ ఐలాండర్లు 2.5 శాతం మంది ఉన్నారు. శ్వేతజాతి విద్యార్థులు ప్రధానంగా ఉన్న మిగతా అందరూ కలిపిన వర్గం సుమారు 50 శాతంగా ఉన్నారు. ఎస్ఎఫ్ఎఫ్ఏ ఏం చెప్పింది? బోస్టన్‌లో శుక్రవారం కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో.. ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ జాతి సమతుల్య చర్యలు చేపడుతోందని, జాతి అనే అంశాన్ని సానుకూల అంశం (ప్లస్ ఫ్యాక్టర్) కన్నా ఎక్కువగా పరిగణిస్తోందని, జాతి-తటస్థ ప్రత్యామ్నాయాలను పరిశీలించటంలో ఆసక్తి చూపటం లేదని ఆధారాలు చూపుతున్నా’’యని పేర్కొంది. మైనారిటీ దరఖాస్తుదారులు కాలేజీలో ప్రవేశాలు పొందటానికి దోహదపడేందుకు అమెరికా కోర్టు ఇచ్చిన ‘అఫర్మేటివ్ యాక్షన్’ (వివక్షకు గురయ్యే వారికి రిజర్వేషన్లు) ఆదేశాలను ‘‘ప్లస్ ఫ్యాక్టర్’’ అనే అంశం ప్రస్తావిస్తోంది. ‘‘జాతి అనేది ఒక ముఖ్యమైన అంశమే కాదు.. హిస్పానిక్, ఆఫ్రికన్-అమెరికన్ విద్యార్థులకు ప్రవేశం కల్పించటానికి దానినే ప్రధానంగా పరిగణినలోకి తీసుకుంటున్నట్లు హార్వర్డ్ అంగీకరించదు’’ అని ఎస్ఎఫ్ఎఫ్ఏ చెప్పింది. ‘‘ఉదాహరణకు.. ఒక ఆసియా-అమెరికన్‌ విద్యార్థికి ఈ వర్సిటీలో అడ్మిషన్ అవకాశం 25 శాతంగా ఉందనుకుంటే.. అదే విద్యార్థి శ్వేత జాతీయుడైతే 35 శాతం, హిస్పానిక్ అయితే 75 శాతం, ఆఫ్రికన్-అమెరికన్ అయితే 95 శాతం అవకాశం ఉంటుంది’’ అని పేర్కొంది. మహిళా దరఖాస్తుదారుల లెక్కలను ఎస్ఎఫ్ఎఫ్ఏ అందించలేదు. స్వయంగా హార్వర్డ్ యూనివర్సిటీయే 2013లో చేపట్టిన స్వీయ పరిశోధనలో ఇదే నిర్ధారణలకు వచ్చిందని.. కానీ ఆ నివేదికను సమాధి చేశారని కూడా ఆ సంస్థ ఆరోపించింది. హార్వర్డ్ స్పందన ఏమిటి? యూనివర్సిటీ ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఎస్ఎఫ్ఎఫ్ఏ విశ్లేషణ చాలా రకాలుగా లోపభూయిష్టమని.. కాబట్టి అది తప్పుదారి పట్టించే నివేదికని అభివర్ణించింది. ‘‘సమాచారం, ఆధారాలను సంపూర్ణంగా, సమగ్రంగా విశ్లేషించినపుడు.. ఆసియా-అమెరికన్లు సహా ఏ గ్రూపు దరఖాస్తుదారుల పట్ల అయినా హార్వర్డ్ కాలేజీ వివక్ష చూపదని స్పష్టమవుతుంది. ఆసియా-అమెరికన్ల ప్రవేశాలు గత దశాబ్దంలో 29 శాతం పెరిగాయి’’ అని హార్వర్డ్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది. ఎస్ఎస్ఎఫ్ఏ - హార్వర్డ్ మధ్య 2014లో మొదలైన న్యాయ పోరాటంలో ఇది తాజా పరిణామం. ‘అఫర్మేటివ్ యాక్షన్’ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను 2016లో అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాను శ్వేత జాతీయురాలినైనందున యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ తన దరఖాస్తును తిరస్కరించిందని ఒక శ్వేతజాతి మహిళ చేసిన ఆరోపణను న్యాయమూర్తులు తిరస్కరించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మైనారిటీ విద్యార్థుల విషయంలో ‘అఫర్మేటివ్ యాక్షన్’ లేదా ‘సానుకూల పక్షపాతా’న్ని ఉపయోగించటాన్ని కొనసాగించవచ్చునని కోర్టు చెప్పింది. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ.. ఆసియా-అమెరికన్ల పట్ల వివక్ష చూపుతోందని ఒక స్వచ్ఛంద ఆరోపించింది. అమెరికా విశ్వవిద్యాలయం మీద సదరు సంస్థ కేసు వేసింది. text: వాస్తవం: అవి నకిలీ పోస్టులని మా పరిశీలనలో తేలింది. పూర్తి వాస్తవాల కోసం ఈ కథనం మొత్తం చదవండి. ప్రస్తుతం అత్యంత పాపులర్ మొబైల్ ఆటల్లో PubG (ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్) ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఆకర్షించింది. భారత దేశంలో ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది. ఈ గేమ్‌ తొలుత 2017 మార్చిలో విడుదలైంది. బ్యాటిల్ రాయలే అనే జపనీస్ థ్రిల్లర్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆటను రూపొందించారు. ఇందులో, 100 మందిని ఒక దీవిలో దించుతారు. వారిలో అందరూ ఆయుధాలు అందుకుని పోరాడుతారు. ఆఖరికి ఎవరు మిగులుతారో వాళ్లే విజేత. ఈ గేమ్‌కు వ్యతిరేకంగా ఉన్న రెండు పోస్టులు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్, ట్విటర్‌లో వైరల్ అయ్యాయి. 'మహారాష్ట్ర హైకోర్టు' జారీ చేసినట్లుగా చెబుతున్న నకిలీ ఉత్తర్వు ఆ నోటీసులో అన్నీ తప్పులే ముందు 'మహారాష్ట్ర హైకోర్టు' నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్న బూటకపు పోస్టు గురించి చూద్దాం. ఈ పోస్టులో పేర్కొన్న న్యాయస్థానం పేరే అనుమానం కలిగిస్తోంది. మహారాష్ట్ర హైకోర్టు అనే పేరుతో కోర్టు లేదు. ఆ రాష్ట్ర హైకోర్టును అధికారికంగా 'బాంబే హైకోర్టు' అని పిలుస్తారు. ’’మీకు తెలియజేయునది ఏమనగా... ఇక నుంచి పబ్‌జీ పనిచేయదు. అందుకు సంబంధించి టెన్సెంట్ గేమ్స్ కార్పొరేషన్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి" అని ఆ నకిలీ నోటీసులో ఉంది. అందులోనూ పలు అక్షర దోషాలు ఉన్నాయి. అధికారిక ఉత్తర్వుల్లో అలాంటి తప్పులు కనిపించడం చాలా అరుదు. ఉదాహరణకు, "magistrates" అనే పదాన్ని "majestratives" అని రాశారు. ఈ ఉత్తర్వు మీద ప్రీజడ్జ్ ("prejudge") సంతకం చేసినట్లుగా ఉంది. నిజానికి, భారత న్యాయ వ్యవస్థలో "prejudge" అనే పోస్టు లేనేలేదు. కే. శ్రీనివాసులు దాని మీద సంతకం చేసినట్లుగా ఉంది. అయితే, ఆ పేరు కలిగిన వ్యక్తులు బాంబే హైకోర్టులో ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. గుజరాత్ పోలీసులు జారీ చేసినట్లుగా చెబుతున్న నకిలీ నోటీసు అది నకిలీ నోటీసు: గుజరాత్ పోలీసులు ఇప్పుడు గుజరాత్ పోలీసులు జారీ చేసినట్లుగా చెబుతున్న నోటీసు గురించి చూద్దాం. గుజరాతీ భాషలో రాసి ఉన్న ఈ నకిలీ నోటీసులో "ఎవరైనా పబ్‌జీ గేమ్‌ను బహిరంగంగా ఆడుతూ పట్టుబడితే, వారి మీద న్యాపరమైన చర్యలు తీసుకుంటాం. వారి మొబైల్ ఫోన్‌ను జప్తు చేస్తాం" అని ఉంది. ఈ నోటీసును కాస్త పరిశీలిస్తే అది అధికారికంగా విడుదల చేసిందేనా? అన్న అనుమానం స్పష్టంగా వస్తుంది. ఆ నోటీసు మీద తేదీ లేదు. అధికారి సంతకం కూడా లేదు. ఇందులోనూ కొన్ని వ్యాకరణ, అన్వయ దోషాలు ఉన్నాయి. అలాంటివి సాధారణంగా అధికారిక ఉత్తర్వుల్లో కనిపించవు. ఈ నకిలీ పోస్టు ట్విటర్‌లోనూ బాగా చక్కర్లు కొడుతోంది. అయితే, భగీరథ్ సింగ్ వాలా అనే ఓ వ్యక్తి ఈ పోస్టులో వాస్తవమెంతో తెలుసుకునేందుకు దానిని గుజరాత్ పోలీసుల అధికారిక ట్విటర్ హ్యాండిల్‌కు రీట్వీట్ చేశారు. కొద్దిసేపటికే "అది నకిలీ పోస్టు. అలాంటి ఉత్తర్వులను గుజరాత్ పోలీసులు జారీ చేయలేదు" అని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ పోస్టుల వ్యాప్తి మీద టెన్సెంట్ గేమ్స్ సంస్థ ఇంకా స్పందించలేదు. PubG అనేకమందిని ఆకట్టుకోవడంతోపాటు, పలు వివాదాలకు కూడా కారణమవుతోంది. ఈ గేమ్ స్టోర్‌లో పెట్టిన ఓ ఫొటో జూలైలో వివాదానికి దారితీసింది. అది జపాన్ మిలిటరీ వినియోగించే చిహ్నంలా ఉందంటూ చాలామంది కొరియన్లు, చైనీయులు అభ్యంతరం చెప్పారు. దాంతో ఆ చిత్రాన్ని తొలగించిన యాప్ రూపకర్తలు, అప్పటికే దాన్ని కొనుగోలు చేసిన వారికి నగదును వెనక్కి ఇచ్చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వాదన: భారత్‌లో పాపులర్ మొబైల్ గేమ్ PubGని బహిరంగంగా ఎవరైనా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని గుజరాత్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, దేశంలో ఈ ఆటను ''మహారాష్ట్ర హైకోర్టు'' నిషేధించిందంటూ సోషల్ మీడియాలో మరో పోస్టు వైరల్ అయ్యింది. text: ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్ మూతపడింది. టోక్యో నగరంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన త్సుకిజీ చేపల మార్కెట్ 83 ఏళ్లుగా నిర్విరామంగా నడుస్తోంది. అంతే కాదు, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ కూడా. ఈ మార్కెట్‌ను 1935లో ప్రారంభించారు. అతి కొద్ది కాలంలోనే ఇది అభివృద్ధి చెంది ప్రధాన మార్కెట్‌గా మారింది. 'ది కిచెన్ ఆఫ్ జపాన్' అన్న పేరు కూడా సంపాదించుకుంది. వీడియో: మూతపడ్డ ప్రపంచ అతిపెద్ద చేపల మార్కెట్ ఇక్కడ రోజుకు దాదాపు 60 వేల మంది దాకా లావాదేవీలు జరుపుతుండేవారు. అయితే ఇప్పుడు వందలాది మంది చేపల వ్యాపారులు తమ దుకాణాలను సర్దుకొని కొత్త మార్కెట్‌కు వెళ్లిపోయే పనిలో ఉన్నారు. 2020లో జరగబోయే ఒలింపిక్స్‌లో భాగంగా జపాన్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనుంది. అందుకోసం మరోచోట కొత్త మార్కెట్‌ను నిర్మించింది. ఈ మార్కెట్‌లో శనివారం జరిగిన ఆఖరి చేపల వేలంపాటలో పాల్గొనేందుకు అనేక మంది తరలివచ్చారు. జపాన్ రాజధాని టోక్యోకు వచ్చే పర్యాటకులంతా ఈ వేలాన్ని చూసేందుకు తెగ ఉత్సాహం చూపించారు. వ్యాపారుల అభ్యంతరం ఈ మార్కెట్‌ను ఇక్కడి నుంచి మార్చడం చాలా మంది వ్యాపారస్తులకు ఇష్టం లేదు. దీన్ని మరో చోటుకు తరలించడంపై జరిపిన సర్వేలో ఏకంగా 83 శాతం మంది వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. "ప్రస్తుతం త్సుకిజీ అంటే ఓ బ్రాండ్. ఇది త్సుకిజీ కావడం వల్లే ఇక్కడ జనం చేపల్ని కొంటున్నారు. ఇంకొక ప్రాంతానికి మారిస్తే, దీనికి ఈ స్థాయిలో గుర్తింపు ఉండదన్నది చాలా మంది ఆందోళన. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇక్కడ నుంచి తరలించకూడదని వ్యాపారులు కోరుకుంటున్నారు. 23 ఏళ్ల నుంచి నేను ఇక్కడే పని చేస్తున్నా. ఈ మార్కెట్‌ను మార్చడం నాక్కూడా ఇష్టం లేదు" అని చేపల వ్యాపారి అత్సుమి నకముర అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న త్సుకిజీ చేపల మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అయితే, ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మార్కెట్, శనివారంనాడు ఆఖరి వేలంపాటతో శాశ్వతంగా మూతబడింది. text: 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఈ కేసులో కోర్టు నిందితులందరినీ దోషులుగా పేర్కొంది. 77 ఏళ్ల ఆశారాం బాపు మరో మహిళపై అత్యాచారం కేసులోనూ నిందితునిగా ఉన్నారు. ఆశారాం బాపు ఉన్న జైలు వద్ద న్యాయమూర్తి ఈ తీర్పును వెల్లడించారు. ఆశారాం బాపు సహజంగా మరణించే వరకు జైలు జీవితం గడపాలని, ఈ కేసులో మిగతా ఇద్దరు నిందితులు 20 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఆశారాం అయిదేళ్లుగా జైల్లోనే ఉన్నారు. ఈ తీర్పు సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో జోధ్‌పూర్‌కు చేరుకున్నారు. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు జోధ్‌పూర్‌లో ఏప్రిల్ 30 వరకు 144 సెక్షన్ విధించారు. ఈ కేసు ఐదేళ్ల పాటు కొనసాగింది. ఆశారాం బాపు, బాధితుల కుటుంబానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో చాలా మలుపులు చోటు చేసుకున్నాయి. జోధ్‌పూర్ కేసు ఏంటి? 2013 ఆగస్టులో ఆశారాం బాపుపై అత్యాచార ఆరోపణలు చేసిన షాజహాన్‌పూర్‌కు చెందిన బాధితురాలి కుటుంబం మొత్తం మొదట్లో ఆయన భక్తులే. 'పవిత్రమైన విద్య' లభిస్తుందనే నమ్మకంతో ఇద్దరు పిల్లలను ఆయన చింద్వాడా ఆశ్రమానికి పంపారు. 2013, ఆగస్టు 7న బాధితురాలి తండ్రికి 16 ఏళ్ల కూతురు అనారోగ్యంతో ఉన్నట్లు ఫోన్ వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు మరుసటిరోజు చింద్వాడా చేరుకున్నపుడు, ఆయన కుమార్తెకు దయ్యం పట్టిందని, వాటిని ఆశారాం బాపు బాగు చేస్తారని తెలిపారు. ఆగస్టు 14న బాధితురాలి కుటుంబం ఆశారాంను కలిసేందుకు జోధ్‌పూర్‌కు వెళ్లింది. ఆగస్టు 15న నమోదు చేసిన ఛార్జిషీటులో ఆశారాం 16 ఏళ్ల బాధితురాలి ఆరోగ్యాన్ని బాగు చేస్తాననే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో బాధితురాలి తండ్రిని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆయనను డబ్బు ఇచ్చి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా ఆ కుటుంబం ఆశారాం బాపుపై న్యాయపోరాటం చేస్తూనే ఉంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అత్యాచారం కేసులో నిందితుడు ఆశారాం బాపు భవితవ్యాన్ని తెల్చే కీలకమైన తీర్పు బుధవారం వెలువడింది. ఆయన్ను దోషిగా పరిగణిస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. మరణించే వరకు ఆయనకు జైలు శిక్ష విధించింది. బీబీసీ ప్రతినిధి ప్రియాంకా దూబే అందిస్తున్న రిపోర్ట్ text: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో బాపట్ట ఎంపీ నందిగం సురేశ్(ఎడమ) వారిలో వైయస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. కోటు ధిక్కరణ చట్టంలోని 10, 12 సెక్షన్లు, కోర్టు ధిక్కరణ నిబంధనలు 5 ప్రకారం జిడిషియల్ రిజిస్ట్రార్ ఈ నోటీసులు జారీ చేశారు. మే 22 నుంచి 24 మధ్య హైకోర్టు రిజిస్ట్రార్‌కి మెయిల్స్, ఫోన్ ద్వారా కొన్ని వీడియోలు, పత్రికా క్లిప్పింగులూ వచ్చాయనీ, పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు స్పందనగా హైకోర్టుపైనా, హైకోర్టు జడ్జీలపైనా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా కులం, అవినీతి, లేని ఉద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారనీ ఆ ఉత్తర్వుల్లో ఉంది. చంద్రబాబు హైకోర్టును మేనేజ్ చేస్తున్నారనీ, తీర్పులు పదినిమిషాల ముందే తెలిసిపోతున్నాయంటూ ఎంపీ నందిగం సురేశ్ చేసిన వ్యాఖ్యలను నోటీసులో ప్రస్తావించారు. హైకోర్టు జడ్జీలను ముక్కలు చేయాలంటూ ఒక వ్యక్తి రాసిన ట్వీట్ గురించీ, జడ్జీలందరినీ కరోనా పేషెంట్ ఉన్న గదిలో ఉంచాలన్న ట్వీట్‌ను, న్యాయమూర్తులను బూతులు తిట్టి నాపై సీబీఐ ఎంక్వైరీ వేసుకోండి అన్న ఫేస్ బుక్ మెసేజీని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిపై కొందరు చేసిన కామెంట్లపై ఏప్రిల్ 6న, 17న రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేశారనీ, తాజా అంశాలపై కూడా 24న రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేశారనీ, దీనిపై స్పందించిన ఛీఫ్ జస్టిస్ కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని ఆదేశించినట్టుగా ఆ ఉత్తర్వుల్లో ఉంది. ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్టు ప్రకటించారు జ్యుడిషియల్ రిజిస్ట్రార్. గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పలు విధాన నిర్ణయాలపై పలువురు కోర్టులకు వెళ్లడం, కోర్టులు వాటికి వ్యతిరేక తీర్పులు ఇవ్వడం జరుగుతోంది. ఇంగ్లిష్ మీడియం, సచివాలయాలకు రంగులు, డా. సుధాకర్ అరెస్టు వంటివి అందులో కొన్ని. ఈ క్రమంలో వైయస్సార్సీపీ నాయకులు కొందరు కోర్టులపై వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పులు ముందే చంద్రబాబుకు తెలిసిపోతున్నాయంటూ విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు సురేశ్. ''హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాల ముందే చంద్రబాబుకు తెలుస్తుంది. మొదట చంద్రబాబును విచారించాలి. ఆయన కాల్‌లిస్టు బయటపెట్టాలి. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌చేసుకుంటూ తిరుగుతున్నాడు. హైకోర్టును మేనేజ్‌చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈ రోజున తీర్పు వస్తే ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నాడు. ఎంతసేపు మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డు ఎక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు.'' అని అన్నారు సురేశ్. ఆమంచి కృష్ణమోహన్ డాక్టర్ సుధాకర్ తరపున వేసిన పిటిషన్‌ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ''కోర్టు సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తుంటే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోటా సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సి వస్తుంది. డాక్టర్ సుధాకర్ ది ఒక పెటీ కేసు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదు. కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోంది. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడిని''. అన్నారు కష్ణమోహన్. ఈ నోటీసులపై బీబీసీ తెలుగుతో మాట్లాడారు ఎంపీ నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్‌లు. తాను ఒక సామాన్యుడిగా తన బాధను చెప్పుకున్నాను తప్ప, కోర్టులను ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు. ''మేం మాట్లాడిన దాంట్లో ధిక్కరించాలనీ, ఇబ్బంది పెట్టాలనీ, లాయర్లు, జడ్జీలను కామెంట్ చేయాలన్న ఆలోచన లేదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, టీడీపీ వారు మైక్ పక్కన పెట్టిన వెంటనే మాట్లాడేది ఏంటి? వాళ్ల సోషల్ మీడియా చూడండి. వాళ్ల ఉద్దేశాలు కనిపిస్తాయి. ''మీరిక్కడ పాలిస్తే, మేం కోర్టుల్లో పాలించగలం'' అంటూ వారు రెచ్చగొట్టారు. ''మేమెక్కడున్నా పాలించగలమని మాట్లాడారు.'' ఇలా మాట్లాడితే ఎవరికైనా బాధే కదా? నాపై దాడి చేసినప్పుడు స్టే ఇచ్చి, తరువాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అది ఎంత బాధాకరం? సహజంగా, ఒక సామాన్యుడిగా నాకుండే బాధ నాకుంది. కోర్టును తప్పు పట్టాలని కాదు. ఆ ఉద్దేశం కూడా ఎప్పుడూ లేదు. కానీ న్యాయం ఇవాళ కాకపోతే రేపు, ఏదో ఒక రోజు, ఏదో ఒక రూపంలో గెలుస్తుంది.'' అన్నారు సురేశ్. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ''నేనేమీ న్యాయమూర్తిపై వ్యక్తిగతంగా కామెంట్ చేయలేదు. అబ్యూజ్ చేయలేదు. అదే సమయంలో నా ప్రాథమిక హక్కు అయినటువంటి, నాకు నచ్చని ఒక విషయాన్ని నేను వ్యక్తీకరించాను. ప్రజల ముందు నేను ఏం చెప్పానో దానికి నేను వంద శాతం కట్టుబడి ఉన్నాను.'' అన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. text: బుధవారం విజ్ఞాన్ భవనలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన పదో విడత చర్చలు కొంత సానుకూలంగా సాగాయి. అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ..చర్చలు సరైన దిశలో జరుగుతున్నాయని చెప్పారు. వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలివేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ఈ చట్టాల గురించి చర్చించడానికి ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే రైతులు వెంటనే ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలుపలేదు. తమలో తాము మరోసారి చర్చించుకుని తుది నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. తదుపరి చర్చలు శుక్రవారం జరగనున్నాయి. శుక్రవారం జరగబోయే చర్చల్లో రెండు పక్షాలకు ఆమోదయోగ్యమైన ఒక ఒప్పందానికి రాగలమని కేంద్ర మంత్రి తోమర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు హాజరైన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ కూడా శుక్రవారం జరగబోయే చర్చల్లో ఒక నిర్ణయానికి రాగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, రైతుల ఆందోళనలు పూర్తి కాలేదని, జనవరి 26న తప్పక ర్యాలీ చేస్తామని ఆయన అన్నారు. రిపబ్లిక్ డే లోపల రైతులను ఒప్పించడం అంత సులభం కాదని రాకేశ్ అన్నారు. ‘మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి’ రైతు స్వరాజ్య వేదిక సభ్యులు కన్నెగంటి రవి తాజా పరిణామాలపై స్పందిస్తూ చట్టాలను వాయిదా వేయడం కాదు. రద్దు చేయాలని అన్నారు. “మద్దతు ధరలపై చర్చించడానికి ప్యానల్ కాదు..చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేయాలి. కాలయాపనతో రైతు ఉద్యమాన్ని చీల్చే ఎత్తుగడలను మానుకుని తక్షణమే రైతు ఉద్యమ డిమాండ్లను కేంద్రం ఆమోదించాలి. రైతులు మొండిపట్టు పట్టడం లేదు. మాట ఇచ్చి తప్పే ప్రభుత్వాలను చూసి ఉన్నారు కనుక అనుమానిస్తున్నారు. చట్టాలను, ఎన్నికల వాగ్దానాలను బుట్టదాఖలు చేసిన ప్రభుత్వాలు ఇవి. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లు..సమగ్ర ఉత్పత్తి ఖర్చు (C 2)కు 50 శాతం కలిపి అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించడం, ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ మార్కెట్ యార్డ్ నెలకొల్పడంతో పాటు, నరేంద్ర మోదీ అధ్యక్షతన పని చేసిన కమిటీ 2012లో సిఫారసు చేసినట్లుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం చేయగలిగితే అప్పుడు కొందరు కోరుకుంటున్నట్లుగా రైతులు ఉద్యమాన్ని విరమించే అవకాశం ఉంది’’ ‘రాష్ట్రాలకూ చర్చల్లో భాగస్వామ్యం కల్పించాలి’ ‘‘ఈ సిఫారసుల అమలుకు ఎవరు (కోర్టు, ప్రభుత్వం) బాధ్యత తీసుకుంటారో కూడా స్పష్టంగా ప్రకటించాలి. అప్పుడే రైతులు నమ్ముతారు. మూడు చట్టాల రద్దు కేంద్రం చేతుల్లో ఉంది. పంటల ప్రణాళిక, మార్కెట్లు, ధరలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశాలు. అందుకే కేంద్రం, రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుని చర్చలు కొనసాగించాలి. అప్పుడే ఒక జాతీయ విధానం, ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక అంశాల చేర్పు కూడా సాధ్యం అవుతాయి. రాజ్యాంగం అదే చెప్పింది..రిపబ్లిక్ డే దగ్గరలో ఉన్నందున కేంద్రం ఇప్పుడైనా రాజ్యాంగాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. రైతులు ఇళ్లకు వెళ్ళాలి అని చెప్పే కోర్టు, రైతులు మొండిగా ఉన్నారని వాదించే కొన్ని మీడియా సంస్థలు, తామేమైనా రైతులకు భరోసా ఇచ్చే ప్రణాళిక ఉంటే చెప్పాలి. ప్రభుత్వాన్ని ఇంకో రూపంలో ఒప్పించే అవకాశం ఉంటే రైతుల ముందు ప్రకటించాలి. రైతులు ఇళ్లకు వెళ్లి , ప్రభుత్వం హామీలు ఉల్లంఘిస్తే ఆ ప్రభుత్వం పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా రైతుల ముందు ప్రకటించాలి” అని రవి అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. text: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండుకు తగిన స్పందన రాలేదని దాంతో సమ్మెకు సిద్ధమవుతున్నామని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ముగ్గురు ఐఏఎస్‌లతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కార్మిక సంఘాల నేతల చర్చలు అంతకుముందు కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన చర్చలూ నిష్ఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక దఫాలు చర్చలు జరిగాయి. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యమూ సమ్మె విషయంలో కఠినంగానే ఉంది. సమ్మె చట్ట వ్యతిరేకమని, సమ్మెలో పాల్గొనే సిబ్బందిని తొలగిస్తామని ఆదేశాలు జారీ చేసింది. ''అక్టోబరు 2న త్రిసభ్య కమిటీతో చర్చల్లో భాగంగా డిమాండ్ల పరిష్కారానికి సమయం పడుతుంది. దసరా సందర్భంగా సమ్మె ఆలోచన విరమించుకోవాలి. 4 నుంచి 6వ తేదీల మధ్య ప్రయాణాలకు 50 వేల మంది అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నారు. వారికి అసౌకర్యం, సంస్థకు నష్టం కలగకూడదు. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు ఉన్నాయి. కార్మిక శాఖ కూడా చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంలో సమ్మెలోకి వెళితే డిస్మిస్ చేసే అవకాశం ఉంది'' అని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులిచ్చారు. అంతేకాదు, ''తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆర్టీసీకి బడ్జెట్ కేటాయింపులకు మించి సాయమందింది. సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఇప్పటికీ సమ్మె విషయంలో వెనక్కు తగ్గకపోతే చర్యలు తప్పవు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. అవసరమైతే స్కూలు బస్సులు కూడా ప్రయాణికుల కోసం తిప్పుతాం'' అని మీడియా ముందు ప్రకటించింది ఐఏఎస్‌ల కమిటీ. అయితే కార్మిక సంఘాలు మాత్రం తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఎస్మా చట్టానికి తాము భయపడబోమని ప్రకటించారు. ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మెకు వెళ్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటున్నారు తప్ప, సరైన హామీ ఇవ్వడం లేదన్నారు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు. ''ఆర్టీసీ సమ్మె ఖాయం. అన్ని సంఘాలు కలసిరావాలి. ఆర్టీసీని బతికించడానికే సమ్మె చేస్తున్నాం. మేం ఎవరి చేతుల్లో కీలు బొమ్మలం కాదు. ఇప్పుడు సకల జనుల సమ్మెను మించిన సమ్మె అవసరం. సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాం'' అని కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి చెప్పారు. కార్మికుల డిమాండ్లు ఇవీ.. పట్టువదలని కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా ముందే ప్రభుత్వం చేత పనిచేయించుకోవాలని ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు. ఈ సమ్మెతో తెలంగాణలో దసరా పండుగ, ముందు వారాంతం రావడంతో సెలవులకు వెళ్లానుకునే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రధాన కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) సహా పలు సంఘాలు ఈ సమ్మెకు మద్దతిచ్చాయి. ఆర్టీసీ సమ్మె.. ప్రతీకాత్మక చిత్రం పండుగ సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మరోవైపు అధికారులు, సమ్మె సందర్భంగా బస్సులు నడిపేందుకు బయటి నుంచి డ్రైవర్లు, కండక్టర్లునూ తీసుకునే పని మొదలుపెట్టారు. 5వ తేదీ ఉదయం నుంచి ఎవరైనా డిపోలోని అధికారులను కలవచ్చని చెప్పారు. హైదరాబాద్ రూరల్ డివిజినల్ మేనేజర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు, 18 నెలల హెవీ డ్రైవింగు లెసెన్స్, బ్యాడ్జీ ఉన్న వారు డ్రైవరుగానూ, పదో తరగతి పాసయిన సర్టిఫికేట్ ఉన్న వారు కండెక్టరు గానూ రావచ్చు. ఒకరోజుకు పల్లె వెలుగు బస్సుకు 4 వేల రూపాయలూ, ఎక్స్ ప్రెస్ బస్సుకు 5 వేల రూపాయలూ ఆర్టీసికి చెల్లించి అంతకంటే ఎక్కువ వచ్చిన ఆదాయాన్ని డ్రైవర్ - కండక్టర్లు రెమ్యూనరేషన్ గా తీసుకోవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పుడు సేవలు అందించిన వారికి భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగాల నియామకాల్లో ఈ సర్వీసును పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. దసర సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అటు హైదరాబాద్లో ఆర్టీసీ అధికారులకు అదనంగా, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లకు కూడా డిపోల వారీ డ్యూటీలు వేసింది ప్రభుత్వం. మరోవైపు సమ్మెపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై ఉత్కంఠ ఏర్పడింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారిపైనా తీవ్రంగా పడుతుంది. text: మొదటి ప్రపంచ యుద్ధం హోరాహోరీగా జరుగుతున్న సమయం అది. అప్పటికే మూడేళ్లుగా భీకర పోరు నడుస్తోంది. 1918 మే 31న ఈశాన్య ఫ్రాన్స్‌లో జర్మనీ ఆకస్మికంగా దాడి ప్రారంభించింది. బ్రిటిష్ సంకీర్ణ దళాలపై పై చేయి సాధించేందుకు జర్మనీ సేనలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఫ్రాన్స్ బలగాలు కొత్తగా సమకూర్చుకున్న బలంతో ముందుకు కదిలాయి. ఆ కొత్త బలమే ఈ బుల్లి యుద్ధ ట్యాంకు. 'ది ఎఫ్‌టీ' అని పిలిచే ఈ ట్యాంకు చాలా పొట్టిగా ఉంటుంది. అప్పటి దాకా 18 నెలల పాటు బ్రిటిష్ సంకీర్ణ దళాలు వినియోగించిన భారీ యుద్ధ ట్యాంకులతో పోల్చితే ఇదో 'పిల్లకాయ' లాంటిది. కానీ, చేతల్లో మాత్రం చాలా గట్టిది. దీని లోపల కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుంటుంది. చాలా తేలికగా ఉండే ఈ ట్యాంకు, కొద్దిపాటి సందు దొరికినా చాలు.. దూసుకెళ్తూనే ఉంటుంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్లు మార్క్ I పేరుతో తయారు చేసిన భారీ యుద్ధ ట్యాంకుల వేగం చాలా తక్కువ. అవి కదులుతుంటే భారీ ఎత్తున శబ్దం వస్తుండేది. దాంతో ప్రత్యర్థి దళాలు వాటి ఆచూకీని సులువుగా కనిపెట్టేవి. తర్వాత వచ్చిన మార్క్ 4 తోనూ అదే సమస్య. వాగులు వంకలు ఎక్కువగా ఉన్న చోట, దట్టమైన అడవుల్లో భారీ ట్యాంకులు వెళ్లడం కష్టంగా ఉండేది. ఈ సమస్యలకు పరిష్కారంగా తక్కువ పరిమాణం కలిగి ఉండి, వేగంగా పరుగెత్తగల ట్యాంకులు అవసరమన్న ఆలోచనతో ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ సంస్థ ఎఫ్‌టీ ట్యాంకును రూపొందించింది. ఈ పొట్టి ట్యాంకుతో ఆ సమస్యలు లేవు. శత్రువుల నుంచి సులువుగా తప్పించుకోగలదు. మాటువేసి దాడి చేయగలదు. అక్కడికక్కడే సులువుగా 360 డిగ్రీల కోణంలో చుట్టూ తిరగగలదు. 2017లో అందుబాటులోకి వచ్చిన బ్రిటిష్ మార్క్ IV ట్యాంకు బరువు దాదాపు 29 టన్నుల దాకా ఉండేది. అదే ఈ కొత్త ట్యాంకు బరువు మాత్రం కేవలం 7 టన్నులే. అంతేకాదు, బ్రిటిష్ మార్క్ ట్యాంకులు బాగా వేడెక్కుతుండేవి. ఈ పొట్టి ట్యాంకులో ఆ సమస్య కూడా లేదు. ఎప్పుడూ గాలి పీల్చుకుంటూ ఇంజిన్‌ని చల్లబరుస్తుంది, వేడి గాలిని బయటకు వదులుతుంది. గోతులను, కాలువలను కూడా దాటుకుంటూ వెళ్లేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇది గంటకు 11 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. 1918 నాటికి అది చాలా ఎక్కువ. మాటువేసి ప్రత్యర్థి దళాలపై దాడి చేసేందుకు ఈ ట్యాంకులు బాగా ఉపయోగపడుతుండేవి. 1918 మే 31న ఒకేసారి 30 ఎఫ్‌టీ ట్యాంకులు రంగంలోకి దిగి, జర్మనీ బలగాలను వెనక్కి పంపించడంలో కీలకపాత్ర పోషించాయి. దాంతో 1919 ఆఖరులోగా 12,000కు పైగా ఎఫ్‌టీ యుద్ధ ట్యాంకులను తయారు చేసివ్వాలని రెనాల్ట్ సంస్థను ఫ్రాన్స్ కోరింది. కానీ, ఆ గడువులోగా అన్నీ తయారు చేయలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జర్మనీ సుమారు 20 యుద్ధ ట్యాంకులను తయారు చేయగా, ఫ్రాన్స్ వద్ద ఉన్న ఎఫ్‌టీ ట్యాంకుల సంఖ్య 1,000 దాటింది. ఎఫ్‌టీ ట్యాంకులను తయారు చేసి ఇప్పటికి వందేళ్లు గడుస్తున్నా.. ఇంకా కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి. దక్షిణ ఇంగ్లాండ్‌లోని కెంట్ ప్రాంతంలో ఉన్న ఓ వర్క్‌షాప్‌లో ప్రస్తుతం రెండు ఎఫ్‌టీ ట్యాంకులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు కూడా చక్కగా నడుస్తోంది. అది దాదాపు వందేళ్ల నుంచీ పనిచేస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వందేళ్ల క్రితం రూపుదిద్దుకున్న 'ది ఎఫ్‌టీ' అనే బుల్లి యుద్ధ ట్యాంకు మొదటి ప్రపంచ యుద్ధం రూపురేఖలనే మార్చేసింది. text: 2కోట్ల 60లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు కానీ, తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది. కార్మికశాఖ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్త వినోజ్ అబ్రహమ్ ఓ అధ్యయనం చేశారు. అందులో, భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందని తేలింది. వినోజ్ అబ్రహమ్ అధ్యయనంలో దిగ్భ్రాంతికి గురిచేసే మరో అంశం వెలుగుచూసింది. ఉపాధి క్షీణించిపోవడంతో పాటు 2013-14, 2015-16 మధ్య కాలంలో అంతవరకూ ఉన్న ఉద్యోగాలు కూడా ఆవిరైపోయాయి. స్వతంత్ర్య భారతంలో ఇలా జరగటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఉద్యోగాలు ఆవిరైపోవడం తాత్కాలికం కావచ్చు. కానీ, సగంమంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయం రంగంలో కూడా ఉపాధి మాయమవుతోంది. గిట్టుబాటు ధరలు లేకపోవడం, వరుస కరవులూ రైతుల్ని వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్నాయి. నిరుద్యోగ రైతులూ, రైతు కూలీలూ.. గృహనిర్మాణం ఇతర రంగాలపై ఆధారపడుతున్నారు. కరువు ధాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి కొరత మెకిన్జీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం వ్యవసాయ రంగంలో 2011-15 మధ్య 2 కోట్ల 60 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఏప్రిల్-జూన్ మధ్య జిడిపి 5.7% తో మూడేళ్ళ కనిష్టానికి చేరింది. వివాదాస్పదమైన నోట్ల రద్దు, జూలైలో ప్రవేశపెట్టిన జీఎస్టీలు వ్యవసాయ, గృహనిర్మాణ, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశీలన ప్రకారం.. రిటైల్, విద్యుత్, నిర్మాణ, నిత్యావసర విభాగం, ఇతర రంగాల్లోని 120 కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడిపోయాయి. విస్తరణ ప్రణాళికలు, స్వల్పకాల వృద్ధిపై కూడా ఈ ప్రభావం పడింది. 'ఉపాధి కల్పన' ప్రస్తుతం భారతదేశం ముందున్న అతి పెద్ద సవాలు. ప్రతి సంవత్సరమూ ఒక కోటీ ఇరవై లక్షల మంది కార్మికులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య దాదాపు 2030 వరకూ కొనసాగుతుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా దేశ జనాభాతో దాదాపు సమానమైన 2 కోట్ల 60 లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతాలతో, ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో కార్మికులు పనిచేయాల్సి వస్తోంది ప్రాణాలు నిలుపుకునేంత సంపాదన ఇండియాలో నిరుద్యగ సమస్య తీవ్రంగా వుంది. కానీ, విదేశాల్లోలాగ నిరుద్యోగానికి అద్దం పట్టే పోడవాటి క్యూలు ఇక్కడ కనబడవు. సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో దేశంలో చాలామంది ప్రజలు కేవలం తమ ప్రాణాల నిలుపుకోవడానికి అవసరమైన మేరకే సంపాదించగలుగుతున్నారు. భారతదేశంలో చాలామంది నిరుద్యోగులు తమ కుటుంబాలపైనే ఆధారపడుతున్నారు. ఉపాధి కొరత కారణంగా, తక్కువ మంది చేయగలిగిన పనిని చాలామంది పంచుకుంటున్నారు. దీంతో, వారి ఆదాయం కూడా పలుచబడుతోంది. దేశంలో దాదాపు ఎనభై శాతం మంది కార్మికులు తగు ప్రమాణాలు పాటించని పరిశ్రమలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీరిలో చాలా తక్కువ మందికే ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత ఉంటోంది. దేశంలో కేవలం 7 శాతం మంది మాత్రమే, ఉత్తమ ప్రమాణాలున్న ఆర్థిక వ్యవస్థల్లో పనిచేస్తూ, కార్మిక ఉపకారాలు పొందుతున్నారని అంచనా. జీఎస్టీ, నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు చతికిలపడ్డారు ''భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. కార్మిక శక్తి విపరీతంగా పెరుగుతోంది. రానున్న ముఫ్ఫై సంవత్సరాల్లో నెలకు దాదాపు పదిలక్షల మంది ప్రజలు కార్మికవర్గంలో భాగమవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా రెండంచెల ఆర్థిక వ్యవస్థను శాశ్వతపరుచుకునే క్రమంలో ఉంది'' అని ఇండియాస్ లాంగ్ రోడ్ పుస్తక రచయిత డాక్టర్ జోషి చెబుతున్నారు. కార్మిక శక్తిని అసంబద్ధంగా పంపిణీ చేయడం వల్లనే నిరుద్యోగ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. ఎక్కువ మంది కార్మికులు అవసరమైన రంగాల్లో ఉపాధి మందకొడిగా సాగుతుంటే, తక్కువమంది కార్మికులు ఉత్పత్తి చేయగలిగిన చోట పెద్దమొత్తంలో పనిచేస్తున్నారు. ఈ కారణాలతో తక్కువ జీతాలతో, ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో పనిచేయాల్సి వస్తోంది. సగంమంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయం రంగంలో కూడా ఉపాధి మాయమవుతోంది భారత్ ఉపాధిని సృష్టించే అవకాశాన్ని కోల్పోయిందా ఉపాధిని సృష్టించడం కోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే గార్మెంట్స్, లెదర్ మొదలైన పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. లైసెన్స్‌లేని కారణాలను చూపి కబేళాలను మూసివేయడం, గోవధను నియంత్రించడం వంటి నిర్ణయాల కారణంగా ఇండియాలో లెదర్ ఎగుమతులు తగ్గిపోయాయి. తక్కువ ధర కలిగిన చిన్నచిన్న బొమ్మలు, నేత వస్తువుల తయారీ లాంటి పరిశ్రమల విషయంలో భారతదేశం, తన వైఫల్యాలను ఇంకా కొనసాగిస్తూనేవుందని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఛీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిన శర్మ అన్నారు. చైనా మార్కెట్‌పై ఇండియా ఆధారపడ్డానికి, ఇండియాలో నిరుద్యోగం పెరగడానికీ ఇదే ప్రధాన కారణం కావచ్చు అని కూడా రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు. బహుశా, ఉద్యోగాల కల్పన విషయంలో భారత్ తన అవకాశాలను ఎప్పుడో వదిలేసిందేమో?? మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. text: దీంతో ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలు ప్రభుత్వ నియమాలను, ప్రజల అభిప్రాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక ఆటను, పోస్టు కార్డులను ఉపయోగించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. 19వ శతాబ్దపు చివరి భాగంలో వారు సాగించిన ఆ ప్రచారం సృజనాత్మకతకు మారుపేరుగా నిలిచింది. బ్రిటిష్ పార్లమెంట్ మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయింది. 'సాధ్యం కాదు' అనే సమాధానాన్ని మహిళలు ఒప్పుకోలేదు. అందుకే సృజనాత్మక ప్రచారాన్నే వారు తమ ఆయుధంగా మలచుకున్నారు. 'సఫ్రేజెట్టో' అనే ఒక ఆటను, పోస్టు కార్డుల సాయంతో ఓటు హక్కు కోసం పోరాడిన మహిళలు ప్రభుత్వ నియమాలను, ప్రజాభిప్రాయాన్ని శాశ్వతంగా మార్చేశారు. 'సఫ్రేజెట్టో' ఏమిటి? చూడడానికి అవి చాలా సాధారణంగా, ఎలాంటి ప్రాముఖ్యతా లేని ఆట వస్తువులుగా కనిపిస్తాయి. కానీ సరైన చేతుల్లో పడితే, వాటికి సమాజాన్ని మార్చేసే శక్తి ఉందని ఓటు హక్కు కోసం పోరాడిన ఆనాటి మహిళలు నిరూపించారు. బ్రిటన్‌లో ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలు తమ భావాలను, అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికి ఆటలే మంచి సాధనాలని గ్రహించారు. ఒక ఆట ద్వారా తమ ఆలోచనలను రాజకీయ వర్గాలూ, తద్వారా చట్టసభల వరకు తీసుకెళ్లవచ్చని వారు భావించారు. ''నిజానికి అది ఒక మంచి మార్కెటింగ్ టూల్'' అని ప్రొఫెసర్ సెనియా పసేటా అన్నారు. బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు ఆమె క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 'సఫ్రేజెట్టో' గేమ్ బోర్డు. ఆక్స్‌ఫర్డ్‌లోని బోడ్లియన్ లైబ్రరీలో మాత్రమే ప్రస్తుతం ఈ బోర్డు ఉంది. దగ్గర నుంచి చూస్తే, 'సఫ్రేజెట్టో' గేమ్ ఇతర బోర్డులకు భిన్నంగా ఉంటుంది. దీనిలో 16 చిన్న ఆకుపచ్చ పావులు, 5 పెద్ద పావులు ఉంటాయి. ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలను, వాళ్ల నాయకురాళ్లను సూచిస్తాయి. పోలీసులు అడ్డుకునే లోపు 'హౌస్ ఆఫ్ కామన్స్' చేరుకుంటే ఆటలో గెల్చినట్లు. నిజజీవితంలో మాదిరే, ఈ ఆట మధ్యలో పట్టుబడితే జైలు లేదా ఆసుపత్రి పాలే. ''ఈ ఆటను బ్రిటిష్ మహిళల సామాజిక, రాజకీయ సంస్థ (డబ్యూఎస్‌పీయూ) సభ్యురాళ్లు సృష్టించారు. మహిళలకు ఓటు హక్కు ప్రచారం కోసం నిధులు సేకరించడానికి ఆ ఆటను ఉపయోగించుకున్నారు. ఆ మహిళల వ్యూహం, నాటి సామాజిక పరిస్థితిని వాళ్లెంత బాగా అర్థం చేసుకున్నారు? వాళ్లకు ఎంత సెన్సాఫ్ హ్యూమర్ ఉంది?... ఇలాంటి విషయాలను ఆ ఆట తెలియపరుస్తుంది'' అని ప్రొఫెసర్ పసేటా వివరించారు. హౌజ్ ఆఫ్ పార్లమెంటు వెలుపల పడవ మీద మహిళలు నిరసన తెలుపుతున్న చిత్రం మాస్ కమ్యూనికేషన్‌లో ఇప్పటి ట్వీటర్‌కన్నా ముందున్న మహిళలు ఓటుహక్కు సాధించాలన్న లక్ష్యం కోసం, మహిళలు అతి తక్కువ నిధులతో తమ పోరాటాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో పోస్టల్ సర్వీసుల ద్వారా రోజుకు మూడుసార్లు ఉత్తరాలను డెలివరీ చేసేవారు. అలా దేశంలోని ప్రతి ఇంటికీ, ప్రతి సంస్థకూ తమ సందేశం పంపాలని వారు నిర్ణయించుకున్నారు. ''ఆరోజుల్లో ఓటు హక్కు కోసం పోరాడుతున్న నాయకురాళ్లు, వాళ్ల ర్యాలీల చిత్రాలున్న పోస్టుకార్డులు వేలాది మంది చేతుల్లో కనిపించేవి. అలా వాళ్ల ప్రచారం విస్తృతంగా జరిగింది'' అని ప్రొఫెసర్ పసేటా తెలిపారు. ఓటు హక్కు సాధించేందుకు 'సఫ్రేజెట్టో' అనే ఆటతో మహిళలు ఉద్యమం చేశారు. బ్రిటన్‌లో మహిళలకు ఓటుహక్కు లభించి వందేళ్లు పూర్తయ్యాయి. అప్పుడప్పుడే ఎదుగుతున్న మహిళా నాయకులు పోస్టు కార్టుల ద్వారా ప్రజలకు పరిచయమయ్యారు. డబ్యూఎస్‌పీయూ వ్యవస్థాపకురాలు ఎమెలీన్ పాంఖర్స్ట్ పాల్గొన్న ర్యాలీలు, ఆమె అరెస్టులకు ఈ కార్డులతో విస్తృత ప్రచారం వచ్చింది. ఆ రోజుల్లో మీడియాపై నియంత్రణల నేపథ్యంలో - కొన్నిసార్లు ఉద్యమంలో కొన్ని ముఖ్యమైన వార్తలను చేరవేయడానికి, మద్దతు కూడగట్టడానికి, నిధుల సేకరణకు పోస్టుకార్డుల ఉద్యమం బాగా ఉపయోగపడింది. పోస్టుకార్డుపై చిత్రం: 1908 ఫిబ్రవరి 13న విక్టోరియా స్ట్రీట్‌లో డబ్యూఎస్‌పీయూ వ్యవస్థాపకురాలు ఎమెలీన్ పాంఖర్స్ట్ ను అరెస్టు చేశారు. నెట్‌వర్కింగ్, సాధికారత ఈ ఉద్యమం ప్రధానంగా మహిళా వాలంటీర్లపై ఆధారపడింది. తద్వారా వారి సాధికారత పెరిగి, మహిళలు తమ శక్తియుక్తులను గ్రహించడం ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా మొదటిసారి మహిళలను - వారి నైపుణ్యాలు, వారు చేపట్టే పనుల ఆధారంగా వర్గీకరించి, వారిని వివిధ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవడం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న నటీమణులు మహిళలు తమ గొంతును ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణను ఇచ్చేవారు. కళాకారులు పోస్టర్లు, బ్యానర్లు తయారు చేసి ఇచ్చేవాళ్లు. రచయితలు ప్రసంగాలు తయారు చేసి ఇస్తే, టీచర్లు సాయంత్రం క్లాసులు తీసుకునేవాళ్లు. 1912 మే 22న ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్ ప్రపంచం తమ మాట వినేట్లు చేశారు యూకేలో మహిళల ఓటు హక్కు కోసం పోరాటం తీవ్రంగా సాగుతుండగానే వాళ్లు ప్రపంచంలోని ఇతర చోట్ల కూడా మహిళల జీవితాలు, రాజకీయ కార్యకలాపాల గురించి తెలుసుకోవడంపై ఆసక్తి కనబరిచారు. అప్పటికే న్యూజీల్యాండ్, నార్వేలలో మహిళలకు ఓటు హక్కు లభించింది. కానీ మిగతా చోట్ల మాత్రం వారికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. యూకేలో మహిళల ఓటు హక్కు కోసం జరిగిన పోరాటం, దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మహిళలను ఆ దిశగా కార్యోన్ముఖులను చేసింది. డబ్ల్యూఎస్‌పీయూ ప్రచురించిన వార పత్రిక 'ఓట్ ఫర్ విమెన్' కవర్ పేజీ. అది 30,000 మందికి చేరింది. ఆనాటి పోరాట యోధురాళ్లకు ప్రపంచవ్యాప్తంగా మహిళల పరిస్థితుల గురించి చాలా అవగాహన ఉందని ప్రొఫెసర్ పసేటా అన్నారు. దీనికి నాటి వుమెన్స్ సఫ్రేజెట్ జర్నల్, ఓట్స్ ఫర్ వుమెన్ ప్రచురణలే సాక్ష్యం. బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించి ఫిబ్రవరి 6తో వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌లో 'ఫ్రమ్ సాఫో టు సఫ్రేజ్: వుమెన్ హు డేర్డ్' అనే ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. దీనిలో 2 వేల ఏళ్ల నుంచి రాజకీయాలు, సైన్సు, కళల్లో రాణించిన మహిళల చరిత్రను ప్రదర్శించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మాక్కూడా ఓటు హక్కు కావాలని బ్రిటన్‌లో మహిళలు మొట్టమొదటిసారి డిమాండ్ చేసినపుడు, సాధ్యం కాదనే సమాధానం లభించింది. text: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ కోస‌ం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ఇదివరకు వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా తుళ్లూరు మండ‌ల కేంద్రంతో పాటుగా వెల‌గ‌పూడి, మంద‌డం గ్రామాల్లో నిర‌స‌న‌లు జోరుగా జరుగుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా ఈ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, సీపీఐ నేత కె నారాయ‌ణ, కాంగ్రెస్ నాయ‌కురాలు సుంక‌ర ప‌ద్మ‌శ్రీ తదితర నాయకులు కూడా వీటిలో భాగమయ్యారు. ప్ర‌భుత్వం నుంచి పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త వ‌చ్చి, త‌మ డిమాండ్ నెర‌వేర్చే వ‌ర‌కూ ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని అమరావతి ఆందోళనకారుల జేఏసీ చెబుతోంది. ప్ర‌భుత్వం మాత్రం రాజధాని అంశంపై హైప‌వ‌ర్ క‌మిటీ ఇచ్చే నివేదిక‌పై క్యాబినెట్‌లో, అసెంబ్లీలో చ‌ర్చించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అమరావతిలో ఆందోళ‌న‌కారుల ప‌ట్ల‌ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తుళ్లూరుకి సొంత చ‌ట్టం ఉందా అని ప్ర‌శ్నించింది. 144సెక్ష‌న్ విధింపుపై సుప్రీంకోర్ట్ ఆదేశాలు అమ‌లుచేయ‌రా అంటూ నిల‌దీసింది. ఆందోళ‌న సాగిస్తున్న‌ మ‌హిళ‌ల ప‌ట్ల పోలీసులు విచ‌క్ష‌ణార‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ దాఖ‌లైన ఫిర్యాదుల‌పై విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలు... అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ వేదిక పేరుతో సాగుతున్న ఈ ఉద్య‌మంలో మ‌హిళ‌లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. రోజూ ఆందోళన కార్యక్రమాలకు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌వుతున్నారు. ఆందోళనకారుల్లో మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. గుంటూరు, విజ‌య‌వాడ‌, తెనాలి వంటి ప్రాంతాల్లో కూడా మ‌హిళ‌లు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్ర‌త్యేకంగా ర్యాలీలు నిర్వ‌హించారు. గ‌తంలో ఎన్న‌డూ నిరసన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనుభ‌వం లేని మ‌హిళ‌లు కూడా పెద్ద సంఖ్యలో త‌ర‌లి వ‌స్తున్నారు. ఈ ఉద్య‌మ అనుభ‌వం త‌మ‌కు కొత్త పాఠాలు నేర్పుతోందని మంద‌డం గ్రామానికి చెందిన ఎన్ శ్రావ‌ణి అన్నారు. ఎంబీఏ చ‌దువుకున్న ఆమె.. నెల రోజులుగా అమ‌రావ‌తి కోస‌ం సాగుతున్న ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు. ‘‘నాకు ఎప్పుడూ ఉద్య‌మంలో పాల్గొన్న అనుభ‌వం లేదు. క‌నీసం నినాదం ఎలా చేయాలో కూడా తెలియ‌దు. అప్పుడ‌ప్పుడూ టీవీల్లో ఇలాంటి ఆందోళ‌న‌లు చూడ‌డ‌మే త‌ప్ప ప్ర‌త్య‌క్ష అనుభ‌వం లేక‌పోవ‌డంతో మొద‌ట కొంత మొహ‌మాటం అనిపించేది. కానీ మా మొహమాటాన్ని బ‌ల‌హీన‌త‌గా భావిస్తున్న స‌మ‌యంలో మాకు మ‌రో మార్గం లేదనిపించింది’’ అని శ్రావణి చెప్పారు. ‘‘రోజూ రోడ్డెక్కుతున్నాం. చివ‌రి వ‌ర‌కూ పోరాడ‌తాం. న్యాయం జ‌ర‌గాలి. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం మేము త్యాగం చేస్తే.. ఇప్పుడు మా త్యాగాల పునాదుల మీద మా ఆశ‌లు స‌మాధి చేస్తామంటే చూస్తూ ఊరుకోలేం క‌దా. నాలాగే చాలా మంది ఎప్పుడూ లేని రీతిలో ధ‌ర్నాలు, దీక్ష‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఆలోచించుకోవాలి. మా క‌న్నీరు చూసిన త‌ర్వాతైనా, మ‌నసు క‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాం’’ అని ఆమె అన్నారు. అరెస్టయిన వారిలోనూ వాళ్లే ఎక్కువ నెల రోజుల ఉద్య‌మంలో ప‌లు సంద‌ర్భాల్లో పోలీసుల‌కు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య వివాదాలు ఏర్పడ్డాయి. పోలీసుల ఆంక్ష‌ల‌ను దాటుకుని ఆందోళనకారులు ముందుకెళ్లే ప్ర‌య‌త్నాలు చేయడంతో పలు చోట్ల అరెస్టులు జ‌రిగాయి. ఇలా అరెస్టైనవారిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఒక్క విజ‌య‌వాడ‌లో జ‌న‌వ‌రి 10న జరిగిన ర్యాలీలోనే 610 మంది మ‌హిళ‌లు అరెస్ట్ అయ్యారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కొంద‌రు మ‌హిళ‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు. రాత్రి వేళ కూడా అరెస్టులు చేశార‌న్న విష‌యంపై, అందుకు కారణాలంటో వెల్ల‌డించాల‌ని తాజాగా హైకోర్టు పోలీసుశాఖను ఆదేశించింది. సూర్యోద‌యానికి ముందు, సూర్యాస్త‌మయం త‌ర్వాత అరెస్ట్ చేయాల్సి వ‌స్తే దానికి కార‌ణాలు వెల్ల‌డిస్తూ నివేదిక‌ను మేజిస్ట్రేట్‌కు అందించాల‌ని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. మ‌హిళ‌ల అరెస్టు విష‌యంలో సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను పాటించాల్సిందేన‌ని, దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ట్ట ప్ర‌కారం పోలీసుల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని సూచించింది. విజయవాడ ర్యాలీ సమయంలో జరిగిన ఘటనల గురించి కారుమంచి నాగ‌మ‌ణి అనే మ‌హిళ బీబీసీతో మాట్లాడారు. ‘‘మాకు ర్యాలీకి అనుమ‌తి ఉంది. ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా బంద‌రు రోడ్డులో ఒక‌వైపు ప్ర‌ద‌ర్శ‌నగా బ‌య‌లుదేరాం. పోలీసులు మ‌మ్మ‌ల్ని అడ్డుకున్నారు. ఎందుకు ఆపుతార‌ని నిల‌దీశాం. శాంతిభ‌ద్ర‌త‌ల కార‌ణాల‌ని చెప్పి బ‌ల‌వంతంగా మ‌మ్మ‌ల్ని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. చీక‌టి ప‌డిన త‌ర్వాత మ‌హిళ‌ల‌ను అరెస్ట్ చేసే స‌మ‌యంలో పాటించాల్సిన నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేదు’’ అని ఆమె అన్నారు. కొందరు పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారని, తమను ఇష్టారాజ్యంగా ఈడ్చేశారని నాగమణి చెప్పారు. ‘‘పోలీస్ స్టేష‌న్ల‌లో కూడా మమ్మల్ని వేధించారు. దీనిపై న్యాయ‌పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఎప్పుడూ బ‌య‌ట‌కు రాని మ‌హిళ‌లు కూడా అమ‌రావ‌తి కోసం ముందుకు వ‌స్తే పోలీసుల‌తో అణ‌చివేయాల‌ని చూడ‌డం అమానుషం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే...’ ఒక‌ప్పుడు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ తీరిగ్గా వంట ప‌ని చేసుకునేదాణ్ని, ఇప్పుడు మాత్రం ఉదయం 8 గంటల కల్లా పని ముగించుకుని దీక్షా శిబిరాలకు వస్తున్నానని పి.రమాదేవి చెప్పారు. ఆమెది వెలగపూడి. ‘‘రోజూ వంట చేసుకోవ‌డం, పిల్ల‌ల‌కు తినిపించడం, ఖాళీ స‌మ‌యం ఉంటే క‌బుర్లు, టీవీల‌తో కాల‌క్షేపం జ‌రిగిపోయేది. ఇప్పుడ‌లా కాదు. నెల రోజులుగా రోజూ ధ‌ర్నా శిబిరంలోనే ఉంటున్నాం. వంట ప‌ని పొద్దున్నే పూర్త‌యిపోతుంది’’ అని రమాదేవి బీబీసీతో చెప్పారు. ‘‘పోలీసులు వ‌చ్చినా, నాయ‌కులు వ‌చ్చినా మా గోడు వెళ్ల‌బోసుకుంటున్నాం. ఐదేళ్లుగా మా ప్రాంతంలో రాజ‌ధాని అభివృద్ధిని క‌ళ్లారా చూస్తున్న మేం, ఇప్పుడు ఇదంతా నిలిపివేస్తున్నారంటే త‌ట్టుకోలేక‌పోతున్నాం. ఎన్నో భ‌వ‌నాలు, రోడ్ల కోసం వేల కోట్లు ఖ‌ర్చు చేసి.. ఇప్పుడు మ‌రో చోట మొద‌లెడ‌తారంటే ఎలా స‌హిస్తాం. మేము రాష్ట్ర ప్ర‌జ‌ల కోస‌మే పోరాడుతున్నాం. అమ‌రావ‌తి అంద‌రిదీ’’ అని ఆమె అన్నారు. ఆందోళనల్లో పాల్గొంటున్నవాళ్లలో గృహిణులతోపాటు విద్యార్థినులు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న యువతులు, మహిళ‌లు కూడా కనిపిస్తున్నారు. సంక్రాంతి సెల‌వులు కావ‌డంతో చాలా మంది మహిళలు దీక్షా శిబిరాలకు పిల్లలనూ వెంట తీసుకువస్తున్నారు. ‘సామ‌ర‌స్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం’ ఆందోళ‌న‌లో పాల్గొంటున్న మ‌హిళ‌ల ప‌ట్ల పోలీస్ యంత్రాంగం సామ‌ర‌స్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని గుంటూరు రూర‌ల్ ఎస్పీ విజ‌య‌రావు తెలిపారు. ఆందోళ‌న‌కారుల సంఖ్య‌కు అనుగుణంగా, మ‌హిళా పోలీసులు కూడా త‌గ్గ సంఖ్య‌లోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘‘శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌క‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నాం. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుకునే హ‌క్కు ఉంది. కానీ, ఆ పేరుతో చ‌ట్ట‌విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు తీసుకుంటాం’’ అని ఆయ‌న తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాల‌న్న డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం మొదలై నెల రోజులు దాటింది. వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. text: ఈ చర్చల కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఖతార్‌ రాజధాని దోహ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపేయో వీటిని చరిత్రాత్మకంగా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అమెరికాకు, తాలిబన్‌లకు మధ్య ఒప్పందం కారణంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే అఫ్గానిస్తాన్‌లో హింస కారణంగా ఖైదీల విడుదల తదుపరి దశ కార్యక్రమం కొన్నాళ్లు నిలిచిపోయింది. సరిగ్గా 19 ఏళ్ల కిందట తాలిబన్లు అమెరికా మీద దాడి చేసిన రోజునే అఫ్గానిస్తాన్‌ నుంచి ఒక బృందం చర్చల కోసం దోహ బయలుదేరి వెళ్లింది. ఈ శాంతి చర్చలు ఫలప్రదంగా జరుగుతాయని తాము ఆశిస్తున్నట్లు అఫ్గానిస్తాన్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న అబ్దుల్లా అబ్దుల్లా వ్యాఖ్యానించగా, మిగిలిన ఆరుగురు తాలిబన్‌ ఖైదీలను విడిచి పెట్టినందున తాము చర్చలకు వస్తున్నామని తాలిబన్‌లు గురువారం ప్రకటించారు. ‘భారత వ్యతిరేక చర్యలకు అఫ్గాన్ భూభాగాన్ని వాడుకోరాదు’ అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఎలాంటి భారత్ వ్యతిరేక చర్యల కోసం వాడుకోరని తాము ఆశిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. అఫ్గాన్ శాంతి చర్చలపై దోహాలో జరుగుతున్న వీడియో సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. శాంతిచర్చలు అఫ్గానిస్తాన్ నేతృత్వంలో, నియంత్రణలో జరగాలని.. అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవించేలా.. మానవ హక్కులు, ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చేలా ఈ చర్చలు ఉండాలని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ కు, గల్ఫ్ దేశాలకు మధ్య శాంతి ఒప్పందాలలో ట్రంప్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇజ్రాయెల్‌తో బహ్రెయిన్‌ శాంతి ఒప్పందం గల్ఫ్‌దేశాలతో శాంతి ప్రయత్నాలు చేస్తున్న ఇజ్రాయెల్ ఇటీవలే యూఏఈతో ఒక చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా బహ్రెయిన్‌, ఇజ్రాయెల్ మధ్య కూడా ఒక శాంతికి అంగీకారం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌లో వెల్లడించారు. “నెల రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రెండో గల్ఫ్‌ దేశం బహ్రెయిన్‌’’ అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య విరోధం కొనసాగుతోంది. పాలస్తీనా వివాదాన్ని పరిష్కరిస్తేనే ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టకుంటామని అరబ్‌ దేశాలు గతంలో ప్రకటించాయి. అయితే గత నెలలో ఇజ్రాయెల్‌, యూఏఈల మధ్య ఒక ఒప్పందం కుదరగా, ఇజ్రాయెల్‌తో చేతులు కలిపే తదుపరి దేశం బహ్రెయినేనని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే రెండు దేశాలు శాంతి ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణను పరిష్కరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ జనవరిలో తన ‘మిడిల్‌ ఈస్ట్‌ పీస్‌ ప్లాన్‌’ను ప్రకటించారు. ఇజ్రాయెల్‌-యూఏఈల మధ్య ఒప్పందంలో ట్రంప్‌ కీలక పాత్ర పోషించారు. తాజాగా జరిగిన ఒప్పందంపై “ఇది శాంతిలో కొత్త శకం’’ అని ట్రంప్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వానికి, తాలిబన్‌లకు మధ్య తొలి శాంతి చర్చలు గల్ఫ్‌ దేశం ఖతార్‌లో మొదలయ్యాయి. వాస్తవానికి ఇవి నెల కిందటే జరగాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. text: సీసీ టీవీ దృశ్యాల్లో యువతి నిద్ర‌ మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌ డ్రామా బయటపడిన తరువాత నుంచి ఆమె ఘట్‌కేసర్‌లోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. బుధవారం ఉదయం ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ నెల ప్రారంభంలో ఫార్మసీ విద్యార్థినిని కొందరు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేశారంటూ తొలుత కేసు నమోదైంది. అయితే, అదంతా అవాస్తవమని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ విద్యార్థినే కట్టుకథ అల్లిందని పోలీసులు తేల్చారు. ఇంతకీ ఏమిటా అత్యాచారం, కిడ్నాప్ నాటకం హైదరాబాద్ శివార్లలోని ఘట్‌కేసర్ ప్రాంతంలో ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలతో నమోదైన కేసును తప్పుడు కేసు అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నిర్ధరించారు. ఆ యువతిపై అత్యాచారం జరగలేదని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 13న విలేఖరుల సమావేశంలో మహేశ్ భగవత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 10 సాయంత్రం 6.29 గంటలకు కీసర పోలీసులకు యువతి కిడ్నాప్ గురైనట్లుగా ఫిర్యాదు అందింది. బాధితురాలుగా భావించిన ఆ అమ్మాయి తన తల్లికి ఇచ్చిన సమాచారం ప్రకారం, మల్లేశ్ అనే వ్యక్తి 100కు ఫోన్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెర్చ్ ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి ఆ అమ్మాయిని పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఆమె చెదిరిన దుస్తులతో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆ యువతిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఆ మరునాడు అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం పోలీసుల బృందం నిందితులను గాలించే పనిలో పడింది. అందులో భాగంగా వారు వందకు పైగా సీసీ కెమేరా ఫుటేజిని పరిశీలించి నలుగురు ఆటో డ్రైవర్లను అనుమానితులుగా భావించి ఫిబ్రవరి 11న ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధితురాలు చెప్పిన వివరాలకు, పోలీసులు సేకరించిన ఆధారాలకు పొంతన కుదరలేదు. దాంతో, పోలీసులు మరొకసారి సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి సీన్-రీకన్‌స్ట్రక్షన్ చేసి విశ్లేషించారు. నిజానికి, ఆ యువతి 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఘట్‌కేసర్, యమ్నంపేట్, అన్నోజిగూడ తదితర ప్రాంతాల్లో ఒంటరిగానే తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఆ సమయంలో ఆ ప్రాంతంలో లేవని కూడా పోలీసులు గుర్తించారు. దాంతో, పోలీసులు ఆ యువతిని మళ్లీ ప్రశ్నించారు. 'చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదే పదే ఫోన్ చేసి అడగడంతో ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకువెళ్లాడని చెప్పాను' అని ఆ యువతి అంగీకరించిందని సీపీ చెప్పారు. అటో డ్రైవర్లు కిడ్నాప్ చేయడం, అత్యాచారానికి పాల్పడడం అంతా కట్టుకథ అని ఆయన తేల్చి చెప్పారు. అమెపై ఎవరూ అత్యాచారం చేయలేదన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇటీవల ఘట్‌కేసర్‌లో తాను కిడ్నాప్‌ అయినట్లుగా అబద్ధమాడిన ఫార్మసీ విద్యార్థిని (19) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. text: గర్భిణులకు ఈ వైరస్‌ త్వరగా సోకుతుందని నివేదికలు వస్తున్న సమయంలో దాదాపు రెండు నెలలకు పైగా ఆమె తిహార్‌ జైల్లో ఉన్నారు. “నేను హిందువులను చంపే టెర్రరిస్టునని, నాతో ఎవరూ మాట్లాడవద్దని ఖైదీలకు జైలు అధికారులు చెప్పేవారు. కానీ నేను ఒక వివాదాస్పద చట్టాన్ని వ్యతిరేకిస్తూ అరెస్టయ్యానని వాళ్లకు తెలియదు’’ అని జైలు నుంచి విడుదలయ్యాక బీబీసీ ప్రతినిధి గీతాపాండేతో సఫూరా జర్గార్‌ అన్నారు. ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొనడమే ఆమె చేసిన నేరం. ఈ ఆందోళన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమయ్యాయి. కానీ జైలుకు వెళ్లిన తర్వాత ఆమెను విడుదల చేయాలంటూ ఒక్క ఉద్యమం, నిరసన ప్రదర్శనా జరగలేదు. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో కఠినమైన లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఆమెలాగా అరెస్టైన అనేకమంది జైల్లోనే ఉండిపోయారు. అయితే ఇది కేవలం ఇండియాలోనే కాదు. ఆసియాలోని చాలా దేశాలలో ప్రభుత్వాలు తాము తయారుచేసిన చట్టాలను కఠినంగా అమలు చేయడానికి కరోనా వైరస్‌ను వాడుకున్నాయి. కరోనా లేకుంటే ఈ ఉద్యమాలు తీవ్రరూపం దాల్చేవి. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చేది. కానీ అలా జరగలేదు. నేతలు ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోగా, ప్రజలదృష్టిని మరల్చి పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించారు. “ప్రజల ఉద్యమాలకు వైరస్‌ శత్రువులా మారింది. మహమ్మారితో పోరాడుతున్నామన్న పేరుతో ప్రభుత్వాలు తమ నిరంకుశ చట్టాలను అమలు చేశాయి’’ అని గ్లోబల్‌ అలయన్స్‌ ఆఫ్‌ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్‌కు చెందిన జోసెఫ్‌ బెనెడిక్ట్‌ బీబీసీతో అన్నారు. “దీని అర్ధం పౌరహక్కులు, మానవహక్కులు వెనకడుగు వేశాయి’’ అని ఆయన అన్నారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు తమపై ఉన్న వ్యతిరేకతను తీవ్రంగా అణచివేశాయని,ఆఖరికి కరోనాను ఎదుర్కోవడంలో తమ వైఫల్యాలను కూడా బైటికి రాకుండా జాగ్రత్త పడ్డాయని ‘సివికస్‌’ తాజాగా విడుదల చేసిన ‘ఎటాక్‌ ఆన్‌ పీపుల్‌ పవర్‌’ అనే రిపోర్ట్‌లో పేర్కొంది. పెరిగిన నిఘాతో కఠినమైన నిబంధనల మాటున ప్రభుత్వాలు తమపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డాయని, దీంతో చాలాచోట్ల ఈ వ్యతిరేకతలు అణచివేతకు గురయ్యాయని ఈ నివేదిక తెలిపింది. కనీసం 26 దేశాలలో కఠినమైన నిబంధనలను అమలు చేశారని, మరో 16 దేశాలో మానవ హక్కుల కార్యకర్తలపై విచారణలు, అరెస్టులు, శిక్షలు జరిగాయి. కరోనా మహమ్మారికి ముందు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళనలు కొనసాగాయి కఠినమైన సందేశం ఇండియాలో సఫూరాతోపాటు పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న 83 ఏళ్ల ఓ మత ప్రచారకుడిని కూడా అరెస్టు చేశారు. దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బెయిల్‌కు వీలులేని అభియోగాలు మోపి జైల్లో పెట్టారు. ఈ అరెస్టులు అణచివేతలు వివిధ సంఘాలకు ఒక సందేశాన్నిచ్చాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఐదు సంస్థలు పేర్కొన్నాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ఆయా సంస్థలు ప్రభుత్వాలకు సూచించాయని ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ జూరిస్ట్‌కు చెందిన మైత్రేయి గుప్తా బీబీసీతో అన్నారు. అయినా అరెస్టు కొనసాగాయని, కొద్దిసంఖ్యలోనే అయినా నిరసనలు బైటికి కనిపించాయని ఆయన పేర్కొన్నారు. అరెస్టయినవారు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రకటించిన పలు ప్రభుత్వాలు, వారిని వెంటాడి వేధిస్తున్నారన్న వాదనలను ఖండిస్తూ వచ్చాయి. ఫిలిప్పీన్స్‌లో గుండె సంబంధ వ్యాధులతోపాటు ఆస్తమాతో బాధపడుతున్న తెరెసిటా నౌల్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆమెపై కిడ్నాప్‌ అభియోగాలు మోపారు. ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని అభియోగాలున్న 400 మందితో కలిపి ఆమెను మీడియా ముందు పరేడ్‌ చేయించారు పోలీసులు. ఆ 400మందిలో కూడా చాలామంది జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలే ఎక్కువ. ఇక జారా అల్వారెజ్‌, రాండాల్‌ ఎచెయిన్స్‌లాంటి కార్యకర్తలపై దాడులు చేసి చంపేశారు. ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఏబీఎస్‌-సీబీఎన్‌ ఛానెల్‌ను మూతపడేలా చేసింది. వాక్‌స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట ఫిలిప్పీన్స్‌లో ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎస్‌-సీబీఎన్‌ను బలవంతంగా మూతపడేలాగా చేయడంతో కరోనా మహ్మమ్మారి వార్తలు కూడా బయటకు రాలేదు. కానీ ప్రెసిడెంట్ రోడ్రిగో మాత్రం తన పాపులారిటీని పెంచుకున్నారు. కరోనా విషయంలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న నెపంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అనేక వెబ్‌సైట్లను మూసేయించింది. హక్కుల సంఘాలను అణచి వేయడానికి కరోనా మహమ్మారిని సర్కార్లు చాకచక్యంగా ఉపయోగించుకున్నాయని నేపాల్‌కు చెందిన హక్కుల కార్యకర్త బిద్య శ్రేష్ఠ బీబీసీతో అన్నారు. నీవర్‌ తెగకు చెందిన ఓ సంప్రదాయ నివాస ప్రాంతాన్ని తొలగించి రోడ్డు వేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా నేపాల్ ప్రభుత్వం పక్కనబెట్టిందని శ్రేష్ఠ ఆరోపించారు. థాయ్‌లాండ్‌, శ్రీలంక, వియత్నాం దేశాలలో అనేకమందిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులకు పాల్పడ్డారని, వీరందరిపైనా కరోనాపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలు మోపారని ఆయన అన్నారు. వాక్‌స్వాతంత్ర్యాన్ని హరించి వేడయానికి మయన్మార్‌ ప్రభుత్వం టెర్రరిజం అనే మాటను విస్తృతంగా వాడుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం కరోనా కారణంగా నిలిచిపోయింది. ప్రజాస్వామ్య ఉద్యమంలో ఈ ఆందోళన కీలకంగా మారింది. ఇంకా పురుడు పోసుకోవాల్సిన అనేక ఉద్యమాలు కరోనా కారణంగా పుట్టకుండానే గిట్టాయి. దక్షిణకొరియా, సింగపూర్‌, తైవాన్‌లాంటి దేశాలలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థలు కరోనాను గుర్తించడంలో సమర్ధవంతంగా పనిచేశాయని, అయితే ఇవి మహమ్మారి తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ అభిప్రాయపడింది. ఈ దేశాలో ప్రభుత్వాల నిర్బంధాలను అడ్డుకోవడానికి అనేక హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయని హక్కుల కార్యకర్త బెనెడిక్ట్ అన్నారు. థాయిలాంటి దేశాలలో రాజుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు కొనసాగిన అరెస్టులు, అణచివేతల ధోరణి మహమ్మారి తర్వాత కూడా కొనసాగవచ్చని బెనెడిక్ట్‌ అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అది ఏప్రిల్‌ 10, 2020. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న రోజులు. పౌరసత్వ చట్టంపై దిల్లీలో ఆందోళన చేస్తున్నప్పుడు సఫూరా జర్గార్‌ మూడు నెలల గర్భిణి. ఆ సమయంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. text: జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడు పెన్సిల్వేనియా ఫలితాలతో బైడెన్ విజయం ఖరారైపోయింది. ఎన్నికల్లో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఓడించారు. బైడెన్ బాటిల్ గ్రౌండ్ సేట్స్ లో కీలకమైన పెన్సిల్వేనియాలో విజయం సాధించినట్లు బీబీసీ ఓట్ల లెక్కింపు సరళిని బట్టి లెక్కవేసింది. ఈ రాష్ట్రంలో విజయంతో ఆయనకు వైట్ హౌస్ పీఠం అందుకోడానికి కావల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల కంటే ఎక్కువ వచ్చాయి. దీనిని తమ అభ్యర్థి అంగీకరించే ఆలోచన లేదని ట్రంప్ లాయర్లు అంటున్నారు. ఈ ఫలితం డోనల్డ్ ట్రంప్‌ను1990ల తర్వాత అమెరికాను ఒకే విడత పాలించిన అధ్యక్షుడిగా మార్చింది. ఓట్ల ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల నుంచి అందిన అనధికారిక సమాచారం ఆధారంగా బీబీసీ బైడెన్ విజయం సాధించినట్లు చెబుతోంది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న విస్కాన్సిన్ లాంటి రాష్ట్రాల నుంచి ఫలితాలు రావల్సి ఉంది. 1900 తర్వాత ఈ ఎన్నికలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. బైడెన్ ఇప్పటివరకూ 73 మిలియన్లకు పైగా ఓట్లు గెలుచుకున్నారు. ఇది ఒక అమెరికా అధ్యక్ష అభ్యర్థి సాధించిన అత్యధిక ఓట్లు. ట్రంప్‌కు దాదాపు 70 మిలియన్ ఓట్లు వచ్చాయి. చరిత్రలో ఇది రెండో అత్యధిక ఓట్లు. ఓట్ల కౌంటింగ్ పూర్తి కాకుండానే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించినప్పటికీ, ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆయన ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. బైడెన్ విజయం అంచుల్లోకి చేరడంతో శుక్రవారం ఆయన తరపు లాయర్లు వివిధ రాష్ట్రాల్లో కేసులు వేశారు. ఎన్నికలు అప్పుడే ముగిసిపోలేదని అన్నారు. అమెరికా అంతటా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న సమయంలో ఈ ఎన్నికల జరిగాయి. బైడెన్ అధ్యక్షుడుగా ఎన్నికైతే లాక్‌డౌన్లు, ఆర్థిక చీకట్ల కమ్ముకుంటాయని ట్రంప్ వాదించారు. ఇటు అధ్యక్షుడు ట్రంప్ కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టలేదని బైడెన్ ఆరోపించారు.బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. 78 ఏళ్ల వయసులో అమెరికాలో చరిత్రలోనే పెద్ద వయసులో అధ్యక్షుడైన నేతగా కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఇంతకు ముందు ఈ రికార్డ్ 74 ఏళ్ల డోనల్డ్ ట్రంప్ పేరునే ఉంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు ఇప్పుడేం జరుగుతుంది... ట్రంప్ ఏమంటున్నారు? సాధారణంగా ఓడిపోయిన అభ్యర్థి దీనిని అంగీకరించాలి. కానీ ట్రంప్ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తానని చెబుతున్నారు. పెన్సిల్వేనియా ఫలితాలకు స్పందనగా ఆయన లాయర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు అప్పుడే ముగియలేదు. నాలుగు రాష్ట్రాల్లో జో బైడెన్ గెలిచారనే తప్పుడు వాదనలు ముగింపుకు చాల దూరంగా ఉన్నాయి అన్నారు. జార్జియాలో రీకౌంటింగ్ జరుగుతోంది. అక్కడ మార్జిన్ చాలా టైట్‌గా ఉంది. ట్రంప్ విస్కాన్సిన్‌లో కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన సుప్రీంకోర్టులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు. ఆధారాలు లేకుండానే ఓటింగ్‌లో మోసాలు జరిగాయంటున్నారు. ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తే, రాష్ట్రాల కోర్టుల్లో దానిని సవాలు చేయడానికి న్యాయ బృందాలు అవసరం అవుతాయి. అప్పుడు, రాష్ట్ర జడ్జిలు సవాలును సమర్థించి ఓట్లు తిరిగి లెక్కించాలని ఆదేశించాల్సి ఉంటుంది. అప్పుడు తీర్పును రద్దు చేయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అడగవచ్చు. అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ గెలవాలంటూతులసెంథిరపురం వాసుల పూజలు ఇటు, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు లెక్కించడం కొనసాగుతుంది. చివరగా ధ్రువీకరించేవరకూ ఫలితాలను వెల్లడించరు. ఎన్నికల తర్వాత ప్రతి రాష్ట్రంలో కొన్ని వారాల పాటు అదే జరుగుతుంది. దీనిని కచ్చితంగా ఎలక్టోరల్ కాలేజీ నుంచి ఎన్నుకున్న 538 మంది అధికారులు(ఎలక్టోరల్స్) సమక్షంలో చేయాల్సి ఉంటుంది. అది ఎన్నికల్లో ఎవరు గెలిచారనేది అధికారికంగా నిర్ణయిస్తుంది. వారు డిసెంబర్ 14న ఓటు వేసేందుకు తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశం అవుతారు. ఎలక్టర్స్ ఓట్లు సాధారణంగా రాష్ట్రంలోని మెజారిటీ ఓట్లను ఓట్లను ప్రతిబింబిస్తాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇది అధికారికంగా అవసరం కాదు. క్యాబినెట్ మంత్రులను నిమియంచడానికి, ప్రణాళికలు రూపొందించడానికి తగిన సమయం ఇచ్చిన తర్వాత కొత్త అధ్యక్షుడు జనవరి 20న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అధికారం అందుకునేందుకు నిర్వహించే వేడుకను ఇనాగ్యురేషన్ అంటారు. ఆ వేడుకను వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ బిల్డింగ్ ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఈ వేడుక తర్వాత కొత్త అధ్యక్షుడు వైట్ హౌస్‌లోకి ప్రవేశిస్తారు. నాలుగేళ్ల కోసం పదవీబాధ్యతలను స్వీకరిస్తారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా తర్వాత అధ్యక్షుడి కోసం జరిగిన రేసులో జో బైడెన్ గెలిచారు. text: భారత్ గ్లోబల్ స్పేస్ పవర్‌గా అవతరించిందని మోదీ బుధవారం నాడు అనూహ్యంగా జాతినుద్దేశించి ప్రకటన చేశారు. దీనిపై కొన్ని మితవాద సోషల్ పేజీల్లో ప్రశంసలు కురిశాయి. మరోవైపు, ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని ఈ ప్రకటన చేశారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే కొన్ని పేజీల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. "1964 మే 27న నెహ్రూ మరణించారు. ఆ తర్వాత 1969 ఆగస్టు 15న ఇస్రో ఏర్పాటైంది" అని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో పేర్కొంటున్నారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 వీటిని సోషల్ మీడియా వేదికలపై వేల మంది చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమని మా పరిశీలనలో తేలింది. మిషన్ శక్తి ప్రయోగానికి ఉపయోగించిన ఉపగ్రహం (దీన్ని జనవరిలో ప్రయోగించారు) వాస్తవమేంటి? ఇస్రో ఏర్పాటుకు నెహ్రూ పునాది రాయి వెయ్యలేదు అనే మాట నిజం కాదు. ఇస్రో 1969లో ఏర్పాటైంది. అయితే అంతకు ముందే, అంటే నెహ్రూ మరణానికి రెండేళ్ల ముందు, 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) ఏర్పాటైంది. దీని ఏర్పాటులో అప్పటి ప్రధాని నెహ్రూ, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్‌లదే కీలక పాత్ర. ఈ పరిశోధన సంస్థ ఏర్పాటలో నెహ్రూ ప్రభుత్వం, డాక్టర్ సారాభాయ్ చేసిన కృషి గురించి ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రస్తావన ఉంది. "1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్)ని ప్రభుత్వం ఏర్పాటుచేయడం ద్వారా అంతరిక్ష రంగంలో కాలుమోపాలని భారత్ నిర్ణయించింది. భూమికి సుదూరంగా ఉన్న వాతావరణంపై పరిశోధనకు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మార్గదర్శనంలో ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్‌ తిరువనంతపురంలో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్) ను ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1969లో ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్ స్థానంలో ఇస్రో ఏర్పాటైంది" అని ఇస్రో వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆగస్టు 1969లో ఇస్రో ఏర్పాటైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు. (ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.) ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటులో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాత్ర ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. బుధవారం నాడు 'మిషన్ శక్తి' (ఏశాట్) ప్రయోగం ద్వారా ఉపగ్రహాన్ని కూల్చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత ఈ పోస్టులు ప్రచారంలోకి వచ్చాయి. text: ఈ 28 లక్షల మందిలో 55 శాతం మంది, అంటే 11.38 లక్షల మంది ఆదాయపు పన్ను కడుతున్నవారే. నిజానికి ఆదాయపు పన్ను కట్టేవారికి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించదు. అయినా, ఇంత మంది ఎలా ప్రయోజనం పొందగలిగారన్నది చర్చనీయాంశంగా మారింది. అనర్హులకు మొత్తంగా రూ.1,364 కోట్ల మేర లబ్ధి జరిగిందని సమాచార హక్కు (సహ) చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు స్పందిస్తూ కేంద్ర వ్యవయసాయశాఖ వెల్లడించింది. పథకంలో పెట్టిన అర్హత ప్రమాణాలను చేరుకోని వారు లబ్ధిదారుల్లో 44.41 శాతం మంది ఉన్నారని కూడా పేర్కొంది. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ప్రొగ్రామ్ హెడ్ వెంకటేశ్ నాయక్ ఈ సహ దరఖాస్తు చేశారు. ఆధార్ ఇచ్చినా... ఈ పథకం లబ్ధిదారులు ప్రభుత్వానికి ఆధార్ సంఖ్య తెలియజేయడం తప్పనిసరి. మరోవైపు ప్రభుత్వం దగ్గర ఆదాయపు పన్ను చెల్లించేవారి మొత్తం సమాచారం ఉంటుంది. దీంతో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారి సమాచారం తెలిసి కూడా ప్రభుత్వం ఈ పథకం కింద ప్రయోజనం ఎందుకు కల్పించిందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ‘‘ప్రభుత్వం దగ్గర పన్ను చెల్లింపుదారుల వివరాలన్నీ ఉంటాయి. ఆధార్, పాన్ కార్డు కూడా అనుసంధానమై ఉంటాయి. 2018లో ఆధార్ విషయమై సుప్రీం కోర్టు తీర్పునిస్తూ... ఆధార్ వెల్లడి ‘స్వచ్ఛందమని చెప్పింది. కానీ, ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు, సేవలు పొందడానికి మాత్రం ఇది తప్పనిసరి అని పేర్కొంది. ప్రైవేటు రంగానికి మాత్రం ఆధార్‌ను వినియోగించుకునే అనుమతి ఇవ్వలేదు’’ అని వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ చెప్పారు. ‘‘పీఎం కిసాన్ పథకం కింద వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రయోజనం దక్కుతుంది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఆదాయపు పన్ను సమాచారంతో సరిపోల్చి, అనర్హులను ప్రభుత్వం ఏరివేయడం సాధ్యమయ్యే పనే’’ అని ఆయన అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ లబ్ధిదారుల్లో రెండు రకాల వాళ్లు ఉన్నారని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఒకటి ఆదాయపు పన్ను చెల్లించేవారు. రెండు అర్హత ప్రమాణాలను అందుకోనివారు. ప్రభుత్వం చెబుతున్నదాని కన్నా, పథకంలోని అనర్హుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని వెంకటేశ్ నాయక్ అంటున్నారు. ‘‘ఇందులో సామాన్య ప్రజల కన్నా ప్రభుత్వం తప్పే ఎక్కువ. జనంలో చాలా మందికి అసలు అర్హత ప్రమాణాలు ఏంటో తెలియవు. ప్రభుత్వ అధికారులకు నియమనిబంధనలు అన్నీ తెలుసు. అయినా, వారు సరిగ్గా పనిచేయలేదు. అనర్హులు స్వయంగా డబ్బును వెనక్కిఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ, అది సాధ్యపడలేదు. మహమ్మారి సమయంలో జనం ఆదాయం కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు అనర్హులను పేర్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని ఆయన అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఐదు ఎకరాల (రెండు హెక్టార్ల) లోపు భూమి ఉన్న రైతులకు ఒక్కొక్కరికీ ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, పది వేల రూపాయలకు పైగా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. 2019లో కేంద్రం ఈ పథకం తెచ్చింది. అయితే, ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమవ్వకుండానే ఈ పథకం తీసుకువచ్చిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. 2019-20 మధ్యంతర బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ పథకం గురించి కేంద్రం ప్రకటించింది. 2018 డిసెంబర్ 1న దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ‘‘ప్రభుత్వం తొందరపాటుతో ఈ పథకం మొదలుపెట్టింది. ఎన్నికలకు ఒక నెల ముందు దీన్ని ప్రారంభించింది. దీంతో ఎవరు లబ్ధిదారులు, ఎవరు కారన్నదానిపై అధికార యంత్రాంగం పెద్దగా దృష్టి పెట్టలేదు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో అనర్హులు లబ్ధి పొందారు. ఈ పథకంలో కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు. ఇది చాలా పెద్ద లోపం. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది’’ అని వెంకటేశ్ నాయక్ అన్నారు. అయితే, కౌలు రైతులను ఈ పథకం పరిధిలోకి తేవడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. వారి సమాచారాన్ని ధ్రువీకరించుకోవడంలో ప్రభుత్వానికి అనేక చిక్కులు ఎదురవుతాయి. మోదీ ప్రభుత్వం ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన రూ.18 వేల కోట్లతో కలిపి ఇప్పటివరకూ రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1.10 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తాను సహ దరఖాస్తు చేసేటప్పటికి ఈ పథకం కింద 9-9.5 కోట్ల మంది లబ్ధిదారులున్నారని, ఇప్పుడు వారి సంఖ్య పది కోట్లు దాటిందని వెంకటేశ్ నాయక్ అన్నారు. ‘నెలవారీ డేటా విడుదల చేయాలి’ ‘‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నెలవారీ డేటా విడుదల చేయాలి. అప్పుడే పరిశోధకులు అధ్యయనం చేసి సలహాలు, సూచనలు చేసేందుకు వీలు కలుగుతుంది’’ అని సిరాజ్ హుస్సేన్ అన్నారు. మొదట్లో అనర్హులు కూడా ఈ పథకంలో చేరిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ఊరిలో ప్రజా సేవా కేంద్రాన్ని నడుపుతున్న సత్యేంద్ర చౌహాన్ అన్నారు. ‘‘మొదట్లో అందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసేవారు. పెద్దగా పరిశీలన లేకుండానే, వాటికి ఆమోదం లభించింది. అప్పట్లో వ్యవసాయ శాఖ ఒక్కటే ఈ పని చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని సరిగ్గా ఉంటేనే, వ్యవసాయ శాఖ వరకూ పత్రాలు వెళ్తున్నాయి’’ అని అన్నారు. దరఖాస్తు ఆమోదం పొందిన మూడు, నాలుగు నెలల తర్వాతే డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడతాయని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రైతులకు లబ్ధి చేకూర్చేందుకు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల్లో 28 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు ఇటీవల సమాచార హక్కు చట్టం కింద చేసిన ఓ దరఖాస్తు ద్వారా బయటపడింది. text: హైగువో చైనాలోని సిచువాన్ ప్రాంతంలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయన భారతీయ యువతి పల్లవిని వివాహం చేసుకున్నారు. ఆమె అహ్మదాబాద్‌లో చైనా భాష అనువాదకురాలిగా పని చేస్తున్నారు. వీరిద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ రెండున్నరేళ్ల వయసు ఉన్న కూతురు ఉంది. “వుహాన్లో కరోనావైరస్ మొదలైనప్పుడు చైనా అంతటా భయం నెలకొంది. అందరం ఒక రకమైన భయంలో గడిపే వాళ్ళం. పల్లవి, ఆమె తల్లి తండ్రులు నన్ను ఇండియాకి రమ్మని పిలిచారు. అప్పుడు ఇండియాలో కోవిడ్ కేసులు లేవు. నాకు భారతీయ వీసా ఉంది. అందుకు నేను నా కుటుంబం దగ్గరకు వచ్చి ఉండాలనుకుని జనవరిలో అహ్మదాబాద్ వచ్చాను” అని హైగువా చెప్పారు. ఆయనకు అలవాటైన ఆహరం అహ్మదాబాద్‌లో దొరకకపోవడం అన్నిటి కంటే పెద్ద సవాలుగా నిలిచింది. "నేను మరి కొన్ని రోజుల్లో శాకాహారిగా మారేటట్లు ఉన్నాను. ఇక్కడ చైనా మాంసాహార వంటలేవి దొరకవు. కోవిడ్-19 భయంతో మాంసాహారం దొరకడం కూడా కష్టంగా మారింది. నేను చాలా వరకు గుడ్లు తిని సరిపెట్టుకుంటున్నాను” అని హైగువా తెలిపారు. “ఆయనకు గుజరాతీ ఆహారం తినే అలవాటు లేదు. ఆయనకు రొట్టెలంటే ఇష్టమే కానీ, అదే ప్రధాన ఆహారంగా తినడానికి ఇష్టపడరు. ఆయన అహ్మదాబాద్ వచ్చిన ప్రతిసారీ ఆయన ఆహారం ఆయనే వండుకుంటారు. నేను చైనా వెళ్ళినప్పుడు ఏవో కొన్ని కాయగూరలు, పళ్లతో సరిపెట్టుకుంటాను” అని హైగువో భార్య పల్లవి చెప్పారు. ఇటీవల సరిహద్దులో చైనా, భారత్ మధ్యలో నెలకొన్న ఉద్రిక్తతలు ఈ కుటుంబం మీద కూడా ప్రభావం చూపాయి. "ఈసారి పల్లవికి, ఆంచికి శాశ్వత వీసా తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియలన్నీపూర్తి చేయాలని అనుకున్నాను. నాకు వాళ్ళని నాతో పాటే చైనాకి తీసుకుని వెళ్లిపోవాలని ఉంది" అని హైగువో చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న భారత్ - చైనా ఉద్రిక్తతల కారణంగా నా చైనా వీసా పని ఆగిపోయిందని పల్లవి చెప్పారు. “నేను డిపెండెంట్ వీసాకి దరఖాస్తు చేశాను. నేనెప్పుడు చైనాకి వెళ్లగలనో నాకు అర్ధం కావడం లేదు” అని పల్లవి అన్నారు. "ఆయన ఇంటిలోకి కావల్సిన కొన్ని నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లేవారు. ఆయనకు మాండరిన్ మాత్రమే వచ్చు. ఇంగ్లిష్ కానీ, మరే ఇతర భాష కానీ మాట్లాడలేరు. అయినా సరే, ఇంటిలోకి కావల్సిన కాయగూరలు తెచ్చేవారు. కానీ గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘటన తర్వాత ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు’’ అని ఆమె వివరించారు. తాము ఉండే సొసైటీలో ఆయన చైనా జాతీయుడు అవడం పట్ల ఏమీ అభ్యంతరాలు లేవన్నారు. కానీ, ఈ పరిస్థితుల్లో ఆయన బయటకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదని పల్లవి చెప్పారు. భారత ప్రభుత్వం చైనా అప్లికేషన్లను బహిష్కరించిన దగ్గర నుంచి ఆయన తన కుటుంబంతో మాట్లాడటం కష్టంగా మారింది. "హైగువో, నేను ఇప్పుడు అతని తల్లితండ్రులతో వి-చాట్ యాప్ ద్వారా మాట్లాడే వీలు లేదు. అంతకుముందు మేము ఆ యాప్ ద్వారా, వీడియో కాల్ ద్వారా రోజుకు నాలుగు సార్లు మాట్లాడుకునే వాళ్ళం’’ అని తెలిపారు. ‘నేను జీవిత కాలానికి అనువాదకురాలిగా మారాను’ పల్లవి వారి ప్రేమ కథను బీబీసీ గుజరాతీకి వివరించారు. "మా కుటుంబంలో మేము బౌద్ధ మతాన్ని అనుసరిస్తాం. నాకు చైనా సంస్కృతి , సంప్రదాయాలు, ప్రజల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. అందుకే నేను చైనా భాష నేర్చుకోవాలని అనుకున్నాను. గయలో 2005 లో డిగ్రీ పూర్తి చేసాక చైనా భాష నేర్చుకున్నాను. అక్కడే ఫ్రీలాన్స్ అనువాదకురాలిగా పని చేయడం ప్రారంభించాను. చైనా నుంచి భారతదేశానికి వచ్చే వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలకు ఇంగ్లిష్ కానీ, మరే భాష గానీ తెలియకపోవడంతో భాషా పరంగా సహాయం చేయడం మొదలు పెట్టాను” అని పల్లవి తెలిపారు. “2016 ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక ఐటీ సంస్థలో అనువాదకురాలిగా ఉద్యోగం మొదలుపెట్టాను. అప్పుడు నేను నెల్లూరులో ఉండేదానిని. ఆ సమయంలో హైగువో అక్కడ క్వాలిటీ ఇంజనీర్‌గా చేరారు. మొదట్లో మా ఇద్దరి సంభాషణలు వ్యాపారం, పని చుట్టూ తిరిగేవి. ఆయనకు ఎక్కువ మంది స్నేహితులు ఉండేవారు కాదు. మేమిద్దరం లంచ్ సమయంలో మా ఇష్టాయిష్టాల గురించి హాబీల గురించి గంటల తరబడి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం” అని చెప్పారు. “ఒక రోజు ఆయన నేనెలాంటి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నానని అడిగారు. నన్ను అర్ధం చేసుకోగలిగే వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాను. భారతీయ సంస్కృతి అంటే అతనికి ఇష్టమని, బౌద్ధాన్ని అనుసరించే భారతీయ మహిళను పెళ్లి చేసుకోవాలని తాను అనుకుంటున్నానని హైగువో చెప్పారు” అని పల్లవి వివరించారు. "మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించాం. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. మా మధ్య ఉన్న తారతమ్యాలు నాకు తెలుసు. నేనేమో శాఖాహారిని. ఆయన మాంసాహారం లేకుండా ఉండలేరు. కానీ మేము ఒకరి అభిరుచులను ఒకరు గౌరవించుకుంటాం” అన్నారు. ఆయన కుటుంబం వి చాట్ గ్రూప్‌లో తనను కూడా చేర్చారని చెప్పారు. ‘‘ఆయన కుటుంబంలో ఆయన తల్లి తండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా సాదరంగా ప్రేమతో ఆహ్వానించారు. ఆయనను మా బంధువులకు పరిచయం చేశాను. మా ఇంటిలో అందరూ ఆయనను ఇష్టపడ్డారు” అని చెప్పారు. “నేను హైగువోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నిర్ణయాన్ని మా నాన్నగారికి చెప్పాను. మా నాన్నగారు వెంటనే ఒప్పుకున్నారు. మా తల్లిదండ్రుల నుంచి ఎటువంటి అభ్యంతరమూ ఎదురు కాలేదు. 2016లో నిశ్చతార్థం జరిగింది. అదే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాం” అని తెలిపారు పల్లవి. "పల్లవి భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. మేం అహ్మదాబాద్‌లో పెళ్లి చేసుకున్నాం. మా కుటుంబం చైనా నుంచి వచ్చి వివాహానికి హాజరైంది. సిచువాన్‌లో రిసెప్షన్ జరిగింది” అని హైగువో పేర్కొన్నారు. పని నిమిత్తం హైగువో చైనాకి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆయన పనిలో భాగంగా వివిధ దేశాలు తిరగాల్సి ఉంటుంది. అందువలన పల్లవి అహ్మదాబాద్ లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. “మధ్యమధ్యలో వచ్చి వెళ్లేవాడిని. 2017లో మాకు పాప పుట్టింది. తనకి మేము ఆంచి అని పేరు పెట్టాం. ఆంచి అంటే శాంతి అని అర్ధం’’ అని హైగువో చెప్పారు. 2018లో చైనా కొత్త సంవత్సరం జరుపుకోవడానికి పల్లవి, ఆంచి చైనా వెళ్లి అక్కడ కుటుంబంతో గడిపారు. ఆంచి భారతీయ సంస్కృతి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలని అనుకున్నారు. ‘‘హాయిగా సాగుతున్న మా జీవితంలో కోవిడ్- 19 పెను మార్పులు తెచ్చేసింది’’ అన్నారు హైగువో. "కానీ, నేను ఆంచితో కలిసి ఇన్ని రోజులు ఉండటం ఇదే మొదటిసారి. నేనెప్పుడు చైనాకి తిరిగి వెళతానో తెలియదు. కానీ, నేను ఇంటికి వెళ్ళగానే ముందు చైనా వంటకాలు వండుకుని నా కుటుంబం, స్నేహితులతో కలిసి విందారగిస్తూ వైన్ సేవిస్తాను’’ అంటారాయన. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) “చైనాలో కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు నేను నా భార్య, కూతురితో కలిసి ఉండటానికి అహ్మదాబాద్ వచ్చేసాను. ఇప్పుడు నేనిక్కడ చిక్కుకుపోయాను. ఎప్పుడు తిరిగి చైనా వెళతానో అర్ధం కావడం లేదు. నేను నా దేశానికి తిరిగి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాను" అని చైనా జాతీయుడు హైగువో అన్నారు. text: అమెరికా వెంటనే అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్లపై యుద్ధం ప్రారంభించింది. తాలిబన్లను అధికారానికి దూరం చేసింది. కానీ 18 ఏళ్ల తర్వాత అమెరికా అదే తాలిబాన్లతో చర్చలు జరుపుతోంది. వారితో శాంతి ఒప్పందానికి దగ్గరగా వచ్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అయితే అమెరిగా విదేశాంగ విధానం ఇప్పుడు ఏ మలుపులో నిలిచిందో తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా, అమెరికా డెలావేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముక్తదర్ ఖాన్‌తో మాట్లాడారు. ముక్తదర్ ఖాన్ అభిప్రాయం ఆయన మాటల్లో... 2017లో ట్రంప్ ప్రభుత్వం తమ జాతీయ భద్రతా ప్రణాళికను కొనసాగించింది. అందులో అమెరికా విదేశాంగ విధానం తీవ్రవాదానికి వ్యతిరేకంగా 'గ్లోబల్ వార్‌' నుంచి వెనక్కు తగ్గి మళ్లీ పాత విధానం దగ్గరికే రావడం కనిపించింది. అందులో అది నాలుగు అంతర్జాతీయ ప్రమాదాలను గుర్తించింది. మొత్తం ప్రపంచం దృష్టిలో చైనా, రష్యాల నుంచి ముప్పు, స్వయంగా అమెరికాకు ఉత్తర కొరియా, ఇరాన్ అణు కార్యక్రమాల నుంచి పొంచి ఉన్న ప్రమాదం. మాట మార్చిన అమెరికా అంటే, ఇప్పుడు అమెరికా ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకునే తమ విదేశాంగ విధానం, బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. 'తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం' అనే మాటను పక్కకు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గత ఏడాదిగా సిరియా, ఇరాక్ ముఖ్యంగా అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన సేనలను వెనక్కు పిలిపించే ప్రయత్నాలు చేస్తుండడం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశాల్లో, ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ అంతమైన తర్వాత తమకు పెద్దగా ప్రమాదం లేదని అది భావిస్తోంది. అందుకే ఆయా దేశాలకు తీవ్రవాదంపై పోరాడ్డానికి అందించిన ఆర్థిక సాయంలో కూడా అమెరికా కోత పెడుతోంది. అంటే అమెరికా 'తీవ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం' అనే విధానం ఒక రకంగా ముగింపు దిశగా వెళ్తోంది. ట్రంప్ పాలనలో దాడులు తక్కువే అయితే ఒక విషయం చెప్పుకోవాలి. అధ్యక్షుడు ట్రంప్ తన వైపు నుంచి ఎలాంటి యుద్ధం ప్రారంభించలేదు. ఒబామా కూడా కొత్తగా ఏ యుద్ధం ప్రారంభించలేదు. కానీ ఆయన పాత యుద్ధాన్నే మరింత అటాకింగ్‌గా చేశారు. డ్రోన్స్ ఉపయోగించడం పెరిగింది, సామాన్యులు టార్గెట్ కావడం జరిగింది ఆయన పాలనలోనే, అంటే ఒక విధంగా ట్విటర్, ప్రకటనలతో ట్రంప్ చాలా దూకుడుగా కనిపిస్తారనే మాట నిజమే. కానీ ఆయన పాలనలో విదేశాంగ విధానం మాత్రం అంత దూకుడుగా కనిపించలేదు. కానీ ఒబామా, బుష్ పాలనలో ఉన్న దుందుడుకు విధానాన్నే ట్రంప్ కూడా కొనసాగించారు. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్‌ను అంతం చేయాలనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అమెరికా విదేశాంగ శాఖ 1990 నుంచి అంతర్జాతీయ తీవ్రవాద ఘటనలపై ఒక వార్షిక నివేదిక విడుదల చేస్తూ వస్తోంది. మనం దాన్ని చూస్తే 2000-2001 మధ్య ప్రపంచవ్యాప్తంగా 100-150 తీవ్రవాద దాడులు జరిగాయి. కానీ అమెరికా, బ్రిటన్ ఇరాక్‌పై దాడి చేసిన తర్వాత మిలిటెంట్ దాడుల సంఖ్య 2004లో 70 వేల వరకూ చేరుకుంది. వీటిలో ఎక్కువ దాడులు ఇరాక్‌లోనే జరిగాయి. తీవ్రవాదం పెరిగింది అమెరికా వల్లే అయితే ఒక విధంగా 9/11 తర్వాత అమెరికా తీసుకున్న చర్యలతో తీవ్రవాదం అంతం కావడానికి బదులు అది మరింత బలోపేతం అయ్యేలా చేసింది. ముఖ్యంగా పశ్చిమాసియా, ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్‌లో అది మరింత పెరిగింది. సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌లో ఉన్నంతవరకూ ఎప్పుడూ ఆత్మాహుతి దాడులు జరగలేదు. సద్దాం హుస్సేన్ 20 ఏళ్లు ఇరాక్‌ను అణచివేశాడు. ఎప్పుడూ సూసైడ్ అటాక్స్ జరగలేదు. అమెరికా ఈ రెండు దేశాల్లోకి అడుగుపెట్టగానే, అవి ప్రారంభమయ్యాయి. అయితే, తీవ్రవాదాన్ని బలోపేతం చేయడంలో అమెరికా పోషించిన ఆ పాత్రను ఇప్పటివరకూ అమెరికా విధాన నిర్ణేతలు ఒప్పుకోవడం లేదు. అందుకే వారి విధానాల గురించి వచ్చే అంచనాల్లో ఎప్పుడూ పొరపాట్లు జరుగుతుంటాయి. జిహాద్ కోసం సిద్ధం అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ సమయంలో సమస్యలకు కారణమైనవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ముస్లిం దేశాల్లో భద్రతగానీ, ప్రజాస్వామ్యంగానీ, ఆర్థికాభివృద్ధిగానీ లేదు. సోషల్ మీడియా వల్ల ఆ దేశాల్లో, ప్రపంచంలోని మిగతా దేశాల్లో జీవితాల మధ్య ఉన్న తేడా అందరికీ కనిపిస్తోంది. అయితే దీనివల్ల పుట్టుకొస్తున్న అసంతృప్తి, ఆగ్రహం, ద్వేషం అనేవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అంశమైనా, చైనాలో వీగర్ ముస్లింల సమస్యైనా, కశ్మీర్ గురించి రకరకాల వార్తలు వస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వాటిని చూసి తమపై వేధింపులు జరుగుతున్నాయని, తమకు ఎవరూ సాయం చేయడం లేదని అనుకుంటున్నారు. వాటిని చూసి వచ్చే కోపం, అసంతృప్తి వారిలో జిహాదీ ఆలోచనా ధోరణిని ప్రేరేపిస్తోంది. జనం ఏ కారణంతో జిహాదీ కావాలని అనుకుంటున్నారో, ఆ సమస్యలు ఇప్పటికీ తగ్గడం లేదు. కానీ, జిహాదీలతో పోరాడే సంస్థలు, దేశాల నైపుణ్యం పెరిగిందని కచ్చితంగా చెప్పచ్చు. వారికి అందే సమాచారం కూడా పెరిగింది. దానివల్ల వాళ్లు ముప్పు రాకముందే దానిని అదుపు చేయగలుగుతున్నారు. కానీ ఆ ప్రమాదాన్ని మాత్రం అంతం చేయలేకపోతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 18 ఏళ్ల క్రితం సెప్టంబర్ 11న న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. text: సభ్య సమాజంలో సాధారణంగా ఎవరూ ఇంకొకరు చావాలని అనరు. ఒకవేళ అలా అన్నారంటే వారిలో అవతలి వ్యక్తి పట్ల ఎంతో కోపం, విద్వేషం గూడుకట్టుకుని ఉండుంటుంది. అసలు ఏ కారణమూ లేకుండా, ఎవరైనా మరొకరు చావాలని ఎందుకు కోరుకుంటారు. సోషల్ మీడియా లాంటి బహిరంగ వేదికల్లో ఓ వ్యక్తి చావాలంటూ, ఆత్మహత్య చేసుకోవాలంటూ కొందరు మాట్లాడుతున్నారంటే, అలా చేసేందుకు వారికి బలమైన కారణం ఉండి ఉండాలి. కానీ, రియా చావాలంటూ కొందరు మాట్లడటానికి కారణాన్ని చూస్తే భయం కలగకమానదు. సభ్య సమాజపు పునాదులనే కదిలించే విషయం అది. నేరం రుజువు కాకుండానే కేవలం అనుమానంతో తీర్పు ఇచ్చేస్తున్నాయి కొన్ని భారతీయ టీవీ చానళ్లు. టీవీ చానళ్లు ఒకదానితో మరొకటి పోటీపడుతూ చూపిస్తున్న ఈ అత్యుత్సాహం జనాల ఆలోచించే శక్తిని దెబ్బతీస్తోంది. సమాజం ఓ రాబందుల గుంపులా తయారవుతోంది. ఇక్కడ తప్పు ఎవరిదో మీడియా, జనాలు నిర్ణయించేస్తారు. విచారణ సంస్థలు ఆ తర్వాత కొసరు పనిని చేస్తాయి. సుశాంత్ సింగ్ మరణం కేసు ‘మీడియా నేర విచారణ’కు సంబంధించి చరిత్రలో ఓ భయానక ఉదాహరణగా మిగిలిపోతుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం ఎవరినైనా ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించడం శిక్షించాల్సిన నేరం అవుతుంది. కానీ, సోషల్ మీడియాలో చట్టం, భావోద్వేగాలకు నిర్వచనాలు మారిపోతాయనుకుంటా. ఇక్కడ ఎవరూ సంయమనం పాటించరు. జవాబుదారీతనం వహించాల్సి ఉంటుందన్న భయమే ఉండదు. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయినట్లుగా, వారిలో బాధ్యత కూడా ఆఫ్ అయిపోతుంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత రియా ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో... తనపై మోపుతున్న ‘నిరాధార ఆరోపణలు’, తన గురించి పుట్టిస్తున్న ‘కట్టు కథల’తో తాను, తన కుటుంబం తీవ్ర ఒత్తిడి అనుభవిస్తున్నామని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని కూడా ఆమె వాపోయారు. ‘‘రోజురోజుకీ ఈ ‘వేధింపులు’ పెరుగుతున్నాయి. దీనికి బదులు మమ్మల్ని అందరినీ ఓ లైన్‌లో నిలబెట్టి కాల్చి చంపొచ్చుగా’’ అని ఆమె అన్నారు. సుశాంత్‌తో రియా చక్రవర్తి ఆత్మహత్య నవ్వులాటా? రియా చక్రవర్తి నేరం చేశారా? చేయలేదా? ఆమెపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందా, లేదా అనేది విచారణలో తేలుతుంది. దాన్ని బట్టే, కోర్టు కూడా దోషులకు శిక్ష నిర్ణయిస్తుంది. ఓవైపు విచారణ జరుగుతుండగానే, మరోవైపు టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా సాగిస్తున్న ‘దర్యాప్తులతో’ తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని రియా అన్నారు. ఆమె అంత ఒత్తిడిలో అన్న మాటలు కూడా కొందరికి నవ్వులాటగా మారాయి. ‘నిన్ను ఎవరు ఆపుతున్నారు?’, ‘మేం కూడా దాని గురించి వేచిచూస్తున్నాం?’, ‘ఆత్మహత్య లేఖ రాయడం మరిచిపోకు’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏమనాలి? ఇంటర్వ్యూలో రియా హావభావాల గురించి కూడా విశ్లేషణలు మొదలయ్యాయి. ‘ఆమె ఎంతో క్యాజువల్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆనవాళ్లే కనిపించడం లేదు’, ‘ఆమెలో కొంచెం కూడా బాధ లేదు’, ‘ఆమె నవ్వు ఆపుకునేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ కొందరు కామెంట్లు చేశారు. సుశాంత్ కుంగుబాటుకు గురయ్యారా, లేదా అన్నది ఆయన బయటకు ఫిట్‌గా, సంతోషంగా కనిపించిన తీరును బట్టి నిర్ణయించడం ఎలాంటిదో.... రియా కళ్లలో నీళ్లను బట్టి ఆమెలో బాధను లెక్కించడం కూడా అలాంటిదే. దుస్తులు, ముఖంలో హావభావాలు ద్వారా రియా అబద్ధాలు చెబుతోందని నిర్ణయానికి వచ్చేయొచ్చా? ఆమె చావాలని కోరుకోగలమా? ఇలాంటి విద్వేషం అసలు ఎక్కడి నుంచి వస్తోంది? దీన్ని ఎవరు పెంచుతున్నారు? సుశాంత్ సింగ్ కుంగుబాటు సమస్యతో బాధపడ్డ విషయం బయటకురాగానే ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేసినవారు, హిందీ చిత్రపరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) రాజ్యమేలుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినవారు కూడా ఇప్పుడు రక్త దాహంతో ఉన్న మూకలా మారారు. సుశాంత్, తాను ప్రేమించుకున్నామని రియా చెప్పారు. కానీ, చాలా టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియాలో పెద్ద సమూహం ఆమెను ‘బయటి మహిళ’గా చిత్రిస్తున్నారు. సుశాంత్ కుటుంబంతో సంబంధాలు దెబ్బతినడం, ఆయన బలహీనతలను బయటకు చెప్పడం వల్ల రియా జనాలకు ‘విలన్’లా కనిపిస్తున్నారు. సుశాంత్‌తో రియా ‘లివ్ ఇన్’ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు ఆమె కుటుంబం అంగీకరించడంపైనా కొందరు అభ్యంతరం చెబుతున్నారు. రియా చక్రవర్తి మరో వాదనను సహించరా? ఒక ప్రముఖ కళాకారుడు అనుమానాస్పద పరిస్థితిలో మరణించినప్పుడు, ఆ విషయంలో మీడియో సందేహాలు వ్యక్తం చేయడం, ఆ వ్యవహారంతో సంబంధమున్న అన్ని పక్షాలను బయటకు తేవడం అవసరం. కానీ, రియా చక్రవర్తిని ఇంటర్వ్యూ చేసిన ఛానెళ్లను ‘అమ్ముడుపోయినవి’, ‘అబద్ధపు ఛానెళ్లు’, ‘యాంటీ నేషనల్’ మీడియా అని కొందరు నిందిస్తున్నారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను రియా ‘బోయ్‌ఫ్రెండ్’ అని పిలుస్తున్నారు. రియాను కఠినమైన ప్రశ్నలు అడగలేదని, ఆమె వాదనను వినిపించేందుకు వేదికను ఇచ్చారని ఆరోపించారు. రెండు నెలలుగా సుశాంత్ సింగ్ జీవితంతో సంబంధమున్నవారికి, లేనివారికి రకరకాలు ఆరోపణలు చేసే వేదికగా మీడియా నిలిచింది. కానీ, ఆ ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి వాటికి సమాధానాలు ఇవ్వడం, అవి వారి ఆలోచనలకు తగ్గట్లు లేకపోవడం కొందరికి రుచించడం లేదు. గందరగోళం సృష్టించడం ద్వారా ఆమె గొంతు మూయించాలనుకుంటున్నారు. రియా ఇంటర్వ్యూలో చాలావరకూ ప్రశాంతంగానే కనిపించారు. కొన్ని సార్లు కంటతడి పెట్టుకున్నారు. కానీ, ఆమె ఇంటర్వ్యూ ఆపలేదు. తనపై చేసిన ఆరోపణలను ఆమె పూర్తిగా విన్నారు. సూటిగా వాటికి జవాబు ఇచ్చారు. రియా హావభావాలపై నాకు కలిగిన వ్యక్తిగత అభిప్రాయం ఇదే అయి ఉండొచ్చు. అలాగే, ఆమె చూపించిన సంయమనం కొందరికి అబద్ధాలు చెబుతున్నట్లుగా కనిపించవచ్చు. కానీ, రియా ఉద్వేగంగా చెప్పిన ఓ విషయాన్ని ఆమె గురించి రాస్తున్నవారు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారు అందరూ అర్థం చేసుకోవాలి. ‘‘రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? కనీసం పారదర్శక విచారణైనా నాకు ఉండదా?’’ అని ఆమె అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తి ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ప్రసారమైన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై దాడి విపరీతంగా పెరిగింది. కొందరు ఆమె ‘చావాలంటూ’ శాపనార్థాలు కూడా పెట్టారు. text: విద్యుత్ ద్వారా నీటి నుంచి వేరు చేసిన హైడ్రోజన్‌ తిని బతికే బాక్టీరియా మట్టి నుంచి దీనిని ఉత్పత్తి చేశారు. సౌరశక్తి, గాలి మరల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసినపుడు, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు జీరో ఉండేలా ఆహారాన్ని కూడా ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వారి కలలు నిజమైతే, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోడానికి ఇది ప్రపంచానికి సాయం అందిస్తుంది. నేను గత ఏడాది హెల్సింకీ శివార్లలో ఉన్న సోలార్ ఫుడ్ పైలెట్ ప్లాంటుకు వెళ్లినపుడు, పరిశోధకులు ఆ ప్రొటీన్ తయారీకి నిధులు సమీకరిస్తున్నారు. ప్రస్తుతం వాళ్లు దాదాపు 5.5 మిలియన్ యూరోల(రూ.4 కోట్ల 35 లక్షలు)పెట్టుబడులు ఆకర్షించారు. విద్యుత్ ధరను బట్టి దశాబ్దం చివరికల్లా, అంటే 2025 కల్లా తమ ఉత్పత్తి ధరను సోయా బీన్ ధరకు సమానంగా ఉంటుందని చెబుతున్నారు. రుచిలో లోపం నేను 'సోలీన్' అనే చాలా విలువైన ప్రొటీన్ గింజలను కొన్ని రుచిచూశాను. దానికి ఎలాంటి రుచి లేదు. శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నది అదే. వాళ్లు దానిని అన్ని రకాల ఆహారానికి తటస్థ సంకలితంలా ఉండాలని అనుకుంటున్నారు. ఇది పైస్, ఐస్ క్రీమ్, బిస్కట్లు, పాస్తా, నూడుల్స్, సాస్‌, బ్రెడ్‌లా బలం అందిస్తుందా అని నేను వారిని అడిగాను. దానిని కల్చర్డ్ మాంసం, చేపలను పెంచడానికి కూడా మాధ్యమంలా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది చిత్తడి భూముల్లో సాగుచేసిన సోయాను పశువులు తినకుండా వాటికి పోషకాలు అందించి కాపాడగలదు. వారి ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగినా, ప్రపంచ అవసరాలను తీరేలా వారు ఈ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయాలంటే, చాలా ఏళ్లు పట్టేలా కనిపిస్తోంది. కానీ భవిష్యత్తులో సంశ్లేష ఆహారం(synthesised food) తయారీ కోసం చూస్తున్న ఎన్నో సంస్థల్లో ఇది కూడా ఒకటి. బ్రిటన్‌లోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీలో చదివిన పాసి వైనిక్కా ఈ సంస్థకు సీఈఓగా ఉన్నారు. అంతరిక్ష యుగం ఆలోచన ఈ టెక్నాలజీ వెనుక నిజానికి, 1960లో అంతరిక్ష రంగంలో అభివృద్ధి చేసిన సాంకేతికత ఉందని ఆయన నాకు చెప్పారు. తను ప్రదర్శించే మొక్కను కొన్ని నెలల క్రితం నుంచీ పెంచుతున్నానని, అది 2022 నాటికి సిద్ధం అవుతుందని ఆయన చెప్పారు. పూర్తి పెట్టుబడులపై 2023లో నిర్ణయం వస్తుందని, అంతా తాము అనుకున్నట్టే జరిగితే 2025లో ప్రొటీన్ ఉత్పత్తికి మొదటి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని అన్నారు. "మేం ఇప్పటివరకూ చాలా బాగా చేశాం. మేం మొదటి ఫ్యాక్టరీ పెట్టగానే, దానికి రియాక్టర్లను జోడించి(ప్రొటీన్‌ను పులియబెట్టడానికి) గాలి, సౌరశక్తి లాంటి ఇతర స్వచ్ఛమైన సాంకేతికల్లాగే దానిలో కూడా అద్భుతమైన సవరణలు తీసుకొస్తాం. 2025 ప్రారంభంలో మేం సోయాతో పోటీపడే అవకాశం ఉందని అనుకుంటున్నాం" అన్నారు. సొలీన్ తయారీకి నీటిని విడగొట్టి హైడ్రోజన్ తయారు చేయడానికి ఎలక్ట్రోలిసిస్ ఉయోగిస్తున్నారు. గాలిలోని హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఖనిజాలను బాక్టీరియా తినేలా చేస్తారు. అది తర్వాత ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. "ఇందులో అత్యంత ముఖ్యమైనది విద్యుత్ ధరే. మరిన్ని పునరుత్పాదక శక్తులు వచ్చేకొద్దీ, ఈ ధర పడిపోతుందని మా సంస్థ భావిస్తోంది" అన్నారు. ఈ అసాధారణ సాంకేతికత పురోగతిని పర్యావరణ ప్రచారకులు, 'అపాకలిప్స్ కౌ' అనే టీవీ డాక్యుమెంటరీ తీసిన జార్జ్ మాంబియాట్ ప్రశంసించారు. భవిష్యత్తుపై ఆశలు మాంబియాట్ సాధారణంగా ప్రపంచం భవిష్యత్తు గురించి నిరాశావాదంతో ఉన్నారు. కానీ సోలార్ ఫుడ్స్ తనలో ఆశలు కల్పించినట్లు చెప్పారు. "ఆహార ఉత్పత్తి మనం నివసిస్తున్న ప్రపంచాన్ని రెండుగా చీల్చేస్తోంది. చేపలుపట్టడం, వ్యవసాయం ఎప్పటినుంచో ఉన్నాయి. ఎన్నో వన్యప్రాణులు అంతరించిపోవడానికి, జీవవైవిధ్యం నాశనం కావడానికి అది ఒక పెద్ద కారణం. వాతావరణ మార్పులకు వ్యవసాయం ఒక ప్రధాన కారణం" అన్నారు. కానీ ఆ ఆశలు ఆవిరైపోతున్నట్లు కనిపిస్తున్న సమయంలో 'వ్యవసాయ రహిత ఆహారం' ప్రజలను, భూమిని కాపాడడానికి అద్భుతమైన అవకాశాలు సృష్టిస్తోంది. తాత్కాలికంగా మొక్కల ఆధారిత ఆహారం వైపు ప్రజలను మళ్లించడం ద్వారా ఎన్నో జాతులను, ప్రాంతాలను కాపాడ్డానికి సమయం ఆదా చేయడానికి మేం సాయం చేయగలం. "కానీ 'వ్యవసాయ రహిత ఆహారం' కనిపించని చోట ఇది ఆశలు రేకెత్తిస్తోంది. మేం త్వరలోనే భూమిని నాశనం చేయకుండా ప్రపంచంలో ఉన్నవారి కడుపు నింపుతాం" అని ఆయన చెప్పారు. "సాంకేతికత అంతరాయం వల్ల ఏర్పడే చాలా సమస్యలను అంచనా వేసే రీథింక్ ఎక్స్ అనే సంస్థ పరిశోధకులు "కచ్చితత్వంతో పులియబెట్టడం వల్ల ఏర్పడే ప్రొటీన్లు 2035 నాటికి జంతువుల నుంచి అందే మాంసకృత్తుల కంటే 10 రెట్లు చౌకగా లభిస్తాయి" అన్నారు. ఫలితంగా పశువుల పెంపకం పరిశ్రమ దాదాపు కుప్పకూలే దశకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మాంసం ఉత్పత్తిదారులు తమ పశువులకు కొత్త ప్రొటీన్లు అందించే సామర్థ్యాన్ని ఇది అడ్డుకోలేదని విమర్శకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆహార పంటలకు సంబంధించి ఏర్పడే పర్యావరణ మార్పులను అరికట్టేందుకు కొత్తరకం పరిష్కారాలు గుర్తించడానికి, ఒక శాస్త్రీయ పరిశోధనకు నేతృత్వం వహించడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేశారు. "భూమిని ఉపయోగించే విషయానికి వస్తే సూక్ష్మజీవుల నుంచి పొందే ప్రొటీన్, సోయా కంటే మరింత సమర్థంగా ఉంటుంది" అని గత ఏడాది ఒక పత్రిక చెప్పింది. అయినా ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇప్పటికీ చాలా మంది మాంసంలా కనిపించే వాటి కంటే, అసలైన మాంసాన్నే తినాలని కోరుకుంటున్నారు. "కొత్తరకం ఆహారం గురించి పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతోంది" అని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ లియాన్ టెర్రీ బీబీసీకి చెప్పారు. "సింథటిక్ ఆహారం చుట్టూ వేగంగా పెట్టుబడులు పెడుతున్నారు. కానీ వాటిని తినాలని నిజంగా ఆకలి వేస్తుందా?" అని ఆయన అడిగారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు 'పలచటి గాలి' నుంచి ఒక ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దశాబ్దం లోపు ఇది సోయా ధరలతో పోటీపడుతుందని చెబుతున్నారు. text: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో సహజ వనరుల విభాగం జారీ చేసిన సూచన ఇది. ఈ భయంకరమైన చేపకు సంబంధించి జారీ చేసిన 15వ హెచ్చరిక ఇది. నార్తర్న్ స్నేక్‌హెడ్ చేప (చనా ఆర్గస్) మన దేశంలో లభ్యమయ్యే కొరమీను జాతికి చెందిన చేప. ఇది పొడవుగా సన్నగా ఉంటుంది. కానీ దీని తల చిత్రంగా బల్లపరుపుగా ఉంటుంది. దీనికి ఆకలి ఎక్కువ. ఇతర జీవులను వేటాడి తింటుంది. ఏటా 10,000 గుడ్లు వేరే చేపలు, కప్పలు, పీతలు తమ దగ్గర్లో ఏదున్నా ఈ స్నేక్‌హెడ్ చేపలు వేటాడి తినేస్తాయి. ఇవి దాదాపు 80 సెంటీమీటర్ల వరకూ పొడవు పెరుగుతాయి. నీటి వెలుపల కూడా శ్వాస తీసుకోవటమే కాదు.. 'నడవగలిగే' సామర్థ్యం కూడా వీటికి ఉంది. ఈ సామర్థ్యంతో ఇవి ఒక నీటి ఆవాసం నుంచి వేరొక నీటి ఆవాసానికి సులభంగా వెళ్లిపోతుంటాయి. ఈ స్నేక్‌హెడ్ ఫిష్ ఎక్కడికైనా ఒకసారి వచ్చిందంటే దానితో పోరాడటం చాలా కష్టం. ఆడ చేపలు ఏటా 10,000 గుడ్ల వరకూ పెడతాయి. ప్రమాదవశాత్తూ దండెత్తాయా? నిజానికి ఈ స్నేక్‌హెడ్ చేపలు చైనా, రష్యా, కొరియా ద్వీపకల్పాల్లో ఉంటాయి. దాదాపు దశాబ్దం కిందట ఈ చేప మొదటిసారి అమెరికాలో కనిపించింది. ఇప్పటివరకూ నాలుగు జాతుల స్నేక్‌హెడ్ చేపలను అమెరికాలో గుర్తించారు. ఈ స్నేక్‌హెడ్ చేపలను ఇంట్లో పెంచుకోవటానికి తీసుకువచ్చిన వారు.. ఉద్దేశపూర్వకంగా వాటిని జలమార్గాల్లో వదిలిపెట్టటం వల్ల వీటి దండయాత్ర మొదలైందని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్తున్నారు. ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జీనియా, కాలిఫోర్నియా, మసాచుసెట్స్, మేరీల్యాండ్ తదితర రాష్ట్రాల్లోనూ ప్రకృతి సహజసిద్ధమైన ప్రాంతాల్లో ఈ స్నేక్‌హెడ్స్ కనిపించాయి. మొదట మేరీల్యాండ్ రాష్ట్రంలో 2002లో దీనిని గుర్తించారు. అయితే అప్పుడు పిల్లచేపలు కనిపించటంతో ప్రకృతిలో ఈ చేపలు పునరుత్పత్తి చేయగలుగుతున్నాయని వెల్లడైంది. దీంతో ఆందోళన పెరిగింది. ప్రజల సాయం జార్జియా రాష్ట్రంలో తొలిసారి ఒక స్నేక్‌హెడ్‌ చేపను పట్టుకున్నట్లు నిర్ధారించిన తర్వాత.. అక్టోబర్ 8వ తేదీన అధికారులు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఈ చేప నీటి వెలుపల కూడా బతకగలదని గుర్తుంచుకోవాలని ప్రజలకు సహజ వనరుల శాఖ సూచించింది. ఈ చేపను పట్టుకున్నపుడు దాని ఫొటో తీయటంతో పాటు.. దానిని ఎక్కడ పట్టుకున్నారనే వివరాలూ నమోదు చేయాలని నిర్దేశించింది. ''ఇది పెద్ద ప్రయత్నమే. కానీ ఇవి దొరికిన ప్రాంతాల్లో గాలించటం ద్వారా వీటిని పట్టుకుని.. వీటి సంఖ్య పెరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాం'' అని జార్జియా సహజ వనరుల శాఖ ఫిషింగ్ ఆపరేషన్స్ మేనేజర్ స్కాట్ రాబిన్సన్ పేర్కొన్నారు. నీరు లేకుండా ఎలా బతుకుతాయి? ఈ స్నేక్‌హెడ్ చేప నీరు లేని నేల మీద బతకటానికి ఉపయోగించే వ్యవస్థ గురించి బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఎవల్యూషనరీ ఎకాలజీ అండ్ ఆక్విటిక్ బయాలజీ ప్రొఫెసర్‌ మార్టిన్ జెన్నర్ బీబీసీకి వివరించారు. ''ఈ చేపలు ఆసియాలోని సహజ ఆవాసాల్లో.. వరి మడులు, అటవీ బురద ప్రాంతాలు వంటి ఆక్సిజన్ తక్కువగా ఉండే బురద ప్రదేశాలను ఆవాసంగా చేసుకుంటాయి'' అని ఆయన తెలిపారు. ''ఆ ప్రాంతాల్లో నివసించే చేపలు మనుగడ సాగించటానికి వివిధ రకాలుగా పరిణమించాయి. ప్రాథమికంగా.. ఆ వాతావరణాల్లో తాము పీల్చుకునే ఆక్సిజన్‌ను గరిష్ఠంగా పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి'' అని పేర్కొన్నారు. అదనపు గాలి గది ఈ జాతి చేపలు తమ మొప్పల కింద ఒక గాలి గదిని అభివృద్ధి చేసుకున్నాయని.. దానిని సుప్రాబ్రాంచియల్ చాంబర్‌గా పిలుస్తారని జెన్నర్ చెప్తున్నారు. సాధారణంగా చేపలు తమ మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఆక్సిజన్ ఆ మొప్పల నుంచే లోపలికి వెళ్లి బయటకు వస్తుంది. ఇటువంటి చేపలు ఎక్కడికైనా వెళ్లటానికి వీలుగా నీటి ఉపరితలం వరకూ వెళ్లగలవు. మళ్లీ నీటిలోపలికి మునిగి ఆక్సిజన్ తీసుకుంటాయి. స్నేక్‌హెడ్స్ విషయంలో ఈ ప్రక్రియలోనే మార్పు వచ్చింది. ''కానీ స్నేక్‌హెడ్స్. నీటి ఉపరితలం మీదకు వెళ్లి గాలిని గుటకవేసి.. దానిని గాలిలో గదిలో నింపుకుని.. మళ్లీ నీటి అడుగుకు వెళ్లి గాలి గదిలోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకోగలవు'' అని జెన్నర్ వివరించారు. నేల మీద పాకటం స్నేక్‌హెడ్స్‌కు నీటి వెలుపల శ్వాస తీసుకోగల సామర్థ్యం.. అవి నేల మీద చిన్నపాటి వలస వెళ్లటానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఉష్ణమండల దేశాల్లో బురద ప్రాంతాలు తరచుగా ఎండిపోతుంటాయి. కాబట్టి నీటి వెలుపల శ్వాస తీసుకునే సామర్థ్యం ఈ చేపలు మరొక చోటుకు వలస వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ''స్నేక్‌హెడ్స్‌ నేల మీద నడవ గలిగే సామర్థ్యం సంతరించుకుంటూ పరిణామం చెందాయి. అవి చాలా మొరటుగా ఆ పనిచేస్తాయి. తమ పక్షాలను ఉపయోగిస్తూ పాకుతాయి. ఇవి నేల మీద గాలిని మింగటం ద్వారా శ్వాసించగలవు కనుక.. నీటి వెలుపల ఇలా కొంత కాల పరిమితి వరకూ మనుగడ సాగించగలవు'' అని తెలిపారు జెన్నర్. అయితే.. నీటి వెలుపల శ్వాసించగల చేపల జాతి స్నేక్‌హెడ్స్ ఒక్కటే కాదని ఆయన చెప్పారు. ''భూమి మీది ఆక్సిజన్‌ను ఉపయోగించుకోగల చేపలు జాతులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు క్యాట్‌ఫిష్‌లోనూ సుప్రాబ్రాంచియల్ చాంబర్లు (అదనపు గాలి గదులు) ఉన్నాయి'' అని వివరించారు. ఇక నీటి వెలుపల శ్వాసించగల మరొక చేప జాతి లంగ్‌ఫిష్‌లో మనుషుల తరహాలోనే ఊపిరితిత్తులు ఉన్నాయి. ''ఆ ఊపిరితిత్తులు శ్వాస పీల్చటం వదలటం చేయవు. కానీ.. అవి గాలిని నింపుకొని ఆక్సిజన్ తక్కువగా ఉన్న పర్యావరణంలో ఉపయోగించుకోగలవు'' అని తెలిపారు. గోరమీ అనే మరొక జాతి చేపల్లో ఊపిరితిత్తుల వంటి అవయవం ఉంది. అది పాక్షికంగా ఊపిరితిత్తి లాగా పనిచేస్తూ గాలి పీల్చుకోవటానికి వీలుకల్పిస్తుంది. క్లైంబింగ్ గోరమీ చేప కూడా నేల మీద కొద్ది దూరం కదలగలదు. క్యాట్‌ఫిష్ వంటి పలు ఇతర జాతుల చేపలు కూడా నీటివెలుపల శ్వాసించగలవు బలమైన పోటీ స్నేక్‌హెడ్స్ కనిపించిన జలాల్లోకి వెళ్లి వచ్చిన వారిని.. ''ఆ నీటితో తడిసిన ప్రతిదాన్నీ.. దుస్తులు, కుక్కలు, పరికరాలు, బోట్లు వంటివాటినన్నిటినీ శుభ్రంచేసి ఎండబెట్టాల''ని జార్జియా అధికారులు ప్రజలకు సూచించటం వెనుక కారణం.. జాతి మనుగడ కోసం స్నేక్‌హెడ్స్ చాలా తీవ్రంగా ప్రయత్నించటమే. ఈ జాతి చేపల భీకర ఆకలి వల్ల.. ఇతర జాతులకు ఆహార లభ్యత మీద కూడా తీవ్ర ప్రభావం చూపగలదు. నీటి లోపల తక్కువ ఆక్సిజన్‌తోనే మనుగడ సాగించగల సామర్థ్యం వల్ల.. జీవించటానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమైన ట్రౌట్, బాస్ వంటి ఇతర జాతుల చేపల మీద స్నేక్‌హెడ్స్‌కు పైచేయి లభిస్తుంది. అందువల్లే ఈ చేప జాతులు భీతిగొలిపే ఖ్యాతి గడించాయి. వీటి మీద ప్రత్యేకంగా నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ కూడా రూపొందింది. ఆ డాక్యుమెంటరీకి ''ఫిష్‌జిల్లా'' అని టైటిల్ పెట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''నార్తర్న్ స్నేక్‌హెడ్ చేప దొరికితే దానిని వదిలిపెట్టకండి. తక్షణం దానిని చంపేసి ఫ్రీజ్ చేయండి. గుర్తుంచుకోండి.. అది నేల మీద కూడా బతకగలదు.'' text: మోసుల్‌లో హతులైన భారతీయుల కుటుంబ సభ్యులు డీఎన్ఏలను సరిపోల్చడం ద్వారా శవాలను గుర్తించినట్టు ఆమె తెలిపారు. జాడలేకుండా పోయిన 39 మంది భారతీయులెవరూ ప్రాణాలతో మిగలలేదని సుష్మ రాజ్యసభలో ప్రకటించారు. వీరందరినీ తీవ్రవాద సంస్థ ఐసిస్ హత్య చేసిందని ఆమె తెలిపారు. 40వ వ్యక్తి తనను తాను ముస్లింగా చెప్పుకొని తప్పించుకున్నాడని ఆమె అన్నారు. తప్పించుకున్న వ్యక్తి పేరు హర్జీత్ మసీహ్. ఈ భారతీయులందరూ ఉపాధి కోసం అక్కడికి వెళ్లినవారే. హర్జీత్ మసీహ్ 2015లోనే వెల్లడించిన హర్జీత్ మసీహ్ వీరిలో 31 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా, నలుగురు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారు. మిగిలిన వారు బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారు. హతులైన వారందరూ తారిఖ్ నూర్ అల్ హుదా కంపెనీలో పని చేస్తుండేవారు. తప్పించుకున్న హర్జీత్ మహీస్ పంజాబ్‌కు చేరుకొని, "అపహరించిన భారతీయులందరినీ ఐసిస్ మిలిటెంట్లు కాల్చి చంపారు" అని తెలిపారు. 2015లో ఆయనీ విషయం ప్రకటించగా, మంత్రి సుష్మ నాడు ఆయన చెప్పిన విషయాలు తప్పు అని తోసిపుచ్చారు. హతులైన భారతీయుల కుటుంబ సభ్యులు నిరుడు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అసలేం జరిగింది? మోసుల్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు 2014లో మొత్తం 80 మందిని అపహరించారు. వారిలో 40 మంది భారతీయులు కాగా, మరో నలభై మంది బంగ్లాదేశీయులు. అపహరణ జరిగినప్పటి నుంచి భారత ప్రభుత్వం పలు మార్లు వారు హత్యకు గురయ్యారన్న విషయాన్ని ఖండిస్తూ వచ్చింది. జాడలేకుండా పోయిన భారతీయుల కుటుంబ సభ్యులు 2017లో సుష్మను కలిశారు. విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా ఆ భేటీ సందర్భంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇరాక్‌కు వెళ్లారు కూడా. మోసుల్ విషాదం ఇరాక్‌లోని రెండో అతి పెద్ద పట్టణమైన మోసుల్‌ను 2014లో తమను తాము ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకునే మిలిటెంట్ సంస్థ ఆక్రమించుకుంది. దానిని తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం కోసం ఇరాక్ సైన్యానికి చెందిన వేల మంది సైనికులు, కుర్ద్ పెష్‌మర్గా మిలిటెంట్లు, సున్నీ అరబ్ తెగలు, షియా తిరుగుబాటుదారులు అంతా కలిసి ఐసిస్‌తో పోరాడారు. అమెరికా వైమానిక దళం కూడా వారి పోరాటానికి అండగా నిలిచింది. మిలిటెంట్లు ఆ పట్టణంలోని ప్రముఖ మార్గాలన్నింట్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలను దూరం నుంచే గమనించడానికి వీలుండేలా పలు భవంతులను నేలమట్టం చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత, మోసుల్‌ను ఐసిస్ పట్టులోంచి విడిపించినట్టుగా ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్-అబాదీ 2017లో ప్రకటించారు. మోసుల్‌పై యుద్ధం ప్రభావం యుద్ధం ఫలితంగా మోసుల్‌ పట్టణానికి చాలా నష్టం వాటిల్లింది. లక్షల మంది ప్రాణభయంతో పట్టణం వదిలి పారిపోయారు. మిలిటెంట్లు పట్టణాన్ని ధ్వంసం చేశారు. భవనాలు, మసీదులను, వంతెనలను కూల్చివేశారు. యుద్ధంలో భాగంగా జరిగిన వైమానిక దాడుల్లో పట్టణం అంతా శిథిలమైంది. వందల మంది శిథిలాల కింద చాలా రోజుల పాటు చిక్కుకుపోయారు. కొందరిని సైనికులు బయటకు తీసి రక్షించారు. మరి కొందరు శిథిలాల కిందే ప్రాణాలు కోల్పోయారు. పట్టణం పునర్నిర్మాణానికి బిలియన్ డాలర్లు అవసరం మోసుల్ పట్టణంలో మౌలిక సదుపాయాలను మళ్లీ అభివృద్ధి చేయాలంటే ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 6,521 కోట్లు) అవసరమని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సేవలతోపాటు పాఠశాలలు, ఆసుపత్రులను మళ్లీ నిర్మించాలంటే ఇందుకు రెట్టింపు ఖర్చు అవుతుందని అంచనా. మోసుల్ నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలు నివాసాలను వదిలి వెళ్లిపోయారని అంతర్జాతీయ శరణార్థుల సంస్థ తెలిపింది. వీరిలో చాలా మంది సమీపంలోని శిబిరాల్లో తలదాచుకున్నారు. మిగిలిన వారు స్నేహితులు, బంధువుల వద్ద ఉండేందుకు వెళ్లిపోయారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇరాక్‌లో 2014లో అపహరణకు గురైన 40 మంది భారతీయుల్లో 39 మంది హతులైనట్టు మంగళవారం విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. text: ఝాన్సీ రైల్వే యార్డులో ఆ రైలును శుభ్రం చేస్తున్న సమయంలో కడుగుతున్నవారికి బోగీలోని టాయిలెట్‌లో ఒక కుళ్లిన శవం కనిపించింది. పరిశీలించిన తర్వాత ఆ శవం మోహన్‌లాల్‌ది అని తెలిసింది. ఇలాంటి విషాదం ఒక్క మోహన్‌లాల్‌ విషయంలోనే జరగలేదు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఎందుకు చనిపోయారు. మోహన్‌లాల్ మరణం లాగే ఈ ప్రశ్న కూడా ఒక రహస్యంలాగే మిగిలిపోయింది. ఝాన్సీలోని రైల్వే పోలీస్ డీఎస్పీ నయీమ్ ఖాన్ మన్సూరీ బీబీసీతో “పోస్టుమార్టం రిపోర్టులో బయట ఎలాంటి గాయాలూ కనిపించలేదని చెప్పారు. శరీరం లోపలి అవయవాలను పరీక్షల కోసం పంపించాం. వాటి రిపోర్టు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు చనిపోయారనేది తెలుస్తుంది” అన్నారు. మోహన్‌లాల్ ప్రయాణించిన శ్రామిక స్పెషల్ రైలు, షెడ్యూల్ ప్రకారం రైలు తర్వాత రోజు గోరఖ్‌పూర్ చేరుకోవాల్సి ఉంది. అదే రోజు అది అక్కడినుంచి తిరిగి బయల్దేరాలి. కానీ రెండు రోజుల ప్రయాణం నాలుగు రోజులు పట్టింది. ఇది మాత్రమే కాదు చాల శ్రామిక్ రైళ్లు తమ నిర్ధారిత గమ్యం చేరుకోడానికి చాలా రోజులపాటు ప్రయాణిస్తున్నాయి. చాలాసార్లు అవి దారి కూడా తప్పుతున్నాయి. అయితే రైల్వే మాత్రం అది దారితప్పడం కాదు, ‘డైవర్షన్’ అని చెబుతోంది. రైల్వే ఏం చెప్పింది? మోహన్‌లాల్ శర్మ శవం నాలుగు రోజుల వరకూ రైలు టాయిలెట్లోనే ఉంది. అన్ని రోజులైనా ఎవరికీ ఆ విషయం తెలీలేదు. మోహన్‌లాల్ దగ్గర 23వ తేదీ టికెట్ దొరికింది. కానీ ఆయన ఇదే రైల్లో వెళ్లారా, లేక వేరే ఏదైనా రైల్లో వెళ్లారా అనేది తెలీడం లేదని ఉత్తరమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అజిత్ కుమార్ సింగ్ చెప్పారు. “మా జిల్లా యంత్రాగం, పోలీసులకు దీని గురించి సమాచారం ఇచ్చాం. ఆ బాడీని హాండోవర్ చేశాం. ఆ తర్వాత పోస్టుమార్టం చేయించడం నుంచి మొత్తం వారే చూసుకున్నారు. ఆయన ఇక్కడివరకూ ఎలా వచ్చారు, ఇదే రైల్లో వెళ్లారా, లేక వేరే రైల్లో వెళ్లారా అనేది ధ్రువీకరించలేకపోయాం. రైల్లో ఆయన మృతదేహం ఉన్న టాయిలెట్ లోపల నుంచి గడియ పెట్టుంది” అని చెప్పారు. “పోస్టుమార్టం రిపోర్టులో మోహన్‌లాల్ దాదాపు నాలుగు రోజుల క్రితం, అంటే మే 24న చనిపోయినట్లు తెలిసింది. శవం దగ్గర నుంచి ఆయన ఆధార్ కార్డ్, కొన్ని సామాన్లు, 27 వేల రూపాయల డబ్బు కూడా దొరికింది” అని డీఎస్పీ నయీం ఖాన్ మన్సూరీ చెప్పారు. మోహన్‌లాల్ శర్మ భార్య పూజ బీబీసీతో “23న మేం రైల్లో కూర్చున్నాం అని ఆయన ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ అయ్యింది. మేం మాట్లాడలేకపోయాం. 28న ఝాన్సీలో ఆయన శవం దొరికిందని ఫోన్ వచ్చింది. తర్వాత మేం అక్కడికి వెళ్లాం” అన్నారు. మోహన్‌లాల్ శర్మ కుటుంబంలో భార్య, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వారి పెద్ద కొడుకు వయసు పదేళ్లు. అందరికంటే చిన్నదైన కూతురి వయసు 5 ఏళ్లు. మోహన్‌లాల్ ముంబయిలో ఒక ప్రైవేట్ కారు నడిపేవారు. లాక్‌డౌన్ సమయంలో లక్షల మంది కార్మికులు సొంత ఊళ్లకు బయల్దేరడంతో ఆయన కూడా అదే పరిస్థితుల్లో ముంబయి నుంచి తన ఇంటికి వస్తున్నారు. “ఝాన్సీలో పోలీసులే ఆయన అంత్యక్రియలు చేశారు. తర్వాత మేం ఇంటికి వచ్చేశాం. ఎవరూ కనీసం అడగడానికి కూడా రాలేదు. మాకు ఎలాంటి సాయం కూడా అందలేదు” అని ఆయన భార్య పూజ ఏడుస్తూ చెప్పారు. గమ్యం చేరుకునేలోపే మరణాలు శ్రామిక్ స్పెషల్ రైళ్లలో కొందరు వలస కూలీల మరణానికి, వారు అంతకు ముందే అనారోగ్యానికి గురవడమే కారణం అని చెబుతున్నారు. వారి ప్రయాణాల కోసం మెరుగైన ఏర్పాట్లు చేశామని రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్నో వాదనలు వినిపిస్తోంది. కానీ శ్రామిక రైళ్లలో ప్రయాణం గురించి అక్కడక్కడా యాత్రికుల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహం వాటిపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. యూపీలో మే 25 నుంచి మే 27 వరకూ 9 మంది కార్మికులు శ్రామిక్ స్పెషల్ రైళ్లలో చనిపోయారు. దేశవ్యాప్తంగా మే 9 నుంచి మే 27 వరకూ ఇలా చనిపోయినవారి సంఖ్య 80 మందికి చేరింది. రైల్వే శాఖ ఈ గణాంకాలను ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. కానీ, రైల్వే భద్రతకు బాధ్యత వహించిన రైల్వే భద్రతా బలగాలు అంటే ఆర్పీఎఫ్ నుంచి ఈ గణాంకాలు సేకరించాం. చనిపోయినవారిలో ఈ కార్మికుల్లో ఎక్కువమంది యూపీ, బిహార్‌కు చెందినవారే ఉన్నారు. రాజస్థాన్‌ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న శ్రామిక్ స్పెషల్ రైల్లో ఆదివారం ఒక కార్మికుడు ముగల్‌సరాయ్ దగ్గర చనిపోయాడు. అతడితోపాటూ వెళ్తున్న వారు 8 గంటల పాటు ఆ శవంతోనే ప్రయాణించారు. “అతడు కరోనా వల్ల చనిపోయాడేమో అని రైల్లో ఉన్న వారందరూ భయంతో వణికిపోయారని, అది పోలీసులకు చెబితే తమ ప్రయాణం కూడా ఎక్కడ ఆలస్యం అవుతుందో అని అతడు చనిపోయిన విషయం ఎవరూ పోలీసులకు చెప్పలేదు” అని వారిలోని ఒక ప్రయాణికుడు తెలిపారు. వారితోనే ఉన్న మరో ప్రయాణికుడు సూరజ్ దాస్ “మాకు చాలా కష్టపడ్డాక రైలు టికెట్ దొరికింది. అందుకే మాతో ఉన్న వ్యక్తి చనిపోయినా ఆ శవంతోనే ప్రయాణించాం. ఉన్నాం. మాల్దా చేరుకోగానే రైల్వే పోలీసులకు చెప్పాం” అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తరప్రదేశ్‌లో బస్తీ జిల్లావాసి మోహన్‌లాల్ శర్మ మే 23న ఝాన్సీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే శ్రామిక్ స్పెషల్ రైల్లో కూర్చున్నారు. ఆ రైలు గోరఖ్‌పూర్ వెళ్లి నాలుగు రోజుల తర్వాత తిరిగి ఝాన్సీ వచ్చింది. కానీ మోహన్‌లాల్ మాత్రం ఇల్లు చేరలేదు. text: 75వ వార్షిక సమావేశాల్లో శుక్రవారం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వర్చువల్‌గా ప్రసంగించారు. జమ్మూ-కశ్మీర్ వివాదం, మైనారిటీల వ్యవహారం, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మాట్లాడారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, సైనికులను మోహరించడం లాంటి విషయాలపై ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలపై భారత ప్రతినిధి రైట్ టు రిప్లై కింద స్పందిస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని, మైనారిటీలతో సహా ఇతర వర్గాల ముస్లింలను హింసిస్తోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో శనివారం నాడు మోదీ ప్రసంగించనున్నారు. ‘‘జమ్ము-కశ్మీర్ సమస్యను పరిష్కరించాలి’’ కశ్మీర్ సమస్య గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ "అంతర్జాతీయ చట్టసమ్మతి ప్రకారం జమ్మూ కశ్మీర్ సమస్య పరిష్కారం కానంతవరకూ దక్షిణ ఆసియాలో శాంతిభద్రతలు నెలకొనడం అసాధ్యమని, భద్రతా మండలి జోక్యం చేసుకుని ఈ సంఘర్షణను నిరోధించాలని" తెలిపారు. "ఫాసిస్ట్, నిరంకుశ, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దురాక్రమణకు పాల్పడితే, మా దేశం ఎదురుతిరిగి, స్వాతంత్ర్యం కోసం తుది వరకూ పోరాడుతూనే ఉంటుంది" అని అన్నారు. వీటితోపాటూ గత ఏడాది లేవనెత్తిన అంశాలు.. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అక్రమ ఆర్థిక రవాణాలు, వాతావరణ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇస్లామోఫోబియా తదితర అంశాల గురించి కూడా పాక్ ప్రధాని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, నాజీల నుంచి ప్రేపణ పొందిందన్నారు. నాజీలు యూదులను ద్వేషిస్తే, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు ముస్లింలను, కొంత మేరకు క్రిస్టియన్లను ద్వేషిస్తున్నారని, గాంధీ, నెహ్రూ కలలు కన్న లౌకికవాద దేశానికి బదులు హిందూ దేశాన్ని తయారుచేస్తున్నారని విమర్శించారు. 2002 గుజరాత్ అల్లర్ల గురించి కూడా ఇమ్రాన్ ప్రస్తావించారు. నితంత్రణ రేఖ వద్ద భారత్ కవ్వింపు చర్యలు చేపట్టినప్పటికీ పాకిస్తాన్ సంయమనంతో వ్యవహరిస్తోందని, శాంతియుత పరిష్కారం కోసం పాకిస్తాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగానికి ఐక్యరాజ్యసమితిలో ఇండియా మిషన్ ప్రథమ కార్యదర్శి (ఫస్ట్ సెక్రటరీ) మిజితో వినితో బదులిచ్చారు మత మైనారిటీలను హింసిస్తున్నారు: భారత్ ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంలోని అంశాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. పాకిస్తాన్ దౌత్యపరంగా మరింత కిందకి దిగజారిందని విమర్శించారు. ‘‘ఇదంతా తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దాడి, యుద్ధానికి ఉసిగొల్పడం, మైనారిటీలని హింసించడం, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని సంరక్షించడానికి చేస్తున్న ప్రయత్నం’’ అని ప్రత్యారోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని ప్రారంభించగానే ఐక్యరాజ్యసమితిలో ఇండియా మిషన్ ప్రథమ కార్యదర్శి (ఫస్ట్ సెక్రటరీ) మిజితో వినితో సభ నుంచి వాకౌట్ చేశారు. భారతదేశం తరఫున మిజితో వినితో మాట్లాడుతూ "జమ్మూకశ్మీర్ భూభాగం భారతదేశంలో అంతర్భాగం. అక్కడి చట్టాలు, విధానాలు భారత అంతర్గత వ్యవహారాలు. కశ్మీర్‌లో ఉన్న ఒకే ఒక్క సమస్య పాకిస్తాన్ దురాక్రమణ. అక్కడ అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నిటినీ పాకిస్తాన్ విడిచిపెట్టాలని కోరుతున్నాం" అని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశం పాకిస్తాన్ అని.. ఒసామా బిన్ లాడెన్‌ను అమర వీరుడు అని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో కొనియాడారని ఆయన తప్పుపట్టారు. "ఇప్పటికి తమ దేశంలో 30 నుంచీ 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని గత ఏడాది అమెరికాలో అంగీకరించారు. దైవదూషణ చట్టం, మత మార్పిడుల ద్వారా తమ దేశంలోని మైనారిటీలైన హిందూ, క్రైస్తవ, సిక్కు మతస్థులను క్రమపద్ధతిలో నాశనం చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని ఇతర ముస్లిం సంప్రదాయాలు పాటించేవారిని కూడా హింసిస్తున్నారు" అని ఆరోపించారు. "తమ గురించి చెప్పుకోడానికి ఏమీ లేని, ప్రపంచానికి విజయాలు, సూచనలు అందించలేని వ్యక్తి మాటలు విన్నాం. అబద్ధాలు, తప్పుడు సూచనలు, ద్వేషాన్ని చూశాం" అని వ్యాఖ్యానించారు. "పాకిస్తాన్ మామూలు దేశంగా మారాలంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేసి, తమ దేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలి. ఐక్యరాజ్య సమితి వేదికగా తప్పుడు ప్రచారాలు ఆపివేయాలి" అని మిజితో వినితో సూచించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత్ - పాకిస్తాన్‌ల మధ్య జమ్ము-కశ్మీర్, ఉగ్రవాద సమస్యలపై మరోసారి వివాదం చెలరేగింది. text: ప్రస్తుతం ముషరఫ్ పాకిస్తాన్‌లో లేరు. ఆయన దుబాయిలో వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ముషరఫ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక వీడియో విడుదల చేశారు. విచారణ కమిటీ తన వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని చూడాలని ఆయన ఆ వీడియోలో కోరారు. రాజ్యాంగ అవహేళన, తీవ్ర దేశద్రోహం కేసులపై మాట్లాడిన ఆయన "ఈ కేసు పూర్తిగా నిరాధారమైనది. దేశద్రోహం విషయం పక్కనపెట్టండి, నేను ఈ దేశానికి ఎంతో సేవలు అందించాను. యుద్ధంలో పోరాడాను. పదేళ్లు దేశానికి సేవ చేశాను" అని అన్నారు. పాకిస్తాన్ చరిత్రలో రాజ్యాంగ అవహేళన కేసులో విచారణను ఎదుర్కొన్న, మరణశిక్ష పడిన మొట్టమొదటి సైనిక నియంత ముషరఫ్. జస్టిస్ వకార్ సేఠ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌లో ఇద్దరు మరణశిక్ష వేయాలనగా, ఒకరు మాత్రం విభేదించారు. ఈ కేసు విచారణలో ముషరఫ్ ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి ముషరఫ్‌కు నెల రోజుల సమయం ఉంటుంది. అయితే, ఇందుకోసం ఆయన కోర్టుకు స్వయంగా రావాల్సి ఉంటుంది. నిజానికి, 2013 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మాజీ అధ్యక్షుడు అయిన పర్వేజ్ ముషరఫ్‌పై రాజ్యాంగాన్ని అవమానించారనే కేసు నమోదైంది. ఈ మాజీ సైన్యాధ్యక్షుడికి వ్యతిరేకంగా మరో తీవ్ర దేశద్రోహం కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టుకు నలుగురు చీఫ్‌ జస్టిస్‌లను మార్చారు. నిందితుడు పర్వేజ్ ముషరఫ్ తనపై ఆరోపణలు నమోదైనప్పుడు ఒక్కసారి మాత్రమే ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదు. ఈలోపు, 2016 మార్చిలో అనారోగ్య కారణాలు చూపించి ముషరఫ్ విదేశాలకు వెళ్లారు. అప్పుడు అధికారంలో ఉన్న ముస్లిం లీగ్(నూన్) ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌ నుంచి ఆయన పేరును తొలగించింది. ఆ తర్వాత ఆయన దేశం వదిలి వెళ్లడానికి అనుమతించింది. వీడియో చిత్రం ముషరఫ్ ఉత్థాన పతనాలు జనరల్ పర్వేజ్ ముషరఫ్ 1999 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటుతో పాకిస్తాన్‌లో అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. 2001 జూన్‌లో ముషరఫ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు తనను తాను అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు. 2002 ఏప్రిల్‌లో ఒక వివాదాస్పద జనాభిప్రాయ సేకరణ ద్వారా ముషరఫ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడుగా కొనాసాగారు. 2007 అక్టోబర్-నవంబర్‌లో ఆయన మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆయన ఎన్నికలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత ముషరఫ్ దేశంలో అత్యవసర స్థితి విధించారు. చీఫ్ జస్టిస్ జస్టిస్ ఇఫ్తికార్ చౌధరి స్థానంలో కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించారు. ఆయన ముషరఫ్ ఎన్నికకు ఆమోదముద్ర వేశారు. 2008 ఆగస్టులో ముషరఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు తనకు వ్యతిరేకంగా మహాభియోగ తీర్మానం తీసుకురావాలని ఏకాభిప్రాయానికి రావడంతో పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్‌కు తీవ్ర దేశద్రోహం కేసులో ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి చెందిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక బెంచ్ మరణశిక్ష విధించింది. text: హ్వాంగ్ క్యో-అహ్న్ తన మద్దతుదారులు, పాత్రికేయుల సమక్షంలో సోమవారం సాయంత్రం ఆయన ఈ పని చేశారు. గతవారం మరో ఇద్దరు మహిళా ఎంపీలు కూడా ఇలాగే గుండు కొట్టించుకున్నారు. దేశ న్యాయ మంత్రి పదవిలో చో కుక్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ తమ నిరసనను వారు ఈ రూపంలో తెలియజేశారు. చో కుక్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హ్వాంగ్ క్యో-అహ్న్ సహా గుండు కొట్టించుకున్న ఆ ఇద్దరు ఎంపీలది లబర్టీ కొరియా పార్టీ. చో కుక్ రాజీనామా చేయాలని, లేదంటే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు దేనికి? చో కుక్ గతంలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూనే జే ఇన్‌ కేబినెట్‌లో సీనియర్ సెక్రటరీగానూ సేవలందించారు. చో కుక్ భార్య కూడా ప్రొఫెసరే. తమ కుమార్తెకు యూనివర్సిటీలో అడ్మిషన్, స్కాలర్‌షిప్‌లు లభించేలా ఫోర్జరీకి పాల్పడ్డట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో మిగతా విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వారి కుటుంబంపై కొన్ని ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు కూడా వచ్చాయి. ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇటీవల కొన్ని చోట్ల సోదాలు కూడా జరిపాయి. తమ కుమార్తెకు లబ్ధి చేకూర్చిన చర్యల విషయంపై మాట్లాడుతూ.. యువతరానికి తాను క్షమాపణలు చెబుతున్నానని చో గత శుక్రవారం చెప్పారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నానని వివరించారు. చో చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడ్డట్లు రుజువు కాలేదని, కేవలం ఆరోపణలు వచ్చాయన్న కారణంతో నియామకాన్ని ఆపడం సరికాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూనే జే ఇన్‌ అన్నారు. రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలు కొన్నేళ్లుగా దక్షిణ కొరియాను కుదిపేస్తున్నాయి. ఇదివరకు పార్క్ గ్వెన్-హై నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి అభియోగాలతోనే కూలిపోయింది. లంచం తీసుకున్నట్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఇప్పుడామె జైలు జీవితం అనుభవిస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత హ్వాంగ్ క్యో-అహ్న్.. పార్క్ హయాంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. మూన్ జే ఇన్ ప్రతిష్ఠను మసకబార్చేందుకే హ్వాంగ్ గుండు గీయించుకుంటూ నాటకమాడుతున్నారని అధికార పార్టీ సమర్థకులు అంటున్నారు. ఒక విషయం పట్ల తమ నిబద్ధత చాటుకోవడానికి దక్షిణ కొరియన్లు ఇలా గుండు కొట్టించుకుంటారు ఎప్పటినుంచో ఈ సంప్రదాయం నిరసన చర్యగా గుండు కొట్టించుకునే సంప్రదాయం దక్షిణ కొరియాలో చాలా కాలంగా ఉంది. దీనికి మూలాలు కన్ఫూషియన్ బోధనల్లో ఉన్నాయి. ఒక విషయం పట్ల తమ నిబద్ధత చాటుకోవడానికి దక్షిణ కొరియన్లు ఇలా గుండు కొట్టించుకుంటారు. 1960ల్లో, 70ల్లో దక్షిణ కొరియా సైనిక నియంతృత్వ పాలనలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు గుండ్లు చేయించుకుని తమ వ్యతిరేకతను చాటుకునేవారు. ఆ తర్వాత కూడా దాన్నో నిరసన తెలిపే మార్గంలా ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటూ వస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బయట ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు హ్వాంగ్ క్యో-అహ్న్ గుండు కొట్టించుకున్నారు. text: ఈ వంతెన వద్ద సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. యమునా నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి... దిల్లీలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల మధ్య ట్రాఫిక్‌ సమస్యను తీర్చడంతో పాటు సందర్శకులకూ కనువిందు చేయనుంది. 8 వరుసల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు. వంతెన విశేషాలు దీన్ని భారత్‌లోనే మొదటి అసమాన కేబుల్ వంతెనగా చెబుతున్నారు. దీని కోసం దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు. 154 మీటర్ల (505 అడుగులు) ఎత్తున్న ఈ వంతెన శిఖరం మీదకు వెళ్లి చుట్టూ దిల్లీ నగరం అందాలను వీక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకోసం ఆ శిఖరం మీద అద్దాల గది ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఒకేసారి 50 మంది వరకూ ఉండొచ్చు. అంత ఎత్తుకు వెళ్లేందుకు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ లిఫ్టులను మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. సందర్శకుల కోసం ఈ వంతెన వద్ద సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మించాలని 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2010 కామన్వెల్త్ క్రీడలకు ముందే దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, అది ఎనిమిదేళ్లు ఆలస్యంగా ఇన్నాళ్లకు పూర్తయ్యింది. దీని కోసం దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు. 572 మీటర్ల పొడవున్న ఈ ఎనిమిది వరుసల వంతెన వల్ల దిల్లీలోని వజీరాబాద్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌ మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాలకు పైగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సిగ్నేచర్ వంతెనను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి రానుంది. text: ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల లభ్యత పెరిగడానికి ఆయనే కారణం. మూత్రపిండాల దానం మిగతా అవయవాల దానం కంటే భిన్నమైనది. శరీరంలో రెండు మూత్రపిండాలు ఉన్నప్పటికీ ఒక్క మూత్రపిండంతోనూ హాయిగా బతికే అవకాశం ఉండడంతో బతికి ఉన్నవారూ ఒక మూత్రపిండాన్ని దానం చేయొచ్చు. మూత్రపిండం అవసరమైన రోగులకు కుటుంబసభ్యులు, బంధువులలో ఎవరైనా దానమిచ్చేందుకు ముందుకొచ్చినా అది ఆ రోగికి నప్పని పరిస్థితి ఉండొచ్చు. ప్రొఫెసర్ ఆల్విన్ రోత్ కానీ, ప్రొఫెసర్ ఆల్విన్ దాతలు, గ్రహీతలతో నెట్‌వర్క్ ఏర్పాటుచేసిన తరువాత ఇలాంటి పరిస్థితులు మారిపోయాయి. ఈ నెట్‌వర్క్‌లో కిడ్నీలు సరిపోలని దాత-గ్రహీతల జోడీలు ఉంటాయి. ఈ నెట్‌వర్క్‌లోని దాత-గ్రహీతల జోడీలు బదిలీ చేసుకోవడం వల్ల కిడ్నీలు సరిపోలే దాత-గ్రహీతల కొత్త జోడీలు కుదురుతాయి. ఈ క్రమంలో కిడ్నీలు సరిపోలడం ప్రాతిపదికగా కొత్త దాత-గ్రహీతలు ఏర్పడతాయి. అప్పుడు ఎక్కువ మంది రోగులకు మూత్రపిండాలు లభ్యమవుతాయి. ప్రపంచంలో ఇరాన్ మినహా మిగతా దేశాల్లో మూత్రపిండాలు విక్రయించడం చట్టవిరుద్ధం. ప్రజల్లో ఎవరైనా రకరకాల కారణాల వల్ల తమ అవయవాలను డబ్బుకోసం విక్రయించుకునే ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు అన్ని దేశాల్లో అవయవాలు అమ్ముకోవడం చట్టవిరుద్ధం. ''ప్రపంచంలో దాదాపు ఎక్కడా ఇలాంటి కిడ్నీ మార్పిడి విధానంలో ధరలకు ప్రమేయం లేకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం'' అని ప్రొఫెసర్ ఆల్విన్ చెప్పారు. ఈ విధానం వల్ల అమెరికాలో ఏటా వెయ్యి మంది గ్రహీతలు తమకు నప్పే కిడ్నీలున్న దాతలను గుర్తించగలుగుతున్నారని చెప్పారాయన. 2012లో ప్రొఫెసర్ ఆల్విన్ రోత్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది జర్మన్ ఎక్స్చేంజ్ ఆరోగ్య సేవల రంగం భవిష్యత్తుపై చర్చించేందుకు కొందరు నోబెల్ ప్రైజ్ విజేతలు, ఇతర దిగ్గజాలు బెర్లిన్‌లో సమావేశమైనప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఆల్విన్‌ను కలిశాం. ''మూత్రపిండాల మార్పిడికి సంబంధించిన అధికారిక నియమనిబంధనలను ప్రతి మార్కెట్‌(దేశం)లో ఎప్పటికప్పుడు సమీక్షించాల''న్నారాయన. జర్మనీలో దీనిపై నిషేధం ఉండడానికి గల కారణాలను తాను అర్థం చేసుకోగలనని.. మూత్రపిండాల అక్రమ రవాణా జరగొచ్చన్న ఆందోళనలతో అక్కడ నిషేధం విధించారని ప్రొఫెసర్ ఆల్విన్ అన్నారు. మూత్రపిండాలు అమ్ముకుంటున్నారా? భవిష్యత్తులో ప్రజలు మూత్రపిండాలు దానం చేసినందుకు ప్రతిఫలం పొందే మార్గాన్నీ యోచిస్తున్నారు. అధికాదాయ దేశాల్లోని గ్రహీతలకు అల్పాదాయ దేశాల దాతల నుంచి కిడ్నీలు అందించి అందుకు వైద్య ఖర్చులు చెల్లించే ఒక పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యతిరేకించింది. 'అధికారిక నిబంధనల అడ్డంకి వల్ల రోగులు చనిపోతే అది సిగ్గుచేటు'' అని ఇలాంటి కార్యక్రమానికి మద్దతు పలుకుతున్న ప్రొఫెసర్ ఆల్విన్ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మూత్రపిండాల మార్పిడి అవసరమైన రోగులకు దాతలు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా దొరుకుతున్నారు. ఇందుకు కారణం.. నోబెల్ బహుమతి పొందిన ఆల్విన్ రోత్ అనే ఆర్థికవేత్త. text: అదే సమయంలో ఆమె కోడలు తమ రెండు గదుల పూరిగుడిసెలో ఒక మూలన పడుకుని ఉన్నారు. ఈ సెప్టెంబరులో కరెంట్ షాక్‌తో లంకా బాయి కొడుకు సంతోష్ చనిపోయారు. "నా కొడుకు ఆవులను మేతకు తోల్కపోయాడు. ఆ రోజు వాన పడుతోంది. నేలంతా తడిసింది. అతడు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లగానే షాక్ కొట్టింది. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. మా ఊరోళ్లు దావఖానకు తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కించారు. వాన బాగా పడుతుండడంతో వాగులో నీళ్లు ఎక్కువయ్యాయి. నా బిడ్డను బతికించుకునేందుకు శానా కష్టపడ్డాం. కానీ, ఆ వాగును దాటలేకపోయాం. దాంతో దారిలోనే నా కొడుకు చనిపోయాడు" అని చెప్పింది ఆ తల్లి. 'మా ఊరికి రావద్దు... మేం ఎవరికీ వోటు వెయ్యం' ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుడిబి గ్రామస్తులకు ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. తాము ఇలాంటి వాటికి అలవాటు పడిపోయామని చెప్పారు గ్రామానికి చెందిన ఒక పెద్దమనిషి. మండల కేంద్రమైన కరణ్ జీత్‌లో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ గ్రామస్తులు రెండు వాగులు దాటాలి. ఒక వాగులో ఏడాది పొడవునా నీళ్లుంటాయి. "ఆ వాగు దాకా వెళ్లడానికే చాలా కష్టం. మట్టి, రాళ్లతో నిండిన దారిలో ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాలి. వాగు దాటిన తర్వాత మరో 12 కిలోమీటర్లు మట్టిదారినే వెళ్లాలి" అని స్థానికుడు గంగన్న వివరించారు. అంతలో మాటల్లోకి వచ్చిన ఒక అమ్మాయి మరో విషయం చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లయింది. కానీ భర్తతో కలిసి ఒక్కసారి కూడా సినిమాకు వెళ్లలేదు. కారణం, వాగు దాటి తడి బట్టలతో థియేటర్‌కి వెళ్లలేక. తాము కనీసం సినిమా టాకీసును కూడా చూడలేదని ఈ ఊరి వాసులు చెప్పారు. రోడ్డు కోసం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను వేడుకుంటున్నా ఒక్క అధికారి వచ్చి సర్వే చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిబి ఒక్కటే కాదు, టేకడి రాంపూర్, కొజ్జంగూడ గ్రామాలది కూడా ఇదే పరిస్థితి. మండల కేంద్రం కరణ్ జీత్‌కి వెళ్లాలంటే వీళ్లంతా వాగులు దాటాల్సిందే. గుడిబి చివరన ఉండడంతో వారు ఎక్కువ దూరం ప్రయాణించాలి. "మా ఊరు మహారాష్ట్ర సరిహద్దులో చివరన ఉంది. అవతలి వైపు పెన్ గంగ నది, ఇవతలివైపు రాళ్లు, మట్టి, వాగులతో నిండిన రోడ్డు. వానా కాలంలో మా పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎంత కష్టమొచ్చినా మా చావు మేమే చావాలి" అని చెప్పారు గయా బాయి. ఈ మూడు ఊళ్లలో మొత్తం జనాభా 392 కాగా, వారిలో 272 మంది ఎస్టీలు. ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదన్న విషయాన్ని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. 'రవాణా సౌకర్యం లేని ఆవాసాల' జాబితాలో ఈ గ్రామాలున్నాయని చెప్పారు. ఇలాంటి గ్రామాల్లో క్రమంగా ఒక దాని తర్వాత ఒక ఊరికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య చెప్పారు. ఇక్కడ 85 ఆవాస ప్రాంతాల్లో ఇంకా రోడ్లు లేవని జిల్లా అధికారులు తెలిపారు. బీబీసీ న్యూస్ తెలుగు ఇందులో కొన్ని ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేసింది. నార్నూర్ మండలంలోని గిరిజన గ్రామం ఉమ్రికి వెళ్లింది. ఇక్కడ రాథోడ్ రామ్ అనే పత్తి రైతు ఉన్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. అక్టోబర్ మొదటి వారంలో ఆయన భార్య పురుగుల మందు తాగారు. పత్తి పంట దెబ్బతినడం, అప్పుల భారం పెరగడంతో తట్టుకోలేక ఆమె ఆలా చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తన భార్యను బతికించుకునేందుకు రాథోడ్ రామ్ అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ, రోడ్డు సౌకర్యం లేని కారణంగా, భార్యను భుజాన మోస్తూ వాగు దాటి వెళ్లేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. అక్కడే ఉన్న ఒక పెద్దాయన మాట్లాడుతూ, "ఎన్నో ఏళ్ల క్రితం మా ఊరికి బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ, రెండేళ్ల నుంచి పనులు ఆగి పోయాయి. మేము మండలం ఆఫీసుకి, బ్యాంకుకి, దావఖానకు... దేనికి పోవాలన్నా గతుకుల మట్టి రోడ్డు మీద, వాగులు దాటి, మళ్లీ గతుకుల మట్టి బాటలో వెళ్లాల్సిందే. మా ప్రాణాలు వాగులోనే పోతున్నాయి. మాకు జ్వరాలు లాంటివి రాకూడదని కోరుకుంటున్నాం" అని అన్నారు. ఈ బ్రిడ్జి అసలు కథ ఏంటన్నది తెలుసుకునేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులను అడిగే ప్రయత్నం చేసింది బీబీసీ న్యూస్ తెలుగు. ఏఈ, కె. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, "ఆ వంతెన నిర్మాణాన్ని ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మాట వాస్తవమే. కానీ మధ్యలో కాంట్రాక్టర్‌తో ఇబ్బందులు రావటంతో పనులు నిలిపివేయాల్సి వచ్చింది. మరోసారి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. 2019 మార్చి 31 నాటికి పూర్తవుతుంది" అని చెప్పారు. గ్రామస్థులు మాత్రం ఈ వంతెన మీద ప్రయాణం చేసే వరకూ నమ్మకం లేదంటున్నారు. మరికొంత దూరంలో ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామస్థులు కూడా రోడ్డు, తాగు నీటి కోసం ఇంకా ఎదురు చూస్తున్నామని చెప్పారు. "మొత్తం దేశమంతా ఎక్కడికో వెళ్ళిపోతోంది. ప్రపంచమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే, మేం మాత్రం ఇంకా రోడ్డు కోసం, నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం" అని 31 ఏళ్ల నవనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. ఇక్కడి యువకులంతా ఆ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. "మాలో చాలామందికి మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఓటుకు ఉండే విలువేంటో మాకు తెలుసు. ఒక్క ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. కానీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా మా సమస్యలు తీరడం లేదు. ఎన్నోఏళ్లుగా మా తాతలు, తండ్రులు ఓటు వేస్తూనే ఉన్నారు. అయినా, మా ఊరి కష్టాలు తీరలేదు. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం" అని 26 ఏళ్ల కిశోర్ అన్నారు. అయితే, ఇదే ఊరిలో పెద్దలు ఈ ఆలోచనకు ఒప్పుకున్నప్పటికీ యువకులతో పూర్తిగా ఏకీభవించట్లేదు. "రేపు ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము ఓట్లు వేయలేదని మమ్మల్ని మొత్తానికే పట్టించుకోవడం మానేస్తే?" అన్న ఆందోళన వ్యక్తం చేశారు తులసి రామ్. జల్దా ఊరు ఒక్కటే కాదు, బోథ్ నియోజకవర్గంలోని గుబిడి, ఉమ్రి వంటి ఇంకా కొన్ని గ్రామాల్లోనూ ఈ ఎన్నికలను బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గుబిడి గ్రామస్థులు ఊరు బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. "మా ఊరిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. కాబట్టి, రాజకీయ నాయకులెవరూ మా గ్రామంలో అడుగుపెట్టేందుకు వీల్లేదు" అని ఆ ఫ్లెక్సీల మీద రాశారు. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. "బిడ్డల మీద ఆధారపడి బతికే వయసు నాది. కానీ, ఇప్పుడు నేనే నా కొడుకు భార్యా పిల్లలను చూసుకోవాల్సి వస్తోంది. నా కొడుకుకు కరెంటు షాక్ తగిలింది. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం వల్ల చనిపోయాడు" అంటూ తన రెండేళ్ల మనవడికి తినిపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది లంకా బాయి. text: కరోనావైరస్‌ను నియంత్రించటానికి తొలుత మార్చి 25న లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ దేశంలో అన్ని రవాణా సదుపాయాలతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. మే 18వ తేదీ నుంచి నాలుగో విడత లాక్‌డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ విమాన సర్వీసులు మొదలు కాలేదు. ఈ సర్వీసులను మే 25వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి బుధవారం ట్విటర్‌లో తెలిపారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 సర్వీసులను పున:ప్రారంభించటానికి సంసిద్ధం కావాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమనయాన సంస్థలకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల కదలికలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణా పద్ధతులు (ఎస్ఓపీల) వేరుగా జారీ చేస్తామన్నారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు క్రమంగా పున:ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. text: 18వ శతాబ్దం చివరి కాలంలో దక్షిణాదిలో బ్రిటిష్ రాజ్‌ను ఎదిరించి పోరాడారు టిప్పు. 1799లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను ఓడించి, హతమార్చిన తర్వాతే మైసూర్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోగలిగారు వలస పాలకులు. టిప్పు మరణం తర్వాత ఆయన సంపదనంతా బ్రిటిషర్లు దోచుకున్నారు. అందులో కొంత భాగాన్ని నజరానాల రూపంలో బ్రిటన్‌కు తరలించారు. అలాంటి వందలాది విలువైన బహుమతుల్ని బ్రిటన్‌లోని వేల్స్‌లో గల పోయిస్ కాసిల్‌లో ఇప్పటికీ చూడొచ్చు. మధ్యయుగాల నాటి ఈ 13వ శతాబ్దపు కోటను బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ సందర్శించారు. ఈ అద్భుత భవనానికీ, టిప్పు సుల్తాన్‌తోనూ, భారత్‌తోనూ ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మైసూర్ సింహంగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌ను... అత్యంత ప్రముఖులైన భారతీయ పాలకుల్లో ఒకరిగా గుర్తిస్తారు. text: ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో అత్యాచారాలు, వేధింపుల కేసును విచారణ చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ శర్మను తమ అనుమతి లేకుండా బదిలీచేయడం, ఆ కేసు విచారణ నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ, కోర్టు ముగిసే వరకూ తమ అధీనంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. "ఈరోజు కోర్టు ముగిసేవరకూ వెళ్లి ఓ పక్కన కూర్చోండి, వారం రోజుల్లో జరిమానా సొమ్మును చెల్లించండి" అని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అంతకుముందు, కోర్టు ఆదేశాలతో నాగేశ్వరరావు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యారు. సీబీఐ తరపున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను కోర్టుకు అందించడంతోపాటు వారి తరపున క్షమాపణలు చెప్పారు. ప్రమోషన్ ద్వారా ఉన్నత స్థానానికి పంపించే ఉద్దేశంతోనే అరుణ్ కుమార్ శర్మను బదిలీ చేశారని, ఓ సీనియర్ అధికారిగా ఆ స్థానంలో ఉంటూ కూడా ఆయన ఈ కేసు విచారణను పర్యవేక్షించవచ్చని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంలో బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాదని కోర్టుకు స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణ కింద ఆయనపై చర్య తీసుకోవచ్చా అని కోర్టు వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేని, వారిని క్షమించాలని ధర్మాసనాన్ని వేణుగోపాల్ కోరారు. కోర్టు ఏదైనా చర్య తీసుకుంటే.. 32 సంవత్సరాల వారి ఉద్యోగ జీవితంలో ఇదో మచ్చలా మిగిలిపోతుందని, వారి క్షమాపణలను అంగీకరించాలని ఆయన కోర్టుకు తెలిపారు. కోర్టులకు ఉన్న ఔన్నత్యాన్ని, విలువను, గౌరవాన్ని కాపాడాలని, ధిక్కరించకూడదని సీజేఐ సూచించారు. గత సంవత్సరం అక్టోబర్ 23న అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను తప్పించిన కేంద్ర ప్రభుత్వం, నాగేశ్వరరావుకు తాత్కాలిక డైరెక్టరుగా బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత జనవరి 8, 9 తేదీల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అలోక్ వర్మ తిరిగి సీబీఐ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ప్రబుత్వం మళ్లీ ఆయనను బదిలీ చేసి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. ఈ సమయంలో నాగేశ్వరరావు చేసిన బదిలీలపై కోర్టు ధిక్కారం కింద సుప్రీం కోర్టు చర్యలకు ఉపక్రమించింది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు, సీబీఐ లీగల్ అడ్వైజరుకు సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఆయనకు ఈ జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. text: క్యాంపస్ బయట మరో గుంపు జాతీయవాద నినాదాలు చేస్తూ, జర్నలిస్టులను, అంబులెన్సులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడింది. ఈ హింసలో దాదాపు 40 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడ్డ గుంపులో ప్రధానంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి చెందినవారు, బయటివారు ఉన్నారని ప్రత్యక్షసాక్షులు, వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందినవారు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. జేఎన్‌యూలో హింస జరిగిన కొద్ది సేపటికే దాడికి పాల్పడింది ఏబీవీపీనేనని జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. జేఎన్‌యూఎస్‌యూ నాయకురాలు ఆయిషీ ఘోష్ కూడా ఈ హింసలో గాయపడ్డవారిలో ఉన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలే ఈ దాడికి పాల్పడ్డాయని ఏబీవీపీ అంటోంది. ఈ హింస వ్యవహారంపై ఇండియా టుడే టీవీ చానెల్ ఒక 'స్టింగ్ ఆపరేషన్' వీడియో టెలికాస్ట్ చేసింది. జేఎన్‌యూలో చదువుకుంటున్న అక్షత్ అవస్థీ ఈ దాడిలో తన పాత్ర ఉన్నట్లు అంగీకరించారని, ఏబీవీపీలో తాను సభ్యుడినని వెల్లడించారని కథనం ప్రసారం చేసింది. ఏబీవీపీ నేపథ్యమేంటి? ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం తమదేనని ఏబీవీపీ చెబుతోంది. హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు అనుబంధ విద్యార్థి సంఘంగా 1949లో ఇది ఏర్పాటైంది. బీజేపీతో తమకు అనుబంధం లేదని ఏబీవీపీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్‌గా పిలుస్తుంటారు. ఈ సంఘ్ పరివార్‌లో బీజేపీ, ఏబీవీపీ కూడా భాగం. ఏబీవీపీ సహకారం బీజేపీకి ఎంతగానో ఉపయోగపడిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఏబీవీపీ నుంచి వచ్చిన చాలా మంది ఆ పార్టీలో పెద్ద నాయకులుగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్, బీజేపీని చాలా మంది రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఒక్కటిగానే చూస్తారు. ఏబీవీపీని కూడా ఆ రెండింటి అనుబంధ సంస్థగా చెబుతారు. విద్య, జాతీయ భద్రత, విశ్వవిద్యాలయ సంస్కరణలు ఏబీవీపీ భావజాలంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. 1990లో ఏబీవీపీ స్టూడెంట్స్ ఫర్ డెవెలప్‌మెంట్ (ఎస్ఎఫ్‌డీ) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'సమగ్ర, సుస్థిరాభివృద్ధి ఆవశ్యకతపై సరైన దృక్పథాన్ని పెంపొందించడం' దీని లక్ష్యం. ఏబీవీపీ అధికారిక మాసపత్రిక పేరు 'రాష్ట్రీయ ఛాత్ర్‌శక్తి'. హిందీలో ఇది వెలువడుతోంది. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఏబీవీపీ పేరు వినిపిస్తూ వస్తోంది. రాజకీయ పక్షపాతాలకు తాము దూరమన్నది ఏబీవీపీ వాదన. అయితే, సామాజిక కార్యక్రమాలు ఏవైనా రాజకీయాలకు పూర్తిగా అతీతంగా ఉండటం సాధ్యం కాదని కూడా ఆ సంస్థ అంటోంది. జేఎన్‌యూ హింసపై ఏబీవీపీ ఏమంది.. జేఎన్‌యూలో హింసపై ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌ను తమపై 'బురద చల్లేందుకు' జరిగిన ప్రయత్నమని ఏబీవీపీ వర్ణించింది. అక్షత్ అవస్థీ తమ విద్యార్థి సంఘంలో సభ్యుడు కాదంటూ ఏబీవీపీ సీనియర్ నాయకురాలు నిధి త్రిపాఠి ప్రకటన విడుదల చేశారు. ఓపీ ఇండియా న్యూస్ పోర్టల్ కూడా ఇండియా టుడే కథనం విశ్వసనీయతను ప్రశ్నిస్తూ మరో కథనం ప్రచురించింది. దిల్లీ పోలీసులు జేఎన్‌యూ హింస కేసు విచారణకు హాజరుకావాలని అవస్థీని కోరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై అవస్థీ ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి పాల్పడింది వామ పక్ష విద్యార్థి సంఘాలేనని, వీడియో ఆధారాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందని రిపబ్లిక్ టీవీ చానెల్ కథనం ప్రసారం చేసింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీలోని జేఎన్‌యూలో ఈ నెల 5న ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన దుండగులు కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులపై, అధ్యాపకులపై దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు గంటకు పైగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. text: మేఘన్, హ్యారీ బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటనకు ముందు వీరు రాణి ఎలిజబెత్-2, రాజకుమారుడు విలియం సహా రాజకుటుంబీకులు ఎవరినీ సంప్రదించలేదని బీబీసీకి తెలిసింది. ఈ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించింది. సీనియర్ రాజకుటుంబీకులు బాధపడినట్లు తెలిసింది. మీడియా తమపై దృష్టి కేంద్రీకరించడం వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను హ్యారీ, మేఘన్ 2019 అక్టోబరులో వెల్లడించారు. బుధవారం నాటి ప్రకటన ఊహించని పరిణామం. ఈ ప్రకటనను హ్యారీ, మేఘన్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలోనూ పెట్టారు. చాలా నెలలపాటు ఆలోచించి, అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు. తనయుడు ఆర్చీతో ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబ సీనియర్ సభ్యుల బాధ్యతల నుంచి వైదొలగాలని, ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడేందుకు పనిచేయాలని అనుకొంటున్నామని, అదే సమయంలో రాణికి సంపూర్ణ సహకారం అందిస్తామని వారు తెలిపారు. రాణి, కామన్వెల్త్, తమ మద్దతుదారుల పట్ల తమకున్న బాధ్యతలను గౌరవిస్తూనే, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండేందుకు సమతూకంతో సమయం కేటాయిస్తామని హ్యారీ, మేఘన్ చెప్పారు. దీనివల్ల రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్‌కు అవగాహన కల్పిస్తూ పెంచడానికి, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుందని వారు వివరించారు. హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్‌హాం ప్యాలస్ అధికారులు చెప్పారని బీబీసీ రాజకుటుంబ ప్రతినిధి జానీ డైమండ్ తెలిపారు. ఈ ప్రకటనతో రాజకుటుంబం ఎంత తీవ్రంగా అసంతృప్తికి లోనైందనేది అధికారుల స్పందన సూచిస్తోందని ఆయన చెప్పారు. హ్యారీ-మేఘన్ నిర్ణయం కంటే, వారు తమను సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం కుటుంబసభ్యులను బాధ పెట్టి ఉండొచ్చని తెలిపారు. ఈ జంటకు, రాజకుటుంబంలోని మిగతా సభ్యులకు మధ్య ఉన్న తీవ్రమైన అంతరాన్ని ఈ పరిణామం స్పష్టంగా చూపిస్తోందని వివరించారు. మేఘన్, హ్యారీ ఈ నిర్ణయంపై హ్యారీ, మేఘన్‌లతో రాజకుటుంబం చర్చలు జరుపుతోందని, ఇవి ప్రాథమిక దశలో ఉన్నాయని రాజప్రాసాదం అధికార ప్రతినిధి చెప్పారు. భిన్నమైన దారిలో నడవాలనే వారి కోరికను రాజకుటుంబం అర్థం చేసుకుంటుందని, కానీ ఇవి సంక్లిష్టమైన అంశాలని, తేలడానికి సమయం పడుతుందని తెలిపారు. క్రిస్మస్ సమయంలో హ్యారీ-మేఘన్ ఆరు వారాలపాటు రాజకుటుంబ విధుల నుంచి విరామం తీసుకొన్నారు. అప్పుడు కొంత సమయం కుమారుడు ఆర్చీ హారిసన్‌తోపాటు కెనడాలో గడిపారు. ఆర్చీ హారిసన్ మేలో పుట్టాడు. హ్యారీకి 35 ఏళ్లు, మేఘన్‌కు 38 ఏళ్లు. ఈ నెల 7న ఈ జంట బ్రిటన్‌కు తిరిగి వచ్చింది. తర్వాత లండన్‌లోని కెనడా హైకమిషన్‌కు వెళ్లి, కెనడాలో తమకు గొప్ప ఆతిథ్యం లభించిందంటూ ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకాదరణ పొందిన అమెరికా డ్రామా 'సూట్స్'‌లో నటించే సమయంలో మేఘన్ టొరంటోలో నివసించారు. ఆమెకు పలువురు కెనడియన్ స్నేహితులు ఉన్నారు. హ్యారీ తన మనసు మాట విన్నారని ఈ నిర్ణయం చెబుతోందని బకింగ్‌హాం ప్యాలస్ మాజీ మీడియా అధికారి డికీ ఆర్బిటర్ వ్యాఖ్యానించారు. ఆర్చీ హారిసన్ పుట్టినప్పుడు మీడియా చేసిన అతి ఈ నిర్ణయానికి కొంత మేర కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అప్పటికే రెండుసార్లు విడాకులు పొందిన వాలిస్ సింప్సన్‌ను పెళ్లి చేసుకోవడానికి 1936లో ఎడ్వర్డ్-VIII రాజరిక హోదాలను వదులుకోవడాన్ని ఆర్బిటర్ ప్రస్తావిస్తూ, ఈ ఘటనతో హ్యారీ నిర్ణయాన్ని పోల్చారు. ఇలాంటి ఘటన ఇప్పటివరకు ఒక్కటే జరిగిందని, ఆధునిక కాలంలో ఇలాంటి పరిణామం జరగనేలేదని చెప్పారు. ఇటీవల లండన్‌లో కెనడా సీనియర్ దౌత్యవేత్తలను కలిసిన హ్యారీ, మేఘన్ హ్యారీ పేదరికంలో లేకపోయినప్పటికీ, రెండు వేర్వేరు ఖండాల్లో స్థిరపడటానికి, ఒక కుటుంబాన్ని పోషించడానికి, భద్రతా ఏర్పాట్లకు, ఇలాంటి ఇతర అవసరాలకు డబ్బు ఎలా సమకూర్చుకుంటారనేది చూడాల్సి ఉందని ఆర్బిటర్ చెప్పారు. సంవత్సరంలో కొంత కాలం వేరే చోట నివసించాలనే ఆలోచన ఉన్నవాళ్లు విండ్సర్ పట్టణంలోని వారి నివాసం ఫ్రాగ్మోర్ కాటేజ్‌ నవీకరణకు 24 లక్షల పౌండ్లకు పైగా ప్రజాధనాన్ని ఎందుకు వెచ్చించారనే ప్రశ్న కూడా వస్తుందని ఆయన తెలిపారు. హ్యారీ-మేఘన్ వద్ద పొదుపు చేసుకున్న సొమ్ము గణనీయంగానే ఉందని బీబీసీ ప్రతినిధి జానీ డైమండ్ చెప్పారు. ఇందులో ప్రిన్సెస్ డయానా ఎస్టేట్ నుంచి హ్యారీకి వారసత్వంగా వచ్చినది, నటిగా మేఘన్ సంపాదించుకొన్న డబ్బు ఉన్నాయని తెలిపారు. పత్రికలు చూపే అమితాసక్తి వల్ల 'మాతృత్వం'లో తాను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని 2019లో ఐటీవీ డాక్యుమెంటరీలో మేఘన్ చెప్పారు. తన సోదరుడు, డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ విలియంకూ, తనకూ మధ్య విభేదాల వార్తలపై హ్యారీ స్పందించారు. తాము రెండు వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నామని ఆయన చెప్పారు. హ్యారీ, మేఘన్ 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇతర రాజకుటుంబీకులు చేరువకాని ప్రజలకు వీరు చేరువయ్యారు. తన వ్యక్తిగత లేఖను ఒకటి చట్టవిరుద్ధంగా ప్రచురించిందంటూ 'ద మెయిల్ ఆన్ సండే' పత్రికపై అక్టోబర్లో మేఘన్ చట్టపరమైన చర్యలు మొదలుపెట్టారు. అలాగే ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించి ద సన్, న్యూస్ ఆఫ్ ద వరల్డ్, ద డైలీ మిర్రర్ పత్రికలపై హ్యారీ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. "కొన్ని బలమైన శక్తుల వల్ల నేను నా తల్లిని కోల్పోయాను. ఇప్పుడు నా కళ్ల ముందే నా భార్య ఇదే శక్తుల వల్ల బాధితురాలిగా మారుతున్నారు" అని హ్యారీ ఒక ప్రకటనలో చెప్పారు. రాజకుమారుడు విలియం, కేట్ మిడిల్‌టన్ దంపతులతో కలసి నిర్వహిస్తున్న సేవాసంస్థ నుంచి గత వేసవిలో హ్యారీ, మేఘన్ దంపతులు బయటకు వచ్చేశారు. బాలలపై లైంగిక దాడుల దోషి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై వివాదం నేపథ్యంలో డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రూ ప్రజాజీవితానికి దూరమైన రెండు నెలలకు హ్యారీ-మేఘన్ నిర్ణయం వెలువడింది. బీబీసీ రాజకుటుంబ ప్రతినిధి జానీ డైమండ్ విశ్లేషణ... హ్యారీ-మేఘన్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఎక్కడ నివసించబోతున్నారు, ఆ ఖర్చులు ఎవరు భరిస్తారు, రాజకుటుంబంలోని మిగతావారితో ఈ జంట సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. రాజకుటుంబ విధుల నుంచి ప్రిన్స్ ఆండ్రూ తప్పుకొన్న తర్వాత కొంత కాలానికే తాజా పరిణామం జరిగింది. 21వ శతాబ్దానికి తగినట్లుగా సంఖ్యాపరంగా పరిమితమైన రాజరిక వ్యవస్థగా బ్రిటన్ రాజరిక వ్యవస్థ మారుతున్నట్లు కొందరికి అనిపించవచ్చు. అయితే ఇతర రాజకుటుంబీకులు చేరువకాని ప్రజలకు హ్యారీ, మేఘన్ చేరువయ్యారు. రాజరిక వ్యవస్థలో వస్తున్న కొత్త మార్పుల్లో వారు భాగమయ్యారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు పనిచేస్తామని రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ ప్రకటించారు. text: శనివారం శ్రీలంకపై విజయంతో, దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో భారత్ పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో నాలుగో స్థానంలో ఉన్న న్యూజీలాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఇప్పుడు భారత్, న్యూజీలాండ్‌ల మధ్య సెమీస్‌లో ఎవరు గెలుస్తారనే చర్చ జోరందుకుంది. అయితే మంగళవారం అంటే జులై 9న మాంచెస్టర్ ఓల్డ్‌ ట్రఫర్డ్ మైదానంలో ఒక్క బంతి పడకుండానే భారత్ ఫైనల్‌కు చేరే అవకాశం ఉందంటే మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, దానికి కోహ్లీ సేనపై 'వరుణుడి దయ' ఉండాలి. మంగళవారం మాంచెస్టర్‌లో మబ్బులు కమ్మచ్చని, వర్షం కురిసే అవకాశం ఉందని బ్రిటన్ వాతావరణ విభాగం చెబుతోంది. ఒకవేళ వర్షం తన 'ఆట' మొదలెడితే, ఆడలేని పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు, మీ మనసులో జూన్ 13న రద్దైన భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ గుర్తుకొచ్చే ఉంటుంది. అప్పుడు కూడా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు టీములకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. కానీ ఇది లీగ్ రౌండ్ మ్యాచ్ కాదు.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్. దీనికోసం రిజర్వ్ డే అంటే అదనంగా ఒక రోజును కేటాయించారు. ఏదైనా కారణంతో మ్యాచ్ జరిగే రోజు అంటే జులై 9న ఆటకు ఆటంకం కలిగితే తర్వాత రోజు అంటే జులై 10న ఆ మ్యాచ్ జరుగుతుంది. అయితే అసలు సమస్యేంటి ఇక్కడ సమస్యంతా వాతావరణం గురించే. బ్రిటన్ వాతావరణ విభాగం చెప్పేది నమ్మాల్సి వస్తే, జులై 10న వాతావరణం జులై 9 కంటే ఘోరంగా ఉండబోతోంది. ఆరోజు ఆకాశం మేఘావృతం కావచ్చు, మధ్యాహ్నం వరకూ (మ్యాచ్ లంచ్ టైమ్) తేలికపాటి జల్లులు పడవచ్చు. మేఘాలు కమ్మేస్తే... అలాంటప్పుడు జులై 9, రిజర్వ్ డే అంటే జులై 10న మ్యాచ్ ఆడడం సాధ్యం కాకుంటే మరో రోజు ఉండదు. అది కచ్చితంగా భారత్‌కు అనుకూలం అవుతుంది. ఎందుకంటే లీగ్ పోటీల్లో న్యూజీలాండ్‌కు 11 పాయింట్లు ఉంటే, టీమిండియాకు 15 పాయింట్లు ఉన్నాయి. దాంతో భారత్ ఆటోమేటిగ్గా ఫైనల్‌ చేరుతుంది. అంటే రెండు రోజులూ వర్షం వల్ల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే, కోహ్లీ సేన మాంచెస్టర్‌లో ఒక్క బంతి కూడా పడకుండానే 'క్రికెట్ మక్కా' లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో అడుగుపెడుతుంది. అయినా.. ఇంగ్లండ్ వాతావరణం, దానివల్ల ప్రభావితమైన మ్యాచ్‌ల గురించి నేను చాలా రాశాను, చెప్పాను. లీగ్ రౌండ్‌లో మొత్తం 45 మ్యాచుల్లో ఏడింటిపై వర్షం ప్రభావం పడింది. మూడు మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. వీటిలో భారత్-న్యూజీలాండ్ లీగ్ మ్యాచ్ కూడా ఉంది. మరోవైపు, ఆతిథ్య ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా తమ సెమీస్‌ మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడకూడదని కోరుకుంటున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌లో జల్లులు పడవచ్చని చెబుతున్నారు. శుక్రవారం రిజర్వ్ డే రోజు కూడా వర్షం 'విలన్' కావచ్చని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం వల్ల ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్ జరగకపోతే ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరుకుంటుంది. అదీ.. ఒక్క బంతి కూడా పడకుండానే. వాతావరణం బాగుండాలని ప్రార్థనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాంచెస్టర్ చేరుకుంటున్నారు. వాళ్లందరి నోటా ఒకే మాట వస్తోంది... "సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగే రోజు ఆకాశం స్పష్టంగా ఉండాలి, వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి". ఆదివారం మాంచెస్టర్‌లో బాగా ఎండకాసింది. "అయితే, భారీ వర్షం వచ్చినా నాకే సమస్యా లేదు, అదే జరిగితే భారత్ ఫైనల్ చేరుకుంటుంది. కానీ ఆట జరిగితే మాత్రం మ్యాచ్ ఉత్కంఠగా జరిగితే బాగుండుననిపిస్తోంది" అని దుబాయి నుంచి మ్యాచ్ చూడ్డానికి వచ్చిన కుమార్, ఆయన భార్య ప్రమీల అన్నారు. నేనిక్కడ స్థానిక విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న కొంతమంది భారత విద్యార్థులను కూడా కలిశాను. వాళ్లంతా భారత్‌లో ఉంటున్న తమ అమ్మనాన్నలకు చెప్పకుండానే మ్యాచ్ టికెట్లు కొనేశామని చెప్పారు. వాళ్లలో ఒకరు.. "పాజీ, దయచేసి వర్షం పడాలని ప్రార్థించండి. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ మాదిరిగా సెమీఫైనల్లో భారత్ మరోసారి ఓడిపోతే చూడలేం" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వరల్డ్ కప్ 2019 తొలి సెమీఫైనల్లో న్యూజీలాండ్‌తో తలపడేందుకు భారత జట్టు మాంచెస్టర్ చేరుకుంది. text: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఆయన పక్కన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం (ఫైల్ ఫొటో) అసలేం జరిగింది? ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం అధిపతిగా ప్రవీణ్ ప్రకాష్ నియమితులయిన నాటి నుంచి పలు పరిణామాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తొలుత సీఎస్‌కి సంబంధం లేకుండా వివిధ శాఖలకు చెందిన ఫైళ్లు తనకు పంపించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపింది. క్యాబినెట్ కార్యదర్శిగా వ్యవహరించే సీఎస్ స్థానంలో సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి హోదాలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయం తీసుకోవడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. దాంతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా తీవ్రంగా స్పందించారు. ఏకంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తికి షోకాజ్ నోటీసు జారీ చేయడం దేశంలోనే అరుదైన ఘటనగా చెబుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్‌కి నోటీసు జారీ అయిన కొన్ని గంటల్లోనే సీఎస్ సీటు మారుస్తూ నిర్ణయం వెలువడింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం జీఓ (RT-2478) జారీ చేసింది. దీనిపై సంతకం చేసింది ప్రవీణ్ ప్రకాశ్ కావడం విశేషం. ముఖ్యమంత్రికి ఈ అధికారం ఉందా? కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిని రాష్ట్ర ప్రభుత్వమే బదిలీ చేసిన సంఘటన గత 10-15 ఏళ్లలో చోటు చేసుకోలేదు. సాధారణంగా ఎన్నికల సమయంలో విధులు సరిగా నిర్వర్తించడం లేదని, తమ ఆదేశాలు పాటించడం లేదని ఎన్నికల సంఘం సీఎస్‌లను మారుస్తుంటుంది. ఆ తరహాలోనే ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ బాధ్యతల్లోకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన కొద్దిమంది ఐఏఎస్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమిస్తుంటారు. కాబట్టి, ఈ హోదాలో వీరి పదవీకాలం చాలా తక్కువ ఉంటుంది. తన ప్రభుత్వం హయాంలో పనిచేసే ఐఏఎస్‌లను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అయితే, ఆ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే. అలాంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. సీఎస్‌ను మార్చినప్పుడు లేదా కొత్త సీఎస్‌గా మరొకరు నియమితులైనప్పుడు మాత్రం ఆ ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి జారీ చేస్తారు. ఇప్పుడు ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాశ్ కూడా ఆ హోదాలోనే జీఓ జారీ చేశారు. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. అయితే, ఒక సంవత్సరంలోపు పదవీకాలం ఉన్నప్పుడు ఒక అధికారిని ప్రభుత్వం బదిలీ చేస్తే.. సదరు అధికారి అదే నగరం/పట్టణంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, అలాంటి అవకాశం లేకపోతే రిటైర్మెంట్ పూర్తయ్యే వరకూ అదే పోస్టులో కొనసాగించాలంటూ గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. కాబట్టి, ఎల్వీ సుబ్రహ్మణ్యం కనుక కోర్టును లేదా క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)ను ఆశ్రయిస్తే ఈ బదిలీ చెల్లుబాటు కాకపోవచ్చునని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు. సీఎస్ హోదాలో ఎల్ వి సుబ్రహ్మణ్యం ఇలా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం అనూహ్యంగా బాధ్యతల్లోకి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని ఈ పదవిలో నియమించింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి సీఎస్‌గా ఎల్వీ ని కొనసాగించారు. ఎమ్మార్ కేసులో జగన్ సహా నిందితుడిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎమ్మార్ సంస్థకు కేటాయించిన భూముల వివాదం అప్పట్లో ఎల్ వి సుబ్రహ్మణ్యం మెడకు చుట్టుకుంది. ఆయన సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు. జగన్ ఆస్తుల వ్యవహారంలో బయటకు వచ్చిన ఈ కేసులో ఎల్వీ సుబ్రహ్మణ్యం పై అప్పట్లో సీబీఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఏపీఐఐసీ ఎండీగా ఉన్నకాలంలో ఎమ్మార్ సంస్థకు కేటాయించిన భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. చివరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టుని ఆశ్రయించగా, కోర్టు ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ‘సీఎంకి లేఖ రాశాను, ఇది సరికాదు’ - రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు శ్రేయస్కరం కాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆయన బీబీసీ తో మాట్లాడుతూ.. ‘‘సీఎస్, జిఏడి విభాగాల మధ్య సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. సీఎంకి వారం క్రితమే లేఖ రాశాను. క్యాబినెట్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలను సీఎస్ నిర్దరిస్తారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల వెనుక ఆర్థిక, న్యాయపరమైన అంశాలు పరిశీలించి సీఎస్ క్యాబినెట్ ముందు ప్రతిపాదిస్తారు. దానికి భిన్నంగా సాగడం శ్రేయస్కరం కాదు. అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు’’ అన్నారు. ‘సీఎం తీరు సరికాదు’ - మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ ఈ విధానం సరికాదని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ‘‘సీఎస్‌ను తొలగించిన విధానం సరిగా లేదు. ఎలాంటి బాధ్యత లేకుండా.. అంతులేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. దీనిని నియంత్రించలేని ముఖ్యమంత్రుల పతనానిని సీఎంఓనే కారణమవుతోంది’’ అని ఒక ఫేస్‌బుక్ పోస్టులో కృష్ణారావు తెలిపారు. ‘‘హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు (ఎల్వీ సుబ్రహ్మణ్యంకు) ఇది బహుమానం అయితే ఇంకా దారుణం’’ అని ఆయన ఈ పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జగన్ కోరి తెచ్చుకున్న వ్యక్తి ఎల్వీ సుబ్రహ్మణ్యం అని, అలాంటి వ్యక్తిని బదిలీ చేశారంటే అర్థం అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కాగా, సీఎస్ బదిలీ.. ఈపీ రొయప్ప కేసు (1974)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని న్యాయ నిపుణుడు వృద్ధుల కల్యాణ రామారావు బీబీసీతో మాట్లాడుతూ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు జరిగాయి. అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌కి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. text: భారతీయులు.. ముఖ్యంగా దక్షిణాదిలో ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీని బ్రిటన్‌కు చెందిన ఓ విద్యావేత్త "ఆసక్తి" లేని ఆహార పదార్థంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. "ప్రపంచంలో అత్యంత అనాసక్తమైన ఆహారం ఇడ్లీ" అంటూ ఎడ్వర్డ్ ఆండర్సన్ అనే చరిత్రకారుడు ట్వీట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు, కొందరి ఆగ్రహానికి దారితీసింది. మినప పప్పు, బియ్యంలను రుబ్బి ఆ పిండిని ఆవిరిపై ఉడికించి చేసే ఇడ్లీలను చట్నీతో కానీ, సాంబారుతో కానీ తింటారు. దీనిని ఆరోగ్యానికి ఉపకరించి శరీరానికి మేలు చేసే అల్పాహారంగా చెబుతారు. ముఖ్యంగా దక్షిణాదిలోఇడ్లీలను ఎక్కువగా తింటారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన ఆహార పదార్ధం ఇడ్లీ అని ప్రముఖ ఫుడ్ రచయత వీర్ సింఘ్వి చెబుతారు. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టమట. సెలవుల్లో చెన్నై వచ్చినప్పుడు తల్లి తనకు ఇడ్లీపై ఇష్టం కలిగేలా చేసేవారంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. కమలా హారిస్ తల్లి తమిళనాడుకి చెందిన వారు కాగా తండ్రి జమైకా దేశస్థులు. రానున్న అధ్యక్ష ఎన్నికలలో అమెరికాలో నివసిస్తున్న భారతీయ ఓటర్లను ఆకర్షించేందుకు ఇడ్లీ గురించి మాట్లాడుతున్న ఏకైక రాజకీయ నాయకురాలు ఆమె మాత్రమే కాదు. మహమ్మారి సమయంలో తమిళ నాడులోని సేలంలో, భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా 'మోదీ ఇడ్లీ'లనే పేరుతో చవకగా ప్రజలకు ఇడ్లీలను పంచుతున్నారు. పాలక పార్టీ వారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పేరుతో 'అమ్మ ఇడ్లీల' పేరుతో చేస్తున్న కార్యక్రమానికి ఇది పోటీ కార్యక్రమం లాంటిది. జయలలితను ఆమె అభిమానులు ప్రేమతో అమ్మ అని పిలుచుకుంటారు. ‘చాలామంది ఆ ఆహారపదార్థాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అనిపించే ఫుడ్ ఏది?’ అని ఒక ఫుడ్ డెలివరీ సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ ఆండర్సన్ ఈ సమాధానాన్ని ట్వీట్ చేశారు. ఆండర్సన్ వ్యాఖ్యలు ఇడ్లీ ప్రియులను బాగా బాధించాయి. దీంతో ఇడ్లీ అభిమానులంతా తమ సమాధానాలతో ట్వీట్ల వర్షం కురిపించారు. ఇషాన్ థరూర్ అనే రచయత "నేను ట్విటర్లో చాలా అవమానపరిచే ట్వీట్‌ని చూసినట్లున్నాను" అని కామెంట్ చేశారు. ఆ వెంటనే ఇషాన్ అభిప్రాయానికి మద్దతు పలుకుతూ తండ్రి శశి థరూర్ సమాధానం చెప్పారు. "అవును! ఈ ప్రపంచంలో కొంతమందికి నిజంగానే ఏమీ తెలియదు. సంస్కృతిని అలవర్చుకోవడం కష్టం. ఇడ్లీల రుచిని ప్రశంసించడానికి, క్రికెట్‌ని ఆస్వాదించటానికి, కేరళ సాంప్రదాయ నృత్యం ఒట్టంతుల్లాల్ ని వీక్షించడానికి ప్రతి జీవికీ అదృష్టం ఉండదు. జీవితం అంటేఎప్పటికీ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోలేని ఈ వ్యక్తి గురించి జాలిపడు" అని సమాధానం ఇచ్చారు. "ఒక ప్లేట్ వేడి వేడి ఇడ్లీలను ఆవాలు,ఎండు మిర్చి , ఉల్లిపాయతో పోపు పెట్టిన చట్నీ , ఇడ్లీ పొడి, నేతితో తిని చూడండి. ఇడ్లీ పిండి సరైన రీతిలో పిలిస్తే ఆ రుచి స్వర్గానికి దగ్గరగా ఉంటుంది. బహుశా దీనిపై పాఠం చెప్పాల్సి ఉంటుందేమో " అంటూ ఆండర్సన్‌కు నేరుగా ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చారు. "ఇప్పటికే ఈ సంవత్సరం తెచ్చి పెట్టిన కష్టాలు చాలవన్నట్లు ఇడ్లీ మీద కూడా సోషల్ మీడియా లో దాడి జరుగుతోంది. వారానికి ఒక్కరోజైనా ఇడ్లీ తినకపోతే నాకు జీవితం అసంపూర్ణంగా తోస్తుంది" అని గౌరవ్ బగారియా అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. "ఈ ట్వీట్ చూడగానే నేను సగం చచ్చిపోయాను" అంటూ హేమ మీనన్ ట్వీట్ చేశారు "నా క్లాసుమేట్ ఈ ట్వీట్‌ని పంపగానే కేవలం ఈ విషయం గురించి ట్వీట్ చేయడానికే నేను ట్విటర్ అకౌంట్ తెరిచి ఇడ్లీల గురించి చెప్పడం ప్రారంభించాను. ఇడ్లీలకు ఆత్మ ఉంటుంది. వాటిని ప్రేమతో చేస్తారు. అవి అనాసక్తి కలిగించేవి కావు. మీరెప్పుడూ సరైన ఇడ్లీలు తిని ఉండరు. మీరెప్పుడైనా జర్మనీ వస్తే చెప్పండి. మేము మీకు వండి పెడతాం" అని అంటూ అనా సూసన్ థామస్ అనే ఆమె ట్వీట్ చేశారు. అయితే,ఇదంతా చూసిన ఆండర్సన్ తన మాటలను వెనక్కి తీసుకోలేదు. ఆయన మధ్యాహ్న భోజనంలో ఇడ్లీ తెప్పించుకుని తిని, ఇడ్లీపై నా అభిప్రాయం ఏమి మారలేదు" అని మళ్లీ ట్వీట్ చేశారు. భారతదేశంలో ఉన్నప్పుడు చాలా సార్లు ఇడ్లీలు తిన్నానని, తన భార్య కేరళకు చెందినవారని ‘బీబీసీ’కి చెప్పారు ఆండర్సన్. ఆయన అత్తగారింటిలో ఇడ్లీలు తరచుగా వండేవారని చెప్పారు. ఇడ్లీలు రకరకాల చట్నీలతో తినాల్సిన పద్దతుల గురించి ట్విటర్ యూజర్లు ఆండర్సన్‌కి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. అరటి ఆకుల్లో ఆవిరి పెట్టిన ఇడ్లీలను వేడివేడిగా ఇడ్లీ కారంతో, అప్పుడే రుబ్బిన కొబ్బరి చట్నీతో, వేడి వేడి సాంబారుతో ఎలా తినాలో వివరించారు. "నిజానికి ఇడ్లీలను సరైన చట్నీలతో తింటే చాలా బాగుంటాయి. దోస, వడ, అప్పం అయితే ఇంకా రుచిగా ఉంటాయి". "ఆహారం వ్యక్తుల ఉనికిని , ప్రాంతీయ భావాలను, భావోద్వేగాలను ఎలా ప్రతిబింబిస్తుందో" ఇడ్లీ మీద జరిగిన ఈ చర్చనిరూపిస్తుంది" అని ఆండర్సన్ అన్నారు. "నాకు వచ్చిన చాలా సమాధానాలలో, యూజర్లు ఇడ్లీలను ఇంటా బయటా ఎలా తినేవారో గుర్తు చేసుకున్నారు. అందులో చాలా మంది భారతదేశం వదిలి పెట్టి ఇతర దేశాలలో నివసిస్తున్న వారే ఉన్నారు. చాలా మంది వారి భూభాగపు ఆహారంతో తమకున్న బంధాన్ని విడదీయలేని అనుబంధం గా భావిస్తారు" అని ఆయన అన్నారు కొంత మంది యూజర్లు ఇచ్చిన సమాధానాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన అన్నారు. "ఈ విషయాన్ని కొంత మంది సీరియస్ గా తీసుకున్నారు. కానీ 99 శాతం మంది హాస్యంతో కూడిన సమాధానాలు ఇచ్చారు" అని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దక్షిణ భారతీయులకు ప్రీతిపాత్రమైన ఇడ్లీని ఏమాత్రం ఆసక్తి కలిగించని ఆహార పదార్థంగా ఒక విద్యావేత్త, చరిత్రకారుడు ట్వీట్ చేయడంతో దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. text: పలమనేరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో కుప్పం వెళ్లే దారిలో వేంకటేశ్వర హేచరీస్ ఉంటుంది. మొత్తం ఎనిమిది మంది సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి అందులోకి దిగారనీ, వారిలో ఏడుగురు మృతి చెందారని చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు బీబీసీకి తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఎనిమిదో వ్యక్తి శివకుమార్ రెడ్డి (46)ని తిరుపతికి తరలించినట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ట్యాంకుకు రెండు మూతలు ఉన్నాయని, కార్మికులు రెండో మూతను తెరవకుండానే ఒక మూతలోంచి లోపలికి దిగినట్టు అధికారులు చెప్పారు. హేచరీస్ వ్యర్థాలు నిల్వ చేసే గుంత 12 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు ఉందని తెలుస్తోంది. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి ఇలా మనుషులను సెప్టిక్ ట్యాంకులోకి దించడానికి హేచరీస్‌ సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకుందా లేదా అనే విషయం నిర్ధారించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. మృతుల పేర్లు: 1) ఎం. రమేష్ (32), 2) జి. కుమారస్వామి (35), 3) బి. రామచంద్ర (23), 4) ఎ. రెడ్డప్ప (30), 5) ఆర్. బాబు (30), 6) కేశవ (20), 7) బి. వెంకటరాజు (23). ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం, మొరం గ్రామంలో శ్రీ వేంకటేశ్వర హేచరీస్ (కోళ్ల ఫారం)లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. text: నాగాలాండ్‌ ప్రధాన కార్యదర్శి టెమ్‌జెన్‌ టాయ్‌ శుక్రవారం ఒక ట్వీట్‌లో "వాణిజ్యపరంగా కుక్కలను మార్కెట్‌లోకి దిగుమతి చేయడం, కుక్కలను అమ్మడం, పచ్చి లేదా ఉడకబెట్టిన కుక్క మాంసాన్ని అమ్మడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది" అని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో మరో ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం ప్రభుత్వం జంతు వధ నిర్వచనం నుంచి కుక్కలను తొలగిస్తూ చట్టం సవరించింది. ఇప్పుడు నాగాలాండ్ ప్రభుత్వం మిజోరాం బాటలో నడుస్తోంది. వాస్తవానికి నాగాలాండ్, మిజోరాంలలో కుక్కల మాంసాన్ని అమ్మడం తినడం చాలా పాత విషయం. కాని ఇది చాలా దారుణమని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ నాగాలాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి నెఫ్యూ రియోకు లేఖ రాసిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ నాగాలాండ్‌లో కుక్క మాంసం అమ్మకం, సరఫరా, వినియోగాలను నిషేధించడానికి తక్షణం చర్య తీసుకోవాలని కోరింది. "నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఇటీవల పశువుల మార్కెట్‌కు సంబంధించిన ఫోటోలు చూశాము. ఇది మాకు షాకిచ్చింది. అమ్మకానికి భారీస్థాయిలో మార్కెట్‌కు తీసుకువచ్చిన కుక్కలను బస్తాలలో మూటకట్టి పెట్టారు. ఇది చాలా దారుణం" అని తన లేఖలో ఆ సంస్థ పేర్కొంది. కుక్క మాంసం వ్యాపారం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇది భారతీయ శిక్షాస్మృతి 1860వంటి వివిధ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తోందని నాగాలాండ్‌లో జంతు సంరక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరోపించింది. కుక్కలను పట్టుకోవడం, వాటి మాంసాన్ని తినడంవల్ల కొన్నిసార్లు రాబిస్‌వంటి వ్యాధులు వస్తాయని ఆ సంస్థ వాదిస్తోంది. ఈ వ్యాధి సోకిన కుక్కల మాంసాన్ని తాకడం, తినడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 30న పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా "రాష్ట్రంలో కుక్కల మార్కెట్లను, కుక్క మాంసాన్ని నిషేధించాల్సిందిగా నాగాలాండ్ ప్రధాన కార్యదర్శికి ఈ-మెయిల్స్‌ పంపండి'' అని లోక్‌సభ ఎంపీ మేనకాగాంధీ ప్రజలను కోరారు. క్రైస్తవ ఆధిపత్య రాష్ట్రాల్లో ప్రజలు క్రమం తప్పకుండా కుక్క మాంసాన్ని చికెన్, మటన్‌లాగా ఇష్టంగా తింటుంటారు. నాగాలాండ్‌ తెగలలో కుక్క మాంసం తినడం వందల సంవత్సరాల నుంచి ఉంది. నాగాలాండ్‌లోఅతిపెద్ద నగరమైన దిమాపూర్ సూపర్‌ మార్కెట్‌లో బుధవారం వరకు కుక్కమాంసం బహిరంగంగానే అమ్మారు. దిమాపూర్‌లో నివసిస్తున్న మావో కొన్నేళ్లుగా దిమాపూర్‌ సూపర్‌ మార్కెట్‌ నుంచి కుక్కమాంసం కొంటున్నారు. అయితే ఇప్పుడు కుక్క మాంసంపై నిషేధాన్ని గురించి ఆయన్ను ప్రశ్నించినప్పుడు "నాగాలాండ్‌లో 17ప్రధాన తెగలు ఉన్నాయి. దాదాపు ప్రతి తెగకు కుక్క మాంసం తినడం అలవాటు. దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రజలు చికెన్‌, మటన్‌ తిన్నట్లు మేం కుక్కమాంసం తింటాం" అని ఆయన అన్నారు. "మొదట్లో మేం వారానికి ఒకసారి రాజామిర్చి (ఈశాన్య రాష్ట్రంలో పండే ప్రధానమైన మిరపకాయ రకం)తో కుక్క మాంసం వడుకునే వాళ్లం. కొన్ని నెలలుగా మేం అలా తినలేకపోతున్నాము. మేము స్థానిక జాతి కుక్కలను ఎక్కువగా ఇష్టపడతాం. కానీ ఇప్పుడు దిమాపూర్ మార్కెట్‌కు అసోం నుంచి కుక్కలను తీసుకువస్తున్నారు'' అని మావో అన్నారు. నాగాలాండ్‌లో కుక్క మాంసం తినడానికి నేపథ్యం ఏంటి? "నాగాలాండ్‌లో కుక్కమాంసాన్ని మంచి పోషకాహారంగా భావిస్తారు. కుక్కమాంసం లైంగిక శక్తిని పెంచుతుందని కూడా ఇక్కడ కొంతమంది నమ్ముతారు. ఈ నమ్మకాలే చాలామంది కుక్కమాంసం తినడానికి ప్రోత్సహించాయి'' అని మావో అన్నారు. నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో నివసించే నోథో థాపర్‌ ఈ మాంసాన్ని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిన తరువాత తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో "కుక్క మాంసం నిషేధించటానికి మంచి కారణం ఒకటి చెప్పండి ?" అని ప్రశ్నించారు. దిమాపూర్ నివాసి మంచాంగ్ అవెన్నో కూడా దీనిపై స్పందించారు. "దీని వెనక ఏమి జరిగిందో తెలియదు. దీనివల్ల వారు పొందేది ఏంటో కూడా తెలియదు. కుక్క మాంసం తినడం ఇక్కడి రాజకీయాలకన్నా, రాజకీయ పార్టీలకన్నా ప్రాచీనమైన అలవాటు''అని అన్నారు. గువహాటిలోని పీపుల్‌ ఫర్‌ యానిమల్స్ అనే ఎన్జీఓ సంస్థ నాయకురాలు సంగీతా గోస్వామి, కుక్క మాంసం తినడం అమానవీయమని అంటారు. నాగాలాండ్‌లో ఆమె అనేకసార్లు కుక్కమాంసం అమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కుక్కమాంసాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ మిజోరాం, నాగాలాండ్‌లలో సంగీతా గోస్వామి చాలాకాలంగా ఉద్యమిస్తున్నారు. బీబీసీతో మాట్లాడిన ఆమె "కుక్క మాంసం నోటిఫైడ్‌ ఆహార పదార్థం కాదు. కాబట్టి ఇది మొదటి నుండి చట్టవిరుద్ధమే. కాని నాగాలాండ్‌లో బహిరంగంగా కుక్క మాంసాన్ని అమ్ముతున్నారు. మిజోరంలో కుక్క మాంసం అమ్మే 28 దుకాణాలను మా సంస్థ మూసేసింది. దారుణం ఏంటంటే గువహాటిలోని మిజోరం భవన్ మెనూలో కుక్కమాంసం వడ్డిస్తున్నారు. కానీ ఇప్పుడు మిజోరాంలో కుక్క మాంసాన్ని అమ్మలేరు. ఆ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది" అని అన్నారు. కుక్కల అక్రమ వ్యాపారాన్ని, కుక్క మాంసం అమ్మకాలను నిషేధించాలని నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంగీతా గోస్వామి స్వాగతించారు. "అసోం నుంచి అనాథ కుక్కలను నాగాలాండ్‌కు తరలించే వ్యాపారం ఆగిపోతుంది. ముఖ్యంగా అసోంలోని గోలఘాట్ జిల్లాలో కొంతమంది కుక్కల నోరు, కాళ్లు కట్టేసి బస్తాలలో కుక్కి నాగాలాండ్‌కు రవాణా చేస్తారు. ఇలా తాళ్లతో కట్టేయడం వల్ల ఒక్కోసారి అవి చనిపోతాయి" అని సంగీతా గోస్వామి అన్నారు. "ఒక కుక్కను అమ్మితే యజమానికి 100 నుంచి 150 రూపాయలు మాత్రమే లభిస్తాయి. నాగాలాండ్‌లో వాటిని కొనే వ్యాపారులు అక్కడ కిలోమాంసాన్ని రూ.300కు అమ్ముతారు. ఆ విధంగా వారు ఒక కుక్కను అమ్మడం ద్వారా రూ.1500కు పైగా సంపాదిస్తారు. మేము పోలీసులు సహాయంతో అసోంలో కుక్కలను అక్రమంగా తరలించే చాలామందిని పట్టుకున్నాము. ఇప్పుడు నాగాలాండ్ ప్రభుత్వం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది" అని గోస్వామి అన్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (హెచ్ఎస్ఐ) కూడా భారతదేశంలో కుక్క మాంసం అమ్మకాలను నిషేధించాలంటూ సంవత్సరాలుగా ప్రచారం చేస్తోంది. ఈ సంస్థ కూడా నాగాలాండ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. "నాగాలాండ్‌లో కుక్కల దారుణ వధ పాపం భారతదేశానికి అంటుకుని ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయం ఆ పాపానికి దూరం చేస్తుంది" అని హెచ్‌ఎస్‌ఐ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్‌పర్ణ సేన్‌గుప్తా బీబీసీతో అన్నారు. హెచ్‌ఎస్‌ఐ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 30,000 కుక్కలను నాగాలాండ్‌కి అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీటిని మార్కెట్‌లో అమ్ముతారు. కర్రలతో కొట్టి దారుణంగా చంపుతారు అని హెచ్‌ఎస్‌ఐ చెబుతోంది. అయితే మిజోరాంలో కూడా కుక్క మాంసం తినడానికి నేపథ్యం ఉంది. "మిజోరాం, నాగాలాండ్‌లోని చాలామంది గిరిజనులు మంగోలాయిడ్ తెగకు చెందినవారు. ఈ తెగల సంస్కృతి, ఆహారపు అలవాట్లు చైనా, కొరియా, వియత్నాం ప్రజల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. కొరియాలో కూడా ప్రజలు కుక్క మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు" అని నాగాలాండ్‌లో సామాజిక సమస్యలను చాలాకాలంగా కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సమీర్‌కర్‌ పురకాయస్థ వ్యాఖ్యానించారు. మంగోలాయిడ్ తెగ ప్రజల రక్తంలో ఐరన్‌ పరిమాణం తక్కువగా ఉంటుందని చెబుతారు. ఇతర మాంసాలకంటే కుక్కు మాంసంలో ఐరన్‌ శాతం ఎక్కువని, మంగోలాయిడ్ తెగకు చెందిన వారు కుక్క మాంసం ఇష్టపడటానికి కారణాలలో ఇది కూడా ఒకటని అంటారు. ఈ ఏడాది మార్చి 4న మిజో నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వం మిజోరాంలో కుక్కలను పశువులుగా పరిగణించబోమని పేర్కొంది. పాత చట్టాన్ని ఏకగ్రీవంగా సవరించి మిజోరాం యానిమల్ స్లాటర్ (సవరణ) బిల్లు, 2020ను ఆమోదించి కుక్కల అమ్మకాన్ని నిషేధించింది. కానీ కుక్కల మాంసం ప్రపంచంలోని అనేక దేశాలలో విస్తృతంగా తింటారు. వీటిలో చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌వంటి దేశాలు ఉన్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వ్యాపారం కోసం కుక్కమాంసం ఎగుమతి, దిగుమతులను నిషేధించాలని నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకంపై నిషేధంతో పాటు కుక్కల మార్కెట్లను పూర్తిగా తొలగించాలని కూడా ముఖ్యమంత్రి నెఫ్యూ రియో అధ్యక్షతన జరిగిన కీలకమైన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. text: త్రివేండ్రంలోని ఓ సభలో కూడా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ప్రముఖ మేధావి వేలుపిల్లై మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు 24 ఏళ్ల అన్నా చాందీ వేదికపైకి వచ్చి, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లు ఎందుకు అవసరమో చెబుతున్నారు. ఆమె ప్రసంగం కోర్టులో వాదనలా సాగింది. ఒక వేళ మహిళలకు ఉద్యోగాలు ఇస్తే... పెళ్లైనవారికి ఇవ్వాలా, పెళ్లి కాని వారికి ఇవ్వాలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘‘మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం మొదలుపెడితే, వైవాహిక జీవిత బాధ్యతల నిర్వహణపై ప్రభావం పడొచ్చు. కొన్ని కుటుంబాల్లో సంపద కూడా తగ్గిపోతుంది. పురుషుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది’’ అని వేలు పిల్లై సభలో అన్నారు. ‘‘మహిళలు పురుషులకు ఇంట్లో ఆనందాన్ని కలిగించే వస్తువు మాత్రమే అన్నట్లుగా ఈ వాదన ఉంది. దీని ఆధారంగానే వాళ్లు మహిళలు ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు ఉండాలని కోరుకుంటున్నారు. మహిళ వంట గది దాటితేనే, కుటుంబ ఆనందం దెబ్బతింటుందన్నది వారి అభిప్రాయం’’ అని అన్నా చాందీ అన్నారు. మహిళలు సంపాదిస్తే, కష్టకాలంలో కుటుంబానికి ఆసరా లభిస్తుందని అన్నా వాదించారు. ఒకవేళ పెళ్లికాని మహిళలకే ఉద్యోగాలు ఇస్తామని చెబితే, మహిళలు పెళ్లి చేసుకోవడం మానేస్తారని కూడా ఆమె అన్నారు. ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు. ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు: అన్నా చాందీ న్యాయవిద్య చదువుకున్నారు. ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొనేందుకే ఆమె కొట్టాయం నుంచి త్రివేండ్రం వరకు వచ్చారని కేరళకు చెందిన చరిత్రకారిణి, రచయిత జే. దేవిక చెప్పారు. అన్నా చాందీ ఈ సభలో చేసిన ప్రసంగంతో మహిళలకు రిజర్వేషన్ల డిమాండ్‌కు బలం లభించినట్లైందని అన్నారు. మహిళల రిజర్వేషన్ల డిమాండ్‌ను మొదలుపెట్టిన మలయాళీ మహిళల్లో అన్నా చాందీ అగ్రపథంలో ఉంటారు. అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి న్యాయపట్టా పొందిన తొలి మహిళ అన్నా చాందీ ట్రావెన్‌కోర్ రాజ్యంలో 1905లో జన్మించారు. 1926లో న్యాయవిద్య పూర్తి చేశారు. కేరళలో న్యాయవిద్య పట్టా పొందిన తొలి మహిళ అన్నా చాందీనే. ‘‘అన్నా ఓ సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. కేరళలో న్యాయవాద పట్టా పొందిన తొలి మహిళ ఆమె. లా కాలేజీలో ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. కాలేజీలో చాలా మంది ఆమెను ఆటపట్టించేవారు. కానీ, ఆమె బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ’’ అని దేవిక చెప్పారు. క్రిమినల్ కేసుల్లో చట్టాలపై బాగా పట్టు ఉన్న న్యాయవాదిగా అన్నా చాందీ పేరుతెచ్చుకున్నారు. రాజకీయాల్లో అడుగు సామాజికంగా మహిళలను చిన్నచూపు చూడటం, రాజకీయాల్లో వారికి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల అన్నా చాందీ తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. 1931లో ట్రావెన్‌కోర్‌ శ్రీమూలమ్ పాపులర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. ‘‘అప్పట్లో రాజకీయాల్లో మహిళలు ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎన్నికల బరిలోకి వచ్చాక అన్నాను అవమానించేలా, ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. ఆమెను అవమానపరిచేలా పోస్టర్లు వేశారు. ఎన్నికల్లో అన్నా ఓడిపోయారు. కానీ, ఆమె మౌనంగా ఉండిపోలేదు. తన మ్యాగజైన్ ‘శ్రీమతి’లో దీనికి వ్యతిరేకంగా ఓ సంపాదకీయం రాశారు’’ అని దేవిక చెప్పారు. 1932లో అన్నా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. ‘‘అసెంబ్లీ సభ్యురాలిగా ఉంటూ మహిళల అంశాలను లేవనెత్తడమే కాదు, బడ్జెట్ లాంటి అంశాలపై చర్చల్లోనూ ఆమె పాల్గొనేవారు’’ అని దేవిక చెప్పారు. ‘శరీరంపై హక్కులు ఉండాలి’ ‘‘మలయాళీ మహిళలకు ఆస్తిపై అధికారాలు, ఓటు హక్కు, ఉద్యోగాలు, గౌరవం, ఆర్థిక స్వాతంత్ర్యం లభించాయి. కానీ, ఎంత మందికి వారి వారి శరీరంపై హక్కులు ఉన్నాయి. మహిళల శరీరం పురుషులకు ఆనందాన్నిచ్చే ఓ వస్తువుగా చూసే మూర్ఖపు ఆలోచన వల్ల ఎంతో మంది మహిళలు హీన స్థితి అనుభవిస్తున్నారు’’ అని అన్నా చాందీ 1935లో రాశారు. కేరళకు ముందు నుంచీ ప్రగతిశీల ప్రాంతంగా పేరు ఉంది. ట్రావెన్‌కోర్ పాలన కాలం నుంచే కేరళలో చాలా వరకూ మాతృస్వామిక వ్యవస్థ నడుస్తూ ఉంది. ట్రావెన్‌కోర్ మహిళా పాలకుల కారణంగా మహిళల విద్య, సామాజికంగా, ఆర్థికంగా వారిని బలోపేతం చేయాల్సిన అవసరం గురించి సమాజంలో అవగాహన ఉంది. అయినా, అక్కడ కూడా మహిళలు వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చేది. ‘‘మహిళలకు తమ శరీరంపై హక్కు ఉండాలని అన్నా చాందీ వాదించారు. పెళ్లి విషయంలో పురుషుల కన్నా మహిళలకు తక్కువ హక్కులు ఉన్న విషయాన్ని కూడా ఆమె లేవనెత్తారు. ఆమె ఉన్న కాలానికి చాలా ఆధునికమైన భావాలు అవి’’ అని దేవిక అన్నారు. చట్టం కూడా మహిళలను, పురుషులను సమానంగా చూడాలని అన్నా చాందీ అభిప్రాయపడ్డారు. 1935లో ట్రావెన్‌కోర్ రాజ్యం చట్టంలో మహిళలకు ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని అన్నా తప్పుపట్టారని దేవిక చెప్పారు. ట్రావెన్‌కోర్ దర్బార్ దీవాన్ అన్నాను జిల్లా స్థాయి న్యాయ అధికారిగా నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి మలయాళీ మహిళగా అన్నాను భావిస్తారు. 1948లో ఆమె జిల్లా జడ్జి పదవి చేపట్టారు. 1959లో భారత్‌లో ఓ హైకోర్టులో జడ్జి పదవి చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు. మహిళలకు తమ శరీరంపై హక్కులు ఉండాలన్న డిమాండ్‌ను అన్నా చాందీ చాలా చోట్ల లేవనెత్తేవారు. ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్‌లో భారత్ వ్యాప్తంగా మహిళలకు గర్భ నిరోధక సాధనాల గురించి, పిల్లల ఆరోగ్యం గురించి సమాచారం ఇచ్చే క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ఈ విషయంలో మహిళా సభ్యుల నుంచే ఆమె వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. హైకోర్టు జడ్జి పదవి నుంచి రిటైరయ్యాక నేషనల్ లా కమిషన్‌లో అన్నా సభ్యురాలిగా చేరారు. అన్నా చాందీ భర్త పీసీ చాందీ పోలీసు అధికారిగా పనిచేసేవారు. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. (చిత్రాలు: గోపాల్ శూన్య) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అది 1928వ సంవత్సరం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అన్న విషయమై ట్రావెన్‌కోర్ రాజ్యంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. text: భారత పైలట్‌ను పట్టుకున్నామంటూ పాకిస్తాన్ సైన్యం ట్వీట్ చేసిన వీడియో నుంచి తీసిన చిత్రం ఇది. దీనిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు. అంతకుముందే, తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లున్నారని, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి ఉన్నారని, రెండో వ్యక్తిని తాము అరెస్టు చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. అరెస్టైన వ్యక్తికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి "నా పేరు వింగ్ కమాండర్ అభినందన్. నా సర్వీస్ నెంబర్ 27981. నేనో పైలట్‌ను, నా మతం హిందూ" అని చెప్పడం కనిపించింది. చుట్టూ ఉన్నవారు మరికొన్ని ప్రశ్నలు వేయగా... క్షమించండి, అంతవరకూ చెప్పడానికి మాత్రమే నాకు అనుమతి ఉంది అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. "నేనొక చిన్న సమాచారం తెలుసుకోవచ్చా, నేనిప్పుడు పాకిస్తాన్ సైన్యంతో ఉన్నానా?" అని ఆ వ్యక్తి అడగడంతో ఆ వీడియో ముగిసింది. ఈ వీడియోలో ఉన్నది భారత పైలట్ అభినందన్ అని పాకిస్తాన్ అంటుండగా, భారత ప్రభుత్వం మాత్రం దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఈ వ్యక్తి భారత పైలటేనా? "నేను ఈ మాటలను అధికారికంగానే చెబుతున్నా. ఒకవేళ నేను తిరిగి నా దేశానికి వెళ్లినా నా మాటల్లో మార్పు ఉండదు. పాకిస్తాన్ సైనిక అధికారులు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. వారు చాలా హుందాగా ప్రవర్తించారు. నాపై ఓ మూక దాడిచేయబోతే సైన్యం నన్ను రక్షించింది. నాకు పెళ్లైంది. నేను దక్షిణ ప్రాంతానికి చెందినవాడిని. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను." అని భారత పైలట్‌గా పాకిస్తాన్ చెబుతున్న వ్యక్తి మాట్లాడిన వీడియోను పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విటర్లో విడుదల చేశారు. తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు ఉన్నారని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ తాజా ట్వీట్‌లో మాత్రం... తమ అదుపులో ఒకే భారత పైలట్ ఉన్నారని, ఆయన వింగ్ కమాండర్ అభినందర్ వర్థమాన్ అనీ, ఆయనను మిలిటరీ నియమ నిబంధనల ప్రకారం చూసుకుంటున్నామని ట్విటర్లో వెల్లడించారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం చోటుచేసుకున్న పరిణామాల్లో ఓ మిగ్ విమానంతో పాటు ఓ పైలట్ కూడా గల్లంతైనట్లు భారత్ ధ్రువీకరించింది. text: ఉదయం 9 గంటలు, అది హైదరాబాద్‌లోని నిజాంపేట, బాచుపల్లి రహదారి. అటూ ఇటూ వాహనాలు దూసుకుపోతున్నాయి. నెలలు నిండిన ఒక మహిళ రోడ్డు దాటడానికి చాలా అవస్థలు పడుతోంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఒక మహిళ ఆమె చేతిని అందుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించి, తన ఆటోలో కూర్చోబెట్టుకొని ఆసుపత్రి ముందు ఆపింది. ఆ మానవి పేరు వెన్నపూస నారాయణమ్మ. వృత్తి ఆటో డ్రైవింగ్. లేడీ ఆటో డ్రైవర్.. పోకిరీలు కనిపిస్తే భరతం పడతారు! బాచుపల్లి సమీపంలోని రాజీవ్‌గాంధీ నగర్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న రేకుల షెడ్డులో ఉంటున్న నారాయణమ్మను బీబీసీ పలకరించింది. తన ఆటుపోట్ల జీవితాన్ని 'ఆటో' ఎలా మలుపు తిప్పిందో ఆమె ఇలా వివరించారు. ''మాది కడప జిల్లా బుజ్జాయిపల్లి గ్రామం. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువుకోలేదు. మా కుటుంబ పరిస్థితుల వల్ల నాకు టీనేజ్‌లోనే పెళ్లి చేశారు. 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చాం. నా భర్త ఓ ప్రైవేట్‌ కంపెనీలో కార్మికుడు. ఆయనకు వచ్చే జీతం చాలా తక్కువ. నాకు ఎక్కడా పని దొరకలేదు. ఇద్దరు పిల్లలను చదివించడం, కుటుంబాన్ని పోషించడం చానా కష్టం అయ్యేది. ఇలా బతకడం కష్టమని మళ్లీ వెనక్కు పోదామని అనుకుంటున్న సమయంలో ఆటో నడపడంపై ఆసక్తి కలిగింది. ప్రయాణికులతో ఎలా మెలగాలో, వారి నుంచి సమస్యలు వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలో ఓ అవగాహన వచ్చింది. వెంటనే ఆటో నడపడం మొదలుపెట్టాను. పన్నెండేళ్ల నుంచి నడుపుతున్నాను.'' హైదరాబాద్‌లో మగవాళ్లు తప్ప ఆడవారు ఆటోలు నడపకపోవడం గమనించి, స్వయంగా తనకు తానే ఆటో డ్రైవింగ్‌ నేర్చుకున్నారు నారాయణమ్మ. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. రాత్రి 11 గంటల దాకా.. ''నేను ఆటో నడుపుతుంటే రోడ్డు మీద అందరూ వింతగా చూస్తారు. కానీ, ప్రయాణికుల వల్ల నాకు ఎన్నడూ ఇబ్బంది కలగలేదు. మగ ఆటో డ్రైవర్‌లు కూడా నాతో చాలా గౌరవంగా ఉంటారు. ఈ పనిలో మహిళగా నేను ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. మన పరిధిలో మనం ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు. ఉదయం 5 గంటలకే లేచి నా భర్త సాయంతో వంట పనులు పూర్తి చేసుకుని ఆటో స్టార్ట్ చేస్తా. రాత్రి 11 గంటల వరకు నడుపుతా. చిన్న పిల్లలను, నెలలు నిండిన వారిని, వృద్ధులను ఉచితంగానే ఆసుపత్రుల దగ్గరకు తీసుకెళ్తాను. ఎక్కడైనా పోకిరీలు అమ్మాయిలను ఇబ్బంది పెడితే వారికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పచెబుతా'' అని నారాయణమ్మ వివరించారు. పిల్లల ఉన్నత చదువులు ఆటో నడపటం వృత్తిగా ఎంచుకున్నాక నారాయణమ్మ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కింది. రోజుకు రూ.700 నుండి రూ.1,200 వరకు ఆదాయం వస్తోందని ఆమె చెప్పారు. ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. మానిష్‌ ఇంజినీరింగ్, మౌనిక ఎం ఫార్మసీ చదువుతున్నారు. బాచుపల్లిలో సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నారు. ఉచితంగా డ్రైవింగ్‌ నేర్పిస్తా ''భయం అనే దాన్ని పక్కన పెట్టి కొంచెం ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మహిళలకు ఆటోడ్రైవింగ్‌ ఎంతో సురక్షితం. లాభదాయకం. ఈ రంగంలోకి రావాలనుకునేవారికి నేను ఉచితంగానే డ్రైవింగ్‌ నేర్పుతాను. వాదా ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే నలుగురు అమ్మాయిలకు నేర్పించాను. మరింత మందికి నేర్పించడానికి స్వయంగా శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా'' అని నారాయణమ్మ చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆమె తన వంతు సాయం అందిస్తున్నారు. తన ఆటోలో వికాలాంగులు, వృద్ధులు, పరీక్షలకు వెళ్లే విద్యార్ధులకు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అంతే కాదు, ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఉచితంగా, వెంటనే ఆసుపత్రికి చేరుస్తూ ఆమె మానవీయతను చాటుతున్నారని స్థానికులంటున్నారు. 'తనకు భయం తెలియదు' ''ఆమెలో మానసిక స్థైర్యం ఎక్కువ. మా పెళ్లయిన కొత్తలో ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురైనా ఆమె ధైర్యంగా నిలబడింది. 'ఆడదానివి' ఆటో నడుపుతావా? అని ఎందరో హేళన చేశారు. అయినా లెక్క చేయకుండా తను అనుకున్న పనిలో ముందుకు సాగింది. అందుకే తను ఆటో నడుపుతానంటే నేను కాదనలేదు. ఇపుడు హైదరాబాద్‌లో ఏ మూలకైనా వెళ్లగలదు. తన తోటి మహిళలకు అండగా ఉంటుంది. ప్రయాణికులు ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది తప్ప ఎక్కువ వసూలు చేయదు. నిజాయితీగా బతకడంలో ఉండే ఆనందం మాకు తెలిసింది. నేను విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ వైండింగ్‌ పనులు చేస్తాను. మా ఇద్దరి శ్రమతో కుటుంబం సాఫీగా సాగిపోతోంది'' అంటారు నారాయణమ్మ భర్త బాల చెన్నారెడ్డి. భర్త బాల చెన్నారెడ్డితో నారాయణమ్మ సురక్షితంగా ఆసుపత్రికి... ''నాకు నెలలు నిండాయి. తరచూ అసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. నారాయణమ్మ ఆటోలోనే వెళ్తాను. నాలాంటి గర్భిణీలను ఆమె ఉచితంగానే ఆటోలో తీసుకెళ్తారు'' అని చెప్పారు నిజాంపేటకు చెందిన మమత. ఆమె ఎంతో స్ఫూర్తి ''ఇంట్లోంచి అడుగు బయట పెట్టేందుకే కొందరు మహిళలు భయపడుతుంటారు. కానీ నారాయణమ్మ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆటో నడపడం గొప్ప విషయం. పురుషుల కంటే ధైర్యంగా హైదరాబాద్‌ రోడ్ల మీద సురక్షితంగా ఆమె ఆటో నడుపుతారు. మహిళలు డ్రైవింగ్‌ ఫీల్డ్‌లోకి రావడానికి ఆమె జీవితమే స్ఫూర్తి'' అంటున్నారు ఆమె తోటి ఆటో డ్రైవర్‌ ఓబులేసు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆటోలు నడపడమంటే 'మగవారు చేసే పని' అనుకునే రోజుల్లో.. ఆటో డ్రైవర్‌గా మారి తన కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించిన ఓ మహిళ కథ ఇది. text: ఇది 2019 లోక్‌సభ ఎన్నికల వరకే కాదని, శాశ్వతంగా కలిసి నడుస్తామని బీఎస్పీ సుప్రీమో మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 38-38 స్థానాల్లో పోటీ చేస్తామని రెండు పార్టీలూ చెప్పాయి. రాయ్‌బరేలీ, అమేథీ సీట్ కాంగ్రెస్ కోసం విడిచిపెట్టాయి. మరో రెండు స్థానాలను సహచర పార్టీలకు ఇచ్చాయి. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన మాయావతి ఆనాటి గెస్ట్ హౌస్ గొడవను ప్రస్తావించడం మాత్రం మర్చిపోలేదు. దేశప్రయోజనం కోసమే తాము ఆ గొడవను పక్కన పెట్టామని మాయావతి స్పష్టం చేశారు. "1993 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అప్పుడు ఎస్పీ-బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే ఆ పొత్తు కొన్ని తీవ్రమైన కారణాల వల్ల ఎక్కువ కాలం నడవలేకపోయింది. దేశ ప్రయోజనాల కోసం 1995లో జరిగిన లక్నో గెస్ట్ హౌస్ గొడవను పక్కన పెట్టాలనుకున్నాం. రెండు పార్టీలు సఖ్యతతో ఉండాలని నిర్ణయించాం" అని మాయావతి అన్నారు. ఎస్పీతో దూరం ఎందుకు పెరిగింది? కానీ రెండు పార్టీల స్నేహం హఠాత్తుగా శత్రుత్వంగా మారిపోయేంతగా అప్పట్లో లక్నో గెస్ట్ హౌస్‌లో ఏం జరిగింది. అది తెలుసుకోవాలంటే మనం 28 ఏళ్ల ముందుకు వెళ్లాల్సుంటుంది. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 1995, గెస్ట్ హౌస్ గొడవ రెండూ చాలా కీలకం అయ్యాయి. భారత రాజకీయ ముఖచిత్రమే మారిపోయేంతగా, ఆరోజు మాయావతి, ములాయం మధ్య అగాథం ఏర్పడింది. నిజానికి 1992లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదే రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోడానికి వ్యూహాత్మకంగా బహుజన్ సమాజ్ పార్టీతో చేతులు కలిపారు. గెస్ట్ హౌస్ గొడవ ఎందుకు? ఎస్పీ 256, బీఎస్పీ 164 స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. ఎస్పీ 109 సీట్లు గెలుచుకోగా, 67 స్థానాల్లో బీఎస్పీ విజయం సాధించింది. కానీ రెండు పార్టీల పొత్తు చాలా రోజులు సాగలేకపోయింది. 1995 వేసవిలో రెండు పార్టీల పొత్తుకు తెరపడే సమయం వచ్చింది. దీన్లో గెస్ట్ హౌస్ ప్రధాన పాత్ర పోషించింది. ఆ రోజు జరిగిన ఘటనతో బీఎస్పీ ప్రభుత్వానికి తమ మద్దతు వెనక్కు తీసుకుంది. ఎస్పీ ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేసింది. మాయావతికి బీజేపీ అండగా నిలిచింది. బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ మద్దతు ఇస్తుందని అప్పటి స్పీకర్ మోతీలాల్ వోరాకు కొన్ని రోజుల్లోనే లేఖ అందింది. సీనియర్ విలేకరి, గొడవ జరిగిన ఆ రోజు గెస్ట్ హౌస్ బయట ఉన్న శరత్ ప్రధాన్ బీబీసీతో "ఆ సమయంలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఉంది. అప్పుడు బీఎస్పీ వారికి మద్దతిచ్చింది. కానీ ప్రభుత్వంలో భాగం కాలేదు" అని చెప్పారు. "రెండు పార్టీల పొత్తు ఏడాదంతా నడిచింది. తర్వాత మాయావతి బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత కొంత కాలానికే మాయావతి ఎస్పీకి తన నిర్ణయం తెలిపారు". గెస్ట్ హౌస్‌లో బీఎస్పీ సమావేశం "మద్దతు వెనక్కు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత మాయావతి గెస్ట్ హౌస్‌లో తమ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. దీంతో బీఎస్పీ, బీజేపీ కలుస్తున్నాయని, ఆమె తమతో పొత్తు తెంచుకుంటోందని ఎస్పీ నేతలకు ఎలాగోలా సమాచారం అందింది". "సమాచారం తెలీగానే ఎస్పీ నేతలు పెద్ద సంఖ్యలో గెస్ట్ హౌస్ బయట గుమిగూడారు. కొంత సేపటికి గెస్ట్ హౌస్ లోపల గదిలో సమావేశం జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న బీఎస్పీ నేతలను కొట్టడం మొదలు పెట్టారు. అదంతా మా కళ్ల ముందే జరిగింది" అని ప్రధాన్ చెప్పారు. "దాంతో మాయావతి వేగంగా పారిపోయి ఒక గదిలో దాక్కున్నారు. లోపల నుంచి గడియ పెట్టుకున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు సికిందర్ రిజ్వీ. ఆ సమయంలో పేజర్లు ఉండేవి. రిజ్వీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తలుపు తెరవద్దని నాకు పేజర్‌లో మెసేజ్ పంపించారు" అన్నారు. "తలుపును కొడుతున్నారు. బీఎస్పీ నేతల్లో చాలా మందిని బాగా కొట్టారు. వారిలో కొంతమందికి రక్తం కారుతోంది. కొంతమంది మాత్రం పారిపోగలిగారు". "అప్పుడు బీఎస్పీ నేతలు పోలీసులకు కూడా ఫోన్ చేశారు. కానీ అప్పుడు ఎవరూ ఫోన్ తీయలేదు" అని ప్రధాన్ చెప్పారు. మాయావతి గదిలో దాక్కోగానే.. "ఈలోపు ఎస్పీ కార్యకర్తలు మాయావతి దాక్కున్న గది తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. వాళ్ల నుంచి కాపాడుకోవడానికి లోపల ఉన్న వాళ్లు తలుపులకు సోఫాలు, టేబుళ్లు అడ్డం పెట్టారు. తలుపులు ఎవరూ లోపలికి రాకుండా చేయాలని అనుకున్నారు". సీనియర్ జర్నలిస్ట్ రామ్ దత్త్ త్రిపాఠీ ఈ ఘటనతో దిల్లీకి లింకుంది అని చెబుతారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు అందరికీ షాక్ తగిలింది. తర్వాత 1993లో బీజేపీని అడ్డుకోడానికి ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ములాయంను ముఖ్యమంత్రి చేశాయి. దాంతో లక్నోలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫలిస్తే ముందు ముందు చాలా సమస్యలు వస్తాయని బీజేపీ భావించింది. అందుకే బీజేపీ నుంచి బీఎస్పీకి ఆఫర్ వెళ్లింది. ఎస్పీతో పొత్తు వదులుకుంటే బీజేపీ మద్దతుతో మాయావతికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుందని చెప్పారు. ములాయంకు అదే సందేహం వచ్చింది. ఆయన సభలో కూడా తన మెజారిటీ నిరూపించుకోవాలని అనుకున్నారు. కానీ స్పీకర్ ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. మాయాను ఎవరు కాపాడారు? ఇదంతా జరుగుతున్నప్పుడు బీఎస్పీ ఎమ్మెల్యేలు అందరూ స్టేట్ గెస్ట్ హౌస్‌లో సమావేశం అయ్యారు. మాయావతి కూడా అక్కడికి వచ్చారు. అప్పుడే ఎస్పీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ నేతలు అప్పుడు మాయావతిని కిందకు తోసేశారని బీఎస్పీ ఆరోపించింది. ఆమెపై హత్యాయత్నం జరిగిందిని కేసు పెట్టింది. దాన్నే గెస్ట్ హౌస్ గొడవ అంటారు. ఆ సమయంలో బీజేపీ నేతలు మాయావతిని కాపాడ్డానికి అక్కడకు చేరుకున్నారని చెబుతారు. కానీ శరత్ ప్రధాన్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. "మాయావతి మీడియా వల్లే బయటపడ్డారు. ఆ సమయంలో గెస్ట్ హౌస్ బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఎస్పీ నేతలు అక్కడి నుంచి మీడియాను పంపించేయాలని ప్రయత్నించారు. కానీ అది వారికి సాధ్యం కాలేదు" అన్నారు. హత్య చేయాలనుకున్నారు-మాయావతి గెస్ట్ హౌస్ గొడవ జరిగిన తర్వాత రోజే బీజేపీ నేతలు స్పీకర్ దగ్గరికి వెళ్లారు. బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు ఇస్తామని తెలిపారు. అప్పుడే కాన్షీరాం మాయావతిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అప్పటి నుంచే మాయా ఒక్కో మెట్టూ ఎక్కడం ప్రారంభించారు. ఆ రోజు జరిగిన గొడవ గురించి మాయవతి ఎప్పుడైనా బహిరంగంగా చెప్పారా? అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరించారా? సమాధానంగా "ఆ.. చాలాసార్లు చెప్పారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో ఆమె స్వయంగా ఆ విషయం చెప్పారు. ఆరోజు తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్నారు అని ప్రధాన్ తెలిపారు. "ఆ రోజు గెస్ట్ హౌస్‌లో జరిగిన గొడవల వల్ల తన ప్రాణాలే పోయేవన్న విషయం మాయావతి మర్చిపోలేకపోయారు కాబట్టే మాయావతికి సమాజ్ వాదీ పార్టీ అంటే ద్వేషం అని భావిస్తారు". ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. text: నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బీజేపీ నేత దిలీప్ సంఘానీ శనివారం అమ్రేలీలో జరిగిన ఒక కార్యక్రమంలో కురియన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "వర్గీస్ కురియన్ అమూల్ డబ్బు నుంచి గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో మతమార్పిడుల కోసం నిధులు అందించేవార"ని దిలీప్ సంఘానీ అన్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. అయితే బీబీసీ ప్రతినిధి అనంత్ ప్రకాశ్‌తో మాట్లాడిన దిలీప్ సంఘానీ అమ్రేలీలోని అమర్ డెయిరీలో తను అన్న మాటల్లో ఆఖరి వాక్యాన్ని ముక్కలు చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. "నేను ఆయన్ను గౌరవిస్తాను. ఆయన సమర్థత గురించి నేను చెప్పాల్సిందేం లేదు. కానీ గుజరాత్‌ డాంగ్ జిల్లాలో శబరీధామ్ నిర్మించిన వారు చందాల కోసం ఆయన దగ్గరకు వెళ్లినపుడు కురియన్ మాకు ఇలాంటి వాటిపై విశ్వాసం లేదని తిరస్కరించారు. కానీ అదే సమయంలో తన పదవీకాలంలోనే ఆయన క్రైస్తవ సంస్థలకు చందాలు ఇచ్చారు" అన్నారు. బీజేపీ నేత తన వ్యాఖ్యను సమర్థించుకున్నారు. అయితే దిలీప్ సంఘానీ వ్యాఖ్యలపై అమూల్ వైపు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. వర్గీస్ కురియన్ ఎవరు? కేరళలో జన్మించిన వర్గీస్ కురియన్ సహకార డెయిరీ అభివృద్ధి కోసం గుజరాత్ ఆనంద్‌లో ఒక విజయవంతమైన మోడల్‌ను స్థాపించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిపారు. కురియన్ 1973లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) స్థాపించారు. 34 ఏళ్ల వరకు దానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ జీసీఎంఎంఎఫ్ సంస్థే తర్వాత అమూల్ పేరుతో డెయిరీ ఉత్పత్తుల సంస్థగా మారింది. ఈ సంస్థలో 11 వేల గ్రామాల్లో 20 లక్షల మందికి పైగా రైతులు సభ్యులుగా ఉన్నారు. సహకార రంగంలో పాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో ఇది కొత్త చరిత్రను లిఖించింది. కురియన్‌ జీవితకాలంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలతో గౌరవించింది. 1965లో కురియన్ రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. వర్గీస్ కురియన్ ఆనంద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఐఆర్ఎంఎ) అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆయనను 'భారతదేశ మిల్క్‌మ్యాన్' అని పిలుచుకుంటారు. ఒకప్పుడు భారతదేశంలో పాల లోటు ఏర్పడింది. దాంతో, పాల ఉత్పత్తిలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా కురియన్ నేతృత్వంలో చర్యలు ప్రారంభమయ్యాయి. 90వ దశకంలోకి అడుగుపెట్టగానే భారత్ పాల ఉత్పత్తిలో అమెరికాను కూడా వెనక్కు నెట్టిందని చెబుతారు. దిలీప్ సంఘానీ చందాల వివాదం కానీ క్రైస్తవ సంస్థలకు చందా ఇచ్చారని వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత వర్గీస్ కురియన్ ఉద్దేశంపైనే ప్రశ్నలు లేవనెత్తారు. అయితే చందా ఇవ్వడం అనేది ఏదైనా ఒక సంస్థకు ప్రత్యేక హక్కు అవుతుందా? "హిందూ సంస్థ శబరీధామ్ చందా ఇవ్వాలని ఆయన్ను చాలా వేడుకుంది. కానీ వర్గీస్ కురియన్ మాకు అలాంటివాటిపై విశ్వాసం లేదని చెప్పేశారు. ఆయన ఎవరికీ చందా ఇచ్చుండకూడదు. ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఇవ్వకపోవడం చేసుండకూడదు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి" అని సంఘానీ తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈ అంశంపై సంఘానీ ఏం చేశారు? "మేం దీనిపై విచారణ చేయించాం. మా విచారణలో ఆయన శబరీధామ్ కోసం చందా ఇవ్వడానికి నిరాకరించారని తెలిసింది. కానీ క్రిస్టియన్ మిషనరీస్‌కు మాత్రం చందా ఇచ్చారు. అయితే ఇందులో ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి వాటి వల్ల కొందరి మనస్తత్వాలు తెలుస్తాయి. వర్గీస్ కురియన్ చారిత్రక రాజీనామా వర్గీస్ కురియన్ తప్పుడు పద్ధతుల్లో 15 ఏళ్ల వరకూ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్నారని కూడా బీజేపీ నేత ఆరోపించారు. 2006లో ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో కురియన్ అమూల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు చెందిన సభ్యుల సహకార సమితుల విశ్వాసాన్ని కోల్పోవడంతో తను రాజీనామా చేసినట్టు అప్పట్లో కురియన్ బీబీసీకి చెప్పారు. వర్గీస్ కురియన్‌కు వ్యతిరేకంగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌లో అవిశ్వాసం తీసుకొచ్చారు. సంస్థ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన నింపిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ రద్దు చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వర్గీస్ కురియన్. ఆయన జీవించి ఉంటే ఈరోజు 97 ఏట అడుగుపెట్టుండేవారు. కానీ భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడైన ఆయన చనిపోయిన ఆరేళ్ల తర్వాత కురియన్ పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. text: దేశంలో వైద్య విద్యకు సంబంధించి అతి పెద్ద సంస్కరణగా కేంద్రం ఈ బిల్లును అభివర్ణిస్తుంది. ఈ బిల్లు వల్ల వైద్య విద్యలో పారదర్శకత ఏర్పడుతుందని, మెడికల్ కళాశాలల్లో తనిఖీల ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్య ఏకీకృత విధానంలో నడుస్తుందని పేర్కొంటోంది. అయితే, ఈ బిల్లును వైద్య సంఘాలు, మెడిసన్ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంబీబీఎస్ అర్హత లేకుండా స్వల్పకాలిక కోర్సులతో వైద్యులుగా మారి ప్రాక్టీస్ ప్రారంభిస్తే ప్రజల ప్రాణాలకే ప్రమాదని.. దీన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్లు పరిస్థితి ఏమిటి? 'ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956'ను రద్దు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్రం ఈ బిల్లులో పెట్టింది. ఇప్పటికే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. తొలుత లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, కొత్తగా రెండు సవరణలు జతచేయడంతో దీన్ని మళ్లీ లోక్‌సభలో పాస్ చేయాల్సి ఉంది. బిల్లులోని కీలకాంశాలు బిల్లుపై ఎవరేమన్నారు? ఈ బిల్లుపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ నకిలీ వైద్యులకు ఈ బిల్లు అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేసేవారికి ఏడాది జైలు శిక్షతో, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదనను బిల్లులో చేర్చినట్లు చెప్పారు. ఈ బిల్లును అనుసరించి వైద్య విద్యార్థులకు నెక్ట్స్ (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. 'నెక్ట్స్‌ పరీక్షనే మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌గా, విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ టెస్ట్‌గా పరిగణిస్తాం' అని తెలిపారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.. ఈ బిల్లుపై చర్చ సమయంలో లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు డాక్టర్ కకోలీ ఘోష్ దస్తీదార్ తన ప్రసంగంలో పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. 'సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా దేశంలోని వైద్యవ్యవస్థ మొత్తాన్నీ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం ఈ మెడికల్ కౌన్సిల్ బిల్లు. ఆరోగ్య రంగానికి కేంద్ర బడ్జెట్లో 2 శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తున్నాం. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి కేవలం 10 లక్షల మంది వైద్యులే ఉన్నారు. ఆర్నెళ్ల కోర్సుతో వైద్యం చేసేయగలిగితే ఇక నాలుగైదేళ్ల కోర్సులెందుకు? ఇంటర్మీయట్ తరువాత ఆర్నెళ్ల కోర్సు చదివేసి వైద్యం మొదలుపెట్టి ప్రజలు ప్రాణాలు తీసి జనాభా తగ్గించేస్తారా.. ఇది ఎంతమాత్రం సహించరానిది. మరిన్ని వైద్య సీట్లు, బోధకులు, పరికరాలు, వసతుల కోసం నిధులు కేటాయించాలి. ప్రపంచంలో వస్తున్న నూతన వైద్య విధానాలూ మనమూ అందిపుచ్చుకునేలా రీసెర్చిని ప్రోత్సహించాలి. సకాలంలో వైద్యం అందించగలిగితే మృత్యువు వరకు వెళ్లినవారిని కూడా బతికించే అవకాశం ఉంటుంది'' అన్నారామె. జూనియర్ డాక్టర్ల అభ్యంతరం ఇదీ.. బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జీజీహెచ్‌ శాఖ అధ్యక్షుడు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంబీబీఎస్‌ అర్హత లేని వారు అడ్డదారిన డాక్టర్లుగా మారి వైద్యం చేస్తే రోగుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందన్నారు. వీరికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) గుంటూరు నగర అధ్యక్షురాలు డాక్టర్‌ పమిడి ముక్కల విజయ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదం పొందిన ఎన్‌ఎంసీ బిల్లు వల్ల ఎంతో కష్టపడి ఎంబీబీఎస్‌ వైద్య చదివే విద్యార్థులకు, వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)ను ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. text: దిల్లీ మహారాణీ బాగ్‌లో నివసించే పాయల్( పేరు మార్చాం) ఆ రోజులను గుర్తు చేసుకుని ఇప్పుడు బాధపడుతోంది. ఆమె జీవితంలో గడిచిన పదేళ్లు చాలా కఠినమైనవి. దానికంతటికీ ఆమె ముఖంపై వెంట్రుకలు ఉండడమే కారణం. పురుషుల్లా ముఖంపై వెంట్రుకలు "నేను స్కూలుకు వెళ్తున్నప్పుడు వెంట్రుకలు లేవు. కానీ, కాలేజికి వెళ్లడం ప్రారంభించాక ముఖంపై సగభాగంలో వెంట్రుకలు వచ్చాయి. మొదట చిన్న చిన్న వెంట్రుకలు రావడంతో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఉన్నట్టుండి అవి పొడవుగా నల్లగా కనిపిచడం మొదలయ్యాయి. వాక్సింగ్ చేయించేదాన్ని, కానీ ఐదు రోజుల్లోనే వెంట్రుకలు మళ్లీ వచ్చేసేవి. దాంతో నేను వాటిని షేవ్ చేసుకోవడం మొదలెట్టా" అంటుంది పాయల్. "ఒక రోజు నాన్న రేజర్ కనిపించలేదు, అమ్మ కూడా నాన్నతో కలిసి అది వెతుకుతోంది. కానీ, తనకు కూడా దొరకలేదు. కాసేపటి తర్వాత నాన్న "పాయల్‌ను అడుగు, షేవ్ చేసుకోడానికి, తనేమైనా తీసుకెళ్లిందేమో అన్నాడు" అని అప్పటి ఘటనలను పాయల్ గుర్తు చేసుకుంది. పదేళ్లలో పాయల్ ఇలాంటివి ఎన్నో వాటిని భరించింది. మందులు వేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో పాయల్ లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని నిర్ణయించింది. మొదట లేజర్ ట్రీట్‌మెంట్ గురించి ఆమె చాలా భయపడేది. చివరికి వారం వారం ఎదురయ్యే వెంట్రుకల సమస్య నుంచి విముక్తి పొందడానికి లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంది. దిల్లీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సురుచి పురీ, "మన సమాజంలో ఏ అమ్మాయైనా తన ముఖంపై వెంట్రుకలు వస్తే అవమానంగా భావిస్తుంది. బయోలాజికల్ సైకిల్‌లో గందరగోళం వల్ల ఇలాంటివి జరుగుతాయని ఎక్కువ మందికి తెలీదు" అని తెలిపారు. మొదట కారణం తెలుసుకోవాలి? డాక్టర్ సురుచి ఫెమినా మిస్ ఇండియా-2014 ఈవెంట్‌కు అధికారిక డెర్మటాలజిస్టుగా ఉన్నారు. "ముఖంపై వెంట్రుకలు రావడానికి రెండు కారణాలు ఉండచ్చు. వెంట్రుకలు జన్యుపరమైన ( జెనెటిక్) కారణాలతో రావచ్చు. లేదా హార్మోన్స్‌లో తలెత్తిన తేడాల వల్ల రావచ్చు. హార్మోన్స్ సంతులనం తప్పడం వల్ల కూడా అలా ముఖంపై వెంట్రుకలు వస్తాయి" అని సురుచి తెలిపారు. "మనిషి శరీరంపై కొన్ని వెంట్రుకలు కచ్చితంగా ఉంటాయి. అలాంటప్పుడు అమ్మాయిల శరీరంపై కాస్త ఎక్కువ వెంట్రుకలు ఉన్నంతమాత్రాన దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ, వెంట్రుకలు చాలా ఎక్కువగా ఉంటే కచ్చితంగా డాక్టరును సంప్రదించాలి" ముఖంపై చాలా ఎక్కువ వెంట్రుకలు ఉండే స్థితిని 'హైపర్ ట్రయికోసిస్' అంటారు. జన్యుపరమైన కారణాలతో ముఖంపై వెంట్రుకలు వస్తే దానిని 'జెనెటిక్ హైపర్ ట్రయికోసిస్' అంటారు. ఆ సమస్య హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల వస్తే దానిని 'హర్‌స్యూటిజం' అంటారని డాక్టర్ సురిచి వివరించారు. హార్మోన్లలో గందరగోళం తలెత్తడానికి పీసీఓడీ( పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్) పెద్ద కారణం కావచ్చని డాక్టర్ సురుచి చెప్పారు. ఈరోజుల్లో అది చాలా వేగంగా పెరుగుతోందని తెలిపారు. అయితే పీసీఓడీ రోగులు అందరికీ ముఖంపై వెంట్రుకలు రావడం జరగదని వివరించారు. పీసీఓడీకి ఎక్కువగా మన లైఫ్‌స్టైల్ కారణం అవుతుంది. మన ఆహార అలవాట్లు, బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించే స్టెరాయిడ్స్, గంటలకొద్దీ ఒకే విధంగా కూచోవడం, ఒత్తిడికి గురికావడం వంటివన్నీ పీసీఓడీని మరింత పెంచే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావం వల్ల మహిళల్లో టెస్టోస్టిరాన్, ఎండ్రోజెన్ లాంటి హార్మోన్లు పెరుగుతాయని డాక్టర్ సురుచి చెప్పారు. ఎవరైనా ఒక అమ్మాయి ముఖంపై చాలా ఎక్కువగా వెంట్రుకలు ఉంటే, వారు మొదట దానికి కారణం తెలుసుకునే ప్రయత్నంచేయాలి. కారణం హార్మోన్లే అయితే జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఎక్కువ కేసుల్లో మందులు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. లేజర్ ట్రీట్‌మెంట్ తప్పదా? మందుల వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందని పాయల్ అనుకోలేదు. "నేను పదేళ్ల వరకూ హోమియోపతి మందులు వాడాను. అందరూ నేను ఖరీదైన వైద్యం చేయించుకోలేదు కాబట్టే ఫలితం కనిపించలేదని అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. నేను దిల్లీలోని చాలా పెద్ద పెద్ద హోమియోపతి డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకున్నా. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు". పాయల్ రెండేళ్ల క్రితమే లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె ముఖంపై కొత్తగా వెంట్రుకలు రాలేదు. పాయల్ డాక్టర్ సురిచి చెప్పింది పూర్తిగా నిజమే అంటుంది. "నా ప్రాబ్లం హార్మోన్స్ వల్ల వచ్చింది. ఎందుకంటే నా పీరియడ్స్ టైమ్‌కు వచ్చేవి కాదు. అది కూడా ఒకే రోజు ఉండేది. దానివల్ల ముఖంపై వెంట్రుకలే కాదు, నా బరువు కూడా పెరుగుతూ వచ్చింది. లేజర్ చేయించుకునే ముందు నేను బరువు తగ్గించుకున్నా, ఆహారంలో మార్పులు చేశా, లైఫ్‌స్టైల్‌ మార్చుకున్నా, ఇప్పుడు ముందుకంటే మెరుగ్గా ఉంది" అంటుంది పాయల్. అయినా ఇది అంత పెద్ద సమస్యా? "మా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎక్కువగా త్రెడింగ్ కోసమే వస్తుంటారు. ఐబ్రో, అపర్ లిప్స్ కాకుండా కొంతమంది అమ్మాయిలు ముఖం అంతా త్రెడింగ్ చేయించుకుంటారు" అని దిల్లీలోని మిరకిల్ బ్యూటీ పార్లర్‌లో పనిచేసే రచన చెప్పారు. "మా దగ్గరకు వచ్చే అమ్మాయిలు కొంతమంది ముఖంపై పూర్తిగా త్రెడింగ్ చేయించుకుంటారు. ఎందుకంటే వారి ముఖంపై మిగతా అమ్మాయిలకంటే ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. కొంతమంది వాక్స్ కూడా చేయించుకుంటారు. వారికి బ్లీచ్ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆ వెంట్రుకలు చాలా పెద్దవిగా ఉంటాయి"అంటారు రచన. తన దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో చాలా మంది తమ ముఖంపై ఉన్న వెంట్రుకల గురించి చాలా ఆందోళన పడుతుంటారని రచన చెప్పారు. డాక్టర్ సురుచి కూడా అదే అంటారు. "ముఖంపై ఉన్న వెంట్రుకల ప్రభావం ఎక్కువగా మెదడుపై పడుతుంది. దానివల్ల కాన్ఫిడెన్స్‌పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది" అని చెప్పారు. మహిళల్లో కూడా పురుషుల హార్మోన్లు ఉంటాయని దిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ ఎండోక్రినాలజిస్ట్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ సుజిత్ ఝా చెప్పారు. "కానీ, అవి చాలా తక్కువగా ఉంటాయి. ఆ హార్మోన్ల లెవల్ పెరిగినప్పుడు, ముఖంపై వెంట్రుకలు వస్తాయి" అన్నారు. దీనికి ప్రధాన కారణం పీసీఓడీనే. దాని వల్ల హార్మోన్ల సంతులనం ఉండదు. ఎక్కువ బరువు ఉన్న వారిలో పీసీఓడీ ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి అని డాక్టర్ సుజిత్ అంటారు. "మొదట ముఖంపై వెంట్రుకలు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అది జెనెటిక్ వల్లా, లేక హార్మోన్ల వల్లా అన్నది గుర్తించాలి. అవి కాకుండా ముఖంపై హఠాత్తుగా వెంట్రుకలు వస్తే అది కేన్సర్ లక్షణం కూడా కావచ్చు. కానీ ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి" అని సుజిత్ తెలిపారు. ప్రపంచ రికార్డ్ సృష్టించిన గడ్డం బ్రిటన్‌లో నివసించే హర్మాన్ కౌర్ గడ్డం ఉన్న అత్యంత చిన్న వయసు మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటికి హర్మాన్ వయసు 16 ఏళ్లు. ఆ వయసులో తనకు పాలిసిస్టిక్ సిండ్రోమ్ ఉందని, దాని వల్ల తన ముఖం, శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయని ఆమెకు తెలిసింది. శరీరం, ముఖంపై ఉన్న వెంట్రుకల వల్ల ఆమె స్కూల్లో ఎన్నో అవమానాలు భరించింది. చాలాసార్లు ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంది. ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ, ఇప్పుడు ఆమె స్వయంగా తన కొత్త రూపాన్ని స్వీకరించింది. గత కొన్నేళ్లుగా తన ముఖంపై ఉన్న వెంట్రుకలు తీయించుకోకుండా ఉంది. "వాక్సింగ్ వల్ల చర్మం కోసుకుపోతుంది. బిగుతుగా అవుతుంది. నా చర్మంపై ఎన్నోసార్లు గాయాలయ్యాయి. వాటికి చెక్ పెట్టాలంటే గడ్డం పెంచడమే మంచిదని అనుకున్నా. అని హర్మాన్ వివరించింది". తన నిర్ణయం చాలా కఠినమైనదని హర్మాన్‌కు తెలుసు. కానీ, ఆమెకు తన మీసాలు, గడ్డం వల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులూ లేవు. బదులుగా ఆమె గడ్డం అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. "నా గడ్డానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏ పురుషుడికో ఉన్న గడ్డం కాదు, ఇది ఒక మహిళ గడ్డం అంటుంది" హర్మాన్. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "అందరూ శరీరాన్ని దాచుకోవడం కోసమే బట్టలు వేసుకుంటారు. కానీ నేను ముఖం దాచుకోడానికి కూడా బట్టలు కట్టుకోవాల్సి వచ్చేది. ముఖానికి గుడ్డ కట్టుకోకుండా నేను ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి వెళ్లలేకపోయేదాన్ని. ఉక్కపోతగా ఉన్నా, వర్షం పడుతున్నా, పదేళ్లు నా ముఖానికి గుడ్డ కట్టుకునే వెళ్లా." text: 3 రోజుల్లో 3 వేల మంది హత్య 33 సంవత్సరాల క్రితం ఘటన 33 సంవత్సరాల క్రితం దిల్లీ వీధులు రక్తసిక్తమయ్యాయి. 1984 అక్టోబర్ 31న భారత ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డులు కాల్చి చంపారు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇందిరను చంపిన బాడీగార్డులు సిక్కులని తెలియడంతో ప్రతీకారంగా దిల్లీలోని సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. 3వే ల మందిని హతమార్చారు. వేల మంది సిక్కులు నిరాశ్రయులుగా మిగిలారు. ఈ మారణహోమం 3 రోజుల పాటు సాగింది. మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి. ఇవి కూడా చదవండి అది మూడు రోజుల మారణహోమం.. మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోశారు. text: నటి, ఉద్యమకారిణి నికోల్ మైనెస్ ఒక ట్రాన్స్‌జెండర్. ఆమె ఇప్పుడు సూపర్ గర్ల్ సిరీస్‌లో 'నియా నల్' అనే తన కలల పాత్ర చేయబోతోంది. "ఈ పాత్రతో ట్రాన్స్‌జెండర్ పిల్లల కోసం కూడా ఒక ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో ఉంటాడు" అని ఆమె కాలిఫోర్నియా శాన్‌డియోగోలో జరిగిన కామిక్ కాన్‌లో ప్రకటించింది. త్వరలో రాబోతున్న సూపర్ గర్ల్ ఫోర్త్ సీజన్‌లో మైనెస్ చేస్తున్న నియా నల్ పాత్రను పరిచయం చేయబోతున్నారు. సూపర్ గర్ల్ సిరీస్‌లో ఇతరులను కాపాడే ట్రాన్స్‌జెండర్ యువతిగా ఈమె పాత్రను వర్ణిస్తున్నారు. వెరైటీతో మాట్లాడిన నికోల్ మైన్స్ "అభిమానులు ట్రాన్స్‌జెండర్ల గురించి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మనం ఎవరైనా కావచ్చు, మనం ఏది కావాలంటే అది చేయచ్చు. మనం సూపర్ హీరోస్ కావచ్చు. ఎందుకంటే మనం చాలా విధాలుగా ఉంటాం" అన్నారు. సూపర్ మెన్ సోదరి, క్రిప్టన్ వాసుల్లో మిగిలిన ఒకరుగా మెలిస్సా బెనోయిస్ట్ సూపర్ గర్ల్ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో నిలా నల్ అనే కొత్త కారెక్టర్ కాక్టో వరల్డ్ వైడ్ మెడియా ఉద్యోగిగా పరిచయం అవుతుంది. ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్ర కథలో వారి చుట్టూ తిరిగేలా ఉండదని ప్రేక్షకులు తెలుసుకోవాలని నికోల్ మెయిన్స్ చెప్పారు. ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరోగానే కాకుండా నియా ఇంకా చాలా పనులు చేస్తుంది. ఆమె ఒక రిపోర్టర్, తను చాలా బలమైనది, చాలా తెలివైనది, మంచి స్నేహితురాలు కూడా. 2014లో స్కూల్ గర్ల్స్ టాయిలెట్ ఉపయోగించడానికి అనుమతించలేదని నికోల్ మెయిన్స్, ఆమె కుటుంబం కోర్టుకు వెళ్లింది. దాంతో ఆ స్కూల్ దేశ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆగ్రహించింది. నటనా కెరీర్ ప్రారంభించిన నికోల్, రాయల్ పెయిన్స్ అనే అమెరికా కార్యక్రమంలో నటనకు 2016 గ్లాడ్ అవార్డు గెలుచుకుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇప్పటివరకూ మనకు సూపర్ హీరోలు, సూపర్ హీరోయిన్లే తెలుసు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక నటి ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో పాత్ర చేసేందుకు సిద్ధమైంది. సూపర్ గర్ల్ అనే లైవ్ యాక్షన్ టీవీ సిరీస్ మొదటిసారి ట్రాన్స్ జెండర్ సూపర్ హీరోను చూపించబోతోంది. text: సిమోనా హాలెప్ రొమేనియాకు చెందిన సిమోనా సెంటర్ కోర్టులో సెరెనా నుంచి అన్ని వైపులకూ దూసుకొస్తున్న బంతులను తిప్పికొడుతూ 6-2, 6-2 స్కోరుతో టైటిల్ గెల్చుకుంది. "ఇది నా అత్యుత్తమ మ్యాచ్" అని చెప్పిన 27 ఏళ్ళ సిమోనాకు ఇది రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్. ఆమె 2018లో ఫ్రెంచి ఓపెన్ టైటిల్ గెల్చుకుంది. అమెరికాకు చెందిన 37 ఏళ్ళ సెరెనా విలియమ్స్‌కు గత 12 నెలల్లో ఇది మూడవ ఫైనల్ ఓటమి. "ఆమె అలవోకగా ఆడింది. జింక పిల్లలా వేగంగా గెంతుతూ దూసుకొస్తున్నట్లు నాకనిపించింది" అని సెరెనా సిమోనాకు కితాబిచ్చింది. సిమోనా అంచనాలను తలకిందులు చేసిన సిమోనా గత ఏడాది ఫైనల్‌లో ఆంజెలిక్ కెర్బర్ చేతిలో ఓడిన సెరెనా విలియమ్స్ మీద క్రీడాభిమానుల అంచనాలు ఈసారి కాస్త తగ్గాయి. ఆట మొదట్లోనే ఆమె 4-0 స్కోరుతో వెనకబడడంతో ఆ అంచనాలు మరింత బలపడ్డాయి. ఆట ప్రారంభానికి ముందే తన మీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పిన సిమోనా అచ్చంగా అలాగే ఆడింది. ఎంతో ఆత్మ విశ్వాసంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె విలియమ్స్ విసిరే సర్వీసులను తిప్పి కొట్టింది. ఇక ర్యాలీలు కొనసాగించడంలో ఆమె చూపించిన బలానికి అమెరికన్ క్రీడాకారిణి తడబడక తప్పలేదు. విరామ సమయాల్లో విలియమ్స్ తన శక్తియుక్తులు కూడగట్టుకోవడానికి కళ్ళు మూసుకుని కనిపిస్తే, సిమోనా హాలెప్ మాత్రం ప్రైజ్ వైపు చూస్తూ కనిపించింది. పెద్దగా పొరపాట్లేమీ లేకుండా స్థిరంగా ఆడిన సిమోనా వరసగా రెండు సెట్లు గెలిచి సెరెనా విలియమ్స్ మీద విజయం సాధించింది. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సిమోనా హాలెప్ తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకుంది. 24వ గ్రాండ్ స్లామ్ సాధించి రికార్డ్ సమం చేయాలన్న సెరెనా విలియమ్స్ కలలను ఆమె చెల్లాచెదరు చేసింది. 56 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరాటంలో అద్భుతమైన అథ్లెటిసిజం ప్రదర్శించి విజయం సాధించింది సిమోనా. text: "మేము ఈ కళను బతికించడానికి పెద్ద వాళ్లకు వారి చిత్రాలను నగిషీ చేసి ఇస్తున్నాము. ఈ కళను బతికించడానికి ఏమైనా సహకారం వస్తుందనే ఆశతోనే అలా చేస్తున్నాం. కానీ మేం కూడా ఎంత వరకు చేయగలం? మా తరంతోనే ఈ కళ ఆగిపోతుందేమో"... నగిషీ చెక్కడం ఆపి, ఇదంతా చెప్పి మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యారు మొహమ్మద్ అబ్దుల్ వాసిఫ్. హైదరాబాద్ టపాచబుత్ర నివాసి అబ్దుల్ వాసిఫ్ ఈ కళపై పనిచేస్తున్న నాల్గో తరం కళాకారుడు. వీడియో: అంతరించిపోతున్న అరుదైన హైదరాబాదీ కళ అద్భుతమైన చరిత్ర లోహాలపై నగిషీలు చెక్కే ఈ కళకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ కళాకారుల మొదటి తరం మొహమ్మద్ అహ్మద్, అబ్దుల్ కరీమ్.. నిజాం ప్రభుత్వ కరెన్సీ డిజైన్, రాజముద్రలు, ఆయుధాలపై నగిషీలు రూపొందించేవారు. అంతే కాకుండా అప్పటి ప్రముఖులకు వారి ముద్ర ఉండేలా రకరకాల డిజైన్లున్న షేర్వాణీ గుండీలను రూపొందించేవాళ్లు. రెండో ప్రపంచ యుద్ధంపై రూపొందించిన కళాకృతితో వీరి మూడో తరం కళాకారుడు షబ్బీర్ అహ్మద్‌కి ప్రభుత్వం ఛీఫ్ డిజైనర్ ఉద్యోగం ఇచ్చింది. మొదట్లో వీరు బంగారు, వెండి రేకులపై డిజైన్లు చెక్కేవారు. ఇప్పుడు జర్మన్ సిల్వర్ రేకుపై నల్లని పొడి పూత పూసి చెక్కుతున్నారు. ఒక్కో డిజైన్ చెక్కడానికి వీరికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఎందరో ప్రముఖుల నుంచి వీరి ప్రతిభకు ప్రశంసలు అందుకున్నారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆదరణ తగ్గటంతో తమ ముందు తరం ఎవరూ ఈ కళను నేర్చుకోవడానికి సిద్ధంగా లేరని, తాము కూడా బతుకుదెరువు కోసం రేడియం స్టిక్కరింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ వంటి పనులు చేస్తున్నామని, గత వేసవికాలంలో కూలర్లు అమ్మామని చెప్పారు వాసిఫ్. వాసిఫ్ "చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. మా నాన్న ఈ కళను బతికించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డర్స్ రావట్లేదు. చాలా కష్టపడుతున్నారు. చాలా కాలం నుంచి చేసేదే... పెద్దవాళ్ల చిత్రాలను చెక్కి వారికి బహుమతిగా ఇవ్వడం తప్ప వేరే ఆర్డర్స్ రావట్లేదు. అందుకే నేను ఈ కళపై ఆధారపడకుండా ఇంజినీరింగ్ చేస్తున్నా" అని చెప్పారు వాసిఫ్ కుమారుడు అహ్మద్ మొహియుద్దీన్. ఈ కళ అంతరిచిపోతుంటే మీకెలా అనిపిస్తోంది? అని ప్రశ్నిస్తే... మూడో తరం కళాకారుడు, చీఫ్ డిజైనర్‌గా పదవీ విరమణ పొందిన షబ్బీర్ అహ్మద్ 1975లో తనకు ఆర్మీ వారు ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని చూపిస్తూ.. "బతకడానికి వేరే పని చేయాల్సి వస్తోంది. మేమేం ఏం చేయగలం? ప్రపంచంతో పాటు వెళ్లాలి కదా" అన్నారు. 1975లో ఆర్మీ వారు ఇచ్చిన ప్రశంసాపత్రం "మాకు ఒకవేళ మళ్లీ పనులు రావడం మొదలైతే మా తర్వాత తరంవారు వారంతట వారే ఈ కళను నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను బలంగా నమ్ముతున్నా" అని ఆశాభావం వ్యక్తం చేశారు వాసిఫ్. ఖురాన్ ఖురాన్ చెక్కడమే లక్ష్యం "ఖురాన్‌లో 30 అధ్యాయాలు ఉంటాయి. అందులో 2 అధ్యాయాలను నగిషీలుగా చెక్కాం. మొత్తం పూర్తి చేయడానికి మాకు నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. ఖురాన్‌ని చెక్కాలనేది మా నాన్న కోరిక. దాన్ని మేం ఎలాగైనా పూర్తిచేస్తాం. మా కళ ఉన్నా లేకపోయినా మేం చెక్కిన ఖురాన్ చరిత్రలో నిలిచిపోతుంది" అంటూ తాము చెక్కిన రెండు అధ్యాయాలను చూపించారు వాసిఫ్. మా కళ బతుకుతుందనే ఆశ "ఈ కళ ప్రసిద్ధి చెంది ప్రపంచమంతా తెలుసుకోవాలి. మోడరన్ ఆర్ట్, కాన్వాస్ ఆర్ట్‌కి లభించినంత ఆదరణ ఈ ప్రాచీన కళకి లభిస్తుందని నా నమ్మకం. ఒక వేళ ఆన్ లైన్, ఈ-కామర్స్ సంస్థల నుంచి సహకారం లభించి, తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే ప్రపంచానికి ఈ కళ తెలుస్తుంది. అంతేకాదు మన పురాతన కళ జీవించి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తుంది’’ అని అంటున్నారాయన. వాసిఫ్ మాతో మాట్లాడినంత సేపు తమ కళ అంతరించిపోదని, ఎలాగైనా ముందుతరాలకు అందుతుందని, జీవించే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నిజాం పాలనలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ హైదరాబాదీ ఆర్ట్ అంతరించిపోతోంది. text: తనను కాదని జయా బచ్చన్‌కు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత నరేష్ అగర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తన స్థాయికీ, ఓ సినీనటి స్థాయికీ పోలిక లేదని నరేష్ అగర్వాల్ అన్నారు. ‘నన్ను కాదని సినిమాల్లో పాటలకు డాన్స్ చేసే వాళ్లకు టికెట్ ఇస్తారా?’ అంటూ జయాబచ్చన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీ తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని అలిగిన నరేష్ అగర్వాల్, ఆ పార్టీ నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు జయా బచ్చన్ ఏమనుకున్నారో కానీ బయట చాలా మంది సామాన్యులు మాత్రం బాధపడ్డారు. నరేష్ అగర్వాల్ ‘సమాజంలో పేరున్న, సంస్కారవంతమైన ఓ నటి గురించి బీజేపీకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అందులోనూ మహిళలను రక్షణ, విదేశాంగ మంత్రులుగా నియమించిన పార్టీకి చెందిన నేత ఇలా మాట్లాడి ఉండకూడదు’ అని ‘@ఐఏఎస్_రామ్‌దేవసి’ అనే యూజర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. అసలు సమస్యంతా ఈ రోజుల్లో కూడా సినిమాల్లో నటించడాన్ని, డాన్స్ చేయడాన్ని తప్పుగా భావించడమే. సినిమాల్లో డాన్స్ చేయడం తప్పయితే, అది కేవలం జయా బచ్చన్‌ను కాదు, సినిమాల్లో నటించడమనే వృత్తినే అవమానించినట్టు అవుతుంది. నరేష్ అగర్వాల్ నేరుగా జయా బచ్చన్ పేరును ప్రస్తావించలేదు. కానీ ఆయన ఆశించిన రాజ్యసభ సీటు జయాబచ్చన్‌కు దక్కింది. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు జయను ఉద్దేశించనవే అని చెప్పకనే చెబుతున్నాయి. ఈ విషయంపై విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. ‘నరేష్ అగర్వాల్ భాజపాలో చేరారు. ఆయన్ని స్వాగతిస్తున్నాం. కానీ జయా బచ్చన్‌ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమంజసమైనవి కావు’ అని సుష్మ ట్వీట్ చేశారు. ‘ఈ వ్యాఖ్యలు అటు సినిమా పరిశ్రమకీ, ఇటు భారతీయ మహిళలకు కూడా అగౌరవం కల్పించేవే’ అనే సమాజ్‌వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ అన్నారు. డాన్స్ చేస్తే తప్పేంటి? జయ భర్త అమితాబ్ బచ్చన్‌ కూడా గతంలో పార్లమెంటుకు మంచి ఆధిక్యంతో ఎన్నికయ్యారు. ఆయన కూడా సినిమాల్లో నటించినవారే. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరూ ఈ మాటలు అనలేదు. నిజానికి చాలామంది మగవాళ్లు సినిమాల నుంచి రాజకీయాలవైపు వచ్చారు. కానీ వారెవరికీ ఇలాంటి వ్యాఖ్యలు ఎదురుకాలేదు. నరేష్ అగర్వాల్ కామెంట్లను ‘ఖండిస్తున్నట్లు’ చెప్పి చాలా మంది ఊరుకున్నారు తప్ప, దానిపై వస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోవట్లేదు. నరేష్ అగర్వాల్‌తో పాటు భాజపాకు కూడా ఈ విషయంపై సమాధానం ఇవ్వాల్సిన అవసరముంది. నరేష్ వ్యాఖ్యలు అతని వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. మనం సినిమాల్నీ, అందులో నటించే మహిళల్నీ ఎలా చూస్తున్నాం? వాళ్ల కోసం ఎలాంటి పాత్రల్ని రూపొందిస్తున్నాం?.. ఈ విషయం పైన కూడా దృష్టిపెడితే ఇలాంటి పరిణామాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జయా బచ్చన్ ఇప్పుడు ఎలా ఉండుంటారు? కోపంగా ఉన్నారా.. బాధ పడుతున్నారా.. లేక తనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ఆలోచనలో ఉన్నారా..? text: మహాత్ముడికి సన్నిహితులనగానే వాళ్ల పేర్లే ఎక్కువగా గుర్తుకువస్తాయి. అయితే, వీళ్లు కాకుండా గాంధీకి దగ్గరివారు చాలా మందే ఉన్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. గాంధీ అడుగుల్లో అడుగులు వేస్తూ నడిచి, ఆయనకు అత్యంత దగ్గరైన ఎనిమిది మంది మహిళలు వీళ్లే.. 1. మెడెలిన్ స్లెడ్ (మీరాబెన్), 1892-1982 బ్రిటీష్ అడ్మిరల్ సర్ ఎడ్మండ్ స్లెడ్ కుమార్తె మెడెలిన్. సైనిక కుటుంబం కావడంతో ఆమె బాల్యంలో క్రమశిక్షణగా పెరిగారు. జర్మన్ సంగీతకారుడు, పియానో విధ్వాంసుడు బీథోవెన్ అంటే మెడెలిన్‌కు అభిమానం. ఆ కారణంతోనే ఆమె‌కు ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్‌తో పరిచయం ఏర్పడింది. రోలెండ్ సంగీతకారుల గురించి రచనలు చేసేవారు. గాంధీ జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు. ఈ జీవిత చరిత్రను మెడెలిన్ చదివారు. ఆ పుస్తకం ఆమె‌పై గొప్ప ప్రభావం చూపింది. గాంధీ చెప్పిన మార్గంలో జీవించాలని ఆమె నిర్ణయానికి వచ్చారు. సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాని గాంధీకి మెడెలిన్ లేఖ రాశారు. గాంధీ ప్రభావంతో ఆమె మద్యం మానేశారు. శాకాహారిగా మారిపోయారు. వ్యవసాయం నేర్చుకున్నారు. 1925 అక్టోబర్‌లో మెడెలిన్ అహ్మదాబాద్‌కు వచ్చారు. ‘‘అక్కడకు వెళ్లగానే తెల్లటి గద్దె మీద కూర్చున్న ఓ బక్కటి వ్యక్తి లేచి, నా దగ్గరికి వచ్చారు. ఆయన బాపూజీ అని నాకు తెలుసు. నా మనసంతా ఆనందం, భక్తితో నిండిపోయింది. కళ్ల ముందు దివ్య కాంతి కనిపించింది. నేను బాపూజీ పాదాల వద్ద కూర్చున్నా. ఆయన నన్ను లేపి.. నువ్వు నా బిడ్డవు అని అన్నారు’’ అని మెడెలిన్ గాంధీని తొలిసారి కలిసిన సందర్భం గురించి ఓ సందర్భంలో వివరించారు. అప్పటి నుంచి మహాత్మ గాంధీ, మెడెలిన్‌ల మధ్య గొప్ప బంధం ఏర్పడింది. మెడెలిన్ పేరు మీరాబెన్‌గా మారింది. 2. నిలా క్రైమ్ కుక్, 1972-1945 ఆశ్రమంలో అందరూ నిలాను నాగిని అని పిలిచేవారు. తనను తాను కృష్ణుడి గోపికగా భావించుకునే ఆమె.. మౌంట్ అబూలో ఓ మత గురువు వద్ద ఉండేవారు. నిలా జన్మస్థలం అమెరికా. మైసూర్‌కు చెందిన రాజకుమారుడితో ఆమె ప్రేమలో పడ్డారు. 1932లో గాంధీకి ఆమె బెంగళూరు నుంచి లేఖ రాశారు. అంటరానితనానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల గురించి గాంధీకి వివరించారు. వాళ్లిద్దరి మధ్య అలా లేఖల ద్వారా సంభాషణలు మొదలయ్యాయి. ఆ మరుసటి ఏడాది 1933లో నిలా.. యరవాడ జైల్లో గాంధీని కలిశారు. గాంధీ నిలాను సబర్మతీ ఆశ్రమానికి పంపారు. కొంతకాలం అక్కడ గడిపాక ఆశ్రమ సభ్యులతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. అయితే, ఉదారవాద ఆలోచనలతో ఉండే నిలాకు ఆశ్రమ జీవితం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ ఇస్లాం స్వీకరించి, ఖురాన్‌ను అనువాదం చేశారు. 3. సరళా దేవీ చౌధరానీ (1872-1945) ఉన్నత చదవులు అభ్యసించిన సరళ దేవీ సంగీతం, భాషలు, రచనల పట్ల చాలా ఆసక్తి చూపించేవారు. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు. ఓసారి లాహోర్‌లోని సరళ ఇంట్లో గాంధీ బస చేశారు. సరళ భర్త, స్వాతంత్ర్య ఉద్యమకారుడు రామ్‌భుజ్ దత్త్ అప్పుడు జైల్లో ఉన్నారు. గాంధీ, సరళల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. సరళను తన ‘ఆధ్యాత్మిక భార్య’గా గాంధీ వర్ణించేవారు. తమ సాన్నిహిత్యం కారణంగా రామ్‌భుజ్‌తో సరళ వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితులు కూడా వచ్చాయని గాంధీ తర్వాతి రోజుల్లో అంగీకరించారు. ఖాదీ గురించి ప్రచారం చేసేందుకు గాంధీ, సరళ కలిసి భారత్‌లో పర్యటించారు. వీరి బంధం గురించి గాంధీ సన్నిహితులకు కూడా తెలుసు. కానీ, కొంత కాలం తర్వాత సరళను గాంధీ దూరం పెట్టారు. కొన్నాళ్లకు హిమాలయాల్లో ఏకాంత జీవితం గడుపుతూ సరళ మృతిచెందారు. 4.సరోజినీ నాయుడు (1879-1949) కాంగ్రెస్‌ తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. గాంధీ అరెస్టు తర్వాత ఉప్పు సత్యాగ్రహం నడిపించాల్సిన బాధ్యత ఆమెపైనే పడింది. సరోజినీ, గాంధీ తొలిసారి లండన్‌లో కలుసుకున్నారు. ‘‘ఆయన ఎత్తు తక్కువ. నెత్తిపై జట్టు కూడా లేదు. నేలపై కూర్చొని ఆలివ్ నూనెలో వేయించిన టమాటలను తింటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకుడిని అలా చూసి నాకు ఆనందంతో నవ్వు వచ్చింది. అప్పుడు ఆయన నా వైపు చూశారు. ‘మీరు కచ్చితంగా నాయుడు గారి శ్రీమతి అయ్యుంటారు. నాతోపాటు తినండి’ అని అన్నారు. నేనేమో ఇదేం పనికిరాని పద్ధతి అని అడిగా’’ అంటూ సరోజినీనాయుడు ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. వారి మధ్య బంధం అలా మొదలైంది. 5. రాజకుమారి అమృత్ కౌర్ (1889-1964) కపూర్థలా రాజు హర్‌నామ్ సింగ్ కుమార్తె అమృత్ కౌర్. ఆమె ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. గాంధీకి అత్యంత సన్నిహితులైన సత్యాగ్రహ ఉద్యమకారుల్లో ఒకరిగా ఆమె పేరును విశ్లేషకులు చెబుతుంటారు. 1934లో తొలిసారి ఆమె గాంధీని కలిశారు. ఇద్దరూ వందల సంఖ్యలో లేఖలు రాసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భాల్లో అమృత్ కౌర్ జైలుకు కూడా వెళ్లారు. స్వతంత్ర భారత్‌కు ఆమె తొలి ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అమృత్ కౌర్‌కు గాంధీ ‘మేరీ ప్యారీ పాగల్ ఔర్ బాగీ’ అంటూ లేఖలు రాసేవారు. చివర్లో తనను తాను ‘తానాషా’ (నియంత)గా అందులో పేర్కొనేవారు. 6. డాక్టర్ సుశీలా నయ్యర్ (1914-2001) గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ నయ్యర్‌‌కు సుశీలా చెల్లెలు. తమ తల్లి వద్దన్నా వినకుండా ఈ అన్నాచెల్లెళ్లు గాంధీతోపాటు ఉండేందుకు వెళ్లారు. అయితే, తర్వాతి రోజుల్లో వారి తల్లి కూడా గాంధీ సమర్థకురాలిగా మారిపోయారు. వైద్యం చదివిన తర్వాత గాంధీకి సుశీలా వ్యక్తిగత డాక్టర్‌గా ఉన్నారు. వృద్ధాప్యంలో గాంధీ.. మనూ, ఆభాల తర్వాత సుశీలా‌పైనే ఎక్కువగా ఆధారపడేవారు. బ్రహ్మచర్యం గురించి గాంధీ చేసుకున్న పరీక్షల్లో సుశీలా కూడా ఉండేవారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కస్తూర్భా గాంధీతోపాటు సుశీలా అరెస్టయ్యారు. పూనాలో కస్తూర్భా గాంధీ ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు ఆమె వెంట సుశీలా ఉన్నారు. 7. ఆభా గాంధీ (1927-1995) ఆభా బెంగాలీ. గాంధీ మునిమనవడు కను గాంధీని ఆమె వివాహం చేసుకున్నారు. గాంధీ ప్రార్థన కార్యక్రమాల్లో ఆభా భజనలు పాడేవారు. కను ఫోటోలు తీసేవారు. 1940లో మహాత్మ గాంధీ ఫోటోలను కను చాలా తీశారు. ఆభా నోవాఖాళీలో గాంధీతోపాటు ఉండేవారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా హిందూ-ముస్లిం అల్లర్లు జరిగాయి. గాంధీ వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన సమయంలో ఆభా అక్కడే ఉన్నారు. ఆభా, మనులతో గాంధీ 8.మను గాంధీ (1928-1969) చాలా చిన్న వయసులోనే మను మహాత్మ గాంధీ వద్ద చేరారు. ఆయనకు ఆమె దూరపు బంధువు. మనును తన మనవరాలిగా గాంధీ భావించేవారు. గాంధీ నోవాఖాలీ‌లో ఉన్న రోజుల్లో అభాతోపాటు మను ఆయనకు సాయంగా ఉండేవారు. వాళ్లద్దరి భుజాల ఆసరాతోనే గాంధీ నడుస్తుండేవారు. గాంధీని వ్యతిరేకించే కొందరు ఆయన నడిచే దారుల్లో ఓసారి మలమూత్రాలు వేసినప్పుడు, వాటిని గాంధీతోపాటు శుభ్రం చేసినవారిలో మను, ఆభా కూడా ఉన్నారు. కస్తూర్భాకు చివరి రోజుల్లో సపర్యలు చేసినవారిలోనూ మను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మహాత్మ గాంధీ జీవితంలో ఆఖరి కొన్నేళ్లు ఎలా గడిచాయన్నది ఆమె డైరీలో వివరంగా రాసుకున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహాత్మా గాంధీతోపాటు ఫొటోల్లో ఆయన చుట్టూ చాలా మందిని మనం చూస్తుంటాం. వారిలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌ లాంటి వాళ్లను తేలిగ్గానే గుర్తుపడతాం. text: తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని, డబ్బుకోసం.. నిమిషానికి వంద రూపాయలు తీసుకుని పిల్లలకు పాలిస్తానంటూ.. వివరించే బోర్డు తన కవల పిల్లల్లోని ఒక పాప ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతోంది. వైద్యం కోసం కనీసం 10 లక్షల రూపాయలు కావాలని ఆమె భర్త చెబుతున్నారు. చైనా సోషల్ మీడియా 'సీనా వీబో'లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ వీడియోకు 24లక్షల వ్యూస్, 5,000 కామెంట్స్ వచ్చాయి. ''మా పాప ఐసీయూలో చికిత్స పొందుతోంది. అందుకు చాలా డబ్బు అవసరం. ఆపరేషన్ పూర్తయ్యాక మేం కనీసం 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు'' అని.. ఆ తండ్రి చెబుతున్నారు. చైనాలోని వైద్య సేవలపై ఈమధ్య కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని వైద్య కేంద్రాలు చాలినంతగా లేవని, వైద్య కేంద్రాలకు పోటెత్తుతున్న ప్రజల తాకిడిని తట్టుకోలేక కొందరు లంచాలు ఇచ్చి మరీ వైద్యం చేయించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ తల్లి కథ నిజమేనంటూ.. షెన్‌జాన్ ఆన్‌లైన్ ప్రెస్ కార్యాలయం తెలిపింది సోషల్ మీడియాలో.. ''సెల్ మిల్క్ సేవ్ గర్ల్'' అనే నినాదంతో యూజర్లు స్పందిస్తున్నారు. ఆ దారిగా వెళ్లే ప్రజలు ఆ తల్లిదండ్రులకు తప్పకుండా సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు కనపడితే.. వారికి తప్పక సాయం చేస్తామని మరికొందరు ప్రతిస్పందిస్తున్నారు. ''నిరుపేదలు.. ఒకవైపు రోగగ్రస్తమైన పిల్లలకు జన్మనిస్తూ, మరోవైపు.. తమ ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోతున్నారు’’ అని ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు 3,000కు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో మరికొందరు ఇందుకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఇలా డబ్బుల కోసం చనుబాలను అమ్ముకోవడం అసహ్యకరం అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. '' మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అందరికీ అర్థమైంది. మీ బిడ్డకు వైద్యం అందాలనే మేం కోరుకుంటున్నాం. కానీ రోడ్లపై చనుబాలను అమ్ముకోవడంతో నువ్వు కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందగలవా?'' అంటూ కామెంట్ చేశాడు. అయితే.. ఈ కామెంట్లపై మరో వ్యక్తి స్పందించాడు. ''ఇది.. నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రుల ప్రేమ! ఇలా స్పందిస్తున్నవారు ఒకసారి ఆలోచించాలి.. అదే మీ బిడ్డకు ఇలా జరిగితే మీరు దేని గురించి ఆలోచిస్తారు.. మీ బిడ్డ గురించా? లేక మీ గౌరవం గురించా?'' ఇవి కూడా చదవంవడి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనాలో ఓ తల్లి తన చనుబాలను అమ్ముతోంది. ఐ.సి.యు.లో ఉన్న తన బిడ్డ వైద్యానికి డబ్బులు కావాలంటూ షెన్‌జాన్ నగర వీధుల్లో ఇలా సహాయం అర్థిస్తోంది. text: ఆ కథనం ప్రకారం, రవి ప్రకాశ్‌ మీద కంపెనీలోని మెజారిటీ వాటా భాగస్వాములు గతనెలలో కేసులు పెట్టారు. దర్యాప్తులో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు గురువారం ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న రవిప్రకాశ్‌, సినీ నటుడు శివాజీ, టీవీ-9 డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తి నివాసాల్లో, టీవీ-9 ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. టీవీ-9ను స్థాపించినపుడు కంపెనీలో రవిప్రకాశ్‌కు ఎనిమిది శాతం వాటా, శ్రీనిరాజు కంపెనీలకు 90 శాతానికి పైగా వాటాలు ఉన్నాయి. దాదాపు ఏడు చానళ్లు ఉన్న కంపెనీలో తనకున్న 90 శాతం వాటాను శ్రీనిరాజు గత ఏడాది జూన్‌లో అలంద మీడియాకు అమ్మారు. అయితే, 90 శాతం వాటాలు కొనుగోలు చేసినా తమకు కంపెనీ నడిపే అవకాశం ఇవ్వకుండా రవిప్రకాశ్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ అలంద మీడియా ఆరోపిస్తోంది. తప్పుడు పత్రాలను సృష్టించి, కొత్త వ్యక్తులను వాటాదారులుగా చూపిస్తున్నారని, కంపెనీ సెక్రెటరీ రాజీనామా చేసినట్లు చూపించి, బోర్డులో తమ సభ్యులు చేరడాన్ని ఆలస్యం చేస్తున్నారని చెబుతోంది. గురువారం సోదాలు జరుగుతుండగానే టీవీ-9ను స్వాధీనం చేసుకొనేందుకు అలంద మీడియా ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. అందులో భాగంగానే రవిప్రకాశ్‌కు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 24న పెట్టిన మొదటి కేసులో రవిప్రకాశ్‌ నటుడు శివాజీతో కలిసి ఆయనకే షేర్ల జారీకి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించారనే ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్‌ 30న పెట్టిన రెండో కేసులో కంపెనీ సెక్రెటరీ రాజీనామా చేసినట్లు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి, లేఖ సృష్టించి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేశారని అలంద మీడియా ప్రతినిధులు ఆరోపించారు. గురువారం జరిపిన సోదాల్లో కీలక పత్రాలతో పాటు 12 హార్డ్ డి‌స్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఆధారాలను ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు. వాటిని విశ్లేషించిన తర్వాత కేసులో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. రవిప్రకాశ్‌, శివాజీ అందుబాటులో లేకపోవడంతో వారికి 160 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. ప్రతీకాత్మక చిత్రం సెల్‌ ఫోన్లపై హ్యాకర్ల దాడి... లక్షల రూపాయల డిమాండ్ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల వెబ్‌సైట్లను రాన్సమ్‌వేర్‌ వైరస్‌‌తో హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు తాజాగా మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వారిపై దృష్టి కేంద్రీకరించారంటూ ఈనాడు రాసింది. సెల్‌ఫోన్లను హ్యాక్‌ చేసి రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొంది. ఇటీవల తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్‌సైట్‌‌ను ఎవరు హ్యాక్ చేశారన్న దానిపై పరిశోధిస్తున్న పోలీసు అధికారులు.. సైబర్‌ నేరస్థులు సెల్‌ఫోన్లపై మాల్‌వేర్‌, రాన్సమ్‌వేర్‌ దాడులు చేస్తుండటాన్ని గుర్తించారు. సెల్‌ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో వినియోగిస్తున్న విండోస్‌ ఎక్స్‌పీ సాఫ్ట్‌వేర్‌ పైరేటెడ్‌ కావడంతో సైబర్‌నేరగాళ్లు సులువుగా దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. రాన్సమ్‌వేర్‌ ద్వారా దాడులు చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినా వాటివల్ల ఉపయోగం ఉండదు. హ్యాకర్లు ఎవరన్నది గుర్తించడం సాధ్యంకాదని, వీరికి మాదకద్రవ్యాలు, ఆయుధాలు రహస్యంగా రవాణాచేసే డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులతో సంబంధాలున్నాయని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. రాన్సమ్‌వేర్‌, మాల్‌వేర్‌ దాడులపై కంపెనీలు, సంస్థలు ఫిర్యాదులు చేసినా అవి కేసుల వరకే పరిమితమవుతున్నాయి. గత నెల 29న విద్యుత్‌ శాఖకు చెందిన నాలుగు డిస్కంల వెబ్‌సైట్లను సైబర్‌ నేరస్థులు హ్యాక్‌ చేశారు. పదిరోజులైనా రాన్సమ్‌వేర్‌ వైరస్‌ను కంప్యూటర్లలోకి ప్రవేశపెట్టిన నిందితులెవరన్నది గుర్తించలేకపోయారు. హైదరాబాద్‌ కేంద్రంగా పాలు, పాల పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న ఓ కార్పొరేట్‌ సంస్థ వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరస్థులు హ్యాక్‌ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు నిందితులను గుర్తించలేదని ఈనాడు పేర్కొంది. వడదెబ్బతో పది మంది మృతి తెలంగాణలో వడదెబ్బతో గురువారం పది మంది మృతిచెందారని నమస్తే తెలంగాణ రాసింది. హైదరాబాద్‌లో ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సీజన్‌లో అత్యధికంగా గురువారం 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లో అత్యధికంగా 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లిలో 46.4 డిగ్రీలు, కరీంనగర్‌లో 46.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తా ఆంధ్రామీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, ఈ ప్రభావంతో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ఫోన్లు వాడొద్దు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు 3,05,040 మందికి, 25 పార్లమెంటు స్థానాలకు 3,01,003 మందికి పోస్టల్‌ బ్యాలెట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారని సాక్షి కథనం పేర్కొంది. అసెంబ్లీ స్థానాలకు 3,18,530 మంది, పార్లమెంటు స్థానాలకు 3,17,291 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సరైన పత్రాలు సమర్పించని వారికి పోస్టల్‌ బ్యాలెట్లు మంజూరు చేయలేదని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారిలో కొంతమంది అసలు దరఖాస్తే చేసుకోలేదని వివరించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కౌంటింగ్‌పై ఆర్వో, ఏఆర్వోలకు మే 17న విజయవాడలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులను జిల్లా యూనిట్‌గా మూడుసార్లు ర్యాండమైజేషన్‌ విధానంలో ఎంపిక చేస్తామన్నారు. లెక్కింపునకు వారం రోజుల ముందు మొదట విడత ర్యాండమైజేషన్, 24 గంటల ముందు నియోజకవర్గ పరిశీలకుల సమక్షంలో రెండో విడత పూర్తి చేస్తామని వివరించారు. కౌంటింగ్‌ రోజు ఒక గంట ముందు సిబ్బందికి ఏ టేబుల్‌ కేటాయించామన్నది తెలియజేస్తామన్నారు. ఉదయం 8.30 తర్వాత కేవలం కేంద్ర ఎన్నికల పరిశీలకులు తప్ప ఆర్వోలతో సహా ఎవ్వరి సెల్‌ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టీవీ-9 సీఈవో రవి ప్రకాశ్‌ మీద చీటింగ్‌, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. text: అందుకు పలు కారణాలు ఉన్నాయి. అందులో కెమిస్ట్రీ దాగి ఉంది. ఆ సువాసన విడుదలలో బ్యాక్టీరియా, మొక్కలతో పాటు ఉరుములు, మెరుపుల పాత్ర కూడా ఉంటుంది. ఇంగ్లీషులో 'పెట్రికో' అని పిలిచే ఈ పరిమళం రహస్యాన్ని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మట్టిలోని బ్యాక్టీరియా బాగా ఎండిపోయిన నేలలు తొలకరి వానలకు తడిసినప్పుడు.. ఆ మట్టిలోని ఒక రకమైన బ్యాక్టీరియా జియోస్మిన్ (C12H22O) అనే ‎రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. ఆ రసాయనం వల్లనే సువాసన వెలువడుతుందని ఇంగ్లాండ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్‌లో మాలిక్యులర్ మైక్రోబయాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ మార్క్ బట్నర్ బీబీసీకి వివరించారు. ఆ బ్యాక్టీరియా పేరు 'స్ట్రెప్టోమైసెస్'. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన కన్నౌజ్ ప్రాంతంలో ఇప్పటికీ మట్టి సువాసన ఇచ్చే అత్తర్లు తయారు చేస్తున్నారు. మే, జూన్ మాసాల్లో తొలకరి జల్లులు పడినప్పుడు వెలువడే జియోస్మిన్‌ను సేకరించి 'మట్టీ కా అత్తర్' పేరుతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్‌లో అత్తర్లను తయారు చేస్తారు. 1960లలో దాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియా పరిశోధకులు ఇసాబెల్ బియర్, ఆర్‌జీ థామస్‌ ఆ మట్టి పరిమళానికి 'పెట్రికో' అని ఇంగ్లీషు పేరు పెట్టారు. ఆ పేరు ఎందుకు పెట్టారు? 1964లో జర్నల్ నేచర్ అనే పత్రికలో 'నేచర్ ఆఫ్ అగ్రిల్లేసియస్ ఆడర్' పేరుతో శాస్త్రవేత్తలు ఇసాబెల్, రిచర్డ్ థామస్‌లు ప్రచురించిన కథనంలో 'పెట్రికో' అనే పదాన్ని ప్రస్తావించారు. 'పెట్రోస్' అంటే గ్రీకు భాషలో 'రాయి' అని అర్థం. 'ఇకోర్' అంటే "దేవుడి నరాల్లో ప్రసరించే ద్రవం" అని అర్థం. ఆ బ్యాక్టీరియాను మందుల్లోనూ వాడుతున్నారు స్వచ్ఛమైన మట్టిలో 'స్ట్రెప్టోమైసెస్' బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుందని మార్క్ బట్నర్ తెలిపారు. ప్రస్తుతం యాంటీ‌బయాటిక్ మందుల తయారీలోనూ ఈ బ్యాక్టీరియాను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అనేక రకాల అత్తర్ల తయారీలోనూ C12H22Oను విరివిగా వాడుతున్నారు. దీని వాసనను ఇతర జంతువుల కంటే మనుషులే ఎక్కువ స్పష్టంగా పసిగట్టగలరని ప్రొఫెసర్ బట్నర్ వివరించారు. C12H22O వాసన అందరూ ఆస్వాదిస్తారు. కానీ.. దాని రుచిని మాత్రం అసహ్యించుకుంటారు. "అదేమీ ప్రమాదకరం కాదు. అయినా మనం ఎందుకు దాని రుచిని అంతగా అసహ్యించుకుంటామో తెలియడంలేదు" అని డెన్మార్క్‌లోని ఆల్‌బోర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెప్పే లండ్ నీల్సన్ అన్నారు. మొక్కల నుంచి మొక్కల్లో సువాసన ఇచ్చే 'టాపీన్ (C10H16)' అనే కార్బన సమ్మేళనాలతో జియోస్మిన్‌‌ను పోల్చవచ్చని ప్రొఫెసర్ నీల్సన్ చెప్పారు. "మొక్కల ఆకులకు ఉండే కేశాలలో టాపీన్లు ఉత్పత్తి అవుతాయి. అయితే వర్షం పడినప్పుడు ఆ కేశాలు దెబ్బతిని టాపీన్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది" అని ప్రొఫెసర్ ఫిలిప్ స్టీవెన్సన్ బీబీసీకి వివరించారు. అలాగే.. వాతావరణం మరీ పొడిగా ఉన్నప్పుడు మొక్కల్లో జీవక్రియ నెమ్మదిస్తుంది. ఆ తర్వాత చిరు జల్లులు పడితే కూడా ఆ మొక్కల నుంచి సువాసన వెలువడుతుంది. ఎండిన కట్టెలు వానకు తడిసినప్పుడు కూడా జియోస్మిన్‌ లాంటి సువాసన ఇచ్చే రసాయనాలు విడుదలవుతాయని స్టీవెన్సన్ తెలిపారు. ఉరుములతో కూడిన వానల వల్ల ఉరుములతో కూడిన గాలివానల వల్ల కూడా అలాంటి వాసన వెలువడుతుంది. ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు పెద్దఎత్తున మెరుపులు వస్తాయి, పిడుగులు పడుతుంటాయి. అప్పుడు ఓజోన్ వాయువు వాసన స్పష్టంగా వస్తుంది. అందుకే దట్టంగా మబ్బులు పట్టి ఉరుములు, మెరుపులతో వాన పడిన తర్వాత ఆరుబయట ఉండి గమనిస్తే వాసన చాలా భిన్నంగా ఉంటుంది. "సాధారణంగా వర్షాలు పడనప్పుడు వాతావరణంలో దుమ్ము, ధూళి, కలుషితాలు అధికంగా ఉంటాయి. అదే ఒక్కసారిగా వర్షాలు పడ్డప్పుడు గాలి అంతా శుభ్రమవుతుంది, అందుకే వర్షం పడ్డప్పుడు పరిశుభ్రమైన ఓజోన్ వాసన వస్తుంది" అని అమెరికాలోని మిసిసిపి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మారిబెత్ స్టోల్సన్‌బర్గ్ వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత పరిమళభరితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మరి ఆ సువాసన ఎందుకు వస్తుంది? text: మాస్క్ మంచిదని అంటున్న ట్రంప్ వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో సైనికులు, హెల్త్ కేర్ వర్కర్లను పరామర్శించడానికి వెళ్లిన ట్రంప్ అక్కడ మాస్క్ ధరించి కనిపించారు. ''నేనెప్పుడూ మాస్క్ ధరించడానికి వ్యతిరేకం కాను. కానీ దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది'' అన్నారు ట్రంప్ గతంలో తాను ఎప్పుడూ మాస్కును ధరించనని ప్రకటించిన ఆయన, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్ మాస్క్ ధరించడాన్ని ఒక సందర్భంలో ఎగతాళి కూడా చేశారు. కానీ నిన్న ఆసుపత్రిని సందర్శించిన ఆయన '' కొన్ని సందర్భాలలో మాస్క్ ధరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రిలో, ఎక్కువమంది రోగులను సందర్శించాల్సి వచ్చినప్పుడు ఇది తప్పదు'' అని అన్నారు గతవారం ఫాక్స్ బిజినెస్ నెట్ వర్క్ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ''నేను మాస్క్ లకు వ్యతిరేకం కాదు'' అని ప్రకటించారు. ''నేను వాటిని ఇష్టపడతాను కూడా'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. లోన్ రేంజర్స్ కథలో ముసుగు వీరుడిలా ఉండటం తనకు ఇష్టమేనని ఆయన అన్నారు. వ్యాధివ్యాప్తి నిరోధానికి గుడ్డతో తయారు చేసిన మాస్కులు ధరించడం మంచిదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోస్ (సీడీసీ) ఏప్రిల్ లో ప్రకటించింది. అయితే తాను ఎప్పుడూ మాస్క్ ధరించనని ట్రంప్ ప్రకటించారు. ''నేను అలా మాస్క్ వేసుకుని తిరగాలనుకోవడం లేదు'' అన్నారు ట్రంప్. ''మాస్క్ చుట్టుకుని ప్రధానులను, ప్రెసిడెంట్లను, రాజులను, రాణులను పలకరించడం నా వల్ల కాదు '' అన్నారాయన. ఆయన సహచరులు చాలాసార్లు ఆయన్ను మాస్క్ ధరించాల్సిందిగా కోరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది? అమెరికాలో గత 24 గంటల్లోనే 66,528 కేసులు నమోదయ్యాయి. ఇది ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసుల రికార్డు.ఇప్పటి అమెరికా వ్యాప్తంగా 135,000 మరణాలు సంభవించాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ప్రజలంతా మాస్కులు ధరించాలని లూసియాన రాష్ట్రం ఆదేశాలు జారీ చేసింది. లూసియానా రాష్ట్రంలో బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని డెమొక్రాటిక్ గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్ ఆదేశించారు. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి. అయితే రిపబ్లికన్ పార్టీ సభ్యులు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. వాషింగ్టన్ రాష్ట్రం, కిర్క్‌లాండ్‌లోని లైఫ్ కేర్ సెంటర్ ''మీకు మాస్క్ ను తప్పనిసరి చేయడం ఇష్టం లేకపోతే అది ధరించాల్సి వచ్చే వరకు మీరు ఇష్టపడకండి'' అని అన్న ఆయన ''ఈ విషయంలో మీరు నన్ను పిచ్చివాడు అనుకున్నా నాకు బాధలేదు'' అని వ్యాఖ్యానించారు. శనివారంనాడు 10,500 కొత్త కరోనా కేసులతో టెక్సాస్ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది.. కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాత్రి 11 తర్వాత బార్లు తెరిచి ఉంచవద్దని సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఓ మరణశిక్షను కూడా నిలిపేయాల్సి వచ్చిన ఘటన ఇండియానా రాష్ట్రంలో జరిగింది. సోమవారంనాడు డేనియల్ లీ అనే వ్యక్తికి మరణశిక్షను అమలు జరపాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆ శిక్షను చూసేందుకు తాము రాలేమని బంధువులు ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. దీంతో కోర్టు మరణశిక్షను వాయిదా వేసింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అమలు జరపబోతున్న శిక్ష ఇది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఎన్నడూ మాస్కుతో కనిపించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి ఫేస్ మాస్కుతో కనిపించారు. text: అందుకే, తల్లిదండ్రులు చిన్నారులను ఎక్కువగా ఆ సీట్లలో కూర్చోబెడుతుంటారు. కానీ, వెనుక సీటు మనం అనుకుంటున్నంత భద్రమైనది కాకపోవచ్చని అమెరికాకు చెందిన ఓ సంస్థ అంటోంది. వెనుక సీట్ల కోసం కూడా ఎయిర్‌బ్యాగులు ఉండాలని ఐఐహెచ్‌ఎస్ సూచించింది. వెనుకున్నవారికే తీవ్ర గాయాలు వెనుక సీట్ల కన్నా ముందు సీట్లపైనే కార్ల తయారీదారులు ఎక్కువగా ద‌ృష్టిపెడుతున్నట్లు అమెరికాకు చెందిన ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హైవే సేప్టీ (ఐఐహెచ్‌ఎస్) అధ్యయనంలో తేలింది. 2000 సంవత్సరం తర్వాత తయారవుతున్న చాలా కార్లు ముందు సీట్లలో కూర్చునేవారికి ఎయిర్‌బ్యాగుల ఏర్పాటుతో వస్తున్నాయి. ప్రమాదాల సమయంలో గాయాల తీవ్రతను తగ్గించేలా సీటు బెల్టులూ వాటిలో ఉంటున్నాయి. కానీ, చాలా కార్లలో వెనుక సీట్లకు ఇలాంటి భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదని ఐఐహెచ్ఎస్ పరిశోధకులు అంటున్నారు. అమెరికాలో 2004 నుంచి 2015 మధ్య వెనుక సీట్లలో కూర్చున్నవారు గాయపడ్డ, మరణించిన కారు ప్రమాదాల సమాచారాన్ని వారు విశ్లేషించారు. వారు పరిశీలించిన 117 ప్రమాదాల్లో.. సగానికిపైగా ఘటనల్లో వెనుక సీట్లలో కూర్చున్నవారే ముందు సీట్లలో ఉన్నవారి కన్నా తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఎక్కువగా ఛాతీ గాయాలయ్యాయి. ఐఐహెచ్ఎస్ విశ్లేషించిన 117 ప్రమాదాల్లోని సగానికిపైగా ఘటనల్లో వెనుక సీట్లలో కూర్చున్నవారే ముందు సీట్లలో ఉన్నవారి కన్నా తీవ్రంగా గాయపడ్డారు. వెనుక సీట్లకు ఏర్పాటు చేస్తున్న సీటు బెల్ట్‌లు కూడా ప్రభావవంతంగా ఉండట్లేదు. కొన్నిసార్లు అవే గాయాలకు కారణమవుతున్నాయి. ‘‘వెనుక సీట్లలో ఉండేవారిపై సీటు బెల్ట్‌లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముందు సీట్లలో ఉన్నవారు బయటపడుతున్న ప్రమాదాల్లోనూ వారు తీవ్ర గాయాలపాలవుతున్నారు’’ అని ఐఐహెచ్ఎస్ పేర్కొంది. ముందు సీట్ల లాగానే వెనుక సీట్లకూ భద్రత ప్రమాణాలను పెంచడంపై తయారీదారులు దృష్టిసారిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఛాతీ గాయాల ముప్పును తగ్గించాలంటే ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు వీగిపోయేలా ఈ సీటు బెల్ట్‌లకు మార్పులు చేయాలని సూచించింది. వెనుక సీట్లకు ఏర్పాటు చేస్తున్న సీటు బెల్ట్‌లు కూడా అంత ప్రభావవంతంగా ఉండట్లేదు. ‘వెనుక సీట్లను విస్మరించారు’ ముందు సీట్ల విషయంలో ఎన్నో భద్రత ఏర్పాట్లు రాగా, వెనుక సీట్లు మాత్రం విస్మరణకు గురయ్యాయని రహదారి భద్రత అంశంపై కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ షాన్ కిల్డేర్ అన్నారు. మరోవైపు ‘ఉబెర్’ లాంటి క్యాబ్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల వెనుక సీట్లలో కూర్చొని ప్రయాణం చేసేవారి సంఖ్య పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్‌ల తరహాలో గాలితో విచ్చుకునే సీటు బెల్ట్‌లు ఉంటే శరీరానికి గాయాలు కాకుండా అడ్డుకునే అవకాశం ఉందని ఐఐహెచ్ఎస్ నివేదిక పేర్కొంది. ఎయిర్ బ్యాగ్‌ల తరహాలో గాలితో విచ్చుకునే సీటు బెల్ట్‌లు కొన్ని కార్లలో ఉంటున్నాయి. ముందు సీట్ల వెనుక భాగంలో ఎయిర్ బ్యాగ్‌ల సదుపాయం కల్పించడం ద్వారా వెనుక సీట్లలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడొచ్చని అభిప్రాయపడింది. భవిష్యత్తులో కారు పైభాగం నుంచి ఎయిర్ బ్యాగులు కిందకి వచ్చేలానూ తయారీదారులు ఏర్పాట్లు చేయొచ్చని పేర్కొంది. వెనుక సీట్ల భద్రతకు సంబంధించిన సమస్యకు త్వరలోనే తయారీదారులు పరిష్కారాలతో ముందుకు రావొచ్చని ఐఐహెచ్ఎస్ అధ్యక్షుడు డేవిడ్ హార్కీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కారులో అన్నింటికన్నా భద్రమైన సీటు వెనుక సీటేనని చాలా మంది అనుకుంటుంటారు. text: క్రికెట్ ప్రపంచకప్ 2019 ట్రోఫీని ముద్దాడుతున్న ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇంతకీ ఈ సూపర్ ఓవర్ ఏంటి? సూపర్ ఓవర్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తొలుత వన్ ఓవర్ పర్ సైడ్ ఎలిమినేటర్(ఊప్సీ) అని పిలిచేది. తర్వాత దాన్ని సూపర్ ఓవర్ అనే సంబోధిస్తోంది. 2008లో ట్వంటీ 20 క్రికెట్ కోసం ఈ సూపర్ ఓవర్‌ను ప్రవేశపెట్టారు. 2004లో ప్రారంభమైన అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్‌ మ్యాచుల్లో ఏదైనా మ్యాచ్ టై అయితే, దాని ఫలితం తేల్చేందుకు బౌల్-ఔట్ పద్ధతిని అనుసరించేవారు. అంటే.. ఒక్కో జట్టు తరపున ఎంపిక చేసిన బౌలర్లు వికెట్లపైకి బాల్ విసరాలి.. ఎవరు ఎక్కువ సార్లు బౌల్డ్ చేస్తే వారే విజేత. సూపర్ ఓవర్‌లో మాత్రం ఆరు బంతుల్లో ఏ జట్టు ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టే విజేత. కేన్ విలియమ్సన్ ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వాస్తవానికి సూపర్ ఓవర్ అనేది ఐసీసీ వన్డే క్రికెట్ ఆట నియమ నిబంధనల్లో లేదు. కానీ, ట్వంటీ20 నియమ నిబంధనల్లో ఉంది. 2011 క్రికెట్ ప్రపంచకప్ నాకౌట్ దశలో ఈ సూపర్ ఓవర్ నిబంధనను వన్డే క్రికెట్‌లో ప్రవేశపెట్టింది ఐసీసీ. కానీ, దీనిని ఉపయోగించే అవకాశం రాలేదు. తర్వాత 2015 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే దీనిని ఉపయోగించాలని నిర్ణయించింది. 2017లో మహిళల క్రికెట్ ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ దశలకు తిరిగి సూపర్ ఓవర్‌ విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2019 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే దీన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. అయితే, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (పురుషుల) క్వాలిఫయర్ 2018 ఆట నియమ, నిబంధనల్లో మాత్రం సూపర్ ఓవర్ నియమ నిబంధనల్ని పేర్కొన్నారు. 16.9.4డి ఫైనల్ మ్యాచ్ టై అయితే.. రెండు జట్లూ సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. దీని ద్వారానే విజేతను ఎంపిక చేస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ ఆడేందుకు వాతావరణం అనుకూలించకపోతే, మ్యాచ్ ఫలితం తేలకపోతే.. సూపర్ సిక్స్ దశలో అత్యుత్తమ దశలో నిలిచిన జట్టే విజేత అవుతుంది. అయితే, ఈ నిబంధనను మరింత స్పష్టంగా వివరించేందుకు ఒక అనుబంధ పత్రాన్ని కూడా ఐసీసీ జత చేసింది. అనుబంధం ఎఫ్ ఏం చెబుతోంది? ఉదాహరణ పైన పేర్కొన్న ఉదాహరణలో 6, 5 బంతులకు రెండు జట్లూ సమాన పరుగులు చేశాయి. కానీ, 4వ బంతికి మాత్రం.. మొదటి జట్టు 2 పరుగులు చేస్తే, రెండో జట్టు ఒక్క పరుగే చేసింది. కాబట్టి మొదటి జట్టే విజేత. వన్డే చరిత్రలో మొదటి మ్యాచ్ ఐసీసీ గణాంకాల ప్రకారం వన్డేల చరిత్రలో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించిన మొదటి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజీలాండ్‌ల మధ్య జరిగిన 2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై అవటం ఇదే తొలిసారి. మ్యాచ్‌ ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాలనుకుంటే.. సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. దీంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలిచింది. మరి ఇరు జట్ల బౌండరీలు కూడా సమానం అయితే అప్పుడు విజేతను ఎలా నిర్ణయిస్తారు? text: వారం రోజుల్లో ఏడుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (8,848 మీటర్లు) ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ పర్వతంపై మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏడుగురు పర్వతారోహకులు మరణించారు. బుధవారం నాడు (మే 22) పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా తీసిన ఫొటో చూస్తే ఎవరెస్టు పర్వతంపై ఎంత రద్దీ ఉందో... అక్కడ వారు ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. ఎవరెస్టును అధిరోహించేందుకు బుధవారం ఒకేసారి వందలమంది ఎగబడ్డారు. దాదాపు 320 మంది క్యూలో ఉన్నారని నిర్మల్ తెలిపారు. దాంతో, చాలామంది కొన్ని గంటలపాటు క్యూలో వేచి ఉండాల్సి వ‌చ్చింది. శిఖ‌రం మీదికి చేరుకునేందుకు ఆల‌స్యమైంది. ఈ వారం రోజుల్లో ఎవరెస్టు మీద చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు, ఒక నేపాలీ, ఒక ఆస్ట్రేలియా, ఒక అమెరికా పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం ఉదయం ఐర్లాండ్‌కు చెందిన పర్వతారోహకుడు కెవిన్ హైనెస్ (56) చనిపోయారు. ఎవరెస్టు పర్వతం దిగుతుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ సీజన్‌లో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. శనివారం బ్రిటన్‌కు చెందిన రోబిన్ హాయ్‌నెస్ ఫిషర్ (44) కూడా మరణించారు. 2012లో తీసిన చిత్రం ఎందుకు చనిపోతున్నారు? "ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్ని సీజన్లలో మాత్రమే అనుమతిస్తారు. అందులోనూ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోతుంటాయి. వాతావరణం అనుకూలించినప్పుడు ఒకేసారి ఎక్కువ మంది పర్వతం మీదికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు రద్దీ భారీగా పెరిగిపోతుంది" అని 'సెవెన్ సమ్మిట్స్ ట్రెక్స్' సంస్థ ఛైర్మన్ మింగ్మా షెప్రా వివరించారు. ఈ క్యూ కారణంగా ఒక్కోసారి గంటన్నర పాటు ముందుకు కదల్లేని పరిస్థితి ఉంటుందని మింగ్మా చెప్పారు. పొడవాటి క్యూలు చాలా ప్రమాదకరమని 1992లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన దుజ్మోవిట్స్ అంటున్నారు. "క్యూలో వేచిచూడాల్సి రావడంతో వెంట తీసుకెళ్లే సిలిండర్‌లో ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో, చాలామందికి తిరిగి పర్వతం కిందికి వచ్చే వరకు ఆక్సిజన్ చాలక మధ్యలోనే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంటుంది" అని దుజ్మోవిట్స్ అంటున్నారు. "1992లో నేను ఎవరెస్టును అధిరోహించినప్పుడు పర్వతం కిందికి దిగుతుండగా ఆక్సిజన్ అయిపోయింది. ఒక్కసారిగా నన్ను ఎవరో గట్టి కర్రతో కొట్టినట్లు అనిపించింది. ఇక అక్కడి నుంచి కదల్లేనేమో అని అనుకున్నాను. కానీ, అదృష్టం కొద్ది కాస్త కోలుకుని క్షేమంగా కిందికి దిగాను" అని దుజ్మోవిట్స్ గుర్తుచేసుకున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు గతంలో కంటే చాలా కఠినంగా ఉన్నాయి. ఏటా ఎవరెస్టును అధిరోహించేందుకు వెళ్లేవారి సంఖ్యతో పాటు, మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. దాంతో, ఏటా పరిమితి మేరకే పర్వతారోహకులను అనుమతించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది 807 మంది ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో 381 మంది పర్వతారోహకులకు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు నేపాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు ఒక్కొక్కరి నుంచి 7 లక్షల 63 వేలు వసూలు చేస్తుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఎంతో సాహసోపేతమైన పని. ఏటా వందల మంది ప్రయత్నిస్తే అతికొద్ది మంది మాత్రమే ఆ శిఖరం పై వరకూ చేరుకోగలుగుతారు. అయితే, కొందరు పర్వతారోహకులు మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు. text: ఆమె కళ్లు ఏమాత్రం కనిపించవు. అయినా.. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించారు. అదీ ఒకసారి కాదు.. వరుసగా రెండు సార్లు ఎంపికయ్యారు. ఇప్పుడామె ఐఏఎస్ అధికారి. ప్రాంజల్ మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో జన్మించారు. పుట్టుకతోనే ఆమెకు పాక్షిక అంధత్వం ఉంది. ఆమె కంటిచూపు పూర్తిగా పోవచ్చునని డాక్టర్లు ఆమె తల్లిదండ్రులకు ముందే చెప్పారు. కానీ.. అది చాలా ముందుగానే సంభవించింది. ఆమె రెండో తరగతి చదువుతున్నపుడు.. ఓ సహ విద్యార్థి పెన్సిల్‌తో ఆమె కంట్లో పొడిచాడు. ఆమె పూర్తిగా కంటిచూపు కోల్పోయారు. అయినా కానీ.. ప్రాంజల్ సాధారణ స్కూల్‌లో చదువు కొనసాగించారు. తర్వాత పరిస్థితిలు చాలా కష్టంగా మారాయి. ఆమెను బద్లాపూర్‌లోని ఒక స్కూల్‌లో చేర్చారు. అక్కడి వాతావరణంలో ఆమె ఇమడలేకపోయారు. దీంతో ఆమెను ముంబైలోని దాదర్‌లో గల కమలాబాయి మెహతా స్కూల్‌లో చేర్చారు. ‘‘ఆ స్కూల్‌లో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివింది. అదంతా చాలా భావోద్వేగాలతో నిండిన ప్రయాణం. సోమవారం నుంచి శుక్రవారం వరకూ అక్కడే స్కూల్‌లోనే ఉండేది. వారాంతాల్లో ఇంటికి వచ్చేది. అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. కానీ సోమవారం వచ్చిందంటే చాలా బాధ కలిగేది’’ అని ఆమె తండ్రి ఎల్.బి. పాటిల్ చెప్పారు. అప్పుడు ఆయన గొంతులో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. ‘‘పదకొండో తరగతి నుంచి ఆమెను దగ్గర్లోని కాలేజీలో చేర్చాం. నా భార్య, కుమారుడు ఆమెను కాలేజీలో దింపేవారు. పదో తరగతి వరకూ ఆమె మరాఠీ మీడియంలో చదివింది. పదకొండో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం. దీంతో ఆమెకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. అయినా అన్నిటినీ అధిగమించి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది’’ అని ఆయన వివరించారు. హెచ్ఎస్‌సీ తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆమె చేరారు. అంధుల కోసం అవసరమైన సదుపాయాలన్నీ ఆ కాలేజీలో ఉన్నాయి. ప్రాంజల్ విశ్వవిద్యాలయం స్థాయిలో ఫస్ట్ ర్యాంక్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆమె ఇంకా ముందుకు సాగాలనుకున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉన్నత విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచే అంతర్జాతీయ సంబంధాల్లో ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేశారు. పీహెచ్‌డీ కోసం కూడా నమోదు చేసుకున్నారు. ఈ మధ్యలో నెట్, సెట్ పరీక్షలు కూడా పాసయ్యారు. సివిల్ సర్వీసెస్ ప్రయాణం... ఎంఫిల్ పూర్తిచేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరవ్వాలని ప్రాంజల్ నిర్ణయించుకున్నారు. ఆరంభంలో.. అందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ సంపాదించుకోవటానికి చాలా కష్టపడ్డారు. అప్పుడు తన పర్సనల్ కంప్యూటర్‌లో స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ‘‘ఆ సాఫ్ట్‌వేర్ నా జీవితాన్ని కొంత సులభం చేసింది. దీని సాయంతో నేను న్యూస్‌పేపర్లు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు అన్నీ చదివేదాన్ని. బ్రెయిలీలో లభించని కొన్ని పుస్తకాలని పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి చదువుకునేదాన్ని’’ అని ప్రాంజల్ తెలిపారు. ‘‘జేఎన్‌యూలో నా ఫ్రెండ్ ఒకరు.. ప్రిలిమ్, మెయిన్ పరీక్షల్లో నా రైటర్‌గా హెల్ప్ చేసింది. మా మధ్య చాలా సఖ్యత కుదిరింది. జవాబు రాయటం కన్నా చెప్పటం చాలా సులభం. ఆమె చాలా సహకరించింది’’ అని వివరించారు. ‘‘నాకు రోజు వారీ పనులు అని నిర్దిష్టంగా ఏమీ లేవు. ఎంఫిల్, సివిల్ సర్వీసెస్ రెంటినీ సమన్వయం చేసుకోవటానికి ప్రయత్నించేదాన్ని’’ అని ఆమె తెలిపారు. ‘‘ఆమె హెడ్‌ఫోన్ సాయంతోనే చదివారు. దీనివల్ల తన చెవులు కూడా దెబ్బతింటాయేమోనని ఆమె కొన్నిసార్లు ఆందోళనపడేది’’ అని పాటిల్ చెప్పారు. ప్రాంజల్ తన తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 773వ ర్యాంకుతో ఎంపికయ్యారు. కానీ ఆమె పోరాటం అక్కడితో ఆగలేదు. ఆమెకు ఇండియన్ రైల్వే ఎకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్ఏఎస్) కేటాయించారు. కానీ.. పూర్తిగా అంధురాలైన వ్యక్తికి ఆ పోస్టు ఇవ్వటానికి రైల్వే నిరాకరించింది. ఈ పరిణామం ప్రాంజల్‌ను తీవ్రంగా కలచివేసింది. ‘‘నేను రెండోసారి సివిల్స్ మెయిన్స్ పరీక్ష 2016 డిసెంబర్ మూడో తేదీన రాయాలి. డిసెంబర్ రెండో తేదీన ఈ విషయాలన్నీ తెలిశాయి. నేను షాక్ తిన్నాను. అయితే మొదట నేను పరీక్షల మీద దృష్టి కేంద్రీకరించాను. ఈ పరిణామం గురించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)లో విచారించాలని నా స్నేహితులకు చెప్పాను’’ అని ప్రాంజల్ తెలిపారు. ‘‘నాకు ఏ సమాచారమూ రాలేదు. అప్పటి రైల్వేమంత్రి సురేశ్‌ప్రభును కూడా కలిశాను. పీఎంఓ సహాయమంత్రి జితేంద్రసింగ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాను. దీంతో వారు నాకు ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీసెస్ కేటాయించారు. సర్వీసును కేటాయించే తన పని డీఓపీటీ పూర్తిచేసినందున నేను అది తీసుకోవాల్సి వచ్చింది. సర్వీస్‌లో చేరాను. ఈలోగా రెండోసారి రాసిన మెయిన్స్‌లో ఎంపికయ్యాను. ఈసారి నాకు 124వ ర్యాంక్ వచ్చింది. నాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) కేటాయించారు. నాకు కేరళ కేడర్ వచ్చింది’’ అని ఆమె వివరించారు. అండగా నిలిచిన కుటుంబం... ప్రాంజల్‌కు కోమల్ పాటిల్‌తో వివాహమైంది. ఆమెను ఆయన బేషరతుగా అంగీకరించారు. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణం భూసావాల్‌లో నివసిస్తారు. అక్కడే ఆయనకు చిన్న వ్యాపారం ఉంది. కోమల్ లాగానే ప్రాంజల్ అత్తమామలు కూడా ఎంతో మద్దతు ఇచ్చారు. ఆమె కష్టసుఖాల్లో ఆమెను వెన్నంటి నిలిచారు. మొదటి దశ శిక్షణ పూర్తయిన తర్వాత ప్రాంజల్ ఇటీవలే ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్‌గా చేరారు. ‘‘ఇప్పుడే నా అసలు పరీక్ష మొదలైంది’’ అని ఆమె అంటారు. జీవితాంతం పోరాడుతూ విజయం సాధిస్తూ వస్తున్న ప్రాంజల్ ఇప్పుడు నూతనోత్సాహంతో ఈ పరీక్షను ఎదుర్కోనున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రాంజల్ పాటిల్.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఇది మామూలు వార్తగానే కనిపించొచ్చు. కానీ అక్కడి వరకూ రావటానికి ప్రాంజల్ చేసిన ప్రయాణం అసాధారణమైనది. ఎందుకంటే.. ఆమె అంధురాలు. text: ఆఫీసు కూడా లేకుండానే ఆన్ లైన్ కంపెనీ పెట్టి రూ.7కోట్లు వసూలు చేశారు ఈ కథనం ప్రకారం విశాఖపట్నానికి చెందిన ఇంజినీరింగ్‌ డిప్లొమా చదివిన ఓ కుర్రాడు, మరో ముగ్గురు యువకులు కలిసి ఓ బోగస్‌ కంపెనీ సృష్టించారు. భారతీయ కంపెనీ అంటే ఎవరూ నమ్మరని బ్రిటన్‌ కంపెనీ పేరుతో మల్టినేషనల్‌ కంపెనీగా రిజిస్టర్‌ చేశారు. వాట్సప్‌ నెంబర్లు కూడా బ్రిటన్‌ నంబర్లు ఇచ్చి, డాలర్ల రూపంలో డబ్బులు వసూలు చేశారు. ఇందులో చేరిన వాళ్లకు ప్రతినెలా మంచి కమీషన్‌ ఇస్తామని ఇంటర్నెట్‌లో ప్రకటనలు ఇచ్చారు. ఆశపడిన కస్టమర్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఇందులో చాలామంది విద్యావంతులే. ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బులు పోగవడంతో నలుగురు యువకులకు ఈ డబ్బును రొటేషన్‌ చేయడం కష్టమేమోన్న భయం పట్టుకుంది. దీంతో కంపెనీని మూసేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌ నెల నుంచి వెబ్‌సైట్‌ మాయమైంది. ఇందులో పెట్టుబడి పెట్టిన హైదరాబాద్‌కు చెందిన ఏఈ ఒకరు అనుమానం వచ్చి వాట్సప్‌ నంబర్‌కు కాల్ చేయగా అది పని చేయలేదు. దీంతో హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి నిందితులు విశాఖపట్నానికి చెందినవారిగా గుర్తించి అరెస్టు చేశారు. ఏపీ అసెంబ్లీలో నివర్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శల నడుము తొలిరోజు వాడివాడిగా సాగాయని సాక్షి దినపత్రిక పేర్కొంది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నివర్‌ తుపాను సృష్టించిన నష్టం, పరిహారం అంశంపై సమావేశాల తొలిరోజున అధికార పక్షాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. చంద్రబాబు మాట్లాడేందుకు అనుమతించడంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, దీనిపై ఆగ్రహించిన చంద్రబాబు స్పీకర్‌ పోడియం ముందు బైఠాయించడంతో సభలో గందరగోళం నెలకొంది. సభా వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారన్న కారణంతో చంద్రబాబు నాయుడు సహా 12 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్‌ చేశారు. రైతుల తరఫున చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించలేదనని తెలుగుదేశం వాదించగా, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా తుపాను బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి పత్రిక పేర్కొంది. అఖిలపక్షంతో మాట్లాడనున్న ప్రధానమంత్రి లాక్‌డౌన్‌ గురించి చర్చిస్తారా ? ఈ నెల 4 ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారని నమస్తే తెలంగాణ పత్రిక వెల్లడించింది. ఈ నెల 4న ఉదయం 10.30 గం.లకు ఆన్‌లైన్‌లో జరగబోయే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లోని అన్ని రాజకీయ పక్షాల ఫ్లోర్‌ లీడర్లకు ఆహ్వానాలు పంపినట్లు ఈ కథనం పేర్కొంది. మరోవైపు టీకా సామర్ధ్యానికి సంబంధించిన సమచారాన్ని ప్రజలందరికీ అర్ధమయ్యే భాషలో అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫార్మా కంపెనీలకు సూచించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న జెనోవా ఫార్మ (పుణె), బయోలాజికల్‌ ఈ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ (హైదరాబాద్‌) కంపెనీల ప్రతినిధులతో ప్రధానమంత్రి మాట్లాడారు. రోజువారీ కరోనా కేసుల సంఖ్య గత కొద్దిరోజులుగా తక్కువగా నమోదవుతోంది పడిపోయిన రోజువారీ కేసులు దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య గత వారం రోజుల్లో రెండుసార్లు 40వేల దిగువకు పడిపోయిందని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది. గత 24 గంటల్లో దిల్లీ, కేరళ, మహారాష్ట్ర సహా ఏ రాష్ట్రంలోనూ కొత్త కేసుల సంఖ్య 6 వేలకు మించలేదని ఈ కథనం వెల్లడించింది. ముఖ్యంగా దేశ రాజధానిలో కేసుల సంఖ్య వరసగా రెండోసారి 5 వేలకు లోపు నమోదైనట్లు తేలిందని ఈ కథనం పేర్కొంది. రోజువారీ మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఈనాడు తెలిపింది. కేరళలో కేసుల సంఖ్య తగ్గినా మరణాల సంఖ్య పెరిగింది. తాజాగా కేరళ అత్యధిక కేసుల నమోదులో వరసగా రెండోరోజు మొదటిస్థానంలో నిలిచింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా 24 గంటల్లో 443 మంది మరణించారని, కొత్త కేసులు 38వేలకు పైగా నమోదు కాగా, కోలుకున్న వారి సంఖ్య 45వేలకు పైగా ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మీరు మునగండి, ఆపై అందర్నీ ముంచండి అన్న రీతిలో చేరిన వాళ్లకు 5 శాతం, చేర్పించిన వాళ్లకు 10శాతం రిటర్న్స్‌ ఇస్తామంటూ ఆశ చూపి వేలమందిని సభ్యులుగా చేర్చుకున్న ఓ ముఠా రూ.7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం ఇచ్చింది. text: మ్యాక్స్ ప్లాంక్ అండ్ టెక్నియాన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ జర్మనీ, ఇజ్రాయెల్ ఇటీవల ఓ అధ్యయాన్ని నిర్వహించాయి. అందులో అమ్మాయిలకన్నా అబ్బాయిలే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని తేలింది. అలాగని మహిళలంతా నిజమే చెబుతారని కాదు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది అబ్బాయిలు అబద్ధాలు చెప్పారు. అదే అమ్మాయిలైతే 38 శాతం మంది అబద్ధాలు చెప్పారు. 44,000 మందికి సంబంధించిన 565 అధ్యయనాల్లో తేలిన విషయమిది. మరి ఎవరి కళ్లు ఎక్కువ నిజాయతీగా కనిపిస్తాయి? వృద్ధులతో పోల్చితే యువత ఎక్కువ అబద్దాలు చెబుతుందట. వయసు పెరుగుతున్న కొద్దీ ఏటా 0.28 శాతం పాయింట్ల చొప్పున మనలో నిజాయితీ పెరుగుతుందట. అదండీ సంగతి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెబుతారు? అమ్మాయిలా? లేక అబ్బాయిలా? వృద్ధులా లేక యువతా? సమాధానం తెలియాలంటే ఈ అధ్యయనం గురించి తెలుసుకోవాల్సిందే. text: ప్రతీకాత్మక చిత్రం 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు 250 మంది పాఠశాల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక చెబుతోంది. 1986 నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఇదే అత్యధికం. అంతకు ముందటి ఏడాది అంటే 2015/16లో 245 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ సమస్యలు, భవిష్యత్తు పట్ల ఆందోళన, బెదిరింపులు వంటివి ఈ ఆత్మహత్యలకు కారణాలుగా పేర్కొన్నారు. అయితే, వారిలో 140 మంది ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో చెబుతూ ఎలాంటి లేఖలూ రాయలేదని పాఠశాలలు తెలిపాయి. బలవన్మరణాలకు పాల్పడిన వారిలో ఎక్కువగా హైస్కూల్ వయసు వారే ఉంటున్నారు. సాధారణంగా జపాన్‌లో 18 ఏళ్ల వయసు వచ్చేవరకు చదువుకుంటారు. 1972 నుంచి 2013 వరకు దేశంలో జరిగిన ఆత్మహత్యల గణాంకాలకు సంబంధించిన నివేదికను 2015లో జపాన్ కేబినెట్ కార్యాలయం విడుదల చేసింది. ఏటా సెప్టెంబర్‌ ఆరంభంలో అత్యధికంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆ నివేదికలో వెల్లడైంది. జపాన్‌లో పాఠశాలలు ఏప్రిల్‌లో తెరుచుకుంటాయి. మొదటి విడతలో జూలై 20 వరకు తరగతులు నడిచిన తర్వాత వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి సెప్టెంబరు 1 నుంచి రెండో విడత ప్రారంభమవుతాయి. వయసుతో నిమిత్తం లేకుండా చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015 గణాంకాల ప్రకారం, అత్యధికంగా ఆత్మహత్య కేసులు నమోదవుతున్న దేశాల్లో జపాన్ ఒకటి. అయితే, గత కొన్నేళ్లుగా ప్రభుత్వం చేపడుతోన్న నివారణా చర్యలతో పరిస్థితి మారుతోందని అధికారులు చెబుతున్నారు. 2003లో దేశవ్యాప్తంగా 34,500 మంది, 2015లో 25,000 మంది ప్రాణాలు తీసుకున్నారు. 2017లో ఆ సంఖ్య 21,000కు తగ్గిందని పోలీసులు తెలిపారు. మొత్తం సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కానీ, బాలల ఆత్మహత్యల రేటు మాత్రం పెరుగుతోంది. "విద్యార్థుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇది ఆందోళనకరమైన విషయం. ఆత్మహత్యల నివారణ కోసం తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది" అని జపాన్ విద్యాశాఖ అధికారి నోరియాకి కిటజాకి అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జపాన్‌లో బాలల ఆత్మహత్యలు గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగాయని ఆ దేశ విద్యాశాఖ వెల్లడించింది. text: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ జూన్ 12న సింగపూర్‌లో కలవబోతున్నారు. ఇద్దరూ సమావేశం అవుతారని ప్రకటన రాగానే.. ఇద్దరూ ఎక్కడ కలుస్తారోననే అంతా ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఊహలకు తెరదించిన ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. "కిమ్ జోంగ్ ఉన్‌తో నేను సమావేశం అయ్యే రోజు కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అది జూన్ 12న సింగపూర్‌లో జరుగుతుంది. ఈ భేటీ విశ్వశాంతికి చాలా ప్రత్యేకమైన క్షణం అయ్యేలా మేమిద్దరం ప్రయత్నిస్తాం" అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హై-ప్రొఫైల్ సమావేశం ఎక్కడ జరగబోతోందో తెలిసినప్పటి నుంచీ.. అసలు ఈ సమావేశం కోసం సింగపూర్‌ను ఎందుకు వేదికగా ఎంచుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి. సింగపూర్‌కు ప్రత్యామ్నాయం ఏది ట్రంప్, కిమ్ సమావేశం సింగపూర్‌లో జరగవచ్చని అంతా అనుకుంటున్నప్పుడు, దానితోపాటూ డీఎంజడ్ ( డీమిలిట్రైజ్డ్ జోన్ ) పేరు కూడా వినిపించింది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య సరిహద్దు ప్రాంతమే డీఎంజడ్. అంటే కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిని కలవడానికి వచ్చినపుడు ఈ ప్రాంతం నుంచే బోర్డర్ దాటి వెళ్లారు. మొదట్లో ట్రంప్ కూడా దానికి సిద్ధమన్నట్టు వార్తలొచ్చాయి. కానీ కొంతమంది ట్రంప్ డీఎంజడ్‌ వద్దకు వెళ్లడం అంటే.. అది దాదాపు ఉత్తర కొరియా వెళ్లినట్టే అని భావించారు. ఈ సమావేశం కోసం ట్రంప్ ఉత్తర కొరియాకు, కిమ్ జాంగ్ ఉన్ అమెరికాకు వెళ్లే ప్రసక్తే ఉండదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. ఆ ప్రాంతం ఏదైనా మూడోదే కావాలి. ఎందుకంటే కిమ్ ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దేశాలు, లేదా యూరప్ వెళ్లడానికి సిద్ధం కారు. అవే కాదు, కిమ్ జోంగ్ ఉన్ జపాన్, దక్షిణ కొరియా వెళ్లడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. ఈ సమావేశానికి చైనా ఆతిథ్యం ఇచ్చుండచ్చు. కానీ దానికి అమెరికా ఒప్పుకోదు. ఆసియాలోని వేరే దేశాలు, ఆఫ్రికా భద్రత దృష్ట్యా అంత సురక్షితం కాదు. ఈ ప్రత్యామ్నాయాలే కాకుండా ఈ సమావేశానికి మంగోలియా పేరు కూడా తెరపైకి రావడం ఆసక్తి కలిగించింది. కానీ అది చైనాకు దగ్గరవడంతో దానిపై అమెరికా అంత ఆసక్తి చూపించకపోయుండచ్చు. కిమ్‌కు నచ్చిన చోటు? అన్నిటికంటే ముఖ్యంగా సింగపూర్ తటస్థంగా ఉంటుంది. ఆ దేశానికి కొరియా ద్వీపకల్పంపై ఎలాంటి ఆసక్తి లేదు. ఉత్తర కొరియా-సింగపూర్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా గత సంవత్సరమే ముగిశాయి. అది మినహా రెండు దేశల సంబంధాలు కాస్తోకూస్తో బాగానే ఉన్నాయి. చెప్పాలంటే చాలా రోజుల వరకూ ఉత్తర కొరియా ప్రజలకు సింగపూర్ వెళ్లడానికి వీసా అవసరం కూడా రాలేదు. ప్రపంచంలో ఉత్తర కొరియా రాయబార కార్యాలయాలున్న40 దేశాల్లో ఇది కూడా ఉంది. సింగపూర్‌లో సమావేశానికి కిమ్ జోంగ్ ఉన్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇది కాకుండా సింగపూర్, ఉత్తర కొరియా మధ్య ఎక్కువ దూరం లేదు. కిమ్ కూడా తక్కువ సమయంలో అక్కడికి చేరుకోగలరు. ఇది చాలా పెద్ద విషయమే, ఎందుకంటే.. విమాన ప్రయాణం గురించి ఆయన ఎక్కువ ఆందోళన పడుతుంటారు. సింగపూర్, అమెరికా స్నేహం ఉత్తర కొరియా నాయకుడి టెన్షన్ దూరం చేసిన సింగపూర్ అటు అమెరికాకు కూడా ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉంది. ఇక్కడ తమ నౌకలను ఉంచడం అమెరికాకు చాలా ఇష్టం. అమెరికా నౌకాదళానికి సింగపూర్ వ్యూహాత్మక స్థావరం. అంతే కాదు, సింగపూర్ పట్ల అమెరికా చాలా సానుకూలంగా ఉంది. ఉత్తర కొరియా నాయకుడితో జరిగే సమావేశంలో అది ఈ దేశానికి భద్రత గురించి కూడా భరోసా ఇవ్వవచ్చు. దీనికి తోడు సింగపూర్ ఇలాంటి సమావేశాలను ఇంతకు ముందే విజయవంతంగా నిర్వహించింది. 2015లో చైనా, తైవాన్ కూడా 60 ఏళ్ల తర్వాత ఇక్కడే కలిశాయి. సింగపూర్‌కు చెందిన ప్రముఖ వార్తా పత్రిక స్ట్రెయిట్ టైమ్స్ "సింగపూర్‌లో సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. ఏ అమెరికా అధ్యక్షుడికైనా అది చాలా ముఖ్యం. దీనితోపాటూ చాలా తక్కువ సమయంలో వారు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేయగలరు" అని పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొన్ని రోజుల ముందు వరకూ ఇద్దరు దేశాధినేతలు ప్రపంచంలోనే అతిపెద్ద శత్రువుల్లా కనిపించారు. యుద్ధం వాకిట్లో నిలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు, విద్వేషాలను చల్లార్చేందుకు చేతులు కలపబోతున్నారు. text: ఆ వీడియోలో రాహుల్, "ఇక్కడి వ్యవసాయ భూముల నుంచి మీరు డబ్బు సంపాదించలేరు. చంద్రునివైపు చూడండి. అక్కడ మీకు నేను భూములు ఇస్తాను. భవిష్యత్తులో మీరు అక్కడ బంగాళదుంపలు పండించుకోవచ్చు. అక్కడ నేను ఒక మెషిన్ ఏర్పాటు చేస్తా. అక్కడి నుంచి బంగాళ దుంపలను గుజరాత్‌కు ఎగుమతి చేసుకోవచ్చు" అని చెప్పినట్లుగా ఉంది. "టీమ్ మోదీ 2019", "నమో అగైన్" వంటి బీజేపీ అనుకూల ఫేస్‌బుక్ పేజీలు ఈ వీడియోను, "ఎవరైనా ఆయనను ఆపండి. ఆయన చంద్రమండలం మీద పంట భూములు ఇస్తానని హామీ ఇస్తున్నారు" అనే వ్యాఖ్యతో షేర్ చేశాయి. ఆ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్లలో వేలాది మంది షేర్ చేసుకుని చూశారు. ఈ 24 సెకండ్ల వీడియోలో రాహుల్ గాంధీ ఒక బహిరంగసభలో మాట్లాడుతూ పంటలు పండించుకోవడానికి రైతులకు చంద్రుని మీద భూములు ఇస్తానని చెబుతున్నట్లుగా ఉంది. అయితే, ఇది తప్పుదారి పట్టించే ప్రచారమని మేం గుర్తించాం. రాహుల్ గాంధీ ఆ మాటలు అన్న మాట నిజమే. కానీ, అది వేరే సందర్భంలో. ఆ వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే క్లిప్‌గా మార్చి వైరల్ చేశారు. నిజమైన వీడియో రాహుల్ గాంధీ గుజరాత్‌లోని పటాన్‌లో ఏర్పాటు చేసిన యువ రోజ్‌గార్ ఖేదుత్ అధికార్ నవసర్జన్ యాత్రలో చేసిన ప్రసంగంలోని 24 సెకండ్ల ముక్కను తీసుకుని ఈ వీడియో తయారు చేశారు. రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్ర ఎన్నికలకు ముందు 2017లో నవసర్జన్ యాత్రలో పాల్గొన్నారు. ఆయన వాస్తవానికి ఏం చెప్పారు? "నేను ఆచరణయోగ్యం కాని హామీలు ఇవ్వను. ఒక్కోసారి మీకు అది నచ్చకపోవచ్చు. కానీ, మోదీజీ ఏమంటున్నారు... ఇక్కడి పంట పొలాలతో మీరు డబ్బు సంపాదించుకోలేరు, అందుకే చంద్రుని వైపు చూడండి. అక్కడ మీకు పంట పొలాలు ఇస్తాను. భవిష్యత్తులో మీరు అక్కడ బంగాళాదుంపలు పండించి మళ్ళీ గుజరాత్‌కే ఎగుమతి చేయొచ్చని అంటున్నారు. ఇలాంటి వాగ్దానాలతో నేను పోటీ పడలేను. నేను వాస్తవాలు మాట్లాడతాను." అంటే, రాహుల్ గాంధీ చెప్పిన ఆ మాటలు మోదీని ఉటంకిస్తూ చెప్పినవన్న మాట. రాహుల్ ఆరోజు చేసిన ప్రసంగం పూర్తి వీడియో ఆయన అధికారిక యూట్యూబ్ పేజిలో ఉంది. అది 2017 నవంబర్ 12న పబ్లిష్ అయింది. "బంగాళదుంపలు... బంగారం" అదే ప్రసంగంలో రాహుల్ చెప్పిన చెప్పిన మరో మాట కూడా 2017-18లో వైరల్ అయింది. ఆ వైరల్ వీడియోలో, "నేనొక యంత్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాను. అది ఎలాంటిదంటే, ఒకవైపు మీరు బంగాళ దుంపలు పెడితే మరో వైపు నుంచి అది మీకు బంగారాన్ని ఇస్తుంది. మీకు అప్పుడు ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు వస్తుంది" అని రాహుల్ చెప్పినట్లుగా ఉంది. ఆ వైరల్ వీడియో ఆయనను చూసి నవ్వుకునేలా చేసింది. ఆ అనుకరణలతో సోషల్ మీడియా ఆయన మీద పరోక్షంగా దాడి చేసింది. అయితే, అది కూడా నాటి గుజరాత్ యాత్రలో రాహుల్ చేసిన ప్రసంగంలోని ఒక శకలం మాత్రమే. మొత్తంగా 17 నిమిషాల 50 సెకండ్లు ఉన్న అసలు వీడియోలో ఆయన ఏమన్నారో చూడండి: "ఆయన ఒక మిషన్ కూడా అక్కడ పెడతానన్నారు. అందులో ఒక వైపు బంగాళ దుంపలు వేస్తే, అది మరోవైపు నుంచి మీకు బంగారాన్ని ఇస్తుంది. మీకు బోలెడంత డబ్బు వస్తుంది. అంత డబ్బుతో ఏంచేయాలో కూడా మీకు పాలుపోదు. ఇవి నా మాటలు కాదు. నరేంద్ర మోదీ మాటలు. ఇదీ మోదీ, బీజేపీల నిజ స్వరూపం." గుజరాత్‌లోని ఆదివాసీలకు రూ. 40,000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన మోదీ వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, వరద బాధితులకు కూడా ఒక్క రూపాయి సాయం అందించలేదని రాహుల్ ఆ ప్రసంగంలో ఆరోపించారు. అయితే, రాహుల్ చెబుతున్నట్లుగా మోదీ ఇచ్చిన అధికారిక ప్రకటన కానీ, వార్త కానీ, వీడియో కానీ మాకు లభ్యం కాలేదు. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతులకు పంటలు పండించుకోవడానికి చంద్రమండలం మీద భూమి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. text: అయితే, ఈ బిల్లులు ప్రవేశపెట్టేముందు 'సృష్టించిన పరిస్థితులను' గతంలో ఎన్నడూ చూడలేదని జర్నలిస్టులతో పాటు, ప్రభుత్వం నియమించిన మధ్యవర్తులు (ఇంటర్‌లోక్యూటర్లు) కూడా అంటున్నారు. వారిలో రాధా కుమార్ ఒకరు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ... గత కొన్నేళ్లుగా రాజకీయంగా, సామాజికంగా కశ్మీర్‌లో ప్రశాంతత అన్నదే లేదని అన్నారు. ఆ పరిస్థితులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని, దీనిని పరిష్కరించకపోతే అది త్వరలోనే మరో విధమైన నిరాశా నిస్పృహలకు దారితీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ విషయానికొస్తే, గత కొన్ని ఎన్నికల నుంచీ తాము అధికారంలోకి వస్తే జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని సవరిస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలలో పేర్కొంటూ వచ్చింది. జమ్ము, కశ్మీర్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కూడా బీజేపీ చేతులు కలిపింది. అయితే, ఆ పార్టీల పొత్తు పూర్తికాలం నిలబడలేదు. మొదట్లో బాగానే కలిసి పనిచేశారు. కానీ, తర్వాత పొత్తు వికటించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారితీసింది. అప్పటి నుంచి గవర్నర్ ద్వారా రాష్ట్రాన్ని బీజేపీ నడుపుతోంది. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. జనసంఘ్ కాలం నుంచే జమ్ము, కశ్మీర్‌ రాజకీయాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీనియర్ జర్నలిస్టు రాహుల్ పండితా చెప్పారు. కేడర్‌ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా కశ్మీర్ లోయలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. "బీజేపీకి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యం కావాలి. అందుకోసమే, కింది స్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో విజయవంతం అవుతోంది కూడా. క్రమంగా, చాలా వేగంగా ఆ పార్టీ కేడర్‌ బలోపేతం అవుతోందనడంలో ఏమాత్రం అనుమానం లేదు" అని ఆయన వివరించారు. పాత చిత్రం కశ్మీర్‌లో భారీగా సాయుధ బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించారు. నాయకులను గృహాలలో నిర్బంధించడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం 'అనవసర చర్య' అని గతంలో ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వ్యవహరించిన (ఇంటర్లోక్యూటర్) రాధా కుమార్ అభిప్రాయపడ్డారు. "పార్లమెంటులో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది కాబట్టి, సభలో ఏ తీర్మానమైనా ప్రవేశపెట్టొచ్చు. కానీ, ఇలాంటి చర్యలు ఎందుకు?" అని ఆమె ప్రశ్నించారు. జమ్ము, కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టక ముందు అమర్‌నాథ్ యాత్రను మధ్యలోనే ఆపేశారు. పర్యటకులంతా వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను మూసివేశారు. అన్ని రకాల పరీక్షలను రద్దు చేశారు. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముఖ్యంగా జమ్ము, కశ్మీర్ విభజన వల్ల శాంతికి బదులుగా మరింత అనిశ్చిత పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని సవరించాలని బీజేపీ ఎప్పటి నుంచో అంటోంది. తాజాగా అందుకు సంబంధించిన బిల్లులను హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. text: విస్తీర్ణంలో దాదాపు బ్రిటన్ పరిమాణంలో ఉండే గయానా జనాభా సుమారు 7.8లక్షలు. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడే మహిళల జాబితాలో ఆ దేశానిది మొదటి స్థానం. అదే మగవారి విషయంలో దానిది రెండో స్థానం. గయానాలో ప్రతి లక్షమందిలో 44మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ప్రపంచ సగటుకంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఒకే దేశంలో అన్ని ఆత్మహత్యలా? ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు? పేదరికం, దేశ వ్యాప్తంగా నేరాలు పెరగడమే ఈ సమస్యకు ప్రధాన కారణాలని చెబుతారు. కుటుంబ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఎక్కువ మంది డిప్రెషన్‌కు గురికావడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోంది. వీటికి తోడు, గయానా వాసులు తమ మానసిక స్థితి గురించి ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే గయానాలోని కొన్ని స్కూళ్లు, విద్యార్థులు తమ భావాలను స్వేచ్ఛగా పంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. దాని వల్ల వారికి ఏవైనా సమస్యలున్నా బయటికి చెప్పుకుంటారని, ఫలితంగా వారి మానసిక పరిస్థితి కాస్త కుదుట పడుతుందనీ అవి భావిస్తున్నాయి. గయానాలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. తోటి విద్యార్థుల చేతిలో వెక్కిరింతలు, బెదిరింపులకు గురవుతున్నారు. దాంతో వారి మనసులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. గయానాలో ప్రతి ఏడుగురిలో ఒకరు కేవలం రోజుకి రూ.130 కంటే తక్కువ ఆదాయంతో దుర్భర పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు. అందుకే ఆత్మహత్యల సమస్యను నివారించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. 2015లో మనుషుల మరణాలకు దారితీసిన కారణాల్లో ఆత్మహత్యలది 17వ స్థానం. నిజానికి ప్రతి ఐదు ఆత్మహత్యల్లో నాలుగు పేద, మధ్య స్థాయి దేశాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆత్మహత్యలు అన్ని దేశాల్లోనూ ఉండే సమస్యే. కానీ దక్షిణ అమెరికాలోని గయానా అనే చిన్న దేశంలో ఆ సంఖ్య మరీ ఎక్కువ. text: కోర్టు తమకు వ్యతిరేకంగా ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోకుండా ఉండాలని కూడా ఆ సంస్థ తన పిటిషన్‌లో కోరింది. వొడాఫోన్- ఐడియా తరఫున అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వినిపించిన వాదనలను సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అంతకు ముందు, వొడాఫోన్ ఐడియాకు ఎలాంటి ఉపశమనాన్ని కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కంపెనీ చెల్లించే ఈ మొత్తం ప్రభుత్వ ఆదాయంలో అదనపు ఆదాయంగా నమోదు అవుతున్నప్పటికీ, దీనివల్ల దేశంలోని మొత్తం టెలికాం పరిశ్రమ భారీ షాక్‌కు గురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ టెలీకాం రంగం భారత్‌ను ప్రపంచంలోని అతిపెద్ద టెలీకాం మార్కెట్లలో ఒకటిగా భావిస్తారు. కానీ, ఇక్కడి ప్రధాన పోటీదారుల్లో ఒకటైన వొడాఫోన్- ఐడియా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. టెలీకాం కంపెనీలు ప్రభుత్వానికి మొత్తం 13 బిలియన్ డాలర్లు చెల్లించాలి. దానికి సుప్రీంకోర్టు మార్చి 17 వరకూ గడువు ఇచ్చింది. గడువులోపు డబ్బు చెల్లించకుంటే, మీపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదని కోర్టు టెలీకాం కంపెనీలను ప్రశ్నించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు టెలీకాం కంపెనీలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పెద్ద టెలీకాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్-ఐడియాను కోర్టు తీర్పు కష్టాల్లో కూరుకుపోయేలా చేసింది. వొడాఫోన్ ఐడియా నష్టాలు వొడాఫోన్ ఐడియా గత త్రైమాసికంలో 6,453 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఆ నష్టం రూ.4,998 కోట్లు ఉంది. ప్రభుత్వం లేదా కోర్టు సాయం లభించకపోతే, తమ వ్యాపారాన్ని మూసివేయాల్సి ఉంటుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా అధికారికంగా వ్యాఖ్యానించడాన్ని బట్టి కూడా పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. కాల్, డేటా రేట్లు పడిపోయి, అప్పుల భారం పెరుగుతున్న సమయంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించడానికి గడువు ఇవ్వాలని కోరుతున్నాయి. కోర్టు మార్చి 17 వరకూ గడువు ఇవ్వడం, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో భారత్‌లో వొడాఫోన్ వ్యాపారం అంతానికి ఇది ప్రారంభమా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. బ్రిటన్ కంపెనీ వొడాఫోన్ భారత టెలీకాం మార్కెట్‌లో అతిపెద్దది, అత్యంత పాత కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ భారత్‌లో తమ వ్యాపారం నిలిపివేస్తే, ఈ ప్రభావం అసాధారణంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సంస్థకు 30 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వొడాఫోన్ వేలమందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. దీనితోపాటు ఈ కంపెనీకి తాళం వేయడం వల్ల మొత్తం టెలీకాం మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కంపెనీకి తాళం పడితే... వొడాఫోన్ ఐడియా భారత మార్కెట్‌లో తమ వ్యాపారానికి తెరదించాలని అనుకుంటే, తర్వాత టెలీకాం రంగంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఉంటాయి. అవి రిలయన్స్, ఎయిర్‌టెల్. భారతీ ఎయిర్‌టెల్ పరిస్థితి కూడా అంత ఘనంగా ఏమీ లేదు. గత త్రైమాసికంలో ఆ సంస్థ 3 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదు చేసింది. అది కూడా ప్రభుత్వానికి సుమారు 5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. టెలీకాం మార్కెట్‌లో కొత్త ఆటగాడిగా అడుగుపెట్టిన రిలయన్స్ జియోకు ఇది ఫీల్‌గుడ్ లాంటి పరిస్థితి. టెలీకాం మార్కెట్‌లో మారుతున్న ఈ పరిస్థితికి కారణం జియోనే అని చాలామంది భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం జియో టెలీకాం మార్కెట్‌లోకి అడుగుపెట్టగానే మొబైల్ ఇంటర్నెట్ రేట్లను భారీగా తగ్గించింది. దానితోపాటు భారత్‌ను ప్రపంచంలో అత్యంత చౌక ధరలకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్న దేశంగా మార్చేసింది. ఆ దెబ్బతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ బిజినెస్ మోడల్ ఛిద్రమైంది. తర్వాత రోజుల్లో ఈ రెండు కంపెనీలకు లక్షల మంది వినియోగదారులు దూరమయ్యారు. రెండు కంపెనీలకు కలిపి నష్టాలు 10 బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయి. ఇప్పుడు అవి మరో నెలలోపు ప్రభుత్వానికి భారీ మొత్తం చెల్లించాలి. ప్రయోజనం ఎవరికి? 2019 నాటికి రిలయన్స్ జియో దగ్గర 35 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వొడాఫోన్ ఐడియాకు తాళాలు పడితే, దానివల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది జియోనే అని భావిస్తున్నారు. 2022 నాటికి జియో తన లాభాలను రెట్టింపు చేస్తుందని, అప్పటికి ఆ కంపెనీ వినియోగదారుల సంఖ్య కూడా 50 కోట్లకు చేరుకుంటుందని టెలీకాం మార్కెట్ నిపుణుల అంచనా. కానీ, డబ్బు పట్ల సున్నితంగా వ్యవహరించే భారత వినియోగదారులకు ఇది ఎంత ప్రయోజనం? ఇది అంత శుభవార్త కాదు. భారీ నష్టాల వల్లే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ రేట్లను పెంచాయి. "ధరలను పెంచడం అనేది అంత తప్పేమీ కాదు. నిజానికి అది మంచిదే. ఎందుకంటే మార్కెట్‌లో పోటీ నిలిచి ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం అదే. భారత్‌లో టెలీకాం మార్కెట్‌ను కాపాడేందుకు, అది సుభిక్షంగా ఉండడానికి అలా జరగడం చాలా అవసరం" అని ఆర్థికవేత్త వివేక్ కౌల్ భావిస్తున్నారు. కానీ, అలా జరిగితే దీనివల్ల భారత్‌లోని భారీ టెలీకాం మార్కెట్ వృద్ధిలో మందగమనం వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇంకా వేచిచూడాల్సి ఉంటుంది. ఈ పోరాటం దేనికోసం? టెలీకాం కంపెనీలు, భారత ప్రభుత్వం మధ్య 'అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ' గురించి సుదీర్ఘంగా వివాదాలు నడుస్తున్నాయి. మామూలుగా చెప్పుకోవాలంటే టెలీకాం కంపెనీలు ఎంత డబ్బు సంపాదిస్తాయో, అందులో ఒక భాగాన్ని అవి టెలీకాం విభాగానికి ఇవ్వాల్సి ఉంటుంది. దానినే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ లేదా ఏజీఆర్ అంటారు. అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నిర్వచనంపై ప్రభుత్వం, టెలీకాం కంపెనీల మధ్య 2005 నుంచే అభిప్రాయ బేధాలు ఉన్నాయి. టెలీకాం బిజినెస్ వల్ల వచ్చే లాభాల నుంచే దానిని తీసుకోవాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం దానిని విస్తృత పరిధిలో చూస్తోంది. టెలికాం బిజినెస్ కాకుండా, వాటి ఆస్తుల అమ్మకాలు, డిపాజిట్ల నుంచి లభించే వడ్డీ లాంటి మిగతా ఆదాయం కూడా ఇందులో లెక్కించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వ పక్షాన తీర్పు వినిపించింది. అంటే... టెలీకాం కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 12.5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని అర్థం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వొడాఫోన్- ఐడియా ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మొత్తంలో సోమవారం రూ.2,500 కోట్లు, శుక్రవారం నాటికి 1,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఈ సంస్థ కోర్టుకు చెప్పింది. text: ఇటీవల లద్దాఖ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ రెండు దేశాలూ తాజాగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్‌లోని మొత్తం 30 యునికార్న్స్‌లో 18 వాటిల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. యునికార్న్ అంటే 7,000 కోట్ల రూపాయల ($1 బిలియన్) కన్నా ఎక్కువ విలువ చేసే ప్రైవేటు కంపెనీ. చైనా పెట్టుబడులు పెట్టినవాటిల్లో ఫుడ్ డెలివరీ యాప్స్, టాక్సీ ఆగ్రిగేటర్స్, హోటల్ చైన్స్, ఈ-లెర్నింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. రెండు దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణల దృష్ట్యా ఈ కంపెనీల భవిష్యత్తే కాకుండా, రాబోయే స్టార్టప్ కంపెనీల భవిష్యత్తు కూడా అనిశ్చితిలో ఉంది. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ 'ట్రూ నార్త్ భాగస్వామి హరీష్ చావ్లా మాట్లాడుతూ "కచ్చితంగా మూలధన వనరులకు నష్టం వాటిల్లింది. వృద్ధి మందగిస్తూ, డీల్స్ పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మొబైల్, వినియోగదారుల విభాగాల్లో చైనా కంపెనీలు చురుకుగా ఉండేవి" అన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం..టిక్‌టాక్, పబ్ జీ లాంటి పాపులర్ యాప్‌లతోసహా 200 పైగా చైనా యాప్‌లను నిషేధించింది. అంతేకాకుండా కొన్ని హైవే ప్రోజెక్టులు, చిన్న, మధ్య తరహా సంస్థలలో చైనా పెట్టుబడులను నిలిపివేసింది. చైనాను బహిష్కరించాలన్న నినాదం ఊపందుకుంటోంది. ఏప్రిల్‌లో కోవిడ్-19 వ్యాపిస్తున్న సమయంలో కంపెనీలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కఠినమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని ప్రవేశపెట్టింది. విదేశీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్టప్‌లకు ఇది ఎదురుదెబ్బే. ఒక దశాబ్దానికి ముందు భారతదేశంలో చైనా కంపెనీల పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. అయితే స్టార్టప్ రీసెర్చ్ సంస్థ ట్రాక్షన్ గణాంకాల ప్రకారం.. 2010 నుంచీ 35 చైనా కంపెనీలు, 85 వెంచర్ క్యాపిటల్, ప్రైవైట్ ఈక్విటీ సంస్థలు...పేటీఎం, స్నాప్ డీల్, స్విగ్గీ లాంటి కంపెనీలతో సహా అనేక పెద్ద పెద్ద స్టార్టప్‌లలో 4 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఈ మధ్య కాలంలో భారతీయ ఎఫ్‌డీఐలో చైనా పెట్టుబడులు 5 నుంచీ 11 శాతానికి పెరిగాయి. చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆరై)లో చేరడానికి భారత్ నిరాకరించినప్పటికీ వాస్తవానికి గత ఐదేళ్లుగా భారత్ అందులో భాగం అవ్వకనే అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సరిహద్దు సంఘర్షణలు, భారత ప్రభుత్వం చైనా యాప్‌ల మీద విధించిన నిషేధాలు ఇండియా స్టార్టప్‌ల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాన్నది చర్చనీయాంశంగా మారింది. "ప్రారంభ దశలో ఆ ప్రభావం మనకి పెద్దగా కనబడకపోవచ్చు" అని చావ్లా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పేటీఎం, స్నాప్ డీల్, బిగ్ బాస్కెట్ లాంటి కొన్ని యునికార్న్‌లను బీబీసీ సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ విషయం చాలా తీవ్రమైనది కావడం వలన వీరిలో ఏ ఒక్కరూ ఆన్-రికార్డ్ మాట్లాడడానికి నిరాకరించారు. అయితే, చైనా నుంచి వచ్చే నిధులను ఆపడం భారత ప్రభుత్వ ఉద్దేశం కాదని పరిశ్రమకు చెందిన కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత ఈక్విటీ సంస్థల్లో, సాంకేతిక రంగ సంస్థల్లో చైనా బలోపేతం అవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని వీరు అభిప్రాయపడుతున్నారు. శివనాడార్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ జాబిన్ టీ జాకబ్ మాట్లాడుతూ "ప్రభుత్వం చైనా పెట్టుబడులను పూర్తిగా నిషేధించదు. నిబంధనలను కట్టుదిట్టం చేస్తూ స్టార్టప్‌లలో ఒక స్థాయి దాటిన తరువాత చైనా పెట్టుబడులు పెట్టే అవకాశం లేకుండా చేస్తుంది" అని అభిప్రాయపడ్డారు. పెట్టిన పెట్టుబడుల నుంచీ బయటకు రప్పించే కంటే 5 జీ ట్రయల్స్ వేస్తున్నప్పుడు పెద్ద పెద్ద టెలికాం కంపెనీలను దూరంగా ఉంచడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో చైనా పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక లా ఫర్మ్ భాగస్వామి అతుల్ పాండే మాట్లాడుతూ "ఇండియాలో చైనా కంపెనీల భారీ పెట్టుబడులు చూస్తే, ఇప్పటికిప్పుడు వాటిని తొలగించి వేరే దేశాల నుంచీ పెట్టుబడులు సమకూర్చగలిగే అవకాశం తక్కువగా ఉంది" అంటున్నారు. తమకు చైనా పెట్టుబడిదారుల నుంచి 12 - 14 దరఖాస్తులు వచ్చాయని, సాధారణ పరిస్థితుల్లో అవన్నీ నిస్సందేహంగా ఆమోదించబడతాయని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ పెండింగ్‌లో ఉన్నాయని అతుల్ పాండే చెప్పారు. ఈ విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో దాన్నిబట్టీ పెట్టుబడుల పరిస్థితులు ఏమిటో తెలుస్తాయని ఆయన అన్నారు. చైనా మొబైల్ ఫాస్ట్ ట్రెండ్‌ నుంచీ భారత స్టార్టప్‌లు పాఠాలు నేర్చుకుంటున్నాయని, చైనా యాప్స్ నిషేధించగానే అనేక కొత్త భారతీయ యాప్స్ తెరపైకి వచ్చాయని, కోవిడ్-19 ప్రభావం నెమ్మదించగానే మిగతా దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంటర్నెట్ కంపెనీలకు ఇప్పటికీ భారత్‌లో అతి పెద్ద మార్కెట్ ఉందని వారంటున్నారు. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో కూడా గూగుల్, ఫేస్‌బుక్‌ లాంటి సిలికాన్ వ్యాలీ సంస్థల నుంచి ఏఐడీఏ, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్‌ లాంటి సంస్థల నుంచీ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, అయితే అవన్నీ ముఖేష్ అంబానీ జియో వంటి ప్లాట్‌ఫారంలలోకి వెళ్లాయని నిపుణులు అంటున్నారు. చైనా పెట్టుబడులను తగ్గించాలంటే స్వదేశీ పెట్టుబడులు పెరగాలని, స్టార్టప్‌ల మూలధనానికి ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే చైనా పెట్టుబడులు లేకుండా స్టార్టప్‌లను భారత్ నిలబెట్టగలదా లేదా అనేది తెలుస్తుందని అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇప్పటికే కోవిడ్-19 వ్యాప్తితో సవాళ్లు ఎదుర్కొంటున్న భారతీయ స్టార్టప్‌లకు మరో కొత్త సవాలు ఎదురవుతోంది. ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్న 'స్టార్టప్ ఇండియా' ప్రయత్నాలకు భారత-చైనాల మధ్య ఘర్షణలు విఘాతం కలిగిస్తాయా అనేది చర్చనీయాంశమైంది. text: న్యూ కెలడోనియా రిఫరెండంలో పెద్ద ఎత్తున ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు ఫ్రాన్స్‌ నుంచి విడిపోవాలా వద్దా అనే అంశంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఫ్రెంచ్‌ పాలనలో ఉండేందుకు 53.26శాతంమంది న్యూ కెలడోనియన్‌లు మొగ్గు చూపారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఈ రిఫరెండంలో 85.6శాతంమంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. రెండేళ్ల కిందట జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 56.7శాతంమంది ఫ్రాన్స్‌తో కలిసి ఉంటామని వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ఈ ఫలితాలపట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశ పాలనపై అక్కడి ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. న్యూ కెలడోనియాలో 40శాతంమంది కెనాక్‌ వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఫ్రెంచ్ ప్రజలతోపాటు యూరప్‌ నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ దాదాపు మూడింట ఒకవంతుమంది ఉన్నారు. మిగిలిన వారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కెలడోనియా సంస్కృతిలో కలిసి పోయారు. ఫ్రెంచ్ పాలలను అక్కడి కెనాక్ తెగ ప్రజలు చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకిస్తున్నారు రిఫరెండం ఎందుకు? ఈ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. 1980లలో స్థానిక కెనాక్‌ తెగకు చెందిన ప్రజలకు, యూరప్‌ నుంచి వచ్చిన వలస ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత ‘నౌమీ ఎకార్డ్‌’ (నౌమీ ఒప్పందం) పేరుతో 1998లో అనేక అంశాలపై ఒక ఒప్పందం కుదిరింది. నౌమీ ఒప్పందం ప్రకారం న్యూ కెలడోనియాలో మూడుసార్లు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. ఇందులో మొదటిది 2018లో జరగగా, తాజాగా రెండో రిఫరెండం నిర్వహించారు. మూడోది 2022లో జరగనుంది. న్యూ కెలడోనియా నికెల్ గనులకు ప్రసిద్ధి. ఎలక్ట్రానికి పరికరాల తయారీకి ఉపయోగపడే ఈ నికెల్ గనులు తమ దేశ ఆర్ధిక వ్యవస్థకు తరగని సంపదని ఫ్రాన్స్‌ భావిస్తోంది. న్యూ కెలడోనియాకు చాలా వరకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నా, రక్షణ, విద్యారంగాలలో ఎక్కువగా ఫ్రాన్స్‌ మీదే ఆధారపడుతోంది. ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున రాయితీలను కూడా పొందుతోంది. నికెల్ గనులకు ప్రసిద్ధి చెందిన న్యూ కెలడోనియాలో చైనా ప్రాబల్యం పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ‘కెనాక్‌’ తెగ ప్రజల్లో ఫ్రాన్స్‌ పట్ల వ్యతిరేకత ఫ్రాన్స్‌ నుంచి స్వేచ్ఛ కావాలంటూ కెనాక్‌ ప్రజలు డిమాండ్‌లు వినిపిస్తూ వస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో కెనాక్‌లు కాని వారంతా ఏకమవుతుండటంతో, అతి పెద్ద వర్గంగా ఉన్నప్పటికీ ఆ తెగ వాదన విజయం సాధించలేకపోతోందని ‘లోవీ ఇనిస్టిట్యూట్’ అనే థింక్‌ట్యాంక్‌ సంస్థ అభిప్రాయపడింది. న్యూ కెలడోనియా నుంచి చైనాకు భారీ ఎత్తున నికెల్ నిల్వలు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్రం అవసరం లేదంటున్న వారి సంఖ్య గత రిఫరెండంతో పోలిస్తే ఈసారి తగ్గడం ఇక్కడ పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. సుమారు 270,000మంది ప్రజలున్న ఈ ప్రాంతం తమదని 1853లో ఫ్రాన్స్‌ ప్రకటించుకుంది. 170 ఏళ్లుగా న్యూ కెలడోనియా ఫ్రెంచ్‌ భూభాగంగా ఉంటూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన స్వయంపాలన లేని ప్రాంతాలలో న్యూ కెలడోనియా కూడా ఒకటి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫ్రాన్స్‌ నుంచి వేరుపడాలని తాము కోరుకోవడంలేదని, ఆ దేశంతోనే కలిసుంటామని దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని ఫ్రాన్స్‌ భూభాగం న్యూ కెలడోనియా ప్రజలు రిఫరెండంలో తేల్చి చెప్పారు. text: చైనాలోని వెంజూ నగరంలో శుక్రవారం 'డీడీ' కారు ఎక్కిన 20 ఏళ్ల యువతిపై డ్రైవరే అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకుముందు కూడా ఈ సంస్థకు చెందిన వాహనంలో ఇలాంటి ఘటన జరిగింది. మేలో 21 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్ ఒకరు జింగ్‌జూ నగరంలో డీడీ కారులో ప్రయాణిస్తూ అత్యాచారం, హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. తాజా ఘటనలో బాధితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో డీడీ కారెక్కింది. స్నేహితులకు మెసేజ్‌లు పంపించింది. కానీ, ఒక గంట తరువాత ఆమె ఫోన్‌లో అందుబాటులో లేకుండాపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో డ్రైవర్‌ను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జోంగ్ అనే ఆ డ్రైవర్ ప్రయాణికురాలిపై అత్యాచారం చేసి చంపేసినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న జోంగ్‌కు ఇంతకుముందు నేరచరిత్రేమీ లేదని డీడీ సంస్థ చెబుతోంది. కానీ, గతంలోనూ ఒకసారి అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు అందిందని మాత్రం అంటోంది. ఒక ప్రయాణికురాలిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వదిలేసి, అక్కడి నుంచి ఆమె వెంటపడ్డాడన్నది అతనిపై వచ్చిన ఫిర్యాదుగా సంస్థ తెలిపింది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) చైనాకు చెందిన అద్దె కార్ల సంస్థ 'డీడీ చషింగ్' కార్ పూలింగ్ సేవలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళను డ్రైవర్ అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు చెప్పడంతో డీడీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. text: దక్షిణ కొరియా పర్యటనలో హ్యోన్ సాంగ్ వోల్ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు ఈ బృందానికి హ్యోన్ సాంగ్ వోల్ నేతృత్వం వహిస్తున్నారు. రహస్య దేశంగా పేరొందిన ఉత్తర కొరియాలో ప్రసిద్ధి చెందిన ‘మారన్‌బాంగ్‌ మహిళా బ్యాండ్‌’కు ఈమే నాయకురాలు. దేశంలో ఈమె పెద్ద సెలబ్రిటీ. గత రెండేళ్లలో తొలిసారి ఇరు కొరియా దేశాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో.. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తమ జట్టును పంపించేందుకు ఉత్తర కొరియా అంగీకరించిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాల కార్యక్రమంపై ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఒక దౌత్య విజయంగా భావిస్తున్నారు. ఈ బృందం దక్షిణ కొరియా రాజధాని నగరం సోల్‌కు వచ్చేందుకుగాను భారీగా భద్రత నడుమ బస్సులో సరిహద్దును దాటడాన్ని స్థానిక మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. వందల మంది పోలీసు సిబ్బంది పహారాలో ఈ బృందం దక్షిణ కొరియాలోని గంగ్నుంగ్‌కు రైలులో బయలుదేరింది. అయితే, దక్షిణ కొరియా మీడియా హ్యోన్ సాంగ్ వోల్‌పైనే ఎక్కువ దృష్టి సారించింది. భారీ భద్రత నడుమ దక్షిణ కొరియాకు బస్సులో వస్తున్న ఉత్తర కొరియా ప్రతినిధి బృందం దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన హ్యోన్ సాంగ్ వోల్‌కు కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద స్వాగతం పలుకుతున్న ఆ దేశ అధికారి మారన్‌బాంగ్‌ మహిళా బ్యాండ్‌‌లో ఆమెతో పాటు పది మంది అమ్మాయిలు ఉంటారు. వీరే ఉత్తర కొరియాకు ఆకర్షణీయమైన ముఖ చిత్రం. పాశ్చాత్య దేశాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ‘స్పైస్ గర్ల్స్‌’ పాప్ గ్రూప్‌కు ఉత్తర కొరియా సమాధానం ఈ మారన్ బాంగ్ మహిళా బ్యాండ్ అని కొందరు అభివర్ణిస్తుంటారు. కొన్నిసార్లు పొట్టి డ్రెస్సులు, హై హీల్స్ వేసుకుని, పాశ్చాత్య తరహా పాప్ సంగీతం మిళితమైన పాటలకు, దేశభక్తి గీతాలకు కూడా వీళ్లు ప్రదర్శనలు ఇస్తుంటారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌‌ - హ్యోన్ సాంగ్ వోల్ ఇద్దరూ ప్రేమించుకున్నారని, ఆమె కిమ్ మాజీ ప్రేమికురాలని ఒకప్పుడు పుకార్లు షికార్లు చేశాయి. కానీ, ఉత్తర కొరియాను నిశితంగా పరిశీలించేవారు మాత్రం వీటిని కొట్టిపారేశారు. 140 మంది సభ్యుల సమ్జియోన్ కళా బ‌ందానికి ఆమె నేత‌ృత్వం వహించనున్నారు. ఒలింపిక్స్ జరిగేప్పుడు ఈ బృందం రెండు ప్రదర్శనలు.. ఒకటి సోల్‌లో, రెండోది గంగ్నుంగ్‌లో ఇస్తుంది. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు సన్నాహకాల్లో భాగంగా ఉత్తర కొరియా తీసుకుంటున్న చర్యల్లో ఈ బ‌ృందం రెండు రోజుల పర్యటన కూడా ఒకటి. ఉత్తర కొరియా అధికారులు దక్షిణ కొరియాలో పర్యటించటం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రతినిధి బృందంలో అథ్లెట్లు, అధికారులు, ఛీర్ లీడర్లు కూడా ఉన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు గాను ఉత్తర కొరియాకు చెందిన మరో బృందం ఈ వారం దక్షిణ కొరియాలో పర్యటించనుంది. అలాగే, వింటర్ ఒలింపిక్స్ కోసం ఉత్తర కొరియా ఒక స్కై రిసార్టును ఏర్పాటు చేస్తోంది. దీనిని పరిశీలించేందుకు దక్షిణ కొరియా ఒక బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించనుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వచ్చే నెల జరగనున్న వింటర్ ఒలింపిక్స్ సాంస్కృతిక వేదికల్ని తనిఖీ చేసేందుకు ఉత్తర కొరియా ప్రతినిధి బృందం దక్షిణ కొరియాకు వచ్చింది. ఇరు దేశాల సంబంధాల్లో ఈ పర్యటన ఒక మైలురాయి. text: అప్పట్లో అది ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో స్మారక నిర్మాణాలు, ఆకర్షణలతో నిండిన ఈ నగరం స్పెయిన్‌ ఎండాలూసియా ప్రాంతంలోని కోర్డోబాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ, ఈ నగరం కేవల 70 ఏళ్లపాటే ఉందనేది కూడా ఒక చరిత్రే. మనం కాల్పనిక మదీనా అజహారా నగరం గురించి మాట్లాడుతున్నాం. దీనిని అరబ్బీలో మదీనా-అల్-జహరా అంటే మెరిసే నగరం అనేవారు. అప్పట్లో స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో అరేబియన్ ముస్లింల పాలన కొనసాగేది. అల్ అందాలూస్( ఇప్పుడు స్పెయిన్‌లోని అందాలూసియా ప్రాంతం) రాజకుమారుడు ఖలీఫా అబ్దుర్‌రహమాన్ 936వ సంవత్సరంలో కోర్డోబా పశ్చిమంలోని గ్వాదలక్వివీర్ నదీ తీరలో తన రాజధానిని నిర్మించాడు. నదీ తీరంలోని బండరాళ్లపై వెలిసిన ఈ నగరం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా ఉండేది. దాన్ని చూసి జనం ఆశ్చర్యపోయేవారట. పదేళ్లలో నగర నిర్మాణం ఆ నగరానికి మదీనా-అల్-జహరా అని పేరు పెట్టారు. దీనిని పదేళ్లలోనే నిర్మించారు. 945లో ఖలీఫా దర్బార్ కూడా ఇక్కడికి చేరింది. ఈ కొత్త రాజధానిని నిర్మించడానికి అంతులేని సంపదను ఖర్చు చేశారు. కొన్ని ఆధారాల ప్రకారం ఈ నగర నిర్మాణానికి పది వేల మంది కూలీలు పనిచేశారు. రోజూ 6,000 రాళ్లను ఇక్కడకు తీసుకొచ్చేవారు. సరకు రవాణా కోసం 1500 గాడిదలు, కంచరగాడిదలు ఉపయోగించారు. అప్పట్లో అత్యంత నిపుణులైన శిల్పులను ఇక్కడకు రప్పించారు. వారు చెక్కిన అందమైన శిల్పాలను నగరంలోని గోడలు, కోటలు, స్తంభాలు, మార్గాలు అన్నిటిపై అమర్చి వాటిని అందంగా మార్చారు. నగరం కోసం భారీ వ్యయం పోర్చుగల్‌లోని ఎస్త్రెమోజ్ నుంచి పాలరాయి తెప్పించారు. కోర్డోబా కొండల్లో నుంచి ఊదా రంగు సున్నపు రాయిని ఉపయోగించారు. ఇక్కడికి దగ్గర్లోని సియెరా డే కాబ్రా నుంచి ఎర్ర రంగు రాయిని తీసుకొచ్చారు. 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుకే నగరం నుంచి తెల్లటి సున్నపురాయి తెప్పించారు. ఇక ఖలీఫా దగ్గర బంగారానికి ఏమాత్రం లోటు ఉండేది కాదు. మదీనా అల్ జహరా పురావస్తు ప్రాంత డైరెక్టర్ ఆల్బర్ట్ మోన్‌తేజో బీబీసీతో మాట్లాడారు. "ఈ నగరం ఖలీఫా గొప్పతనం, సంపద, బలానికి నిదర్శనం. అందుకే దీని గురించి చెబుతున్నప్పుడు అందులో వీలైనంత ఎక్కువ వైభవం, గొప్పతనం కనిపించేలా చేయడానికి చూస్తాం" అన్నారు. "ఈ నగరాన్ని నిర్మిండానికి వారు రాజ్యంలోని అన్ని ఆర్థిక వనరులను ఉపయోగించారు. ఆ సమయంలో ఖిలాఫత్ వార్షిక బడ్జెట్ 40 నుంచి 50 లక్షల దిర్హాంలు. అందులో కనీసం మూడింట ఒక వంతు భాగాన్ని మదీనా అల్ జహరా నిర్మాణానికే ఖర్చు చేశారు". "ఈ నగరాన్ని ఎగుడుదిగుడు బండరాళ్లపై నిర్మించారు. వాస్తు నిపుణులు దీనిని పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నారు. నగరాన్ని మూడు వేరువేరు తలాలుగా మార్చారు. అన్నిటికంటే పైన ఉన్న ప్రాంతంలో రాజపరివారానికి ఒక కోటను నిర్మించారు. ఇది అబ్దుర్‌రహమాన్ మూడో నివాస స్థలంగా ఉండేది. ఇందులో చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవి. వాటిని అలంకరించడానికి అద్భుత శిల్పకళా నైపుణ్యం ఉపయోగించారు" అని మోన్‌తేజో చెప్పారు. ఖలీఫా మొత్తం నగరాన్ని చూసేలా.. విశాలంగా ఉన్న తమ మహలు పైనుంచి ఖలీఫా మొత్తం నగరాన్ని చూడగలిగేవారు. రెండో ప్రాంతంలో పాలన కోసం భవనాలు, కీలకమైన అధికారుల ఇళ్లు ఉండేవి. నగరంలో కింది స్థాయిలో సాధారణ ప్రజలు జీవించేవారు. ఇక్కడ సైనికుల ఇళ్లు, మసీదులు, బజార్లు, స్నానాల గదులు, బహిరంగ తోటలు ఇంకా ఎన్నో ఉండేవి. నిర్మించిన 15 ఏళ్లకే నగరంలోని కొన్ని ప్రాంతాలు కూలగొట్టి మళ్లీ పెద్దవిగా కట్టారు. "కోర్డోబా ఖిలాఫత్ మధ్యధరా సముద్ర ప్రాంతంలో అప్పట్లో మహా సామ్రాజ్యంగా ఉండేది. దానిని బైజాంటిన్ సామ్రాజ్యంతో పోల్చేవారు. ఆ సమయంలో మదీనా అల్ జహరా అంత సంపన్న నగరం ఎక్కడా లేదు" అని మోన్‌తేజో చెప్పారు. 70 ఏళ్లకే అంతరించిన నగరం అయితే ఈ నగరం కేవలం 70 ఏళ్లు మాత్రమే ఉనికిలో ఉంది. 976లో ఖలీఫా అబ్దుర్‌రహమాన్ కొడుకు, వారసుడు అల్ హాకెన్-2 మరణం తర్వాత నుంచి ఈ నగరం పతనం మొదలైంది. పాలనా పగ్గాలు కేవలం 11 ఏళ్ల వయసులో ఉన్న ఆయన కొడుకు హిషామ్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. అప్పుడు అధికారమంతా అల్ హాకెన్ సేనాపతి అల్-మంజూర్ చెలాయించేవాడు. ఆయన్ను మంత్రిగా, సలహాదారుడుగా నియమించింది అల్ హాకెనే. కానీ, అల్ మంజూర్ అల్-అందాలూస్ పాలనను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తర్వాత తన కోసం వేరే నగరాన్ని నిర్మించాడు. మదీనా అల్ జాహిరా, మదీనా అల్ జహ్రాను వదిలి అక్కడికి వెళ్లిపోయాడు. ఆనాటి అందాలు ధ్వంసం రక్తసిక్తమైన అంతర్యుద్ధం తర్వాత 1031లో కోర్డోబా ఖిలాఫత్ కూడా ముగిసింది. ఆ ప్రాంతం వేరు వేరు రాజ్యాలుగా విడిపోయింది. వాటిని తైఫా రాజ్యాలు అనేవారు. తర్వాత మదీనా అల్ జహరాను పూర్తిగా విడిచిపెట్టారు. పాశ్చాత్య ప్రపంచంలో అత్యంత అందమైన నగరం అని పేరున్న అల్ జహరాను దోచేశారు, తగలబెట్టారు. దాని అందాలను ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణానికి ఉపయోగించిన అత్యంత విలువైన వస్తువులను గోడల నుంచి స్తంభాల నుంచీ పెకలించారు. వాటిని తీసుకువెళ్ళి అమ్ముకున్నారు. "రాజధానికి సంబంధించిన వస్తువులు ఎవరిదగ్గరైనా ఉంటే, వారిని చాలా గౌరవించేవారు. చివరికి వారు సెవిలే చేరుకున్నారు. లేదంటే ఉత్తర ఆఫ్రికా, ఉత్తర స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు" అని మోన్‌తేజో చెప్పారు. గోడల్లో రాళ్లు కూడా తీసుకెళ్లారు తర్వాత కూడా అక్కడ దోపిడీలు జరిగాయి. నగరాన్ని చాలా ఘోరంగా దోచుకున్నారు. గోడలు, భవనాలకు తాపడం చేసిన శిల్పాను, కట్టడాలకు ఉపయోగించిన రాళ్లను కూడా పెకలించి తీసుకెళ్లిపోయారు. మదీనా అల్ జహరా ఒక అందమైన నగరం నుంచి నిర్మాణ సామగ్రిని తవ్వి తీసుకునే ఒక గనిలా మారిపోయింది. శతాబ్దాల నాటి అందమైన శిల్పాలు, నగిషీలు తాపడం చేసిన రాళ్లుండడమే ఆ నగరానికి శాపమైంది. తర్వాత అందరూ ఆ నగరం గురించి మర్చిపోయారు. 1911లో ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు ఈ నగరం బయటపడింది. ఈ మాయా నగరం అలా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఒక అంచనా ప్రకారం అప్పట్లో ఉన్న నగరంలో 11 శాతం మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది. 2018లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అత్యంత విలాసవంతంగా, సంపన్నంగా ఉన్న ఈ నగరాన్ని చూసి అప్పట్లో జనం ఆశ్చర్యపోయేవారట. text: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న రాజు ప్రమాదంలో చేయిని.. ఆ తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయాడు.. దీంతో వ్యవసాయాన్నే ఉపాధిగా ఎంచుకున్నాడు ఒకపుడు పులులు సంచరించిన 'పులిమడుగు'లో బంజరు భూమిని సస్యశ్యామలంగా మార్చాడు. లంబాడా గిరిజన తెగకు చెందిన బానోతు రాజుకు ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్‌ శివారులోని పులిమడుగు అటవీ ప్రాంతంలో ఎన్నడో సర్కారు వారు ఇచ్చిన నాలుగు ఎకరాల భూమి ఉంది. బొగ్గు గని నుంచి హరిత వనానికి... రాళ్లురప్పల మధ్య ఉన్న ఆ భూమిని సాగు చేసే స్తోమతు లేక, సింగరేణి బొగ్గుగనుల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు. కొన్నేళ్లు పనిచేశాక 1997లో లారీ ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. దాంతో కంపెనీ రాజును ఉద్యోగం నుండి తొలగించింది. మూడేళ్ల కిందట ఒంటి చేత్తో మొక్కలు నాటి నీరు పోసిన బానోతు రాజు.. ఇంత కాలం వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వచ్చారు ఉన్న జీవనాధారం కూడా పోవడంతో అతడు తన బీడు భూమినే నమ్ముకోవాల్సి వచ్చింది. భార్య కమల సాయంతో భూమిని చదును చేసి.. కొంతకాలం జొన్నలు, పత్తి పండించాడు. కానీ నీటి సదుపాయం లేక నష్ట పోయాడు. చివరికి రెండు ఎకరాల్లో 140 మామిడి మొక్కలను ఒంటి చేత్తో నాటాడు. పక్కనే ఉన్న వాగులోని నీటిని కుండలతో తెచ్చి ఆ మొక్కలను పెంచాడు. అంతర పంటలుగా కూరగాయలు పండిస్తూ ఇంటి అవసరాలు తీర్చుకునేవాడు. సింగరేణిలో పనిచేసినపుడు వచ్చిన జీతంలో పొదుపు చేసిన కొంత డబ్బుతో తన పొలంలో బోరు వేసుకున్నాడు. వాగు ఎండినపుడు ఈ బోరు నీటితో వ్యవసాయం చేయసాగాడు. మిగిలిన మరో రెండు ఎకరాల్లో వరి కూడా పండిస్తున్నాడు. వ్యవసాయ నిపుణుల సలహాలతో సాగు చేస్తూ ఎకరాకు 25 నుండి 35 బస్తాల వరకు వరి దిగుబడి సాధిస్తున్నాడు. ఉపాధి హామీ పథకంలో ఇచ్చిన మామిడి, టేకు మొక్కలను నాలుగేళ్ల పాటు నీళ్లు పోసి పెంచానని బానోతు రాజు చెప్తారు కంపెనీ పొమ్మంది, నేల తల్లి రమ్మంది... ''ప్రమాదంలో చేతిని పోగొట్టుకున్నాక, సింగరేణిలో ఉద్యోగం పోయింది. ఇంట్లో గడవడానికి కూలిపనులు చేద్దామనుకున్నా కానీ నా అవిటి తనం చూసి ఎవరూ పనికి పిలిచే వారు కాదు. వేరేదారి లేక మాకున్న బంజరు భూమిని సాగులోకి తేవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. గిరిజనుల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయంటారు కానీ, మాకు ఏ ఒక్కటీ ఉపయోగపడలేదు. ఉపాధి హామీ పథకంలో మామిడి, టేకు మొక్కలు ఇచ్చారు. వాటినే నాలుగేళ్ల పాటు నీళ్లు పోసి పెంచాను. నా నలుగురు కొడుకులు డిగ్రీలు చదివారు. కానీ ఎవరికీ ఉపాధి లేదు. వారు కూలీపనులకు పోతున్నారు'' అంటాడు బానోతు రాజు. జీవితం పట్ల కొంత నిరాశ ఉన్నప్పటికీ, అతడిలో ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. మామిడి తోట చుట్టూ కంచెగా 580 టేకు మొక్కలు నాటాడు. అవి నేడు వృక్షాల్లా ఎదుగుతున్నాయి. మూడేళ్ల కిందట బానోతు రాజు నాటిన టేకు మొక్కలు మరో ఐదేళ్లలో సిరుల పంట పండిస్తాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు స్వేదంతో సేద్యం చేశాడు... ''వ్యవసాయం పట్ల రాజుకున్న ఆసక్తిని చూసి నరేగా పథకం ద్వారా పండ్ల మొక్కలు, టేకు మొక్కలు ఇచ్చాం. వాటిని రెండు చేతులున్న వారికంటే ఎక్కువ శ్రద్ధగా పెంచాడు. బోరు పని చేయకపోతే బిందెలతో నీటిని మోసే వాడు. మరో ఏడేళ్లు ఆగితే టేకు కలప కనక వర్షం కురిపిస్తుంది. మామిడి పండ్ల మీద ఏడాదికి రూ. 70 వేల నుండి రూ. 90 వేల వరకు ఆదాయం వస్తుంది. ఎవరి మీదా ఆధార పడకుండా అతను పడిన కష్టమే నేడు అతనికి ఆదాయ వనరుగా మారింది'' అని జిల్లా డ్వామా ఏపీడీ మల్లేష్‌ డూడీ బీబీసీతో అన్నారు. బానోతు రాజు మామిడి మొక్కలతో పాటు వరి కూడా సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు రెండు పంటలు వరి... ''పులిమడుగు చుట్టుపక్కల 15 బస్తాలు కూడా పండని పరిస్థితుల్లో బానోతు రాజు పొలంలో 35 బస్తాలకు పైగా పండిస్తూ ఏడాదికి రెండు పంటలు పండించడం అతడి కష్టానికి తగిన ఫలితం’’ అంటూ స్థానిక రైతులు అభినందిస్తున్నారు. బానోతు రాజు రోజూ ఉదయమే అంబలి తీసుకొని పొలానికి పోయి సాయంత్రం వరకు పని చేసి ఇంటికి చేరతాడు. పండ్లతోటలకు చీడ, పీడలు రాకుండా సేంద్రియ కషాయాలు చల్లుతాడు. కలుపు మొక్కలను పీకి, వాటినే నేలలో బయోకంపోస్టుగా తయారు చేసి భూసారాన్ని కాపాడుతాడు. టీవీల్లో వ్యవసాయ కార్యక్రమాలు చూస్తూ వైవిధ్య సాగు పద్ధతులపై అవగాహన పెంచుకుంటాడు. రెండు చేతులున్న వారు కూడా సాధించ లేని ప్రగతిని రాజు ఒంటి చేత్తో సాధించి అందరికీ అదర్శంగా నిలిచాడు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జీవిత కాలంలో ఒక్క మొక్కను కూడా పెంచని వారెందరో ఉన్న ఈ కాలంలో.. ఒంటి చేత్తో వందలాది మొక్కలకు ఐదేళ్ల పాటు రోజూ నీరు పెట్టి, కంటికి రెప్పలా కాపాడి రెండెకరాల పండ్ల తోటను సృష్టించాడీ గిరిజన రైతు. text: తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవాల ఆధారంగా, సదుద్దేశంతో చేసినవని ఆయన తన పిటిషన్లో వివరించారు. గతంలో కూడా సుప్రీం కోర్టు సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా వంటి రిటైర్డ్ న్యాయమూర్తులతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శౌరీ వంటి వారు పత్రికల్లో లేదంటే టీవీ చానళ్లలో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో వివరించారు. అలాంటి వ్యాఖ్యలను పునరుద్ఘాటించినా, వాటికి మద్దతు తెలిపినా కూడా అది ప్రచురణ కిందకే వస్తుంది కాబట్టి, వారు కూడా కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లేనా అని ప్రశాంత్ భూషణ్ తన రివ్యూ పిటిషన్లో ప్రశ్నించారు. తాను కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఇచ్చిన తీర్పును స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి శిక్షలు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో అవినీతి గురించి గతంలోనూ చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని, వారిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బరూచా కూడా ఉన్నారని అన్నారు. ఇంకా, తన పిటిషన్ మీద బహిరంగ విచారణ జరిపించాలని, సూమోటో కేసును సుప్రీం కోర్టు న్యాయమూర్తి (ఇటీవల రిటైర్ అయ్యారు) జస్టిస్ అరుణ్ మిశ్రా విచారించి ఉండాల్సింది కాదని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో అభిప్రాయపడ్డారు. దిల్లీ అల్లర్ల కేసులో విద్యార్థి సంఘం మాజీ నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌ దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ నాయకుడు, యునైటెడ్ అగైనెస్ట్ హేట్‌ సహ వ్యవస్థాపకుడు ఉమర్‌ ఖలీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 11గంటలపాటు ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేశారని యునైటెడ్ అగైనెస్ట్ హేట్‌ వెల్లడించింది. ఢిల్లీ అల్లర్లకు ఒమర్‌ ఖలీద్‌ సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. యునైటెడ్ అగైనెస్ట్ హేట్‌ న్యాయవాది పంకజ్‌ ఉమర్‌ ఖలీద్ అరెస్టును బీబీసీకి ధ్రువీకరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపీఏ)లోని సెక్షన్ల కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తన కుమారుడు ఉమర్‌ను అరెస్టు చేసినట్లు తండ్రి సయ్యద్‌ ఖాసీం తెలిపారు.“ స్పెషల్ సెల్‌ పోలీసులు మధ్యాహ్నం 1 నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో అరెస్టు చేశారు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అల్లర్లపై దర్యాప్తు ముసుగులో ఢిల్లీ పోలీసులు నిరసనలను నేరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని యునైటెడ్ అగైనెస్ట్ హేట్ ఆరోపించింది. సీఏఏ, యూఏపీఏ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. అవి అసత్య ఆరోపణలు, అబద్ధపు కేసు: ఖలీద్ అరెస్టుకు హెచ్ఆర్ఎఫ్ ఖండన జేఎన్‌యూ పూర్వ విద్యార్ధి, యునైటెడ్ అగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్ట్ చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్ఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఉమర్ ఖలీద్ తన ప్రసంగాలు, రచనలు, అహింసాయుత కార్యకలాపాల ద్వారా రాజ్యాంగ విలువలను, నిరసించే హక్కును, నిర్భయంగా బ్రతకాలనే సందేశాన్ని శాంతియుతంగా చాటుతున్నారని పేర్కొంది. ''ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈశాన్య దిల్లీలో జరిగిన హింసాకాండలో పాల్గొన్నాడనే అసత్య ఆరోపణలతో ఆయనపై అత్యంత కిరాతకమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. లేని సాక్ష్యాధారాలను సృష్టించి ఉమర్ ఖలీద్ మీద ఈ అన్యాయమైన అబద్ధపు కేసు బనాయించారని హెచ్ఆర్ఎఫ్ భావిస్తోంది'' అని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్.కృష్ణ, ఎస్.జీవన్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు వ్యూహం రచించిన కుట్రదారులు, వాటిని రెచ్చగొట్టిన వారు, అల్లర్లకు పాల్పడ్డ కిరాతక మూకలు ఈనాటికీ దిల్లీ వీధులలో, అధికార కారిడార్లలో నిర్భయంగా తిరుగుతున్నారని హెచ్ఆర్ఎఫ్ పేర్కొంది. దిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా మతసామరస్యం కోసం కృషి చేసిన సంస్థలపై, కార్యకర్తలపై విషపూరిత దుష్ప్రచారం చేసుకుంటూ, అబద్ధపు కేసులు బనాయిస్తున్నారని.. రాజ్యం, బీజేపీ, దాని అనుబంధ సంస్థల అండదండలున్నాయి కాబట్టే వారు ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉమర్ ఖలీద్, ఇతర సి.ఏ.ఏ. వ్యతిరేక కార్యకర్తలు అందరినీ వెంటనే విడిచిపెట్టాలని, వారిపై బనాయించిన అబద్ధపు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. యూఏపీఏ చట్టాన్ని, రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఉద్యమించాలని ప్రజాస్వామికవాదులను కోరింది. జపాన్‌ కొత్త ప్రధాని యొషిహిడే సుగా ఆరోగ్య సమస్యలతో జపాన్‌ ప్రధాన మంత్రి పదవి నుంచి షింజో అబే తప్పుకోనుండటంతో అధికార లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ యొషిహిడే సుగాను తదుపరి నేతగా ప్రకటించింది. ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీగా పని చేస్తున్న 71 సంవత్సరాల సుగా అతి త్వరలోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ప్రధాని షింజో అబేకు సుగాను అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. ఆయన విధానాలను సుగా కొనసాగిస్తారని జపాన్‌ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. 534మంది సభ్యులున్న లిబరల్‌ పార్టీ ప్రజాప్రతినిధులలో 377 మంది ఆయనకు మద్దతు ప్రకటించారు. బుధవారంనాడు పార్లమెంటులో జరగబోయే మరో ఎన్నికలో ఆయన విజయం సాధిస్తే ప్రధానమంత్రి అవుతారు. పార్లమెంటులో లిబరల్‌ డెమెక్రాటిక్‌ పార్టీకి బలం ఉండటంతో ఆయన ప్రధాని కావడం ఖాయమని చెబుతున్నారు. మధ్యంతర ప్రధానిగా వస్తున్న సుగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల వరకు ఈ పదవిలో కొనసాగుతారు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కోర్టు ధిక్కరణ కేసులో తనను సుప్రీం కోర్టు దోషిగా నిర్ధరించడంపై లాయర్ ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. text: విజయ్ మాల్యా బీబీసీ కమ్యూనిటీ అఫైర్స్ స్పెషలిస్ట్ సాజిద్ ఇక్బాల్ కథనం.. నేరారోపణల కేసు విచారణ కోసం విజయ్ మాల్యాను భారత్‌కు పంపాలని లండన్ ప్రధాన న్యాయమూర్తి ఎమ్మా ఆర్బథ్నాట్ ఆదేశించారు. ఈ ఆదేశాలు వెలువడిన 2నెలలకు ఇంగ్లండ్ హోంశాఖ మంత్రి ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు చేసుకోవడానికి విజయ్ మాల్యాకు 14రోజుల సమయం ఉంది. ఇంగ్లండ్ హోం శాఖ నిర్ణయం వెలువడిన తర్వాత విజయ్ మాల్యా ట్విటర్‌లో స్పందించాడు. అందులో.. ''వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు డిసెంబర్ 10, 2018న వెలువడ్డాయి. నేను అప్పీలు చేసుకుంటానని చెప్పాను. కానీ హోం శాఖ తన నిర్ణయాన్ని ప్రకటించేవరకు అప్పీలు ప్రక్రియను మొదలుపెట్టలేను. ఇప్పుడు హోంశాఖ కూడా స్పందించింది. ఇక నేను అప్పీలు ప్రక్రియను ప్రారంభిస్తాను'' అని మాల్యా ట్వీట్ పేర్కొంది. కింగ్‌ఫిషర్ సంస్థల అధినేత విజయ్ మాల్యా.. వేల కోట్ల రూపాయలకుపైగా అప్పులు ఎగవేసి, డీఫాల్టర్‌గా 2016 మార్చిలో దేశం వదిలి వెళ్లారు. కానీ దేశం వదిలి పారిపోయారన్న వాదనతో ఆయన ఏకీభవించడంలేదు. తాను అప్పులు తీరుస్తానని, అయితే అందుకోసం భారత ప్రభుత్వం.. తన షరతుల్లేని ఆఫర్‌ను అంగీకరించాలని గతేడాది జూలైలో భారత ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన అన్నారు. ఇక్బాల్ మీనన్ నేరస్థుల అప్పగింతలో భాగంగా దోషులను తమకు అప్పగించాలంటూ భారత్ కోరిన వ్యక్తుల్లో విజయ్ మాల్యా మొదటివాడు కాదు. ఇలాంటి కేసులను ఎదుర్కొన్న పెద్దల జాబితాలో మరికొందరు భారతీయులు ఉన్నారు. భారత్-యూకే దేశాలు 1992లో నేరస్థుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ఒప్పందం తర్వాత ఇంగ్లండ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన మొదటి వ్యక్తి ఇక్బాల్ మీనన్. ఇతన్ని ఇక్బాల్ మిర్చి అని కూడా పిలుస్తారు. భారత్‌కు అప్పగించాక, ఆ కేసును కొట్టివేశారు. ఇక్బాల్ మీనన్ కోర్టు ఖర్చులను భారత ప్రభుత్వమే చెల్లించాల్సి వచ్చింది. 1993 పేలుళ్లకు సంబంధం ఉందంటూ ఇక్బాల్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు 1995లో ఇక్బాల్ నివాసంపై దాడులు చేసి డ్రగ్స్, టెర్రరిజం కేసుల్లో అరెస్టు చేశారు. ఈ కేసు కోర్టుకు వచ్చే సమయానికి, డ్రగ్స్, టెర్రరిజం అభియోగానికి బదులు, లండన్‌లోని తన రైస్ మిల్‌కు మేనేజర్‌గా పని చేసిన వ్యక్తిని హత్య చేశాడంటూ మరో అభియోగం తెరపైకి వచ్చింది. ఇక్బాల్ వద్ద ఉద్యోగం మానేసిన కొంత కాలానికే, ముంబైలో ఆ మేనేజర్ హత్యకు గురయ్యాడు. కానీ ఇక్బాల్ వ్యవహారంలో దోషుల అప్పగింత ముందుకు సాగలేదు. ఇక్బాల్‌ను తమకు అప్పగించాలని భారత్ కోరినపుడు, బోవ్ స్ట్రీట్ కోర్టు న్యాయమూర్తులు.. 'మేం స్పందించడానికి భారత్ ప్రస్తావించిన కేసు ఏదీ లేదు..' అని వ్యాఖ్యానించారు. ఇక్బాల్ అప్పగింత కోసం భారత్ మళ్లీ అప్పీల్ చేయలేదు. ఇక్బాల్ కోర్టు ఖర్చులను కూడా భారత ప్రభుత్వమే చెల్లించింది. ఉమర్జీ పటేల్ దోషుల అప్పగింత వ్యవహారంలో ఇంగ్లండ్ కోర్టులో వినిపించిన మరో ప్రముఖుడి పేరు ఉమర్జీ పటేల్. ఈయన్ను హనీఫ్ టైగర్ అని కూడా పిలుస్తారు. 1993 జనవరిలో సూరత్ నగరంలోని ఓ రద్దీ మర్కెట్లో గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఒక స్కూల్ విద్యార్థిని చనిపోయింది. ఈ కేసుకు సంబంధించి హనీఫ్‌ను తమకు అప్పగించాలని భారత్ ఇంగ్లండ్‌ను కోరింది. 1993 ఏప్రిల్‌లో రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్ పరిసరాల్లో మరో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు వ్యూహరచన చేశాడన్న ఆరోపణలు కూడా హనీఫ్‌పై ఉన్నాయి. దోషుల అప్పగింత వ్యవహారం నుంచి తనను తప్పించాలంటూ 2013లో బ్రిటీష్ హోంశాఖ మంత్రికి హనీఫ్ చేసిన విజ్ఞాపన ఇంకా పరిశీలనలో ఉన్నట్లు.. 2017లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ హోంశాఖ అధికారిక ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదని అన్నారు. సమీర్‌భాయ్ వినుభాయ్ పటేల్ భారత్-ఇంగ్లండ్‌ దేశాల మధ్య జరిగిన దోషుల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఇంగ్లండ్ నుంచి భారత్ రప్పించగలిగిన ఏకైక వ్యక్తి సమీర్‌భాయ్ వినుభాయ్ పటేల్. సమీర్‌భాయ్ వినుభాయ్ పటేల్‌పై 2002 గుజరాత్ అల్లర్ల ఆరోపణలు ఉన్నాయి. నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం తనను భారత్‌కు అప్పగించడాన్ని సమీర్‌భాయ్ వ్యతిరేకించలేదు. పైగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అప్పగింత ప్రక్రియ వేగవంతమైంది. 2016 ఆగస్టు 9న వినుభాయ్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 22న ఇంగ్లండ్ హోంశాఖ, వినుభాయ్‌ను భారత్‌కు అప్పగించే ఫైలుపై సంతకం చేసింది. 2016 అక్టోబర్ 18న వినుభాయ్‌ను భారత్‌కు అప్పగించారు. కానీ తనపై ఉన్న అభియోగాల్లో వినుభాయ్ దోషిగా తేలాడా లేదా అన్న విషయంపై సమాచారం లేదు. 1992 నేరస్థుల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఇంతవరకూ భారత్ కేవలం ముగ్గుర్ని మాత్రమే ఇంగ్లండ్‌కు అప్పగించింది. మనీందర్‌పాల్ సింగ్ కొహ్లీ (భారత పౌరుడు): అభియోగం: హ్యాన్నా ఫోస్టర్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు 2007, జూలై 29న భారత ప్రభుత్వం ఇంగ్లండ్‌కు అప్పగించింది. సోమాయ కేతన్ సురేంద్ర (కెన్యా పౌరుడు): అభియోగం: చీటింగ్ కేసు మీద, 2009, జూలై 8న భారత ప్రభుత్వం ఇంగ్లండ్‌కు అప్పగించింది. కుల్విందర్ సింగ్ ఉప్పల్ (భారత పౌరుడు): అభియోగం: కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసుల్లో నవంబర్ 24, 2013లో భారత ప్రభుత్వం ఇంగ్లండ్‌కు అప్పగించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపారు. ఇలా.. నేరారోపణలు ఎదుర్కొంటూ విదేశాల్లో స్థిరపడిన దోషులను భారత్ రప్పించడం ఇదే మొదటిసారా? text: జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ ఈ హరిత టపాసుల ఫార్ములాను తయారు చేసింది. చూడ్డానికి ఇవి మామూలు టపాసులలానే ఉంటాయి. అలానే పేలుతాయి. కానీ, వీటి నుంచి పొగ, శబ్దం తక్కువగా వెలువడతాయి. సాధారణ టపాసులు ఎక్కువ నైట్రోజెన్, సల్ఫర్ వాయువులను విడుదల చేస్తాయి. వాటితో పోలిస్తే హరిత టపాసులు 40-50శాతం తక్కువ వాయువులను విడుదల చేస్తాయి. దీపావళి: హరిత టపాసులు అంటే ఏంటి? ఈ హరిత టపాసుల తయారీ కోసం ప్రత్యేకమైన పదార్థాలను వినియోగిస్తారు. ఈ టపాసుల్లో చాలా రకాలుంటాయి. 1. నీరు విడుదల చేసే టపాసులు: ఇవి పేలితే నీటి బుడగలు విడుదలవుతాయి. వీటిని సేఫ్ వాటర్ రిలీజర్లు అని పిలుస్తారు. 2. తక్కువ సల్ఫర్, నైట్రోజెన్ విడుదల చేసే టపాసులు: కాలుష్యాన్ని తగ్గించే ఆక్సిడైజింగ్ పదార్థాలు వీటిలో ఉంటాయి. 3. అల్యుమినియం వినియోగం తక్కువ: ఈ హరిత టపాసుల తయారీకి 50-60శాతం తక్కువ అల్యుమినియం వినియోగిస్తారు. వీటిని SAFAL (సేఫ్ మినిమల్ అల్యుమినియం క్రాకర్స్) అని పిలుస్తారు. 4. ఆరోమా టపాసులు: ఇవి పేలితే శబ్దంతో పాటు సువాసనలు కూడా వస్తాయి. కానీ, భారతీయ మార్కెట్‌లో హరిత టపాసులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ప్రభుత్వం పరీక్షించాకే వీటికి అనుమతిస్తుంది. అందుకే అవి విస్తరించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ హరిత టపాసుల్ని వినియోగించరు. ఈ ఆలోచన భారత్‌లోనే పుట్టిందని, ఇవి వినియోగంలోకి వస్తే ప్రపంచంలో ఓ కొత్త మార్పునకు భారత్ శ్రీకారం చుడుతుందని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ చీఫ్ సైంటిస్ట్ సాధన చెప్పారు. ‘ఈ టపాసుల విషయంలో మా పరిశోధన పూర్తయింది. అనుమతి కోసం దరఖాస్తు చేశాం’ అని సాధన వెల్లడించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దీపావళి నాడు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే హరిత టపాసుల్ని(గ్రీన్ క్రాకర్స్) మాత్రమే వినియోగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. text: "ఎవరా మాట అనేది? గత నాలుగేళ్ల కాలంలో ఆయనేం చేశారు? ఇప్పుడు దేశంలో అవినీతి లేదంటారా? ఆయన మంత్రివర్గ సహచరుల్లోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారు" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమారస్వామి అన్నారు. "కర్ణాటకలో అడ్డదారులు తొక్కి యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నించిన మోదీ, అమిత్ షాలకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మోదీ ఇప్పుడు అవినీతిని ఎలా అడ్డుకుంటారట?" అని కుమారస్వామి ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. "నల్లధనం, అవినీతిపై మేం చేస్తున్న పోరాటం బద్ధ శత్రువులు ఇప్పుడు స్నేహితులుగా మారేలా చేసింది. మా పోరాటం వాళ్లను ఏకం చేసి, ఒకే వేదికపైకి వచ్చేలా చేసింది. భారీ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు చేతులు కలుపుతున్నారు" అని మోదీ అన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 23 పార్టీల నేతలు హాజరయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, దిల్లీ ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ, తదితర నాయకులు ఉన్నారు. కటక్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చేసినవే. "దేశ ప్రయోజనాల కోసమే కూటమి" "వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు ఒక్కచోటుకి రావడం అనేది.. ఒక ఉమ్మడి వేదికను తయారు చేసే చిన్న ప్రయత్నం. అది ఏదో ఒక్క నాయకుడి స్వప్రయోజనం కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం. ఆ వేదిక విజయవంతం అయ్యేందుకు మొన్నటి కార్యక్రమం దోహదపడుతుంది" అని కుమారస్వామి అన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఒక నేతను నిలబెట్టడం కంటే, ఉమ్మడిగా ముందుకెళ్లడమే ఉత్తమమన్న ఆలోచనతోనే విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని కుమారస్వామి తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక సమస్యలున్నాయి. అలాగే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన ప్రత్యేక సమస్యలు నెలకొని ఉన్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ద్వారా ఆ సమస్యలపై దృష్టిపెడితే ప్రజలు మనల్ని నమ్ముతారని ఆయన వివరించారు. "జాతీయ స్థాయిలో ఆ కూటమికి తాను ఉత్ర్పేరకం లాంటి వ్యక్తినేమీ కాబోనని ఆయన అంటున్నారు. "ఆ కూటమిలో నేను చాలా చిన్న వ్యక్తిని. కర్ణాటకను అభివృద్ధి చేయడం వరకే నేను పరిమితం. మా నాన్న(మాజీ ప్రధాని దేవె గౌడ)కు సొంత పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో ఆయన ఉత్ర్పేరకంగా పనిచేయొచ్చు" అని కుమారస్వామి అన్నారు. అయితే, కర్ణాటక విషయంలో "మేము(కాంగ్రెస్, జేడీ(ఎస్)) పరస్పర అవగాహనతో కలిసి పనిచేస్తాం. ఏ సమస్య వచ్చినా, పరిష్కరించేందుకు నేను ప్రయత్నిస్తా. అది దేవె గౌడ, సోనియా గాంధీల దాకా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు" అని అన్నారు. స్వామి.. రుణ మాఫీ హామీ ఏమయ్యింది? పారిశ్రామికవేత్తలకు బెయిల్ అవుట్ ప్యాకేజీలు ప్రకటించినట్టుగానే.. అన్నదాతలను కూడా ఆదుకోవాల్సిన అవసరముందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. "రుణ మాఫీ అనేది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. గత మూడేళ్లుగా కర్ణాటకలో రైతులు కరవు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రూ.58,000 కోట్ల పంట నష్టపోయారు. "రైతులకు మార్కెటింగ్ సదుపాయం మాత్రమే కాదు, వ్యవసాయ పద్ధతులు మారాలి. ఆ మార్పు రాకపోతే, రైతు కుటుంబాల సమస్యలను పరిష్కరించలేం. ఈ విషయంలో రైతులను ఒప్పించాల్సిన అవసరముంది" అని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కుమారస్వామి, మాట మీద నిలబడలేదంటూ బీజేపీ రాష్ట్రవ్యాప్త(బెంగళూరు మినహా) బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, తమ పార్టీ సొంత బలంతో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే రైతు రుణాలు మాఫీ చేస్తానన్న మాట నిజమేనని కుమారస్వామి తెలిపారు. కానీ, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినందున, నిర్ణయం తీసుకునేముందు తమ భాగస్వామ్య పార్టీతోనూ చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని, అవినీతిపరులైన విపక్ష నాయకులంతా ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడాన్ని కర్ణాటక సీఎం కుమారస్వామి తప్పుబట్టారు. text: ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని తొలుత సంస్థ ప్రకటించినప్పటికీ తరువాత కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో కొందరు మరణించారని సంస్థ యజమాని, సీఈవో అదర్ పునావాలా తెలిపారు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన భవనం నుంచి అయిదు కాలిన మృతదేహాలు బయటకు తీసినట్లు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ప్రమాదంలో అయిదుగురు మరణించారని పుణె మేయర్ మురళీధర మొహల్ తెలిపారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది. నిర్మాణంలో ఉన్న భవనంలో వెల్డింగు పనుల కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. 'సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం నాలుగో అంతస్తులో అగ్ని చెలరేగడంతో అక్కడ కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదానికి కారణమేంటో తెలుసుకుంటున్నాం. వెల్డింగు పనులు కారణం కావొచ్చు. ప్రమాదం వల్ల నాలుగో ఫ్లోర్ మొత్తం తగలబడిపోయింది. మంటలను పూర్తి అదుపు చేసిన తరువాత నాలుగో అంతస్తులో కాలిన మృతదేహాలను చూశారు. చనిపోయినవారు భవన నిర్మాణ కార్మికులు కావొచ్చు. మిగతా అందరినీ భవనం నుంచి ఖాళీ చేయించారు'' అని పుణె మేయర్ మురళీధర్ మొహల్ 'బీబీసీ'కి చెప్పారు. ప్రమాదం ఎక్కడ జరిగింది సీరమ్ ఇనిస్టిట్యూట్‌లోని టెర్మినల్ 1 గేట్ సమీపంలోని మంజరీ ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంటలను అదుపుచేయడానికి 10 ఫైర్ ఇంజిన్లు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా కోవిడ్ టీకా ఉత్పత్తికి ఎలాంటి విఘాతం కలగబోదని ఆ సంస్థ ప్రకటించింది. అయితే, మంటలను అదుపు చేసిన తరువాత అగ్నిమాపక సిబ్బందికి అక్కడ కాలిన మృతదేహాలు కనిపించాయి. కోవిడ్ వ్యాక్సీన్ తయారీ సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సీన్లు తయారుచేసే సంస్థ. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సీన్ కూడా ఇక్కడ తయారవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీన్ తయారీ సంస్థ ఇది. భారత్ ఒక్కటే కాకుండా అనేక ఇతర దేశాలకు వ్యాక్సీన్ల విషయంలో ఈ సంస్థ చాలా కీలకం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. text: నార్వేలోని ఓ చిన్న పట్టణానికి చెందిన ఆమె కాలేజీ చదువు కోసం ఇల్లు వదిలి దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే, అలా వెళ్లిన కొన్ని రోజులకే ఆమె మంచం పట్టారు. మంచం మీద నుంచి లేవలేని స్థితికి చేరుకున్నారు. మాలిన్‌ను ఆమె కుటుంబం ఒక మానసిక చికిత్సా కేంద్రంలో ఏడాది పాటు ఉంచింది. "ఆ మందులకు నా మతి పోయినట్లు ఉండేది. నా ఆలోచనలు, భావాలతో సంబంధం లేకుండా జీవితం సాగుతున్నట్లు అనిపించేది. నేను సాయం అడిగిన ప్రతిసారీ మందులు ఇచ్చేవారు. వాటి వల్ల నా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు" అని మాలిన్ చెప్పారు. "చాలా దారుణంగా అనిపించేది. ‘ఇదే నీ జీవితం. దీనితో నువ్వు సరిపెట్టుకోవాల్సిందే’ అని అందరూ అనేవారు. కానీ, ఈ జీవితం నాకు నచ్చేది కాదు" అని ఆమె అన్నారు. మాలిన్‌లా మానసిక సమస్యలకు (సైకోసిస్‌కు) చికిత్స తీసుకునేవారిలో 20 శాతం మంది ఔషధాలకు స్పందించనివారు ఉంటారని ఓ అంచనా. ఇలాంటివారికి ఈ మందుల వల్ల అలసట, బరువు పెరగటం, కొలెస్టరాల్, మధుమేహం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి ఈ మందుల వల్ల వారి జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ నేపథ్యంలోనే మానసిక ఆరోగ్య కేంద్రాల్లో బలవంతంగా రోగులను పెట్టి, చికిత్స అందించే విధానంలో మార్పులు రావాలని ‘యూఎన్ కమిటీ ఎగినెస్ట్ టార్చర్’ చెప్పింది. మాలిన్ మాలిన్ లాగే మెట్టే ఎల్లింగ్స్డాలెన్ కూడా తన మానసిక సమస్యకు 13 ఏళ్ల పాటు మందులు వాడారు. ఆమె పరిస్థితి మరింత దిగజారిందే కానీ ఏమాత్రం మెరుపడలేదు. మందులు వాడకుండానే జీవించాలని నిర్ణయించుకున్న ఆమె 2005లో నార్వే వైద్య విధానాలను మార్చే ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం పేషెంట్ యూజర్ గ్రూప్ చెయిర్ పర్సన్‌గా ఉన్నారు. మానసిక సమస్యలతో బాధపడేవారికి వారికి ఇష్టం ఉంటేనే చికిత్స అందించాలని మెట్టే అంటున్నారు. మెట్టే లాంటి వారు చేసిన ఉద్యమాల ఫలితంగా... మందులు లేని వార్డులను మొదలుపెట్టాలని నార్వే ఆరోగ్య శాఖ మంత్రి ప్రాంతీయ వైద్య అధికారులను ఆదేశించారు. ఇలాంటి చికిత్స పద్ధతులు మరి కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ వైద్య కేంద్రాలలో మానసిక రోగాలకు ఔషధాలు లేకుండా చికిత్స చేయడం మొదలు పెట్టిన తొలి దేశంగా నార్వే నిలిచింది. ఈ మందులు లేని వార్డులను నిర్వహించే బాధ్యతను డైరెక్టర్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సబ్స్టన్స్ డాక్టర్ మాగ్నస్ హాల్డ్ తీసుకున్నారు. "ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను పొందే అవకాశం ఉండాలి. రోగికి మందులు ఎలా పని చేస్తాయో వివరించగలగాలి. ఆ మందుల వలన కలిగే ముప్పును తెలియజేయాలి. తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే రోగుల మెదడులో రసాయనాల సమతుల్యత సరిగ్గా ఉండదనే అపోహ ఉంది. కానీ, ఆ వాదనకు ఆధారాలు లేవు" అని ఆయన చెప్పారు. మందులు లేకుండా ఇస్తున్న చికిత్స చాలా మంది రోగులకు పని చేస్తోందని మాగ్నస్ తెలిపారు. డాక్టర్ మాగ్నస్ హాల్డ్ మాలిన్ కూడా ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు ఇప్పుడు 34 ఏళ్లు. ఆమె ఈ మానసిక వైద్య కేంద్రంలో చాలా వారాలు గడుపుతుంటారు. మధ్య మధ్యలో ఇంటికి వెళుతూ ఉంటారు. మాలిన్ ఇప్పుడు ఒంటరిగా నివసిస్తున్నారు. సమస్య నుంచి కోలుకోవడానికి కళను ఆశ్రయించారు. ఉద్యోగం చేయాలని కూడా అనుకుంటున్నారు. "ఇప్పుడిప్పుడే నన్ను నేను కనుగొంటున్నా. నా మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటున్నాను. భవిష్యత్తు మీద నాకు ఆశ కలుగుతోంది" అని మాలిన్ అన్నారు. అయితే, ఇలా మందులు లేకుండా చికిత్స చేయడం నార్వేలో వివాదాస్పదంగా మారింది. 20 ఏళ్ల క్లాడియా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో, మతిభ్రంశంతో బాధపడుతూ ఉండేవారు. మందులు వాడిన తర్వాత ఆమె పరిస్థితి కాస్త మెరుగయ్యింది. మందులు వాడితేనే తనకు హాయిగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ మందులు లేకుండా చికిత్స చేసే విధానం ఆధారాల కంటే కూడా ఆదర్శాల ప్రభావంతో వచ్చిందని విమర్శకులు అంటున్నారు. ఇలా మందులు లేకుండా చికిత్స చేయడం మానసిక వైద్య శాస్త్రానికి విరుద్ధమని డాక్టర్ జాన్ ఐవర్ రాస్బెర్గ్ అన్నారు. ‘‘ఈ విధానం పని చేయదని చరిత్ర చెబుతోంది. అందుకే దీనిని అమలు చేయడం ఆపేశారు. ప్రభావవంతమైన మందులు లేకుండా చికిత్స చేసే విధానం ఉండదు" అని ఆయన అన్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మందులతో చికిత్స చేయడం మొదలుపెట్టి... పరిస్థితిని బట్టి మందులను తగ్గిస్తూ రావడం మంచిదని ఐవర్ అభిప్రాయపడ్డారు. కానీ, మాగ్నస్ హాల్డ్ ఈ వాదనతో అంగీకరించడం లేదు. మందులు లేకుండా కోలుకున్న రోగుల గురించి ఆయన పరిశోధన చేయాలని భావిస్తున్నారు. అయితే, హాల్డ్ వాదనలను బలపరిచే ఆధారాలు లేవు. మెట్టే ఎల్లింగ్స్డాలెన్ మందులు లేకుండా చేసే ఈ చికిత్స భవిష్యత్తులో ఎలా పని చేస్తుందనే విషయంపై అనేక ఆందోళనలు, అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడే రోగులకు మాత్రం మందులతోనే చికిత్స ఇస్తున్నారు. మానసిక రోగాలకు చికిత్స తీసుకోలేని చాలా మంది రోగులు వీధుల్లో బతుకుతున్నారని వైద్యులు అంటున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేని వారు నేరాలు చేసే అవకాశం గానీ, సన్నిహితుల పట్ల హింసాత్మకంగా మారే అవకాశం గానీ ఉందని చెబుతున్నారు. తీవ్ర మానసిక సమస్యలతో మతి స్థిమితం కోల్పోయినవారు హత్యలు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. మందులు లేకుండా మానసిక రోగులకు చికిత్స అందించే విధానం గురించి ప్రచారం నిర్వహించిన వారిలో ఒకరైన హాకన్ రియాన్ యులండ్ మాత్రం... మందులతో చేసే చికిత్స వల్ల వచ్చే ప్రమాదాలను చర్చించకపోతే ప్రజలను మభ్యపెట్టినట్లవుతుందని అంటున్నారు. ప్రజలను మత్తులో ముంచడానికి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. మానసిక రోగులు తమ జీవితాల గురించి నిర్ణయించుకునే అవకాశం ఇచ్చిన నార్వేలో జరుగుతున్న ఈ పరిణామాలను... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక వైద్యులు, రోగులు కూడా గమనిస్తున్నారు. మందులు లేకుండా చికిత్స చేయడం అనేది ఓ వెర్రి ఆలోచన అయినా అవ్వొచ్చు. లేక మానసిక వైద్య శాస్త్రాన్నే తిరగరాసే విధానమైనా కావొచ్చు. కాలమే సమాధానం చెబుతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మాలిన్ 21 ఏళ్ల వయసు నుంచీ మానసిక ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడుతూ చికిత్సాకేంద్రానికి వచ్చారు. తాను లావుగా ఉంటానని, ఎందుకూ పనికి రాననే ఆలోచనలతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకునేవారు. text: రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చిన బుమ్రా ఐదు వికెట్లు తీసి వెస్టిండిస్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. దీంతో ఆతిథ్య జట్టు 100 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో రోస్టన్ ఛేస్(12), కెమర్ రోచ్(38), క్యుమిన్స్(19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి 27 ఓవర్లలలోనే వెస్టిండిస్ కథ ముగిసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు నష్టపోయి 343 పరుగులు చేసింది. ఈ దశలోనే కెప్టెన్ కోహ్లీ ఇన్సింగ్స్ డిక్లేర్డ్ చేశారు. దీంతో వెస్టిండిస్‌పై 419 పరుగులు భారీ లక్ష్యం పడింది. రాణించిన రహానే, విహారీ భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 222 పరుగులు చేసింది. 77 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కోహ్లీ, రహానే, హనుమ విహారీ రాణించడంతో వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 51 పరుగులతో రాణించగా, హనుమ విహారీ(92) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రహానే(102) నెమ్మదిగా ఆడుతూ టెస్టుల్లో 10వ సెంచరీ చేశాడు. విహారీతో కలిసి రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో లంచ్ సమయానికి భారత్ 287/4తో పటిష్ఠ స్థితికి చేరింది. రహానే తర్వాత క్రీజ్‌లో వచ్చిన పంత్ (7) ఎక్కువ సేపు కొనసాగలేకపోయాడు. విహారీ ఔటకావడంతో కోహ్లీ 343/7 పరుగుల వద్ద ఇన్సింగ్స్ డిక్లేర్డ్ చేశారు. బుమ్రా సూపర్ ఇన్నింగ్స్ భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన వెస్టండీస్ జట్టు ఆదిలోనే తడబడింది. భారత ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, ఇషాంత్ బౌలింగ్ ధాటికి ఆ జట్టు కుప్పకూలింది. స్కోర్ బోర్డు మీద 10 పరుగులు చేరుకునేలోపే ఓపెనర్లు బ్రాత్ వైట్ (1), క్యాంప్ బెల్ (7) వెనుదిరిగారు. టీ బ్రేక్ సమాయానికి వెస్టిండీస్ స్కోర్ 15/5కు చేరింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రోచ్, కమిన్స్ కొద్దిసేపు నిలదొక్కుకోవడంతో ఆ జట్టు 100 పరుగులైనా చేయగలింది. బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్సింగ్స్‌లో సెంచరీ చేసిన రహానేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ‌షిప్ పట్టికలో 60 పాయింట్లతో శ్రీలంకతో కలిసి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో టెస్టు శుక్రవారం జమైకాలో ప్రారంభమవుతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫాస్ట్ బౌలర్ బుమ్రా చెలరేగడంతో ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. text: పఠాన్‌కోట్ దాడిలో మృతి చెందిన జవాను గురుసేవక్ సింగ్ వారిలో ఒకరు హరియాణాకు చెందిన యువ గరుడ కమాండో గుర్‌సేవక్ సింగ్. మాట్లాడిన మరుసటి రోజే 2016 జనవరి 1న గురుసేవక్ సింగ్ తన తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ మరుసటి రోజే ఆయన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన జరిగి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ కుటుంబం మౌనంగా రోదిస్తూనే ఉంది. ఆ దుఃఖంలోనూ.. వారు చెప్పే మాట.. "మా గుర్‌సేవక్ సింగ్ (25) దేశం కోసం ప్రాణాలర్పించారు. ఎంతో గర్వంగా భావిస్తున్నాం". "మీరు మీ ఇంట్లో సహజంగా చనిపోతారు కావచ్చు. కానీ.. నా కొడుకు తన మాతృ భూమి కోసం పోరాడి ప్రాణాలు అర్పించాడు. ఎంతో గర్వంగా ఉంది" అని పఠాన్‌కోట్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన గరుడ కమాండో గురుసేవక్ సింగ్ తండ్రి సుచా సింగ్ అంటున్నారు. ప్రస్తుతం గురుసేవక్ సింగ్ కుటుంబం తన స్వగ్రామం హరియాణాలోని గర్నాలా‌లో ఉంటోంది. "పంజాబ్‌లోని జలంధర్‌లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. 2016 జనవరి 1న మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మాతో మాట్లాడాడు. ఇంటికి వస్తున్నావా? అని అడిగితే.. లేదు నాన్నా మరికొన్ని రోజులపాటు వీలుకాదన్నాడు. ఆ మరుసటి రోజే అతడు మరణించాడన్న సందేశం వచ్చింది" అంటూ బరువెక్కిన స్వరంతో సుచా సింగ్ తన కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పెళ్లైన ఆరు వారాలకే .. "పఠాన్‌కోట్ దాడికి సరిగ్గా నెలన్నర ముందే గురుసేవక్ సింగ్ వివాహమైంది. ఇప్పుడు ఆయన కుమార్తె వయసు ఏడాదిన్నర. ఆమెకు గుర్రీత్ అని పేరు పెట్టుకున్నాం" అని సుచా సింగ్ తెలిపారు. తమ మనవరాలు పెద్దయ్యాక భారత ఆర్మీలో చేరతానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన అంటున్నారు. సుచా సింగ్ కూడా ఆర్మీలో పనిచేశారు. ఆయన పెద్ద కుమారుడు హరిదీప్ కూడా ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు. "నా కొడుకు మరణం మమ్మల్ని కకావికలం చేసింది. ఉగ్రవాదులు ఎంత మందిని చంపుతున్నామన్నదే చూశారు. కానీ.. ఎవరిని చంపుతున్నామన్న విషయాన్ని పట్టించుకోలేదు" అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగురు జవాన్ల మృతి 2016 జనవరి 1 అర్ధరాత్రి దాటాక భారత ఆర్మీ దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని పఠాన్‌కోట్‌ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. నాలుగు రోజులకు ఆపరేషన్ ముగిసింది. ఈ మొత్తం ఆపరేషన్‌లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ఐదుగురు సాయుధులు హతమయ్యారని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ జైష్-ఎ-మహమ్మద్ పనేనంటూ భారత్ ఆరోపిస్తోంది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై మిలిటెంట్ల దాడి జరిగి రెండేళ్లు అవుతోంది. 2016 జనవరి 2న సాయుధులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. text: ప్రయోగాల్లో ఈ బ్యాక్టీరియా వ్యాధి కేసులు 80 శాతం పైగా పడిపోయాయని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన వివరాలు పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్ గొప్ప మార్పు తీసుకొస్తుందని.. టైఫాయిడ్ మరణాలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెప్పారు. యాంటీబయోటిక్స్‌ను బలంగా తట్టుకుని మరీ టైఫాయిడ్ విస్తరిస్తున్న పాకిస్తాన్‌లో 90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. టైఫాయిడ్ జ్వరం ఏమిటి? కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే సాల్మొనెలా టైఫీ అనే బ్యాక్టీరియా సోకటం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఇది పేదరిక వ్యాధి. పారిశుధ్యం అతి తక్కువగా ఉండే, శుభ్రమైన తాగునీటి కొరత ఉండే దేశాల్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: టైఫాయిడ్ సోకిన వారిలో సగటున ప్రతి 100 మందిలో ఒకరికి అంతర్గత రక్తస్రావానికి దారితీసి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. టైఫాయిడ్‌కు సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు సేకరించటం కష్టం. అయితే.. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 1.1 కోట్ల నుంచి 2.1 కోట్ల మందికి ఇది సోకుతోంది. ఏటా 1,28,000 మంది నుంచి 1,61,000 మందిని బలితీసుకుంటోంది. ప్రయోగాల్లో ఏం జరిగింది? నేపాల్‌లోని ఖట్మాండు లోయలో తొమ్మిదేళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల 20,000 మందికి పైగా చిన్నారులు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో టైఫాయిడ్ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. ఈ చిన్నారుల్లో సగం మందికి కొత్త వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ అధ్యయనం మొదటి సంవత్సరంలోనే.. వారిలో టైఫాయిడ్ కేసులు 81 శాతం పడిపోయాయి. ''ప్రపంచంలో అత్యంత అధికంగా టైఫాయిడ్ సోకగల చిన్నారులపై ఇది ప్రభావం చూపకుండా ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోంది'' అని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ బీబీసీకి చెప్పారు. ''టైఫాయిడ్ భారం చాలా పెద్దది. కుటుంబాలు తమ పిల్లలను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లటం.. వైద్య పరీక్షలు, యాంటీబయోటిక్స్‌ కోసం భారీగా ఖర్చులు పెడుతూ పేదరికంలో కూరుకుపోవటం మనం చూస్తున్నాం. ఈ వ్యాధిని నియంత్రించటానికి ఈ కొత్త వ్యాక్సిన్ రావటం చాలా ఉద్వేగ భరిత సందర్భం'' అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ రక్షణ ఎంత కాలం వరకూ కొనసాగుతుందనేది చూడటానికి.. ప్రస్తుతం ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్న నేపాల్ చిన్నారులు, బంగ్లాదేశ్‌లోని మలావీ ప్రాంత పిల్లలను పరిశీలించటం కొనసాగుతుంది. ''ఈ వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాధి విస్తృతిని తగ్గించి.. శుభ్రమైన తాగునీటి కొరత, పారిశుధ్య లోపం ఉన్న ప్రాంతాల ప్రజల ప్రాణాలను కాపాడగలదు'' అని టైఫాయిడ్ వాక్సిన్ ఆక్సెలరేషన్ కన్సార్షియం డైరెక్టర్ డాక్టర్ కాథలీన్ న్యూజీల్ చెప్పారు. వ్యాక్సిన్ అవసరం ఏమిటి? టైఫాయిడ్.. యాంటీబయోటిక్స్‌ను తట్టుకోవటంలో పతాక స్థాయి సామర్థ్యాన్ని సంతరించుకుందని.. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న చికిత్సల పరిమితిని మించిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధిని నివారించటానికి అత్యంత సమర్థవంతమైన మార్గం శుభ్రమైన తాగునీరు, నీటితో ఫ్లష్ చేసే టాయిలెట్లను అందరికీ అందుబాటులోకి తేవటం చాలా దేశాలకు అసాధ్యంగా మారుతోంది. ఇప్పటికే రెండు టైఫాయిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాకూడా.. రెండు సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఇవ్వటానికి రెండిటిలో దేనికీ అనుమతి లేదు. కాబట్టి అత్యంత ముప్పు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ రక్షణ లేదు. పాకిస్తాన్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది? పాకిస్తాన్‌లో మందులను అతి తీవ్రంగా తట్టుకోగల (ఎక్స్‌టెన్సివ్‌లీ డ్రగ్ రెసిస్టెంట్ - ఎక్స్‌డీఆర్) టైఫాయిడ్ జ్వరం విజృంభించింది. ''టైఫాయిడ్‌కు చికిత్స చేయటానికి మనం ఉపయోగించే అన్ని రకాల యాంటీబయోటిక్స్‌లో ఒక్క రకం మినహా మిగతా అన్నిటినీ తట్టుకోగల సామర్థ్యాన్ని ఒక రకం టైఫాయిడ్ సంతరించుకుంది. దానివల్ల.. టైఫాయిడ్ సోకిన వారిలో ఐదో వంతు మందిని బలితీసుకున్న పాత రోజులకు వెళ్లే ప్రమాదం తలెత్తింది'' అని వాక్సిన్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సేత్ బర్కిలీ బీబీసీ న్యూస్‌తో పేర్కొన్నారు. ఇది 2016లో సింధ్ ప్రావిన్స్‌లోని హైదర్‌బాద్‌లో మొదలైంది. పది వేల మందికి పైగా ప్రజలకు సోకింది. సింధ్ ప్రావిన్స్‌లో 90 లక్షల మందికి పైగా పిల్లలకు వ్యాక్సిన్ అందించటానికి గవీ ఇప్పుడు నిధులు చెల్లిస్తోంది. ప్రపంచంలో చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్‌ల జాబితాలో ఈ కొత్త టైఫాయిడ్ వ్యాక్సిన్‌ను చేర్చిన మొదటి ప్రాంతంగా సింధ్ ప్రావిన్స్ మారుతుంది. ''టైఫాయిడ్ మీద పోరాటంలో పరిస్థితులను పూర్తిగా మార్చివేసే వ్యాక్సిన్ ఇది. సరైన సమయంలో ఇది అందుబాటులోకి వచ్చింది'' అని డాక్టర్ బర్కిలీ చెప్పారు. ''ఈ ప్రమాదకర వ్యాధి విజృంభణను నియంత్రించటంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించాలి. మరిన్ని దేశాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాల్లో దీనిని చేర్చిన తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా టైఫాయిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది'' అని తెలిపారు. ''చాలా వేగంగా ఓ కొత్త నివారణ అందుబాటులోకి రావటం ఉద్వేగ భరితమైన విషయం. ఇది వ్యాధి నివారణకు సాయపడటమే కాదు.. వ్యాధికారక బ్యాక్టీరియాలు మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకోవటానికి వ్యతిరేక పోరాటంలోనూ దోహదపడుతుంది'' అని ప్రొఫెసర్ పొలార్డ్ పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఓ కొత్త టైఫాయిడ్ వ్యాక్సిన్ 'చాలా అద్భుతంగా' పనిచేస్తోందని.. ఈ ఇన్‌ఫెక్షన్‌లో దాదాపు చికిత్స చేయలేని రకాన్ని నిలువరించటానికి దీనిని ఉపయోగిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. text: ఉత్తర కొరియా కరోనా దేశ సరిహద్దులను మూసివేయడం లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ దేశంలో వైరస్ వ్యాపించలేదని ఉత్తర కొరియా చెబుతోంది. కానీ, దక్షిణ కొరియాలో అమెరికా ఆర్మీ సీనియర్ కమాండర్ ఉత్తర కొరియా వాదనలను అబద్ధాలని, అసాధ్యం అని చెబుతున్నారు. అయితే, ఉత్తర కొరియా నిపుణుడు ఒకరు బీబీసీతో “అక్కడ వైరస్ కేసులు లేవని చెప్పలేం. కానీ, అది భారీ స్థాయిలో వ్యాపించే అవకాశాలు తక్కువ” అని చెప్పారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 53 వేల మందికి పైగా మృతి చెందారు. ఉత్తర కొరియాలో ఇప్పటివరకూ ఒక్క వ్యక్తికి కూడా కరోనావైరస్ వ్యాపించలేదని ఆ దేశ సెంట్రల్ యాంటీ-ఎపిడమిక్ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ పాక్ మ్యాంగ్-సూ వార్తా సంస్థ ఎఎఫ్‌పీతో చెప్పారు. “మేం ఈ వైరస్ వ్యాపించకుండా మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయడం. వారిని క్వారంటైన్‌లో పెట్టడం లాంటి చర్యలు చేపట్టాం. వారి అన్ని వస్తువులనూ పూర్తిగా శానిటైజ్ చేశాం. మా భూ, వైమానిక, సముద్ర మార్గాలను మూసివేశాం” అని ఆయన చెప్పారు.. ఉత్తర కొరియా కరోనా ఉత్తర కొరియా వాదన నిజమే అయ్యుంటుందా? దక్షిణ కొరియాలోని అమెరికా ఆర్మీ కమాండర్ జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ ఉత్తర కొరియా వాదనల్లో నిజం లేదన్నారు. ఆయన సీఎన్ఏ, వాయిస్ ఆఫ్ అమెరికాలకు ఇచ్చిన సంయుక్త ఇంటర్వ్యూలో “మాకు లభించిన సమాచారం ప్రకారం అలా జరగడం అసాధ్యం అని మాత్రమే నేను మీకు చెప్పగలను” అన్నారు. “అయితే, ఉత్తర కొరియాలో మొత్తం ఎన్ని కరోనా వైరస్ కేసులు ఉండచ్చు అనేది కూడా పక్కాగా ఏదీ చెప్పలేం” అని ఆయన అన్నారు. అమెరికా వెబ్‌సైట్ ఎన్‌కే న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ ఆలివ్ హాటమ్ కూడా ఉత్తర కొరియాలో వైరస్ కేసులు ఉన్నాయనే భావిస్తున్నారు. ఉత్తర కొరియా సరిహద్దులు చైనా, దక్షిణకొరియాలతో కలుస్తాయి కాబట్టి, ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని మనం అసలు అనుకోలేం.. ఉత్తర కొరియాకు చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాల స్థాయిని బట్టి చూస్తే, ఆ దేశంలో కరోనా కేసులే లేవంటే, నాకు అసలు నమ్మకం కుదరడం లేదు” అన్నారు. అయితే, ఉత్తర కొరియాలో కరోనా భారీ స్థాయిలో వ్యాపించే అవకాశాలు కూడా తక్కువని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా కరోనా ఉత్తర కొరియా వైరస్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కుంది? కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి మిగతా చాలా దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా చాలా వేగంగా, సమర్థవంతంగా చర్యలు చేపట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది జనవరి నెల చివరి నుంచే తమ సరిహద్దులు మూసివేసింది. తర్వాత ప్యాంగ్యాంగ్ వచ్చే వందలాది విదేశీయులను క్వారంటైన్లో ఉంచింది. ఆ సమయంలో చైనాలో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఎన్‌కే న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఉత్తర కొరియా తన 10 వేల మంది పౌరులను ఐసొలేషన్‌లో ఉంచింది. 500 మంది ఇప్పటికీ క్వారంటైన్లో ఉన్నారు. ఉత్తర కొరియాలో ప్రజలకు కరోనా వైరస్ గురించి తెలుసా? ఉత్తర కొరియాలో చాలామందికి కరోనా వైరస్ గురించి ‘చాలా కొద్దిగా’ మాత్రమే తెలుసి ఉంటుందని ఆలివ్ హాటమ్ భావిస్తున్నారు. “అక్కడ మీడియా కవరేజ్ చాలా ఎక్కువగా ఉంది. వార్తాపత్రికల్లో ప్రతి రోజూ ఒక పేజీ నిండా దేశంలో, అంతర్జాతీయంగా ఉత్తర కొరియా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటోందో చెబుతున్నారు” అన్నారు. “ఉత్తర కొరియాలో ప్రజలకు వైరస్‌ను ఎలా అడ్డుకోవాలో కూడా నేర్పిస్తున్నారని” సోల్‌లో ఉన్న కుకమిత్ యూనివర్సిటీ పరిశోధకులు ఫ్యోండోర్ టెరటిటిస్కీ చెప్పారు. ఉత్తర కొరియాలో ఆరోగ్య సదుపాయాలుఎలా ఉన్నాయి? ఉత్తర కొరియాలో వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయి ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియా ఆరోగ్య వ్యవస్థ ఆ దేశంలాగే తలసరి ఆదాయం ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే చాలా మెరుగ్గా పనిచేస్తోందని ఫ్యోండర్ టెరటిటిస్కీ అన్నారు. “ఉత్తర కొరియా చాలా పెద్ద సంఖ్యలో తమ డాక్టర్లకు శిక్షణ ఇచ్చింది. అయితే అక్కడి డాక్టర్లకు పశ్చిమ దేశాలతో పోలిస్తే తక్కువ అర్హతలు ఉంటాయి. వారితో పోలిస్తే జీతాల కూడా తక్కువే. కానీ, వారు తమ పౌరుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను చాలా బాగా చూసుకోగలరు” అని చెప్పారు. ఆలివ్ హాటమ్ కూడా టెరటిటిస్కీతో ఏకీభవించారు. కానీ, “ఉత్తర కొరియా డాక్టర్లు మామూలు వ్యాధులకు సమర్థంగా చికిత్స అందించగలరు. కానీ కరోనావైరస్ లాంటి తీవ్ర సమస్యలను ఎదుర్కోడానికి వారికి మరింత మెరుగైన మెడికల్ పరికరాలు, మెరుగైన ఆరోగ్య సదుపాయాల అవసరం అవుతుంది” అని కూడా చెప్పారు. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల వల్ల కూడా కొత్త వైద్య పరికరాలు కొనుగోలు చేయడం వారికి కష్టంగా మారింది అన్నారు. “నగరాల్లో మెరుగైన ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయి. కానీ వారితో పోలిస్తే, గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి అలాంటి సదుపాయాలు లభించడం కష్టం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆస్పత్రులకు నిధుల కొరత కూడా ఉంది. అక్కడ ఆ ఆస్పత్రుల్లో నీరు, విద్యుత్ సరఫరా కూడా సరిగా ఉండదు” అని ఆలివ్ హాటమ్ చెప్పారు. ఉత్తర కొరియా వైరస్ కేసులు ఎందుకు దాస్తోంది? కరోనావైరస్ కేసులు తమ దేశంలో కూడా ఉన్నాయని ఉత్తర కొరియా అంగీకరిస్తే అది వారి ఓటమి సంకేతం అవుతుంది. “ఉత్తర కొరియా ఈ వైరస్ నుంచి ఎలా తట్టుకుంటోందో దాని గురించి చాలా ప్రచారం జరుగుతోంది. అక్కడ వైరస్ కేసులు ఉన్నాయి అనే అనుకుంటే, అప్పుడు అది దానికి ఓటమి అంగీకరించడం లాగే అవుతుంది. దానివల్ల ఉత్తరకొరియా ప్రజల్లో ఒక భయం లాంటిది ఏర్పడుతుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పారిపోడానికి ప్రయత్నిస్తారు, దానివల్ల దేశంలో అస్థిరత నెలకొంటుంది. వైరస్ వ్యాప్తి మరింత పెరగవచ్చు” అని ఆలివ్ హాటమ్ చెప్పారు. ఉత్తర కొరియా వైరస్ కేసులు దాచిపెట్టి, తన ఇమేజ్ కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది అని ఫ్యోండోర్ టెరటిటిస్కీ భావిస్తున్నారు. “ఉత్తర కొరియా తన ఇమేజ్ నాశనం అయ్యేలా బయటికి ఎలాంటి సమాచారం ఇవ్వాలని అనుకోవడం లేదు. మీ దగ్గర చెప్పుకోడానికి ఏదైనా మంచి కారణం లేనంతవరకూ, ఏదీ చెప్పవద్దు అనేది వారి ప్రాథమిక నియమం” అని ఆయన చెప్పారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియా తమ దేశంలో ఒక్క వ్యక్తి కూడా కరోనా వైరస్‌కు గురికాలేదని చెబుతోంది. ఆ దేశం చెబుతున్న మాటలపై ఇప్పుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. text: జపాన్‌లో ఏటా 200,000 జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. జపాన్‌లో "ఫ్యామిలీ రొమాన్స్" పేరుతో ఇషీ ఒక సంస్థను నడుపుతున్నారు. తల్లిదండ్రులను, స్నేహితులను, బంధువులను ఆ సంస్థ అద్దెకు ఇస్తుంది. ఈ సంస్థలో 2,200 మంది ఉద్యోగులు ఉన్నారు. వారు ప్రమాదాలలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు, కుటుంబ కలహాలతో విడిపోయిన వారికి లేదా మరేదైనా కారణాలతో ఆత్మీయులను కోల్పోయిన వారికి తల్లిలా, తండ్రిలా, తమ్ముడిలా, సోదరిలా, సోదరుడిలా, బాబాయిలా, మామయ్యలా, అత్తలా, తాతయ్య,లా నానమ్మలా, అమ్మమ్మలా వ్యవహరిస్తారు (నటిస్తారు). అందుకు డబ్బులు (అద్దె) తీసుకుంటారు. "నేను 35 మంది పిల్లలకు తండ్రిగా వ్యవహరిస్తున్నాను. వారంలో రెండు మూడు రోజులు వెళ్లి వారితో ఓ నాలుగు గంటలపాటు గడుపుతాను" అని ఇషీ చెప్పారు. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. మరి, అంతమంది పిల్లలకు "తండ్రి"గా వ్యవహరించడం, డబ్బులు తీసుకుని పరిచయం లేని కుటుంబాలలో సభ్యుడిగా నటించడం ఎలా అనిపిస్తుంది? అన్న విషయాలను సంస్థ నిర్వాహకుడు యూచి ఇషీ బీబీసీతో పంచుకున్నారు. ఇషీ నాలుగు గంటలపాటు స్నేహితుడిగా లేదా బంధువుగా నటించేందుకు 20,000 యెన్లు (రూ. 12,800) తీసుకుంటారు. నకిలీ కానీ... "ఫ్యామిలీ రొమాన్స్ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకు 14 ఏళ్ల క్రితం వచ్చింది. అందుకు కారణం నా స్నేహితురాలికి ఎదురైన ఒక సమస్య. ఒకసారి నా స్నేహితురాలు తన కొడుకుని ఓ ప్రైవేటు స్కూలులో చేర్పించేందుకు తీసుకెళ్లింది. అయితే, పిల్లవాడితో పాటు అతని తల్లిదండ్రులు ఇద్దరూ రావాలని ఆ స్కూలువాళ్లు అన్నారు. కానీ, ఆమె ఒంటరి మహిళ. దాంతో, తప్పని పరిస్థితిలో తనకు భర్తగా నటిస్తూ నేను వెళ్లాను" అని ఇషీ చెప్పారు. "నేను ఆ అబ్బాయికి నాన్నగా నటించాలని అనుకున్నాను. కానీ, నేను, ఆ బాలుడు.. ఒకే కుటుంబ సభ్యులు అన్నట్లుగా సరిగా నటించలేకపోయాం. దాంతో, అలా ఇబ్బందులు పడేవారికి ప్రొఫెషనల్ సేవలు అందిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఫ్యామిలీ రొమాన్స్ సంస్థ" అని ఆయన చెప్పుకొచ్చారు. "నేను నకిలీ బంధువునే, కానీ ఆ నాలుగు గంటల పాటు మీ సొంత కుటుంబ సభ్యుడిగా, ఆత్మీయతను పంచుతాను, ప్రాణ స్నేహితుడిగా వ్యవహరిస్తా" అని అంటున్నారు ఇషీ. అద్దెకు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ సంస్థ వినియోగదారుల్లో విభిన్న రకాల అవసరాలు కలిగిన వ్యక్తులుంటారు. కొందరు తమకు జీవిత భాగస్వామిగా నటించే వ్యక్తి కావాలంటూ వస్తారు. అందుకు వారి ఎత్తు, వయసుకు తగ్గట్టుగా ఉండే పురుషుడు లేదా మహిళను ఈ సంస్థ ఎంపిక చేసి పంపిస్తుంది. తమకు స్నేహితులు లేరని బాధపడేవారు కూడా ఈ సంస్థ నుంచి స్నేహితులను అద్దెకు తీసుకోవచ్చు. "మేము వారికి ఎంతో కాలంగా స్నేహితులం అన్నట్లుగా నడుచుకుంటాం. కలిసి షాపింగ్‌కు వెళ్తాం. సరదాగా చాటింగ్ చేస్తాం. డిన్నర్ పార్టీలలో పాల్గొంటాం" అని ఇషీ చెప్పారు. కొందరు వృద్ధులు తమకు కొడుకులు, కోడళ్లు, బిడ్డలు, మనుమలు, మనుమరాళ్లు అద్దెకు కావాలంటూ వస్తారు. తండ్రి పాత్రకు భారీ డిమాండ్ 'తండ్రి' పాత్రకు డిమాండ్ అధికంగా ఉంటుందని ఇషీ చెప్పారు. జపాన్‌లో ఏటా దాదాపు 2 లక్షల జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. తండ్రి లేదా తల్లి ఎవరో ఒకరు మాత్రమే కలిగిన కుటుంబాలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. వారంతా తమ వద్దకు వస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, ఎంత నటించినా, సొంత కుటుంబ సభ్యుడు లేని లోటును మాత్రం ఎవరూ పూడ్చలేరని ఇషీ అంటున్నారు. తండ్రి పాత్రలోనూ కొందరు చాలా మృదు స్వభావం కలిగిన వ్యక్తి కావాలంటారు, చాలా కఠినంగా వ్యవహరించే వ్యక్తి ఉంటే పంపించండని మరికొందరు అడుగుతారు. చిన్న పిల్లలు 'తండ్రి' కావాలంటూ వచ్చినప్పుడు వారి నాన్న ఎందుకు రావట్లేదు? అన్న పూర్తి వివరాలను ఈ సంస్థ నిర్వాహకులు తెలుసుకుంటారు. పిల్లలకు తండ్రిగా నటించిన తర్వాత 'బాయ్...' చెబుతూ వారిని విడిచి వెళ్లిపోయేటప్పుడు ఎంతో బాధగా ఉంటుందని ఇషీ అంటున్నారు. "అంతసేపు నాన్నా.. నాన్నా అంటూ మాతో ఆడుకుంటారు. మేం వారిని ప్రేమగా చూసుకుంటాం. వారిని వదిలి వెళ్లేటప్పుడు కలిగే బాధ మాటల్లో చెప్పలేం. మమ్మల్ని వదిలివెళ్లొద్దు అంటూ పిల్లలు ఏడుస్తుంటారు, వెంటపడుతుంటారు. వారిని ఒప్పించడం చాలా కష్టం" అని ఆయన వివరించారు. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా ఐదు కుటుంబాల్లో సభ్యుడిగా ఉండొచ్చు. కానీ, ఇషీ తానే ఆ సంస్థను స్థాపించారు కాబట్టి ఆయన 25 కుటుంబాలలో 'అద్దె సభ్యుడి'గా నటిస్తున్నారు. ఆ 25 కుటుంబాలకు చెందిన మొత్తం 35 మంది పిల్లలు ఇషీని తమ సొంత తండ్రిగా భావిస్తారు. ఆ కుటుంబాల తరఫున ఆయనకు 69 నకిలీ బంధుత్వాలు ఉన్నాయి. "నేను ఒక కుటుంబం వద్దకు వెళ్తున్నప్పుడు.. ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ రాసి ఉన్న నోట్‌బుక్‌ను వెంట తీసుకెళ్తా. అప్పుడప్పుడు కొందరు పిల్లల ముద్దు పేర్లను మరచిపోతుంటాను. అలాంటప్పుడు వెంటనే బాత్రూంలోకి వెళ్లి నోట్‌బుక్‌లో చూసుకుంటా" అని ఇషీ చెప్పారు. ఈ నకిలీ బంధుత్వాల కారణంగా తన సొంత బంధుత్వాలపై ఎలాంటి ప్రభావం లేదని ఆయన అంటున్నారు. ఇషీ అసలు వివాహమే చేసుకోలేదు, సొంత సంతానం లేదు. ఇకముందు వివాహం చేసుకోనని చెబుతున్నారు. తాను పెళ్లి చేసుకుని సొంత కుటుంబాన్ని ప్రారంభిస్తే, ఆ 25 కుటుంబాల పిల్లలతో తనకున్న అనుబంధం దెబ్బతింటుందేమో అనిపిస్తోందని ఆయన అంటున్నారు. ఈ సంస్థ ఉద్యోగులతో పాటు, వినియోగదారులకు కొన్ని కఠినమైన షరతులు ఉంటాయి. వారు చేతిలో చేయి వేయొచ్చు. కానీ, ముద్దు పెట్టుకోకూడదు, శృంగారంలో పాల్గొనకూడదు. ఈ సంస్థ మొత్తం 30 రకాల సేవలు అందిస్తుంది. అందులో ఒక్కో సేవకు ప్రత్యేకంగా నియమ నిబంధనలు ఉంటాయి. వినియోగదారులు నాలుగు గంటలకు 20,000 యెన్లు (రూ. 12,800) చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణం, ఆహారం ఖర్చులు అదనం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "నా వయసు 38 ఏళ్లు. నాకిప్పుడు 25 కుటుంబాలు ఉన్నాయి, 35 మంది పిల్లలు ఉన్నారు. అయితే, ఆ పిల్లలు నా సంతానం కాదు. నేను వారికి 'అద్దె తండ్రి'ని మాత్రమే. అంటే... డబ్బులు తీసుకుని వారికి నాన్నలా నటిస్తాను" అని యూచి ఇషీ చెప్పారు. text: ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌కు చెందిన పవన్ కుమార్ ఏప్రిల్ 18న జరిగిన రెండో దశ పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఈవీఎంపై ఉన్న రకరకాల గుర్తులు చూసి కన్ఫ్యూజ్ అయి అనుకోకుండా కమలం గుర్తు(బీజేపీ) నొక్కేశారు. తాను కోరుకున్న పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేశానన్న బాధతో ఆయన తన వేలిని కోసుకున్నారు. ఈ విషయం చెబుతూ సోషల్ మీడియాలో ఆయన వీడియో పోస్ట్ చేయగా అదిప్పుడు వైరల్‌గా మారింది. ''నేను ఏనుగు గుర్తు(బీఎస్పీ)కు ఓటేయాలనుకుని వెళ్లాను. కానీ, పొరపాటున ఈవీఎంలో కమలం గుర్తుపై నొక్కాను'' అంటూ ఆయన ఆ వీడియోలో చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక పార్టీకి ఓటు వేయాలనుకుని పొరపాటున మరో పార్టీకి ఓటు వేసినందుకు తనను తాను శిక్షించుకున్నాడు ఓ యువకుడు. text: ఐఫోన్ టెన్ ఎస్ 5.8 అంగుళాలు, ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్ 6.5 అంగుళాలు, ఐఫోన్ టెన్ ఆర్ 6.1 అంగుళాల తెరలు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లతో పాటు, ECG, ఫాల్- డిటెక్షన్ అనే సరికొత్త ఫీచర్‌‌తో కొత్త స్మార్ట్‌వాచీని కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ ఆవిష్కరించింది. స్క్రీన్ సైజు ఇలా పెరిగింది! ఇప్పటివరకు మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్లలో అత్యంత ఖరీదైనదిగా ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్ నిలవనుంది. యాపిల్ వెల్లడించిన వివరాల మేరకు.. అమెరికాలో దీని ధర అంతర్గత మెమొరీ సామర్థ్యాన్ని బట్టి 1,099 డాలర్ల (రూ.72,022) నుంచి 1,449 డాలర్ల (రూ.97,256) వరకు ఉంది. 64జీబీ, 256జీబీ, 512జీబీల వేరియంట్లలో టెన్ ఎస్ మ్యాక్స్ దొరుకుతుంది. వీటి ధర 1,099 డాలర్లు, 1,249 డాలర్లు, 1,449 డాలర్లుగా ఉంది. టెన్ ఎస్ మోడల్ ధర మ్యాక్స్ కంటే 100 డాలర్లు తక్కువ ఉంటుంది. నిజానికి గతంలో వచ్చిన ఐఫోన్ 8 ప్లస్‌, ఇప్పుడు విడుదల చేసిన టెన్ ఎస్ మ్యాక్స్ పరిమాణం సమానమే. కానీ, టెన్ ఎస్ మ్యాక్స్‌ తెర పెద్దదిగా ఉంటుంది. అందుకు కారణం, ఈ ఫోన్ ముందుభాగంలో ఖాళీ స్థలం తక్కువగా ఉండటమే. టెన్ ఎస్, టెన్ ఎస్ మ్యాక్స్ ఫోన్లు అత్యాధునిక ఓఎల్‌ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్) డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. ఈ తరహా తెరలను ప్రస్తుతం అత్యంత ఖరీదైన మోడళ్లలోనే వినియోగిస్తున్నారు. ఆరు రంగుల్లో ఐఫోన్ టెన్ ఆర్ లభిస్తుంది. ఆరు రంగుల్లో టెన్ ఆర్ మోడల్ ఐఫోన్ టెన్ ఆర్ కూడా పెద్ద స్క్రీన్ కలిగి ఉంది. అయితే, అది ఎల్‌సీడీ తెర. ఈ ఫోన్‌ ఫ్రేమ్‌ను స్టీల్‌తో కాకుండా అల్యూమినియంతో తయారు చేశారు. అందువల్ల దీనిపై తొందరగా గాట్లు, చారలు పడే అవకాశం ఉంటుంది. టెన్ ఆర్ మోడల్ 6 రంగుల్లో లభిస్తుంది. వేరువేరు వేరియంట్లలో ఫోన్లు దొరుకుతున్నందున వినియోగదారులు తమకు నచ్చింది ఎంచుకునే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. "గతంలో ఒక ఓఎస్ నుంచి మరో ఓఎస్‌కు మారేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆండ్రాయిడ్ అయినా, ఐఓఎస్ అయినా ఒకసారి వాడినవారు మళ్లీ అదే ఓఎస్ ఉన్న ఫోన్లవైపే చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఐఫోన్‌ వాడిన వారు మళ్లీ ఐఫోనే తీసుకుంటున్నారు. కొత్త మోడల్ ఫోన్ కొనే ముందు తెర గురించి ఆలోచిస్తున్నారు" అని విశ్లేషకులు చెబుతున్నారు. స్పీడ్ పెంచే స్మార్ట్ ప్రాసెసర్ తాజా ఫోన్లలో 'ఏ12 బయోనిక్' అనే సరికొత్త చిప్‌ (ప్రాసెసర్) అమర్చినట్టు యాపిల్ తెలిపింది. ఈ సంస్థ వాడిన తొలి 7- నానోమీటర్ ట్రాన్సిస్టర్ సాంకేతికతతో అభివృద్ధి చేసిన స్మార్ట్‌ఫోన్ చిప్ ఇదే. దీనివల్ల ఫోన్ వేగం పెరగడంతో పాటు, బ్యాటరీ బ్యాకప్ కూడా మెరుగవుతుంది. అందుకే, గతేడాది వచ్చిన ఐఫోన్‌ టెన్‌తో పోల్చితే తాజా ఎక్స్‌ఎస్ ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్ 30 నిమిషాలు పెరుగుతుందని యాపిల్ చెబుతోంది. చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి కూడా 7- నానోమీటర్ టెక్నాలజీతో మొబైల్ చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఇటీవల ప్రకటించింది. ఈ మూడు ఫోన్లలోనూ ఫేస్ ఐడీ ఫీచర్ మరింత వేగంగా పనిచేస్తుందని యాపిల్ తెలిపింది. ఫేస్ ఐడీ (ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత) ద్వారా వినియోగదారుడు ముఖాన్ని చూపిస్తే ఫోన్‌ తెరుచుకుంటుంది. ఈ ఏడాది మార్చిలో హువాయి విడుదల చేసిన 'పీ20 ప్రో' ఫోన్‌కు మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. అలాగే యాపిల్ కూడా మూడు రేర్ కెమెరాలు కలిగిన ఫోన్‌ను తీసుకొస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, అది నిజం కాలేదు. ఐఫోన్ టెన్ ఎస్, టెన్ ఎస్ మ్యాక్స్‌లు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు కలిగి ఉన్నాయి. టెన్ ఆర్‌కి ఒకే కెమెరా ఉంది. ఈ ఫోన్లలో ఫొటోల బ్యాగ్రౌండ్‌ని బ్లర్ చేసేందుకు కొత్త టూల్‌ను తీసుకొచ్చింది యాపిల్. డ్యుయల్ సిమ్ సదుపాయం టెన్ ఎస్, టెన్ ఎస్ మ్యాక్స్ ఫోన్లలో రెండు సిమ్‌లు వేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు, సిమ్ కార్డు లేకుండానే, క్యూఆర్ కోడ్‌తో పనిచేసే ఎలక్ట్రానిక్ సిమ్‌ (eSIM)తో కూడా ఈ ఫోన్లు పనిచేస్తాయి. ఇంతకు ముందు గూగుల్ పిక్సెల్ 2 ఫోన్‌లో eSIM సదుపాయం ఉంది. అయితే, చైనా విపణిలో అమ్మే ఐఫోన్లలో మాత్రం తప్పనిసరిగా సిమ్ కార్డులు వాడాల్సిందే. స్మార్ట్‌వాచీలో ఈసీజీ సిరీస్ 4 స్మార్ట్‌వాచీని కూడా యాపిల్ ఆవిష్కరించింది. గతంలో విడుదల చేసిన వాచీల్లో చుట్టూ అంచుల వెంట ఖాళీ స్థలం ఉంటుంది. ఈ వాచీలో మాత్రం అంచులదాకా తెర విస్తరించి ఉంటుంది. అందుకే పాత మోడళ్లతో పోల్చితే పరిమాణంలో 2 మి.మీ మాత్రమే పెరిగినా... ఈ వాచీలో డిస్‌ప్లే మాత్రం 30 శాతం పెరిగిందని యాపిల్ తెలిపింది. తెర పెద్దది కావడం వల్ల ఒకేసారి ఎక్కువ సమాచారం చూసుకునే వీలుంటుంది. పాత వాచీల కంటే ఇది కాస్త నాజూకుగా (పలుచగా) ఉంది. ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్) ద్వారా హృదయ స్పందనను కూడా ఈ వాచీ తెలియజేస్తుంది. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు గుర్తించి అలర్ట్ చేస్తుంది. అందుకోసం ఈ వాచీలో కొత్తగా సెన్సర్లు అమర్చారు. ఈ వాచీ ధరించిన వ్యక్తి కిందపడిపోయినప్పుడు గుర్తించి అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అలర్ట్ పంపే ఫీచర్‌ను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది. 40మి.మీ, 44 మి.మీ వేరియంట్లలో ఈ వాచీ లభిస్తుంది. అయితే, ఆశించిన స్థాయిలో ఫోన్‌ని, స్మార్ట్‌వాచీని మెరుగుపరచలేదన్న విమర్శలు యాపిల్‌కి ఎదురయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణ సంస్థ సీసీఎస్ ఇన్‌సైట్ తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్ టెన్‌కు అదనపు ఫీచర్లు జోడిస్తూ.. ఐఫోన్ టెన్ ఎస్, ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్, ఐఫోన్ టెన్ ఆర్ పేర్లతో మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది యాపిల్. వీటిలో రెండు ఐఫోన్ ఎక్స్ కంటే పెద్ద తెరలు కలిగి ఉన్నాయి. text: జస్టిస్ కేఎం జోసెఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలన్న ప్రతిపాదనను మరోసారి పరిశీలించాలన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు బుధవారం సుప్రీంకోర్టు కొలీజియం తన స్పందన తెలియజేయాల్సి ఉండగా, దీనిపై కొలీజియం ఏకాభిప్రాయానికి రాలేదు. ఇందూ మల్హోత్రా, కేఎం జోసెఫ్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని కొలీజియం (సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిల బృందం) జనవరిలో సిఫారసు చేసింది. అయితే, దీనిపై చాలా కాలం తర్వాత ఇందూ మల్హోత్రా నియామకానికి సంబంధించిన సిఫారసును కేంద్ర న్యాయశాఖ స్వీకరించింది. కానీ, జస్టిస్ జోసెఫ్ విషయంలో మాత్రం పునరాలోచించాలని సిఫారసును కొలీజియంకు తిప్పి పంపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం చీఫ్‌ దీపక్ మిశ్రాకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోసెఫ్‌ను ఎందుకు నియమించకూడదో మూడు కారణాలను ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో మొదటి కారణం, సుప్రీంకోర్టులో కేరళ నుంచి ఇదివరకే ఒక న్యాయమూర్తి ఉన్నారు. ఇది రాష్ట్రాల ప్రాతినిధ్య సూత్రానికి అనుగుణమైంది కాదు. రెండోది, ప్రస్తుతం దేశంలో సీనియారిటీ ప్రకారం జస్టిస్ జోసెఫ్‌ 42వ స్థానంలో ఉన్నారు. అది చాలా తక్కువ. మూడో కారణం, సుప్రీంకోర్టు జడ్జిలలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సముదాయాలకు చెందిన వారు ఒక్కరు కూడా లేరు. జస్టిస్ ఇందూ మల్హోత్రా మంత్రి రవిశంకర్ లేఖ అందిన తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిల్లో ఒకరైన కురియన్ జోసెఫ్ స్పందించారు. "మా సిఫార్సులను ప్రభుత్వానికి మరోసారి పంపిస్తాం. ఆయన నియామకానికి సంబంధించిన సిఫారసును తిప్పి పంపించే ముందు ప్రభుత్వం గత ఉదాహరణలను కూడా పట్టించుకోలేదనే విషయాన్ని వాస్తవాలూ, గణాంకాల ఆధారంగా తెలియజేస్తాం." అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో చెప్పారు. ఆ మరుసటి రోజే అదే పత్రిక మరో కథనం ప్రచురించింది. "ఒకవైపు కొలీజియం సమావేశం జరగాల్సి ఉండగా, ఇలాంటి విషయాలను మీడియాకు వెల్లడించడం సంప్రదాయానికి, నియమాలకు విరుద్ధం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కొలీజియం అంటే ఏమిటి? సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలను, ప్రధాన న్యాయమూర్తిని కలిపి కొలీజియం అంటారు. కొలీజియం సిఫారసుల మేరకు జడ్జీల నియామకం, బదిలీలు జరుగుతాయి. కొలీజియం తన సిఫారసులను ప్రభుత్వానికి పంపిస్తుంది, ఆ తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జడ్జీలు నియమితులవుతారు. సాధారణంగా కొలీజియం సిఫారసులకు ప్రభుత్వం అంగీకరిస్తుంది. కానీ, జస్టిస్ జోసెఫ్ నియామకం విషయంలో మాత్రం మోదీ ప్రభుత్వం పునరాలోచించాలని కొలీజియాన్ని కోరింది. "ఇప్పుడు కొలీజియం తన సిఫారసులను మళ్లీ ప్రభుత్వానికి పంపిస్తే, ప్రభుత్వం తప్పకుండా దానిని అంగీకరించాల్సి ఉంటుంది" అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా ఉపకులపతి ఫైజాన్ ముస్తఫా అన్నారు. జస్టిస్ జోసెఫ్ విషయంలో ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోంది? లేఖలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్న అంశాలపై కొన్ని దశాబ్దాలుగా న్యాయ సంబంధిత విషయాలను పరిశీలిస్తున్న సీనియర్ పాత్రికేయుడు రాకేశ్ భట్నాగర్ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. "సుప్రీంకోర్టు జడ్జి నియామకానికి సంబంధించి ఈ నిబంధనలు ఎవరు, ఎప్పుడు పెట్టారు? ప్రస్తుతం చాలా రాష్ట్రాల నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది జడ్జీలు సుప్రీంకోర్టులు ఉన్నారు. జస్టిస్ యంబీ లోకుర్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏకే సిక్రీలు ముగ్గురూ దిల్లీకి చెందిన వారే కదా" అని భట్నాగర్ అన్నారు. జస్టిస్ జోసెఫ్ నియామకం విషయంలో మోదీ ప్రభుత్వ తీరును మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ కూడా తప్పుపట్టారు. 'ఉత్తరాఖండ్' తీర్పే నిరాకరణకు కారణమా? "ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి మీరు నచ్చకపోతే, మీ నియామకానికి అంగీకరించదు" అని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. దాదాపు 100 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా ఇదే విషయాన్ని గురువారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ముందు లేవనెత్తారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని చట్టవిరుద్ధమని జస్టిస్ జోసెఫ్‌ చెప్పినందువల్లనే ఆయన పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని న్యాయవాదుల సంఘం ప్రతినిధి ఇందిరా జైసింగ్ ఆరోపించారు. 2016లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం చట్టవ్యతిరేకమని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. జస్టిస్ జే. చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయి, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ "జస్టిస్ జోసెఫ్ నియామకాన్ని మోదీ ప్రభుత్వం తిరస్కరించడం వెనకున్న అసలు కారణం ఆయన ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకించడమేనన్న విషయం కాస్త ఆలోచించగలిగే ఏ వ్యక్తికయినా స్పష్టంగా అర్థమవుతుంది" అని ఫైజాన్ ముస్తఫా అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్‌కు సంబంధించిన మరో ఫైల్ కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'తో మాట్లాడుతూ కొలీజియం సభ్యుడు జస్టిస్ కురియన్, "జస్టిస్ జోసెఫ్ విషయంలో ప్రభుత్వం ఇలా సాచివేత ధోరణని ప్రదర్శించడం మొదటిసారేమీ కాదు. చల్లగా ఉండే పర్వత ప్రాంతానికి తన శరీరం తట్టుకోవడం లేదు కాబట్టి తనను ఉత్తరాఖండ్ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన రెండేళ్ల కిందటే దరఖాస్తు చేసుకున్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్-తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. ఆ ఫైల్ ప్రభుత్వానికి పంపించింది కూడా. కానీ ప్రభుత్వం దానిపై ఇప్పటికీ స్పందించలేదు" అని తెలిపారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని జస్టిస్ కురియన్ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కేరళకు చెందిన జస్టిస్ కురియన్ ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు ఓ లేఖ రాశారు. అందులో ఆయన "కొలీజియం సిఫారసులను ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతోంది. ఇది సుప్రీంకోర్టు అస్తిత్వానికే ప్రమాదకరం" అని రాశారు. జస్టిస్ కురియన్ మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి జస్టిస్ దీపక్ మిశ్రా పనితీరును ప్రశ్నించారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొలీజియానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రభుత్వానికి ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు స్వతంత్రను కాపాడాలన్న ఒత్తిడి ఆయన తన సహచరుల నుంచి ఎదుర్కొంటున్నారు. తమ సిఫారసులను మళ్లీ ప్రభుత్వానికి పంపించాలని వారు కోరుతున్నారు. అయితే బుధవారం జరిగిన సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై కొలీజియం సభ్యుల మధ్య తలెత్తిన విభేదం ఓ కొలిక్కి రానట్టు వార్తా సంస్థలు తెలిపాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం, కొలీజియంల మధ్య ఏం జరుగుతుంది అన్న అంశాన్ని దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. text: ఒరాంగుటాన్ వంటి ఇతర ఏప్స్ ఉన్న జంతుశాలల్లోకి కూడా ప్రజలను అనుమతించడం లేదు. వీటికి కరోనావైరస్ సోకుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ మానవజాతికి సమీప లక్షణాలుండే ఈ కోతి జాతులకు కూడా కరోనా ముప్పుందన్న భయాలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట బ్రాంక్స్ జూలో ఒక పులికి కరోనా సోకిందన్న వార్తల నేపథ్యంలో పులి, ఆ జాతి జంతువులున్న చోట కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రువాండా, యుగాండా, కాంగోల్లోని అడవుల్లో గొరిల్లాలకు వైద్యం అందించే ‘గొరిల్లా డాక్టర్స్’లో చీఫ్ వెటర్నరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కిరస్టన్ గిలార్డ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘కొండ గొరిల్లాలకు ఈ వైరస్ సోకుతుందో లేదో మాక్కూడా స్పష్టత లేదు. అలాంటి ఆధారాలు కూడా లేవు. అయితే, మానవుల్లో వ్యాధులు కలిగించే బాక్టీరియాలు, వైరస్‌ల బారిన ఇవి కూడా పడుతుంటాయి. అంతేకాదు, వాటికి శ్వాసకోశ సమస్యలూ వస్తుంటాయి’’ అన్నారు. గాయపడిన గొరిల్లాకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఎడ్డీ బృందం అంతరించిపోతున్న జీవులు కొండ గొరిల్లాలు (శాస్త్రీయ నామం: గొరిల్లా బెరింగీ బెరింగీ) అంతరించిపోతున్న జీవుల్లో ఒకటి. ఇప్పుడివి రువాండా, యుగాండా, కాంగో అడవుల్లో మాత్రమే ఉన్నాయి. ఈ మూడు దేశాల్లోనూ ప్రస్తుతం కరోనావైరస్ పాజిటివ్ కేసులున్నాయి. అందుకే.. ఈ మూడు దేశాల్లోనూ గొరిల్లా టూరిజం నిలిపివేశారు. సామాజిక దూరం పాటించడం.. అడవి గొరిల్లాల కోసం పనిచేసే ఫారెస్ట్ రేంజర్లు, పశువైద్యులు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా రాకముందు కూడా వీటిని సందర్శించడానికి వచ్చేవారిని కనీసం 7 మీటర్ల దూరం నుంచే చూడనిచ్చేవారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి. వైరస్‌ల ముప్పు వేట, ఆవాసాలు తగ్గిపోవడం వంటి కారణాలతో గ్రేట్ ఏప్స్ ఇప్పటికే మనుగడ కోసం పోరాడుతున్నాయి. వాటికి వైరస్‌ల ముప్పు ఉంది. గ్రేట్ ఏప్స్‌కు ప్రధాన ముప్పుగా చెబుతున్న మూడు కారణాలలో వైరస్‌లు కూడా ఒకటి. సాధారణంగా వచ్చే ఫ్లూ వంటివి చింపాంజీలకు వస్తాయి. ఎబోలా వల్ల ఎన్నో చనిపోయాయి ఇక ఆఫ్రికాను వణికించిన ఎబోలా వైరస్ వల్ల కూడా ఆ ఖండంలో పెద్ద సంఖ్యలో చింపాంజీలు, గొరిల్లాలు మృతిచెందినట్లు చెబుతారు. బ్రిటన్‌లోని లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీలో ప్రిమేట్ బయాలజీ ప్రొఫెసర్ సెర్గీ విచ్ మాట్లాడుతూ.. చాలా దేశాల్లో గ్రేట్ ఏప్స్ టూరిజాన్ని నిలిపివేశారని చెప్పారు. వాటికి వైరస్ వస్తుందో లేదో తెలియదు కానీ మనుషులకు ఉన్న ముప్పును వీటికీ వ్యాపించకుండా చూడాలనుకుంటున్నామన్నారు. ఒరాంగుటాన్ బతికి ఉన్నవి నాలుగు రకాలే.. ప్రస్తుతం ప్రపంచంలో గొరిల్లాలు (ఆఫ్రికా), బొనోబోలు (ఆఫ్రికా), ఒరాంగుటాన్ (ఆగ్నేయాసియా), చింపాంజీ (ఆఫ్రికా)లు అనే నాలుగు రకాల గ్రేట్ ఏప్స్ మనుగడలో ఉన్నాయి. ఇవన్నీ మానవ జాతికి అత్యంత సమీప లక్షణాలున్న జంతువులు. కోట్ల సంవత్సరాల కిందట ఒకే పూర్వీకుల జాతి నుంచి మనిషి, ఈ గ్రేట్ యాప్స్ వచ్చాయి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ కారణంగా గ్రేట్ ఏప్స్ (కోతి జాతికి చెందినవి)ను కూడా లాక్‌డౌన్‌లో ఉంచారు. ఆఫ్రికాలో గొరిల్లా టూరిజాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. text: అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాలను, పథకాలను ఈ సర్వే నివేదికలో వెల్లడించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న నవరత్నాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించింది. కాగా ప్రభుత్వం ప్రకటించిన ఈ గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సంక్షేమ లెక్కలు ఎలా ఉన్న అభివృద్ధి కనిపించలేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నివేదికలో ఏముందంటే.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్‌డీపీ రూ .9,72,782గా అంచనా వేశారు. 2018-19లో ఇది రూ .8,62,957 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 12.73% వృద్ధి సాధించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి 8.16 శాతంగా ఉందని, అది దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ ఉందని ప్రకటించారు. అనుకూలమైన వాతావరణ పరిస్థితుల మూలంగా వ్యవసాయరంగంలో జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 18.96 శాతం పెరిగినట్లు ప్రకటించుకున్నారు. హార్టీకల్చర్ లో 11.67% పశుసంవర్థక శాఖలో 4.53% వృద్ధి చూపించారు. 2019-20లో సేవల రంగం 9.11% వృద్ధి రేటును సూచిస్తుంది. తలసరి ఆదాయం పెరిగింది 2018-19లో ఏపీలో తలసరి ఆదాయం రూ .1,51,173గా ఉండగా ప్రస్తుతం అది రూ.1,69,519కి పెరిగినట్లు సర్వే నివేదికలో పేర్కొన్నారు. జాతీయ తలసరి ఆదాయం రూ .1,34,432 కంటే ఏపీలో ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. నవరత్నాల పథకాల అమలును ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యారంగం: భారతదేశ సగటు అక్షరాస్యత శాతం 72.98 శాతం కంటే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువగా ఉంది. ఏపీలో అక్షరాస్యత శాతం 67.35% గా ఉంది. రాష్ట్రంలో అర్హత కలిగిన 42.33 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ. 15,000 చొప్పున బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు పేర్కొన్నారు. 'జగనన్న అమ్మ ఒడి' పథకంలో రూ. 6336.45 కోట్లు వ్యయం చేసినట్టు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్: 'జగన్నన్న విద్యా దీవెన' పథకంలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థులు మొత్తం 13.26 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు మైనారిటీల ఫీజును తిరిగి చెల్లించారు. దానికోసం రూ .3329.49 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. 'జగన్న వసతి దీవెన' కింద 8.08 లక్షల అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనారిటీ విద్యార్థులకు రూ .2087 కోట్లు అందించారు. జగన్నన్న గోరుముద్ద పథకం కింద రాష్ట్రంలో పాఠశాల పిల్లలకు నాణ్యమైన పోషకమైన భోజనం అందించడానికి 1,105 కోట్లు ఖర్చు చేశారు. వైద్య, ఆరోగ్యరంగం: వార్షికాదాయం రూ. 5లక్షల లోపు ఉన్న వారందరికీ ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నారు. 144 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని నివేదికలో వెల్లడించారు. 2019-20లో 2.70 లక్షల మంది రోగులు ఈ సేవలను ఉపయోగించుకున్నట్లు నివేదిక పేర్కొంది. పింఛన్లు: పెన్షన్ అర్హత వయస్సు 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గించారు. జనవరి 2020లో 6.14 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది. ప్రతి నెలా 54.68 లక్షల మంది పెన్షనర్లకు రూ.1320.76 కోట్లు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్లకు రూ. 2019-20లో 15,635 కోట్లు కేటాయించగా దానిని 2020-21లో 18,000 కోట్లకు పెంచారు. రైతులకు: 'వైయస్ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్' కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 (పీఎం కిసాన్ యోజన నుంచి రూ .6000తో కలిపి) పెట్టుబడి మద్ధతు అందిస్తున్నాట్లు తెలిపారు. ఈ పథకంలో 46.69 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 6534 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. ఉద్యానవన పంటలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని... ఆయిల్ పామ్, బొప్పాయి, లైమ్, కోకో, టొమాటో మరియు మిరపకాయల ఉత్పాదకతలో మొదటి స్థానం, మామిడి, స్వీట్ ఆరెంజ్ & పసుపు వంటి పంటలలో రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. జలయజ్ఞం: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన 54 ఇరిగేషన్ ప్రాజెక్టులలో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయని నివేదిక వెల్లడించింది. హౌసింగ్, మద్య నియంత్రణలో ప్రగతి.. మత్సకార భరోసా, వైయస్ఆర్ చేయూత, ఆసరా పథకాల తీరునూ నివేదిక వెల్లడించింది. నామినేటెడ్ పోస్టులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, దిశ బిల్లు, 3 రాజధానుల బిల్లు, పాలన వికేంద్రీకరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను ఈ నివేదిక ప్రస్తావించింది. 'సామాజిక ఆర్థిక సర్వేలో సమగ్ర దృష్టి లోపించింది' ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే ప్రధానాంశాలను పరిశీలిస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా కనిపించడం లేదని ఆర్థికరంగ నిపుణుడు పి.సతీష్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై ఆయన బీబీసీతో మాట్లాడారు. ''సంక్షేమం కోసం నవరత్నాలు అమలు చేస్తున్నారు. పథకాల అమలు మీద అభ్యంతరాలు లేవు. కానీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెడుతున్నట్టు కనిపించడం లేదు. పోలవరం గురించి ప్రస్తావన లేదు. 30వేల కోట్ల పునరావాసం అందించాలి. వారి మాట కూడా కనిపించడం లేదు'' అన్నారు. ''పాలన వికేంద్రీకరణ అంటున్నారు గానీ అమరావతి అభివృద్ధి మాటేమిటన్నది కూడా చెప్పలేదు. మూడు రాజధానులు సమానంగా అభివృద్ధి చేయాలంటే 50వేల ఎకరాల భూమి ఉన్న అమరావతిలో ప్రాజెక్టుల సంగతేమిటన్నది స్పష్టత లేదు'' అన్నారు. 'కరోనా సంక్షోభ పర్యవసానంగా వచ్చిన ఆర్థిక సమస్యలకు సమాధానమేదీ?' ''ఇక కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సమస్యలకు సమాధానంగా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుందా అన్నది సందేహమే. వివిధ రూపాల్లో ప్రజలకు నగదు బదిలీ ద్వారా లబ్ది చేకూర్చి మార్కెట్ ని పునరుత్తేజం చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ అభివృద్ధి మీద తగిన శ్రద్ధ పెట్టాల్సి ఉంద''ని సతీశ్ అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ 2019-20ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో ప్రధానాంశాలను ప్రభుత్వం వెల్లడించింది. text: ఇదో విస్తృతమైన అధ్యయనమని బ్రిటన్, చైనా పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా ఐదు లక్షల మంది చైనీయులపై పదేళ్లపాటు పరిశీలన జరిపినట్లు చెప్పారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తిస్తాయని వారు స్పష్టం చేశారు. ఆరోగ్యంపై మద్యం నేరుగా చూపే ప్రతికూల ప్రభావానికి ఇవే ఆధారాలని తెలిపారు. మద్యం తాగడాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచించారు. అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరమని, అది గుండెపోటు ముప్పును పెంచుతుందని చాలా మందికి తెలుసు. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యానికి మంచిదేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరికొన్ని అధ్యయనాలు మద్యపానమే మంచిది కాదని పేర్కొంటున్నాయి. మద్యపానానికి సురక్షితమైన స్థాయి అంటూ ఉండదని స్పష్టం చేస్తున్నాయి. తాజా అధ్యయనాన్ని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం, చైనీస్ వైద్యశాస్త్రాల అకాడమీ పరిశోధకులు నిర్వహించారు. అధ్యయనంలో తేలిన ప్రధానాంశాలు: 1. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతుంది. 2. రోజుకు నాలుగు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 35 శాతం పెరుగుతుంది. ఈ అధ్యయనం ప్రకారం ఒక పెగ్గు(స్పిరిట్స్), సీసా బీరు, చిన్న గ్లాసంత వైన్‌ దాదాపు ఒకే ప్రభావాన్ని చూపుతాయి. ఈ మూడు రకాల మద్యాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. అధ్యయనం ప్రకారం రోజుకు సగం సీసా వైన్ తాగితే గుండెపోటు ముప్పు 38 శాతం పెరుగుతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్‌హాల్టర్ చెప్పారు. స్వల్పంగా లేదా ఓ మోస్తరుగా మద్యం తీసుకుంటే గుండెపోటు ముప్పు తగ్గుతుందనే దాఖలాలేవీ లేవని అధ్యయనం స్పష్టం చేసింది. గుండెపోటుకు సంబంధించి మద్యం ప్రభావాలపై పూర్తి స్పష్టత రాలేదని, వీటిని గుర్తించేందుకు రానున్న సంవత్సరాల్లో మరింత డేటాను సేకరించాల్సి ఉందని తెలిపింది. మితంగా తీసుకుంటే వైన్, బీరు మంచి ప్రభావాన్ని చూపుతాయనేది రుజువు కాలేదని అధ్యయనాన్ని రాసిన ప్రొఫెసర్ రిచర్డ్ పెటో తెలిపారు. రిచర్డ్ పెటో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వైద్య గణాంకాలు, సాంక్రమిక వ్యాధుల విజ్ఞాన విభాగానికి చెందిన ప్రొఫెసర్. మద్యపానం ప్రభావాలపై అధ్యయనానికి తూర్పు ఆసియా దేశాలు అనువైనవి. చైనీస్ మూలాలున్న చాలా మంది ప్రజల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు వారిని మద్యపానానికి దూరంగా ఉంచుతాయి. మద్యం తాగితే వారిపై ప్రతికూల ప్రభావం సత్వరం కనిపిస్తుంది. వారికి అస్వస్థతగా అనిపిస్తుంది. చైనాలో ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి మద్యపానం అలవాటు ఉండదు. మహిళల్లో అతి కొద్ది మందే మద్యం తాగుతారు. పైన చెప్పుకొన్న జన్యువులు పశ్చిమ దేశాల ప్రజల్లో ఉండవు. చైనీయులపై జరిపిన అధ్యయనం లాంటిదే వీరిపై జరపడం సాధ్యం కాదు. ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ బర్గెస్ అభిప్రాయపడ్డారు. ఇది చైనీయులపై మాత్రమే జరిపిన అధ్యయనమని చెప్పారు. ఇది స్పిరిట్స్, బీర్ తీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, వైన్‌పై దృష్టి కేంద్రీకరించలేదని ఆయన తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రోజూ స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్తరు స్థాయి వరకు మద్యం తాగినా రక్తపోటు పెరుగుతుందని, గుండెపోటు ముప్పు పెరిగే ఆస్కారముందని ఆరోగ్య పత్రిక 'ద లాన్సెట్'లో వెలువడిన ఒక అధ్యయనం తెలిపింది. text: పై చిత్రంలో కనిపిస్తున్న ఇంట్లో సెక్స్ వర్కర్లు తమ కో-ఆపరేటివ్‌ సంస్థను నిర్వహిస్తారు. ఈ ఇంటి గోడలపై రంగురంగుల పెయింటింగ్ వేశారు. కోల్‌కతా మహానగరం నడి మధ్యలో, ఇరుకిరుకు గల్లీలతో ఉండే సోనాగాఛీ ప్రాంతాన్ని ఆసియాలోనే అతి పెద్ద వ్యభిచార ప్రాంతంగా పరిగణిస్తారు. ఇది దాదాపు 11 వేల సెక్స్ వర్కర్లకు నెలవుగా ఉంది. సెక్స్ వర్కర్ల హక్కుల కోసం, మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయడం కోసం చైతన్యం తేవాల్సిన అవసరం ఉందంటూ ట్రాన్స్‌జెండర్ కళాకారులు ఇలా పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టారు. బెంగళూరుకు చెందిన ఓ ఆర్ట్ గ్రూపు వీరికి సహకారం అందించింది. ఇళ్లపై పెయింటింగ్స్ వేయడానికి దాదాపు వారం రోజులు పట్టింది. ఇక్కడున్న వేశ్యాగృహాల్లో అత్యధికం శిథిలావస్థలో ఉన్నాయి. చాలా చోట్ల వీటి గోడలు చుట్టపక్కల వారి గోడలతో కలిసిపోయాయి. వేశ్యాగృహాల చుట్టుపక్కల ఉన్న ఇళ్ల గోడలపై కూడా పెయింటింగ్స్ వేశారు. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా ఇళ్లపై ఇలాంటి పెయింటింగ్స్ వేయాలనే ఆలోచన ఉంది. భారత్‌లో వేశ్యావృత్తి అనేది ఇప్పటికీ ఒక పెద్ద సమస్యగా ఉంది. దేశంలో రోజూ 30 లక్షల మంది సెక్స్ వర్కర్స్‌గా పని చేస్తుంటారని ఒక అంచనా. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా నగరంలోని సోనాగాఛీ ప్రాంతాన్ని ట్రాన్స్‌జెండర్ కళాకారులు రంగుల హరివిల్లులుగా తీర్చిదిద్దుతున్నారు. text: కతిహార్‌లోని కొందరు వ్యభిచార బాధిత మహిళలను సీతు తివారీ కలిశారు (బాధిత మహిళల పేర్లు మార్చాం). సోనమ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఇరుగుపొరుగువారు ఓ బ్రోకర్‌తో మాట్లాడి ఆమె పెళ్లిచేశారు. కానీ ఆమెను వ్యభిచారం చేయాలంటూ భర్త ఒత్తిడి చేసేవాడు. కాదంటే కొట్టేవాడు. ఓరోజు తన ఇద్దరు పిల్లలతో కలిసి సోనమ్ కతిహార్‌కు పారిపోయారు. ఇప్పుడు ఆమె ఇక్కడే ఓ కిరాణాషాపు నడుపుకుంటున్నారు. "పెళ్లైన మొదటి సంవత్సరం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వ్యభిచారం చేస్తేనే భోజనం పెడతామని అత్తమామలతో కలసి చెప్పాడు. కాదంటే ఆకలితో మాడిపోవాల్సిందేనన్నారు" అని సోనమ్ చెప్పారు. రాబియాను 30 వేల రూపాయలకు అమ్మేశారు. ఆమె అత్త ఈ ఒప్పందాన్ని కుదిర్చింది, తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి అనే ముసుగులో వ్యభిచారకూపంలోకి దిగబోతున్నామని రాబియా, సోనమ్‌లకు తెలియదు. రాబియా కూడా కతిహార్‌కు తన పిల్లలతో కలిసి పారిపోయి వచ్చారు. "బంధువులు, చుట్టుపక్కలవారు మమ్మల్ని ఎంతో అవమానించేవారు. మేమెలా బతుకుతున్నామో మాకు తెలుసు. పెళ్లికొడుకు కుటుంబం గురించి తెలుసుకోకుండా అమ్మాయిలకు పెళ్లి చేస్తే, ఆ అమ్మాయిల జీవితాలు నరకప్రాయమే. అమ్మాయిలెవరూ ఉత్తర్ ప్రదేశ్‌లో అబ్బాయిలతో పెళ్లిళ్లు కుదుర్చుకోవద్దని సూచిస్తున్నా" అని రాబియా అంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, గత పదేళ్లలో మహిళల అక్రమ రవాణాపై బిహార్ పోలీసులు 753 కేసులు నమోదు చేశారు. 1049 మంది మహిళలను రక్షించారు. "పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లింగనిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి కొన్ని అక్రమ రవాణా ముఠాలు వారిని పెళ్లి పేరుతో ఈ వ్యభిచార రొంపిలోకి దింపుతుంటాయి" అని బిహార్ అడిషనల్ డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు. పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల శిల్పి సింగ్ గత 16 ఏళ్లుగా సీమాంచల్ ప్రాంతంలో ఈ సమస్యపై పోరాడుతున్నారు. భూమికా విహార్ అనే తన సంస్థ 2017లో పదివేల ఇళ్లలో ఓ సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతంలో ఎలాంటి విచారణ లేకుండా బ్రోకర్ల ద్వారా 142 పెళ్లిళ్లు జరిగాయి. యూపీలో మహిళల అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఇదొకటి. కానీ దీనిపై ఏ రాజకీయ నాయకుడూ మాట్లాడరు. "బతకడం కోసం పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న బ్రోకర్లు వారికి డబ్బు ఆశ చూపి వలవేస్తారు. పెళ్లి కుమార్తెల అక్రమ రవాణాపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి" అని భూమిక విహార్ సంస్థ డైరెక్టర్ శిల్పి సింగ్ కోరుతున్నారు. అదృష్టం బాగుండి రాబియా, సోనమ్‌లు ఇంటికి వచ్చేశారు. కానీ సీమాంచల్‌లో వీరిలాంటి వేలాదిమంది అమ్మాయిలు పెళ్లిళ్లైన తర్వాత ఎక్కడున్నారనే సమాచారం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, బిహార్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 918 మంది స్త్రీలున్నారు. కానీ సీమాంచల్‌లో ఇది 927. కేంద్ర, రాష్ట్రాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా మహిళా సాధికారత మాత్రం ఇక్కడ ఎక్కడా కనబడదు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) లోక్‌సభ ఎన్నికల రెండో దశలో బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి చెందిన మూడు నియోజకవర్గాలు పూర్ణియా, కతిహార్, కిషన్‌గంజ్‌లలో పోలింగ్ జరగబోతోంది. ఈ ప్రాంతాల్లో యువతులను పెళ్లిళ్ల పేరుతో వల వేసి వ్యభిచార వృత్తిలోకి దింపడం నిత్యకృత్యం. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. text: ఈ నేపథ్యంలో అసలు ప్రమాణ స్వీకార విధానం ఎలా ఉంటుంది, గత అనుభవాలేమిటి, కాలక్రమేణా ఈ ప్రమాణ స్వీకారం ప్రక్రియ ఎలా మారుతూ వచ్చింది అనేది చర్చించుకోవడం అవసరం. ప్రమాణ స్వీకార ప్రక్రియకు ముందు... ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, రాష్ట్రపతి పరిధిలో పనిచేసే కేంద్ర ఎలక్షన్ కమిషన్ శాసన సభకు ఎన్నికయిన విజేతల వివరాలు గవర్నర్‌కు పంపుతుంది. గెలిచిన పార్టీ తమ నాయకుణ్ని ఎన్నుకుంటుంది. ఆ తర్వాత నూతన ప్రభుత్వ ఏర్పాటుకు, మెజారిటీ స్థానాలు గెలిచిన లెజిస్లేచర్ పార్టీ నాయకుడి అభీష్టం మేరకు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లు చేయమని రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిస్తారు. దాన్ని సాధారణ పరిపాలన శాఖ (జనరల్ ఎడ్మినిస్ట్రేషన్) పొలిటికల్ కార్యదర్శి మిగతా అన్ని శాఖల సమన్వయంతో అమలు చేస్తారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తొలి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జూన్ 8, 2014న గుంటూరు నాగార్జున యునివర్సిటీ ఎదురుగా వున్న బైబిల్ గ్రౌండ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన పనులన్నీ ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధికారులు అప్పట్లో హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరు నగరాల్లో బసచేసి పర్యవేక్షించవలసి వచ్చింది. స్థానికంగా కృష్ణా, గుంటూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం తరపున కలెక్టర్లు ఈ పనులు పూర్తిచేశారు. అట్టహాసంగా ఏర్పాట్లు - అధికారుల ఇబ్బందులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్ర విభజన తర్వాత, దేశంలో 29వ రాష్ట్రంగా వారు తమ ప్రాంతానికి ఒక ప్రాదేశిక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా 2014 జూన్ 2న సాధించుకున్నారు. వారికి అది ఒక విజయోత్సవం కనుక, దాన్ని వారు ఒక పండుగగా నిర్వహించుకున్నారు. అయితే ఏపీలో ముహూర్తాలు చూసుకుని జూన్ 8 సాయంత్రం 6-7 గంటల మధ్య ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. అది కూడా లక్షలాది మంది పార్టీ కార్యకర్తలను తరలించి, వారి మధ్య అట్టహాసంగా దాన్ని జరపాలనుకున్నారు. ఇటువంటి సందర్భాలకు వేదిక ఏదైనా ఒక స్టేడియం అయినప్పుడు, దాని సామర్ధ్యాన్ని బట్టి ప్రేక్షకులు ఉంటారు. కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి 4-5 లక్షల మంది జనం వస్తారు, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి అని పార్టీ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. దాంతో అందుకు తగిన అలంకరణతో వేదిక, రాజ్‌భవన్ సిబ్బంది పర్యవేక్షణలో ఏర్పాట్లు, ప్రోటోకాల్ మేరకు ప్రభుత్వ అతిథులకు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు, రవాణా, సీటింగ్ ఏర్పాట్లు, రాత్రి బస, భోజన ఏర్పాట్లు, రాకపోకలు, భద్రత, మైదానం అంతా బారికేడింగ్, కుర్చీలు, పార్కింగ్ ఏర్పాట్లు, మైక్, లైటింగ్, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాట్లు, మీడియా ఎన్‌క్లోజర్, ఇంటర్‌నెట్, మండువేసవి కావడంతో మంచినీళ్ళ ఏర్పాటు, సభ ముగిశాక బాణాసంచా కాల్చడం... ఇటువంటివి ఇంకా ఎన్నో అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. సభా వేదిక కోల్‌కతా-చెన్నైజాతీయ రహదారి పక్కన ఉండడంతో కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ వద్ద, గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట వద్ద నుంచి హైవేపై ట్రాఫిక్ మళ్ళించారు. చంద్రబాబుతో ఎన్డీయే నేతలు ప్రభుత్వ, పార్టీ అతిథులు అప్పట్లో కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామి కావడంతో, చంద్రబాబు నాయుడు ఆహ్వానంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మినహా మిగతా కేంద్ర మంత్రి మండలిలో ఒకరిద్దరు మినహా అందరూ ప్రభుత్వ అతిథులుగా వచ్చారు. ఇక ప్రభుత్వంలో లేని అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లు వారికి అదనం. వీరు కాకుండా దిల్లీ నుంచి నేషనల్ మీడియాను కూడా ప్రభుత్వం పిలిపించింది. వీరంతా రెండు ప్రత్యేక విమానాల్లో గన్నవరం వచ్చి, అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో వేదిక వద్దకు వచ్చి వెళ్లారు. ఈ ఒక్క పని సజావుగా పూర్తి చేయడానికే అధికారులు అష్టకష్టాలు పడ్డారు. వేదిక వద్ద ఉక్కపోతకు ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో కూర్చున్న అతిథులు ఏసీలు ఉన్నప్పటికీ దుంపలు ఉడికినట్టు ఉడికిపోయారు. మీడియా ఎన్‌క్లోజర్లో ముందుగా నిల్వ ఉంచిన నీళ్ళ బాటిళ్లు సభ మధ్యలోనే అయిపోతే, వేదిక పక్కన ఉన్న నీళ్ళ బాటిళ్లను వారికి చేర్చడం సాధ్యం కాలేదు. ఒక దశలో 'క్రౌడ్ మేనేజ్‌మెంట్' సాధ్యంకాక పోలీస్ అధికారులు నిస్సహాయులయ్యారు. ఎలాగోలా సభ ముగిశాక, పోలీస్ పైలెట్ ఉన్న ప్రోటోకాల్ వాహనాలు మాత్రం అక్కణ్ణించి బయట పడగలిగితే, మిగిలినవి 15 కి.మీ. దూరంలో ఉన్న విజయవాడ, గుంటూరు చేరడానికి అర్ధరాత్రి దాటింది! ఇక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి సంగతి చెప్పనక్కరలేదు. వేదిక నిర్మాణ పనులు మే నెల మూడో వారంలో 42- 44 డిగ్రీల ఎండల్లో మొదలైనప్పుడు స్థానికులు ముందుకు రాకపొతే, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తమిళనాడు, ఒడిశా నుంచి లేబర్‌ను తీసుకురావాల్సి వచ్చింది. ఆ మైదానంలో తీవ్రమైన ఎండలో వాళ్ళు ఐరన్ పైప్స్ కోసి వెల్డింగ్ చేస్తూ వేదిక నిర్మించారు. ఆ వేడిలో పనిచేయడానికి పనివాళ్ళు దొరక్క ప్రతిదానికీ ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సి వచ్చింది. సభ ముగిశాక, పులిహోర పొట్లాలు, నీళ్ళ బాటిళ్లు చెత్త శుభ్రం చేయడానికి వారాలు పట్టింది. ఇక దారి పొడవునా పడేసిన వాటి సంగతి అంతే! రాకపోకల్లో రోడ్డు ప్రమాదాలు వీటికి అదనం. ఇంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేసి, ఏడాది తిరిగి వచ్చాక జూన్ 2న నవ నిర్మాణ దీక్ష అని మొదలు పెట్టి, ప్రభుత్వ అధికారిక వేదిక మీద నుంచి - "కుట్రతో రాష్ట్రాన్ని విభజించి..." అంటూ మొదలయ్యే వాక్యంతో ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఇక ఇప్పటికీ ఏపీ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడు అనేది స్పష్టత లేని పరిస్థితి. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక అవుతోంది. పదేళ్ళు హైదరాబాద్‌లో ఉండాల్సిన రాజధానిని, అకస్మాత్తుగా విజయవాడ తరలించిన చంద్రబాబు నాయుడు, గడచిన ఐదేళ్ళలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఇక్కడ ఒక కన్వెన్షన్ హాలు కూడా నిర్మించలేకపోయారు. ముందుగా కొన్నాళ్ళు ప్రైవేట్ హోటళ్ళలో నడిపించి, ఆ తర్వాత తన అధికారిక నివాసం వద్ద ప్రభుత్వ నిధులతోనే 'ప్రజా వేదిక' పేరుతో అన్ని వసతులతో ఒక భారీ సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. దానిలో ఇన్నాళ్ళుగా కలెక్టర్ల సమావేశాలు, తెలుగుదేశం పార్టీ మీటింగులు... రెండూ జరిగేవి. అది ప్రభుత్వానికి పార్టీకి మధ్య విభజన రేఖ చెరిగిపోయిన కాలం కనుక, దాన్ని నిరోధించ గలిగిన యంత్రాంగం అప్పట్లో లేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో, దాన్ని ఇప్పుడు ప్రభుత్వ వేదికగా గుర్తించడం కష్టం. పైగా మే 27న సోమవారం కూడా నారా లోకేష్ 'ప్రజావేదిక'లో పార్టీ మీటింగ్ పెట్టినట్టు మంగళవారం వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రెండవ 'టర్మ్'లో అయినా అవసరమైన శాశ్వత భవనాలు కొన్ని అయినా సిద్దమైతే, ఇటువంటి 'ప్రోటోకాల్' సందర్భాలకు అనువుగా ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం ఎలా జరగాలి? నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనేది పూర్తిగా 'బుక్' ప్రకారం నిర్వహించాల్సిన ప్రోటోకాల్ అంశం. అది సాధారణంగా ప్రొటోకాల్ ప్రకారం జరిగిపోవాల్సిన అధికారిక ప్రక్రియ. గవర్నర్ సమక్షంలో సింపుల్‌గా జరిగిపోయే ప్రక్రియ. ఎన్టీఆర్ తర్వాతే అది రాజ్ భవన్ నుంచి లాల్ బహుదూర్ స్టేడియంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఆనవాయితీని కొనసాగించారు. ఇప్పుడు అది పూర్తిగా ఎన్నికైన ప్రభుత్వ ఇష్టంగా మారింది. అయితే, రోహిణి కార్తె ఎండలు, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, వీలైనంతలో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడడం అవసరం. అయినా ప్రతిదానిలో కాలానుగుణంగా మార్పులు సహజం, కానీ ఒక 'ప్రోటోకాల్' సంప్రదాయానికి ఇవ్వవలసిన గౌరవప్రపత్తులు ఎన్నికైన పార్టీలు ఇచ్చినప్పుడే, అధికార యంత్రాంగం వాటి స్థాయిని కాపాడగలుగుతాయి. అందువల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆపడమే కాకుండా, కాలక్రమంలో పౌరసమాజ ప్రమాణాలు కొనసాగుతాయి. ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత తన కార్యాలయం నుంచి కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను తెలియచేస్తూ, పైసా ఖర్చు లేకుండా రేడియో, దూరదర్శన్ వంటి అధికారిక మీడియా ద్వారా ప్రసంగించవచ్చు. ఇప్పుడున్న వెబ్ క్యాస్టింగ్ టెక్నాలజీతో దాన్ని ప్రజలు తాము ఉన్న చోటు నుంచి ఎక్కడికీ వెళ్ళకుండానే, తమ స్మార్ట్ ఫోన్లలో చూడవచ్చు. మనం మాట్లాడే దానిలో విషయం ఉన్నప్పుడు, అది ఎంత చిన్న సందేశం అయినా విలువైనదే అవుతుంది. సహజంగా మితభాషి అయినప్పటికీ, ఇప్పటికే దిల్లీ పత్రికా సమావేశంలో జగన్ మరింత క్లుప్తంగా మాట్లాడవలసింది అనే సూచనలు మొదలయ్యాయి. మన పక్కనున్న ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నవీన్ పట్నాయక్ సుదీర్ఘ ప్రసంగం అంటే, అది - పదినిముషాలు అట! ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. text: అది కూడా ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన రెండు రోజుల్లోనే ఈ కీలక సమావేశం జరగటం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాల సొంత బరి నుంచి కాంగ్రెస్ ఎన్నికల భేరీ మోగించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోదీ రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు నెల రోజుల కిందటి వరకూ కష్టంగా ఉన్నట్లు కనిపించాయి. కానీ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి, తదనంతరం పాకిస్తాన్‌తో సైనిక ఉద్రిక్తతల తర్వాత.. మోదీ నిర్ణయాత్మక నాయకుడినని నిరూపించుకున్నారని, కాబట్టి ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారని.. ఆయనను అత్యంత తీవ్రంగా విమర్శించే వారు కూడా అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని అదాలాజ్ వద్ద ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహా సీనియర్ నాయకులు ఈ సభలో ప్రసంగించారు. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక.. యూపీ వెలుపల పాల్గొన్న మొదటి బహిరంగ సభ ఇది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపటంతో పాటు.. బలప్రదర్శనగా కూడా ఈ బహిరంగ సభను నిర్వహించినట్లు భావిస్తున్నారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని పునరుద్ఘాటిస్తూ.. సబర్మతి ఆశ్రమం వద్ద ప్రార్థనల అనంతరం సమావేశాన్ని ప్రారంభించటం ద్వారా సీడబ్ల్యూసీ దేశవ్యాప్తంగా అనేక రాజకీయ సందేశాలను పంపించింది. మహాత్మా గాంధీ 1930లో మార్చి 12వ తేదీనే దండి యాత్ర ప్రారంభించటం ఈ సందర్భంగా గమనార్హం. అంతేకాదు.. ఈ సమావేశాన్ని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ స్మారకం దగ్గరే నిర్వహించటం ద్వారా పటేల్ తన కాలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడని దేశానికి గుర్తుచేశారు. ఇక బహిరంగ సభకు 'జై జవాన్ - జై కిసాన్' సభగా పేరు పెట్టటం మూడో సందేశం. జవాన్లు, సైనికుల ప్రాధాన్యత గురించి గట్టి సందేశం ఇవ్వటం దీని లక్ష్యం. పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరటం.. గుజరాత్‌లో కాంగ్రెస్ బలపడుతోందని చెప్తున్న మరో సందేశం. అన్నిటికీ మించి.. మోదీ, షా ద్వయాన్ని వారి సొంత బరి నుంచే సవాల్ చేయటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నది ఈ సమావేశం, సభల సంకేతం. గుజరాత్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశిస్తోంది. ముఖ్యంగా.. పార్టీ ఎన్నికల వ్యూహానికి ఈ సీడబ్ల్యూసీ సమావేశం తుది రూపమిచ్చింది. అలాగే పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా చర్చించింది. అయితే.. ఆ సవాళ్లు నిజానికి చాలానే ఉన్నాయి. ఇంకా పూర్తిగా వేగం పుంజుకోని పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేయటం మొదటి సవాలు. బూత్ కమిటీలను క్రియాశీలం చేయాల్సి ఉంది. సరైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర నాయకులు పార్టీ సభలు, ప్రచారానికి ప్రజలను పెద్ద సంఖ్యలోనే ఆకర్షించవచ్చు. అయితే అలా వచ్చిన వారిని ఓట్లుగా మలచాల్సి ఉంటుంది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. కాంగ్రెస్ తన బలాలు ఏమిటో, బలహీనతలు ఏమిటో గుర్తించింది. నియోజకవర్గం వారీగా వ్యూహరచన మీద దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇక.. రాజకీయ చర్చను.. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, వ్యవసాయ సంక్షోభం, రఫేల్ కుంభకోణం, మైనారిటీ సమూహాలపై పెరుగుతున్న విద్వేష నేరాలు వంటి దేశంలోని అంతర్గత అంశాల మీదకు తిరిగి మళ్లించటం ఎలా అనేది రెండో సవాలు. ప్రస్తుతమైతే.. పుల్వామా ఆత్మాహుతి దాడి, దానికి ప్రతిగా బాలాకోట్‌లో వైమానిక దాడుల అనంతరం ఉగ్రవాదం, జాతీయవాదం అంశం మీద మోదీ ముందుకు దూసుకెళుతున్నారు. ఈ అంశం నుంచి పూర్తి స్థాయిలో లబ్ధి పొందాలని బీజేపీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ.. ఉద్యోగాలు, వ్యవసాయ సంక్షోభం, రఫేల్ కుంభకోణం, నోట్ల రద్దు, జీఎస్‌టీ, మోదీ ప్రభుత్వం చెప్పుకుంటున్న బూటకపు విజయాలు, 2014 ఎన్నికల హామీల అమలులో ఆయన వైఫల్యం తదితర అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది. అయితే.. పుల్వామా ఘటన ఈ ఇతర అంశాలన్నిటినీ ప్రస్తుతానికి వెనక్కు నెట్టేసింది. వీటిని మళ్లీ ప్రధాన చర్చలోకి తీసుకురావటం కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. అదీగాక.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ వ్యతిరేక ప్రచారానికే ప్రాధాన్యమిచ్చింది. కానీ ప్రజలకు వ్యతిరేక ధోరణి నచ్చదు. ఈ అంశాలన్నిటినీ సీడబ్ల్యూసీ చర్చించింది. ఇతర పార్టీలతో పొత్తులు, కూటమి ఏర్పాటు కాంగ్రెస్ ముందున్న మూడో సవాలు. పార్టీ ఇంకా పొత్తులను బలోపేతం చేసుకునే ప్రక్రియలోనే ఉంది. డీఎంకే వంటి కొన్ని పార్టీలతో ఆ పని పూర్తి చేసింది. అయితే.. జేడీ(ఎస్), ఆర్‌జేడీ, సీపీఎం, ఇతర ప్రాంతీయ పార్టీలతో సీట్ల పంపకాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ - బీఎస్‌పీ కూటమితో చర్చలు ఇంకా ముగియలేదు. దీంతో ఈ రాష్ట్రం అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని.. రాష్ట్రాల వారీగా స్థానిక పొత్తులు అవసరమని సీడబ్ల్యూసీకి తెలుసు. ఎన్నికల్లో కెమిస్ట్రీ (భావసారూప్యం) కన్నా అర్థమెటిక్స్ (సీట్ల లెక్కలు) చాలా ముఖ్యం మరి. పార్టీ ముందున్న నాలుగో సవాలు ఎన్నికలకు అవసరమైన నిధులు సమీకరించటం. అపరిమితంగా నిధులు ఖర్చుచేయగల బీజేపీ శక్తితో పోలిస్తే.. కేంద్రంతో పాటు, చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేనందువల్ల కాంగ్రెస్ పార్టీ భారీ ఎన్నికల ఖర్చుకు అవసరమైన నిధుల కోసం కష్టాలు పడుతోంది. బీజేపీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,027 కోట్ల ఆదాయం లభించినట్లు ప్రకటించింది. అన్నిటికన్నా ముఖ్యంగా.. రాహుల్ గాంధీ చాలా కష్టపడి పనిచేస్తుండవచ్చు.. కానీ ఆయన బలం సరిపోదన్న భావన ఇంకా కొనసాగుతూనే ఉంది. ''మోదీ కాకపోతే.. ఎవరు?'' అన్నది జనం అడుగుతున్న ప్రశ్న. రాహుల్ తన ఇమేజీని మార్చుకునే ప్రక్రియ కొంత కాలం కిందట ప్రారంభించారు. గత ఏడాది కాలంగా సరైన అడుగులే వేశారు. అయినా ఆయన ఇంకా తన లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. కాబట్టి రాహుల్ ఇమేజీని భారీగా పెంచుకోవటం చాలా ముఖ్యం. అందుకోసం ఓటర్లతో అనుసంధానం అవ్వాల్సిన అవసరముంది. రాజకీయాల్లో సందేశం ఇవ్వటం చాలా కీలకం. సీడబ్ల్యూసీ సమావేశం గాంధీనగర్‌ నుంచి దేశానికి బహుళ సందేశాలిచ్చింది. ఇది ఎంతవరకూ సఫలమవుతుందనేది ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరిగే మే 23వ తేదీన చూడాలి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. text: మామూలు క్యాప్సూల్‌లాగే ఉండే వారానికో-పిల్ మెల్లమెల్లగా ఔషధం విడుదలయ్యే ఈ క్యాప్సూల్ వల్ల హెచ్‌ఐవీ పేషెంట్లు రోజూ మందులను వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడడానికి ఇది సాధారణ క్యాప్సూల్‌లాగే ఉంటుంది కానీ, కడుపులో చేరాక దానిపై ఉన్న కోటింగ్ కరిగిపోయి, వారం రోజుల వ్యవధిలో దాని లోపల నక్షత్ర రూపంలో ఉండే ఔషధం విడుదలౌతుంది. పందులపై నిర్వహించిన ప్రయోగంలో పరిశోధకులు వారం రోజుల పాటు ఉండేలా మూడు యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ - డొల్యూట్‌గ్రావిర్, రిల్పివిరైన్, క్యాబోటెగ్రావిర్ - దాని పొట్టలో ప్రవేశపెట్టారు. ఈ విషయంలో కోతులతో పాటు ఇతర పాలిచ్చే జంతువులపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే సైంటిస్టులు మాత్రం మరో రెండేళ్లలో మనుషులపై ఈ ప్రయోగాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. హెచ్‌ఐవీ నిపుణులు ఈ కొత్త ట్రీట్‌మెంట్‌ను ఆహ్వానిస్తూనే, మనుషుల్లో వారానికో-పిల్ వాస్తవరూపం ధరించాలంటే చాలా కాలమే పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇలా క్రమక్రమంగా ఔషధాన్ని విడుదల చేసే విధానాన్ని కేవలం హెచ్‌ఐవీకి మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇతర వ్యాధులకు కూడా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. నక్షత్రం ఔషధం నెమ్మదినెమ్మదిగా విడుదల ఇప్పటికే పందుల్లో 'ఇవెర్‌మెక్టిన్' అనే మలేరియా డ్రగ్‌ను ఇలా క్యాప్సూల్ రూపంలో ప్రవేశపెట్టారు. ఇది రెండు వారాల పాటు పంది కడుపులోనే ఉంది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు జియోవానీ ట్రావెర్సో, ''ఔషధాన్ని రోజూ కాకుండా కేవలం వారానికోమారు మత్రమే తీసుకునేలా చేయడం వల్ల రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. భవిష్యత్తులో కొన్ని వ్యాధులకు నెలకోమారు ఔషధం తీసుకునే విధానం కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది'' అన్నారు. డిమెన్షియా, స్క్రిజోఫ్రెనియాలాంటి మానసిక ఆరోగ్య సమస్యలున్న పేషెంట్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని డాక్రట్ ట్రావెర్సో తెలిపారు. కొన్ని స్లో-రిలీజ్ ఔషధాలను ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వొచ్చని వివరించారు. లిండ్రా అనే సంస్థ రాబోయే 12 నెలల్లో ఇలా దీర్ఘకాలం పాటు ఔషధాన్ని విడుదల చేసే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనుషులలో ప్రయోగించి చూడాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని జంతువులపై ప్రయోగాలు చేసి, మనుషులపై ప్రయోగాలకు ఆమోదం లభించిన తర్వాత హెచ్‌ఐవీ ఔషధంపై ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బ్రిటిష్ హెచ్‌ఐవీ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు, ''ఈ పరిశోధన ఇంకా మొదటి దశలో ఉంది. ఇలాంటి ప్రయోగాలను జంతువుల తర్వాత మనుషులపై చేయడానికి ముందు వాటి ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుంది'' అన్నారు. టెర్రాన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ ప్రతినిధి, ''హెచ్‌ఐవీతో జీవిస్తున్న పేషెంట్లు రోజూ ఒక మాత్రను వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలీదు. ఒకవేళ అలాంటివి ఉంటే, ఇలాంటి పరిశోధనలు ఆ ఇబ్బందులను తొలగిస్తే అది మంచిదే. అయితే అలాంటి ప్రత్యామ్నాయాలు ప్రస్తుతం లభిస్తున్న వాటికన్నా తక్కువ ప్రభావవంతంగా మాత్రం ఉండరాదు'' అన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హెచ్‌ఐవీకి జంతువులపై నిర్వహించిన వారానికో పిల్ పరిశోధనల్లో ఆశాజనకమైన ఫలితాలు వెలువడ్డాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలో మనుషులపైనా ఈ ప్రయోగాలు చేపడతామని తెలిపారు. text: పోలింగ్ ముగిశాక ఈవీఎంలను ఓటింగ్ కేంద్రాల నుంచి నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాల వరకు తీసుకెళ్లడం వరకు పెద్ద ప్రక్రియే ఉంటుంది. స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచన ఈవీఎంలు పోలింగ్ బూత్‌ నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు.. పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి బాధ్యుడిగా వ్యవహరిస్తారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆయనకు క్వాషీ జ్యుడీషియరీ అధికారాలుంటాయి. నిబంధనలను అనుసరించి సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసినట్లు ప్రిసైండింగ్ అధికారి బయటకు వచ్చి మౌఖికంగా ప్రకటిస్తారు. తర్వాత ఏజెంట్లు, సిబ్బంది సమక్షంలో కంట్రోల్ యూనిట్‌ (ఈవీఎం) స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లకు చూపించి వారి సంతకాలను (17సీ పేపర్ సీల్ అకౌంట్) తీసుకుంటారు. స్విచ్ ఆఫ్ చేసిన ఈవీఎంలకు అడ్రస్ ట్యాగ్‌లు పెట్టి అన్నింటికీ ప్రభుత్వ రాజముద్ర వేస్తారు. ఈవీఎంలను పోలీస్ పహారా మధ్య ప్రభుత్వ వాహనంలో పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఈవీఎంలను అందించి సంతకం చేస్తారు. అలాగే, పోలింగ్‌కు ముందు ఎన్నికల సంఘం ఇచ్చిన ఫారంలు, ఇతర వస్తువులను కూడా రిటర్నింగ్ అధికారికి అందిస్తారు. వీటితో పాటు ప్రిసైడింగ్ అధికారి డైరీని అందిస్తారు. ఈ డైరీలో ఒక పోలింగ్ బూత్‌లో ఉన్న ఓట్లు, పోలైన మొత్తం ఓట్లు అందులో స్త్రీలు, పురుషులకు సంబంధించిన ఓట్లను నోట్ చేస్తారు. కౌంటింగ్ దగ్గర ఎదైనా సమస్య వస్తే ఆ ఈవీఎంలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారి డైరీ, 17సీ పేపర్ సీల్ అకౌంట్ ( ఈవీఎంలకు సంబంధించి ఏజెంట్లు, పరిశీలకుడు, ప్రిసైడింగ్ అధికారి సంతకాలు)ను పరిశీలిస్తారు. దీంతో పోలింగ్‌కు సంబంధించి ఒక అంకం పూర్తవుతుంది. ఈవీఎంలను భద్రపరిచే గదలును స్ట్రాంగ్ రూంలుగా పేర్కొంటారు. కేంద్ర బలగాల సమక్షంలో వీటికి భద్రత కల్పిస్తారు. ఈవీఎంల నుంచి ఓట్లను ఎలా లెక్కిస్తారంటే... ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగించాలి. అయితే, బయటి డోర్ మాత్రమే తెరవాలి. లోపలి భాగాన్ని తెరవకూడదు. తర్వాత పవర్ ఆన్ చేయాలి. ఇప్పుడు సీల్‌ను తొలగించి లోపల ఉన్న రిజల్ట్స్ మీట నొక్కాలి. అప్పుడు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో డిస్‌ప్లేలో కనిపిస్తుంది. కౌంటింగ్ ప్రక్రియ ఇలా.. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం, లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు. నిబంధన 52 ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు. నిబంధన 55(సీ) ప్రకారం ఈవీఎంలు టాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒక వేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ప్రతి కౌటింగ్ టేబుల్ మీద బ్లూపాయంట్ పెన్. ఫారం 17(సీ)లోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి. కౌంటింగ్‌కు ముందు 17(సీ) ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి రిజల్ట్ బటన్‌ను నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు. ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్‌లు ఉంటారు. లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది. ప్రతి రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు. ఎన్నికల సంఘం పరిశీలకుడు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపల ఫోన్ వినియోగించుకోడానికి అర్హులు. మిగిలిన వారు ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతించరు. ఎన్నికల సంఘం లెక్కింపును వీడియో తీస్తుంది. దాన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతుంది. కౌంటింగ్ మగిశాక అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీ ఫ్యాట్‌లోని ఓటర్ స్లిప్పులను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు. తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫారం 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్‌కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడుతారు. అవసరం లేదని భావిస్తే ఫారం 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి, శాసన సభకు అందిస్తారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో 91 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి తొలి దశ ఎన్నికలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ స్థానాలతో పాటు శాసన సభ‌కు ఎన్నికలు నిర్వహించారు. ఈవీఎంలో మీట నొక్కడంతో ఎన్నికలకు సంబంధించి మీ బాధ్యత ముగిసింది. కానీ, ఇక్కడి నుంచే ఎన్నికల అధికారుల అసలు పని మొదలవుతుంది. text: ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ చేసే బెదిరింపులను అంతర్జాతీయ సమాజం గమనించాలనీ, కశ్మీర్‌లో భారత సైనికుల చర్యలను ఆపాలనీ కోరింది. అసలు పాకిస్తాన్‌పై భారత్ ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదనీ, భారత ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేననీ, ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమనీ పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ‘భారత్‌వన్నీ అసత్య ప్రచారాలు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి భారత్ ఊహల్లోంచి పుట్టినవే. పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన, అబద్దాలు నిజమైపోవు. కశ్మీర్‌లో భారత ఆగడాలపై అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదురైన ప్రతిసారీ భారత్ ఇలాంటి ఆరోపణలు చేసి దృష్టి మరలిస్తుంది’ అని పాక్ విదేశాంగశాఖ కార్యదర్శి ముహమ్మద్ ఫైసల్ పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్‌లో పాక్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు భారత్ ప్రకటించింది. కానీ కేవలం నియంత్రణ రేఖ దగ్గర భారత్ ఫైరింగ్ మాత్రమే జరిపిందనీ, ఎలాంటి మెరుపు దాడులూ జరపలేదనీ పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. ఈ విషయంపై లండన్‌లో మోదీ మాట్లాడుతూ ‘భారత చరిత్రలో అన్నీ విజయాలే ఉంటాయి. ఎప్పుడూ భారత్ అజేయ దేశమే. ఇతరుల హక్కుల్ని లాక్కోవడం భారత చరిత్రలో లేదు. అలాగని దేశంలోని అమాయకుల ప్రాణాల్ని బలిగొంటే ఊరుకునేది లేదు. ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. నేను మోదీని, నాక్కూడా వాళ్ల భాషలో జవాబు చెప్పడం తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు. పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో భారత్‌లోనూ ప్రశ్నలు ఎదురయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఆ దాడులకు సాక్ష్యాలు చూపాలని కోరాయి. కానీ సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతామని ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా పేర్కొంది. సాక్ష్యాలు అడిగి సైన్యాన్ని అనుమానిస్తున్నారని మోదీ ప్రభుత్వం ప్రత్యర్థులకు బదులిచ్చింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ‘నేను మోదీని, నాకు వాళ్ల భాషలో జవాబివ్వడమే తెలుసు’.. బుధవారంనాడు లండన్‌లోని భారతీయ సముదాయంతో మాట్లాడుతూ పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ గురించి అడిగిన ప్రశ్నకు భారత ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానం ఇది. text: రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందిన వారికి అక్షరం ముక్క రాదని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఓసీ సంఘాలు నిర్వహించిన ఒక సభలో ఆయన ఈ మాటలు అన్నారు. రిజర్వేషన్ వల్ల ఉద్యోగం పొందిన ఒక ఉన్నతాధికారిని తన నియోజకవర్గంలో నియమించానని, కానీ, ఆయనకు అక్షరం ముక్క కూడా రాదని తరువాత తెలిసిందని చెప్పారు. ''మా నియోజకవర్గంలో అందరు ఏఈలూ కలసి ఒక ఉన్నతాధికారి గురించి చెప్పి, మంచి ఆఫీసర్ అని నియామకం చేయించమన్నారు. పనిచేసేవారైతేనే తీసుకుందాం అన్నాను. బాగా పనిచేస్తాడని చెప్పారు. తీసుకురమ్మన్నాను. తను పనిచేస్తున్నాడు. ఒకసారి నేను పిలిచి మాట్లాడితే అతనికి అక్షరం ముక్క కూడా రాదు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాను. ''ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాడు సర్. బాగా చదివితే అడ్డం తిరుగుతాడు. ఇతనైతే ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాడు' అన్నారు" అని వేదికపై చెప్పారు ధర్మారెడ్డి. అంతేకాదు, రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు వచ్చిన వారే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా ఉన్నారనీ, వారి వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుందని ధర్మారెడ్డి అన్నారు. ''రాష్ట్రంలో, జిల్లాలో ఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లినా ఉన్నతాధికారులుగా వారే ఉన్నారు. రాష్ట్రం నాశనం అవడానికి కారణం వాళ్లే'' అన్నారు. రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు రావాలనీ, ఒకసారి రిజర్వేషన్ ఫలితం అందుకున్న వారికి మళ్లీ ఉద్యోగం ఫలితం ఇవ్వకూడదనీ, దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలనీ ధర్మా రెడ్డి కోరారు. ''ఒకసారి రిజర్వేషన్ వస్తే ఉన్నత స్థితికి వెళ్తున్నారు. వారి పిల్లలు కార్పొరేట్ స్కూళ్లల్లో చదువుతూ ఉన్నత స్థితికి వెళ్తున్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ దాని వల్ల తాము తప్ప ఎవరూ బాగుపడే స్థితిలో ఉండకూడదని వారు అనుకుంటున్నారు. రిజర్వేషన్ వచ్చిన కుటుంబంలోని వారికి ఇక రిజర్వేషన్ అక్కర్లేదని నేను వాదిస్తున్నాను. ఎప్పుడో వచ్చిన రిజర్వేషన్ విధానంలో మార్పులు జరగాలి. కేంద్రం దానికి బాధ్యత తీసుకోవాలి'' అని ధర్మా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాటలన్న కొన్ని గంట్లోలే ఆయన వాటిని వెనక్కు తీసుకున్నారు. ఈ విషయాన్ని తాను ఏ వేదిక మీదైనా చెబుతాననీ, ఓసీ సంఘాలతో కలసి నడుస్తానని చెప్పిన ధర్మారెడ్డి, ఆ తరువాత తన వ్యాఖ్యాలను వక్రీకరించారంటూ కొత్త వాదన వినిపించారు. ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ''నా మాటలను వక్రీకరించారు. గిట్టని వారు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి. తప్పుడు ప్రచారాలను నమ్మద్దు. నేను అగ్రకుల పేదల రిజర్వేషన్ల అమలు గురించే మాట్లాడాను. నేను తప్పుడు మాటలు అన్నట్టు చెబుతున్నారు. నేను రిజర్వేషన్ తగ్గించాలి అనలేదు. పదిశాతం ఈడబ్లుఎస్ అదనంగా వస్తుంది అన్నాను. దాన్ని పేద, బలహీన వర్గాలకు వర్తించి ఇవ్వమన్నాను. నా మాటలు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నా మాటలను వెనక్కు తీసుకుంటున్నాను. సారీ చెప్తున్నాను'' అన్నారు ధర్మారెడ్డి. మరోవైపు చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై పలు దళిత, బీసీ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో కులాల వారీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం ఎస్టీలకు 6 శాతం బీసీలకు (ఏ-డీ) 25 శాతం బీసీ (ఈ) (కొన్ని ముస్లిం శాఖలు) 4 శాతం వీటికి అదనంగా ఇకపై ఓసీల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకూ ఓపెన్ కేటగిరీలో 50 శాతం ఉద్యోగాలు ఉండగా, ఇకపై 40 శాతానికి తగ్గుతాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణ రాష్ట్రంలోని పరకాల నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. text: ఎఫ్‌బీఐ ఏజెంట్లు 1934లో చికాగోలో కాల్చి చంపింది డిలింగర్‌ను కాదని.. అతడి వేషంలో ఉన్న వేరొక వ్యక్తినని డిలింగర్ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఇండియానాపోలిస్‌లోని క్రౌన్ హిల్ స్మశానవాటికలో సమాధి చేసిన మృతదేహాన్ని వెలికితీసి పరీక్షించి నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియానా అధికారులు ఎట్టకేలకు అందుకు అంగీకరించారు. వచ్చే డిసెంబర్ 31వ తేదీన మృతదేహాన్ని వెలికితీయాలని నిర్ణయించారు. కానీ.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ స్మశాన వాటిక కోర్టుకు వెళ్లింది. కుట్ర సిద్ధాంతం అంటున్న ఎఫ్‌బీఐ 1934లో చికాగోలోని బయోగ్రాఫ్ థియేటర్‌లో తమ ఏజెంట్లు కాల్చి చంపింది డిలింగర్‌నే అనటానికి తమ దగ్గర 'సమాచార సంపద' ఉందని ఎఫ్‌బీఐ ఆగస్టులో ఒక ట్వీట్‌లో పేర్కొంది. చికాగోలో కాల్చి చంపిన వ్యక్తి మృతదేహాన్ని పొరుగు రాష్ట్రమైన ఇండియానా రాజధాని ఇండియానాపోలిస్‌లో సమాధి చేశారు. అది డిలింగర్ కాదంటున్న వాదనలన్నీ 'కుట్ర సిద్ధాంతం' అని ఎఫ్‌బీఐ కొట్టివేసింది. అయితే, ఎఫ్‌బీఐ ఏజెంట్లు చంపింది డిలింగర్ వేషంలో ఉన్న వేరే వ్యక్తినని తాము నమ్ముతున్నట్లు డిలింగర్ మేనల్లుడు మైఖేల్ థాంప్సన్, ఇతర కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాధిలో ఉన్న వ్యక్తి కళ్ల రంగు, వేలిముద్రలు వేరేవని చెప్పటానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని వారు అంటున్నారు. జాన్ డిలింగర్ జీవిత కథతో 2009లో విడుదలైన పబ్లిక్ ఎనిమీస్ సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించిన జానీ డెప్ ఎవరీ జాన్ డిలింగర్? అమెరికాలో అత్యంత సంక్షుభిత కాలంగా భావించే 'మహా మాంద్యం' శకం 1930వ దశకంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్‌. అతడు నడిపే 'డిలింగర్ గ్యాంగ్'‌ బ్యాంకు దోపిడీలకు పాల్పడేదని ఆరోపణలు ఉన్నాయి. అతడు రెండు సార్లు జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు. డిలింగర్‌ను 'పబ్లిక్ ఎనిమీ నంబర్ 1' అని అప్పట్లో అభివర్ణించేవారు. అతడి తల మీద అప్పట్లోనే 10,000 డాలర్ల బహుమానం ప్రకటించారు. డిలింగర్ జీవిత కథతో 2009లో 'పబ్లిక్ ఎనిమీస్' అనే పేరుతో క్రైమ్ డ్రామా మూవీ విడుదలైంది. మైఖేల్ మాన్ దీనికి దర్శకత్వం వహించారు. డిలింగర్ పాత్రను జానీ డెప్ పోషించాడు. గ్యాంగ్‌స్టర్ చివరి రోజులను, ఆధునిక ఎఫ్‌బీఐ జననాన్ని ఈ సినిమా వివరిస్తుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలో ఎనిమిది దశాబ్దాల కిందట ఎఫ్‌బీఐ ఏజెంట్లు కాల్చి చంపామని ప్రకటించిన గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్ మృతదేహాన్ని సమాధి నుంచి తవ్వితీయటానికి ఇండియానాపోలిస్ అధికారులు అనుమతించారు. text: విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేజ్రీవాల్, దిల్లీలో ఆస్పత్రి పడకల కొరత లేదని చెప్పారు. ఈరోజుకు కూడా దిల్లీలో 5 వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని, ఈ సంఖ్యను మరింత పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. తాజా నిర్ణయం ప్రకారం దిల్లీలో ఆడిటోరియాలు, మాల్స్, జిమ్స్, స్పాలు వారాంతాల్లో పూర్తిగా మూసేస్తారు. సినిమా థియేటర్లు మూడింట ఒక వంతు సామర్థ్యంతో నడపడానికి అనుమతించారు. హోటళ్లు కూడా మూసేస్తారు. హోం డెలివరీ మాత్రం చేసుకోవచ్చు. వీక్లీ మార్కెట్లను కూడా కొన్ని షరతులతో అనుమతించారు. ఇప్పటికే ఖరారైన పెళ్లిళ్లు జరుపుకోవడానికి అభ్యంతరం ఉండదు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 "వారం రోజుల్లోని పని దినాల్లో ఎవరైనా ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లాల్సి ఉంటుంది. కానీ, వారాంతాల్లో చాలా మంది వినోదం కోసం బయటకు వెళతారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఆపవచ్చు. ఈ నిర్ణయం కొంతమందికి బాధ కలిగించవచ్చు. కానీ, కరోనా సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేజ్రీవాల్ వివరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఇతర ఉన్నతాధికారులతో ఈ ఉదయం సమావేశమైన తరువాత కేజ్రీవాల్ ఈ నిర్ణయం ప్రకటించారు. బుధవారం నాడు దిల్లీలో కొత్తగా 17,282 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి దిల్లీలో ఒకే రోజులో ఇన్ని కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. దిల్లీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌తో తీవ్రంగా ప్రభావితమైన నగరంగా మారింది. బుధవారం నాడు మరణాలు కూడా 100 దాటిపోయాయి. దిల్లీలో కరోనా పరీక్షలు చేయించుకుంటున్న వారిలో పాజిటివ్‌గా తేలుతున్న వారి శాతం గణనీయంగా పెరిగింది. సోమవారం నాడు 12.4 శాతం నుంచి ఇది బుధవారానికి 16 శాతానికి చేరుకుంది. దేశంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 లక్షల కొత్త కేసులు... వేయికి పైగా మరణాలు భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,00,739 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య మంత్రిత్ శాఖ ప్రకటించింది. ఒకే రోజు 1,038 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా, మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. భారత్‌లో గత 24 గంటల్లో 93,528 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,24,29,564కు చేరింది. దేశంలో ప్రస్తుతం 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో ఇప్పటివరకూ 11,44,93,238 డోసుల కరోనా వ్యాక్సీన్ వేశారు. సెకండ్ వేవ్‌లో పది రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 4న భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరాయి. ఆ రోజు 1,03,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో 20 వేలు దాటిన రోజువారీ కేసులు యూపీలో గత 24 గంటల్లో కొత్తగా 20,510 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల కొత్తగా 67 మంది చనిపోయారు. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 9,376కు చేరింది. కరోనా కేసులు పెరగడంతో మిగతా రాష్ట్రాల నుంచి తిరిగొచ్చేవారు క్వారంటైన్‌లో ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బయటి నుంచి వచ్చేవారికి ఆయా జిల్లాల అధికారులు పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వారు 14 రోజుల హోం క్వారంటైన్ ఉండాల్సుంటుంది. లక్షణాలు లేనివారు 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. దీనిపై యూపీ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు లఖిత మార్గదర్శకాలు జారీ చేసింది. ఇళ్లలో క్వారంటీన్ వ్యవస్థ లేకపోతే, వారిని ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటీన్( స్కూళ్లు, ఇతర భవనాలు)లో ఉంచాలని సూచించింది. జార్ఖండ్‌లో యూకే, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ జార్ఖండ్‌లో దాదాపు మూడో వంతు శాంపిళ్లలో కరోనా యూకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటెంట్ వైరస్ ఉన్నట్లు తేలింది. జార్ఖండ్ రాంచీ, తూర్పు సింహభూమ్ జిల్లా నుంచి ఇటీవల సేకరించిన శాంపిళ్లలో కనీసం 33 శాతం శాంపిళ్లలో యూకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటెంట్ ఉన్న వైరస్ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ శాంపిళ్లన్నింటినీ పరీక్షల కోసం భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు పంపించారు. ఆరోగ్య విభాగం దీనిని ధ్రువీకరించారు. ఈ రిపోర్ట్ ప్రకారం యూకే స్ట్రెయిన్‌ను బి-1.1.7, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్‌ను బీ-1.617గా గుర్తించారు. జనవరి 1 నుంచి మార్చి 23 మధ్య ఇలాంటి శాంపిళ్లు చాలా తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ చెప్పారు. బుధవారం సాయంత్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,198 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇది అత్యధికం. మొత్తం కేసుల్లో రాంచీలోనే 1273 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 14న జార్ఖండ్‌లో కరోనా వల్ల 31 మంది చనిపోయారు. గత నాలుగు రోజులుగా వంద మరణాలు నమోదయ్యాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీలో వారాంతపు రోజుల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు text: వారానికి గరిష్ఠంగా 48 లేదా అంతకంటే తక్కువ పనిగంటలు ఉండాలని ఐఎల్‌వో సిఫార్సులు చెబుతున్నాయి. దక్షిణ కొరియా చట్టసభ నేషనల్ అసెంబ్లీ దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు ఊరట కలించేలా పనిగంటలను తగ్గిస్తూ మార్చిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. వారానికి గరిష్ఠంగా 68గా ఉన్న పనిగంటలను 52 గంటలకు కుదించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, మరిన్ని ఉద్యోగాలు సృష్టించేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు ఈ చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. పనిగంటల తగ్గింపుతో దేశంలో జననాల రేటు కూడా పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. గత కొన్ని దశాబ్దాల్లో దక్షిణ కొరియాలో జననాల రేటు బాగా తగ్గింది. 'ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్-ఓఈసీడీ)' 2016లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం- అత్యధిక పనిగంటలున్న అభివృద్ధి చెందిన దేశం దక్షిణ కొరియానే. ఒక్కో కార్మికుడు సగటున ఏడాదికి 2,069 గంటలు పనిచేస్తున్నట్లు ఓఈసీడీ నివేదిక తెలిపింది. ఓఈసీడీ 38 దేశాలపై ఈ విశ్లేషణ జరిపింది. వ్యతిరేకించిన కంపెనీలు కంపెనీల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను పక్కనబెట్టి దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది జులై నుంచి అమలవుతుంది. దీనిని తొలి దశలో భారీ కంపెనీలు అమలు చేయాల్సి ఉంటుంది. తర్వాత చిన్నస్థాయి కంపెనీలు కూడా దీని ప్రకారం పనిగంటలను తగ్గించాల్సి ఉంటుంది. కంపెనీల వ్యతిరేకతను పక్కనబెట్టి దక్షిణ కొరియా ప్రభుత్వం పనిగంటలను తగ్గించే చట్టాన్ని తీసుకొచ్చింది. దక్షిణ కొరియా: కారణాలు ఏమిటి? సంపన్న దేశాలతో పోలిస్తే దిగువ, మధ్యస్థాయి ఆదాయాలున్న దేశాల్లో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) అధ్యయనాలు చెబుతున్నాయి. సంపన్న దేశమే అయినప్పటికీ దక్షిణ కొరియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దక్షిణ కొరియాలో స్వయం ఉపాధి కార్మికులు ఎక్కువగా ఉండటం, వేతనాలు తక్కువగా ఉండటం, ఉద్యోగ అభద్రత, ఇతరత్రా అంశాలు దీనికి కారణం. జపాన్‌లోనూ అధిక పనిగంటలు దక్షిణ కొరియా మాదిరే సంపన్న దేశమైన జపాన్‌లోనూ అధిక పనిగంటలు ఉన్నాయి. వారానికి ఉండాల్సిన పనిగంటలపై పరిమితిని విధించే చట్టమేదీ జపాన్‌లో లేదు. జపాన్‌లో పని ఒత్తిడి, సుదీర్ఘ సమయం పనిచేయడం కొందరు కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇది మరణాలకూ దారితీస్తోంది. వారానికి ఉండాల్సిన పనిగంటలపై పరిమితిని విధించే చట్టమేదీ జపాన్‌లో లేదు. పని ఒత్తిడి కారణంగా సంభవించే మరణానికి జపాన్ భాషలో ప్రత్యేకంగా ఒక పదమే ఉంది. ఈ మరణాన్ని 'కరోషి' అంటారు. పని ఒత్తిడి కారణంగా గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చనిపోవడాన్ని లేదా బలవన్మరణానికి పాల్పడటాన్ని కరోషి అని వ్యవహరిస్తారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జపాన్‌లో 1,456 కరోషి కేసులు నమోదైనట్లు ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ కేసులు ఇంతకన్నా ఎక్కువే ఉంటాయని, చాలా కేసులు రికార్డుల్లో నమోదై ఉండవని కార్మిక హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఆసియా: ఎక్కువ మంది.. ఎక్కువ గంటలు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవలి గణాంకాల ప్రకారం- ఆసియా దేశాల్లో ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ఆసియాలో 32 శాతం దేశాల్లో పనిగంటలపై జాతీయస్థాయిలో ఎలాంటి సార్వజనీనమైన పరిమితి లేదు. 29 శాతం దేశాల్లో వారానికి 60 లేదా అంతకంటే ఎక్కువ పనిగంటలు ఉన్నాయి. వారానికి గరిష్ఠంగా 48 లేదా అంతకంటే తక్కువ పనిగంటలు ఉండాలనే ఐఎల్‌వో సిఫార్సులను కేవలం నాలుగు శాతం దేశాలే అమలు చేస్తున్నాయి. అమెరికా: నిబంధన లేదు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికాల్లో, కరీబియన్ ప్రాంతంలో 34 శాతం దేశాల్లో వారానికి గరిష్ఠ పనిగంటలపై సార్వజనీన నిబంధనేదీ లేదు. ఎంతో అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలోనూ ఈ నిబంధన లేదు. మధ్యప్రాచ్యం: పనిగంటలు 60కి పైనే మధ్యప్రాచ్యంలో చట్టపరంగానే సుదీర్ఘ పనిగంటలు ఉన్నాయి. పది దేశాలకుగాను ఎనిమిది దేశాల్లో వారానికి పనిగంటలు 60కి పైన ఉన్నాయి. యూరప్: బెల్జియం, టర్కీ తప్ప.. యూరప్‌లో బెల్జియం, టర్కీ మినహా అన్ని దేశాల్లో వారానికి గరిష్ఠంగా 48 పనిగంటలు ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో మాత్రమే అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్రికా: అలాంటి దేశాలు అత్యధికం ఇక్కడే ఆఫ్రికాలో చాలా దేశాల్లో కార్మికులు అత్యధిక గంటలు పనిచేస్తున్నారు. మూడింట ఒక వంతు మందికి పైగా కార్మికులు 48 గంటలకు మించి పనిచేస్తున్న దేశాలు అత్యధికంగా ఆఫ్రికాలో ఉన్నాయి. నగరాల్లో పనిగంటలు: ముంబయిలో 43.7, దిల్లీలో 42.6 నగరాల వారీగానూ సగటు పనిగంటల వివరాలనూ కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకు యూబీఎస్ 71 నగరాలపై 2016లో ఒక విశ్లేషణను విడుదల చేసింది. ఈ విశ్లేషణ ప్రకారం- వారానికి సగటు పనిగంటలు ముంబయిలో 43.7గా, దిల్లీలో 42.6గా ఉన్నాయి. హాంకాంగ్‌లో అత్యధికంగా 50.1 పనిగంటలు ఉన్నాయి. మెక్సికో సిటీలో 43.5, బ్యాంకాక్‌లో 42.1 పనిగంటలు ఉన్నాయి. యూబీఎస్ విశ్లేషణ ప్రకారం వారానికి సగటు పనిగంటలు ముంబయిలో 43.7 కాగా దిల్లీలో 42.6 మెక్సికో: సెలవులూ తక్కువే మెక్సికోలో పనిగంటలు అత్యధికంగా ఉండటమే కాదు, సెలవులు కూడా చాలా తక్కువ. మెక్సికోలో పెయిడ్ వార్షిక సెలవుల కనీస సంఖ్య 10లోపే. జపాన్, చైనా, నైజీరియాల్లోనూ దాదాపు ఇంతే. బ్రెజిల్‌లో ఈ సెలవుల సంఖ్య 20-23 మధ్య ఉంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కార్మికులు ధనిక దేశాల్లో ఎక్కువ సమయం పనిచేస్తున్నారా, పేద దేశాల్లో ఎక్కువ సమయం పనిచేస్తున్నారా? అసలు ప్రపంచవ్యాప్తంగా పనిగంటలు ఎలా ఉన్నాయి? సెలవులు ఎలా ఉన్నాయి? 'మే డే' సందర్భంగా ప్రత్యేక కథనం... text: బాలీవుడ్‌లో డాన్‌ కథలు ఇంకా వస్తూనే ఉన్నాయి. డాన్‌ల నేపథ్యాలు కావచ్చు, వారి హింసా చరిత్ర కావచ్చు. బయటి ప్రపంచానికి వారు కనిపించకపోయినా, వారి కథలు మాత్రం బాలీవుడ్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంటాయి. అండర్‌ వరల్డ్‌తో సంబంధం ఉన్న అనేకమంది డాన్‌ల కథలను ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూశారు. దావూద్‌ ఇబ్రహీం నుంచి చోటా రాజన్‌, మాయ డోలాస్‌, మాన్య సుర్వే...ఇలా అనేకమంది కథలు తెర మీద కనిపించాయి. ఇందులో దావూద్‌ ఇబ్రహీం పాత్ర మిగతా అందరు డాన్‌లకన్నా ఎక్కువమందిని ఆకర్షించింది. 1980, 90ల తర్వాత ముంబయి, దాని సమీప ప్రాంతాలలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ల ప్రభావం ఉందని చెబుతారు. 1993 సీరియల్ బాంబు పేలుళ్ల తరువాత ముంబయిలో అండర్‌ వరల్డ్‌ పేరు ఎక్కువగా వినిపించింది. బాలీవుడ్‌ సినిమాల్లో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నుంచి అనురాగ్‌ కశ్యప్‌ వరకు, చాలామంది దర్శకులు తమ సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డాన్‌లను, వారి నేర చరిత్రలు చూపించడానికి ప్రయత్నించారు. మరోసారి డాన్‌ కథతో రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా తీశారు దావూద్‌ పాత్రతో అనేక సినిమాలు అనురాగ్‌ కశ్యప్‌ 'బ్లాక్‌ ఫ్రైడే', రామ్‌గోపాల్‌ వర్మ 'కంపెనీ', నిఖిల్‌ అద్వానీ 'డి డే' సినిమాలు దావూద్‌ పాత్ర చుట్టూ తిరుగుతాయి. మిలన్‌ లుథ్రియా 'వన్స్ అపాన్ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి' సినిమా దావూద్‌ ఇబ్రహీం డాన్‌గా ఎదిగిన తీరును చూపిస్తుంది. దావూద్ సోదరిపై 'హసీనా పార్కర్‌' అనే సినిమాతోపాటు 'ఏక్‌ థి బేగం' అనే వెబ్‌ సిరీస్‌ కూడా విడుదలైంది. 2002లో దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా 'కంపెనీ' సినిమా విడుదలైంది. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ దావూద్‌ ఇబ్రహీం పాత్ర పోషించారు. వివేక్‌ ఒబెరాయ్‌కు ఇది తొలి చిత్రం. మళ్లీ ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ 'డి కంపెనీ' అనే సినిమాను సిద్ధం చేశారు. దావూద్ తొలినాళ్ల కథే 'డి కంపెనీ' "నేను మరోసారి 'డి కంపెనీ' సినిమాతో ముంబయికి వస్తున్నాను. గ్యాంగ్‌స్టర్‌ దావూద్ ఇబ్రహీం జీవితాన్ని ఇందులో చూపించబోతున్నాను" అని ఓ సందర్భంలో వర్మ అన్నారు. "దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌ల మధ్య యుద్ధం ఆధారంగా 2002లో 'కంపెనీ' సినిమాను రూపొందించాను. ఈసారి కేవలం దావూద్‌ గురించే చూపిస్తాను. ఇది దావూద్‌ డాన్‌గా జీవితాన్ని ప్రారంభించడానికి సంబంధించిన కథ." అని వర్మ అన్నారు. దావూద్‌ జీవితాన్ని బిగ్‌ స్క్రీన్‌ మీద చూపించడానికి బాలీవుడ్‌కు ఎందుకంత ఆసక్తి? అన్న ప్రశ్నకు "క్రైమ్‌ అనేది ప్రేక్షకులను ఆకర్షించే అంశం. పత్రికలు, టీవీలలో నేరగాళ్లకు సంబంధించిన విషయాలపట్ల ప్రేక్షకులు, పాఠకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు" అన్నారు వర్మ. "ఈ రోజుల్లో 'గాడ్‌ ఫాదర్‌' కంటే ఎక్కువ జనాదరణ పొందిన చిత్రం ఉండదు. బోరింగ్‌ కథలు ప్రజలకు నచ్చవు. వాళ్లకు అండర్‌ వరల్డ్‌ లేదా ఫాంటసీతో కూడిన సినిమాలు ఇష్టం" అన్నారు వర్మ. పెద్ద స్టార్లు కూడా మాఫియా డాన్‌ పాత్రల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. 'గ్యాంగ్‌స్టర్‌ను హీరో అనుకోనవసరం లేదు' క్రైమ్‌ వరల్డ్‌, వారితో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ల జీవితాలను అంత గొప్పగా ఎందుకు చూపిస్తున్నారు? అన్న ప్రశ్నకు రామ్‌గోపాల్‌ వర్మ సమాధానమిచ్చారు. "వైన్‌ గ్లాస్‌ పట్టుకుంటే, హీరోతో తలపడితే దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది జస్ట్‌ సినిమా. కేవలం వినోదమే" అని వర్మ అన్నారు. "నిజమైన సినిమాను చూపించాలనుకుంటే అందులో పాత్రల నెగెటివ్‌ కోణాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. 'సత్య' కావచ్చు, 'డి కంపెనీ' కావచ్చు, నా సినిమాల్లోని పాత్రలన్నీ నెగెటివ్‌లో ఉంటాయి." అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. గ్యాంగ్‌స్టర్‌ను హీరోలా చూపించడం తన లక్ష్యం కాదంటారు రామ్‌ గోపాల్‌ వర్మ. "ఇది కేవలం గ్యాంగ్‌స్టర్‌ల నిజరూపాన్ని చూపించడమే. నా సినిమాలన్నీ అలాగే ఉంటాయి. 'డి కంపెనీ' కూడా అలాగే ఉంటుంది" అన్నారాయన. మూస ఫార్ములా సినిమాలు వస్తున్నాయని సినిమా ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దావూద్‌ను తెరపై చూడాలని ప్రేక్షకులు ఎందుకు అనుకుంటున్నారు? "దావూద్‌ ఒక రహస్యం. అతని వీడియోను, ఫొటోను ఎక్కువమంది చూడలేదు. చాలా కాలం కిందట షార్జా స్టేడియంలో కనిపించిన ఫొటో ఒకటి. అది కాక ఇంకా ఒకటి రెండు ఫొటోలు మాత్రమే సర్క్యులేట్ అవుతున్నాయి. దావూద్‌ నిజంగా ఎలా ఉంటాడో చాలా మందికి తెలియదు." అన్నారు సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అజయ్‌ బ్రహ్మాత్మజ్‌. "దావూద్‌ నేర చరిత్ర కారణంగా అతని గురించి తెలుసుకోవాలని ప్రజల్లో ఆసక్తి ఉంది. తెరపై అతని కథలు పదే పదే రావడానికి అదే కారణం" అన్నారాయన. రామ్‌గోపాల్‌ వర్మ నేర ప్రపంచాన్ని, కార్పొరేట్ ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తారని, అందుకే అతని సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని అజయ్‌ బ్రహ్మాత్మజ్‌ అభిప్రాయపడ్డారు. 'గ్యాంగ్‌స్టర్‌- గ్లామర్‌ ఫార్ములా పాతబడింది' సినిమా బిజినెస్‌ను దగ్గరగా పరిశీలిస్తున్న కొందరు మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర గ్యాంగ్‌స్టర్‌ సినిమాలు అద్భుతాలు చేయలేకపోతున్నాయని అంటున్నారు. "ఇలాంటి సినిమాల్లో కొత్తదనం లేదు. దావూద్‌, ఇతర గ్యాంగ్‌స్టర్‌ల గురించి కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. మన దగ్గర కథా రచయితల కొరత ఉంది. ఇంతకన్నా మంచి ఐడియాలు రావాల్సి ఉంది" అని ఫిల్మ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ అమోద్‌ మెహ్రా అన్నారు. "మొదట్లో అండర్‌ వరల్డ్‌ కథలు బాగానే నడిచాయి. కానీ ఇప్పుడు ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొంతమంది దర్శకులు ఒక సినిమా హిట్టయితే అలాంటి సినిమాలే తీస్తున్నారు." అన్నారు మెహ్రా. అయితే ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద పెద్ద స్టార్లు కూడా సినిమాల్లో గ్యాంగ్‌స్టర్‌లు, క్రిమినల్స్‌ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం గ్యాంగ్‌స్టర్‌ పాత్రలుంటే సరిపోదని, వాటికి గ్లామర్‌ కూడా అద్దాల్సి ఉందని మెహ్రా అభిప్రాయపడ్డారు. అయితే ఈ గ్యాంగ్‌స్టర్, గ్లామర్‌ కాక్టెయిల్‌ కూడా ఎక్కువకాలం ప్రేక్షకులను ఆకర్షించదని మెహ్రా అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హిందీ సినిమా తెరపై అండర్‌ వరల్డ్‌ డాన్‌లు తరచూ కనిపిస్తుంటారు. ఈ ధోరణి 90ల నుంచి ఎక్కువగా ఉంది. మాఫియా ముఠాలు, డాన్‌ల కథలతో బాలీవుడ్‌లో అనేక సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. text: మొదట ఐరాసలో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ తన ప్రసంగంలో భారత పాలనలోని కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఆ ప్రాంతంలో భారతీయ సైనికులు సామాన్య ప్రజలపై పెల్లెట్ గన్స్‌ను ప్రయోగిస్తున్నారని ఆయనన్నారు. అలాగే త‌మ దేశంలోని ఉగ్రవాద శక్తులకు భార‌తదేశం మద్దతునిస్తోంద‌ని కూడా పాకిస్తాన్ ఆరోపించింది. భార‌త్ దీనిపై తీవ్రంగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌ను 'టెర్రరిస్తాన్'గా అభివ‌ర్ణించింది. పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ గురువారం ఐక్యరాజ్య స‌మితి సర్వసభ్య స‌మావేశంలోకాశ్మీర్‌లో భార‌త్ యుద్ధ నేరాల‌కు పాల్పడుతోందని ఆరోపించారు. అక్కడ నిర‌స‌న‌ వ్యక్తం చేస్తున్న పౌరుల‌పై భార‌త్ తీవ్రమైన అణ‌చివేత విధానాలకు పాల్పడుతోందని అన్నారు. "పెల్లెట్ల కార‌ణంగా కశ్మీర్‌లో ఎంతో మంది కంటి చూపును, అవ‌య‌వాల‌ను కోల్పోయారు. అవ‌న్నీ యుద్ధ నేరాలే" అని అబ్బాసీ అన్నారు. కాశ్మీర్‌లో అంతర్జాతీయ పర్యవేక్షణ కోసం ఐక్యరాజ్య స‌మితి ప్రత్యేక ప్రతినిధిని నియ‌మించాల‌ని సూచించారు. అబ్బాసీ ఆరోప‌ణ‌ల‌ను ఐక్యరాజ్య సమితిలో భార‌త ప్రతినిధి ఈనాం గంభీర్ తిప్పి కొట్టారు. "ఒసామా బిన్ లాడెన్‌, ముల్లా ఒమ‌ర్‌ల‌కు ఆశ్రయం ఇచ్చిన దేశం తామే బాధితుల‌మ‌ని చెప్పుకోవ‌డం వింత‌గా ఉంది" అని గంభీర్ అన్నారు. పాకిస్తాన్‌ను 'టెర్రరిస్తాన్'గా పేర్కొంటూ, "అంత‌ర్జాతీయ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తున్నది, ఎగుమ‌తి చేస్తున్నది ఆ దేశ‌మే" అని తిప్పి కొట్టారు. పాక్ ఇత‌ర దేశాల భూభాగాల‌ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐరాస వేదికపై భారత్, పాకిస్తాన్‌లు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కశ్మీర్‌లో భారత సైనికులు హింసకు పాల్పడుతున్నారని పాకిస్తాన్ ఆరోపించగా, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నది ఆ దేశమేనని భారత్ ఆరోపించింది. text: లయన్ ఎయిర్ సంస్థ నడుపుతున్న ఇదే మోడల్ విమానం గతేడాది అక్టోబర్‌లో ఇండోనేసియాలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 189 మంది చనిపోయారు. ఈ రెండు విమానాలూ కొత్తవే. రెండూ రన్‌వే పైకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయాయి. బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్ విమానాలు వాణిజ్య సేవలు ప్రారంభించింది 2017వ సంవత్సరంలోనే. సాధారణంగా పాత, ఎక్కువకాలం వినియోగంలో ఉన్న విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. విమానాలను సరిగ్గా నిర్వహించకపోవడం, వివిధ విడిభాగాలను సమయానుకూలంగా పరిశీలించక, మార్చకపోవటం వంటి కారణాలు ఉంటాయి. అయితే, కొత్త విమానాలు కూలిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ విమానాలు ఎన్ని ఉన్నాయి? బోయింగ్ సంస్థ చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడైన విమానాలు 737 మాక్స్ మోడల్‌వే. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా విమానయాన సంస్థలు 4,500 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. మిగతా విమానాలకు దీనికీ తేడాలేంటి? జకార్తాకు చెందిన ఏవియేషన్ నిపుణుడు జెర్రీ సోజాట్‌మన్ బీబీసీతో మాట్లాడుతూ.. 737 మాక్స్ విమానాల ఇంజిన్ కొంత ఆధునికమైనదని, దీని రెక్కలు గత మోడల్స్‌తో పోలిస్తే పెద్దవని చెప్పారు. దీనివల్ల విమానం సమన్వయంపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. విమానం నిలిచిపోయే ప్రమాదంలో పడినప్పుడు పైలట్‌ను అలర్ట్ చేసే సెన్సర్లు ఉంటాయి. వీటిని యాంగిల్ ఆఫ్ అటాక్ (ఏఓఏ) సెన్సర్లు అంటారు. ప్రమాదానికి గురైన లయన్ ఎయిర్ విమానానికి ఈ సెన్సర్ల నుంచి భారీస్థాయిలో సంకేతాలు అందాయని ఇండోనేసియా జాతీయ రవాణా భద్రత కమిటీ తెలిపింది. అయితే, ఈ విమాన ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా తుది నివేదిక తయారు కాలేదు. ఈ సెన్సర్లు, వాటితో అనుసంధానమైన సాఫ్ట్‌వేర్ పాతతరం 737 మోడల్ విమానాలతో పోలిస్తే భిన్నంగా పనిచేస్తాయి, కానీ ఈ విషయాన్ని పైలట్లకు చెప్పలేదు. ఈ విమానం ప్రయాణానికి అనుకూలమేనా? లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు ఈ విమానాలను తయారు చేసే బోయింగ్ సంస్థ విమాన నిర్వహణ బులెటిన్‌ను ఆయా ఎయిర్‌లైన్స్‌కు జారీ చేసింది. ఈ యాంగిల్ ఆఫ్ అటాక్ (ఏఓఏ) సెన్సర్ల గురించి అప్పట్లో అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)... అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అన్ని విమానాల ఎయిర్‌వర్తీనెస్ (విమానం ప్రయాణానికి అనుకూలంగా ఉందా? లేదా? అన్నది నిర్ణయించే నిర్థిష్టమైన తనిఖీలు)కు సంబంధించి అన్ని విమానయాన సంస్థలు పరిశీలన జరపాలని సూచించింది. ఒకవేళ ఈ సెన్సర్ల పరిస్థితిని కనుక పరిష్కరించకుంటే.. విమానాన్ని నియంత్రించటంలో పైలట్లు ఇబ్బంది పడతారని, అలాంటప్పుడు విమానం ఉన్నట్టుండి నిట్టనిలువుగా కిందకు జారిపోయే ప్రమాదంలో పడుతుందని, ఎత్తు నుంచి పడిపోయి భూమిని ఢీకొంటుందని ఎఫ్ఏఏ తెలిపింది. విమాన పైలట్ల కోసం రూపొందించే ఫ్లైట్ మ్యానువల్స్ (విమానాన్ని ఎలా నడపాలో తెలిపే సూచనలు/మార్గదర్శకాల పుస్తకం)లో తాజా సమాచారం ఇవ్వాలని అమెరికాలోని విమానయాన సంస్థలకు సూచనలు అందాయి. యాంగిల్ ఆఫ్ అటాక్ సెన్సర్ల గురించి పైలట్లకు తెలుసా? అదే సమయంలో ఈ విషయాన్ని ఇతర దేశాల విమానయాన నియంత్రణ సంస్థలకు కూడా అందజేశామని ఎఫ్ఏఏ వెల్లడించింది. అంటే.. ఆయా దేశాల విమానయాన నియంత్రణ సంస్థలు ఈ సమాచారాన్ని ఆయా దేశాల్లో విమానాలు నడిపే ఎయిర్‌లైన్స్ సంస్థలకు, అవి వారి పైలట్లకు అందజేస్తాయన్నది ఎఫ్ఏఏ ఉద్దేశం. ఈ సెన్సార్ సమస్య గురించి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ పైలట్లకు కూడా సమాచారం ఉండి ఉండాలని విమానయాన నిపుణులు చెబుతున్నారు. అయితే, లయన్ ఎయిర్ విమానం ఎదుర్కొన్న సమస్యనే ఇథియోపియన్ ఎయిర్‌లైన్ విమానం కూడా ఎదుర్కొందా, లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. బోయింగ్ సంస్థ ఏమంటోంది? ఆదివారం విమాన ప్రమాదం అనంతరం బోయింగ్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ''అమెరికా జాతీయ రవాణా భద్రత బోర్డు నేతృత్వంలో సాంకేతిక సహాయాన్ని అందించేందుకు సాంకేతిక బృందం సన్నద్ధమైంది'' అని తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన విమానయాన సిబ్బంది, ప్రయాణికులకు సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బోయింగ్ సంస్థ తయారు చేసే 737 మాక్స్ 8 విమానం ఈనెల 10వ తేదీ ఆదివారం ఇథియోపియాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. text: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అన్ని వయసుల మహిళలూ షహీన్‌బాగ్ ధర్నాలో పాల్గొంటున్నారు డిసెంబర్ 31.. దిల్లీ చరిత్రలో వందేళ్లలో అత్యంత చలిగా ఉన్న రోజు. కానీ షహీన్‌బాగ్ ప్రాంతపు ప్రజలు ఆ చలికి వెరవలేదు. వీరు డిసెంబర్ 15వ తేదీ నుంచీ ఒక వీధిలో టెంటు కింద ధర్నా చేస్తున్నారు. మందంగా దుప్పట్లు, వేడి టీ కప్పులు వారి ఆయుధాలయ్యాయి. ఆ తీవ్ర చలిలో రోడ్డు మీద ప్రతిఘటనా పాటలు పాడుతూ వీరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అర్థరాత్రికి కొద్ది నిమిషాల ముందు అందరూ నిలుచుని జాతీయ గీతం ఆలపించారు. వారి డిమాండ్ ఏమిటి? పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించటం. డిసెంబర్ 11వ తేదీన అమలులోకి వచ్చిన ఈ చట్టం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు ఆశ్రయం ఇవ్వజూపుతోంది. ఆ దేశాల్లో మతపరమైన వివక్ష, అణచివేతల నుంచి పారిపోయి వచ్చే మత మైనారిటీలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం చెప్తోంది. కానీ.. భారతదేశపు ముస్లింలకు ప్రభుత్వ మాటలు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయాయి. ఈ చట్టం తమ పట్ల వివక్ష చూపుతుందని.. తమలో కొందరిని దేశం నుంచి బహిష్కరించటమో, నిర్బంధ కేంద్రాలకు తరలించటమో కూడా జరగవచ్చునని వారిలో చాలా మంది భయపడుతున్నారు. ''నేను ఇంటి నుంచి ఒంటరిగా బయటకు రాను. సమీపంలోని మార్కెట్‌కు వెళ్లటానికి కూడా నా కొడుకు కానీ, నా భర్త కానీ నాకు తోడుగా వస్తారు. కాబట్టి నేను ఇక్కడ ధర్నాలో పాల్గొనటం మొదట కష్టంగా అనిపించింది. కానీ.. నిరసన తెలపక తప్పదని నాకు బలంగా తోచింది'' అని నిరసనకారుల్లో ఒకరైన ఫిర్దౌస్ షఫీక్ చెప్పారు. ఫిర్దౌస్ షఫీక్ వంటి మహిళలు పాల్గొనటం వల్ల షహీన్ బాగ్ నిరసన అసాధారణ కార్యక్రమంగా మారిందని ఉద్యమకారులు, వ్యాఖ్యాతలు అభివర్ణిస్తున్నారు. నిరసన తెలియజేయటానికి మహిళలు ఇళ్లలోంచి బయటకు రావాల్సిన అవసరముందని ఫిర్దౌస్ షఫీక్ అంటున్నారు ''ఈ మహిళలు ఉద్యమకారులు కాదు..'' అని దిల్లీకి చెందిన ముస్లిం విమెన్స్ ఫోరమ్ వ్యవస్థాపకురాలు సయ్యదా హమీద్ చెప్తారు. వీళ్లు సాధారణ ముస్లిం మహిళలు. ఇంటి వ్యవహారాలు చూసుకునే గృహిణులు. ఇప్పుడు ఒక జాతీయ చర్చకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలుచున్నారు. ''మతాలకు అతీతంగా ఒక జాతీయ సమస్య విషయంలో వీరు బయటికి రావటం ఇదే మొదటిసారి. ఇది ముఖ్యమైన విషయమని నేను భావిస్తున్నా. ఇది ముస్లిం సమాజాన్ని బాధితులుగా చేయటానికి సంబంధించిన అంశమైనప్పటికీ.. ఇది లౌకిక అంశం'' అంటారు హమీద్. ఈ నిరసన మొదలైనపుడు ఎంత మంది మహిళలు ఉన్నారనేది చెప్పటం కష్టం. కానీ వీరి సంఖ్య చాలా వేగంగా పెరిగిపోయింది. మొదట.. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన.. పోలీసులతో ఘర్షణగా ముగిసిన డిసెంబర్ 15వ తేదీ రాత్రి వీరు బయటకు వచ్చారు. పోలీసులు ఆ తర్వాత అనుమతి లేకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించి.. విద్యార్థులు, సిబ్బంది మీద దాడి చేశారని ఆ యూనివర్సిటీ చెప్పింది. ఆ రాత్రి అనంతరం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూ పోయి.. దేశమంతటా విస్తరించాయి. చాలా నిరసనలు మొదలై, ముగిసిపోయినప్పటికీ.. కొన్ని ఆందోళనలు హింసాత్మకంగా మారినప్పటికీ.. షహీన్‌బాగ్‌లోని ఈ ప్రాంతంలో ధర్నా స్థిరంగా శాంతియుతంగా కొనసాగుతోంది. అయితే.. దిల్లీ, నోయిడాల సరిహద్దులోని ఈ ప్రాంతం ప్రయాణికులకు కీలకమైన అనుసంధానంగా ఉండటంతో.. కొందరు ఈ ధర్నా పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ''ఇది మా వ్యాపారం మీద ప్రభావం చూపుతోంది'' అని స్థానిక దుకాణదారుడు ఒకరు చెప్పారు. నోయిడాలో పనిచేసే స్థానికుడు ఒకరు.. తాను విధులకు వెళ్లటానికి ఇప్పుడు రెట్టింపు సమయం పడుతోందని తెలిపారు. ఎవరి జీవనానికీ ఆటంకం కలిగించాలని తాము భావించటం లేదని.. తమ ధర్నాను శాంతియుతంగా కొనసాగిస్తామని నిరసనకారులు హామీ ఇస్తున్నారు. అయితే.. మరో దుకాణదారు వీరికి సంఘీభావం తెలిపారు. కొంతమంది దుకాణదారులైతే నిరసనలో పాల్గొంటున్న వారికి ఆహారం కూడా సరఫరా చేస్తున్నారు. నిజానికి ఈ నిరసన పెరుగుతున్న కొద్దీ.. రాజధాని నగరం నలుమూలల నుంచీ జనం వస్తున్నారు. వారిలో విద్యార్థుల నుంచి, రాజకీయ వ్యాఖ్యాతల వరకూ అనేక వర్గాల వారు ఉన్నారు. ''ఈ నిరసన హింసాత్మకంగా మారకూడదని.. మా మీద బలప్రయోగం చేయటానికి పోలీసులకు అవకాశం ఇవ్వరాదని మేం కోరుకుంటున్నాం'' అని నిరసనల్లో పాల్గొంటున్న ఒక మహిళ చెప్పారు. ''ప్రభుత్వం వల్ల మేం ఆందోళన చేపట్టక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఒకవేళ మేం మా పౌరసత్వాన్ని నిరూపించుకోవటంలో విఫలమైతే.. మమ్మల్ని నిర్బంధ కేంద్రంలో పెట్టటమో, దేశం నుంచి బహిష్కరించటమో జరుగుతుంది. కాబట్టి మా హక్కుల కోసం ఇప్పుడే పోరాటం చేయటం ఉత్తమం'' అని షఫీక్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పౌరుల జాతీయ జాబితా (ఎన్‌ఆర్‌సీ)తో కలిపి అమలు చేసినట్లయితే తమ పౌరసత్వం ప్రమాదంలో పడుతుందన్న చాలా మంది ఆందోళనలకు.. ఆమె మాటలు అద్దంపడుతున్నాయి. పౌరుల జాతీయ జాబితా కోసం.. భారతీయులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ధృవపత్రాలు సమర్పించాల్సి ఉండటం దీనికి కారణం. అయితే.. ఆ జాబితాలో లేని ముస్లిమేతరులు పౌరసత్వ సవరణ చట్టం కింద మైనారిటీలుగా రక్షణ పొందవచ్చు. కానీ ధృవపత్రాలు లేని ముస్లింలకు ఆ హక్కు లేదు. వారిని నిర్బంధించటం లేదా దేశం నుంచి పంపించి వేయటం జరగవచ్చు. అత్యంత తీవ్రమైన చలి వాతావరణాన్ని ఎదిరించి మరీ ఈ మహిళలు ధర్నా కొనసాగిస్తున్నారు దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ జాబితాను తక్షణం అమలు చేసే ప్రణాళికలేవీ లేవని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మహిళల్లో కొంత మంది తమ పనులు వదులుకుని మరీ ఆందోళన కొనసాగిస్తున్నారు. రిజ్వానా బనీ రోజు వారీ వేతన కార్మికురాలు. తాను ఇక్కడ రాత్రీ పగలూ ధర్నాలో పాల్గొనటం వల్ల తన వేతనం కోల్పోతున్నానని చెప్తున్నారు. కానీ.. ఆ చట్టం వల్ల తనకు, తన కుటుంబానికి ఏం జరుగుతుందో అనే భయం ఆమెను వేధిస్తోంది. ''మా పౌరసత్వాన్ని నిరూపించే ధృవపత్రాలను ఎక్కడి నుంచి తేవాలి? ఎలా తేవాలి? అనేది మాకు తెలియదు. మమ్మల్ని మతం ప్రాదిపదికన విభజిస్తున్నారు. మేం ముందు భారతీయులం. ఆ తర్వాతే.. హిందువులమైనా.. ముస్లింలమైనా'' అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో అన్ని వయసుల మహిళలూ పాల్గొంటున్నారు. ''నేను ఈ దేశాన్ని విడిచి వెళ్లను. నా పౌరసత్వాన్ని నిరూపించుకునే క్రమంలో చనిపోవాలనీ నాకు లేదు'' అని 70 ఏళ్ల ఆస్మా ఖటూన్ చెప్పారు. ఆమె రోజుల తరబడి ఈ ధర్నా శిబిరంలో కదలకుండా నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలో ఇతర మతాల వారు కూడా చేరాలని హుమైరా సయీద్ చెప్తున్నారు ''నేను ఒక్కదానినే కాదు.. నా పూర్వీకులు, నా పిల్లలు, నా మనవళ్లు.. మేమందరం భారతీయులమే. కానీ దీనిని నిరూపించుకోవాలని మేం కోరుకోవటం లేదు'' అని ఉద్ఘాటించారు ఆస్మా. ఈ చట్టం ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తమకు కనిపిస్తోందని.. కానీ ఇది ప్రతి ఒక్కరికీ ప్రమాదకరమేనని నిరసనకారులు చెప్తున్నారు. ''ఈ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఇది ప్రస్తుతానికి ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చసుకోవచ్చు. కానీ.. క్రమంగా ఇతర మతస్తులను కూడా ఇది లక్ష్యంగా చేసుకుంటుందని మేం భావిస్తున్నాం'' అని యూనివర్సిటీ విద్యార్థిని హుమైరా సయీద్ పేర్కొన్నారు. ''ఒక ముస్లింగా.. నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల కోసం.. మా సమాజం కోసం.. ప్రతి ఒక్కరి కోసం నేను ఈ నిరసనలో పాల్గొనాలని నాకు తెలుసు'' అని ఆమె చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా.. భారతదేశ రాజధాని దిల్లీలో అత్యంత శీతకాలపు చలిని ఎదిరిస్తూ రెండు వారాలుగా వందలాది మంది మహిళలు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి అరవింద్ చాబ్రా కథనం. text: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. ఇందులో భారత విదేశీ మారక నిల్వలు మెరుగైన స్థితిలో ఉన్నాయని చెప్పారు, కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, విదేశీ రుణాలు తగ్గుతున్నాయని తెలిపారు. నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తిలో క్షీణత వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పనితీరు మెరుగైందని, బ్యాంకులిచ్చే రుణాల్లో వృద్ధి వచ్చిందని ఇందులో చెప్పారు. ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంచనాలను ఇందులో వెల్లడించారు. దానికి ఎదురయ్యే సవాళ్ల గురించి చెప్పారు. దేశంలోని వివిధ ఆర్థిక రంగాల పరిస్థితి గురించి, వాటిని మెరుగుపరిచే చర్యల గురించి ఈ సర్వేలో చెప్పారు. భవిష్యత్తులో రూపొందించే విధానాల కోసం ఈ సర్వే ఒక దృష్టికోణంలా పనిచేస్తుందని, ప్రభుత్వం ఏయే రంగాలపై దృష్టి పెట్టాలో కూడా చెప్పారు. ఈ సర్వే సిఫారసులు మాత్రమే, వీటిని అమలు చేయడానికి ఎలాంటి చట్టపరమైన బాధ్యతలు లేవు. అందుకే ప్రభుత్వం దీనిని కేవలం సూచనలా స్వీకరిస్తుంది. ఆర్థిక సర్వేలో ప్రధాన అంశాలు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో దేశ ఆర్థిక స్థితి దశ, దిశల గురించి చెప్పే ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. text: వాణిజ్య యుద్ధంలో భాగంగా ఇప్పటికే పలు ఉత్పత్తులపై సుంకాలు పెంచినప్పటికీ మునుపెన్నడూ లేనట్లుగా ఈసారి సుమారు 6 వేల వస్తువులకు ఇది వర్తించనుంది. దుస్తులు, బియ్యం వంటి ప్రధానమైన ఉత్పత్తులన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, చాలామంది ఊహించినట్లుగా స్మార్ట్ వాచ్‌లు, ఖరీదైన కుర్చీలను మాత్రం ఇందులో చేర్చలేదు. స్మార్ట్ వాచ్‌లు వంటివి చైనా ముఖ్య ఎగుమతుల్లో ఉండడంతో వాటిని లక్ష్యంగా చేసుకుంటారని అంతా భావించారు. తాజా పన్నుల వడ్డన ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి 10 శాతం పన్ను విధించగా.. రెండు దేశాల మధ్య పరిస్థితులు సద్దుమణిగి ఒప్పందం కుదరకపోతే 2019 జనవరి 1 నుంచి సుంకం 25 శాతానికి పెరుగుతుంది. కాగా.. అమెరికా తమపై పన్నుల వడ్డన కొనసాగిస్తే తాము దీటుగా బదులివ్వడం ఖాయమని చైనా ఇంతకుముందే చెప్పింది. తాజా పరిణామాలతో రెండు దేశాలమధ్య వాణిజ్య పోరు పూర్తిగా రాజుకున్నట్లయింది. ప్రపంచంలోని రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు వాణిజ్యపరమైన ఆంక్షలను చూపుతూ పరస్పరం హెచ్చరికలకు దిగుతుండడంతో ఈ పోరు కొత్త మలుపులు తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాను ఎదుర్కొనేందుకు చైనా నాలుగు బలమైన అస్త్రాలను ప్రయోగించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అవి... 1. అమెరికా సంస్థలపై ఉక్కుపాదం చైనా భూభాగం నుంచి కార్యకలాపాలు సాగించే అమెరికా సంస్థలకు కొత్త నిబంధనలు విధించడం, వాటి నిర్వహణ ఖర్చులు పెరిగేలా చేయడం. కస్టమ్స్ విధానాలు కూడా కఠినతరం చేయడం. ''ఇలాంటి విధానాలు చైనాకు కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా అలాగే చేస్తే అమెరికా వ్యాపారానికి ఇబ్బందులు తప్పవు'' అని న్యూయార్క్‌లోని సిరాక్యూజ్ యూనివర్సిటీ ఆర్థికశాస్ర్త ప్రొఫెసర్ మేరీ లవ్లీ అభిప్రాయపడ్డారు. ''అయితే, ఈ వ్యూహం రెండు దేశాలనూ ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల చైనా, అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎగుమతిదారులు వెనుకాడుతారు. వినియోగదారులపైనా అనవసర భారం పడుతుంది'' అని ఆమె అన్నారు. 2. అమెరికాను ఏకాకిని చేసి.. ఇతర ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంటూ అమెరికాను ఏకాకిని చేసే పనిలో చైనా ఇప్పటికే ఉంది. దీన్ని మరింత వేగవంతం చేయొచ్చు. ఇప్పటికే పలు ఐరోపా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు చైనా తన వాణిజ్యాన్ని విస్తరిస్తోంది. పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాలకు చైనా నాయకత్వం వహించొచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా సహా పలు పసిఫిక్ దేశాల మధ్య ప్రతిపాదనల్లో ఉన్న 'ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్' వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం మనుగడలో లేదు. ఈ ఒప్పందానికి అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ ఒప్పందం నీరుగారింది. ఇప్పుడు చైనా దీనికి నేతృత్వం వహించే అవకాశాలున్నాయి. అమెరికా సుంకాల ప్రభావం చైనాపైనే కాకుండా కెనడా, మెక్సికో వంటి దేశాలు, కొన్ని ఐరోపా దేశాలనైనా పడుతుండడంతో అమెరికా లేకుండా కొత్త కూటములు ఏర్పడొచ్చు. 3. యువాన్ విలువ తగ్గించి.. అమెరికాను నేరుగా దెబ్బకొట్టాలని చైనా అనుకుంటే తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించేందుకు కూడా వెనుకాడకపోవచ్చు. చైనా కరెన్సీ బలహీనపడితే చైనా ఎగుమతులు చౌకవుతాయి. అదేసమయంలో అమెరికా వస్తువులు ఖరీదుగా మారుతాయి. ''చైనా తన దేశంలోని సంస్థలను బలోపేతం చేసేందుకు ఆర్థిక వ్యవస్థలోకి మరింత కరెన్సీని తీసుకురావొచ్చు. లేదంటే యువాన్ విలువను తగ్గించనూవచ్చు'' అని ఫోర్బ్స్ మ్యాగజీన్, న్యూయార్క్ టైమ్స్‌కు బిజినెస్ కథనాలు రాసే బ్రియాన్ బోర్జికోవ్‌స్కీ అన్నారు. అయితే... కరెన్సీ అనేది రెండువైపులా పదునున్న కత్తి. వాణిజ్యం యుద్ధంలో దాన్ని వాడడం వల్ల ఇద్దరికీ నష్టం జరగొచ్చు. యువాన్ విలువ తగ్గిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. 4. అమెరికా బాండ్లను అమ్మేస్తే.. గత రెండు దశాబ్దాలలో చైనా సురక్షిత పెట్టుబడులుగా భావించి అమెరికా ట్రెజరీ బాండ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. దానికి వడ్డీల రూపంలో వందల కోట్లు ఆర్జించింది. సుమారు 117 లక్షల కోట్ల డాలర్ల విలువైన బాండ్లు ఉన్నాయి. వాటిని కనుక చైనా తిరిగి విక్రయించడం మొదలుపెడితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడుతుంది. ట్రెజరీ బాండ్లు పేరుకుపోతే వాటి విలువ తగ్గడంతో పాటు అమెరికా సంస్థలు, వినియోగదారుల రుణ పరపతీ తగ్గిపోతుంది. ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు మందగమనం తప్పదు. అయితే, సురక్షితమైన అమెరికా బాండ్లను తిరిగి విక్రయిస్తే చైనా సైతం ఆ ప్రభావానికి లోనవ్వాల్సి వస్తుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అలా విక్రయించిన బాండ్లకు ప్రత్యామ్నాయంగా చైనా అంతటి సురక్షిత పెట్టుబడులు పెట్టడమూ కష్టమే అవుతుంది. చైనాకూ నష్టమే.. అయితే, చైనా ఇలాంటి చర్యలకు దిగకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. చైనా కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైనది కావడంతో వాణిజ్య యుద్ధం వల్ల చైనాయే దుర్బల స్థితిలో ఉందని వాషింగ్టన్‌లోని 'స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' ఆర్థిక నిపుణుడు స్కాట్ కెనడీ అభిప్రాయపడ్డారు. ''అమెరికా బాండ్లను విక్రయించడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించేందుకు చైనా ప్రయత్నించకపోవచ్చు. ఎందుకంటే అమెరికా కనుక మరింతగా సుంకాలు పెంచితే అప్పుడు చైనాకే నష్టం'' అని ఆయన అన్నారు. నోబెల్ బహుమతి పొందిన ఆర్థిక వేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ దీనిపై స్పందిస్తూ ఈ వాణిజ్య యుద్ధానికి తట్టుకునే స్థితిలో చైనా ఉందని చెప్పారు. ''వాణిజ్య యుద్ధం ప్రభావం నుంచి బయటపడే వనరులు, పద్ధతులు చైనా వద్ద ఉన్నాయి. 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నిల్వలు ఆ దేశానికి ఉన్నాయి'' అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వాణిజ్య యుద్ధం ఈ రెండు దేశాలపైనే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్లను అస్థిరపరిచే ప్రమాదముందని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికా తాజాగా 20,000 కోట్ల డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించింది. text: పలు స్థానిక పత్రికలను తిరగేసినపుడు పలువురు వైద్య, మానసిక నిపుణులను సంప్రదించినపుడు ఈ ధోరణి ఎలా పెరుగుతోందో అర్థమవుతుంది. ఇక బయటకు రాని అంశాలైతే ఎన్నో! అసలు ఇలాంటి ధోరణి ఎందుకు పెరుగుతోంది.. బీబీసీ మరాఠీ ప్రతినిధి అనఘా పాఠక్ అందిస్తున్న రిపోర్ట్. దేశంలోని పలు నగరాల్లో భర్తలకు 'పోర్న్ మీద మాత్రమే' ఆసక్తి ఉండటంతో భార్యలపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అది ఇద్దరి బంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పట్టణాలుగా మారుతున్న గ్రామీణ ప్రాంతాల్లో వివాహితులైన మహిళలు.. తమ భర్తల 'పోర్న్ తరహా సెక్సు' కోరికల వల్ల గాయపడి చికిత్స తీసుకోవడం పెరుగుతోంది. ఇక నాసిక్ వంటి మధ్యశ్రేణి నగరంలో.. తన వద్దకు వస్తున్న విడాకుల కేసుల్లో 45 శాతం కేసులకు కారణం పోర్నేనని ఒక న్యాయవాది చెప్తున్నారు. కానీ దీనికి అధికారికంగా 'అసహజ సెక్సు' అని కారణంగా చూపుతున్నట్లు తెలిపారు. రత్న (అసలు పేరు కాదు)ది మహారాష్ట్రలోని ఓ వెనుకబడిన ప్రాంతం. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఆరంభించింది. ముందంతా మంచి కాలమేనని ఎన్నో కలలు కనింది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, హమ్ దిల్ దే చుకే సనమ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో చూపినట్లు.. తన భర్త తనను ప్రేమించాలని కోరుకుంది. కొన్ని రోజులు అనుకున్నట్లుగానే సాగింది. ఆమె భర్త బాగా చదువుకున్నాడు. ఆమె అవసరాలు తీర్చేవాడు. కానీ ఒకే ఒక సమస్య: శృంగారం బాధాకరంగా.. ఒక్కోసారి హింసాత్మకంగా ఉండేది. ఆమె భర్తకు పోర్న్‌ వ్యసనం ఉంది. ఆ వీడియోల్లో చూపే పనులు చేయాలంటూ రత్నని బలవంతం చేసేవాడు. రోజులు గడిస్తే తన భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆమె ఆశించింది. కానీ అలా జరగలేదు. నిజానికి అతడు ఇంకా హింసాత్మకంగా మారాడు. రాత్రంతా పోర్న్ చూడటం మొదలుపెట్టాడు. ఉత్ప్రేరకాలు వాడేవాడు. భార్యతో బలవంతంగా సెక్స్ చేసేవాడు. తన కోరికలు తీర్చకపోతే ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. ఒక రోజు.. ఒక పోర్న్ వీడియోలో చూపిన విధంగా రత్న కాళ్లను సీలింగ్ ఫ్యాన్‌కు కట్టి ఆమెను తలకిందులుగా వేలాడదీసి.. ఆమెతో సెక్స్ చేశాడు. దీంతో ఆమె గుండె బద్దలయింది. తీవ్రంగా కుంగిపోయింది. ఇక భరించలేని స్థితిలో అయిష్టంగానే విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ''ఆ ఘటన రత్న జీవితాన్ని మార్చేసింది. ఆమె ఇంకా మనుషుల్ని నమ్మలేకపోతోంది. ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు'' అని సోషల్ వర్కర్ రాధా గవాలే చెప్తారు. హింసా బాధితులైన మహిళలు, పిల్లలకు సాయం చేయడం కోసం టాటా ట్రస్ట్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉమన్ అండ్ చిల్డ్రన్ సెల్‌లో పనిచేస్తున్న సోషల్ వర్కర్లలో రాధ ఒకరు. ''పోర్న్ ప్రభావంతో భర్తలు లైంగిక దాడులకు పాల్పడుతున్న కేసులు మా దగ్గరకు రావడం అంతకంతకూ పెరుగుతోంది'' అని ఆమె తెలిపారు. ''భర్తలు పోర్ను వీడియోలు చూసి తమతో అసహజ సెక్సు చేయాలని తమ భార్యల మీద ఒత్తిడి తెస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే వారిని హింసించడం మామూలుగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతమైనా.. అన్ని సామాజిక, ఆర్థిక తరగతుల కుటుంబాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. మగవాళ్లు మద్యం మత్తులో ఉన్నపుడు ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి'' అని రాధ వివరించారు. చౌక స్మార్ట్‌ఫోన్లు, ఉచిత ఇంటర్నెట్ పాత్ర... భారతదేశంలో ''పెద్దలకు మాత్రమే'' ప్రత్యేకించిన కంటెంట్‌ వినియోగం 2016-17లో దాదాపుగా రెట్టింపయిందని విడూలీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుబ్రత్ కార్ చెప్పారు. విడూలీ తన వినియోగదారులకు అనలటిక్స్, డాటా ఇంటెలిజెన్స్ అందిస్తుంది. ''చౌక స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ దాదాపుగా ఉచితంగా లభిస్తుండడం వల్ల పోర్న్ వీక్షించడం పెరిగినట్లు మా సర్వే చెప్తోంది'' అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని.. మరాఠ్వాడా ఉమన్ అండ్ చిల్డ్రన్ సెల్ కో-ఆర్డినేటర్ జ్యోతి సప్కాల్ తెలిపారు. ''కొన్నిసార్లు మగాళ్ల లక్ష్యం లైంగిక తృప్తి కాదు.. వాళ్లు తమ మగతనం నిరూపించుకోవాలని కోరుకుంటారు. లేదంటే తమ భార్యలను ''అదుపు''లో ఉంచాలని భావిస్తారు'' అని ఆమె చెప్పారు. ''ఇటువంటి హింసకు మూలం.. 'నా పెళ్లాం.. నా ఆస్తి... దానితో నేను ఏమైనా చేసుకోవచ్చు' అనే విశ్వాసమే'' అని జ్యోతి విశ్లేషించారు. ఒక భర్త పోర్న్ వీడియోలు చూసి, వాటిలోని సెక్స్ కార్యకలాపాలను అనుకరించాలంటూ తన భార్యను కోరిన ఒక ఉదంతం గురించి రాధ తెలిపారు. ''ఒకసారి అతడు ఆమెను చెక్క మంచానికి కట్టేసి, అసహజంగా ప్రవర్తించాడు. వీడియో తీసి తన ఫ్రెండుకి పంపించాడు. అతడొక దినసరి కూలీ. అయినా కూడా పోర్న్ చూడటానికి ఒక స్మార్ట్‌ఫోను, చౌక ఇంటర్నెట్ అతడికి ఉన్నాయి'' అని ఆమె చెప్పారు. భావావేశాల పాత్ర లేదు.. ఏ మహిళ అయినా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నపుడు ఆమె వెంటనే ఎవరినైనా సాయం కోరాలని హైదరాబాద్‌కు చెందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ షర్మిళ మజుందార్ పేర్కొన్నారు. ''ఎలాంటి హింస అయినా, విపరీత లైంగిక చర్యల ద్వారా ప్రేరణ పొందే వికృత లైంగిక వాంఛలను అసలేమాత్రం ఉపేక్షించకూడదు'' అన్నారామె. సెక్స్ విషయంలో భాగస్వాములిద్దరికీ సమాన స్వేచ్ఛ ఉండాలి. శృంగారాన్ని ఇద్దరూ సమానంగా ఆస్వాదించగలిగేలా ఉండాలి. కానీ.. భారతదేశంలో వైవాహిక జీవితంలో ప్రేమానురాగాల కోసం ఎదురుచూసే రత్న లాంటి మహిళలకు ఇది ఇంకా పగటి కలగానే ఉంది. సెక్సు విషయాల్లో భారతీయ మహిళల ఇష్టాయిష్టాలకు చోటు లభించడం చాలా అరుదు. పోర్న్ చూడటంలో తప్పేమీ లేదని కూడా షర్మిళ భావిస్తారు. ''కొన్నిసార్లు దంపతుల మధ్య దూరాన్ని తగ్గించడానికి, ఆరోగ్యవంతమైన లైంగిక సంబంధాలు కలిగివుండటానికి ఇది సాయపడుతుంది'' అని ఆమె పేర్కొన్నారు. కానీ సెక్సు గురించి మాట్లాడటం ఇంకా నిషిద్ధంగానే ఉన్నా భారత్ వంటి దేశంలో.. సెక్సు గురించి స్కూళ్లలో, ఇళ్లలో బహిరంగంగా చర్చజరగనంత వరకూ.. భార్యాభర్తల మధ్య ఆరోగ్యవంతమైన లైంగిక సంబంధాలు ఉండటమనేది సుదూర స్వప్నమే. మహిళలు మొదట చేయాల్సిన పని గొంతెత్తి మాట్లాడటమని.. ఆ తర్వాత వారి మాటను భర్తలు, కుటుంబ సభ్యులు వినిపించుకోవాలని ఆశించాలని రాధ అంటారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫోన్లలో పోర్న్ చూసి భార్యలను అసహజ శ‌ృంగారానికి బలవంతం చేయడం దేశంలో పెరుగుతోంది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలు.. పట్టణాలు, చివరకు గ్రామాల్లోనూ ఇలాంటి తీరుతో చాలా మంది భార్యలు ఇబ్బందులుపడుతున్నారు. text: ఆయన భార్య, ఇటీవలే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాను ఈడీ ఆఫీసు వరకూ వదలడానికి వచ్చారు. ఆమె తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన సోదరి ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడంతోపాటు ఉత్తర ప్రదేశ్‌ తూర్పు ప్రాంతానికి ఆమెను ఇన్‌ఛార్జిగా చేశారు. ప్రియాంకను విలేఖరులు కొత్త బాధ్యతలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినపుడు ఆమె "రాహుల్ గారు నాకు ఈ బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషం.'' అన్నారు. భర్తకు ఈడీ సమ్మన్లు రావడంపై మాట్లాడిన ప్రియాంక "ఏం జరుగుతోందో మొత్తం ప్రపంచానికి తెలుసు" అన్నారు. పార్టీ బాధ్యతలు అందుకున్న తర్వాత ఇన్నాళ్లకు విలేఖరులకు ప్రియాంకను కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం లభించింది. రాబర్ట్ వాద్రా మధ్య దిల్లీలో ఉన్న జామ్‌నగర్ హౌస్‌లో ఉన్న ఈడీ ఆఫీసుకు సుమారు 3.45కు చేరుకున్నారు. ఆయన మనీ లాండరింగ్ కేసులో మందస్తు బెయిల్ తీసుకున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని వాద్రా కోర్టుకు చెప్పారు. లండన్‌లో ఇల్లు కొన్నారనే ఆరోపణలకు సంబంధించి వాద్రాపై మనీ లాండరింగ్ కేసు నడుస్తోంది. గతంలో వాద్రా ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. "బీజేపీ ప్రభుత్వం రాజకీయ ఒత్తిడులతోనే ఈ మొత్తం కేసులు నడిపిస్తోంది"అని వాద్రా అన్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ లండన్‌లో ఉన్నాయని ఈడీ కోర్టులో చెప్పింది. లండన్‌లో ఆయనకు రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్స్ ఉన్నాయని తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఆఫీసుకు వచ్చారు. మనీ లాండరింగ్ కేసులో వాద్రాను విచారించేందుకు ఈడీ ఆయనకు సమ్మన్లు పంపించింది. text: క‌రోనావైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు విధించిన‌ లాక్‌డౌన్‌తో విద్యు‌త్ చార్జీల వ‌సూలుకు అంత‌రాయం ఏర్ప‌డింది. మీట‌ర్ రీడింగ్‌ల‌ను తీసేందుకు ఇంటింటికీ వెళ్లే విద్యుత్ సిబ్బందికి కోవిడ్‌-19 ముప్పు ఉండ‌టంతో బిల్లుల జారీ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు తెలంగాణ స్టేట్ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్‌) తెలిపింది. అయితే, గ‌తేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల్లో వినియోగం ఆధారంగా ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వినియోగ‌దారులు బిల్లులు చెల్లించాల‌ని టీఎస్ఎస్‌పీడీసీఎల్ సూచించింది. లాక్‌డౌన్ తెర‌చిన అనంత‌రం రీడింగ్‌లు తీస్తామ‌ని, వినియోగ‌దారులు ఎక్కువ చెల్లించినా లేదా త‌క్కువ చెల్లించినా.. వ‌చ్చే నెల‌లో స‌వ‌రించి బిల్లులు ఇస్తామ‌ని స్ప‌ష్టంచేసింది. "‌మూడు నెల‌ల బిల్లులు క‌లిపి ఇచ్చారు" ప్ర‌స్తుతం కంటైన్‌మెంట్ జోన్‌లు మిన‌హాయించి రాష్ట్రంలో‌ లాక్‌డౌన్‌ను స‌డ‌లించారు. దీంతో విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌లు తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు. గ‌త మూడు నెల‌‌ల్లో వినియోగ‌దారులు చెల్లించిన మొత్తాన్ని కొత్త రీడింగ్‌తో స‌వ‌రించి బిల్లులు ఇస్తున్నారు. అయితే ఈ బిల్లుల్లో త‌ప్పులున్నాయ‌ని, చార్జీలు ఎక్కువ‌గా వ‌సూలు చేస్తున్నార‌ని వినియోగ‌దారులు ఫిర్యాదు చేస్తున్నారు. "మార్చి 5న నేను రూ. 247 బిల్లు చెల్లించాను. ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల్లో గ‌తేడాది చార్జీల ప్ర‌కారం టీఎస్ఎస్‌పీడీసీఎల్ సూచించిన‌ట్లే మొత్తం రూ. 463 పేటీఎంలో చెల్లించాను. అయితే జూన్‌లో వ‌చ్చిన బిల్లు.. నేను కేవ‌లం రూ. 285 చెల్లించిన‌ట్లు చూపిస్తోంది. స‌వ‌రించిన అనంత‌రం మ‌ళ్లీ రూ. 1,519 క‌ట్టాల‌ని అడుగుతున్నారు. బిల్లులో త‌ప్పులున్నాయా? లేక చార్జీల‌ను పెంచి వ‌సూలు చేస్తున్నారా?" అని వినియోగ‌దారుడు సీహెచ్‌ సంతోష్ ప్ర‌శ్నించారు. "మా క‌రెంటు బిల్లు ఎప్పుడూ రూ. 1,200 దాటేది కాదు. ఇప్పుడేమో మూడు నెల‌ల‌కు క‌లిపి రూ. 7,000 బిల్లు ఇచ్చారు. ఇది నిజంగా దోచుకోవ‌డ‌మే. లాక్‌డౌన్‌తో అన్ని విధాలుగా న‌ష్ట‌మే జ‌రిగింది" అని సి.సంస్కృతి వివ‌రించారు. మ‌రోవైపు ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్‌ను నెటిజ‌న్‌ రాఘ‌వ్ గాజుల కోరారు. "లాక్‌డౌన్ స‌మ‌యంలో బిల్లుల‌ను లెక్కించే విధానంలో ‌తేడాలు జ‌రిగిన‌ట్టు అనిపిస్తోంది. నెల‌వారీ శ్లాబ్ రేట్‌ల‌ను తీసుకోకుండా.. మూడు నెల‌ల బిల్లుపై వ‌చ్చే శ్లాబ్ రేటును తీసుకుంటున్నారు. ఫ‌లితంగా బిల్లులు పెరిగిపోతున్నాయి" అని ఆయ‌న అన్నారు. గ‌తేడాదితో పోలిస్తే ప్ర‌తి రోజు ఎనిమిది నుంచి ప‌ది మిలియ‌న్ యూనిట్ల వ‌ర‌కూ విద్యుత్ వినియోగం త‌గ్గింది. చార్జీల వ‌సూలు ఇలా ఇంటి అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే విద్యుత్ చార్జీల ఆధారంగా వినియోగ‌దారుల‌ను టీఎస్ఎస్‌పీడీసీఎల్ మూడు కేట‌గిరీలుగా వ‌ర్గీక‌రి‌స్తోంది. 0 నుంచి 100 యునిట్ల విద్యుత్ వినియోగం వ‌ర‌కు కేట‌గిరీ-1గా, 101 నుంచి 200 వ‌ర‌కు కేట‌గిరీ-2గా, 200 యూనిట్ల‌కుపై వినియోగించే వారిని మూడో కేట‌గిరీగా విభ‌జిస్తోంది. ఈ కేట‌గిరీల్లో కూడా శ్లాబులు ఉంటాయి. వాటి ఆధారంగానే చార్జీలు వ‌సూలు చేస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు 170 యూనిట్లు వినియోగిస్తే.. కేట‌గిరీ-2లోకి వ‌స్తారు. దీని ప్ర‌కారం.. మొద‌టి 100 యూనిట్ల‌కు రూ. 3.3 చొప్పున (ఒక యూనిట్‌కు) రూ. 330, ఆ త‌ర్వాత 70 యూనిట్లు ఒక్కో యూనిట్‌కు రూ. 4.3 చొప్పున రూ. 301 అవుతుంది. మొత్తంగా రూ. 631 చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెల‌ల బిల్లులు క‌లిపి ఒకేసారి ఇవ్వ‌డంతో త‌మ శ్లాబులు మారిపోయాయ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. అందుకే బిల్లులు ఎక్కువ‌గా వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. అయితే ఈ ఆరోప‌ణ‌లను టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఆప‌రేష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ జె.శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. "మూడు నెల‌ల స‌గ‌టు ఆధారంగా శ్లాబులు" "మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల బిల్లును క‌లిపి ఒకే బిల్లులో ఇస్తున్నాం. అయితే శ్లాబుల విష‌యానికి వ‌చ్చేస‌రికి బిల్లు మొత్తాన్ని మూడుతో భాగించి.. వ‌చ్చే మొత్తం ఆధారంగా శ్లాబులు నిర్ణ‌యిస్తున్నాం. దీనివ‌ల్ల వారు ఎంత వినియోగిస్తున్నారో అదే శ్లాబులో ఉన్న‌ట్లు అవుతుంది" అని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విధానం ప్ర‌కారం.. మూడు నెల‌ల‌కు గాను 1,723.47 యూనిట్లను వినియోగించి ఉంటే.. రూ. 12,152గా బిల్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంటే మొద‌ట 1,723.47ను మూడు భాగాలుగా విభ‌జిస్తారు. అప్పుడు నెల‌వారి వినియోగం 574.49 యూనిట్లుగా తేలుతుంది. దీనిలో మొద‌టి 200 యూనిట్ల‌కు రూ. 5 చొప్పున (ఒక యూనిట్‌కు)‌; 201 నుంచి 300 యూనిట్ల‌కు రూ. 7.20 చొప్పున; 301 నుంచి 400 వ‌ర‌కు రూ. 8.50 చొప్పున; 401కుపై యూనిట్ల‌కు రూ. 9 చొప్పున వ‌సూలు చేస్తారు. అప్పుడు ఒక నెల బిల్లు వ‌స్తుంది. దీన్ని మ‌ళ్లీ మూడుతో గుణిస్తే మూడు నెల‌ల బిల్లు (రూ. 12,152) వ‌స్తుంది. గ‌త ఏడాది వినియోగం ఆధారంగా ఇప్ప‌టికే కొంత బిల్లు చెల్లించి ఉంటే.. ఈ మొత్తంలో దాన్ని మిన‌హాయిస్తారు. "టారిఫ్ రేట్ల‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ అనుమ‌తిస్తే త‌ప్ప.. టారిఫ్‌లు మార్చ‌డం సాధ్యంకాదు. టారిఫ్‌లు పెంచామంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజ‌మూ లేదు" అని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్ర‌స్తుత బిల్లును రెండు లేదా మూడు వాయిదాల్లో చెల్లించొచ్చ‌ని ఆయ‌న‌ తెలిపారు. అయితే మూడొంతుల్లో ఒక వంతు బిల్లు ప్ర‌స్తుతం త‌ప్ప‌నిస‌రిగా చెల్లించాల‌ని స్ప‌ష్టంచేశారు. వాయిదాల‌కు వెళ్తే వ‌డ్డీ కూడా క‌ట్టాల్సి ఉంటుంద‌న్నారు. "ఎక్కడా త‌ప్పులు జ‌ర‌గ‌లేదు" బిల్లుల్లో త‌ప్పులతోపాటు చార్జీలను పెంచార‌న్న వార్త‌ల‌ను టీఎస్ఎస్‌పీడీసీఎల్ చైర్మ‌న్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ (సీఎండీ) ర‌ఘుమారెడ్డి కూడా ఖండించారు. "బిల్లుల్లో ఎలాంటి త‌ప్పులూ లేవు. వినియోగం పెర‌గ‌డం వ‌ల్లే బిల్లులు ఎక్కువ‌గా వ‌చ్చినట్లు కనిపిస్తోంది. వినియోగం పెర‌గ‌డం వ‌ల్లే శ్లాబులు మారాయి. ప్ర‌తి వేస‌విలోనూ ఇదే జ‌రుగుతుంది" అని చెప్పారు. "ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల్లో ఇంటి అవ‌స‌రాల కోసం ఉప‌యోగించే విద్యుత్ వినియోగం 39 శాతం పెరుగుతుంది. ఫ‌లితంగా శ్లాబ్ లలోనూ మార్పులు వ‌స్తుంటాయి. లాక్‌డౌన్ వ‌ల్ల చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. నిజానికి మా ఇంట్లో విద్యుత్ వినియోగం కూడా 15 శాతం పెరిగింది" అని ఆయన పేర్కొన్నారు. డిస్కంలు మ‌రిన్ని క‌ష్టాల్లోకి... ఇప్ప‌టికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంల‌ను లాక్‌డౌన్ మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టింద‌ని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గ‌తేడాదితో పోలిస్తే ప్ర‌తి రోజు ఎనిమిది నుంచి ప‌ది మిలియ‌న్ యూనిట్ల వ‌ర‌కూ విద్యుత్ వినియోగం త‌గ్గిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ముఖ్యంగా వాణిజ్య విద్యుత్ వినియోగం బాగా ప‌డిపోయిందన్నారు. మ‌రోవైపు గ‌త మూడు నెల‌ల్లో వినియోగ‌దారుల నుంచి వ‌చ్చే ఆదాయ‌మూ బాగా త‌గ్గింద‌ని ర‌ఘుమారెడ్డి చెప్పారు. "మార్చిలో 67 శాతం మంది మాత్ర‌మే బిల్లులు చెల్లించారు. ఏప్రిల్‌లో ఇది 44 శాతం, మేలో 68 శాతంగా ఉంది. స‌గ‌టున ఈ మూడు నెల‌ల్లో కేవ‌లం 60 శాతం మంది మాత్ర‌మే బిల్లులు చెల్లించారు" అని తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణ‌లో విద్యుత్ బిల్లులు భారీగా పెంచేశార‌ని ట్విట‌ర్ వేదిక‌గా నెటిజ‌న్లు వెల్ల‌డిస్తున్నారు. బిల్లులో త‌ప్పులు ఉన్నాయ‌ని, శ్లాబుల‌ను పెంచేసి చార్జీల‌ను ఎక్కువ‌గా వ‌సూలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. text: ఉద్యోగులు ఏం చేస్తున్నారో, వారి పనితీరు ఎలా ఉందో చూడటానికి కాదు. వాళ్లు సమయానికి ఇంటికి వెళ్తున్నారా లేదా చూసేందుకు. జపాన్‌లో ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం చాలామంది ఉద్యోగులకు మామూలైపోయింది. "సమయం ముగిశాక కూడా ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లో ఎవరుంటున్నారో ఈ డ్రోన్‌లో ఉన్న కెమెరా ద్వారా తెలుసుకుంటాం" అని టీఏఐఎస్ఈఐ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నొరిహిరో కటో అంటున్నారు. జపాన్ చట్టాల ప్రకారం ఓ ఉద్యోగి నెలలో 100 గంటలకు మించి అదనపు సమయం పని చేయకూడదు. కరోషి... అంటే పనిచేస్తూ ఆఫీస్‌లోనే చనిపోవడం. కొన్ని దశాబ్దాలుగా ఇది జపాన్‌ను తీవ్రంగా వేధిస్తున్న సమస్య. ఎక్కువ సమయంపాటు పనిచేయడాన్ని నివారించేందుకు కంపెనీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఈ డ్రోన్ జపాన్‌లోని ఓ ఆఫీసులో గస్తీ తిరుగుతోంది. ఇది ఎందుకు ఇలా తిరుగుతోందో తెలుసా? వాటిలో భాగమే... కళ్ల కదలికలను పసిగట్టే ఓ కొత్తరకం కళ్లజోళ్లు. ఈ కళ్లజోళ్లు అవి పెట్టుకున్నవారి కళ్ల కదలికల సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తాయి. మీ ఏకాగ్రత తగ్గితే, కాసేపు విరామం తీసుకోమని ఫోన్లకు సందేశం పంపిస్తాయి. జపాన్‌లో దశాబ్దాలుగా ఉన్న ఈ అధిక సమయం పనిచేసే ఈ అలవాటును టెక్నాలజీ మారుస్తుందేమో చూడాలి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ డ్రోన్ జపాన్‌లోని ఓ ఆఫీసులో గస్తీ తిరుగుతోంది. ఇది ఎందుకు అలా తిరుగుతోందో తెలుసా? text: అత్యాచారం ప్రతీకాత్మక చిత్రం ముందుగా అనుకున్న పథకం ప్రకారమే నిందితులు ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్యచేయాలనీ భావించారని రాసింది. పోలీసు వాహనాల సైరన్లు నలువైపులా మోగుతుండటంతో వెనకడుగు వేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ముఠాగా ఏర్పడి అఘాయిత్యాలకు పాల్పడేవారని, మరికొందర్నీ అత్యాచారం చేశారని విచారణలో తేలినట్టు తెలిసింది. కేసు వివరాలను రాచకొండ పోలీసులు శుక్రవారం అధికారికంగా వెల్లడించే అవకాశముందని ఈనాడు చెప్పింది. బాధిత విద్యార్థిని (19) మేడ్చల్‌కు సమీపంలోని ఓ కళాశాలలో బీ-ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగుతున్న యువతి అక్కణ్నుంచి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న ఆర్‌ఎల్‌నగర్‌లోని ఇంటికి ఆటోలో వెళ్లేది. ప్రధాన నిందితుడు తన సెవెన్‌ సీటర్‌ ప్యాసింజర్‌ ఆటోను రాంపల్లి చౌరస్తా దగ్గరున్న అడ్డాలో నిలిపి ఉంచడంతో కొన్నిసార్లు ఆ ఆటోలోనూ ప్రయాణించింది. ఆ క్రమంలోనే అతడి కన్ను ఆమెపై పడింది. సహచరులైన మరో ముగ్గురు ఆటో డ్రైవర్లకు ఆమె గురించి చెప్పిన అతను, అదనుచూసి కిడ్నాప్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఎప్పటిలాగే యువతి బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి 5.45 గంటల మధ్య రాంపల్లి చౌరస్తా దగ్గర కళాశాల బస్సు దిగి ఆటో అడ్డా వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు, ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేసి 'మ్యాటర్‌ రెడీగా ఉందంటూ' సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఆటోలో ఇద్దరు మహిళలు, యువకుడు ఉండటంతో ఆమె యథావిధిగా అందులో ఎక్కింది. చౌరస్తా నుంచి కి.మీ. దూరంలో ఉన్న సత్యనారాయణ కాలనీ దగ్గర ఇద్దరు, ఆ తర్వాత కొంతదూరంలో మరొకరు దిగారు. ఇంకొంచెం దూరంలో యువతి దిగాల్సిన ఆర్‌ఎల్‌నగర్‌ బస్‌స్టాప్‌ ఉంది. నిందితుడు ఆటోను అక్కడ ఆపకుండా వేగంగా యంనంపేటవైపు పోనిచ్చాడు. అనుమానించిన యువతి 'ఆటోను మన స్టాప్‌లో ఆపకుండా డ్రైవర్‌ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నాకు భయమేస్తోందంటూ' తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె బంధువులకు విషయం చెప్పగా, వాళ్లు డయల్‌ 100కు సాయంత్రం 6.30 గంటల సమయంలో ఫోన్‌ చేశారు. ఆటో యంనంపేటకు చేరుకోగానే మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి వెనుక సీట్లో యువతికి చెరోవైపు కూర్చున్నారు. మరోవ్యక్తి ఘట్‌కేసర్‌ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ యువతిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చారు. అందులోనే అందరూ అత్యాచారం చేశారని ఈనాడులో రాశారు. అదే సమయంలో పోలీస్‌ వాహనాల సైరన్‌ మోగడం, 'ఆటోలో అమ్మాయిని కిడ్నాప్‌ చేశారు..ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ' పోలీసులు మైకుల్లో ప్రకటిస్తుండటాన్ని విన్న నిందితులు దొరికితే ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయపడ్డారు. యువతిని వ్యాన్‌ నుంచి కిందకు దించి పక్కనే పొదల్లో పడేసి పరారయ్యారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు బాధితురాలి జాడను గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అన్నోజిగూడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. తదుపరి వైద్యపరీక్షల నిమిత్తం గురువారం నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోందని పత్రిక చెప్పింది. రాంపల్లి చౌరస్తా దగ్గర సీసీటీవీ ఫుటేజీని పోలీసులు జల్లెడ పట్టారు. ఆ క్రమంలోనే బాధితురాలితోపాటు మరో యువకుడు ఆటోలో ఎక్కినట్లు గుర్తించి విచారించారు. అతను చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా అడ్డాలోని ఆటో డ్రైవర్లను ఆరాతీశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నలుగుర్ని గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసిందని కథనంలో చెప్పారు. కేసు దర్యాప్తును రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదుచేశారని ఈనాడు వివరించింది. విమానయానం మరింత భారం దేశీయ విమాన టికెట్ల ధరలను కేంద్రం పెంచినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది. ఇక నుంచి విమాన ప్రయాణం మరింత భారంకానుంది. దేశీయ విమాన టికెట్ల ధర కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌర విమాయాన మంత్రిత్వ శాఖ 10 శాతం నుంచి 30 శాతం వరకు గురువారం పెంచింది. ఈ కొత్త పరిమితులు వచ్చే మార్చి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు అమల్లో ఉండనున్నాయని మంత్రిత్వ శాఖ ఆదేశాల్లో పేర్కొందని పత్రిక రాసింది. గత ఏడాది మే 21న దే శీయ విమాన సర్వీసులను పునరుద్ధరించిన సందర్భంగా మంత్రిత్వ శాఖ విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధించింది. విమాన ప్రయాణ కాలాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించింది. ధరల పెరుగుదల వలన విమాన ప్రయాణికులపై భారం అధికంగా ఉండనుంది. విమానయాన కంపెనీలు తమ టికెట్లలో కనీసం 40 శాతం టికెట్లు కనిష్ఠ, గరిష్ఠ పరిమితిలోని సగటు ధరకన్నా తక్కువకు విక్రయించాలని గత మే 21న డీజీసీఏ వెల్లడించింది. కొవిడ్‌ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ పూర్తి సామర్థ్యంలో 80 శాతం విమానాలు మాత్రమే నడపాలని స్పష్టం చేసిందని ఆంధ్రజ్యోతి వివరించింది. రాష్ట్రం రాబడి పెరగాలి- సీఎం వై.ఎస్.జగన్ రాష్ట్ర ఆదాయ మార్గాల పెంపుపై దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారులకు సూచించారని సాక్షి కథనం ప్రచురించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 'నవరత్నాలు', సంక్షేమ పథకాల అమలుతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆదాయ మార్గాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రజలపై భారం మోపకుండా రాబడి పెంచడానికి ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆదాయ ఆర్జన శాఖలు, సంస్థల అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎక్కడెక్కడ దృష్టి పెడితే ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుని తరచూ సమీక్షించుకుంటూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారని పత్రిక పేర్కొంది. సంక్షేమ పథకాల ద్వారా పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పరచాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. వీటితోపాటు అభివృద్ధి పనులకు కూడా నిధులు అవసరమైనందున ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే... గత ఆర్థిక ఏడాది కంటే ఈ ఏడాది రూ.1,800 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, పరిస్థితి మెరుగు పడుతోందని అధికారులు సీఎంకు వివరించారని సాక్షి వివరించింది. ఎకానమీ ఎసీ-3 కోచ్ సామాన్యుల కోసం ఎకానమీ ఏసీ-3 టైర్ కోచ్‌లు సామాన్యులకు ఏసీ-3 టైర్ ప్రయాణం సౌకర్యాన్ని అందించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కోచ్‌లు ఆవిష్కరించిందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది. ఎకానమీ ఏసీ 3-టైర్‌ కోచ్‌లను రైల్వే శాఖ ఆవిష్కరించింది. ఏసీ రైలు ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త కోచ్‌లను మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో తయారుచేసిన కొత్త 3-టైర్‌ కోచ్‌లలో 83 చొప్పున బెర్త్‌లు ఉంటాయి. ప్రస్తుతమున్న 3-టైర్‌ కోచ్‌లలో బెర్త్‌లు 64, స్లీపర్‌ క్లాస్‌లో 72 చొప్పున ఉన్నాయి. కొత్త కోచ్‌లలో ప్రతి బెర్త్‌కు ప్రత్యేకంగా ఏసీ వెంట్‌లు, రీడింగ్‌ లైట్లు, యూఎస్‌బీ చార్జర్‌ ఉంటాయి. ఫైర్‌-ప్రూఫ్‌ బెర్త్‌లు, పై బెర్త్‌లకు ఎక్కేందుకు ఆధునీకరించిన నిచ్చెనలు ఇతర ప్రత్యేకతలు. కొత్త కోచ్‌లను ఇంజనీరింగ్‌ అద్భుతంగా అభివర్ణిస్తున్నారని నమస్తే తెలంగాణ రాసింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హైదరాబాద్‌ శివార్లలో విద్యార్థినిపై అత్యాచారం చేయాలని నిందితులు ముందే ప్లాన్ వేశారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. text: ఫలితంగా విధిలేని పరిస్థితుల్లో జనం రకరకాల చిట్కాలు ఉపయోగించి చూడాల్సి వస్తోంది. ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ కొందరు చాలా ప్రమాదకరమైన పద్ధతుల ద్వారా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉదాహరణకు ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ పెంచడానికి అసలు ఏమాత్రం పని చేయని వంటింటి చిట్కాలు కూడా చెబుతున్నారు. నెబులైజర్‌తో ఆక్సిజన్ అందుతుందా ఒకవైపు దేశంలో మెడికల్ ఆక్సిజన్ దొరక్క జనం అల్లాడిపోతుంటే మరోవైపు తనను డాక్టర్‌గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా షేర్ అవుతోంది. తనను డాక్టర్‌గా చెప్పుకుంటున్న ఆయన ఈ వీడియోలో నెబులైజర్ ఆక్సిజన్ సిలిండర్‌లా పనిచేస్తుందని అంటున్నారు. నెబులైజర్ అంటే శ్వాస పీల్చుకోవడం ద్వారా ఔషధాన్ని రోగి శరీరంలోకి పంపించే ఒక పరికరం. ఔషధం ఒక ఆవిరిలా మారినప్పుడు, రోగి దానిని శ్వాస ద్వారా పీల్చుకుంటాడు. వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఈ వీడియోలో ఆయన దాన్ని ఎలా ఉపయోగించాలో హిందీలో చెప్పడం కనిపిస్తుంది. "మన వాతావరణంలో తగినంత ఆక్సిజన్ ఉంది. ఈ నెబులైజర్ దానిని మన శరీరంలోకి పంపగలదు. ఆక్సిజన్ లాగడానికి మీకు ఒక నెబులైజర్ ఉంటే చాలు" అని ఆయన చెబుతుంటారు. ఆ పోస్ట్‌లో హాస్పిటల్ పేరు కూడా ఇచ్చారు. అది దిల్లీకి దగ్గరగా ఉంది. కానీ, ఇప్పుడు ఆయన మాట మార్చారు. "నెబులైజర్ నుంచి ఆక్సిజన్ అందుతుంది అనే వాదనలకు ఎలాంటి ప్రమాణాలు, శాస్త్రీయ అధ్యయనాలు లేవు" అని ఆయన చెప్పారు. అదనపు ఆక్సిజన్‌ను అందించడానికి ఈ టెక్నిక్ అసలు పనిచేయదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. డాక్టరుగా చెబుతున్న వ్యక్తి వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, ఆయన మరో వీడియో కూడా విడుదల చేశారు. అందులో ఆయన తన సందేశాన్ని ప్రజలు అపార్థం చేసుకున్నారని.. నెబులైజర్‌ను ఆక్సిజన్ సిలిండర్ స్థానంలో ఉపయోగించవచ్చు అని చెప్పడం తన ఉద్దేశం కాదని అన్నారు. అయితే, ఆయన మొదట చెప్పిన నెబులైజర్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ షేర్ అవుతూనే ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒక ప్రసంగంలో ఈ వీడియో స్క్రీన్ షాట్ కూడా చూపించారు. డాక్టర్లు ఫోన్, వాట్సాప్ ద్వారా రోగులకు మందుల గురించి సలహాలు, సూచనలు ఇస్తున్నారని చెప్పడానికి ఆయన ఈ స్క్రీన్ షాట్ చూపించారు. అయితే ఆయన తన ప్రసంగంలో ఈ వీడియో, ఆడియో ఉపయోగించలేదు. మూలికలతో ఆక్సిజన్ స్థాయి పెరగదు భారత సోషల్ మీడియా ప్లాట్‌పాంలలో కోవిడ్-19 చికిత్స గురించి చెబుతూ ఇటీవల ఆక్సిజన్ లెవల్ పెంచుతాయంటూ వంటింటి చిట్కాలు కూడా వెల్లువెత్తాయి. ఇంటర్‌నెట్, చాట్ ఫ్లాట్‌ఫాంలలో ఈ చిట్కాలు జోరుగా షేర్ అయ్యాయి. వాటిలో కర్పూరం, వాము, నీలగిరి తైలం మిశ్రమం కోవిడ్ రోగుల్లో ఆక్సిజన్ లెవల్ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. కానీ, ఈ మిశ్రమం వల్ల కోవిడ్-19 రోగులకు ఏదైనా ప్రయోజనం కలిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సంప్రదాయ ఆయుర్వేద ఔషధాన్ని ప్రమోట్ చేస్తూ ఒక డాక్టర్ పెట్టిన ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో 23 వేల సార్లు షేర్ చేశారు. ఈ వీడియో వాట్సాప్‌లో కూడా జోరుగా షేర్ అవుతోంది. ఇక వాస్తవం ఏంటంటే, సాధారణంగా స్కిన్ క్రీమ్, లేపనంలా ఉపయోగించే కర్పూరంను శరీరం లోపలికి తీసుకోవడం ప్రాణాంతకం కావచ్చు. కర్పూరం ఆవిరి శరీరంలోపల విషపూరితం కాగలదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది. విజయ్ సంకేశ్వర్ వాదన గురించి వార్త నిమ్మరసం కరోనాకు మందు కాదు ఒక సీనియర్ నేత, పారిశ్రామిక వేత్త ఇటీవల ముక్కులో రెండు చుక్కల నిమ్మ రసం వేసుకుంటే శరీరంలో ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ పెరుగుతుందని చెప్పారు. "ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న తన సహచరులకు ఈ చిట్కా పాటించమని చెప్పాను. అది చేశాక వారి ఆక్సిజన్ లెవల్ 88 శాతం నుంచి 96 శాతానికి చేరింది" అని విజయ్ సంకేశ్వర్ అనే ఆయన చెప్పారు. "ఈ చిట్కాతో భారత్‌లో 80 శాతం ఆక్సిజన్ సమస్య తీరిపోతుందని" కూడా ఆయన అన్నారు. కానీ ఆక్సిజన్ లెవల్ పెంచడానికి ఈ చిట్కా పనిచేస్తుందని కూడా ఎలాంటి ప్రామాణికతా లేదు. యోగా గురు రాందేవ్ చిట్కాలు భారత్‌కు చెందిన ప్రముఖ యోగా గురు రాందేవ్ కూడా ఈ మధ్య "ఇంట్లో కూర్చునే ఆక్సిజన్ లెవల్ పెంచుకునే పద్ధతుల" గురించి వార్తా చానళ్లలో, తన యూట్యూబ్ చానల్ వీడియోల్లో చెబుతూ కనిపిస్తున్నారు. ఆ వీడియోలో ఆయన "దేశమంతా ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు" అంటారు. తన వేలికి ఒక ఆక్సిజన్ లెవల్ కనుగొనే డివైస్ పెట్టుకుంటున్న బాబా "మీకు ఒక అద్భుతం చూపిస్తున్నాను" అంటారు. ఆ తర్వాత ఆయన శ్వాసకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేసి చూపిస్తారు. ఒక ఆసనంలో కూర్చున్న రాందేవ్ మొదట కొంత సేపు శ్వాసను ఆపుతారు. తన ఆక్సిజన్ లెవల్ సురక్షిత స్థాయి కంటే దిగువకు పడిపోతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఆయన "ఆక్సిజన్ పడిపోవడానికి 20 సెకన్లు పడుతుంది. రెండు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ రక్తంలో ఆక్సిజన్ దానికదే వచ్చేస్తుంది" ఎందుకంటే మన వాతావరణంలో తగినంత ఆక్సిజన్ ఉంది అంటారు. సాధారణంగా యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, "కోవిడ్-19 లాంటి సమస్య వల్ల శరీరంలో ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ తగ్గిపోయినప్పుడు, దానిని బయటి నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే, సప్లిమెంటల్ మెడికల్ ఆక్సిజన్ అవసరమవుతుంది" అని డబ్ల్యుహెచ్ఓ చెబుతోంది. "రోగి శరీరంలో ఆక్సిజన్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితి ఎక్కువ సమయం కొనసాగితే, దానికి తగిన చికిత్స అందకపోతే, శరీరంలోని కణాలు తమకుతాముగా పనిచేయడం ఆగిపోతుంది. ఆ పరిస్థితిలో కేవలం మెడికల్ ఆక్సిజన్ మాత్రమే ప్రాణాలు కాపాడగలదు" అని డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ జెనెట్ డియాజ్ చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా సెకండ్ వేవ్ భారత ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న రోగులకు సత్వర చికిత్స అవసరం అవుతోంది. text: ఇవీ దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి 'ఘనాం'కాలు! దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ మొట్టమొదటి సారి వన్డే సిరీస్ గెల్చుకొని చరిత్ర సృష్టించడంలో విరాట్ కోహ్లి పాత్ర ఎంత కీలకమో పై గణాంకాలే సాక్ష్యం. ఈ సిరీస్‌లో పరుగులు చేయడంలో విరాట్ కోహ్లి ఎంతగా ఆధిక్యాన్ని కనబర్చాడంటే రెండో స్థానంలో ఉన్న శిఖర్ ధవన్‌కూ, తనకు మధ్య వ్యత్యాసం 235 పరుగులు. ఆరు మ్యాచ్‌లలో కలిపి శిఖర్ 323 పరుగులు చేశాడు. కోహ్లి మనసులో మాట చివరి వన్డేలో గెలుపు సాధించిన తర్వాత, కామెంటేటర్స్ దగ్గర నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకూ అందరూ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' కోహ్లిపై ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే, ఆయన మాత్రం తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు క్రెడిట్ ఇచ్చాడు. సెంచూరియన్ వన్డే తర్వాత కోహ్లి మాట్లాడుతూ, "గ్రౌండ్ బయటి నుంచి సహకారం అందించిన వారికి కూడా క్రెడిట్ దక్కాల్సిందే. నా భార్య నా మనోస్థైర్యాన్ని పెంచింది. అందుకు గాను ఆమెకు ప్రశంసలు దక్కాల్సిందే. గతంలో ఆమెపై బాగా విమర్శలొచ్చాయి. ఈ టూర్‌లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అయితే ఆమె నన్ను ఎల్లప్పుడూ ముందడుగు వేసేలా ప్రేరణనిచ్చింది. ఆమెకు నా ధన్యవాదాలు" అని అన్నాడు. అనుష్కతో వివాహం తర్వాత విరాట్ కోహ్లికి ఇది మొట్టమొదటి విదేశీ పర్యటన. సవాలు కఠినమైందే అయితే దక్షిణాఫ్రికాలో కోహ్లి సేన ప్రయాణం నల్లేరుపై బండి నడకలా ఏమీ సాగలేదు. టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. మొదటి రెండు టెస్ట్ మ్యాచుల్లో ఓటమి తర్వాత కెప్టెన్‌గా అతని నిర్ణయాలపై పలు సందేహాలు కూడా విమర్శకులు లేవనెత్తారు. అంతేకాదు, దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఇండియా ఎన్నడూ వన్డే సిరీస్‌ను గెల్చుకోలేదని చరిత్ర తెగేసి చెబుతోంది. కానీ కోహ్లి మాత్రం చరిత్రను తిరగరాయాలనే పట్టు బట్టినట్టున్నాడు. ఆయన ముందు నిలబడి టీంకు నేతృత్వం వహించాడు. ఈ సిరీస్‌లో ఆయన బ్యాట్ నుంచి వెలువడ్డ మూడు శతకాల్లో మొదటిది డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో నమోదైంది. 112 పరుగులు చేసిన కోహ్లి టీంకు విజయాన్ని అందించడమే కాదు, దక్షిణాఫ్రికా పట్ల జట్టు సభ్యుల మనుసుల్లో నెలకొన్న భయాలను కూడా పటాపంచలు చేశాడు. సిరీస్ ప్రారంభంలో వన్డే ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పుడు టాప్‌కు చేరుకుంది. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధిస్తున్న కొద్ది టీం ర్యాంకింగ్ మెరుగవుతూ వచ్చింది. కెప్టెన్‌కు కోచ్ ప్రశంసలు దక్షిణాఫ్రికాలో విజయం సాధించి చరిత్ర సృష్టించడంలో క్రెడిట్ విరాట్ కోహ్లికే దక్కుతుందని కోచ్ రవిశాస్త్రి అన్నారు. "కెప్టెన్‌కే పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. ఆయన ఇంటెన్సిటీ లెవల్ చాలా ఉన్నతంగా ఉంది. అతన్ని చూస్తే మిగతా ఆటగాళ్లకు కూడా ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలన్న ప్రేరణ లభిస్తుంది" అని రవి అన్నారు. తన పర్‌ఫార్మెన్స్ పట్ల కోహ్లి కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఈ విజయానికి క్రెడిట్ మొత్తం జట్టుకు దక్కుతుందని అన్నాడు. "ప్రదర్శనలో ఎప్పుడూ నేను ముందు నిలబడి నేతృత్వం వహించాలని అనుకుంటాను. మొత్తం టీం కష్టపడింది. అందుకే సిరీస్‌ను 5-1 ఆధిక్యంతో గెల్చుకున్నాం. ఇదో గొప్ప అనుభవం" అని విరాట్ అన్నాడు. సరైన నిర్ణయాలు, సత్ఫలితాలు టెస్ట్ సిరీస్‌కు భిన్నంగా వన్డే సిరీస్‌లో కోహ్లి నాయకత్వ తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆయన సరైన టీంను ఎన్నుకున్నాడు. బౌలర్లను సరైన పద్ధతిలో ఉపయోగించాడు. అనుభవజ్ఞుడైన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కూడా ఆయనకు చాలా మద్దతు లభించింది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్‌లు ఇద్దరూ కెప్టెన్ తమపై పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టడమే కాదు, ఇప్పుడు వారిద్దరూ నవతరం భారతీయ స్పిన్ స్టార్లుగా అవతరించారు. ఆరు మ్యాచ్‌లలో 13.88 సగటుతో కుల్దీప్ యాదవ్ 17 వికెట్లు తీసుకున్నాడు. సిరీస్‌లో అతడే మేటి బౌలర్‌గా నిలిచాడు. యుజువేంద్ర చహల్ ఆయనకన్నా ఓ మెట్టు మాత్రమే కింద నిలుస్తూ, 16.37 సగటుతో 16 వికెట్లు దక్కించుకున్నాడు. అందుకే మరి, కెప్టెన్ విరాట్ కోహ్లి తన బౌలర్లను ప్రశంసల్లో ముంచెత్తాడు. "ఈ ఇద్దరు మణికట్టు మాంత్రికులు అద్భుతంగా రాణించారు. వాళ్లిద్దరూ దక్షిణాఫ్రికాలో తొలిసారి ఆడారు. ఎంతో సాహసం కనబర్చారు. అందుకే వారికి వికెట్లు దక్కాయి" అని కోహ్లి అన్నాడు. కోహ్లి ఉన్నాడు జాగ్రత్త! తాజా వన్డే సిరీస్‌లో నిరుపమాన విజయం సాధించిన తర్వాత కోహ్లి ఇప్పుడు మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపించాడు. భవిష్యత్తులోనూ ఇదే జోరును కొనసాగించాలనే పట్టుదలను వ్యక్తం చేశాడు. "నా కెరీర్‌లో ఇంకా బహుశా ఎనిమిది లేదా తొమ్మిదేళ్ల సమయం మిగిలింది. ఒక క్రికెటర్ కెరీర్ చాలా సుదీర్ఘంగా ఏమీ ఉండదు. నేను ఇందులో వీలైనంత ఎక్కువగా సాధించాలని కోరుకుంటున్నా. దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించడం కన్నా మించిన గౌరవం మరొకటి ఏదీ ఉండదు. దీనిని నేను తేలిగ్గా తీసుకుంటే నాకు ఇప్పటి వరకు లభించిన గౌరవానికి న్యాయం చేసినట్టు అవదు" అని కోహ్లి అన్నాడు. అంటే ఇకపై తన ప్రత్యర్థి టీంలకూ, బౌలర్లకు ఊరటనిచ్చే ప్రసక్తే లేదనే సంకేతాలిస్తున్నాడు విరాట్ కోహ్లి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా? మ్యాచ్‌లు : 6 సగటు స్కోరు : 186 పరుగులు : 558 సెంచరీలు : 3 text: ఒక గిగాబైట్ (జీబీ) డేటా ధర భారత్‌లో 0.26 డాలర్లు కాగా ఇది యూకేలో 6.66 డాలర్లుగా ఉందని కేబుల్.కో.యూకే అనే ఓ సంస్థ చేసిన ఈ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో కూడా డేటా ధరలు ఎక్కువగానే ఉన్నాయని, 1 జీబీ డేటా 12.37 డాలర్లుగా ఉందని తెలిపింది. ఈ ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయని 'కేబుల్' సంస్థ టెలీకమ్యూనికేషన్స్ విశ్లేషకుడు డాన్ హౌడిల్ తెలిపారు. "యూకే ఆరోగ్యకరమైన మార్కెట్టే అయినా ఈయూలోని ఫిన్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ వంటి కొన్ని దేశాల్లో డేటాకోసం యూకేలో మేం చెల్లించేదాని కన్నా చాలా తక్కువ చెల్లిస్తున్నారు. బ్రెగ్జిట్ తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 230 దేశాల్లో మొబైల్ డేటా రేట్లు ఎలా ఉన్నాయో ఈ అధ్యయనంలో భాగంగా కేబుల్ సంస్థ పరిశీలించింది. దీనిలో యూకే 136వ స్థానంలో నిలిచింది. 1 జీబీ డేటాకు ప్రపంచ సగటు ధర 8.53 డాలర్లు అని ఈ అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ యూరప్‌లో అత్యంత చవకగా 1.16 డాలర్లకే 1 జీబీ మొబైల్ డేటా అందిస్తున్న దేశం ఫిన్లాండ్. డెన్మార్క్, మొనాకో, ఇటలీల్లో కూడా 1 జీబీ డేటా ధర 2 డాలర్లలోపే ఉంది. ఇక్కడి 15 దేశాల్లో యూకే కన్నా తక్కువ ధరకే మొబైల్ డేటా లభిస్తోంది. తూర్పు యూరప్‌లోని పోలాండ్‌లో 1 జీబీ మొబైల్ డేటా ధర 1.32 డాలర్లు కాగా, రొమేనియాలో 1.89 డాలర్లు, స్లొవేనియాలో 2.21 డాలర్లుగా ఉంది. తూర్పు యూరప్‌లో చవకగా డేటా అందించే దేశాలు ఇవే. డేటా రేట్లు (డాలర్లలో) తక్కువగా ఉన్న మొదటి ఐదు దేశాలు డేటా రేట్లు (డాలర్లలో) ఎక్కువగా ఉన్న మొదటి ఐదు దేశాలు డేటా ప్యాక్‌ల ధరలు 1 జీబీ మొబైల్ డేటా ధర అత్యధికంగా జింబాబ్వేలో 75.20 డాలర్లుగా ఉంది. అత్యంత చవకైన, ఖరీదైన డేటా సేవలందించే దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. రువాండా, సుడాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. ఇవన్నీ 1 డాలర్ కన్నా తక్కువగే 1 జీబీ డేటానిస్తున్నాయి. కానీ ఈక్వటోరియల్ గినీ, సెయింట్ హెలీనాలు అదే డేటాకు 50 డాలర్లకు పైగా వసూలు చేస్తున్నాయి. చవకగా డేటా లభించే మొదటి 20 దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. ఇక్కడి తైవాన్, చైనా, దక్షిణ కొరియాలు మాత్రమే ప్రపంచ సగటు ధర కన్నా కొద్దిగా ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ధరల్లో ఇన్ని వ్యత్యాసాలకు కారణాలు చాలా సంక్షిష్టంగా ఉన్నాయని హౌడిల్ అభిప్రాయపడ్డారు. "కొన్ని దేశాల్లో మొబైల్, ఫిక్సుడ్ బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల అక్కడి ప్రొవైడర్లు పెద్దమొత్తంలో డేటాను అందించగలుగుతున్నాయి. దీంతో రేట్లు దిగివస్తున్నాయి. బ్రాండ్‌బ్యాండ్‌ వ్యవస్థకు కావలసిన మౌలిక సౌకర్యాలు సరిగ్గా లేని దేశాల్లో మొబైల్ డేటాపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి ప్రభుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోనే రేట్లు ఉండాలని ఆదేశిస్తున్నాయి" అని ఆయన విశ్లేషించారు. "డేటా రేట్లు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను చూస్తే... మౌలిక సౌకర్యాలు అంత గొప్పగా లేని దేశాల్లో వినియోగం కూడా చాలా తక్కువగానే ఉంటోంది. ప్రజలు చాలా తక్కువమొత్తంలో అంటే, 10 మెగాబైట్ల వంటి తక్కువ డేటా ప్యాక్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారికి గిగాబైట్ డేటాను కొనడం అంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది" అని హౌడిల్ తెలిపారు. వివిధ దేశాల్లో లభించే విభిన్న ప్యాకేజీలు, సిమ్-ఓన్లీ ఆఫర్ల ఆధారంగా ఈ పరిశోధన జరిగింది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) యూకేలో మొబైల్ డేటాకోసం ప్రజలు చెల్లించే ధరలు యూరప్‌లోని ఇతర దేశాలకన్నా ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. text: కానీ, డేవిడ్‌కు అతడి భార్య కన్నా ఇరవై రెట్లు ఎక్కువ రుణం తీసుకోవటానికి ఆపిల్ కార్డ్ అనుమతి ఇచ్చింది. ఇదేదో అరుదైన ఉదంతం కాదు. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వాజ్నియాక్ కూడా తాను, తన భార్యకు వేరే బ్యాంక్ అకౌంట్లు, వేరే ఆస్తులు లేకపోయినా తమ విషయంలోనూ ఇలాగే జరిగిందని ట్వీట్ చేశారు. ఈ అంశం అమెరికాలో ప్రజల ఆగ్రహానికి కారణమైంది. నియంత్రణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆపిల్ కార్డును నిర్వహించే గోల్డ్‌మాన్ సాక్స్ ‌సంస్థను రాజకీయ నాయకులు విమర్శించారు. అయితే, ఇలా లింగ వివక్ష, జాతి వివక్ష లేదా మరో రకమైన వివక్షతో నిర్ణయాలు తీసుకోవటంలో మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్‌ల - అంటే కంప్యూటర్ అంచనాలు వేయటానికి సంబంధించిన నియమనిబంధనల - పాత్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కంప్యూటర్లు నిష్పాక్షికమైన యంత్రాలని, మనుషుల తరహాలో ఆలోచించలేవు కాబట్టి అవి వివక్ష చూపవని సమాజం పొరపాటుపడుతుంది. వాస్తవం ఏమిటంటే, అవి ప్రాసెస్ చేసే సమాచారం, బహుశా వాటికి ఆ డాటాను అందించే వారు, వాటిని తయారు చేసే వారు స్వయంగా వివక్షాపూరితంగా ఉంటారు. ఎక్కువ శాతం తాము వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నామని వారికి కూడా తెలియదు. అలాగే, యంత్రాలు కూడా లింగ సమాచారం వంటి నిర్దిష్ట ప్రశ్నలు అడగకుండానే పురుషులు, మహిళల మధ్య వివక్షాపూరిత నిర్ధారణలకు రాగలవు. మన జీవితాల మీద ప్రభావం ఏమిటి? కంప్యూటర్ ఆల్గోరిథమ్‌ల వినియోగం వల్ల మన రోజువారీ జీవితాల్లో చాలా అంశాలు - రవాణా నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకూ కొనుగోళ్ల నుంచి క్రీడల వరకూ - మారిపోవటమే కాదు.. మెరుగుపడ్డాయనటంలో సందేహం లేదు. ముఖ్యంగా, మన ఆర్థిక జీవితాలపై విస్పష్టమైన, ప్రత్యక్ష ప్రభావం ఉంది. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు గృహ రుణాలు తదితర రుణ దరఖాస్తులను ప్రాసెస్ చేయటానికి మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. బీమా రంగం కూడా రిస్కు స్థాయిని నిర్ధారించటానికి మెషీన్ల మీదే ఆధారపడుతోంది. ఒక వినియోగదారు దేనికైనా ఎంత చెల్లించాల్సి ఉంటుంది, అసలు ఆ వినియోగదారుకు ఆ ఉత్పత్తి లభిస్తుందా లేదా అనేది నిర్ణయించటానికి ఆల్గోరిథమే కీలకం. బీమాను చూడండి: ఒకే రకమైన ఆస్తులు, ఒకే రకమైన భద్రతా వ్యవస్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఇంటి బీమా కోసం వేర్వేరు మొత్తాలు చెల్లించటానికి కారణం దానిని ఒక ఆల్గోరిథమ్ నిర్ణయించటమే. ఆల్గోరిథమ్ ఆయా ప్రాంతాల పోస్టల్ కోడ్‌ను ఉపయోగించుకుని ఆ ప్రాంతంలో నేరాల రేటును పరిశీలిస్తుంది. అలా సదరు ఆస్తిలో దొంగతనాలు జరగటానికి గల అవకాశాలను అంచనా వేస్తుంది. దాని ప్రకారం బీమాను నిర్ణయిస్తుంది. అలాగే క్రెడిట్ స్కోర్ల విషయంలో కూడా అప్పును తిరిగి చెల్లించటంలో మీరు ఎంత విశ్వసనీయులు అనేదానిపై మెషీన్ నిర్ధారణను.. మీ మొబైల్ ఫోన్ కాంట్రాక్టు మొదలుకుని మీరు అద్దెకు ఉంటున్న ఇల్లు ఎక్కడ ఉందనేది కూడా ప్రభావితం చేస్తుంది. ఆపిల్ కార్డ్ ఉదంతంలో, దాని ఆల్గోరిథమ్ ఎలా నిర్ణయాలకు వస్తుంది, ఏ డేటాను అది ఉపయోగిస్తుంది అనేది మనకు తెలియదు. అయితే, ఏ తరహా వారిని ఆర్థికంగా రిస్కుతో కూడుకున్న వ్యక్తులుగా పరిగణిస్తారు, లేదంటే అప్పు కోసం దరఖాస్తులు చేస్తున్న వారు ఎవరు అనే తరహా పాత సమాచారం ఇందులో ఉండొచ్చు. మరి ఈ ఆల్గోరిథమ్‌లు వివక్షాపూరితమైనవా? దరఖాస్తుదారుల లింగం, జాతి, వయసు వంటి వివరాలను తాము అసలు అడగట్లేదని, అలా అడగటం చట్ట వ్యతిరేకమని ఆపిల్ కార్డును నిర్వహిస్తున్న గోల్డ్‌మాన్ సాక్స్ చెప్తోంది. కాబట్టి దరఖాస్తుదారులు పురుషులా, మహిళలా అనే దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం జరగదని పేర్కొంది. అయితే, ''ప్రచ్ఛన్న అంశాలు'' అనే విషయాన్ని ఈ వాదన విస్మరిస్తోందని శాన్ ఫ్రాన్సిస్కోలోని యూఎస్ఎఫ్ సెంటర్ ఫర్ అప్లయిడ్ డేటా ఎథిక్స్ డైరెక్టర్ రాచెల్ థామస్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉదాహరణకు, మీ లింగం ఏమిటనేది ఒక ఆల్గోరిథమ్‌కు తెలియకపోవచ్చు. కానీ, మీరు ఒక ప్రాథమిక పాఠశాల టీచర్ అనే విషయం దానికి తెలియవచ్చు. అంటే, అది మహిళలు అత్యధికంగా ఉండే రంగంగా దాన్ని గుర్తించగలదు. ఇటువంటి పాత సమాచారం అంతా పోలీసులు, జడ్జిల వంటి మనుషులు తీసుకున్న నిర్ణయాలతో నిండివుండవచ్చు. ఆ నిర్ణయాలను ఒకరి జాతి ప్రభావితం చేసి ఉండవచ్చు. అలాంటి వివక్షాపూరిత గత చరిత్ర నుంచి మెషీన్ నేర్చుకున్నట్లయితే.. అది దానినే పునరావృతం చేస్తుంటుంది. అలాగే, ఇంతకుముందు చూడని సమాచారాన్ని ప్రాసెస్ చేయటం ఇంకా దారుణంగా కూడా ఉంటుంది. ప్రాంతీయ యాసలు లేని శ్వేతజాతీయుల నుంచి తీసుకున్న డేటా ద్వారా అధికంగా 'శిక్షణ' పొందిన ఒక ఫేసియల్ రికగ్నిషన్, లేదా వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్.. ఎవరైనా ఒక వ్యక్తి శ్వేతజాతీయుడు కానట్లయితే, లేదంటే వారి ప్రాంతీయ యాస బలంగా ఉన్నట్లయితే వారిని సరిగా గుర్తించలేకపోవచ్చు. ఈ అంశం కాల్ సెంటర్‌కు ఫోన్ చేసే కొంతమందికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ సమస్య విషయంలో మనం ఏం చేయగలం? ఆల్గోరిథమ్‌లలో నిష్పక్షపాత వ్యవస్థ మీద కొంత కాలంగా వాడి వేడి చర్చ జరుగుతోంది. ఆ చర్చలో ఏకాభిప్రాయం లేదు. అయితే, వ్యాపార సంస్థలు ఈ ఆల్గోరిథమ్‌ను ఎలా నెలకొల్పామనే దాని గురించి పూర్తి వివరాలు వెల్లడించటం ఒక మార్గం. కానీ, ఈ ఉత్పత్తులు విలువైన వాణిజ్య ఆస్తులు. అత్యంత నైపుణ్యం గల వ్యక్తులతో అధిక వేతనాలు చెల్లించి వీటిని అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ రహస్యాలను బయటపెట్టటానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉండవు. అమెజాన్ సంస్థ ఆల్గోరిథమ్‌ తమకు ఉచితంగా లభిస్తే చాలా రిటైల్ సంస్థలు ఎంతో సంతోషిస్తాయి. ఆల్గోరిథమ్ పారదర్శకంగా ఉండటం మరొక మార్గం. అంటే, ఒక వినియోగదారుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నపుడు దానికి కారణాలు ఏమిటి, వారి సమాచారంలోని ఏ అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఉందనేది ఆ వినియోగదారుకు వెల్లడించడం. ఇటువంటి సమాచారాన్ని వెల్లడించడమెలా అనే దాని మీద కూడా ఏకాభిప్రాయం లేదు. తక్కువ నిర్దిష్ట సమాచారం ప్రాతిపదికగా ఎక్కువ ఆల్గోరిథమ్‌లు పనిచేయటం మరొక మార్గం. సమీకరించిన విధానాలను ఉపయోగించటం పెరుగుతోందని బీమా రంగానికి సాఫ్ట్‌వేర్‌ను అందించే చార్లెస్ టేలర్ ఇన్స్యూర్‌టెక్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేసన్ సహోటా చెప్తున్నారు. అంటే, ఒక బీమా సంస్థ ఒక నిర్దిష్ట కార్మికుల బృందానికి ఉమ్మడిగా ఆరోగ్య బీమా అందించవచ్చు. బీమా సంస్థ ఈ బృందం మొత్తానికి కలిపి రిస్క్‌ను అంచనా వేస్తుంది కాబట్టి.. అలా బీమా పొందినవారు వ్యక్తిగతంగా దరఖాస్తులు నింపాల్సిన అవసరం ఉండదు. బీమా నిబంధనలను సరళీకరిస్తుండటంతో ప్రాసెస్‌ తక్కువగా ఉండాలని, వేగంగా చెల్లింపులు జరగాలని వినియోగదారుల డిమాండ్లు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చేయటం వల్ల విధానాలకు - దరఖాస్తుదారులకు మధ్య తేడాను గుర్తించటం కష్టమవుతుంది. దీనివల్ల ఒక్కో వ్యక్తికి నిర్దిష్టంగా ఉత్పత్తులను రూపొందించటంతో పాటు, అవి మరింత ఖరీదైనవిగా కూడా ఉంటాయి. దానికి బదులుగా వారి సమాచారాన్ని ఎందుకు అడుగుతున్నామనేది, దానిని ఎలా ఉపయోగిస్తున్నామనేది ప్రజలకు చెప్పాలంటారు సహోటా. ఒకవేళ ఏదైనా వివక్షాపూరితంగా కనిపించినట్లయితే.. కేవలం డేటాను తప్పుపట్టి సరిపుచ్చటంతో కాకుండా ఈ సమస్యను అధిగమించే మార్గాన్ని కనిపెట్టడానికి కృషి చేయటం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జామీ హీన్‌మీయర్ హాన్సాన్‌కు తన భర్త టెక్ వ్యాపారవేత్త డేవిడ్ కన్నా మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంది. వారికి తమ ఆస్తిలో సమాన వాటాలున్నాయి. ఆదాయ పన్ను రిటర్నులను జాయింట్‌గా సమర్పిస్తారు. text: జిమ్మీ లాయ్‌ను తీసుకెళ్తున్న పోలీసులు చైనా గత జూన్ నెలలో కొత్తగా అమలులోకి తెచ్చిన వివాదాస్పద భద్రతా చట్టం కింద ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన వారిలో అత్యంత ప్రముఖ వ్యక్తి జిమ్మీ లాయ్. ప్రజాస్వామ్య గళం వినిపించే వారిలోనూ జిమ్మీ ప్రముఖులు. గత ఏడాది హాంగ్ కాంగ్‌లో చెలరేగిన నిరసనలకు మద్దతుగా నిలిచారు. జిమ్మీ లాయ్‌ వయసు ప్రస్తుతం 71 సంవత్సరాలు. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఆయన మీద ఫిబ్రవరి నెలలో చట్టవ్యతిరేక సమావేశం, బెదిరింపు అభియోగాలు నమోదు చేశారు. జిమ్మీని సోమవారం అరెస్ట్ చేసిన అనంతరం పోలీస్ బెయిల్ మంజూరు చేశారు. అల్లర్లకు జిమ్మీ ఆజ్యం పోశారని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. ఆయన ప్రచురణలు విద్వేషాలను రెచ్చగొట్టేలా, పుకార్లు పుట్టించేలా, హాంకాంగ్, చైనా అధికారులపై బురద జల్లేలా ఉన్నాయని పేర్కొంది. జిమ్మీతోపాటు ఆయన ద్దరు కొడుకులు, తమ సంస్థ నెక్స్ట్ డిజిటల్‌లో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లనూ అరెస్టు చేసినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. జిమ్మీ పత్రిక యాపిల్ డైలీ భవనంలో సోదాలు చేపట్టేందుకు పోలీసులు ప్రవేశిస్తున్న దృశ్యాలు కూడా మీడియాలో కనిపించాయి. మరోవైపు ఈ అరెస్టును పోలీసులు కూడా ధ్రువీకరించారు. విదేశీ శక్తులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 39 నుంచి 72 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఫేస్‌బుక్‌లో తెలిపారు. అయితే జిమ్మీ పేరును వారు ప్రస్తావించలేదు. జిమ్మీ లాయ్ ఎవరు? జిమ్మీ లాయ్ ఓ దిగ్గజ వ్యాపారవేత్త. ఆయన ఆస్తుల విలువ బిలియన్ డాలర్లపైనే ఉంటుంది. వస్త్ర వ్యాపారంతో ఆయన బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం యాపిల్ డైలీ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక చైనా అధినాయకత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంది. హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఉద్యమకారుల్లో ఆయన కూడా ఒకరు. 2019 నిరసనలకు ఆయన మద్దతు పలికారు. అంతేకాదు ప్రదర్శనల్లో పాలుపంచుకున్నారు కూడా. జూన్ 30న హాంకాంగ్ కొత్త భద్రతా చట్టాన్ని ఆమోదించినప్పుడు.. ఇది హాంకాంగ్‌కు చీకటి రోజని బీబీసీతో ఆయన చెప్పారు. కొత్త చట్టంతో హాంకాంగ్ కూడా చైనాలా అవినీతి మయం అవుతుందని, ఇక్కడ వ్యాపారం చేసేవారికి ఎలాంటి రక్షణా ఉండదని అన్నారు. ''జైలుకు వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడ నేను చదవడానికి వీలుపడని కొత్త పుస్తకాలు చదువుకోవచ్చు. అయినా నేను పాజిటివ్‌గానే ఉంటాను'' అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. హాంకాంగ్ ప్రతి స్పందన ఏమిటి? అరెస్టును తాము ప్రత్యక్ష వేధింపులుగా పరిగణిస్తున్నామని, తాము న్యాయవాదులను ఏర్పాటు చేస్తున్నామని యాపిల్ డైలీ వర్గాలు తెలిపాయి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య అభిప్రాయాలను అణచివేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తాము అనుకున్నవన్నీ నిజమయ్యాయని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ ఆసియా విభాగం కో-ఆర్డినేటర్ టేవెన్ బట్లర్ వ్యాఖ్యానించారు. ''జిమ్మీని వెంటనే విడుదల చేయాలి. ఆయనపై అభియోగాలను వెనక్కి తీసుకోవాలి'' ఈ అరెస్టును తాము ముందుగానే ఊహించామని 1989 తియాన్‌మెన్ స్క్వేర్‌ నిరసనల్లో పాలుపంచుకున్న వాంగ్ డాన్ చెప్పారు. అయితే ఆయన కొడుకులను అరెస్టు చేయడాన్ని తాము ఊహించలేదని అన్నారు. కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం ద్వారా జిమ్మి సంకల్పాన్ని దెబ్బతీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ''ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలు చర్యలు తీసుకోవాలి'' జిమ్మీ అరెస్టును హాంకాంగ్ హక్కుల ఉద్యమకర్త జాషువా వాంగ్ కూడా ఖండించారు. నెక్స్ట్ డిజిటల్ సంస్థ వెలుపల పోలీసులు మీడియా భవిష్యత్తు అనిశ్చితిలో గ్రేస్ సోయ్, బీబీసీ వరల్డ్ సర్వీస్, విశ్లేషణ హాంకాంగ్‌లో అతిపెద్ద ప్రజాస్వామ్య అనుకూల పత్రికైన యాపిల్ డైలీ న్యూస్‌రూమ్‌పై 200 మంది పోలీసు అధికారులు సోదాలు చేపట్టడంతో చాలా మంది విస్మయానికి గురయ్యారు. ఇక్కడ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం. నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని ఆమోదించినప్పుడే ఇలాంటివి జరుగుతాయని తాము ఊహించినట్లు యాపిల్ డైలీ ఉద్యోగి ఒకరు వివరించారు. హాంకాంగ్‌పై చైనా ప్రభుత్వ ఆధిపత్యంతోపాటు హాంకాంగ్ అధికారులనూ జిమ్మీ తరచుగా విమర్శించేవారు. అందుకే ఆయన్ను నగరంలో ఘర్షణలకు కారణమయ్యే వ్యక్తిగా చైనా అధికార వార్తా సంస్థ ముద్ర వేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోలను ఆయన కలిసినప్పుడు చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. నెక్స్ట్ మీడియా ప్రతి వార్తనూ సంచలనంగా చూపిస్తుందని విమర్శలు ఉన్నాయి. అయితే చైనాతో వ్యాపార సంబంధాల్లేని అతి తక్కువ మీడియా సంస్థల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న యాపిల్ డైలీ.. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయంపై తాము తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని పత్రిక పేర్కొంది. అయితే జిమ్మీ మాత్రం స్పందించలేదు. ఈ వివాదాన్ని తట్టుకొని సంస్థ నిలబడుతుందా? లేదా అనేది అస్పష్టంగా మారింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలతో హాంగ్ కాంగ్ మీడియా వ్యాపార దిగ్గజం జిమ్మీ లాయ్‌ని పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. ఆయన వార్తా పత్రికల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. text: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి ఒక్కోసారి అది కుట్రలతో, మంత్ర-తంత్రాలతో మగాడిని వశం చేసుకునే మహిళ కథగా ఉంటే, ఇంకోసారి అది సంతోషంగా, బలంగా ఉండే పురుషుడిని అణగారిన, బలహీనమై వ్యక్తిగా మార్చిన మహిళ కథగా కనిపిస్తుంది. కథలో కొత్త మలుపులు కూడా వస్తుంటాయి. ముఖ్య పాత్రలు పోషించే వారు వచ్చివెళ్తుంటారు. చాలా లోతైన సత్యం తెలిసినట్లు తమ అభిప్రాయాలను చెబుతుంటారు. కానీ, ఈ కథ ఒక మహిళ, పురుషుడి మధ్య ఉన్న బంధం గురించి. కానీ, ఇక్కడ పురుషుడు హీరో అయితే, మహిళ విలన్. అది కూడా ఎలాంటి దర్యాప్తూ లేకుండానే. ఇప్పటివరకూ అయితే ప్లాట్ ఇలాగే నడుస్తూ వచ్చింది. ఉంటూ వచ్చింది. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో చనిపోయి కనిపించిన తర్వాత, చాలా కాలం పాటు దానికి కారణం బాలీవుడ్‌లో బంధుప్రీతే అన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రశ్నించారు. టీవీ స్టూడియోలో చర్చలు జోరుగా సాగాయి. కానీ, తర్వాత ఆ సందేహాలన్నీ అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వైపు తిరిగాయి. ఆమెకు డబ్బు ఆశ ఉందన్న కొందరు అత్యాచారం, హత్య కూడా చేస్తామని బెదిరించారు. దీంతో, విసిగిపోయిన రియా దీనిపై ముంబయి పోలీసులకు, సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఆధిపత్యం చూపించే మహిళలు కానీ, సుశాంత్ తండ్రి రియా తన కొడుకు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని, డబ్బుల కోసం పీడించిందని, కుటుంబానికి దూరం చేసిందని బీహార్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో, ఆ వదంతులన్నింటికీ ఒక విధంగా ఆమోద ముద్ర వేసినట్టైంది. దర్యాప్తు జరిగేటపుడు, కోర్టు విచారణ సమయంలో పరిశీలించే అభియోగాలను, అక్కడివరకూ వెళ్లే ముందు ఆరోపణలుగా చెప్పాలి. కానీ, అలా జరగలేదు. రియా చక్రవర్తిని బిహార్ జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ‘విష కన్య’గా వర్ణించారు. “సుశాంత్‌ను ప్రేమలో పడేయడానికి, ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం పంపించారు. తర్వాత, ఆమె అతడిని ఏం చేసిందో మనందరికీ తెలుసు” అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి ఇలాంటి వ్యాఖ్యలతో రియాపైనే కాదు, మొత్తం బెంగాల్ మహిళలపై సోషల్ మీడియాలో విసుర్లు మొదలయ్యాయి. “ఇంగ్లిష్ మాట్లాడే, వివాహేతర సంబంధాలు పెట్టుకోడానికి వెనకాడని, మనసులో మాటను ఓపెన్‌గా చెప్పే బెంగాలీ మహిళలు ఉత్తరభారతంలో మగవాళ్లను నాశనం చేస్తున్నారని” ఆరోపణలు వచ్చాయి. “బెంగాలీ అమ్మాయిలు ఆధిపత్యం చూపిస్తారు. అబ్బాయిలను ఎలా బుట్టలో పెట్టాలో వాళ్లకు తెలుసు, మొదట వాళ్లు మంత్రాలతో పెద్ద చేపకు ఎరవేస్తారు. తర్వాత వారితో అన్ని పనులూ చేస్తారు” అంటూ రకరకాల ట్వీట్స్ పెట్టారు. ఇలాంటి వాటిపై కోల్‌కతా పోలీసులకు రిపోర్ట్ కూడా చేశారు. కానీ, బెంగాలీ, మిగతా మహిళలు సోషల్ మీడియాలో అలా పెట్టినవారికి, అదే పద్ధతిలో సమాధానం చెప్పారు. ట్విటర్‌లో రుచికా శర్మ అనే యువతి “భారత్‌లో మహిళలను మంత్రగత్తెలుగా చెబుతూ టైంపాస్ చేసే పద్ధతి పాపులర్ అవుతోంది. ఇలాంటి ఆలోచనలు దశాబ్దాల స్త్రీవాద ఉద్యమాలను మార్చలేకపోయాయి. ఎందుకంటే పురుషులతో మన బంధం, ఇంటి నుంచే ప్రారంభం కావాల్సుంటుంది” అన్నారు. నటి స్వస్తికా ముఖర్జీ కూడా ట్విటర్‌లో అలాగే స్పందించారు. “అవును, నాకు రుయీ, బెత్కి అంటే ఇష్టం. తర్వాత వాటిని ఆవనూనెలో ఫ్రై చేసి, వేడి వేడి అన్నంలో, ఎండు మిర్చి లేదా పచ్చిమిర్చితో తింటాను. బెంగాలీ మహిళల్లారా, ఎవరైనా నాతో కలవాలనుకుంటున్నారా” అని ట్వీట్ చేశారు. నిస్సహాయ పురుషుడు మంత్ర తంత్రాలు, చేతబడితో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను వశం చేసుకున్నారనే వాదన, ఒక తెలివైన మగాడిని నిస్సహాయుడుగా మార్చేసింది. ఇదంతా, గత ఏడాది జలాలుద్దీన్ రూమీ “లైక్ ది షాడో, అయాం, అండ్ అయాం నాట్ (ఒక నీడలా.. నేను ఉన్నాను, లేను)” అనే వాక్యాలు పోస్ట్ చేసిన అదే సుశాంత్ సింగ్ గురించి చెబుతున్నారు. నిస్సహాయత అనే ఈ వాదన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుంగుబాటు రోగి అనే దానికి సంబంధించినది. ఈ వాదనపై కూడా చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి. అది వేరే విషయం. ఆయన ఫొటోల్లో విషాద ఛాయలు కూడా కనిపించాయి. “డిప్రెషన్ లుక్.. అంటే ఏంటి? సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి టీవీ కవరేజ్‌లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా మానసిక వైద్య నిపుణులు కూడా ఎందుకు మాట్లాడ్డం లేదు” అని సినీ విశ్లేషకులు అనా వెట్టికాడ్ అన్నారు. మానసిక వ్యాధి అంటే ఏదైనా వైఫల్యం, ఒక వ్యక్తిగత ఓటమి. మగాడిని బలహీనుడిగా భావించడం సమాజానికి కూడా కష్టమే. అది కూడా టెలివిజన్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ మీద హీరో పాత్రలు పోషించిన ఒక మగాడు, బాలీవుడ్ బయటి నుంచి వచ్చినప్పటికీ, అక్కడ తన లక్ష్యాన్ని చేరుకున్న ఒక వ్యక్తి బలహీనుడు ఎందుకు అవుతాడు. కుంగుబాటు లాంటి వ్యాధి మన హీరోకు ఉండడం అసౌకర్యంగానే అనిపిస్తుంది. ఆయనకు ఆ వ్యాధి ఉన్నప్పుడు, దానిని కూడా దుర్వినియోగం చేసుంటారు. అది ఆయన తప్పు కాదు, సుశాంత్‌ను మోసం చేసినవారిదే అవుతుంది. చర్చలో తర్వాత అందరి వేళ్లూ రియా చక్రవర్తిని చూపిస్తాయి. మహిళల దుస్తులపై వ్యాఖ్యలు ఒక వీడియోను విడుదల చేసిన రియా, న్యాయవ్యవస్థపై తన నమ్మకం ఉంచారు. మీడియాలో తన గురించి చెబుతున్నవన్నీ తప్పని చెప్పారు. కానీ, తెల్లటి సల్వార్-కమీజ్‌లో ఆమె విడుదల చేసిన ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు కాకుండా, ఆమె వేసుకున్న దుస్తులు పతాక శీర్షికల్లో నిలిచాయని సుశాంత్ తండ్రి తరఫు లాయర్ అన్నారు. రియా వీడియో ఆమె గురించి చెప్పలేదు, ఆమె బట్టల గురించి చెబుతోంది. ఆమె తన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి బట్టలు వేసుకుని ఉంటుందని నాకు అనిపించడం లేదు. ఆమె తనను తాను ఎంత సాదాసీదా అమ్మాయిని అని చూపించాలనుకుంటోంది” అన్నారు. దీనిని సీనియర్ లాయర్ కరుణా నంది ‘లీగల్ మిసోజనీ’ అంటే చట్ట పరిధిలో మహిళలను కించపరచడంగా చెప్పారు. “తక్కువ బట్టలు అంటే నేరం, సల్వార్-కమీజ్ అంటే నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు” అని ట్వీట్ చేశారు. మీడియాలో ప్రచారం చేస్తున్న మానసిక వ్యాధులకు సంబంధించిన అపోహలను దూరం చేసేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ థెరపిస్ట్ ఒక ప్రకటన ఇచ్చారు. “కుంగుబాటును మానసిక వ్యాధి అనుకోడానికి బదులు వ్యక్తి బలహీనతగా భావించడం తప్పు” అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ‘బైపోలార్ డిజార్డర్’ ఉండేదని కూడా చెబుతున్నారు. అది దాచిపెట్టుకోకుండా, ఇతరులను సాయం కోరేలా రియా అతడిలో ధైర్యం పెంచిందని అంటున్నారు. ఈ సీరియల్ అప్పుడే అయిపోలేదు. మీడియా కోర్టులో ప్రతి రోజూ కొత్త సమాచారం అందిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవారి వ్యాఖ్యలు బయటికి వస్తూనే ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారణం ఆత్మహత్యా, లేక అతడిని హత్య చేశారా? ఈ మరణం వెనక ఏదైనా కుట్ర ఉంటే, అది ఎవరు, ఏ లక్ష్యంతో చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే దారిలో రాజకీయం, వ్యక్తిగత స్వార్థం కూడా ఉంది. వీటన్నిటి మధ్యా నిజాన్ని ఎక్కడో అణగదొక్కేశారు. న్యాయవ్యవస్థ, దర్యాప్తు ఏజెన్సీల కోసం వేచిచూడకుండా స్టింగ్ ఆపరేషన్, సొంత పరిశోధనల ద్వారా ఈ నేరాన్ని నిర్ధరించాలనే మీడియా ఈ తొందరపాటు ప్రాణాంతకం కావచ్చు. ఒత్తిడి, ఆత్మహత్య మధ్య ఏ బంధం గురించి మనం దీనిని మొదలుపెట్టామో, అదే పరిస్థితిని విలన్ కోసం పరుగులు తీస్తూ సృష్టించకూడదు. బహుశా అందుకే డైరెక్టర్ హన్సల్ మెహతా తన ట్విటర్‌లో ఒక ప్రశ్న అడిగారు. “మీడియా ట్రయల్ వల్ల అలాంటిదే జరిగితే.. దానికి ఎవరు బాధ్యులు?“ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి జీవితాన్ని న్యూస్ చానళ్లు ఈ మధ్య ఒక టీవీ సీరియల్‌లా చూపిస్తున్నాయి. text: దానికోసం చైనా ఒక పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేస్తోంది., ఈ ప్లాన్ ప్రకారం ఇస్లాంను చైనీకరణ చేస్తారు. అంటే ఆ దేశంలో ఇస్లాం చైనా కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ పంచవర్ష ప్రణాళిక గురించి ఇప్పటివరకూ బయటకు రాలేదు. కానీ దీని ముసాయిదా గురించి జనవరి 6, 7 తేదీల్లో జరిగిన సమావేశం తర్వాత చైనీస్ ఇస్లామిక్ అసోసియేషన్ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రెస్ రిలీజ్‌లో ప్రస్తావించారు. చైనాలో లక్షల మంది వీగర్ ముస్లింలను షింజియాంగ్‌లోని శిబిరాల్లో ఉంచారనే కథనాలు వస్తున్న సమయంలో చైనీకరణ అనే ఈ కొత్త ఆలోచన తెరపైకి వచ్చింది. షింజియాంగ్ ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. ఇది చైనాకు పశ్చిమంగా చాలా దూరంలో మధ్య ఆసియా సరిహద్దుల్లో ఉంది. 2015లో షీ జిన్‌పింగ్ బలమైన అపీల్ తర్వాత పార్టీలోని యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్ అనే ఒక యూనిట్ ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం లాంటి విదేశీ మతాలను చైనీకరణ చేయడానికి ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తోంది. ఈ యూనిట్ దేశంలో అస్థిరతకు కారణమయ్యే అంశాలను చల్లార్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది. పంచవర్ష ప్రణాళిక రూపొందించేందుకు ఇస్లామిక్ ప్రతినిధుల సమావేశం పంచవర్ష ప్రణాళిక ఏంటి? దేశంలోని ఇస్లాంను మరింత ఎక్కువ చైనీకరణ చేయడమే ఈ ముసాయిదా ఉద్దేశం అని తెలుస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా చైనా సోషలిస్టు సిద్ధాంతాల ప్రకారం ఇస్లాంలో మార్పులు చేస్తారని జాతీయ స్థాయిలో ముస్లింలను ఏకం చేసి వారికి ప్రాతినిధ్యం వహించే చైనీస్ ఇస్లామిక్ అసోసియేషన్ తెలిపింది. ఈ మార్పు గురించి బీజింగ్‌లోని చైనా ఇస్లామిక్ ఇన్‌స్టిట్యూట్ డీన్ గావో జైన్‌ఫూ జనవరి 6న చైనా ప్రభుత్వ వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడారు. "ఇస్లాం చైనీకరణ అంటే దాని గుర్తింపు, ఆచార-సంప్రదాయాలను, ఆలోచనా విధానం మార్చడం కాదు, దానిని సోషలిస్టు సమాజానికి అనుగుణంగా మార్చడం" అన్నారు. "ప్రస్తుతం చైనాలో ఉన్న ఇస్లాం సమాజాలు రాజకీయంగా మెరుగుపరుచుకోడానికి, పార్టీ నాయకత్వాన్ని అనుసరించి తమ మతాన్ని చైనీకరణ చేయాలని కోరినట్లు" ఆ వార్తాపత్రిక తెలిపింది. చైనీకరణ కోసం ఈ పంచవర్ష ప్రణాళికలో ఏమేం జరగవచ్చో కూడా కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. "ఇందులో భాగంగా ప్రాథమిక సామాజిక విలువలు, చట్టం, సంప్రదాయం-సంస్కృతి గురించి లెక్చర్స్, శిక్షణ ఉంటాయని" చైనా ఇస్లామిక్ అసోసియేషన్ చీఫ్ యంగ్ ఫెమింగ్ తెలిపారు. ఒక సానుకూల భావన కలిగేలా రకరకాల కథల ద్వారా ముస్లింలకు మార్గనిర్దేశం చేస్తారు "దేశంలోని ముస్లింలు ఇస్లాం చైనీకరణ గురించి మరింత బాగా తెలుసుకోవడానికి మదరసాల్లో పుస్తకాలు కూడా ఉంచుతారు" అని గావో జైన్‌ఫూ తెలిపారు. అయితే, ఈ ప్రణాళిక గురించి వేరే వివరాలేవీ బయటకు రాలేదు. ప్రస్తుతం దాన్ని గోప్యంగా ఉంచారు. మొత్తం ప్రణాళిక ఏంటో ముందు ముందు వెలుగులోకి వస్తుందని గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. మొత్తం ఐదు ప్రచారాలతోపాటు క్రైస్తవుల్లో వారి మతం, సోషలిస్టు విలువల మధ్య సంబంధాలను పెంచాలని, మతశాస్త్రాల మరింత లోతుగా చెప్పాలని, మత విద్యను క్రమబద్ధం చేయడం, చైనాపై విశ్వాసం పెంపొందించాలని, పరోపకారంపై దృష్టి పెట్టాలని ఈ ప్రణాళికలో చెప్పారు. మీడియాలో ఈ వార్త ఎలా వచ్చింది? ఈ వార్త మీడియాలో రావడం గురించి కూడా ప్రత్యేక అర్థాలు తీస్తున్నారు. చైనీకరణ అనే ఈ ప్రణాళికపై జరిగిన సమావేశానికి సంబంధించిన వార్త చైనా భాషలో వచ్చే పత్రికల్లో రాలేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే చైనా మీడియా ఏడాదంతా ఇస్లాం చైనీకరణ గురించి వార్తలు అందిస్తూ వచ్చింది. ముఖ్యంగా చైనా అధికారులు దీనిని మత అతివాదంతో ప్రేరేపితం అవుతున్న తీవ్రవాదాన్ని నియంత్రించడానికి కీలక అడుగుగా భావించారు. కానీ ఈ సమావేశానికి సంబంధించిన వార్త గ్లోబల్ టైమ్స్ ఇంగ్లీష్ ఎడిషన్‌లో వచ్చింది. కానీ చైనీస్ ఎడిషన్‌లో మాత్రం రాలేదు. అంటే అలా చేయడం ద్వారా ఈ అంశంతో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాలని చైనా ప్రభుత్వం అనుకుంటున్నట్టు భావిస్తున్నారు. గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు షిజిన్ గత ఆర్నెల్లుగా షింజియాంగ్‌కు చైనా ఎంత ప్రాధాన్యం ఇస్తోంది అనే అంశాన్ని చూస్తున్నారు. ముఖ్యంగా వీగర్ ముస్లింలను ఆ ప్రాంతంలో ఉన్న నిర్బంధ శిబిరాల్లో ఉంచిన విషయాన్ని బీబీసీ సహా అంతర్జాతీయ మీడియా ప్రశ్నించినప్పటి నుంచి ఆయన ఇలా చేస్తున్నారు. ఆ సమయంలో ఆ వార్తాపత్రికకు షింజియాంగ్‌లోకి వెళ్లడానికి అనుమతి లేదు. దాంతో హు షిజిన్ స్వయంగా అక్కడికి వెళ్లారు. ఆయనకు ఆ శిబిరం ఒక ఒకేషనల్ ట్రైనింగ్ కేంద్రం అని చెప్పారు. అతివాద ధోరణులు లేకుండా చేయడానికే దాన్ని ఏర్పాటు చేశామన్నారు. వార్షిక ఇస్లామిక్ సమావేశంలో పాల్గొన్నది ఎవరు? వార్షిక ఇస్లామిక్ సమావేశం బీజింగ్‌లో జరిగింది. బీజింగ్, షాంఘాయ్ సహా మరో ఆరు ప్రాంతాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. చైనాలో ప్రధానంగా ముస్లిం జనాభా ఉన్న షింజియాంగ్ ప్రాంతానికి చెందిన ఒక్క ప్రతినిధి కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇస్లాం చైనీకరణతో ఏమవుతుంది షీ జిన్‌పింగ్ 2015లో యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో చేసిన ప్రసంగంలో మొదటిసారి ఇస్లాంను చైనీకరణ చేయాలనే ప్రస్తావన తీసుకొచ్చారు. షీ జిన్‌పింగ్ ఆ యూనిట్ కోసం మత సంబంధిత ఎజెండాను అందించారు. నాలుగు ప్రముఖ రంగాల్లో పనిచేయడం చాలా అవసరం అని వారికి చెప్పారు. వాటిలో మొట్టమొదటిది చైనీకరణ. నిర్బంధంలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం 2009లో వీగర్ మహిళల ఆందోళనలు అప్పటి నుంచి యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్ మసీదులపై ఎక్కువగా నియమ-నిబంధనలు అమలు చేయడం ప్రారంభించింది. దీనిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి, ప్రధానంగా మసీదులపై జాతీయ జెండాను ఎగరేయాలి. అక్కడికి వచ్చేవారికి సోషలిజం గురించి, మహిళలను గౌరవించడం లాంటి ఇతర అంశాలను చెప్పాలి. చైనా ప్రభుత్వం నిబంధనలను వెనకేసుకొస్తూ చైనీస్ ఇస్లామిక్ అసోసియేషన్ 2018 మేలో ఒక ఆర్టికల్‌ ప్రచురించింది. అందులో మాటిమాటికీ ఖురాన్ గురించి ప్రస్తావించింది. అందులో ఖురాన్ దేశభక్తిని, మాట నిలబెట్టుకోవడాన్ని, నిష్పక్షపాతం, పరోపకారాలను బోధిస్తుందని, చెప్పింది. ముఖ్యంగా చైనాను ఒక విజ్ఞాన మూలంగా వర్ణించింది. కానీ, ఈ వ్యాసంలో చివరి మూడు పదాలూ సరిగా లేవు. ఎందుకంటే ఖురాన్‌లో చైనా ప్రస్తావన లేదు. అయితే మహమ్మద్ ప్రవక్త "మీకు విజ్ఞానం కావాలంటే చైనా వరకూ వెళ్లండి" అన్నట్లు అరబ్బీలో ఒక మాట ఉందని చెబుతారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనా తమ దేశంలోని ముస్లిం మైనారిటీల నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి ఒక రాజకీయ ప్రచారం నిర్వహించబోతోంది. text: ఈ ఐక్యరాజ్యసమితి ఏమిటి? దాని సర్వసభ్య సభ ఏమిటి? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1945లో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి. ప్రస్తుతం 193 దేశాలు ఇందులో పూర్తి కాలపు సభ్యదేశాలుగా ఉన్నాయి. హోలీ సీ (పోప్ పరిధిలో ఉన్న ప్రాంతం), స్టేట్ ఆఫ్ పాలస్తీనా దేశాలు సభ్యత్వం లేకుండా ఇందులో కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో గల ఆరు విభాగాల్లో సర్వసభ్య సభ ఒకటి. ఈ సంస్థ ఏం చేయాలనేది నిర్ణయించే ప్రధాన విభాగం ఇదే. ఐరాస సభ్యత్వం గల 193 దేశాలకూ ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక్క విభాగమూ ఇదే. ఈ సర్వసభ్య సభ వార్షిక సమావేశం ప్రతి ఏటా సెప్టెంబర్‌లో పక్షం రోజుల పాటు న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశాల మధ్యలో నాలుగు రోజుల పాటు సాధారణ చర్చ ఉంటుంది. ఈ సాధారణ చర్చలో ఏం చర్చిస్తారు? మాదక ద్రవ్యాల సమస్య మొదలుకుని భద్రత వరకూ అనేక రకాల అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ ఏడాది.. ఐరాస ఆమోదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను.. భవిష్యత్ తరాల అవసరాలు తీర్చే సామర్థ్యం దెబ్బతినకుండానే ప్రస్తుత తరాల అవసరాలను తీర్చే విధంగా వేగవంతంగా అమలు చేసే అంశం మీద చర్చలు ఉంటాయి. నాలుగేళ్ల కిందట ఒక విధానంగా ఆమోదించిన ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరుగుతున్న మొదటి ఐరాస శిఖరాగ్ర సమావేశమిది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాలను నిర్మూలించే అంశం మీద గురువారం నాడు ప్రత్యేకంగా చర్చిస్తారు. భౌగోళికంగా, ఆర్థికంగా ఒంటరిగా ఉన్న, పర్యావరణపరంగా అతిసున్నితంగా ఉన్న చిన్న దీవులు ఎదుర్కొంటున్న సవాళ్ల మీద చర్చలతో శుక్రవారం ఈ సంప్రదింపులు ముగుస్తాయి. ఈ వారంలో ప్రధానాంశాలు ఏమిటి? ఈ సమావేశాల్లో ప్రపంచ నాయకులు ఇతర ప్రపంచ నాయకులతో ప్రణాళిక ప్రకారం కానీ, అకస్మాత్తుగా కానీ కలవటం పతాక శీర్షికలకు ఎక్కింది. బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా తొలిసారి ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఆయన పలు ఇతర దేశాల అధినేతలతో బ్రెగ్జిట్ అంశం మీద మరిన్ని చర్చలు జరపవచ్చు. సర్వసభ్య సమావేశంలో సందర్భంగా.. వాతావరణ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సును కూడా నిర్వహించారు. అందులో 16 ఏళ్ల ఉద్యమకారిణి గ్రెటా థంబర్గ్ ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ''మీరు మీ వట్టి మాటలతో నా స్వప్నాలను, నా బాల్యాన్ని దొంగిలించారు. మీకెంత ధైర్యం?'' అని ప్రశ్నించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో ప్రపంచం తగినంతగా కృషి చేయటంలేదన్నారు. ''ప్రపంచ ప్రవర్తనలో మార్పు రావటం ఇప్పుడు అవసరం'' అని పేర్కొన్నారు. ఇదెలా పనిచేస్తుంది? ఐరాస సర్వసభ్య సమావేశాల్లో మొదట బ్రెజిల్ నాయకుడు కానీ లేదంటే వారి ప్రతినిధి కానీ.. ఆ తర్వాత ఆతిథ్య దేశమైన అమెరికా మాట్లాడాలని సంప్రదాయం నిర్దేశిస్తోంది. సర్వసభ్య సభ తొలి నాళ్లలో అందరికన్నా ముందు మాట్లాడటానికి ఎవరూ సుముఖంగా ఉండేవారు కాదు. దీంతో బ్రెజిల్ తరచుగా ముందుకు వచ్చి మొదట గళం విప్పేది. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది. ఈ ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సానారో మాట్లాడాల్సి ఉంది. అయితే.. ఆయనకు హెర్నియా సర్జరీ జరిగినందున హాజరవుతారా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. ఆయన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రసంగించాల్సి ఉంటుంది. ఈ సమావేశం సందర్భంగా ప్రతి దేశపు నాయకుడు కానీ ఆ దేశ ప్రతినిధి కానీ సర్వసభ్య సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలనేది ఐరాసలో వారి ప్రాతినిధ్య హోదా, భౌగోళిక సమతుల్యం తదితర అంశాల ప్రాతిపదికగా నిర్ణయమవుతుంది. మాట్లాడేవారిని వారి ప్రకటనలు 15 నిమిషాల లోపు ఉండేలా చూడాలని కోరుతారు. అయితే ఈ పరిమితిని తరచుగా విస్మరిస్తుంటారు. సర్వసభ సమావేశంలో సుదీర్ఘ సమయం ప్రసంగించిన రికార్డు క్యూబా నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రోది. ఆయన 1960లో నాలుగున్నర గంటల పాటు ప్రసంగించారు. సర్వసభ్య సభ ప్రతినిధులు వారి పేర్ల ఇంగ్లిష్ అనువాదం ప్రకారం.. ఇంగ్లిష్ అక్షరమాల క్రమంలో సభలో ఆశీనులవుతారు. అయితే.. మొదటి కుర్చీలో కూర్చునే దేశాన్ని మాత్రం ప్రతి ఏటా ఐరాస జనరల్ సెక్రటరీ ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఘనాను ఎంపిక చేశారు. ఎవరు హాజరవుతారు? ఎవరు హాజరుకారు? ఈ సమావేశాలకు హాజరవుతామని గత వారాంతం వరకూ 90 మంది పైగా ప్రపంచ నాయకులు చెప్పారు. వారిలో బోరిస్ జాన్సన్ (బ్రిటన్), ఇమాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్), వోలోడిమిర్ జెలెన్క్సీ (ఉక్రెయిన్) తదితరులు ఉన్నారు. వ్లాదిమిర్ పుతిన్ (రష్యా), షి జిన్‌పింగ్ (చైనా), బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్)లు హాజరుకావటం లేదు. సర్వసభ్య సభ అధ్యక్షుడిని ప్రతి ఏటా ఎన్నుకుంటారు. ఈ ఏడాది నైజీరియా నాయకుడు తిజ్జానీ ముహమ్మద్-బాందే ఎన్నికయ్యారు. ఇంతకుముందు ప్రధాన ఘట్టాలు ఏమిటి? 2006లో వెనిజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ని 'దయ్యం' (ద డెవిల్) అని అభివర్ణించారు. అంతుకుముందు రోజు అదే పోడియం వద్ద జార్జి బుష్ మాట్లాడటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఆ పోడియం వద్ద 'ఇంకా దయ్యం వాసన వస్తోంది' అని కూడా వ్యాఖ్యానించారు. మూడేళ్ల తర్వాత లిబియా నాయకుడు కల్నల్ గడాఫీ గంటన్నర సేపు పైగా మాట్లాడారు. మధ్యలో ప్రతినిధులు సభ విడిచి వెళుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. పెద్ద దేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ సూత్రాలను వంచిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఆ తర్వాత తన ప్రసంగం పత్రాన్ని నేల మీదకు విసిరేశారు. ఇటీవల 2017లో ట్రంప్ ప్రసంగిస్తూ.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్‌ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ''రాకెట్ మ్యాన్ తనకు తాను ఆత్మాహుతి కార్యక్రమం చేపట్టారు'' అని ఎద్దేవా చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచ దేశాల నాయకులు ఈ వారంలో న్యూయార్క్‌లో సమావేశమవుతున్నారు. వాతావరణ మార్పు అంశం వారి అజెండాలో అగ్రస్థానంలో ఉండబోతోంది. ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇంకా ఏమేం అంశాలపై చర్చిస్తారు? text: కానీ, ఆ ఉయ్యాల ఎంపికలో ఏమరపాటు అందులో నిద్రించే పసి ప్రాణాన్నే బలి తీసుకోవచ్చు. అమెరికన్ ఆట బొమ్మల తయారీ సంస్థ ఫిషర్-ప్రైస్ తాము తయారుచేసిన దాదాపు 50 లక్షల ఉయ్యాలలను ఇప్పుడు వెనక్కు తీసుకుంది. అమెరికా వినియోగదారులు, ఉత్పత్తుల భద్రత కమిషన్ (సీపీఎస్‌సీ) ఈ విషయాన్ని వెల్లడించింది. 'రాక్ అండ్ ప్లే' ఉయ్యాళ్లలో ఇప్పటివరకూ 30 మందికి పైగా చిన్నారులు మరణించినట్లు సీపీఎస్‌సీ పేర్కొంది. తమ ఉత్పత్తులు భద్రమైనవేనని, అయితే స్వచ్ఛందంగా సదరు ఉయ్యాళ్లను వెనక్కితీసుకునేందుకు సిద్ధమయ్యామని ఫిషర్-ప్రైస్ యాజమాన్య సంస్థ మాటెల్ వెల్లడించింది. 2009 నుంచి ఇప్పటి వరకూ ఉయ్యాల్లో పక్కకు దొర్లడం, బోర్లా పడుకోవడం వల్ల పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాము గుర్తించామని సీపీఎస్‌సీ తెలిపింది. వారంతా మూడు నెలలు పైబడిన చిన్నారులని వివరించింది. చిన్నారుల వయసు మూడు నెలలు దాటినా, వారు దొర్లడం మొదలుపెట్టినా 'రాక్ అండ్ ప్లే' ఉయ్యాలను వాడొద్దని ఆ ఉత్పత్తికి సంబంధించి ఫిషర్-ప్రైస్ చేసిన జాగ్రత్తలు, సూచనల్లో ఉంది. ''మేం జాగ్రత్తలు, సూచనలు చేసినప్పటికీ దుర్ఘటనలు జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. సీపీఎస్‌సీ భాగస్వామ్యంతో కలిసి ఆ ఉయ్యాళ్లను వెనక్కితీసుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చాం'' అని ఫిషర్-ప్రైస్ వెల్లడించింది. దాదాపు 47 లక్షల ఉత్పత్తులపై ఈ రీకాల్ ప్రభావం ఉండొచ్చని సీపీఎస్‌సీ అంచనా వేసింది. 'రాక్ అండ్ ప్లే' ఉయ్యాళ్ల వాడకాన్ని వెంటనే ఆపివేసి, వాపస్ డబ్బుల కోసం ఫిషర్-ప్రైస్‌ను సంప్రదించాలని వినియోగదారులకు సూచించింది. ఈ ఉత్పత్తులను ప్రాణాంతకమైనవిగా వర్ణిస్తూ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) వీటి రీకాల్ కోసం ఇదివరకు డిమాండ్ చేసింది. ''దుకాణాల్లో అమ్ముతున్నారంటే భద్రమైన వస్తువే అని జనాలు అనుకోవచ్చు. దురదృష్టవశాత్తు అది అన్ని వేళలా నిజం కాదు'' అని ఏఏపీ అధ్యక్షుడు కైల్ యాసుడా అన్నారు. రాక్ అండ్ ప్లే ఉయ్యాళ్లు వాలుగా ఉంటాయి. వాటిలో పక్కకు దొర్లినప్పడు, బోర్లా పడుకున్నప్పుడు చిన్నారులకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతోందని, ఇదే మరణాలకు కారణం అవుతోందని పలు నివేదికల్లో తేలినట్లు ఏఏపీ వెబ్‌సైట్ పేర్కొంది. చిన్నారులను నిద్ర పుచ్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పసిబిడ్డ ఉన్న ప్రతి ఇంట్లో కనిపించే వస్తువు ఉయ్యాల. పాపో, బాబో.. అందులో ఆదమరిచి నిద్రపోతుంటే, తల్లిదండ్రులు నిశ్చింతగా పనుల్లో మునిగిపోతారు. text: The aftermath of the explosion in Mogadishu పేలుడు పదార్థాలు నింపిన లారీని పేల్చివేయడం భారీ ప్రాణనష్టానికి కారణమైంది. ఈ ఘటనలో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంతవరకు తెలియలేదని వారు ప్రకటించారు. 'పేలుడు ధాటికి సఫారీ హోటల్ కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుని 300 మంది తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు' అని సోమాలియాలోని బీబీసీ ప్రతినిధి చెప్పారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. సోమాలియా ప్రభుత్వంతో పోరాడుతున్న అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ తరచూ మొగదిషును లక్ష్యంగా చేసుకుంటుండడంతో ఇక్కడ హింస నిత్యకృత్యమైపోయింది. 2007లో అల్ షబాబ్ గ్రూప్ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం నేపథ్యంలో దేశాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో మొహమ్మద్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మంటల్లో తగలబడుతున్న ట్రక్ (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.) సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం ఒక రద్దీ కూడలిలోని హోటల్ వద్ద భారీ పేలుడు జరిగింది. దీంతో కనీసం 358 మంది మృతిచెందారు. text: ప్రస్తుతం అంకెలను, విశ్లేషణలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి వ్యూహం, ప్రతి వాదన వెనుకా మోదీ కరిష్మా పని చేస్తోంది. కన్నడనాట ఫలితాలను బట్టి చూస్తే కర్ణాటక ప్రజలు నెహ్రూ నిజంగానే జనరల్ తిమ్మయ్య, ఫీల్డ్ మార్షల్ కరియప్పలను అవమానించారని భావించి ఉండవచ్చు. కొన్ని నెలల క్రితమే చాలా మంది గుజరాత్‌లో మంచి పోటీ ఇచ్చారని రాహుల్ గాంధీని ప్రశంసించారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో మోదీ-షాల ముందు రాహుల్ ప్రదర్శన సరిపోలేదేమో అనిపిస్తోంది. ఉచ్ఛదశలో మోదీ పాపులారిటీ కర్ణాటకలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు వ్యతిరేకత పెరగడానికి, బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణాలను అర్థం చేసుకోవాలంటే పరిస్థితులను లోతుగా విశ్లేషించాలి. ప్రస్తుతం మోదీ పాపులారిటీ ఉచ్ఛదశలో ఉన్నది అన్నది స్పష్టం. ఆయన పేరు మీదనే ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపు సాధించడం జరుగుతోంది. అంతే కాకుండా బీజేపీ ప్రచార వ్యవస్థ.. ఎన్నికల సిబ్బంది, కాంగ్రెస్‌ కన్నా బాగా పని చేశాయి. ప్రజలు ఇంకా దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని విశ్వసిస్తున్నారు. అందువల్ల మోదీ పాపులారిటీ తగ్గుతోంది, దక్షిణాది ఉత్తరాదిలా కాదు అన్నవారంతా పునరాలోచించుకోవాలి. ‘పీపీపీ’గా కాంగ్రెస్ మోదీ కర్ణాటకలో 20కి పైగా ర్యాలీలలో పాల్గొన్నారు. నెహ్రూ కార్డును ప్లే చేశారు. అన్ని పాచికలనూ ఉపయోగించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ 'పీపీపీ'గా, అంటే పంజాబ్, పుదుచ్చేరి పరివార్‌గా మారిపోతుందని మోదీ అన్నారు. ఈ ఎన్నికలతో ఒక విషయం స్పష్టమైంది. ఏ త్రిముఖ పోటీలోనైనా మోదీ-షా ద్వయం ముందంజలో ఉంటారు. బీజేపీతో ఎవరు పోటీ పడాలన్నా వారు ఏకం కాక తప్పదు. రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? ఈ ఫలితాలు కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసానికి గట్టి ఎదురుదెబ్బ. చిన్న చిన్న రాజకీయ పార్టీలు తమ తమ స్వార్థం కారణంగా దూరంగా ఉన్నంత కాలం, బీజేపీకి ఎదురు ఉండదు. ఇప్పుడు దేశంలోని రాజకీయ పక్షాలన్నీ బీజేపీ ముందు చిన్నవే. కర్ణాటకలో కాంగ్రెస్ సీట్లు తగ్గిపోవడం రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బే. దీంతో 2019 ఎన్నికలలో విపక్షాలకు నేతృత్వం వహించే సామర్థ్యం రాహుల్‌కు ఉందా అని సందేహాలు తలెత్తే అవకాశం ఉంది. మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి వారు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? కర్ణాటకలో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా రాజస్థాన్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ నుంచి లాక్కోవాలని భావించిన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసాన్ని మోదీ-షా ద్వయం దెబ్బ తీసింది. ఈ ఫలితాలను పరిశీలిస్తే, రాజకీయాల్లో దేనినీ ఖచ్చితంగా చెప్పలేం. క్రికెట్ లాగే ఇక్కడ కూడా సమీకరణలు ఎప్పుడైనా మారొచ్చు. 2019 ఎంతో దూరంలో లేదు. కర్ణాటక ఫలితాలు ఎన్నో పాఠాలను చెబుతున్నాయి. కానీ వాటిని స్వీకరిస్తారా లేదా అనేదే ప్రశ్న. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) విజయానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో విజేతకే అన్నీ దక్కుతాయి. విజేత అన్నీ సక్రమంగా చేశాడనీ, పరాజితుడు ఏదీ సరిగా చేయలేదని భావిస్తారు. text: బీబీసీ ఇన్నోవేటర్స్: చెత్త, అట్టముక్కలు, పీచుతో ఇంటి పైకప్పులు ఇళ్లు సరిగా లేకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా సుమారు 6.5 కోట్ల మంది మురికివాడల్లో నివసిస్తున్నట్లు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇవి కూడా చూడండి "మనుషులు నివసించడానికి పనికిరాని ఇళ్లు ఉండే నివాస ప్రాంతాలను" మురికి వాడలుగా పరిగణిస్తారు. "ఒకసారి మీరు మురికివాడల్లోని ఇళ్ల పైకప్పులు చూడండి. లెక్కలేనన్ని చిల్లులు పడి ఉంటాయి. పైకప్పు ఇంత అధ్వానంగా ఎందుకు ఉందని వారిని ప్రశ్నిస్తే, మాకు అంతకన్నా మెరుగైన ఇళ్లు కట్టుకునే స్తోమత లేదని వారు చెబుతారు" అని గణంత్ర అన్నారు. మురికివాడల్లోని ఇళ్ల పైకప్పులు సాధారణంగా రేకులు లేదా కాంక్రీట్‌తో నిర్మిస్తారు. దీంతో వీటిలో నివసించే వారిపై వాతావరణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎండా కాలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో చలి తీవ్రతను తట్టుకోవాల్సి ఉంటుంది. వానా కాలంలో ఇళ్లు కురుస్తుంటాయి. చదువు తర్వాత సొంత ఊరికి తిరిగొచ్చిన ఇంజినీరు గణంత్ర, ఇంటి పైకప్పులను మరింత నాణ్యంగా నిర్మించాలని సంకల్పించారు. ఇవి చౌకగా ఉండాలి. దీర్ఘకాలం మన్నాలి. నివసించే వారికి సౌకర్యంగా ఉండాలన్నది ఆయన తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి కూడా చూడండి సవాళ్లను ఎదుర్కొని.. చివరకు "మడ్‌రూఫ్" అనే సంస్థను గణంత్ర ప్రారంభించారు. నమూనా పైకప్పులను తయారు చేయడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. 300 పైచిలుకు ప్రయత్నాలు చేశారు. చెత్త, పనికిరాని అట్టముక్కల గుజ్జు, పీచు వంటి వాటితో పైకప్పులు తయారు చేశారు. ఇవి గట్టిగా ఉండటంతోపాటు తడిసినా నానకుండా, చెమ్మపట్టకుండా ఉంటాయి. "చాలా మంది నిపుణులు ఇది సాధ్యం కాదని వదిలెయ్యమని నాకు చెప్పారు" అని గణంత్ర తెలిపారు. "మురికివాడల్లో సమస్యను చూసినప్పుడు వారి కోసం మనం ఏదైనా చేయాలి" అని నాకనిపించింది అని ఆయన చెప్పారు. భవిష్యత్తులో పైకప్పులకు సౌరశక్తి పలకలను కూడా అమర్చుతామని హసిత్ గణంత్ర చెబుతున్నారు మడ్‌రూఫ్ సంస్థ అమ్మకాల బృందంలో అందరూ మహిళలే. వీరిలో చాలా మంది ఆ సంస్థ వినియోగదారులే. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే ఈ మహిళలు మడ్‌రూఫ్ నిర్మించే కొత్తరకం పైకప్పులు ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో తోటివారికి చెబుతున్నారు. మురికివాడల వాసులకు ఈ పైకప్పులు మెరుగ్గా ఉన్నాయని సేల్స్ ఉమన్ కౌసల్య షామ్ర చెప్పారు. "ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారు ఎంతో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది" అని ఆమె అన్నారు. "అటువంటి వారికి ఈ పైకప్పుల నిర్వహణ ఎంత సులభమో వివరిస్తాం. వీరిలో ఎక్కువ మంది పేదలే కాబట్టి రుణాలు లభించేలా సాయం చేస్తాం" అని ఆమె వివరించారు. ఇవి కూడా చూడండి చదరపు అడుగుకు రూ.260 సగటున 250 చదరపు అడుగుల పైకప్పుకు సుమారు రూ. 65,000 ఖర్చు అవుతుంది. రేకులతో చేసే పైకప్పుతో పోలిస్తే ఇది ఖరీదైనది. కాంక్రీటుతో పోలిస్తే చౌక. అయితే మడ్‌రూఫ్ వినియోగదారుల్లో సగం మందికి సూక్ష్మ రుణాలు లభించాయి. నెలకు సుమారు రూ. 3,000 చొప్పున రెండు సంవత్సరాలు చెల్లిస్తారు. "మా ఇంట్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పైకప్పు వల్ల ఎండా కాలంలో వేడి చాలా తీవ్రంగా ఉంటోంది. ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది." అని సకీనా చెబుతున్నారు. తమ ఇంటికి మెరుగైన పైకప్పును ఏర్పాటు చేసుకునేందుకు ఆమె సాధ్యమైనంత త్వరగా మడ్‌రూఫ్ కుటుంబంలో చేరాలని భావిస్తున్నారు. దక్షిణాసియాలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలను 'బీబీసీ ఇన్నోవేటర్స్' సిరీస్ వెలుగులోకి తెస్తుంది. సమస్యలకు పరిష్కారాలు చూపే గొప్ప ఆవిష్కరణలు మీకు ఎక్కడ కనిపించినా, మీరే అలాంటి పరిష్కారాలు కనుగొన్నా ఆ ఫొటోలను మాతో పంచుకోండి. yourpics@bbc.co.uk కి ఈమెయిల్ చేయొచ్చు. #Jugaad, #BBCInnovators హ్యాష్‌ట్యాగ్‌లతో @BBCWorldService కి షేర్ చేయండి. లేదా ఈ లింక్‌ను క్లిక్ చేసి అప్‌లోడ్ చేయొచ్చు.. BBC Innovators గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నీడనిచ్చే వస్తువు మాత్రమే మురికివాడలను నిర్మూలిస్తానని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. 2020 నాటికి పట్టణాల్లో అందుబాటు ధరలకే 2 కోట్ల గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈలోపు మురికివాడల్లోని పరిస్థితులను మెరుగుపర్చేందుకు సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రీజియనల్ ఎక్సలెన్స్ (క్యూర్) వంటి సంస్థలు పని చేస్తున్నాయి. "ఇంటి నిర్మాణంలో పైకప్పు ఎంతో కీలకం. ప్రజలకు మంచి ఇంటిని అందుబాటులోకి తీసుకు రావాలంటే పైకప్పు విషయంలో వినూత్నంగా ఆలోచించాలి" అని క్యూర్ డైరక్టర్ రేణు చోస్లా అభిప్రాయపడ్డారు. అహ్మదాబాద్‌ మురికివాడల్లో చాలా మంది పైకప్పును కేవలం నీడనిచ్చే వస్తువుగా మాత్రమే చూస్తారు. తాను నడిపే పాఠశాలలో కొత్తరకం పైకప్పులను వినియోగించడం ద్వారా విద్యార్థులకు మరింత ఎక్కువసేపు బడిలో గడిపే అవకాశం లభించినట్లు సంజయ్ పటేల్ అనే వ్యక్తి చెప్పారు. "పాఠశాల భవనంపైకి పిల్లలు ఎక్కుతారు. గాలి పటాలు ఎగుర వేస్తారు. అవసరమైతే అక్కడే నిద్రపోతారు. ఇంతకు ముందు రేకుల కప్పు ఉండేది. అది ఎందుకూ పనికొచ్చేది కాదు. దీనిపైకి పిల్లలను ఎక్కించడం ఎంతో ప్రమాదకరం" అని పటేల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి "మేము రూపొందించిన పైకప్పు ప్యానెళ్లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వీటి గురించి విదేశీయులు అడుగుతున్నారు. ఎందుకంటే మురికివాడల్లో జీవనం అనేది అంతర్జాతీయ సమస్య." అని గణంత్ర అంటున్నారు. 20 ఏళ్లపాటు మన్నేలా పైకప్పు ప్యానెళ్లను మడ్‌రూఫ్ రూపొందించింది. త్వరలోనే మురికివాడల్లోని చాలా ఇళ్లకు తమ పైకప్పులను వినియోగించుకోవచ్చని గణంత్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి కూడా చూడండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హసిత్ గణంత్ర అనే ఇంజినీరు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మురికివాడల్లో నివసించే ప్రజల జీవితాలను, వారి ఇబ్బందులను దగ్గరగా పరిశీలించారు. text: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. రోగులను కాపాడటానికి వెంటిలేటర్లు చాలా పెద్ద సంఖ్యలో అవసరమవుతాయి. నిండా రెండేళ్లు లేని నొక్కా రోబోటిక్స్ అనే స్టార్టప్ సంస్థ సౌర విద్యుత్ ప్లాంట్లను శుభ్రం చేసే జలరహిత రోబోలను తయారు చేస్తోంది. ఈ సంస్థ గత ఏడాది టర్నోవర్ 27 లక్షల రూపాయలు. ఇందులో పనిచేసే మెకానికల్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్ ఇంజనీర్లు దేశంలోని ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో చదువుకున్నారు. వీరి సగటు వయసు 26 ఏళ్ళు. ప్రస్తుతం దేశంలో కేవలం 48,000 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయనది అంచనా. వీటిలో ఎన్ని పని చేస్తున్నాయో ఎవరికీ తెలియదు. అయితే, ఈ యూనిట్లు అన్నింటినీ ఇప్పటికే రకరకాల వ్యాధులతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న రోగులకు ఉపయోగిస్తున్నారు. కోవిడ్-19 వ్యాధి సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు తీవ్రంగా జబ్బుపడుతున్నారు. వారికి ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారవచ్చు. ఇతర దేశాల్లో కనిపిస్తున్న తరహాలోనే ఈ రోగులతో దేశంలో ఆస్పత్రులు నిండిపోవటం మొదలైంది. కొన్ని దేశాల్లో ఎవరిని కాపాడాలో డాక్టర్లు ఎంచుకోక తప్పని సరిస్థితి తలెత్తింది. భారత ఆస్పత్రుల్లో సిద్ధమవుతున్న ఐసోలేషన్ పడకలు ప్రస్తుతం దేశంలో రెండు భారతీయ కంపెనీలు, అవసరమైన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వెంటిలేటర్లు తయారు చేస్తున్నాయి. ఒక్కో దాని ధర దాదాపు రూ. 1.50 లక్షల వరకూ ఉంటుంది. అగ్వా హెల్త్‌కేర్ అనే సంస్థ నెల రోజుల్లో 20,000 వెంటిలేటర్లు తయారు చేయటానికి ఏర్పాట్లు చేసుకుంది. భారత ప్రభుత్వం చైనా నుంచి 10,000 వెంటిలేటర్లు తెప్పిస్తోంది. కానీ, పెరుగుతున్న రోగులకు అవి ఏ మూలకూ సరిపోవు. నొక్కా రోబోటిక్స్ ఇంజనీర్లు తయారు చేస్తున్న వెంటిలేటర్ల ధర ఒక్కోటి రూ. 50,000 వరకూ ఉంటుంది. ఏడుగురు ఇంజనీర్ల బృందం పని మొదలు పెట్టిన ఐదు రోజుల్లోనే మూడు పోర్టబుల్ మెషీన్ల నమూనాలు సిద్ధం చేసింది. వాటిని రక్తానికి ఆక్సిజన్ అందించి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే కృత్రిమ ఊపిరితిత్తులకు అమర్చి పరీక్షిస్తున్నారు. రోగుల మీద పరీక్షించగల యంత్రాలను ఏప్రిల్ ఏడో తేదీ కల్లా తయారు చేయాలన్నది వారి ప్రణాళిక. ‘‘వీరు సాధించగలరు’’ అంటున్నారు డాక్టర్ దీపక్ పద్మనాభన్. బెంగళూరులోని జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులార్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న పద్మనాభన్ ఈ ప్రాజెక్టుకు కీలక సలహాదారుగా ఉన్నారు. ‘‘కృత్రిమ ఊపిరితిత్తుల మీద పరీక్షించినపుడు ఇవి బాగా పనిచేస్తున్నట్లు కనిపించాయి’’ అని చెప్పారు. కరోనా సంక్షోభంలో భారత్‌కు వేల సంఖ్యలో వెంటిలేటర్ల అవసరం కావచ్చు. స్ఫూర్తిదాయకం ఈ తక్కవ ధర, స్వదేశీ ఇన్వేజివ్ వెంటిలేటర్‌ను తయారు చేయటానికి కాలంతో పోటీపడుతున్న ఈ ఇంజనీర్ల కృషి.. స్ఫూర్తిదాయకం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇంత వేగంగా రంగంలోకి దిగి సమన్వయంతో పనిచేయటం భారత దేశంలో సాధారణంగా కనిపించదు. ‘‘ఈ మహమ్మారి మనందరినీ ఎన్నడూ ఊహించని రీతిలో కలుపుతోంది’’ అని అమితాబ బంధోపాధ్యయ పేర్కొన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బయొలాజికల్ సైన్సెస్ అండ్ బయోఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన ఆయన ఈ ప్రాజెక్టులో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ వెంటిలేటర్లను తయారు చేయటం ఎలా అనే అంశం గురించి ఈ యువ ఇంజనీర్లు ఇంటర్నెట్‌లో ఓపెన్ సోర్స్ మెడికల్ సప్లైస్ గ్రూపుల్లో పరిశోధించారు. అనుమతులు పొందిన తర్వాత కేవలం ఎనిమిది గంటల్లోనే మొదటి నమూనాను తయారు చేశారు. ఎంఐటీ ఇంజనీర్లు ఇచ్చిన కొన్ని డిజైన్లు చాలా ఉపయోగపడ్డాయని డాక్టర్లు చెప్తున్నారు. అవసరమైన విడిభాగాలు గల సంస్థలను తెరచి వాటిని సరఫరా చేయటానికి స్థానిక అధికారులు సాయం చేశారు. ఒక్కో యంత్రం తయారీకి దాదాపు 200 విడిభాగాలు అవసరం. ఈ యంత్రాలను తయారు చేయటానికి తమ ఫ్యాక్టరీలను ఉపయోగించుకోవచ్చునని.. ఒక పెద్ద వైద్య పరికరాల తయారీ సంస్థ సహా కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. మే మధ్య కాలాని కల్లా 30,000 వెంటిలేటర్లు తయారు చేయాలన్నది ప్రణాళిక. అంటే రోజుకు 150 నుంచి 200 యూనిట్లు తయారు చేయాలి. వెంటిలేషన్ ప్రక్రియ సుశిక్షితులైన సిబ్బంది నిర్వహణలో చేస్తారు. ఈ కృషిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు సాయం చేశారు. ఐఐటీ మాజీ విద్యార్థి, లిథియం తయారీదారుడు రాహుల్ రాజ్.. కేరింగ్ ఇండియన్స్ అనే గ్రూపును ఏర్పాటు చేశారు. కేవలం 24 గంటల్లో 1,000 మంది అందులో చేరారు. అదే ఐఐటీలో చదివిన గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ వంటి మాజీ విద్యార్థులు ఈ ఇంజనీర్లతో జూమ్ మీటింగ్‌లు నిర్వహించి వివరాలను తెలుసుకోవటంతో పాటు సలహాలు కూడా ఇచ్చారు. ప్రతి దశనూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వైద్యుల బృందం పరిశీలించి, కఠినమైన ప్రశ్నలు అడిగి ఆమోదించింది. భారతీయ పరిస్థితులకు సరిపోయే ఎటువంటి సమస్యలూ లేని శ్వాస యంత్రాలను అందించాలన్నది లక్ష్యమని వారు చెప్తున్నారు. ‘‘మాకు అనుభవం లేదు. కానీ, ఉత్పత్తులను సులభంగా తయారు చేయటంలో మంచి నేర్పు ఉంది. మేం తయారు చేసే రోబోలు చాలా సంక్లిష్టమైనవి. ఇది ప్రాణాలను రక్షించే యంత్రం. ఇందులో రిస్క్ ఉంటుంది. కాబట్టి మేం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని నొక్కా రోబోటిక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నిఖిల్ కురేల్ పేర్కొన్నారు. ఈ అసాధారణ సవాలును స్వీకరించడంలో భారతదేశం గెలిచిందా అనేది వారం రోజుల్లో తెలుస్తుంది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పుణెలోని ఒక కర్మాగారంలో కొందరు యువ ఇంజనీర్లు కాలంతో పోటీ పడుతున్నారు. తక్కువ ధరకు లభించే వెంటిలేటర్ (కృత్రిమ శ్వాసను అందించే పరికరం)ను తయారు చేయటంలో వారు నిమగ్నమయ్యారు. text: బ్యాట్స్‌మెన్ షూస్‌ను లక్ష్యంగా చేసుకొని బౌలర్లు వేసే యార్కర్లకు చాలా సార్లు బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానం ఉండదు. కానీ, అలాంటి యార్కర్‌లను కూడా హెలీకాప్టర్ షాటతో అమాంతంగా స్టాండ్స్‌లోకి పంపే టెక్నిక్ ధోనీ సొంతం. ఈ షాట్ కొట్టడానికి బ్యాట్స్‌మెన్‌కు టెక్నిక్ కంటే ప్రాక్టీస్, టైమింగ్ చాలా ముఖ్యం. ఈ విషయంలో ఝార్ఘండ్ డైనమేట్ ఆరితేరాడు. అలా మొదలెట్టారు 2006లో గోవాలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డేలో జేమ్స్ అండర్సన్ వేసిన ఫుల్ లెంత్ బాల్‌ను ధోనీ తనదైన స్టైల్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. అప్పుడైతే ఎవరూ దాన్ని హెలికాప్టర్ షాట్ అని పిలవలేదు. ఒక కూల్ డ్రింక్ కంపెనీ తన ప్రకటనలో ధోనీతో ఈ షాట్‌ను హెలికాప్టర్ షాట్‌గా పిలిపించడంతో అప్పటి నుంచి దీన్ని అదే పేరుతో పిలిస్తున్నారు. ధోనీ బయోపిక్ 'ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో కూడా హెలీకాప్టర్ షాట్ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. దూసుకొస్తున్న యార్కర్‌ను క్రీజు దాటకుండా ఫ్లిక్ చేసి లెగ్ సైడ్‌ నుంచి అమాంతంగా స్టాండ్‌కు పంపే ఈ షాట్‌ను కనిపెట్టింది వాస్తవానికి ధోనీ కాదు. సంతోశ్ లాల్‌ అనే క్రికెటర్‌ది. అఫ్గానిస్తాన్ క్రికెటర్ ముహ్మద్ షహజాద్ కూడా తన దైన స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడుతున్నాడు ఎవరీ సంతోష్ లాల్ సంతోశ్ లాల్ కూడా క్రికెటరే. ధోనీ స్నేహితుడు. అతనితో కలిసి రంజీలకు ఆడాడు. ధోనీ ఇతనే వద్దే హెలీకాప్టర్ షాట్ నేర్చుకున్నట్లు ధోనీ మీద వచ్చిన బయోపిక్‌లో చూపించారు. జార్ఘండ్, బిహార్ తరఫున 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన సంతోశ్ లాల్... ధోనీతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఏడేళ్ల పాటు రంజీలకు ఆడిన సంతోశ్ 2013లో మరణించాడు. సంతోశ్ లాల్ అనారోగ్యంతో చివరి దశలో ఉన్నప్పుడు అతనికి ధోనీ అన్నివిధాలుగా సహాయం అందించాడు. మెరుగైన వైద్య సహాయం కోసం అతడిని రాంచీ నుంచి ఢిల్లీకి పంపేందుకు ఏయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశాడు. ధోనీ దారిలో పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ మొదలెట్టిన హెలికాప్టర్ షాట్‌ను చాలా మంది క్రికెటర్లు అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ..ధోనీ స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడేస్తున్నాడు. అఫ్గానిస్తాన్ క్రికెటర్ ముహ్మద్ షహజాద్ కూడా తన దైన స్టైల్‌లో ఈ షాట్‌ కొడుతున్నాడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హెలికాప్టర్ షాట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ధోనీ సిగ్నేచర్ షాట్ గురించి అందరికీ తెలిసిందే. text: చీరల వ్యాపారులు బాధిత బాలిక ఫొటోలను చీరల ప్యాకెట్స్‌పై, బండిల్స్‌పై అతికించడం ద్వారా అవి అన్ని చోట్లకూ చేరేలా చూశారు. కఠువా దారుణంతో మొదలై, ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న చిన్నారులపై అత్యాచారం, హత్య ఘటనలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 11 రోజుల క్రితం సూరత్‌లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ క్రికెట్ స్టేడియం సమీపంలో దాదాపు తొమ్మిదేళ్ల వయసున్న బాలిక శవాన్ని పోలీసులు కనుగొన్నారు. బాలికపై 86 గాయాల గుర్తులున్నాయి. బాలికను దాదాపు వారం రోజులు బంధించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఆ బాలిక తల్లిదండ్రులెవరు? ఏ ప్రాంతం వారు? అన్న విషయాలు ఎవరికీ తెలియలేదు. అయితే తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కుటుంబం సూరత్ పోలీసులను ఆశ్రయించింది. ఆ పాప తమ కూతురేనని ఆ కుటుంబం అంటోంది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి తమ కూతురు కనిపించకుండా పోయిందని వారు చెప్పినట్టు సమాచారం. వారు తమకు చూపించిన ఫొటోలు బాధిత బాలిక ఫొటోలను పోలి ఉన్నాయని సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మ బీబీసీతో చెప్పారు. అయితే, వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాతే దీనిని ధ్రువీకరించగలమని ఆయన అన్నారు. సూరత్ వ్యాపారుల వినూత్న స్పందన - చీరల ప్యాకెట్లపై బాలిక ఫోటోల ముద్రణ బాధిత బాలిక ఎవరైందనేది గుర్తించేందుకు సూరత్‌లోని వస్త్ర వ్యాపారులు, కొన్ని సామాజిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. సూరత్ నగరం వస్త్ర పరిశ్రమకూ, ప్రత్యేకించి చీరల వ్యాపారానికి పేరు గాంచిందందనే విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు సూరత్‌కు వచ్చి చీరలు కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు సూరత్‌లోని వివిధ పరిశ్రమల్లో పని చేస్తారు. ఈ నేపథ్యంలో చీరల వ్యాపారులు బాధిత బాలిక ఫొటోలను చీరల ప్యాకెట్స్‌పై, బండిల్స్‌పై ముద్రించడం ద్వారా అవి అన్ని చోట్లకూ చేరేలా చూశారు. మరోవైపు, బాలిక తల్లిదండ్రులెవరో తెలిపిన వారికి 5 లక్షల బహుమానం ఇస్తామని సూరత్ బిల్డర్ల సంఘం ప్రకటించింది. 'ఈ ఘటన మమ్మల్ని కుదిపేసింది' ఈ ఘటన తమను బాగా కలచివేసిందని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారి లలిత శర్మ బీబీసీతో అన్నారు. ఆ బాలిక ఎవరో గుర్తించడం, ఆమెకు న్యాయం జరిగేలా చూడడం తమ బాధ్యతగా భావించినట్టు ఆయన చెప్పారు. "చీరల ప్యాకెట్లపై బాలిక ఫొటోను ముద్రిస్తే, ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకూ అవి వెళ్తాయి కాబట్టి అలా అది బాలిక తల్లిదండ్రుల వరకూ చేరొచ్చని మేం భావించాం" అని శర్మ వివరించారు. ఇప్పటి వరకు 25 వేల ప్యాకెట్లు బాలిక ఫొటోలతో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయనీ, మరో లక్ష ఫొటోలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. బాలికను గుర్తించే దాకా, నిందితులను అరెస్ట్ చేసే దాకా చీరల బండిల్స్‌పై బాలిక ఫొటోను ఇలా ముద్రిస్తూనే ఉంటామని మరో వ్యాపారి రాజీవ్ శర్మ చెప్పారు. వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని సూరత్ పోలీసు కమీషనర్ సతీష్ శర్మ బీబీసీతో అన్నారు. "సమాజంలోని వివిధ వర్గాలు ఇలా ముందుకు వస్తే పోలీసు దర్యాప్తుకు ఇదెంతో ఉపయోగపడుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసు అధికారులు కూడా బాలిక ఫొటోను దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పీలకు చేరేలా చేశారు. ఆ క్రమంలోనే ఆ ఫొటో బాధితురాలి తల్లిదండ్రులకు చేరినట్టు భావిస్తున్నారు. వారు తమ కూతురి ఫొటోలు కొన్ని తీసుకొని సూరత్‌కు వచ్చి పోలీసు అధికారులను సంప్రదించారు. ఆ ఫొటోలు మృతురాలి ఫొటోతో సరిపోలినట్టు కనిపిస్తున్నప్పటికీ డీఎన్ఏ పరీక్ష తర్వాతే నిర్ధరించగలమని సూరత్ పోలీసు అధికారులు బీబీసీతో చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సూరత్‌లో గుర్తు తెలియని దుండగుల అత్యాచారానికి బలై మృతి చెందిన బాలికది ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చని గుజరాత్ పోలీసు అధికారులు చెబుతున్నారు. text: మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), అవినాష్ రెడ్డి (కడప), మిథున్ రెడ్డి (రాజంపేట), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) - ఈ ఐదుగురూ కొద్ది సేపటి క్రితం లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా సమర్పించారు. పున‌రాలోచించుకోండి: స్పీక‌ర్ రాజీనామాల‌పై పున‌రాలోచించు కోవాల‌ని లోక్‌స‌భ స్సీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులకు సూచించారు. స‌భ‌లోనే ఉండి హోదా కోసం పోరాటం చేయ‌వ‌చ్చు క‌దా అని కూడా ఆమె వారికి న‌చ్చ‌చెప్పేందుకు ప్ర‌య‌త్నించినట్టు వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి బీబీసీకి చెప్పారు. అయితే తాము రాజీనామాల‌కే సిద్ధపడ్డామని వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌స‌భ స‌భ్యులు అయిదుగురూ స్సీక‌ర్‌కు సున్నితంగా తెలిపారని ఆయన వివరించారు. "హోదా కోసం పోరాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రికి నిర‌స‌న‌గా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నాం" అని వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌స‌భ స‌భ్యులు తమ లేఖలో ప్రకటించారు. మీ వాళ్లతోనూ రాజీనామా చేయించండి: జగన్ రాజీనామాల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తాము చెప్పిందే చేస్తామని అంటూ, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. "మేం చెప్పిందే చేస్తాం! వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఈరోజు రాజీనామా చేస్తున్నారు. టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని నేను చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా" అని జగన్ తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామాలు స్పీకర్‌కు సమర్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తాము రాజీనామా చేసినట్టు వారు పేర్కొన్నారు. text: సెప్టెంబరు 25న ఆయన ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం నుంచి చైనాకు బయలుదేరి వెళ్లిన తరువాత కుటుంబసభ్యులతోనూ మాట్లాడలేదని అధికారులు తెలిపారు. ఆయన ఫ్రాన్స్‌లో అదృశ్యం కాలేదని ఈ దర్యాప్తు జరుపుతున్న బృందం ద్వారా తెలిసిందని ఏఎఫ్‌ఫీ వార్తాసంస్థ తెలిపింది. మెంగ్‌ను ప్రశ్నించడం కోసం చైనాకు తీసుకెళ్లినట్లుగా 'ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' తన కథనంలో రాసింది. చైనా ఎందుకు ఆయన్ను ప్రశ్నించాలనుకుంటుందన్న విషయంలోనూ స్పష్టత లేదని హాంగ్‌కాంగ్‌కు చెందిన పత్రికలు రాశాయి. ఫ్రాన్స్ ఏం చెబుతోంది? తన భర్త అదృశ్యంపై మెంగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై దర్యాప్తు మొదలైంది. సెప్టెంబరు 29 నుంచి ఆయన నుంచి సమాచారం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సెప్టెంబరు 29 కాదని.. 25 నుంచే ఆయన నుంచి సమాచారం లేదని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆ తరువాత స్పష్టత ఇచ్చారు. చైనా అధికారులతో దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇంటర్‌పోల్ అధ్యక్షుడి పరిస్థితిపై, ఆయన భార్యకు బెదిరింపులు రావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అంతకుమించి ఏమీ చెప్పలేమన్నారు. ఇంటర్‌పోల్ ఏమంటోంది? మొత్తం ఇంటర్‌పోల్ వ్యవస్థకు సూచనలు అందించే, మార్గదర్శనం చేసే ఎక్జిక్యూటివ్ కమిటీని అధ్యక్షుడిగా మెంగ్ నడిపిస్తారని.. 2020 వరకు ఆయన పదవీ కాలం ఉందని ఇంటర్‌పోల్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఈ పదవికి ఎన్నిక కాకముందు చైనాలో ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉండేవారు. దేశాంతరంలో ఉంటూ తన ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేవారిని వేటాడేలా చైనా ఆయనపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందన్న ఆందోళనను ఆయన ఎన్నిక అనంతరం మానవ హక్కుల సంఘాలు వ్యక్తంచేశాయి. మెంగ్ చైనాకు కోపం తెప్పించారా? చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ అధికారుల అదృశ్యం ఘటనలకు మెంగ్ కనిపించకపోవడానికి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. సాధారణంగా చైనాలో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకునేటప్పుడు వారు హఠాత్తుగా కనిపించకుండా పోతారు. ఆ తరువాత పార్టీ.. 'ఆయన దర్యాప్తులో ఉన్నారు' అని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ఆ తరువాత క్రమశిక్షణ చర్యల పేరిట ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపిస్తారు. చివరకు ఆయన్న జైలులో వేస్తారు. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తరువాత 2012 నుంచి ఇప్పటివరకు సుమారు 10 లక్షల మందిని ఏదో రకంగా ఇలాగే జైలుకు పంపించారు. ఈ పరిణామాలపై బీబీసీ ఆసియా ఎడిటర్ సెలియా హాటన్ మాట్లాడుతూ.. ''మెంగ్ విషయానికొస్తే ఆయన కనిపించకుండాపోయిన కొద్దిరోజులకు భార్య ఫ్రాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనిపించకుండాపోయిన కమ్యూనిస్ట్ పార్టీ అధికారుల భార్యలు అరుదుగా ఇలా చేస్తారు. చాలా తీవ్రమైన శిక్ష విధిస్తారన్న భయం ఉంటే తప్ప వారు ఇలా చేయరు. చైనా కారణంగానే ఆయన కనిపించకుండా పోయినట్లయితే అందుకు కారణమెవరు? అంతర్జాతీయ స్థాయిలో ఇంత కీలక పదవిని వదులుకుని వెళ్లడానికి కారణమేంటి? అనేది తెలియాల్సి ఉంది'' అన్నారు. కాగా, మెంగ్ అదృశ్యం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని చైనాను ఇంటర్‌పోల్ కోరింది. ఈ మేరకు సెక్రటరీ జనరల్ జుర్గెన్ స్టాక్ పేరిట ఒక ప్రకటనను ఇంటర్‌పోల్ వెబ్‌సైట్‌ ప్రచురించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే అదృశ్యం సంచలనంగా మారింది. దీనిపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించింది. text: "నన్ను పరీక్ష రాయనివ్వలేదు. నన్ను క్షమించు అమ్మ" అని సూసైడ్ నోట్ రాసిన సాయిదీప్తి ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. గురువారం జరిగిన ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి దీప్తి బాబాయి సురేశ్ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడుతూ, ''స్కూల్లో అంద‌రి ముందు కులం పేరుతో మా అమ్మాయిని టీచర్ తిట్టారని తెలిసింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం. అయితే, ఇప్పటి వరకు బాధ్యులను అరెస్టు చేయ‌లేదు'' అని అన్నారు. ‘టీచర్ కులం పేరుతో దూషించారని చెప్పింది‘ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాయిదీప్తి అక్క సాయిలత బీబీసీతో మాట్లాడుతూ.. ''ఆ రోజు (గురువారం) నేను ఇంట్లోనే ఉన్నా. మౌను (సాయిదీప్తి) స్కూల్‌ నుంచి 10.30 గం లకే ఇంటికి వచ్చింది. ఏమైంది అని అడిగితే ఫీజు కట్టకపోవడంతో పరీక్ష రాయనివ్వలేదని చెప్పింది. మీ కులం వాళ్లు అందరూ ఇంతే, ఎప్పుడూ ఫీజు క‌ట్ట‌రు అని ఒక టీచ‌ర్ అన్న‌ట్టుగా చెల్లి నాతో చెప్పి బాధపడింది. అమ్మకు చెప్పనా అని అడిగితే, ఇప్పుడు వద్దు సూపర్ మార్కెట్‌లో పని ఒత్తిడిలో ఉంటుంది ఇంటికి వచ్చాక చెబుదాం అని అంది. కొద్దిసేపు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ డ్యాన్స్ కూడా చేసింది. ఆ తర్వాత డ‌బ్బులు తీసుకోవ‌డానికి నేను బ్యాంకు వెళ్లి తిరిగి వచ్చేసరి ఉరి వేసుకుని కనిపించింది. స్కూల్ వార్షిక ఫీజు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఉండొచ్చు'' అని చెప్పారు. సాయి దీప్తి తండ్రి బాలకిషన్ ప్రైవేటు ఉద్యోగి కాగా, త‌ల్లి సునీత సూప‌ర్ మార్కెట్‌లో పని చేస్తున్నారు. సాయిదీప్తి ఆత్మహత్యపై స్కూల్ ప్రిన్సిపల్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. 'అట్రాసిటీ కేసు నమోదు చేశాం' సాయిదీప్తి సూసైడ్‌నోట్ ఆధారంగా జ్యోతి మోడ‌ల్ స్కూల్ యాజ‌మాన్యంపై కేసు న‌మోదు చేశామని మ‌ల్కాజ్‌గిరి ఇన్స్‌పెక్టర్ కొముర‌య్య‌ బీబీసీకి తెలిపారు. ''ఘటనపై త‌ల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. సూసైడ్‌కి సంబంధించిన సెక్ష‌న్ల‌తో పాటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కూడా కేసు న‌మోదు చేశాం. బాధ్యుల‌ను అరెస్ట్ చేస్తాం'' అని తెలిపారు. ‘ప్రభుత్వమే బాధ్యత వహించాలి‘ హైదరాబాద్ పేరెంట్స్ స్కూల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కె. వెంకట్ సాయినాథ్ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడుతూ... ''ప్రైవేటు స్కూల్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం ఏ విధంగా విఫలమవుతుందో చెప్పడానికి సాయిదీప్తి ఆత్మహత్య ఒక ఉదాహరణ. కార్పొరేట్ స్కూల్లే కాదు చిన్నస్థాయి ప్రైవేటు స్కూల్లు కూడా ఫీజులు వసూలు చేయడంలో దారుణమైన పద్ధతులను అవలంభిస్తున్నాయి. సాయిదీప్తి స్కూల్లో ఆమెతో పాటు మరో ఏడుగురిని ఫీజు కట్టలేదని బయట నిలబెట్టారు. సాయి దీప్తిని కులం పేరుతో టీచర్ దూషించినట్లు ఆమె పేరెంట్స్ చెబుతున్నారు. సరైన వసతులు లేకుండానే ప్రభుత్వం ఇలాంటి స్కూల్‌లకు అనుమతి ఇస్తోంది. స్కూల్ యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట పడకపోతే రైతు ఆత్మహత్యల మాదిరిగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. బేటీ పడావో అని ప్రభుత్వాలు అంటున్నాయి కానీ, విద్యార్థినులు కనీసం చదువుకునే వాతావరణం కూడా ఉండటం లేదు. సాయిదీప్తి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి'' అని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''క్షమించు అమ్మ.. పరీక్ష రాయనివ్వలేదు'' అని సూసైడ్ నోట్ రాసి 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన సాయిదీప్తి (14) స్థానిక జ్యోతి మోడ‌ల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. text: ఇండియన్ ఐడల్ 10వ సీజన్ విజేత ఆదివారం జరిగిన ఇండియన్ ఐడల్ 10వ సీజన్ ఫైనల్స్‌లో సల్మాన్ అలీని విజేతగా ప్రకటించారు. సల్మాన్‌ అలీకి సుమారు రెండు కోట్ల ఓట్లు వచ్చాయి. ట్రోఫీతో పాటు 25 లక్షల నగదు, ఒక కారు గెల్చుకున్నారు. అంకుశ్ భరద్వాజ్ రెండోస్థానంలో నిలిచారు. నితిన్ కుమార్, నీలాంజన రాయ్, విభోర్ పరాషర్ గట్టి పోటీ ఇచ్చారు. ఇండియన్ ఐడల్ ఫైనల్స్‌కి వచ్చిన 'జీరో' మూవీ నటులు షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కంటెస్టెంట్లను ఉత్సాహపరిచారు. షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ అలీతో ప్రత్యేకంగా 'సజ్దా' పాటని పాడించుకున్నారు. ఇండియన్ ఐడల్ 10వ సీజన్ జూలైలో మొదలైంది. నేహా కక్కర్, అనూమాలిక్, విశాల్ దడ్‌లానీ జడ్జిలుగా వ్యవహరించారు. 'మీటూ' ఆరోపణల తర్వాత అనూమాలిక్ వైదొలిగారు. ఎవరీ సల్మాన్ అలీ? తన మెలోడి స్వరంతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను కొల్లకొట్టాడు.. సల్మాన్ అలీ. ఇంతకీ సల్మాన్ అలీ ఎవరు? ఈ స్థాయికి ఎలా వచ్చారు? సల్మాన్ అలీ, హరియాణా మీవట్‌లోని ఒక కుగ్రామం నుంచి వచ్చాడు. సల్మాన్ అలీకి ఎలాంటి సినీ, రాజకీయ నేపథ్యం లేదు. అతనిదొక మధ్యతరగతి కుటుంబం. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో ఆడి పాడటం సల్మాన్ అలీ కుటుంబం జీవనాధారం. గత నాలుగు తరాలుగా వాళ్లిదే పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సల్మాన్ అలీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మరెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. సల్మాన్ స్కూల్ డ్రాపవుట్. పేదరికం కారణంగా చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. సల్మాన్ తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచే తన గాత్రంతో అందర్ని మంత్రముగ్ధులను చేసేవాడు. 11 ఏళ్ల వయసులోనే గాయకుడిగా సల్మాన్ తన కెరీర్ మొదలుపెట్టాడు. స్థానికంగా జరిగే వేడుకలు, కార్యక్రమాల్లో తండ్రి, తాతలతో కలిసి పాటలు పాడేవాడు. తన స్వరాన్ని నమ్ముకుని, ముందుకు సాగాడు. రియాలిటీ షోలో అతను పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గతంలో 'స రి గ మ ప లిటిల్ చాంపియన్స్'లో పాల్గొన్నాడు. సింగర్ కైలాష్ ఖేర్ ఇతనికి గురువు. ఇండియన్ ఐడల్‌ 10లో సల్మాన్ అలీ ఒక్క జడ్జిల అభిమానం పొందడమే కాదు.. షోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ అతని ప్రతిభను ప్రశంసించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక అభిమాని తనను చూసేందుకు వచ్చినప్పుడు సల్మాన్ అలీ చాలా ఎమోషనల్ అయ్యాడు. 'బాహుబలి' పాటగాడే ఇండియన్ ఐడల్ 9వ సీజన్ విజేత ఇండియన్ ఐడల్ రేసు.. తెలుగు వాళ్లు ఇండియన్ ఐడల్‌లో తెలుగు గాయకులు కూడా సత్తా చాటారు. సీజన్ 9 టైటిల్‌ని ఎల్‌వీ రేవంత్ గెల్చుకున్నాడు. ఇందులోనే పీవీఎన్ఎస్ రోహిత్ మూడోస్థానంలో నిలిచారు. ఇక సీజన్ 5లో శ్రీరామచంద్ర ఇండియన్‌ ఐడల్‌ గెల్చుకున్నాడు. సీజన్ 2లో కారుణ్య రన్నరప్‌గా వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి పాటగాడిగా పేరుతెచ్చుకున్న రేవంత్... ఇండియన్ ఐడల్9వ సీజన్ విజేతగా నిలిచాడు. బాహుబలిలో మనోహరీ పాట పాడింది రేవంతే. ఉత్తరాది నుంచి వచ్చిన సింగర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైన తట్టుకుని నిలబడ్డాడు. క్రికెటర్ సచిన్ తెండూల్కర్ చేతుల మీదుగా టైటిల్ అందుకున్నాడు. రెండో స్థానంలో రేవంత్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఖుదాబక్ష్ (పంజాబ్) నిలిచారు. తెలుగు గాయకుడు పీవీఎన్ఎస్ రోహిత్‌ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. 'పాడుతా తీయగా'లో ఎస్పీ బాలు ప్రసంశలు అందుకున్న ఈ సింగర్ ఇండియన్ ఐడల్‌లోనూ రాణించాడు. ఇండియన్ ఐడల్ 9వ సీజన్‌లో తెలుగు గాయకులిద్దరూ మంచి ప్రతిభ చూపించారు. 'పాటల పోటీల్లో పాల్గొనేందుకు పేపర్‌ బాయ్‌గా మారాడు' రేవంత్‌కి పాటలంటే ప్రాణం. చదువుకునే రోజుల్లో పాటల పోటీల్లో పాల్గొనేందుకు డబ్బులు లేకపోతే పేపర్‌బాయ్‌గా మారాడు. అవి సరిపోక హోటల్‌లో క్యాటరింగ్‌ బాయ్‌గా పనికి కుదిరాడు. రేవంత్‌ సొంతూరు శ్రీకాకుళం. పాటల పూదోటలో అవకాశాల వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. 'సూపర్‌సింగర్స్‌' కార్యక్రమంతో మంచి పేరు రావడంతో రేవంత్ పాటల ప్రయాణం మొదలైంది. సంగీత దర్శకుడు కీరవాణి 'మర్యాదరామన్న'లో అవకాశం ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. బద్రీనాథ్‌, బాహుబలి వంటి సినిమాల్లో పాడాడు. శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచినట్లు ప్రకటించిన క్షణం ఇండియన్ ఐడల్ గెల్చుకున్న తొలి తెలుగు గాయకుడు శ్రీరామచంద్ర తెలుగు గాయకుల్లో తొలిసారి ఇండియన్‌ ఐడల్‌ కిరీటాన్ని గెల్చుకున్న సింగర్‌ శ్రీరామ చంద్ర మైనంపాటి. ఇండియన్‌ ఐడల్‌ ఐదవ సీజన్‌ టైటిల్‌ని శ్రీరామచంద్ర అందుకున్నారు. షో మొదటి నుంచి శ్రీరామచంద్ర అందరికీ ఫేవరేట్‌గా ఉన్నాడు. ఓసారి శ్రీరామ్‌ పాడిన 'క్వాజా మేరీ క్వాజా' పాటకు సంజయ్‌దత్‌ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని తెలుగులో మాట్లాడించుకుని తనకు నచ్చిన పాటను పాడించుకుంది. నటులు బిపాసాబసు, కత్రినాకైఫ్‌, ప్రియాంక చోప్రా ఇలా ప్రతీ ఒక్కరూ శ్రీరామ్‌ పాటను మెచ్చుకున్నారు. అమీర్‌ఖాన్‌ అయితే 'ఆ కిశోర్‌కుమారే' పాడుతున్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో పుట్టిన శ్రీరామచంద్ర చదువు హైదరాబాద్‌లో సాగింది. ఇక్కడే తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ స్థాయికి ఎదిగారు. అనేక చిత్రాల్లో పాటలు పాడారు. చిరుసరిగమలు నుంచి ఇండియన్ ఐడల్ రన్నరప్‌ సీజన్ 2లో మరో తెలుగు గాయకుడు కారుణ్య రన్నరప్‌గా నిలిచాడు. సంగీత నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిన ఎన్‌.సి.కారుణ్య చిరుసరిగమలు ఆల్బమ్‌తో పాటల పూదోటలోకి అడుగుపెట్టాడు. అనేక తెలుగు చిత్రాల్లో పాటలు పాడి ప్రేక్షకుల మెప్పు పొందాడు. టీవీల్లోను పాపులర్‌ సింగర్‌. ఇండియన్‌ ఐడల్‌ సిరీస్‌- 2లో రన్నరప్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. ఇండియన్ ఐడల్ మ్యూజిక్ రియాలిటీ షోని 2003లో ప్రారంభించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మెలోడీ వాయిస్‌తో మాయ చేశాడు. గాత్రంతో మంత్రముగ్ధులను చేశాడు. సుమారు 2 కోట్ల మంది మది దోచుకుని ఇండియన్‌ ఐడల్‌ 2018 అయ్యాడు. అతనే హరియాణా సంచలనం సల్మాన్ అలీ. text: ఉదయం పూట ఎక్కువగా తినడం, నిద్రపోవడానికి చాలాసేపటి ముందే భోజనాన్ని ముగించడం ద్వారా ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుందని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక పరిశోధన ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే మహిళలు త్వరగా భోజనం చేయడం వల్ల సానుకూల ఫలితాలు కనిపించాయని తేలింది. ఆలస్యంగా అల్పాహారం తీసుకునేవాళ్లలో బీఎంఐ ఎక్కువగా నమోదవుతున్నట్లు కూడా మరో పరిశోధన ద్వారా తెలుస్తోంది. ‘ఉదయం రాజులా, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రి బంటులా తినాలని పాత సామెత ఒకటి చెబుతోంది. అందులో చాలావరకు నిజముందని నా నమ్మకం’ అంటారు లండన్‌లోని కింగ్స్ కాలేజీలో న్యూట్రిషినల్ సైన్సెస్ లెక్చరర్‌గా సేవలందిస్తున్న డాక్టర్ గెర్డా పాట్. ఇప్పుడు భోజన వేళలకూ, బాడీ క్లాక్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. రాత్రిపూట ఎక్కువ తింటే ఎందుకు అరగదు? సాధారణంగా మన అలవాట్లకు తగ్గట్లే మన జీవ గడియారం(బాడీ క్లాక్) కూడా ఉంటుంది. రోజూ దాదాపు ఒకే సమయానికి నిద్ర లేవడం, నిద్ర రావడం లాంటివన్నీ బాడీ క్లాక్‌ పనిలో భాగమే. ఆ సమయానికి రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల స్థాయుల లాంటివాటిని నియంత్రించడం ద్వారా శరీరంలో ఏ క్రియ చోటు చేసుకోవాలనే సూచనలను బాడీ క్లాక్ అందిస్తుంది. క్రమం తప్పకుండా ఒకే పనిని ఒకే సమయానికి చేయడం ద్వారా మన జీవ గడియారం ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని దానికి తగ్గట్లే స్పందిస్తుంది. నిద్ర మాదిరిగానే భోజన వేళలు కూడా జీవ గడియారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని ‘క్రోనో న్యూట్రిషన్’ అని పిలుస్తున్నారు. ‘ప్రతి 24గంటలకూ ఏ జీవ క్రియ ఏ సమయానికి జరగాలనే సందేశాన్ని జీవ గడియారం శరీరానికి అందిస్తుంది. అందుకే రాత్రి పూట ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకపోవడం మంచిది. అప్పటికే నిద్రకు సమయం ఆసన్నమైందనే సందేశాన్ని జీవగడియారం శరీరానికి అందించి ఉంటుంది. దాంతో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. ఫలితంగా అరుగుదల కూడా మందగిస్తుంది’ అని ప్రొఫెసర్ గెర్డా అన్నారు. ‘రాత్రి వేళలో ఆహారం అంత సులువుగా అరగదని తెలుస్తున్నా, అలా ఎందుకు జరుగుతుందన్న కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలీదు’ అని సర్రే యూనివర్సిటీకి చెందిన క్రోనో బయోలాజీ నిపుణుడు డాక్టర్.జొనాథన్ జాన్‌స్టన్ తెలిపారు. ఉదయంపూట తీసుకున్న ఆహారం అరగడం కంటే, రాత్రుళ్లు తీసుకున్న ఆహారం అరగడానికి తక్కువ శక్తి ఖర్చవుతుందనీ, అందుకే రాత్రుళ్లు ఎక్కువ తినడం వల్ల కెలొరీలు పేరుకునే అవకాశం ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైనట్లు జొనాథన్ వివరించారు. వివిధ షిఫ్టుల్లో పనిచేసేవారిపై భోజన వేళల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇంకా తేలలేదు భోజనం ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు? అందుకే ప్రతిసారీ మనం తీసుకునే ఆహారాన్ని మార్చుకోవాల్సిన పనిలేదనీ, భోజన వేళల్లో మార్పులు చేసుకుంటే సత్ఫలితాలు అందుతాయనీ ఆయన అంటున్నారు. ఈ భోజన వేళలకు సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదు. ఉదాహరణకు భోజనం ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు? వివిధ షిఫ్టుల్లో పనిచేసేవారిపై భోజన వేళల ప్రభావం ఎలా ఉంటుంది? ఏవైనా కొన్ని రకాల పదార్థాలను కొన్ని వేళల్లోనే తీసుకోవాలా? లాంటి ప్రశ్నలకు పూర్తిస్థాయిలో జవాబు దొరకలేదు. మొత్తానికి పగటి వేళలోనే శరీరానికి ఎక్కువ కెలొరీలు అందించాలనీ, అందులోనూ భోజన సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోవాలనీ ప్రొఫెసర్ జొనాథన్, ప్రొఫెసర్ గెరాట్‌లు సూచించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పొద్దున పూట రాజులా పుష్టిగా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలా ఆలోచించి తినాలి, రాత్రిపూట బంటులా కొద్దిగా తినాలి అని చెబుతుంటారు. ఆ మాటలో ఎంత వరకూ నిజముందో, మనం ఆహారం తీసుకునే వేళల ప్రభావం ఆరోగ్యంపై, ముఖ్యంగా ఊబకాయంపై ఎలా ఉంటుందో తెలుసుకునేందకు శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు సాగిస్తున్నారు. text: యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో మాట్లాడుతున్న విజయసింగ్ ఠాకుర్ ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమైనదని.. భారత సార్వభౌమాధికారానికి సంబంధించిన ఈ నిర్ణయం విషయంలో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. అక్కడ అంతర్జాతీయ విచారణ జరపాలంటూ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్‌ఆర్‌సీ 42వ సాధారణ సమావేశాల్లో పాకిస్తాన్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉదయం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐరాసను కోరడంతో పాటు కశ్మీర్‌లో మానవహననం జరిగే పరిస్థితులున్నాయంటూ తీవ్ర ఆరోపణలతో ఒక ప్రకటన చేశారు. దీనికి భారత్ గట్టి సమాధానమిచ్చింది. భారత్ వైఖరి తెలుపుతూ, పాకిస్తాన్‌ని ఎండగడుతూ భారత విదేశాంగ కార్యదర్శి (తూర్పు) విజయసింగ్ ఠాకుర్, ఐరాసలో భారత శాశ్వత కార్యక్రమ ఫస్ట్ సెక్రటరీ విమర్శ్ ఆర్యన్‌లు ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజల హక్కుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని వారు తమతమ ప్రకటనల్లో స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాన్’ ఉగ్రవాదానికి పుట్టినిల్లయిన పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని విజయ్ సింగ్ ఠాకుర్ చెప్పారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏళ్లుగా కశ్మీర్‌ను ఎలా నాశనం చేసిందో వివరిస్తూ పాక్ రెండు నాల్కల ధోరణిని ఆమె ఎండగట్టారు. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలనీ.. పూర్తిగా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. జమ్మూకశ్మీర్‌లో సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఏళ్లుగా పాతుకుపోయిన లింగవివక్షకు తెరపడుతుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో సవాళ్లు ఉన్నప్పటికీ అక్కడి పౌర ప్రభుత్వం ప్రాథమిక సేవలు, నిత్యావసరాల సరఫరా, సంస్థలు ఎప్పటిలా పనిచేసే పరిస్థితులు, రవాణాకు ఇబ్బందుల్లేకుండా చూస్తోందని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం కారణంగా ముప్పు ఉండడంతో ప్రజల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్తగా కొన్ని ఆంక్షలు విధించినా ఒక్కటొక్కటిగా సడలిస్తున్నారని స్పష్టం చేశారు. విమర్శ్ ఆర్యన్ సీమాంతర ఉగ్రవాదం ఇక సాగించలేమనే.. తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని.. భారత్‌ను వ్యతిరేకిస్తున్న పాక్ సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి ఆటంకం అవుతుందన్న ఉద్దేశంతోనే జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ అంతగా ఆందోళన చెందుతోందని ఫస్ట్ సెక్రటరీ విమర్శ్ ఆర్యన్ తన ప్రకటనలో ఎండగట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐరాస మానవ హక్కుల మండలి వేదికగా (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ విషయంలో చేసిన ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. text: ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి సహా నిందితులందరినీ దిల్లీలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓసారి 2జీ స్పెక్ట్రం కుంభకోణం ఏమిటి? ఇందులోని ప్రధాన ఘట్టాలను చూద్దాం. స్పెక్ట్రం అంటే? తరంగాల ద్వారా టెలికమ్యూనికేషన్ ప్రసారాలు జరుగుతాయి. ఈ తరంగాలనే స్పెక్ట్రం అంటారు. 2జీ స్పెక్ట్రం అనేది రెండో తరం టెలికమ్యూనికేషన్లకు సంబంధించినది. కుంభకోణం ఏమిటి? మొబైల్‌ ఫోన్ల ద్వారా మనం మాట్లాడుకోవాలన్నా, ఇంటర్నెట్, ఇతర వైర్‌లెస్ సేవలకు ఈ స్పెక్ట్రం అవసరం. ఈ స్పెక్ట్రం కోసం టెలికాం సంస్థలు ప్రభుత్వానికి నిర్దేశిత రుసుము చెల్లించి అనుమతులు తీసుకుంటాయి. ఇలా అనుమతులు ఇవ్వడంలో అవినీతి చోటు చేసుకుందనేది ప్రధాన ఆరోపణ. ఎన్ని కోట్లు? నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు జారీ చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ 2010లో చెప్పింది. ప్రధాన ఘట్టాలు.. 2007లో రాజా టెలికాం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు 2007 మే: కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా డీఎంకే నేత ఎ.రాజా బాధ్యతల స్వీకారం ఆగస్టు: 2జీ స్పెక్ట్రం లైసెన్సుల జారీ, టెలికాం సర్కిళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అక్టోబరు: 46 సంస్థల నుంచి 575 దరఖాస్తులు నవంబరు: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని, లైసెన్సుల ఫీజును సవరించాలని కోరుతూ టెలికాం మంత్రి రాజాకు ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ 2008 జనవరి: "ఫస్ట్ కం ఫస్ట్" విధానంలో అనుమతులు జారీ చేయనున్నట్లు టెలికాం శాఖ ప్రకటన సెప్టెంబరు: 45 శాతం వాటాను ఎతిసలాత్‌కు విక్రయించిన స్వాన్ టెలికాం నవంబరు: టాటా టెలీసర్వీసెస్‌లో సుమారు 26 శాతం వాటాను కోనుగోలు చేసిన డొకోమో. దాదాపు 60 శాతం వాటాను టెలినార్‌కు విక్రయించిన యునిటెక్ 2009 మే: లూప్ టెలికాం సంస్థకు స్పెక్ట్రం కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను విచారించాల్సిందిగా సీబీఐని ఆదేశించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) అక్టోబరు: కొందరు టెలికాంశాఖ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ నవంబరు: లాబీయిస్ట్ నీరా రాడియా, టెలికాం మంత్రి రాజాల మధ్య మాటామంతీ నడవడంతోపాటు టెలికాం శాఖ విధానాల్లో కార్పొరేట్ సంస్థలు జోక్యం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం విచారణలో వెల్లడి రాజాను విచారించాలంటూ సుప్రీం కోర్టులో సుబ్రమణియన్ స్వామి పిటిషన్ వేశారు 2010 సెప్టెంబరు: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో రూ.70,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం, రాజాలకు సుప్రీం కోర్టు ఆదేశం సెప్టెంబరు: టెలికాం మంత్రి రాజాను విచారించేలా ప్రధానిని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో సుబ్రమణియన్ స్వామి పిటిషన్ సెప్టెంబరు: ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సుప్రీం కోర్టుకు తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబరు: 2జీ కేటాయింపుల్లో అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చిన కాగ్ నివేదిక నవంబరు: టెలికాం మంత్రి పదవికి రాజా రాజీనామా. కపిల్ సిబల్‌కు అదనపు బాధ్యతలు షాహిద్ బల్వా 2011 ఫిబ్రవరి: రాజా, డీబీ గ్రూప్ ప్రమోటర్ షాహిద్ బల్వా అరెస్ట్ ఫిబ్రవరి: డీఎంకే‌కు చెందిన కలైంగర్ టీవీకి షాహిద్ బల్వా అక్రమంగా నిధులు తరలించినట్లు దిల్లీ హై కోర్టుకు తెలిపిన సీబీఐ మార్చి: 2జీ కుంభకోణం విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు ఏప్రిల్ 2న: సీబీఐ తొలి ఛార్జ్ షీట్ ప్రధాన నిందితులు: రాజా, ఆయన ప్రైవేటు కార్యదర్శి ఆర్‌కె చండోలియా, టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురా ప్రధాన కంపెనీలు:రిలయన్స్ కమ్యూనికేషన్స్, స్వాన్ టెలికాం, యునిటెక్ వైర్‌లెస్ (తమిళనాడు) సీబీఐ ఛార్జ్ షీట్‌లో కనిమొళి పేరును చేర్చింది ఏప్రిల్ 25న: సీబీఐ రెండో ఛార్జ్ షీట్ ప్రధాన నిందితులు: డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి నవంబరు: విచారణ ప్రారంభం డిసెంబరు: సీబీఐ మూడో ఛార్జ్ షీట్ నిందితులు: ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు అన్షుమన్ రుయా, రవి రుయా; ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ (స్ట్రాటజీ, ప్లానింగ్) వికాస్ సరా; లూప్ టెలికాం ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్, ఆమె భర్త ఐ.పి. ఖైతాన్ కంపెనీలు: లూప్ టెలికాం, లూప్ మొబైల్, ఎస్సార్ టెలి హోల్డింగ్ 2012 ఫిబ్రవరి: టెలికాం మాజీ మంత్రి రాజా హయాంలో జారీ చేసిన 122 లైసెన్సుల రద్దు ఆగస్టు: తగిన ప్రాథమిక ఆధారాలు లేవంటూ, పి.చిదంబరాన్నివిచారించాలన్న అభ్యర్థనలను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం 2013 డిసెంబరు: లోక్‌సభకు 2జీ నివేదికను సమర్పించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2014 ఏప్రిల్: రాజా, కనిమొళిలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ మే: ప్రధానికి తెలిసే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కోర్టుకు రాజా వాంగ్మూలం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2017 ఏప్రిల్: ప్రత్యేక కోర్టు విచారణ పూర్తి డిసెంబరు 21: అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు (ఆధారం: ఈడీ వర్సెస్ ఎ.రాజా కేసు తీర్పు, టెలికాం మంత్రిత్వశాఖ, కాగ్) మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దాదాపు ఏడేళ్లనాటి "2జీ" కుంభకోణం కేసులో తీర్పు వచ్చింది. text: "గంటపాటు కర్ఫ్యూను సడలించగానే, ఆర్టికల్ 370 రద్దుకు కశ్మీరీ ప్రజలు ఎలా మద్దతు తెలుపుతున్నారో చూడండి" అని క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. దానిని అనేక ఫేస్‌బుక్ గ్రూపుల్లో, ట్విటర్ ఖాతాల్లో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తెల్ల దుస్తులు ధరించిన ముస్లింలు జాతీయ పతాకం పట్టుకుని రోడ్డుమీద ర్యాలీ తీస్తూ ’’భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలు చేయడాన్ని చూడొచ్చు. ఈ వీడియో ప్రామాణికతను పరిశీలించేందుకు బీబీసీ పాఠకులు మాకు వాట్సాప్ ద్వారా వీడియోను పంపించారు. బక్రీద్‌‌కు ముందుగా ఆదివారం కశ్మీర్‌లో కర్ఫ్యూను సడలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం ఉదయం, మసీదులో ప్రజలు ప్రార్థనలు చేస్తున్న కొన్ని ఫొటోలను హోమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షేర్ చేశారు. అయితే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోకు కశ్మీర్‌కు, ఆర్టికల్ 370 సవరణ తర్వాత నెలకొన్న పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని మా పరిశీలనలో వెల్లడైంది. ఆ వీడియో కర్ణాటకలోని బెంగళూరులో తీసినదని తేలింది. అది ఇప్పటిది కాదు, ఏడు నెలల క్రితం చిత్రీకరిందని గుర్తించాం. వీడియో వెనకున్న వాస్తవం ఆ వీడియోను 2019 ఫిబ్రవరిలో చిత్రీకరించారు. అందులో కనిపిస్తున్న ప్రజలు బోహ్రా ముస్లిం సముదాయానికి చెందినవారు, కశ్మీరీలు కాదు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ద్వారా వెతికితే, 2019 ఫిబ్రవరి 19న లిండా న్యోమాయి అనే మహిళ చేసిన ట్వీట్‌లో ఈ వీడియో కనిపించింది. ఆమె ట్విటర్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె బీజేపీ కార్యకర్త, ఆ పార్టీ ఎస్టీ వింగ్ సభ్యురాలు. #IndianArmyOurPride, #StandWithForces అనే హ్యాష్‌ట్యాగులతో ఆమె ఆ వీడియోను ట్వీట్ చేశారు. "పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించేందుకు బెంగళూరులోని బెనెర్ఘట్టా రోడ్డులో బోహ్రా సముదాయానికి చెందిన ముస్లింలు ర్యాలీ తీశారు" అని ఆమె క్యాప్షన్ రాశారు. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మీడియా కథనాల ప్రకారం, పుల్వామా దాడిని ఖండిస్తూ, బెంగళూరులో మాదిరిగానే ముంబయిలోనూ స్థానిక ముస్లింలు ర్యాలీ తీశారు. బోహ్రా ముస్లింలు ఎవరు? గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బోహ్రా ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నారు. వ్యాపారంలో విజయవంతమైన ముస్లిం సముదాయంగా వీరిని భావిస్తారు. ప్రవక్త హజరత్ మొహమ్మద్‌కు వారసుడిగా భావించే ఫాతిమా ఇమామ్స్‌ వారసత్వమే ఈ దావూదీ బోహ్రా సముదాయం అని చెబుతారు. ఈ సముదాయానికి చెందినవారు ఇమామ్స్‌ను మాత్రమే గౌరవిస్తారు. తయ్యబ్ అబుల్ కాసీం బోహ్రాలలో ఆఖరి, 21వ ఇమామ్. బోహ్రా సముదాయానికి అగ్రనేత సయ్యెదానా ముఫ్‌దల్ సైఫుద్దీన్‌ను కలిసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వెళ్లారు. బెంగళూరులో ర్యాలీ నిర్వహించిన మాట వాస్తవమేనని ముంబయికి చెందిన బోహ్రా కమ్యూనిటీ సీనీయర్ సభ్యుడు బీబీసీకి చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 సవరణను స్వాగతిస్తూ కొంతమంది ముస్లింలు ర్యాలీ తీస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. text: మహిళలు తమపై దాడిచేసిన వారి మీద ఈ పరికరం ద్వారా బయటకు కనిపించని ఒక గుర్తును ముద్రించవచ్చు. ఆ గుర్తు ఓ చిన్న హస్తం ఆకారంలో ఉంటుంది. ఆ హస్తం ముద్ర ఉన్నవారిని తర్వాత ఇదే పరికరంలోని నల్లని వెలుగును ఉపయోగించి గుర్తించవచ్చు. లైంగిక వేధింపుల నేరాలను అరికట్టటానికి సాయం చేయటం కోసం ఈ పరికరాన్ని రూపొందించామని తయారీ సంస్థ సాచిహతా చెప్తోంది. అయితే, ఇది బాధితుల మీద అదనపు భారం మోపుతుందని లైంగిక వేధింపుల అంశంపై పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది. గత మే నెలలో జపాన్‌లోని ఒక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మీద తమ శరీరాలను తాకుతూ లైంగిక వేధింపులకు (గ్రోపింగ్) పాల్పడిన అనుమానితుడిని ఇద్దరు స్కూలు విద్యార్థినులు తరుముతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ నేపథ్యంలో ఈ యాంటీ-గ్రోపింగ్ ఒక స్టాంప్‌ను తయారు చేస్తున్నట్లు సాచిహతా ప్రకటించింది. ''లైంగిక వేధింపులు లేని ప్రపంచం దిశగా ఈ పరికరం ఓ చిన్న ముందడుగు'' అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు. అత్యాచారం, లైంగిక హింస భయాలను సొమ్ము చేసుకోవటానికి ప్రైవేటు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, ఈ దాడులకు పాల్పడేవారిని ఎదుర్కొనే భారం బాధితులపైనే మోపుతున్నారని రేప్ క్రైసిస్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో పేర్కొన్నారు. టోక్యో రైళ్లలో కేవలం మహిళలకు మాత్రమే కేటాయించిన బోగీలు ఉంటాయి ''ఇటువంటి ఉత్పత్తులను ఆవిష్కరించి తయారు చేస్తున్న వారివి సదుద్దేశాలే అనటంలో సందేహం లేదు. అయితే, ప్రజలు, ప్రధానంగా మహిళలు, బాలికల్లోని లైంగిక హింస, అత్యాచారాల భయాన్ని సొమ్ము చేసుకోవటమనేది ఒక సమస్య'' అని కేటీ రసెల్ వ్యాఖ్యానించారు. ''ఇటువంటి 'నిరోధ' ఉత్పత్తులు లైంగిక హింస నుంచి కాపాడుకునే భారాన్ని బాధితులు, బాధితులు కాగలవాళ్ల మీదే మోపుతున్నాయి. నిజానికి ఆ బాధ్యత మొత్తం ఈ నేరాలకు పాల్పడే వారి మీదే ఉంటుంది. ఈ నేరాలను అరికట్టే శక్తి కూడా వారికే ఉంటుంది'' అని ఆమె అభిప్రాయపడ్డారు. టోక్యో నగరంలో 2017లో 2,620 లైంగిక నేరాల ఫిర్యాదులు అందాయని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. అందులో గ్రోపింగ్ నేరాల కేసులు 1,750 ఉన్నాయని.. అవి ఎక్కువగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో జరిగాయని చెప్పారు. యాంటీ-గ్రోపింగ్ స్టాంప్ పరికరం ధర ఒక్కొక్కటి 2,500 యెన్లు (సుమారు రూ. 1,700) నిర్ణయించారు. మంగళవారం పరిమిత సంఖ్యలో 500 విడుదల చేయగా.. మొత్తం 30 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయని సంస్థ అధికార ప్రతినిధి సీఎన్ఎన్ వార్తా సంస్థకు చెప్పారు. జపాన్‌లో గ్రోపింగ్ దాడులను అరికట్టటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల కిందట 'డిజి పోలీస్' అనే యాప్ విడుదలైంది. బాధితులు ఈ యాప్ ద్వారా ''ఇక్కడ ఒక గ్రోపర్ ఉన్నాడు.. దయచేసి సాయం చేయండి'' అనే మెసేజ్‌ను డిస్‌ప్లే చేయటం ద్వారా సహ ప్రయాణికులను అప్రమత్తం చేయటానికి వీలు కల్పిస్తుంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించటానికి టోక్యో రైళ్లలో 2009లోనే యాంటీ-గ్రోపింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం.. ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, అనుమతి లేకుండా మహిళలు, బాలికల ఫొటోలు తీస్తున్నారని 6,000 మందికి పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులను బయటపెడుతూ చర్చలోకి తెచ్చిన #MeToo ఉద్యమం.. జపాన్‌లో బలంగా విస్తరించలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక 149 దేశాలతో రూపొందించిన లైంగిక సమానత్వ సూచీలో జపాన్‌ 110వ స్థానంలో ఉంది. ఎంతమంది మహిళలు వేధింపులకు గురవుతున్నారు? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణాలో మహిళల శరీరాన్ని అసభ్యంగా తాకుతూ చేసే లైంగిక వేధింపులను అరికట్టటానికి జపాన్ వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. text: పైన కనిపిస్తున్నది దిల్లీ పరిసర ప్రాంతమైన గ్రేటర్ నోయిడాలోని డాబ్రా కుంట. మూడేళ్ల క్రితం ఈ కుంట దుర్గంధంతో నిడిపోయి ఉండేది. దాని సమీపంలోకి వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, 2019 నాటికి దాని స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు వెనకున్నది స్థానిక యువకుడు రామ్‌వీర్ తన్వార్. "ఈ నీటి కుంట మూడు నాలుగేళ్ల క్రితం ఓ చెత్త డంపింగ్ యార్డులా ఉండేది. మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాళ్లం. అప్పుడు ఎంతో శుభ్రంగా ఉన్న కుంట, రానురాను దుర్గంధమైపోయింది. అందరూ దీనిని ఒక మురుగునీటి గుంటగా చూసేవారు" అని రామ్‌వీర్ చెబుతారు. పది కుంటలను శుభ్రం చేసిన యువకుడు రామ్‌వీర్ తన్వార్ వృత్తిపరంగా ఇంజినీర్. ఉద్యోగం వదిలేసి గ్రేటర్ నోయిడా ప్రాంతంలో మురికిమయమైన నీటి కుంటలను బాగుచేసే పని ప్రారంభించారు. "ఈ కుంటలో ఎలాంటి కాలుష్యం ఉంది? ఎంత చెత్త ఉంది? అనేది విశ్లేషించేవాడిని. ఎలాగైనా శుభ్రం చేయాలని అనుకున్నా. అయితే, బురద బాగా పేరుకుపోయింది. అందులో ఎవరూ అడుగుపెట్టలేరు. దాన్ని తొలగించేందుకు యంత్రాలు అవసరమయ్యేవి, దాంతో ఖర్చు పెరుగుతుండేది. కొన్నాళ్లకు స్థానికులు నాతో చేతులు కలపడం ప్రారంభించారు. ఆర్థిక సాయం కూడా చేశారు." "నేను ఉద్యోగం వదిలేసి ఈ పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, చాలా మంది వారించారు. కుటుంబాన్ని ఎలా చూసుకుంటావు? అని ప్రశ్నించేవారు. కొన్నిసార్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి" అని రామ్‌వీర్ గుర్తుచేసుకున్నారు. రామ్‌వీర్ గత పదేళ్లలో చెత్తకుప్పలుగా తయారైన 10 కుంటలను శుభ్రం చేశారు. "నేనో, యంత్రాలో ఇప్పుడు కుంటను శుభ్రం చేసి వెళ్లిపోగానే, మళ్లీ కొన్నాళ్లకు ఎవరైనా వచ్చి శుభ్రం చేస్తారులే అన్నట్లుగా ప్రజలు ఆలోచిస్తారు. ఈ పనిలో అందరూ చేతులు కలిపినప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది" అంటారు రామ్‌వీర్. ఇప్పుడు చాలామంది నడక కోసం ఈ కుంట వద్దకు రావడమే కాదు, ఇందులోని నీరు వ్యవసాయానికి కూడా పనికొస్తోంది. ఈ కుంట వల్ల ప్రజలకు ఉపాధి దొరకడమే కాదు, భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది. "ఈ ఉద్యమంలో మేము విజయవంతం అయ్యామని అనుకుంటున్నా. గతంలో ప్రతికూలంగా ఆలోచించినవారు, ఇప్పుడు సానుకూలంగా మారిపోయారు" అని చెప్పారు రామ్‌వీర్. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కాలుష్య కాసారంగా మారిన నీటి కుంటలను పునరుద్ధరించేందుకు ఓ యువకుడు నడుం బిగించాడు. ఒకటి కాదు, రెండు కాదు... పది కుంటలను శుభ్రం చేశాడు. text: షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించిన షిర్డీ సంస్థాన్ దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తుల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు షిర్డీ సాయిబాబా సంస్థాన్ వెల్లడించింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది భక్తులకు త్వరలోనే సమాచారం అందిస్తామని ప్రకటించింది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థాన్ ప్రకటించింది. ముంబై సిద్ధి వినాయక ఆలయం మూసివేత సిద్ధి వినాయక ఆలయం.. ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని కూడా సోమవారం సాయంత్రం నుంచే మూసివేశారు. భక్తుల రాకపోకల్ని నిలిపివేశారు. మళ్లీ ఎప్పటి నుంచి దర్శనాలను ప్రారంభిచేది త్వరలోనే సమాచారం ఇస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మహారాష్ట్రలో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దర్శనానికి వచ్చే భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భక్తుల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేయడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్వహాకులు వెల్లడించారు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో తగ్గిన భక్తుల రాకపోకలు ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా భక్తుల రాకపోకలు గతంతో పోల్చితే తగ్గాయి. సెలవు రోజుల్లో 60వేలకు పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నప్పటికీ మామూలు రోజుల్లో మాత్రం 45వేలకు అటూ ఇటూగా ఉంటున్నారు. తిరుమల అధికార వెబ్ సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం మార్చి 16వ తేదీ ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 44,140 మాత్రమే. ఇదే మార్చి 15న దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,747. ప్రస్తుతానికి భక్తుల రాకపోకలపై ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు లేకపోయినప్పటి... వీలైనంత వరకు తిరుమల రావాలనుకునే వాళ్లు తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడమే మంచిదని టీటీడీ సూచిస్తోంది. ద‌ర్శ‌నాల‌కు ముందుగా రిజ‌ర్వ్ చేసుకున్న వాళ్ల‌కు వాయిదా వేసుకుని తేదీలు స‌ర్దుబాటుకి అవ‌కాశం ఇస్తున్నట్టు తెలిపింది. రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు చేసుకుంటే న‌గ‌దు వాప‌స్ ఇచ్చేందుకు టీటీడీ నిర్ణ‌యించింది. భద్రాచలంలో నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు భక్తులు లేకుండానే భద్రాద్రి రాముని కల్యాణం కరోనావైరస్ ప్రభావం భద్రాద్రిపై కూడా పడింది. ఏటా వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని ఈ సారి భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీరామ నవమి వేడుకల్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తామని అన్నారు. విజయవాడ కనక దుర్గ ఆలయంలో ముందు జాగ్రత్తలు దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ముందు జాగ్రత్త చర్యలు విజయవాడ కనకదుర్గ ఆలయానికి కూడా భక్తుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు అధికారులు కూడా భక్తుల రాకపోకలపై తాత్కాలికంగా ఆక్షలు విధించారు. విదేశాల నుంచి, దూర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు కొద్ది రోజుల పాటు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడి వృద్ధులు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని కోరారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని, భక్తులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. సింహాచలం దేవస్థానంలో ముఖానికి మాస్కులు కట్టుకొని విధులకు హాజరైన అర్చకులు మాస్కులతో నిత్యపూజలు ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయం సింహాచలంలోనూ దర్శనానికొచ్చే భక్తులపై ఆంక్షలు విధించారు ఆలయ అధికారులు . కరోనావైరస్ ముప్పును దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, 12 ఏళ్ల లోపు పిల్లలు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా అర్చకులు, దేవస్థానం సిబ్బంది మాస్కులతోనే విధులకు హాజరవుతున్నారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండై క్యూలైన్లు, నిత్య అన్నదాన సత్రం, ప్రసాదం క్యూలైన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేట్టు చూస్తున్నామని, భక్తులకు శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచామని ఈవో తెలిపారు. దేవస్థానం నిర్వహించే ప్రధాన ఉత్సవాలు, పూజాది కార్యక్రమాలు భక్తులు లైవ్ టెలీకాస్ట్‌ ద్వారా వీక్షించడం మంచిదని సూచించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో కరోనావైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ఒకే చోట పదుల సంఖ్యలో జనం గుమిగూడవద్దన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. text: ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, కొన్ని గంటల తర్వాత బిలాల్‌ను జామీనుపై విడుదల చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు మత ఛాందస వాదంపై సోషల్ మీడియాలో బిలాల్ తరచూ వ్యాఖ్యలు చేసేవారు. పాకిస్తాన్‌లో షియా ముస్లింలపై ద్వేషాన్ని పెంచేలా జరుగుతున్న ర్యాలీలపై సెప్టెబరు 18న ఆయన రెండు ట్వీట్లు చేశారు. ఒక ట్వీట్‌లో ఇస్లామాబాద్‌లో జరిగిన షియా వ్యతిరేక ర్యాలీ క్లిప్‌ను ఆయన ట్యాగ్ చేశారు. దాని కింద ఇలా రాశారు. ''షియా ముస్లింలపై విద్వేషం కక్కే ఈ ముల్లాలు ర్యాలీ నిర్వహిస్తుంటే నేనూ ప్రశాంతంగా కూర్చోలేను. దీనికి ముందు ఇంకొక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో షియాలను కాఫిర్ (ఇస్లాంపై నమ్మకంలేనివారు)గా పేర్కొన్నారు''. ''ఇది చాలా ప్రమాదకరం. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వారు ప్రయత్నిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ నిషేధించిన సంస్థలు ఈ ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. వారిని ఎందుకు పట్టుకోవట్లేదు''అని ఆయన వ్యాఖ్యానించారు. షియా ముస్లింలను నిషేధించాలంటూ అభ్యర్థనలు బిలాల్ ట్వీట్ చేసిన వీడియో క్లిప్‌లో.. పెద్ద ర్యాలీ కనిపిస్తోంది. షియా ముస్లింలను నిషేధించాలంటూ ఓ వ్యక్తి వేదికపై నుంచి చెబుతున్న దృశ్యాలు దీనిలో ఉన్నాయి. అంతేకాదు షియా ముస్లింలతో సంబంధాలు పెట్టుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా చేశారు. ఈ ట్వీట్‌పై పాకిస్తాన్ మహిళా హక్కుల ఉద్యమకారిణి ఇస్మత్ రజా షాజహాన్ స్పందించారు. ''చైనా-ఇరాన్‌ల మధ్య కుదిరిన 400 బిలియన్ డాలర్ల ఒప్పందం, ఇరాన్‌ (షియా దేశం)లోని బందర్‌అబ్బాస్‌ పోర్టుకు పెరుగుతున్న ప్రాధాన్యంపై అమెరికా, సౌదీతోపాటు చాలా గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ చీఫ్, సైన్యాధిపతి జనరల్ బాజ్వాల.. సౌదీ పర్యటన, సౌదీపై విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రకటన తర్వాత షియాలపై విద్వేషాలు వెదజల్లడం మొదలైంది''అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, షియాలపై విద్వేషం వెదజల్లడానికి చాలా కారణాలున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు అయేషా సిద్దిఖీ అన్నారు. చైనా-ఇరాన్‌ల మధ్య కుదరిన ఆ 400 బిలియన్ డాలర్ల ఒప్పందం ఒక చిన్న కారణం అయ్యుండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. దైవదూషణ ఆరోపణలు మొహరం ప్రదర్శనల తర్వాత షియాలకు వ్యతిరేకంగా ర్యాలీలు జరగడం మొదలైంది. షియాలు దైవ దూషణకు పాల్పడుతున్నారని అతివాద సున్నీ ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఏఎఫ్‌పీ వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. కరాచీలో సెప్టెంబరు 11న షియా వ్యతిరేక ర్యాలీ జరిగింది. దైవ దూషణను ఇకపై సహించేదిలేదని దీనిలో ఇస్లామిక్ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాంకు చెందిన ఖారీ ఉస్మాన్ వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో కొందరు సిపాహ్-ఇ-సాహెబా సంస్థ సభ్యులు షియా వ్యతిరేక బ్యానర్లు ప్రదర్శించారు. గత కొన్నేళ్లుగా షియాలపై దాడులు చేస్తూ, వారిని మట్టుపెడుతున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలున్నాయి. షియాలపై విద్వేషం అంశం పాకిస్తాన్ సెనేట్‌లోనూ శుక్రవారం చర్చకు వచ్చింది. షియాలపై విద్వేషాన్ని కొందరు బహిరంగంగానే వెదజల్లుతున్నారని, దీన్ని వెంటనే ఆపేలా చూడాలని ప్రభుత్వాన్ని ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కోరింది. ఈ అంశంపై పీపీపీ పార్లమెంటరీ నాయకుడు, సెనేటర్ షెరీ రెహ్మాన్ మాట్లాడారు. ''పాకిస్తాన్‌లోని ముస్లింలలో షియాలు 20 శాతం వరకూ ఉంటారు. ఇటీవల కాలంలో వారిపై దాడులు పెరిగాయి. ఇవి దేశ సుస్థిరతకు ముప్పు తెచ్చే అవకాశముంది. షియాలపై 20కిపైగా దాడులు జరిగినట్లు కేసులు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు'' జిన్నా పాకిస్తాన్ ''షియా ముస్లింలకు వ్యతిరేకంగా ర్యాలీలు జరుగుతున్నాయి. వాటిలో విద్వేష పూరిత నినాదాలు చేస్తున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. దీనిపై తక్షణమే స్పందించాలి''అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు. ''ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు మనం చాలా ప్రయత్నిస్తున్నాం. చాలా త్యాగాలనూ చేస్తున్నాం. ఇది జిన్నా పాకిస్తాన్. మసీదుకు వెళ్లినట్టే.. మనం ఆలయాలకూ వెళ్లొచ్చని జిన్నా చెప్పారు. మీరు ఏ మతానికి చెందిన వారైనా ప్రభుత్వం వివక్ష చూపదని అన్నారు''. ''దేశ ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాపాడాలి. షియాలు కూడా ఈ దేశ పౌరులే''అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు. దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ సమాచారం ప్రకారం.. పాకిస్తాన్‌లో 2001 నుంచి 2018 మధ్య 4,847 మంది షియాల హత్యలు జరిగాయి. అయితే వాస్తవానికి ఈ సంఖ్య దీని కంటే పది రెట్లు ఎక్కువే ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. సున్నీలదే ఆధిపత్యం ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ సమాచారం ప్రకారం.. మొహరం తర్వాత షియాలపై దాడులు పెరిగాయి. కరాచీలో గత కొన్ని వారాల్లో ఇవి మరింత ఎక్కువయ్యాయి. కరాచీలో సెప్టెంబరు 13న జరిగిన షియా వ్యతిరేక ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. మహమ్మద్ అలీ జిన్నా రోడ్‌లో పెద్దయెత్తున్న షియా వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక్కడ నిరసనలకు నేతృత్వం వహించిన వారిలో మునీబుర్ రెహ్మాన్ కూడా ఉన్నారు. రుయితే హిలాల్ కమిటీకి ఈయన ఛైర్మన్. ఈద్ పర్వదినాలను ప్రభుత్వం తరఫున వీరే ప్రకటిస్తారు. ఈ ఏడాది జులైలో పంజాబ్ ప్రావిన్స్‌ అసెంబ్లీ.. తెహ్‌ఫుజ్-ఇ-బునియాద్-ఇ-ఇస్లాం బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం.. సున్నీలు చెప్పే ఇస్లాం వ్యాఖ్యానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. దీనిపై షియాలు నిరసన వ్యక్తంచేశారు. చాలా మంది సభ్యులు బిల్లులోని నిబంధనలను చదవకుండానే దీనికి మద్దతుగా ఓటేశారు. ఇక్కడ ఆగస్టులో 42 దైవ దూషణ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం షియాలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇటీవల మూడేళ్ల షియా బాలుడిపైనా కేసు నమోదు చేశారు. నియంతృత్వ సైన్యాధిపతి జియా ఉల్ హక్ హయాంలో 1980ల్లో పాకిస్తాన్‌లో షియాలపై హింస మొదలైంది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా.. కూడా ఇస్మైలీ షియానే. అయితే జియా ఉల్ హక్ హయాంలోనే షియాలపై దాడులు ఎక్కువయ్యాయి. అయితే, జిన్నా షియానా లేక సున్నీనా? అనే వివాదం ఎప్పటి నుంచో నడుస్తూ వస్తోంది. ''జిన్నాకు అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు ముస్లిం లీగ్‌కు చెందిన షబ్బీర్ అహ్మద్ ఉస్మానీ అనే ఇస్లాం బోధకుడు అక్కడే ఉన్నారు. సున్నీ విధివిధానాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన పట్టుబట్టారు. వివాదం తేలకపోవడంతో.. రెండు విధానాల్లోనూ అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది''అని పాకిస్తాన్ చరిత్రకారుడు ముబారక్ అలీ.. బీబీసీతో చెప్పారు. ''జిన్నా.. ఇస్మైలీ కావడంతో షియా అయ్యారు. ఇస్మైలీలు.. ఆరుగురు ఇమామ్‌లను నమ్ముతారు. షియాలు 12 మంది ఇమామ్‌లను నమ్ముతారు. నాకు తెలిసినంత వరకూ ఆయన మతాన్ని అంతగా పట్టించుకోరు. కానీ ఆయనకు చాలా ఆత్మగౌరవం ఉండేది. ఇస్మైలీలు.. ఆగా ఖాన్‌ను కొలుస్తారు. కానీ ఆయన్ను ఇమామ్‌గా అంగీకరించడం జిన్నాకు ఇష్టముండేది కాదు. అందుకే ఆయన్ను షియాగా పిలవొచ్చు'' ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్‌లో సైన్యాన్ని విమర్శించిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌కు చెందిన జర్నలిస్టు బిలాల్ ఫరూఖిని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ గత వారం అరెస్టు చేశారు. text: గత వారం డెన్మార్క్ సుమారు 1.7 కోట్ల మింక్‌లను చంపేయాలని తీసుకున్న నిర్ణయం చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది రాజకీయ రంగును సంతరించుకోవడంతో డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్రిక్సన్ ఈ నిర్ణయానికి చట్టబద్ధత లేదని అంగీకరించారు. ఆమె ఈ అంశంపై పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. అసలు ఏం జరిగింది? ఇప్పటి వరకు మనుష్యులలో మాత్రమే విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు మింక్ అనే జంతువులలో కనిపించడం మొదలైంది. వైరస్ సోకిన కొంత మంది వ్యక్తుల ద్వారా మింక్ ఫార్మ్స్‌లో ఉండే మింక్‌లకు ఈ వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఈ జంతువుల నుంచి మనుషులకు తిరిగి వైరస్ సోకిన కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పటికే డెన్మార్క్‌లో 200 మందికి మింక్ నుంచి కరోనావైరస్ సోకినట్లు గుర్తించారు. వైరస్‌లో మింక్ నుంచి తలెత్తిన స్ట్రెయిన్ కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ వైరస్ యాంటీ బాడీలను పరిరక్షించదని ఇది వ్యాక్సీన్ అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని చెబుతున్నారు. ఈ నివేదికలు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయని, అయితే ఈ వైరస్ వలన కరోనా చికిత్సకు, వ్యాక్సీన్ మీద ప్రభావాన్ని తెలుసుకునేందుకు మరి కొన్ని అధ్యయనాలు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వీటిలో జరిగే మ్యూటేషన్ ప్రక్రియ వ్యాక్సీన్ తయారీ మీద ప్రభావం చూపిస్తుందో లేదో చెప్పడానికి ఇంకా కొంత కాలం వేచి చూడకుండా ఎటువంటి నిర్ణయానికీ రాలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. గత వారం డెన్మార్క్ సుమారు 1. 7 కోట్ల మింక్ లను అంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ కూడా ఇతర వైరస్ లాగే కాలక్రమేణా తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అయితే, డెన్మార్క్ లో ప్రస్తుతం కనిపించిన వైరస్ మనుషులకు ప్రమాదకరమో కాదో చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. "జంతువుల మధ్య ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రతి సారీ దీని స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇది ఒక వేళ ప్రస్తుతం మనుష్యులలో కనిపిస్తున్న వైరస్ కంటే మరీ ఎక్కువగా తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటే గనక వ్యాక్సీన్ పని తీరు పై ప్రభావం పడే అవకాశం ఉంది" అని ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిరాడ్ కి చెందిన ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మరిసా పేర్ చెప్పారు. అయితే, వీటిలో ఇప్పటి వరకు కనిపించిన వైరస్ స్వభావం తీవ్రంగా ఉండి వైరస్ ప్రొటీన్లని పెంచేస్తున్నాయి. ఈ ప్రోటీన్లను హరించే లక్ష్యంగా కొన్ని వ్యాక్సిన్ల తయారీ కూడా జరుగుతోంది. " ఏదైనా ప్రత్యేక ప్రోటీన్ ని లక్ష్యంగా పెట్టుకుని దానికి తగిన రోగనిరోధక శక్తి పెంపొందించడానికి వాక్సీన్ అభివృద్ధి చేస్తున్న సమయంలో, ఈ జంతువుల నుంచి ఒక వేళ వైరస్ తిరిగి మనుష్యులకు సోకుతుంటే, వ్యాక్సీన్ కూడా వైరస్ నుంచి రక్షించలేదు" అని పేర్ చెప్పారు. మింక్ లలో కనిపిస్తున్న జన్యు మార్పుల వలన వ్యాక్సీన్ తయారీ మీద ప్రభావం చూపవచ్చు అనే భయంతో డెన్మార్క్ లో చాలా ప్రాంతాలలో తిరిగి లాక్ డౌన్ విధించారు. డెన్మార్క్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ నిషేధం విధించింది. గత వారం డెన్మార్క్ సుమారు 1. 7 కోట్ల మింక్ లను అంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉన్ని కోసం చైనా, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలండ్ లలో ఏటా 5 కోట్ల మింక్ లను పెంచుతూ ఉంటారు. అయితే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, అమెరికాలో ఇప్పటికే ఈ జంతువులలో వైరస్ సోకినట్లు నివేదికలు రావడంతో వీటిని ఏరివేయడం ప్రారంభించారు. మింక్ లలో కూడా మనుష్యుల లాగే వైరస్ సోకిన తర్వాత ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడం నుంచీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. "వీటికి ఆహారం ఇస్తున్నప్పుడు కానీ, లేదా ఇన్ఫెక్షన్ సోకిన తుంపర్ల వలన కానీ వైరస్ సోకుతుందేమోనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వైరస్ మిగిలిన ఇతర జంతువులకు వేటికైనా సోకిందేమో పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని యూనివర్సిటీ కాలేజీ లండన్ కి చెందిన ప్రొఫెసర్ జొవాన్ సాంటిని అన్నారు. ఈ మింక్ లలో కనిపించిన వైరస్ పై శాస్త్రవేత్తలు జన్యు పరమైన అధ్యయనాలు చేస్తున్నారు. ఈ వైరస్ తన స్వభావాన్ని ఎలా మార్చుకుంటుందో ఇది వ్యాప్తి చెందే క్రమంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, ఇది ఎంత అంటువ్యాధో చూడాల్సిన అవసరం ఉంది. అని సాంటిని అన్నారు. వివిధ దేశాలు వీటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు అవలంబించాయి? ఈ మింక్ ల పెంపకాన్ని ఆపాలని ఇప్పటికే డెన్మార్క్, చైనా, మలేసియా కి చెందిన కొంత మంది శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటి పెంపకం పై పర్యవేక్షణ పెంచి జీవ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే డెన్మార్క్‌లోని గ్రామాల శివార్లలో చంపేసిన మింక్‌లు గుట్టలుగుట్టలుగా ఉన్నాయని రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ పని కోసం ఇప్పటికే పోలీసులు, సైనిక దళాలను రంగంలోకి దించి ఆరోగ్యకరంగా ఉన్న జంతువులను కూడా చంపేయాలని రైతులను ఆదేశించారు. అయితే, దీనికి కొంత సమయం పట్టవచ్చు. "మా దగ్గర 65,000 మింక్ లు ఉన్నాయి. రానున్న వారాల్లో వీటన్నిటినీ అంతం చేస్తాం " అని ఫునెన్ లో మింక్ పెంపకం చేస్తున్న మార్టిన్ ఫ్రొమ్ చెప్పారు. రాత్రికి రాత్రే జీవనాధారం కోల్పోయానని ఆయన అంటున్నారు. ఇలా జరిగింది ఈయనొక్కరికే కాదు. కన్నీళ్లు పెట్టుకుంటున్న చాలా మంది రైతులు డానిష్ టెలివిజన్ లో కనిపించారు. డెన్మార్క్ లో 1000 కి పైగా మింక్ పెంపకం ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పటికే 116 మింక్ ఫార్మ్స్ లో మొత్తం మింక్ లన్నిటినీ అంతం చేయడం పూర్తయిందని డానిష్ వెటర్నరీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. డెన్మార్క్ ఈ విషయంలో కాస్త తీవ్రంగానే స్పందించేదేమోనని కొందరు విమర్శిస్తున్నారు. రైతులకు ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించకుండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల విముఖత వ్యక్తం అవుతోంది. డెన్మార్క్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన మింక్ పరిశ్రమ పూర్తిగా మూత పడి కనీసం 6000 మంది ఉద్యోగాలు కోల్పోతారని కోపెన్ హాగెన్ ఫుర్ ట్రేడ్ సంఘం అధ్యక్షుడు టేగ్ పెడర్సన్ అన్నారు. గుట్టలుగా మింక్ కళేబరాలు కరోనావైరస్ వలన ఇప్పటికే నెథర్లాండ్స్ మింక్ ఊలు ఉత్పత్తిని నిషేధించింది. యుకె, ఆస్ట్రియాలో వీటి ఉత్పత్తిని కొన్నేళ్ల క్రితమే ఆపేసారు. జర్మనీ కూడా ఈ ఉత్పత్తిని నెమ్మదిగా తగ్గిస్తూ వస్తోంది. బెల్జియం, ఫ్రాన్స్, నార్వే కూడా వీటి ఉత్పత్తిని ఆపాలనే ప్రణాళికల్లో ఉన్నారు. యూరప్ అంతటా కనీసం 4350 మింక్ ఫార్మ్స్ ఉన్నాయి. మిగిలిన యూరప్ దేశాల లాగే డెన్మార్క్‌లో కూడా ఈ వ్యాపారాన్ని క్రమేపీ తగ్గించేందుకు తగిన ప్రణాళిక ఉండాలని డానిష్ జంతు పరిరక్షణ సంఘాల వారు భావిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) డెన్మార్క్‌లో మింక్(ముంగిసలను పోలిన జంతువు)లలో కరోనావైరస్ ఉన్నట్లు బయటపడటంతో ఆ దేశ ప్రభుత్వం వీటిని పూర్తిగా అంతం చేయాలనే నిర్ణయం తీసుకుంది. text: ''చైనాలో ఎక్కడో ఒక చోట గబ్బిలం ఒకటి ఆకాశంలో ఎగురుతూ విసర్జిస్తే అది అడవిలో పడి ఉంటుంది. అందులో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండుంటాయి. అడవి జంతువు ఏదైనా, బహుశా అలుగు(పాంగోలిన్) ఆకుల మధ్య పురుగుల కోసం వెతుకుతూ ఆ గబ్బిలం విసర్జితాలను సమీపించినప్పుడు అందులోని కరోనా వైరస్ దానికి సంక్రమించి ఉండొచ్చు. అక్కడి నుంచి ఈ వైరస్ వన్యప్రాణుల్లో వ్యాపించగా అలాంటి ఒక వన్యప్రాణిని వేటాడినప్పుడు ఎవరైనా ఈ వైరస్ బారిన పడి.. వన్యప్రాణులను అమ్మే మార్కెట్లో ఉండేవారికి సంక్రమింపజేయడంతో ఇది ప్రబలడం ప్రారంభమై ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఈ వైరస్ ఏ జంతువుల్లో ఉంటుందన్నది గుర్తించి దాని ద్వారా తమ సూత్రీకరణ నిజమని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కనుక్కోవడం ఒక రకంగా డిటెక్టివ్ కథలాంటిదని జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ కన్నింగ్‌హామ్ అన్నారు. అడవిజంతువుల్లో అనేక రకాలకు ఈ వైరస్ ఉండొచ్చని.. ముఖ్యంగా గబ్బిలాల్లో వివిధ రకాల కరోనా వైరస్ ఉంటుందని అంటున్నారు. ఒక రోగి శరీరం నుంచి ఈ కొత్త వైరస్ కోడ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించినప్పుడు చైనాలో గబ్బిలాలతో సంబంధం బయటపడింది. క్షీరదాలైన గబ్బిలాలు పెద్దపెద్ద సమూహాలుగా గుమిగూడుతాయి. ఇది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. భూమి మీద ప్రతి ఖండంలోనూ వీటి ఉనికి ఉంది. ఇవి రోగాల బారిన పడడం చాలా అరుదు.. కానీ, వ్యాధికారకాలను మాత్రం అవి వ్యాపింపజేస్తాయి. లండన్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ కేట్ జోన్స్ చెప్పిన ప్రకారం.. గబ్బిలాలు ఎగరడానికి కావాల్సిన శక్తి అవసరాలను సమకూర్చుకోవడంతో పాటు డీఎన్‌ఏ‌కు కలిగే నష్టాన్ని మరమ్మతులు చేసుకునే సామర్థ్యాలనూ సంతరించుకున్నాయి. ఈ కారణంగానే ఇవి వైరస్‌లను తట్టుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు కేట్ జోన్స్. గబ్బిలాల ప్రవర్తన వైరస్‌ల వృద్ధికి వీలు కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి నివసించే విధానాన్ని పరిశీలిస్తే వాటికి పెద్ద సంఖ్యలో వైరస్‌లుంటాయని అర్థమవుతుందని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జోనాథన్ బాల్ చెప్పారు. అంతేకాకుండా గబ్బిలాలు క్షీరదాలు కావడం వల్ల మానవులకు ప్రత్యక్షంగా కానీ ఇతర జీవుల ద్వారా కానీ వైరస్‌లను వ్యాపింపజేసే అవకాశముందని చెప్పారు. వేళ్లన్నీ పాంగోలిన్ వైపే.. ఇక ఈ చిక్కుముడిలో రెండో భాగమేంటంటే.. తన ఒంట్లో వైరస్ నింపుకొని వుహాన్ మార్కెట్‌కు తీసుకొచ్చిన జంతుజాతిని గుర్తించడం. ఈ విషయంలో అనుమానాలన్నీ పాంగోలిన్‌లపైనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణాకు గురవుతున్న జంతువులు పాంగోలిన్‌లుగా చెబుతారు. ఇవి చీమలను తిని బతుకుతాయి. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనా సంప్రదాయ ఔషధాల తయారీలో వీటిని ఉపయోగించడం వల్ల వీటికి ఆసియాలో మంచి గిరాకీ ఉంది. అంతేకాదు, పాంగోలిన్ మాంసాన్ని కొందరు బాగా ఇష్టపడతారు. పాంగోలిన్‌లలో కనుగొన్న కరోనా వైరస్‌లకు మనుషుల్లో గుర్తించిన కరోనా వైరస్‌లకు దగ్గర పోలికలున్నట్లు చెబుతున్నారు. మనుషులకు సోకడానికి ముందు గబ్బిలాలు, పాంగోలిన్‌ల మధ్య కరోనా వైరస్ మార్పిడి జరిగిందా అన్న అనుమానాలున్నాయి. దీనికి సంబంధించి నిర్ధారణలకు రావడానికి ముందు నిపుణులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. పాంగోలిన్‌లపై జరుగుతున్న అధ్యయనానికి సంబంధించి ఇంకా పూర్తి డేటా అందుబాటులోకి రాకపోవడంతో దీన్ని నిర్ధారించుకోవడం అసాధ్యం. ఎన్ని పాంగోలిన్‌లపై అధ్యయనం చేశారు.. వాటి మూలాలు ఏంటనేది ముఖ్యమని ప్రొఫెసర్ కన్నింగ్‌హామ్ అన్నారు. ''ఉదాహరణకు.. అడవి నుంచి నేరుగా పాంగోలిన్‌లను శాంపిల్ కోసం తీసుకున్నారా.. లేదంటే ఎక్కడైనా బందీగా ఉన్నదో, మార్కెట్‌లోనిదో పాంగోలిన్‌పై అధ్యయనం చేశారా అన్నది ప్రధానం. అడవుల నుంచి ఎక్కువ సంఖ్యలో పాంగోలిన్‌లను తెచ్చి అధ్యయనం చేస్తే అది అర్థవంతంగా ఉంటుంది, మార్కెట్ల నుంచి తెచ్చిన ఒకట్రెండుపై అధ్యయనం చేస్తే ఫలితాలలో కచ్చితత్వం సందేహాస్పదమే''నన్నది కన్నింగ్‌హామ్ మాట. ''పాంగోలిన్లు, గబ్బిలాలు, ఇతర అడవి జంతువులను మార్కెట్లలో తరచూ విక్రయిస్తారు. ఈ పరిస్థితులు ఒక జంతువు నుంచి మరో జంతువుకు వైరస్ సంక్రమించేలా చేస్తాయి. మనుషులకు కూడా ఇలాంటి చోట సంక్రమించే ప్రమాదముంది'' అన్నారు కన్నింగ్‌హామ్. చైనాలో కరోనా వైరస్ ప్రబలడానికి కేంద్ర స్థానమైన వుహాన్ మార్కెట్‌ను మూసివేయడానికి ముందు అక్కడ అన్ని రకాల జంతువులు, పక్షులు బతికి ఉన్నవి విక్రయించడమే కాకుండా వాటి మాంసాన్నీ విక్రయించేవారని 'ది గార్డియన్' తెలిపింది. ఒంటెలు, కోలాలు అవయవాలతో పాటు తోడేలు పిల్లలు, తేళ్లు, ఎలుకలు, ఉడుతలు, నక్కులు, చెట్టు పిల్లులు, ముళ్ల పందులు, సాలమాండర్స్, తాబేళ్లు, మొసళ్లు, తొండలు, బళ్లులు, ఉడుములు వంటివన్నీ విక్రయించేవారు. ఇటీవల కాలంలో మనకు తెలిసిన అనేక వైరస్‌లు అడవి జంతువుల నుంచే వచ్చాయి. ఎబోలా, హెచ్ఐవి, సార్స్ వంటివన్నీ అడవి జంతువుల నుంచే మనుషులకు సంక్రమించాయని ప్రొఫెసర్ కేట్ జోన్స్ అన్నారు. వైరస్‌లను గుర్తించే సామర్థ్యం పెరగడం ఇదంతా తెలుస్తోందని.. అటవీ ప్రాంతాల్లో మనుషుల చొరబాటు పెరగడం వల్ల మానవ జాతి ముందెన్నడూ ఎదుర్కోని వైరస్‌లు సంక్రమిస్తున్నాయని జోన్స్ అభిప్రాయపడ్డారు. ప్రమాద కారకాలను తెలుసుకుంటే నివారణా చర్యలూ తీసుకోవచ్చని.. అయితే, అవి వన్యప్రాణులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలని ప్రొఫెసర్ కన్నింగ్‌హామ్ అన్నారు. గబ్బిలాలలో అనేక వైరస్‌లు ఉంటున్నా పర్యావరణ వ్యవస్థలో అవి కూడా అవసరమేనని చెప్పారు. ''కీటకాలను ఆహారంగా తీసుకునే గబ్బిలాలు దోమలు, పొలాల్లోని కీటకాలను తింటాయని.. పండ్లను తినే గబ్బిలాలు చెట్ల మధ్య పరాగసంపర్కం చేసి విత్తనాలను వ్యాప్తికి సహకరిస్తాయని చెప్పారు. వేల మంది మరణానికి కారణమైన ఈ వైరస్ మానవులకు ఎలా సంక్రమించిందన్నది కచ్చితంగా తెలుసుకోలేకపోయినా.. భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌లను ఎదుర్కోవడానికి ఈ అధ్యయనాలు ఉపకరిస్తాయని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డయానా బెల్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రాణాంతక కరోనావైరస్ వన్యప్రాణుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించిందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. text: వయాగ్రా కొనాలంటే చాలా దేశాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. అలాగే చాలా చోట్ల మందుల షాపుల్లో మందుల చీటీ లేకుండానే వయాగ్రా ఇచ్చేస్తుంటారు. మరి దీన్ని ఎవరు తీసుకోవచ్చు? వయాగ్రా కనెక్ట్ కేవలం అంగ స్తంభన సమస్యలు కలిగిన పురుషులకు మాత్రమేనని వైద్యులు తెలిపారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో అయితే 18 ఏళ్ల లోపు పిల్లలకు దీనిని విక్రయించరాదు. అక్కడ ఫార్మసిస్టు అంగీకరిస్తే, మహిళలు తమ భాగస్వామి తరఫున వాటిని కొనుగోలు చేయవచ్చు. శృంగారంలో పాల్గొనడానికి 'ఫిట్'గా లేని పురుషులకు దీనిని విక్రయించరాదు. తీవ్రమైన గుండెజబ్బులు, రక్తనాళ సమస్యలు ఉన్నవారు ఈ విభాగం కిందకు వస్తారు. చిన్న చిన్న వ్యాయామాలకే అలసిపోయేవారు, రెండు అంతస్తుల మెట్లను ఎక్కేసరికి ఆయాసపడిపోయేవాళ్లు ఈ పిల్స్ తీసుకోరాదు. దీన్ని కొనాలనుకునేవారు పరీక్షలు చేయించుకోవాలా? కొనాలనుకున్నవారు అవసరమైతే ఒక ప్రైవేట్ రూంలో ఫార్మసిస్టుతో మాట్లాడొచ్చు. పలు ఫార్మసీలలో ఇప్పుడు ప్రైవేట్ కన్సల్టేషన్ సదుపాయం ఉంటోంది. పిల్స్ కొనాలనుకుంటున్న వ్యక్తి ఆరోగ్యం గురించి, అతను వాడుతున్న ఇతర మందుల గురించి ఫార్మసిస్టు అడిగి తెలుసుకుంటాడు. అయితే కొంటున్నవారి లైంగిక జీవితం గురించి ఎలాంటి వ్యక్తిగత ప్రశ్నలూ అడగరాదు. కొనాలనుకుంటున్న వారు శరీర పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. వయాగ్రా పని చేస్తుందా? చాలాసార్లు పని చేస్తుంది. కానీ ఈ పిల్స్ అందరిపై ప్రభావం చూపించవు. ఈ ఔషధం పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేట్లు చేసి, అంగ స్తంభన జరగడానికి అవకాశం కల్పిస్తుంది. శృంగారంలో పాల్గొనడానికి ఒక గంట ముందు ఈ పిల్ వేసుకోవాలి. ఈ పిల్స్‌ను ఆహారంతో పాటు, ఆహారం లేకుండా కూడా తీసుకోవచ్చు. అయితే కడుపు నిండా ఆహారం తీసుకుని ఉంటే మాత్రం పిల్స్ కొంచెం ఆలస్యంగా పని చేయడం ప్రారంభిస్తాయి. వీటిని ద్రాక్షపళ్లతో కానీ, ద్రాక్షరసంతో కానీ కలిపి తీసుకోకూడదు.. ఎందుకంటే అది ఔషధం పని తీరును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఒక 50 ఎంజీ పిల్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ మీకు అంగ స్తంభన జరిగి చాలా కాలం అయి ఉంటే, పిల్ పని చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. మద్యం ఎక్కువగా సేవించే వారిలో కూడా అంగ స్తంభనకు సమయం తీసుకుంటుంది. పిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? పిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని లేదా ఎక్కువ సేపు ఉందని మీరు భావిస్తే, డాక్టర్ లేదా ఫార్మసిస్టుతో మాట్లాడండి. ఈ ఔషధాన్ని తీసుకున్న వారు కొందరు అంగ స్తంభన బాధాకరంగా ఉందని, అది సుమారు నాలుగు గంటల పాటు ఉందని తెలిపారు. ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇలాంటిది జరిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు? ఈ కింది తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వెంటనే పిల్స్ నిలిపేసి, వైద్య సహాయం తీసుకోండి ఇతర మందులతో కలిపి తీసుకునేప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు: గుండెపోటుకు నైట్రేట్ పిల్స్ తీసుకునేవారు వయాగ్రా కనెక్ట్ తీసుకోరాదు. అలాగే అమిల్ నైట్రేట్ తీసుకునేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. రయోసిగువట్, రిటోనేవిర్ అనే ఔషధాలు వాడే వారు కూడా వయాగ్రా తీసుకోరాదు. మీరు ఏదైనా చికిత్స పొందుతుంటే దాని గురించి ఫార్మసిస్టులకు చెప్పి, మీరు వయాగ్రా వాడొచ్చా, లేదా అని అడగడం మర్చిపోవద్దు. అంగ స్తంభన సమస్యల వెనుక గుండెజబ్బులు, కొలెస్టరాల్, మధుమేహ సమస్యలు ఉండవచ్చు కనుక ఫార్మసిస్టులు కూడా వయాగ్రా తీసుకునేవారికి డాక్టర్లతో ఫాలో-అప్ అపాయింట్‌మెంట్ తీసుకోమని సలహా ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఇవి లభ్యమవుతాయి? కొన్ని ఔషధ సంస్థలు ఆన్‌లైన్‌లో కూడా వీటిని విక్రయిస్తున్నాయి. విక్రయదారుడు మంచి పేరున్న వారు అయి ఉండేలా చూసుకోండి. గుర్తింపు పొందని విక్రయదారుల నుంచి వీటిని కొనడం సురక్షితం కాదు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వయాగ్రా కొంటున్నారా? లేక కొనాలనుకుంటున్నారా? ఈ రెండింటిలో దేనికి అవును అన్నా.. మీరు ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. ఎందుకంటే వయాగ్రా వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండటంతో దాన్ని ఉపయోగించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. text: 29 ఏళ్ల ఎలిసా పిలార్స్కీ కొన్ని కుక్కలను వెంట తీసుకుని జింకలను వేటాడేందుకు ఈ నెల 16న రెట్జ్ ఫారెస్టులోకి వెళ్లారు. అడవిలో కొంత దూరం వెళ్లాక వేరే కుక్కల గుంపు వచ్చి ఆమె మీద దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని విల్లర్స్-కాటెరెట్స్ అనే పట్టణానికి సమీపంలో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మృతురాలు ఆరు నెలల గర్భవతి అని తెలిసింది. "కాళ్లు, చేతులు, పొట్ట, తలపై అనేక కుక్కలు తీవ్రంగా కరిచిన తరువాత ఆమె మరణించారు" అని ప్రాసిక్యూటర్ ఫ్రెడెరిక్ ట్రిన్ చెప్పారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరానికి ఈశాన్యం వైపున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుక్కలకు పరీక్షలు ఆమెను కరచిన కుక్కలేవి? అవి ఎవరివి? అన్నది గుర్తించేందుకు 93 కుక్కలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. అందులో అయిదు మృతురాలికి చెందిన కుక్కలు కూడా ఉన్నాయి. మృతురాలి నుంచి సేకరించిన తాజా డీఎన్‌ఏ నమూనాలతో ఆ కుక్కల డీఎన్‌ఏలను పోల్చి చూస్తామని పోలీసులు చెప్పారు. ఆమె తల, మొండెం, చేతులకు పెద్దగా గాట్లు పడటంతో తీవ్రమైన రక్తస్రావం అయ్యిందని శవ పరీక్షలో వెల్లడైంది. స్థానిక కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు. ఆ ఘటనకు ముందు ఆమె తన భాగస్వామి క్రిస్టఫర్‌కు ఫోన్ చేసి 30 కుక్కలు తన మీద దాడి చేసేందుకు వస్తున్నాయని చెప్పారు. ఈ ఘటన తర్వాత ఈ సీజన్‌లో అన్ని రకాల వేటను నిలిపివేయాలంటూ జంతు సంరక్షణ సంస్థ అధ్యక్షుడు, నటుడు బ్రిగిట్టే బార్డోట్ ఫ్రెంచ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ మహిళ మరణంలో వేట కుక్కల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని ఫ్రెంచ్ హంటింగ్ అసోసియేషన్ అంటోంది. రెట్జ్ అటవీ ప్రాంతం విల్లర్స్-కోటెర్ట్స్ అనే చిన్న పట్టణం చుట్టూ దాదాపు 32,000 ఎకరాలలో విస్తరించి ఉంది. వివిధ రకాల జింకలు, నక్కలతో పాటు అనేక వన్యప్రాణులకు ఇది నిలయంగా ఉంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అడవిలో వేటకు వెళ్లిన ఓ గర్భిణిని కుక్కలు దాడి చంపేశాయి. ఉత్తర ఫ్రాన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనను అక్కడి పోలీసులు ధ్రువీకరించారు. text: గాడిద చర్మం, మాంసంతో తినుబండారాలు ఇక్కడ, వీటి చర్మాలను ఒలిచి ఔషధాలను, పౌష్టికాహారాలను తయారు చేస్తున్నారు. చైనాలో గాడిద మాంసానికి మంచి గిరాకీ ఉంది. వీటి చర్మాలకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు గాడిదల్లో పునరుత్పత్తి కూడా కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. ఇలా చైనాలో గాడిదలు తగ్గిపోవడంతో వ్యాపారులు వాటి కోసం విదేశాలవైపు చూస్తున్నారు. ఇప్పుడు వీరి చూపు, ఆఫ్రికా ఖండం మీద పడింది. ఆఫ్రికాలోని పేద దేశాల్లో, గాడిదలతో వ్యవసాయం చేస్తారు. అక్కడ గాడిదలను రవాణాకు వాడుతూ బతికే పేదవారు చాలా మంది ఉన్నారు. జింబాంబ్వేలో 1,50,000 డాలర్లతో ఒక గాడిదల కబేళాను ప్రారంభించనున్నారు. ఆఫ్రికాలో గాడిదలకు డిమాండ్ పెరగడంతో, వీటి ఖరీదు రెట్టింపు అయ్యింది. దీంతో, వ్యాపారులే కాదు, దొంగలు సైతం ఈ గాడిదల వెంటపడుతున్నారు. గాడిదలను కోల్పోయిన పేదలు, మరో గాడిదను కొనలేక, పూట గడవక నానా అవస్థలూ పడుతున్నారు. 'రాత్రికి రాత్రే గాడిదలు మాయం' కెన్యాలో, బండిపై నీళ్ళను అమ్ముతూ పొట్టపోసుకునే ఆంథొనీ మాప్ వాన్యామాకు కార్లోస్ అనే గాడిద ఉండేది. ఓ చిన్న నీళ్ల ట్యాంకును కార్లోస్‌కు తగిలించి, నీళ్లు అమ్ముతూ బాగానే సంపాదించేవాడు. తన ఆదాయంతో కొంత భూమి కూడా కొన్నాడు. ఒక ఇల్లు కొన్నాడు. పిల్లల స్కూలు ఫీజులూ కట్టాడు. మొత్తానికి, తన కుటుంబాన్ని బాగానే చూసుకున్నాడు. చివరకు గాడిద పేరే ఆయనకు ముద్దుపేరు అయ్యింది. బయటివాళ్లు ఆంథొనీని కార్లోస్ అని పిలిచేవారు. ఇదలా ఉండగా ఓ రోజు ఆంథోనీ గాడిదను ఎవరో చంపి.. చర్మం ఒలుచుకెళ్లారు. ఈ సందర్భంగా ఆంథోనీ మాట్లాడుతూ.. 'ఓ రోజు ఉదయాన్నే లేచి చూస్తే, కార్లోస్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికాను. ఎక్కడా కనిపించలేదు. చివరికి, ఓ చోట పడి ఉండటం చూశాను. ఎవరో చర్మాన్ని ఒలుచుకుపోయారు'' అని తన ఆవేదనను వెళ్లగక్కారు. తన బండిని లాగడానికి ఆంథొనీ, ఇప్పుడు ఓ గాడిదను అద్దెకు తీసుకున్నాడు. కానీ, తన రోజువారీ ఆదాయంలో సగం డబ్బు అద్దెకే సరిపోతోంది. ఆంథోనీకి గాడిద పేరే ముద్దుపేరు అయ్యింది ''ఇప్పడు నాదగ్గర డబ్బు లేదు. అప్పులు ఉన్నాయి. నా పిల్లల స్కూలు ఫీజూ కట్టలేదు. ప్రస్తుతం నాదగ్గర కార్లోస్ లేదు.. కుటుంబం నామీద ఆధారపడింది. నేను వారిని చూసుకోవాలి '' అని ఆంథొనీ అంటున్నారు. మరొక కార్లోస్‌ను కొనడానికి ఆంథొనీ వద్ద డబ్బు లేదు. గాడిదల ఎగుమతి వ్యాపారం - నిజాలు యేటా 10లక్షల 80వేల గాడిద చర్మాల వ్యాపారం జరుగుతోంది విషాదం కెన్యాలో ఈ మధ్యనే మూడు కబేళాలను ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారం ఊపందుకుంది. ఒకవైపు గాడిదలకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపున ఈ వ్యాపారంలో ధనప్రవాహమూ కొనసాగుతోంది. ఒక్కో కబేళాలో రోజుకు 150 గాడిదలను వధిస్తారు. వీటి మాంసాన్ని ప్యాక్ చేసి, ఫ్రీజర్లలో నిలువ చేస్తారు. వీటి చర్మాలను ఎగుమతి చేస్తారు. కెన్యాలోని నాయివష లోఉన్న 'స్టార్ బ్రిలియంట్ డాన్కీ ఎక్స్‌పోర్ట్' కబేళాలో ప్రాణాలతోఉన్న గాడిదలను తూకం వేసి అమ్ముతారు. చైనా వ్యాపారులు, ఈ గాడిదల ప్యాకింగ్ విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు ఒక బోల్ట్‌గన్ తో వీటి తలకు గురిపెట్టి కాల్చి చంపుతారు. ఆ తర్వాత వీటి చర్మం ఒలిచి.. మాంసం ప్యాక్ చేస్తారు. కెన్యాలో గాడిదల కబేళాకు మొదటిసారిగా ప్రభుత్వ అనుమతి లభించింది తనకేనని ఛీఫ్ఎగ్జిక్యూటివ్ కరియుకి చెబుతున్నారు. గాడిదలకు అంతగా డిమాండ్ లేని రోజుల్లో, తమ అవసరాలకోసం ఆవులను, మేకలను అమ్మేవారని కరియుకి చెబుతున్నారు. కానీ, ఆవుల కంటే ఇప్పుడు గాడిదలనే ఎక్కువగా అమ్ముతున్నారని ఆయన వివరించారు. డజను పైచిలుకు దేశాలు, గాడిదల వర్తకాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నాయి ''చైనా మార్కెట్‌తో మేం సంతోషంగా ఉన్నాం. ఒకప్పుడు గాడిదల నుండి పెద్దగా లాభం ఉండేదికాదు. కానీ ఈరోజు చాలామంది గాడిదలతో లాభపడుతున్నారు'' అని తెలిపారు. చైనా వ్యాపారులు, ఈ గాడిదల ప్యాకింగ్ విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు. గాడిద చర్మాలను ఉడికించడం వల్ల తయారయ్యే పదార్థాన్ని సాంప్రదాయక ఔషధం తయారీ, పౌష్టికాహార తయారీలో కూడా వాడతారు. సాంప్రదాయక చైనా ఔషధాల్లో ఎజియాఓను వాడతారు. ఒక కిలో ఎజియాఓ విలువ దాదాపు 25,400/- కానీ, కబేళాల్లో గాడిదల పట్ల వ్యవహరించే తీరు మాత్రం విమర్శలకు గురవుతోంది. కబేళాల్లో ఉన్న గాడిదల దయనీయ స్థితిని ఒక బ్రిటిష్ సంస్థ, కొందరు దక్షిణాఫ్రికా విలేకరులు కలిసి వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితులు, ఆందోళనకరంగా ఉన్నాయని, పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చేవరకూ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నాయని ఇంగ్లండ్ లోని గాడిదల సంరక్షణశాలకు చెందిన మైక్ బేకర్ అన్నారు. ''గతంలో ఎప్పుడూ చూడనంతగా లక్షలాది గాడిదలను కబేళాకు తరలిస్తున్నారు. అక్కడ వాటి దుస్థితి వర్ణనాతీతం''. ఒక్కో కబేళాలో రోజుకు 150 గాడిదలను వధిస్తారు ''గాడిదల చర్మం ఒలవడం సులువవుతుందన్న కారణంతో, వాటికి ఆహారం ఇవ్వకుండా ఆకలితో మాడుస్తున్నారు. దుడ్డుకర్రతో, చచ్చే వరకూ బాదుతున్నారు''. ఉగాండా, టాన్జానియా, బోత్స్వానా, నైజీరియా, బర్ఖినా ఫాసో, మాలి, సెనెగల్ దేశాలు గాడిద మాంసాన్ని చైనాకు ఎగుమతి చేయడాన్ని నిషేధించాయి. డజను పైచిలుకు దేశాలు, గాడిదల వర్తకాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నాయి. తమ దేశ జంతు సంపద క్షీణిస్తోందని, ప్రజల్లో అంతర్లీనంగా జంతువుల పట్ల క్రౌర్యం పెరుగుతోందని ఈ దేశాలు భావిస్తున్నాయని బేకర్ చెబుతున్నారు. గుర్రాలకన్నా ముందు మనిషిని మోసిన గాడిదకు ఇప్పుడు కష్టమొచ్చింది. చైనాలో వీటి సంఖ్య భారీగా తగ్గిపోతోంది. text: నాలుగు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న ముగాబే మిలటరీ భద్రత నడుమ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. జింబాబ్వే ఓపెన్ యూనివర్సిటీకి ముగాబేనే ఛాన్స్‌లర్. ఏటా జరిగే ఈ స్నాతకోత్సవానికి దేశాధ్యక్షుడు హాజరవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముగాబే ఆ కార్యక్రమానికి వస్తారని చాలామంది ఊహించలేదు. ముగాబే చేతి నుంచి పట్టా అందుకున్న వాళ్లలో నాలుగు రోజుల క్రితం ఆయన్ని నిర్బంధించిన మిలటరీ జనరల్ భార్య మ్యారీ షివెంగా కూడా ఉన్నారు. ముగాబే భార్య గ్రేస్, విద్యా శాఖ మంత్రి, గ్రేస్‌కి సన్నిహితుడైన జొనాథన్ మాయో ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. మరోపక్క దేశ పాలనకు సంబంధించి ముగాబేతో చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయనీ, వీలైనంత త్వరగా వాటి ఫలితాల్ని ప్రజల ముందుంచుతామనీ ఆ దేశ మిలటరీ చెబుతోంది. దేశమంతా మిలటరీ అధీనంలో ఉన్నా, తమకు మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేవని జింబాబ్వే పౌరులు చెబుతున్నారు. దుకాణాలు ఎప్పటిలానే తెరుచుకుంటున్నాయనీ, రాజధాని వీధుల్లోనూ ప్రజలు తిరుగుతున్నారనీ సోషల్ మీడియా ద్వారా కొందరు పరిస్థితులను పంచుకుంటున్నారు. ఇంకొందరు ‘బీబీసీ’తో మాట్లాడుతూ, ఒక నియంతృత్వ నేతను తప్పించే ప్రయత్నం మొదలుపెట్టినందుకు ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సైనిక చర్య కారణంగా గృహ నిర్బంధంలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే శుక్రవారం నాడు తొలిసారి ఇంటి నుంచి బయటికొచ్చారు. దేశ రాజధాని హరారేలో జరిగిన జింబాబ్వే ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. text: ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు గత వారమే పారిపోయినట్లు భావిస్తున్నారు. నిజానికి ఆయనది ఉత్తర కొరియానే. మూడేళ్ల క్రితం అక్కడి నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చారు. మళ్లీ వారం క్రితం స్వదేశానికి పారిపోయారు. దక్షిణ కొరియాలోని గాంగ్వా ద్వీపం నుంచి ఈదుకుంటూ స్వదేశానికి ఆయన పారిపోయినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. సరిహద్దుకు సమీపంలోని గాంగ్వా ద్వీపానికి మొదట ఆ వ్యక్తి చేరుకున్నారని దక్షిణ కొరియా సైన్యం సోమవారం వెల్లడించింది. గాంగ్వా ద్వీపం నుంచి యెల్లో సీ వరకు వెళ్లే ఓ డ్రైనేజీ పైపు ఉంది. అందులో తీగల కంచె ఉన్నా, దాని కింద నుంచి ఆ వ్యక్తి పాక్కుంటూ వెళ్లినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత యెల్లో సీలో ఓ మైలు దూరం ఈదుకుంటూ ఉత్తర కొరియాకు ఆయన చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు... పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ రోగిగా అనుమానిస్తున్న వ్యక్తికి ఆ ఇన్ఫెక్షన్ లేదని దక్షిణ కొరియా అంటోంది. text: కోవిడ్-19 హాట్‌స్పాట్ అయిన ముంబై వంటి నగరాల్లో మద్యపాన ప్రియులు సామాజిక దూరం నిబంధనలను తోసిపుచ్చారు. దీంతో ప్రభుత్వం దుకాణాలను మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. అదుపులోని లేని కొనుగోలుదార్ల మీద పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. బెంగళూరులో ఒక కొనుగోలుదారుడు ఏకంగా రూ. 52,000 బిల్లు చేయటం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. మద్యపాన ప్రియులు వెర్రిగా దుకాణాలకు పరుగులు తీయటం ఆశ్చర్యకరమేమీ కాదు. కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల మద్యానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ విక్రయాలు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చినపుడు బ్రిటన్‌లో ఈ మార్చి నెలలో 22 శాతం పెరిగితే, అమెరికాలో 55 శాతం పెరిగింది. భారతదేశంలో మద్యం విక్రయించటం ఎప్పుడూ సులభం కాదు. ఈ-కామర్స్, హెం డెలివరీలకు అనుమతి లేదు. చాలా రాష్ట్రాలు మద్యాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే మద్యనిషేధం నినాదం ఓట్లు తెచ్చిపెట్టగలదు. మద్యం ఉత్పత్తి, ధరలు, అమ్మకాలు, పన్నుల మీద దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికీ తమ సొంత విధానాలు ఉన్నాయి. అయితే, పరిమాణంలో చూస్తే మద్యపానంలో ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానం భారతదేశానిదేనని లండన్‌కు చెందిన పరిశోధన సంస్థ ఐడబ్ల్యూఎస్ఆర్ మద్యం మార్కెట్‌పై చేసిన విశ్లేషణ చెబుతోంది. భారతదేశం ఏడాదికి 66.30 కోట్ల లీటర్ల మద్యం వినియోగిస్తుంది. ఇది 2017 కన్నా 11 శాతం ఎక్కువ. తలసరి వినియోగం కూడా పెరుగుతోంది. ప్రపంచంలో ఏ ఇతర దేశం కన్నా భారతదేశం అత్యధిక మొత్తంలో విస్కీ వినియోగిస్తుంది. ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్న అమెరికా కన్నా కూడా మూడు రెట్లు ఎక్కువ. ప్రపంచంలో విక్రయించే ప్రతి రెండు విస్కీ బాటిళ్లలో ఒక బాటిల్‌ను భారతదేశంలోనే అమ్ముతున్నారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా మద్య వినియోగం తగ్గినపుడు.. ప్రపంచ విస్కీ మార్కెట్‌ను భారత్ 7 శాతం మేర పెంచింది. భారతదేశంలో మద్యం విక్రయాల్లో 45 శాతం ఐదు దక్షిణాది రాష్ట్రాలు – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోనే జరుగుతాయి. ప్రభుత్వాల ఆదాయాల్లో 10 శాతం కన్నా ఎక్కువ భాగం మద్యం అమ్మకాల మీద పన్నుల ద్వారానే వస్తున్నాయని క్రిసిల్ పరిశోధన విభాగం లెక్కగట్టింది. మద్యం వినియోగం ఎక్కువగా ఉన్న మరో ఆరు రాష్ట్రాలు – పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు – తమ ఆదాయాల్లో 5 నుంచి 10 శాతం లిక్కర్ ద్వారానే ఆర్జిస్తున్నాయి. మద్యం షాపుల ఎదుట చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ‘‘కానీ ఏప్రిల్‌లో ఒక్క చుక్క కూడా అమ్మలేదు. ఆదాయాల దయనీయ పరిస్థితుల్లో ఉండటంతో మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు ప్రారంభించాలని ఈ రాష్ట్రాలు చాలా ఆతృతగా ఉన్నాయి’’ అని క్రిసిల్ పేర్కొంది. మద్యం అమ్మకాల పన్నులు లేకపోవటంతో దాదాపు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఖర్చు చేయటానికి అవసరమైన నిధులు లేక తిప్పలు పడుతున్నాయి. అయితే.. దేశంలో మద్యం వినియోగం పెరుగుతుండటం.. ఒక చీకటి నిజాన్ని కప్పిపెడుతోంది. భారతదేశ పురుషుల్లో మూడో వంతు మంది మద్యం తాగుతారని ప్రభుత్వ నివేదిక ఒకటి చెప్తోంది. వయసు 10 సంవత్సరాల నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 14 శాతం మందకి పైగా మద్యం తాగుతారు. భారతదేశ జనాభాలో 11 శాతం మంది అధికంగా మద్యం సేవిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్త సగటు 16 శాతంగా ఉంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. మద్యం తాగేవారిలో మూడో వంతు మంది నాటు సారా, గుడుంబా వంటి స్థానికంగా తయారుచేసిన మద్యం సేవిస్తారు. ఇందులో కల్తీ కారణంగా అనేక విషాదాలకు కారణమవుతోంది. మద్యం తాగేవారిలో సుమారు 19 శాతం మంది మద్యపాన బానిసలుగా ఉన్నారని ఆ నివేదిక చెప్తోంది. దాదాపు మూడు కోట్ల మంది జనం ‘‘ప్రమాదకర రీతి’’లో మద్యం తాగుతున్నారు. అంతేకాదు, భారతదేశంలో వినియోగించే మద్యంలో సగం పైగా మద్యం ‘‘నమోదుకాని’’ మద్యమేనని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. ఉదాహరణకు స్థానికంగా కాచిన మద్యం వివరాలు కొన్ని రాష్ట్రాల్లో అధికారికంగా నమోదు కావు. వాటి మీద పన్నులు ఉండవు. మద్యం తాగేవారిలో చాలా ఎక్కువ మంది స్థానికంగా తయారుచేసిన, ఇంట్లో కాచిన, నకిలీ మద్యాన్ని ఇష్టపడుతున్నారని 2014లో ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ నిర్వహించిన సర్వేలో గుర్తించారు. భారతీయులు గతం కన్నా మరింత ఎక్కువగా మద్యం తాగుతున్నారు. 1990 నుంచి 2017 మధ్య మద్య వినియోగం గురించి 189 దేశాల్లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో.. భారతదేశంలో మద్యం వినియోగం 38 శాతం పెరిగిందని గుర్తించారు. వయోజన తలసరి వినియోగం 4.3 లీటర్ల నుంచి 5.9 లీటర్లకు పెరిగింది. ‘‘మద్య వినియోగాన్ని తగ్గించటం లక్ష్యంగా చేపట్టే చర్యల ప్రభావం కన్నా.. మద్యం కొనుగోలు చేయటానికి తగినంత ఆదాయం ఉన్న జనం సంఖ్య పెరగటం’’ వల్ల మద్య వినియోగం పెరిగిందని ఈ అథ్యయనానికి సారథ్యం వహించిన జర్మనీలోని టెక్నీష్ యూనివర్సిటాట్ డ్రెస్డెన్ ప్రొఫెసర్ జాకబ్ మాంథే నాతో చెప్పారు. మద్యం అందుబాటు ధరల్లో ఉండటం కూడా పెరుగుతోంది. ఉదాహరణకు.. అధికాదాయ దేశాలతో పోలిస్తే.. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో బీరు మరింత చౌకగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. మద్యం షాపుల వద్ద క్యూలో నిల్చున్న వారిని అదుపు చేయడానికి కొన్ని చోట్ల పోలీసులు రంగంలోకి దిగారు భారతదేశంలో మద్యపానం వల్ల ప్రధాన భారం.. లివర్ సిర్రోసిస్, గుండె జబ్బులు వంటి అంటువ్యాధులు కాని జబ్బుల వల్ల పడుతోందని ప్రొఫెసర్ జాకబ్ పేర్కొన్నారు. మద్యపానం పెరగటం వల్ల ఈ తీరు ఇంకా పెరుగుతుందన్నారు. 2012లో అన్ని రోడ్డు ప్రమాదాల్లో మూడో వంతు ప్రమాదాలకు కారణం మద్యం తాగి వాహనాలు నడపటమేనని అధ్యయనాలు చెప్తున్నాయి. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం వయోజన పురుషుల్లో దాదాపు 10 శాతం మంది మద్యపాన వ్యసనపరులు. లివర్ సిర్రోసిస్ వల్ల సంభవించే మరణాల్లో 60 శాతం పైగా మరణాలకు కారణం మద్యపానమే. మద్యపానం అనేది ఓ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. గృహ హింసకు కూడా మద్యపానం ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మద్యనిషేధానికి బలంగా మద్దతిస్తున్నది గ్రామీణ మహిళలే. మద్యం ధరలను మరింతగా పెంచటం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. శ్యాం హూస్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త సంతోష్ కుమార్ నిర్వహించిన పరిశోధనలో.. విస్కీ, రమ్ వంటి మద్యాల ధరలను పెంచటం వల్ల వాటి వినియోగం అతి స్వల్పంగా, ఒక మాదిరిగా తగ్గుతుందని గుర్తించారు. భారతదేశంలో హానికర మద్యపానం విషయంలో ధరల నియంత్రణతో పాటు అవగాహన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయన భావిస్తున్నారు. దేశం మద్యం మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించటానికి స్వరాజ్ ఇండియా పార్టీ నేత, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఒక జాతీయ ప్రణాళిక సూచిస్తున్నారు. ప్రభుత్వాలు మద్యం నుంచి వచ్చే ఆదాయాల మీద ఆధారపడటం తగ్గించుకోవటం, మద్యాన్ని ప్రోత్సహించటం నిలిపివేయటం, మద్యం విక్రయాలపై ఇప్పుడున్న చట్టాలు, నిబంధనలను అమలుచేయటం, ఒక ప్రాంతంలో రిటైల్ లైసెన్స్ ఇవ్వటానికి స్థానిక ప్రజల్లో 10 శాతం మంది అంగీకారం తీసుకోవటం, మద్యం విక్రయాల మీద వచ్చే ఆదాయాలను జనాన్ని మద్యం నుంచి దూరం చేయటానికి ఖర్చుచేయటం వంటి చర్యలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవటం కన్నా నిషేధం విధించటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని.. బ్లాక్ మార్కెట్‌కు బాటలు పరుస్తుందని నిరూపితమైంది. మద్యపానాన్ని ఒక నైతిక అంశంగా మారిస్తే ఉదారవాదుల నుంచి విమర్శలు వస్తాయి. ప్రముఖ విశ్లేషకుడు ప్రతాప్ భాను మెహతా చెప్తున్నట్లు, ‘‘మనం స్వేచ్ఛ గురించి నిజంగా పట్టించుకున్నట్లయితే... సాంస్కృతికంగా, రాజకీయంగా మద్య అర్థికవ్యవస్థకు మన వ్యసనాన్ని కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంక్లిష్ట సమస్యను పరిష్కరించటానికి తెలివైన మార్గాలను కనుక్కోవాల్సి ఉంది.’’ అది సులభం కాదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని నివారించటానికి విధించిన లాక్‌డౌన్‌ను కొన్ని నగరాలు గత వారంలో సడలించిన తర్వాత దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు డవాటి క్యూలు కనిపించాయి. text: ఆ తరువాత, అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి, ఆ తరువాత బంగ్లాదేశ్ నుంచి జనం తరలిరావడంతో అస్సాం ముఖచిత్రం క్రమంగా మారుతూ వచ్చింది. ఆ తరువాత విదేశీయుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో అస్సాంలో 1979 నుంచి 1985 వరకు ఆరేళ్ల పాటు తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. కానీ, ఇక్కడ తలెత్తిన ప్రశ్న ఏమిటంటే ఎవరు విదేశీయులు, ఎవరు కారు? వీరిని లెక్కించడమెలా? అప్పట్లో, విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వివాదానికి ఇదొక ముఖ్య కారణం. 1985లో ఆసు, తదితర సంస్థలతో భారత ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చింది. ఈ ఒప్పందాన్ని 'అస్సాం ఒప్పందం'గా పిలుస్తారు. ఈ ఒప్పందం ప్రకారం, 1971 మార్చి 25 తరువాత అస్సాంకు తరలివచ్చిన హిందూ-ముస్లింలను లెక్కించి, వాళ్లను రాష్ట్రం నుంచి బయటకు పంపించాలి. 2005లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌ను సవరించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో... అస్సాం ఒప్పందం ప్రకారం, 1971 మార్చి 25కు ముందు అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి వివరాలు కూడా ఈ రిజిస్టర్‌లో నమోదు చెయ్యాలి. కానీ వివాదం అక్కడితో ఆగిపోలేదు. ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఈ విషయమై వచ్చిన వివాదాలన్నిటినీ కలిపి 2015లో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రతీక్ హజేలా అనే ఐఏఎస్ అధికారికి ఎన్ఆర్‌సీ (NRC) పని అప్పగించారు. ప్రతీక్ హజేలాకి ఎన్ఆర్‌సీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించి ఈ రిజిస్టర్‌ను గడువులోపే సవరించాలని ఆదేశించారు. 2017 డిసెంబర్ 31న ఈ ఎన్ఆర్‌సీ డ్రాఫ్టును పబ్లిష్ చెయ్యాలని చివరి గడువు విధించారు. కానీ, విధించిన గడువులోగా డ్రాఫ్టు పూర్తి చెయ్యడం కష్టమని, జూలై వరకు గడువును పొడిగించాలని ఎన్ఆర్‌సీ కోఆర్డినేటర్ కోరారు. సుప్రీంకోర్టు ఈ వినతికి అంగీకరించలేదు. ఎంతవరకు తయారుచేస్తే అంతవరకే డిసెంబర్ 31న జాబితాను ప్రచురించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకే, ఆదివారం రాత్రి 12 గంటలకు ఈ డ్రాఫ్ట్‌ను విడుదల చేశారు. ఇందులో రెండు కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజల వివరాలు నమోదై ఉన్నాయి. మిగిలినవాళ్ల పేర్లు ఇంకా ధృవపరచవలసి ఉంది. ఈ డ్రాఫ్ట్‌లో పేర్లు లేని వారికి తమ వాదనలు వినిపించుకునే వీలు కల్పిస్తారు. ఈ డ్రాఫ్ట్ కారణంగా అస్సాంలో కొంత మేరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరి పేరైనా ఈ డ్రాఫ్ట్‌లో లేకపోతే వారిని విదేశీయులుగా పరిగణిస్తారా అని ప్రజలు నిలదీస్తున్నారు. వారిని ఏం చేస్తారనే విషయంలో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు గమనించిన పరిస్థితి ఏమిటంటే, ఒకే కుటుంబంలో ఇద్దరి పేర్లు నమోదై ఉంటే, మరొకరి పేరు నమోదు కాలేదు. ఇలాంటి అవకతవకలు చాలానే ముందుకొచ్చాయి. ఇలాంటి ఫిర్యాదులొచ్చినప్పుడు ఎన్ఆర్‌సీ వాటిని వెంటనే సరిచేస్తుందని ఆశిస్తున్నారు. 1951లో ప్రారంభమైన ఎన్ఆర్‌సీ వ్యవహారంలో 2018 వరకు ఎందుకు కదలిక రాలేదన్నది మరో ప్రశ్న. దేశ విభజన తర్వాత ఎవరెవరు ఎక్కడున్నారు, అస్సాంలో ఎంత మంది ఉన్నారు, వారెవరు- వంటి వివరాలన్నీ రిజిస్టరులో నమోదు చేయడం అప్పటి ఎన్ఆర్‌సీ లక్ష్యం. తర్వాత కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వలస వచ్చిన వారిలో చట్టబద్ధంగా వచ్చిన వారున్నారు. అక్రమంగా వచ్చిన వారూ ఉన్నారు. చట్టపరంగా చాలా మంది వచ్చారు. వారు తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఈ క్రమంలోనే అస్సాం ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం 1971 మార్చి 21ను కటాఫ్ తేదీగా నిర్ణయించి ఎన్‌ఆర్‌సీని సవరించాలని నిర్ణయించారు. ఆ తేదీనే బంగ్లాదేశ్‌ను సార్వభౌమ దేశంగా షేక్ ముజీబుర్ రహమాన్ ప్రకటించారు. అయితే అధికార మార్పిడి ప్రకటన 1971 డిసెంబర్ 16న జరిగింది. ఎన్ఆర్‌సీపై రాజకీయాలు ఈలోగా నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్‌పై రాజకీయాలు మొదలయ్యాయి. అస్సాంలో ముస్లిం జనాభా 34 శాతంకన్నా ఎక్కువ. వీరిలో 85 శాతం మంది ముస్లింలు బయటి ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారే. వీరిలో అత్యధికులు బంగ్లాదేశీయులు. వీరంతా వేర్వేరు సమయాల్లో ఇక్కడికొచ్చారు. వీరు భారత్‌నే తమ దేశంగా భావించారు. ఇక్కడి భాష కూడా నేర్చుకున్నారు. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందువులకు పౌరులుగా గుర్తింపునిస్తామని బీజేపీ అస్సాం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పౌరసత్వ చట్టంలో ఒక సవరణ చేసింది. అదిప్పుడు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే హిందువులకు సమస్యేమీ ఉండదు కానీ ముస్లింలకు మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎన్ఆర్‌సీ డేటాను విడుదల చేయగానే అస్సాంలో పెద్ద ఎత్తున హింస చెలరేగవచ్చనే ప్రచారం ముందు నుంచే మొదలైంది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సైన్యాన్ని అప్రమత్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారిలో హిందువులు, ముస్లింల మధ్య విభజన రేఖను బీజేపీ గీసింది. హిందువులైతే అక్రమంగా ప్రవేశించినా అభ్యంతరం లేదు కానీ ముస్లింల విషయంలో అక్రమ చొరబాట్లను సహించరనే ప్రచారం సాగుతోంది. మత ప్రాతిపదికన జనాన్ని చీల్చే రాజకీయ ఎత్తుగడలు బీజేపీ అనుసరిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇవ్వడం ద్వారా అస్సాం హిందూ ప్రాబల్య రాష్ట్రంగా ఉంటుందని బీజేపీ ఆశిస్తోంది. బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలకు సమాంతరంగా మరో భిన్నమైన భావజాలం కూడా తలెత్తుతోంది. వీరు అసమియా భాషను ప్రధానాంశం చేస్తున్నారు. రాష్ట్రంలో బంగ్లా భాష మాట్లాడేవారి సంఖ్య పెరగడం వల్ల అసమియా భాష ప్రమాదంలో పడుతోందని వారి అభిప్రాయం. ఈ కారణంగా అస్సాంలో ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలతో పాటు సామాజిక ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి. మా ఇతర కథనాలు: స్వాతంత్ర్యం తరువాత 1951లో, అస్సాంలో 'నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్' తయారు చేశారు. 1951 జనాభా లెక్కల తరువాత తయారుచేసిన ఈ రిజిస్టర్‌లో అస్సాంలో అప్పటికి ఉన్న ప్రజలందరి వివరాలు నమోదు చేశారు. text: బీబీసీ టీమ్‌ను వెంటాడి వారి ఫుటేజ్ డిలీట్ చేయించారు రాత్రి పూట జిన్జియాంగ్ నిర్మానుష్య హైవేలమీద ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని గుర్తు తెలియని కార్లు మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయని గమనించాం. మేము అక్కడకి వెళ్లిన క్షణం నుంచీ అవి మా వెనకే వస్తున్నాయి. హైవే మీద అవి వేగంగా దూసుకొస్తూ, ప్రమాదకరం అనిపించేంత దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఆ వాహనాల్లో ఉన్నవాళ్లు ఎవరో మాకు తెలీదు. కానీ నగరాన్ని విడిచి వెళ్లిపొమ్మని మాపై ఒత్తిడి తెచ్చారు. రెస్టారెంట్లకు, షాపులకూ మా వెనకే వచ్చారు. మాకు ఏమీ అందించవద్దని యజమనులకు చెప్పారు. ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ కూడా, చైనా ప్రభుత్వ పాలసీ పత్రాల ఆధారంగా మేము తయారుచేసిన నివేదికలో కొన్ని కొత్త సాక్ష్యాలు ఉన్నాయి. వీగర్ ముస్లింలను, ఇతర మైనారిటీ వర్గాల ప్రజలను పత్తిని సేకరించే పనిలో బలవంతంగా ప్రవేశపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పండించే పత్తి పంటలో ఐదవ వంతు ఇక్కడ పండుతుంది. అయితే, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నడిపే మీడియా మా రిపోర్టుల గురించి వారి సొంత నివేదికను ప్రచురించింది. అక్కడ జరుగుతున్నవాటిని బీబీసీ అతి చేసి చూపిస్తోందని, మా రిపోర్టులన్నీ ఫేక్ న్యూస్ అని అరోపించింది. దీనికి సంబంధించి ఇంగ్లిష్ వార్తా పత్రిక్ 'చైనా డైలీ' రూపొందించిన ఒక వీడియోను చైనీస్ సోషల్ మీడియా సైట్లలోనూ, చైనాలో నిషేధించిన అంతర్జాతీయ వెబ్‌సైట్లలో కూడా ప్రచురించారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో ఐదో భాగం షింజియాంగ్‌నుంచి వస్తుంది చైనా అసాధారణ దాడి "ఇంగ్లిష్‌లో ఇంత తీవ్ర విమర్శనాత్మక దాడి, చైనీస్ సబ్‌టైటిల్స్‌తో సహా ప్రచురించడం అరుదైన విషయం" అని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన హన్నా బెయిలీ అభిప్రాయపడ్డారు. చైనా ప్రభుత్వ సహాయంతో డిజిటల్ సైట్లలో ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని ఆ దేశం ఎలా ఉపయోగిస్తుందనే అంశంపై బెయిలీ పరిశోధన చేస్తున్నారు. "జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోను రూపొందించారు. చైనా ఇంతకముందు అవలంబించిన వ్యూహాలకన్నా ఇది కాస్త భిన్నమైనది. సాధారణంగా మెయిన్‌ల్యాండ్ చైనాలో ఉన్నవారికోసం ప్రచురించే వాటిల్లో పశ్చిమ దేశాలను విమర్శిస్తూ, జాతీయవాదాన్ని పెంపొందించే విధంగా సమాచారాన్ని పొందుపరుస్తారు. కానీ, అంతర్జాతీయ వినియోగదారులకోసం మాత్రం మధ్యస్థంగా, కొంత రాజీ ధోరణిలో సమాచారం ఉంటుంది" అని బెయిలీ అన్నారు. కూకా బట్టల మిల్లును చిత్రీకరించడానికి వెళ్లిన బీబీసీ టీమ్ నీడలా వెంటాడారు కూకా నగరంలో ఒక టెక్స్‌టైల్ మిల్లు ప్రధాన ద్వారం బయట బీబీసీకి కొంతమంది మేనేజర్లు, స్థానిక అధికారులకు జరిగిన వాగ్వివాదంపై చైనా డైలీ రిపోర్ట్ దృష్టి కేంద్రీకరించింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఒక పోలీసు అధికారి అందించిన బాడీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా చైనా డైలీ, బీబీసీపై ఆరోపణలు చేసింది. బీబీసీ బృందానికి, పోలీసు అధికారికి మధ్య జరిగిన తేలికపాటి చర్చను చూపిస్తూ...బీబీసీ దీన్ని పెద్దది చేసి చూపిస్తోందంటూ ఆరోపించింది. చైనా అధికారులు మమ్మల్ని రిపోర్ట్ చెయ్యనివ్వకుండా అడ్డుకుంటున్నారని బీబీసీ ప్రచురించింది అంటూ దృష్టిని అంతటినీ ఆ సంఘటన మీదకు మళ్లించింది. అయితే, బీబీసీ బృందం వద్ద ఉన్న కొన్ని ఫుటేజ్‌లను అక్కడి అధికారులు బలవంతంగా డిలీట్ చేయించారన్న విషయాన్ని మటుకు చైనా డైలీ తెలుపలేదు. అంతేకాకుండా మా వద్ద మిగిలిన ఫుటేజ్‌లను కూడా సమీక్షించారు. అసలు మొత్తం విషయం గురించి విస్తృత పరిధిలో వివరణ ఇవ్వలేదు సరి కదా మాపై వచ్చిన ఆరోపణలకు జవాబు ఇచ్చే అవకాశాన్ని కూడా బీబీసీకి ఇవ్వలేదు. వెంటాడి ఫుటేజ్ డెలిట్ చేయించారు ఫుటేజ్ డిలీట్ చేయించారు జిన్జియాంగ్ ప్రాంతంలో మేము దాదాపు 72 గంటలపాటూ పర్యటించిన సమయంలో మమ్మల్ని దారంతా వెంబడిస్తూనే ఉన్నారు. కనీసం అయిదుసార్లు పబ్లిక్ స్థలాల్లో షూటింగ్ చెయ్యకూడదని మమ్మల్ని వారించారు. కొన్నిసార్లు బలవంతంగా ఆపడానికి ప్రయత్నించారు. మమ్మల్ని ఆపడానికి వాళ్లు మా కెమేరా ముందుకు వచ్చారు. దాంతో మేము వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నామంటూ మాపై నేరం మోపారు. కనీసం రెండు సార్లు ఇలాంటివి జరిగి ఉంటాయి. రెండుసార్లు మేము షూట్ చేసిన ఫుటేజ్‌లను డిలీట్ చేశారు. మరొకసారి, పంటపొలాలను చిత్రీకరించడం ద్వారా రైతు హక్కులను ఉల్లంఘిస్తున్నామంటూ మమ్మల్ని కొద్దిసేపు నిర్బంధించారు. జిన్జియాంగ్ కవరేజ్ తమ అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బ తీస్తుందని భావించడం వల్లే చైనా ఇలాంటి ప్రోపగాండాకు పూనుకున్నదేమో అనే సందేహం కలుగక మానదు. కానీ, స్వదేశంలో విదేశీ మీడియాపై దాడి ప్రయత్నాలు అంత మంచిది కాదు. దానివల్ల ఇంతవరకూ పబ్లిక్‌లోకి రాని కొన్ని కథనాలను బయటపెట్టినట్టు అవుతుంది. కూకా టెక్స్‌టైల్ మిల్లుకు, రీ-ఎడ్యుకేషన్ క్యాంపుకు మధ్య పెద్ద సంఖ్యలో జనాలు తరలించారని 2019 మేలో తీసిన ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అంతర్గత భద్రతకోసం నాలుగువైపులా గోడలు ఉన్నాయి, ఒక వాచ్‌టవర్ కూడా ఉంది. ఈ క్యాంపును 'వృత్తివిద్య శిక్షణా శిబిరం' అని వ్యవహరిస్తూ, అక్టోబర్ 2019లోనే మూసేసిన దాన్ని చిత్రీకరించడానికి బీబీసీ వృధా ప్రయత్నం చేస్తోందంటూ చైనా డైలీ ప్రచురించింది. అయితే, ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం ద్వారా అక్టోబర్‌లో ఈ శిబిరాన్ని మూసి వేయలేదని, పని చేస్తూనే ఉందని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, ఇక్కడ మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని నిర్థారణ అవుతోంది. ఆ ఫొటోలో కనిపిస్తున్న వాళ్లు ఎవరు? వాళ్లని శిబిరానికి, ఫ్యాక్టరీకి మధ్య ఎందుకు తరలిస్తున్నారు? అక్కడ జరుగుతున్న పని వాళ్ల మీద బలవంతంగా రుద్దారా లేక వాళ్లు ఇష్టపడే చేస్తున్నారా...ఇలాంటి విషయాలన్నిపైనా దర్యాప్తు చేయాల్సి ఉంది. బాడీ కెమేరా ఫుటేజ్‌లను అందజేసిన పోలీస్ అధికారిని చైనా డైలీ చేసిన ఇంటర్వ్యూ చూస్తే జిన్జియాంగ్ ప్రాంతంలో జర్నలిస్టులపై ఎంత ప్రణాళికాబద్ధమైన నిఘా ఉంచారో బోధపడిపోతుంది. మేము కూకా చేరుకున్న కొద్దిసేపట్లోనే మా హోటల్ లాబీలో మీటింగ్ పెట్టి మా హక్కులు, పరిమితుల గురించి మమ్మల్ని హెచ్చరించినట్లు ఆ అధికారి అంగీకరించారు. నిజానికి, ఆ మీటింగ్ అయ్యేవరకు హోటల్‌నుంచీ బయటకు వెళ్లడానికి మాకు అనుమతి లేదని హోటల్ సిబ్బంది మాకు ముందే చెప్పారు. ఆ పోలీసు అధికారితో పాటూ మరో ఇద్దరు ప్రోపగాండా అధికారులు కూడా ఆ మీటింగ్‌కు వచ్చారు. మేము కూకాలో ఉన్నంతవరకూ వాళ్లిద్దరూ మా వెంటే ఉంటారని చెప్పారు. అప్పటికే మా వెనుక వస్తున్న కార్లకు తోడు వీళ్ల కారు కూడా మమ్మల్ని అనుసరించింది. మా రిపోర్ట్‌ను ఫేక్ న్యూస్ అని ప్రచారం చేయడం, దానిపై చైనా డైలీ రూపొందించిన కార్యక్రమం, మమ్మల్ని వెంబడిస్తూ వచ్చిన కార్లు...ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసిన ప్రయత్నాలని, మేము అందించే కథనంపై నియంత్రణ కొనసాగించే ప్రయత్నాలని తెలుస్తోంది. మేము బీజింగ్‌కు తిరిగి వచ్చిన తరువాత అక్కడి అధికారులు మమ్మల్ని పిలిచి...ఆ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీని చిత్రీకరించడానికి ముందే దాని యజమానుల అనుమతి తీసుకుని వెళ్లాల్సింది అని అన్నారు. బహిరంగ స్థలంలో ఉన్న భవనాన్ని చిత్రీకరించడం చైనా మీడియా నిబంధనలకు వ్యతిరేకం కాదని మేము చెప్పాం. విదేశీ జర్నలిస్టుల అక్రిడిటేషన్ విధానాన్ని ఒక నియంత్రణ సాధనంగా చైనా ఉపయోగిస్తోంది. తక్కువ రోజులకే వీసాలు ఇవ్వడం, జర్నలిస్టులు చేసిన కవరేజ్‌ను చైనా అంగీకరించని పక్షంలో వారి వీసాలను రెన్యువల్ చేయకపోవడంలాంటివన్నీ చేస్తోంది. నా రిపోర్ట్ పబ్లిష్ అయిన తరువాత, నాకు కొద్ది కాలానికే వీసా ఇచ్చారు. జిన్జియాంగ్ రిపోర్ట్ కారణంగానే వీసా కాలాన్ని తగ్గించారని అధికారులు చెప్పారు. బీబీసీ రహస్య కెమేరా ఉపయోగించిందని చైనా డైలీ ఆరోపించింది. కానీ మేము అలాంటిది ఏమీ వాడలేదు. "అంతర్జాతీయ దృక్కోణాన్ని చైనా విమర్శించే విధానం ఇప్పుడు మరింత రక్షణాత్మకంగా మారిందని" హన్నా బెయిలీ అన్నారు. "జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని ప్రభావితం చేయడానికి చైనా అనేక రకాల సాధనాలను ఉపయోగిస్తుంది. విదేశీ మీడియాపై అవిశ్వాసాన్ని కలుగజేయడం కూడా అలాంటి ఒక సాధనమే" అని ఆమె అభిప్రాయపడ్డారు. తాను రూపొందిన రిపోర్ట్‌లో ఉన్న తప్పులపై వ్యాఖ్యానించాలని చైనా డైలీని మేము కోరాం. మేము అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు కానీ "జిన్జియాంగ్‌లో ఎవ్వరినీ బలవంతంగా పనిలోకి దింపలేదని" తేల్చి చెప్పింది. చైనా డైలీ ప్రోపగాండా వీడియోలో ఆఖరుగా ఒక టెక్స్‌టైల్ మిల్లు కార్మికురాలిని "ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని అడిగారు. "నేను ఇక్కడ నా ఇష్ట ప్రకారమే పనిచేస్తున్నాను" అని ఆమె జవాబిచ్చారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉన్న జర్నలిస్టుల దగ్గరనుంచీ ఇలాంటి ప్రశ్న వస్తుందని ఆమెకు ముందే తెలుసు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనాలోని పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్ గురించి వాస్తవాలను రిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న విదేశీ జర్నలిస్టులపై భారీ ఆంక్షలు విధించడమే కాక చైనా మరో కొత్త వ్యూహాన్ని కూడా అవలంబిస్తోంది. స్వతంత్ర్య మీడియా కవరేజ్‌ను "నకిలీ వార్తలు" (ఫేక్ న్యూస్)" అని ముద్ర వేస్తోంది. text: 19వ శతాబ్దం నాటి పశ్చిమ ఆఫ్రికా మ్యాప్ చూస్తే, నదుల ప్రవాహ దిశలనే మర్చే భారీ పర్వతాల్లా ఇవి కనిపించేవి. వీటి గురించి అనేక కథలు ప్రచారంలో ఉండేవి. ఈ పర్వతాల గురించి వర్ణనలు విన్నవాళ్లు, మ్యాప్‌లు చూసినవాళ్లు కాంగ్ పర్వతాలు హిమాలయాల తరహాలో భారీగా ఉంటాయని అనుకుంటారు. కానీ, నిజానికి ఈ పర్వతాలు అసలు లేనేలేవు. కేవలం మ్యాప్‌ల్లోనే ఇవి కనిపిస్తాయి. మ్యాపులు, సమాజాల దృక్పథాల మధ్య సంబంధం గురించి సిమోన్ గార్‌ఫీల్డ్ అనే జర్నలిస్ట్ ‘ఆన్ ద మ్యాప్’ అనే పుస్తకం రాశారు. కాంగ్ పర్వతాలు కేవలం మ్యాప్‌లు సృష్టించిన కల్పిత పర్వతాలని ఆయన అంటున్నారు. స్కాటిష్ యాత్రికుడు ముంగో పార్క్ మొదటగా కాంగ్ పర్వతాల గురించి వర్ణించారు. నైజర్ నది జన్మ స్థానం గురించి 1795 నుంచి 1797 మధ్యలో ఆయన అన్వేషించారు. ప్రస్తుతం సెనెగల్, మాలి ఉన్న ప్రాంతాల వరకూ వెళ్లారు. ఆయన యాత్ర గురించి 1799లో ఓ పుస్తకం అచ్చైంది. దీనికి చివర్లో బ్రిటన్‌కు చెందిన మ్యాపుల చిత్రకారుడు జేమ్స్ రెనెల్ వేసిన ఓ మ్యాపు ఉంది. భూ మధ్య రేఖకు ఉత్తరం వైపు 10 డిగ్రీల అక్షాంశం వెంబడి దాదాపు పశ్చిమ ఆఫ్రికా వ్యాప్తంగా కాంగ్ పర్వతాలు విస్తరించి ఉన్నట్లు ఇందులో గీశారు. కాంగ్ సామ్రాజ్యం రాజధాని నగరం కాంగ్ పేరు మీద ఈ పర్వతాలకు ఆ పేరు పెట్టారు. వట్టారా అని కూడా ఈ సామ్రాజ్యానికి పేరు ఉంది. ‘పొరపాటా? కావాలనే చేశారా?’ ముంగో పార్క్ ఏవైనా పర్వతాలను చూశారా? లేక అవి ఉన్నట్లు కల్పించి చెప్పారా? అన్నది నిర్ధారించడం చాలా కష్టం. ‘‘పార్క్ వేటినో చూసి పొరబడి ఉంటారు. మేఘాలను చూసి పర్వతాలు అనుకున్నారేమో!’ అని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ ప్రొఫెసర్ థామస్ బాసెట్ అన్నారు. పశ్చిమ ఆఫ్రికా భౌగోళిక పరిస్థితుల విషయంలో థామస్ నిపుణుడు. ‘‘యాత్రికులు, వ్యాపారులను ఆ వైపు పర్వత శ్రేణి ఉందా అని పార్క్ అడిగి ఉంటారు. వాళ్లు అవునని చెప్పి ఉండొచ్చు. అయోమయానికి మించిన కథేదో దీని వెనుక ఉండొచ్చు!’ అని థామస్ అభిప్రాయపడ్డారు. 1848లో ఆఫ్రికా మ్యాప్ నైజర్ నది ప్రవాహ మార్గం అప్పట్లో భూగోళ శాస్త్రవేత్తలకు చిక్కుముడిగా ఉండేది. ఈ అంశం కూడా కాంగ్ పర్వతాల గురించి కల్పనలో కీలకమై ఉండే అవకాశాలున్నాయి. ‘‘జేమ్స్ రెనెల్ తన సొంత సిద్ధాంతం ప్రకారం కాంగ్ పర్వతాలను వర్ణించారు. దీని గురించి పరస్పర విరుద్ధమైన చాలా సిద్ధాంతాలు ఉన్నాయి’’ అని థామస్ అన్నారు. రెనెల్ తన కాలంలో బాగా పేరు మోసిన భూగోళ శాస్త్రవేత్త. అట్లాంటిక్ సముద్రానికి తూర్పు వైపు నుంచి ఆఫ్రికాలోకి నైజర్ నది ప్రవహించి, ఆ తర్వాత అక్కడి డెల్టా లాంటి ప్రాంతంలోకి అది విస్తరించి కనుమరుగవుతుందని రెనెల్ ప్రతిపాదించారు. ఆ నది దక్షిణాన ఉన్న బెనిన్ గల్ఫ్ వైపు ప్రవహించకుండా కాంగ్ పర్వతాలు ‘అడ్డంకి’గా మారాయని ఆయన చెప్పారు. అయితే, నిజానికి నైజర్ నది ఆ వైపుగానే ప్రవహిస్తోంది. జేమ్స్ రెనెల్ రెనెల్ వర్ణనలు చాలా ప్రభావం చూపాయి. 19వ శతాబ్దం మొత్తం దాదాపు అన్ని ఆఫ్రికా మ్యాపుల్లో కాంగ్ పర్వతాలు ఉన్నట్లుగా చూపారు. అయితే, వాటి ఆకారాన్ని మ్యాపులు గీసేవాళ్లు తమకు ఊహాశక్తికి తగ్గట్లుగా గీశారు. కొన్ని మ్యాపుల్లో ఆఫ్రికా ఖండంలో పశ్చిమం నుంచి తూర్పు వైపుకు సహారా ఎడారి, మధ్య ఆఫ్రికా మధ్య పెద్ద గోడలా వీటిని గీశారు. అవి చాలా ఎత్తైనవని, వాటి లోయల్లో బంగారం నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని కూడా వర్ణనలు చేశారు. ప్రస్తుతం ఘనా ఉన్న ప్రాంతంలోని అష్టాని సామ్రాజ్యానికి అత్యంత విలువైన లోహం కాంగ్ పర్వతాల నుంచే వచ్చిందని కూడా కొందరు యురోపియన్లు వాదించారు. 1818లో పశ్చిమ ఆఫ్రికా మ్యాపు అయితే, 1889లో ఫ్రాన్స్ అధికారి, యాత్రికుడు లూయిస్ గుస్తావే బింగర్ నైజర్ నది వెంబడి యాత్ర చేపట్టారు. అసలు కాంగ్ పర్వతాలు లేనే లేవన్న వార్తను పారిస్ జియోగ్రాఫికల్ సొసైటీకి తెలియజేసింది ఆయనే. దీంతో ఇక మ్యాపుల్లో నుంచి కూడా వాటిని తీసేయడం మొదలైంది. ప్రపంచం గురించి మనకున్న అపోహలు, అభిప్రాయాలు వాస్తవికమనైవని మనం అనుకునే మ్యాపులను సైతం ఎలా మార్చేస్తాయన్నదానికి కాంగో పర్వతాలు ఒక ఉదాహరణ అని ప్రొఫెసర్ థామస్ బాసెట్ అన్నారు. ‘‘మ్యాపులు కూడా తమ చారిత్రక నేపథ్యాలకు అనుగుణంగా తమ తమ జనాల కోసం కొందరు తయారుచేసుకున్న సామాజిక అభిప్రాయలే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 18వ శతాబ్దానికి ముందు మ్యాపుల్లో చిత్రవిచిత్రమైన కల్పిత అంశాలు ఉండేవని థామస్ చెప్పారు. 16వ శతాబ్దంలో ఒర్టెలియస్ అనే మ్యాపులు గీసే కళాకారుడు నైలు నది దక్షిణ ఆఫ్రికాలోని రెండు పెద్ద సరస్సుల్లో పుట్టినట్లుగా చిత్రించారని అన్నారు. ‘‘19వ శతాబ్దానికి సైన్స్ ఎంతో కొంత పురోగతి సాధించింది. అలాంటి సమయంలోనూ మ్యాపుల్లో కాంగ్ పర్వతాలు కనిపించడం అసాధారణమైన విషయమే’’ అని థామస్ చెప్పారు. రెనెల్‌కు ఉన్న పేరు, ప్రాముఖ్యతలు... యురోపియన్ ప్రచురణకర్తలకు ఉన్న వ్యాప్తి కారణంగా కాంగ్ పర్వతాల గురించిన అపోహను చాలా కాలం ఎవరూ ప్రశ్నించకుండా ఉండిపోయారు. లూయిస్ గుస్తావే బింగర్ కాంగ్ పర్వతాలు లేవని అధికారికంగా చెప్పడం వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఆయన బయటపెట్టిన విషయం పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రాన్స్ సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేసింది. 19వ శతాబ్దంలో యురోపియన్ ప్రభుత్వాలకు మ్యాపులంటే కేవలం భౌగోళిక సమాచారం చెప్పే అంశాలే కాదు. వలస సామ్రాజ్యాలను నెలకొల్పాలన్న ఆకాంక్షలకు ఉపయోగపడే సాధనాలు. ‘‘19వ వతాబ్దంలో రాజకీయ మ్యాపులను అసలు భౌగోళిక పరిస్థితులపై రుద్దారు. బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగీసు మ్యాపుల మధ్య తేడాలు ఉండటానికి అదే కారణం. వాళ్లు భూభాగాలను వర్ణించడం కాదు, వాటిపై తమ హక్కును ప్రకటించుకున్నారు’’ అని థామస్ బాసెట్ అన్నారు. మ్యాపులను నిశితంగా పరిశీలించాలని, ఉన్నదున్నట్లుగా నమ్మకూడదన్న పాఠం కాంగ్ పర్వతాలు మనకు నేర్పించాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మ్యాపును ఏ పరిస్థితుల్లో రూపొందించారు? ఎందుకోసం రూపొందించారు? ఇలా ఈ ప్రశ్నలకు సమాధానాలను పరిగణనలోకి తీసుకోకుండా మనం మ్యాపులను సరిగ్గా అర్థం చేసుకోలేం’’ అని అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కాంగ్ పర్వతాల శిఖరాలు ఆకాశాన్ని పొడుస్తున్నట్లుగా ఉంటాయని, ఏడాదిలో చాలా కాలం వాటిపై మంచు పరుచుకుని ఉంటుందని అప్పట్లో యూరప్‌లో చెప్పుకునేవారు. text: వీటిలో ఒకరు సంపన్నుడు కావచ్చని, ఇంకొకరు ఆయన బానిస అయ్యుంటారని పాంపే పురాతత్వ శాఖ అధికారులు చెప్పారు. "వాళ్లు బహుశా విస్ఫోటనం నుంచి తప్పించుకోవాలని చూసుండవచ్చ"ని డైరెక్టర్ మాసిమో ఒసన్నా తెలిపారు. క్రీస్తు శకం 79లో వెసువియస్ అగ్నిపర్వతం పేలడంతో ఉప్పొంగిన లావా పాంపే నగరాన్ని చుట్టుముట్టింది. దానిని బూడిద చేసింది. ఆ నగరంలోని ప్రజలు అందులోనే గడ్డకట్టుకుపోయారు. వారు పురాతత్వ శాస్త్రవేత్తలకు అమూల్యమైన ఒక వనరుగా మారారు. ఈ తాజా అవశేషాలను నవంబరులో ప్రాచీన నగరం శివార్లలోని ఒక పెద్ద భవనంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు కనుగొన్నారు. బాధితుల్లో సంపన్నుడి వయసు 30-40 మధ్య ఉంటుందని, అతడు ఉన్ని దుస్తులు వేసుకున్నట్టు అతడి మెడ కింద ఆనవాళ్లు కనిపించాయని వారు చెప్పారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వయసు 18-23 మధ్య ఉంది. బాగా పాడైన వెన్నెముక అతడు శారీరక కష్టం చేసే బానిస అయ్యుండవచ్చని చెబుతోందని తవ్వకాలు జరిపిన అధికాలు తెలిపారు. గట్టిపడిన బూడిదగా మారిన బాధితుల శరీరాలను ఉపయోగించి వాటి అచ్చులు పోతపోశారు. "థెర్మల్ షాక్ వల్ల వారు చనిపోయారని, వారి పాదాలు, చేతుల ద్వారా అది కనిపిస్తోంది" అని ఒసన్నా రిపోర్టర్లకు చెప్పారు. ఇక్కడ విస్ఫోటనం జరిగిందని చెప్పడానికి ఒక అసాధారణ సాక్ష్యంగా ఆయన వాటిని వర్ణించారు. నేపుల్స్ సమీపంలో పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే ప్రాంతంలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ కరోనా వల్ల అక్కడికి పర్యటకుల రాకను నిషేధించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రెండు వేల ఏళ్ల కిందట వెసువియస్ అగ్నిపర్వతం పేలినపుడు ప్రాచీన రోమన్ నగరం పాంపేలో చనిపోయిన ఇద్దరు పురుషుల అవశేషాలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. text: వాతావరణ వివరాలను అందించే వెబ్ సైట్ వెదర్ అండర్‌ గ్రౌండ్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుపానుల్లో 26 పెను తుపాన్లు ఈ తీరంలోనే సంభవించాయి. ప్రస్తుతం మే 20 సాయంత్రానికి భారత్, బంగ్లాదేశ్ తీరంలో దాటే అవకాశం ఉందని భావిస్తున్న సైక్లోన్ ఆంఫాన్ ఆ వరుసలో 27వది. ఈ పెను తుపాను కారణంగా భారత్‌లోని ఒడిషా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ, అటు బంగ్లాదేశ్‌లోనూ పెనుగాలులతో కూడిన కుంభ వృష్టి కురవనుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పెను తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపనుందని, అది తీరాన్ని దాటే సమయంలో గంటకు సుమారు 191 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఘోరమైన పెను తుపాన్లకు బంగాళాఖాతం ఎందుకు కేంద్రంగా మారుతోంది? ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయని చెబుతారు వాతావరణ పరిశోధకులు. ఇక్కడ లోతు తక్కువగా ఉంటూ ఒక వైపుకు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉంటుంది. సాధారణంగా తుపాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డువైపుకు తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుపాను తీరాన్ని తాకుతుంది. ఈ తరహా భౌగోళిక పరిస్థితులకు బంగాళాఖాతం ఓ స్పష్టమైన ఉదాహరణ అని వెదర్ అండర్ గ్రౌండ్‌ కాలమిస్ట్, ప్రముఖ వాతావరణ పరిశోధకులు బాబ్ హెన్సన్ నాతో అన్నారు. బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండటం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. ఫలితంగా తీవ్ర తుపానులు సంభవిస్తుంటాయి. “అక్కడ ఉష్ణ్రోగ్రతల స్థాయి చాలా ఎక్కువ” అని భారత వాతావరణ పరిశోధన విభాగ అధిపతి డి మహాపాత్ర వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పెను తుపానులు సంభవించే మరి కొన్ని తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణ లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం. “కానీ బంగాళాఖాతం యొక్క ఉత్తర తీర ప్రాంతంలో తుపానులు ఒక్కసారిగా విరుచుకుపడి పెను నష్టానికి కారణమవుతాయి. భూమ్మీద ఇంకెక్కడా ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తవు” అని హెన్సన్ అన్నారు. తూర్పు తీర ప్రాంతంలో జన సాంద్రత అధికంగా ఉండటం కూడా తీవ్ర నష్టానికి కారణమవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు తీర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. సైక్లోన్ ఫొని బీభత్సం సైక్లోన్ ఆంఫన్ విషయంలో ఎందుకంత భయం? సైక్లోన్ ఆంఫన్‌ను సూపర్ సైక్లోన్‌గా వాతావరణ శాఖ హెచ్చరించడం ఈ భయానికి ప్రధాన కారణం. సూపర్ సైక్లోన్ అంటే గంటకు 220 కిలోమీటర్ల వేగాన్ని మించి గాలులు వీస్తాయి. ఇటువంటి తుపానుల వల్ల అనేక విపత్తులు ఎదురవుతాయి. బలమైన గాలుల కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో అలల పోటు తీవ్రంగా ఉంటుంది ఈ రెండింటితో పాటు భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తాయి. సాధారణంగా బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలో ఎప్పటికప్పుడు తుపానులు వచ్చినా ప్రతి పదేళ్లకు ఒకసారి మాత్రమే ఈ స్థాయి తుపానులు విరుచుకుపడుతుంటాయి. 1970 నవంబర్లో వచ్చిన సైక్లోన్ భోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుపానుల్లో ఒకటి. బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుపాను కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాను సమయంలో తీర ప్రాంతంలో అలలు సుమారు 34 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుపానుల తీవ్రత పెరుగుతూ వస్తోందని హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమృత్ అన్నారు. 2008 మే నెలలో బర్మా తీరంలో సంభవించిన నర్గిస్ తుపాను కారణంగా సుమారు లక్ష 40 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. “ ఓ సిరాతో వేసిన వర్ణ చిత్రంపై ఒక్కసారిగా బకెట్‌తో నీళ్లు గుమ్మరించినట్టయ్యింది. ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించిన గీతలన్నీ (డెల్టా కాల్వలు) పూర్తిగా చెరిగిపోయాయి. కిందనున్న పేపర్ మొత్తం నలిగిపోయినట్టయిపోయింది” అంటూ ఓ పాత్రికేయుడు నాటి బీభత్సం గురించి వర్ణించారు. చివరి సారిగా 1999లో సూపర్ సైక్లోన్ భారత్‌లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుపాను ధాటికి సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కుళ్లిన శవాలు, స్మశానాల్లో ఆకాశాన్ని అంటుతున్న పొగ.. అప్పట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించిన నాకు కనిపించిన దృశ్యాలవి. నాటి భయానక పరిస్థితి ఇప్పటికి నాకు గుర్తుంది. ఓ సూపర్ సైక్లోన్ ధాటికి పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతాయో మొదటిసారిగా నాకు అప్పుడే తెలిసింది. కోల్‌కతా నగరంపై కారు మబ్బులు కోల్‌కతా నగరంపై కారు మబ్బులు కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచంలోనే అతి పెద్ద తీరప్రాంతం బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది. సుమారు 50 కోట్ల మంది ఈ తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుపానుల్ని ఎదుర్కొంటోంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతమే. text: ఆయన 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో అదృశ్యమయ్యారని, తర్వాత పాకిస్తాన్ అదుపులోకి తీసుకుందని చెప్పారు. అప్పటి నుంచి తన భర్తను స్వదేశానికి తీసుకురావాలని దమయంతి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దమయంతి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, జేఎన్‌యూలో మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పని చేశారు. వింగ్ కమాండర్ అభినందన్‌ ఫిబ్రవరి 27న పాకిస్తాన్ దళాలకు చిక్కారు. 50 గంటల తర్వాత విడుదలైన ఆయన తిరిగి భారత్ చేరారు. కానీ ఇలా చిక్కుకున్న చాలామంది భారతీయులు మాత్రం ఇంకా పాక్ చెరలోనే మగ్గిపోతున్నారు. ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ విజయ్ తాంబే కూడా 1971 యుద్ధంలో భాగంగా, పాకిస్తాన్ భూభాగంలో అదృశ్యమయ్యారు. ఆయన భార్య దమయంతి తాంబే ఆయన విడుదల కోసం గత 48 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘‘నేను ఈ రెండు ఘటనలనూ పోల్చడం లేదు. వింగ్ కమాండర్ అభినందన్‌ను తిరిగి దేశానికి అప్పగించినపుడు అది పూర్తి స్థాయి యుద్ధం కూడా కాదు’’ అని దమయంతి అన్నారు. అభినందన్‌లా నా భర్త కూడా పాక్ సైన్యానికి చిక్కారు అసలు ఏం జరిగింది? ‘‘మొదట మా ఆయన యుద్ధంలో కనిపించకుండా పోయారని మాకు టెలిగ్రాం అందింది. తర్వాత అదే వార్తను నేను రేడియోలో విన్నాను. తన కొలీగ్స్ కొందరు ఆయన్ను పాకిస్తాన్ టీవీ చానల్లో చూశామని చెప్పారు. మా మావయ్య పాకిస్తాన్ న్యూస్ పేపర్లు తీసుకొచ్చారు. వాటిలో ఐదుగురు భారత పైలెట్లను పాకిస్తాన్ పట్టుకుందని, వారిలో ఒకరి పేరు తాంబే అని ఉంది. దాంతో పైలెట్లను పాకిస్తాన్ నిర్బంధించినట్లు ఒప్పుకుందనే అనుకున్నాం’’ అని ఆనాటి సంఘటనలను దమయంతి బీబీసీతో పంచుకున్నారు. ‘‘కొంతకాలానికి యుద్ధం ముగిసింది. సిమ్లా ఒప్పందం జరిగింది. యుద్ధ ఖైదీల అప్పగింత జరిగింది. యుద్ధ ఖైదీలను వారి దేశాలకు పంపిస్తారు. విజయ్ కూడా అందరిలాగే ఇంటికి తిరిగొస్తారనే అనుకున్నాం. కానీ మొదటి రెండు జాబితాల్లో ఆయన పేరు లేదు. మూడో జాబితా వస్తుందన్నారు. అందులో మిగతా వారి పేర్లుంటాయిలే అనుకున్నాం. కానీ ఆ జాబితా విడుదల కాలేదు, యుద్ధ ఖైదీలు కూడా రాలేదు. మేం ప్రభుత్వానికి లేఖ రాశాం. కానీ ఏ సమాధానం లేదు’’ అని దమయంతి వివరించారు. ‘‘ఒక మంత్రి మమ్మల్ని ప్రభుత్వ క్వార్టర్స్ నుంచి ఇంకా బయటికి వెళ్లలేదే అని అడిగారు. అధికారులకు ఇళ్లు దొరకడం లేదని, అందుకే మేం ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారులు మాతో మాట్లాడ్డం అదే మొదటిసారి. యుద్ధం ముగిసింది. మనం గెలిచాం. దేశం అప్పుడు విజయోత్సవాల్లో ఉంది. ఆ సమయంలో మా కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి’’ అని ఆమె అన్నారు. అభినందన్‌ను విడుదల చేసిన రోజు భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద అటారీ వైపు జాతీయ జెండాతో భారతీయులు తాము ఈ విషయాన్ని పాకిస్తాన్ దగ్గర ఎన్నోసార్లు ప్రస్తావించామని భారత ప్రభుత్వం చెబుతోంది. కానీ దమయంతి మాత్రం తన ప్రయత్నం వదులుకోవడం లేదు. ‘‘నిజం చెప్పాలంటే, ఈరోజు కూడా ఆ కేసు మూసేయడం గురించి నేను పట్టించుకోవడం లేదు. కేసు మూసేయడం అంటే ప్రయత్నాలన్నీ ఆపేశారని అర్థం. భారత ప్రభుత్వం.. అక్కడ ఇంకా యుద్ధ ఖైదీలు ఉన్నారని ఒప్పుకోడానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తమ దగ్గర యుద్ధ ఖైదీలు ఉన్నారని చెప్పడం లేదు. కానీ నాకు మాత్రం ఆయన అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. ఆయన విడుదల కోసం నేను కాకుండా ఇంకెవరు ప్రయత్నిస్తారు’’ అని దమయంతి తన బాధను పంచుకున్నారు. ‘ఆయన ఇప్పుడు ఎక్కడున్నారని భావిస్తున్నారు? ఏ పరిస్థితిల్లో ఉండచ్చు?’ అని బీబీసీ ప్రతినిధి దమయంతిని ప్రశ్నించినపుడు.. ‘‘ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఆ విషయం తెలుసుకునే మార్గం కూడా లేదు. నన్ను రెండుసార్లు పాకిస్తాన్ పంపినప్పుడు మమ్మల్ని కోట్ లఖ్‌పత్ జైలుకు తీసుకెళ్లారు. కొంతమంది భారత ఖైదీలను మా ముందు పరేడ్ చేయించారు. అక్కడ వాళ్ల కాళ్లకు సంకెళ్లు వేయడం, వారి పరిస్థితి అంతా చూసి నాకు ఒక్క క్షణం.. వీళ్లు ఇలా జీవించాలా? ఇలా బతకడం కంటే విజయ్ ప్రాణాలతో లేకపోవడమే మంచిది అనిపించింది. అందుకే, ఆయన ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలీదు. కానీ తిరిగొస్తే మాత్రం, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా, నా జీవితంలో ఆయనకు 200 శాతం చోటు ఉంటుందని మాత్రం నాకు తెలుసు’’ అని ముగించారు దమయంతి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎదురుచూపులు ఎంత భారంగా ఉంటాయో 71 ఏళ్ల దమయంతికి బాగా తెలుసు. తన భర్త, ఫ్లైట్ లెఫ్టినెంట్ విజయ్ తాంబే ఇంటికి వస్తారని గత 48 ఏళ్లుగా ఆమె ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఆయన రాలేదు. text: ఈ పర్యటన కోసం భారత ప్రభుత్వం ముందు తాను ఒక షరతు పెట్టానని వాయవ్య ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ డేవిస్ చెప్పారు. కశ్మీర్లో ఎక్కడైనా తిరగడానికి, ప్రజలతో మాట్లాడ్డానికి తనకు స్వేచ్ఛనివ్వాలని కోరినట్లు తెలిపారు. బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన డేవిస్ "కశ్మీర్లో నేను ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లేలా, ఎవరితో మాట్లాడాలనుకుంటే వారితో మాట్లాడగలిగేలా నాకు స్వేచ్ఛ కావాలని కోరాను. నాతో సైన్యం, పోలీసులు లేదా భద్రతా బలగాలకు బదులు స్వతంత్ర జర్నలిస్టులు, టెలివిజన్ బృందం ఉండాలని చెప్పాను. వార్తల్లో కత్తిరింపులు, కుదించడాన్ని మేం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పాం. అక్కడ ఏం జరుగుతోందో దాని గురించి నిజమైన, నిజాయితీ రిపోర్టింగ్ ఉండాలని చెప్పానని" తెలిపారు. అలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత తనకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకున్నట్లు డేవిస్ చెప్పారు. శ్రీనగర్‌లో యూరోపియన్ యూనియన్ ఎంపీల కాన్వాయ్ మోదీని సమర్థించే సంస్థ నుంచి ఆహ్వానం తనకు కశ్మీర్ పర్యటన ఆహ్వానం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మద్దతుదారులుగా చెబుతున్న 'ఉమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ థింక్ ట్యాంక్' తరఫున వచ్చిందని చెప్పారు. ఈ పర్యటన ఏర్పాట్లను భారత ప్రభుత్వ సహకారంతో చేస్తున్నట్లు అందులో స్పష్టంగా చెప్పారని" డేవిస్ తెలిపారు. "ఈ పర్యటన ఖర్చును 'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నాన్ అలైన్డ్ స్టడీస్' భరిస్తుందని నాకు చెప్పారు. అయితే ఆ సంస్థకు లభించే ఆ నిధుల సోర్స్ ఏదనేదానిపై నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు" అని డేవిడ్ చెప్పారు. "నిర్వాహకులు మొదట్లో కాస్త 'భద్రత అవసరం' అవుతుంది అన్నారు. కానీ రెండ్రోజుల తర్వాత నాకు ఆహ్వానం రద్దు చేసినట్లు చెప్పారు. ఎందుకంటే పర్యటనకు వెళ్లేవారి సంఖ్య పూర్తైందన్నారు. నా ఆహ్వానం పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు" చెప్పారు. 'ఆల్ ఈజ్ వెల్' అనడానికి రెడీగా లేను ఆహ్వానం వెనక్కు తీసుకోవడానికి కారణం ఏమని చెప్పారు అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. నిర్వాహకులకు తన షరతులు సరిగా అనిపించకపోయుండచ్చని చెప్పారు. "నేను మోదీ ప్రభుత్వం పీఆర్ స్టంట్‌లో భాగం కావడానికి, 'ఆల్ ఈజ్ వెల్' అని చెప్పడానికి రెడీగా లేను. నా ఈమెయిల్ ద్వారా వారికి ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాను. కశ్మీర్‌లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కాలరాస్తుంటే, ప్రపంచానికి దాని గురించి తెలియాలి. భారత ప్రభుత్వం ఏం దాచాలనుకుంటోంది? జర్నలిస్టులు, పర్యటించే నేతలకు స్థానిక ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? వారి సమాధానం చూస్తుంటే, నా అభ్యర్థన వారికి నచ్చలేదని అనిపిస్తోంది" అని డేవిస్ చెప్పారు. "నేను ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానో, అక్కడ కశ్మీరీ వారసత్వంలో భాగమైన వారు కొన్ని వేల మంది ఉన్నారు. వారి బంధువులు చాలా మంది కశ్మీర్లో ఉన్నారు. కశ్మీరీలను ప్రభావితం చేస్తున్న చాలా అంశాలను వారు నా ముందుకు తెచ్చారు. వాటిలో సమాచార మాధ్యమాలపై విధించిన నిషేధం కూడా ఉంది" అని డేవిస్ చెప్పారు. ఆందోళన చెందలేదు ఈ పర్యటన నుంచి మీరు ఏం సాధించాలనుకున్నారు? అనే ప్రశ్నకు డేవిస్ జవాబిస్తూ.. "నేను కశ్మీర్ లోయలో ప్రాథమిక స్వేచ్ఛ మళ్లీ నెలకొంటోందని చూపించాలని, ప్రజల రాకపోకలు, అభిప్రాయం పంచుకోవడం, లేదా శాంతియుత వ్యతిరేక ప్రదర్శన హక్కుపై ఎలాంటి నిషేధం లేదు అని చెప్పాలనుకున్నా. కానీ నిజం చెప్పాలంటే.. అలా కనిపిస్తుందని నాకు ఎప్పుడూ అనిపించలేదు. భారత ప్రభుత్వం తన చర్యలపై స్వతంత్ర్య సమీక్షకు అనుమతించేందుకు సిద్ధంగా ఉందా అనేదానికి ఇది ఒక లాంటి పరీక్ష" అన్నారు. కశ్మీర్ పర్యటన ఆహ్వానం వెనక్కు తీసుకోవడం గురించి తను ఆందోళన చెందలేదని డేవిస్ చెప్పారు. "నాకు మొదటే ఈ పర్యటన పీఆర్ స్టంట్‌లా అనిపించింది. దాని లక్ష్యం నరేంద్ర మోదీకి సాయం చేయడమే. నాకు తెలిసి, కశ్మీర్‌లో భారత ప్రభుత్వం చర్యలు గొప్ప ప్రజాస్వామ్య సూత్రాలను వంచించడం లాగే భావిస్తున్నాను. ప్రపంచం ఈ స్థితిపై ఎంత తక్కువ దృష్టి పెడితే, ఆయన అంత సంతోషిస్తారు" అని డేవిస్ చెప్పారు. సరైన సమాచారం లేదు కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారు అని అడగ్గా డేవిస్ స్పందిస్తూ.. "కశ్మీర్లో ఏమేం జరుగుతున్నాయో, వాటి గురించి కచ్చితమైన సమాచారం లేదు. కానీ ప్రజలను జైళ్లలో పెట్టినట్లు, మీడియాపై నిషేధం, సమాచార మాధ్యమాలపై కఠిన ఆంక్షలు, సైన్యం నియంత్రణ గురించి మేం వింటున్నాం. ప్రభుత్వ చర్యల గురించి ఎంత సానుభూతి ఉన్నా, ఈ చర్య మత పక్షపాతంతో తీసుకున్నదని కూడా ఆలోచించాలి. ముస్లింలు హిందూ జాతీయవాదాన్ని సమర్థవంతమైన వ్యవస్థగా చూస్తున్నారు. అది భవిష్యత్తులో మంచిది కాదు. ప్రస్తుతం దేశాల మధ్య శాంతి ప్రాధాన్యం వేగంగా, అసమర్థంగా మారుతోంది" అన్నారు. లండన్లో ఇటీవల కశ్మీర్ అంశంపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో కొందరు గుడ్లు, రాళ్లు విసరడం గురించి మాట్లాడిన క్రిస్ డేవిడ్, తన మద్దతు శాంతియుత ప్రదర్శనలకే అన్నారు. కానీ, ప్రజలకు నష్టం కలిగించే ఏ వస్తువునైనా ఉపయోగించడం చట్టవిరుద్ధం, తప్పు అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) యూరప్ ఎంపీల బృందం కశ్మీర్ పర్యటనలో ఉంది. యూరోప్ పార్లమెంటు సభ్యుడు క్రిస్ డేవిస్ కూడా వారితో రావాలని అనుకున్నారు. కానీ తనకు పంపిన ఆహ్వానాన్ని తర్వాత వెనక్కు తీసుకున్నారని, ఆ ప్రతినిధి బృందంలో తనకు చోటు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. text: ఆమెను ఆగస్టు 14 రాత్రి నాగ్‌పూర్‌లోని ఆరేంజ్ ఆస్పత్రికి చేర్చాక, బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అక్కడి వైద్యులు భయపడ్డారు. ఆమె తల, మొహం నుజ్జునుజ్జయ్యాయి. ఎడమ కంటి గుడ్డు బయటకు పొడుచుకొచ్చింది. నోరు చిట్లిపోయి పక్కకు జరిగింది. ఒంటినిండా అనేక గాయాలున్నాయి. చాలా రక్తం పోయింది. ‘అది మనుషులు చేసిన పనిలా కనిపించలేదు, ఏదో మృగం చేసిన దాడిలానే ఉంది’ అని ఆరేంజ్ ఆస్పత్రి క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్ డా.రాజేష్ అటల్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. ‘ఇక్కడికి వచ్చే సమాయానికి ఆమె భరించలేని నొప్పి, భాధను అనుభవిస్తోంది. అతి కష్టమ్మీద ఊపిరి తీసుకుంటోంది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్త పోటు పడిపోయింది’ అని ఆయన అన్నారు. 26ఏళ్ల ఆ యువతిపై అత్యాచారం జరిపి ఆ తరువాత రెండున్నర కేజీల బరువున్న రాయితో ఆమె మొహంపై తీవ్రంగా దాడి చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయు. ఆ ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. బాధితురాలు నాగ్‌పూర్‌కు దగ్గర్లోని ఉమ్రెడ్‌లో ఉన్న ‘వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్’ ఉద్యోగి. ఆమె పని చేసే చోటుకు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఆగంతుకులు ఆమెను అనుసరించి, అత్యాచారం జరిపి తరువాత హత్య చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆ వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. నేరం జరిగిన సమయంలో చుట్టూ పదుల సంఖ్యలో లారీలున్నా ఎవరూ వారిని గమనించలేదు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం 8గం.కు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే సమయానికి ‘ఉమ్రెడ్ బాధితురాలు’ ఆపరేషన్ థియేటర్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె గాయాలకు శస్త్ర చికిత్స చేయడానికి నలుగురు సర్జన్లకు ఎనిమిది గంటలు పట్టింది. దాడి తరువాత ఆమెకు చేసిన సర్జరీల్లో అది మొదటిది. ‘ఆమె తలపై చాలా ఫ్రాక్చర్లయ్యాయి. అదృష్టవశాత్తూ మెదడుకు ఎలాంటి గాయాలూ కాలేదు. చాలా పళ్లు విరిగిపోయాయి. నోరు మొత్తం చిట్లింది. 25ఏళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం ఆ యువతి కోలుకుంటోంది. సైగల ద్వారా సంభాషిస్తోంది. కొన్ని రోజుల్లో మాట్లాడుతుందని ఆశిస్తున్నాం’ అని డా.రాజేష్ అన్నారు. ‘ఆ యువతి వాంగ్మూలమే మా విచారణకు చాలా కీలకం’ అని ఉమ్రెడ్ డీఎస్పీ పౌర్ణిమా తవారే చెప్పారు. కేసులో ప్రధాన నిందితులైన మమ్లేష్ చక్రవర్తి(24), సంతోష్ మాలి(40)లను అరెస్టు చేసి వారిపైన అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. చక్రవర్తి లారీ క్లీనర్, మాలి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆ ఘటన జరిగినప్పుడు ప్రధాన నిందితుడైన మాలి మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ‘నా కూతరు మాట్లాడుతుంది. తనపై దాడి చేసిన వారికి శిక్షపడేలా చేస్తుంది’ అని బాధితురాలి తల్లి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. ‘బొగ్గు గనిలో పని వాతావరణం ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ తన కాళ్లమీద తాను నిలబడాలని, అందుకే అక్కడ పనిచేస్తున్నానని నా కూతురు చెప్పేది’ అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు, సోదరుడు ఛత్తీస్‌గఢ్‌లో ఉంటారు. ఆమె తండ్రి తన ఐదెకరాల భూమిని బొగ్గు గనికి బదిలీ చేశారు. దానికి పరిహారంలో భాగంగా ఆయన కూరుతుకు ఆ గనిలోనే క్లెరికల్ ఉద్యోగం ఇచ్చారు. ‘బాధితురాలు గనిలోని వెయి బ్రిడ్జ్ దగ్గర పనిచేస్తోంది. ఆ ఘటన జరిగిన రోజు వర్షం కురుస్తోంది. గనికి దగ్గర్లో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అందులో ఒకరు వెయి బ్రిడ్జ్ నంబర్ 4 దగ్గర పనిచేసే వ్యక్తి బంధువు. దాంతో అక్కడ పనిచేసే వ్యక్తి సెలవు పెట్టి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో వెయి బ్రిడ్జ్ 1 దగ్గర పనిచేసే ఆ యువతిని వెయి బ్రిడ్జ్ 4కి పంపించాం. కానీ ఆ వెయి బ్రిడ్జి మిగతా నిర్మాణాలకు కాస్త దూరంగా ఉంటుంది. మధ్యాహ్నం 1.50 ప్రాంతంలో భోజనం చేశాక ఆ యువతి వెయి బ్రిడ్జ్ దగ్గర్లో ఉన్న టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడే ఈ ఘటన జరిగింది’ అని గని సేఫ్టీ మేనేజర్ రవీంద్ర ఖేడ్కర్ చెప్పారు. ‘మధ్యాహ్నం 2గం.ల ప్రాంతంలో ఆ యువతి టాయిలెట్ వైపు వెళ్లడం వెయి బ్రిడ్జ్ 1కి అమర్చిన సీసీ టీవీలో నమోదైంది. ఆమె వెనకే నిందితుడు కూడా వెళ్లాడు. 17 నిమిషాల తరువాత ఆ వ్యక్తి వెనక్కు వచ్చాడు. కానీ, ఆ యువతి మాత్రం రాలేదు’ అని స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ హకే తెలిపారు. మధ్యలో ఉన్న ట్రక్కుల వల్ల అవతలివైపు ఉన్నవాళ్లకు టాయిలెట్ కనిపించలేదని, లేకపోతే ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. గనిలోని మరో ట్రక్కు డ్రైవర్ ఆమెను గుర్తించాడు. తరువాత అందరూ కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఉమ్రెడ్‌లో నిరసనలు ఆగస్టు 16న ఈ ఘటనకు వ్యతిరేకంగా ఉమ్రెడ్ వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, మహిళా ఉద్యోగికి భద్రత కల్పించలేని గని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా మంది వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పది వేల మంది ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం యాజమాన్యం వెయి బ్రిడ్జ్ 1 దగ్గర టాయిలెట్‌ను నిర్మిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన బాధితురాలు ఉమ్రెడ్‌లోనే పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ రోజూ 32 కి.మీ. ప్రయాణించి గనిలో పనికి వెళ్తోంది. గనిలో మహిళల భద్రత గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ పీఆర్‌వో నుంచి ఇంకా సమాధానాలు రాలేదు. ‘ఇటీవలి కాలంలో ఉమ్రెడ్‌లో చాలామంది చదువుకున్న యువతీ యువకుల్ని ఉద్యోగంలోకి తీసుకున్నాం. వారిలో కనీసం వందిమంది భూమి పరిహారంలో భాగంగా ఉద్యోగాలు పొందిన వారే. బాధితురాలు కూడా అలాంటి వాళ్లలో ఒకరు’ అని గని ఉన్నతాధికారుల్లో ఒకరు అన్నారు. ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులు రెండో ఆలోచన లేకుండా బాధితురాలి సోదరుడికి బదులు ఆమెకే ఉద్యోగం ఇప్పించారు. ఈ ఘటన జరిగిన వెంటనే గని యాజమాన్యం, ఉద్యోగుల నిర్వహణ బాధ్యతను చూసే ఓ అధికారిని ఉమ్రెడ్ నుంచి నాగ్‌పూర్‌కు బదిలీ చేసింది. దాంతో ఒకరి తప్పిదాన్ని కప్పిపుచ్చి మరెవరినో బలిపశువును చేస్తారేమోననే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘దాదాపు 300 మంది అర్హత కలిగిన మహిళలను డబ్ల్యుసీఎల్ ఉమ్రెడ్ ప్రాంతంలో జనరల్ కేటగిరీ వర్కర్ల కింద యాజమాన్యం నియమించింది. కానీ వీరి సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై వారికి స్పష్టత లేదు. సురక్షితం కాని ప్రాంతాల్లో వారికి పని కల్పించే ముందు మానవ వనరుల విభాగం ఒక్కసారి కూడా ఆలోచించలేదు’ అని గని ఏరియా అధికారి ఒకరు బీబీసీకి వివరించారు. బాధితురాలు 2016 డిసెంబర్‌లో ఉద్యోగంలో చేరింది. మొదట ఆమెకు గనిలో ఉపయోగించే పేలుడు పదార్థాల విభాగంలో పని కల్పించారు. కానీ అక్కడ పని కష్టంగా ఉండటంతో ఆమె వేరే చోటుకు బదిలీ చేయించుకున్నారు. దాంతో ఆమె వెయి బ్రిడ్జ్‌ దగ్గర పనిలో చేరారు. రోజూ గనిలోకి ప్రవేశించి, బయటకు వెళ్లే ట్రక్కుల కంప్యూటరైజ్డ్ ఎంట్రీలను నమోదు చేయడం ఆ యువతి బాధ్యత. కనీసం రోజూ 800 ట్రక్కులు వచ్చి వెళ్తుంటాయి. సరైన భద్రత లేకుండా అక్కడ పని చేయడం కష్టం. చాలాసార్లు దురుసుగా, తాగి ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు ఎదురుపడుతుంటారు. దురదృష్టవశాత్తూ ఆ రోజు మధ్యాహ్నం ఆ యువతి విషయంలో అదే జరిగింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఓ పక్క దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగినప్పుడు మరోపక్క నాగ్‌పూర్‌లో ఓ యువతి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య పోరాడుతూ ఆస్పత్రిలో చేరింది. text: అసెంబ్లీ సమావేశాల కంటే వాడి వేడిగా, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సాగాయి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉంది. దీంతో ఎలాగైనా రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలని ఆ పార్టీ వ్యూహం రచించింది. రెండు రోజులు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీ మంగళవారం రూల్ 71ను ప్రతిపాదించింది. 71వ రూల్ కింద చర్చ కోసం పట్టు పట్టడంతో ఆరోజు బిల్లు తీసుకోవడం చాలా ఆలస్యమైంది. అసలు బిల్లే తీసుకోవద్దని తెలుగుదేశం కోరింది. ముందు బిల్లులను సభకు పరిచయం చేయాలని వైసీపీ పట్టుపట్టింది. చివరకు మంగళవారం రాత్రి ఈ రాజధాని బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆరోజు అత్యంత ఉద్రిక్తంగా సభ సాగింది. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గరకు వెళతారు. కానీ, ఈసారి 15 మంది మంత్రులు అధ్యక్షుడి పోడియం దగ్గరకు వెళ్లి నిరసన చెప్పారు. ఆరోజు సందర్శకుల గ్యాలరీలో వైయస్సార్సీపీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కూర్చొని తమ సభ్యులకు సలహాలు ఇచ్చారు. ఒక దశలో పరిషత్ ప్రత్యక్ష ప్రసారాలు కూడా నిలిపివేశారు. వాయిదా పడినప్పుడల్లా తమకు అనుకూలంగా ఓటేసేలా స్వతంత్ర్య సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మొత్తానికి రూల్ 71పై చర్చ కూడా జరిగింది. గందరగోళం మధ్యే సభ బుధవారానికి వాయిదా పడింది. ఇక బుధవారం కూడా సమావేశాలు అంతే వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభలో మాట్లాడటానికి తెలుగుదేశానికి 84 నిమిషాలు, వైయస్సార్సీపీకి 27 నిమిషాలు, తెలుగుదేశం నామినేటెడ్ సభ్యులకు 8 నిమిషాలు, స్వతంత్ర్య సభ్యులకు 9 నిమిషాల సమయం ఇచ్చారు ఛైర్మన్ షరీఫ్. స్వతంత్ర్య ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు. బీజేపీ రాయలసీమలో హైకోర్టును స్వాగతించింది. మూడు ప్రాంతీయ బోర్డులను స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్సీ వీర్రాజు చెప్పారు. "అమరావతిలో దాదాపు అన్ని భవనాలు నిర్మాణాలూ పూర్తయ్యాయనీ, అయినా సీఎం ఒక్క రోజూ అమరావతిలో పర్యటించలేదు" అని తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. రాజధాని తరలింపు వల్ల ప్రజాధనం వృథా అవుతుందని ఆయన అన్నారు. అయితే, తాము వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించే ఆలోచిస్తామని, అమరావతిలో తెలుగుదేశం నేతలు భూదోపిడీ చేశారని విమర్శించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ క్రమంలో అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సెల్ ఫోన్ చూడటానికి మంత్రి బొత్స అభ్యంతరం చెప్పారు. సెల్ ఫోన్‌లో నోట్స్ చూస్తూ మాట్లాడడం తప్పేమీ లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాల సుబ్రమణ్యం స్పందించారు. ఛైర్మన్ నిర్ణయం పట్ల మంత్రి బుగ్గన అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ఇతర ఎమ్మెల్సీలను తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పించడానికి వైయస్సార్సీపీ పెద్దలు తమవంతు ప్రయత్నాలు చేశారు. మండలి సమావేశాలను చూడడానికి చంద్రబాబు స్వయంగా గ్యాలరీకి వచ్చారు. తన చాంబర్‌లో లైవ్ రాకపోవడంతో ఇక్కడకు వచ్చారు. పక్కనే మరో గ్యాలరీలో విజయసాయి, సుబ్బా రెడ్డి కూర్చున్నారు. బాలకృష్ణ, రోజా ఒకే గ్యాలరీలో కూర్చుని సభను చూశారు. మార్షల్స్ అడగడంతో చంద్రబాబు తన సెల్ ఫోన్‌ను వారి దగ్గర డిపాజిట్ చేసి, అప్పుడు గ్యాలరీకి వెళ్లారు. వీరంతా చూస్తుండగా, ఛైర్మన్ పోడియం ఎదురుగా లోకేశ్, బొత్స సత్యనారాయణలు వాగ్వివాదానికి దిగారు. నాయకులు ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ప్రసంగాల తరువాత, బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయాలని తెలుగుదేశం పట్టుపట్టింది. కుదరదని అధికార పక్షం వాదించింది. నినాదాలు, తోపులాటలు, దూసుకెళ్లడాలు, ఫిర్యాదులు, దుందుడుకు మాటలు సాగాయి. సభను పది నిమిషాలు వాయిదా వేశారు. టీడీపీకీ మండలిలో అత్యధిక సీట్లు ఉన్నాయి తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామనీ, వైయస్సార్సీపీ నుంచి రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని మీడియాతో వ్యాఖ్యానించారు యనమల రామకృష్ణుడు. మండలిలో తెలుగుదేశం మెజార్టీ ఉంది కాబట్టి, తాము అడిగితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందే అని చెప్పారాయన. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఉండేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. న్యాయ సలహా కోసం, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యాన్ని సభకు పిలిపించింది. అనేకసార్లు వైసీపీ, తెలుగుదేశం సభ్యులు చైర్మన్‌ను విడివిడిగా కలిశారు. ఛైర్మన్ కూడా సభ్యులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. సభ మళ్లీ ప్రారంభమైనా అదే పరిస్థితి. చివరకు నిబంధన 154 ప్రకారం తన విచక్షణాధికారాలను ఉపయోగించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఆ తరువాత సభను నిరవధిక వాయిదా వేశారు. "చంద్రబాబు చట్ట సభలపై గౌరవం లేకుండా వ్యవహరించారు. లాబీల్లో కూర్చుని ప్రభావితం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం తెచ్చిన బిల్లులను అడ్డుకున్న ఈ రోజు చరిత్రలో బ్లాక్ డే. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపే వీలు లేకుండా ఉద్దేశపూర్వకంగా సెలెక్ట్ కమిటీకి పంపారు" అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ వ్యాఖ్యానించారు. "ఛైర్మన్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం కాకుండా, చంద్రబాబు చెప్పినట్టు చేశారు. ఆయన చరిత్రహీనులుగా మిగిలిపోతారు" అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సెలెక్ట్ కమిటీ అంటే? ఈ సెలెక్ట్ కమిటీ విధానం బ్రిటిష్ పార్లమెంటు సంప్రదాయం నుంచి వచ్చింది. రాజ్యసభలో కూడా ఈ నిబంధన ఉంది. రాజ్యసభ నుంచే రాష్ట్రాల శాసన పరిషత్‌లు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ఏదైనా బిల్లుపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు దానిపై చర్చించడానికి సభలోని కొందరు సభ్యులతో ఒక కమిటీ వేస్తారు. అందులో అన్ని పార్టీల వారూ ఉంటారు. ఆ కమిటీకి ఒక ఛైర్మన్ ఉంటారు. ఆ కమిటీ ఈ బిల్లుపై అధ్యయనం చేసి తన నివేదికను ఛైర్మన్‌కు ఇవ్వాలి. సాధారణంగా సెలెక్ట్ కమిటీ ఛైర్మన్‌ను, గడువునూ సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. ఏ గడువూ నిర్ణయించని పక్షంలో మూడు నెలలకు మించకుండా ఆ కమిటీ తన నివేదికను ఇవ్వాలి. భారతదేశంతో పాటూ బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల చట్టసభల్లో కూడా ఈ సెలెక్ట్ కమిటీ విధానం ఉంది. ఎవరైనా సభ్యుడు ఏదైనా బిల్లును ఈ కమిటీకి పంపమని సభాధ్యక్షుడు కోరవచ్చు. మెజార్టీ ఆధారంగా నిర్ణయం జరుగుతుంది. బిల్లు గురించి అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీ అన్ని హక్కులూ కలిగి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో తమకు నచ్చని బిల్లు వచ్చినప్పుడు దానిని ఆలస్యం చేయడానికి లేదా కనీసం ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని మార్పులైనా చేయడానికి ఈ కమిటీని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా వాడతాయి. ఈ కమిటీ కింద గరిష్టంగా మూడు నెలలు బిల్లును ఆపగలరు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సంబంధిత బిల్లులు శాసన మండలిలో ఆగిపోయాయి. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను కౌన్సిల్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిలువరించింది. అధికార పార్టీ అభ్యంతరం చెప్పినా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఆ బిల్లులు చట్ట రూపం దాల్చడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. text: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ ఇంకా ఏమన్నారంటే... లాక్ డౌన్ ముగిసిన వెంటనే వైరస్ వ్యాప్తి మొదలవుతుంది, మళ్లీ తన ప్రతాపం చూపిస్తుంది. మన దగ్గర ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల దేశ ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించండి. రేషన్ కార్డులు లేనివాళ్లెందరో ఉన్నారు. వారందరికీ ఆహారం అందించండి. వారి ఆకలిని తీర్చండి. మన దగ్గర గోడౌన్లన్నీ నిండుగా ఉన్నాయి. వాటిని ప్రజలకు సరఫరా చేస్తే, ఇప్పుడు చేతికొచ్చిన పంటలతో మళ్లో గోడౌన్లను నింపుకోవచ్చు. పేద ప్రజల చేతికి వీలైనంత ఎక్కువ నగదు అందించాలి. హాట్‌స్పాట్లను గుర్తించేందుకు డైనమిక్ టెస్టింగ్ ప్రారంభించాలి. అలా చేయడం ద్వారా వైరస్‌ను అరికట్టగలం. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతోంది. అది మనందరం చూడబోతున్నాం. నిరుద్యోగం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోతుంది. కొన్ని నెలల్లోనే అసలు సమస్య మొదలవుతుంది. దీనికోసం వ్యూహాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలను వైరస్ నుంచి కాపాడటం ఎంత ముఖ్యమో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోకుండా చూడ్డం కూడా అంతే ముఖ్యం. రాష్ట్రాలు, ప్రధాని మధ్య ఈ ప్రణాళిక, వ్యూహాలపై లోతైన చర్చలు జరగాలి. కోవిడ్-19ను సమర్థంగా అడ్డుకోవాలి. కానీ దాన్ని నిరోధించడం సాధ్యం కాదు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులకు సంబంధించి చాలా పెద్ద సమస్య ఎదురైంది. వారి విషయంలో ప్రధాని, కేంద్ర ప్రభుత్వాలు సరైన దిశలో ఆలోచన చేయాలి. "కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం లాక్ డౌన్ పొడిగించాలని కోరాయి. మీరేమో భిన్నంగా మాట్లాడుతున్నారు" అని ప్రశ్నించగా... "ఇంత భారీ స్థాయిలో వలస కార్మికులు ఉన్న సందర్భంలో లాక్ డౌన్ విధించిన ఏకైక దేశం భారత్ మాత్రమే అనుకుంటున్నా. నేను నా అభిప్రాయాన్ని చెబుతున్నా. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టెస్టింగ్‌ను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది" అని చెప్పారు. భారత్ సరైన స్థితిలో ఉంది అని ప్రధాని చెబుతున్నారు కదా, దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా... ఇంత పెద్ద దేశానికి ఆర్థిక సంక్షోభం ఎదురుకాబోతోంది, దాన్ని ఎలా ఎదుర్కొంటారు? పేదల ఆకలిని ఎలా తీరుస్తారు అని ఆయన ప్రశ్నించారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో టెస్టింగ్ కిట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ ఎక్కువ పరీక్షలు జరిగాయి. మన దగ్గర కూడా అదే జరగాలి. అందుకే నేను పదేపదే టెస్టింగ్ అవసరం గురించి చెబుతున్నా. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించకపోతే ఓ ప్రాంతం హాట్‌స్పాట్‌గా మారుతున్న విషయాన్ని ఎలా గుర్తించగలం? ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "లాక్‌డౌన్ అనేది మహమ్మారిని అరికట్టేందుకు పరిష్కారం కాదు. దీంతో కేవలం వైరస్ వ్యాప్తి తాత్కాలికంగా ఆగింది అంతే" అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. text: అతని జీవితంలో ఘనతలున్నాయి. 1992లో హ్యూస్టన్‌లో ఉంటున్నప్పుడు యేట్స్ స్కూల్‌ లయన్స్ జట్లు తరఫున టెక్సాస్‌ స్టేట్ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో ఫ్లాయిడ్‌ పాల్గొన్నారు. రన్నర్స్ అప్‌ టీమ్‌లో అతను సభ్యుడు. అతని జీవితంలో పతనాలు కూడా ఉన్నాయి. 2007 సంవత్స్రరంలో ఒక దొంగతనం కేసులో ఫ్లాయిడ్‌ ఐదు సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవించారు. మిన్నీపోలిస్‌ నగరంలో మే 25న ఒక పోలీస్‌ కాళ్ల కింద నలిగి మరణించే నాటికి అతను ఓ సాదాసీదా అమెరికన్ పౌరుడు. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మెరుగైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. దేశంలో లక్షమందికి పైగా చంపి, నాలుగు కోట్ల మందిని నిరుద్యోగులుగా చేసిన ఒక మహమ్మారి అమెరికాను చుట్టేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో, నల్లజాతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ పుట్టి పెరిగారు. సిటీ సెంటర్‌కు ఈ ప్రాంతం దక్షిణ భాగంలో ఉంటుంది. ప్రముఖ సింగర్‌, లిరిక్‌ రైటర్‌ బెయాన్స్ కూడా అక్కడే పెరిగారు. కెనడాకు చెందిన ప్రముఖ ర్యాపర్‌ డ్రేక్‌ కూడా ఈ ప్రాంతంలోని వారి సంగీతాభిరుచిని తరచూ మెచ్చుకునేవారు. 1990లలో హూస్టన్‌లో ఉన్నప్పుడు ఫ్లాయిడ్‌ కూడా హిప్‌-హాప్‌ గ్రూపుల్లో తిరుగుతూ స్పిట్‌బార్స్‌లో పాలు పంచుకునేవారని చెబుతారు. జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది? చాలా అమెరికన్‌ నగరాలలాగే హ్యూస్టన్‌లో కూడా పేదరికం, జాతి వివక్ష, ఆర్ధిక అసమానతలు కనిపిస్తాయి. ఫ్లాయిడ్‌ నివసించే మూడో వార్డులో ఇళ్ల స్థలాల విషయంలో తరచూ ఉద్రిక్తతలు, హింస చోటు చేసుకుంటుంటాయి. ''ఇక్కడికి వేరే ప్రాంతం వాళ్లను తీసుకొస్తే...''అమ్మో నేనింత పేదరికాన్ని ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతారు'' అని రోనీ లిల్లార్డ్ బీబీసీతో అన్నారు. ''ఇక్కడి వాళ్లలో చాలామంది ఇప్పటికీ 1920లో కట్టించిన చెక్క ఇళ్లలో నివాసం ఉంటుంటారు. పేదరికం నుంచి ఇక్కడ ఎవరూ తప్పించుకోలేరు'' అని రికాన్సైల్‌ పేరుతో ర్యాపర్‌ షోలు నిర్వహించే లిల్లార్డ్ చెబుతున్నారు. క్యూనీ హోమ్స్ పేరుతో ఉండే కాలనీలో నివాసముంటున్నఫ్లాయిడ్‌ పేరు చుట్టుపక్కల చాలామందికి తెలుసు. క్యూనీ హోమ్స్‌ అంటే ఇటుకతో కట్టిన భవనాలు అని అర్ధం. ఆ బిల్డింగ్‌లలో ఉండేవారిని 'బ్రిక్‌ బాయ్స్‌' అంటారు. ఆరడుగుల, ఆరంగుళాల పొడవున్న ఫ్లాయిడ్‌కు అథ్లెటిక్స్‌ కోసం పుట్టినట్లు కనిపిస్తారు. టీనేజ్‌లో ప్లాయిడ్‌ను స్నేహితులు 'జెంటిల్‌ జెయింట్‌' అని పిలిచేవారు. బాస్కెట్‌బాల్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆడటంలో ఆయన దిట్ట. ''నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని, 12 సంవత్సరాల వయసులోనే ఫ్లాయిడ్‌ 6 అడుగుల 2 అంగుళాల పొడవు ఉండేవారు'' అని అతని చిన్ననాటి స్నేహితుడు, అతని టీమ్‌మేట్‌ జోనాథన్‌ వీల్‌ స్థానిక మీడియాతో అన్నారు. ''అంత పొడవున్న వ్యక్తిని అంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు'' అని చెప్పారు. ట్రంప్‌ను నోరు మూసుకోమని వార్నింగ్ ఇచ్చిన హ్యూస్ట‌న్ పోలీస్ చీఫ్‌ జాన్‌ యేట్స్‌ హైస్కూలు ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడిన ఫ్లాయిడ్‌ 88వ నంబర్‌ జెర్సీ ధరించేవారు. ఆ తర్వాత సౌత్‌ ఫ్లోరిడా స్టేట్‌ కాలేజ్‌ బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యారు. 1993 నుంచి 1995 వరకు అక్కడే జార్జ్‌ అక్కడే చదువుకున్నారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. కొన్నాళ్ల తర్వాత టెక్సాస్‌ తిరిగి వచ్చి కింగ్స్‌విల్లేలోని ఏ అండ్‌ ఎమ్ యూనివర్సిటీలో చేరారు. కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. డ్రగ్స్‌ సరఫరా, దొంగతనం కేసుల్లో అనేకసార్లు అరెస్టయ్యారు ఫ్లాయిడ్‌. మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నేరంపై 2007లో కోర్టు ఫ్లాయిడ్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ''జైలు నుంచి విడుదలయ్యాక, మంచి మనిషిగా మారే క్రమంలో జార్జ్‌, స్థానికంగా పనిచేసే మత సంస్థ రిసరెక్షన్‌ హ్యూస్టన్‌లో చేరారు'' అని అతని చిన్ననాటి మిత్రుడు లిల్లార్డ్‌ వెల్లడించారు. '' తాను మారడమే కాదు...తన చుట్టూ ఉన్న తన కమ్యూనిటీ వాళ్ల గురించి కూడా ఆలోచించేవారు'' అని లిల్డార్డ్‌ అన్నారు. తుపాకీ హింసను విడనాడాలంటూ ఫ్లాయిడ్‌ ఇచ్చిన సందేశపు వీడియోను 2017లో చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ''మీరు ఇంటికి రండి'' అంటూ చెడుదారి పట్టిన యువతకు సందేశం ఇచ్చారు ఫ్లాయిడ్‌. క్రైస్తవ మత సంబంధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి 2018లో ఫ్లాయిడ్‌ మిన్నెసోటాకు వెళ్లినట్లు అతని కుటుంబం హ్యూస్టన్‌ క్రానికల్‌ పత్రికకు వెల్లడించింది. ''సరికొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు'' అని అతని క్లాస్‌మేట్ క్రిస్టోఫర్‌ హ్యారిస్‌ అన్నారు. '' తనలో వచ్చిన మార్పుపట్ల అతను చాలా సంతోషంగా ఉన్నారు'' అని హ్యారిస్‌ వెల్లడించారు. క్రైస్తవ మిషనరీ 'సాల్వేషన్‌ ఆర్మీ'లో ప్లాయిడ్‌ కొన్నాళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. కొన్నాళ్లు లారీడ్రైవర్‌గా, ఓ డ్యాన్స్‌ క్లబ్‌లో బౌన్సర్‌గా కూడా పని చేశారు. అక్కడ ఆయన్ను 'బిగ్‌ ఫ్లాయిడ్‌' అని పిలిచేవారు. కోవిడ్‌ -19 సంక్షోభం కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో చాలామంది అమెరికన్లలాగానే ఫ్లాయిడ్‌ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. అరెస్టయిన రోజున ఆయన 20 డాలర్ల నకిలీ నోటుతో సిగరెట్లు కొనడానికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఫ్లాయిడ్‌ మరణంపై మొదలైన నిరసనలు అమెరికావ్యాప్తంగా హింసకు కారణమయ్యాయి. వివిధ నగరాల్లో వందలమందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్‌ పోలీసులు రంగంలోకి దిగి శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ''ఒక మంచి మనిషిని చంపేశారు'' అని చెప్పిన ప్లాయిడ్‌ మిత్రుడు లిల్లార్డ్‌ కూడా నిరసన ప్రదర్శనల్లో హింసపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. '' అతను క్షమాపణలకు కరిగిపోయే వ్యక్తి. ప్రజల మనిషి'' అన్నారు లిల్లార్డ్‌. ''తాను చనిపోక ముందు కూడా తనలాంటి చాలామంది కష్టాల్లో ఉన్నారని అతనికి తెలుసు'' అని లిల్లార్డ్‌ వ్యాఖ్యానించారు. ''ఈ ఆందోళన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను దాటి పోయింది. ఇది ఒకరకంగా అమెరికా మీద అమెరికన్ల ఆక్రోశం'' అని అభివర్ణించారు లిల్లార్డ్‌. జార్జ్ ఫ్లాయిడ్‌ను ఎందుకు చంపేశారు? ట్రంప్ బంకర్‌లో ఎందుకు దాక్కున్నారు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగి చనిపోయి, తన మరణంతో అమెరికా అంతటినీ కదిలించక ముందే.. ఆఫ్రో-అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. text: "ఇలాంటి క్లిష్ట సమయంలో తనపై వచ్చే విమర్శలను, బహిరంగ చర్చను అణచివేయాలనే మోదీ ప్రయత్నాలు క్షమార్హం కాదు" అని ఆ జర్నల్‌లో రాశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా ప్రకారం భారత్‌లో ఆగస్టు 1 నాటికి కరోనా వల్ల సంభవించే మరణాల సంఖ్య 10 లక్షలకు చేరవచ్చని జర్నల్ తన రిపోర్టులో చెప్పింది. కరోనాపై మొదటి విజయం సాధించిన తర్వాత, దానిపై ఏర్పాటైన ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఏప్రిల్ వరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని లాన్సెట్ చెప్పింది. "దాని ఫలితం ఇప్పుడు మన ముందుంది. ఇప్పుడు మహమ్మారి పెరుగుతోంది. భారత్‌లో కొత్తగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం తన తప్పులను ఒప్పుకుని, పారదర్శకతతో నేతృత్వం వహిస్తుందా లేదా అనేదానిపై ఆ చర్యలు విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది" అని జర్నల్ తెలిపింది. "కేసుల సంఖ్య పెరిగేకొద్దీ, ప్రభుత్వం నిర్ణీత సమయానికి కచ్చితమైన గణాంకాలు అందుబాటులో ఉంచాలి, ప్రతి 15 రోజులకు ఒకసారి దేశంలో ఏం జరుగుతోంది, మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ప్రజలు ఏం చేయాలో చెప్పాలి. అందులో, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశాల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది". కరోనా వ్యాప్తి గురించి మరింత తెలుసుకునేలా, మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేలా జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ప్రోత్సహించాలి. ప్రాంతీయ స్థాయిలో ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి చర్యలు ప్రారంభించాయి. కానీ మాస్క్ వేసుకునేలా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా, జనం గుమిగూడకుండా, క్వారంటీన్, టెస్టింగ్ జరిగేలా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం పాత్ర కీలకం. వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని లాన్సెట్ జర్నల్ అభిప్రాయపడింది. "ప్రస్తుతం దేశం ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. వ్యాక్సీన్ సరఫరాను పెంచడం. అవి గ్రామీణ ప్రాంతాలకు, పేదల వరకూ చేరేలా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం. ఎందుకంటే దేశంలో 65 శాతం జనాభాకు ఆరోగ్య సేవలు అందడం లేదు" అని చెప్పింది. భారత ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితి, భారత్‌లో మహమ్మారి అంతం దిశగా సాగుతోందని ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటనను కూడా లాన్సెట్ ప్రస్తావించింది. "కొన్ని నెలలకు కేసులు తగ్గిన తర్వాత భారత్‌ కరోనాను ఓడించిందని చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, సెకండ్ వేవ్ ప్రమాదం, కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసింది" అని జర్నల్ చెప్పింది. "హెచ్చరికలు చేసినా ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాలను అనుమతించింది. అందులో లక్షలమంది గుమిగూడారు. దానితోపాటూ ఎన్నికల ర్యాలీలుకూడా జరిగాయి" అని జర్నల్ తన ఎడిటోరియల్‌లో చెప్పింది. దేశంలో వ్యాక్సినేషన్ తీరుపై కూడా లాన్సెట్ విమర్శలు గుప్పించింది. "కేంద్రం స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఫెయిల్ అయ్యింది. టీకా డోసులు పెంచడం, 18 ఏళ్లకు పైబడిన అందరికీ వ్యాక్సీన్ వేయడం గురించి కేంద్రం రాష్ట్రాల సలహాలు తీసుకోలేదు. హఠాత్తుగా తన పాలసీ మార్చింది. దాంతో వ్యాక్సీన్ల సరఫరాలో కొరత ఏర్పడి, గందరగోళం వ్యాపించింది" అని చెప్పింది. మహమ్మారితో పోరాడ్డానికి కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాలు సన్నద్ధంగా ఉన్నాయని జర్నల్ చెప్పింది. అవి ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి మిగతా రాష్ట్రాలకు కూడా అందిస్తున్నాయని తెలిపింది. అటు మహారాష్ట్ర సెకండ్ వేవ్ ఎదుర్కోడానిక సిద్ధంగా లేదని, అది ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకలు, మిగతా అవసరమైన మెడికల్ సౌకర్యాలతోపాటూ, దహనాలకు స్థలం సమస్య కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. పడకలు, ఆక్సిజన్ డిమాండ్ చేస్తున్న వారిపై కొన్ని రాష్ట్రాలు భద్రతకు సంబంధించిన చట్టాలను కూడా ప్రయోగించాయని లాన్సెట్ చెప్పింది. లాన్సెట్ ఈ రిపోర్టుతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం ట్విటర్‌లో లాన్సెట్ ఎడిటోరియల్ చూసిన తర్వాత ప్రభుత్వానికి సిగ్గుంటే, దేశాన్ని క్షమాపణలు అడగాలి అన్నారు. ఆయన ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ రాజీనామాకు కూడా డిమాండ్ చేశారు. "ప్రభుత్వం బాకాలు ఊదేవారు, లాన్సెట్ గతంలో ప్రచురించిన ఎడిటోరియల్‌ను ఉపయోగించి తమ గొప్పలు చెప్పుకున్నారు" అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు. దిల్లీలో మరో వారం లాక్‌డౌన్... మెట్రో సేవలు కూడా బంద్ దిల్లీలో లాక్‌డౌన్ మరో వారం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్ చాలా కఠినంగా ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు కరోనా వ్యాప్తి రేటు 35 శాతం అంటే, 100 మందికి టెస్ట్ చేస్తే 35 మందికి వ్యాపించేదని గుర్తించినట్లు కేజ్రీవాల్ చెప్పారు ఇప్పుడు లాక్‌డౌన్ తర్వాత ఈ వ్యాప్తి రేటు 23 శాతానికి తగ్గిందని ముఖ్యమంత్రి చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఇది కఠినంగా ఉంటుందని తెలిపారు. రేపటి నుంచి మెట్రో సేవలు కూడా నిలిపివేయనున్నారు. శనివారం దిల్లీలో కొత్తగా 17,364 కరోనా కేసులు నమోదుకాగా, కోవిడ్‌తో 332 మంది చనిపోయారు. భారత్‌లో మళ్లీ 4 లక్షలకు పైగా కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,03,738 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల మొత్తం 4,092 మంది చనిపోయారు. శనివారం దేశంలో 3,86,444 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కి చేరగా, దేశంలో మొత్తం మరణాలు 2,42,362కు పెరిగింది. ఇప్పటివరకూ దేశంలో 16,94,39,663 డోసుల వ్యాక్సీన్ వేశారు. భారత్‌లో ప్రస్తుతం 37,36,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో వరుసగా గత నాలుగు రోజుల నుంచీ 4 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో కోవిడ్-19ను నియంత్రించడం కంటే, ట్విటర్లో వచ్చే విమర్శలను అణచివేయడంపైనే ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్ తన ఎడిటోరియల్‌లో విమర్శించింది. text: సుమత్రన్ రైనోలు ప్రపంచంలో వందలోపే ఉన్నాయని భావిస్తున్నారు. అక్కడ ఇప్పటి వరకున్న ఏకైక సుమత్రన్ ఖడ్గమృగం 'ఇమాన్' బోర్నియో ద్వీపంలో చనిపోయింది. 25 ఏళ్ల ఈ ఆడ రైనో శనివారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మలేషియాలోని చివరి మగ సుమత్రన్ రైనో ఈ ఏడాది మేలో చనిపోయింది. ఒకప్పుడు సుమత్రన్ రైనోలు ఆసియా ఖండం వ్యాప్తంగా ఉండేవి. నేడు అడవుల్లో ఇవి దాదాపు కనిపించడం లేదు. ప్రపంచంలో సుమత్రన్ ఖడ్గమృగాలు ఇప్పుడు వందలోపు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నారు. ఇవి ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లోని అడవుల్లో ఉంటున్నాయి. ఈ సంఖ్య 30లోపేనని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ జాతి ఖడ్గమృగాలకు అంతరించిపోయే ముప్పు అత్యంత తీవ్రస్థాయిలో ఉంది. ఇమాన్‌ది సహజ మరణమేనని, అందుబాటులో ఉన్న వివరాలను బట్టి... మరణానికి 'షాక్' కారణమని సబా రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, పర్యావరణ శాఖల మంత్రి క్రిస్టీన్ ల్యూ చెప్పారు. ఈ ఖడ్గమృగాన్ని 2014 మార్చిలో పట్టుకున్నప్పటి నుంచి చనిపోయేవరకు చాలా బాగా చూసుకున్నామని ఆమె తెలిపారు. వేటగాళ్ల వల్ల, ఆవాసాలు కోల్పోవడం వల్ల సుమత్రన్ ఖడ్గమృగాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ రైనోలకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య- ఇవి చెట్టుకొకటి పుట్టకొకటి కావడం. మలేషియాలో వీటి సంఖ్య పెరిగేలా ప్రత్యుత్పత్తి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇండోనేషియాలో సుమత్రన్ రైనో సంరక్షణకేంద్రంలోని రైనో 'రోసా' రైనో జాతుల్లో అత్యంత చిన్నది ఇదే ప్రపంచంలో ఖడ్గమృగాల జాతులు ప్రస్తుతం ఐదు ఉన్నాయి. వీటిలో మూడు ఆసియాలో, రెండు ఆఫ్రికాలో ఉన్నాయి. ఆసియాలోని జాతుల్లో సుమత్రన్ రైనో ఒకటి. ఇప్పుడున్న జాతుల్లో అత్యంత చిన్నది ఇదే. సుమారు 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఉన్నితో కూడిన ఖడ్గమృగ జాతికి, సుమత్రన్ రైనోకు దగ్గరి పోలికలు ఉంటాయి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అత్యంత అరుదైన సుమత్రన్ ఖడ్గమృగం (రైనో) మలేషియాలో అంతరించిపోయింది. text: ఇది చాలా వింత ప్రశ్నగా కనిపించొచ్చు కానీ, దీని వెనకాల సైన్స్ ఉంది. ఇటీవల బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక పరిశోధనా ఫలితాలలో, పిల్లలు చదువుపై ఎంత ఎక్కువ సమయం వెచ్చిస్తే, వాళ్లకు కళ్లద్దాలు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంది అనడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయి. అందువల్ల, తరగతి గదిలో పిల్లల చేతులు గాల్లోకి లేచినపుడు, ఉపాధ్యాయులు ఎలా ఆ ప్రశ్నల తాకిడిని తట్టుకుంటారు? ''మిస్, ఇది పాత వార్తే. మాకు ఇది ముందే తెలుసు.'' ఈ ఆలోచన చాలా కాలం నుంచి ఉన్నదే. కానీ తరగతి గదిలో ఎక్కువ సేపు ఉంటే కళ్లద్దాలు అవసరం అవుతాయన్న విషయాన్ని ఎవరూ నిరూపించలేకపోయారు. ''ఎందుకలా, మిస్?'' ఎందుకంటే పిల్లలను కొన్ని దశాబ్దాల పాటు బంధించి, అది వాళ్ల కళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధన నిర్వహించడం నైతికం కాదు. పిల్లలకు వాళ్లకై వాళ్లు ముందుకొస్తే తప్ప.. ''అది సాధ్యం కాదు మిస్. కానీ మరి ఇప్పుడు ఎలా కనుగొన్నారు?'' ఈ పరిశోధన కోసం యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ కార్డిఫ్‌లు ఒక ఉపాయం పన్నాయి. ఈ పరిశోధనలో వాళ్లు 68,000 మందిని, వాళ్ల డీఎన్‌ఏను పరిశీలించారు. ''డీఎన్‌ఏ అంటే ఏమిటిమిస్?'' అది మనిషి నిర్మాణానికి సంబంధించిన నియమాల చేతిపుస్తకం లాంటిది. మనిషి మనిషికీ అది ప్రత్యేకం. ఈ చేతి పుస్తకంలో కొంత మంది కళ్లు ఎలా పెరుగుతాయో, దాని వల్ల వాళ్లకు ఎలా హ్రస్వదృష్టి వచ్చే అవకాశం ఉందో ఉంటుంది. డీఎన్‌ఏ అనేది చాలా శక్తివంతమైనది. డీఎన్‌ఏలోని కొన్ని భాగాలు మీరు ఎన్నేళ్ల వరకు చదువుకుంటారో కూడా అంచనా వేయగలవు. ''అయితే ఏంటి?'' ఈ పరిశోధనను బట్టి డీఎన్‌ఏలో హ్రస్వ దృష్టి లక్షణాలు కలిగిన పిల్లలు ఎక్కువ కాలం పాఠశాలల్లో గడపలేదని తెలుస్తోంది. అయితే పాఠశాల, యూనివర్సిటీ అంటే ఇష్టపడే డీఎన్‌ఏ లక్షణాలున్న పిల్లలకు హ్రస్వదృష్టి ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంటే దీని అర్థం - తరగతి గదుల్లో కళ్లకు చెరుపు చేసేది ఏదో ఉన్నట్లు తెలుస్తోంది. ''కానీ నిజంగా నా కళ్లు అంత పాడైపోతున్నాయా మిస్?'' అది చెప్పడం అసాధ్యం. అది ఒక్కొక్కరి మీద ఒక్కో రకం ప్రభావం చూపుతుంది. కానీ సగటున, 16 ఏళ్లకు చదువు ఆపేయడానికి, యూనివర్సిటీ విద్య పూర్తయ్యే వరకు చదువు కొనసాగించడానికి మధ్య తేడా 'మైనస్ వన్ డయాప్టర్'. ''అంటే?'' కాంతి వెలుతురు చూడగలిగే సామర్థ్యాన్ని డయాప్టర్‌లలో కొలుస్తారు. మైనస్ వన్ డయాప్టర్ అంటే చాలా తక్కువే. కానీ, మీరు డ్రైవింగ్ చేయడానికి కళ్లద్దాలు తప్పనిసరి కావడానికి ఆ మాత్రం చాలు. ''కానీ ఇప్పుడు నాకు ఎలాగూ కళ్లద్దాలు ఉండనే ఉన్నాయిగా?'' తీవ్రమైన హ్రస్వదృష్టి వల్ల చాలా సమస్యలున్నాయి. దాని వల్ల 'మయోపిక్ మాకులోపతి' రావచ్చు. రెండూ కలిస్తే నీకు అంధత్వం రావచ్చు. ''వింటుంటే భయమేస్తోంది మిస్'' ఇదింకా సగమే. చిన్న వయసులో చత్వారం (దూరదృష్టి) ఉంటుంది. కానీ పెరిగే కొద్దీ పిల్లల చూపు చక్కబడుతుంది. అందువల్ల చిన్నప్పుడే హ్రస్వదృష్టి వచ్చిందంటే నీ పరిస్థితి దిగజారుతోందన్న మాట. ''అంటే నేను చదువు ఆపేయాలా'' ఊహూ, వద్దు. పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ డెనీజ్ అటాన్, 'ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పే విధానంపై చర్చ జరిగేట్లు చేయాలన్నదే మా లక్ష్యం' అన్నారు. ''మిస్, ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు చైనాలోని చాలా మంది పిల్లలు కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు.'' నువ్వు చెప్పింది నిజమే, చైనాలోని కొన్ని ప్రాంతాలలో 80 శాతం మంది పిల్లలు హ్రస్వదృష్టితో పాఠశాల నుంచి బయట పడుతున్నారు. ''మిస్, నేను ఫోన్‌నే చూస్తూ ఉంటే గుడ్డిదానిని అవుతానని మా అమ్మ అంటూ ఉంటుంది'' ఈ పరిశోధనను 50 ఏళ్ల క్రితం పాఠశాలకు వెళ్లిన వాళ్లపై జరిపారు. ''అంటే అది పాతబడిపోయిందా మిస్?'' నేను దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ - ఆధునిక జీవితం మన కళ్లను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలీదు. మన చాలా సమయాన్ని ఇళ్ల లోపలే గడుపుతున్నాం. అందుకే డాక్టర్ అటన్ భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తవచ్చని అంటారు. ''నాకు బోర్ కొడుతోంది. నేను వెళ్లి బైట ఆడుకోవచ్చా మిస్?'' బైట కాలం గడపడం నీ కళ్లను సంరక్షిస్తుంది. ఆగ్నేయాసియాలో జరిగిన చాలా పరిశోధనల్లో కాంతివంతమైన వెలుతురు, కళ్లు సాధారణంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని, హ్రస్వదృష్టిని అరికడుతుందని తేల్చాయి. 'మిస్..'' ఇంక ప్రశ్నలు చాలు. ఇక నీకు స్పెల్లింగ్ పరీక్ష మొదలెడదాం.. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''మిస్, మిస్! మీ క్లాసులతో నేను గుడ్డిదాన్ని అవుతానా?'' text: ఓటు లేనివారికి మార్చి 15లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈనెల 23న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తామని చెప్పారు. ఈలోపే అర్హులందరూ జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత.. గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఇక కొత్త ఓటర్ల నమోదుకు మాత్రమే అవకాశం ఉందని, ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఓట్ల తొలగింపునకు అవకాశం లేదని ఆయన వెల్లడించారు. ఈనెల 15లోగా ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లోనైనా ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవచ్చని ద్వివేదీ చెప్పారు. ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా? తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఓటరు గుర్తింపు కార్డులు లేకున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. జాబితాలో పేరున్న వారందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు. జాబితాలో పేరు ఉన్నా.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఏం చేయాలి? ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే.. ఈ కింది పత్రాల్లో వేటినైనా ఉపయోగించుకుని ఓటు వేసే వీలుంటుంది. ఓటరు జాబితాలో పేరు ఉండి.. పై గుర్తింపు పత్రాలు ఉన్న వారు.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఆంధ్రప్రదేశ్‌ ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. అందుకు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. text: తాను రోజూ ఉదయం మూత్రం తాగడమే కాదు, ముఖం మీద రాసుకుంటానని కూడా ఓ మహిళ చెప్పారు భారీ భవనాలు కూలినప్పుడు, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద రోజుల తరబడి చిక్కుకుని తాగడానికి నీళ్లు దొరక్క మూత్రం తాగి బతికి బయటపడిన వారి గురించి వార్తలు వస్తుంటాయి. కానీ, కొందరు మాత్రం తాము 'ఆరోగ్యంగా' ఉండేందుకు నిత్యం తమ మూత్రాన్ని తామే తాగుతున్నామని చెబుతున్నారు. తన మూత్రాన్ని తానే తాగడం వల్ల పలు దీర్ఘకాలిక రుగ్మతలు మాయమయ్యాయని లండన్‌లోని కెవింగ్టన్‌ ప్రాంతానికి చెందిన యోగా టీచర్ 33 ఏళ్ల కేలెయ్ ఓక్లె ఇటీవల చెప్పారు. థైరాయిడ్, దీర్ఘకాలిక నొప్పి (ఫైబ్రోమైయాల్జియా) లాంటి సమస్యుల నుంచి కూడా ఉపశమనం పొందానని ఆమె వివరించారు. ఇలా మూత్రాన్ని తాగడాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించినట్లు ప్రెస్ అసోసియేషన్‌ వార్తా సంస్థతో ఆమె చెప్పారు. "రోగ నిరోధక శక్తిని మూత్రం పునరుద్ధరించగలదని, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని, చర్మానికి కూడా మంచిదని నేను విన్నాను. అందుకే నా మూత్రాన్ని తాగడం ప్రారంభించాను" అని కేలెయ్ తెలిపారు. ఈమె రోజూ మూత్రాన్ని సేవించడమే కాదు, దాన్ని దూదితో ముఖమంతా రాసుకుంటారు కూడా. దాంతో తన చర్మం ప్రకాశవంతంగా ఉంటోందని అంటున్నారు. తమ మూత్రాన్ని తామే తాగడాన్ని కొందరు "యూరిన్ థెరపీ" అంటారు. "యురోఫేజియా" అని కూడా వ్యవహరిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలా మూత్రాన్ని తాగడం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయంటున్నది కేలెయ్ ఒక్కరే కాదు, ఇటీవల మరికొందరు కూడా చెప్పారు. "నా మూత్రాన్ని నేను తాగడం వల్ల నా బరువు సగం తగ్గించుకోగలిగాను" అని కెనడాలోని అల్బెర్టాకు చెందిన 46 ఏళ్ల లీహ్ శాంప్సన్ ది సన్ పత్రికకి తెలిపారు. గతంలో 120 కిలోల బరువుతో తీవ్రంగా ఇబ్బందిపడ్డ తాను మూత్రం సేవించడం ద్వారా ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. "యూరిన్ థెరపీ గురించి వివరించే ఓ యూట్యూబ్ వీడియో లింకును నా ఫ్రెండ్ పంపించారు. దాన్ని చూసిన తర్వాత బాత్‌రూంకు వెళ్లి గుప్పిట్లో మూత్రాన్ని పట్టుకుని తాగేశాను. దాంతో కొన్ని రోజుల్లోనే నాలో మార్పు కనిపించింది" అని వివరించారు. ప్రస్తుతం ఆమె మూత్రాన్ని తాగడంతో పాటు, రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకునేటప్పుడు మూత్రంతోనే గొంతును కూడా శుభ్రం చేసుకుంటారు. అంతేకాదు, మూత్రం చుక్కలను కళ్లలో కూడా వేసుకుంటున్నారు. దోమలు కుట్టినప్పుడు నొప్పి తగ్గేందుకు తాను మూత్రం సేవిస్తానని పోర్చుగల్‌లో ఉంటున్న 39 ఏళ్ల ఫెయిత్ క్యాంటర్ అనే మరో మహిళ ఇటీవల వెల్లడించారు. "మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ, తర్వాత అలవాటైంది. రోజూ పొద్దున్నే కొద్దిగా మూత్రం తాగుతాను. గతంతో పోల్చితే ఇప్పుడు నన్ను దోమలు చాలా తక్కువ కుడుతున్నాయి. ఒకవేళ కుట్టినా వాపు, దురద, నొప్పి రావడంలేదు" అని ఆమె చెప్పారు. వీళ్లంతా చెబుతున్నది చదివిన తర్వాత "యూరిన్ థెరపీ"తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా! అనిపిస్తుంది. కానీ, వైద్యులు మాత్రం ఇలా మూత్రాన్ని తాగాలని ఎవరికీ సిఫార్సు చేయడంలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. "భారత మాజీ ప్రధాని కూడా మూత్రం తాగేవారా?" ది గార్డియన్ పత్రిక కథనం ప్రకారం... భారత మాజీ ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ కూడా చాలా కాలంపాటు "యూరిన్ థెరపీ"ని అనుసరించేవారట. 1978లో అమెరికన్ జర్నలిస్టు డాన్ రాథర్‌తో మోరార్జీ దేశాయ్ ఆ వివరాలను పంచుకున్నారు. భారత్‌లో వైద్య ఖర్చులు భరించలేని లక్షలాది మందికి యూరిన్ థెరపీ చక్కని పరిష్కారమని కూడా ఆయన అన్నారు. చైనా యూరిన్ థెరపీ అసోసియేషన్ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం, మెయిన్‌లాండ్ చైనా ప్రాంతంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా మూత్రాన్ని తాగుతారు. ప్రతీకాత్మక చిత్రం కుక్క మూత్రం తాగిన మహిళ ఈ ఏడాది జూన్‌లో ఓ మహిళ తన కుక్క మూత్రాన్ని తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె కుక్కను పార్కుకు తీసుకెళ్లారు. అది మూత్రం పోసేటప్పుడు ఓ కప్పులో పట్టుకుని తాగేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే, ఇలా మూత్రం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వ్యర్థాలనుతాగినట్లే మూత్రం అనేది శరీరం నుంచి వెలువడే వ్యర్థ పదార్థం. అందులో నీటితోపాటు, శరీరం వదిలించుకునే వ్యర్థాలు ఉంటాయి. "మూత్రపిండాల సమస్యలు లేనప్పుడు మూత్రం శుభ్రంగానే ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే, శరీరం లోపల ఉన్నప్పుడు సరే. కానీ, బయటకు రాగానే అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. దాన్ని సేవించడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయొచ్చు" అని డాక్టర్ జుబైర్ అహ్మద్ బీబీసీకి వివరించారు. మూత్రం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని ఆయన అన్నారు. "మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే మార్గాల్లో ఒకటి మూత్రం. ఆ వ్యర్థాలు ఉండే మూత్రం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు" అని చెప్పారు. కిడ్నీలకు ప్రమాదకరం మూత్రం తాగడమంటే శరీరం వదిలించుకున్న ప్రమాదకర పదార్థాలను మళ్లీ శరీరంలోకి పంపినట్లే. అది మీ ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తుంది అని మరో వైద్యుడు ఆండ్రూ థోన్బర్ హెచ్చరించారు. "కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను, లవణాలను తొలగిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల మూత్రంలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. మిగతా 5 శాతం శరీరం వదిలించుకునే పొటాషియం, నైట్రోజన్ లాంటి పదార్థాల ఉంటాయి. శరీరంలో వాటి స్థాయి ఎక్కువైతే కొన్ని సమస్యలకు దారితీస్తాయి. ఇప్పుడు అలా బయటకు వచ్చిన ఆ మూత్రాన్నే మళ్లీ తాగడం పేగులకు, కిడ్నీలకూ ప్రమాదమే" అని డాక్టర్ థోన్బర్ బీబీసీకి వివరించారు. "మూత్రం తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్లు తొందరగా అందుతాయని కొందరు అనుకుంటారు. అయితే, విటమిన్ల కోసం సమతుల ఆహారం తీసుకోవాలి తప్ప ఇలా ప్రమాదకర పద్ధతులు పాటించడం మంచిది కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పొద్దున లేవగానే తమ మూత్రాన్ని తామే తాగితే రోగాలు దూరమవుతాయా? మూత్రాన్ని రాసుకుంటే ముఖం మృదువుగా తయారవుతుందా? వైద్యులు ఏమంటున్నారు? text: అయితే ,కరోనా అనుభవం కొత్తది కాబట్టి దీన్ని పాఠంగా తీసుకుని దేశంలో వైద్య సౌకర్యాలు పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సూచించారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధులపై పరిమితులను తొలగించాలని, కేంద్రం ఆర్ధికంగా రాష్ట్రాలకు మరింత సహాయం చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 80 శాతం యాక్టివ్‌ కేసులున్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా కృషి చేస్తే దేశం నుంచి కరోనాను పారదోలడం కష్టం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రులనుద్దేశించి అన్నారు. అత్యధిక యాక్టివ్ కేసులున్న పది రాష్ట్రాలు కరోనా మీద గెలిస్తే, దేశం కూడా గెలిచినట్లేనని మోదీ వ్యాఖ్యానించారు. 72గంటల్లో వైరస్‌ బాధితుడిని గుర్తించే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చిందని, ఆసుపత్రులలో ఐసీయులు, బెడ్‌ల సంఖ్యను పెంచడం వల్ల కూడా మరణాల రేటు తగ్గడానికి కారణమైందని ప్రధాన మంత్రి అన్నారు. అయితే తెలంగాణ సహా బీహార్‌, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో పరీక్షలు ఎక్కువగా జరడంలేదని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. "తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. రికవరీ రేటు 71శాతంగా ఉంది. మరణాల రేటు 0.7 శాతంగా ఉంది. వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం. ఐసీఎంఆర్‌, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం'' అని సీఎం కె. చంద్రశేఖర రావు ఈ సమావేశంలో వెల్లడించినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. భారతదేశంలో సగటు మరణాల రేటు ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. యాక్టివ్‌ కేసుల శాతం కూడా తగ్గిందని ప్రధాని అన్నారు. "రాష్ట్రంలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టెస్టులు నిర్వహించాం, మరిన్ని టెస్టులు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది'' అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నట్లు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ ట్విటర్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు మరిన్ని పెంచాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రిని కోరినట్లు ఈ ట్వీట్‌లో పేర్కొంది. తమ రాష్ట్రంలో నమోదైన కోవిడ్‌-19 మరణాలలో 89మరణాలు కోవిడ్‌తోపాటు ఇతర వ్యాధులు ఉండటంవల్లే ఎక్కువగా జరిగాయిని పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్, బీహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాల సీఎంలు, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలోని 80శాతం కేసులు పది రాష్ట్రాలలోనే ఉన్నాయని, కరోనాను పారదోలడంలో ఈ పది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సందర్భంగా అన్నారు. text: అయితే, పర్యావరణ మార్పులు జరగడం బూటకం కాదని నమ్ముతున్నట్లు చెప్పారు. సీబీఎస్ మీడియా నిర్వహించిన '60 మినిట్స్' కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించే తుది హెచ్చరిక ఇదేనని శాస్త్రవేత్తలు ప్రకటించిన వారంలోపే ట్రంప్ ఇలా మాట్లాడటం గమనార్హం. మానవ కార్యకలాపాల వల్లే పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరూ అంగీకరిస్తున్నారు. పెరుగుతున్న భూతాపంపై వాతావరణ మార్పులను అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ 'ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్' (ఐపీసీసీ) గత వారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భూమి సగటు ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగిపోతోందని హెచ్చరించింది. ''మానవ కార్యక్రమాల వల్ల భూ ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల పారిశ్రామిక విప్లవం కంటే ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత పెరిగింది'' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం పెరిగితే మంచు కరిగే వేగం మరింత పెరుగుతుంది పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో సత్వరం ఫలితమిచ్చే చర్యలు చేపట్టాలని ఆ నివేదికలో తెలిపారు. వాతావరణ మార్పులతో సహా అనేక విషయాలపై ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. అవి: "నేను పదవి చేపట్టడానికి ముందు రోజే ఉత్తర కొరియాతో యుద్ధానికి అమెరికా దాదాపు సిద్ధమైంది." "రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హత్యలతో సంబంధం బహుశా ఉండవచ్చు, కానీ, నేను వాళ్ళను నమ్ముతున్నాను. అది మా దేశంలో జరిగింది కాదు." "2016 ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంది. చైనా కూడా జోక్యం చేసుకుందని అనుకుంటున్నా" ఇంకా, వలస బాలలను వేరుచేసే విధానాన్ని' తిరిగి తీసుకొస్తారో లేదో చెప్పడానికి ఆయన నిరాకరించారు. కానీ, అక్రమ వలసలపై చర్యలుంటాయని ట్రంప్ అన్నారు. వాతావరణ మార్పులపై ట్రంప్ ఏమన్నారు? శాస్త్రవేత్తల మాటలు చూస్తుంటే 'ఓ పెద్ద రాజకీయ అజెండా' వారికి ఉన్నట్లు కనిపిస్తోందని ఆదివారం నాటి ఇంటర్య్వూలో ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ''ఇది అబద్ధం అని అనుకోవడం లేదు. కానీ, ఏదో కాస్త తేడా ఉండొచ్చని అనుకుంటున్నా'' అని చెప్పారు. ''మానవ కార్యకలాపాల వల్లే వాతావరణ మార్పులు జరుగుతున్నాయా? అనేది నాకు తెలియదు. కానీ, ఇక్కడో విషయం చెప్పాలి. కోట్లకొద్ది డబ్బును ఇవ్వాలనుకోవడం లేదు. లక్షలాది ఉద్యోగాలను వదులుకోవాలనుకోవడం లేదు. ప్రతికూల పరిస్థితులను కల్పించను.'' అని పేర్కొన్నారు. భూతాపం దానంతటదే వెనుకటి స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. పునరుత్పాదక శక్తి రంగం కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది: రోగెర్ హర్రబిన్, బీబీసి పర్యావరణ విశ్లేషకులు వాతావరణ మార్పులపై ట్రంప్ అభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది శాస్త్రవేత్తలు కూడా మానవ ప్రమేయం వల్లే ప్రస్తుత వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయనే వాదనను నిరాకరిస్తున్నారు. అయితే, ఓ సహజ చక్రంలా వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి వస్తోందని భావించడం లేదని చెబుతున్నారు. ఉద్గారాల తగ్గింపునకు కోట్ల రూపాయిలు ఇవ్వాలనుకోవడం లేదని ట్రంప్ చెబుతున్నారు. పునరుత్పాదక శక్తి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించకుండా మిగిలిన ప్రభుత్వాలు కూడా ట్రంప్ దారిలోనే నడుస్తున్నాయి. ఉద్గారాలు వెల్లడించే ఫ్యాక్టరీలు మూసివేయడం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి పర్యావరణ రహిత పరిశ్రమల్లో ఉపాధి కల్పించవచ్చు. కానీ, ఇంగ్లండ్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. అమెరికాలో బొగ్గు పరిశ్రమలో కంటే సౌర పరిశ్రమలో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించవచ్చు. అయితే, అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ విషయం తెలుసా? శాస్త్రవేత్తల మాటేమిటి? ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఇతరత్రా భారీ చర్యలు చేపడితేనే వాతావరణ మార్పులను నియంత్రించగలమని గత వారం విడుదల చేసిన నివేదికలో ఐపీసీసీ వెల్లడించింది. 2030 నాటికి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను 45 శాతానికి అంటే 2010 స్థాయికి తీసుకరావవడం, బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం, అలాగే, 2.7 చదరపు మైళ్ల భూమిని వినియోగంలోకి తేవడం చేయాలని సూచించింది. ఈ చర్యలు చేపట్టకపోతే వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గతంలో ట్రంప్ ఏమన్నారంటే? 2016 ఎన్నికల సమయంలో వాతావరణ మార్పులు అనేది ఒట్టి బూటకం అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, పదవి చేపట్టినప్పటి నుంచి దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. భూతాపాన్ని నియంత్రించేందుకు అమెరికాతో పాటు, 187 దేశాలు సంతకం చేసిన 'పారిస్ క్లైమెట్ ఛేంజ్ అగ్రిమెంట్' నుంచి వైదొలుగుతున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే, అమెరికా వ్యాపారాలు, కార్మికులకు నష్టంలేని కొత్త ఒప్పందాలపై చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటించారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పర్యావరణ శాస్త్రవేత్తలకు 'రాజకీయ అజెండా' ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు. భూతాపం పెరగడానికి మానవ కార్యకలాపాలు కారణమనే వాదనపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. text: అది చనిపోయిన బంధువుల ఫొటోల ముఖాలను యానిమేట్ చేయడానికి ఒక ప్రత్యేక రకం డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఆ టూల్‌కు 'డీప్ నోస్టాల్జియా' అనే పేరు పెట్టారు. కొంతమందికి ఈ ఫీచర్‌ సంచలనం సృష్టించేదిగా అనిపిస్తే, మరికొంతమందికి ఇది ఒక మాయాజాలంగా అనిపించవచ్చు. డీప్ ఫేక్ వ్యక్తులను తయారు చేయకుండా అడ్డుకోడానికి తాము ఇందులో 'స్పీచ్' చేర్చలేదని ఈ కంపెనీ చెప్పింది. డీప్ ఫేక్ టెక్నాలజీపై ఒక చట్టం తీసుకురావాలని బ్రిటన్ అనుకుంటున్న సమయంలో ఈ టూల్ బయటికొచ్చింది. ఒకరి అంగీకారం లేకుండా డీప్ ఫేక్ వీడియోను రూపొందించడం చట్టవిరుద్ధంగా చేయాలనే ప్రతిపాదనను బ్రిటన్ లా కమిషన్ పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోడానికే తాము ఉద్దేశపూర్వకంగా ఇందులో 'స్పీచ్‌'ను చేర్చలేదని మై హెరిటేజ్ సైట్ చెబుతోంది. ఉదాహరణకు ప్రస్తుతం సజీవంగా ఉన్నవారి డీప్ ఫేక్ వీడియోలు రూపొందించకుండా ఉండడానికి కంపెనీ అలా చేసింది. "మన పాత జ్ఞాపకాలకు ఒక రూపం ఇచ్చే ఉద్దేశంతో, మేం దీనిని రూపొందించాం" అని కొత్త టెక్నాలజీ గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలకు జవాబుగా ఈ కంపెనీ చెప్పింది. కానీ, కొంతమంది 'డీప్ ఫేక్ నోస్టాల్జియా' ఫీచర్‌ను ఇష్టపడతున్నారు. దానిని మాయాజాలంగా భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం దాన్ని ఒక సంచలనం సృష్టించే టూల్‌గా భావిస్తున్నారు. దానిని ఇష్పపడడ లేదు" అని కంపెనీ అంగీకరించింది. "దీని ద్వారా వచ్చే ఫలితాలు వివాదాస్పదం కావచ్చు. ఈ టెక్నాలజీని 'నిర్లక్ష్యం' చేయడం కష్టం" అని కంపెనీ చెప్పింది. ఫేక్ లింకన్ వీడియో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా కంప్యూటర్లో రూపొందించిన వీడియోలను డీప్ ఫేక్ అంటారు. వాటిని ప్రస్తుత ఫొటోల ద్వారా రూపొందిస్తారు. ఇజ్రాయెల్ కంపెనీ డీ-ఐటీ 'డీప్ నోస్టాల్జియా' టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, సజీవంగా ఉన్నవారి అంతకు ముందు వీడియోల ఆధారంగా ఆ కంపెనీ తమ అల్గారిథంకు శిక్షణ ఇచ్చింది. దాని ద్వారా ప్రజల ముఖాలు, వాళ్ల భావాలు మార్చి వీడియోలు రూపొందించవచ్చు. మై హెరిటేజ్ వెబ్ సైట్‌లో క్వీన్ విక్టోరియా, ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి చారిత్రక ప్రముఖుల యానిమేటెడ్ వీడియోలు చేశారు. ఈ నెల మొదట్లో ఒక కంపెనీ ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఒక అబ్రహాం లింకన్‌ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. దానిని లింకన్ జన్మదినం సందర్భంగా పోస్ట్ చేశారు. ఈ వీడియో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాట్లాడుతున్నట్లు చూపించారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది తమ పూర్వీకుల యానిమేటెడ్ వీడియోలు చేసి ట్విటర్‌లో పెట్టడం మొదలెట్టారు. కొంతమంది వాటిని అద్భుతంగా ఉన్నాయని చెబితే, మరికొంతమంది మాత్రం ఈ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో చానల్ 4 ఒక 'డీప్ ఫేక్ క్వీన్‌' వీడియోను రూపొందించింది. అందులో రాణి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎలా ఫేక్ న్యూస్‌ వ్యాపించేలా చేయవచ్చో ఈ వీడియోతో హెచ్చరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జీనియాలజీ లేదా వంశవృక్షాన్ని రూపొందించే 'మై హెరిటేజ్' వెబ్ సైట్ ఒక టూల్ తీసుకొచ్చింది. text: ఉత్తరకొరియా చట్టవిరుద్ధంగా అణ్వస్త్ర పరీక్షలు చేస్తోందని అమెరికా రక్షణ మంత్రి అన్నారు. అణుదాడులకు పాల్పడితే భారీ ఎత్తున సైనిక చర్యకు దిగుతామని అన్నారు. వార్షిక రక్షణ చర్చల కోసం దక్షిణకొరియాకు వచ్చిన ఆయన ఆ దేశ రక్షణ మంత్రి సాంగ్ యంగ్ మూతో కలిసి మాట్లాడుతూ ఉత్తరకొరియా తీరుపై మండిపడ్డారు. ఉత్తరకొరియా చట్టవిరుద్ధంగా క్షిపణి, అణ్వాయుధ పరీక్షలు చేస్తూ తన పొరుగు దేశాలను, ప్రపంచాన్ని భయపెడుతోందని మాటిస్ అన్నారు. ఇలాంటి చర్యలను అమెరికా ఏమాత్రం సహించబోదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ట్రంప్ పర్యటనకు ముందుగా దక్షిణకొరియాకు వచ్చిన మాటిస్ ఉత్తరకొరియాను తీవ్రంగా హెచ్చరించారు. కాగా నవంబరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించడానికి ముందుగా అమెరికా రక్షణ మంత్రి ఉత్తరకొరియాకు ఈ స్థాయిలో హెచ్చరికలు జారీచేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఉత్తరకొరియా గత నెలలో ఏకంగా ఆరు సార్లు అణ్వస్త్ర పరీక్షలు చేసింది. క్షిపణి పరీక్షలను కూడా వరుసగా జరుపుతున్న ఉత్తరకొరియా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జపాన్ మీదుగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామల నేపథ్యంలోనే దక్షిణ కొరియా తన క్షిపణి నిరోధక వ్యవస్థలను మోహరిస్తూ జాగ్రత్త పడుతోంది. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి అక్టోబరు ప్రారంభంలో విమానవాహక నౌకలు, డిస్ట్రోయర్లు, ఫైటర్ జెట్‌లతో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో భారీఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఇది ఉత్తరకొరియాకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అమెరికా, దక్షిణ కొరియాలు తమపై యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయంటూ ఆ దేశం ఆరోపించింది కూడా. ఈ ఉద్రిక్తతలు ఇలా కొనసాగుతుండగానే శుక్రవారం దక్షిణ కొరియాకు చెందిన పదిమంది జాలర్లను ఉత్తరకొరియా విడిచిపెట్టింది. తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా బోటుతో ప్రవేశించారన్న కారణంతో కొద్దిరోజుల కిందట వారిని ఉత్తరకొరియా అదుపులోకి తీసుకుంది. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) అణ్వాయుధాలను వాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ఉత్తరకొరియాను హెచ్చరించారు. text: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం కాబోతున్నారన్న వార్త విని నవంబర్ 22 రాత్రి చాలా మంది నిద్రలోకి జారుకున్నాక, ఆయన చెప్పిన ఆ మాటలు నిజమయ్యాయి. తెల్లవారేసరికి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తోడుగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సామాన్య ప్రజలే కాదు, చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల బడా పాత్రికేయులు, రాజకీయ నాయకులు కూడా ఈ పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా ఈ వ్యవహారం గురించి ఒక్కొక్కటిగా వార్తలు బయటకు వచ్చాయి. రాత్రికి రాత్రే అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిసింది. దీని తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రక్రియను గవర్నర్ మొదలుపెట్టారు. తెల్లవారు జామున పాలన అధికారాలను దేవేంద్ర ఫడణవీస్‌కు అప్పగించారు. రాత్రికి రాత్రి కథ ఎలా మారింది? ప్రభుత్వం ఏర్పాటు చేయగల బలం రాత్రికే రాత్రే ఒక పక్షం నుంచి మరో పక్షానికి మారడం ఆసక్తికర పరిణామం. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, రాజకీయ క్రీడ మొత్తం నవంబర్ 22 సాయంత్రం మొదలైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్న లేఖతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ దగ్గరికి వెళ్లారు. అనంతరం దేవేంద్ర ఫడణవీస్ గవర్నర్‌ను కలిసి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని కోరారు. తమకు ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఆ తర్వాత ఈ అంశం దిల్లీకి చేరింది. తాజా పరిణామాలను కోశ్యారీ కేంద్రానికి తెలియజేశారు. ఇదే సమాచారం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. శనివారం (నవంబర్ 23) ఉదయం 5.47కు రాష్ట్రపతి పాలన తొలగింపు గురించి కేంద్రం తెలియజేసింది. నవంబర్ 12న దీన్ని విధించారు. రాష్ట్రపతి పాలన తొలగింపుతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఉదయం 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందా? రాత్రికే రాత్రే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష పార్టీలు అంటున్నాయి. ''మహారాష్ట్ర చరిత్రలో ఇదొక మచ్చ. అంతా హడావిడిగా చేసేశారు. ఇందులో ఎదో ఒక మతలబు ఉంది. ఇంతకంటే సిగ్గుపడే విషయం మరోటి ఉండదు'' అని కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రసాదించిన హక్కులు ఉపయోగించుకుని 2019, నవంబర్ 12న మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనను నవంబర్ 23న తొలగించాలని ఆదేశిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ఆమోదపు లేఖలో రాసి సంతకం చేశారు. రాజ్యాంగం ప్రకారం చూస్తే, ఈ వ్యవహారంలో తప్పేమీ లేదని మహారాష్ట్ర రాజకీయాలను దగ్గరగా గమనించే రాజ్యాంగ నిపుణుడు ఉల్హాస్ భట్ అంటున్నారు. ''ఏ పక్షాన్నైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే హక్కు గవర్నర్‌కు ఉంది. ఏదైనా పక్షం తమ బలాన్ని నిరూపించుకోగలదని అనిపిస్తే గవర్నర్ ఆహ్వానం పంపుతారు. అయితే, గవర్నర్ కోశ్యారీ ఇదివరకే అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని బీజేపీ చెప్పింది. నైతికంగా చూస్తే మళ్లీ వారికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వడం తప్పు'' అని ఉల్హాస్ అన్నారు. కేబినెట్ ఆమోదం ఎలా వచ్చింది? రాష్ట్రపతి పాలనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం అవసరం. రాత్రికి రాత్రే కేబినెట్ ఆమోదం ఎలా వచ్చిందన్నది ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సుర్జేవాలా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. 'అలకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్'లోని రూల్ నెం.12 కింద ఈ నిర్ణయం తీసుకున్నామని, న్యాయపరంగా ఇది పూర్తి సమ్మతమైన చర్యేనని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో (ఎక్స్‌ట్రీమ్ ఎమర్జెన్సీ), ఊహకు అందని సంకట పరిస్థితి ఏర్పడే అవకాశాలు (అన్‌ఫోర్సీన్ కాంటిజెన్సీ) ఉన్నప్పుడు ప్రధానికి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని రూల్ నెం.12 చెబుతుంది. ''రాష్ట్రపతి ఏ నిర్ణయమైనా, కేబినెట్ అనుమతితోనే తీసుకుంటారని రాజ్యాంగం చెబుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కేబినెట్ సమావేశం జరిగిందా అన్నదానిపై స్పష్టత లేదు. నిబంధనల ప్రకారం ప్రధాని ఒక్కరే ఆమోదం తెలిపినా, దాన్ని కూడా కేబినెట్ ఆమోదంగా పరిగణిస్తారు'' అని ఉల్హాస్ అన్నారు. మహారాష్ట్రలో సాగిన రాజకీయ నాటకంలో గవర్నర్ పోషించిన పాత్రపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్సీపీలోని ఏయే ఎమ్మెల్యేలు ఫడణవీస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ లేఖలు పంపారు? దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వచ్చినప్పుడు, తెల్లవారే దాకా గవర్నర్ ఎందుకు వేచి చూడలేదు? అమిత్ షా ప్రయోజనాల కోసమే గవర్నర్ పనిచేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉల్హాస్ భట్ కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. ''ప్రజాప్రయోజనార్థం పనిచేస్తానని గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ, వాస్తవం అలా కాదు'' అని ఆయన అన్నారు. గవర్నర్ పదవి ప్రధాని అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే వారిని నియమిస్తుంది కాబట్టి, వారు కూడా కేంద్రానికి అనుకూలంగా నడుచుకుంటుంటారు. ఇందిరాగాంధీ కాలం నుంచి ఉన్న పరిస్థితే మోదీ హయాంలోనూ కొనసాగుతోంది. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్సీపీలోని అత్యధిక మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని శరద్ పవార్ అంటున్నారు. బీజేపీ బలాన్ని నిరూపించుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ''సంతకాలు చేసిన ఎమ్మెల్యేలందరినీ రాజ్‌భవన్‌లో హాజరుపరచాలని దేవేంద్ర ఫడణవీస్‌ను గవర్నర్ అడగాల్సింది. ఇలాంటి తీరే ప్రశ్నలు తలెత్తేందుకు కారణమవుతుంది'' అని ఉల్హాస్ భట్ అన్నారు. ఫడణవీస్ ప్రమాణ స్వీకారం అంశం ఇప్పుడు సుప్రీం కోర్టుకూ చేరింది. ఫడణవీస్, అజిత్ పవార్‌ల ప్రమాణ స్వీకారాలను సవాలు చేస్తూ శివసేన పిటిషన్ వేసింది. ఆ రాత్రి ఎన్ని నియమాలను కేంద్రం పాటించింది, వేటిని పాటించలేదు అన్నది ఇక సుప్రీం కోర్టు తేలుస్తుంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''రాజకీయాల్లో, క్రికెట్‌లో ఏ క్షణం ఏదైనా జరగొచ్చు''. మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని రోజుల క్రితం బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య ఇది. text: భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 120 బంతుల్లో పది ఫోర్ల సహాయంతో 116 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40వ సెంచరీ. కోహ్లీ తర్వాత విజయ్ శంకర్ అత్యధికంగా 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేశాడు. భారత జట్టులో రోహిత్ శర్మ, ధోనీ, బుమ్రాలు డకౌట్ అయ్యారు. 251 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో భారత జట్టు 2-0తో ముందంజలో ఉంది. మూడో వన్డే ఈనెల 8వ తేదీన రాంచీలో జరుగనుంది. వన్డేల్లో 500వ విజయం వన్డేల్లో భారత జట్టుకు ఇది 500వ విజయం. ఆస్ట్రేలియా తర్వాత వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది. భారత జట్టు తన తొలి వన్డేను 1974 జూలై 13వ తేదీన ఇంగ్లండ్‌పై ఆడింది. తొలి విజయం 1975 జూన్ 11వ తేదీన ఈస్ట్ ఆఫ్రికాపై పది వికెట్ల తేడాతో నమోదు చేసింది. పదో వికెట్ 49 ఓవర్ మూడో బంతికి ఆడమ్ జంపా (2 బంతుల్లో రెండు పరుగులు) ఔటయ్యాడు. తొమ్మిదో వికెట్ 49 ఓవర్ మొదటి బంతికి మార్కస్ స్టొయినిస్ (65 బంతుల్లో 52 పరుగులు) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ 45 ఓవర్ నాలుగో బంతికి పాట్ కమ్మిన్స్ డకౌట్ అయ్యాడు. ఏడో వికెట్ 45 ఓవర్ రెండో బంతికి కైల్టెర్ నైల్ (4 బంతుల్లో నాలుగు పరుగులు) ఔటయ్యాడు. ఆరో వికెట్ 44 ఓవర్ మూడో బంతికి అలెక్స్ క్యారీ (24 బంతుల్లో 22 పరుగులు) ఔటయ్యాడు. ఐదో వికెట్ 37 ఓవర్ మూడో బంతికి హ్యాండ్స్‌కోంబ్ (59 బంతుల్లో 48 పరుగులు) రనౌట్ అయ్యాడు. నాలుగో వికెట్ 28 ఓవర్ మూడో బంతికి మాక్స్‌వెల్ (18 బంతుల్లో 4 పరుగులు) ఔటయ్యాడు. మూడో వికెట్ 23 ఓవర్ ఐదో బంతికి షాన్ మార్ష్ (27 బంతుల్లో 16 పరుగులు) ఔటయ్యాడు. రెండో వికెట్ 15 ఓవర్ మూడో బంతికి ఖవాజా (37 బంతుల్లో 38 పరుగులు) ఔటయ్యాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: తొలి వికెట్ 14 ఓవర్ మూడో బంతికి ఆరోన్ ఫించ్ (53 బంతుల్లో 37 పరుగులు) ఔటయ్యాడు. శిఖర్ ధవన్ పదో వికెట్ 48 ఓవర్ రెండో బంతికి బుమ్రా డకౌట్ అయ్యాడు. తొమ్మిదో వికెట్ 47 ఓవర్ ఐదో బంతికి కుల్దీప్ యాదవ్ (మూడు బంతుల్లో మూడు పరుగులు) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ స్కోరు 248 పరుగుల వద్ద 47 ఓవర్ మొదటి బంతికి కోహ్లీ ఔటయ్యాడు. ఏడో వికెట్ 45వ ఓవర్ ఐదో బంతికి రవీంద్ర జడేజా (40 బంతుల్లో 21 పరుగులు) ఔటయ్యాడు. ఆరో వికెట్ 32 ఓవర్ మూడో బంతికి ధోనీ డకౌట్ అయ్యాడు. ఐదో వికెట్ 32 ఓవర్ రెండో బంతికి జాదవ్ (12 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 12 పరుగులు) ఔటయ్యాడు. నాలుగో వికెట్ 28వ ఓవర్ ఐదో బంతికి విజయ్ శంకర్ రనౌట్ అయ్యాడు. కోహ్లీ నేరుగా కొట్టిన బంతిని బౌలర్ జంపా అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అది వెళ్లి రెండో ఎండ్‌లో వికెట్లను తాకింది. అప్పటికే క్రీజు నుంచి ముందుకొచ్చిన విజయ్ శంకర్ వెనుదిరిగే ప్రయత్నం చేసినప్పటికీ చేరుకోలేకపోయాడు. దీంతో అతను రనౌట్ అయ్యాడు. విజయ్ శంకర్ 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేశాడు. మూడో వికెట్ 17వ ఓవర్ చివరి బంతికి 75 పరుగుల దగ్గర భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన అంబటి రాయుడు లియాన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. రెండో వికెట్ టీమిండియా 9వ ఓవర్ మూడో బంతికి 38 పరుగుల దగ్గర రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన శిఖర్ ధవన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. తొలి వికెట్ మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పరుగుల ఖాతా తెరవక ముందే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ కొట్టిన బంతి జంపా చేతుల్లో పడింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నాగపూర్ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. text: కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగాన్ని చూస్తున్న దక్షిణ కొరియా ప్రజలు నూతన సంవత్సరం సందర్భంగా చేసిన ప్రసంగంలో, అటు అమెరికాను హెచ్చరిస్తూనే కొత్తగా దక్షిణ కొరియాకు స్నేహ హస్తం చాస్తున్నట్లుగా ఆయన మాటలు సాగాయి. మీట నొక్కితే చాలు అమెరికా ఆయువు తన చేతిలో ఉందని కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దేశంపై తాము అణుదాడి జరపగలమని కిమ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన "లాంచింగ్ బటన్" తన టేబుల్ వద్దే ఉన్నట్లు తెలిపారు. కాబట్టి అమెరికా తమపై యుద్ధానికి వచ్చే సాహసం ఎప్పటికీ చేయలేదని చెప్పుకొచ్చారు. "అమెరికా మొత్తం మా అణు ఆయుధాల పరిధిలో ఉంది. ఇదేదో బెదిరించడానికి అన్నాననుకుంటే పొరపాటు. ఇది వాస్తవం" అని కిమ్ టీవీ ప్రసంగంలో హెచ్చరించారు. దక్షిణ కొరియా జాతీయ జెండా స్నేహం చిగురించొచ్చు తొలిసారిగా దక్షిణ కొరియా విషయంలో కిమ్ ధోరణిలో మార్పు కనిపించింది. ఇప్పటికైతే ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య యుద్ధవాతావరణం ఉందంటూనే, కొత్త ఏడాదిలో పరిస్థితులు మారొచ్చని సంకేతాలు ఇచ్చారు. ఇందుకు ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని కిమ్ చెప్పుకొచ్చారు. ఇటు దక్షిణ కొరియా, అటు ఉత్తర కొరియాకు సంబంధించి 2018 ఎంతో ముఖ్యమైనది. ఈ ఏడాదికి ఉత్తర కొరియా ఏర్పడి 70 ఏళ్లు పూర్తి కానుంది. దక్షిణ కొరియా ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. "2018 మాకు ఎంతో ముఖ్యమైనది. ఈ ఏడాదిలో పరిస్థితులు మారొచ్చు" అని కిమ్ అన్నారు. మా ఆటగాళ్లను పంపుతాం వింటర్ ఒలింపిక్స్ క్రీడలకు వీలైతే తమ దేశం తరపున బృందాలను పంపుతామని కిమ్ వెల్లడించారు. "వింటర్ ఒలింపిక్స్ రూపంలో మాకు మంచి అవకాశం లభించింది. కొరియా ప్రజల ఐక్యతను చాటేందుకు ఇదే మంచి తరుణం. దీనిపై రెండు దేశాల అధికారులు వెంటనే చర్చలు ప్రారంభించాలి. వింటర్ ఒలింపిక్స్ విజయవంతం కావాలని ఆశిస్తున్నా" అని కిమ్ అన్నారు. వాస్తవానికి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తుది గడువు ముగిసిపోయింది. అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియా ఫిగర్ స్కేటర్లు ర్యోమ్ తే, కిమ్ జు వింటర్ ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. ఆపే ప్రస్తకే లేదు అణు ఆయుధాల తయారీని మాత్రం ఆపే ప్రసక్తే లేదని కిమ్ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో అణు వార్ హెడ్లు, బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడంతోపాటు వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేమూ చూస్తాం ఉత్తర కొరియా హెచ్చరికలపై విలేకరులు ప్రశ్నించగా "వారేం చేస్తారో మేమూ చూస్తాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మా ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ మరోసారి అమెరికాను హెచ్చరించారు. text: ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్నవరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన లైవ్‌ వీడియో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వరవరరావు భార్య, కుమార్తెలు విజ్జప్తి చేశారు. జైలు అధికారులు మాత్రం ఆయన ఆరోగ్యం బాగుందని చెబుతున్నారని , కానీ వాస్తవాలు వేరుగా కనిపిస్తున్నాయని వారు అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన వరవరరావును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ లేఖలకు కనీసం సమాధానం కూడా లేదని వరవరరావు భార్య హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని, వరవరరావు ఆరోగ్యం విషయంలో సహాయం చేస్తానని ఆయన మాటిచ్చారని హేమలత చెప్పారు. ఆయన ఆరోగ్యం ఎప్పటి నుంచి విషమంగా ఉంది? ''మే 26 నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదని మాకు తెలిసింది. మే 28న జేజే ఆసుపత్రికి తరలించారు. తర్వాత జూన్1న తిరిగి ఆయన్ను తలోజా జైలుకు తరలించారు. జూన్7వ తారీఖు నుంచి ఆయన మాటలో తేడాను గమనించాం'' అని వరవరరావు భార్య హేమలత మీడియా సమావేశంలో వెల్లడించారు. ''జూన్ 24న ఫోన్‌ చేసినప్పుడు ఆయన మతిస్థిమితం లేనట్లుగా మాట్లాడారు. జూలై 2న ఫోన్‌ చేసినప్పుడు మమ్మల్ని గుర్తు పట్టే పరిస్థితిలో కూడా లేరు. నిన్న జులై 11న మాట్లాడినప్పుడు తన తల్లిదండ్రుల అంత్యక్రియల గురించి చెబుతున్నారు. ఈ మాటల తీరు చూస్తుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అర్ధమవుతోంది'' అని హేమలత బీబీసీతో అన్నారు. ''8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. తల్లి మరణించి 35 సంవత్సరాలైంది. ఇప్పుడు వారి అంత్యక్రియల గురించి మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు'' అని, ఆయన ఆరోగ్యం గురించి ఎందరికో ఎన్నో విన్నపాలు చేసినీ ఎవరూ పట్టించుకోలేదని ఆమె చెప్పారు. గత 47 ఏళ్లలో వరవర రావు తనపై మోపిన 25 కేసుల్లో నిర్దోషిగా విడుదల అయ్యారని ఆయన కుమార్తెలు చెప్పారు బెయిల్ అవసరం లేదు బతికించుకుంటే చాలు : వరవరరావు కుమార్తెలు వరవరరావుకు బెయిల్ పొందే హక్కుందని, అయితే వస్తుందన్న ఆశ తమకు లేదని తల్లితోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కుమార్తెలు సహజ, అనల, పవన అన్నారు. ''ఇప్పుడు మేం బెయిల్ కోరడం లేదు. కానీ ముందు ఆయన్ను బతికించుకోవాలి. ఆయన శరీరంలో సోడియం, పొటాషియ స్థాయిలు దారుణంగా పడిపోయాయి'' అని పవన అన్నారు. విడుదల చేయండి-మేమైనా బతికించుకుంటాం: ఎన్.వేణుగోపాల్ ''వరవరరావు ఆరోగ్య పరిస్థితి మీద ఒక్క మహారాష్ట్ర గవర్నర్ మినహా ఎవరూ స్పందించ లేదు. ఆయన్ను జైలు నుంచి తక్షణం ఆసుపత్రికి తరలించాలి. లేదంటే మాకు అప్పజెప్పండి. మేము, కుటుంబ సభ్యులు కలిసి ఆయన్ను బతికించుకుంటాం" అని సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ అన్నారు. వరవరరావుకు బంధువు కూడా అయిన వేణుగోపాల్, కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు మేం చేస్తున్న ఒకే ఒక విజ్జప్తి ఒక్కటే, ఆయనను తక్షణమే విడుదల చేయాలి. వీవీ హక్కులను కాపాడాలి: మేధావులు, సామాజికవేత్తలు బీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావును తక్షణమే విడుదల చేయాలని సామాజిక ఉద్యమకారులు, మేధావులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. వరవరరావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని, ఆయనకు వైద్యం అందించాలని కాలమిస్టు, సామాజిక ఉద్యమకారుడు సుదీంధ్ర కులకర్ణి అన్నారు. వైద్యం పొందే హక్కు ఆయనకు ఉందన్నారు కులకర్ణి. ఫాసిస్టు ధోరణితో ప్రశ్నించే వారి గొంతులను కేంద్రం నొక్కేయాలని చూస్తోందని హైదరాబాద్ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆరోపించింది. వరవరరావును మరికొందరిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారని, వారిని తక్షణమే విడుదల చేయాలని ఫోరం ట్విటర్‌లో డిమాండ్ చేసింది. ఇంత పెద్ద వయసున్న ఒక రచయితను ఇబ్బంది పెడుతున్న వారిని భారతదేశం క్షమించదు. ఆయనకు వైద్యం అందించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సామాజికవేత్త, వామపక్ష నేత దీపాంకర్ అన్నారు. ''80ఏళ్ల వయసులో ఒక వృద్ధ రచయిత, అలుపెరుగని శ్రమజీవిని ఇబ్బంది పెడుతున్నారు. ఎందరు విజ్జప్తి చేసినా ఈ మూర్ఖ ప్రభుత్వాలలో చలనం రావడం లేదు'' అని విరసం సభ్యుడు పి.వీరబ్రహ్మచారి అన్నారు. బీమా-కోరెగావ్ కేసులో వరవరరావు, మావోయిస్టులతో సంబంధాల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాల ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నేతలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండడం.. జైళ్లలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో వీరిని విడుదల చేయాలని కోరుతున్నారు. వరవరరావు నడవలేని స్థితిలో, పళ్లు తోముకునే స్థితిలో కూడా లేరని జైలులో ఆయన సహచరులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారిలో ఆందోళన అధికమైంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీమాకోరేగావ్‌ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన రచయిత, విరసం నాయకులు వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ప్రాణాలను కాపాడాలని ఆయన సతీమణి హేమలత, కుటుంబ సభ్యులు, సహచరులు విజ్జప్తి చేశారు. text: గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న మిలటరీ సిబ్బంది పాలూ నగరంలో ఒక షాపింగ్ సెంటర్, హోటల్ కుప్ప కూలిపోయాయి. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికి తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం అర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు, ఈ విలయం కారణంగా 832 మందికి పైగా చనిపోయారని అధికారులు ప్రకటించారు. మృతులను సామూహికంగా ఖననం చేసేందుకు ఇండోనేసియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నాడు ఒకే చోట దాదాపు 300 మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన దేశాధ్యక్షుడు జోకో విడోడో, బాధితులను ఆదుకోవడానికి రాత్రింబగళ్ళు సహాయక చర్యలను కొనసాగించాలని కోరారు. పాలూ నగరంలో కూప్పకూలిన మసీదు రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైన ఈ భూకంపం వల్ల చాలా భవనాలు కూలిపోయాయి. ఈ శిథిలాల కింద ఎంతో మంది ప్రజలు చిక్కుకున్నారని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వొ నుగ్రొహొ విలేకరుల సమావేశంలో చెప్పారు. తొలుత భూకంపం రావటంతో అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అలా అధికారులు సునామీ హెచ్చరికలు ఎత్తివేసిన కాసేపట్లోనే దాదాపు 20 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతూ సులవేసి ద్వీపంలోని పాలు నగరాన్ని ముంచెత్తాయి. ఇండొనేషియా: భారీ భూకంపంతో ముంచెత్తిన సునామీ నగరంలో కూలిపోయిన భవంతుల శిథిలాల కింద ఎవరైనా ప్రజలు ప్రాణాలతో ఉన్నారేమోనని అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. యంత్రాలను ఉపయోగించకుండా తవ్వకాలు చేపట్టారు. డొంగల నగరంపై భూకంప, సునామీ తీవ్రత ఎంతగా ఉందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదు. ఆ నగరానికి వెళ్లే రోడ్లు ధ్వంసం కావటం, అడ్డంకులు ఎదురవడం, ఒక వంతెన కూలిపోవటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. భూకంపం, సునామీ కారణంగా 16 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని రెడ్ క్రాస్ సంస్థ అంచనా వేసింది. ‘‘ఇదొక విషాదం. మరింత తీవ్రం కావొచ్చు’’ అని రెడ్ క్రాస్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని, వేలల్లో ఉండొచ్చని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కళ్లా తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాలను దేశాధ్యక్షుడు జోకో విడొడొ సందర్శిస్తున్నారు. పాలు నగరంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను కాపాడుతున్న సహాయ సిబ్బంది డొంగల నగరంలో పరిస్థితి ఏంటి? డొంగల నగరానికి రోడ్డు మార్గంలో కానీ, ఆకాశ మార్గంలో కానీ వెళ్లే అవకాశాల్లేవని, బహుశా సముద్ర మార్గంలో వెళ్లి సహాయ కార్యకలాపాలు అందించాలని సహాయ సంస్థ కేథలిక్ రిలీఫ్ సర్వీసెస్ ఇండోనేసియా దేశ మేనేజర్ యెన్ని సుర్యానీ తెలిపారు. శుక్రవారం వచ్చిన భూకంపం తర్వాత ఈ దీవిలో తీవ్రమైన భూ ప్రకంపనలు కొనసాగాయి. గత నెలలో కూడా వరస భూకంపాలు ఇండొనేషియా ద్వీపాలను అతలాకుతలం చేశాయి. లోంబోక్‌లో సంభవించిన భూకంపానికి వందలాది మంది చనిపోయారు. ఆగస్టు 6న సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం 460 మంది ప్రాణాలు తీసింది. కూలిపోయిన ఒక ఆస్పత్రి శిథిలాలపైనే చికిత్స పొందుతున్న మహిళ ‘పాలు’ నగరంలో పరిస్థితి ఏంటి? ఈ నగర జనాభా 3,35,000. భూకంపం ధాటికి చాలా భవంతులు కూలిపోయాయి. వాటి శిథిలాల కింద ప్రాణాలతో చాలామంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రోవా-రోవా అనే ఒక హోటల్ శిథిలాల కింద చిక్కుకున్న 24 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన తీవ్ర భూకంపంతో వచ్చిన భారీ సునామీ వల్ల హిందూ మహా సముద్రం పరిధిలో 2,26,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఒక్క ఇండొనేసియాలోనే 1,20,000 మందికి పైగా చనిపోయారు. తరచూ భూకంపాలు సంభవించే అవకాశంతో పాటు అగ్నిపర్వతాలున్న వలయంలో ఉన్న ఇండొనేసియాకు భూకంపాల ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటోంది. ‘తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు’ పోస్కో నుంచి రెబెక్కా హెన్స్‌ఖె, బీబీసీ ప్రతినిధి, జకార్తా పాలు నగరం నుంచి నాలుగు గంటల ప్రయాణ దూరంలో ఉన్న పోస్కో నగరంలో నిత్యావసరాల కొరత ఏర్పడింది. పెట్రోలు పంపులు ఖాళీ అయిపోతున్నాయి. సూపర్ మార్కెట్లలో చాలా తక్కువ మొత్తంలోనే సరుకులు ఉన్నాయి. తాగేందుకు బాటిల్ నీళ్ల కోసం చాలా కష్టపడి వెతుక్కోవాల్సిన పరిస్థితి. మా బీబీసీ బృందంతో పాటు ప్రయాణిస్తున్న ఎర్మి లియానా తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదు. ‘‘కూలిపోయిన వంతెనకు సమీపంలోనే వాళ్లు ఉంటారు. ఫోన్లో వారిని సంప్రదించలేకపోతున్నాను. వాళ్లు బ్రతికే ఉండాలని దేవుణ్ణి ప్రార్థించటమే ఇప్పుడు నేను చేయగలిగినది’’ అని ఆమె అన్నారు. డొంగల నగరానికి ఎలాంటి సహాయం వెళుతున్నట్లు మాకు కనిపించట్లేదు. ఇప్పటికీ ఆ నగరానికి సమాచార సంబంధాలు పునరుద్ధరించలేదు. ఇవి కూడా చదవండి: భవిష్యత్తులో జకార్తాను చూడలేమా? (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇండోనేసియాలోని తీర ప్రాంత నగరం 'పాలు'లో శుక్రవారం సంభవించిన తీవ్ర భూకంపం వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక బృందాలు భారీ యంత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. text: విమానంలో పెళ్లి మరోవైపు ఈ పెళ్లి విషయంలో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వివాదంలో చిక్కుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. వివాహ సమయంలో విమానంలో పనిచేసిన సిబ్బందిని స్పైస్‌జెట్ విధుల నుంచి తప్పించింది. అసలు ఏం జరిగింది? మదురై నుంచి బయలుదేరిన విమానంలో ఒక జంట పెళ్లి చేసుకుంది. ఈ విమానంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతరుతోపాటు వారి బంధువులు కూడా ఉన్నారు. మదురైకు చెందిన పెళ్లి కొడుకు మే 23న స్పైస్‌జెట్ చార్టర్ ఫ్లైట్‌ను బుక్ చేసుకున్నారు. అయితే విమానంలో పెళ్లి జరిపించేందుకు దాన్ని బుక్ చేసుకున్నట్లు తమకు ముందుగా తెలియదని విమాన యాన సంస్థ వెల్లడించింది. ‘‘స్పైస్‌జెట్ విమానాన్ని వారు ముందుగా బుక్ చేసుకోవడం నిజమే. కానీ పెళ్లి కోసమే బుక్ చేసుకుంటున్నట్లు వారు చెప్పలేదు’’అని మదురై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సెంథిల్ వలవన్ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది. విచారణకు ఆదేశించిన డీజీసీఏ కోవిడ్ నిబంధనలు పాటించకపోయినా, మాస్కులు సరిగా పెట్టుకోకపోయినా.. ఆ ప్రయాణికులను విమానాల్లో ఎక్కించుకోవద్దని డీజీసీఏ ఇటీవల ఆదేశాలు జారీచేసింది. మదురై ఘటనపై విమానయాన సంస్థ నుంచి డీజీసీఏ నివేదిక కోరింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు ప్రయాణికులపై విమానయాన సంస్థ ఫిర్యాదు నమోదు చేసింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమిళనాడులో ఓ జంట విమానంలో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో దీనిపై చర్చ జరుగుతోంది. text: ఆ సినిమా చూస్తున్నంత సేపు.. 'ఒకవేళ నాకూ ఇలాంటి అవకాశం వస్తే? నేను ఏమేం చేస్తాను?' అన్న ఆలోచన రాకుండా మానదు. సీఎంగా పనిచేస్తే అవకాశం వస్తే ఎవరు వద్దనుకుంటారు! సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే 'బీబీసీ పాప్‌అప్' బృందం బెంగళూరు యువతతో ఒక ప్రయోగం చేసింది. 'మీరే కనుక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు' అని ప్రశ్నించింది. కర్నాటకలోని ఏఏ సమస్యలపై దృష్టిపెడతారో వారి నుంచి తెలుసుకుంది. ఒక్క రోజు సీఎం అయితే మీరేం చేస్తారు? అయితే, అక్కడి యువత ముఖ్యమంత్రి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ముందు బీబీసీ కన్నడ భాషలోనూ వార్తావిశేషాలు అందించాలంటూ కోరింది. ఇప్పటికే ఉన్న బీబీసీ హిందీకి తోడుగా గత ఏడాది బీబీసీ తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏమో! బీబీసీ కన్నడ భాషలో కూడా వార్తావిశేషాలందించే రోజు రావొచ్చు. ప్రస్తుతానికి మనం కర్నాటకలోని సమస్యల సంగతి చూద్దాం. కర్ణాటకలో బీబీసీ పాప్ అప్ బృందం ఈ 'ఒక రోజు ముఖ్యమంత్రులు' ఏఏ అంశాలను ప్రస్తావించారో చదవండి. ట్రాఫిక్ ఇది చాలాకాలంగా పట్టిపీడిస్తున్న సమస్య. ముఖ్యంగా ఆఫీసులు, కళాశాలలకు వెళ్లివచ్చే సమయాల్లో బెంగళూరు నగరంలో రద్దీ అంతాఇంతా కాదు. బెంగళూరులో సగటున ప్రతి ఒక్కరూ ఏడాదికి 240 గంటలు ట్రాఫిక్‌లో ఉంటారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆఫీసులకు వెళ్లేవారు నగరంలో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తుంటారని, దీనివల్ల ట్రాఫిక్ పెరుగుతోందని అంటున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే #BBCNewsPopUPలో 'ఒక రోజు ముఖ్యమంత్రి'గా ఉన్నవారంతా ఈ సమస్యను ప్రస్తావించారు. అందరికీ అందుబాటులో ఆరోగ్యం బెంగళూరులోని ఓ మిషనరీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న అర్చన మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రినైతే అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. వైద్యం భారం కాకుండా చూస్తానని.. ముఖ్యంగా పేదలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తానని అన్నారు. మెట్రోని సకాలంలో విస్తరించడం బెంగళూరులో మెట్రో పనులు 2006లో మొదలయ్యాయి. కానీ, దాని విస్తరణ పనులు మాత్రం నత్తనడక నడుస్తున్నాయి. ప్రస్తుతం రెండు మార్గాల్లో నడుస్తున్న మెట్రో రైలు ప్రతిరోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నప్పటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించాలంటే ఈ రెండు మార్గాలు చాలవంటున్నారు నగరవాసులు. మెట్రో విస్తరణ వేగవంతం చేయాలని కోరుతున్నారు. తాము ముఖ్యమంత్రి అయితే ఆ పని చేస్తామని చెప్తున్నారు. పాదచారులకు అనుకూలమైన రోడ్లు #BBCNewsPopUPలో ఒక రోజు సీఎంగా ఉన్న వినయ్ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని రోడ్లపై పాదచారులు, సైక్లిస్టులకు ప్రథమ ప్రాధాన్యం ఉండాలని, ఆ తరువాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు ప్రాధాన్యం దక్కాలని.. ఆ తరువాతే ప్రైవేటు వాహనాలకు అవకాశం ఉండాలని అన్నారు. గుంతల్లేని రోడ్లు బెంగళూరులో గుంతల్లేని రోడ్లు ఉండవంటున్నారు నగరవాసులు. కొన్ని చోట్లయితే ఆ గుంతలను బట్టే అదే రోడ్డో పోల్చుకోవచ్చని సరదాగానే సమస్య తీవ్రతను చెప్పుకొచ్చారు. అడవుల ఆక్రమణ కర్నాటకలో అడవుల నరికివేత సమస్య తీవ్రంగా ఉంది. గత 19 ఏళ్లలో ఇది అయిదు రెట్లు పెరిగిందని ఇటీవల కాగ్ నివేదిక సైతం వెల్లడించింది. ఈ సమస్యనూ పలువురు ప్రస్తావించారు. ఎండిపోతున్న నీటివనరులు బెంగళూరును ఒకప్పుడు తటాకాల నగరంగా పిలిచేవారు. ఇప్పుడది మండుతున్న చెరువుల నగరంగా మారిపోతోంది. నీరెండిపోయి ఖాళీ అయిన చెరువుల్లో చెత్తాచెదారం పోగవడం, అవి తగలబడడం ఇక్కడ సాధారణమైపోయింది. అలాగే నీటివనరుల్లో కాలుష్యం పొంగిపొర్లడమూ ఇక్కడ సాధారణమే. స్కూళ్లలో ఇంగ్లిష్ తగ్గాలి.. దక్షిణ భారతదేశంలో చాలాచోట్ల ఇంగ్లిష్ వచ్చినవారు ఉన్నప్పటికీ తమ మాతృభాషలను ఇంగ్లిష్ కనుమరుగు చేసే పరిస్థితిని ఇష్టపడబోమని చెప్పారు. తాను కనుక ముఖ్యమంత్రి అయితే స్కూళ్లలో ఇంగ్లిష్‌కు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వకుండా చూస్తానని.. స్థానిక భాషల ఉనికి కాపాడతానని ఓ యువతి చెప్పారు. బెంగళూరు నగరవాసులు ప్రస్తావించిన సమస్యలపై బీబీసీ పాప్‌అప్ బృందం కథనాలు అందిస్తుంది. మా పాప్ అప్ కార్యక్రమాలకు రాలేకపోయినవారు కూడా తమ ఆలోచనలను #BBCNewsPopUp, #KarnatakaElection2018 హ్యాష్ ట్యాగ్‌లు ఉపయోగిస్తూ మా సోషల్ మీడియా పేజీల ద్వారా మాతో పంచుకోవచ్చు. ఇంకెందుకాలస్యం.. స్పందించండి. మీరు చెప్పే కథనం బీబీసీలో వస్తుంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'ఒకే ఒక్కడు' సినిమా చూశారు కదా.. అందులో హీరో ఒక రోజు పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాడు. 24 గంటల్లో రాజకీయ, పాలన వ్యవస్థను పూర్తిగా చక్కదిద్ది ప్రజల హృదయాలు గెలుచుకుంటాడు. text: భారత పిచ్, దక్షిణాఫ్రికా సగటు బౌలింగ్ అతడి సవాలును మరింత సులభంగా మార్చేయడంతో విశాఖపట్టణంలో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ సెంచరీలు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 127 రన్స్ చేశాడు. ఇది అతడి టెస్ట్ కెరీర్లో ఐదో శతకం. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు. ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. వసీం అక్రం 1996లో ఒక టెస్టులో 12 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 2015లో అజింక్య రహానే తర్వాత భారత్ నుంచి ఒక ఆటగాడు ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. అయితే, రోహిత్ శర్మ కంటే ముందు విజయ్ హజారే, సునీల్ గావస్కర్(మూడు సార్లు), రాహుల్ ద్రవిడ్(రెండు సార్లు), విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఈ ఫీట్ చేశారు. ముఖ్యంగా సునీల్ గావస్కర్ తర్వాత ఓపెనర్‌గా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు చేసిన ఘనత సాధించిన ఒకే ఒక భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టెస్టు మ్యాచుల్లో ప్రదర్శన గురించి ఎప్పుడూ విమర్శలు ఎదుర్కుంటూ వచ్చిన రోహిత్ శర్మ వాటన్నిటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనే మూడ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. text: 2014 తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన అతిపెద్ద దాడి ఇదే. బలూచిస్తాన్‌లోని మస్టంగ్ పట్టణంలో జరిగిన ఈ దాడిలో బలూచిస్తాన్ అవామీ పార్టీ అభ్యర్థి సిరాజ్ రస్సానీతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఎస్) ప్రకటించింది. శక్తిమంతమైన బాంబును తన శరీరానికి అమర్చుకున్న ఓ వ్యక్తి ఎన్నికల ప్రచార ర్యాలీలోకి ప్రవేశించి పేల్చేసుకున్నాడని స్థానిక అధికారులు తెలిపారు. "పేలుడు ధాటికి అనేక మంది దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. తీవ్రంగా గాయపడి చాలామంది హాహాకారాలు చేశారు" అని స్థానిక పాత్రికేయుడు చెప్పినట్టు ఏఎఫ్‌పీ న్యూస్ తెలిపింది. ఈ నెల 25న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆ ప్రచార కార్యక్రమాలే లక్ష్యంగా తాజాగా వరుస దాడులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ఎన్నికల నేపథ్యంలో గత 24 గంటల్లో మూడు బాంబు దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. శుక్రవారమే బన్ను పట్టణంలోనూ ఇలాగే మరో ఎన్నికల ర్యాలీలో బాంబు దాడి జరిగింది. అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 2014 డిసెంబర్‌లో పెషావర్‌లోని ఆర్మీ స్కూలుపై తాలిబన్ మిలిటెంట్లు చేసిన దాడిలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 132 మంది చిన్నారులే. ఆ తర్వాత అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది తాజా దాడిలోనే. మంగళవారం పెషావర్‌లో ఓ ఎన్నికల ప్రచార సభలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి సహా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి చేసింది తామేనని పాకిస్తాన్ తాలిబన్ సంస్థ తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్‌ ఎన్నికల ర్యాలీలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 128 మంది చనిపోయారు. మరో 150 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. text: క్రికెట్ ప్రపంచకప్‌లో తలపడుతున్న పది దేశాల జట్ల కెప్టెన్లు 1975 నుంచి నాలుగేళ్లకోసారి జరుగుతున్న ఈ క్రీడా సంగ్రామంలో ఇప్పటికి 2015 నాటికి 11 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు జరుగుతున్నది 12వ ఎడిషన్. మే 30 (గురువారం) నుంచి జూలై 14 (ఆదివారం) వరకు 46 రోజుల పాటు ఇంగ్లండ్, వేల్స్‌ల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 11 ప్రాంతాల్లో మొత్తం 48 మ్యాచ్‌లు ఉంటాయి. జూలై 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్, జూలై 14న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. షెడ్యూల్ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) క్రికెట్ ప్రపంచకప్ 2019 రానే వచ్చింది. 48 మ్యాచ్‌ల ఈ సుదీర్ఘ టోర్నమెంట్‌లో 10 జట్లు తలపడనున్నాయి. text: నేపాల్‌లో చైనా రాయబారి హామో యాంకీ నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ వీరు సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ గురించి నేపాల్ అధ్యక్ష కార్యాలయం తరఫు నుంచి గానీ, విదేశాంగ శాఖ నుంచి గానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. హావో యాంకీ మాత్రం ట్విటర్‌లో దీని గురించి స్పందించారు. దాదాపు గంట పాటు వీరి సమావేశం జరిగింది. అయితే, బిద్య దేవి హావో యాంకీ భేటి అవ్వడాన్ని నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోవడంగా కొందరు చూస్తున్నారు. సాధారణంగా దౌత్యవేత్తలు తాము పనిచేసే దేశాల్లో జరిగే అంతర్గత రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ, చైనా రాయబారి హవో యాంకీ ఇంతకుముందు కూడా నేపాల్‌లోని రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నేపాల్‌లోని అధికార కమ్యూనిస్టు పార్టీలో పెద్ద నాయకులైన కేపీ ఓలీ, కమల్ దహల్ ప్రచండ మధ్య వ్యవహారాల్లో హావో యాంకీ జోక్యం చేసుకుని ఉండకపోతే అక్కడ కొన్ని నెలల ముందే రాజకీయ సంక్షోభం వచ్చి ఉండేదన్నది కొందరి అభిప్రాయం. పార్టీపై పట్టు ఉన్న ప్రచండకు, ప్రధాని పదవిలో ఉన్న ఓలీకి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోంది. ఓలీ సిఫారసు తర్వాత నేపాల్ పార్లమెంటులోని ప్రతినిధుల సభను డిసెంబర్ 20న నేపాల్ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీ రద్దు చేశారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో చైనా రాయబారితో బిద్య దేవి భేటీ అవ్వడాన్ని భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. నేపాల్ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీ 'నేపాల్ అంతర్గత రాజకీయాల్లో చైనా జోక్యం' ''నేపాల్ ఇప్పుడు జరుగుతున్నవి అంతర్గత రాజకీయ విషయాలు. ప్రధానమంత్రి కేపీ ఓలీ ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది'' అని నేపాల్‌కు చెందిన సీనియర్ పాత్రికేయుడు యుబ్‌రాజ్ ఘిమిరే అన్నారు. కొన్నేళ్లుగా నేపాల్‌లో చైనా జోక్యం పెంచుకుంటూ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ''2006లో నేపాల్‌లో జరిగిన రాజకీయ మార్పుల విషయంలో భారత్ పాత్రను గమనించిన చైనా... భారత్ ప్రభావ పరిధిలో నేపాల్ ఉందని భావించింది. ఆ సమయంలో నేపాల్‌లో భారత్ పోషించిన పాత్రను అమెరికా, యురోపియన్ దేశాలు ప్రశంసించాయి. నేపాల్‌లో భారత్ జోక్యం చేసుకోవడం భద్రతపరంగా తమకు ముప్పు కావొచ్చని చైనా భావించింది. అమెరికా భారత్‌ను పొగడటం కూడా చైనా అభిప్రాయం బలపడటానికి కారణమైంది. దీంతో నేపాల్‌లో చైనా పెట్టుబడులను, తమ ప్రభావాన్ని పెంచుకోవాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది'' అని ఘిమిరే చెప్పారు. నేపాల్‌లో నాలుగు రంగాల్లో చైనా పెట్టబడులు బాగా పెంచింది. వాణిజ్యం, ఇంధన రంగం, పర్యాటక రంగంతోపాటు భూకంపం తర్వాత నేపాల్ పునర్నిర్మాణంలోనూ చైనా పాత్ర పోషించింది. నేపాల్‌కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అధిక వాటా చైనాదే. నేపాల్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తడం చైనాను కలవరపెట్టేదే. చైనా, నేపాల్ ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే దేశాలు ఇదే పరిస్థితిని ఆశిస్తాయి. అయితే, ఓలీ ప్రభుత్వం పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేకపోతుండటం చైనాకు ఇబ్బందికరమైన పరిణామమే. ''చైనా కోరుకుంటే ఓలీ అధికారంలో కొనసాగుతారని, లేదంటే దిగిపోతారని అనుకోవడం సరికాదు. నేపాల్‌ ఇప్పుడు అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా కీలకమైనవి'' అని ఘిమిరే అన్నారు. ప్రచండ రాజకీయ సంక్షోభానికి కారణాలు నేపాల్ ప్రధాని కేపీ ఓలీ సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) విలీనమైన తర్వాత 2018లో కేపీ ఓలీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత పార్టీలో సంఘర్షణ మొదలైంది. తాజాగా రాజ్యాంగ పరిషత్ భేటీ ఏర్పాటు చేయకపోవడంపై సమావేశం ఏర్పాటు విషయమై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాని కేపీ ఓలీ అధ్యక్షురాలికి సిఫార్సు చేశారు. అనంతరం అధ్యక్షురాలు ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో వివాదం మొదలైంది. పార్టీలోని సీనియర్ నాయకులు ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలిని ఎంపీలు అభ్యర్థించారు. ప్రధాని పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేపీ ఓలీ దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో కేపీ ఓలీపై ఒత్తిడి పెరిగింది. ఇటు ఎంపీలు ప్రత్యేక సమావేశం కోసం చేసిన అభ్యర్థనను వెనక్కితీసుకోవాలని, ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా వెనక్కితీసుకోవాలని రెండు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కానీ, ఇది జరగలేదు. కేపీ ఓలీ పార్లమెంటును రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఇప్పుడు పార్టీ చీలిపోయింది. విభేదాలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మంగళవారం పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై, పార్టీ ఛైర్మన్ పదవి నుంచి కేపీ ఓలీని తొలగించింది. ఆ పదవిలో మాధవ్ కుమార్ నేపాల్‌ను నియమించింది. బుధవారం సీపీఎన్ (మావోయిస్టు)కు చెందిన ప్రచండ-మాధవ్ వర్గం ప్రచండను పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నుకుంది. మే నుంచి ఇప్పటివరకూ చైనా రాయబారి క్రియాశీలంగా వ్యవహరించి కేపీ ఓలీని సంక్షోభం నుంచి కాపాడిన సందర్భాలు ఒకట్రెండు ఉన్నాయని యువ్‌రాజ్ ఘిమిరే అన్నారు. ''మేలో చైనా రాయబారి ప్రచండతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మాధవ్ కుమార్‌తోనూ భేటీ అయ్యారు. మరుసటి రోజు ఈ ఇద్దరు నేతలు పరస్పర విమర్శల దాడి ఆపేసి, పార్టీని బలోపేతం చేయడం గురించి మాట్లాడారు'' అని ఘిమిరే చెప్పారు. జులైలో కూడా చైనా రాయబారి నేపాల్‌లోని ఐదుగురు సీనియర్ రాజకీయ నేతలతో సమావేశమయ్యారని, అయితే దీని గురించి బయటకు ప్రకటనలేవీ రాలేదని అన్నారు. ''నేపాల్‌లో అధికారంలోని ఉన్న కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావడం చైనాకు ఇష్టం లేదు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. పార్టీగా ఒకటిగా ఉంటే, చైనా తరహా కమ్యూనిస్టు భావజాలం విజయం సాధించినట్లుగా చూడొచ్చు. ఇక కేపీ ఓలీ ప్రధాని పదవిలో ఉంటే, భారత్‌కు ఎదురుగా పనిచేయొచ్చు'' అని టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక డిప్లొమాటిక్ ఎడిటర్ ఇంద్రాణీ బాగ్చీ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నేపాల్‌లో చైనా రాయబారిగా పనిచేస్తున్న హామో యాంకీ మంగళవారం నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీతో భేటీ అయ్యారు. text: ఇందులో వింతేముంది? ఏ పెళ్లి కూతురైనా ఇలాగే తయారవుతారు కదా! అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. మీ అనుమానం సరైనదే, కానీ ఈ పెళ్లికూతురి పూర్తి కథ మీకు తెలిసి ఉండదు. ఈ 'పెళ్లి కూతురు'కి పూలజడ లేదు, అసలు జడే లేదు. అసలు తలమీద దాదాపు వెంట్రుకలే కనిపించడంలేదు. ఈమె పేరు వైష్ణవి పువేంద్రన్ పిళ్లై. సన్నిహితులు ప్రేమగా నవీ అని పిలుస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పేరు నవీ ఇంద్రాణ్ పిళ్లై. వీరి పూర్వీకులది తమిళనాడు. కొన్ని దశాబ్దాల క్రితం మలేషియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వైష్ణవి ప్రస్తుతం మలేషియాలోనే ఉంటున్నారు. వైష్ణవి రెండుసార్లు కేన్సర్‌తో పోరాడి గెలిచారు. మొదటిది రొమ్ము కేన్సర్, రెండోది లివర్- వెన్నెముక కేన్సర్. కొన్నాళ్ల క్రితం కీమోథెరపీ చేయించుకున్నాక ఆమె జుట్టంతా రాలిపోయింది. సాధారణంగా ఎవరైనా పెళ్లి రోజు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ, కేన్సర్ బాధితులకు అదంత సులువు కాదు. ప్రత్యేకించి, మహిళా కేన్సర్ రోగులకు మరింత కష్టం. కేన్సర్ కారణంగా ఆమె రొమ్ములను వైద్యులు తొలగించారు. కీమోథెరపీ చేయించున్న తర్వాత జుట్టంతా రాలిపోయింది, శరీరం బలహీనంగా తయారైంది. తనలాగే కేన్సర్‌తో పోరాడుతున్న ఎంతోమందికి ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైష్ణవి పెళ్లి కూతురిగా తయారై ఫొటో షూట్‌ తీయించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ షూట్‌లో ఒక్క ఫొటోలోనూ తన జుట్టులేని తలను దాచిపెట్టేందుకు ఆమె ప్రయత్నించలేదు. అన్ని ఫొటోల్లోనూ ఆమె తల కనిపిస్తుంది. కొన్నింట్లో పలుచని వస్త్రం కప్పుకున్నా, జుట్టులేని తల బయటకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫొటోల్లో ఎక్కడా వైష్ణవి ముఖంలో బాధ కనిపించలేదు. ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఎవరైనా సరే, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండాలని, నిరాశ నిస్పృహలతో బాధపడకూడదంటూ ఇతరులకు స్ఫూర్తినిచ్చే మాటలు రాస్తున్నారు. వైష్ణవితో బీబీసీ మాట్లాడింది, ఆమె పూర్తి వివరాలు తెలుసుకుంది. నవీ స్టోరీ ఆమె మాటల్లోనే.. నేను మలేషియాలో ఉండే ఒక భారతీయ కుటుంబానికి చెందిన 28 ఏళ్ల అమ్మాయిని. అమ్మా, నాన్న, అక్క ఉన్నారు. ఇంజినీరింగ్ చదివాను, కొన్నేళ్లపాటు ఇంజినీర్‌గా పనిచేశాను. భరతనాట్యం అంటే నాకు ఎంతో ఇష్టం. వంట చేయడం, కర్ణాటక సంగీతం కూడా ఇష్టం. ప్రయాణాలు చేస్తూ, కొత్త స్నేహితులను సంపాదించుకోవాలని ఉంటుంది. మేకప్ వేయడం కూడా ఇష్టం. నాకు రొమ్ము కేన్సర్ వచ్చిందన్న విషయం 2013లో తెలిసింది. అప్పుడు షాకయ్యాను. అంతకుముందు జీవితాన్ని సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. కానీ, కేన్సర్ చికిత్స తీసుకున్న తర్వాత అంతా మారిపోయింది. భయమేసింది, కానీ దాని నుంచి బయటపడతానన్న నమ్మకం ఉండేది. చికిత్స చేయించుకున్న తర్వాత కొన్నేళ్లకు ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కానీ, 2018లో మళ్లీ కేన్సర్ దాడి చేసింది. ఈసారి అది రొమ్ము నుంచి వెన్నెముకతో పాటు కాలేయం దాకా విస్తరించింది. దాంతో, మరింత ఆందోళన చెందాను. ఇక చావు ముందు తలవంచాల్సి వస్తుందేమో అనిపించింది. కేన్సర్ మహమ్మారి మనిషిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగదీస్తుంది. రోగి ఒక్కరే కాదు, ఆ కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మలేషియాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేన్సర్‌ చికిత్సకు ప్రత్యేక సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో, ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యాయి. కేన్సర్ మన శరీరాన్ని, మెదడును పూర్తిగా మార్చేస్తుంది. ఆ పరిస్థితులను తట్టుకోవడం చాలా కష్టమైన పని. ఇప్పటి వరకు 16 సార్లు కీమోథెరపీ చేయించుకున్నాను. మానసిక కుంగుబాటుతో పాటు, ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టాయి. నా కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు అండగా నిలిచారు. కానీ, మిగతా ప్రపంచం నా నుంచి దూరంగా వెళ్లిపోతోందనిపించింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న క్యాన్సర్ బాధితురాలు కేన్సర్, కుంగుబాటు విషయాలను బయటకు చెబితే ఇతరులు తమను చిన్నచూపు చూస్తారన్న అభిప్రాయం మలేషియా సమాజంలో ఉంది. అందుకే, ఆ విషయాల గురించి బయట ఎవరితోనూ మాట్లాడొద్దని మా అమ్మానాన్నలు చెప్పేవారు. నాకున్న జబ్బుల గురించి బయటకు తెలిస్తే నాకు మంచి సంబంధాలు రావని వాళ్ల భయం. అయితే, నేను దాన్ని పట్టించుకోలేదు. కేన్సర్ గురించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించాను. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అది అలా జరిగిపోతుండగా.. ఓ రోజు బెడ్ మీద పడుకుని నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తుండగా నా మదిలో ఓ ఆలోచన వచ్చింది. పెళ్లి కూతురిగా తయారై ఫొటోషూట్ చేయించుకోవాలని అనిపించింది. నన్ను ఎవరైనా ప్రేమిస్తారో లేదో నాకు తెలియదు. నాకు వివాహం అవుతుందో లేదో తెలియదు. కానీ, నా ఈ కలను నిజం చేసుకోవాలని అనిపించింది. ఆ తర్వాత వెంటనే ఫొటోగ్రాఫర్‌తో, మేకప్ ఆర్టిస్టుతో మాట్లాడాను. నా ఆలోచన వాళ్లకు నచ్చింది. సరే చేద్దాం అన్నారు. ఆ ఫొటోషూట్ చేసేటప్పుడు నా ఫొటోలు ఇంత వైరల్ అవుతాయని నేను ఊహించలేదు. అయితే, నా ఫొటోలు సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళలకు చేరాలని మాత్రం కోరుకున్నాను. ఇప్పుడు అలాగే జరిగింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత వేల సంఖ్యలో స్పందనలు వచ్చాయి. అందులో చాలామంది కేన్సర్‌తో బాధపడుతున్న అమ్మాయిలే. అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అందం విషయానికొస్తే.. మీరు అందంగా ఉన్నారని అనుకుంటే, అందంగానే కనిపిస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ మీద మీరు విశ్వాసం కలిగి ఉండటమే అందం. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోలేదు. ఒక వ్యక్తిని ప్రేమించాను. గతంలో అతనితో రిలేషన్‌లో ఉన్నాను. కానీ, తర్వాత బ్రేకప్ అయ్యింది. గొప్ప విషయం ఏమిటంటే, మా బ్రేకప్‌కి కారణం కేన్సర్ కాదు. దానికి మరో కారణం ఉంది. ఇప్పటికీ అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించేవారు కావాలి. నా కల నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేయడంతో పాటు వైష్ణవి ఒక అద్భుతమైన ఉత్తరం కూడా రాశారు. అందులోని కొంత భాగం ఇదీ... కేన్సర్ చికిత్స మన జీవితంలో ఎన్నో పరిమితులు విధిస్తుంది. మన అందాన్ని దోచేస్తుంది, మనలోని ఆత్మవిశ్వాసాన్ని లాగేసుకుంటుంది. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన పెళ్లి రోజు గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. పెళ్లి కూతురిగా ఎలా ఉంటామో ఊహించుకుంటాం. కానీ, కేన్సర్ అలాంటి కలలు నెరవేరకుండా చేస్తుంది. ఎంతోమంది మహిళలు కేన్సర్ కారణంగా తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు, రద్దు చేసుకున్నారు. నన్ను ప్రేమించే వ్యక్తితో వివాహం జరగాలని ఆశపడుతున్నాను. పెళ్లి కూతురిగా కనిపించాలని అనుకుంటాను. తన ప్రాణ స్నేహితుడితో నవీ కేన్సర్ చికిత్స వల్ల జుట్టు రాలిపోవడం నాకు ఎదురైన అత్యంత క్లిష్టమైన సమస్య. దాంతో, నేను అందంగా లేనని నన్ను ఎవరూ ఇష్టపడరని బాధపడ్డాను. ఇక పెళ్లి కూతురిలా కనిపించే అవకాశం లేదని ఆందోళన చెందాను. జుట్టు అనేది మహిళకు 'కిరీటం' లాంటిదని భావిస్తారు. అది లేకపోవడం మనల్ని ఎంతగానో కుంగదీస్తుంది. అయితే, ఏది ఏమైనా అన్నింటినీ స్వీకరించాలని, నన్ను నేను గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నాను. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్వాగతించేందుకు సిద్ధమైపోయాను. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఆ 'పెళ్లికూతురు' చక్కగా నుదుటి మీద తిలకం దిద్దుకున్నారు. లిప్‌స్టిక్, చేతులను, కాళ్లను గోరింటాకుతో అలంకరించుకున్నారు. అందమైన చీర కట్టుకున్నారు. text: హమిద్ అన్సారీ కుటుంబం అతని విడుదలకు సంబంధించిన పత్రాలను వెంటనే తయారు చేయాలని పెషావర్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో అతన్ని భారత్‌కు పంపించనున్నట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి డాక్టర్. మొహమ్మద్ ఫైజల్ వెల్లడించారు. 2012లో ఓ ఫేస్‌బుక్ చాట్‌ కారణంగా హమిద్ ఇండియా నుంచి అఫ్గానిస్థాన్ వెళ్లి అక్కడి నుంచి సరైన పత్రాలు లేక పాక్‌లో చిక్కుకున్నారు. ఆరేళ్ల కిందట మొదలైన ఈ కథ ఇప్పుడు ముగింపునకు వస్తోంది. పాక్‌లోని ఖైబర్ పఖ్తునఖ్వా జిల్లాలోని కొహట్‌లో సరైన పత్రాలు చూపని కారణంగా హమిద్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. మర్దాన్‌లోని జైల్లో మూడేళ్లు హమిద్‌ శిక్ష అనుభవించారు. ముంబై నుంచి కొహట్‌కు హమిద్ ఎందుకు వెళ్లారు? ఇంతకీ ఆయన అక్కడికి వెళ్లడానికి కారణం ఏమిటి? హమిద్ అన్సారీ ఎవరు? ముంబైకి చెందిన హమిద్ అన్సారీ (33) మేనేజ్‌మెంట్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. అక్కడే ఓ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరాలనుకున్నారు. ఆయన తల్లి ఫౌజియా అన్సారీ హిందీ ప్రొఫెసర్‌, తండ్రి బ్యాంకులో ఉద్యోగి, సోదరుడు దంత వైద్యుడు. హమిద్ విడుదల కోసం ప్రయత్నిస్తున్న జతిన్ దేశాయి బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ, 'పాకిస్తాన్‌ను సందర్శించాలని హమిద్ చాలా సార్లు అనుకున్నారు. కానీ, ఆయనకు వీసా లభించలేదు' అని తెలిపారు. హమిద్ పాక్‌కు రావడానికే ముందే ఆయనను కొన్నిసార్లు కలసినట్లు జతిన్ దేశాయి బీబీసీకి చెప్పారు. పాక్‌కు వెళ్లడానికి హమిద్ చాలా ఆతృతగా ఉండేవారని అన్నారు. జతిన్ చెబుతున్నదాని ప్రకారం, పాక్‌లోని కొహట్‌కు చెందిన యువతి హమిద్‌కు సోషల్ మీడియా ఫ్రెండ్. ఆమెను కలవడానికి హమిద్ పాకిస్తాన్‌ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ దేశ విసా కోసం ప్రయత్నించి విఫలమ్యారు. దీంతో కొహట్‌లోని కొందరిని ఫేస్‌బుక్ ద్వారా కలిశారు. కాబుల్ మీదుగా ముంబై నుంచి కొహట్‌కు హమిద్ 2012 నవంబర్ 4న ముంబై నుంచి విమానంలో కాబుల్ చేరుకున్నారు. అక్కడ ఓ విమానయాన సంస్థలో ఇంటర్వ్యూ కోసం వెళుతున్నట్లు ఇంట్లో చెప్పారు. కానీ, కాబుల్ వెళ్లాక అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో హమిద్ కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. మరోవైపు కాబుల్ నుంచి సరైన పత్రాలు లేకుండానే హమిద్ జలాలాబాద్ చేరుకొని అక్కడ సరిహద్దు దాటి టొర్కమ్ మీదుగా పాక్‌లోని కరాక్ చేరుకున్నారు. అక్కడే రెండు రోజులుండి హమాజ్ పేరుతో నకిలీ గుర్తింపు కార్డు సృష్టించి కొహట్‌ చేరుకున్నారు. అక్కడ దర్యాప్తు అధికారులు ఆయనను అరెస్టు చేశారు. హమిద్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యలు అతడి ల్యాప్‌టాప్‌ను పరిశీలించారు. ఈ- మెయిల్, ఫేస్‌బుక్ సంభాషణల ఆధారంగా అతను ఎక్కడికి వెళ్లారో కనుక్కున్నారు. కొహట్‌లోని ఒక యువతి కోసం తమ కుమారుడు పాక్ వెళ్లారని గ్రహించారు. పాక్ యువతి సూచన మేరకే తన కొడుకు అక్కడికి వెళ్లాడని హమిద్ తల్లి చెబుతుండగా, అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించడం వల్లే హమిద్‌ను అరెస్టు చేశామని పాక్ అధికారులు తెలిపారు. హమిద్‌ను ఫేస్‌బుక్‌లో కలిసింది ఎవరు? 'హమిద్ పాక్‌కు వెళ్లడానికి ఆ దేశంలోని కొందరితో ఫేస్‌బుక్‌లో సహాయం కోసం అడిగారు' అని ఈ కేసుపై పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు అంటున్నారు. హమిద్‌కు సంబంధించిన ఫేస్‌బుక్ అకౌంట్లను పరిశీలించే అవకాశం లేదు. కానీ, 2012 మార్చి నుంచి నవంబర్ 2012 వరకు పాకిస్తాన్‌లోని కరాక్‌కు చెందిన రెహమాన్‌తో హమిద్ చాలాసార్లు ఫేస్‌బుక్ చాట్ కొనసాగించినట్లు అతని కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. సబాఖాన్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ నుంచి హమిద్‌ అకౌంట్‌కు మధ్య ఎక్కువ సంభాషణలు కొనసాగాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమాచారాన్ని కోర్టుకు కూడా తెలిపారు. హమిద్ ఆచూకీ కోసం 2012లో ఫౌజా అన్సారీ పెషావర్ కోర్టులో హెబిస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై పాక్ రక్షణ శాఖ సమాధానమిస్తూ హమిద్ అన్సారీ సెక్యూరిటీ ఏజెన్సీ ఆధీనంలో ఉన్నారని, ఆయనపై మిలటరీ కోర్టులో విచారణ కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. గూఢచర్య అభియోగంతో 2016లో హమిద్ అన్సారీకి మిలటరీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. గూఢచర్యం చేయడానికే తాను పాక్ వచ్చినట్లు విచారణలో హమిద్ చెప్పారని అధికారులు తెలిపారు. హమిద్ విడుదల కోసం లాహోర్ జర్నలిస్టు జీనత్ కృషి చేశారు జర్నలిస్టు అదృశ్యం ఈ కేసులో మరో కీలకమైన విషయం పాక్ జర్నలిస్టు జీనత్ షెహజాది అదృశ్యం కావడం. లాహోర్‌లోని స్థానిక చానెల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న జీనత్, హమిద్ కేసుపై పనిచేశారు. తన మీద దయ చూపాలని 2015లో హమీద్ రాసిన లేఖను పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి, మిలటరీ ఇంటెలిజెన్స్ జనరల్ రిజ్వాన్ సత్తార్‌కు ఆమెనే పంపించారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే జీనత్ అదృశ్యం అయ్యారు. పాక్ మానవ హక్కుల న్యాయావాది హీనా జిలానీ వాదన ప్రకారం 19 ఆగస్టు 2015న జీనత్ తన కార్యాలయానికి వెళుతున్న క్రమంలో అదృశ్యం అయ్యారు. టొయోటా వాహనాల్లో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆమె అదృశ్యం తర్వాత వారి ఇంట్లో మరో విషాదకర సంఘటన జరిగింది. జీనత్ సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోదరి అదృశ్యంపై కలత చెంది తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని జీనత్ తల్లి బీబీసీకి చెప్పారు. అదృశ్యం అయిన 27 నెలల తర్వాత అఫ్గానిస్తాన్, పాక్ సరిహద్దుల మధ్య జీనత్ కనిపించారు. ఆమె బయటకు వచ్చాక వారి కుటుంబం మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకుంది. హమిద్ ఎప్పుడు విడుదలవుతారు? హమిద్‌ శిక్షా కాలం డిసెంబర్ 16నాటికి పూర్తైంది. ఆ తర్వాత ఆయనను ఏ కారణంతోనూ జైలులో ఉంచడానికి వీలులేదు. తాజాగా హమిద్ తరఫు న్యాయవాది ఖ్వాజీ ముహ్మద్ బీబీసీతో మాట్లాడుతూ, జైలు అధికారులు, మిలటరీ సిబ్బంది సమక్షంలో మర్దాన్ జైలులో తాను హమిద్‌ను కలిశానని చెప్పారు. హమిద్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేయాలని పెషావర్ హైకోర్టులో ఖ్వాజీ ముహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు డిసెంబర్ 13లోపు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హమిద్‌ను భారత్‌కు పంపించేందుకు డిసెంబర్ 11 నాటికే అన్ని ఏర్పాట్లు చేశామని భారత్ హైకమిషన్‌కు అతడిని అప్పగిస్తామని అంతర్గత వ్యవహారాల శాఖ కోర్టుకు తెలిపింది. భారత్, పాక్‌ల మధ్య గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా వారి దేశాలకు అప్పగించాలి. హమిద్ అన్సారీ తల్లిదండ్రులు కుమారుడి విడుదల కోసం మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు 'మేం రోజులు లెక్కపెడుతున్నాం' ఇరు దేశాలు హమిద్ అన్సారీ విషయాన్ని మానవీయ కోణంలో చూస్తున్నాయని జతిన్ దేశాయి పేర్కొన్నారు. 'కర్తార్‌పూర్ కారిడార్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది. ఒకవేళ మానవీయ కోణంలో హమిద్ భారత్‌కు తిరిగి వస్తే అది రెండు దేశాల మధ్య సఖ్యతను మరింత పెంచుతుంది' అని ఆయన చెప్పారు. హమిద్ త్వరలోనే ఇంటికి వస్తారని వారి కుటుంబ సభ్యులు ఆశిస్తున్నట్లు జతిన్ తెలిపారు. 'వారు రోజులు లెక్కపెడుతున్నారు. తమ కొడుకు సాధ్యమైనంత త్వరగా ఇంటికి రావాలని ఎదురు చూస్తున్నారు' అని హమిద్ తల్లిదండ్రుల పరిస్థితిని జతిన్ వివరించారు. భారత జర్నలిస్టులను ఉద్దేశిస్తూ నవంబర్ 30న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించినప్పుడు సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి.. హమిద్ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ 'దేవుడి దయతో మేం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కేసు విషయం నాకు తెలియదు. తప్పకుండా దీని గురించి తెలుసుకుంటా' అని బదులిచ్చారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించడంతో పాటు గూఢచర్యానికి పాల్పడ్డారనే అభియోగంతో పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న భారత్‌కు చెందిన హమిద్ అన్సారీ డిసెంబర్ 16 నాటికి మూడేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్నారు. text: శ్రీలంక తీరంలో తగలబడిపోతున్న ఈ నౌక క్రమంగా మునిగిపోతోంది. ఈ నౌక 1,486 కంటెయినర్లతో మే 15న గుజరాత్‌లోని హజీరా నౌకాశ్రయం నుంచి బయల్దేరింది. 186 మీటర్ల పొడవైన ఈ నౌకలో చమురు, నైట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలు, సౌందర్య ఉత్పత్తులు తరలిస్తున్నారు. నైట్రిక్ యాసిడ్ లీక్ అవ్వడం వల్ల మంటలు చెలరేగి ప్రమాదం సంభవించి ఉంటుందని శ్రీలంక అధికారులు భావిస్తున్నారు. ఈ నౌక నీటిలో మునిగితే కొన్ని వందల టన్నుల చమురు ట్యాంకులు నీటిలో కలిసే ప్రమాదం ఉంది. ఇది సముద్ర జీవుల వినాశనానికి దారి తీయవచ్చని నిపుణులు అంటున్నారు. గత పది రోజులుగా ఈ నౌకలో చెలరేగుతున్న మంటలను ఆర్పి, నౌక మునిగిపోకుండా చూసేందుకు శ్రీలంక, భారత నౌకా దళాలు చాలా ప్రయత్నించాయి. కానీ, అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, రుతుపవనాలు ఈ పనికి ఆటంకం కలిగించాయి. "ఈ నౌక మునిగిపోతోంది. అయితే, సముద్ర జలాల్లో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేందుకు నౌకను సముద్ర గర్భం లోపలికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, షిప్ వెనుక భాగం నీటిలోకి వెళ్ళిపోయింది" అని శ్రీ లంక నేవీ ప్రతినిధి కెప్టెన్ ఇండికా సిల్వా బీబీసీకి చెప్పారు. ఈ నౌక మునగడం అతి దారుణమైన పర్యావరణ సమస్యలకు దారి తీస్తుందని పర్యావరణ నిపుణులు డాక్టర్ అజంతా పెరీరా బీబీసీ కి చెప్పారు. "ఆ నౌకలో ఉన్న నైట్రిక్ ఆమ్లాలు, చమురుతో పాటు ఉన్న ఇతర ప్రమాదకరమైన వస్తువులు సముద్ర గర్భాన్ని నాశనం చేస్తాయి" అని అన్నారు. అది సముద్రం లోపలికి పంపే ముందు ఆ నౌకను పరిశీలించేందుకు డైవర్లను పంపి ఉండాల్సిందని అజంతా పెరీరా అభిప్రాయపడ్డారు. నెగొంబో తీరంలో ఇప్పటికే కొన్ని రోజులుగా చమురు వ్యర్ధాల కాలుష్యం చోటు చేసుకుంటోంది. అయితే, నెగొంబో పరిసర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించి అత్యవసర చర్యలు చేపట్టినట్లు శ్రీలంక ఫిషరీస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బర్డ్ ఫ్లూ: మనుషులకు H10N3 స్ట్రెయిన్, చైనా తొలి కేసు నమోదు చైనాలో ఒక 41 ఏళ్ల వ్యక్తికి అరుదైన బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. ఈ స్ట్రెయిన్‌కు సంబంధించిన తొలికేసుగా దీనిని ధ్రువీకరించారు. ఈ వైరస్ ఆయనకు ఎలా వచ్చిందనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. కానీ, H10N3 స్ట్రెయిన్ ఒకరి నుంచి ఇతరులకు అంత సులభంగా వ్యాపించదని భావిస్తున్నారు. జియాంగ్సూ ప్రావిన్సులో ఉండే బాధితుడికి గత వారం చేసిన పరీక్షల్లో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం కోలుకున్న ఆయన త్వరలో డిశ్చార్జ్ కాబోతున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌ ద్వారా ఆయనకు వచ్చిన స్ట్రెయిన్ వైరస్ వేరే ఎవరికీ వ్యాపించలేదని అధికారులు గుర్తించారు. "ఝెంజియాంగ్ నగరంలో ఉంటున్న ఆయన ఏప్రిల్ 28న ఆస్పత్రిలో చేరారు. ఒక నెల తర్వాత ఆయనకు పరీక్షల్లో H10N3 ఉన్నట్లు బయటపడింది" అని బీజింగ్ నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం చెప్పింది. "మనుషులకు H10N3 సోకిన కేసులు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాలేదు. కోళ్ల నుంచి మనుషులకు వ్యాపించిన ఇది ఒక అరుదైన కేసు. ఇది భారీగా వ్యాపించే ప్రమాదం చాలా తక్కువే" అని ఎన్‌హెచ్‌సీ చెప్పిందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. H10N3 స్ట్రెయిన్ కోళ్లలో తీవ్ర వ్యాధులకు కారణం కాదని, అది వేగంగా కూడా వ్యాపించదని కమిషన్ చెప్పింది. ప్రస్తుతానికి ఇది మనుషుల్లో ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తున్నట్లు ఎలాంటి సూచనలు కనిపించలేదని డబ్ల్యుహెచ్ఓ రాయిటర్స్‌కు చెప్పింది. ప్రస్తుతం H5N8 వేరియంట్ వల్ల కోళ్లలో వైరస్ వ్యాపిస్తోంది. దీంతో యూరోపియన్ దేశాల్లో కొన్ని లక్షల కోళ్లను గుంతలు తీసి పూడ్చిపెట్టారు. రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న పాక్ ప్రభుత్వం బాలీవుడ్ అలనాటి నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఈ ఇళ్లున్నాయి. ఈ భవనాలను ఇంతకు ముందు ఎలా ఉండేవో అలాగే ఉంచి సంరక్షించనున్నారు. రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇద్దరూ ఆయా భవనాల్లోనే జన్మించారు. ఇప్పుడు వాటికి మరమ్మతులు జరుగుతున్నాయి. రెండు భవనాలను స్వాధీనం చేసుకుని సీల్ వేశామని, వాటిని పురాతత్వ శాఖకు అప్పగిస్తామని పెషావర్‌ డిప్యూటీ కమిషనర్ చెప్పారని ఖైబర్ పంఖ్తుంఖ్వా పురాతత్వ, మ్యూజియం శాఖ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ సమద్ బీబీసీకి చెప్పారు. రెండు భవనాల పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. పెషావర్‌లో రాజ్ కపూర్ కుటుంబానికి చెందిన భవనం ఖైబర్ పంఖ్తుంఖ్వా పురాతత్వ శాఖ 2020 సెప్టెంబర్‌లో ఈ భవనాలకు సంబంధించి పెషావర్ కమిషనర్‌కు ఒక లేఖ రాసింది. తమ విభాగం వాటిని రక్షిత భవనాలుగా ప్రకటించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ భవనాలు రెండింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం మూతపడి ఉన్న ఆ ఇళ్లను పునరుద్ధరించి మ్యూజియంలుగా మారుస్తారని, వాటితోపాటూ, మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌కు సంబంధించిన వస్తువులను కూడా భద్రపరుస్తామని అధికారులు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. పెషావర‌లోని దిలీప్ కుమార్ జన్మించిన భవనం ఈ భవనాల పునరుద్ధరణతో సాంస్కృతిక పర్యటకానికి ప్రోత్సాహం లభిస్తుందని పురాతత్వ శాఖ ఆశిస్తోంది. పెషావర్‌లో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న 188 భవనాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రసాయనాలతో నిండిన సింగపూర్ కి చెందిన ఎక్స్ ప్రెస్ పెర్ల్ నౌక శ్రీలంక తీరంలో కొలంబో ఓడరేవు దగ్గర మునిగిపోతోంది. ఇది పర్యావరణ హానికి దారి తీస్తుందేమోననే భయాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండు వారాల నుంచి ఈ నౌకలో మంటలు చెలరేగుతున్నాయి. text: అలా అరగంట కూర్చున్నానో లేదో మా నర్సు పిలిచింది "మేడమ్, ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయి దాహం అంటోంది" అని చెప్పింది. "మంచి నీళ్లు ఇవ్వమని చెప్పు" అన్నాను. "లేదు మేడమ్ ఆమెతో వచ్చినవారు నీరు ఇవ్వొద్దంటున్నారు" అంది. వెంటనే నేను అక్కడికి పరుగుపరుగున వెళ్లి ఆమెకు దగ్గరుండి నీళ్లు తాగించాను. మా ప్రాంతంలో బాలింతరాళ్లకి మంచినీళ్లు ఎక్కువ ఇవ్వకూడదనీ, ఇస్తే నెమ్ము చేరుతుందనీ, వాతం వస్తుందని.. ఇలా చాలా మూఢ నమ్మకాలున్నాయి. చిన్నచిన్న గ్లాసుల్లో కొలిచినట్లు రోజుకు పావు లీటరుకు మించకుండా తాగిస్తుంటారు. దీంతో శరీరానికి నీరు చాలినంత అందక కొందరు పేషెంట్లు డీహైడ్రేషన్ ,యూరినరీ ఇన్ఫెక్షన్, ఇతర సమస్యల బారిన పడుతుంటారు. అందుకే, ఈ విషయంలో నేను కాస్త కచ్చితంగా ఉంటాను. అదీకాక దాదాపు మూడు తరాల క్రితం మా ఇంట్లో జరిగిన అలాంటి ఒక ఘటన కూడా నన్ను భయపెడుతూ ఉంటుంది. భయపెట్టే చిన్ననాటి జ్ఞాపకం "మా తాతయ్య మొదటి భార్య చనిపోతే మా బామ్మ(నాయనమ్మ) ఆయన రెండో భార్య అయ్యారు. తాతయ్య మొదటి భార్య ఎందుకు చనిపోయారు? అని మేమడిగితే, మా పెదనాన్న ఒకసారి దాన్ని మా కళ్లకు కట్టినట్టు చెప్పారు". "మా తాతయ్య మొదటి భార్యకు కాన్పు అయ్యాక జ్వరం వచ్చింది. అప్పట్లో అంతా ఆయుర్వేద వైద్యమే ఉండేదట. స్వయంగా వాళ్ల నాన్నే ప్రముఖ ఆయుర్వేద వైద్యులట. మా తాత కూడా ఆయన దగ్గరే ఆ వైద్యం నేర్చుకున్నారని మా పెద్దవాళ్లు చెప్పారు. జ్వరం వచ్చిన ఆవిడకి "లంఖణం పరమౌషధం" అని పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదట. దాంతో గొంతెండిపోయిన ఆవిడ కాస్త కొర్ర నీళ్లయినా ఇవ్వమని బతిమాలారని చెబుతారు. మా తాతయ్య మాత్రం "ఉండు మీ నాన్న వస్తున్నారేమో చూసి, ఆయన్నడిగి తాగిస్తాను" అన్నారట. అప్పుడే ఆయన వీధి మలుపు తిరుగుతూ కనిపించారట. ఆయన వస్తున్నాడని తెలియగానే ఆవిడ "ఇంక నేను చావడం ఖాయం" అన్నారని చెప్పారు. ఆయనొచ్చి కూతురిని "నేలమీద ఉమ్ముతావా" అన్నారట. అప్పటికే డీ హైడ్రేషన్లో ఉన్న ఆమె ఉమ్ము కూడా వేయలేకపోయారు. అది చూసి ఆయన "ఉమ్ములో దోషముంది, ఏమీ ఇవ్వకండి" అని వాళ్లకు చెప్పారట. తర్వాత ఆమె చనిపోయారని మా పెదనాన్న చెప్పారు. చిన్నతనం నుంచి ఇప్పటివరకూ నాకు ఆ ఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా భయమేస్తుంది. ఈ మూఢ నమ్మకం మా ప్రాంతానికే పరిమితం అయ్యిందో, దేశమంతా ఉందో నాకు సరిగా తెలీదు. నీళ్లు ఇవ్వకపోతే ఫిట్స్ కూడా రావచ్చు పాశ్చాత్య దేశాలలో సాధారణ కాన్పు అయిన వెంటనే చక్కటి భోజనం పెడతారని తెలుసు. మన ప్రాంతాల్లో నార్మల్ డెలివరీ అయిన వెంటనే భోజనం పెట్టొచ్చని చెప్పినా ఎవరూ వినిపించుకోరు. మూడు రోజులయ్యాక గానీ తిండి పెట్టరు అసలు మామూలుగా ఉన్న వాళ్లకంటే బాలింతరాళ్లకే బలమైన, పరిశుభ్రమైన సమతులాహారం, మంచి నీళ్లు ఎక్కువ అవసరం. కాన్పు అయిన మహిళ తన శరీరంలోని రక్తం, నీరు కోల్పోయి ఉంటుంది. అదీకాక బిడ్డకి పాలివ్వాలంటే ఆమెకు సరైన ఆహారం, మంచినీళ్లూ చాలా అవసరం. పాలిచ్చే ముందు ప్రతి తల్లి రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి. మనవాళ్లు మూఢ నమ్మకాలలో బాలింతరాళ్లను ఊహించలేని పథ్యాలు పెడతారు. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వుంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కారప్పొడులూ, వేపుడు కూరలూ, వెల్లుల్లీ ఎక్కువగా తినిపించి, మజ్జిగ, పెరుగు ఇవ్వడం మానేస్తారు. దాంతో విపరీతంగా దాహం వేస్తుంది. కానీ, అరిచి, గీపెట్టినా చుక్క నీళ్లివ్వరు. ఆ పరిస్థితిలో డీహైడ్రేషన్‌కి గురై వారికి మూత్రం సరిగా రాదు. దాంతో యూరినరీ ఇన్ఫెక్షన్లు, జననాంగాల ఇన్ఫెక్షన్లతోపాటు, అది ఇంకా తీవ్రమైన దుష్పరిణామాలకి కూడా కారణమవ్వవచ్చు. ఒక్కోసారి డీహైడ్రేషన్ తీవ్రం కావడం వల్ల మెదడులో రక్తం గూడు కట్టి ఫిట్స్ కూడా రావచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకునే సిజేరియన్ అయితే ఆరు గంటల తర్వాత, సాధారణ కాన్పు అయితే గంట తర్వాత నేను మంచినీళ్లు, ఇతర ద్రవ పదార్థాలను దగ్గరుండి మరీ తాగిస్తుంటాను. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక కాన్పు చేసి వచ్చిన నేను చెమటలు తుడుచుకుంటూ గదిలోకి వచ్చి కూర్చున్నాను. కాన్పు చేసేటప్పుడు పేషెంటుకే కాదు, మాకూ(డాక్లర్లకు) చెమటలు పడతాయి. సాధారణ ప్రసవమైతే మరీనూ. text: గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్‌గై ఎన్నికైన విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశ్వరావు కుమార్తె. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్లీలత తార్నాక నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. మేయర్ పదవి కోసం బీజేపీ నుంచి ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారి కలెక్టర్ శ్వేతా మహంతి ఓటింగ్ నిర్వహించారు. ఆ తరువాత విజయలక్ష్మి మేయర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది. అంతకు ముందు జీహెచ్ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి అనుమతించడంతో కార్పొరేటర్లు తమకు అనువైన భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత గురువారం ఉదయం నుంచి ఏం జరిగింది... ఇవాళ హైదరాబాద్ మేయర్ ఎన్నిక జరగబోతోంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా సీల్డ్ కవర్ సంస్కృతిని ప్రారంభిస్తూ, టీఆర్ఎస్ పార్టీ రహస్యంగా తమ అభ్యర్థి పేరును ప్రకటించబోతోంది. ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌లో సమావేశం పూర్తయింది. మేయర్, డిప్యూటి మేయర్ అభ్యర్థుల పేర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన సీల్డు కవర్‌లో ఉంటాయి. ఎన్నిక కోసం టీఆర్ఎస్ అభ్యర్థులు బస్సులో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయల్దేరారు. అయితే, కె. కేశవ రావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతలు మేయర్, డిప్యూటి మేయర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నిక ఎప్పుడు మొదట కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం కలెక్టర్ శ్వేతా మహంతి ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఉన్నతాధికారులు దానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అభ్యర్థులు ప్రమాణం చేస్తారు. ఈ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. ట్రాఫిక్ మళ్లించారు. ఎన్నికకు సంబంధం లేని జీహెచ్ఎంసీ ఉద్యోగులను కూడా కార్యాలయంలోకి రానివ్వడం లేదు. మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఇప్పటికే తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేశాయి. తమ ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దించాయి. అయితే సంఖ్యాపరంగా సాధారణ మెజార్టీ ఈ ఎన్నికకు సరిపోతుంది కాబట్టి టిఆర్ఎస్ విజయం లాంఛన ప్రక్రియ మాత్రమే. ఉదయం పదిన్నర తరువాత సమావేశం ప్రారంభం అవుతుంది. ఎన్నికైన ఒక జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మరణించడంతో మిగిలిన 149 మంది ప్రమాణం చేస్తారు. ఎన్నిక ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 12.30 కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పకడ్బందీ లెక్కలు సాధారణ మెజార్టీతో గెలుపు సాధ్యమని తేలడంతో ఎన్ని ఓట్లు వాడాలి, ఎవర్ని వాడాలి అనే అంశంపై టిఆర్ఎస్ తెర వెనుక విస్తృత కసరత్తు చేసింది. మొత్తం ఎన్నికైన సభ్యులు కాకుండా, మరో 44 మంది ఎక్స్ అఫీషియోలు ఉన్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియోలు అందర్నీ ఉపయోగించకుండా, కొందరి ఓట్లు భవిష్యత్తు మునిసిపల్ ఎన్నికలకు పక్కన పెడుతోంది. పూర్తి లెక్కలు ఎన్నికలు పూర్తయ్యాకే తెలుస్తాయి. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో వెళ్తూ గోరటి వెంకన్న పాట ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి అయిన విజయలక్ష్మికి ఎంఐఎం మద్దతు తెలిపింది. డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత ఎన్నికయ్యారు. text: దీనిపై ఇప్పటికే పలు సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి. మంగళవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో నిరసనల హోరు కనిపించింది. బుధవారం మరోసారి ‘చలో అంతర్వేది’కి బీజేపీ, జనసేన సహా వివిధ ధార్మిక, మత సంస్థలు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొందరు నేతలను గృహ నిర్బంధం చేశారు. మరోవైపు.. అంతర్వేదిలో ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువాం నాడు రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ పంపింది. దీంతో.. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవో వెలువడనుంది. అంతర్వేదిలో కాలిపోయిన రథం కారణాలపై పలు ఊహాగానాలు సెప్టెంబరు 5 అర్ధరాత్రి దాటిన తరువాత అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయింది. సుదీర్ఘకాలంగా ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఈ రథాన్ని వినియోగించేవారు. అంతర్వేది రథోత్సవం అత్యంత ఉత్సాహంగా సాగేది. భక్తులు పవిత్రంగా భావించే ఈ రథం మంటల్లో కాలిపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. తొలుత షార్ట్ సర్య్యూట్ అని, ఆ తర్వాత తేనె సేకరణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదం అని ప్రచారం జరిగింది. ఏదీ నిర్ధరణ కాకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు డీఐజీ, విశాఖ రేంజ్ డీఐజీతో పాటు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంతర్వేదిలో, అంతర్వేదికి వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు క్లూస్ టీమ్, డాగ్ స్క్యాడ్ సహాయంతో విచారణ చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు. వారిలో అంతర్వేది ఆలయ సిబ్బంది కూడా ఉన్నారనే ప్రచారం సాగింది. కానీ పోలీసులు నిర్ధరించలేదు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఇప్పటికీ నిర్ధరణకు రాలేదు. పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉందని చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. నిందితులను గుర్తించాలని కోరుతూ ఆందోళన తీవ్రతరం మరోవైపు హిందూ సంస్థలు, ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. అంతర్వేది ఆలయం వద్ద ఆందోళన చేపట్టాయి. అదే సమయంలో ఘటనా స్థలంలో ఉన్న మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్ సహా పలువురిని ఆందోళనకారులు నిలదీశారు. ఆ సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుపై రాళ్లు రువ్వడంతో మంత్రులను ఆలయం లోపలికి తీసుకెళ్లి పోలీసులు భద్రత కల్పించారు. నిరసనకారులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయాలకు భద్రత కల్పించాలని, రథం కాలిపోయిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భజరంగదళ్ ప్రతినిధి రవికుమార్ మాట్లాడుతూ ‘‘ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. అంతర్వేది ఆలయం రథం విషయం సీరియస్‌గా తీసుకోవాలి. కారకులను కఠినంగా శిక్షించాలి. హిందూమత ఆలయాలకు అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలి. ఏదయినా జరిగిన తర్వాత స్పందించడం కాదు. ఆలయాల రక్షణ కోసమే మా ఆందోళన. వెంటనే స్పందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం’’ అన్నారు. మంత్రుల బృందం పర్యటన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు అంతర్వేది ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు అంటున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘అంతర్వేది అగ్ని ప్రమాద సంఘటన స్థలం వద్ద డీఐజీ క్యాంప్‌ను ఏర్పాటు చేశాం. పరిసరప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఫోరెన్సిక్ శాఖ కు చెందిన నిపుణులను కూడా తీసుకొచ్చాం. సంఘటన స్థలంలో అణువణువూ నిషితంగా గుర్తిస్తున్నాం. అయినప్పటికీ కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నించారు. అంతర్వేది పరిసరాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇతరులు ఎవ్వరు ఈ ప్రాంతానికి రావద్దు. అపోహలు విశ్వసించవద్దు. సామరస్యంగా ఉండాలని కోరుతున్నాం. విచారణ పూర్తికాగానే అన్ని వివరాలు వెల్లడిస్తా’’మని చెప్పారు. ‘చలో అంతర్వేది’కి పిలుపు.. నాయకుల గృహ నిర్బంధం మంగళవారం నాటి ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ‘చలో అంతర్వేది’కి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యలకు దిగారు. పలువురు సీనియర్ బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే, అమలాపురం నియోజకవర్గ అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా సహా రాజమండ్రిలో పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే గృహ నిర్బంధం చేస్తున్నట్టు రాజమహేంద్రవరం ఎస్పీ షీమోజీ బాజ్‌పాయ్ బీబీసీకి తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన కలకలం రేపుతోంది. రాజకీయంగానూ వివాదంగా మారింది. text: అనకున్నంతా అయింది. అంచనా నిజమేనని తేలింది. జీడీపీ గ్రోత్ రేటు పతనమై నాలుగున్నర శాతానికి చేరింది. కొంతకాలం ముందు రాయిటర్స్ వార్తా సంస్థ ఆర్థికవేత్తలతో ఒక సర్వే చేసింది. అందులో ఈ రేటు ఐదు శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేశారు. కానీ వారు కూడా ఈ గణాంకాలు 4.7 శాతం వరకే ఉంటాయని భావించారు. ఇప్పుడు వచ్చిన గణాంకాలు, శాస్త్రవేత్తల అంచనాల కంటే మరింత ఘోరంగా ఉన్నాయి. గత ఆరేళ్లలో అత్యంత ఘోరమైన గణాంకాలు ఇవే. ఇంతకు ముందు 2013లో జనవరి నుంచి మార్చి మధ్య ఈ రేటు 4.3 శాతం దగ్గర ఉంది. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, జీడీపీ పెరగాల్సినప్పుడు వరుసగా ఆరో త్రైమాసికం ఈ పతనం నమోదైంది. అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే, ఇండస్ట్రీ గ్రోత్ రేటు 6.7 శాతం పతనమై సగం పర్సెంట్ మాత్రమే ఉండిపోయింది. ఇందులో కూడా మానుఫ్యాక్చరింగ్, అంటే పరిశ్రమల్లో తయారయ్యే వస్తువుల వృద్ధి స్థానంలో సగం పర్సెంట్ పతనం నమోదైంది. అటు వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4.9 నుంచి పడిపోయి 2.1 శాతానికి, సర్వీసెస్ రేటు కూడా 7.3 శాతం నుంచి పడిపోయి 6.8కి చేరింది. జీడీపీని ఎలా అర్థం చేసుకోవాలి? జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. తెలుగులో దీనిని స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీనికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా, ఏదైనా, ఎంత తయారవుతున్నా, ఎవరైనా ఎంతైనా సంపాదిస్తున్నా, వాటన్నిటి పూర్తి మొత్తం అని అర్థం. ఆదాయాన్ని బట్టి చూస్తే దీన్ని లెక్కలేయడం అంత సులభం కాదు. అందుకే ఇక్కడ ఖర్చు ప్రకారం లెక్కలు వేయడం సులభంగా ఉంటుంది. ఏదైనా కొనడానికి అయిన మొత్తం ఖర్చు జీడీపీ అవుతుంది. జీడీపీలో వృద్ధినే జీడీపీ గ్రోత్ రేట్ అంటారు. దాని ప్రకారం దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో లెక్కలు వేస్తారు. ఇక్కడ దానితోపాటు పర్ కాపిటా జీడీపీ అంటే దేశంలో తలసరి జీడీపీ ఎంతుంది, అనే గణాంకాలు కూడా జారీ చేస్తారు. ఈ తలసరి లేదా పర్ కాపిటా గణాంకాలు దిగువన ఉంటే, దేశ పౌరులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారి అవసరాలు తీర్చుకోవడం కష్టం అవుతోందని, లేదా అవసరాలు తీరడం లేదని నేరుగా అర్థం చేసుకోవచ్చు. ఈ గణాంకాలు ఎక్కువగా ఉంటే పౌరుల జీవితం మెరుగ్గా ఉందని అర్థం. అంతమాత్రాన దేశంలో పేదరికం, పస్తులు లేవనే అర్థం రాదు. ఎందుకంటే అది సగటు అవుతుంది. అమెరికా సగటు పర్ కాపిటా జీడీపీ 55 వేల డాలర్లకు దగ్గరగా ఉంటుంది. కానీ అక్కడ కూడా దాదాపు 10 శాతం జనాభాకు పూటగడవడం కష్టంగా ఉంది. గణాంకాలు కలిగిస్తున్న ఆందోళన భారత్‌లో తలసరి జీడీపీ ఈ ఏడాది మార్చిలో 2041 డాలర్లు అంటే సుమారు ఒక లక్ష 40 వేల రూపాయలు. ఈ వార్షికాదాయంతో చాలా మంది ముంబయి లాంటి నగరాలలో ఇప్పటికీ కుటుంబాలను పోషిస్తున్నారు. కానీ ఇది సగటు. అంటే కొంతమంది దీనికంటే వేలు, లక్షల రెట్లు సంపాదిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. దేశ జనాభాలోని ఒక పెద్ద భాగం ఇందులో పదో వంతు, లేదా వందో వంతు భాగం కూడా సంపాదించలేకపోతోంది. కానీ అది సమానత్వంపై చర్చ, అది పూర్తిగా వేరే అంశం కూడా. జీడీపీ త్రైమాసికం గణాంకాలు ఎందుకు ఇంత ఆందోళన కలిగిస్తున్నాయి అంటే, గత ఏడాదిన్నరలో ఇది అంతకంతకూ పడిపోతూ గత ఆరేళ్లలో అత్యంత బలహీనమైన స్థాయికి చేరుకుంది. దీనితోపాటూ మరో అతిపెద్ద ఆందోళన ఏంటంటే ప్రస్తుత స్థితిని మెరుగుపరిచే అవకాశం కూడా అనిపించడం లేదు. చాలామంది ఆర్థికవేత్తలకు అనిపిస్తున్న దాని ప్రకారం ఈసారీ పతనం పెరగడం అంటే మొత్తం ఏడాదిలో దాన్ని మెరుగుపరచడం కష్టం అని అర్థం. అంటే వారు మొత్తం ఆర్థిక సంవత్సరం అభివృద్ధి వేగంలో ఇప్పుడే పతనం చూస్తున్నారు. అది కూడా, దీనిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఒకటి కాదు ఎన్నో చర్యలు చేపడుతున్న సమయంలో.. ప్రభుత్వం ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థికవ్యవస్థను రూపొందించాలని ఒక లక్ష్యం పెట్టుకుని కూచుంది. కాలుక్యులేటర్లో లెక్కలు చేస్తే, దానికి జీడీపీ గ్రోత్ రేట్ 12 శాతానికి పైన ఉండాలని తెలుస్తుంది. భారత్ గత పదేళ్ల నుంచీ 10 శాతం పర్సెంట్ గ్రోత్ కలలు కంటోంది. సాధారణంగా ఏడాదికి 7 నుంచి 8 మధ్య పెరుగుతూ కూడా వచ్చింది. గత ఏడాది రేటు పతనమైప్పటికీ అది 7 శాతం ఉంది. కానీ, ఇప్పుడు ఇందులో మరింత పతనం వస్తే తీవ్రంగా ఆందోళన కలిగించే లక్షణం అవుతుంది. ఉద్యోగాలు పోతాయనే భయం ఇక్కడ, ఆందోళనకలిగించే అంశం ఏంటంటే, ఖర్చుల్లో అత్యంత వేగంగా పతనం కనిపిస్తోంది. అది కూడా సామాన్యుల ఖర్చులు అంటే కంజుమర్ స్పెండింగ్‌లో ఉంది. అంటే జనం వస్తువులు కొనడం లేదు. ఖర్చులో కోతలు పెట్టుకుంటున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బును బాగా ఆలోచించి ఖర్చు పెడుతున్నారు. దాని ప్రభావం వల్ల ఖర్చు లేకపోతే వస్తువుల అమ్మకం ఉండదు. అమ్మకాలు లేకుంటే, తయారీదారులు, వ్యాపారులు, కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. వీళ్లు కష్టాల్లో ఉండే వారి ఉద్యోగులు కూడా సమస్యల్లో ఉంటారు. జీతాలు పెరగవు. అశలు రాకపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాలు పోతాయనే భయం కూడా ఉంటుంది. చాలామంది ఉద్యోగాలు పోయాయి కూడా. చుట్టూ అలాంటి వార్తలు వినిపిస్తుంటే, ప్రజలు దేశంలో అభివృద్ధి జరగలేదనే నమ్మకంతో ఉన్నారనే అర్థం. ఇప్పటివరకూ ప్రభుత్వం ఏం చేసిందో, అదంతా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే, డబ్బులు సిస్టంలోకి రావడం, పరిశ్రమలను వృద్ధి చెందితే అభివృద్ధి పెరుగుతుంది అనే దారిలోనే సాగింది. కానీ రుణాలు చౌకగా ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో మాంద్యం లేదు అంటారు. ఆర్థికశాస్త్రం సిద్ధాంతాల ప్రకారం ఆమె మాట నిజమే కావచ్చు. నిర్వచనాల ప్రకారం ఇది మాంద్యం కాదు. దీనిని ఇంగ్లీషులో రిసెషన్ అంటారు. ఆర్థిక మంత్రి ఇది బహుశా స్లో- డౌన్ అన్నారు. స్లో డౌన్‌ను మందగమనం అటారు. మందగమనం వాదన ఇప్పుడు ఈ స్లో డౌన్‌కు పరిష్కారం ఏంటనేదే ప్రశ్న. వినియోగదారుల మనసులో తాము జేబుపై చేయి వేసుకుని మరీ డబ్బులు ఖర్చు పెట్టచ్చు అనే నమ్మకం ఎలా కలిగిస్తారు. దానికి ఒకే ఒక దారుంది. జాబ్ మార్కెట్‌లో వృద్ధి తీసుకురావడం. ప్రజలకు చేతుల్లో ఒక ఉద్యోగం ఉందని కనిపించినపుడు, తమ ముందు రెండు ఆఫర్లు కూడా ఉన్నాయని అనిపించినప్పుడు వారిలో ఒక ఉత్సాహం వస్తుంది. సంపాదించే ముందే ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు. ఈ పరిస్థితి ఎలా వస్తుంది. దానికి నిపుణులు చాలా సూచనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు ఏ సూచన కనిపిస్తే దానిని అమలు చేసి చూసేద్దామనే మరో సమస్య కూడా కనిపిస్తోంది. దానివల్ల షేర్ మార్కెట్ నడిచిపోతుండవచ్చు. కానీ ఆర్థికవ్యవస్థను ముందుకు నడపడం కష్టం. ఇప్పుడు ఆర్థిక సలహా మండలిలో కొత్తగా వచ్చిన నిపుణులకు చాలా అనుభవం ఉంది. వారు చాలా పనికొచ్చే కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం కనీసం ఆ సూచనలపై అయినా దృష్టి పెట్టాలి. నోట్లరద్దు జరిగిన వెంటనే జీడీపీ గ్రోత్ రేటులో ఒకటి నుంచి ఒకటిన్నర శాతం పతనం రావచ్చని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంచనా వేశారు. ఇప్పుడు అది నిజమవుతూ కనిపిస్తోంది. కనీసం ఆయనతో మాట్లాడైనా ఈ వ్యాధికి చికిత్స ఏంటో అడగవచ్చు. తాజా గణాకాలు వచ్చాక.. మాంధ్యం, మందమనం లాంటి సాంకేతిక పరిభాషలో, రిసెషన్ లేదా స్లో డౌన్ లాంటి పదాల తేడాలు చూపించడంలో పడిపోకుండా ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ప్రభుత్వం తీవ్రంగా అనుకోవాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడ్డానికి పార్టీలను పక్కనపెట్టి అందర్నీ కలుపుకుని పోవాలి. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే వైపు మందుకువెళ్లాలి. (రచయిత సీఎన్‌బీసీ ఆవాజ్ మాడీ ఎడిటర్. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గత త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గ్రోత్ గణాంకాలు విడుదలయ్యాయి. text: గీచి మత్సుమురా ఆయన పేరు గీచి మత్సుమురా. ఆయన 1945 ఆగస్టులో చనిపోయారు. నాటి యుద్ధ కాలంలో జపనీస్ మూలాలున్న ప్రజలను నిర్బంధించేందుకు కాలిఫోర్నియాలోని మాంజనర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాడు నిర్బంధ కేంద్రంలోని మరికొందరు బందీలతో కలిసి మత్సుమురా పర్వత ప్రాంతంలో సుదూర నడకకు వెళ్లారు. బొమ్మలు వేయడం ఆయన అభిరుచి. బొమ్మలు వేసేందుకు మత్సుమురా ఈ బృందం నుంచి వేరుపడ్డారు. ఇంతలో ఆకస్మికంగా వచ్చిన ఒక అసాధారణ తుపాను వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాలక్రమంలో మత్సుమురా వివరాలు అందుబాటులో లేకుండా పోయాయి. 2019లో మళ్లీ ఆయన వివరాలు వెలుగు చూశాయి. 1942లో మత్సుమురా కుటుంబాన్ని అమెరికా సైన్యం ఇంటి నుంచి బలవంతంగా పంపించి వేసింది టైలర్ హోఫర్, బ్రాండన్ ఫోలిన్ కాలిఫోర్నియాలోని మౌంట్ విలియమ్సన్ సమీప ప్రాంతంలో సంచరిస్తుండగా, దెబ్బతినని ఒక అస్థిపంజరం కనిపించింది. కొంత భాగంపై రాళ్లు ఉన్నాయి. అస్థిపంజరంలో నడుము చుట్టూ బెల్టు, కాళ్లకు లెదర్ షూస్ ఉన్నాయని, చేతులు కట్టుకొన్న భంగిమ కనిపించిందని వార్తాసంస్థ 'అసోసియేటెడ్ ప్రెస్' తెలిపింది. దశాబ్దాల కిందట ఆచూకీ తెలియకుండా పోయిన వ్యక్తుల రికార్డులను ఇన్యో కౌంటీ పోలీసులు పరిశీలించారు. అస్థిపంజరంలో కనిపించిన ఆనవాళ్లతో ఎవరి వివరాలూ సరిపోలలేదు. మాంజనర్ నిర్బంధ కేంద్రంపై 2012లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అప్పుడు మత్సుమురా మరణం చర్చలోకి వచ్చింది. ఆయన మరణానికి సంబంధించిన భాగం తుది డాక్యుమెంటరీలో లేదు. అయితే దర్శకుడు కోరీ షియోజాకి మత్సుమురా మరణం గురించి డాక్యుమెంటరీ ప్రదర్శన సందర్భంగా మాట్లాడారు. మత్సుమురా మనవరాలు లోరి ఇచ్చిన నమూనా సాయంతో ఈ అస్థిపంజరానికి అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు జరిపించారు. పర్వతాల్లో ఎక్కడో ఒక చోట తన తాత అస్థిపంజరం ఉందని తనకు తెలుసని, ఆయన మృతదేహంపై ఉంచిన రాళ్ల ఫొటోను అవ్వ తనకు చూపించేదని లోరి అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. ఆయన్ను 'ది ఘోస్ట్ ఆఫ్ మాంజనర్'గా వ్యవహరించేవారని తమ సమీప బంధువు కాజువే చెప్పారని ఆమె వెల్లడించారు. పర్వతాల్లో మత్సుమురాను ఖననం చేసిన తర్వాత నిర్బంధ కేంద్రం వద్ద బౌద్ధ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు జపాన్ సంతతి ప్రజలను నిర్బంధించేందుకు అమెరికా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పది నిర్బంధ కేంద్రాల్లో మాంజనర్ కేంద్రం ఒకటి. చేపలు పట్టడానికో లేదా ఇతర అభిరుచుల వల్లో నిర్బంధ కేంద్రంలోని బందీలు ఎక్కువగా బయటకు వచ్చేవారని రికార్డులు చెబుతున్నాయి. మత్సుమురా ఈ కేంద్రం నుంచి బయటకు వచ్చే సమయానికి బందీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు తొలగించింది. నిర్బంధ కేంద్రం నుంచి సమీపంలోని సియెర్రా నెవడాలో ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని సరస్సుల్లో చేపలవేటకు బయల్దేరిన బృందంలో మత్సుమురా భాగమయ్యారని ఇన్యో కౌంటీ పోలీసులు ఒక ప్రకటనలో చెప్పారు. కొంత సేపటి తర్వాత ఆయన, బొమ్మ వేసేందుకు ఈ బృందం నుంచి వేరుపడ్డారని తెలిపారు. బొమ్మలు వేయడం ఆయనకు మాంజనర్ నిర్బంధ కేంద్రంలో అలవాటు అయ్యుండొచ్చు. హఠాత్తుగా బలమైన తుపాను విరుచుకుపడింది. తుపాను తీవ్రత తగ్గిన తర్వాత మత్సుమురా వెంట వచ్చిన ఇరత బందీలు ఆయన ఆచూకీ కోసం గాలించారు. కానీ జాడ గుర్తించలేకపోయారు. పర్వతాల్లో తిరుగుతున్న ఒక జంటకు 1945 సెప్టెంబరు 3న మత్సుమురా భౌతికకాయం కనిపించింది. కొన్ని రోజుల తర్వాత మాంజనర్ అధికారులు ఒక చిన్న బృందాన్నిమత్సుమురా భౌతికకాయం కనిపించిన చోటకు పంపి, దానిని అక్కడే పూడ్చిపెట్టించారు. మృతదేహం కనిపించిన పర్వత ప్రాంతం చాలా ఎత్తైనది కావడం వల్ల అక్కడి నుంచి దానిని కిందకు తీసుకురావడం కష్టమని భావించి వాళ్లు అలా చేశారు. మాంజనర్ నిర్బంధ కేంద్రం ప్రస్తుతం మ్యూజియం, స్మారక కేంద్రంగా ఉంది. 1945 నవంబరు 21న మాంజనర్ నిర్బంధ కేంద్రాన్ని ప్రభుత్వం శాశ్వతంగా మూసివేసింది. నాడు నిర్బంధించిన చాలా కుటుంబాల మాదిరే మత్సుమురా కుటుంబీకులకు సొంతంగా ఇల్లు కానీ వ్యాపారం కానీ లేవని, నిర్బంధ కేంద్రం మూసివేసే వరకు వాళ్లు అక్కడే కొనసాగారని పోలీసులు ప్రకటనలో తెలిపారు. నిర్బంధ కేంద్రం మూసేశాక మత్సుమురా కుటుంబం కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉన్న శాంటా మోనికా నగరానికి చేరుకుంది. అప్పటికి మూడేళ్ల ముందు అంటే 1942లో అమెరికా సైన్యం తమను ఇళ్ల నుంచి బలవంతంగా పంపించే వరకు ఈ కుటుంబం అక్కడే ఉండేది. 2019లో మత్సుమురా సమాధిని చూశామని హైకింగ్‌కు వెళ్లిన కొందరు చెప్తే తాము దిగ్భ్రాంతి చెందామని మాంజనర్ పోలీసు అధికారి బెర్నాడెటే జాన్సన్ చెప్పారు. మత్సుమురాను గుర్తించినందున ఆయన కుటుంబానికి కొంత మనశ్శాంతి దక్కుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు మాంజనర్ నిర్బంధ కేంద్రం నాటి బందీల మ్యూజియంగా, స్మారక కేంద్రంగా ఉంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలోని కాలిఫోర్నియాలో అక్టోబరులో కనిపించిన ఒక అస్థిపంజరం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నిర్బంధ కేంద్రంలో ఉంచిన జపనీస్-అమెరికన్ కళాకారుడిదని గుర్తించారు. text: పెద్దలు చెప్పినట్లు, ఆడవాళ్లు యంత్రాల్లా పిల్లల్ని కనాల్సిందేనా? ఇలాంటి విషయాలపై ప్రపంచవ్యాప్తంగా సునిశిత చర్చ జరగాలంటున్నారు.. వాషింగ్టన్ డీసీలో స్థిరపడిన పాకిస్తాన్‌ యువతి జైనాబ్ అమిన్. జైనాబ్‌లాగే అమెరికాలోని చాలామంది దక్షిణాసియా యువతులు ఇలాగే అభిప్రాయ పడుతున్నారు. పిల్లల్ని కనడమే కాదు.. వారి పెంపకం పట్ల కూడా వారు ఆసక్తి చూపించడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం అక్కడ ప్రతీ ఐదుగురిలో ఒకరు పిల్లల్ని కనేందుకు ఇష్ట పడటం లేదు. "పిల్లల్ని కనాలా వద్దా అనేది ఆ యువతి ఇష్టం. తప్పనిసరిగా కనాల్సిందే అనే కట్టుబాటు ఉండకూడదు" అని వారు చెబుతున్నారు. “అమ్మాయిలకు భర్త, పిల్లలు ఉండటం తప్పనిసరేం కాదు” పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇంతకీ పిల్లలు వద్దని వాళ్లు ఎందుకు అనుకుంటున్నారు? వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వాషింగ్టన్ డీసీలో ఉంటున్న దక్షిణాసియా యువతులతో బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ అబ్బాసి మాట్లాడారు. అందులో ఒకరు జైనాబ్ అమిన్. ఆమె స్వస్థలం పాకిస్తాన్‌లోని లాహోర్. ఏడేళ్ల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఒక అంతర్జాతీయ సంస్థలో ఆమె మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నారు. పిల్లల విషయంలో ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో జైనాబ్ మాటల్లోనే చూద్దాం. గర్భాశయం, అండాశయం ఉందని పిల్లల్ని కనేయాలా? తల్లి కావడం అనేది యువతి ఇష్టం. ఆమెకు ఇష్టం ఉంటే కంటుంది..లేదంటే లేదు. ఆమె పిల్లల్ని కనాల్సిందే అని ఒత్తిడి తెచ్చే అధికారం ఎవ్వరికీ లేదు. తల్లి కావడమే ఒక మహిళ పనా? ఆ ఒక్క అంశం ఆధారంగానే ఆమెను అంచనా వేయవద్దు. దాన్ని మించిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను సంతోషంగా ఉండాలంటే తప్పనిసరిగా భర్త, పిల్లలు ఉండాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నా. కేవలం భర్త, పిల్లలు ఉంటే ఆ ఇల్లు అందమైన నందనవనం అవుతుందా? ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయా? లేదంటే నేను ఎక్కడైతే / ఎలాగైతే ఆనందంగా ఉంటానో అదే నా ఇల్లు అనుకోవాలా? స్వార్థం కోసమే పిల్లల్ని కంటున్నారు! ప్రజలు తమ స్వార్థం కోసం పిల్లల్ని కంటున్నారు. సొంత ఆనందం కోసం మరో ఆలోచన లేకుండా పిల్లల్ని కని పడేస్తున్నారు. పిల్లల్ని కనడమే కాదు..వాళ్లను పెంచడం కూడా చాలా పెద్ద బాధ్యత. పిల్లల్ని కంటే చాలు వాళ్లంత వాళ్లే పెరుగుతారని మా సమాజంలో అనుకుంటారు. పిల్లల మానసిక, శారీరక పరిస్థితి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఒక బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడంపై ఎవరూ దృష్టి పెట్టారు. నా వరకైతే పిల్లల్ని కని పెంచడం చాలా పెద్ద బాధ్యత. నేనా బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా లేను. సంతానం లేకుండా జీవితం ఎలా? నాకు స్వేచ్ఛ ఉంది. స్వాతంత్ర్యం ఉంది. ఎలాంటి బాధ్యతలు లేవు. నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను. మరెవరికో నచ్చేలా ఉండాల్సిన పనిలేదు. మరొకరి అంచనాలకు తగ్గట్టుగా నా ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు. నా తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకుంటారు. ఒకవేళ వారు మరోలా ఆలోచించినా.. వాళ్ల అభిప్రాయాలు నాపై రుద్దరు. వాళ్లకు నచ్చినట్లు ఉండాలని నాపై ఒత్తిడి తీసుకురారు. పిల్లలు వద్దనుకుంటే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరని నా స్నేహితులు నన్ను హెచ్చరిస్తూ ఉంటారు. చివరికి నీకు మగతోడు కూడా దొరకదని చెప్పారు. కానీ వారితో నేను విబేధిస్తాను. కేవలం సెక్స్, పిల్లల్ని కనడం కోసమే నేను కావాలనుకునే వ్యక్తిని నేను అస్సలు పెళ్లే చేసుకోను. నన్ను నన్నుగా ఇష్టపడాలి అన్నారు.. జైనాబ్ అమిన్. పిల్లలు వద్దనుకునే మహిళల సంఖ్య రెట్టింపు! పిల్లలు వద్దనుకునే అమెరికా మహిళల సంఖ్య 1976తో పోలిస్తే రెట్టింపు అయిందని 2010లో పీఈడబ్ల్యూ కేంద్రం చేసిన అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ప్రతీ ఐదుగురిలో ఒకరు పిల్లల్ని కనాలనుకోవడం లేదు. దీనికి వారు వివిధ కారణాలు చెబుతున్నారు. వాటిలో ప్రధానమైనవి ఇవి. పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా పిల్లల్ని కనాలనే రూలేం లేదు అని జైనాబ్ లాంటి వాళ్లు చెబుతున్నారు. ఈ విషయంలో అమ్మాయిలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని చెబుతున్నారు. పిల్లల్ని కనాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహిళకు మాతృత్వం తప్పనిసరా? పిల్లలు కనడంపై వారి ఇష్టానికి విలువలేదా? text: వినాయక చవితి సందర్భంగా ఇచ్చిన ఈ ప్రకటనలో.. ‘‘మీరు ఒక గాడిదను పూజిస్తారా? ఏనుగును పూజిస్తారా? మీరే ఎంచుకోండి’’ అంటూ రాజకీయ సందేశాన్ని కూడా పేర్కొంది. డెమొక్రాట్ల రాజకీయ చిహ్నం గాడిద కాగా, రిపబ్లికన్ల రాజకీయ చిహ్నం ఏనుగు. ఈ ప్రకటన సమస్యాత్మకమైనదని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) తెలిపింది. టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయం దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ కార్యాలయమే స్థానిక పత్రికలో ఈ ప్రకటన ఇచ్చింది. ‘‘ముఖ్యమైన హిందూ పండుగ సందర్భంగా హిందువులను దగ్గర చేసుకునేందుకు రిపబ్లికన్ పార్టీ చేసిన ప్రయత్నం అభినందనీయమే కానీ, ఈ ప్రకటన హిందూ దైవం వినాయకుడిని.. ఒక రాజకీయ పార్టీ గుర్తు అయిన జంతువు చిహ్నంతో పోల్చడం సమస్యాత్మకం, అభ్యంతరకరం’’ అని హెచ్ఏఎఫ్ బోర్డు సభ్యుడు రిషి భుటాడ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. చాలామంది హిందువులు ఈ అభ్యంతరకర ప్రకటనను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. రిపబ్లికన్ పార్టీ స్పందన కోరారు. విమర్శలు, ఆగ్రహాల నేపథ్యంలో పార్టీ స్పందిస్తూ.. ఈ ప్రకటన ఇచ్చింది హిందూ సంప్రదాయాలను, పద్ధతులను అప్రతిష్టపాలు చేయటానికి కాదని తెలిపింది. ‘‘ప్రకటన వల్ల ఎవరైనా మనస్తాపానికి గురైనట్లైతే మేం క్షమాపణలు చెబుతున్నాం. మా ఉద్దేశమైతే కచ్చితంగా అది కాదు’’ అని ఫోర్ట్ బెండ్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ ఛైర్మన్ జాసీ జెట్టన్ స్థానిక విలేకరులకు తెలిపారు. పార్టీ క్షమాపణలు చెప్పిన వెంటనే.. క్షమాపణల్ని ఆమోదిస్తున్నామని హెచ్ఏఎఫ్ తన ప్రకటనను సవరించింది. ‘‘మున్ముందు ఫోర్ట్ బెండ్‌లోని హిందువులు, ఇతర మతస్థులకు దగ్గరయ్యేందుకు ఇలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది బహిరంగ ప్రశ్న’’ అని భుటాడ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హిందువులను ఆకర్షించేందుకు ఇచ్చిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ క్షమాపణలు తెలిపింది. text: ప్రపంచంలోని అత్యంత కాలుష్యమయ నగరాల్లో దిల్లీ ఒకటి. గాలి నాణ్యత తరచూ ప్రమాదకర స్థాయులకు చేరుతుంటుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పచ్చదనం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం కాలుష్యాన్ని ఎంతో కొంత నియంత్రిస్తోందని చెప్పొచ్చు. అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా ఈ పచ్చదనం కూడా తగ్గిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం దిల్లీ నడిబొడ్డున వేల చెట్లను నరికివేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన గురించి వినగానే తనకు దిగ్భ్రాంతి కలిగిందని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించినవారిలో ఒకరైన 48 ఏళ్ల జుహీ సక్లానీ చెప్పారు. చెట్లను ప్రేమించేవారికి, కాలుష్యాన్ని చెట్లు తగ్గిస్తాయని నమ్మేవారికి ప్రభుత్వ ప్రతిపాదన తప్పుడు ప్రతిపాదనగా అనిపించిందని తెలిపారు. ఇదే తమను చెట్ల పరిరక్షణకు పోరాటం జరిపేలా చేసిందన్నారు. 2016 జులైలోనే ప్రతిపాదనకు ఆమోదం దిల్లీలోని ఏడు ప్రాంతాల్లో వేల చెట్లను నరికేయాలనే ప్రతిపాదన 2016 జులైలోనే ఆమోదం పొందింది. ఒక్క ప్రాంతంలోనే దాదాపు 11 వేల చెట్లను నరికివేయనున్నారని గత నెల్లో మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత దీనిపై చర్చ రేగింది. చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు పర్యావరణవేత్తలు, కాలుష్య వ్యతిరేక పోరాట సంఘాల ప్రతినిధులు సహా దిల్లీలోని వందల మంది పౌరులు తక్షణం నడుం కట్టారు. అతికొద్ది సమయంలోనే అందరూ సంఘటితమయ్యారు. వృక్షాల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో మద్దతు కూడగట్టేందుకు పర్యావరణ కార్యకర్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో, వాట్సప్‌ లాంటి మెసేజింగ్ సర్వీస్‌లలో ఈ పోరాటానికి మద్దతు పెరిగింది. వివిధ మార్గాల్లో వెయ్యి మందికి పైగా ప్రజలు నిరసన తెలిపేందుకు ఈ పోరాటం ప్రేరణ అందించింది. బైఠాయింపులు, వర్క్‌షాప్‌లు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, ధ్యానం రూపంలో ప్రదర్శనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, చెట్లను కాపాడేకొనేందుకు నిరంతర కాపలా.. ఇలా పర్యావరణ కార్యకర్తలు చాలా ప్రయత్నాలు చేశారు. దిల్లీలో వాయు కాలుష్యం కారణంగా అత్యంత తీవ్రమైన ప్రభావం పడుతోంది పిల్లలపైనే స్వచ్ఛమైన గాలి ప్రజల హక్కు పర్యావరణం, యువత అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ 'స్వేచ్ఛ'కు చెందిన విమలేందు ఝా బీబీసీతో మాట్లాడుతూ- స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు ప్రజలకున్న హక్కును చెట్లను నరికివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదన కాలరాస్తోందని వ్యాఖ్యానించారు. పౌరుల హక్కులను, పర్యావరణాన్ని సంరక్షించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వాతావరణ కాలుష్యంలోంచి ప్రజలను బయటపడేసేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వమే సమస్యను మరింత తీవ్రతరం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. దిల్లీని మరింత నివాస యోగ్యంగా మార్చేందుకు చేస్తున్న పోరాటాల్లో విమలేందు చురుగ్గా పాల్గొంటున్నారు. వివిధ సందర్భాల్లో నాయకత్వం కూడా వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లో ఆయన దిల్లీ వ్యాప్తంగా వేల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు తాను చేస్తున్న ఉద్యమంలో దిల్లీలో ప్రస్తుతం చేస్తున్న పోరాటం ముఖ్యమైన భాగమని విమలేందు వ్యాఖ్యానించారు. 'ద న్యూ దిల్లీ నేచర్ సొసైటీ' పేరుతో చెట్లను కాపాడేందుకు సోషల్ మీడియాలో ఒక వేదికను ప్రారంభించిన వర్హేన్ ఖన్నా- ఒక్క చెట్టును కూడా నరికివేయడానికి తాము అంగీకరించబోమని తెలిపారు. దిల్లీలో సుమారు రెండు కోట్ల మంది బతుకుతున్నారని, చెట్లను నరికివేస్తే ప్రతి ఒక్కరిపైనా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. చెట్లను తొలగించే స్థానంలో వచ్చే నిర్మాణాలతో ఎవరో ప్రయోజనం పొందుతారని, కానీ చెట్ల తొలగింపు వల్ల ప్రతి ఒక్కరూ బాధపడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. చెట్టుకు 10 మొక్కలు నాటుతామన్న కేంద్రం చెట్ల నరికివేతపై ప్రజావ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం మొదట్లో తేలిగ్గా తీసుకొంది. పైగా, ''కేవలం 14 వేల చెట్లనే'' తాము తొలగించబోతున్నామని చెప్పింది. నరికివేసే ప్రతి చెట్టుకు బదులుగా పది మొక్కలు నాటుతామని ప్రభుత్వం తర్వాత హామీ ఇచ్చింది. 'ఇదో అర్థరహితమైన హామీ' ఈ హామీపై జుహీ సక్లానీ స్పందిస్తూ, ఇది అర్థరహితమైనదని కొట్టిపారేశారు. దేశంలో మొక్కలు బతికి చెట్లుగా ఎదిగే అవకాశాలు చాలా తక్కువని ప్రస్తావించారు. పైగా, తాము ఉండే ప్రాంతాలకు 30 కిలోమీటర్ల దూరంలో మొక్కలు నాటితే తమకుండే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు నరికేయాలనుకున్న చెట్లలో 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న చెట్లు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని వర్హేన్ ఖన్నా తప్పుబట్టారు. ఇక చెట్లు నరికివేయబోమన్న మంత్రి పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పూరి గత నెల 28న 'ట్విటర్' వేదికగా ఒక ప్రకటన చేశారు. దిల్లీలో కాలనీల పునరభివృద్ధి(రీడెవలప్‌మెంట్) కోసం ఇకపై చెట్లను నరికివేయబోమని హామీ ఇచ్చారు. దిల్లీ రీడెవలప్‌మెంట్ ప్రణాళికలను సమీక్షించుకుంటామని, చెట్లను నరికేయాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా వీటిని మార్చుకుంటామని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్ర బీబీసీతో చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం కొంత 'బిల్టప్-అప్ ఏరియా'ను వదులుకోవాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు. న్యాయపోరాటం ఇదీ ఒకవైపు క్షేత్రస్థాయిలో, ఆన్‌లైన్‌లో ఉద్యమం సాగుతుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ)లో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ ప్రాజెక్టుపై హైకోర్టు, ఎన్‌జీటీ రెండూ స్టే ఇచ్చాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దిల్లీలో ఎక్కడా ఒక్క చెట్టు కూడా కొట్టివేయడానికి వీల్లేదని హైకోర్టు ఈ నెల 4న ఆదేశించింది. రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుల పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీసి, దిల్లీకి హాని కలిగించే చర్యలను తాము అనుమతించబోమని వ్యాఖ్యానించింది. 'ఇది దిల్లీ ప్రజల విజయం' హైకోర్టులో పిటిషన్ వేసిన కౌశల్ కాంత్ మిశ్రతోపాటు ఇతర పర్యావరణ కార్యకర్తలు న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది దిల్లీ ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. దేశంలో అందరికీ సమాన అవకాశాల కల్పన, సుపరిపాలన కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థ 'యూత్ ఫర్ ఈక్వాలిటీ' వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన కౌశల్ వృత్తిరీత్యా ఎముకలు, కీళ్ల వైద్యుడు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు చెట్లను నరికివేయడం, తొలగించడం కొనసాగిస్తున్నారని, హైకోర్టు, గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని పర్యావరణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక చెట్టును కొట్టివేస్తుండటాన్ని ప్రత్యక్షంగా చూసిన విమలేందు ఝా ఈ అంశంపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. చెట్ల నరికివేత ఆగదనే ఆందోళన పర్యావరణవేత్తల్లో ఇంకా ఉంది. అందుకే పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజలను ముఖ్యంగా బాలలను చైతన్యపరచడం మీద వారు దృష్టి పెట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీ ప్రజలు 16 వేల చెట్లను గొడ్డలివేటు నుంచి కాపాడుకున్నారు. ఉద్యమించి విజయం సాధించారు. ఈ పోరాటం సాగిన తీరు ఇదీ.. text: వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో భారత్ ఓడిపోయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ భవిష్యత్తు గురించి స్టీవ్ వాను ఒక ప్రశ్న అడిగారు. స్టీవ్ వాను న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రశ్నించింది. ఆస్ట్రేలియా క్రికెట్ రిటైర్మెంట్ పాలసీ, 2004లో అతడి రిటైర్మెంట్ గురించి ప్రశ్నించినపుడు స్టీవ్‌ వా "ఆస్ట్రేలియా కచ్చితంగా అలా చేస్తుంది. ఎందుకంటే మనం ఎంత పెద్ద ఆటగాడైనా, అందులో పెద్ద తేడా ఉండదు. మనం తప్పుకోవాల్సిందే" అన్నారు. అయితే భారత్, ఆస్ట్రేలియాలో ఆటగాళ్లను ఒకేవిధంగా చూడ్డం కూడా సరికాదని కూడా స్టీవ్ వా అన్నారు. "బహుశా భారత ఉపఖండంలో ఆటగాళ్లకు కాస్త స్వేచ్ఛ లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 140 కోట్ల మంది వారిని ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఒక క్రికెటర్ మామూలు ఆటగాడిలా ఉండడు. అతడు ప్రముఖుడు అయిపోతాడు, దేవుడైపోతాడు. అలా అయ్యాక రిటైర్మెంట్ తీసుకోవడం అంటే అంత సులభం కాదు" అన్నాడు. "ఒక నిర్ణీత వయసుకు చేరుకోగానే అది చాలా సవాలుగా మారుతుంది. మీరు చెబుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ గొప్ప ఆటగాడు" అని స్టీవ్ వా చెప్పాడు. ఇప్పుడు, భారత ఉపఖండంలో నిజంగా పెద్ద క్రికెటర్లకు రిటైర్మెంట్ గురించి చాలా స్వేచ్ఛ ఉందా, మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేందుకు సరైన సమయమా ఇదేనా అనే ప్రశ్న కూడా వస్తుంది. మొదట ధోనీ విషయానికి వద్దాం. ఎందుకంటే వరల్డ్ కప్‌లో అతడు నెమ్మదిగా ఆడడంపై జనం ప్రశ్నలు సంధిస్తున్నారు. అతడు రిటైరయితే మంచిదని కూడా మాట్లాడేస్తున్నారు. జులై 7న 38వ ఏట అడుగుపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ ఐదేళ్ల ముందు 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ వన్డే, టీ20ల్లో మాత్రం ఆడుతున్నాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కూడా ధోనీ రిటైర్మెంట్ గురించి తనకేం చెప్పలేదని అన్నాడు. ధోనీ టీ20ల్లో 98 మ్యాచ్‌లు ఆడి 1617 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్లో అతడి సగటు 37.60, స్ట్రైక్ రేట్ 126.13 ఉంది. ఇక వన్డేల్లో 10,773 పరుగులు చేసిన ధోనీ సగటు 50.58 పరుగులు. స్ట్రైక్ రేట్ 87.56. వరల్డ్ కప్ 2019లో పరుగుల విషయానికి వస్తే ధోనీ 27వ స్థానంలో నిలిచాడు. 272 పరుగులు చేసిన ధోనీ భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(648), విరాట్ కోహ్లీ(443), లోకేశ్ రాహుల్(361) తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక వరల్డ్ కప్‌లో ధోనీ స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ 87.78. కెప్టెన్ కోహ్లీ ఈ టోర్నీలో 94.06 స్ట్రైక్ రేటుతో ఆడాడు. ధోనీ ఓవరాల్ స్ట్రైక్ రేట్ కూడా 87.56 అనే విషయం ఇక్కడ చెప్పుకోవాలి. గత కొంతకాలంగా ధోనీ ప్రదర్శన గమనిస్తే 2016లో అతడు 13 వన్డేల్లో 27.80 సగటుతో ఆడాడు. అదే 2018లో అతడి బ్యాటింగ్ సగటు 25.00 ఉంది. కానీ 2017లో మాత్రం ధోనీ 60.62 యావరేజితో ఆడాడు. 2019లో ఇప్పటివరకూ అతడి బ్యాటింగ్ సగటు 60.00. ధోనీ ప్రదర్శన గణాంకాలు చూస్తుంటే అతడి ఆటతీరు యావరేజి కంటే అంత ఘోరంగా లేదని మనం కచ్చితంగా చెప్పచ్చు. కానీ రిటైర్మెంట్ ప్రకటించేందుకు అతడు తన ప్రదర్శన మరింత పడిపోయేవరకూ వేచిచూడాలా అనే ప్రశ్న కూడా వస్తుంది. మొదటి ఉదాహరణ: సచిన్ టెండూల్కర్ ఈ విషయంలో ధోనీ ముందున్న ఒక అతిపెద్ద ఉదాహరణ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవద్దని సచిన్ ధోనీని కోరుతున్నాడు. సచిన్ తన క్రికెట్ కెరీర్లో 6 వరల్డ్ కప్‌లు ఆడాడు. ఆ సమయంలో ఎన్నో రికార్డులు సెట్ చేశాడు. రిటైర్ అయ్యాక మాట్లాడిన సచిన్ "2007 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, కానీ వివియన్ రిచర్డ్స్ సలహాతో మనసు మార్చుకున్నానని" స్వయంగా చెప్పాడు. 2011 వరల్డ్ కప్‌లో భారత్ సొంతగడ్డపై చాంపియన్‌గా నిలిచింది. అది సచిన్ రిటైర్మెంట్ తీసుకోడానికి చాలా మంచి అవకాశం. కానీ తను అలా చేయలేదు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన వన్డేలు, టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ ప్రదర్శన పడిపోతూ వచ్చింది. ఆ సమయంలో అతడు 21 వన్డేల్లో 39.43 సగటుతో రన్స్ చేసాడు. 15 టెస్టుల్లో కేవలం 633 పరుగులే చేయగలిగాడు. రిటైర్ అయ్యే సమయానికి వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు కపిల్ పేరునే ఉంది రెండో ఉదాహరణ: కపిల్ దేవ్ భారత్‌కు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకరని చెబుతారు. కానీ కేవలం ఒక్క రికార్డు కోసం అతడు కూడా సుదీర్ఘంగా జట్టును అంటిపెట్టుకున్నాడు. ఆ సమయంలో కపిల్ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే కనిపించింది. కపిల్ దేవ్ 1988లోనే వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌ అయ్యాడు. కానీ టెస్టు మ్యాచుల్లో అప్పట్లో న్యూజీలాండ్ బౌలర్ రిచర్డ్ హాడ్లీ కూడా ఆడుతున్నాడు. వీరిద్దరి మధ్య ఇయాన్ బోథమ్ అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేయాలనే పోటీ ఉండేది. హాడ్లీ ఆ రికార్డును 1988లోనే బద్దలు కొట్టాడు. ఆ ఏడాది చివర్లో అతడి వికెట్ల సంఖ్య 391కి చేరింది. హాడ్లీ తర్వాత రెండేళ్లు ఆడాడు. 1990లో రిటైర్మెంట్ ప్రకటన సమయానికి హాడ్లీ వికెట్ల సంఖ్య 431కి చేరింది. అప్పటికి కపిల్ 365 వికెట్ల దగ్గరున్నాడు. అంటే తను రిచర్డ్ హాడ్లీ టెస్టు రికార్డుకు కేవలం 66 వికెట్ల దూరంలో ఉన్నాడు. కానీ, హాడ్లీ రికార్డు బ్రేక్ చేయడానికి కపిల్‌కు మరో నాలుగేళ్లు పట్టింది. ఆ రికార్డు కోసం అతడు 35 టెస్టులు ఆడాడు. ఆ సమయంలో కపిల్ దేవ్ ప్రదర్శన గురించి అతడి గణాంకాలే చెబుతాయి. కపిల్ తన చివరి 14 టెస్ట్ మ్యాచుల్లో కేవలం 27 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ జట్టును అంటిపెట్టుకుని ఉండడంతో యువ బౌలర్ శ్రీనాథ్‌కు జట్టులో తన ప్లేస్ కన్‌ఫర్మ్ చేసుకోడానికి చాలాకాలం వేచిచూడాల్సి వచ్చింది. 1992 ప్రపంచకప్‌ సమయంలో వసీం అక్రంతో మియాందాద్ మియాందాద్ కూడా ఒక ఉదాహరణే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు, రిటైర్మెంట్ ప్రకటించేలా మీడియా తనపై చాలా ఒత్తిడి తెచ్చిందని చెప్పాడు. 1996 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత మియాందాద్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 1992 ప్రపంచకప్ మియాందాద్‌కు ఆరో వరల్డ్ కప్. ఈ టోర్నీలోనే పాకిస్తాన్ ప్రపంచ చాంపియన్ అయ్యింది. ఈ విజయంలో మియాందాద్ కూడా ఒక హీరోగా నిలిచాడు. ఫైనల్లో పాకిస్తాన్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినపుడు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత కూడా తన కెరీర్‌ను పొడిగించి తప్పు చేశానని మియాందాదే చెప్పుకున్నాడు. 1992లో రిటైర్మెంట్ తీసుకోడానికి తనకు మంచి అవకాశం వచ్చిందన్నాడు. 1992 ప్రపంచకప్‌లో జావేద్ మియాందాద్ 437 పరుగులు చేశాడు. జట్టు ప్రపంచ కప్ కూడా గెలుచుకుంది. కానీ ఆ తర్వాత మియాందాద్ టెస్టు మ్యాచులు ఆడాడు. ఒక్క సెంచరీ కూడా లేకుండా 11 టెస్టుల్లో 32.11 సగటుతో 578 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 1992 తర్వాత మియాందాద్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. కానీ అతడిని 1996 ప్రపంచ కప్ జట్టులో మళ్లీ ఎంపిక చేశారు. కానీ, ఆ టోర్నీలో జావేద్ మొత్తం పరుగులు 54 మాత్రమే. ఇప్పుడు "పైన చెప్పిన క్రికెట్ దిగ్గజాల్లాగే రిటైర్ కావాలా", లేక లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్, ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్, వెస్టిండీస్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌లా రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడతాడా అనేది ధోనీపైనే ఉంది. ఎందుకంటే ఈ దిగ్గజాలు క్రికెట్‌కు వీడ్కోలు పలికినపుడు "వాళ్లకు ఇంకా కొన్నేళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా ఉందే" అని అందరూ చెప్పుకున్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత ఉపఖండంలో రిటైర్మెంట్ తీసుకునే విషయంలో క్రికెటర్లకు చాలా స్వేచ్ఛ ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా భావించాడు. text: ఈ లాక్‌డౌన్ విధానాలు శారీరక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీయడంతో పాటు సమాజంపైనా వినాశకర ప్రభావం చూపుతాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 6 వేల మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతులు వారివారి జీవితాలను చూసుకోగలరని.. దుర్బలమైన వారికి రక్షణ కల్పించేలా చర్యలు ఉండాలంటున్నారు. 'గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్' పేరిట చేసిన ఈ ప్రకటన శాస్త్రీయ సమాజంలోనే ఇతరులు హెచ్చరికలు చేసేలా ప్రేరేపించింది. విమర్శకులు చెబుతున్నదేమంటే.. * మరింత లక్ష్యీకృత వైఖరి దుర్బలులను రక్షించడం ఇంకా కష్టతరం చేస్తుంది. * కరోనావైరస్ వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులున్నాయంటే దానర్థం మరింత మందికి ముప్పుందనే. అయితే... బ్రిటన్‌లోని కొందరు గవర్నమెంట్ ప్రాక్టీషనర్లు సంతకం చేసిన ఒక లేఖలోని అంశాలకు ఈ డిక్లరేషన్ అద్దం పడుతోంది. టీవీ డాక్టర్లు ఫిల్ హామండ్, రోజ్‌మరీ లియోనార్డ్ సహా బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్‌లో ఉన్న చాలామంది సీనియర్ వైద్యులు హెల్త్ సెక్రటరీకి రాసిన ఆ లేఖలో నాన్ కోవిడ్ కేసుల్లో తీవ్రమైనవాటికి తగినంత ప్రాధాన్యం దొరకలేదని పేర్కొన్నారు. గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ అంటే ఏమిటి? ఇది అమెరికాలో ప్రారంభమైన ఉద్యమం. ఈ ప్రకటనపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. 50 వేల మంది ఇతరులు సంతకాలు చేశారు. సంతకాలు పెట్టినవారిలో బ్రిటన్‌ నిపుణులు * డాక్టర్ సునేత్ర గుప్తా - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎపిడమాలజిస్ట్ * ప్రొఫెసర్ ఎలెన్ టౌన్‌సెండ్, నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ సెల్ఫ్ హార్మ్ ఎక్స్‌పర్ట్ * డాక్టర్ పాల్ మెక్‌గీ, డిసీజ్ మోడలర్, ఎడినబరో యూనివర్సిటీ వ్యాక్సిన్ వచ్చేవరకు లాక్‌డౌన్ విధానాలు అమలులో ఉంచడం వల్ల కోలుకోలేని నష్టం కలుగుతుందని.. అణగారినవర్గాలకు మరింత హాని కలిగిస్తుందని వీరంతా అంటున్నారు. నిపుణులు చెబుతున్న ఆరోగ్య హాని.. * బాల్యంలో టీకాలు వేయడం తగ్గిపోతుంది. * క్యాన్సర్, హృద్రోగులకు ఆరోగ్య సేవలు మృగ్యమవుతాయి. వృద్ధులు, మానసికంగా, శారీరకంగా దృఢంగా లేనివారికి కోవిడ్ వల్ల ముప్పు 1000 రెట్లు అధికమని.. అలాగే చిన్నారులకు కోవిడ్‌తో కంటే ఫ్లూ వల్ల అధిక ముప్పు ఉందని వారు అంటున్నారు. జనాభాలో రోగ నిరోధక శక్తి పెరుగుతున్నకొద్దీ కరోనావైరస్ సోకే ముప్పు క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే రిటైరైనవారికి నిత్యవసరాలు, ఇతర సరకులు అందివ్వాలని ఈ ప్రకటన సూచిస్తోంది. చేతులు శుభ్రం చేసుకోవడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటికే పరిమితం కావడం వంటి సాధారణ జాగ్రత్త చర్యలు అందరూ పాటించాలి. నిపుణుల సూచనలు * రిస్క్ తక్కువగా ఉన్న యువతను పనులు చేయడానికి అనుమతించాలి. * ప్రత్యక్ష బోధన కోసం స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు తెరవాలి. * క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించొచ్చు. రెస్టారెంట్లు తెరవొచ్చు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కోవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనల కారణంగా తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తూ సాగుతున్న అంతర్జాతీయ ఉద్యామానికి వేల మంది సైంటిస్టులు, ఆరోగ్య నిపుణులు మద్దతిస్తున్నారు. text: పాక్ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ''సమా టీవీ''కి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 1999లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు. పాక్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్. సైన్యం చర్యలతో దేశం భ్రష్టు పట్టకూడదనే గుణపాఠాన్ని పాక్ చరిత్ర నుంచి నేర్చుకుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ''దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే.. సైనిక చట్టాలను అమలుచేయడం సరికాదు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థను సంస్కరించాలి''. గంటన్నర పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ చాలా ఆరోపణలు చేశారు. ''భారత్ సాయం చేస్తోంది'' పాక్ సైన్యాన్ని బలహీనం చేసేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత్ సాయం చేస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు. ''నవాజ్ షరీఫ్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. అల్తాఫ్ హుస్సేన్ అప్పట్లో ఇలానే చేశారు. నవాజ్ షరీఫ్‌కు భారత్ మద్దతు ఇస్తుందని నాకు వంద శాతం తెలుసు. పాక్ సైన్యం బలహీనమైతే ఎవరికి ప్రయోజనమో అందరికీ తెలుసు.'' ''మానవతా కోణంలో నవాజ్ షరీఫ్‌కు సాయం చేయాలని పాక్ ప్రభుత్వం భావించింది. కానీ ఆయన రాజకీయాలు చేస్తున్నారు. పాక్‌కు వ్యతిరేకులుగా భావిస్తున్న చాలా మందిని ఆయన కలుస్తున్నారు''అని ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పాక్‌ను ముక్కలు చేయాలని భారత్ కుట్ర పన్నుతోందని ఇమ్రాన్ ఆరోపించారు. సైన్యమే లేకపోతే ''ఒకసారి కళ్లు తెరవండి. అఫ్గానిస్తాన్, యెమెన్, ఇరాక్, సిరియాలను చూడండి. మనం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాం. ఇదంతా సైన్యం వల్లే. సైన్యమే లేకపోతే దేశం నేడు ముక్కలైపోయుండేది'' ''పాక్ ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలు నేడు చరిత్రలోనే అత్యంత ఉత్తమంగా ఉన్నాయి. సైన్యం కనుసన్నల్లో నడుచుకోకుండా స్వతంత్రంగా ఎదిగిన తొలి పాక్ నాయకుణ్ని నేనే'' గిల్గిత్-బాల్టిస్తాన్‌లో భారత్ చర్యల గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ''అది చైనా-పాకిస్తాన్ ఆర్థిక నడవాలో భాగం. ఆ ప్రాంతం మొత్తాన్ని ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడి ప్రాంతవాసులు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకోవాలని అనుకుంటోంది'' పాక్ సున్ని-షియాల మధ్య భారత్ గొడవలు పెట్టాలని భావిస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు. భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని అందరికీ తెలుసుని అన్నారు. ప్రతిపక్షాల గురించి పట్టించుకోను ''ప్రతిపక్షాలు ఏం చేయాలని అనుకుంటున్నాయో నాకు అనవసరం. వారు దేశంలోని సైన్యం, న్యాయవ్యవస్థలపై విమర్శలు చేస్తూ.. ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు''అని ప్రతిపక్షాల గురించి అడిగిన ప్రశ్నలపై ఇమ్రాన్ స్పందించారు. ''నేను ఎన్నికైన ప్రధాన మంత్రిని. నన్ను రాజీనామా చేయాలని ఎవరు అడుగుతారు? ఒకవేళ ఐఎస్‌ఐ డీజీ అడిగితే.. ముందు ఆయన్నే రాజీనామా చేయమని చెబుతా''. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నవాజ్ షరీఫ్ అనుమతి లేకుండానే అప్పటి పాక్ సైన్యాధిపతి కార్గిల్‌పై దాడి చేసుంటే, ఆయన్ను షరీఫ్ పదవి నుంచి తొలగించి ఉండేవారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. text: పాలస్తీనా పరిధిలోని బర్జాయిట్ యూనివర్సిటీ ఇటీవల ఈ అంశంపై పరిశోధనలు జరిపింది. ఈ పరిశోధనలో కొన్ని ఎలుకలను తీసుకొని వాటిలో కొన్నింటికి కార్బొనేటెడ్ డ్రింక్స్ ( గ్యాస్ ఉండే తియ్యని పానీయాలు), మరికొన్నింటికి సాధారణ తియ్యని పానీయాలు ఇచ్చి పరీక్షించారు. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన ఎలుకలు 'ఫ్లాట్ డ్రింక్స్' ( గ్యాస్ లేని పానీయాలు) తాగిన ఎలుకలకంటే ఎక్కువ బరువు పెరిగినట్లు వారి పరిశోధనలో తేలింది. అంతేకాదు కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన ఎలుకల్లో ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ అనే హార్మోన్ అధికస్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. 'చీజ్ సాండ్‌విచ్' పరీక్ష ఇదే తరహా పరిశోధనను బీబీసీ ‘ట్రస్ట్ మీ ఐయాం ఏ డాక్టర్’ బృందం మనుషులపై చేసింది. బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ బ్రౌన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. పరిశోధనలో భాగంగా ఆయన స్వచ్ఛందంగా ప్రయోగానికి ముందుకువచ్చిన వాళ్లను బృందాలుగా విభజించారు. ఫలితాలపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రయోగం గురించి వాళ్లకు చెప్పలేదు. 10 గంటలపాటు వారికి ఏలాంటి ఆహారం ఇవ్వకుండా ల్యాబ్‌కు తీసుకొచ్చారు. అక్కడ వాళ్లందరికి మొదటగా కేలరీలు తక్కువగా ఉండే సాండ్‌విచ్‌లు ఇచ్చారు. దాని వల్ల అందరిలోనూ ఒకేస్థాయిలో ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ ఉత్పత్తి అవుతుందనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అది తిన్న గంట తర్వాత కొందరికి కార్బొనేటెడ్ డ్రింక్స్, మరికొందరికి నార్మల్ డ్రింక్స్ ఇచ్చారు. 10 నిమిషాల తర్వాత జేమ్స్ అందరి రక్తనమూనాలను సేకరించారు. వారిలో ఉన్న గ్రెలిన్ స్థాయిలను పరిశీలించారు. కొన్నివారాలపాటు మూడుసార్లు ఇదే తరహాలో వారిపై పరిశోధనలు జరిపారు. అయితే ప్రయోగాలకు హాజరైన వారికి ఒకరకమైన సాండ్‌విచ్ ఇచ్చినా డ్రింక్స్ మాత్రం ప్రతిసారి మార్చారు. ఒకే వ్యక్తికి భిన్నరకాల డ్రింక్స్ అందించడంలో ముఖ్యఉద్దేశం వాటి ప్రభావం ఎలా ఉందో పరిక్షించడానికే. 'గ్రెలిన్'దే కీలక పాత్ర సాధారణ డ్రింక్స్ కంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన వారిలో గ్రెలిన్ స్థాయి 50 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. అంటే సాధారణ పానీయాల కంటే గ్యాస్ ఉండే పానీయాలు (కార్బొనేటెడ్ డ్రింక్స్) ఆకలిని ఎక్కువగా ప్రేరేపిస్తాయని దాని వల్లే ఆ డ్రింక్స్ తాగిన వాళ్లు లావెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 'కార్బొనేటెడ్ డ్రింక్స్, సాధారణ డ్రింక్స్‌లను రెండు గ్రూపులకు ఇచ్చి ఆ తర్వాత వారు ఎంత తిన్నారో పరిశీలించాం. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన వాళ్లు సాధారణ డ్రింక్స్ తాగిన వాళ్ల కంటే 120 కేలరీలు ఎక్కువ తింటున్నట్లు గ్రహించాం' అని జేమ్స్ చెప్పారు. గ్యాస్ కారణమా? కూల్ డ్రింక్స్‌లో ఉన్న గ్యాస్ వల్లే లావెక్కే అవకాశం ఉందా అంటే అదే ప్రధానకారణమని చెప్పలేమని జేమ్స్ అన్నారు. 'కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కార్బన్ డై ఆక్సైడ్‌ ఉంటుంది. దాన్ని తాగినప్పుడు జీర్ణాశయంలో కార్బన్ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది. అక్కడ రసాయన చర్యలు జరిగి ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ స్థాయిని అది పెంచుతుంది. మరో కారణం, కడుపులో గ్యాస్ చేరడం వల్ల అది ఉబ్బిపోతుంది. దీంతో అందులోని కణాలు గ్రెలిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది' అని జేమ్స్ తెలిపారు. కార్బొనేటెడ్, నాన్ కార్బొనేటెడ్ డ్రింక్స్‌లలో ఏవి మంచివి, వేటిని తాగాలి అని అడిగితే రెండూ మంచివి కాదు అని జేమ్స్ చెబుతున్నారు. మంచినీళ్లే ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తియ్యటి పానియాల్లో కేలరీలు అధిక స్థాయిలో ఉంటాయన్న విషయం తెలిసిందే. మనం తాగే సాధారణ కూల్ డ్రింక్‌లో ఏడు చెంచాల చక్కెరకు సమానమైన తీపి ఉంటుంది. అయితే మనల్ని ఊబకాయుల్ని చేస్తుంది ఆ పానియాల్లోని తీపా లేక గ్యాసా? text: ఇటీవల కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రతినిధులు సౌదీ అరేబియా నుంచి ఇక్కడకు విమానంలో వచ్చిన సమయంలో పేలుడు చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువ మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. తనతోపాటు తన మంత్రి బృందం క్షేమంగానే ఉందని ప్రధాన మంత్రి ప్రకటించారు. హౌతి తిరుగుబాటుదారులే ఈ దాడి చేపట్టారని సమాచార ప్రసార శాఖ మంత్రి ఆరోపించారు. హౌతీ తిరుబాటుదారులను అణచివేస్తూ, అధ్యక్షుడు మన్సౌర్ హాదీ ప్రభుత్వాన్ని మళ్లీ పునరుద్ధరించాలని 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇక్కడ వైమానిక దాడులు చేపట్టాయి. అప్పటినుంచీ రెండు వర్గాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 1,10,000 మందికిపైనే మరణించారు. సిరియాలో బస్సుపై మిలిటెంట్ల దాడి, 28 మంది మృతి తూర్పు సిరియాలోని ఓ బస్సుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 28 మంది మరణించారు. మృతులందరూ సైనికులేనని వార్తలు వస్తున్నాయి. కల్లోలిత దెయిర్ అల్‌జౌర్ ప్రావిన్స్‌లో ఈ దాడి జరిగింది. అయితే, దీనిలో మరణించిన వారంతా పౌరులేనని ప్రభుత్వ మీడియా బుధవారం తెలిపింది. కానీ, దాడిలో మరణించింది సైనికులేనని పరిశీలక సంస్థలు చెబుతున్నాయి. మరణించిన వారి సంఖ్య 28 కంటే ఎక్కువే ఉండొచ్చని వివరిస్తున్నాయి. ఈ దాడిని తామే చేపట్టామని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. అయితే, జిహాదీ సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఈ దాడి చేపట్టిందని, మృతుల సంఖ్య 37 అని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్‌వోహెచ్‌ఆర్) తెలిపింది. మరోవైపు బస్సు దాడిలో మరణించింది సైనికులేనని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా వివరించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దక్షిణ యెమెన్ నగరం ఏడెన్‌లోని విమానాశ్రయంలో విధ్వంసకర దాడి జరిగింది. భారీ పేలుడుకు ఇక్కడ 22 మంది మరణించారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. text: మదర్ థెరీసా ఛారిటీలో శిశువుల అమ్మకాలపై రాష్ట్ర శిశు సంక్షేమ సమితి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై విచారణ జరిపారు. శిశువు విక్రయంతో సంబంధం ఉన్న ఒక మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు, ఛారిటీలో ఉన్న మరో ఇద్దరు సిస్టర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత వారిలో ఒకరిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఛారిటీలో పనిచేసే మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేశామని రాంచీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ఎస్ఎన్ మండల్ వెల్లడించారు. వారు విక్రయించిన నవజాత శిశువును శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. "ఛారిటీ నుంచి మరికొందరు శిశువులను కూడా అక్రమంగా విక్రయించినట్టు బయటపడింది. ఆ పిల్లల తల్లుల పేర్లు కూడా సేకరించాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది" అని మండల్ తెలిపారు. అదుపులో ఉన్న మహిళలు శిశువును అమ్మినట్టు అంగీకరించారని పోలీసులు తెలిపారు. శిశు విక్రయాలు జరిగిన కేంద్రం నుంచి లక్షా 48 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మానవ అక్రమ రవాణాకు గురైన యువతులు, పెళ్లి కాకుండానే గర్భవతులు అయినవారికి నిర్మల్ హృదయ్-మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆశ్రయం కల్పిస్తుందని శిశు సంక్షేమ సమితి అధ్యక్షుడు రూప్ కుమార్ తెలిపారు. "ఛారిటీలోని మహిళా ఉద్యోగులు నవజాత శిశువును ఉత్తర ప్రదేశ్‌ దంపతులకు అమ్మారు. ఆస్పత్రి ఖర్చుల పేరుతో లక్షా 20 వేల రూపాయలు తీసుకున్నారు. జువైనల్ చట్టాల గురించి తెలిసి కూడా వారు ఇలాంటి నేరానికి పాల్పడ్డారు" అని రూప్ కుమార్ అన్నారు, ఛారిటీలోని మహిళా ఉద్యోగులు మరికొందరు పిల్లల్ని కూడా గతంలో 50 నుంచి 70 వేలకు అమ్మినట్టు శిశు సంక్షేమ సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిశు విక్రయాల వెనుక ఒక పెద్ద ముఠా ఉండవచ్చని శిశు సంక్షేమ సమితి అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరింది. ప్రస్తుతం అమ్మకానికి గురైన శిశువుకు జన్మనిచ్చిన యువతి, మార్చి 19న నిర్మల్ హృదయ్-మిషనరీస్ ఆఫ్ చారిటీలో చేరిందని రూప్ కుమార్ తెలిపారు. ఆ యువతి రాంచీలోని సదర్ ఆస్పత్రిలో ఈ ఏడాది మే 1న ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. పోలీసుల విచారణలో ఛారిటీ మహిళా ఉద్యోగులను ఈ ఏడాది మే 14న శిశువును అమ్మినట్టు బయటపడింది. ఛారిటీ వాదన ఛారిటీలో శిశువును అమ్మడంపై రాంచీ మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన సునీతా కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ వార్తలు నమ్మలేకపోతున్నా. మా కేంద్రంలో ఇలా జరగడతో మేం షాకయ్యాం. నాకు తెలిసినంత వరకూ ఇలా ఎప్పుడూ జరగలేదు. శిశువును అమ్మడం, మా సంస్థ విలువలకు విరుద్ధం. మేం కూడా దీనిపై దృష్టి పెట్టాం. శిశు విక్రయం నిజమని తేలితే, మరోసారి ఇలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం" అని సునీతాకుమార్ చెప్పారు. అయితే, ఆరోపణలు వచ్చిన కేంద్రంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారి మాత్రం దీనిపై మాట్లాడడానికి నిరాకరించారు. నియమాలు ఏం చెబుతున్నాయి? నిబంధనల ప్రకారం ఒక యువతిని ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చుకున్నప్పుడు, ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ వివరాలు రాష్ట్ర శిశు సంక్షేమ సమితికి ఇవ్వాల్సి ఉంటుందని సమితి అధ్యక్షుడు రూప్ కుమార్ తెలిపారు. అయితే, జూన్ 30న శిశువును కొన్న దంపతులతో మాట్లాడిన ఛారిటీ ఉద్యోగులు వారికి ఒక చట్టపరమైన పని పూర్తి చేయాలని చెప్పారు. బిడ్డను తీసుకురావాలని కోరారు. జులై 2న ఆ దంపతులు రాంచీ రాగానే, వారి దగ్గర బిడ్డను తీసుకుని కనిపించకుండా వెళ్లిపోయారు. సమితి విచారణ బిడ్డ దూరమవడంతో దంపతులు శిశు సంక్షేమ సమితికి ఫిర్యాదు చేశారు. వారికి జరిగినదంతా చెప్పారు. దీంతో ఛారిటీలో శిశు విక్రయాల విషయం వెలుగులోకి వచ్చింది. ఛారిటీ ఉద్యోగులను శిశు సంక్షేమ సమితి విచారించింది. అమ్మిన శిశువును తిరిగి జన్మనిచ్చిన తల్లికే అప్పగించారని గుర్తించింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ బిడ్డను ఒక సంస్థ సంరక్షణలో ఉంచింది. శిశు విక్రయాల ఆరోపణలతో ఛారిటీలో ఆశ్రయం పొందుతున్న మిగతా మహిళల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అక్కడ ఉన్న 13 మంది యువతులను శిశు సంక్షేమ సమితి మరో కేంద్రానికి తరలించింది. ఛారిటీ భవనాన్ని సీల్ చేస్తామని తెలిపింది. శిశువును అమ్మగా వచ్చిన డబ్బులో 10 వేలు గార్డ్‌కు, 20 వేలు మహిళా ఉద్యోగులకు, మిగతా 90 వేలు చారిటీలోని ఒక సిస్టర్‌కు ఇచ్చినట్టు మహిళా ఉద్యోగులు విచారణలో తెలిపారు. మదర్ థెరీసా ఛారిటీలో శిశు విక్రయాలపై పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. "సేవ పేరుతో జార్ఖండ్‌ మిషనరీస్ చేస్తున్న వ్యాపారం ఇప్పుడు బట్టబయలైంది" అని బీజేపీ ఎంపీ సమీర్ ఉరాన్, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు రామ్‌కుమార్ పాహన్ తాము జారీ చేసిన ఒక ప్రకటనలో అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని మదర్ థెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో శిశువుల విక్రయాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. 14 రోజుల శిశువును అమ్మినందుకు చారిటీలో పనిచేస్తున్న ఒక మహిళను అరెస్ట్ చేశారు. text: శిశువులను చెత్తలో పడేయడం నిషిద్ధమనే సందేశంతో కూడిన పోస్టర్ రాజధాని కారకస్‌లో తాను నివసించే అపార్ట్‌మెంట్‌కు దగ్గర్లో ఓ చెత్తకుండీలో పసికందు బయటపడిన తర్వాత ఆయన ఈ బొమ్మ రూపొందించారు. తర్వాత దీనిని దేశవ్యాప్తంగా గోడలపై అతికించారు. పసిపిల్లలను చెత్తకుండీలో పడేయడం-వదిలేయడం మామూలు విషయమైపోతోందని, కానీ ఇది మామూలు విషయం అనుకోవడానికి వీల్లేనిదని, ఈ నిజాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని మెజికానో వివరించారు. వెనెజ్వెలాలో దాదాపు మూడో వంతు జనాభా అంటే 90 లక్షల మందికి పైగా ప్రజలకు తగినంత ఆహారం అందడం లేదని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) అధ్యయనం చెబుతోంది. ఆర్థిక వ్యవస్థ పతనం, భరించలేనంతగా ధరలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దేశంలో గర్భనిరోధక సాధనాలు అంతగా అందుబాటులో లేకపోవడం, చాలా మందికి వాటిని కొనగలిగేంత డబ్బు లేకపోవడం లాంటి కారణాల వల్ల అవాంఛిత గర్భధారణను అడ్డుకోలేకపోతుంటారు. గర్భస్రావం (అబార్షన్) చట్టాలు కఠినంగా ఉండటం మరో ముఖ్యమైన కారణం. తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటే తప్ప గర్భం తొలగించడాన్ని ఇక్కడి చట్టాలు అనుమతించవు. వీధుల్లో, లేదా ప్రభుత్వ భవనాల ముందు వదిలేసిన శిశువుల సంఖ్య 70 శాతం పెరిగిందని 2018లో ఓ సేవాసంస్థ తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో ఈ అంశంపై ప్రభుత్వం అధికారిక గణాంకాలేవీ వెల్లడించలేదు. ఈ సమస్యపై సమాచార శాఖ, బాలల హక్కుల సంస్థ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. వాటి నుంచి స్పందన రాలేదు. తల్లిదండ్రులు వదిలేసే, అనధికార దత్తత కింద ఇచ్చే పిల్లల సంఖ్య పెరగడం వాస్తవమేనని సామాజిక సేవలు, ఆరోగ్య సేవల కార్యకర్తలు పలువురు బీబీసీతో చెప్పారు. దేశంలో దత్తత ఇచ్చే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దీనికి ఆర్థిక తోడ్పాటు సరిగా లేదని, దీంతో తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో శిశువులను వదిలిపెట్టడం లాంటి మార్గాలను ఎంచుకొంటున్నారని కారకస్‌లో దారిద్ర్యం తాండవించే ఒక ప్రాంతంలోని బాలల పరిరక్షణ మండలి సభ్యుడైన గైనకాలజిస్ట్ నెల్స్ విల్లాస్మిల్ తెలిపారు. ఆయన ఓ ఉదాహరణను ప్రస్తావించారు. థామస్(అసలు పేరు కాదు) కారకస్‌లో ఒక పేదరాలికి జన్మించాడని, అతడిని పోషించే స్తోమత తనకు లేదని ఆమె భావించారని డాక్టర్ విల్లాస్మిల్ చెప్పారు. థామస్ పుట్టినప్పుడు అక్కడే ఉన్న ఆయన, శిశువును ఆదుకొనేందుకు అంగీకరించారు. శిశువును పోషించలేనని ఓ తల్లి చెప్పడం ఇదే తొలిసారి కాదని ఆయన తెలిపారు. పిల్లలకు ఆహారం అందించేందుకు వెనెజ్వెలాలో సామాజిక వంటశాలలు ఏర్పాటు చేశారు. అయినా వారిని పోషకలోపం వేధిస్తోంది. సాధారణంగా బిడ్డకు తొలిసారి పాలు పట్టించిన తర్వాత తల్లుల ఆలోచన మారిపోతుంటుందని, కానీ కొన్నిసార్లు అలా జరగదని, అప్పుడు బిడ్డ విషయంలో ఏంచేయాలనేది ఆలోచించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. థామస్ తల్లి నిస్సహాయత వ్యక్తంచేసిన తర్వాత విల్లాస్మిల్ తన పేషెంట్లలో ఒకరిని సంప్రదించారు. ఆమె తానియా(అసలు పేరు కాదు). 40ల్లో ఉన్నారు. బిడ్డకు జన్మనివ్వాలని ఆమె పరితపించేవారు. అయితే ఆమె గర్భం దాల్చలేకపోయారు. థామస్‌ను, అతడి తల్లిని ఆదుకొనేందుకు తానియా ముందుకొచ్చారు. తర్వాత థామస్‌ను తీసుకోవడానికి ఆమె నిరాకరించారు. తన స్నేహితులైన ఒక జంటను సంప్రదించారు. వెనెజ్వెలాలోని ఓ గ్రామీణ ప్రాంతాని చెందిన ఆ జంట- థామస్‌ను సొంత బిడ్డలా పెంచుకొనేందుకు అంగీకరించింది. ఆ జంట ఇంట్లో థామస్ ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు. తాను చేసిన పనిపై తనకు విచారం లేదని తానియా చెప్పారు. థామస్ మేలు కోసమే అధికారిక దత్తత మార్గాలను అనుసరించకుండా ఇలా చేశానని తెలిపారు. వెనెజ్వెలాలో చట్టబద్ధమైన దత్తత అనేది పెద్దగా పనిచేయదని, అనాథాశ్రమానికి అప్పగిస్తే థామస్‌ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆమె వ్యాఖ్యానించారు. థామస్‌ను అతడి తల్లి అంగీకారంతోనే తానియా స్నేహితులకు అప్పగించారు. థామస్ తల్లిలాగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉండే మహిళలను మోసగించేవారికీ వెనెజ్వెలాలో కొదవ లేదు. ఇందుకు ఇసాబెల్ కథే ఓ ఉదాహరణ. రెండో సంతానం కడుపులో ఉన్నప్పుడు ఇసాబెల్(అసలు పేరు కాదు) భర్త చనిపోయారు. దీంతో బిడ్డను వదులుకోవాలనే ఆలోచన ఆమె చేశారు. ఒంటరినైపోయిన తాను బిడ్డను పోషించలేనని అనుకొన్నానని ఇసాబెల్ తెలిపారు. తెలిసినవాళ్ల సలహా మేరకు ఆమె కరీబియన్ ప్రాంతంలోని ట్రినిడాడ్ దీవికి వెళ్లి ఓ జంటను కలుసుకొన్నారు. పుట్టబోయే శిశువును దత్తత తీసుకోవడానికి ఆ జంట ఆసక్తిగా ఉందని వాళ్లు చెబితే ఆమె అక్కడకు వెళ్లారు. దత్తతకు సంబంధించిన ఏర్పాట్లను ఒక కొలంబియా మహిళ చూసుకున్నారు. అంతా తన మాట ప్రకారమే చేస్తామని మొదట్లో ఇసాబెల్‌కు చెప్పారు. తర్వాత ఆమె ఆలోచనలకు విరుద్ధంగా కొలంబియా మహిళ నుంచి ఒత్తిడి ఎదురైంది. అంతా చట్టబద్ధంగానే జరుగుతోందని తనతో చెప్పారని, కానీ అలా జరగడం లేదని తనకు అర్థమైందని ఆమె తెలిపారు. వాస్తవానికి తాను మనుషుల అక్రమ రవాణా వలలో చిక్కుకున్నానని చెప్పారు. వెనెజ్వెలాలో ఆర్థిక వ్యవస్థ పతనం, ధరల పెరుగుదలతో మూడో వంతు ప్రజలకు తగినంత ఆహారం దొరకడం లేదు. తనపై ఎప్పుడూ నిఘా ఉండేదని ఆమె వెల్లడించారు. తానుంటున్న ఇంటి నుంచి ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదని, ట్రినిడాడ్ నుంచి వెనెజ్వెలాకు తిరిగి రావడానికి విమాన టికెట్ తీయిస్తామన్నారని, కానీ అలా చేయలేదని వివరించారు. ట్రినిడాడ్‌కు వెళ్లిన తర్వాత కొన్ని వారాలకు అక్కడి ఆస్పత్రిలో ఆమె నెలలు నిండకుండానే ఒక మగబిడ్డను ప్రసవించారు. శిశువును దత్తత ఇవ్వొద్దని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ కొలంబియా మహిళ, న్యాయవాదినని చెప్పుకొన్న ఓ పురుషుడు బిడ్డను తమకు ఇవ్వాలని ఆమెను ఒత్తిడి చేశారు. దత్తత తీసుకోవాలనుకొన్న జంట పార్కింగ్ ప్రదేశంలో ఎదురుచూస్తోందని, ఇంగ్లిష్‌లో ఉన్న కొన్ని పత్రాలపై సంతకం చేసి, బిడ్డను ఇచ్చేయాలని చెబుతూ ఒత్తిడి చేశారని ఇసాబెల్ వివరించారు. తనకు ఆ పత్రాలు అర్థం కాలేదన్నారు. బిడ్డను ఇవ్వడానికి ఇసాబెల్ తొలుత ససేమిరా అన్నారు. తర్వాత ఆమెను బంధించినవారు ఆహారం, ఔషధాలు, బిడ్డకు అవసరమైన డైపర్లు నిరాకరించి ఒత్తిడి పెంచారు. నిస్సహాయ పరిస్థితుల్లో మరో మార్గం లేక బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు, తాను తిరిగి వెనెజ్వెలా చేరుకొనేందుకు బిడ్డను వాళ్లకు ఇచ్చేయాల్సి వచ్చిందని ఇసాబెల్ రోదిస్తూ చెప్పారు. ఇసాబెల్ కొడుకు ప్రస్తుతం ట్రినిడాడ్‌లో అధికార యంత్రాంగం సంరక్షణలో ఉన్నాడు. అతడిని వారానికి ఒకసారి చూసేందుకు మాత్రమే ఆమెకు అనుమతి ఉంది. అతడిని తిరిగి తన అప్పగించాలంటూ ఇసాబెల్ న్యాయపోరాటం చేస్తున్నారు. తన బిడ్డ తనకు దక్కే వరకు పోరాడుతూనే ఉంటానని ఆమె చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "పసి బిడ్డలను చెత్తలో పడేయడం నిషిద్ధం" అనే సందేశంతో వెనెజ్వెలా కళాకారుడు ఎరిక్ మెజికానో రూపొందించిన ఈ బొమ్మ దేశంలో నెలకొన్న విషాదకర పరిస్థితిని సూచిస్తోంది. text: సల్ఫార్డ్ రాయల్ ఆస్పత్రిలో పనిచేసే 26 ఏళ్ల సెట్టే బ్యూనావెంచురా తన కుడి కాలి పిక్కలో నొప్పిగా అనిపించినా 8 వారాలపాటు ఆ బాధను అసలు పట్టించుకోలేదు. తర్వాత ఏప్రిల్‌లో ఆమె కాలికి తీసిన స్కానింగ్‌లో సర్కోమా ఉన్నట్లు బయటపడింది. దాంతో మోకాలి పైవరకూ ఆమె కుడి కాలు తొలగించారు. “ఒక నర్సుగా పనిచేస్తున్నప్పుడు మనం మన బాధల్ని మర్చిపోవాలి. ఎందుకంటే, మనం వేరే వాళ్లకు సాయం చేస్తూ బిజీగా ఉంటాం. కానీ, దానిని అంత నిర్లక్ష్యం చేసి ఉండకూడదేమో” అని ఆమె అన్నారు. ఎకిల్స్‌కు చెందిన బ్యూనావెంచురా కాలు నొప్పి వల్ల నడడానికి కూడా ఇబ్బంది పడ్డారు. కానీ, ఆస్పత్రిలో రోజంతా నిలబడడం వల్లే అలా ఉందేమో అనుకున్నారు. “కోవిడ్-19 వల్ల మా పని చాలా పెరిగింది. మాకు మా బాధలు, నొప్పుల గురించి ఆలోచించే సమయమే లేదు” అంటారు బ్యూనావెంచురా. “మా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు మేం అక్కడ ఉండాలి. ఆ స్థాయి నిబద్ధతకు నేను ఫలితాన్ని అనుభవించాను” “ఆస్పత్రుల్లో పనిచేస్తుంటే అలాగే ఉంటుంది. మన నొప్పులను మనం మర్చిపోతాం. ఎందుకంటే మనం వేరే వాళ్లకు సాయం చేయడంలో బిజీగా ఉంటాం. అలా చేయడం నాకు ఇష్టం. కానీ ప్రతిదానికీ మూల్యం చెల్లించాలి” అన్నారు. గోల్ఫ్ బాల్ సైజులో కణితి కుడి కాలులో కణితి ‘గోల్ఫ్ బాలు’ సైజులో పెరిగిందని, కాలు తీసేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉండేదని ఆమె చెప్పారు. ”మీ కాలు తీసేయాలని వాళ్లు నాకు చెప్పినపుడు, నేను చాలా అప్‌సెట్ అయ్యా. కానీ, నాకు దాని గురించి ఆలోచించే సమయం లేకపోవడంతో అందుకు సిద్ధమయ్యాను” అని బ్యూనావెంచురా తెలిపారు. “నన్ను నేను చూసుకోడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేసే నేను, నాకే ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు”. బ్యూనావెంచురాకు ఇప్పుడు కృత్రిమ కాలు అమర్చారు. నవంబరులో తిరిగి విధులకు వెళ్లగలనని ఆమె అనుకుంటున్నారు. తన అనుభవం నుంచి అందరూ పాఠం నేర్చుకోవాలని బ్యూనావెంచురా చెబుతున్నారు. “ఎవరికైనా దీర్ఘకాలిక నొప్పి ఉంటే, వెంటనే దానికి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. నేను దీన్ని త్వరగా గుర్తించి ఉంటే, ఇప్పుడు బహుశా వేరే స్థితిలో ఉండేదాన్ని” అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా విధుల్లో ఉన్న ఒక నర్సు తీవ్రంగా వేధిస్తున్న కాలు నొప్పిని పట్టించుకోలేదు. రోగుల సేవలు అందించడం ముఖ్యం అనుకున్నారు. తర్వాత ట్యూమర్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడడంతో కాలు తొలగించారు. text: ఇప్పటివరకూ భారత్ ఆస్ట్రేలియాతో ఆ దేశంలో ఆడిన ఏ టెస్ట్ సిరీస్‌లోనూ మొదటి మ్యాచ్ గెలవలేదు. ఇప్పుడు అడిలైడ్ టెస్టులో విజయంతో భారత్ ఆ రికార్డు కూడా బద్దలు కొట్టింది. భారత్ ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్ తొలి టెస్టులో ఆ దేశాన్ని ఓడించిన రెండో ఆసియా దేశంగా నిలిచింది. ఇంతకు ముందు పాకిస్తాన్‌కు ఇలాంటి విజయమే దక్కింది. ఇప్పుడు టీమిండియా అరుదైన విజయంపై బీసీసీఐ సంతోషం వ్యక్తం చేసింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 "అడిలైడ్‌తో 'లవ్ అఫైర్‌'లో టీమిండియా మరో అద్భుత అద్యాయం జోడించిందని" బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ విజయంతో కెప్టెన్ కోహ్లీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. అశ్విన్ మొత్తం ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో ఇది అతడి అత్యుత్తమ ప్రదర్శన ఇది బౌలర్ల విజయం ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. అందుకే, విజయం తర్వాత తన బౌలర్లను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. బౌలర్లు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నారని చెప్పాడు. పుజారా, రహానే బ్యాటింగ్‌పై కూడా ప్రశంసించాడు. ఇద్దరూ ఈ విజయానికి పునాదులు వేశారన్నాడు. మిడిల్ ఆర్డర్ తర్వాత అందరూ వరసగా పెవిలియన్ చేరడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విజయం తర్వాత సునీల్ గావస్కర్ "భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల లీడ్ వచ్చినా ఆత్మవిశ్వాసంతో కనిపించిందని" అన్నారు. "ఈ ఓటమితో ఆస్ట్రేలియాపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది" అని అన్నారు. పదేళ్ల క్రితం ఇదే అద్భుతం 2008 తర్వాత భారత్ ఆస్ట్రేలియాపై మళ్లీ టెస్టుల్లో విజయం సాధించింది. 2008లో జనవరి 16-20 మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ విజయం తర్వాత మళ్లీ ఆ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం ఇప్పుడే జరిగింది. పెర్త్, డబ్ల్యుఏసీఏ గ్రౌండ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఉత్కంఠగా సాగిన పెర్త్ టెస్ట్ ఆ మ్యాచ్‌ కూడా అడిలైడ్ టెస్ట్‌లాగే పోటాపోటీగా జరిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసింది. రాహుల్ ద్రావిడ్ 93 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 2008లో టెస్ట్ గెలిచిన ఆనందంలో కెప్టెన్ కుంబ్లే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 294 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్ష్మణ్ 79 పరుగులు చేశాడు. తర్వాత 400 పరుగులకు పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 340 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆట ముగియడానికి అరగంట ముందే భారత జట్టు ఆతిథ్య జట్టును పెవిలియన్ పంపింది. ఆ సిరీస్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అనిల్ కుంబ్లే ఈ గెలుపును తన అత్యుత్తమ విజయంగా వర్ణించాడు. ఇప్పుడు నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టులోనే విజయం సాధించిన కోహ్లీ సేన సంబరాలు చేసుకుంది. ఆస్ట్రేలియాకు అరుదైన రికార్డ్ మిస్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే అది కూడా ఆ జట్టుకు ఒక రికార్డ్ అయ్యుండేది. మొదటిసారి ఆస్ట్రేలియా హోం గ్రౌండ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 323 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసిన జట్టుగా నిలిచేది. ఇప్పటివరకూ ఆ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో చేజ్ చేసిన అత్యధిక పరుగులు 315 మాత్రమే. 1902లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్లు కోల్పోయి ఈ విజయం అందుకుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆస్ట్రేలియాలో ఆతిథ్య దేశంపై తొలి టెస్టులోనే విజయం సాధించిన భారత్ ఎన్నో రికార్డులు అందుకుంది. text: ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటనలో దాదాపు 16 ఏళ్ల పాటు భారత క్రికెట్‌లో సాగిన ఆయన శకం ముగిసింది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ రికార్డులు సృష్టించారు. ‘‘మీ అందరి ప్రేమకు నా ధన్యవాదాలు. ఈ సాయంత్రం 7.29గం.ల నుంచి నేను రిటైర్‌ అయినట్లుగా పరిగణించండి’’ అని ఆయన తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టులో వెల్లడించారు. "మే పల్‌ కా దో పల్ కా షాయర్‌ హు ''అనే హిందీ పాటతో కూడిన వీడియో ద్వారా తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను ఇన్‌స్టా‌గ్రాంలో వివరించారు ఆయన. అలాగే తన కెరీర్‌లో మధుర స్మృతులను 4.07 ని.ల వీడియో ద్వారా పంచుకున్నారు. కాగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ''ధోనీ నీతో ఆడడాన్ని ఇష్టపడ్డాం. నా హృదయం గర్వంతో ఉప్పొంగుతుండగా నీ ఈ ప్రయాణంలో నీతో కలవాలని నిర్ణయించుకున్నాను. జై హింద్'' అంటూ ధోనీతో కలిసి భోజనం చేస్తున్న ఫొటో ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసి రిటైర్మెంట్ ప్రకటించారు సురేశ్ రైనా. మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన ఏకైక కెప్టెన్ మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ చరిత్రలో నిలిచిపోయారు. 2007లో ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌, 2011లో ఐసీసీ వరల్డ్‌ కప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని కెప్టెన్‌ ధోనీ ఆధ్వర్యంలోని జట్లు గెలుచుకున్నాయి. భారత్ తరఫున 350 వన్డేలు ఆడిన ధోనీ, 50 కంటే ఎక్కువ సగటుతో 10,773 పరుగులు చేశారు. వన్డే క్రికెట్‌లో ధోని 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలున్నాయి.. వికెట్ కీపర్‌గా 321 క్యాచ్‌లు తీసుకొని 123 మంది ఆటగాళ్లను స్టంప్ అవుట్‌ చేశారు. టీ-20 క్రికెట్‌లో భారత్ తరఫున 98 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 37 పైగా సగటుతో 1617 పరుగులు చేశారు. టెస్ట్‌ క్రికెట్‌లో 2014లోనే ధోనీ రిటైరయ్యారు. 90 టెస్టుల్లో 38కి పైగా సగటుతో 4876 పరుగులు చేసిన ధోనీ, టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంప్‌లు చేశారు. బ్యాట్స్‌ మన్‌గా 6 సెంచరీలు, 33 అర్ధసెంచరీలు చేశారు. వెల్లువెత్తుతున్న ట్వీట్లు కాగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన క్రికెట్‌కు, భారత జట్టుకు చేసిన సేవలను.. ఆయన రికార్డులను గుర్తు చేస్తూ ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ‘‘భారత క్రికెట్‌కు నీ సేవలు చిరస్మరణీయం ధోనీ. నీతో కలిసి 2011 వరల్డ్‌ కప్‌ గెలవడం నా జీవితంలో అత్యంత అద్భుతమైన ఘట్టం’’ అని సచిన్‌ ట్వీట్ చేశారు. ధోనీ రిటైర్మెంట్ తరువాత నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా సాగాలని సచిన్ ఆకాంక్షించారు. ‘‘ధోనీ రిటైర్‌మెంట్‌తో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఆతనొక అద్భుతమైన ఆటగాడు. అతని నాయకత్వ లక్షణాలు ఎవరితోనూ పోల్చలేనివి’’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు కెరీర్‌ నుంచి రిటైర్‌కావాల్సిందే. కానీ మనకు సన్నిహితులైన వారు ఆట నుంచి వెళ్లిపోతుంటే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. ధోనీ క్రికెట్‌కు చేసిన సేవలు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ నిలిచిపోతాయ’’ని విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. గొప్ప వ్యక్తి క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడంటూ విఖ్యాత కామెంటరేటర్ హర్ష భోగ్లే ట్వీట్ చేశారు. అద్భుతమైన కెరీర్ ఉన్న ధోనీకి అభినందనలు.. క్రికెట్ మైదానంలో అడుగు పెట్టిన గొప్ప కెప్టెన్లలో నీవొకడివి. నీ నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా విజయవంతంగా సాగాలని మాజీ కోచ్ కృష్ణమాచారి శ్రీకాంత్ ట్వీట్ చేశారు. టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్ తదితరులూ ధోనీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. కాగా ధోనీకి గౌరవంగా ఒక ఫేర్‌‌వెల్ మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ కోరారు. ఆ మ్యాచ్‌కు ఝార్ఖండ్ రాష్ట్రం స్పాన్సర్ చేస్తుందని ఆయన ముందుకొచ్చారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. text: ప్రపంచానికి రెడ్ స్టార్ 'మాదాల రంగారావు'. నటుడు, వామపక్ష భావజాలంతో చలన చిత్రాలు నిర్మించిన నిర్మాత. కానీ, నాకు.. మా అమ్మ చౌదరాణికి, మరికొంతమంది దగ్గిరవారికి తను 'రంగా'. అలా ఆ రోజుల్లో మాములుగా ఎవరూ కనబడేవారు కాదు. మద్రాసు మహానగరంలో కూడా. కనబడితే గినబడితే ఏ స్పెన్సర్స్ లోనో, తాజ్ కోరమాండల్ హోటల్లోనో, చోళా షెరాటన్‍, లేదు ఎయిర్‌పోర్ట్ లాంటి చోట్ల మాత్రమే... ఆ ఆల్బమే చలన చిత్ర జగత్తులోకి ఒక ఎంట్రీ!. నిర్మాతకో, దర్శకుడికో ఆ ఆల్బం చూపించాలి. అదే వారి పోర్ట్‌ఫోలియో. కానీ, రంగా విషయంలో అలా కాలేదు. పరిచయం అయిన కొద్ది రోజులలోనే అమ్మ చౌదరాణికి 'పెద్ద కొడుకు' అయిపోయాడు. రంగా నటుడిగా నిలబడ్డానికి ప్రయత్నిస్తున్న తొలి రోజులవి. ఆదివిష్ణు గారి నాటకం అనుకుంటాను, "మంచుతెర". విజయరాఘవాచారి రోడ్డులోని ఆంధ్రా క్లబ్‍లో ఒక ఆదివారం సాయంత్రం నాటక ప్రదర్శన. గుత్తా రామినీడు, గుమ్మడి, కె.ఎస్. ప్రకాశరావు, మరి కొంత మంది చలన చిత్ర రంగ ప్రభుతులు ఆహుతులు. రంగాది అందులో ఒక ముఖ్యమైన పాత్ర. మద్రాసులోని తెలుగు చలనచిత్ర రంగంలోని ప్రముఖులలో కొందరికి ఒకేసారి, ఒకే చోట తన నటనా కౌశల్యాన్ని చూపించడం, పరిచయం కావడం రంగాకు అదే తొలిసారి. నాటక ప్రదర్శన అనంతరం దర్శకుడు గుత్తా రామినీడు ఒక మంచి పాత్రనిస్తానని తనకు మాట ఇచ్చారు. మద్రాసు విశ్వవిద్యాలయం రీడర్‌గా ఉన్న పర్వతనేని గంగాధర రావు గారింటి పక్కనే రంగా ఉండేవాడు (సి.ఐ.టి.నగర్‌లో). ఆ ఇల్లే తరవాత తన ‘యువతరం’కి ప్రొడక్షన్ ఆఫీస్ అయింది. రంగా తన కుమారుడు రవిని నేను చదువుకున్న మైలాపూర్ కేసరి హై స్కూల్లోనే చేర్పించినట్లు గుర్తు. రంగాతో పాటు, టి.కృష్ణ, పోకూరి బాబురావు, నర్రా వెంకటేశ్వర్లు, బి.గోపాల్, వందేమాతరం శ్రీనివాస్ తదితరులకు కొంతకాలం రాణీ బుక్ సెంటరే కూడలి. ఒంగోలు నుంచి వచ్చిన నల్లూరి 'అన్న' వీరందరికి ఒక పెద్ద దిక్కు. ప్రజా నాట్యమండలి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండేవాడు. టి.కృష్ణ, రంగా మొదట్లో కలిసే ఉన్నా, కాలక్రమంలో ఎవరి తరహాలో వారు తమదైన శైలిలో దర్శక, నిర్మాతల వైవిధ్యమైన పంథాలమూలంగా తలా ఒక మార్గం ఎంచుకున్నారు. 90లలో అనుకుంటా.. ఒక రోజు సాయంత్రం తన వెస్పా స్కూటర్ వేసుకుని మా ఇంటికి వచ్చాడు. ఏదో మాటలమీద, "అనిల్‌తో సినిమా తీయిస్తానమ్మా, ' అని మా అమ్మతో అన్నాడు. నేను నవ్వేసాను. అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఎప్పటి లాగానే నవ్వుతూనే అన్నాడు, "నువ్వు కాదన్నా నేను వాడిని నిర్మాతని చేస్తాను! లాభాలన్నీ నీవీ, అప్పులన్నీ నావే!" అని నవ్వుతునే అన్నాడు. "అమ్మా, నీకు తలకొరివి పెట్టాల్సిన పెద్దకొడుకుని నేనేనమ్మా! అనిల్ కాదు. నేను తనతో సినిమా తీయిస్తాను. నీ మీద ఒట్టు!" అని నవ్వుతూ అమ్మ నెత్తిన చెయ్యి పెట్టి ఒట్టేసాడు. అమ్మ నవ్వుతూనే అంది, "సరేలే, వాడితో నువ్వు తీయించినప్పుడు, నేను చూసినప్పుడు సంగతి కదా!"అని. ఏదైనా మీటింగ్‍కి వెళ్లేటప్పుడు తన మెడ చుట్టూ ఎర్రటి స్కార్ఫ్ ఉండేది. ఒకసారి ఏదో బయట ఊర్లో పార్టీ మీటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. "రా, మనిద్దరం వెళ్లి సూట‌కేస్ కొనుక్కోద్దాం," అని నన్ను లాక్కెళ్లాడు. నార్త్ ఉస్మాన్ రోడ్డులోని వివేక్ అండ్ కో కి వెళ్లాం. వి.ఐ.పి. సూట్ కేసులు పెద్దవే. వాటిల్లో కొట్టొచ్చినట్లు ఉన్న ఎర్ర రంగు సూట‌కేసు తీసుకున్నాడు. నేనడిగాను, "రంగన్నా, ఎందుకు ఎప్పుడూ ఆ ఎరుపే వాడుతావు! నువ్వు "ఎర్రోడివని ప్రంపంచానికి తెలుసుగా?" అని. "నేను ఎర్రోడిని అని ప్రపంచానికి తెలియడం వేరు. నేను ఎర్రోడిగానే బతుకుతాను అని ప్రపంచానికి చెప్పడం వేరు!" అని అన్నాడు. మా రంగా ఎర్రోడే. కొన్ని విషయాల్లో వెర్రివాడు కూడా! తనని నమ్ముకున్న వాళ్లకి నేనున్నాని.. వాళ్ల వెమ్మటే నిలబడ్డాడు. తనని కాటేసినవాళ్లని కూడా క్షమించి, ఉద్యోగాలిప్పించాడు కూడా! కాకపోతే నన్ను నిర్మాత‌గా చూసుకోకుండానే వెళ్లిపోయాడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టీ నగర్ పవర్ హౌస్ దగ్గర, చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు, మెడకి టై, టక్ చేసుకుని, షూస్ వేసుకుని చేతిలో ఒక ఆల్బం‌తో నిటారుగా నిలబడి అడుగులు వేస్తున్న 'రంగా'నే గుర్తుండిపోయాడు. text: వ్యవసాయ విరమణ సన్మాన మహోత్సవం పేరుతో నాగులును సత్కరిస్తున్న కుటుంబ సభ్యులు. అయితే, అదేమీ షష్టిపూర్తి మహోత్సవమో, వివాహ వార్షికోత్సవమో కాదు.. రైతన్న రిటైర్మెంట్.. అవును, వ్యవసాయ విరమణ సన్మాన కార్యక్రమం. 40 ఏళ్లు భూమినే నమ్ముకొని తమను జీవితంలో స్థిరపడేలా చేసిన ఓ రైతుకు వారి కొడుకులు చేసిన వినూత్న సత్కారం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన రైతు, బానోత్‌ నాగులు.. ఆయనకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రాందాస్‌ విజయవాడలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా, రెండో కుమారుడు రవి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. మూడో కుమారుడు శ్రీను ఎంఏ బీఈడీ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు విశ్రాంతినివ్వాలని, వారి శ్రమను తగిన రీతిలో గౌరవించాలని ముగ్గురు కొడుకులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా, మే 29న బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, వ్యవసాధికారులను తమ ఇంటికి ఆహ్వానించి పెద్ద వేడుక నిర్వహించారు. తల్లిదండ్రులను వేదికపై ఆహ్వానించి వ్యవసాయ విరమణ సన్మాన మహోత్సవం పేరుతో వారిని ఘనంగా సన్మానించారు. 'నాన్న కష్టానికి గుర్తింపుగా, మరెందరికో స్ఫూర్తిగా' 40 ఏళ్లుగా వ్యవసాయం చేసి తమను ఉన్నత చదవులు చదివించిన నాన్నకు మేం ఇచ్చే చిన్న గౌరవం ఈ పదవీ విరమణ సన్మానమని నాగులు కుమారుడు రవి బీబీసీకి చెప్పారు. ‘‘చిన్నప్పుటి నుంచి ఆయన చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. అందుకే ఆయన కోసం ఏదైనా చేయాలనుకున్నాం. ఇంట్లో వాళ్లతో చర్చించి ఇలా పదవీ విరమణ సత్కారం ఏర్పాటు చేశాం’అని ఆయన తెలిపారు. ''ఉద్యోగులు 60 ఏళ్లు దాటితే పదవీ విరమణ ఉంటుంది. అదే రైతుకు అలాంటిదేమీ ఉండదు. వ్యవసాయం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఈ రంగంలో ఉన్నవాళ్లకు కూడా ఒక వయసు రాగానే విశ్రాంతినివ్వాలి'' అనేది తన అభిప్రాయం అని రవి చెప్పారు. ''నాన్నను, ఆయన వృత్తిని గౌరవించాలనే ఉద్దేశంతోనే మేం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులు దీన్ని చూసి కొంతైనా మారితే చాలు. కొందరైనా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని భావిస్తున్నాం'' అని రవి పేర్కొన్నారు. నాన్నను, ఆయన వృత్తిని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నాగులు కుమారుడు రవి తెలిపారు. వ్యవసాయ మంత్రి నుంచి అభినందనలు నాగులుకు నిర్వహించిన వ్యవసాయ విరమణ సన్మాన కార్యక్రమానికి వారి బంధువులు, స్నేహితులతో పాటు వ్యవసాయ అధికారులు కూడా హాజరయ్యారు. 'మా నాన్నను సన్మానించిన విషయం తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. మా నాన్నతో ఫోన్లో మాట్లాడి అభినందించారు. చాలా మంది రాజకీయనాయకులు, వ్యవసాయ అధికారులు కూడా వచ్చారు'' అని రవి తెలిపారు. 'భూమితో బంధం పోతుందని బాధపడ్డారు' ''తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరంన్నర పొలాన్ని మా నాన్న తన కష్టంతో 10 ఎకరాలకు పెంచారు. రైతు విరమణ ప్రతిపాదన తెచ్చిప్పుడు భూమితో బంధం పోతుందని ఆయన బాధపడ్డారు'' అని రవి చెప్పారు. అన్నదాతగా, కన్న తండ్రిగా ఆయన మా కడుపు నింపారు. ఇప్పుడు ఆయనకు విశ్రాంతినిచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాన్ని వదిలేసినా ఊరిని మాత్రం వదిలివెళ్లను - నాగులు, విశ్రాంత రైతు ‘‘40 ఏళ్లు వ్యవసాయం చేశాను. ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. పంటలు బాగా పండి లాభాలొచ్చిన రోజులూ ఉన్నాయి.. పెట్టుబడులు కూడా కోల్పోయిన సందర్భాలున్నాయి. వ్యవసాయం అనుకూలించినా, అనుకూలించకపోయినా కూడా దీన్నే నమ్ముకుని జీవితం సాగించాను. సాగు ఆధారంగానే నా పిల్లలను పెంచి వారికి మంచి భవిష్యత్ ఇచ్చాను. ఇప్పుడు వారు నన్ను ఇంతకాలం పడిన కష్టం చాలు విశ్రాంతి తీసుకోమని కోరారు. వ్యవసాయాన్ని వదిలేయాలంటే మొదట బాధగా అనిపించింది. కానీ, నేనూ అలసిపోయాను. అందుకే వారి మాట కాదనలేక అంగీకరించాను. ఇప్పటికీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది, అయినా, పిల్లల మాటను గౌరవించి విరమించుకున్నాను. మొత్తం భూమిని కౌలుకిచ్చేశాను. అయితే, వ్యవసాయాన్ని వదిలేసినా మా ఊరిని మాత్రం వదలను. పిల్లలు వారుండే హైదరాబాద్ వచ్చేయమని కోరుతున్నారు. కానీ.. ఇక్కడే ఉంటాను. నా పిల్లల పెళ్లి ఎంతో ఘనంగా చేశాను. వారిప్పుడు అంతకంటే ఘనంగా నా ఈ వ్యవసాయ విరమణ వేడుకను జరిపారు.’’ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆ ఇళ్లంతా సందడిగా ఉంది.. బంధువులు, స్నేహితులతో కళకళలాడుతోంది.. ఇంటి ముందున్న వేదికపై వృద్ధ దంపతులు దండలు మార్చుకుంటున్నారు. అతిథులంతా చప్పట్లు కొడుతున్నారు. text: గతంలో 156 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న హాంకాంగ్.. 21 ఏళ్ల క్రితం అంటే 1997 జూలై 1న చైనా చేతుల్లోకి వెళ్లింది. అయితే.. 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' అనే సూత్రంలో భాగంగా.. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి హక్కులు కలిగి ఉంది. కానీ, అక్కడ పూర్తిస్థాయి ప్రజాస్వామిక ప్రభుత్వం మాత్రం లేదు. గొడుగు విప్లవం తమ ప్రాంతాన్ని చైనా క్రమక్రమంగా ఆక్రమిస్తోందంటూ.. 2014లో హాంకాంగ్‌లో ఆందోళనలు పెద్దఎత్తున మొదలయ్యాయి. హాంకాంగ్‌లో స్వేచ్ఛావాదం కోసం విద్యార్థుల నాయకత్వంలో ప్రారంభమైన ఆ ఉద్యమంలో.. లక్షల మంది నిరసన తెలిపారు. నెత్తిన గొడులు పెట్టుకుని వచ్చిన విద్యార్థుల నినాదాలతో హాంకాంగ్ ప్రధాన వ్యాపార కూడలి దద్దరిల్లింది. ఆ ఉద్యమాన్ని గొడుగు విప్లవం (అంబ్రెల్లా రివల్యూషన్)గా పేర్కొంటారు. 2014లో గొడుగులతో నిరసన ప్రదర్శన. ఆ తర్వాత ఏటా 'ప్రో- డెమోక్రసీ' ఉద్యమం జరుగుతోంది. కానీ, ఉద్యమంలో కీలకమైన అనేక మందిని జైళ్లలో పెట్టడంతో గతేడాది ఆందోళనలు బలహీన పడ్డాయి. ఈ ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో 50వేల మంది ఉద్యమకారులు పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. కానీ, అందులో పాల్గొన్నది 9,800 మందే అని పోలీసులు తెలిపారు. ఇరు వర్గాలు తెలిపిన లెక్కలు కూడా గతంలో కంటే తక్కువగానే ఉన్నాయి. ఆదివారం హాంకాంగ్ వీధుల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రజలు ఆదివారం వందల మంది బ్యానర్లు, పసుపు రంగు గొడుగులు పట్టుకుని వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనల నేపథ్యంలో హాంకాంగ్ వీధుల్లో పోలీసులను భారీగా మోహరించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చిత్రపటాలను కాల్చుతూ కొందరు నిరసన తెలిపారు. చిత్రపటాలకు అంటించిన మంటను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా సిబ్బంది. చైనాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ మాస్కులతో నిరసనకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. 2014 ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్ తాజా నిరసనలో పాల్గొని ప్రసంగించారు. అయితే, ఈ ఆందోళనలు 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' అనే సూత్రాన్ని అవమానించేలా ఉన్నాయని, ఇలాంటి చర్యల వల్ల హాంకాంగ్ అభివృద్ధికి నష్టం కలిగిస్తాయని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యం కోసం ఏటా జరిగే నిరసనకు ఈ ఏడాది ప్రజల నుంచి స్పందన తగ్గింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతల నడుమ ఆదివారం నిర్వహించిన వార్షిక ప్రదర్శనలో చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువ మంది పాల్గొన్నారు. text: బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ ఏపీ ఎంపీలు బుధవారం పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్న వేళ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీంతో మోదీపై ఏపీతో పాటు తెలంగాణలో సైతం రాజకీయ నేతలూ, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయని కొందరు అంటుంటే, అసలు పార్లమెంటులో బిల్లుపై ఓటింగ్ జరపాలంటే తలుపులు మూయకుండా ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ప్రధాని ఏమన్నారు? బుధవారం పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు సభ జరగకుండా అడ్డుపడుతున్న సమయంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ''ఎన్నికల్లో లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించారు. అప్పుడు సభ ఆర్డర్‌లో లేదు. ఆంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా తెలంగాణ ఏర్పాటు చేసిన పక్షాల్లో మేమూ ఉన్నాం" అని అన్నారు. "నాలుగేళ్ల తర్వాత కూడా ఇంకా ఇన్ని సమస్యలు ఉండడానికి కారణమదే. రాజకీయ స్వార్థంతో హడావుడిగా ఏపీ విభజన నిర్ణయం తీసుకున్నారు''అని వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో కాంగ్రెస్ తీరుపైనే మోదీ విమర్శలు చేసినప్పటికీ ఆయన వ్యాఖ్యలపై తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు నిరసన తెలుపుతున్నాయి. చిన్నమ్మది ఒక మాట.. మోదీది మరో మాటా! 2014 ఎన్నికల ప్రచార వేళ బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా తిరుపతిలో మోదీ ప్రసంగిస్తూ ''తల్లిని చంపి బిడ్డను బతికించారు'' అని వ్యాఖ్య చేసినప్పుడూ తెలంగాణలో విమర్శలు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాడు మోదీ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ''రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర మరిచిపోవద్దు, ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి'' అంటూ బీజేపీ నేత సుష్మా స్వరాజ్ లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలుగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో మండిపాటు ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రసంగంపై సోషల్‌ మీడియలో నెటిజన్లు తీవ్రంగానే ప్రతిస్పందిస్తున్నారు. ''ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు తెలిపింది. ఆ పార్టీకి చెందిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు'' అని మోదీ పార్లమెంట్ ప్రసంగంపై ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ''నిన్న అదే పార్లమెంట్‌ సాక్షిగా మీ గౌరవం తగ్గించుకున్నారు. తెలంగాణ.. కశ్మీరో, నోటిఫైడ్ ఏరియానో కాదు'' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటునే మోదీ అవహేళన చేశారు: రేవంత్ రెడ్డి మోదీ ప్రసంగం చౌకబారుగా ఉందని, ఆయన తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ''విభజన చట్టం ప్రకారం నేరవేర్చాల్సిన హామీలనే కేంద్రం నెరవేర్చలేదు. ఎన్డీయే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం అక్కడ సమస్యలు పరిష్కరించింది. ఏ రోజైనా ఇద్దరు సీఎంలతో విభజన సమస్యలపై ప్రధాని చర్చించారా?'' అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని ప్రధాని చెప్పడం హర్షణీయమే కానీ, బిల్లు పై ఓటింగ్ సమయంలో తలుపులు మూస్తారనే చిన్న విషయం ప్రధానికి తెలియకపోవడం బాధాకరమని రేవంత్ పేర్కొన్నారు. వి. ప్రకాశ్ 'మోదీ తెలంగాణ వ్యతిరేకి' తెలంగాణ ప్రజల మనోభావాలు తెలియకుండా ప్రధాన మంత్రి మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర, పోరాటాల గురించి తెలిసుంటే మోదీ ఇలా మాట్లాడేవారు కాదని టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ జలవనరుల సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ''చిన్న రాష్ట్రాలకు ఆర్ఎస్ఎస్ అనుకూలమే కానీ, అదే సంస్థ నుంచి వచ్చిన ప్రధాని మాత్రం రాజకీయ లబ్ధి కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చులకనగా మాట్లాడుతున్నారు" అని ప్రకాశ్ అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను విమర్శించేలా ఉన్నాయి కానీ, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని తాము అనుకోవడం లేదని టీఆర్ఎస్ నేత, ఎంపీ వినోద్ కుమార్ బీబీసీతో అన్నారు. ''అడ్డంగా విభజించారు, నిలువునా విభజించారు అనేది కాదు తెలంగాణ రావడం ముఖ్యం. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి చేయడం మా కర్తవ్యం'' అని వినోద్ చెప్పారు. రామచంద్రరావు 'ఆ ఆగ్రహం కాంగ్రెస్ ధోరణిపైనే.. తెలంగాణపై కాదు' ప్రధాని ఏ సందర్భంలో అలా వ్యాఖ్యానించారో గమనించాలని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఎంఎల్సీ రామచంద్రరావు దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, ''పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీరును మాత్రమే మోదీ విమర్శించారు కానీ, తెలంగాణకు వ్యతిరేకంగా కాదు'' అని అన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో విభజనకు సంబంధించి పార్టీలన్నింటితో చర్చించకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లిందని, అయినా కూడా తమ పార్టీ భేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిందని ఆయన గుర్తు చేశారు. ''బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ ఏర్పాటయ్యేదే కాదు. ఆనాడే అన్ని పార్టీలతో చర్చించి తెలంగాణ బిల్లును రూపొందిస్తే పోలవరం, హైకోర్టు విభజన, ఉద్యోగాల సమస్య తదితర అంశాలపై స్పష్టత వచ్చేది. మోదీ దీనిపైనే వ్యాఖ్యానించారు. తెలంగాణపై వ్యతిరేకంగా కాదు'' అని రాంచంద్రరావు తెలిపారు. 'ప్రధాని వ్యాఖ్యలు సరికావు' ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి తలుపులు మూసి అడ్డంగా విభజించారు అనడం సరికాదు అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ బిల్లు పాస్ చేసే సమయంలో తాను సభలో ఉన్నానని, సభలో ఏ బిల్లు పాస్ చేసినా హౌజ్ క్లియర్ అని స్పీకర్ ఆదేశించిన తర్వాత తలుపులు మూసేసి బిల్లు ఆమోదానికి సిద్ధమవుతారని తెలిపారు. ''ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయి. నాలుగేళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తికి సభ నియమాలు తెలియవా'' అని పొన్నం ప్రశ్నించారు. 'తలుపులు ఎందుకు మూస్తారంటే?' బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ తలుపులు మూసివేయడంలో తప్పేమీ లేదని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల పొలిటకల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ''బిల్లు ఆమోదించే ప్రక్రియ, ఓటింగ్ అంతా సభ నియమాలను అనుసరించే జరుగుతుంది. సభ అధ్యక్షుడి ఆదేశానికి అనుగుణంగానే సభ నిర్వహణ జరుగుతుంది. ఎన్నుకోబడిన సభ్యులు మాత్రమే బిల్లుపై ఓటింగ్ చేయడానికి అర్హులు. బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు బయటివారు లోపలికి, లోపలివారు బయటకు వెళ్లకుండా ఉండేందుకు తలుపులు మూసివేస్తారు. ఇందులో తప్పేమీ లేదు'' అని వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''పార్లమెంట్ తలుపులు మూసి అడ్డంగా విభజించారు''... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలివి. text: ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తరచూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, ఇతరుల నుంచి దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. కానీ, ఆ సలహాలను పాటించడం ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి అంత సులువు కాదు. ప్రపంచ పట్టణ జనాభాలో దాదాపు 30 శాతం మంది ప్రజలు మురికివాడల లాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వారికి సరైన నివాస సదుపాయాలు ఉండవు, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండదు. దాంతో, అంటువ్యాధులు సులువుగా వ్యాప్తి చెందుతాయి. నైరోబీలోని ముకురు మురికివాడలో స్నానం చేసేందుకు కూడా నీళ్లు కొనుక్కోవాల్సిందే 43ఏళ్ల సెలెస్టీన్ అధియాంబో తన భర్త, ఆరుగురు పిల్లలతో కెన్యా రాజధాని నైరోబీ‌లోని ముకురు మురికివాడలో నివసిస్తున్నారు. ఇరుకుగా ఒకే గది ఉన్న వారి ఇంటికి నీళ్లు రావు. విద్యుత్ సదుపాయం లేదు. ఇళ్ల మధ్య మురుగు నీరు ఏరులై పారుతుంది. చెత్త అంతా నేరుగా నదిలోకి వెళుతుంది. ఈ మురికివాడలో 5 లక్షల మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు. "ఏదైనా అంటువ్యాధి సోకితే ఒక పిల్లాడిని వేరుగా ఉంచేందుకు మా ఇంట్లో గది లేదు. ప్రభుత్వమే రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లాలి" అని ఆమె బీబీసీతో చెప్పారు. ముకురు మురికివాడలో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు స్నానం చేసేందుకు కూడా సరిపడా నీళ్లు దొరకడంలేదని ఈ మురికివాడ వాసులు చెబుతున్నారు. ఇక్కడ మెర్సీ ముకురు అనే స్వచ్ఛంద సంస్థ నాలుగు ప్రాథమిక పాఠశాలలు నడుపుతోంది. వాటిలో దాదాపు 7,000 విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో సగం మంది విద్యార్థులకు సబ్బు కొనుక్కొనే స్తోమత లేదని ఆ సంస్థ అధ్యక్షులు మేరీ కిల్లీన్ అంటున్నారు. "ఈ పరిస్థితులను చూస్తుంటే నాకు భయమేస్తోంది. మా ప్రాంతంలో కరోనావైరస్ వ్యాప్తి చెందితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేం" అని అధియాంబో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఆఫ్రికాలో చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న ఇంట్లోనే 12 మంది దాకా ఉంటారు. ఎవరికైనా కరోనావైరస్ లాంటిది సోకితే, వారిని నిర్బంధంలో ఉంచడం సాధ్యమయ్యే పనికాదు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రతినిధి డాక్టర్ పియరీ యంపీలే చెప్పారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని అనేక దేశాలలో ఆయన పనిచేశారు. నీటి సమస్య మురికివాడలకే పరిమితం కాదు. భారత్‌లోని చెన్నై, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరాలు గత ఏడాది తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. చెన్నైకి తాగు నీటిని రైళ్లలో తరలించాల్సి వచ్చింది. దక్షిణాసియాలోని చాలా నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గతేడాది చెన్నైలో తీవ్రమైన కరవు ఏర్పడింది. "ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే నీటి కొరత వస్తే, తరచూ చేతులు కడుక్కోవాలంటే మాకు నీళ్లు దొరకడం కష్టమే" అని చెన్నై శివారులో నివసిస్తున్న శాంతి శసింద్రనాథ్ బీబీసీతో అన్నారు. గత ఏడాది నీటి కొరత సమయంలో, వారు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల నుంచి నీటిని కొనాల్సి వచ్చింది. "పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు చాలా తక్కువ ఉన్నాయి. వైద్యుల సలహాలను చాలామంది పాటించడం లేదు" అని శాంతి చెప్పారు. చెన్నైలో గత ఏడాదిలాగే నీటి ఎద్దడి ఎదురైతే తరచూ చేతులు కడుక్కోవడం కష్టమవుతుందని శాంతి అంటున్నారు "రైళ్లలో జనాలు దగ్గుతారు, తుమ్ముతారు. ఎదుటివారి ముఖానికి వారికి మధ్య దూరం కొన్ని అంగుళాలు మాత్రమే ఉంటుంది. అయినా కనీసం నోటికి రుమాలు అయినా అడ్డుపెట్టుకోరు. అదేంటని అడిగితే, కొందరు క్షమించండని అంటారు. మరికొందరు ఎదురు మాట్లాడతారు" అని ఆమె అంటున్నారు. "చేతులను జాగ్రత్తగా, శుభ్రంగా కడుక్కోవాలని మా పిల్లలకు చెప్పాను. బయటి నుంచి వచ్చినప్పుడల్లా చేతులు కడుక్కోవాలని సూచించాను. అందుకే ఐదు నిమిషాలు బయట తిరిగినా చేతులను కడుక్కుంటున్నారు. చాలావరకు ప్రయాణాలను తగ్గించుకున్నాం" అని ఆమె చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ పాప్పీ లాంబెర్టన్ చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారందరినీ నిర్భంధంలో పెడితేనే పరిస్ధితి అదుపులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్రికాలో కరోనా మహమ్మారి మహా విపత్తులా మారకముందే ప్రభుత్వాలు, నాయకులు అప్రమత్తమై గట్టి చర్యలు చేపట్టాలని డాక్టర్ యం.పీలే అంటున్నారు. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్‌ సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు దాదాపు మూతపడుతున్నాయి. text: కేసీఆర్, కేటీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసిన మహారాష్ట్ర నాయకులు "తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మా గ్రామాల్లోనూ అమలు చేయాలి. అలా చేయలేకపోతే మా గ్రామాలను తెలంగాణలో కలపాలి" అనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. తాము టీఆర్‌ఎస్‌ టికెట్‌పై మహారాష్ట్రలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపారు. 'మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ, మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది" అని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు వెంట మహారాష్ట్రలో ఉన్న గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజకీయ నాయకులు ఏమంటున్నారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని ధర్మాబాద్ తాలూకా సహా... 5 నియోజకవర్గాలలోని పలు గ్రామాల ప్రజలతో, రాజకీయ నాయకులతో బీబీసీ మాట్లాడింది. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? "ఇక్కడ మాకు ప్రతిదీ సమస్యే. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా" అని నయ్‌గావ్‌ నియోజకవర్గానికి చెందిన గంగాధర్ అన్నారు. "మా ప్రాంతంలో గ్రామాలకు సరిగా రోడ్లు లేవు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు" అని డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన చిన్నా రెడ్డి చెప్పారు. "నీటి సమస్య ఉంది. నాలాలు శుభ్రం చేయరు. రోడ్లు బాగుండవు" అని బోకర్ ప్రాంతానికి చెందిన గణపతి రావు చెప్పారు. డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన రాజు మాత్రం తమకు సమస్యలేమీ లేవని అన్నారు. "గతంలో సమస్యలు ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో సమస్యలేమీ లేవు. అంతా బాగా ఉంది. మా మహారాష్ట్ర కూడా అభివృద్ధి అవుతుంది" ఆయన వివరించారు. "సరైన వైద్య సదుపాయాలు లేవు. కరెంటు, విద్య, ఇవన్నీ ఇక్కడ సమస్యలే" అని కిన్వట్‌కు చెందిన సూర్యవంశీ గజానంద్ చెప్పారు. "మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కోపం ఏంటంటే, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, ఆ పథకాల ప్రయోజనాలు అందాల్సిన వారికి అందవు" అని బోకర్‌‌ నియోజకవర్గం వాసి స్వరూప అన్నారు. మహారాష్ట్ర సీఎం ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా టీఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న స్థానిక నాయకులతో బీబీసీ మాట్లాడింది. "సరిహద్దులో ఉండటంతో మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. తెలంగాణను కేసీఆర్ అంత అభివృద్ధి చేసినప్పుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కేంద్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది కదా" అని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ ప్రశ్నించారు. "మా తాలూకా మాత్రమే కాదు, సరిహద్దులో ఉన్న అన్ని తాలూకాల్లోనూ నాయకుడిగా నిలబడి ప్రజలందరికీ సౌకర్యాలు అందేలా చూడాలని కేసీఆర్ నాకు సూచించారు. కేసీఆర్ చెప్పడంతోనే (ఎన్నికల) పనిలో దిగాము" అని బాబురావు గణపతిరావు చెప్పారు. "ఇక్కడ టీఆర్‌ఎస్ పోటీ చేయడం వల్ల, నాకు తెలిసి పెద్దగా ఏం జరగదు. ఓట్లను చీల్చడం తప్పితే, ఆ పార్టీ గెలిచే అవకాశాలైతే లేవు. కాబట్టి టీఆర్‌ఎస్ పార్టీ ఒక స్పాయిలర్‌గా వచ్చి మహారాష్ట్రలో బీజేపీని బలపరిచే పని చేయటానికి ఇష్టపడదు అనుకుంటున్నా. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రాధాన్యతలు ఏంటో తెలుసు. ఒక స్పాయిలర్‌గా కాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తే ఇంకా మంచిది" అని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు. టీఆర్‌ఎస్ పోటీపై ఏమంటున్నారు? "ఇది ఒక పొలిటికల్ స్టంట్ కూడా అయి ఉండవచ్చు. ఇక్కడ చాలా మంచి అభివృద్ధి పథకాలు ఉన్నాయి. అందరికి ప్రయోజనాలు అందుతున్నాయి. కాబట్టి, తెలంగాణలోని టీఆర్‌ఎస్ పార్టీ ఇక్కడికి వచ్చి ఎన్నికలలో పోటీ ఇవ్వలేదు" అని శివసేన నేత కునాల్ నాగర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలన్న నినాదంతో టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధులు ప్రయత్నించారు. "టీఆర్‌ఎస్ ఇక్కడ పోటీ చేయడం చాలా మంచిది" అని నయ్‌గావ్‌కు చెందిన గంగాధర్ అన్నారు. "అంతటా పోటీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. కేవలం సరిహద్దు వెంట ఉన్న ఒకటి రెండు నియోజకవర్గాలలో నిలబడితే ఏం ఫలితం ఉంటుంది?" అని డెగ్లూర్ వాసి చిన్నా రెడ్డి ప్రశ్నించారు. "టీఆర్‌ఎస్‌ వాళ్లను ముందు తెలంగాణను బాగు చేసుకోమనండి. ఆ తర్వాత మా మహారాష్ట్ర వైపు రమ్మనండి" అని రాజు అన్నారు. స్వరూప భిన్నాభిప్రాయాలు "తెలంగాణ అధికారులు ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడి అధికారులు మాత్రం పక్కకు పో అని కసురుకుంటారు" అని హథ్‌గావ్‌ నియోజకవర్గానికి చెందిన కమలా భాయ్ చెప్పారు. "మహారాష్ట్రలో మాకు ఏమీ తక్కువ లేదు. మా ప్రభుత్వం అన్నీ ఇస్తోంది" అని బోకర్ నియోజకవర్గానికి చెందిన గణపతి రావు అన్నారు. "మా ఎమ్మెల్యేను గెలిపించుకుని రోడ్ల కోసం పోరాడుతాం. మాకు తెలంగాణ వాళ్లు ఏమీ అవసరం లేదు" అని నయ్‌గావ్‌ వాసి శివాజీ వ్యాఖ్యానించారు. కిన్వట్‌కు చెందిన సూర్యవంశీ గజానంద్ మాత్రం... "మేము మహారాష్ట్రలో కాకుండా, తెలంగాణలో ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాం. నేను ఒక్కడిని కాదు. మా దగ్గర చాలామంది అలాగే అనుకుంటున్నారు" అని చెప్పారు. "మహారాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఆ పథకాలను లబ్ధిదారులకు అందేలా చేస్తే చాలు" అని స్వరూప అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని నయ్‌గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. text: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని గుడివాడలో ఈ నెల 2న మస్తానమ్మ చనిపోయారు. ఆమె వయసు 107 ఏళ్లని చెబుతారు. మస్తానమ్మ వృద్ధాప్యం కారణంగా కన్నుమూసినట్టు ఆమె మనవడు కర్రె నాగభూషణం బీబీసీకి తెలిపారు. మస్తానమ్మ ఆరుబయట.. పొలం గట్ల వద్ద.. కట్టెల పొయ్యిపై పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో చేసే వంటలు నెటిజన్లను నోరూరిస్తాయి. మిక్సర్, ఇతర అధునాతన సామగ్రి ఏదీ వాడకుండా మస్తానమ్మ వంట చేసే విధానాన్ని ఆమెకు వరుసకు మనవడైన కె.లక్ష్మణ్, ఆయన స్నేహితుడు శ్రీనాథ్ రెడ్డి వీడియో తీసి వారు 2016లో ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ 'కంట్రీ ఫుడ్స్'లో పెట్టేవారు. దాదాపు ఏడాది క్రితం అప్‌లోడ్ చేసిన 'వాటర్‌మిలన్ చికెన్' వీడియోకు కోటీ 10 లక్షల వ్యూస్ వచ్చాయి. మస్తానమ్మ వంటకాల్లో అత్యంత ప్రసిద్ధ వంటకం ఇది. టొమాటోలో ఆమ్లెట్, ఎగ్ దోశ, చికెన్ బిర్యానీ, ఈము పక్షి మాంసం కూర తదితర వంటకాల వీడియోలను కనీసం 30 లక్షల నుంచి 80 లక్షల మంది చూశారు. 'గ్రానీ మస్తానమ్మ' శాకాహారం, మాంసాహారం - రెండు రకాల వంటలూ చేస్తారు. ఏ వంటలో ఏ పదార్థం ఎంతుండాలనేది ఆమె ఉజ్జాయింపుగా వేస్తారు. మీ అభిమానులకు మీరిచ్చే సందేశం ఏమిటని బీబీసీ నిరుడు ఒక ఇంటర్వ్యూలో మస్తానమ్మను అడగ్గా- ''బాగా కూరలు వండుకొని, సుబ్బరంగా తినండి'' అని పెద్దగా నవ్వుతూ చెప్పారు. మస్తానమ్మ 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారని 'ద హిందూ' ఒక కథనంలో తెలిపింది. ''మస్తానమ్మ అసలు పేరు మార్తమ్మ. ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఆమెను ఒక ముస్లిం కుటుంబం దత్తత తీసుకొంది. ఆమె పేరును మస్తానమ్మగా మార్చింది. మస్తానమ్మకు 22 ఏళ్ల వయసులో భర్త చనిపోయారు. ఆమె ఐదుగురి సంతానంలో నలుగురు మరణించారు. ఆమె సంతానంలో ఇప్పుడు ఒక్క కుమారుడు మాత్రమే ఉన్నారు. ఆయన ఇంటిని ఆనుకొని ఉన్న మరో ఇంట్లో మస్తానమ్మ విడిగా ఉండేవారు'' అని వివరించింది. చిన్నతనం నుంచే వంటలకు ప్రసిద్ధి మస్తానమ్మ పుట్టిన గ్రామం తెనాలి మండలంలోనే ఉన్న కోపల్లె గ్రామం. చిన్నతనం నుంచి రుచికరమైన వంటలకు ఆమె ప్రసిద్ధి. మెట్టినింటికి వెళ్లిన తర్వాత గుడివాడ గ్రామంలో పలు ఇళ్లలో శుభకార్యాల సందర్భంగా తన చేతి వంటల రుచి చూపించేవారు. సుమారు ఐదు వేల జనాభా ఉన్న గుడివాడలో దాదాపుగా అందరికీ మస్తానమ్మ చేతివంట బాగా తెలుసు. ఈ విషయం గ్రహించిన లక్ష్మణ్, స్నేహితుడితో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, గుడివాడలోనే వంటల వీడియోలు రికార్డ్ చేసేవారు. వాటిని అప్‌లోడ్ చేయగానే తొలుత వేలల్లో, తర్వాత లక్షల్లో వ్యూస్ రావడం వారికి ఉత్సాహాన్నిచ్చింది. చాక్లెట్ కేక్, పిజ్జాల నుంచి ఎండు చేపలపులుసు వరకు పలు గ్రామీణ వంటలను ఆమె చేతుల మీదుగా తయారు చేయించి, వీడియోలు పోస్ట్ చేశారు. గడిచిన ఆరు నెలలుగా మస్తానమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వీడియోలకు అవకాశం లేకుండా పోయింది. ఆమె చివరిసారిగా చేసిన యూట్యూబ్ వంటకం- ములక్కాయ, కోడిగుడ్డు కర్రీ. యూట్యూబ్ ద్వారా తమ నాన్నమ్మకు ఆదరణ లభించడం తమకు ఆనందాన్నిచ్చిందని నాగభూషణం చెప్పారు. సీఫుడ్ వంటల్లో ఆమెకు ప్రావీణ్యం ఉందన్నారు. నానమ్మ మరణం తమ కుటుంబంలో పెద్దలోటు అని చెప్పుకొచ్చారు. మస్తానమ్మ మస్తానమ్మ మస్తానమ్మ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తన చేతి వంటతో 'యూట్యూబ్‌'లో సంచలనం సృష్టించి, దేశ విదేశాల్లో లక్షల మంది అభిమానం చూరగొన్న వృద్ధ మహిళ కర్రె మస్తానమ్మ కన్నుమూశారు. text: నరేంద్రమోదీ సర్కారు దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటోంది అరవింద్ సుబ్రమణియన్ తాజాగా ఒక పత్రికలో రాసిన వ్యాసంలో.. దేశ ఆర్థిక వృద్ధిని లెక్కించే విధానాన్ని భారతదేశం మార్చిందని.. దీనివల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనా ప్రతి ఏటా వాస్తవం కన్నా 2.5 శాతం అధికంగా లెక్కించి చెప్తున్నారని తన పరిశోధనలో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయన నిర్ధారణలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాదారుల సంఘం తిరస్కరించింది. ఆయన లేవనెత్తిన అంశాలు ఒక్కొక్క దానికీ ఖండనలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది. అయితే.. అరవింద్ సుబ్రమణియన్ విశ్లేషణలు భారత ఆర్థికాభివృద్ధి గణాంకాల విశ్వసనీయత మీద మరోసారి ఆందోళనలను రేకెత్తించాయి. 2018లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారతదేశం నిలిచింది. అయితే.. ఈ వృద్ధిని లెక్కించటానికి అనుసరించిన విధానం లోపభూయిష్టంగా ఉందని, ఆర్థిక వ్యవస్థకు వాస్తవికంగా ప్రతిఫలించటం లేదని ప్రముఖ ఆర్థికవేత్తలు చాలా మంది వాదించారు. ప్రభుత్వ అంచనాల కన్నా వాస్తవ ఆర్థికవృద్ధి రేటు చాలా తక్కువగా ఉందని అరవింద్ సుబ్రమణియన్ అంటున్నారు ఏమిటీ వివాదం? జీడీపీని లెక్కించే పద్ధతిని భారతదేశం 2015లో మార్చింది. ప్రధాన మార్పుల్లో ఒకటి: జీడీపీని ఇప్పుడు మార్కెట్ ధరలను ఉపయోగించి లెక్కిస్తున్నారు. అంతకుముందు కనీస ధరలను బట్టి లెక్కించేవారు. అంటే.. ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులు పొందటానికి అయ్యే టోకు ధరల ఆధారంగా 2015 వరకూ జీడీపీని లెక్కించేవారు. కానీ ఇప్పుడు వినియోగదారులు చెల్లించే మార్కెట్ ధరల ఆధారంగా జీడీపీని లెక్కిస్తున్నారు. అలాగే.. త్రైమాసిక, వార్షిక వృద్ధిని లెక్కించటానికి ఆధారంగా ఉండే సంవత్సరాన్ని (బేస్ ఇయర్‌ను) 2004-05 నుంచి 2011-12కు మార్చారు. ఇలా మార్చినప్పటినుంచీ.. ఈ కొత్త పద్ధతి మీద ఆర్థికవేత్తలు, గణాంక నిపుణుల నుంచి నిశిత విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 2011-12 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆర్థికాభివృద్ధిని వాస్తవంకన్నా అతిశయంగా చూపించారని చెప్పటం ద్వారా ఆ సందేహాలను అరవింద్ సుబ్రమణియన్ బలపరిచారు. దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగింది ఈ సంవత్సరాల్లో ఆర్థికాభివృద్ధి 7 శాతంగా ఉందని అధికారిక లెక్కలు చెప్తుంటే.. ''వాస్తవ వృద్ధి'' కేవలం 4.5 శాతంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. అరవింద్ సుబ్రమణియన్ తన సొంత పరిశోధన ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పరిశోధనను హార్వర్డ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ప్రచురించింది. కొత్త విధానం అమలులోకి వచ్చిన 2015 నుంచి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో అధిక వృద్ధి రేటు అంచనాలను ప్రశ్నిస్తున్న నిపుణుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ.. నిరుద్యోగిత 2017 - 18 మధ్య 45 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగింది. నిరుద్యోగిత ఇంత అధికంగా ఉన్నపరిస్థితుల్లో అధిక ఆర్థికాభివృద్ధి లెక్కల మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ అధిపతి, అంర్జాతీయ ద్రవ్య నిధి మాజీ ప్రధాన ఆర్థికవేత్త రఘురాం రాజన్ కూడా సందేహాలు వ్యక్తంచేశారు. నిర్మలా సీతారామన్ ఇటీవలే ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు భారత ప్రభుత్వం ఏం చెప్తోంది? ఆర్థికాభివృద్ధిని లెక్కించటానికి తాము ప్రవేశపెట్టిన పద్ధతిని ప్రభుత్వం సమర్థించుకుంది. ''ఆర్థికవ్యవస్థలో వివిధ రంగాల తోడ్పాటును భారతదేశం నిష్పాక్షికంగా లెక్కిస్తుంది. ఆమోదించిన విధానాలు, పద్ధతుల్లోనే దేశ జీడీపీ అంచనాలు రూపొందించటం జరిగింది'' అని భారత అర్థగణాంక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక లెక్కల సేకరణ విషయమై ప్రభుత్వం మీద ప్రశ్నలు తలెత్తటం ఇదే మొదటిసారి కాదు. 2016 జూన్‌లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీని లెక్కించటానికి ఉపయోగించిన కంపెనీల్లో 36 శాతం సంస్థల ఆచూకీ లభించకపోవటమో, వాటిని పొరపాటుగా వర్గీకరించటమో జరిగిందని ఇదే అర్థగణాంక మంత్రిత్వశాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సమాచారం సేకరించే విధానంలో లోటుపాట్లు ఉన్నాయని ప్రభుత్వం సైతం అంగీకరించింది. ఈ నేపథ్యంలో.. భారత జీడీపీ గణాంకాలను పరిశీలించటానికి భారతీయులు, విదేశీయులతో కూడిన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుబ్రమణియన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి ఇది భారతదేశం మీద ఎలా ప్రభావం చూపుతుంది? ఇటీవలే రెండో సారి ఎన్నికల్లో గెలిచిన మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరించాల్సిన ఒత్తిడిని ప్రభుత్వం ఇప్పటికే ఎదుర్కొంటోంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాదని ప్రభుత్వ సొంత లెక్కలే అంగీకరిస్తున్నాయి. చైనా జీడీపీ వృద్ధి రేటు ఐదేళ్లలో అత్యంత మందకొడిగా ఉన్నప్పటికీ.. వేగంగా అభివృద్ధఇ చెందుతున్న ఆర్థికవ్యవస్థ హోదా చైనాకు వెళ్లిపోయింది. ఇది భారత గౌరవాన్ని దెబ్బతీయటం మాత్రమే కాదు.. గత కొన్నేళ్లలో అమలు చేసిన ఆర్థిక విధానాలు నిజానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తప్పుడు చిత్రం చూపటం ద్వారా వృద్ధిని ఎలా కుంటుపరిచాయనేది కూడా చాటుతోంది. ఉదాహరణకు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి దేశంలో వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచారు. కానీ అలా చేయటం వ్యాపారాలకు మరిన్ని అవరోధాలను సృష్టించింది. వాళ్లు ఎక్కువ ధరకు పెట్టుబడులు అప్పు తెచ్చుకునేలా చేసింది. పరిస్థితులను మరింతగా దిగజార్చుతూ.. మొండి బకాయిలు, చెడ్డ రుణాలు బ్యాంకుల మీద ప్రభావం చూపాయి. దీంతో డబ్బులు తీసుకోవటం కష్టంగా మారింది. ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మూడు సార్లు తగ్గించింది వృద్ధి రేటు ఒడిదుడుకుల్లో పడటం మొదలయ్యాక.. ఆర్థికవ్యవస్థకు ప్రోత్సాహం ఇవ్వటం కోసం రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. ఆర్థికాభివృద్ధిని కుంగదీస్తున్న రెండు పెను సవాళ్లు.. ఉద్యోగాల లేమి, వ్యవసాయ సంక్షోభం. ఆర్థికవ్యవస్థ మీద విశ్వాసాన్ని పునరుద్ధరించటంతో పాటు.. విధానాల విశ్లేషణ కోసం ఎప్పటికప్పుడు వాస్తవిక గణాంకాలను అంచనా వేయటానికి అర్థగణాంక వ్యవస్థను అత్యవసరంగా పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సమాచార సేకరణ విధానాన్ని ఆధునికీకరించటం కోసం ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. మందగమనాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన అవసరముందని అరవింద్ సుబ్రమణియన్ కూడా అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత ఆర్థికాభివృద్ధిని వాస్తవం కన్నా అధికంగా అంచనా వేసి ఉండవచ్చునని దేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారు. text: కేవలం 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో మునగడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడిందని యూకేలోని వేల్స్‌కు చెందిన కొందరు చెబుతున్నారు. "నాకు ఇప్పుడు 49 ఏళ్లు. మెనోపాజ్ మొదలయ్యే దశలో చల్లటి నీళ్లలో మునిగేదాన్ని. దాంతో, నేను మెనోపాజ్ దశలోకి చేరిన విషయం కూడా తెలియలేదు" అని అలిసన్ ఓవెన్ అనే మహిళ వివరించారు. "మెనోపాజ్ దశ మొదలవగానే.. చాలామందికి ఒళ్లంతా చెమటలు పట్టడం.. మానసిక ఆందోళన, చిరాకు, కోపం, కుంగుబాటు, అకారణంగా ఏడుపు వస్తుందని చాలా సార్లు చదివాను. కానీ, నేను ఆ సమయంలో చన్నీళ్లలో ఈత కొట్టేదాన్ని కాబట్టి, నాకు ఆ సమస్యలేవీ రాలేదు" అని ఆమె చెప్పారు. అప్పటి నుంచి తాను తరచూ చల్లని నీటిలో ఈత కొడుతున్నట్లు అలిసన్ తెలిపారు. ఆమె ఒక్కరే కాదు.. మరికొందరు మహిళలను కూడా తన వెంట తీసుకెళ్తున్నారు. అందరూ బృందంగా వెళ్లి సముద్రంలో ఈత కొడుతున్నారు. "ఈత కొడుతుంటే చాలా సరదాగా.. ఉత్సాహంగా అనిపిస్తుంది. చిన్న పిల్లలా మారిపోయినట్లు అనిపిస్తుంది. దాంతో, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. నాతో పాటు మరికొందరు మహిళలు వస్తున్నారు. వాళ్లు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు" అని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా ఈత కొట్టే మహిళలు సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నారు. వెళ్లినప్పుడల్లా 20 మంది దాకా బృందంగా బీచ్‌కి వెళ్లి సముద్రంలో మునిగి వస్తారు. తాను 91 సెకన్ల దాకా నీటిలో మునిగి ఉండగలనని అలిసన్ చెప్పారు. "నేను ప్రస్తుతం మెనోపాజ్ దశలో ఉన్నాను. నాకు పెద్దగా ఇబ్బందిగా అనిపించడంలేదు. రాత్రి వేళలో చెమటల సమస్య కూడా ఎక్కువేమీ లేదు. గతంతో పోల్చితే చిరాకు తగ్గింది" అని మరో మహిళ 53 ఏళ్ల పట్రీషియా వుడ్‌హౌజ్ వివరించారు. మెనోపాజ్ అంటే ఏమిటి? మహిళలకు 45--50 సంవత్సరాల వయసులో వరసగా పన్నెండు నెలలు నెలసరి రాకుండా ఆగిపోతే దానిని "మెనోపాజ్" అంటారు. ఇది శాశ్వతమైన, సహజమైన మార్పు. ఇది జబ్బుకాదు. ఇది ఒక దశ. మన దేశంలో ఏటా పది మిలియన్ల మంది "మెనోపాజ్" దశకు చేరుకుంటున్నారు. 45 - 50 ఏళ్ల మధ్యలో అది ఎప్పుడయినా ఆగిపోవచ్చు. నలభై ఏళ్లకే ఆగిపోతే "ప్రిమెచ్యూర్ మెనోపాజ్" అంటారు. చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి కూడా తొందరగా, అంటే తొలగించిన సంవత్సరానికే "మెనోపాజ్" లక్షణాలు కనపడతాయి. కొన్ని లక్షణాలు: చన్నీళ్లు ఎలా పనిచేస్తాయి? చన్నీళ్లలో మునగడం ద్వారా ఉపశమనం కలుగుతోందని చెప్పడం అసాధారణ విషయమేమీ కాదని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్‌కు చెందిన ప్రొఫెసర్ మైక్ టిప్టన్ అన్నారు. చల్లని నీటిలో ఈత కొట్టడంలో ఆయనకు చాలా అనుభవం ఉంది. "చల్లని నీటిలో స్నానం లేదా ఈత కొట్టడం ద్వారా కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని చాలామంది అనుభవపూర్వకంగా చెబుతుంటారు. కానీ, అది ఎలా సాధ్యం అన్నదానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు" అని ఆయన అన్నారు. "సాధారణంగా చన్నీళ్లతో స్నానం చేసేటప్పుడు నీళ్లు శరీరం మీద పడగానే ఒక్కసారిగా వణికిపోతాం. అలాంటప్పుడు స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. దాంతో, ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. అయితే, అలా చేయడం అన్నిసార్లూ మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చన్నీళ్లలో మునిగినప్పుడు ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది." అని ప్రొఫెసర్ టిప్టన్ వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) చల్లని నీటిలో మునగడం వల్ల మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని కొంతమంది మహిళలు అంటున్నారు. text: పాకిస్తాన్ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్ఏపీ) అత్యవసర ప్రాతిపాదికన వినియోగించేందుకు రెండు సంస్థల వ్యాక్సీన్లకు ఆమోదం తెలిపింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించి, ఆస్ట్రోజెనెకా ఫార్మా సంస్థ తయారుచేస్తున్న వ్యాక్సీన్‌తోపాటు చైనా సంస్థ సాయనోఫార్మ్ తయారు చేస్తున్న వ్యాక్సీన్‌ను పాక్ ఆమోదించింది. అయితే, ఈ వ్యాక్సీన్లు దేశంలో ఇప్పుడే అందుబాటులోకి వస్తాయా? లేదా? అన్నది స్పష్టత లేదు. బ్రిటన్, భారత్‌తోపాటు చాలా దేశాలకు వ్యాక్సీన్లు అందించేందుకు ఆస్ట్రోజెనెకా ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది. సాయనోఫార్మ్ వ్యాక్సీన్ చైనాతోపాటు కొన్ని దేశాల్లో ఇప్పటికే వినియోగంలో ఉంది. చాలా దేశాలతో ఆ సంస్థ ఒప్పందాలు కూడా చేసుకుంది. పాకిస్తాన్ మాత్రం ఈ రెండు సంస్థలతో ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదు. సాయనోఫార్మ్ నుంచి 10 లక్షల వ్యాక్సీన్ డోసుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ‘ప్రీ-బుకింగ్’ చేసిందని ప్రధానికి వైద్య సలహాదారుడిగా ఉన్న ఫైసల్ సుల్తాన్ చెప్పారు. అధికారికంగా ఆర్డర్ ఇవ్వడానికి ముందే ఈ పని చేసిందని చెప్పారు. చైనా నుంచి పాకిస్తాన్‌కు మార్చి నెలలో ఈ డోసులు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏ తేదీన ఇవి వస్తాయన్నదానిపై ప్రభుత్వం తరఫు నుంచి అధికారంగా స్పష్టమైన సమాచారం లేదు. ఈ విషయమై వివరణ కోసం బీబీసీ ఫైసల్ సుల్తాన్‌ను సంప్రదించింది. కానీ, ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వ్యాక్సీన్ కొనుగోలు కోసం పాకిస్తాన్ ఏ సంస్థతోనూ ఇంతవరకూ ఎందుకు ఒప్పందం చేసుకోలేదో చెప్పలేదు? వ్యాక్సీన్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ జాప్యమేమీ కారణం కాదని నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యక్షుడు డాక్టర్ అతా ఉర్ రెహమాన్ అన్నారు. ‘‘వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలు పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకోవడం లేదు. వాటివద్ద ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యానికి సరిపోయేంత ఆర్డర్లు ఉన్నాయి. అందుకే అధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అవి ముందుకు రావడం లేదు’’ అని ఆయన అన్నారు. ఎలా పొందవచ్చు? పాకిస్తాన్ ప్రభుత్వాల స్థాయిలో ఏదైనా దేశంతో వ్యాక్సీన్ కోసం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గ్లోబల్ అలయన్స్ ఫర్ వాక్సీన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ (గావి), కోఅలైషన్ ఫర్ ఎపిడమిక్ ప్రీపేర్డ్‌నెస్ ఇనోవేషన్స్ (సీఈపీఐ) కలిసి ఏర్పాటు చేసిన కోవాక్స్ కూటమి పాకిస్తాన్‌కున్న మరో అవకాశం. కోవాక్స్ ద్వారా పాక్‌లో 20 శాతం జనాభాకు వ్యాక్సీన్లు ఇస్తారు. పాకిస్తాన్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఈ కూటమిలో చేరాయి. కోవాక్స్ పాకిస్తాన్‌కు ఉచితంగా వ్యాక్సీన్ అందించాల్సి ఉంటుంది. కోవాక్స్ ద్వారా కొన్ని వారాల్లోనే పాకిస్తాన్‌కు వ్యాక్సీన్ రావొచ్చని ప్రధాని వైద్య సలహాదారుడు ఫైసల్ సుల్తాన్ ఇదివరకు స్థానిక మీడియాతో చెప్పారు. అయితే, ఆగస్టు కన్నా ముందు ఈ వ్యాక్సీన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు ఆరోగ్య శాఖ అధికారి బీబీసీతో అన్నారు. ‘‘కోవాక్స్ తమ ప్రాధాన్యత కార్యక్రమాన్ని అనుసరిస్తూ దేశాలన్నింటికీ వ్యాక్సీన్లు ఇస్తుంది. గావి ద్వారా పాకిస్తాన్‌లో ఇప్పటికే వివిధ రోగాలకు సంబంధించిన వ్యాక్సీనైజేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరోనావైరస్ వ్యాక్సీన్‌ను కూడా ఇందులో చేర్చొచ్చు’’ అని ఆయన చెప్పారు. కోవాక్స్ ద్వారా అందే డోసులతో పాకిస్తాన్‌లో వ్యాక్సీన్ అవసరం పూర్తిగా తీరుతుందా అన్నది ఓ పెద్ద ప్రశ్న. ప్రైవేటు సంస్థలు త్వరగా ఇస్తాయా? ఔషధాలను దిగుమతి చేసుకుని, సరఫరా చేసే ప్రైవేటు సంస్థలతోనూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవచ్చు. డీఆర్ఏపీ అనుమతితో పాకిస్తాన్‌లోని ప్రావిన్సు ప్రభుత్వాలు వ్యాక్సీన్ కోసం ఏ ప్రైవేటు సంస్థతోనైనా ఒప్పందం చేసుకోవచ్చని కోవిడ్-19 విషయంలో పర్యవేక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ డైరెక్టర్ అసద్ ఉమర్ వెల్లడించారు. అయితే, వ్యాక్సీన్‌ను త్వరగా పాకిస్తాన్‌కు తీసుకురావడం ప్రైవేటు సంస్థలకు కూడా కష్టమేనని పంజాబ్ ప్రావిన్సు ఆరోగ్య శాఖ అధికారి అంటున్నారు. ‘‘ఇప్పటివరకూ వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలన్నీ ప్రభుత్వాలతోనే ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఆర్డర్లు పూర్తి చేయడానికే వాటికి నెలల సమయం పడుతుంది’’ అని అన్నారు. జనాలు సొంతంగా కొనుక్కోవాలా? ప్రైవేటు సంస్థలు వ్యాక్సీన్ అమ్మడం మొదలుపెడితే, జనాలు వాటిని మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తుందని పంజాబ్ ప్రావిన్సు ఆరోగ్య శాఖ అధికారి అన్నారు. ‘‘జనాలు సొంతంగా వ్యాక్సీన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రావాలని ప్రస్తుతం ఏ ప్రభుత్వమూ కోరుకోవడం లేదు. ఇలా జరిగే అవకాశాలు కూడా తక్కువే. కేంద్ర ప్రభుత్వం లేదా ప్రావిన్సు ప్రభుత్వాలు ఆ ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు’’ అని అన్నారు. ప్రావిన్సు ప్రభుత్వాలకు సాధ్యమా? ప్రావిన్సు ప్రభుత్వాలు తమకు తాముగా వ్యాక్సీన్లు కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. అయితే, ప్రావిన్సు ప్రభుత్వాలు సొంతంగా వ్యాక్సీన్ కొనుగోలు చేసే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. పంజాబ్ ప్రావిన్సు వ్యాక్సీన్ కోసం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఇంతవరకూ ప్రావిన్సు ప్రభుత్వం ఏ సంస్థతోనూ వ్యాక్సీన్ కోసం ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. వ్యాక్సీన్లను సొంతంగా తెప్పించుకునేందుకు సింధు ప్రావిన్సు ప్రయత్నాలు చేస్తోందని ఆ ప్రావిన్సు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అజరా పెచీహో బీబీసీతో చెప్పారు. ‘‘త్వరగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాం. అయినా, మార్చి వరకూ సమయం పట్టేలా ఉంది’’ అని ఆమె అన్నారు. ‘‘వ్యాక్సీన్‌ను దిగుమతి చేసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆస్ట్రోజెనెకా వ్యాక్సీన్ కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ఈ విషయంలో కేంద్రం దిశానిర్దేశాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటాం. వ్యాక్సీనేషన్ కోసం కేంద్రం ఏర్పాటు చేసే కార్యక్రమాలు పంజాబ్‌లోనూ అమలవుతాయి. వీటన్నింటి కోసం కేంద్ర స్థాయిలో ఓ విధానం ఉండటం అవసరం. అప్పుడు దేశంలో అందరికీ సమానంగా వ్యాక్సీన్ అందుతుంది’’ అని పంజాబ్ ప్రావిన్సు ప్రాథమిక ఆరోగ్య శాఖ కార్యదర్శి మహమ్మద్ ఉస్మాన్ యూనుస్ అన్నారు. చైనాపై ఆశలు వ్యాక్సీన్ కోసం మిత్రం దేశం చైనాపై పాకిస్తాన్ బాగా ఆశలు పెట్టుకుందని డాక్టర్ అతా ఉర్ రెహమాన్ అన్నారు. ‘‘సాయనోఫార్మ్ వ్యాక్సీన్ 79 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది. దాని ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆమోదం లభించిన తర్వాత యూఏఈ, ఇండోనేసియా తదితర దేశాల్లోనూ జనాలకు దీన్ని ఇవ్వనున్నారు’’ అని ఆయన చెప్పారు. ‘‘సాయనోఫార్మ్‌ నుంచి పాకిస్తాన్ వ్యాక్సీన్‌ను ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తోందనేది నేను చెప్పలేను. ఆ సంస్థ ఎంత త్వరగా వ్యాక్సీన్‌ను తయారుచేయగలదన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. మార్చిలో ఆ వ్యాక్సీన్ పాకిస్తాన్‌కు వస్తుందని ఆశాభావంతో ఉన్నాం’’ అని ఆయన అన్నారు. ఏవి రావొచ్చు? ‘‘ఆస్ట్రోజెనెకా సంస్థ బ్రిటన్, భారత్‌ల్లో వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండూ దేశాల్లోనూ కోవిడ్ రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఆ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సీన్లలో పెద్ద భాగం ఆ రెండు దేశాలకే వెళ్తోంది’’ అని డీఆర్ఏపీ అదనపు డైరెక్టర్ అక్తర్ అబ్బాస్ ఖాన్ అన్నారు. చైనా సంస్థలు మినహా యురోపియన్, అమెరికన్ సంస్థల నుంచి పాకిస్తాన్‌కు వ్యాక్సీన్‌లు త్వరగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పంజాబ్ ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. సాయనోఫార్మ్ చైనా ప్రభుత్వ సంస్థ కాబట్టి, పాకిస్తాన్‌కు వ్యాక్సీన్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే, త్వరితగతిన ఎంత మొత్తంలో వ్యాక్సీన్లు ఆ సంస్థ ఇవ్వగలదన్నది చూడాల్సి ఉంది. సాయనోఫార్మా కాకుండా కైనసాయనో అనే చైనా సంస్థ కూడా పాకిస్తాన్‌లో కోవిడ్ వ్యాక్సీన్ ట్రయల్స్ చేస్తోంది. ప్రస్తుతం ఇవి మూడో దశలో ఉన్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే డీఆర్ఏపీ దీనికి ఆమోదం ఇవ్వొచ్చు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్‌లో సాధారణ ప్రజలకు కోవిడ్ వ్యాక్సీనేషన్ ఇంకా మొదలవ్వలేదు. ఆ దేశంలో వ్యాక్సీన్లు ఉత్పత్తి అవ్వడం లేదు. వాటి కొనుగోలు కోసం కూడా ప్రభుత్వం అధికారికంగా ఏ ఒప్పందాలూ చేసుకోవడం లేదు. text: అయితే, భారతదేశం నుంచి అనుమతి తీసుకోకుండానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ జరిగిందని అమెరికా నావికా దళానికి చెందిన ఏడో ఫ్లీట్ ధ్రువీకరించడమే కాకుండా, అలా చేసేందుకు తమకు అధికారం, స్వేచ్ఛ ఉన్నాయని పేర్కొంది. ఏడో ఫ్లీట్ అమెరికా నావికదళంలోనే అతి పెద్దదైన, అభివృద్ధి చెందిన నౌకల సముదాయం. పశ్చిమ పసిఫిక్, హిందూ మహా సముద్రాల ప్రాంతాలనూ ఇది కవర్ చేస్తుంది. లక్షదీవుల సమీపంలో జరిపిన ఆపరేషన్ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉందని ఏడో ఫ్లీట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. "ఇండియాకు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఆ దేశ అనుమతితో సంబంధం లేకుండా అమెరికా నావికాదళం తమ హక్కులను వినియోగించుకోవడం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉంది" అని ఆ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా, అమెరికా నావికాదళం ప్రతిరోజు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆపరేషన్లు నిర్వహిస్తుంటుందని.. ఇలాంటి ఆపరేషన్లు ఇంతకుముందు కూడా నిర్వహించామని, ఇకపై కూడా నిర్వహిస్తామని ఏడో ఫ్లీట్ తెలిపింది. భారతదేశం అనుమతి లేకుండా ఇతర దేశాల ఓడలు భారత ప్రాంగణంలోకి రావొచ్చా? నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను అంతర్జాతీయ చట్టాల్లో గుర్తిస్తారు. అయితే, వీటికి కొన్ని షరతులు ఉంటాయి. కాగా, భారతదేశానికి చెందిన జోన్లలోకి ఇతర దేశాల ఓడలు ప్రవేశించడం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందా అనేది ప్రస్తుత వివాదం. అలా చేసే హక్కు తమకు ఉందని అమెరికా అంటోంది. కానీ, భారత సముద్ర చట్టం అందుకు అనుమతించదు. భారత చట్టాల ప్రకారం విదేశీ నౌకలు భారత ఈఈజడ్ మీదుగా ప్రయాణించలేవు. భారతదేశం ఏమంటోంది? భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై స్పందిస్తూ.. "ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలను అనుసరించి భారతదేశానికి చెందిన ఈఈజడ్‌లో ఇతర దేశాల నౌకాదళాలకు సైనిక విన్యాసాలు, యుద్ధాభ్యాసాలు చేసేందుకు అధికారం ఉండదు. ముఖ్యంగా ఆ విన్యాసాలలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు వినియోగించినట్లయితే ఆ తీర ప్రాంత అనుమతి లేకుండా ఆపరేషన్లు నిర్వహించకూడదు. యూఎస్ నౌక జాన్ పాల్ జోన్స్ కదలికలను పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్క జలసంధి వరకూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుత సంఘటనపై భారతదేశ ఆందోళలను దౌత్య మార్గాల ద్వారా అమెరికాకు తెలియజేశాం" అని తెలిపింది. "ఐక్యరాజ్య సమితి కన్వెషన్ అనుసరించి సముద్ర చట్టాల పట్ల ఇండియా, అమెరికా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అయితే, సైనిక విన్యాసాల సమయంలో పేలుళ్లకు పాల్పడ్డారా లేదా అనేది చూడాలి. ఒకవేళ పేలుళ్లు జరిగితే ఈ సమస్య రూపం మారిపోతుంది" అని భారత నావికాదళానికి చెందిన రిటైర్డ్ కొమోడోర్ సి. ఉదయ భాస్కర్ తెలిపారు. "ఇన్నోసెంట్ పాసేజ్ అని ఒకటుంటుంది. దీని ప్రకారం ఏ జోన్‌లో ఓడలు ప్రవేశించనున్నాయో ఆ జోన్ అధికార దేశానికి ముందే సమాచారం అందిస్తారు. విన్యాసాల సమయంలో పేలుళ్లు జరుగుతాయనుకుంటే ‘నోటీస్ టూ మరీనర్స్’ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత వివాదంలో చాలా అస్పష్టత ఉంది. అమెరికా ప్రోటోకాల్ పాటించామని చెబుతోంది. సముద్ర చట్టాలను రెండు దేశాలు భిన్నంగా అర్థం చేసుకుంటున్నాయి. ఇది ఒక వింత పరిస్థితి" అని ఆయన వివరించారు. సముద్రం ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే దేశ తీరానికి 200 నాటికల్ మైళ్లు అంటే 370 కిలోమీటర్ల దూరంలో ఉండే కొన్ని ప్రత్యేక హక్కులు దఖలుపడిన సముద్ర ప్రాంతం. ఏప్రిల్ 7న అమెరికా నౌకాదళ ఏడో ఫ్లీట్ మాల్దీవుల సముద్ర తీరాన్ని దాటి భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లోకి ప్రవేశించింది. ఈ సంఘటన భారతదేశానికి కచ్చితంగా దిగ్భ్రాంతి కలిగించే విషయమే. ఎందుకంటే హిందూ మహా సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా దూకుడును తగ్గించేందుకు ఇండియా, అమెరికా కలిసి పని చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు కూడా క్వాడ్ గ్రూపు సభ్యులే. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కలిసి పని చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అమెరికా నౌకాదాళం చర్యలను పట్టించుకోకుండా ఉండడం ఇండియాకు అసాధ్యం. ఎన్నో సందేహాలు "1995 నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలను భారత్ ఆమోదించిందిగానీ అమెరికా ఇంతవరకూ ఆమోదించలేదు. భారత దేశ చట్టాలకు విరుద్ధంగా ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ప్రవేశించడమే తప్పు. పైగా దాని గురించి ప్రచారం కూడా చేస్తున్నారు" అంటూ భారత నౌకాదళ మాజీ అధ్యక్షుడు అరున్ ప్రకాశ్ ట్వీట్ చేశారు. "దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా నౌకలు నిర్వహించిన ఫ్రీడం ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్ అంతరార్థం చైనాకు 'ఇది ఒక పెద్ద మారిటైమ్ హక్కు' అనే సందేశం పంపడమే. అయితే, అమెరికా నౌకాదళం ఏడో ఫ్లీట్ ఇలా చేయడం ద్వారా ఇండియాకు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా నౌకాదళానికి చెందిన నౌక జాన్ పాల్ జోన్స్ (డీడీజీ 53) ఏప్రిల్ 7న లక్షదీవులకు పశ్చిమాన 130 నాటికల్ మైళ్ల దూరంలో భారత్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ (ఈఈజడ్)లో సైనిక విన్యాసాలు సాగించినట్లు చెప్పుకొంది. text: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనను గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయల విరాళాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా చేస్తానని చెప్పారు కేఏ పాల్‌. ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు 281 ఓట్లు (278 ఈవీఎం ఓట్లు, 3 పోస్టల్ ఓట్లు) వచ్చాయి. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 1,143. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ (పీఎస్‌పీ) ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పిన కేఏ పాల్ నరసాపురం లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు 3037. నోటాకు లభించిన ఓట్లు 12,066. ఆయనకంటే కొందరు స్వతంత్ర పార్టీల అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ‘ఆంధ్రాను అమెరికా చేస్తా’ ఎన్నికల ముందు ఆయన వివిధ టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చిన పాల్... తామే అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకొచ్చారు. నామినేషన్ నుంచి ప్రచారం వరకు పాల్ తనదైన శైలిలో వినూత్నంగా ముందుకెళ్లారు. కోట్ల రూపాయలు విరాళాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాగా తీర్చిదిద్దుతానని కూడా పాల్ అన్నారు. ‘రష్యా జోక్యం’ ఆ తరువాత ఆయన తన మాట మర్చారు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. ఈవీఎంలో తన పార్టీ గుర్తుకు ఓటు వేస్తే అది మరొకరికి పడుతోందని, అందువల్ల ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఆయన ఫేసుబుక్ ఖాతాలో వీడియోలు కూడా పోస్టు చేశారు. వైసీపీ విజయం నరసాపురం అసెంబ్లీ స్థానంలో వైసీపీఐ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు గెలుపొందారు. ప్రసాద రాజుకు 55,556 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌కు 49,120 ఓట్లు పడ్డాయి. టీడీపీ తరపున బరిలో నిలిచిన బండారు మాధవ నాయుడుకు 27,059 ఓట్లు లభించాయి. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంది. కనుమూరి రఘురామ కృష్ణ రాజు ఎంపీగా విజయం సాధించారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా హడావుడి చేశారు. వినూత్న ప్రచారశైలితో మీడియా దృష్టిని ఆకర్షించారు. text: భారత పార్లమెంటు భవనం దాదాపు 860 కోట్ల రూపాయల వ్యయంతో టాటా ప్రాజెక్ట్ దేశ రాజధాని నడిబొడ్డున సరికొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనుంది. బ్రిటిష్ వలస పాలన నాటి ప్రస్తుత పార్లమెంటు భవనం స్థానంలోనే ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తారు. ఈ నిర్మాణం 2022 నాటికి, అంటే భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సిద్ధమవుతుంది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సందర్భంలో ప్రభుత్వం ఆ మహమ్మారిని కట్టడి చేయడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తే బాగుంటుందని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా బారిన పడి 80,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ప్రభుత్వం మాత్రం 1920ల నాటి ఈ భవనానికి కాలం చెల్లిందని చెబుతోంది. అందుకే, కొత్త పార్లమెంటు భవన నిర్మాణం తప్పనిసరి అని అంటోంది. ఎంపీల సంఖ్యతో పాటు పార్లమెంటు సిబ్బంది సంఖ్య కూడా ఇటీవలి కాలంలో పెరిగిందని గుర్తు చేస్తోంది. కొత్తగా నిర్మించబోయే భవనం ఇప్పుడున్న దాని కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అందలో 1,400 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుంటుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దిల్లీలో వలస పాలన కాలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూపొందించిన దాదాపు 20,000 కోట్ల రూపాయల ప్రణాళికలో భాగంగా పార్లమెంటు భవనాన్ని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. ఆర్థిక భారంతో పాటు భవన నిర్మాణ శైలికి సంబంధించిన విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన దాదాపు దశాబ్ద కాలంగా వినిపిస్తూనే ఉంది. పార్లమెంటు స్పీకర్లు కొందరు పార్లమెంటు భవనాన్ని కొత్తగా నిర్మించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వృత్తాకార పార్లమెంటు భవనానికి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ రూపకల్పన చేశారు. భారీ గుమ్మటాలతో డిజైన్ చేసిన ఈ భవన నిర్మాణాన్ని 1927లో పూర్తి చేశారు. అయితే, ఈ భవన నిర్మాణం పూర్తయిన తరువాత కొందరు చరిత్ర కారులు దాని ఆకారం చూసి ఎగతాళి చేశారని చరిత్రకారుడు దీన్యార్ పటేల్ తన పుస్తకంలో రాశారు. బ్రిటన్ రాజకీయ ప్రముఖుడు ఫిలిప్ సాసూన్, 'ఈ భవనం గ్యాసోమీటర్‌లా ఉంద'ని వ్యాఖ్యానించారని ఆయన అన్నారు. వాస్తు శిల్పి బేకర్ కూడా ఈ నిర్మాణంలోని లోపాలను అంగీకరించారు. "సెంట్రల్ హాలు మీద నిర్మించిన గుమ్మటం సరిగా అమర్చడంలో విఫలమయ్యాం" అని బేకర్ చెప్పినట్లు పటేల్ రాశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించే కాంట్రాక్టును దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ గెల్చుకుంది. text: బీబీసీ ఇంటర్వ్యూలో అంబేడ్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ ఛైర్మన్ బీఆర్ అంబేడ్కర్ 1953 జూన్ 22న బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌లో ప్రజాస్వామ్యం భవిష్యత్తు, ఎన్నికల వ్యవస్థ, ఇతర అంశాలపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా అని బీబీసీ అడగ్గా- విజయవంతం కాదని అంబేడ్కర్ సమాధానమిచ్చారు. అయితే నామమాత్రంగా, లాంఛనప్రాయంగా మాత్రం ఇది కొనసాగుతుంటుందని, ఎన్నికలు, ప్రధానమంత్రి, ఇతరత్రా అంశాలన్నీ ఉంటాయని చెప్పారు. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: బీఆర్ అంబేడ్కర్ సరైన వారు ఎన్నికైతేనే ఎన్నికలకు ప్రాధాన్యం ఎన్నికలు ముఖ్యం కాదా అని ప్రశ్నించగా, ముఖ్యం కాదని, ఎన్నికల్లో సరైన వారు ఎన్నికైతేనే వాటికి ప్రాధాన్యం ఉంటుందని అంబేడ్కర్ స్పష్టం చేశారు. సరిగా పాలించని వారిని గద్దె దించేందుకు ఎన్నికలు ప్రజలకు అవకాశం కల్పిస్తాయి కదా అని పేర్కొనగా, ''అవును, కానీ ఆ స్పృహ, ఆలోచన ఎవరిలో ఉన్నాయి? ఓటింగ్ జరిగేది ప్రభుత్వాలను ఎన్నుకొనేందుకు/మార్చేందుకు అనే చైతన్యం ఎవరిలో ఉంది? ఎవ్వరిలోనూ లేదు'' అని ఆయన స్పందించారు. మన ఎన్నికల వ్యవస్థలో అభ్యర్థికి ప్రాధాన్యం తక్కువ అని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థిని నిర్ణయించడంలో ప్రజలకు పాత్ర లేకుండా పోయిందని కూడా ఆయన చెప్పారు. ''ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తమ చిహ్నం జోడెద్దులకు ఓటేయాలని ప్రజలను కోరింది. ఎందుకంటే.. అభ్యర్థి ఎవరన్నది జనం పట్టించుకోరు. ఓటర్లు జోడెద్దులకే ఓటేశారు'' అని ఆయన చెప్పారు. అసమానతలు పోవాలి ''భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. మౌలిక కారణం ఏంటంటే- ఇక్కడున్న సామాజిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం అనువైనది కాదు'' అని అంబేడ్కర్ తెలిపారు. భారత సామాజిక వ్యవస్థలో అసమానతలు ఉన్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. వివక్షతో కూడిన ఈ వ్యవస్థను అంతమొందించాల్సి ఉందన్నారు. శాంతియుత మార్గంలో ఈ వ్యవస్థను అంతమొందించాలంటే సమయం పడుతుందని అంబేడ్కర్ చెప్పారు. సామాజిక వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి (జవహర్‌లాల్ నెహ్రూ), ఇతర నాయకులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు కదా అని ప్రస్తావించగా, అంతులేని ప్రసంగాలతో ఒరిగేదేమీ లేదని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు. ప్రసంగాలతో విసుగెత్తిపోయామన్నారు. మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్పు రాకపోతే కమ్యూనిజమే ప్రత్యామ్నాయం మార్పు కోసం చేసే ప్రయత్నాలేవీ ఫలించకపోతే ప్రత్యామ్నాయం ఏమిటని బీబీసీ ప్రశ్నించగా- అప్పుడు ఒక విధమైన కమ్యూనిజమే ప్రత్యామ్నాయం అవుతుందని తాను భావిస్తున్నట్లు అంబేడ్కర్ చెప్పారు. ఇటీవలే తాను అమెరికా వెళ్లి వచ్చానని ఆయన ప్రస్తావించారు. అమెరికాలో ప్రజాస్వామ్యం ఉందని, ప్రజాస్వామ్యం విజయవంతమవుతున్నందున అక్కడ కమ్యూనిజం రాదని అభిప్రాయపడ్డారు. అమెరికాలో అందరికీ మంచి ఆదాయం ఉందని చెప్పారు. భారత్‌లోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడేలా చర్యలు చేపట్టవచ్చు కదా అని బీబీసీ అన్నప్పుడు, భారత్‌లో అదెలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. భారత్‌లో అందరికీ భూమి లేదని, వర్షపాతం తక్కువని, ఇతర సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించకుండా పరిస్థితులను మెరుగుపరచలేమని ఆయన వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించగలదని తాను అనుకోవడం లేదని అంబేడ్కర్ తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) బీబీసీ: డాక్టర్ అంబేడ్కర్, భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా? అంబేడ్కర్: అవ్వదు. అయితే నామమాత్రంగా, లాంఛనప్రాయంగా మాత్రం ఉంటుంది. text: పదేళ్ల క్రితం, అప్పుడే నాకు పెళ్లి అయింది. ఓ పూజ కోసం నేను నాగర్‌కోయిల్‌లోని మా అత్తగారింటికి వెళ్తూ దారి మధ్యలో అరటిపళ్ల కోసం ఆగాను. పోషకాలు పుష్కలంగా ఉండే ఎరుపు, పసుపు, ఊదా రంగులోని ఈ పళ్లను చూశాను. వీటి గెలలను పైకప్పుకు వేళాడదీశారు. ఒక్కో రకం అరటి పండుకు ఒక్కో పేరు ఉంది. పూవన్, చెవ్వళి, మట్టిపళ్లం ఇలా భిన్నమైన పేర్లతో వీటిని పిలుస్తున్నారు. ఇలాంటి రంగు రంగుల అరటి పళ్లను నేను పుట్టిపెరిగిన హైదరాబాద్‌లో ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్.. నాగర్‌కోయిల్‌కు 1200 కి.మీ. దూరంలో ఉంటుంది. నాకు సాధారణ అరటిపళ్లు మాత్రమే తెలుసు. వీటిని తమిళంలో వళైపళం, హిందీలో కేలా అని అంటారు. కానీ నాగర్‌కోయిల్‌లో దాదాపు 12 నుంచి 15 రకాల అరటి పళ్లు కనిపిస్తాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. ఒక్కో అవసరానికి ఒక్కోలా వీటిని ఉపయోగిస్తుంటారు. ఒక్కసారిగా నా పెళ్లి ముందు జీవితం ఎంత హాయిగా గడిచిపోయిందో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని అరటిపళ్ల గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. భారత్‌లో విరివిగా లభించే పళ్లలో అరటిపళ్లు ప్రధానమైనవి. ఇవి ఏడాది పొడవునా లభిస్తాయి. తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి. అందుకే ప్రతి శుభకార్యం, పండుగ, ఇతరత్రా కార్యక్రమాల్లోనూ వీటికి ప్రత్యేక స్థానముంటుంది. అరటిపళ్లు మాత్రమే అరటి చెట్టు మొత్తానికీ భారత సంస్కృతీ, సంప్రదాయాలతో విడదీయరాని అనుబంధముంది. దేశీయ రకాలను ఇంటి వెనుక, తోటల్లో పెంచుతుంటారు. ఇక్కడి తేమతో కూడిన వాతావరణం, చిత్తడి నేలలు అరటిపళ్లు పెంచడానికి అనువైన ప్రాంతాలు. ముఖ్యంగా పశ్చిమ కనుమల వెంబడి ఇవి చక్కగా పెరుగుతాయి. భూమిపై తొలినాళ్లలో పండించిన పంటల్లో అరటి కూడా ఒకటి. విస్తృతంగా పండించే పంటగా కూడా దీనికి పేరుంది. వీటికి భారత్, ఆగ్నేయాసియా పుట్టినిల్లు. అయితే, ఇప్పుడు ఇవి చాలా ప్రాంతాలు, దేశాలకు విస్తరించాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ కూడా ఎక్కువ మంది వీటిని ఆహారంగా తీసుకున్నారు. సులభంగా తయారుచేసుకోగలిగే బనానా బ్రెడ్ అయితే, అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. కదళీ ఫలం రుచికి అలెగ్జాండర్ మంత్రముగ్ధుడైనట్లు చరిత్ర చెబుతోంది. అరటిని సంస్కృతంలో కదళీ ఫలంగా పిలుస్తారు. అలెగ్జాండర్ వీటిని పశ్చిమాసియాకు తీసుకెళ్లాడు. అక్కడే వీటికి బనాన్ అనే పేరు వచ్చింది. అరబిక్‌లో బనాన్ అంటే చేతి వేళ్లు అని అర్థం. ఆ తర్వాత ఇవి 15వ శతాబ్దంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులకు విస్తరించాయి. ఆ తర్వాత బెర్ముడాకు చేరాయి. 17,18 శతాబ్దాల్లో బెర్ముడా నుంచి ఇంగ్లండ్‌కు ఈ పళ్లను తీసుకెళ్లేవారు. 1835లో మూసా కేవెండిషిగా పిలిచే పసుపు అరటిపళ్లను ఇంగ్లండ్‌లోని డెబ్రీషైర్‌లో జోసెఫ్ ప్యాక్స్‌టన్ పెంచేవారు. తన యజమాని విలియం కేవెండిష్ పేరునే ఆయన ఈ అరటిపళ్లకు పెట్టారు. మిగతా రకాలతో పోల్చినప్పుడు పరిమాణంతోపాటు రుచి కూడా కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఈ కేవిండిష్ రకాలు ప్రత్యేకమైనవి. ఇవి వ్యాధులను తట్టుకొని నిలబడతాయి. అదే సమయంలో దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పశ్చిమ దేశాలు ఈ రకానికి బాగా అలవాటుపడ్డాయి. భారత్‌లో అధిక దిగుబడినిచ్చే జీ9 కేవిండిష్ రకాలను వాణిజ్య అవసరాల కోసం పెంచుతుంటారు. అయితే, దేశీయ అరటి రకాలు కూడా చాలా ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్థానికులు పూవన్, మొండన్, పేయన్ (త్రిమూర్తులు) అంటూ పాటలు కూడా పాడుతుంటారు. రుచిలో భిన్నంగా ఉండటంతో వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు. మరోవైపు భారత్‌లో అరటిపళ్లను సర్వ రోగ నివారిణిగా కూడా పిలుస్తుంటారు. ఇటు శారీరక, అటు ఆధ్యాత్మిక చికిత్సల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. జిగురుజిగురుగా ఉండే ఈ పళ్లు చిన్నప్పుడు నాకు అసలు ఇష్టముండేవి కాదు. పచ్చకామెర్ల తర్వాత వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు మా అమ్మ నాకు వీటిని ఇవ్వడం ఇప్పటికీ గుర్తుంది. మా అమ్మమ్మ అయితే వీటిని పూజ అయిన తర్వాత ప్రసాదంగా పెట్టేవారు. నేడు అరటి పళ్లలోని పోషక విలువల గురించి దాదాపు అందరికీ తెలుసు. పండిన తర్వాత వీటిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బీ3, విటమిన్ సీలతోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. భారత్‌లో వేల ఏళ్ల నుంచీ వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. అరటి చెట్లను చాలా పవిత్రంగా చూస్తారు. దీనిలో ప్రతి భాగాన్ని ఉపయోగిస్తారు. పళ్లు, ఆకులు, పువ్వులు, అరటి దవ్వ ఇలా అన్నింటినీ వైద్యంలో ఉపయోగిస్తారు. అరటి పళ్లలో చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారని దిల్లీలోని నాద్ వెల్‌నెస్‌కు చెందిన ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్. శ్రీలక్ష్మి తెలిపారు. మరోవైపు ఆయుర్వేదంలో భాగంగా మధుమేహ నివారణకు అరటి పువ్వు, దవ్వలను ఉపయోగిస్తుంటారు. అరటి కాండం లోపలి రసాన్ని కీటకాలు కుట్టినప్పుడు, కుష్టు రోగ నివారణలో ఉపయోగిస్తుంటారు. రక్తపోటు, నిద్రలేమి లాంటి ఒత్తిడి సంబంధిత వ్యాధుల నివారణలోనూ అరటిని ఉపయోగిస్తారని శ్రీలక్ష్మి చెప్పారు. థలపొథ్తిచిల్‌గా పిలిచే చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. దీనిలో భాగంగా ఔషధ మిశ్రమాన్ని తలకు పట్టించి అరటి ఆకులో శరీరాన్ని చూడతారు. ఫలితంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. బౌద్ధ మతంలోని తెరవాద గ్రంథమైన పాలి కేనన్‌లో ప్రస్తావించిన ఏకైక పండు అరటి పండే. వేదాలు, భగవద్గీతలోనూ దీనికి చోటుంది. అరటి, మామిడి, పనసలను ముక్కానిగా తమిళ సంగం రచనల్లో పిలుస్తారు. అరటిని హిందువుల గురువైన బృహస్పతితో పోలుస్తారు. మరోవైపు సంతాన ప్రాప్తికీ అరటి చెట్టుతో సంబంధముందని హిందువులు భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో అరటి చెట్లను గుమ్మానికి రెండు వైపులా కడతారు. పశ్చిమ బెంగాల్‌లో అయితే దుర్గాపూట సమయంలో అరటి చెట్లును దుర్గా మాతగా కొలుస్తారు. అరటి చెట్లుకు ఎర్ర రంగు అంచు ఉండే పసుపు చీరను కట్టి అమ్మవారిలా ముస్తాబు చేస్తారు. ఈ దేవతను కోలా బవుగా పిలుస్తారు. ఇక్కడ కోలా అంటే అరటి పండు, బవు అంటే మహిళ అని అర్థం. అరట పళ్లు తినడం విషయానికి వస్తే భారత్‌లో చాలా విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొందరు పచ్చివి తింటారు. మరికొందరు పళ్లు తింటారు. మట్టి పళహం లాంటి తేలిగ్గా అరిగిపోయే రకాలను పిల్లలకు ఆహారంగా పెడుతుంటారు. మరోవైపు నేంద్రన్, రస్థలి లాంటి ఎక్కువరోజులు నిల్వ ఉండే, నీరు తక్కువగా ఉండే రకాలను వంటల్లో వాడుతుంటారు. ''మేం కొంకణిలో వీటిని కేలె అని పిలుస్తుంటాం. కొంకణీ వంటల్లో వీటికి ప్రత్యేక స్థానముంది''అని ద లవ్ ఆఫ్ స్పైస్ బ్లాగ్ రచయిత శంతల నాయక్ షెనోయ్ వివరించారు. ''అరటి కాయ వేపుడు(కేలె ఉపకారి) అంటే నాకు చాలా ఇష్టం. కొబ్బరి తురుముతో చేసుకునే కేలె కోడెల్, అరటి పళ్లతో చేసుకునే స్వీట్ కేలె హల్వో కూడా నాకు ఇష్టం''అని ఆయన వివరించారు. ''సైవ మెన్ కుళంబులో చేపకు బదులు అరటి కాయల్ని ఉపయోగిస్తాం. శాకాహారులు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. చేపలకు ప్రత్యామ్నాయంగా మేం అరటి కాయలను చాలా కూరల్లో ఉపయోగిస్తాం''అని వన్స్ అపాన్ ఏ టైమ్ రెస్టారెంట్ చెఫ్ పార్ట్నర్ విఘ్నేష్ రామచంద్రన్ తెలిపారు. నాకు అరటి పళ్లను ఎలా ఉపయోగిస్తారో మొత్తం తెలుసు అనుకున్నప్పుడే నేను సీ శేఖర్ గారిని కలిశాను. ఆయన చెన్నై శివార్లలోని అంకపుథూర్‌లో చేనేత కార్మికుడు. ఆయన అరటి వ్యర్థాలతో, అరటి పీచుతో చీరలు కూడా తయారుచేస్తుంటారు. ఆయన దగ్గర దాదాపు వంద మంది మహిళలు పనిచేస్తుంటారు. వీరు ఏళ్ల నుంచి పత్తి, అరటి పీచుతో చీరలు తయారుచేస్తున్నారు. పచ్చిదైనా లేదా పండినా, పళ్లు అయినా పువ్వులైనా, కేవెండిష్ అయినా పూవన్ అయినా.. అన్నింటికీ భారత సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానముంది. వీటి గురించి తెలుసుకున్న కొద్దీ కొత్త విషయాలు, ఆశ్చర్యకర సంగతులు బయటపడుతూనే ఉంటాయి. ఇక నా విషయానికి వస్తే పూజల కోసం అయితే రసకడలి లేదా మట్టి పళంను ఎంచుకుంటాను. ఎందుకంటే వీటిని చాలా శుభప్రదంగా భావిస్తుంటారు. మరోవైపు సాయంత్రం హాయిగా తినేందుకు అరటి చిప్స్ కూడా కొనుక్కుంటుంటాను. వీటిని ఒక్కోటి తింటుంటే ఒక్కో కథ గుర్తుకు వస్తుంటుంది. ఇవి కూడాచదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌ అరటి పళ్లకు పుట్టినిల్లు. ఏడాది పొడవునా అందుబాటులో ఉండటం, తక్కువ ధరకే లభించడంతో ప్రజల జీవితాల్లో వీటికి ప్రత్యేక స్థానం దక్కింది. భారత సంస్కృతీ సంప్రదాయాల్లో అడుగడుగునా దీని జాడలు కనిపిస్తాయి. text: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా కూటమికి ఆధిక్యం లభిస్తుందని లగడపాటి అంచనా వేశారు. ప్రజా కూటమికి 65 (+/-10), టీఆర్‌ఎస్‌కు 35 (+/-10), ఇతరులు 14 (+/- 4) స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కానీ, ఆ అంచనాలు ఫలించలేదు. దీంతో మొదట సంచలనంగా మారిన ఈయన సర్వే చివరకు అంచనాలను తప్పింది. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గళమెత్తి నిత్యం వార్తల్లో నిలిచిన ఆయన అనంతరం.. తెలంగాణ విడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగారు. అయితే, తన అభిరుచిగా చెప్పుకొనే ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పనిని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వేలనూ ఆయన సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు. అది రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది ఆయనవి చిలక జోష్యాలని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అనగా.. తన సర్వేలు నిజమైన సందర్భాలే అధికమని.. తానెవరినీ ప్రభావితం చేయడానికి సర్వేలు చేయడం లేదని లగడపాటి అన్నారు. గతంలో ఆయన తన బృందంతో చేయించిన సర్వేల ఆధారంగా వేసిన అంచనాలు ఎక్కువ సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండగా.. తెలంగాణ, తమిళనాడు విషయంలో విఫలమయ్యాయి. ఎన్నికల ఫలితాల అంచనా అనేది నేతలు, విశ్లేషకులు, పార్టీలు, మీడియా స్థాయిలో మొదటి నుంచీ ఉన్నప్పటికీ అది ఒక ప్రత్యేక గుర్తింపుతో రావడమనేది 1991లో మొదలైంది. ఎన్నికల సరళి అధ్యయనం, ఫలితాల అంచనా విషయంలో ప్రణయ్ రాయ్, యోగేంద్ర యాదవ్, జీవీఎల్ నరసింహరావు(ప్రస్తుత బీజేపీ రాజ్యసభ ఎంపీ)లను తొలి తరం ముఖ్యులుగా చెప్పుకోవాలి. ఆ తరువాత ఈ రంగం మరింత విస్తృతమైంది. లగడపాటి ప్రవేశం.. పారిశ్రామికవేత్త అయిన లగడపాటి రాజగోపాల్ 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2005లో తొలిసారి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై ఆయన బృందం సర్వే చేసింది. ఆ తరువాత గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సర్వే ఫలితాలు వెల్లడించారు. అవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. అనంతరం 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో వచ్చిన ఉపఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఫలితాలు అంచనా వేయడంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికలు, ఆ తరువాత 2011, 2012, 2013లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఆయన బృందంతో సర్వేలు చేశారు. 2014 ఎన్నికల్లో లగడపాటి అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయి? పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు అంచనాలు వెల్లడించారు. ఆంధ్ర, రాయలసీమలు(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) ఒక యూనిట్‌గా, తెలంగాణ ఒక యూనిట్‌గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కలిసి.. తెలంగాణలో టీఆర్ఎస్, దేశంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్(ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు)లో సర్వే: * 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమి 115 నుంచి 125.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 55 సీట్లు గెలుస్తాయని చెప్పారు. * 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమి 19 నుంచి 22 స్థానాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 6 స్థానాలు గెలుచుకుంటాయని చెప్పారు. వాస్తవ ఫలితాలు: * అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 103, బీజేపీ 4 కలిపి మొత్తం 107 సీట్లు గెలుచుకున్నాయి. ఇది లగడపాటి అంచనాల్లోని కనిష్ఠ సీట్లు 115 కంటే 8 తక్కువ. * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 66 సీట్లు గెలుచుకుంది. ఇది లగడపాటి అంచనాల్లోని గరిష్ఠ సీట్లు 55 కంటే 11 అధికం. * ఏపీలో పార్లమెంటు సీట్లకు వచ్చేసరికి టీడీపీ 15, బీజేపీ 2 కలిపి మొత్తం 17 గెలిచాయి. ఇది లగడపాటి అంచనాల్లోని కనిష్ఠ సంఖ్య 19 కంటే రెండు తక్కువ. * వైఎస్సార్ కాంగ్రెస్ 8 లోక్ సభ సీట్లు గెలిచింది. ఇది లగడపాటి అంచనాల్లోని గరిష్ఠ సీట్ల కంటే రెండు ఎక్కువ. 2014 ఎన్నికల్లో తెలంగాణపై లగడపాటి అంచనాలు * 17 లోక్‌సభ సీట్లలో టీఆర్ఎస్ 8 నుంచి 10... కాంగ్రెస్ 3 నుంచి 5... టీడీపీ-బీజేపీ కూటమి 3 నుంచి 4... ఎంఐఎం ఒక స్థానం గెలుస్తాయన్నారు. * 119 అసెంబ్లీ సీట్లలో టీఆర్‌ఎస్ 50 నుంచి 60.. కాంగ్రెస్ 30 నుంచి 40.. టీడీపీ-బీజేపీ 18 నుంచి 22.. ఎంఐఎం 7 నుంచి 9 గెలిచే అవకాశం ఉందని చెప్పారు. వాస్తవ ఫలితాలు: * టీఆర్ఎస్ 63 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. లగడపాటి సర్వేలోని గరిష్ఠ సంఖ్య 60 కంటే 3 ఎక్కువ వచ్చాయి. * కాంగ్రెస్ 21 సీట్లు గెలిచింది. లగడపాటి అంచనా వేసిన కంటే 9 తక్కువగా వచ్చాయి. * టీడీపీ 15, బీజేపీ 5 గెలిచాయి. లగడపాటి ఈ కూటమికి 18 నుంచి 22 వస్తాయని చెప్పారు. అదే అవధిలో వచ్చాయి. * ఎంఐఎం నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. లగడపాటి చెప్పిన కనిష్ఠ సంఖ్యతో ఇది సమానం. * టీఆర్ఎస్ 11 లోక్ సభ సీట్లలో విజయం సాధించింది. లగడపాటి అంచనా కంటే ఒకటి ఎక్కువ వచ్చింది. * టీడీపీ 1, బీజేపీ 1 గెలిచాయి. ఆయన అంచనాల కంటే ఒకటి తక్కువ. * కాంగ్రెస్ పార్టీ 2 గెలిచింది. ఇది కూడా సర్వే ఫలితాల కంటే ఒకటి తక్కువ. * ఎంఐఎం 1 గెలిచింది. లగడపాటి కూడా అంతే సంఖ్యలో అంచనా వేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఒక స్థానం గెలిచింది. 2014 లోక్ సభ ఎన్నికలపై సర్వే: * బీజేపీ సొంతంగా 270 నుంచి 280 సీట్లు, ఎన్టీయే కూటమి 320 నుంచి 330 లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని లగడపాటి చెప్పారు. * కాంగ్రెస్ పార్టీ సొంతంగా 60 నుంచి 70 సీట్లు.. యూపీఏ పార్టీలన్నీ కలిసి 70 నుంచి 80 సీట్లలో గెలవొచ్చని తెలిపారు. వాస్తవ ఫలితాలు: * బీజేపీ 282 లోక్‌సభ స్థానాలు గెలిచింది. * కాంగ్రెస్ 44 సీట్లు గెలిచింది. ఇది లగడపాటి అంచనాల కంటే బాగా తక్కువ. ఆయన 60 నుంచి 70 గెలుస్తుందని అంచనా వేశారు. అందుకే 'ఆంధ్రా ఆక్టోపస్' అయ్యారా? అంతకుముందు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 155 అసెంబ్లీ సీట్లు, 33 లోక్ సభ సీట్లు వస్తాయని లగడపాటి చెప్పగా అది నిజమైంది. 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది రాజీనామాలు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ వారంతా గెలుస్తారని ఆయన చెప్పారు. అదీ నిజమైంది. 2011లో కడప లోక్‌సభ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుమారు 4 లక్షల మెజారిటీ వస్తుందని లగడపాటి అంచనా వేయగా అది నిజమైంది. నంద్యాల ఉప ఎన్నికల విషయంలోనూ ఆయన అంచనాలు నిజమయ్యాయి. రాజకీయాలకు దూరం కావడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లగడపాటి అప్పట్లో ప్రతి ఎన్నికల సమయంలో పార్టీకి తన అంచనాలు ఇచ్చేవారు. తమిళనాడు విషయంలో తడబాటు లగడపాటి సర్వేలు అత్యధిక సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నప్పటికీ 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన అంచనాలు విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో ఆయన డీఎంకే గెలుస్తుందని అంచనా వేశారు. కానీ, అన్నాడీఎంకే వరుసగా రెండోసారి విజయం సాధించి జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాజకీయ పార్టీల ప్రచారాలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు హోరెత్తుతున్న సమయంలోనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు కూడా తెలంగాణలో మార్మోగింది. text: నేటి ఆధునిక ప్రపంచంలో సమాచార సాంకేతికత (ఐటీ) కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందుకు కారణం భారత్. ఐటీకి ఎంతో కీలకమైన 'సున్నా(0)'ను ఆవిష్కరించింది ఈ దేశమే. భారత్‌కు సుసంపన్నమైన నాగరికత ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇది ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. మహాత్ముడి ప్రేరణ వల్లే ఈరోజు నేను మీ ముందు అమెరికా అధ్యక్షునిగా నిలబడ్డాను అంటే మహాత్మా గాంధీ సందేశాల ప్రేరణే కారణం. అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు మహాత్ముని సిద్ధాంతాలే ఆదర్శంగా నిలిచాయి. బాంగ్రా నృత్యం చేశా భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఈ శతాబ్దంలో సరికొత్త భాగస్వామ్యానికి తెరతీస్తాయని నేను విశ్వసిస్తున్నాను. అమెరికా అధ్యక్షునిగా నేను తొలిసారి సందర్శించిన ఆసియా దేశం భారత్. అక్కడ మేం బాంగ్రా నృత్యం చేశాం. అమెరికాలో తొలిసారిగా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు జరిపాం. ఆయన వల్లే యోగా దాదాపు 100 సంవత్సరాల క్రితం స్వామీ వివేకానంద షికాగో వచ్చారు. హిందూ మతాన్ని, యోగాను అమెరికాకు తీసుకొచ్చారు. చంద్రునికి నిచ్చెన వేశాం భారత్, అమెరికా నేడు అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌లుగా మారాయి. మనం ఉమ్మడిగా ఎన్నో కొత్త ఆవిష్కరణలకు తెరలు తీశాం. చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహాలకు సంబంధించిన పరిశోధనల్లో రెండు దేశాలూ తమదైన ముద్ర వేశాయి. అప్పుడే ప్రపంచానికి మేలు ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికా అతి పురాతనమైన ప్రజాస్వామ్యం. మనం ఏకతాటిపై నడిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సురక్షితంగా ఉంటుంది. ఐక్యమత్యమే మహా బలం మతం పేరుతో అడ్డు గోడలు నిర్మించుకోనంత కాలం భారత ప్రజాస్వామ్యం దీర్ఘకాలం పాటు మనుగడ సాగిస్తుంది. కులం, మతం, వర్గం పేరుతో భారత్ ఎప్పుడూ విడిపోకూడదు. జాతి అంతా కలిసి కట్టుగా ఉండాలి. అన్ని వర్గాల వారు షారుఖ్ ఖాన్ సినిమాలు చూసి ఆనందిస్తారు. అన్ని మతాల వారూ మిల్కా సింగ్, మేరీ కోం విజయాలను వేడుకగా జరుపుకొంటారు. ఇటువంటి స్ఫూర్తి ఎంతో అవసరం. అప్పుడే నేర్చుకోగలం ఎక్కువ మంది అమెరికా విద్యార్థులు భారత్‌కి రావాలి. మరింత మంది భారత్ విద్యార్థులు అమెరికా వెళ్లాలి. మనం ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవడానికి ఇది ఏంతో అనువైన మార్గం. భారత్, అమెరికా ప్రజలకు ఉమ్మడిగా ఉండే సుగుణం కష్టపడే తత్వమే. అభివృద్ధి చెందిన దేశం ఆసియాలో చూసినా, ప్రపంచవ్యాప్తంగానైనా భారత్ అభివృద్ధి చెందిన దేశమే. భారత్ కొన్ని దశాబ్దాలలోనే శరవేగంగా అభివృద్ధి చెందింది. మీరు సాధించిన అభివృద్ధిని సాధించడానికి ఇతర దేశాలకు శతాబ్దాలు పట్టింది. నేటి తరం అదృష్టం భారత్ నేడు ప్రపంచ సారథుల్లో ఒకటిగా నిలిచింది. నేటి తరం తల్లిదండ్రులు, తాతలు దీన్ని ఊహించుకొని ఉంటారు. వారి పిల్లలు, వారి మనుమలు, మనుమరాళ్లు భవిష్యత్తులో దీన్ని ఒక చరిత్రగా చెప్పుకొంటారు. కానీ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యులుగా నిలిచే అదృష్టం మాత్రం నేటి తరానికి లభించింది. మా ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఆయన భారత్‌లో ఉన్నారు. గతంలో ఆయన అధ్యక్ష హోదాలో భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలలోని 10 ముఖ్యమైన అంశాలు. ఐటీ .. భారత్ పుణ్యమే text: ప్రతీకాత్మక చిత్రం దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు. ‘‘పాల్ఘర్ ఘటనపై చర్యలు తీసుకున్నాం. నిందితులందరినీ అరెస్టు చేశాం. హేయమైన ఈ నేరానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తాం’’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం సూరత్‌కు కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పాల్ఘర్‌లో కొందరు అడ్డుకున్నారు. వాళ్లను కారు నుంచి బయటకు లాగి కొట్టి చంపారు. కారులో ప్రయాణిస్తున్నది దొంగలనే అనుమానంతో ఆ మూక వారిపై దాడి చేసింది. కానీ, వాళ్లు సూరత్‌లో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధవ్ ఠాక్రే దాడిలో మరణించిన ఈ ముగ్గురిలో ఇద్దరు సాధువులు, మరొకరు వాళ్ల కారు డ్రైవర్. సాధువుల్లో ఒకరి వయసు 70 ఏళ్లు, మరొకరి వయసు 35 ఏళ్లు ఉంటుంది. వీరితోపాటు ఉన్న కారు డ్రైవర్ వయసు 30 ఏళ్లు. ఘటనకు సంబంధించి మొత్తం 110 మంది నిందితులను అరెస్టు చేశామని, వారిలో 9 మంది మైనర్లు ఉన్నారని పాల్ఘర్ పోలీసులు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. నిందితుల్లో 101 మంది ఈ నెల 30 వరకూ పోలీసు కస్టడీలో ఉంటారని, ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి విచారణ జరపాలి: బీజేపీ గురువారం రాత్రి ఈ మూక దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసు అధికారి అక్కడే ఉండటం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు. ‘‘పోలీసుల ముందే ఓ గుంపు మనుషుల్ని కొడుతుండటం సిగ్గుపడాల్సిన విషయం. పోలీసుల దగ్గరి నుంచి లాక్కెళ్లి మరీ కొడుతున్నారు. మహారాష్ట్రలో చట్టవ్యవస్థ బలహీనపడిపోయిందా?’’ అని ఆయన ప్రశ్నించారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ సంస్థ కూడా ఈ దాడిని ఖండించింది. బాధిత సాధువులు జూనా అఖాడేకు సంబంధించినవారుగా పేర్కొంది. మరోవైపు దేశంలో 144 సెక్షన్ అమల్లో ఉంటే ఇంత మంది జనం ఎలా పోగయ్యారని జూనా అఖాడే అధికార ప్రతినిధి మహంత్ నారారణ్ గిరి సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా పాల్ఘర్ ఘటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలో ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్‌ను విచక్షణరహితంగా కొందరు కొట్టిచంపారు. ఇప్పటివరకూ లిబరల్స్ ఎవరూ కనీసం నోరు మెదపలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమయ్యాయంటూ ఆక్రోశం వ్యక్తం చేయడం లేదు’’ అని ఆయన అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గురువారం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న మూకదాడికి సంబంధించి నిందితులను అరెస్టు చేశామని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. text: ఎమర్జెన్సీ వెంటిలేటర్ ఆ కథనం ప్రకారం, ‘జీవన్‌లైట్‌’గా పిలిచే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్‌ చెబుతోంది. ఇది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారంగా పనిచేస్తుంది. దీంతో విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడవచ్చు. రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు చేసి, వైద్యుడికి యాప్‌ ద్వారా సమాచారం అందజేసే ఫీచర్‌తో పాటు, ఆక్సిజన్‌ సిలిండర్‌ను కూడా జత చేసి జీవన్‌లైట్‌ను రూపొందించారు. ఈ పరికరానికి వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఫీచర్‌ ఉండటంతో రిమోట్‌ మానిటరింగ్‌ విధానంలో రోగులను తాకకుండానే వాడే వీలుంది. ఇందులో ఉండే లిథియం అయాన్‌ బ్యాటరీని సెల్‌ఫోన్‌ తరహాలో రీచార్జి చేసుకోవచ్చు. ఒకసారి చార్జ్‌ చేస్తే 5 గంటల పాటు ఏకబిగిన పనిచేస్తుందని చేసిన ఏరోబయోసిస్‌ చెబుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, డీఆర్‌డీవో, ఐసీఎంఆర్‌ తదితర సంస్థల ప్రామాణికాలకు అనుగుణంగా దీనిని తయారుచేసినట్లు వెల్లడించింది. హృద్రోగులు, టైప్‌–2 మధుమేహం ఉన్న వారు కరోనా వైరస్‌ బారిన పడితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి అత్యవసర సమయాల్లో ఈ జీవన్‌ లైట్‌ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరోనా సోకిన వారికే కాకుండా ఇతర సందర్భాల్లో చిన్న పిల్లలు, వృద్ధులకు తలెత్తే శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ను వాడొచ్చు. ఈ వెంటిలేటర్ లక్ష రూపాయలకే అందుబాటులోకి వస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ మూర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఏరోబయోసిస్‌కు రోజుకు 50 నుంచి 70 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ రేణు జాన్‌ కోరారు. స్మార్ట్‌ఫోన్‌లో కరోనావైరస్ పరీక్ష - హైదరాబాద్ స్టార్టప్ కసరత్తు కరోనావైరస్‌ (కొవిడ్‌-19) లక్షణాల్లో ప్రధానంగా ఉండే ‘దగ్గు’ను స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేసి, వ్యాధి సోకిందో లేదో ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ డాక్టుర్నల్‌ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం, క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు డాక్టుర్నల్‌ అప్లికేషన్‌ను వినియోగిస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణకూ వినియోగించే దిశగా ప్రయత్నించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌).. యాప్ నిర్వాహకులకు సూచించింది. దీంతో.. దగ్గును రికార్డు చేసి, ఇతర లక్షణాలను యాప్‌లో నమోదు చేసి వ్యాధిని గుర్తించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సంస్థ తయారుచేసింది. నెల రోజుల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది. ఇప్పటివరకు కొవిడ్‌-19ను గుర్తించేందుకు రక్తం, కఫం (కళ్లె) నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు. క్షయ వ్యాధిని గుర్తించేందుకు డాక్టుర్నల్‌ సంస్థను రాహుల్‌ పత్రి, అర్పితాసింగ్‌, వైష్ణవిరెడ్డి, బాలకృష్ణ బగాడి, శేఖర్‌ఝా కలిసి 2016లో ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ వేదికగా ఈ అంకుర సంస్థ పనిచేస్తోంది. దగ్గుకు సంబంధించి 7,000 శాంపిల్స్‌ను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో విశ్లేషించారు. వీటి ఆధారంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. సాఫ్ట్‌వేర్‌ రెండు రకాల్లో (వేరియంట్స్‌) అందుబాటులో ఉంది. మైక్రోఫోన్‌ సాయంతో పనిచేయడంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ సాయంతో పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇది రోగి దగ్గు శబ్దాన్ని గుర్తించి.. క్షయనా? కాదా? చెబుతుంది. దీనికి సంబంధించి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ద్వారా థర్డ్‌పార్టీ క్లినికల్‌ పరిశీలన చేయించారు. 92 శాతం కచ్చితత్వంతో వ్యాధి గుర్తింపు జరుగుతోందని తేలింది. టీబీ అప్లికేషన్‌ ప్రజలకు నేరుగా అందుబాటులో లేదు. కేవలం పీహెచ్‌సీలు, ఆసుపత్రులు, టీబీ కేంద్రాలలో వైద్యులు పరిశీలించేందుకు అందుబాటులో ఉంచారు. ‘‘ఇప్పటివరకు 25 స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహించాం. టీబీతో పాటు సీవోపీడీ, ఆస్తమా, పీడియాట్రిక్‌, శ్వాసకోశ వ్యాధులను గుర్తించే వీలుంది. సులువైన పద్ధతిలో వ్యాధిని గుర్తించే పద్ధతి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే డాక్టుర్నల్‌ స్థాపించాం’’ అని సంస్థ సీఈవో అర్పితాసింగ్‌ వివరించారు. విమానయానం ఈ నెల 30 వరకూ విమానాల బుకింగ్‌లు తీసుకోబోమన్న ఎయిర్ ఇండియా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించనున్నారని, విమానయాన సంస్థలు బుకింగ్‌లు కూడా ప్రారంభించాయని.. అయితే.. దేశీయ, విదేశీ మార్గాల్లోనూ ఈ నెల 30 వరకు బుకింగ్‌లను తీసుకోబోమని ఎయిర్‌ఇండియా ప్రకటించిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం, ఈ నెల 14వ తేదీన లాక్‌డౌన్‌ పూర్తికానున్న నేపథ్యంలో.. ఆ రోజు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్‌లైన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. గత నెల 24 నుంచి నిలిచిపోయిన విమాన సర్వీసులను యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విమానయానమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి రెండు రోజుల కిందట ప్రకటించారు. 14 తరువాత రైళ్లకు రిజర్వేషన్‌... 20వ వరకు రిగ్రెట్‌ కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 14వ తేదీ తరువాత పొడిగించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం చూచాయగా వెల్లడించడంతో ప్రయాణాలకు అనేకమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో చెప్పింది. రైల్వే అధికారులు ప్రభుత్వ ఆదేశం మేరు ఏప్రిల్‌ 14 వరకు మాత్రమే టిక్కెట్లను ఇవ్వకుండా బ్లాక్‌ చేశారు. ఆ తరువాత ఎవరైనా బుక్‌ చేసుకునే వీలుంది. దాంతో ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉండిపోయిన వారు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నారు. అయితే, కొన్ని రైళ్లలో ఏప్రిల్‌ 15 నుంచి 20వ తేదీ వరకు టిక్కెట్లు బుక్‌ అయిపోయాయని, టిక్కెట్‌కు యత్నిస్తే రిగ్రెట్‌ అని తిరస్కరిస్తోందని తెలుస్తోంది. ఇక ప్రజా రవాణా సంస్థ బస్సులకు ముందుగా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం వున్నప్పటికీ ఎవరూ దానిని పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. బస్సులు రోడ్లపైకి వస్తే.. ఏదో ఒకటి పట్టుకొని గమ్యం చేరుకోవచ్చుననే ధీమాతో వున్నట్టు ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇప్పుడు టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్న వారంతా లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయినవారేనని, ఇతరులు ఎవరూ ఈ సమయంలో ప్రయాణానికి సిద్ధంగా లేరని, ఏప్రిల్‌ 14 తరువాత ఒక వారం రోజులు తప్ప ఆ తరువాత కొన్నిరోజులు పెద్దగా రద్దీ వుండదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐఐటీ హైదరాబాద్‌ అనుబంధ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ)కి చెందిన ఏరోబయోసిస్‌ ఇన్నోవేషన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ.. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్‌ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది. text: అంటార్కిటికా ఉష్ణోగ్రతలు మొట్టమొదటిసారి 20 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటాయి. ఇక్కడ తీరానికి దూరంగా 20.75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పరిశోధకులు చెప్పారు. "అంటార్కిటికాలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదు" అని బ్రెజిల్ శాస్త్రవేత్త కార్లోస్ షేఫర్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు. ఇది రీడింగ్ మాత్రమే ఫిబ్రవరి 9న నమోదైన ఈ ఉష్ణోగ్రతల గురించి ఆయన హెచ్చరించారు. కానీ, ఇది ఒక రీడింగ్ మాత్రమే అంటార్కిటికా దీర్ఘకాలిక డేటాలో భాగం కాదు. అంటార్కిటికా ద్వీపకల్పంలో గత వారం కూడా 18.3 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 20.75 రీడింగ్‌ను కూడా ఇదే ఖండానికి చెందిన దీవుల సమూహంలో ఒకటైన సీమోర్ దీవి మానిటరింగ్ స్టేషన్ నుంచి తీసుకున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ, ఆ రీడింగ్ తమ విస్తృత అధ్యయనంలో భాగం కాదని, దానిని భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంచనా వేయడానికి ఉపయోగించలేమని శాస్త్రవేత్త షేఫర్ అన్నారు. "భవిష్యత్తులో వాతావరణ మార్పులను అంచనా వేయడానికి మేం దీనిని ఉపయోగించలేం. ఇది ఒక డేటా పాయింట్. ఈ ప్రాంతంలో ఏదో భిన్నంగా జరుగుతోంది అనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే" అని ఆయన అన్నారు. అంటార్కిటికా ఎంత వేగంగా వేడెక్కుతోంది? ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యుఎంఓ) వివరాల ప్రకారం అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు గత 50 ఏళ్లలో దాదాపు 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. ఆ సమయంలో పశ్చిమ తీరం అంతటా ఉన్న దాదాపు 87 శాతం హిమానీనదాలు తరిగిపోయాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల గత 12 ఏళ్లుగా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాయని అందులో చెప్పారు. అత్యంత వెచ్చగా ఉన్న జనవరిగా గత నెల అంటార్కిటికాలో కొత్త రికార్డు సృష్టించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రస్తుతం హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు దగ్గరగా ఉన్నాయి. అదే సమయంలో సాధారణంగా మైనస్ డిగ్రీలు ఉండే మంచు ఖండంలో ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. text: కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలనెవరినీ దిల్లీకి రావద్దని సూచించిన సీఎం ఒంటరిగానే దిల్లీ పర్యటన చేస్తున్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది. హోంమంత్రి అమిత్‌షా, జలశక్తి శాఖామంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ల నివాసాలకు అధికారులతో కలిసి వచ్చినా, సమావేశం మాత్రం ఏకాంతంగానే జరిపారని ఈ కథనం పేర్కొంది. మంత్రి షెకావత్‌తో ఏ అంశంపై సమావేశమవుతున్నారో కూడా అధికారులకు సమాచారమివ్వలేదని వెల్లడించిది. హోంమంత్రి అమిత్‌షా ఇంటికి కూడా ఒంటరిగానే వెళ్లిన సీఎం కేసీఆర్‌ భేటీ తర్వాత వివరాలను మీడియాకు కూడా వెల్లడించలేదని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. అధికార పార్టీ నేతలు దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ వైసీపీ వార్‌ చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు గ్రామంలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని ఈనాడు పత్రిక రాసింది. ఇటీవల మరణించిన తమ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అంగళ్లు గ్రామానికి వచ్చిన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. తెలుగుదేశం నాయకులు తమ నియోజకవర్గంలోకి రావద్దంటూ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని ఈనాడు కథనం వెల్లడించింది. వీరి గొడవ ముంబయి చెన్నై రహదారి మీద జరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయిందని పేర్కొంది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయని టీడీపీ నేత నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ రవి మధునోహరాచారి తెలిపినట్లు ఈనాడు కథనం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంతో మమత ఢీ అంటే ఢీ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌లో జరిగిన దాడి వ్యవహారం మరోసారి కేంద్రం, మమతా బెనర్జీల మధ్య చిచ్చుపెట్టిందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఈ వ్యవహారం తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్రానికి గవర్నర్‌ నివేదిక పంపగా దీనిపై దిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలకు కేంద్రం సమన్లు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న మమతా బెనర్జీ సర్కారు దీనిపై స్పందించరాదని నిర్ణయించినట్లు ఈ కథనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పంపిన సమన్లపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌, ఇదే వ్యవహారంపై ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వ సమావేశం ఉన్నందున దిల్లీకి రాలేకపోతున్నట్లు కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటన మీద పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ ధన్‌కర్‌ కూడా తీవ్ రవ్యాఖ్యలు చేశారని సాక్షి పేర్కొంది. మమతా బెనర్జీ ప్రభుత్వం నిప్పుతో చెలగాటమాడుతోందని, సీఎం స్పందన చూస్తే ఆమెకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నట్లు కనిపించడం లేదని గవర్నర్‌ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు మమతా బెనర్జీ కూడా ఈ వ్యవహారమంతా బీజేపీ కార్యకర్తల నాటకమని ఆరోపించినట్లు సాక్షి కథనం వెల్లడించింది. రూ.10కోట్ల చిట్టీల డబ్బుతో కుటుంబం పరార్‌ హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం రూ.10కోట్లు వసూలు చేసి ఆ డబ్బుతో పరారైందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి పాతబస్తీలోని బండ్లగూడ-పటేల్‌నగర్‌లో నివాసముంటున్న సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డ్‌ ఉద్యోగి బాబూరావు, ఆయన భార్య అంజలీ దేవి చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. చుట్టుపక్కల కుటుంబాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరు గత 30 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నారు. అయితే ఈ నెల 5న హఠాత్తుగా ఈ కుటుంబం ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయింది. ఫోన్‌లు చేస్తే స్విచ్ఛాప్‌ అని వస్తుండటంతో ఆందోళన చెందిన కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 85 మంది బాధితులు సీసీఎస్‌ పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చారు. ఈ కుటుంబం వద్ద చిట్టీల రూపంలో డబ్బులు పెట్టిన వారు 300మంది వరకు ఉంటారని అంచనా. కేసు నమోదు చేసుకున్నపోలీసులు బాబూరావు కుటుంబం కోసం గాలిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దిల్లీలో కేంద్ర మంత్రులతో ఏకాంత సమావేశాలు నిర్వహించారని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా రాసింది. దిల్లీ పర్యటనలో సీఎం పలువురు మంత్రులతో భేటీ అయ్యారని అయితే వీటిలో ఎక్కువగా ఏకాంత సమవేశాలేనని పేర్కొంది. text: బ్యాంకు మోసాలు, మూక దాడులు, రఫేల్ ఒప్పందం, సీబీఐలో అవినీతి ఆరోపణలు, తాజాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో 'సోనియా గాంధీ' పేరును మధ్యవర్తి మిషెల్ చెప్పడం వంటి విషయాలు పతాక శీర్షికల్లో నిలిచాయి. సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తదితర అంశాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. బీజేపీ, కాంగ్రెస్‌లతో టీడీపీ పొత్తుల వ్యవహారం, వైసీపీ అధినేత వైఎస్. జగన్‌ పాదయాత్ర, ఆయనపై విశాఖ విమానాశ్రయంలో దాడి వంటి విషయాలు వార్తల్లో ప్రధానంగా నిలిచాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం వైపు చూద్దాం. ఈ ఏడాది దేశంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందో చూద్దాం. లోక్‌సభ ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. లోక్‌సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగనున్నాయి. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? లేక రాహుల్ గాంధీ అవుతారా? అన్నది తేలిపోనుంది. కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని విపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరాజయం పాలైంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కమలం గట్టి పట్టు సాధించింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్ భారీ విజయం సాధించింది. 2019లో ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, జమ్ము కశ్మీర్.. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయి. క్రికెట్ వరల్డ్ కప్ మే నెలాఖరులో ఐసీసీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. నెలన్నర పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో 10 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు రెండు సార్లు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు మూడోసారి ప్రంపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న కాంక్షతో ఉంది. జూన్ ‌5న భారత్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో జరుతుంది. జూన్ 16న భారత్‌, పాకిస్తాన్ తలపడనున్నాయి. వివిధ దేశాల జట్లతో భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్: జూన్ 5: దక్షిణాఫ్రికా జూన్ 9: ఆస్ట్రేలియా జూన్ 13: న్యూజిలాండ్ జూన్ 16: పాకిస్తాన్ జూన్ 22: అఫ్గానిస్థాన్ జూన్ 27: వెస్టిండీస్ జూన్ 30: ఇంగ్లండ్ జులై 2: బంగ్లాదేశ్ జులై 6: శ్రీలంక రామ మందిరం ఈ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అంశం బీజేపీకి అత్యంత ముఖ్యమైన విషయం. జనవరి 4న రామ మందిరం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మందిరం నిర్మాణం కోసం ఈ ఎన్నికల్లోగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలన్న డిమాండ్ ఉంది. దాంతో, ఈ విషయం పతాక శీర్షికల్లో నిలిచే అవకాశం ఉంది. బయోపిక్ సినిమాల క్యూ ఈ ఏడాది పలు రాజకీయ నాయకుల బయోపిక్ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్‌, చంద్రబాబు నాయుడుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు ఈ ఎన్నికల సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పేరుతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సినిమా కూడా విడుదల కానుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాజకీయాల నుంచి సినిమాల వరకు 2018 సంవత్సరం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లింది. text: ప్రస్తుతం ఈ యాప్‌ను అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఇండోనేషియా, మెక్సికోలలో విడుదల చేశారు. భారత వినియోగదారులకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. వినియోగదారులతో వ్యాపారపరమైన లావాదేవీలు, సంప్రదింపులు జరిపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది. భారతదేశంలో చిన్న సంస్థలు, వ్యాపారుల సంఖ్య చాలా ఎక్కువ. వీరికి వాట్సాప్ బిజినెస్ యాప్ ఒకరకంగా వెబ్‌సైట్‌లా పని చేస్తుంది. ఈ బిజినెస్ యాప్‌లోని ప్రత్యేకతలను ఓసారి చూద్దాం.. బిజినెస్ ప్రొఫైల్: వ్యాపార వివరాలను ఇక్కడ పొందుపరచవచ్చు. వెబ్‌సైట్, ఇ-మెయిల్, సంస్థ లేదా షాపు చిరునామా, మొబైల్ నెంబరు వంటి వాటిని అధికారికంగా ఇక్కడ పంచుకోవచ్చు. మెసేజింగ్ టూల్స్: వినియోగదారులతో సంప్రదింపులకు ఈ టూల్స్ ఉపయోగపడతాయి. కస్టమర్లు తరచూ అడిగే ప్రశ్నలకు ఆటోమేటిక్‌గా సమాధానాలు ఇచ్చే సదుపాయం ఉంది. అలాగే హలో, హాయ్, వెల్‌కం అంటూ వినియోగదారులను పలకరించొచ్చు. మెసేజ్ స్టాటిస్టిక్స్: ఎన్ని సందేశాలు పంపారు? ఎంత మందికి చేరాయి? ఎన్ని సందేశాలను చదివారు? వంటి గణాంకాలను ఈ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. వాట్సాప్ వెబ్: వాట్సాప్ బిజినెస్ యాప్‌ను కంప్యూటర్‌ ద్వారా వాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ధ్రువీకరణ: వాట్సాప్ బిజినెస్ యాప్ వినియోగించడం ప్రారంభించిన కొద్ది కాలం తరువాత అధికారికంగా ధ్రువీకరణ కూడా లభిస్తుంది. మొబైల్ ఫోను నెంబరు పక్కన ఆకుపచ్చ రంగులో టిక్ మార్క్ కనిపిస్తుంది. వారికి అక్కర్లేదు ఈ బిజినెస్ యాప్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ యాప్ నుంచే సంప్రదింపులు జరపొచ్చు. వారు అంగీకరిస్తేనే వినియోగదారులతో వ్యాపారులు సంప్రదింపులు జరపడానికి, వారి అనుమతి అవసరమని గత ఏడాది టెక్నాలజీ వెబ్‌సైట్ టెక్‌క్రంచ్‌కు వాట్సాప్ వెల్లడించింది. మిశ్రమ స్పందన అమెరికాలో ఈ యాప్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. అకౌంట్ తెరచేటప్పుడు ఇ-మెయిల్, పాస్‌వర్డ్ వంటి భద్రతాపరమైన సదుపాయాలు లేవని కొందరు వ్యాపారులు తెలిపారు. ఇండోనేషియా, మెక్సికోలలో వ్యాపారులు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతానికి ఉచితం ప్రస్తుతం ఈ యాప్‌ను ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే భవిష్యత్తులో వ్యాపారుల నుంచి ఫీజు వసూలు చేసే ఆలోచన ఉన్నట్లు వాట్సాప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్ ఇడేమా గత ఏడాది సెప్టెంబరులో వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చిన్న వ్యాపారుల కోసం వాట్సాప్ ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. దీని పేరు వాట్సాప్ బిజినెస్. text: సనా మారిన్ తమ ప్రభుత్వంలోని మంత్రి మార్ట్ హెల్మ్ వ్యాఖ్యలు చాలా ఇబ్బందిగా అనిపించాయని కల్యులాయిడ్ అన్నారు. ఇటీవలే ఫిన్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసున్న ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఫిన్‌లాండ్‌లో మహిళల నాయకత్వంలోని మరో నాలుగు పార్టీలతో కలిసి ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి సనా నేతృత్వం వహిస్తున్నారు. కొద్దికాలంగా రాజకీయాల్లో ఎదుగుతున్న నేత ఆమె. అలాంటి సనాను ఎస్తోనియా మంత్రి హెల్మ్ తన పార్టీకి చెందిన రేడియోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ''ఒక సేల్స్ గర్ల్ ప్రధాని కావడాన్ని చూశాం. వీధుల్లో ఉద్యమాలు చేసే మరికొందరు, చదువులేని వారు ఆమె మంత్రివర్గంలో చేరారు'' అన్నారాయన. ఎస్తోనియా మంత్రి మార్ట్ హెల్మ్ తాను వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చానని.. అంతేకాదు, యూనివర్సిటీలో చదువుకోవడానికి ముందు సేల్స్ అసిస్టెంట్‌గానూ పనిచేసినట్లు సనా ఇంతకుముందు చెప్పారు. సనా తన కుటుంబంలో హైస్కూలు విద్య పూర్తిచేసి యూనివర్సిటీలో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి. ''ఫిన్‌లాండ్ వాసిగా అత్యంత గర్వపడుతున్నాను'' అంటూ ''ఈ దేశంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తికి కూడా చదువుకునే అవకాశం ఉంది, జీవితంలో ఎంతో సాధించడానికి అవకాశం ఉంది. ఒక దుకాణంలో క్యాషియర్‌గా పనిచేసే వ్యక్తి కూడా ప్రధాని కావొచ్చు'' అని ట్వీట్ చేశారామె. ఎస్తోనియా అధ్యక్షురాలు కెర్స్‌తీ కల్యులాయిడ్ కాగా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఎస్తోనియా మంత్రి హెల్మ్ అన్నారు. సనా మారిన్‌కు ఆయన క్షమాపణ చెప్పారు. ''సామాజికంగా చిన్న స్థాయి నుంచి కూడా రాజకీయంగా ఎదగడం సాధ్యమే'' అని చెప్పడానికి ఉదాహరణగా సనా నేపథ్యాన్ని ప్రస్తావించానని.. తన మాటలు తప్పుగా అనిపిప్తే ఫిన్‌‌లాండ్ ప్రధానికి క్షమాపణలు చెబుతున్నానని హెల్మ్ అన్నారు. మరోవైపు దీనిపై ఎస్తోనియా అధ్యక్షురాలు కల్యులాయిడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆమె.. ''ఫిన్‌లాండ్ అధ్యక్షులు సౌలీ నినిస్తోకు ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడి ప్రధానికి, ఆమె ప్రభుత్వానికి నేను క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేయమని కోరాను'' అని చెప్పారు. సనా మారిన్ మంత్రి హెల్మ్ వ్యాఖ్యలపై ఎస్తోనియాలోని విపక్షాలు మండిపడుతూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. లేదంటే ప్రధాని జూరీ రతాస్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. గల్ఫ్‌ ఆఫ్ ఫిన్‌లాండ్‌కు ఒక వైపు ఫిన్‌లాండ్, రెండో వైపు ఎస్తోనియా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య భాషాపరమైన బంధముంది. కాగా సనా మారిన్‌పై ఈ వ్యాఖ్యలు చేసిన హెల్మ్‌కు వివాదాస్పద వ్యక్తి, సంచలన వ్యాఖ్యలు చేసే నేతగా పేరుంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా చేత్తో 'ఓకే' అన్నట్లుగా సంజ్ఞ చేయడం వివాదాస్పదమైంది. శ్వేత జాతీయవాదులకు ఆయన ఈ సంకేతం పంపారన్న ఆరోపణలున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫిన్‌లాండ్ కొత్త ప్రధాని సనా మారిన్‌ను 'సేల్స్ గర్ల్' అని తమ దేశ మంత్రి అనడంపై ఎస్తోనియా అధ్యక్షురాలు కెర్స్‌తీ కల్యులాయిడ్ క్షమాపణ చెప్పారు. text: అయితే, తన ప్రధాన వెబ్‌సైట్, యాప్‌లకు సంబంధించి గతంలో ఉన్న నీలి రంగు బ్రాండింగ్‌నే ఫేస్‌బుక్ కొనసాగిస్తుంది. కొత్త లోగోలో ఫేస్‌బుక్ పేరు క్యాపిటల్ లెటర్స్‌లో కనిపిస్తుంది. ఇకపై ఉత్పత్తిని బట్టి బ్రాండింగ్ వివిధ రంగులలో కనిపించనుంది. ఉదాహరణకు, వాట్సాప్‌లో అయితే ఆకుపచ్చగా ఉంటుంది. ''ప్రపంచంతో, వ్యక్తులతో మా బ్రాండ్ ఆలోచనాత్మకంగా అనుసంధానం కావాలని కోరుకుంటున్నాం'' అని ఫేస్‌బుక్ తెలిపింది. ఫేస్‌బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో మాట్లాడుతూ, ''వినియోగదారులు వారు ఉపయోగించే ఉత్పత్తులను ఏ కంపెనీలు తయారు చేస్తాయో తెలుసుకోవాలి. ఫేస్‌బుక్‌లో భాగమైన ఉత్పత్తులు, సేవల గురించి చాలా ఏళ్ల నుంచి ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాం'' అని పేర్కొన్నారు. అమెరికా చట్టసభల సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ మాట్లాడుతూ, ''ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ వంటి పెద్ద టెక్నాలజీ కంపెనీలను విడదీయాలి. వాటిపై కఠినమైన నియంత్రణ ఉంచాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. ఫేస్‌బుక్ బ్రాండింగ్ మార్పుపై ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. ''ఫేస్‌బుక్ తాను కోరుకున్న విధంగా బ్రాండింగ్‌ను మార్చుకోవచ్చేమో, కానీ, ఈ టెక్ కంపెనీలు చాలా పెద్దవి, శక్తిమంతమైనవి అనే నిజాలను దాచలేవు. పెద్ద టెక్ కంపెనీలను విడదీసే సమయం వచ్చేసింది'' అని పేర్కొన్నారు. బ్రాండింగ్ మార్చడం సత్ఫలితాలిస్తుందా? గతంలో అనేక పెద్ద కంపెనీలు తమ బ్రాండింగ్‌ను మార్చే ప్రయత్నం చేశాయి. అనేక కారణాలతో ఇటీవల ఫేస్‌బుక్ విమర్శలకు గురైంది. నిజనిర్ధారణ లేకుండా రాజకీయ ప్రకటనలను ఫేస్‌బుక్‌లో ప్రచారం చేయడంపై ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల అమెరికా చట్టసభ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమంలో చిన్నారులపై వేధింపులను అరికట్టే విషయంలో విఫలమవడం, డిజిటల్ కరెన్సీ విషయంలో అడ్డంకులు, కేంబ్రిడ్జ్ అనలటికా డాటా కుంభకోణం ఇటీవల ఫేస్‌బుక్‌ను చుట్టుముట్టాయి. వ్యక్తిగత గోప్యతను పెంపొందించేందుకు ఫేస్‌బుక్‌లో మార్పులు తీసుకురానున్నట్లు ఈ ఏడాది మొదట్లో జుకర్‌బర్గ్ ప్రకటించారు. 'అక్కడ అవసరం లేదు' బ్రాండ్ క్యాప్ కన్సల్టెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మన్ఫ్రెండ్ అబ్రహం బీబీసీతో మాట్లాడుతూ, ''ఇది ఫేస్‌బుక్‌కు సంబంధించి విజయవంతమైన ముందడుగు అవుతుంది. బ్రాండ్ మార్పు అనేది సరళీకరణలో ఒక భాగం. బ్రాండింగ్ మార్పు అనేది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు'' అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం విషయంలో లోగోను మార్చకుండా అలాగే ఉంచడం సరైన చర్యేనని తెలిపారు. ''ఫేస్‌బుక్ ప్రధాన వెబ్‌సైట్‌కు బ్రాండ్ మార్పు అవసరం లేదు'' అని పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫేస్‌బుక్ తన ఉత్పత్తులు, సేవలకు సంబంధించి కొత్త బ్రాండింగ్‌ ఇవ్వబోతోంది. రాబోయే కొద్ది వారాల్లో ఫేస్‌బుక్ కొత్త బ్రాండ్‌... ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కనిపించనున్నాయి. text: అతడు జరిపిన కాల్పుల్లో 57 మంది గాయపడ్డారు. నఖోన్ రట్చసిమా నగరాన్ని కోరట్ అని కూడా అంటారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడున్నరకు సౌథమ్ ఫిథక్ మిలిటరీ క్యాంపులో థొమ్మా కాల్పులు మొదలయ్యాయి. థొమ్మా మొదట తన కమాండింగ్ ఆఫీసర్‌ను చంపేసి, సైనిక క్యాంపు నుంచి ఆయుధాలను, ఆయుధ సామగ్రిని దొంగిలించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. క్యాంపులో చనిపోయిన అధికారి కల్నల్ అనంతరోట్ క్రాసే అని బ్యాంకాక్ పోస్ట్ చెప్పింది. అక్కడ క్రాసే అత్త అయిన 63 ఏళ్ల మహిళ, మరో సైనికుడు కూడా కాల్పుల్లో చనిపోయినట్లు తెలిపింది. క్యాంపు నుంచి హంవీ-తరహా వాహనంలో థొమ్మా బయల్దేరాడు. అనేక చోట్ల కాల్పులు జరుపుతూ సాగాడు. సాయంత్రం ఆరు గంటలకు టర్మినల్ 21 షాపింగ్ సెంటర్‌కు చేరుకున్నాడు. అతడు అక్కడ వాహనంలోంచి దిగి, పారిపోతున్న జనంపై కాల్పులు జరిపాడని స్థానిక మీడియాలో ప్రసారమైన వీడియోలను బట్టి తెలుస్తోంది. నగర వీధులతోపాటు షాపింగ్ సెంటర్లో థొమ్మా కాల్పులకు తెగబడ్డాడు. తన దాడి దృశ్యాలను అతడు సోషల్ మీడియాలో పెట్టాడు. థొమ్మాతో కాల్పులు విరమింపజేయడానికి అధికారులు అతడి తల్లిని కూడా షాపింగ్ సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. శనివారం రాత్రి షాపింగ్ సెంటర్ భవనంలో అతడిని భద్రతా బలగాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి చంపేశాయి. థోమా వయసు 32 ఏళ్లు. థాయ్ ప్రధాని ప్రయుత్ చన్‌-వోచా నగరంలోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత కాల్పుల ఘటన గురించి మాట్లాడారు. ఇలాంటి ఘటన ముందెన్నడూ జరగలేదని, ఇలాంటి సంక్షోభం మరెన్నడూ తలెత్తకూడదని చెప్పారు. ఓ ఆస్తి లావాదేవీలో మోసపోయాననే భావన థొమ్మాకు ఉండేదని, అదే ఈ దాడికి కారణంగా కనిపిస్తోందని తెలిపారు. కాల్పులు జరుగుతున్నప్పుడు షాపింగ్ సెంటర్లో బల్లల కింద దాక్కుని ప్రాణాలతో బయటపడ్డామని కొందరు బాధితులు చెప్పారు. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశాడు? దాడి సమయంలో తన సోషల్ మీడియా ఖాతాల్లో థొమ్మా పోస్ట్‌లు పెట్టాడు. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్‌లో- "నేను లొంగిపోవాలా, వద్దా" అని అడిగాడు. ఇంతకుముందు అతడు ఓ తుపాకీ, మూడు తూటాలు ఉన్న ఫొటోను పోస్ట్ చేసి, ఎగ్జైట్ అవ్వాల్సిన సమయం వచ్చిందని, మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరని రాశాడు. కాల్పుల ఘటన తర్వాత అతడి పేజీని ఫేస్‌బుక్ తొలగించింది. ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారికి ఫేస్‌బుక్‌లో తావులేదని, ఈ దాడికి ప్రశంసించే లేదా మద్దతిచ్చే వారిని తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) థాయ్‌లాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం నాటి సైనికుడి కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 20 నుంచి 26కు పెరిగింది. కాల్పులకు పాల్పడ్డ జూనియర్ ఆఫీసర్ జక్రఫంత్ థొమ్మాను భద్రతా బలగాలు కాల్చి చంపాయని పోలీసులు చెప్పారు. text: దేశాల వారీగా సగటు ఎత్తును చూస్తే, కొన్ని దేశాల మధ్య 20 సెంటీమీటర్ల (8 అంగుళాల) వరకూ వ్యత్యాసం ఉంటోందని చెప్పింది. 2019లో 19 ఏళ్ల అబ్బాయిల సగటు ఎత్తు నెదర్లాండ్స్‌లో అత్యధికంగా 183.8 సెంటిమీటర్లుగా ఉందని, అత్యల్పంగా తూర్పు టీమోర్‌లో 160.1 సెంటీమీటర్లుగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇదే వయసు అమ్మాయిలు సగటు ఎత్తు నెదర్లాండ్స్‌లో అత్యధికంగా 170.4 సెంటీమీటర్లు, గ్వాటెమాలాలో అత్యల్పంగా 150.9 సెంటీమీటర్లు ఉందని లెక్కగట్టింది. 19 ఏళ్ల అబ్బాయిల సగటు ఎత్తు భారత్‌లో 166.5 సెంటీమీటర్లు. బ్రిటన్‌లో 178.2 సెంటీమీటర్లు, అమెరికాలో 176.9 సెంటీమీటర్లు, చైనాలో 175.7 సెంటీమీటర్లుగా ఉన్నాయి. అత్యధిక ఎత్తు ఉన్న దేశాల జాబితాలో బ్రిటన్, అమెరికా, చైనా వరుసగా 39, 47, 65 ర్యాంకుల్లో నిలిచాయి. భారత్ 180వ స్థానంలో ఉంది. ఇక 19 ఏళ్ల అమ్మాయిల సగటు ఎత్తు విషయంలో భారత్ ర్యాంకు 182. భారత్‌లో వీరు సగటున 155.2 సెంటీమీటర్ల పొడవు ఉంటున్నారు. అదే బ్రిటన్, చైనా, అమెరికా ఈ జాబితాలో వరుసగా 49, 54, 58 స్థానాల్లో నిలిచాయి. 19 ఏళ్ల అమ్మాయిల సగటు ఎత్తు బ్రిటన్‌లో 163.9 సెంటీమీటర్లు, చైనాలో 163.5 సెంటీమీటర్లు, అమెరికాలో 163.3 సెంటీమీటర్లుగా ఉంది. ఐదేళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 6.5 కోట్ల మంది ఎత్తుకు సంబంధించిన సమాచారాన్ని పరిశోధకుల బృందం విశ్లేషించి, ఈ సమాచారం వెల్లడించింది. ఇందుకోసం 1985 నుంచి 2019 మధ్య జరిగిన రెండు వేల అధ్యయనాల సమాచారాన్ని పరిశీలించింది. లాన్సెట్‌ మ్యాగజీన్‌లో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. వాయువ్య యూరప్, మధ్య యూరప్‌ల్లో చిన్నారులు, యువత పొడుగ్గా ఉంటున్నారని... దక్షిణాసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, తూర్పు ఆఫ్రికాల్లో పొట్టిగా ఉంటున్నారని ఈ అధ్యయనం తెలిపింది. నెదర్లాండ్స్‌లో 13 ఏళ్ల బాలురు, లావోస్‌లో 19 ఏళ్ల యువకుల ఎత్తు (ఐదు అడుగుల నాలుగు ఇంచులు) సమానంగా ఉంది. నెదర్లాండ్స్‌లోని 11 ఏళ్ల అమ్మాయిలు... గ్వాటెమాలా, బంగ్లాదేశ్, నేపాల్, తూర్పు టీమోర్‌ల్లో 19 ఏళ్ల అమ్మాయిలు దాదాపు ఒకే ఎత్తు (ఐదు అడుగులు) ఉంటున్నారు. గత 35 ఏళ్లలో చైనా, దక్షిణ కొరియాల్లో చిన్నారుల ఎత్తు మెరుగుపడింది. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాల్లో సగటు ఎత్తు 1985 నుంచి మారలేదు. శరీరం బరువు, ఎత్తుకు మధ్య నిష్పత్తి ఆధారంగా బీఎంఐని లెక్కగడతారు. బీఎంఐ 18.5 నుంచి 25 మధ్య ఉంటే మనిషి ఎత్తుకు తగిన బరువు ఉన్నట్లుగా పరిగణిస్తారు. 18.5 కన్నా తక్కువ ఉంటే ఉండాల్సినదాని కన్నా బరువు తక్కువ ఉన్నట్లు, 25 కంటే ఎక్కువ ఉంటే ఉండాల్సినదానికన్నా బరువు ఎక్కువ ఉన్నట్లు భావిస్తారు. తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ బీఎంఐని కూడా విశ్లేషించారు. పసిఫిక్ ద్వీపాలు, గల్ఫ్ దేశాలు, అమెరికా, న్యూజీలాండ్‌‌ల్లో యువత బీఎంఐ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. భారత్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లో తక్కువగా ఉందని తేల్చారు. బీఎంఐ అతితక్కువగా ఉన్న దేశాల వారికి, అతిఎక్కువగా ఉన్న దేశాల వారికి మధ్య వ్యత్యాసం చూస్తే, దాదాపు 25 కేజీల తేడా కనిపిస్తోందని చెప్పారు. కొన్ని దేశాల్లో ఐదేళ్ల వయసులో ఆరోగ్యకరమైన బీఎంఐ ఉన్నవాళ్లు 19 ఏళ్ల వయసుకు వచ్చేసరికి స్థూలకాయులుగా మారిపోతున్నారు. పిల్లల ఎత్తు, బరువు విషయంలో జన్యువుల కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని పరిశోధకులు అన్నారు. కానీ, దేశం మొత్త జనాభా విషయంలో మాత్రం పోషకాహారం, సామాజిక పరిస్థితులు కీలకమవుతాయని వారు చెబుతున్నారు. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పోషకాహార విధానాలు కూడా ఎక్కువగా ఐదేళ్ల లోపు పిల్లలను దృష్టిలో పెట్టుకునే ఉంటున్నాయని, పెద్ద వయసున్న పిల్లలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. చిన్నతనంలో, టీనేజీలో ఆరోగ్యకరమైన ఎత్తు, బరువు ఉన్నవారు తదనంతర జీవితంలోనూ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇంపీరియల్ కాలేజీ లండన్ పరిశోధకురాలు డాక్టర్ ఆండ్రియా రోడ్రిగేజ్ మార్టినెజ్ అన్నారు. ''పోషకాలు బాగా ఉండే ఆహార పదార్థాల లభ్యత పెరిగేందుకు, వాటి ధరలు తగ్గేందుకు మన అధ్యయన ఫలితాలు తోడ్పడాలి. చిన్నారుల బరువు అతిగా పెరగకుండా, ఎత్తు పెరగడానికి పోషకాలు చాలా ముఖ్యం. స్కూళ్లలోని ఉచిత భోజన పథకాల్లో వీటిని భాగం చేయాలి. అల్పాదాయ కుటుంబాలకు పోషకాహారాలను అందించే పథకాలను తేవాలి'' అని ఆమె అభిప్రాయపడ్డారు. ''మొదటిసారిగా ఈ అధ్యయనం చిన్నపిల్లలతోపాటు టీనేజీ వారిపైనా దృష్టి పెట్టింది. పిల్లలు చిన్నప్పుడే కాదు, పెరిగి పెద్దయ్యే క్రమంలోనూ ఆరోగ్యంగా ఉండాల్సిన విషయమై వివిధ దేశాలు తగినంత చేయడం లేదని బయటపెట్టింది'' అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ అలన్ డంగూర్ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొన్ని దేశాల్లోని చిన్నారులు యుక్త వయసు వచ్చేసరికి ఎత్తు తగినంత పెరగలేకపోతుండటానికి పోషకాహార లోపం కారణం కావొచ్చని తాజా అధ్యయనం అభిప్రాయపడింది. text: ఈ యాప్ ఆధారంగా సేకరించే సమాచారాన్ని డ్రైవర్లతో పంచుకుంటుంది. కేవలం లొకేషన్ షేర్ చేయడమే కాదు, ట్యాక్సీని బుక్ చేసే సమయంలో ఫోన్ ఎంత కోణంలో వంగి ఉంది, ఎంత కచ్చితంగా టైప్ చేస్తున్నారు... వంటి వివరాలను కూడా ఈ యాప్ విశ్లేషిస్తుంది. మద్యం సేవించి ఉన్న వారికి సేవలు అందించడానికి ఇష్టం లేని డ్రైవర్లు... ఈ సమాచారం ఆధారంగా రైడ్‌ను తిరస్కరించవచ్చు. "వ్యక్తిగత సమాచారాన్ని ఈ యాప్ రికార్డ్ చేయదు" అని పేటెంట్ కోసం చేసిన దరఖాస్తులో ఉబర్ పేర్కొందని అమెరికా పేటెంట్ కార్యాలయం తెలిపింది. క్యాబ్ బుక్ చేసేముందు ఫోన్ ఎలా పట్టుకున్నారు, వారి నడక తీరు ఎలా ఉంది, ఎలా టైప్ చేస్తున్నారనే దాని ఆధారంగా వారు ఏ స్థాయిలో తాగి ఉన్నారనేది ఉబర్ అంచనా వేస్తుంది. వ్యక్తిగత వివరాల సేకరణ, నిర్వహణకు సంబంధించి ఉబర్‌కు సరైన చరిత్ర లేదు. 2014లో 'గాడ్ వ్యూ' అనే ఓ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ప్రయాణికులు, డ్రైవర్ల కచ్చితమైన లొకేషన్‌కు సంబంధించిన వివరాలను ఉబర్ రికార్డ్ చేసింది. ఇలా సేకరించిన డేటా బయటకు పొక్కడంతో దాదాపు లక్షమంది డ్రైవర్ల భద్రతకు ముప్పు వాటిల్లింది. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ల భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా 2017 జూన్‌లో ఉబర్ సహవ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అమెరికాలో గత నాలుగేళ్లలో 100 మందికి పైగా ఉబర్ డ్రైవర్లు ప్రయాణికులను లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయని, ఇందులో 31మంది నేరాలు రుజువయ్యాయని సీఎన్ఎన్ తెలిపింది. ప్రయాణికుల స్థితిని అంచనా వేయడం అంటే వారి భద్రతకు ప్రమాదమే అని దీనిపై విమర్శలున్నాయి. "ప్రయాణికులు, డ్రైవర్లు... ఇద్దరికీ ఉబర్ రైడ్‌ను మరింత మెరుగ్గా మార్చేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉబర్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎన్నో ఆలోచనలపై మేము పేటెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అవన్నీ ఆచరణలోకి రావు" అని ఉబర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమ ట్యాక్సీల్లో ప్రయాణించేవారు ఎంత మొత్తంలో మద్యం సేవించి ఉన్నారో తెలుసుకునేందుకు ఉద్దేశించిన టెక్నాలజీపై పేటెంట్ కోసం ఉబర్ దరఖాస్తు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికత సాయంతో ఉబర్ ట్యాక్సీ సేవలు ఉపయోగించుకునేవారు ఏ స్థాయిలో ఆల్కహాల్ తాగి ఉన్నారో తెలుసుకోవచ్చని ఉబర్ చెబుతోంది. text: చార్మినార్‌పై ఊడిన సున్నం పెచ్చు చార్మినార్‌కి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత 20-30 సంవత్సరాల్లో అనేకసార్లు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అప్పుడెప్పుడూ జరగనట్టుగా, ఈసారి 2 మీటర్లపైనే వెడల్పున్న భాగం ఊడి పడింది. నిజానికి చార్మినార్ ప్రధాన కట్టడానికి సమస్య లేకపోయినా, చుట్టూ ఉండే సున్నపు మిశ్రమంతో చేసిన అలంకరణలు, అదనపు నిర్మాణాలు కొంత కాలంగా దెబ్బతింటూ వస్తున్నాయి. భారత పురావస్తు శాఖ దీనికి మరమ్మతులు చేపడుతూనే ఉంది. 1591లో నిర్మించిన ఈ కట్టడంపై 17వ శతాబ్దంలో ఒకసారి పిడుగుపడి ఒక మినార్ మొత్తం కూలిపోయింది. అప్పట్లో దాన్ని తిరిగి నిర్మించారు. తిరిగి 1924లో ఏడో నిజాం హయాంలో మరమ్మతులు చేశారు. ఇటీవలే చార్మినార్ మినార్ల రిపేర్లు పూర్తయ్యాయి. కానీ ఆ వెంటనే, ఇంత పెద్ద సున్నపు భాగం ఊడిపడడం చర్చకు కారణమైంది. ప్రస్తుతానికి మరింత నష్టం జరగకుండా పెచ్చులూడిన భాగం చుట్టూ మెష్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. చార్మినార్‌కి జరిగే నష్టాన్ని ఆపడం కోసం కట్టడం పైకి ఎక్కే అవకాశం ఆపేశారు. గతంలో చార్మినార్‌ను ఆనుకునే వాహనాలు వెళ్లేవి. ఇప్పుడు చార్మినార్ చుట్టూ ఉన్న రోడ్డు బాగు చేసి, చార్మినార్‌ని పూర్తిగా ఆనుకుని ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ చుట్టూ ఎప్పుడూ పర్యటకులతో పాటు స్థానిక చిరు వ్యాపారులు, కొనుగోలుదార్లతో రద్దీగా ఉంటుంది. అయితే తాజా ఘటన వల్ల ఎవరికీ ఏ హానీ జరగలేదు. మరింత సున్నపు మిశ్రమం కిందపడకుండా తాత్కాలికంగా మెష్ ఏర్పాటుచేశారు. "ఇది మొదటిసారి కాదు, కానీ ప్రమాదం ఏమీ లేదు" చార్మినార్ పెచ్చులూడడం ఇదే మొదటిసారి కాదు. ఎనిమిది నుంచి పదిసార్లు వరకూ ఇలా జరిగింది. కానీ ఈసారి చాలా పెద్ద భాగం ఊడి పడింది. దాదాపు అరటన్ను పైనే ఉంటుంది దాని బరువు. దీనివల్ల మొత్తం చార్మినార్ భద్రతకు ముప్పు ఉంటుందని ఏమీ చెప్పలేం. అలాగే పురావస్తు శాఖ వారి పనిని కూడా తప్పు పట్టలేం. బహుశా సున్నపు మిశ్రమం వాడాల్సినదాని కంటే 10 నుంచి 12 శాతం తక్కువ నాణ్యత ఉండేది వాడి ఉంటారు అనుకుంటున్నా. అన్నిటికీ మించి ఇది ఒక ఉద్వేగపూరిత అంశం. చార్మినార్ అంటేనే హైదరాబాద్ గుర్తింపు. అందుకని కొంచెం బాధగా ఉంటుంది. అయితే చార్మినార్ మొత్తానికి మాత్రం ఏం ప్రమాదం లేదు అని బీబీసీతో చెప్పారు చరిత్రకారులు సఫీయుల్లా. ఇది కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చార్మినార్ పెచ్చులు ఊడుతోంది. చార్మినార్లోని ఒక మినార్ (నాలుగు స్తంభాల్లో ఒకటి) నుంచి సున్నం (పాత కట్టడాల్లో సున్నపు మిశ్రమాన్ని సిమెంటులా వాడేవారు) పెచ్చులు ఊడి కిందపడ్డాయి. text: వీరిలో శ్రీలంక టీ-20 కెప్టెన్ లసిత్ మలింగ, వన్డే టీమ్ కెప్టెన్ దిముత్ కరుణరత్నె కూడా ఉన్నారు. 2009 మార్చిలో లాహోర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు శ్రీలంక టీమ్ వెళ్తున్న బస్‌పై మిలిటెంట్ దాడి జరిగింది. తర్వాత చాలా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్‌లో ఆడడానికి నిరాకరించాయి. జట్టులోని ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్ల గురించి మాట్లాడిన శ్రీలంక క్రికెట్ బోర్డు "పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం, వెళ్లకపోవడం అనేది మేం ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేశాం" అని చెప్పింది. ఆ తర్వాత పది మంది ఆటగాళ్లు పాకిస్తాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు బోర్డు చెప్పింది. సెప్టెంబర్ 27న ప్రారంభం కావల్సిన పాకిస్తాన్ పర్యటనలో శ్రీలంక జట్టు పాక్ టీంతో మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. క్రికెట్‌ ఆతిథ్యం విషయంలో ఏకాకిగా మారిన పాకిస్తాన్‌కు ఈ పర్యటన చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. అయితే, 2009 దాడి తర్వాత కూడా శ్రీలంక జట్టు ఒకసారి పాకిస్తాన్ వెళ్లింది. 2017 అక్టోబర్‌లో శ్రీలంక లాహోర్‌లో ఒక టీ-20 మ్యాచ్ ఆడింది. కానీ ఆ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్‌గా ఉన్న థిసార పెరీరా కూడా ఈసారి పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించాడు. ఈ పర్యటనలో పాకిస్తాన్‌తో శ్రీలంక రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాల్సి ఉంది. కానీ వాటి తేదీలు, వేదికలు ఇంకా ఖరారు కాలేదు. అయితే, శ్రీలంక క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో మాత్రం "పాకిస్తాన్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడకూడదు. ఒకవేళ ఆడాలనే అనుకుంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడాలి. అక్కడ పాకిస్తాన్ ఎన్నో టెస్ట్ సిరీస్‌లు ఆడింది" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) శ్రీలంక క్రికెట్ జట్టులోని 10 మంది ఆటగాళ్లు.. భద్రతా కారణాలతో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించారు. text: బెంగుళూరులో జరిగిన ఈ వివాహానికి విచ్చేసిన అతిధులు వధూవరులకు క్రిప్టో కరెన్సీ ని బహుమతులుగా ఇచ్చారు. ఇది అతిధుల నిర్ణయం కాదు. బెంగుళూరు కి చెందిన ప్రశాంత్ శర్మ (28 ) , నీతి శ్రీ (28 ) ఈ వారాంతం లో బెంగుళూరులో వివాహం చేసుకున్నారు. ప్రశాంత్, నీతి, బెంగుళూరు లో ఒక స్టార్ట్ అప్ కంపెనీని నడుపుతున్నారు. ప్రశాంత్ జంషెడ్‌పూర్, నీతి, పాట్నాకు చెందినవారు. పెళ్లికి 190 మంది అతిధులు హాజరయ్యారు. అయితే వీరిలో కేవలం 15 మంది మాత్రమే సాధారణ బహుమతులు ఇచ్చారు. మిగిలిన అందరూ క్రిప్టో కరెన్సీ ని బహుకరించారని , ప్రశాంత్ బీబీసీ కి చెప్పారు. "ఈ బహుమతుల విలువ నేను బయటకు చెప్పలేను కానీ, సుమారు లక్ష రూపాయిల విలువ చేసే బహుమతులు లభించాయి". బెంగుళూరు లాంటి పెద్ద నగరంలో బహుమతి ఎంపికకి అతిధులు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మా స్నేహితులు చాలా మంది టెక్నాలజీ రంగం లో పని చేస్తున్నారు. అందుకు మేము బహుమతులను టెక్నాలజీ తో అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నాం. మా తల్లి తండ్రులకి ఈ విషయం చెప్పినపుడు వాళ్ళు కూడా మా నిర్ణయానికి మద్దతు పలికారు అని తెలిపారు. "బిట్ కాయిన్ లతో పాటు మేము సాంప్రదాయ బహుమతి కూడా ఇచ్చామని" పెళ్లికి హాజరయిన ఒక అతిధి చెప్పారు. "ఇది చాలా వినూత్న బహుమతి. నీతి ప్రశాంత్ ఇటువంటి బహుమతులు తీసుకోవాలని బిట్ కాయిన్ ల విలువ పెరిగాక తీసుకున్నది ఏమి కాదు. ఈ తరహాలో బహుమతులు తీసుకోవాలని వాళ్ళు ఒక 2 నెలల ముందే నిర్ణయించుకున్నారు" అని ఐం హై సీఈఓ, నీతి పాత బాస్ ఎన్ రవి శంకర్ చెప్పారు. ఈయన కూడా బిట్ కాయిన్ లను బహుమతి ఇచ్చిన వారిలో ఒకరు. ఒక ప్రైవేట్ బిట్ కాయిన్ ఎక్స్చేంజి ప్రతినిధులు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొని, అతిధులకు పెట్టుబడి విధానాలు వివరించడం ఈ పెళ్ళిలో మరో విశేషం. బడుగు వర్గాల పిల్లల చదువు కోసం బహుమతులు క్రిప్టో కరెన్సీ విలువ ఒక్క సారిగా పెరగడం వలన ఇది ఎక్కువ కాలం నిలవదని వార్తలు వచ్చాయని, కానీ తనకి బిట్ కాయిన్ల నుంచి సంపాదించాలని ఉద్దేశ్యం ఏమి లేదని ప్రశాంత్ తెలిపారు. "ఏ వస్తువునైనా మళ్ళీ అమ్మాలనే ఉద్దేశ్యం తో కొంటే మార్కెట్ లో బబుల్ తయారు అవుతుంది. కానీ మేము బిట్ కాయిన్ లను భవిష్యత్ లో ఎలా పని చేస్తాయో చూడాలనే ఉద్దేశ్యం తో తీసుకున్నామని, పేర్కొన్నారు. ముఖ్యం గా బ్లాక్ చైన్ టెక్నాలజీ పై మాకు చాలా ఆసక్తి కలిగించింది" అని అన్నారు. "మాకు ఇలా వచ్చిన బహుమతులను మేము బడుగు వర్గాల పిల్లల చదువు కి ఇద్దామనుకుంటున్నాం. విద్య దేశం లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని మా నమ్మకం" అని నీతి చెప్పారు బిట్ కాయిన్ ల పై ప్రభుత్వం పెట్టే నిబంధనల గురించి ఈ జంట పెద్దగా ఆలోచించటం లేదు. "మార్కెట్ లోకి వచ్చే ఎటువంటి కొత్త టెక్నాలజీ అయినా కేంద్రీకృత విధానాలను సరళం చేయాలని అనుకుంటుంది. ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచం లో ఉన్న ప్రభుత్వాలన్నీ వీటి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవాలి" అని ప్రశాంత్ అన్నారు. "బిట్ కాయిన్ వాడకం, నిర్వహణ లో పారదర్సకత లేదని రెగ్యులేటర్లు భావిస్తున్నారు. చాలా దేశాల ప్రభుత్వాలు ఈ విధానం పట్ల సుముఖుత వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అనుకుంటున్నారు" , అని ఆర్ధిక వేత్త ప్రాంజల్ శర్మ అన్నారు ఇందులో పెట్టుబడులు పెట్టేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. "బిట్ కాయిన్ లను ఇండియన్ కరెన్సీ లో కొని ప్రపంచ మార్కెట్ లో అమ్మడం ఎంత వరకు న్యాయ బద్ధమో ఆలోచించాలని" సైబర్ లా అడ్వొకేట్ అన్నారు. ఇలా చేయడం విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనలను వ్యతిరేకిస్తుందని అయన పేర్కొన్నారు. బిట్ కాయిన్స్ కి భవిష్యత్ ఉంది. వీటి విషయం లో ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అని అన్నారు. క్రిప్టో కరెన్సీ ని లీగల్ టెండర్ గా ఆమోదించమని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా పెట్టుబడిదారులకు మూడవ సారి హెచ్చరిక చేసిన రెండు రోజులకే నీతి ప్రశాంత్ ల వివాహం జరగడం విశేషం. ఇతర కథనాలు బిట్‌కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా? బోయింగ్ 777 పిన్న పైలెట్.. బెజవాడ అమ్మాయే (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బెంగళూరులో జరిగిన ఒక టెక్కీ జంట వివాహం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇదేమి ప్రత్యేక వివాహం కాదు. సాంప్రదాయ వివాహం. కాకపొతే ఈ పెళ్ళికి బహుమతులే ఆకర్షణగా నిలిచాయి. ఈ పెళ్ళికి వచ్చిన అతిధుల చేతుల్లో గిఫ్ట్ ప్యాకెట్ లు కనిపించలేదు. text: వారికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని ఆల్వార్‌లోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సరితా స్వామి చెప్పారు. నిందితుల్లో విపిన్ యాదవ్, రవీంద్ర కుమార్, కాలూరామ్, దయానంద్, యోగేశ్ కార్, భీమ్ రాఠీ ఉన్నారు. 2017 ఏప్రిల్ 1న ఆల్వార్ జిల్లాలో 55 ఏళ్ల పెహ్లూ ఖాన్‌ను స్వయం ప్రకటిత గోసంరక్షకులు తీవ్రంగా కొట్టారు. ఆయన రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలోని నూహ్ ప్రాంతానికి చెందిన పెహ్లూ ఖాన్ రాజస్తాన్ నుంచి తన ఆవులతో సొంతూరికి వెళ్తుండగా దిల్లీ-ఆల్వార్ జాతీయ రహదారిలోని బెహ్రోర్ సమీపాన ఈ దాడి జరిగింది. నాడు పెహ్లూ ఖాన్ తన ఇద్దరు కొడుకులు ఇర్షాద్, ఆరిఫ్‌, మరో ఇద్దరు గ్రామస్థులతో కలిసి ఒక అద్దె వాహనంలో వెళ్తున్నారు. రాజస్థాన్‌లో ఒక పశువుల సంతలో కొన్న ఆవులను ఆయన అందులో స్వగ్రామానికి తరలిస్తున్నారు. నాటి మూక దాడిలో పెహ్లూ ఖాన్‌తోపాటు ఆయన ఇద్దరు కుమారులూ గాయపడ్డారు. కొన్ని చెక్ పాయింట్లు దాటిన తర్వాత ఆరుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్ల మీద తమను వెంబడిస్తున్నట్టు పెహ్లూ ఖాన్ తదితరులు గమనించారు. ఈలోగా వారు పెహ్లూ ఖాన్ వాహనాన్ని దాటి ముందుకెళ్లి వారిని ఆపారు. ఆ తర్వాత దాడి జరిగింది. దాడితో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పెహ్లూ ఖాన్ చనిపోవడానికి ముందు కొద్దిగా స్పృహలోకి వచ్చారు. తనపై దాడికి పాల్పడిన ఆరుగురి పేర్లను వెల్లడించారు. వారిని అరెస్టు చేయడానికి ముందే పోలీసులు పెహ్లూ ఖాన్, ఇతర బాధితులపై కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆవులను తరలిస్తున్నారనేది వారిపై మోపిన అభియోగం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాజస్తాన్‌లో పాడి రైతు పెహ్లూ ఖాన్‌ను కొట్టి చంపిన కేసులో మొత్తం ఆరుగురు నిందితులను న్యాయస్థానం బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది. text: BARCROFT MEDIA VIA GETTY IMAGES ‘‘ఏమైంది, గృహ హింసా?’’ అని అడిగాను. కాదు అని చెప్పి ఏడవడం మొదలుపెట్టారామె. ‘‘మా ఇంట్లో వాళ్లెవ్వరినీ నేను సహాయం అడగలేను అని చెప్పారు" అని సామాజిక కార్యకర్త షబ్నం హాష్మి వివరించారు. ఆ అమ్మాయి ఒక లెస్బియన్ అనీ, తనను బలవంతంగా ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేసేశారని చెప్పారు. తాను లెస్బియన్ అని పదేపదే చెప్పినా ఇంట్లో ఎవ్వరూ వినిపించుకోలేదని, పెళ్లి అయ్యాక అత్తవారింటికి వెళ్లాల్సి వచ్చిందని, అక్కడ ఇమడలేక పారిపోయి 'అన్హద్' అనే స్వచ్ఛంద సంస్థ సహాయం కోరవలసి వచ్చిందని బాధితురాలు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దిల్లీ హై కోర్టులో ఉంది. తన హక్కులు, భద్రత కోసం ఆ అమ్మాయి పోరాడుతోంది. బాధితురాలి భద్రత విషయమై కోర్టు స్పందిస్తూ.. మేజర్ అయిన వ్యక్తిని అత్తవారింట్లోనో, పుట్టింట్లోనో ఉండమని బలవంతం చేయలేమని పేర్కొంది. తాను కోరుకున్న చోట ఉండే హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో అన్హద్ బాధితురాలికి సహాయంగా నిలిచింది. ప్రస్తుతం ఆమె దిల్లీలోని మరో ఎన్జీవో ఆధ్వర్యంలో నడిచే షెల్టర్ హోంలో ఉంటున్నారు. AMAL KS/HINDUSTAN TIMES VIA GETTY IMAGES అందరికీ తెలిసినా కూడా పెళ్లి చేశారు అన్హద్‌తో కలిసి పనిచేస్తున్న షబ్నం ఏడో తారీఖు పొద్దున్న తనకు మళ్లీ ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. ఆ అమ్మాయి గాభరా పడుతూ, సహాయం కావాలని కోరారని చెప్పారు. "బలవంతంగా తనకు పెళ్లి చేసేశారని, తన పరిస్థితి విషమంగా ఉందని ఆమె చెప్పారు. ఇది చిన్నవిషయం కాదని నాకర్థమైంది. తనని నా ఆఫీసుకి రమ్మన్నాను. అప్పుడు ఆమె నాకు మొత్తం కథ చెప్పారు" అని షబ్నం తెలిపారు. ఆ అమ్మాయి ఏడాదిన్నరగా ఈ యాతన అనుభవిస్తోంది. ఆమెకు 2019 లో వివాహమైంది. తాను లెస్బియన్ అని, అబ్బాయిలపై తనకు ఆసక్తి లేదని, పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పారామె. కానీ, కుటుంబం ఆమె మాట వినిపించుకోలేదు. పెళ్లయ్యాక ఆమె బురారీలోని తన అత్తవారింటిని వచ్చారు. తనకు అబ్బాయిలమీద ఆసక్తి లేదని, లెస్బియన్ అని తనను పెళ్లి చేసుకున్న అబ్బాయికి వివరించి చెప్పారు. వారిద్దరి మధ్య ఏ రకమైన శారీరక సంబంధం ఏర్పడలేదు. కానీ, ఆమె అక్కడే ఉండవలసి వచ్చింది. అక్కడ ఆమెకు ఊపిరి సలపలేదు. రాను రాను నిరాశ నిస్పృహలు ఎక్కువయ్యాయి. పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్తతో విడాకుల గురించి మాట్లాడారు. అయితే, ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకోవడం వాయిదా పడుతూ వచ్చింది. ఆమె భర్త విడాకులు తీసుకునేందుకు అంగీకరించారు. కానీ, తన చెల్లెల్లి వివాహం అయ్యేంతవరకూ ఉండమని.. లేదంటే కుటుంబం పరువు పోతుందని అభ్యర్థించారు. ఆమె కాదనలేకపోయారు. ఈలోగా 2020 మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించారు. భర్త చెల్లెలు వివాహమైంది కానీ తనకు అక్కడనుంచీ బయటపడే మార్గం చిక్కలేదు. CHANDAN KHANNA/AFP VIA GETTY IMAGES చికిత్స చేయిస్తామని బెదిరించారు బాధితురాలి భర్త భారత వైమానిక దళంలో పని చేస్తున్నారు. ఆయన పోస్టింగ్ వేరే చోట. ఆమె అప్పుడప్పుడూ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. తనకు వివాహేతర సంబంధాలున్నాయని అత్తవారింట్లో నిందలు మోపారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. ఈ వివాహ బంధంలో ఇరుక్కుపోయి, ఎంత వేదన అనుభవిస్తున్నారన్న విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు విడమర్చి చెప్పారు. అమీర్ ఖాన్ నిర్వహించిన సత్యమేవ జయతే ప్రోగ్రాంలో ఎల్జీబీటీ కమ్యూనిటీ పడుతున్న బాధల గురించి వచ్చిన ఒక ఎపిసోడ్‌ను కూడా ఆమె తన తల్లిదండ్రులకు పంపించి చూడమని చెప్పారు. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమె మాటలు వినలేదు. తనను అత్తారింటి నుంచి వెనక్కు తీసుకు వస్తే కుటుంబం పరువు పోతుందని అన్నారు. లెస్బియన్‌గా ఉండడం అనేది ఒక జబ్బు అని, దీనికి చికిత్స చేయిస్తామని చెప్పారు. దాంతో బాధితురాలు మరింత భయపడిపోయారు. ఈ వివరాలన్నీ బాధితురాలు ఫైల్ చేసిన పిటిషన్లో స్పష్టం చేశారు. "బాధితురాలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు చాలా అయోమయంలో ఉన్నారు. తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఆమె చాలా కంగారు పడిపోయారు. వాళ్లు ఇప్పుడు వచ్చి ఆమెను చికిత్సకు తీసుకెళతారని ఆందోళన పడ్డారు. తన ఫోన్ కూడా లాగేసుకుంటారని భయపడ్డారు" అని షబ్నం తెలిపారు. తనకు ధైరం చెప్పి, పోలీసులకు కంప్లైంట్ చేసిన తరువాత ఆమె కాస్త నెమ్మదించారు. ఇప్పుడు ఆమె మానసిక స్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ప్రస్తుతం షెల్టర్ హోంలో ఉన్నారు. తొమ్మిదో తేదీన బాధితురాలి హక్కులను పరిరక్షించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు షబ్నం తెలిపారు. ఆ తరువాత షబ్నంకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. "ఆ రోజు రాత్రి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు షెల్టర్ హోం దగ్గరకు వెళ్లి, ఆమెను అప్పగించమని డిమాండ్ చేశారు" అని షబ్నం చెప్పారు. కుటుంబం ఏమంటోంది? ఈ విషయం గురించి బాధితురాలి తండ్రి భరత్ సింగ్‌తో మాట్లాడితే.. తన కుమార్తె లెస్బియన్ అన్న సంగతి తనకు తెలియదని చెప్పారు. "మా అమ్మయి ఈ విషయం మాకెప్పుడూ చెప్పలేదు. ముందే చెప్తే పెళ్లి చేసేవాళ్లమే కాదు. తన అత్తవారింట్లో ఏం జరిగిందో మాకు తెలియదు. మీ అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోయిందని కబురు చేస్తే మేం వెళ్లాం. మా అమ్మాయితో మాట్లాడనివ్వండని, కనీసం చూడనివ్వండని వాళ్లని అడిగాం. మా కుటుంబం కోర్టు మెట్లెక్కే ప్రసక్తే లేదు. మా అమ్మాయి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటుంది. ఇంటికి రావాలకుంటే వచ్చేయొచ్చు" అని ఆయన చెప్పారు. కోర్టులో న్యాయమూర్తి స్వయంగా బాధితురాలితో మాట్లాడారని, ఎక్కడ ఉండదల్చుకున్నారని అడిగారని బాధితురాలి తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ తెలిపారు. అయితే, ప్రస్తుతం బాధితురాలికి తన ఇంటికి వెళ్లే ఉద్దేశం లేదని, అక్కడ ఆమెకు ప్రమాదమని భయపడుతున్నారని ఆమె చెప్పారు. "మేం హై కోర్టులో పిటిషన్ వేశాం. ఎందుకంటే ఆ అమ్మాయి అత్తమామల ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్నాక వాళ్లింట్లో వాళ్లు ఆమెను వెతకడం ప్రారంభిస్తారు. కనిపిస్తే ఏ స్వామీజీ దగ్గరకో, డాక్టర్ దగ్గరకో తీసుకునివెళతారు. ఇప్పుడు ఆ పని చేయలేరు. కోర్టు ఆమెకు భరోసా ఇచ్చింది" అని గ్రోవర్ తెలిపారు. "కోర్టు ఏం చెప్పిందంటే.. మేజర్ అయిన యువతిని ఎవరూ ఏ బంధంలోనూ నిర్బంధించలేరు. తన సెక్సువల్ ఓరియెంటేషన్ వేరుగా ఉంటే ఇలా బలవంతంగా వివాహం చేయలేరు. వెంటనే తనకు విడాకులు ఇమ్మని ఆమె భర్తను కోర్టు ఆదేశించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు" అని లాయర్ చెప్పారు. కేసు ముగిసిన తరువాత బాధితురాలు తన ఇష్ట ప్రకారం జీవించవచ్చు. చదువుకోవాలంటే చదువుకోవచ్చు లేదా ఉద్యోగం చేయొచ్చు అని ఆమె అన్నారు. ఇదొక్కటే కేసు కాదు ఇలా ఎంతోమంది లెస్బియన్ అమ్మాయిలకు బలవంతంగా వివాహాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి వేదనే అనుభవిస్తూ ఉన్నారు. "ఇలాంటి బలవంతపు వివాహాలు, స్వలింగ సంపర్కులని నిర్బంధించి పెళ్లిళ్లు చేస్తున్న కేసులు తక్కువేమీ లేవు. కాకపోతే, వీటి గురించి తగినంత డాటా లేదు. ప్రభుత్వం వీళ్ల గురించి సీరియస్‌గా తీసుకోవట్లేదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. ఒక్కోసారి నాకు వారానికి ఇలాంటి కాల్స్ రెండు సార్లైనా వస్తుంటాయి. మన సమాజంలో స్త్రీ ఇష్టాయిష్టాలకు, హక్కులకు గుర్తింపు లేదు. స్వలింగ సంపర్కులలో స్వలింగ స్త్రీల జీవితాలు మరింత కష్టం. అమ్మాయిలకు కూడా శారీరక వాంఛలు ఉంటాయని ఈ సమాజం అంగీకరించదు. అలాంటప్పుడు అమ్మాయిలు ఏం చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆ మహిళలంతా ఇలా వివాహ బంధాల్లో చిక్కుకుని జీవితాంతం దుఃఖపడుతుంటారు, హింసకు గురవుతుంటారు" అని మానవ హక్కుల కార్యకర్త హరీశ్ అయ్యర్ తెలిపారు. స్వలింగ సంపర్కుల గురించి పెత్త ఎత్తున అవగాహన కలిగించాల్సి ఉంది. చాలామంది దీన్ని ఒక జబ్బు అని కూడా అనుకుంటున్నారు. నిపుణులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని హరీశ్ అభిప్రాయపడ్డారు. "చట్టంలో, సమాజంలో కూడా స్వలింగ సంపర్కుల పట్ల అవగాహన పెరగాలి. స్వలింగ వివాహాలు చట్టబద్ధం చెయ్యాలి. అప్పుడు ప్రజల్లో కూడా కొంత మార్పు వస్తుంది. ప్రభుత్వం ఎల్జీబీటీ అవగాహన కార్యక్రమాలు రూపొందించాలి. విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. అప్పుడే ఇది సహజమనే అవగాహన ప్రజల్లో వస్తుంది" అని వృందా గ్రోవర్ అన్నారు. కాలంతో పాటూ ప్రజల్లో మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. కానీ, ఈలోగా ఎంతోమంది యువతులు బలైపోతారని ఆమె విచారం వ్యక్తం చేశారు. బాధితురాలు ప్రస్తుతం షెల్టర్ హోంలో ఉంటున్నారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 25న జరగనుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏడో తేదీకి వారం ముందు ఒక అమ్మాయి నుంచి నాకో ఫోన్ కాల్ వచ్చింది. ‘‘నాకు చాలా ఆందోళనగా ఉంది, నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లగలరా?’’ అని అడిగారు ఆమె. text: మొత్తం 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్‌లో ఇదే బెస్ట్. అంతకు ముందూ ఐర్లాండ్, ఇంగ్లండ్‌‌తో మ్యాచుల్లో తన బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. తాజా మ్యాచ్ లైవ్ స్కోర్.. అప్‌డేట్స్‌ని ఇక్కడ చూడొచ్చు కుల్దీప్ పవర్ పంచ్ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ మిగతా మ్యాచుల్లో కూడా తన జోరు కొనసాగుతుందని ఆతిథ్య జట్టుకు హెచ్చరిక పంపించాడు. అందుకు తగ్గట్టే వన్డేల్లో విజృంభించాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందిన మ్యాచ్‌లో కుల్దీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. "ఇది ఇంగ్లండ్‌లో నా మొదటి పర్యటన. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మ్యాచ్‌లో కూడా మేం ఇలాగే చేయాలనుకుంటున్నాం" అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కుల్దీప్ వల్లే ఈ విజయం దక్కిందని అన్నాడు ఫాస్ట్ బౌలర్ కాబోయి స్పిన్నర్ అయ్యాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్రికెట్ ట్రైనింగ్ ప్రారంభించినపుడు కుల్దీప్ ఫాస్ట్ బౌలర్‌ కావాలని అనుకున్నాడు. 1994లో ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో పుట్టిన కుల్దీప్ యాదవ్‌కు రిస్ట్ స్పిన్నర్( మణికట్టుతో బంతిని తిప్పే స్పిన్ బౌలర్)అవమని అతడి కోచ్ సలహా ఇచ్చాడు. దాన్ని అమలు చేయడం అంత సులభం కాకపోయినా కుల్దీప్ శ్రమ ఫలించింది. పిచ్‌పై అద్భుతాలు సృష్టించేలా చేసింది. అండర్-19, ఇండియా ఎ, ఉత్తర్ ప్రదేశ్ తరఫున అద్భుతాలు చేసిన కుల్దీప్ తర్వాత భారత జట్టులో భాగమయ్యాడు. 2017లో కుల్దీప్ ట్వంటీ-20, వన్డే, టెస్ట్ కెరీర్ కూడా ప్రారంభమైంది. 2017 మార్చిలో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో కుల్దీప్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి భారత్ విజయానికి మార్గం సుగమం చేశాడు. రెండు టెస్ట్ మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన కుల్దీప్, 20 వన్డేల్లో 39 వికెట్లు, 11 ట్వంటీ-20 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. గిరగిరా తిరుగుతూ దూసుకొచ్చే కుల్దీప్ బంతులు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఎంత మాయ చేస్తున్నాయో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి భారత్ గెలుపును సులభతరం చేశాడు. మొదట బెయిర్‌స్టో, జేసన్ రాయ్, జో రూట్‌లను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపాడు. text: అమెరికా ఆంక్షలు విధించడంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తీవ్రంగా స్పందించారు. "ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ కొత్త కుట్రలో అమెరికా సఫలం కాదనడంలో సందేహమే లేదు" అని ఆయన అన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చమురు ఎగుమతులపైనే ఆధారపడింది. ఇప్పుడు అమెరికా ఆంక్షల తర్వాత ఇరాన్ చమురు అమ్మకాలకు సమస్యలు ఎదురవుతాయి. అయితే, ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలకు తమ మద్దతు ఉంటుందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. కానీ ఆ కంపెనీలపై ఈ ఆంక్షల ప్రభావం పడుతుందా? ఎందుకంటే అవి ఇరాన్‌తో వ్యాపారం కొనసాగిస్తే, అమెరికాతో అవి చేసే వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడవచ్చు. అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు ఎందుకు విధించింది? ఇరాన్ సహా ఆరు దేశాలతో 2015లో జరిగిన అణు ఒప్పందం నుంచి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా బయటకి వచ్చింది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్‌తో ఈ అణు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఇరాన్‌కు 2016లో అమెరికా, మరో ఐదు దేశాలకు చమురు అమ్మడానికి, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేయడానికి అనుమతి లభించింది. ఈ అణు ఒప్పందం నుంచి బయటికి వచ్చాక ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన ఒక ప్రసంగంలో డోనల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలూ ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోవాలన్నారు. కానీ యూరోపియన్ యూనియన్ సహా, మిగతా దేశాలు మాత్రం ఇరాన్ అణు ఒప్పందానికి కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాయి. అణు ఒప్పందంపై ఏకపక్ష వైఖరితో అమెరికా దాన్ని ఉల్లంఘించిందని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా ఆంక్షలతో అంతర్జాతీయ కంపెనీలు ఇరాన్‌తో చేస్తున్న వ్యాపారాల నుంచి వెనకడుగు వేయడం ప్రారంభించాయి. దీంతో ఇరాన్ చమురు ఎగుమతులు పడిపోయాయి. ఐఎంఎఫ్ ప్రకారం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 1.5 శాతం క్షీణిస్తుంది అమెరికా ఆంక్షల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అమెరికా ప్రకటనను బట్టి ఇరాన్‌తో ఏ కంపెనీలు వ్యాపారం కొనసాగిస్తే, వాటికి అమెరికాతో వ్యాపారం చేయడానికి అనుమతి లభించదు. అంతే కాదు, ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలతో బిజినెస్ చేసే అమెరికా కంపెనీలు కూడా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నవంబర్ 5వ తేదీ సోమవారం నుంచి బ్యాంకింగ్ రంగంలో ఆంక్షలు అమలవుతాయి. ఆగస్టులో బంగారం, విలువైన లోహం, మోటార్ వాహనాల రంగం(అమెరికా సెక్టార్) సహా చాలా పరిశ్రమలను ఈ ఆంక్షలు చుట్టుముట్టాయి. ఇరాన్‌తో చమురు వ్యాపారాన్ని పూర్తిగా ఆపివేయాలని అనుకుంటున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. కానీ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోడానికి 8 దేశాలు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. దిగుమతులు తగ్గించుకోడానికి గడువు ఇచ్చింది. అసోసియేటెడ్ ప్రెస్ వివరాల ప్రకారం ఈ 8 దేశాల్లో ఇటలీ, భారత్, జపాన్, దక్షిణకొరియా లాంటి అమెరికా సహచర దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ తమ కంపెనీలు ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించడానికి, అమెరికా ఆంక్షల వల్ల వచ్చే నష్ట నుంచి బయటపడడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పివి) అనే ఒక పేమెంట్ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నాయి. ఈ పేమెంట్ వ్యవస్థలో కంపెనీలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరం లేకుండా ఉంటుంది. ఒక బ్యాంకులా పనిచేసే ఎస్‌పివి ఇరాన్, దానితో వ్యాపారం చేసే కంపెనీల మధ్య లావాదేవీలను చూసుకుంటుంది. ఇరాన్ యూరోపియన్ యూనియన్ దేశాలకు చమురు ఎగుమతులు చేసినప్పుడు, దిగుమతి చేసుకునే కంపెనీలు ఎస్‌పివి ద్వారా చెల్లింపులు జరుపుతాయి. ఇరాన్ వీటిని ఎస్‌పివిలో క్రెడిట్‌ రూపంలో ఉంచుతుంది. యూరోపియన్ యూనియన్ ఇతర దేశాల నుంచి ఏవైనా ఉత్పత్తులను కొనడానికి ఇదే ఎస్‌పివి ద్వారా చెల్లింపులు జరుపుతుంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో యూరోపియన్ యూనియన్ తమ చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చింది. తాజా మార్పులతో అమెరికా ఆంక్షల వల్ల వచ్చిన నష్టాల నుంచి పరిహారం కోరడానికి ఈయూ కంపెనీలకు అనుమతి లభిస్తుంది. సోర్స్: క్లిపర్ గణాంకాలు అయినా, ఈ ఆంక్షల వల్ల యూరోపియన్ యూనియన్ దేశాల్లోని ఎన్నో కంపెనీలపై విస్తృత ప్రభావం పడుతుంది. ఉదాహరణకు షిప్పింగ్ ఆపరేటర్లు ఎస్‌పిబి వ్యవస్థ ద్వారా చమురు కొనుగోలు చేయాలని భావిస్తాయి. కానీ చమురు రవాణా చేసే కంపెనీలు అమెరికాలో కూడా తమ వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఆ కంపెనీలపై ఆంక్షలు అమలైతే, షిప్పింగ్ ఆపరేటర్లకు చాలా నష్టం కలగవచ్చు. "ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రత్యక్షంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి లేదు" అని కొలంబియా యూనివర్సిటీ సీనియర్ పరిశోధకులు, ఆంక్షల అంశాల్లో నిపుణులు రిచర్డ్ నఫ్యూ అన్నారు. కానీ ఇరాన్‌తో పెద్ద ఎత్తున వ్యాపారం చేసే ఎన్నో దేశాలు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికే సిద్ధమవుతాయని ఆయన తెలిపారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్యతరహా సంస్థలు ఈ ఎస్‌పివి వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. "ఎస్‌పివి ద్వారా ఇరాన్‌కు విక్రయించే ఉత్పత్తులపై ద్వితీయ స్థాయి ఆంక్షలు ఉండవచ్చు. అప్పుడు ఈ లావాదేవీలే సమస్యలో పడుతాయి" అని రీడ్ స్మిత్‌లో అంతర్జాతీయ వ్యాపార, జాతీయ భద్రతా అధ్యక్షుడు లీ హాన్సన్ అన్నారు. అయితే ఇరాన్ ఏం చేయచ్చు? "చమురు ఎగుమతులను పూర్తిగా జీరో చేస్తున్నట్టు అమెరికా ఇటీవల చెప్పింది. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దానివల్ల చమురు ధరలు పెరుగుతాయి." అని బర్మింగ్ హాం యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కాట్ లుక్స్ తెలిపారు. "అంతే కాదు.. ఇరాన్ నుంచి చమురు కొనడంలో ఏయే దేశాలకు మినహాయింపులు లభిస్తోందో, అవన్నీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశమైన చైనాతో కలిస్తే అది కూడా గమనించాల్సిన విషయమే అవుతుంది". ఇంతకు ముందు 2010, 2016 సంవత్సరాల్లో ఇరాన్ చమురు వ్యాపారంపై ఆంక్షలు విధించినపుడు, ఆ దేశ ఎగుమతుల్లో సుమారు 50 శాతం పతనం నమోదైంది. ఈసారి కూడా ఎగుమతులపై ఆంక్షల ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇరాన్‌, దాని వ్యాపార భాగస్వాములు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తాయనేది కూడా స్పష్టం అవుతోంది". "దీనివల్ల ఏవైనా సమస్యలు వస్తాయేమో, అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇరాన్ ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి ఆంక్షలు ఎదుర్కొంది" అని ఐరోపా యూనియన్ ఫారిన్ కౌన్సిల్ సీనియర్ ఫెలో ఎలీ గెరాన్మేహ్ అన్నారు. ఇక్కడ, ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పచ్చు. ఇరాన్ తన చమురు అమ్మడానికి ఇంతకు ముందు అనుభవాలను ఉపయోగించుకుని వ్యూహాత్మక పద్ధతులను వెతుక్కోవాల్సి వస్తుంది. ఇరాన్ ఈ లోటును భర్తీ చేయడానికి రష్యా, చైనాతో కొత్త సంబంధాలు ఏర్పరుచుకోవాలని కూడా చూడవచ్చు. ఇది కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈరోజు అంటే నవంబర్ 5న ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు (అమెరికా కాలమానం ప్రకారం నవంబర్ 4 అర్థరాత్రి నుంచి) అమల్లోకి వచ్చాయి. text: దేశంలోని ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల విలీనం అవసరం, దాని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై వాదోపవాదాలు నడుస్తున్నాయి. భారత్‌లో బ్యాంకుల విలీనం ఇది కొత్తేమీ కాదు. అయితే, ముందెప్పుడూ ఇంత భారీ స్థాయిలో, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లకు మాత్రమే పరిమితమై విలీన ప్రక్రియ చేపట్టలేదు. 1969 జులై 20న 14 అతిపెద్ద వాణిజ్య బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. వ్యవసాయం, చిన్నపరిశ్రమలు, ఎగుమతులు, పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేందుకు, బలహీనవర్గాలను బలోపేతం చేసేందుకు ఆ చర్య తీసుకుంది. ఆ తర్వాత 1980లో ఆంధ్రాబ్యాంకు సహా మరో 13 బ్యాంకులను కూడా జాతీయం చేశారు. భారత ఆర్థిక చరిత్రలో అతిప్రధానమైన విధానపరమైన నిర్ణయం ఇదేనని విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. బ్యాంకుల జాతీయం కన్నా ముందు భారత ఆర్థిక వ్యవస్థను భారీ కార్పొరేట్ సంస్థలే నియంత్రించేవి. డిపాజిటర్లకు ఎలాంటి రక్షణా ఉండేది కాదు. బ్యాంకుల జాతీయీకరణ, 1991లో చేపట్టిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. వినియోగదారులు, పెట్టుబడిదారుల్లో గొప్ప విశ్వసనీయతను సంపాదించుకుంది. బ్యాంకుల విలీనం ఫలితం ఎలా ఉండబోతుంది? పీఎస్‌బీల సంఖ్య తగ్గిపోవడం వల్ల మానవవనరులు, ఉద్యోగకల్పన, ఆర్థికవృద్ధి వంటి వాటికి కొన్ని స్వల్పకాలిక, మరికొన్ని దీర్ఘకాలిక ప్రతికూలతలు ఎదురవ్వొచ్చు. పీఎస్‌బీల విలీనం ఉద్దేశం ఏంటన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. బ్యాంకులను లాభాల్లోకి తేవడం కోసమో లేక పెట్టబడుల అవసరాలు తీర్చేందుకో ఈ నిర్ణయం తీసుకోలేదు. స్వల్పకాలికంగా ఎదురయ్యే ప్రతికూలతల్లో ప్రధానమైనది మానవవనరులపై పడే ప్రభావమే. సంస్కృతి పరంగా, కార్యకలాపాలపరంగా ఆయా బ్యాంకుల మధ్య ఉండే తేడాలకు తగ్గట్లు సర్దుకుపోవడంలో ఉద్యోగుల వైఖరి ఎలా ఉంటుందన్నదాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విలీన నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌బీఐ, దాని అనుబంధ ప్రాంతీయ బ్యాంకుల విలీనంతో పోలిస్తే ఇప్పుడు జరగబోయే విలీనం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల వ్యవహారాలు, సంస్థాగత నిర్మాణం ఒకేలా ఉండేవి. కానీ, ఇప్పుడు పీఎస్‌బీల విషయంలో అలా కాదు. నాయకత్వ అభివృద్ధిపరంగానూ కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. నిరర్థక ఆస్తులు, మొండి బకాయిల సమస్యలను నియంత్రించేందుకు, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచేందుకు విలీనం ఉపయోగపడుతుందా? అనేది మరో పెద్ద ప్రశ్న. భారత ఆర్థికవ్యవస్థ దృష్టసారించాల్సిన ప్రధాన సమస్యలు మూడు ఉన్నాయి. పీఎస్‌బీల విలీనం వీటిని సమర్థవంతంగా పరిష్కరించగలదా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రభుత్వ, ప్రవేటు రంగాల బ్యాంకులకు కాలక్రమంలో నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి. పీఎస్‌బీలతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకుల రికవరీ రేటు మెరుగ్గా ఉంది. ఎందుకంటే, రుణాల రికవరీ ప్రక్రియల విషయంలో ప్రైవేటు రంగ బ్యాంకులు కింది స్థాయి వరకూ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తాయి. పీఎస్‌బీలు మాత్రం ఇలాంటి ప్రక్రియలను అనుసరించవు. నిర్వహణపరంగా ఉన్న అమసర్థతను ఈ విషయం తేటతెల్లం చేస్తుంది. దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారీ బ్యాంకుల విలీనం కారణంగా కార్యకలాపాల నిర్వహణను ఏమైనా మెరుగ్గా చేయొచ్చా అన్నది చూడాలి. పెట్టుబడులు, రుణాలకు సంబంధించి బ్యాంకుల పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యత పెరగడం వల్ల కార్యకలాపాల స్థాయి కూడా పెరుగుతుంది. విలీనం వల్ల కలిగే తొలి ప్రయోజనం ఇదే. అయితే, అవసరమైన కొత్త నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా ఈ కార్యకలాపాల నిర్వహణలో సమర్థత రాదు. బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతమున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. మొత్తంగా బ్యాంకింగ్ ధోరణులు ఒకేలా మారేందుకు విలీనం ప్రక్రియ తోడ్పడొచ్చు. కానీ, సంస్థాగత నిర్మాణం అభివృద్ధి విషయంలో బ్యాంకులు కృషి చేయాలి. స్వల్పకాలికంగా కొత్త ఉద్యోగాలు అవసరం తగ్గడం, ఉన్న వనరులు ఏకీకృతమవ్వడం వల్ల నిరుద్యోగిత పెరగొచ్చు. అయితే, ఉద్యోగాల విషయంలో ఎలాంటి కోతా ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కొంత సమయం తర్వాత అన్ని విభాగాల్లో సిబ్బంది అవసరానికి మించి సిబ్బంది ఉన్న భావన కలగొచ్చు. బ్రాంచ్‌ల సంఖ్య, లావాదేవీల సంఖ్య తగ్గడం వల్ల నిర్వహణపరమైన వ్యయం తగ్గి బ్యాంకులకు ఆర్థిక ప్రయోజనం కలగొచ్చు. ఉద్యోగావకాశాలు తగ్గిపోతే దీర్ఘకాలంలో ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడుతుంది. అందుకే ఉత్పాదక ఉద్యోగ అవకాశాల సృష్టి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. అప్పుడే జనాభాలో ఎక్కువ శాతం యువత ఉన్నందుకు ప్రతిఫలాన్ని దేశం పొందగలుగుతుంది. లేకపోతే, జీడీపీ వృద్ధి రేటును ఎనిమిది శాతాన్ని దాటించడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగానే మారుతుంది. ప్రస్తుత ఆర్థిక సమస్యలను, బ్యాంకింగ్ రంగంలోని సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పీఎస్‌బీల విలీనం ఒక్కటే సరిపోకపోవచ్చు. (గార్గి సన్నాటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐబీఎం)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ వ్యాసంలోని విషయాలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, బీబీసీవి కావు) ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన తాజా ప్రకటనపై చాలా చర్చ జరుగుతోంది. text: కానీ, ఇటీవల ముగ్గురు వ్యక్తులు ఈ ప్రాంతంలో రెండు వారాల పాటు తప్పిపోవడం సంచలనంగా మారింది. వారిలో ఇద్దరు ప్రాణాలతో తిరిగి రాగా, మూడో వ్యక్తి శవమై కనిపించారు. ఆ ముగ్గురు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా వారి కారు ఒక నదిలోని ఇసుకలో చిక్కుకుపోయింది. దానిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా, ఫలితం లేదు. మూడు రోజుల తర్వాత దగ్గరలో ఎక్కడైనా నివాస ప్రాంతాలు ఉన్నాయేమో సాయం అడుగుదామని ఆ ముగ్గురూ తలో వైపు వెళ్లారు. ఫోన్ సిగ్నల్ ఉండదు. ఎటు చూసినా ఎవరూ కనిపించలేదు. హెలికాప్టర్‌లో వెళ్లి వారికోసం వెతుకుతున్న పోలీసులకు ఇద్దరు దొరకగా, మూడో వ్యక్తిని ఓ రైతు గుర్తించారు. వెంట తీసుకెళ్లిన నీళ్లు, వొడ్కా డ్రింకులు, బిస్కెట్లు, నూడుల్స్‌ తమను కొంత మేరకు బతికించాయని ప్రాణాలతో వచ్చినవారు చెప్పారు. ఆ ఇద్దరు కారుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా హెలికాప్టర్‌లో వెళ్లిన పోలీసులు గుర్తించి రక్షించారు. వేసవి కాలంలో ఈ ప్రాంతం అత్యంత వేడిగా ఉంటుంది. ఇక్కడ తప్పిపోవడం అత్యంత ప్రమాదకరం. అయితే, కొందరు నిపుణులు మాత్రం ఇక్కడ కూడా మరణాలను చాలావరకు నివారించవచ్చు అని అంటున్నారు. మరి, ఇలాంటి మారుమూల నిర్మానుష్య, ఎడారి ప్రాంతాలలో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ సేపు ప్రాణాలను నిలుపుకోవచ్చు? నీళ్లు లేకుండా మీరు ఎంతకాలం బతకగలరు? వేడిని తట్టుకోవడంతో పాటు, శరీరంలో నీరు త్వరగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడగలిగితే చాలావరకు ప్రాణాలతో బయటపడొచ్చని ఆస్ట్రేలియాలోని క్రిటికల్ కేర్ అండ్ ట్రామా రెస్పాన్స్ సెంటర్‌కు చెందిన డాక్టర్ మ్యాట్ బ్రేర్లీ చెప్పారు. సాధారణంగా పరిస్థితిలు అన్నీ అనుకూలంగా ఉంటే, ఒక వ్యక్తి నీళ్లు లేకుండా మూడు రోజుల దాకా ప్రాణాలతో ఉండగలడు. శారీరక ప్రయాస ఉండకూడదు, ఎండలో తిరగకుండా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక ఎండలు తీవ్రంగా ఉండే వేసవి కాలంలో ఈ ఎడారి ప్రాంతంలో నీళ్లు లేకుండా ఒక రోజు బతకడమే కష్టమని బ్రేర్లీ చెప్పారు. చెట్ల నీడలో ఉండటం, శారీరక శ్రమ తక్కువగా ఉండేలా జాగ్రత్తపడితేనే ఇక్కడ మూడు రోజులు ప్రాణాలు నిలుపుకునే వీలుంటుందని ఆయన వివరించారు. ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకలగరు? ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం అంత ముఖ్యమైనది కాదని బుష్‌క్రాఫ్ట్ సర్వైవల్ ఆస్ట్రేలియా అనే సంస్థకు చెందిన నిపుణులు గార్డన్ బెడ్‌మ్యాన్ చెబుతున్నారు. ఆహారం లేకుండా మనుషులు మూడు వారాల దాకా ప్రాణాలను నిలుపుకోవచ్చని ఆయన అంటున్నారు. అంటే, ఆహారం కంటే ముందు వేడిని తట్టుకోవడం, నీళ్లు లేకుండా ఉండటం చాలా ముఖ్యం. "గాలి లేకుండా మూడు నిమిషాల దాకా బతకొచ్చు, నీళ్లు లేకుండా మూడు రోజులు, ఆహారం లేకుండా మూడు వారాలు ప్రాణాలు నిలుపుకోవచ్చు" అని గార్డన్ వివరించారు. అయితే, ఆరోగ్యంగా ఉన్న వయోజనులతో పోల్చితే... శారీరకంగా బలహీనంగా ఉండే పిల్లలు, వృద్ధులకు శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, ఆకలి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 2015లో ఇదే ఆస్ట్రేలియాలోని నిర్మానుష్య ప్రాంతంలో తప్పిపోయిన 62 ఏళ్ల వ్యక్తి ఆరు రోజుల పాటు నీళ్లు లేకుండా, చీమలను తింటూ ప్రాణాన్ని నిలుపుకున్నారు. ఎండలో ఎంత సేపు ఉండొచ్చు? వేసవి కాలంలో ఇలాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతుంటాయి. దాంతో, ఎండలో బహిరంగ ప్రదేశాలలో చాలా సేపు తిరగడం అత్యంత ప్రమాదకరం. మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీలు ఉంటుంది. అది 40 డిగ్రీలు దాటితే చాలా ప్రమాదకరమని డాక్టర్ బ్రేర్లీ చెబుతున్నారు. శ్రమ పెరిగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిన తర్వాత, అవయవాలు ఒక్కొక్కటిగా విఫలమవ్వడం ప్రారంమవుతుంది. మూత్రపిండాలు, మెదడు కూడా సరిగా పనిచేయవు. అంటే, మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. శరీర ఉష్ణోగ్రత మరీ తగ్గినా ప్రమాదమే. అందుకే, చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు దుప్పట్లు, స్వెటర్లు ధరించాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఉత్తర ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో మనుషులు బతకడమే కష్టం. ఈ ప్రాంతమంతా దాదాపు ఎడారిలా ఎండిపోయి ఉంటుంది. ఎటు చూసినా చుక్క నీరు దొరకదు. అందుకే, ఈ ప్రాంతమంతా దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తుంటుంది. text: బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బఫ్టా) నుంచి వైన్‌స్టీన్‌ బహిష్కరణకు గురయ్యారు హాలీవుడ్ మూవీ మొఘల్‌గా పేరు తెచ్చుకున్న వైన్‌స్టీన్ నిర్మాతగా వ్యవహరించిన దాదాపు 300 సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. 81 ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి. అయితే అతను తమపై లైంగిక వేధింపులకు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడంటూ అనేక మంది నటీమణులు మీడియా ముందుకు వచ్చారు. బాధితుల్లో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీతో పాటు, రోస్ మెక్‌గోవాన్ కూడా ఉన్నారు. ఆస్కార్ బహుమతులు ఇచ్చే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో వైన్‌స్టీన్ సభ్యుడిగా ఉన్నారు. శనివారం జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో అతని సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు ఓటింగ్ నిర్వహించారు. అందులో మెజారిటీ సభ్యులు అతనికి వ్యతిరేకంగా ఓటు వేశారని అకాడమీ వెల్లడించింది. "కేవలం సహోద్యోగుల గౌరవానికి భంగం కలిగించాడని దూరం పెట్టడం మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యక్తులను సహించకూడదు. లైంగిక వేధింపులను ఉపేక్షించబోమని హెచ్చరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అకాడమీ తెలిపింది. వైన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలపై అమెరికా, బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 65 ఏళ్ల వైన్‌స్టీన్, తనకు వ్యతిరేకంగా పలువురు నటీమణులు చేసిన ఆరోపణలపై ప్రతిస్పందించాడు. తన ప్రవర్తన చాలా మందికి బాధ కలిగించి ఉంటుందని ఒప్పుకున్న వైన్‌స్టీన్‌, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. పరస్పర అంగీకారం లేకుండా ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదని స్పష్టం చేశాడు. ఇవి కూడా చూడండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌ను ఆస్కార్ బోర్డు బహిష్కరించింది. పలువురు నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆస్కార్ గవర్నర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. text: ఈ అమ్మాయిలు ఎందుకు గళం విప్పలేకపోయారు? లైంగిక దాడులను ఎందుకు ప్రతిఘటించలేకపోయారు? ఒకే చోట ఉంటున్న వీరు ఎందుకు స్థైర్యం కూడగట్టుకోలేకపోయారు? వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. అందరిదీ దీనగాథే. కుటుంబ హింస నుంచి తప్పించుకొన్నవారు, కుటుంబ సభ్యులే మనుషుల అక్రమ రవాణాదారులకు అమ్మేస్తే, వారి నుంచి తప్పించుకొన్నవారు, వ్యభిచార కూపాల నుంచి బయటపడ్డవారు, భర్త పెట్టే చిత్రహింసలను తట్టుకోలేక పారిపోయి వచ్చినవారు, భర్త 'వదిలేస్తే' తలదాచుకొనేందుకు వచ్చినవారు, అత్యాచారానికి గురైనందుకు సమాజం నుంచి ఎదరయ్యే ఛీత్కారాలను తట్టుకోలేక ఆశ్రయం కోసం వచ్చినవారు ఈ సంరక్షణ గృహాల్లో ఉన్నారు. అనారోగ్యం లేదా అంగవైకల్యం బారిన పడ్డప్పుడు కుటుంబ సభ్యులు పట్టించుకోకపోతే పోలీసుల సాయంతో ఇక్కడకు చేరుకున్నవారు, బాల కార్మికులుగా పనిచేస్తుండగా, అధికారులు రక్షించడంతో ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. సంరక్షణ గృహంలో ఈ అమ్మాయిలను అందరూ వదిలించుకొన్న వస్తువులను చూసినట్టు చూశారు. ఈ గృహాల్లో వీరికి ఏ మాత్రం విలువ ఉండదు. వ్యక్తిగత గుర్తింపుగాని, ప్రతిష్ఠగాని ఉండదు. ఈ అమ్మాయిలపై లైంగిక వేధింపుల విషయంలో సంరక్షణ గృహాల నిర్వాహకులకు, ఈ అమ్మాయిలతో సెక్స్‌ కోసం డబ్బు చెల్లించిన వ్యక్తులకు ఈ పరిస్థితులు ఆసరాగా మారి ఉండొచ్చు. ఈ పరిస్థితులను చూసుకొనే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉండొచ్చు. ముజఫర్‌పూర్‌లోని బాలికా సంరక్షణ గృహం 'అవి నరక ద్వారాలు' ఇలాంటి మహిళలను, బాలికలను చేరదీసి ఆశ్రయం కల్పించేందుకు 1969లో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ 'షార్ట్ స్టే హోమ్స్' ఏర్పాటు చేసింది. తర్వాత అనేక చట్టాలు, నిబంధనలు వచ్చాయి. అయినా.. అవేవీ వారిని కాపాడలేకపోయాయి. ఈ గృహాల్లో సాగే అనైతిక నేరాలకు వాళ్లు బలైపోతున్నారు. 2013లో ఇలాంటి సంరక్షణ గృహాలపై అధ్యయనం చేసిన 'ఏషియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్' సంస్థ.. అవి 'భారత నరక ద్వారాలు' (ఇండియాస్ హెల్ హోల్స్) అని వ్యాఖ్యానించింది. భారత్‌లో చిన్నారులపై అత్యాచారాల్లో ఎక్కువగా ఇలాంటి గృహాలలోనే జరుగుతున్నాయని, బాధితుల్లో బాలికలే అధికంగా ఉంటున్నారని ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇలాంటి దారుణాలు చిన్నస్థాయి పట్టణాల్లోనే కాదు.. దిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లోనూ జరుగుతున్నాయి. చిన్నారుల కోసం ఏర్పాటు చేసే ఏ సంరక్షణ గృహమైనా 'జువెనైల్ జస్టిస్ యాక్ట్' కింద నమోదై ఉండాలి. కానీ.. చాలావరకు అలా నమోదు కాలేదని ఆ నివేదిక తెలిపింది. పరిష్కారం ఏంటి? బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత, ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి మహిళలకు, బాలికలకు ఓ పెద్ద సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని, దాని నిర్వహణను ప్రభుత్వమే చూడాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ సూచించారు. కానీ 'ఏషియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్' నివేదిక ప్రకారం.. ప్రభుత్వేతర సంస్థలతో పాటు, ప్రభుత్వం నిర్వహిస్తున్న గృహాలలోనూ లైంగిక హింస జరుగుతోంది. ఈ గృహాల్లో ఉంటున్నవారి విలువ ఏమిటో ప్రభుత్వ అధికారులు గుర్తించకపోతే.. ప్రభుత్వ, ప్రభుత్వేతర గృహాల మధ్య తేడా ఏమీ ఉండదు. 'ఎవరూ పట్టించుకోలేదు' బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని గృహంలో ఉంటున్న బాలికలు 'రెడ్ లైట్ ఏరియా'ల నుంచి వచ్చినవాళ్లేమీ కాదు. ప్రకృతి విపత్తుల్లో తల్లిద్రండ్రులను కోల్పోవడం వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్లు కూడా కాదు. ఈ గృహాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. అయిదేళ్లుగా దీని నిర్వహణ బాధ్యతలను శిశు సంక్షేమ శాఖ ఆ సంస్థకే అప్పగిస్తోంది. నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత ఆ సంస్థ పనితీరును సమీక్షించి, అంతా సక్రమంగా ఉంటేనే మళ్లీ బాధ్యతలు అప్పగించాలి. కానీ.. అలా జరగలేదు. ఈ బాలికలపై లైంగిక హింసకు పాల్పడిన వ్యక్తులు.. వారిని అందరూ 'వదిలించుకొన్న' వస్తువులను చూసినట్లు చూశారు. తాము ఏం చేసినా ఎదిరించేవారే లేరు అన్నట్టుగా ప్రవర్తించారు. ఆ అకృత్యాలపై జాతీయ స్థాయి పత్రికల్లో పలుమార్లు వార్తలు వచ్చినా.. బాధితులకు మద్దతుగా ఎక్కడా పెద్దగా ర్యాలీలు జరగలేదు. కాలేజీ విద్యార్థులు వీధుల్లో ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టలేదు. మనమే స్పందించనప్పుడు.. బాధిత బాలికలు ఎదిరిస్తారని ఎలా ఆశించగలం? ఈ బాలికలను ఎవరూ 'పట్టించుకోలేదు'. వారి కుటుంబాలు, సమాజం, ఇతర స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఎవరూ 'పట్టించుకోలేదు'. తమపై జరుగుతున్న అకృత్యాల గురించి ఎవరికి చెప్పుకోవాలో ఈ బాలికలకు తెలియదు. ఫిర్యాదు చేస్తే.. మరింత హింసను ఎదుర్కోవాల్సి వస్తుందేమో? ఒకవేళ గృహం నుంచి బయటకు గెంటేస్తే.. ఎక్కడికి వెళ్లాలి? బయట ఎవరిని నమ్మాలి? అయినా.. ఓ బాలిక ధైర్యంగా బయటికొచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఉన్న ఓ సంరక్షణ గృహం నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులను ఆశ్రయించింది. బిహార్‌లోని సంరక్షణ గృహాల్లో పరిస్థితులను పరిశీలించేందుకు 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్)' బృందం వెళ్లినప్పుడు.. వేధింపులకు గురవుతున్న బాలికలే ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ విషయాలపై ఫిబ్రవరిలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు టిస్ తన నివేదిక అందజేస్తే, జూన్‌లో చర్యలు తీసుకున్నారు. ఈ గ‌ృహాల్లో ఎలాంటి అమ్మాయిలు ఉంటారు? అన్నది ప్రశ్న కాదు. వాటిని ఎలాంటి వ్యక్తులు నిర్వహిస్తున్నారు? అన్నదే ప్రశ్న. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సంరక్షణ గృహాల్లో ఉంటున్న బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని 46 మంది, ఉత్తర్‌ప్రదేశ్ దేవరియాలోని 24 మంది అమ్మాయిలు లైంగిక హింసకు గురయ్యారు. ఒకే చోట ఉన్న ఇంతమందిపై సుదీర్ఘకాలం పాటు లైంగిక దాడులు ఎలా జరిగాయి? text: హత్య, దాడి, కిడ్నాప్ అభియోగాలు ఎదుర్కుంటున్న అన్నా మే బ్లెసింగ్ ‘అన్నా మే బ్లెసింగ్’ అనే 92 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుమారుడు కేర్ హోంలో ఉంచాలని అనుకున్నారని.. ఆ సంగతి తెలుసుకున్న ఆమె ఆగ్రహంతో హత్యకు పాల్పడినందని అభియోగ పత్రాల్లో ఉంది. కొడుకును హత్య చేశాక ఒక దశలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బ్లెసింగ్ పోలీసులకు తెలిపారు. పోలీసు రికార్డులు, స్థానిక మీడియా ప్రకారం, జులై 2న మరికోపా కంట్రీలోని ఫౌంటెన్ హిల్స్‌లో ఈ హత్య జరిగింది. రెండు తుపాకులు వెంట తీసుకెళ్లి.. బ్లెసింగ్ కొడుకు పేరును పోలీసులు వెల్లడించలేదు. తల్లితో కలిసి ఉండడం కష్టంగా అనిపించడంతో అతడు ఆమెను అన్ని సౌకర్యాలూ ఉన్న ఒక కేర్ సెంటర్‌లో వదిలిపెట్టాలని అనుకున్నాడు. కుమారుడి గదిలోకి వెళ్లి ఆయనతో గొడవపడడానికి ముందు బ్లెసింగ్ తనతో పాటు రెండు తుపాకులను తీసుకెళ్లినట్లు పోలీసులు తమ రిపోర్టులో రాశారు. అక్కడ కుమారుడితో మాటామాటా పెరగడంతో 1970లో కొన్న ఒక రివాల్వర్ బయటకు తీసిన బ్లెసింగ్ దానితో అతడిపై కాల్పులు జరిపారు. మెడ, దవడలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత ఆమె తుపాకీని కొడుకు స్నేహితురాలికి గురిపెట్టారు. అయితే.. ఆమె బ్లెసింగ్‌తో పెనుగులాడి తప్పించుకోగలిగారు. అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది. ‘నా జీవితాన్ని తీసుకున్నావు.. నీ ప్రాణాలు తీసుకుంటా’’ బ్లెసింగ్ దగ్గర ఉన్న రెండో తుపాకీని చనిపోయిన ఆమె భర్త 1970లో ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. బ్లెసింగ్ తన కుమారుడు, అతడి స్నేహితురాలితో కలిసి ఆరిజోనాలో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆయన బ్లెసింగ్‌ను తన ఇంటి నుంచి పంపించేయాలని అనుకున్నప్పుడు "నువ్వు నా జీవితాన్ని తీసుకున్నావ్, నేను నీ ప్రాణాలు తీసుకుంటా" అని అన్నట్టు తెలుస్తోంది. హత్య తర్వాత బ్లెసింగ్ తన గదిలో ఒక వాలు కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తను చేసిన పనికి తనను చంపేయాలని ఆమె వారితో అన్నారు. కాగా హత్య, దాడి, కిడ్నాపింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్లెసింగ్‌కు 5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వృద్ధాశ్రమానికి పంపిస్తున్నాడనే కోపంతో అమెరికాలో ఒక 92 ఏళ్ల తల్లి తన 72 ఏళ్ల కుమారుడిని హత్య చేసిందని అక్కడి పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. text: ల్యాండ్ ఫోన్ కనెక్షన్ కావాలంటే రెండుమూడేళ్లు ఆగాలి. ఫోన్ కాల్ చేసుకోవాలంటే ఎస్టీడీ బూత్‌ల ముందు పడిగాపులు కాయాలి. ఇదీ 90వ దశకంలో భారత్ పరిస్థితి. ఒక్క టెలికాం రంగంలోనే కాదు ఈ 30 ఏళ్లలో అన్నింటా భారత ముఖచిత్రం మారిపోయింది. ఈ మార్పు ఎక్కడ మొదలైంది? ఎవరు మొదలు పెట్టారు? 1991లో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. విదేశీ అప్పులు భారంగా మారాయి. ఎగుమతుల కంటే దిగుమతులు విపరీతంగా పెరిగాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. నిధుల కోసం ప్రపంచబ్యాంకు ముందు 20 టన్నుల బంగారం కుదవ పెట్టే పరిస్థితి వచ్చింది. మరోవైపు దేశ రాజకీయ వ్యవస్థ కూడా అదే పరిస్థితిలో ఉంది. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. అది ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని స్థితి నెలకొంది. ఆ క్లిష్ట సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. పదవీలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను తన ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. 1991 జులై 24న ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌ సాక్షిగా 'మన ఆలోచనను అమలు పరిచే సమయం వస్తే భూమ్మీద ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు' అనే విక్టర్ హ్యూగో వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. పీవీ నరసింహారావు.. ఎల్పీజీ నమూనా తో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, లుక్ ఈస్ట్ పాలసీ పేరుతో రూపొందించిన కొత్త విదేశాంగ విధానం భారతను వృద్ధి దిశలోకి తీసుకెళ్లాయని ద బ్రింక్ అండ్ బ్యాక్: ఇండియాస్ 1991 స్టోరీ పుస్తకంలో మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు. 1991లో భారత్ జీడీపీ రూ.5,86,212 కోట్లుగా ఉంటే, 2015 నాటికి రూ. 1,35,76,086 కోట్లకు చేరింది. అంటే దాదాపు 2216 రెట్లు పెరిగింది. 2015- 16లో భారత్ జీడీపీ 2 ట్రిలియన్ డాలర్లను దాటింది. 1991లో మన దగ్గర విదేశీ మారక నిల్వలు 74 మిలియన్ డాలర్లు మాత్రమే ఉంటే, 2015 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరాయి. నాడు పీవీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఒకప్పుడు ఆర్థిక లోటుతో ఉన్న భారత్ నేడు ఆసియాలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందని హఫ్ లయన్‌ పుస్తక రచయత, అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ వినయ్ సీతాపతి పేర్కొన్నారు. అయితే, ఆర్థికలోటుతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని, మైనారిటీలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని నిలబెట్టిన ప్రధాని నరసింహారావుకు ఆ మేరకు ఘనత దక్కిందా? ‘మరుగున పడేశారు’ ఈ విషయాలకు సంబంధించి పీవీకి తగినంత పేరు లభించకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కారణం అని చెబుతారు వినయ్ సీతాపతి. హఫ్‌లయన్ పేరుతో ఈయన పీవీ నరసింహారావుపై ఒక పుస్తకం రాశారు. 'సంస్కరణ ముఖపత్రం వీపీ సింగ్ హయాంలోనే రూపొందినా, దాన్ని పట్టుదలగా తీసుకొచ్చి అమలు చేసింది మాత్రం పీవీ నరసింహారావే. పీవీ ఘనతను సొంత పార్టీనే మరుగున పడేసింది' అంటారు వినయ్ సీతాపతి. 'బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ రెండో భార్య పేరు తెలిసిన లా స్టూడెంట్‌ను పీవీ నరసింహారావు గురించి అడిగితే తెలియదని చెప్పాడు. అప్పుడే ఆయనపై పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నా' అని వినయ్ సీతాపతి చెప్పారు. మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు కూడా పీవీకి సంస్కరణల ఘనత దక్కకపోవడంపై తన పుసక్తం 1991- హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీలో ప్రస్తావించారు. 'పీవీ హయాంలో మన్మోహన్ సింగ్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, రాకేశ్ మెహన్ లాంటి ఆర్థికవేత్తలు ఉన్నారు. విధాన నిర్ణయాలను తీసుకున్నది మాత్రం పీవీనే. కానీ, ఎప్పుడూ, ఏది తన ఘనతగా ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. పీవీ పదవి నుంచి దిగిపోగానే కాంగ్రెస్ పార్టీ ఆయనను మరుగునపడేసింది' అని తన పుసక్తంలో పేర్కొన్నారు. మరోవైపు, ఆర్థిక సంస్కరణల ఘనత ఆయనకు దక్కకుండా చేయడం మాత్రమే కాదు ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వం సరిగ్గా చేయించలేదనే విమర్శలున్నాయి. పీవీని కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని ప్రధాని మోదీ ఓ సందర్భంలో విమర్శించారు. ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేసిన పీవీని నిజంగా కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందా? ఇందిర, రాజీవ్‌లకు విధేయుడిగా పనిచేసిన పీవీ.. గాంధీ కుటుంబానికి ఎందుకు దూరమయ్యారు? '1992లో రెండు కుట్రలు జరిగాయి' రాజీవ్ గాంధీ హత్య అనంతరం అనుకోని పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది. 'ఆ సందర్భంలో భారత దేశానికి కావాల్సిన సరైన వ్యక్తి సరైన స్థానంలో ఉన్నాడు' అని పీవీ గురించి వినయ్ సీతాపతి అభివర్ణించారు. 'గాంధీ కుటుంబం నుంచి రానివారిని కాంగ్రెస్ పార్టీలో ఎదగనివ్వరు. 1992లో రెండు కూల్చివేతలకు కుట్ర జరిగింది. ఒకటి బాబ్రీ మసీదు, రెండు.. పీవీ నరసింహారావు. సంఘ్ పరివార్ బాబ్రీని కూల్చివేయాలనుకుంటే, పీవీ ప్రత్యర్థులు ఆయనను పదవిలోంచి దించెయ్యడానికి కుట్ర పన్నారు' అని తన పుస్తకంలో వినయ్ సీతాపతి వివరించారు. పీవీ ఆర్థిక సంస్కరణల ఘనత, బాబ్రీ మసీదు కూల్చివేతతో తుడిచిపెట్టుకపోయిందని ఆయన తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. పీవీని గాంధీ కుటుంబం ఎందుకు దూరం పెట్టింది? అప్పట్లో సోనియాగాంధీకి, పీవీ నరసింహారావుతో సరైన సంబంధాలు ఉండేవి కావని, ఒకరి పట్ల మరొకరు అనుమానంతోనే ఉండేవారని కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వా తన స్వీయ చరిత్రలో ప్రస్తావించారు. పీవీ ప్రభుత్వంలో ఆమె సిబ్బంది వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 'కరేజ్ అండ్ కమిట్‌మెంట్' పేరుతో ఆమె రాసుకున్న ఆత్మకథలో సోనియా, పీవీలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు. '1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఇద్దరి మధ్యా ప్రచ్ఛనయుద్ధం మొదలైంది' అని ఆ పుసక్తంలో మార్గరేట్ అల్వా పేర్కొన్నారు. 'ఆమెకు సుతరామూ ఇష్టం లేదు' పీవీ మృతదేహానికి దిల్లీలో అంత్యక్రియలు జరపకపోవడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ‘సోనియా గాంధీకి ఇష్టం లేకపోవడం వల్లే పీవీ అంత్యక్రియలను ప్రభుత్వం దిల్లీలో జరపించలేదు అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్లు' వినయ్ సీతాపతి తన పుస్తకంలో వెల్లడించారు. వినయ్ సీతాపతి పుస్తకం తెలుగు అనువాదం నరసింహుడులో పీవీ కుమారుడి ఆవేదనను ఆయన మాటల్లోనే ఇచ్చారు. 'మాకప్పటికే అనుమానం ఉంది. నాన్నగారి అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం సోనియాగాంధీకి ఇష్టం లేదు. ఇక స్మృతి చిహ్నం సంగతి చెప్పేదేముంది?... నాన్నగారిని ఒక జాతీయనాయకుడిగా గుర్తించడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు... మా మీద ఆవిడ చాలా ఒత్తిడి తీసుకువచ్చింది. చివరికి మేం ఒప్పుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది'అని పీవీ కుమారుడు ప్రభాకర్ అన్నట్లు నరసింహుడు పుస్తకం పేర్కొంటుంది. 'సగం కాలిన శవం' పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరుకాలేదు. పీవీ అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేదని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పీవీ మృతదేహం పూర్తిగా కాలకుండానే ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై పీవీ సన్నిహితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పివిఆర్‌కె ప్రసాద్‌ స్పందించారని వినయ్ సీతాపతి తన పుస్తకంలో వివరించారు 'ఆయన దేహం సగంకాలిన స్థితిలో వదిలేశారన్నది నిజంకాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది. ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది. ఏమైనా ఆయన మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాదుకు పంపించారనీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. పీవీ శరీరం సగమే కాలిందన్న భావన ఆయనకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే' అని ప్రసాద్‌ పేర్కొన్నారని హఫ్‌లయన్ పుసక్తం చెబుతోంది. ఆంగ్ల దినపత్రిక గార్డియన్ ఒక వ్యాసంలో పీవీ నరసింహారావు గురించే ప్రస్తావిస్తూ ‘భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చేసిన ఏకైక నేరం. ఆయన గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటమే’ అని పేర్కొంది. అవినీతి ఆరోపణలు ప్రధాని పదవి నుంచి దిగిపోయాక అవినీతి ఆరోపణలు పీవీని చుట్టుముట్టాయి. 1993లో అవిశ్వాస పరీక్షలో నెగ్గేందుకు ఎంపీలకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో ఆయనపై నమోదైన కేసును విచారించిన ప్రత్యేకన్యాయస్థానం పీవీకి మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. అయితే, తర్వాత కాలంలో దిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. అలాగే, సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, లఖుబాయి పాఠక్ కేసులలో ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) స్మార్ట్‌ఫోన్ దర్శనంతోనే ఇప్పుడు మనకు తెల్లారుతోంది. అమెరికాలో యాపిల్ ఫోన్ కొత్త వెర్షన్ విడుదలవగానే మన ఇంటి ముందుకు వచ్చేలా చేసుకుంటున్నాం. ఇది నేటి ఇండియా స్థితి. text: ''బలమైన శాస్త్రీయ ప్రక్రియలు, ప్రమాణాలతో రాజీ పడే పరిస్థితులను కల్పించే తొందరపాటు పరిష్కారం ఏదీ'' మంచిది కాదని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హెచ్చరించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నాటికి కోవిడ్ వ్యాక్సిన్‌ను విడుదల చేయాలన్నది తమ 'అభిమతమ'ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చెప్పింది. అయితే.. తాము చెప్పిన ఆ తేదీ 'ఒక డెడ్‌లైన్ కాద'ని ఐసీఎంఆర్ ఆ తర్వాత పేర్కొంది. 'కోవాక్సిన్' పేరుతో రూపొందించిన వ్యాక్సిన్‌ను మనుషుల మీద ప్రయోగాత్మకంగా పరీక్షించటానికి ఎంపిక చేసిన 12 సంస్థలకు ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావటంతో ఈ అంశంపై వివాదం మొదలైంది. ఆగస్టు 15వ తేదీన ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేయటానికి వీలుగా.. మనుషుల మీద ప్రయోగాత్మక పరీక్షలను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులనూ సత్వరం పొందాలని ఆయా సంస్థలకు ఆయన రాసిన లేఖలో నిర్దేశించారు. ఈ నిర్దేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించటం జరుగుతుందని ఆ లేఖ హెచ్చరించింది. మరోవైపు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ‘‘కొవ్యాక్సిన్‌’ సహా దేశంలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లలో ఏదన్నా 2021 కంటే ముందు ప్రజా వినియోగానికి అందుబాటులోకి వచ్చే అవకాశం లేద’’ని చెప్తున్న వాక్యాన్ని తొలగించటంతో గందరగోళం తలెత్తింది. దీంతో తీవ్ర నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు 15 డెడ్‌లైన్ అనేది డ్రామా తప్ప మరేమీ కాదని.. ఇది భారతదేశ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తుందని చాలా మంది విమర్శించారు. నెల రోజుల్లో ప్రయోగాత్మక పరీక్షలు పూర్తిచేయాలంటూ ఐసీఎంఆర్ అతి తక్కువ గడువు ఇవ్వటం.. అసలు ఎప్పుడూ వినలేదని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పార్థ పి మజుందర్ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఇలాంటి ఆదేశాలు బయోమెడికల్ పరిశోధనలకు, ఔషధ పరిశ్రమలకు చెడ్డ పేరు తెస్తాయన్నారు. కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ వివాదం ముదరడంతో.. ఆగష్టు 15 అనేది డెడ్‌లైన్ కాదని.. అనవసర అధికారిక జాప్యాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రమేనని.. సురక్షితమైన ప్రయోగాత్మక పరీక్షల విషయంలో రాజీపడటానికి ప్రయత్నించలేదని వివరణ ఇచ్చింది. ఐసీఎంఆర్ మొదట్లో విడుదల చేసిన సమాచారాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని అజ్ఞాత ఐసీఎంఆర్ అధికారి ఒకరు చెప్పినట్లు మింట్ పత్రిక ఒక కథనంలో ఉటంకించింది. ఒక వ్యాక్సిన్ తయారు చెయ్యాలంటే దశాబ్దాలు కాకపోయినా కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు నెలల కాలంలోనే వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నారు. సార్స్-కోవ్-2 అని అధికారికంగా పరిగణించే కోవిడ్-19 వ్యాధికి 2021 మధ్య నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. అంటే.. ఈ వైరస్ వ్యాప్తి మొదలైన 12 నుంచి 18 నెలలకు అది అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అది కూడా సైన్స్ పరంగా ఓ భారీ అద్భుతమే అవుతుంది. తీరా వచ్చిన తర్వాత అది సమర్థంగా పని చేస్తుందనే గ్యారంటీ లేదు. మీ జిల్లా పేరు వెతకండి భారత్‌లో కరోనావైరస్ కేసులు ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రజలు వినియోగించటం కోసం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను నిర్ణీత గడువులోగా తయారు చేయటం సాధ్యం కాదని భారత శాస్త్రవేత్తల బృందం ఒకటి హెచ్చరించింది. text: జమాల్ ఖషోగ్జీ హత్యకు పాల్పడినందుకు, ఇందులో నేరుగా భాగస్వాములైనందుకు రియాద్ క్రిమినల్ కోర్టు ఐదుగురికి మరణ దండన, నేరాన్ని కప్పిపుచ్చినందుకు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముగ్గురికి మొత్తం 24 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. మిగతా ముగ్గురు నిర్దోషులుగా తేలారని వివరించింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే ఖషోగ్జీని 2018 అక్టోబర్‌ 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో సౌదీ అరేబియా కాన్సులేట్‌లో సౌదీ ఏజెంట్ల బృందం హత్య చేసింది. టర్కీకి చెందిన తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి అవసరమైన పత్రాల కోసం ఆ రోజు కాన్సులేట్‌ లోపలికి వెళ్లిన ఖషోగ్జీ, తర్వాత కనిపించలేదు. ఖషోగ్జీ హత్యకు గురయ్యారని ఆ తర్వాత వెల్లడైంది. హత్య కేసులో 11 మంది నిందితులపై రహస్యంగా విచారణ సాగింది. 59 ఏళ్ల ఖషోగ్జీ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కాలమిస్టు. ఆయన అమెరికాలో ఉండేవారు. తన ప్రియురాలు హటీస్ చెంగిజ్‌ను పెళ్లి చేసుకోవడానికి అవసరమైన పత్రాల కోసం ఖషోగ్జీ ఆ రోజు కాన్సులేట్‌‌కు వెళ్లారు. ఖషోగ్జిని ఒప్పించి లేదా బలప్రయోగంతో సౌదీకి తీసుకొచ్చేందుకు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగం ఉపసారథి ఒక 'సంప్రదింపుల బృందాన్ని' ఇస్తాంబుల్‌కు పంపించారని, హత్యకు ఆ బృందం సారథే ఆదేశాలిచ్చారని సౌదీ డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షాలన్ షాలన్ 2018 నవంబరులో మీడియాతో చెప్పారు. ఖషోగ్జీకి, సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత ఆయన్ను బలప్రయోగంతో నియంత్రించారని, అప్పుడు ఆయనకో డ్రగ్‌ను అధిక మోతాదులో ఇచ్చారని, అది మరణానికి దారితీసిందని దర్యాప్తు అధికారులు తేల్చారని షాలన్ పేర్కొన్నారు. ఖషోగ్జీ మృతదేహాన్ని ముక్కలు చేసి కాన్సులేట్ బయట వేచి ఉన్న మరో వ్యక్తికి అందజేశారని చెప్పారు. ఖషోగ్జీని సౌదీకి తీసుకొచ్చే మిషన్ మొదలైనప్పుడు ఆయన్ను చంపాలనే ముందస్తు ఆలోచన లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో తేలిందని షాలన్ సోమవారం రియాద్‌లో మీడియాతో చెప్పారు. ఖషోగ్జీ హత్యలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాత్రపై దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అధికారి యాగ్నెస్ కాలమర్డ్ డిమాండ్ చేశారు. "ఖషోగ్జీది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య. దీనికి సౌదీ అరేబియానే బాధ్యత వహించాలి. హత్యపై దర్యాప్తు జరిపించాలి" అని ఆమె నిరుడు అక్టోబరులో తన నివేదికలో పేర్కొన్నారు. కోర్టు తీర్పు తర్వాత కాలమర్డ్ స్పందిస్తూ- దర్యాప్తును, ప్రాసిక్యూషన్‌ను, న్యాయాన్ని అపహాస్యం చేయడం ఇంకా కొనసాగుతోందని ఆమె ట్విటర్లో విచారం వ్యక్తంచేశారు. ఖషోగ్జీ హత్యలో తనకు ఎలాంటి ప్రమేయమూ లేదని యువరాజు సల్మాన్ చెప్పారు. హత్యలో ప్రమేయం లేదన్న యువరాజు సల్మాన్ ఈ హత్యలో తనకు ఎలాంటి ప్రమేయమూ లేదని యువరాజు చెప్పారు. అయితే ఇది సౌదీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వ్యక్తులు చేసినందున సౌదీ నాయకుడిగా దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తానని ఆయన ఈ ఏడాది అక్టోబరులో వ్యాఖ్యానించారు. నిందితుల విచారణ రహస్యంగా సాగింది. విచారణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని, అర్థవంతమైన జవాబుదారీతనానికి సౌదీ అధికార వ్యవస్థ అడ్డంకులు కల్పించిందని 'హ్యూమన్ రైట్స్ వాచ్' ఆక్షేపించింది. ఖషోగ్జీ హత్య కేసు నేపథ్యంలో యువరాజు సీనియర్ సహాయక అధికారి సౌద్ అల్ ఖహ్తానీని ప్రభుత్వం తప్పించింది. తగిన ఆధారాల్లేకపోవడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పింది. ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఉపసారథి అహ్మద్ అల్-అసిరిపైనా విచారణ సాగింది. అయితే తగిన ఆధారాల్లేవనే కారణంతో ఆయన్ను నిర్దోషిగా తేల్చారు. మొత్తం 31 మందిపై దర్యాప్తు సాగించామని, వీరిలో 21 మందిని అరెస్టు చేశామని, 11 మందిని నిందితులుగా కోర్టు ముందకు తీసుకెళ్లామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. 2018 అక్టోబరు 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లోకి వెళ్తున్న ఖషోగ్జీ ఖషోగ్జీ హత్యకు ముందు ఆయన చివరి క్షణాలుగా చెబుతున్న రికార్డింగ్స్‌ వివరాలను టర్కీలోని ప్రభుత్వ అనుకూల వార్తాపత్రిక 'సబా' ఈ ఏడాది సెప్టెంబరులో ప్రచురించింది. ఇవి కాన్సులేట్ లోపల జరిగిన రికార్డింగ్స్‌ అని, టర్కీ నిఘా వర్గాల నుంచి వీటిని పొందామని తెలిపింది. ఖషోగ్జీని 'హిట్ స్క్వాడ్' అనే పేరున్న ఒక గ్రూప్ హత్య చేసిందని పత్రిక చెప్పింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన బృందంలోని ఫోరెన్సిక్ నిపుణుడు, ఖషోగ్జీ లోపలికి రాక ముందు ఆయన్ను 'బలి ఇవ్వాల్సిన జంతువు'గా పేర్కొన్నట్లు తెలిపింది. కాన్సులేట్‌లో ఖషోగ్జీకి డ్రగ్ ఇచ్చారని, హంతకులతో ఖషోగ్జీ చివరగా తనకు ఆస్తమా ఉందని, తన నోటిని మూసి ఉంచవద్దని చెప్పారని, తర్వాత ఆయన స్పృహ కోల్పోయారని పత్రిక వివరించింది. తలకు ఒక సంచి వేయడంతో ఖషోగ్జీకి ఊపిరాడలేదని, ఆయన పెనుగులాడినట్లు అనిపించే శబ్దాలు కూడా రికార్డ్ అయ్యాయని పేర్కొంది. సౌదీలో స్వతంత్ర భావాలుంటే అరెస్టు తప్పదన్న ఖషోగ్జీ అఫ్గానిస్తాన్‌లో సోవియట్ జోక్యం, ఒసామా బిన్ లాడెన్ బలపడిన తీరు, ఇతర అంశాలపై ఖషోగ్జీ అనేక కథనాలు రాశారు. ఒకప్పుడు సౌదీ రాజకుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. సౌదీ సీనియర్ అధికారులకు సలహాదారుగానూ వ్యవహరించారు. సౌదీ వ్యవహారాలపై గట్టి పట్టున్న ఖషోగ్జీ 2017లో అమెరికాకు వెళ్లిపోయారు. అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారిపై సౌదీ యువరాజు సల్మాన్ ఆదేశాల మేరకు జరుగుతున్న అణచివేత నుంచి బయటపడేందుకు దేశం నుంచి తనను తానే వెలి వేసుకుంటున్నానని ఆయన అప్పట్లో చెప్పారు. హత్యకు గురికావడానికి కొన్ని రోజుల ముందు బీబీసీతో ఖషోగ్జీ మాట్లాడుతూ- స్వతంత్ర భావాలున్న అందరినీ సౌదీలో అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. సౌదీ ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఉపసారథి అహ్మద్ అల్-అసిరికి ఈ హత్యలో ప్రమేయం లేదని తేల్చారు. టర్కీ మీడియా కథనాల ప్రకారం 2018 అక్టోబర్ 2 నాటి పరిణామాలు: తెల్లవారుజామున 03.28: అనుమానిత సౌదీ ఏజెంట్లతో మొదటి ప్రైవేట్ జెట్ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగింది. 05.05: సౌదీ కాన్సులేట్‌కు దగ్గర్లోని రెండు హోటళ్లలో వీరంతా దిగారు. 12.13: అనేక దౌత్య వాహనాలు కాన్సులేట్ వద్దకు వచ్చాయి. వాటిలో సౌదీ ఏజెంట్లు ఉన్నట్లు అనుమానాలు. 13.14: కాన్సులేట్‌లో ప్రవేశించిన ఖషోగ్జీ 15.08: కాన్సులేట్ నుంచి బయటికి వచ్చిన వాహనాలు. అవి దగ్గరలో ఉన్న సౌదీ కాన్సుల్ ఇంటికి వెళ్లాయి. 17.18: ఇస్తాంబుల్ చేరుకున్న రెండో ప్రైవేట్ జెట్. 17.33: ఖషోగ్జీ పెళ్లి చేసుకోవాలని భావించిన హటీస్ చెంగిజ్ కాన్సులేట్ బయట వేచి ఉండడం సీసీటీవీలో కనిపించింది. 18.20: రెండు ప్రైవేట్ జెట్‌లలో ఒకటి ఇస్తాంబుల్ నుంచి బయలుదేరి పోయింది. మరో జెట్ రాత్రి 9 గంటల సమయంలో వెళ్లిపోయింది. కోర్టు తీర్పు తర్వాత ఐరాస ప్రత్యేక అధికారి కాలమర్డ్ స్పందిస్తూ- దర్యాప్తును, ప్రాసిక్యూషన్‌ను, న్యాయాన్ని అపహాస్యం చేయడం ఇంకా కొనసాగుతోందని విచారం వ్యక్తంచేశారు. నిందితుల్లో ఫాహద్ షాబిబ్ అల్‌బలావి, తుర్కి ముసీరఫ్ అల్‌షెహ్రి, వాలీద్ అబ్దుల్లా అల్‌షెహ్రి, మహెర్ అబ్దులజీజ్ ముత్రెబ్, డాక్టర్ సలాహ్ మొహమ్మద్ తుబాగీ మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని ఐరాస ప్రత్యేక అధికారి కాలమర్డ్ జూన్‌లో చెప్పారు. సలాహ్ మొహమ్మద్ తుబాగీ సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖలో ఫోరెన్సిక్ నిపుణుడు. మహెర్ అబ్దులజీజ్ ముత్రెబ్, యువరాజు సల్మాన్ ఒకప్పటి సీనియర్ సహాయక అధికారి ఖహ్తానీ తరపున పనిచేసిన నిఘా అధికారి అని అమెరికా చెబుతోంది. నిందితులు ప్రభుత్వ ఉద్యోగులని, ఉన్నతాధికారుల ఆదేశాలకు వారు అభ్యంతరం చెప్పలేరని వారి తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినట్లు కాలమర్డ్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో ఐదుగురికి సౌదీ కోర్టు సోమవారం మరణ శిక్ష విధించింది. మరో ముగ్గురికి కారాగార శిక్ష వేసింది. text: ఇది అడ్డిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 44 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని విమానయాన సంస్థ వెల్లడించింది. ఇథియోపియా రాజధానిలో టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 విమాన ప్రమాదంలో 149 ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది కూడా చనిపోయారని ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి చెప్పారు. వీరంతా 33 దేశాలకు చెందిన వారని తెలిపారు. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. text: తెలంగాణ రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో భేటీ అయిన కేసీఆర్ ఆ తర్వాత ఢిల్లీ వచ్చారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని కూటమి (ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. వీటిపైనే చర్చ - సీఎంఓ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారని వివరించింది. సెక్రటేరియేట్ నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్‌ను బదిలీ చేయటం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, హైదరాబాద్‌కు ఐఐఎస్ఈఆర్ మంజూరు, ఆదిలాబాద్‌లో ఎన్‌హెచ్ఏఐతో సంయుక్తంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ, జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక జోన్‌కు నిధుల మంజూరు, వరంగల్‌లో రూ.వెయ్యి కోట్లతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధి మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయని సీఎంఓ వివరించింది. మోదీని కలిసిన తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. చెప్పడం వేరే, చేసే పని వేరే - చంద్రబాబు మోదీతో కేసీఆర్ సమావేశం కావటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చేస్తున్న పర్యటనల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ''యాక్షన్సే మాట్లాడుతున్నాయి కదా. ఇతని (కేసీఆర్) చర్యలు, బీజేపీ చర్యలు.. రెండూ కలసి మాట్లాడుతున్నాయి కదా. అందుకే కదా ఎవరికీ నమ్మకం లేకుండా పోతోంది'' అని చంద్రబాబు స్పందించారు. ''నిన్నటి వరకూ అందరి వద్దా తిరిగి, మళ్లాపోయి పీఎంను కలిస్తే ఏంటి? ఇప్పుడు (మాట్లాడేది) రాష్ట్ర సమస్యలా? లేక వాళ్ల బ్రీఫింగా? వాళ్లే వీటన్నింటిపైనా స్పందించాలి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం వేరే, చేసే పని వేరే'' అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ వెళ్లి కేసీఆర్‌ను కలుస్తా - అఖిలేష్ యాదవ్ దేశంలో ఏదో ఒక రూపంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒకే వేదికపైకి రావాలని, ఈ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. కేసీఆర్‌తో తాను మాట్లాడానని, డిసెంబర్ 25 లేదా 26 తేదీల్లో దిల్లీలో తాము కలవాలనుకున్నామని, కానీ కలవలేకపోతున్నామని, కాబట్టి కేసీఆర్‌ను కలిసేందుకు తాను మళ్లీ సమయం కోరతానని అఖిలేష్ చెప్పారు. కేసీఆర్‌ను కలిసేందుకు తాను స్వయంగా హైదరాబాద్ వెళతానని, ఇందుకోసం జనవరి 6వ తేదీ తర్వాత సమయం కోరతానని అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. text: ట్రంప్ డ్యూమాలో శనివారం జరిగిన ఈ దాడిలో 70 మంది చనిపోయారని డమాస్కస్ రూరల్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్ధరించినట్లు అమెరికా కేంద్రంగా పనిచేసే 'ద యూనియన్ ఆఫ్ మెడికల్ రిలీఫ్ ఆర్గనైజేషన్స్' బీబీసీకి తెలిపింది. ఈ సంస్థ సిరియాలోని ఆస్పత్రులతో కలిసి పనిచేస్తోంది. తూర్పూ ఘూటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఏకైక కంచుకోట డ్యూమా. ఇది దేశ రాజధాని డమాస్కస్ సమీపంలో ఉంది. డ్యూమాలో రసాయన దాడి జరగలేదని సిరియా, రష్యా చెప్పాయి. రసాయన దాడి వార్తల నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ- వరుసగా ట్వీట్లు పెట్టారు. సిరియా అధ్యక్షుడు అసద్‌ను జంతువుగా సంభోదించారు. ఓ ట్వీట్‌లో ఆయన్ను 'Animal Assad' అని పేర్కొన్నారు. తిరుగుబాటుదారుల గ్రూపు 'జైష్ అల్-ఇస్లాం'తో రష్యా గత వారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అసద్ ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. జైష్ అల్-ఇస్లాం చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెడితే డ్యూమా నుంచి వెళ్లిపోయేందుకు జైష్ అల్-ఇస్లాం సభ్యులకు 48 గంటల గడువు ఇచ్చేలా ఆదివారం ఒక ఒప్పందం కుదిరిందని సిరియా ప్రభుత్వ మీడియా చెప్పింది. ఈ అంశంపై జైష్ అల్-ఇస్లాం నుంచి ఎలాంటి స్పందనా వెలువడలేదు. డ్యూమా ఘటనకు సంబంధించి స్వచ్ఛంద సంస్థ 'వైట్‌ హెల్మెట్స్' ఒక వీడియో విడుదల చేసింది. ఒక ఇంట్లో చాలా మంది బాలలు, మగవాళ్లు, ఆడవాళ్ల మృతదేహాలు పడి ఉన్నట్లు అందులో ఉంది. వారిలో చాలా మంది నోళ్లలో నురగ కనిపిస్తోంది. డ్యూమాలో అసలేం ఏం జరిగింది, మృతుల సంఖ్య ఎంత అనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. సిరియా, రష్యా అధ్యక్షులు బషర్ అల్-అసద్, వ్లాదిమిర్ పుతిన్ అమెరికా సైనిక చర్యకు దిగుతుందా? తిరుగుబాటుదారుల అధీనంలోని ఖాన్‌షేఖౌన్ పట్టణంలో అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందంటూ, దీనికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరుడు ఏప్రిల్‌లో ఒక వైమానిక స్థావరంపై క్షిపణి దాడి జరిపించారు. ఖాన్‌షేఖౌన్ పట్టణంలో సారిన్ వాయువును ప్రయోగించడంతో 80 మందికి పైగా చనిపోయారు. ఈ రసాయనిక దాడికి సిరియా ప్రభుత్వమే కారణమని ఐక్యరాజ్యసమితి, రసాయన ఆయుధాల నిర్మూలన సంస్థ సంయుక్తంగా జరిపిన విచారణలో వెల్లడైంది. ఇప్పుడు డ్యూమా దాడి నేపథ్యంలో సిరియాలో అమెరికా మళ్లీ దాడి జరిపే ఆస్కారముందా అని వైట్‌హౌస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు టిమ్ బాసర్ట్‌ను ఏబీసీ టీవీ అడగ్గా- ఏ పరిణామాన్నీ తోసిపుచ్చలేమని బదులిచ్చారు. సిరియాలోని హోమ్స్ నగరంలో చోటుచేసుకొన్న విధ్వంసం (2012 నవంబరు) విచారణ జరపాలన్న బ్రిటన్ డ్యూమా ఘటనపై పోప్ ఫ్రాన్సిస్ స్పందిస్తూ- రసాయన ఆయుధాల వినియోగం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. డ్యూమా దాడిపై తక్షణం విచారణ జరపాలని బ్రిటన్ డిమాండ్ చేసింది. పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తే సిరియాపై దాడి చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ చెప్పారు. తూర్పు ఘూటాలో అసద్ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను ఓడిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయని, ప్రభుత్వ బలగాలు ఇక ముందుకు సాగకుండా అడ్డుకొనేందుకే 'రసాయన దాడి' ఆరోపణలను చేస్తున్నారని సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సిరియాలోని డ్యూమా నగరంలో జరిగిన అనుమానిత రసాయన దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి 'భారీ మూల్యం' చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ సిరియా అధ్యక్షుడు అల్-అసద్, అసద్ ప్రభుత్వ మద్దతుదేశాలైన రష్యా, ఇరాన్‌లను హెచ్చరించారు. text: మానవ పూర్వీకులగా భావించే కోతి పుర్రెను ఇథియోపియాలో కనుగొన్నారు. ఈ పుర్రెను విశ్లేషించడం ద్వారా కోతి నుంచి మనిషి ఎలా వచ్చాడనే విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే, మానవ జాతి పరిణామ క్రమానికి ముందు లూసీ అనే కోతి ఉందనే అభిప్రాయాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఆవిష్కరణను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పుర్రెను మిరో డోరా అనే ప్రదేశంలో ప్రొఫెసర్ యోహన్నెస్ హైలే-సెలాసీ కనుగొన్నారు. ఈ ప్రాంతం ఇథియోపియాలోని మిల్లె జిల్లాలో ఉంది. ప్రొఫెసర్ యోహన్నెస్ హైలే-సెలాసీ అమెరికాలోని ఒహియోలో క్లీవ్‌ల్యాండ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ శాస్త్రవేత్త. ఈ శిలాజం దొరకగానే తాను ఇది కలా నిజమా అనుకున్నాని ఆయన బీబీసీతో చెప్పారు. ఆస్ట్రాలోపిథెకస్ అనామెన్సిస్(4.2 మిలియన్ ఏళ్ల కిందటి) అని పిలిచే కోతి లాంటి మానవ పూర్వీకుడికి ఈ శిలాజం చక్కటి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. లూసీనే మానవుల తొలి పూర్వీకుడు అనేదానిపై ఇంకా స్పష్టత లేదు ఎ. అనామెన్సిస్ మానవ పరిణామ క్రమానికి సంబంధించిన ముందు దశగా భావిస్తుంటారు. దీని తర్వాత దశను ఆస్ట్రాలోపిథెకస్ అఫారెన్సిస్‌గా పేర్కొంటారు. మానవ పరిణామక్రమ పూర్వ దశగా దీన్ని పరిగణిస్తారు. ఈ దశను హోమోగా పిలుస్తారు. 1974లో తొలిసారిగా అఫారెన్సిస్ అస్థిపంజరాన్ని గుర్తించడం సంచలనాన్ని కలిగించింది. తవ్వకాలు జరిపిన స్థలంలో బీటిల్స్‌లోని లక్కీ ఇన్ ది స్కై విత్ డైమండ్స్ పాటను ప్రదర్శించిన తర్వాత ఈ శిలాజానికి పరిశోధకులు లూసీ అని పేరు పెట్టారు. ''నడిచే తొలి కోతి'' అని ప్రశంసలందుకున్న లూసీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రొఫెసర్ ఫ్రెడ్ స్పూర్ దీనిపై నేచర్‌లో రాస్తూ ''లూసీ మానవ పరిణామక్రమానికి ప్రసిద్ధ చిహ్నంగా మారింది'' అని పేర్కొన్నారు. ఏళ్ల కిందట అనామెన్సిస్ ఒక చిన్న సమూహంగా ఉండి ప్రధాన సమూహం నుంచి వేరుపడింది. కాలక్రమేణా స్థానిక పరిస్థితుల కారణంగా అఫారెన్సిస్‌గా పరిణామం చెందింది. అయితే, మానవ పరిణామ క్రమానికి చెందిన కోతి దశను కనుక్కోవడం చాలా కీలకం. అనామెన్సిస్, అఫారెన్సిస్‌లే కాకుండా మానవ పరిణామ క్రమానికి దగ్గరగా ఉన్న అనేక కోతి జాతులు ఉండి ఉండొచ్చు. లూసీ కూడా హోమో సమూహానికి చెందిన తాజా ఆవిష్కరణగా నిరూపించనప్పటికీ ఇటీవల వెలుగు చూసిన కొన్ని జాతులను ఇది వివాదంలోకి తీసుకొస్తుంది. మానవాళి ప్రత్యక్ష పూర్వీకుడు ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అనే పందేలు ఇప్పుడు ఆపేశారు అని ప్రొఫెసర్ హైల్-సెలాసీ అంగీకరించారు. ''చాలా ఏళ్లుగా మానవ పూర్వికులుగా అఫారెన్సిస్ జాతిని పరిగణించారు. కానీ, మేం ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము'' అని ఆయన పేర్కొన్నారు. లూసీ అనే కోతి అవశేషాలను పరిశీలించి, ఇదే మానవుల పూర్వీకుడిగా కొందరు భావిస్తుంటారు. మనవుడి, కోతికి మధ్య సంబంధానికి గల 'లింక్' గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మానవ శాస్త్రవేత్తలు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా జర్నలిస్టులు అనామెన్సిస్ శిలాజం గురించి వివరించాల్సి వచ్చినప్పుడు అది కోతిలోని భాగంగానూ, మానవుడిలోని భాగంగానూ వర్ణిస్తుంటారు. మానవ పరిణామ క్రమంలో చాలా లింకులు ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ మనకు అంతుచిక్కడం లేదు. ఆధునిక మానవుడి పరిణామ క్రమం సరిగ్గా లేదని నిరూపించే అంశాల్లో అనామెన్సిస్ ఆవిష్కరణ తాజాది. నిజం చాలా క్లిష్టమైంది, ఆసక్తికరమైంది. వాతావరణం, ఆవాసాలు, ఆహార కొరతను తట్టుకొని మానవ పరిణామ క్రమం ఎలా ఎదిగిందనే కథను అనామెన్సిస్ ఆవిష్కరణ చెబుతుంది. మానవ పరిణామ క్రమానికి సంబంధించిన పరిశోధనలో పనిచేస్తున్న కొద్దిమంది ఆఫ్రికన్ శాస్త్రవేత్తలలో ప్రొఫెసర్ హైల్-సెలాసీ ఒకరు. పాశ్చాత్య ఆధారిత పరిశోధన సంస్థల నుంచి అవసరమైన నిధులు, ఆర్థిక మద్దతు పొందడం అర్హత కలిగిన ఆఫ్రికన్ పరిశోధకులకు కూడా కష్టమైన పని అని ఆయన చెప్పారు. "మానవ పరిణామ క్రమానికి సంబంధించిన చాలా శిలాజ ఆధారాలు ఆఫ్రికా నుంచి వచ్చాయి. ఆఫ్రికన్లు తమ ఖండంలో లభించే వనరులను ఉపయోగించుకోగలరని, ఆంత్రోపాలజీని మరింత ముందుకు తీసుకెళ్లగలరని నేను భావిస్తున్నాను'' అని ఆయన నాకు చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఇథియోపియాలో మానవ పూర్వీకులుగా భావించే కోతికి సంబంధించిన దాదాపు 38 లక్షల సంవత్సరాల కిందటి పురాతన పుర్రెను పరిశోధకులు కనుగొన్నారు. text: డాక్టర్ అన్నా బ్లాక్నీ, డాక్టర్ విల్ బడ్ అవును, టీకాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు ఆ టీకాలు ఎంత సురక్షితమో చెప్పడానికి, వాటి గురించి సమాచారం ప్రజలకు అందించడానికి టిక్‌టాక్‌ను సాధనంగా మార్చుకుంటున్నారు. ‘‘వినోదం కోసం ఇక్కడకు రండి.. కానీ, సైన్స్‌కి కట్టుబడండి అనేది టిక్ టాక్ విషయంలో నా వైఖరి’’ అన్నారు రేడియో 1 న్యూస్‌బీట్‌తో మాట్లాడిన డాక్టర్ అన్నా బ్లాక్నీ. అన్నా అమెరికాకు చెందినవారు. లండన్ ఇంపీరియల్ కాలేజీలో కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి చేస్తున్న బృందంలో ఆమె కూడా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాక్సీన్ ప్రాముఖ్యాన్ని చెప్పే యూఎన్ ప్రాజెక్ట్‌ టీమ్ హలోలో పని చేస్తున్న అన్నా బ్లాక్నీ వ్యాక్సీన్ గురించి వివరాలు అందిస్తూ ఆమె టిక్‌టాక్‌లో పెట్టిన వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు. 30 ఏళ్ల అన్నాకు ఇప్పుడు టిక్ టాక్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలను 28 లక్షల మంది లైక్‌ చేశారు. ‘సైన్స్‌ను మరింతగా నమ్మండి’టిక్‌టాక్‌లో మరో సైన్స్ స్టార్ డాక్టర్ విల్ బడ్. లండన్‌లో వివిధ వ్యాక్సీన్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న రీసెర్చ్ డాక్టర్ ఆయన. టీకాల సమాచారం ప్రజలకు అందించడం.. వారిలోని మీమాంసను తొలగించడమే తన లక్ష్యమని 26 ఏళ్ల విల్ చెప్పారు. ‘‘ఇవన్నీ సరదా వీడియోలు. 50 నుంచి 60 సెకన్ల నిడివి ఉంటాయి. డాక్టర్ అన్నా బ్లాక్నీ వీటి ఆధారంగా ప్రజలు టీకాల సమాచారం తెలుసుకోవడంతో పాటు సైన్స్‌ను మరింతగా నమ్మే అవకాశం ఉంటుంది’’ అన్నారు విల్. 2016లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న విల్ కరోనావైరస్ కారణంగా తొలుత లాక్‌డౌన్ విధించినప్పుడు ఇల్లు కదలలేదు. కరోనావైరస్ భయం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు.ప్రజలు తాము తల దూర్చలేని విషయాల గురించి ప్రజలు భయపడుతున్నారనీ ఆయనకు తెలుసు. ‘‘నేను అలాంటివారికి సాయం చేయాలనుకుంటున్నాను. నా నుంచి సమాచారం పొందిన తరువాత టీకా వేయించుకోవాలో వద్దో వారో నిర్ణయించుకుంటారు’’ అంటారు విల్. ఆక్స్‌ఫర్డ్, ఇంపీరియల్ కోవాక్, జాన్సెన్ వ్యాక్సీన్ ప్రయోగాల కోసం పని చేస్తున్న విల్ టిక్‌టాక్‌లో సమాధానమిచ్చే ప్రశ్నలువిల్, అన్నాలకు ప్రజల నుంచి అనేక రకాల ప్రశ్నలు వస్తుంటాయి. టీకా ఎంత వేగంగా అందుబాటులోకి వస్తుంది.. టీకా సురక్షితమేనా వంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ‘‘వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుంది.. మందులతోపోల్చితే వ్యాక్సీన్ ఎంతవేగంగా పనిచేస్తుంది.. వేర్వేరు వ్యాక్సీన్ల మధ్య వ్యత్యాసం వంటివి వివరిస్తాం’’ అన్నారు విల్. ఇదంతా పోకడల గురించేసంక్లిష్టమైన శాస్త్రీయ సమాచారాన్ని చిన్న వీడియోలో ఉంచడానికి ప్రయత్నించడం సవాలే. అయినా, విల్ , అన్నాలు ఎలా చేస్తున్నారు?‘ ‘టిక్‌టాక్ ట్రెండ్స్ అనుసరించి టీకా లేదా సైన్స్ థీమ్‌తో ప్రయత్నిస్తాం’’ అని అన్నా చెప్పారు. విల్ చేసిన వీడియోల్లో డ్యాన్స్ చేస్తూ టీకా గురించి వివరించింది ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది. సింగర్ డాలీ పార్టన్ వ్యాక్సీన్ రీసెర్చ్ కోసం విరాళం ఇచ్చిన తరువాత ఆమెతో కలిసి అన్నా చేసిన వీడియో‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. విల్ తన వీడియోల్లో ఒకట్రెండు ముఖ్యాంశాలు చెబుతారు. గ్రాఫ్ కానీ న్యూస్ స్టోరీ కానీ బ్యాక్‌గ్రౌండ్‌గా వాడుతూ తాను చెప్పాల్సిన సమాచారాన్ని వివరంగా చెబుతారు. ‘‘చూసేవాళ్లకు బోర్ కొట్టకుండా వారిని ఎంగేజ్ చేసేలా వీడియోలు రూపొందిస్తాను’’ అన్నారు విల్. ప్రజలు అడిగే అనేక ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారంటారు. ‘‘ప్రశ్నలు అడిగేవారితో వాదనకు దిగకుండా, ఉద్వేగాలకు లోను కాకుండా ఉండాలి. అలాకాకపోతే చెప్పాల్సింది చెప్పలేం. వాస్తవాలతో జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అన్నారు విల్, అన్నా. ‘‘ప్రస్తుత తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ కాలంలో పూర్తి వాస్తవాలతో ప్రజల సందేహాలకు సమాధానమిస్తూ వారిని చైతన్యపరచడం నా పని’’ అన్నారు అన్నా. టిక్‌టాక్ మంచి సాధనంగా కనిపిస్తోంది నాకు.. ఇంకా చాలామంది సైంటిస్టులు ఈ పనిచేస్తే బాగుంటుంది అంటున్నారు అన్నా. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సైన్స్, టిక్‌టాక్ కలిసి సాగుతాయని మీరు ఊహించి ఉండకపోవచ్చు. కానీ, కరోనావైరస్ అనే చీకటి సొరంగానికి మరో చివర వ్యాక్సీన్ అనే వెలుగు కనిపిస్తుండడంతో ఈ రెండూ ముఖ్యమైన భాగస్వాములుగా మారాయి. text: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ముఖ్యమంత్రి పళనిసామి తమిళనాడు అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో తీరిపోనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 234 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం తమిళనాడులో మొత్తం సుమారు 6.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 3,18,28,727 మంది కాగా, 3,08,38,473 మంది పురుష ఓటర్లు. 7,246 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మిగతా రాష్ట్రాల ఫలితాలతో పాటే తమిళనాడు ఎన్నికల ఫలితాలను కూడా మే 2న ప్రకటిస్తారు. డీఎంకె నేత ఎంకె స్టాలిన్ స్థానిక పార్టీల మధ్యే పోటీ... అధికార పార్టీ ఏఐఏడీఎంకే... ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. బీజేపీకి ఆ పార్టీ 20 సీట్లు కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే... కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగుతోంది. వైకో నేతృత్వంలోని మారుమలార్చీ ద్రవిడ మున్నేట్ర కళగంతోపాటు మరో ఎనిమిది చిన్న పార్టీలు కూడా డీఎంకే గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. సీపీఎం, సీపీఐ కూడా డీఎంకేతో జత కట్టాయి. డీఎంకే ఈసారి కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు కేటాయించింది. 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలకు డీఎంకే తలో ఆరో సీట్లు ఇచ్చింది. ఐయూఎంఎల్, కొంగునాడు మున్నేట్ర కళగం పార్టీలకు మూడు చొప్పున కేటాయించింది. తమిళనాడు అసెంబ్లీ సీట్లలో మొత్తంగా బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలు 20 కాగా, కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక పార్టీల మధ్యే పోటీ కనిపిస్తోంది. సినీ నటుడు కమల్ హాసన్ మూడేళ్ల క్రితం ప్రారంభించిన మక్కల్ నీతిమయ్యమ్ పార్టీ ఈ ఎన్నికలతోనే మొదటిసారి బరిలోకి దిగుతోంది. కమల్ హాసన్ ప్రధాన అభ్యర్థులు వీళ్లే... ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, కమల్ హాసన్, బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎల్ మురుగన్ ధారాపురం లాంటి వారు ప్రముఖ అభ్యర్థులుగా ఉన్నారు. పళనిస్వామి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఎడప్పాడీపై అందరి దృష్టీ ఉంది. ఆయన ఈ సీటుకు పోటీ చేయడం ఇది ఏడోసారి. అందులో నాలుగుసార్లు (1989, 1991, 2011, 2016ల్లో) ఆయన గెలిచారు. స్టాలిన్ కోలాథూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెపాక్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఇక కమల్ హాసన్ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు మురుగన్... ధారాపురం సీటు నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు హెచ్ రాజా కారాయికుడీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ అంశాల చుట్టూనే... అధికార పార్టీ ఏఐఏడీఎంకేపై ప్రతిపక్ష పార్టీలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. ఏఐఏడీఎంకే నాయకుల్లో చాలా మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏఐఏడీఎంకే బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మళ్లీ ఏఐడీఎంకే అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో బీజేపీ తన ఇష్టానుసారం విధానాలను అమలు చేస్తుందని ఓటర్లను హెచ్చరిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో నీట్ ప్రవేశ పరీక్ష కూడా కీలక అంశాల్లో ఒకటిగా ఉంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు కూడా జరిగాయి. ఇక మాజీ సీఎం జయలలిత మరణం అంశం కూడా ఈ ఎన్నికల్లో చర్చకు వస్తోంది. తాము అధికారంలోకి వస్తే జయలలిత మరణం వెనుకున్న అసలు కారణాలను వెలికితీస్తామని డీఎంకే అంటోంది. ‘పెట్రోల్ ధర తగ్గిస్తాం’ తమను గెలిపిస్తే, పెట్రోల్ ధరను తగ్గిస్తామని కూడా డీఎంకే హామీ ఇచ్చింది. చెన్నై నుంచి సేలం వరకు 277 కి.మీ. పొడవున ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు కూడా ఎన్నికల అంశంగా మారింది. ఈ ప్రాజెక్టును కోర్టు నిలుపుదల చేసింది. అయితే, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తామని కేంద్ర బడ్జెట్‌ ద్వారా బీజేపీ సంకేతాలు ఇచ్చిందని చెబుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో మొదటి సారి మతం చుట్టూ కూడా రాజకీయాలు తిరుగుతున్నాయి. డీఎంకే-కాంగ్రెస్-వామపక్షాల కూటమిని ‘హిందూ వ్యతిరేక’ కూటమిగా వర్ణిస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ మిత్ర పక్షం ఏఐఏడీఎంకే వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తమ వైఖరిని మార్చుకుంది. రెండేళ్ల క్రితం రాజ్యసభలో ఈ చట్టాన్ని సమర్థించిన ఆ పార్టీ... ఇప్పుడు మాత్రం దాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పింది. ఇదివరకటి ఎన్నికల్లో ఏమైంది? 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో ఏఐఏడీఎంకే 136 సీట్లు గెలిచి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు డీఎంకేకు 89... దాని మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఐయూఎంఎల్‌కు ఒక సీటు వచ్చాయి. ఏఐఏడీఎంకేతో అప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఆ రాష్ట్రంలో పార్టీల ప్రచారం జోరు అందుకుంది. text: ప్రస్తుతం ఆమె వయసు 75 సంవత్సరాలు. ఆమె మృతదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నానక్‌రామ్ గూడలోని తమ నివాసంలో ఉంచుతామని, విజయ నిర్మల అంత్యక్రియలను రేపు నిర్వహిస్తామని నరేష్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. విజయ నిర్మల మృతి పట్ల పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలనటిగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన విజయ నిర్మల, హీరోయిన్‌గా తన కెరియర్‌ను కొనసాగించారు. తెరమీద మాత్రమే కాక, డైరెక్టర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. విజ‌య నిర్మ‌ల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ హీరో చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి గారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయ నిర్మల'' అని చిరంజీవి అన్నారు. ''అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడువాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ కృష్ణ‌గారికి, న‌రేష్‌కు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి అన్నారు. పనిరాక్షసి బాలనటిగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన విజయ నిర్మల, హీరోయిన్‌గా తన కెరియర్‌ను కొనసాగించారు. నటిగా మాత్రమే కాకుండా, డైరెక్టర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. మళయాళ సినిమా 'భార్గవి నిలయం' హీరోయిన్‌గా విజయ నిర్మల తొలి చిత్రం. రంగులరాట్నం సినిమాతో తెలుగు సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. కృష్ణతో విజయ నిర్మల తొలి చిత్రం సాక్షి. హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటించిన తర్వాత, ఆమె సాక్షి సినిమాలో నటించారు. తన భర్త పేరు కృష్ణ, తన పేరులోని విజయ రెండు పేర్లు కలిసేలా ‘విజయకృష్ణ’ బ్యానర్‌ను ప్రారంభించారు. హీరోయిన్‌గా మొదటి సినిమా మళయాళంలో చేసిన విజయ నిర్మల, డైరెక్టర్‌గా తన మొదటి చిత్రం ‘కవిత’ను కూడా మళయాళంలోనే చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో 'మీనా' నవల ఆధారంగా, తెలుగులో అదే పేరుతో మీనా సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకత్వంలో ఆమె పనితనం చూసి, అందరూ ఆమెను పనిరాక్షసి అని పిలిచేవారు. తన సొంత బ్యానర్‌లో మాత్రమే కాకుండా, ఇతర నిర్మాతలు కూడా విజయ నిర్మలతో సినిమాలు చేశారు. తన భర్త కృష్ణతోపాటు, హేమాహేమీలు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును కూడా విజయనిర్మల డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కృష్ణ కూడా మరో హీరోగా నటించారు. సావిత్రి, భానుమతి తర్వాత దర్శకత్వం వైపు మళ్లిన ప్రముఖ హీరోయిన్ విజయ నిర్మల. హీరోయిన్‌గా ఆమె కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశారు. 'అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఆవిడ అమ్మ.. షూటింగ్ సెట్‌లో హిట్లర్' విజయ నిర్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు శివనాగేశ్వర రావు, ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలను జర్నలిస్ట్ రూపావాణికి వివరించారు. ''అవసరానికో సందర్భాన్ని బట్టో చాల మందిని మేడం అనాల్సివస్తుంది.. కానీ నేను ఇష్టంగా మేడం అని పిలుచుకునేది మాత్రం మా మేడం విజయ నిర్మల గారినే.. నేను ఆవిడ దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఆవిడ అమ్మ.. సెట్ లో హిట్లర్'' అని శివనాగేశ్వర రావు చెప్పుకొచ్చారు. ''ఊటీలో కృష్ణ గారి షూటింగ్స్ జరుగుతుంటే ఏప్రిల్, మే నెలల్లో ఆయన అన్ని సినిమాల సాంగ్స్ ఊటీలో ప్లాన్ చేసేవారు. అప్పుడు మేడం కూడా ఊటీలోనే వుండే వారు. ఆవిడ స్వయంగా వంటచేసి, లొకేషన్‌కి పంపేవారు. కృష్ణ గారి బర్త్‌డే అయితే మాకు పండగే.. ఆ రోజు ఆవిడ స్వయంగా వండిన వంటలతోనే మాకు భోజనాలు!'' ''కొన్ని మరణాలు ఒక పట్టాన జీర్ణించుకోలేం. నిర్మాతని జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయం ఆమె దగ్గర నేను నేర్చుకున్న తొలి పాఠం'' అని ఆయన అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రముఖ తెలుగు సినీ నటి, హీరో కృష్ణ సతీమణి విజయ నిర్మల జూన్ 27, గురువారం తెల్లవారుజామున మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల, హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. text: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్ కాజు మార్జు వంట కోసం పదార్థాలను సరిగా ఎంపిక చేసుకోకున్నా, సరిగా ఉడికించకున్నా, ఆహార పదార్థాలను నిల్వ చేసే పరిస్థితులు సరిగా లేకున్నా... వాటిని తింటే వాంతులు, విరేచనాలతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడమే కాదు, కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అయిదు పదార్థాలను తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఇంత రిస్క్ చేసి తినడం ఎందుకులే అని మీరు అనుకుంటే, వాటిని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిది. రెడ్ బీన్స్ 1. రెడ్ బీన్స్, సోయా బీన్స్ (రాజ్మా) బీన్స్, చిక్కుడు ఆరోగ్యానికి మంచివని సాధారణంగా చెబుతుంటారు. అయితే, అందులో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిని సరిగ్గా వండకుండా తింటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఎరుపు బీన్స్, సోయాబీన్స్ ఈ కోవలోకి వస్తాయి. ఉత్తర భారతంలో దీన్ని అత్యధికంగా ఉపయోగిస్తారు. సానుకూల విషయం ఏంటంటే, వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. మరోవైపు ప్రతికూల విషయానికొస్తే, పచ్చి బీన్స్‌లో 'ఫైటోహెమగ్లుటినిన్' అనే కొవ్వు పదార్థం ఉంటుంది. ఆ కొవ్వును జీర్ణించుకోవడం చాలా కష్టం. దీనిని సరిగా ఉడికించకుండా తింటే కడుపులో నొప్పి, వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది. రెడ్ బీన్స్ మాదిరిగానే, సోయాబీన్స్‌లో కూడా ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతారు. కానీ, దురదృష్టవశాత్తు వాటిలో సహజమైన టాక్సిన్ (ట్రిప్సిన్ అనే ఎంజైమ్‌) కూడా ఉంటుంది. అది ఆహారం సరిగా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది. ఈ రెండు బీన్స్‌ను కనీసం 12 గంటలు నీటిలో నానబెట్టి, కడగాలి. ఆ తర్వాత ఉడకబెట్టి, ఆరబెట్టాలి. అప్పుడు వండుకుని తింటే సమస్యలు ఉండవు. జాజికాయలను ఎక్కువగా వాడితే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది 2. జాజికాయ ఈ మసాలా దినుసు ఇండోనేషియాలో ఎక్కువగా దొరుకుతుంది. కొన్ని రకాల వంటకాలలో అదనపు రుచి కోసం వీటిని వినియోగిస్తారు. బంగాళాదుంపలు, మాంసం, సాస్‌లు, కూరగాయలు వంటకాలతో పాటు, కొన్ని పానీయాల తయారీలోనూ జాజికాయను వాడుతారు. అయితే, దీనిని అధిక పరిమాణంలో తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వికారం, నొప్పి, శ్వాస సమస్యలు, మూర్ఛతో పాటు మానసిక సమస్యలకు కూడా ఇది కారణం అయ్యే అవకాశం ఉంది. జాజికాయ వల్ల ఆహారం విషతుల్యమై దానిని తిన్నవారు చనిపోయిన ఘటనలు చాలా అరుదుగానే ఉన్నాయి. అయినా, దీని వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చీజ్ లోపల పురుగులను వేస్తారు 3. కాజు మార్జు చీజ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్‌గా దీనికి పేరుంది. దీనికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ... దీని లోపల పురుగులు ఉండటం. ఆ పురుగులను చూస్తే తినాలన్న ఆసక్తి కొందరికి కలగపోవచ్చు, కానీ ఇటలీలోని సర్డీనియాలో బాగా ప్రాచుర్యం ఉన్న ఈ చీజ్‌ను ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. పెకోరినో రొమానో అనే ఇటాలియన్ చీజ్‌కు లార్వాలను కలిపి కాజు మార్జును తయారు చేస్తారు. లోపల ఉండే ఆ చిన్న పురుగులు చీజ్‌ను మెత్తగా, జిగురులా చేస్తాయి. దాంతో, దానిని తినేటప్పుడు చీజ్ లోపలి మధ్య భాగం దాదాపు ద్రవ పదార్థంలా ఉంటుంది. ఆ పురుగుల కారణంగా దీని రుచి భిన్నంగా ఉంటుంది. దీనిని తినాలంటే, ముందుగా కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ చీజ్ దొరకడం చాలా అరుదు. ఎందుకంటే, యూరోపియన్ యూనియన్ అనుమతి పొందిన ఆహార పదార్థాల జాబితాలో కాజు మార్జును చేర్చలేదు. కాబట్టి, దీనిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు. దీనిని "ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్"గా అభివర్ణిస్తారు. ఇది తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. ఒకవేళ లోపల ఉన్న పురుగులు చనిపోతే ఆ చీజ్ చెడిపోయిందని అర్థం. ఆరోగ్యం సరిగా లేనప్పుడు దీనిని తింటే కడుపులో అసౌకర్యంగా అనిపించడం, వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రుబర్బ్ కాడలు 4. రుబర్బ్ (రేవల్చిన్ని) బ్రిటిష్ వంటకాలలో రుబర్బ్ కాడలకు బాగానే ప్రాధాన్యం ఉంది. చాలా బ్రిటిష్ ఫలహారాలు, పానీయాలలో వీటిని వినియోగిస్తారు. కానీ, రుబర్బ్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, రుచికరమైన కాడలతో పాటు వచ్చే పచ్చని ఆకుల్లో విషం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఆకుల్లో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. అది కడుపులోకి వెళ్తే వికారం కలిగిస్తుంది. ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే శక్తిని తగ్గిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు కూడా ఆ పదార్థం కారణమయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సాలిక్ ఆమ్లం కలిగి ఉండే రుబర్బ్ ఆకులు నిజంగా ఎంత ప్రమాదకరమైనవి అనే దానిపై ఇంకా చాలా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి కాడలలోనూ ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది, కానీ ఆకులతో పోలిస్తే కాడలలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆకులను తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పూర్తిగా అలాంటి వంటకాలకు దూరంగా ఉండటం మంచిది. అత్యంత ప్రమాదకరమైన పఫ్ఫర్ ఫిష్ వంటకానికి జపాన్‌లో చాలా డిమాండ్ ఉంది 5. పఫ్ఫర్ ఫిష్ పఫ్ఫర్ ఫిష్... అత్యంత విషపూరితమైన చేప ఇది. దీని శరీరంలో విషపూరిత టెట్రోడోటాక్సిన్ ఉంటుంది. అది సైనైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని చెబుతారు. అయితే, అంత ప్రమాదకరమైనా, దీనితో చేసే వంటకాలకు కొన్ని దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. విషపూరితమైన అవయవాలను తొలగించిన తర్వాతే పఫ్ఫర్ చేపను వండాలి. అందుకోసం చెఫ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. జపాన్‌లో పఫ్ఫర్ ఫిష్‌తో చేసే 'ఫుగు' అనే వంటకానికి మంచి ఆదరణ ఉంది. ఈ వంటకం తయారు చేసే చెఫ్‌లు కొన్నేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వంటకంలో చేప మెదడు, చర్మం, కళ్ళు, బీజకోశాలు, కాలేయం, పేగులు లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొన్ని పదార్థాలను తింటే ఎలాంటి హానీ ఉండదని అనిపించవచ్చు. కానీ, కొన్నింటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. text: తనకు చికిత్స అందించిన వైద్య సిబ్బందితో పల్లవ బాగ్లా ఏప్రిల్ 22న ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. నాలుగు రోజుల తర్వాత సీటీ స్కాన్ చేయించుకోగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. బాగ్లాకు జ్వరం తగ్గక పోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోవిడ్ లక్షణాలు కనిపించిన 8 రోజులకు ఆయన ఆసుపత్రిలో చేరారు. రక్త పరీక్షలు చేసి స్టెరాయిడ్లు ఇచ్చారు. మధుమేహం కూడా ఉండటంతో షుగర్ లెవెల్స్ బాగా పెరిగి పోయాయి. ఆక్సిజన్ స్థాయి పడిపోలేదు. ఎనిమిది రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత బాగ్లా కోలుకున్నారు. ఇంటికి వెళ్లే ముందు డాక్టర్లు.. మధుమేహం ఉన్న, వ్యాక్సీన్ తీసుకోని ఆయన వయసు మరో వ్యక్తి స్కానింగ్ రిపోర్టులను బాగ్లా రిపోర్టులతో పోల్చి చూపించారు. "రెండు స్కానింగ్ రిపోర్టుల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. ఒక వేళ వ్యాక్సీన్ తీసుకోకుండా ఉండి ఉంటే నేను వెంటిలేటర్ పైకి వెళ్లాల్సి వచ్చి ఉండేదని డాక్టర్లు చెప్పారు. సరైన సమయానికి పూర్తి వ్యాక్సినేషన్ తీసుకోవడం నన్ను కాపాడింది" అని బాగ్లా చెప్పారు. భారతదేశంలో 3 శాతం ప్రజలకు వ్యాక్సీన్ ఇచ్చినప్పటికీ వ్యాక్సీన్ తీసుకున్న 2 వారాల తర్వాత ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని ఇప్పటివరకు ఎక్కువగా డాక్టర్లు, నర్సులు లాంటి వైద్య సిబ్బంది ఎదుర్కొన్నారు. బాగ్లాకు సోకిన ఇన్ఫెక్షన్‌కు కారణమైన వైరస్ జెనెటిక్ కోడ్ ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఆయన ముక్కు, గొంతు నుంచి శాంపిళ్లు తీసుకున్నారు. భారతదేశంలో 3శాతం మందికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్‌లు కొత్తగా ఇన్ఫెక్షన్లు సోకకుండా నిరోధించగలుగుతున్నాయా అనేది తేల్చేందుకు ఆయన నుంచి శాంపిళ్లు తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాక్సీన్‌లు ప్రభావవంతమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా నిరోధించలేనప్పటికీ అవి అనారోగ్యం తీవ్ర కాకుండా ఆపడంతో పాటు కోవిడ్ వల్ల చనిపోకుండా కూడా ఆపగలవు. ప్రమాదకరమైన వైరస్ వేరియంట్ల నుంచి అవి రక్షించగలవు. కానీ, వ్యాక్సిన్లు 100 శాతం ప్రభావవంతమైనవని చెప్పలేం. "ఈ పరిస్థితుల్లో వ్యాక్సీన్ తర్వాత కలిగే ఇన్ఫెక్షన్లు" రావడం పూర్తిగా ఊహించిన పరిణామమే. వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చదని నిపుణులు అంటున్నారు. అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది? అమెరికాలో ఏప్రిల్ 26 వరకు 9.5 కోట్ల మంది ప్రజలు పూర్తిగా వ్యాక్సీన్ తీసుకున్నారు. అందులో 9,045 మందికి వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ సోకినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. అందులో 835 (9 శాతం) మంది ఆసుపత్రిలో చేరగా 132 (1 %) మంది మరణించారు. ఆసుపత్రిలో చేరిన మూడింట ఒక వంతు మంది రోగులు, 15 శాతం మరణాలు కోవిడ్ లక్షణాలు కనిపించకుండా కానీ, కోవిడ్ సంబంధం లేనివి కానీ ఉన్నాయి. భారతదేశంలో ఈ అంశానికి సంబంధించిన వివరాల విషయంలో స్పష్టత లేదు. వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ బారిన పడిన డాక్టర్ల గురించి చాలా రిపోర్టులు బయటకు వస్తున్నాయి. కొన్ని మరణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ మరణాలకు కోవిడ్ ఇన్ఫెక్షన్‌కు సంబంధం ఉందా అనేది స్పష్టం కాలేదు. భారతదేశంలో వ్యాక్సినేషన్ జరిగిన ప్రతి 10,000 మందిలో ఇద్దరు నుంచి నలుగురికి ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఈ సమాచారం పూర్తిగా అందుబాటులో లేదు. గత మూడు నెలలుగా పరీక్షలు జరుగుతున్న వారు వ్యాక్సీన్ తీసుకున్నారో లేదో వివరాలు సేకరించడం లేదు. ఆసుపత్రుల నుంచి లభిస్తున్న ఆధారాలు భిన్నంగా ఉన్నాయి. తమిళనాడులో రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సీన్ తీసుకున్న వైద్య సిబ్బందిలో చాలా కొంత మందికి మాత్రమే ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపినట్లు అమెరికాలోని మేయో క్లినిక్ ప్రొఫెసర్ విన్సెన్ట్ రాజ్ కుమార్ చెప్పారు. "వ్యాక్సీన్ తీసుకున్న వారు త్వరగా కోలుకున్నారు" అని ఆయన నాకు చెప్పారు. మరో వైపు దిల్లీలోని అతి పెద్ద కోవిడ్ హాస్పిటల్ లోక్ నాయిక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 60 శాతం మంది డాక్టర్లు వ్యాక్సీన్ తీసుకున్నాక ఇన్ఫెక్షన్‌కి గురయ్యారు. కొంత మంది వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫెక్షన్ సోకి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది" అని క్రిటికల్ కేర్ నిపుణురాలు డాక్టర్ ఫరా హుస్సేన్ చెప్పారు. భారతదేశంలో వ్యాక్సిన్ల కొరత కొనసాగుతోంది. దిల్లీలో మరో ఆసుపత్రి ఫోర్టిస్ సి- డాక్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 113 మంది వైద్య సిబ్బంది వ్యాక్సీన్ తీసుకోగా అందులో 15 మందికి రెండు వారాల తర్వాత ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిసింది. అందులో 14 కేసుల్లో తేలికపాటి లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. . అందులో ఒక్కరికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చింది. "ముఖ్యంగా వైద్య సిబ్బందిలో వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు సోకడాన్ని ఎక్కువగా చూస్తున్నాం. కానీ, అవి తేలికపాటి లక్షణాలతోనే ఉంటున్నాయి" అని ఈ రిపోర్టు సహ రచయత, డయాబెటాలజిస్ట్ డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ఇటీవల ఒక అధ్యయనం కోసం పూర్తిగా వ్యాక్సీన్ డోసులు తీసుకుని ఇన్ఫెక్షన్‌కు గురైన వైద్యరంగ సిబ్బంది నుంచి శాంపిళ్లను సేకరించారు. అందులో ఇద్దరికి శరీర రోగ నిరోధక శక్తిని తట్టుకోలేని వైరస్ మ్యుటేషన్లు ఇన్ఫెక్ట్ అవ్వగా, మిగిలిన ఎవరికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకలేదని ప్రముఖ జెనెటిసిస్ట్ డాక్టర్ వినోద్ స్కారియా చెప్పారు. అయితే, సాధారణ జనాభాలో తలెత్తుతున్న ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్ల పని తీరు గురించి తెలుసుకోవడానికి, మరింత సమాచారం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత చాలా మంది ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారనే ప్రశ్నను చాలా మంది అడుగుతున్నట్లు వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు. వ్యాక్సీన్ తీసుకోకపోతే ఏమవుతుంది? భారతదేశంలో రోజువారీ కేసులు తగ్గడం వల్ల హెర్డ్ ఇమ్మ్యూనిటీ స్థాయికి చేరడానికి చాలా సమయం పడుతుంది. వ్యాక్సీన్ తీసుకోవడానికి సుముఖత చూపించకపోవడం మరింత దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది. వ్యాక్సీన్ తీసుకోకపోవడం వల్ల భారతదేశంలో సెకండ్ వేవ్‌లో వచ్చిన వైరస్ మ్యుటేట్ కావడం సులభం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్‌ రకాలు వ్యాక్సీన్లు అందించే రోగ నిరోధక శక్తిని కూడా తప్పించుకోగలవు. భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి సిద్ధమవడానికి వైరల్ అయ్యే మ్యుటేషన్లను సీక్వెన్సింగ్ చేయడమే కీలకం. అయితే, వ్యాక్సీన్లు మాత్రం ఇన్ఫెక్షన్ సోకినవారు తీవ్రంగా జబ్బు పడకుండా లేదా ఆసుపత్రి పాలు కాకుండా మాత్రం కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీకాలు తీసుకున్నవారికి ఇన్ఫెక్షన్ సోకి.. వారి నుంచి కూడా ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీరు కూడా మాస్కులు ధరించడం మానకూడదు. అంతే కాకుండా, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, గాలి, వెలుతురు లేని ప్రదేశాలు, లేదా ఏసీ ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండటం లాంటివి చేయకూడదు. కేరళ రాష్ట్రంలో చేసినట్లు రెండు మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలి. ప్రభుత్వం నుంచి వస్తున్న వైద్య సందేశాలు అయోమయానికి గురి చేయకుండా స్పష్టంగా ఉండాలి. వ్యాక్సీన్ తీసుకున్న వారు ఇళ్లల్లో, పని స్థలాల్లో అందరితో కలవచ్చా లేదా అనే సందేశం సూటిగా ఉండాలి. "వ్యాక్సీన్లు పని చేస్తాయి. కానీ, అవి తీసుకోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి జాగ్రత్తలు పాటించకపోవడానికి లైసెన్సు కాదు. వ్యాక్సీన్లు తీసుకున్నప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి" అని బాగ్లా చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీకి చెందిన ఒక సైన్సు జర్నలిస్ట్ పల్లవ బాగ్లాకు వ్యాక్సీన్ తీసుకున్న 3 వారాల తరువాత జ్వరం, గొంతు నొప్పి మొదలయ్యాయి. ఆయన వయసు 58 ఏళ్లు. text: తన కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు కక్షగట్టి కాల్చిచంపారు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. ‘‘పొలంలో పని చేసుకుంటున్నఅమ్రిశ్‌ శ‌ర్మ‌ అనే రైతును కొంతమంది దుండగులు కాల్చి చంపారు. తన కూతురిని వేధించారని అమ్రిశ్‌ శ‌ర్మ‌ 2018లో కొందరు వ్యక్తులపై కేసు పెట్టారు. ఆయన్ను చంపినవారిలో ఆ కేసు నిందితుడు కూడా ఉన్నారు’’ అని హాథ్‌రస్ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ జైస్వాల్ వెల్లడించారు. "అమ్రిశ్‌ శ‌ర్మ‌ కుమార్తె ఫిర్యాదు ఆధారంగా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. లలిత్ శర్మ అనే నిందితుడిని అరెస్టు చేశాం. మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తాం’’ అని జైస్వాల్ తెలిపారు. సోమవారం హత్య జరిగిన సమయంలో తన తండ్రి పొలంలో పని చేస్తున్నారని మృతుడు అమ్రిశ్‌ శ‌ర్మ‌ కుమార్తె బీబీసీకి తెలిపారు. ‘‘నిందితుడిపై ఇంతకుముందు మేం వేధింపుల కేసు పెట్టాం. దాంతో కక్ష పెట్టుకున్నారు. చాలాసార్లు మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు కూడా చెప్పాం. కానీ వారు పట్టించుకోలేదు. చివరకు మా నాన్నను చంపారు’’ అని మృతుడి కుమార్తె వెల్లడించారు. ‘‘అమ్మ, నేను నాన్నకు భోజనం తీసుకుని పొలం దగ్గరకు వెళ్లాం. దుండగులు తెల్ల రంగు కారులో వచ్చి నాన్నపై కాల్పులు జరిపారు. నాన్న కిందపడిపోగా, దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. మేం ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించాం. కానీ బతికించుకోలేకపోయాం’’ అని ఆ యువతి వెల్లడించారు అమ్రిశ్ శర్మ హత్య కేసు నిందితులలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులపై గతంలో కేసు తన ఇంట్లోకి ప్రవేశించి కూతురిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గౌరవ్ శర్మపై బాధితురాలి తండ్రి అమ్రిశ్ శర్మ 2018 జులైలో కేసు పెట్టారు. ఈ కేసులో గౌరవ్ శర్మ కొన్నాళ్లు కస్టడీలో ఉండి, బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసును విత్ డ్రా చేసుకోవాలని జైలు నుంచి బైటికి వచ్చిన తర్వాత గౌరవ్ శర్మ ఒత్తిడి చేశారని, కానీ తన తండ్రి అందుకు ఒప్పుకోలేదని బాధితురాలు వెల్లడించారు. ఆ కారణంగా బాధితుడిపై నిందితులు కక్ష పెంచుకున్నారు. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య అనేకసార్లు గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. "పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. నిందితులు ఆ కుటుంబాన్ని చంపేస్తామని గతంలోనే బెదిరించారు. పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ హత్యను నివారించేవారు.’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానికుడు ఒకరు తెలిపారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టాలని యూపీ సీఎం ఆదేశించారు ఉత్తర్‌ప్ర‌దేశ్‌లో వరుస ఘ‌ట‌న‌లు యూపీలో అత్యాచార సంఘటనలే కాకుండా హత్యలు, లైంగిక వేధింపుల కేసులు అనేకం నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట సీతాపూర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేశారని, ఆపై ఆమెను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వినిపించాయి. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. వేధింపుల కారణంగా ఇటీవల ప్ర‌యాగ్‌రాజ్‌లో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుమార్తెకు వేధింపులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. తన కూతురిని వేధిస్తున్నారంటూ గత ఏడాది న‌వంబ‌ర్‌లో నిరసన వ్యక్తం చేసిన ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా, రాష్ట్రంలో శాంతి భద్రతలపై పదే పదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినవారిపై ఫిర్యాదు చేసిన ఓ తండ్రిని ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లాలో కొందరు దుండగులు కాల్చి చంపారు. text: నన్నయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తాజాగా ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ఉన్న సూర్య రాఘ‌వేంద్రను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి (వైస్ చాన్స్‌లర్) ప్ర‌క‌టించారు. ఈ కేసుపై సమగ్ర విచార‌ణ జరపాలని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. సీఎంకు లేఖతో వెలుగులోకి రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఉన్న ఆదిక‌వి న‌న్న‌య యూనివ‌ర్సిటీని పదేళ్ల క్రితం ప్రారంభించారు. నాటి నుంచి ఈ క్యాంప‌స్ చుట్టూ అనేక వివాదాలు అల‌ముకున్నాయి. ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డం కలకలం సృష్టించింది. ఇంగ్లిష్ విభాగానికి అధిప‌తిగా ఉన్న సూర్య రాఘ‌వేంద్ర అనే ప్రొఫెస‌ర్ విద్యార్థినుల‌కు అభ్యంత‌ర‌కరమైన సందేశాలు పంపించ‌డం, త‌న ఫ్లాట్‌కి ర‌మ్మంటూ వారిని బ‌ల‌వంతం చేయ‌డం వంటి ఆరోప‌ణ‌లు నేరుగా ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్లాయి. ముగ్గ‌ురు విద్యార్థినులు ఈ మేర‌కు సీఎంకు లేఖ రాశారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను అడ్డుకోవాల‌ని కోరారు. వీసీగా ఉన్న సురేష్ వ‌ర్మ‌, ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్ మిత్రులు కావ‌డంతో త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని వారు లేఖ‌లో ఆరోపించారు. యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై ప్రొఫెస‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లపై సీఎం విచార‌ణ‌కు ఆదేశించారు. దాంతో ద‌స‌రా సెల‌వుల స‌మ‌యంలో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విచార‌ణ చేసి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇన్‌ఛార్జ్ వీసీగా ఉన్న సురేష్ వ‌ర్మ చెప్పారు. ప్రొఫెసర్‌ను కాపాడుతున్నారంటూ ఆందోళన ముఖ్య‌మంత్రి ఆదేశాల త‌ర్వాత కూడా క్యాంప‌స్‌‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌పై ఇన్‌ఛార్జ్ వీసీ సరైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే ఆరోపణలూ వస్తున్నాయి. సెల‌వుల త‌ర్వాత సోమ‌వారం తిరిగి క్లాసులు ప్రారంభం కాగానే పలువురు మహిళా నేతలు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ నేత‌ జ‌క్కంపూడి విజ‌య‌ల‌క్ష్మి కూడా పాల్గొన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ... "త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువులే విద్యార్థుల జీవితంలో కీల‌కం. అలాంటి వారి మీద ఆరోప‌ణలు వ‌చ్చిన‌ప్పుడు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేసి చ‌ర్య‌లు తీసుకోవాలి. ముఖ్య‌మంత్రి కూడా ఈ యూనివ‌ర్సిటీలో వ్య‌వ‌హారాల‌పై దృష్టి పెట్టారు. అయినా, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తిని విధుల్లో కొన‌సాగిస్తుంటే విచార‌ణ ఎలా సాధ్యం అవుతుంది. స‌స్ఫెండ్ చేయాల్సిందే. పూర్తిగా విచార‌ణ చేసి బాధ్య‌ులంద‌రి మీద చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే" అని డిమాండ్ చేశారు. ఆందోళ‌నలు తీవ్రం కావ‌డం, సెల‌వుల త‌ర్వాత తొలిరోజే క్యాంప‌స్‌లో వేడి రాజుకోవ‌డంతో చివ‌ర‌కు ప్రొఫెస‌ర్‌ని స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు వీసీ సోమవారం సాయంత్రం ప్ర‌క‌టించారు. ఫిర్యాదుదారులు ఏమంటున్నారు, వీసీ ఏం చేశారు? విద్యార్థుల ఫిర్యాదుపై విచార‌ణ విష‌యంలో ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన ముగ్గురు విద్యార్థినుల్లో ఒక‌రు ఇప్ప‌టికే కోర్సు పూర్తి చేసిన విద్యార్థి కాగా, మ‌రో ఇద్ద‌రు త‌ర‌గ‌తుల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే, అధికారులు పిలిస్తే విచార‌ణ‌కు మాత్ర‌మే హాజ‌ర‌వుతామ‌ని వారిలో ఒక‌రు బీబీసీతో చెప్పారు. ఫిర్యాదుపై సీఎం విచార‌ణ‌కు ఆదేశించ‌గానే క్యాంప‌స్‌లోని అంత‌ర్గ‌త క‌మిటీ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ ప్రారంభించిన‌ట్టు వీసీ సురేష్ వ‌ర్మ బీబీసీకి తెలిపారు. "ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఉపేక్షించం. ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రొఫెస‌ర్‌ను సస్పెండ్ చేశాం. విచార‌ణ జ‌రిగినంత కాలం ఇది అమ‌లులో ఉంటుంది. విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు హాజ‌రుకావాల‌ని ఆదేశించాం. అప్ప‌టి వ‌ర‌కూ హెడ్ క్వార్ట‌ర్స్ వ‌దిలి వెళ్ల‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వులు కూడా ఇచ్చాం. క‌మిటీ నివేదిక ఆధారంగా తదుపరి చ‌ర్య‌లు ఉంటాయి" అని వీసీ వివరించారు. వాసిరెడ్డి పద్మ (మధ్యలో) అయితే, పేరుకే అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు కానీ, విద్యార్థులు ధైర్యంగా వెళ్లి తమ సమస్యలను ఆ కమిటీకి విన్నవించుకునే పరిస్థితి ఉండటంలేదని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. "విశ్వవిద్యాలయం అంటే పుస్తకాలలో ఉన్నది చెప్పడం మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన ప్రదేశం అది. విశ్వవిద్యాలయాల్లో సమూల ప్రక్షాళన జరగాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను తక్షణమే అరెస్టు చేసి, విశ్వవిద్యాలయంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నవారే విచారిస్తారా? బాధితులు తమ ఫిర్యాదులో ప్రొఫెస‌ర్‌తో పాటు, వీసీ పేరును కూడా ప్ర‌స్తావించారు, అలాంట‌ప్పుడు వీసీ ఆధ్వ‌ర్యంలో సాగుతున్న విచార‌ణలో వాస్త‌వాలు ఎలా వెలుగులోకి వ‌స్తాయ‌ని ఏపీ సీ‌ఎల్‌ఏ రాష్ట్ర అధ్య‌క్షుడు, బార్ కౌన్సిల్ స‌భ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్ర‌శ్నిస్తున్నారు. "ఆరోప‌ణ‌లు యూనివ‌ర్సిటీ ప్ర‌తిష్ట దెబ్బ‌తీయ‌డం కోస‌మేన‌ని ఇప్ప‌టికే వీసీ అన్నారు. అలాంట‌ప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరిగే విచార‌ణలో ఇంకేం తేలుస్తారు? గ‌తంలోనూ క్యాంప‌స్‌లో ఇలాంటివి జ‌రిగాయి. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లతో ఒక‌రిని డిస్మిస్ కూడా చేశారు. అయినా ఇప్పుడు ఫిర్యాదుదారులు ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్ మీద ముఖ్యమంత్రికి రాసిన లేఖ‌లో వీసీ తీరుపై కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వీసీ, ప్రొఫెస‌ర్ స‌న్నిహితులు కావ‌డంతో త‌మ‌కు న్యాయం జ‌ర‌గుతుంద‌నే న‌మ్మ‌కం లేద‌ని వారు ముఖ్య‌మంత్రికి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ఇప్పుడు విచార‌ణ‌కు కూడా విద్యార్థులు రాక‌పోవ‌డానికి అదే కార‌ణం. అందుకే వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాలంటే ఉన్నత స్థాయి అధికారులతో విచార‌ణ చేయించాలి" అని సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీస్ కేసు నమోదు విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సెల్ ఫోన్ ద్వారా అసభ్య సందేశాలు పంపుతూ, వారిని లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై రాజానగరం పోలీస్ స్టేషన్‌లో నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రపై నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ టేకి సూరయ్య ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 14 న క్రైం నెం. 489/2019 U/Sec. 354(A), 354(D), 509, 506 IPC కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రావణి ఈరోజు సూర్యరాఘవేంద్రను ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా నందిగామలో అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. గ‌తంలో ఏం జ‌రిగింది? నన్న‌య విశ్వవిద్యాలయంలో అన‌ర్హుల‌కు పోస్టులు కేటాయించారన్న ఆరోపణలు గతంలో వివాదాస్పదమయ్యాయి. ఆ వ్య‌వ‌హారం గ‌వ‌ర్న‌ర్ దృష్టికి కూడా వెళ్లింది. చివ‌ర‌కు ప్ర‌స్తుతం వీసీగా ఉన్న సురేష్ వ‌ర్మ నియామ‌కం చెల్ల‌ద‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. 2012 నుంచి 2017 వ‌ర‌కూ వివిధ క‌మిటీల రిపోర్టుల ప్ర‌కారం కంప్యూట‌ర్ సైన్స్ విభాగ అధిప‌తిగా సురేష్ వ‌ర్మ నియామ‌కం చెల్ల‌ద‌ని యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాలు కూడా ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న విధుల్లో కొన‌సాగుతున్నారు. పైగా ప్ర‌స్తుతం ఇన్‌ఛార్జ్ వీసీగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌తో పాటుగా ప‌లువురు ఆధ్యాప‌కుల నియామ‌కాల‌లో అన‌ర్హుల‌ను ఎంపిక చేయ‌డంపై వ‌చ్చిన అభ్యంత‌రాల‌పై విచార‌ణ క‌మిటీలు ఆధారాలను సైతం బయటపెట్టాయి. అయినా, ఆయన మీద చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. తనపై వచ్చిన ఆరోప‌ణ‌లు అవాస్తవమని వీసీ సురేష్ వ‌ర్మ అంటున్నారు. కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆరోపణలు చేస్తున్నా, తాము మాత్రం నిష్పాక్షికంగా విచార‌ణ చేస్తున్నామ‌న్నారు. వాస్త‌వాలు వెలుగులోకి తీసుకొస్తామ‌ని, బాధితుల‌కు అండ‌గా ఉంటామని చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆదిక‌వి న‌న్న‌య విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల వివాదం ముదురుతోంది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రొఫెస‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. text: సెంట్రల్ మాడ్రిడ్‌లోని సిబెల్స్ ఫౌంటైన్‌ను ప్లాస్టిక్ బాటిళ్లు కప్పేశాయి. ప్రపంచంలో ప్లాస్టిక్ ప్రభావం ఏమేరకు ఉందో తెలియచెప్పడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. అయితే, ఇదే సమయంలో ప్లాస్టిక్ ఎలా పుట్టింది? ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ విప్లవం ఎలాంటి మార్పులు తెచ్చింది? వంటి విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు శాస్త్రవేత్త, ప్రొఫెసర్ మార్క్ మిడోవ్నిక్. ప్లాస్టిక్‌ గురించి లోతుగా అధ్యయనం చేసిన ఆయన, మనిషి జీవితాన్ని ప్లాస్టిక్ ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తున్నారు. సెల్యూలాయిడ్ అనే ప్లాస్టిక్‌తో తొలుత స్నూకర్ బంతులను తయారు చేశారు. 1. ఏనుగు దంతాలకు ప్రత్యామ్నాయంగా వచ్చి.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదటి వాణిజ్యపరమైన ప్లాస్టిక్ వస్తువు దూదితో తయారైంది. అప్పట్లో బిల్లియర్డ్ బంతులను ఏనుగు దంతాలతో తయారు చేసేవారు. అయితే, 1863లో ఏనుగు దంతాల కొరత తీవ్రమైంది. దాంతో బంతుల తయారీ కోసం ప్రత్యామ్నాయ పదార్థాలను కనుగొన్నవారికి 10,000 డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్టు అమెరికన్ బిల్లియర్డ్ బాల్స్ తయారీ సంస్థ ప్రకటిచించింది. ఆ ఛాలెంజ్‌ని అమెరికన్ ఔత్సాహికుడు జాన్ వెస్లీ హయత్ స్వీకరించాడు. దూది, నైట్రిక్ ఆమ్లంతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. సెల్యూలోజ్ నైట్రేట్‌(నైట్రోసెల్యూలోజ్) అనే పదార్థాన్ని కనుగొన్నాడు. దాన్ని 'సెల్యూలాయిడ్' అని కూడా అంటారు. అది సాగే గుణం కలిగి ఉంటుంది. అయితే, దానితో చేసిన బంతులు పేలిపోయే ప్రమాదం ఉండేది. ఒకటికొకటి తాకినప్పుడు పెద్దగా శబ్దం వచ్చేది. అయినా సరే.. ఆ పదార్థం వేల రకాల వస్తువుల తయారీలో ఉపయోగపడింది. తర్వాత సెల్యూలాయిడ్‌ను వాణిజ్యపరంగా సినిమా టేపుల తయారీకి పెద్దఎత్తున వినియోగించారు. సెల్యూలాయిడ్ పదార్థంతో సినిమా టేపులను తయారు చేసేవారు 2. సినిమాలకు, ప్లాస్టిక్‌కి సంబంధం తొలినాళ్లలో సినిమా రీళ్లను పేపర్‌తో తయారు చేసేవారు. బలంగా ఉండి, సాగే గుణం కలిగిన సెల్యూలాయిడ్ పదార్థం అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్నే రీళ్ల తయారీలో వినిగించారు. దాంతో పొడవాటి రీళ్లను సులువుగా తయారు చేసే వీలుండేది. హాలీవుడ్ సినిమాల అభివృద్ధికి ఆ మార్పు ఎంతగానో దోహదపడింది. 3. బేకలైట్ రంగప్రవేశం 1907లో బేకలైట్ అనే మరో ప్లాస్టిక్ పదార్థం అందుబాటులోకి వచ్చింది. దీనితో అనేక రకాల వస్తువులను విభిన్న ఆకృతుల్లో తయారు చేసే వీలుండేది. విద్యుత్ నిరోధక గుణం కలిగి ఉండటంతో బేకలైట్‌ను బల్బుల హోల్డర్లు, ప్లగ్‌లు, స్విచ్‌బోర్డుల తయారీకి విరివిగా వినియోగించారు. తర్వాత మరెన్నో రకాల ప్లాస్టిక్ పుట్టుకొచ్చేందుకు దారి చూపింది బేకలైట్. 4. రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రభావితం చేసిన ప్లాస్టిక్ 1930, 40ల్లో పాలీఎథిలీన్ సహా అనేక కొత్త రకాల ప్లాస్టిక్ పదార్థాలను పరిశోధకులు తయారు చేశారు. రెండో ప్రపంచయుద్ధంలో పాలీఎథిలీన్ కీలక పాత్ర పోషించింది. రాడార్ వ్యవస్థల కోసం వేసే పొడవాటి విద్యుత్ వైర్లకు పూతగా ఆ పదార్థాన్ని బ్రిటన్ సంకీర్ణ దళాలు వినిగించాయి. ఆ రాడార్‌తో అట్లాంటిక్ సముద్రంలో సరకు రవాణా ఓడల భద్రతను పర్యవేక్షించేవారు. ఇంకా అనేక రకాలుగా ప్లాస్టిక్‌ ఉపయోగపడింది. పారాచూట్‌ల తయారీలో నైలాన్‌ను వినియోగించేవారు. యుద్ధ వాహనాల తలుపులను, హెల్మెట్‌లను కూడా వేరువేరు రకాల ప్లాస్టిక్‌తో చేసేవారు. 5. పాటల రికార్డింగ్ కోసం 19వ శతాబ్దం మధ్యకాలం వరకు ఎవరైనా సంగీతాన్ని పరికరాలు వాయిస్తున్నప్పుడు మాత్రమే వినేవారు. కానీ, థామస్ ఎడిసన్ ఫోనోగ్రాఫ్ సిలిండర్ రూపొందించిన తర్వాత ఆ సంగీతాన్ని రికార్డు చేసుకునే వెసులుబాటు వచ్చింది. తర్వాత వినైల్ రికార్డులు, క్యాసెట్లు, టేపులు, సీడీల ద్వారా ఆ సదుపాయం మరింత పెరిగింది. ఇదంతా ప్లాస్టిక్ పుణ్యమే. ఆస్పత్రుల్లో డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడకం పెరిగింది. 6. ఆస్పత్రుల్లో.. ప్లాస్టిక్ పదార్థాలకు అదనంగా కొన్ని రకాల రసాయనాలు కలపడం ద్వారా మృధువైన, సాగే గుణం కలిగిన వస్తువులు తయారు చేసే అవకాశం వచ్చింది. దాంతో ఆస్పత్రుల్లో వినియోగించే అనేక డిస్పోజబుల్ వస్తువుల తయారీ సులువైంది. ఉదాహరణకు.. డిస్పోజబుల్ సిరంజీలు రావడం వల్ల అనేక ప్రమాదాలు తప్పాయి. తక్కువ ధరలకే, నచ్చిన ఆకృతుల్లో, ఇంపైన రంగుల్లో ప్లాస్టిక్ వస్తువులు దొరుకుతుండటంతో వాటి వాడకం విపరీతంగా పెరిగింది. 7. ధర తక్కువ రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పెట్రో రసాయనాల పరిశ్రమ బాగా వృద్ధి చెందింది. ఆ సమయంలోనే మరిన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు పుట్టుకొచ్చాయి. 1960 ప్రాంతంలో ఒక్కసారి వాడి పడేసే ప్లేట్లు, కిచెన్ సామగ్రి లాంటి ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్‌లోకి వచ్చాయి. తర్వాత క్రమక్రమంగా అనేక రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చేశాయి. తక్కువ ధరలకే విభిన్న ఆకృతులు, రంగుల్లో దొరుకుతుండటంతో వాటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ కవర్ చుట్టడం ద్వారా పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. 8. ఆహార వృథా తగ్గుతుంది యూరప్ దేశాల్లో ఏటా 88 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. అదే ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడం పెరిగితే, ఆ వృథాను క్రమంగా తగ్గించే వీలుంటుంది. కూరగాయలు, పండ్లు వంటివి ప్లాస్టిక్‌ కవర్లతో ప్యాక్ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయని, దాంతో పొలాల నుంచి మార్కెట్లకు తరలించే సమయంలో జరిగే నష్టాన్ని కూడా తగ్గించుకునే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో ఎక్కడ తేడా జరుగుతోంది? ప్రస్తుతం ప్రపంచంలో ప్లాస్టిక్ ఓ పెను సమస్యగా మారింది. నాణ్యత లేని నాసిరకం ప్లాస్టిక్ సంచులు, నాన్ డిస్పోజబుల్ కాని వస్తువులు పర్యావరణానికి ఎక్కువ హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సముద్రంలో చేరే ప్లాస్టిక్ చెత్త కొన్న దశాబ్దాల పాటు అలాగే ఉండిపోతుంది. నిమిషానికో ఓ ట్రక్కు లోడు ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కలుస్తోంది. అందుకే, ప్లాస్టిక్ వాడే తీరు మారాల్సిన అవసరం ఉంది. వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం, రీసైక్లింగ్ గురించి అందరూ ఆలోచించాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పర్యావరణానికి ప్లాస్టిక్ పెను ప్రమాదంగా మారుతోందన్న విషయాన్ని చాలామంది గ్రహించారు. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతోంది. text: మైకేల్ హరికేన్ విధ్వంసం చెట్టు కూలిన సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడని ఫ్లోరిడా అధికారులు తెలిపారు. తుపాను మూలంగా ఫ్లోరిడా, అలబామా, జార్జియా ప్రాంతాల్లోని 5,00,000 మంది ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేకుండా పోయింది. తీవ్రతను బట్టి మూడవ కేటగిరీ తుపానుగా భావిస్తున్న హరికేన్ మైకేల్ మూలంగా గాలులు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని పాన్‌హాండిల్ ప్రాంతంలో బుధవారం నాడు ఈ తుపాను అల్లకల్లోలం సృష్టించింది. హరికేన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఫ్లోరిడా రాష్ట్రంలోని పనామా నగరం మైకేల్ హరికేన్ తీరం దాటిన తరువాత కూడా అంతే తీవ్రంగా అలబామా, జార్జియాల మీదకు దూసుకొచ్చింది. భూతలం మీదకు వచ్చిన తరువాత కూడా అది అంత బలంగా ఉండడం నిపుణులనే ఆశ్చర్యపరిచింది. మంగళవారం నాడు రెండో కేటగిరీగా భావించిన మైకేల్ హరికేన్ బుధవారం నాటికి మరింత బలపడి దాదాపు అయిదో కేటగిరీ స్థాయికి చేరుకుంది. ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ దీన్ని 'ఊహకందని విపత్తు'గా అభివర్ణించారు. గత 100 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తీవ్రమైన తుపాను ఇదేనని ఆయన అన్నారు. మైకేల్ హరికేన్ మార్గం మైకేల్ హరికేన్ ధాటికి మధ్య అమెరికాలో 13 మందికి పైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. హోండురాస్‌లో ఆరుగురు, నికరాగ్వ లో నలుగురు, ఎల్ సాల్వడార్‌లో ముగ్గురు చనిపోయారు. ఫ్లోరిడా నుంచి 3,70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశించారు. కానీ, చాలా మంది ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని అధికారులు చెబుతున్నారు. తీరప్రాంత నగరమైన అపలాచికోలాలో అలలు రెండున్నర మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. పనామా సిటీ బీచ్ నుంచి తన భార్యతో కలసి ఉప్పెను దాటుకుని బయటపడిన తిమోతీ థామస్ అనే వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ, 'ఏదో నరకం తరుముకొస్తోంది' అని అన్నారు. మయామీలోని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్.హెచ్.సి) వాతావరణ నిపుణుడు డెనిస్ ఫెల్ట్‌జెన్, 'మనం మరో భాగంలో ఉన్నాం' అని ఫేస్‌బుక్‌లో రాశారు. "చరిత్రను చూస్తే, 1851 తరువాత ఫ్లోరిడా వాయవ్య ప్రాంతంలో కేటగిరీ-4 హరికేన్ ఎన్నడూ రాలేదు' అని ఆయన అన్నారు. ఫ్లోరిడా, అలబామా, జార్జియా, ఉత్తర కెరోలినా ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. సహాయక చర్యల కోసం ఫ్లోరిడా ఇప్పటికే 3,500 మంది నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ను సిద్ధం చేసింది. ఇవి కూడా చదవండి: ఫ్లోరిడా వాయవ్య ప్రాంతంలో మున్నెన్నడూ లేనంతటి శక్తిమంతమైన తుపాను విరుచుకుపడింది. తీర ప్రాంత నగరాలు నీట మునిగాయి. బలమైన వృక్షాలు కూడా గాలి ధాటికి కట్టె పుల్లల్లా విరిగి పడుతున్నాయి. text: నిజానికి రెండు కొరియా దేశాల మధ్య సమాచార మార్పిడి విషయంలో ఎన్ని ఆంక్షలు ఉన్నా, గతంలోనూ అవి రకరకాల పద్ధతుల్లో చెప్పదలచుకున్న విషయాన్ని అవతలివాళ్లకు తెలిసేలా చేసేవి. ఈ క్రమంలో తమ సమాచారాన్ని అవతలివాళ్లకు తెలిపేందుకు కొన్ని చిత్రమైన పద్ధతులను అనుసరించేవి. బెలూన్లు రెండు కొరియా దేశాల ప్రజలు తమ సమాచారాన్ని అవతలివాళ్లకు చేరవేసేందుకు ఎయిర్ బెలూన్లనే సాధనంగా వాడుకునేవారు. ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చినవాళ్లు, ఆ దేశాన్ని వ్యతిరేకించే సంఘాలు తమ నినాదాలను బ్యానర్లపై రాసి వాటిని ఎయిర్ బెలూన్లకు కట్టేవి. ఆ బెలూన్లు ఉత్తర కొరియా భూభాగంలో పడేలా వదిలేవి. ఎక్కువగా దక్షిణ కొరియా వాసులే ఈ పద్ధతిని పాటించేవారు. 2015లో ఇలా ఎయిర్ బెలూన్లు తమ భూభాగంలోకి ప్రవేశించినప్పుడు ‘యుద్ధం ప్రకటించింది’ అంటూ దక్షిణ కొరియాను ఉద్దేశిస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. ఒక పక్క ఈ చర్యలను ఉత్తర కొరియా విమర్శిస్తున్నా, ఆ దేశస్థులు కూడా దక్షిణ కొరియాకు బెలూన్ల ద్వారా సందేశాలను పంపిస్తారు. రేడియోలు ఉత్తర కొరియా ప్రభుత్వం రేడియో తరంగాల ద్వారా స్వదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా సందేశాలను పంపుతుంది. తమ దేశంలో కేవలం ప్రభుత్వం నుంచి అందే ఫ్రీక్వెన్సీలు మాత్రమే ప్రసారమయ్యేలా ఉత్తర కొరియా పరిమితులు విధించింది. బయటి దేశాల నుంచి వచ్చే దాదాపు అన్ని సిగ్నళ్లను ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది. కానీ విదేశీ ప్రసారాలను సైతం సంగ్రహించగలిగే శక్తిమంతమైన రేడియోలు ఉన్నవారు మాత్రం రహస్యంగా ఆ ప్రసారాలనూ వింటారు. దక్షిణ కొరియాకు చెందిన ‘కొరియన్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం’, బీబీసీ కొరియన్, రేడియో ఫ్రీ ఏషియా, వాయిస్ ఆఫ్ అమెరికాస్ కొరియన్ సర్వీస్ లాంటి కొన్ని విదేశీ స్టేషన్ల ప్రసారాలను ఉత్తర కొరియన్లు రహస్యంగా వింటారు. ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియా వెళ్లిన కొందరు వ్యక్తులు ‘ఫ్రీ నార్త్ కొరియా రేడియో’, ‘నార్త్ కొరియా రిఫార్మ్ రేడియో’ లాంటి స్టేషన్లను నడుపుతున్నారు. ఇతర దేశాలకు తాను చెప్పదలచుకున్న విషయాల్ని మాత్రమే చెప్పడానికి ‘వాయిస్ ఆఫ్ కొరియా’ అనే తన అధికారిక రేడియో స్టేషన్‌ను ఉత్తర కొరియా ఉపయోగిస్తుంది. ఉత్తర కొరియాలో టెలివిజన్ ప్రసారాలపైన అనేక ఆంక్షలున్నాయి. అయినప్పటికీ స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి దక్షిణ కొరియాకు చెందిన టీవీ షోలు, సినిమాలు ప్రవేశిస్తాయి. లౌడ్‌స్పీకర్ల ప్రచారం తమ గొప్పలు చెప్పడానికి, ఎదుటివాళ్ల రాజకీయ, సామాజిక వ్యవస్థలను విమర్శించడానికీ తమ సరిహద్దులో భారీ లౌడ్ స్పీకర్లను వినియోగించిన చరిత్ర రెండు కొరియా దేశాలకూ ఉంది. దక్షిణ కొరియా భూభాగంలో అమర్చిన లౌడ్ స్పీకర్లు ఎక్కువగా తమ ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ ఉత్తర కొరియా మానవ హక్కుల రికార్డును ఎండగడతాయి. పెద్ద శబ్దాలతో సంగీతాన్ని కూడా ప్రసారం చేస్తూ ఉత్తర కొరియా సైనికుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఉత్తర కొరియా లౌడ్ స్పీకర్లు తమ ప్రభుత్వ సందేశాలను వినిపిస్తూనే, దక్షిణ కొరియాతో పాటు అమెరికా లాంటి దేశాల చర్యలను ఖండిస్తాయి. కానీ ఇటీవలే రెండు దేశాలు తమ స్పీకర్ శబ్దాల తీవ్రతతో పాటు ప్రసారాలనూ తగ్గించాయి. సరిహద్దులో సమాచార మార్పిడి రెండు కొరియా దేశాలూ పరస్పర అంగీకారంతో పన్ముంజోమ్ అనే ప్రాంతంలో ఓ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. రెండేళ్ల పాటు దీని సేవలు నిలిచిపోయిన అనంతరం 2018లోనే ఈ హాట్‌లైన్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. 1971లో ఉత్తర కొరియా-దక్షిణ కొరియాకు చెందిన రెడ్ క్రాస్ సంస్థలు సంభాషించుకునేందుకు తొలి డైరెక్ట్ టెలిఫోన్ సేవలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అలాంటి దాదాపు 33 ఇంటర్ కొరియన్ టెలిఫోన్ లైన్లు పనిచేస్తున్నాయి. ఒక కంప్యూటర్ తెర, ఫ్యాక్స్ మెషీన్ అనుసంధానించిన ఫోన్ ద్వారా రెండు దేశాల అధికారులు సాధారణంగా రోజూ రెండు సార్లు సంభాషించుకుంటారు. 2016లో దక్షిణ కొరియా ‘జాయింట్ ఇంటర్ కొరియన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌’ను మూసేయడంతో ఉత్తర కొరియా ఈ హాట్‌లైన్‌ను డిస్కనెక్ట్ చేసింది. 2018 జనవరిలో దీన్ని పునరుద్ధరించడంతో రెండు దేశాల మధ్య తిరిగి చర్చలు మొదలయ్యాయి. అవే దక్షిణ కొరియా నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా కూడా పాల్గొనేందుకు బాటలు వేశాయి. మరీ నేరుగా మాట్లాడాలనుకుంటే సరిహద్దు వెంబడి సైనికుల చెవినపడేలా గట్టిగా తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇటీవల యునైటెడ్ నేషన్స్ కమాండ్‌కు చెందిన అధికారి ఒకరు తన సందేశాన్ని దక్షిణ కొరియా సరిహద్దులో నిలబడి, ఉత్తర కొరియా సైనికులకు వినబడేలా అరిచి చెప్పారు. లీడర్స్ స్పెషల్ ‘ఇంటర్ కొరియన్ సమ్మిట్’ జరగనున్న నేపథ్యంలో తొలిసారిగా రెండు దేశాల నాయకుల మధ్య డైరెక్ట్ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియా రాజధాని సోల్‌లోని అధ్యక్ష కార్యాలయం నుంచి ఉత్తర కొరియా స్టేట్ ఎఫైర్స్ కమిషన్‌కు నేరుగా ఈ హాట్‌లైన్ సేవలు అందుతాయి. ఇలా నేరుగా మాట్లాడుకోవడం ద్వారా అపోహలు దూరమై మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని దక్షిణ కొరియా అధికారులు భావిస్తున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌లు ఏప్రిల్ 27న కలుసుకోనున్నారు. ఆ రెండు దేశాలు అధికారికంగా సంభాషించుకోవడం చాలా తక్కువ. అందుకే వీళ్లిద్దరి చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. text: టీమిండియా ఫ్యాన్స్‌కు ట్రోఫీ తప్ప వేరే ఏదీ సంతోషం ఇవ్వదు. భారత జట్టుపై అభిమానులు అంత నమ్మకం పెట్టుకోడానికి ఒక కారణం కూడా ఉంది. ప్రపంచమంతా దాన్ని విరాట్ కోహ్లీ అని పిలుస్తుంది. 2017లో జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌ 351 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు విజయవంతంగా చేజ్ చేసినపుడు ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ "టెస్టుల్లో, వన్డేల్లో టీ-20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీనే" అని ప్రశంసించాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్, 2019 ఐసీసీ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా "విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్‌ని మించిన ఆటగాడు, బహుశా ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్" అని అన్నాడు. ఇప్పుడు కోట్లాది అభిమానుల ఆశలన్నీ ఆ అద్భుత ఆటగాడు, కెప్టెన్‌పైనే పెట్టుకున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి భారత్‌ సొంతం అవుతుందని ఎదురుచూస్తున్నారు. క్రికెట్‌వైపు ఆకర్షణ విరాట్ కోహ్లీ దిల్లీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి ప్రేమ్ కోహ్లీ విరాట్‌ను ఒక పెద్ద క్రికెటర్ చేయాలని, అతడు భారత్ తరఫున ఆడుతుంటే చూడాలని కలలు కన్నాడు. అందుకే ఆయన కోహ్లీని దిల్లీలో కోచ్ రాజ్‌కుమార్ శర్మ అకాడమీలో చేర్పించారు. విరాట్ ఏకాగ్రత, కోచ్ శ్రమ అతడిని ఒక్కో మెట్టు ఎక్కించింది. సమయం రాగానే విరాట్ దిల్లీ రంజీ టీంలో కూడా చోటు లభించింది. తర్వాత జరిగిన ఒక ఘటన రాత్రికిరాత్రే ఒక యువ ఆటగాడిని, పరిపక్వత ఉన్న ఒక క్రికెటర్‌గా మార్చేసింది. దిల్లీ కర్ణాటక మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. దిల్లీ టీమ్ పరిస్థితి దారుణంగా ఉంది. మ్యాచ్ కాపాడుకోవడమే కష్టంగా ఉంది. ప్రత్యర్థి టీమ్ 446 పరుగులకు సమాధానంగా దిల్లీ 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేయగానే రోజు ముగిసింది. అప్పుడు కోహ్లీ 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కానీ ఇంట్లో పరిస్థితి సరిగా లేదు. నిజానికి విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. ఆ రాత్రి ఆయన కన్నుమూశారు. కోచ్ రాజ్‌కుమార్ శర్మ 'విరాట్ కోహ్లీ-ద మేకింగ్ ఆఫ్ ఎ చాంపియన్' రాస్తున్నప్పుడు మాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ తర్వాత రోజు ఏం జరిగిందో చెప్పారు. "ఆ సమయంలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నా, విరాట్ ఫోన్ చేశాడు" అన్నారు. "విరాట్ ఫోన్లో ఏడుస్తున్నాడు. తండ్రి చనిపోయాడని, ఇప్పుడు నన్నేం చేయమంటారని అడిగాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావ్ అని నేను అడిగాను. కోహ్లీ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా అన్నాడు. నేను అలాగే చెయ్ అన్నాను. కొన్ని గంటల తర్వాత విరాట్ మళ్లీ ఫోన్ చేశాడు. మళ్లీ ఏడుస్తున్నాడు. అంపైర్ తనను తప్పుడు అవుట్ ఇచ్చాడని చెప్పాడు" అని శర్మ చెప్పారు. "దిల్లీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ పునీత్ బిష్ట్‌తో విరాట్ పెద్ద భాగస్వామ్యం నమోదు చేశాడు. దిల్లీని కష్టాల నుంచి బయటపడేశాడు. అది కూడా తన తండ్రి, మెంటర్, గైడ్ చనిపోయిన తర్వాత రోజు".. క్రికెట్ అంటే ఉన్న ఆ ఇష్టమే విరాట్ కోహ్లీకి ప్రపంచ చాంపియన్‌గా మార్చింది. రన్ చేజింగ్‌లో రికార్డులు విరాట్ కోహ్లీకి తర్వాత భారత అండర్-19 టీమ్‌ కెప్టెన్సీ లభించింది. ఆ జట్టుతోనే కోహ్లీ అండర్-19 ప్రపంచ కప్ కూడా గెలిచాడు. తర్వాత భారత జట్టులో ఎంట్రీ కోసం అతడు ఎక్కువ రోజులు ఆగలేదు. 2008లో శ్రీలంకతో కోహ్లీ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. మొదటి సిరీస్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ, అద్భుతమైన తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా నాంది పలికాడు. తర్వాత వన్డేల్లో విరాట్ ఒక్కొక్క రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. ప్రత్యేకంగా టార్గెట్‌ను చేజ్ చేయడంలో ఎవరికీ అందని ఘనత సాధించాడు. ప్రత్యర్థి టీమ్ స్కోరును చేజ్ చేస్తూ కోహ్లీ 84 మ్యాచుల్లో 21 సెంచరీలు చేశాడు. 5 వేల పరుగులకు పైనే చేశాడు. విరాట్ సెంచరీల్లో 18 మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు. వన్డే క్రికెట్‌లో టార్గెట్‌ను చేజ్ చేస్తూ రికార్డులు సృష్టించిన కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్ బహుశా ఎవరూ లేరనే చెప్పవచ్చు. అత్యుత్తమ ఆటగాడు కోహ్లీ ప్రస్తుతం పరుగులు చేస్తున్న వేగాన్ని బట్టి చూస్తే, తను రిటైర్ అయ్యే సమయానికి బ్యాటింగ్‌లో అత్యుత్తమ రికార్డులన్నీ అతడి పేరనే ఉంటాయని క్రీడా పండితులు భావిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసే స్టైల్ తిరుగులేనిది. అతడు 49 హాఫ్ సెంచరీలు, 41 సెంచరీలు చేశాడు. వికెట్‌పై నిలబడడం అతడికి ఎంత ఇష్టమో ఈ సంఖ్యే చెబుతుంది. కోహ్లీ దాదాపు ప్రతి రెండో హాఫ్ సెంచరీని సెంచరీగా మలచగలుగుతున్నాడు. ముచ్చటగా మూడో అవకాశం విరాట్ కోహ్లీకి ఇది మూడో వరల్డ్ కప్ అవుతుంది. మొదటిసారి 2011 ప్రపంచ కప్‌లో ఆడిన కోహ్లీ, 21 ఏళ్లకే వరల్డ్ చాంపియన్ అనిపించుకున్నాడు. ఈ టోర్నీలో కోహ్లీ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అటు శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ ఆ హెలికాప్టర్ షాట్, గౌతం గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇదే ఇన్నింగ్స్‌లో గంభీర్‌తో, కోహ్లీ అమూల్యమైన 85 పరుగుల భాగస్వామ్యం భారత్ విజయానికి చాలా కీలకం అయ్యింది. 2015 వరల్డ్ కప్‌ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో జరిగింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో కోహ్లీ 126 బంతుల్లో 107 రన్స్ చేశాడు. భారత్ ఈ మ్యాచ్‌ను 76 పరుగులతో గెలిచింది. కోహ్లీ ఈ టోర్నీలో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వాటి సాయంతో భారత్ తన గ్రూప్‌లో టాప్‌లో నిలిచింది. అయితే ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో కోహ్లీ కేవలం 1 రన్ చేసి అవుటయ్యాడు. భారత్ ఆ మ్యాచ్ చేజార్చుకుంది. కోహ్లీ వెంట బలమైన జట్టు ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్ కోహ్లీకి మూడో వరల్డ్ కప్ అవుతుంది. కోహ్లీ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. అతడి బ్యాట్‌ నుంచి వరుసగా సెంచరీలు జాలువారుతున్నాయి. కోహ్లీ ఇప్పుడు తన కెరీర్ పీక్స్‌లో ఉన్నాడని క్రీడా నిపుణులు చెబుతున్నారు. భారత జట్టు కూడా పక్కాగా, సమతూకంతో ఉంది. టీమిండియాలో అనుభవజ్ఞులు, యువకుల అద్భుత మిశ్రమం కనిపిస్తోంది. జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు, అతడు బహుశా తన చివరి వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. కోహ్లీ టీమ్ ఐసీసీ వరల్డ్ కప్ 2019 గెలవగలదా? అభిమానులు మాత్రం ఈ వరల్డ్ కప్ కోహ్లీది, ఇండియాదే అని గట్టిగా నమ్ముతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జూన్ 5, 2019. భారత జట్టు తన వరల్డ్ కప్ 2019 జర్నీని ఆరోజు నుంచే ప్రారంభిస్తుంది. మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్‌లో ఆడుతుంది. text: సుమారు 40 ఏళ్ల క్రితం ప్రముఖ హిందీ కవి అలోక్ ధన్వా తన కవిత 'భాగీ హుయీ లడ్‌కియా' (పారిపోయిన బాలికలు)లో రాసిన మాటలివి. ఇవి నిన్ను, నన్ను ఉద్దేశించి రాసినవి. ఇది నిజం కాబట్టే, మహిళలు నిర్భయంగా సంచరిస్తుంటే గాభరా పడతాం. కానీ నీ గాభరా వాళ్లు అలా సంచరించడాన్ని ఆపలేకపోయిందని నీకు తెలుసా? కేవలం నువ్వు కళ్లు మూసుకున్నంత మాత్రాన, ఆ వైపు చూడనంత మాత్రాన మహిళలు తమ జీవితంలో తిరుగుబాటు చేయడం ఆపలేదు. అలాంటి కనిపించని తిరుగుబాట్లను ఎందుకు వెలుగులోకి తీసుకురాకూడదు అని మేం భావించాం. సామాజిక సరిహద్దులను చెరిపేస్తూ, తమ కలలను, కోరికలకు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ, తమ ఉనికిని వెదుక్కుంటున్న ఈ భారతీయ మహిళలను పరిచయం చేసుకోండి. వీళ్లు నీ, నా మధ్యలోనే జీవిస్తున్నారు. వీళ్లు తమకు నచ్చినట్లుగా ఉత్తర, ఈశాన్య, దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని గ్రామాల్లో, నగరాల్లో జీవిస్తున్నారు. రాబోయే నెలన్నర కాలంలో మేం దేశంలోని విభిన్న ప్రాంతాలు, వర్గాలకు చెందిన 12 మంది కథలను మీ ముందుకు తీసుకొస్తాం. ఈ కథలు తప్పకుండా మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తాయి. అవి భారతదేశంలోని మహిళల గురించి మీ అభిప్రాయాలను, అంచనాలను ఖచ్చితంగా సవాలు చేస్తాయి. వీటిలో మేం, పెళ్లి కాగానే తన భర్త నపుంసకుడు అని తెలిసిన ఒక మహిళ కథను మీతో పంచుకుంటాం. అతను శారీరకంగా ఆమెను సంతృప్తిపరచలేడు, మానసికంగా ఆమె భావాలను పంచుకోవడంపై అతనికి ఆసక్తీ లేదు. సామాజిక ఒత్తిడితో అతను పెళ్లికి అంగీకరించాడు. కానీ అలాంటి అసంపూర్ణమైన బంధంతో ఆ మహిళ ఏం చేయగలదు? ఒక పాప పుట్టగానే - తండ్రి తనకు నచ్చిన మహిళతో, తల్లి తనకు నచ్చిన పురుషుడితో వెళ్లిపోతే, ఆ పాప ఒంటరిగా మిగిలిపోయిన కథ మరొకటి. తల్లిదండ్రులు జీవించే ఉన్నా, ఆ బాలిక అనాథే. ఆమె ఏం కోరుకుంటోంది? హోమోసెక్సువల్ సంబంధాల గురించి ఎంతో చెప్పారు, రాశారు. కానీ ఎలాంటి శారీరక ఆకర్షణ లేదా సెక్స్ లేకుండా దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్న ఇద్దరు మహిళలను మీరెప్పుడైనా కలిసారా? అలాంటి స్వేచ్ఛాభావాలు కలిగిన మహిళలను కలవాలనుకుంటున్నారా? విడాకులు తీసుకున్న మహిళలు అసహాయులు అని భావించే వాళ్లకు, తన భర్త ప్రేమను కోల్పోయిన తర్వాత, ప్రేమించడం నేర్చుకుని, తనను తాను గౌరవించుకోవడం నేర్చుకున్న మహిళ కథ చదవడం చాలా బావుంటుంది. ఒంటరిగానే జీవించాలని నిర్ణయించుకున్న మహిళల కథనాలు చదవడం కూడా ఆసక్తికరమే. పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయం వల్ల కుటుంబంతో, సమాజంతో యుద్ధం చేసినంత పని అవుతుంది. అలాంటి వాళ్లందరూ సంతోషంగా ఉన్నారు. ఒకరు తనకు ఇష్టం వచ్చిన రీతిలో జీవించడాన్నిఆస్వాదిస్తున్నారు. మరొకరు ఒక శిశువును దత్తత తీసుకుని, ఆ శిశువును సొంతంగా పెంచి పెద్ద చేయడంలో బిజీగా ఉన్నారు. మరొకరు - తన సహజీవనం వల్ల వచ్చిన గర్భాన్ని ఉంచుకుని, ఆ బిడ్డను పెంచుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ సంబంధం విచ్ఛిన్నమైతే, అయినా బిడ్డకు జన్మనిచ్చి, పెంచి పెద్దచేసుకోవాలని నిర్ణయించుకున్న ధైర్యవంతురాలు. కుటుంబ ఒత్తిడితో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత హింసించే భర్త పాలైన కథ మరొకరిది. ఈ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడ్డారు? ఆ బంధాన్ని అలాగే కొనసాగించారా? లేక దాని నుంచి బయటపడే ధైర్యాన్ని కూడగట్టుకున్నారా? భర్త హింసించకున్నా, ఆమె పట్ల ప్రేమ లేకపోతే? నిర్జీవంగా ఉన్న వైవాహిక బంధాన్ని కాసింత రంగులమయం చేసుకోగల దారి ఉందా? ఆమె ఆ ఖాళీని మరో వ్యక్తితో పూరించుకునే ప్రయత్నం చేస్తే పర్యవసానం ఏంటి? ఎందుకు మహిళలు తమ భర్త నుంచి దూరంగా పారిపోవాలనుకుంటారు? ఒక కథనం దీనికి కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తుంది. ఆ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా దానికి ఎలా పరిష్కారాన్ని కనుగొన్నారో ఆ కథనంలో చదవండి. ఒక మహిళ వికలాంగురాలైతే, ఆమె తన భర్త, అతని కుటుంబం దృష్టిలో 'సంపూర్ణ' మహిళ' ఎలా కాగలదు? సహజీవనం ఇచ్చిన ధైర్యంతో ఒక మహిళకు తన సామర్థ్యంపై విశ్వాసం, నమ్మకం ఎలా పెరిగాయో మరో కథనం వివరిస్తుంది. తక్కువ చదువుకున్నా, తన కాళ్ల మీద తాను నిలబడుతూ, ఒక బాధ్యత లేని వ్యక్తితో కలిసి జీవిస్తున్న మరో మహిళ కథనం కూడా ఉంది. అతను ఏమీ సంపాదించకపోవడమే కాకుండా, తనకు ఇష్టం వచ్చినపుడు వచ్చి తనతో సెక్స్‌లో పాల్గొనమని ఆమెను బలవంతం చేస్తుంటాడు. అతను కండోమ్‌లు ఉపయోగించడు. దాంతో ఆమె బలహీనురాలైపోతోంది. కానీ ఆ సంబంధాన్ని తెగ్గొట్టుకొనేందుకు ఆమె సిద్ధంగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆ మహిళ ఏం చేయాలి? ఈ వారాంతం నుంచి బీబీసీ స్పెషల్ సిరీస్ #HerChoice ఇలాంటి 12 కథనాలను మీ ముందుకు తెస్తుంది. ఇదంతా మన మధ్యనే జరుగుతోందని మీరు గుర్తుంచుకోవాలి. కొంతమంది మహిళలు ఆలోచిస్తున్నారు, మరికొందరు అనుకున్న పనిని చేస్తున్నారు. అలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి మనకు ఇది ఒక అవకాశం. 'భాగీ హుయీ లడ్‌కీ' కవితలో అలోక్ ధన్వా ఆ తర్వాత రాసినట్లు... 'అనేక మంది బాలికలు తమ ఆలోచనల్లో పారిపోతుంటారు రాత్రిళ్లు మేల్కొని, తమ డైరీ పేజీలలో, వాళ్ల సంఖ్య నిజంగా పారిపోయిన వాళ్లకంటే చాలా ఎక్కువ..' ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) 'భార్యలను వేశ్యల నుంచి, ప్రియురాళ్లను భార్యల నుంచి వేరు చేసి చూసే నువ్వు, ఒక మహిళ నిర్భయంగా తిరుగుతూ వేశ్యలు, భార్యలు, ప్రియురాళ్లలో తన ఉనికిని వెదుక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎందుకంత ఆందోళన?' text: గత ఏడాది దేశమంతటా 1,39,123 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు అందులో పేర్కొంది. వారిలో 10,281 మంది రైతులు, రైతు కూలీలని తెలిపింది. అంటే దేశంలోని జరుగుతున్న మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 7.4 శాతం మంది రైతులే ఉన్నారన్న విషయం ఈ తాజా నివేదిక ద్వారా అర్థమవుతోంది. దేశంలో 10,281 ఆత్మహత్యలలో 5,957 మంది రైతులు కాగా 4,324 రైతు కూలీలు ఉన్నారు. రైతులు, రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (3,927 బలవన్మరణాలు) మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 628 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 499 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 2018లో 908, 2017లో 851 రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం... 2019లో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 499 మంది రైతుల్లో సొంత భూమి ఉన్నవారు 373 మంది, కౌలు రైతులు 118 మంది, రైతు కూలీలు ఎనిమిది మంది ఉన్నారు. 2016లో రోజుకు 14 మంది రైతు కూలీలు ప్రాణాలు తీసుకున్నారు. ‘ప్రభుత్వ చర్యలు ఫలితాలనిస్తున్నాయి’: తెలంగాణ వ్యవసాయ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో కొన్నేళ్లుగా రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉంటున్నాయి. వాటిని నివారించేందుకే 2018 ఆగస్టులో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ చర్యల కారణంగానే గత ఏడాది రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు. “రైతు బంధు, రైతు బీమా పథకాలు, సాగు నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం, సకాలంలో విత్తనాల సరఫరా, మద్దతు ధరకే పంటలను కొనుగోలు చేయడం వంటి ప్రభుత్వ చర్యల కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి” అని ఆయన బీబీసీతో అన్నారు. గోదాముల సంఖ్య పెంచిన కారణంగా రైతులకు పంట నష్టం తగ్గిందని నిరంజన్ రెడ్డి ఆన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు, తెలంగాణ ప్రాంతంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండేవని, రాష్ట్రం ఏర్పడ్డాక వాటి సామర్థ్యాన్ని 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని ఆయన తెలిపారు. మరోవైపు ప్రభుత్వం చేయాల్సింది ఇంకా చాలా ఉందని అంటున్నాయి ప్రతిపక్షాలు. “రైతులకు మద్దతు ధర పెంచాలి. వాణిజ్య పంటల సాగు పెంచాలి. రైతు ఆత్మహత్యలు అసలు ఎందుకు ఉండాలి? అన్నదాతల ఆత్మ హత్యలు లేకుండా చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలి” అని కాంగ్రస్ నేత గూడూరు నారాయణ రెడ్డి బీబీసీతో అన్నారు. ఆత్మహత్య చేసుకున్న భర్త ఫొటోలతో దిల్లీలో ఆందోళన చేసిన తెలుగు రాష్ట్రాల మహిళలు. ‘కౌలు, ఆదివాసీ రైతులను విస్మరిస్తున్నారు’ రైతు ఆత్మహత్యలు తగ్గడంలో రైతు బంధు పథకం, ప్రభుత్వ పంట సేకరణ కొంత మేరకు ఉపయోగపడ్డాయని రైతు సంఘాల నేతలు కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో నమోదు కావడం లేదని రైతు స్వరాజ్య వేదిక నాయకుడు కన్నెగంటి రవి బీబీసీతో అన్నారు. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “భూమి లేని కౌలు రైతులకు, ఆదివాసీ ప్రాంతాల రైతులకు రైతు బంధు, రైతు బీమా అమలు కావడం లేదు. మహిళా రైతులను రైతులుగా గుర్తించడం లేదు’’ అని ఆయన అన్నారు, కౌలు రైతులను గుర్తించి వారికి రైతుబంధు ఇవ్వగలిగితే... పోడు రైతులకు కూడా రైతు బంధు, రైతు బీమా పథకం వర్తింపజేస్తే రైతు ఆత్మహత్యలు మరింత తగ్గుతాయని కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు. “వ్యవసాయ కూలీలకు సమగ్ర సాంఘిక సంక్షేమ పథకం అమలు చేయాలి. ఈ కుటుంబాలకు కూడా బీమా పథకం అమలు చేయాలి. అప్పుడే రైతు ఆత్మహత్యలు తగ్గుతాయి” అని అన్నారు. వీటన్నింటితోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఓ సమగ్ర వ్యవసాయ విధానం అవసరం అని రైతు సంఘాల నేతలు అంటున్నారు. రైతు ఆత్మహత్యల విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోసం బీబీసీ సంప్రదించినప్పటికీ ప్రభుత్వ వర్గాల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీ‌ఆర్‌బీ) నివేదికను విడుదల చేసింది. text: దానికి ఒక కారణం ఉంది. అఫ్గానిస్తాన్ అప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించినా.. వారి ఆటతీరు అందరినీ ఆకర్షించింది. మరోవైపు భారతీయ జట్టులోని ప్రముఖ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అందుకే, ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ మెరుగైన ఆట ప్రదర్శిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. సీనియర్ ఆటగాళ్ళు లేకుండా బరిలోకి దిగిన భారతీయ జట్టును ఆ టీమ్ ఎదుర్కోగలదా అనుకున్నారు. అక్కడ అదే జరిగింది. అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోగానే అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. కానీ మొహమ్మద్ షహజాద్ అద్భుత సెంచరీతో కెప్టెన్‌గా తన నిర్ణయం సరైనదే అని నిరూపించాడు. భారత జట్టుకు సవాలు విసిరేలా ఆ టీమ్ 252 పరుగుల స్కోరు కూడా చేసింది. మ్యాచ్ ఎలా టై అయ్యింది? అఫ్గానిస్తాన్‌ నిర్దేశించిన లక్ష్యానికి సమాధానంగా భారత్‌కు మంచి ప్రారంభమే లభించింది. అయితే, ఓపెనర్లు ఇద్దరి పార్టనర్‌షిప్ తర్వాత మరో సుదీర్ఘ భాగస్వామ్యం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లో రవీంద్ర జడేజా అత్యుత్సాహంతో కొట్టిన షాట్ టీమిండియాను 252 పరుగులకే పరిమితం చేసింది. మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కెప్టెన్ ధోనీ అఫ్గానిస్తాన్‌ను ఆకాశానికెత్తేశాడు. "నాకు ఈ జట్టు క్రికెట్ చాలా మెరుగైందని అనిపిస్తోంది. ఆసియా కప్ ప్రారంభం నుంచి వారు బాగా ఆడారు. అప్ఘానిస్తాన్ తమ ఆటను అద్భుతంగా మెరుగు పరుచుకున్న జట్టుగా నిలుస్తుంది" అన్నాడు. "అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ చాలా బాగుంది. చాలా బాగా ఫీల్డింగ్ చేశారు, బౌలింగ్ కూడా టైట్‌గా ఉంది" అన్నాడు ధోనీ. శిఖర్ ధవన్, రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్లకు, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆ ప్రభావం భారత జట్టుపై చాలా స్పష్టంగా కనిపించింది. ధోనీ ఇంకేం చెప్పాడు? "దీన్ని మేం మా పూర్తి బలంతో ప్రారంభించలేదు. చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చాం. బంతి స్వింగ్ కానప్పుడు, ఫాస్ట్ బౌలర్లు లెంత్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అలా మేం 5-6 ఓవర్లు నష్టపోయాం" అని ధోనీ చెప్పాడు. "కొంతమంది రనౌట్ కూడా అయ్యారు. అవి కాకుండా వేరే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని నేను ప్రస్తావించాలని అనుకోవడం లేదు. జరిమానా కట్టడం నాకు ఇష్టం లేదు. ఫలితం చూస్తే టై అనేది అంత తక్కువేం కాదు. మేం ఓడిపోయి కూడా ఉండవచ్చు" అని ధోనీ అన్నాడు. ఇంతకీ, ధోనీ ఏయే విషయాలను ప్రస్తావించదలచుకోలేదని అన్నాడు? ఏ విషయాలు మాట్లాడితే జరిమానా కట్టాల్సి వస్తుందని భావించాడు? అంపైర్ నిర్ణయాల గురించే అతను అలా అన్నట్టు తెలుస్తోంది. వాటిలో మహి ఎల్‌బీడబ్ల్యు కూడా ఉంది. కానీ, అంపైరింగ్‌తో పాటు కెఎల్ రాహుల్‌ నిర్ణయం కూడా అతడికి బాధ కలిగించింది. కెఎల్ రాహుల్ పొరపాటు దెబ్బ కొట్టిందా? 26వ ఓవర్లో జావేద్ అహ్మదీ వేసిన ఐదో బంతికి ధోనీ ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. బంతి తన ప్యాడ్‌కు తగలగానే అంపైర్ వేలెత్తేశాడు. దాంతో ధోనీ బాధగా పెలివియన్ దారి పట్టాల్సి వచ్చింది. రీప్లేలో ధోనీ బాధకు కారణం ఏంటో తెలిసింది. బంతి ఆఫ్ స్టంప్‌పై తన ప్యాడ్‌కు తగిలింది. ఆ టైంలో తను షాట్ కొట్టడానికి కాలు కూడా బయటకు పెట్టాడు. టర్న్ అయిన బంతి లెగ్ స్టంప్ నుంచి బయటికి వెళ్తున్నట్టు కూడా కనిపించింది. కానీ, ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి ధోనీకి DRS (అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే విధానం - డిసెషన్ రివ్యూ సిస్టమ్) ఆప్షన్ లేకుండా పోయింది. దానిని అప్పటికే ఓపెనర్ కెఎల్ రాహుల్ వాడేశాడు. 21వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్ ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ దినేష్ కార్తీక్‌తో చర్చించిన తర్వాత రాహుల్ DRS తీసుకున్నాడు. ధోనీ అభిమానుల ఆగ్రహం కానీ, రీప్లేలో అవుట్ అయినట్లు స్పష్టంగా తేలడంతో రాహుల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. రాహుల్ DRS తీసుకోకుండా ఉంటే, ధోనీకి DRS ప్రత్యామ్నాయం ఉండేది. అంపైర్ నిర్ణయాన్ని తప్పని నిరూపించే అవకాశం లభించేది. సోషల్ మీడియాలో ధోనీ అభిమానులు ఇదే విషయంపై పోస్టులు పెడుతున్నారు. సర్ జడేజా అనే హ్యాండిల్లో "కెఎల్ రాహుల్ రివ్యూ అడగకుంటే, ధోనీ నాటవుట్ అయ్యేవాడు, క్రీజులోనే నిలిచేవాడు" అని ట్వీట్ చేశారు. దీపక్ రాజ్ వర్మ అనే మరో హ్యాండిల్ "ఎంఎస్ ధోనీ అవుట్ కాలేదు, కానీ, రాహుల్ రివ్యూ వాడేయడం వల్ల, అతడు పెవిలియన్ చేరాల్సి వచ్చింది" అని పెట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ మ్యాచ్ ఫలితం వల్ల టీమిండియాపై ఎలాంటి ప్రభావం పడదు. అయినా, భారత్-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. text: కానీ సోషల్ మీడియా వేదికలు విపరీతంగా వ్యాప్తిచెందటం వల్ల కొన్ని సవాళ్లు కూడా పుట్టుకొచ్చాయి. ఫేక్ న్యూస్ (బూటకపు వార్తలు)ను గుర్తించటం అందులో ఒకటి. కఠినమైన సైబర్ చట్టాలు ఉన్నా కూడా.. దీనిని ఎదుర్కోవటానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందా? బీబీసీ ఇండియా ప్రతినిధి షుమైలా జాఫ్రీ కథనం... పోస్ట్ of YouTube ముగిసింది, 1 మాలీకా బొఖారీ పాకిస్తాన్ ఎంపీ. కొన్ని వారాల కిందట ఆమె లక్ష్యంగా ఒక ఫేక్ న్యూస్ ప్రచారమైంది. ఓ కీలక పదవిలో ఆమెను నియమించటానికి కారణం ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ సన్నిహిత మిత్రుడొకరికి ఆమె సోదరి కావటమేనన్నది ఆ ఫేక్ న్యూస్ సారాంశం. మాలీకా ఖండించినా దానిని ఎవరూ పట్టించుకోలేదు. ''మహిళను కాబట్టి అది నన్ను చాలా బాధపెట్టింది. నేను ఎన్నడూ మహిళ అనే కార్డును ఉపయోగించను. జనం మహిళల గురించి మాట్లాడేటపుడు ఫొటోలు కూడా షేర్ చేస్తుంటారు. అది చాలా బాధపెడుతుంది'' అని మాలీకా బొఖారి బీబీసీతో పేర్కొన్నారు. మాలీకా ఘటన తర్వాత పాకిస్తాన్ సమాచార మంత్రిత్వశాఖ.. ఫేక్ న్యూస్‌ను గుర్తించటం కోసం ఒక ట్విటర్ అకౌంట్‌ను క్రియేట్ చేసింది. కానీ.. దీనిని క్రియేట్ చేసిన కొన్ని గంటలకే ఈ ట్విటర్ అకౌంట్‌ను అనుకరిస్తూ ఫేక్ అకౌంట్ ట్విటర్‌లో ప్రత్యక్షమైంది. దీంతో సమాచార మంత్రిత్వశాఖ ఖండనను జారీచేయాల్సి వచ్చింది. సమాచార మంత్రిత్వశాఖ సైబర్ విభాగం ఆ అకౌంట్‌ను నిర్వహిస్తోంది. కొన్ని రోజుల్లేనే వేలాది మంది ఆ అకౌంట్‌ను ఫాలో అయ్యారు. కానీ ఇప్పటివరకూ ఇది ఎటువంటి ఫేక్ న్యూస్‌నూ గుర్తించలేదు. ప్రధానమంత్రి గురించి, తమ ప్రభుత్వం గురించి వచ్చే తప్పుడు సమాచారాన్ని గుర్తించి చెప్పటానికే అది పరిమితమైంది. ''ప్రివెన్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ చట్టం ఇప్పటికే అమలులో ఉంది. అయినా చాలా మంది ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. కొందరికి తాము చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామని తెలియదు. కానీ ఒక బృందం ఇలా చేస్తోందంటే.. ఏవో ఉద్దేశాలున్నట్టే'' అని సైబర్ విభాగం డీజీ జహంగీర్ ఇక్బాల్ చెప్పారు. ఇక ముహమ్మద్ సొహాయిబ్ ఓ జర్నలిజం విద్యార్థి. అతడు గత ఏడాది.. పనామా కేసులో నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా ఒక బూటకపు తీర్పును సృష్టించి తన స్నేహితులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లో దానిని షేర్ చేశాడు. అది సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందంటే.. ప్రధాన స్రవంతిలోని టీవీ చానళ్లు కూడా వాస్తవ తీర్పుకు బదులుగా ఈ నకిలీ తీర్పునే తమ చానళ్లలో చూపించాయి. ''పలు టీవీ చానళ్లు దీనిని బాహాటంగా చూపించాయి. చాలా మంది వ్యాఖ్యాతలు దీనిని చదివారు. కొన్ని కార్యక్రమాల్లో న్యాయవాదులు సైతం దీనిని విశ్లేషించారు. కానీ ఇది నకిలీదని గుర్తించలేకపోయారు'' ముహమ్మద్ సోహాయిబ్ బీబీసీ ప్రతినిధికి వివరించారు. పాకిస్తాన్‌లో ఫేక్ న్యూస్ అనేది ఒక తీవ్ర సమస్య అని మీడియా డెవలప్‌మెంట్ సంస్థలు భావిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి దీనికి ఏ పరిష్కారమూ లేదు. దీని గురించి మెయిన్‌స్ట్రీమ్ జర్నలిస్టులకు కూడా అవగాహన లేదు. ''ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలియదు. కానీ ఆ పరిష్కారం ఈ రంగం లోపలి నుంచే రావాలి. ఒకవేళ బయటి నుంచి.. అంటే ప్రభుత్వం నుంచి పరిష్కారం వస్తే.. అది జర్నలిజాన్ని దెబ్బతీస్తుంది'' అని మీడియా మేటర్స్ ఫర్ డెమొక్రసీ అనే సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ సదాఫ్ ఖాన్ వ్యాఖ్యానించారు. దేశంలో సెన్సార్‌షిప్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఫేక్‌న్యూస్‌ని సక్రమంగా నిలువరించలేకపోతే.. ప్రభుత్వం దానిని సాకుగా వాడుకుని సోషల్ మీడియా మీద ఆంక్షలు విధించే అవకాశముందని పాకిస్తాన్‌లోని మీడియా ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇంటర్నెట్ విస్తరణ, సోషల్ మీడియాకు ఆదరణ పెరుగుతుండటంతో.. గతంలో ఎన్నడూ లేని విధంగా జనం సమాచారం పంచుకోవటానికి, అభిప్రాయాలు వ్యక్తంచేయటానికి అవకాశం అందివచ్చిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. text: హవేరీ నగరంలోని భగత్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ఇటీవల మిడ్ టెర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించగా విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకంటూ ఓ అధ్యాపకుడు వారి తలలకు అట్టపెట్టెలు అమర్చారు. నాలుగు వైపులా మూసి ఉన్న అట్టపెట్టెలకు ఒక వైపు ముఖం వెడల్పున రంథ్రం చేసి వాటిని విద్యార్థుల తలలకు పెట్టారు. అలా చేయడం వల్ల వారు ఎదురుగా ఉన్న ప్రశ్నపత్రం, జవాబు పత్రం తప్ప పక్కకు తిరిగి చూడడానికి వీలుండదన్న ఉద్దేశంతో వారు ఈ పనిచేశారు. విద్యార్థులు అలా పరీక్షలు రాస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి అధికారులు స్పందించారు. విద్యార్థులతో అలా పరీక్షలు రాయించిన నిర్వాహకుడు ఎం.బి.సతీశ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయన క్షమాపణ చెబుతూ లేఖ రాశారు. ''ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడూ చేయబోనని జిల్లా ఉప కమిషనర్‌కు రాత పూర్వకంగా క్షమాపణ చెప్పాను'' అని సతీశ్ బీబీసీతో చెప్పారు. అయితే, సతీశ్ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. తాను విద్యార్థుల సమ్మతితోనే అలా చేశానని, వారే అట్టపెట్టెలు తెచ్చుకుని తలలకు తగిలించుకుని పరీక్షలు రాశారని ఆయన అన్నారు. ''ఇలా చేయమని ఎవరినీ బలవంతం చేయలేదు. ఆ ఫొటోల్లో చూస్తే కొందరు అట్టపెట్టెలు పెట్టుకోని విద్యార్థులూ కనిపిస్తారు. కొందరు కాసేపు పెట్టుకుని తరువాత తీసేశారు. కానీ, ఆ ఫొటో వైరల్ అయిపోయింది'' అన్నారాయన. ''ఇది కేవలం ప్రయోగపూర్వకంగా చేశాం. జపాన్, చైనాల్లో ఇది సర్వసాధారణం. ముంబయిలోనూ ఇలా కొన్ని చోట్ల చేసినట్లు వార్తలొచ్చాయి'' అన్నారు సతీశ్. ఈ వ్యవహారంపై ప్రీ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌సీ పీర్జాదా మాట్లాడుతూ.. ''సతీశ్ సోషల్ మీడియా స్టేటస్‌లో ఈ చిత్రం చూడగానే నేను వెంటనే పరీక్ష జరుగుతున్న గదికి వెళ్లాను. నేను వెళ్లేటప్పకి కూడా కొందరు విద్యార్థులకు తలలకు అట్టపెట్టెలున్నాయి. కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరుగుతున్నాయి అప్పుడు'' అన్నారు. ''బిహార్లోని ఒక కాలేజీలో ఇలాంటి విధానం పరీక్షించి చూసినట్లు పేపర్లలో చదివానని, అందుకే తానూ ప్రయోగాత్మకంగా ఇలా చేశానని సతీశ్ నాతో అన్నారు'' అని చెప్పారాయన. ఇలాంటి పద్ధతులతో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ''ఇలా చేసేటప్పుడు పిల్లలకు ఏం చెప్పారన్నది కీలకం. సరదా కోసమే అని చెబితే ఫరవాలేదు. అంతేకానీ, మీరంతా కాపీ కొడుతున్నారు కాబట్టి ఇలా చేయండి అంటే మాత్రం అది వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ప్రపంచం తమను నమ్మడం లేదన్న భావన వారిలో ఏర్పడుతుంది'' అని సైకాలజిస్ట్ అచిరా చటర్జీ 'బీబీసీ'తో అన్నారు. ఈ ఘటన అధ్యాపకుల అసమర్థతకు అద్దం పడుతందని, విద్యార్థులు మోసం చేస్తారన్న భావనలో అధ్యాపకులు ఉండడం వల్ల ఇలాంటిది జరిగిందని.. ఒకవేళ నిజంగా విద్యార్థులు మోసం చేసినా దాన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధానం ఇది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కాపీ కొట్టకుండా పరీక్షలు రాయాలన్న బుద్ధిని విద్యార్థులకు అందించలేకపోవడం అధ్యాపకుడి వైఫల్యమని, విద్యార్థులకు ఇలాంటి శిక్ష వేయడం సరైంది కాదని ఆమె చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కర్నాటకలో ఓ కాలేజీలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కాపీ కొట్టకుండా వారి తలలకు అట్టపెట్టెలు అమర్చడం వివాదాస్పదమైంది. దీంతో ఇందుకు బాధ్యుడైన నిర్వాహకుడు అధికారులకు క్షమాపణ చెప్పారు. text: బిష్నోయి సముదాయానికి చెందిన వారు అటవీ జంతువులను, చెట్లను కాపాడడం కోసం తమ ప్రాణాలివ్వడానికైనా వెనుకాడరని ప్రతీతి. అందుకే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల్ని వేటాడారన్న విషయం తెలియగానే ఈ సముదాయానికి చెందిన జనాలంతా రోడ్డెక్కారు. బిష్నోయి సముదాయానికి చెందిన వారు తమ ఆరాధ్య గురువు జంభేశ్వర్ బోధించిన 29 నియమాలను పాటిస్తారు. పశుపక్ష్యాదులనూ, చెట్లను కాపాడడం అన్నది వీటిలో ఒకటి. బిష్నోయిలు కేవలం ఎడారి ప్రాంతంలోనే లేరు. రాజస్థాన్‌తో పాటు హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వారు ఉన్నారు. తమ సముదాయానికి చెందిన త్యాగధనులను గుర్తు చేసుకోవడం కోసం బిష్నోయిలు ఏటా రాజస్థాన్‌లోని ఖేజ్‌డలీ గ్రామంలో మేళాలో పాల్గొంటారు. బిష్నోయి సముదాయం జోధ్‌పూర్ నుంచి గతంలో ఎంపీగా ఉన్న జస్వంత్ సింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ, "మా సంస్థాపకుడు జంభేశ్వర్ భూతదయను బోధించారు. ప్రాణులను కాపాడాలి. చెట్లను రక్షించాలి అన్నది ఆయన మాకు నేర్పిన పాఠం. ఈ పనులు చేసిన వ్యక్తికి వైకుంఠం ప్రాప్తిస్తుందని ఆయన బోధించారు" అని అన్నారు. రాజరికపు రోజుల్లో ఈ సముదాయానికి చెందిన వారు చెట్లనూ, పశుపక్షులను కాపాడడం కోసం రాజ్యంతో సైతం పోరాడిన సందర్భాలున్నాయి. బిష్నోయి సమాజానికి చెందిన పర్యావరణ కార్యకర్త హనుమాన్ బిష్నోయి మాట్లాడుతూ, "జోధ్‌పూర్ రాజ్యంలో నాటి పాలకులు చెట్లు నరకాలని ఆదేశించినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ బిష్నోయి సమాజం వారు ఆందోళన చేపట్టారు. ఇది 1787 నాటి విషయం. ఆ సమయంలో ఈ రాజ్యాన్ని అభయ్‌సింగ్ పాలించేవాడు" అని చెప్పారు. "ఆ సమయంలో - సర్ సాఠే రూంఖ్ రహే తో భీ సస్తో జాన్ - అనే నినాదం ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే, తల నరుక్కొని అయినా సరే చెట్లు కాపాడుదాం. ఎందుకంటే చెట్ల కంటే మన తలలే చౌక" అని జోధ్‌పూర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి జస్వంత్ బిష్నోయి అన్నారు. 'పూర్వీకుల త్యాగాలు' "రాజభటులు వచ్చి చెట్లు నరకడానికి ప్రయత్నించగా జనం జోధ్‌పూర్ దగ్గరలో ఉన్న ఖేజ్‌డలీకి చేరుకొని దానికి నిరసన తెలిపారు" అని బిష్నోయి చెప్పారు. "ఆ సమయంలో బిష్నోయి సమాజానికి చెందిన అమృతాదేవి నిరసన ప్రదర్శనలకు నేతృత్వం వహించారు. చెట్టుకు బదులు తనను నరకండని ఆమె ముందుకొచ్చారు." ఆ సందర్భంగా చెట్లను కాపాడేందుకు మొత్తం 363 మంది ప్రాణాలు అర్పించారు. వారిలో 111 మంది మహిళలు." "నాడు ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవడం కోసం ఖేజ్‌డలీలో ప్రతి ఏటా మేళా జరుగుతుంది. జనం తమ పూర్వీకుల బలిదానాలను గుర్తు చేసుకొని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తారు." "తమ సంకల్పాన్ని ప్రకటించడానికే కాకుండా, వన్య ప్రాణులనూ, చెట్లనూ రక్షించాల్సిన బాధ్యత గురించి కొత్త తరాలకు అవగాహన కల్పించడం కోసం కూడా ఈ మేళాను నిర్వహిస్తుంటారు." గురు జంభేశ్వర్ - బిష్నోయిల గురువు గురు జంభేశ్వర్ 1451లో జన్మించారు. బీకానేర్ జిల్లాలోని సమర్‌స్థల్ గురువు జన్మస్థలం. అది బిష్నోయిలకు ఓ తీర్థ స్థలం. ఆ ప్రాంతంలో ఉన్న మకామ్‌లో గురు జంభేశ్వర్ సమాధి కూడా ఉంది. అక్కడ కూడా ప్రతి ఏటా మేళా జరుగుతుంది. మార్వాడ్ రాజ్యంలో జనగణన సూపరింటిండెంట్ (సెన్సస్ సూపరింటిండెంట్)గా ఉన్న మున్షీ హర్‌దయాల్ బిష్నోయి సముదాయం గురించి ఓ పుస్తకం రాశారు. "బిష్నోయి సమాజం సంస్థాపకుడైన జంభోజీ పవార్ (జంభేశ్వర్) నిజానికి రాజ్‌పుత్ కులానికి చెందిన వాడు. 1487లో తీవ్రమైన కరవు ఏర్పడినప్పుడు జంభోజీ ప్రజలను ఆదుకోవడానికి బాగా కృషి చేశారు" అని ఆయన ఆ పుస్తకంలో రాశారు. "ఆ సమయంలో జాట్ సముదాయం వాళ్లు కూడా జంభోజీతో ప్రభావితులై, బిష్నోయి సంప్రదాయాన్ని స్వీకరించారు." 'బీస్ (ఇరవై), నౌ (తొమ్మిది) కలిస్తే బిష్నోయి' జంభోజీ హిందువుల దేవుడైన విష్ణువు అవతారమని బిష్నోయి సముదాయం వారు విశ్వసిస్తారని మున్షీ హర్‌దయాల్ రాశారు. జంభోజీ బోధించిన మొత్తం 29 జీవన నియమాల సారమే బిష్నోయి అని వ్యాఖ్యానిస్తారు. ఇరవై (బీస్), తొమ్మిది (నౌ) కలిసి బిష్నోయి అయ్యింది. బిష్నోయి సమాజంలో చనిపోయిన వారిని ఖననం చేస్తారు. మాజీ ఎంపీ బిష్నోయి ఇలా అంటారు: "రాజస్థాన్, హరియాణా, పంజాబ్ మొదలైన రాష్ట్రాల్లో ఎవరైనా చనిపోతే శవాన్ని ఖననం చేస్తారు. యూపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం దహనం చేస్తారు." ఎడారిలో వన్య ప్రాణుల విషయంలో బిష్నోయిలు చాలా కచ్చితమైన వైఖరితో ఉంటారు. జింకల్ని వేటాడే వారితో బిష్నోయిలు తలపడ్డారన్న వార్తలు తరచుగా వినవస్తుంటాయి. ప్రగాఢ బంధం బిష్నోయిలు ఎక్కువగా ఉండే గ్రామాల్లో బిష్నోయి మహిళలు అనాథ జింకపిల్లను చంకలోకి ఎత్తుకొని స్తన్యం ఇచ్చే దృశ్యాలు కూడా కనిపిస్తాయి. "మూగజీవాలతో బిష్నోయి సమాజానికి ఎంత లోతైన సంబంధాలుంటాయనడానికి ఇది ఉదాహరణ మాత్రమే" అని మాజీ ఎంపీ బిష్నోయి అంటారు. సాధారణంగా బిష్నోయిలకు వ్యవసాయం, పశుపాలనలే ప్రధాన వ్యాపకం. అయితే కాలగమనంతో పాటు బిష్నోయిలు కూడా పరిశ్రమల్లోకి, వ్యాపారంలోకి అడుగుపెట్టారు. "ప్రకృతిని గౌరవించాలని జంభోజీ మాకు నేర్పించారు. మేం సమస్త ప్రాణుల సహఅస్తిత్వాన్ని విశ్వసిస్తాం" అని బిష్నోయి సమాజానికి చెందిన హనుమాన్ బిష్నోయి అంటారు. "మానవ జీవితం ఎంత విలువైందో, ప్రకృతిని కాపాడడం కూడా అంతే విలువైంది." "జంభోజీ జీవితంతో, బోధనలతో ప్రభావితులైన అనేక కులాల వారు బిష్నోయి జీవన విలువల పట్ల విశ్వాసం ప్రకటించారు. బిష్నోయిలుగా మారిపోయారు" అని ఆయనంటారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నిర్జన ఎడారి ప్రాంతంలో వన్య ప్రాణులనూ, చెట్లను కాపాడడానికి నడుం బిగించిన జన సముదాయం బిష్నోయిలది. text: ఈ వైరస్ వల్ల చనిపోయిన 56 మందిలో 15 మందికి జమాత్‌తో లింకులు ఉన్నట్టు బయటపడ్డాయి. మొత్తం 2 వేల మందికి కరోనావైరస్ వ్యాపించగా వాటిలో 400 కేసులు తబ్లీగీ జమాత్‌కు సంబంధించినవే. కానీ, ఈ విషయం బయటికొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల వాదనలు కనిపిస్తున్నాయి. వాటితోపాటూ, జమాత్‌లో పాల్గొని కరోనా పాజిటివ్ వచ్చిన కొందరు, ఆ వైరస్ వ్యాపించేలా పోలీసులపై ఉమ్మినట్లు ఒక వీడియో షేర్ చేస్తున్నారు. గురువారం సాయంత్రం ట్విటర్‌లో ఒక యూజర్ 27 సెకన్ల ఈ వీడియోను పెట్టి “ఆధారాలు కావల్సిన వారు ఈ వీడియోను చూడండి” అని ట్వీట్ చేశాడు. ట్విటర్‌లో ఈ వీడియోను 81 వేల మందికి పైగా చూశారు. దాదాపు 4 వేల మంది రీట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌ ఇప్పుడు డెలిట్ అయ్యింది. దీనిని, ఫేస్‌బుక్‌లో కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు. మేఘరాజ్ చౌధరి అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను రెండు లక్షల మంది చూశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతడికి అటూఇటూ, ఎదురుగా పోలీసులు కూర్చుని కనిపిస్తారు. ఆ వ్యక్తి ఎదురుగా కూర్చున్న పోలీసుపై ఉమ్ముతాడు. ఆ తర్వాత పోలీసులు అందరూ లేచి అతడిని కొడతాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా శబ్దాలు వినిపిస్తాయి. వీడియో అక్కడితో ముగుస్తుంది. ఈ వీడియోను నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ ఘటనకు సంబంధించినదిగా చెబుతూ షేర్ చేస్తున్నారు. నిజానికి, బుధవారం పీటీఐ, ఏఎన్ఐ రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 167 మందిని తుగ్లకాబాద్‌లో ఉన్న రైల్వే క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. అక్కడ వీరు డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాదు, వారిపై ఉమ్మారు కూడా. కానీ, వైరల్ అవుతున్న ఈ వీడియోను ఆ వార్తతో లింకుపెట్టి షేర్ చేస్తున్నారు. బీబీసీ అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది. ఈ వీడియోలో చెబుతున్న వాదన సరైనదేనా అని తెలుసుకోడానికి ప్రయత్నించింది. ఈ వీడియోపై మొదట ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే తబ్లీగీ జమాత్ వారు అందరినీ డీటీసీ బస్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. కానీ, వీడియోలో కనిపిస్తున్న ఇది పోలీస్ వ్యాన్‌లా ఉంది. అందులో వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టి కనిపిస్తున్నారు. అతడు కరోనా పాజిటివ్ అయితే, మెడికల్ పరీక్షల కోసం తీసుకెళ్తుంటే, ఆ వాహనంలో మెడికల్ స్టాఫ్ ఒక్కరు కూడా ఎందుకు లేరు. ఈ వీడియో ఫ్రేమ్ ఉపయోగించి మేం రివర్స్ సెర్చ్ చేసినప్పుడు, మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఒక వీడియో దొరికింది. 2020 మార్చి 2న పబ్లిష్ చేసిన వీడియోలో చూపిస్తున్న దాని ప్రకారం ఒక అండర్ ట్రయల్ ఖైదీ తనను తీసుకెళ్తున్న పోలీసులతో గొడవ పడ్డాడు. వారిపై ఉమ్మాడు. నిజానికి, ఇంట్లో వాళ్లు తన కోసం తీసుకొచ్చిన భోజనం తినడానికి అనుమతించలేదనే కోపంతో అతడు ఇదంతా చేశాడు. ఈ వీడియోను మరింత సెర్చ్ చేసినపుడు మాకు మహారాష్ట్ర టైమ్స్, ముంబయి మిర్రర్‌లో కూడా ఇదే వీడియో కనిపించింది. ముంబయి మిర్రర్‌లో 2020 ఫిబ్రవరి 29న ఈ వీడియోను షేర్ చేశారు. అందులో ఉన్న వివరాల ప్రకారం ఇందులో అలా చేసిన వ్యక్తి పేరు మొహమ్మద్ సుహైల్ షౌకత్ అలీ. వయసు 26 ఏళ్లు. ఇతడిని విచారణ కోసం ముంబయి కోర్టుకు తీసుకెళ్లారు. అతడి కుటుంబ సభ్యులు సుహైల్ కోసం ఇంటి భోజనం తీసుకొచ్చారు. కానీ పోలీసులు అది తిననివ్వకుండానే అతడిని తీసుకెళ్లిపోయారు. దాంతో కోపమొచ్చిన అతడు పోలీసులతో గొడవపడ్డాడు. వాళ్లపై ఉమ్మాడు. తర్వాత పోలీసులు షౌకత్ అలీని కొట్టారు. నిజానికి, ఈ వీడియో మొత్తం ఒక నిమిషం 25 సెకన్లు ఉంది. ఇందులో షౌకత్ అలీ పోలీసులతో గొడవపడడం, వారిని బూతులు తిట్టడం కూడా వినిపిస్తుంది. కానీ, గురువారం నాడు వైరల్ అయిన వీడియో 27 సెకన్లు మాత్రమే ఉంది. నిజాముద్దీన్‌లో ఉన్న తబ్లీగీ జమాత్‌తో దీనికి లింకు పెడుతున్నారు. బీబీసీ పరిశోధనలో ఇది దిల్లీది కాదని, ముంబయికి సంబంధించిన ఒక పాత వీడియో అని తేలింది. దీనికి తబ్లీగీ జమాత్ లేదా కరోనా వైరస్ కేసులతో ఎలాంటి సంబంధం లేదని, దీనిని షేర్ చేస్తూ చెబుతున్నవి కూడా పూర్తిగా అబద్ధం అని గుర్తించింది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మార్చిలో జరిగిన తబ్లీగీ జమాత్ ధార్మిక కార్యక్రమానికి హాజరైన వారికి కరోనావైరస్ వ్యాపించిన తర్వాత దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. text: ఎడమ నుంచి కుడివైపు.. కిమ్ హాక్-సాంగ్, కిమ్ డోంగ్-చు, టోనీ కిమ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ మధ్య త్వరలో జరుగనున్న చరిత్రాత్మక సమావేశం నేపథ్యంలో సుహృద్భావ సూచికగా ఈ పరిణామాన్ని పరిగణిస్తున్నారు. శిఖరాగ్ర సదస్సు ఏర్పాట్లలో భాగంగా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోతో పాటు ఖైదీలు ముగ్గురూ తిరిగి వస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా విడుదల చేసిన కిమ్ హాక్-సాంగ్, టోనీ కిమ్, కిమ్ డోంగ్-చు.. ముగ్గురూ ‘‘ఎవరి సాయం లేకుండా విమానంలో నడువగలుగుతున్నారు’’ అని అమెరికా అధ్యక్ష భవనం పేర్కొంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై వారిని ఉత్తర కొరియా అరెస్ట్ చేసి శ్రామిక శిబిరాలకు పంపించింది. వీరి విడుదల విషయాన్ని ట్రంప్ బుధవారం ఒక ట్వీట్ ద్వారా ప్రకటించారు. ‘‘వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి భేటీ’’ కోసం తేదీని, వేదికను ఖరారు చేసినట్లు కూడా ట్రంప్ తెలిపారు. వీరి విడుదలను ట్రంప్ అభినందించారని.. సానుకూలమైన సుహృద్భావ సంకేతంగా ఈ చర్యను ట్రంప్ పరిగణిస్తున్నారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా సాండర్స్ ఆ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా విడుదల చేసిన అమెరికా పౌరులు ఎవరు? కిమ్ హాక్-సాంగ్‌ను 2017 మేలో ‘‘శత్రుపూరిత చర్యలు’’ అనుమానంపై అరెస్ట్ చేశారు. ఆయన తానొక క్రైస్తవ మిషనరీ ప్రతినిధినని.. ప్యాంగ్యాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (పీయూఎస్‌టీ) లో ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించదలచుకున్నానని గతంలో పేర్కొన్నారు. టోనీ కిమ్ (కిమ్ సాంగ్-డుక్ అని కూడా పిలుస్తారు) కూడా పీయూఎస్‌టీలో పనిచేశారు. 2017 ఏప్రిల్‌లో ఆయనను గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆయన ఉత్తర కొరియాలో మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దక్షిణ కొరియా మీడియా చెప్తోంది. అరవయ్యో దశకం ఆరంభంలో పాస్టర్‌గా పనిచేసిన కిమ్ డోంగ్-చుల్‌ను 2015లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆయనకు 10 సంవత్సరాలు కఠిన శ్రమను శిక్షగా విధించారు. ఈ ముగ్గురి అరెస్టు, జైలు నిర్బంధం రాజకీయ ప్రేరేపితమని.. మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శలు వచ్చాయి. వీరిని ఈ నెల ఆరంభంలో జైలు నుంచి ప్యాంగ్యాంగ్‌లోని హోటల్‌కు మార్చారని వార్తలు వచ్చాయి. దాంతో ఈ ముగ్గురినీ త్వరలో విడుదల చేస్తారన్న ఊహాగానాలూ వచ్చాయి. ఒటో వామ్‌బీర్‌ ప్యాంగ్యాంగ్‌లో తన నేరాన్ని అంగీకరించిన ఏడాది తర్వాత చనిపోయాడు ఉత్తర కొరియా జైళ్లు ఎలా ఉంటాయి? ఉత్తర కొరియాలో సరైన విచారణ పద్ధతులను పాటించకుండా సుమారు 1.20 లక్షల మందిని జైళ్లలో నిర్బంధించినట్లు కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ నార్త్ కొరియా (హెచ్ఆర్ఎన్‌కే) చెప్తోంది. దక్షిణ కొరియాకు చెందిన డీవీడీని వీక్షించటం మొదలుకుని దేశం వదిలి వెళ్లటానికి ప్రయత్నించటం వరకూ.. ఉత్తర కొరియా ప్రభుత్వం ఎలాంటి కారణానికైనా ప్రజలను జైలులో పెడుతుందని కార్యకర్తలు చెప్తారు. రాజకీయ ఖైదీలను వేరే జైళ్లకు పంపిస్తారు. క్రూరమైన శ్రామిక శిబిరాలు వాటిలో ముఖ్యమైనవి. గనుల తవ్వకం, చెట్లు నరికి దుంగలు మోయటం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అమెరికన్ మిషనరీ కెన్నెత్ బే కూడా ఉత్తర కొరియాలో ఇలాంటి శిక్షకు గురయ్యారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయినా వారంలో ఆరు రోజుల పాటు పొలంలో పనిచేయించారు. ఒక హోటల్ చిహ్నాన్ని దొంగిలించిన నేరానికి జైలులో పెట్టిన ఒటో వామ్‌బీర్‌ను.. గత ఏడాది విడుదల చేసినపుడు తీవ్రంగా జబ్బుపడి ఉన్నాడు. విడుదలై ఇంటికి తిరిగొచ్చిన కొద్ది రోజులకే చనిపోయాడు. అతని మరణానికి కారణమేమిటనేది ఇంకా తెలియదు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియా నిర్బంధించిన అమెరికా పౌరులు ముగ్గురిని జైలు నుంచి విడుదల చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్‌లో తెలిపారు. text: హర్పాల్ సింగ్ భార్య దేవీందర్ కౌర్ 8 సిక్ రెజిమెంట్‌కు చెందిన హర్పాల్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో చనిపోయారు. ఆ రోజును హర్పాల్ భార్య దేవీందర్ కౌర్ ఎన్నటికీ మరచిపోలేరు. యుద్ధం మనుషులను, సంతోషాన్ని, అన్నింటినీ దూరం చేస్తుందని ఆమె చెబుతారు. ''నా భర్త చనిపోయినప్పుడు నా తల్లిదండ్రులు, బంధువులు అండగా నిలిచారు. ప్రభుత్వం మద్దతు అందించింది. అప్పుడు నా కొడుకు మూడు నెలల పసివాడు'' అని ఆమె తెలిపారు. భారత్-పాకిస్తాన్: ఒక యుద్ధ వితంతువు కథ ఇది కొన్నేళ్లుగా, తన భర్త పనిచేసిన రెజిమెంటే తన కుటుంబమని, ప్రతి నెలా రెజిమెంట్ వాళ్లు వచ్చి తమ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుంటారని దేవీందర్ కౌర్ చెప్పారు. తన చిన్న కూతురు కచ్చితంగా సైన్యంలో చేరుతుందని ఆమె తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో జతువాల్ అనే గ్రామం ఇది. నాయక్ హర్పాల్ సింగ్ అంటే ఇక్కడ అందరికీ తెలుసు. text: ఆక్సిజన్ లేకపోవడంతో పేషెంట్లను చేర్చుకోవడం లేదంటూ ఆసుపత్రుల వద్ద బోర్డులు పొద్దునే వేదనతో కూడిన గొంతుతో ఒక స్కూల్ టీచర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఈ రోజు నిద్ర లేచాను. ఆమె 46 ఏళ్ల భర్తకు కోవిడ్ సోకడంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో మృత్యువుతో పోరాడుతున్నారు. శ్వాస తీసుకోవడం కూడా ఒక విలాసంగా మారిపోయిన ఈ నగరంలో ఇది ఇంకో రోజు అని నాకు నేనే చెప్పుకున్నాను. వెంటనే రకరకాల వాళ్లకి ఆక్సిజన్ కోసం ఫోన్లు చేయాల్సి వచ్చింది. ఇంతలో ఆసుపత్రిలో మానిటర్ బీప్ శబ్దాలు వినిపిస్తుండగా ఆమె తిరిగి ఫోన్ చేసి తన భర్త ఆక్సిజన్ స్థాయి 58కి పడిపోయిందని చెప్పారు. కొంత సేపటికి 62కి పెరిగిందని ఆమె ఆనందంగా చెప్పారు. ఆక్సిజన్ స్థాయి 92 కంటే తక్కువ పడిపోతే డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆమె భర్త స్పృహలోనే ఉన్నారని.. మాట్లాడుతున్నారని చెప్పారు. క్రిటికల్ కేర్‌లో పనిచేస్తున్న నా డాక్టర్ స్నేహితునికి ఈ విషయం చెబుతూ సందేశం పంపాను. కొంత మంది ఆక్సిజన్ స్థాయి 40కి పడిపోయినా మాట్లాడుతారని డాక్టర్ సమాధానం ఇచ్చారు. నేను వార్తాపత్రిక తెరిచేసరికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 25 మంది తీవ్ర అస్వస్థతతో మరణించారనే వార్త ఫ్రంట్ పేజీలో కనిపించింది. క్రిటికల్ కేర్‌లో ఇచ్చే ఆక్సిజన్ ప్రెషర్ తగ్గించి చాలా మందికి మాన్యువల్‌గా ఆక్సిజన్ ఇస్తున్నట్లు ఆసుపత్రి చెప్పింది. మొదటి పేజీలో ముగ్గురు వ్యక్తులు ఒకే ఆక్సిజన్ సిలిండర్‌ను పంచుకుంటున్న చిత్రం కనిపించింది. ప్రజల పట్ల వహించిన అశ్రద్ధ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముగ్గురు అపరిచితులు ఈ విషాదంలో చిక్కుకుపోయారు. అందులో ఉన్న ఒక వ్యక్తి 40 సంవత్సరాల కొడుకు అదే ఆసుపత్రిలో బెడ్ కోసం ఎదురు చూస్తూ కొన్ని రోజుల క్రితమే ఆసుపత్రి బయట మరణించారు. ఈయనకు కనీసం స్ట్రెచర్ అయినా దొరికింది అని ఆ రిపోర్టులో ఉంది. దీనికే భారతీయులు చాలా కృతజ్ఞతగా భావించాలేమో. మీరు మా ఆప్తుల కోసం పడకలు, ఆక్సిజన్, మందులు ఇవ్వలేకపోతే కనీసం వారి మృత దేహాలను మోసుకుని వెళ్ళడానికి ఒక స్ట్రెచర్ అయినా ఇవ్వండి అని ఆక్రోశిస్తున్నారు. రోజు గడుస్తున్న కొలదీ పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని అర్థమైంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలా మంది రోగులు చనిపోతున్నారు. చాలా మందులు దొరకటం లేదు. కొన్ని బ్లాక్ మార్కెట్ లో పెట్టి అమ్ముతున్నారు. యుద్ధ సమయంలో ఉన్నట్లు ప్రజలు భయంతో ఇష్టం వచ్చినట్లు మందులను కొంటున్నారు. చాలా విధాలుగా మనం అలాంటి స్థితిలోనే ఉన్నాం. ఇంతలో ఆ టీచర్ మళ్లీ కాల్ చేశారు. ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఫ్లో మీటర్ లేకపోవడం వల్ల ఆమె సొంతంగా ఒకటి తెచ్చుకోవాలని చెప్పారు. ఫోన్లు చేయడం, ట్విటర్‌లో అభ్యర్ధనలు పెట్టడం మళ్లీ మొదలైంది. ఆక్సిజన్ సిలిండర్ నుంచి రోగికి పంపించే ఆక్సిజన్‌ను నియంత్రించే పరికరాన్ని ఒకరు సంపాదించగలిగారు. ప్రభుత్వం చెప్పే విషయాలు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. రోగులను బతికించడానికి ఆక్సిజన్ సిలిండర్లు నగరానికి సరైన సమయానికి రావడం లేదు. ఆసుపత్రుల్లో పడకలు లేవు. కొన్ని మందులు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఉన్నత వర్గాల వారికి కూడా ఏమి ప్రాధాన్యాలు లేవు. ఈ మధ్యాహ్నం ఒక పత్రిక ఎడిటర్ ఫోను చేసి ఆయనకు తెలిసిన ఒక రోగికి ఆక్సిజన్ సిలిండర్ లభిస్తుందేమోనని అడుగుతున్నారు. నేను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ సముదాయంలో ఎవరికైనా అవసరం అవుతుందేమోననే ఉద్దేశంతో కొంత మంది సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సముదాయంలో ఇప్పటికే 57 మందికి ఇన్ఫెక్షన్ సోకి వారి వారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉన్నారు. రోగులు వారి తిండి గురించి వారే చూసుకోవాల్సి వస్తోంది. చాలా మందికి ఇది నెమ్మదిగా మృత్యువు వైపు తీసుకుని వెళ్లే మార్గంలా ఉంది. కోవిడ్-19 చాలా రకాలుగా ఆకస్మికంగా దాడి చేసే ఒక రోగం. "నేను చనిపోతున్నా కూడా నేను నిజంగా చనిపోయే వరకు బతికి ఉన్నట్లే అర్ధం" అని పాల్ కళానిధి అనే న్యూరో సర్జన్ తన స్వీయ చరిత్ర 'వెన్ బ్రీత్ బికమ్స్ ఎయిర్'లో రాశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆక్సిజన్, ఆక్సిజన్, నాకు కొంచెం ఆక్సిజన్ దొరుకుతుందా? text: వాషింగ్టన్ పోస్ట్‌ పత్రికకు యజమానిగా ఉండటం వల్ల తాను ట్రంప్‌కు శత్రువుగా మారానని బెజోస్ వ్యాఖ్యానించారు. వదంతులను ప్రచురించే టాబ్లాయిడ్ 'నేషనల్ ఎంక్వైరర్' తన ప్రైవేటు సందేశాలను సంపాదించిందని ఆయన వెల్లడించారు. వీటిని ఎలా సేకరించారనే విచారణను నిలిపివేయాలని ఈ పత్రిక మాతృసంస్థ అయిన అమెరికన్ మీడియా ఇన్‌కార్పొరేషన్(ఏఎంఐ) తనను అడిగిందని చెప్పారు. తాను, తన భార్య మెకంజీ విడిపోతున్నామని బెజోస్ గత నెల్లో ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ది ఎంక్వైరర్ పత్రిక బెజోస్ వివాహేతర సంబంధ వివరాలు, ఇతర ప్రైవేటు సందేశాలను ప్రచురించింది. జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకంజీ బెజోస్ ఆరోపణలపై స్పందన కోసం బీబీసీ చేసిన విజ్ఞప్తిపై ఏఎంఐ ఇంకా స్పందించలేదు. తాను, తన ప్రేయసి, మాజీ టీవీ వ్యాఖ్యాత లారెన్ సాంచెజ్‌ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను ప్రచురిస్తామని బెదిరిస్తూ ఏఎంఐ ప్రతినిధులు తన తరపు మధ్యవర్తులకు ఈమెయిల్ పంపారని బెజోస్ గురువారం రాసిన బ్లాగ్ పోస్ట్‌లో ఆరోపించారు. వివిధ ఈమెయిళ్లను ఆయన తన పోస్టులో ఉంచారు. తనపై, తన ప్రేయసిపై నేషనల్ ఎంక్వైరర్ కవరేజీ రాజకీయ ప్రేరేపితం కాదని ఒక ''తప్పుడు ప్రకటన'' చేయాల్సిందిగా ఏఎంఐ తనను కోరిందని బెజోస్ బ్లాగులో రాశారు. కవరేజీ రాజకీయ ప్రేరేపితమని అనుమానించేందుకు తగిన ప్రాతిపదిక లేదంటూ ఈ ప్రకటన చేస్తే సదరు ఫొటోలను ప్రచురించకుండా ఉంటామని ఏఎంఐ న్యాయవాది ఒకరు బుధవారం ప్రతిపాదించారని బెజోస్ పోస్ట్ చేసిన ఈమెయిళ్లు చెబుతున్నాయి. ''వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది కలిగిస్తామని ఏఎంఐ చెబుతున్నప్పటికీ, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల యత్నాలకు లొంగకుండా ఏఎంఐ నాకు పంపిన సమాచారాన్ని బయటపెడుతున్నా'' అని బెజోస్ వెల్లడించారు. ఏఎంఐకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో సంబంధాలున్నాయని బ్లాగు మొదట్లో బెజోస్ రాశారు. మాజీ టీవీ వ్యాఖ్యాత లారెన్ సాంచెజ్ బెజోస్ అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్ పోస్ట్ యజమాని కూడా. ఈ పత్రికకు యజమానిగా ఉండటం వల్ల తనకు సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, కొందరు శక్తిమంతమైన వ్యక్తులకు తాను శత్రువుగా మారానని చెప్పారు. వీరిలో ఏఎంఐ అధిపతి డేవిడ్ పెకర్ స్నేహితుడైన అధ్యక్షుడు ట్రంప్ ఒకరని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బృందానికి తాము సహకరించామని ఏఎంఐ ఇటీవలే తెలిపింది. ట్రంప్‌తో లైంగిక సంబంధం గురించి నోరు విప్పకుండా ఉండేందుకు ఒక ప్లేబాయ్ మోడల్‌కు లక్షన్నర డాలర్లు చెల్లించే విషయంలో తాము తోడ్పాటు అందించామని అంగీకరించింది. తన వ్యాపార దక్షత పేలవమని అమెజాన్ వాటాదారులకు తెలియజేసేందుకు ఈ ఫొటోలను ప్రచురించాల్సిన అవసరముందని ఏఎంఐ వాదిస్తోందని, కానీ అమెజాన్ సాధించిన ఉత్తమ ఫలితాలే తన వ్యాపార దక్షతను చాటుతున్నాయని బెజోస్ వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలోని ఒక మీడియా సంస్థ యజమాని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు సేకరించి వాటితో తనను బెదిరిస్తున్నారని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆరోపించారు. text: ఆహారం కోసం క్యూలో నిలబడ్డ ఆలమ్ బిడ్డ కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆలమ్ పని చేసే కర్మాగారం మూతపడింది. రోజు కూలీగా పని చేసే ఆయనకు మరో దారి లేక ఆకలి తీర్చుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఆహార కేంద్రానికి రావాల్సి వచ్చింది. “ఎలా బతకాలో తెలియడం లేదు. నా కుటుంబాన్ని పోషించాలంటే అప్పు చేయడం తప్ప మరో దారి లేదు” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆలమ్. నీరజ్ కుమార్... ఓ వలస కూలీ. ఇప్పుడు దిల్లీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే చాలా మంది వలస కూలీల్లానే ఇంటి బాట పట్టారు. అయితే రైళ్లు, బస్సులు అన్నీ ఆగిపోవడంతో వెళ్లిపోవాలనుకున్న వాళ్లు మరో దారి లేక కాలి నడకనే బయల్దేరారు. మేం మాట్లాడే సమయానికే కుమార్ తన భార్య, పదేళ్ల కుమార్తెతో కలిసి సుమారు 40 కిలోమీటర్ల దూరం కాలి నడకనే ప్రయాణించారు. “ఇక్కడ మాకు ఉపాధి లేదు. అందుకే వెళ్లిపోతున్నాం. బస్సుల్లేవు, మా ఊరు చేరుకోవాలంటే మేం మరో 260 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు. నీరజ్ కుమార్, అతని భార్య సుమారు రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అయితే ఆలమ్, కుమార్ వంటి అసంఘటిత కార్మికులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం సుమారు లక్షా 75 వేల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. దేశ కార్మిక శక్తిలో సుమారు 94 శాతం మందికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అసంఘటిత రంగం ద్వారానే ఉపాధి లభిస్తోంది. కానీ లాక్ డౌన్ కారణంగా అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా రాత్రికి రాత్రే వేలాది మంది నిరుద్యోగులయ్యారు. “ఏ ఒక్కర్నీ ఆకలితో ఉండనియ్యం” ఇది ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్న సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట. కానీ ఊహించని లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా చితికిపోతోంది. వ్యాపారాలు మూతపడ్డాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఉత్పత్తి పడిపోతోంది. నిజానికి ఈ సంక్షోభానికి ముందు భారత వృద్ధి రేటు అంతో ఇంతో బాగానే ఉండేది. ఒకానొక సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును నమోదు చేసింది కూడా. అయితే గత ఏడాది మాత్రం 4.7% కి పడిపోయింది. వరుసగా ఆరేళ్ల తర్వాత అతి తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది అప్పుడే. గత ఏడాది దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోని 8 ప్రధాన పారిశ్రామికరంగాల ఉత్పత్తి 5.2శాతానికి పడిపోయింది. గడిచిన 14 ఏళ్లలో అదే అత్యల్పం. 2016లో జరిగిన నోట్ల రద్దు తర్వాత చిన్న తరహా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. సర్కారు సాయం సరిపోతోందా ? ఈ కరోనావైరస్ సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టయ్యిందని నిపుణులు చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూనే మరోవైపు ఆర్థిక పరిస్థితి చితికిపోకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. “ఉచితంగా రేషన్ ఇస్తున్నారు సరే.. కానీ పేదలు వాటిని ఎలా అందుకోగల్గుతారు? ఈ విషయంలో కేంద్రం సైన్యాన్ని, రాష్ట్ర విభాగాలను వినియోగించుకొని స్వయంగా పేదలకు అందించే ఏర్పాటు చెయ్యాలి” అని ఆర్థిక నిపుణులు అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. వేలాది మంది వలస కూలీలు తమ ఊళ్లకు వేల కిలోమీటర్ల దూరాలలో చిక్కుకుపోయారు. ఈ పరిస్థితుల్లో నగదు, నిత్యావసరాలు నేరుగా వారికి అందజేయడం ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం కావాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇది కేవలం వలస కూలీల సమస్య మాత్రమే కాదు. లాక్ డౌన్ కారణంగా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. దేశ జీడీపీలో సుమారు 2లక్షల51వేల కోట్ల రూపాయల(265 బిలియన్ డాలర్లు) ఆదాయానికి సేద్యమే ఆధారం. కరోనావైరస్:లాక్ డౌన్ కారణంగా రైతులకు తప్పని కష్టాలు పీకల్లోతు కష్టాల్లో అన్నదాతలు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు ఏప్రిల్ నెలలో ముందస్తు సాయం కింద 2వేల రూపాయల అందజేయనున్నట్లు ప్రకటించింది. అది కూడా ఏటా ఇచ్చే 6వేల రూపాయల సాయంలో భాగంగానే. “ఇప్పటికే ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితులు లేవు. ఫలితంగా నగరాలకు ఉత్పత్తులు నిలిచిపోతాయి. ధరలు పెరిగిపోతాయి. అందువల్ల రైతులకు ఇచ్చే సాయం ఏ మాత్రం సరిపోదు” ఆర్థిక నిపుణులు అని అరుణ్ కుమార్ అన్నారు. సరిగ్గా కొత్త పంట చేతికొచ్చే సమాయానికి కరోనా మహమ్మారి పంజా విసిరింది. దీంతో ఆ పంటను ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పండే పంటను నగరాలకు తీసుకెళ్లడం ప్రభుత్వానికి పెద్ద సవాలు కానుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలు సరఫరా చేసే వ్యవస్థ సవ్యంగా పని చేయని పక్షంలో భారీ ఎత్తున ఆహారం వృథా కావడమే కాదు... అన్నదాతలు కూడా తీవ్రంగా నష్టపోతారు. దేశంలో నిరుద్యోగ సమస్య కూడా తీవ్రం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్లలో ఎంతో కొంత ఆదాయాన్ని కోల్పోయే వారు కొందరైతే పూర్తిగా ఉపాధి కోల్పోయే మరెంతో మంది ఉండొచ్చని ఆర్థిక నిపుణులు వివేక్ కౌల్ వ్యాఖ్యానించారు. ఇతర పారిశ్రామిక రంగాలది అదే పరిస్థితి నిన్నటి వరకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదేశీయ వైమానిక రంగం కూడా లాక్ డౌన్ దెబ్బకు కుదేలవుతోంది. దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దేశీయ విమాన రంగానికి ఈ ఏడాది సుమారు 30వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని సెంటర్ ఫర్ ఏసియా ఫసిఫిక్ ఏవియేషన్(సీఏపీఏ) అంచనావేస్తోంది. దాని పర్యవసానం ఆతిథ్య, పర్యాటక పరిశ్రమపైనా పడుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న గొలుసు కట్టు హోటళ్లు రానున్న కొన్ని నెలల పాటు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయి. భారీ ఎత్తున మూత పడే ప్రమాదం కూడా ఉంది. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్ రంగం కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంగా ఈ ఏడాది సుమారు రూ.15,283కోట్లు(2బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ సరిపోతుందా? అమెరికా, చైనా, సింగపూర్ వంటి దేశాలతో పోల్చితే ఇది సముద్రంలో నీటి బొట్టంత అంటున్నారు నిపుణులు. కనీ వినీ ఎరుగని ఈ సంక్షోభ సమయంలో మున్ముందు మరింత భారీ ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహమ్మద్ ఆలమ్... దేశ రాజధాని దిల్లీలో పట్టెడన్నం కోసం భారీ క్యూలో నిలుచున్న వేలాది మంది కూలీల్లో ఒకరు. text: కిందిస్థాయి కార్మికుల కోసం బరువు తక్కువ ఉండి, తొందరగా ఆరిపోయే సూట్లు తయారు చేసినట్టు ఒయాసిస్ సంస్థ చెబుతోంది. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికుల కోసం తక్కువ బరువు కలిగిన, తొందరగా ఆరిపోయే సూట్లను రూపొందించినట్టు జపాన్ రాజధాని టోక్యోలోని ఒయాసిస్ స్టైల్ వేర్ అనే కంపెనీ తెలిపింది. పారిశుధ్య కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికుల నుంచి ఈ సూట్లకు మంచి ఆదరణ లభిస్తోందని జపాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. 'వాళ్లను ప్రోత్సహించేందుకే' బ్లూ- కాలర్ కార్మికుల్లో ఆత్మవిశ్వాసం పెంచే ఆలోచనతో ఈ సూట్లు రూపొందించామని తయారీ సంస్థ చెబుతోంది. "వ్యవసాయం, పారిశుద్ధ్యం, భవన నిర్మాణం తదితర రంగాల్లోకి కార్మికులుగా వెళ్లే క్రమంలో 20, 30 ఏళ్ల జపాన్ యువత తీవ్రమైన న్యూనతా భావానికి లోనవుతున్నారు. సంప్రదాయంగా కార్మికులు వేసుకునే దుస్తులు కూడా ఆ న్యూనత పెరగడానికి ఓ కారణం. ఈ విషయాన్ని గ్రహించిన మా ఇంజినీర్లు, ఆ కార్మికుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ సూట్లను రూపొందించారు" అని ఆ సంస్థ వివరించింది. ప్రతీకాత్మక చిత్రం 'నీళ్లు పడ్డా తడవదు' దేశంలో పెరిగిన డిమాండ్‌ని భర్తీ చేసేందుకు.. భూకంపాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టే సిబ్బంది, భవన నిర్మాణ కార్మికుల అవసరం భారీగా పెరుగుతోందని, అందుకే ఈ రంగాల్లో యువత ప్రవేశించేలా ప్రోత్సహించాలన్నది కూడా తమ ఆలోచన అని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. "నేను పొలంలో పనిచేసేటప్పుడు కూడా ఇలాంటి సూట్లు వేసుకుంటాను. ఇది నీళ్లు పడ్డా తొందరగా తడవదు. దాంతో కొద్దిపాటి వర్షం వచ్చినప్పుడు నాకు రెయిన్ కోటు కూడా అవసరం ఉండదు" అని కియోటో సైటో అనే రైతు జపాన్ టైమ్స్ పత్రికతో చెప్పారు. ఈ తరహా వస్త్రధారణ వల్ల రైతులు, వ్యవసాయ కూలీల ఆలోచనా తీరులోనూ మార్పు వస్తుందని ఒయాసిస్ సంస్థ చెప్పినట్టు ఆ పత్రిక రాసింది. ఈ ఏడాది మార్చి నుంచి సూట్ల అమ్మకాలు ప్రారంభించగా, ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఒయాసిస్ సంస్థ చెబుతోంది. తమ వ్యాపార క్లయింట్లతో పాటు, తోటి కంపెనీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి హయాటో సుహారా తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు, పారిశుద్ధ్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా జపాన్‌కు చెందిన ఓ సంస్థ బిజినెస్ సూట్లు తయారు చేసింది. text: గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న ఫేస్‌బుక్-కేంబ్రిడ్జ్ అనలిటికా మోసం.. ఇంటర్నెట్ వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతపైన అనేక చర్చలకు దారితీసింది. బ్రిటన్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా.. అనుమతి లేకుండా 5 కోట్లమందికి పైగా ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అంతర్జాతీయంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బెర్లిన్‌కు చెందిన ‘టాక్టికల్ టెక్’ అనే డిజిటిల్ సెక్యూరిటీ సంస్థతో బీబీసీ మాట్లాడింది. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత డేటాను సమీక్షించుకోవడం, అనవసరమైన సమాచారాన్ని తొలగించడం ఎలాగో తెలుసుకుంది. ఆ వివరాలు మీ కోసం.. 1. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎలా శుద్ధి చేయాలి? మీ ఫొటోలు, మీరు పంపిన, మీకు వచ్చిన సందేశాలు.. ఇలా మీ ప్రొఫైల్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పిస్తుంది. ఆ సమాచారం కావాలంటే.. ‘జనరల్ ఎకౌంట్ సెట్టింగ్స్’‌కు వెళ్లి ‘డౌన్‌లోడ్ ఎ కాపీ ఆఫ్ యువర్ ఫేస్‌బుక్ డేటా’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దాంతో ఆ సమాచారమంతా మీ ఈమెయిల్‌కు అందుతుంది. దాని ఆధారంగా మీకు కావాల్సిన సమాచారాన్ని తొలగించుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్‌లోనే ‘యాప్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ‘షో మోర్’ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఫేస్‌బుక్ ఖాతా తెరిచినప్పటి నుంచి ఉపయోగించిన యాప్స్ అన్నీ కనిపిస్తాయి. వాటన్నింట్లో మీకు సంబంధించిన బోలెడంత సమాచారం ఉంటుంది. అనవసరమైనయాప్స్‌ను ‘రిమూవ్’ చేయడం ద్వారా ఆ సమాచారాన్ని కూడా తొలగించొచ్చు. అవసరమైన యాప్స్‌లో కూడా సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా యాప్‌ని నియంత్రించొచ్చు. మీ ప్రొఫైల్ పేజీలోకి వెళ్లి ‘వ్యూ యాక్టివిటీ లాగ్‌’ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మిమ్మల్ని ట్యాగ్ చేసిన వాళ్లందరి సమాచారం కనిపిస్తుంది. వాటిని డిలీట్ చేయడం ద్వారా మీ ఖాతా ఎక్కువమంది దృష్టిలో పడకుండా జాగ్రత్త పడొచ్చు. 2. గూగుల్‌కి మీ గురించి ఎంత తెలుసు? ఆన్‌లైన్‌లో అందరికంటే గూగుల్‌కే మీ గురించి ఎక్కువగా తెలుసు. చాలామంది రోజుకి కనీసం ఒక్క గూగుల్ యాప్‌నైనా ఉపయోగించే అవకాశాలు ఎక్కువ. అలా గూగుల్ దగ్గర మీకు తెలీకుండానే చాలా సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. గూగుల్ సేకరించిన మీ సమాచారాన్ని తొలగించాలంటే ముందు మీ గూగుల్ ఎకౌంట్‌లోకి ‘సైన్ ఇన్’ అవ్వాలి. సైన్ ఇన్ అయ్యాక మీ లోగోపై క్లిక్ చేస్తే ‘ప్రైవసీ చెకప్’ పేజీ కనిపిస్తుంది. అందులోకి వెళ్లడం ద్వారా మీ సమాచారాన్ని నియంత్రించొచ్చు. అక్కడ ‘స్టెప్-3’లో ‘పర్సనలైజ్ యువర్ గూగుల్ ఎక్స్‌పీరియన్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గూగుల్ దగ్గరున్న మీ ఫోన్ నంబర్లు, ఫొటోలు ఇతర సమాచారమంతా కనిపిస్తుంది. అక్కడ ఆ సమాచారాన్ని నియంత్రించే, తొలగించే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. మొత్తంగా గూగుల్ దగ్గర మీకు సంబంధించి ఎంత సమాచారం ఉందో తెలియాలంటే ఈ లింక్‌ని క్లిక్ చేయండి. 3. లొకేషన్ డేటాతో జాగ్రత్త! మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే మీరెవరో, ఎక్కడుంటారో, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో.. అన్ని విషయాలూ థర్డ్ పార్టీ యాప్స్‌కు తెలిసే అవకాశాలెక్కువ. అందుకే లోకేషన్ హిస్టరీని తెలుసుకోవడం ద్వారా మీ సమాచారాన్ని నియంత్రించొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు: గూగుల్ మ్యాప్స్> మెనూ> టైం లైన్. అక్కడ ఒక్కో ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు: సెట్టింగ్స్> ప్రైవసీ> లొకేషన్ సర్వీసులు> మేనేజ్ లోకేషన్ యాక్సెస్. అక్కడ ప్రతి యాప్‌కు సంబంధించిన లోకేషన్ సేవల్ని నియంత్రించొచ్చు. 4. ప్రైవేట్ బ్రౌజర్లు వాడండి చాలామందికి ఏ వెబ్‌సైట్ తెరిచినా అందులో గతంలో వాళ్లు చూసిన షాపింగ్ వెబ్‌సైట్ల తాలూకు ప్రకటనలు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. థర్డ్ పార్టీ సంస్థల ట్రాకర్ల వల్లే ఇలా మీరు వెళ్లిన వెబ్‌సైట్ల సమాచారం ఇతరులకు తెలుస్తుంది. నిజానికి ఏ వెబ్ బ్రౌజర్‌ కూడా నేరుగా ఇలా థర్డ్ పార్టీ ట్రాకింగ్‌ను నియంత్రించదు. కానీ గూగుల్, మోజిలా, సఫారీ లాంటి బ్రౌజర్లు.. ప్రైవేట్ లేదా ‘ఇన్‌కాగ్నిటో’ బ్రౌజింగ్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఆ మోడ్‌లో ఇంటర్నెట్‌ను వినియోగిస్తే బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, టెంపరరీ ఫైల్స్ లాంటివన్నీ బ్రౌజర్‌ని మూసేయగానే డిలీట్ అయిపోతాయి. దాంతో థర్డ్ పార్టీలకు మీ సమాచారాన్ని సేకరించే అవకాశం ఉండదు. బ్రౌజర్(గూగుల్, మోజిలా, సఫారీ) తెరిచి అందులో మెనూకి వెళ్లి న్యూ ప్రైవేట్/ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌ను తెరిస్తే థర్డ్ పార్టీల వలలో పడకుండా బ్రౌజ్ చేసుకోవచ్చు. 5. నిజంగా అన్ని యాప్స్ అవసరమా? చాలామంది ఫోన్లలో అవసరమైన వాటికంటే ఎక్కువ యాప్స్ ఉంటాయి. వాటిని తొలగించడం ద్వారా ఫోన్ మెమరీని పెంచుకోవడంతో పాటు మన సమాచార వ్యాప్తినీ నియంత్రించొచ్చు. ఏ యాప్‌ను డిలీట్ చేయాలో తెలియకపోతే ఈ ప్రశ్నలు వేసుకోండి. ఈ పాటికి ఎలాంటి యాప్స్‌ను డిలీట్ చేయొచ్చో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫేస్‌బుక్, గూగుల్ లాంటి సంస్థలు మీ డేటాను స్టోర్ చేసుకుంటాయని మీకూ తెలుసు. కానీ అవి ఎంత సమాచారాన్ని సేకరిస్తాయో, దాన్ని ఎలా తొలగించాలో తెలుసా? text: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన 'అన్యాయం'పై పార్లమెంటులో నిరసన తెలుపుతామని నిర్ణయించినట్టుగా టీడీపీ ఎంపీలు మీడియాకు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వం ఆశించిన ప్రాధాన్యం దక్కకపోవడంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్య మైత్రి తెగతెంపులయ్యే అవకాశముందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. అందుకు మరింత ఊతమిస్తూ ఆదివారం తెలుగుదేశం ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు కూడా సాగాయి. పోరాటం పార్లమెంటులోనే! అయితే, అంతా ఊహించినట్టుగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తుపై సంచలన నిర్ణయమేదీ తీసుకోలేదు. బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు తమ గళాన్ని మరింతగా వినిపించాలని సూచించారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం కొనసాగింది. సమావేశం నుండి బయటికి వచ్చిన తర్వాత పలువురు టీడీపీ పార్లమెంటు సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ పోరాటం దశల వారీగా జరుగుతుందని, ఇప్పుడిది ఆరంభం మాత్రమేనని వారన్నారు. రైల్వేజోన్, పోలవరం తదితర అంశాలపై పార్లమెంటులో పోరాడుతామని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం తప్పదని ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ''విభజన చట్టంలో ఉన్న అంశాల్లో, రెవెన్యూ లోటు భర్తీ, రైల్వే జోన్ అంశంపై బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరగలేదు. దీనిపై ప్రజల్లో ఉన్న ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెస్తాం. ఇప్పటికైనా ఏపీకి న్యాయం చేయాలని కోరుతాం'' అని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం అన్నారు. అమిత్‌షా ఫోన్ కాల్ ప్రభావం? అంతకు ముందు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసినట్టుగా, సమావేశంలో తీవ్ర నిర్ణయాలేవీ తీసుకోవద్దని ఆయనకు సూచించినట్టుగా మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, అమిత్‌షా ఫోన్ కాల్ చేశారన్నది వాస్తవం కాదన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి బీబీసీతో మాట్లాడుతూ, అమిత్‌షా ఫోన్ చేసి మాట్లాడడం, మాట్లాడకపోవడానికి పెద్ద ప్రాముఖ్యతేమీ లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల వ్యవహారం ప్రభుత్వ వ్యవహారం, రాజ్యాంగపరమైన వ్యవహారం తప్ప రాజకీయమైంది కాదని అన్నారు. "అసలు టీడీపీతో పొత్తు ఉంటుందా, ఉండదా అన్న అంశానికి బీజేపీ అంత ప్రాధాన్యం ఇస్తుందని నేననుకోను. పార్లమెంటులో కావల్సినంత మెజారిటీ ఉన్నప్పుడు దానికి ఆందోళన ఏముంటుంది? నా దృష్టిలో టీడీపీ తెగతెంపులు చేసుకుంటుందనే భయం బీజేపీకి లేదు. అలాంటి ఆలోచన తెలుగుదేశానికి కూడా ఏమీ లేదు" అని ఆయన అన్నారు. ఇవన్నీ బాబు డ్రామాలు: అంబటి రాంబాబు కేంద్రంతో పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన, "మిత్రపక్షంగా ఉంటూనే పోరాటం చేస్తామని అనడంలో అర్థం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజంగానే పోరాడాలనే ఉద్దేశం ఉంటే రాజీనామాలు చేయడానికి ముందుకు రావాల్సింది" అని అన్నారు. "ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, బడ్జెట్‌ను రూపొందించేటప్పుడే పోరాడకుండా, ఇప్పుడు పోరాడతామని చెప్పడం ఓ డ్రామా" అని అంబటి బీబీసీకి చెప్పారు. ట్రేడింగే తప్ప రాష్ట్రంలో రూలింగేదీ?: సోము వీర్రాజు మరోవైపు, బీజేపీ ఎంఎల్‌సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కర్నూలులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలుగుదేశంపై నిప్పులు చెరిగారు. పరోక్షంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, "ఓ మహానాయకుడు పార్టీని స్థాపిస్తే మీరు దాన్ని భూస్థాపితం చేశారు" అని వ్యాఖ్యానించారు. తాము నిప్పుకణికలం అని చెబుతూ తెలుగు దేశం పార్టీ నేతలు అవినీతిపరులంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుండగా, మరోవైపు రాష్ట్రంలో బీజేపీ కీలక నేత వీర్రాజు ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా ఓ ప్రహసనమే: తెలకపల్లి రవి తెలుగుదేశానికి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనే ఉద్దేశం ఉందని తాను భావించడం లేదని తెలకపల్లి రవి బీబీసీతో అన్నారు. "ప్రజలలో తమ పాలన పట్ల అసంతృప్తి ఉందని, అది రోజురోజుకూ పెరుగుతోందని తెలుగుదేశానికి బాగా తెలుసు. అందుకే కేంద్రంపై ధ్వజమెత్తడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని అది చూస్తోంది" అని రవి అన్నారు. తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌సీపీలు రెండూ బీజేపీని సంతృప్తి పర్చడానికే ప్రయత్నిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఇవేవీ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని స్థితిలో ఉన్నాయని, ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ కూడా తెలుగు దేశాన్ని విమర్శిస్తోందే తప్ప కేంద్రాన్ని ఏమీ అనడం లేదని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవహారాల ఫలితంగా రాష్ట్ర ప్రజలకే అన్యాయం జరుగుతోందని, ఇది దురదృష్టకరమైన పరిస్థితి అని రవి అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బీజేపీతో పొత్తు విషయంలో తీవ్ర నిర్ణయం తీసుకోవచ్చంటూ కొద్ది రోజులుగా సాగిన ఊహాగానాలకు తెర పడింది. text: ఆనందాన్నిచ్చేదిగా, ఆరోగ్యాన్నిచ్చేదిగా.. కొన్నిసార్లు దైవలోకానికి - భక్తులకు అనుసంధానకర్తగా ఆయా మతాలలో కొన్ని మొక్కలకు పవిత్ర స్థానం కల్పించారు. సంగీతకారిణి జాహ్నవి హారిసన్ ‘పవిత్ర వృక్షశాస్త్రా’న్ని అధ్యయనం చేస్తున్నారు. కమలం నుంచి.. తులసి వరకూ.. పవిత్రమైన ఏడు మొక్కలు.. అవి దేనికి ప్రతీకలు, ఎందుకు అనే వివరాలను ఆమె ఇలా వివరిస్తున్నారు. 1. కమలం ఆధ్యాత్మికత నేపథ్యంలో.. విద్యావంతులైన వారికి తామర పుష్పం విశిష్టమైనది. ముఖ్యంగా హిందువులకు (బౌద్ధులకు కూడా). మురికి, బురద నుంచి పుట్టి వాటిపైన ఒంటరిగా నిలుచునే ఈ అందమైన, ఆకర్షణీయమైన కమలం.. జీవానికి, ఫలదీకరణకు, స్వచ్ఛతకు చిహ్నం. ఈ మొక్క వేర్లు బురదలో ఉన్నాకూడా ఈ పుష్పం స్వచ్ఛంగా, ధవళవర్ణంలో నీటిపై తేలియాడుతుంటుంది. కమలం హిందువుల దేవుడు విష్ణువు నాభి నుంచి పుట్టిందని, పుష్పం మధ్యలో మరో హిందూ దైవం బ్రహ్మ ఆసీనుడై ఉంటాడని పురాణ గాథ. దేవుడి చేతులు, పాదాలు.. కమలం లాగా ఉంటాయని, దేవుడి కళ్లు కమల దళాలుగా ఉంటాయని, దేవుడి చూపు, స్పర్శ తామర మొగ్గలంత మృదువుగా ఉంటాయని కొందరు విశ్వసిస్తారు. ప్రతి వ్యక్తిలోనూ పవిత్రమైన తామర జీవాత్మ ఉంటుందని హిందూమతం ప్రబోధిస్తుంది. 2. బదనిక బదనికను క్రిస్మస్ మాయాజాలంతో అనుబంధమున్నదిగా మనమిప్పుడు పరిగణిస్తున్నాం. కానీ దీని ప్రతీకాత్మకత ప్రాచీన సెల్టిక్ డ్రూయిడ్స్ కాలానికి చెందినది. సూర్యదేవుడు టారానీస్ స్వభావానికి ఈ బదనిక ప్రతినిధి అని వారు నమ్మేవారు. ఈ బదనిక తీగ అల్లుకునిఉన్న ఏ చెట్టునైనా పవిత్రమైనదిగా భావించేవారు. దక్షిణాయనం.. డ్రూయిడ్ అధినాయకుడు ధవళవస్త్రం ధరించి ఓక్ చెట్టు మీదున్న బదనిక తీగను బంగారు కొడవలితో కత్తిరించే కాలం. ఆ తర్వాత ఈ విశిష్టమైన మొక్కను, దాని చిన్న పండ్లను మతపరమైన కర్మకండాలకు, ఔషధల్లోనూ ఉపయోగిస్తారు. బదనికతో తయారు చేసిన కషాయంతో జబ్బు నయమవుతుందని, ఎలాంటి విషానికైనా విరుగుడుగా పనిచేస్తుందని, మనుషులు, జంతువుల్లోనూ పునరుత్పత్తికి దోహదపడుతుందని, మంత్ర ప్రయోగాల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్మేవారు. కానీ నిజానికి ఇవన్నీ పొరపాటే. బదనికను కడుపులోకి తీసుకుంటే విషపూరితమవుతుంది. 3. తులసి హిందూమతంలో.. పవిత్ర బృందావనానికి రక్షకురాలిగా వ్యవహరించటం ద్వారా కృష్ణభగవానుడికి, ఆయన భక్తులకు బృందాదేవి సేవ చేసిందని చెప్తారు. బృందావనం ఇప్పుడు ఒక తీర్థస్థలం. బృందాదేవి మానవరూపంలో ఉన్న దేవత అయినప్పటికీ ఆమెను భౌతిక ప్రపంచంలో తులసి రూపంగా అవతరించాలని, ఆమె ఎక్కడ పెరిగినా అది బృందావనం లాగా పవిత్ర స్థలం అవుతుందని కృష్ణుడు ఆశీర్వదించాడని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఈ పవిత్ర తులసి మొక్క అన్ని చోట్లా విస్తారంగా పెరుగుతంది. ప్రపంచమంతటా కోట్లాది మంది హిందువులు, అందులోని వేర్వేరు శాఖల వారు ఆలయాల్లోనూ, ఇళ్లలోనూ తులసిని పూజిస్తారు. 4. పేయోటి నైరుతి టెక్సస్, మెక్సికోల్లోని ఎడారుల్లో సహజంగా పెరిగే ఒక చిన్నపాటి, కాండంలేని జెముడు మొక్క పేయోటి. స్థానిక ఆదివాసీలు లక్షల ఏళ్లుగా దీనిని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. మెక్సికోకు చెందిన హ్యూచోల్ ఇండియన్లు, ఉత్తర అమెరికాలోని చాలా ఆదివాసీ అమెరికా తెగల ప్రజలు.. పేయోటి పవిత్రమైన పుష్పమని, దేవుడితో సంభాషించేందుకు ఇది సాయం చేస్తుందని విశ్వసిస్తారు. ప్రార్థనా కార్యక్రమాల్లో ఉపయోగించే ఈ పుష్పం.. భ్రాంతిని కలుగజేయగలదు. ఆ భ్రాంతినే వేరే ప్రపంచ దృశ్యాలుగా భావించేవారు. పేయోటి ఆధ్యాత్మిక శక్తులను ప్రస్తుతించేది కేవలం ఆదివాసీలు మాత్రమే కాదు. ఆ జెముడుకు గల భ్రాంతికలిగించే గుణం వల్ల.. 1950ల్లో కళాకారులు, సంగీతవిద్వాంసులు, రచయితలు దీనిని ఒక మతాన్ని ఆరాధించినట్లు ఆరాధించేవారు. తన రచన ‘వన్ ఫ్లూ ఓవర్ ద కకూస్ నెస్ట్’లోని ప్రారంభ వాక్యాలను పేయోటి వల్ల భ్రాంతిలో ఉన్నపుడు రాసినట్లు కెన్ కెసీ పేర్కొన్నారు! 5. చౌకుమాను సతత హరితంగా ఉండే చౌకుమాను చెట్టును చిరకాలంగా పునర్జన్మకు, అమరత్వానికి ప్రతీకగా పరిగణించేవారు. ఎందుకంటే.. ఈ చెట్టు కొమ్మల నుంచి వచ్చే వేళ్లు మళ్లీ నేలలో పాతుకుని కొత్త మొదళ్లుగా తయారుకాగలవు. అంతేకాదు.. చౌకుమానులో బోలైపోయిన పాత బెరడు లోపల నుంచి కొత్త కాండం కూడా పుట్టుకురాగలదు. అందుకే ఇది పునర్జన్మకు ప్రతీకగా నిలవటంలో ఆశ్చర్యం లేదు! క్రైస్తవ విశ్వాసంలో చౌకుమాను చెట్టు ప్రతీకాత్మకమైనది: చనిపోయిన వారి శవపేటికల్లో చౌకుమాను చిగుర్లు పెట్టటం సంప్రదాయంగా ఉండేది, చాలా చర్చిల వద్ద చౌకుమాను చెట్లు ఉండేవి. చర్చి పక్కన కొన్ని చౌకుమాను చెట్లను నాటటం పరిపాటి అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో అప్పటికే చౌకుమాను చెట్టు ఉన్న ప్రదేశంలో చర్చిల నిర్మాణం జరిగేది. ఈ చెట్లను క్రైస్తవ శకానికి ముందు డ్రూయిడ్లు పవిత్రమైనవిగా భావించేవారు. వాస్తవంగా పాగన్ ఆలయ స్థలాల్లో ఈ చౌకుమాను చెట్లను నాటటం లేదా ఈ చెట్లు ఉన్న ప్రాంతాలను పాగన్ ఆలయాల కోసం ఎంపిక చేసుకోవటం జరిగింది. అనంతర కాలంలో ఈ పద్ధతినే చర్చి కూడా అవలంబించింది! 6. గంజాయి రాస్తాఫారీయన్ మతంలో గంజాయికి ప్రాధాన్యం ఉంది. ‘జీవ వృక్షం’ అంటూ ప్రస్తావించిన చెట్టు గంజాయి మొక్కేనని.. దీని వినియోగం పవిత్రమైనదని ఆ మతం విశ్వసిస్తుంది. ఉదాహరణకు ప్రకటన 22:2 ఇలా చెప్తుంది.. ‘ఈ మొక్క యొక్క ఆకులు జనులను నయం చేయును’. రాస్తాఫారీ ‘తార్కిక సదస్సు’ల్లో గంజాయి వినియోగం అంతర్భాగం. అవి మతపరమైన సమావేశాలు. సభ్యులు రాస్తా దృక్పథంలో జీవితం గురించి ఆ సదస్సుల్లో చర్చిస్తారు. వీరు ఈ మొక్కను ‘పవిత్ర మూలిక’ అనీ, ‘జ్ఞాన మొక్క’ అనీ అభివర్ణిస్తుంటారు. ఈ మొక్క ధూమపానం ద్వారా గొప్ప జ్ఙానం, అంత:దృష్టి లభిస్తుందని వారు విశ్వసిస్తారు. ఈ మూలికను ఉపయోగించటం వల్ల దేవుడికి, విశ్వానికి, ఆధ్యాత్మిక స్వీయాత్మకు మరింత దగ్గరగా పయనిస్తామని వారు భావిస్తారు. ఈ ’జ్ఞాన మొక్క’ ధూమపానం చాలా సంప్రదాయబద్ధమైన చర్య: దీనిని ఒక సిగరెట్‌లా చుట్టటమో, పైపులో కూరటమో చేస్తారు. దానిని ఒకరి తర్వాత ఒకరు పీలుస్తూ పంచుకుంటారు. ఈ ధూమపానానికి ముందు ప్రార్థన చేస్తారు. 7. భూతులసి ఆహార పదార్థాల్లో సువాసన, రుచి కోసం వాడే ఆకులుగా ‘భూతులసి’ (ఓసిమమ్ బసీలియమ్) చాలా మందికి తెలుసు. కానీ సనాతన క్రైస్తవమతంలో, ప్రత్యేకించి గ్రీకు చర్చి పరిధిలో ఇది చాలా పవిత్రమైన మొక్క. ’బాసిల్’ అనే పేరే ‘రాచరికా’ గ్రీకు పదం నుంచి వచ్చింది. యేసు సమాధి సమీపంలో అతడి రక్తం చిందిన చోట ఈ మొక్క పుట్టిందని సనాతన క్రైస్తవులు విశ్వసిస్తారు. అప్పటి నుంచీ శిలువ పూజలో, ప్రత్యేకించి ఉపవాస దినాలలో ఈ భూతులసి మొక్క పాత్ర కూడా విడదీయరానిదైంది. మతాచార్యుడు పవిత్ర జలాన్ని శుద్ధి చేయటానికి ఈ భూతులసి ఆకులను ఉపయోగిస్తారు. సమావేశమైన జనం మీదకు పవిత్ర జలాన్ని చిలుకరించటానికి కూడా ఈ భూతులసి ఆకులను ఉపయోగిస్తారు. శిలువను ఈ మొక్క బొకేలతో అలంకరించి చర్చి చుట్టూ ఊరేగించి, ఆ ఆకు రెమ్మలను భక్తులకు పంచుతారు. చాలా మంది ఆ రెమ్మలకు వేర్లు పుట్టే వరకూ నీటిలో ఉంచుతారు. అలా వేర్లు వచ్చిన తర్వాత దానిని తమ ఇంట్లో నాటుతారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చాలా మత సంప్రదాయాల్లో మొక్కలను ఆధ్యాత్మిక చిహ్నాలుగా పరిగణిస్తారు. text: నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఆదేశించింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సీనియర్ అడ్వొకేట్ ప్రకాశ్ రెడ్డిని అమికస్ క్యూరీ (మధ్యవర్తి)గా హైకోర్టు నియమించింది. మరోవైపు, 'దిశ' కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసును రిజిస్టర్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, విచారణ జరపాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిందని రిపోర్టర్ సుచిత్ర మొహంతీ తెలిపారు. ‘‘ఈనెల 11వ తేదీ బుధవారం ఈ పిటిషన్‌పై దృష్టిసారిస్తాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారని వివరించారు. ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారణకు స్వీకరించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు విజ్ఞప్తి చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. text: వీకే సింగ్ ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి. గతంలో భారత ఆర్మీ ఛీఫ్‌గా కూడా పనిచేశారు భారతదేశం నుంచి ఒక మంత్రి చివరిసారిగా ఉత్తర కొరియా వెళ్లింది 1998 సెప్టంబరులో. అప్పటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ప్యాంగ్‌యాంగ్ వెళ్లారు. ఈసారి పర్యటనకు మరింత ప్రాధాన్యం ఉంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ఉత్తర కొరియాలో ఎంతోమంది సీనియర్ మంత్రులు, అధికారులను కలిశారు. వారం క్రితం రెండు దేశాల మధ్య రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చలు కూడా జరిగాయి. ఆసక్తికరంగా, దశాబ్దం తర్వాత ఉభయ కొరియాల మధ్య తొలి సదస్సు జరిగిన కొన్ని వారాల తర్వాత, అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు వచ్చే నెలలో చారిత్రాత్మక సమావేశానికి సన్నద్ధమైన తరుణంలో ఈ అరుదైన దౌత్య పర్యటన కుదిరింది. ఏకపక్షంగా అణ్వాయుధాలు వదులుకోవాలని అమెరికా పట్టుబడితే, చర్చల నుంచి తప్పుకుంటామని ఉత్తర కొరియా చెబుతుండడంతో జూన్ 12న డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగే చర్చలపై అనిశ్చితి నెలకొంది. అంటే దౌత్యపరమైన సుడిగాలిలో వెనకబడిపోకుండా ఉత్తర కొరియాకు తిరిగి దగ్గర కావడానికే భారత్ ఈ సమయాన్ని ఎంచుకుందా? లేక మిత్రదేశం అమెరికాకు అనుకూలంగా ఇలా చేసిందా? కిమ్, ట్రంప్ ఇద్దరూ జూన్ 12వ తేదీన సింగపూర్‌లో భేటీ కావాల్సి ఉంది ఇరుదేశాల మధ్యా కొనసాగుతున్న సంబంధాలు గత 45 ఏళ్లుగా భారత్, ఉత్తర కొరియాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఉన్నాయనేది చాలా మంది మర్చిపోయారు. ఇరు దేశాలకు ఢిల్లీ, ప్యాంగ్‌యాంగ్‌లో చిన్న రాయబార కార్యాలయాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఉత్తర కొరియా దౌత్యవేత్తలు ఢిల్లీలో విదేశీ రాయబారుల కోర్సులకు హాజరవుతుంటారు. ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగంగా భారత్ ప్యాంగ్‌యాంగ్‌కు ఆహార సామగ్రి కూడా పంపించింది. 2004లో భారత్‌లో సునామీ వచ్చినపుడు ఉత్తర కొరియా తమ వంతుగా 30 వేల డాలర్ల సాయం అందించింది. భారత్ తన మంత్రిని 20 ఏళ్ల క్రితం ఉత్తర కొరియా పంపించినా, ప్యాంగ్‌యాంగ్ నుంచి ఎన్నో ఏళ్లుగా సీనియర్ అధికారులు భారత్‌ రావడం కొనసాగుతూనే ఉంది. ఉత్తర కొరియాలో వీకే సింగ్, ఇతర అధికారులు వాణిజ్య సంబంధాలు 2015 ఏప్రిల్‌లో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి ఢిల్లీ వచ్చారు. మానవతా సాయం కోరేందుకు భారత విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. తర్వాత ఏడాది సెప్టంబర్‌లో ఉత్తర కొరియా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సహాయ మంత్రి ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వెళ్లారు. దేశంలో ఒక కేంద్ర మంత్రి ఉత్తర కొరియా అధికారిక కార్యక్రమానికి హాజరు కావడం బహుశా అదే మొదటిసారి. రెండు దేశాల వ్యాపార, వాణిజ్య సంబంధాలు ముందు ముందు ఎలా బలోపేతం కానున్నాయి అనే విషయంపై అప్పుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. 2013లో చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత దేశం, ఉత్తర కొరియాకు మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉండేది. భారత్ నుంచి ప్రధానంగా పరిశ్రమల రసాయనాలు, ముడి చమురు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఎండు ఫలాలు, సహజ జిగురు, ఇంగువ లాంటివి దిగుమతి అయ్యేది. 2014లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 130 మిలియన్ల డాలర్ల నుంచి 200 మిలియన్ డాలర్ల వరకూ క్షీణించింది. 2017లో క్షిపణి పరీక్షల తర్వాత ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి తాజా ఆంక్షలతో భారత్ దాదాపు అన్ని వ్యాపారాలపై నిషేధం విధించింది. ‘ఉత్తర కొరియాకు భారత దేశం ఒక కిటికీ’ "ఉత్తర కొరియా దౌత్య సంబంధాలు కొనసాగించిన కొన్ని దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ప్రపంచాన్ని చూడడానికి ఉత్తర కొరియాకు భారత దేశం ఒక కిటికీ లాంటిది. రెండు దేశాల మధ్యా సుదీర్ఘ, సున్నిత సంబంధాలున్నాయి" అని ఢిల్లీలో ఉన్న డిఫెన్స్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్, అనాలసిస్ సభ్యులు, భారత తూర్పు ఆసియా ఒప్పందాల్లో నిపుణులు అయిన ప్రశాంత్ కుమార్ సింగ్ నాకు చెప్పారు. గత ఏడాది.. ప్యాంగ్‌యాంగ్‌లో తమ దౌత్య ఉనికిని తగ్గించుకోవాలన్న అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్ సూచనలను భారత్ తోసిపుచ్చింది. నేరుగా టిల్లర్‌సన్‌ను ఉద్దేశించి మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ "మీకు సమాచారం అందించే ఛానెళ్లు తెరిచి ఉండడానికి, మీ మిత్ర దేశాల రాయబార కార్యాలయాలు మాత్రం అక్కడ ఉండచ్చా" అని ప్రశ్నించారు. ట్రంప్, కిమ్ భేటీ విషయంలో భారత్ వైఖరి ఏంటి? కొరియా ద్వీపకల్పంలో తాజా పరిణామాలను పరిశీలించడానికి మంత్రి వీకే సింగ్‌ను ప్యాంగ్‌యాంగ్ పంపినట్టు కేంద్రం తెలిపింది. శాంతిస్థాపన దిశగా చొరవ చూపుతున్న కొరియాకు భారత్ మద్దతు తెలియజేయడానికే మంత్రి అక్కడకు వెళ్లారంది. అయితే రాబోవు పరిణామాలతో, అనిశ్చితిలో పడిన కిమ్, ట్రంప్ సమావేశంతో సింగ్ పర్యటనకు ఏదైనా సంబంధం ఉందా? '"ట్రంప్ తన శిఖరాగ్ర సమావేశాన్ని ప్రమాదంలో పడేయడనే మనం అనుకోవాలి. బహుశా ఆ సమావేశం జరగాలని అనుకుంటున్న అమెరికన్లు భారత్ సహకారం కోరుకుంటూ ఉండచ్చు" అంటారు డాక్టర్ సింగ్. "భారత్ ఇక్కడ కాస్త కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఈ ప్రాంతంలో సమస్యాత్మకం కానిది, ఉత్తర కొరియాతో మంచి సంబంధాలు ఉన్న ఒకే ఒక ప్రధాన దేశం కూడా భారత దేశమే. ఒంటరి అయిపోయిన వారసత్వ పాలకుడితో చర్చలు జరిపే విషయానికి వస్తే, ఇది అరుదైన విషయమే. ఇక్కడ చిన్న మిత్రుడు కూడా పెద్ద సాయం చేయగలడనేది సుస్పష్టం" అంతర్జాతీయ సమాజం నుంచి దూరమైన ఉత్తరకొరియా మనుగడ కోసం అణ్వాయుధాలపై ఆధారపడింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రెండు దశాబ్దాల తర్వాత మొదటి సారి ఒక కేంద్ర మంత్రిని ఉత్తర కొరియా పంపించినట్టు భారత్ గురువారం వెల్లడించింది. text: ఈ పాదయాత్ర మార్చి 12వ తేదీన ముంబై ‌చేరుకుంటుంది. అక్కడ రైతులు అసెంబ్లీని ముట్టడించాలని భావిస్తున్నారు. ఇంతకూ ఈ నిరసన ప్రదర్శన వెనుక ఉన్న కారణాలేంటి? 'ఈ పాదయాత్ర 25 వేల మంది రైతులతో ప్రారంభమైంది. ముంబై చేరుకునేసరికి వారి సంఖ్య 50 వేలకు చేరుతుందని భావిస్తున్నాం. సమాజంలోని అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. వీళ్లలో 96 ఏళ్ల ముసలివాళ్లు, మహిళా రైతులు కూడా ఉన్నారు'' అని ఈ లాంగ్ మార్చ్‌ను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ పార్థ్ మీనా నిఖిల్ బీబీసీకి వివరించారు. ఈ పాదయాత్ర మహారాష్ట్రలో రైతుల దయనీయ పరిస్థితిని మరోసారి బహిర్గతం చేసింది. కదం తొక్కిన మహారాష్ట్ర రైతులు పలువురు వ్యవసాయ నిపుణులు, జర్నలిస్టులు, రైతు నాయకులతో మాట్లాడిన బీబీసీ.. ఈ పాదయాత్ర వెనుక ఉన్న కారణాలను కనుగొనే ప్రయత్నం చేసింది. 1. రుణమాఫీ 'కట్టుకథలు' 'రుణమాఫీ గణాంకాలను చాలా ఎక్కువ చేసి చెబుతున్నారు. జిల్లా బ్యాంకులు దివాలా తీశాయి. ఈ పరిస్థితిలో బ్యాంకులు కేవలం అంచనా వేసిన లబ్ధిదారుల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రుణాలు ఇవ్వగలిగాయి. అందువల్ల రుణమాఫీ అసంపూర్తిగా జరిగింది. రుణమాఫీ ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా చేయాలి. కానీ వాళ్లెప్పుడూ డిజిటల్ లిటరసీ గురించి ఆలోచించలేదు.'' అని మరాఠ్వడా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ ఉన్హాలే తెలిపారు. 'రుణమాఫీ అమలు చేయడానికి ముందు వాళ్లు ఒక పైలెట్ ప్రాజెక్టును అమలు చేయాలి. అది చేయలేదు. తాము లబ్ధిదారుల్లో ఉన్నామా, లేదా అని రైతులు రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇది రైతుల విషయంలో చాలా క్రూరమైన పరిహాసం'' అన్నారు సంజీవ్. 2.పరిష్కారం కాని 'చట్టబద్ధమైన ధర' సమస్య సీనియర్ జర్నలిస్ట్ నిషికాంత్ భాలేరావ్ చట్టబద్ధమైన ధర గురించి మాట్లాడుతూ, ''రైతుల సమస్యలు తొలగిపోవాలంటే వాళ్లకు చట్టబద్ధమైన ధర లభించాలి. కేవలం కనీస మద్దతు ధర సరిపోదు. ప్రకృతి విపత్తులతో పాటు, ప్రభుత్వ నిర్ణయాలు కూడా రైతులను దగా చేస్తున్నాయి'' అన్నారు. చట్టబద్ధమైన ధరపై సంజీవ్ ఉన్హాలే, ''రైతులకు కానీ, ప్రభుత్వానికి కానీ అంతర్జాతీయ మార్కెట్‌పై నియంత్రణ లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడైనా ధరలు పడిపోతే, అది మన రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పినపుడే రైతులకు మంచి ధర లభిస్తుంది. అందువల్ల ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలి'' అని సూచించారు. 3. సంక్షోభంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం, వ్యవసాయాభివృద్ధి రేటు మందగించింది. సీనియర్ రైతు నాయకులు విజయ్ జవన్‌ధియా దీనికి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'రాజ్యాంగం ప్రకారం, వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. కానీ ముఖ్యమైన నిర్ణయాలన్నీ కేంద్రమే తీసుకుంటుంది. కనీస మద్దతు ధరతో పాటు వ్యవసాయోత్పత్తుల ఎగుమతి-దిగుమతుల విధానాలను కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. దాని ప్రభావంతో వ్యవసాయ ఆదాయం 44 శాతం పడిపోయింది. పత్తి, కాయధాన్యాలు, గింజలపై ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మందగిస్తోంది'' అని తెలిపారు. 4. చీడల నివారణ - కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత 'పంట చీడలు పత్తి పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి పరిష్కారంగా మనం కొత్త హైబ్రిడ్ విత్తనాలను కనుగొనాలి. మనం ఇంకా కరువును తట్టుకునే, రోగాలను తట్టుకునే విత్తనాలపై దృష్టి పెట్టలేదు. ఔరంగాబాద్‌లోని మహికో కంపెనీ దీనిపై పరిశోధనల కోసం ఏటా రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు చెందిన నేతలు హైబ్రిడ్ రకంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.'' 'ఆహార పదార్థాలు కాకుండా మిగతా వ్యవసాయోత్పత్తులను రసాయనాల ద్వారా ప్రాసెస్ చేయవచ్చు. కొత్త రకం విత్తనాలతో మహికో సిద్ధంగా ఉంది. కానీ కేంద్రమే దీనిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ విత్తనంతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి'' అన్నారు భాలేరావ్. 5. గిరిజనులకు భూమిపై యాజమాన్యం ఈ పాదయాత్రలో వేలాదిమంది గిరిజనులు పాల్గొంటున్నారు. నిజానికి ఈ పాదయాత్రలో అతి పెద్ద బృందం వాళ్లదే. గిరిజనుల సమస్యలపై మాట్లాడుతూ జర్నలిస్ట్ నిఖిల్,''నాసిక్ ప్రాంతంలోని గిరిజన భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి. గిరిజనులు పంటలను పండిస్తున్నా, వాటిపై యాజమాన్య హక్కు మాత్రం లేదు. అందువల్ల గిరిజనులు ఆ భూమిపై తమకు హక్కు కల్పించాలని కోరుతున్నారు. '' కొందరు గిరిజనులు తమ పరిస్థితిని వివరిస్తూ, ''అటవీ అధికారులు హఠాత్తుగా వచ్చి మా పంటలను నాశనం చేస్తుంటారు. అందువల్ల మాకు భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలి. లేకపోతే మేమెప్పుడూ వాళ్ల దయ మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది'' అని తెలిపారు. 6. పెరిగిపోతున్న అప్పులు విజయ్ జవన్‌ధియా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి గురించి వివరిస్తూ, 'కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రానికి రూ.2.5 లక్షల కోట్ల అప్పులు ఉండేవి. ఇప్పుడు అవి రూ.4.13 లక్షల కోట్లకు చేరాయి. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? దాని వల్ల ఒక్క సామాన్యునికైనా మేలు జరిగిందా? కేవలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు మాత్రమే పెరిగాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రైతుల చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నది కూడా వాళ్లే'' అని తెలిపారు. 7. దయనీయ స్థితిలో జంతు ప్రాథమిక సంరక్షణ కేంద్రాలు లాల్య-ఖుర్కట్ లాంటి వ్యాధుల కారణంగా అనేక మంది రైతుల పశువులు మరణించాయి. ఈ సమస్యపై జర్నలిస్ట్ భాలేరావ్, 'గ్రామీణ ప్రాంతాలలో పేరుకు జంతువుల ప్రాథమిక సంరక్షణ కేంద్రాలైతే ఉన్నాయి కానీ, వాటి పరిస్థితి అత్యంత దయనీయం. అక్కడ పశువులకు సరైన సమయంలో వైద్యం లభించడం లేదు. మీడియా కూడా దీనిని పట్టించుకోవడం లేదు. అందువల్లే ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు'' అన్నారు. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. 'భారతీయ కిసాన్ సభ' మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని వేలాది మంది రైతులు ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొంటున్నారు. text: మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం తమ సొంతూళ్లకు నడిచి వెళ్తున్న వలస కార్మికులు కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. అత్యవసర సేవల వైద్య విభాగం అందించిన సమాచారం ప్రకారం మొదటి లాక్ డౌన్ కాలంలో సుమారు 208 మంది మరణించారు. కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకూడందన్న ఉద్ధేశంతో లాక్ డౌన్ విధించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. కానీ హఠాత్తుగా ఆయన చేసిన ప్రకటనతో వందల సంఖ్యలో వలస కార్మికులు ఎలాగోలా తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకున్నారు. 2020 మార్చి 29 వరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్-19కారణంగా 25 మంది చనిపోగా, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య సేవలు అందకపోవడం వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే మే 20 నాటికి వచ్చేసరికి రోడ్డు ప్రమాదాలు లేదా సుదూర తీరాలకు నడవలేక అలసి పోయి మార్గ మధ్యంలోనే మరణించిన వారి సంఖ్య 200కి పైగానే ఉంది. వివిధ మీడియాల్లో వచ్చిన కథనాలను బీబీసీ పరిశీలించింది. మొత్తం మరణాల్లో 42 కేసులు రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవి కాగా, 32 మంది నడిచి నడిచి తీవ్రంగా అలసిపోయి సమయానికి అత్యవసర వైద్యం అందక మరణించారు. లాక్ డౌన్ ప్రకటన మొదలైనప్పటి నుంచి 5 రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే చాలా మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని మా విశ్లేషణలో తేలింది. రోడ్డు ప్రమాదాల తర్వాత వేల కిలోమీటర్ల దూరం నడవటం వల్లే మెజార్టీ మరణాలు సంభవించాయి. విపరీతమైన అలసట, నిస్సత్తువ కారణంగా చనిపోయిన వారిలో వృద్ధుల నుంచి యవకుల వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. 65 ఏళ్ల రామ్ కృపాల్ ముంబై నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 1500 కిలోమీటర్ల దూరాన్ని కొంత వరకు నడిచి మరి కొంత ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వడం ద్వారా ప్రయాణించినప్పటికీ తన సొంత ఊరు చేరుకునే మార్గంలో తీవ్రమైన అలసటకు గురై ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని ములుగు జిల్లా పేరూరు గ్రామం నుంచి తన సొంతూరు వెళ్లాలనుకున్న 12 ఏళ్ల చిన్నారి దట్టమైన అడవుల గుండా సుమారు మూడు రోజుల పాటు వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన తర్వాత ఛత్తీస్‌ఘడ్‌లోని బీజ్‌పూర్ చేరుకునేసరికి ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ ప్రకటించక ముందు తన మామయ్య సహా 13 మందితో కలిసి మిరప పొలాల్లో పని చేసేందుకు ఆమె వెళ్లారు. రైలు ప్రమాదాలు మే నెల ప్రారంభంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక కథనం ప్రకారం 40 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత అలసిపోయిన కూలీలు కర్మదా స్టేషన్ సమీపంలో ఆగిపోయారు. అప్పటికే లాక్ డౌన్ కారణంగా రైళ్లు ఆగిపోవడంతో అవి రావనుకొని ట్రాక్ పై నిద్రించారు. కానీ ఓ గూడ్సు రైలు వారి మీద నుంచి వెళ్లిపోవడంతో 20 మందిలో 16 మంది మరణించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ట్విట్టర్లో ద్వారా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చిన ప్రధాని మోదీ.. వారికి అసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరో ఘటనలో ఇద్దరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తమ సొంతూరికి కాలి నడకన వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో సరుకు రవాణా రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే వారు చనిపోయారు. ఈ దుర్ఘటన ఏప్రిల్‌లో జరిగింది. మార్చి మొదటి వారంలో కూడా గుజరాత్‌లోని వాపి జిల్లాలో సరుకు రవాణా చేసే రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. (ఈ కథనంలో పేర్కొన్న ప్రతి ఘటన కనీసం రెండు మీడియా నివేదికలతో నిర్ధారించినవని గమనించగలరు.) కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి మార్చి 24 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు వలస కూలీల ప్రాణాలు తీశాయి. text: జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ మధ్యప్రదేశ్‌కు 72 ఏళ్ల కమల్‌నాథ్‌ను, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా 67 ఏళ్ల అశోక్ గెహ్లాత్‌ను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్ రాజవంశీకుడు జ్యోతిరాదిత్య సింథియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌ ముఖ్యమంత్రి పదవిని కోరుకున్నప్పటికీ వారి అభ్యర్థనలను రాహుల్ తిరస్కరించారు. దీంతో నలభైల్లో ఉన్న ఈ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం మరింత కాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి. పాత తరానికే ప్రాధాన్యం ఇచ్చారెందుకు? ప్రస్తుతం దేశంలో మెల్లగా కాంగ్రెస్ గాలి వీయడం మొదలైంది.. బీజేపీకి సవాల్‌గా నిలిచేందుకు రాహుల్ ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అదే సమయంలో భవిష్యత్‌నూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాలు, ప్రచారం, నిధుల సమీకరణ, ఇంకా ఎన్నికలకు సంబంధించిన సకల అంశాలకూ అనుభవజ్ఞులైన నేతల అండ రాహుల్‌కు అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో అనుభవం, ప్రతిభ గల నేతలు ఫలితాలు రాబట్టగలుగుతారు. సీనియర్లను నమ్ముకోవడమనేది రాహుల్ గత అయిదేళ్లలో నేర్చుకున్నారు. 2013లో ఆయన పార్టీ ఉపాధ్యక్షుడైన మొదట్లో యువతరానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. కానీ, ఇది గమనించిన సీనియర్లలో ఆందోళన పెరిగింది.. చాలామంది సీనియర్లు రాహుల్‌తో సౌకర్యంగా ఉండలేకపోయేవారు. ఆయన అసహనం, రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టకపోవడం, నాన్చుడు ధోరణి వంటివన్నీ సీనియర్లకు నచ్చేవి కావు. కానీ, గత ఏడాది చివర్లో రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన ధోరణిలో చాలామార్పు వచ్చింది. తన కొత్త జట్టు కూర్పులో సమతూకాన్ని పాటించారు. పాత తరం నుంచి పలువురు నేతలను తన జట్టులోకి తీసుకుని సీనియర్ల విశ్వాసాన్నీ సంపాదించారు. సీనియర్ నేతల నైపుణ్యాలు పార్టీకి అవసరమన్న సంగతిని రాహుల్ గుర్తించారు. ఆ కారణంగానే అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, పి.చిదంబరం, కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాత్, కమల్ నాథ్ వంటివారికి అవకాశాలు దక్కాయి. అదేసమయంలో దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది వంటి నేతలను పక్కన పెట్టారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ కార్యవర్గాలు, రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే ప్యానళ్లలో అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. సీనియర్ల మార్గదర్శకత్వంలోని యువ నాయకత్వం పార్టీకి అవసరమన్న సంగతిని రాహుల్ గుర్తెరిగారు. కమల్‌నాథ్‌కు కలిసొచ్చిందేంటి? ప్రస్తుత సందర్భంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసిన అశోక్ గెహ్లాత్, కమల్ నాథ్‌ల విషయానికొస్తే.. కమలనాథ్‌ను ఎంపికలో రాహుల్ అన్ని కోణాల్లో ఆలోచించారనే చెప్పాలి. కేంద్రంలోని వివిధ ప్రభుత్వాలలో అనేక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూసిన అనుభవం ఉన్న కమల్ నాథ్ పాలనలో ముద్ర వేయగలరన్నది మొదటి అంశమైతే... రెండోది పార్టీకి ఉపయోగపడడంలోనూ ఆయనకు జ్యోతిరాదిత్య సింథియా కంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార ప్రపంచంలో విస్తృత పరిచయాలున్న కమల్ నాథ్ రానున్న లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీకి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడంలో సాయపడగలరనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా 72 ఏళ్ల కమల్ నాథ్‌కు ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కకపోతే మళ్లీ అవకాశం రావడం కష్టమే, అదే సమయంలో సింథియా వయసులో చిన్నవాడే కావడంతో ఆయనకు అవకాశాలు అందుకోవడానికి ఎంతో సమయం ఉంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన కమల్‌నాథ్‌కు చాన్సివ్వకుంటే ఆయన సమస్యలు సృష్టించే అవకాశాలూ ఎక్కువే. ముఠా రాజకీయాలకు పేరుపడిన మధ్యప్రదేశ్‌లో, అందులోనూ.. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మద్దతు పుష్కలంగా ఉన్న కమల్ నాథ్‌ను నిరాశపరిస్తే చిక్కులు తప్పవని రాహుల్ భావించి ఉంటారు. యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన చిత్రం. చిత్రంలో అశోక్ గెహ్లాత్, రాహుల్, సచిన్ పైలట్ గుజరాత్ ఎన్నికల నుంచే గెహ్లాత్‌పై గురి ఇక రాజస్థాన్ సీఎంగా రాహుల్ ఎంపిక చేసిన అశోక్ గెహ్లాత్ గురించి చెప్పాలంటే గుజరాత్ ఎన్నికల సమయంలోనే ఆయనపై గురి కుదిరింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో పుంజుకొంది. ఆయన ఎన్నికల వ్యూహాలు, వ్యక్తిగతంగా తనకు చెప్పిన సూచనలు రాహుల్‌కు ఆయనపై నమ్మకం కుదిరేలా చేశాయి. అంతేకాదు.. రాజస్థాన్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రతి నియోజకవర్గంలో నమ్మిన బంట్లు ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలోని నేతలతో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలున్నాయి. అందరితో కలిసిపోయే, సర్దుకుపోయే స్వభావం ఉన్న గెహ్లాత్ రాజస్థాన్‌లోని వివిధ సామాజికవర్గాలను పార్టీకి అనుకూలంగా మలచడంలో, సమస్యలను పరిష్కరించడంలో పైలట్ కంటే సమర్థంగా పనిచేయగలరని రాహుల్ భావించారు. బొటాబొటి మెజారిటీతో బయటపడడంతో ప్రభుత్వాన్ని నడిపించడానికి అనుభవజ్ఞుడి అవసరం ఉందని, అది గెహ్లాతేనని రాహుల్ నమ్మారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా మాదిరిగానే పైలట్ కూడా యువకుడు కావడంతో ఆయనకు ఇంకా ముందుముందు చాలా కాలం ఉందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోలేదు. కమల్‌నాథ్ వలె గెహ్లాత్ కూడా ఎన్నికలకు నిధులు సమీకరించడంలో సిద్ధహస్తులు. పైగా, పార్టీలో కూడా అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతూ ఆయనకే ఉంది. మరోవైపు 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా రాహుల్ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటుండడంతో ఈ ఇద్దరికీ అవకాశాలు దక్కాయి. దీంతో సింథియా, పైలట్ కూడా రాహుల్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకున్న తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపికచేసే అత్యంత కీలకమైన, సున్నితమైన పనిని పూర్తిచేశారు. ఈ క్రమంలో ఆయన అనుభవానికే పెద్ద పీట వేసి యువనేతలను నిరాశపరిచారు. text: వెలుగులు చిమ్ముతున్న కుంభ్ నగరంలో ఇప్పుడు ఎవరినోట విన్నా హిజ్రాల అఖాడా మాటే వినిపిస్తోంది. అయితే అఖాడాలకు ప్రాధాన్యం ఇచ్చే అఖాడా పరిషత్ సంస్థ ఈ అఖాడాను గుర్తించడానికి ఎందుకు నిరాకరిస్తోంది. 2019లో కుంభమేళా శుభారంభానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు. హిజ్రాల అఖాడా ప్రధానాధికారి షాహీ పేష్వాయీతో నగరంలో ప్రవేశించారు. నగరంలో వారి పేష్వాయీ రాగానే జనం మొదటిసారి హిజ్రాలను అలా చూసి షాక్ అయ్యారు. 2016లో ఉజ్జయిని కుంభమేళాలో చర్చల్లో నిలిచిన హిజ్రాల అఖాడా, ప్రయాగరాజ్ కుంభమేళాలో జునా అఖాడాతో చేతులు కలిపింది. వారితోపాటు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం గురించి చెప్పిన హిజ్రాల అఖాడా ఆచార్య మహామండలేశ్వర్, అఖాడా చీఫ్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ హిజ్రాల అఖాడా జునా అఖాడాలో విలీనం కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని జునా అఖాడా సంరక్షకుడు హరిగిరి కూడా అంగీకరించారు. బీబీసీతో మాట్లాడిన ఆయన హిజ్రాల అఖాడా జునా అఖాడాలో విలీనం అయ్యిందని చెప్పడం పూర్తిగా తప్పు అన్నారు. హిజ్రాల అఖాడా వేరే సంస్థ అని, అది ఇక ముందు కూడా ఉంటుందని అన్నారు. అఖాడా ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి? హిజ్రాలకు విడిగా అఖాడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నకు లక్ష్మీభాయి సమాధానం ఇచ్చారు. "సనాతన ధర్మం నుంచీ హిజ్రాల సమాజం పతనం జరిగింది. దానిని ఎవరూ మెరుగు పరచలేదు. అందుకే హిజ్రాల అఖాడా అవసరం ఏర్పడింది. 2014లో సుప్రీకోర్టు మాకు థర్డ్ జెండర్ గుర్తింపు ఇచ్చినపుడు, హిజ్రాలకు గౌరవ మర్యాదలు దక్కాలంటే మతాన్ని మించిన దారి ఏదీ లేదని నాకు అనిపించింది. కానీ నాకు ఏ పదవుల మీద ఆశ లేదు. నన్ను ఈ కుర్చీకి వాచ్‌మెన్‌లా భావిస్తున్నాను" అన్నారు. "హిజ్రాల పట్ల జునా అఖాడా మైండ్‌సెట్ చాలా బాగా అనిపించింది. మమ్మల్ని ఇలా వారితోపాటు ఉండేలా చేయడం మాకు లభించిన గౌరవం. మమ్మల్ని జునా అఖాడా చాలా ఉదారంగా ఆదరించింది" అని ఆమె తెలిపారు. హిజ్రాల అఖాడా మహామండలేశ్వర్ భవానీ నాథ్ వాల్మీకి "మేం కూడా ప్రధాన స్రవంతిలో కలవాలి. అందుకే అఖాడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. సమాజంలో ప్రజలు మమ్మల్ని అంగీకరించడం లేదు. కానీ మా మాట చెప్పడానికి, వారిని ఒప్పించేందుకు మతం అనేది చాలా మంచి మార్గం. అందరికీ పూజించే హక్కు, గౌరవం ఉంది. అందుకే హిజ్రాల సమాజంతో కూడా అలాగే ప్రవర్తించాలి" అన్నారు. హిజ్రాల అఖాడా ఉత్తర భారత మహామండలేశ్వర్ భవానీ హిజ్రాల అఖాడాపై వ్యతిరేకత హిజ్రాల అఖాడా ఏర్పాటు విషయం బయటికి వచ్చినపుడు హిజ్రాల సమాజంలోని వారే దాన్ని వ్యతిరేకించారు. వారు వ్యతిరేకించడానికి కారణం కూడా మతమే. అంతే కాదు. సనాతన సంప్రదాయం ప్రకారం ఏర్పడిన 13 అఖాడాలు కూడా హిజ్రాలు విడిగా అఖాడా ఏర్పాటు చేయడాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. అఖాడాలకు గుర్తింపు ఇచ్చే అఖాడా పరిషత్ సంస్థ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి కూడా హిజ్రాల అఖాడా గురించి సనాతన సంప్రదాయంలో ఎలాంటి ఉనికీ లేదన్నారు. ముందు ముందు కూడా దానికి 14వ అఖాడాగా గుర్తింపు లభించదని చెప్పారు. "హిజ్రాల అఖాడాకు ఎలాంటి గుర్తింపూ లేదు. 13 అఖాడాలు ఉన్నాయి. అవి మాత్రమే ఉంటాయి. అయినా వారు జునా అఖాడాలో విలీనం అయ్యారు. అలాంటప్పుడు వారికి ఇప్పుడు ఎలాంటి అస్తిత్వం లేదు. హిజ్రాలు అందరికంటే భిన్నమైన సమాజం ఏం కాదు. లక్ష్మీ త్రిపాఠీ వచ్చారు. అక్కడ కాస్త హంగామా చేస్తున్నారు. కానీ దానివల్ల ఏదీ దక్కదు. వారు జునా అఖాడాలో ఉన్నారు, కానీ తర్వాత జునా నుంచి కూడా బయటికి వెళ్లిపోతారు. అదే జరుగుతుంది. సన్యాస సంప్రదాయంలో హిజ్రాలకు సన్యాసం తీసుకునే హక్కు లేదు. వారు అత్యాశతో ఇలా చేయడం హిజ్రాల సమాజానికే అవమానం" అన్నారు. అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి "మీ ఇంట్లో మిమ్మల్ని మీరు ప్రధాన మంత్రిగా ప్రకటించుకుంటే అందరూ దాన్ని ఒప్పుకుంటారా. 13 అఖాడాలకు మాత్రమే గుర్తింపు ఉంది. అవే ఉంటాయి. హిజ్రాలకు సన్యాసం ఇప్పించేవారు కూడా ఆ పాపంలో భాగమవుతారు. ఎందుకంటే శాస్త్రాల్లో హిజ్రాలకు సన్యాసం ఇచ్చినట్టు ఎక్కడా ఎలాంటి వివరణా లేదు" అన్నారు. అంతే కాదు, హిజ్రాల అఖాడాలో ఉన్న చాలా మంది పదాధికారులు అఖాడా ఏర్పాటు చేయడానికి ముందు తమ సమాజంలో కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. "ఎందుకంటే ఎక్కువ మంది ఇస్లాంను విశ్వసిస్తారు. తమ మతం వదులుకుని హిందూ సంప్రదాయాలు పాటించాలని అనుకోకపోవడంతో వారు అఖాడా ఏర్పాటును వ్యతిరేకించారు" అన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అఖాడాలో ఉత్తర భారత్‌కు చెందిన మహామండలేశ్వర్ భవానీ స్వయంగా ఇస్లాం వదిలి హిందుత్వం స్వీకరించారు. ఆమె హజ్ కూడా వెళ్లొచ్చారు. అయితే 2010లో ఇస్లాం మతం స్వీకరించే ముందు ఆమె హిందువుగా ఉండేవారు. "ఎప్పుడూ వివక్ష ఉండడంతో నేను ఆందోళన చెందాను. అందుకే నేను ఇస్లాం స్వీకరించాను. నేను హజ్ కూడా వెళ్లొచ్చాను. నాకు ఇస్లాం నమాజు చదివే స్వేచ్చను ఇచ్చింది. నన్ను హజ్‌కు వెళ్లనిచ్చింది. కానీ నాకు నా సనాతన సంప్రదాయంలోకి తిరిగి రావడానికి, ఇందులో నా సమాజానికి ఏదైనా చేయగలిగే అవకాశం లభించినప్పుడు తిరిగి వచ్చేశాను. ఘర్ వాపసీ అనేది శిక్షేం కాదుగా" అన్నారు. స్వలింగ సంపర్కుల చేరికపై వివాదం స్వలింగ సంపర్కులు హిజ్రాల అఖాడాలో కలవడంపై కూడా అఖాడా పదాధికారుల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయి. కొంతమంది హిజ్రాలు స్వలింగ సంపర్కులను అఖాడాలో కలపడం వారి హక్కులను హరించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇటు అఖాడా చీఫ్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ మాత్రం ప్రతి వర్గాన్నీ అఖాడాతో కలుపుకుని తీసుకువెళ్తామని చెబుతారు. "మా అఖాడాలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. వారు గే అయినా, లెస్బియన్ అయినా, ఏ సెక్సువల్ ఓరియెంటేషన్ అయినా మేం అందరినీ మా వెంట తీసుకుని ముందుకు వెళ్తామని భరోసా ఇస్తున్నాం. మేం ఎవరి పాపపుణ్యాలు చూసి ఆశీర్వదించం. మా అఖాడా తలుపులు అందరికోసం తెరిచే ఉంటాయి" అని లక్ష్మి తెలిపారు. అయితే భవానీ నాథ్ వాల్మీకి దీనికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. "స్వలింగ సంపర్కులు హిజ్రా సమాజాన్ని చాలా నాశనం చేశారు. వారి వల్ల మేం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా సమాజంలో, మా అఖాడాలో కేవలం హిజ్రాలే ఉంటారు. నేను హిజ్రాను, హిజ్రాల అభివృద్ధి కోసమే పనిచేస్తాను. నేను వారిని నిందించను, కానీ వారికి అండగా కూడా ఉండను. మిగతా వారు నా మాటను అంగీకరించకపోయినా, హిజ్రాల సమాజానికి ఈ దుర్దశ స్వలింగ సంపర్కుల వల్లే వచ్చింది. వారికి స్వేచ్ఛ అవసరమైంది. హిజ్రాలకు కాదు" అన్నారు. అఖాడా చీఫ్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీతో ఫొటో దిగిన సాధువులు మిగతా అఖాడాలకు ఇది ఎలా భిన్నం? హిజ్రాల అఖాడా పేరు కుంభమేళాలో ప్రతి ఒక్కరికీ తెలిసింది. మిగతా అఖాడాల బాబాల గురించి ఎవరికీ తెలీకపోయినా, హిజ్రాల అఖాడా గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. హిజ్రాల అఖాడాలో ప్రధాన పండాల్‌ దగ్గర రోజంతా జనం కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న కొంతమంది హిజ్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. దానితోపాటు అఖాడా చీఫ్ ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ టెంట్ బయట ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనం గుమిగూడుతున్నారు. ఆమెను ఒక్క క్షణమైనా చూడాలని ఎదురుచూస్తున్నారు. టెంట్ లోపల కూర్చున్న లక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న వారిలో సాధువులు, సన్యాసుల నుంచి గర్భిణులు వరకూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. లక్ష్మి ప్రతి ఒక్కరికీ సెల్ఫీ తీసుకునే అవకాశం ఇస్తున్నారు. కొన్నిసార్లు ఆమే స్వయంగా ముందుకొచ్చి సెల్ఫీ క్లిక్ చేస్తున్నారు. అయితే లక్ష్మి కాకుండా మిగతా టెంట్ల దగ్గర మామూలుగా రోజంతా హడావుడి తక్కువే ఉంటుంది. మిగతా అఖాడాల్లా ఇక్కడ గంజాయి తాగే సాధువులు కనిపించరు, ఎలాంటి హడావుడీ ఉండదు. లౌడ్ స్పీకర్లలో కేవలం భజనలు మాత్రం వినిపిస్తుంటాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ కుంభమేళా ఈసారీ చాలా రకాలుగా చర్చల్లో నిలిచింది. ఆ కారణాలన్నింటిలో ఒకటి కిన్నెర్(హిజ్రాల) అఖాడా. text: కఠువా రేప్ కేసు: సీబీఐ ఇప్పుడొచ్చి ఏం చేస్తుంది? ‘ఆ బాలికతో పాటు అందరికీ న్యాయం జరగాలి. జమ్మూకశ్మీర్‌లో పారదర్శకంగా విచారణ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నిందితులకు అక్కడ లభిస్తున్న మద్దతును చూస్తుంటే, కేసు విచారణ సజావుగా సాగుతుందనే నమ్మకం నాకు కలగట్లేదు’ అని బాధిత కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా రజావత్ బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. కఠువా రేప్ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఏప్రిల్ 9న క్రైం బ్రాంచి అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కఠువా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లినప్పుడు కొందరు న్యాయవాదులు గొడవకు దిగి అడ్డుకున్నారు. అందుకే దీపిక ఈ కేసు విచారణ రాష్ట్రానికి వెలుపల జరగాలని కోరుతున్నారు. కానీ అలా కేసును వేరే ప్రాంతానికి బదిలీ చేయడం సాంకేతికంగా కుదురుతుందా? బాధిత కుటుంబం కోర్టులో విచారణ జరిగినప్పుడల్లా వచ్చిన ప్రతిసారీ అక్కడి వెళ్లగలుగుతుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఈ విషయంలో దేశమంతా ఆ కుటుంబానికి తోడుగా ఉంటుంది. వాళ్లు అధైర్య పడాల్సిన పనిలేదు’ అని దీపిక చెప్పారు. "నన్ను కూడా బెదిరిస్తున్నారు" ఈ కేసును స్వీకరించాక తనకు కూడా బెదిరింపులు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడే తనను కోర్టు మెట్ల మీద బెదిరించారని, అందుకే తనకు కూడా రక్షణ కావాలని కోరినట్లు ఆమె చెప్పారు. దీపిక 2013లోనే బార్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. మరోపక్క బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భుపిందర్ సింగ్ మాత్రం దీపిక ఆరోపణలు అర్థం లేనివని చెబుతున్నారు. దీపిక బాధిత కుటుంబం తరఫున వాదిస్తున్న విషయం కూడా తనకు తెలీదని, ఈ మొత్తం విషయంపై సీబీఐ విచారణ జరగాలని ఆయన అన్నారు. క్రైం బ్రాంచి ఈ కేసుకు మతం రంగు పులిమే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. కానీ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం క్రైం బ్రాంచి విచారణతో సంతృప్తిగానే ఉన్నారనీ, వాళ్లు సీబీఐ విచారణ కోరుకోవట్లేదని దీపిక చెప్పారు. ‘ఆ పాప దుస్తుల్ని కడిగేశారు. ఆధారాల్ని మాయం చేశారు. ఇప్పుడు సీబీఐ మాత్రం ఏం చేస్తుంది?’ అని దీపిక ప్రశ్నించారు. "మతం రంగు పలుముతున్నారు" ఈ కేసుకు హిందూ - ముస్లిం అన్న మతం రంగు పులమడం తనను చాలా బాధించిందని ఆమె పేర్కొన్నారు. ఏ దారీ లేనప్పుడే కొందరు ఇలా మార్గాలు వెతుకుతారని ఆమె అన్నారు. ‘నేను కశ్మీరీ పండిట్‌ని. నేనిక్కడే పుట్టాను. జమ్మూలో పనిచేస్తున్నాను. నేనూ హిందువునే. అందుకే కొన్నిసార్లు సిగ్గుపడతాను’ అని చిన్నారిపై అత్యాచారాన్ని గుర్తుచేసుకుంటూ అన్నారు. ఈ కేసు దీపికా వద్దకు ఎలా చేరింది? ఈ ప్రశ్నకు సమాధానం దీపికా ఇలా చెప్పారు.. "నేను చాలా కాలంగా బాలల హక్కులు కోసం పనిచేస్తున్నాను. ప్రారంభం నుంచీ నేను ఈ కేసును గమనిస్తూనే ఉన్నాను. నాకూ ఐదేళ్ల కూతురు ఉంది. ఈ చిన్నారి కేసు నన్ను ఎంతగానో కలచివేసింది. దాంతో నేనే బాధిత కుటుంబాన్ని సంప్రదించాను." వారిని ఫిబ్రవరిలో కలిశాను. కోర్టు పర్యవేక్షణలో క్రైం బ్రాంచి దర్యాప్తు జరిపించేలా పట్టుబట్టాం. అందులో విజయవంతం అయ్యామని ఆమె వివరించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్ ఆ చిన్నారిపై అత్యాచారం చేసినట్టు తేలితే అతనికి కూడా ఉరిశిక్ష పడుతుందా? అన్న చర్చ మొదలైంది. అందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా అనుకూలంగా ఉన్నారు. న్యాయవాది దీపికా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో దోషులందరినీ ఉరిశిక్ష తీయాలన్నదే తన కోరిక అని ఆమె అన్నారు. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కఠువా రేప్ కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు విచారణ జమ్మూకశ్మీర్ బయట జరగాలని అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. text: ఆయనను ఎందుకు విడుదల చేస్తున్నామనేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. వివాదాస్పద జమ్ముకశ్మీర్ ప్రాంతానికి రాజ్యాంగంలో కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని ఆగస్టులో రద్దు చేయటానికి ఒక రోజు ముందు వేలాది మంది స్థానిక నాయకులతో పాటు ఫరూక్ అబ్దుల్లాను కూడా గృహనిర్బంధంలో ఉంచారు. రాష్ట్రంలో అలజడిని అణచివేయటానికి ప్రభుత్వం వేల సంఖ్యలో సైనికులను మోహరించింది. సమాచార వ్యవస్థలను స్తంభింపజేసింది. పార్లమెంటు సభ్యుడు కూడా అయిన ఫరూక్ అబ్దుల్లాను వివాదాస్పద ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధించటం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు ఇతర కశ్మీర్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల కిందట ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. రాష్ట్రంలో ''ప్రజాస్వామిక అసమ్మతి స్వరాన్ని అణచివేస్తున్నారు'' అని ఆ సంయుక్త తీర్మానం విమర్శించింది. రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఉద్యమకారులు, న్యాయవాదులు సహా వేలాది మంది కూడా నిర్బంధంలో ఉన్నారు. వారిలో చాలా మందిని కశ్మీర్ వెలుపలి నగరాల్లోని జైళ్లకు తరలించారు. ఈ చర్య నిరంకుశమైనదని చాలా మంది విమర్శకులు తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఈ నిర్బంధాలు అవసరమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. వీటిని పాక్షికంగానే పునరుద్ధరించారు. కశ్మీర్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లాను.. రాష్ట్రంలో ''భారత అనుకూల'' రాజకీయ నాయకుడిగా పరిగణిస్తారు. జమ్మూకశ్మీర్ మొత్తం తమకే చెందుతుందని భారత్, పాకిస్తాన్‌లు రెండూ వాదిస్తున్నాయి. అయితే.. ఈ ప్రాంతంలో కొన్ని భాగాలు మాత్రమే ఈ దేశాల అధీనంలో ఉన్నాయి. పార్లమెంటు సభ్యుల్లో ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే తొలుత పార్లమెంటుకు తెలియజేయాలన్న విధానం ఉంది కనుక.. ఫరూక్ అబ్దుల్లాను తొలుత గృహనిర్బంధంలో ఉంచినపుడు.. దానిపై వివరణ ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఫరూక్ అబ్దుల్లాను ''నిర్బంధించటం కానీ, అరెస్ట్ చేయటం కానీ జరగలేదు'' అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చెప్పారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఉద్వేగంగా మాట్లాడుతూ.. అమిత్ షా అబద్ధం చెప్తున్నారని ఆరోపించారు. ''నా రాష్ట్రం తగలబడుతోంటే, నా ప్రజలను జైళ్లలో చంపేస్తోంటే నాకు నేనుగా నా ఇంట్లోనే ఎందుకు ఉండిపోతాను? ఇది నేను నమ్మిన భారతదేశం కాదు'' అని ఆయన పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏడు నెలలుగా నిర్బంధంలో ఉన్న కశ్మీర్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. text: యాపిల్ మరో 10ఏళ్ల తరవాత కూడా ఇదే స్థానంలో ఉంటుందా? దీనికి ముందు 1987లో ఐబీఎం స్టాక్‌ మార్కెట్‌లో 10 వేల కోట్ల డాలర్ల విలువను దాటిన సంస్థగా గుర్తింపు సాధించింది. అంతకన్నా ముందు 1957లో జనరల్ మోటార్స్ తొలిసారి వేయి కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డు సృష్టించింది. యూఎస్ స్టీల్ 1901లో 100 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించింది. 30 ఏళ్ల తరువాత ఐబీఎంను గమనిస్తే, నాటి వైభవం ఇప్పుడా సంస్థకు లేదు. కంప్యూటర్ రంగంలో ఇప్పటికీ ఐబీఏంకు పేరున్నా, ఫార్చ్యున్-500 సంస్థల్లో కనీసం టాప్ 30 జాబితాలో కూడా అది కనిపించదు. ఈ ఫార్చ్యున్ ర్యాంకులను సంస్థల టర్నోవర్ ఆధారంగా బిజినెస్ మేగజీన్ ‘ఫార్చ్యున్’ లెక్కిస్తుంది. 30 ఏళ్ల తరవాత ఐబీఎంను గమనిస్తే, నాటి వైభవం ఇప్పుడా సంస్థకు లేదు. అత్యంత సమర్థుడే మనుగడ సాగిస్తాడనే సూత్రం వ్యాపారాలకు కూడా వర్తిస్తుందంటారు విశ్లేషకులు. ఆ సూత్రం ప్రకారమే ఐబీఎం మునుపటి స్థానాన్ని కోల్పోయిందని చెబుతారు. అమెరికాకు చెందిన ఇన్నోసైట్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం 1964లో ఓ సంస్థ సగటున 33 ఏళ్లపాటు ఫార్చ్యున్ 500 జాబితాలో కొనసాగితే, 2016 నాటికి అది 24 ఏళ్లకు పడిపోయింది. 2027నాటికి 12 ఏళ్లకు మించి సంస్థలు ఆ జాబితాలో కొనసాగలేకపోవచ్చని వాళ్లు భావిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దాని మీద ఆధారపడిన సంస్థల ప్రభావం అప్పటికే స్థిరపడిన సంస్థలపై తీవ్రంగా పడుతోంది. యాపిల్ సంస్థే దానికో పెద్ద ఉదాహరణ. 2007లో ఐఫోన్‌ను ప్రవేశపెట్టిన యాపిల్ 2018 నాటికి ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. టర్నోవర్ పరంగా చూస్తే అమెరికాకు చెందిన రిటైల్ చెయిన్ వాల్‌మార్ట్... ఫార్చ్యున్ 500 జాబితాలో ముందుంది. కానీ, యాపిల్ ఆ జాబితాలో కూడా వడివడిగా ముందడుగేస్తోంది. 2005లో అదే జాబితాలో యాపిల్ 263వ స్థానంలో ఉంటే ఇప్పుడు మాత్రం నాలుగో స్థానంలో ఉంది. వ్యాపారం ఎంత వేగంగా ఎదుగుతుందో, పతనం కూడా అంతే వేగంగా అరంభమవుతుందని వ్యాపార వర్గాల అంచనా. అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇదే విషయాన్ని చెబుతోంది. రానున్న 5-10ఏళ్ల కాలంలో ఫార్చ్యున్ 500 జాబితాలో 75 శాతం సామాన్య ప్రజలకు తెలియని కంపెనీల పేర్లే కనిపిస్తాయని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ‘ప్రస్తుతం ఓ ఎదురులేని శక్తికి, కదలలేని వస్తువుకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఆ శక్తి పేరు అత్యాధునిక టెక్నాలజీ. అది మార్కెట్‌ మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది’ అని బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూప్‌ అభివృద్ధి నిపుణుడు ప్యాట్రిక్ ఫోర్త్ 2014లో టెడ్‌ టాక్‌లో చెప్పారు. ఇప్పటికీ ఆ ప్రసంగం కార్పొరేట్ వర్గాల్లో తప్పక చూడాల్సిన వీడియోల జాబితాలో ఉంటుంది. 2018 ముగిసే నాటికి వాట్సాప్‌ వల్ల గత ఆరేళ్లలో టెలికాం రంగానికి జరిగిన నష్టం దాదాపు 38,600 కోట్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు ఈ అంచనాలను బట్టి చూస్తే ‘రేపటి యాపిల్’ ప్రస్తుతం ఫార్చ్యున్ జాబితాలో లేకపోవచ్చు కూడా. ‘చరిత్రలో ఎప్పుడూ లేనంతగా చాలా తక్కువ మందే ఇంటర్నెట్ సాయంతో అత్యంత విలువైన సంస్థలను సృష్టించే పరిస్థితి ఇప్పుడుంది. వాట్సాప్ అందుకో అతి పెద్ద ఉదాహరణ. 2014లో ఫేస్‌బుక్ దాన్ని 1,900 కోట్ల డాలర్లకు కొన్నప్పుడు వాట్సాప్‌‌లో దాదాపు 50మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అందుకే, 20 ఏళ్ల తరవాత అత్యంత విలువైన సంస్థగా ఏది అవతరిస్తుందో చెప్పడం కష్టం’ అంటారు టెక్ నిపుణులు, కాన్‌స్టిలేషన్ రీసెర్చ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డియన్ హెన్‌క్లిఫ్. వాట్సాప్‌ వల్ల టెలికామ్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 2018 ముగిసే నాటికి, గత ఆరేళ్లలో వాట్సాప్‌ వల్ల టెలికాం రంగానికి జరిగిన నష్టం విలువ 38,600 కోట్ల డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, ఉబర్, ఎయిర్‌బీఎన్‌బీ, స్పాటిఫై, అమెజాన్ లాంటి సంస్థల ప్రభావం కూడా ఇతర రంగాలపై తీవ్రంగా పడింది. వీడియో క్యాసెట్లను అద్దెకిచ్చే 'బ్లాక్ బస్టర్' అనే సంస్థకు గతంలో అమెరికా వ్యాప్తంగా 8వేల స్టోర్లు ఉండేవి. కానీ, 2018 జూలై నాటికి ఒకేఒక్క స్టోర్ మిగిలుంది. 2025 నాటికి ఫార్చ్యున్ 500 జాబితాలో టాప్-25లో ఉంటాయని భావిస్తున్న సంస్థలకు, 2018 జాబితాకు చాలా తేడా ఉంది. వాల్‌మార్ట్, షెల్, టొయోటా, జనరల్ మోటార్స్ లాంటి సంస్థలు 2025లో టాప్‌ స్థానాల్లో ఉండవని భావిస్తున్నారు. ప్రస్తుతం అందరి కళ్లూ కొత్తగా వస్తోన్న ఫుడ్ డెలివరీ కంపెనీ గ్రాబ్ హబ్, రొబోటిక్ సర్జరీ యంత్రాలను తయారు చేసే ఇంట్యుటివ్ సర్జికల్ లాంటి కొన్ని సంస్థలపైనే ఉన్నాయి. స్పేస్ ట్రావెల్, జెనిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగ సంస్థలకూ మంచి భవిష్యత్తు ఉన్నట్లు కనిపిస్తోంది. నోకియా, కొడాక్ లాంటి సంస్థలు గుర్తున్నాయా? ఒకప్పుడు అవి మార్కెట్ లీడర్స్. కానీ విధ్వంసక ఆవిష్కరణల (disruptive innovations) పుణ్యమా అని అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1901లో యూఎస్ స్టీల్ 1 బిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. వీడియో క్యాసెట్లను అద్దెకిచ్చే ‘బ్లాక్ బస్టర్’ అనే సంస్థకు గతంలో అమెరికా వ్యాప్తంగా 8 వేల స్టోర్లు ఉండేవి. కానీ, 2018 జూలై నాటికి ఒకే ఒక్క స్టోర్ మిగిలింది. 1955 నుంచి ఫార్చ్యున్ 500 జాబితాను గమనిస్తే కేవలం 54 సంస్థలు మాత్రమే ప్రతి జాబితాలోనూ చోటు దక్కించుకున్నాయి. ‘కంపెనీలు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం ప్రస్తుత వ్యాపారం గురించి మాత్రమే ఆలోచించడం మంచిది కాదు. ముఖ్యంగా లాభాలు అందుతున్న సమయంలో భవిష్యత్తులో అవకాశాలుండే రంగంలో పెట్టుబడులు పెట్టాలి’ అంటారు షికాగోకు చెందిన పాల్ లీవండ్ అనే మార్కెట్ నిపుణుడు. మరి తదుపరి ‘యాపిల్’ సంస్థ ఏది? భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా మారే కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది? ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ప్రపంచంలోనే లక్ష కోట్ల డాలర్ల విలువైన తొలి సంస్థగా అవతరించింది యాపిల్. text: అది 2019.. హర్గెయిసా న‌గ‌రంలో మధ్యాహ్న భోజనం తరువాత చాలామంది కునుకు తీసే సమయం. జన సంచారం తక్కువగా ఉండ‌టంతో ఎవరి కంటా పడకుండా వెళ్లడానికి అనువైన సమయం. 20 ఏళ్ల మహమ్మద్, తన ప్రియుడు అహ్మద్ ఇంటికి వెళ్లాడు. ఎవరూ చూడకుండా ఇద్దరూ ఒక గదిలోకెళ్లి తలుపులు వేసుకున్నారు. అనుకోకుండా అహ్మద్ సోదరి ఆ తలుపులు తోసుకుని లోపలికొచ్చారు. వారిద్దరినీ అక్కడ అలా చూసి కెవ్వుమని కేక పెట్టారు. ఇంట్లో అందరూ నిద్ర లేచారు. మహమ్మద్ వెంటనే తలుపు చాటున దాక్కున్నాడు. అప్పుడు అతనికి ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. "ఇంటికి రావొద్దు, నిన్ను చంపేస్తారు" అని ఫోన్‌లో ఓ వ్యక్తి చెప్పారు. 30 ఏళ్ల క్రితం సోమాలియా నుంచి విడిపోయిన సోమాలీ ల్యాండ్ రాజధాని హర్గెయిసా. అక్కడ కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాలు అమలవుతాయి. స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావిస్తారు. ఎల్జీబీటీ స‌భ్యులు తమ ఇష్టాయిష్టాల‌ను త‌మ‌లోనే దాచుకోవాల్సి ఉంటుంది. త‌మ గురించి ఎవ‌రికైనా తెలిసిపోతుందేమోన‌ని భయంతోనే వారు బతుకుతుంటారు. తనలోని స్త్రీ త‌త్వాన్ని దాచుకోవడానికి మహమ్మద్ చాలా కష్టపడేవారు. "నాకు నాలుగైదేళ్లు ఉన్నప్పుడే గందరగోళం మొదలైంది. మిగతా అబ్బాయిల్లా కాకుండా నా కోరికలు, ఆలోచనలు వేరుగా ఉండేవి" అని మహమ్మద్ వివరించారు. ఇంట్లో మహమ్మద్ తన సోదరులతోపాటూ పడుకునేవారు. నిద్రపోయే ముందు అబ్బాయిలంతా చేరి అమ్మాయిల గురించి మాట్లాడుకునేవారు. నీకెలాంటి అమ్మాయిలు ఇష్టం అని తనని అడిగేవారు. "అప్పుడే నాకు అర్థ‌మయ్యింది. నేను అంద‌రిలా కాకుండా భిన్నంగా ఉన్నానని అనిపించింది." మహమ్మద్ అమ్మాయిల్లా అందంగా కనిపించాలని తహతహలాడేవాడు. మేకప్ మీద ఎక్కువ‌ దృష్టి ఉండేది. ఇంట్లో తోటి అబ్బాయిలతో కాకుండా అమ్మాయిలతో స్నేహం చేసేవాడు. వారి బట్టలు వేసుకుని చూసుకునేవాడు. మూడుసార్లు వాళ్లమ్మకు అలానే దొరికిపోయాడు. ఏదో ఒకటి చేస్తే గానీ.. మహమ్మద్ దారికి రాడని ఆమె భావించారు. మహమ్మద్‌‌ను తన పెద్దన్నయ్యకు అప్పజెప్పి రోజూ ఖురాన్‌లో పాఠాలు చదివించమని చెప్పారు. ‘అమ్మాయిల్లా కనిపించాలని ఆతృతపడే మగవారిని, అబ్బాయిల్లా కనిపించాలని సరదాపడే అమ్మాయిలను దేవుడు శిక్షిస్తాడు’అని రాసి ఉన్న ఒక వాక్యాన్ని రోజుకు పదిసార్లు చదివించేవారు. "నేను దేవుడికి కోపం తెప్పిస్తున్నానని, నన్ను శపిస్తాడని, మరణానంతరం నన్ను నరకానికి పంపిస్తాడని మా అన్నయ్య నాతో అనేవారు." "నాకప్పుడు పదేళ్లు. చాలా భయపడేవాడిని. రాత్రి పిచ్చి కలలు వచ్చేవి. నిద్రలో అరుస్తూ లేచి కూర్చునేవాడిని. నన్ను దేవుడినుంచి కాపాడండి, నరకంలో నన్ను మంటల్లో కాల్చేస్తున్నారు అని అరిచేవాడిని." తన కుటుంబ సభ్యులను సంతృప్తి పరచడానికి కొంతకాలం అబ్బాయిలా ఉండడానికి మహమ్మద్‌‌ ప్రయత్నించారు. “కానీ నన్ను నేను దాచిపెట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. అప్పటికి నేను చాలా చిన్నవాడిని. చెప్పినవన్నీ తొందరగా మర్చిపోయేవాడిని” అని మహమ్మద్‌‌ చెప్పారు. చిరవకు మహమ్మద్‌కు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఒక పునరావాస కేంద్రానికి పంపించారు. ''సోమాలీ విలువలకు వ్యతిరేకంగా నడుచుకునే పిల్లల్ని, యువకులను బాగు చెయ్యడానికి ఇలాంటి కేంద్రాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థల్లో చేరిన వారు వారి ఇష్టాలకు వ్యతిరేకంగా చాలా కఠినమైన పరిస్థితుల్లో కాలం గడుపుతుంటారు. కొన్నిచోట్ల డబ్బు కోసం ఖురాన్‌ను వక్రీకరించి కూడా చెప్తుంటారు'' అని మహమ్మద్‌‌ అన్నారు. మహమ్మద్‌‌ను ఆడ దెయ్యం ఆవహించిందని, అందుకే అతని ప్రవర్తన అలా ఉందని, అతని కుటుంబ సభ్యులు భావించారు. ఆ పున‌రావాస కేంద్రంలో ఆడ దెయ్యాన్ని తరిమేస్తామన్నారు. ఆ సెంటర్‌లో వాళ్లు తమని తాము ‘జీవితాలను కాపాడేవారు’గా పిలుచుకుంటారు. తమ దగ్గరికి వచ్చిన వారిని నరకానికి వెళ్లకుండా అడ్డుకుంటామని ప్రచారం చేసుకుంటారు. "నా దృష్టిలో ఇంతకన్నా దరిద్రమైన ప్రదేశం మరొకటి ఉండదు" అని మహమ్మద్‌‌ అన్నారు. అక్కడ మహమ్మద్‌కు సంప్రదాయ పురుషుడిలా ఎలా ప్రవర్తించాలో పాఠాలు చెప్పేవారు. మగవాడిలా ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో చెప్పేవారు. తమ దగ్గరికొచ్చిన మిగతా రోగులతో ఫుట్‌బాల్ ఆడమని బలవంత పెట్టేవారు. అది మహమ్మద్‌కు ఇష్టం ఉండేది కాదు. ఇస్లామిక్ పాఠాలూ చెప్పేవారు. నాలుగో రోజు నుంచీ మహమ్మద్‌‌పై లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టారు. "రాత్రి పూట నాపై అత్యాచారం చేసేవారు. కొన్నిసార్లు గుంపులుగా వచ్చేవారు." అత్యాచారం చెయ్యడం అక్కడ చాలా మామూలు విషయం. ఆ సంస్థను నిర్వహించేవారు, అక్కడికి వచ్చిన రోగులు కూడా అత్యాచారాలకు పాల్పడేవారు. ఆ కేంద్రంలో 10 నుంచి 30ఏళ్ల‌ వయసు గలవాళ్లు ఉండేవారు. అందరూ ఒక పెద్ద హాల్‌లో వరుసగా పడుకునేవారు. అక్కడ ఎవరికీ రక్షణ ఉండేది కాదు. ఉదయం పాఠాల్లో చెప్పేది వేరు, రాత్రిపూట చేసేది వేరు. "‌మేం ఎవరికీ చెప్పం అనే నమ్మకంతోనే ఇవన్నీ చేసేవారు." మనుషులకు పట్టిన దెయ్యాలను తరిమేయడానికి ఆ సంస్థలో హర్మల అనే మూలికల మందు ఇస్తారు. అది తీసుకుంటే మత్తుగా ఉండి ఒక విధమైన భ్రాంతి కలుగుతుంది. వాంతులు అవుతాయి. ఇది దెయ్యాలను తరిమేయడానికి సహకరిస్తుందని చెప్తారు. కానీ ఆ మందు ఇవ్వాల్సిన డోసు కన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఇది ప్రాణాంతకమైనది. ముఖ్యంగా పిల్లలకు చాలా హాని చేస్తుందని పరిశోధ‌నలో తేలింది. "అది తీసుకున్నాక నేను ఎక్కడో ఎగురుతున్నట్టు, నా చుట్టూ నక్షత్రాలు ఉన్నట్టు అనిపించేది. అప్పుడు నాపై అత్యాచారం చేసేవారేమో తెలీదు. నాకు స్పృహ ఉండేది కాదు." ఒకసారి హర్మల మందు తీసుకున్నాక మహమ్మద్‌కు విపరీతమైన కడుపు నొప్పి వచ్చి ఆస్పత్రిలో చేర్పించాల్సిన ప‌రిస్థితి వచ్చింది. ఆ పునరావాస కేంద్రం నుంచి బయటపడ్డాక మహమ్మద్‌‌ తన లైంగికతను దాచుకోవడానికి ప్రయత్నించాడు. అహ్మద్‌ను కలిసే వరకూ తన టీనేజ్ అంతా అలాగే గడిచిపోయింది. గే సోమాలీస్ అనే సీక్రెట్ చాట్ గ్రూపులో వారిద్దరూ కలుసుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. తరువాత ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒకరినొకరు కలుసుకునేవారు. ఇంట్లో తనని చంపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసిన త‌ర్వాత‌ మహమ్మద్‌‌ దేశం నుంచీ పారిపోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అది అంత సులువు కాదు. చాలా దేశాల్లో సోమాలీలకు సులువుగా వీసాలు ఇవ్వరు. అనేక ష‌ర‌తులు ఉంటాయి. వేల డాలర్లు బ్యాంక్ అకౌంట్‌లో చూపించాలి. సోమాలీ ల్యాండ్ ప్రజలకు అది చాలా కష్టం. ఇథియోపియా, జిబౌటి, కెన్యా, ద‌క్షిణాఫ్రికా మాత్రమే సోమాలీ ల్యాండ్‌ను స్వతంత్ర్య దేశంగా పరిగణిస్తాయి. మహమ్మద్‌కు బ్లాక్ మార్కెట్లో పాస్‌పోర్టు కొనుక్కోవడం, ఎల్లో ఫీవర్ వ్యాక్సీన్ వేసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం తప్ప మరో మార్గం క‌నిపించ‌లేదు. అలా ఆ దేశం నుంచీ మహమ్మద్‌ తప్పించుకున్నారు. పారిపోయినట్టు ఇంట్లో తెలిసే సమయానికే ఆయ‌న విమానం ఎక్కేశారు. అదే మొదటిసారి ఆయ‌న‌ విమానంలో ప్రయాణించ‌డం. "చాలా కొత్తగా.. వింతగా అనిపించింది. విమానం కిటికీ లోంచి బయటకి చూస్తూ కూర్చున్నాను" అని మహమ్మద్ చెప్పారు. ఆయ‌న‌ మలేసియా విమానం ఎక్కారు. ఆ దేశంలో ప‌ర్య‌ట‌క‌ వీసాలు అక్కడికి చేరుకున్న వెంటనే మంజూరు చేస్తారు. కానీ మలేసియాలో శరణార్థులుగా ఉండే సోమాలీలకు జీవితం అంత సులభం కాదు. అక్కడ కూడా స్వలింగ సంపర్కం నేరమే. అయితే మహమ్మద్ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. ఆయ‌న‌కు మలేషియాలో పునరావాసానికి ఆమోదం లభించింది. ఇదంతా జరగడానికి ఒక ఏడాది పట్టింది. ఆ ఏడాదంతా ఆయ‌న‌ చాలా కష్టపడ్డారు. జెనీవా ఒప్పందం ప్రకారం శరణార్థిగా వచ్చిన అతనికి మలేషియాలో ఉద్యోగం చేసే అర్హత లేదు. మరోవైపు తన కుటుంబ స‌భ్యులు తనని వెతుక్కుంటూ వచ్చి మళ్లి వెనక్కి తీసుకెళ్లి చంపేస్తారేమోననే భయం ఆయ‌న్ను వెంటాడింది. తనతోపాటు అక్కడ ఉన్న సోమాలీ శరణార్థులను నమ్మడానికీ లేదు. వారు తన గుట్టు బయటపెట్టి తన కుటుంబానికి పట్టిస్తారేమోనని భయపడేవారు. "ఏదో ఒక రోజు నేను అమెరికా లేదా యూరప్ వెళ్లిపోవాల‌ని అనుకుంటున్నా." "అప్పటివరకూ నా జాగ్రత్తల్లో నేనుంటూ, నా కుటుంబానికి దొరక్కుండా ఉండాలి" అని మహమ్మద్ అన్నారు. తను పారిపోయిన తరువాత అహ్మెద్ పరిస్థితి ఏమిటో మహమ్మద్‌కు తెలీదు. అహ్మెద్‌ని కాంటాక్ట్ చెయ్యడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చిత్రాలు: సారా ఎల్సా పినన్‌ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "మహమ్మద్‌‌ను మామూలు మగవాడిలా మార్చేందుకు అతడి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. అత‌డిలోని అమ్మాయిల‌ ల‌క్ష‌ణాలు పోగొట్టడానికి మందులు కూడా వాడారు. చివరికి అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు'' అని లైలా మహమూద్ చెప్పారు. text: ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారు: విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో ఉంచాం. వారి పాస్‌పోర్టులను అన్నీ సీజ్ చేయాలని అధికారులకు చెప్పాం. రాష్ట్రంలో ప్రస్తుతం అనుమానితులు 114 మంది ఉన్నారు. అందరికీ మంచి పద్ధతిలోనే చెప్పి సహకరించాలని కోరుతాం. లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. అమెరికాలో ప్రజలను కట్టడి చేయడం పోలీసులకు సాధ్యం కాకపోవడంతో సైన్యానికి బాధ్యతలు ఇచ్చారు. మన దగ్గర కూడా ప్రజలు పోలీసులకు సహకరించకపోతే, ఆర్మీని రంగంలోకి దించాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా సహకరించి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని ప్రజలను కోరుతున్నాను. అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కవులు మంచి కవితలు రాయాలని కోరుతున్నాను. నియంత్రణ విషయంలో పోలీసులు, అధికారులు మాత్రమే బయట కనిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎటు పోయారు? జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్లంతా ఎటు పోయిండ్రు? అది మంచిది కాదు. అందరూ రంగంలోకి దిగాలి. పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రతినిధులందరూ పనిచేయాలి. బాధ్యత అంతా పోలీసులదే అంటే సరికాదు, మంత్రులు,ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు... ఇలా అందరూ బాధ్యత తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. పోలీసులతో పాటు మనం కూడా 24 గంటలూ పనిచేయాలి. రాష్ట్ర సరిహద్దుల దగ్గర దాదాపు 3,400 వాహనాలు నిలిచిపోయాయి. వాటికి ఇవాళ ఒక్కరోజు టోల్‌ ఛార్జీలు రద్దు చేసి వదిలేస్తున్నాం. ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే 104 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలి. వెంటనే ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. రైతులు కూడా పట్టణాలలో ఉన్న మార్కెట్లకు రావద్దు. తమతమ ఊర్లలోనే వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉన్నవారు అలాగే ఉండాలి. మాట వినకపోతే వారి పాస్‌పోర్టులను శాశ్వతంగా రద్దు చేయాల్సి వస్తుంది. ఎవరైనా అధిక ధరలకు సరకులు, కూరగాయలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి, వారి దుకాణాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తాం. తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఒక్క వ్యక్తి కూడా వీధుల్లోకి రావొద్దు. వస్తే పరిస్థితి కఠినంగా ఉంటుంది. ఎవరికైనా అత్యవసరం అయితే 100కు ఫోన్ చేయండి. పోలీసులు మీకు సాయం చేస్తారు. సాయంత్రం 6 గంటలకే దుకాణాలన్నీ మూసివేయాల్సిందే. 6 గంటల 1 నిమిషానికి దుకాణం తీసి ఉన్నా సీజ్ చేసేస్తాం. వ్యవసాయ పనులకు అనుమతి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కొనసాగించవచ్చు. అయితే, అక్కడ కూడా ఎవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దు. ఉపాధి హామీ పథకం పనులను కూడా కొనసాగిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. కానీ, కార్మికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఎక్కడా గుంపులుగా ఉండొద్దు. నౌకాశ్రయాలు మూసివేశారు. రైళ్లు ఆగిపోయాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలు కూడా పూర్తిగా రద్దయ్యాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు తన కుమారుడి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అలాగే అందరూ ఆలోచించాలి. వీధుల్లోకి గుంపులు గుంపులుగా రాకూడదు. ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నా ఈ అంటు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయినా అనవసరంగా రోడ్ల మీదికి వస్తే పెట్రోల్ బంకులను కూడా మూసివేయాల్సి వస్తుంది. సోమవారం కొందరు మీడియా ప్రతినిధులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిందని తెలిసింది. అలాంటివి ఇకనుంచి జరగకూడదు. పోలీసులు కూడా మీడియా వారి పట్ల సంయమనంతో వ్యవహరించాలి. బ్యాంకు ఖాతాల్లో నగదు గురువారం నుంచి బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం. నగదు సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తాం. రాష్ట్ర ప్రజలందరినీ చేతులెత్తి కోరుతున్నాను. అందరూ ప్రభుత్వానికి సహకరించండి. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కేసులు నిర్ధరణ అయ్యాయని, అందులో ఒకరు కోలుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. కరోనావైరస్‌ తాజా పరిస్థితులను, దాన్ని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రెస్ మీట్‌లో సీఎం వివరించారు. బాధితులు అందరూ కోలుకుంటున్నారని కూడా చెప్పారు. text: వెండీ టక్ 2017-18 క్లిప్పర్ రేస్‌లో వెండీ టక్ తన టీమ్‌తో కలిసి పడవలో లివర్‌పూల్ చేరుకున్నపుడు వేలాది మంది ఆమె బృందానికి ఆహ్వానం పలికారు. గత ఆగస్టులో బ్రిటన్‌లోని లివర్‌పూల్ నుంచి మొత్తం 12 పడవలు ప్రపంచం చుట్టిరావడానికి బయలుదేరినపుడు సుమారు 2 లక్షల మంది వాటికి వీడ్కోలు పలికారు. బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల నిక్కీ హేండర్సన్ టీమ్‌ ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. పోటీలో విజయం సాధించిన 53 ఏళ్ల టక్ - ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నానని అన్నారు. 11 నెలల తర్వాత లివర్‌పూల్‌కు తిరిగి వచ్చిన నౌక ఈ పోటీలలో మొత్తం 41 దేశాలకు చెందిన నావికులు పాల్గొన్నారు. మహిళలు కెప్టెన్‌లుగా వ్యవహరించే ఇలాంటి పోటీలు గతంలో ఎప్పుడూ జరగలేదని 1996లో ఈ పోటీలను ప్రారంభించిన, ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన నావికుడు సర్ రాబిన్ నాక్స్-జాన్‌స్టన్ అన్నారు. రెండోస్థానం వచ్చిన టీమ్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హెండర్సన్ బ్రిటన్‌ ఎంపీ ఆన్నే మిల్టన్ కూతురు. హెండర్సన్ టీమ్‌లో పాల్గొన్న నాటింగ్ హామ్ షైర్ అగ్నిమాపక దళానికి చెందిన రెబెక్కా సిమ్స్, ఇది క్రీడల్లో పాల్గొనే మహిళలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న బ్రిస్టల్ నావికుడు సైమన్ స్పియర్స్ ఈదురుగాలుల కారణంగా సముద్రంలో పడి మరణించారు. దీనిపై విచారణ జరుగుతోంది. గత ఏడాది పోటీ ప్రారంభం సందర్భంగా సర్ రాబిన్ నాక్స్-జాన్‌స్టన్‌తో నావికులు క్లిప్పర్ రేస్ పోటీ మొత్తం 8 అంచెలుగా ఉంటుంది. ఒకే రకంగా ఉండే క్లిప్పర్ 70 అనే ప్రత్యేకంగా డిజైన్ చేసిన పడవలతో పోటీలు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనే నావికులంతా అనుభవం లేని వారే. వారికి అనుభవం కలిగిన వాళ్లు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు. 1996లో ప్రారంభమైన ఈ పోటీలలో మొత్తం 40 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం పూర్తి చేయాలి. నౌకలు లివర్‌పూల్‌ను చేరుకోవడంతో అంబరాన్ని అంటిన సంబరాలు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఆస్ట్రేలియాకు చెందిన వెండీ టక్.. ప్రతిష్టాత్మక క్లిప్పర్ రేస్‌లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళగా అవతరించారు. text: ఇద్దరు నేతలూ మరోసారి సమావేశం అవడానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని అమెరికా అధికారులు చెప్పారు. "అణు నిరాయుధీకరణపై దృష్టి పెట్టేందుకు వారు నిబద్ధతతో ఉన్నట్టు ప్యాంగ్‌యాంగ్ నుంచి వచ్చిన లేఖ చెబుతోంది" అని వైట్ హౌస్ ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు. ఇద్దరు నేతల మధ్య జూన్‌లో సింగపూర్‌ చర్చల తర్వాత ఈ అంశంపై సంప్రదింపులకు బ్రేక్ పడినట్లు కనిపించింది. ఈ లేఖలో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడితో మరోసారి సమావేశం అయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని కిమ్ కోరారని శాండర్స్ చెప్పారు. సమావేశం ఏర్పాటు కోసం తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఆ ఏర్పాట్లు ప్రారంభించామని ఆమె తెలిపారు. అయితే, ఇద్దరి మధ్య రెండో సమావేశం ఎక్కడ ఉంటుందనేదానిపై ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. స్వాగతించిన దక్షిణ కొరియా ఇటు, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఈ లేఖను స్వాగతించారు. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణ అంశం, అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరిగే చర్చల వల్లే మాత్రమే కొలిక్కి వస్తుంది అన్నారు. జూన్‌లో ట్రంప్-కిమ్ సింగపూర్‌లో సమావేశం కావడానికి మూన్ సయోధ్య కీలకం అయ్యింది. ఆయన కూడా వచ్చే వారం కిమ్‌తో మూడో దశ ముఖాముఖి చర్చలకు సిద్ధమవుతున్నారు. అమెరికా-ఉత్తర కొరియా చర్చలవైపు అడుగులు వేసేలా ఆయన ఒక మధ్యవర్తిలా వ్యవహరిస్తున్నారని బీబీసీ సియోల్ ప్రతినిధి చెప్పారు. ఉత్తర కొరియా అణు కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి అణు ఇంధన సంస్థ హెడ్ యుకియా అమానో ఆ దేశాన్ని హెచ్చరించిన తర్వాత రోజే ట్రంప్‌కు కిమ్ రాసిన లేఖ అందింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను అతిక్రమించినందుకు ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్నేహపూర్వక లేఖ గత వారం జరిగిన ఉత్తర కొరియా మిలిటరీ పెరేడ్‌పై కూడా శాండర్స్ ప్రశంసలు కురిపించారు. అణ్వాయుధాలు లేవని అలా అనడం లేదని, విజయవంతమైన ట్రంప్ విధానాలే దీనికి కారణం అన్నారు. ఉత్తర కొరియా 70వ వార్షికోత్సవ పెరేడ్‌లో సైనికులు, ట్యాంకులు, ఇతర ఆయుధాలు కనిపించినా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను(ఐసీబీఎం) మాత్రం ప్రదర్శించలేదు. అమెరికాను తాకగల వార్‌హెడ్స్ మోసుకెళ్లే ఆ క్షిపణులు పెరేడ్‌లో కనిపించి ఉంటే కిమ్ తమను రెచ్చగొట్టినట్టు అమెరికా భావించేది. కిమ్ లేఖ రాసినందుకు ట్రంప్ ట్విటర్‌లో థాంక్స్ చెప్పారు. పరేడ్‌ను "ఉత్తర కొరియా వైపు నుంచి ఒక భారీ, సానుకూల ప్రకటన"గా వర్ణించారు. "థాంక్యూ ఛైర్మన్ కిమ్. మనం అందరూ అనుకుంది తప్పని నిరూపించాం" అన్నారు. కొరియన్ ద్వీపకల్పంలో నిరాయుధీకరణ దిశగా పనిచేసే ఒక ఒప్పదంపై సింగపూర్‌ శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-కిమ్ సంతకాలు చేశారు. కానీ ఈ ప్రక్రియను ధ్రువీకరించే గడువుగానీ, వివరాలుగానీ, విధానాలుగానీ అందులో లేవు. రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు, పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పర్యటన మాత్రం చివరి నిమిషంలో రద్దయింది. తాము ఈ ప్రక్రియకు నిబద్ధతతో ఉన్నప్పటికీ చర్చలు ఆగిపోవడానికి మీరే కారణమంటూ రెండు దేశాలూ పరస్పరం నిందించుకున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్-ఉన్ నుంచి మళ్లీ ఎప్పుడు సమావేశం అవుదామంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఒక లేఖ వచ్చిందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. text: దీని ప్రకారం బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద భూమి ఇప్పుడు హిందూ పక్షాలకు లభిస్తుంది. దానితోపాటూ సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మించుకోడానికి ఐదు ఎకరాల భూమిని కూడా ఇస్తారు. దశాబ్దాల పురాతన కేసులో 40 రోజులపాటు జరిగిన విచారణ తర్వాత శనివారం ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. భారత్‌లోని ఎన్నో రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వాగతించాయి. అందరూ శాంతి, సోదరభావంతో ఉండాలని పిలుపునిచ్చాయి. 450 ఏళ్ల పోరాటం ఫలించింది విశ్వ హిందూ పరిషత్ రెండో నేత ప్రవీణ్ తొగాడియా రామమందిర ఉద్యమ సమయంలో చాలా చురుగ్గా ఉండేవారు. అశోక్ సింఘాల్ తర్వాత విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలు ఆయనే అందుకున్నారు. అయితే ఇటీవల వీహెచ్‌పీ నుంచి విడిపోయిన తొగాడియా అంతర్జాతీయ హిందూ పరిషత్ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. అయోధ్య కేసులో తీర్పు వచ్చిన తర్వాత బీబీసీ ప్రవీణ్ తొగాడియాతో మాట్లాడింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన ఏమన్నారో, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో ఆయన మాటల్లోనే.. హిందువుల కోసం 'గొప్ప ఆలయం' అనే 450 ఏళ్ల పోరాటం ఈరోజు సార్థకమైంది. నాలుగున్నరేళ్లలో నాలుగు లక్షల మంది త్యాగాలు చేశారు. తమ కుటుంబాలు, కెరీర్ వదులుకుని వచ్చిన లక్షల మంది కరసేవకులు, రామ భక్తుల త్యాగాలు ఈరోజు ఫలించాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పును నేను స్వాగతిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ట్రస్ట్ ఏర్పాటు సమయంలో రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు, కుటుంబాలు, కెరీర్ కూడా వదులుకుని వచ్చిన వారి జ్ఞాపకాలను ఆ మందిరంతో జోడించాలని నేను వారిని కోరుతున్నాను. అలా చేసినప్పుడు, హిందువుల ఈ మహత్తర పోరాటం రాబోవు తరాలకు గుర్తుండిపోతుంది. ఉద్యమం అవసరం ఏముంది? ఈ ఉద్యమంలో ఇంతమంది ఎందుకు మరణించారా అని నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. ఒకే తల్లి ఇద్దరు కొడుకులు, కొఠారీ సోదరులు గోధ్రా రైల్వే స్టేషన్లో చనిపోయిన 59 మందిలో ఉన్నారు. ఎందుకంటే వారు ఉద్యమం చేశారు. కోర్టు ద్వారానే రామ మందిరం నిర్మించాలని అనుకుంటే, మంచి వకీలును పెట్టుకుంటే సరిపోయేది. ఈ ఉద్యమం ఎందుకు? ఎందుకంటే, 1984 నుంచి ఆరెస్సెస్-బీజేపీ.. "ఇది కాంగ్రెస్ ప్రభుత్వం" అని చెబుతూ వచ్చాయి. "మనం సోమ్‌నాథ్ లాగే పార్లమెంటులో చట్టం చేసి, రామ మందిరం నిర్మించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మందిరం నిర్మించదు, ఉద్యమం చేయండి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించండి, మా ప్రభుత్వం తీసుకురండి" అని చెప్పాయి. "రాముడిపై ప్రమాణం చేసేవారే మందిరం నిర్మిస్తారు" అని చెప్పిన లాల్‌కృష్ణ అడ్వాణీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర ప్రారంభించారు. రామ మందిరం నిర్మించాలి, దానిని ఎలా నిర్మించాలి అనే దానికే ఉద్యమం చేశాం, బీజేపీ ప్రభుత్వం వస్తే, పార్లమెంటులో చట్టం చేసి రామ మందిరం నిర్మిస్తాం అన్నారు. 2014లో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం వచ్చింది. అప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టం చేశారు. కానీ రామ మందిరం చట్టం కాలేదు. రామ మందిరాన్ని సుప్రీం కోర్టు తీర్పుతో నిర్మిస్తున్నారు. రామ మందిరం పేరుతో, అధికారం కోసం ఎంతోమంది బిడ్డల ప్రాణాలు తీశారు అని నా మనసులో కూడా బాధ ఉంది. అలా అది జరిగిందంటే అది పాపమే. దేవుడు ఆ పాపాలకు శిక్ష వేస్తాడు. 1992 డిసెంబర్ 6 డిసెంబర్ ఆరున బాబ్రీ నిర్మాణం కూలింది. బాబ్రీ నిర్మాణం కూలకపోయుంటే ఈరోజు రామ మందిరం కట్టాలనేవారా? రామ మందిరం కోసం బాబ్రీ నిర్మాణాన్ని కూల్చాల్సిందే. కానీ బాబ్రీ నిర్మాణం ఎప్పటివరకూ ఉంటుందో, అప్పటివరకూ దాన్ని చూపించి ఓట్లు రాబట్టవచ్చని, అది కూలితే ఓట్లు రావని కొందరు అనుకున్నారు. వారు బాబ్రీ నిర్మాణాన్ని ముస్లింల కోసం కాపాడాలని అనుకోలేదు, ఓట్ల కోసమే దానిని అలా ఉంచారు. కానీ డిసెంబర్ 6 ఉదయం లక్షలాది కరసేవకులు బాబ్రీ నిర్మాణాన్ని కూల్చేశారు. కానీ, కల్యాణ్ సింగ్ అనే వ్యక్తి, తన ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేశాడు. ఈరోజు అదే కల్యాణ్ సింగ్ ఒంటరి అయిపోయాడు. ఆయనపైన కేసు కూడా నడుస్తోంది. అందుకే కొందరు ప్రభుత్వం కోసం బాబ్రీని కాపాడాలనుకుంటే, కల్యాణ్ సింగ్ రాముడి కోసం తన ప్రభుత్వాన్నే వదులుకున్నాడు. 2018లో మళ్లీ అయోధ్య ఎందుకు 2014లో ప్రభుత్వం వచ్చినపుడు మాట నిలబెట్టుకోడానికి మేం మళ్లీ మళ్లీ సమావేశం అయ్యాం. మన ప్రభుత్వం వస్తే సోమనాథ్ లాగే చట్టం తీసుకొస్తాం అన్నారు అని అడిగాను. అలా చాలా సమావేశాలు జరిగాయి. కానీ, చట్టం మాత్రం రాలేదు. తర్వాత 'మీరు ఆ విషయం వదిలేయండి' అని నాతో అన్నప్పుడు, నేను వాళ్లనే వదిలేశాను. వదిలిన తర్వాత నాకు వారు 'క్రమశిక్షణ'గా చెప్పే దాన్నుంచి విముక్తి లభించింది. అక్టోబర్ 21న నేను కొన్ని వేల మందిని తీసుకుని లక్నో నుంచి అయోధ్య వెళ్లాను. 1992 తర్వాత ఆరోజు మొదటిసారి అయోధ్య వీధుల్లో రామభక్తులు మాత్రమే కనిపించారు. కానీ, ఆ రామభక్తుల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అక్కడ మా పొట్ట కొట్టింది. మా పొట్టపై కొట్టారు మొదట్లో, అక్కడ ఆశ్రమాల్లో ఉండడానికి ఏర్పాట్లు ఉండేవి. కానీ మమ్మల్ని లోపలికి రానీయకుండా వాటిపై ఒత్తిడి తెచ్చారు. అందరూ సరయూ నది ఒడ్డునే పడుకున్నారు. అక్కడి వార్తాపత్రికలు, టీవీలు దాని కవరేజీ ఇచ్చాయి. ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టామో వారి కుర్చీ ఇవ్వమని రామభక్తులు అడగడం లేదు, అయోధ్యలో రామ మందిరం కట్టాలనే అడుగుతున్నారు. వారికే తిండి లేకుండా చేస్తారా... అని బాధపడ్డాను. 90లో ములాయం సింగ్ కాల్పులు జరిపిస్తే, వీళ్లు ఇప్పుడు పొట్టగొట్టారు. ఓట్లవర్షం కురిసి, అధికారంలోకి వచ్చేలా చేసిన నా సోదరుల్లో ఒకరు రామ మందిరం కట్టాలనుకుంటే, మరో సోదరుడు మసీదును కాపాడాలని అనుకునేవాడు. కొందరు రామ మందిరం నిర్మించడానికి అయోధ్యలో ఏవో చేస్తుంటే, ఎవరో వారికి తిండి లేకుండా చేస్తున్నారు. ఇంకెవరో రాముడి పేరుతో అధికారం చెలాయిస్తూ ఉద్యమాలు నడిపించి జనాలను చంపిస్తున్నారు. ఈలోపు రామ మందిర యాత్రలు నడుస్తూ వచ్చాయి. ప్రజల మనసులో మందిరం కావాలనే కోరిక ఉండేది. చివరికి కోర్టు తీర్పు ఇచ్చింది. 450 ఏళ్ల పోరాటం ఒక విజయంగా మారింది. కానీ సోమనాథ్ లాగే ఈ ఆలయం నిర్మించి ఉంటే, ఎక్కువ ఆనందించేవాళ్లం. ఇది లాయర్ల పోరాటానికి ఫలితం కదా. 1989లో అవకతవకల ఆరోపణ 1989లో నేను కేంద్ర నాయకత్వంలో లేను, అప్పుడు గుజరాత్ అధ్యక్షుడిగా ఉండేవాడిని. అందుకే అధికారాలు-నిధులు అన్నీ దిల్లీ వాళ్ల చేతుల్లోనే ఉండేవి. వారిని ఏమైందని అడిగాను. నా దగ్గర 88 నుంచి 98 వరకూ ఎలాంటి లెక్కలు లేవు. 1998 తర్వాత నుంచి ఆ లెక్కలన్నీ నా దగ్గరుండేవి. అన్నీ సరిగ్గా ఉండేవి. నేను ప్రతిరోజూ ఐదారు ఆపరేషన్లు చేసే, క్యాన్సర్ ఆస్పత్రి నుంచి బయటికొచ్చిన క్యాన్సర్ సర్జన్‌ని. అప్పట్లో నేను ఎలాంటి హిందుత్వ మూవ్‌మెంట్‌లో ఉండేవాడ్ని కాదు. మిగతా డాక్టర్లలాగే, మతవిశ్వాసాలు, భక్తి ఉండేవి. పరిస్థితులు మెల్లమెల్లగా మారుతూ మొదట గుజరాత్ హిందూ లీడర్ అయ్యాను. తర్వాత దేశ, ప్రపంచ హిందూ లీడర్ అయ్యాను. తర్వాత 1998లో నా ఆస్పత్రిని తెరిచాను. రెండేళ్ల తర్వాత నా ఇల్లు, కుటుంబం, మొత్తం ఆస్తులు వదిలేశాను. ఆ తర్వాత నా దగ్గర సంపద, ఉండడానికి ఇల్లు, ఒక్క రూపాయి కూడా లేదు. నా దగ్గర మూడు సంచులే ఉన్నాయి. ఒకదాన్లో బట్టలు, ఒకదాన్లో పుస్తకాలు, ఒకదాన్లో దేవుళ్లు ఉంటారు. దేశ విభజన సమయంలో జరిగినట్లు, హిందువులు మళ్లీ అభద్రతా భావంలో పడకూడదు. ఏ గ్రామం, ఏ వీధీ రక్షణ లేకుండా ఉండకూడదు. హిందూ సమాజం సుభిక్షంగా ఉండాలి. అక్కడ ఎవరూ పస్తులతో, నిరక్షరాస్యతతో, అనారోగ్యంతో, ఉపాధి లేకుండా ఉండకూడదు. అదే సంకల్పంతో నేను 1998లో అన్నీ వదిలేసి వచ్చాను. దానికోసమే పనిచేస్తున్నాను. అలాగే ముందుకెళ్తున్నాను. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూమి గురించి దశాబ్దాల పాటు నడిచిన కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం తీర్పు ఇచ్చారు. text: హిమాలయాల్లో ఒక్క ఈ భాగంలోనే వెయ్యికి పైగా గ్లేసియర్స్ ఉన్నాయని గ్లేసియర్‌(హిమానీనదం)పై పరిశోధనలు చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశాలంగా ఉన్న ఒక గ్లేసియర్ కరిగి విడిపోయి ఉంటుందని, అలా దాన్నుంచి భారీ స్థాయిలో జల ప్రవాహం వచ్చిందని చెబుతున్నారు. గ్లేసియర్ వల్ల మంచు చరియలు పడి ఉండచ్చని, బండరాళ్లు, మట్టి విడిపోయి కిందికి వచ్చుండవచ్చని అంటున్నారు. "మేం వాటిని డెడ్-ఐస్ అంటాం. ఎందుకంటే ఈ గ్లేసియర్ కరిగి విడిపోయినపుడు వాటిలో సాధారణంగా పెద్ద పెద్ద బండరాళ్లు, రాళ్ల శిథిలాలు ఉంటాయి. శిథిలాలు కిందికి భారీస్థాయిలో ప్రవహించాయి కాబట్టి, అలా జరిగిందనడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది" అని డాక్టర్ డీపీ డోభాల్ చెప్పారు. డీపీ డోభాల్ భారత ప్రభుత్వ వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ నుంచి ఇటీవలే రిటైర్ అయ్యారు. ఏదైనా ఒక గ్లేసియర్ సరస్సులో మంచు చరియలు విరిగి పడుంటాయని, దానివల్లే భారీ స్థాయిలో నీళ్లు కిందికి వచ్చాయని, వరద కూడా వచ్చిందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో అలాంటి గ్లేసియర్ సరస్సు ఏదీ ఉన్నట్టు సమాచారం లేదని మరికొంతమంది అంటున్నారు. కానీ ఈమధ్య గ్లేసియర్‌ సరస్సు ఎంత త్వరగా ఏర్పడుతుంది అనేది కూడా మనం చెప్పలేమని డాక్టర్ డోభాల్ చెప్పారు. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గ్లేసియర్లు కరుగుతున్నాయి. దీంతో గ్లేసియర్ సరస్సులు ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయి. ఎన్నో కొత్త సరస్సులు ఏర్పడ్డాయి. ఆ సరస్సుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరినపుడు, అది తన సరిహద్దులు దాటి పొంగుతుంది. దారిలో ఏవి ఉంటే వాటిని తనలో కలిపేసుకుంటూ ప్రవహిస్తుంది. అలా, దాని దారిలో పల్లెలు, రోడ్లు, వంతెనలు లాంటి మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి. ఇటీవల ఏళ్లలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి మంచుచరియలు, కొండచరియలు నదికి అడ్డంగా పడిపోవడం వల్ల దాని ప్రవాహం కాసేపు ఆగిపోయి ఉండవచ్చని, నీటిమట్టం పెరిగి అది తెగడంతో హఠాత్తుగా భారీ స్థాయిలో నీళ్లు విడుదలై ఉంటాయని కూడా నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతాల్లో కొండ చరియలు పడి నదీ ప్రవాహం ఆగిపోవడం, తాత్కాలిక సరస్సులా ఏర్పడడం లాంటి ఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. తర్వాత వాటిలో నీటిమట్టం పెరగడంతో అవి పొంగి పల్లెలు, వంతెనలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు లాంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయేలా చేస్తాయి. 2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, ఇంకా చాలా ప్రాంతాల్లో జలప్రళయం వచ్చింది. అప్పుడు కూడా నిపుణులు ఎన్నో థియరీలు ఇచ్చారు. "చాలా కాలం గడిచిన తర్వాత.. ఛౌరాబారీ గ్లేసియర్ విరగడం వల్లే ఆ వరద వచ్చిందనే విషయాన్ని మేం కచ్చితంగా చెప్పగలిగాం" అని డాక్టర్ డోభాల్ చెప్పారు. ఉత్తరాఖండ్ అధికారులు ధౌలీగంగా నదిలో ఈ వరద ఎందుకు వచ్చిందో తెలుసుకోడానికి నిపుణుల బృందాన్ని కూడా పంపిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆదివారం ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం వచ్చిన ఈ ప్రాంతం చాలా మారుమూల ఉంటుంది. అందుకే, అది ఎలా జరిగుంటుంది అనేది చెప్పడానికి ఇప్పటివరకూ ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. text: మీరు ఆకాశంలో చూడగానే అది కనిపించదు. టెలిస్కోప్‌తో చూసినా మీకు దాని ఆచూకీ తెలియదు. భూమికి 4.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌర వ్యవస్థలోని ఎనిమిదవ గ్రహమది. మనం ఆకాశం వైపు చూసినప్పుడు కనిపించే ఒక చిన్న నక్షత్రం కంటే కొంచెం పెద్ద పరిమాణంలో నెప్ట్యూన్ ఉంటుంది. రాత్రి వేళ ఆకాశం వైపు చూసినప్పుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహాలు శుక్రుడు, అంగారకుడు (కుజుడు) చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కానీ, నెప్ట్యూన్ మన కంటికి కనిపించదు. పురాతన కాలం నుంచి ఈ వైవిధ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. 19వ శతాబ్దంలోనే మనం నెప్ట్యూన్ ఉనికి గురించి తెలుసుకోగలిగాం. దీని ఆవిష్కరణ ఎంతో ముఖ్యమైంది. ''ఆకాశం వైపు చూడటం వల్ల లేదా టెలిస్కోపు సహాయంతో మనం సౌరవ్యవస్థలోని నెప్ట్యూన్‌ను గుర్తించలేదు'' అని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లూసీ గ్రీన్ పేర్కొన్నారు. ఆయన లండన్ యూనివర్సిటీ కాలేజ్‌లోని ముల్లార్డ్ స్పేస్ సైన్స్ లాబొరేటరీలో పని చేస్తున్నారు. లెక్కలే నెప్ట్యూన్‌(ఇంద్రుడు)ను పట్టించాయి 19వ శతాబ్దంలో న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలను అనుసరించి సూర్యుని చుట్టూ ఉన్న గ్రహాల కక్ష్యలను అంచనా వేయగలిగారు. ఒక్క యురేనస్ విషయంలో మాత్రం విఫలమయ్యారు. ఎందుకంటే ఈ గ్రహం కక్ష్యలో పరిభ్రమించే మార్గం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ సమయంలో, సూర్యుడి నుంచి చాలా దూరంలో ఉన్న గ్రహం యురేనస్ అని, న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలు సుదూరంలో ఉన్న గ్రహాలకు సంబంధించి పనిచేయకపోవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు భావించారు. కానీ, మరికొంతమంది శాస్త్రవేత్తలు లెక్కలపై ఆధారపడ్డారు. సూర్యుడు వైపు యురేనస్ పరిభ్రమణ కక్ష్య మధ్యలో ఒక భారీ వస్తువు ఉండొచ్చని భావించారు. ''వారు ఎప్పుడైతే గణితం సూచించిన ప్రాంతం వైపు టెలిస్కోప్‌ను పెట్టి చూశారో అప్పుడే వారికి ఒక కొత్త గ్రహం ఆచూకీ లభించింది'' అని గ్రీన్ చెప్పారు. గణితం కొత్తగా కనిపెట్టిన సబ్జెక్ట్ కాదని, అది ఎప్పటి నుంచో ఉనికిలో ఉన్నదేనని చెప్పడానికి నెప్ట్యూన్ ఆవిష్కరణ సాక్ష్యంగా నిలిచింది. ''ఇంతకీ గణితం ఏమిటి, ఒక నమూనానా, వివరణా, వాస్తవికతకు ఒక రూపమా? లేక అదే వాస్తవికతా?" టెలిస్కోప్ పరిశీలనల కంటే లెక్కల ద్వారానే నెప్ట్యూన్‌ను కనుక్కోగలిగారు కేక్ లెక్క లెక్కించడం, కొలవడం వంటి భౌతిక కారణాల వల్ల మానవులు లెక్కలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. మనం కూడా అక్కడి నుంచే ప్రారంభిద్దాం. ఒక కేక్‌ను ఉదాహరణగా తీసుకుందాం. ఆ కేక్ గురించి గణితం అన్ని రకాల విషయాలను తెలియజేస్తుంది. అంటే దాని కొలతలు, బరువు, దానిని ఎలా విభజించాలో ఇవన్నీ స్పష్టం చేస్తుంది. వాస్తవం చేరుకోలేని చోటుకు కూడా గణితం చేరుకుంటుందని ఈ కేక్ మనకు చెబుతుంది. మీరు ఒక వేళ ఆ కేకులో మూడో వంతు తింటే, ఇంకా మూడింట రెండు వంతుల కేక్ మిగిలే ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి, మీరు ఆ మిగిలిన కేక్ కూడా తినడం కొనసాగిస్తే చివరకు అక్కడ ఏమీ మిగలదు. ''మన పూర్వీకులు కొలవడానికి, లెక్కించడానికి ఆచరణాత్మక గణితాన్ని ఉపయోగించారు, రుణ సంఖ్యలను వారు వాడలేదు'' అని గణిత పుస్తకాల రచయిత అలెక్స్ బెలోస్ చెప్పారు. మీరు వాస్తవికత మీద ఆధారపడి కొలవగల లేదా లెక్కించగల వస్తువులను గణిస్తే, సున్నా కంటే తక్కువ స్థాయిని మీరు ఊహించడం కష్టం. అప్పులు, రుణాత్మక సంఖ్యలు మీరు కేక్ ముక్కలన్ని తిన్న వెంటనే, అది అయిపోతుంది. ఇక నెగటివ్ కేక్ అనేదే ఉండదు. కానీ, బెలోస్ ఏం చెబుతారంటే, మనం రుణాత్మక సంఖ్యను వినియోగించే పరిధి ఉంటుంది. వాటి గురించి ఆలోచించడం సర్వ సాధారణం. బెలోస్ డబ్బు లెక్కించడాన్ని ఇందుకు ఉదాహరణగా సూచిస్తున్నారు. ''ఖాతాలు, అప్పుల సందర్భంలో మనం రుణాత్మక సంఖ్యను ఆచరణాత్మకంగా ఉపయోగిస్తాం'' ఉదాహరణకు మీరు 5 రూపాయలు బాకీ ఉన్నారు. అప్పుడు మీకు ఆ మొత్తాన్ని ఇస్తాను. మీరు బాకీ తీర్చేస్తారు. అప్పుడు మీ దగ్గర గణితం ప్రకారం సున్నా రూపాయలు ఉంటాయి. ఈ రోజుల్లో రుణాత్మక సంఖ్యలు లేకుండా గణితం గురించి ఆలోచించడం కష్టం. అప్పుల విషయంలో మాత్రమే కాదు. అనేక విషయాల్లోనూ ఇదే పరిస్థితి. కానీ, మీరు రుణాత్మక సంఖ్యలతో లెక్కలేస్తున్నప్పుడు వింతైన అనుభవాలను చూస్తారు. గొప్ప చిక్కుప్రశ్న మీరు రెండు సంఖ్యలను గుణిస్తే ఫలితం ఒక ధన సంఖ్య వస్తుంది. అందువల్ల -1 x -1 = 1 (ధన సంఖ్య) అవుతుంది. కానీ, ఈ ఫలితం మనకు నిజమైన చిక్కు ప్రశ్నను తీసుకొస్తుంది. కానీ, మీరు ఏ సంఖ్యనైనా వర్గం (స్క్వేర్) చేసినప్పుడు లేదా వాటిని గుణించినప్పుడు ఫలితం రుణ సంఖ్య మాత్రమే వస్తుంది. అయితే, ఇలా వచ్చినప్పుడు మొదట్లో ప్రజలు దీనిని అసంబద్ధంగా భావించారని బెల్లోస్ చెప్పారు. గణిత శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఏమంటారంటే, ''అవును, ఇది అసంబద్ధం కావొచ్చు, కానీ నేను ఈ పద్దతిలో గణించినప్పుడే నాకు సరైన సమాధానం లభిస్తుంది. మనకు సమాధానాలు అవసరం, వాటిని కనుగొనడంలో ఇది మాకు సహాయపడితే మంచిదే'' అని పేర్కొన్నారు. నిజానికి, మనం గణితం విషయంలో వాస్తవికతను వదిలేశాం. ఎలాంటి సందర్భానైనా వివరించడానికి గణితం మనకు ఉపయోగపడుతుంది. ఊహాత్మక సంఖ్య ''-1 వర్గమూలాన్ని ఊహాత్మక సంఖ్యగా పిలుస్తారు, ఇలాంటి పేరు పెట్టడం ఘోరమైన విషయం కానీ, ఇది గణితం వాస్తవమైనదని, అకస్మాత్తుగా ఊహాత్మకంగా మారిందనే అభిప్రాయాన్ని ఇస్తుంది'' అని బెలోస్ చెప్పారు. ''గణితం మొదటి నుంచీ ఊహాత్మకమైనదే. మనం మూడు కేకుల గురించి మాట్లాడగలం, కానీ, మనం కేకులను చూస్తున్నాం. కానీ 'మూడు' చూడటం లేదు. ఇక్కడ మూడు అనేది ఓ ప్రాతినిధ్య సంఖ్య" అని ఆయన పేర్కొన్నారు. సంకీర్ణ సంఖ్యలు వాస్తవ సంఖ్యల వల్ల సమాధానం కనుగొనలేని కొన్ని సమీకరణాలకు సంక్లిష్ట సంఖ్యలు (కాంప్లెక్స్ నంబర్స్) పరిష్కారాలను చూపిస్తాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, రాడార్లు, వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. 20వ శతాబ్దపు హంగేరియన్ భౌతిక శాస్త్రవేత్త యూజీన్ విగ్నేర్ 1960లో రాసిన ఒక వ్యాసంలో సంక్లిష్ట సంఖ్యలను సూచించారు. లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? చికాగోలోని స్కూల్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్‌ట్యూట్‌లో గణిత శాస్త్రవేత్తగా పనిచేస్తున్న యుజెనియా చెంగ్ దీనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ''సంఖ్యలను మనం తాకలేం కాబట్టి అవి వాస్తవం కాదని ప్రజలు భావిస్తున్నారు. కానీ, చాలా విషయాలు ఇలాంటివే. ఆకలి కూడా ఇలాంటిదే. దాన్ని నేను తాకలేను" అని ఆమె ఉదాహరించారు. "గణితం నిరాకారమైనదే కానీ, నిరాకారమైనది కూడా ఆకారమవడం నిజమే'' అని ఆమె పేర్కొన్నారు. ఏది వాస్తవం? గణితం వాస్తవికత అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, జీవశాస్త్రం గురించి ఆలోచించండి, ఇది కెమిస్ట్రీపై ఆధారపడి ఉంది. అలాగే, దీన్ని భౌతిక శాస్త్ర నియమాలతో నిర్వచించాలి. లేదా నీలిరంగు ఆకాశం గురించి ఆలోచించండి, కాంతి వక్రీభవనం వల్ల ఆకాశం నీలిరంగులో ఉంటుందని వివరణ ఉంది. అదే సంఖ్యల విషయానికి వస్తే... మీరు బాగా లోతుగా ఆలోచిస్తే, భౌతిక వాస్తవికత కూడా గణితశాస్త్రమే అని అనిపిస్తుంది. అయితే, ప్రేమ, ఆకలి, నైతికత వంటి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి గణితశాస్త్రం మనకు చెప్పదనే విషయాన్ని గ్రహించాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒకసారి నెప్ట్యూన్ (ఇంద్రుడు) గురించి ఆలోచించండి. ఎందుకంటారా? text: ఐఫోన్ తయారీ సంస్థ అయిన యాపిల్ మార్కెట్ విలువ.. న్యూయార్క్‌లో గురువారం మధ్యాహ్నం ట్రేడింగ్ తర్వాత ఈ సంఖ్యను చేరుకుంది. ట్రిలియన్ డాలర్లు.. అంటే లక్ష కోట్ల డాలర్లు.. భారత కరెన్సీలో గురువారం నాటి డాలర్ విలువను బట్టి 68.61 లక్షల కోట్ల రూపాయలు. ఆ సంస్థ షేరు విలువ 207 డాలర్లకు (సుమారు రూ. 14,207) పెరిగింది. మంగళవారం నుంచి షేరు విలువ 9 శాతం మేర పెరిగింది. 1980లో మొదటిసారి షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటి నుంచీ యాపిల్ షేర్ ధర 50,000 శాతానికి పైగా పెరిగింది. 1976లో యాపిల్ సహ సంస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన షెడ్డులో ఈ కంపెనీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో మాక్ కంప్యూటర్లతో పేరు తెచ్చుకున్న యాపిల్ సంస్థ తర్వాత స్మార్ట్ ఫోన్లతోను, తదరంతరం యాప్‌లతోనూ లాభాల బాట పట్టింది. 2011లో స్టీవ్ జాబ్స్ మరణించటంతో టిమ్ కుక్ ఈ కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఐఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచి యాపిల్ లాభాలను గణనీయంగా పెంచారు. యాపిల్ తన సరికొత్త ఐఫోన్ మోడల్‌ను ప్రవేశపెట్టడం వల్లనే గతేడాది దాని లాభాలు పెరిగాయని బీబీసీ ఉత్తర అమెరికా టెక్నాలజీ రిపోర్టర్ డేవ్ లీ తెలిపారు. స్టాక్‌మార్కెట్లలో అస్థిరత్వం, చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో యాపిల్ లాభాలు తగ్గొచ్చని ఆయన తెలిపారు. ‘‘యాపిల్ కంపెనీ, దాని ఉత్పత్తుల పట్ల ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. యాపిల్ ఉత్పత్తులు ప్రపంచాన్ని మార్చాయి. ఇప్పుడు సరికొత్త ఆర్థిక చరిత్రను సృష్టించాయి’’ అని డేవ్ లీ అభిప్రాయపడ్డారు. ఇలాంటివే మరికొన్ని వార్తలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచంలో లక్ష కోట్ల డాలర్ల విలువను అందుకున్న మొట్టమొదటి పబ్లిక్ కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది. text: అతని వద్ద ఉన్న పావురం మీద వాలిందంటే అదృష్టం వరిస్తుందని అతని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ బాల బాబా చల్లే నీటిలో తడిసిముద్దవుతున్నారు. అందుకే ఆ బాలుణ్ని 'వాటర్ బాబా' అని కూడా పిలుస్తున్నారు. కర్నూలు జిల్లాలో ‘వాటర్ బాబా’ బనగానపల్లె బీసీ కాలనీలో నివసిస్తున్న రఫీ, రమీజాబీల కొడుకే షాహిద్. ఈ బాలుడు గత కొంతకాలంగా వాటర్ బాబా, బాలబాబా, షాహిద్ బాబాగా పేరు పొందాడు. అతను అనుగ్రహిస్తే ఎంతటి అనారోగ్య సమస్యలైనా దూరమవుతాయని ఆ నోటా, ఈ నోటా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ బాలుడికి మహత్తులున్నాయంటూ జనం క్యూలు కడుతున్నారు. టోకెన్లు తీసుకొని మరీ అతని దర్శనం కోసం ఎగబడుతున్నారు. తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకునే ఈ బాల బాబా ప్రతి గురువారం రాత్రి పూజలో కూర్చుంటాడు. తనకిష్టమైనప్పుడు భక్తుల మీద నీళ్లు చల్లుతాడు. అ నీటిలో తడిచేందుకు జనం పోటీ పడుతుంటారు. నీళ్ళతోనే కాదు, అతనింట్లో ఉన్న పావురం కూడా రోగాలను నయం చేస్తుందని భక్తుల నమ్మకం. ఆ పావురం ఎవరిపై వాలితే వారిని అదృష్టం వరిస్తుందని వారంటారు. అందుకే ఆ పావురం పొడుస్తుంటే తన్మయత్వం చెందుతుంటారు. జై మాహీష్మతీ.. అంటూ సినిమా డైలాగులు చెబుతూ కేరింతలు కొడుతూ ఆటలాడుకొనే ఈ పిల్లాడు పూజలో కూర్చున్నప్పుడు మాత్రం ఏమీ మాట్లాడడు. జనం తమ సమస్యలను ముందు అతని తల్లికి చెప్పుకోవాలి. ఆమె వాటిని బాల బాబాకు వివరిస్తుంది. స్వామి చిన్నపిల్లాడు కాబట్టి సరిగా అర్థం కాదని, అందుకే తనకు చెప్పాలని బాలుని తల్లి అంటోంది. భక్తులపై నీళ్లు చల్లుతున్న 'వాటర్ బాబా' అయితే పావురం వాలితేనో, నీళ్ళు చల్లితేనో రోగాలు పోతాయనుకోవటం మూఢనమ్మకమేనని జనవిజ్ఙానవేదిక అంటోంది. తల్లిదండ్రుల మానసికస్థితి సరిగా లేనందునే షాహిద్‌ను బాబాగా ప్రచారం చేస్తున్నారని ఆ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియా తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే అమాయక ప్రజలకు నష్టం జరగటంతోపాటు భవిష్యత్తులో పిల్లాడు అసాంఘిక శక్తిగా మారే ప్రమాదముందన్నారు. తల్లిదండ్రులే చిన్నపిల్లాడిని చదువు మాన్పించటంపట్ల విద్యాశాఖాధికారులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. షాహిద్‌ను బడికి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని ఎంఈఓ స్వరూప తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే షాహిద్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని అన్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కర్నూలు జిల్లా బనగానపల్లెలో పన్నెండేళ్ల బాలుడు బాబా అవతారమెత్తాడు. అతను చల్లే నీళ్లలో తడిస్తే రోగాలు మటుమాయం అవుతాయని ప్రచారం జరుగుతోంది. text: మీడియా తమతో వ్యవహరించిన తీరును గతంలో ఈ రాజకుటుంబ దంపతులు విమర్శించారు. గత ఏడాది విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రిన్స్ హ్యారీ... ఒకప్పుడు తన తల్లితో మీడియా వ్యవహరించినట్లే ఇప్పుడు తన భార్యతోనూ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రిన్సెస్ డయానా బతికున్న రోజుల్లో మీడియా నిత్యం ఆమెపై ఫోకస్ చేసేది. ఆమె ధార్మిక కార్యక్రమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా నిత్యం ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో పతాక వార్తలుగా ఉండేది. ఒకవేళ ఇప్పుడు ఆమె ఉంటే తన కుమారుడు, కోడలి చర్యలకు ఆమెకు మద్దతు పలికేదా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. డచెస్ ఆఫ్ ససెక్స్ మేగన్‌పై జరుగుతున్న నిర్దాక్షిణ్య ప్రచారం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతున్నట్లుగా ఉందని హ్యారీ అన్నారు. ''నేను నా తల్లిని కోల్పోయాను. ఇప్పుడు నా భార్య కూడా అదే బలమైన శక్తులకు బలవుతుండడాన్ని చూస్తున్నాన''ని హ్యారీ వ్యాఖ్యానించారు. 2018లో మేగన్ మార్కెల్, హ్యారీలు వివాహం చేసుకున్న తరువాత మేగన్ తన తండ్రి థామస్ మార్కెల్‌కు రాసిన లేఖను ఆదివారం 'డైలీ మెయిల్' ప్రచురించిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి హ్యారీ చెబుతున్నట్లు మేగన్‌తో మీడియా వ్యవహరిస్తున్న తీరు డయానాతో వ్యవహరిస్తున్న తీరు ఒకేలా ఉందా? డయానా, హ్యారీ, విలియమ్స్ ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది ''డయానా ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ రాజకుటుంబ చిహ్నంగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందార''ని రాజకుటుంబ రచయిత కేటీ నికోల్ రేడియో-1 న్యూస్‌బీట్‌తో చెప్పారు. అయితే, ప్రపంచం ఆమె పట్ల కనబరిచిన ఆసక్తి అన్నిసార్లూ సానుకూలంగా లేదని కేటీ అన్నారు. ''మీడియాలో డయానాపై తరచూ విమర్శలు వచ్చేవి. అప్పట్లో ప్రపంచంలోనే ఆమె అత్యంత ప్రముఖురాలిగా ఉండేవారు, ఆమె కుమారులు ప్రిన్స్ విలియమ్, ప్రిన్సి హ్యారీ జీవితాలపైనా మీడియా నిత్యం ఆసక్తి చూపేది'' అన్నారు కేటీ. రాజకుటుంబ వ్యవహారాలపై పట్టున్న పాత్రికేయుడు జేమ్స్ బ్రూక్స్ ఈ మాటలను అంగీకరిస్తూనే ''కొన్నిసార్లు మీడియాతో ఆమెకు సత్సంబంధాలు ఉండేవి.. వారు కూడా ఆమె పక్షానే ఉండేవారు. కానీ, మరికొన్నిసార్లు ఆమె మీడియా తన పట్ల అనుచితంగా వ్యవహరిస్తోందనేవారు. డయానా, మీడియా మధ్య సంబంధాలు ఒక్కోసారి ఒక్కోలా ఉండేవి'' అన్నారు. అనంతర కాలంలో ప్రిన్సెస్ డయానా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆమె ప్రచారాన్ని కోరుకుంటున్నారని.. మీడియా దృష్టి తనపై ఉండాలని కోరుకుంటున్నారని కొందరు అనేవారు. డయానా మీడియాను వాడుకున్న, ఆడుకున్న సందర్భాలున్నాయని.. కానీ, చివరకు అది రెండు పక్షాలకూ అతి అయ్యిందని కేటీ అన్నారు. మరోవైపు మేగన్ రాజకుటుంబంలోకి వచ్చిన తరువాత తన పర్సనల్ బ్లాగ్‌ను ఆపేశారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూలన్నీ కూడా చాలావరకు ఆమె చేపట్టే ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినవే ఉంటున్నాయి. డయానా మరణం ప్రిన్సెస్ డయానా మరణం నాటి రోజుల ఆధారంగా ప్రిన్స్ హ్యారీ మీడియాపై అభిప్రాయాన్ని ఏర్పచుకున్నారని జేమ్స్ అన్నారు. ''హ్యారీ, విలియమ్స్‌లకు మీడియాపై ఏర్పడిన అభిప్రాయాలు తన తల్లి మరణం వల్ల కలిగిన వేదన నుంచి కలిగినవి. పత్రికా ఫొటోగ్రాఫర్లు వెంటాడిన మూలంగానే తమ తల్లి మరణించిందన్నది ఇప్పటికీ వారి దృష్టిలో ఉన్నద''ని ఆయన చెప్పారు. పారిస్‌లో 1997 ఆగస్ట్ 31న పాంట్ డి అల్మా సొరంగ మార్గంలో కారు ప్రమాదంలో డయానా మరణించేనాటికి హ్యారీ వయసు పన్నెండేళ్లు. ఆ ప్రమాదం జరిగినప్పటికి డ్రైవర్ హెన్నీ పౌల్ తాగి ఉండడంతో పాటు పత్రికా ఫొటోగ్రాఫర్లు మోటార్‌సైకిళ్లపై ఆమె కారును వెంబడిస్తున్నారు. డ్రైవర్, పత్రికా ఫొటో‌గ్రాఫర్ నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని విచారణలు తేల్చాయి. 2017లో బీబీసీతో హ్యారీ మాట్లాడుతూ తన తల్లి మరణంలో పత్రికా ఫొటోగ్రాఫర్ల పాత్ర ఉందని అన్నారు. ''జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే, ఆమె కారును వెంబడించిన ఫొటోగ్రాఫర్లే ప్రమాదంలో ఆమె చనిపోయి వెనుక సీట్లో నిర్జీవంగా ఉన్నప్పుడు ఆమె చిత్రాలను తీశారు'' అన్నారాయన. మేగన్, హ్యారీ నెగటివ్ కవరేజ్ 2019 అక్టోబరు నాటి ప్రిన్స్ హ్యారీ ప్రకటనకు విరుద్ధంగా కేటీ ''డయానాను వెంబడించినట్లుగా మేగన్‌ను పత్రికా ఫొటోగ్రాఫర్లెవరూ వెంబడించడం లేదు'' అన్నారు. అయితే, మేగన్‌ను విమర్శిస్తూ వస్తున్న కథనాలతో విసిగిపోయిన హ్యారీ ఈ ప్రకటన చేసి ఉంటారని కేటీ అన్నారు. ''తన భార్య గురించి క్రమం తప్పకుండా వ్యతిరేక కథనాలు వెలువరిస్తున్నారని భావిస్తున్న పాత్రికేయులను ఆయన విమర్శిస్తున్నారు'' ''మేగన్ దుబారా గురించి అనేక వ్యతిరేక కథనాలొచ్చాయి. దేశంలో పన్నులు కట్టేవారి డబ్బులను వృథా చేస్తూ తమ ఇంటికి కొత్త హంగులు దిద్దుతున్నారని, డిజైనర్ దుస్తుల కోసం ఆమె వేల పౌండ్లు ఖర్చు చేస్తున్నారని కథనాలు వచ్చాయి'' మేగన్ తనపై అందరి దృష్టి ఉండాలని కోరుకుంటూ ఉండొచ్చని.. ఆమె డయానాలా కాకుండా రాజ కుటుంబీకుడిని పెళ్లాడడానికి ముందే సెలబ్రిటీ అని పలువురు చెబుతారు. ''వివాహానికి ముందే ఆమెది సెలబ్రిటీ లైఫ్ స్టైల్.. రాజ కుటుంబంలోకి రావడం వల్ల ఆమె ఇప్పుడలాంటి లైఫ్ స్టైల్‌లోకి వచ్చారని నేను భావించడం లేదు'' అంటారు కేటీ. ''అయితే, ఆమె పెళ్లికి ముందే సెలబ్రిటీ అయినప్పటికీ ఏంజెలినా జూలీ, నికోల్ కిడ్మన్ మాదిరి టాప్ యాక్ట్రెస్ ఏమీ కాదు. ఇంత పబ్లిసిటీ ఆమెకు ముందెన్నడూ లేదు. రాజకుటుంబంలోని మిగతావారిపై మీడియా దృష్టి ఉన్నట్లే ఈమెపైనా ఉంది. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కూడా పత్రికలవారితో ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి'' అన్నారు కేటీ. హ్యారీ, మేగన్ దంపతులంటే ప్రజలకు ఆసక్తి ఉంది.. అయితే, దానికి ఒక పరిమితి ఉంటుంది. రాజకుటుంబానికి సంబంధించిన అంశాలను కవర్ చేయడం మీడియా విధి కావొచ్చు కానీ అది ఒక పద్ధతి ప్రకారం, నిష్పాక్షికంగా ఉండాలని కేటీ అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బ్రిటన్‌ రాజవంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ దంపతులు రాచ విధుల నుంచి తాము వైదొలగుతున్నామంటూ చేసిన ప్రకటనతో ఇప్పుడు హ్యారీ తల్లి డయానా పేరు చర్చనీయమవుతోంది. text: మరోవైపు ఈ ఉదంతంపై సౌదీ మాత్రం తమకేమీ తెలియదంటోంది. ఖషొగ్జీని సౌదీ ఏజెంట్లే హతమార్చారన్న టర్కీ అధికారుల ఆరోపణలను ఖండించింది. తమపై ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో రాజకీయంగా, ఆర్థికంగా సౌదీ ఎంత కీలకంగా ఉంది.. అమెరికా చర్యలకే దిగితే ఆ ప్రభావం ఎలా ఉండనుందో చూద్దాం.. 1. చమురు సరఫరా, ధరల పెరుగుదల ప్రపంచ చమురు నిక్షేపాల్లో 18 శాతం సౌదీ అరేబియా వద్దే ఉన్నాయి. అంతేకాదు, ప్రపంచంలో చమురు ఎగుమతుల్లో సౌదీయే ప్రథమ స్థానంలో ఉందని 'పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి'(ఒపెక్) గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణమే సౌదీని అంతర్జాతీయ యవనికపై శక్తిమంతమైన దేశంగా నిలుపుతోంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా కానీ, ఇతర దేశాలు కానీ సౌదీపై ఆంక్షలు విధిస్తే ఆ దేశం కూడా అంతేస్థాయిలో ప్రతిస్పందించొచ్చు. తన చమురు ఉత్పత్తిని తగ్గించి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగేలా చేయొచ్చు. 'అల్ అరేబియా' వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక కథనంలో ఆ సంస్థ జనరల్ మేనేజర్ 'టర్కీ అల్దాఖిల్'.. ''సౌదీపై ఆంక్షలు విధిస్తే ప్రపంచం ఆర్థిక విపత్తు బారిన పడే ప్రమాదం ఉంది'' అని అభిప్రాయపడ్డారు. ''బ్యారల్ ముడి చమురు 80 డాలర్లకు చేరితేనే ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కానీ, సౌదీపై చర్యలు తీసుకుంటే ధరలు 200 డాలర్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు'' అని తన సంపాదకీయ వ్యాసంలో రాశారు. చివరకు అది ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. 2. మిలటరీ ఒప్పందాలు రక్షణ బడ్జెట్ల విషయంలో సౌదీ అరేబియాది ప్రపంచ దేశాల్లో మూడో స్థానం. 2017లో సౌదీ అరేబియా అమెరికాతో 11 వేల కోట్ల డాలర్ల విలువై ఆయుధాల ఒప్పందం చేసుకుంది. గత పదేళ్ల కాలంలో ఒక్క అమెరికాతోనే 35 వేల కోట్ల డాలర్ల ఆయుధ ఒప్పందాలు చేసుకుంది. అందులో అమెరికా ఆయుధ ఎగుమతుల చరిత్రలోనే అత్యంత పెద్ద ఒప్పందం కూడా ఉంది. అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల నుంచి కూడా సౌదీ పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఒకవేళ అమెరికా కనుక తనపై ఆంక్షలు విధిస్తే అప్పుడు సౌదీ తన రక్షణ అవసరాల కోసం చైనా, రష్యాల వైపు చూసే అవకాశం ఉంటుందని అల్దాఖిల్ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. 3. భద్రత, ఉగ్రవాదం మధ్య ప్రాచ్యంలో ఉగ్రవాదంపై పోరులో కానీ, భద్రత విషయంలో కానీ సౌదీ అరేబియాది కీలక పాత్ర అని పాశ్చాత్య దేశాలు చెబుతూ వస్తున్నాయి. యెమెన్‌లో సౌదీ బలగాలు యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నప్పటికీ బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆ దేశంతో దగ్గరి సంబంధాలు కొనసాగించడాన్ని సమర్థించుకుంటున్నారు. బ్రిటన్ వీధుల్లో ప్రజలు సురక్షితంగా తిరగగలిగేలా సౌదీ సహకారం అందిస్తోందంటూ అందుకు కారణం చూపుతున్నారు. ఇస్లాం మత ఆవిర్భావ స్థలమైన సౌదీ అమెరికా నేతృత్వంలో... ఐఎస్‌పై పోరాడుతున్న అంతర్జాతీయ సంకీర్ణ కూటమిలో సభ్యదేశంగా ఉంది. గత ఏడాది సౌదీ 40 ముస్లిం దేశాలను కలుపుకొంటూ ఉగ్రవాద నిరోధానికి గాను ఇస్లామిక్ సైన్యాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు ఖాషొగ్జీ అదృశ్యం తరువాత అమెరికా కనుక సౌదీపై చర్యలకు దిగితే సౌదీతో అమెరికా, పాశ్చాత్య దేశాల మధ్య సమాచార పంపిణీ అన్నది గతంగా మిగిలిపోతుందని అల్దాఖిల్ అభిప్రాయపడ్డారు. 4. ప్రాంతీయ కూటములు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని పరిమితం చేయడం కోసం సౌదీ అమెరికాతో కలిసి పావులు కదిపింది. మధ్యప్రాచ్యవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా సున్నీ, షియా అధికార కేంద్రాలు సంక్షోభాలను రగిలించాయి. సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించేందుకు గాను అక్కడి తిరుగుబాటు వర్గాలకు సౌదీ అరేబియా మద్దతుగా నిలవగా... అసద్‌ను అధికారంలో కొనసాగించేందుకు రష్యాతో కలిసి ఇరాన్ సహకరిస్తోంది. ఇప్పుడు అమెరికా కనుక సౌదీతో తన వైఖరిని మార్చుకుంటే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవచ్చని.. రష్యా, సౌదీలు.. ఫలితంగా సౌదీ, ఇరాన్ మధ్య కూడా సయెధ్య కుదరొచ్చని అల్దాఖిల్ తన వ్యాసంలో రాసుకొచ్చారు. 5. వాణిజ్యం, పెట్టుబడులపై ప్రభావం అమెరికా చెబుతున్నట్లుగానే చర్యలకు దిగితే సౌదీ విపణికి అమెరికా సంస్థలు దూరమైనా ఆశ్యర్యపోనవసరం లేదని అల్దాఖిల్ తన వ్యాసంలో విశ్లేషించారు. సౌదీతో అమెరికా వస్తు, సేవల వాణిజ్యం 2017లో 4,600 కోట్ల డాలర్ల మేర ఉంది. అంతేకాదు.. రెండు దేశాల మధ్య వాణిజ్యం కారణంగా 2015లో అమెరికాలో 1,65,000 మందికి ఉద్యోగాలు దొరికాయని అమెరికా వాణిజ్య శాఖ అంచనా వేసింది. సౌదీలో పౌర హక్కుల కార్యకర్తలు, మహిళా హక్కుల ఉద్యమ కారులను విడిచిపెట్టాలంటూ కెనడా పిలుపునివ్వడంతో ఆ దేశంపై సౌదీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ దేశంతో కొత్తగా చేపట్టబోయే వాణిజ్యాన్నంతటినీ నిలిపివేసింది. అంతేకాదు కెనడా నుంచి ఆహార దినుసుల దిగుమతినీ ఆపేసింది. ప్రభుత్వ ఉపకార వేతనాలతో కెనడాలో చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులనూ వెనక్కు పిలిపించాలని నిర్ణయించింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాత్రికేయుడు జమాల్ ఖషొగ్జీ హత్యలో సౌదీ అరేబియాకు పాత్ర ఉన్నట్లు తేలితే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. text: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన రాడార్ చిత్రాలు 2019 ఫిబ్రవరి 27న ‘మా ఎఫ్-16 యుద్ధ విమానం ధ్వంసం కాలేద’ని చెప్పిన పాక్ వాదనలకు భారత్ ఈ ఫొటోల ద్వారా సమాధానం ఇచ్చింది. అదే రోజున పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని భారత వైమానిక దళం చెప్పింది. పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 అయితే ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్.. ఐఏఎఫ్ దీని గురించి మరింత సమాచారం బహిరంగం చేయలేదని చెప్పారు. ఎందుకంటే అది భద్రత, గోప్యత లాంటి షరతులను ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. "రాడార్ నుంచి తీసిన చిత్రాల్లో నియంత్రణ రేఖకు పశ్చిమంగా వింగ్ కమాండర్ వర్దమాన్ పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ఎదుర్కున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని, రెండో ఫొటోను పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానం మాయమైన పది సెకన్ల తర్వాత తీశారని" ఎయిర్ వైస్ మార్షల్ చెప్పారు. పాకిస్తాన్ అదే ఎఫ్-16 విమానాన్ని కోల్పోయిందన్నారు. గత వారం అమెరికా వార్తా పత్రిక 'ఫారిన్ పాలసీ'.. అమెరికా భద్రతా అధికారుల సమాచారం ప్రకారం అమెరికా పాకిస్తాన్ నుంచి ఎన్ని ఎఫ్-16లు అమ్మిందో అవన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పింది. ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ వాటిలో ఏ విమానం కూడా మాయం కాలేదని తెలిపింది. ఈ రిపోర్ట్ తర్వాత రెండు దేశాల మధ్య వివాదం మరింత రాజుకుంది. వైస్ మార్షల్ కపూర్.. ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఎఫ్-16ను మిగ్ 21 బైసన్ విమానం కూల్చేసిందని చెప్పారు. ఫిబ్రవరి 27న రెండు విమానాలు కూలిపోయాయనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఇందులో ఒకటి భారత వైమానిక దళ మిగ్ బైసన్ అయితే, ఇంకొకటి పాకిస్తాన్ ఎఫ్-16 అని తెలిపారు. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చారని చెబుతోంది. కానీ అది కూడా నియంత్రణ రేఖకు అవతల ల్యాండ్ అయ్యింది. అందుకే పాకిస్తాన్ భద్రతా బలగాలు ఆయన్ను అరెస్టు చేశాయి. ఆయన మూడు రోజుల వరకూ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు. ఇటు పాక్ సైన్యం ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాత్రం భారత్ వాస్తవాలను తొక్కి పెడుతోందని అన్నట్టు పాక్ పత్రికలు తెలిపాయి. "ఫిబ్రవరి 27న తాము కూల్చిన భారత మిగ్-21 బైసన్ యుద్ధ విమానం శిథిలాల్లో లభించిన నాలుగు మిసైళ్లు ఇప్పటికీ తమ స్వాధీనంలో ఉన్నాయని" ఆయన చెప్పారని ఆ దేశ పత్రికలు రాశాయి. పాకిస్తాన్ సైన్యం దగ్గర చెప్పడానికి ఇంకా చాలా నిజాలు ఉన్నాయని గఫూర్ అన్నట్లు తెలిపాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత వైమానిక దళం రాడార్ ద్వారా తీసిన చిత్రాలను సోమవారం (ఏప్రిల్ 8వ తేదీన) విడుదల చేసింది. text: వరుసగా జరుగుతున్న ఈ మూక దాడుల వార్తలు భారత మీడియాతో పాటు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలోనూ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఇటీవల అల్వర్‌లో రక్బర్ అనే వ్యక్తి చనిపోయిన ఘటనపై పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. శుక్రవారం రాత్రి అల్వర్ జిల్లాలోని రాంగఢ్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో గోరక్షకుల దాడిలో రక్బర్ తీవ్రంగా గాయపడినట్లు ఆరోపణలున్నాయి. ఆపైన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలోనూ పోలీసులు కావాలనే జాప్యం చేశారనే విమర్శలు వస్తున్నాయి. దాడి జరిగిన మూడు గంటల తరవాత పోలీసులు రక్బర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు విదేశీ మీడియా దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వివిధ దేశాల్లో వెబ్‌సైట్లు, పత్రికలు వీటిని ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. గోరక్షకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రక్బర్ భారత్‌లో గోరక్షకుల చేతిలో చనిపోయిన వ్యక్తి అంటూ అల్వర్ ఘటనకు సంబంధించి అల్ జజీరా ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఆ ఘటన గురించి వివరిస్తూ రాజస్థాన్‌లోని లాల్వాడీ గ్రామంలో 28ఏళ్ల ముస్లిం వ్యక్తిని గోరక్షకులు చంపారంటూ పేర్కొంది. దోషులుపై చర్య తీసుకుంటామంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ దొరికేవరకూ మృతదేహాన్ని ఖననం చేయబోమని అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు తెలిపింది. ఉత్తర భారతంలో గోవుల్ని కాపాడేందుకు గోరక్షకులు నిత్యం తిరుగుతుంటారని, వాళ్ల చేతుల్లో ముస్లింలు చనిపోవడం ఇదేమీ తొలిసారి కాదని, ఇలాంటి దాడులు అనేకం జరిగాయని ఆ కథనం పేర్కొంది. మలేషియాకు చెందిన ‘ది సన్ డెయిలీ’ కూడా... ‘గోవుల్ని తరలిస్తుండగా గోరక్షకుల దాడిలో చనిపోయిన ముస్లిం వ్యక్తి’ అంటూ కథనాన్ని అందించింది. ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని కూడా విదేశీ మీడియా ప్రస్తావించింది. ‘సామూహిక దాడిలో గాయపడ్డ వ్యక్తి దగ్గరకు వెళ్లే ముందు పోలీసులు టీ బ్రేక్ తీసుకున్నారు’ అన్న శీర్షికతో ‘ది గార్డియన్’ ఓ కథనాన్ని అందించింది. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ముందు టీ కోసం ఆగిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారని కూడా అది తెలిపింది. ఓ ముస్లిం యువకుడిని చంపిన ఘటనలో శిక్షపడ్డ వ్యక్తుల మెడలో పూల మాల వేసిన మంత్రి జయంత్ సిన్హా భారత్‌లో గోవుల్ని కాపాడేందుకు గోసంరక్షకులు రహదార్లపై సంచరిస్తుంటారనీ, వాళ్ల చేతిలోనే రక్బర్ చనిపోయాడనీ ఆ కథనంలో పేర్కొన్నారు. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కూడా ఈ ఘటనకు ప్రాధాన్యమిచ్చింది. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేముందు టీ తాగిన అధికారులపై విచారణ అంటూ కథనాన్ని అందించింది. అల్వర్ ఘటనకు ముందు జరిగిన సామూహిక దాడులపై కూడా విదేశీ మీడియా కథనాల్ని ప్రచురిస్తూ వస్తోంది. ఓ ముస్లిం యువకుడిని చంపిన ఘటనలో శిక్షపడ్డ ఎనిమిది మంది వ్యక్తుల మెడలో పూల మాల వేసిన భారత కేంద్ర మంత్రి అంటూ జయంత్ సిన్హాకు సంబంధించిన కథనాన్ని ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించింది. ‘ద్వేషం మత్తులో, ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన గుంపుకి సన్మానం చేసిన భారత నేత’ అంటూ దానికి శీర్షికనిచ్చింది. జయంత్ సిన్హా వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఆ కథనంలో అందించింది. సామూహిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అభిజీత్, నీలోత్పల్ దాస్ వీటితో పాటు, అసోంలో మూక దాడిలో చనిపోయిన ఇద్దరు యువకులకు సంబంధించిన కథనాన్ని కూడా ‘ది సన్’ ప్రచురించింది. ‘ఫేక్ న్యూస్ కిల్లింగ్స్’ అంటూ దానికి శీర్షికనిచ్చి, భారత్‌లో ఓ కొత్త ట్రెండ్ విస్తరిస్తోందని పేర్కొంది. ఇలా భారత్‌లోని అనేక ఘటనలకు సంబంధించి విదేశీ మీడియా కూడా ప్రాధాన్యమివ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రజల సామూహిక దాడిలో ఎవరో ఒకరు చనిపోయిన ఘటనపై చర్చ ముగిసే లోపే, మరో ప్రాంతంలో మరో వ్యక్తిపై దాడి జరిగిందన్న వార్త మీడియాలో కనిపిస్తోంది. text: జీ7 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలూ మీడియా సమావేశంలో మాట్లాడారు. "ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీని అభినందించాను. వాణిజ్యం, సైన్యం గురించి, ఇంకా ఎన్నో అంశాలపై మాట్లాడుకున్నాం" అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అనంతరం మాట్లాడిన మోదీ... ఈరోజు నా మిత్రుడు, ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాధ్యక్షుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. "ఎప్పుడు అవకాశం దొరికినా మేం కలుస్తూనే ఉన్నాం. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సుమారు 700 మిలియన్ ఓటర్లు గత ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలివ్వడం ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా. ఫోన్ చేసి అభినందించినందుకు కృతజ్ఞతలు. భారత్ అమెరికా.. ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకెళ్లే దేశాలు. ప్రపంచ క్షేమం కోసం కలిసి పనిచేయడం, భాగస్వామ్యం అందించడం, మా ఉమ్మడి విలువలతో మానవజాతికి, ప్రపంచాభివృద్ధికి ఉపయోగపడడం లాంటి ఎన్నో విషయాలపై చాలా లోతుగా చర్చిస్తుంటాం. ఆర్థిక, వాణిజ్య రంగాలలో భారత్, అమెరికా చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా అంశాల్లో మేం అమెరికా కల్పించిన సౌకర్యాలను స్వాగతిస్తున్నాం. మేం కలిసి వాణిజ్య రంగంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. భారత సమాజం అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతోంది. అమెరికా అభివృద్ధిలో భారత సమాజం ఎంత భాగస్వామ్యం అందిస్తోందో, అమెరికా కూడా భారత సమాజానికి అంత గౌరవం, ఆదరణ ఇస్తోంది. దానికి నేను అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను" అని మోదీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంపై ఎవరేమన్నారు? ట్రంప్ - మేం కశ్మీర్ గురించి చర్చించాం. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని భారత ప్రధాని అన్నారు. మోదీ- భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్నో ద్వైపాక్షిక అంశాలున్నాయి. పాక్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేశాను. పాక్ పేదరికంతో పోరాడాలి, భారత్ కూడా. భారత్-పాక్ నిరక్షరాస్యత, వ్యాధులపై కూడా పోరాడాలని చెప్పాను. పేదరికం సహా, అన్ని సమస్యలపై మనం కలిసి పోరాడదాం అని చెప్పాను. రెండు దేశాల ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం అని చెప్పాను. అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా ఎప్పుడూ ఈ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతూనే ఉన్నాను. కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం అంగీకరిస్తారా? మోదీ- భారత్, పాక్ మధ్య ఉన్న అన్ని సమస్యలు ద్వైపాక్షికం. అందుకే మేం ప్రపంచంలోని ఏ దేశాన్నీ దానికోసం ఇబ్బందిపెట్టం. భారత్-పాకిస్తాన్ 1947కు ముందు కలిసే ఉన్నాయి. మా రెండు దేశాలూ కలిసి మా సమస్యలపై చర్చించుకోగలం, దానికి పరిష్కారం కూడా వెతకగలమనే నమ్మకం నాకుంది. ట్రంప్ - మా మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టే నేను ఇక్కడున్నా. వాళ్లు చాలా రోజుల నుంచీ అలా చర్చలు జరుపుతున్నారు. ఈ సమస్యలను వారే పరిష్కరించుకుంటారని భావిస్తున్నాను. మోదీ మంచి ఇంగ్లిష్ మాట్లాడతారని, కానీ ఈరోజు ఎందుకో హిందీలో మాట్లాడుతున్నారు అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించగా, మోదీ నవ్వుతూ ట్రంప్ చేతులపై గట్టిగా తట్టారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యలను తమకుతాముగానే పరిష్కరించుకోగలమని, దానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. text: ప్రజల నమ్మకానికి బలమైన కారణమేమిటంటే నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించిన గొప్ప చరిత్ర ఎన్నికల సంఘానికి ఉంది. ప్రత్యేకించి 1990ల్లో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ టీఎన్ శేషన్ భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘ ప్రస్తుత వైఖరి అనేక సందేహాలకు తావిస్తోంది. గుజరాత్‌లో ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడం, ప్రకటన విషయంలో తీవ్ర జాప్యం చేయడం నిష్పాక్షిక సంస్థగా భావించే ఎన్నికల సంఘంపై పలు సందేహాలకు కారణమవుతోంది. గుజరాత్‌లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్ళడం పరిస్థితి తీవ్రతను చెప్తోంది. ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కాంగ్రెస్‌కు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారో మర్చిపోయినట్లుగా ఉన్నారు. అప్పటి ఎన్నికల కమిషనర్ జేమ్స్ లింగ్డో మీద తాను చేసిన తీవ్ర ఆరోపణల విషయం మోదీకి గుర్తులేదేమో. జేమ్స్ మైకేల్ లింగ్డో క్రైస్తవుడని అందుకే ఆయన మరో క్రైస్తవరాలైన సోనియా గాంధీకి సహకరిస్తున్నారని అప్పటి సీఎం నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై లింగ్డో కూడా తీవ్రంగానే స్పందించారు. "నాస్తికుడనే పదానికి కూడా అర్థం తెలియని ఇలాంటి దిగజారిన నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు" అని ఆయన స్పందించారు. ఓ దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు ఎన్నికల సంఘ నిష్పాక్షికత ఎంతో అవసరం. ఎన్నికల కమిషన్‌ మీద ప్రభుత్వాల ఒత్తిడి ఉండకుండా చూడటం అంతకన్నా ముఖ్యం. లేకపోతే ఎన్నికల కమిషన్ ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రజలు నమ్మరు. ఈవీఎం పనితీరుపై అనుమానాలు: ఎన్నికల సంఘం వైఖరి ఈ ఏడాది మార్చిలో ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమైనప్పుడు ఎన్నికల కమిషన్ వైఖరి పలు సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంల పనితీరుపై ఆందోళన అనవసరమని చెప్పే బదులు ఈవీఎంలను హ్యాక్ చేయలేరని మాత్రమే ఎన్నికల సంఘం తెలిపింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు సౌరభ్ భరద్వాజ్ శాసనసభలో ఓ యంత్రాన్ని హ్యాక్ చేసి చూపించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలుండటం కొత్త విషయం కాదు. 2009లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2011లో ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్లారు. ఎన్నికల సంఘం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. హ్యాకింగ్ చేసి చూపించండనే సవాలు విసరడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఎవరైనా హ్యాక్ చేసి చూపిస్తానంటే పారదర్శకత, స్పష్టత అనే తన విధానాలను పక్కనపెడుతూ ఎన్నో షరతులు విధించింది. ఇక రాబోయే ఎన్నికల నుంచి ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీపీఏటీ) విధానాన్ని ప్రవేశపెడుతున్నామని మే నెలలో 12వ తేదీన అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైది ప్రకటించారు. వీవీపీఏటీ పద్ధతి వల్ల తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అనే విషయాన్ని ఓటరు రసీదు రూపంలో తెలుసుకోవచ్చు. అయితే ఈ విధానాన్ని ముందే ప్రవేశపెట్టి ఉంటే అనుమానాలన్నీ ఎందుకు వ్యక్తమౌతాయి? ఒకవేళ హ్యాకింగ్ ఆరోపణలు నిరాధారమైనా, కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి మాత్రం ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను ప్రశ్నించేలా చేసింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ఏమాత్రం మంచిది కాదు. ఎన్నికల కమిషనర్ పదవి ఒక రాజ్యాంగబద్ధ పదవి. ఈ పదవిని ప్రభుత్వం అభిశంసన ద్వారా తప్ప మరేవిధంగానూ తొలగించలేదు. ఎన్నికల సంఘం ప్రభుత్వం ఒత్తిళ్లకు లోనుకాకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. శేషన్ చేపట్టిన సంస్కరణలు 1990లో అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఓటింగ్‌లో రిగ్గింగ్ చేసే, అవినీతికి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎన్నికల వ్యయాలు తగ్గేలా చేశారు. నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆయన ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు పలు సంస్కరణలు చేపట్టారు. టీఎన్ శేషన్ పదవీకాలంలో వీపీ సింగ్, చంద్రశేఖర్, నరసింహారావు, అటల్ బిహారి వాజ్‌పేయి, హెచ్‌డి దేవెగౌడ ప్రధానమంత్రులుగా ఉన్నారు. కానీ శేషన్ మాత్రం ఏ నాయకుడికి, ఏ పార్టీకి కూడా అనుకూలంగా వ్యవహరించలేదు. సంస్కరణల విషయంపై దూకుడుగా వ్యవహరిస్తూ తన అధికారాలను ఆయన ఉపయోగించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు రాత్రి పెద్ద హైడ్రామా జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విపక్షాల అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలిచారని ప్రకటించింది. కానీ అప్పుడు ఎన్నికల సంఘంపై ఎక్కడోచోట ప్రభుత్వ ఒత్తిళ్లున్నాయనే విషయం మాత్రం స్పష్టమైంది. ఓ పటిష్ట ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సంఘానికి పూర్తి స్వతంత్రత ఉండాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా తన విధులు నిర్వర్తించాలనే విషయాన్ని శేషన్ బలంగా నమ్మారు. కానీ ఇప్పుడు తమపై ప్రభుత్వ ఒత్తిళ్లు లేవని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలను కూడా ఎవరూ నమ్మడం లేదు. హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం అక్టోబర్ 12న జారీ చేసింది. కానీ గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అంతకు ముందు ఎన్నికల సంఘం లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తుందని తీవ్రంగా చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షక పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఇవన్నీ జరగవనీ అందుకే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించలేదని విపక్షాలు అంటున్నాయి. ఇప్పుడిప్పుడే జై షా వివాదం ముదరడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవనే, బీజేపీ కొంత సమయం కోరుతోందని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ అమలులోకొస్తుంది. ఈ కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ప్రజాకర్షక కార్యక్రమాలు నిర్వహించలేవు. ఈ ఎన్నికల కోడ్ విధానాన్ని కూడా శేషన్ ప్రవేశపెట్టారు. ఏమిటీ ఆంతర్యం? ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2013 వరకూ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల వాదనలో కూడా బలం ఉందని అనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదో దానికి ఆయన చెప్పిన కారణం కూడా గర్హనీయం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉండడం వల్లనే ఈ రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం లేదని అచల్ కుమార్ జ్యోతి అన్నారు. కానీ ఇదే ఏడాది మార్చిలో మణిపూర్, గోవాలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు, వాతావరణం కూడా భిన్నంగానే ఉన్నాయి కదా? మరెందుకు అక్కడ ఒకేసారి ఎన్నికలు జరిపించారనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల సంఘమే దీనికి సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి చెబుతున్న విధంగా ఎన్నికల కమిషనర్ ప్రశ్నల మధ్య చిక్కుకుని ఉండకూడదు. ఆయన వైఖరి ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఉండాలి. తమ ప్రభావం కోల్పోయిన సంస్థల్లో ఎన్నికల సంఘమే కాదు.. నోట్ల రద్దు సమయంలో ఆర్‌బీఐ కూడా ఎందుకు అప్రతిష్ఠను మూటగట్టుకుందో అందరికీ తెలుసు. చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎలా నిలిచినా.. ప్రజాస్వామ్యానికి పునాదులుగా పరిగణించే పార్లమెంట్, ఆర్‌బీఐ, ఎన్నికల సంఘం లాంటి సంస్థలను బలోపేతం చేసే విషయంలో మాత్రం ఆయన గుర్తుండరు. ఈ విషయంలో ఆయన ఇందిరాగాంధీతో పోటీపడుతున్నట్లు కనిపిస్తున్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఇప్పటివరకూ దేశ ప్రజలు ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియను నిర్వహించే ఎన్నికల సంఘానికి పూర్తి స్వతంత్రత ఉందని, నిష్పాక్షికంగానే తన విధులను నిర్వర్తిస్తుందని ప్రజలు ఇప్పటివరకూ నమ్మారు. text: ఈ మ్యాచ్ గురించి మీరు ఏం అనుకుంటున్నారు? ఈ మ్యాచ్ జరగాలని నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మాంచెస్టర్ వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఈ మ్యాచ్ భారత్ కంటే పాకిస్తాన్‌కు ఎక్కువ ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాకిస్తాన్‌ సెమీ ఫైనల్స్ చేరుకోవడంపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అయితే, భారత జట్టుపై మాత్రం అభిమానుల అంచనాల భారం ఉంది. వాతావరణం సహకరిస్తే, మనం అద్భుతమైన మ్యాచ్ చూడొచ్చు. ఇంగ్లండ్‌లో విపరీతంగా వర్షం కురుస్తోంది. ఐసీసీ మాత్రం లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించలేదు. దీనిపై మీరేమంటారు? ప్రతిరోజూ కనీసం ఒక మ్యాచ్ జరుగుతోంది. కాబట్టి ప్రతి మ్యాచ్‌కూ రిజర్వ్ డే పెట్టడం కష్టం. ఒకవేళ వర్షం వల్ల రద్దయిన మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదా పడితే ఆ రోజు మూడు మ్యాచ్‌లు నిర్వహించాల్సి రావొచ్చు. దీనివల్ల సమస్యలు తలెత్తవచ్చునని ఐసీసీ భావించి ఉండొచ్చు. గతంలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు వాతావరణ సమస్య రాలేదు. అప్పుడు వాతావరణం బాగుంది. భారత జట్టు గురించి ఏమనుకుంటున్నారు? ఈ జట్టు ప్రపంచకప్‌ను సాధించగలదా? భారత్‌కు మంచి టీం ఉంది. కానీ, నా ఫేవరెట్ టీం మాత్రం ఇంగ్లండ్. ఆ జట్టులో అన్ని రకాల ప్లేయర్లూ ఉన్నారు. పైగా, ఆ జట్టు తమ సొంత గడ్డపై ఆడుతోంది. ఒకవేళ భారత్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్స్‌కు చేరితే మబ్బులతో నిండిన ఈ వాతావరణం కీలకమవుతుంది. అప్పుడు సొంత గడ్డపై ఆడుతున్న జట్టుకే మ్యాచ్ గెలిచే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాతావరణానికి ఆ జట్టులోని వారంతా అలవాటు పడి ఉంటారు కాబట్టి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే రోజు వాతావరణం ఎలా ఉండొచ్చు? పగటిపూట ఎండలో ఆడటాన్ని భారత జట్టు ఇష్టపడుతుంది. ఒకవేళ ఎండ లేకపోతే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇదే. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాతావరణానికి బాగా అలవాటు పడిన జట్లు ఇంగ్లండ్, న్యూజీలాండ్ మాత్రమే. అందుకే ఆ రెండు జట్లపై తలపడటం మిగతా వాళ్లకు కష్టం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్‌పై భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత వ్యాఖ్యాత సునీల్ గావస్కర్‌ బీబీసీ ప్రతినిధి వినాయక్ గైక్వాడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ.. text: ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్ అయిన బిల్లీ జీన్ కింగ్ వాళ్ల నాయకురాలు. దశాబ్దాలుగా టెన్నిస్‌లో మహిళలను పురుషులకన్నా తక్కువగా చూడడాన్ని ప్రశ్నించేందుకు వారు ఒక సంఘంగా మారారు. ''ఈ ఏడాది పురుషులకిస్తున్న ప్రైజ్ మనీలో మూడోవంతులో సగాన్ని మహిళలకిచ్చారు'' అని చెప్తున్నారు నాటి క్రీడాకారిణి ఒకరు. ''1970 కన్నా ముందు టోర్నమెంట్లలో ఆడే అవకాశం ఇవ్వండంటూ మహిళలు అభ్యర్థించాల్సి వచ్చేది. 150 నుంచి 400 డాలర్ల కోసం అధికారులను బతిమాలాడాల్సి వచ్చేది. బలమైన ఫోర్‌హ్యాండ్ లేకున్నా సరే.. అందంగా ఆకర్షణీయంగా ఉండేవాళ్లకు తొందరగా అవకాశం ఇచ్చేవారు'' అని ఆమె చెప్పారు. టెన్నిస్ కోర్టులో సమానత్వం విషయంలో మహిళా క్రీడాకారుల తరఫున బిల్లీ జీన్ కింగ్ పోరాటం చాలా విశిష్టమైనది. ''ఏ మనిషి అయినా మంచి ఆట ఆడినపుడు దానికి తగిన పారితోషకం పొందటం కన్నా మేలైన విషయం మరొకటి ఉండదు'' అన్నారు బిల్లీ జీన్ కింగ్. ఆమె లాంటి వారు మహిళా క్రీడ కోసం మహిళల కోసం నిలబడి పోరాడుతున్నారు. వారి కథ అగ్రస్థానంలో ఉన్న మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఇతర కథనాలు ‘ఇట్లు... ప్రేమతో నీ ఒబామా’ ప్రపంచంలో మొట్టమొదటి సీడీ ప్లేయర్ ఇదే! (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) వీళ్లు నవతరం మహిళా ఉద్యమకారులు. ఒక ప్రెఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణుల బృందం. పురుషాధిపత్యమున్న టెన్నిస్ క్రీడలో మహిళలకు సమాన పారితోషికం ఇవ్వాలని వీరు పోరాడుతున్నారు. text: గురువారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ మాట్లాడుతూ "వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుని, దేశంలో స్థిరమైన పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసుకోగలిగాం” అని అన్నారు. ఆరు నెలల క్రితమే ఉత్తర కొరియా తమ దేశపు సరిహద్దులను మూసేసి, కొన్ని వేల మంది ప్రజలను ఐసొలేషన్లో పెట్టింది. ఉత్తర కొరియాలో అసలు వైరస్ కేసులే లేవని అధికారులు చెబుతున్నప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మహమ్మారిని అరికట్టేందుకు అధికారులు ఆరు నెలల పాటు తీసుకున్న చర్యలను కిమ్ విశ్లేషించారు. పార్టీ సెంట్రల్ కమిటీ నాయకత్వం వహించిన దూర దృష్టే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సహకరించిందని అన్నారు. కానీ, పొరుగు దేశాలలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున నిబంధనలు సడలించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు సడలిస్తే వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని ఆయన పదే పదే హెచ్చరించినట్లు శుక్రవారం కేసిఎన్ఏ రిపోర్ట్ చేసింది. సోల్ నుంచి బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి జరిగిందా లేదా అనే విషయం పై స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరి 30 వ తేదీ నుంచి దేశ సరిహద్దులు మూసేసారు. సరిహద్దు ప్రాంతంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ కి చెందిన వాలంటీర్లు వైరస్ ని అరికట్టేందుకు సహాయక చర్యలు చేసే పనిలో ఉన్నారు. ఆ దేశంలో వైరస్ కేసులు ఉన్నప్పటికీ అవి నిర్ధరణ కాలేదు. కానీ, రాజధానిలో జన జీవనం సాధారణ స్థితిలోనే ఉందని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పోంగ్యాంగ్ మాత్రం కోవిడ్ ని విజయవంతంగా అరికట్టినట్లు కనిపించాలని చూస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ అవలంబించిన చర్యలు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పనికొచ్చాయనే సందేశాన్ని ప్రజలకి ఇస్తున్నారు. మిగిలిన ప్రపంచం అంతా వైరస్ తో పోరాడుతుంటే ఉత్తర కొరియా ప్రజలను మాత్రం దీని నుంచి రక్షించినట్లు ప్రజలు భావించాలనే సందేశాన్ని ఆయన ఇస్తున్నారు. కానీ, వీటికి ఉత్తర కొరియా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సరిహద్దు రవాణాని పూర్తిగా నిలిపేశారు. దీంతో, నిత్యావసరాల సరుకుల సరఫరా పూర్తిగా ఆగిపోయింది. సరిహద్దులో చాలా వ్యక్తిగత రక్షణ పరికరాలు, వైద్య సరఫరాలు నిలిచిపోయాయని కొంతమంది దౌత్య సిబ్బంది చెప్పారు. ప్రజలు భయంతో పోంగ్యాంగ్ డిపార్ట్మెంటల్ స్టోర్లలో అధిక మొత్తంలో సరుకులు కొనుక్కుంటున్నట్లు తెలిసింది. సరుకులు లేకపోవడంతో షాపులలో అరలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో దక్షిణ కొరియాకి వెళ్లిన వారిలో కేవలం 12 మంది ఫిరాయింపుదారులే ఉన్నారు. ఉత్తర కొరియా లో ప్రజలు వైరస్ బారిన పడి ఉండకపోవచ్చు. కానీ, వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు మాత్రం పూర్తిగా తెగిపోయాయి. ఉత్తర కొరియాలో తప్పని సరిగా మాస్క్లు ధరిస్తున్నారు జనవరి ఆఖరి వారంలో ఉత్తర కొరియా సరిహద్దుల్ని మూసేసి, రాజధాని పోంగ్యాంగ్లో వందలాది మంది విదేశీయులను క్వారంటైన్ కి పంపించి వైరస్ కి వ్యతిరేకంగా సత్వరం స్పందించింది. ఉత్తర కొరియా పౌరులను కూడా ఐసొలేషన్ లో పెట్టింది. పాఠశాలలను మూసేసింది. ఉత్తర కొరియా లో ఇప్పుడు స్కూళ్ళు తెరుచుకున్నాయి. కానీ, బహిరంగ సమావేశాల పై నిషేధం విధించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలనే నిబంధనను జారీ చేసినట్లు, రోయఁటర్స్ రిపోర్ట్ తెలిపింది. ఉత్తర కొరియా ఇప్పటి వరకు 922 మందికి మాత్రమే వైరస్ పరీక్షలు చేసినట్లు, వీరందరికి పరీక్షల్లో నెగిటివ్ అని తేలినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా చైనాతో సరిహద్దుని కలిగి ఉన్నప్పటికీ, ఒక్క వైరస్ కేసు కూడా నమోదు కాలేదని చెబుతోంది. ఇది నిజం కాకపోవచ్చని ఎన్ కే న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ ఒలివర్ హోథమ్ ఈ సంవత్సరం మొదట్లో బీబీసీ కి చెప్పారు. "చైనా , దక్షిణ కొరియా లతో సరిహద్దు ఉన్న లతో కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. ఈ దేశం వైరస్ రాకుండా ఎలా అడ్డుకోగలిగిందో ఇప్పటికీ అర్ధం కాలేదని”, ఆయన అన్నారు. "కానీ, సత్వరమే చర్యలు తీసుకోవడం వలన వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపగలిగారేమో “ అని ఆయన అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియాలో కరోనావైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్లు జాతీయ మీడియా సంస్థ కేసిఎన్ఏ ప్రచురించింది. text: శాంతివన్‌లో చదువుకుంటున్న పిల్లలు గ్రామానికి చెందిన 65 ఏళ్ల లక్ష్మీబాయి తన పొలం మధ్యలో నిర్మించుకున్న గదిలో ఒక మేక, రెండు కోళ్లను పెంచుకుంటూ జీవిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యల కారణంగా ఆమె కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. జిల్లాలోని వేలాది మంది రైతులలాగే, లక్ష్మిబాయి భర్త కూడా అప్పులు తీర్చలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కుమారుడు శివాజీ వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. కానీ అతను కూడా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శివాజీ మరణించాక, ఆమె కోడలు నందా ఒక రోజు ఉదయం హఠాత్తుగా తన ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి, ఎటో వెళ్లిపోయింది. అయితే ఈ కథ లక్ష్మిదో, ఆమె భర్తదో లేక ఆమె కుమారుడిదో కాదు. మరాఠ్వాడా ప్రాంతంలో తీసుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలది. ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న 'శాంతివన్' అనే పాఠశాలలో చదువుకుంటున్న ఆ పిల్లలంతా ఇప్పడు తమ కాళ్ల మీద తాము ఎలా నిలబడాలో నేర్చుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పిల్లలతో దీపక్ నాగర్‌గోజె, ఆయన భార్య లక్ష్మీబాయి 14 ఏళ్ల మనవడు సూరజ్ శివాజీ రావు, తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి బీడ్ జిల్లాలోని అరవి గ్రామంలో ఉన్న ఆ పాఠశాలలోనే చదువుకుంటున్నాడు. తల్లి వెళ్లిపోయాక సూరజ్ అత్తయ్య జిజాబాయి తన సోదరుడి పిల్లల ఆలనా పాలనా చూసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాల పిల్లల జీవితాలో 'శాంతివన్' ఆశాదీపాలు వెలిగిస్తోందని ఆమె తెలిపారు. ''మొదట ఈ పిల్లలు చాలా ఏడ్చేవాళ్లు. తాతయ్య, తండ్రి చనిపోవడం, తల్లి తమను విడిచిపోవడం.. ఇవన్నీ వాళ్లకు అర్థమయ్యేవి కాదు. వాళ్లు గ్రామమంతా తిరుగుతూ మా అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడిగేవాళ్లు. నాకేం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. అప్పుడే మాకు శాంతివన్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి తెలిసింది. దాంతో ఈ పిల్లలను అక్కడ చేర్పించాం'' అని జిజాబాయి తెలిపారు. సూరజ్‌ను కలవడానికి మేం థలసెరాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరవి గ్రామానికి వెళ్లాం. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న సూరజ్‌తో పాటు శాంతివన్ వ్యవస్థాపకుడు, ప్రధానోపాధ్యాయుడు అయిన దీపక్ నాగర్‌గోజెను కలిశాం. ఇతరుల కోసం జీవించడంలోనే మజా.. బాబా ఆమ్టే ప్రేరణతో దీపక్ 18 ఏళ్ల క్రితం ఏడున్నర ఎకరాల స్థలంలో శాంతివన్‌ను ప్రారంభించారు. ''నేను బాబా ఆమ్టేను కలిసినప్పుడు నా వయస్సు 18 ఏళ్లు. ఆయనను కలిసిన తర్వాత నాకు - అందరూ వాళ్ల కోసం వాళ్లు జీవిస్తారు. కానీ ఇతరుల కోసం జీవించడంలోనే మజా ఉంది అనిపించింది. నేను బీడ్‌లోని బాలాఘాట్ ప్రాంతానికి చెందినవాణ్ని. ఇక్కడ ప్రాంతం మొత్తం రాళ్లతో నిండి ఉంటుంది. ఏడాదికి ఒక పంటే పండుతుంది.'' ''ఇక్కడ ప్రతి రెండో సంవత్సరం కరువు వస్తుంది. అందువల్ల ఇక్కడ వ్యవసాయం ఎప్పుడూ జూదమే. అందుకే రైతులు చాలా ఏళ్లుగా ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ల పిల్లలు చదువులు ఆగిపోతే వాళ్లంతా ఏమైపోతారా అని ఆలోచించాను'' అని దీపక్ తెలిపారు. ఆ ప్రాంతంలో పేదరికం, నిరుద్యోగం ఎక్కువ కావడంతో ఆత్మహత్యలు మరింత పెరిగాయి. ఈ విషవలయాన్ని గుర్తించిన దీపక్ అలా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను గుర్తించి, వారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించారు. ''ఇవాళ శాంతివనంలో సుమారు 8 వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 3 వందల మంది హాస్టల్లో ఉంటున్నారు. ఈ 3 వందల మందిలో 2 వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలే'' అని దీపక్ తెలిపారు. పిల్లలతో దీపక్ నాగర్‌గోజె ఈ పాఠశాలను దీపక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా కేవలం కొద్దిమంది దాతల సాయంతో నడుపుతున్నారు. ఇక పిల్లలకు కావాల్సిన కూరగాయలు, ఆహారధాన్యాలు దీపక్ కుటుంబానికి చెందిన భూముల్లోనే పండిస్తున్నారు. మేం వెళ్లేసరికి సూరజ్ భోజనం చేయడానికి మెస్‌కు వెళుతున్నాడు. అతని గ్రామం గురించి, నాన్నమ్మ గురించి అడగగానే ఆ పిల్లవాడి కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ''కొన్నిసార్లు ఇంటికి దూరంగా ఉన్నానని బాధ కలిగినా, ఇక్కడ నేను సంతోషంగానే ఉన్నాను. ఇక్కడ నాకు మంచి స్నేహితులు కూడా ఉన్నారు. నేనే భవిష్యత్తులో డాక్టర్‌నో, ఇంజనీర్‌నో కావాలనుకుంటున్నాను'' అన్నాడు. పూజా కిషన్ ఆవుటె సూరజ్‌లాగే బీడ్ జిల్లా గెవోరాయి తహసీల్‌కు చెందిన పూజా కిషన్ అవుటె శాంతివన్‌లోనే పెరిగింది. ఆమె ప్రస్తుతం జిల్లా కేంద్రంలో కంప్యూటర్ కోర్స్ చదువుకుంటోంది. 20 ఏళ్ల పూజా మొదటి పరిచయంలోనే తన నవ్వు మొహంతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తనలోని బాధను ఆమె తన మొహంలోని సంతోషం, తన ఉత్సాహం వెనుక దాచుకుంది. పూజాకు తమ ప్రాంతంలోని రైతుల జీవితాలను మెరుగుపర్చాలన్నది కోరిక. తన కుటుంబం గురించి, చదువు గురించి చెబుతూ ఆమె, ''మా నాన్న తీసుకున్న అప్పు తీర్చలేకపోయాడు. మాకున్న కొద్దిపాటి భూమిలో ఆయన మా పెదనాన్నతో కలిసి పని చేసేవాడు. మా పెదనాన్న డబ్బులన్నీ తాను ఉంచుకుని, అప్పులు మాత్రం మా నాన్న వాటాకు పంచాడు'' అని తెలిపింది. పూజా పదవ తరగతిలో ఉన్నపుడు ఆమె తండ్రి కాళ్లు చేతులు తాళ్లతో కట్టుకుని బావిలో దూకి చనిపోయాడు. తండ్రి గురించి చెబుతుంటే ఆమె కళ్లలో నీళ్లు నిలిచాయి. ''ఆయనకు ఈత కొట్టడం వచ్చు. అందుకే పైకి తేలుతాననే భయంతో కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసుకున్నాడు. ఇప్పడు ఇంటి వద్ద అమ్మ ఒక్కటే కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది'' అని పూజా తెలిపింది. పూజా ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసి, పై చదువులు చదవాలనుకుంటోంది. ''నేను మాస్టర్ డిగ్రీ చేసి, మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. ఉద్యోగం రాగానే మా అమ్మను నా దగ్గరకు తెచ్చేసుకుంటాను. ఆమెను ఎప్పుడూ నా దగ్గరే పెట్టుకుని, ఇంకెప్పుడూ పనికి పోనివ్వను.'' ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈసారి కూడా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వర్షాలు ఆలస్యంగా పడ్డాయి. నల్లరేగడి నేలల పంటపొలాలను దాటుకుంటూ మేం బాలాఘాట్ కొండల మధ్య ఉన్న థలసెరా గ్రామానికి వెళ్లాం. text: ఉత్తరాఖండ్‌లో నందాదేవి గ్లేసియర్ (హిమనీనదం)లో మంచు చరియలు విరిగిపడటంతో సంభవించిన జల ప్రళయంలో చిక్కుకున్న వారికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రదీప్ భరద్వాజ్ ఈ విషయం చెప్పారు. సిక్స్ సిగ్మా స్టార్ హెల్త్‌కేర్ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో అయిన భరద్వాజ్.. ఆదివారం తన బృందంతో వరద ప్రభావిత చమోలీకి చేరుకున్నారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు చమోలీలోని రేణీ ప్రాంతానికి ప్రదీప్ బృందం చేరుకునేటప్పటికీ పరిస్థితులు భయానకంగా అనిపించాయి. డాక్టర్ ప్రదీప్ భరద్వాజ్ ''నేను మా వైద్య బృందంతో కలిసి రేణీ గ్రామానికి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చాను. అప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ దళాలు బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎటుచూసినా పెద్దపెద్ద రాళ్లు, బురద, నీరే కనిపించాయి. ఒక్కసారిగా కేదార్‌నాథ్ విపత్తు కళ్లముందు మరోసారి కనబడింది''అని ఆయన చెప్పారు. ''11 మృతదేహాలు బురదలో కూరుకుపోవడాన్ని చూశాను. బయటకు తీస్తున్న చాలా మృతదేహాలకు ఒంటిపై బట్టలు కూడా లేవు. బహుశా నీటి వేగం వల్లే బట్టలన్నీ కొట్టుకుపోయి ఉండొచ్చు. ఈ మృతదేహాలను గుర్తుపట్టడం చాలా కష్టం. ఒకవేళ వీరి దగ్గర ఎలాంటి ఐడీ కార్డులూ లేకపోతే పరిస్థితి మరింత జటిలం అవుతుంది. డీఎన్‌ఏ పరీక్షల అవసరం రావొచ్చు''అని వివరించారు. చమోలీలో పగటిపూటే ఈ జల ప్రళయం సంభవించింది. ఒక్కసారిగా వరద నీరు ప్రచండ వేగంతో ఉప్పొంగుతూ రావడాన్ని వందల మంది చూశారు. నీళ్ల శబ్దంతోపాటు బండరాళ్లు ఒకదానితో మరొకటి కొట్టుకోవడంతో వచ్చే శబ్దాలతో వాతావరణం భయానకంగా మారింది. వరద ప్రవాహానికి సమీపంలోని దాదాపు 17 గ్రామాలపై వరద ప్రభావం పడిందని డాక్టర్ ప్రదీప్ తెలిపారు. జగ్‌జూ, తపోవన్, మలారీ, తోలమ్ తదితర గ్రామాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. ''ఈ భయానక దృశ్యాలను 17 గ్రామాల ప్రజలు కళ్లారా చూశారు. వారిలో చాలా మంది భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దృశ్యాలను దగ్గర నుంచి చూసిన చాలా మందికి మానసిక వైద్యం అవసరం అవుతుంది''అని డాక్టర్ ప్రదీప్ చెప్పారు. ''ముంపునకు గురైన ప్రాంతం నుంచి ఓ మహిళను గ్రామస్థులు మా దగ్గరకు తీసుకొచ్చారు. ఆమె ఇప్పుడు ఏమీ మాట్లాడలేకపోతోంది. ఘటనకు ముందు ఆమె చక్కగా మాట్లాడేదని గ్రామస్థులు చెబుతున్నారు. చాలా మందిలో బీపీ పెరిగింది. మొత్తం అందరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నాం''అని ఆయన అన్నారు. ప్రస్తుతం నదీ ప్రవాహం మొత్తం కనిపించే ప్రాంతాల్లో కూర్చొని కొంతమంది గ్రామవాసులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సహాయక చర్యలు చేపడుతున్నవారికి ఏమైనా అవసరం ఉంటే వెంటనే మిగతావారిని అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు విడతల వారీగా గ్రామస్థులంతా నదీ ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా చిన్న తేడా కనిపించినా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. శిబిరాలు.. కౌన్సెలింగ్ ''భయానకమైన దృశ్యాలను దగ్గర నుంచి చూసిన చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా వరదకు సమీపంలో ఎక్కువ ప్రభావితమైన ఇలాంటి ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాం''అని ప్రదీప్ చెప్పారు. ''సోమవారం కూడా పరిసర ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటుచేస్తాం. ఆందోళన, కుంగుబాటు తదితర మానసిక సమస్యల నుంచి బయటపడేందుకూ చికిత్స అందిస్తాం''. ''వరద ప్రభావంతో గాయపడిన 11 మందికి ఆదివారం చికిత్స అందించాం. గాయాలపాలైన వారికి వెంటనే చికిత్స మొదలుపెడుతున్నాం''. ''భయానక పరిస్థితుల్లో ఆందోళనకు గురైన గ్రామస్థులందరికీ మానసిక చికిత్స అవసరం అవుతుంది''అని ప్రదీప్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''వరద ప్రవాహం దాటికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయి. దీనిబట్టి వరద ఎంత ఉద్ధృతితో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు''. text: పెరుగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనలు అయితే, ఈ చట్టం అమలును నిలిపివేసేలా ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విస్తృతంగా వ్యక్తమవుతున్న ఆందోళనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరస్కరించారు. ఆ తరువాతే సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చట్టం మూడు పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వజూపుతోంది. ఈ చట్టం ప్రజలకు మత వివక్ష పీడన నుంచి రక్షణ కల్పిస్తుందని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం చెప్తోంది. కానీ, భారతదేశంలోని 20 కోట్ల మందికి పైగా ముస్లింలను అణచివేసే 'హిందూ జాతీయవాద' అజెండాలో ఈ చట్టం ఒక భాగమని విమర్శకులు అంటున్నారు. పొరుగు దేశాల నుంచి ''చొరబాటుదారులను'' ఏరివేయటానికి విస్తృత కార్యక్రమం చేపడతామని ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించటం ఈ భయాలను ఇంకా పెంచుతోంది. ఇది ప్రతిపక్షాలు చేయిస్తున్న ఆందోళనలని అంటున్న ప్రధాని మోదీ తమ పూర్వీకులు భారతదేశంలో నివసించారని నిరూపించుకోవటానికి విస్తారమైన ధృవపత్రాల మీద ఆ కార్యక్రమం ఆధారపడటంతో.. తమను ఏ దేశానికీ చెందని వారిగా మార్చివేస్తారని చాలా మంది ముస్లిం పౌరులు భయపడుతున్నారు. అయితే, ఈ చట్టం ''హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా భారత పౌరుల మీద ఎటువంటి ప్రభావం చూపదు'' అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. ఆయన మంగళవారం ఒక సభలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, "ప్రతిపక్షం అబద్ధాలు, వదంతులను ప్రచారం చేస్తోంది. హింసను ప్రేరేపిస్తోంది. అపోహలు, అబద్ధాల వాతావరణాన్ని సృష్టించటానికి పూర్తి శక్తిని వినియోగిస్తోంది'' అని అన్నారు. హోం మంత్రి అమిత్ షా కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే విధానాన్ని పునరుద్ఘాటించారు. ''నేను, నా ప్రభుత్వం రాయిలా దృఢంగా ఉన్నాం. పౌరసత్వ నిరసనలకు తలొగ్గటం కానీ, వెనుకడుగు వేయటం కానీ జరగదు'' అని ఆయన అన్నారు. కొనసాగుతున్న ఆందోళనలు - జామియా కేసులో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ దిల్లీ సీలంపూర్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి మంగళవారం వ్యతిరేకంగా ప్రారంభమైన శాంతిపూర్వక ప్రదర్శనలు చూస్తూచూస్తూనే హింసాత్మకంగా మారాయి. రిపోర్ట్స్ ప్రకారం వెయ్యికి పైగా నిరసనకారులు రోడ్డుపైకి వచ్చినపుడు ఒక స్కూల్ బస్‌ను ధ్వంసం చేశారు. ఒక పోలీస్ పోస్టుకు నిప్పుపెట్టారు. రెండు పోలీస్ బూత్‌లను ధ్వంసం చేశారు. దీంతో, ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ చార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నట్లు దిల్లీ పోలీసులు చెబుతున్నారు. అటు, జామియా మిలియా ఇస్లామియా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివారం జరిగిన హింసాత్మక ప్రదర్శనలకు సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్‌పై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీలంపూర్‌లో ఏం జరిగింది? "సీలంపూర్ టీ పాయింట్ దగ్గర ఒక గంటపాటు శాంతిపూర్వక వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. కానీ, తర్వాత ఆందోళనకారుల్లోంచే కొందరు జనాలపై రాళ్లు విసరడం మొదలుపెట్టారు" అని దిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ ఆలోక్ కుమార్ చెప్పారు. "సీలంపూర్ ఘటనలో 21 మంది గాయపడ్డారు. వారిలో 12 మంది దిల్లీ పోలీసులు, ముగ్గురు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం" అన్నారు. పోలీసులు లాఠీచార్జి గానీ, కాల్పులుగానీ జరపలేదని ఆయన చెబుతున్నారు. టియర్ గ్యాస్ మాత్రం ప్రయోగించామన్నారు. "మదరసాలు, మసీదుల్లో శాంతి నెలకొనాలని అపీల్ చేశాం, ఇప్పుడు పరిస్థితి నియంత్రణలో ఉంది" అని ఆలోక్ చెప్పారు. సీలంపూర్‌లో ప్రదర్శనలు హింసాత్మకం కావడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శాంతియుతంగా ఉండాలని అపీల్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ జామియా ప్రాంతంలో హింసాత్మక ఘటనల కేసులో దిల్లీ పోలీసులు మంగళవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, జామియా మిలియాలో జరిగిన హింస కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను దిల్లీ సాకేత్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షాలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశాయి. మోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. "శాంతిపూర్వక ప్రదర్శనలను ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని" ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అణచివేయకూడదని సోనియా కోరారు. విపక్షాలు ఎంతైనా వ్యతిరేకించనీ: అమిత్ షా విపక్షాలు ఎంత వ్యతిరేకించినా, కొత్త పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఈ వ్యతిరేక ప్రదర్శనలకు కాంగ్రెస్ పార్టీయే కారణం" అన్నారు. CAA వ్యతిరేక ప్రదర్శనలపై కేంద్ర సహాయ మంత్రి సురేష్ అంగడి షాకింగ్ కామెంట్స్ చేశారు. జిల్లా అధికారులు, రైల్వే అధికారులను హెచ్చరించిన ఆయన "ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తుంటే 'కనిపించగానే కాల్చివేయాలని' ఒక మంత్రిగా ఆదేశిస్తున్నానని" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామని భారత సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. జనవరి నెలలో పిటిషన్లను విచారిస్తామని చెప్పిన సుప్రీం కోర్టు వాటికి సమాధానాలు సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. text: ఇది ప్రస్తుతం ఇలాంటి శిశువుల కోసం వాడుతున్న ఇంక్యుబేటర్ల కంటే పూర్తిగా భిన్నమైనది. 37 వారాల గర్భస్థ దశ కంటే ముందే జన్మించే శిశువుల మరణాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. మరో పదేళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు చెబుతుండగా, ఈ వైద్య సాంకేతికతను దుర్వినియోగం చేసే ఆస్కారమూ ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి అనంతరం బయట ప్రపంచంలోకి రావాల్సిన బిడ్డ నెలలు నిండక ముందే జన్మిస్తే, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడడం వైద్యులకు సవాలే. ఇలాంటి శిశువుల కోసమే నెదర్లాండ్స్‌కు చెందిన డిజైనర్ లీసా మేడ్‌మేకర్, కొందరు వైద్యులు కలిసి కృత్రిమ గర్భసంచిలను అభివృద్ధి చేస్తున్నారు. ఇవి అచ్చంగా తల్లి గర్భాన్నే పోలి ఉంటాయి. లీసా మేడ్‌మేకర్, డిజైనర్ ఇంక్యుబేటర్‌కు, కృత్రిమ గర్భసంచికి తేడా ఏమిటి? ఇంక్యుబేటర్‌లో గాలి ఉంటుంది. కృత్రిమ గర్భసంచిలో ద్రవాలుంటాయి. అవి కూడా శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడుండే ద్రవాల్లానే ఉంటాయి. ఇంక్యుబేటర్‌లో గాలి ఉండడం వల్ల శిశువు తల్లి గర్భంలో కదిలినట్లు కదలలేదు, పైగా ఈ గాలి ఊపిరితిత్తుల్లో సమస్య కలిగించొచ్చని వైద్యులు చెబుతున్నారు. కృత్రిమ గర్భసంచి ఎలా పనిచేస్తుంది? ఇందులో అయిదు బెలూన్లు ఉంటాయి. వీటిలోకి అవసరమైన ద్రవాలు పంపిస్తారు. అందులో శిశువు తల్లి గర్భంలో కదిలినట్ల కదులుతుంది. కృత్రిమ గర్భసంచిని కృత్రిమ మాయ(ప్లాసెంటా)తో అనుసంధానిస్తారు. కృత్రిమ గర్భసంచిలో నీరు, ఖనిజ ద్రవాలు ఉండడం వల్ల శిశువు పూర్తిగా తల్లి గర్భంలో ఉన్నట్లే ఉంటుంది. అంతేకాదు, తల్లి గర్భంలో శిశువుకు ఆక్సిజన్, పోషకాలు బొడ్డుతాడు ద్వారా అందినట్లే ఇందులోనూ కృత్రిమ బొడ్డు తాడు ద్వారా అందుతాయి. ఎన్ని రోజులు ఉంచాలి? నెలలు నిండకుండా జన్మించిన శిశువును కృత్రిమ గర్భసంచిలో 4 వారాల పాట ఉంచిన తరువాత బయటకు తీయాలి. ఆ 4 వారాల సమయంలో శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటిలాగే పోషకాలు అందుకుంటూ పూర్తిస్థాయిలో ఎదుగుతుంది. దీనివల్ల ఆ శిశువు ప్రాణాలకు ప్రమాదం తప్పుతుంది. దుష్ప్రభావాలుంటాయా? ఈ విధానంలో మంచిచెడ్డలు ఇంకా పూర్తిగా తెలియవని ఈ పరిశోధనల్లో భాగస్వామి అయిన డాక్టర్ గైడ్ ఓయీ అంటున్నారు. కృత్రిమ గర్భసంచిలో ఉన్న సమయంలో కానీ, దీర్ఘకాలికంగా కానీ దీని వల్ల శిశువుపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇంకా పూర్తిగా తెలియదంటున్నారాయన. తమ ప్రయోగాలు పూర్తి కావడానికి ఇంకో అయిదేళ్లు పడుతుందని.. ఆ తరువాత మానవ శిశువులను ఇందులో ఉంచి పరీక్షిస్తామని ఆయన చెబుతున్నారు. నెలలు నిండకుండా జన్మించిన శిశువును కృత్రిమ గర్భసంచిలో 4 వారాల పాట ఉంచిన తరువాత బయటకు తీయాలి. దుష్పరిణామాలకూ అవకాశం ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది శిశువులు నెలలు నిండకుండా జన్మిస్తుండగా వారిలో సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసం రూపొందిస్తున్న ఈ కృత్రిమ గర్భసంచుల పద్ధతిని దుర్వినియోగం చేసే ఆస్కారముందన్న వాదనా ఒకటి ఉంది. గర్భిణులు తమ సౌకర్యం కోసం వైద్యుల సహాయంతో ముందుగానే శిశువుకు జన్మనిచ్చి కృత్రిమ గర్భసంచుల్లో ఉంచినా ఉంచొచ్చని అది సహజ పద్ధతిలో బయట ప్రపంచంలోకి రావాల్సిన శిశువులకు కూడా ఇలాంటి అవసరం కల్పిస్తుందని అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నెదర్లాండ్స్‌కు చెందిన కొందరు వైద్యులు కృత్రిమ గర్భసంచిని రూపొందించే పనిలో ఉన్నారు. నెలలు నిండడానికి చాలా సమయం ఉంటుండగానే జన్మించే శిశువుల ప్రాణాలు కాపాడేందుకు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. text: గ్రీస్ పతనమైన తర్వాత చైనాలో గణితశాస్త్రం కొత్త శిఖరాలను అధిరోహించింది గణితశాస్త్రం ప్రయాణం ఈజిప్టు, మెసొపటేమియా, గ్రీస్‌లలో మొదలైంది. కానీ ఈ నాగరికతలు క్షీణించిన తర్వాత పశ్చాత్య దేశాల్లో గణితశాస్త్రం పురోగతి ఆగిపోయింది. అయితే.. తూర్పు ప్రపంచంలో గణితశాస్త్రం శక్తివంతమైన శిఖరాలకు చేరుకుంది. ప్రాచీన చైనాలో.. వేల మైళ్లు విస్తరించిన మహా కుడ్యం (గ్రేట్ వాల్) నిర్మాణానికి గణితమే కీలకమైంది. అంతేకాదు.. చక్రవర్తి పరిపాలనా వ్యవహారాల నిర్వహణలోనూ గణాంకాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. చైనాలో సామ్రాజ్య అంత:పుర వ్యవస్థను వారసత్వ అవకాశాలను పెంచటానికి అనుగుణంగా రూపొందించారు గణాంక ప్రేమాయణ ప్రణాళిక... చక్రవర్తి నిర్ణయాలన్నిటి మీదా - ఆయన ఏ రోజు, ఏ రాత్రి ఏ పని చేయాలన్నది కూడా - కేలండర్, గ్రహాల కదలికలు ప్రభావం ఉండేది. చక్రవర్తి తన అంతఃపురంలో ఉన్న ఎంతో మంది స్త్రీలతో ఎప్పుడెప్పుడు ఎవరితో శయనించాలో సూచిస్తూ ప్రాచీన రాజాస్థాన సలహాదారులు ఒక వ్యవస్థను తయారు చేశారు. రేఖాగణిత శ్రేణి (జియోమెట్రిక్ ప్రోగ్రెషన్) అనే గణిత సిద్ధాంతం ఆధారంగా దీనిని రూపొందించారు. చక్రవర్తి 15 రాత్రుల్లో 121 మంది స్త్రీలతో శయనించాల్సి ఉండేదని ప్రాచీన గాథ చెప్తోంది. ప్రతి మహిళా బృందం.. మొదటి బృందం కన్నా మూడు రెట్లు పెద్దగా ఉంటుంది. కాబట్టి.. చక్రవర్తి 15 రాత్రుల్లో తన అంతఃపురంలో ఉన్న ప్రతి మహిళతోనూ శయనించేలా గణిత నిపుణులు ఒక ఆవర్తన వలయం (రోటా) రూపొందించారు. చైనా తొలి సార్వభౌముడు క్రీస్తుపూర్వం 2800 సంవత్సరంలో తను పూజించే ఒక దేవత ద్వారా అంకెలను సృష్టింపజేశారని చైనా పురాణ గాధ చెప్తోంది పున్నమి రోజుల్లో స్త్రీ, పురుష శక్తులు మొదటి రాత్రిని మహారాణికి రిజర్వు చేశారు. రెండో రాత్రి ముగ్గురు సీనియర్ సహచరిణిలకు కేటాయించారు. మూడో రాత్రి తొమ్మిది మంది భార్యల వంతు. ఆపైన 27 మంది ఉంపుడుగత్తెలను ఒక్కో రాత్రికి తొమ్మిది మంది చొప్పున విభజించి.. వారికి మూడు రోజులు కేటాయించారు. చివరిగా 81 మంది బానిస స్త్రీలను తొమ్మది మంది చొప్పున విభజించి తొమ్మిది రోజులు కేటాయించారు. పౌర్ణమి సమీపంలో ఉన్నపుడు అత్యున్నత శ్రేణి స్త్రీలతో చక్రవర్తి శయనించేలా కూడా ఈ రోటాను తయారు చేశారు. పున్నమి రోజుల్లో ఆయా మహిళల స్త్రీశక్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని.. అప్పుడు చక్రవర్తి పురుషశక్తితో సమానంగా ఉండగలదని ఈ రోటా రూపకర్తల ఆలోచనగా చెప్తారు. ఈ ఏర్పాటు ఉద్దేశం.. సామ్రాజ్యానికి సాధ్యమైనంత ఉత్తమ వారసుడిని పొందటమేనన్నది స్పష్టం. గణితశాస్త్రం మీద ఆధారపడింది కేవలం చక్రవర్తి ఆంతరంగిక మందిరం ఒక్కటే కాదు. రాజ్యాన్ని నడపటానికి కూడా గణితమే కేంద్రంగా ఉంది. ప్రాచీన చైనీయులు అంకెల్లో క్రమానుగతాల మీద కూడా దృష్టి పెట్టారు అంకెలకు మహత్తులు ప్రాచీన చైనా చాలా విస్తారమైన, ఇంకా పెరుగుతూ ఉన్న సామ్రాజ్యం. దానికి కఠినమైన చట్టం ఉంది. విస్తృత పన్నులు ఉన్నాయి. బరువులు, కొలతలు, నగదుకు సంబంధించి ప్రామాణిక వ్యవస్థ ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో దశాంశ పద్ధతి అమలులోకి రావటానికి దాదాపు 1,000 సంవత్సరాల ముందే చైనాలో దశాంశ పద్ధతి ఉపయోగంలో ఉంది. అంతేకాదు.. పశ్చిమ దేశాల్లో పంతొమ్మిదో శతాబ్దం వరకూ కనిపించని రీతుల్లో చైనాలో ప్రాచీన కాలం నుంచే సమీకరణలను (ఈక్వేషన్లను) పరిష్కరించేవారు. చైనా మొదటి సార్వభౌముడు ఎల్లో ఎంపరర్.. అంకెలకు విశ్వాంతర ప్రాధాన్యం ఉందని విశ్వసిస్తూ.. తను పూజించే ఒక దేవత ద్వారా గణాంకశాస్త్రాన్ని సృష్టింపజేశారని చైనా పురాణగాథ చెప్తోంది. ఈనాడు కూడా అంకెలకు మహత్తులు ఉన్నాయని చాలా మంది చైనీయులు నమ్ముతారు. బేసి సంఖ్యలను పుంలింగంగానూ, సరి సంఖ్యలను స్త్రీలింగంగానూ పరిగణిస్తారు. నాలుగో అంకె (4) ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవాలన్నది వారి విశ్వాసాల్లో ఒకటి. అదే సమయంలో ఎనిమిది (8) సిరి సంపదలను తెచ్చిపెడుతుందనీ నమ్ముతారు. అలాగే.. అంకెలలో క్రమానుగతాల మీద కూడా ప్రాచీన చైనీయులు దృష్టి పెట్టారు. అలా తమదైన సుడోకును తయారు చేశారు. ప్రాచీన చైనా జ్యోతిష్యశాస్త్రంలో ఉపయోగించిన శిష్ట శిద్ధాంతాన్ని (రిమెయిండర్ థియోరమ్) ఆరో శతాబ్దం నాటికల్లా గ్రహాల కదలికలను కొలవటానికి ఉపయోగించేవారు. ఇది ఇప్పటికీ ఇంటర్నెట్ క్రిప్టోగ్రఫీ వంటి వాటిల్లో ఉపయోగపడుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కాలాన్ని కొలవడం నుంచి సాగరంలో ప్రయాణించడం వరకూ.. ప్రాచీన నాగరికతలకు ప్రధాన ఇరుసుగా ఉన్నది గణితశాస్త్రం. text: చరిత్ర ఆమెను ప్రఖ్యాత, వివాదాస్పద వ్యక్తిగా గుర్తుపెట్టుకుంటుంది. తొలితరం ఫెమినిస్ట్, స్వాతంత్ర్య యోధురాలిగా ఆమెను కీర్తిస్తారు. ఆమె ఓ క్రూరమైన వ్యక్తి అని ఇంకొందరు భావిస్తారు. బౌడికా గురించి చరిత్ర ఏం చెప్పినా, ఆమె ఓ తిరుగులేని నాయకురాలు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఆ యోధురాలి నుంచి ఈ తరం వ్యక్తులు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు చాలా ఉన్నాయి. 1. దుస్తులతో జాగ్రత్త ఎదుటివాళ్ల దృష్టిని ఆకర్షించడంలో దుస్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పటి ఆఫీసులకే కాదు, లోహ యుగం నాటి పరిస్థితులకు కూడా ఈ నియమం వర్తిస్తుందని బౌడికా నిరూపించారు. ‘ఆమె చాలా ఎత్తుగా ఉంటుంది. రూపంలో రౌద్రం తాండవిస్తుంది. నడుము దాకా జుట్టు, మెడలో బంగారు నెక్లెస్, చేతికి కడియం, భిన్న రంగుల్లో ఉండే ‘ట్యునిక్’ (ఒక రకమైన లో దుస్తులు), దాన్ని కప్పేసే మందపాటి పరదా... ఇలా చక్కటి వస్త్రధారణతో ఆమె చాలా శక్తిమంతంగా కనిపించేవారు’ అని రోమన్ చరిత్రకారుడు కాసియస్ డియో ఆమెను వర్ణించారు. బౌడికా విగ్రహాల్లో కూడా ఆ దర్పం స్పష్టంగా కనిపిస్తుంది. తొలి రోజుల్లో శక్తిమంతమైన వస్త్రాలంకరణను ఆయుధంగా మార్చుకున్న వ్యక్తి బౌడికా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆఫ్రికా చరిత్ర: పుస్తకాల్లో కనిపించని శక్తిమంతమైన మహారాణి 2. పేరులో చాలా ఉంది ప్రాచీన బ్రైతానిక్ భాషలోని బౌడ్ అనే పదం నుంచి బౌడికా అనే పేరు పుట్టింది. ఆ పదానికి ‘విజయం’ అని అర్థం. బౌడిగా అంటే విజయాన్ని తీసుకువచ్చేదని అర్థం. ఆ పేరు ఆమెకు పుట్టుకతో లభించింది కాదు. కాలక్రమంలో ఆ పేరును ఆమె స్వీకరించారని చెబుతారు. భారీ బలగాలను సమీకరించడంలో ఆ పేరు కూడా సాయపడిందని అంటారు. అందుకే... పేరులో చాలా ఉంది. 3. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు బౌడికా భర్త ప్రాసుటాగస్ తూర్పు ఆంగ్లియాలోని ఐసెనీ తెగను పాలించేవారు. ఆయన రోమన్ల ఆక్రమణను సమ్మతించేవారు. ఆ కారణంగానే తన కుర్చీని కాపాడుకున్నారు. కానీ, ఆయన చనిపోయాక రోమన్లు ఆ రాజ్యాన్ని కూడా చేపట్టాలని చూశారు. భూముల్ని కబ్జా చేశారు. భారీ సుంకాల్ని చెల్లించడానికి బౌడికా నిరాకరించడంతో ఆమెను కొట్టి, ఆమె కుమార్తెలను రేప్ చేశారు. ఆ క్రమంలో బౌడికా శక్తిని రోమన్లు తక్కువగా అంచనా వేశారు. రోమన్లపై తిరగబడాలని నిర్ణయించుకున్న బౌడికా, తన సొంత తెగ ప్రజలతో పాటు ఇతర బలగాలను సమీకరించారు. వాళ్లు విజయవంతంగా రోమన్ల తొమ్మిదవ సైనిక బలగాలను ఓడించడంతో పాటు రోమన్ల రాజధాని కోల్చెస్టర్‌ను నాశనం చేశారు. ఆ పైన లండన్, సెయింట్ ఆల్బన్స్‌ నగరాలను సమూలంగా నేలమట్టం చేశారు. స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేయడంతో లభించిన ఫలితం అది. 4. బలగాల సంఖ్య కంటే సరైన శిక్షణ ముఖ్యం యుద్ధం మొదలుపెట్టాక అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కానీ, బౌడికా ఆ పని చేయలేదు. లండన్‌, సెయింట్ ఆల్బన్స్ నగరాలను నేలకూల్చడంతో... బౌడికా సైన్యంపై దండెత్తి ప్రతీకారం తీర్చుకోవాలని రోమన్ గవర్నర్ నిర్ణయించారు. నిజానికి రోమన్లతో పోలిస్తే బౌడికా సైన్యంలో పదింతల మంది సైనికులున్నారు. కానీ వాళ్లకు ఎలాంటి శిక్షణ లేదు. సరైన ఆయుధాలు లేవు. కానీ, రోమన్ల సైనికులు సుశిక్షితులు. శత్రువులను ఎలా దెబ్బతీయాలో వాళ్లకు బాగా తెలుసు. అందుకే సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రోమన్లు బౌడికా సైన్యంపై విజయం సాధించారు. బలగాలు... అంటే ఉద్యోగుల సంఖ్య కంటే సరైన శిక్షణ ముఖ్యం అని బౌడికా ఉదంతం తెలియజేస్తుంది. 5. గుంపులో నుంచి బయటపడాలి బౌడికా చేసిన దాడి రోమన్లపై జరిగిన మొదటి తిరుగుబాటేం కాదు. కానీ, ఆ తిరుగుబాటు చేసింది ఓ మహిళ కావడంతో అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బౌడికా మహిళ కాబట్టే రోమన్లపై ఎన్ని తిరుగుబాట్లు జరిగినా, ఇది ఎక్కువమందికి తెలుసని చరిత్రకారులు చెబుతారు. అత్యంత బలమైన రోమన్ల సామ్రాజ్యంపై దండెత్తిన అతి కొద్ది మహిళల్లో ఒకరిగా బౌడికా అందరికీ గుర్తుండిపోతారు. చరిత్ర పుస్తకాల్లో ఆమె గురించిన సమాచారం తక్కువగా ఉన్నప్పటికీ ‘తిరుగుబాటు’ అనే ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఆమె పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 6. రోల్ మోడల్ చాలా ముఖ్యం బౌడికా కథ చాలాకాలంపాటు మరుగునపడిపోయింది. 16వ శతాబ్దంలో రచయితలు చరిత్రపైన ఆసక్తి చూపడంతో బౌడిక విజయగాథ మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ I కూడా బౌడికా కథ నుంచి స్ఫూర్తి పొందారు. సామ్రాజ్యవాదంలో శక్తిమంతమైన నాయకురాలిగా విక్టోరియన్లు బౌడికాను గుర్తించారు. స్త్రీలకు ఓటు హక్కు కోసం జరిగిన ఉద్యమంలో కూడా బౌడికానే స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆ ప్రేరణతోనే పోరాడి యూకేలో మహిళలు ఓటు హక్కు సాధించారు. ‘బౌడిక స్వరూపం అస్పష్టంగా ఉంటుంది. అందుకే ఆమెలో రకరకాల పార్శ్వాలు కనిపిస్తాయి. అనేక రకాల అంశాల్లో ఆమె ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని రిచర్డ్ హింగ్లీ అనే పురాతత్వవేత్త చెబుతారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సుమారు 2వేల ఏళ్ల క్రితం లోహ యుగంలో ఓ ఉన్నత వర్గానికి చెందిన మహిళ రోమన్ సైన్యాన్ని చీల్చి చెండాడారు. తన పోరాట పటిమతో రోమన్లను తరిమి కొట్టారు. ఆ యోధురాలి పేరు బౌడిక. text: ప్రస్తుతం కమలం వికసిస్తోంది, కానీ దాన్ని పెంచిపోషించిన వాళ్ల రాజకీయ జీవితం మాత్రం ముగింపు దశకు చేరువైంది. ఎన్నికల్లో పార్టీకి కొత్త నాయకత్వం ఒకటి తర్వాత మరోటి వరుస విజయాలను తెచ్చిపెడుతోంది. అటల్ బిహారీ వాజ్‌పేయీ 2005 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా, బీజేపీలో రెండు తరాలకు మధ్య వారధిగా నిలిచిన వ్యక్తి ఆయనే. శారీరక వైకల్యంతో ఉన్నా ఇప్పటికీ పాత తరం నాయకుల్లో అత్యంత శక్తిమంతమైన నేత ఆయనే. జనతా పార్టీ నుంచి బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతాన్ని మార్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌)ను వాజ్‌పేయీ ఒప్పించారు. దాంతో కొత్తగా ఏర్పడిన బీజేపీ గాంధేయ వాదాన్ని ఎంచుకుంది. అలాగే, అప్పటి సంఘ్ సారధిగా ఉన్న సహబ్ దేవరాస్ ముందు వాజ్‌పేయీ మరో డిమాండ్ కూడా పెట్టారు. తమ సమితి 'హిందూ' అనే పదానికి బదులుగా ఇండియా వాడాలన్నది ఆ డిమాండ్. జన సంఘ్ నుంచి జనతా పార్టీ, ఆ తర్వాత బీజేపీ ఏర్పాటు వరకు తొలిసారిగా ఒక మౌలిక మార్పునకు అంగీకారం కుదిరింది. దాని ఫలితంగానే ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం లేని ఎం.సి. ఛాగ్లా, శాంతి భూషణ్, రామ్ జెఠ్మలానీ, సికందర్ భక్త్, సుష్మా స్వరాజ్, జశ్వంత్ సింగ్ లాంటి నేతలు బీజేపీలో భాగం అయ్యారు. అయితే, బీజేపీ పుట్టిన నాలుగు సంవత్సరాల్లోనే ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం 1984 డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీతో వెళ్లాలా? లేక హిందుత్వను ఎంచుకోవాలా? అని సంఘ్‌ డైలమాలో పడింది. చివరికి సంఘ్ హిందుత్వను ఎంచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఎన్నికల తర్వాత రెండేళ్లకు బీజేపీ మనసు మార్చుకుంది. మళ్లీ మితవాద మార్గాన్ని ఎంచుకుంది. 1986లో అత్యంత ప్రజాదరణ కలిగిన వాజ్‌పేయీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హిందుత్వ వాదాన్ని ఆలింగనం చేసుకుంది. వాజ్‌పేయీతో పోల్చితే అప్పటికి ఎల్‌కే అడ్వాణీ ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఏమీ కాదు. కానీ 1988లో ఆయోధ్య ఉద్యమంలో చేరేందుకు అంగీకరించడం, ఆ తర్వాత అయోధ్య రథ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం వల్ల ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల చూపు అడ్వాణీ వైపు మళ్లింది. దాంతో పార్టీలో వాజ్‌పేయీ ఏకాకిగా మారారు. అయితే, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద నిర్మాణం కూలిన తర్వాత సంఘ్ పరివార్, బీజేపీలకు మళ్లీ వాజ్‌పేయీ గుర్తుకొచ్చారు. అది కూడా తాత్కాలికమే. అప్పుడు ప్రధాని రేసులో అడ్వాణీ ఉన్నారు. కానీ, అడ్వాణీని అదృష్టం వరించలేదు. 1990 నాటి జైన్-హవాలా కేసుకు సంబంధించిన డైరీలో ఆయన పేరు ప్రత్యక్షమైంది. దాంతో పార్లమెంటు సభ్యత్వానికి అడ్వాణీ రాజీనామా చేశారు. ఆ కేసులో నిర్ధోషిగా బయటపడిన తర్వాతే పార్లమెంటులో అడుగుపెడతా అని శపథం చేశారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో పోటీపడలేనన్న విషయం అడ్వాణీకి తెలుసు. అందుకే బీజేపీ ప్రధాని అభ్యర్థి వాజ్‌పేయీ అని 1995 నవంబర్‌లో ముంబయిలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఇక ఆనాటి నుంచి అడ్వాణీకి ప్రధాని అవ్వాలన్న కల ఓ ఎండమావిగానే మిగిలిపోయింది. అడ్వాణీ ప్రధానికి పదవి రాలేదు. కానీ 2005లో పాకిస్తాన్ వెళ్లినప్పుడు చేసిన ప్రకటన ఆయన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. తర్వాత పార్టీ ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది, ఎందుకంటే మరో ప్రత్యామ్నాయం లేదు. 2009 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీని నిలబెట్టేందుకు నరేంద్ర మోదీ ఓకే చెప్పారు. గుజరాత్‌లో వచ్చిన ప్రభంజనంతో 2012లో మోదీ దిల్లీ ప్రచారం ప్రారంభమైంది. అయితే, మోదీని ప్రధాని అభ్యర్థిగా కాదు కదా, ఎన్నికల ప్రచార కమిటీకి అధ్యక్షుడిగా నియమించేందుకు కూడా అడ్వాణీ ఇష్టపడలేదు. బీజేపీలో బలమైన వ్యూహకర్తగా ఉన్న అడ్వాణీ, పార్టీలో అంతర్గతంగా మారుతున్న ఆలోచలను మాత్రం గుర్తించలేకపోయారు. పార్టీ లోపల, బయట మోదీకి మద్దతు ఉప్పెనలా ఎగిసిపడింది. అడ్వాణీకి ప్రధాని అభ్యర్థిగా నిలబడే అవకాశం దూరమైంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టారు. దాంతో బీజేపీలోని ముగ్గురు వస్తాదులు అటల్, అడ్వాణీ, మురళీ మనోహర్‌ల శకం ముగిసింది. ఇదీ బీజేపీలో మోదీ శకం. పార్టీ నాయకుడే కాదు, పార్టీ నిర్వహణ, ఎన్నికల్లో అనుసరించే విధానాలు, ప్రభుత్వాన్ని నడిపే తీరు, నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం.. ఇలా అన్ని విషయాల్లోనూ బీజేపీ రూపురేకలు మారిపోయాయి. మీరు ఒకవేళ మోదీ వ్యతిరేకులు అయితే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను బలవంతంగానే అదృశ్యం చేశారని అనుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్‌పేయీ సరైన సమయంలోనే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉన్నా నేటికీ పార్టీకి రియల్ హీరో ఆయనే. ఆయన్ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో పోల్చవచ్చు. అలాగే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలు కపిల్‌దేవ్‌ లాంటివారు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్లంతా బలవంతంగా రిటైర్‌మెంట్ తీసుకున్నవారే. 2014 తర్వాత బీజేపీ మోదీ, షాల పార్టీ అయిపోయింది. ఏ నిర్ణయాన్నీ పార్టీ తీసుకోలేదు. అన్నీ నాయకుడే తీసుకుంటారు పార్టీలో అమలు చేస్తారు. దీన్ని కేంద్రీకృత అధికారంగా చెప్పొచ్చు. అయినా అది విజయవంతంగానే సాగుతోంది. ధిక్కార స్వరం వినిపించే సాహసం ఎవరూ చేయడంలేదు. నరేంద్ర మోదీ అన్న ఒక్క పేరు వల్లనే పార్టీకి ఓట్లు పడుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. తమ సీనియర్ల మాదిరిగా నిదానంగా వెళ్లడంపైన ఇప్పటి నాయకులకు నమ్మకం లేదు. కేవలం నాలుగేళ్లలోనే ఆరు రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాల్లో ఒంటరిగా లేదా పొత్తుతో అధికారం చేపట్టే స్థాయికి బీజేపీ చేరుకుంది. దీన్ని బహుశా పార్టీ వ్యవస్థాపకులు కలలో కూడా ఊహించి ఉండరు. ఇంత ఎత్తుకు చేరుకోవడం సులువేం కాదు, అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. 2019 ఎన్నికల్లో ఆ స్థానం పదిలంగా ఉంటుందా? లేదా అన్నది ముందున్న సవాల్. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది.' ఇవి 37 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రసంగంలోని మాటలు. text: ఓల్గా, పీటర్ 2018 సంవత్సరానికి పోలండ్ రచయిత్రి ఓల్గా తొకర్‌జక్, 2019 సంవత్సరానికి ఆస్ట్రియా రచయిత పీటర్ హాండ్కే ఎంపికయ్యారు. వివాదాస్పద రచయిత అయిన పీటర్ దాదాపు ఐదేళ్ల క్రితం నోబెల్ సాహిత్య పురస్కారం రద్దుకు పిలుపునిచ్చారు. నోబెల్‌ ప్రైజ్‌కు ఎంపికైన రచయితకు 'బూటకపు క్యాననైజేషన్'‌, క్షణకాలం ప్రపంచ దృష్టి, పత్రికల్లో కొంత చోటు దక్కుతాయని, ఈ పురస్కారంతో ఉపయోగం లేదనే అర్థంలో ఆయన అప్పట్లో విమర్శలు చేశారు. చనిపోయిన వ్యక్తిని రోమన్ కేథలిక్ చర్చ్‌లో 'సెయింట్‌'గా అధికారికంగా ప్రకటించడాన్ని 'క్యాననైజేషన్' అంటారు. 1990ల్లో యుగోస్లావ్ యుద్ధంలో సెర్బులకు మద్దతిచ్చినందుకు, జాతిసంహారం(జీనోసైడ్), యుద్ధనేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్న మాజీ సెర్బ్ నాయకుడు స్లబోడన్ మిలసోస్లిక్ అంత్యక్రియల కార్యక్రమంలో (2006లో) మాట్లాడినందుకు పీటర్ వివాదాస్పదుడయ్యారు. పురస్కారాన్ని అందుకోవడానికి ఓల్గా, పీటర్ ఇద్దరూ అంగీకరించారని నిర్వాహకులు తాజాగా స్పష్టం చేశారు. లైంగిక దాడి ఆరోపణలతో నిరుడు వాయిదా స్వీడిష్ అకాడమీ సభ్యురాలి భర్త లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో గత సంవత్సరం సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని స్వీడిష్ అకాడమీ ప్రకటించలేదు. పురస్కార ప్రకటనను 2019కి వాయిదా వేసింది. గత సంవత్సరం అకాడమీ సభ్యురాలు కటారినా ఫ్రోస్టెన్సన్‌ భర్త జీన్-క్లాడ్ ఆర్నాల్ట్ లైంగిక దాడికి తెగబడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఆయనకు అక్టోబరులో రెండేళ్ల జైలు శిక్ష పడింది. అకాడమీ నుంచి కటారినా ఫ్రోస్టెన్సన్ తప్పుకొన్నారు. అప్పట్లో నోబెల్ ప్రైజ్ విజేతల పేర్లు ప్రకటనకు ముందే లీక్ అవుతున్నాయనే ఆరోపణల కూడా వచ్చాయి. సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలో ఆరేళ్లను పక్కన పెడితే ఇప్పటివరకు రెండు సంవత్సరాలు మాత్రమే పురస్కారాన్ని ప్రకటించలేదు. 1935లో ఎవరికీ ప్రకటించలేదు. 2018లో లైంగిక దాడి వివాదం వల్ల ప్రకటించలేదు. నోబెల్ పురస్కారం కింద ఓల్గా, పీటర్‌లకు తలా 90 లక్షల క్రోనార్ల నగదు, మెడల్, డిప్లొమా అందజేస్తారు. ఓల్గా, పీటర్‌లకు అకాడమీ ప్రశంస ఇదీ ఓల్గా తొకర్‌జక్ నిరుడు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం 'మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌'కు కూడా ఎంపికయ్యారు. 57 ఏళ్ల ఓల్గా పోలిష్ భాషలో రాసే అత్యంత ప్రముఖ నవలాకారిణి. ఓల్గా తన నవలల్లో ఒక అద్భుత ఊహా ప్రపంచాన్ని, సరిహద్దులకు అతీతమైన జీవన విధానాన్ని ఆవిష్కరిస్తారని, అంతేగాకుండా విషయ పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలనే తపన కనిపిస్తుందని అకాడమీ ఒక ప్రకటనలో ప్రశంసించింది. నాటక రచయిత, నవలాకారుడు అయిన పీటర్ వయసు 76 ఏళ్ళు. మానవ అనుభవాలను పీటర్ తనదైన విశిష్ట శైలిలో ప్రభావవంతంగా అక్షరబద్ధం చేశారని అకాడమీ వ్యాఖ్యానించింది. 1971లో తన తల్లి ఆత్మహత్యపై పీటర్ రాసిన 'ఎ సారో బియాండ్ డ్రీమ్స్' అనే రచన అత్యధిక ప్రజాదరణ పొందిన ఆయన రచనల్లో ఒకటి. ఇది 1975లో వెలువడింది. పురస్కారం కింద ఈ ఇద్దరు రచయితలకు తలా 90 లక్షల క్రోనార్లు (దాదాపు 6.48 కోట్ల రూపాయలు) నగదు బహుమానం, మెడల్, డిప్లొమా అందజేస్తారు. వీడియో: నోబెల్ పురస్కారం ఎలా పుట్టింది? డైనమైట్‌ను కనుగొన్నందుకు నోబెల్‌ను ‘మృత్యువ్యాపారి’ అని నిందించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి 2018, 2019 సంవత్సరాలకు ఇద్దరు ఐరోపా రచయితలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు మహిళ. text: 'మిస్ పీరియడ్' అనే కార్టూన్ క్యారెక్టర్‌తో ఉండే ఈ బ్యాడ్జీలను ధరించే విధానాన్ని గత అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టారు. ఈ బ్యాడ్జీలు ధరించిన సిబ్బందికి ఎక్కువ సాయం లభించేలా చూడటం, ఎక్కువ సేపు విరామం తీసుకునేందుకు అవకాశం ఇవ్వటం ఈ విధానం ఉద్దేశం. ''సిబ్బంది రుతుస్రావ సమాచారాన్ని వినియోగదారులతో పంచుకోవటం అసలు మా ఉద్దేశం కాదు'' అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు. ఈ బ్యాడ్జీలను ఎందుకు ప్రవేశపెట్టారు? ఒసాకా ఉమెడా డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కు చెందిన దైమారు శాఖలో మహిళా దుస్తుల విభాగంలో పనిచేసే 500 మంది మహిళా సిబ్బంది కోసం అక్టోబర్ నెలలో రుతుస్రావ బ్యాడ్జీలు ధరించే విధానం ప్రవేశపెట్టారు. సిబ్బంది వీటిని స్వచ్ఛందంగా ధరించవచ్చు. ఉద్యోగులే స్వయంగా సూచించిన తర్వాత వీటిని ప్రవేశపెట్టారు. అయితే.. స్టోరులో కొత్త విభాగం ప్రారంభానికీ ఈ బ్యాడ్జీకీ సంబంధం ఉంది. ఈ బ్యాడ్జీ మీద ఒకవైపు... ఆ కొత్త విభాగం 'మహిళల సంక్షేమానికి' అంకితమైందని, అది నవంబర్ 22వ తేదీన ప్రారంభమవుతుందని చెప్తోంది. మరొకవైపు.. 'సీరీ చాన్' మస్కట్ ముద్రించి ఉంది. సీరీ అంటే రుతుస్రావం అని అర్థం. ''ఈ సమాచారం వెల్లడించటం ద్వారా సిబ్బంది పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరచటం ఈ బ్యాడ్జి ఉద్దేశం'' అని దైమారు అధికార ప్రతినిధి యోకో హిగుచి బీబీసీతో పేర్కొన్నారు. సిబ్బంది, వినియోగదారులు ఏమంటున్నారు? ఈ బ్యాడ్జీల గురించి స్టోరు యాజమాన్యం నవంబర్ 21వ తేదీన మీడియాకు చెప్పినపుడు.. సదరు మహిళ రుతుస్రావంలో ఉన్న విషయాన్ని సహోద్యోగులతో పాటు వినియోగదారులకు కూడా తెలియజేయటం వీటి ఉద్దేశమని కొన్ని సంస్థలు తప్పుగా నివేదించాయి. అప్పుడు ప్రజల నుంచి ''చాలా ఫిర్యాదులు'' వచ్చాయని.. ''వాటిలో కొన్ని వేధింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయని''.. పేరు వెల్లడించని దైమారు ఉన్నతస్థాయి సిబ్బంది ఒకరు చెప్పారు. కొంతమంది సిబ్బంది ఈ బ్యాడ్జీలను ధరించటానికి అయిష్టత చూపారని హిగుచీ తెలిపారు. ''కానీ ఇతరులు సానుకూలంగా స్పందించారు. సహోద్యోగుల్లో ఒకరు రుతుస్రావంలో ఉన్నట్లు తెలిసినపుడు.. ఆమె కోసం బరువైన వస్తువలను మనం పట్టుకెళతాం అని ముందుకు వెళ్లవచ్చు. లేదంటే ఎక్కువ సేపు విరామం తీసుకోవాలని సూచించవచ్చు. ఈ మద్దతు పరస్పరం లభిస్తుంది'' అని ఆమె పేర్కొన్నారు. వినియోగదారులు సైతం తమ మద్దతు తెలుపుతూ ఫోన్‌లు చేశారని కూడా ఆమె తెలిపారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? దైమారు సంస్థ ఈ విధానాన్ని రద్దు చేయటం లేదు. కానీ దీని మీద పునరాలోచన చేస్తున్నారు. ఈ సమాచారం సాధారణ ప్రజలకు తెలియకండానే సహోద్యోగులతో పంచుకునేందుకు వేరే మార్గం వెదుకుతామని హిగుచీ చెప్పారు. 'చర్చ భారీగా మారుతోంది' ''చాలా దేశాల్లో మాదిరిగానే జపాన్‌లో కూడా రుతుస్రావం గురించి మహిళలు.. పురుషులతో కాదుకదా కనీసం బహిరంగంగా మాట్లాడటం అరుదు. ఈ అంశాన్ని ఎప్పుడూ సిగ్గుపడే విషయంగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు ఇందులో భారీ మార్పు వస్తోంది'' అని టోక్యోలో బీబీసీ న్యూస్ ప్రతినిధి యూకో కాటో పేర్కొన్నారు. ''రుతుస్రావం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో స్వేచ్ఛగా మాట్లాడటం ఎలా అనే అంశం మీద.. ప్రభుత్వ టీవీ చానల్ ఎన్‌హెచ్‌కేలో ప్రజాదరణ గల ఉదయపు కార్యక్రమం 'అసాయ్‌చీ'లో మహిళా, పురుష వ్యాఖ్యాతలతో గంట సేపు చర్చ నిర్వహించారు'' అని ఆమె పేర్కొన్నారు. అక్టోబర్‌లో వినియోగ పన్ను రేటును 8 శాతం నుంచి 10 శాతానికి పెంచినపుడు.. రుతుస్రావ ఉత్పత్తుల మీద కూడా ఆ పన్నును పెంచటం మహిళల్లో వ్యతిరేకతకు దారితీసిందని.. మహిళల రుతుస్రావాల గురించి సామాజిక చర్చకు ఈ విషయం కూడా దోహదపడిందని వివరించారు. ఈ బహిరంగ చర్చకు సోషల్ మీడియా కూడా సాయపడిందని.. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో శిబిరాల్లో తలదాచుకునేటపుడు మహిళల అనుభవాలు కూడా ఈ చర్చను పెంపొందించాయని తెలిపారు. ''ఆ శిబిరాల్లో మహిళలు రక్తస్రావాన్ని నియంత్రించుకోవాలని సలహాలు ఇవ్వటం, ప్యాడ్లు కావాలని అడగటం తప్పని చెప్పటం వంటి ఉదంతాలతో సోషల్ మీడియాలో చాలా కథనాలు చూశాం'' అని యూకో పేర్కొన్నారు. ఉదాహరణకు ఒక శిబిరంలో ప్యాడ్ కావాలని అడిగినపుడు.. ''ఇటువంటి సమయంలో సెక్స్ గురించి నువ్వె ఎలా ఆలోచిస్తావు?'' అనే స్పందన వచ్చినట్లు ఒక కథనం చెప్తోందని ఆమె వివరించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జపాన్‌లోని ఒక డిపార్ట్‌మెంటల్ స్టోరులో మహిళా సిబ్బంది తాము రుతుస్రావంలో ఉన్నపుడు ప్రత్యేక బ్యాడ్జీలు ధరించవచ్చు. అయితే, ఈ విధానం గురించి తాము 'పునరాలోచిస్తామ'ని ఆ స్టోర్ యాజమాన్యం చెప్తోంది. text: బాక్సింగ్‌ డే అనగానే సహజంగా చాలామందికి బాక్సింగ్‌ ఆట గుర్తుకు వస్తుంది. కానీ దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. చాలా దేశాలలో ఈ రోజును సెలవు దినంగా పాటిస్తారు. అయితే బాక్సింగ్‌ డే కు బ్రిటన్‌ మూలాలున్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న దేశాలలో ఈ రోజును ఉత్సాహంగా జరుపుకుంటారు. పాశ్చాత్య క్రైస్తవ మత క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ పండగ తర్వాత రెండో రోజును బాక్సింగ్‌ డే గా పాటిస్తారు. దీనినే సెయింట్‌ స్టీఫెన్స్‌ డే అని కూడా అంటుంటారు. కాటలోనియా, ఐర్లాండ్‌, స్పెయిన్‌లలో దీనిని ఆ పేరుతో పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో ఈ రోజున టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడతారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా-భారత్ జట్లు డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) శనివారం నుంచి ఆస్ట్రేలియాలో బాక్సింగ్‌ డే టెస్ట్‌ ప్రారంభం కానుంది. క్రిస్మస్‌ తరువాతి రోజును ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో బాక్సింగ్‌ డే గా జరుపుకుంటారు. text: సాధారణంగా ఎన్నికలు పూర్తయిన వెంటనే అందరి దృష్టీ ఎగ్జిట్ పోల్స్‌వైపు మళ్లుతుంది. అయితే ఈ సారి దేశమంతా ఎన్నికలు పూర్తయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అసలు ఎగ్జిట్ ఎలా నిర్వహిస్తారు? వీటిలో కచ్చితత్వం ఎంత? అనే అంశాలపై కొందరు నిపుణులతో బీబీసీ మాట్లాడింది. ఎన్నికల సర్వేలకు అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వాహకులు మొబైల్ ఫోన్, ఇతర సాధనాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. భారత్‌లో ఓటర్లను చాలా వరకు నేరుగా, క్షేత్రస్థాయిలో కలుస్తారు. ఎగ్జిట్ పోల్ నిర్వహించే తీరుపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ భాస్కరరావు మాట్లాడుతూ- ''ఇదివరకు డమ్మీ బ్యాలట్ పేపర్ విధానాన్ని అనుసరించేవారు. మీరు ఎవరికి ఓటేశారో డమ్మీ బ్యాలట్ పేపర్‌పై టిక్ చేసి, దాన్ని బాక్సులో వేయండని ఓటర్లను నిర్వాహకులు కోరేవారు. ఇప్పుడు దాదాపు ఎవ్వరూ ఈ విధానాన్ని అనుసరించడం లేదు'' అన్నారు. ఎగ్జిట్ పోల్ ఎలా సాగుతుంది? సర్వేల మెథడాలజీపై సీవోటర్ సంస్థలో అడ్వాన్స్డ్ అనలిటిక్స్ విభాగం ఎడిటర్ మను శర్మ స్పందిస్తూ- దాదాపు అన్నిసంస్థలూ 'రాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్' విధానాన్నే అనుసరిస్తున్నాయన్నారు. ఈ విధానం ప్రకారం- నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకుని, అందరి ఆలోచనలను ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు. ప్రిపోల్, ఎగ్జిట్ పోల్: వ్యత్యాసం ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. తాము ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ రెండూ నిర్వహిస్తున్నామని ఆయన లోగడ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తున్నాయని, వీటి సంఖ్య ఎంతనేది నిర్దిష్టంగా చెప్పలేనని తెలిపారు. ఏ సమయంలో ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఎగ్జిట్ పోల్‌లో కీలకమైనవి ప్రీ పోల్ సర్వే ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రిపోల్ సర్వేలు ఏ దశలోనైనా జరగొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రిపోల్ సర్వేలో పాల్గొన్న ఓటర్లు సర్వే సమయానికి ఇంకా నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు, సందిగ్ధంలో ఉండొచ్చు లేదా వారిలో కొందరు ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చు కూడా. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ రోజే చేపడతారు. ఎగ్జిట్ పోల్‌లో ఓటింగ్‌లో పాల్గొన్నవారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు. ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఎగ్జిట్ పోల్‌లో చాలా కీలకం. ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు చాలా వరకు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొంటారు. సాధారణంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తికి అనుగుణంగా వారిని ఎంచుకొంటారు. కానీ ఎగ్జిట్ పోల్‌లో ఇలాంటి వెసులుబాటు తక్కువని భాస్కరరావు అభిప్రాయపడ్డారు. కచ్చితత్వం ఎంత? ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువ. అయితే "ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే అంచనాల్లో కచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చని, కానీ చాలా సంస్థలు తుది ఫలితాలకు 60 శాతం దగ్గరగా ఉన్నా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకొంటున్నాయని" భాస్కరరావు చెప్పారు. "పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఆయతెలిపారు. "కానీ ఈ ప్రక్రియను ఎంత మంది పకడ్బందీగా, విస్తృతంగా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే" అని భాస్కరరావు అన్నారు. ఈ అంశంపై గతంలో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సామాజికవేత్త, సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ "సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటరు మూడ్‌, శాంపిల్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి" అనారు. 'మార్జిన్ ఆఫ్ ఎర్రర్' ఎంత? ఎగ్జిట్ పోల్స్‌లో 'మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌'పై సీవోటర్‌కు చెందిన మను శర్మ మాట్లాడుతూ "ఇది సాధారణంగా ఐదు శాతం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం మూడు శాతమే ఉంటుంది" అని చెప్పారు. "అత్యధిక సందర్భాల్లో దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పార్టీల ఓటింగ్ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉన్నా, అన్నీ ఒకే దిశలో ఉంటాయి" అని ఆయన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవీ దేశంలో 2014-18 మధ్య వెలువడిన వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే చాలాసార్లు ఇవి ఎన్నికల్లో విజేతను సరిగ్గానే అంచనా వేశాయి. పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను అంచనా వేయడంలో మాత్రం తడబడ్డాయి. వేర్వేరుగా ఎందుకుంటాయి? "అరుదైన సందర్భాల్లోనే వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకే దిశలో కాకుండా, భిన్నంగా ఉంటాయి" అని మను శర్మ తెలిపారు. ఆయన 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితికి స్థానిక అంశాలు ప్రధాన కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. "రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా ఉంటుందని" మను శర్మ చెప్పారు. ఓటింగ్ శాతంలో వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం చాలా సులభం అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో తొలి దశ ఎన్నికలు దాదాపు ముగిశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరికాసేపట్లో తెరపడనుంది.. తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ దాదాపు పూర్తైంది. text: సింగపూర్‌లో జరిగిన ఆర్‌సీఈపీ సమావేశంలో కంబోడియా ప్రధాని హూన్ సేన్, న్యూజీలాండ్ ప్రధాని జెసిండా అడర్న్‌లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ దీనిలో 'అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియన్ నేషన్స్' అంటే ఆసియాన్ 10 సభ్య దేశాలు, వాటితోపాటు భారత్, జపాన్, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహా బృందం దీని గురించి తన అభిప్రాయం తెలియజేసింది. ఈ ప్రతిపాదిత ఆర్‌సీఈపీ భారత్ కూడా చేరాలని వారు భావిస్తున్నారు. భారత్ ఆర్‌సీఈపీకి దూరంగా ఉండాలనే ప్రశ్నే తలెత్తదని, దానివల్ల భారతదేశం పెద్ద ప్రాంతీయ మార్కెట్‌కు బయటే ఉండిపోతుందని ఆ బృందం భావిస్తోంది. ఈ బృందానికి సుర్జీత్ భల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీలో ఆయన సభ్యుడు. దీనివల్ల రూపాయి స్థిరంగా ఉంటుందని, దానితోపాటు కస్టమ్స్ సుంకం, కార్పొరేట్ టాక్స్ కూడా తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. ఈ 16 ఏసియా పసిఫిక్ దేశాల దగ్గర గ్లోబల్ జీడీపీలో మూడో వంతు భాగం ఉంది. ఇది విజయవంతం అయితే ఆర్సీఈపీ 340 కోట్ల ప్రజల మార్కెట్ అవుతుంది. ఆసియాన్ సభ్యదేశాలు బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం కానీ, ఈ 16 దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని అసమానతలు అవరోధంగా మారాయి. ఆస్ట్రేలియా సంపన్న దేశం. అక్కడ తలసరి కనిష్ట జీడీపీ 55 వేల డాలర్లకు పైనే ఉంటుంది. ఇటు, కంబోడియా 1300 డాలర్లతో తలసరి ఆదాయం చివరి స్థానంలో ఉంది. మరో వైపు భారత్ విషయానికి వస్తే, దానికి ఆర్‌సీఈపీ ఒక సవాలు కంటే తక్కువేం కాదని చెబుతున్నారు. భారత్‌కు దీనివల్ల ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఎలక్ట్రానిక్ డేటా షేరింగ్, లోకల్ డేటా స్టోరేజ్ డిమాండ్లే. భద్రతా కారణాలు, జాతీయ ప్రయోజనాలు, గోప్యత దృష్ట్యా వీటిని షేర్ చేసుకోవడం అంత సులభం కాదు. ఈ అవసరాల వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో భారత్ ఒకవేళ దీనిలో చేరితే దేశీయ ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పింది. థాయ్‌లాండ్‌లో ఆర్‌సీఈపీ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఎస్బీఐ నివేదిక వచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత నవంబర్‌లో దీనిపై భారత్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎస్బీఐ తన 2018-19 నివేదికలో ఆర్‌సీఈపీ 15 సభ్య దేశాల్లో 11 దేశాలతో భారత్‌కు వాణిజ్య లోటు ఉందని చెప్పింది. 2018-19లో భారత్ వాణిజ్య లోటు 184 బిలియన్ డాలర్లు. ఆర్సీఈపీ దేశాలతో భారత్ దిగుమతులు 34 శాతం ఉంటే, ఎగుమతులు కేవలం 21 శాతం ఉన్నాయని ఈ నివేదికలో చెప్పారు. భారత్ ఎదుట అసలు సవాలు భారత్‌కు ఇందులో ఇంకా ఎన్నో రకాల సవాళ్లు ఉన్నాయి. ట్రేడ్ యూనియన్, సివిల్ సొసైటీ, స్వదేశీ గ్రూపులకు వాటి వైపు నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ నుంచి డెయిరీ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం అతిపెద్ద అభ్యంతరంగా ఉంది. వాటితోపాటు జనరిక్ మందుల లభ్యత, మైనింగ్ లాభాలు, నీళ్లు, శక్తి, రవాణా, టెలీకాం ప్రైవేటీకరణ కూడా పెద్ద అడ్డంకులే. వీటితోపాటు ఆర్థిక అసమానత కూడా ఒక సమస్యగా ఉంది. ఆర్సీఈపీ దేశాలు పరస్పర అభిప్రాయ బేధాలను దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆ సవాళ్లు ముగిసిపోలేదు. ఈ నెల బ్యాంకాక్‌లో చాలా సమావేశాలు జరిగాయి. కానీ, డెయిరీ ఉత్పత్తులు, ఈ-కామర్స్, ప్రత్యక్ష పెట్టుబడులు లాంటి అంశాలపై ఇప్పటివరకూ ఏకాభిప్రాయం కుదరలేదు. ఆర్సీఈపీ 16 దేశాల మధ్య ఒక వ్యాపార ఒప్పందం ఉంది. దాని ప్రకారం సభ్య దేశాలు ఎగుమతి, దిగుమతుల టారిఫ్ తగ్గిస్తాయి లేదా పూర్తిగా రద్దు చేస్తాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే వ్యాపారానికి ప్రోత్సాహం అందిస్తాయి. దేశంలో భయం ఎందుకు కానీ భారత్‌లో దీని గురించి తయారీదారులు, రైతులు కూడా భయపడుతున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయానికి వస్తే భారత్ గత అనుభవాలు సరిగా లేవు. భారత్ ఈ దేశాలన్నింటితో వాణిజ్య లోటుతో ఉంది. అది ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ దేశాల్లో భారత్ మొత్తం ఎగుమతులు 20 శాతం ఉన్నాయి. అటు దిగుమతులు 35 శాతం ఉన్నాయి. అమెరికా ట్రేడ్ వార్‌కు దిగడంతో చైనా ఆర్సీఈపీకి మద్దతిస్తోంది. భారత్‌కు అతి పెద్ద ఎగుమతిదారు చైనానే. ఒక్క చైనాతోనే భారత వాణిజ్య లోటు చాలా భారీగా ఉంది. చైనా నుంచి ప్రతి ఏటా దిగుమతి అయ్యే ఎలక్ట్రికల్ మెషినరీ, పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టీల్, అల్యూమినియం, కృత్రిమ ఫైబర్, ఫర్నిచర్ భారత మార్కెట్లో భారీగా అమ్ముడవుతాయి. ఆర్సీఈపీ డీల్ జరిగితే భారత మార్కెట్లో చైనా ఉత్పత్తులు మరింత పెరుగుతాయనే భయం కూడా ఉంది. గత అనుభవాలు ఎలా ఉన్నాయి 2006 తర్వాత ద్వైపాక్షిక వాణజ్య ఒప్పందాలపై భారత్ దూకుడుగా సంతకాలు చేయడం ప్రారంభించింది. భారత్ మొదటిసారి శ్రీలంకతో 2000లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమంట్ చేసుకుంది. ఆ తర్వాత మలేసియా, సింగపూర్, దక్షిణ కొరియాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. గణాంకాలు గమనిస్తే, ఈ ఒప్పందాల వల్ల భారత వాణిజ్య లోటు తగ్గడానికి బదులు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నీతి ఆయోగ్ రెండేళ్ల క్రితం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న దేశాలతో వ్యాపారంపై ఒక నివేదిక ప్రచురించింది. ఈ నివేదికలో భారత్ దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గాయని చెప్పారు. దేశీయ తయారీ పరిశ్రమల్లో ఒకటైన లోహ పరిశ్రమపై 'ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్' అంటే ఎఫ్టీఏ వల్ల తీవ్ర ప్రభావం పడింది. ఒక నివేదిక ప్రకారం లోహాలపై ఎఫ్టీఏ టారిఫ్‌లో 10 శాతం తగ్గించడం వల్ల దాని దిగుమతులు 1.4 శాతం పెరిగాయి. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఆర్సీఈపీ వల్ల వ్యవసాయ ఉత్పత్తులపై చాలా ప్రతికూల ప్రభావం పడింది. వీటిలో పాల ఉత్పత్తులు, మిరియాలు, ఏలకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంక నుంచి మిరియాలు, ఏలకలు అత్యంత చౌకగా దిగుమతి అవుతున్నాయి. ఇలా, ఆసియాన్ దేశాలు కేరళ రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. రబ్బర్ రైతులకు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. వియత్నాంలో రబ్బర్ చౌక ధరకు లభిస్తుంది. దాని వల్ల ఇండోనేసియా పరిశ్రమలు మూతపడ్డాయి. ఫిలిప్పీన్స్, ఇండోనేసియా నుంచి కొబ్బరి నూనె కేక్ వస్తుండండతో కొబ్బరిరైతులు కూడా ఆందోళనలో ఉన్నారు. డెయిరీ పరిశ్రమలపై ప్రభావం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పాల ఉత్పత్తులు(డెయిరీ ప్రొడక్ట్స్) భారత మార్కెట్లోకి వస్తే ఇక్కడ దేశీయ డెయిరీ సెక్టార్‌పై ఆ ప్రభావం పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్ 11న మహాబలిపురంలో చర్చలు జరిగినపుడు రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు గురించి కూడా చర్చ జరుగుతుందని అనుకున్నారు. 2013-14, 2018-19 మధ్య చైనాతో భారత్ వాణిజ్య లోటు 36 బిలియన్ డాలర్ల నుంచి పెరిగి 53 బిలియన్ డాలర్లకు చేరింది. దాంతో, ఇప్పుడు భారత్ మొత్తం వాణిజ్య లోటులో చైనాదే సగం ఉంది. మార్కెట్లో చైనా ప్రవేశించడం వల్ల వ్యాపారుల పరిస్థితి ఎలా మారుతుంది అనేదానిపై నీతి ఆయోగ్ 2017 నివేదిక ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. ఆసియాన్ దేశాలు-చైనా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగాక 2016లో ఆసియాన్ ఆరు దేశాల( ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, సింగపూర్)తో చైనా వ్యాపారం 54 బిలియన్ డాలర్ల లోటుకు బదులు, 53 బిలియన్ డాలర్ల మిగులు అయ్యింది. ప్రధానమంత్రి మోదీ, షీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి ముందు రెండు దేశాల మధ్య 120 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. వాటి గురించి చాలా చర్చ జరిగింది. ఈ ఒప్పందాల్లో భారత్ నుంచి చక్కెర, రసాయనాలు, ప్లాస్టిక్, మందులు, ఎరువుల ఎగుమతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇది ఎంత ముఖ్యం, దీనివల్ల ఎంత వాణిజ్య లోటు తగ్గడానికి సహకారం లభిస్తుంది అనేది చూడాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అంతర్జాతీయ వాణిజ్యంలో గత కొన్నేళ్లుగా ఏ భాగస్వామ్యాల గురించి ఎక్కువ చర్చ జరుగుతోందో వాటిలో ప్రతిపాదిత 'రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్' (RCEP) అంటే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం కూడా ఉంది. అయితే, ఇది ఇప్పటికీ క్షేత్రస్థాయిలో జరగకపోయినా, చాలా విషయాల వల్ల పతాక శీర్షికల్లో నిలుస్తోంది. text: దాదాపు అలాంటి సంఘటనే ముంబయిలో నిజంగా జరిగింది. ఈ నగరంలోని గోవాండి ప్రాంతంలో ఉన్న బిరాదీ చంద్ అలియాస్ సాధూబాబా ఒక బిచ్చగాడు. ఇటీవల రైలు పట్టాల మీద తీవ్రంగా గాయపడి చనిపోయాడు. సాధూబాబా చనిపోయాక అతని గుడిసెలో తనిఖీ చేసిన పోలీసులు, ఆయన దాదాపు 11 లక్షల రూపాయలు పోగేసినట్లు గుర్తించారు. పట్టాలు దాటుతుండగా అతడు తీవ్రంగా గాయపడ్డారని, తర్వాత చనిపోయాడని ముంబై పోలీసులు చెప్పారు. "అక్టోబర్ 4న రాత్రి 7.40 గంటలకు పట్టాలు దాటుతున్నప్పుడు సాధూబాబా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను రాజవాడి ఆస్పత్రికి తీసుకెళ్లాం, అప్పటికే చనిపోయాడని అక్కడి వైద్యులు చెప్పారు" అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ నందకిశోర్ సస్తే చెప్పారు. సాధూబాబా గుడిసెలో పోలీసులు 8.77 లక్షల రూపాయల విలువైన ఫిక్సెడ్ డిపాజిట్‌ పత్రాలు, అకౌంటులో 96 వేల రూపాయలు ఉన్నట్లు చూపే బ్యాంకు పాస్‌బుక్ గుర్తించారు. చిన్న గిన్నెతో భిక్షాటన అక్కడ వేలాది 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు కూడా బయటపడ్డాయి. వాటి విలువ దాదాపు లక్షా 47 వేలు ఉంటుంది. బిరాడిచంద్ అలియాస్ సాధూబాబా ఇంత డబ్బు బిక్షాటనతోనే కూడబెట్టినట్లు తెలుస్తోంది. "నాకు ఆయన చిన్నప్పటి నుంచీ తెలుసు. రైల్వే స్టేషన్లో అడుక్కునేవారు. ఆయన దగ్గర అంత డబ్బు ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఆయన మామూలు భిక్షగాడిలాగే బతికారు, తన దగ్గర ఇంత డబ్బు ఉందని ఎప్పుడూ చెప్పుకోలేదు" అని ఆటో డ్రైవర్ మిరాజ్ ఖురేషీ చెప్పాడు. సాధూబాబా గుడిసెలో అంత డబ్బు దొరకడంతో ఆ ప్రాంతమంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. "రోజంతా బిచ్చగాళ్ళు ఎంత అడుక్కుంటారనేది ఎవరూ పట్టించుకోరు. సాధూబాబా తనకు వచ్చిన డబ్బును చిన్న సంచిలో పెట్టుకునేవారు. ఆయన ఇంత కూడబెట్టారని మేం అనుకోలేదు. ఆయన దగ్గర ఎప్పుడూ నాణేలతో ఉన్న ఒక చిన్న గిన్నె ఉండేది" అని పొరుగింట్లో ఉండే నజ్మా బానో చెప్పారు. కుటుంబం గురించి కూడా చెప్పలేదు సాధూ బాబా తన గుడిసెలో ఉన్న రేకు డబ్బాలు, ప్లాస్టిక్ ట్యాంకుల్లో డబ్బులు దాచిపెట్టారని స్థానికులు చెప్పారు. నాకు తెలిసినప్పటి నుంచీ, ఆయన ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. మంచి బట్టలు, చెప్పులు కూడా వేసుకోరు. భిక్షాటన చేస్తూనే ఇంత డబ్బు పోగుచేశారంటే నమ్మలేకపోతున్నాం. గుడికి, వేరే ఎక్కడికైనా వెళ్తున్నానని మాకు చెప్పేవారు. కానీ, తనకు కుటుంబం ఉందనే విషయం ఎప్పుడూ చెప్పలేదు. నేను ఆయనతో మాట్లాడేదాన్ని. సాధూబాబా దగ్గర ఇంత డబ్బుందని అనుకోలేదు" అని సయిదా బేగం చెప్పారు. సాధూబాబా గుడిసె ఉండే ప్రాంతం చాలా చీకటిగా ఉంటుంది. ఆయన దగ్గర అంత డబ్బుందని ఎవరికైనా తెలిసుంటే, అదెప్పుడో మాయమయ్యేదని స్థానికులు భావిస్తున్నారు. కానీ, సాదాసీదాగా బతుకుతూ ఆ డబ్బును బిరాదీ చంద్ దానిని చాలా రహస్యంగా దాచిపెట్టారు. ఆయన తను తినడానికి తెచ్చుకునే చపాతీలను ఎలుకలకు, కాకులకు కూడా పెట్టేవారు. దాంతో ఆయన దగ్గర అంత డబ్బు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. సాధూబాబా మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయనది రాజస్థాన్ అని, ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారని గుర్తించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం సినిమాలో బ్రిడ్జి మీద ఓ బిచ్చగాడు చనిపోతాడు. అతడ్ని పైకి లేపగానే గోనె పట్టాల కింద ఉన్న నోట్లన్నీ గాలికి లేస్తాయి. ఆ డబ్బు కోసం జనం ఎగబడిన సన్నివేశాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చూపించిన తీరు మనసుల్ని కదిలిస్తుంది. text: హాంకాంగ్‌లో అమల్లోకి తెచ్చిన కొత్త జాతీయ భద్రత చట్టం, వీగర్ ముస్లింలపై వేధింపుల వంటి విషయాలపై తీవ్రంగా స్పందిస్తోంది. హాంకాంగ్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని బ్రిటన్ రద్దు చేసుకోనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ఈ విషయమై పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్లకు ముందు నుంచే ఉంది. హాంకాంగ్‌లో నేరాలు చేసినవారు ఎవరైనా బ్రిటన్‌కు వస్తే, వారిని పట్టుకుని తిరిగి హాంకాంగ్‌కు అప్పగించడం ఈ ఒప్పందం ఉద్దేశం. ఇక హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టానికి స్పందనగా అమెరికా కూడా కొన్ని చర్యలు తీసుకుంది. హాంకాంగ్‌కు కల్పించిన వాణిజ్యపరమైన ప్రత్యేక హోదాను వెనక్కితీసుకుంది. మరోవైపు అమెరికా, బ్రిటన్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయని చైనా పదేపదే వాదిస్తోంది. హాంకాంగ్‌ను అమెరికా, బ్రిటన్ అస్థిరపరచాలనుకుంటున్నాయని ఆరోపిస్తోంది. ‘కొత్త జాతీయ భద్రత చట్టం ద్వారా హాంకాంగ్‌లో ఇష్టానుసారం ఎవరినైనా అదుపులోకి తీసుకుని, చైనాకు పంపించే అవకాశం ఉంది’ ఎందుకు ఈ చర్యలు హాంకాంగ్ ఇదివరకు బ్రిటీష్ వలస పాలనలో ఉండేది. 'వన్ కంట్రీ, టూ సిస్టమ్స్' (ఒక దేశం, రెండు వ్యవస్థలు) సూత్రం ప్రకారం 1997లో చైనాలో భాగంగా మారింది. ఇందుకోసం బ్రిటన్, చైనాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చైనాలో భాగంగా ఉన్నా... విదేశాంగ, రక్షణ వ్యవహారాలు తప్ప మిగతా అంశాల్లో హాంకాంగ్‌కు 'అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్తి' 50 ఏళ్లపాటు ఉంటుంది. ఫలితంగా హాంకాంగ్‌కు సొంతదైన న్యాయవ్యవస్థ, సరిహద్దులు ఏర్పడ్డాయి. చైనాలోని మిగతా ప్రాంతాల ప్రజలకు లేని స్వేచ్ఛ, హక్కులు హాంకాంగ్ ప్రజలకు దక్కాయి. అయితే, గత కొన్నేళ్లుగా హాంకాంగ్ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందంటూ స్థానిక పౌరహక్కుల ఉద్యమ సంస్థలు ఆరోపిస్తున్నాయి. హాంకాంగ్ నుంచి చైనాకు నేరస్థులను తరలించే బిల్లుకు వ్యతిరేకంగా గత ఏడాది భారీ స్థాయిలో హాంకాంగ్‌లో నిరసనలు రేగాయి. హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్యవాదులను, ఉద్యమకారులను ఈ బిల్లును అడ్డం పెట్టుకుని చైనా అదుపులోకి తీసుకుంటుందని ఆందోళనలు వచ్చాయి. ‘కొత్త చట్టంతో హాంకాంగ్ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పు’ హాంకాంగ్‌‌లో తాజాగా తెచ్చిన కొత్త జాతీయ భద్రత... హాంకాంగ్‌లో ఎవరినైనా అదుపులోకి తీసుకుని, చైనాకు తరలించే వీలు కల్పిస్తోందని నిపుణులు అంటున్నారు. 1985లో బ్రిటన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ చట్టం తీవ్ర ఉల్లంఘన అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. హాంకాంగ్‌లో వచ్చిన కొత్త చట్టంతో అక్కడి న్యాయవ్యవస్థ స్వతంత్రకు ముప్పు రావొచ్చని బ్రిటన్ సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రీడ్ వ్యాఖ్యానించారు. హాంకాంగ్ వాసులు తమ దేశంలో ఉండేందుకు, తమ దేశ పౌరులుగా మారేందుకు అవకాశం కల్పిస్తామని బ్రిటన్ ఇప్పటికే ప్రకటించింది. తాజా నిర్ణయంతో హాంకాంగ్‌లో బ్రిటిష్ ఓవర్సీస్ పాస్‌పోర్టు ఉన్న సుమారు మూడున్నర లక్షల మంది, ఆ పాస్‌పోర్టు తీసుకునేందుకు అర్హులైన మరో 26 లక్షల మంది ఐదేళ్లపాటు బ్రిటన్‌లో ఉండడానికి రావచ్చు. తర్వాత ఏడాదికి, అంటే ఆరేళ్లు పూర్తైన తర్వాత వారందరూ బ్రిటన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదివరకు వీరి హక్కులు పరిమితంగా ఉండేవి. వీసా లేకుండా బ్రిటన్‌లో ఆరు నెలలు మాత్రమే ఉండేందుకు వీలుండేది. తమ దేశంలో 5జీ మొబైల్ సాంకేతికత రంగంలోకి చైనా సంస్థ హువావే అడుగుపెట్టకుండా కూడా బ్రిటన్ నిషేధం విధించింది. ఈ నిషేధం ప్రకారం బ్రిటన్‌లోని మొబైల్ ప్రొవైడర్లు డిసెంబర్ 31 తర్వాత నుంచి హువావే పరికరాలు కొనుగోలు చేయకూడదు. 2027 వరకూ తమ నెట్‌వర్క్‌లో అన్ని హువావే 5జీ కిట్‌లను తొలగించాలి. ఈ చర్యలతో బ్రిటన్ చైనాకు గట్టి సందేశం పంపే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తరహాలో చైనా అధికారులపై ఆంక్షలు విధించే అంశం గురించి కూడా చర్చ జరుగుతోంది. కానీ, బ్రిటన్‌లో ఇలాంటి చర్య తీసుకోవడం సంక్లిష్ఠమైన ప్రక్రియ. చాలా సమయం పడుతుంది. తమ ఉన్నతాధికారులపై బ్రిటన్ ఏవైనా ఆంక్షలు విధిస్తే, తాము కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. మానవహక్కుల విషయమై కూడా చైనాపై బ్రిటన్ విమర్శల దాడిని పెంచింది. షింజియాంగ్ ప్రావిన్సులో వీగర్ ముస్లింలపై చైనా తీవ్ర వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. చైనాలో ముస్లింలకు బలవంతపు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయిస్తుండటం, విస్తృత స్థాయిలో వారిపై వేధింపులకు పాల్పడుతుండటం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయని, చాలా కాలంగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని బ్రిటన్ విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ అన్నారు. మరిన్ని దేశాలూ... వీగర్ ముస్లింల కళ్లకు గంతలు కట్టి, రైళ్లలో ఎక్కిస్తున్నట్లుగా దృశ్యాలున్న ఓ డ్రోన్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియా భద్రత సంస్థలు కూడా దీన్ని ధ్రువీకరించాయి. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంబిన్ ఇవన్నీ ‘అబద్ధాల’ని అన్నారు. హాంకాంగ్, వీగర్ ముస్లింల వ్యవహారాలకు సంబంధించిన చైనా ఉన్నత అధికారులు, సంస్థలపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది. హాంకాంగ్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని కెనడా కూడా రద్దు చేసుకుంది. సైన్య అవసరాల కోసం చైనా నుంచి వచ్చే దిగుమతుల కోసం చేసుకున్న ఒప్పందాన్ని కూడా సమీక్షించనున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ కొత్త భద్రత చట్టం నేపథ్యంలో అక్కడికి వెళ్లే తమ దేశ పర్యాటకులకు కెనడా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త జాతీయ భద్రత చట్టం ద్వారా హాంకాంగ్‌లో ఇష్టానుసారం ఎవరినైనా అదుపులోకి తీసుకుని, చైనాకు పంపించే అవకాశం ఉందని కెనడా హెచ్చరించింది. హాంకాంగ్ వాసులకు ఆశ్రయం కల్పించే విషయాన్ని ఆస్ట్రేలియా కూడా పరిశీలిస్తోంది. హాంకాంగ్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హాంకాంగ్‌తో సంబంధాలను న్యూజీలాండ్ కూడా సమీక్షించుకుంటోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా దారిలోనే బ్రిటన్ కూడా... చైనాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. text: ఈ కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 12మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిపిన నిందితుడిని 19 ఏళ్ల నికొలస్ క్రూజ్‌గా గుర్తించారు. ఏఆర్-15 తరహా ఆయుధంతో క్రూజ్‌ ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నికొలస్ క్రూజ్‌ను ఇటీవలే స్కూల్‌ నుంచి బహిష్కరించారు. స్కూల్ బయట జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు బ్రౌవర్డ్ కంట్రీ షరీఫ్ స్కాట్ ఇజ్రాయెల్ చెప్పారు. స్కూల్ లోపల జరిపిన కాల్పుల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం నిందితుడు నికొలస్ క్రూజ్‌ పోలీసుల అదుపులోనే ఉన్నారు. 2012లో కనెక్టికట్ స్కూల్‌ కాల్పుల ఘటనలో 20మంది విద్యార్థులు చనిపోయారు. ఆ తర్వాత అమెరికాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. అసలు ఏం జరిగింది? 'నికొలస్ క్రూజ్‌ ఫైర్ అలారం మోగించి స్కూల్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడేలా చేశారు. ఆ తర్వాత కాల్పులు మొదలుపెట్టారు. గేటు బయట మొదలైన కాల్పులు.. స్కూల్ లోపల కూడా కొనసాగాయి' అని భద్రతా సిబ్బంది చెప్పినట్లు సీబీఎస్ న్యూస్ పేర్కొంది. స్కూల్‌ లోపల ఉన్న విద్యార్థులను పోలీసులు సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. 'ఉదయమే ఇలాంటి ఘటన జరిగింది. ఆ తర్వాత మాకు కాల్పుల శబ్దం వినిపించింది. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటుందని మేం అనుకోలేదు' అని ఒక విద్యార్థి చెప్పారు. 'మాకు బాణాసంచా తరహా శబ్దం వినిపించింది. నీకు కూడా వినిపించిందా అని నా స్నేహితుడి అడిగా' అని బైలీ అనే మరో విద్యార్థి చెప్పారు. ఈ కాల్పులు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయని ఫ్లోరిడా సెనేటర్ మార్కో రుబియో అన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశంతోనే నిందితుడు కాల్పులు జరిపినట్లు చెప్పారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. 2013 నుంచి అమెరికా స్కూళ్లలో 291 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే సగటున వారానికి ఒక ఘటన జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఫ్లోరిడా పార్క్‌లాండ్‌లోని ఒక పాఠశాలలో అదే స్కూల్‌కి చెందిన పూర్వ విద్యార్థి కాల్పులు జరిపారు. text: అందులో మనం ఏ డేటా భద్రపరుస్తున్నామో, మన ఆన్‌లైన్ కార్యకలాపాలు ఏమిటో, మనకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అన్నిటిపైనా నిఘా పెట్టబోతోందా? కంప్యూటర్లలో డేటాపై నిఘా పెట్టాలని, వాటిని సేకరించేందుకు, దర్యాప్తు జరిపేందుకు దేశంలోని నిఘా ఏజెన్సీలకు హక్కులు కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో సామాన్యుడి మనసులో కూడా ఇలాంటి ప్రశ్నలే పుట్టుకొస్తున్నాయి. కేంద్ర హోంశాఖ శుక్రవారం (20.12.2018) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పది ఏజెన్సీలకు ఈ హక్కులు అందించింది. మొదట్లో పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఆ కేసుల్లో కంప్యూటర్ లేదా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టేవారు. దర్యాప్తు చేసేవారు. వాటిని సీజ్ చేసేవారు. సామాన్యులు కూడా కొత్త ఆదేశాల కిందికి వస్తారా? సోషల్ మీడియాలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అది తమ గోప్యత హక్కులో జోక్యం చేసుకున్నట్లేనని చాలా మంది భావిస్తున్నారు. అప్రకటిత అత్యవసర స్థితి అమలవుతోందా? విపక్షాలు కూడా దీనిపై ప్రశ్నలు లేవెనెత్తుతున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో అప్రకటిత అత్యవసర స్థితి అమలైందని అన్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం ఏజెన్సీలకు ఈ హక్కు మొదట్నుంచీ ఉన్నదే అని చెబుతోంది. వాటిని తాము మళ్లీ జారీ చేశామని మాత్రమే చెప్పింది. రాజ్యసభలో విపక్షాల ఆరోపణలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రభుత్వం సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు సామాన్యులను గందరగోళంలో పడేస్తున్నాయని అన్నారు. "ఐటీ యాక్ట్ సెక్షన్ 69 కింద ఎవరైనా తమ భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే, అది దేశ భద్రతకు, సమగ్రతకు సవాలుగా నిలిస్తే ఈ హక్కు ద్వారా ఏజెన్సీలు వారిపై దర్యాప్తు చేయవచ్చు" అని జైట్లీ తెలిపారు. "2009లో యూపీఏ ప్రభుత్వం ఏయే ఏజెన్సీలకు కంప్యూటర్లపై నిఘా పెట్టే హక్కులు ఉంటాయో నిర్ణయించింది. ఎప్పటికప్పుడు ఆ ఏజెన్సీల జాబితా ప్రచురించేవారు. ప్రతిసారీ దాదాపు అవే ఏజెన్సీలు ఉండేవి" అని జైట్లీ చెప్పారు. "దేశ భద్రతకు సవాలు విసిరేవారు, తీవ్రవాద కార్యకలాపాలలో ప్రమేయం ఉన్నవారి కంప్యూటర్ల పైనే ఈ నిఘా ఉంటుంది. సామాన్యుల కంప్యూటర్లు, డేటాపై ఎలాంటి నిఘా ఉండదు" కొత్తగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరమేంటి? మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఇదే ప్రశ్నతో మోదీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టింది. "మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయంతో రాజకీయంగా షాక్‌కు గురైన బీజేపీ ఇప్పుడు ప్రతి ఇంట్లో వ్యక్తిగత సంభాషణలు వినాలని అనుకుంటోందని" కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయవీర్ షేర్‌గిల్ ఆరోపించారు. "ఐటీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారం "ఏ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది, ఆ ఆదేశాలు ఎప్పుడు ఇవ్వాలి, అనేదంతా ఆయా కేసుల ఆధారంగా ఉంటుంది. అవేవీ లేకుండానే ప్రభుత్వం ఈ హక్కులు ఇవ్వకూడదు" "యూపీఏ ప్రభుత్వం 2009లో ఇలాంటి ఆదేశాలు ఇచ్చినపుడు, ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ వాటిని కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని" జయవీర్ షేర్‌గిల్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరగడంతో బీజేపీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో దీనిపై స్పష్టత ఇచ్చింది. సామాన్యులను ఈ నిఘా నుంచి బయట ఉంచుతామని చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు ఆదేశాలు ఇస్తారని, ఎవరి కంప్యూటర్‌ పైనైనా నిఘా పెట్టే ముందు హోం మంత్రిత్వశాఖ నుంచి దానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఐటీ యాక్ట్ 2000 అంటే ఏంటి? భారత ప్రభుత్వం ఐటీ యాక్ట్ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను 2000 జూన్ 9న ప్రచురించింది. ఈ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా జాతీయ భద్రతకు సవాలుగా మారితే, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే, ఏజెన్సీలు వారి కంప్యూటర్లు, డేటాపై నిఘా పెట్టవచ్చు అని పేర్కొంది. చట్టంలో సబ్ సెక్షన్-1లో నిఘా హక్కు ఏ ఏజెన్సీలకు ఇవ్వాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక సబ్ సెక్షన్-2లో ఏదైనా హక్కులు పొందిన ఏజెన్సీ భద్రతకు సంబంధించిన అంశాల విషయంలో ఎవరినైనా పిలిస్తే, వారు ఆ ఏజెన్సీలకు సహకరించాలని, అన్ని వివరాలూ సమర్పించాలని తెలిపింది. సబ్ సెక్షన్-3లో పిలిపించిన వ్యక్తి ఏజెన్సీలకు సహకరించకపోతే, అతడిని శిక్ష విధించవచ్చని పేర్కొంది. అందులో ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. ఏయే ఏజెన్సీలకు హక్కులు అందించారు శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 10 భద్రత, నిఘా ఏజెన్సీలకు కంప్యూటర్, ఐటీ పరికరాలపై నిఘా పెట్టే హక్కులు అందించారు. ఆ ఏజెన్సీల్లో... దేశంలో నిఘా చరిత్ర టెక్నాలజీ ద్వారా నేర కార్యకలాపాలకు పాల్పడకుండా సుమారు వందేళ్ల క్రితమే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ రూపొందించారు. ఈ యాక్ట్ ప్రకారం భద్రతా ఏజెన్సీలు ఆ సమయంలో టెలిఫోన్‌లో జరిగే సంభాషణలను ట్యాప్ చేసేది. అనుమానితుల సంభాషణలపైన మాత్రమే భద్రతా ఏజెన్సీలు నిఘా పెట్టేవి ఆ తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, కంప్యూటర్ వాడకం పెరిగింది. కంప్యూటర్ ద్వారా నేర కార్యకలాపాలకు పాల్పడకుండా 2000లో భారత పార్లమెంట్ ఐటీ చట్టం ఆమోదించింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మీరు, మేము మనమంతా పనిచేస్తున్న కంప్యూటర్లపై కేంద్రం నిజంగానే కన్నేసి ఉంచబోతోందా? text: ఉత్తర జర్మనీలో యూటిన్ నగరానికి సమీపంలోని డొడావెర్ అడవిలో 500 ఏళ్ల ‘ఓక్ చెట్టు’ ఉంది. ప్రపంచంలోనే పోస్టల్ చిరునామా కలిగిన ఏకైక చెట్టు ఇదే. దీని కోసమే ప్రత్యేకంగా ఓ పోస్టల్ కోడ్‌.. పోస్టు బాక్సు (చెట్టు తొర్ర)తో పాటు.. పోస్ట్‌మ్యాన్ కూడా ఉన్నారు. ఒక చెట్టుకు ఇన్ని ఏర్పాట్లు చేయడమేంటి? అన్నదే మీ అనుమానం కదా. రొమాంటిక్ పోస్టు బాక్సు ఈ చెట్టుకు ఉన్న పోస్టుబాక్సు(చెట్టు తొర్ర) ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ పోస్టుబాక్సుగా పేరుంది. ఈ ఓక్ చెట్టుకు ఉత్తరం రాస్తే తొందరగా పెళ్లవుతుందని చాలా మంది నమ్మకం. తమకు పలానా లక్షణాలు, అర్హతలు ఉన్న భాగస్వామి కావాలని వివరిస్తూ.. ఇక్కడికి ఉత్తరాలు రాసి పంపుతారు. వాటిన్నింటినీ పోస్ట్‌మ్యాన్ తీసుకెళ్లి ఈ చెట్టు తొర్రలో వేస్తారు. ఎవరైనా వచ్చి వాటిని తీసి చదువుకుని.. నచ్చితే దాన్ని రాసిన వారికి ప్రత్యుత్తరం పంపొచ్చు. అలా ఇద్దరి మధ్య ఏర్పడే పరిచయం కొన్నిసార్లు వివాహాల వరకూ వెళ్తుంది. ఇప్పటి వరకు ఈ చెట్టు 100కు పైగా జంటలను కలిపిందని స్థానికులు చెబుతున్నారు. 'పెళ్లి కుమారుడి ఓక్' అని పిలిచే ఈ చెట్టు చిరునామాకు దేశవిదేశాల నుంచి ఏటా 1000 ఉత్తరాలు దాకా వస్తున్నాయని జర్మనీ తపాలా సేవల సంస్థ డచ్ పోస్ట్ అధికార ప్రతినిధి మార్టిన్ గ్రండ్లర్ చెప్పారు. వేసవిలో ఎక్కువగా ఉత్తరాలు వస్తాయని ఆయన తెలిపారు. తాను ఆరు ఖండాల నుంచి వచ్చిన ఉత్తరాలను ఈ చెట్టుకు చేరవేశానని, వాటిలో కొన్ని తనకు ఏమాత్రం అర్థంకాని భాషలోనూ ఉండేవని 1984 నుంచి రెండు దశాబ్దాలపాటు ఇక్కడ పోస్టుమ్యాన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన మార్టెన్స్ వివరించారు. 128 ఏళ్ల కిందటి ప్రేమ కథ ఈ నమ్మకం ఏర్పడటానికి 128 ఏళ్ల కిందటి ఓ జంట ప్రేమ కథే కారణమని మార్టెన్స్ చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. 1980లో మిన్నా అనే స్థానిక యువతి అదే ఊరికి చెందిన చాక్లెట్ తయారు చేసే విల్‌హెల్మ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే.. అతడిని కలవొద్దని, చూడొద్దని ఆ యువతి తండ్రి హెచ్చరించారు. దాంతో ఆ ఇద్దరూ రహస్యంగా లేఖల ద్వారా సంభాషించుకునేవారు. వీరద్దరూ నేరుగా కలుసుకోకుండా ఉత్తరాలను ఆ చెట్టు తొర్రలో వేస్తూ పరస్పరం మార్చుకునేవారు. అలా ఓ ఏడాది గడిచిన తర్వాత ఆ యువతి తండ్రి వారి పెళ్లికి అంగీకరించారు. దాంతో ఆ చెట్టు కిందే ఆ జంట 1891 జూన్ 2న పెళ్లి చేసుకున్నారు. ఆ జంట ప్రేమ కథ జర్మనీ అంతటా తెలియడంతో.. అప్పటి నుంచి ఈ చెట్టుకు ప్రేమ లేఖలు రావడం ప్రారంభమైంది. ఉత్తరాల సంఖ్య పెరగడంతో డచ్ పోస్ట్ సంస్థ ఆ చెట్టుకు ప్రత్యేకంగా పోస్టల్ కోడ్‌, పోస్టు మ్యాన్‌ను కేటాయించింది. చెట్టుకు మూడు మీటర్ల ఎత్తులో ఉన్న ఆ పోస్టు బాక్సు(తొర్ర) దగ్గరకు సులువుగా వెళ్లేందుకు ఓ నిచ్చెన కూడా ఏర్పాటు చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎక్కడైనా వ్యక్తుల పేరుతోనో.. సంస్థల పేరుతోనో ఉత్తరాలు రాస్తారు. కానీ.. ఓ చెట్టుకు దేశవిదేశాల నుంచి ఎంతో మంది పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉత్తరాలు రాస్తున్నారు. text: అయితే, ఆ దేశంలో నిశ్శబ్దం ప్రతిధ్వనిస్తుంటుందని బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ పేర్కొన్నారు. ఆ దేశంలో అడుగుపెట్టగానే మీకు సింగపూర్‌లో ఉన్నామా అని అనిపిస్తుంది. రహదారులు చాలా చక్కగా ఉంటాయి. వేలాది చెట్లతో నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు. పాదచారులు వెళ్లేలా రహదారుల పక్కన స్థలాన్ని వదిలారు. పెద్ద గోపురాలతో ఉన్న మసీదులు కనిపిస్తాయి. వాటిపై అరబిక్‌లో పెద్ద పెద్ద సంకేతాలు, గడ్డంతో ఉన్న సుల్తాన్ హస్సనల్ బొకై చిత్రాలు కనిపిస్తాయి. అప్పుడే ఈ దేశం బ్రూనై అని మీకు తెలుస్తుంది. బ్రూనై సుల్తాన్ పూర్తిస్థాయిలో రాజరిక పాలన కొనసాగుతున్న కొన్ని దేశాల్లో ఇదీ ఒకటి. సుల్తాన్‌కే పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి. ఆయనే దేశానికి ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, బ్రూనైలోని ఇస్లామిక్ మత పెద్ద కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఆయన చెప్పిందే చట్టం. మత పాలన వైపు అడుగులు 1984 వరకు బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న బ్రూనై స్వాతంత్ర్యం వచ్చాక మలయ్ ముస్లిం రాజ్యం అని సుల్తాన్ ప్రకటించారు. ఇప్పుడు బ్రూనియన్లలో ఈ భావన స్థిరపడింది. ''మలయ్ భాష, సంస్కృతి, ఆచారాలు, రాజరిక వ్యవస్థ అనేవి ఇస్లామిక్ బోధనలు, విలువల సారాంశం. వీటిని అందరూ పాటించాలి'' అని మలయ్ భావనను ప్రభుత్వం వర్ణించింది. బ్రూనైలో ఉండేవారంతా మలయ్ జాతి వారు కాదు. ఇండోనేసియా సంతతి ముస్లింలు కూడా ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కఠినమైన ఇస్లామిక్ సిద్ధాంతాలను ఆచరించే దేశంగా బ్రూనైను తీసుకెళ్లారు. బ్రూనైపై చక్కటి అవగాహన ఉన్న ఇస్లాం ఇన్ సౌత్ ఈస్ట్ ఏసియా నిపుణుడు డొమినిక్ ముల్లెర్ బీబీసీతో మాట్లాడుతూ, ''గత మూడు దశాబ్దాల నుంచి సుల్తాన్ మతపాలన వైపు పూర్తిస్థాయిలో వెళ్లిపోతున్నారు. 1987లో మక్కా యాత్ర తర్వాత ఈ పరిస్థితి కనిపిస్తుంది. షరియా చట్టాలను అమలు చేయాలని పదే పదే చెబుతున్నారు.'' అని పేర్కొన్నారు. బ్రూనైలో ప్రతిపక్షమే లేదు. స్వతంత్ర పౌర సమాజం ఊసే లేదు. 1962లో విధించిన ఎమర్జెన్సీ కిందే ఇంకా ఆ దేశం పాలన నడుస్తోంది. గుమిగూడి మాట్లాడుకోవడం, భావప్రకటన స్వేచ్ఛ పై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మీడియా కూడా స్వేచ్ఛగా పని చేయలేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ మీడియాను మూసివేస్తారు. 2016లో బ్రూనై టైమ్స్‌కు ఇలానే జరిగింది. ఇక్కడ అనేక చట్టాలున్నాయి. 'స్వీపింగ్ సెడిషన్ చట్టం' ముఖ్యమైనది. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే ఈ చట్టాన్ని వారిపై ప్రయోగిస్తారు. అందువల్లే జర్నలిస్టులు ఈ దేశాన్ని సందర్శించడం కష్టం. ఇక్కడ ప్రజలు మంచి ఆతిథ్యాన్ని ఇస్తారు. సాయం అందిస్తారు. అయితే, కొత్తగా వచ్చిన షరియా పీనల్ కోడ్ గురించి మాట్లాడమంటే పెదవి విప్పడానికి కూడా నిరాకరిస్తారు. చాలా మంది బీబీసీ బృందాన్ని కలవడానికి కూడా ముందుకురాలేదు. ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదులో మేం కొందరు ముస్లింలను కలిశాం. ''లెస్బియన్‌తో మేం సోషల్ మీడియాలో కూడా చాట్ చేయం.'' అని ఒకరు చెప్పారు. బ్రూనై బయట కొందరు గేలను కూడా మేం కలిశాం. దేశంలో కొత్తగా అమలు చేస్తున్న శిక్షా స్మృతిలో రాళ్లతో కొట్టిచంపడం తదితర కఠినమైన శిక్షలు ఉన్నాయనే విషయాన్ని వారు నమ్మడం లేదు. ఎల్జీబీటీ సమూహానికి సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టాలపై బ్రూనియన్లు రెండుగా విడిపోయారు. దీనిపై ఒక గే మాట్లాడుతూ,'గే అనే విషయం బయటకు తెలియకుండా బ్రూనైలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు.ప్రాథమిక మానవ హక్కులను ఎవరూ అణచివేయలేరు' అని పేర్కొన్నారు. మరో లెస్బియన్ మాత్రం కొత్త చట్టం వల్ల స్వలింగసంపర్కులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందారు. ''సుల్తాన్ మాటలే చట్టం. ఇప్పుడు స్వలింగ సంపర్కానికి సంబంధించి మరణశిక్ష ఉండదని ఆయన చెబుతున్నారు. దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. బ్రూనియన్లు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.'' అని అన్నారు. మలేసియాలోని ఒక బార్ వారాంతాల్లో మలేసియావైపు పరుగులు బ్రూనైకి సిరిసంపదలు తెచ్చిపెడుతున్న చమురు, గ్యాస్ నిక్షేపాలు మరో రెండు దశాబ్దాల్లో అంతరించిపోవచ్చు. చమురు రేట్లు తగ్గడంతో గత కొన్ని సంవత్సరాలుగా భారీ లోటు బడ్జెట్‌తో దేశం నడుస్తోంది. ఆర్థికవృద్ధి పెద్దగా లేదు. ఆగ్నేయాసియాలోనే అత్యంత నిరుద్యోగం ఈ దేశంలోనే కనిపిస్తోంది. శనివారం రాత్రి రాగానే బ్రూనైకి సరిహద్దుగా ఉన్న మలేసియా వైపు జనసందోహం కనిపించింది. వారాంతాన్ని మద్యం తాగుతూ, పొగ పీల్చుతూ, సంగీతం వింటూ ఆస్వాదించాలని చాలా మంది బ్రూనియన్లు సరిహద్దు వద్ద వేచిచూస్తున్నారు. వారికి తమ దేశంలో ఇవేవి అందుబాటులో లేవు. అందుకే గంటన్నరలో చేరుకునే మలేసియావైపు వెళ్తున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వ్యభిచారం, అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలపై కఠినమైన ఇస్లామిక్ శిక్షలను అమలు చేస్తూ బ్రూనై అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. text: అది జార్ఖండ్ రాష్ట్రం. సిండేగా జిల్లా. కారామాటి గ్రామం. ఈ గ్రామంలో 100 కుటుంబాలుంటాయి. వెనుకబడిన వర్గానికి చెందిన సంతోషి కుటుంబానికి రేషన్ డీలర్ 8 నెలలుగా సరకులు ఇవ్వడంలేదు. కారణం.. ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేయలేదంట. ‘ఆకలి నొప్పి’ అనారోగ్యం కారణంగా సంతోషి తండ్రి ఏ పనీ చేయలేరు. అందువల్ల కుటుంబ భారమంతా తల్లీకూతుళ్లపైనే. తల్లి కోయలిదేవి, పెద్ద కూతురు ఇద్దరూ కలిసి వేప పుల్లలు అమ్ముకునో, ఎవరింట్లో అయినా పాచిపని చేసుకుంటూనో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరూ వారికి పని ఇవ్వటానికి ఆసక్తి చూపలేదు. తమ కుటుంబంలో ఎన్నో రాత్రులు ఆకలితో గడిచిపోతాయని సంతోషి తల్లి తెలిపారు. ''సెప్టెంబరు 28 మధ్యాహ్నం కడుపులో నొప్పి వస్తోందని సంతోషి చెప్పింది. ఆకలి వల్లే ఆమెకు కడుపునొప్పి వచ్చిందని, అన్నం తినిపిస్తే నొప్పి తగ్గిపోతుందని ఊర్లో ఉన్న డాక్టరు చెప్పారు.'' ''కానీ సంతోషికి తినిపించడానికి ఇంట్లో ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. అప్పటికే సంతోషి అన్నం కావాలి అని ఏడవటం మొదలుపెట్టింది. ఆమె కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. ఇంట్లో ఉన్న టీ పొడి, ఉప్పు కలిపి టీ కాచి, సంతోషికి ఇవ్వాలని అనుకున్నాను. ఇంతలోపే సంతోషి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది" అని కోయలిదేవి తెలిపారు. ఆకలి కాదు మలేరియా ! కానీ సిండేగా జిల్లా డిప్యూటీ కలెక్టరు మంజునాథ్ భజంత్రి మాత్రం సంతోషి ఆకలితో చనిపోలేదన్నారు. మలేరియా సోకడంతోనే ఆమె చనిపోయిందని బీబీసీకి తెలిపారు. ''సెప్టెంబరు 28న సంతోషి చనిపోయింది. కానీ దీని గురించి అక్టోబర్ 6న పేపరులో వార్త వచ్చింది. దసరా సందర్భంగా స్కూలుకు సెలవులిచ్చారని, అందుకే సంతోషికి మధ్యాహ్న భోజనం దొరక్కపోవడంతో ఆమె చనిపోయిందని వార్త వచ్చింది.'' ''కానీ సంతోషి మార్చ్ తర్వాత అసలు స్కూలుకే రాలేదు. మేము సంతోషి మృతిపై దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాం. వారి నివేదిక ప్రకారం, సంతోషి చనిపోవడానికి మలేరియాయే కారణమని తేలింది. సంతోషికి చికిత్స అందించిన డాక్టరుతో కూడా ఈ కమిటీ మాట్లాడింది" అని మంజునాథ్ తెలిపారు. మలేరియానా? ఆకలి చావా? కానీ డిప్యూటీ కమిషనర్ ఈ ఆకలి చావును దాస్తున్నారని జల్ డేగాలో ఉండే సామాజిక కార్యకర్త తారామతి సాహు ఆరోపించారు. సెప్టెంబరు 27న స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఉండే నర్సు మాలాదేవి సంతోషికి జ్వరం లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ''ఆగస్టు 21న డిప్యూటీ కలెక్టరు నిర్వహించిన జనతా దర్బార్‌లో కోయల్ దేవి రేషన్ కార్డును రద్దు చేశారని ఫిర్యాదు చేశాను. సెప్టెంబరు25న రేషన్ కార్డును పునరుద్ధరించమని మళ్ళీ ఫిర్యాదు చేశాను. అప్పుడు సంతోషి బతికే ఉంది. అయితే అధికారులు మా ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో సంతోషి ఆకలితో చనిపోయింది" అని తారామతి సాహు తెలిపారు. 'రైట్ టు ఫుడ్' విచారణ ఈ ఘటన తర్వాత 'రైట్ టు ఫుడ్'కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం కారామాటి గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టింది. వారి వెంట ఆ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం కూడా ఉంది. ''సంతోషి ఆకలి వల్లే చనిపోయిందని కోయల్ దేవి నాకు చెప్పారు'' అని ఈ బృందంలో సభ్యులయిన ధీరజ్ కుమార్ తెలిపారు. ''ఎవరైనా అన్నం దొరక్క ఆకలితో చనిపోతే దాన్నేమనాలి? దానికి ప్రభుత్వమే కొత్త పదం కనుగొనాలి. ఎవరైనా ఇలా చనిపోతే దానికి ఆకలి కారణం కాదని అనడం ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడమే'' అని ప్రముఖ సామాజిక కార్యకర్త బలరాం అన్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) పదకొండేళ్ల సంతోషి నాలుగు రోజుల పాటు ఆకలితో అలమటించింది. కానీ, రేషన్ దొరకలేదు. తినడానికి అన్నం లేక ఆమె చనిపోయిందని కుటుంబీకులు చెబుతున్నారు. text: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీల్) మొట్టమొదటిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్‌బుక్, ట్విటర్ వినియోగం విస్తృతం కావడంతో ఐఓసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఇలా బుక్ చేసుకోవచ్చు! ముందుగా మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత ఐఓసీఎల్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ indianoilcorplimited కోసం సెర్చ్ చేయాలి. indianoilcorplimited లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీకి కుడివైపు బాక్సులో 'బుక్ నౌ' అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, పేరు, ఈమెయిల్, ఎల్‌పీజీ నెంబర్ ఇస్తే చాలు. గ్యాస్ బుక్ అయిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా కూడా డబ్బులు చెల్లించొచ్చు. ట్విటర్ ద్వారా బుకింగ్ ఇలా! మీ ట్విటర్‌ హ్యాండిల్‌లో @indanerefill‌ సెర్చ్ చేయండి. తొలిసారి బుక్ చేస్తున్నట్లయితే, ముందుగా మీ ఎల్‌‌పీజీ ఐడీ, ఈమెయిల్ వివరాలతో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఆ తర్వాత సిలెండర్ బుక్ చేసుకునేందుకు ఎల్‌పీజీ నెంబర్‌, ఈమెయిల్‌తో @indanerefill‌కి ట్వీట్ చేయాలి. అంతే. మీ సిలెండర్ బుక్ అయిపోయినట్లే! ప్రస్తుతం ఐఓసీల్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే హెచ్‌పీ, భారత్ గ్యాస్‌ సంస్థలు కూడా వినియోగదారులకు ఈ సేవ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఫోన్‌ కాల్, ఎస్‌ఎంఎస్‌, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునే సదుపాయం ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. వీటికి అదనంగా ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విటర్‌లో కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. text: ‘‘ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించి అందిన తాజా నిఘా సమాచారం మేరకు అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్నారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలోను, అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకుల సురక్షత, భద్రతల నేపథ్యంలోనూ.. లోయలో వారు తమ బసను తక్షణం తగ్గించుకుని, వీలైనంత త్వరగా వెనక్కు వెళ్లిపోయేందుకు అవసరమైన ఏర్పాట్లు తీసుకోవాలని సూచిస్తున్నాం'' అని జమ్మూ, కశ్మీర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి షలీన్ కబ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని భారత ఆర్మీ తెలిపింది. యాత్ర మార్గంలో ఒక ల్యాండ్‌మైన్, స్నిపర్ రైఫిల్ లభించాయని వెల్లడించింది. ''గత మూడు, నాలుగు రోజుల్లో నిఘా వర్గాల నుంచి లభించిన నివేదికల మేరకు అమర్‌నాథ్ యాత్రను విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. దీంతో సోదాలను ముమ్మరం చేశాం. ఈ సోదాల్లో మాకు సానుకూల ఫలితాలు వచ్చాయి'' అని చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ చెప్పారు. భారత ఆర్మీకి లభించిన ల్యాండ్‌మైన్‌పై పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్నాయని, అలాగే ఎం 24 ఎ అమెరికన్ స్నిపర్ రైఫిల్‌కు టెలిస్కోపిక్ విధానంలో గురి చూడగల ఏర్పాట్లు ఉన్నాయని ధిల్లాన్ వెల్లడించారు. గత మూడు రోజులుగా యాత్ర వెళ్లే దారిలో అణువణువూ గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. జమ్మూ, కశ్మీర్‌లో సాయుధ బలగాల మొహరింపును పెంచిన నేపథ్యంలో ఆర్మీ, పోలీసు అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ''పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు మా సోదాల్లో తేలింది, ఈ మేరకు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం'' అని ధిల్లాన్ చెప్పారు. ఐఈడీలు, క్రూడ్ బాంబుల రూపంలో కూడా పెను ముప్పు పొంచి ఉందని, వాటిని కూడా ఈ సోదాల్లో రికవరీ చేశామని తెలిపారు. ''ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. శాంతిని భగ్నం చేయాలని పాకిస్తాన్ సైన్యం ఎదురు చూస్తోంది. కానీ, వారు కోరుకున్నదేమీ జరగదు. శాంతిని భగ్నం చేసేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వం'' అని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భద్రతా బలగాలను భారీగా మొహరిస్తున్నారు. ఈ మేరకు పారా మిలటరీ సిబ్బందిని విమానాలు, హెలీకాఫ్టర్లలో తరలిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై అనామానాలు కలుగుతున్నాయి. అదనంగా 100 కంపెనీల (10 వేల మంది) భద్రతా బలగాలను గత వారం రోజులుగా రాష్ట్రంలోకి దించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఈ బలగాల మొహరింపు ఇంకా కొనసాగుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భారత సైన్యం ప్రకటించింది. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో పేలుడు పదార్థాలు లభించాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్ లోయలో ఉన్న యాత్రికులంతా తక్షణం వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. text: "మేం విజయం సాధించాం, ప్రజలు మాపట్ల స్పష్టమైన తీర్పునిచ్చారు" అని ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పీటీఐ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చు. పాకిస్తాన్ ఎన్నికల ప్రచారమంతా హింసాత్మకంగానే సాగింది. ఓటింగ్ రోజున కూడా క్వెట్టాలో జరిగిన బాంబు పేలుడులో 31మంది మృతిచెందారు. క్రీడల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్... పాకిస్తాన్ సైన్యం తన పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వీటిని ఆయన తోసిపుచ్చారు. తుదిఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పడుతుంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ ఈ ఫలితాలను తిరస్కరించింది. పోలింగ్‌లో ఎన్నో అవకతవకలు, రిగ్గింగ్ జరిగాయని వారు ఆరోపించారు. ఈ ఎన్నికలు ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి, నవాజ్ షరీఫ్ పార్టీకి మధ్య పోటీగానే నిలిచాయి. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడి పీపీపీ పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుంది. ఫలితాల సరళి తెలిసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ చరిత్రలోనే నిష్పక్షపాతంగా జరిగిన ఎన్నికలు ఇవి అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఎలాంటి అంశాలపైనైనా విచారణ జరిపించేందుకు సిద్ధమన్నారు. పాకిస్తాన్ అభివృద్ధికి సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలనూ ఇమ్రాన్ ఖాన్ కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్‌తో చర్చలకు సిద్ధమని తెలిపారు. ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం ఫలితాలు (26.07.2018 రాత్రి 10 గంటలు) ఈ ఎన్నికలు నిజంగానే నిష్పాక్షికంగా జరిగాయా? పీఎంఎల్-ఎన్ మొదటి నుంచీ ఈ ఎన్నికలు, ప్రచార సమయంలో సైన్యం పాత్రపై ఆరోపణలు చేస్తూనే ఉంది. పీటీఐ పార్టీకి సైన్యం, కోర్టులు కూడా సహకారం అందిస్తున్నాయని, పరోక్షంగా ఆ పార్టీ విజయానికి దోహదం చేస్తున్నాయని విమర్శించింది. కానీ సైన్యం ఈ ఆరోపణలను ఖండించింది. మరోవైపు మానవ హక్కుల సంఘం కూడా ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనడానికి ఎన్నో ఉదంతాలున్నాయని వ్యాఖ్యానించింది. మీడియా గొంతు నొక్కడానికి బహిరంగంగానే ప్రయత్నాలు జరిగాయని స్వతంత్ర మీడియా పేర్కొంది. పోలింగ్ సమయంలో ఎన్నో కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికలు ముగిసిన అనంతరం కొన్ని రాజకీయ పక్షాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్ల లెక్కింపు సమయంలో తమ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించేశారని కొన్ని పార్టీల ప్రతినిధులు తెలిపారు. ఫలితాలకు సంబంధించిన అధికారిక పత్రాలను ఇవ్వాలని కోరినా తిరస్కరించారని, ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి పీఎంఎల్-ఎన్‌ పార్టీకి బాగా పట్టుందని భావిస్తున్న పంజాబ్ ప్రావిన్స్‌లో ఫలితాల వెల్లడికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సాంకేతిక అవాంతరాల కారణంగానే ఫలితాల వెల్లడి ఆలస్యమైందని ఎన్నికల సంఘం వివరించింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించుకున్నారు. text: ఉత్తర ఇటలీలోని షియావోనియా ఆస్పత్రిలో కరోనా బాధితలకు చికిత్స చేస్తున్న వైద్యులు ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య కూడా 5,883 నుంచి 7,375కు అంటే 25 శాతం పెరిగిందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది. రోజు రోజుకూ పరిస్థితి తీవ్రం అవుతుండడంతో లోంబార్డీతో పాటు 14 ప్రావిన్సులలో కోటి 60 లక్షల మందిని క్వారెంటైన్ అంటే నిర్బంధంలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతాల వారు ఎక్కడికైనా ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇటలీలోని మిలాన్, వెనిస్ రెండూ కరోనావైరస్ బాధిత ప్రాంతాలే. దేశ వ్యా‌ప్తంగా పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, నైట్ క్లబ్‌లు అలాగే ఇతర అన్ని వేదికల్ని మూసేయాలని ప్రధాని జుసెప్పే కాంటే ఆదేశించారు. ఏప్రిల్ మూడో తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నాలుగో వంతు జనాభాపై కరోనా ప్రభావం యూరోప్‌ మొత్తంలో అత్యధికంగా కరోనావైరస్ కేసులు ఇటలీలోనే నమోదయ్యాయి. శనివారం నాటికి కేసుల సంఖ్య మరింత పెరిగింది కూడా. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన నిర్బంధం ఇటలీ జనాభాలో దాదాపు నాల్గోవంతుపై ప్రభావం చూపిస్తోంది. అది కూడా దేశ కేంద్ర స్థానం కావడంతో ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటలీలో మృతుల సంఖ్య 366కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లోనే 133 మంది ప్రాణాలు కోల్పోయారు. "మా ప్రజల ఆరోగ్యానికి మేం భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. మేం తీసుకున్న చర్యల కారణంగా కొన్ని సార్లు చిన్న చిన్న త్యాగాల నుంచి మరి కొన్ని సార్లు పెద్ద పెద్ద త్యాగాలు కూడా చెయ్యాల్సి ఉంటుంది." అని ప్రధాని కొంటే అన్నారు. కానీ "మన విషయంలో మనం బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇదే" అని కొంటే వ్యాఖ్యానించారు . గత వారంలోనే దేశంలోని అన్ని పాఠశాలలను, కాలేజీలను, విశ్వ విద్యాలయాలను పది రోజుల పాటు మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీలో ఒక్క రోజులోనే 4500కిపైగా కరోనావైరస్ కేసుల నమోదు ఇప్పటికే ఆలస్యమయ్యిందా? బీబీసీ రోమ్ ప్రతినిధి మార్క్ లోవన్ విశ్లేషణ కరోనావైరస్ విషయంలో వారం క్రితమే ప్రభుత్వం ఈ స్థాయిలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఒక వేళ కేసుల సంఖ్య తగ్గి ఉంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించి ఉండేవి. కానీ అలా జరగలేదు. బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. నిజానికి ఇదే అత్యంత నాటకీయ పరిణామం. అలాగని బాధిత ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చెయ్యలేదు. విమానాలు, రైళ్లు ఇప్పటికీ తిరుగుతునే ఉన్నాయి. అలాగే అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలకు అనుమతులు ఇస్తునే ఉన్నారు. అయితే ప్రజల్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు..? ఎందుకు వెళ్తున్నారన్న విషయాన్ని పోలీసులు ప్రశ్నించవచ్చు. చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందా ..? ఇదే అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇటలీలో కరోనావైరస్ ప్రభావం కొద్ది వారాల క్రితం నుంచే మొదలయ్యింది. ప్రస్తుతం దేశంలో 22 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చైనా తర్వాత అత్యంత కఠినమైన తీవ్ర మైన చర్యల్ని తీసుకుంటోది ఇటలీ. కానీ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వంటిదేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్లకే పరిమితమైన కోటి పైగా ప్రజలు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా సుమారు లోంబర్డేలోని ఉత్తర ప్రాంతంలో ఏ ఒక్కరూ అడుగు పెట్టలేరు. అలాగే అక్కడ నుంచి బయట ప్రాంతాలకు రాలేరు. అత్యవసర సమయాల్లో తప్ప సుమారు కోటి మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ ప్రాంతంలో అతి ముఖ్యమైన నగరం మిలాన్. అక్కడ సుమారు 14 ప్రాంతాలు కరోనావైరస్ ప్రభావానికి లోనయ్యాయి. ఆరోగ్య పరమైన లేదా ఉద్యోగ పరమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవ్వరూ బయటకు వచ్చే వీలు లేదని ప్రధాని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఉత్తర ఇటలీలో నివసిస్తున్న 50 వేల మందిపై మాత్రమే ఈ నిర్బంధం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. పెళ్లిళ్లు ఆగిపోయాయి వైరస్ ధాటికి పెళ్లిళ్లు , వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తాతాల్కికంగా నిలిచిపోయాయి. నైట్ క్లబ్బులు, వ్యాయామశాలలు, రిసార్టులను ఇప్పటికే మూసేశారు . నిర్బంధంలో ఉన్న ప్రాంతాల్లోని రెస్టారాంట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు మాత్రమే అనుతిస్తున్నారు. అలాగే అందులో కూర్చొనే కస్టమర్ల మధ్య దూరం కనీసం 3 అడుగులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గృహ నిర్బంధాన్ని బయటకొస్తే 3 నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రావచ్చు. వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటలీకి సూచించింది. ఈ విషయంలో చైనా తీసుకున్న చర్యల్ని ప్రశంసించింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇటలీలో కరోనావైరస్ వల్ల ఒక్క రోజులోనే 133 మంది మరణించారు. దీనితో కలిపి దేశంలో ఇప్పటివరకు 366 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ text: లీటరు పానీయంలో 150 మిల్లీ గ్రాములకు మించి కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్‌లను 16 ఏళ్ల లోపు వారికి విక్రయించరాదని బూట్స్, అస్డా, వెయిట్రోస్, టెస్కో, కోఅప్ వంటి సూపర్ మార్కెట్లు తీర్మానించుకున్నాయి. చిన్న పిల్లలు ఎక్కువగా ఈ ఎనర్జీ డ్రింక్‌లను తాగుతున్నారంటూ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలోనే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కోఅప్ తెలిపింది. అల్డి, లిడ్ల్, సాన్స్‌బరీస్, మొర్రిసన్స్ వంటి పలు సూపర్ మార్కెట్లు కూడా స్వచ్ఛందంగా ఈ అమ్మకాల నిషేధాన్ని పాటించనున్నాయి. తమ వినియోగదారులు ఆరోగ్యవంతమైన జీవితాలను పొందేందుకు సహకరించటమే ఎప్పటికీ తమ ప్రధాన ఉద్దేశ్యమని బూట్స్ అధికార ప్రతినిధి చెప్పారు. ‘‘అత్యధిక చక్కెర, కెఫీన్ ఉన్న ఈ ఎనర్జీ డ్రింక్‌లను యువతీ, యువకులు ఎక్కువగా తాగుతున్నారంటూ ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనల్ని మేం పట్టించుకున్నాం’’ అని తెలిపారు. పూర్తిగా నిషేధించాలి బ్రిటన్‌లో ఎనర్జీ డ్రింక్‌లను పూర్తిగా నిషేధించాలంటూ కొన్ని వారాల కిందట ప్రధానమంత్రి థెరిస్సా మేను ఎంపీ మారియా కాల్‌ఫీల్డ్ కోరారు. ఎనర్జీ డ్రింక్‌లను దేశవ్యాప్తంగా నిషేధించాలంటూ ఉద్యమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే సూపర్ మార్కెట్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సెలబ్రిటీ జామీ ఒలివర్ #NotForChildren అనే ఉద్యమానికి నేతృత్వం వహించారు. తాజాగా సూపర్ మార్కెట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ.. ‘మంచిపని చేశారు’ అని ట్వీట్ చేశారు. స్కూళ్లు తమ ప్రాంగణాల్లో ఎనర్జీ డ్రింక్‌లను విక్రయించరాదని, పిల్లలకు ఈ పానీయాలను అమ్మటంపై నియంత్రణలు ఉండాలంటూ ఎన్‌ఏఎస్‌యూడబ్ల్యుటీ ఉపాధ్యాయ సంఘం కూడా ఉద్యమం నడిపింది. ఈ డ్రింక్‌లను పిల్లలు తాగటం వల్ల స్కూళ్లలో వారి ప్రవర్తనపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఈ పరిస్థితుల్ని ఉపాధ్యాయులే పరిష్కరించాల్సి వస్తోందని సంఘం ప్రధాన కార్యదర్శి క్రిస్ కీట్స్ బీబీసీతో అన్నారు. ‘‘ఈ డ్రింక్‌లు దీర్ఘకాలంలో ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాల గురించి అవగాహన లేకపోవటంతో ఇవి సాధారణ సాఫ్ట్ డ్రింక్‌లేనని పిల్లలు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు’’ అని కీట్స్ తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 16 ఏళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్‌లను అమ్మకూడదని బ్రిటన్‌లోని సూపర్ మార్కెట్లు నిర్ణయించాయి. ఈ పానీయాల్లో అత్యధిక మొత్తంలో చక్కెన, కెఫీన్‌లు ఉంటున్నాయన్న ఆందోళనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాయి. text: కరోనావైరస్ మహమ్మారికి చైనా బాధ్యత వహించేలా చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందన్నారు.. చైనాను శిక్షించే లక్ష్యంతో తీసుకుంటున్న చర్యలను ప్రకటిస్తున్న సమయంలో “ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా చైనా గుప్పిట్లో ఉంది” అని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే తమ నిధులను వేరే సంస్థలకు మళ్లించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధిక నిధులు అందించే ఏకైక దేశం అమెరికా. ఇది 2019లో ఆ సంస్థకు 400 మిలియన్ డాలర్లకు పైగా నిధులు అందించింది. ఈ ఏడాది తిరిగి అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు ప్రచారం చేస్తున్న ట్రంప్ ఈ మహమ్మారిని నియంత్రించలేక, దానిని కవర్ చేసుకోడానికే చైనాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా వల్ల అమెరికాలో అత్యధికంగా లక్షా 2 వేల మందికి పైగా చనిపోయారు. డబ్ల్యుహెచ్ఓ-ట్రంప్ ట్రంప్ ఏమేం అన్నారు? “మేం ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఉన్న బంధాన్ని రద్దు చేస్తున్నాం. ఆ నిధులను ఇతర అంతర్జాతీయ ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థలకు మళ్లిస్తున్నాం” అని ట్రంప్ వైట్ హౌస్‌లో చెప్పారు. “చైనా ప్రభుత్వం దురాగతం ఫలితంగా ఇప్పుడు ప్రపంచమంతా బాధపడుతోంది. లక్ష మందికి పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయేలా చైనా ఈ విశ్వ మహమ్మారిని ఉసిగొల్పింది” అన్నారు.. “వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనా ఒత్తిడి తెచ్చింది” అని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు. నేపథ్యం ఏమిటి? ‘ప్రాథమిక విధి’ని నిర్వహించడంలో విఫలమైందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే నిధులను శాశ్వతంగా నిలిపివేస్తామని గత నెలలో బెదిరించిన ట్రంప్, కరోనా మహమ్మారి పట్ల డబ్ల్యుహెచ్ఓ చేపడుతున్న చర్యలను విమర్శించారు. మే 18న డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్‌కు లేఖ రాసిన ట్రంప్, అందులో “ప్రపంచం తీవ్రంగా నష్టపోయేలా చేసిన ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మీరు, మీ సంస్థ పదే పదే తప్పటడుగులు వేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది” అన్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు డబ్ల్యుహెచ్ఓను చైనా చేతిలో ‘కీలుబొమ్మ’గా వర్ణించారు. ఇటు, అమెరికాలో కరోనా వైరస్ వ్యాపించడానికి ఆ దేశమే కారణం అని చైనా ఆరోపించింది. "అబద్ధాలు చెప్పే అమెరికా రాజకీయ నాయకులే" కరోనా వ్యాప్తికి కారణం అంది. “ట్రంప్ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.కరోనాను ఎదుర్కోవడంలో అమెరికా అసమర్థతకు మేమే కారణమని, మాపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు” అని ఏప్రిల్ ప్రారంభంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ఆరోపించారు. కరోనా మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనపై స్వతంత్ర దర్యాప్తు చేసేందుకు డబ్ల్యుహెచ్ఓ సభ్య దేశాలు అంగీకరించాయి. మీ జిల్లా పేరు వెతకండి కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికాకు ఉన్న బంధాన్ని తెంచేస్తున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. text: అంతేకాదు, వ్యవసాయ కుటుంబాల ఆదాయాన్ని అప్పులు మింగేస్తున్నాయి. వారి వార్షిక ఆదాయం ఎంతో, వారిని చుట్టుముడుతున్న అప్పులూ దాదాపు అంతేస్థాయిలో ఉన్నాయి. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక దేశ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాల ఆర్థిక స్థితిగతులను, వారికి అందుతున్న సమ్మిళిత ఆర్థిక సేవల స్థాయిని వివరించింది. 'అఖిల భారత గ్రామీణ సమ్మిళిత ఆర్థిక సర్వే: 2016-17'(నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే-ఎన్ఏఎఫ్ఐఎస్) పేరిట జరిపిన ఈ అధ్యయనం దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులకు దర్పణం పట్టింది. ఈ నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలోని అన్ని రకాల కుటుంబాల సగటు ఆదాయం నెలకు రూ. 8,059 కాగా వ్యవసాయ కుటుంబాల సగటు ఆదాయం రూ. 8,931. వ్యవసాయేతర కుటుంబాల సగటు ఆదాయం నెలకు రూ.7,269గా లెక్కకట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం రూ. 6,920 కాగా, తెలంగాణలో ఆ మొత్తం రూ. 8,951. కూలి పనులే ప్రధాన ఆదాయ వనరు రైతు కుటుంబాల సగటు ఆదాయం 2016-17లో నెలకు రూ.8,931 మాత్రమేనని తేల్చిన ఈ నివేదిక అందులో సాగు ద్వారా 35 శాతం(రూ.3,140) ఆదాయం వస్తుండగా.. కూలి ద్వారా 34 శాతం(రూ.3,025).. మిగతాది ఇతర మార్గాల ద్వారా వస్తున్నట్లు వెల్లడించింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయంలో కూలి పనులే ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించింది. 54 శాతం ఆదాయం కూలి ద్వారా వస్తున్నట్లు వెల్లడించింది. మొత్తంగా చూసుకుంటే గ్రామీణ భారతదేశంలోని కుటుంబాల (వ్యవసాయ, వ్యవసాయేతర కలిపి) ఆదాయంలో సాగు ద్వారా 19 శాతమే వస్తుండగా కూలి ద్వారా 43 శాతం వస్తున్నట్లు లెక్కించింది. నాలుగేళ్లలో పెరుగుదల రూ.2,505 ఆదాయం అరకొరగా ఉండడంతో పాటు ఏటికేడు పెరిగిపోతున్న అప్పులు, ఆర్థిక సేవలు అందనంత దూరంలో ఉండడం, బీమా సౌకర్యం అంతంత మాత్రం కావడం వ్యవసాయదారుల జీవితాల్లో అభివృద్ధికి చోటు లేకుండా చేస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించిన వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విభాగం నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2012-13లో చేసిన అధ్యయనం ప్రకారం దేశంలోని వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం రూ. 6,426. అంటే, తాజా నాబార్డ్ నివేదికతో పోల్చి చూసుకుంటే ఆ నాలుగేళ్ల కాలంలో రైతు కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.2,505 మాత్రమే పెరిగిందన్నమాట. ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే దీన్ని పెరుగుదలగా భావించలేమని ఆర్థికవేత్తలు అంటున్నారు. అధమ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పంజాబ్‌లోని వ్యవసాయ కుటుంబాలు అత్యధికంగా నెలకు సగటున రూ. 23,133 ఆదాయం పొందుతుండగా హరియాణా, కేరళ రైతులు రూ.18,496 రూ.16,927 ఆదాయంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నారు. ఇక, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అధమ స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రైతులు రూ.6,920 సగటు ఆదాయంతో 28వ స్థానంలో ఉండగా, రూ.6,668 సగటు ఆదాయంతో ఉత్తరప్రదేశ్ అట్టడుగుకు పడిపోయింది. తెలంగాణ రైతు కుటుంబాలు నెలకు సగటున రూ.8,951 ఆదాయంతో జాతీయ సగటు కంటే స్వల్పంగా ముందున్నాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని 245 జిల్లాల్లో 40,327 కుటుంబాలకు చెందిన 1,87,518 జనాభాపై జరిపిన ఈ అధ్యయన నివేదిక గ్రామీణ ప్రజల జీవనోపాధి స్థితిగతులు, సమ్మిళిత ఆర్థిక స్థాయిపై సమగ్ర అవలోకనానికి వీలుకల్పిస్తోంది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని చాలా కుటుంబాలకు ఇప్పటికీ వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరు. 2016-17లో దేశంలో 21.17 కోట్ల కుటుంబాలు ఉండగా అందులో గ్రామీణ ప్రాంతాల్లో 10.07 కోట్ల కుటుంబాలున్నాయి. ఇందులో 48 శాతం వ్యవసాయ కుటుంబాలు. రైతు నెత్తిన రుణ భారం.. ఏ రాష్ట్రంలో ఎలా ఉంది? ఈ సర్వే చేసేనాటికి గ్రామీణ భారతంలో వ్యవసాయాధారిత కుటుంబాలలో 52.5 శాతం, వ్యవసాయేతర కుటుంబాల్లో 42.8 శాతం రుణ ఊబిలో ఉన్నాయి. వీరిలో మూడో వంతు స్థానిక వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ సంస్థల నుంచి అప్పులు తీసుకోగా సుమారు 60 శాతం మంది బ్యాంకులు, ఇతర గుర్తింపు పొందిన సంస్థల నుంచి రుణాలు పొందారు. అయితే, రుణ మొత్తం సగటు విషయానికి వస్తే, బ్యాంకులు, ఇతర గుర్తింపు సంస్థల నుంచి తీసుకున్నదాని కంటే వడ్డీవ్యాపారులు, ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్నదే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. ఈ సర్వే చేసిన నాటికి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 79 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణ ఊబిలో ఉన్నాయి. 76 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత స్థానంలో ఉంది. కర్ణాటకలో 75 శాతం కుటుంబాలది ఇదే పరిస్థితి. తమిళనాడులో 61 శాతం, కేరళలో 56 శాతం ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశాన్ని మినహాయిస్తే అరుణాచల్ ప్రదేశ్(69 శాతం), మణిపుర్(61 శాతం), ఒడిశా(54 శాతం) ఉత్తరాఖండ్(50 శాతం) గ్రామీణ ప్రాంతాల్లో సగం లేదా, అంతకంటే ఎక్కువ రైతు కుటుంబాలు అప్పుల్లో చిక్కుకుని ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఈ శాతం 50కి మించలేదు. ఆదాయం అప్పులకే సరి సగటున గ్రామీణ కుటుంబానికి రూ. 91,852 అప్పు ఉండగా అందులో బ్యాంకులు, గుర్తింపు ఉన్న సంస్థల నుంచి తీసుకున్న రుణం రూ. 28,207. వడ్డీవ్యాపారులు, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న రుణ సగటు రూ. 63,645. గ్రామీణ భారతంలో, రైతు కుటుంబాలకు సమ్మిళిత ఆర్థిక సేవలు అందుబాటులో లేవని ఇది స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కుటుంబాల విషయానికొచ్చేసరికి సగటు రుణం రూ. 1,04,602 ఉంది. వ్యవసాయేతర కుటుంబాల రుణం సగటున రూ.76,731. దేశంలోని వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం రూ. 8,931. అంటే వార్షిక ఆదాయం రూ. 1,07,412. మరోవైపు సగటు అప్పు రూ. 1,04,602 ఉంది. అంటే, రైతు కుటుంబాల ఆదాయం అప్పుల తీర్చడానికి సరిపోగా మిగిలేది నామమాత్రం. వ్యవసాయ కుటుంబాల్లో రుణాలకు ప్రధాన కారణం సాగు పెట్టుబడులే. బీమా వారికి ఎంతో దూరం సర్వే కాలం నాటికి గ్రామీణ భారత కుటుంబాల్లో నాలుగో వంతు మాత్రమే జీవిత, వాహన, ఆరోగ్య బీమాలు వంటి ఏదో ఒక బీమాను కలిగి ఉన్నాయి. వ్యవసాయ కుటుంబాల్లో 26 శాతం మందికి ఏదో ఒక బీమా ఉంది. గ్రామీణ కుటుంబాల్లో 6 శాతం మాత్రమే ఆరోగ్య బీమా ఉన్నవారున్నారు. వ్యవసాయ కుటుంబాలకు వచ్చేసరికి ఇది 5 శాతం మాత్రమే. ఆర్థిక అక్షరాస్యత పెరిగితేనే గ్రామీణ కుటుంబాల్లో 49 శాతానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో పొదుపు ఖాతాలున్నాయి. వ్యవసాయ కుటుంబాల్లో ఇది 53 శాతం. గ్రామీణ ప్రజల్లో 25 శాతం మంది ఇతరుల సహాయం లేకుండా ఏటీఎం కార్డును ఉపయోగించలేకపోతున్నారు. 60 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలను సొంతంగా వినియోగించుకోలేకపోతున్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా దేశంలోని వాస్తవ పరిస్థితులు ఆ లక్ష్యాన్ని ప్రతిబింబించడం లేదు. గ్రామీణ భారతదేశ కుటుంబాల రాబడిలో సాగు ఆధారిత ఆదాయం వాటా 20 శాతం కూడా లేకపోవడమే అందుకు నిదర్శనం. వ్యవసాయ కుటుంబాల రాబడిలో కూడా నేరుగా సాగు ద్వారా వస్తున్న ఆదాయం 35 శాతం మాత్రమే. text: పాశ్చాత్య దేశాల్లో చాలామంది పురుషులు నిలుచుని మూత్రం పోస్తారు కానీ, ప్రస్తుతం దీనిని పలు దేశాల్లో వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని పురుషులు తమ అలవాటును మార్చుకోవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. కొందరు దీనిని సమాన హక్కుల అంశంగానూ చూస్తున్నారు. మరి, పురుషులు ఎలా మూత్రం పోస్తే మంచిది? BBC Indian Sportswoman of the Year ను ఎన్నుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి సాధారణంగా చూస్తే, నిలుచుని మూత్రం పోసే తొట్లను తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో అమర్చే వీలుంటుంది. అదే, కూర్చుని పోసే టాయిలెట్లకు ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. అయితే, మూత్రం పోసే సమయంలో శరీరం భంగిమ ప్రభావం మూత్ర నాళంలో మూత్రం ప్రవాహం మీద ఉంటుందని పలు వైద్య సంస్థలు చెబుతున్నాయి. మూత్ర పిండాలలో ఉత్పత్తి అయిన మూత్రం మూత్రాశయం (బ్లాడర్)లో నిల్వ ఉంటుంది మూత్ర విసర్జన ప్రక్రియ మూత్ర విసర్జన ఎలా జరుగుతుందో చూద్దాం. మూత్రపిండాలు రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుంటాయి. ఆ వడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థమే మూత్రం. ఆ మూత్రం మూత్రాశయం (బ్లాడర్‌)లో నిల్వ ఉంటుంది. మూత్రాశయం సామర్థ్యం 300 మి.లీ నుంచి 600 మి.లీ దాకా ఉంటుంది. కానీ, చాలావరకు అది మూడింట రెండొంతులు నిండగానే మనం దానిని ఖాళీ చేసేస్తుంటాం. బ్లా‌డర్‌ను పూర్తిగా ఖాళీ చేయాలంటే మనలో నాడుల నియంత్రణ వ్యవస్థ సరిగా పనిచేయాలి. అప్పుడే, టాయిలెట్‌కు ఎప్పుడు వెళ్లాలో మనకు తెలుస్తుంది, టాయిలెట్‌ దగ్గరలో లేనప్పుడు మూత్రాన్ని అలాగే ఆపుకునేందుకు వీలుంటుంది. మూత్రాశయం నిండినప్పుడు ఆ విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. మనం మూత్ర విసర్జించేందుకు టాయిలెట్‌కు వెళ్లగానే మూత్రాశయం కండరాలు ముడుచుకుంటాయి. అప్పుడు అందులోని మూత్రం విసర్జననాళం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో బాధపడే పురుషులు కూర్చుని మూత్రం పోయడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది నిలుచోవాలా? కూర్చోవాలా? ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన సులువుగానే జరుగుతుంది. కానీ, కొన్నిసార్లు పురుషులకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూత్ర విసర్జనలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రొస్టేట్‌ గ్రంథి వాపుతో బాధపడుతున్న వారు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూర్చుని మూత్రం పోస్తే ఉపశమనం లభిస్తుందని, కూర్చోవడం ద్వారా విసర్జననాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ప్లోస్ వన్ అనే సైన్స్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో అరోగ్యంగా ఉన్న పురుషులతో పాటు, ప్రోస్టేట్ సిండ్రోమ్‌ (లోవర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్)తో బాధపడుతున్నవారిని పరిశీలించారు. ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్న పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నారని, కూర్చున్నప్పుడు మూత్రనాళాల్లో ఒత్తిడి తగ్గి చాలా సౌకర్యవంతంగా, త్వరగా మూత్ర విసర్జన చేయగలుగుతున్నారని ఆ పరిశీలనలో వెల్లడైంది. అయితే, ఆరోగ్య వంతులైన పురుషులు నిలబడినా, కూర్చున్నా పెద్దగా తేడా కనిపించలేదు. మూత్ర విసర్జన సమస్యలున్న పురుషులు కూర్చుని మూత్రం పోసేందుకు సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండే టాయిలెట్లను ఎంచుకోవాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచిస్తోంది. కూర్చుని మూత్ర విసర్జన చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చని, పురుషుల్లో శృంగార సమస్యలు కూడా తగ్గుతాయనే కథనాలను మనలో చాలామంది చదివే ఉంటారు. కానీ, అందుకు సంబంధించి సరైన ఆధారాలు లేవు. ముఖ్యంగా 2012లో స్వీడన్‌లోని పబ్లిక్ టాయిలెట్ల దుస్థితిని చూసి విసిగెత్తిపోయిన ఒక స్థానిక రాజకీయ నాయకుడు పురుషుల్లో మార్పు తీసుకొచ్చేందుకు చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ తరహా కథనాలు పుట్టుకొచ్చాయి. పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను అలా అన్నానని ఆయన చెప్పారు. ఆ తర్వాత పలు యూరోపియన్ దేశాల్లో- ప్రత్యేకించి పబ్లిక్ టాయిలెట్లలో నిలబడి మూత్ర విసర్జన చేయడంపై నిషేధం ఉన్న జర్మనీలో పెద్దఎత్తున చర్చ నడిచింది. కొన్ని చోట్ల పబ్లిక్ టాయిలెట్లలో నిలుచుని మూత్ర విసర్జన చేయడం నిషిద్ధం కొన్ని టాయిలెట్ల మీద నిలుచుని మూత్రం పోయడం నిషిద్ధం అని హెచ్చరించే గుర్తులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కూర్చుని మూత్ర విసర్జన చేసే పురుషులను కొందరు అవహేళన చేస్తుంటారు. కొన్ని హోటళ్లలోని టాయిలెట్లలోనూ పురుషులు కూర్చుని మూత్రం పోయాలని కోరుతూ గుర్తులు ఏర్పాటు చేస్తున్నారు. 2015లో జర్మనీలో ఓ కేసు సంచలనం సృష్టించింది. తమ ఇంట్లో అద్దెకున్న వ్యక్తి నిలుచుని మూత్రం పోయడం వల్ల బాత్రూంలోని పాలరాతి బండలు చెడిపోయాయని కేసు పెట్టిన యజమాని, అందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ కేసులో కిరాయిదారుడికి ఊరటనిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పురుషులు నిలుచుని మూత్ర విసర్జన చేయడం 'ఇప్పటికీ సాధారణ విషయమే', ఆయన్ను తప్పుబట్టాల్సిన అవసరం లేదని జడ్జ్ వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా చాలా సంప్రదాయాల్లో బాలికలు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే, పురుషులు మాత్రం నిలబడి చేయాలని చెబుతారు. text: సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్ ప్రసాద్ బీబీసీకి సస్పెన్షన్ విషయాన్ని ధృవీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు ఉంటాయన్నారు. సస్పెండైన వారిలో ముజఫర్‌పూర్ బాలల సంరక్షణ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ దేవేశ్ కుమార్ శర్మ కూడా ఉన్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (టిస్) సోషల్ ఆడిట్ నివేదిక ఆధారంగా మే 31న శర్మే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దేవేశ్ శర్మకు అందజేసిన సస్పెన్షన్ ఆర్డర్‌లో, టిస్ రిపోర్టులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయన ఆ సంరక్షణ గృహం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్‌పై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సస్పెన్షన్ ఆర్డర్ 'చిన్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు' దేవేశ్ శర్మ బాలికల సంరక్షణ గృహాన్ని సందర్శించినా, అక్కడ బాలికల పట్ల ఏదో జరగరానిది జరుగుతోందన్న విషయాన్ని ఆయన ఎన్నడూ పై అధికారులకు చెప్పలేదని సస్పెన్షన్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సమాధానంగా, తనకు టిస్ నివేదిక అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు దేవేశ్ శర్మ తెలిపారు. మే 29న తనకు టిస్ నివేదిక అందిందని, తాను మే 31నే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశానని ఆయన వెల్లడించారు. బాలికల సంరక్షణ గృహాన్ని సందర్శించినపుడు ఆయనకు అక్కడ ఎలాంటి అసహజమైన సంఘటనలూ కనిపించలేదా? దీనికి జవాబిస్తూ ఆయన, తనకు ఆ బాలికలు ఎన్నడూ ఏమీ చెప్పలేదన్నారు. తానే కాకుండా అక్కడికి మహిళా సంక్షేమ శాఖ అధికారులు కూడా వెళుతుంటారని, కానీ వాళ్లకూ ఎలాంటి సమాచారమూ లేదని తెలిపారు. బ్రజేష్ ఠాకూర్ టిస్ నివేదిక ఆధారంగా మే 31న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, అదే రోజు ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థకు ఒక టెండర్ మంజూరైంది. దానిపై సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతకం ఉంది. ప్రభుత్వం కేవలం చిన్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటోందా లేక వాటిపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులను కూడా బాధ్యులుగా చేస్తున్నారా అని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్ ప్రసాద్‌ను బీబీసీ ప్రశ్నించింది. బ్రజేష్ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు అయిన తర్వాత కూడా ఆయనకు ఎలా టెండర్ మంజూరైంది? దీనికి జవాబిస్తూ అతుల్ ప్రసాద్, ''బ్రజేష్ ఠాకూర్‌కు లభించిన టెండర్ బల్క్‌లో లభించింది. అయితే, జరిగిన సంఘటనతో దానిని రద్దు చేశాం'' అని తెలిపారు. మార్చి 15 తేదీతో ఉన్న టిస్ నివేదిక కానీ టిస్ నివేదిక ప్రభుత్వానికి మార్చి 15నే చేరింది. దానిలో బ్రజేష్ ఠాకూర్‌ తన ఇంటిలోనే బాలికల సంరక్షణ గృహాన్ని నిర్వహిస్తున్నాడని, అక్కడ బాలికలపై అత్యాచారం జరుగుతోందని పేర్కొన్నారు. మరి అలాంటప్పుడు ఆయనకు టెండర్ ఎలా మంజూరు చేశారు? దీనికి జవాబుబగా అతుల్ ప్రసాద్, టిస్ నివేదిక ప్రభుత్వానికి మే 27న అధికారికంగా అందిందని తెలిపారు. అయితే బీబీసీకి లభించిన పత్రాలను పరిశీలించినపుడు టిస్ తన నివేదికను ప్రభుత్వానికి మార్చి 15నే సమర్పించినట్లు తెలుస్తోంది. 'బాలికా సంరక్షణ గృహాన్ని డీఎమ్ ఎంపిక చేశారు' సస్పెండ్ అయిన అధికారుల్లో ఒకరు, సంరక్షణ గృహం పరిశీలన కోసం మహిళా కమిషన్ సభ్యులు కూడా వచ్చేవారని, అయితే వాళ్లు కూడా ఎన్నడూ అక్కడి పరిస్థితులపై ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తనను సస్పెండ్ చేసినపుడు, మరి వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? తన పేరు వెల్లడించరాదన్న షరతు కింద, సస్పెండైన మరో అధికారి - బ్రజేష్ కుమార్ బాలికల సంరక్షణ గృహానికి ఐదేళ్ల నుంచి డీఎమ్ ధర్మేంద్ర కుమార్ సింగ్ అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. బ్రజేష్ కుమార్ నివాసం సంరక్షణ గృహానికి సరిపోదన్న విషయం డీఎమ్‌కు తెలుసని, అయినా ఆయనకు టెండర్ మంజూరు చేశారని ఆయన తెలిపారు. అలాంటప్పుడు డీఎమ్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ''మమ్మల్ని బలిపశువులను చేశారు'' అని ఆ అధికారి అన్నారు. ఈ విషయం గురించి అతుల్ ప్రసాద్‌ను ప్రశ్నించినపుడు - విచారణ ఇంకా పూర్తి కాలేదని, ముందు ముందు మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు, తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ సస్పెండైన దేవేశ్ శర్మ ప్రస్తుత డీఎమ్‌కు లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది తానేనని, అందుకే తనకు చాలా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ముజఫర్‌పూర్‌లోని బాలికల సంరక్షణ గృహంలో 34 మంది బాలికలపై అత్యాచారం జరిగిన కేసులో ప్రభుత్వం శనివారం 21 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరి సస్పెన్షన్‌కు సిఫార్సు చేసింది. text: పశ్చిమాన, ఉత్తరాన తన కంచుకోటలను నిలబెట్టుకోవటమే కాదు.. తూర్పున, దక్షిణాన కొత్త ఖాతాలు తెరిచింది బీజేపీ. కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని మెరుగుపరచుకుంది. కానీ, ఆ పార్టీ సీట్లు స్వల్పంగానే పెరిగాయి. రాహుల్ గాంధీ తమ కుటుంబ నియోజకవర్గమైన అమేఠీని కోల్పోయారు. 1999 తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోవటం ఇదే మొదటిసారి. స్వాతంత్ర్యం తర్వాత మూడు సార్లు ఈ స్థానం కాంగ్రెస్ చేజారింది. మోదీ మ్యాజిక్ బీజేపీ విజయానికి కారణం మొత్తం నరేంద్రమోదీయే. ఇందిరాగాంధీ తర్వాత దేశం చూసిన అత్యంత బలమైన ప్రధానమంత్రి ఆయన. ఇంతకుముందలి ఎన్నికల్లో విఫలమైన అభ్యర్థులు సహా పార్టీలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ.. మోదీ వాటన్నిటినీ అధిగమించి నేరుగా ఓటరును ఆకట్టుకోగలిగారు. అంటే.. ప్రతిపక్షం జాగ్రత్తగా అల్లిన సామాజిక సంకీర్ణాలన్నీ - కులం, వర్గం, గ్రామీణ, పట్టణ విభజన వంటివి - ప్రధానమంత్రి మోదీ తలపడినప్పుడు తునాతునకలయ్యాయి. ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ సంక్షోభం వంటి సామాజిక, ఆర్థిక సమస్యలను తోసిరాజని విజయం సాధించటానికి.. బలమైన దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం సమర్థంగా పనిచేస్తుందని నరేంద్రమోదీ నిరూపించారు. మట్టికరిచిన ప్రతిపక్షం ఎన్నికల్లో విపక్ష వైఫల్యానికి బాధ్యుడిగా రాహుల్‌గాంధీ ఒక్కరి మీదే గురిపెడుతున్నారు. ఆయన బాధ్యత చాలా ఉందనటంలో సందేహంలేదు. ''చౌకీదార్ చోర్ హై'' అంటూ నరేంద్రమోదీ మీద వ్యక్తిగతంగా దాడి చేసే ఆయన ఎత్తుగడ పేలవమైనది. అది బలంగా బెడిసికొట్టింది. పొత్తులు కుదుర్చుకోవటంలో ఆయన అసమర్థత, అభ్యర్థుల ఎంపికలో జాప్యం, చివరి నిమిషంలో ప్రియాంకా గాంధీని రంగంలోకి తీసుకురావటం కూడా తీవ్ర వైఫల్యాలే. కానీ వాస్తవం ఏమిటంటే.. రాహుల్ గాంధీని మాత్రమే కాదు పెద్ద ప్రతిపక్ష నేతలు ప్రతి ఒక్కరినీ బీజేపీ మట్టికరిపించింది. ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్‌బంధన్‌గా ఏర్పడిన అఖిలేశ్ యాదవ్, మాయావతిలు కొంత సవాలు విసిరినట్లు కనిపించినప్పటికీ.. చివరికి వారు కూడా కొట్టుకుపోయారు. నరేంద్రమోదీతో నేరుగా తలపడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ.. తన సొంత ఇంట్లోనే అవమానం చవిచూశారు. మోదీతో ఢీకొట్టటానికి ప్రయత్నించిన మాజీ మిత్రులు - తనను ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయటానికి ప్రయత్నించిన టీఆర్ఎస్ నాయకుడు కె.చంద్రశేఖరరావు, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌లకు సైతం వారి స్థానం ఏమిటో బీజేపీ తెలియజెప్పింది. విస్తరణవాద బీజేపీ బీజేపీ దిగ్భ్రాంతికర ఫలితాలకు నేటి భారతదేశపు రాజకీయ పటం అద్దం పడుతోంది. గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, దిల్లీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో దాదాపు అన్ని సీట్లనూ గెలుచుకోవటం ద్వారా.. 2014 విజయాన్ని పునరావృతం చేయగలగటం అద్భుతం. ఆ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో సీట్లు కోల్పోయింది కానీ అనుకున్నన్ని కాదు. బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, అసోంలలో గత ఫలితాల కన్నా మెరుగుపడింది కూడా. అన్నిటికీ మించి బీజేపీకి, ఆ పార్టీ నాయక ద్వయం - మోదీ, అమిత్‌షాలకు మోదం కలిగించేది ఏమిటంటే, పార్టీ కొత్త ప్రాంతాలకు విస్తరించటం. బెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో గతంలో ప్రతిపక్షం చేతుల్లో ఉన్న స్థానాలకు బీజేపీ విస్తరించింది. అక్కడ ప్రాంతీయ పార్టీలకు.. కనీసం బెంగాల్, ఒడిశాలలో బలమైన ప్రత్యర్థి అవుతోంది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఫలితాలు అద్భుతం.. అంతటి విజయాలను ఆ పార్టీ సైతం ఊహించి ఉండకపోవచ్చు. పార్టీని, సంఘ్‌పరివార్‌ను, ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్‌ను బాగా సంతోషం కలిగించే విషయం ఏమిటంటే.. ఆ విజయం వామపక్షాలను దెబ్బతీసి సాధించటం. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట అయిన బెంగాల్‌లో ఇప్పుడు వామపక్ష ఎంపీ ఒక్కరు కూడా లేరు. పాలక వారసత్వాల పరాజయం అమేఠీలో రాహుల్‌గాంధీ ఓటమి.. దేశంలోని చాలా ప్రాంతాల్లో కుటుంబ, వారసత్వ రాజకీయాలను ఎలా తిరస్కరించారనేది చాటిచెప్తోంది. బీజేపీలో సైతం కుటుంబ వారసత్వ రాజకీయ నాయకులు - హిమాచల్‌ప్రదేశ్‌లో అనురాగ్ ఠాకూర్, రాజస్థాన్‌లో దుష్యంత్ సింత్, మహారాష్ట్రలో పూనమ్ మహాజన్ వంటి వారు - ఉన్నప్పటికీ.. ప్రధానంగా ప్రతిపక్షాన్నే.. అంటే కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలనే వారసత్వ రాజకీయాలు అధికంగా ఉన్న పార్టీలుగా జనం పరిగణిస్తారు. వారిలో చాలా మందిని ఓటర్లు తిరస్కరించారు. కాంగ్రెస్‌లో ఓటమి పాలైన వారసుల్లో రాహుల్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా, జితన్ ప్రసాద్, అశోక్ చవాన్‌ తదితరులు ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్ కోడలు డింపుల్, మేనల్లుడు ధర్మేంద్రయాదవ్, లాలూప్రసాద్ కుమార్తె మీసా భారతి, టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవితలు కూడా పరాజయం పాలయ్యారు. అయితే జయించగలిగిన వారు కొంతమంది ఉన్నారు. అందులో అతి ముఖ్యమైన వారు డీఎంకే కరుణానిధి వారసులు. కనిమొళి, దయానిధి మారన్‌లు విజయం సాధించారు. కానీ.. ఓట్లు గెలవటానికి కుటుంబ వారసత్వం ఒక్కటే సరిపోదన్నది స్పష్టమైంది. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఓటమి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చాటుతోంది. కాంగ్రెస్‌ను కాపాడిన దక్షిణాది మరైతే.. భారతదేశపు అతి పురాతనమైన గొప్ప పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు కనుక ఆదుకోకపోయినట్లయితే.. ఆ పార్టీ పరిస్థితి చరిత్రలో అత్యంత దారుణ స్థితికి దిగజారి ఉండేది. కాంగ్రెస్ గెలిచిన సుమారు 50 సీట్లలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లోనే దాదాపు 30 సీట్లు ఉన్నాయి. మిగిలిన సీట్లలోనూ అత్యధికం పంజాబ్ నుంచి వచ్చాయి. కానీ వాస్తవం ఏమిటంటే.. ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. హరియాణా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పట్టుసాధించలేకపోయింది. కేవలం కొన్ని నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోనూ పట్టు కోల్పోయింది. రాహుల్ గాంధీ నాయకత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సోదరి ప్రియాంక కూడా ప్రభావం చూపలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి ఆలోచిస్తుందా? ముఖ్యమైన విషయం, లోక్‌సభలో ఎన్‌డీఏకి భారీ మెజారిటీ ఉంది. ఒకవేళ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కూడా ఎన్‌డీఏకి మద్దతు ఇస్తే దిగువ సభలో ఆ కూటమి మెజారిటీ మూడింట రెండు వంతులు దాటిపోతుంది. అదే జరిగితే, ప్రతిపక్షం అనేది పేరుకు మాత్రమే మిగులుతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా చూసినా చరిత్రాత్మకమైనవనే చెప్పాలి. 1971లో ఇందిరాగాంధీ సాధించిన విజయం తర్వాత.. వరుసగా రెండోసారి సంపూర్ణ మెజారిటీ సాధించిన రెండో ప్రధానమంత్రి నరేంద్రమోదీ. text: ఆయన మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం ఆగస్ట్ 10న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స తరువాత ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో చికిత్స అందించారు. అయితే.. సర్జరీ అనంతరం ప్రణబ్ ముఖర్జీ కోమాలోకి వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తున్నారు. ప్రణబ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ట్విటర్‌లో వెల్లడించారు. ఆగస్టు 10వ తేదీన ప్రణబ్ స్వయంగా.. తాను చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినపుడు కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చిందని ట్వీట్ చేశారు. అప్పటికి వారం రోజులుగా తనను కలిసి వారందరూ ఐసొలేట్ అయ్యి.. కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. అదే ఆయన ఆఖరి ట్వీట్ అయింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయానికికి పూర్తి సైనిక లాంఛనాల మధ్య మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. దిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్-19 ఆంక్షలు పాటిస్తూ, కుటుంబ సంప్రదాయాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కోవిడ్-19 దృష్ట్యా గన్ క్యారేజీకి బదులుగా ఓ అంబులెన్స్‌లో ప్రణబ్ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువచ్చారు. అంతకుముందు, ఈరోజు ఉదయమే ప్రణబ్ మృతదేహాన్ని ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసానికి తరలించారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, దీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రణబ్‌కు నివాళులు అర్పించారు. ఏడు రోజులు సంతాప దినాలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రణబ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ప్రభుత్వ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న బెంగాల్ (ఇప్పుడు పశ్చిమ బెంగాల్)లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. "బెంగాల్‌లోని ఒక చిన్న దీపపు వెలుగు నుంచి దిల్లీ షాండ్లియర్ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను" అని తన జీవన ప్రయాణాన్ని ఆయన ఓ సందర్భంలో వివరించారు. కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ప్రస్థానం ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి. ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభలో కొనసాగారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు. కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా... భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు. 1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు. ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. 2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు. మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు. ఇక సెలవు: ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయంగానూ గుర్తింపు ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు. భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు. వ్యక్తిగత జీవితం ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో "థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014), ద టర్బులెంట్ ఇయర్స్ (2016), కొయిలేషన్ యియర్స్ (2017) విమర్శకుల ప్రశంసలు పొందాయి. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ‘‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయం గురించి వినగానే నా మనసు దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం ఒక శకానికి ముగింపు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి, స్నేహితులకు, దేశ ప్రజలందరికీ నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను’’ అంటూ రాష్ట్రపతి కోవింద్ సంతాపం తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘‘భారత రత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారతదేశం విషాదంలో మునిగింది. ఆయన మన దేశ అభివృద్ధి పథంలో చెరగని ముద్ర వేశారు. ఒక సమర్థుడైన విద్యావంతుడుగా, అత్యున్నత రాజనీతిజ్ఞుడుగా ఆయన రాజకీయాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకున్నారు’’ అంటూ సంతాపం వ్యక్తంచేశారు. ప్రణబ్ ముఖర్జీ మృతికి కాంగ్రెస్ ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేసింది. ‘‘ప్రణబ్ ముఖర్జీ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన ప్రణబ్ ముఖర్జీ ఆయన చిత్తశుద్ధి, కరుణకు ఎప్పటికీ చిరస్మరణీయులుగా ఉంటారు. ఆయన కుటుంబం, దేశంతో కలిసి మేం ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొంది. ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి వ్యూహాత్మక నష్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక ట్వీట్‌లో విచారం వ్యక్తంచేశారు. ఆయన గత ఐదు దశాబ్దాలుగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ''మాజీ భారత రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మరణం తీవ్ర విషాదం నింపింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారు'' అని కేటీఆర్ సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్షవర్దన్, స్మృతి ఇరానీలతోపాటూ మమతా బెనర్జీ, విజయసాయిరెడ్డి, నారా లోకేష్, సినీ నటులు మహేశ్ బాబు, నాగబాబు కూడా ప్రణబ్ ముఖర్జీ మృతికి ట్విటర్‌లో సంతాపం తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి మంగళవారం మధ్యాహ్నం దిల్లీలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. text: ఫయాజుల్ హసన్ ఫయాజుల్ హసన్‌ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన నాయకుడు. ఫయాజుల్ హసన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు పీటీఐ మంగళవారం ట్విటర్‌లో పేర్కొంది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 హిందూ సమాజం గురించి కించపరిచే వ్యాఖ్యల నేపథ్యంలో ఫయాజుల్ హసన్‌ను తమ పార్టీ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వం పదవి నుంచి తొలగించిందని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ ట్విటర్‌లో తెలిపింది. ''ఇతరుల మతవిశ్వాసాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడరాదు. పరమత సహనం పునాదులపైనే పాకిస్తాన్ నిర్మితమైంది'' అని పీటీఐ చెప్పింది. ఫయాజుల్ హసన్ ఫయాజుల్ హసన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ అధికార ప్రతినిధి షాబాజ్ గిల్ ధ్రువీకరించారు. ఫయాజుల్ హసన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఆయన వ్యాఖ్యలతో పంజాబ్ ప్రభుత్వానికి సంబంధం లేదని షాబాజ్ గిల్ ఒక వీడియో సందేశంలో చెప్పారు. హిందూ సమాజానికి ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దూర్ సంఘీభావం ప్రకటించారని, మైనారిటీల (పాకిస్తాన్‌లో హిందువులు మైనారిటీలు) మనసును గాయపరిచే ఎలాంటి ప్రకటనలు చేసినా, పనులకు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారని ఆయన వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర సమాచార, సాంస్కృతికశాఖ మంత్రి ఫయాజుల్ హసన్ చోహాన్ పదవికి రాజీనామా చేశారు. text: దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్‌'లో మొత్తం 650 స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సాధించాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాలి. కన్జర్వేటివ్‌ పార్టీ 364 స్థానాలు సాధించింది. మూడు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీకి ఇంత భారీ మెజార్టీ సాధించడం ఇదే తొలిసారి. ఇప్పుడు పార్లమెంటులో ఎలాంటి అడ్డంకులు లేకుండా బ్రెగ్జిట్‌‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం బోరిస్‌ సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతగా థెరిసా మే స్థానంలో బోరిస్ జాన్సన్ ఎన్నికైన తర్వాత 2019 జూలైలో ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజల మద్దతు లేకుండానే జాన్సన్ ప్రధాని పీఠం ఎక్కారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శించారు. తాజా ఎన్నికల ఫలితాలతో ఆ విమర్శలు పటాపంచలయ్యాయి. 1987లో మార్గరెట్ థాచర్ విజయం తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీకి ఇంత భారీ మెజార్టీ రావడం ఇదే తొలిసారి. బోరిస్ జాన్సన్ ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేశారు, ఆ తరువాత రాజకీయల్లోకి ప్రవేశించారు. కన్జర్వేటివ్‌ పార్టీకి నాయకుడిగా, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆ హోదాలో కూర్చునేందుకు ఆయనకు తగిన అర్హతలు లేవంటూ చాలా మంది విమర్శలు చేశారు. ఆ మాటలన్నీ తప్పు అని తాజా ఎన్నికలతో ఆయన నిరూపించారు. టర్కిష్ పూర్వీకులు బోరిస్ జాన్సన్ తనను తాను 'యూరోసెప్టిక్' అని చెప్పుకుంటారు. ఆయన పూర్వీకులది టర్కీ. తాత జర్నలిస్టు. తండ్రి దౌత్య అధికారి, తల్లి కళాకారిణి. వారి కుటుంబం న్యూయార్క్‌లో నివాసం ఉన్నప్పుడు 1964 జూన్ 19న బోరిస్ జాన్సన్ జన్మించారు. తర్వాత వారి కుటుంబం యూకేలో స్థిరపడింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రాచీన సాహిత్యం చదివారు. 'ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేటింగ్' సొసైటీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. చదువు పూర్తయ్యాక జర్నలిజంలో కెరీర్ ప్రారంభించారు. మొదట ది టైమ్స్ పత్రికలో పనిచేశారు. అయితే, ఒకరి వ్యాఖ్యను వక్రీకరించారన్న ఆరోపణతో ఆ పత్రిక ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. కన్సర్వేటివ్ పార్టీకి అనుకూలమైన ది డైలీ టెలీగ్రాఫ్ పత్రికకు బ్రస్సెల్స్‌లో ప్రతినిధిగా చేరారు. 1986 జూన్‌లో బోరిస్ జాన్సన్ రచయితగా ఆ తర్వాత యూకేలో టెలిగ్రాఫ్ పత్రిక కోసం ప్రత్యేక రచయితగా పనిచేశారు. ఆ తరువాత మితవాద అనుకూల మ్యాగజైన్ 'ది స్పెక్టేటర్' సంపాదకుడు అయ్యారు. ఆ పత్రికలో ఆఫ్రికన్లు, ఒంటరి తల్లుల గురించి ఆయన వాడిన పదజాలంపై విమర్శలు వచ్చాయి. అయినా, ఆ పత్రిక సర్క్యులేషన్ బాగానే పెంచగలిగారు. "హావ్ ఐ గాట్ న్యూస్ ఫర్ యు?" అనే ప్రముఖ బీబీసీ కార్యక్రమంలో క్రమం తప్పకుండా కనిపించడం ప్రారంభించిన తర్వాత అయన అనేక మందికి పరిచయమ్యారు. ఆ కార్యక్రమంలో ప్యానెలిస్టులు ఒక వారంలో వచ్చిన వార్తల మీద చమత్కారంతో కూడిన జోకులు వేసేందుకు ప్రయత్నిస్తారు. ఆయన మాటలు, అభిప్రాయాలు విమర్శలకు కారణమవ్వడంతో పాటు, ఆయనను రాజకీయ ప్రముఖుడినీ చేశాయన్నది ఆయన జీవిత చరిత్ర రాసిన సోనియా పర్నెల్ సహా చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో 2001లో జాన్సన్ ఎంపీ అయ్యారు. 2007లో లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. జూలై 2010లో ప్రవేశపెట్టిన "బోరిస్ బైక్" అనే అద్దె సైకిళ్ల కార్యక్రమం ఆయన ప్రారంభించిన అత్యంత ప్రతిష్ఠాత్మక రవాణా కార్యక్రమాలలో ఒకటి. అందరూ ఆయన్ను సింపుల్‌గా బోరిస్ అని పిలుస్తారు. జాన్సన్ విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. యువరాణి డయానా జ్ఞాపకార్థం థేమ్స్ నదిపై ప్రతిష్ఠాత్మక గార్డెన్ బ్రిడ్జి నిర్మించేందుకు చేసిన ప్రణాళికలను జాన్సన్ వారసుడు సాదిక్ ఖాన్ చేత రద్దు చేశారు. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపు 70 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన తరువాత రద్దు చేయడం విమర్శలకు దారితీసింది. బ్రెగ్జిట్ ఛాంపియన్ 2016లో ఈయూ నుంచి యూకే బయటకు వచ్చే అంశం (బ్రెగ్జిట్) పై రెఫరెండం ఓటింగ్ జరిగింది. అయితే, బ్రెగ్జిట్ మీద మొదట్లో బోరిస్ జాన్సన్ వైఖరి అస్పష్టంగా ఉండేది. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగాలనడాన్ని విభేదిస్తూ ఒక వార్తాపత్రికకు ఆయన కథనాన్ని కూడా రాశారు. బ్రిటన్ ఈయూలోనే ఉండాలని చెప్పారు. కానీ, చివరికి సొంత పార్టీ (కన్జర్వేటివ్‌ పార్టీ) నాయకుడు కేమరూన్‌ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్న బ్రెగ్జిట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రెఫరెండం పోల్స్‌లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఎక్కువ ఓట్లు రావడంతో కేమరూన్ రాజీనామా చేశారు. దాంతో, కన్జర్వేటివ్‌ పార్టీ అధినాయకుడి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బోరిస్ జాన్సన్ ప్రయత్నించారు. కానీ, ఆయనకు బదులుగా థెరిసా మే విజేతగా నిలిచారు. బ్రెగ్జిట్ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకున్న బోరిస్ జాన్సన్‌ను విదేశాంగ మంత్రిగా థెరిసా మే నియమించారు. థెరిసా మే స్థానంలో కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాక 2019 జూలైలో ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే 2020 జనవరి 21 నాటికి యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేస్తుందని ఎన్నికల ప్రచారంలో బోరిస్ జాన్సన్ అన్నారు. ఇప్పటికే ఈయూతో ఒప్పందానికి అంగీకారం కుదిరింది. ఇప్పుడు దిగువ సభలో కన్జర్వేటివ్‌ పార్టీ భారీ మెజార్టీ సాధించింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే నెలలో ఈయూ నుంచి బ్రిటన్‌ను బయటకు తీసుకు రావడానికి ప్రజలు తమకు శక్తిమంతమైన అధికారాన్ని ఇచ్చారని జాన్సన్ తాజాగా అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో, ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగనున్నారు. text: "అమెరికా రహస్యాలు దొంగిలిస్తూ, మార్కెట్లో అమెరికా సంస్థలను భర్తీ చేస్తూ చైనా తన శక్తి పెంచుకుంటోంద"ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్‌ రాట్‌క్లిఫ్ అన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం చైనాపై కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా వస్తువులపై సుంకాలు విధించింది. తమ మేధోసంపత్తిని దొంగిలిస్తున్నారని ఆ దేశంపై ఆరోపణలు చేసింది. కానీ, చైనా ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు. అయితే, తమ టెక్ దిగ్గజం హువావేను అమెరికా మార్కెట్‌కు దూరంగా పెట్టడం, తమ వస్తువులపై సుంకాలు విధించడం లాంటి చర్యలపై చైనా స్పందించింది. "ఆర్థికంగా, సైనికపరంగా, సాకేతికంగా ప్రపంచ ఆధిపత్యమే లక్ష్యంగా చైనా అమెరికాను ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తోంద"ని రాట్‌క్లిఫ్ ఆరోపించారు. ఆయన కొన్ని వ్యాఖ్యల్లో అంతకు ముందు విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టఫర్ ప్రస్తావించిన అంశాలు కూడా ప్రతిధ్వనించాయి. అయితే, అమెరికా మిత్రదేశమైన ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచిన చైనా, ఆస్ట్రేలియా వైన్ మీద దిగుమతిపై సుంకాలు విధించి, అఫ్గానిస్తాన్‌లో హక్కుల ఉల్లంఘన గురించి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్న సమయంలో రాట్‌క్లిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘చైనాపై రకరకాల రాజకీయ అణచివేత చర్యలను ప్రారంభించారు. చైనాను అదుపు చేయాలనే ఒక బలమైన సైద్ధాంతిక పక్షపాతం, వ్యూహంతో ఇలా చేస్తున్నారు. అందరిపై గూఢచారులనే ముద్ర వేయడం అమెరికా మానేస్తుందని మేం ఆశిస్తున్నాం" అని చైనా విదేశాంగ మంత్రి హువా చున్యింగ్ బుధవారం ఆరోపించారు. రాట్‌క్లిఫ్ ఇంకా ఏమన్నారు అమెరికా ఇంటెలిజెన్స్ ప్రధానంగా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, రష్యాపై దృష్టిపెట్టేదని, ఇప్పుడు వాటి స్థానాన్ని చైనా భర్తీ చేసిందని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రాట్‌క్లిఫ్ అన్నారు. చైనా ఒకరకమైన ఆర్థిక గూఢచర్యంలో మునిగుందన్న ఆయన ఆ చర్యలను 'రాబ్, రెప్లికేట్, రీప్లేస్‌'గా వర్ణించారు. ప్రపంచమంతటా తన ఉత్పత్తులు అమ్మాలనుకున్న ఒక చైనా విండ్ టర్బైన్ సంస్థ, అమెరికాలో తన ప్రత్యర్థి సంస్థ సమాచారం దొంగిలించి దోషిగా నిలిచిందని దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. షేర్ల ధరలు పడిపోవడంతో సదరు అమెరికా సంస్థ తమ సిబ్బందిని కూడా తొలగించిందని చెప్పారు. అమెరికా నుంచి ప్రతి ఏటా 500 బిలియన్ డాలర్ల విలువైన మేథోసంపత్తి చౌర్యానికి గురవుతోందని, తమ పరిశోధనలను దొంగిలిస్తున్న చైనీయులను ఎఫ్‌బీఐ తరచూ అరెస్ట్ చేస్తోందని రాట్‌క్లిఫ్ అన్నారు. హార్వార్డ్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం చీఫ్‌కు, ఈ ఏడాది ప్రారంభంలో ఆయన అరెస్ట్ అయ్యే ముందు వరకూ అది నెలకు 50 వేల డాలర్లు చెల్లించేదని ఆరోపించారు. హువావే లాంటి టాప్ చైనా టెక్నాలజీ సంస్థలు అందించే సాంకేతికతలో చైనా నిఘా ఇంటెలిజెన్స్ వర్గాలు జోక్యం చేసుకుంటున్నాయని, ఫలితంగా.. చైనా టెక్నాలజీని ఉపయోగించే మిత్రదేశాలతో తమ నిఘా సమాచారాన్ని పంచుకోలేకపోతున్నామని తెలిపారు. జీవశాస్త్రపరంగా మెరుగైన సామర్థ్యాలు ఉన్న సైనికులను తయారు చేయడానికి చైనా తమ సైన్యంలో 'మనుషులపై ప్రయోగాలు చేసిందనే విషయాన్ని అమెరికా నిఘా దళాలు బయటపెట్టాయని అన్నారు. చైనా తమ కాంగ్రెస్ సభ్యులను రష్యాకంటే ఆరు రెట్లు, ఇరాన్ కంటే 12 రెట్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుందన్నారు. అమెరికాలాగే మిగతా దేశాలు కూడా చైనా నుంచి ఇలాంటి సవాళ్లే ఎదుర్కుంటున్నాయి. "తాము అగ్ర స్థానంలో లేని ప్రపంచ క్రమాన్ని చైనా ఒక చారిత్రక ఉల్లంఘనగా భావిస్తోంది. దానిని మార్చి, ప్రపంచమంతటా వ్యాపించిన స్వేచ్ఛను లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రెండో ప్రపంచ యుద్ధం నుంచి చైనా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు పెను ముప్పుగా మారిందని అమెరికా టాప్ ఇంటెలిజెన్స్ అధికారి అన్నారు. text: నుస్రత్ జహాన్‌ను కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశారు. 19 ఏళ్ల నుస్రత్ జహాన్ రఫీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కి.మీ. దూరంలో ఉన్న ఫెనీ పట్టణంలో ఏప్రిల్‌లో హత్యకు గురయ్యారు. లైంగిక వేధింపులపై నుస్రత్ ఫిర్యాదు చేసిన ప్రధాన ఉపాధ్యాయుడు, మరో ఇద్దరు విద్యార్థినులు ఈ కేసులో ప్రధాన నిందితులు. నుస్రత్ హత్య దేశవ్యాప్తంగా అలజడి రేపింది. ఆమెకు న్యాయం చేయాలంటూ ఎన్నో నిరసనలు జరిగాయి. ఈ కేసులో విచారణ చాలా వేగంగా ముగిసింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో సంవత్సరాల తరబడి విచారణ జరిగే బంగ్లాదేశ్‌లో ఈ కేసు విచారణ మాత్రం చాలా వేగంగా జరిగింది. హత్య చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని మరోసారి రుజువైంది అని ప్రాసిక్యూటర్ హఫీజ్ అహ్మద్ మీడియాతో అన్నారు. ఈ తీర్పుతో తన బాధ కొద్దిగా తగ్గిందని నుస్రత్ తల్లి చెప్పారు. "నేనిప్పటికీ నుస్రత్‌ను మర్చిపోలేకపోతున్నా. ఆమె ఎంత బాధ అనుభవించిందో నాకు నిరంతరం గుర్తొస్తూనే ఉంటుంది" అని తీర్పు విన్న తర్వాత షిరిన్ అక్తర్ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పీల్ చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సిరాజ్ ఉద్దౌలా నుస్రత్ హత్య కేసు విచారణలో ఆమె చేసిన ఆరోపణలను బయటకు రాకుండా చేసేందుకు జరిగిన కుట్రకోణం వెల్లడైంది. దీనిలో ఆమె తోటి విద్యార్థినులు, ఆ వర్గంలోని కొందరు పెద్దల పాత్ర కూడా ఉంది. ప్రధానోపాధ్యాయుడు సిరాజ్ ఉద్దౌలాతోపాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు రుహుల్ అమీన్, మక్సూద్ ఆలమ్‌లను ఈ హత్యకు బాధ్యులుగా కోర్టు నిర్ణయించింది. వేధింపుల ఆరోపణలపై అరెస్టై జైలులో ఉన్న సిరాజ్.. జైలు నుంచే ఆమె హత్యకు ఆదేశాలిచ్చారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులు అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన స్థానిక నేతలు. నుస్రత్‌ది హత్య కాదు, ఆత్మహత్య అనే అసత్య ప్రచారానికి వీరికి స్థానిక పోలీసులు కూడా సహకరించారని నిర్ధరణైంది. నుస్రత్ హత్యకు నిరసనగా ఏప్రిల్ 12న ఢాకాలో జరిగిన నిరసన పోలీసులకు ఫిర్యాదు చేయాలని మార్చిలో నుస్రత్ జహాన్ నిర్ణయించుకున్నప్పుడు ఆమె కుటుంబం పూర్తిగా మద్దతునిచ్చింది. అప్పటి నుంచి ఆమెకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటైంది. ఇప్పటికీ తాము భయంతోనే బతుకుతున్నామని ఆమె సోదరుడు మహ్మదుల్ హసన్ నోమన్ తెలిపారు. "వాళ్లు కోర్టు గదిలోనే నన్ను బెదిరించారు. అది మీకు తెలుసు. నాకు చాలా భయంగా ఉంది. మాకు భద్రత కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా. మా భద్రతపై పోలీసులు కూడా దృష్టిసారించాలని కోరుతున్నా" అని నోమన్ మీడియాతో అన్నారు. కోర్టు తీర్పును నుస్రత్ కుటుంబం స్వాగతించింది. శిక్ష త్వరగా అమలు కావాలని కోరింది. బంగ్లాదేశ్‌లో మరణశిక్షను ఉరివేయడం ద్వారా అమలు చేస్తారు. ఆగ్రహం, కన్నీళ్లు... న్యాయం కోసం పోరాటం అక్బర్ హుస్సేన్, ఫెనీ నుంచి బీబీసీ బెంగాలీ ప్రతినిధి కోర్టు తీర్పు వెలువడగానే నుస్రత్ కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ నిందితుల తరపు వాళ్లు గట్టిగా కేకలు వేశారు. కానీ, బంగ్లాదేశ్‌లో సాధారణంగా నుస్రత్ లాంటి మహిళలకే అన్యాయం జరుగుతుంటుంది. బంగ్లాదేశ్‌లోని విద్యా సంస్థలు, మదర్సాలలో లైంగిక వేధింపులు చాలా ఎక్కువ. దీనిపై మాట్లాడితే జరిగే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. నుస్రత్‌కు ఏమైంది? ఈ సంవత్సరం ఏప్రిల్ 6న స్కూలు పైభాగంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. ఇది జరిగిన 11 రోజుల తర్వాత, తనను అసభ్యకరంగా తాకుతున్నారంటూ ప్రధానోపాధ్యాయుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బుర్ఖాలు ధరించిన నలుగురైదుగురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టి ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఆమె తిరస్కరించారు. దీంతో ఆమెను మంటల్లో తగలబెట్టి హత్య చేశారు. "దీన్ని వాళ్లు ఆత్మహత్య కింది చిత్రీకరించాలని ప్రయత్నించారు. కానీ, ఆమె తప్పించుకుని, సహాయాన్ని కోరడంతో విషయం బయటికొచ్చింది" అని పోలీసులు తెలిపారు. తను తీవ్ర గాయాలపాలైందని తెలుసుకున్న తర్వాత.. ఆమె తన సోదరుడి ముందు ఓ వాంగ్మూలాన్నిచ్చింది. ఆతడు దాన్ని ఫోన్‌లో రికార్డు చేశాడు. "ఆ ఉపాధ్యాయుడు నన్ను అసభ్యంగా తాకాడు. నా చివరి శ్వాస వరకూ నేను దీనిపై పోరాడతా" అంటూ దాడికి పాల్పడిన వారి పేర్లను వెల్లడించింది. శరీరంపై 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 10న ఆమె మరణించింది. సమాజంలో నెలకొన్న సమస్య తీవ్రతను ఈ కేసు తెలియజేస్తోందంటూ మహిళా సంఘాలు ప్రదర్శన చేశాయి. బంగ్లాదేశ్‌లో లైంగిక వేధింపులు ఎక్కువేనా? బంగ్లాదేశ్‌లో లైంగిక వేధింపులు సర్వసాధారణం.. వస్త్ర పరిశ్రమలో పనిచేసే 80శాతం మంది మహిళలు వేధింపులను చూడటమో, అనుభవించడమో జరిగిందని యాక్షన్ ఎయిడ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నివేదిక ఈ సంవత్సరంలో వెల్లడించింది. మరోవైపు, 2019లో మొదటి ఆరు నెలల్లో లైంగికంగా వేధింపులకు గురై 26 మంది మహిళలు చనిపోయారు, 592 మంది అత్యాచారానికి గురయ్యారు, 113 మంది మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారని మహిళా హక్కుల సంస్థ 'మహిళా పరిషద్' తెలిపింది. ఇవి కేవలం అధికారిక లెక్కలు. కానీ వాస్తవ పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉండొచ్చు. లైంగిక వేధింపులపై నుస్రత్ మాదిరిగా బహిరంగంగా మాట్లాడటం ఇక్కడ చాలా తక్కువ. ఇక దీనిపై ఫిర్యాదు చేయడం ప్రమాదంతో కూడిన వ్యవహారం. నుస్రత్ కేసు ప్రత్యేకం. ఎందుకంటే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె వాంగ్మూలాన్ని వారు ఫోన్లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఇది మీడియాకు చేరింది. మరోవైపు, ప్రధానోపాధ్యాయుడిని విడుదల చేయాలంటూ కొందరు నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో నుస్రత్ కుటుంబం మరింత ప్రమాదంలో పడింది. ఈ నేరంలో 16మంది పాత్ర ఉందని విచారణలో వెల్లడైంది. (జైలు వ్యానులో వారిని చూడొచ్చు) నుస్రత్ హత్యపై ప్రజలు ఎలా స్పందించారు? నుస్రత్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైంది. లైంగిక వేధింపుల బాధితులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో తెలియచేసింది. చట్టపరంగా తీసుకునే చర్యల నుంచి ఏ ఒక్క దోషీ తప్పించుకోలేడని ప్రధాన మంత్రి షేక్ హసీనా బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆమె చూపిన ప్రత్యేక శ్రద్ధ నుస్రత్ కుటుంబానికి కొంత ధైర్యాన్నిచ్చింది. "ఇంత త్వరగా న్యాయం జరుగుతుందని మేం ఊహించలేదు. దీనికి మేం ప్రధానికి నేరుగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. ఆమె అవకాశం ఇస్తారనే ఆశిస్తున్నాం" అని నోమన్ అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను పోలీసులు మొదట కొట్టిపారేసినా, మే నెలలో 16మందిపై అభియోగాలు నమోదు చేశారు. వేగంగా జరిగిన ఈ కేసు విచారణ 62 రోజుల్లో పూర్తైంది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిందని విద్యార్థినిని మంటల్లో తగలబెట్టి హత్యచేసినందుకు 16మందికి ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు తీర్పునిచ్చింది. text: జయరాజ్ పి.జయరాజ్ (58), ఆయన కుమారుడు ఫెనిక్స్(38)లను లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం మూసివేయాల్సిన సమయం తరువాత కూడా దుకాణం తెరిచే ఉంచారన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.. ఆ సమయంలో ఒకరి తరువాత ఒకరు మరణించారు. ఈ సంఘటనపై తమిళనాడు రాష్ట్రమంతటా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో , రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదప్పాడి కె. పళనిసామి ఆదివారం ఒక ప్రకటన చేస్తూ, హైకోర్టు అనుమతిస్తే దీనిపై సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారు. ఫెనిక్స్ జూన్ 19న ఏం జరిగిందంటే షాపులు మూయంచేందుకు పోలీసులు వచ్చినప్పుడు ఫెనిక్స్‌కు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఫెనిక్స్‌, ఆయన తండ్రి జయరాజ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జయరాజ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.వారి వెనకే ఫెనిక్స్ కూడా స్టేషన్‌కు వెళ్లారు. జయరాజ్‌ను, ఫెనిక్స్‌ను పోలీసులు స్టేషన్‌లోని సెల్‌లో బంధించారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం, లాక్‌డౌన్‌లో అనుమతించిన సమయం దాటాక కూడా నడుస్తున్న షాపులను మూయించేందుకు పోలీసులు వెళ్లినప్పుడు జయరాజ్, ఫెనిక్స్, వారి మిత్రులు కొందరు వారి దుకాణం ముందు నిల్చొని ఉన్నారు. వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. కానీ, వారు పోలీసులనే తిట్టారు. పోలీసుల విధులకు అడ్డుపడ్డారు. పోలీసు అధికారిని చంపేస్తామని కూడా వారు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్‌లో ఉంది. జయరాజ్, ఫెనిక్స్‌లపై 188, 269, 294(బీ), 353, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. జూన్ 21న వాళ్లిద్దరినీ కోవిల్‌పట్టి సబ్ జైలుకు పంపించారు. జయరాజ్, ఫెనిక్స్ కిందపడ్డారని, వాళ్లకు అంతర్గత గాయాలయ్యాయని కూడా ఎఫ్ఐఆర్‌లో ఉంది. కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఫెనిక్స్ మరణించారు. మంగళవారం ఉదయం జయరాజ్ ప్రాణాలు కోల్పోయారు. కస్టడీ మరణాలపై నిరసన ''జూన్ 22 సాయంత్రం తలనొప్పి కారణంగా ఫెనిక్స్ చనిపోయారు. జైలు సూపరింటెండెంట్ సాయంతో డ్యూటీలో ఉన్న వార్డెన్ ఆయన్ను చికిత్స కోసం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, రాత్రి 9 గంటలకు ఆయన చనిపోయారు. కొన్ని గంటల తర్వాత జయరాజ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆయన మరణించారు'' అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు. ''కింద పడటం వాళ్లకు అలాంటి గాయాలవుతాయా? సతాంకులంలో చాలా జైళ్లు ఉన్నాయి. అయినా, వారిని వంద కి.మీ.ల దూరంలోని కోవిల్‌పట్టి జైల్లో ఎందుకు పెట్టారు'' అని జయరాజ్, ఫెనిక్స్‌ల బంధువు చార్లెస్ ప్రశ్నించారు. రక్తస్రావం వల్ల ఫెనిక్స్ మరణించారని, ఫెనిక్స్ మలద్వారంలో లాఠీ పెట్టారని చార్లెస్ ఆరోపించారు. అయితే, పోలీసుల నుంచి అధికారిక పోస్ట్ మార్టమ్ నివేదికను ఇంకా కోర్టులో సమర్పించలేదు. ఈ ఉదంతంపై మానవ హక్కుల సంఘం పోలీసులకు నోటీసులు పంపింది. సతాంకులానికి ఓ విచారణ కమిటీని పంపినట్లు తెలిపింది. తాజాగా జూన్ 28న ముఖ్యమంత్రి పళనిసామి దీనిపై స్పందించారు. హైకోర్టు అనుమతితో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తామన్నారు. కోవిల్‌పట్టి జైలు తండ్రీకొడుకుల మృతి తరువాత ఏమైంది? మరణానికి ముందు ఆ తండ్రీకొడుకులిద్దరినీ తీవ్రంగా వేధించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని విపక్ష ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై నిరసన వ్యక్తంచేశారు. వర్తక సంఘాలూ పోలీసుల చర్యను ఖండించాయి. స్థానిక న్యాయస్థానం ఒకటి ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఈ తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసును ప్రభుత్వం బదిలీ చేసింది. బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అందించింది. అమెరికాలో జరిగితే ఇండియాలో స్పందించారు.. దక్షిణ భారతంలో జరిగితే స్పందించలేదు అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీస్ అధికారి మోకాలితో మెడపై నొక్కిపెట్టి హతమార్చిన ఘటన తరువాత దానిపై భారత్‌లోనూ సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు. కానీ, తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై మాత్రం పెద్దగా స్పందన లేదు.తమిళనాడులోని తూత్తుకుడి వంటి చిన్నపట్టణంలో ఈ ఘటన జరగడంతో అది నేషనల్ మీడియా దృష్టిలో పడడానికి సమయం పట్టింది. ఇటీవల వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో దీనిపై తీవ్ర చర్చ జరగడంతో ఇప్పుడు అందరి దృష్టిలో పడింది. ‘‘దక్షిణ భారతదేశంలో జరిగే ఘటనలపై ఎవరూ చర్చించడం లేదు.. అవి ఇంగ్లిష్‌లో రాకపోవడమే దానికి కారణం’’ అని నెటిజన్ ఒకరు ఓ వీడియోలో చెప్పారు. మృతులను ఎంతగా వేధించారో కూడా ఆమె వివరించారు.మరోవైపు ఈ ఇద్దరి మరణానికి కారణంగా భావిస్తున్న పోలీసుపై హత్య కేసు పెట్టకుండా కేవలం ట్రాన్స్‌ఫర్ చేయడంతో సరిపెట్టడంపైనా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు దీనిపై రాహుల్ గాంధీ, క్రికెటర్ శిఖర్ ధావన్ వంటివారూ స్పందించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. పోలీసుల జులుం అయేషా పెరీరా, బీబీసీ ఇండియా ఆన్‌లైన్ ఎడిటర్ భారత్‌లో 2019లో 1731 మంది పోలీసు కస్టడీలో మరణించినట్లు కొన్న స్వచ్ఛంద సంస్థల కన్సార్టియం ఒకటి తన నివేదికలో వెల్లడంచింది. అంటే సగటున రోజుకు అయిదుగురు పోలీస్ కస్టడీలో చనిపోతున్నారు.పోలీసులు ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో కూడా ఆ నివేదికలో చెప్పారు. నేరాంగీకారం పేరుతో నిందితులను తీవ్రంగా హింసించడం భారతదేశంలో పోలీసింగ్‌లో భాగంగా మారిందన్నది వాస్తవం. దీనికి కారణమయ్యే పోలీసులకు చాలా అరుదుగా శిక్ష పడుతుంది.చాలాసార్లు వారిని బదిలీ చేయడంతోనే సరిపెడతారు. అరుదుగా మాత్రమే వారిని బాధ్యులను చేస్తారు. ఈ పరిస్థితి మారాలని న్యాయవ్యవస్థ ఎన్నోసార్లు వ్యాఖ్యానించింది. ‘‘కస్టడీలో నిందితుడు చనిపోయి ఆ నిజం వెల్లడైనా కూడా తమనెవరూ ఏమీ చేయరన్న ధైర్యం పోలీసులకు ఉంది’ అని గత ఏడాది ఒక కేసు తీర్పులో న్యాయమూర్తి అన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పోలీసులపై ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక అథారిటీని అన్ని రాష్ట్రాలూ ఏర్పాటు చేయాలని 2006లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ అలాంటి వ్యవస్థ లేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమిళనాడులో పోలీస్ కస్టడీలో ఉన్న తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. text: జనవరి 31, 2020 నుంచి ఆయా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు, కచ్చితంగా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్‌ సిస్టంతోనే మొబైళ్లు విడుదల చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ 'పై' ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే మొబైళ్లు విడుదల చేస్తే వాటి సాఫ్ట్‌వేర్లను తాము అప్రూవ్ చెయ్యబోమని తెలిపింది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్ సంస్థ 2019 సెప్టెంబర్ 3న విడుదల చేసింది. ఆ తర్వాత చాలా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ మొబైళ్లకు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్లు రిలీజ్ చేశాయి. గూగుల్ మొబైల్ సర్వీసెస్ ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మొబైళ్లు తయారుచేసే సంస్థలకు ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు గూగుల్ యాప్స్ కలిగిన సూట్ కూడా... ప్రత్యేకంగా అందించడంతో పాటు, ప్లేస్టోర్లో లక్షలాది యాప్‌లను అందుబాటులో ఉంచుతుంది. దీంతో పాటు మనం కొనే ఫోన్లలో ముందుగానే గూగుల్ యాప్స్ అన్నీ ప్రీఇన్‌స్టాల్ చేసి ఉంచుతుంది. వాటికి ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్‌డేట్లు, ప్యాచ్‌లు అందిస్తోంది. కానీ ఇప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ 10 విడుదల తర్వాత తమ ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైళ్లు తయారు చేసే సంస్థలన్నీ కచ్చితంగా ఆండ్రాయిడ్ 10తోనే స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చెయ్యాలని నిబంధన విధించింది. ఎందుకీ నిబంధనలు ఉదాహరణకు ఆపిల్ ఫోన్‌నే తీసుకుంటే, అందులో స్మార్ట్ ఫోన్‌తో పాటు, దాన్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ios తయారు చేసేదీ ఆపిల్ సంస్థే కాబట్టి, తమ స్మార్ట్ ఫోన్లు వాడేవారికి పూర్తిస్థాయి సెక్యూరిటీ అందించడం వీలవుతుంది. వీటితో పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు, అప్‌డేట్స్ కూడా ఆపిల్ సంస్థనే విడుదల చేస్తుంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సదుపాయం లేదు. ఎందుకంటే... శాంసంగ్, ఎల్‌జి, వన్ ప్లస్, రెడ్‌మీ, మొటోరోలా, నోకియా ఇలా మొబైళ్లు తయారు చేసే సంస్థలు వేరే. వాటిలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ తయారు చేసే సంస్థ గూగుల్ వేరే. ఇలా వేర్వేరు సంస్థలున్నప్పుడు, స్మార్ట్ ఫోన్లు తయారు చేసే సంస్థల్ని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యు ఫ్యాక్చరర్లు అంటారు. ః వినియోగదారుల్ని ఆకట్టుకోడానికి సదరు ఫోన్ల మ్యాన్యుఫ్యాక్చరర్లు, గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను బేస్ చేసుకుని, దానికి చిన్నచిన్న మార్పులు చేసి, తమదైన శైలిలో యూజర్ ఇంటర్‌ఫేస్‌లు తయారు చేస్తున్నాయి. ఇలా అన్ని మొబైల్ తయారీ సంస్థలకూ ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ ఫేస్‌లున్నాయి. ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌ల వల్ల సదరు కంపెనీల మొబైల్స్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌లు వినియోగదారులు వాడుకునేందుకు సులువుగా ఉంటాయి. ఇది కూడా ఆయా మొబైల్ ఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. శాంసంగ్, రెడ్‌మీ, వన్ ప్లస్, హువావే, రియల్‌మి, హానర్ వంటి మొబైల్ తయారీ సంస్థలన్నింటికీ తమ ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ ఫేస్‌లున్నాయి. ఇవన్నీ గూగుల్ ఆధారంగానే పనిచేస్తాయి. కానీ వాటి వాడేటప్పుడు మొబైల్ స్క్రీన్ మీద వేరేగా కనిపిస్తాయి. గూగుల్ ఆండ్రాయిడ్ సంస్థ ఎప్పటికప్పుడు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు రిలీజ్ చేస్తుంది. వాటిని ఫోన్ల మ్యాన్యుఫ్యాక్చరర్లు కూడా యథాతథంగా తమ ఫోన్లలో రిలీజ్ చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని సంస్థలు వాటిని యథాతథంగా రిలీజ్ చేయవు. దీని వల్ల ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఈ యూజర్ ఇంటర్ ఫేస్‌లు కొన్నిసార్లు పూర్తిగా అప్‌డేట్ అవ్వకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సమస్య ఎక్కడొస్తుంది? తొలితరం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే స్మార్ట్ ఫోన్లకు ఈ అప్‌డేట్లు రిలీజ్ చేయడం గూగుల్ నిలిపేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ 'మార్ష్‌మాల్లో ' ముందున్న వాటిని ఓల్డర్ వెర్షన్లుగా గూగుల్ పరిగణిస్తోంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అవసరమైన అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు రిలీజ్ చేయడం నిలిపేసింది. కానీ ఆ తర్వాత వెర్షన్లకు మాత్రం విడుదల చేస్తోంది. ఇలా గూగుల్ ఎప్పటికప్పుడు అప్‌డేట్లు రిలీజ్ చేయకపోతే.. సదరు ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి అప్లికేషన్లు రన్ అవ్వవు. దీంతో పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల... సదరు స్మార్ట్ ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, గూగుల్ తన అప్‌డేట్స్ తప్పనిసరిగా ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యు ఫ్యాక్చరర్లు నేరుగా రిలీజ్ చేసేలా ఇలా గడువు విధించిందని టెక్నికల్ ఎక్స్ పర్ట్ నల్లమోతు శ్రీధర్ తెలియచేశారు. దీనివల్ల జనవరి 31 తర్వాత మార్కెట్లోకి విడుదలయ్యే కొత్త స్మార్ట్ ఫోన్లన్నీ... పూర్తిగా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. అంటే మొబైల్ కంపెనీల యూజర్ ఇంటర్ ఫేస్‌లు కూడా. కంపాటబులిటీ టెస్ట్ సూట్, వెండర్ టెస్ట్ సూట్, ఇంకా గూగుల్ టెస్ట్ సూట్ వంటి ఆటోమేటెడ్ టెస్ట్ లన్నీ పాసై ఉంటాయి. దీనివల్ల స్మార్ట్ ఫోన్లు మరిన్ని ఫీచర్లతో పాటు, వేగవంతమైన ఆపరేటింగ్, పటిష్టమైన సెక్యూరిటీని సాధ్యమవుతుంది. అయితే, స్మార్ట్ ఫోన్ వినియోగదారులెవరికీ దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మొబైల్ కంపెనీలే ఆటోమాటిగ్గా ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ పంపిస్తాయి. లేదంటే మీరైనా సిస్టమ్ అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మొబైల్ తయారీదారులు జనవరి 31 తర్వాత ఆండ్రాయిడ్ 10కు అప్‌డేట్ కావాల్సిందే. గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మీద పనిచేసే మొబైళ్లను తయారు చేసే కంపెనీలకు కొత్త నిబంధనలు విధించింది. text: నిజానికి సునామీ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. కానీ, దాని తీవ్రతను తక్కువగా అంచనా వేసి 30 నిమిషాల తరువాత హెచ్చరికలు ఆపేశారు. ఇండోనేసియాలోని సులవేసి ద్వీపానికి సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు 7.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అనంతరం వరుస ప్రకంపనలతో సముద్రం అల్లకల్లోలంగా మారి సునామీ రూపంలో విరుచుకుపడింది. తొలి ప్రకంపనలు నమోదైన వెంటనే ఇండోనేసియా వాతావరణ భూభౌతిక విభాగ(బీఎంకేజీ) అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 0.5 నుంచి 3 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. కానీ, 30 నిమిషాల తరువాత ఆ హెచ్చరికలను నిలిపివేశారు. సులవేసి ద్వీపంలోని పాలు నగరం ఒక సన్నని అఖాతంలో ఉంది. అధికారుల హెచ్చరికల్లో చెప్పిన కంటే అధికంగా 6 మీటర్ల ఎత్తున అలలు విరుచుకుపడి విధ్వంసం సృష్టించాయి. పైగా, బీచ్ ఫ్రంట్ ఫెస్టివల్ కారణంగా సముద్ర తీరంలో వందలాది మంది స్థానికులు పోగయ్యారు. సునామీ రావడంతో వందలాది మంది రాకాసి అలలకు బలైపోయారు. సునామీ రానుందని ప్రజలకు తెలుసా లేదా? బీఎంకేజీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కేవలం 30 నిమిషాల్లోనే ఉపసంహరించుకోవడంతోనే ప్రజలు విపత్తు తీవ్రతను ఊహించలేకపోయారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కానీ, తాము జారీ చేసిన హెచ్చరికలు అమల్లో ఉన్న సమయంలో ఈ సునామీ విరుచుకుపడిందని అధికారులు చెబుతున్నారు. బీఎంకేజీ చైర్‌పర్సన్ ద్వికోరిటా కర్ణావతి దీనిపై ‘జకార్తా పోస్ట్‌’తో మాట్లాడుతూ.. సునామీ వచ్చేసిందదన్న సమాచారం రావడం, పాలులో తమ ఉద్యోగి పరిశీలించిన తరువాతే హెచ్చరికలు ఉపసంహరించుకున్నామని చెప్పారు. సునామీ హెచ్చరిక వ్యవస్థ నమ్మదగినదేనా? సాయంత్రం 6.37 గంటలకు చివరి ప్రకంపనలు వచ్చిన తరువాత హెచ్చరికలు ఉపసంహరించుకున్నామని, హెచ్చరిక ఉపసంహరణ తరువాత ప్రకంపనలు నమోదు కాలేదని ఆమె తెలిపారు. సునామీ హెచ్చరికలను టెక్స్ట్ మెసేజిల రూపంలో ప్రజలకు పలుమార్లు పంపించామని.. కానీ, అవి వారికి చేరినట్లుగా లేవని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. ప్రకంపనల కారణంగా విద్యుత్, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో సునామీ హెచ్చరికలు ప్రజలకు చేరకపోయి ఉంటాయని విపత్తుల విభాగ అధికార ప్రతినిధి తెలిపారు. ఇంతకీ ఇండోనేసియాలో సునామీల విషయంలో ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థ ఉందా? 170 సిస్మిక్ బ్రాడ్‌బ్యాండ్ స్టేషన్లు, 238 యాక్సిలరోమీటర్ స్టేషన్లు, 137 టైడల్ గేజ్‌లను అనుసంధానిస్తూ ఇండోనేసియాలో సునామీలపై ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ ఉంది. కానీ, ఇది చాలా పరిమితమైనదని అధికారులు చెబుతున్నారు. 170 భూకంప సెన్సర్లు ఉన్నప్పటికీ అందులో 70 సెన్సర్లు నిర్వహించడానికి తగినంత బడ్జెట్ మాత్రమే ఉందని బీఎంకేజీ భూకంప, సునామీ కేంద్రం అధ్యక్షుడు రహమత్ ట్రియానో 'బీబీసీ ఇండోనేసియా'కు తెలిపారు. సునామీపై ముందుగానే హెచ్చరిక పంపినప్పటికీ అలలు ఎంతెత్తున వస్తాయన్నది కచ్చితంగా అంచనా వేయలేకపోయామని ఆయన చెప్పారు. అంతేకాదు, సునామీ ప్రభావానికి గురయిన పాలు నగరానికి సమీపంలో అలల కొలమానిని(టైడల్ గేజ్‌)లు లేవు. అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టైడల్ గేజ్ ఒక్కటే కొంతలోకొంత దగ్గర్లో ఉన్నట్లు. అది కూడా సముద్ర మట్టం 6 సెంటీమీటర్ల మేర పెరిగినట్లుగా మాత్రమే గుర్తించింది. దాని ప్రకారం సునామీ అలలు 0.5 మీటర్లకు మించి ఎత్తు ఉండకపోవచ్చని అంచనాకు వచ్చారు. ''పాలుకు సమీపంలో టైడల్ గేజ్ ఉన్నట్లయితే అంచనాలు కచ్చితంగా ఉండేవి. అప్పుడు నష్టం ఈ స్థాయిలో ఉండేది కాదు'' అని ట్రియానో తెలిపారు. సెన్సర్లు అమర్చిన తెప్పలు ఇప్పుడు పనిచేయడం లేదు అంచనాల్లో విఫలం.. అందుకే భారీ ప్రాణ నష్టం సునామీ అంచనాలు, హెచ్చరికలకు సంబంధించిన అధునాతన వ్యవస్థలు ఉన్నట్లయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు. సముద్రంలో సెన్సర్లు అమర్చిన తెప్పలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా అధునాతనమైనవేమీ కావు. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తరువాత అమెరికా, జర్మనీ, మలేసియాలు విరాళంగా ఇచ్చిన ఈ సెన్సర్లలో ఇప్పుడు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిధుల లేమి కారణంగా వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఈ కారణంగానే బీఎంకేజీ.. భూకంపం వచ్చిన తరువాత, దాని తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు చేస్తోంది. ఈ సెన్సర్ల నుంచి సమాచారం కనుక వస్తే మరింత కచ్చితమైన, మరింత ముందస్తు హెచ్చరికలకు అవకాశం ఉండేదని ట్రియానో బీబీసీ ఇండోనేసియాకు తెలిపారు. సునామీలను అంచనా వేసే వ్యవస్థలు పనిచేయడం లేదని ఇండోనేసియా వాతావరణ భూభౌతిక విభాగ(బీఎంకేజీ) అంగీకరించింది ఎక్కడ విఫలమయ్యారు? సాధారణంగా ఇలాంటి భూకంపాల వల్ల సునామీలు రావని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ సివిల్, ఎన్విరానమెంటల్ ఇంజినీరింగ్ విభాగ ఉప అధిపతి ప్రొఫెసర్ ఫిలిప్ లీ ఫేన్ అభిప్రాయపడ్డారు. భూపొరల్లో నిట్టనిలువుగా కదలికలు వచ్చినప్పుడే సునామీలు వస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రకంపనల్లో భూఫలకాలు ఒకదానితో ఒకటి అడ్డంగా ఒరిపిడికి గురయ్యాయని.. దానివల్ల ఫలకాలు అడ్డంగా మాత్రమే కదులుతాయని, నిట్టనిలువుగా కదలవని ఆయన తెలిపారు. కాగా, పాలు తీరంలో గతంలోనూ సునామీలు వచ్చాయని.. ఈ ద్వీపం సన్నగా, పొడవుగా ఉండడం వల్ల సునామీ వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని బందుంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సముద్రశాస్త్ర ఆచార్యుడు హమ్జా లతీఫ్ వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇండోనేసియాపై సునామీ విరుచుకుపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏమయ్యారో ఇప్పటికీ తెలియనివారి సంఖ్య వేలల్లో ఉంది. text: సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ... ఇలా గాంధీ వంశంలోని రెండు తరాలకు చెందిన నలుగురు ప్రతినిధులు లోక్‌సభలో అమేఠీకి ప్రాతినిధ్యం వహించారు. అయితే తాజా ఓట్ల లెక్కింపు లెక్కల ప్రకారం రాహుల్ గాంధీ అమేఠీ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీకన్నా దాదాపు 9 వేల ఓట్లతో వెనుకబడి ఉన్నారు. 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా ఇక్కడి నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో ఈ స్థానం నుంచి ఆయనపై స్మృతి ఇరానీని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ పోటీని ఆసక్తికరంగా మార్చింది. అప్పుడు రాహుల్ ఆమెను 1,07,903 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. అయితే బీజేపీ ఈసారి ఎన్నికల్లోనూ స్మృతినే అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ స్థానాన్ని ఎలాగైనా కాంగ్రెస్ చేతుల్లోంచి, ముఖ్యంగా గాంధీ కుటుంబం పట్టులోంచి తప్పించాలనే వ్యూహంతో బీజేపీ పావులు కదిపింది. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు వరాల జల్లులు కురిపించింది. ఏకే-203 రకం అసాల్ట్ రైఫిళ్లు తయారు చేసే కర్మాగారానికి ప్రధాని మోదీ మార్చి నెలలో పునాది రాయి వేశారు. ఇవన్నీ అమేఠీని తమ పట్టులోకి తెచ్చుకునేందుకు బీజేపీ పన్నిన వ్యూహంలో భాగమని చెప్పొచ్చు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మహాకూటమి ఈ స్థానం నుంచి ఎవరినీ పోటీలో దించకపోవడం ద్వారా కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ఎన్నికలు మరో నాలుగు నెలలున్నాయనగా, జనవరి 23న ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ, ఆమెకు పశ్చిమ ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ఆమెను తెర ముందుకు తేవడం ద్వారా 80 స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ తన పరిస్థితిని మెరుగుపర్చుకోగలుగుతుందని ఆశించారు. అయితే, స్మృతి ఇరానీ ఈ ఆధిక్యాన్ని ఇలాగే నిలబెట్టుకొంటూ విజయ కేతనం ఎగరేస్తారా? లేదా లెక్కింపు పూర్తయ్యే లోగా రాహుల్ గెలుపు కోసం కావాల్సిన ఓట్లు సాధించగలుగుతారా? అనేది చూడాల్సిందే. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గత యాభై రెండేళ్ల చరిత్రలో 1998-99 మధ్య దాదాపు ఏడాది సమయాన్ని మినహాయిస్తే, ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీదే ఏకఛత్రాధిపత్యమని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి అది గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా నిలిచింది. text: అలా జోక్ వేస్తూ ఆయన షత్తాఫ్(బమ్ గన్) అని పిలిచే ఒక పిచికారీ గొట్టాన్ని దాటుకుని ముందుకు కదిలారు. ''మీరు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవారు. కానీ వెనక్కి సంబంధించిన ఆ విషయానికొస్తే వెనుకబడే ఉన్నారు.'' చాలామంది ప్రజలు యూసఫ్ మాటలతో అంగీకరిస్తారు. చాక్లెట్ పుడ్డింగ్‌ అయితే ఇలా తుడుచుకుంటారా? చాలా పాశ్చాత్య దేశాల్లో టాయిలెట్‌కి వెళ్లిన తరువాత కడుక్కోకుండా తుడుచుకుంటారన్న విషయం ప్రపంచంలో ఎంతోమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పేపరుతో తుడుచుకోవడం కంటే నీటితో కడుక్కుంటే మరింత శుభ్రంగా ఉంటుంది. అందుకే.. నీటితో తమ వెనుకభాగాన్ని కడుక్కునే అలవాటున్నవారు ''మీ మూతికి అంటుకునే చాక్లెట్ పుడ్డింగ్‌ను కేవలం కాగితంతో తుడిచి వదిలేస్తారా?'' అని అడుగుతారు. ప్రాచీన గ్రీకులు శుభ్రం చేసుకునే పింగాణీ పెంకులు, వలసరాజ్యాల అమెరికన్లు వాడిన గింజలు తీసిన మొక్కజొన్న కండెలతో పోల్చితే ప్రస్తుతం పాశ్యాత్యులు వినియోగిస్తున్న టిష్యూ పేపర్ ఎంతో మృదువైనదే. అయితే, నీరయితే ఆ మాత్రం ఇబ్బంది కూడా ఉండదన్నది అందరూ అంగీకరించేమాట. అందుకే చాలా దేశాల్లో నీటినే వాడుతుంటారు. పారిశుద్ధ్య సామ్రాజ్యవాదం ప్రపంచానికి బిడెట్ అనే పదాన్ని పరిచయం చేసింది ఫ్రెంచ్ వారు. బిడెట్ అంటే టాయిలెట్‌కి వెళ్లిన తరువాత కడుక్కోవడానికి నీటిని పిచికారీ చేసే చిన్న పరికరం. ఈ టాయిలెట్ ఉపకరణం ఫ్రాన్స్‌లో పెద్దగా పాపులర్ కానప్పటికీ ఇటలీ, అర్జెంటీనాల్లో మాత్రం బాగా వాడుకలో ఉన్నాయి. కమెడియన్ యూసఫ్ చెప్పిన బమ్‌గమ్ ఫిన్లాండ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అమెరికా, బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాల్లో టిష్యూ పేపర్ల వినియోగమే ఎక్కువ. ఆధునిక బాత్‌రూం సంస్కృతిపై బ్రిటన్, అమెరికాలు ఎక్కువ ప్రభావం చూపాయని ఆర్కిటెక్చర్ చరిత్రకారిణి బార్బరా పెన్నర్ తాను రాసిన 'బాత్ రూం' పుస్తకంలో పేర్కొన్నారు. నిజానికి 1920ల్లో ఆంగ్లో-అమెరికన్ బాత్‌రూం ధోరణులు ప్రపంచవ్యాప్తమయ్యాయి. దాన్నే పారిశుద్ధ్య సామ్రాజ్యవాదం అనేవారు. ముస్లిం దేశాల్లో నీరే వాడుతారు మల విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలని ఇస్లాం సూచిస్తున్నందున ముస్లిం దేశాల్లో నీటినే వినియోగిస్తారు. నీరు వాడాలా.. కాగితమా? అనే అంశంపై ఆసక్తి ఉన్న జుల్ ఓత్‌మేన్ అనే ఆస్ట్రేలియా ఉద్యోగి టాయిలెట్లలో సౌకర్యాలకు సంబంధించిన సాంస్కృతిక, చారిత్రక ధోరణులపై పరిశోధన చేశారు. కొంతమంది ముస్లిం ఆస్ట్రేలియన్లు నీరు, టాయిలెట్ పేపర్ రెండింటినీ ఉపయోగిస్తారని ఆమె పరిశోధనలో గుర్తించారు. 20 పౌండ్ల నోటుతో గత రెండేళ్లుగా శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో నివసిస్తున్న ముంబయికి చెందిన డాటా సైంటిస్ట్ ఆస్తా గార్గ్ మాట్లాడుతూ టాయిలెట్‌లో వాడేందుకు మగ్ కొనేందుకు ఎన్ని దుకాణాలు తిరిగినా దొరకలేదని.. చివరకు భారతీయ దుకాణంలో అది దొరికిందని చెప్పారు. ''కొంతమంది భారతీయులు కూడా టాయిలెట్ పేపర్ వాడకానికి అలవాటుపడతారు. కానీ, నీరు దొరికినప్పుడు మాత్రం నీరే వాడుతారు'' అన్నారామె. ''అమెరికాలో ఒక భారతీయ మిత్రుడి ఇంటికి వెళ్లినప్పుడంతా అక్కడ టాయిలెట్ సీట్ పక్కన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ బకెట్‌లో నీరు కానీ ఉంటుంది'' అన్నారామె. పాశ్యాత్యులు కాగితం తుడుచుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుందని.. బ్రిటన్‌లోని షెఫీల్డ్స్‌లో ఉండే తన క్లాస్‌మేట్ ఒకసారి టాయిలెట్ పేపర్ అయిపోతే 20 పౌండ్ల నోటుతో తుడుచుకోవడం తెలుసని ఓత్‌మన్ చెప్పారు. సంగీతకారుడు, పాడ్‌కాస్టర్ అయిన కైజర్ కుయో కుటుంబం దీనికి ఒక హైబ్రీడ్ పరిష్కారం కనుగొంది. మూడేళ్ల కిందట వారు బీజింగ్ నుంచి అమెరికా వెళ్లారు. వారు కొన్ని చైనా అలవాట్లు అలాగే కొనసాగిస్తూ అమెరికా అలవాట్లనూ నేర్చుకున్నారు. అమెరికన్ల విధానాన్ని అలవాటు చేసుకున్న తన పిల్లలు ఎంత టాయిలెట్ పేపర్ వాడుతున్నారో చూసి కుయో ఆశ్చర్యపోయారట. మిగతా దేశాల వారికంటే అమెరికన్లు ఎక్కువగా టాయిలెట్ పేపర్ వాడుతారు. అక్కడ సగటున ప్రతి వ్యక్తి ఏడాదికి 141 రోల్స్ పేపర్ వాడుతారు. వాడిపడేసే టాయిలెట్ పేపర్ల కారణంగా మరుగుదొడ్లలో సమస్యలు తలెత్తుతాయని.. అమెరికాలో 25 శాతం మరుగుదొడ్లకు ఈ సమస్య ఉందని ఆస్తా గార్గ్ చెప్పారు. కుయో కుటుంబం ఇప్పుడు టాయిలెట్ పేపర్ వాడకం తగ్గించి ఫ్లష్ చేయడానికి వీలైన వెట్ వైప్స్ వాడుతోంది. ఎలా కూర్చోవాలి..? టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు ఎలా కూర్చోవాలన్న చర్చా ఒకటుంది. పాశ్చాత్య శైలి టాయిలెట్ సీట్లయితే కుర్చీలో మాదిరి కూర్చుంటారు. అదే, సాధారణ టాయిలెట్ సీట్లయితే నేలన కూర్చున్నట్లుగా(స్క్వాట్) ఉంటాయి. మానవ శరీర నిర్మాణం ప్రకారం చూస్తే సాధారణ టాయిలెట్ సీట్లపై కూర్చునే విధానంలోనే మల విసర్జన సాఫీగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఒక్కో దేశంలో ఒక్కో అలవాటు, పద్ధతి ఉంది. చైనాలో ఎక్కువగా సాధారణ టాయిలెట్ సీట్లే వాడుతారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మూడింట రెండొంతులు ఇవే వాడుకలో ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''మనం అరబ్బులం కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మూడు వస్తువులు మర్చిపోకుండా తీసుకెళ్లాలి. అవి పాస్‌పోర్ట్, డబ్బు, పోర్టబుల్ బిగెట్'' అని ఈజిప్ట్ కమెడియన్ బసీమ్ యూసఫ్ జూన్ నెలలో బ్రిటన్‌లో తన తొలి ప్రదర్శన సందర్భంగా జోక్ వేశారు. text: పాక్ పాలిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. 'కశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం' అవుతుంది అంటూ ఆ ర్యాలీలో నినాదాలు వినిపించాయి. మరోవైపు అదే పాక్ పాలిత కశ్మీర్‌లో పాకిస్తాన్‌కు, భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌ వేర్పాటువాదులు కూడా నినాదాలు చేస్తున్నారు. ఇటీవల, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని తిత్రినోట్ సెక్టార్‌లో భారీ నిరసన ర్యాలీ తీశారు. కశ్మీర్‌కు స్వాతంత్య్రాన్ని కోరుతున్న 12 పార్టీలు ఆ ర్యాలీలో పాల్గొన్నాయి. భారత్ 370వ అధికరణాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించడంతో పాటు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కూడా నిరసనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ పార్టీలు స్వతంత్ర కశ్మీర్‌ను కోరుతున్నాయి. భారత్, పాకిస్తాన్ బలగాలు కశ్మీర్‌ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. నిరసన ర్యాలీ తీస్తూ నియంత్రణ రేఖను దాటి భారత పాలిత కశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన 22 మందిని పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అందరూ సంయమనం పాటించాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. నియంత్రణ రేఖను దాటేందుకు తన పిలుపు కోసం వేచి ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. మరొక ర్యాలీలో... కశ్మీర్‌లో జిహాద్ చేయాలని ఎవరైనా అనుకుంటే అది కశ్మీరీలకే నష్టం కలిగిస్తుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. కమ్రాన్ బేగ్ ఈ నిరసనలు ఎందుకు? కశ్మీర్ లోయపై భారత్, పాకిస్తాన్‌ల నియంత్రణకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా నిరసనలు కొనసాగుతున్నాయని వేర్పాటువాదులు, స్వాతంత్ర్య అనుకూల వర్గాలు అంటున్నాయి. ఇటీవలి నిరసనలలో పాకిస్తాన్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్‌ఎఫ్)కు చెందిన కమ్రాన్ బేగ్ కూడా పాల్గొన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "స్వతంత్ర కశ్మీర్ కోసం గతంలోనూ మా గొంతును బలంగా వినిపించాం. కానీ, మా గొంతు బయటి ప్రపంచానికి వినిపించకుండా, లోయకే పరిమితం చేశారు. కానీ, కాలం మారుతోంది. మా గొంతును వినగలిగినవారు ఇప్పుడు బయట చాలా మంది ఉన్నారు" అని అన్నారు. పాకిస్తాన్‌లో నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌ను 1966లో స్థాపించారు. దీనిని పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ఉద్యమకారులకు 'నర్సరీ'గా చాలామంది అభివర్ణిస్తుంటారు. పాకిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాలు చేయడంతో పాటు, కశ్మీరీల స్వయం నిర్ణయాధికారం కోసం కూడా ఎన్‌ఎస్‌ఎఫ్ మాట్లాడుతోంది. పాకిస్తాన్ అంతటా స్థానిక వార్తా ఛానళ్లపై 'ఆంక్షలు' విధించడం వల్ల తమ కార్యకలాపాలను వార్తల్లో చూపించరని ఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు అంటుంటారు. 19 మంది వేర్పాటువాద గ్రూపు కార్యకర్తలను పాకిస్తాన్ అరెస్టు చేసింది ఈ గ్రూపుల డిమాండ్ ఏంటి? ప్రస్తుతం, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో 14కి పైగా వేర్పాటువాద, స్వాతంత్ర్య అనుకూల గ్రూపులు ఉన్నాయి. ఇటీవల అందులో 12కి పైగా గ్రూపులు కలిసి పీపుల్స్ నేషనల్ అలయన్స్ అనే కూటమిగా ఏర్పడ్డాయి. భారత్, పాకిస్తాన్‌ల నుంచి కశ్మీర్‌కు పూర్తి స్వాతంత్ర్యం కావాలంటూ ఈ కూటమి ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడేవారిని కూడా ఈ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. "మా డిమాండ్ ఒక్కటే. పాకిస్తాన్‌‌కు కశ్మీర్‌ కావాలనుంటే మొదట మా ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇవ్వాలి. మా ఉన్నత న్యాయస్థానానికి అధికారాలు ఇవ్వాలి. మా అసెంబ్లీని పూర్తిస్థాయి శాసనసభగా మార్చాలి. అలా చేస్తే, నేను పాకిస్తాన్‌ను ఎందుకు శత్రువుగా భావిస్తాను?" అని ఎన్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన కమ్రాన్ బేగ్ అన్నారు. తమ కార్యకర్తలపై పాకిస్తాన్ అక్రమంగా దేశద్రోహం కింద కేసులు బనాయిస్తోందని వేర్పాటువాద గ్రూపులు ఆరోపిస్తున్నాయి. ఇస్లామాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్లీ ప్రాంతంలో వేర్పాటువాద గ్రూపు జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్‌) ఇటీవల ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో పాల్గొన్న 19 మంది జేకేఎల్‌ఎఫ్‌ కార్యకర్తలను పాకిస్తాన్ అరెస్టు చేసి జైలులో పెట్టింది. జేకేఎల్‌ఎఫ్‌ను 1977లో అమానుల్లా ఖాన్, మక్‌బూల్ భట్ లండన్‌లో స్థాపించారు. ప్రస్తుతం దీనికి యాసిన్ మాలిక్ నేతృత్వం వహిస్తున్నారు. "అప్పట్లో మా కార్యకర్తలు కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం లండన్‌లో, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని కొంత భాగంలో శాంతియుతంగా పోరాడేవారు. కానీ, మరో మార్గం లేక 1988 జులై 31న మేం ఆయుధాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికీ, ఇప్పటికీ మా డిమాండ్ ఏమీ మారలేదు" అని జేకేఎల్‌ఎఫ్‌ సీనియర్ సభ్యుడు ఖ్వాజా సైఫుద్దీన్ అన్నారు. ఖ్వాజా సైఫుద్దీన్ "కశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్ మధ్య ఒక భూభాగానికి సంబంధించిన వివాదం కాదని అప్పుడు చెప్పాం. ఇది మా స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటం. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. కానీ, ఒకప్పుడు మాకు మద్దతు ఇచ్చినవారే (పాకిస్తాన్) ఇప్పుడు మా మీద దేశద్రోహం ఆరోపణలు చేస్తున్నారు" అని సైఫుద్దీన్ అన్నారు. పాకిస్తాన్‌లో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రూపుల్లో వేర్పాటువాద కశ్మీర్ నేషనల్ పార్టీ కూడా ఉంది. 2007లో స్థాపించిన ఈ పార్టీ... తన మేనిఫెస్టోలో "విదేశీ బలగాలు" కశ్మీర్ నుంచి వెళ్లిపోవాలి, స్వతంత్ర కశ్మీరీ దేశం ఏర్పాటు కావాలి అని పేర్కొంది. "ప్రజల ఆంక్షనే మేం చెబుతున్నాం. మా ప్రజలను విడగొట్టొద్దు అని కోరుతున్నాం. ఆర్టికల్ 370 పేరిట భారత్ ఏం చేసిందో... గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 35-Aను ఉపసంహరించడం ద్వారా పాకిస్తాన్ కూడా అదే చేస్తోంది" అని జేకేఎల్‌ఎఫ్ నేత పర్వేజ్ మీర్జా అన్నారు. "గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 33 శాతం భూభాగాన్ని, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో ఐదు శాతం ప్రాంతాన్ని కలిపి స్వతంత్ర ప్రాంతంగా పాకిస్తాన్ అంగీకరించాలని, ఆ భూభాగం నుంచి పాకిస్తాన్ తన సైనికులను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అని పర్వేజ్ మీర్జా చెప్పారు. పాకిస్తాన్ పాలిత కశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ మసూద్ ఖాన్ ప్రభుత్వం ఏమంటోంది? పాకిస్తాన్ పాలిత కశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ మసూద్ ఖాన్ మాట్లాడుతూ, "ఇటీవల జరిగినట్లుగానే ఆజాద్ కశ్మీర్‌లో గతంలోనూ నిరసనలు జరిగాయి. నిర్దిష్ట భావజాలంతో ఉన్న ఒక గ్రూపు ఈ నిరసనలు చేస్తోంది. వాస్తవం ఏమిటంటే పాక్ పాలిత కశ్మీర్‌లో ఎక్కువ మంది పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నారు. ఎవరి మీదా ఎలాంటి ఆంక్షలూ లేవు. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా తమ ఆకాంక్షలను బహిరంగంగా వ్యక్తీకరించవచ్చు" అని అన్నారు. వేర్పాటువాద గ్రూపులు చేసిన వాదనలను పాక్ పాలిత కశ్మీర్ సమాచార శాఖ మంత్రి ముష్తాక్ మిన్హాస్ ఖండించారు. "ఆజాద్ కశ్మీర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అలాగని, ప్రభుత్వ విధానాలకు, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వేర్పాటువాదులు ప్రజల్లో అసత్య ప్రచారం చేస్తుంటే ఊరుకోం. కఠిన చర్యలు తీసుకుంటాం" అని మంత్రి అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసి 45 రోజులు అయ్యింది. అప్పటి నుంచి భారత పాలిత కశ్మీర్, పరిసర ప్రాంతాలలో నిరసనలు జరిగాయి. ఇదే సమయంలో కశ్మీరీలకు మద్దతుగా ర్యాలీలకు ఏర్పాట్లు చేయడంలో పాకిస్తాన్ కూడా బిజీగా ఉంది. text: నేపాల్ ప్రధానమంత్రి ఓలీ సీపీఎన్ ఇద్దరు చైర్మన్లలో కేపీ ఓలీ ఒకరు. "సీపీఎన్ మరో చైర్మన్ పుష్పకమల్ దాహాల్ (ప్రచండ) లేదా పార్టీ సీనియర్ నేతలతో, తొమ్మిది మంది సభ్యులున్న పార్టీ సెక్రటేరియట్‌లోనూ దీనిపై చర్చించలేదు, దీని గురించి సమాచారం కూడ లేదు" అని ఆయన ప్రకటనలో చెప్పారు. నేపాల్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా భారత నిఘా ఏజెన్సీ రా చీఫ్ సామంత్ గోయల్ పర్యటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కానీ, గోయల్ ఓలీని కలిశారనే విషయాన్ని నేపాల్ ప్రధానమంత్రి ఓలీ మీడియా సలహాదారు గురువారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. విమర్శలు, సందేహాలు నేపాల్ ప్రధాని ఓలీ మీడియా సలహాదారు సూర్యా థాపా సోషల్ మీడియాలో దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. తర్వాత సీపీఎన్ నేతలు, కార్యకర్తలు, విపక్ష నేతలు ప్రధానమంత్రిపై తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రధానమంత్రి దౌత్య ప్రవర్తనా నియమావళిని అనుసరించలేదని చాలామంది ఆరోపిస్తున్నారు. "ప్రధాని సాధారణంగా విదేశీ దౌత్యవేత్తలు లేదా రాజకీయ నేతలను కలుస్తుంటారు. కానీ ఆయన సమావేశం జరిగేటపుడు విదేశాంగ శాఖకు సంబంధించిన ఒక అధికారిక ప్రతినిధి అక్కడక కచ్చితంగా ఉంటార"ని మాజీ విదేశాంగ మంత్రి, పార్టీ ప్రస్తుత ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ్ చెప్పారు. కేవలం కోడ్ ఆఫ్ కండక్ట్ అనుసరించాలని మాత్రమే తాను చెబుతున్నానని ఆయన తెలిపారు. ఈ సమావేశాన్ని అసాధారణంగా వర్ణించిన శ్రేష్ఠ్.." భారత నిఘా ఏజెన్సీ చీఫ్ ప్రధానిని ఇలా ఎందుకు కలిశారనే విషయాన్ని సీరియస్‌గా అడగడం సహజమే. ఇక్కడ, ఈ సమావేశం ఎందుకు జరిగింది, ముఖ్యంగా ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్న కూడా వస్తుంది" అన్నారు. బీబీసీతో మాట్లాడిన ఆయన "ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని తేలిగ్గా తీసుకునేలా లేదు. దీనిపై చర్చ జరగాలి" అన్నారు. రహస్య సమావేశం మేలో నేపాల్ ఒక కొత్త రాజకీయ పటం విడుదల చేసిన తర్వాత భారత్ నుంచి ఒక ఉన్నతస్థాయి అధికారి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారత్, నేపాల్ మధ్య సంబంధాలు ఇంతకు ముందులా లేవు. ఇలాంటి సమయంలో భారత నిఘా ఏజెన్సీ చీఫ్ అక్కడికి రావడం, ఆ దేశ ప్రధానిని కలవడం అంటే దానికి చాలా లోతైన అర్థం ఉందని విశ్లేషకులు అంటున్నారు. విదేశాంగ శాఖ అధికారులకు కూడా తెలీనంత రహస్యంగా జరిగిన ఈ చర్చలతో అధికార పార్టీ నేతలకు షాక్ తగిలింది. సమావేశంలో ఏం చర్చించారు బుధవారం భారత నిఘా ఏజెన్సీ చీఫ్ గోయల్ మర్యాద ప్రకారం ప్రధానిని కలిశారని నేపాల్ ప్రధాని ఓలీ మీడియా సలహాదారు సూర్యా థాపా తన ప్రకటనలో చెప్పారు. భారత్-నేపాల్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం, పరస్పర సహకారం పెంపొందించడం లాంటి అంశాలకు భారత్ కట్టుబడి ఉందని ఈ సమావేశం ద్వారా రా చీఫ్ పునరుద్ఘాటించారని అందులో తెలిపారు. అధికారిక ప్రకటన రావడానికి ముందు నేపాల్‌లోని ఏ ప్రభుత్వ సంస్థ నుంచీ దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు. కానీ చాలా మంది నేతలు ప్రధాని గోయల్‌ను రా చీఫ్ కలవలేదని స్పష్టం చేశారు. నేపాల్ ప్రజలు: భారత్ తమ హామీలు నెరవేర్చలేదు అసంతృప్తికి కారణం భారత్‌తో వివాదాలను పరిష్కరించుకోడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంపై చర్చించడానికి ఇటీవల అధికార సీపీఎన్ పార్టీ సిద్ధమైంది. చాలా కీలక అంశాలపై ప్రభుత్వ తీరు గురించి పార్టీలో తీవ్ర అభిప్రాయ బేధాలు ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఏ సమాచారం లేకుండానే విదేశీ నిఘా ఏజెన్సీ చీఫ్‌తో ప్రధాని సమావేశం కావడం పార్టీ నేతల్లో గందరగోళానికి దారితీసింది. గోయల్ నేపాల్ చేరుకున్నారనే వార్తలు బయటికి రాగానే, పుష్పకమల్ దాహాల్(ప్రచండ), పార్టీ సీనియర్ నేతలు, విపక్ష నేతలు రా చీఫ్‌ను ప్రధాని కలవలేదని చెప్పారు. సీపీఎన్ శాశ్వత సభ్యుడు మాజీ ఉప ప్రధాని, హోంమంత్రి భీమ్ రావల్ గురువారం ట్వీట్ ద్వారా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. రా చీఫ్ ప్రధానమంత్రి ఓలీని కలవడం గురించి ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. సమావేశం జరిగిన విధానం కూడా అభ్యంతరకరంగా ఉందన్నారు. భారత్, చైనా సరిహద్దు వివాదం: ఎల్ఓసీ, ఎల్ఏసీ, అంతర్జాతీయ సరిహద్దు... వీటి అర్థం ఏంటి? దౌత్య గౌరవం ప్రధాని ఓలీ ఇలా సమావేశం కావడం దౌత్య గౌరవానికి వ్యతిరేకమని విదేశాంగ అంశాల్లో నిపుణులు అంటున్నారు. "ఇటీవల నేపాల్‌లో పెరుగుతున్న చైనా ప్రభావం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. రా చీఫ్ ఈ పర్యటన ద్వారా నేపాల్‌తో చర్చలకు తలుపులు తెరవాలని భారత్ అనుకుంటోంది. కానీ సుదీర్ఘ కాలంలో నేపాల్ మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది" అన్నారు. "ఈ సమావేశం జరిగిన తీరు చూస్తే, ప్రధానమంత్రి తన వ్యక్తిగత ఇబ్బందులను కూడా ప్రస్తావించే ఉంటారు. భారత్ ఆయనకు మద్దతు ఇస్తామని భరోసా కూడా ఇచ్చుంటుంది. వీటి గురించి కచ్చితంగా ఏదో చర్చ జరిగే ఉంటుంది" అన్నారు. అదే జరిగుంటే, ప్రస్తుతానికి దీనివల్ల ఏ ప్రయోజనం లేకపోయినా, సుదీర్ఘ కాలంలో ఇది ఒక అంశంగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బుధవారం ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, భారత నిఘా ఏజెన్సీ రా చీఫ్ సామంత్ గోయల్ మధ్య జరిగిన చర్చల గురించి తమ పార్టీకే తెలియదని నేపాల్ అధికార పార్టీ సీపీఎన్ ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ్ ఒక ప్రకటనలో చెప్పారు. text: చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ నినాదం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మదిలో నుంచి వచ్చినదే. సెర్చ్ ఇంజిన్ అనగానే గూగుల్, ఫొటోకాపీ అనగానే జిరాక్స్ బ్రాండ్లు గుర్తుకొచ్చినట్లు ఈ- వ్యాలెట్ చెల్లింపులు అనగానే పేటీఎం బ్రాండ్ గుర్తుకురావాలని విజయ్ కోరిక. ఈ- నగదు చెల్లింపులకు పేటీఎం పర్యాయపదంగా నిలవాలనేది ఆయన లక్ష్యం. అయితే, ఇటీవల వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో పేటీఎంపై ఆరోపణలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ వివాదం ఏంటి? ఓ మీడియా కంపెనీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మ( విజయ్ శేఖర్ శర్మ సోదరుడు).. బీజేపీ మేధోసంస్థ ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయమ్ సేవక్ సంఘ్)‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే, గతంలో కశ్మీర్‌లో రాళ్ల దాడి జరిగిన ఘటన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తమకు ఫోన్ వచ్చిందని, అక్కడి పేటీఎం వినియోగదారుల వివరాలు కావాలని పీఎంవో అడిగిందని స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పారు. దీంతో పేటీఎం వినియోదారుల వ్యక్తిగత వివరాల గోప్యతపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విమర్శలను పేటీఎం ఒక ప్రకటనలో ఖండించింది. థర్డ్ పార్టీతో తాము ఎప్పుడూ డేటాను పంచుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై అజయ్ శేఖర్ శర్మను బీబీసీ పలుమార్లు సంప్రదించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పేటీఎం వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం అశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పేటీఎం ఎందుకు విజయవంతమైంది 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశమంతా ఆశ్చర్యపోయింది. అయితే, ఈ ప్రకటన పేటీఎంకు వరంగా మారింది. అది ఊహించనిస్థాయిలో అభివృద్ధి చెందింది. నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా 2010లో పేటీఎం ప్రారంభమైంది. అయితే, నగదు లావా దేవీలే ఎక్కువగా నడిచే దేశంకావడంతో పేటీఎం పెద్దగా వినియోగదారులకు చేరువ కాలేదు. ఆరేళ్లలో అంటే 2016 వరకు పేటీఎం వినియోగదారుల సంఖ్య 12.5 కోట్లు. ఈ- చెల్లింపులు చాలా తక్కువగా ఉండేవి. కానీ, పెద్దనోట్ల రద్దు తర్వాత పేటీఎం దశ తిరిగింది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత కంపెనీ ఒక్కసారిగా 50 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశమంతా నగదు కొరతను ఎదుర్కోవడంతో దాదాపు 19 కోట్ల మంది వినియోగదారులు వెంటనే పేటీఎంకు అనుసంధానమయ్యారు. పేటీఎం ఎలా విస్తరించింది నోట్ల రద్దు తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ ఏర్పాటుకు విజయ్ శేఖర్ శర్మ తన భాగస్వామ్య కంపెనీ వన్97లో ఉన్న ఒక శాతం వాటాను రూ.325 కోట్లకు అమ్ముకున్నారు. ఆ తర్వాత కంపెనీకి వినియోగదారులు మరింత పెరగడంతో చైనాకు చెందిన అలీబాబా, ఎస్ఏఐఎప్‌లను తన భాగస్వామ్యులుగా చేర్చుకున్నారు. చైనా పెట్టుబడిదారులు కలవడంతో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం 6 నెలల్లోనే విజయ్ శేఖర్ శర్మ 200 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చగలిగారు. ఇక అప్పటి నుంచి విజయ్ శేఖర్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు కూడా పేటీఎంలో పెట్టుబడులు పెట్టింది. గత ఏడాది మేలో 1.4 బిలియన్ డాలర్లతో కంపెనీని విస్తరించింది. ఇక పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్లతో తన పోటీదారులను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. బ్యాంక్, ఈ-కామర్స్‌తో పాటు జనరల్ ఇన్సూరెన్స్‌లకు కూడా అనుమతి పొందింది. 2015లో రూ.334 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ 2017 మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అత్యంత వేగంగా రూ. 828 కోట్ల ఆదాయానికి ( ఈ కామర్స్‌ను మినహాయించగా) చేరడంలో ఇక ఆశ్చర్యమేముంది. ప్రస్తుతం పేటీఎంకు 30 కోట్ల మంది వినియోగదారులున్నారు. రోజూ సగటున 70 లక్షల చెల్లింపులు జరుగుతున్నాయి. వీటి విలువ 940 కోట్ల డాలర్లు ఉంటుంది. రాజకీయంగా విమర్శలు పెద్ద నోట్ల రద్దు తర్వాత విజయ్ శేఖర్ శర్మ బహిరంగంగానే మోదీ విధానాలకు మద్దతు తెలుపుతున్నారు. ప్రధానమంత్రి పెద్ద సైజు ఫొటోలతో వివిధ పత్రికల్లో పేటీఎం వాణిజ్య ప్రకటనలను కూడా ఇచ్చింది. ''స్వతంత్ర్య భారత ఆర్థిక చరిత్రలో ఇదో సాహసోపేత నిర్ణయం''అని పెద్దనోట్ల రద్దును ప్రశంసించింది. దీంతో పేటీఎంపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. పేటీఎం అంటే 'పే టూ పీఎం' అని రాహుల్ గాంధీ ఎగతాళి చేయగా, అధికార పార్టీ పేటీఎంకు అనుకూలంగా ప్రవర్తిస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీంతో ప్రభుత్వం వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ముందస్తు అనుమతి లేకుండా ప్రధాని ఫొటోలను వాడటంపై జరిమానా విధిస్తామని పేటీఎంను హెచ్చిరించింది. కానీ, 6 నెలల తర్వాతే పేటీఎం తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పింది. వ్యక్తిగత వివరాల గోపత్యపై అనుమానాలు రావడంపై పేటీఎంలో పెట్టుబడులు పెట్టిన అలీబాబాను బీబీసీ సంప్రదించగా వారు స్పందించలేదు. సాఫ్ట్ బ్యాంకు అధికార ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, తాము తమ పోర్ట్ పోలియో కంపెనీల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయమని తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 'పేటీఎం కరో' అనే పదబంధం బాగా ప్రచారంలోకి వచ్చింది. text: ''అనేక ఇబ్బందికర, రెచ్చగొట్టే సంకేతాలు, హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్య'' చేపట్టినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పేర్కొన్నారు. అమెరికా దళాల మీద దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తల ప్రాతిపదికగా ఈ యుద్ధనౌకను మోహరించినట్లు పేరు చెప్పని అమెరికా అధికారి ఒకరిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఎటువంటి దాడినైనా తాము ''భీకరమైన బలం''తో తిప్పికొడతామని బోల్టన్ చెప్పారు. ''అమెరికా ప్రయోజనాల మీద కానీ, మా మిత్రుల మీద కానీ ఎటువంటి దాడినైనా క్రూరమైన బలంతో ఎదుర్కొంటామని ఇరాన్ ప్రభుత్వానికి స్పష్టమైన, పొరపాటుకు తావులేని సందేశం పంపించటానికి అమెరికా సెంట్రల్ కమాండ్ రీజియన్‌లో యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ కారియర్ స్ట్రైక్ గ్రూప్, బాంబర్ టాస్క్ ఫోర్స్‌ను మోహరిస్తున్నాం'' అని బోల్టన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ''ఇరాన్ ప్రభుత్వంతో అమెరికా యుద్ధం కోరుకోవటం లేదు. కానీ ఎటువంటి దాడినైనా, ప్రచ్ఛన్న దాడినైనా సరే.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ కానీ ఇరాన్ సైనిక బలగాలను కానీ.. ఎదుర్కోవటానికి మేం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం'' అని కూడా వ్యాఖ్యానించారు. అమెరికా యుద్ధనౌక అమెరికా మిత్రదేశాలతో కలిసి ఏప్రిల్ చివరి నుంచి నిర్వహిస్తున్న యుద్ధ క్రీడల్లో పాల్గొనటానికి ఇప్పటికే యూరప్‌లో ఉంది. యుద్ధానికి సన్నాహాలా? జొనాథన్ మార్కస్, బీబీసీ రక్షణ రంగ ప్రతినిధి ఈ యుద్ధనౌకను మోహరించటానికి ప్రేరేపించినట్లుగా ఆరోపిస్తున్న ఇరాన్ చర్యల గురించి కానీ, అమెరికా చేపట్టిన మోహరింపుల గురించి కానీ ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే.. యుద్ధనౌకను, అందులోని యుద్ధ బృందాన్ని గల్ఫ్‌కు పంపించటం అసాధారణ పరిణామేమీ కాదు. అయితే.. ఈ ప్రాంతంలోని అమెరికా భూతల వైమానిక బలగాలను తాత్కాలికంగా మరింత బలోపేతం చేస్తుండటం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. ఇరాన్ మీద అమెరికా ఇటీవలి నెలలో ఒత్తిడి పెంచుతోంది. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించటం, చమురు ఆంక్షలను కఠినతరం చేయటం వంటి చర్యలు ఇందులో భాగమే. కానీ ట్రంప్ సర్కారు లక్ష్యమేమిటనేది అస్పష్టంగా ఉంది. ఇరాన్‌తో తాము యుద్ధం కోరుకోవటం లేదని ట్రంప్ ప్రభుత్వ అధికార ప్రతినిధులు గట్టిగా చెప్తారు. కానీ ఇరాన్‌లో ప్రభుత్వం మారటానికి సంబంధించిన తమ ఆతృతని ఏమాత్రం దాచుకోలేకపోతున్నారు. ఈ యుద్ధనౌక మోహరింపు, హెచ్చరికలు.. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితులను యధాతథంగా కొనసాగేలా చూడటానికి అమెరికా చేస్తున్న ప్రయత్నమా? లేక ఇరాన్‌ మీద ఒత్తిడిని మరింత పెంచేందుకు చేస్తున్న ప్రయత్నమా? ఈ పరిణామాలు.. యాదృచ్ఛికంగా కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ యుద్ధంగా బద్దలు కావచ్చునని ట్రంప్ ప్రభుత్వ విమర్శకులు చాలా మంది భయపడుతున్నారు. గల్ఫ్‌లో యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌ను మోహరించటం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి అమెరికా, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ యుద్ధనౌకను మోహరించటం జరుగుతోంది. ఇరాన్‌తో 2015లో అమెరికా, ఇతర దేశాలు చేసుకున్న చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ఉపసంహరించుకున్నారు. ఆ ఒప్పందం కింద.. ఆంక్షలను సడలించినట్లయితే తన సున్నిత అణు కార్యక్రమాలను పరిమితం చేయటానికి, అంతర్జాతీయ పరిశీలకులను తనిఖీకి అనుమతించటానికి ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ నుంచి ఇంకా చమురు కొనుగోలు చేస్తున్న ఐదు దేశాలు - ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, టర్కీలకు ఆంక్షల నుంచి ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్ గత నెలలో ప్రకటించింది. అదే సమయంలో.. ఇరాన్‌కు చెందిన అత్యున్నత సాయుధ బలగాల సంస్థ రివల్యూషనరీ గార్డ్ కోర్‌ను విదేశీ ఉగ్రవాద బృందంగా అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఆ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతోంది. ఆ దేశ కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ వార్షిక ద్రవ్యోల్బణ రేటు నాలుగు రెట్లు పెరిగిపోయింది. విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దేశంలో నిరసనలు చెలరేగాయి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇరాన్‌కు ''విస్పష్టమైన, నిస్సందేహమైన సందేశం'' పంపించటానికి మధ్య ఆసియాలో అమెరికా తన యుద్ధ విమాన వాహక నౌకను మోహరించింది. text: వీరిలో కోటీ పది లక్షల మంది పిల్లలే! 70 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు యద్ధం, మరోవైపు అనారోగ్యం.. అక్కడి ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. 2015 మార్చి నుంచి ఇప్పటిదాకా 8,600 మంది మరణించారు. కొందరు యుద్ధం వల్ల మరణిస్తే.. మరికొందరు అనారోగ్యంతో మరణించారు. సంక్షోభంలోని 2 కోట్ల మంది ప్రజల్లో కోటీ పది లక్షల మంది పిల్లలే! అసలు యెమెన్‌లో ఏం జరిగింది? ఈ యుద్ధం వెనక కారణాలేమిటి? యెమెన్ ప్రజల కన్నీటి కథను తెలుసుకుందాం రండి.. మా ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) యెమెన్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది మామూలు సంక్షోభం కాదు.. 2 కోట్ల మంది ప్రజలు సహాయం కోసం చూస్తున్నారు. text: ఆ సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగింది. బగ్దాదీ ఇడ్లిబ్‌లో ఎందుకున్నారు. ఆయన అక్కడున్నాడన్న విషయం ఎలా తెలిసింది. బగ్దాదీ చనిపోయారని అమెరికా అంత కచ్చితంగా ఎలా చెబుతోంది. దాడి ఎక్కడ.. ఎప్పుడు జరిగింది? బగ్దాదీ కోసం అమెరికా ఎంతో కాలంగా వెతుకుతోంది. అతనిపై 25 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు 177 కోట్ల రూపాయల బహుమతి ఉంది. అతడిని చంపినా.. ప్రాణాలతో పట్టిచ్చినా... కనీసం ఆచూకీ చెప్పినా.. 177 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఐఎస్ ఆవిర్భావం నుంచి అమెరికా, దాని సంకీర్ణ సేనలు వెతుకుతున్నప్పటికీ, అతడు దొరక్కుండా తిరుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం రెండు వారాల క్రితం బగ్దాదీ గురించి సమాచారం అందింది. అప్పటినుంచి అతడిపై నిఘా పెట్టారు. అతడు త్వరలోనే మరో ప్రాంతానికి వెళ్లబోతున్నారని నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. కానీ చివరి క్షణంలో ఐఎస్ చీఫ్ తన మనసు మార్చుకున్నారు. దాంతో దాడి చేయాలన్న ప్రయత్నాలను రెండు, మూడుసార్లు అమెరికా కమాండోలు విరమించుకోవాల్సి వచ్చింది. చివరికి సిరియా- ఇడ్లిబ్‌ ప్రాంతంలో.. టర్కీ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల దూరంలో.. బరిషా అనే గ్రామం బయట బగ్దాదీ స్థావరాన్ని గుర్తించారు. అందులో ఉన్నది అతనేనని నిర్ధారించుకుని.. అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్‌ ఈ దాడి చేపట్టింది. బగ్దాదీ అక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది? బగ్దాదీ సెల్‌ఫోన్ వాడరు. సెల్‌ఫోన్ వాడితే నిఘా వర్గాలు కనిపెడతాయని భయం. కానీ, ఇంటర్నెట్‌ మాత్రం బాగా వాడేవారు. ఇదే అతన్ని నిఘా వర్గాలకు పట్టించింది. టెక్నాలజీతో బగ్దాదీ ఎక్కడున్నారో గుర్తించారు. ఆపరేషన్ ఎలా మొదలైంది? బగ్దాదీ స్థావరాన్ని పక్కాగా గుర్తించిన అమెరికా కమాండోలు మెరుపుదాడి చేశారు. ఎనిమిది హెలికాప్టర్లు ఇరాక్‌ నుంచి బయలుదేరాయి. గంట 10 నిమిషాలు ప్రయాణించి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1 గంటకు లక్ష్యాన్ని చేరుకున్నాయి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే టర్కీ, సిరియా, రష్యా మిలిటరీ అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి హెలికాప్టర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే రష్యాకు ముందే సమాచారం ఇచ్చారు. కానీ, ఎందుకోసమన్నది మాత్రం చెప్పలేదు. అదే సమయంలో యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను సైతం సిద్ధం చేశారు. హెలికాప్టర్లను చూడగానే బగ్దాదీ అనుచరులు కాల్పులు జరిపారు. అమెరికా స్పెషల్ ఫోర్స్ వాటిని తిప్పి కొట్టింది. హెలికాప్టర్లు రెండు ఇళ్లపై మిస్సైల్స్‌ ప్రయోగించాయి. ఫైరింగ్ 30 నిమిషాల పాటు కొనసాగింది. స్థానికులు కూడా బీబీసీకి ఇదే విషయం చెప్పారు. హెలికాప్టర్లు ల్యాండైన మరుక్షణం లొంగిపోవాలని అమెరికా సేనలు బగ్దాదీని కోరాయి. ఇద్దరు యువకులు, 11 మంది చిన్నారులు లొంగిపోయారు. కానీ బగ్దాదీ మాత్రం ఇంటి లోపలే ఉండిపోయారు. దాంతో బగ్దాదీ కంపౌండ్ ప్రహారీ, ఇంటి గోడలను పేల్చేసి సైనికులు లోపలికి ప్రవేశించారు. మెయిన్ డోర్‌ ద్వారా వెళ్లి బగ్దాదీ వలలో చిక్కుకోకుండా అమెరికా కమాండోలు ఇలా వెళ్లారు. ఆ తర్వాత ఏరివేత మొదలుపెట్టారని ట్రంప్ చెప్పారు. సిచ్యువేషన్ రూంలో కూర్చుని ట్రంప్ ఈ ఆపరేషన్‌ను వీక్షించారు. చనిపోయింది బగ్దాదేనా? కమాండోల ఆపరేషన్‌తో తప్పించుకునేందుకు బగ్దాదీ ప్రయత్నించారు. తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఒక సొరంగంలోకి పారిపోయారు. అమెరికా ఆర్మీ డాగ్స్ ఆయన్ను వెంబడించాయి. సొరంగం చివరికి చేరుకోగానే డాగ్స్‌ ఆయనపైకి దూకేశాయి. కిందపడిన బగ్దాదీ తాను వేసుకున్న ఆత్మాహుతి కోటును పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ట్రంప్ వెల్లడించారు. పేలుడులో బగ్దాదీ శరీరం ముక్కలు ముక్కలైపోయింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా చనిపోయింది బగ్దాదేనని తేలిందని ట్రంప్ చెప్పారు. అతనితో పాటు అతని ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు. బగ్దాదీ ఇద్దరు భార్యలు మరణించారు. బగ్దాదీ స్థావరంలో ఉన్న వాళ్లు కొందరు లొంగిపోయారు. మరికొందరు సైనికుల కాల్పుల్లో మరణించారు. బగ్దాదీ కాంపౌండ్ నుంచి 11 మంది చిన్నారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ మొత్తం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. అయితే, దాడి చేపట్టిన 15 నిమిషాల్లోనే బగ్దాదీ చనిపోయారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. "ఒక క్రూర హంతకుడు, ఎన్నో మరణాలకు కారణమైన వ్యక్తి క్రూరంగా అంతమయ్యారు. అతను కుక్కచావు చచ్చారు. ఒక పిరికివాడిలా చనిపోయారు" అని ట్రంప్ అన్నారు. అయితే, బగ్దాదీ మరణాన్ని ఇస్లామిక్ స్టేట్- ఐఎస్ ఇంకా ధ్రువీకరించలేదు. గతంలో కూడా బగ్దాదీ చనిపోయినట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు? అబూ బకర్ అల్ బగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం అవ్వద్ ఇబ్రహీం అల్-బద్రి. అనుచరులు 'ఖలీఫా ఇబ్రహీం'గా పిలుచుకుంటారు. మధ్య ఇరాక్ నగరం సమర్రాలో 1971లో బగ్దాదీ పుట్టారు. యువకుడిగా ఉన్నప్పుడు ఖురాన్ బోధించేవారు. 2003లో సద్దాం హుస్సేన్ పాలన అంతమైనప్పుడు ఇస్లామిక్ తిరుగుబాటు గ్రూపు ఆవిర్భావానికి బగ్దాదీ సాయం చేశారని చెబుతారు. ఆ తర్వాత 2004లో బగ్దాదీని అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని బక్కా క్యాంపులో నిర్బంధించాయి. ఆయన నుంచి ప్రమాదం లేదని భావించిన అమెరికా.. పది నెలల తర్వాత అతన్ని వదిలేసింది. బుక్కా క్యాంపు నుంచి బయటపడిన బగ్దాదీ అల్-ఖైదా ఇన్ ఇరాక్‌తో పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రమంగా బగ్దాదీ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా మారారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో చనిపోయారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. text: తిరుగుబాటుదార్ల ఆధీనంలోని చివరి నగరం దూమాపై రసాయన దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థ ‘వైట్ హెల్మెట్’ ట్వీట్ చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే ఆస్కారముందని పేర్కొంది. దాడికి గురైన ఓ బేస్‌మెంట్‌లో గుట్టలుగా పడివున్న మృతుల ఊహాచిత్రాలను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అనంతరం, ఆ ట్వీట్‌ను తొలగించి, మృతుల సంఖ్య 150 అని మరో ట్వీట్ చేసింది. విషవాయువు దాడి ఆరోపణలను సిరియా ప్రభుత్వం ఖండించింది. ఇదంతా కట్టు కథ అంటూ కొట్టిపారేసింది. ఈ ఘటనపై అమెరికా స్పందిస్తూ- పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పింది. విషరసాయన దాడి వాస్తవమైతే సిరియా ప్రభుత్వానికి మద్దతిస్తున్న రష్యా ఈ ఘటనకు బాధ్యత వహించాలని అమెరికా డిమాండ్ చేసింది. సిరియా ప్రభుత్వం గతంలోనూ సొంత పౌరులపైనే రసాయన ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించింది. తిరుగుబాటుదార్లకు మద్దతు తెలుపుతున్న మీడియా కూడా ట్విటర్‌లో స్పందించింది. ఈ రసాయనదాడిలో దాదాపు వెయ్యి మందికిపైగా సిరియన్లు దుష్ప్ర భావానికి లోనయ్యారని పేర్కొంది. గగనతల దాడిలో భాగంగా.. హెలికాప్టర్ నుంచి ఓ బ్యారెల్‌ను కిందకు జారవిడిచారని, అందులో విషపూరిత ‘సారిన్’ రసాయనం ఉందని స్థానిక మీడియా ఆరోపించింది. ఇంతవరకు తిరుగుబాటుదార్ల అధీనంలోని దూమా నగరాన్ని, సిరియా ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సిరియాలోని తూర్పు ఘూటాలో జరిగిన అనుమానిత విషవాయువు దాడిలో 70 మంది ప్రజలు మరణించి ఉంటారని స్థానికులు, అధికారులు తెలిపారు. text: ఇస్రో చైర్మన్ కే శివన్ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. థర్మల్ ఇమేజింగ్ ద్వారా ఆర్బిటార్.. విక్రమ్ ల్యాండర్ ఫొటోలను తీసినట్లు ఆయన పేర్కొన్నట్లు వివరించింది. ''ల్యాండర్‌తో ఇంకా కమ్యునికేషన్ సాధ్యపడలేదు. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాం'' అని శివన్ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన వ్యోమనౌక దాదాపు 47 రోజులు ప్రయాణించి చంద్రుడి వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉంది. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు. అయితే, మరో 2.1 కి.మీ.లు కిందకు వెళ్తే చంద్రుడిపై ల్యాండర్ దిగుతుందనగా.. దానితో ఇస్రో కమ్యునికేషన్ కోల్పోయింది. ప్రణాళిక ప్రకారం చంద్రుడిపై రెండు భారీ బిలాల మధ్యన ఉన్న రెండు ప్రాంతాల్లో ఒక దానిని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ ఎంచుకొని దిగాలి. ఆ తర్వాత అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకువచ్చి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతుంది. అక్కడున్న నీటి స్ఫటికాలు, ఖనిజ లవణాల ఆధారాలు సేకరిస్తుంది. కమ్యునికేషన్ ఎందుకు తెగిపోయింది ల్యాండర్‌తో కమ్యునికేషన్ తెగిపోవడానికి అందులోని సెంట్రల్ ఇంజిన్‌లో తలెత్తిన లోపం కారణమై ఉండొచ్చని ఇస్రోకు చెందిన మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రొడ్డం నరసింహా అభిప్రాయపడ్డారు. ''సెంట్రల్ ఇంజిన్‌లో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. అవసరమైన థ్రస్ట్‌ను అది అందించలేకపోయినట్లుగా ఉంది. అందుకే, వేగాన్ని తగ్గించే ప్రక్రియ అనుకున్నట్లుగా జరగలేదు. ఫలితంగానే కమ్యునికేషన్ తెగిపోయి ఉంటుంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు. ''ల్యాండర్ గమనాన్ని చూపించే రేఖ నిర్ణీత పరిమితుల్లో ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్లు. మూడింట రెండొంతుల సమయం అది అలాగే సాగింది. కానీ, మరింత కిందకు వెళ్లగానే ఆ రేఖ పరిమితులను దాటింది. ఆ తర్వాత కొద్ది సేపు నేరుగా సాగి, పరిమితుల బయట దిశగా వెళ్లింది'' అని నరసింహా చెప్పారు. ''మెల్లగా కిందకు పోవాల్సింది పోయి, వేగంగా పడటం ప్రారంభించింది. నిజానికి ల్యాండర్ సెకన్‌కు 2 మీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలంపై దిగాలి. లేకపోతే, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్‌ను వేగంగా కిందకు పడేలా చేసి ఉండొచ్చు'' అని ఆయన వివరించారు. మొదటి రెండు దశల్లో రఫ్ బ్రేకింగ్, ఫైన్ బ్రేకింగ్ ఆపరేషన్స్ పూర్తైన తర్వాత ల్యాండర్ బాగానే ఉంది. హోవరింగ్ దశలోనే ల్యాండర్ గమనాన్ని సూచించే రేఖ పరిమితులు దాటినట్లు స్క్రీన్లపై కనిపించింది. చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యం వెనుక సెంట్రల్ ఇంజిన్‌ లోపం ఉండొచ్చన్న నరసింహా అభిప్రాయంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో న్యూక్లియన్ అండ్ స్పేస్ పాలసీ ఇనిషియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వరి రాజగోపాలన్ ఏకీభవించారు. ల్యాండర్‌ నాలుగు మూలల్లో ఒక్కోటి చొప్పున నాలుగు ఇంజిన్లు ఉంటాయని, వాటిలో ఒకటి విఫలమై కూడా ఈ పరిణామం తలెత్తి ఉండొచ్చని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చంద్రయాన్-2 ప్రయోగం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. text: సియాన్ రంగును ఎక్కువగా చూస్తే నిద్ర రాకుండా చేస్తుందని, అదే తక్కువ స్థాయిలో ఉంటే నిద్రపుచ్చేందుకు సాయపడుతుందని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వివరించారు. ఆ రంగులో కంటికి కనిపించనంత సూక్ష్మ మార్పు జరిగినా దాని ప్రభావం నిద్రపై పడుతుందని తేలింది. సియాన్‌ను ఎక్కువ, తక్కువ చేసుకునేలా ఉండే కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ తెరలను అభివృద్ధి చేసేందుకు ఈ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ స్థాయి సియాన్ ప్రభావానికి గురైతే నిద్ర రాదా? తక్కువ లేదా ఎక్కువ స్థాయి సియాన్ కలర్‌ ప్రభావానికి గురైన వ్యక్తుల్లో నిద్ర హార్మోన్ స్థాయిలో వ్యత్యాసాలను గుర్తించారు. సియాన్ రంగును ఎంత చూశారన్నదాన్ని బట్టి వారి లాలాజలంలో ఉండే నిద్ర హార్మోన్ మెలటోనిన్లో హెచ్చుతగ్గులు నమోదైనట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. 'ఆ కలర్ మారిందో లేదో కూడా మన కంటికి తెలియకపోవచ్చు. కానీ, ఏమాత్రం మార్పు జరిగినా దానికి తగినట్టుగానే మన శరీరం స్పందిస్తుంది' అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాబ్ లుకాస్ అన్నారు. సియాన్ కలిపిన ఇతర రంగులతోనూ ఆ ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఉండాలనుకునే వారికోసం కంప్యూటర్ తెరల్లో సియాన్‌ కలిసిన రంగులను వాడొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారికి అది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే నిద్రలేమి నుంచి దూరం కావాలనుకుంటే సియాన్ లేని మరో వెర్షన్ స్క్రీన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. పరిశోధకులు రెండు రకాల తెరలు తయారు చేశారు. వాటిలో ఒకటి సియాన్ లేనిది, ఇంకోటి సియాన్‌ ఉన్నది. ఈ అధ్యయనంలో భాగంగా రెండు రకాల (ఒకటి సియాన్ లేనిది, ఇంకోటి సియాన్ ఉన్నది) తెరలపై ఓ సినిమా ప్రదర్శించారు. అప్పుడు ప్రేక్షకులు నిద్రమత్తులో జారుకున్నాక వారి లాలాజలంలో మెలటోనిన్ స్థాయిలో వచ్చిన తేడాలను పరిశీలించారు. తమ పరిశోధన కొత్తరకం కంప్యూటర్ తెరలు, టీవీలు, స్మార్ట్‌ఫోన్ల తెరల తయారీకి దోహదపడనుందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్లతో గడుపుతూ నిద్రను దూరం చేసుకుంటున్న టీనేజీ పిల్లలకు సియాన్‌ రహిత తెరలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాజెల్‌కు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం పూర్తి వివరాలను 'స్లీప్' జర్నల్‌లో ప్రచురించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆకు పచ్చ, నీలి రంగులకు మధ్యస్థంగా ఉండే సియాన్ రంగు మన నిద్రపై ప్రభావం చూపిస్తుందని జీవశాస్త్రజ్ఞులు గుర్తించారు. నిద్రపుచ్చడంతో పాటు నిద్ర రాకుండా చేయడంలోనూ ఈ రంగు ప్రభావం ఉంటుందని తేల్చారు. text: గురువారం వేకువన 3 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆసుపత్రి చీఫ్ ఫైర్ ఆఫీసర్ 'బీబీసీ'కి తెలిపారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారని ఆయన ధ్రువీకరించారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 ఐసీయూలో 40 మంది ఆసుపత్రి ఐసీయూలో పీపీఈ కిట‌్‌ ధరించిన సిబ్బంది ఒకరికి మొట్టమొదట మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని.. అక్కడే ఉన్న సిబ్బందికి ఇవి అంటుకోవడంతో ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగేటప్పటికి ఐసీయూలో 40 మందికి పైగా కోవిడ్ రోగులున్నారు. హోం క్వారంటైన్‌లో అగ్నిమాపక సిబ్బంది కాగా మంటలను అదుపు చేయడానికి వచ్చిన సుమారు 40 మంది అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అనంతరం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కోవిడ్ రోగులు ఉన్న ఐసీయూలోకి వెళ్లడంతో వీరంతా క్వారంటైన్‌కు వెళ్లారిప్పుడు. ప్రమాదం జరిగిన ఆసుపత్రి ఐసీయూలోని రోగులను సమీపంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆసుపత్రికి మార్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడానని.. ఈ ప్రమాదంలో గాయపడినవారు కోలుకునేలా వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించానని ట్వీట్ చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో కోవిడ్ రోగులు ఉన్న ఒక ప్రయివేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో 8 మంది రోగులు మరణించారు. text: 2019 జనవరి 17న హైదరాబాద్‌లో ఒక బాలికకు కరాటే టెక్నిక్ చూపిస్తున్న కరాటే అంతర్జాతీయ చాంపియన్ సయేదా ఫాలక్ క్రీడల్లో మహిళల పట్ల భారతీయుల వైఖరుల గురించి చేసిన ఈ పరిశోధనలో- మహిళా అథ్లెట్లకు పురుషులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే వాదనకు అత్యధికులు మద్దతు పలికారు. పురుషుల క్రీడలతో పోలిస్తే మహిళలు పాల్గొనే క్రీడలు అంత వినోదభరితంగా లేవని సర్వేలో పాల్గొన్నవారిలో 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. మహిళా క్రీడాకారులు కనిపించే తీరు, వారి సంతానోత్పత్తి సామర్థ్యం గురించి ప్రతికూల ఆలోచనా దృక్పథాలు ఉన్నట్లు కూడా సర్వేలో వెల్లడైంది. 14 రాష్ట్రాల్లో 10,181 మందిపై బీబీసీ ఈ సర్వే నిర్వహించింది. మగవారికి, ఆడవారికి క్రీడల ప్రాధాన్యం ఎంత, ఏయే రాష్ట్రాలకు క్రీడల్లో ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది, దేశంలో బాగా తెలిసిన అథ్లెట్లు ఎవరు లాంటి ప్రశ్నలకు కూడా ఇందులో సమాధానాలు లభించాయి. లింగ వివక్షే ప్రధాన కారణం భారత కుర్రాళ్లు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, సైక్లింగ్, పరుగు పోటీల్లో, ఇతర క్రీడాంశాల్లో పాల్గొంటుండగా, అమ్మాయిలు అన్ని క్రీడల్లో పాల్గొనలేకపోతున్నారు. భారత్‌లో ఉన్న లింగవివక్షే దీనికి ప్రధాన కారణం. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు మంది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్రీడలు మహిళలకు తగినవి కాదని చెప్పారంటే ఇంతకన్నా వేరే కారణం ఏముంటుంది? - గీతా పాండే, బీబీసీ ప్రతినిధి ఆడవారికి సరైనవి కాదని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడిన క్రీడల్లో కుస్తీ, బాక్సింగ్, కబడ్డీ, వెయిట్‌లిఫ్టింగ్ ఉన్నాయి. సర్వేలో వెల్లడైనదాని ప్రకారం మహిళలకు సరిపోయే క్రీడల్లో అథ్లెటిక్స్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. మూస ఆలోచనాధోరణులను భారత క్రీడాకారిణులు సవాలు చేస్తున్నారు. మహిళలకు 'సరిపోయేవికాదని' ఎంతో మంది భారతీయులు భావించే కుస్తీ, బాక్సింగ్, కబడ్డీ, వెయిట్‌లిఫ్టింగ్‌లలో అంతర్జాతీయ స్థాయిలో వారు రాణిస్తున్నారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి భారత్ గర్వపడేలా చేశారు. భారత్‌లో ఆడేవారు తక్కువే భారత్‌లో దాదాపు 64 శాతం మంది వయోజనులు ఎలాంటి ఆటలు లేదా శారీరక శ్రమ కలిగే కార్యకలాపాల్లో పాల్గొనడంలేదని అధ్యయనం వెల్లడించింది. స్త్రీ, పురుషుల వారీగా చూస్తే ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. తాము ఆటలు ఆడామని 42 శాతం మంది మగవారు చెప్పారు. ఇలా చెప్పిన ఆడవారి సంఖ్య కేవలం 29 శాతం. అంటే ఆటలు ఆడిన ఆడవారి శాతం పురుషులతో పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు తక్కువగా ఉంది. వయసును బట్టి చూస్తే ఇందులో మరో ఆసక్తికర కోణం ఉంది. 15-24 ఏళ్ల మధ్య వయసు అబ్బాయిలే క్రీడల్లో అత్యధికంగా పాల్గొంటున్నారు. మరే వయసువారూ ఇంతగా ఆటలు ఆడటం లేదు. ఈ విషయంలో భారత్‌లోని వివిధ రాష్ట్రాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. క్రీడల్లో పాల్గొనడంలో తమిళనాడు (మొత్తం జనాభాలో 54%) మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర (మొత్తం జనాభాలో 53%) రెండో స్థానంలో ఉంది. పంజాబ్, హరియాణాల్లో వాటి జనాభాతో పోలిస్తే కేవలం 15% మందే ఆటలు ఆడుతున్నారు. భారత్‌లో క్రీడల్లో అత్యధిక ఆదరణ పొందిన వ్యక్తి సచిన్ తెందూల్కరే భారత్‌లో ప్రముఖ అథ్లెట్లు ఎవరని అడిగితే... మీకు తెలిసిన క్రీడాకారుల్లో అత్యున్నతమైనవారు ఎవరని ప్రశ్నిస్తే- వచ్చిన సమాధానం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అత్యధికులు ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ తెందూల్కర్ పేరే చెప్పారు. ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఆయనే అందరికీ అభిమాన ఆటగాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, సర్వే చేసిన వారిలో 30 శాతం మంది అసలు ఒక్క క్రీడాకారుడి పేరు కూడా చెప్పలేకపోవడం. 50 శాతం మంది కనీసం ఒక్క క్రీడాకారిణి పేరు కూడా చెప్పలేకపోయారు. అనేక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెల్చుకున్న అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును 18 శాతం మంది చెప్పారు. 1970, 1980లలో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్‌పై ఆధిపత్యం చలాయించిన పీటీ ఉష ఇప్పటికీ కొంతమంది భారతీయుల మదిలో ఉన్నారు. ప్రస్తుత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు కన్నా ఆమె ఒక్క శాతం మాత్రమే వెనకబడి ఉన్నారు. పురుషులు, మహిళలతో కూడిన ఓ జాబితా నుంచి ఓ అథ్లెట్‌ను ఎంపికచేయాలని అడిగినప్పుడు వచ్చిన ఫలితాలు కొంత భిన్నంగా ఉన్నాయి. దాదాపు 83శాతం మంది అథ్లెట్లను కొంతమేరకు గుర్తించారు. అయితే ఈ ఫలితాలు పురుషులకే ఎక్కువ అనుకూలంగా వచ్చాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) క్రీడల్లో పురుషుల్లాగే మహిళలు కూడా రాణిస్తున్నారా? భారత్‌లో బీబీసీ సర్వేలో పాల్గొన్న అనేక మంది దీనికి ఔనని సమాధానమిచ్చారు. text: జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ, "ఈ భూమిపై తప్పులు చేయలేని మనిషి లేడు. మీరు వంద మంచి పనులు చేసి ఉండవచు. అలాగని, పది తప్పులు చేయడానికి మిమ్మల్ని అనుమతించరు. జరిగిందేదో జరిగిపోయింది. కానీ, అందుకు ఆ వ్యక్తి (ప్రశాంత్ భూషణ్) పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని మేం కోరుకుంటున్నాం" అని అన్నారు. ప్రశాంత భూషణ్ మాత్రం తాను సమర్పించిన వాదనలో ఎలాంటి మార్పు ఉండదని, దాని వల్ల కోర్టు సమయం అకారణంగా వృథా అవుతుందని అన్నారు. "కోర్టు కోరుకుంటే దీని మీద మళ్లీ విచారణకు సిద్ధమే. కానీ, నా ప్రకటనలో పెద్దగా తేడా ఉండదు. నాకు కోర్టు సమయాన్ని వృథా చేయడం ఇష్టం లేదు" అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. జస్టిస్ మిశ్రా దీనిపై స్పందిస్తూ, "మీరు మళ్లీ ఆలోచించుకుంటే బాగుంటుంది... ఈ విషయంలో మీరు కేవలం చట్టపరమైన ప్రజ్ఞను ఉపయోగించవద్దు" అని అన్నారు. ధిక్కరణ కేసులో దోషి 2020 ఆగస్టు 14 న కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను.. జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది. ఈ కేసులో విచారణ వాయిదా వెయ్యాలని ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీం కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు. "శిక్షపై విచారణను వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. సమీక్ష పిటిషన్‌పై విచారణ తేలనంతవరకూ శిక్షపై విచారణ తారీఖుని వాయిదా వెయ్యాలని" ఆయన పిటిషన్‌లో వెల్లడించారు. గురువారం సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే.. శిక్షపై విచారణ గురించి తమ వాదనను వినిపించారు. "పునర్విచారణ పిటిషన్ వేసేవరకూ, శిక్ష పడదని కోర్టు హామీ ఇస్తోంది" అని జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు. "ముప్పై రోజుల్లో సమీక్ష పిటిషన్ దాఖలు చేసే హక్కు మాకు ఉంది" అని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. "నేరాన్ని రుజువు చేయడం, శిక్షించడం రెండు వేర్వేరు విషయాలు. నా అప్పీల్ న్యాయబద్ధమైనది. శిక్షను వాయిదా చేయవచ్చు. అంతమాత్రాన ఆకాశం ఊడిపడిపోదు" అని దవే అన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రశాంత్ భూషణ్ తన వాదనను వినిపించారు. "కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేల్చినందుకు చాలా బాధగా ఉంది" అని అన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే భిన్న ఆలోచనలకు ఆస్కారం ఉండాలి అని ఆయన అన్నారు. భూషణ్ మాట్లాడుతూ.."కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్టు భావించిన నా ట్వీట్లు... నా బాధ్యత. ఇంకేం కాదు. వాటిని వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చూడాలి. నేను రాసినది నా వ్యక్తిగత అభిప్రాయం. నా విశ్వాసాలు, అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు నాకు ఉంది" అన్నారు. మహాత్మాగాంధీని ఉటంకిస్తూ "నాకు దయ అవసరం లేదు, నేను డిమాండ్ చేయను. నేను ఔదార్యాన్ని కూడా కోరుకోను. కోర్టు ఏ శిక్ష విధించినా దాన్ని సంతోషంగా అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని భూషణ్ అన్నారు. గురువారం నాడు ప్రశాంత్ భూషణ్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలను విన్న జస్టిస్ మిశ్ర, "పునర్నివచారణ అభ్యర్థనను దఖలు పరిచేంతవరకు ఎలాంటి శిక్షఉండదు" అని హామీ ఇచ్చారు. వివాదం ఏంటి? ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు వివాదాస్పద ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని జులై 22వ తేదీన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసు జారీ చేసింది. ఆలోచించే హక్కు (ఫ్రీడమ్ ఆఫ్ థాట్) కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని ప్రశాంత్ భూషణ్ సమాధానం ఇచ్చారు. దీనిపై విచారణ కొనసాగింది. ఆ ట్వీట్లు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని, వాటిని పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్ దోషి అని ఈరోజు సుప్రీంకోర్టు తేల్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఒక మోటారు సైకిల్‌పై ఉన్న ఫొటోను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ తన అఫిడవిట్‌లో స్పందిస్తూ.. మూడు నెలలకు పైగా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని, ఈ నేపథ్యంలో విచారంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం వృధా అనే వ్యాఖ్యకు వివరణ ఇస్తూ.. ‘అలాంటి ఆలోచనలను బహిరంగంగా వ్యక్తీకరించడం ఇబ్బందిరకంగా అనిపించొచ్చు కానీ అదే వాస్తవం, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించకూడదు’ అని తెలిపారు. ‘ధిక్కరణ’పై భిన్నాభిప్రాయాలు ఈ విషయంపై రెండు రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి ప్రశాంత భూషణ్ కోర్టు ధిక్కరణ కేసుపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. "రెండు ట్వీట్లలో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చలేము. సమాజం పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కుంటున్న ఈ సమయంలో చిన్న చిన్న విమర్శలకు కోపం తెచ్చుకోకుండా భిన్నమైన ఆలోచనలకు కూడా భాగం కల్పిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుంది" అని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రశాంత్ భూషణ్‌కు మద్దతుగా బిఎఐ మరో ప్రకటన కూడా జారీ చేసింది. అయితే, 15 మంది న్యాయమూర్తులతో సహా వందకు పైగా మేధావులు సుప్రీం కోర్టుకు మద్దతిస్తూ లేఖను జారీ చేసారు. కోర్టు నిర్ణయానికి అభ్యతరం తెలియజేయడం సబబు కాదని వీరు తెలిపారు. మరో పక్క భూషణ్‌కు మద్దతుగా నిల్చినవారు న్యాయవ్యవస్థలో భాగమైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలను అవమానంగా భావిస్తూ ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని, ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. పంజాబ్, తమిళనాడుకు చెందిన న్యాయవాదులు ఈ నిర్ణయం సరి కాదంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసారు. కోర్టు తీర్పును విమర్శించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 21 మంది నాయకులు తనకు మద్దతు ప్రకటించారని ప్రశాంత్ భూషణ్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ కురియన్ జోసెఫ్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ 'ఐదుగురు లేదా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాలి' అని అన్నారు. "ఇలాంటి కేసుల విషయంలో ఇంట్రా-కోర్టులో అప్పీల్ చేసుకునే వీలు కల్పించాలి. న్యాయవ్యవస్థ విఫలం అవ్వకుండా కాపాడుకోవడం కోసమైనా ఇంట్రా-కోర్టు అప్పీలు మంజూరు చెయ్యాలి" అని ఆయన అన్నారు. జస్టిస్ సీఎస్ కెర్నాన్‌పై వచ్చిన ధిక్కరణ కేసులో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పినట్టు జస్టిస్ కురియన్ తెలిపారు. ‘ఇలాంటి కేసుల్లో తీర్పు చెప్పే ముందు వివరంగా వాదనలు జరగాలి. విస్తృతంగా అభిప్రాయాలు వినాలి. ఎక్కువమందిని భాగస్వాములను చెయ్యాలి’ అని జస్టిస్ కురియన్ అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన ప్రకటనను మార్చుకోవడానికి సుప్రీం కోర్టు 2-3 రోజుల గడువు ఇచ్చింది. text: ఈ కొత్త టెలిస్కోప్ ఇప్పటికే పది లక్షల కొత్త గెలాక్సీల మ్యాప్ రూపొందించింది విశ్వానికి సంబంధించి తాము కొత్త ‘అట్లాస్‌’ రూపొందించామని, లోతైన వివరాలతో రికార్డు సమయంలో ఈ పని చేశామని ఆస్ట్రేలియా జాతీయ శాస్త్రీయ పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ఓ తెలిపింది. మొత్తంగా 30 లక్షల గెలాక్సీలను తాము మ్యాప్ చేశామని, వాటిని ఇదివరకటి సర్వేలతో పోల్చితే రెండింతలు మెరుగ్గా కనిపించేలా చిత్రాలు తీశామని ప్రకటించింది. విశ్వంలో కొత్త విషయాలను ఆవిష్కరించేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకటి సర్వేలు ఏళ్లపాటు చేసిన పనిని, తాము అధునాతన టెలిస్కోప్‌తో 300 గంటల్లో పూర్తి చేశామని సీఎస్ఐఆర్ఓ తెలిపింది. ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతామని, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనాలు చేయొచ్చని ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన డాక్టర్ డేవిడ్ మెక్‌కానెల్ తెలిపారు. నక్షత్రాల పుట్టుక నుంచి గెలాక్సీలు ఏర్పడే విధానం, భారీ కృష్ణబిలాలు రూపుదిద్దుకునే క్రమం, వాటి మధ్య జరిగే చర్యలు... ఇలా అన్నింటిపై అధ్యయనం చేసేందుకు అవసరమైన సమాచారం వీటిలో ఉంటుందని ఆయన అన్నారు. భవిష్యతులో నిర్వహించబోయే సర్వేల్లో కోట్ల సంఖ్యలో మరిన్ని కొత్త గెలాక్సీలను కనుగొంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారి అంతటా 36 డిష్‌ల సమాహారంతో ఈ అస్కాప్ టెలిస్కోప్‌‌ను రూపొందించారు ఈ టెలిస్కోప్ ప్రత్యేకత ఏంటి? 36 డిష్ యాంటెన్నాలను కలిపి ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అరే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ) అనే టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. ఈ యాంటెన్నాలన్నీ కలిసి ఆకాశాన్ని విస్తృతంగా చిత్రిస్తాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని సీఎస్ఐఆర్‌ఓ ముర్చిసన్ అబ్జర్వేటరీలో ఆరు కి.మీ.ల విస్తీర్ణంలో ఈ టెలిస్కోప్ వ్యవస్థ ఉంది. ఈ డిష్ యాంటెన్నాలకు వచ్చే సంకేతాలన్నీ క్రోడీకరించుకుని నాణ్యమైన హై రెజల్యూషన్ చిత్రాలను ఈ టెలిస్కోప్ వ్యవస్థ రూపొందిస్తుందని, ఒకే భారీ యాంటెన్నాను ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చుతో పోల్చితే చాలా తక్కువ వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయొచ్చని సీఎస్ఐఆర్ఓ తెలిపింది. ఆస్ట్రేలియా మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ కన్నా ఎక్కువ వేగంతో ఈ టెలిస్కోప్‌ నుంచి పెద్ద మొత్తంలో డేటా వస్తుంది. పెర్త్ నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ కంప్యూటర్ వ్యవస్థకు దీన్ని పంపి ప్రాసెస్ చేశాక, గెలాక్సీల చిత్రాలు రూపొందిస్తారు. ఏం గుర్తించింది? ఏఎస్‌కేఏపీ ఈ ఏడాదే తొలిసారిగా ఆకాశాన్ని సర్వే చేసింది. ఆకాశంలోని 83 శాతం పరిధిని చిత్రించి, 30 లక్షల గెలాక్సీలను గుర్తించింది. లోతైన వివరాలున్న 903 చిత్రాలను కలిపి ఓ మ్యాప్‌గా రూపొందించింది. ఇదివరకు ఇలాంటి సర్వే చేసేందుకు వేల సంఖ్యలో చిత్రాలు తీయాల్సి వచ్చేది. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ‘స్క్వేర్ కిలోమీటర్ అరే’ను దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. దీని కోసం ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే ఏఎస్‌కేఏపీని రూపొందించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎడారిలో ఏర్పాటు చేసిన ఓ అధునాతన టెలిస్కోప్ ద్వారా లక్షలాది కొత్త గెలాక్సీల (నక్షత్ర మండలాలను) మ్యాప్‌ను గుర్తించినట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. text: కానీ, ఊహించని రీతిలో వ్యాపించిన కోవిడ్-19.. వారు పిల్లల్ని కనాలనే ఆలోచనను వాయిదా వేసుకునేలా చేసింది. ఆయన తనకున్న భయాలను ‘బీబీసీ’కి వివరించారు. "ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికే భయపడుతున్నప్పుడు మరో బిడ్డను కనడం.. ఆ బిడ్డతోపాటు మనకు కూడా ముప్పే" అని కార్తీక్ అన్నారు. “ఇటీవల కొంత మంది గర్భిణులు ప్రసవ సమయంలో కోవిడ్-19 సోకి మరణించినట్లు వార్తలు చూసిన తర్వాత మరింత భయం వేసింది” అని ఆయన చెప్పారు. “గర్భం దాలిస్తే ప్రతి నెలా చికిత్స కోసం, వైద్య పరీక్షలు, స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్తూ ఉండాలి. ఈ ప్రక్రియలో నాకు, నా భార్యకు, కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది” అన్నారాయన. “ఇదంతా పక్కన పెడితే, వ్యక్తిగత రక్షణ పరికరాలు, శానిటైజేషన్ అంటూ సాధారణంగా అయ్యే ఖర్చు కంటే.. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది” ఈ సమయంలో గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే మనం పుట్టబోయే బిడ్డ, స్వీయ సంరక్షణ పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం లాంటిదేనని ఆయన అన్నారు. కోవిడ్-19 ప్రబలినప్పటి నుంచి 9 నెలల సమయంలో ప్రపంచంలోనే అత్యధిక జననాలు (రెండు కోట్ల పది లక్షలు) భారత్‌లో చోటు చేసుకుంటాయని యూనిసెఫ్ అంచనా వేసింది. చైనాలో (ఒక కోటి 35 లక్షలు), నైజీరియా (60 లక్షల నలభై వేలు), పాకిస్తాన్ (50 లక్షలు), ఇండోనేసియాలో (40 లక్షలు) జననాలు నమోదు కావొచ్చని పేర్కొంది. శిశు మరణాల శాతం ఎక్కువగా ఉన్న ఈ దేశాల్లో.. కోవిడ్-19 వ్యాప్తితో మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా తెలిపింది. యూనిసెఫ్ చేసిన వాదనతో హైదరాబాద్‌కు చెందిన గైనకాలజిస్ట్ మంజుల అనగాని ఏకీభవించారు. దంపతుల మధ్య పెరిగిన అన్యోన్యత ఫెర్టిలిటీ చికిత్స తీసుకుంటున్న కొంత మంది లాక్‌డౌన్ సమయంలో సహజంగా గర్భం దాల్చారని గైనకాలజిస్ట్ మంజుల అనగాని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల గృహ హింస పెరిగిందనే నివేదికలు వచ్చాయి. కానీ, దంపతుల మధ్య అన్యోన్యత కూడా అదే రీతిలో పెరిగిందని మంజుల అన్నారు. చాలా మంది ఇంటి నుంచే పని చేయడంతో ఎప్పటి నుంచో పిల్లల్ని కనడం వాయిదా వేస్తూ వస్తున్న వారు కూడా గర్భం దాల్చడానికి అవకాశం దొరికిందని అన్నారు. గతంలో తన దగ్గరకు వచ్చే కేసులతో పోలిస్తే లాక్‌డౌన్‌లో వచ్చిన కేసుల సంఖ్యలో పెద్దగా తేడా ఏమీ లేదని చెప్పారు. గర్భం దాల్చిన వారు పెరిగారు అని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, తనను సంప్రదించడానికి వచ్చే వారి కేసుల సంఖ్య మాత్రం తగ్గలేదని చెప్పారు. ఇప్పటివరకు పిల్లలపై కోవిడ్-19 చూపే ప్రభావం గురించి కచ్చితమైన పరిశోధనలు జరగకపోవడంతో ఇది పుట్టబోయే శిశువులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కచ్చితంగా చెప్పలేమని అన్నారు. ఇటీవల తన దగ్గర ఒక కోవిడ్-19 సోకిన గర్భిణి ఆరోగ్యకరమైన బిడ్డకే జన్మనిచ్చినట్లు తెలిపారు. ఒకవేళ దంపతులకు ఎలాంటి సమస్యలు లేకుండా, పిల్లల్ని కనడం కోసం తొందర లేని పక్షంలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రంగా ఉన్నంత వరకు గర్భం దాల్చడాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిదని ఆమె సూచించారు. కానీ, ఎప్పటి నుంచో పిల్లలు కోసం ఫెర్టిలిటీ చికిత్స తీసుకుంటున్న వారు, లేదా సహజంగా గర్భం దాల్చిన వారు మహమ్మారికి భయపడి గర్భస్రావం మాత్రం చేయించుకోవాల్సిన పని లేదని, అన్నారు. కోవిడ్ భయంతో పిల్లల్ని కనడం వాయిదా వేసుకుంటున్నారా? మాతృత్వపు అనుభూతిని ఆస్వాదించలేకపోతున్నాను. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న వసంత (పేరు మార్చడమైనది)కి మార్చ్ నెలలో గర్భం దాల్చినట్లు తెలిసింది. ఆమె తల్లితండ్రులు అమెరికా ప్రయాణం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆమె వెంటనే హైదరాబాద్ వచ్చేశారు. అప్పుడు గర్భస్రావం చేయించుకోవడం శ్రేయస్కరం కాదని డాక్టర్లు చెప్పడంతో ఆమె అందుకు సిద్ధపడలేదు. అయితే, ఆమె మాతృత్వపు అనుభవాలను ఆస్వాదించటం కన్నా అనుక్షణం భయంతో గడపాల్సి వస్తోంది. ఈ కోవిడ్-19, లాక్‌డౌన్‌ల గురించి ఏ మాత్రం ముందుగా తెలిసినా గర్భం దాల్చడం గురించి ప్లాన్‌చేసి ఉండేవాళ్లమని ఆమె అన్నారు. "ఇప్పుడు నాకున్న భయం ఒక్కటే - నేను ఇంట్లో జాగ్రత్తగా ఉంటాను. కానీ, ఇంట్లో పనుల కోసం, ఉద్యోగం కోసం ఇతర కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడం తప్పదు కదా! ఎవరి వల్ల కరోనావైరస్ సోకుతుందో తెలియదు కదా" అని ఆమె అన్నారు. అమెరికాలో తాము వాకింగ్‌కు వెళ్లేవాళ్లమని, ఇక్కడ బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని అన్నారు. వీటన్నింటి వల్ల చాలా కష్టంగా ఉంటోందని అన్నారు. ‘‘ప్రస్తుతానికి డాక్టర్ చెక్‌అప్ కోసం క్లీని‌క్‌కు మాత్రమే వెళ్తున్నాను. హాస్పిటల్ అంటే ఎక్కడ కోవిడ్-19 బారిన పడతానో అనే భయం అయితే మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉంది’’ “అలాగే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ హాస్పిటల్ ఖర్చులు కూడా పెరుగుతాయని అనిపిస్తోంది. కానీ, ఇప్పుడిక నేనేమి చేయలేను” ఆమె పడుతున్న ఇబ్బందులను చూసి ఆమె స్నేహితులు కొందరు ఈ కోవిడ్-19 కేసులు తగ్గు ముఖం పట్టేవరకు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కోవిడ్ భయంతో పిల్లల్ని కనడం వాయిదా వేసుకుంటున్నారా? ఉత్సాహం చూపిస్తున్న దంపతులు అయితే, ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్న వారి కంటే, లాక్‌డౌన్‌లో పిల్లల్ని కనడానికి ఇష్టపడే వారే ఎక్కువగా కనిపిస్తున్నారని తెనాలికి చెందిన గైనకాలజిస్ట్ మాధవి కొడాలి చెప్పారు. లాక్‌డౌన్ వల్ల సమయం దొరకడంతో తమ దగ్గరకు ఫెర్టిలిటీ చికిత్స కోసం వచ్చే వారు ఎక్కువయ్యారని ఆమె అన్నారు. కోవిడ్-19 కారణంగా అబార్షన్ కోసం తన దగ్గరకు కేవలం ఒకే ఒక్క కేసు వచ్చినట్లు చెప్పారు. ఈ సమయంలో పిల్లల్ని కని తనను బిడ్డను ముప్పులో పెట్టకుండా ఉండేందుకు ఆమె అబార్షన్ చేయమని కోరినట్లు మాధవి చెప్పారు. ముంబయిలో ఒక హాస్పిటల్‌లో మే నెల నాటికి కోవిడ్-19 సోకిన గర్భిణులే దాదాపు 100 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు బీబీసీ పేర్కొంది. కేరళలో కోవిడ్-19 భయంతో సరైన సమయానికి వైద్యం దొరక్క కవల పిల్లలు కడుపులోనే మరణించినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం.. అక్టోబరు నాటికి దేశంలో 1,00,800 మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే మాతా శిశు మరణాలు సంఖ్య పై స్పష్టత లేదు. వైద్య సేవల కొరత ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో అమలులో ఉన్న లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ లు, వైద్య సేవలు, పరికరాలు, సిబ్బంది లోటు వల్ల ఈ సమయంలో పుట్టిన పిల్లలు, తల్లులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని యూనిసెఫ్ అంచనా వేసింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకుతుందేమోననే భయంతో చాలా మంది గర్భిణులు సరైన సమయానికి హాస్పిటల్‌కి వెళ్లలేకపోవడం, లేదా వైద్య సేవల కొరత వల్ల అత్యవసర సేవలు లభించకపోవడం జరుగుతోందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రియెట్టా ఫోరా అన్నారు. కోవిడ్-19 నివారణ కోసం తీసుకుంటున్నచర్యల వల్ల పుట్టిన పిల్లల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉందని, దీంతో కొన్ని లక్షల మంది తల్లీపిల్లల ఆరోగ్యం ముప్పులో పడవచ్చని యూనిసెఫ్ హెచ్చరించింది. యూనిసెఫ్ సూచనలు ఈ పరిస్థితిని నివారించడానికి యూనిసెఫ్ ప్రభుత్వానికి, వైద్య రంగానికి కొన్ని సూచనలు చేసింది. గర్భిణులు, శిశువులకు అవసరమైన వైద్య సేవలను అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బందికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందుబాటులో ఉండాలి. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. వైద్య సేవలు అందుబాటులో లేని ప్రదేశాల్లో మొబైల్ హెల్త్ కిట్లు, వైద్య సేవల లభించేటట్లు చూడాలి. గర్భిణీలకు కూడా యూనిసెఫ్ కొన్ని సూచనలు చేసింది వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. కోవిడ్-19 లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవాలి. అందు కోసం పుట్టిన శిశువులను తాకకుండా ఉండాల్సిన పని లేదు. కాన్పు విషయంలో ప్రణాళిక ఉండాలి. శిశువు జన్మించాక టీకా ప్రణాళికను తప్పని సరిగా పాటించాలి. కోవిడ్-19 లేని సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 2.8 మిలియన్ మాతా శిశు మరణాలు చోటు చేసుకున్నాయి. తగిన చర్యలు తీసుకుంటే ఈ మరణాలను తగ్గించవచ్చని యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కార్తీక్ (పేరు మార్చాం)కి 2018లో వివాహమైంది. కార్తీక్ దంపతులు రెండేళ్ల తర్వాత పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. text: దిల్లీలోని ఒక వీధిలో గోడ మీద వేసిన కోవిడ్ టెస్టింగ్ చిత్రం సెప్టెంబర్ రెండోవారం నుంచి భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, టెస్టుల విషయంలో అనుసరిస్తున్న విధానాలు కరోనాపై యుద్ధానికి ఆటంకంగా మారుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. అసలు ఇండియాలో టెస్టులు ఎలా జరుగుతున్నాయి? పీసీఆర్ టెస్టు అనేది ఇండియాలో బాగా వినియోగంలో ఉన్న కోవిడ్ పరీక్షా విధానం. దేశవ్యాప్తంగా ఇదే ప్రామాణికమైన టెస్టుగా భావిస్తున్నారు. కానీ, చాలా రాష్ట్రాలలో ఇప్పుడు జరుగుతున్న మొత్తం టెస్టుల్లో 60% మాత్రమే పీసీఆర్ టెస్టులు. మిగతావన్నీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు (ర్యాట్)లే. వీటిలో వేగంగా ఫలితాలు వచ్చినా, ప్రామాణికత అంతంత మాత్రమే. ర్యాట్ టెస్టుల్లో తప్పుడు నెగెటివ్ రిపోర్టులతో దాదాపు 50 శాతం కేసులు మిస్సవుతున్నట్లు తేలింది. వీటివల్ల వైరస్ బారినపడిన వారిని గుర్తించడం కష్టం. అయితే, ఇవి హాట్ స్పాట్ లలో బాగా పనికొస్తాయని నిపుణులు అంటున్నారు. ‘‘ర్యాట్ టెస్టులు, పీసీఆర్ టెస్టులను కలిపి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది’’ అని హరియాణాలోని అశోకా యూనివర్సిటీలో అంటువ్యాధుల విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ అన్నారు. అయితే, ర్యాట్ టెస్టులు చేస్తున్నది ఒక్క భారతదేశమే కాదు. వైరస్ సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న అనేక యూరోపియన్ దేశాలు ఈ టెస్టులనే ఆశ్రయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టెస్టులు ఒకే రకంగా జరుగుతున్నాయా? అలా చెప్పే పరిస్థితి లేదు. దేశంలోని మొత్తం కేసుల్లో 17శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దాని తర్వాతి స్థానంలో తక్కువ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలాంటి రాష్ట్రాలున్నాయి. కానీ ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు చూపించాయి. ఇక్కడ టెస్టు ఫలితాలను బట్టి చెప్పగలిగేది ఏంటంటే, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో 50% కన్నా తక్కువ కేసులను మాత్రమే పీసీఆర్ టెస్టుల ద్వారా తేల్చగలిగారు. అంటే, చాలా కేసులు దొరక్కుండా పోయి ఉంటాయి. మహారాష్ట్రలో దాదాపు 60 శాతం టెస్టులు పీసీఆర్ టెస్టులే. తమిళనాడులో కూడా ఎక్కువగా పీసీఆర్ టెస్టుల మీదే ఆధారపడ్డారు. రాష్ట్రాలలో కొన్నిప్రాంతాల్లోనే ఎక్కువ టెస్టులు వివిధ రాష్ట్రాలలో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా టెస్టులు జరిగినట్లు తేలింది. ఉదాహరణకు నవంబర్ 30 నాటికి ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన కేసుల్లో 13% ఒక్క లఖ్‌నవూకు చెందినవే. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన టెస్టులతో పోలిస్తే ఈ నగరంలో 6% టెస్టులు మాత్రమే జరిగాయి. ఆ తరువాత స్థానం యూపీలోని కాన్పూర్ నగరానిది. అయితే, ఇక్కడ జరిగిన పరీక్షలు 3 % లోపే ఉన్నాయి. బిహార్ లో జిల్లాల వారీగా వచ్చిన డేటాను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ లో కనిపించిన ధోరణే ఇక్కడ కూడా కనిపిస్తుంది. బిహా ర్రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 18% కేసులు ఒక్క పట్నాలోనే నమోదు అయ్యాయి. అయితే, అక్కడ జరిగిన టెస్టులు రాష్ట్రం మొత్తంలో జరిగిన టెస్టుల్లో 3% మాత్రమే. మిగతా ప్రాంతాలలో పట్నాకన్నా ఎక్కువ టెస్టులు జరగ్గా, పాజిటివ్ రిపోర్టులు మాత్రం తక్కువగా వచ్చాయి. ‘‘ఎక్కువ కేసులున్నచోట తక్కువ టెస్టులు, తక్కువ కేసులున్నచోట ఎక్కువ టెస్టులు జరిపినప్పుడు తక్కువ పాజిటివ్ రిపోర్టులే వస్తాయి’’ అని కేరళకు చెందిన పబ్లిక్ హెల్త్ పాలసీ విశ్లేషకులు డాక్టర్ రిజో జాన్ అన్నారు. భిన్నమైన నిఘా వ్యవస్థలు 80% పాజిటివ్ కేసులలో కాంటాక్ట్ ట్రేసింగ్ ను 72 గంటల్లో పూర్తి చేయాలని నేషనల్ కోవిడ్-19 నిబంధనలు సూచిస్తున్నాయి. కానీ, తక్కువ కాంటాక్ట్ ట్రేసింగ్, తక్కువ టెస్టింగ్ వల్ల దేశంలో కోవిడ్ విపరీతంగా పెరగిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ మీద రాష్ట్రాల నుంచి కచ్చితమైన సమాచారం అందలేదు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగా పని చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. అందుకు భిన్నంగా సెప్టెంబర్ నుంచి కర్ణాటక రాష్ట్రం ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ లో బాగా వెనకబడి ఉన్నట్లు తేలింది. కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో తెలంగాణ రాష్ట్రం దగ్గర ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా బాగానే ఉన్నా సెప్టెంబర్ నుంచి ఓవరాల్ టెస్టులతోపాటు ఇది కూడా తగ్గుముఖం పడుతూ వస్తోంది. అదే కేరళ విషయానికి వస్తే మే 4 నుంచి నమోదైన వాటిలో 95%కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగినట్లు తేలింది. కానీ, వీటిలో ఏవి కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చెప్పినట్లు 80% కేసులను 72 గంటల్లో గుర్తించినట్లు సమాచారం లేదు. చాలా రాష్ట్రాలు ఈ సమాచారాన్ని వెల్లడి చేయలేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ ప్రభావానికి తీవ్రంగా గురైన రాష్ట్రాలు టెస్టుల నిర్వహణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వైరస్‌ను ఎదుర్కోవడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ ముమ్మరం చేయాలని గతంలో అన్నారు. text: ఇరాన్ అణు ఒప్పందాన్ని ధ్రువీకరించేందుకు నిరాకరించిన ట్రంప్ ఇరాన్ ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలకు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపించారు. అణ్వాయుధాలకు కళ్లెం వేసే 2015 ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందన్నారు. ఇరాన్‌పై కొత్త ఆంక్షలను ప్రతిపాదించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో ప్రసంగించిన ట్రంప్ ఇరాన్‌పై నిప్పులు చెరిగారు. ఆ దేశానికి అణ్వాయుధాలు అందే దారులన్నింటినీ మూసివేసే దిశగా తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. "ఇరాన్‌కు కావాల్సింది హింస, ఉగ్రవాదం అన్న విషయం అందరూ ఊహించేదే. అణు ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించడం చాలా ప్రమాదకరమైన విషయం. అందుకు మేం ఏమాత్రం అంగీకరించబోం" అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి నడుచుకుంటోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఎందుకిలా చేస్తున్నారు? ఇరాన్ అణు ఒప్పందాన్ని సమర్థిస్తూ ప్రతి 90 రోజులకోసారి అమెరికా అధ్యక్షుడు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అది ఆ ఒప్పందంలో భాగం. ఇప్పటి వరకు రెండు సార్లు ధ్రువీకరించిన ట్రంప్, మూడోసారి నిరాకరించారు. ఈ ఆదివారంతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా నిరాకరించడంతో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలా? వద్దా? అన్న విషయాన్ని ఆ దేశ కాంగ్రెస్ 60 రోజుల్లోగా నిర్ణయించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేందుకే ట్రంప్ మొగ్గుచూపుతున్నారని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదన్నది కాంగ్రెస్ నిర్ణయించాల్సి ఉంది. ట్రంప్ కోరుతున్న మార్పులేంటి? (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అణు ఒప్పందం విషయంలో ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుందని హెచ్చరించారు. text: అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కొత్త రాష్ట్రంగా నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొన్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని విమర్శించిన విభజన తరువాత రాష్ట్రానికి రాజధాని లేకుండాపోయిందని.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ కూడా సక్రమంగా జరగలేదన్నారు. కొత్తగా మూడు.. ఏపీ బడ్జెట్‌లో ఈసారి ఒక కొత్త పథకం, కొత్త కార్పొరేషన్, ఒక కొత్త సంస్థను ప్రకటించి కేటాయింపు చేశారు. రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రకటించి రూ. 5 వేల కోట్లు కేటాయించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. దీంతోపాటు కొత్తగా క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు, డ్రైవర్ల సాధికార సంస్థకు రూ. 150 కోట్లు ఇచ్చారు. అంకెల్లో బడ్జెట్ ఏపీ 2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.12,732 కోట్లు కేటాయించారు. వివిధ రంగాలు, శాఖలకు కేటాయింపులు వ్యవసాయం: రూ. 12,732 కోట్లు ఉన్నత విద్య: రూ. 3,171 కోట్లు మాధ్యమిక విద్య: రూ. 22,783 కోట్లు వైద్య, ఆరోగ్య శాఖ: రూ. 10,032 కోట్లు గృహనిర్మాణం: రూ. 4,079 కోట్లు జలవనరుల శాఖ: రూ. 16,852 కోట్లు పౌరసరఫరాలు: రూ. 3,763 కోట్లు ఇంధన, మౌలిక వసతులు: రూ. 5,473 కోట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి: రూ. 35,182 కోట్లు ఆర్థిక శాఖ: రూ. 51, 841 కోట్లు అటవీ, పర్యావరణం: రూ. 491 కోట్లు సాధారణ పరిపాలన: రూ. 1,117 కోట్లు హోం శాఖ: రూ. 6,397 కోట్లు పరిశ్రమలు: రూ. 4,114 కోట్లు చిన్నమధ్యతరహా పరిశ్రమలు: రూ. 400 కోట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: రూ. 1,006 కోట్లు కార్మిక, ఉపాధి కల్పన: రూ. 1,225 కోట్లు రహదారులు, భవనాలు: రూ. 5,382 కోట్లు మత్స్యశాఖ అభివృద్ధి: రూ. 100 కోట్లు న్యాయ శాఖకు 918 కోట్లు అసెంబ్లీకి 149 కోట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు ప్రణాళిక: రూ. 1403 కోట్లు రెవెన్యూ శాఖ: రూ. 5,546 కోట్లు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌: రూ. 172 కోట్లు యువజన, క్రీడలు: రూ. 1982 కోట్లు సంక్షేమానికి.. సాంఘిక సంక్షేమం: రూ. 6,861 కోట్లు బీసీ సంక్షేమం: రూ. 8,242 కోట్లు మైనార్టీ సంక్షేమం: రూ. 1308 కోట్లు మహిళాశిశు సంక్షేమం: రూ. 3408 కోట్లు కార్పొరేషన్లు, సబ్ ప్లాన్లు, సంస్థలు, పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు 'అన్నదాత సుఖీభవ' పథకం: రూ. 5 వేల కోట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ: రూ.458 కోట్లు డ్రైవర్‌ సాధికార సంస్థ: రూ. 150 కోట్లు బీసీ కార్పొరేషన్‌: రూ. 3 వేల కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్‌: రూ.100 కోట్లు క్షత్రియ కార్పొరేషన్‌: రూ. 50 కోట్లు ధరల స్థిరీకరణ నిధి: రూ. 1000 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ: రూ. 300 కోట్లు డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఏపీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఎస్సీ సబ్‌ప్లాన్‌: రూ. 14,367 కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్‌: రూ. 5,385 కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌: రూ. 16,226 కోట్లు మైనార్టీ సబ్‌ప్లాన్‌: రూ. 1,304 కోట్లు పసుపు- కుంకుమ: రూ. 4 వేల కోట్లు ముఖ్యమంత్రి యువనేస్తం: రూ. 1200 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు: రూ. 1100 కోట్లు చంద్రన్న బీమా: రూ. 354 కోట్లు అన్నా క్యాంటీన్లు: రూ. 300 కోట్లు చేనేతకు సహకారం: రూ. 225 కోట్లు 9,10 తరగతుల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం: రూ. 156 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు: రూ. 175 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు: రూ. 128 కోట్లు మైనార్టీలకు దుల్కన్‌ పథకం: రూ. 100 కోట్లు ఎన్టీఆర్‌ విదేశీ విద్య: రూ. 100 కోట్లు వృద్ధాప్య, వింతంతు పింఛన్లు: రూ. 10,401 కోట్లు డిఫరెంట్లీ ఏబుల్డ్ పింఛన్లు: రూ. 2,133కోట్లు ఉపాధి హామీ పథకం: రూ. 1000కోట్లు రాజధానిలో భూసమీకరణ: రూ. 226కోట్లు రాష్ట్రంలో రైల్వేలైన్ల నిర్మాణం: రూ. 150కోట్లు వ్యవసాయ మార్కెటింగ్‌, కో-ఆపరేటివ్‌ శాఖ: రూ.12,732.97 కోట్లు పాడి పశు సంవర్ధక, మత్స్యశాఖ: రూ. 2,030.87 కోట్లు అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాలు: రూ. 491.93 కోట్లు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో 2019-20 సంవత్సరానికి రూ. 2,26,117.53 కోట్లతో ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనమండలిలో పురపాలక మంత్రి నారాయణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. text: ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్ఖడ్‌తో ఆదివారం గంగూలీ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. గవర్నర్ నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ముఖ చిత్రంగా మారతారని చర్చలు ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం దిల్లీకి వెళ్తున్న సమయంలో విమానాశ్రయంలో పాత్రికేయులతో మాట్లాడారు. గవర్నర్‌తో భేటీ గురించి ప్రశ్నించినప్పుడు... ''నేను ఎవరితోనూ మాట్లాడకూడదా?'' అని ఎదురు ప్రశ్నించారు. జగ్‌దీప్ దన్ఖడ్ గవర్నర్ అయినప్పుటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో మమత ప్రభుత్వంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో గంగూలీ భేటీ కావడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గవర్నర్ నివాసం నుంచి బయటకు వచ్చాక... ''ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమే. ఏడాదిగా జగ్‌దీప్ దన్ఖడ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఇంతవరకూ ఆయన ఈడెన్ గార్డెన్‌ను సందర్శించలేదు. ఆయన్ను ఆహ్వానిందుకే వచ్చాను'' అని గంగూలీ అన్నారు. ఈడెన్ సందర్శనతో పాటు వివిధ అంశాల గురించి గంగూలీతో చర్చించినట్లు గవర్నర్ దన్ఖడ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఆ ఇతర అంశాలేంటి అనే సమాచారం లేదు. గంగూలీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు దన్ఖడ్ తెలిపారు. గవర్నర్‌ను గంగూలీ ఈడెన్ గార్డెన్స్‌కు ఆహ్వానించడం కన్నా, ఈ సమయంలో ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. రాజకీయంగా వాతావరణం వేడెక్కి ఉంది. దీంతో గంగూలీ చర్య కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తుండటానికి సంకేతం కావొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గంగూలీ రాజకీయ ప్రవేశం గురించి చర్చలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సీపీఎం లేదా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ల్లో చేరవచ్చని ఊహాగానాలు నడిచాయి. గంగూలీకి వామ పక్ష నేతలతో సాన్నిహత్యం ఉందని చెబుతారు. వామ పక్ష కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో కోల్‌కతాలో పాఠశాల ఏర్పాటు చేసేందుకు గంగూలీకి స్థలం కూడా కేటాయించారు. అయితే, చట్టపరమైన కారణాలతో ఆ స్థలం కేటాయింపు పూర్తి కాలేదు. ఇక టీఎంసీ ప్రభుత్వం సాల్ట్ లేక్‌లో గంగూలీకి రెండెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిసి ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చేశారు. అప్పుడు కూడా గంగూలీ బీజేపీలో చేరతారని వదంతులు వచ్చాయి. ''ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వస్తాను అన్నారు. అలాంటిదేమీ జరగలేదు కదా!'' అని గంగూలీ అన్నారు. అంతకుముందు మమత బెనర్జీ చొరవ మీద గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి పొందారు. అమిత్ షా సహా ముగ్గురు కేంద్ర మంత్రులు ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. అయితే, తన నియమాకం వెనక ఎలాంటి రాజకీయాలూ లేవని గంగూలీ అప్పుడు వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి గంగూలీ బీజేపీలో చేరతారని వదంతులు వస్తూనే ఉన్నాయి. అయితే, ఆయన మాత్రం వీటిని నిరాకరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన వన్‌డే మ్యాచ్‌ను బీసీసీఐ రద్దు చేసింది. అప్పుడు ఈ నిర్ణయాన్ని మమత బెనర్జీ విమర్శించారు. రాజకీయాల్లోకి రావడం గురించి గంగూలీ స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఈ విషయంపై ఆయన భార్య డోనా గంగూలీ మాట్లాడారు. ''గంగూలీ ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వస్తే, ఆయన అగ్ర స్థానంలో ఉంటారు'' అని ఆమె అన్నారు. ఈ మధ్య అమిత్ షా మాట్లాడుతూ బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి బెంగాలీ వ్యక్తే అయ్యుంటారని అన్నారు. డోనా, అమిత్ షా వ్యాఖ్యలను ముడిపెడుతూ చాలా మంది చూస్తున్నారు. ''క్రికెట్ మైదానంలో గంగూలీ కెప్టెన్‌గా విజయవంతమయ్యారు. బెంగాల్ క్రికెట్ సంఘం, బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల్లోనూ రాణించారు. టీవీ షోలోనూ పని చేస్తున్నారు. బెంగాల్‌లో ఆయనకు మంచి ప్రజాదరణ ఉంది. రాజకీయాలు ఆయనకు సరిపడతాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం'' అని క్రీడా పాత్రికేయుడు తపన్ దత్ అన్నారు. ''ఏ రాజకీయ పార్టీకీ గంగూలీ దగ్గరగా లేరు. అయితే, అన్ని పార్టీల నాయకులతో ఆయన కలిసిమెలిసి మెదులుతారు. ఒక్క భేటీని చూసి మనం ఓ అంచనాకు రాలేం. క్రికెట్ మైదానంలోలాగే రాజకీయాల్లోనూ గంగూలీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు'' అని పాత్రికేయుడు శభ్రదీప్ సాహా వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై టీఎంసీ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే, గంగూలీ రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయం కాదని ఇదివరకు టీఎంసీ ఎంపీ, అధికార ప్రతినిధి సౌగత్ రాయ్ అన్నారు. ''గంగూలీ రాజకీయాల్లోకి వస్తే, నేనైతే సంతోషించను. బెంగాలీలందరికీ ఆయన ఒక ఐకాన్. బెంగాల్ నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన వ్యక్తి ఆయన ఒకరే. అయితే, రాజకీయ నేపథ్యమేమీ లేని కారణంగా ఆయన ఇక్కడ మనుగడ సాగించలేరు'' అని రాయ్ అన్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాత్రం గంగూలీ రాజకీయాల్లోకి రావాలనే అన్నారు. ''ఆయన ఏం నిర్ణయించుకుంటారో తెలియదు. కానీ, ఆయన్ను మేం గౌరవిస్తాం. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. మంచి వ్యక్తులను బీజేపీ ఆహ్వానిస్తోంది'' అని చెప్పారు. అయితే గవర్నర్‌తో గంగూలీ భేటీ అవడాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఘోష్ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని 2011 నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. text: పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం మంజురాణి ముందున్న లక్ష్యం చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఏ ఆటనైనా దీక్షతో, నిబద్ధతో ఆడేవారు మంజురాణి. హరియాణాలో రితాల్ ఫోగట్ గ్రామానికి చెందిన మంజురాణి తన తోటి పిల్లలంతా కబడ్డీ ఆడటం చూసి తాను జట్టులో చేరిపోయారు. తాను మంచి కబడ్డీ ప్లేయర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె భావించేవారు. కొన్నాళ్లు కబడ్డీలో కొనసాగారు. కానీ తర్వాత విధి ఆమెను మరో బాటలో నడిపించింది. ఆర్ధిక వనరుల లేమి ఉన్నా పట్టుదలగా ప్రాక్సీస్ చేశారు మంజురాణి కొత్త స్వ‌ప్నం ఆమె కబడ్డీలో చూపుతున్న ప్రతిభను గుర్తించిన ఆమె కోచ్ స‌హాబ్ సింగ్‌ నర్వాల్ ఆమెలో ఇంకెంతో శక్తి ఉందని భావించారు. ఇలా టీమ్‌గా కాకుండా, వ్య‌క్తిగ‌త క్రీడ‌ల్లో ఆమె ఇంకా రాణిస్తారని అంచనా వేశారు. అదే విషయం ఆమెకు చెప్పారు. తర్వాత ఆమె మనసు బాక్సింగ్ మీదకు మళ్లింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున కాంస్య పతకం సాధించిన మేరీకోమ్‌ ఆమెలో స్ఫూర్తి ర‌గిలించారు. మేరీకోమ్‌ స్ఫూర్తి, కబడ్డీ కోచ్ ప్రోత్సాహంతో ఆమె బాక్సింగ్ క్రీడ‌కు మారారు. నిర్ణయమైతే మార్చుకున్నారుగానీ అందుకు అవసరమైన శిక్షణ విషయంలో ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. ఆర్ధికంగా వనరులు అవసరమయ్యాయి. సరిహద్దు భద్రతా దళంలో పని చేసిన ఆమె తండ్రి 2010లో మరణించారు. ఇంట్లో ఆమెతోపాటు ఆరుగురు పిల్లలున్నారు. వీరంతా తండ్రికి ప్ర‌భుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి జీవించాల్సిందే. బాక్సింగ్‌లో రాణించాలని కోరుకుంటున్న తన కూతురి కలలను ఎలా సాకారం చేయాలో తల్లికి అర్ధం కాలేదు. ఆమెకు శిక్షణ ఇప్పించడం తల్లికి పెద్ద సవాలుగా మారింది. ఆహార నియమాలు పాటిస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్న మంజురాణికి అప్పట్లో బాక్సింగ్‌ గ్లవ్స్‌ కొనడానికి కూడా చేతిలో డబ్బులుండేవి కావు. కబడ్డీలో శిక్షణ ఇచ్చిన సహాబ్‌ సింగ్‌ నర్వాల్‌ బాక్సింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తన ఊర్లోని పొలాల్లోనే మంజురాణి ప్రాక్టీస్ చేసేవారు. విమెన్ బాక్సింగ్ కు మంజురాణి ఆశాకిరణంగా మారారు ‘స్వర్ణ’యుగం మొదలు రాణి కుటుంబం దగ్గర ఆర్ధిక వనరులు లేకపోయినా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఉన్న కొద్దిపాటి వనరులతో శిక్షణ తీసుకున్న మంజురాణి, 2019లో జరిగిన సీనియర్‌ నేషనల్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు. అలా తొలి పతకాన్ని గెలుచుకుని క్రీడా ప్రపంచంలోకి తొలి అడుగును ఘనంగా వేశారు మంజురాణి. నేషనల్ ఛాంపియన్ షిప్‌ స్ఫూర్తిని కొనసాగించిన మంజురాణి రష్యాలో జరిగిన వరల్డ్‌ విమెన్ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌ వరకు వెళ్లారు. ఎంతో కష్టమైన ఈ పోటీలో ఆమె వెండిపతకం సాధించారు. అదే సంవత్సరంలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియాల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో కూడా సిల్వర్ మెడల్‌ గెలుచుకున్నారు. ఆరంభంలో సాధించిన విజయాలతో హరియాణా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆమెకు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ గేమ్ లో బంగారు పతకం గెలవడం లక్ష్యంగా పెట్టింది. కుటుంబ సహకారం ఉంటే భారతదేశంలో ఏ క్రీడాకారుడైనా, క్రీడాకారిణైనా అద్భుతమైన విజయాలను సాధిస్తారని రాణి బలంగా నమ్ముతారు. తన లక్ష్య సాధనలో కుటుంబం పాత్ర ఎనలేనిదని ఆమె చెప్పారు. (బీబీసీ పంపిన ప్రశ్నావళికి మంజురాణి ఇచ్చిన సమాధానాలు ఈ కథనానికి ఆధారం) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ, విజయం అనేది పెద్ద విషయంకాదని మంజురాణి నిరూపించారు. text: చాయియేవి ఝిన్యి 20 ఏళ్ల క్రితం వరకూ జంతువులను వేటాడేవారు ఖొనోమా తెగకు చెందిన 76 ఏళ్ల చాయియేవి ఝిన్యి ఒకప్పుడు వేటగాడే. కానీ, 2001లో ఆ వృత్తిని మానేశారాయన. తరతరాలుగా ఈ తెగవారికి జంతువులను, పక్షులను వేటాడటమే ప్రధాన జీవనాధారంగా కొనసాగింది. వేట అనేది ఇక్కడి గ్రామాల్లో సంప్రదాయ వృత్తిగా ఉండేది. అడవి జంతువులను, పక్షులను వేటాడుతుండేవారు. అయితే, అత్యంత అరుదైన వన్యప్రాణులు కనుమరుగయ్యే ప్రమాదముందని గ్రహించిన కొందరు స్థానికులు ఇక్కడి ప్రజల్లో మార్పు తేవాలని నిర్ణయించారు. ఖొనోమా గ్రామం వన్యప్రాణులను చంపుకుంటూపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, దాంతో భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వివరిస్తూ 1993లో ప్రచారం ప్రారంభించారు. ఆ ఉద్యమం ఫలితంగా తొలుత దాదాపు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో వేటను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఆ వృత్తిని శాశ్వతంగా వదిలేస్తున్నట్టు ఖొనోమా తెగ ప్రజలు ప్రకటించారు. దాంతో 1998లో ఈ ప్రాంతం 'ఖొనోమా నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రాగోపన్ సాంచురీ' గా మారింది. ఏ జీవిని కూడా వేటాడేందుకు వీళ్లేదంటూ గ్రామ కౌన్సిల్ నిషేధం విధించింది. చెట్లను నరకడం, తగలబెట్టడంతో పాటు గ్రామం చుట్టుపక్కల ఉన్న అడవులకు, సహజన వనరులకు నష్టం కలిగించే ఎలాంటి పనులూ చేపట్టేది లేదంటూ నిర్ణయించింది. వేటాడిన జంతువుల తలలను ఇళ్లల్లో పెట్టుకోవడం ఈ తెగలో సంప్రదాయం. అందుకే ఇప్పటికీ కొందరి నివాసాల్లో దశాబ్దాల కిందటి జంతువుల తలలు కనిపిస్తున్నాయి. కొందరి ఇళ్లల్లో దశాబ్దాల కిందటి జంతువుల తలలు ఉన్నాయి వేట మానేసిన తర్వాత చాలామంది వేటగాళ్లు తమ వద్ద ఉన్న తుపాకులను కూడా వదిలేశారు. అప్పట్లో వేటకోసం నాటు తుపాకులు, వలలు, వివిధ రకాల బోన్లు వాడేవారు. వాటిలో కొన్ని ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకృతి రమణీయతకు అద్దంపడుతోంది ఖొనోమా గ్రామం. విభిన్న రకాల పంటలు, ఔషధ మొక్కలు, వృక్షాలతో కళకళలాడుతోంది. ప్రకృతిని పరిరక్షించాలన్న చైతన్యం, ఇక్కడి వ్యవసాయంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ రైతులు పంటచేలకు రసాయన ఎరువులను, పురుగుమందులను వినియోగించరు. "మా జీవితం, ఆచార సంప్రదాయాలు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. అందుకే మేము దాన్ని పరిరక్షించాలని నిర్ణయించాం. పక్షులు, జంతువులు, పూలు అన్నింటినీ కాపాడతాం" అని ఖొనోమా నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రాగోపన్ సాంచురీ చైర్మన్ ఖ్రిఖోటో మోర్ అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రకృతిని పరిరక్షించేందుకు తరతరాలుగా కొనసాగుతున్న అడవి జంతువులను వేటాడే సంప్రదాయ వృత్తిని నాగాలాండ్‌లోని ఓ తెగకు చెందిన ప్రజలు వదిలేశారు. వేటను శాశ్వతంగా వదిలేసిన తర్వాత ఇక్కడి ప్రజలు ఎలా జీవనం సాగిస్తున్నారో ఫొటోగ్రాఫర్ సయాన్ హజ్రా వివరిస్తున్నారు. text: ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తిలో కోత విధించడం గతంలో ఎన్నడూ జరగలేదు. నిజానికి రష్యా సహా ఇతర చమురు ఉత్పత్తి దేశాలన్నింటినీ ఒప్పిస్తూ ఏప్రిల్ 9నే ఈ ఒప్పందంపై ఓ ప్రకటన చేసేలా ఒపెక్ ప్లస్ ఒప్పించింది. కానీ చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు మెక్సికో అంగీకరించలేదు. ప్రస్తుతం ఈ తాజా ఒప్పందంపై ఒపెక్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే అన్ని దేశాలు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాయి. రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ల మేరకు ఉత్పత్తిలో కోత విధించనున్నాయన్న విషయాన్ని మాత్రమే ప్రస్తుతానికి ఒపెక్ సభ్య దేశాలు వెల్లడించాయి. ఒపెక్ నిర్ణయంతో చమురు ధరల్లో పెరుగుదల చమురు ధరల్లో పెరుగుదల తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆసియా మార్కెట్లలో బ్యారెల్‌కు ఒక డాలర్ మేర ధర పెరిగింది. ఇక బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 3.9% పెరిగి 32.71 డాలర్లకు చేరగా అమెరికాలో ఉత్పత్తయ్యే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడాయిల్ ధరలు కూడా బ్యారెల్‌కు 6.1% మేర పెరిగి 24.15 డాలర్లకు చేరుకున్నాయి. “ఇదొక అసాధారణమైన ఒప్పందం. ఎందుకంటే ఇది కేవలం ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల మధ్య మాత్రమే జరిగిన ఒప్పందం కాదు... అమెరికా సహా జీ-20 దేశాలు కూడా ఉత్పత్తిలో కోత విధించేందుకు అలాగే కొంత మేర నిల్వ చేసేందుకు అంగీకరించాయి” అని మార్నింగ్ స్టార్ చమురు పరిశోధన సంస్థ డైరక్టర్ శాండీ ఫైల్డన్ బీబీసీతో చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కువైట్ ఇంధన శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ మొహమ్మద్ అల్-ఫదల్ ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ, రష్యా న్యూస్ ఏజెన్సీ “టాస్” కూడా వేర్వేరుగా ఇదే విషయాన్ని చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మంది ప్రజలు లాక్ డౌన్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో గ్లోబల్ ఆయిల్ డిమాండ్ మూడో వంతుకు పడిపోయింది. ఉత్పత్తిలో కోత విధించే విషయంలో ఒపెక్ ప్లస్ దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో మార్చి నెలలో ఆయిల్ ధరలు 18 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యా-సౌదీల మధ్య పీటముడి ముఖ్యంగా రష్యా-సౌదీ అరేబియాల మధ్య పీట ముడి పడింది. అయితే ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే సూచనలు కనిపిస్తున్నాయని ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన తర్వాత చమురు ధరల్లో పెరుగుదల కనిపించింది. గురువారం ఒపెక్ ప్లస్ తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రస్తుతానికి సభ్యదేశాలు రోజుకు 10 మిలియన్ బ్యారెళ్లు లేదా మే 1 నాటికి 10 శాతం మేర ఉత్పత్తిలో కోత విధిస్తాయి. సభ్య దేశాలు కానివి అంటే అమెరికా, కెనడా, బ్రెజిల్, నార్వేలు తమ ఉత్పత్తిలో మరో 5 మిలియన్ బ్యారెళ్ల మేర కోత విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై నుంచి డిసెంబర్ మధ్యలో రోజుకు 8 మిలియన్లు, 2021 జనవరి నుంచి 2022 ఏప్రిల్ మధ్య కాలంలో రోజుకు 6 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిలో కోత విధించే అవకాశం ఉందని సమాచారం. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చమురు ఉత్పత్తిలో కోత విధించాలన్న నిర్ణయంపై ఒపెక్ సభ్య దేశాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. రోజుకు 10% మేర ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. text: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ గురువారం చేసిన ప్రసంగానికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు.. ఉత్తర కొరియా శుక్రవారం ఉదయం మరో రెండు క్షిపణులను తన తూర్పు సముద్ర తీరంలోకి పేల్చి పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో క్షిపణుల ప్రయోగం ఇది ఆరోసారి. వారం రోజుల కిందట కూడా ఉత్తర కొరియా జపాన్ సముద్రంలోకి రెండు క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్‌ల మధ్య జూన్‌లో జరిగిన భేటీలో.. అణు నిరాయుధీకరణ చర్చలను మళ్లీ ప్రారంభించాలని అంగీకరించిన అనంతరం ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్షల పరంపర చేపట్టటం గమనార్హం. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నందున ఉత్తర కొరియా మీద అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించింది. దక్షిణ కొరియా ఏం చెప్పింది? జపాన్ వలస పాలన నుంచి ఉత్తర కొరియా విముక్తి పొందిన దినోత్సవం సందర్భంగా మూన్ జే-ఇన్ ప్రసంగిస్తూ.. కొరియా ద్వీపకల్పాన్ని 2045 నాటికి ఐక్యం చేస్తామని ప్రతినబూనారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినపుడు కొరియా రెండు దేశాలుగా విభజితమైంది. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చాలన్న లక్ష్యాన్ని సాధించటం.. ఉభయ కొరియాల మధ్య చర్చలు స్తంభించిపోయినట్లు కనిపిస్తుండటంతో ''అత్యంత కీలక దశ''లో ఉందని మూన్ జే-ఇన్ పేర్కొన్నారు. ''కొరియా ద్వీపకల్పానికి, ఆసియాకు, ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలను అందించే నూతన కొరియా ద్వీపకల్పం మున్ముందు ఏర్పడుతుంది'' అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికా - దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఉత్తర కొరియా ప్రతిస్పందన ఏమిటి? అయితే, ''ఇప్పుడు కూడా ఉత్తర కొరియా సంయుక్త సైనిక కసరత్తును కొనసాగిస్తోంది'' అంటూ.. అలాంటపుడు చర్చలకు అర్థం ఏమిటని ఉత్తర కొరియా ఒక ప్రకటనలో ప్రశ్నించింది. ''శాంతియుత ఆర్థికవ్యవస్థ, శాంతియుత పాలన గురించి మాట్లాడితే అలా చేసే హక్కు ఆ దేశానికి లేదు'' అని తప్పుపట్టింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ మీద విమర్శలు ఎక్కుపెడుతూ.. ''ఒకవైపు మా సైన్యాన్ని చాలా వరకూ 90 రోజుల్లో ధ్వంసం చేసే ప్రణాళికలతో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తూ.. మరోవైపు ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య 'చర్చల' గురించి మాట్లాడుతున్న మూన్ జే-ఇన్ ఆలోచనా సరళి ఎంత ఆరోగ్యవంతమైనదని కూడా మేం ప్రశ్నిస్తున్నాం'' అని వ్యాఖ్యానించింది. ఉత్తర కొరియా నెల రోజుల వ్యవధిలో ఆరు సార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది ''ఆయన నిజంగా సిగ్గులేని మనిషి'' ప్రస్తుతం జరుగుతున్న అమెరికా - దక్షిణ కొరియా సైనిక విన్యాసాల మీద ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తోను, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తోను చేసుకున్న ఒప్పందాలను ఈ సైనిక విన్యాసాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఆ సైనిక విన్యాసాలను 'యుద్ధ అభ్యాసాల'ని ఉత్తర కొరియా ఇంతకుముందు అభివర్ణించింది. ఈ సైనిక విన్యాసాలు చాలా విడ్డూరమైనవని, ఖరీదైనవని వ్యాఖ్యానిస్తూ ట్రంప్‌కు ఇటీవల రాసిన ఒక లేఖలో కిమ్ జోంగ్-ఉన్ అభ్యంతరం తెలియజేశారని వార్తలు వచ్చాయి. సైనిక విన్యాసాలు నిర్వహించాలన్న దక్షిణ కొరియా నిర్ణయమే అణు నిరాయుధీకరణ చర్చల్లో ప్రతిష్టంభనకు పూర్తి కారణమని ఉత్తర కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధి తప్పుపట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దక్షిణ కొరియాతో ఇక చర్చలు కొనసాగించే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా తేల్చిచెప్పింది. చర్చలు విఫలమయ్యాయంటూ.. దక్షిణ కొరియా చర్యలే దీనికి కారణమని తప్పుపట్టింది. text: మెస్సీ విఫలమవడంతో 2002 తర్వాత ఈ దక్షిణ అమెరికా టీమ్ రెండోసారి గ్రూప్ దశను చేరలేకపోయే ప్రమాదం కనిపిస్తోంది. అర్జెంటీనా 2002లో తొలిసారి ఈ టోర్నమెంటులో గ్రూప్ దశను చేరలేకపోయింది. 30 ఏళ్ల వయసులో ఉన్న మెస్సీకి కనీసం మరో ప్రపంచ కప్ ఆడే అవకాశం ఉంది. కానీ అర్జెంటీనాకు అతిపెద్ద టైటిల్ తెచ్చిపెట్టడానికి రష్యాలో జరుగుతున్న 2018 ప్రపంచకప్ అతడికి ఆఖరి అవకాశం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ మెస్సీ సాధించిన ఘనత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జట్టుకు స్వర్ణపతకం తెచ్చిపెట్టడమే. బార్సిలోనాలో కూడా మెస్సీ సీజన్ అంత గొప్పగా లేదు. డొమెస్టిక్ లీగ్‌ను రెండుసార్లు గెలుచుకున్నా, యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్‌లో వరసగా మూడో సీజన్‌లో క్వార్టర్ ఫైనల్‌ చేరడంలో కాటలాన్స్ విఫలమైంది. అదే సమయంలో రియల్ మాడ్రిడ్ అమెరికా ఖండంలో ఆధిపత్యం చెలాయించడాన్ని చూడాల్సివచ్చింది. ఈ సీజన్‌లో మెస్సీ ఎందుకు రాణించలేకపోతున్నాడు అనడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో కొన్ని.. 1)శారీరక అలసట 2017/2018 యూరోపియన్ సీజన్‌లో మెస్సీ మొత్తం 54 మ్యాచ్‌లు ఆడాడు. 2014/2015 నుంచి అతడు ఆడిన వాటిలో ఇవి చాలా ఎక్కువ. గత ఐదేళ్లలో అతడు ఆడిన అత్యధిక మ్యాచ్‌లు కూడా. ట్రాన్స్‌ఫర్ మార్కెట్ సైట్ గణాంకాల ప్రకారం మెస్సీ మొత్తం 4,468 నిమిషాలపాటు ఆడాడు. సగటున ఒక్కో గోల్ కోసం 99 నిమిషాలు ఆడాడు. బార్సిలోనాలో 45 గోల్స్ వేసిన మెస్సీ, 18 అసిస్ట్స్ చేసి తన సీజన్ ముగించాడు. 2) బాధిస్తున్న గాయం 2018 ఏప్రిల్‌లో జాతీయ జట్టు నుంచి అందిన సమాచారం ప్రకారం.. కుడి కాలి తొడలో గాయం మెస్సీని బాధిస్తోందని అర్జెంటీనా వార్తా పత్రిక క్లారిన్ తెలిపింది. అతడి స్ప్రింట్, వేగం అందుకునే సామర్థ్యాలపై అది ప్రభావం చూపుతోందని చెప్పింది. ఇటలీ, స్పెయిన్‌తో జట్టుకు అతి కీలకమైన పోటీల్లో కూడా ఆడకుండా అతడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ సమస్య బహిర్గతం అయ్యింది. తర్వాత స్పెయిన్ చేతిలో తన జట్టు 6-1 తేడాతో ఓడిపోవడాన్ని మెస్సీ కళ్లారా చూశాడు. 3) అర్జెంటీనా జట్టుకు మంచిరోజులు కరువు రష్యా 2018 ప్రపంచకప్‌ కోసం జరిగిన సౌత్ అమెరికన్ క్వాలిఫికేషన్ టోర్నమెంటులో అర్జెంటీనా ఆటతీరు ఘోరంగా ఉంది. లీగ్ ఫార్మాట్ టోర్నమెంటులో ఇది ఆఖరి రౌండ్‌లో చోటు దక్కించుకుంది. అది కూడా ఫలితాలు వెలువడ్డాక, ఇతర జట్ల స్కోర్లు తక్కువగా ఉండటం వల్ల. ఆ పోటీలో 7 గోల్స్‌ వేసిన మెస్సీ, అర్జెంటీనా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ జట్టు ప్రదర్శనపై అభిమానులు, మీడియా విరుచుకుపడకుండా ఆ గోల్స్ ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. గత ప్రపంచ కప్ పోటీల్లో అర్జెంటీనా ఫైనల్ చేరగలిగినా, అదనపు సమయంలో ఒక్క గోల్‌ చేసిన జర్మనీ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. వరల్డ్ కప్ పోటీల్లో అర్జెంటీనా చివరిగా 1986లో గెలిచింది. 1993లో జరిగిన కోపా అమెరికా తర్వాత అర్జెంటీనా ఒక్క పెద్ద ట్రోఫీ కూడా గెలుచుకోలేదు. 2004, 2008లో వరసగా ఒలింపిక్ విజేతగా నిలిచినా అది ఆ గాయాలకు మందు వేయలేకపోయింది. 4) దూసుకుపోతున్న రొనాల్డో పోర్చుగల్‌ జట్టులోని ప్రత్యర్థి, దశాబ్దంగా అన్నింటిలో తనతో పోలుస్తూ వస్తున్న ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో సంచలన ఫామ్ కూడా మెస్సీ కష్టాలకు తోడైంది. స్పెయిన్‌పై హాట్రిక్ గోల్స్ చేసిన రొనాల్డో 2018 ప్రపంచకప్‌లో తన జట్టుకు అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాడు. వీటిలో కొన్ని తరాల వరకూ గుర్తుండిపోయే ఒక ఫ్రీ కిక్ కూడా ఉంది. ఆ తర్వాత మొరాకోపై తలతో బుల్లెట్ వేగంతో ఒక గోల్ చేశాడు. ఆ మ్యాచ్ మొత్తానికీ నమోదైన గోల్ అదే. ఈ టోర్నమెంటులో ఐస్‌లాండ్‌తో పెనాల్టీ మిస్ చేయడం మెస్సీకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలితే, మరోవైపు రొనాల్డో మాత్రం ఇప్పటికే దూసుకుపోతున్నాడు. రెండేళ్ల క్రితం మెస్సీ చేయలేకపోయింది రొనాల్డో చేసి చూపించాడు. యూరో 2016 టోర్నమెంట్‌లో తన జట్టుకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టాడు. రొనాల్డో మెరుపులు అంతటా కనిపించాయి. కానీ ఫైనల్లో 22 నిమిషాల తర్వాత అతడు గాయపడ్డాడు. కానీ ఆటగాడి నుంచి కోచ్‌ అవతారం ఎత్తాడు. మైదానం అంచుల్లో నిలబడి, తన జట్టుకు మార్గనిర్దేశం చేశాడు. అతడి నీడలో అసలు కోచ్ మసకబారిపోయాడు. ఆ గాయమే సాకుగా లేకుంటే, మెస్సీ కూడా అలా ప్రేక్షకుడిలా మారిపోయే ప్రమాదం ఉంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐదు సార్లు ప్రపంచ ప్లేయర్‌గా నిలిచిన లియోనెల్‌ మెస్సీ ఈ ఏడాది గత రెండు మ్యాచుల్లో ఒక్క గోల్ కూడా కొట్టలేక పోయాడు. కనీసం తోటి ఆటగాళ్లకు మద్దతు కూడా ఇవ్వలేకపోయాడు. నిజానికి తాజా ప్రపంచ కప్‌లో ఐస్‌లాండ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఒక పెనాల్టీ కూడా మిస్ చేశాడు. text: తల్లి రీనాతో పాప రివర్(ఆసుపత్రిలో జన్మించిననాటి చిత్రం) ఇద్దరినీ కలిపే ఉంచాలని ఎన్నో పిటిషన్లు వచ్చినప్పటికీ కోర్టు దానికి అంగీకరించలేదని బీబీసీ ప్రతినిధి ప్రీతీ ఝా తెలిపారు. మానవ హక్కుల కార్యకర్త ‘రీనా మే నాసినో’ను గత ఏడాది మనీలాలో అరెస్ట్ చేసినప్పుడు తను గర్భవతి అని ఆమెకు తెలియదు. ఆ సమయంలో రాత్రి పూట దాడులు చేసిన పోలీసులు ఆమెతోపాటూ మరో ఇద్దరు కార్యకర్తలను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. జైల్లో పరీక్షలు చేసిన తర్వాత 23 ఏళ్ల నాసినోకు తాను గర్భవతిననే విషయం తెలిసింది. అనంతరం ఆమె బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్ల తరువాత తల్లీబిడ్డలను వేర్వేరుగా ఉంచారు. అధికారులు నాసినోకు దూరం చేసిన ఆడ శిశువు గతవారం చనిపోయింది. దీంతో జైల్లోని ఫిలిప్పీన్ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. బిడ్డను కాపాడలేకపోయిన న్యాయ వ్యవస్థపై దేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. మూడు నెలల తన కుమార్తె రివర్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాసినోకు 3 రోజుల అనుమతి ఇచ్చారు జైలు అధికారులు కోర్టులో సవాలు చేశారు పట్టణ పేదల కోసం పోరాడే ఒక బృందంలో పనిచేసే నాసినోను 2019 నవంబర్‌లో ఒక ఆఫీసులో ఉన్నప్పుడు మరో ఇద్దరు కార్యకర్తలతో కలిసి అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు తమ దగ్గర ఉంచుకున్నారనే ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు. కానీ వారు ఆ ఆరోపణలను ఖండించారు. వామపక్షాల వైపు ఉన్న కార్యకర్తల అణచివేతకు వారే పేలుడు పదార్థాలను పెట్టారని ఆరోపించారు. “అలాంటి పరిస్థితుల్లోనూ తల్లి అవుతన్నందుకు నాసినో చాలా సంతోషించారు. విచారణకు ఎక్కువ సమయం పడుతుందని తెలిసినా, కస్టడీలో బిడ్డకు జన్మనివ్వడాన్ని ఆమె కోర్టులో సవాలు చేశారు” అని ఆమె లాయర్ జోసలీ డీన్లా చెప్పారు. కానీ, ఫిలిప్పీన్స్ లో కోవిడ్-19 వ్యాపించడంతో ఆమె గురించి ఆందోళన వ్యక్తమైంది. దేశంలోని లాయర్ల సంఘం నాసినో తరఫున ఎన్నో పిటిషన్లు వేసింది. ఆమెను విడుదల చేయాలని కోరాయి. ఏప్రిల్‌లో అత్యంత బలహీనంగా కరోనా వ్యాపించే స్థితిలో ఉన్న 22 మంది ఖైదీలను విడుదల చేయాలన వారు మొదటి పిటిషన్ వేశారు. ఆ ఖైదీల్లో నాసినో కూడా ఉన్నారు. తర్వాత బిడ్డతో సహా ఆమెను ఆస్పత్రిలో లేదంటే మనీలా సిటీ జైల్లో ఉంచాలని కోరారు. “కోర్టు మా అభ్యర్థనకు నిరాకరించడంతో మేమంతా షాకయ్యాం. న్యాయమూర్తి మానవతా దృష్టితో తన కోణం నుంచి అందుకు అగీకరించి ఉండాల్సింది. కానీ, దురదృష్టవశాత్తూ కోర్టు ఆ తల్లీబిడ్డలపై ఎలాంటి దయా చూపించలేకపోయింద”ని అని డీన్లా అన్నారు. నాసినో, రివర్‌ల కోసం పోరాడిన నాసినో తల్లి(నీలం రంగు టీషర్ట్) తల్లీబిడ్డలకు మద్దతుగా పిటిషన్లు మాసినో పాప పేరు రివర్ మాసినో. జులై 1న పాప పుట్టినపుడు బరువు చాలా తక్కువగా ఉంది, కొన్ని రోజులకు, నాసినా బిడ్డతో మనీలా జైలుకు తిరిగొచ్చారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక గదిలో ఉన్నారు. ఫిలిప్పీన్ చట్టాల ప్రకారం కస్టడీలో ఉన్న వారు తల్లి అయినపుడు మొదటి నెల రోజులు మాత్రమే బిడ్డ ఆమెతో ఉండవచ్చు. ఈ నియమాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మలేసియాలో జైల్లో ఒక తల్లి తన బిడ్డను మూడు నాలుగేళ్లు వచ్చే వరకూ తనతోనే ఉంచుకోవచ్చు. అదే బ్రిటన్‌లో బిడ్డకు 18 నెలల వయసు వచ్చేవరకూ తల్లి తనతోనే ఉంచుకోవచ్చు. నాసినో, ఆమె శిశువును జైలు నుంచి విడుదల చేయించేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. “మేం సుప్రీంకోర్టు గేటుకు బ్లూ రిబ్బన్లు కూడా కట్టాం. అవి రివర్‌కు గుర్తు. బయట కాండిల్స్ వెలిగించాం. కానీ వారు పట్టించుకోలేద”ని ఫిలిప్పీన్‌లో రాజకీయ ఖైదీల స్నేహితులు, కుటుంబాలకు అండగా నిలిచే కపాటిడ్ గ్రూపు సభ్యుడు ఫిడెస్ లిమ్ అన్నారు. ఈ సంస్థ సాయంతో నాసినో తల్లి లిమ్ కూడా దాదాపు ప్రతి వారం అధికారులకు ఫొటోలు, లేఖలు అందించేవారు. తన కూతురిని విడుదల చేయాలని వేడుకునేవారు. పాపకు తల్లి పాలు ఎంత ముఖ్యమో మాకు తెలుసన్న లిమ్ రాజకీయ ఖైదీగా ఉన్న తన 70 ఏళ్ల భర్త విడుదల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. “నాసినో బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రిలో వైద్యులు బిడ్డ తల్లితోనే ఉండాలని సిఫారసు చేశారు. కానీ, జైలు అధికారులు మాకు తగిన వనరులు లేవని, సాకులు చెప్పారు. తల్లిపాలు పొందే బిడ్డ హక్కును కాలరాశారు” అని లాయర్ డీన్లా చెప్పారు. బ్యాంకాక్ రూల్స్- మహిళా ఖైదీలతో ఎలా వ్యవహరించాలనేదానిపై ఉన్న ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రకారం ఒక బిడ్డను తల్లి నుంచి వేరు చేయాల్సి వస్తే, ఆ నిర్ణయం బిడ్డ ప్రయోజనాల ఆధారంగానే తీసుకోవాలి. దీనిపై ఫిలిప్పీన్స్ జైలు అధికారుల నుంచి స్పందన తీసుకోవడం వెంటనే సాధ్యం కాలేదు. తల్లి నుంచి వేరు చేశాక. ఆగస్టు 13న పాప రివర్‌ను తల్లి నుంచి వేరు చేశారు. దానిని నాసినో భరించలేకపోయారని ఆమె లాయర్ చెప్పారు. ఆమె బిడ్డను ఇవ్వాలనుకోలేదు. ఇంకొంత కాలం తనతో ఉంచాలని వాళ్లను వేడుకున్నారు అన్నారు. కోవిడ్-19 వల్ల ఖైదీల నిబంధనలను కఠినతరం చేశారు. డీన్లా ఆమె సహచరులు నాసినోతో ఫోన్లో మాత్రమే మాట్లాడగలిగారు. శిశువును నాసినో తల్లి లిన్‌కు అప్పగించిన తర్వాత నెలకే పాపకు విరేచనాలు కావడంతో ఆమె చాలా భయపడిపోయారు. శిశువు పరిస్థితి మరింత ఘోరంగా మారడంతో సెప్టెంబర్ 24న ఆస్పత్రిలో చేర్చారు. కానీ నాసినోకు తన బిడ్డను చూడ్డానికి అనుమతి ఇవ్వలేదు. గత వారం మూడు నెలల రివర్ న్యుమోనియాతో చనిపోయింది. పాప మరణంతో ఫిలిప్పీన్‌లో చాలా మందిని కదిలించింది. సోషల్ మీడియాలో చిన్నారి మృతికి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. చాలా మంది దేశ న్యాయవ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, మరికొందరు సంపన్నులను మాత్రం తమ పిల్లల పెళ్లిళ్లకు ఇతర కార్యక్రమాలకు తాత్కాలికంగా విడుదల చేస్తున్నారని, సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పాప అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు మంగళవారం ఉదయం నాసినోకు మూడు రోజుల సెలవు ఇచ్చింది. తర్వాత జైలు అధికారులు ఆమె కారుణ్య విడుదల కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జైల్లో ఉన్న ఒక తల్లి నుంచి అధికారులు దూరం చేసిన మూడు నెలల శిశువు చనిపోవడంతో ఫిలిప్పీన్‌లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. text: ఆసియాలోనే అత్యధికంగా అంతరించిపోతున్న పక్షి జాతులకు ఇండోనేసియా ఆవాసంగా ఉంది. పక్షుల అక్రమ రవాణా కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతోంది. దేశీయంగా కొన్ని పెద్ద పెద్ద మార్కెట్లలో వీటి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. కొందరు విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తారు. "గురువారం ఉదయం ఓడలో లభించిన ఈ చిలుకలను ఎక్కడికి రవాణా చేస్తున్నారనే సమాచారం ఇంకా తెలియలేదు" అని స్థానిక పోలీసు అధికారి దోడిక్ జునైది ఏఎఫ్ పీ వార్తా సంస్థకు తెలిపారు. "ఓడలో ఉన్న డబ్బాలలోంచి వింత శబ్దాలు వస్తుండటంతో ఓడలోని సిబ్బందికి అనుమానం వచ్చింది" అని ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఓడలో దొరికిన పక్షులను బ్లాక్ క్యాప్డ్ లోరీస్ గా గుర్తించారు. ఇవి న్యూ గినియా ప్రాంతంలోనూ నైరుతి పసిఫిక్ మహాసముద్రానికి దగ్గర్లో ఉన్న దీవులలోనూ కనిపిస్తాయి. "ఇవి ఇండోనేసియాలో రక్షిత పక్షుల జాబితాలో ఉన్నాయి. అక్రమ రవాణా చేసేందుకు ఈ పక్షులకు బాగా గిరాకీ ఉంది" అని వైల్డ్ లైఫ్ ట్రేడ్ పరిశీలన సంస్థకు చెందిన ఎలిజబెత్ జాన్ చెప్పారు. "ఈ ప్రాంతంలో పక్షుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ఇండోనేసియా ప్రయత్నిస్తోంది. కానీ, మరింత కఠినంగా వ్యవహరించాలి. పక్షులను మార్కెట్లకు తరలించే దోషులను అరెస్ట్ చేయాలి" అని ఆమె బీబీసీకి చెప్పారు. ప్లాస్టిక్ సీసాలలో పక్షులు దొరకడం ఇది మొదటి సారి కాదు. 2015లో అరుదైన 21 ఎల్లో క్రెస్టెడ్ కొకాటూ పక్షులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని ఇండోనేసియా పోలీసులు అరెస్టు చేశారు. అవి కూడా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి. ఇండోనేసియా అధికారులు 2017లో డ్రైనేజీ పైపులలో బంధించిన 125 విదేశీ పక్షులను పట్టుకున్న కేసులో చాలా అరెస్టులు కూడా జరిగాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తూర్పు ఇండోనేసియా ప్రాంతంలో పపువా దగ్గర లంగరు వేసిన ఒక ఓడలో ప్లాస్టిక్ సీసాలలో బంధించిన డజన్ల కొద్దీ చిలకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓడలో ఉన్న డబ్బాల నుంచి శబ్దాలు వినిపించడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేయగా ఇవి బయటపడ్డాయి. ఇందులో 64 చిలకలు సజీవంగా ఉండగా, 10 చిలకలు చనిపోయాయి. text: కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది. ‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , ) పలికినట్లు పలకాలి’’ అని అందులో కమలా రాశారు. ‘‘కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారత సంస్కృతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’’ అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె. కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు. కమలాకు మాయా అనే చెల్లెలు కూడా ఉన్నారు. చిన్నప్పుడు వారి ఇంట్లో ఎప్పుడూ నల్ల జాతి అమెరికన్ గాయకుల సంగీతం వినిపిస్తూ ఉండేది. కమలా తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి శ్యామల గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా హారిస్ ప్రముఖులు. అయితే, ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు. text: ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయంపై వార్త ఈ పత్రికలు 1966 జనవరి 24న కూలిపోయిన ఒక ఎయిర్ ఇండియా విమానంలో ఉండేవని భావిస్తున్నారు. ఆ విమాన ప్రమాదంలో 117 మంది చనిపోయారు. ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలుపు అక్కడ దొరికిన పత్రికలలో నేషనల్ హెరాల్డ్, ఎకనామిక్స్ టైమ్స్ సహా దాదాపు డజను పత్రికలు ఉన్నాయి. వాటి మొదటి పేజీలలో.. ఇందిరాగాంధీ తొలి ఎన్నికల్లో విజయం సాధించడానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి. స్థానిక రెస్టారెంట్ యజమాని ఒకరు ఈ పేపర్లను గుర్తించారు. “అవి ఇప్పుడు ఆరుతున్నాయి. కానీ, మంచి కండిషన్‌లో ఉన్నాయి. చదవడానికి వీలుగానే ఉన్నాయి” అని చామోనిక్స్ స్కీ రిసార్ట్ పక్కనే రెస్టారెంట్ నడుపుతున్న టిమోతీ మాటిన్ ఏఎఫ్‌పీకి చెప్పారు. అవి తడిసి ఉండడంతో ఆరబెట్టిన తరువాత వాటిని, విమానాలు కూలిన ప్రాంతాల్లో తను కనుగొన్న మిగతా వస్తువులతో కలిపి రెస్టారెంట్‌లో ప్రదర్శిస్తానని ఆయన చెప్పారు. దొరికిన భారత పత్రికలతో టిమోతీ రెస్టారెంటులో ప్రదర్శిస్తా: టిమోతీ కూలిన ఈ విమానం అవశేషాల్లో అత్యంత విలువైనవి ఆయనకు 2013లో దొరికాయి. పచ్చలు, నీలాలు, కెంపులు లాంటి విలువైన రత్నాలతో ఉన్న పెట్టె ఆయనకు దొరికింది. వాటి విలువ 1,47,000 డాలర్ల(కోటీ పది లక్షలకు పైనే) నుంచి 2,79,000 డాలర్ల(2 కోట్లకు పైనే) వరకూ ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పర్వతాలపై హిమానీనదాలు కరగడానికి, ధ్రువాల దగ్గర మంచు పలకలు వెనక్కు జగడానికి కారణం అవుతున్నాయి. మౌంట్ బ్లాంక్ గ్రాండ్ జొరాస్సెస్ శిఖరం దగ్గర ఉన్న ప్లాన్‌పిన్సియక్స్ హిమానీనదం కూలిపోయేలా బలహీనంగా ఉందని అధికారులు గత సెప్టెంబర్‌లోనే హెచ్చరించారు. అప్పట్లో బాంబేగా పిలుచుకుంటున్న ముంబయి నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 1966 జనవరి 24న మాంట్ బ్లాంక్ శిఖరం దగ్గర కూలిపోయింది. ప్రయాణం మధ్యలో దిల్లీ, లెబనాన్‌లోని బీరూట్‌లో రెండుసార్లు ఆగిన అది స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మూడో సారి ఆగడానికి దిగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. జెనీవాలో దిగుతున్న సమయంలో ఆ విమానం పర్వతానికి ఢీకొంది. ఆ ప్రమాదంలో విమానంలోని 106 మంది ప్రయాణికులతోపాటూ 11 మంది సిబ్బంది కూడా చనిపోయారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫ్రాన్స్‌లో ఆల్ప్స్ పర్వతాలపై 1966 నాటి భారతీయ వార్తా పత్రికలు బయటపడ్డాయి. మాంట్ బ్లాంక్ హిమానీనదం కరుగుతుండడంతో దాని అడుగున గుర్తించారు. text: వ‌ల‌స కార్మికులను ఆదుకోవ‌డంతో మొద‌లుపెట్టి.. అంద‌రికీ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, ఆరు నెల‌ల‌పాటు ఆహార ధాన్యాల పంపిణీ, ప‌ట్ట‌ణ-గ్రామాల్లో ఉపాధి హామీ, ఉద్యోగాలు కోల్పోయిన‌వారికి ప‌రిహారం, పంట రుణాల‌కు మూడు నెల‌ల మిన‌హాయింపులు త‌దిత‌ర సూచ‌న‌లు ఇందులో ఉన్నాయి. డాక్యుమెంట్‌ను త‌యారుచేసిన వారిలో కేంద్ర ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారుడు దీప‌క్ నయ్య‌ర్‌, ప్ర‌ణాళికా సంఘం మాజీ స‌భ్యుడు అభిజిత్ సేన్‌, చ‌రిత్ర‌కారుడు రామ‌చంద్ర గుహ‌, మ‌హాత్మా గాంధీ మ‌న‌వ‌డు రాజ్‌మోహ‌న్ గాంధీ, జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెస‌ర్ హిమాన్షు, స‌ఫాయి క‌ర్మ‌చారి ఆందోళ‌న్ జాతీయ క‌న్వీన‌ర్ బెజ‌వాడ విల్స‌న్‌, గ్రీన్ పీస్ ఇండియా ఫౌండ‌ర్ ల‌లితా రామ్‌దాస్, మాజీ నావికాద‌ళ అధిప‌తి ఎల్ రామ్‌దాస్‌ త‌దిత‌రులున్నారు. యోగేంద్ర యాదవ్ మిష‌న్ జైహింద్‌లోని వివ‌రాలివీ... 1. వ‌ల‌స కార్మికుల‌ను ప‌ది రోజుల్లోగా సొంత ఇళ్ల‌కు చేర్చాలి. కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు... వ‌ల‌స కార్మికులను పది రోజుల్లోగా సుర‌క్షితంగా, గౌర‌వప్ర‌దంగా ఇంటికి చేర్చే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం తీసుకోవాలి. 2. కోవిడ్ రోగులు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు అండ‌గా నిల‌వాలి: ప‌రీక్ష‌ల నుంచి వెంటిలేట‌ర్ల వ‌ర‌కు అంద‌రికీ ఉచితంగా.. 3. ఎవ‌రూ ఆక‌లితో ఉండ‌కూడ‌దు ‌ ఉపాధి హామీపై త‌ప్ప‌నిస‌రిగా 200 రోజుల ఉపాధి క‌ల్పించాలి. 4. అంద‌రికీ ఉపాధి 5.అంద‌రి‌కీ ఆదాయం ప్రతీకాత్మక చిత్రం 6. వ‌డ్డీలు తీసుకోకూడ‌దు 7. నిధులు లేవ‌ని ఆపేయ‌కూడ‌దు అయితే ఆదాయం కోసం ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చేసుకోవ‌చ్చ‌నే అర్థం వ‌చ్చేలా ఏడో సూత్రం ఉంద‌ని వివాదం చెల‌రేగింది. "సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌నున్న డ‌బ్బు, స్థిరాస్తులు, బాండ్లు ఇలా అన్ని వ‌న‌రుల‌ను జాతీయ వ‌న‌రులుగా ప్ర‌భుత్వం భావించాలి" అని మొద‌టగా ఏడో పాయింట్లో రాశారు. కొద్దిసేప‌టి త‌ర్వాత త‌మ‌కు జాతీయీక‌ర‌ణ‌, ప్రైవేటు ఆస్తుల స్వాధీనం లాంటి ఆలోచ‌న‌లే లేవ‌ని స్వ‌రాజ్ ఇండియా పార్టీ నాయ‌కుడు యోగేంద్ర యాద‌వ్‌ స్ప‌ష్టంచేశారు. ఏడో పాయింట్లో మార్పులుచేసి.. ఆ డాక్యుమెంట్‌ను మ‌రోసారి ఆయ‌న ట్వీట్‌చేశారు. 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ.కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) క‌రోనావైర‌స్‌తో చుట్టుముట్టిన ఆర్థిక‌, ఆరోగ్య‌, మాన‌వ‌తా సంక్షోభాల‌ను ప‌రిష్కరించేందుకు ప్ర‌ముఖ ఆర్థిక వేత్త‌లు, మేధావులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు ఏడు సూత్రాల ప్ర‌ణాళిక‌ను రూపొందించారు. దీనికి మిష‌న్ జైహింద్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. text: మదన్‌లాల్ ఖురానా బీజేపీ దిల్లీ యూనిట్ ఆయన మృతిని ధ్రువీకరించింది. 82 ఏళ్ల ఖురానా రాత్రి 11 గంటలకు కీర్తినగర్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఖురానా మృతికి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ట్విటర్‌లో నివాళులు అర్పించారు. మదన్‌లాల్ ఖురానా కుమారుడు దిల్లీ బీజేపీ ప్రతినిధి హరీష్ ఖురానా, తండ్రి అంత్యక్రియలు ఈరోజు 3 గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహిస్తామని తెలిపారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, హర్షవర్ధన్ రాణే, విజయ్ గోయెల్ కూడా ఖురానా మృతికి ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఖురానా పార్థివ దేహాన్ని అంతిమదర్శనం కోసం ఆదివారం 12 గంటలకు 14, పండిత్ మార్గ్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉంచుతామని దిల్లీ బీజేపీ ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గా తెలిపారు. మదన్‌లాల్ ఖురానా 1993 నుంచి 1996 వరకూ దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో ఆయన కొన్ని నెలలు రాజస్థాన్ గవర్నర్‌గా కూడా ఉన్నారు. మదన్‌లాల్ ఖురానా 1936లో ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఫైసలాబాద్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం దిల్లీలోని కీర్తి నగర్‌లో ఒక రెఫ్యూజీ కాలనీలో స్థిరపడింది. 1965 నుంచి 1967 వరకు ఆయన జన్‌సంఘ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 90 దశకంలో బీజేపీ దిల్లీ యూనిట్‌కు కీలక నేతగా మారారు. కార్యకర్తలు ఆయన్ను 'దిల్లీకా షేర్' అని పిలుచుకునేవారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీజేపీ నేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా శనివారం అర్థరాత్రి మృతిచెందారు. text: ఈ సిరీస్‌లో మ్యాచ్ టై అయ్యి, సూపర్ ఓవర్ ఆడాల్సి రావడం ఇది వరుసగా రెండో సారి. రెండు సార్లూ టీమ్ ఇండియాకే విజయం దక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 165 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజీలాండ్ కూడా 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్‌లో న్యూజీలాండ్ 13 పరుగులు చేసింది. భారత్ ఇంకో బంతి మిగిలుండగానే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసింది. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చారు. తొలి బంతినే సిక్సర్ బాదిన రాహుల్, రెండో బంతిని బౌండరీకి తరలించాడు. కానీ తర్వాత బంతికే ఔటయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులొచ్చాయి. ఐదో బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ భారత్‌కు సిరీస్‌లో వరుసగా నాలుగో విజయాన్నందించాడు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (39), మనీష్ పాండే (50 నాటౌట్) రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. న్యూజీలాండ్ బౌలర్ ఇష్ సోది మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ మున్రో (64), సీఫెర్ట్ (57) అర్ధ శతకాలు చేశారు. మళ్లీ ఆఖరి ఓవర్‌లో.. ఆఖరి ఓవర్‌లో న్యూజీలాండ్ జట్టు చేయాల్సింది ఏడు పరుగులే. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి. సీఫెర్ట్‌తోపాటు టేలర్ (24) క్రీజులో బాగా కుదురకుని ఉన్నారు. కానీ, శార్దూల్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి టేలర్ ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన మిచెల్ ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టాడు కానీ, మరుసటి బంతికి సీఫెర్ట్ రనౌట్ అయ్యాడు. నాలుగో బంతికి శాంట్నర్ ఒక పరుగు తీశాడు. ఐదో బంతికి మిచెల్ క్యాచౌట్ అయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు సాధించాల్సి ఉండగా.. శాంట్నర్ ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగు సాధించే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. కివీస్‌కు కలిసిరాని సూపర్ ఓవర్లు న్యూజీలాండ్ జట్టు గత ఏడాది కాలంలో మూడు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో రెండు తాజా మ్యాచ్‌లు కాగా, ఒకటి చారిత్రక వరల్డ్ కప్ ఫైనల్. ఈ మూడింటిలోనూ కివీస్ జట్టుకు పరాజయాలే దక్కాయి. ఇంగ్లండ్‌తో ఆడిన వరల్డ్ కప్ ఫైనల్‌లోనైతే సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమమయ్యాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బౌండరీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆ జట్టును విజేతగా ప్రకటించారు. అప్పట్లో ఈ విధానంపై క్రీడాభిమానుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్ న్యూజీలాండ్‌ల మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. text: గ్రామీణ మహిళలకు ఆరోగ్యంపై సూచనలు చేస్తున్న ఆరోగ్య కార్యకర్త పద్నాలుగేళ్ల ప్రమీలకు ప్రతిసారీ పీరియడ్ రావడానికి పది, పన్నెండు రోజులముందు తెల్లబట్ట అవుతోంది. ఇదేమన్నా జబ్బా లేక అందరికీ అలాగే ఉంటుందా అనేది తెలియక ఆమె ఆందోళన చెందుతోంది. పూర్ణిమకు ఈమధ్యే పెళ్లయింది. నిత్యం తెల్లబట్ట అవుతుండడంతో భర్త దగ్గరకు రావడం మానేశాడు. అంతేకాదు, ఆమె ప్రవర్తనను కూడా అనుమానించాడు. విషయం పెద్దల వరకూ పాకి విడాకుల వరకూ వెళ్లింది. చివరకు ఆమెను పరీక్షించిన ఫ్యామిలీ డాక్టర్ జోక్యం చేసుకుని ఆమెకు ఏ జబ్బూ లేదనీ, అదంతా పెళ్లయిన కొత్తలో సహజమేననీ వివరించడంతో వాళ్ల కాపురం నిలబడింది. వీళ్లే కాదు, కొత్తగా కానుపైన కరుణ, బహిష్ఠులాగిపోయిన భ్రమరాంబను కూడా ఈ తెల్లబట్ట సమస్య ఇబ్బంది పెట్టింది. మరి, ఇంతమందిని వేధిస్తోన్న ఈ తెల్లబట్ట సమస్య ఏమిటి? వైద్యశాస్త్రం ఏం వివరిస్తోందో తెలుసుకుందాం. నోట్లో ఉమ్మి ఎలా తయారవుతూ ఉంటుందో మహిళల జననేంద్రియాల నుంచి కూడా ఒక తెల్లని స్రావం తయారవుతుంది. దాన్నే వాడుకలో తెల్లబట్ట అంటుంటారు. వైద్య పరిభాషలో 'ల్యూకోరియా' అంటారు. ఇది ప్రధానంగా గర్భాశయ ముఖ ద్వారం(సెర్విక్స్ )లో వుండే గ్రంథుల నుంచి యోని మార్గంలోకి స్రవిస్తుంది. యోనిమార్గంలో ఎలాంటి గ్రంథులూ ఉండవు. దీనిలో ద్రవ పదార్థంతో పాటు, కొన్ని మృత కణాలు, ఇంకా జననేంద్రియాలకు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటాయి. వీటిని "డోడర్ లైన్ బాసిల్లై " అంటారు. ఇవి మృతకణాలలోని గ్లైకోజన్ ని విడగొట్టి లాక్టిక్ యాసిడ్‌ను తయారు చేసి వెజైనల్ PHని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఈ చర్య... వ్యాధికారక సూక్ష్మజీవులు జననేంద్రియాలలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అలా ఈ ద్రవపదార్థం, జననమార్గం తడిగానూ, ఆరోగ్యంగా ఉండటానికి, ఇంకా సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించకుండా రక్షణకవచంగానూ ఉపయోగపడుతుంది. సాధారణంగా రోజుకు దాదాపు 10 మిల్లీ లీటర్ల వరకు ఈ తెల్లబట్ట కనిపిస్తుంటుంది. కొన్ని పరిస్థితులలో మాత్రం ఇది ఎక్కువవుతుంది. ఇలా తెల్లబట్ట ఎక్కువయ్యే పరిస్థితులను రెండు వర్గాలుగా విభజించవచ్చు. 1. ఫిజియొలాజికల్ ల్యుకోరియా 2. పెథలాజికల్ ల్యుకోరియా ఇలాంటి తెల్లబట్టతో ఏ ప్రమాదమూ లేదు ఫిజియొలాజికల్ ల్యూకోరియా.. ఇది జబ్బు వల్ల వచ్చే తెల్లబట్ట కాదు. దీనికి చికిత్స అవసరం లేదు. ఇలా అయ్యే తెల్లబట్ట తెల్లగా ఉంటుంది. దుర్వాసన, దురద వంటి సమస్యలేమీ ఉండవు. శారీరకంగా, మానసికంగా ఉద్రేకానికి గురయినప్పుడు ఇది వస్తుంది. దాదాపు అన్ని వయసులవారిలో కనిపిస్తుంది. * అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో కూడా పుట్టిన వారం రోజులలోపు తెల్లబట్ట కానీ, ఎర్రబట్ట కానీ కనపడవచ్చు. దీనికి కారణం తల్లి కడుపులో ఉన్నపుడు రక్తంలో ప్రవహించిన హార్మోన్ల స్థాయి బయటకు రాగానే తగ్గడం. దీనికి చికిత్స అవసరం లేదు, దానికదే తగ్గిపోతుంది. * 10 నుంచి 12 ఏళ్ల వయసులో.. అంటే రజస్వల కావడానికి ముందు సుమారు 3 నుంచి 6 నెలల పాటు తెల్లబట్ట అవుతుంది. ఇది జననావయవాల పెరుగుదల, రక్త సరఫరా ఎక్కువ కావడాన్నీ సూచిస్తుంది. దీనికీ చికిత్స అవసరం లేదు. * బహిష్ఠు రావడానికి నాలుగైదు రోజుల ముందు కానీ, పది పన్నెండు రోజుల ముందుకానీ తెల్లబట్ట కనిపించడం సర్వ సాధారణం. నెల మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో కనిపించే తెల్లబట్ట కొంత చిక్కగా ఉంటుంది. * గర్భిణులుగా ఉన్నప్పుడు తొలి నెలల్లో, నిండు నెలల్లోనూ అయ్యే తెల్ల బట్ట జననావయవాల పెరుగుదలను, రక్త సరఫరా వృద్ధిని సూచిస్తుంది. * బహిష్ఠులు ఆగిపోయే దశలో కూడా హార్మోన్ల సమతుల్యత సరిగా లేక తెల్లబట్ట అవుతుంది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లో ప్రధానంగా కనిపించే లక్షణం తెల్లబట్ట ఎప్పుడు జబ్బుగా పరిగణించాలి? తెల్లబట్ట రంగుమారి కొంచెం పసుపుగా లేదా ఆకుపచ్చగా ఉన్నప్పుడు, దుర్వాసనతో ఉన్నప్పుడు, దురద కలిగిస్తున్నప్పుడు జబ్బుగా పరిగణించాలి. దీనినే 'పెథలాజికల్ ల్యూకోరియా' అంటారు. * పెథలాజికల్ ల్యూకోరియాకి కారణాలు ట్రైఖోమోనాస్ వజైనాలిస్ ఇన్ ఫెక్షన్: ఇది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.సుమారు నూటికి 50 మందిలో ఈ సూక్ష్మజీవి కనిపిస్తూ ఉంటుంది. జనన మార్గమంతా దురద, మంటగా ఉంటుంది. దుర్వాసనతో కూడిన ఆకుపచ్చ రంగు స్రావాలు మహిళలను ఇబ్బంది పెడతాయి. ఈ సూక్ష్మ జీవి లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి చికిత్స జీవిత భాగస్వాములిద్దరికీ ఇవ్వాలి. క్లమీడియా ఇన్ ఫెక్షన్: ఇది క్లమీడియా ట్రైఖోమాటిస్ అనే సూక్ష్మజీవి కారణంగా వస్తుంది. లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుంది. జననేంద్రియ వ్యవస్థలో వాపు కలగ జేసి, ఒక్కోసారి వంధ్యంత్వానికీ దారితీసే ప్రమాదముంది. తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి. మరికొన్ని ఇతర బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లూ, గనేరియా, సిఫిలిస్ వంటి సుఖవ్యాధులూ కూడా పెథలాజికల్ ల్యూకోరియాకు కారణమవుతాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లతోనూ.. సాధారణంగా మహిళలలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వారి రోగనిరోధక శక్తి తగ్గిన సమయాలలో.. ఉదాహరణకు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు, కుటుంబనియంత్రణ మాత్రలు వాడుతున్నప్పుడు, స్టెరాయిడ్ మాత్రలు వాడే సమయాల్లోనూ వస్తూఉంటాయి. ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లలో ఎక్కువగా కనిపించేది 'కాండిడా ఆల్బికన్స్'. షుగర్ వ్యాధితో బాధపడే మహిళలు ఎక్కువగా దీనిబారిన పడుతుంటారు. చాలా తీవ్రమయిన దురద, చిన్నచిన్న తెల్ల పెరుగు కుదుపల్లాంటి తెల్లబట్ట కావడం దీని లక్షణాలు. షుగర్‌ను అదుపులోకి తీసుకొచ్చిన తరువాత ఈ వ్యాధి మందులకు లొంగుతుంది. ఈ సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులే కాక, జననేంద్రియాలలో వచ్చే కణుతులూ, గడ్డలు, కేన్సర్లూ తెల్లబట్టకు కారణమవుతాయి. పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి ముఖ్యంగా 40-60 ఏళ్ల వయసు మహిళలు ఎలాంటి నొప్పి, బాధ లేకపోయినా కూడా 'పాప్ స్మియర్' అనే పరీక్ష చేయించుకుని కేన్సర్ లేదని నిర్ధారించుకోవాలి. అవసరమయితే 'సర్వయికల్ బయాప్సి' కూడా చేయించుకోవాలి. మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లో ప్రధానంగా కనిపించే లక్షణం తెల్లబట్ట. కాబట్టి ఈ పరీక్షలు తప్పనిసరి. నివారణ, జాగ్రత్తలు * వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం * కాటన్ లోదుస్తులు వాడడం * బహిష్ఠు సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడడం, వాటిని ప్రతి రెండు గంటలకూ వాటిని మార్చుకోవడం. * జననేంద్రియాలను గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవడం. * గాఢమైన కెమికల్స్ కలిగి వుండే డెట్టాల్, సబ్బులు వాడకూడదు. మైల్డ్ సోప్స్‌తో శుభ్రం చేసుకోవాలి. * జననేంద్రియాల వద్ద ఎలాంటి పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు వాడరాదు. * దుర్వాసన, దురదతో కూడిన తెల్లబట్టను గుర్తించగానే డాక్టర్ని సంప్రదించి జీవిత భాగస్వాములిద్దరూ చికిత్స తీసుకోవడం అవసరం. చికిత్స తెల్లబట్టకు కారణం గుర్తించి అది సాధారణమైనదా... లేదంటే చికిత్స అవసరమా అనేది వైద్యులు తెలియజేయాలి. చికిత్స అవసరమైతే, వైద్య పరీక్షలు నిర్వహించి తెల్లబట్టకు కారణమేంటో తెలుసుకుని తగిన చికిత్స ప్రారంభించాలి. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒకసారి 'పాప్ స్మియర్' పరీక్ష చేయించుకుని కేన్సర్, ఇతర ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటి సమస్యలు గుర్తిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి. జీవిత భాగస్వాములిద్దరిలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇద్దరికీ చికిత్స అవసరం. షుగర్ ,బి.పి లాంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకుంటూ బరువు పెరగకుండా చూసుకుంటూ, మంచి ఆహారంతో, తగినంత వ్యాయామంతో, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జీవన శైలిని మార్చుకుంటే ఇటువంటి వ్యాధులు దరిచేరవు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పన్నెండేళ్ల ప్రియాంకకు గత మూడు నెలలుగా తెల్లబట్ట అవుతోంది. అమ్మకు చెబితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఇంజక్షన్ చేయిస్తుందన్న భయం.. అందుకే చెప్పకుండా తనలో తానే బాధపడుతోంది. text: మిథున్ రెడ్డి మాట్లాడే సమయంలో టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధాని భూముల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని మిథున్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి ఏకపక్షంగా దర్యాప్తు జరుగుతుందనే భావన కలుగుతోందని, కాబట్టి దీనిని సీబీఐతో దర్యాప్తు చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. అదేవిధంగా, ఫైబర్‌గ్రిడ్‌ నిధుల అవకతవకలు, అంతర్వేది రథం ఘటనపైనా సీబీఐ దర్యాప్తు చేయించాలన్నారు. రూ.80 లక్షల విలువైన ఫోన్లు చోరీ లక్షా రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.80 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లను దొంగిలించిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద వెలుగుచూసిందని సాక్షి దిన పత్రిక ఓ కథనం ప్రచురించింది. సినీ ఫక్కీలో కంటైనర్‌లోకి చొరబడిన ఆగంతకులు.. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమలో తయారైన 980 రెడ్‌మి ఫోన్లను గోతాల్లో నింపుకుని పారిపోయారు. శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు సెల్‌ఫోన్ల లోడుతో బయలుదేరిన కంటైనర్‌ వెనుక తాళాలను కత్తిరించిన దుండగులు.. లోపలకి చొరబడి కొన్ని మొబైల్స్‌ను దొంగిలించి, వాహనం ఆగిన సమయంలో దిగి పారిపోయారు. వెనుకగా వస్తున్న వాహనదారులు కాజ టోల్‌ ప్లాజా వద్ద కంటైనర్‌ డ్రైవర్‌కు ఆగంతకులు చొరబడిన విషయాన్ని చెప్పారు. దీంతో డ్రైవర్, సిబ్బంది బుధవారం ఉదయం మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు కంటైనర్‌తో సహా చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరిగ్గా మూడేళ్ల కిందట కూడా ఇదే పరిశ్రమలో తయారైన మొబైల్‌ ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌ లారీ నెల్లూరుకు సమీపంలో చోరీకి గురైంది. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి పాల్పడిన ముఠాను గుర్తించి కొంతమేరకు రికవరీ చేశారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస‌రావుకు క‌రోనా ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాస‌రావు క‌రోనా బారిన ప‌డ్డారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది. కరోనా ల‌క్ష‌ణాలు కనిపించడంతో సెప్టెంబ‌ర్ 9న చెన్నైలో ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని ,ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానని సింగీతం పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం(సెప్టెంబ‌ర్ 22) నాటితో ఆయ‌న క్వారంటైన్ గ‌డువు ముగుస్తుంద‌ని తెలిపారు. అయితే అంత‌కు ముందు రోజే ఆయ‌న పుట్టిన‌రోజు కావ‌డం విశేషం. " 65 ఏండ్లుగా నేను పాజిటివ్‌గా ఉన్నా, కానీ డాక్ట‌ర్లు ఇప్పుడు కొత్త‌గా కోవిడ్ పాజిటివ్ అన్నారు"అని ఆయన చమత్కరించారు. హోమ్ ఐసోలేష‌న్‌లో భాగంగా ప్ర‌త్యేక గ‌దిలో ఉన్నాన‌ని, ఇది త‌న‌కు హాస్ట‌ల్ రోజుల‌ను గుర్తు చేస్తోందంని వ్యాఖ్యానించారు. మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్ర‌త్త‌లు ప‌డ్డా ఆ వైర‌స్ త‌న‌కు సోకింద‌ని" ఆయన తెలిపారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లు ఇకపై బ్యాంకుకు వెళ్లనక్కర్లేదు.. ఉద్యోగులే ఇంటికొస్తారు కరోనావైరస్ వ్యాప్తి నడుమ మహమ్మారితో బ్యాంక్‌‌‌‌లకు రాలేకపోతున్న ప్రజల కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌‌‌లు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను మొదలుపెట్టాయని వెలుగు పత్రిక తెలిపింది. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను 70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు అందజేయనున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌‌‌లు తెలిపాయి. ఈ సర్వీసుల కోసం కస్టమర్లు తమ బ్యాంక్ మొబైల్ యాప్, వెబ్‌‌‌‌సైట్, కాల్ సెంటర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మొదటగా అప్లికేషన్ ఫామ్‌‌‌‌ను నింపాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్‌‌‌‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ నుంచి అన్ని బ్యాంకింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్స్ ఈ సర్వీసు రిక్వెస్ట్‌‌‌‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. బ్యాంక్ వర్కింగ్ డేస్‌‌‌‌లో మీ సర్వీసు డెలివరీ టైమ్‌‌‌‌ను మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సర్వీసు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక, కేసు ఐడీ, రిక్వెస్ట్ టైప్ వంటివి మీకు ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ రూపంలో పంపిస్తారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రాజధాని ప్రాంత భూముల కోనుగోళ్ల ఆరోపణలు, ఏసీబీ కేసును వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది. text: తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రకు వరుణ్ తేజ్ ను ఎంచుకుని..మాతృకకు తనదైన అనుసృజన రాసుకుని తీసిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమాపై ప్రేక్షకుల్లో విడుదలకు ముందే ప్రత్యేక ఆసక్తి కలిగించాడు. విడుదలకు కొన్ని గంటల ముందు 'గద్దలకొండ గణేష్'గా పేరు మార్చుకున్న వాల్మీకి కథ గురించి తెలుసుకుందాం. అద్బుతమైన కథ.. అంచనా తప్పిన కథనం అభిలాష్(అధర్వ మురళి)అనే కుర్ర అసిస్టెంట్ డైరెక్టర్ సంవత్సరం లోపు సినిమా తీయాలనే పంతంతో ఉంటాడు. తన సినిమాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యమున్న విలన్ని.. హీరోగా చూపించాలనుకుంటాడు. అందులో భాగంగానే ఆంధ్ర, తెలంగాణ బార్డర్లో ఉన్న గద్దలకొండ గ్రామంలో విలనిజం చేసే గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్)ని ఎంచుకుని అతని ప్రతీ చర్యను గమనిస్తూ...అతని గురించిన విషయాలు ఆరాతీస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిలాష్.. గణేష్ దృష్టిలో పడతాడు. ఆ తర్వాత గణేష్ బారి నుండి తప్పించుకోవడానికి అభి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు గణేష్ కథేమిటీ? అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. గబ్బర్ సింగ్ మేకోవర్ నుండి పూర్తిగా బయటపడని డైరెక్టర్ "నేను జనాలను మార్చేలా సినిమాలు తీయలేను, అందుకే జనాలను ఎంటర్‌టైన్ చేసే సినిమాలు చేస్తాను 'అని 'గద్దలకొండ గణేష్ (వాల్మీకి)' సెకండ్ హీరో పాత్ర పోషించిన అధర్వ మురళి డైలాగ్ మాత్రమే కాదు ఆ సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ అభిప్రాయం కూడానని చూస్తున్నంత సేపూ అనిపిస్తుంది. కానీ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేకపోతే జనాల సహనానికి పరీక్ష పెట్టినట్లే.. కాకపోతే గద్దలకొండ గణేష్ ఈ మేరకు కొంత సఫలమయ్యాడనే చెప్పొచ్చు. హరీష్ శంకర్‌కి గబ్బర్ సింగ్ సక్సెస్ నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచి సినిమాలు ఆయన నుండి వచ్చే అవకాశం ఉంది. దువ్వాడ జగన్నాధం ఫెయిల్యూర్ తర్వాత, తమిళంలో బాబీ సింహా నటించిన 'జిగర్ తండా' రీమేక్‌లో, ఫర్ఫెక్ట్ క్లాస్ లుక్ లో కనిపించే 'వరుణ్ తేజ్'ని గద్దలకొండ గణేష్ అనే పేరుతో మాస్ విలన్‌గా చూపించాలనుకోవడం నిజంగా ధైర్యం చేశారనే చెప్పాలి. తమిళ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు మధ్య ఉన్న తేడాను దృష్టిలో ఉంచుకుని.. హరిష్ శంకర్ తెలుగు రీమేక్‌లో కథను అనుసృజన చేసి మన వాతవరణానికి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశాడు. తమిళప్రేక్షకులు ఆదరించినంతగా ప్రయోగాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించరనే బలమైన వాదన వినిపించే ముందు అసలు ఎందుకు ఆదరించడం లేదు? ఎక్కడ సమస్య ఉంది?అనే రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగిన డైరెక్టర్ ఎవరైనా అద్భుతమైన సినిమాలు తీయగలరేమో. అయితే కథను నువ్వెంత గొప్పగా అల్లుకున్నావు, ఎన్ని మలుపులు, ట్విస్టులు ప్లే చేశావు అనేదానికన్నా సినిమాను నువ్వెలా చూపించావు అన్నదే ముఖ్యం. అసలు సినిమా అంటేనే దృశ్యకావ్యం కదా. సినిమా మొదలైనప్పటి నుండి కథలోని పాత్రలు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా, సన్నివేశాలు కూడా ఒకదానికి, మరొకదానికి పొంతన లేని విధంగా సాగుతుంటాయి. విలనిజానికి లవ్లీ టచ్ ఇచ్చిన లవర్ బాయ్ ఇప్పుటి వరకు లవర్ బాయ్ తరహా పాత్రలనే పోషించిన వరుణ్ తేజ్ చక్కటి హావభావాలతో విలనిజం చూపించడంలో కూడా పర్వాలేదనిపించాడని చెప్పవచ్చు. మాస్ లుక్, గెటప్, మ్యానరిజం, అటిట్యూడ్, డైలాగ్స్ డెలివరీ.. అన్నీ చక్కగా కుదిరాయి. సినిమాలో మిగతా పాత్రలన్నింటినీ అతను పక్కకు నెట్టేసి స్క్రీన్ మీద ఆధిపత్యం చలాయించినట్లుగా అనిపిస్తుంది. అవసరమైన చోట అవసరమైన భావోద్వేగాలను చూపిస్తూ సినిమా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. వరణ్ తేజ్‌లో ఉన్న మరో నటకోణాన్ని బాగా చూపించగలిగాడు హరీష్ శంకర్. ఇక వరుణ్ తేజ్ తరువాత చెప్పుకోదగ్గ పాత్ర అధర్వ మురళి. తమిళ కుర్రాడైన అధర్వ మురళి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. ఎక్కడా తమిళ్ నెటివిటీ కనపడకుండా అచ్చ తెలుగు కుర్రాడిలా నటించి మెప్పిస్తాడు. మెరిసిన సితార - మెరిసిమెరవని తార శ్రీదేవి అనే పేరుతో పూజాహెగ్డే కనిపించినంతలో మెరిసిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అలనాటి 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మా...'రీమేక్ పాటలో బాగా ఆకట్టుకుంది. అయితే పాత్ర నిడివి మరి తక్కువ కావడం వలన ఇంకాసేపు కనిపిస్తే బాగుండుననిపిస్తుంది ఆమె అభిమానులకు. మృణాళిని రవి తన పరిధిలో పర్వాలేదనిపించింది. సత్య చింతమల్లి పాత్రలో, బ్రహ్మాజి రౌడిబ్యాచ్‌కి నటన నేర్పే టీచర్ పాత్రలో ప్రేక్షకులను బాగా నవ్వించారు. సుబ్బారావు, జబర్దస్త్ రవి, తనికెళ్ళ భరణి..తదితరులు ఎవరి పరిధిలో వాళ్ళు బాగా నటించారు. క్లాస్ కథలో మాస్ మెరుపులు కురిపించాలనుకున్న హరీష్ శంకర్ ప్రయత్నం వృధా పోలేదు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరికొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దువ్వాడ జగన్నాథం'మిగిల్చిన నిరాశను పూడ్చుకొనే ప్రయత్నంలో ఉన్న దర్శకుడు హరీష్ శంకర్.. ఈసారి తమిళ కల్ట్ మూవీ 'జిగర్ తండా' ఆధారంగా 'గద్దలకొండ గణేష్' తీశాడు. text: కేఎఫ్‌సీ దక్షిణాఫ్రికా ఈ వీడియోను షేర్ చేసి, ఈ జంట వివరాలు తెలుసుకొనేందుకు సహకరించాలని నెటిజన్లను కోరింది. ఈ పోస్ట్ 17 వేలసార్లకు పైగా రీట్వీట్ అయ్యింది. #KFCProposal అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవడం మొదలైంది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 తర్వాత ఈ జంటను గుర్తించారు. వీరి పేర్లు- భుట్ హెక్టర్, నోన్‌హాన్‌హ్లా. ఈ జంటను గుర్తించిన తర్వాత ఈ అంశం మరో ఆసక్తికర మలుపు తీసుకుంది. వీరి పెళ్లి ఏర్పాట్లకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. పెళ్లిలో వినోద కార్యక్రమాలు, హనీమూన్ సమయంలో వసతి తాము ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రముఖ గాయకుడు, గేయరచయిత జేక్స్ బాంట్వినీ ట్విటర్లో స్పందిస్తూ- పెళ్లిలో తాను ఉచితంగా ప్రదర్శన ఇస్తానన్నారు. తర్వాత ఈ జంటకు వివిధ కంపెనీలు బహుమతులను ప్రకటించడం మొదలైంది. "హనీమూన్ ప్రాంతాలు చాలా దూరంలో ఉంటాయి. ఈ జంటను ఆయా ప్రాంతాలకు కార్లో ఎవరైనా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ పని మేం చేస్తాం" అని ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థ 'ఆడి' దక్షిణాఫ్రికా శాఖ ట్విటర్లో చెప్పింది. భుట్ హెక్టర్, నోన్‌హాన్‌హ్లా పెళ్లి సందర్భంగా వారి అందమైన ప్రేమకథ కోసం రెండు పేజీలు కేటాయిస్తామని డీఆర్‌యూఎం పత్రిక తెలిపింది. బీరు మొదలుకొని వంట సామాన్ల వరకు పెద్దయెత్తున బహుమతులు వస్తున్నాయి. విరాళాల రూపంలో వేల డాలర్ల ఆర్థిక సహాయాన్నీ కొందరు ఈ జంటకు ప్రకటిస్తున్నారు. కేఎఫ్‌సీలో భుట్ హెక్టర్ ప్రపోజల్‌ను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టిన కటేకా మలోబొలా అనే వ్యక్తి, దక్షిణాఫ్రికన్ల స్పందన చూసి హర్షం వ్యక్తంచేశారు. ఇది నిజమైన వీడియో అని, దీనిని ఓ వాట్సప్ గ్రూప్‌లో పెట్టానని, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్‌లలో అప్లోడ్ చేశానని, తర్వాత భారీ స్పందన వచ్చిందని ఆయన ఇంకో వీడియోలో చెప్పారు. భుట్ హెక్టర్, నోన్‌హాన్‌హ్లా జంట ప్రేమకథలో మరో ఆసక్తికర అంశం ఉంది. "2012లోనే పెళ్లయ్యింది.. కానీ..." తమకు 2012లోనే పెళ్లయ్యిందని ఈ జంట దక్షిణాఫ్రికా వెబ్‌సైట్ 'సోవెటన్‌'తో చెప్పింది. కానీ అప్పట్లో భుట్ హెక్టర్ కొన్న ఉంగరాలు అతడికి సంతృప్తి కలిగించలేదని, అంతకన్నా మంచి ఉంగరం భార్యకు కొనివ్వాలనుకున్నారని ఆ జంటను ఉటంకిస్తూ సోవెటన్ తెలిపింది. తనకు ఉద్యోగం లేదని, భార్యకు మంచి ఆభరణం కొనడానికి కావాల్సినంత డబ్బు తన వద్ద లేదని హెక్టర్ చెప్పాడు. తమ శ్రేయోభిలాషులకు, దక్షిణాఫ్రికన్లకు ఈ జంట ధన్యవాదాలు తెలిపింది. "దక్షిణాఫ్రికన్లకు ధన్యవాదాలు. మీ సహృదయత మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మా ప్రేమకథ మీలో చాలా మంది మనసులను తాకింది. ఇది మేమెన్నడూ ఊహించలేదు" అని ఆ జంట తమ ప్రకటనలో తెలిపింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దక్షిణాఫ్రికాలోని ఓ కేఎఫ్‌సీ రెస్టారంట్లో యువతీయువకుల జంట ఒకటి ఫ్రైడ్ చికెన్ తింటోంది. ఇంతలోనే యువకుడు మోకాళ్లపై కూర్చుని, ఆమెకు ఉంగరాన్ని బహూకరించి 'ప్రపోజ్' చేశాడు. ఈ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. text: విదేశాలు కూడా సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రూ.700కోట్లను కేరళకు అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి విజయన్ స్వయంగా వెల్లడించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా విదేశీ సహాయాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించలేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై విమర్శలు మొదలవుతున్నాయి. కేరళలో ప్రజలకు ఆహారం, దుస్తుల అవసరం చాలా ఉంది. భారీ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేయాలి. నీళ్లు, విద్యుత్, రవాణా వ్యవస్థలను పునరుద్ధరించాలి. వీటిన్నింటికీ చాలా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ సహాయాన్ని ఎందుకు స్వీకరించట్లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేరళ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారిని దీని గురించి బీబీసీ ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ గత 15-20ఏళ్లలో దేశంలో సంభవించిన విపత్తులను గమనిస్తే, చాలాసార్లు భారత ప్రభుత్వం విదేశీ సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదనే విషయం అర్థమవుతుంది. 2004 సునామీ సమయంలో మొదట భారత ప్రభుత్వం విదేశీ సాయాన్ని తిరస్కరించింది. కానీ తరువాత ఆ సాయం తీసుకోక తప్పలేదు. ఒక నివేదిక ప్రకారం సునామీ సమయంలో అందిన ఆర్థిక సాయంలో 70శాతం విదేశాల నుంచి వచ్చిందే. ఆ తరువాతి ఏడాది కశ్మీర్‌లో సంభవించిన భూకంపం ధాటికి 1300మంది చనిపోయారు. దాదాపు 30వేల మంది తమ ఇళ్లను కోల్పోయారు. ఆ సమయంలో చాలా దేశాలు ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎలాంటి విదేశీ సాయాన్ని తీసుకోలేదు. మరోపక్క అదే సమయంలో పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్‌లో పరిస్థితులను పునరుద్ధరించేందుకు ఆ దేశం విదేశీ సాయాన్ని కోరింది. కేరళకు యూఏఈ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించింది ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ, ‘భారత ప్రభుత్వం తనను తాను ఒక డోనర్(దాత)లాగా చిత్రించుకోవడానికే చూస్తుంది’ అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ‘మా సమస్యలను మేం చూసుకోగలం’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి హామిద్ అన్సారీ వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక తెలిపింది. భారత్ ఓ అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా కనిపించడానికి ఇష్టపడుతుందని, అందుకే విదేశీ సహాయాన్ని పొందడానికి ఆసక్తి చూపట్లేదని ఆ పత్రికా కథనం చెబుతోంది. కానీ 2014లో ఒడిశా తుపాను తరువాత భారత ప్రభుత్వం అమెరికా నుంచి లక్ష డాలర్ల ఆర్థిక సహాయాన్ని స్వీకరించింది. దీన్ని బట్టి చూస్తే గత 15-20ఏళ్ల భారత్ విదేశాల మీద ఆధారపడటం కంటే స్వయం శక్తిపైన ఆధారపడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పడం సమంజసం. ప్రస్తుత కేరళ పరిస్థితే అందుకు ఉదాహరణ. అక్కడ విదేశీ సాయానికి బదులుగా భారత సైన్యాన్ని బరిలోకి దింపి పరిస్థితులను చక్కబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేరళలో ఇప్పుడిప్పుడే వరద ఉద్ధృతి తగ్గుతోంది ప్రకృతి విపత్తుల నిపుణుడు సంజయ్ శ్రీవాస్తవ్ ఇటీవలే కేరళ నుంచి తిరిగొచ్చారు. విదేశీ ఆర్థిక సాయాన్ని తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని ఆయన అన్నారు. కానీ కేరళలో విదేశాలకు చెందిన సంస్థల సిబ్బంది సేవలందిస్తున్నారనీ, ఐరాసకు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్ లాంటి సంస్థలకు చెందిన వలంటీర్లు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ‘సాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. తరువాత వారికి ఆహారం, దుస్తులు సమకూరుస్తారు. ఆపైన వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటారు. ఆ తరువాతే నష్టానికి సంబంధించిన అంచనాలు మొదలవుతాయి. ఆపైన పునరావాస కార్యక్రమాలు చేపడతారు. దీనంతటికీ నెల రోజులైనా పడుతుంది’ అని సంజయ్ వివరించారు. కేరళ ప్రభుత్వం 2వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కోరింది. కానీ జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేశాకే కేరళకు ఎంత సాయం అవసరమవుతుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవచ్చు. విదేశీ సాయం అవసరమో లేదో కూడా అప్పుడే తేల్చుకుంటుంది అని సంజయ్ అభిప్రాయపడ్డారు. విదేశీ సాయంపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో విదేశీ సాయం గురించి వెలువడిన మీడియా కథనాలపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. ‘‘కేరళలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన పలు దేశాలు, విదేశీ ప్రభుత్వాలను భారత ప్రభుత్వం అభినందిస్తోంది. అయితే, కేరళలో సహాయ, సహకారాల అవసరాలను (నిధులను) ప్రభుత్వం దేశీయంగా లభించే మద్దతు చర్యలతో తీర్చగలదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు, అంతర్జాతీయ సంస్థలు ప్రధాన మంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. వీటిని స్వాగతిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కేరళలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. రాష్ట్రాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రూ.600కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. text: ఆ కథనం ప్రకారం.. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధనలకు తగిన సహకారం అందించేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సిప్లా ముందుకొచ్చింది. ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చిన కొన్ని డ్రగ్స్‌ సాయంతో ఔషధం తయారీకి ప్రయత్నిస్తున్నామని ఐఐసీటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. పదిమంది శాస్త్రవేత్తలు, మరో 30 మంది నిపుణులు ఈ పనిలో నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎయిడ్స్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధుల చికిత్సకు ఔషధాలను తయారుచేసిన ఐఐసీటీ ఈసారి కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఫెవిపిరవిల్‌, రెమిడిసవిర్‌, టెలాక్సివిర్‌ అనే డ్రగ్స్‌ కరోనాకు విరుగుడుగా పనిచేయవచ్చని ఐఐసీటీ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. ఈ డ్రగ్స్‌పై ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. అయితే మార్కెట్లో వీటి అవసరం రాకపోవడంతో వాటి ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఈ డ్రగ్స్‌ పారిశ్రామిక స్థాయిలో టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో తయారుచేసి ఎటువంటి షరతులు లేకుండా మార్కెట్లోకి విడుదల చేయడానికి సిప్లా సిద్ధమవుతున్నది. నాలుగు నెలల్లోగా ఔషధాన్ని విడుదల చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చంద్రశేఖర్‌ 'నమస్తే తెలంగాణ'కు తెలిపారు. రెండు షిఫ్టుల్లో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు. తాము ఔషధాన్ని తయారుచేసి సిప్లాకు అందిస్తామని, ఆ సంస్థ భారీస్థాయిలో వాటిని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. నిత్యావసరాలపై బెంగవద్దు.. ఆంక్షలు, మినహాయింపులపై కేంద్రం స్పష్టత 21 రోజుల పాటు దేశం లాక్‌ డౌన్‌ ఉంటుందని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ప్రకటన చేసిన అనంతరం కేంద్ర హోం శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీచేసిందని సాక్షి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. లాక్‌ డౌన్‌ వర్తించేవి: 1. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల కార్యాలయాలు, పబ్లిక్‌ కార్పొరేషన్‌ సంస్థలు మూసి ఉంటాయి. ఇందులో మినహాయింపు వర్తించేవి: 2. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు మూసి ఉంటాయి. వీటిలో మినహాయింపు వర్తించేవి: 3. ఆసుపత్రులు, వైద్య సంస్థలు, ఔషధ ఉత్పత్తులు, పంపిణీ సంస్థలు (పబ్లిక్, ప్రయివేటు), డిస్పెన్సరీలు, కెమిస్ట్‌(ఫార్మసీ), వైద్య పరికరాల షాపులు, వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు, క్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్స్, అంబులెన్స్‌ సేవలు 4. అన్ని వాణిజ్య, ప్రయివేటు సంస్థలు మూసి ఉంటాయి. ఇందులో మినహాయింపు వర్తించేవి: 5. పారిశ్రామిక సంస్థలు మూసి ఉంటాయి. ఇందులో మినహాయింపు: 6. విమానం, రైలు, రోడ్డు రవాణా ఉండదు. మినహాయింపు: 7. ఆతిథ్య సేవలు నిలిపివేయాలి మినహాయింపు: 8. విద్యా సంస్థలు, పరిశోధన, కోచింగ్‌ సంస్థలు బంద్‌ 9. అన్ని ప్రార్థన మందిరాలు మూసి ఉంటాయి. 10. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మత వేడుకలు, సమావేశాలపై నిషేధం 11. అంత్యక్రియల విషయంలో 20 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదు. 12. ఫిబ్రవరి 15 తరువాత దేశంలోకి వచ్చిన వారంతా స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు నిర్ధిష్ట కాలం హోం క్వారంటైన్‌లో లేదా ఆసుపత్రి క్వారంటైన్‌లో ఉండాలి. లేనిపక్షంలో ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు. 13. ఈ చర్యలన్నీ అమలయ్యేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్‌ కమాండర్‌గా క్షేత్రస్థాయిలోకి పంపి అమలయ్యేలా చూడాలి. ఈ చర్యలు అమలుకావడంలో ఇన్సిడెంట్‌ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు. 14. ఈ ఆంక్షలన్నీ ప్రజల కదలికల నియంత్రణకే తప్ప అత్యవసర వస్తువుల రవాణాకు సంబంధించి కాదని యంత్రాంగం గుర్తుంచుకోవాలి. 15. ఆసుపత్రుల సేవలు కొనసాగడం, వాటికి వనరుల సమీకరణ కొనసాగేలా ఇన్సిడెంట్‌ కమాండర్స్‌ చూడాలి. అలాగే ఆసుపత్రుల విస్తరణ, వాటికి అవసరమయ్యే మెటీరియల్, పనివారు లభ్యమయ్యేలా చూడాలి. 16. ఆంక్షలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 వరకు గల సెక్షన్ల కింద శిక్షార్హులు. ఏటీఎం విత్‌డ్రాయల్‌ చార్జీల రద్దు దేశంలో కోవిడ్‌-19 విజృంభణ. సగటు జీవులు, ఎంఎ్‌సఎంఈలు, సగటు పౌరులపై దాని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అన్ని వర్గాలకు ఊరట కల్పించేందుకు పలు చర్యలు ప్రకటించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడం, ఆర్థిక కార్యకలాపాలకు పెను అంతరాయం ఏర్పడడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ విస్తృతమైన చర్యలు ప్రకటించినట్టు నిర్మల చెప్పారు. ఈ మహమ్మారి వల్ల ఏర్పడుతున్న భారీ నష్టాల నుంచి భిన్న వర్గాలను కాపాడేందుకు ఉద్దీపన ప్యాకేజి సిద్ధం అవుతున్నదని, వీలైనంత త్వరలోనే అది ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. పౌరులకు ఊరట ఇచ్చే చర్యలు - ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌పై చార్జీల ఎత్తివేత, ప్రైవేటు బ్యాంకులు సహా అన్ని బ్యాంకుల ఏటీఎంల్లోనూ మూడు నెలల పాటు ఉచిత విత్‌డ్రాయల్‌ సదుపాయం, పరిస్థితిని బట్టి ఈ సదుపాయం మరింత ఎక్కువ కాలం విస్తరించే అవకాశం - సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస నిల్వ నిర్వహించాల్సిన నిబంధనకు మినహాయింపు, పెనాల్టీల ఎత్తివేత - 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువు, పాన్‌-బయోమెట్రిక్‌ ఆధార్‌ అనుసంధానం గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి బుధవారం నుంచి సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. చిరంజీవి వీడియో సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది. 'ఇక నుంచి నేను కూడా సోషల్‌మీడియాలోకి రావాలి అనుకుంటున్నా. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాల్ని అభిమానులతో పంచుకోవాలి అనుకోవడమే. నేను చెప్పాలి అనుకుంటున్న సందేశాల్ని ప్రజలతో చెప్పడానికి ఇది వేదికగా భావిస్తున్నా' అని ఈ సందర్భంగా చిరు అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'చిరంజీవి కొణిదెల' పేరుతో ఖాతా కనపడుతోంది. దీన్ని అప్పుడే 3.7 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 'సైరా' తర్వాత చిరు... కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'ఆచార్య' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. Source: Ministry of Health & Family Welfare కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మానవాళి మనుగడకే సవాలు విసురుతూ.. ప్రపంచమంతటా మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే ఔషధం తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధనలు మొదలయ్యాయని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. text: ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రణాళికలు రచించినప్పటికీ.. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. భారత్ గడ్డపై పుట్టిన 36 ప్రముఖ మత సంప్రదాయాలకు చెందిన 135 మంది సాధువులు ఈ వేడుకకు వస్తున్నారు. బాబ్రీ మసీదు-రామ మందిరం వివాదంపై కోర్టులో దావావేసిన వారిలో ఒకరైన ఇక్బాల్ అన్సారీ, అయోధ్య నివాసి, పద్మ శ్రీ మహమ్మద్ షరీఫ్‌లకూ భూమి పూజ ఆహ్వానం అందింది. నేపాల్‌లోని జానకీ దేవాలయ ప్రతినిధులూ ఇక్కడకు వస్తున్నారు. అయోధ్యతో సీత పుట్టినిల్లుగా చెప్పే జనక్‌పుర్‌కు సంబంధమున్నట్లు ఎన్నో కథలు చెబుతున్నాయి. మరోవైపు రామ మందిర ఉద్యమంలో ఏళ్లపాటు క్రియాశీలంగా వ్యవహరించిన చాలా మందికి ఎలాంటి ఆహ్వానాలు అందలేదు. నిజమే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మందినే ఆహ్వానించారు. అయితే అతిథుల జాబితాపై చాలా చర్చ జరుగుతోంది. భూమి పూజను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తారు. కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. భూమి పూజపై ప్రకటన చేసే సమయంలో వేదికపై చంపత్ రాయ్‌తోపాటు చాలా మంది కనిపించారు. కానీ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ మాత్రం కనిపించలేదు. అయోధ్యలోని అతిపెద్ద అఖాడాల్లో ఒకటైన మణి రామ్‌దాస్ జీ అఖాడా పీఠాధిపతి అయిన గోపాల్ దాస్ ఏళ్లుగా రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ అధిపతిగా కొనసాగారు. దశాబ్దాల తరబడి రామజన్మభూమి ఉద్యమంలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన గొంతు పెద్దగా వినిపించలేదు. ఆయనకు వీహెచ్‌పీతో సంబంధముంది. అయితే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ లేదా వీహెచ్‌పీల్లో కార్యకర్త గానీ, నాయకుడుగా గానీ పనిచేయలేదు. భూమి పూజకు గోపాల్ దాస్ రాకపోవడంపై రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల్లో ఒకరైన డాక్టర్ అనిల్ మిశ్రా బీబీసీతో మాట్లాడారు. ''మీడియాలో ఏవో కథనాలు వస్తుంటాయి. కానీ వాస్తవం వేరు. గోపాల్ దాస్ నడవడానికి కష్టమవుతోంది. ఇప్పుడు ఆయన తన సొంత ఆశ్రమంలోనే ఉంటున్నారు''అని ఆయన వివరించారు. ''రామ జన్మభూమి ఉద్యమం పేరుతో చేసిన రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకొని చంపత్ రాయ్ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ అన్నింటినీ తమ నియంత్రణలోకి తీసుకొంటోంది''అని హిందుత్య, అయోధ్యపై పుస్తకాలు రాసిన ధీరేంద్ర ఝా వ్యాఖ్యానించారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగమే. రెండింటి భావజాలాలు ఒకేలా ఉంటాయి. వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడైన చంపత్ రాయ్.. ప్రస్తుతం రామజన్మభూమి ట్రస్టుకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి కేంద్ర బిందువైన 2.77 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయిస్తూ గతేడాది నవంబరు 9న ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణానికి వేరేచోట ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు సూచించింది. మందిరం నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ విషయంపై ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ పేరుతో ఓ స్వతంత్ర ట్రస్టును ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ ముగ్గురి మధ్యే ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని క్యాబిటెన్ మీటింగ్‌లో తీసుకున్నామని మోదీ చెప్పారు. ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులు సహా 15 మంది సభ్యులు ఉంటారని వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రామ మందిర నిర్మాణం, నిర్వహణను ఎవరు చూసుకుంటారనే అంశంపై ప్రశ్నలు వచ్చాయి. దీంతో రామ జన్మభూమి న్యాస్, రామాలయ ట్రస్టు, టెంపుల్ కన్‌స్ట్రక్షన్ ట్రస్టుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. రామ జన్మభూమి న్యాస్‌కు వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో సంబంధాలున్నాయి. మందిర నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై 1990 నుంచీ వీరు కరసేవక్‌పురంలో వర్క్‌షాప్‌ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో రామాలయ ట్రస్టు ఏర్పాటైంది. అందులో ద్వారకాపీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సహా పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో ఈ రెండు సంస్థలకు ప్రాతినిథ్యం దక్కింది. అయితే మూడో సంస్థ అయిన టెంపుల్ కన్స్‌ట్రక్షన్ ట్రస్టుకు ఎలాంటి ప్రాతినిథ్యం దక్కలేదు. కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్నవారికే కాకుండా.. రామ మంది నిర్మాణంతో సంబంధమున్న అందరికీ ప్రాతినిథ్యం కల్పించాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది. రామ జన్మభూమి కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న నిర్మోహీ అఖాడా, హిందూ మహా సభ కూడా.. మంది నిర్మాణం, నియంత్రణపై తమ వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్‌లో నిర్మోహీ అఖాడాకు చెందిన దీనేంద్ర దాస్‌కు చోటు దక్కింది. అయితే తమ ప్రతినిధితో ఎలాంటి చర్చలూ జరపకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మోహీ అఖాడా అధికార ప్రతినిధి కార్తిక్ చోప్రా వ్యాఖ్యానించారు. భూమి పూజ కార్యక్రమాన్ని రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలతోపాటు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ, పారిశ్రామికవేత్తలు నియంత్రిస్తున్నారని కార్తిక్ ఆరోపించారు. అడ్వాణీ నిర్వహించిన రథ యాత్రలో సమన్వయకర్తగా నరేంద్ర మోదీ పనిచేశారు శివసేన ఏమంటోంది? భూమి పూజ కార్యక్రమానికి శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరుకాబోరని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. గత కొన్నేళ్లలో అయోధ్యను చాలాసార్లు ఠాక్రే సందర్శించారు. అయితే రామాలయం ఏదో ఒక పార్టీకి మాత్రమే చెందదని, అన్ని కార్యక్రమాల్లోనూ తమనూ భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రామ జన్మభూమి ట్రస్టులో తమకూ ప్రాతినిధ్యం కల్పించాలని శివసేన నాయకుడు ప్రతాప్ శర్ణిక్.. నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ''బాబ్రీ మసీదు కూల్చివేత బాధ్యతను శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే తన నెత్తిన వేసుకున్నారు. అయినప్పటికీ అందరూ అడ్వాణీని హీరోగా కొనియాడారు. అది ఠాక్రే జీవితంలో అత్యంత విచారకరమైన రోజు''అని అప్పటి సంగతులను ప్రతాప్ గుర్తుచేశారు. ''బాబ్రీ మసీదు కూల్చివేతకు రక్తం చిందించిన తమ పార్టీ నాయకులు ఏనాడూ రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదు''అని శివ సేన పత్రిక సామ్నా కథనం కూడా రాసింది. ''ట్రస్టులో సభ్యులందరూ అయితే మోదీకి సన్నిహితులు. లేదా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో సంబంధమున్న నాయకులు. 2024 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ట్రస్టును ఇలాంటి వారితో ఏర్పాటుచేశారు''అని సామ్నా ఆరోపించింది. అడ్వాణీతోపాటు బీజీపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి కూడా భూమి పూజకు హాజరు కావడంలేదు. రామ జన్మభూమి ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఉమా భారతికి మాత్రం ఆహ్వానం అందింది. అయితే, కార్యక్రమానికి తాను హాజరు కావడంలేదని ఉమా భారతి కూడా ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రితోపాటు అక్కడకు వచ్చే వేల మంది ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నానని ఆమె వివరించారు. అందరూ వెళ్లిపోయాక ఆ ప్రాంతాన్ని దర్శించుకుంటాని వివరించారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ భోపాల్ నుంచి అయోధ్యకు రైలులో రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోపంగా ఉండటం వల్లే కార్యక్రమానికి హాజరు కావడంలేదని వార్తలు కూడా వచ్చాయి. దళితులతో భూమిపూజపై చర్చ కొన్ని రోజుల క్రితం దేవాలయం భూమి పూజ దళితుడితో చేయించాలని ట్విటర్‌లో చర్చ జరిగింది. 1989లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం.. బిహార్‌కు చెందిన దళితుడు కామేశ్వర్ చౌపాల్‌తో భూమి పూజ చేయించింది. ఇప్పుడు కూడా శ్రీ రామ జన్మభూమి ట్రస్టులో ఆయనకు సభ్యత్వం ఉంది. ''రామ జన్మభూమికి సంబంధించిన వాస్తవాలు లభించేలా భూమి నుంచి 200 అడుగుల లోతున టైమ్ క్యాప్సూల్‌ను పంపించబోతున్నాం''అని ఇటీవల ఆయన ఓ కథనం రాసుకొచ్చారు. అయితే, ఆ మరుసటి రోజే అలాంటిదేమీ లేదని చంపత్ రాయ్ ప్రకటన విడుదల చేశారు. టైమ్ క్యాప్సూల్ ప్రకటన తప్పని ఆయన చెప్పారు. కేవలం రామ జన్మభూమి ట్రస్టులోని అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారం మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. సోమవారం దళితుల అంశంపై మాట్లాడుతూ.. ''ఒక సారి సాధువు అయితే.. ఆ మనిషి దేవుడు అవుతాడు. అలాంటప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న వార్తల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12.15కు భూమి పూజ జరగబోతోంది. కేవలం 32 సెకన్లు మాత్రమే ఈ ముహూర్తం ఉంటుంది. దీని కోసం వారణాసితోపాటు కొన్ని ప్రముఖ స్థలాల నుంచి పండితులు వస్తున్నారు. ప్రస్తుతమున్న తాత్కాలిక దేవాలయంలో 30 ఏళ్లుగా పూజలు చేస్తున్న పండితుడు సత్యేంద్ర దాస్‌ను ఈ విషయంపై సంప్రదించలేదు. ''మందిరం నిర్మించిన తర్వాత ఇక్కడ పండితుడు ఎవరు ఉంటారు అనేది రాముడికే తెలియాలి''అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అయోధ్యలో రామ మందిరానికి నేడు (ఆగస్టు 5న) భూమి పూజ చేయనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం మధ్యాహ్నం ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. text: బంగారం కొనుగోళ్లు.. ధరల్లో ప్రస్తుతం ఉన్న ట్రెండే కొనసాగితే ఈ అక్షయ తృతీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అక్షయ తృతీయగా నిలుస్తుంది. 2018 ఏప్రిల్ 17 అంటే మంగళవారం 24 కేరట్ల బంగారం దాదాపు రూ.32,000 (పది గ్రాములు)గా ఉంది. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? బంగారాన్ని పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావిస్తారు. ప్రస్తుతం వాణిజ్య అస్థిరత నెలకొని ఉంది. అమెరికా చైనాపై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. దీంతో చాలా మంది తమ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకన్నా బంగారానికే మళ్లించొచ్చు. దీని వల్ల బంగారం ధరలు పెరగొచ్చు. వీటి ప్రభావం భారత్‌పై ఎక్కువగానే ఉండొచ్చు. మరి భారత్ పరిస్థితి? మళ్లీ మొదటికి వద్దాం. 2016లో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత దేశంలో బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం దిగుమతులు గతేడాదితో పోల్చితే ఈ మార్చిలో 40 శాతం పడిపోయాయి. అయితే సమీప భవిష్యత్తులోనే దేశంలో బంగారానికి గిరాకీ పెరిగే వీలుంది. ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. దీంతో రైతులు కాస్త ఆదాయాన్ని పొందారు. ఫలితంగా పండగలపుడు బంగారానికి గిరాకీ పెరిగే వీలుంది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనే బంగారానికి మూడింట రెండో వంతు డిమాండ్ ఉంటుంది. గతంలో అక్షయ తృతీయకు ఏం జరిగింది? ఇప్పటి వరకూ లభిస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. ఈ ఏడాదే అక్షయ తృతీయకు బంగారం ధర ఎక్కువగా ఉంది. 2010లో అక్షయ తృతీయ అప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.18,167. కానీ ఇది గతేడాది రూ.29,860కి చేరింది. ఇదీ ట్రెండ్ 2017 ఏప్రిల్ 28న- 28,861 2016, మే 9న - 29,860 2015 ఏప్రిల్ 21న - 26,938 2014 మే 2న - 28,865 2013 మే 13న -26,829 2012 ఏప్రిల్ 24న - 28,852 2011 మే 6న - 21,736 ఆధారం: Goldpriceindia.com శుభవార్త ఏంటంటే.. మీరు గతంలో బంగారం కొని ఉంటే ఇప్పుడు వాటికి మంచి రాబడిని పొందొచ్చు. ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా? దీనిపై నిపుణులు విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. '' రూ.30వేల వద్ద సాధారణంగా బంగారాన్నిఅమ్ముతారు. అయితే ఇప్పుడు ధరలు స్థిరంగా లేవు. ఈ ఏడాది ఆఖరుకు బంగారం ధర మరింత పెరుగుతుంది. అందువల్ల ఈ అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే ఇకపై ధర పెరుగుతుంది'' అని కామ్‌ట్రెండ్స్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ వెల్లడించారు. అయితే.. '' ఇప్పుడు ట్రేడింగ్ వాతావరణం అంత అనుకూలంగా లేదు. కొనుగోలుకు కొన్ని నెలలు ఆగాలని సూచిస్తాను'' అని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్, ఎస్ఎంసీ గ్లోబల్‌కి చెందిన వందనా భారతి తెలిపారు. సెప్టెంబరు అక్టోబరు నెలలకు ధరల్లో 5-6 శాతం దాకా సర్దుబాటు వచ్చే వీలుంది.. అప్పుడు కొనుగోలు చేయొచ్చు అని సూచించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏప్రిల్ నెలలో భారత్‌లో బంగారానికి ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈ నెలలోనే బంగారం కొనేందుకు 'మంచి రోజు'గా భావించే అక్షయ తృతీయ వస్తుంది. అది ఈ ఏడాది ఏప్రిల్ 18న వచ్చింది. text: హెరెరో తిరుగుబాటుదారులు 20వ శతాబ్దపు తొలినాళ్లలో నమీబియాలో కొన్ని వేల మంది హెరెరో, నామా జాతి ప్రజలను జర్మన్లు చంపేశారు. ఈ మరణాలను మారణహోమంగా అంగీకరిస్తూ జర్మనీ ఆర్ధిక మంత్రి హీకో మాస్ శుక్రవారం ప్రకటన చేశారు. "నమీబియాను, మరణించిన వారి వారసులను క్షమించమని అడగడం జర్మనీకున్న చారిత్రక, నైతిక బాధ్యత" అని ఆయన అన్నారు. బాధితులకు కలిగిన తీవ్రమైన వేదనను గుర్తించే ప్రయత్నాల్లో భాగంగా ఆ దేశ అభివృద్ధికి 1.34 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం, ఆ దేశ మౌళిక సదుపాయాలు, వైద్య రంగం, ఈ మారణహోమం వల్ల ప్రభావితులైన జాతులకు శిక్షణా కార్యక్రమాల కోసం 30 సంవత్సరాల వరకు నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపింది. "నేడున్న పరిస్థితులకు అనుగుణంగానే ఈ ఘటనలను మేము మారణహోమం అని అధికారికంగా గుర్తిస్తాం"అని మాస్ అన్నారు. "వలస పాలనలో చోటు చేసుకున్న ఘటనలను పక్కన పెట్టేసి, మెరుపులు అద్దకుండా వాటిని చర్చించాల్సిన అవసరముంది" అని ఆయన ప్రకటనలో అన్నారు. "ఇది మారణహోమంగా గుర్తించడమే సరైన అడుగు" అని నమీబియా ప్రభుత్వపు ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం అమ్ముడుపోయిందని అంటూ కొంత మంది సంప్రదాయ నాయకులు జర్మనీ ఇచ్చిన ప్యాకేజీని తీసుకోవడానికి నిరాకరించారు. వలస పాలనలో నమీబియాలో మారణహోమం జరిగినట్లు జర్మనీ అధికారికంగా అంగీకరించింది మారణహోమం సమయంలో ఏం జరిగింది? నమీబియాతో ఐదేళ్ల పాటు సాగిన చర్చల తర్వాత శుక్రవారం నాటి ప్రకటన విడుదలయింది. నమీబియా 1884-1915 వరకు జర్మనీ వలస పాలనలో ఉంది. ఆ సమయంలో జర్మనీ నమీబియా ప్రజలపై అవలంబించిన అమానుష చర్యలను "20వ శతాబ్దంలో మర్చిపోయిన మారణహోమం" గా చరిత్రకారులు అభివర్ణించారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా అని పిలిచేవారు. ఒక జాతిని, మత సమూహాన్ని, లేదా వర్గాన్ని పూర్తిగా గాని, పాక్షికంగా గాని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో చంపడాన్ని 'మారణహోమం' అని ఐక్యరాజ్య సమితి నిర్వచిస్తోంది. జర్మన్లు తమ భూమిని, పశు సంపదను ఆక్రమించిన తర్వాత హెరెరో, నామా జాతులు వారు చేసిన తిరుగుబాటుతో 1904లో ఈ మారణహోమం మొదలయింది. ఈ తిరుగుబాటుకు ప్రతీకారంగా అక్కడి జనాభాను అంతం చేయాలని అక్కడి మిలటరీ అధిపతి లోథార్ వోన్ ట్రోథా పిలుపునిచ్చారు. ఆ మారణహోమంలో బ్రతికి బయటపడిన వారు ఎడారిలోకి పారిపోయారు. ఆ తర్వాత వారిని కాన్సంట్రేషన్ శిబిరాల్లో పెట్టి వెట్టి చాకిరీ చేయించుకున్నారు. చాలా మంది రోగాలతో, అలసటతో, ఆకలితో మరణించారు. కొంత మంది పై లైంగిక వేధింపులు, ఔషధాల కోసం ప్రయోగాలు జరిగాయి. ఆ సమయంలో స్వదేశీ జాతులకు చెందిన వారు కనీసం 80 శాతం మంది మరణించి ఉంటారని అంచనా. కొన్ని వేల మంది ప్రజలు మరణించారు. గతంలో ఈ అమానుషం చోటు చేసుకున్నట్లు జర్మనీ గుర్తించినప్పటికీ దానికి పరిహారం చెల్లించడానికి మాత్రం అంగీకరించలేదు. 2018లో శ్వేత జాతి యూరోపియన్ల జాత్యహంకారాన్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని మానవ అవశేషాలను నమీబియాకు తిరిగి పంపించింది. వాటిని కొన్ని ఉపయోగపడని, గుర్తించని అధ్యయనాల కోసం వాడుకుంది. మే మధ్యలో కొంత మంది ప్రత్యేక దౌత్యవేత్తలు చేసిన చర్చల ఫలితంగా ఈ కొత్త ఒప్పందానికి జర్మనీ అంగీకరించింది. వచ్చే నెలలో ఇరు దేశాల పార్లమెంట్లలో ఈ ఒప్పందాన్ని ఆమోదించడానికి ముందే జర్మనీ విదేశాంగ మంత్రి నమీబియా రాజధాని విండ్ హోయక్ లో ఒక తీర్మానం చేస్తారని ఆశిస్తున్నట్లు, జర్మనీ మీడియా కథనాలు చెబుతున్నాయి. అధికారికంగా క్షమాపణలు చెప్పేందుకు జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మీర్ నమీబియా వెళ్లవచ్చని చెబుతున్నారు. హెరెరో పారామౌంట్ చీఫ్ వెకి రుకోరో దీనిపై స్పందనలెలా ఉన్నాయి? జర్మనీ అధికారికంగా మారణహోమం జరిగినట్లు ఆమోదించడమే తొలి అడుగని నమీబియా ప్రభుత్వ అధికారులు అంటుండగా, కొంత మంది మాత్రం వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. వలస పాలకుల చేతిలో అనుభవించిన తిరిగి కోలుకోలేని హానిని అనుభవించిన వారికి ఈ పరిహారం సరిపోదని, పరిహారం కోసం అమెరికా కోర్టుల్లో జర్మనీ పై కేసులు వేయాలని ప్రయత్నించిన హెరెరో పారామౌంట్ చీఫ్ వెకి రుకోరో అన్నారు. "ఈ ఒప్పందాన్ని చూస్తుంటే నమీబియా ప్రభుత్వం పూర్తిగా అమ్ముడుపోయినట్లుగా అనిపిస్తోందంటూ దీంతో సమస్యలున్నాయి" అని ఆయన రాయిటర్స్ సంస్థతో అన్నారు. బాధితుల జ్ఞాపకార్ధం న్యాయమైన సయోధ్యను కుదర్చడానికి ఒక ఆమోదయోగ్యమైన మార్గాన్ని ఎన్నుకోవడానికి ఈ చర్చలు లక్ష్యంగా పెట్టుకున్నాయని మాస్ అన్నారు. ఈ చర్చల్లో హెరెరో, నామా జాతుల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే, ఈ చర్చల్లో పాల్గొన్న సంప్రదాయ నాయకులు మాత్రం ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదని నమీబియా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇందులో ముఖ్యంగా భాషకు సంబంధించిన విషయంలో వివాదం ఉంది. అధికారికంగా ఇచ్చే పరిహారం విషయంలో సయోధ్య పై ఈ ఒప్పందం దృష్టి సారించింది. దీనిని పరిహారంగా కాకుండా, సహాయం చేస్తున్నట్లుగా మాస్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మారణహోమంలో బలైన చాలా మంది వారసులను పక్కకు పెట్టారని హ్యాం బర్గ్ యూనివర్సిటీలో గ్లోబల్ హిస్టరీ ప్రొఫెసర్ జర్గెన్ జిమ్మరర్ అన్నారు. "సయోధ్య కుదుర్చుకోవడమే లక్ష్యమైతే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది" అని ఆయన అన్నారు. "ఈ మొత్తం ప్రక్రియలో బాధితులే తమను పక్కన పెట్టినట్లు భావిస్తే బాధితులతో సయోధ్య ఎలా కుదురుతుంది" అని ఆయన ప్రశ్నించారు. ఒక మాజీ వలస రాజ్యం ఇలాంటి చర్చలకు పూనుకోవడం ఇదే మొదటిసారని, బీబీసీకి చర్చల గురించి రాసిన వ్యాసంలో టిమ్ వీవెల్ అన్నారు. ఈ ఒప్పందం తమ పూర్వీకులు కోల్పోయిన సంపదను, భూమిని తిరిగి సంపాదించి పెడుతుందని కిక్కిరిసిన ప్రాంతాల్లో, అసంఘిటితంగా నివసిస్తున్న చాలా మంది హెరెరో, నామా జాతుల ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన రాశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నమీబియా జర్మనీ వలసపాలనలో ఉన్నప్పుడు అక్కడ మారణహోమం జరిగినట్లు జర్మనీ అధికారికంగా అంగీకరించింది. అందుకు పరిహారంగా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. text: మరణించిన వారిలో కొందరు స్థానికంగా భిక్షాటనతో బతుకుతున్నారు. వారు మద్యానికి అలవాటు పడడం, మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగినట్లు గ్రామస్థులు తెలిపారు. కురిచేడులో మరణించినవారిని అనుగొండ శ్రీను, భోగెం తిరుపతయ్య, గుంటక రామిరెడ్డి, కడియం రమణయ్య, రాజారెడ్డి, బాబు, ఛార్లెస్, అగష్టీన్, కొనగిరి రమణయ్యగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. కురిచేడు ప్రాంతంలో కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉండడంతో మద్యం దుకాణాలు మూసేశారు. లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో మద్యం అలవాటున్న కొందరు శానిటైజర్ తాగడం ప్రారంభించారు. శానిటైజర్‌ను నాటుసారాతో కలిపి తాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా తాగినవారిలో ఒక వ్యక్తి రాత్రికి రాత్రి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. తరువాత మరికొందరు అనారోగ్యం పాలయ్యారు. వీరిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి చేరుకోక మునుపే కొందరు, చేరుకున్న తరువాత కొందరు మరణించారు. ''కొద్దికాలంగా, మద్యం షాపులు క్లోజ్ చేసినప్పటి నుంచి తాగుతున్నారు. బావి దగ్గర కుర్రాళ్లు కూడా తాగుతున్నారు. మొదట ఇద్దరు మొదలు పెట్టారు, తరువాత మిగతా వారు ప్రారంభించారు'' అంటూ మీడియాకు చెప్పారు స్థానికులు కొందరు. పోలీసులు వారు తాగిన సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తాగిన పదార్థంలో ఏం కలిసింది? అనే కోణంలో శాంపిళ్లను పరీక్షకు పంపారు. కొందరికి చికిత్స అందిస్తున్నారు. శానిటైజర్ కడుపులోకి వెళితే చనిపోతారా? శానిటైజర్ లో ఎక్కువ భాగం ఆల్కహాల్ ఉంటుంది. అందుకే మద్యం దొరకని వారు ఇది తాగారు. ''నిజానికి శానిటైజర్ అతి తక్కువ మోతాదులో అంటే 20-30 మిల్లీ లీటర్లు కడుపులోకి వెళ్లినా మరీ అంత ప్రమాదం జరగదు. కానీ, ఎక్కువ మోతాదులో తాగితే రకరకాల సమస్యలు వస్తాయి. అన్న వాహిక, పొట్ట, జీర్ణ వ్యవస్థ, చిన్నపేగులకు గాయాలు అవుతాయి. ఇది కరోజివ్ ఏజెంట్. అంటే యాసిడ్ లాగా అన్నమాట. కొన్ని సందర్భాల్లో పొట్ట, పేగులు చితికిపోయే అవకాశం కూడా ఉంది.'' అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రామాంజనేయులు బీబీసీకి వివరించారు. ''దానికితోడు కల్తీ శానిటైజర్ తో ఇంకా ప్రమాదం. ఎందుకంటే కల్తీల్లో మిథనాల్ ఉంటుంది. అది తాగినా, పీల్చినా ప్రమాదమే. పీలిస్తే ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థకు ప్రమాదం. పొట్టలోకి వెళ్లినప్పుడు అసిసోడిస్ ఫామ్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ బయటకు వస్తుంది. రక్తంలో ఆమ్లాలు (యాసిడ్స్) పెరుగుతాయి. లాక్టిక్ యాసిడ్ వంటివి కిడ్నీల ద్వారా బయటకు వెళ్లవు. దీంతో శరీరంలో పొటాషియం పెరుగుతుంది. ఆయాసం వస్తుంది. ఒక్కసారిగా గుండె ఆగిపోవచ్చు. మెటబాలిక్ చర్యలు తీవ్రమై కణాలు దెబ్బతింటాయి. అప్పటికప్పుడు మరణించే అవకాశం ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే చాలా తక్కువ మోతాదులో శానిటైజర్ పొట్టలోకి వెళ్తే ఏం కాదు కానీ, మద్యం తాగే పరిమాణంలో పొట్టలోకి వెళ్లినప్పుడు అత్యంత ప్రమాదకరం.'' అన్నారు డాక్టర్ రామాంజనేయులు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది చనిపోయారు. జిల్లాలోని కురిచేడు మండల కేంద్రంలో 10 మంది, పామూరులో మరో ముగ్గురు మత్తు కోసం శానిటైజర్ తాగి మరణించారు. text: ఓ మామూలు కుర్రాడు హిజ్రాల మధ్య ఓ 'సాధారణ' వ్యక్తిగా ఎలా పెరిగి పెద్దయ్యాడో చెప్పే కథ ఇది. గోపాల్ స్వస్థలం గుజరాత్‌లోని కర్చోలియా గ్రామం. అతడు పుట్టగానే తల్లి చనిపోయింది. దాంతో తండ్రి ఆ పిల్లాడిని నష్టజాతకుడిగా భావించాడు. తల్లి మరణానికి ఆ పిల్లాడే కారణం అనుకునేవాడు. తండ్రి కుటుంబ సభ్యులు ఆ పిల్లాడిని అనాథ శరణాలయంలో వదిలేసి అతడికి మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు. ఈ విషయం అహ్మదాబాద్‌లో ఉండే మాను అనే ఓ హిజ్రాకు తెలిసింది. చనిపోయిన ఆ పిల్లాడి తల్లి మానుకు దూరపు బంధువు. ఆ పిల్లాడిని అనాథ శరణాలయంలో వదిలేస్తారని తెలిసి మాను తట్టుకోలేకపోయింది. దాంతో పంచాయతీ పెద్దల్ని ఒప్పించి ఆ బిడ్డను తానే దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. పోలీసులు, ప్రభుత్వాధికారుల సాయంతో అధికారికంగానే ఆ పిల్లాడిని దత్తత తీసుకొని తనతో పాటు తీసుకెళ్లిపోయింది. గోపాల్ అని ఆ అబ్బాయికి పేరు కూడా పెట్టింది. ''నేను హిజ్రాను. పిల్లల్ని పెంచే పద్ధతిపైన నాకు ఏమాత్రం అవగాహన లేదు. కానీ నెమ్మదిగా ఇతరుల్ని చూసి గోపాల్‌ను కూడా అలానే పెంచడం మొదలుపెట్టాను. మా వర్గంలో అంతా నన్ను 'గురు' అని పిలుస్తారు. నాకు 80మంది శిష్యురాళ్లున్నారు. నేనేది చెబితే వాళ్లదే చేస్తారు'' అని మాను బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. సాధారణంగా హిజ్రాలు పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు వెళ్లి ఆడీపాడీ డబ్బులు సేకరిస్తుంటారు. కానీ గోపాల్ కోసం ఆ పని మానేసినట్టు మాను చెప్పారు. ''నేను చేసే పనుల ప్రభావం గోపాల్‌పైన ఏమాత్రం పడకూడదని ముందే నిర్ణయించుకున్నాను. అందుకే పెళ్లిళ్లకు వెళ్లి డబ్బులు అడగడం మానేశాను. పెద్దయ్యాక వాడికి ఈ విషయం తెలిస్తే చిన్నబుచ్చుకుంటాడేమో అనే భయంతోనే ఆ పని చేశాను. నా పనిలో భాగంగా గోపాల్‌ను ఎప్పుడూ బయటకు తీసుకెళ్లలేదు. మొదట్లో మా ప్రభావం వాడిపైన పడకుండా పెంచడం కాస్త కష్టమైంది. కానీ గోపాల్‌ను మామూలు కుర్రాడిలా పెంచడంలో నా తోటి హిజ్రాలు కూడా సాయంగా నిలిచారు.’’ ‘‘వాడికి నాలుగేళ్ల వయసప్పుడు స్కూల్లో చేర్పించా. అక్కడ అప్లికేషన్లో తండ్రి స్థానంలో నా పేరే రాశా. ఇతర పిల్లల తండ్రుల్ని చూశాక వాడు కూడా తన తండ్రి ఎక్కడని అడిగేవాడు. పదేపదే అలా అడుగుతుండటంతో ఉండబట్టలేక వాడిని వాళ్ల నాన్న దగ్గరకు తీసుకెళ్లా. కానీ అప్పటికీ ఆ తండ్రి మనసు మారలేదు. మమ్మల్ని చాలా అవమానకరంగా చూశాడు. 'ఆ నష్టజాతకుడిని మళ్లీ నా ఇంటికి తీసుకురాకు' అని గెంటేశాడు. ఆయన మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ రోజు నుంచీ మళ్లీ గోపాల్‌ను ఆ ఊరికి తీసుకెళ్లలేదు'' అంటూ మాను నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. మాను స్నేహితులంతా గోపాల్‌ను ఇంజినీర్‌గా లేదా వ్యాపారవేత్తగా చూడాలనుకుంటున్నారు. గోపాల్ మాత్రం డాక్టరై పేదలకు సేవ చేయాలనుందని చెబుతున్నాడు. ఏదేమైనా అందరి కోరికా, గోపాల్ బాగా చదువుకొని ఇతర కుర్రాళ్లలా జీవితంలో స్థిరపడాలనే. ‘'వాడు ఏం కావాలంటే అది చేయొచ్చు. వాడి చదువుకోసం నేను డబ్బు దాచిపెట్టాను. పెళ్లి, ఇల్లు.. ఇలా అన్ని అవసరాలకూ డబ్బును పొదుపు చేస్తున్నాను. భవిష్యత్తులో గోపాల్‌కు వ్యాపారం చేయాలనిపిస్తే దానికోసం కూడా డబ్బు సమకూర్చడానికి నేను సిద్ధం'’ అన్నారు మాను, గోపాల్ భవిష్యత్తు గురించి తన ప్రణాళికను వివరిస్తూ. గోపాల్‌కు పెళ్లి వయసు వచ్చేసరికి తాను అతడి పక్కన ఉంటానో లేదోననే విచారాన్ని మాను వ్యక్తం చేశారు. గోపాల్ మాత్రం.. ‘'నేనెప్పుడూ అమ్మతోనే ఉంటాను. ఆమె కోసమే కష్టపడి చదువుతున్నాను. వచ్చే సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని ఆమెను సంతోషపెడతాను. నాకోసం ఇన్ని చేసిన అమ్మ కోసం నేను ఏం చేసినా తక్కువే'’ అంటాడు, వాళ్ల 'అమ్మ'ను దగ్గరికి తీసుకుంటూ. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గోపాల్‌కు ఇప్పుడు 14ఏళ్లు. కానీ ఆ పిల్లాడికి 10రోజుల వయసున్నప్పుడే కుటుంబం అతడిని వదిలేసింది. దాంతో పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ అబ్బాయిని మాను మాసి అనే ఓ హిజ్రా దత్తత తీసుకుంది. text: వయసుపైబడటం, జన్యుపరంగా సంక్రమించిన లక్షణాలు దీనికి కారణాలు. మానసిక ఒత్తిడి కూడా ఇందులో పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, ఒత్తిడి వల్ల జుట్టు ఎలా తెల్లబడుతోందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఇదివరకు స్పష్టంగా గుర్తించలేకపోయారు. బ్రెజిల్‌లోని సావో పాలో, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు మాత్రం మెలానోసైట్‌లు అనే మూల కణాల వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెబుతున్నారు. మెలానోసైట్‌లు మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. చర్మానికి, జుట్టుకు రంగు ఈ మెలనిన్ వల్లే వస్తుంది. ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్న సమయంలో పరిశోధకులకు ఈ విషయంలో కొన్ని ఆధారాలు దొరికాయి. ఎలుకలను నొప్పికి గురిచేసినప్పుడు వాటిలో అడ్రినలిన్, కార్టిసోల్ విడుదలవుతోంది. గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతున్నాయి. నాడీకణ వ్యవస్థపై ప్రభావం పడి, వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. వెంట్రుక కుహరాల్లోని మెలనిన్‌ను ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతున్నాయి. ''ఒత్తిడి శరీరానికి మంచిది కాదని భావించాం. కానీ, ఇందులో మేం ఊహించని విషయాలు బయటపడ్డాయి. ఒత్తిడి వల్ల పిగ్మెంట్‌లను ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతున్నాయి. అవి ఒక్కసారి పోతే, తిరిగి రావడం కుదరదు. శాశ్వతమైన నష్టం జరుగుతుంది'' అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యా కీ హ్సు చెప్పారు. మరో ప్రయోగంలో పరిశోధకులు అధిక రక్తపోటును తగ్గించే ఔషధాన్ని ఎలుకలకు ఇచ్చి చూశారు. ఒత్తిడి వల్ల శరీరంలో వస్తున్న మార్పులను దీంతో అడ్డుకోవచ్చని వాళ్లు గుర్తించారు. నొప్పికి గురైన ఎలుకల జన్యువులను సాధారణ ఎలుకలతో పరిశోధకులు పోల్చిచూసినప్పుడు.. ఒత్తిడి వల్ల మూల కణాలు నష్టపోయే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సైక్లిన్-డిపెండెంట్ కినేస్ (సీడీకే) అనే ప్రోటీన్‌ వెలుగుచూసింది. ఈ ప్రోటీన్‌ ఉత్పత్తిని అదుపు చేసినప్పుడు, ఎలుకల్లో వెంట్రుకల రంగు మారడం కూడా ఆగిపోయింది. ఇలా సీడీకే‌ను నియంత్రించే ఔషధంతో జుట్టు తెల్లబడటాన్ని అడ్డుకునే మార్గం ఉందని పరిశోధకులు అంటున్నారు. ''ఈ పరిశోధనలో వచ్చిన ఫలితాలు.. తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారమో, నివారణ మార్గమో కాదు. ఎలుకలపైనే మేం పరిశోధన చేశాం. మనుషుల్లో పనిచేసే మార్గం కనిపెట్టడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి'' అని ప్రొఫెసర్ యా కీ హ్సు అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సాధారణంగా మనుషుల్లో వయసు 35 ఏళ్లకు అటూఇటూ చేరుకున్న తర్వాత ఎప్పుడైనా.. జుట్టు తెల్లబడటం మొదలవ్వొచ్చు. text: "ఇది భారత్ కాదు. ఇది పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్. పరాయి దేశ ప్రజలు బీజేపీకి, మోదీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి" అనే క్యాప్షన్‌‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో జనాలు పాటలు పాడుతూ, మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. "అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తమిళనాడు" లాంటి రైట్ వింగ్ అనుకూల ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేశారు. రెండు రోజుల్లో కొన్ని వేలసార్లు ఈ వీడియోను షేర్ చేశారు. తమిళం, ఇంగ్లీష్, హిందీ, తదితర భాషల్లో క్యాప్షన్లు పెట్టి ఫేస్‌బుక్, ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో బలూచిస్తాన్‌లో తీసింది కాదని మా పరిశీలనలో వెల్లడైంది. వాస్తవం ఏంటి? ఈ వీడియోతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, అది కశ్మీర్‌లో తీసిన వీడియో అని మా పరిశీలనలో తేలింది. ఈ ఏడాది మార్చి 31న జమ్మూకశ్మీర్ రాష్ట్ర బీజేపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ వీడియోను ట్వీట్ చేసింది. మరోసారి మోదీ సర్కార్ రావాలంటూ నినాదాలు చేస్తూ అనంతనాగ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి సోఫీ యూసుఫ్‌కు మద్దతుగా వేలాది మంది ర్యాలీ తీశారని ఆ ట్వీట్‌లో రాశారు. ఈ వీడియోను జమ్మూకశ్మీర్ బీజేపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీలోనూ షేర్ చేశారు. బీజేపీ నేత, అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి యూసుఫ్ కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఏముంది? అది కశ్మీర్‌లోని అనంతనాగ్ పట్టణంలో ఉన్న ఖనబాల్ హౌసింగ్ కాలనీలో తీసిన వీడియో అని బీబీసీ కంట్రీబ్యూటర్ మాజిద్ జహంగీర్ తెలిపారు. "మేము మళ్లీ గెలుస్తాం. మోదీజీ మీరు ముందుకెళ్లండి. మేము మీతోనే ఉన్నాం. అమిత్ షా జీ ముందుకెళ్లండి. మేము మీతోనే ఉన్నాం" అంటూ అనేక మంది నినాదాలు చేస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ ర్యాలీలో బురఖా ధరించిన మహిళలు బీజేపీకి అనుకూలంగా పాటలు పాడుతూ, డ్యాన్సులు వేయడంతో పాటు, మోదీ ఫేస్ మాస్కులు ధరించడాన్ని కూడా చూడొచ్చు. మార్చి 30న అనంతనాగ్‌లో బీజేపీ అభ్యర్థి సోఫీ యూసుఫ్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఈ వీడియోను చిత్రీకరించారు. అనంతనాగ్ బీజేపీ అభ్యర్థి యూసుఫ్ మాజీ పోలీసు అధికారి అయిన యూసుఫ్ బీజేపీ జాతీయ మండలిలో సభ్యుడిగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అనంతనాగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత ప్రధాని నరేంద్ర మోదీకి జేజేలు పలుకుతూ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్సులో ప్రజలు ర్యాలీ తీసినట్లుగా చూపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. text: 2015 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో మ‌హిళ‌లపై జ‌రిగిన దాడుల‌కు సంబంధించి మొత్తం 15,967 కేసులు నమోదయ్యాయి. కాగా 2016 నాటికి నమోదైన కేసుల సంఖ్య 16,362కి పెరిగాయి. ఇక వాటిలో మ‌హిళ‌ల‌ హ‌త్య కేసులు 1,099 నుంచి 1,123 కి పెరిగాయి. 2017 గణాంకాల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని పోలీసు శాఖ లెక్క‌లు చెబుతున్నాయి. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు, అత్యాచారాల‌తోపాటు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ సంఘటనలు కూడా పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌ కలిగించే అంశం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్ర‌కారం లైంగిక వేధింపుల కేసులు 18% పెరగ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌పై జరుగుతున్న దాడులకు అద్దం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌పై సాగుతున్న హింస‌కు చెక్ పెట్టాల‌నే సంక‌ల్పంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు పలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. శక్తి టీమ్స్: పోలీస్ శాఖలో మ‌హిళా శ‌క్తి అందులో భాగంగా ఇప్ప‌టికే 'షీ టీమ్స్' పేరుతో కొన్ని జిల్లాల్లో నేరాలు అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. మ‌హిళ‌లు, విద్యార్థినుల‌కు ర‌క్ష‌ణగా మ‌హిళా పోలీసు బృందాలు మ‌ఫ్టీలో ర‌ద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ ఈవ్ టీజ‌ర్లు, ఇత‌ర వేధింపుల‌కు పాల్ప‌డే వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అవి మంచి ఫ‌లితాలు ఇచ్చిన‌ట్లు గ‌తంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా అర్బ‌న్ ఎస్పీగా ప‌నిచేసి, ప్ర‌స్తుతం విజ‌య‌వాడ డీసీపీగా ప‌నిచేస్తున్న రాజ‌కుమారి చెబుతున్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అర్బన్‌లో ఏకంగా మ‌హిళ‌ల‌పై హింస‌కు సంబంధించిన కేసుల్లో 34% త‌గ్గుద‌ల కనిపించినట్లు ఆమె వివ‌రించారు. శిక్ష‌ణ త‌ర్వాత రంగంలో దిగిన‌ 'శ‌క్తి టీమ్స్' ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌త్యేక మ‌హిళా బృందాల‌ను రంగంలోకి దింపేందుకు ఏపీ పోలీస్ శాఖ సిద్ధ‌మ‌య్యింది. అందులో భాగంగానే ప్ర‌యోగాత్మ‌కంగా విజ‌య‌వాడ న‌గ‌రంలో శ‌క్తి టీమ్ పేరుతో మ‌హిళా పోలీస్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్ష‌ణ ఇచ్చారు. స్వీయ ర‌క్ష‌ణతో పాటు, ఆక‌తాయిల ఆట‌కట్టించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల సామ‌ర్థ్యాలు పెంచేందుకు ప్ర‌య‌త్నించారు. సైబ‌ర్ క్రైమ్ పెర‌గడానికి కార‌ణాలు, నివార‌ణ‌కు సంబంధించిన అంశాల‌లో కూడా శ‌క్తి టీమ్‌లోని 70 మంది మ‌హిళా పోలీసు కానిస్టేబుల్స్‌కి అవ‌గాహ‌న క‌ల్పించారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు సంబంధించిన చ‌ట్టాల మీద వారికి అవ‌గాహ‌న కల్పించడంతోపాటు కారు డ్రైవింగ్, స్విమ్మింగ్, తైక్వండో, క‌రాటే వంటి రక్షణ కళల్లో త‌ర్ఫీదు ఇవ్వ‌డంతో శ‌క్తి టీమ్‌లో ఆత్మ‌విశ్వాసం క‌నిపిస్తోంది. తాము ఓ పోలీస్ ఆఫీస‌రుతో స‌మానంగా అవ‌గాహ‌నా శిబిరాల్లో మాట్లాడ‌గ‌లుగుతున్నామ‌ని శ్రావ‌ణి అనే మ‌హిళా కానిస్టేబుల్ బీబీసీకి తెలిపారు. మ‌హిళా కానిస్టేబుళ్లు అయిన‌ప్ప‌టికీ వారిలో అత్య‌ధికులు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. ఎంటెక్, ఎంఈడీ, బీఎల్ వంటి వివిధ కోర్సులు పూర్తి చేశారు. అయిన‌ప్ప‌టికీ కానిస్టేబుల్‌గా ప‌నిచేసేందుకు ముందుకు వ‌చ్చిన వారిని ఎంపిక చేసిన పోలీస్ ఉన్న‌తాధికారులు వారి శ‌క్తి సామ‌ర్ధ్యాలు పెంచేందుకు 4నెల‌లపాటు శిక్ష‌ణ అందించారు. ముఖ్యంగా ఎస్పీగా ప‌నిచేస్తున్న కాలంలో షీ టీమ్స్ నిర్వ‌హ‌ణ‌లో అనుభ‌వం ఉన్న రాజ‌కుమారి డీసీపీగా ఉండ‌డంతో ఈ శ‌క్తి టీమ్ మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ని క‌విత అనే కానిస్టేబుల్ అభిప్రాయపడ్డారు. ‘మ‌హిళ‌లు తమ సమస్యలను మాతో చెప్పుకుంటున్నారు’ శిక్ష‌ణ పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం విజ‌య‌వాడ న‌గ‌రంలో 5 క్ల‌స్ట‌ర్స్‌గా ఈ శ‌క్తి టీమ్స్ ప‌ని ప్రారంభించాయి. విద్యార్థినులు, మ‌హిళ‌లు ఎక్కువగా సంచ‌రించే ప్రాంతాల్లో ఈ శ‌క్తి టీమ్స్ గ‌స్తీ తిరుగుతుంటారు. దాని వ‌ల్ల అనేక మంది త‌మ స‌మ‌స్య‌ల‌ను మాతో పంచుకున్నారంటూ శ‌క్తి టీమ్ స‌భ్యురాలు దివ్య‌జ్యోతి తెలిపారు. త‌మ స‌మ‌స్య‌లు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న విద్యార్థినులు అనేకమంది త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌న్నారు. నేరం జ‌రిగిన త‌ర్వాత కేసు న‌మోదు కాకుండా, నేరాలు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తుగా అప్ర‌మ‌త్తం చేయ‌డం, అవ‌గాహ‌న పెంచ‌డం, ఆక‌తాయిల‌ను అడ్డుకోవ‌డం తమ ల‌క్ష్యాలు అని టీమ్ మెంబ‌ర్ వెంక‌ట‌ర‌త్నం పేర్కొన్నారు. 'రాష్ట్ర‌మంతా శ‌క్తి టీమ్స్ ఏర్పాటు..' శ‌క్తి టీమ్స్‌ ప్రస్తుతం.. వివిధ పోలీసు స్టేష‌న్లకు అనుసంధానంగా ప‌నిచేస్తున్నాయి. ఎవ‌రైనా వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు '100, 102' అత్యవసర సేవల ద్వారా త‌మ‌కు సమాచారం అందిస్తే వెంట‌నే అప్ర‌మత్తం అవుతామ‌ని టీమ్ స‌భ్యురాలు పావ‌ని చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా శ‌క్తి టీమ్ కోసం ప్ర‌త్యేకంగా వాహ‌నాలు సిద్ధం చేశారు. టీమ్ స‌భ్యులే స్వ‌యంగా న‌డుపుకుంటూ వెళ్లేలా డ్రైవింగ్‌లో శిక్ష‌ణ పొంద‌డంతో 3 వాహ‌నాలను వారికోసం కేటాయించారు. మ‌రో 20 ఈ-సైకిళ్లను కూడా సిద్ధం చేశారు. సైకిళ్ల‌పై, కార్ల‌లో ప్ర‌త్యేక బృందాలు.. నగరంలో గ‌స్తీ తిరుగుతూ ఉండ‌టంవ‌ల్ల నేరాలు చేసేందుకు కూడా కొంద‌రు వెన‌కాడ‌తార‌ని డీసీపీ రాజ‌కుమారి అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏపీ పోలీసు శాఖ నిర్ణ‌యంలో భాగంగా ప్ర‌యోగాత్మ‌కంగా విజ‌య‌వాడ‌లో ప్రారంభించిన శ‌క్తి టీమ్ ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉంద‌న్నారు. శిక్ష‌ణ పొందిన టీమ్ స‌భ్యులు శ్ర‌ద్ధ‌గా ప‌నిచేస్తే రాష్ట్రంలో నేరాల అదుపుకు తాము చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఏపీలో మ‌హిళ‌ల మీద నేరాల స్థాయి ఎక్కువ‌గా ఉన్న త‌రుణంలో శ‌క్తి టీమ్స్ వంటివి స‌త్ఫ‌లితాల‌నివ్వడం అంద‌రికీ సంతోష‌మే అంటున్నారామె. విజ‌య‌వాడ త‌ర్వాత రాష్ట్ర‌మంతా ఈ శ‌క్తి టీమ్స్‌కు ప్ర‌త్యేక యూనిఫారం అందించి, రంగంలోకి దించుతామని ఆమె అన్నారు. 'ఆస‌క్తిగా మారిన శ‌క్తి బృందాలు' విజ‌య‌వాడ‌లో వీధుల్లో శక్తి టీమ్స్ సంచరిస్తున్నాయి. ఆర్టీసీ బ‌స్టాండ్‌లు, కాలేజీలు, ఇత‌ర అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఈ టీమ్ సభ్యులు.. ఓవైపు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, మ‌రోవైపు ఆక‌తాయిల‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా గ‌త‌వారం రోజులుగా త‌మ కాలేజీ వ‌ద్ద ఈవ్ టీజ‌ర్ల తాకిడి త‌గ్గింద‌ని న‌లంద కళాశాల‌కు చెందిన ర‌మ్య అనే విద్యార్థిని తెలిపారు. కొత్త యూనిఫారంతో రోడ్డు మీద‌కు వ‌చ్చిన శక్తి టీమ్స్ పట్ల నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మ‌హిళ‌ల‌పై హింస‌కు సంబంధించి అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది. text: రఖైన్ రాష్ట్రంలో శాంతి, సుస్థిరతల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సూచీ చెప్పారు రోహింగ్యా ముస్లింలు చాలా మంది దేశాన్ని విడిచిపోలేదని, హింస ఆగిపోయిందని ఆమె చెప్పారు. రఖైన్ రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి ఆమె మంగళవారం తొలిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మానవ హక్కుల ఉల్లంఘనలన్నిటినీ ఆమె ఖండించారు. రఖైన్‌లో అత్యాచారాలకు కారకులెవరైనా చట్టం ముందు నిలబెడతామన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న రఖైన్ రాష్ట్రంలో గత ఆగస్టులో పోలీస్ శిబిరాలపై రోహింగ్యా మిలిటెంట్లు దాడులు చేశారని మయన్మార్ చెప్తోంది. ఈ మిలిటెంట్లపై చర్య పేరుతో రఖైన్ రాష్ట్రంలో భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ హింస కారణంగా 4,00,000 మందికి పైగా రోహింగ్యా ముస్లింలు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కి శరణార్థులుగా వలస వెళ్లారు. తమ గ్రామాలను ఎలా దగ్ధం చేస్తున్నారో.. సైన్యం చేతుల్లో తాము ఎన్ని బాధలకు గురవుతున్నామో ఆ శరణార్థులు వివరిస్తున్నారు. రఖైన్ రాష్ట్రంలో తమ ఆపరేషన్లు మిలిటెంట్లను ఏరివేయడానికే పరిమితమని, తాము పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని సైన్యం చెప్తోంది. ఆ ప్రాంతాన్ని సందర్శించడంపై మయన్మార్ ఆంక్షలు విధించింది. అయితే ప్రభుత్వ నియంత్రణలో బీబీసీ విలేకరులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముస్లింలు తమ సొంత గ్రామాలను తామే దగ్ధం చేసుకుంటున్నారన్న అధికారిక వాదనలో నిజం లేదనేందుకు బీబీసీ బృందానికి ఆధారాలు లభించాయి. మానవ హక్కుల ఉల్లంఘనలను సూచీ ఖండించారు రఖైన్‌లో జరుగుతున్నది ‘జాతి నిర్మూలన’ అని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఈ సంక్షోభం విషయంలో సూచీ ప్రతిస్పందనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హక్కుల ఉల్లంఘనను ఖండిస్తున్నాం... ఈ నేపథ్యంలో సూచీ తాజాగా దేశ రాజధాని నే ప్యీ తావ్‌లో చేసిన ప్రసంగం టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమయింది. ఈ వారంలో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తాను పాల్గొనలేకపోతున్నానని.. కాబట్టి ఈ ప్రసంగం చేస్తున్నానని సూచీ చెప్పారు. మయన్మార్‌లో పరిస్థితిని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఏం చేస్తోందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ‘‘మానవ హక్కుల ఉల్లంఘనలన్నిటినీ, చట్టబద్ధంకాని హింసను మేం ఖండిస్తున్నాం. రాష్ట్రమంతటా శాంతి, సుస్థిరతల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు. అయితే సైన్యం మీద వచ్చిన ఆరోపణల గురించి ఆమె ప్రస్తావించలేదు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి ‘‘సాయుధ ఘర్షణలు కానీ, ఖాళీ చేయించే ఆపరేషన్లు కానీ జరగడం లేదు’’ అని మాత్రం పేర్కొన్నారు. ‘ప్రపంచంలో మిత్రులెవరూ లేని ప్రజలు’ రోహింగ్యాలు సంక్షోభానికి మూలం తెలుసుకుంటాం... కానీ అత్యధిక ముస్లింలు రఖైన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని, దీనిని బట్టి పరిస్థితి అంత తీవ్రంగా లేదని తెలుస్తోందని సూచీ వ్యాఖ్యానించడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఈ సంక్షోభానికి మూలం ఏమిటనేది తెలుసుకోవడం కోసం వలస వెళ్లిన ముస్లింలతోనూ, రాష్ట్రంలోనే ఉన్న ముస్లింలతోనూ మాట్లాడాలని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. సూచీ ఇంతకుముందు ఈ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ‘‘తప్పుడు సమాచారం’’ ద్వారా విషయాన్ని వక్రీకరిస్తున్నారని, ఉగ్రవాదుల ప్రయోజనాలను ప్రచారం చేయడం ద్వారా ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. మయన్మార్‌లో పౌర ప్రభుత్వానికి వాస్తవాధినేత సూచీ అయినప్పటికీ, రఖైన్ రాష్ట్రంలో వాస్తవాధికారం సైన్యం చేతుల్లో ఉంది. ఎందుకంటే అంతర్గత భద్రత అధికారం సైన్యానిదే. మయన్మార్‌లో రోహింగ్యా సంక్షోభం విషయంలో ‘అంతర్జాతీయ పరిశీలన’కు తాను భయపడటం లేదని ఆ దేశ వాస్తవ అధినేత్రి ఆంగ్ సాన్ సూచీ పేర్కొన్నారు. text: 'మగపిల్లాడు పుట్టేవరకు మా అత్తమామలు మాతో మాట్లాడలేదు' అని కన్నీటి పర్యంతమయ్యారు అదే ప్రాంతానికి చెందిన హేము. నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు, పుట్టిన బిడ్డను పురిట్లోనే వదిలేసే పరిస్థితి ఇంకా కొనసాగుతోందా? ప్రత్యేక రాష్ట్రం వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ సమస్య పరిష్కారమైందా? తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మీ, అమ్మఒడి, కేసీఆర్ కిట్ తదితర పథకాలతో పరిస్థితి ఏమైనా మారిందా..? తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పర్యటించిన బీబీసీ బృందం ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతం రెండు దశాబ్దాలుగా ఆడపిల్లల అమ్మకాల వార్తలతో చర్చల్లో ఉంటోంది. బీబీసీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు చాలా మంది మహిళలు ఆడపిల్ల పుడితే సమాజంలో తమ పరిస్థితి దారుణంగా ఉంటోందని చెప్పారు. గతేడు గొట్టిముక్కల గ్రామం తెల్లావుల తండాకు చెందిన కవిత తన బిడ్డను రూ.వెయ్యికి అమ్మేశారు. కానీ, అధికారులు రంగంలోకి దిగి ఆ పాపను తిరిగి కవితకే అప్పగించారు. 'మగపిల్లాడు పుట్టిన తరవాతే మా వాళ్లు నాతో మాట్లాడటం మొదలు పెట్టారు' అని కవిత బీబీసీకి చెప్పారు. హేమీ 'ఆడపిల్ల పుడితే పురిట్లోనే వదిలేస్తా' పార్శీతండాకు చెందిన హేమీకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో అత్తమామలు ఆమెతో మాట్లాడలేదు. 'ఈసారి మగపిల్లాడు పుడితే ఇంటికి తీసుకొస్తా... ఆడపిల్ల పుడితే పురిట్లోనే వదిలేస్తా' అని ప్రసవ సమయంలో అనుకున్నానని హేమీ బీబీసీకి చెప్పారు. నాలుగో కాన్పులో హేమీకి మగ పిల్లాడు పుట్టాడు. లలితది కూడా గతంలో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. 'నాకు వరసగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నా. కానీ, మా వాళ్లు నాతో మాట్లాడటం మానేశారు. దీంతో మరోసారి గర్భం దాల్చాను. దేవుడి దయవల్ల మగ పిల్లవాడు పుట్టాడు. ఇప్పుడు అందరు నాతో మాట్లాడుతున్నారు' అని లలిత తెలిపారు. లాలీ నాలుగేళ్లలో 40కి పైగా కేసులు దేవరకొండ, చందంపేట మండలాల్లో ఆడపిల్లల అమ్మకాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. లంబాడా తండాలలోనే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆడపిల్లలను అమ్మేవారు, కొనేవారిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నట్లు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ కృష్ణవేణి బీబీసీకి తెలిపారు. నాలుగేళ్లలో దాదాపు 42 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 'రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రమే రెండు శిశు సంరక్షణ గృహాలున్నాయి. నాలుగేళ్లలో ఇక్కడ 170 మంది ఆడపిల్లలను వదిలేసి వెళ్లారు. వీరిని దత్తత తీసుకోడానికి దరఖాస్తులు కూడా ఎక్కువే వస్తుంటాయి' అని ఆమె వివరించారు. ఊయల 'వరకట్నమే అసలు సమస్య' ఆడపిల్లలను అమ్మేయడం, పురిటిలోనే వారిని వదిలేయడం ఒక సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. 'లంబాడి తెగలు మైదాన ప్రాంతానికి వచ్చి సమాజంతో సంబంధాలు ఏర్పరుచుకోవడంతో వారిలో వరకట్న సమస్య మరింత ఎక్కువైంది. వీరి కుటుంబాల్లో మగపిల్లలను చదివిస్తుంటే ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. చదువకున్న అబ్బాయిలకు భారీ కట్నం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆడపిల్ల అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది' అని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కృష్ణవేణి విశ్లేషించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలతో కలిపి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. 'అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి గర్భిణీల వివరాలను సేకరిస్తున్నాం. ప్రసవాల సంఖ్యను కూడా నమోదు చేస్తున్నాం. నిఘా పెరగడంతో 2017 నుంచి ఆడపిల్లల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి' అని తెలిపారు. అయితే, ఈ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉందని గ్రామ రిసోర్స్ సెంటర్ అధికారి డాక్టర్ రుక్మిణి రావు బీబీసీకి చెప్పారు. ‘ముఖ్యంగా ఈ సమస్యను మహిళల కోణంలోనే అందరూ చూస్తున్నారు. మగాళ్లలో చైతన్యం తీసుకొస్తేనే పరిస్థితి మారుతుంది. ఆడపిల్లలు మగవారితో సమానంగా పెంచేలా వారిని చైతన్యపరచాలి. ఆడపిల్లల స్వయంసమృద్ధికి ఉపయోగపడేలా ప్రభుత్వ పథకాలు తీసుకరావాలి’ అని చెప్పారు. ఎన్ని చర్యలు చేప్టటినా, అంతర్గతంగా ఆడపిల్లల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయిని, ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి అని రుక్మిణి రావు పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'ఆడపిల్ల అంటే ఇష్టం లేదు.. ఏడికేల్లి కట్నం తేవాలి' అని నిర్మొహమాటంగా చెప్పారు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన లంబాడీ మహిళ లాలీ. text: కానీ, గత ఏడాది 2020 మార్చిలో పతనం తర్వాత షేర్ మార్కెట్‌లో జోష్ వచ్చింది. నాస్డాక్ షేర్లలో గత ఏడాది చివరి వరకూ 42 శాతం వృద్ధి నమోదైంది. అమెరికాలోనే అతిపెద్ద వృద్ధి ఇదే. ఏడాది పొడవునా ఎస్అండ్‌పి500 షేర్లు 15 శాతం పైకి వెళ్లాయి. కానీ, కరోనా మహమ్మారి ప్రభావంతో కష్టాల్లో పడిన చమురు కంపెనీలు, బ్యాంకులు, ఎయిర్ లైన్స్ వల్ల బ్రిటన్ స్టాక్ ఎక్ఛేంజ్ ఇండెక్స్ ఎఫ్‌టీఎస్ఈ100 అంత మెరుగైన స్థితిలో నిలవలేకపోయింది. గత ఏడాది ప్రారంభంలో ఇందులో 14 శాతం పతనం వచ్చింది. కానీ గత కొన్ని నెలల్లో అందులో వేగంగా వృద్ధి వచ్చింది. యూరోపియన్ యూనియన్‌తో ట్రేడ్ డీల్, వ్యాక్సీన్‌కు అనుమతులు లభించిన తర్వాత ఇందులో చాలా జోరు కనిపించింది. భారతదేశంలో కూడా నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. జపాన్‌లో వ్యాక్సీన్ తయారైన తర్వాత మరోసారి షేర్ మార్కెట్లలో జోష్ కనిపించడం మొదలైంది. ఫార్మస్యూటికల్ స్టాక్స్, గేమింగ్ కంపెనీల షేర్లు వీటిలో ముందంజలో నిలిచాయి. అయితే షేర్ మార్కెట్ పనితీరు అంచనా ఈ మొత్తం ప్రక్రియను ప్రతిబింబించదు. నగదు విలువ పతనం "ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. షేర్ మార్కెట్ ధర అనేది ఇప్పుడు, ఈ సమయం కోసం కాదు. షేర్ మార్కెట్ ఒక కారు నడపడం లాంటిది. అందులో, దూరంగా ఉన్న లక్ష్యాలను చూస్తుంటాం. ముందు కనిపిస్తున్న గుంతలను కాదు" అని మనీ మేనేజర్ స్క్రాండర్స్‌లో యూకే ఈక్వెటీస్ చీఫ్ స్యూ నాఫ్కా చెప్పారు. ఆమోదించిన లేదా అభివృద్ధి చేస్తున్న కొత్త వ్యాక్సీన్లు విజయవంతం అయితే వాటి వల్ల వృద్ధి వస్తుందని, అమ్మకాలు సాధారణంగానే ఉంటాయని పెట్టుబడిదారులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. వారు చౌక రుణాలను ఉపయోగిస్తున్నారు. వ్యాపారాలకు అది ఒక వరం లాంటిది. కేంద్ర బ్యాంకులు కూడా ఈ చౌక రుణాల వ్యాపారంలో ఉన్నాయి. వాటి ప్రభావం కూడా కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఒక్కటే ప్రభుత్వ, కార్పొరేట్ నుంచి 895 బిలియన్ పౌండ్ల బాండ్లు కొనుగోలు చేయాలని ఒక ప్రణాళిక రూపొందించింది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ అమెరికా ఫెడ్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆస్తులు కొనుగోలు చేసింది. రుణాలను మరింత చౌకగా చేయడమే ఈ కొనుగోళ్ల ఉద్దేశం. బాండ్ల కొనుగోలు రూపంలో ఈ డబ్బు ఆర్థికవ్యవస్థలోకి వచ్చినపుడు, అది ఇంకెక్కడైనా ధరలు పెరగడానికి కారణం అవుతుంది. "దానివల్ల డబ్బు విలువలో పతనం వచ్చింది. ఈ చౌక డబ్బు ఆర్థిక ఆస్తుల విలువను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మనం చూస్తున్నది అదే" అంటారు నాఫ్కా. ఐదు పెద్ద కంపెనీలు మనం మార్కెట్ ప్రదర్శన చూసినప్పుడు, సాధారణంగా కంపెనీల గ్రూప్ ఇండెక్స్ చూస్తాం. ఇండెక్స్ వాల్యూపై చిన్న కంపెనీల ప్రదర్శనకు బదులు పెద్ద కంపెనీల వృద్ధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో పెద్ద కంపెనీలు చాలా పెద్దవి అయిపోయాయి. ఈ ఏడాది టెక్ కంపెనీలకు చాలా బాగుంది. జనం సుదూర ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం వల్ల వారి ఆదాయంలో వృద్ధి వచ్చింది. ఉదాహరణకు నాస్డాక్ ఏడాది మొదట్లో చాలా గ్రోత్ చూసింది. కానీ, ఐదు కంపెనీలు.. అంటే గూగుల్‌కు చెందిన అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ ధర మిగతా 95 కంపెనీలన్నిటినీ కలిపితే దాదాపు దానితో సమానంగా ఉంది. "అలాంటప్పుడు షేర్ మార్కెట్ ఇండెక్స్ చూస్తే కరోనా మహమ్మారి వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదనే అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అందుకే, ఇండెక్స్ చూసి మనం అన్ని కంపెనీల పరిస్థితి సరిగానే ఉందని అంచనా వేయాల్సిన అవసరం లేదు" అని స్యూ నాఫ్కా చెప్పారు. పదేళ్లుగా ట్రెండ్ ఉంది ఒక ఇండెక్స్‌లో కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యం, నిష్క్రియాత్మక పెట్టుబడి అనే దాని వృద్ధితో ముడిపడి ఉంటుంది. ఇందులో పెన్షనర్స్, మనీ మేనేజర్స్, స్పెక్యులేటర్లు, ఇండెక్స్‌ను ప్రభావితం చేసే చౌక పెట్టుబడులను కొనుగోలు చేయవచ్చు. అందుకే పెట్టుబడిదారుడు ఈ ఫండ్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, అతడు ప్రాథమిక వాటాలు కొంటాడు. ధరలు పెరుగుదలకు సాయం చేస్తాడు. "గత 10 ఏళ్ల నుంచి మీరు ఒక ట్రెండ్ చూస్తున్నారు. డబ్బు ప్రవాహం క్రియాశీల నిధుల నుంచి నిష్క్రియాత్మక నిధులవైపు వెళ్తోంది" అని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌ ఆర్థిక మార్కెట్ పరిశోధకులు యోహానస్ పెట్రో అన్నారు. చాలా కంపెనీలు తమ పరిమాణం వల్ల ఇండెక్స్‌తో అనుసంధానం అవడం, విడిపోవడం జరుగుతుంది. కానీ, ఎప్పుడూ అలానే జరగదు. పెద్ద కంపెనీలు షేర్ మార్కెట్ ఇండెక్స్‌లో భాగం కాకుండా కూడా ఉండచ్చు. ఉదాహరణకు ఈ నెల ఎస్అండ్‌పీ500 ఇండెక్స్‌లో ప్రవేశించబోయే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఫండ్ నుంచి షేర్లు కొనుగోలులో సమస్యలు తలెత్తడంతో షేర్ల కోసం అదనంగా వంద బిలియన్ డాలర్లు డిమాండ్ చేసింది. భయపడడం లేదు పతనం కోసం పరిస్థితులు సిద్ధంగా ఉంటాయని చెబుతారని బ్రోకరేజ్ సంస్థ థీమిస్ ట్రేడింగ్‌లో భాగస్వామి జో సాలోజీ చెప్పారు. "చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్ ఎప్పుడూ పైకే వెళ్లలేదని ఆలోచిస్తారు. కానీ, అందులో పతనం ఎప్పుడు వస్తుందనేది చెప్పడం కష్టం" అన్నారు. "వాళ్లు సీఎన్ఎన్‌లో ఇచ్చిన ఒక ఇండికేటర్ చూస్తారు. దాని పేరు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. ఒకప్పుడు అది చాలా ఎత్తున ఉండేది. కానీ అది ఇప్పుడు పడిపోయింది. నాకది చూసినప్పుడు జనాల్లో భయం లేదనే అనిపిస్తుంది" అంటారు సాలోజీ. ఆయన, మార్కెట్ వృద్ధితో పోలిస్తే పతనం అయ్యేటపుడు ఏర్పడే పరిస్థితుల నిష్పత్తి అనే మరో పాయింట్ మీద కూడా దృష్టి పెట్టారు. 2012 తర్వాత నుంచి ఇటీవలి వరకూ మార్కెట్‌ వృద్ధిపై విధించే షరతులు అది పతనమైనప్పుడు ఉండే షరతుల కంటే ఎక్కువగా ఉన్నాయి. బామ్మగారి షేర్ మార్కెట్‌ ట్రేడింగ్ పాఠాలు "జనాలు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మనం దాన్నే విశ్లేషించాం. ఇప్పుడు ధర ఎక్కువ ఉందంటే... ఇదే మంచి సమయం అనుకుంటాం. మన షేర్లు తీసేయాలని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. అలా మనల్ని మనమే మార్కెట్లో చాలా తెలివైనవాళ్లం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనమెవరం తెలివైన వాళ్లం కాదు" అని జో సాలోజీ చెప్పారు. "కొన్ని కారణాల వల్ల మార్కెట్ స్వయంగా తనకు తానుగా నడుస్తుంటుంది. ఉద్యోగాలు పోయిన చాలా మంది ఇప్పుడు తక్కువగా ఖర్చు చేస్తున్నారు. కానీ తర్వాత వాళ్లు కొనుగోళ్లు చేయాలని అనుకుంటారు. గత సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం బహుశా కఠినమైన మార్గం అవలంబించాల్సి ఉంటుంది" అంటారు నాఫ్కా "మార్కెట్ దిగువకు వెళ్లినపుడు పెట్టుబడిదారులు ఎలాంటి వైఖరి ఎంచుకుంటారు అనేది చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్లు కొత్త పెట్టుబడిదారులు అయితే, మార్కెట్లో కొత్తగా ఒడిదొడుకులు అనుభవం పొందుతున్నప్పుడు, వీలైనంత త్వరగా లాభంతో తన డబ్బును వెనక్కు తీసేసుకోవాలని అనుకుంటాడు. అలాంటి వారి సంఖ్య తక్కువే ఉండచ్చు. కానీ, వాళ్లు ఈ మార్కెట్లో క్రియాశీలకంగా ఉన్నారు" అంటారు జో సాలోజీ. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. కొన్ని దేశాల్లో పని లేక చాలా మంది ఇళ్లలోనే ఉండిపోవడంతో ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తోంది. text: దిల్లీలో ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారని వార్తాఏజెన్సీలు వెల్లడించాయి. పోస్ట్ of Twitter ముగిసింది, 1 మరోవైపు తనకు కరోనా సోకిందని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేశారు. వేరే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధరణైందని.. గత వారం రోజుల్లో తనను కలిసినవారెవరైనా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాకబు చేశారు. సోమవారం ఆయన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ప్రణబ్ కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ ప్రభుత్వాలలో ఆర్థిక మంత్రిగా.. మన్మోహన్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా.. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్‌ ముఖర్జీ(84) ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. text: కొంతకాలంగా రాహుల్ రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా చాలా చర్చ జరుగుతోంది. తాను పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్ ప్రకటించినప్పటికీ, పార్టీలోని సీనియర్లు, ఇతర నాయకులు ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ, రాహుల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేరని కథనాలు వచ్చాయి. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తూ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. "పార్టీ అభివృద్ధి కోసం బాధ్యత తీసుకోవడం తప్పనిసరి. అందుకే రాజీనామా చేస్తున్నా" అని రాహుల్ వెల్లడించారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 లేఖలో రాహుల్ ఇంకా ఏమన్నారంటే... తదుపరి అధ్యక్షుడిని నామినేట్ చేయాల్సిందిగా చాలామంది నన్ను కోరారు. కానీ నేను ఆ పని చేయడం సరికాదు. మా పార్టీకి ఎంతో ఘనమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ధైర్యంగా పార్టీని నడపగల వ్యక్తి ఎంపికలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోగలదని నేను నమ్ముతున్నా. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరాను. వాళ్లకు ఆ సామర్థ్యం ఉంది, వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. నా పోరాటం అధికారం కోసం కాదు. అలాగని బీజేపీపై ద్వేషం, కోపం కూడా లేవు. కానీ నా శరీరంలోని ప్రతి అణువూ దేశం గురించి బీజేపీ సిద్ధాంతాలను, ఆలోచనలను వ్యతిరేకిస్తుంది. ఈ పోరాటం కొత్తది కాదు. ఇది మన భూమిపై వేలాది సంవత్సరాల నుంచి జరుగుతోంది. వారు వ్యత్యాసాలు చూస్తున్న చోట నేను సారూప్యత చూస్తున్నాను. వారు ద్వేషం చూస్తున్న చోట నేను ప్రేమను చూస్తున్నాను. వాళ్లు భయపడేదాన్ని, నేను హత్తుకుంటున్నాను. ఈ ఆలోచన లక్షల ప్రజల మనసుల్లో వ్యాపించాలి. భారతదేశంలోని ఈ ఆలోచనను ఇప్పుడు మనం రక్షించాలి. నేను ఈ పోరాటం నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోని నమ్మకమైన సైనికుడిని. అంకితభావం ఉన్న భారతదేశ పుత్రుడిని. నా తుది శ్వాస వరకూ దేశాన్ని రక్షించుకునేందుకు నేను పోరాటం కొనసాగిస్తాను. మేం ఒక బలమైన, గౌరవప్రదమైన ఎన్నికల్లో పోటీ చేశాం. మేం దేశంలోని ప్రజలు, మతాలు, సమాజాలు అందరినీ గౌరవిస్తూ ప్రచారం చేశాం. నేను వ్యక్తిగతంగా ప్రధానితో, ఆరెస్సెస్‌తో, వారి అధీనంలో ఉన్న సంస్థలతో పోరాటం చేశాను. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే ఆ పోరాటం చేశాను. భారతదేశంలో ఆదర్శాలను రక్షించుకోడానికి నేను పోరాటం చేశాను. కొన్నిసార్లు నేను పూర్తిగా ఒంటరిగా నిలిచాను. దానికి చాలా గర్వపడుతున్నాను. నేను నా పార్టీ కార్యకర్తల నుంచి, పార్టీ సభ్యుల నుంచి, వారి సాహసం, అంకితభావం నుంచి చాలా నేర్చుకున్నాను. పూర్తిగా స్వతంత్రంగా, పరిశుభ్రంగా జరిగే ఎన్నికల కోసం దేశంలోని సంస్థలు నిష్పక్షపాతంతో ఉండడం తప్పనిసరి. అన్ని ఆర్థిక వనరులను ఒకే పార్టీ నియంత్రణలో ఉన్నంత వరకు దేశంలో ఎన్నికలు స్వతంత్రంగా జరగవు. మేం 2019లో ఒక రాజకీయ పార్టీనే ఎదుర్కోలేదు. దానికి బదులు మేం భారత ప్రభుత్వంలోని మొత్తం యంత్రాంగాన్ని ఎదుర్కుని పోరాడాం. ప్రతి సంస్థనూ విపక్షానికి వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. భారత సంస్థల ఏ నిస్పాక్షికత గురించి మనం ప్రశంసిస్తూ వచ్చామో, అది ఇప్పుడు లేదని పూర్తిగా స్పష్టమైంది. దేశంలోని అన్ని సంస్థలను చేతుల్లోకి తీసుకోవాలన్న ఆరెస్సెస్ ఉద్దేశం ఇప్పుడు నెరవేరింది. మన ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో బలహీనం చేశారు. ఇక్కడ అతిపెద్ద ప్రమాదం ఏదంటే, ఒకప్పుడు భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన ఎన్నికలు ఇప్పుడు కేవలం ఒక ఆచారంగా మారాయి. అధికారం చేజిక్కించుకున్న ఫలితంగా భారతదేశం ఊహించలేని స్థాయిలో హింస, బాధ భరించాల్సి ఉంటుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ, రుణాలపై కూడా దీని చెడు ప్రభావం పడుతుంది. ప్రధాన మంత్రి ఈ విజయంతో ఆయన అవినీతి ఆరోపణల నుంచి విముక్తి పొందలేదు. ఎవరు ఎంత డబ్బైనా ఖర్చు చేయనీ, ఎంత ప్రాపగాండా చేసినా, సత్యం వెలుగును అడ్డుకోలేరు. దేశంలోని సంస్థలను మళ్లీ దక్కించుకోడానికి, వాటిలో తిరిగి జీవం నింపడానికి మొత్తం భారతదేశం ఒకటి కావాలి. ఈ సంస్థలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే తిరిగి నిలబెట్టగలదు. కీలకమైన ఈ పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ స్వయంగా కఠిన మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు బీజేపీ పక్కా ప్రణాళిక ప్రకారం భారత ప్రజల గొంతు నొక్కేస్తోంది. ఆ గొంతులను కాపాడడం కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం. ఫరూఖ్ అబ్దుల్లా అభినందనలు రాహుల్‌ను రాజీనామా నిర్ణయాన్ని ఫరూఖ్ అబ్దుల్లా అభినందించారు. "తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు ఆయనకు అభినందనలు. ఆయన యువకుడు. భవిష్యత్‌లో అధ్యక్షుడయ్యే అవకాశం మళ్లీ రావచ్చు. ఆ స్థానంలో వేరే వ్యక్తి ఉండాలనే ఆయన ఎప్పుడూ కోరుకున్నారు. ఎన్నికల్లో ఓటమే ఈ నిర్ణయానికి కారణమని నేను చెప్పలేను. ఇక ఇప్పుడు ఆయన పార్టీ అభివృద్ధికోసం పనిచేయవచ్చు" అని ఫరూఖ్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్విటర్లో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా ఆయన వ్యాఖ్యానించారు. text: పట్టణంలోకి వెళ్లద్దంటూ అధికారుల హెచ్చరికలు 1970లో ఖాళీ అయిన విట్టెనూమ్ అనే ఈ మారుమూల పట్టణం చూడాలని వస్తున్నపర్యాటకులను, ఉత్సాహవంతులను ఎలా ఆపాలా అని అధికారులు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. పెర్త్‌కు 1100 కిలోమీటర్లు ఉత్తరంగా ఉన్న విట్టెనూమ్ వస్తున్న వారిని హెచ్చరిస్తూ అధికారులు నోటీస్ బోర్డులు పెట్టారు. గతంలో తవ్వకాలు జరిగిన ఈ ప్రాంతమంతా కలుషితం అయ్యిందని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. గనిలోంచి ఆస్‌బెస్టాస్ బయటకు తీయడంతో గతంలో ఇక్కడ కొన్ని వేల మంది స్థానికులు, పర్యాటకులు మృతి చెందారు. చెర్నోబిల్, భోపాల్ విషాదాల్లాగే, విట్టెనూన్‌లో జరిగిన దానిని కూడా ఒక అతిపెద్ద విషాదంగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. జనం ఎవరూ ఈ పట్టణంలోకి రాకుండా రోడ్డు పక్కన అధికారులు బోర్టులు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇక్కడ ఇంకా కొంతమంది నివసిస్తూనే ఉన్నారు. అయినా, గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌లో పోటెత్తుతున్న వీడియోలు, బ్లాగుల్లో వెలుస్తున్న పోస్టులతో విట్టెనూమ్ వెళ్లద్దనే ప్రభుత్వం హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదనే విషయం బయటపడింది. నిర్జనంగా ఒక ప్రాంతం 'ఒక్కసారి వెళ్లొస్తే ఏమవుతుంది?' ఈ నెల మొదట్లో పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే వైట్, ఈ పట్టణంలోకి వెళ్లాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పిల్బారా ప్రాంతంలోంచి ప్రయాణించాడు. లోయలు, జలపాతాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే కర్జిని నేషనల్ పార్క్‌కు వెళ్లే దారిలో ఈ విట్టెనూమ్ పట్టణం ఉంటుంది. విట్టెనూమ్ వెళ్లే ముందు పట్టణంలో ఆస్‌బెస్టాస్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి పరిశోధన చేశానని వైట్ బీబీసీకి చెప్పారు. తను ఆ ప్రాంతంలో ఉన్న హెచ్చరికల బోర్డులు కూడా చదివానన్నారు. "గాలిలో ఉన్న ఫైబర్స్ వల్లే సమస్యలు వచ్చాయని అక్కడ నాకు అనిపించింది. మేం వెళ్లినప్పుడు అక్కడ గాలి అంత ఎక్కువగా లేదు. అందుకే అక్కడ కాసేపున్నంత మాత్రాన ఏం కాదని అనిపించింది" అని వైట్ చెప్పారు. అధికారులు మాత్రం విషపూరితమైన ఆస్‌బెస్టాస్ ఫైబర్స్ విట్టెనూమ్, దానికి దగ్గరే ఉన్న ఒక పాపులర్ లోయతోపాటు పట్టణం చుట్టుపక్కల ఉన్నాయని చెబుతున్నారు. అలనాటి విట్టెనూమ్ జనం వదిలి వెళ్లిన ప్రాంతాలను, నిర్జనంగా ఉన్న పట్టణాన్ని చూడడం తనకు బాగా అనిపించిందని వైట్ చెప్పారు. పట్టణంలో వెళ్లడానికి తనకు ఎలాంటి భద్రతా సమస్యా రాలేదన్నారు. ఈ పట్టణంలోకి వెళ్లిన మిగతావారు కూడా తమకు కూడా వైట్ లాగే అనిపించినట్టు ఆన్‌లైన్లో చెప్పారు. ఒక యూట్యూబ్ వీడియోలో పురుషుల బృందం ఒక పాత ఆస్‌బెస్టాస్ గనిలోకి వెళ్లింది. అక్కడ గని తవ్వకాల గురించి తెలిసిన ఒక స్థానికుడు వారిని తీసుకెళ్లినట్టు అందులో కనిపించింది. వీడియో కింద పోస్ట్ చేసిన కామెంట్స్‌లో కొందరు "గతాన్ని అద్భుతంగా చూపారని" వారికి కంగ్రాట్స్ చెప్పారు. కొందరు మాత్రం వారిని హెచ్చరించారు. "అక్కడ ఆ ప్రాంతంలో బ్లూ ఆస్‌బెస్టాస్ ప్రమాదకరస్థాయిలో లేదా? ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండాలి. అది ప్రాణాలు తీయచ్చు" అని ఒకరు కామెంట్ పెట్టారు. "ఇది మీ వ్యక్తిగతం అని తెలుసు, కానీ అంత రిస్క్ చేయడం ఎందుకు" అని మరొకరు అన్నారు. అధికారుల హెచ్చరికలు జాగ్రత్త విట్టెనూమ్ వెళ్లివచ్చామని చెబుతూ పోస్ట్ చేసిన ఈ వీడియోలు అధికారులను అప్రమత్తం చేశాయి. "విట్టెనూమ్ చరిత్ర వల్ల, పట్టణంలో, దాని చుట్టుపక్కల పర్యటిస్తున్న వారి భద్రతపై ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి" అని ఆష్‌బర్టన్ ప్రాంతానికి చెందిన అధికారి రాబ్ పాల్ చెప్పారు. మేం ఎవరికైనా విట్టెనూమ్ రావడం ప్రమాదం అనే చెబుతాం. ప్రభుత్వం గనులను 1966లో మూసేశాక, అక్కడ నివసించే చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. విట్టెనూమ్‌లో ఉన్న భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. 2006లో అది పట్టణం హోదాను కోల్పోయింది. దానిని అధికారిక మ్యాపుల్లోంచి, రోడ్ సూచికల్లోంచి తీసేశారు., నిర్జన పట్టణం విట్టెనూమ్‌లో విడుదలైన ఆస్‌బెస్టాస్ వల్ల మెసొథెలియోమా అనే అరుదైన క్యాన్సర్ వస్తుందని ప్రభుత్వ వెబ్ సైట్ చెబుతోంది. ఛాతి, పొత్తి కడుపులో ఉండే పొరపై దీని ప్రభావం పడుతుందని, కాలుష్యం వల్ల ఆస్‌బెస్టోసిస్, లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చని అంటోంది. అక్కడకు వెళ్లారా అంతే సంగతులు అంటోంది. ఆస్‌బెస్టాస్‌ ప్రభావానికి గురైన తర్వాత కొన్ని దశాబ్దాల వరకూ దాని లక్షణాలు బయటపడకపోవచ్చని ఈ వెబ్ సైట్‌లో తెలిపారు. "సురక్షితంగా ఉండండి. విట్టెనూమ్‌కు వెళ్లకండి" అని ప్రభుత్వం ఇందులో అధికారిక సలహా ఇచ్చింది. అన్ని హెచ్చరికలు చేసినా పట్టణం చూడాలనుకునే తనలాంటి పర్యాటకులు వాటిని పట్టించుకోమని వైట్ చెబుతున్నారు. అక్కడ చాలా బోర్డులు ఉన్నాయి. కానీ జనం వాటిని చదువుతారని నేను అనుకోవడం లేదు. నాలాగే అందరూ అక్కడి ప్రమాదాల గురించి తెలుసుకునే వెళ్తారు అని వైట్ అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న ఈ పట్టణాన్ని ఒక ఆస్‌బెస్టాస్(రాతినార) గనిపై నిర్మించారు. అదే స్థానికులకు ప్రమాదంగా మారింది. చివరకు ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయేలా చేసింది. ఇప్పుడీ పట్టణం దాదాపు నరమానవుల్లేని ‘ఘోస్ట్’ టౌన్‌గా మారింది. text: దాడికి ఉపయోగించిన ఆయుధాలు, నిఘా సమాచారాన్ని బట్టి అమెరికా ఈ అంచనాకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు బీబీసీతో మాట్లాడిన ఇరాన్ అధికారి మాత్రం ఈ పేలుళ్లతో ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. గురువారం ఉదయం చమురు ట్యాంకర్లపై దాడి జరిగింది. వాటిలోని సిబ్బందిని కాపాడామని ఇరాన్, అమెరికా రెండూ చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గంలో ఈ పేలుడు జరిగింది. గురువారం జరిగిన పేలుళ్ల కంటే ముందు సుమారు నెల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన నాలుగు చమురు ట్యాంకర్లపై కూడా దాడి జరిగింది. మేలో జరిగిన ఈ దాడికి ఏ గ్రూపులు, దేశాలు బాధ్యత తీసుకోలేదు. ఇందులో కూడా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అమెరికా అప్పుడు కూడా ఇరాన్‌పై ఆరోపణలు చేసింది. కానీ ఆ పేలుళ్లలో తమ పాత్ర లేదన్న ఇరాన్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఒమన్ గల్ఫ్‌లో గురువారం జరిగిన దాడి తర్వాత చమురు ధరలు సుమారు నాలుగు శాతం పెరిగాయి. ఒమన్ గల్ఫ్‌లో ఉన్న హోర్మూజ్ దగ్గర జరిగింది. ఆ మార్గంలో రోజూ లక్షల డాలర్ల చమురు రవాణా అవుతుంది. పాంపేయో ఏం చెప్పారు... దీనిపై వాషింగ్టన్‌లో మాట్లాడిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. "నిఘా సమాచారం, ఈ దాడికి ఉపయోగించిన ఆయుధాలు, ఈ ఆపరేషన్ అమలు చేయడానికి ఎలాంటి నిపుణులు అవసరం ఉంటుంది, ఇటీవల ఇరాన్ ద్వారా నౌకలపై జరిగిన ఇలాంటి దాడుల ఆధారంగా మేం ఈ అంచనాకు వచ్చాం. నిజానికి ఈ ప్రాంతంలో ఉన్న ఏ గ్రూపులకూ ఇలాంటి చర్యలకు పాల్పడే వనరులు, నైపుణ్యం లేవు" అన్నారు. అమెరికా, దాని సహచరుల ప్రయోజనాలపై ఇరాన్, దాని సహచరులు జరుపుతున్న దాడులకు సంబంధించి ఇది తాజా కేసు. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే జరిగే ఇలాంటి దాడులు అంతర్జాతీయ శాంతిభద్రతలకు చాలా ప్రమాదం. ఇది నౌకారవాణా స్వేచ్ఛపై జరిగిన క్రూరమైన దాడి. ఇది ఇరాన్ వైపు నుంచి ఉద్రిక్తతలు పెంచే చర్యలు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం అని పాంపేయో చెప్పారు. పేలుడు గురించి సమాచారం 'ఫ్రంట్ అల్టయర్‌' అనే చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది, దీనిలో మూడు పేలుళ్లు జరిగాయని నార్వే మారీటైమ్ అథారిటీ గురువారం చెప్పింది. ఫ్రంట్ అల్టయర్ నౌకను తైవాన్ ప్రభుత్వ చమురు రీఫైనరీ కంపెనీ సీపీసీ కార్పొరేషన్ అద్దెకు నడుపుతోంది. ఇందులో 75 వేల టన్నుల చమురు ఉందని సీపీసీ కార్పొరేషన్ ప్రతినిధి చెప్పారు. టార్పెడో (జలాంతర్గామితో ప్రయోగించే క్షిపణి)తో ఈ దాడి చేశారని భావిస్తున్నారు. కానీ దీనిని ఇప్పటివరకూ ధ్రువీకరించేదు. ఇది మైన్ అటాక్ కూడా కావచ్చని మరికొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. మార్షల్ ద్వీపం జెండా ఉన్న పడవలకు నిప్పంటుకుందని ఫ్రంట్‌లైన్ నౌక యజమాని అన్నారు. ఇరాన్ మీడియా మాత్రం అది మునిగిపోయిందని చెబుతోంది. దానిని కంపెనీ కొట్టిపారేసింది. కొకుకా కొరేజియస్ నౌకలో ఆపరేషన్స్ నిర్వహించే బీఎంఎస్ షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీ దానిలోని సిబ్బంది బయటపడ్డారని, అటుగా వెళ్తున్న ఒక నౌక వారిని కాపాడిందని చెప్పింది. మరో ప్రతినిధి ఈ ట్యాంకర్లో మిథనాల్ ఉందని, అది మునిగిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. నౌకను కాపాడ్డానికి ఎవరొచ్చారు ఇరాన్ క్రూ నౌకలోని వారిని కాపాడిందని, వారిని జాస్క్ రేవుకు తీసుకెళ్లారని ఆ దేశ మీడియా చెప్పింది. వారిని మరోవైపు సిబ్బందికి సాయం చేసేందుకు ఘటనాస్థలానికి యూఎస్ఎస్ బైన్‌బ్రిడ్జ్ నౌకను పంపించామని బహ్రెయిన్‌లోని అమరికా ఫిఫ్త్ ఫ్లీట్ చెప్పింది. "అమెరికా నౌకాదళానికి రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి ఆందోళనగా కాల్స్ వచ్చాయి" అని సైనిక ప్రతినిధి చెప్పారు. దాంతో కొకుకా ట్యాంకర్ సిబ్బందిలో 29 మందిని బైన్‌బ్రిడ్జ్‌లో సైన్యం సురక్షితంగా కాపాడిందని అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎందుకు 2015లో జరిగిన ఇరాన్ అణు ఒప్పందం నుంచి బయటిరావాలని అమెరికా 2018లో నిర్ణయించింది. అమెరికా సహచర దేశాలతోపాటు చాలా దేశాలు ఈ చర్యను తీవ్రంగా విమర్శించాయి. మేలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను కఠినం చేశారు. ఆ దేశంలోని చమురు రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అణు ఒప్పందం ప్రకారం తాము చేసిన కొన్ని హామీలను వాయిదా వేస్తున్నట్టు తర్వాత ఇరాన్ కూడా చెప్పింది ఇటీవల కొన్ని నెలల నుంచీ అమెరికా గల్ఫ్‌లో తన సైన్యం మోహరింపు పెంచింది. ఇరాన్ వల్ల తమకు ప్రమాదం ఉంది కాబట్టే అలా చేస్తున్నామని చెప్పింది. మరోవైపు, అమెరికానే దూకుడుగా వ్యవహరిస్తోందని ఇరాన్ చెప్పింది. అమెరికా దగ్గర ఎలాంటి నిఘా సమాచారం ఉంది -జొనాథన్ మార్కస్, రక్షణ ప్రతినిధి విశ్లేషణ పాంపేయో ఇలాంటి నిర్ణయానికి రావడం చాలా దారుణం. కానీ ఈ పేలుళ్లకు సరైన కారణం గురించి చాలా తక్కువ వివరాలు అందాయి. రెండు ట్యాంకర్లకు జరిగిన నష్టంపై ఫోరెన్సిక్ విశ్లేషణలు చెబుతున్న దానిని బలపరిచేలా అక్కడ వేరే నౌకల కదలిక ఉందనడానికి ఉపగ్రహాలు లేదా వేరే ట్రాకింగ్ సమాచారం కావాలి. త్వరగా ఒక నిర్ణయానికి రావడం ప్రమాదం అని కొందరు వాదించచ్చు. ఇక అమెరికా స్పందించాలని ముఖ్యంగా సైనికపరంగా స్పందించాలనుకుంటే, అప్పుడు చాలా దేశాలు దాని మిత్ర దేశాలు కూడా అమెరికా దగ్గర దీని గురించి ఎలాంటి కచ్చితమైన నిఘా సమాచారం ఉందో తెలుసుకోవాలనుకుంటాయి అనేది స్పష్టమైంది. ఇక, ఇరాన్ విషయానికి వస్తే, ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పడం తొందరపాటే అవుతుంది. నిజానికి తమను ఇరికించారని అది వాదించడం వల్ల, తమపై నిందలు రాకుండా చూసుకుంటున్నట్లు అవుతుంది. ఇరాన్ అధికారి "ఇది ఇరాన్, అంతర్జాతీయ సమాజం మధ్య ఉన్న సంబంధాలను బలహీనం చేసే ప్రయత్నం" అని ఆరోపించారు. దాడిపై స్పందనలు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ గురువారం ట్యాంకర్లలో జరిగిన పేలుళ్లను ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాట్లాడిన ఆయన ప్రపంచం గల్ఫ్‌లో ఘర్షణలను తట్టుకోలేదని అన్నారు యూరోపియన్ యూనియన్ రెండు దేశాలూ సంయమనం పాటించాలని అపీల్ చేసింది. అటు రష్యా కూడా ఎవరూ ఎలాంటి నిర్ణయానికీ రావద్దని, పేలుళ్లతో ఇరాన్‌పై ఒత్తిడి కూడా పెట్టకూడదని అంది. ఇరాన్‌ను రష్యా సహచర దేశంగా భావిస్తారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒమన్ గల్ఫ్‌లో ‌ఉన్న రెండు ట్యాంకర్లపై రెచ్చగొట్టకుంటానే దాడి చేయడానికి ఇరానే బాధ్యత వహించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో అన్నారు. text: ట్రంప్ ఈ విచారణకు రావాలని, లేదంటే ఈ ప్రక్రియపై ఫిర్యాదులు మానుకోవాలని సభ జ్యుడిషియరీ కమిటీ డెమొక్రటిక్ చైర్మన్ జెరాల్డ్ నాడ్లర్ అన్నారు. ఆయన హాజరైతే సాక్షులను ప్రశ్నలడిగే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్‌స్కీతో ట్రంప్ జులైలో మాట్లాడిన కాల్స్ కేంద్రం సాగుతున్న ఈ అభిశంసన విచారణ తదుపరి దశకు చేరడానికి అది సూచన. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న జో బిడెన్, ఆయన కుమారుడిపై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ట్రంప్ కోరారన్నది ఆరోపణ. బిడెన్‌పై దర్యాప్తు కోరుతూ, లేని పక్షంలో ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేస్తామంటూ ట్రంప్ బెదిరించారా లేదన్న అన్న అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అయితే, ట్రంప్ తాను ఏ తప్పూ చేయలేదంటూ ఈ విచారణను కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. కొన్నివారాల పాటు రహస్య పద్ధతిలో సాగిన సాక్షుల విచారణ అనంతరం హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ రెండు వారాల పాటు చేపట్టిన బహిరంగ విచారణలనూ ముగించింది. విచారణ చేపట్టిన నిఘా, పర్యవేక్షణ, విదేశీ వ్యవహారాల కమిటీలు ఇప్పుడు నివేదిక రూపొందించే పనిలో ఉన్నాయని, డిసెంబరు 3న నివేదిక వస్తుందని నిఘా కమిటీ డెమొక్రటిక్ చైర్మన్ ఆడమ్ చిఫ్ చెప్పారు. జెరాల్డ్ నాడ్లర్ చెప్పిందేమిటి? వచ్చే నెలలో విచారణకు రావాలంటూ తాను ట్రంప్‌కు లేఖ రాశానని నాడ్లర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ''ఆయన ముందు రెండు మార్గాలున్నాయి.. విచారణకు హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పడం ఒకటైతే రెండోది ఈ ప్రక్రియపై మాట్లాడకుండా ఉండడం'' అని నాడ్లర్ అన్నారు. ''ఆయన నేరుగా హాజరు కావడం కానీ, లేదంటే గతంలో కొందరు అధ్యక్షుల మాదిరిగా తన తరఫు న్యాయవాదులను పంపించడం కానీ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారాయన. విచారణకు హాజరయ్యేదీ లేనిదీ డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల్లోపు చెప్పాలని, ఒకవేళ న్యాయవాదిని పంపించాలని నిర్ణయిస్తే ఆ న్యాయవాది ఎవరో తెలపాలని కోరారు. అభిశంసన విచారణలో తదుపరి పర్వం జ్యుడిషియరీ కమిటీ ముసాయిదా రూపకల్పన తయారీలో నిమగ్నమవుతుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న సభలో తొలుత ఓటింగ్ జరిగిన తరువాత రిపబ్లికన్లు నడిపించే సెనేట్‌లో విచారణ జరుగుతుంది. మూడింట రెండొంతుల మెజారిటీతో ట్రంప్ దోషిగా తేలితే అమెరికా చరిత్రలోనే అభిశంసన వల్ల పదవిని కోల్పోయిన తొలి అధ్యక్షుడవుతారు ట్రంప్. కాగా, ఈ విచారణను రెండు వారాలకు పరిమితం చేయాలని వైట్‌హౌస్, రిపబ్లికన్లు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) డిసెంబరు 4న జరగబోయే తొలి అభిశంసన విచారణకు హాజరు కావాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అక్కడి చట్టసభ కాంగ్రెస్ కోరింది. text: కార్డియాక్ అరెస్ట్ గుండెలోని కొన్ని భాగాలను నిర్వీర్యం చేస్తుంది. ఒకసారి నశించాక, ఆ కణాలు తిరిగి పుంజుకోలేవు. అయితే దీనికి పరిష్కారాన్ని కనుగొన్నామని, దీని వల్ల వేలాది మంది ప్రాణాలను రక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిరంతర ఆక్సిజన్ సరఫరా కోసం గుండె కరొనరీ ధమనుల మీద ఆధారపడుతుంది. అవి కనుక బ్లాక్ అయిపోయి, ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే, కొన్ని నిమిషాలలోనే గుండె కండరాల జీవకణాలు మరణించడం ప్రారంభిస్తాయి. వైద్యులు ఒక గంటలోగా దానిని క్లియర్ చేయకుంటే, 100 కోట్లకు పైగా హృదయ కండరాల జీవకణాలు తిరిగి జీవం పోసుకోలేవు. దీనిని తట్టుకుని బ్రతికిన వాళ్లు కూడా శాశ్వతంగా హృదయ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలి. ఒక్క యూకేలోనే ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య సుమారు 4.5 లక్షలు ఉండవచ్చని అంచనా. ఈ సమస్యను ఎదుర్కొన్న వారిలో 50 శాతం మంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ''గుండె బలహీనం కావడం వల్ల తగినంత రక్తప్రసరణ జరగక గుండె పనిచేయడం ఆగిపోతుంది'' అని కేంబ్రిడ్జిలోని అడెన్ బ్రూక్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ సంజయ్ సిన్హా తెలిపారు. గుండెతో వచ్చిన సమస్య ఏమిటంటే, మన ఇతర శరీర భాగాలు - ఉదాహరణకు చర్మం, కాలేయంలా కాకుండా గుండెకు తనను తాను నయం చేసుకునే శక్తి చాలా తక్కువ. ఏడాదికి కేవలం 0.5 శాతం మాత్రమే గుండె కండరాల కణాల ప్రతిరూపకల్పన జరుగుతుంది. అందువల్ల దెబ్బ తింటే, తమంతట తాముగా అవి సరిదిద్దుకోలేవు. దీని వల్ల గుండెలోని కొన్ని భాగాలు పని చేయడం మానేస్తాయి. ప్రస్తుతం హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం - గుండె మార్పిడి. అయితే గుండెను దానం చేసే వాళ్లు దొరకడం చాలా కష్టం. యూకేలో గుండె మార్పిడి ఆపరేషన్లు కేవలం ఏడాదికి 200 మాత్రమే జరుగుతున్నాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్లు లేదా తీవ్రమైన ప్రమాదాలలో గాయపడిన వాళ్ల నుంచి మాత్రమే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు పనికి వచ్చే గుండె లభిస్తోందని సంజయ్ సిన్హా తెలిపారు. హార్ట్ ప్యాచ్ దీనికి మరో ప్రత్యామ్నాయం - స్టెమ్ సెల్ మెడిసిన్. క్లినికల్ ట్రయల్స్‌లో శాస్త్రవేత్తలు దెబ్బ తిన్న గుండెలోకి స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా కండరాలను తిరిగి పని చేయించే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా దెబ్బ తిన్న రక్తనాళాలు పునరుజ్జీవం పొంది, గుండెకు రక్త సరఫరా పెరిగింది. అయితే ఈ విధానంలో చాలా కొద్దిగా మాత్రమే ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఇంజెక్ట్ చేసి స్టెమ్ సెల్స్‌లో 5 శాతం మాత్రమే గుండెకు అతుక్కోవడంలో సఫలమౌతున్నాయి. అయితే కేంబ్రిడ్జి యూనివర్సిటీలో స్టెమ్ సెల్ బయాలజిస్టులతో పాటు సిన్హా ''హార్ట్ ప్యాచెస్'' అనే వినూత్నమైన ఆలోచన చేస్తున్నారు. ఏమిటీ ప్యాచ్ వర్క్? 2.5 చదరపు సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో చిన్న ముక్కల రూపంలో ఉండే ఈ గుండె కండరాలను ల్యాబ్‌లో తయారు చేస్తారు. నెల రోజుల వ్యవధిలో వీటిని అభివృద్ధి చేస్తారు. రక్తకణాలను తీసుకుని, వాటిని స్టెమ్ సెల్స్‌గా రీప్రోగ్రామింగ్ చేసి, తర్వాత వాటిని ఏ భాగం కావాలంటే అవి - గుండె కండరాల కణాలు, రక్తనాళాల కణాల రూపంలోకి వాటిని మారుస్తారు. హార్ట్ ప్యాచెస్ విషయానికి వస్తే, గుండె చుట్టూ ఉండే పొర వాటికి రూపాన్నిస్తుంది. ఇలా తయారు చేసిన కృత్రిమ గుండె కణజాలం, నిజమైన గుండె కణజాలంలాగే పని చేస్తుంది. ఈ హార్ట్ ప్యాచెస్‌ను పేషెంట్ల రక్తం నుంచే తయారు చేయడం వల్ల, గుండె వాటిని తిరస్కరించే అవకాశం కూడా చాలా తక్కువ. ప్రస్తుతం సిన్హా ఈ హార్ట్ ప్యాచెస్‌ను ఎలుకలు, పందులపై ప్రయోగిస్తున్నారు. అంతా సక్రమంగా జరిగితే, ఐదేళ్ల తర్వాత మానవులపై ప్రయోగాలను ప్రారంభిస్తారు. ఈ ప్యాచ్‌లు ఎలా పనిచేస్తాయి? అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ యూనివర్సిటీలు కూడా ఇదే బాటలో హార్ట్ ప్యాచెస్ తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్, ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ ద్వారా గుండెలో దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. గుర్తించిన ప్రదేశానికి అనుగుణంగా వాళ్లు త్రీడీ ప్రింటర్ ద్వారా హార్ట్ ప్యాచ్‌ను తయారు చేస్తారు. అనంతరం సర్జన్లు ఛాతీ కుహరాన్ని తెరిచి, ఈ ప్యాచ్‌ను ధమనులు, సిరలతో కలిసి పని చేసేలా అమరుస్తారు. దీనిలో ప్రధానమైన సమస్య - కొత్తగా అమర్చిన ప్యాచ్, ఏ మేరకు హృదయ స్పందనలకు అనుగుణంగా కొట్టుకుంటుంది అనేది. అయితే గుండె నుంచి ఆ ప్యాచ్‌కు వెళ్లే విద్యుత్ సంకేతాలు ప్యాచ్‌ను కూడా అదే వేగంతో కొట్టుకునేలా చేస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ ప్రయోగమే విజయవంతమైతే భవిష్యత్తులో గుండె జబ్బు ఉన్నవాళ్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మామూలుగా తమ జీవితాన్ని గడిపేయొచ్చు. ప్రపంచంలో తొలి గుండె మార్పిడి ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ప్రపంచంలో అవయవాల దానం చాలా తక్కువ. అదీ గుండెను దానం చేయడం మరీ అరుదు. దీంతో హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నవారి జీవితం అర్ధాంతరంగా ముగుస్తోంది. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు 'హార్ట్ ప్యాచెస్'ను తయారు చేసే పనిలో ఉన్నారు. అదే జరిగితే హృద్రోగులు కూడా మిగతా ఆరోగ్యవంతుల్లాగే మామూలుగా జీవించొచ్చు. text: అన్ని వర్గాల వారూ ఓట్లు వేసే సాధారణ ఎన్నికల కంటే.. అందరూ డిగ్రీ పైన చదువుకున్న వారు, పిల్లలకు పాఠాలు చెప్పే వారు ఓట్లు వేసే ఈ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చెల్లని ఓట్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్క హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నియోజకవర్గంలోనే 21 వేలకు పైగా చెల్లని ఓట్లు వచ్చాయి. మామూలు ఎన్నికల్లో వంద ఓట్లు ఉండి, ఒకరికి 40 రెండో వారికి 35, మూడో వారికి 15, నాలుగో వారికి 10 ఓట్లు వచ్చాయి అనుకుంటే.. అప్పుడు 40 ఓట్లు వచ్చిన మొదటి వ్యక్తి గెలిచినట్టు. కానీ ఇక్కడ ఆ మొదటి వ్యక్తికి వ్యతిరేకంగా 60 ఓట్ల వచ్చాయన్న విషయం మనం మర్చిపోతున్నాం. అంతేకాదు. కనీసం ఓటేసిన వారిలో సగం మంది కూడా ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వలేదని అర్థం. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ లోపం జరగదు. ఓటేసిన వారి అభిప్రాయం మరింత పక్కాగా ప్రతిఫలించే విధానంలో జరుగుతాయి ఎమ్మెల్సీ ఎన్నికలు. దాన్నే ప్రాధాన్యత క్రమం ఎన్నిక అంటారు. అంటే ఇక్కడ ఓటు వేసే వారు మొదటి వ్యక్తికి ఓటు వేయవచ్చు. అతని తరువాత సెకండ్ బెస్ట్ అనుకున్న వారికీ ఓటు వేయవచ్చు. ఉదాహరణకు ఎన్నికల్లో పది మంది పోటీ చేస్తే, పది మందికీ ఓటేయవచ్చు. కానీ ఫస్ట్ ప్రయార్టీ, సెకండ్ ప్రయార్టీ ఇలా వెళ్లాలి. అంటే మీరు ఫలానా వారు ఎమ్మెల్సీ అయితే బావుంటుంది అనుకుంటే, ఆ ఫలానా వ్యక్తికి నంబర్ వన్ ఓటు వేస్తారు. ఒకవేళ వారు కాకపోతే రెండో వారు బెటర్ అనుకుంటే ఆ రెండో వ్యక్తికి నంబర్ టూ వేస్తారు. పోనీ ఈ ఇద్దరూ కాకపోతే ఫలానా వారు వచ్చినా పర్లేదు అనుకుంటే ఆ ఫలానా వ్యక్తికి మూడో ప్రాధాన్యత వేస్తారు. అసలు ఇదంతా కాదు, నా ఉద్దేశంలో ఒక్కరు మాత్రమే ఆ పదవికి అర్హులు అనుకుంటే, ఆ ఒక్కరికి మాత్రమే ఓటు వేసి, మిగిలిన ఎవరికీ నంబర్ టూ, త్రీ ఇవ్వకుండా వదిలేయవచ్చు. ఇలా సాగుతుంది ఆ ఎన్నిక. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది? 1. ఈ ఓటింగ్ గురించి ఎన్నికల సంఘం సూచనలను ప్రతీ బూత్ బయటా స్పష్టంగా ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై ప్రచార వీడియోను వెబ్‌సైట్‌లో పెట్టింది. అందులో ఉన్న సూచనలు, ఓటేసే వారు చేసిన తప్పులూ ఇవే. 2. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అందరు అభ్యర్థలకూ ఓటేయవచ్చు. లేదా ఒకే అభ్యర్థికి ఓటేయవచ్చు. లేదా కొందరికి ఓటేయవచ్చు. కాకపోతే ఎవరికి ఫస్ట్, ఎవరికి సెకండ్, ఎవరికి థర్డ్ అన్నది నిర్ణయించుకుని, వారి పేర్లు ఎదురుగా ఆ నంబర్ వేయాలి. 3. అభ్యర్థులకు ఎదురు గడిలో నంబర్ వేయాలి. అటూ ఇటూ కాకుండా వేస్తే ఓటు చెల్లకుండా పోతుంది. 4. అలాగే ఎంత మందికైనా ఓటేయవచ్చు కానీ... 1, 2, 3.. ఇలా వరుసగా వేయాలి. వరుసగా అంటే బాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లున్న వరుసలో కాదు. మనకు నచ్చిన ప్రాధాన్యతలో వేయాలి. అంతే కానీ మధ్యలో నంబర్లు మిస్ చేయకూడదు. అంటే 1 వేసి 2 లేకుండా 3 వేయకూడదు. లేదా 1 వేయకుండా 2, 3 వేయకూడదు. అలా చేసినా ఆ ఓటు చెల్లదు. 5. హిందూ అరబిక్ అంకెలు లేదా (1,2,3), రోమన్ అంకెలు (I,II,III,IV), లేదా భారతీయ భాషల అంకెలు (తెలుగు అంకెల్లో - ౧,౨,౩,౪) వేయాలి. వన్ టూ త్రీ, ఒకటి రెండు మూడు అని రాయకూడదు. అప్పుడూ ఓటు చెల్లదు. అయితే ఏదో ఒక రకం అంకెలే వాడాలి కానీ ఒక్కోటీ ఒక్కో రకం కలిపి (1,౧, IV - ఇలా) వాడకూడదు. 6. ఒకే వ్యక్తిపై రెండు ఓట్లు (1,1 లేదా 1, 2) వేసినా చెల్లదు. ఒకే నంబర్ ఇద్దరికి వేసినా చెల్లదు. టిక్ మార్కులు, వేలి ముద్రలు, సంతకాలు, ఇతర రాతలు చెల్లవు. 7. ఎన్నికల సంఘం ఇచ్చిన స్కెచ్ పెన్ మాత్రమే వాడాలి. వేరే పెన్, పెన్సిల్ తో ఓటు వేస్తే చెల్లదు. ఇప్పుడు చెల్లని ఓట్లన్నీ వీటిల్లో ఏదో ఒక తప్పు చేసిన వారేనన్నమాట.. విజేత ఎన్నికయ్యేది ఇలా... ఎక్కువ మంది ఓటు వేసిన, అంటే, కనీసం 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికీ నంబర్ వన్ ఓట్లు సగం కంటే ఎక్కువ రాకపోతే అప్పుడు, వారికి వచ్చిన నంబర్ టూ ఓట్లు చూస్తారు. తరువాత నంబర్ 3 ఓట్లు పరిశీలిస్తారు. అలాగే తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ వెళతారు. మొత్తానికి సగం కంటే ఎక్కువ మంది ఆమోదం ఏదో రూపంలో ఉన్న వారికి మాత్రమే ఇక్కడ విజయం దక్కుతుంది. 1. మొత్తం పోల్ అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్టు లెక్క. అంటే వంద ఓట్లు ఉంటే 51 ఓట్లు వచ్చిన వారే గెలుస్తారు. మొదటి ఉదాహరణలో చెప్పినట్టు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా గెలవరు. కచ్చితంగా సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. 2. ప్రతీ ప్రాధాన్యతకూ సమాన విలువ ఉంటుంది. అంటే, మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోతే, అప్పుడు అతి తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థినీ తొలగిస్తూ వెళతారు. అలా తొలగించిన వారి బాలెట్ పేపర్లో ఉన్న రెండో ప్రాధాన్యత ఓట్లు తీసి ఆపైన ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఎన్ని వస్తే వారికి అన్ని కలుపుతారు. 3. అలా సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరో ఒకరికి వచ్చే వరకూ తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కొక్కరినీ తీసివేస్తూ, వారి బాలెట్లలో వారికి కాకుండా మిగిలిన వారికి వచ్చిన ప్రాధాన్యతా ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కులుపుతూ వెళతారు. అలా 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చే వరకూ చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు వచ్చాయి. text: మింక్‌లను ఉన్నితో ఉండే వాటి చర్మం కోసం పెంచుతుంటారు దీంతో అందులో ఉన్న దాదాపు లక్ష మింక్ జంతువులను చంపేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య మే నెలలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఆమె భర్త, ఆయనతోపాటు ఫామ్‌లో పనిచేస్తున్న మరో ఆరుగురికి కూడా వైరస్ సోకింది. దీంతో ఆ ఫామ్‌లో ఉన్న జంతువులను అధికారులు విడిగా ఉంచి, జాగ్రత్తగా పరిశీలించారు. జులై 13న వాటికి పరీక్షలు నిర్వహించగా, దాదాపు 87 శాతం జంతువులు ఇన్ఫెక్షన్‌తో ఉన్నట్లు తేలింది. ఆరోగ్యశాఖ అధికారులు ఆ ఫామ్‌లో ఉంటున్న మొత్తం 92,700 మింక్‌లను చంపేయాలని ఆదేశించారు. ఫామ్ నడుపుతున్న సంస్థకు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నెదర్లాండ్స్‌లోనూ వేల సంఖ్యలో మింక్‌లను చంపేశారు మింక్‌లను ఉన్నితో ఉండే వాటి చర్మం కోసం‌ ఫామ్‌ల్లో పెంచుతుంటారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు 200 కి.మీ.ల దూరంలోని ఓ గ్రామంలో ఈ ఫామ్ ఉంది. స్పెయిన్‌లో కరోనావైరస్ హాట్‌స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో అరగాన్ ప్రావిన్సు కూడా ఒకటి. ఇక్కడ దాదాపు 2.5 లక్షల కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. జంతువుల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించే ప్రమాదాన్ని నివారించేందుకు మింక్‌లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అరగాన్ వ్యవసాయశాఖ మంత్రి జొవాక్విన్ ఒలోనా చెప్పారు. ‘‘జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ వ్యాపిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ, ఫామ్ ఉద్యోగి నుంచి ఈ వైరస్ జంతువులకు సోకి ఉండొచ్చు. లేదా జంతువుల నుంచే ఫామ్ ఉద్యోగులకు వచ్చి ఉండొచ్చు’’ అని ఆయన అన్నారు. పిల్లులు, కుక్కలు సహా కొన్ని రకాల జంతువుల్లోనూ కరోనావైరస్ ప్రబలే అవకాశముందని ఇటీవల కొన్ని అధ్యయనాలు సూచించాయి. మింక్‌ల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించకుండా ఉండేందుకు వాటిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు జంతువుల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించే విషయం గురించి అంతగా స్పష్టత లేదు. దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి. డెన్మార్క్, నెదర్లాండ్స్‌ల్లోని మింక్ ఫామ్‌ల్లో కరోనావైరస్ వ్యాపించిన ఉదంతాలు ఇటీవల వచ్చాయి. గత కొన్ని నెలల్లో నెదర్లాండ్స్‌లో కరోనావైరస్ వ్యాపించినట్లుగా గుర్తించిన ఫామ్‌ల్లో వేల సంఖ్యలో మింక్‌లను చంపేశారు. జంతువుల నుంచి కరోనావైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న కేసులు మే నెలలో రెండు వచ్చాయని నెదర్లాండ్స్ ప్రభుత్వం తెలిపింది. జంతువుల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించినట్లుగా గుర్తించిన కేసులు ఇవే ప్రథమం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. ‘‘మనుషుల నుంచి కరోనావైరస్ మింక్‌లకు సోకిన ఘటనలు ఉన్నాయి. అలాగే మింక్‌ల నుంచి మనుషులకు వైరస్ సోకిన ఉదంతాలూ ఉన్నాయి. వైరస్ వ్యాప్తిలో మింక్‌లు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయన్నదానిపై అధ్యయనం చేస్తున్నాం’’ అని డబ్ల్యూహెచ్ఓ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) స్పెయిన్‌లోని అరగాన్ ప్రావిన్సులో మింక్ అనే జంతువులను పెంచే ఓ ఫామ్‌లో కరోనావైరస్ వ్యాపించింది. text: విక్రాంత్ విమాన వాహక యుద్ధ నౌక భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పూర్తిగా దేశీయంగా తయారుచేసుకుంటున్న విక్రాంత్ క్లాస్ యుద్ధనౌక ప్రస్తుతం సిద్ధమవుతోంది. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందట ప్రారంభమైంది.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధనౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. భారత నావికాదళంలో చేరేందుకు సిద్ధమవుతూ.. కోచి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ విమాన వాహక యుద్ధనౌకను సందర్శించిన బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ కథనం. కోచీ షిప్‌యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న విక్రాంత్ హిందూ మహాసముద్రం... మహాసముద్రాల్లో ప్రపంచంలోనే మూడో అతి పెద్దది. రవాణా, రక్షణపరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం భారత్, చైనా, అమెరికా.. అన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆధిపత్య పోరులో పైచేయి సాధించేందుకు.. రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలిచేందుకు భారత్ సిద్ధం చేస్తున్న బ్రహ్మాస్త్రమే ఈ విక్రాంత్. కేరళలోని కోచి షిప్‌యార్డ్‌లో నిర్మితమవుతున్న ఇది ఇప్పటికే జల ప్రవేశం చేసి భారత సైన్యానికి సేవలందించేందుకు సన్నద్ధమవుతోంది. 37,500 టన్నుల బరువుగల ఈ భారీ నౌకను, పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. దీనిపై 20 యుద్ధవిమానాలను, ఇంకా కొన్ని చిన్న యుద్ధ నౌకలను మోహరించవచ్చు. ఏడు కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల హిందూ మహాసముద్రంలో అడ్డే లేకుండా ముందుకుసాగే సామర్థ్యం దీనిది. యుద్ధనౌకపై నుంచి ఎగురుతున్న విమానం అలాంటి ఈ యుద్ధనౌకను ప్రపంచానికి చూపించే అవకాశం బీబీసీకి లభించింది. ఇక్కడ సుమారు వెయ్యి మంది పని చేస్తున్నారు. వాస్తవానికి.. అనుకున్న సమయానికి దీని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోవడంతో గడువు పొడిగిస్తూ వస్తున్నారు. మరో ఏడాదిలో ట్రయిల్ రన్‌కు సిద్ధం చేస్తామని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. ‘‘ఇది అంత సులభమైన ప్రాజెక్ట్ కాదు. పదేళ్లు కావస్తున్నా నిర్మాణం పూర్తికాలేదు. ఇక ఖర్చు కూడా సుమారు 20,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇదే సమయంలో చైనా సొంత సాంకేతికతతో ఒక యుద్ధనౌకను పూర్తి చేసి సముద్రంలో దించింది. రెండో నౌకను ట్రయిల్ రన్‌కు పంపింద’’ని భారత నావికాదళ వార్‌షిప్ ప్రొడక్షన్ సూపరింటెండెంట్ కమడోర్ సిరిల్ థామస్ చెప్పారు. ‘‘మొదటిసారిగా సొంత యుద్ధనౌకను తయారు చేసేటప్పుడు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే చాలా సమయాన్ని తీసుకున్నాయి. మేం ఇతర దేశాల నుంచి ఎలాంటి సాయం తీసుకోడం లేదు. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. గతంలో ఎన్నడూ యుద్ధనౌకలను నిర్మించని కోచి షిప్ యార్డ్, విక్రాంత్ విషయంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటోంది’’ అని కోచీ షిప్‌యార్డ్ డైరెక్టర్ ఎన్‌వీ సురేశ్ బాబు ‘బీబీసీ’కి తెలిపారు. ఐఎన్ఎస్ విక్రామాదిత్య విక్రాంత్ ఘనతను వివరిస్తూ భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా.. ‘‘ఒక నగరానికి సరిపడా విద్యుత్‌ను ఇది ఉత్పత్తి చేయగలదు. రెండు రన్‌వేలు, 1500 మంది సిబ్బంది.. ఇలా గతంలో ఎన్నడూ లేనన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. రెండో విమానవాహక యుద్ధనౌకకు మరిన్ని ప్రత్యేకతలను అద్దాలని నౌకా దళం భావిస్తోంద’’ని చెప్పారు. దేశీయంగా నిర్మించనున్న రెండో విమానవాహక యుద్ధనౌక విషయమై భారత రక్షణశాఖతో చర్చలు ప్రారంభించామని.. దాన్నీ సంప్రదాయ వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూపొందించనున్నామని చెప్పారాయన. కాగా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ మూడు యుద్ధనౌకలను కలిగి ఉండాలన్న నౌకాదళ కల ఇప్పటికీ నెరవేరలేదు. బడ్జెట్‌లో రక్షణ కేటాయింపులు తగ్గుతున్న నేపథ్యంలో ఇది నెరవేరని ఆశేనని కొందరంటున్నారు. ప్రస్తుతం భారత్‌కున్న ఏకైక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య మాత్రమే. సోవియట్ రష్యా కాలం నాటి దీన్ని మార్పులు చేసుకొని వాడుకుంటున్నాం. విక్రాంత్ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకోగలదు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రక్షణ రంగంలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలిచే సామర్థ్యం గల భారత్.. విమాన వాహక యుద్ధనౌకల విషయంలో మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద ఈ తరహా నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. text: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్ మాలికీ 18 డ్రోన్లు, 7 క్రూయిజ్ మిసైళ్లు ఉత్తర దిశ నుంచి పేల్చారని సౌదీ తాజాగా చెప్పడంతో ఈ దాడులు యెమెన్ భూభాగం నుంచి జరగలేదని సూచించినట్లయింది. ఇంతకుముందు ఈ దాడులు తమ పనేనని యెమెన్‌లోని ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దీన్ని అడ్డంపెట్టుకుని తమపై ఎవరైనా దాడులు చేస్తే తిప్పికొడతామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఈ దాడుల వెనుక ఉన్నది ఇరానే అంటూ అమెరికా ఢంకా బజాయించి చెబుతోంది. బుధవారం సౌదీ అరేబియా వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో దీనిపై మాట్లాడుతూ ఇది ‘యుద్ధానికి కవ్వింపు చర్య’ అన్నారు. వీటిని తిప్పికొట్టడానికి అమెరికా ముందు చాలా మార్గాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా అన్నారు. 'మేం చాలా బలమైన స్థితిలో ఉన్నాం. మా ముందు చిట్టచివరగా ప్రయోగించాల్సిన అస్త్రమూ సిద్ధంగానే ఉంది, దానికంటే ముందు దశలూ ఉన్నాయి. ఏం చేయాలో నిర్ణయిస్తాం' అన్నారాయన. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రదర్శించిన యూఏవీ, మిసైల్ శకలాలు సౌదీ ఏం చెబుతోంది? సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డ్రోన్లు, క్షిపణుల శకలాలను ప్రదర్శించారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్ మాలికీ మాట్లాడుతూ.. ఈ దాడులు ఉత్తరం వైపు నుంచి జరిగాయని చెప్పారు. ఇరానే దీనికి కారణమనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. మాలికీ సమావేశంలో ప్రదర్శించిన శకలాలలో ఇరాన్ మానవ రహిత వైమానిక వాహనానికి (యూఏవీ) చెందిన రెక్క ఒకటి ఉంది. అంతేకాదు... ఈ యూఏవీల్లో ఉన్న కంప్యూటర్లలోని డాటా ఆధారంగా అవి ఇరాన్‌వేనని తేలిందన్నారు. అబ్కాయిక్ చమురు కేంద్రంపై 18 యూఏవీలు, అబ్కాయిక్, ఖురైస్ రెండు క్షేత్రాలపైనా కలిపి 7 క్రూయిజ్ మిసైళ్లు ఇరాన్ వైపు నుంచి ప్రయోగించారని ఆయన ఆరోపించారు. ఖురైస్ చమురు క్షేత్రంపై నాలుగు క్రూయిజ్ మిసైళ్లు పడ్డాయని.. మరో మూడు అబ్కాయిక్ సమీపంలో పడ్డాయని చెప్పారు. ఇవన్నీ ఉత్తర దిశ నుంచి వచ్చాయని మాలికీ తెలిపారు. అబ్కాయిక్‌పై యూఏవీ పడుతున్న దృశ్యాలనూ ఆయన ప్రదర్శించారు. ఎక్కడి నుంచి ప్రయోగించారన్నది కచ్చితంగా నిర్ధారణైన తరువాత ఆ వివరాలూ వెల్లడిస్తామన్నారు. ఈ దాడులు అంతర్జాతీయ సమాజంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించిన ఆయన దీనికి కారణమైనవారికి తగిన శాస్తి జరగాలన్నారు. ఇరాన్ ఏమంటోంది? సౌదీ ఆరోపణలపై ఇంతవరకు ఇరాన్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు. అయితే, ఇరాన్ ఒక దౌత్య ప్రకటన చేసిదంటూ ఆ దేశ వార్తా ఏజెన్సీ ఒకటి ఇంతకుముందు చెప్పింది. దానిప్రకారం.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్య చేపట్టినా అందుకు వెంటనే ప్రతిఫలం అనుభవిస్తారు' అని ఉందంటూ ఆ వార్తాసంస్థ ఇంతకుముందే చెప్పింది. ఇరాన్ అధ్యక్షుడి సలహాదారు ఒకరు ''సౌదీ సమావేశం చూస్తుంటే వారికేమీ తెలియదని తెలిసిపోయింది'' అని అన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి ''సౌదీ తన చమురు కేంద్రాలకు జరిగిన నష్టాన్ని తక్కువగా చూపుతూ శాటిలైట్ చిత్రాలను మార్ఫింగ్ చేసింది'' అని అన్నారు. ఏం జరగబోతోంది? ఈ దాడుల వెనుక ఇరాన్ ఉందని అమెరికా బాహాటంగానే చెబుతున్నప్పటికీ ఈ వ్యవహారంలో అమెరికా వైపు నుంచి సైనిక జోక్యం జరపడానికి ట్రంప్ ఆసక్తిగా లేరు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ''దీన్ని సైనిక సంక్షోభంగా మలచడం చాలా సులభం. కానీ, మధ్యప్రాచ్యంలోని గత అనుభవాలు అలాంటి చర్యలు పరిస్థితులను మరింత జటిలంగా మారుస్తాయని రుజువు చేశాయి'' అన్నారు. సౌదీ ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముందు ట్రంప్ ఓ ప్రకటన చేశారు. అందులో ఆయన తాను ఇరాన్‌పై ఆంక్షలు మరింత పెంచాలని అమెరికా ఖజానా అధికారులకు సూచించినట్లు చెప్పారు. మరో 48 గంటల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయనీ ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలు ఆ దేశ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతూ ఆ దేశాన్ని ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టాయి. ఇంతకీ గొడవేమిటి? సౌదీ ప్రభుత్వ సంస్థ ఆరామ్కో నిర్వహణలోని చమురు కేంద్రం అబ్కాయిక్, ఖురైస్ చమురు క్షేత్రాలపై శనివారం ఉదయం డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడులు జరిగాయి. పొరుగునే ఉన్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీలోని జనసమ్మర్థ ప్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ లాంఛర్లతో వరుస దాడులు చేశారు. హౌతీ తిరుగుబాటుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ దేశాధ్యక్షుడికి సౌదీఅరేబియా మద్దతు ఉంది. దాంతో సౌదీ, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య వివాదం ఉంది. అలాగే, ఇరాన్, సౌదీల మధ్యా ప్రాంతీయ శత్రుత్వం ఉంది. సౌదీకి బలమైన మిత్రుడైన అమెరికా - ఇరాన్‌కు శత్రుత్వం ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాలను పరిమితం చేసేందుకు ఉద్దేశించిన ఓ ఒప్పందం నుంచి బయటకొచ్చేశారు. ఈ ఏడాది తొలినాళ్ల నుంచి ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. గల్ఫ్‌లో జూన్, జులైల్లో రెండు చమురు నౌకలపై జరిగిన దాడుల వెనుకా ఇరాన్ ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అంతకు ముందు మే నెలలో చమురునౌకలపై జరిగిన దాడులూ ఇరాన్ పనేనని అమెరికా ఆరోపిస్తోంది. అయితే, ఇరాన్ ఈ ఆరోపణలన్నీ ఖండిస్తూ వస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమ చమురు కేంద్రాలు, క్షేత్రాలపై దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ అందుకు ఆధారంగా డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల శకలాలను సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ బయట ప్రపంచానికి చూపించింది. text: ప్రభాస్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. తన పాత్ర గురించి ఆయన ఇటీవల ఒక వార్తా పత్రికతో మాట్లాడారు. "ఒక రాక్షస రాజు పాత్ర పోషించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో వినోదం కూడా ఉంటుంది. లక్ష్మణుడు తన చెల్లెలు శూర్ఫణక ముక్కు కోయడం వల్లే రావణుడు ప్రతీకారంతో రాముడితో యుద్ధం చేశాడని, సీతను అపహరించాడని ఆ పాత్రకు తగిన కారణం కూడా ఉంటుంది" అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో సైఫ్‌కు వ్యతిరేకంగా పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఆయన ఈ వ్యాఖ్యలు హిందువులను అవమానించడమేనని చాలా మంది అన్నారు. కొంతమంది ఈ సినిమాను బహిష్కరించాలని కూడా అపీల్ చేయడం ప్రారంభించారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ తన వ్యాఖ్యలపై ఒక ప్రకటన జారీ చేశారు. "ఒక ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని, కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని నాకు తెలిసింది. నాకు అలాంటి ఉద్దేశం ఏమాత్రం లేదు. నేను నిజాయితీగా అందరినీ క్షమించమని కోరుతున్నా. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా" అని చెప్పారు. సైఫ్ ఈ సినిమాను చెడుపై మంచి సాధించిన విజయానికి వేడుకలా వర్ణించారు. "శ్రీరాముడు ఎప్పుడూ నాకు సత్యానికి, శౌర్యానికి ప్రతీకగా నిలిచారు. ఆదిపురుష్ చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే వేడుక గురించి. మహాకావ్యాన్ని ఏ లోపం లేకుండా అందించేందుకు మా మొత్తం టీమ్ కలిసి పనిచేస్తోంది" అన్నారు. ఆదిపురుష్ ఎలాంటి సినిమా? ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాను తెలుగు, హిందీలలో తీయడంతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేయనున్నారు. రామాయణం ఆధారంగా తీస్తున్న ఆదిపురుష్‌కు ఓం రావుత్ డైరెక్టర్. ఆయన 'తానాజీ: ద అన్‌సంగ్ వారియర్' సినిమాకు దర్శకత్వం వహించారు. ఆదిపురుష్ సినిమా ఇంకా మొదలవలేదు. వచ్చే ఏడాది దీని షూటింగ్ ప్రారంభం కానుంది. 2022లో విడుదల అవుతుందని అనుకుంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రభాస్ రాముడుగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రంలో పురాణ పాత్ర రావణాసురుడి గురించి చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. text: ఇక్కడ ఏడు భారతీయ కుటుంబాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది యూనివర్సిటీ ఆఫ్ అలాస్కాలో పని చేస్తున్నారు. వీరంతా గురువారం నాడు ఉత్సాహంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఏడాదీ ఇక్కడి వాళ్లు దీపావళి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. భారతీయులకు ఈ పండుగ ఎంత ముఖ్యమో వీరికి బాగా తెలుసు. కానీ ఎలా జరుపుకొంటారో పెద్దగా అవగాహన లేదు. భారతీయ సంస్కృతితో పాటు ఆహారం, వస్త్రధారణ, యోగా వంటి వాటిని వారు అమితంగా ఇష్ట పడతారు. మైనస్ 60 డిగ్రీల చలిలో.. ఇక్కడి అందమైన నగరం ఫెయిర్‌బ్యాంక్. ఫిబ్రవరిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల దాకా పడిపోతాయి. అయితే దీపావళి ఉత్సాహానికి ఉత్తర ధ్రువంలోని రంగురంగుల అరోరా కాంతులు ఇక్కడి రాత్రులకు మరిన్ని సొబగులు అద్దుతాయి. పగళ్లను మరింత సుందరంగా తీర్చిదిద్దుతాయి. మే నుంచి ఆగస్టు వరకు అక్కడ రోజంతా, అంటే 24 గంటలూ సూర్యుని నులి వెచ్చని కిరణాలు తాకుతూనే ఉంటాయి. అంటే ఈ కాలంలో అసలు రాత్రిళ్లే ఉండవు. ఆగస్టు నుంచి ఈ సమయం మెల్లగా తగ్గుతూ సెప్టెంబరు చివరి నాటికి పగలు (12 గం.), రాత్రి (12 గం.) సమానమవుతాయి. డిసెంబరులో పగటి సమయం 3 గంటలు మాత్రమే. సూర్యుడు ఉదయించిన గంట లేదా గంటన్నరలోనే ఏదో అర్జెంటు పని ఉన్నట్లు వెంటనే అస్తమిస్తాడు. యోగా శిక్షణ కేంద్రం యోగా శిక్షకులను తయారు చేయడానికి ఇక్కడ యోగా అకాడమీ కూడా ఉంది. ఇక్కడ యోగా నేర్చుకున్న వారిలో చాలా మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తుంటారు. రెండేళ్ల క్రితం డేవ్, మెలీసా ఇలాగే పుణెకీ వచ్చారు. ఇప్పటికీ నాటి పర్యటన జ్ఞాపకాలు వారి తలపుల్లో సజీవంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క భారతీయ దుకాణం కూడా లేదు. ఇతర దేశాల్లో ఉండే ఏ భారతీయులనైనా అడిగి చూడండి వీటి అవసరమేమిటో చెబుతారు. అయితే అద్భుతమైన భారతీయ రుచులను ఆస్వాదించేందుకు ఇవేవీ మాకు అడ్డు కావడం లేదని వారంటారు. అలాస్కా యూనివర్సిటీలో వేడుకలు ఫెయిర్‌బ్యాంక్‌లో యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా ప్రాంగణంలో దీపావళి జరుపుకొంటారు. 'నమస్తే ఇండియా' అనే విద్యార్థి సంఘం ఈ ఏర్పాట్లు చూసుకుంటుంది. భారతదేశం నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఉంటారు. ఇంజినీరింగ్, బయాలజీ, ఆర్కిటిక్ రీసెర్చ్, మరైన్ సైన్స్, మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. దాదాపు 350 మంది కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక హాలులో దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో టికెట్ ధర 20 డాలర్లు (సుమారు రూ.1300). ఇందులో కొంత దాతృత్వ పనులకు, మరికొంత అంతర్జాతీయ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకు కేటాయిస్తారు. రుచికరమైన భారతీయ వంటకాలు ఇక్కడి వంటకాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు? చోలే, మటర్ పనీర్, బంగాళదుంప కూర, చికెన్ మఖానీ, పూరి, పులావ్, పకోడి, పప్పు వంటివి ఉంటాయి. అమర్‌ఖండ్, బేసన్ లడ్డు, బర్ఫీ వంటి మిఠాయిలు కూడా. ఇవన్నీ విశ్వవిద్యాలయంలోనే తయారు చేస్తారు. ఉదయం మొదలుపెడితే మధ్యాహ్నానికి వంట పూర్తవుతుంది. హాలును రంగవల్లులు, రంగురంగుల పూలు, దీపాలతో అలంకరిస్తారు. ఇక్కడి వాతావరణం చూస్తే స్వదేశంలో ఉన్నట్లే అనిపిస్తుంది. వినాయక పూజతో కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పెద్దలను ఆహ్వానిస్తారు. ఇక్కడి అమెరికన్లను భారతీయ వస్త్రధారణలో చూడటం అద్భుతమైన విషయం. బాలీవుడ్ వంటి పాటలకు నృత్యాలు చేస్తారు. ఆనందంగా మిఠాయిలు పంచుకుంటారు. చివర్లో చిన్నాపెద్దా కలిసి సందడి చేస్తారు. అందరినీ ఒక చోటకి చేర్చడం.. మన సంస్కృతిని చాటడం.. అందరి జీవితాల్లో వెలుగులు నిండేలా ప్రార్థించడం.. దీపావళి ఇచ్చే సందేశం ఇదే. ‘మాలో జ్ఞాన దీపాలను వెలిగించమని ఆ దేవుడిని వేడుకుంటాం. కాబట్టి భారత్‌కు దూరంగా ఉన్నా పండుగలన్నీ మాతోనే ఉంటాయి. ఆ ఆనందాలు కూడా’ అంటారు వాళ్లు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అలాస్కా.. ఉత్తర అమెరికా సుదూరపు అంచుల్లో ఆర్కిటిక్‌కు సమీపంలో ఉండే రాష్ట్రం. అక్టోబరులో వీచే చల్లని గాలులతో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల వరకు పడిపోతాయి. పరిసరాలు మంచుతో దట్టంగా పేరుకు పోయి మనోహరంగా ఉంటాయి. text: జనరల్ మోటార్స్ సీఈఓగా పనిచేసినప్పుడు దివ్య సూర్య దేవర ఆ కంపెనీకి చెందిన దాదాపు రూ.5.78 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలను చక్కగా నిర్వర్తించారు దివ్య చదివింది కూడా బీకామే. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్‌లో ఆమె చదువుకున్నారు. బీకాం తర్వాత ఎంకాం చదివారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చేరి ఎంబీఏ పట్టా పొందారు. ఆమె ఛార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కూడా. 39 ఏళ్ల దివ్య ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. అమెరికాలో దిగ్గజ కంపెనీల్లో ఒకటైన జనరల్ మోటార్స్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఆమె నియమితురాలయ్యారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆమె ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆమె అదే కంపెనీలో కార్పొరేట్ ఫైనాన్స్ విభాగంలో ఉపాధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదమూడేళ్ల కిందట ఆమె జనరల్ మోటార్స్ కంపెనీలో చేరారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చారు. ‘‘మా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన దివ్య అనుభవం, నాయకత్వం గత కొన్నేళ్లుగా దృఢమైన వ్యాపార ఫలితాలు సాధించిపెట్టాయి’’ అని జనరల్ మోటార్స్ ఛైర్మన్, సీఈఓ మేరీ బర్రా చెప్పారు. 2013 నుంచి 2017 వరకు జనరల్ మోటార్స్ సీఈఓగా పనిచేసినప్పుడు దివ్య సూర్య దేవర ఆ కంపెనీకి చెందిన దాదాపు రూ.5.78 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలను చక్కగా నిర్వర్తించారు. కంపెనీ ఆర్థిక వ్యూహాల్లో ఆమె కీలకంగా వ్యవహరించారు. కంపెనీ ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడిదారులతో సంబంధాలను చక్కబెట్టడంతో పాటు ప్రత్యేక ప్రాజెక్టుల బాధ్యతలను కూడా ఆమె చేపట్టారు. దివ్య భర్త రాజ్ సూర్యదేవర. వీరికి ఒక కుమార్తె ఎందుకంత ప్రత్యేకం? ఫార్చ్యూన్ 500 సీఎఫ్ఓల్లో మహిళలు 64 మంది మాత్రమే (2016 నివేదిక ప్రకారం). అంటే 12.5 శాతం. పైగా, ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ప్రైవేటు కంపెనీల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళల శాతం చాలా తక్కువ. అలాంటిది దివ్య అధికారికంగా సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫార్చ్యూన్ టాప్ 10 కంపెనీల్లో ఒకటైన జనరల్ మోటార్స్‌లో తొలి రెండు అత్యున్నత స్థానాల్లోనూ.. (చైర్మన్, సీఈఓ మేరీ బర్రా, సీఎఫ్ఓగా దివ్య) మహిళలే ఉంటారు. ఈ కంపెనీలో తొలి ఛైర్మన్, సీఈఓ మేరీ బర్రా కాగా, తొలి సీఎఫ్ఓ దివ్య సూర్యదేవర కానున్నారు. దివ్య సూర్యదేవర గురించి మరికొంత.. దివ్య చిన్నతనంలోనే ఆమె తండ్రి చనిపోయారు. విద్యా రుణాల సహాయంతోనే ఆమె చాలావరకు చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనే జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షురాలి హోదా చేపట్టారు. ఆమె భర్త రాజ్ సూర్యదేవర. వీరికి ఒక కుమార్తె. దివ్య కుటుంబం న్యూయార్క్‌లో నివసిస్తుంది. ఆమె మాత్రం డెట్రాయిట్‌‌లో పనిచేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబంతో గడుపుతున్నారు. జనరల్ మోటార్స్‌కు ముందు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్‌, యూబీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేశారు. 22 ఏళ్ల వయస్సులో ఎంబీఏ చదివేందుకు ఆమె తొలిసారి అమెరికా వెళ్లారు. 2002లో ప్రపంచ బ్యాంకు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు దివ్య ఎంపికయ్యారు. 'నువ్వు కోరుకునేది ఏదైనా సరే.. దాన్ని సాధించాలంటే నువ్వు చాలా కష్టపడి పనిచేయాలి' ‘‘అమ్మ పెంపకం.. ఆమె విశ్వాసం వల్లే’’ ‘‘నా బాల్యం చాలా వరకు చెన్నైలోనే గడిచింది. చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. ముగ్గురు కూతుళ్లను పెంచే భారం మా అమ్మపైనే పడింది. అయినప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకూడదని, ముఖ్యంగా చదువు విషయంలో ఎలాంటి అవరోధాలూ ఉండకూడదని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆమె మాపై చాలా విశ్వాసం ఉంచేది. ఆ అంచనాల వల్లనే మేం అత్యుత్తమంగా పనిచేయటం నేర్చుకున్నాం. ఏదీ అంత సులభంగా లభించదని కూడా ఆమె ద్వారానే మాకు అర్థమైంది. నువ్వు కోరుకునేది ఏదైనా సరే.. దాని సాధించాలంటే నువ్వు చాలా కష్టపడి పనిచేయాలి’’ అని రియల్ సింపుల్ మేగజీన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దివ్య సూర్యదేవర చెప్పారు. తనను సవాల్ చేసే, సంక్లిష్టమైన పనులను తాను ఇష్టపడేదానినని ఆమె తెలిపారు. అమెరికాలో చదువుకునేప్పుడు దివ్య వద్ద సరిపడినంత డబ్బు ఉండేది కాదు. దీంతో స్నేహితులే ఆమెను తమతో పాటు విహార యాత్రలకు తీసుకెళ్లేవారు. ‘(చదువు పూర్తయ్యే వరకు) నా జీవితమంతా అప్పుల్లోనే గడిచింది’ అని ఆమె అంటారు. ‘విద్యా రుణాల సహాయంతోనే నేను చదువుకున్నాను. ఒకవైపు ఆ రుణాలు తీర్చాలి. మరోవైపు ఉద్యోగం వెతుక్కోవాలి. అలాంటి ఒత్తిళ్ల మధ్యే నేను యూబీఎస్‌లో చేరాను’ అని చెప్పారు. అలాంటి ఒత్తిళ్ల నుంచి వచ్చిన ఆమె తదనంతర కాలంలో రూ.లక్షల కోట్ల విలువైన కంపెనీ ఆర్థిక కలాపాలను చూసే కీలక వ్యక్తిగా ఎదగడం స్ఫూర్తిదాయకం. 'ఎవరికో ఏదో ఒక విధానం బాగుందని మీరు కూడా దాన్నే అనుకరించవద్దు. మీకు సరిపోయేలాగా పనుల్ని సమన్వయం చేసుకోండి' ఖాళీ సమయం కూతురితోనే.. తను కూడా ‘అమ్మలాగే’ దివ్య కుటుంబంతో గడిపేది వారాంతాలు, సెలవు రోజుల్లోనే. ఖాళీ సమయం దొరికితే తన కూతురితోనే గడుపుతానని ఆమె అంటారు. అదే తనకు ముఖ్యమని చెబుతారు. ‘‘అమ్మ ఏం చేస్తే నేనూ అదే చేస్తా’’ అని తన కూతురు అంటుంటుందని తెలిపారు. ఇలా.. ఒకవైపు కుటుంబం, మరోవైపు కార్యాలయ పనులను సమన్వయం చేసుకోవటం.. ఏది ముఖ్యమో తెలుసుకుని, దానికి ప్రాధాన్యత ఇవ్వటమే కీలకమని అంటారు. అయితే, ఈ క్రమంలో.. ‘ఎవరికో ఏదో ఒక విధానం బాగుందని మీరు కూడా దాన్నే అనుకరించవద్దు. మీకు సరిపోయేలాగా పనుల్ని సమన్వయం చేసుకోండి’ అని ఆమె సూచించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీకాం, ఎంకాం చదివితే ఏమవ్వొచ్చు? మన కష్టానికి అదృష్టం కూడా తోడైతే మరో దివ్య సూర్యదేవర కావొచ్చు!! text: తొలుత మ‌ర్క‌జ్‌కి వెళ్లి వ‌చ్చిన వారి ద్వారా ఈ వైర‌స్ వ్యాప్తి చెంద‌గా ఇప్పుడు లోక‌ల్ కాంటాక్టులు కూడా న‌మోద‌వుతున్నాయి. దాంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చెబుతున్నారు. క‌ర్నూలు ఎంపీ ఇంట్లో ఆరుగురు క‌ర్నూలు జిల్లాలో ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వైర‌స్ బారిన ప‌డుతుండ‌డం విశేషంగా మారుతోంది. ఇప్ప‌టికే న‌గ‌రంలో ప్ర‌ముఖ వైద్యుడు క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోవ‌డం అంద‌రినీ విషాదంలో ముంచింది. తాజాగా క‌ర్నూలు ఎంపీ డాక్ట‌ర్ కే సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధార‌ణైంది. ఈ విష‌యం రెండు రోజులుగా ప్ర‌చారంలో ఉంది. కాగా ఎంపీ నేరుగా మీడియా ముందుకు వ‌చ్చి ఈ ప్ర‌చారం వాస్త‌వ‌మేన‌ని ప్ర‌క‌టించారు డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ ఈ ప‌రిణామాలపై ‘బీబీసీ’తో మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో ఆరుగురుకి పాజిటివ్ వ‌చ్చింద’’ని స్పష్టం చేశారు. ‘‘మా తండ్రి, నా ఇద్ద‌రు సోద‌రులు.. ఆ ఇద్దరి భార్యలు, ఒక సోదరుడికి కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. అంద‌రి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. ఎలాంటి స‌మస్య‌లు లేవు. వారంతా క‌ర్నూలు కోవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ ఆస్ప‌త్రిలో అన్ని స‌దుపాయాలున్నాయి. య‌ధావిధిగా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐసోలేష‌న్ పూర్తి చేస్తారు. మేము కూడా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నాం. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. వైర‌స్ ఎలా సోకిందనేది ఇంకా నిర్ధర‌ణ కాలేదు. అన్నింటినీ ప‌రిశీలిస్తున్నాం’’ అని తెలిపారు. ‘వైరస్ వ్యాప్తి తగ్గించడానికి లాక్‌డౌన్ దోహదపడుతుంది’ మిగిలిన దేశాల‌తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌క్కువ‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించ‌డానికి, వ్యాప్తిని త‌గ్గించ‌డానికే లాక్‌డౌన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఎక్కువ కేసులు రావ‌డం ప‌ట్ల ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని, ఇమ్యూనిటీ పెంచుకోవ‌డం ద్వారా కరోనాను ఎదుర్కోవ‌చ్చ‌ని తెలిపారు. యూరప్ దేశాలు, అమెరికా లాంటి ప‌రిస్థితి మ‌న దేశంలో రాద‌ని ఒక డాక్ట‌ర్ గా స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌న‌ని ఆయ‌న అంటున్నారు. కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ నిల‌క‌డ‌గా ఉంది.. ఆందోళ‌న అవ‌స‌రం లేదు. క‌ర్నూలు జిల్లాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప‌ట్ల ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ వీర పాండియ‌న్ అన్నారు. తాజా ప‌రిస్థితిపై ఆయ‌న బీబీసీతో మాట్లాడారు. ‘జిల్లాలో ప్ర‌స్తుతం 279 కేసులున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త నాలుగు పాజిటివ్ కేసులు మాత్ర‌మే వ‌చ్చాయి. 24 మంది ఐసోలేష‌న్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు సార్లు నెగిటివ్ రావ‌డంతో వారిని ఇంటికి పంపించాము. జిల్లాలో ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. అవ‌స‌ర‌మైన మేర‌కు సిబ్బంది , స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కేసులు కూడా త్వ‌ర‌లో త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద’’ని చెప్పారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏపీలో క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందులో క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. text: కరోనావైరస్‌ను నియంత్రించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు తీసుకోవడంలో యురోపియన్ యూనియన్ విఫలమైందని ట్రంప్ చెప్పారు విజృంభిస్తున్న కరోనావైరస్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఈ తాజా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన టీవీలో ప్రసంగిస్తూ.. యూరప్ నుంచి అమెరికాకు 30 రోజుల పాటు ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు వివరించారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్‌లోని 26 దేశాలు ప్రకటించాయి. తమతో సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం తగదని ఆక్షేపించాయి. కోవిడ్-19 ఓ ప్రపంచవ్యాప్త సంక్షోభం అని ఈయూ కమనిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లీయెన్, చార్లెస్ మైకేల్ తెలిపారు. దీన్ని అడ్డుకోవడానికి ఏకపక్ష చర్యలు కాదు, సహకారం కావాలి అని వారన్నారు. ఈ నియంత్రణలు చాలా కఠినమే అయినప్పటికీ, తప్పనిసరి అని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ప్రయాణాల రద్దు ఆదేశాలు బ్రిటన్‌కు వర్తించబోవని వెల్లడించారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ 460 కరోనావైరస్ (కోవిడ్-19) కేసులు నమోదయ్యాయి. ఈయూ దేశాల అధ్యక్షులకు వివరించి, నిర్ణయం తీసుకునేంత సమయం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇప్పటి వరకూ 1135 కేసులు నమోదు కాగా, ఈ వైరస్ సోకిన వారిలో 38 మంది మరణించారు. ‘‘మన దేశంలోకి మరిన్ని కొత్త కేసులు ప్రవేశించకుండా, రాబోయే 30 రోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేస్తున్నాం’’ అని ట్రంప్ చెప్పారు. ‘‘ఈ కొత్త నిబంధనలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి’’ అని ఆయన తెలిపారు. కాగా, అమెరికా ఆర్థిక రంగంపై కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పన్ను ఉపశమన చర్యలు తీసుకునేందుకు వీలుగా చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ను ట్రంప్ కోరారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? అమెరికాలోని సామాన్య ప్రజలకు కరోనావైరస్ సోకే ప్రమాదం తక్కువ అని అధికారులు చెప్పారు. అయితే, ఈ నెలలో నమోదైన కొత్త కేసుల్ని బట్టి చూస్తే మాత్రం ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. న్యూ రోకెల్లె, న్యూయార్క్ నగరాల నుంచే ఈ వైరస్ మొదలైందని భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. తమంతటతాముగా గృహ దిగ్బంధనంలో ఉన్న వారికి నేషనల్ గార్డ్ సిబ్బంది ఆహారాన్ని సరఫరా చేయనున్నారు. భారీగా ప్రజలు గుమికూడటాన్ని రద్దు చేస్తున్నట్లు వాషింగ్టన్ గవర్నర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి 38 మంది చనిపోగా.. అందులో ఈ ఒక్క రాష్ట్రానికి చెందినవారే 24 మంది ఉన్నారు. జాతీయ అలర్జీ, అంటు రోగాల సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంతోనీ ఫాకీ అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం గురించి కాంగ్రెస్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇది ఇంకా ముదురుతోంది’’ అని చెప్పారు. ఇప్పటికే వ్యాధి సోకిన వారికి నయం చేయడం, వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోగలగడంపైనే ఇదంతా ఆధారపడి ఉందని వెల్లడించారు. అమెరికాలో డాక్టర్ వద్దకు వెళ్లి వైద్యం పొందేందుకు చాలా డబ్బు ఖర్చవుతుంది. దీంతో ప్రజలు వైద్య సేవలు పొందేందుకు వెనకడుగువేస్తున్నారు. ఈ అధిక వ్యయం కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. వైరస్ సోకినవారికి పెయిడ్ సిక్ లీవ్ (అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు జీతం చెల్లిస్తూనే సెలవు తీసుకునే వెసులుబాటు) లేకపోవడం, అవసరమైన పరీక్షలు అందుబాటులో లేవనే భయాలు కూడా ఇతర కారణాలు. ‘‘ఏ అమెరికన్ అయినా పరీక్ష చేయించుకోవచ్చు, దానికి అడ్డేమీ లేదు, అయితే డాక్టర్ నుంచి ఆదేశాలు ఉండాలి’’ అని ప్రస్తుత సంక్షోభాన్ని నివారించే టాస్క్‌ ఫోర్స్‌కి ఇన్‌ఛార్జిగా ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. రోగులపై ఈ చార్జీల భారం పడకుండా చూస్తామని వైద్య బీమా కంపెనీలు హామీ ఇచ్చాయని తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) యూరప్‌లో ఒక్క బ్రిటన్ మినహా మిగతా అన్ని దేశాల నుంచి అమెరికాకు రాకపోకల్ని 30 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. text: సరైన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్-19 మృతులకు అంత్యక్రియలు నిర్వహించవచ్చు. ఆ దృశ్యాలు మరణం గురించి మాత్రమే కాదు.. మృతుల గురించి కూడా భయాలను రాజేస్తున్నాయి. వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచి కూడా వైరస్ సోకుతుందన్న భయాలు అవి. కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి మృతదేహాల నుంచి వైరస్ సంక్రమిస్తుందా? అంత్యక్రియలు నిర్వహించటం సురక్షితమేనా? వైరస్ మృతులను ఖననం చేయాలా? దహనం చేయాలా? మృతదేహాల నుంచి కోవిడ్-19 వ్యాపిస్తుందా? కోవిడ్-19 మృతదేహాల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందనే భయం అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ ప్రధానంగా మనుషుల ఉమ్మి, తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అయితే.. ఈ వైరస్ కొన్ని రకాల ఉపరితలాల మీద కొన్ని రోజుల వరకూ సజీవంగా ఉండగలదు. ‘‘ఇప్పటివరకూ అయితే మృతదేహాల నుంచి సజీవంగా ఉన్నవారికి వైరస్ సంక్రమిస్తున్నట్లు ఆధారాలేమీ లేవు’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పాన్-అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి విలియం అడుక్రో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇస్తాంబుల్‌లో అనుమానిత కోవిడ్-19 మృతుడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం. మృతదేహాల్లో వైరస్ బతకగలదా? ‘‘మృతదేహాల నుంచి వైరస్ సోకపోయినప్పటికీ.. మనం వైరస్ వ్యాప్తి నిరోధక, నియంత్రణ చర్యలను పాటించాల్సి ఉంటుంది. మృతులు మనకు ఎంతటి ఆత్మీయులైనా వారి మృతదేహాలను ముద్దాడటం వంటివి చేయకూడదు’’ అని ఆయన పేర్కొన్నారు. రక్తస్రావ కలిగించే ఎబోలా, మార్బర్గ్ వంటి జ్వరాలు, కలరా కేసుల్లో మినహా మృతదేహాల నుంచి సాధారణంగా ఇన్‌ఫెక్షన్ సంక్రమించదని డబ్ల్యూహెచ్ఓ మార్చిలో విడుదల చేసిన సిఫారసులు చెప్తున్నాయి. ‘‘మహమ్మారి ఇన్‌ఫ్లుయెంజా రోగుల ఊపిరితిత్తుల విషయంలో శవపరీక్ష సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే.. ఆ ఊపిరితిత్తుల నుంచి మాత్రమే ఇన్‌ఫెక్షన్ సోకగలదు. లేనిపక్షంలో మృతదేహాల నుంచి ఇన్‌ఫెక్షన్ అంటదు’’ అని వివరించాయి. కానీ.. తీవ్ర శ్వాస వ్యాధులతో చనిపోయిన వారి ఊపిరితిత్తులు, ఇతర శరీర అవయావాల్లో సజీవ వైరస్‌లు ఇంకా ఉండగలవు. శవపరీక్ష ప్రక్రియల్లో ఇవి బయటకు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్-19 మృతుల బందువులు, స్నేహితులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత శిక్షణ, రక్షణ ఉన్న వృత్తినిపుణులు కోవిడ్-19 బాధితుల మృతదేహాలన అంత్యక్రియలకు సిద్ధం చేసేలా చూసుకోవాలి. ఈక్వెడార్‌లో మార్చురీలలో ఖాళీ లేక రోడ్లపైనే మృతదేహాలను వదిలేస్తున్నారు. అంత్యక్రియలను నిర్వహించవచ్చా? కొన్ని ప్రాంతాల్లో కోవిడ్-19 మృతుల సంఖ్య విపరీతంగా ఉండటంతో అంత్యక్రియల విషయంలో సంక్షోభం తలెత్తింది. సామాజిక దూరం మార్గదర్శకాలను అనుసరించటం కోసం పలు దేశాల్లో అంత్యక్రియల నిర్వహణను నిషేధించారు. ఇతర దేశాల్లో చాలా పరిమితమైన హాజరుతో అనుమతిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కొన్ని ఆంక్షలను పాటిస్తూ కోవిడ్ మృతుల భౌతికకాయాలను సందర్శించవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. ‘‘మృతదేహాన్ని తాకటం కానీ ముద్దాడటం కానీ చేయకూడదు. మృతదేహాన్ని సందర్శించిన తర్వాత తమ చేతులను సోపు, నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఒకరికొకరు కనీసం ఒక మీటరు దూరంలో ఉండాలన్న భౌతిక దూరం ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలి’’ అని ఆ మార్గదర్శకాలు చెప్తున్నాయి. శ్వాస సంబంధిత సమస్యల లక్షణాలు ఉన్న వారు ఈ అంత్యక్రియలకు హాజరుకాకూడదు. ఒకవేళ హాజరవ్వాల్సివస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి కనీసం ఫేస్ మాస్క్ ధరించాలని సూచించింది. అలాగే పిల్లలు, 60 ఏల్లు దాటిన పెద్దవాళ్లు, ఇతరత్రా అనారోగ్యాలతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.. మృతదేహాన్ని నేరుగా తాకకూడదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అంత్యక్రియలపై అనేక ఆంక్షలు విధించారు. మృతదేహాలను సమాధి చేయాలా, దహనం చేయాలా? సమాధి చేయటం, దహనం చేయటం రెండూ చేయవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. ‘‘ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధుల వల్ల చనిపోయిన వారిని దహనమే చేయాలనే భావన జనంలో ఉంది. కానీ అది నిజం కాదు. అంతిమ సంస్కారాలు సంస్కృతికి సంబంధించిన విషయం. వనరుల అందుబాటుకు సంబంధించిన విషయం’’ అని వివరించింది. మృతదేహాలను సమాధి చేయటం లేదా చితిమీదకు చేర్చటం వంటి పనులు చేసేవారు గ్లవ్స్ ధరించాలి, అనంతరం ఆ గ్లవ్స్‌ను తొలగించి పారవేశాక చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మృతదేహాన్ని మోసుకెళ్లే వ్యక్తులు కూడా ప్రొటెక్టివ్ సూట్, ఇతర రక్షణ సామగ్రి ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కోవిడ్-19 మృతుల శరీరాలను హడావుడిగా ఖననం చేయాల్సిన అవసరం లేదని కూడా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మృతులకు చెందిన వస్తువులను కూడా దగ్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని గ్లవ్స్ ధరించి తాకాలని, డిటర్జెంట్‌తో కానీ 70 శాతం ఇథనాల్ ద్రావణంతో కానీ, బ్లీచ్‌తో కానీ పూర్తిగా ప్రక్షాళన చేయాలి. మృతుల దుస్తులను మెషీన్‌లో డిటర్జెంట్‌తో 60 నుంచి 90 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతకవచ్చు. లేదంటే పెద్ద డ్రమ్ములో వేడి నీళ్లు, సోపులో నానబెట్టి కర్రతో తిప్పుతూ ఉతకవచ్చు. బ్రెజిల్‌లో మరణాలు పెరగడంతో సామూహిక ఖననాలు చేస్తున్నారు. గౌరవాన్ని కాపాడాలి... ఈ ప్రక్రియలో ‘‘మృతుల మర్యాదను, వారి సంస్కృతి, సంప్రదాయాలను, వారి కుటుంబాల గౌరవాన్ని కాపాడాలి’’ అని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. కానీ మహమ్మారి కారణంగా తీవ్ర భయాందోళనలు వ్యాపిస్తుండటంతో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ పాటించటం కష్టంగా మారాయి. కోవిడ్ మృతుల సంఖ్య ఈక్వెడార్‌లోని గేయాస్ ప్రావిన్స్‌లో కేవలం కొన్ని వారాల్లోనే 10,000 దాటిపోవటంతో ఇక్కడ ‘‘పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది’’ అని ఈక్వెడార్ అసోసియేషన్ ఆఫ్ ఫ్యునరల్ సర్వీసెస్ అధిపతి మెర్విన్ టెరాన్ బీబీసీ ముండోతో చెప్పారు. లాటిన్ అమెరికాలో బ్రెజిల్ తర్వాత కోవిడ్-19 ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న దేశం ఈక్వెడార్. పరిస్థితులు చేయిదాటి పోవటంతో ఆరోగ్య వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కోలేకపోయింది. మార్చురీలు నిండిపోవటంతో శవపేటికలు, మృతదేహాలను రోజుల తరబడి వీధుల్లోనే వదిలేశారు. మృతదేహాల్లో కూడా వైరస్ ఉండే ప్రమాదం ఉంది, అందువల్ల అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. మృతదేహాలను భద్రపరచటానికి అవసరమైన ఎయిర్‌ కండిషనింగ్ కానీ, తగిన సదుపాయాలు కానీ లేనీ గిడ్డంగులకు శవాలను తరలిస్తున్నారు. ‘‘చావు వాస్తవికతను చూడటం అలవాటైన మాకే.. ఒక మృతదేహాన్ని గుర్తించటానికి ఆ గిడ్డంగులకు వెళ్లటం చాలా కష్టంగా మారింది. 24 గంటల తర్వాత ఆ మృతదేహాలకు నీరు చేరి పాడవుతున్నాయి’’ అని టెరాన్ చెప్పారు. అమెరికా లోని న్యూయార్క్‌లో, బ్రెజిల్‌ లోని మానస్‌లో, టర్కీలోని ఇస్తాంబుల్‌లో సామూహిక సమాధుల ఫొటోలు పతాక శీర్షికలకు ఎక్కాయి. కానీ.. ఈ కరోనావైరస్ కాలంలో మృతులకు గౌరవప్రదమైన తుదివీడ్కోలు ఇవ్వటానికి కఠోరమైన మరణ వాస్తవికత అడ్డుపడకూడదని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ‘‘అధికారులు ఒక్కో కేసు ప్రాతిపదికగా పరిస్థితిని పర్యవేక్షించాలి. కుటుంబానికి గల హక్కులకు, మరణానికి కారణాన్ని శోధించాల్సిన అవసరం, ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదాల మధ్య సంతులనం సాధించాలి’’ అని ఆ సంస్థ పేర్కొంది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మృతులకు సంబంధించి విషాదకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారి కోసం విలపించే ఆత్మీయులు ఎవరూ వారి మృతదేహాల సమీపంలో కనిపించటం లేదు. text: అంటార్కిటికాలోని వెడ్డెల్ సముద్రంపై తేలియాడుతున్న ఈ దీర్ఘచతురస్రాకార మంచు శకలాన్ని నాసా గుర్తించింది. ఉపరితలం చదునుగా ఉండి, పదునైన మొనలు లేదా అంచులు కలిగివున్న ఈ ఐస్‌బర్గ్.. ఈ మధ్యనే మరో పెద్ద మంచు కొండ నుంచి విరిగిపోయినట్లుగా తెలుస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. సముద్రపు అలల దాటికి మొద్దుబారక, దీని మొనలు ఇంకా పదునుగానే ఉన్నాయి. ఈ ఫోటోను గత వారం నాసా రీసర్చ్ ప్లేన్ చిత్రీకరించింది. ఇలాంటి ఐస్‌బర్గ్‌లు కొత్తవేం కాదు. వీటిని ట్యాబ్యులార్ ఐస్‌బర్గ్‌ అని అంటారు. పొడవుగా, చదునుగా ఉండే ఈ ట్యాబ్యులార్ ఐస్‌బర్గ్‌లు పెద్ద పెద్ద ఐస్ షెల్ఫ్‌ చివర్ల నుంచి విడిపోయి, ఇలా కనిపిస్తాయి. మనకు గోర్లు పెరిగి, పొడవుగా అయ్యాక వాటి చివర్లు ఏవిధంగా విరిగిపోతాయో అలానే ఇలాంటి శకలాలు కూడా విరిగిపోతాయని నాసా, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్త కెల్లీ బ్రంట్ వివరించారు. ''ఇవి గణిత శాస్త్రంలో వివరించే చతురస్రం, దీర్ఘచతురస్రం.. ఇలాంటి ఆకారాల్లో ఉండటమే వింతగా అనిపిస్తుంది'' అని కెల్లీ బ్రంట్ అన్నారు. ప్రస్తుతం నాసా విడుదల చేసిన ఫోటోలోని ఐస్‌బర్గ్.. ఆర్కిటిక్ ప్రాంతంలోని 'లార్సెన్-సి' అనే ఐస్ షెల్ఫ్ నుంచి వచ్చింది. ఫోటోలో చూసి, ఈ మంచు శకలం ఎంతపెద్దదో చెప్పడం కష్టమే. కానీ దీని కొలతలు అటు నుంచి ఇటువైపుకు 1.6 కి.మీ.కు మించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐస్‌బర్గ్ ఎలా ఉంటుంది? అనగానే ఓ మంచు కొండ ఠక్కున కళ్ల ముందు మెదులుతోందా? కానీ కొండలా నిటారుగా కాకుండా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఓ మంచు శకలం ఫోటోను నాసా విడుదల చేసింది. text: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ)కి చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్ ఈ నీటి జాడను కనుగొంది. గతంలో జరిగిన పరిశోధనలు అంగారకుడిపై కొన్ని ‘తడి ప్రాంతాల’ను గుర్తించాయి. కానీ ద్రవరూపంలో, నీరు ఓ సరస్సులా ఏర్పడిన ప్రాంతాన్ని కనుగొనడం ఇదే ప్రథమం. గతంలో నాసా రోవర్ చిత్రించిన ఫోటోల్లో కూడా అంగారకుడిపై నీటి జాడ కనిపించింది. అంగారకుడిపై వాతావరణం చల్లగా ఉండడంతో.. నీటి ఉపరితలం ఘనీభవించింది. ఆ మంచు పొరల కింద నీరు ద్రవ రూపంలో ఉంది. ఇలాంటి నీటి జాడ కోసం చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఆ పరిశోధనలన్నీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. తాజా ఆవిష్కరణ.. ఇతర గ్రహాలపై జీవం గురించి సాగుతున్న అధ్యయనాలకు మరింత తోడ్పాటునిస్తుంది. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఇటాలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్‌ ప్రొఫెసర్ రోబర్టో ఓరోసే మాట్లాడుతూ.. ''ఇది ద్రవ రూపంలో ఉన్న నీటి సరస్సు అని తేలింది. అయితే ఇది మరీ అంత పెద్ద సరస్సు కాకపోవచ్చు'' అన్నారు. ఎలా కనుగొన్నారు? అంగారకుడి ఉపరితలం పైకి, లోపలి పొరలలోకి మార్సిస్ రాడార్ కొన్ని తరంగాలు/సంకేతాలను పంపింది. ఉపరితలాన్ని తాకి తిరిగి వెనక్కు వచ్చే తరంగాలను మార్సిస్ విశ్లేషిస్తుంది. ఆ విశ్లేషణల్లో భాగంగా కనిపించిన తెల్లటి మచ్చలు అంగారకుడి దక్షిణ ధృవాన్ని సూచించాయి. అక్కడే.. నీరు, మంచు, దుమ్ము కలగలసిన ప్రాంతం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మంచు పొరలకు 1.5 కి.మీ. కింద ఏదో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ''ఆ ప్రాంతం లోతులకు వెళ్లి వెనక్కు వచ్చిన తరంగాలు, సాధారణంగా అంగారకుడి ఉపరితలాన్ని తాకి వచ్చిన తరంగాల కంటే బలంగా ఉన్నాయి. అక్కడే.. నీటి జాడ ఉన్నట్లు కనుగొన్నాం'' అని ప్రొఫెసర్ ఓరోసే అన్నారు. అంగారకుడిపై జీవం ఉన్నట్లేనా? ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం! ''అంగారకుడి ఉపరితలం.. జీవం ఉండటానికి అనువైన ప్రాంతం కాదన్న విషయం మనకు తెలుసు. కానీ.. తాజా అధ్యయనంతో, అంగారకుడి లోపలి పొరల్లో జీవం ఉందా? అనే విషయంపై పరిశోధనలు జరగాల్సి ఉంది'' అని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డా.మనీష్ పటేల్ అన్నారు. ''అంగారకుడి లోపలి పొరల్లో మనకు హాని కలిగించే రేడియేషన్ నుంచి రక్షణ లభిస్తుంది. వాతావరణంలో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు మనకు తగినంత మోతాదులో ఉంటాయి. అన్నిటికీ మించి, ఈ ప్రాంతం.. జీవం మనుగడకు అవసరమయ్యే నీరు ఇక్కడ కనిపించింది.'' ఆస్ట్రోబయాలజీలో నీటి కోసం అన్వేషించడం కీలకాంశం. భూమి వెలుపల జీవం మనుగడ కోసం సాగే అధ్యయనం ఇది. ''అంగారకుడిపై జీవం కోసం సాగుతున్న మా అన్వేషణ ఇంకా పూర్తవ్వలేదు. అయితే.. అంగారకుడిపై ఏ ప్రాంతంలో పరిశోధనలు చేయాలో తాజా అధ్యయనం వివరించింది. ఈ ప్రాంతం.. మా పరిశోధనలకు ఓ భాండాగారం లాంటిది.’’ అని మనేష్ పటేల్ అన్నారు. పరిశోధనల్లో బయటపడ్డ ఆ నీటి ఉష్టోగ్రత, దాని గుణం జీవరాశికి అణుగుణంగా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అంగారకుడిపై ఉన్న చల్లటి వాతావరణంలో నీరు ద్రవ రూపంలో ఉండాలంటే (పరిశోధకుల అంచనా ప్రకారం -10 నుంచి -30 సెల్సియస్) అందులో చాలా రకాల లవణాలు ఉండాలి. ''అలాంటి వాతావరణంలో నీరు చాలా చల్లగా, కటిక ఉప్పుగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలోని నీరు జీవం ఉద్భవం, మనుగడకు పెనుసవాలే!'' అని ఇంగ్లండ్‌కు చెందిన డా. క్లైర్ కజిన్స్ అన్నారు. తర్వాత ఏమిటి? తాజా ఆవిష్కరణ ద్వారా.. అంగారకుడిపై జీవం ఉండేదా? భవిష్యత్తులో ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? అన్నిటికన్నా ముందు ఆ సరస్సులోని నీటి స్వభావంపై లోతైన పరిశోధనలు జరగాలి. ''అంగారకుడిపై ఇలాంటి ప్రాంతాల కోసం ఇంకా గాలించాలి. ఇప్పుడు బయటపడిన నీటి సరస్సు.. అంగారకుడిపై జరుగుతున్న అధ్యయనాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటార్కిటికా లోపలి పొరల్లోని నీటిపై జరిగిన పరిశోధనల్లాగే.. అంగారకుడి లోపలి పొరల్లో ఉన్న నీటి సరస్సులపై కూడా పరిశోధనలు జరగాలి'' అని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డా.మ్యాట్ బాల్మ్ అన్నారు. ''అంగారకుడి లోపలి పొరల్లో దాగున్న నీటిని పరీక్షించడం అంత సులువు కాదు. ఈ ప్రాజెక్టులో.. మంచు పొరలను 1.5 కి.మీ. లోతుకు తవ్వగలిగే రోబోలు అవసరం అవుతాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పని చేయలేం. టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందాలి'' అని మ్యాట్ బాల్మ్ అన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అంగారక గ్రహంపై ఓ నీటి సరస్సును పరిశోధకులు గుర్తించారు. అంగారకుడి దక్షిణ ధృవంలోని మంచు పొరల కింద, ఈ సరస్సు ఉంది. ఇది 20కి.మీ. మేర విస్తరించినట్లు భావిస్తున్నారు. text: "సౌదీ అరేబియా నాజరాన్ పట్టణం దగ్గర సౌదీ అరేబియా సైన్యంలోని మూడు బ్రిగేడ్లు మాకు లొంగిపోయాయి" అని హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి బీబీసీకి చెప్పారు. "పట్టుబడ్డ సైనికుల సంఖ్య వేలల్లో ఉంది. హౌతీ తిరుగుబాటుదారుల మూడు రోజుల ఆపరేషన్‌లో సౌదీ అరేబియా సంకీర్ణ సైన్యంలోని చాలా మంది సైనికులు మరణించారు" అని ఆయన చెప్పారు. హౌతీ తిరుగుబాటుదారుల వాదనను సౌదీ అరేబియా అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. టీవీలో పెరేడ్ చేయిస్తాం హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి కల్నల్ యాహియా సారియా బీబీసీతో "యెమెన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ మా అతిపెద్ద ఆపరేషన్ ఇదే" అన్నారు. "సౌదీ సైన్యం లొంగిపోయింది. ఆయుధాలు, యంత్రాలు కోల్పోవడంతోపాటు వారికి భారీ ప్రాణనష్టం జరిగింది. మాకు పట్టుబడిన సైనికులతో ఆదివారం హౌతీ నియంత్రణలో ఉన్న అల్ మసీరాహ్ నెట్‌వర్క్‌ చానల్లో పెరేడ్ చేయిస్తాం" అని చెప్పారు. హౌతీ తిరుగుబాటుదారులు మొదట సౌదీ అరేబియాలోని రెండు చమురు ప్లాంట్లపై దాడి చేశామని చెప్పారు. ఈ దాడి సెప్టెంబర్ 14న జరిగింది. ఆ దాడులతో అంతర్జాతీయ స్థాయిలో చమురు మార్కెట్‌పై ప్రభావం పడింది. కానీ, ఈ దాడికి ఇరాన్ కారణమని సౌదీ అరేబియా, అమెరికా ఆరోపించాయి. ఇరాన్ వాటిని ఖండించింది. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఉందని భావిస్తున్నారు.ట 2015 నుంచి సంఘర్షణ 2015లో యెమెన్ రాజధాని సనాను హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి ఈ యుద్ధం నడుస్తోంది. దేశ అధ్యక్షుడు అబ్దరబూ మన్సూర్ హాదీ యెమెన్ వదిలి పారిపోవాయాడు. తర్వాత హౌతీ తిరుగుబాటుదారులు ఉత్తర యెమెన్‌లోని చాలా ప్రాంతాలపై పట్టు సాధించారు. అధ్యక్షుడు హాదీకి సౌదీ అరేబియా మద్దతు ఉంది. సౌదీ నేతృత్వంలో సంకీర్ణ సేనలు 2015లో హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ సైన్యం ఇప్పటికీ దాదాపు రోజూ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు చేస్తున్నారు. ఈ అంతర్యుద్ధం వల్ల యెమెన్ తీవ్ర మానవతా సంక్షోభంలో చిక్కుకుపోయింది. సుమారు 80 శాతం దేశ జనాభా అంటే సుమారు రెండు కోట్ల 40 లక్షల మంది ప్రజలు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు కోటి మంది ఆకలితో అల్లాడిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2016లో యుద్ధం వల్ల 70 వేల మందికి పైగా మృతిచెందారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సౌదీ అరేబియా సైనికులను భారీ సంఖ్యలో పట్టుకున్నామని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు చెప్పారు. text: ఇలాంటి ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకూ లభించలేదు. బీబీసీ ఇటీవల జామెల్ మైల్స్ అనే ఒక పిల్లాడి కథనం ప్రచురించింది. కోలరాడా, డెన్వర్‌లోని తన స్కూల్లో జామెల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అతడు 'గే' కావడమే అని వెల్లడైంది. జామెల్ తల్లి లియా రోషల్ పియర్స్ ఈ వివరాలు చెప్పారు. జామెల్ తను గే అనే విషయాన్ని కొన్ని వారాల క్రితమే తనకు చెప్పాడని, అందుకు గర్విస్తున్నానని తనతో అన్నాడని ఆమె తెలిపారు. ఈ వార్త చదివిన చాలా మంది మనసులో ఒక ప్రశ్న రావచ్చు. ఒక చిన్న పిల్లాడికి తన లైంగికత గురించి ఎలా తెలుస్తుంది? అని. తర్వాత బీబీసీ ఈ విషయం గురించి ఇద్దరు సైకాలజిస్టులతో మాట్లాడింది. జటిలమైన ఈ విషయం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని భావించింది. ఈ సైకాలజిస్టులు ఇద్దరూ స్పెషలిస్టులు. వీరిలో ఒకరు జెండర్ స్టడీ స్పెషలిస్ట్, సోషల్ సైకాలజీలో పీహెచ్‌డీ చేసిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫ్లోరిడా(అమెరికా) సైకాలజీ ప్రొఫెసర్ ఎషియా ఎటన్, ఇంకొకరు అమెరికా సైకాలజీ యూనియన్ ఎల్జీబీటీ కేసుల డైరెక్టర్ క్లింటన్ డబ్ల్యు అండర్సన్. కొడుకు జామెల్ మైల్స్‌తో తల్లి లియా రోషల్ పియర్స్ సెక్సువల్ ఓరియంటేషన్ సగటు వయసు ఎంత? ఒక వ్యక్తికి ఏ వయసులో లైంగిక అవగాహన లేదా సెక్సువల్ ఓరియంటేషన్ వస్తుంది? దీని గురించి ఏవైనా పరిశోధనలు జరిగాయా? నిపుణులు దీనిపై ఏమంటున్నారు? "కొన్ని పరిశోధనల ప్రకారం 8 నుంచి 9 ఏళ్ల వయసులోనే పిల్లలకు మొదటిసారి లైంగిక ఆకర్షణ కలుగుతుంది. మిగతా పరిశోధనలను చూస్తే అలా 11 ఏళ్లకు దగ్గరలో జరుగుతుందని తేలింది. ఈ పరిశోధనల్లో సెక్సువల్ ఓరియెంటేషన్ సగటు వయసు గుర్తించడంలో రకరకాల ఫలితాలు వచ్చాయి" అన్నారు ఎషియా ఎటన్. "ఇది ఒక క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే సెక్సువల్ బిహేవియర్(లైంగిక ప్రవర్తన), సెక్సువల్ ఓరియంటేషన్ (లైంగిక అవగాహన) మధ్య ఒక వ్యత్యాసం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తికి ఎమోషనల్‌ లేదా లైంగికంగా ఒకరంటే ఇష్టం ఏర్పడితే దానిని సెక్సువల్ బిహేవియర్ అంటారు. "స్త్రీ లేదా పురుషుల వైపు కలిగే లైంగిక ఆకర్షణను బట్టి తమ సెక్సువల్ ఓరియంటేషన్ ఏంటి అనేదికూడా వారు తెలుసుకోవచ్చు. కానీ ఈ రెండూ సమయం, సందర్భంతోపాటు మారవచ్చు". "వాస్తవానికి అందరూ వారి వయసులో రకరకాల దశలను దాటేసరికి సెక్సువల్ ఓరియంటేషన్‌ గురించి రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒకరికి కేవలం ఆరేళ్ల వయసులో ఇలా అయితే, ఇంకొకరికి 16 ఏళ్ల వయసులో ఆ అనుభవం తెలుస్తుంది. కొంతమంది అసలు అలా ఎప్పటికీ అనిపించదు" అని ఎషియా తెలిపారు. . ప్రస్తుత యువతలో తమ ఎల్జీబీటీక్యూ గురించి హైస్కూల్లో చదివేటపుడే తెలుస్తోంది. వారు అంతకు ముందు తరాలతో పోలిస్తే చాలా ముందున్నారు. దానికి కారణం అధిక అవగాహన, వారి సామాజిక ఆమోదం. సెక్సువల్ ఓరియంటేషన్ మారవచ్చు ఈ విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మిగతా కారణాలతోపాటు జెండర్, సెక్సువాలిటీ సైకలాజికల్ కోణాలు అనేవి ఫిజియాలజీ, సోషియో కల్చరల్ సందర్భాలను చూపిస్తాయి. సంస్కృతి, సమాజంలో మార్పులు వచ్చేకొద్దీ వ్యక్తి జెండర్, సెక్సువాలిటీ మార్పులు చోటుచేసుకుంటాయి. అని క్లింటన్ డబ్ల్యు అండర్సన్ తెలిపారు. "కచ్చితంగా కొందరిలో ఇలా జరుగుతుంది. వారిలో 9 ఏళ్లు లేదా అంతకు ముందే లైంగిక ఆకర్షణలు ఏర్పడతాయి. కానీ ఆ వయసులో వారికి తమ లైంగిక ప్రవర్తనను బాగా అర్థం చేసుకునే జ్ఞానం, భావోద్వేగ సామర్థ్యం ఉంటుందని అనుకోలేం. ఎవరైనా ఒక వ్యక్తికి లైంగిక అవగాహన లేదా సెక్సువల్ ఓరియంటేషన్ అనేది ఒక వయసులో తెలియాలనేం లేదు. ఒక వయసులో వారి లైంగిక ఆకర్షణ వేరేలా ఉండవచ్చు. అది సమయంతోపాటూ మరోలా మారవచ్చు. ఎక్కువ మందికి లైంగిక అవగాహన అనేది యుక్తవయసులోనే ఏర్పడుతుంది. ఎందుకంటే అది ప్రధానంగా రొమాన్స్, లైంగిక సంబంధాల విషయంలో జరుగుతుంది. రెండోది స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాలు చిన్నతనంలో కూడా వృద్ధి చెందుతాయి". తల్లిదండ్రులు, సమాజం ప్రభావం పిల్లల్లో లైంగిక అవగాహన గురించి, అతడిపై సాధారణంగా తన తల్లిదండ్రులు, సమాజం ప్రభావం ఎంత, ఏ మేరకు ఉంటుంది? పరిశోధనల ఫలితాల ప్రకారం ఎక్కువ మంది ఎల్జీబీటీక్యూ యువకులు తమ చిన్నతనంలో టామ్‌బాయ్‌లాగే ఉన్నారు. ఇంట్లో నుంచి బయటికొచ్చిన తర్వాత వారు, తమ స్కూల్, ఆఫీసులు, సమాజం నుంచి ద్వేషాలు, భేదాలు, హింస లాంటివి ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉంటుంది. అన్నారు ఎషియా ఎటన్. "అదృష్టవశాత్తూ, పరిశోధనల్లో మరో విషయం కూడా తెలిసింది. కుటుంబం, స్నేహితులు, స్కూల్లో సాయంగా ఉండేవారితో ఉన్న అనుభవాలు, వారిపై ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా నిరోధకాల్లా పనిచేస్తాయి." అని ఎటన్ చెప్పారు. "తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి స్నేహితులు, బయటి ప్రపంచం గురించి చెబుతూ తమ సెక్సువల్ ఓరియంటేషన్ గుర్తించేలా చేయవచ్చు అలా చేయడం వల్ల తమ పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారు బాటలు వేసినట్టవుతుంది." "చిన్న వయసులోనే లైంగిక అవగాహన ఏర్పడితే దానిని తల్లిదండ్రులు, సమాజం ఆమోదించడం చాలా అవసరం. తల్లిదండ్రులు దానిని అంగీకరించకపోతే పిల్లల్లో చెడు మానసిక ధోరణులు, సంబంధిత పరిణామాలు ఏర్పడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దానిని అంగీకరిస్తే మాత్రం పిల్లల్లో మెరుగైన పరిణామాలు కనిపిస్తాయి" అని క్లింటన్ చెప్పారు. "పిల్లల లైంగిక అవగాహనను తల్లిదండ్రులు అంగీకరిస్తే అది వారికి రక్షణలా నిలుస్తుంది. కానీ పిల్లలు మిగతా పిల్లలతో ఉండే స్కూల్, ఆటలు లాంటి వాటిలో దీనిపై సానుకూల లేదా వ్యతిరేక ప్రభావం పడవచ్చు." "పిల్లలు చదువులో ముందుకు వెళ్లేందుకు, మానసికంగా వారు ఆరోగ్యంగా ఉండేందుకు స్కూల్స్ లాంటి చోట వారికి కాస్త సురక్షిత, అనుకూల వాతావరణం ఉండేలా మనమే జాగ్రత్త పడాల్సి ఉంటుంది" అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇవికూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక తొమ్మిదేళ్ల పిల్లాడికి తన లైంగికత గురించి తెలుస్తుందా? text: అత్యాచారం జరిగిన ప్రదేశం నిందితులు తాము పోలీసులమ‌ని ఎందుకు చెప్పారు? ఆల‌మూరులోని ఓ డిగ్రీ కాలేజ్‌లో చ‌దువుతున్న విద్యార్థిని మార్చి 3న త‌న స్నేహితుల‌తో వీడ్కోలు పార్టీ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్నేహితుడి వాహ‌నంపై మండ‌పేట బైపాస్ రోడ్డులో వ‌స్తున్న ఆమె వాహ‌నాన్ని సంగం కాల‌నీ జంక్ష‌న్ వ‌ద్ద ఇద్ద‌రు వ్యక్తులు ఆపి, తాము పోలీసుల‌మంటూ, వాహనం రికార్డులు చూప‌మ‌ని బెదిరించారు. త‌గిన ప‌త్రాలు లేక‌పోవ‌డంతో బాధితురాలి స్నేహితుడిని నిందితుల్లో ఒక‌రు దూరంగా తీసుకెళ్లాడు. ఆ స‌మ‌యంలో బాధితురాలి ద‌గ్గ‌ర ఉన్న వ్య‌క్తి , తన స్నేహితులు మ‌రో ఇద్ద‌రిని పిలిచి స‌మీపంలో ఉన్న పొలాల మ‌ధ్య అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధితురాలి స్నేహితుడిపై దాడికి పాల్ప‌డ‌డంతో అత‌నికి గాయాల‌య్యాయి. సామూహిక అత్యాచారం త‌ర్వాత బాధితురాలిని అక్క‌డే వ‌దిలేసి నిందితులు వెళ్లిపోయారు. స్పృహ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న స్నేహితుల‌కు ఫోన్ చేసి, వారి స‌హాయంతో బాధితురాలు ఇంటికి చేరింది. బాధితురాలి తండ్రి చ‌నిపోయారు. త‌ల్లి అనారోగ్యంతో మంచాన ఉన్నారు. ఈ విషయం త‌ల్లికి తెలిస్తే ఏమ‌వుతుందోన‌నే భ‌యంతో బాధితురాలు త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని దాచిపెట్టే ప్ర‌య‌త్నం చేసింది. త‌ర్వాత‌ రోజు తన సోద‌రుడికి ఈ విష‌యం చెప్ప‌డంతో అత‌డి స‌హాయంతో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. అత్యాచారం జరిగిన ప్రదేశం నిందితుల‌ను త‌ప్పించేందుకు రాజ‌కీయ నేత‌ల య‌త్నం మార్చి 4వ తేదీన పోలీసుల‌కు ఫిర్యాదు రావ‌డంతో వారు రంగంలోకి దిగారు. బాధితురాలు చెప్పిన ఆధారాల స‌హాయంతో విచార‌ణ ప్రారంభించి నిందితుల వివ‌రాల‌ను క‌నుగొన్నారు. కానీ కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసే విష‌యంలో మాత్రం జాప్యం జ‌రిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎంపీ జీవీ హ‌ర్ష‌కుమార్ స్వ‌యంగా బాధితురాలిని ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పారు. తాము అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. ఈ విష‌యంలో కేసు లేకుండా రాజీ య‌త్నాలు జ‌రిగిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. "మండ‌పేట‌లో ద‌ళిత విద్యార్థినిపై జ‌రిగిన గ్యాంగ్ రేప్ నిందితుల‌ను గుర్తించినా, త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో జాప్యానికి రాజీయత్నాలే కార‌ణం. అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన మండ‌పేట నేత‌లు కలిసి ఈ ప్ర‌య‌త్నాలు చేశారు. అది తెలుసుకుని ద‌ళిత సంఘాలుగా మేం జోక్యం చేసుకున్నాం. బాధితురాలికి అన్యాయం జ‌రిగితే ఆందోళ‌న త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించ‌డంతో చివ‌ర‌కు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిర్భయ చ‌ట్టం, దిశ చ‌ట్టాల కింద క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. ద‌ళిత విద్యార్థినికి జ‌రిగిన అన్యాయంలో నిందితుల‌ను కాపాడాల‌ని చూసిన వారిపై కూడా చ‌ర్య‌లు తీసుకోవాలి. అత్యాచారానికి పాల్ప‌డిన వారికి కొంద‌రు రాజ‌కీయ నేత‌లు అండ‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌హించ‌కూడ‌దు" అని హర్షకుమార్ బీబీసీతో అన్నారు. నిర్భయ చ‌ట్టం, ఎస్సీ, ఎస్టీ చ‌ట్టాల కింద కేసులు ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మార్చి 5వ తేదీన మండ‌పేట‌లో వారిని గుర్తించి అరెస్ట్ చేసిన‌ట్టు 6వ తేదీన మీడియాకు తెలిపారు. అదే రోజు ఆల‌మూరు కోర్టులో వారిని హాజ‌రుప‌రిచి, కోర్ట్ ఆదేశాల‌తో రిమాండుకి త‌ర‌లించారు. ఈ కేసు వివ‌రాల‌ను రామ‌చంద్రాపురం డీఎస్పీ ఎం.రాజ‌గోపాల్ రెడ్డి బీబీసీకి వివ‌రించారు. "నిందితుల‌పై 376డీ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం సెక్ష‌న్ 3/2 కింద కేసులు న‌మోదు చేశాం. న‌లుగురు నిందితులు ఇప్పుడు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌లో ఉన్నారు. నిందితుల‌పై ఉన్న అభియోగాలు నిర్ధర‌ణ కానందున వారి వివ‌రాలు వెల్ల‌డించ‌లేం. బాధితురాలితో పాటు, నిందితుల వివ‌రాలు కూడా ప్ర‌చురించ‌వ‌ద్దు" అని ఆయ‌న చెప్పారు. దోషుల‌కు క‌ఠిన శిక్ష‌లు త‌ప్ప‌వు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఈ దుర్ఘ‌ట‌న‌లో పోలీసుల పేరు చెప్పి నేరం జ‌ర‌గ‌డంతో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. కేసు విష‌యంలో పోలీసులు ఎటువంటి ఒత్తిడీ లేకుండా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించిన‌ట్టు మంత్రి తెలిపారు. "పోలీసులం అని చెప్పి వాహనం ఆపి అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో దోషుల‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డాలి. స‌కాలంలో ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసి, కోర్ట్ తీర్పు వ‌చ్చేలా చూసేందుకు ప్ర‌య‌త్నిస్తాం. ఈ కేసులో నేను జోక్యం చేసుకున్నానంటూ సాగిన ప్ర‌చారంలో వాస్త‌వం లేదు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీస్ సిబ్బందిని ఆదేశిస్తున్నాం. దిశ యాప్ ద్వారా ఇలాంటి ప‌రిస్థితుల్లో సుర‌క్షితంగా బ‌య‌ట‌పడే మార్గాల‌ను అన్వేషించాలి. అందుకు అనుగుణంగా చైత‌న్యం పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం" అని సుభాష్ చంద్రబోస్ బీబీసీకి వివ‌రించారు. నాకు జ‌రిగిన అన్యాయం ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు: బాధితురాలు బాధితురాలిని చికిత్స కోసం కాకినాడ‌లోని ఆస్ప‌త్రికి త‌రలించారు. అక్క‌డ ఆమెను ఎస్సీ మాల కార్పొరేష‌న్ చైర్మ‌న్ స‌హా కొందరు నేత‌లు ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న గురించి బాధితురాలు బీబీసీతో మాట్లాడారు. "అప్ప‌టి వ‌ర‌కూ సంతోషంగా గ‌డిచింది. డిగ్రీ ఫైన‌లియ‌ర్ విద్యార్థులమంతా గ్రూప్ ఫొటో తీసుకోవ‌డం కోసం కాలేజీకి వెళ్లాం. తిరిగి వ‌స్తున్న‌ప్పుడు మమ్మల్ని ఆపితే, పోలీసులే అనుకున్నాం. కేసు పెట్టిన త‌ర్వాత అరెస్ట్ కాకుండా త‌ప్పించుకునేందుకు చాలా ప్ర‌య‌త్నించారు. మాపై ఒత్తిడి తెచ్చారు. కానీ ఇలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌ద‌ని నేను కోరుకుంటున్నాను. నిందితుల‌కు త‌గిన శిక్ష పడాలి. చాలా వేడుకున్నాను. కానీ వాళ్లు రాక్ష‌సుల్లా వ్య‌వ‌హ‌రించారు. నన్ను వ‌ద‌ల‌కుండా దారుణంగా హింసించారు. వారికి ఉరి శిక్ష వేయాలి. నా భవిష్య‌త్ నాశ‌నం చేశారు. వాళ్ల‌కి బ‌తికే హ‌క్కు లేదు" అంటూ తన బాధను వ్యక్తం చేశారు. పోలీసుల‌మ‌ని చెప్పి ఎవ‌రైనా మీ వాహ‌నాన్ని ఆపితే ఏం చేయాలి? ఎవ‌రు, ఏ వాహనాన్ని ఆపినా తొలుత పోలీసులో కాదో నిర్ధరించుకునే హ‌క్కు ప్ర‌జ‌ల‌కుంద‌ని డీఎస్సీ ఎం.రాజ‌గోపాల్ రెడ్డి బీబీసీకి తెలిపారు. "గ‌తంలో ఎన్న‌డూ ఇలా పోలీసుల‌మంటూ వాహ‌నాలు అడ్డుకుంటున్నతీరు మా దృష్టికి రాలేదు. ఇదే మొద‌టి సారి. పోలీసుల పేరుతో సివిల్ డ్రెస్సుల్లో వాహ‌నాలు ఆపే ప‌రిస్థితి ఉండ‌దు. ఒక‌వేళ ఎక్క‌డైనా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో త‌నిఖీల కోసం వాహ‌నాలు ఆపితే ప్ర‌జ‌లు కూడా వారిని ప్రశ్నించాలి. వారు పోలీసులో కాదో నిర్ధరించుకోవాలి. వారి ఐడీ కార్డులు అడ‌గాలి. కానిస్టేబుళ్ల‌కైతే నెంబ‌ర్ ఉంటుంది. దానిని కూడా అడ‌గాలి. అలాంటి వివ‌రాలు అడుగుతున్న‌ప్పుడు చెప్పే స‌మాధానాన్ని బ‌ట్టి చాలామందికి అర్థ‌మైపోతుంది. అప్పుడు వారు అస‌లు పోలీసులా కాదా అన్న‌ది తెలుస్తుంది" అంటూ ఆయ‌న చెబుతున్నారు. జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం అత్యాచార ఘటనలు ఏటా పెరుగుతున్నాయి. పోలీసులు తమ వివ‌రాలు చెప్పిన త‌ర్వాతే వాహ‌న‌దారుడిని అడ‌గాలి పోలీసులు కూడా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో త‌నిఖీలు చేయాల్సి ఉంటుంద‌ని, దానికి త‌గ్గ‌ట్టుగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ఏపీ బార్ కౌన్సిల్ స‌భ్యుడు, మాన‌వ‌హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. "పోలీసులు విధి నిర్వ‌హ‌ణ‌లో యూనిఫాం త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి. నేమ్ బోర్డ్ క‌నిపించేలా ఉండాలి. వాహ‌న త‌నిఖీల సంద‌ర్భంగా త‌మ పేరు, వివ‌రాలు తెలియ‌జేయాలి. ఎందుకు త‌నిఖీలు చేస్తున్నార‌న్న‌ది కూడా వాహ‌న‌దారుడికి తెలపాల్సి ఉంటుంది. అన్ని వివ‌రాలూ తెలుసుకున్న త‌ర్వాత మాత్ర‌మే వాహ‌నదారులు త‌మకు సంబంధించిన ప‌త్రాల‌ను అందించ‌వ‌చ్చు. అనుమానితుల నుంచి పేరు, ఇత‌ర వివ‌రాలు అడిగి తెలుసుకోవచ్చు. కానీ విచార‌ణ పేరుతో అక్క‌డి నుంచి తీసుకెళ్లే అధికారం లేదు. అందుకు త‌గిన ప్ర‌క్రియ‌ను అనుస‌రించాలి. కానీ ఎక్కువ సంద‌ర్భాల్లో అలా జ‌ర‌గ‌డం లేదు. ఈ పరిస్థితి కార‌ణంగానే ప్ర‌శాంతంగా ఉండే మండ‌పేట‌లో కూడా పోలీసుల పేరుతో అత్యాచారానికి ఒడిగ‌ట్టేందుకు సాహ‌సించారు. పున‌రావృతం కాకూడ‌దంటే పోలీసుల ప‌నితీరులోనే మార్పు రావాలి" అని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట‌లో డిగ్రీ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని కొందరు తాము పోలీసుల‌మంటూ ఆపి, ప‌క్క‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. text: భీమా కోరెగావ్ కేసులో అరెస్టయిన నిందితులు అమెరికాలోని ఒక సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్ష రిపోర్ట్ ఆధారంగా అమెరికా ప్రముఖ వార్తా పత్రిక 'ద వాషింగ్టన్ పోస్ట్' ఈ కేసులో అరెస్టైన ఒకరికి వ్యతిరేకంగా ఆధారాలు 'ప్లాంట్' చేశారని చెప్పింది. పుణెలో జరిగిన హింస కేసులో చాలామంది వామపక్ష కార్యకర్తలు, మేధావులను అరెస్ట్ చేశారు. భీమా కోరెగావ్‌లో అంగ్లేయుల మహార్ రెజిమెంట్, పీష్వా సైన్యం మధ్య జరిగిన యుద్ధంలో మహార్ రెజిమెంట్ గెలిచింది. దళితులు ఎక్కువగా ఉన్న ఆ సైన్యం విజయం 200వ వార్షికోత్సవం సందర్భంగా ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఎల్గార్ పరిషద్‌ సంస్థకు చెందిన చాలామంది సభ్యులను, ప్రముఖ దళిత, మానవ హక్కుల కార్యకర్తలను వేరు వేరు సమయాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అరెస్ట్ చేశారు. వారిపై 'ప్రధానమంత్రి హత్యకు కుట్ర', 'దేశ ఐక్యత, సమగ్రతను విచ్ఛిన్నం' చేయడానికి ప్రయత్నించడం లాంటి తీవ్రమైన అభియోగాలు మోపారు. వీరందరూ ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. 'ది వాషింగ్టన్ పోస్ట్' రిపోర్ట్ ప్రకారం మసాచుసెట్స్‌లో ఉన్న ఆర్సనల్ కన్సల్టింగ్ ల్యాబ్ తన పరిశోధనలో దళిత హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ల్యాప్‌టాప్‌పై సైబర్ దాడి జరిగిందని ఒక నిర్ధరణకు వచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్టుల ప్రకారం ఒక మాల్‌వేర్(వైరస్) ద్వారా ఆ ల్యాప్‌టాప్‌లోకి చాలా డాక్యుమెంట్స్ పెట్టారు. వాటిలో వివాదిత డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ హత్య కుట్ర కోసం రోనా విల్సన్ ఆయుధాలు సేకరణ గురించి చర్చించారనేది కూడా ఉంది. అయితే, విల్సన్ ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ దర్యాప్తు ఏజెన్సీ పరిశీలించినపుడు, అందులో ఎలాంటి వైరస్ ఉన్నట్టూ ఆధారాలు దొరకలేదని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రతినిధి వాషింగ్టన్ పోస్ట్‌కు చెప్పారు. ఈ కేసులో ఎవరెవరిని నిందితులుగా చేర్చారో, వారికి వ్యతిరేకంగా తగిన ఓరల్, డాక్యుమెంటల్ ఎవిడెన్సులు ఉన్నాయని ఎన్ఐఏ ప్రతినిధి పత్రికతో అన్నారు. రోనా విల్సన్ కేసులో కొత్త మలుపు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించిన తర్వాత రోనా విల్సన్, మిగతా నిందితుల లాయర్లు ముంబయి హైకోర్టులో పిటిషన్ వేశారు. విల్సన్‌పై ఉన్న ఆరోపణలన్నీ రద్దు చేయాలని, ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితుల తరపు లాయర్ అయిన మిహిర్ దేశాయి బీబీసీతో దీనిపై మాట్లాడారు. "మేం పూర్తిగా ఈ విచారణనే రద్దు చేయించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే, దేనిని ప్రధాన ఆధారంగా చూపించి ఈ కేసులు నమోదయ్యాయో, అదే ఇప్పుడు 'ప్లాంటెడ్' అని నిరూపితం అవుతోంది. మేం డాక్యుమెంట్స్ 'ప్లాంట్' చేయడంపై కూడా స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నాం. మొత్తం ప్రక్రియలో డాక్యుమెంట్లు ప్లాంట్ చేయడం గురించి ఎందుకు దర్యాప్తు జరగలేదు. ప్రాసిక్యూషన్ దీనిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు" అన్నారు. రోనా విల్సన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ కాపీ పొందడంలో ఆయన లాయర్ మిహిర్ విజయవంతం కాగలిగారు. "మేం 2019 డిసెంబర్‌లో కోర్టుకు దరఖాస్తు చేసి, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న అన్నిటి క్లోన్ కాపీలు డిమాండ్ చేశాం. కోర్టు ఆదేశాలతో వాటిని మాకు అందించారు" అన్నారు. కోర్టు ద్వారా తమకు అందిన వస్తువుల ఫోరెన్సిక్ పరీక్షల కోసం రోనా విల్సన్ తరఫు న్యాయ ప్రతినిధులు అమెరికా బార్ అసోసియేషన్ సాయం కోరినట్లు హైకోర్టు పరిధిలో దాఖలైన పిటిషన్లను బట్టి తెలుస్తోంది. అమెరికా బార్ అసోసియేషన్ వారు ఆర్సనల్ కన్సల్టింగ్‌ను సంప్రదించేలా చేసింది. ఈ కంపెనీ గత 20 ఏళ్లుగా ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంటుంది. రిపోర్ట్, వాదన, పిటిషన్ ఆర్సనల్ కన్సల్టింగ్ రిపోర్టును ఉటంకిస్తూ రోనా విల్సన్ ల్యాప్‌టాప్‌లో మొదటి డాక్యుమెంట్‌ను ఆయనను అరెస్ట్ చేయడానికి 22 నెలల ముందే ప్లాంట్ చేశారని న్యాయవాదులు తమ పిటిషన్‌లో చెప్పారు. "ఒక హ్యాకర్ నెట్‌వైర్ అనే మాల్‌వేర్(వైరస్)ను ఉపయోగించాడు. దాని ద్వారా మొదట పిటిషనర్(విల్సన్) మీద నిఘా పెట్టాడు. తర్వాత మాల్‌వేర్ ద్వారా దూరం నుంచే, దానిలో చాలా ఫైళ్లు వేశాడు. వాటిలో కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశపెట్టిన 10 డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక ఫోల్డర్‌లో పెట్టి, దానిని హిడెన్ మోడ్‌( కనిపించకుండా)లో ఉంచాడు. 22 నెలలపాటు హ్యాకర్ అప్పుడప్పుడూ పిటిషనర్ ల్యాప్‌టాప్‌లో అతడికి తెలీకుండానే వాటిని ప్లాంట్ చేశాడు" అని ఆ పిటిషన్‌లో చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ గురించి కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. విల్సన్ ల్యాప్‌టాప్‌ను చాలాసార్లు రిమోట్లీ(దూరం నుంచి) నియంత్రించారని చెప్పారు. అయితే, ఈ సైబర్ దాడి చేసింది ఎవరు, అతడికి ఏదైనా సంస్థతో లేదా విభాగంతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయం ఆర్సనల్ కన్సల్టింగ్ రిపోర్టులో చెప్పలేదు. ఉత్తర అమెరికాలో మాల్‌వేర్‌కు సంబంధి ముగ్గురు స్వతంత్ర నిపుణులతో ఈ రిపోర్ట్‌ను తనిఖీ చేయించారని, వారందరూ ఈ రిపోర్ట్ బలంగా ఉందని చెప్పారని వాషింగ్టన్ పోస్ట్ తన రిపోర్టులో తెలిపింది. "2016లో తీవ్రవాద ఆరోపణలతో అరెస్ట్ అయిన టర్కీకి చెందిన ఒక జర్నలిస్టును ఆర్సనల్ కన్సల్టింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విడుదల చేశారు. ఆయనతోపాటూ అరెస్ట్ చేసిన మిగతా నిందితులను కూడా విడుదల చేశారు" అని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో చెప్పింది. 2018లో భీమా కోరెగావ్‌లో హింస జరిగిన తర్వాత పుణె పోలీసులు చాలా మంది వామపక్ష కార్యకర్తలు, మేధావుల ఇళ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. వారి ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, మిగతా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర లభించిన డాక్యుమెంట్లను కోర్టుల్లో ఆధారాలుగా ప్రవేశపెట్టిన పోలీసులు, నిందితుల వెనుక నిషేధిత మావోయిస్టు సంస్థ హస్తం ఉందని చెప్పారు. రోనా విల్సన్, వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా సహా 14 మందికి పైగా సామాజిక కార్యకర్తలను ఈ కేసులో అరెస్ట్ చేశారు. మొదట పుణె పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు ఇప్పుడు ఎన్ఐఏ దగ్గర ఉంది. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై ఎన్ఐఏ స్పందన తెలుసుకోడానికి ఎన్ఐఏ ప్రతినిధి, ప్రభుత్వ లాయర్లను బీబీసీ సంప్రదించింది. కానీ, ఎలాంటి సమాధానం లభించలేదు. వారి నుంచి స్పందన రాగానే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్ర పుణెలోని భీమా కోరెగావ్‌లో 2018లో జరిగిన హింస కేసు దర్యాప్తు, అరెస్టులకు సంబంధించి వచ్చిన ఒక కొత్త రిపోర్ట్ అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచింది. text: ఒక దశలో ఫార్క్ సైన్యం 20,000 ఉండేవారు. ఈక్వడార్ సరిహద్దు సమీపంలో వాల్టర్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఆయన్ను అంతమొందించినట్లు అధ్యక్షుడు ఇవాన్ ప్రకటించారు. కొలంబియా చరిత్రలోనే వాల్టర్ ఓ తీవ్ర నేరస్థుడని ఇవాన్ అన్నారు. 2018 మొదట్లో ఇద్దరు ఈక్వడార్ జర్నలిస్టులను, వారిడ్రైవర్‌‌ను హత్య చేసిన కేసులో గ్వాచో కోసం కొలంబియా బలగాలు గాలించాయి. 2016లో ఫార్క్ లెక్కల ప్రకారం వారి సైన్యంలో 15ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు 21మంది ఉన్నారు. ఎవరీ గ్వాచో? 29ఏళ్ల గ్వాచో.. కొలంబియా తిరుగుబాటు సంస్థ 'ఫార్క్'లో సభ్యుడుగా ఉండేవారు. 2016లో గొరిల్లా సంస్థ కొలంబియా ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వేల మంది తిరుగుబాటుదారుల్లో గ్వాచో ఒకరు. ఫార్క్ నుంచి బయటకొచ్చిన గ్వాచో, 'ఆలివర్ సినిస్టెర్రా ఫ్రంట్'ను స్థాపించాడు. ఈ సంస్థలో 70-80మంది సైన్యం ఉంటుందని ఓ అంచనా. వీరు కొలంబియా-ఈక్వడార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇద్దరు ఈక్వడార్ జర్నలిస్టులను అపహరించడంతో ఈ సంస్థ తొలిసారిగా అంతర్జాతీయ దృష్టికి వచ్చింది. వీరి హత్యల తర్వాత, ఈక్వడార్‌కు చెందిన ఒక జంటను కూడా వీరు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచీ రెండు దేశాలూ గ్వాచోను లక్ష్యంగా చేసుకున్నాయి. గ్వాచోను వీలైతే సజీవంగా పట్టుకోవడానికి, లేదంటే హతమార్చడానికి 3 వేలమంది సాయుధ బలగాలను కొలంబియా రంగంలోకి దింపినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. ఫార్క్ సైన్యంలో చాలామంది నిరుపేద, గ్రామీణ పురుషులు, మహిళలే! ఫార్క్‌ను స్థాపించింది రైతులే! ‘ఫ్యుయెర్జాస్ అర్మడాస్ రివల్యూషనరీస్ డి కొలంబియా(ది రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) అనే ఈ కొలంబియా సాయుధ తిరుగుబాటు దళాలను సంక్షిప్తంగా ఫార్క్ అంటారు. ఇది కొలంబియాలోనే అతి పెద్ద తిరుగుబాటు సంస్థ. అర్ధశతాబ్దం పాటు కొలంబియాను తన గెరిల్లా పోరాటాలతో వణికించిన తిరుగుబాటు సంస్థ ఇది. మార్క్సిస్ట్-లెనినిస్ట్ భావజాలంతో 1960లో ఏర్పడిన ఇది 1964 నుంచి సాయుధ పోరాట బాట పట్టింది. ఈ సంస్థను స్థాపించింది కొందరు సన్నకారు రైతులే. అప్పట్లో కొలంబియాలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో పట్టణాలకు చెందిన వర్గాలు ఉన్నప్పటికీ, గ్రామీణ స్థాయిలో గొరిల్లా సైన్యం భారీగా ఉంది. 2008లో వ్యవస్థాపకుడు మాన్యఎల్ మరుల్యాండా (మధ్యలోని వ్యక్తి) అనారోగ్యంతో మరణించారు. చనిపోయేదాకా ఈయనే ఫార్క్ నాయకుడు. ఫార్క్ సంఖ్య ఎంత? ఫార్క్‌లో 6వేల నుంచి 7 వేల మంది సైనికులు ఉంటారని, వీరికి అదనంగా 8,500మంది సానుభూతిపరులు ఉండొచ్చన్నది భద్రతాదళాల అంచనా. 2002లో వీరి సంఖ్య 20వేల వరకూ ఉండేదని భద్రతా దళాలు చెబుతున్నాయి. వీరి కార్యకలాపాలు ఎలా ఉంటాయి? యుద్ధరంగంలో పోరాడగలిగిన సైనికులు చిన్నచిన్న వర్గాలుగా ఏర్పడతారు. ఈ వర్గాలన్నీ అవసరమైన సమయంలో మహాసైన్యంలా ఏకమయ్యేందుకు సిద్ధంగా ఉంటాయి. వీరంతా ఓ డజను కంటే తక్కువ సంఖ్యలోని టాప్ కమాండర్ల నేతృత్వంలో పని చేస్తారు. ఈ సంస్థ అధినేత రోడ్రిగో లండనో ఎఛెవెరీ.. అలియాస్ టిమోఛెన్కో. మార్కెటాలియా రిపబ్లిక్ తర్వాత, తమ పోరాటాన్ని సాయుధ పోరాటంగా మార్చాలని ఫార్క్ భావించింది. వీరు ఆయుధాలు ఎందుకు పట్టారు? అణచివేత నుంచి ఫార్క్ సంస్థ ఏర్పడింది. అణచివేతకు వ్యతిరేకంగా ఎలాంటి పనినైనా విద్రోహ చర్యగా భావించే కాలంలో ఈ సంస్థ గళమెత్తింది. కొలంబియా సమాజంలో అసమానతల చరిత్ర ఉంది. అక్కడ.. ఎక్కువ శాతం భూమి కొద్దిమంది ధనిక వర్గాల చేతుల్లో ఉంది. 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం ఆరంభంలో.. అప్పులు చెల్లించడం కోసం కొలంబియా.. దేశంలోని భూమిని పెద్దమొత్తంలో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయం.. అధిక శాతం భూమి ధనికుల చేతుల్లో ఉండటానికి పాక్షికంగా కారణం అయ్యుండొచ్చు. ఫార్క్ వ్యవస్థాపకుల్లో కొందరు మొదటగా ఓ వ్యవసాయ సంఘాన్ని ప్రారంభించారు. 1950లోని క్యూబా తిరుగుబాటు స్ఫూర్తితో తమ హక్కుల కోసం, భూమిపై అధికారం కోసం డిమాండ్ చేశారు. ఈ వ్యవసాయ సంఘం కమ్యూనిస్టు భావజాలంతో తమకు ప్రమాదం పొంచివుందని పెద్దమొత్తంలో భూములున్నవారితోపాటు ప్రభుత్వం కూడా భావించింది. ఈ దళాన్ని విచ్ఛిన్నం చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ దశను 'మార్కెటాలియా రిపబ్లిక్' పేరుతో పిలుస్తారు. ఈ పరిణామం తర్వాత, తమ పోరాటాన్ని సాయుధ పోరాటంగా మార్చాలని ఫార్క్ భావించింది. ఫార్క్ ఏర్పాటుకు ముందు కొలంబియాలో పదేళ్లపాటు అంతర్యుద్ధం నడిచింది. ఫార్క్‌కు ముందు కొలంబియా ప్రశాంతంగానే ఉండేదా? ఫార్క్ ఏర్పాటుకు ముందు ఒక దశాబ్దకాలంపాటు కొలంబియాలో అంతర్యుద్ధం జరిగింది. ఈ సమయంలో 2లక్షల నుంచి 3లక్షల మంది ప్రజలు మరణించి ఉంటారని అంచనా. ఈ సమయాన్ని 'లా వయోలెన్సియా'గా పిలుస్తారు. అంటే.. హింస అని అర్థం. ఒక హత్య పదేళ్ల అంతర్యుద్ధానికి కారణమైంది! లిబరల్ పార్టీకి చెందిన అధ్యక్ష అభ్యర్థి జార్జ్ ఎలీసర్ గైతన్‌ను 1948లో కాల్చి చంపారు. ఈ హత్యతో కొలంబియా రాజధానిలో లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీల మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆనాడు ప్రారంభమైన అల్లర్లు పదేళ్లపాటు కొనసాగాయి. ప్రపంచంలోనే ఎక్కువ కాలం కొనసాగిన తిరుగుబాటు ఇది. ఫార్క్‌లో సభ్యులు ఎవరు? పేద రైతులను, పిల్లలను ఫార్క్ సంస్థ.. బలవంతంతో సభ్యులుగా చేర్చుకుంటోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి. కానీ వారంతా స్వచ్ఛందంగానే సభ్యులుగా చేరుతున్నట్లు ఫార్క్ చెప్పేది. 2016లో ఫార్క్ లెక్కల ప్రకారం వారి సైన్యంలో 15ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు 21మంది ఉన్నారు. చాలామంది సైనికులు గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు చెందిన పురుషులు, మహిళలే. తమ చేతికి తుపాకి ఇస్తామని ఊరిస్తారని ఫార్క్ నుంచి బయటకు వచ్చినవారు చెబుతున్నారు. కొకైన్ రవాణా, లేదా ఈ వ్యాపారం చేసేవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. 'ప్రపంచంలోనే ధనిక సంస్థ ఫార్క్' ప్రపంచంలోని తిరుగుబాటు సంస్థల్లో ఫార్క్ అత్యంత ధనవంతమైన సంస్థ అని విశ్లేషకుల అభిప్రాయం. వీరి అభిప్రాయాన్ని ఫార్క్ కమాండర్లు ఖండిస్తున్నారు. కొలంబియాలో కొకైన్ డ్రగ్ పెద్దమొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఈ డ్రగ్స్‌ను రవాణా చేయడం ద్వారా, లేదా ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేవారిపై పెద్దమొత్తంలో సుంకాలను వసూలు చేయడం ద్వారా డబ్బును సమకూర్చుకుంటున్నారు. మరోవైపున డబ్బుల కోసం కిడ్నాపులు కూడా చేస్తున్నారు. 2016లో శాంతి ఒప్పందం గత కొన్నేళ్లుగా కొలంబియా భద్రతా దళాల నుంచి ఫార్క్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా అందిస్తోన్న లక్షల డాలర్ల ఆర్థికసాయంలో అధిక భాగాన్ని, తిరుగుబాటుదార్లను అణిచివేయడానికి కొలంబియా ఖర్చుచేస్తోంది. గత దశాబ్ద కాలంలో ఫార్క్ వ్యవస్థాపకుడు మాన్యుఎల్ మరుల్యాండాతోపాటు మరికొందరు అగ్రనేతలు మరణించారు. ఫార్క్ సైనికుల సంఖ్య కూడా 20వేల నుంచి 7వేలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కోసం ఫార్క్ సంస్థనే ముందుకు వచ్చింది. 2016లో ఆయుధ విరమణ ఒప్పందం జరిగింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొలంబియా గెరిల్లా దళ నాయకుడు వాల్టర్ అరిజాలా ప్రభుత్వ బలగాల చేతిలో మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు ఇవాన్ దూకే శుక్రవారం ధ్రువీకరించారు. వాల్టర్ అరిజాలా.. కొలంబియాలో గ్వాచో అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. text: బౌన్సర్లతో భయపెట్టే తమ జట్టు బౌలర్‌ను రంగంలోకి దించారు.. ఆయన వేసిన బంతి ఆ పెద్దాయన ముఖానికి తాకి పళ్లు కదిలిపోయాయి. అయినా, ఆయన ఏమాత్రం చలించలేదు. ఆ తరువాత బంతికే సిక్సర్ బాదారు. మొత్తంగా ఆ ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేశాక కానీ శాంతించలేదు. ఇది ఈనాటి ఆట కాదు.. 1952‌లో బాంబే, హోల్కర్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్. యాభయ్యేడేళ్ల ఆ క్రికెట్ ఉక్కు మనిషి పేరు కల్నల్ సీకే నాయుడు. అప్పటికి హోల్కర్ జట్టుకు కెప్టెన్ ఆయన. భారతదేశంలో ఉక్కుమనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయి పటేల్ జన్మదినం, సీకే నాయుడు జన్మదినం ఒకటే(అక్టోబరు 31). అందుకే.. ఆరడుగుల ఎత్తుతో, బలిష్టమైన దేహంతో బలమైన షాట్లతో విరుచుకుపడే సీకే నాయుడిని క్రికెట్లో ఉక్కుమనిషిగా అభివర్ణిస్తుంటారు. సర్దార్ వల్లభాయి పటేల్‌తో సీకే నాయుడు భారత క్రికెట్‌కు మొట్టమొదటి కెప్టెన్‌.. తెలుగువారే భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రప్రథమ కెప్టెన్ సీకే నాయుడు. 1932 జూన్ 25వ తేదీన భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడింది. ఆ జట్టుకు సీకే నాయుడే కెప్టెన్. నాగపూర్‌లో పుట్టిపెరిగి.. అక్కడే స్కూలు రోజుల నుంచి క్రికెట్ ఆడి భారత జట్టుకు తొలి కెప్టెన్ అయిన సీకే తెలుగువారు. ఆయన పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. అందుకే జులై 24వ తేదీ మంగళవారం మచిలీపట్నంలో సీకే నాయుడి విగ్రహాన్ని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆవిష్కరించారు. భారత్ ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్న కొఠారి కనకయ్యనాయుడు(ఎడమ), నానిక్ అమరనాథ్ భరద్వాజ్(కుడి) 52 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ భారత క్రికెట్‌లో అరుదైన క్రికెటర్‌గా సీకే నాయుడి పేరు చెబుతారు. బౌలర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన బ్యాట్స్‌మన్‌గా మారి భారీ సిక్సర్లకు పెట్టింది పేరయ్యారు. అరవయ్యేళ్ల వయసు వరకు క్రికెట్ ఆడిన ఆయన యవ్వనంలో ఉండగా 1923లో సైన్యంలో పనిచేస్తున్న సమయంలో బ్రిటిష్ జట్టుతో ఆడుతూ స్కోరును ఉరకలేయించేవారు. భారత జట్టుకు చీఫ్ సెలక్టర్‌గానూ కొనసాగారు. చీఫ్ సెలక్టర్‌గా ఉంటూనే ఆయన 52 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్‌లో ఆయన ఏకంగా డబుల్ సెంచరీ చేశారు. సహచర క్రికెటర్లతో సీకే నాయుడు ముంబయి జింఖానా గ్రౌండ్స్‌లో ఓసారి ఎంసీసీ జట్టుతో ఆయన హోల్కర్ టీం తరఫున ఆడినప్పుడు జట్టు మొత్తం 187 పరుగులు చేస్తే అందులో సీకే ఒక్కరే 153 చేశారు. ఇక 1956-57 రంజీ ట్రోఫీలో ఆయన చివరిసారిగా ఆడారు. అప్పటికి ఆయన వయసు 62 ఏళ్లు. ఆ మ్యాచ్‌లో ఆయన 52 పరుగులు చేశారు. ఆ సందర్భంగా వినూ మన్కడ్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టడాన్ని ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తుంటారు. భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవల నేపథ్యంలో ఏటా కల్నల్ సీకే నాయుడు టోర్నీ నిర్వహిస్తున్నారు. అలాగే సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నెలకొల్పారు. సీకే నాయుడు సోదరుడు కొఠారి సుబ్రహ్మణ్యం నాయుడు ఆద్యుడు.. ఆరాధ్యుడు * భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రప్రథమ కెప్టెన్ సీకే నాయుడు. * పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి క్రికెటర్ కూడా ఆయనే. * వాణిజ్య ప్రకటనలకు క్రికెటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఆయనతోనే మొదలైంది. అప్పట్లో ఓ టీ కంపెనీ తమ ప్రకటనల్లో సీకే నాయుడి చిత్రాన్ని వాడుకునేది. * క్రికెట్ చరిత్రలో మొదటి మహిళా కామెంటేటర్ 'చంద్ర సీకే నాయుడు' ఆయన కుమార్తే. ‘సీకే నాయుడు ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో ఆమె పుస్తకం రాశారు. * సీకే నాయుడు సోదరుడు సీఎస్ నాయుడు(కొఠారి సుబ్రహ్మణ్య నాయుడు) కూడా భారత్ తరఫున ఆడారు. మరో ఇద్దరు సోదరులు కూడా క్రికెటర్లే అయినప్పటికీ భారత్‌కు ఆడలేదు. సీకే నాయుడు కుమారులు కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. ఆల్‌రౌండ్ ప్రతిభ కెరీర్‌లో 207 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సీకే నాయుడు మొత్తం 11,825 పరుగులు చేశారు. అందులో 26 సెంచరీలున్నాయి. బౌలర్‌గానూ ప్రతిభ చూపిన ఆయన కెరీర్లో 411 వికెట్లు తీశారు. అటు ఫీల్డింగ్‌లోనూ 170 క్యాచ్‌లు పట్టారు. ఏడు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడారు. పూర్తి పేరు: కఠారి కనకయ్య నాయుడు జననం: 1895, అక్టోబర్ 31న నాగపూర్‌లో మరణం: 1967, నవంబరు 14 సీకే నాయుడిది మచిలీపట్నమే: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సీకే నాయుడు స్మారకంగా ఆయన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. సీకే నాయుడి పూర్వీకులది మచిలీపట్నం కావడంతో ఆ ప్రఖ్యాత క్రికెటర్ విగ్రహాన్ని పట్టణంలో నెలకొల్పాలని చాలా కాలంగా అనుకుంటున్నామని.. అందులో భాగంగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించి జులై 24న ఆవిష్కరించామని ఆంధ్రప్రదేశ్ క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ‘బీబీసీ’కి తెలిపారు. భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కుంబ్లే శంకుస్థాపన చేశారు. రూ.8 కోట్లతో ఈ మినీ స్టేడియం నిర్మించనున్నామని మంత్రి చెప్పారు. మరో రూ.5 కోట్లతో స్విమింగ్‌పూల్ కూడా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) యాభయ్యేడేళ్ల ఒక పెద్దాయన బ్యాటు పట్టుకుని క్రీజులోకి వచ్చాడు.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకు మొదలైంది. text: ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భారత్ బంద్ పిలుపునివ్వడంతో, తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన పార్టీలు, టిఆర్ఎస్, వైయస్సార్సీపీ, తెలుగుదేశాలు బంద్’కు ఏదో రూపంలో మద్దతిచ్చాయి. కానీ వాళ్లు ముందు నుంచీ అదే స్టాండ్ లో ఉన్నారా? రాత్రికి రాత్రి మాట మార్చారా? టీఆర్ఎస్: పార్లమెంటులో వ్యతిరేకించింది టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో ఈ మూడు బిల్లులనూ వ్యతిరేకించింది. రెండు సభల్లోనూ ఆ పార్టీ సభ్యులు ఈ సాగు బిల్లులకు వ్యతరేకంగా మాట్లాడారు. ఇవి రైతులకు నష్టం చేస్తాయని టీఆర్ఎస్ వాదించింది. అదే విషయాన్ని బంద్‌కి మద్దతు ఇచ్చే క్రమంలో గుర్తు చేశారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు. బంద్‌కి మద్దతిస్తూ, తాము గతంలో ఈ చట్టాలను పార్లమెంటులో కూడా వ్యతిరేకించామని చెప్పారు. టీఆర్ఎస్ వైఖరి అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్: నాడు బిల్లులకు మద్దతు.. నేడు బంద్‌కు మద్దతు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఈ బిల్లులకు మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. ''వైయస్సార్ కాంగ్రెస్ తరఫున ఈ బిల్లుకు మద్దతిస్తున్నాను. గతంలో (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) రైతులను దళారుల దయకు వదిలేశారు. దళారులు సొంత లాభాలు చూసుకున్నారు. ఈ బిల్లుల్లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి’’ అని ఆయన అప్పుడు చెప్పారు. ‘‘రేయింబవళ్లు కష్టపడే రైతులకు సరైన ధర దొరుకుతందా లేదా అనే సమస్య ఉంది. కాంట్రాక్టు ఫార్మింగ్ విధానం వల్ల ముందే నిర్ణయించిన ధర వారికి దక్కుతుంది. రిస్కు కొనేవారికి వెళుతుంది. ఏపీఎంసీ (మార్కెట్ కమిటీలు) ప్రాంతంలోనే అమ్మాలన్న నిబంధన తగ్గుతుంది. పక్క జిల్లాలో కూడా పంట అమ్ముకోలేని విధానాన్ని తప్పిస్తుంది’’ అని రాజ్యసభలో ప్రసంగించినపుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అలాగే.. ‘‘(ఈ బిల్లుల్లో) కొన్ని సమస్యలు ఉన్నా, సమయాభావం వల్ల మీ దృష్టికి తీసుకురాలేకపోతున్నాను. ఒక ముఖ్యమైన అంశం ఇందులో పొగాకును కలపలేదు. పొగాకును కూడా ఈ బిల్లుల్లో చేర్చాలి'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తరువాత రాష్ట్రంలో తమ పార్టీ రైతుల కోసం చేస్తోన్న కార్యక్రమాలు వివరించారు. తమ ప్రభుత్వం, రాష్ట్రంలో, ఆరు పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చిందనీ, ఇదే విధంగా కేంద్రం కూడా ''వీలైనన్ని పంటలను కనీస మద్దతు ధరలో చేర్చాలి'' అని విజయసాయి కేంద్ర మంత్రిని కోరారు. అంతేకాదు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని సభలో చూపించిన ఆయన, ఆ పార్టీ ఈ బిల్లుల్లోని విధానాలకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టి, ఇప్పుడు (పార్లమెంటులో బిల్లులు వచ్చిన సమయంలో) హిపోక్రసీ ప్రదర్శిస్తోందనీ విమర్శించారు. కాంగ్రెస్ దళారులకు అనుకూల పార్టీయని ఆయన అన్నారు. కొన్ని రోజుల కిందట ఏ బిల్లులకు అనుకూలంగా వైయస్సార్సీపీ రెండు సభల్లోనూ మాట్లాడిందో, ఇప్పుడు అవే చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతోన్న బందుకు తాజాగా సంఘీభావం ప్రకటించింది. విజయసాయి ప్రసంగంలో చెప్పిన కనీస మద్దతు ధర అనే మాటను పట్టుకుని, తాము షరతులతో కూడిన మద్దతు ఇచ్చామని కొత్త వివరణ తీసుకువచ్చారు ఆ పార్టీ వ్యవసాయ మంత్రి కన్నబాబు. బంద్‌కి మద్దతు అంటే పార్టీ పరంగా కాదు, ఏకంగా ప్రభుత్వమే స్వయంగా బంద్ ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులూ మధ్యాహ్నం వరకూ ఆపేసింది. ''త్వరలో మద్దతు ధర విషయంలో రైతుల భయాలు పోగొట్టే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చిన వారి మనోభావాలు గౌరవిస్తున్నాం’’ అని కన్నబాబు చెప్పారు. ‘‘ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ బంద్ నిర్వహించుకుంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు ఒంటి గంట తరువాతే తెరవాలి. ఆర్టీసీ బస్సులూ ఒంటి గంట తరువాతే నడపాలి. విద్యా సంస్థలు మూసివేయాలి. బంద్ శాంతియుతంగా జరగడానికి రైతు సంఘాలు మద్దతివ్వాలి'' అంటూ ఆయన బంద్‌కి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఈ విషయంలో టీడీపీ యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ''ఇక్కడో విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు పార్లమెంటులో సాగు చట్టాలకు బేషరతు మద్దతిచ్చారు. కానీ వైయస్సార్సీపీ మాత్రం కనీస మద్దతు ధరకు భరోసా ఇవ్వాలనే షరతుపై మద్దతిచ్చింది. కానీ ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు, కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అప్పుడు మద్దతిచ్చి, ఇప్పుడు కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వడం అంటేనే ఆయన ఎంత దూరం దిగజారారో తెలుస్తోంది. కేంద్ర బిల్లుతో కలెక్టర్లకు ఏం సంబంధం? ఈ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబరులో ఒక్క లేఖ కూడా రాయలేదు. దిల్లీలో ధర్నాలు చేస్తాననీ చెప్పలేదు. ఇదంతా డ్రామా’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘ఈ సమస్యకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకుతుందని ఆశిస్తున్నాం. రైతు బావుంటేనే దేశం బావుంటంది. మాది రైతు అనుకూల ప్రభుత్వం'' అన్నారు కన్నబాబు. మా మద్దతు బేషరతు కాదని స్పష్టంగా చెప్పాం: వైసీపీ ఎంపీ ''ఈ బిల్లులకు టీడీపీ కూడా మద్దతిచ్చింది. మేము మా సలహాలను స్పష్టంగా చెప్పాం. మా మద్దతు బేషరతు కాదు. నేను చాలా పాయింట్లు చెప్పాను.'' అని బీబీసీతో చెప్పారు నరసరావుపేట వైయస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవ రాయలు. ''బిల్లుల్లో కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని కాపాడినట్టే, అదే స్థాయిలో రైతులనూ కాపాడాలి. రైతులకు స్వామినాథన్ కమిటీ ఫార్ములా ప్రకారం రేటు నిర్ధారించాలి. ఎగుమతులే కాకుండా, దేశీయ అవసరాల కోసం ఉత్పత్తులు ఉంచాలి. గుత్తాధిపపత్య ధోరణులను నివారించాలి. కార్పొరేట్లతో రైతులకు గొడవ వస్తే ఆర్డీవో దగ్గరకు వెళ్లాలన్నారు. వారికి ఇప్పటికే చాలా పని ఒత్తిడి ఉంది. వివాదాల పరిష్కారంలో రైతులు నష్టపోకుండా చూడాలి. మార్కెట్ కమిటీలు నిర్వీర్యం అవుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయలోటును కేంద్ర భర్తీ చేయాలి'' అని లోక్‌సభలో కేంద్రానికి చెప్పినట్టుగా బీబీసీకి వివరించారు కృష్ణదేవరాయలు. టీడీపీ: మద్దతిస్తున్నామని చెప్పలేదు.. వ్యతిరేకిస్తున్నామనీ చెప్పలేదు వైయస్సార్సీపీ కంటే టీడీపీ తెలివిగా వ్యవహరించింది. బిల్లుకు మద్దతిస్తున్నాం అని చెప్పి సభలో మాట్లాడారు విజయసాయి. కానీ టీడీపీ ఎంపీ కనకమేడల మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా బిల్లుకు మద్దతిస్తున్నామని చెప్పలేదు. అలాగని వ్యతిరేకిస్తున్నట్టూ చెప్పలేదు. అనేక ప్రశ్నలు ప్రభుత్వం ముందుంచారు. రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ ఈ బిల్లులపై మాట్లాడారు. ''(ఈ బిల్లుపై) సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. రాష్ట్రాలకు మార్కెట్ ఫీజు చెల్లించక్కర్లేదు. కార్పొరేట్ ప్రమేయం వల్ల కనీస మద్దతు ధర వ్యవస్థ పోతోంది. రైతులు కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. మొత్తం స్టాక్ తీసుకుని కార్పొరేట్లు రైతులను కంట్రోల్ చేస్తారు. దీంతో రైతులకు తక్కువ లాభం, వినియోగదారులు ఎక్కువ ఖర్చు పెట్టాలి’’ అని ఆయన నాడు పేర్కొన్నారు. ‘‘రైతుల రక్షణకు ఏమీ చేయలేదు. రైతుల ఆత్మహత్యలు ఆపాలి. ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ప్రభుత్వం ఈ అంశాలపై వివరణ ఇవ్వాలి'' అన్నారు కనకమేడల రవీంద్ర కుమార్ తన ప్రసంగంలో. రైతులకు అనుకూలంగా బిల్లులోని సమస్యలను లేవనెత్తిన ఆయన, తాను బిల్లుకు మద్దతిస్తున్నాను లేదా వ్యతిరేకిస్తున్నాను అనే మాట మాత్రం మాట్లాడకుండా తప్పించుకున్నారు. తాజాగా దేశవ్యాప్త బంద్ విషయం వచ్చేసరికి టీడీపీ మళ్లీ కొత్త వైఖరి తీసుకుంది. ఈ బంద్‌కు మద్దతిస్తున్నట్టు కానీ, లేదా దూరంగా ఉంటున్నట్టు కానీ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కానీ ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. ''మేం సంస్కరణలకు వ్యతిరేకం కాదు. మానవతతో కూడిన సంస్కరణలే మా నినాదం. ఈ బిల్లులపై సభలో మేం స్పష్టంగా చెప్పాం. మద్దతు ధరపై నియంత్రణ పోతోంది. రైతును గాలికి వదిలేయకుండా రైతులకు రక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే రైతును ఆదుకుంటుందని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశాం’’ అని టీడీపీ మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు బీబీసీతో పేర్కొన్నారు. పార్లమెంటులో చెప్పినదానికి కట్టుబడి ఉన్నాం: కాలువ శ్రీనివాసులు ‘‘రాజ్యసభలో విజయసాయి బీజేపీ సభ్యుల కంటే బలంగా ఆ బిల్లుకు మద్దతిచ్చారు. దీనిపై వైయస్సార్సీపీ అసెంబ్లీలో కూడా మిగతా పార్టీలతో చర్చించలేదు. మేం సంస్కరణలకు వ్యతిరేకం కాదు కాబట్టి చట్టాలను వ్యతిరేకించలేదు. కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులను స్పష్టంగా చెప్పాం. కానీ మా బలం తక్కువ. రైతుల సమస్యలపై మాకు కన్సర్న్ ఉంది. పార్లమెంటులో చెప్పినదానికి మేం వెనక్కుపోవడం లేదు. దానికి కట్టుబడి ఉన్నాం. రైతుల కోసం ముందుకు వెళ్తాం'' అని మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు వివరించారు. అయితే ఈ బిల్లులపై రెండు సభల్లోనూ ఓటింగ్ జరగలేదు. కేవలం మూజువాణి ఓటుతో బిల్లులు పాస్ అయ్యాయి. ఓటింగ్ జరిగి ఉంటే ఎవరు వ్యతిరేకంగా ఓటు వేశారో, ఎవరు అనుకూలంగా ఓటు వేశారో తేలి ఉండేది. మూజువాణి ఓటు కాబట్టి వారి ప్రసంగాల ఆధారంగా వారి వైఖరి నిర్ణయించాల్సి వచ్చింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వ్యవయసాయానికి సంబంధించిన మూడు కొత్త చట్టాలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ బిల్లులపై లోక్‌సభలో కంటే రాజ్యసభలో చర్చ - రచ్చ కూడా జరిగాయి. మొత్తానికి బిల్లులు పాస్ అయ్యాయి. దానిపై దేశవ్యాప్తంగా కొంత చర్చ జరిగినా, పంజాబ్ - హర్యానాలు మాత్రం తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. text: అడ్డదిడ్డంగా రోడ్డు దాటితే.. నీరు పడుద్ది రెడ్‌ సిగ్నల్ పడినప్పుడు ప్రజలు రోడ్డు దాటి ప్రమాదాలకు గురికాకుండా చైనా ప్రభుత్వం ఓ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఎవరైనా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తే వాళ్లపైన నీళ్లు పడేలా ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు దాటేవారిని మోషన్ సెన్సార్ల ఆధారంగా గుర్తించి ఆ వ్యవస్థ నీటిని వెదజల్లుతుంది. అడ్డదిడ్డంగా రోడ్డు దాటేవారి ఫొటోలను కూడా చాంగ్జీ ప్రావిన్స్‌లో పెద్ద తెరలపై ప్రసారం చేస్తారు. ప్రజలు నిబంధనలను ఉల్లంఘించకుండా చేసేందుకే ఈ ప్రయత్నం అని చైనా అంటోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'సిగ్నల్‌ను పట్టించుకోకుండా ఎలా పడితే అలా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే నీరు పడుద్ది జాగ్రత్త' అని చైనా ప్రభుత్వం ప్రజల్ని హెచ్చరిస్తోంది. text: పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారా? కానీ దత్తత తీసుకోవాలని వారు అనుకోగానే అది సులభంగా జరిగిపోదు. భారత్‌లో దత్తత తీసుకోవడం చట్టబద్ధమే అయినా, దానికి కొన్ని నియమ, నిబంధనలు కూడా ఉన్నాయి. దత్తత తీసుకోవాలనుకున్న దంపతులు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉండాలి. దంపతులకు దీర్ఘకాలిక వ్యాధులు ఏవీ ఉండకూడదు. ఆ దత్తతకు ఇద్దరూ అంగీకరించాలి. దత్తత తీసుకోవాలనుకున్న దంపతులకు తమ రక్తం పంచుకుని పుట్టిన ఉండకూడదు. ఒంటరిగా ఉన్న మహిళలు ఆడ, మగ ఇద్దరు పిల్లలనూ దత్తత తీసుకోవచ్చు కానీ ఒంటరిగా ఉన్న పురుషులు మాత్రం మగబిడ్డను మాత్రమే దత్తత తీసుకోడానికి అనుమతి ఉంటుంది. పెళ్లైన రెండేళ్ల తర్వాత మాత్రమే భార్యాభర్తలకు దత్తత తీసుకోడానికి అర్హత లభిస్తుంది. దంపతులకు వారు దత్తత తీసుకునే పిల్లలకు మధ్య వయసులో 25 ఏళ్ల వ్యత్యాసం ఉండాలి. అన్ని అర్హతలు ఉన్నా దంపతులు ఎవరైనా ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని దత్తత తీసుకోవడం కుదరదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పిల్లల కోసం ఎంతోకాలం ఎదురుచూసిన దంపతులు ఇక తమకు పిల్లలు పుట్టరని తెలిశాక, ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావిస్తారు. text: 'పరీక్షలు కదా ఒత్తిడికి గురై ఉంటుంది.. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనయినప్పుడు ఇలా నొప్పి తీవ్రంగా వస్తుంద'ని చెప్పారు డాక్టర్. ........... ప్రతి నెలా రెండు రోజులు నాగా పెడుతున్న నాగమ్మతో 'ఇలా పని ఎగ్గొడితే ఎలా.. నేను చేసుకోలేకే కదా నిన్ను పెట్టుకున్నది' వాపోయింది ఇంటావిడ ఈశ్వరి. 'ఏం చెయ్యనమ్మగారూ..! బయటజేరిన రెండురోజులూ పక్క దిగలేనమ్మా. వాంతులు కూడా అవుతాయి. డాక్టర్నడిగితే కొంత వయసు ముదిరితే తగ్గుతుందంటున్నారు' చెప్పింది నాగమ్మ. ........... పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగని విమలని వాళ్లత్తగారు పొద్దున్నుంచి ఒకటే సతాయిస్తోంది. 'బహిష్టు సమయంలో కడుపులో నొప్పంటావు అందుకే పిల్లలు పుట్టటం లేదు' అంటోంది. ఆవిడ పోరు పడలేక విమల భర్తను తీసుకుని డాక్టర్ దగ్గరకెళ్లింది. 'బహిష్టు సమయంలో కడుపు నొప్పి వస్తే పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు? అసాధారణ పరిస్థితులలో(ఎండోమెట్రియోసిస్, కొన్ని ఇన్ఫెక్షన్స్) మాత్రమే అలాంటి సమస్య వస్తుంద'ని లేడీ డాక్టరు స్పష్టంగా చెప్పారు. కడుపు నొప్పి రావడం ఒకరకంగా అండం విడుదలకు సూచన అని, అండం విడుదలకాని సందర్భంలో వచ్చే బహిష్టులలో కడుపు నొప్పి ఉండదని చెబుతూ 'అండం విడుదలయితేనేగా పిల్లలు పుట్టే అవకాశముంటుంది, అంతేకానీ, కడుపు నొప్పి వచ్చినంత మాత్రాన పిల్లలు పుట్టరని కాదు, ఏదైనా వ్యాధి వల్ల నొప్పి వస్తోందా.. లేదా సహజంగా వచ్చే నొప్పేనా అన్నది మొదట నిర్ధారించుకోవాల'ని చెప్పారామె. బహిష్టు లేదా పిరియడ్ అంటే ఏంటి? చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఈ 'బహిష్టు సమయంలో కడుపునొప్పి'. దీన్నే వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు. అసలు ఈ నొప్పి కథేమిటో తెలుసుకుందాం.. బహిష్టు అంటే యుక్త వయసు ఆడపిల్లలలో నెలనెలా కనిపించే రక్తస్రావం. ఇది 50-200 మిల్లీ లీటర్లు ఉంటుంది. గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై, అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు సంసిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన రక్తసరఫరాను, పోషకాలను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి తోడ్పడుతుంది. గర్భధారణ జరగని పరిస్థితులలో ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బయటకు విసర్జించబడుతుంది. దాంతోపాటు కొంత వ్యర్థ కణజాలాలు, అందులో ఉండే రక్తనాళాల కొనలు కూడా గర్భాశయ ద్వారం ద్వారా బయటకు విసర్జించబడతాయి. ఇదంతా హార్మోన్ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ముఖ్యమైనవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్. నెల మొదటి భాగం ఈస్ట్రోజన్ అధీనంలో.. రెండో భాగం అంటే 14 నుంచి 28 రోజుల వరకు ప్రొజెస్టిరోన్ అధీనంలో ఉంటుంది. మరి.. కడుపు నొప్పి ఎందుకొస్తుంది? బహిష్టు సమయంలో వచ్చే ఈ నొప్పిని వైద్య పరిభాషలో 'డిస్మెనోరియా' అంటారు. ఇది సాధారణంగా రక్తస్రావంతో కానీ.. రక్తస్రావానికి కొద్ది గంటల ముందు నుంచి కానీ మొదలై ఒకట్రెండు రోజులు ఉంటుంది. కొద్దిమందిలో రక్తస్రావం మొదలు కావడానికి ఒకట్రెండు రోజుల ముందునుంచే నొప్పి వస్తుంది. దీనికి కారణం గర్భాశయ లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్ విచ్ఛిన్నమై బయటకు వచ్చేటపుడు ఆ కణజాలం నుంచి విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ F2ఆల్ఫా అనే పదార్థం. దీనివల్ల గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. అప్పుడు గర్భాశయ కండరాలు ముడుచుకోవడం వల్ల రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో గర్భాశయ కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. ఫలితం కడుపు నొప్పి. గర్భాశయ ద్వారం చిన్నదిగా, సన్నగా ఉంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి ఏ వయసు వారికి వస్తుంది? సాధారణంగా యుక్త వయసు వారిలో అంటే 14-25 ఏళ్ల మధ్య ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. రజస్వల అయిన మొదటి రెండేళ్లు నొప్పి ఉండకపోవచ్చు. ఆ సమయంలో అండం విడుదల కాకుండానే హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల వల్ల మాత్రమే బహిష్టు అవుతుంది. అనంతరం కొన్నాళ్లకు అండం కూడా విడుదల కావడం ప్రారంభమైతే కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మధ్య వయసు వారి విషయానికొస్తే.. ఒక్కోసారి ఇతర వ్యాధులేమైనా కూడా కారణం కావొచ్చు. ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నొప్పి వస్తుంది. లక్షణాలు ఏంటి? ఈ డిస్మెనోరియాని రెండు రకాలుగా వర్గీకరిస్తారు 1) ప్రైమరీ డిస్మెనోరియా యుక్త వయసులో నూటికి యాభై మందిలో కనిపించే నొప్పి ఇది. దీనికి ప్రత్యేక కారణమంటూ ఉండదు. వయసు పెరిగాక, పిల్లలు కలిగాక ఈ సమస్య దానికదే తగ్గిపోతుంది. 2) సెకండరీ డిస్మెనోరియా: దీనికి కొన్ని రకాల వ్యాధులు కారణం * ఎండోమెట్రియోసిస్: ఈ వ్యాధి వల్ల కడుపునొప్పి తీవ్రంగా ఉండడమే కాకుండా సంతాన లేమికీ దారి తీయొచ్చు. దీనికి కారణం గర్భాశయ కుహరాన్ని కప్పి ఉంచే ఎండోమెట్రియమ్ పొర అసహజంగా, అసాధారణంగా గర్భాశయం వెలుపలా.. పొత్తి కడుపులోని అండాశయం తదితర అవయవాలపై వ్యాపించి ఆయా కణజాలాలలో వాపుని కలగజేసి వాటి విధులకు ఆటంకం కలిగించడం. దీనివల్ల పీరియడ్స్‌లో క్రమబద్ధత లోపించడం, సంతానోత్పత్తి దెబ్బతినడం జరుగుతాయి. కాబట్టి బహిష్టు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ కారణమేమో తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని నిర్ధరించుకోవాలి. * ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయం కండరాలలో వచ్చే కణుతులు. వీటివలన గర్భాశయం పరిమాణం పెరుగుతుంది. * ఎడినోమయోసిస్ : ఈ సమస్య ఉన్నవారిలో ఎండోమెట్రియమ్ పొర గర్భాశయ గోడలకు పరిమితం కాకుండా కండరాలలోనికి చొచ్చుకునిపోతుంది. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్తస్రావం కలుగుతాయి. * జననేంద్రియ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్లు: లైంగిక సంబంధాల వల్ల వ్యాపించే సుఖవ్యాధులు కూడా సెకండరీ డిస్మెనోరియాకి కారణాలు. పిల్లలు పుడితే డిస్మెనోరియా తగ్గుతుందా? పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం కానీ పిల్లలు పుట్టాకా, కొంత వయసు పెరిగాక తగ్గే అవకాశముంది. వ్యాధి నిర్ధారణ ఎలా? అనుభవజ్ఞులైన వైద్యులు రోగి నుంచి అవసరమైన సమాచారం సేకరించడం ద్వారా, కొన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధరణ చేస్తారు. దీనికి ఉపకరించే పరీక్షలు.. * జననేంద్రియాల లోపలి పరీక్ష * కొన్ని రకాల రక్తపరీక్షలు * అల్ట్రాసౌండ్ స్కానింగ్ * లాప్రోస్కోపీ.. ఇది ఎండోమెట్రియోసిస్‌ వ్యాధి నిర్ధరణలో, చికిత్సలో కూడా ఉపకరిస్తుంది. పొత్తికడుపు, నడుము మధ్య వేడినీళ్ల బ్యాగుతో కాపడం పెడితే కడుపు నొప్పి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? * సమస్యను అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. * వేడినీళ్ల స్నానం చేయడం.. పొత్తికడుపు, నడుము మధ్య వేడినీళ్ల బ్యాగుతో కాపడం పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది. * క్రమంతప్పని వ్యాయామం.. కాఫీ వినియోగం తగ్గించడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల రక్త సరఫరా పెరిగి నొప్పి తీవ్రత తగ్గే అవకాశముంది. * సిగరెట్, ఆల్కహాల్ అలవాటుంటే వెంటనే మానేయాలి. మందులు ఉన్నాయా? * ఇక మందుల విషయానికొస్తే నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాండిన్స్ స్థాయిని తగ్గించే మందులు సురక్షితమైనవి. వీటిని డాక్టరు సలహాపైనే వాడాలి. * నొప్పి బాగా తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహాపై ఓసీ పిల్స్ కానీ, ప్రొజెస్టిరోన్ ఉన్న లూప్ కానీ వాడొచ్చు. * వ్యాధుల కారణంగా వచ్చే కడుపు నొప్పికి ఆ వ్యాధిని నిర్ధారణ చేసి తగిన చికిత్స చేయాలి. బహిష్టు సమయంలో కడుపునొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అది ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన చికిత్స తీసుకుంటే మహిళల ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఎంతో విలువైన పనిగంటలు కూడా వృథా కాకుండా ఉంటాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పదో తరగతి పరీక్షలు రాస్తూ కడుపు నొప్పని మధ్యలోనే ఇంటికి పరుగెత్తుకొచ్చిన ప్రేమను చూసి ఇంట్లో అంతా కంగారుపడ్డారు. పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతున్న అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసికెళ్తే కంగారేమీ లేదని.. బహిష్టు సమయంలో వచ్చే నొప్పేనని చెప్పారాయన. text: మరోవైపు.. హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుడు ఒకరు తమకు అంతర్జాతీయ మద్దుతు అందించాలని ప్రాధేయపడ్డారు. హాంగ్‌కాంగ్ పౌరులు 30 లక్షల మంది వరకూ బ్రిటన్ పౌరసత్వం అందిస్తామంటూ యూకే చేసిన ప్రకటన.. ''తీవ్రంగా జోక్యం చేసుకోవటమే''నని చైనా రాయబారి లీయు షిజామింగ్ పేర్కొన్నారు. చైనా వివాదాస్పదమైన కొత్త చట్టం అమలులోకి తెచ్చినపుడు బ్రిటన్ ఈ పౌరసత్వ ప్రకటన చేసింది. పాక్షిక స్వయంపత్రిపత్తి ప్రాంతంగా హాంగ్‌కాంగ్‌కు గల స్వాతంత్ర్యాలను చైనా విధించిన కొత్త చట్టం తుడిచిపెడుతుందని ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో తమకు మరింత ఎక్కువ మద్దతు కావాలని.. చైనాకు లొంగిపోవద్దని హాంగ్‌కాంగ్ వాసులతో పాటు, ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య ఉద్యమకారుడు జాషువా వాంగ్ ఇంతకుముందు పిలుపునిచ్చారు. అయితే.. హాంగ్‌కాంగ్ పౌరులకు పౌరసత్వం కల్పిస్తామన్న ప్రతిపాదనను బ్రిటన్ పునఃపరిశీలిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చైనా రాయబారి లియూ చెప్పారు. ''హాంగ్‌కాంగ్ వ్యవహారాలపై బ్రిటన్ ప్రభుత్వం బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది'' అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత.. దీనిపై ఖచ్చితంగా ఎలా స్పందించాలనే అంశంపై చైనా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హాంగ్‌కాంగ్ ప్రాంతాన్ని చైనాకు తిరిగి అప్పగించే సమయంలో.. ఆ ప్రాంతానికి 50 ఏళ్ల పాటు నిర్దిష్ట స్వాతంత్ర్యాలు అందించేలా 1997లో చేసుకున్న ఒప్పందాన్ని కాపాడాలని చైనాకు బ్రిటన్ విజ్ఞప్తి చేసింది. హాంగ్‌కాంగ్‌లో కొత్త చట్టం విధించటం పట్ల అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. గత వారంలో అమలులోకి తెచ్చిన ఈ చట్టం.. హాంగ్‌కాంగ్ భూభాగంలో 'వేర్పాటు, విద్రోహం, ఉగ్రవాదాలు' లక్ష్యంగా చేసుకుంది. ఆ నేరాలకు గాను గరిష్టంగా జీవితఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. జాషువా వాంగ్ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు ఈ చట్టం వాస్తవానికి వాక్‌స్వాతంత్ర్యాన్ని కాలరాస్తుందని వాంగ్ వంటి వ్యతిరేకులు అంటున్నారు. అలాంటిదేమీ జరగదని చైనా తిరస్కరిస్తోంది. జాషువా వాంగ్‌తో పాటు మరో ఇద్దరిని సోమవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. వారిపై అక్రమ సమావేశం అభియోగాలు మోపారు. ఈ చట్టం ఇప్పటికే భయానకమైన ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌లోని ప్రభుత్వ గ్రంథాలయాల నుంచి ప్రజాస్వామ్య అనుకూలురు రాసిన పుస్తకాలను గత వారాంతంలో తొలగించారు. అయితే పోరాటం కొనసాగించాలని జాషువా వాంగ్ కృతనిశ్చయంతో ఉన్నారు. ''ఇది చాలా కష్టతరమైన పోరాటమని మాకు తెలుసు. కానీ ఏదేమైనా అంతర్జాతీయ సమాజంలో మా మిత్రులు తమ అంతర్జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తారు'' అని ఆయన కోర్టు వెలుపల విలేకరులతో చెప్పారు. ''ఈ వారాంతంలో జరుగనున్న ప్రైమరీ ఎన్నికలో హాంగ్‌కాంగ్ ప్రజలు ఓటువేయాలని మేం ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హాంగ్‌కాంగ్‌లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ మరింత ఎక్కువ మంది.. చైనాకు లొంగిపోవటం జరగదని ఆ దేశానికి తెలిసేలా చేయాలని మేం కోరుతున్నాం'' అని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ చట్టం? చైనా అమలులోకి తెచ్చిన కొత్త చట్టం.. హాంగ్‌కాంగ్ మీద గతంలో చైనాకు లేని విస్తృత అధికారాలు ఆ దేశానికి లభిస్తాయి. ఈ చట్టం ప్రకారం.. చైనా కేంద్ర ప్రభుత్వం మీద, హాంగ్‌కాంగ్ ప్రాంతీయ ప్రభుత్వం మీద ద్వేషాన్ని ప్రేరేపించటం నేరం అవుతుంది. వేర్పాటు చర్య, కేంద్ర ప్రభుత్వం పట్ల విద్రోహం, ఉగ్రవాదం, విదేశీ లేదా బయటి శక్తులతో కుమ్మక్కు వంటి పనులన్నీ నేరాలు అవుతాయి. నిందితుల మీద రహస్య విచారణలకు, అనుమానితుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేయటానికి, వారిని చైనా ప్రధాన భూభాగంలో విచారించటానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది. జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను పరిష్కరించటానికి హాంగ్ కాంగ్‌లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కార్యాలయం.. హాంగ్‌కాంగ్ స్కూళ్లలో జాతీయ భద్రతకు సంబంధించిన విద్య తదితర అంశాలను కూడా పర్యవేక్షిస్తుంది. నిరసనల్లో ఆస్తులను ధ్వంసం చేయటం వంటి వాటిని ఉగ్రవాదంగా పరిగణించవచ్చు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు యూజర్ల వివరాలను పోలీసులు అడిగినప్పుడు అందించాల్సి రావచ్చు. ఈ చట్టాలను అమలు చేయటం కోసం హాంగ్ కాంగ్ నగరం సొంతంగా జాతీయ భద్రత కమిషన్‌ను కూడా ఏఱ్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి చైనా ఒక సలహాదారును నియమిస్తుంది. జాతీయ భద్రత కేసులను విచారించే న్యాయమూర్తులను నియమించే అధికారం హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు ఉంటుంది. ఈ చర్య కారణంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద భయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా.. ఈ చట్టానికి ఎలా భాష్యం చెప్పాలనే అంశం మీద చైనాకే అధికారం ఉంటుంది. ఈ చట్టంలోని ఏవైనా అంశాలకు హాంగ్ కాంగ్‌లోని ఏవైనా చట్టాలకు మధ్య తేడాలు ఉన్నట్లయితే చైనా చట్టానికే ప్రాధాన్యత లభిస్తుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హాంగ్‌కాంగ్‌లో కొత్త భద్రతా చట్టాన్ని అమలులోకి తెచ్చిన చైనా.. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని బ్రిటన్‌కు చైనా హెచ్చరించింది. text: చంద్రముఖి ఆమె బుధవారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌లో కనిపించడంతో పోలీసులు బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. తర్వాత గురువారం ఆమెను హైకోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. ‘‘నేను మంగళవారం ఆటో ఎక్కి అబిడ్స్ వెళ్ళాను. అక్కడ ఇంకో ఆటో ఎక్కాను. కానీ అదే ఆటోలో ఇంకో ఇద్దరు ఎక్కి నాకు కత్తి చూపించి బెదిరించారు. ఒక ఇయర్ఫోన్ దాంతో పాటు ఒక ఫోన్ నాతో ఉంచారు. ఐదు నిముషాల వరకు ఎం జరుగుతోందో నాకు అర్ధం కాలేదు. కానీ చెవిలో నాతో మాట్లాడుతున్నతను నన్ను బెదిరించాడు. ప్రణయిని చంపినట్టే నన్ను చంపుతానని బెదిరించారు. కాబట్టి వారు చెప్పినట్టు చేస్తూ వెళ్ళాను. నేను బస్సు లో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ నుంచి విజయవాడ అక్కడ నుంచి నెల్లూరు అక్కడ నుంచి చెన్నై చేరాను. చెన్నై చేరాక చీకటిగా ఉండటంతో చెవిలో ఉన్న హెడ్ఫోన్ అక్కడే పడేసి ఆటో ఎక్కి పారిపోయాను. ఎవరు ఫాలో అవట్లేదు అని నిర్దారించుకొని తిరుపతి బస్సు ఎక్కి అక్కడినుంచి హైదరాబాద్ చేరుకున్నాను." అని తెలిపారు. చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడంతో కోర్టు చంద్రముఖిని తమ ముందు హాజరుపరచాలని కోరింది. దీంతో తెలంగాణ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి చంద్రముఖి ఆచూకీ కోసం గాలింపులు జరిపారు. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థిగా చంద్రముఖి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల సంఘాలు, బీఎల్ఎఫ్ కార్యకర్తలు ప్రచారంలో ఆమెకు సహకరిస్తున్నారు. ‘‘తమ్ముడు, నీ ఓటు నాకే వేయ్యాలి. మమ్నల్ని మనుషులుగా గుర్తించాలి అంటూ మెడలో నీలం రంగు కండువా వేసుకొని ఓ మహిళ మా ఇంటికి ప్రచారానికి వచ్చారు. టీవీలో చూశాకే ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది’ అని గోషామహల్‌కు చెందిన రమేశ్... చంద్రముఖి గురించి బీబీసీతో అన్నారు. 1994లో ట్రాన్స్ జెండర్లను థర్ట్‌జెండర్లుగా గుర్తించిన ఎన్నికల సంఘం వారికి ఓటు హక్కు కల్పించడంతో ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిథ్యం మొదలైంది. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 2,739 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఓటర్ల నుంచి అభ్యర్థుల వరకు... వివక్ష... విస్మరణ...నుంచి రాజ్యాధికారం దిశగా ట్రాన్స్‌జెండర్లు అడుగులు వేస్తున్నారు. భారత ఎన్నికల్లో థర్డ్ జెండర్ల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కేవలం ఓటర్లుగానే కాదు అభ్యర్థులుగానూ పోటీపడుతున్నారు. భారత ఎన్నికల సంఘం 1994 నుంచి ట్రాన్స్‌జెండర్లకు ఓటు హక్కు కల్పించింది. అంతకు ముందు ట్రాన్స్ జెండర్లను ఎన్నికల సంఘం మహిళల కిందనే పరిగణిస్తూ వారి వివరాలను ఓటర్లు లిస్టులో పేర్కొనేవారు. అయితే, సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు 2009 నుంచి ఎన్నికల సంఘం థర్ట్ జెండర్ కాలమ్‌ను ఓటరు లిస్టులో ప్రవేశపెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. షబ్నం మౌసీ చరిత్ర సృష్టించిన షబ్నం మౌసీ భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన ట్రాన్స్ జెండర్‌గా షబ్నం మౌసీ చరిత్ర సృష్టించారు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని సోహగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో షబ్నం మౌసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 17,800 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అయితే, 2008 ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్‌పై అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మధు కిన్నార్...తొలి ట్రాన్స్ జెండర్ మేయర్ ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2015లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ మధు కిన్నార్ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులను కాదని ప్రజలు మధు కిన్నార్‌కే మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి మహవీర్ గురుజీ కంటే 4000 ఓట్ల మెజారిటీని సాధించిన కిన్నార్ దేశంలోని తొలి ట్రాన్స్ జెండర్ మేయర్‌గా చరిత్ర సృష్టించారు. రాహుల్ గాంధీపై పోటీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకరావచ్చని ట్రాన్స్ జెండర్లు భావిస్తున్నారు. ఇందు కోసం వారు కీలకమైన నేతలు పోటీచేసే నియోజకవర్గాల నుంచే బరిలోకి దిగుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ సోనమ్ కిన్నర్ రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన ఆమేథి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇదే ఎన్నికల్లో తమిళనాడులోని మధురై నుంచి శరత్ కుమార్ కు చెందిన సముతువ మక్కల్ కట్చీ పార్టీ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ భారతి కన్నమ్మ పోటీ చేశారు. కీలకమైన ఆర్కే నగర్ నుంచి దేవి అనే మరో ట్రాన్స్ జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2017లో ఉత్తరాఖండ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజనీ రావత్ స్వతంత్ర అభ్యర్థిగా రాయిపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2012లో ఉత్తర ప్రదేశ్‌లోని ఆయోధ్య అసెంబ్లీస్థానం నుంచి ట్రాన్స్ జెండర్ గుల్షన్ బిందో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బిందో గెలవనప్పటికీ 22 వేల ఓట్లు సాధించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ‘మా హక్కుల కోసం పోరాడటానికి ఎన్నికలను ఒక వేదికగా ఎంచుకున్నా’ అని చంద్రముఖి తన ప్రచారంలో చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి ట్రాన్స్ జెండర్ ఆమె. ఎన్నికల్లో పోటీకి దిగడం, అదృశ్యమై తిరిగి రావడంతో చంద్రముఖి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. text: కంపెనీ షేర్ల ధర చాలా ఎక్కువగా ఉందని ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించటమే దీనికి కారణం. ఇన్వెస్టర్లు వెంటనే కంపెనీ నుంచి తప్పుకోవటంతో.. మస్క్ కంపెనీలోని తన సొంత వాటాలో కూడా 300 కోట్ల డాలర్లు పోగొట్టుకున్నారు. తన ఆస్తులను అమ్మేస్తున్నట్లు చెప్తూ పలు ట్వీట్లు చేసిన మస్క్.. ‘‘టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువగా ఉంది’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 మరొక ట్వీట్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ తన మీద కోపంగా ఉన్నారని, మరొక ట్వీట్‌లో ‘‘కొడుగడుతున్న చైతన్య క్రాంతికి వ్యతిరేకంగా పోరాటం.. పోరాటం’’ అంటూ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో టెస్లా భవిష్యత్తు గురించి మస్క్ 2018లో చేసిన ఒక ట్వీట్ కారణంగా.. ఆ కంపెనీ మీద నియంత్రణ సంస్థ 2 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. అంతేకాదు.. ఇకపై తాను చేసే ట్వీట్లను న్యాయవాదులు ముందుగానే పరిశీలించానికి కూడా ఆయన అంగీకరించాల్సి వచ్చింది. ‘తలనొప్పి’ ‘షేర్ ధర గురించి చేసిన ట్వీట్.. హాస్యానికి చేశారా? దానిని న్యాయవాదులు ముందుగా పరిశీలించి ఆమోదించారా?’ అని ఆయనను అడిగితే.. ఆయన ‘లేదు’ అని బదులిచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో తెలిపింది. టెస్లా షేర్ ధర ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. సంస్థ విలువ దాదాపు 10,000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ స్థాయికి చేరుకుంటే.. సంస్థ యజమాని కోట్లాది డాలర్లు బోనస్‌గా చెల్లించాల్సి వస్తుంది. ‘‘మస్క్ వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉంటాయని మనం అనకుంటాం. పెట్టుబడిదారులకు అది పెద్ద తలనొప్పే. ఆయన ఈ చర్యలతో వాల్ స్ట్రీట్ చాలా విసుగు చెందింది’’ అని వెడ్‌బుష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు డానియల్ ఐవ్స్ రాయిటర్స్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ 2018లో.. టెస్లాను స్టాక్ మార్కెట్ నుంచి తప్పించి వ్యక్తిగతం చేసుకోవటానికి అవసరమైన నిధులు సమకూర్చుకున్నట్లు ట్వీట్ చేశారు. దానివల్ల కూడా కంపెనీ షేర్ల ధరలు ఎగుడుదిగుళ్లకు లోనయ్యాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్.. ఇది మార్కెట్ ను ప్రభావితం చేసే వ్యాఖ్య అని తీర్పు చెప్తూ ఆయనకు జరిమానా విధించింది. మళ్లీ ఇటువంటివి జరగకుండా ఉండటానికి టెస్లా మీద ఆంక్షలు విధించింది. అయితే.. ప్రైవేటుగా వెళతానన్న ఎలాన్ ట్వీట్ ఉద్దేశం తమను మోసం చేయటమేనంటూ షేర్ హోల్డర్లు వేసిన కేసును టెస్లా, మస్క్ ఎదుర్కోక తప్పదని ఫెడరల్ జడ్జి ఒకరు గత నెలలో స్పష్టంచేశారు. మస్క్ గత వారంలో.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో ఇళ్లలోనే ఉండాలంటూ విధించిన ఆంక్షలను విమర్శస్తూ ట్వీట్ చేశారు. గత ఏడాది ఒక బ్రిటిష్ డ్రైవర్ను ‘పీడో గై’ (పిల్లలమీద లైంగిక దాడికి పాల్పడే వ్యక్తి) అని అభివర్ణిస్తూ ట్వీట్ చేయటంతో మస్క్ కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. నటుడు, ప్రొడ్యూసర్ జీన్ వైల్డర్ నుంచి 2013లో తాను కొనుగోలు చేసిన తన ఇల్లు కూడా తాను విక్రయించే ఆస్తుల్లో ఉందని మస్క్ పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టెస్లా సంస్థ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో.. ఆయన కార్ల కంపెనీ విలువ 1400 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1.05 లక్షలు) ఆవిరైపోయింది. text: గత ఆరు నెలలుగా సుమారు 80,000 నుంచి లక్ష మంది వైద్య సిబ్బంది తెలంగాణాలో కోవిడ్ విధుల్లో ఉన్నారు. సాధారణ ప్రజల కంటే కోవిడ్ రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది వైరస్ బారిన పడే అవకాశం 33 శాతం ఎక్కువగా ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే పేర్కొంది. ఇటీవల ఖమ్మం జిల్లా మణుగూరు కోవిడ్ కేంద్రంలో వైద్యునిగా సేవలు అందించిన 35 ఏళ్ల నరేష్ కుమార్ కోవిడ్ బారిన పడి మరణించారు. వైద్య సిబ్బందిలో పెరుగుతున్న పాజిటివ్ రేటుకు గల కారణాలపై ‘బీబీసీ న్యూస్ తెలుగు’ కొందరు డాక్టర్లతో మాట్లాడింది. కోవిడ్ చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు, శానిటైజర్లు కానీ లేవని యాదాద్రి జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యాధికారి ఒకరు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికే పీపీఈ కిట్లు సరఫరా చేస్తున్నారు తప్ప కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించడానికి వైద్య సిబ్బంది వెళ్లేటప్పుడు మాత్రం ఎలాంటి రక్షణ పరికరాలు లభించడం లేదని ఆమె చెప్పారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఎన్-95 మాస్కులు అవసరమైన స్థాయిలో లభించకపోవడమే వైద్య సిబ్బంది వైరస్ బారిన పడడానికి కారణమని చెప్పొచ్చని ఆమె అన్నారు. ఇవన్నీసరిపడా అందుబాటులో ఉంటే సిబ్బందిలో పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. “కోవిడ్ సమయంలో ఒక కాన్పు చేయాలంటే పీపీఈ కిట్ తప్పనిసరిగా ధరించాలి. కానీ, మాకు తగినన్ని కిట్లు లేవు. ఈ ముప్పు భరించలేక సొంత డబ్బులతో పీపీఈ కిట్లు కొనుక్కుని వేసుకుంటున్నాను. కానీ, ఒక ఏఎన్ఎం కానీ, ఆశ వర్కర్ కానీ వారికి వచ్చే జీతాలతో సొంతంగా ఎలా కొనుక్కోగలరు”? అని ఆమె ప్రశ్నించారు. గొంతెత్తి ప్రశ్నిస్తే వెంటనే అధికారులు తనిఖీలకు వచ్చి లోపాలు వెతికి మరీ మెమో ఇస్తారనే భయంతో ఎవరూ నోరు విప్పి మాట్లాడరని ఆమె అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక 30 మంది సిబ్బంది ఉంటే 10 పీపీఈ కిట్లు మాత్రమే సరఫరా చేస్తే అవి ఎవరికి ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. తనకు 9 నెలల వయసున్న కవల పిల్లలు, 80 ఏళ్ల తల్లి ఉన్నారని.. ప్రతి రోజు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని విధులకు హాజరవుతున్నామని చెప్పారు. ఎన్ని నిధులైనా విడుదల చేస్తామని కలెక్టరు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ, పరికరాల సరఫరా మాత్రం జరగడం లేదని ఆరోపించారు. ఇదే తరహా అభిప్రాయాన్ని దిల్లీకి చెందిన డాక్టర్ ఆనంద్ కుమార్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం, రోగుల సంఖ్యకు తగినంత సిబ్బంది లేకపోవడం.. సిబ్బందికి సరైన అవగాహన ఇవ్వలేకపోవడం లాంటివి వైద్య సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడటానికి గల కారణాలని ఆనంద్ కుమార్ ‘‘బీబీసీ న్యూస్ తెలుగు’’కు వివరించారు. సిబ్బందికి ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు తగినన్ని అందించలేకపోవడం, సిబ్బందిపై ఎక్కువగా పని భారం మోపడం వల్ల కోవిడ్ సోకే ప్రమాదం ఉందన్నారు. హాస్పిటళ్లలోనే కాకుండా బయటకు వెళ్లినప్పుడు కూడా కొందరు సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కొంత వరకు కారణమని అన్నారు. హాస్పిటళ్లలో కరోనా రోగులకు బెడ్లు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమర్చకపోవడం, కోవిడ్ విధుల తర్వాత కొంత మంది వైద్య సిబ్బంది క్వారంటైన్ నిబంధనలు సరిగా పాటించక పోవడంకూడా పాజిటివ్ శాతం పెరగడానికి కారణం కావొచ్చన్నారు. అయితే, దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కన్సల్టెంట్ ఫిజీషియన్‌గా పని చేస్తున్న డాక్టర్ మధు చిత్తర్వు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో వైద్య సిబ్బందితో పోల్చితే సాధారణ ప్రజలకు చేస్తున్న టెస్టులు తక్కువ కావడం వల్ల సాపేక్షంగా ఆరోగ్య సిబ్బందిలో పాజిటివ్ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు. వైద్య సిబ్బంది వైరల్ లోడ్‌కు ఎక్కువగా ఎక్సపోజ్ కావడం వల్ల కూడా దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారాయన. మొదట్లో కేవలం ప్రభుత్వ హాస్పిటళ్లలోనే కోవిడ్‌కు చికిత్స ఇవ్వడం వలన కూడా పూర్తి భారమంతా ప్రభుత్వ వైద్య సిబ్బందిపై పడిందని, కానీ, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా చికిత్స లభిస్తుండటం వలన పరిస్థితి మెరుగు పడిందని చెప్పవచ్చని ఆయన అన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇదే అంశం పై బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు. ప్రస్తుతం డాక్టర్లు ధరిస్తున్న ఎన్ 95 మాస్కులు పూర్తిగా సురక్షితం కాదని, అవి గట్టిగా బంధించి ధరిస్తే కేవలం 95 శాతం సురక్షితమని చెప్పారు. లేదంటే ముక్కు పక్క భాగం నుంచి వైరస్ దాడి చేస్తుందని ఆయన అన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో పని చేసే వైద్య సిబ్బందికి ఒక ఎన్ 95 మాస్క్ వైరస్ నుంచి రక్షణ ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. చాలా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదని అన్నారు. పవర్డ్ ఎయిర్ ప్యూరిఫయింగ్ రెస్పిరేటర్ (పీఏపీఆర్) అయితే 99.97 శాతం సురక్షితంగా పని చేస్తుందని చెప్పారు. సెప్టెంబరు 4న తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన వైద్య బులెటిన్ ప్రకారం తెలంగాణలో 1,35,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,02,024 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 866 మంది మరణించారు. భారతదేశంలో మరణాల రేటు 1. 75 శాతం ఉండగా తెలంగాణాలో 0. 63 శాతం ఉన్నట్లు ఆ బులెటిన్ తెలిపింది. తెలంగాణలో 17 ప్రభుత్వ కేంద్రాలలో, 35 ప్రైవేటు కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ లో వైద్య సిబ్బందిలో పాజిటివ్ రేటు 18 శాతం ఉండగా , మహారాష్ట్రలో 16, దిల్లీలో 14, కర్ణాటక లో 13, పుదుచ్చేరి లో 12, పంజాబ్ లో 11 శాతం నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇటీవల ప్రకటనలో తెలిపారు. వైద్య సిబ్బంది తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రామాణిక విధానాలను విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యక్తిగత రక్షణ పరికరాలు సరిగ్గా ధరించారో లేదో పరిశీలించడానికి ఇద్దరు డాక్టర్ల మధ్య బడ్డీ విధానాన్ని కూడా పాటించమని సూచించినట్లు చెప్పారు. గత ఆరు నెలలుగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రధానంగా కోవిడ్ రోగులకు చికిత్స జరుగుతోంది. ఇక్కడ తేలికపాటి లక్షణాలున్నవారి నుంచి తీవ్రమైన లక్షణాలున్న రోగులు చికిత్స నిమిత్తం వచ్చి చేరుతున్నారు. గాంధీ లో సుమారు 2500 మంది వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌కు చెందిన 38 మంది వైద్య సిబ్బంది పాజిటివ్ బారిన పడినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. రాష్ట్రంలో సుమారు 2000 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడినట్లు, అందులో 14 మంది మరణించినట్లు గత వారంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించినట్లు కూడా ఆ కథనం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే కోవిడ్ బారిన పడిన వైద్య సిబ్బంది శాతం కేంద్రం ప్రకటించిన కంటే బాగా తక్కువగానే కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 7000 మంది వైద్య సిబ్బంది మరణించినట్లు ఆమ్నెస్టీ మానవ హక్కుల సంస్థ పేర్కొంది. అందులో 573 మంది భారతదేశం నుంచి ఉన్నారు. మెక్సికో, అమెరికాలోనే 1000 కి పైగా వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడి మరణించినట్లు ఆమ్నెస్టీ అంచనా వేసింది. ‘మాస్కులు, పీపీఈ కిట్లు తగినన్ని అందిస్తున్నాం’ ఈ అంశం పై తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్ ప్రభుత్వ ఇఎన్ టి హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య సిబ్బందికి కావల్సిన వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు సరఫరా చేస్తోందని చెప్పారు. డాక్టర్లు ప్రతి నిత్యం రోగులకు చికిత్స చేయడం వలన ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుందని, అంతే కాకుండా వైద్య సిబ్బందిలో టెస్టింగ్ అధిక స్థాయిలో జరగడం వలన కూడా పాజిటివ్ కేసులు బయటపడతాయని అన్నారు. ఎన్ని సురక్షిత చర్యలు తీసుకున్నా వైరస్ బారిన పడకుండా ఉండటమనేది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. ఆఖరికి ఎన్ 95 మాస్కులు కూడా 95 శాతమే మాత్రమే సురక్షితమని ఆయన చెప్పారు.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా పీపీఈ కిట్లు, మాస్కుల కొరత లేదనే చెబుతూ వస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 18 శాతం మంది వైద్య సిబ్బంది కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. ఇది దేశంలోనే అత్యధికమని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇందులో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్లు, కేర్ ప్రొవైడర్లు కూడా ఉన్నారు. text: రంపచోడవరంలో ఏజన్సీలో బైక్‌ ఆంబులెన్స్‌ మారుమూల ప్రాంతంలోని ఆ కొండ మీద నుంచి ఆ గర్భిణిని కిందికి తీసుకెళ్లడమెలా? అంబులెన్స్ ఆ కొండెక్కి వచ్చే దారిలేదు. ఇంతలో ఎవరో 108కి ఫోన్‌ చేశారు. గంట లోపే ఒక అంబులెన్స్ కొండ మీదకి దూసుకొచ్చింది. అది 'బైక్‌ అంబులెన్స్‌'. ఆ అంబులెన్స్‌లో ఆమెను జాగ్రత్తగా ఎక్కించుకొని కొండ కిందికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. సోంపేట పొలిమేరల్లో ఆమె ఆ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. అందులోనే ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. బైక్‌ ఆంబులెన్స్‌లోనే పండంటి బిడ్డను ప్రసవించిన ప్రమీల పాయికోని ఒక బైక్ అంబులెన్స్ తమ ఊర్లోని తల్లీబిడ్డల ప్రాణాలను ఎలా కాపాడిందో.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పొంకాల గ్రామస్తులు వివరించారు. వైద్యుడు అందుబాటులో లేని ప్రాంతాల్లో.. అంబులెన్సుల వంటి వాహనాలు వెళ్లటానికి రహదారులు లేని చోట.. ఈ బైక్ అంబులెన్సులు ఇప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. కొండాకోనల మధ్యనున్న మారుమూల గ్రామాల్లో సరైన రహదారులు లేని చోట నివసిస్తున్న ప్రజలకు.. ఆపత్కాలంలో వైద్య చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రులకు చేర్చడానికి ఆంధ్రప్రదేశ్‌‌లో 'బైక్‌ అంబులెన్స్‌'లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా ఇలాంటిదే 'ప్రాజెక్ట్‌ రెక్కలు' అనే పథకం అమలవుతోంది. బైక్‌ అంబులెన్స్‌లు ఎక్కడ తిరుగుతున్నాయి? ''ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఐటీడీఏ గిరిజన ప్రాంతాలలో గత మార్చి నెల నుండి 122 బైక్‌ అంబులెన్స్‌లు తిరగడం ప్రారంభమైంది. సీతంపేటలో 15, పార్వతీపురంలో 24, పాడేరులో 42, రంపచోడవరంలో21, చింటూరులో 6, కె.ఆర్‌పురంలో 8, శ్రీశైలంలో 6 బైక్‌ అంబులెన్స్‌లు ప్రస్తుతం తిరుగుతున్నాయి'' అని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ‘‘శ్రీకాకుళంలో 15 వాహనాలు మార్చి నెల నుండి తిరుగుతున్నాయి. ఇప్పటివరకు 389 కేసులకు సాయం అందించాయి. అయితే ఈ కొత్త అంబులెన్స్‌ల గురించి చాలామందికి తెలియదు. అందుకే డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌తో సహా పోస్టర్లు, కరపత్రాలుతో ప్రచారం చేయబోతున్నాం'' అని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. ''ఇప్పటివరకు బైక్‌ అంబులెన్స్‌ల ద్వారా 1,637 మంది రోగులు సకాలంలో ఆసుపత్రులకు చేరారు. ఎక్కువ కేసులు గర్భిణిలకు సంబంధించినవే. గత మార్చి నుంచి ఇప్పటి వరకు బైక్‌లు 28,061 కిలోమీటర్లు ప్రయాణించాయి’’ అని ఆరోగ్య ఆంధ్ర ప్రతినిధి అంకిత పురోహిత్‌ వివరించారు. ‘‘మా ఇళ్ల మధ్యకు అంబులెన్స్‌లు రావడానికి సరైన దారి లేదు. రోగమెచ్చినా, పాములు కాటేసినా, ఆసుపత్రికి మంచాల మీద మోసుకు వెళ్లాల్సి వచ్చేది. ఈ చిన్న అంబులెన్స్‌లు వచ్చాక కొన్ని ప్రాణాలు దక్కుతున్నాయి'' అని చెప్తున్నారు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామస్తులు. అయితే.. కొన్ని కొండ ప్రాంతాల్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ లేక పోవడం వల్ల ఈ సౌకర్యం పొందలేక పోతున్నామంటున్నారు కొందరు గిరిజనులు. ఈ ఆలోచన ఎవరిది? ''మారుమూల కుగ్రామాల్లో ఆనారోగ్యంతో ఉన్న వారిని కాపాడడానికి బైక్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యది. ఆమె చొరవతోనే గిరిజన ప్రాంతాల్లో ఈ సేవలు మొదలయ్యాయి’’ అని తెలిపారు ప్రకాశం జిల్లా డీఎంహెచ్‌ ఒ.రాజ్యలక్ష్మి. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో 8,137 కుగ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 122 బైక్‌ అంబులెన్స్‌లు అందరికీ సేవలు అందించడం ఆసాధ్యం. వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ''అసలు రహదారులు సరిగా లేక మామూలు అంబులెన్స్‌లు కూడా సకాలంలో రాలేకపోతున్నాయి. ముందు ప్రభుత్వం ఉన్న రోడ్లకు రిపేర్లు చేసి బాగు చేయాల్సిన అవసరం ఉంది. అపుడే మారుమూల ప్రాంతంలోని ప్రజలకు మేలు కలుగుతుంది. 1,239 ఆవాసాలున్న గిరిజన ప్రాంతాల్లో 15 బైక్‌లు ఎంతమందిని కాపాడుతాయి? వీటిని పెంచాల్సిన అవసరం ఉంది'' అంటారు శ్రీకాకుళం జిల్లా, కవిటి గ్రామానికి చెందిన డాక్టర్‌ పూడి రామారావు. తెలంగాణలో ''ప్రాజెక్టు రెక్కలు'' మారుమూల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించే 'ప్రాజెక్టు రెక్కలు' పథకాన్ని తెలంగాణలో తొలిసారిగా గత సంవత్సరం వికారాబాద్‌ జిల్లాలో ప్రారంభించారు. మోటార్‌‌సైకిల్‌ నడపటం వచ్చిన పది మంది ఏఎన్‌ఎంలకు మొదటిగా వాహనాలు అందించారు. ఆ వాహనాల మీద ఏఎన్‌ఎంలు సులభంగా మారుమూల గ్రామీణులకు వైద్య సేవలు అందించడం సులభమైంది. దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ వున్న 101 మంది ఏఎన్‌ఎంలకు మోటర్‌ బైక్‌లు అందించారు. వీటిలో వాక్సినేషన్‌ కిట్, ఇతర సామాగ్రి పెట్టుకునే సదుపాయం కూడా కల్పించారు. తెలంగాణలో ప్రాజెక్టు రెక్కలు ప్రాజెక్టులో బైక్‌లు పొందిన ఏఎన్‌ఎం లు రోజాకుమారి, షబానా ‘‘మారుమూల గ్రామాలకు ఒకప్పుడు షేర్‌ ఆటోల్లో పోవాల్సి వచ్చేది. చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఇవన్నీ గమనించిన అప్పటి కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ మాకు బైక్‌లు ఏర్పాటు చేశారు’’ అని చెప్పారు వికారాబాద్‌ ఏఎన్‌ఎం రోజాకుమారి. ‘‘కలెక్టర్‌ నిధుల నుంచి వాహనానికి పది వేల రూపాయలు, ప్రజారోగ్య శాఖ మరో పది వేల రూపాయలు అందించారు. వాహనాలు సరఫరా చేసిన సంస్థ అసలు ధరలో ఐదు వేల రూపాయలు తగ్గించింది. దీంతో మాకు వాహనం ధరలో పాతిక వేల రూపాయల వరకూ తగ్గింది. మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వడంతో బైక్‌లు చాలా తక్కువ ధరకే సమకూరాయి'' అని మరో ఏఎన్ఎం షబానా వివరించారు. వికారాబాద్‌ జిల్లాలో విజయవంతైన ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొండ మీద ఓ పల్లెలోని పూరిల్లు. ఆ ఇంట్లో ఓ నిండు చూలాలు. ఆమె పేరు ప్రమీల పాయికో. నెలలు నిండాయి. పురిటి నెప్పులు మొదలయ్యాయి. భరించలేని బాధతో ఆమె కేకలు పెడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కానీ ఎలా? text: షారుఖ్‌‌ ఖాన్‌, దీపికా ప‌దుకొణె, అనుష్క శ‌ర్మ‌, ఇలియానా త‌దిత‌ర బాలీవుడ్ ప్ర‌ముఖులు తాము డిప్రెషన్‌కు గురయినట్లు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది డిప్రెష‌న్‌లో కూరుకుపోయిన‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడే వార్త‌లు వ‌స్తుంటాయి. తమ‌ను ఈ మాన‌సిక రుగ్మత కుంగ‌దీసింద‌ని షారుఖ్‌‌ ఖాన్‌, దీపికా ప‌దుకొణె, అనుష్క శ‌ర్మ‌, ఇలియానా త‌దిత‌ర బాలీవుడ్ ప్ర‌ముఖులు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. భార‌త్‌లో డిప్రెష‌న్ లాంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఎంత మంది స‌త‌మ‌తం అవుతున్నారు? వారిలో ఎంత మందికి వైద్యం అందుతోంది? ఇంత‌కీ డిప్రెష‌న్‌ను గుర్తించ‌డం ఎలా? ఈ రుగ్మ‌త‌కు గురైతే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి? దీన్నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి? బాధ‌, కోపం, నిరుత్సాహం, ఆందోళ‌న లాంటి భావోద్వేగాలు అంద‌రికీ వ‌స్తుంటాయి. అయితే డిప్రెష‌న్ బాధితుల్లో ఇవి దీర్ఘ‌కాలం ఉంటాయి. ఎంత మందిని పీడిస్తోంది? మాన‌సిక స‌మ‌స్య‌ల‌పై 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్' 2016లో భార‌త్‌లోని 12 రాష్ట్రాల్లో సర్వే చేప‌ట్టింది. ఈ సర్వే ప్రకారం భార‌త్‌లో 14 శాతం మంది ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో10 శాతం మందికి సత్వర వైద్య సహాయం అందించాల్సిన‌ అవసరముంది. మ‌రోవైపు 20 శాతం మంది భార‌తీయులు త‌మ జీవితంలో ఏదో ఒక‌సారి డిప్రెష‌న్ బారిన ప‌డుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) కూడా వెల్ల‌డించింది. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక.. భార‌త్‌లో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందగలుగుతున్నారని చెప్పింది. ఇది ఇలాగే కొనసాగితే పదేళ్ల తరువాత ప్రపంచంలో మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. 20 శాతం మంది భార‌తీయులు త‌మ జీవితంలో ఏదో ఒక‌సారి డిప్రెష‌న్ బారిన ప‌డుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) వెల్ల‌డించింది. అస‌లు ఏమిటీ వ్యాధి? డిప్రెష‌న్ ఒక మాన‌సిక రుగ్మ‌త‌. దీన్నే కుంగుబాటు అని పిలుస్తారు. మ‌హిళ‌లు.. పురుషులు, చిన్నా.. పెద్దా ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవ‌రికైనా ఇది రావొచ్చు. బాధ‌, కోపం, నిరుత్సాహం, ఆందోళ‌న లాంటి భావోద్వేగాలు అంద‌రికీ వ‌స్తుంటాయి. అయితే డిప్రెష‌న్ బాధితుల్లో ఇవి దీర్ఘ‌కాలం ఉంటాయి. అంతేకాదు వారి జీవితాన్ని ఇవి తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంటాయి. కుంగుబాటు చాలా కార‌ణాల వ‌ల్ల‌ వ‌స్తుంది. ఇది వ్య‌క్తిని బ‌ట్టీ మారుతుంటుంది. అయితే ఆప్తుల్ని కోల్పోవ‌డం, భాగ‌స్వామి దూరం కావ‌డం, పెద్ద‌పెద్ద‌ జ‌బ్బులు.. లాంటి తీవ్రంగా కుంగ‌దీసే ప‌రిణామాల వ‌ల్లే ఎక్కువ మంది డిప్రెష‌న్ బాధితులుగా మారుతుంటారు. మెనోపాజ్‌, నిద్ర స‌మ‌స్య‌లు, కొన్ని ఔష‌ధాల దుష్ప్ర‌భావం, మంచి ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఫిట్‌నెస్ లేకపోవ‌డం లాంటివీ కుంగుబాటు ముప్పును పెంచుతాయి. కొన్నిసార్లు జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్లా కుంగుబాటు సంక్ర‌మిస్తుంది. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి? డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు చాలా ఉంటాయి. ఇవి ఒక్కొక్క‌రిలో ఒక్కోలా క‌నిపిస్తుంటాయి. అయితే, అందరిలోనూ క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలు ఇవి.. భావోద్వేగాలు ఆలోచ‌న‌లు ప్ర‌వ‌ర్త‌నా ప‌ర‌మైన‌.. శారీర‌క ప‌ర‌మైన ల‌క్ష‌ణాలు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏం చేయాలి? ఈ ల‌క్ష‌ణాలు సాధార‌ణంగా చాలా మందిలో క‌నిపిస్తాయి. అయితే ఇవి దీర్ఘ‌‌కాలం ఉంటే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. మాన‌సిక నిపుణులైతే ఇంకా మంచిది. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఈ ల‌క్ష‌ణాలు ప‌దేప‌దే క‌నిపిస్తే.. ఎలాంటి ఆల‌స్యం లేకుండా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. అంతేకాదు ఈ ఆలోచ‌న‌ల గురించి స్నేహితులు, బంధువులు ఇలా ఎవ‌రో ఒక‌రితో మాట్లాడాలి. ప‌క్క‌నుండే వారిలో ఈ డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏం చేయాలంటే.. మొద‌ట వారు చెప్పేవన్నీ జాగ్ర‌త్త‌గా వినాలి. ఒక్కోసారి మాట్లాడ‌టం, భావాల‌ను పంచుకోవ‌డం కూడా డిప్రెష‌న్ త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అయితే, వినేట‌ప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు. వారిని ప్రోత్స‌హించేలా, భావాల‌ను పంచుకొనేలా మాట్లాడాలి. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లేలా డిప్రెష‌న్ బాధితుల్ని ప్రోత్స‌హించాలి. అయితే 'ఎంజాయ్ చెయ్‌', 'చీర్ అప్' లాంటి ప‌దాల‌ను వారికి చెప్ప‌కపోవ‌డ‌మే మంచిది. కుంగుబాటు తీవ్రంగా ఉంటే.. యాంటీ-డిప్రెసెంట్ ఔష‌ధాల‌ను వైద్యులు సూచిస్తారు. చికిత్స ఇలా.. డిప్రెష‌న్ రోగుల‌ను.. స్వ‌ల్ప‌, మధ్య‌స్థం, తీవ్రం అనే మూడు కేట‌గిరీలుగా విభ‌జిస్తారు. వీటి ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తారు. సాధార‌ణంగా ఎక్కువ మందికి కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ (సీబీటీ)తో చికిత్స ప్రారంభిస్తారు. ఇది ఒక కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌. దీనిలో భాగంగా నెగెటివ్ ఆలోచ‌న‌లు, తీవ్ర‌మైన బాధ‌కు కార‌ణాలు గుర్తించి.. వాటిని అధిగ‌మించేందుకు వైద్యులు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంటారు. ప్ర‌తికూల ఆలోచ‌న‌ల మూలాల‌తోపాటు వాటిని అధిగ‌మించే మార్గాలూ తెలుసుకోవ‌డం ద్వారా.. ప్ర‌తికూల ప్ర‌వ‌ర్త‌న‌ల జోలికి పోకుండా అడ్డుకోవ‌చ్చు. కుంగుబాటు తీవ్రంగా ఉంటే.. యాంటీ-డిప్రెసెంట్ ఔష‌ధాల‌ను వైద్యులు సూచిస్తారు. ఇవి భావోద్వేగాల‌ను ప్ర‌భావితం చేసే మెద‌డులోని ర‌సాయ‌న చ‌ర్య‌ల‌ను క్రియాశీలం చేస్తాయి. దీంతో కొంత‌వ‌ర‌కు నిస్సత్తువ‌‌, నిరాశ‌, భావోద్వేగ స‌మ‌స్య‌ల‌ను అడ్డుకోవ‌చ్చు. అయితే ఈ ఔష‌ధాల‌తో కొన్ని ప్ర‌తికూల ప్ర‌భావాలూ ఉంటాయి. కొంతమంది రోగుల‌కు ధ్యానం, వ్యాయామం, మ్యూజిక్‌, ఆర్ట్ థెర‌పీల‌ను సూచిస్తారు. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆరు నెల‌లుగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఆయ‌న ఆత్మహ‌త్య‌కు గ‌ల కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. మ‌ర‌ణానికి డిప్రెష‌న్‌ ప్రేరేపించి ఉండొచ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. text: ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్న పొడుగాటి పైన్ చెట్ల మధ్యలోంచి సూరీడు తొంగిచూస్తున్నాడు. సేంద్రియ రంగులు మాత్రమే వాడి తయారుచేసి చేనేత పట్టు, కాటన్ దుస్తుల కోసం నేను అక్కడకు వెళ్లాను. స్థానిక చేనేత కార్మికులు రూపొందించిన ఆ వస్త్రాలను అవని అనే సంస్థ విక్రయిస్తోంది. అక్కడ నా దృష్టిని మరో విషయం ఆకర్షించింది. అది... ఎండిన పైన్ చెట్ల కొమ్మలు, ఆకుల గుట్టలు. ఓ వ్యక్తి ఆ ఎండిన పైన్ కొమ్మలను ఒక మోటారుకు అమర్చిన పెద్ద సిలిండర్‌లో పెడుతున్నాడు. పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి చేస్తున్నారక్కడ. పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్‌‌లో అనేక ఆలయాలు ఉండడంతో ఆ రాష్ట్రాన్ని దేవభూమి అంటారు. ఈ రాష్ట్రానికి టిబెట్, నేపాల్‌తో సరిహద్దులున్నాయి. మంచు పర్వతాలు, నదులు, అనేక వృక్ష, జంతుజాతుజాలాలున్న ఉత్తరాఖండ్‌ది ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ. ఉత్తరాఖండ్ అంతటా పైన్ అడవులు విస్తారంగా ఉన్నాయి. సుమారు 10 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ పైన్ అడవులతో అక్కడ కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. ఎండిన పైన్ ఆకులు నేలరాలి పోగవుతాయి. తేలిగ్గా ఉండే ఇవి ఏమాత్రం అగ్గి రాజుకున్నా అడవిని దహించివేస్తాయి. ఏటా ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్ర అడవుల్లోనే 13 లక్షల టన్నుల పైన్ ఆకులు నేలరాలుతుంటాయని అంచనా. మార్చి, జూన్ నెలల మధ్య ఎక్కువగా ఈ ఆకులు రాలుతాయి. ఇవి కొండవాలులో పరుచుకుంటాయి. ఇవి ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులకు కారణమవుతున్నాయి. బయోమాస్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ కార్చిచ్చుల కారణంగా నష్టం జరుగుతుందని.. అటవీ సమతుల్యతను అవి దెబ్బతీస్తాయని జీబీ పంత్ నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ హిమాలయన్ ఎన్విరానమెంట్‌లో సెంటర్ ఫర్ సోషియో ఎకనమిక్ హెడ్ జీసీఎస్ నేగి అన్నారు. ఔషధ మూలికలు, ఇతర అవసరాలుగా ఉపయోగించే 1800 రకాల మొక్కలకు ఇక్కడి అటవీ ప్రాంతం ఆలవాలం. కానీ, కార్చిచ్చులు ఈ ప్రాంతాన్ని ఆ మొక్కల మనుగడకు అననుకూలంగా మార్చేస్తున్నాయి. "దేశీయ మొక్కలు, చెట్లు పర్యావరణపరంగా, సామాజికంగా ఎంతో విలువైనవి. అవి భూ, జల సంరక్షణలో ఎంతో కీలకం. ఫలితంగా అడవి స్థానికులకు తిండి, ఇతర అటవీ ఉత్పత్తులను అందివ్వడమే కాకుండా జీవివైవిధ్యాన్ని కాపాడుతుంది'' అంటారు నేగి. పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి తరువాత మిగిలే వ్యర్థాలలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బొగ్గులా మలచి వంట చెరకుగా వినియోగిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతం బేరినాగ్‌లో అవని సంస్థ ఉంది. సోలార్ ఇరిగేషన్ నేపథ్యం ఉన్న మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ రజనీశ్ జైన్, ఆయన భార్య గ్రాఫిక్ డిజైనర్ రష్మి 1999లో దీన్ని స్థాపించారు. ఏటా కార్చిచ్చులు అడవులను నాశనం చేయడంతో పాటు అక్కడి ప్రజల జీవితాలపైనా ప్రభావం చూపిస్తుండడంతో ఏదైనా చేయాలనుకున్నారు వారు. కార్చిచ్చులకు కారణమవుతున్న పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి అవకాశాల గురించి రజనీశ్ వెతికారు. పైన్ ఆకులను విద్యుదుత్పత్తికి వాడితే కార్చిచ్చులు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలుంటాయని.. వంటచెరకు ఇబ్బందులు, వలసలు వంటి అన్ని సమస్యలనూ తీర్చొచ్చని భావించారు. బయోమాస్ గ్యాసిఫికేషన్ పద్ధతిలో పైన్ ఆకులతో విద్యుత్ తయారుచేయడంపై దృష్టిపెట్టారు. విద్యుదుత్పత్తిలో ఈ రకమైన సాంకేతికత 1994 నుంచి భారత్‌లో పెరగనారంభించింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌‌కు చెందిన దాసప్ప అనే ఇంజినీర్ తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంజినీరింగ్ సంస్థ దాసాగ్ సహకారంతో బయోమాస్ గ్యాసిఫయర్లను మెరుగుపరిచే పని మొదలుపెట్టారు. వారు పైన్ ఆకులతోనే కాదు ఊక, వరిగడ్డి, ఆకులు, కొబ్బరి పీచు వంటి వ్యవసాయ వ్యర్థాలతో విద్యుదుత్పత్తి చేశారు. ఆక్సిజన్ తగ్గించిన వాతావరణంలో ఈ వ్యర్థాలను 1,000 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువ వేడి చేస్తారు. అప్పుడు కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, హైడ్రోజన్‌, ఇతర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల నుంచి ధూళి, తారు వేరు చేసి మండించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఆ తరువాత దాసప్ప ఆ డిజైన్‌ను మరింత అభివృద్ధి చేసి పేటెంటు పొందారు. కర్ణాటకలో ప్రస్తుతం ఇలాంటివి 30 యూనిట్లు పనిచేస్తున్నాయి. ''వ్యవసాయ, అటవీ వ్యర్థాలు పుష్కలంగా ఉన్న భారత దేశంలో శిలాజ ఇంధనాలతో పోల్చితే పర్యావరణంపై తక్కువ ప్రతికూల ప్రభావం, తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి చేసే మార్గం ఇది'' అంటారు దాసప్ప. అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్‌లోనూ ఈ బయోమాస్ గ్యాసిఫికేషన్ విధానం వాడుక ఎక్కువగానే ఉంది. అయితే, 2007లో తాను పైన్ ఆకులతో ఈ విధానంలో విద్యుదుత్పత్తి చేయొచ్చని ప్రతిపాదించినప్పుడు ఉత్తరాఖండ్ అధికారులు, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు రజనీశ్. ''వాళ్లే కాదు గ్రామస్థులూ దీనిపై ఆసక్తి చూపించలేదు. నాకు బుర్ర లేదనుకున్నారు'' అని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు రజినీశ్. అయితే, ఈ ఆలోచన వోల్కార్ట్ ఫౌండేషన్ అనే స్విట్జర్లాండ్ స్వచ్ఛంద సంస్థను ఆకట్టుకుంది. వారు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు. దీంతో 2009లో ఆయన ప్రపంచంలోనే మొట్టమొదట 9 కిలోవాట్ల సామర్థ్యమున్న పైన్ ఆకుల విద్యుత్కేంద్రం ప్రారంభించారు. ఇప్పుడా పవర్ ప్లాంట్ అవని వర్క్‌షాప్‌కు విద్యుత్ అందిస్తోంది. అంతేకాదు.. విద్యుదుత్పత్తి చేయగా మిగిలిన వ్యర్థాలు వంట చెరకుగా పనికొస్తున్నాయి. ఈ విజయంతో రజనీశ్ ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ సంస్థల నుంచీ మద్దతు పొందగలిగారు. తన ప్రయత్నం వల్ల గ్రామస్థులకు జీవనోపాధి లభించడంతో పాటు కార్చిచ్చులూ తగ్గుతాయని రజనీశ్ గట్టిగా నమ్మారు. 2011లో ఆయన అవని బయో ఎనర్జీ అనే స్వచ్ఛంద సంస్థ ఒకటి స్థాపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రాలు తమ విద్యుత్ అవసరాలలో కొంత పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న జాతీయ విధానం ప్రకారం ఆ ఒప్పందం జరిగింది. 2014లో ఉత్తరాఖండ్ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ పైన్ ఆకుల నుంచి గ్యాసిఫికేషన్ విధానంలో విద్యుదుత్పత్తి విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే, ఈ ప్రాజెక్టును పెద్ద ఎత్తున చేపట్టడానికి అవరోధాలున్నాయి. పైన్ ఆకులను పెద్ద ఎత్తున సేకరించడానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అంత అనుకూలం కాదు. నిటారైన కొండ ప్రాంతాల్లో యంత్రాల సహాయంతో పైన్ ఆకులు సేకరించే వీలు లేదు. ఒక కిలోవాట్ పర్ అవర్ విద్యుదుత్పత్తికి 1.5 కిలోల పైన్ ఆకులు అవసరం. ఆలెక్క 120 కిలోవాట్ పర్ అవర్ ప్రాజెక్టు స్థాపించాలంటే పెద్దమొత్తంలో పైన్ అవసరం. దీంతో 10 నుంచి 25 కిలోవాట్ల చిన్న ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ సేకరణకు మొదట్లో గ్రామీణ మహిళలు సంశయించారు. కానీ, కిలోకు రూ. 2 ఇవ్వడానికి నిర్ణయించి రజనీశ్ వారిని ఒప్పించారు. అది వారికి ఆదాయ మార్గంగా మారింది. మూడేళ్లుగా ఈ పనిలో ఉన్న ఆశాదేవి మాట్లాడుతూ.. ''నేను మొదటి ఏడాది రూ. 8 వేలు సంపాదించాను. ఆ డబ్బుతో పాల కోసం ఒక గేదెను కొన్నాను. ఈ ఏడాది నెలకు రూ. 17,000 సంపాదించాను. ఈ డబ్బుతో ఇంట్లో మరో గది నిర్మించాం. వచ్చే ఏడాది వంట గది కట్టుకుంటాం'' అన్నారు. ప్రస్తుతంలో కుమావూ ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో 25 కిలోవాట్ల పవర్ ప్లాంట్లు 7 ఉన్నాయి. 10 కిలోవాట్ల ప్లాంట్లు 5 ఉన్నాయి. మరో 40 ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా కార్చిచ్చులనూ నివారిస్తున్నాయని రజనీశ్ అన్నారు. నిత్యం ఎండిన పైన్ ఆకులను సేకరిస్తుండడంతో ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఒక్క కార్చిచ్చూ లేదని రజనీశ్ చెబుతున్నారు. కార్చిచ్చుల కారణంగా నాశనమయ్యే సంప్రదాయక ఔషధ మొక్కలు మళ్లీ పెరుగుతున్నాయని.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరికొన్ని స్థానిక మొక్క జాతులూ తిరిగి మనుగడలోకొస్తాయని జీపీఎస్ నేగి అన్నారు. ఈ ఏడాది కఫాల్, బే బెర్రీ మొక్కలు త్రిపురవేదిలో ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయని.. గోల్డెన్ హిమాలయన్ రాస్‌బెర్రీ, హిమాలయన్ ఓక్ కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చలికాలం ముదురుతున్న నవంబరు నెలలో ఒక ఉదయాన నేను ఉత్తరాఖండ్‌లోని పిత్తోర్‌గఢ్ జిల్లా త్రిపురవేది గ్రామంలోని కొండ మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. text: అబ్దుల్ కలీమ్ - అబ్దుల్ కలీమ్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన నిందితుడు కలీమ్ పరిస్థితే కాదు, ఇదే కేసులో నిర్దోషిగా విడుదలైన మ‌హ్మద్ అబ్దుల్ జాహెద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ‘‘నేను ఒక‌ప్పుడు మొబైల్ టెక్నీషియ‌న్‌ని. పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఆప‌రేష‌న్‌ను కనీసం అర్థం చేసుకోలేక‌పోతున్నా. జీవితంలో చాలా వెనుకబడిపోయాను’’ అని జాహెద్ బాధపడుతున్నాడు. 2005 అక్టోబ‌రు 12 ద‌స‌రా రోజున ఒక వ్య‌క్తి హైద‌రాబాద్ బేగంపేట‌లోని పోలీసు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో త‌న‌ను తాను పేల్చుకున్నాడు. అత‌ను బంగ్లాదేశీయుడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఒక హోంగార్డు చ‌నిపోయారు. మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. పేలుడులో బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) సంస్థ పాత్ర ఉందని, ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాలిన్ అనే వ్య‌క్త‌నీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అభియోగపత్రంలో పేర్కొంది. ఇందులో మొత్తం 20 మంది పేర్లు ఉన్నాయి. మ‌హ్మ‌ద్ అబ్దుల్ జాహెద్, అబ్దుల్ కలీమ్, ష‌కీల్, స‌య్య‌ద్ హాజి, అజ్మ‌ల్ అలీ ఖాన్, అజ్మ‌త్ అలీ, మ‌హ్మూద్ బ‌రూద్ వాలా, షేక్ అబ్దుల్ ఖాజా, న‌ఫీస్ బిశ్వాస్‌లతోపాటు బంగ్లాదేశ్ పౌరుడైన బైల‌లుద్దీన్‌ను కూడా అరెస్ట్ చేశారు. దాదాపు ప‌న్నెండేళ్ల త‌ర్వాత, కలీమ్, జాహెద్‌లతోపాటు మ‌రో ఎనిమిది మంది నిందితులను హైదరాబాద్‌లోని అదనపు మెట్రోపాలిటన్ సెష‌న్స్ కోర్టు ఆగ‌స్టు 10న నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ వీరంద‌రిపై ఉన్న ఆరోప‌ణ‌లు కొట్టేస్తూ జ‌డ్జి టి.శ్రీనివాసరావు 65 పేజీల తీర్పు ఇచ్చారు. "ఆత్మాహుతి చేసుకున్న వ్య‌క్తికీ, నిందితులకూ మ‌ధ్య పేలుడు కుట్ర‌లో సంబంధముందనే అభియోగాన్ని ప్రాసిక్యూష‌న్ నిరూపించ‌లేక‌పోయింది" అని తీర్పులో ఉంది. పని వెతుక్కుంటున్న కలీమ్ క‌లీమ్ ప్రస్తుతం ప‌ని కోసం వెతుకుతున్నాడు. అయితే జైల్లో ఉండ‌గా వ‌చ్చిన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఆయన్ను పనిచేయనివ్వడం లేదు. 34 ఏళ్ల జాహెద్ జీవితంలో 12 ఏళ్ళు జైల్లోనే గ‌డిచిపోయాయి. హైదరాబాద్ మూసారాంబాగ్‌లోని ఓ ఇరుకైన గల్లీలో ఉండే జాహెద్.. ఇప్పుడు జీవితాన్ని కొత్త‌గా మొదలుపెట్టాలనుకొంటున్నాడు. "నేనిప్పుడు స్థిరపడాలనుకుంటున్నా. త్వ‌ర‌లోనే వ్యాపారం మొద‌లుపెట్టి పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. కానీ నాకు అమ్మాయిని ఇవ్వ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు" అని అతడు చెప్పాడు మ‌హ్మద్ అబ్దుల్ జాహెద్ ఇలాంటి కేసుల విచార‌ణ‌లో జాప్యాన్ని తగ్గించేందుకు వీటిని ప్ర‌త్యేక కోర్టుల‌కు అప్పగించాల‌ని డిఫెన్స్ న్యాయ‌వాది ఎం.ఎ. అజీమ్ అంటున్నారు. "తీర్పు ఏదైనా కావ‌చ్చు, కానీ ఇలాంటి కేసుల‌కు ప్ర‌త్యేక కోర్టులుంటే వేగ‌వంత‌మైన తీర్పులను ఆశించ‌వ‌చ్చు" అని ఆయ‌న చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేయ‌నున్న‌ట్టు సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) డీసీపీ అవినాశ్ మొహంతి తెలిపారు. ‘‘సాక్ష్యాధారాలను త‌గిన స్థాయిలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. అప్పీలు చేయ‌డానికి అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయి" అని చెప్పారు. మా బాధకు బాధ్యత ఎవరిది: జాహెద్ అప్పీల్‌కు వెళ్ల‌డానికి ప్రాసిక్యూష‌న్‌కు అన్ని హ‌క్కులూ ఉన్నాయని, అయితే ఒక‌సారి పెట్టిన సాక్ష్యాధారాలను మాత్రం మార్చే వీల్లేద‌ని డిఫెన్స్ లాయ‌ర్ ఎం.ఎ.అజీమ్ చెబుతున్నారు. "ప్రాసిక్యూష‌న్ వాళ్లు అప్పీల్‌కు వెళ్ల‌డం అంటే, దేశంలోని అన్ని కోర్టులూ క్లీన్ చిట్ ఇచ్చే వ‌ర‌కు నిర్దోషుల జీవితాల‌ను ప‌ట్టి ఉంచడ‌మే. ఇదెంత వ‌ర‌కూ న్యాయం?" అని ఆయన ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌ను అకార‌ణంగా 12 ఏళ్ళు జైల్లో పెట్టిన‌దానికి, తాము పడ్డ బాధ‌కు బాధ్య‌త ఎవ‌రిద‌ని జాహెద్ భావోద్వేగంగా ప్ర‌శ్నిస్తున్నాడు. మ‌రి కేసు హైకోర్టుకు వెళితే ప‌రిస్థితి ఏంట‌ని జాహెద్‌ను అడిగితే, "ప్ర‌స్తుతానికి మ‌మ్మ‌ల్ని ఒంటరిగా వ‌దిలేయాల‌ని కోరుకుంటున్నాం" అని బదులిచ్చాడు. ‘నా భర్త చావుకు కారణమెవరు?’ నాటి పేలుడులో చ‌నిపోయిన హోంగార్డు స‌త్య‌నారాయ‌ణ భార్య మ‌హాల‌క్ష్మి ఇప్పటికీ విషాదంలోనే ఉంది. త‌న భ‌ర్త చావుకు కార‌ణ‌మెవ‌ర‌ని ఆమె ప్ర‌శ్నిస్తోంది. భ‌ర్త మ‌ర‌ణంతో కోడ‌లిగా, వ‌దిన‌గా, ముగ్గురి పిల్ల‌ల‌ త‌ల్లిగా ఆమె అనేక బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకోవాల్సి వ‌చ్చింది. ఆమెకు ఇప్పుడు 57 ఏళ్లు. మహాలక్ష్మి "కుటుంబాన్ని పోషించ‌డానికి రోజంతా కుట్టుప‌ని చేసాను. మా మ‌ర‌ద‌లి పెళ్లి చేశాను. పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించాను" అని ఆమె తెలిపారు. మహాలక్ష్మి ఇప్పుడు కొడుకుల‌పై ఆధార‌ప‌డి జీవనం సాగిస్తున్నారు. "వాళ్ల‌కూ కుటుంబాలున్నాయి. మా ఆయ‌న బతికుంటే వాళ్ల‌పై ఆధార‌ప‌డాల్సిన గ‌తి నాకుండేది కాదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. 2015 నాటి జాతీయ నేర రికార్డుల విభాగం అంచ‌నా ప్ర‌కారం భారత జైళ్లలోని ఖైదీల్లో 67 శాతం మంది విచార‌ణ ఎదుర్కొంటున్నవారే. టాస్క్ ఫోర్స్ కార్యాలయ పేలుడు కేసులో జైలు పాలై, నిర్దోషులుగా విడుదలైన ఇద్దరి జీవితాలు ఇప్పటికే తలకిందులయ్యాయి. మరోవైపు దాడి బాధితుల కుటుంబ సభ్యులు 12 ఏళ్లైనా నేటికీ విషాదంలోనే ఉన్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "నాకింకా రాత్రిళ్లు నిద్ర ప‌ట్ట‌డం లేదు, అరెస్టు త‌ర్వాత నా జీవితం మొత్తం త‌ల‌కిందులైపోయింది. నాకు భార్య కావాల్సిన అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది. సొంతిల్లు, సొంత వ్యాపారం అనే క‌ల‌లు చెదిరిపోయాయి." text: శాస్త్రవేత్తలు ఈ పరికరం త్రీడీ కంప్యూటర్ మోడల్ తయారు చేశారు రోమన్ కాలం నాటి నౌక శిథిలాల్లో 1901లో దీనిని కనుగొన్నప్పటి నుంచి యాంటీకితేరా మెకానిజం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. గ్రహణాలు, మిగతా ఖగోళ ఘటనల గురించి అంచనా వేయడానికి చేతితో తిప్పే ఈ పురాతన గ్రీకు పరికరాన్ని ఉపయోగించేవారని భావిస్తున్నారు. కానీ ఈ పరికరంలో మూడో భాగం మాత్రమే మిగలడంతో, దీని పూర్తి రూపం ఎలా ఉండేదో, ఇది ఎలా పనిచేసేదో అని పరిశోధకులను ఆలోచనలో పడిపోయారు. ఈ పరికరంలో మూడో భాగం మాత్రమే దొరికింది గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు ఈ పరికరం వెనుక భాగం మెకానిజం గురించి ఇంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కనుగొన్నారు. కానీ దాని ముందు భాగంలో ఉన్న గేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనేది ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. ఇప్పుడు పరికరం త్రీడీ కంప్యూటర్ మోడల్ ఉపయోగించిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు, చివరకు దీని గుట్టు విప్పారని భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ పరికరం ముందు ప్యానల్ మొత్తాన్ని రీక్రియేట్ చేశారు. ఇప్పుడు ఆధునిక మెటీరియల్స్ ఉపయోగించి యాంటీకిథెరా పూర్తి స్థాయి నమూనాను తయారు చేయాలని అనుకుంటున్నారు. శుక్రవారం సైంటిఫిక్ రిపోర్ట్‌లో ప్రచురితమైన ఒక పేపర్ ఈ పరికరం గేరింగ్ సిస్టమ్‌కు సంబంధించిన కొత్త చిత్రాలను బయటపెట్టింది. అందులో వాటి పూర్తి వివరాలు, క్లిష్టమైన భాగాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి త్రీడీ మోడల్ "అద్భుతమైన ఈ పురాతన గ్రీకు మేధోశక్తి గుట్టు విప్పినపుడు, అది సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలను చూపించింది. ఈ మెకానిజంలో స్వయంగా చెక్కివున్న శాస్త్రీయ శాసనాల్లోని భౌతిక ఆధారాలకు అనుగుణంగా, దానిలోని వర్ణనలకు సరిపోలేలా ఉన్న మొట్టమొదటి మోడల్ మాదే" అని ఈ పేపర్ ప్రధాన రచయిత ప్రొఫెసర్ టోనీ ఫ్రీత్ అన్నారు. ఈ మెకానిజంను ఒక ఖగోళ కాలిక్యులేటర్‌గా, ప్రపంచంలోని మొట్టమొదటి ఆనలాగ్ కంప్యూటర్‌గా కూడా వర్ణిస్తున్నారు. ఇత్తడితో చేసిన ఈ పరికరంలో కొన్ని డజన్ల గేర్లు ఉన్నాయి. దీని వెనుక కవర్ మీద విశ్వం వర్ణన ఉంది. అందులో ఆ పరికరాన్ని తయారు చేసినప్పుడు వారికి తెలిసిన ఐదు గ్రహాల కదలికలను చూపిస్తున్నారు. కానీ 82 భాగాలే ఉన్న ఈ పరికరంలో మూడో వంతు మాత్రమే మిగిలింది. అంటే, ఈ పరికరం ఎక్స్-రే డేటా పూర్తి చిత్రాన్ని, పురాతన గ్రీకు గణిత పద్ధతిని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక్కో భాగాన్నీ కలపాల్సి ఉంటుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ప్రపంచంలోనే అత్యంత పురాతన కంప్యూటర్‌గా చెబుతున్న 2,000 ఏళ్ల నాటి ఒక పురాతన పరికరం అసలు ఎలా పనిచేసేదో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు దాని త్రీడీ మోడల్‌ను రీక్రియేట్ చేశారు. text: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబరు ఒకటిన లేఖ రాశారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 83 శాతం ఆదాయం కోల్పోయినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా ఖర్చు గణనీయంగా పెరిగిందని వివరించారు. "ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఒడిదుడుకులతో తగినంత నిధులను సమకూర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాం. రుణాల కోసం ద్రవ్య సంస్థల నుంచి ఫ్రంట్ లోడింగ్ విధానంలో అప్పులు తీసుకుంటున్నాం. విధి లేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంపై ఆధారపడాల్సి వచ్చింది" అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏడాదికి సరిపడా నిధులను ముందే తీసుకోవడాన్ని ఫ్రంట్ లోడింగ్ అంటారు. మరోవైపు వేతనాలు, ఖర్చుల్లో అసమానతలను పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ నుంచి తాత్కాలికంగా తీసుకునే రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులుగా చెబుతారు. ఆగస్టు 31 న తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల్లో రాష్ట్రం రూ. 8,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌దీ ఇదే పరిస్థితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఆర్థిక నిపుణుడు ఎస్‌.అనంత్‌తో బీబీసీ తెలుగు మాట్లాడింది. "పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు మరీ దిగజారింది. దివాలాకు దగ్గరగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో రాష్రంలో ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉంది. ఐదు నెలల ఆదాయం రూ. 37,305.79 కోట్లు కాగా.. ఖర్చు రూ. 88,618.19 కోట్లు. దీంతో లోటు రూ. 51,312.40 కోట్లకు చేరింది. కేవలం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ. 25,103.58 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019-20 లో తీసుకున్న మొత్తం అప్పు రూ. 40,400.96 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆర్థిక పరిస్థితిపై వివరాలను బీబీసీ న్యూస్ కోరింది. అయితే ఎలాంటి స్పందనా రాలేదు. అయితే, ప్రతి నెల రాష్ట్ర అకౌంట్లను కాగ్ పరీశిలించి తమ వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచుతోంది. దీనిలోని వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తెలంగాణ ఆదాయం రూ. 23,221.56 కోట్లు కాగా.. ఖర్చు రూ. 38,425.67 కోట్లు. దీంతో లోటు రూ. 15,204.11 కోట్లకు చేరింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ. 20,783.84 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019-20 లో తీసుకున్న అప్పు రూ. 29,902 కోట్లుగా కాగ్ అంచనా వేసింది. కేంద్రం నుంచి బకాయిలు మరోవైపు కేంద్రం నుంచి వస్తువుల సేవల పన్ను (జీఎస్‌టీ) కాంపెన్‌సేషన్ సెస్సు బకాయిలు కూడా రావాల్సి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 4,863.21 కోట్లని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. రూ. 5,420 కోట్లని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు ఇటీవల ట్వీట్ చేశారు. ఐజీఎస్‌టీ కూడా రూ. 2,700 కోట్ల వరకూ కేంద్రం బాకీ ఉందని ఆయన తెలిపారు. జీఎస్‌టీ చెల్లింపుల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా మారింది. అయితే, పరిహార సెస్సు (కాంపెన్‌సేషన్ సెస్సు)ల్లో తగ్గిన వాటాను రుణాలతో భర్తీ చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదివరకు పన్నులతో పోల్చినప్పుడు జీఎస్‌టీ అమలు చేశాక వచ్చే పన్నులోటును భర్తీ చేసేందుకు జీఎస్‌టీ కాంపెన్‌సేషన్ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు కాంపెన్‌సేషన్ సెస్సును కేంద్రం విధిస్తోంది. ఇప్పుడు దీనిలో తగ్గుతున్న వాటాలను రుణాలతో భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇది అన్యాయమని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. వీటిలో బీజేపీ పాలిత కర్నాటక కూడా ఉంది. "జీఎస్‌టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే. సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలనడం సరి కాదు. సెస్ ఎక్కువ చెల్లిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. తక్కువ సెస్ తీసుకుంటోంది కూడా తెలంగాణనే" అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు. లోటు బడ్జెట్ ప్రభావం ఆదాయం బాగా తగ్గిపోవడంతో కొత్త మార్గాల్లో ఆదాయాన్ని అర్జించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృత్తి పన్ను పెంచింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రూ. 1,250గా ఉన్న వృత్తి పన్ను శ్లాబును రూ. 2,000 కు పెంచింది. ఏడాదికి రూ. 2,500 మించకుండా వృత్తి పన్ను వసూలు చేసేందుకు గత ఉత్తర్వులను సవరించినట్టు పేర్కొంది. "సంక్షేమ పథకాల అమలుకు భారీ ఆర్థిక కేటాయింపులు అవసరం. ఒక వైపు ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. మరోవైపు సంక్షేమ పథకాలకు నిధుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్నులు పెంచడం అనివార్యంగా మారింది" అని ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పన్ను రూపంలో ఆదాయం పెంచే దిశగా ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ వివాదంలో ఉన్న లేక ఆమోదంలేని భూములను రెగ్యులరైజేషన్ చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. మరోవైపు ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తేచ్చుకునే పరిమితిని మూడు శాతం నుంచి ఐదు శాతానికి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్సును తెలంగాణ మంత్రి మండలి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రుణ శాతం పెరుగుతుంది. ముంచుకొస్తున్న ముప్పు అయితే, తాహతుకు మించి వ్యయం చేయడం వల్లే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతోందని ఆర్థిక రంగ నిపుణుడు ఎస్.అనంత్ వ్యాఖ్యానించారు. "విపరీతమైన ఖర్చుతో కూడుకున్న ఎన్నికల హామీలను నెరవేర్చడంతో రాష్ట్రాలకు అలవికానంత వ్యయమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ వ్యయాలకు తగ్గట్లు ఆదాయం పెరగడం లేదు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా తగ్గాయి'' అని ఆయన పేర్కొన్నారు. ''గతంలో లోటును అధిగమించేందుకు.. రాష్టాలు సొంతంగా పన్నులు విధించి అదనపు ఆదాయం సమకూర్చుకోగలిగేవి. అయితే, వస్తువు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో రాష్ట్రాలు పన్నులు పెంచే వెసులుబాటును కోల్పోయాయి. కేంద్రంపై ఇదివరకటికన్నా ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది" అని చెప్పారు. మరోవైపు రాష్ట్రాలు రుణాలు తీసుకోవడం ఎప్పటిలానే కొనసాగించడంతో పాత, కొత్త బకాయిలను ఎలా తీర్చగలవో అంతుబట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. "ఇదే పరిస్థితి కొనసాగితే.. ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం భవిష్యత్‌లో అంత సులభం కాదు. బ్యాంకు రుణాలపై ఆధారపడే చిన్న వ్యాపారులపై ఈ ప్రభావం పడొచ్చు. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ వ్యయాల్లో కోత పడి.. దేశంలో సామాజిక, రాజకీయ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం అప్పులతోనే ముందుకు సాగాలని అంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు. text: 1942లో అయిదేళ్ల వైరా ఫొటో లాత్వియాకు పదేళ్ల పాటు అధ్యక్షురాలిగా ఉన్న వైరా వైక్ ఫ్రీబెర్గా ఆ దేశ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళ కూడా. వైరా కుటుంబం ఏడు దశాబ్దాల కిందట లాత్వియాను విడిచి జర్మనీ వెళ్లిపోయింది. ఆ తరువాత మొరాకో, అక్కడి నుంచి కెనడా వెళ్లిపోయింది ఆ కుటుంబం. అయితే, తన తల్లిదండ్రులు ఎన్నడూ తనను లాత్వియా దేశస్థురాలన్న విషయం మర్చిపోనివ్వలేదని వైరా 'బీబీసీ'తో చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లాత్వియాను తొలుత జర్మనీ, ఆ తరువాత సోవియట్ యూనియన్ ఆక్రమించాయి. అప్పటి జ్ఞాపకాలు ఇంకా తనకున్నాయంటారామె. 1944 ప్రాంతంలో లాత్వియాలో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని.. రష్యా బలగాలు లాత్వియాలో మార్చ్ చేసేవని చెప్పారు. చిన్నతనంలో తనకు తెలియక ఆ కమ్యూనిస్ట్ రెడ్ ఆర్మీ ఎర్ర జెండాలు ఎగరవేస్తూ పిడికిలి పైకెత్తి నినాదాలు చేస్తుంటే, తను కూడా అలా పిడికిలి బిగించి హుర్రే అనే దాన్నని... కానీ, తన తల్లి 'ఇది చాలా విషాదం నిండిన రోజు.. నువ్వు అలా వారిని అనుకరించొద్ద'ని తనకు చెప్పిందని వైరా ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. అదే ఏడాది చివర్లో ఆ కుటుంబం స్వదేశాన్ని వీడింది. జర్మనీలోని ల్యూబెక్‌లో శరణార్థుల శిబిరంలోని స్కూల్‌లో సహచర విద్యార్థులతో వైరా(వృత్వంలో ఉన్న బాలిక) పాఠాలు నేర్పిన ప్రవాసం వైరాకు ఏడేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను తీసుకుని జర్మనీ వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఫ్రెంచి పాలనలో ఉన్న మొరాకోకు.. ఆ తరువాత కెనడాకు వెళ్లారు. 1998లో తనకు 60 ఏళ్ల వయసున్నప్పుడు వైరా మళ్లీ లాత్వియా తిరిగొచ్చారు. అలా వచ్చిన ఎనిమిది నెలల్లోనే లాత్వియాకు అధ్యక్షురాలయ్యారు. ''తెల్లవారితే కొత్త సంవత్సరం.. అదే రోజు రాత్రి లాత్వియా బలగాలతో వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకలో బయలుదేరాం. లాత్వియా నుంచి వెళ్లిపోతున్న ఆ బలగాలు కొంతమంది సాధారణ పౌరులనూ తమ ఓడలో ఎక్కించుకున్నాయి. అందులో మేమూ ఉన్నాం. మేమంతా ఓడ డెక్‌పైకి ఎక్కి లాత్వియా జాతీయ గీతాన్ని ఆలపించా'మంటూ ఆమె అప్పటి ప్రవాస ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికే లాత్వియా నుంచి వస్తున్న శరణార్థుల కోసం జర్మనీలో ఏర్పాటు చేసిన శిబిరాల్లోని ఒకదాంట్లో వైరా కుటుంబం ఆశ్రయం పొందింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. పది నెలల వయసున్న వైరా చెల్లెలు న్యుమోనియోకు గురై ఆ శరణార్థి శిబిరంలోనే చనిపోయింది. రష్యా సైనికుల సామూహిక అత్యాచార బాధితురాలు నిర్ణయం జీవితమంటే ఏంటో చెప్పింది చెల్లెలు చనిపోయిన కొద్దికాలానికి వైరా తల్లి మళ్లీ గర్భం దాల్చింది. ఏడాది తరువాత ఆమెకు కొడుకు పుట్టాడు. అదే సమయంలో పక్క శిబిరంలో ఓ 18 ఏళ్ల యువతి కూడా పాపను ప్రసవించింది. కానీ, ఆ యువతి ఆ పాప ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. లాత్వియాలో సోవియెట్ సైనికులు సామూహిక అత్యాచారం కారణంగా ఆ యువతి గర్భం దాల్చడంతో పుట్టిన బిడ్డను తన పాపగా చూసుకోలేకపోయింది. నర్సులు ఎన్నిసార్లు ఆ పాపను ఆ యువతి వద్దకు తీసుకెళ్లినా ఆమె ఆదరించలేదు. చివరకు నర్సులు ఆ పాపకు చనిపోయిన వైరా సోదరి పేరు 'మారా' అని పెట్టారు. ఆ ఘటన వైరాను ఎంతగానో కదిలించింది. తాము ఎంతగానో ప్రేమించే చెల్లెలు తమకు దూరమైంది.. కానీ, ఇక్కడ ఆ యువతి తనకు జన్మించిన చిన్నారినే స్వీకరించడం లేదు.. జీవితం అంటే ఇలా ఉంటుందా అని అప్పుడే తెలిసిందని వైరా చెబుతారు. బాల్య వివాహ భయం జర్మనీలో నాలుగేళ్లు గడిపాక పదకొండేళ్ల వయసులో వైరా తల్లిదండ్రులతో కలిసి మొరాకోలోని కాసాబ్లాంకాకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ''రాత్రి వేళ మేం ప్రయాణిస్తున్న ట్రక్ నుంచి మమ్మల్ని బయటకు నెట్టేశారు. అదొక చిన్న ఊరు. అక్కడ ఫ్రెంచ్ ప్రజలున్నారు. వారితో పాటు అనేక దేశాలవారున్నారు. ఇటలీ, స్పెయిన్, రష్యా ఇలా అన్ని దేశాల్లో ఇబ్బందులు పడి వచ్చినవారితో ఆ ఊరు ఒక చిన్న ప్రపంచంలా ఉంది' అని మొరాకోలో తాము చేరుకున్న ప్రాంతం గురించి వైరా చెబుతారు. అక్కడ తండ్రితో పాటు పనిచేసే ఓ అరబ్ వ్యక్తి తనకు పెళ్లి చేసేయాలని సూచించాడని.. 15 వేల ఫ్రాంకుల కట్నం, రెండు గాడిదలు, కొన్ని పశువులు ఇస్తాను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరాడని.. తండ్రి అంగీకరించకపోవడంతో ఇంకా ఎక్కువ మొత్తం ఇచ్చేందుకూ సిద్ధపడ్డాడని.. వైరా ఇంకా చిన్నపిల్ల, చదువుకుంటుందని చెప్పగా.. చదువుకోనిస్తానని కూడా చెప్పాడని.. అయితే, తండ్రి మాత్రం అందుకు అంగీకరించలేదని చెప్పారు. ఆ ఘటన తరువాత తనకు పెళ్లి చేసేస్తారేమోన్న భయం తనను వెంటాడేదని వైరా చెప్పుకొచ్చారు. సెక్సిస్ట్ ప్రొఫెసర్ ఆ తరువాత కొద్దికాలానికి వైరా కుటుంబం కెనడా చేరుకుంది. 16 ఏళ్ల వయసులో వైరాకు అక్కడ ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చేస్తూనే టొరంటో యూనివర్సిటీలో చదువుకునేది. అక్కడ లాత్వియా నుంచే ప్రవాసం వచ్చిన ఇమాంట్స్ ఫ్రీబెర్గ్స్‌ ఆమెకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయనే ఆమె జీవితభాగస్వామి అయ్యారు. సైకాలజీ చదువుకున్న ఆమె 1965లో సైకాలజీలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అయితే.. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో ఓ ప్రొఫెసర్ తన సెక్సిస్ట్ వ్యాఖ్యలతో కంపరం పుట్టించిన ఘటనను చెప్పుకొచ్చారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు వ్యర్థం అని ఆ ప్రొఫెసర్ అనేవారని.. కానీ.. పురుషుల కంటే మహిళలు కూడా విజయాలు సాధించగలరని ఆమె అంటారు. మాంట్రియల్ యూనివర్సిటీలో 33 ఏళ్లు పనిచేసిన వైరా అయిదు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతారు. ఇప్పటివరకు ఆమె 10 పుస్తకాలు రాశారు. 2003లో రెండో సారి అధ్యక్షురాలైనప్పుడు వైరా 60 ఏళ్ల వయసులో స్వదేశానికి.. వైరా 60 ఏళ్ల వయసులో 1998లో స్వదేశానికి తిరిగొచ్చారు. అక్కడ ఎమిరటస్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ పదవికి రాజీనామా చేద్దామనుకుంటున్న సమయంలో ఓ రోజు సాయంత్రం లాత్వియా ప్రధాని నుంచి ఆమెకు ఫోనొచ్చింది. లాత్వియాలో నెలకొల్పుతున్న ఓ కొత్త సంస్థ బాధ్యతలను ఆమె చేతిలో పెట్టారు. అక్కడికి కొద్దిరోజుల్లోనే లాత్వియా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం సాధించారు. అలా ఆ దేశ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. 2004లో లాత్వియా యూరోపియన్ యూనియన్, నాటోల్లో చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన ఆమె 2007 వరకు అధ్యక్ష పదవిలో ఉన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు, ఆ తరువాత కూడా మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేశారు. మహిళలు ఏమీ సాధించలేరన్న కెనడా ప్రొఫెసర్‌పై విజయం సాధించడం కంటే ఇంకా ఎంతో సాధించానని ఆమెకు కూడా తెలుసు. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) యుద్ధం కారణంగా నాశనమైన లాత్వియా నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి దశాబ్దాల పాటు ప్రవాసంలో గడిపిన ఆమె పరిస్థితులు మారాక సొంత దేశానికి తిరిగొచ్చి కొద్దికాలానికే ఏకంగా దేశాధ్యక్షురాలయ్యారు. text: ఈ సమస్య ఉన్నవారికి ఒమేగా-3 హాని కలిగించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. బీఎంజే సంస్థ 80కి పైగా అధ్యయనాలను సమీక్షించగా, ఒమేగా-3 వల్ల వారికి హాని కలుగుతుందనే ఆధారాలు లభించలేదు. అయితే దీనివల్ల ప్రయోజనం కలుగుతుందనే దాఖలాలూ లేవు. ఆరోగ్యకర ఆహారంలో భాగంగా ఆయిలీ ఫిష్‌ను తినడం ద్వారా ఒమేగా-3ని పొందడం మేలని చారిటీ సంస్థ 'డయాబెటిస్ యూకే' చెప్పింది. మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో 90 శాతం మంది టైప్ 2 డయాబెటిస్ బాధితులే. ఈ సమస్య ఉన్నవారిలో క్లోమ గ్రంథి(పాంక్రియాస్) తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు, లేదా శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు స్పందించలేవు. అధిక బరువు, ఊబకాయం, మధుమేహం ఉన్నవారితో దగ్గరి బంధుత్వం ఉంటే ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది. పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ లీ హూపర్ బీబీసీతో మాట్లాడుతూ, ఒమేగా-3 సప్లిమెంట్లు గ్లూకోజ్ నియంత్రణను మరింత కష్టతరం చేస్తాయని, దీనివల్ల టైప్-2 మధుమేహ బాధితులకు హాని కలగొచ్చనే ఆందోళనలు ఉన్నాయని చెప్పారు. ఈ సమస్య ఉన్నవారికి లేదా ఈ సమస్య తలెత్తే ముప్పున్నవారికి ట్రైగ్లిజరాయిడ్లు అధిక స్థాయిలో ఉండొచ్చు. ట్రైగ్లిజరాయిడ్లు ఒక రకమైన బ్లడ్ ఫ్యాట్. దీనిని ఒమేగా-3 తగ్గిస్తుందని చెబుతారు. అయితే ఒమేగా-3తో హానిగాని, ప్రయోజనంగాని ఉండదని లీ హూపర్ చెప్పారు. ఒమేగా-3 సప్లిమెంట్లు ఖరీదైన వ్యవహారమని ఆమె వ్యాఖ్యానించారు. మధుమేహం ముప్పుంటే ఈ సప్లిమెంట్లపై కంటే ఆయిలీ ఫిష్ లేదా శారీరక శ్రమ కోసం డబ్బు వెచ్చించాలని సూచించారు. పండ్లు, తృణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటానికి దోహదపడతాయి. 'డయాబెటిస్ యూకే' డిప్యూటీ హెడ్ ఆఫ్ కేర్ డగ్లస్ ట్వెనెఫోర్ మాట్లాడుతూ- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అత్యంత ప్రధానమైన అంశమన్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, యోగర్ట్, చీజ్ లాంటి కొన్ని ఆహార పదార్థాలు టైప్ 2 మధుమేహం ముప్పును తగ్గిస్తాయని తెలిపారు. ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కీలకమని, టైప్ 2 మధుమేహం ఉన్నవారు సప్లిమెంట్ల రూపంలో కంటే వారానికి రెండుసార్లు ఆయిలీ ఫిష్ తినడం మేలని డగ్లస్ వివరించారు. హెల్త్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(హెచ్‌ఎస్‌ఐఎస్)కు చెందిన డాక్టర్ క్యారీ రుక్స్‌టన్ భిన్నమైన వాదన వినిపించారు. ప్రభుత్వ సలహా ప్రకారం ప్రజలు చేపలు ఎక్కువగా తినాలనే తాను కూడా చెబుతానని ఆమె తెలిపారు. కానీ వాస్తవానికి ఫిష్ ఆయిల్ నుంచి లేదా ఆల్గే నుంచి తయారుచేసిన ఒమేగా-3 సప్లిమెంట్లు తీసుకున్నా సరిపోతుందని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టైప్-2 మధుమేహం ఉన్నవారిని ఒమేగా-3 ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకొనేలా ప్రోత్సహించకూడదని ఇంగ్లండ్‌లోని 'యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ అంగీలా' పరిశోధకులు చెప్పారు. text: నిజానికి ఏడాదిన్నర నుంచే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను రాహుల్ గాంధీ చూసుకుంటున్నా, అధికారకంగా అధ్యక్ష పదవి తల్లి సోనియా గాంధీ నుంచి ఆయనకు అందింది గతేడాది డిసెంబర్ 16నే. ఆ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవడానికి ముందే మూడు హిందీ రాష్ట్రాలు... రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల విజయం రూపంలో ఆయనకు మంచి బహుమతి దక్కింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ విజయం పార్టీకి తిరుగులేని శక్తినిచ్చింది. అక్కడ ఓట్లు, సీట్ల విషయంలో కాంగ్రెస్‌కు(63) బీజేపీకి(15) మధ్య చాలా అంతరం ఉంది. ఇప్పటిదాకా ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అదే ఎక్కువ అంతరం. ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో తమ పేదల అనుకూల పాలనా విధానాన్నే అస్త్రంగా మలచుకొని బీజేపీ ప్రచారం చేసింది. కానీ వారి నుంచే పార్టీకి వ్యతిరేకత ఎదురైంది. మరోపక్క దేశంలో గ్రామీణ ప్రజలు, రైతు వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న తరుణంలో రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ వ్యతిరేక ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ ఓటింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా జరగాలనేం లేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల షేర్ పరంగా కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మధ్య ప్రదేశ్‌లో బీజేపీకే కాస్త ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ, చివరికి ఇతర పార్టీల మద్దతుతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లోనూ కాంగ్రెస్ అలాంటి పరిస్థితినే కొనసాగించొచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే, ఈ ఫలితాల కారణంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో, చిన్న స్థాయి నాయకుల్లో రాహుల్ సామర్థ్యంపైన ఉన్న అనుమానాలు తొలగిపోయుంటాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ సీట్లలో 59 బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. (2014లో 62 ఉండేవి. ఉప ఎన్నికల్లో మూడు సీట్లు కోల్పోయింది) ప్రస్తుత ఓటింగ్ సరళిని గమనిస్తే, 2019లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో తన సీట్లను 6 నుంచి 33కు పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాల వల్ల, 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి మేలైన సారథి ఎవరనే దానిపై చర్చకు కూడా ముగింపు పడుతుంది. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌ కూడా రాహుల్‌కు మద్దతు తెలిపారు. గత ఏడాది కాలంలో గుజరాత్‌లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగైంది. కర్నాటకలో జేడీ(ఎస్)తో కలిసి అధికారాన్ని చేజిక్కిచ్చుకుంది. ఈ పరిణామాలు రాహుల్ నేతృత్వంలోనే జరిగాయి. రాజస్థాన్‌లో ఉప ఎన్నికల్లో ఆల్వార్, అజ్మీర్ లోక్ సభ స్థానాలతో పాటు కర్నాటకలో గత నెల ఉప ఎన్నికల్లో మరో రెండు లోక్ సభ సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకుంది. వీటితో పోలిస్తే డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయం కాంగ్రెస్‌కు మరింత కీలకంగా మారింది. 2013 డిసెంబర్‌లో మొదలైన కాంగ్రెస్ తిరోగమనానికి ఇది ముగింపు పలికింది. పార్టీకి హీనమైన రోజులు చరిత్రలో కలిసిపోయాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. 2013 డిసెంబర్‌లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ ఫలితాలు కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. ఫలితంగా 2014లో లోక్‌సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య అత్యల్పంగా 44కు పడిపోయింది. 2013లో రాజస్థాన్ అసెంబ్లీలో 93 సీట్ల నుంచి ఆ పార్టీ బలం 21కి దిగజారింది. దిల్లీలో పరిస్థితి మరీ దారుణం. కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అనూహ్య విజయాన్ని సాధించింది. వరుసగా 15ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్, ఆ ఏడాది అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క సీటూ గెలవలేకపోయింది. మధ్య ప్రదేశ్‌లో బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ 230 అసెంబ్లీ సీట్లకుగాను 165 సీట్లు చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఆ చేదు అనుభవాలనుంచి కాంగ్రెస్ బయటపడుతోంది. అంతమాత్రాన ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పోలుస్తూ వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగ్గా రాణిస్తుందని చెప్పడం కూడా సరికాదు. 2014లో నెలకొన్న 282-44 సీట్ల అంతరాన్ని ఐదేళ్లలో భర్తీ చేయడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదు. నరేంద్ర మోదీ - రాహుల్ గాంధీ మధ్య పోటీలో అనుకూల పవనాలు మోదీవైపే వీయొచ్చు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా లోక్‌సభలో ప్రస్తుతం దాని బలం 47కే పరిమితమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎన్నికల మ్యానిఫెస్టోల్లో రుణ మాఫీ, నిరుద్యోగ భృతి లాంటి ఆచరణకు కష్టమైన హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మధ్య ప్రదేశ్‌లో బీజేపీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు, 23వేల గ్రామ పంచాయతీల పరిధిలో గోశాలలను నిర్మిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హిందుత్వ విమర్శలు రాహుల్ గాంధీని కూడా తాకాయి. ఆయన ఎన్నికల సమయంలో గుళ్ల చుట్టూ కూడా తిరిగారు. మరోపక్క 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన హింసలో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కమల్ నాథ్‌ను ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం కూడా ఆయనపై విమర్శలకు తావిస్తోంది. దాన్ని బట్టి చూస్తే ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ తనను తాను ఒక ప్రత్యామ్నాయంగా చూపించుకోగలుగుతోంది. కానీ, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతీక కాలేకపోతోందని అర్థమవుతోంది. ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందే తప్ప ప్రత్యామ్నాయ రాజకీయాల్లో ఒక విజేతగా కనిపించట్లేదు. రాజకీయంగా రాహుల్ గాంధీకి ఏడాది కాలంలో కొన్ని సానుకూలతలైతే ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో వివిధ వర్గాలను ఆయన ఒకతాటిపైకి తెచ్చిన తీరు పార్టీ శ్రేణుల్ని ఆకర్షించింది. ముఖ్యంగా పార్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య సఖ్యత కుదిర్చి, సీనియర్లకు ప్రాధాన్యం కల్పించి నాయకత్వం మారినంత మాత్రాన సీనియర్లను పక్కనబెట్టాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని కూడా రాహుల్ పంపారు. సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా పార్టీ పుంజుకోవడానికి సాయపడిన అందరికీ రాహుల్ ప్రాధాన్యం కల్పించారు. దీని వల్ల ఆయనకు ఇంటా బయటా స్నేహితులు లభిస్తారు. ఒక్కో పావును కదపడంలో ఆయన అమిత్ షాకు పోటీనిచ్చినా, మోదీ మాస్ అప్పీల్‌ను జయించాలంటే మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో ఆయన కూటములను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కూటమిలో కాంగ్రెస్‌ది కింది చేయి అయినా సరే. (జతిన్... ‘రాహుల్: ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ రాహుల్ గాంధీ’ పుస్తక సహ రచయిత, పాత్రికేయుడు) ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయం అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు రాహుల్ గాంధీలోనూ కొత్త ఉత్సాహం నింపింది. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్‌కు ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. text: మెన్ రాష్ట్రంలోని వాన్ బరెన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. తనకు తూటా తగిలినట్లు రొనాల్డ్ 911కు ఫోన్ చేయడంతో, ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఆయన ఏర్పాటు చేసుకున్న ఉచ్చును గుర్తించారు. ఇంట్లోకి ఎవరైనా చొరబడేందుకు ప్రయత్నిస్తే హ్యాండ్ గన్ పేలి వారికి తూటా తగిలేలా ఇంటి తలుపులను రొనాల్డ్ తీర్చిదిద్దినట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికాలో ఇళ్ల యజమానులు ఇలాంటి ఉచ్చులు ఏర్పాటు చేసుకోవడం అసాధారణమేమీ కాదు. కానీ, ఇద్ది చట్ట వ్యతిరేకమైన చర్య. ‘‘తనకు తూటా తగిలిందని రొనాల్డ్ మాకు ఫోన్ చేసి చెప్పారు. మేం వెళ్లి విస్తృత స్థాయిలో విచారణ జరిపాం. రొనాల్డ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న పరికరం కారణంగానే గన్ పేలినట్లు గుర్తించాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు’’ అని స్థానిక పోలీసు విభాగం ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించింది. అయితే, ఆ గన్ అనుకోకుండా ఎలా పేలిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇంట్లో మరిన్ని అనుమానాస్పద పరికరాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో వాటిని వారు పరిశీలిస్తున్నారు. గతంలోనూ ఇలా ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న ఉచ్చుల కారణంగా వ్యక్తులు చనిపోయిన ఘటనలు అమెరికాలో చోటుచేసుకున్నాయి. అమెరికాలో ఇలాంటి ఉచ్చులు పూర్తిగా చట్ట విరుద్ధం. వీటిని ఏర్పాటు చేసుకునేవారిపై అధికారులు చర్యలూ తీసుకుంటున్నారు. ఇలాంటి ఉచ్చుల బారిన పడ్డ చొరబాటుదారులకు.. ఇళ్ల యజమానులే పరిహారం చెల్లించేలా గతంలో కోర్టులు తీర్పునిచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమ ఇంటిని కాపాడుకునే హక్కు వ్యక్తులకు ఉన్నప్పటికీ, చొరబాటుదారుడికి శిక్షను నిర్ణయించే అధికారం యజమానికి లేదని కోర్టులు స్ఫష్టం చేశాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇంట్లోకి ఎవరూ చొరబడకుండా సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఉచ్చులో చిక్కుకుని అమెరికాలో రొనాల్డ్ సిర్ (65) అనే వ్యక్తి మరణించారు. text: మరో 40మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. వేదాంత గ్రూప్‌కి చెందిన ఈ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు నిరసనలు చేపట్టి 100 రోజులు కావడంతో ఫ్యాక్టరీతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం వైపుగా ఆందోళనకారులు ర్యాలీగా బయలుదేరారు. ఆ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ఫ్యాక్టరీతో పాటు, కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఆ ఆంక్షల్ని లెక్క చేయని ఆందోళనకారులు ఫ్యాక్టరీ, కలెక్టర్ కార్యాలయం పరిసరాలకు చేరుకున్నారు. పోలీసులు, ఫ్యాక్టరీ భద్రతా సిబ్బంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి. దాంతో పోలీసులు తొలుత భాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళతో సహా 9మంది చనిపోయారు. మరో 40మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 9 మంది చనిపోయిన మాట వాస్తవమేననీ, కానీ వారు పోలీసుల కాల్పుల్లో చనియపోయారో లేదోనన్నది స్పష్టం కాలేదనీ జిల్లా అధికారి ఒకరు బీబీసీ తమిళ ప్రతినిధి ప్రమీలా కృష్ణన్‌తో చెప్పారు. ప్రస్తుతం తూతుక్కుడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏమిటీ స్టెర్లైట్? ప్రపంచంలోని అతిపెద్ద లోహ, మైనింగ్ సంస్థల్లో 'వేదాంత' ఒకటి. దీని యజమాని అనిల్ అగర్వాల్. ఆయన స్వస్థలం బిహార్‌లోని పట్నా. వ్యాపారవేత్తగా ముంబయిలో స్థిరపడిన అనిల్ వేదాంత కంపెనీని స్థాపించారు. లండన్ షేర్ మార్కెట్‌లో నమోదైన తొలి భారతీయ కంపెనీ ఇదే. వేదాంత గ్రూపులోని ఓ సంస్థ స్టెర్లైట్. గుజరాత్‌ సమీపంలోని సిల్వస్సా, తమిళనాడులోని తూతుక్కుడిలో ఈ సంస్థ కార్యాకలాపాలు నిర్వహిస్తోంది. తూతుక్కుడిలోని కర్మాగారంలో ఏటా 4 లక్షల మెట్రిక్ టన్నుల రాగిని ఉత్పత్తి చేస్తోంది. ఎప్పటి నుంచి ఈ నిరసనలు? స్టెర్లైట్‌కు మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ 1992లో 500 ఎకరాల భూమి కేటాయించింది. అయితే, ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఆందోళనలు చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. పరిశ్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని 1993లో అక్కడి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలిపోయింది. "1994లో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఈ ఫ్యాక్టరీకి నిరభ్యంతర పత్రం ఇచ్చింది. అయితే పర్యావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షలు చేయాలని ఆ సంస్థను కోరింది. పరిశ్రమను గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, 14 కిలోమీటర్ల దూరంలోనే నెలకొల్పారు" అని పర్యావరణవేత్త నిత్యానంద్ జయరామన్ వివరించారు. కేసులు: నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఎండీఎంకే నేత వైగో, కమ్యూనిస్టు పార్టీల నేతలు ఈ కర్మాగారానికి వ్యతిరేకంగా కేసులు వేశారు. ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని ఈ ఫ్యాక్టరీ తీవ్రంగా కలుషితం చేస్తోందని వారు ఆరోపించారు. 1997- 2012 మధ్య ఈ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందాలను పునరుద్ధరించుకోలేదన్నది ప్రధాన ఆరోపణ. ఈ కర్మాగారాన్ని మూసేయాలని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో సంస్థ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కంపెనీకి రూ.100 కోట్ల జరిమానా విధించిన అత్యున్నత న్యాయస్థానం, కార్యకలాపాలను కొనసాగించవచ్చని చెప్పింది. ఎందుకీ ఆకస్మిక ఆందోళన? స్టెర్లైట్ కర్మాగార విస్తరణను వ్యతిరేకిస్తూ తొలి రోజు నుంచీ తాము శాంతియుతంగా నిరసన చేస్తున్నామని పర్యావరణవేత్త నిత్యానందన్ అన్నారు. ఈ పరిశ్రమను కట్టడి చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ సంస్థ అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని, దానికి వ్యతిరేకంగానే తాము ఈ ఆందోళన చేస్తున్నామని ఆయన తెలిపారు. కంపెనీ ఏమంటోంది? పరిశ్రమ విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ తీసుకున్నామని సంస్థ పీఆర్వో ఇసాకిముథు తెలిపారు. కర్మాగారంలో వ్యర్థాల నిర్వహణ కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. శుద్ధి చేసిన సముద్రపు నీరు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే వృథా నీటిని మాత్రమే కొత్త యూనిట్‌లో వినియోగిస్తామని, ద్రవరూప వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని వెల్లడించారు. తమ ఫ్యాక్టరీ వల్ల 2,000 మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పీఆర్వో వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమిళనాడులోని తూతుక్కుడి (Tuticorin) జిల్లాలో స్టెర్లైట్ రాగి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 9మంది చనిపోయారు. text: గాంధీజీ ప్రభావానికి గురైనవారూ ఉన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్‌ మండేలా (1928-2013), అమెరికాలో పౌర హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ (1929-1968) తదితరులు. అయితే, వీరందరిలోనూ అహింస అనిగానీ, సహాయ నిరాకరణ అనిగానీ పలకగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు మాత్రం.. గాంధీ. అహింస అనేది గాంధీ ఇంటి పేరుగా మారిపోయింది, ఎందుకు? 1919లో గాంధీజీ ఇచ్చిన హర్తాళ్ పిలుపు మొదలుకొని 1942లో ఆయన నడిపిన 'క్విట్‌ ఇండియా' వరకూ అన్ని ఉద్యమాలూ శాంతియుతంగానే ప్రారంభమయ్యాయి. కానీ, వాటిలో ఏదీ అహింసాత్మకంగా ముగియలేదు. అయినా అహింసతోనే స్వాతంత్ర్యం సిద్ధించింది అని మనకు మనం నచ్చచెప్పుకొంటాం. అదే వింత. ఉద్యమంలో హింస చేరిందని చెప్పి ప్రతిసారీ పొంగిన ఉద్యమంపై నీళ్లు కుమ్మరించారు గాంధీజీ, ఆయన నడిపిన ఉద్యమాలన్నిటికీ ఇదొక రొటీన్‌ ముగింపు. ఆయన ఉద్యమాన్ని నిర్దయగా బలిపెట్టినా.. శాంతి అహింసలను కాపాడడం కోసమే ఆయన ఆ పని చేశారని జాతి నమ్మింది. అలా నమ్మించారు. ఎవరు? శాంతి, అశాంతి, హింస, అహింస అనే మాయా వలయంలో నుంచి బయటపడి ఆలోచిస్తేగానీ అసలు మర్మం తెలియదు. అహింసాత్మక ప్రతిఘటన దీని గురించి మాట్లాడుతూ, "రష్యన్‌ విప్లవంలో కూడా తొలి దశలో పోరాటం అహింసాత్మకంగానే సాగింది" అంటాడు రష్యన్‌ విప్లవ నేత ట్రాట్‌స్కీ. విప్లవ వర్గాలు తొలి తిరుగుబాటు అడుగులు వేసేటప్పుడు చట్టపరిధిని దాటకుండా, మత భావాలను నొప్పించకుండా జాగ్రత్త తీసుకొంటాయి. ఆ దశలో వారికి తమ శక్తి మీద పూర్తి నమ్మకం ఉండదు. రైతాంగం విషయంలో ఇది మరింత నిజం. ఆ దశలో వర్గాల మధ్య రాజీ కుదర్చాలని బోధించేవారు ప్రభుత్వవర్గం నుంచే తలెత్తుతారు. రచయిత టాల్‌స్టాయ్‌ రైతు మనస్తత్వం బాగా తెలిసినవాడు. ఆయన "అహింసాత్మక ప్రతిఘటన" అనే సిద్ధాంతం పుట్టిన నేపథ్యం అది. - ఇదీ లియోన్‌ ట్రాట్‌స్కీ విశ్లేషణ సారాంశం. నిజానికిది అన్ని విప్లవాలకూ వర్తించే సార్వత్రిక సూత్రమని చెప్పవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసినా, షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో కశ్మీర్ ప్రజల పోరాటాన్ని చూసినా, ఆనాటి దేశంలో తలెత్తిన అనేక జమీందారీ వ్యతిరేక పోరాటాలు చూసినా, మొత్తంగా బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలను చూసినా ఇదే కనిపిస్తుంది. తొలి దశలో దొరల్నీ పాలకుల్నీ బతిమలాడుకోడమే కనిపిస్తుంది. వేడుకోళ్లూ మొత్తుకోళ్లూ ఆ దశలో మామూలే. దొరల్ని ఇంకా ఇంకా సంతోషపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి. శాంతియుతంగా పొరాడటంలో ఇంకా ఇతర ప్రయోజనాలు లేవని కాదు. ఉద్యమం సామాన్య జనంలో విస్తరించడానికి అవి తోడ్పడతాయి. ఉద్యమం పెరిగాక కూడా సమ్మెలు, హర్తాళ్లు, పన్నుల ఎగవేత లాంటి శాంతియుత ఉద్యమాలకు గొప్ప ప్రభావం ఉంటుంది. తొలిదశలో ఉద్యమం శాంతియుతంగా ఉండాలని ఎవరూ బోధించనక్కర్లేదు. కానీ, ఆ తర్వాత కూడా సమయోచితంగా ప్రయోగించగలిగిన అద్భుత ఆయుధం అహింస. కానీ, అక్కడితో ఆగిపోతుందా? పాలకులు అహింసను అహింసతోనే ఎదుర్కొన్నారా? నిరాయుధులైన ప్రజల సమావేశాలను పాలకులు ఎన్నిసార్లు రక్తపుటేరులుగా మార్చలేదు. జలియన్‌వాలాబాగ్‌లో వాళ్లు చేసిన పనేమిటి? చట్ట పరిధిలోనే జరిగే పోరాటాలకు ప్రాధాన్యం లేదని ఎవరూ అనరు. క్యూబా, దక్షిణ వియత్నాం, చైనా తదితర వివ్లవాల్లో సాయుధ పోరాటాలను చట్టబద్ధ పోరాటాలతో సమన్వయం చేశారు. చివరి రెండు దేశాల్లోనూ కమ్యూనిస్టులు ఆ పని చేశారు. క్యూబాలో బాటిస్టా పీడ విరగడ చేసుకోడానికి అనేక పార్టీలు పరస్పరం సహకరించుకొన్నాయి. గాంధీజీ అహింస అనే దాన్ని సర్వరోగనివారిణి గానూ సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రయోగించే ఏకైక పిడి సూత్రంగానూ మార్చేశారు. అది కూడా సాదాసీదాగా లేదు. అహింస విషయంలో ఆయన జనాన్ని గందరగోళపర్చిన సందర్భాలు కొల్లలు. ఇదేం తర్కం అని ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన కత్తికి రెండు వైపులా పదునుంది అనుకోవాలన్నమాట. ఏకకాలంలో.. హింస చేయడమే సరైన బాధ్యత అని బోధించినా, అహింస తప్ప మరే గత్యంతరమూ లేదని వాదించినా ఆయనకే చెల్లిపోయింది. చిట్టగాంగ్‌ ఆయుధాగారంపై సూర్యసేన్‌ అనుయాయుల దాడిగానీ, భగత్‌సింగ్ వంటి వీరుల త్యాగాలు గానీ, మన్యంలో అల్లూరి నడిపిన పితూరీలుగానీ, నావికుల తిరుగుబాటు గానీ, జనంపై కాల్పులు జరపడానికి నిరాకరించిన సిపాయిలు గానీ, ముస్లిం లీగు నిర్వహించిన పోరాటాలు గానీ, రైతాంగ పోరాటాలు గానీ, కార్మికుల సమ్మెలు గానీ, దేశం నలుమూలలా విప్లవకారులూ కమ్యూనిస్టులూ సోషలిస్టుల విప్లవ చర్యలు గానీ, కదిలించలేని బ్రిటిష్ పాలనని గాంధీ శాంతి, అహింసలూ కదిలించాయని మనల్ని మనం నమ్మించుకొంటున్నాం అనిపిస్తుంది. గాంధీని పిరికివాడని ఎవరూ అనలేరు. ఆయన నిగ్రహ శక్తి గొప్పదే. పోలీసులు ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా ఆయన తన పంతాన్ని విడిచిపెట్టని మాట నిజమే. ఆయన పట్టిన నిరాహార దీక్షల్లో ఏదీ ఉత్తుత్తి దీక్ష కాదన్నది నిజం. అప్పుడప్పుడూ బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చి కొన్ని చిన్న కోర్కెలు తీర్చిన మాట నిజం. కానీ, భారత్‌ని వదిలేయడానికి గాంధీ నిరాహార దీక్షలు, గాంధీ అలక పాన్పులు, గాంధీ ఆత్మశక్తి, గాంధీ సహకార నిరాకరణలు, గాంధీ శాంతి అహింసలూ కారణమా అన్నది ప్రశ్న. బ్రిటిష్ పాలకులు నిరాహార దీక్షలకే చలించిపోయేంత సున్నిత హృదయులా? వాళ్లు ఎప్పటి నుంచో అదిమిపెట్టి ఉంచుతున్న ఐర్లాండ్‌ని చూడండి. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా అక్కడ 1917 నుంచే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఆ దీక్షల్లో లెక్కలేనంత మంది చనిపోయారు. మార్గరెట్‌ థాచర్‌ పాలనలో ఒక్క 1981లోనే నిరాహార దీక్షల్లో 10 మంది చనిపోయారు. మొట్ట మొదట చనిపోయినవాడు బాబీ శాండ్స్. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కానీ, థాచర్‌ ప్రభుత్వానికి చలనమే లేదు. గాంధీ అహింసా మంత్రాలకి బ్రిటిష్ చింతకాయలు రాలలేదన్నది స్పష్టం. మళ్లీ టాల్‌స్టాయ్‌ దగ్గరికి వెళ్దాం. అహింసాత్మక ప్రతిఘటన గురించి పూర్తిగా నమ్మి ఆయన దానిని బోధించారు. ఆయన ప్రభువర్గం వాడే అయినప్పటికీ ఆ వర్గం మీద ఆయనకు వల్లమాలిన ప్రేమ ఏమీ లేదు. ఆయన నూటికి నూరు పాళ్లూ రైతుల మనిషి, రైతుల క్షేమం కోసమే అహింసను ఆయుధంగా వాడమన్నారు. గాంధీ అలా కాదు. జమీందార్లు, భూస్వాములు, పెట్టుబడిదార్లు గాంధీ దృష్టిలో ధర్మకర్తలు. వారు ఆయన మనుషులు. ఆయన వారి మనిషి. వారి ప్రయోజనాలు దాటి ఆయన ఎక్కడకూ పోరు. ఎన్నడూ పోలేదు. కాకపోతే, శాంతిగా దయగా ఉండమని ఆయన వారికి బోధిస్తారు. వాళ్లు మరీ దుర్మార్గంగా ఉన్నప్పుడు అలుగుతారు కూడా. అది వేరే విషయం. ఇప్పుడు జమీందారులు లేరు. భూస్వాములు దాదాపు కనుమరుగవుతున్నారు. పెట్టుబడిదారులు మాత్రం ఏపుగా పెరిగి ఉన్నారు. ఏటా గాంధీ కథలను గుర్తుచేయడానికి వారున్నారు. మరి సూర్యసేన్‌లనూ, భగత్ సింగులనూ, సీతారామరాజుల్నీ, కార్మిక కర్షక పోరాట వీరుల్నీ గుర్తుచేయడానికి ఎవరున్నారు? బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. అంబేడ్కర్‌ మాట్లాడుతూ... తాను గాంధీని మహాత్మ అని సంబోధించను అని స్పష్టం చేశారు. భారత చరిత్రలో గాంధీది ఒక అంకం మాత్రమేననీ ఆయన ఒక యుగకర్త కాజాలడనీ ఆంబేడ్కర్ అన్నారు. ఏటా గాంధీ జయంతులూ, గాంధీ వర్థంతులూ రొటీన్‌గా కాంగ్రెస్‌ పార్టీ జరుపుతూ, గాంధీ జ్ఞాపకాలకి కృత్రిమ శ్వాస పరికరాలు తగిలించకుండా ఉంటే ప్రజల స్మృతిపథం నుంచి ఆయన ఏనాడో మాయమై ఉండేవారంటారు డా. అంబేడ్కర్‌. (అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) గాంధీజీ ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల ప్రభావానికి గురయ్యారు. జాన్‌ రస్కిన్‌ (1819-1900), హెన్రీ డేవిడ్‌ థొరో (1817-1862), లియో టాల్‌స్టాయ్‌ (1828-1910). ఒక బ్రిటిషర్‌; ఒక అమెరికన్‌; ఒక రష్యన్‌. text: సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సంస్థలు కలసి హైదరాబాద్‌లో మురుగు నీటిలో కరోనా వైరస్ జాడపై పరిశోధన జరిపాయి. నిజానికి నోరు, ముక్కు నుంచే కాకుండా, మల, మూత్రాల నుంచి కూడా కరోనా వైరస్ విసర్జితమవుతుందని తొలుత పరిశోధకులు గుర్తించారు. ఒకసారి వ్యాధి సోకిన వారి నుంచి సుమారు 35 రోజుల వరకూ విసర్జితాల్లో వైరస్ ఉంటుంది. అయితే ఈ మురుగునీటిలోని వైరస్ వల్ల మనుషులకు వ్యాధి సోకదని సీసీఎంబీ తెలిపింది. ప్రస్తుతం 2 లక్షల 60 వేల యాక్టివ్ కేసులు ఉండవచ్చు హైదరాబాద్ నగరంలో రోజుకు 180 లక్షల లీటర్ల మురుగు నీరు విడుదల అవుతుంది. అందులో 40 శాతం మురుగు నీటిని వివిధ ప్లాంట్లలో శుద్ధి చేస్తారు. నగరంలోని 80 శాతం శుద్ధి ప్లాంట్ల దగ్గర సీసీఎంబీ శాంపిల్స్ తీసుకుంది. నీరు శుద్ధి చేసిన తరువాత వైరస్ కనిపించలేదనీ, తద్వారా నీరు శుద్ధి బాగా జరుగుతోందనీ సీసీఎంబీ వ్యాఖ్యానించింది. ఈ పరిశోధన వల్ల గత 35 రోజుల్లో ఎందరికి వ్యాధి సోకిందో ఒక అంచనా వేసింది సీసీఎంబీ. సుమారు 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ జాడ ఉన్నట్టు సీసీఎంబీ తెలిపింది. వారు తీసుకున్నది మొత్తం హైదరాబాద్లో 40 శాతం ప్రాంత శాంపిలే కాబట్టి, ఆ లెక్కన మొత్తం హైదరాబాద్లో సుమారు 6 లక్షల 60 వేల మందికి వైరస్ సోకి ఉండొచ్చని ఆ సంస్థ అంచనా చెబుతోంది. ఈ ఆరున్నర లక్షల్లో గత 35 రోజుల్లో వైరస్ సోకి లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేనివారు, అలాగే కోలుకున్న వారూ ఉన్నారు. రాకేశ్ మిశ్రా అలాగే, సంప్రదాయ పద్ధతిలో చేసే విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం నగరంలో 2 లక్షల 60 వేల యాక్టివ్ కేసులు ఉండొచ్చని సీసీఎంబీ చెబుతోంది. సీసీఎంబీ ఐఐసీటీ పరిశోధనలను మెడ్ రెక్సివ్ అనే సైన్సు పత్రికకు పంపించారు. వాటిపై ఇంకా సమీక్ష జరగాల్సి ఉంది. ''ముందు నుంచీ చెబుతున్నట్టే, లక్షణాలు లేకుండా ఎక్కువ మందిలో వైరస్ ఉంటోంది. వారికి ఆసుపత్రి అవసరం లేదు, మరణాల శాతం కూడా తక్కువ అన్న వాదనను మా పరిశోధన బలపరిచింది. స్థానిక ప్రభుత్వాలతో కలసి ఈ పరిశోధనలు చేయడం ద్వారా ఏఏ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికీ, దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికీ ఉపయోగపడుతుంది అని చెప్పారు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై సంచలన పరిశోధన చేసింది సీసీఎంబీ సంస్థ. మురుగు నీటిలో వైరస్ వ్యాప్తి ఆధారంగా ఈ పరిశోధన సాగింది. ఈ పరిశోధన ప్రకారం హైదరాబాద్లో 6 లక్షల మందికి పైగా వైరస్ సోకి ఉండొచ్చని సీసీఎంబీ చెబుతోంది. అయితే మురుగునీటి ద్వారా వైరస్ రాదని ఆ సంస్థ ప్రకటించింది. text: అదొక్కటే ఆమె ఎదుర్కొన్న సవాలు కాదు. 100 మీటర్లు పరిగెత్తేందుకు కూడా ఆమె శ్రమపడేవారు. కాళ్లలో, ఉదర భాగంలో బలం పెంచుకునేందుకు, బరువులు కట్టుకుని ఆమె పరుగులు తీసేవారు. కఠిన వ్యాయామాలు చేసేవారు. శిక్షణ, మ్యాచ్‌లు పూర్తయ్యాక పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అర్ధరాత్రి వరకూ పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. క్రీడల కోసం చదువును నిర్లక్ష్యం చేయకూడదని సొనాలీకి ఆమె కుటుంబం గట్టిగానే చెప్పింది. అయితే, క్రీడల్లో రాణించేందుకు ఆమెకు తమకు చేతనైనంత సహకారం కూడా అందించింది. సొనాలీ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. ఆమె తల్లి వికలాంగురాలు. ఆమె తినుబండారాలు అమ్మే కొట్టు నడిపించేవారు. సొనాలీ కబడ్డీలో సత్తా చాటుకుని, భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడింది. 1995లో మే 27న ముంబయిలోని లోయర్ పారెల్‌లో సొనాలీ పుట్టారు. మహర్షి దయానంద్ కాలేజీలో చదివారు. బాల్యంలో ఆమెకు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. అయితే, క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఆట వస్తువులు కొనిచ్చే పరిస్థితిలో ఆమె కుటుంబం లేదు. ఆ తర్వాత ఆమె కాలేజీలో సరదాగా కబడ్డీ ఆడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెకు ఈ క్రీడపై ఆసక్తి పెరిగింది. స్థానిక శివ శక్తి మహిళా సంఘ క్లబ్ కోచ్ రాజేశ్ పడవే దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. సొనాలీకి ఆయనే షూస్, కిట్ కొనిచ్చారు. ఆమెకు కఠోర శిక్షణ ఇచ్చారు. కోచ్‌లు... గౌరీ వాడేకర్, సువర్ణ బర్టాకే లాంటి సీనియర్ క్రీడాకారిణుల తోడ్పాటుతోనే తాను ఈ క్రీడలో ఎదగగలిగానని సొనాలీ చెబుతుంటారు. శిక్షణ మొదలుపెట్టిన కొన్నేళ్లకు సొనాలీ వెస్టర్న్ రైల్వేస్ జట్టులో చేరారు. అక్కడ గౌతమి అరోస్కర్ శిక్షణలో మరింత నైపుణ్యం సాధించారు. 2018లో జరిగిన ద ఫెడరేషన్ కప్ టోర్నమెంట్ సొనాలీ కెరీర్‌లో కీలక మలుపు. ఆ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించిన ఇండియన్ రైల్వేస్ జట్టులో ఆమె సభ్యురాలు. ఈ టోర్నీలో ప్రదర్శనతో సొనాలీ జాతీయ కోచింగ్ శిబిరానికి ఎంపికయ్యారు. ఆ తర్వాత జకార్తాలో జరిగిన 18వ ఆసియన్ క్రీడల్లో భారత్ తరఫున ఆడే అవకాశం సంపాదించుకున్నారు. ఆ టోర్నీలో భారత జట్టు వెండి పతకం గెలిచింది. ఆ తర్వాత 2019లో కాఠ్‌మాండూలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఈ రెండు టోర్నీల్లో విజయాలు సొనాలీకి మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి 2019లో రాష్ట్రంలో అత్యున్నత క్రీడాపురస్కారమైన శివ్ ఛత్రపతి అవార్డును అందజేసి సొనాలీని సత్కరించింది. ఆ మరుసటి ఏడాది సొనాలీ 67వ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచారు. మున్ముందు మరిన్ని అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ తరఫున ఆడి రాణించాలని ఆమె ఆశిస్తున్నారు. భారత్‌లో మహిళల కబడ్డీని మరింత ప్రోత్సహించడానికి... పురుషులకు ప్రొ కబడ్డీ లీగ్ ఉన్నట్లుగానే మహిళలకు కూడా ఓ ప్రొఫెషనల్ లీగ్ ఉండాలని సొనాలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. (సొనాలీ విష్ణు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సొనాలీ విష్ణు శింగేట్ ఇప్పుడు భారత మహిళల కబడ్డీ జట్టులో ఓ ప్రముఖ ప్లేయర్. కానీ, ఈ క్రీడలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, ఆమెకు వేసుకునేందుకు షూస్ కూడా లేవు. వాటిని కొనిచ్చే స్థితిలో ఆమె కుటుంబం లేదు. text: ఓ వంతెన మీద వేలాడుతున్న మృతదేహానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ... ‘అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా అతడి వ్యక్తిత్వాన్ని పదేపదే కించపరచడమే దానికి కారణం. రాజకీయ నాయకులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి’ అని పేర్కొంటూ వేలాదిమంది దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోతో పాటు ఆ డ్రైవర్ పేరును అరవింద్ కుమార్‌గా పేర్కొంటూ, అతడు రాసిన ఆత్మహత్య లేఖ అంటూ ఒక లేఖను కూడా చూపిస్తూ ఆ పోస్టును సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. #AmritsarTrainTragedy అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో పంజాబ్ పోలీసు అధికారి కూడా ఒకరు ఉండటంతో ఆ పోస్టుకు మరింత బలం చేకూరింది. ఇదీ నిజం అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు. అతడు ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో పోలీసుల అదుపులో ఉన్నాడు. అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ ఎస్.ఎస్.శ్రీవాస్తవ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆ ఫొటోల్లో ఆత్మహత్య లేఖ అంటూ చూపుతున్న లేఖ అసలు ఆత్మహత్య లేఖే కాదని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేసి విషయాన్ని సంచలనంగా మార్చే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. అమృత్‌సర్ స్టేషన్ సుపరింటెండెంట్ కూడా ఈ ఫొటోలు, వీడియో నకిలీవని తేల్చారు. ఆ ఫొటో ఎవరిది? సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఫొటో అక్టోబర్ 20 అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతంలో ఉరి వేసుకుని చనిపోయిన ఓ వ్యక్తిదని పోలీసులు తెలిపారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) అమృత్‌సర్‌లో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 58మంది చనిపోయారు. అయితే, ఆ ప్రమాదానికి కారణమైన రైలును నడిపిన డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. text: అమిత్ షా ప్రకటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉంది. "ఈ రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఎన్‌ఆర్‌సీనీ అమలు చేయనివ్వబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. నేను హామీ ఇస్తున్నాను, అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్న ప్రతి వ్యక్తినీ బయటకు పంపుతాం" అని కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్‌ఆర్‌సీని బెంగాల్‌లో అమలు చేయవద్దంటున్నారు. గతంలో భారీ నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు. ఎన్‌ఆర్‌సీ జాబితా అంటే ఏంటి? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోకముందు (అంటే 1971 మార్చి 24కి ముందు) నుంచి తాము భారత్‌లో స్థిరపడినట్లు నిరూపించుకునే వారి జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) అంటున్నారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ తుది జాబితాను ఆగస్టు 31న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అస్సాంలో ఉంటున్న దాదాపు 19 లక్షల మంది భారతీయులు కాదని ఆ జాబితా ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు వారికి మరో 120 రోజుల అవకాశం కల్పించింది. అస్సాం తర్వాత, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలంటూ అధికార బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అస్సాంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పింది. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ కూడా బంగ్లాదేశ్‌తో 2,000 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీసిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ (పాత చిత్రం) అస్సాంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. కొన్ని కుటుంబాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తమ భవితవ్యం పట్ల ఆందోళనతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. "విదేశీయులు" అనే అనుమానంతో చాలా మందిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌సీ జాబితా రూపొందించలేదు. అయినా, ఆ రాష్ట్రంలో కొన్ని విషాదకర ఘటనలు జరిగాయి. అస్సాంలో లక్షల మందిలాగే, తమ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనతో 38 ఏళ్ల ఆనంద రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. తాము భారతీయులమేనని "నిరూపించుకునేందుకు" తగిన పత్రాలు లేవన్న భయంతో ప్రాణాలు తీసుకున్నవారిలో ఆనంద ఒకరు. ఆనంద వయసు 11 నెలలు ఉన్నప్పుడు, బంగ్లాదేశ్‌లో వివక్ష కారణంగా ఆయన తల్లిదండ్రులు భారత్‌కు వలస వచ్చారు. "అస్సాంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించడం ప్రారంభించినప్పటి నుంచి మా కుటుంబం భయంతో బతుకుతోంది. భారత్‌లో మాకు ఓటు హక్కు ఉంది. కానీ, భూమి లేదు. మేము ఇక్కడి వాళ్లమేనని నిరూపించుకునేందుకు పత్రాలు లేవు. ఆనంద దీని గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవారు. మనల్ని కూడా బంగ్లాదేశ్‌కు పంపిస్తారేమో అని భయపడుతూ ఉండేవారు" అని ఆయన సోదరుడు దక్షదా రాయ్ బీబీసీతో చెప్పారు. 1947, 1971లలో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు హిందువులు, ముస్లింలు భారీ సంఖ్యలో వలసవచ్చారు. ఈ జిల్లాకు చెందిన ఇటుక బట్టీ కార్మికుడు 36 ఏళ్ల కమల్ హుస్సేన్ మొండల్ కూడా ఎన్‌ఆర్‌సీ భయంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. "అక్రమ వలసదారుడు అంటూ కేంద్ర ప్రభుత్వం తమను నిర్బంధ కేంద్రంలో వేస్తుందేమో అన్న భయంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు" అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పేద ముస్లింలకు భారత పౌరసత్వం లేకుండా చేయాలన్న కుట్రతో ప్రభుత్వం ఈ పనిచేస్తోందని ఎన్‌ఆర్‌సీ గురించి చాలా మంది విమర్శకులు అంటున్నారు. ఆ విమర్శలను ప్రభుత్వం ఖండించింది. అయినా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పిస్తామన్న హామీ ఇచ్చే పౌరసత్వ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. "ఈ రోజు హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, క్రైస్తవ శరణార్థులకు హామీ ఇస్తున్నాను. మీరు భారత దేశాన్ని విడిచి వెళ్లాలని ఎవరూ బలవంతం చేయరు. వదంతులను నమ్మవద్దు. ఎన్ఆర్సీకి ముందు మేము పౌరసత్వ సవరణ బిల్లును తీసుకువస్తాం. మీ అందరికీ భారత పౌరసత్వం లభించేలా ఆ బిల్లు ఉంటుంది" అని మంగళవారం నాటి ప్రసంగంలో అమిత్ షా నొక్కి చెప్పారు. 9 కోట్లకు పైగా జనాభాతో, పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగో రాష్ట్రం. ఈ రాష్ట్ర పౌరుల్లో మూడింట ఒకవంతు ముస్లింలు ఉన్నారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గళాన్ని వినిపిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో, కొన్ని ముస్లిం సంస్థలు రాష్ట్రంలో కరపత్రాలను పంచాయి. సెమినార్లు నిర్వహించాయి. "అకస్మాత్తుగా రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తే" తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేలా గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలకు ఆ సంస్థలు సూచించాయి. "అక్రమ వలసదారుల కోసం అస్సాంలో భారీ నిర్బంధ శిబిరాన్ని నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది తీవ్ర అయోమయంలో బతుకుతున్నారు. మేము అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది" అని మహ్మద్ నసీరుల్లా బీబీసీతో చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పశ్చిమ బెంగాల్‌లోనూ జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బెంగాల్‌లో అక్రమంగా ఉంటున్న ప్రతి వ్యక్తినీ 'బయటకు గెంటేస్తాం' అని అన్నారు. text: పరుగులు తీసే కాలం ఎవరినీ వదలదని తనకు తెలుసు. అందుకే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు అతడు ప్రకటించాడు జట్టు కోసం తను ఎంత చేశాడో తనిప్పుడు వెనుదిరిగి గర్వంగా చూసుకోగలడు. ఆఫ్ స్టంప్ ఎక్కడుందో తెలుసుకుని ఆచితూచి ఆడే అతడి బ్యాటింగ్ నైపుణ్యం, ఎవరూ అడగకుండానే తనంతట తనే అంగీకరించే అతడి పోటీతత్వం, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో తను కూడా ఉండాలనే ఆ తపన..అన్నీ కలగలసి అతడిని ఒక గంభీరమైన, గర్వించదగ్గ ఆటగాడిగా నిలిపాయి. డాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్‌తో అతడి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందరూ వీరూ-గౌతీ షో అనేవారు. దానిని స్థిరమైన పరుగుల ప్రవాహంగా భావించేవారు. సెహ్వాగ్‌తో కలిసి గంభీర్ తన పాత్రను పోషించిన తీరు ప్రశంసనీయం. తనలోని దూకుడును ఎక్కువసేపు అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు. కానీ కనురెప్ప వేయకుండా బ్యాటింగ్ చేసి తను దాన్ని సాధించాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ బిగ్ ప్లేయర్ 2007లో ముంబయిలో ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 ఫైనల్, 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ ఫైనల్ టాప్ స్కోరర్‌గా నిలిచాక గంభీర్ ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. జోహనెస్‌బర్గ్‌లో పాకిస్తాన్‌పై 75, ముంబైలో శ్రీలంకపై 97 పరుగులు చేసినపుడు, స్ట్రోక్ ప్లేయర్లను స్వేచ్ఛగా ఆడనిస్తూనే గంభీర్ తన పరుగుల దాహాన్ని ఎలా తీర్చుకున్నాడనేది గుర్తుచేస్తుంది. లిమిటెడ్ ఓవర్లలోనే కాదు, టెస్టుల్లో కూడా 2008-2012 మధ్య గంభీర్ భారత బ్యాటింగ్‌కు ఒక స్తంభంలా నిలిచాడు. 2006లో, దాదాపు 2007 పూర్తిగా టెస్టుల్లో చోటు లభించకపోయినా, 2008లో ఆస్ట్రేలియా సీబీ సిరీస్‌లో పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆ లిమిటెడ్ ఓవర్ సిరీస్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియాపై చెరో సెంచరీ కూడా చేశాడు. ఆ సిరీస్ అంతటా గంభీర్ బ్యాటింగ్‌లో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్ సెలక్టర్లు తిరిగి అతడిని జట్టులోకి పిలిపించేలా చేసింది. జట్టులో చోటు కోసం పోరాటం బెస్టాఫ్ త్రీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 2-0తో ఓడించిన తర్వాత జట్టు తిరిగి స్వదేశానికి వెళ్తున్నప్పుడు మెల్‌బోర్న్ విమానాశ్రయంలో నేను అతడితో మాట్లాడింది నాకు గుర్తుంది. "టెస్టు జట్టులో మిమ్మల్ని ఆడించే అవకాశాలేవైనా ఉండచ్చని మీరు అనుకుంటున్నారా? అని అడిగాను, దానికి అతడు నావైపు చూసి ..మీరు అనుకుంటున్నారా"? అన్నాడు. నిజం చెప్పాలంటే, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో సెలక్టర్లు తనను పట్టించుకోకపోయినప్పుడు అతడు నన్నేమీ అనలేదు. బదులుగా ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనరుగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాడు. తనలో బ్యాటింగ్ సత్తా పుష్కలంగా ఉందని సెలక్టర్లకు మరోసారి చూపించాడు. చివరికి అదే అతడికి ఆస్ట్రేలియాతో ఒక అవకాశాన్ని ఇచ్చింది. మొహాలీ టెస్టులో రెండో ఇన్నింగ్స్ 104 పరుగులు చేసిన గౌతమ్, వెంటనే ఫిరోజ్ షా కోట్ల మైదానంలో 206 పరుగులు చేసి భారత్ ఆ టెస్ట్ సిరీస్ గెలవడానికి కీలకం అయ్యాడు. బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, షేన్ వాట్సన్, పీటర్ సిడిల్ లాంటి బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కుని చాలా కొద్దిమంది మాత్రమే బ్యాక్ టు బ్యాక్ టెస్టుల్లో సెంచరీలు చేశారు. ఈ స్కోర్లు ఒక టెస్ట్ క్రికెటరుగా గంభీర్ సత్తాను, సంకల్పాన్ని నిరూపిస్తాయి. రెండు రోజులు సుదీర్ఘ ఇన్నింగ్స్ అయినా, 2009లో న్యూజీలాండ్‌తో నేపియర్ టెస్ట్ డ్రా చేయడానికి చివరి రెండు రోజులు పోరాడాల్సిన దశలో గౌతమ్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 12 గంటలా 45 నిమిషాలు క్రీజులో ఉన్న గంభీర్ 137 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి చివరకు ఆ టెస్ట్ డ్రా అయ్యేందుకు కారణమయ్యాడు. నాకు బాగా నచ్చిన గౌతం గంభీర్ ఆన్ ఫీల్డ్ మూమెంట్ మాత్రం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అతడు చేసిన డబుల్ సెంచరీనే. వాట్సన్‌కు గంభీర్ చుక్కలు గంభీర్ 90ల్లో ఉన్నప్పుడు షేన్ వాట్సన్ ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. బౌన్సర్లు వేస్తూ ఎడమచేతి బ్యాట్స్ మెన్ అయిన గంబీర్‌ను ముప్పుతిప్పలు పెట్టాలనుకున్నాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ ఇచ్చి థర్డ్ మ్యాన్‌ చేతికి చిక్కేలా గంభీర్‌ను మాయ చేయాలనుకున్నాడు. కానీ అతడి తర్వాత ఓవర్లోనే గౌతం గంభీర్ తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. 99లో బ్యాటింగ్ చేస్తున్న గంభీర్ ఒక అడుగు ముందుకేసి స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. అతడు సెంచరీ పూర్తి చేసిన ఆ స్టైల్ చూసి సెహ్వాగ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ అద్భుతమైన షాట్‌తో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పొటింగ్‌ తర్వాత రోజు వరకూ వాట్సన్‌ను బౌలింగ్ నుంచే తప్పించాల్సివచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాక గౌతం గంభీర్ రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఐపీఎల్ లాంటి డొమెస్టిక్ క్రికెట్‌లోనే ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా సక్సెస్ కూడా అయ్యాడు. 2008 రంజీట్రోఫీలో ఫైనల్లో సెంచరీ చేయడంతోపాటు, అతడు ఢిల్లీ జట్టును ముందుకు నడిపించిన తీరు కూడా గుర్తుండిపోతుంది. టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి గంభీర్‌కు ఆ జర్నీ చాలా కీలకంగా నిలిచింది. ఇంకో విషయానికి వస్తే, 1999-2000లో శ్రీలంకలో జరిగిన ఐసీసీ యూత్ వరల్డ్ కప్‌ కోసం తనను సెలక్ట్ చేయనపుడే అతడు అన్ని క్రికెట్ ఫార్మాట్లకు దూరం కావాలనుకున్నాడు. కానీ అది నిజం కాలేదు. వ్యాపారంపై ఫోకస్ పెట్టాలనుకున్నాడు ఆ సీజన్లో చాలా పరుగులు చేసినప్పటికీ, తనను నిర్లక్ష్యం చేయడంపై గంభీర్ చాలా ఆవేదన చెందాడు. క్రికెట్‌ కంటే తన చదువు, వ్యాపారాలపై దృష్టి పెట్టడమే మంచిదని అనుకున్నాడు. జట్టు సెలక్షన్‌కు వ్యతిరేకంగా ఒక వార్తాపత్రికలో వ్యాసం రాయిస్తే, ఏదైనా మార్పు వస్తుందని అప్పట్లో అతడి కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు. ఒక జర్నలిస్టుతో కూడా మాట్లాడారు. కానీ గౌతం గంభీర్ కెరీర్ ముగిసిందనే వార్త రాయడం కంటే వేరే ఏం చేస్తే మంచిదో ఆ జర్నలిస్టుకు బాగా తెలుసు. అందుకే అతడు గౌతం గంభీర్‌తో మాట్లాడాడు. మీ ఫోకస్ అంతా టెస్టులు, వన్డేలు ఆడాలనే లక్ష్యం మీదే ఉంచమని చెప్పాడు. ఇప్పుడు, మూడు క్రికెట్ ఫార్మాట్లలో భారత తరఫున 10324 పరుగులు స్కోర్ చేసిన గౌతం గంభీర్ తన కెరీర్ సంతృప్తికరంగా పూర్తి చేశాడు. ఇక జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు. గంభీర్ భారత క్రికెట్‌కు ఒక విశ్వసనీయ సేవకుడుగా నిలిచాడు. ముందున్న లక్ష్యంపై దృష్టి పెడుతున్నప్పుడు అతడు తన అభిరుచిని, దేశభక్తిని భుజాలపై మోయడానికి భయపడలేదు. అందుకే గంభీర్ ఇప్పుడు వెనుదిరిగి తన కెరీర్‌ను సంతృప్తిగా, సగర్వంగా చూసుకోగలడు. మరోవైపు గంభీర్ ఆఖరు మ్యాచ్ రంజీ ట్రోఫీలో భాగంగా గురువారం దిల్లీలో జరుగనుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చివరికి అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గర్వంగా, గుండెనిబ్బరంతో తన జట్టు కోసం, దేశం కోసం క్రికెట్ ఆడిన గంభీర్ ఇక దానికి ముగింపు చెప్పాలని ధైర్యంగా నిర్ణయించుకున్నాడు. text: వీరంతా ఎర్రచందనం కోసం వచ్చిన కూలీలుగా స్థానిక మీడియా ప్రతినిధులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు చెరువులో ఎందుకు పడ్డారు? ఎర్రచందనం కోసం వచ్చి పోలీసుల నుంచి తప్పించుకోవడానికే చెరువులోకి దిగారని స్థానిక జర్నలిస్టు ఒకరు బీబీసీకి తెలిపారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి 8-9 గంటల మధ్య పోలీసులు కడప-రేణిగుంట రహదారిలో వెళుతున్నారు. ఆ సమయంలో రోడ్డుపై ఓ లారీని ఆపి, కొందరు వ్యక్తులు బ్యాగులు తీసుకుని హడావుడిగా లారీ దిగుతున్నారు. పోలీసులను చూసి.. లారీ నుంచి దిగినవారు చీకట్లోనే పరారయ్యారు. వారిని వెంబడించేందుకు పోలీసులు ప్రయత్నించినా, ఆ చీకట్లో వారి జాడ తెలియరాలేదు. ఆ ప్రాంతంలో చుట్టూ కొండలు ఉండటంతో, వారు ఆ కొండల్లోకి పారిపోయి ఉంటారని అనుమానించి పోలీసులు వెనుతిరిగారని స్థానిక జర్నలిస్టు బీబీసీకి వివరించారు. కానీ... అనుమానితులు పక్కనే ఉన్న కొండల్లోకి వెళ్లుంటారని పోలీసులు భావించారు. కానీ తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న చెరువులోకి దిగారని, తమ భుజానికి బ్యాగులు వేసుకుని చెరువును దాటేందుకు ప్రయత్నించారని స్థానిక జర్నలిస్టు అన్నారు. చెరువులోకి దిగినవారు ఈదలేక, ఊపిరాడక చివరికి మృత్యువాత పడ్డారు. ‘’ఆదివారం ఉదయం ఆ చెరువులో మూడు మృతదేహాలు కనిపించాయని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మరో రెండు మృతదేహాలను కూడా గుర్తించారు. మృతులు ఆపిన లారీకి, మృతదేహాలు లభ్యమైన చెరువుకు మధ్య దూరం కూడా 300మీటర్లు మాత్రమే ఉంటుంది. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలలానే కనిపిస్తున్నారు’’ అని ఆయన తెలిపారు. ఎవరైందీ కచ్చితంగా చెప్పలేం! అయితే శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగిందన్న వార్తలను జిల్లా ఎస్పీ బాపూజీ అట్టాడ ఖండించారు. ఈ విషయమై ఎస్పీని బీబీసీ ప్రతినిధి హృదయ విహారి ఫోన్లో సంప్రదించగా.. ఆ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుందన్న అనుమానంతో పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తుంటారని, శుక్రవారం ఇలాంటి సంఘటన జరిగుంటే తప్పక తన దృష్టికి వచ్చేదని, కానీ కొన్ని గంటల క్రితమే తనకు సమాచారం అందిందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగే ప్రాంతమన్న కారణంగానే ఆ చుట్టుపక్కల దాదాపు 7-8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ అన్నారు. మృతుల వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహాలు కుళ్లిపోయాయని, వారు ఎవరైందీ గుర్తించడం కష్టమవుతోందని ఎస్పీ చెప్పారు. వీరంతా ఎర్రచందనం కోసం వచ్చిన కూలీలని వెంటనే చెప్పలేమని, అలాగని ఏ విషయాన్నీ ఖండించలేమని ఎస్పీ వివరించారు. అసలు వీళ్లు తెలుగు వాళ్లా లేక తమిళ కూలీలా అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ''కానీ చూడటానికి మాత్రం వారంతా కూలీలుగానే కనిపిస్తున్నారు. ఆ మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, దర్యాప్తు చేపడతాం'' అని ఎస్పీ వివరించారు. మృతుల వద్ద దొరికిన బ్యాగుల్లో ఊరగాయలు, పొడులు, వాటిని దాచుకోవడానికి కొన్ని కవర్లు ఉన్నాయి. మృతులు తమిళనాడు వాసులేనన్న అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన.. గతంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ ఘటనను గుర్తుచేయక మానదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గమనిక : మృతదేహాల ఫొటోలున్నాయి కడప జిల్లా ఒంటి మిట్ట మండలం చెర్లోపల్లి గ్రామ చెరువులో 5 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతులు ఎవరన్నదీ ఇంకా తెలీలేదు. text: ఆ కథనం ప్రకారం.. ఆదివారం విజయవాడ దాసరి భవన్‌లో నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పక్షం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమం 29 గ్రామాలకే పరిమితం కాదన్నారు. ఆనాడు రాజధాని కోసం ప్రభుత్వానికి ఆ రైతులు భూములిచ్చారని.. చంద్రబాబుకో, లోకేశ్‌కో కాదన్న సంగతి జగన్‌ ప్రభుత్వం గుర్తెరగాలని సూచించారు. అమరావతిలో నిర్మించిన ఇళ్లు మొండి గోడలుగా మిగిలాయని, భవిష్యత్‌లో దానిని శ్మశానం చేసేందుకు జగన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. ఇక 24 గంటలూ ఆర్టీజీఎస్‌ డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరో నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 24గంటలు ఆర్టీజీఎస్‌(రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి 12.30నిమిషాల నుంచి ఆర్టీజీఎస్‌ సేవలు 24x7 అందుబాటులో ఉండనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఇది సాధ్యమయ్యేందుకు కృషిచేసిన ఆర్‌బీఐ బృందానికి, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు.ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ సేవలు అన్ని పనిరోజుల్లో కేవలం ఉదయం 7గం.ల నుంచి సాయంత్రం 6గం.ల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా నిర్ణయంతో 24గంటలపాటు ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. అధిక మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఆర్‌టీజీఎస్‌ను వినియోగిస్తుండగా, నెఫ్ట్‌ ద్వారా కేవలం రూ.2 లక్షలలోపు మాత్రమే నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇక, డిసెంబర్‌ 2019 నుంచి నెఫ్ట్‌(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానాన్ని అన్నిరోజుల్లో నిరంతర(24x7) సదుపాయాన్ని ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ...సీఎం ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది అంటూ సాక్షి ఒక కథనంలో తెలిపింది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్‌ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు’ అని సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపిందని ఈ కథనంలో పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ ఎవరి కోసం?..కమల్ హాసన్ ఎవరిని రక్షించేందుకు రూ.వెయ్యికోట్లతో పార్లమెంటును నిర్మిస్తున్నారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రశ్నించారంటూ నవతెలంగాణ ఒక కథనంలో తెలిపింది. 2021 మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మదురై నుండి తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తమ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టడంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారీ మొత్తంతో నూతన పార్లమెంటు భవనం నిర్మించాలన్న అత్యుత్సాహానికి గల కారణమేమిటని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో సగం మంది ఆకలితో అల్లాడుతున్నారని, కరోనా వైరస్‌ కారణంగా వేలాది మంది జీవనోపాధిని కోల్పోయారని, దేశంలో సగం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇటువంటి సమయంలో.. రూ. వెయ్యికోట్లతో నూతన భవనం నిర్మించడం అవసరమా అని మండిపడ్డారంటూ ఈ కథనంలో రాసారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాజధాని అమరావతి ఉద్యమానికి ఎవరైనా మద్దతిస్తే వారికి కులాలు ఆపాదిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మండిపడ్డారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. text: 1926 ఏప్రిల్ 6వ తేదీన.. అప్పట్లో అమెరికాలో మత పెద్ద అయిన మిల్టన్ న్యూబెర్రీ ఫ్రాంజ్‌కు గాంధీ ఈ లేఖను రాశారు. ఏసుక్రీస్తు ‘‘మానవ చరిత్రలో గొప్ప బోధకుల్లో ఒకరు’’ అని గాంధీ సంబోధించారు. దశాబ్దాల పాటు ప్రైవేటు కలెక్షన్స్‌లో ఉన్న ఈ లేఖను పెన్సిల్వేనియాకు చెందిన రాబ్ కలెక్షన్స్ 50 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టింది. ‘‘మిత్రమా, నీ ఉత్తరం అందింది. నీవు పంపించిన (మత) సిద్ధాంతాలను అంగీకరించటం నాకు సాధ్యం కాదు. కంటితో చూడలేని సత్యాలకు అత్యున్నత రూపం, పరమ సత్యం ఏసుక్రీస్తే అన్న నీ మాటతో ఏకీభవించలేకపోతున్నాను’’ అని ఈ లేఖలో గాంధీ రాశారు. ఏసుక్రీస్తు ''మానవ చరిత్రలో గొప్ప బోధకుల్లో ఒకరు'' అని గాంధీ సంబోధించారు ‘‘మానవజాతి చరిత్రలోని గొప్ప బోధకుల్లో ఏసుక్రీస్తు ఒకరు అన్నదే నా నమ్మకం. అందరూ ఏదో ఒక మత విశ్వాసాన్ని యాంత్రికంగా అంగీకరించటం ద్వారా మతపరమైన ఐక్యత సాధ్యం కాదని, పరస్పర మత విశ్వాసాలను గౌరవించటం ద్వారానే ఐక్యత సాధ్యమవుతుందన్నది మీకు తెలియనిదా?’’ అని పేర్కొన్నారు. అలాగే.. ‘‘మీరు పంపించిన స్టాంపును కూడా నేను తిప్పి పంపిస్తున్నాను. దాన్ని భారతదేశంలో వినియోగించటం సాధ్యపడదు’’ అని కూడా గాంధీ ఈ లేఖలో తెలిపారు. ‘‘మా పరిశోధన ప్రకారం.. ఏసుక్రీస్తును ఉద్దేశిస్తూ గాంధీ రాసిన, పబ్లిక్ మార్కెట్‌కు అందుబాటులోకి వచ్చిన లేఖ మరేదీ లేదు’’ అని రాబ్ కలెక్షన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏసుక్రీస్తు గురించి మహాత్మాగాంధీ రాసిన ఒక లేఖను అమెరికాలో వేలం వేయనున్నారు. text: అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పదవి నుంచి దిగిపోయాక స్వచ్ఛంద కార్యక్రమాల్లో మునిగిపోయారు. 43వ అధ్యక్షుడు జార్జ్ బుష్ కుంచె పట్టి, బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. అయితే, ట్రంప్ సంప్రదాయ రాజకీయ నేత కాదన్న విషయాన్ని మనం గమనించాలి. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ సంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నో పనులు చేశారని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిమ్ కాల్కిన్స్ గుర్తు చేశారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత మునుపటి అధ్యక్షుల్లా ఆయన ప్రవర్తిస్తారని ఆశించలేమని ఆయన అన్నారు. మళ్లీ పోటీ చేయొచ్చు ట్రంప్ రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసందని భావించలేం. ఆయన మరోసారి అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అమెరికాలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన నేత, నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆ పదవిని అధిష్ఠించడం ఒకేసారి జరిగింది. గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ ఈ ఘనత సాధించారు. 1885లో మొదటిసారి, 1893లో రెండోసారి ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ట్రంప్ కూడా ఈ ఫీట్ సాధించాలని కోరుకోవచ్చు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీపడే అవకాశాలున్నాయని తాను భావిస్తున్నానని మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిక్ మల్వనీ ఇటీవలే అన్నారు. ఎన్నికల ప్రచార సభలు అంటే ట్రంప్‌కు చాలా ఇష్టం. తాజా ఎన్నికల్లో ట్రంప్‌కు 7.15 కోట్ల ఓట్లు పడ్డాయి. ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో ఇదే రికార్డు. అమెరికన్ ఓటర్లలో ఆయనకు ఇంకా చాలా మద్దతు ఉందన్నదానికి ఇది నిదర్శనం. ట్రంప్ పెద్ద కొడుకు డోనల్డ్ ట్రంప్ జూనియర్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపార సామ్రాజ్యంపై దృష్టి పెడతారా? అధ్యక్ష పదవి చేపట్టకముందు ట్రంప్ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియాల్టీ టీవీ స్టార్ కూడా. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక ఆయన మళ్లీ తన వ్యాపారాల విస్తరణపై దృష్టి పెట్టొచ్చు. రాబోయే కొన్నేళ్లలో ట్రంప్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల మేర రుణాలు చెల్లించాల్సి ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే, తన ఆస్తులతో పోల్చితే, ఇది చిన్న మొత్తమని ట్రంప్ అన్నారు. ట్రంప్‌ కుటుంబ వ్యాపార సంస్థ ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చాలా హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. ముంబయి, ఇస్తాంబుల్, ఫిలిప్పీన్స్‌ల్లోనూ ట్రంప్ బ్రాండ్‌తో కొన్ని వ్యాపారాలు నడుతుస్తున్నాయి. బ్రిటన్, దుబాయి, ఇండోనేసియాల్లోనూ గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. తిరిగి వ్యాపారంపై దృష్టి సారిస్తే ట్రంప్‌కు చేతి నిండా పని ఉన్నట్లే. ట్రంప్ వ్యాపారాలు ప్రధానంగా పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే ఉన్నాయి. కరోనావైరస్ సంక్షోభం ఈ రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ కారణంగా ట్రంప్ సంపద 7,400 కోట్ల రూపాయల మేర తరిగిపోయి ఉండొచ్చని ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. గత 15 ఏళ్లలో పదేళ్లు ట్రంప్ ఆదాయ పన్నులే కట్టలేదని, ఆదాయం కన్నా తనకు నష్టాలే ఎక్కువ వస్తున్నట్లు ఆయన చూపిస్తూ వచ్చారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. అయితే, ట్రంప్, ఆయన సంస్థ ఈ వార్తలను తోసిపుచ్చారు. ''ట్రంప్ బ్రాండ్ గురించి ఎప్పుడూ చర్చ జరిగేలా ట్రంప్ చూసుకుంటూ వస్తున్నారు. ట్రంప్ బ్రాండ్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది. కానీ, ఆయన పాలన ప్రభావం దానిపై ఉంది. ఆ బ్రాండ్ విషయంలో జనాల్లో తీవ్ర స్థాయిలో విభజన వచ్చింది. వ్యాపార బ్రాండ్లకు ఇది మంచిది కాదు. ఇప్పుడు మీరు మీ వివాహ వేదికగా ట్రంప్ హోటల్‌ను ఎంచుకున్నారంటే, ఓ రకంగా మీరొక రాజకీయ అభిప్రాయాన్ని చెబుతున్నట్లే. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు పరిస్థితి అలా ఉండేది కాదు'' అని ప్రొఫెసర్ టిమ్ కాల్కిన్స్ అన్నారు. ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వైట్ హౌజ్‌లో సీనియర్ సలహాదారు పదవిని స్వీకరించాక ఆమె తన పేరుతోనే నడిపిస్తున్న బ్రాండ్ బాగా దెబ్బతింది. ఆ బ్రాండ్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపులు వచ్చాయి. చాలా రిటైల్ సంస్థలు ఆ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం ఆపేశాయి. ట్రంప్ కొడుకులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ ఇప్పటిరకూ ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్వహణను చూస్తు ఉన్నారు. ఇటు తండ్రి రాజకీయ కెరీర్ విషయంలోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రంప్ ఇప్పుడు ఎలా మందుకు వెళ్తే తమ కుటుంబానికి మంచిదని వాళ్లు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండవచ్చని ప్రొఫెసర్ కాల్కిన్స్ అన్నారు. వార్తా చానల్ మొదలుపెడతారా? ట్రంప్‌కు టీవీ రంగం కొత్త కాదు. గతంలో 'ద అప్రెంటిస్' అనే రియాల్టీ షోకు ఆయన వ్యాఖ్యాతగా ఉన్నారు. వార్తా ఛానెళ్ల రంగంపై ట్రంప్‌ ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంతంగా గానీ, ఇప్పటికే ఉన్న టీవీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపి గానీ ఆయన టీవీ ఛానెల్‌ను ప్రారంభిస్తారన్న చర్చలు జరుగుతున్నాయి. ''ట్రంప్ టీవీకి కచ్చితంగా వీక్షకులు ఉంటారు. కార్డాషియన్స్ తరహాలోనే ట్రంప్ కూడా 'తిట్టుకుంటూనే జనం చూసే' ఇమేజ్ సంపాదించుకున్నారు. వివాదాలను ఆయన అవకాశాలుగా మలుచుకుంటారు. అదే ట్రంప్ పద్ధతి'' అని క్యూ స్కోర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హెన్నీ షాఫర్ అభిప్రాయపడ్డారు. వన్ అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ (ఓఏఎన్ఎన్), న్యూస్ మ్యాక్స్ కేబుల్ నెట్‌వర్క్‌లతో ట్రంప్ చేతులు కలిపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సంస్థలతో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. టీవీ ఛానెళ్లు కాకుండా మీడియా, వినోద రంగాల్లోనే ఇతర కార్యక్రమాలపైనా ట్రంప్ దృష్టి పెట్టవచ్చు. అమెరికాలో మాజీ అధ్యక్షులు రాసిన పుస్తకాలకూ మంచి డిమాండ్ ఉంటుంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా కలిసి పుస్తకాలు రాసేందుకు సుమారు 483 కోట్ల రూపాయలకు ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. పుస్తక ఒప్పందాలకు ఇంత మొత్తం రావడం అరుదే. జార్జ్ బుష్ ఆత్మకథ పుస్తక హక్కుల కోసం 74 కోట్ల రూపాయల అడ్వాన్సు అందుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌తోనూ ఒబామా దంపతులు ఓ భారీ ఒప్పదం చేసుకున్నారు. క్లింటన్ దంపతులు కూడా పాడ్‌కాస్ట్ సేవల ఒప్పందాలు చేసుకున్నారు. విశ్రాంతి తీసుకుంటారా? అధ్యక్ష పదవి దిగిపోయాక కూడా ట్రంప్‌కు కొన్ని సదుపాయాలు ఉంటాయి. ఆయనకు ఏటా 1.5 కోట్ల రూపాయల పెన్షన్ అందుతుంది. జీవిత కాలం సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తుంది. వైద్య సదుపాయాలు, ప్రయాణ ఖర్చులు, సిబ్బందికి అయ్యే వ్యయం కూడా ప్రభుత్వమే భరిస్తుంది. తనకు ఉన్న సంపదతోపాటు ఇవన్నీ చాలు అనుకుని ట్రంప్ విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ఏవైనా సేవా కార్యక్రమాలు చేపట్టొచ్చు. ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ రిసార్టులో గోల్ఫ్ ఆడుతూ సేద తీరొచ్చు. ''ట్రంప్‌కు లైమ్ లైట్‌తో బతకడం ఇష్టం. ఆయన ఇలా ప్రశాంత జీవితం గడుపుతారని నేనైతే అనుకోను. ట్రంప్ బ్రాండ్‌ను మనం ఇంకా చూస్తాం అనుకుంటా'' అని ప్రొఫెసర్ కాల్కిన్స్ అన్నారు. ఇక గత అక్టోబర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చెప్పిన ఓ మాట కూడా మనం గుర్తుచేసుకోవాలి. ''అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే పరమచెత్త అభ్యర్థి బైడెన్‌. ఆయనతో పోటీ పడుతున్నందుకు నాపై ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలుసా? ఒకవేళ ఓడిపోతే, జీవితమంతా నేను ఏం చేయాలి? చరిత్రలోనే చెత్త అభ్యర్థిపై ఓడిపోయానన్న అవమానంతో దేశాన్ని విడిచివెళ్లాలేమో?'' అని ట్రంప్ అప్పుడు అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదవీకాలం వచ్చే జనవరి 20తో తీరిపోనుంది. అప్పుడు తనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా దేశ పాలన పగ్గాలను తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడన్‌కు అందించాల్సిందే. text: కరోనావైరస్ కారణంగా చిన్న పిల్లల్లో మరణాలు రేటు సున్నాగా ఉంది. ఇప్పటి వరకూ నమోదైన 70000 కేసుల్లో 80శాతం మందిలో ప్రాథమిక దశ లక్షణాలున్నాయని, వీరిలో వృద్ధులు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని 'చైనీస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సీసీడీసీ) వెల్లడించింది. వైద్య సిబ్బంది కూడా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. మరణాల రేటు 2.3% ఈ నివేదిక తెలిపింది. కరోనా వైరస్‌కు అత్యంత ప్రభావితమైన హుబేలో మరణాల రేటు 2.9% ఉండగా, ఇది మిగిలిన దేశం మొత్తం మీద 0.4% ఉంది. మంగళవారం నాటి ప్రభుత్వ వివరాల ప్రకారం ఇప్పటివరకూ 1868 మంది మరణించగా, 72,436 మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. సోమవారం నాడు 98 మంది చనిపోగా, 1886 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 93 మరణాలు, 1807 కేసులు హుబేలోనే నమోదయ్యాయి. 12000కు పైగా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 80ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో మరణాల రేటు అత్యధికంగా 14.8 శాతంగా ఉంది. ఈ అధ్యయనం ఏం చెబుతోంది? సీసీడీసీ సోమవారం వెల్లడించిన నివేదిక చైనీస్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో కూడా ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా చైనా వ్యాప్తంగా ఫిబ్రవరి 11 నాటికి నిర్థరించిన, అనుమానిత, గుర్తించిన, ఎలాంటి లక్షణాలు చూపించని... మొత్తం 72314 కోవిడ్-19 కేసులను పరిశీలించింది. ఇప్పటి వరకూ భావిస్తున్న వైరస్ లక్షణాలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రక్రియలను ఈ అధ్యయనం నిర్థరించింది. చైనా వ్యాప్తంగా నమోదైన 44672 కేసులకు సంబంధించి మరింత వివరంగా విశ్లేషణ చేసింది. వాటిలో కొన్ని పరిశీలనలు... ఇక వైద్య సిబ్బందికి ఉన్న ముప్పు గురించి కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. ఫిబ్రవరి 11 నాటికి మొత్తం 3019 మంది వైద్య సిబ్బంది ఇన్ఫెక్షన్‌కు గురవ్వగా, వీరిలో 1716 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇందులో ఐదుగురు మరణించారు. కోరోనావైరస్‌తో బాధపడుతున్న వారిని గుర్తించి, నిర్థరించడం ఎలా అనే వివరాలను ఫిబ్రవరి 13న చైనా సవివరంగా వెల్లడించింది. భవిష్యత్ ఎలా ఉంటుంది? జనవరి 23-26 మధ్యలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 వరకూ అది తగ్గుతూ వస్తోంది. కొన్ని నగరాలను పూర్తిగా మూసి ఉంచడం, ముఖ్యమైన సమాచారాన్ని వేర్వేరు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం (ఉదాహరణకు.. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, తగిన జాగ్రత్తలు వహించడం), రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను తరలించడం వంటి చర్యలు ఈ తగ్గుదలకు దోహదం చేశాయి. చాలామంది ప్రజలు తమ విహారయాత్రలను ముగించుకుని తిరిగి వస్తున్న సందర్భంలో ప్రస్తుతం మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం చేసినవారు సూచించారు. లేదంటే మరోసారి వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. చైనాలో కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వుహాన్ నగరాన్ని పూర్తిగా మూసి ఉంచారు. దేశంలోని ఇతర నగరాల్లో కూడా రవాణా, బయట తిరగడంపై అనేక తీవ్రమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కోవిడ్-19 గా పిలుస్తున్న కరోనావైరస్ చైనాను అతలాకుతలం చేయడం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఆ దేశ వైద్య శాఖ అధికారులు ఓ భారీ అధ్యయన నివేదికను విడుదల చేశారు. text: జలాలుద్దీన్ చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అఫ్గానిస్తాన్‌లో ముఖ్యమైన మిలిటెంట్ నాయకుడైన ఆయనకు తాలిబన్, అల్-ఖైదా రెండింటితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2001 నుంచి ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాలను జలాలుద్దీన్ కొడుకు చేపట్టినట్లు భావిస్తున్నారు. అఫ్ఘాన్, నాటో దళాలపై గత కొన్నేళ్ళలో జరిగిన చాలా దాడుల వెనుక హఖానీ నెట్‌వర్క్ ఉంది. హఖానీ ఎక్కడ చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అన్న అంశాలపై అఫ్ఘాన్ తాలిబన్ చేసిన ప్రకటనలో స్పష్టంగా పేర్కొనలేదు. ‘‘ఇస్లాం వ్యాప్తి కోసం యువకుడిగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన గొప్ప కష్టాలను భరించారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడ్డారు’’ అని ఆ ప్రకటన తెలిపింది. హఖానీ మృతిపై చాలా సంవత్సరాలు పుకార్లు వినిపించాయి. కనీసం ఏడాది కిందటే నాయకుడు చనిపోయాడని హఖానీ నెట్‌వర్క్‌ సన్నిహిత వర్గాలు 2015లో బీబీసీకి తెలిపాయి. కానీ, ఈ సమాచారాన్ని ఎవ్వరూ ధ్రువీకరించలేదు. అమెరికా ‘సీఐఏకు గొప్ప ఆస్తి’ 1980ల్లో సోవియట్ దళాలు అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పుడు అఫ్ఘాన్ గెరిల్లా నాయకుడైన జలాలుద్దీన్ హక్కానీ వాటిపై పోరాడారు. అప్పట్లో ఆయన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి హక్కానీ గొప్ప ఆస్తి అని అమెరికా అధికారులు కూడా ఒప్పుకున్నారు. 1996లో తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్నప్పుడు హక్కానీ వారితో కలిశారు. జలాలుద్దీన్ హక్కానీ ‘‘గొప్ప యోధుడు.. ఈ శకంలోని గౌరవనీయులైన జీహాదీ నాయకుల్లో ఒకరు’’ అని తాలిబన్ తన ప్రకటనలో అభివర్ణించింది. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలో దళాలు సైనిక చర్యకు దిగి 2001లో తాలిబన్‌ను తరిమేశాయి. దీంతో అప్ఘాన్-పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న గిరిజన ప్రాంతాల నుంచి కార్యకలాపాలు కొనసాగించిన గ్రూపుల్లో హక్కానీ నెట్‌వర్క్‌ ఒకటి. ఎక్కువగా.. పాకిస్తాన్ నుంచి పనిచేస్తుందని భావిస్తున్న ఈ గ్రూపు, అఫ్ఘానిస్తాన్‌లో దారుణమైన దాడుల్లో కొన్నింటికి కారణమని నిందిస్తారు. గతేడాది కాబుల్‌లో 150 మంది చనిపోయిన ట్రక్కు బాంబు పేలుడు కూడా ఈ దాడుల్లో ఒకటి. మిలిటెంట్లకు ‘నష్టం’ మఫౌజ్ జుబైద్, బీబీసీ న్యూస్, కాబుల్ జలాలుద్దీన్ హక్కానీ మరణించే నాటికి గణనీయమైన కార్యకలాపాల్లో కానీ, వ్యూహాత్మక పాత్రలో కానీ లేరు. అయినప్పటికీ ఆయన స్థాపించిన మిలిటెంట్ సంస్థకు ఇది లాంఛనప్రాయ నష్టం. కొన్నేళ్ల కిందటే సంస్థపై నియంత్రణ మొత్తాన్ని జలాలుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ పొందారు. అనంతరం సంస్థకు సలహాదారుగా జలాలుద్దీన్ వ్యవహరిస్తున్నారని, హక్కానీ నెట్‌వర్క్‌కు ఇది భారీ మానసిక నష్టమని భావిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్‌లో ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన, భయానకమైన మిలిటెంట్ గ్రూపుల్లో హక్కానీ నెట్‌వర్క్ ఒకటిగా కొనసాగుతోంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కంటే ఎక్కువ ఆదరణ హక్కానీ నెట్‌వర్క్‌కే ఉందని కొందరు అంటుంటారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ‘సహజ కారణాల’ వల్లనే జలాలుద్దీన్ మరణించారని తాలిబన్ నొక్కి చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. జలాలుద్దీన్ మృతికి సంబంధించి వెలువడిన చాలా అపోహలను ఉద్దేశించి చేసిన ప్రస్తావన అది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హఖానీ మిలిటెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించిన జలాలుద్దీన్ హఖానీ మరణించినట్లు అఫ్గాన్ తాలిబన్ ప్రకటించింది. text: ఆసిమ్ సయీద్ ఓ పాకిస్తానీ బ్లాగర్. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన సోదరుడి పెళ్లికి పాకిస్తాన్ వచ్చిన ఆసిమ్‌ను 2017 జనవరిలో కిడ్నాప్ చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థే తనను కిడ్నాప్ చేసి, కౄరంగా హింసించిందని ఆసిమ్ చెబుతున్నారు. కిడ్నాపర్ల నుండి విడుదలయ్యాక బ్రిటన్‌లో ఆశ్రయం పొందడానికి ఆసిమ్ ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్‌లో తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు. జనవరిలో ఐదుగురు సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేశారు. వారిలో ఆసిమ్ సయీద్ ఒకరు. అయితే, కిడ్నాప్ ఆరోపణలను పాకిస్తాన్ ఆర్మీ తోసిపుచ్చింది. కిడ్నాప్‌లకు, ఆర్మీకు సంబంధం లేదని చెబుతోంది. కిడ్నాప్‌కు గురవడానికి ముందు తాను ఓ ఫేస్‌బుక్ పేజ్‌ను నడిపేవాడినని ఆసిమ్ బీబీసీకి తెలిపారు. పాకిస్తాన్ మిలిటరీ సృష్టించిన 'మోచీ' అనే సంస్థ గురించి ఆ పేజ్‌లో చర్చ జరిగేదన్నారు. ''పాకిస్తాన్ ఏర్పడ్డప్పటి నుంచి దేశంలో మిలిటరీ పాలన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నడిచేది'' అన్నారు. 70 సంవత్సరాల పాకిస్తాన్‌ చరిత్రలో సగభాగం మిలిటరీ పాలనలోనే ఉంది. సోదరుడి పెళ్లికి వచ్చినపుడు కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆసిమ్‌ను తమ కారు ఎక్కాలని ఆదేశించారని, వాళ్లందరూ ఆర్మీ యూనిఫాంలో కాకుండా మామూలు బట్టల్లోనే ఉన్నారని ఆసిమ్ వివరించారు. ''నిన్ను ఎందుకు తీసుకువచ్చామో తెలుసా?' అని అడిగారు. నాకు తెలియదన్నాను. అప్పుడు నన్ను కొట్టడం మొదలుపెట్టారు. 'మోచీ గురించి మాట్లాడుదాం' అన్నారు. ఆ తర్వాత ఈ-మెయిల్ అకౌంట్, మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌లు చెప్పాలని అడిగారని’’ తెలిపారు. 2016లో 728 మంది సోషల్ మీడియా కార్యకర్తలు అదృశ్యమయ్యారు పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ గణాంకాల ప్రకారం.. 2016లో 728 మంది అదృశ్యమయ్యారు. ఈ సోషల్ మీడియా కార్యకర్తల అదృశ్యం వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ హస్తముందని, అదృశ్యమైన వారిని కోర్టుకు హాజరు పరచకుండా వారికి మిలిటెంట్లతో సంబంధాలను అంటగట్టారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంతో సెక్యూరిటీ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం లేదని, కిడ్నాప్ అయిన వారి సంఖ్య కూడా వాస్తవం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ''ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నేను కింద పడిపోయాను. నా మెడ భాగాన్ని ఎవరో కాళ్లతో గట్టిగా తొక్కి ఉంచారు. మరొకరు నన్ను కొడుతూనే ఉన్నారు. నా వీపు, చేతులు నలుపు, నీలం రంగులోకి మారిపోయాయి. ఒళ్లంతా కందిపోయింది.'' భారత నిఘా సంస్థ గురించి ప్రశ్నలు అడుగుతున్నపుడు తనకు పలుసార్లు పాలిగ్రాఫ్‌తో పరీక్షించారని అన్నారు. ''భారత నిఘా సంస్థ 'రా' (ఆర్.ఏ.డబ్ల్యూ)తో నీకు సంబంధాలున్నాయా? ఎవరి ఆదేశాల ప్రకారం నువ్వు పనిచేస్తావు? 'రా' నుండి డబ్బు ఎలా అందుతోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు'' తనకు ఏ నిఘా సంస్థలతోనూ సంబంధాలు లేవని చెప్పానని, తన ఫేస్‌బుక్ పేజ్ గురించి కూడా ప్రశ్నించారన్నారు. ఆసిమ్ సయీద్‌తో పాటు నిర్బంధంలో ఉన్న మిగతా వారిని కూడా విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. దైవదూషణ ఆరోపణలున్న వ్యక్తులను ప్రజలే కొట్టి, చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి నిర్బంధంలో ఉన్నపుడు, తన ప్రాణాలపై ఆశలు వదులుకున్నానని ఆసిమ్ అన్నారు. గతంలో కిడ్నాప్‌కు గురైన సోషల్ మీడియా కార్యకర్తలెవ్వరూ తిరిగి ఇంటికి చేరలేదని చెప్పారు. అధికార వర్గాలపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో, బ్లాగర్స్‌కు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ బ్లాగర్స్ అందరూ మత వ్యతిరేకులని, దైవ దూషణకు పాల్పడ్డారంటూ మతపెద్దలు రోడ్డెక్కారు. పాకిస్తాన్‌లో చట్టాల ప్రకారం, దైవదూషణ మరణ శిక్షకు అర్హమైనది. దైవదూషణ ఆరోపణలున్న కొందరిని ప్రజలే కొట్టి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వారాల చెర నుండి విడుదలై ఇంటికొచ్చాక కానీ తనపై దైవదూషణ ఆరోపణలున్నాయని తనకు తెలియలేదని ఆసిమ్ చెప్పారు. తాను ఎప్పుడూ దైవనిందకు పాల్పడలేదని, తన బ్లాగుల్లో కూడా అటువంటి పని చేయలేదని స్పష్టం చేశారు. కేవలం తమను భయపెట్టడానికి, తమ కుటుంబాలను బెదిరించడానికే ఇలాంటి దైవనింద ఆరోపణలు చేశారని మరో బ్లాగర్ వివరించారు. పాకిస్తాన్‌లో తాను బతకలేనని, సింగపూర్‌లో కూడా ఉద్యోగం లేకుండా బతకలేనన్నారు ఆసిమ్. అందుకే, ఆశ్రయం కల్పించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేసినందుకు నాకు బాధ లేదు. కానీ, ప్రజల్లో చైతన్యం రావాలి’’ అని ఆసిమ్ సయీద్ అన్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ‘‘భారత నిఘా సంస్థ 'రా' (ఆర్.ఏ.డబ్ల్యూ)తో నీకు సంబంధాలున్నాయా? ఎవరి ఆదేశాల ప్రకారం నువ్వు పనిచేస్తావు? 'రా' నుండి డబ్బు ఎలా అందుతోంది?’’ ఇవీ.. ఆసిమ్ సయీద్‌ను అడిగిన ప్రశ్నలు. text: టాటూ గర్ల్ 21 సంవత్సరాల హలీనా మిస్త్రీ లెస్టర్‌లో ఉంటారు. అందరిలాగా డాక్టరో, ఇంజనీరో కాలేదీవిడ.. తన అభిరుచికి తగ్గట్టుగా టాటూ కళాకారిణి అయ్యారు. అయితే.. భారతీయ చిత్రకళలను టాటూలకు మేళవించి.. కస్టమర్ల ఒంటిపై బొమ్మలు చెక్కేస్తారు. ‘‘భారత్‌లో పెద్ద వయసు మహిళల ఒంటిపై కనిపించే పచ్చబొట్లు చిన్న వయసులోనే నన్ను బాగా ఆకర్షించాయి...’’ అని చెబుతోన్న హలీనా.. తన మెడపై కూడా భారతీయ పచ్చబొట్టును పోలివుండే టాటూను వేసుకున్నారు. ఈ టాటూ చుక్కలే తన భారతీయ నేపథ్యం చెబుతాయని ఆమె అంటున్నారు. అయితే.. విదేశీయులకు భారతీయ చిత్ర కళలతో టాటూలు వేయడాన్ని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈవిడ టాటూలు వేస్తారు. ఆమె వేసే టాటూల్లో దేశవాళీ బొమ్మలు అలా ఒదిగిపోతాయి. అదే ఈ గుజరాతీ యువతి ప్రత్యేకత. text: సెక్స్ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు చేతులెత్తేసింది. ఇక్కడ సుమారు 5 వేల మంది సెక్స్ వర్కర్లు నివసిస్తున్నారు. భారత్‌లో సెక్స్ వర్క్ అక్రమం కాబట్టి తమ జీవితంలో ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అక్కడి మహిళలు చెబుతారు. సమాజంలో ఈ మహిళలకు ఎలాంటి గుర్తింపు లేదు. మనుగడ కోసం వారి దగ్గర రుజువుగా ఎలాంటి అధికారిక పత్రాలూ లేవు. ఈ మహిళలకు ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది. ఈ సెక్స్ వర్కర్లు తమ సంపాదన జమ చేసుకునేందుకు ఒకే ఒక బ్యాంక్ ఉండేది. ఇప్పుడు అది కూడా మూతబడింది. కామాటిపుర రెడ్ లైట్ ఏరియాలో ఉండే 5 వేల మంది సెక్స్ వర్కర్లలో ఎక్కువ మందికి ఏ ప్రధాన బ్యాంకుల్లోనూ ఖాతాలు లేవు. కొంతమంది సెక్స్ వర్కర్లు "ఖాతా తెరవాలంటే బ్యాంక్ వాళ్లు ఆధార్ కార్డ్, తమ దగ్గర లేని ఇతర పత్రాలు అడుగుతున్నారని చెబుతున్నారు. అందుకే బ్యాంకుల సేవలు పొందడం ఈ మహిళలకు ఎప్పుడూ సవాలుగా నిలుస్తోంది. అయితే, సెక్స్ వర్కర్లకు సాయం అందించేందుకు, 2007లో కామాటిపుర రెడ్ లైట్ ఏరియాలో ఒక ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేశారు. దాని పేరు సంగిని విమెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్. దీన్ని ఫండింగ్ లోటు కారణంతో గత ఏడాది డిసెంబర్‌లో మూసేశారు. ఇక్కడ సెక్స్ వర్కర్స్‌కు వచ్చే సమస్యలను పరిష్కరించడానికే సంగిని విమెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. "సంగిని బ్యాంకులో కేవలం ఒక ఫొటో ఇస్తే చాలు సెక్స్ వర్కర్లకు ఖాతా తెరిచేవారు" అని ఈ సహకార బ్యాంక్‌కు చెందిన కొందరు వ్యవస్థాపక సభ్యులు చెప్పారు. ఈ బ్యాంకును 2007లో అమెరికాకు చెందిన ఒక సంస్థ నిధులతో ఏర్పాటు చేశారు. కానీ 2009లో ఆ సంస్థ నిధులు ఇవ్వడం ఆపేసింది. ఆ తర్వాత బ్యాంకు కార్యకలాపాల బాధ్యతను ఇండియా-800 ఫౌండేషన్ తీసుకుంది. కానీ కొంతకాలం తర్వాత ఇండియా-800 ఫౌండేషన్ సంగిని బ్యాంక్‌ నుంచి విడిపోయింది. సంగిని బ్యాంక్ కోల్‌కతాలోని సోనామాఛీ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఉషా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లా నడుస్తుందని అనుకుని ప్రారంభించారు. కానీ ఈ బ్యాంక్ పదేళ్లలోనే చేతులెత్తేసింది. డబ్బు పొదుపు చేయడంలో ఈ బ్యాంక్ తమకు చాలా సాయం చేసిందని కొంతమంది సెక్స్ వర్కర్లు చెబుతారు. "సంగిని బ్యాంకులో కొంతమంది 64 వేల రూపాయల నుంచి 5 లక్షల వరకూ జమ చేశారు. కామాటిపురలో రోజుకు 200 నుంచి 2 వేల వరకూ సంపాదించే మహిళలకు అది చాలా పెద్ద మొత్తమే" అంటారు చాంద్ బీ. సెక్స్ వర్కర్ తనూజా ఖాన్‌కు సంగిని బ్యాంకులో ఖాతా ఉండేది, ఇప్పుడు తన డబ్బు ఏం చేయాలా అని ఆమె దిగులు పడుతోంది. "మేం సంపాదించే డబ్బును, ఇప్పుడు భద్రంగా కాపాడుకోవడం కష్టమైపోయింది. బ్యాంక్ మూతబడడంతో మా కష్టాలు పెరిగాయి. పడక దగ్గర 500 నుంచి వెయ్యి రూపాయలు పక్కన పెడితే చాలు, దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకెళ్లిపోతారు. అందుకే డబ్బులు ఎక్కడో ఒకచోట కనిపించకుండా దాయాల్సివస్తోంది" అని తనూజా చెప్పారు. "ఇక్కడ బట్టలు, పాత్రలు కూడా దొంగిలిస్తారు. అలాంటప్పుడు డబ్బు బయటెలా ఉంచగలం" అంటున్నారు మిగతా మహిళలు అయితే, బ్యాంక్ మూతబడడం వెనుక ప్రధాన కారణం నిధుల లోటు. దాని వల్లే ఇప్పుడు కామాటిపురలో చాలా మంది మహిళల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ముంబైలో ఉన్న కామాటిపురను భారతదేశంలోని రెండో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా చెబుతారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా కోల్‌కతాలోని సోనాగాఛీ తర్వాత కామాటిపుర పేరే చెబుతారు. ఇక్కడివారికి ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. text: 2016లోనూ దిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది కానీ ఈ ప్రభావం పెద్దగా కనిపించలేదు. టపాసుల మోతతో దిల్లీ మారుమోగింది. ఆశించినంతగా కాలుష్యం తగ్గలేదు. దీపావళి టపాసుల మోతతో దిల్లీలో పొగ దట్టంగా కమ్ముకుంది. ఆకాశంలో దుమ్ముధూళి చేరింది. దీనికి పొగమంచు తోడవడంతో గాలితో గాఢత పెరిగింది. అయితే, గత దీపావళి కంటే ఈసారి కాలుష్యం కాస్త తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా గాలి కాలుష్యం తీవ్రతను లెక్కిస్తారు. దీపావళి రోజు దిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 319గా ఉంది. గతేడాది దీపావళి రోజు ఇది 431గా ఉంది. అంటే గతేడాది కంటే ఈసారి కాలుష్యం కాస్త తగ్గింది. అయితే, ఈ రెండు గణాంకాలు ప్రమాదకరమేనని వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న హరిజిత్ సింగ్ బీబీసీకి చెప్పారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకరంగానే భావించాల్సి ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 కంటే ఎక్కువుంటే మరింత ప్రమాదకరం. కోర్టు ఆంక్షలు, ప్రజల్లో చైతన్యం రావడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి కాలుష్య తీవ్రత కాస్త తగ్గిందని హరిజిత్ సింగ్ చెప్పారు. దీపావళి రోజు సాయంత్రం 6 గంటలకు వాయు, శబ్ధ కాలుష్యం తక్కువగానే ఉన్నప్పటికీ.. అర్ధరాత్రి 12గంటల సమయంలో వీటి తీవ్రత చాలా పెరిగింది. దీపావళి మరుసటి రోజు సాధారణం కంటే పదిరెట్ల ఎక్కువ కాలుష్యం పర్టిక్యులర్ మ్యాటర్ అంటే గాలిలో ఉన్న కాలుష్య కణాల సంఖ్య. పీఎం 2.5 అంటే క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 100 మైక్రోగ్రాముల కాలుష్య కణాలు ఉన్నట్లు లెక్క. 60 మెక్రోగ్రాములు ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. అంటే దీపావళి రోజు సాధారణం కంటే పదిరెట్లు అధికంగా కాలుష్యం ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీలో నవంబర్ 9 వరకు టపాసులు విక్రయించొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, బాణాసంచా కాల్చొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు. అందుకే దిల్లీలో టపాసుల మోత మోగింది. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోనూ కాలుష్యం పెరిగింది. ఉదయం 11గంటలకు గాలిలో పీఎం 2.5 గాలి నాణ్యత 177గా నమోదైంది. శుక్రవారం ఒక్కరోజులోనే కాలుష్యం భారీగా పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ కాలుష్యం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కాలుష్యం పెరుగుతుందనే కారణంతో దిల్లీలో బాణాసంచా అమ్మకాలను సుప్రీంకోర్టు నిషేధించింది. text: ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో చైనా ఇచ్చిన రుణాల సాయంతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. యుగాండాలో మూడు నెలల క్రితం నిర్మించిన ఎంటెబె-కంపాలా ఎక్స్‌ప్రెస్ వే ఇప్పటికీ పర్యటక ఆకర్షణగా నిలుస్తోంది. 51కిలోమీటర్ల ఈ రహదారి యుగాండా రాజధాని కంపాలాను, ఎంటెబే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతుంది. ఈ రహదారిని చైనా ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన 476 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3400 కోట్లు) రుణంతో చైనాకు చెందిన ఓ కంపెనీ నిర్మించింది. గతంలో ట్రాఫిక్ చిక్కుల మధ్య ఎంతో కష్టంగా ఉండే రెండు గంటల ప్రయాణం, ఈ రహదారి కారణంగా ప్రస్తుతం 45నిమిషాల ఆహ్లాదకర ప్రయాణంగా మారింది. యుగాండా ఇప్పటిదాకా చైనా నుంచి 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.21,500 కోట్లు) రుణాన్ని పొందింది. ‘ఈ రుణాల వల్ల చైనా సంస్థలకు భారీ వ్యాపారం కూడా దొరుకుతోంది. ముఖ్యంగా చైనా నిర్మాణ రంగ సంస్థలన్నీ కలిసి ఆఫ్రికాను రైల్వే, రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, స్టేడియంలు, వాణిజ్య భవనాల నిర్మాణ కేంద్రాలుగా మార్చేశాయి’ అని మకెరెరె యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ ఒకరు బీబీసీతో చెప్పారు. యుగాండాలో చైనా నిర్మించిన రహదారి ఈ రుణాల వల్ల ఆఫ్రికా దేశాలు మరోసారి అప్పుల్లో కూరుకుపోయి వాటిని తిరిగి చెల్లించలేని స్థితిలోకి జారుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆఫ్రికాలో తక్కువ ఆదాయం ఉన్న 40శాతం దేశాలు అప్పుల పాలయ్యాయి. వాటిలో కొన్ని దేశాల స్థితి మరింత క్లిష్టంగా ఉంది అని ఏప్రిల్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. 2017 చివరి నాటికి చాద్, ఎరిత్రియా, మొజాంబిక్, కాంగో రిపబ్లిక్, దక్షిణ సూడాన్, జింబాబ్వేలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. జాంబియా, ఇథియోపియాల్లో పరిస్థితి మరింత దిగజారింది. కేవలం 2017లోనే ఆఫ్రికాలో కొత్తగా సంతకం చేసిన చైనా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విలువ 76.5బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.5.5లక్షల కోట్లు) చేరిందని చైనాకు చెందిన ఆర్థికవేత్త జెరెమీ స్టీవెన్స్ పేర్కొన్నారు. త్వరలో ఆఫ్రికన్ దేశాలకు కొత్త అప్పులు తీసుకొనే వెసులుబాటు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో రుణాల రూపంలో చైనా అందిస్తోన్న అభయ హస్తం తమను ఎటు తీసుకెళ్తుందోననే భయం ఆఫ్రికన్ దేశాల్లో పెరుగుతోంది. ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ది యురోపియన్ కమిషన్, ది వరల్డ్ బ్యాంక్, జీ 8 దేశాలు, యురోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్‌లు కలిసి ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అందిస్తున్న సాయం కంటే ఒక్క చైనా అందిస్తున్న ఆర్థిక సాయమే ఎక్కువ. ఇథియోపియాలో చైనా నిర్మించిన రైల్వే వ్యవస్థ చైనా ఇస్తున్న ఈ రుణాల ప్రభావం ఆఫ్రికావ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త విమానాశ్రయాలు, రహదారులు, భవంతులూ చకచకా వెలుస్తున్నాయి. ఉపాధి కల్పన మెరుగవుతోంది. గతంతో పోలిస్తే 2012 నుంచి ఆఫ్రికాలో చైనా పెట్టుబడుల విలువ మూడింతలు పెరిగింది. అంగోలాలో అయితే మరింత ఎక్కువగా ఉంది. అంగోలాలో రుణాలకు ప్రతిగా చైనా ఆ దేశం నుంచి భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంది. ఆఫ్రికా చైనాల లావాదేవీల్లో ఆఫ్రికా కూడా లాభపడినట్లే కనిపిస్తున్నా, పై చేయి మాత్రం చైనాదేనని, తమకు ఎక్కువ అనుకూలంగా ఉండే ఒప్పందాల ప్రకారమే రుణాలు మంజూరు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. 2025నాటికి ఆఫ్రికాలోని చైనా సంస్థల ఆదాయం 31లక్షల కోట్లకు చేరుతుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. కేవలం ఒక దేశంతోనే వ్యాపారం చేస్తే అత్యుత్తమ డీల్స్ ఎలా వస్తాయని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో వ్యాపార కాంట్రాక్టుల కోసం లంచం ఇవ్వడం అనేది కొన్ని పాశ్చాత్య దేశాల్లో నేరం. కానీ చైనాలో అలాంటి చట్టాలేవీ లేవు. దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సాల్వాకిర్ మయరిట్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘ఏ ప్రాజెక్టునైనా దాని ద్వారా కలిగే ఉపయోగాలు, అందే లాభాల ఆధారంగానే లెక్కగట్టాలి. చైనాతో లావాదేవీల్లో ఆఫ్రికా ప్రభుత్వాలు కూడా ఎంత పారదర్శకంగా ఉంటున్నాయన్నది ముఖ్యం’ అని ఆర్థిక నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిజ్ బీబీసీతో చెప్పారు. చైనా నుంచి పొందుతున్న రుణాలను ఆఫ్రికన్ దేశాలు తిరిగి చెల్లించలేకపోవచ్చనే అనుమానాలను 2015లోనే జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వ్యక్తం చేసింది. చైనాతో పాటు మరి కొన్ని దేశాలు, సంస్థల నుంచి తీసుకున్న రుణాలు కూడా ఆఫ్రికాపై అప్పుల ఒత్తిడి పెంచుతున్నాయి. రహదారులు, రైల్వే లైన్లు కాకుండా ఉపాధిని కల్పిస్తూ ఇతర దేశాల పెట్టుబడులను ఆకర్షించే సెజ్‌లు, పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు కోసం ఆఫ్రికాలో చైనా డబ్బును ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనా కూడా అలాంటి నిర్మాణాల్లో పెట్టుబడులు పెడతామని మాటిస్తూ వచ్చింది తప్ప, ఇప్పటిదాకా అలాంటి పని చేయలేదు. ప్రస్తుతానికి ఆఫ్రికా వాసులు చైనా నిర్మించిన అత్యాధునిక రహదారులపై ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఈ రుణాలే తమను అప్పుల ఊబిలో పూర్తిగా ముంచేస్తాయనే భయాలు వాళ్లలో నెలకొన్నాయి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆఫ్రికా దేశాలకు చైనా చాలా ఉదారంగా రుణాలు ఇస్తోంది. ఆ రుణాలే త్వరలో ఆఫ్రికా పాలిట గుదిబండగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. text: ఈ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న. 2001లో అమెరికా ఆధ్వర్యంలో అఫ్గాన్‌లో దాడులు జరిగిన అనంతరం పరిస్థితి క్షీణించడం మొదలైంది. ప్రస్తుతం దేశమంతటా తీవ్రమైన అభద్రత అలముకుంది. గత పదిహేడేళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువ భూభాగాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలంపాటు సాగుతున్న యుద్ధమిది. రోజులు గడిచే కొద్దీ అక్కడ పరిస్థితి మరింత జటిలమైంది. దాడులు మరింత తరచుగా, తీవ్రంగా, విస్తారంగా, భయానకంగా జరుగుతున్నాయి. అటు తాలిబాన్లు, ఇటు అమెరికా/నాటో సహకారంలో పనిచేస్తున్న అఫ్గాన్ ప్రభుత్వ బలగాలు పరస్పరం పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆగస్టు 10న తాలిబాన్లు రాజకీయంగా కీలకమైన ‘ఘజ్ని’ ప్రావిన్సులోకి అడుగుపెట్టారు. కానీ అఫ్ఘాన్‌ సేనలు... అమెరికా మద్దతుతో జరిగిన వైమానిక దాడుల సహాయంతో వారిని వెనక్కు పంపాయి. ఈ ఏడాది మే 15న తాలిబాన్లు పశ్చిమ అఫ్గానిస్తాన్‌లో ఇరాన్‌ సరిహద్దు దగ్గరగా ఉన్న ఫరా ప్రావిన్సులో అడుగుపెట్టారు. కాల్పుల విరమణ సమయంలో అఫ్గాన్ సైనికుడితో ఫొటోకు పోజిచ్సిన తాలిబాన్లు ఇలా వాళ్లు ముందడుగు వేస్తున్నప్పుడల్లా జరుగుతున్న దాడుల్లో చాలామంది తాలిబాన్లు చనిపోతున్నారు. కానీ అలాంటి దాడులు వాళ్ల స్థైర్యాన్ని పెంచడంతో పాటు మరింత మంది తమ వైపు ఆకర్షితులయ్యేందుకు ప్రేరేపిస్తున్నాయి. వందలాది యూఎస్, యూకే, ఇతర విదేశీ బలగాలకు చెందిన వాళ్లు హత్యకు గురైన హెల్మాండ్, ఖాందహార్ లాంటి ప్రావిన్సుల్లో ఎక్కువ భాగం ఇప్పటికీ తాలిబాన్ల అధీనంలోనే ఉంది. వీళ్ల దాడుల్లో చనిపోతున్న సామాన్య పౌరుల సంఖ్య కూడా అత్యధిక స్థాయికి చేరుకుంది. ఐరాస లెక్కల ప్రకారం 2017లో దాదాపు పదివేల మంది పౌరులు ఈ దాడుల్లో గాయాల పాలయ్యారు. వాళ్లలో ఎక్కువమంది మృతిచెందారు. 2018లో ఆ సంఖ్య మరింత ఎక్కువవుతుందని అంచనా. ట్రంప్ ప్రణాళిక పనిచేస్తోందా? అఫ్గానిస్థాన్‌లో ‘గెలవడానికే పోరాడతాం’ అని వ్యాఖ్యానిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రణాళికలను రూపొందించారు. తాలిబాన్లను అణచివేయడానికి చతుర్ముఖ వ్యూహాన్ని అమలు చేస్తామని, వాళ్లను అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చలకు ఒప్పిస్తామని తెలిపారు. 1. అత్యధిక స్థాయిలో సైనిక ఒత్తిడి.. వైమానిక దళం, ప్రత్యేక బలగాలతో దాడులు పెంచుతామని చెప్పారు. వేలాదిమంది అమెరికా సైనికులను అఫ్గాన్‌లో ప్రవేశపెట్టారు. 2. తాలిబాన్ల ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకోవడం. ముఖ్యంగా ఓపియం ఉత్పత్తి కేంద్రాలపై బాంబులు కురిపించి ధ్వంసం చేయడమన్నది అమెరికా ఎంచుకున్న మరో మార్గం. ఓపియం ఉత్పత్తిదారుల నుంచే వారికి అత్యధికంగా విదేశీ కరెన్సీ వారికి అందుతోంది. 3. తాలిబాన్ల యుద్ధంలోని ధర్మబద్ధత గురించి మతవాద సంస్థలను బహిరంగంగా ప్రశ్నించి, దాని ద్వారా పౌరుల్లో అవగాహన పెంచడం. 4. పాకిస్తాన్‌ మీద ఒత్తిడి పెంచి అక్కడ తలదాచుకుంటున్న తాలిబాన్‌ నేతలను పట్టుకోవడం. కానీ ఈ నాలుగు మార్గాలూ చాలా వరకు విఫలమైనట్లే కనిపిస్తున్నాయి. యుద్ధానికి కారణాలేంటి? అఫ్ఘానిస్తాన్‌లో యుద్ధం తీవ్రతరం కావడానికి ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఇరు పక్షాలు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి, అత్యధిక భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 2. 2001 తరువాత ఎన్ని దాడులు జరిగినప్పటికీ తిరుగుబాటుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పదేళ్ల క్రితం అఫ్ఘాన్‌లో 15వేల మంది తిరుగుబాటుదారులు ఉన్నారని అంచనా వేశారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 60వేలు దాటింది. 3. అఫ్ఘానిస్తాన్‌, పాకిస్తాన్‌లలో ఇస్లామిక్ స్టేట్ శాఖలు ఉద్భవించడంతో హింస మరింత తీవ్రమైంది. నగరాల్లో పౌరులనే లక్ష్యంగా చేసుకొని అనేక భయంకరమైన దాడులకు పాల్పడినట్లు ఈ గ్రూపు పేర్కొంది. 4. శాంతి చర్చలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కువగా వస్తుండటంతో... ఆ చర్చలలో తమ డిమాండ్లదే పై చేయిగా ఉండాలని తాలిబాన్లు భావిస్తున్నారు. 5. ఇరాన్, రష్యా, పాకిస్తాన్‌ లాంటి దేశాలకూ అమెరికాకూ మధ్య పెరుగుతున్న దూరం కూడా అఫ్ఘానిస్తాన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ మూడు దేశాలూ తాలిబాన్లకు మద్దతిస్తున్నాయని అఫ్ఘాన్ అధికారులు అంటున్నారు. కానీ ఆ దేశాలు ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి. అఫ్ఘాన్ సేనలు అడ్డుకోగలవా? తాలిబాన్ల హింస వేగంగా విస్తరిస్తుండటంతో పాటు అఫ్ఘాన్ భద్రతా బలగాల పరిధి కూడా విస్తరిస్తోంది. ఈ క్రమంలో జరుగుతున్న దాడుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దేశంలో నెలకొన్న అవినీతితో పాటు నాయకత్వ లోపం, సైన్యానికి వనరుల సరఫరాపైన అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల మధ్య లోపించిన సమన్వయం వల్ల పాలన సజావుగా సాగట్లేదు. అనేక అంశాల్లో ప్రభుత్వంలోని రెండు పక్షాలపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఎన్నికలు జరుగుతాయా? మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పార్లమెంటరీ ఎన్నికలను ఈ ఏడాది అక్టోబర్ 20న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ పెరిగిన హింస కారణంగా ఆ ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ హింస కారణంగా ఎన్నికలు రద్దయితే తరువాత పరిస్థితి ఎలా ఉంటుందనేదీ ప్రశ్నార్థకమైంది. 2019 ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ శక్తి సామర్థ్యాలకు ఈ రెండు ఎన్నికలు పరీక్ష పెట్టనున్నాయి. సైనిక చర్య ద్వారా అఫ్ఘాన్‌లో శాంతి నెలకొనే అవకాశం లేదనే అభిప్రాయం దాదాపు అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది. కాబట్టి అటు తాలిబాన్లతో పాటు ప్రభుత్వం కూడా చర్చలకు సముఖంగానే ఉంది. ఇప్పటికే అమెరికా అధికారులు, తాలిబాన్ ప్రతినిధుల మధ్య ఖతార్‌లో ఓ సమావేశం జరిగింది. త్వరలో వాళ్లు మళ్లీ కలవనున్నారు. ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ రెండు పక్షాలూ యుద్ధాన్ని గెలవలేవనడానికి ఈ సమావేశాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కానీ అమెరికా-అఫ్ఘానిస్తాన్‌తో పాటు పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, భారత్‌, చైనా లాంటి దేశాల సహాకరంతోనే అఫ్ఘాన్‌లో శాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. ఆ పైన యుద్ధంతో చితికిపోయిన నేల రాజకీయ భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించాల్సింది అఫ్ఘాన్ వాసులే. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అఫ్గానిస్తాన్‌లో గతంలో పత్రికల్లో పతాక శీర్షికలుగా కనిపించిన మరణ వార్తలు ఇప్పుడు మామూలు విషయాలైపోయాయి. ఆ దేశంలో సైన్యం మీద తాలిబాన్, ఇతర మిలిటెంట్ గ్రూపుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ఎడతెగని ఘర్షణలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. text: లండన్‌తో పాటు బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో అరుదైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులకు ఇంటెన్సివ్ కేర్ విభాగాల్లో చికిత్స జరుగుతోందని జనరల్ ప్రాక్టీషనర్లకు పంపిన ఒక అత్యవసర హెచ్చరికలో ప్రభుత్వం వెల్లడించింది. జ్వరం లాంటి లక్షణాలతోపాటు శరీరంలోని వివిధ అవయవాల్లో మంటపుట్టడం ఈ తరహా వ్యాధి లక్షణాలలో ఒకటి. ఇలాంటి లక్షణాలున్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, సంఖ్యాపరంగా అలాంటి కేసులు తక్కువే అని భావిస్తున్నప్పటికీ ఈ లక్షణాలతో ఎంతమంది చిన్నారులు బాధపడుతున్నారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. చిన్నారుల్లో ఈ అరుదైన, తీవ్రమైన వ్యాధి లక్షణాల విషయం తమ దృష్టికి వచ్చిందని ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ మెడికల్ డైరెక్టర్ స్టెఫాన్ పావిస్ వెల్లడించారు. ''గత కొద్ది రోజులుగా చిన్నపిల్లల్లో ఇలాంటి అరుదైన లక్షణాలు కనిపిస్తున్నాయని మాకు తెలిసింది. ఈ విషయంపై అత్యవసరంగా దృష్టిసారించాలని మేం నిపుణులను కోరాం'' అన్నారు స్టెఫాన్ పావిస్. కరోనావైరస్ లక్షణాలకు దగ్గరగా ఉన్న ఈ సరికొత్త రోగ లక్షణాలు యూకేలో పెరుగుతున్న విషయాన్ని గుర్తించామని ఈ హెచ్చరికలు జారీ చేసిన ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ వెల్లడించింది. అయితే, దీనికీ కరోనావైరస్‌కు సంబంధం ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధరణ కాలేదు. వివిధ వయసుల చిన్నారులు ఈ వ్యాధితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ తరహా లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో తీవ్రమైన జ్వరం, రక్తపోటు పడిపోవడం, చర్మం మీద దద్దుర్లు, మచ్చలు, శ్వాసలో ఇబ్బందులు కనిపిస్తాయి. కొందరిలో జీర్ణకోశ సంబంధ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, గుండెల్లో మంట, రక్తపరీక్షల్లో అసాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి శరీరం వైరస్‌తో పోరాడి అలసిపోయినట్లు కనిపించే లక్షణాల్లాంటివని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కేసులను అత్యవసరంగా పరిశీలించాలని డాక్టర్లకు పంపిన అలర్ట్‌లో పేర్కొన్నారు. అయితే కరోనావైరస్‌తో చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా చూసినా చిన్నారుల్లో కోవిడ్-19 బాధితులు తక్కువగా ఉన్నారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. స్పెయిన్, ఇటలీలలోనూ కొందరు డాక్టర్లు ఈ తరహా లక్షణాలను గుర్తించారని కేంబ్రిడ్జ్‌లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్‌లో కన్సల్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ నజీమా పఠాన్ చెబుతున్నారు. ''సెప్టిక్ షాక్ తరహా అనారోగ్యం, చర్మం మీద దద్దులతో చాలామంది పిల్లలు మా వద్దకు వస్తున్నారు. ఇవి చూడటానికి టాక్సిక్ షాక్ సిండ్రోమ్, కవాసాకి (గుండె, రక్తనాళాలపై ప్రభావం చూపే) వ్యాధి లక్షణాల్లాగా ఉన్నాయి. మొత్తం మీద, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌కు కరోనావైరస్ సోకిన చిన్నారులు సులభంగా గురవుతారు. అయితే ఈ వ్యాధి లక్షణాలతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది'' అని నజీమా పఠాన్ అంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు 20కి లోపే ఉన్నట్లు తమ వైద్యనిపుణులు గుర్తించారని నేషనల్ హెల్త్ సర్వీస్ వెల్లడించింది. అయితే పరిశోధన కొనసాగుతోందని, దానికి, కరోనావైరస్‌కు సంబంధమున్నట్లు ఇంతవరకు నిరూపణ కాలేదని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ వ్యాధి గురించి తల్లిదండ్రులు కంగారుపడొద్దని, చిన్నారుల్లో ఈ లక్షణాలు ఏమైనా కనిపించినా, లేక ఏవైనా అనుమానాలున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాల్సిందిగా సూచించామని ది రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ (ఆర్‌సీపీసీహెచ్ ) వెల్లడించింది. ''తల్లిదండ్రులకు మేం కూడా ఇదే చెప్పాలనుకున్నాం. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై అనుమానాలుంటే, 111 నెంబర్‌కు కాల్ చేసి నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగాన్ని సంప్రదించాలి, లేదంటే ఫ్యామిలీ డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇంకా కావాలంటే 999కు కాల్ చేసి సలహా అడగాలి. సదరు నిపుణులు హాస్పిటల్ వెళ్లాలంటే వెంటనే వెళ్లిపోవాలి'' అని నేషనల్ హెల్త్ సర్వీస్ లో క్లినికల్ డైరక్టర్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ విభాగానికి డైరక్టర్ గా పని చేస్తున్న ప్రొఫెసర్ సైమన్ కెన్నీ సూచించారు. సాయం ఎప్పుడు పొందాలంటే.. "కరోనా వైరస్ చిన్న పిల్లలకు కూడా సోకుతున్నప్పటికీ, వారికది చాలా తక్కువగా ప్రమాదకకారిగా మారుతుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే అది కరోనా వైరస్ వల్ల కావచ్చు, నాన్ కరోనా ఇన్ఫెక్షన్ వల్లా కావచ్చు. మీ చిన్నారులు కరోనా వైరస్ వల్ల, నాన్ కరోనా వైరస్ సమస్యలతో అనారోగ్యంగా కనిపిస్తే 999కు కాల్ చేయాలని, లేదంటే యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసుకు వెళ్లాలి" అని ఆర్‌సిపిసి హెచ్ తల్లిదండ్రులకు సూచించింది. ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి.. ఒళ్లంతా పాలిపోయినట్లు కనిపిస్తుంది. మచ్చలు ఏర్పడతాయి. ముట్టుకుంటే విపరీతమై చల్లగా తగులుతారు. ఊపిరి తీసుకోవడంలో విరామం ఎక్కువగా ఉండొచ్చు. శ్వాస లయ తప్పుతుంది. గొంతు గరగరలాడుతుంది. శ్వాస పీల్చుకోవడంలో విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోసారి స్పందనలు కూడా కనిపించవు. పెదవుల చుట్టు నీలిరంగు రింగ్ ఏర్పడుతుంది. ఒక్కోసారి ఫిట్స్ రావచ్చు ఒక్కోసారి విపరీతమైన బాధకు లోనవుతారు ( ఎంత సముదాయించినా ఆగకుండా ఏడుస్తారు ), అయోమయానికి గురవుతారు. నీరసంగా కనిపిస్తారు. ఒక్కోసారి స్పృహతప్పుతారు. గ్లాస్ టెస్ట్ చేసినా తగ్గిపోని స్థాయిలో దద్దుర్లు ఏర్పడతాయి. వృషణాల్లో నొప్పి, ముఖ్యంగా యువకుల్లో ఇలాంటి లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చిన్నారుల్లో కనిపిస్తున్న వింత, ప్రమాదకరమైన లక్షణాలకు కరోనావైరస్‌తో సంబంధం ఉందేమో పరిశీలించాల్సిందిగా బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ వైద్యులకు ఆదేశాలు జారీ అయ్యాయి. text: అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీవులను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఫెమా) అంటోంది. ఇప్పటికే ఉత్తర కేరొలినా, దక్షిణ కేరొలినా, వర్జీనియా ప్రాంతాల్లోని దాదాపు 17లక్షల మంది తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఉత్తర కేరొలినాలో 100కు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తర కేరొలినా తీర ప్రాంతంలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దాంతో వరదలు కూడా మొదలయ్యాయి. భారీ అలలకు బీచ్‌లో ఏర్పాటు చేసిన చెక్క వంతెన ధ్వంసమైంది పునరావాస కేంద్రంలో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. గురువారం ఉదయం 250 కిలోమీటర్ల వేగంతో కదిలిన హరికేన్, తర్వాత 165 కిలోమీటర్లకు తగ్గింది. అయితే, గాలి వేగం కాస్త తగ్గినా, వర్ష సూచనలో మాత్రం మార్పు లేదని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) అంటోంది. గురువారం నుంచి శనివారం వరకు తీర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కేరొలినాలోని తీర ప్రాంతాల్లో 50 నుంచి 75 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంది. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదముందని, వరదనీటి మట్టం 13 అడుగుల దాకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయకుంటే పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదముందని విపత్తు నిర్వహణ విభాగం అధికారులు అంటున్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలు దక్షిణ కేరొలినాలోని మైటల్ బీచ్‌లో 12 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. పలు విమానాశ్రయాలపై ఈ భీకర తుపాను ప్రభావం పడే అవకాశం ఉంది. ఫ్లైట్అవేర్.కామ్ ప్రకారం 1400కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. దక్షిణ కేరొలినాలోని ఛాల్స్‌టన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. హరికేన్ ప్రభావం తగ్గిన తర్వాతే దీన్ని తెరుస్తామని విమానయాన శాఖ తెలిపింది. వర్షం, భారీ గాలులు ప్రారంభం కావడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దాంతో ఉత్తర కేరొలినాలోని అట్లాంటిక్ బీచ్‌లో ఏర్పాటు చేసిన బోర్డ్ వాక్ బ్రిడ్జి ధ్వంసమైంది. పలు చోట్ల పార్కులను మూసివేశారు మరోవైపు, ఉత్తర కేరొలినాలో టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భీకర హరికేన్ ఫ్లోరెన్స్ తుపాను ఉత్తర కేరొలినా వద్ద తీరాన్ని దాటింది. ఈ తుపాను భారీగా ఫ్రాణనష్టం కలిగించగలదని అధికారులు హెచ్చరించారు. text: ఈ మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ముంబయిలోని కాలంబోలీ రైల్వే స్టేషన్ నుంచి ఖాళీ ట్యాంకర్లతో విశాఖపట్నం వెళ్తుంది. అక్కడ నుంచి వాటిని రీఫిల్ చేసుకుని తిరిగి ముంబయి చేరుకుంటుంది అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక అధికారి చెప్పారు. ఏడు ట్యాంకర్లతో వెళ్లే ఈ ప్రత్యేక రైలులో ఒక్కో ట్యాంకరులో 16 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ నింపవచ్చు. ఈ రైలు రాకపోకలకు ప్రాధాన్యం కూడా ఇవ్వనున్నారు. ఈ రైలుతోపాటూ ఇలాంటి మరికొన్ని రైళ్లు నడిపించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత్‌లో దాదాపు 20 లక్షల కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో దేశంలో ఇప్పటివరకూ లక్షా 78 వేల మంది చనిపోయారు. ఆక్సిజన్ కొరతతో ఎంతమంది చనిపోయారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పడకలు, మందుల కొరతతోపాటూ మెడికల్ ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. కరోనా రోగులకు మెడికల్ ఆక్సిజన్ అందించడం చాల కీలకం అయ్యింది. భోపాల్‌లోని ఒక ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు చనిపోయారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక రిపోర్ట్ ప్రచురించింది. ఇక, ముంబయిలోని ఒక ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు చనిపోవడానికి కూడా ఆక్సిజన్ కొరతే కారణమని ఆరోపిస్తూ ఎన్డీటీవీ వార్తలు ప్రసారం చేసింది. 12 రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. వీటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ ఉన్నాయి. ఓవైపు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ తీర్చే సామర్థ్యం లేకుండా ఉంటే, మరోవైపు ఆక్సిజన్ తయారు చేసే గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో దాని డిమాండ్ మరింత పెరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది ప్రస్తుతం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ప్రభుత్వం 50 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతికి చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఆక్సిజన్‌ను తొమ్మిది పరిశ్రమల మినహా, పారిశ్రామిక అవసరాలకు వినియోగించడాన్ని ప్రభుత్వ ఎంపవర్డ్ గ్రూప్-2 నిషేధించింది. వాటితోపాటూ 162 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడానికి నిధులు అందించింది. ఈ తాత్కాలిక ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు చిన్నవిగా ఉంటాయి. వీటిని సుదూర ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తారు. కానీ, కోవిడ్ తర్వాత ఈ ప్లాంట్ల అవసరాలు తీరిపోతాయని వినాయక్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజీవ్ గుప్తా చెబుతున్నారు. "ఈ ప్లాంట్లలో తయారయ్యే ఆక్సిజన్ స్వచ్ఛత 93 శాతం వరకూ ఉంటుంది. వాటితో అవసరాలు తీరిపోతాయి. ఒక ప్లాంట్ సామర్థ్యం ఒకటి నుంచి రెండు మెట్రిక్ టన్నుల వరకూ ఉంటుంది" అన్నారు. కానీ, అసలు ఆక్సిజన్ కొరత ఆ స్థాయికి ఎందుకు చేరింది. రైలు నడపాల్సిన అవసరం ఏంటి? భారత్‌లో సమస్య మెడికల్ ఆక్సిజన్ కొరత కాదు, దానిని అవసరమైన ప్రాంతాలకు చేర్చడమేనని నిపుణులు చెబుతున్నారు. "కోవిడ్‌కు ముందు భారత్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 6,500 మెట్రిక్ టన్నులు. అది పది శాతం పెరిగి ఇప్పుడు రోజుకు 7,200 మెట్రిక్ టన్నులకు చేరింది" అని ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ సిద్దార్థ్ జైన్ అన్నారు. కోవిడ్‌కు ముందు భారత్‌లో ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరమయ్యేదని, ఇప్పుడు ఆ రోజువారీ అవసరం దాదాపు 5 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని జైన్ చెప్పారు. ఈ మెడికల్ ఆక్సిజన్‌ను అవసరమైన ప్రాంతాలకు పంపడం ఒక పెద్ద సవాలుగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. "ఒకవైపు మెడికల్ ఆక్సిజన్ అవసరం పశ్చిమాన ఉన్న మహారాష్ట్రలో తీవ్రంగా ఉంటే, తూర్పు భారత్‌లో ఉన్న రూర్‌కెలా, హల్దియా స్టీల్ ప్లాంట్లలో వాటి నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి" అని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాసెస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ చీఫ్ సాకేత్ టీకూ చెప్పారు. మెడికల్ ఆక్సిజన్‌ను ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే ప్రత్యేకంగా తయారైన ట్యాంకర్లు అవసరం. వాటిని క్రయోజెనిక్ ట్యాంకర్లు అంటారు. మెడికల్ ఆక్సిజన్‌ను నిజానికి సిలిండర్లలో, క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా ద్రవ రూపంలో సరఫరా చేస్తారు. ఆక్సిజన్ రైలుతో ఏమవుతుంది "క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ ఆక్సిజన్‌ను మైనస్ 183 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిల్వ చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దాని అవసరం ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు" అని సాకేత్ టీకూ అన్నారు. ఒక పెద్ద కంపెనీ అధికారి వివరాల ప్రకారం ఆయన కంపెనీకి 550 క్రయోజెనిక్ ట్యాంకర్లు ఉన్నాయి. గత ఏడాది నుంచీ వాటిని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ, రోడ్డు మార్గంలో లిక్విడ్ ఆక్సిజన్‌ను ఒక దగ్గరనుంచి మరో ప్రాంతానికి తరలించడానికి చాలా సమయం పడుతోంది. అందుకే, ఈ రైలు ఉపయోగించడం వల్ల వల్ల ఆక్సిజన్ సరఫరా వేగంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. "రైల్లో ఆక్సిజన్ తరలించడానికి ఒక విధానం రూపొందించాం. దీనికి డిమాండ్ ఇలాగే ఉంటే, రైల్వే శాఖ క్రయోజెనిక్ ట్యాంకర్లను డిజైన్ చేసి, వాటి తయారీ గురించి కూడా ఆలోచిస్తుంది" అని ఆ అధికారి తెలిపారు. ఆక్సిజన్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంది "గత ఏడాది సెప్టెంబర్‌లో కోవిడ్ కేసులు పీక్స్‌కు చేరుకున్నప్పుడు ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 3200 మెట్రిక్ టన్నుల వరకూ ఉంది" అని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాసెస్ మానుఫాక్చర్స్ అసోసియేషన్ చీఫ్ సాకేత్ టీకూ చెప్పారు. చెప్పారు. కానీ ఆ తర్వాత కోవిడ్ రోగుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో, మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా తగ్గడం మొదలైంది. ఇండస్ట్రియల్ గ్రేడ్, మెడికల్ ఆక్సిజన్‌లో చాలా పెద్దగా వ్యత్యాసం ఉండదనే విషయం అందరూ తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ గ్రేడ్ ఆక్సిజన్ 99.5 శాతం స్వచ్ఛంగా ఉంటే.. మెడికల్ ఆక్సిజన్ 90 నుంచి 93 శాతం స్వచ్ఛంగా ఉంటుంది. తమ కంపెనీ ఫిబ్రవరిలో 2 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చే 36 నెలల్లో 8 కొత్త ప్లాంట్స్ నిర్మించబోతున్నట్లు ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ సిద్దార్థ్ జైన్ చెప్పారు. "భారత్ తన ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పది శాతం పెంచింది. ఐనాక్స్‌తోపాటూ ఏ కంపెనీ అయినా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలంటే రెండేళ్లు పడుతుంది" అన్నారు. ఉత్పత్తి సామర్థ్యం పెంచడం గురించి మాట్లాడిన రాజీవ్ గుప్తా మెడికల్ ఆక్సిజన్‌ను కేవలం ఆస్పత్రుల్లో ఉపయోగించడం కోసమే ఉత్పత్తి చేయడం లేదని చెప్పారు. "మెడికల్ ఆక్సిజన్‌ను ఎక్కువగా ఉక్కు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. స్టీల్ ప్లాంట్లలో ఉన్న అవసరాన్ని బట్టి మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తారు" అని ఆయన చెప్పారు. మరోవైపు, పెరుగుతున్న కరోనా కేసుల గురించి సాకేత్ టీకూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు మన దగ్గర ఆక్సిజన్ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని భరోసా ఇచ్చారు. "ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లాంటి మరిన్ని చర్యలు తీసుకోడానికి పనులు జరుగుతున్నాయి. అయితే, అవేంటి అనేది తెలీడం లేదు" అన్నారు. ఆక్సిజన్ ఎలా ఉపయోగిస్తారు మెడికల్ ఆక్సిజన్‌ను ఒక ప్రణాళిక ప్రకారం ఉపయోగించాల్సిన అవసరం ఉందని సాకేత్ టీకూ భావిస్తున్నారు. "ఒకవైపు, గుజరాత్‌లో కరోనా రోగులకు రోజుకు 800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉపయోగిస్తుంటే, మరోవైపు ఆరున్నర లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్న మహారాష్ట్రలో ప్రతిరోజూ 1200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. కేరళలో ప్రతి రోజూ 100 మెట్రిక్ టన్నులు కూడా ఉపయోగించడం లేదు. మేం ఇదే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెప్పాం" అని ఆయన చెప్పారు. చాలామంది భయంతో తమ ఇళ్లలోనే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుంటున్నారని, దానివల్ల మన దగ్గర సిలిండర్ల సంఖ్య కూడా తగ్గిపోయిందని రాజీవ్ గుప్తా చెప్పారు. గుజరాత్‌లో పరిస్థితి గత కొన్నిరోజులుగా దారుణంగా మారింది. "కోవిడ్‌కు ముందు గుజరాత్‌లో ఉత్పత్తి అయ్యే వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నుంచి రోజూ 150 మెట్రిక్ టన్నులు ఆస్పత్రులకు వెళ్లేదని, ఇప్పుడు ఆ డిమాండ్ 900 మెట్రిక్ టన్నులకు పెరిగింది" అని మధురాస్ ఇండస్ట్రీస్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జిగ్నేష్ షా చెప్పారు. "మా అమ్మ చనిపోతోంది, మా నాన్న బతకరు, నా భార్య చావు బతుకుల్లో ఉందంటున్న జనం రెండు సిలిండర్లు ఇవ్వండి, కనీసం ఒక్క సిలిండర్ అయినా ఇవ్వండి అని దీనంగా వేడుకుంటున్నారు. అది చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు" అన్నారు జిగ్నేష్. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో, ఆక్సిజన్ డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. దీంతో భారతీయ రైల్వే సోమవారం రాత్రి నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. మొదటి రైలు సోమవారం రాత్రి 8.05కు ముంబయి నుంచి బయల్దేరింది. text: డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్‌తో వియత్నాంలో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ట్రంప్ తర్వాత మీడియాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ నుంచి తమకు కొంత 'మంచి సమాచారం' వచ్చిందని చెప్పారు. అదేంటో ఆయన వివరించలేదు. "భారత్, పాకిస్తాన్ నుంచి మాకు ఒక 'ఆకర్షణీయమైన వార్త' వచ్చిందని నేను అనుకుంటున్నాను. మాకు కొంత 'మంచి సమాచారం' కూడా వచ్చింది. అది రెండు దేశాల మధ్య ఘర్షణకు తెరదించుతుందనే ఆశిస్తున్నా. ఈ ఉద్రిక్తతలు వారి మధ్య సుదీర్ఘకాలంగా దశాబ్దాల నుంచీ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ వాటి మధ్య చాలా విముఖత కూడా ఉంది. అందుకే రెండు దేశాల మధ్య మేం వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేం శాంతిని తీసుకురావడంలో విజయవంతం కాగలమనే అనుకుంటున్నాను" అని ట్రంప్ తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ కురేషీ స్పందించిన పాకిస్తాన్ అటు పాకిస్తాన్ కూడా అమెరికా అధ్యక్షుడి ప్రకటనను స్వాగతించింది. పాక్ న్యూస్ చానల్ జియో న్యూస్‌తో మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ కురేషీ భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడాలన్న డోనల్డ్ ట్రంప్ ఆకాంక్షలను స్వాగతించారు. భారత పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలకు భంగం కలిగేలా ఉంటే అతడిని తిరిగి అప్పగించే విషయం పాకిస్తాన్ పరిశీలిస్తుందని కురేషీ తెలిపారు. "ఇప్పుడే భారత్ నుంచి వివరణ పత్రాలు అందాయి. నాకు వాటిని పరిశీలించే అవకాశం కూడా దొరకలేదు. మేం రాత్రి పార్లమెంటరీ నేతలకు దీని గురించి చెప్పాం. దీనిపై క్యాబినెట్ సమావేశం జరిగింది. మేం ఆ పత్రాలను సహృదయంతో పరిశీలిస్తామని నేను ఇప్పటికీ చెబుతున్నా. వారు(భారత్) ఈ వివరాలు ముందే పంపించుంటే బాగుండేది. వారు మొదట దాడి చేసి, ఇప్పుడీ పత్రాలు పంపించారు. వారు మొదటే వీటిని పంపించి, పాకిస్తాన్ సమాధానం కోరుంటే, దాడి చేయాల్సిన అవసరం ఉండేది కాదు అన్నారు. పైలెట్‌ను తిరిగి అప్పగించడం వల్ల పరిస్థితుల్లో మార్పు వస్తుందని అనిపిస్తే పాకిస్తాన్ ఆ విషయాన్ని పరిశీలిస్తుంది. మేం అన్ని రకాల సానుకూల ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నాం. అన్నారు. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ మేం సిద్ధం, మీరు సిద్ధమా "ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శాంతి చర్చలు కొనసాగేలా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. మోదీ సిద్ధంగా ఉన్నారా? అని కురేషీ ప్రశ్నించినట్లు జియో న్యూస్ తెలిపింది. భారత్ తీవ్రవాదం గురించి చర్చలు జరపాలని భావిస్తుంటే దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. "మీరు(భారత్) రాజకీయాల కోసం ప్రాంతీయ స్థిరత్వాన్నే ప్రమాదంలో పెట్టాలని చూస్తున్నారు. రాజకీయాల్లో అది అవసరం కావచ్చు, కానీ చరిత్ర మిమ్మల్ని క్షమించదు" అన్నారు. మా మొదటి ప్రాధాన్యం శాంతి, స్థిరత్వమే అన్నారు. యుద్ధం రాకూడదనే కోరుకుందాం. యుద్ధం వస్తే పాకిస్తాన్ ప్రభావితమవుతుంది, కానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడదా అని ప్రశ్నించారు. జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన తర్వాత ఈ వారం పాక్ వైమానిక దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో రెండు దేశాలు నిగ్రహం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కశ్మీర్ అంశంలో భారత్, పాకిస్తాన్ మధ్య సంఘర్షణకు తెరపడుతుందని ఆశిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గురువారం చెప్పారు. text: చాలా నాటకీయంగా ప్రసంగించే మోదీ, కాగితంపై రాసుకున్న ప్రసంగాలను పట్టిపట్టి చదివే రాహుల్ గాంధీల్లో వచ్చిన తేడా స్పష్టంగా కనిపించింది. బహుశా నాలుగున్నరేళ్ల కాలంలో గట్టి ప్రశ్నలు అడగలేని చీర్‌లీడర్ మీడియాను మాత్రమే ఎదుర్కొన్న మోదీ నిజంగానే జటిలమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరేమో. అయితే రాహుల్ గాంధీ మాత్రం అనేక ప్రశ్నలను సంధించారు. మోదీ మాయమాటలు, బిలియనీర్లతో ఆయనకున్న సంబంధాల గురించి రాహుల్ తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే మోదీ ఆ విమర్శలన్నటికీ మరిచిపోలేని సమాధానం ఇస్తారని, 2019 ఎన్నికలకు ముందు అది బాగా ఉపయోగపడుతుందని బీజేపీ భావించింది. నిజానికి అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలన్న ఆలోచన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాది. ప్రతిపక్షాలలో ఉన్న విభేదాలను బహిర్గతం చేసి, ఎన్డీయే ఏకతాటి మీద ఉందని తెలియజేయాలన్నది షా వ్యూహం. అయితే 20 ఏళ్లకు పైగా బీజేపీతో స్నేహం చేస్తున్న శివసేన ఈసారి చేయిచ్చింది. తమ 18 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. ఈ అవమానం చాలదన్నట్లు రాహుల్ గాంధీ ప్రధానిని ఆలింగనం చేసుకోవడంపై కూడా సేన హర్షం వ్యక్తం చేసింది. రాహుల్ రాజకీయవేత్తగా పరిణితి చెందాడంటూ పేర్కొంది. తెలుగుదేశం పార్టీ మోదీని 'మోసకారి, 'మంచి నటుడు' అని అన్నపుడు దానిని 'నైతికత వర్సస్ మెజారిటీ' అని వ్యాఖ్యానించింది. మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన అమెరికన్ యాసతో కూడిన ఇంగ్లీష్‌లో గణాంకాలతో సహా మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రతి హామీని ఎలా విస్మరించారో వివరించారు. గల్లా ప్రసంగించినంత సేపూ మోదీ కోపంగా కనిపించారు. ఇక రాహుల్ గాంధీ మోదీని ఆకస్మికంగా ఆలింగనం చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు.. మోదీ వడ్డీతో సహా బాకీ తీరుస్తారని అనుకున్నారు. దురదృష్టవశాత్తూ అనుకున్నది జరగలేదు. దాదాపు 90 నిమిషాల మోదీ ప్రసంగం మాయమాటల్లాగే వినిపించాయి. మోదీ తన హోదాను మర్చిపోయి, సోనియా గాంధీ ఇటాలియన్ యాసను ఎద్దేవా చేసినపుడు వాటికి ప్రతిస్పందనగా ట్రెజరీ బెంచీల నుంచి కొన్ని బలవంతపు నవ్వులు మాత్రం వచ్చాయి. అయితే విచిత్రం ఏంటంటే, రాహుల్ మోదీని ఆలింగనం చేసుకున్నపుడు రాజ్‌నాథ్ సింగ్, అనంత్ కుమార్‌ల మొహాల్లో నవ్వులు విరిసాయి. అయితే రాహుల్ చర్య స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు మాత్రం నచ్చలేదు. రాహుల్ సభాసాంప్రదాయాలను పాటించాలని ఆమె హితవు పలికారు. మొత్తమ్మీద మోదీ మాటల చాతుర్యంతో రాబోయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలన్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. మోదీ ప్రసంగంలో పస కనిపించలేదు. కఠినమైన ప్రశ్నలకు ఎలా ప్రతిస్పందస్తారన్న దానిని బట్టి ఒక నేతను అంచనా వేయొచ్చు. మీడియాకు దూరంగా ఉండే మోదీ ప్రధానిగా ఉండగా ఒక్క పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయని ప్రధానిగా పేరొందారు. ప్రస్తుతం ఎలాంటి ప్రశ్నలనైనా ఎదుర్కొనడం ఆయనకు కష్టం కావచ్చు. అంతే కాకుండా మోదీ ఇప్పటివరకు పార్లమెంటులో కూడా సరైన ప్రశ్నలను ఎదుర్కోలేదు. ఇక ప్రతిపక్షాలను వ్యక్తిగత వ్యంగ్యోక్తులతో దెబ్బ తీసే విధానం ఆయన హోదాకు తగినది కాదు. అంతే కాకుండా కింది స్థాయి నుంచి వచ్చిన తన గతాన్ని మార్కెట్ చేసుకోవాలన్న ప్రయత్నాలు కూడా ఇటీవల బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ది కూడా అలాంటి నేపథ్యమే అయినా, ఆయన ఎన్నడూ దాని గురించి చెప్పుకోలేదు. ఇన్నాళ్లూ ఊహించినట్లు 2019 ఎన్నికల్లో విజయం బీజేపీకి ఇక ఎంత మాత్రమూ సులభం కాదు. అందువల్ల మోదీ తన స్టైల్‌ను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాను కూడా పోటీలో ఉన్నానని రాహుల్ సవాలు విసిరారు. మోదీ ఆయనను ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మంచి మాటకారిగా పేరొందిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లోక్‌సభలో మాత్రం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఒక సుదీర్ఘమైన, నిరర్ధక ప్రసంగం చేశారు. text: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు ''డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీ పరిధిలోని సరాయి గ్రామంలో 'గ్రామదర్శిని' కార్యక్రమం నిమిత్తం సర్వేశ్వరరావుతో కలిసి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఇక్కడి(అరకు) నుంచి వాహనాల్లో బయల్దేరాం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డుంబ్రిగుడ దాటాక ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని లివిటిపుట్ అనే గ్రామం గుండా వెళ్తుండగా నక్సలైట్లు దాడికి వచ్చారు. మేం ఊరి మధ్యలో వెళ్తుండగా తుప్పల్లోంచి, గ్రామంలోంచి వాళ్లు ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లలో ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్లు వచ్చిన వెంటనే కాల్పులు జరపలేదు. ఏకే-47 తుపాకులు, చిన్న చిన్న పిస్టళ్లు వారి వద్ద ఉన్నాయి. సాధారణ దుస్తుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ బూట్లు వేసుకున్నారు. టోపీలు పెట్టుకొన్నారు. తూటాలకు అవసరమైన బెల్టులు, బ్యాగులు పకడ్బందీగా పెట్టుకొని ఉన్నారు. రోడ్డుపై ముందు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వాహనం ఉంది. తర్వాత మా కారు ఉంది. నక్సలైట్లు ఒక్కసారిగా సర్వేశ్వరరావు కారును చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టి, ఆపించారు. డోర్ తీసి, ''మీరు లొంగిపోండి, మీ ఆయుధాలను మాకు ఇచ్చేయండి, మిమ్మల్ని ఏమీ చేయం'' అని గన్‌మెన్లకు చెప్పారు. గన్‌మెన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాగేసుకున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చనిపోయిన ప్రదేశం గన్‌మెన్లను, ఎమ్మెల్యేను వాహనంలోంచి కిందకు దించేశారు. తర్వాత వారిని ఎటూ కదలకుండా చేశారు. ఇది జరుగుతున్నప్పుడు మా కారు కొంత దూరంలో ఉంది. అక్కడి నుంచే ఇదంతా చూశాను. వాళ్లు సాధారణ దుస్తుల్లోనే ఉన్నా వాళ్ల చేతుల్లో ఆయుధాలు ఉండటం చూసి నక్సలైట్లనే అనుకున్నాను. వెంటనే సోమ కూర్చుని ఉన్న మా కారును అక్కడి నుంచి తప్పించేందుకు పక్కకు తిప్పాను. ఇది చూసి మావోయిస్టులు పరుగెత్తుకుంటూ మా కారు వద్దకు వచ్చారు. ఇంతలో మాకు అడ్డుగా ఒక పెద్ద లారీ వచ్చింది. లారీ వల్ల కూడా మాకు అక్కడి నుంచి బయటపడటం సాధ్యం కాలేదు. లారీ ఎవరిదో తెలియదు. అప్పటికీ కారు పోనిచ్చేస్తానని నేను సోమతో అన్నాను. ఆయన వద్దన్నారు. ''ఏదయితే అది అయింది. ఆపేయ్. వెనక్కు తిప్పొద్దు'' అని చెప్పారు. అవే సోమ ఆఖరి మాటలు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ చనిపోయిన ప్రదేశం కారు వెనక్కు పోనిస్తే మొత్తం వాహనాన్నే పేల్చేస్తారని ఆయన అనుకున్నారేమో. అందుకే వెనక్కు తిప్పొద్దని చెప్పారనిపిస్తోంది. బండి నిలిపాక ఒక నక్సలైట్ దగ్గరకు వచ్చి అద్దం గుండా నా వైపు తుపాకీ గురిపెట్టాడు. మేం అద్దాలు వేసుకొని ఉన్నాం. వాటికి బ్లాక్ ఫిల్మింగ్ ఉంది. బయటివాళ్లు మాకు కనిపిస్తారుగాని, మేం బయటకు కనిపించం. నేను కనిపించకపోవడం వల్ల నేను డ్రైవర్ అన్న విషయం అతనికి తెలిసుండదు. తుపాకీ లోడ్ చేసుకొని నాపై కాల్పులకు దాదాపు సిద్ధంగా ఉన్నాడు. బండి ఆపేసి నక్సలైట్ వైపు చూశాను. బండి ఆపేయ్, కదలనిస్తే ఎన్‌కౌంటర్ చేసేస్తానని, ఘోరంగా ఉంటుందని హెచ్చరించాడు. ఆపేస్తానని చెప్పాను. అతడు తెలుగులోనే మాట్లాడాడు. తర్వాత మిగతా నక్సలైట్లు కారును చుట్టుముట్టారు. ముందు గన్‌మెన్లను లొంగిపొమ్మని చెప్పి కిందకు దించారు. వారి నుంచి ఆయుధాలు తీసేసుకున్నారు. ఒక్కసారిగా అంత మంది అక్కడకు వచ్చేసరికి ఏం చేయాలో మాకు తెలియలేదు. తిరగబడటానికి కూడా అవకాశం లేదు. సోమను కూడా కారులోంచి దించేసి ఆయన చేతులను వెనక్కు తిప్పి తాడుతో కట్టేశారు. ఆయన్ను సర్వేశ్వరరావు వద్దకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత వారిద్దరినీ ఒకేసారి నడిపించుకుంటూ ఒక చోటకు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే సోమ నివాసం వద్ద ... గన్‌మెన్లను, డ్రైవర్లను, పీఏను మరో చోటకు తీసుకెళ్లారు. ముగ్గురు నలుగురు నక్సలైట్లు.. మా అందరికీ తుపాకులు గురిపెట్టి, కదిల్తే కాల్చేస్తామన్నారు. మమ్మల్ని ఎటూ కదలకుండా చేశారు. సర్వేశ్వరరావు, సోమ ఉన్న ప్రదేశానికీ, మాకూ చాలా దూరం ఉంది. అక్కడ సర్వేశ్వరరావు, సోమలతో నక్సలైట్లు ఏదో మాట్లాడారు. మాకు వినిపించలేదు. తర్వాత సోమను ముగ్గురు నలుగురు నక్సలైట్లు చేతులు పట్టుకొని దిగువలో ఉన్న ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. సర్వేశ్వరరావును మరో ప్రదేశానికి తీసుకెళ్లారు. తర్వాత రెండు నిమిషాల్లోనే సోమను తీసుకెళ్లిన ప్రదేశం నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. మూడు నాలుగు రౌండ్లు కాల్చారు. తర్వాత కొన్ని సెకన్లలోనే సర్వేశ్వరరావుపైనా మూడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. సోమపై కాల్పులు జరపడం నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆ ప్రదేశం కొంత తగ్గులో ఉంది. కాల్పుల శబ్దం మాత్రమే వినిపించింది. సర్వేశ్వరరావుపై కాల్పులు జరపడమైతే కొంత మేర కనిపించింది. తుప్పలు ఉన్నందున పూర్తిగా కనిపించలేదు. ''అన్నా, నన్నేం చేయొద్దు.. వదిలేయండి, అన్నా.. వదిలేయండి అన్నా'' అంటూ సర్వేశ్వరరావు ఆర్తనాదాలు చేశారు. అయినా నక్సలైట్లు వదల్లేదు. ఆయనపై కాల్పులు జరిపారు. తర్వాత ఆయన కాసేపు అరిచి కింద పడిపోయారు. అరకు లోయ దాడికి వచ్చిన నక్సలైట్ల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. ఎత్తు తక్కువగానే ఉన్నారు. వచ్చినవాళ్లలో ఎక్కువ మంది ఆడవారే. ఈ ఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల 40-50 మంది గ్రామస్థులు ఉన్నారు. సర్వేశ్వరరావు, సోమపై నక్సలైట్లు ఈ దాడి చేస్తున్న సమయంలో, కాల్పులు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఒక మహిళా నక్సలైట్ గ్రామస్థులను కూర్చోబెట్టి మీటింగ్ నిర్వహించారు. ఒకవైపు సర్వేశ్వరరావు, సోమలను నక్సలైట్లు తీసుకెళ్లడం, మమ్మల్ని బంధించడం చేస్తుండగా, మరోవైపు ఆమె ఈ మీటింగ్ నిర్వహించారు. సర్వేశ్వరరావు, సోమలను హత్య చేశాక నక్సలైట్లు వాకీ టాకీలో ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత మమ్మల్ని వదిలేశారు. అందరూ ఒక చోటకు చేరి అక్కణ్నుంచి బయల్దేరారు. నేను సోమ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాను. అప్పుడు నక్సలైట్లు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. నాకు దగ్గర్లోనే ఉన్నారు. వెళ్లేటప్పుడు కూడా వాళ్లు సర్వేశ్వరరావు, సోమ చనిపోయారో లేదోనని మరోసారి చూసుకున్నారు. మృతదేహాలను కొట్టినట్టు అనిపించింది. నాకు సరిగా కనిపించలేదు. తర్వాత ఇద్దరు మావోయిస్టులను నా వద్దకు పంపించారు. ఆ ఇద్దరు మావోయిస్టులను, నన్ను సర్వేశ్వరరావు, సోమ మృతదేహాల వద్దకు పంపించి, వారిద్దరి సెల్‌ఫోన్లను తెప్పించుకున్నారు. తర్వాత కండ్రుం వైపు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. డుంబ్రిగుడ పోలీసు స్టేషన్ ఆదివారం సరాయిలో గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తున్నామని ఈ దాడి జరగడానికి ముందు రోజైన శనివారం డుంబ్రిగుడ ఎస్సైకు ఎమ్మెల్యే సిబ్బంది సమాచారం ఇచ్చారంట. కార్యక్రమానికి బయల్దేరబోయే ముందు కూడా ఎస్సైకు చెప్పారంట. అయినా పోలీసులు రాలేదు. కాల్పులు జరిగిన రోజు కూడా మధ్యాహ్నం మూడున్నరైనా పోలీసులు ఘటనా స్థలికి రాలేదు. కాల్పులు జరిగిన చోట మొబైల్ సిగ్నల్ ఉండదు. ఘటన తర్వాత నేను డుంబ్రిగుడకు వెళ్లి సీఐకు, ఎస్‌ఐకు ఫోన్ చేసి నక్సలైట్ల దాడి గురించి చెప్పాను. సర్వేశ్వరరావు, సోమ వాళ్ల సంబంధీకులకు కూడా సమాచారం ఇచ్చాను. పోలీసులు ఎంతకూ రాకపోవడంతో, అక్కడే వేచి ఉండటం మంచిది కాదని, సోమ మృతదేహాన్ని ఆయన వాహనంలో, సర్వేశ్వరరావు మృతదేహాన్నిఆయన వాహనంలో చేర్చి ఇంటికి తీసుకొచ్చేశాం.'' అరకు ఆందోళనల తీవ్రత ఇదీ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మన్యంలో కాల్చి చంపిన ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి, సివేరి సోమ కారు డ్రైవర్‌ చిట్టిబాబుతో బీబీసీ తెలుగు మాట్లాడింది. సోమ వద్ద ఆయన పది నెలలుగా పనిచేస్తున్నారు. మంగళవారం అరకులో చిట్టిబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... text: ఈస్టర్ రోజున పలు చర్చిల్లో జరిగిన ఈ పేలుళ్లు.. గత నెలలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి మసీదుల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా జరిపినవని దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు. పేలుళ్ల తరువాత పార్లమెంటు అత్యవసరంగా సమావేశం కాగా.. రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజయవర్ధనె ''న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన పేలుళ్లకు ప్రతీకారంగానే మన దేశంలోని చర్చిల్లో దాడులు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది'' అని చెప్పారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చిలోని మసీదుల్లో మార్చి 15న జరిగిన పేలుళ్లో సుమారు 50 మంది మరణించారు. ఇప్పుడు శ్రీలంకలోని చర్చిల్లో జరిగిన పేలుళ్లలో 321 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో 10 మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. తమ పనేనంటున్న ఐఎస్ తాజాగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమంటూ తన వార్తా సంస్థ ద్వారా ప్రకటించుకుంది. అయితే, శ్రీలంక ప్రభుత్వం ఈ పేలుళ్లకు స్థానిక ఇస్లామిస్ట్ గ్రూప్ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) పనేనని చెబుతోంది. శ్రీలంకలోని బీబీసీ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఐఎస్ ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఐఎస్ ఏమైనా చేస్తే వెంటనే తన మీడియా పోర్టల్‌లోనూ ఆ చిత్రాలనూ పోస్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎస్ స్వయంగా ప్రకటించుకున్నప్పటికీ దీనిపై ఇంకా నిర్ధరణకు రావాల్సి ఉంది. మరోవైపు పేలుళ్లతో సంబంధం ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేసిన 40 మందిలో ఒక సిరియా పౌరుడూ ఉన్నాడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) శ్రీలంకలో 321 మందిని పొట్టన పెట్టుకున్న భీకర బాంబు పేలుళ్లపై ఆ దేశ మంత్రి ఒకరు కీలక వివరాలు వెల్లడించారు. text: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లకు ఇప్పుడే కాదు... రాబోయే సంవత్సరాల్లో కూడా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. మూడు వారాలుగా విమానయాన రంగంలో ఉద్యోగావకాశాల గురించి గమ్యంలో చర్చిస్తున్నాం. ఆ సిరీస్‌లో భాగంగా... ఈ వారం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ (ఏఎంఈ) ఉద్యోగాల గురించి వివరిస్తున్నారు Careers360.comడైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ అనే ఉద్యోగాల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చాలామంది గ్రామీణ విద్యార్థులకు ఏవియేషన్ అంటే ఓ సుదూర స్వప్నం. ఎవరైనా కొద్దిమందికి పైలట్లు, ఎయిర్ హోస్టెస్ వంటి ఉద్యోగాలపై కొంత అవగాహన ఉంటే ఉండొచ్చు. కానీ ఏఎంఈల గురించి ఎక్కువ మందికి తెలియదు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లకు ఇప్పుడే కాదు... రాబోయే సంవత్సరాల్లో కూడా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఒక్క ఎయిర్‌క్రాఫ్ట్ గాలిలోకి ఎగరాలంటే దానికి సుమారు 33 మంది ఇంజినీర్లు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్లనే ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అంటారు. ఈ ఉద్యోగంలో చేరాలంటే ఏ కోర్సు పూర్తి చేయాలి, ఆ కోర్సుకు కావాల్సిన అర్హతలేమిటి, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి.. ఈ వివరాలన్నీ ఈ వారం 'గమ్యం'లో. #గమ్యం: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ కావడం ఎలా? డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆమోదించిన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ శిక్షణ సంస్థలు దేశవ్యాప్తంగా 51 ఉన్నాయి. తెలంగాణలో కూడా 3 ఉన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ - అర్హతలేమిటి? ఏఎంఈ కోర్సులో చేరడానికి కనీస అర్హత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2. బీఎస్సీలో ఎంపీసీ గ్రూపుతో చదువుతున్నవారు లేదా చదివినవారు కూడా ఈ కోర్సులో చేరవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ చేసినవారూ ఈ శిక్షణ పొందడానికి అర్హులే. వీరంతా ఏఎంఈలో చేరాలంటే కనీసం 50 శాతం మార్కులతో ప్లస్ 2 లేదా డిప్లొమా ఉత్తీర్ణులు కావాలి. ఎలక్ట్రికల్ సిస్టమ్స్, రకరకాల ఇంజిన్లు, నేవిగేషన్ వ్యవస్థ... ఇలా అన్ని అంశాలనూ ఇందులో భాగంగా నేర్పిస్తారు. శిక్షణ - లైసెన్స్ డీజీసీఏ గుర్తింపు పొందిన 51 సంస్థల్లో ఎక్కడైనా చేరవచ్చు. వీటిలో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని మాత్రం నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. శిక్షణ కాలం మూడు సంవత్సరాలు. ఈ మూడేళ్లలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అన్ని విభాగాలపైనా చాలా కఠోరమైన శిక్షణనిస్తారు. ఎలక్ట్రికల్ సిస్టమ్స్, రకరకాల ఇంజిన్లు, నేవిగేషన్ వ్యవస్థ... ఇలా అన్ని అంశాలనూ ఇందులో భాగంగా నేర్పిస్తారు. ఈ శిక్షణ పూర్తయ్యాక లైసెన్స్ కోసం డీజీసీఏకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ లైసెన్స్ పరీక్ష సంవత్సరానికి మూడుసార్లు నిర్వహిస్తారు. బీఏఎంఈసీ (బేసిక్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ సర్టిఫికెట్) - దీనిలో అర్హత సాధిస్తే మీరు ఉద్యోగానికి అర్హులే. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ తదనంతర శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ తర్వాత ఏఎంఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎంఈ లైసెన్స్ - దీనికోసం మూడు పరీక్షలు, ఓ ఇంటర్వ్యూలో అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ వివరాలన్నీ డీజీసీఏ వెబ్‌సైట్లో ఉంటాయి. సాధారణంగా శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగానే ఈ పరీక్షలు ఉంటాయి. లాగ్ బుక్ - ఇది చాలా కీలకమైన అంశం. మీరు శిక్షణలో నేర్చుకునే సమయంలోనే మీరు నేర్చుకున్నదానికి, మీరు చేసే ప్రతి పనికీ లాగ్ బుక్ మెయింటెయిన్ చేయాలి. లైసెన్స్ పొందడానికి చివర్లో మూడు పరీక్షలు, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావడం మాత్రం ఎవరికైనా తప్పనిసరి. ప్రైవేటు శిక్షణ సంస్థలున్నాయా? ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నేరుగా ఈ కోర్సులో చేర్చుకుని శిక్షణనిచ్చేందుకు డీజీసీఏ కొన్ని విమానయాన సంస్థలకు వెసులుబాటు కల్పించింది. ఆ సంస్థల ద్వారా కూడా ఏఎంఈ శిక్షణ పొందవచ్చు. కానీ లైసెన్స్ పొందడానికి చివర్లో మూడు పరీక్షలు, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావడం మాత్రం ఎవరికైనా తప్పనిసరి. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం మరో తప్పనిసరి అంశం. శిక్షణ పొందడానికి ఇది అవసరం లేదు కానీ లైసెన్స్ పొందే ముందు అవసరమవుతుంది. ప్రతి ఎయిర్‌లైన్స్ సంస్థా చాలా ఎక్కువ సంఖ్యలో క్రమం తప్పకుండా ఏఎంఈల నియమాకాలు చేపడుతూనే ఉంటుంది. అవకాశాలు ఎలా ఉంటాయి? ప్రతి నెలా సుమారు 5 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ఎన్నో కొత్త విమానయాన సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక్క విమానం గాల్లోకి ఎగరాలంటే సుమారు 33 మంది ఇంజినీర్లు దాన్ని పరీక్షించి అనుమతివ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లకు ఎంత డిమాండ్ ఉండబోతోందో. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం కొత్త ఇంజినీర్లు అవసరమవుతూనే ఉంటారు. ప్రతి ఎయిర్‌లైన్స్ సంస్థా చాలా ఎక్కువ సంఖ్యలో క్రమం తప్పకుండా ఏఎంఈల నియమాకాలు చేపడుతూనే ఉంటుంది. అందువల్ల మారుతున్న కాలానికి తగిన ఆధునిక కోర్సు కాబట్టి.. ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. text: కర్నూలులో కొండా రెడ్డి బురుజు సరిగ్గా 90 ఏళ్ల క్రితం వరకూ ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు లేదు. అంతకుముందు.. ప్రస్తుత అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను, కర్నాటకలోని బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను దత్త మండలం అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయం సీడెడ్ జిల్లాలు ఇంగ్లీషులో ఒక ప్రాంతాన్ని, ప్రాంతంపై అధికారాన్ని బదిలీ చేయడాన్ని సీడెడ్ (ceded) అంటారు. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక 1792 వరకూ ఈ ప్రాంతం రకరకాల రాజులు, వంశాలు, సామంతుల పాలనలో ఉండేది. 1792లో మూడో మైసూరు యుద్ధం ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతం నిజాం రాజుకు వచ్చింది. అక్కడి నుంచి 1800 వరకూ రాయలసీమ నిజాం రాజుల పాలనలో ఉండేది. ఆ తరువాత మరాఠాలు, టిప్పు సుల్తాన్ నుంచి దాడులు ఎదుర్కొన్న అప్పటి రెండో నిజాం రాజు, బ్రిటిష్ సైన్యం సహాయం కోరాడు. ఇదే సైన్య సహకార పద్ధతి. బ్రిటీష్‌వారి సాయానికి ప్రతిగా ప్రస్తుత రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి (ఈస్ట్ ఇండియా కంపెనీకి) దత్తత ఇచ్చారు. దీన్ని బ్రిటిష్ వారు అప్పటి మద్రాసు రాష్ట్రంలో కలిపి సీడెడ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇది 1800వ సంవత్సరంలో జరిగింది. సీడెడ్‌ జిల్లాలను తెలుగులో 'దత్త మండలాలు'గా వ్యవహరించేవారు. రాయలసీమ నామకరణం మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఆంధ్ర మహాసభల్లో భాగంగా సీడెడ్ జిల్లాల సమావేశాలు 1928 నవంబర్ 17, 18 తేదీల్లో నంద్యాలలో జరిగాయి. సీడెడ్ లేదా దత్త మండలం అన్న పదం బానిసత్వాన్ని సూచిస్తూ అవమానకరంగా ఉందన్న ఉద్దేశంతో దీన్ని మార్చాలన్న ప్రతిపాదనలు ఆ సమావేశాల్లో వచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి నారాయణ రావు సీడెడ్ బదులు రాయలసీమ అన్న పేరు వాడాలని ప్రతిపాదన చేశారు. బళ్లారి, అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు ప్రాంతాలను రాయలసీమగా పిలవాలని ఆ సభల్లో తీర్మానించారు. "వాస్తవానికి రాయలసీమకు ఈ పేరు పెట్టింది స్వతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు అనుకునే వారు. కానీ 1928, నవంబరు 17, 18 తేదీల్లో ఆంధ్ర మహాసభల్లో భాగంగా దత్తమండలం సమావేశాలు కూడా జరిగాయి. కడప కోటిరెడ్డి దానికి అధ్యక్షులు. చిలుకూరు నారాయణ రావు కూడా అందులో ఉన్నారు. ఈ ప్రాంతానికి దత్త మండలం కాకుండా ఇంకేదైనా పేరు పెట్టాలన్న చర్చ వచ్చినప్పుడు యథాలాపంగా రాయలసీమ అనే పేరు ప్రతిపాదించారు నారాయణ రావు. పప్పూరి రామాచార్యాలు ఆ తీర్మానాన్ని ఆమోదింపచేశారు. 1946 జనవరి 3వ తేదీన రాయలసీమ భాషా సంపద పేరుతో తాను చేసిన రేడియో ప్రసంగంలో ఈ విషయాన్ని వివరించిన నారాయణ రావు, రాయలసీమకు ఆ పేరు పెట్టినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. టేకుమల్ల కామేశ్వర రావు రాసిన వాజ్ఞ్మయ మిత్రుడు అనే గ్రంథంలో రాయలసీమ పేరుపెట్టడం గురించిన చరిత్ర సవివరంగా ఉంది" అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చరిత్ర, పురావస్తు శాస్త్ర ఆచార్యులు నాగోలు కృష్ణారెడ్డి బీబీసీతో అన్నారు. 1617 శతాబ్దాల్లోనే వాడుకలో ‘రాయలసీమ’ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 16 -17 శాతాబ్దాల్లో రాయలసీమ అనే పదం మొదట వినిపించింది. "మట్లి సంస్థానం కాలంలో రాసిన అభిషిక్త రాఘవం అనే గ్రంథంలో రాయలసీమ అనే పదం ఉంది. తెలుగు సాహిత్యంలో రాయలసీమ పదం కనిపించింది అదే మొదలు. మట్లి సంస్థానం రాజధాని ప్రస్తుత కడప జిల్లా సిద్ధవటం దగ్గర్లో ఉండేది" అని కృష్ణా రెడ్డి వివరించారు. కవితలో సీమ పౌరుషం రాయలసీమను దత్త మండలంగా పిలవడంపై తన అభ్యంతరాన్ని చెబుతూ, రాయలసీమ గొప్పదనాన్ని చెబుతూ 128 పంక్తుల్లో 'దత్త' పేరుతో దీర్ఘ కవిత రాసారు చిలుకూరి నారాయణ రావు. మంజరి ద్విపద చందస్సులో ఈ కవిత రాసిన చిలుకూరి నారాయణ రావు తెలుగు సాహిత్యం, చరిత్రపై కృషి చేశారు. దత్తన మందును నన్ను దత్తమెట్లగుదు రిత్తన మాటలు చేత చిత్తము కలదె ఇచ్చినదెవరో పుచ్చినదెవరురా పుచ్చుకున్నట్టి ఆ పురుషులు ఎవరో తురక బిడ్డండిచ్చె దొరబిడ్డ పట్టె అత్తసొమ్మునుగొని అల్లుండుదానమమర చేసినట్టు (సారాంశం: ఇవ్వడానికి నిజాం ఎవడు, తీసుకోవడానికి తెల్ల దొర ఎవడు? అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, ఈ ప్రాంతాన్ని ఎలా దానమిస్తారంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు కవి) గండికోట పరిసరాల్లో కనువిందు చేసే దృశ్యాలు సీమ సరిహద్దులేవి? 1953 వరకూ మద్రాసు రాష్ట్రంలో, 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంది. కానీ 1953కి ముందున్న రాయలసీమ ఇప్పుడు చాలా కుదించుకుపోయింది. 1953 వరకూ రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావణగేరే ప్రాంతాలు కర్నాటకలో కలిశాయి. 1970లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు తాలూకాలను తెచ్చి ప్రకాశం జిల్లాలో కలిపారు. ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో కోస్తా-సీమ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. సీమ పెద్దలు, ప్రజలు అసహ్యించుకున్న 'సీడెడ్' పదాన్నీ, ఫ్యాక్షనిజాన్నీ తెలుగు సినిమా ఇంకా వదల్లేదు! ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'రాయలసీమ'.. తెలుగు నేలపై ఈ పేరుకి ప్రత్యేకత ఉంది. సినిమాల ప్రభావంతో ఆ పేరుకు అదనపు హంగులు వచ్చాయి. కానీ ఇంతకీ ఈ ప్రాంతానికి ఆ పేరు ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? కృష్ణదేవరాయల పాలన సమయం నుంచీ ఈ పేరు వచ్చిందా? text: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలో ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) నిర్వహణలో ఆ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో రైతుల ప్రధాన డిమాండ్లు: మహారాష్ట్రంలో పార్టీ పటిష్టంగా లేకున్నా, సీపీఐ(ఎం) రైతులను ఎలా సమీకరించగలిగింది? కమ్యూనిస్టు పార్టీకి మహారాష్ట్రలోని నాసిక్, పాల్ఘార్ జిల్లాలలో, అహ్మద్‌నగర్ జిల్లాలోని కొంత ప్రాంతంలో చెప్పుకోదగ్గ ప్రభావం ఉంది. ముంబై వీధుల్లో కదం తొక్కుతున్న రైతులంతా నాసిక్ జిల్లాలోని కల్వాన్, దిండోరి పేఠ్, సర్గానా; పాల్ఘార్ జిల్లాలోని తలసారి, జవ్హార్, మొఖాడా; థానె జిల్లాలోని షాహపూర్, మురాదాబాద్; అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోలె, సంగమనేర్; జల్గావ్‌ జిల్లాలోని కొన్ని గిరిజన ప్రాంతాలకు చెందిన వారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే జీవ పాండు గావిత్‌కు నాసిక్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. పాల్ఘార్ జిల్లాలో కూడా ఆ పార్టీకి గతంలో చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. మరోవైపు ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి అజిత్ నవాలె గత దశాబ్దకాలంగా గిరిజన సమస్యలపై పోరాడుతున్నారు. గావిత్, నవాలె ఇద్దరూ ఈ పాదయాత్రకు నేతృత్వం వహిస్తున్నవారిలో ప్రముఖులు. గిరిజన రైతులను చైతన్యవంతం చేయడంలో వారిదే ముఖ్యపాత్ర. సుభాష్ కాలు గాంగొడె, పంగార్నె గ్రామం, నాసిక్ జిల్లా రైతులు ఏమంటున్నారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తాను రూ. 40 వేలు రుణం తీసుకున్నానని నాసిక్ జిల్లా పంగార్నె గ్రామానికి చెందిన సుభాష్ కాలు గాంగొడె తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగానే, తాము పత్రాలన్నీ నింపి, రుణమాఫీకి దరఖాస్తు చేశామని అన్నారు. కానీ నాలుగు నెలలు గడిచినా, వాళ్లకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం మాత్రం లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని చెబుతోంది. రైతుల రెండో సమస్య - అటవీ భూములు. 2007-08లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 68 మంది సీపీఎమ్ ఎంపీలు ఒక చట్టం ఆమోదం పొందడం కోసం కృషి చేశారు. ఆ చట్టం కింద గ్రామపంచాయితీ, స్థానిక సంస్థలతో కలిసి ఒక అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ అటవీభూములను సాగు చేసుకుంటున్న వారి కుటుంబ పెద్ద పేరిట భూములు కేటాయించేలా చూస్తుంది. ఆదివాసీలు తాము సాగు చేసుకుంటున్న అటవీభూములను తమకే కేటాయించాలని కోరుతున్నారు. చాయాతాయి గుల్హానే, అమరావతి తమ పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలని, రైతులకు జరైన జీవనోపాధి కల్పించాలని అమరావతికి చెందిన చాయాతాయి గుల్హానేకోరారు. తమకు సుమారు ఒక లక్ష అప్పు ఉందని, దానిని మాఫీ చేయాలని కోరారు. ఎలాంటి ఉపాధి కానీ, పింఛన్ కానీ లేకపోవడంతో గుడ్డివాడైన తన భర్త ఆరు నెలల క్రితం మరణించాడని తెలిపారు. ఉపాధి కోసం తన కుమారులు ఇంకా అక్కడా ఇక్కడా తిరుగుతున్నారని అన్నారు. తాము ఏ అటవీభూముల్ని సాగు చేసుకుంటున్నామో, వాటిపై తమకు హక్కు కల్పించాలని నాసిక్ జిల్లా సుర్గానా తెహసీల్‌కు చెందిన రమేష్ దేవరామ్ లహరే అన్నారు. తమకు భూములు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అది జరగలేదని తెలిపారు. తమకు 5-6 ఎకరాలు ఇవ్వాలని రమేష్ కోరారు. తన తల్లిదండ్రులు, సోదరిని తానే పోషించాలని, పొలాల్లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మా రైతులమంతా మా భూమిపై మాకే హక్కు ఉండాలని కోరుతున్నాం'' అని రమేష్ డిమాండ్ చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నాసిక్ ప్రాంతం నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేసిన మహారాష్ట్ర రైతులు ముంబై చేరుకున్నారు. తమ పంటలకు మరింత మెరుగైన ధర ఇవ్వాలని, తమ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. text: నిర్మా దేవి ఈ అంశంపై బీబీసీ హిందీ ప్రతినిధి సరోజ్ సింగ్ అందిస్తున్న కథనం ఇది. నిర్మా దేవి, బిహార్‌లోని గయ జిల్లాలో మారుమూల గ్రామమైన బారాచట్టికి చెందిన మహిళ. ఆమెకు 29 సంవత్సరాలు. 11 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చాక ఆమె కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక పద్ధతుల గురించి ప్రస్తావన తెస్తే చాలు, ఇతర మహిళలు తప్పుబట్టేవారు. ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా? ఈ 8 అద్భుత ఆవిష్కరణలు మహిళలవే ఇలాంటి పరిస్థితుల కారణంగానే దేశంలోకెల్లా అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో సగటున ఒక్కో మహిళకు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోకెల్లా బిహార్‌లోనే సంతానోత్పత్తి రేటు ఎక్కువ. కుటుంబంతో నిర్మా దేవి ఒక మహిళ జన్మనిచ్చే మొత్తం పిల్లల సగటు సంఖ్యను సంతానోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. ఈ విషయంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాల ప్రకారం జాతీయ సగటు ఇదరు కాగా, బిహార్ సగటు మాత్రం ముగ్గురు. మార్పుకు ప్రతినిధిగా నిర్మా దేవి బిహార్‌లో ఇప్పుడిప్పుడే అక్కడక్కడా మార్పు కనిపిస్తోంది. కుటుంబ నియంత్రణపై గ్రామాల్లో చర్చకు తెర తీసిన ఒక టీవీ సీరియల్ నిర్మా దేవి లాంటి మహిళలను మార్పుకు ప్రతినిధులుగా నిలుపుతోంది. వారు కుటుంబ నియంత్రణ పాటించేందుకు అడుగు ముందుకేస్తున్నారు. ‘‘నేను గర్భనిరోధక మాత్రలు వాడతాను. వీటివల్ల ప్రతికూల ప్రభావమేమీ ఉండదని నాకు తెలుసు’’ అని నిర్మా దేవి స్పష్టంగా చెబుతుండటాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. నిర్మా దేవికి ఇద్దరు పిల్లలు. కొడుకుకు పదేళ్లు. కుమార్తెకు ఏడేళ్లు. ఆమె తన ఇద్దరు సంతానం మధ్య మూడేళ్ల ఎడం పాటించడంతోపాటు గ్రామంలోని దాదాపు 200 మంది మహిళలను కూడా ఈ దిశగా ఆలోచింపజేశారు. ’’మై కుచ్ భీ కర్ సక్తీ హూ’’ (నేనేదైనా చేయగలను- అని అర్థం ) సీరియల్ తనపై చాలా ప్రభావం చూపిందని నిర్మా దేవి చెబుతున్నారు. లైంగిక ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఇతర అంశాలపై గ్రామీణ మహిళల్లో చైతన్యం పెంచాలనుకునే ముంబయి వైద్యురాలు స్నేహ కథే ఈ సీరియల్. ఈ పాత్రను చూసి నిర్మా దేవి ప్రేరణ పొందారు. సీరియల్ ఇదే ‘‘ఓ ఎపిసోడ్‌లో ఒక మహిళ నాలుగో సంతానానికి జన్మనిస్తూ ఆస్పత్రి స్ట్రెచర్‌పైనే ప్రాణాలు వదిలింది. ఆమెకు మూడేళ్లలో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆమె శరీరం నాలుగో సంతానానికి అప్పటికి ఇంకా సిద్ధమైనట్లు లేదు’’ అని నిర్మా దేవి చెప్పారు. ఈ ఎపిసోడ్ చూశాక, కుటుంబ నియంత్రణపై మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె సంకల్పించుకొన్నారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి మహిళలను చైతన్యపరిచేందుకు 20 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య కార్యకర్త అండ స్థానిక ఆరోగ్య కార్యకర్త పూనమ్ కల్పించిన అవగాహనతోనే తన ఇద్దరు పిల్లల మధ్య మూడేళ్ల వ్యవధిని పాటించగలిగానని నిర్మా దేవి చెప్పారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం(ఎన్‌హెచ్‌ఆర్‌ఎస్) కింద నియమితమైన సామాజిక ఆరోగ్య కార్యకర్తల బృందంలో పూనమ్ ఒకరు. వీరు లైంగిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా ప్రోత్సహిస్తుంటారు. తప్పని తిప్పలు కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచుకున్నా, గర్భనిరోధక మాత్రలు సంపాదించడానికి మాత్రం నిర్మా దేవి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. ‘‘మాత్రలు తెచ్చివ్వమని అడిగితే మా ఆయన మొదట్లో ససేమిరా అన్నారు. నేనెలా తీసుకురాగలను, ఊళ్లో ఎవరైనా మగవారికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా అన్నారు’’ అని ఆమె వివరించారు. కుటుంబ నియంత్రణపై చైతన్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బృందంతో సమావేశమైన నిర్మా దేవి తాను ఒత్తిడి చేయడంతో తన భర్త ఎట్టకేలకు ఒప్పుకొన్నారని, దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడ తనకు గర్భనిరోధక మాత్రలు ఉచితంగా ఇచ్చారని తెలిపారు. తర్వాత ఊళ్లోని మిగతా ఆడవారినీ గర్భనిరోధం పాటించేలా నిర్మా దేవి ఒప్పించగలిగారు. ప్రతి గంటకు ఐదుగురి మరణం భారత్‌లో ప్రసవ సమయంలో ప్రతి గంటకు ఐదుగురు మహిళలు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ‌హెచ్‌వో) నివేదిక ఒకటి చెబుతోంది. కుటుంబ నియంత్రణ పద్ధతులపై స్త్రీ, పురుషులిద్దరికీ సరైన అవగాహన లేకపోవడం ఈ సమస్యకు ఒక కారణం. కుటుంబ నియంత్రణ శస్ర్తచికిత్స చేయించుకోవాల్సిన బాధ్యత భార్యదేకాని, భర్తది కాదనే భావన భారత్‌లో ఎక్కువ. నిరోధ్‌లు వాడటం, మాత్రలు వేసుకోవడం లాంటి తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులపైనా అవగాహన పెద్దగా లేదు. సంతానం మధ్య తగినంత ఎడమ పాటించలేకపోవడానికి ఇదో ముఖ్య కారణం. చదువుల రాణి ఈ తెలంగాణ కళ్యాణి సౌదీలో ఇది ఏ మార్పులకు సంకేతం? (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో గర్భనిరోధం గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది వెనకాడతారు. గర్భనిరోధక మాత్రలు వాడటానికీ సంశయిస్తారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు అధిక సంతానానికి దారితీస్తున్నాయి. అయితే బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక టీవీ సీరియల్ కుటుంబ నియంత్రణపై చర్చ జరిగేలా చేస్తోంది. text: కోర్టులో ప్రభుత్వం మెరీనా బీచ్‌లో ఖననానికి సంబంధించి వివాదం ఉందని తెలిపింది. చెన్నైలోని గిండీలో కరుణ సమాధికి చోటు ఇస్తామని తెలిపింది. దీంతో అంశం చివరకు మద్రాసు హైకోర్టు వరకు వెళ్లింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరహాలోనే డీఎంకే అధినేత కరుణానిధిని ఖననం చేయనున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి (94) చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. జయలలిత మృతి సమయంలో ఆమెను దహనం చేయకుండా ఖననం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో మద్రాసు యూనివర్సిటీకి చెందిన తమిళ ప్రొఫెసర్ డాక్టర్ వి.అరుసు బీబీసీతో మాట్లాడుతూ, ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నందువల్లే జయలలితను దహనం చేయకుండా ఖననం చేశారని తెలిపారు. ''హిందూ సంప్రదాయాలు , బ్రాహ్మణ పద్ధతులను ద్రవిడ ఉద్యమకారులు నమ్మరు. జయలలిత, కరుణానిధి ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి వారిని దహనం చేయడం లేదు'' అని చెప్పారు. బ్రాహ్మణ వ్యతిరేకత జయలలిత కూడా ద్రవిడ పార్టీ నాయకురాలే. కరుణనిధి కూడా ఎప్పటి నుంచో ద్రవిడ ఉద్యమంలో భాగస్వామ్యులై ఉన్నారు. అందుకే జయలలిత మాదిరిగా ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేయనున్నారు. ద్రవిడ ఉద్యమకారులు హిందూ ఆచారాలు, పద్ధతులనే కాకుండా కులాన్ని సూచించే పేర్లను కూడా పెట్టుకోరని వి.అరుసు తెలిపారు. అన్నాదురై, ఎంజీఆర్, పెరియార్ రామసామిలతో కరుణానిధి జయలలిత కంటే ముందు ఎంజీ రామచంద్రన్‌ను కూడా ఖననం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు, ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురై సమాధి సమీపంలోనే వీరిద్దరి సమాధులున్నాయి. ఎంజీఆర్ మొదట్లో డీఎంకేలోనే ఉండేవారు. అన్నాదురై మృతి తర్వాత పార్టీ పగ్గాలను కరుణానిధి చేపట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఎంజీఆర్, కరుణల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఎంజీఆర్ ..డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. ఇవికూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరుణానిధి మృతదేహాన్ని మెరీనా బీచ్‌లో ఖననం చేయాలని డీఎంకే డిమాండ్ చేయగా.. ప్రభుత్వం దానికి నిరాకరించింది. మద్రాసు హైకోర్టు ఈ వివాదానికి తెరదించుతూ మెరీనాలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించింది. text: శృంగార సమయంలో ‘మహిళల 86 శాతం’ భావప్రాప్తిని తమ అల్గారిథం ధ్రువీకరించగలదని సైప్రస్‌లో ఉన్న రెలీడా లిమిటెడ్ సంస్థ చెప్పింది. సంస్థ తాము రూపొందించిన ఒక ప్రెజంటేషన్‌కు సంబంధించిన కొన్ని స్లైడ్స్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. వాటిని కొన్ని వేలసార్లు రీట్వీట్ చేశారు. దీని ద్వారా సెక్స్ టెక్ ఉత్పత్తులు తయారు చేసేవారికి తాము సాయం చేయాలని అనుకున్నామని, తమ ప్రయత్నాన్ని వక్రీకరిస్తున్నారని సంస్థ చెప్పింది. లెలో అనే సెక్స్ టాయ్ సంస్థ మేనేజర్‌ స్టూ నూజెంట్ ట్విటర్‌లో ఈ ప్రెజెంటేషన్‌ పోస్ట్ చేశారు. ఆ స్లైడ్స్ బీబీసీ పరిశీలించింది. ఒక మహిళకు భావప్రాప్తి కలిగిందనే విషయాన్ని తెలుసుకోడానికి విశ్వసనీయమైన పద్ధతి ఏదీ లేదని అవి చెబుతున్నాయి. అందులో భావప్రాప్తి పొందినట్లుగా నటించిన మహిళలకు సంబంధించిన గణాంకాలు కూడా ఇచ్చారు. తమ అల్గారిథంను ఇంకా అభివృద్ధి చేస్తున్నామని, తమ ప్రెజెంటేషన్ ప్రచురించడానికి ఉద్దేశించింది కాదని రెలిడా సంస్థ చెప్పింది. హృదయ స్పందన ఆధారంగా... ఇంతకు ముందు హృదయ స్పందనలో మార్పులపై జరిగిన పరిశోధనల ఆధారంగా అది ఈ అల్గారిథం రూపొందించింది. “క్లైమాక్స్’కు చేరుకున్నప్పుడు హృదయ స్పందనలో ఒక నిర్దిష్ట పాటర్న్ ద్వారా భావప్రాప్తిని గుర్తించవచ్చు. అల్గారిథం ఇంకా పూర్తి కానప్పటికీ, ఒక మహిళ మరో మహిళ క్షేమం కోసం దానిని సృష్టించారు అని సంస్థ బీబీసీకి పంపిన ఈమెయిల్లో చెప్పింది. “మేం ఈ అల్గారిథంను నేరుగా మహిళలకు లేదా పురుషులకు అమ్మాలని అసలు అనుకోవడం లేదు. నిజానికి ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమాచారం మహిళలపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తుంది” అని తెలిపింది. సంస్థ నూజెంట్ చేసిన ట్వీట్‌ను ‘అనైతికం’గా వర్ణించింది. ఆయన మాత్రం లింకెడిన్లో ఉన్న కొన్ని స్లైడ్స్ అందుబాటులో ఉండడంతో వాటిని పెట్టానని చెప్పాడు. “సూటిగా చెప్పాలంటే, మా డిజైన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయో, లేదో నిర్ణయించడానికి మా దగ్గర ఇప్పటికే చాలా బలమైన, విశ్వసనీయమైన వ్యవస్థ ఉంది. వాటిని ఉపయోగించేవారిని అడిగి మేం దానిని రూపొందించాం” అని నూజెంట్ చెప్పారు. “ఏ కేసులో అయినా ‘భావప్రాప్తి’ అనేది ఒక సెక్స్ టాయ్ ద్వారా వచ్చే సంతోషాన్ని కొలవడానికి సరైన కొలమానం కాదు. మా అల్గారిథం పూర్తిగా సైన్స్ కోసమే” అని రెలీడా అంటోంది. అయితే, నూజెంట్ మాత్రం తమకు ఎప్పుడూ రాని సమస్యను పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. “నిజానికి అది పొందిన(లేదా పొందుతున్న) వారు చెప్పినదానికి వ్యతిరేకంగా ‘భావప్రాప్తి’ని గుర్తించాలనే ఆలోచన ప్రమాదకరం” అని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహిళల్లో భావప్రాప్తిని గుర్తించేందుకు అల్గారిథం రూపొందించడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతుండడంతో దానిని తయారు చేస్తున్న సదరు సంస్థ తాము చేస్తున్న పనిని సమర్థించుకుంది. text: ప్రధాని మోదీ తర్వాత అమిత్ షాను ప్రస్తుతం దేశంలో రెండవ శక్తిమంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అయితే 27 ఏళ్ల జయ్ షా ప్రస్తుత ఇతర కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. ద వైర్ అనే వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన కుమారుడి వ్యాపారం కొన్ని వేల రెట్లు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆయన వ్యాపార వృద్ధిని తండ్రి రాజకీయ పలుకుబడితో జోడించి చూస్తున్నారు. 'షా బిజినెస్ మోడల్' గురించి వివరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. అయితే అమిత్ షాకు మద్దతుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముందుకొచ్చారు. ఈ కథనాన్ని ప్రచురించిన వెబ్‌సైట్‌పై పరువు నష్టం కేసు నమోదు చేయబోతున్నామని తెలిపారు. ఈ మొత్తం వివాదంపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం దాకా అంతటా ప్రస్తుతం జయ్ అమిత్ షా చర్చలకు కేంద్రబిందువుగా నిలిచారు. అసలు జయ్ ఏం చేస్తారు? గుజరాత్‌లో తన తండ్రి నీడన ఆయన వ్యాపారం ఎలా పెంపొందింది? అనే విషయాల పట్ల పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. తొలిసారి మీడియా దృష్టికి వచ్చిన తీరు జయ్‌ షా మొట్టమొదట 2010లో మీడియా దృష్టిలో పడ్డారు. అప్పటికి 20 ఏళ్ల వయసున్న జయ్ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ గుజరాత్ హైకోర్టుకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటే వెళ్లేవాడు. కోర్టు కార్యకలాపాలు జరిగేటప్పుడు ఆయన న్యాయవాదుల వెనుకే కూర్చునేవారు. కోర్టులో సాగే వాదప్రతివాదాల్లో ఓ వైపు రాం జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తుంటే మరోవైపు కె.టి.ఎస్. తులసీ ఆ వాదనల్ని ఖండించే ప్రయత్నం చేస్తుండేవారు. అయితే జయ్ మాత్రం వారి వాదనలకన్నా వారి ముఖాల్లో కనిపించే హావభావాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే వారు. కోర్టు విచారణ జరుగుతున్నంత సేపు ఆయన హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేవారు. 2010 వరకు ఈ యువకుడి పేరు జయ్ షా అనే విషయం ఎవ్వరికీ తెలియదని చెప్పొచ్చు. 2010లోనే సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో జయ్ షా తన తండ్రి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగేవారు. ఆ సమయంలోనే ఆయన తొలిసారి మీడియా, ప్రజల దృష్టిలో పడ్డారు. గుజరాత్ హైకోర్టు అమిత్ షాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన గుజరాత్‌లో అడుగు పెట్టగూడదంటూ సుప్రీంకోర్టు ఆంక్ష విధించింది. ఆ తర్వాత అమిత్ షా దిల్లీకి వెళ్లిపోయారు. ఆ సమయంలో అమిత్ షా నారన్‌పురా నియోజవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. ఆయన దిల్లీకి వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజల సమస్యలను తెలుసుకునే బాధ్యత జయ్ తన భుజాలకెత్తుకున్నారు. దాంతో పాటే తండ్రి నిర్వహిస్తూ వచ్చిన షేర్ మార్కెట్ వ్యాపారాన్ని కూడా ఆయన చేపట్టారు. గుజరాత్ క్రికెట్ బాధ్యతలు జయ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ)లో కూడా భాగమయ్యారు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి దాదాపు జీసీఏ బాధ్యతలన్నీ జయ్ చేతుల్లోనే పెట్టారు. ఆయన తన తనయుడిని జీసీఏ జాయింట్ సెక్రటరీగా నియమించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి హితేశ్ పటేల్ బీబీసీ న్యూస్ గుజరాతీతో మాట్లాడుతూ తండ్రీ తనయులిద్దరినీ పోల్చలేమని అన్నారు. జయ్ ఎల్లప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండాలని కోరుకునే వారని ఆయన తెలిపారు. జీసీఏ రోజువారీ నిర్వహణ పనుల కోసం జయ్ సమయం కేటాయించలేకపోయేవారని పటేల్ అంటారు. తండ్రికి ఉన్నంత అవగాహన కూడా ఆయనకు లేదని పటేల్ అభిప్రాయపడ్డారు. 'తండ్రి లాంటి హోదా కనిపించదు' జయ్ నిర్మా ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్ చదివారు. మూడేళ్ల క్రితం ఆయన తన క్లాస్‌మేట్ రుషితా పటేల్‌ను వివాహం చేసుకున్నారు. తండ్రీ, తనయుల్లో ఉమ్మడి లక్షణం ఏమిటంటే తమ వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ బహిరంగం కానివ్వరు. అమిత్ షా స్నేహితుడు కమలేశ్ త్రిపాఠీ బీబీసీతో మాట్లాడుతూ, "తన కుమారుడిపై తన హోదా ప్రభావం పడగూడదని అమిత్ తొలి నుంచీ భావించేవారు" అని చెప్పారు. తమ కుటుంబంలోనూ, సన్నిహిత మిత్రమండలిలోనూ ఎవరికీ సులువుగా చోటివ్వకపోవడం వారిద్దరిలో కనిపించే మరో ఉమ్మడి లక్షణం. జయ్‌కు కూతురు పుట్టినప్పుడు జరిగిన కార్యక్రమానికి చాలా తక్కువ మంది బంధుమిత్రులను మాత్రమే పిలిచారు. తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం, వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడమే జయ్ ఏకైక లక్ష్యమని షా కుటుంబాన్ని దగ్గరగా గమనించే వారు చెబుతారు. ఇప్పుడు అతని వ్యాపారం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్రంగా మారింది. మా వెబ్‌సైట్‌పై మరి కొన్ని తాజా కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏకైక కుమారుడు జయ్ షా. ఆయన కంపెనీ ప్రస్తుతం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. text: తన చదువు పూర్తి చేశాక గిరిజనులకు సేవ చేయాలనుకుని భావించారు. ఆమె టోపీవాలా మెడికల్ కాలేజీలో గైనకాలజీ(స్త్రీరోగ సంబంధ వైద్యం) చదివేవారు. కానీ పాయల్ మే 22న ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కలలన్నీ ఛిద్రమయ్యాయి. సీనియర్ల వేధింపులు భరించలేకే పాయల్ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. ఐపీసీ సెక్షన్ 306/34 ప్రకారం ముగ్గురు మహిళా డాక్టర్లపై అగ్రీపాడా స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్లను కూడా కలిపారు. ఏసీపీ దీపక్ కుదాల్ బీబీసీతో మాట్లాడుతూ.. "కేసు దర్యాప్తు చేస్తున్నామని" చెప్పారు. ఆత్మహత్యకు కారణం డాక్టర్ పాయల్ పశ్చిమ మహారాష్ట్రలోని మీరాజ్-సాంగ్లీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గత ఏడాది ఆమె పీజీ చేసేందుకు టోపీవాలా మెడికల్ కాలేజ్( బీవైఎల్ నాయర్ ఆస్పత్రి సంబంధిత)లో చేరారు. ఆమె వెనుకబడిన వర్గాలకు చెందినవారు. రిజర్వేషన్ కోటాలో ఆమెకు ఇక్కడ అడ్మిషన్ లభించింది. అదే మెడికల్ కాలేజీలో ఉన్న ముగ్గురు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆమెను కులం పేరుతో దూషించేవారని, కులం ఆధారంగా ఆమెను వేధించారని ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులతో విసిగిపోయిన పాయల్ ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. పాయల్ వాళ్లమ్మ ఆబేదా తాడవీ బీవైఎల్ నాయర్ ఆస్పత్రి డీన్‌కు దీనిపై లిఖిత ఫిర్యాదు చేశారు. అందులో.. తను ఏ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందో, అదే ఆస్పత్రిలో పాయల్‌పై వేధింపులు జరిగాయని, వాటిని తను స్వయంగా చూశానని ఆరోపించారు. ఆ ఫిర్యాదులో ఆమె "నేను అప్పుడు కూడా కేసు పెట్టడానికి వెళ్తున్నా. కానీ పాయల్ నన్ను ఆపేసింది. దాంతో ఆమెను మరింత వేధించారు. నా కూతురు చెప్పడం వల్లే నన్ను నేను ఆపుకున్నాను" అని తెలిపారు. సీనియర్ మహిళా డాక్టర్ రోగుల ముందు కూడా పాయల్‌ను ఎగతాళి చేసేవారని, దాంతో పాయల్ చాలా మానసిక ఒత్తిడికి గురైందని ఆబేదా చెప్పారు. ఆమె మానసిక ఆరోగ్యం గురించి తనకు ఆందోళనగా ఉండేదని తెలిపారు. పాయల్ తన డిపార్ట్‌మెంట్ మార్చాలని కూడా అప్లికేషన్ పెట్టిందన్నారు. చివరికి మే 22న పాయల్ ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్(ఎంఎఆర్డీ) ఆమెను వేధించినట్లు చెబుతున్న ముగ్గురు మహిళా డాక్టర్లను సస్పెండ్ చేసింది. ఆమె కుటుంబం మాత్రం యూనిట్ హెడ్‌ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. పాయల్‌తోపాటు పనిచేస్తున్న మిగతా డాక్టర్లు దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులుగా చెబుతున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సెలింగ్ అవసరం ఈ ఘటనతో మెడికల్ రంగానికి సంబంధించిన చాలా మంది షాక్‌ అయ్యారు. పాయల్ మృతితో వివక్ష, మానసిక ఒత్తిడి అంశం మరోసారి వెలుగులోకి వచ్చిందన్నారు. జేజే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అంబేడ్కర్ మెడికోస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రేవంత్ కానిందే మాట్లాడుతూ.. "పీజీ చేస్తున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందంటే, ఆమె ఎంత మానసిక ఒత్తిడికి గురయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చని" అన్నారు. "యూనివర్సిటీ, కాలేజీలు సమాన అవకాశాల సెల్ ఏర్పాటు చేయాలని యూజీసీ మార్గనిర్దేశాలు జారీచేసింది. కానీ మహారాష్ట్రలోని ఏ కాలేజీలూ అలా చేయడం లేదు. విద్యార్థులు తమ ఇళ్లు వదిలి చదువుకోడానికి వస్తారు. వారికి కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇలాంటి కేసులు త్వరగా విచారించేందుకు, కాలేజీ యంత్రాంగం ఎస్సీ-ఎస్టీ అధికారిని నియమించాలి". "జనరల్, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఒకరినొకరు అర్థం చేసుకునేలా వారికి షేరింగ్ కౌన్సెలింగ్ సెషన్ ఉండాలి" అన్నారు. కాలేజ్ డీన్ డాక్టర్ రమేష్ భర్మాల్ స్పందన తెలుసుకోవాలని బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన వైపు నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు. మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం యాంటీ రాగింగ్ టీమ్.. ఘటన జరిగిన తర్వాత రోజు నుంచే దర్యాప్తు చేపట్టింది. ఈ టీమ్ దాదాపు 25 మంది వాంగ్మూలం సేకరించింది. మంగళవారం ఉదయం లోపు పాయల్ ఆత్మహత్యపై ఒక నివేదిక సమర్పించనుంది. పాయల్‌ను వేధించినట్లు చెబుతున్న ముగ్గురు మహిళా డాక్టర్లు కూడా యాంటీ రాగింగ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. పాయల్ పనిచేస్తున్న యూనిట్ హెడ్ మీద కూడా దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఆస్పత్రి తమ పరిధిలో ఉండడంతో గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీనిపై విచారణ ప్రారంభించింది. వార్డెన్, ఎంఏఆర్డీ, డీన్ ఆఫీసులో ఉన్నవారు ఆస్పత్రిలో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమకు తెలీదని చెబుతున్నారు. అలాంటివి జరక్కుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాయల్‌కు ఏవైనా సమస్యలుంటే తమకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె భర్త సల్మాన్‌కు కూడా చెప్పామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కానీ పాయల్‌ చదువుకు ఇబ్బంది అవుతుందని ఆయన తమ దగ్గరకు వచ్చేవాడు కాదని, అప్పుడే తాము వీటిపై మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. ‘‘మాతో కలిసి పనిచేస్తున్న ఒక తెలివైన విద్యార్థిని మేం కోల్పోయాం. పాయల్ మృతికి షాక్ అయ్యాం’’ అని ఆ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర మహారాష్ట్ర జలగావ్‌కు చెందిన పాయల్ తాడావీ ఎప్పుడూ డాక్టర్ కావాలని కలలు కనేవారు. text: సుల్తానా, హామిదుర్ 39 ఏళ్ల హామిదుర్ రహమాన్, ఆయన భార్య పార్సియా సుల్తానాలు అసోంలోని జోర్‌హాట్ జిల్లాలో కొన్ని హిందూ మందిరాల నిర్మాణాలు, మరమ్మతులు చేయించారు. మసీదులకూ కూడా వీరు సాయం చేస్తున్నారు. తమకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా వేయించారు. ‘‘మా నాన్న టీ తోటలో పనిచేసేవారు. అక్కడ మా కుటుంబం తప్ప, అందరూ హిందువులే ఉండేవారు. కానీ, మా కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు ఎప్పుడూ నాకు ఆ తేడా తెలియనివ్వలేదు. టీ తోటలోనే ఓ హరి మందిరం ఉండేది. అక్కడ పౌరాణిక నాటకాలు వేసేవారు. నేను కూడా నా మిత్రులతో కలిసి వాటిలో పాత్రలు వేసేవాడిని. కాలేజీ వయసు వచ్చేదాకా నేను వాటిలో పాల్గొంటూనే ఉన్నా. నేను అన్ని మతాలను గౌరవించడానికి ఇదే కారణం. నా స్తోమత కొద్దీ వీలైన సాయం చేస్తుంటా. మీడియాలో నాపై వార్తాలు రావాలని కాదు, నా మనసుకు సంతోషం కలగాలని ఈ పని చేస్తున్నా’’ అని హామిదుర్ బీబీసీతో చెప్పారు. అస్సాంలో హిందూ-ముస్లింల విభజనకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ పాత్రికేయుడు వైకుంఠ్ నాథ్ గోస్వామి అభిప్రాయపడ్డారు. ‘‘గత కొన్నేళ్లుగా హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలను పరస్పర వ్యతిరేకులుగా మార్చి ఓట్లు పొందాలని చూస్తున్నారు. కానీ, అసోం ఎగువ ప్రాంతంలో విభజన రాజకీయాలు పనిచేయవు. అక్కడ ఐకమత్యం ఎక్కువ’’ అని అన్నారు. హామిదుర్ రహమాన్ రోడ్లు కూడా వేయించారు హామిదుర్ రోజుకు ఐదు సార్లు నమాజ్ చదువుతారు. హిందూ మందిరాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారు. ఇస్లాంలో విగ్రహాన్ని ఆరాధించేవారిని ‘కాఫిర్లు’గా పరిగణిస్తారు. కానీ, హామిదుర్ ఓ మందిరానికి కాళీ మాత విగ్రహాన్ని, త్రిశూలాన్ని, గంటను కూడా దానం చేశారు. ‘‘నేను నా మత నియమాలను పాటిస్తా. వాళ్లు (హిందువులు) వాళ్ల నియమాల ప్రకారం అన్నీ చేస్తారు. ఇందులో అభ్యంతరకర విషయం ఏముంది? 2013-14 నుంచి నేను ఇలా సాయం చేస్తున్నా. వారి కోసం ఎక్కడికైనా వెళ్తా. ఏదైనా లోటు ఉంటే, దాన్ని తీర్చాలని ప్రయత్నిస్తా’’ అని హామిదుర్ అన్నారు. జోర్‌హాట్‌‌లోని తితాబర్‌ పట్టణంలో ఓ శివాలయ నిర్మాణానికి కూడా హామిదుర్ సాయం చేశారు. ‘‘2008లో వెదురు, టిన్‌ ఉపయోగించి ఈ ఆలయాన్ని కట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత నిర్మాణం దెబ్బతింది. అప్పట్లో తరుణ్ గోగోయ్ ప్రభుత్వాన్ని కూడా సాయం కోసం మేం అభ్యర్థించాం. కానీ ఫలితం లేకపోయింది. స్థానికుల సాయంతో పక్కా నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఈ సమయంలోనే హామిదుర్ మాకు ఇటుకలు అందించారు. గేటు చేయంచారు. గంట, త్రిశూలం కూడా అందజేశారు. మా ఆలయం బాగుపడింది. హామిదుర్ కూడా ఎదిగారు’’ అని ఆ ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజెన్ హజారికా అన్నారు. వినోద్ శర్మ తితాబర్ హైండిక్ గ్రామంలో ఉన్న మందిరంలో ఒక హాలును, బంగాలీ పట్టీలోని రాధా కృష్ణ హరి మందిర ప్రాంగణంలో టాయిలెట్లను కూడా హామిదుర్ కట్టించారు. రాధా కృష్ణ మందిర సమీపంలో రోడ్డును కూడా ఆయనే వేయించారని శివాలయ కమిటీ అధ్యక్షుడు నికు మాలాకార్ చెప్పారు. హిందూ దేవాలయాల నిర్మాణానికి హామిదుర్ సాయం చేస్తుండటాన్ని స్థానిక ముస్లింలు కూడా అభినందిస్తున్నారు. ఆయన మసీదుల కోసం కూడా సాయం చేశారు. ‘‘మా మాసీదు నిర్మాణం, సుందరీకరణకు హామిదుర్ దాదాపు రూ.12 లక్షలు దానం చేశారు. ఆ తర్వాత వేరే మతాల మందిరాలకు కూడా ఆయన సాయం చేస్తున్నారు. ఇది చాలా మంది పని. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేమీ లేదు. తితాబర్‌లో ఎప్పుడూ సామరస్య వాతావరణం ఉంది. ఇప్పటివరకూ మతపరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు’’ అని బోకాహోలా జమా మసీదు నిర్మాణ సమితి కార్యదర్శి అబ్దుల్ రవుఫ్ అహ్మద్ అన్నారు. అబ్దుల్ రవుఫ్ అహ్మద్ తితాబర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తరుణ్ గొగోయ్ వరుసగా 15 ఏళ్లు అసోంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడూ ఈ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. తితాబర్ పట్టణంలోని శాహ్ ఆలమ్ రోడ్డుకు హామిదుర్ మరమ్మతులు చేయించారు. ‘‘వర్షాకాలంలో ఈ రోడ్డు నీళ్లతో నిండిపోయేది. రాత్రి పూట ఈ దారి నుంచి వెళ్లే ధైర్యం కూడా జనాలు చేసేవారు కాదు. ఈ విషయాన్ని గ్రామస్థులు హామిదుర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన దగ్గరుండి రోడ్డును బాగు చేయించారు. నీళ్లు పోవడానికి కాలువలు తవ్వించారు. ఈ రోడ్డుపై ఇప్పుడు వాహనాలు బాగా తిరుగుతున్నాయి’’ అని స్థానికుడు బుబుల్ హుస్సేన్ అన్నారు. హామిదుర్‌కు జోర్‌హాట్‌లోని చినామార్‌లో ఉక్కు పరిశ్రమ ఉంది. ఒకప్పుడు ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, గత కొన్నేళ్లలోనే వ్యాపారంలో బాగా ఎదిగారని స్థానికులు చెబుతారు. ‘‘జనాలకు సాయం చేయడం కన్నా మంచి పని ఏముంటుంది. మా మొత్తం కుటుంబం ఆయన వెంట ఉంది. మాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి’’ అని హామిదుర్ భార్య సుల్తానా అంటున్నారు. ‘‘మతంతో సంబంధం లేకుండా జనాలు ఒకరికొకరు సాయం చేసుకునేలా సమాజం ఉండాలని... నేను, నా ఇద్దరు కుమార్తెలు కోరుకుంటున్నాం. నా భర్తతోపాటు నేను కూడా ఆలయాలకు వెళ్తుంటా. ప్రార్థన చేస్తా. ఇప్పటివరకూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. మా కుటుంబంలో ఒక కోడలు హిందూ మతానికి చెందినవారే. మేమంతా కలిసిమెలిసి ఉంటాం’’ అని ఆమె చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అస్సాంలో హిందూ దేవాలయాల నిర్మాణానికి, మరమ్మతులకు ఆర్థిక సాయం చేస్తూ ఓ ముస్లిం జంట మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. text: సేల్స్ టార్గెట్ అందుకోకుంటే, బొద్దింక తినాల్సిందే బెల్టుతో దెబ్బలు తింటున్న కొందరు పసుపు రంగులో ఉన్న ద్రవాన్ని తాగుతున్నట్టు ఉన్న కొన్ని వీడియోలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "టార్గెట్ చేరుకోలేకపోయిన ఉద్యోగులు బొద్దింకలు తినాలని సంస్థ ఆదేశించినట్లు" సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. ఉద్యోగులతో మూత్రం తాగించిన ఘటనతో ముగ్గురు మేనేజర్లను జున్యి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఉద్యోగులకు దారుణమైన శిక్షలు చైనా సోషల్ మీడియా సైట్ వీబోలో వైరల్ అయిన వీడియోలో మధ్యలో నిలబడిన ఒక ఉద్యోగిని బెల్టుతో కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీరందరూ గ్వీజో నగరంలో ఇళ్లను రిపేర్ చేసే కంపెనీలో పనిచేసే ఉద్యోగులని చెబుతున్నారు. వీరిలో కొందరు ముక్కు మూసుకుని ప్లాస్టిక్ కప్పుల్లో ఉన్న పసుపు ద్రవాన్ని తాగడం వీడియోలో కనిపిస్తోంది. పనితీరు సరిగా లేని ఉద్యోగులు బొద్దింకలను కూడా తినాల్సి వస్తుందని మేనేజర్లు బెదిరిస్తున్నట్టు ఈ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో ఈ పసుపు ద్రవాన్ని మూత్రం అంటున్నారు ఉద్యోగం పోతుందని సిబ్బంది భయం స్థానిక మీడియా కథనాల ప్రకారం టాయిలెట్‌లోని నీళ్లు లేదా వినెగర్ తాగించడం, గుండు కొట్టించడం లాంటి శిక్షలు కూడా ఈ సంస్థలో అమలు చేస్తున్నారు. ఈ సంస్థ గత రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. లోపల వేస్తున్న శిక్షల గురించి బయట చెబితే, పనిలోంచి తీసేస్తారని, జీతం ఇవ్వరని సిబ్బంది భయపడిపోతున్నారు. చైనా సంస్థలు తమ ఉద్యోగులను శిక్షించడం, అవమానించడం లాంటి ఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో కొన్ని సంస్థలు ఉద్యోగులను శిక్షించడం, లేదా టీమ్ స్పిరిట్ పేరుతో ఇలాంటి చాలా దారుణాలకు పాల్పడ్డాయి. వీటిలో ఒకరితో ఇంకొకరికి చెంపదెబ్బలు వేయించడం, మోకాళ్లపై నడిపించడం, చెత్తకుండీలకు ముద్దు పెట్టించడం లాంటి కేసులు కూడా నమోదయ్యాయి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనాలో అమ్మకాల టార్గెట్లు అందుకోలేకపోయిన ఉద్యోగులతో మూత్రం తాగించి, బొద్దింకలు తినిపించిన ఒక సంస్థ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. text: ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే.., గుండెపోటో, ఛాతీ నొప్పో నిమిషాల్లో తేల్చేసి పేషెంట్లను ఇంటికి పంపేయొచ్చు. దీనివల్ల యేటా కోట్లాది రూపాయలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. గుండెపోటా? ఛాతి నొప్పా? ఛాతి నొప్పి వచ్చే రోగులలో మూడింట రెండొంతుల మందికి గుండెపోటు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఈసీజీ ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తెలుసుకుంటున్నారు. ఛాతి నొప్పి అనుమానం కలిగి, ఈసీజీ క్లియర్‌గా ఉంటే, వారికి ట్రోపోనిన్‌ అనే రక్తపరీక్ష నిర్వహిస్తున్నారు. కానీ గుండె కండరాలు దెబ్బ తిన్న విషయం తెలుసుకోవాలంటే.. ఈ పరీక్షను ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ మళ్లీ చేయాలి. గుండెపోటు తర్వాత ట్రోపోనిన్‌ ప్రొటీన్లకన్నా, రక్తంలోని సీఎమ్‌వైసీ (కార్డియాక్ మయోసిన్-బైండింగ్ ప్రొటీన్ సి) స్థాయి చాలా వేగంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సీఎమ్‌వైసీ పరీక్ష ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉందో లేదో వెంటనే నిర్ధారించవచ్చని పరిశోధకులు 'సర్క్యులేషన్' పత్రికలో తెలిపారు. సీఎమ్‌వైసీ పరీక్ష భేష్ స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్‌ దేశాలలో ఛాతి నొప్పితో బాధపడుతున్న సుమారు రెండు వేల మంది రోగులపై ట్రోపోనిన్‌, సీఎమ్‌వైసీ రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కొత్త పరీక్ష ద్వారా మొదటి మూడు గంటల్లోనే ఎవరెవరికి గుండెపోటు వచ్చే అవకాశం లేదో నిర్ధారించేశారు. ''ఈ కొత్త విధానం ద్వారా పేషెంట్లు తమ విలువైన కాలాన్ని ఆసుపత్రి బెడ్లపై వృధా చేసే బాధ తప్పుతుంది'' అని లండన్‌లోని సెయింట్‌ థామస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ టామ్ కైయర్ అన్నారు. ఈ పరీక్షలతో 15-30 నిమిషాల్లో విశ్వసనీయమైన ఫలితాలు వస్తాయన్నారు. సీఎమ్‌వైసీ పరీక్షల ద్వారా ఆయన పని చేస్తున్న హాస్పిటల్‌లోనే సుమారు రూ. 70 కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా. అదే దేశవ్యాప్తంగా లెక్కిస్తే అది లక్షల కోట్లలోకి చేరుతుంది. బ్రిటిష్ కార్డియో వాస్క్యులర్ సొసైటీకి చెందిన ప్రొ. సైమన్ రే.. ట్రోపోనిన్‌ పరీక్ష స్థానంలో కొత్త పరీక్షను ప్రవేశపెట్టే ముందు మరికొంత పరిశోధన జరగాలని సూచిస్తున్నారు. ''గుండెపోటు సూచనలు కనిపించిన వెంటనే ఈ పరీక్షను నిర్వహించవచ్చు. ఇది గుండెపోటా లేక కేవలం ఛాతీ నొప్పా? అన్నది కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు. అదీ అన్నిటికన్నా ముఖ్యం'' అని రే అన్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌ టీమ్.. వేలాది మంది పేషెంట్లపై పరీక్షలు నిర్వహించిన అనంతరం, సీఎమ్‌వైసీ పరీక్ష మరో ఐదేళ్లలో అందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. text: 2017 ఫిబ్రవరి 22న శ్రీనివాస్ కూచిబొట్ల, అతని స్నేహితుడు అలోక్ కాన్సస్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఉండగా అమెరికా పౌరుడు పురింటన్ వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా అలోక్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరపడానికి ముందు "మా దేశం విడిచిపోండి" అని పురింటన్ నినాదాలు చేశాడు. ఈ కేసును విచారించిన కాన్సస్‌లోని ఫెడరల్ కోర్టు జాత్యహంకారంతోనే పురింటన్ కాల్పులు జరిపినట్లు నిర్ధరించింది. నిందితుడు పురింటన్‌ 78 ఏళ్లు జైల్లోనే ఉండాలని శిక్ష విధించినట్లు కాన్సస్ సిటీ న్యూస్ అండ్ వెదర్ న్యూస్ చానల్ పేర్కొన్నట్లు పీటీఐ చెప్పింది. అతనికి వందేళ్లు వచ్చే వరకు పెరోల్ కూడా ఇవ్వొద్దని ఆదేశించింది. ఫెడరల్‌ కోర్టు తీర్పు ప్రకారం పురింటన్ ఇక జీవితమంతా జైలులోనే గడపాల్సి ఉంది. కోర్టు తీర్పును శ్రీనివాస్ భార్య స్వాగతించారు. కోర్టు తీర్పుతో చనిపోయిన తన భర్త తిరిగిరాడు. కానీ మరొకసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో ఆమె కోరారు. శ్రీనివాస్ కూచిబొట్ల స్వస్థలం హైదరాబాద్‌. అమెరికాలో ఏవియేషన్ సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా పని చేసేవారు. శ్రీనివాస్ హత్య కేసుతో పాటు పురింటన్‌పై మరో రెండు కేసులు ఉన్నాయి. అతనిపై ఉన్న జాత్యాంకార అభియోగాల కేసు మే 21న విచారణకు రానుంది. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూచిబొట్ల శ్రీనివాస్‌ను హత్య చేసిన పురింటన్‌కు కాన్సస్ ఫెడరల్ కోర్టు జీవితఖైదు విధించింది. text: సచివాలయం నుంచి ప్రజావేదికకు మారిన సమావేశం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఈ నెల 24న కలెక్టర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వేదికగా తొలుత వెలగపూడిలోని సచివాలయం అనుకున్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని సమావేశ మందిరంలో ఈ సమావేశం ఉంటుందని నోటీసులు కూడా పంపించారు. తాజాగా వేదికను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సమావేశం కరకట్ట మీద ఉన్న ప్రజావేదికలో జరుగుతుందని వెల్లడించింది. ఇది వివాదానికి ఆజ్యం పోసింది. ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ చంద్రబాబు లేఖ ప్రజావేదిక కోసం ఈ నెల 4న చంద్రబాబు లేఖ ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రికి జూన్ 4న రాసిన ఆ లేఖలో తన నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజావేదికను ప్రతిపక్ష నేత నివాసంగా కేటాయించాలని కోరారు. సాధారణంగా ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం నివాసం కేటాయించాల్సి ఉంటుంది. గత శాసనసభ కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌ను నివాసంగా కేటాయించింది. దానిపట్ల అప్పట్లో జగన్ నిరసన వ్యక్తం చేశారు. ఫైల్ ఫొటో ప్రజావేదికలోనే గత సమావేశాలు చంద్రబాబు హయాంలో పలుమార్లు కలెక్టర్లతో సమీక్షలు ప్రజావేదిక కేంద్రంగానే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన ఈ భవనం పలు సమావేశాలకు వేదికయ్యింది. ఇక ప్రభుత్వం మారిన తర్వాత జగన్ నివాసం కేంద్రంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లోనే పలుమార్లు అధికారిక సమావేశాలు జరిగాయి. చంద్రబాబు నివాసంగా ఉన్న లింగమనేని ఎస్టేట్స్ కూడా కరకట్ట పరిధిలో ఉన్న అక్రమ నివాసం కాబట్టి చర్యలు తప్పవని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృషారెడ్డి, ఇతరులు ప్రకటించారు. చంద్రబాబు నివాసానికి భద్రత ఎలా: టీడీపీ నేతలు ప్రజావేదిక‌లో ప్రభుత్వ సమావేశాలు నిర్వహిస్తే, దానిని అనుకుని ఉన్న చంద్రబాబు నివాసానికి భద్రత ఎలా అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ- "ప్రభుత్వ తీరుని నిరసిస్తున్నాం. ఇప్పటికీ చంద్రబాబు రాసిన లేఖకు సమాధానం లేదు. ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు నివాసంలో నిత్యం టీడీపీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. అలాంటప్పుడు దానిని ఆనుకుని ఉన్న భవనంలో సమావేశాలు అంటే సమంజసం కాదు. మా సామాన్లు కూడా తీసుకోనివ్వకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారు" అని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే.. సచివాలయంలో కలెక్టర్ల సమావేశానికి స్థలాభావం కారణంగానే వేదిక మార్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. తాజా ఉత్తర్వులను అనుసరించి తాము వ్యవహరిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి సిసోడియా వెల్లడించారు. ప్రొటోకాల్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, గుంటూరు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన ప్రజావేదికను పరిశీలించారు. సమావేశం ఏర్పాట్ల కోసం ఆదేశాలు జారీ చేశారు టీడీపీవి అర్థంలేని ఆరోపణలు: శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశ వేదికను వివాదాస్పదం చేయడం తగదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "ప్రజావేదిక ప్రభుత్వ అవసరాలకు నిర్మించారు. ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దానిని రాజకీయం చేయడం సమంజసం కాదు. ఏపీలో అందరికీ రక్షణ ఉంటుంది. ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. అపోహలతో అనవసరంగా ఆందోళన సరికాదు" అని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. పాలక, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ప్రజా వేదిక కేంద్రంగా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం వివాదానికి కారణం అవుతోంది. ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు ఇంటిని ఆనుకుని కార్యక్రమాలకు పూనుకోవడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. text: తీర్పు వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతించాల్సిందే.. అనుమతించకపోవటం రాజ్యాంగ విరుద్ధం - సుప్రీంకోర్టు తీర్పు రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. లింగసమానత్వానికి అది విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయ్యప్ప స్వామి 'బ్రహ్మచారి' అని అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో తెలిపారు. శబరిమల దేవస్థానం మహిళలపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ 2006లోనే కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై 2016లో విచారణ జరిగింది. ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీంకోర్టు అప్పుడు స్పష్టం చేసింది. అలా నిషేధం విధించడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ''పురుషుడు ఆలయంలోకి వెళ్లగలిగినప్పుడు, మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26ల ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని 2016లో వ్యతిరేకించిన కేరళ ప్రభుత్వం, 2017 నవంబర్‌లో జరిగిన విచారణ సమయంలో మాత్రం ఆ పిటిషనర్లకు మద్దతు తెలిపింది. అన్ని వయసుల మహిళలనూ మందిరంలోకి అనుమతించేందుకు తాము సిద్ధమేనని చెప్పింది. విశ్వాసాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను వివక్షకు గురిచేస్తున్నారని, పురుషుల్లాగే మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లి పూజలు చేసుకునే అనుమతివ్వాల్సిందే అని పిటిషన్ వేసిన లాయర్ల సంఘం ప్రతినిధి ఇందిరా జైసింగ్ అన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందా? లేదా అది "తప్పనిసరిగా పాటించాల్సిన మతపరమైన ఆచారం" కిందకు వస్తుందా? అన్నది పరిశీలించేందుకు 2017లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. శబరిమల ఆలయం ప్రాముఖ్యత ఏంటి? దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే యాత్రికులు 18 పవిత్ర మెట్ల మీది నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అత్యంత నిష్ఠతో 41 రోజుల పాటు ఉపవాసం చేయకుండా ఆ 18 మెట్లను దాటలేరని భక్తుల నమ్మకం. మందిరంలోకి ప్రవేశించేముందు భక్తులు కొన్ని కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉపవాసం సమయంలో అయ్యప్ప భక్తులు నలుపు రంగు దుస్తులు (మాల) మాత్రమే ధరించాలి, అన్ని రోజులూ గడ్డం చేసుకోకూడదు. రోజూ ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ ఉద్యమం ఫలానా మహిళ 'పవిత్రమే' (రుతుచక్రం మొదలు కానివారు, ఆగిపోయిన వారు) అని గుర్తించగల యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మాత్రమే ఆ మహిళలను ఆలయంలోకి అనుమతిస్తామని 2015లో శబరిమల దేవస్థానం ఛైర్మన్ ప్రయర్ గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ 2015లో విద్యార్థినులు ఉద్యమం ప్రారంభించారు. "ప్రస్తుతం ఆయుధాలను గుర్తించేందుకు మనుషుల శరీరాల శరీరాలను స్కాన్ చేసే మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఫలానా మహిళ 'పవిత్రంగా' ఉన్నారా? లేదా? అని స్కాన్ చేసి చెప్పేసే రోజులు వస్తాయి. అలాంటి మెషీన్‌ కనుగొన్న తర్వాత, మహిళలను మందిరంలోకి అనుమతించే విషయంపై మాట్లాడదాం’’ అని గోపాలకృష్ణన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, #HappyToBleed పేరుతో ఫేస్‌బుక్‌లో పెద్ద ఉద్యమమే జరిగింది. "మహిళలను ఎప్పుడు అనుమతించాలన్నది కాదు, వాళ్లు ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్లాలనుకుంటే అప్పుడు వెళ్లే హక్కు వాళ్లకుండాలి" అని ఆ ఉద్యమాన్ని ప్రారంభించిన నిఖితా ఆజాద్ బీబీసీతో అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) శబరిమల మందిరంలోకి మహిళలను అనుమతించకుండా దేవస్థానం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 28వ తేదీన) తీర్పు వెల్లడించింది. text: వరుసగా మూడో రోజు భారత మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అయితే, ప్రారంభంలో భారీగా పతనమైన భారత మార్కెట్లు, తర్వాత మెరుగుపడి మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 561 పాయింట్లు (1.61 శాతం), నిఫ్టీ 168.20 పాయింట్లు (1.58 శాతం) నష్టపోయాయి. జపాన్ మార్కెట్ 'నిక్కీ 225 ఇండెక్స్' 7 శాతం (1071.8 పాయింట్లు) పడిపోయింది. తర్వాత కాస్త కుదుటపడటంతో ఆ నష్టం 4.73 శాతానికి తగ్గింది. ఆసియాలోని ఇతర మార్కెట్లు సైతం నష్టాల్లోనే నడిచాయి. లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, పారిస్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 3 శాతం వరకు పతనమయ్యాయి. అమెరికాలో ప్రధాన స్టాక్ మార్కెట్ డౌజోన్స్ ఒక్కసారిగా 1175 పాయింట్లు (4.6 శాతం) నష్టపోయింది. 2011 తర్వాత డౌ ఇంతగా కుదేలవ్వడం ఇదే తొలిసారి. బీఎస్‌ఈ సెన్సెక్స్ (06-02-2018) 2017లో మదుపరులకు మార్కెట్లు లాభాల పంట పండించాయి. డౌజోన్స్ దాదాపు 25 శాతం వృద్ధి చెందింది. అంతగా జోష్ ఇచ్చిన మార్కెట్లు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలడంతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అమెరికాలో ఈ పరిస్థితికి ప్రధాన కారణం శుక్రవారం వెలువడిన ఉద్యోగాల నివేదికే అని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యోగుల జీతాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. అయితే జీతాలు పెరిగితే, ద్రవ్యోల్బణం కూడా పరుగులు పెడుతుంది. ఆ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ ఊహాగానాలే డౌజోన్స్ పతనానికి కారణమయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీగా పతనమైన అమెరికా షేర్ మార్కెట్లు భారత ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా మూడో రోజూ ఇక్కడి మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. అయితే, కొన్ని నెలలుగా భారీగా పుంజుకున్న మార్కెట్లకు ఈ పతనాన్ని దిద్దుబాటుగానే చూడాలని నిపుణులు అంటున్నారు. "తాజా నష్టాలపై గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ దిద్దుబాటుగానే చూడాలి" అని బీఎన్‌పీ పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు గౌరంగ్ షా అన్నారు. మరి కొందరు నిపుణులు మాత్రం మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు మదుపరులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు. "అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్(ఎల్‌టీసీజీ) ప్రభావంతో భారత మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపరులు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది" అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ అధినేత జయంత్ మాంగ్లిక్ వివరించారు. ఆర్‌బీఐ వైపే మదుపరుల చూపు ప్రస్తుతం మార్కెట్ నిపుణులు అంతా బుధవారం రిజర్వ్ బ్యాంకు ప్రకటించబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్ష వైపు చూస్తున్నారు. వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మంగళవారం భారత్ సహా, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ప్రధాన మార్కెట్లు పతనమవ్వడం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో ప్రధాన మార్కెట్లన్నీ నేలచూపులు చూశాయి. text: కొంత కాలంగా రూ. 2000 నోటు క్రమంగా ఏటీఎంల నుంచి కనుమరుగు అవుతుండటంతో ప్రభుత్వం నుంచి మళ్లీ ఏదో పెద్ద ప్రకటన వస్తుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ నోటు రద్దు గురించి చెప్పకపోయినా, ముద్రణను ఆపేసినట్లు సమాచార హక్కు పిటిషన్‌కు స్పందనగా ఆర్‌బీఐ వెల్లడించింది. పెద్దనోటుకు ఏమయ్యింది? "మూడేళ్ల కిందట ఏటీఎం నుంచి రూ.రెండు వేలకు మించి డబ్బులు తీసుకుంటే రూ. 2000 నోటు కచ్చితంగా కనిపించేది. కానీ ఆర్నెల్లుగా ఆ నోటు రాకపోవడంతో నాలో అనుమానం పెరిగింది" అని సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ బీబీసీకి చెప్పారు. ఆ నోటు అదృశ్యంపై ఆర్‌బీఐ నుంచి సమాచార హక్కు చట్టం కింద ఆయన వివరణ కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సుధీర్‌, కొన్నేళ్లు అమెరికాలో ఉండి వచ్చారు. సమాచార హక్కు కింద ఆర్‌బీఐ 2016 నుంచి ముద్రించిన కరెన్సీ నోట్ల వివరాలను వెల్లడించింది ఆర్‌బీఐ ఏం చెప్పింది? ఇటీవల కాలంలో ఏటీఎంల నుంచి రూ. 2000 నోటు రావడం లేదని, అసలు అది చెలామణిలో ఉందా, ముద్రణ చేస్తున్నారా లేదా అని సుధీర్‌ తన పిటిషన్‌లో ఆర్‌బీఐని కోరారు. "ఈ నోట్‌ను మళ్లీ రద్దు చేస్తారేమో అన్నదే నా సందేహం, దాన్ని తెలుసుకునేందుకే పిటిషన్‌ వేశా" అని సుధీర్‌ వెల్లడించారు. ‘బ్లాక్‌మనీ భయంతో రెండువేల నోట్‌ను చెలామణిలో లేకుండా చేస్తున్నారా?’ అని తన పిటిషన్‌లో ఆర్‌బీఐని కోరారు సుధీర్‌. దీనిపై వివరణ ఇచ్చిన ఆర్‌బీఐ రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు తెలిపే గణాంకాలను సుధీర్‌కు పంపింది. 2016-17 సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ముద్రించిన ఆర్‌బీఐ.. 2019-20 సంవత్సరంలో మాత్రం ఒక్క కొత్త నోటును కూడా ముద్రించలేదని ఆ గణాంకాలు చెప్తున్నాయి. ఏటీఎంలలో రెండు వేల నోటు ఎందుకు కనిపించడం లేదనే అనుమానంతో సమాచార హక్కు కింద వివరాలు కోరినట్లు జలగం సుధీర్ తెలిపారు మరి రూ. 2,000 నోటు ఎటు వెళ్తోంది? దేశంలో రూ. 2 వేల నోట్లు సర్క్యులేషన్‌కు సరిపడా ఉన్నాయని, అందుకే ఆ నోటు ముద్రణను ఆపేశామని అప్పటి కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ గత ఏడాది జనవరి 4న ప్రకటించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. "సరిపడా సర్క్యులేషన్‌లో ఉంటే ఏటీఎంలలో రెండు వేల నోటు ఎందుకు కనిపించడం లేదు. అదే నా అనుమానం'' అని సుధీర్‌ అన్నారు. గతంతో పోలిస్తే రెండు వేల నోటు ఈ మధ్య కనిపించడం తగ్గిందని హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరాల సర్వీస్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ బీబీసీతో వెల్లడించారు. "బిజినెస్‌ కోసం పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేస్తుంటాం. ఏటీఎంలలో ఎక్కువగా ఇప్పుడు రూ. 500, రూ. 100 నోట్లే కనిపిస్తున్నాయి. కస్టమర్లు కూడా పెద్ద నోటు తీసుకురావడం లేదు'' అని శ్రీనివాస్‌ వెల్లడించారు. ఏటీఎంలలో లేదా? గత ఆరు నెలలుగా ఏటీఎంలలో రూ. 2,000 నోటు పెట్టడంలేదని ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకులో పని చేస్తున్న సీనియర్‌ అధికారి సందీప్‌ బీబీసీతో చెప్పారు. గతంలో రూ. 2,000 నోటు ఉంచడానికి ఉపయోగించే స్లాట్‌ (క్యాసెట్‌ అంటారు) కూడా ఇప్పుడు లేదని, దాని స్థానంలో కొత్త రూ. 100 నోటు, రూ. 500 నోట్ల క్యాసెట్‌లు అమర్చారని ఆయన వెల్లడించారు. "రెండు వేల నోటును రద్దు చేయడం అనేది ఉండకపోవచ్చు. కానీ సర్క్యులేషన్‌ తగ్గించడమన్నది వాస్తవం'' అని సందీప్‌ తెలిపారు. మళ్లీ మళ్లీ వదంతులు 2016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్‌బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రూ. 2,000 నోటు రద్దుపై గత మూడేళ్లుగా ఇలాంటి ఊహగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు అన్ని రూ. 2000 నోట్లను అత్యవసరంగా క్యాష్‌ చెస్ట్‌ (ఆర్‌బీఐ తరఫున బ్యాంకుల డబ్బును నిల్వ చేసే ప్రదేశం)కు తరలించాలని తన బ్రాంచ్‌లను ఆదేశించిందని, దీంతో ఆ నోటును రద్దు చేస్తున్నారని ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయని "బిజినెస్‌ ఇన్‌సైడర్‌ ఇండియా'' అనే వెబ్‌సైట్‌ ఫిబ్రవరి 10, 2020న ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనికి నోట్ల రద్దు కారణం కాదని, రెండు వేల నోట్లను ఇకపై ఏటీఎంలలో లోడ్‌ చేయవద్దని బ్యాంకు అధికారులకు అందిన ఆదేశాలే దీనికి కారణమని ఈ వెబ్‌సైట్ తన కథనంలో బ్యాంకు సీనియర్‌ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. థర్డ్‌ పార్టీ ఏటీఎం సర్వీస్‌ ప్రొవైడర్లకు కూడా రూ. 2,000 నోట్ల క్యాసెట్ స్థానంలో రూ.వంద నోట్ల క్యాసెట్‌లు అమర్చాలని ఆదేశాలొచ్చినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ పరిణామం, ఆర్నెల్ల నుంచి ఈ నోట్లు కనిపించడం లేదన్న పిటిషనర్‌ సుధీర్‌ వాదనతో సరి పోలింది. చెలామణి ఆపడానికి కారణాలేంటి? పెద్ద నోట్ల వల్ల బ్లాక్‌మనీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. దీంతోపాటు నకిలీ కరెన్సీకి పెరుగుతుందన్న ఆందోళన వినిపించింది. "ఎక్కువ విలువ నోట్ల వల్ల డబ్బును దాచుకోవడం ముఖ్యంగా బ్లాక్‌కు మళ్లించడం సులభమవుతుంది. లాకర్లలో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవచ్చు. అలా చేయడం వల్ల మార్కెట్‌లో క్యాష్‌ ఫ్లో తగ్గిపోతుంది. దీన్ని అడ్డుకోడానికే ప్రభుత్వం రెండు వేల నోట్ల చెలామణినికి తగ్గించి ఉండొచ్చు'' అని బ్యాంకు అధికారి సందీప్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ నిర్ణయం వల్ల సహజంగానే పెద్ద నోట్లన్నీ ఆగిపోయి వాటి స్థానంలో చిన్ననోట్ల చెలామణి పెరుగుతుంది. దీనివల్ల బ్లాక్‌మనీతో పాటు, క్యాష్‌ఫ్లో సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు. "వంద రూపాయల నకిలీ నోటు ముద్రణకు, రెండు వేల రూపాయల నోటు ముద్రణకు ఖర్చులో తేడా స్వల్పంగా ఉంటుంది. కానీ నోట్ల విలువలో భారీ తేడా ఉంటుంది. అలాంటప్పుడు దొంగ నోట్ల తయారీదారుల ఆప్షన్‌ సహజంగా పెద్ద నోటే అవుతుంది'' అని సందీప్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ ఇప్పుడేం చేస్తోంది? రూ. 2000 నోట్ల స్థానంలో కొత్త రూ. 50, రూ. 200 నోట్ల ముద్రణను క్రమంగా పెంచినట్లు సమాచార హక్కు పిటిషనర్‌ సుధీర్‌కి ఇచ్చిన వివరణలోని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే రూ. 500 నోట్ల ముద్రణ 2016-17 నుంచి 2019-20 నాటికి దాదాపు రెట్టింపయ్యింది. ఒక్కో నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుంది? ఒక్కో నోటుకు అయ్యే ఖర్చుపై పిటిషనర్ అడిగిన ప్రశ్నలకు ఆర్‌బీఐ సమాధానం ఇచ్చింది. ఆర్‌బీఐ ఇచ్చిన గణాంకాలను బట్టి చూస్తే రూ. 200 నోటుకు ఎక్కువ ఖర్చు అవుతుందని తేలింది. ఇక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల డినామినేషన్లను 2016-17 నుంచి 2019-20 వరకు ముద్రణను పూర్తిగా నిలిపేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. పాత రూ. 10, 20, 50 నోట్లను ముద్రణ తగ్గించిన ఆర్‌బీఐ వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రిస్తోంది. మొత్తం మీద రూ. 2,000 రూపాయల నోటు రద్దు గురించి చెప్పకపోయినా, దాని ముద్రణను నిలిపేసినట్లు మాత్రం ఆర్‌బీఐ అధికారికంగా వెల్లడించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన తర్వాత మళ్లీ అలాంటి పరిణామాలు జరగబోతున్నాయంటూ పలుమార్లు ఊహాగానాలు, వదంతులు వినిపించాయి, వినిపిస్తూనే ఉన్నాయి. text: ఈ చిహ్నానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ, దీనిని ఎక్కువగా నాజీ జర్మనీకి, దాని నేరాలకు సంబంధించినదిగా చూస్తారు. ఈ స్వస్తిక్‌తో కూడిన ఎంబ్లమ్‌ను ఉపయోగించటం ఆపేశామని ఫిన్‌లాండ్ ఎయిర్‌ఫోర్స్ ఇప్పుడు నిర్ధారించింది. ఈ మార్పుని ముందు హెల్సింకి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టీవైనెన్ గుర్తించారు. ఈ చిహ్నాన్ని వాడటం వలన ఫిన్‌లాండ్ దళాలకు ఏమైనా ఉపయోగం ఉందా అని ఆయన గతంలో ప్రశ్నించారు. నాజీయిజం యూరప్‌ను అతలాకుతలం చేయటానికి చాలా ముందుగానే.. ఫిన్‌లాండ్ స్వంతంత్ర దేశంగా మారినపుడు 1918లో స్థాపితమైనప్పటి నుంచీ స్వస్తికను చిహ్నంగా వాడుతోంది. 1945 వరకు వాయు సేన విమానాల పై తెలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ మీద నీలం రంగు స్వస్తిక్ చిహ్నంగా ఉండేది. నాజీ జర్మనీ, ఫిన్‌లాండ్ రెండూ కూటమి కట్టినప్పటికీ.. నాజీ జర్మనీకి తన మద్దతును తెలపటం ఈ చిహ్నం ఉద్దేశం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ చిహ్నాన్ని విమానాల నుంచి తొలగించినప్పటికీ , ఎయిర్ ఫోర్స్ యూనిట్లో కొన్ని చోట్ల, జెండాల పైన, యూనిఫామ్ల పైన ఇంకా కొనసాగుతోందని ఫిన్నిష్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి బీబీసీకి చెప్పారు. జనవరి 2017 నుంచి ఎయిర్ ఫోర్స్ దళానికి, ఎయిర్ ఫోర్స్ సేవా దళానికి వలయాకారంలో ఉన్న రెక్కల మధ్యలో ఉన్న బంగారు గద్ద చిహ్నంగా ఉందని, ఎయిర్ ఫోర్స్ తెలిపింది. "దళం సభ్యులు యూనిఫామ్ మీద కూడా ఈ చిహ్నాలు వాడతారు. ఆ చిహ్నం ఎప్పటికప్పుడు అపార్థాలకు కారణమైంది. కాబట్టి ఈ పాత చిహ్నాన్ని ఉపయోగించటం అనవసరమని భావించాం'' ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి చెప్పారు. ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ పాతకాలపు యుద్ధవిమానం మీద స్వస్తిక చిహ్నం స్వస్తిక అంటే ఏమిటి? స్వస్తిక చిహ్నం సిలువ ఆకారంలో ఉండి కుడి వైపుకి కొన్ని వంపులు తిరిగి ఉంటుంది. సంస్కృతం లో స్వస్తికని సంక్షేమానికి అదృష్టానికి సూచికగా భావిస్తారు. దీనిని భారతీయ సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు. 20వ శతాబ్దం మొదట్లో పశ్చిమ దేశాలలో ఇదొక ఫ్యాషన్ చిహ్నంగా మారింది. 1920లో అడాల్ఫ్ హిట్లర్ స్వస్తికని నేషనల్ సోషలిస్ట్ పార్టీ చిహ్నంగా ఎంచుకున్నారు. ఆ తర్వాతి దశాబ్దంలో ఈ పార్టీ జర్మనీలో అధికారంలోకి వచ్చింది. పశ్చిమ దేశాలలో స్వస్తికని హిట్లర్ కాలంలో చోటు చేసుకున్న మారణహోమాలకి, నాజీ పాలనకి ప్రతీకగా చూస్తారు. ఫిన్‌లాండ్‌లో 1920ల నాటి భవంతులపై స్వస్తిక చిహ్నం కనిపిస్తుందని ప్రొఫెసర్ టీవైనెన్ చెప్పారు. "దీనిని ఫిన్‌లాండ్లో కేవలం ఒక అలంకార చిహ్నంగానే చూస్తారు” అని ఆయన పేర్కొన్నారు. ప్రసిద్ధ ఫిన్‌లాండ్ కళాకారుడు ఆక్సెలి గాలెన్ కళ్ళెలా 1889లో ఈ చిహ్నాన్ని తన పెయింటింగ్‌లో వాడారు. ఆయన చాలా చిత్రాలలో ఈ చిహ్నాన్ని స్వేచ్ఛకి గుర్తుగా వాడటం మొదలుపెట్టారు. ఆయన గీసిన చిత్రాలలో చిన్న చిన్న స్వస్తికలను చిత్రించడంతో, నాజీ గుర్తులను ప్రతిబింబించలేదు. ఫిన్‌లాండ్ అధ్యక్షుని అధికారిక జెండా మీద కూడా ఈ గుర్తు కనిపిస్తుంది. కానీ, ఈ చిహ్నాన్ని ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్‌కి పరిచితం చేసింది స్వీడన్‌కి చెందిన ఎరిక్ వాన్ రోసెన్ అనే వ్యక్తి. ఆయన స్వస్తికని అదృష్టానికి సంకేతంగా వాడేవారు. ఆయన 1918 లో ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ కి విమానాన్ని బహుకరించినప్పుడు దాని మీద నీలం రంగులో ఉన్న స్వస్తిక చిహ్నం ఉండేది. ఫిన్నిష్ ఎయిర్ ఫోర్స్ కి అదే తొలి విమానం. దీని పేరు తులిన్ టిప్ డి . ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ తమ విమానాలన్నిటి మీద 1945 వరకు ఇదే చిహ్నాన్ని వాడటం మొదలు పెట్టింది. 1918లో నాజీ వాదం లేకపోవడం వలన, ఈ చిహ్నానికి నాజీ వాదానికి ఎటువంటి సంబంధం లేదని ఎయిర్ ఫోర్స్ భావించింది. ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ శత వార్షికోత్సవం సందర్భంగా 2018లో ప్రదర్శించిన పాతకాలపు ఈ పాతకాలపు యుద్ధవిమానం మీద స్వస్తిక చిహ్నం ఈ విమానాన్ని బహుకరించే సమయానికి రోసెన్‌కి నాజీయులతో ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ , ఆయన 1930 నాటికి స్వీడన్ సోషలిస్ట్ ఉద్యమంలో ముఖ్య వ్యక్తిగా మారారు. ఆయన జర్మనీ లో ఒక నాజీ అధికారి హర్మన్ గోరింగ్ కి బావగారు కూడా. అతను హిట్లర్ కి స్నేహితుడు కూడానని ప్రొఫెసర్ టీవైనెన్ చెప్పారు. వాన్ రోసెన్ గుర్తుగా కొన్ని ఎయిర్ ఫోర్స్ పతాకాలు, అలంకారాల మీద ఈ చిహ్నం ఉన్నప్పటికీ , ఎయిర్ ఫోర్స్ ప్రధాన దళం మీద ఈ చిహ్నం లేదని ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి చెప్పారు. స్వస్తికని నిషేధించాలని ఆయన ఎప్పుడూ డిమాండ్ చేయలేదని ప్రొఫెసర్ టీవైనెన్ బీబీసీ కి చెప్పారు. “సైన్యం బాధ్యత దేశాన్ని రక్షించడం కానీ, స్వీడన్ కి చెందిన వ్యక్తి ఇచ్చిన చిహ్నాన్ని కాపాడటం కాదని” అన్నారు. ఇలాంటి చిహ్నాలు ఉండటం వలన ఫిన్‌లాండ్ యువత సైన్యాన్ని చూసే దృక్పధాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. ఫిన్‌లాండ్ పొరుగు దేశమైన రష్యా ఈ చిహ్నం వలన ఫిన్‌లాండ్ ని శత్రువుగా చూసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ దేశానికి ఎప్పుడైనా ఏదైనా ముప్పు సంభవిస్తే పశ్చిమ దేశాలు ఫిన్‌లాండ్ కి మద్దతు తెలిపే విషయం పై కూడా ప్రభావం పడవచ్చని అన్నారు. ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఇంకా స్వస్తిక చిహ్నం ఉన్నప్పటికీ, ఎయిర్ ఫోర్స్ కేంద్ర దళంలో ఈ చిహ్నాన్ని తొలగించడం నెమ్మదిగా వాన్ రోసెన్ చిహ్నం నుంచి నెమ్మదిగా బయట పడే సంకేతాలు మాత్రం ఇస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొన్ని సంవత్సరాలుగా ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ చిహ్నంగా ఉన్న రెండు పక్షి రెక్కల మధ్య స్వస్తిక్ చిహ్నాన్ని నిశబ్దంగా తొలగించేశారు. text: సీఏఏ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లోని ముస్లిమేతర మైనారిటీ సమాజాల వారికి పౌరసత్వం అందించడానికే అని, దానివల్ల భారత్‌లోని మైనారిటీలపై ఎలాంటి ప్రభావం పడదని మోదీ ప్రభుత్వం చెబుతోంది. ఎన్ఆర్సీ గురించి క్యాబినెట్‌లో ఇంకా ఎలాంటి చర్చా జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా అన్నారు. పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, చర్చల మధ్య బీజేపీ, దాని మిత్రదళాల కూటమి ఎన్డీయేలో కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్డీయేలో రెండో అతిపెద్ద మిత్రపక్షమైన జేడీయూ, తాము ఎన్ఆర్సీకి అనుకూలంగా లేమని చెప్పింది. అటు ఎన్డీయేలో ఉన్న ఎల్జేపీ కూడా ఎన్ఆర్సీ డ్రాఫ్ట్ పూర్తిగా చదివేవరకూ మేం దానికి మద్దతు ఇవ్వమని చెప్పింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తమ రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేయనివ్వం అని స్పష్టం చేశారని ఆ పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి బీబీసీకి చెప్పారు. "సుప్రీంకోర్టు నిర్దేశాల ప్రకారం ఎన్ఆర్సీని కేవలం అస్సాం కోసమే రూపొందించారు. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ, ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ దీన్ని అమలు చేయడం తమవల్ల కాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్ఆర్సీని అస్సాంలోనే అమలు చేయలేనప్పుడు, దానిని బిహార్ లేదా దేశంలో ఎలా అమలుచేస్తాం?" అని త్యాగి ప్రశ్నించారు. ఇప్పుడు వ్యతిరేకత ఎందుకొస్తోంది? పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు ఎన్డీయే పక్షాలన్నీ అది పాస్ అయ్యేలా చేసి, దానికి ఒక చట్టరూపాన్ని ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఈ ప్రశ్నకు కేసీ త్యాగి సమాధానమిచ్చారు. "సీఏఏను ఎన్ఆర్సీతో జోడిస్తే, అది ప్రమాదకరం. మా పార్టీ అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులు ఎదుర్కొన్న ఐదు సమాజాల ప్రజలతోపాటు ముస్లిం సమాజాన్ని కూడా అందులో చేర్చాలి" అని అన్నారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం గురించి ఎన్డీయేలో ఏదైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నిస్తే... దీనిపై "అలా చెప్పడానికి ఎన్డీయేకు ఎలాంటి నిర్మాణం లేదు. కానీ నితీశ్ కుమార్.. తమ పార్టీ దానికి అనుకూలంగా లేదని పట్నాలో చెప్పారు" అని త్యాగి చెప్పారు. ఎన్డీయేలో చీలికలు వస్తున్నాయా? జేడీయూ-ఎల్జేపీ కాకుండా బీజేపీ పాత మిత్రుల్లో ఒకరైన అకాలీదళ్ కూడా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తన గళం వినిపించింది. దేశంలోని ముస్లింలకు అభద్రతాభావం ఉండకూడదనే తాము దానిని వద్దని అనుకుంటున్నట్లు స్వయంగా మైనారిటీలకు (సిక్కులకు) ప్రాతినిధ్యం వహిస్తున్న అకాలీదళ్ నేత, రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ చెప్పారు. ఎన్డీయే లోపల అంత వ్యతిరేకతను చూస్తే ఆ కూటమిలో చీలికలు వచ్చాయనే భావించాలా? అని అడిగితే కేపీ త్యాగి, "ఎలాంటి చీలికలూ రాలేదు. కానీ భారత్‌లో ఎప్పటినుంచో ఉంటున్న వాళ్లను బయటకు పంపించడం తప్పు" అన్నారు. అటు, సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ మాత్రం ఎన్డీయేలో ఎలాంటి చీలికలు లేవు, ఇవన్నీ ఊహాగానాలని అన్నారు. "పార్లమెంటులో జేడీయూ, ఎల్జేపీ, అకాలీదళ్ సీఏఏకు మద్దతిచ్చాయి. ఈ పార్టీలకు సీఏఏ గురించి ఎలాంటి వ్యతిరేకత లేదు. వాళ్లు ఎన్ఆర్సీని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. దానిపై కూడా నితీశ్ కుమార్ నేరుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై ప్రశాంత్ కిశోర్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎన్ఆర్సీని ఎప్పుడు తీసుకొస్తోందో కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టంగా చెప్పలేదు" అని అన్నారు. బీజేపీ పరిస్థితి మెరుగుపడడం చూసి జేడీయూ కంగారు పడుతోందనే దృష్టితో చూస్తున్నారు అని ప్రదీప్ సింగ్ అన్నారు. "బీజేపీ ఇప్పుడు అతిపెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఒక పెద్ద పార్టీ ముందు ప్రాంతీయ పార్టీల స్పేస్ అంతమైపోయే సమస్య ఉంటుంది. మనం మహారాష్ట్రలో శివసేనకు అలా జరగడం చూశాం. మహారాష్ట్రలో ఒకప్పుడు బీజేపీ నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడు అది అక్కడ అతిపెద్ద పార్టీ" అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల వల్ల ఒత్తిడి తీసుకొస్తున్నారా? "బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ రెండూ సమాన స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ ఇప్పుడు లోక్‌సభ ఫార్ములా ప్రకారమే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని భావిస్తే, బిహార్‌లో ఆ రెండు పార్టీల మధ్య తేడాలు రావచ్చు" అని ప్రదీప్ సింగ్ అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌కు జేడీయూ, ఎల్జేపీకి ఎలాంటి సంబంధం లేదు కానీ, సీట్ల పంపకం కోసం ఇలాంటివి ఒత్తిడి తెచ్చే రాజకీయాలు అని చెప్పారు. "రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమి తర్వాత ఈ రెండు పార్టీలూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడం మనం చూశాం. అప్పుడు, అది ఈ సీట్ల పంపకం గురించే జరిగింది. కానీ, బీజేపీ మళ్లీ రెండింటినీ కూటమిలో కొనసాగేలా చేయగలిగింది. ఇప్పుడు వస్తున్న వ్యతిరేకత కూడా సీట్ల పంపకం గురించే" అన్నారు ప్రదీప్ సింగ్. ఆయనలాగే సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ సన్నిహితులుగా భావించే రాధికా రామశేషన్ కూడా జేడీయూ పరిస్థితులను చూసే వ్యతిరేకిస్తోంది అంటున్నారు. "జేడీయూకు 12-13 శాతం మైనారిటీ ఓట్లే లభించేవి. అది ఇప్పుడు పూర్తిగా చేజారిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. అలాంటప్పుడు వారు ఎక్కువ కాలం దీన్ని వ్యతిరేకిస్తారని నాకు అనిపించడం లేదు" అని ఆమె అన్నారు. అకాలీదళ్ ఎందుకు వ్యతిరేకిస్తోంది ఎన్డీయేలో ఎలాంటి చీలికలు లేవని రాధిక చెప్పారు. "ఎందుకంటే ఈ పార్టీలన్నీ పార్లమెంటులో సీఏఏకు మద్దతుగా ఓటు వేశాయి. దానివల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్లు, బిల్లును అక్కడే వ్యతిరేకించేవారు" అన్నారు. ఆమె బీజేపీ మిత్రపక్షాల వైఖరిని ఎన్నికలకు జోడించి కూడా చూస్తున్నారు. "ఈ వ్యతిరేకత తర్వాత, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు సగం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపిని ఒప్పించేలా చేయవచ్చు" అని ఆమె చెప్పారు. అటు, అకాలీదళ్‌ వ్యతిరేకతను పెద్ద విషయంగా రాధిక భావించడం లేదు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అకాలీదళ్ వ్యతిరేకతకు ఎలాంటి అర్థం లేదని అన్నారు. కానీ ప్రదీప్ సింగ్ మాత్రం దీనిని భిన్నంగా చూస్తున్నారు. అకాలీదళ్ విషయం పూర్తిగా వేరే అంటున్నారు. "పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను కూడా చేర్చాలని అకాలీదళ్ అంటుంటే... అది పెద్ద విషయం కాదు. కానీ, అదే అకాలీదళ్ నరేష్ గుజ్రాల్ మీద కోపంగా కూడా ఉంది. ఆయన తనను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా చేయాలని కోరుకుంటున్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ సజీవంగా ఉన్నంతవరకూ అకాలీదళ్-బీజేపీ కూటమి నడుస్తుంది. ఎందుకంటే అది భావోద్వేగ కూటమి. ఎన్ఆర్సీ వల్ల ఎన్డీయేలో ఎలాంటి చీలికలూ రావడం జరగదు" అంటారు ప్రదీప్ సింగ్. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ సిటిజన్స్ రిజిస్టర్ (ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపై తాము వెనకడుగు వేసేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. text: జేమ్స్ పీబుల్స్, డిడియర్ క్యులెజ్, మిచెల్ మేయర్ (ఎడమ నుంచి కుడికి) విశ్వం పరిణామక్రమంపై చేసిన పరిశోధనలకు, సుదూరంగా ఉన్న సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని కనిపెట్టినందుకు శాస్త్రవేత్తలు జేమ్స్ పీబుల్స్, మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ ముగ్గురికీ కలిపి 90 లక్షల క్రోనార్లు (దాదాపు 6.48 కోట్ల రూపాయలు) నగదు బహుమానం లభిస్తుంది. మంగళవారం స్వీడన్ రాజధానిలోని స్టాక్‌హోంలో జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కార విజేతలను ప్రకటించారు. విశ్వంలో మన స్థానం గురించి చాలా ముఖ్యమైన విషయాలను వీరి పరిశోధనలు తెలియజేస్తున్నాయని నోబెల్ కమిటీ సభ్యుడు ఉల్ఫ్ డేనియల్సన్ వ్యాఖ్యానించారు. వీరి పరిశోధనల్లో ఒకటి అంతుచిక్కని విశ్వం చరిత్రకు సంబంధించినదని, ఇదెంతో ఆసక్తికరమైనదని ఆయన చెప్పారు. గ్రహాన్ని కనుగొన్న పరిశోధన "ఈ విశ్వంలో మనం (భూమి) ఒంటరా? విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా" అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేసిందని ఆయన తెలిపారు. మహా విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) తర్వాత వెలువడిన ఉష్ణమే(ఆఫ్టర్‌గ్లో) 'సీఎంబీ రేడియేషన్' '51 పెగాసి బి' అనే ఈ గ్రహం మనకు 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహాన్ని మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌ 1995లో కనుగొన్నారు. కెనడాలో జన్మించిన జేమ్స్ పీబుల్స్ విశ్వం పరిణామక్రమం, విశ్వంలో భూమి స్థానం గురించి పరిశోధనలు చేశారు. పీబుల్స్ వయసు 84 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం అమెరికా న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో సేవలందిస్తున్నారు. విశ్వంలో 'కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్(సీఎంబీ)' రేడియేషన్ ఉనికి నిజమేనని ఇతర శాస్త్రవేత్తలతో కలిసి జేమ్స్ పీబుల్స్ అంచనా వేశారు. మహా విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) తర్వాత వెలువడిన ఉష్ణమే(ఆఫ్టర్‌గ్లో) 'సీఎంబీ రేడియేషన్'. సీఎంబీని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు విశ్వం వయసు, ఆకృతి, విశ్వంలోని వస్తువులను అంచనా వేయగలగుతున్నారు. "సీఎంబీ రేడియేషన్ను 1965లో కనుగొన్నారు. విశ్వం తన ప్రారంభ దశ నుంచి నేటి వరకు ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో అర్థం చేసుకొనేందుకు సీఎంబీ రేడియేషన్ ఎంతగానో దోహదం చేసింది" అని నోబెల్ భౌతికశాస్త్ర పురస్కార కమిటీ సారథి మాట్స్ లార్సన్ చెప్పారు. జేమ్స్ పీబుల్స్ సైద్ధాంతిక ఆవిష్కరణలే లేకపోతే దాదాపు గత 20 ఏళ్లలో సీఎంబీ రేడియేషన్‌ అంచనాలతో ఏమీ తెలిసేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీకాత్మక చిత్రం విశ్వంలో దాదాపు 95 శాతం ఉండే అంతుచిక్కని అంశాలైన డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ సిద్ధాంతానికి సంబంధించి కూడా జేమ్స్ పీబుల్స్ విశేషమైన పరిశోధనలు చేశారు. విశ్వంలో సాంద్రతలో మార్పుల నుంచి నక్షత్ర మండలాలు, ఇతర భారీ ఖగోళ నిర్మాణాలు ఎలా ఏర్పడ్డాయో వివరించే సిద్ధాంతం అభివృద్ధిలోనూ ఆయన పాత్ర ఉంది. మీ పరిశోధనల్లో అత్యంత ప్రధానమైనది ఏదని జేమ్స్ పీబుల్స్‌ను అడగ్గా- ఇది చెప్పడం కష్టమని ఆయన బదులిచ్చారు. తన పరిశోధనలు ఒకదానికొకటి ముడిపడినవని తెలిపారు. ఇవి జీవితకాలం సాగించిన పరిశోధనలని ఆయన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 'రేడియల్ వెలాసిటీ టెక్నిక్'తో మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్ నాడు 51 పెగాసి బి గ్రహాన్ని గుర్తించారు. తన చుట్టూ తిరుగుతున్న గ్రహపు గురుత్వాకర్షణ శక్తికి లోనైనప్పుడు మాతృ నక్షత్రం స్పందించే తీరు ఆధారంగా సుదూర లోకాల ఆచూకీని ఈ టెక్నిక్‌తో గుర్తిస్తారు. మిచెల్ మేయర్ వయసు 77 ఏళ్లు కాగా, డిడియర్ క్యులోజ్‌కు 53 సంవత్సరాలు. 51 పెగాసి బి గ్రహాన్ని కనుగొన్నప్పుడు వీరిద్దరూ స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. మిచెల్ మేయర్ ప్రస్తుతం అక్కడే ప్రొఫెసర్ ఎమిరిటస్‌గా ఉన్నారు. డిడియర్ క్యులోజ్ జెనీవా విశ్వవిద్యాలయంతోపాటు బ్రిటన్లోని యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. గురుత్వ తరంగాలపై కంప్యూటర్ సిమ్యులేషన్ గత ఏడేళ్లలో నోబెల్ పురస్కారాల విజేతలు: 2018: లేజర్ ఫిజిక్స్‌ రంగంలో ఆవిష్కరణలకు డోనా స్ట్రిక్‌ల్యాండ్, ఆర్థర్ అష్కిన్, గెరార్డ్ మౌరౌలకు. 2017: గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినందుకు రాయినర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్‌లకు. 2018 నోబెల్ విజేతల్లో ఒకరైన డోనా స్ట్రిక్‌ల్యాండ్ 2016: మ్యాటర్ అరుదైన దశలపై పరిశోధనలకు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డానే, మైకేల్ కోస్టర్‌లిట్జ్. 2015: సబ్‌-అటామిక్ పదార్థాలైన న్యూట్రినోలు రూపం మార్చుకుంటాయని గుర్తించినందుకు తకాకీ కజీత, ఆర్థర్ మెక్‌డొనాల్డ్‌లకు. 2014: నీలివర్ణపు కాంతిని వెదజల్లే డయోడ్ల(‌ఎల్‌ఈడీల)ను అభివృద్ధి చేసినందుకు ఇసాము అకసాకి, హిరోషి అమానో, షుజీ నకమూరలకు. 2014: నీలివర్ణ ఎల్‌ఈడీలను అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ 2013: హిగ్స్ బోసన్ సిద్ధాంతంపై జరిపిన పరిశోధనలకుగాను ఫ్రాంకోయిస్ ఇంగ్లర్ట్, పీటర్ హిట్స్‌లకు. 2012: కాంతి, మ్యాటర్‌లపై పరిశోధనలకు సెర్జ్ హరోచ్, డేవిడ్ జే.వైన్‌ల్యాండ్‌లకు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) విశ్వానికి సంబంధించి సరికొత్త అంశాలను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. text: 'బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్' సందర్భంగా 'రొమ్ము క్యాన్సర్' పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు నడుము పై భాగంలో ఎలాంటి ఆచ్చాదన లేకుండా రొమ్ముపై చేతులు పెట్టి పాట పాడారు. ఆస్ట్రేలియా రాక్ బ్యాండ్ సంస్థ డివైనల్ రూపొందించిన 'ఐ టచ్ మై సెల్ఫ్' పాటను సెరెనా విలియమ్స్ ఆలపించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ పాటకు సంబంధించిన పోస్ట్ కనిపించింది. ఈ పాటను 1990లో మొదటిసారి విడుదల చేశారు. మహిళల లైంగిక సంతృప్తి నేపథ్యంగా ఈ పాట వెలువడింది. అయితే, క్యాన్సర్‌ను సూచించే గడ్డలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు మహిళలు తమ రొమ్ములను పరీక్షించుకోవడం ఎంత ముఖ్యమో చెప్పేలా ఈ పాట నేపథ్యాన్ని మార్చి ఇప్పుడు వాడారు. పోస్ట్ of Instagram ముగిసింది, 1 ''ఐ టచ్ మై సెల్ఫ్ ప్రాజెక్ట్‌లో ఈ మ్యూజిక్ వీడియో భాగంగా ఉంది. రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయిన డివా, చిర్సీ, అంఫ్లెట్‌ల గౌరవార్థం దీన్ని రూపొందించారు. మహిళలకు ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం అని గుర్తు చేస్తూ వారు ప్రపంచానికి ఈ సూపర్ హిట్ పాటను అందించారు.'' అని ఈ టెన్నిస్ దిగ్గజం తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పాట రికార్డింగ్ తనను కంఫోర్ట్ జోన్ నుంచి బయట పడేసిందని విలియమ్స్ తెలిపారు. ఈ వీడియోను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. సెరెనా బాగా పాడారని చాలా మంది ప్రశంసించారు. ఇవికూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టెన్నిస్ రాకెట్‌తో మైదానంలో చెలరేగిపోయే సెరెనా విలియమ్స్ గొంతు సవరించారు. text: కోర్టు ఆవరణలో ఇంగ్లండ్‌లోని భారత హై కమిషన్ అధికారి ఎ.ఎస్.రాజన్‌ను బీబీసీ ప్రతినిధి గగ్గన్ సబర్వాల్ కలిశారు. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని సబర్వాల్ ఎ.ఎస్.రాజన్‌ను ప్రశ్నించగా.. ‘‘అది కోర్టు వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు జరిగిన విచారణ ఫలితాలతో మేం సంతృప్తిగా ఉన్నాం. వెయిట్ అండ్ సీ..’’ అని రాజన్ అన్నారు. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశాడాన్న విషయంలో తగిన ఆధారాలతో ఈడీ, సీబీఐ అధికారుల బృందం మార్చి 28న లండన్‌కు చేరుకుంది. ఆ ఆధారాలన్నిటినీ అక్కడి న్యాయస్థానం ముందుంచింది. నీరవ్ మోదీ అక్కడి ప్రత్యక్ష సాక్షిని భయపెట్టారని.. లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని భారత్‌ తరఫున వాదనలు వినిపించిన క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అతని బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో లండన్‌లో పోలీసులకు చిక్కిన నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ రెండు సార్లు తిరస్కరణకు గురయింది. దీంతో ఆయన మళ్లీ కస్టడీలోకి వెళ్లనున్నారు. నీరవ్ మోదీ ఎవరు? నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్‌ నుంచి లండన్‌ వెళ్లారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్‌ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇటీవల ది టెలిగ్రాఫ్ పత్రిక జర్నలిస్టులు లండన్ వీధుల్లో నీరవ్ మోదీని ఇంటర్వ్యూ చేశారు. లండన్‌లో సుమారు 73కోట్ల ఖరీదైన త్రీ బెడ్‌రూం అపార్టుమెంట్‌లో ఉంటున్నారని, మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారని ది టెలిగ్రాఫ్‌ కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నీరవ్ మోదీని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆయన్ను త్వరలోనే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఈడీ సమాచారం ఇచ్చినట్టు పీటీఐ సహా ప్రముఖ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆ తరువాత పరిణామాల్లో భాగంగా బుధవారం ఆయన్ను అరెస్టు చేసినట్టు బ్రిటన్ పోలీసులు వెల్లడించారు. అనంతరం నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది. మార్చి 29 వరకు పోలీసు కస్టడీకి తరలించారు. తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడతో కస్టడీ పొడిగించనున్నారు. పీఎన్‌బీ కుంభకోణం ఎలా జరిగింది? సీబీఐ చెబుతున్న వివరాల ప్రకారం.. నీరవ్ మోదీ ముంబయిలోని PNB బ్యాంకును సంప్రదించారు. ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం కావాలని అడిగారు. విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకు ఆయనకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ - LOU ఇచ్చింది. అంటే విదేశాల్లో ముడి వజ్రాలు సరఫరా చేసే వారికి డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు అంగీకరించింది. కానీ PNB అధికారులు నకిలీ LOUలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు అనుమానం రాలేదు. దాంతో నిధులు విడుదల చేశాయి. ఆ తర్వాత PNB అధికారులు ఇంటర్ బ్యాంకింగ్ మెసెజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. దీన్ని గుర్తించకుండా విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులు PNBకి రుణం ఇచ్చేశాయి. ఆ తర్వాత ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. దాంతో నీరవ్ మోదీ ముడి వజ్రాలు పొందారు. పాత రుణాలకు కూడా కొందరు PNB అధికారులు కొత్తగా LOUలు ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్న నీరవ్ మోదీ రుణాలు చెల్లించలేదు. కొత్తగా వచ్చిన అధికారులు భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కుంభకోణం 2011 నుంచి 2018 మధ్య కాలంలో జరిగింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను 13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 26 ఉంటుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనాలని కోర్టు ఆదేశించింది. text: హిందూ ఆధ్యాత్మిక సంస్థ 'స్వాధ్యాయ్ పరివార్' ఆధ్వర్యంలో ఈ చర్చిల్లో నారాయణ ఉపనిషత్తును పఠిస్తారు. ఈ ఉపనిషత్తు విశ్వ శాంతి సందేశాన్ని ఇస్తుంది. స్వాధ్యాయ్ పరివార్‌కు చెందిన ఆమోద్ దాతార్ బీబీసీతో మాట్లాడుతూ- పాండురంగశాస్త్రి అథవాలే ఆధ్వర్యంలో 1991లో ఈ కార్యక్రమం మొదలైందన్నారు. గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు బాధను కలిగించే సందర్భమని, ఈ సందర్భంలో నారాయణ ఉపనిషత్తు పఠనంతో వారికి తోడుగా ఉంటామని తెలిపారు. రెండు మతాల మధ్య అంతరాలను తొలగించుకొనేందుకు ప్రార్థనను ఒక మార్గంగా ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు. నారాయణ ఉపనిషత్తు ప్రపంచ శాంతిపై దృష్టి కేంద్రీకరిస్తుందని, చర్చిలో దీని పఠనానికి క్రైస్తవులు ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదని, వారు పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. నారాయణ ఉపనిషత్తులోని మొదటి మంత్రం గురించి ఆమోద్ దాతార్ వివరించారు. నారాయణుడు ప్రపంచానికి శాంతిని ప్రసాదించేవాడని, నారాయణుడు పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడని, నారాయణుడిని పూజించాలని ఇది చెబుతుందని ఆయన తెలిపారు. ఉపనిషత్తు సంస్కృతంలో ఉంది. క్రైస్తవ మతపెద్ద ఫ్రాన్సిస్ డీబ్రిటో బీబీసీతో మాట్లాడుతూ- చర్చిలో ఉపనిషత్తు పఠనాన్ని స్వాగతించారు. ''భారత్‌లో అనేక సంస్కృతులు, అనేక భాషలు, అనేక మతాలు ఉన్నాయి. పూజా విధానం, ప్రార్థన తీరు ఒక్కో మతం వారికి ఒక్కోలా ఉంటుంది. భిన్నత్వంలో ఇమిడి ఉన్న అందమే ఇది'' అని ఆయన వ్యాఖ్యానించారు. క్రైస్తవులు, హిందువుల మధ్య బంధం బలపడేందుకు చర్చిలో ఉపనిషత్తు పఠనం తోడ్పడుతుందని, అందుకే స్వాధ్యాయ్ పరివార్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తాము స్వాగతిస్తామని ఆయన వివరించారు. ''వారు గుడ్ ఫ్రైడే రోజు మా వద్దకు వస్తారు. దీపావళి రోజు మేం వాళ్ల వద్దకు వెళ్తాం'' అని తెలిపారు. ఆమోద్ దాతార్ మార్చి 30న గుడ్‌ఫ్రైడే సందర్భంగా మహారాష్ట్రలోని పలు చర్చిల్లో ఉపనిషత్తు పఠనం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా కజ్రత్‌లోని 'అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్'‌లో ప్రార్థనల తర్వాత చర్చి ఫాదర్ కాలిస్టస్ ఫెర్నాండెజ్ సమక్షంలో స్వాధ్యాయ్ పరివార్ ఆధ్వర్యంలో నారాయణ ఉపనిషత్తును పఠించారు. కార్యక్రమంపై ఫెర్నాండెజ్ స్పందిస్తూ- ''చర్చిలో 2010 నుంచి ఉపనిషత్తు పఠనం జరుగుతోంది. దీని పఠనానికి స్వాధ్యాయ్ పరివార్ సభ్యులను మేం హృదయపూర్వకంగా స్వాగతిస్తాం. ఇలాంటి కార్యక్రమాలకు క్రైస్తవులు ఎన్నడూ అభ్యంతరం చెప్పరు. భారత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేయడాన్ని మేం స్వాగతిస్తాం'' అన్నారు. నిరుడు 114 చర్చిల్లో ఉపనిషత్తు పఠనం తమ ఆధ్వర్యంలో 2016లో 98 చర్చిల్లో, 2017లో 114 చర్చిల్లో ఉపనిషత్తు పఠనం నిర్వహించినట్లు ఆమోద్ దాతార్ తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబయి, ఠాణే, పుణె, నాసిక్, ఔరంగాబాద్‌ జిల్లాల్లో, గుజరాత్‌లోని రాజ్‌కోట్, వదోదర జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్రలోని పలు చర్చిల్లో గుడ్ ఫ్రైడేకు ఎంతో ప్రత్యేకత ఉంది. గుడ్ ఫ్రైడే రోజు ముంబయి, మరికొన్ని ప్రాంతాల్లోని కొన్ని చర్చిల్లో క్రైస్తవ ప్రార్థనలతోపాటు హిందూ గ్రంథమైన నారాయణ ఉపనిషత్తు పఠనం జరుగుతుంది. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతోంది. text: అక్సాయి చీన్‌లో ఉన్న గల్వాన్ లోయ గురించి రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గల్వాన్ లోయ తీరంలో చైనా సైన్యం కొన్ని టెంట్స్ కనిపించాయి. ఆ తర్వాత భారత్ కూడా అక్కడ తన సైన్యం మోహరింపు పెంచింది. చైనా మాత్రం, గల్వాన్ లోయ దగ్గర భారత్ రక్షణ సంబంధిత అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తోంది. మేలో రెండు దేశాల సరిహద్దుల్లో వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. మే 9న నార్త్ సిక్కిం నాకూలా సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో లద్దాఖ్‌లో ఎల్ఏసీ దగ్గర చైనా ఆర్మీ హెలికాప్టర్లు కనిపించాయి. ఆ తర్వాత భారత వైమానికదళం కూడా సుఖోయ్ సహా మితా యుద్ధ విమానాలతో గస్తీ ప్రారంభించింది. సోమవారం వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా కూడా చైనా గురించి మాట్లాడారు. “అక్కడ కొన్ని అసాధారణ కార్యకలాపాలు కనిపించాయి. అలాంటి ఘటనలపై మేం నిశితంగా నిఘాపెడతాం. తగిన చర్యలు కూడా తీసుకుంటాం. అలాంటి వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి గత వారం మాట్లాడిన పదాతిదళం చీఫ్ జనరల్ ఎంఎం నరవణే “చైనాతో ఉన్న సరిహద్దుల్లో భారత దళాలు తమ ‘స్థానం’లో ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి” అని చెప్పారు. ఈ గొడవల్లో ఇరు దేశాల సైనికులూ దూకుడుగా ప్రవర్తించారు. అందుకే వారికి స్వల్ప గాయాలయ్యాయి అని కూడా ఆయన చెప్పారు. భారత్-చైనా ఉద్రిక్తత భారత్‌పై చైనా ఆరోపణ చైనా ఈ ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటోంది. చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం ప్రచురించిన ఒక కథనంలో గాల్వన్ నది (లోయ) ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణం భారత్ అని రాసింది. చైనా సైన్యం వివరాలుగా చెబుతూ ఆ పత్రిక “భారత్ ఈ ప్రాంతంలో రక్షణ సంబంధిత అక్రమ కట్టడాలు నిర్మిస్తోంది. అందు వల్ల చైనా అక్కడ సైన్యం మోహరింపు పెంచింది. ఈ ఉద్రిక్తతలను భారత్ మొదలుపెట్టింది. కానీ, అక్కడ 2017లో డోక్లాం లాంటి పరిస్థితులు ఏర్పడవు అని మాకు నమ్మకం ఉంది. భారత్ కోవిడ్-19 వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అది గాల్వన్ ఉద్రిక్తతలు సృష్టించింది” అని రాశారు. గ్లోబల్ టైమ్స్ గాల్వన్ లోయ చైనా ప్రాంతం అని కూడా రాసింది. భారత్ చేపట్టినవి సరిహద్దు అంశాల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల ఉల్లంఘనే అని పేర్కొంది. మే ప్రారంభం నుంచీ భారత్ గాల్వన్ లోయ దగ్గర సరిహద్దు దాటుతోందని, చైనా భూభాగంలోకి చొచ్చుకొస్తోందని చెప్పింది. గాల్వన్ లోయ ఎందుకు కీలకం వివాదిత గాల్వన్ లోయ ప్రాంతం అక్సాయి చీన్‌లో ఉంది. ఈ లోయ లద్దాఖ్, అక్సాయి చీన్ మధ్య భారత-చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంది. ఇక్కడ వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అక్సాయి చీన్‌ను భారత్ నుంచి వేరు చేస్తుంది. అక్సాయి చీన్‌ మాదని భారత్, చైనా రెండూ వాదిస్తున్నాయి. చైనా దక్షిణ షింజియాంగ్, భారత్ లద్దాఖ్‌లో ఈ లోయ వ్యాపించి ఉంది. “ఈ ప్రాంతం భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఎందుకంటే ఇది పాకిస్తాన్, చైనా షింజియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో కలిసి ఉంది. 1962 యుద్ధం జరిగినప్పుడు గాల్వన్ నది దగ్గర ఈ ప్రాంతం యుద్ధానికి ప్రధాన కేంద్రంగా మారింది” అని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, అంతర్జాతీయ అంశాల నిపుణుడు ఎస్డీ ముని అన్నారు. భారత్-చైనా ఉద్రిక్తత కరోనా సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత ఒకవైపు ప్రపంచం కరోనావైరస్‌తో పోరాడుతోంది. భారత్‌లో కూడా ఈ కేసులు 3 లక్షలు దాటాయి. చైనాపై యూరప్, అమెరికా మాటిమాటికీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో రెండు దేశాల మధ్య కొత్త వివాదం తలెత్తడానికి కారణమేంటి? “ప్రస్తుత సమయంలో భారత్ తమవిగా భావిస్తున్న ప్రాంతాలపై తమ వాదనను బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. కానీ అవి వివాదాస్పద ప్రాంతాలు” అని ఎస్డీ ముని చెప్పారు. ఇది 1958 నుంచే మొదలైంది. అప్పుడు అక్సాయి చీన్‌లో చైనా రోడ్డు నిర్మిస్తోంది. అది కరాకోరమ్ రోడ్డతో కలుస్తుంది. పాకిస్తాన్ వైపు కూడా వెళ్తుంది. ఆ రోడ్డు నిర్మిస్తున్నప్పడు భారత్ దానిని పట్టించుకోలేదు. కానీ రోడ్డు వేశాక అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటినుంచి అక్సాయి చీన్‌ను చైనా స్వాధీనం చేసుకుందని భారత్ చెబుతోంది” అని ఆయన చెప్పారు. “కానీ, భారత్ దీనిపై అప్పుడు ఎలాంటి సైనిక చర్యకూ దిగలేదు. ఇప్పుడు భారత్ తన వాదన వినిపించాలి కాబట్టి చర్యలు చేపడుతోంది. పీఓకే, గిల్గిత్-బాల్టిస్తాన్ గురించి భారత్ తన వాదనను ఎలా బలోపేతం చేసుకుందో, అలాగే చేస్తోంది. అదే సమయంలో అక్సాయి చీన్‌లో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కానీ, ఇప్పుడు చైనాకు దానివల్ల ఇబ్బందిగా ఉంది” అన్నారు. గాల్వన్ లోయలో భారత్ నిర్మాణాలు అక్రమం అని చైనా అంటోంది. ఎందుకంటే ఎల్ఏసీని అంగీకరిస్తామని, అక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టమని భారత్-చైనా మధ్య ఒక ఒప్పందం జరిగింది. కానీ, చైనా అక్కడ ముందు నుంచీ అవసరమైన సైనిక నిర్మాణాలు పూర్తి చేసింది. ఇప్పుడు ప్రస్తుత స్థితిని కొనసాగించాలని మాట్లాడుతోంది. తన స్థితిని బలోపేతం చేసుకోడానికి, ఇప్పుడు భారత్ కూడా అక్కడ వ్యూహాత్మక నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటోంది. మారుతున్న భారత్ వ్యూహం పీఓకే నుంచి భారత్ తన వ్యూహాన్ని అక్సాయి చీన్‌ వైపు మార్చడానికి కారణం ఏంటి. భారత్ అభద్రతగా భావిస్తోందా, లేదా దూకుడుగా మారిందా? దీనిపై ఎస్డీ ముని “భారత్ దూకుడుగా మారలేదు. కచ్చితంగా వ్వయహరిస్తోంది. ఏ ప్రాంతాలను అది తమ హక్కుగా చెబుతూవచ్చిందో, ఇప్పుడు వాటిపై తమ హక్కు చూపించుకోవడం కూడా మొదలైంది” అన్నారు. “1962తో పోలిస్తే ఇప్పటి భారత్ చాలా బలంగా ఉంది. ఆర్థికంగా కూడా పుంజుకుంది. అంతే కాదు, చైనా ఎలా ఆవిర్భవిస్తోందో చూస్తుంటే, దాన్నుంచి మనకు ప్రమాదం కూడా పెరుగుతోంది. పాకిస్తాన్‌తో కూడా భారత్‌కు సంబంధాలు దారుణంగా ఉన్నాయి. దాంతో ప్రమాదం మరింత పెరుగుతోంది. అలాంటప్పుడు తమ సరిహద్దులను రక్షించుకోవాలని భారత ప్రభుత్వానికి అనిపిస్తోంది. అక్సాయి చీన్‌లో భారత సైన్యం నిర్మాణాలు చేపడితే, అక్కడ నుంచి చైనా సైన్యం కార్యకలాపాలపై నిఘా పెట్టచ్చు” అంటారు ఎస్డీ ముని. అటు గ్లోబల్ టైమ్స్ ఒక రీసెర్చ్ గురించి చెబుతూ గ్వాలన్ లోయలో డోక్లామ్ లాంటి స్థితి లేదని చెప్పింది. అక్సాయి చీన్‌లో చైనా సైన్యం బలంగా ఉందని, ఉద్రిక్తతలు పెరిగితే భారత సైన్యం దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాసింది. దీనికి సంబంధించి మాట్లాడిన నిపుణులు “చైనా పరిస్థితి అక్కడ బలంగా ఉంటే, దానివల్ల భారత్‌కు నష్టం కలగచ్చు. కానీ, కరోనావైరస్ వల్ల చైనా ఇప్పుడు దౌత్యపరంగా బలహీనం అయ్యింది. యూరోపియన్ యూనియన్, అమెరికా దానిపై బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నాయి. భారత్ ఇప్పటివరకూ చైనాను ప్రత్యక్షంగా ఏదీ అనలేదు. అందుకే చైనా భారత్‌తో సమతుల విధానాన్ని ఆశిస్తోంది. ఈ విషయంలో భారత్ చైనాతో సంప్రదింపులు జరిపే స్థితిలో ఉంది. దేశాలపై ఒత్తిడి పెరుగుతుందా? కరోనా కాలంలో రెండు దేశాల సరిహద్దుల దగ్గర ఏర్పడిన ఈ ఉద్రిక్తతల వల్ల వాటిపై మరింత ఒత్తిడి పెరుగుతుందా? ఎస్డీ ముని మాత్రం “కరోనావైరస్‌తో పోరాటం ఒకవైపు, దేశ రక్షణ మరోవైపు. చైనా కూడా దక్షిణ చైనా సముద్రంలో సైనిక నిర్మాణాలను విస్తృతం చేసింది. ప్రపంచమంతా కరోనావైరస్ నియంత్రణలో బిజీగా ఉంది, కానీ సైన్యం కరోనావైరస్‌తో పోరాడ్డం లేదు. సైన్యం తమపని తాము చేస్తుంది. ఇవి కరోనాకు ముందు నుంచీ వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సమస్యలుగా ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. అందుకే చైనా వాదన సరైనది కాదు” అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో గత కొన్ని వారాల నుంచీ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) దగ్గర రెండు దేశాలు తమ సైన్యం మోహరింపు పెంచుతున్నాయి. text: ప్రతీకాత్మక చిత్రం ప్రసూతి ఆస్పత్రి కావడంతో, నిత్యం వందల మంది వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. నగరంలో ఉన్న 5 ప్రసూతి ఆస్పత్రుల్లో పేట్లబురుజు చాలా ముఖ్యమైనది. ఇక్కడ రోజుకి సుమారు 70 ప్రసవాలు జరుగుతుంటాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు ఆరు లక్షల కాన్పులు అవుతుంటాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఆస్పత్రిలోని ఎంత మంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనేదానిపై అధికారులు, సూపరింటెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ మే చివరి వారంలో ఒక గర్భిణికి సి-సెక్షన్ చేసే క్రమంలో ఆమె నుంచి ఆస్పత్రిలో వారికి వైరస్ వ్యాపించిందని డాక్టర్లు చెబుతున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రికి సిబ్బందికి చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని కూడా తెలిపారు. ఐసీయూ వార్డు (ఫైల్ ఫొటో) మాపై ఒత్తిడి పెరుగుతోంది: జూడాలు పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలోనే కాదు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. "ఇంతకు ముందు కంటే ఎక్కువ సమయం డ్యూటీ చేయాల్సి వస్తోంది. మాకే కాదు, మా కుటుంబ సభ్యులకు కూడా వైరస్ ప్రమాదం ఉంది. ఇళ్ళకి వెళ్లాలంటే భయం వేస్తోంది. వెళ్ళినా ఒకే గదికే పరిమతం అవుతున్నాము” అని ఒక జూనియర్ డాక్టర్ చెప్పారు. ఆస్పత్రిలోని కొంత మంది వైద్య సిబ్బందికి కరోనా సోకటంతో, మిగతావారిపై బాధ్యత పెరిగిందని జూనియర్ వైద్యులు చెబుతున్నారు. కొన్నిరోజుల్లో పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "మా పై గత మూడు నెలలుగా పని ఒత్తిడి పెరిగింది, మాలో కొంత మందికి కొరోనా సోకడం, ఇలా ఎన్నో ఒత్తిళ్లలో పరీక్షలు సరిగా రాయలేమేమో అనిపిస్తోంది. ఒక వేళ సరిగా రాయలేక పోతే, మా భవిష్యత్తు మరింత దారుణంగా మారుతుంది. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాము" అని మరో జూనియర్ డాక్టర్ బాధపడ్డారు. ఒక వైపు పెరుగుతున్న ఒత్తిడి, మరో వైపు ఆస్పత్రులలో సిబ్బంది అంతంత మాత్రంగానే ఉండడంతో, ఆ ప్రభావం ఆరోగ్య సేవలపై పడింది. ఉదాహరణకు ప్రసూతి ఆస్పత్రులలో పేట్లబురుజు, అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి అత్యంత ముఖ్యమైనవి. వీటితో పాటు, గాంధీలో కూడా గర్భిణులు పరీక్షలు చేయించుకుంటారు. కానీ, ఇప్పుడు దానిని కరోనా రోగుల కోసమే కేటాయించటంతో గర్భిణుల కేసులను అఫ్జల్‌గంజ్ ఆస్పత్రిలో ప్రత్యేక బ్లాక్‌కు తరలించారు. దీంతో వైద్య సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. 50 శాతం సిబ్బందితో సేవలు గాంధీ ఆస్పత్రిలో 12 మంది డాక్టర్లు, ఆరుగురు వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. "గాంధీలో సుమారు 1100 మంది డాక్టర్లు, 550 మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. కరోనా వ్యాపించిన కొత్తల్లో మూడో వంతు సిబ్బందితోనే వైద్య సేవలు అందించాం.. కానీ కేసులు పెరుగుతుండడంతో ఇప్పుడు 50 శాతం సిబ్బందితో పని చేస్తున్నాము. ఈ సిబ్బంది మూడు షిఫ్టులలో పని చేస్తారు. వారం తర్వాత వారు క్వారంటైన్‌లో ఉంటారు. అప్పుడు మరో 50 శాతం సిబ్బంది డ్యూటీలోకి వస్తారు” అని ఆయన కోర్టుకు వివరించారు. మిగతా ఆస్పత్రుల్లో కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నామని ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొంత మందికి కరోనా సోకటం వల్ల, ఎదురవుతున్న సిబ్బంది కొరతను భర్తీ చేసేంమదుకు జిల్లాల నుంచి పిలిపించిన డాక్టర్లను తాత్కాలికంగా నియమిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 54 ప్రభుత్వ ఆస్పత్రులను ప్రత్యేకంగా కరోనా చికిత్స కోసమే కేటాయించామని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిలో ఎక్కువమంది కరోనాకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. text: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విభజన కారణంగా రాజధానిని, ఆదాయాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం అందడం లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో ఆరోపించారు. ప్రధాన రంగాలకు బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్2018: తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారు? బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే! బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే 12 రాష్ట్రాలు బడ్జెట్లు ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల బడ్జెట్లను పరిశీలిద్దాం. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పశ్చిమ్‌బంగ, జమ్ముకశ్మీర్, గుజరాత్‌లు ప్రధాన రంగాల్లో దేనికెంత కేటాయించాయో చూద్దాం. 1) బిహార్: 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ: ఫిబ్రవరి 27 * జీఎస్‌డీపీ అంచనా: రూ.5,15,634 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 11 శాతం ఎక్కువ. * వ్యయం అంచనా: రూ.1,76,990 కోట్లు * రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,60,735 కోట్లు దేనికెంత.. కేంద్ర బడ్జెట్: ‘ఓట్ల కోసం కలల వల’ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 16న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది 2) ఉత్తరప్రదేశ్ బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 16, 2018 * జీఎస్‌డీపీ అంచనా: రూ.14,88,934 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 8 శాతం ఎక్కువ. * వ్యయం అంచనా: రూ.4,28,385 కోట్లు * రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.3,53,784 కోట్లు దేనికెంత.. గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఏమిచ్చింది? ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ 3) ఛత్తీస్‌గఢ్ బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 10, 2018 * జీఎస్‌డీపీ అంచనా: రూ.3,25,644 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే11.7 శాతం ఎక్కువ. * వ్యయం అంచనా: రూ.83,179 కోట్లు * రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.73,782 కోట్లు దేనికెంత.. 'రక్షణ బడ్జెట్‌లో రెండు శాతం శానిటరీ ప్యాడ్లకు ఖర్చు పెట్టాలి' కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 4) కేరళ బడ్జెట్ బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 2, 2018 * జీఎస్‌డీపీ అంచనా: రూ.7,72,894 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే12.6 శాతం ఎక్కువ. * వ్యయం అంచనా: రూ.1,27,093 కోట్లు * రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,03,136 కోట్లు దేనికెంత.. బీజేపీ ఫేస్‌బుక్ పేజీలో ఏపీ నెటిజన్ల నిరసనలు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 5) పశ్చిమబెంగాల్ బడ్జెట్ బడ్జెట్ తేదీ: జనవరి 31, 2018 * జీఎస్‌డీపీ అంచనా: రూ.10,48,678 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 15 శాతం ఎక్కువ. * వ్యయం అంచనా: రూ.1,95,829 కోట్లు * రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,48,834 కోట్లు ప్రత్యేకత: రెవెన్యూ లోటు అస్సలు లేదు. ద్రవ్యలోటు మాత్రం రూ.23,805 కోట్లు ఉంది. దేనికెంత.. కేంద్ర బడ్జెట్లో మీ జేబుకు చిల్లు వేసే అంశాలు.. ఊరట కలిగించేవి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ 6) గుజరాత్ బడ్జెట్ బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 20, 2018 * జీఎస్‌డీపీ అంచనా: రూ.14,96,013 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 13.3 శాతం ఎక్కువ. * వ్యయం అంచనా: రూ.1,81,945 కోట్లు * రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,40,927 కోట్లు దేనికెంత.. మొట్టమొదటి కేంద్ర బడ్జెట్: 'ఆకలి తీర్చుకునేందుకు విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేం' జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ 7) జమ్ముకశ్మీర్ బడ్జెట్ బడ్జెట్ తేదీ: జనవరి 11, 2018 * జీఎస్‌డీపీ అంచనా: రూ.1,16,637 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 6.9 శాతం ఎక్కువ. * వ్యయం అంచనా: రూ.80,313 కోట్లు * రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.71,180 కోట్లు ప్రత్యేకం: జమ్ముకశ్మీర్‌లోని అన్ని కార్మిక చట్టాలు అమలు చేస్తూ వ్యవసాయ, గృహ కార్మికుల మినహా అన్ని రంగాల కార్మికుల కోసం 'ఉమ్మడి ఉద్యోగ స్మృతి' రూపొందిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దేనికెంత.. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1,91,063.61 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయంగా రూ.1,50,270 కోట్లుగా పేర్కొన్నారు. text: రియాజ్ కాకుండా మరణించిన ఆ మరో మిలిటెంట్ ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు. అవంతీపుర స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసులు కలిసి రియాజ్‌ను పోరా గ్రామంలో ముట్టడించాయి. ఇక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారని, మూడు ఆపరేషన్లు కొనసాగుతున్నాయని సమాచారం ఉంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో ఇటీవల జరిగిన రెండు మిలిటెంట్ దాడుల్లో ఓ కల్నల్, ఓ మేజర్ సహా ఎనిమిది మంది భద్రతదళాల సిబ్బంది మరణించిన నేపథ్యంలో తాజా ఘటన జరిగింది. రియాజ్ నైకూ వయసు 40 ఏళ్లు. స్థానిక హిజ్బుల్ ముజాహిదీన్‌లో ఇప్పటివరకూ ప్రాణాలతో మిగిలిన నాయకుడు రియాజ్ మాత్రమే. 2016లో బుర్హన్ వానీ భద్రతదళాల కాల్పుల్లో హతమైన తర్వాత హిజ్బుల్ బాధ్యతలు రియాజ్ చేతుల్లోకి వెళ్లాయి. రియాజ్‌ను పట్టించినవారికి రూ.12 లక్షల నజరానా ఇస్తామని ఇదివరకు పోలీసులు ప్రకటించారు. హిజ్బుల్‌ను మళ్లీ సంఘటితం చేస్తున్నారని, భద్రతాదళాలపై దాడులకు పాల్పడుతున్నారని రియాజ్‌పై పోలీసులు అరోపణలు చేస్తున్నారు. కశ్మీర్‌లో ఈ ఏడాది మార్చి తర్వాత మిలిటెంట్ దాడుల గణనీయంగా పెరిగాయి. చలి ఎక్కువగా ఉన్న సమయంలో మిలిటెంట్లపై ఆపరేషన్లు నిలిచిపోయాయని పోలీసు వర్గాలు చెప్పాయి. బుర్హన్ వానీ ‘‘జనవరి నుంచి ఇప్పటివరకు 76 మంది మిలిటెంట్లు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. కానీ, 20 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సీనియర్ అధికారులు కూడా వారిలో ఉన్నారు’’ అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు చెప్పారు. పోలీసు వర్గాలు చెబుతున్నదాని ప్రకారం రంజాన్ మాసం తొలి పది రోజుల్లో 14 మంది మిలిటెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఎనిమిది మంది జవాన్లు, ఓ దివ్యాంగ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో లాక్‌డౌన్ మొదలైన తర్వాత నియంత్రణ రేఖ వద్ద భారత్, పాకిస్థాన్ సైన్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు కశ్మీర్‌లో మిలిటెంట్లకు వ్యతిరేకంగా కార్యకలాపాలను కూడా భారత సైన్యం పెంచింది. ఈ ఏడాది మరణించిన 76 మంది మిలిటెంట్లలో 34 మంది లాక్‌డౌన్ సమయంలోనే చనిపోయినట్లు సమాచారం. ఇక మిలిటెంట్లు హతమైనప్పుడు స్థానికుల నుంచి వస్తున్న నిరసనలకు అడ్డుకట్టే వేసేందుకు భద్రతాదళాలు కొత్త విధానాన్ని పాటించాలని నిర్ణయానికి వచ్చాయి. కొత్త విధానం ప్రకారం ఇక చనిపోయిన మిలిటెంట్ల గుర్తింపు వివరాలను బయటకు వెల్లడించరు. వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించరు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కశ్మీర్‌లో భద్రతాదళాలు, హిజ్బుల్ మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ టాప్ మిలిటెంట్ రియాజ్ నైకూ, ఆయన సహచరుడు హతమయ్యారు. text: అందులో భాగంగా ఏజ‌న్సీలోని మారుమూల గ్రామాల‌తో పాటు స‌ముద్రంలో ఉన్న ద్వీప గ్రామాల్లోనూ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ స‌ముద్ర తీరానికి సుమారు 7 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్‌లో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దాంతో స‌ముద్రం మ‌ధ్య‌లో ఉన్న ఆ గ్రామంలో పోలింగ్ కోసం సిబ్బంది స‌ముద్ర జ‌లాల‌పై ప‌య‌న‌మ‌య్యారు. తాళ్ల‌రేవు మండ‌లం కోరింగ పంచాయితీ ప‌రిధిలోని హోప్ ఐలాండ్ ప‌రిధిలో సుమారు 110 కుటుంబాలు నివ‌సిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది వ‌ల‌స జీవులు. పూర్తిగా మ‌త్స్య‌కారులు నివ‌సించే ఈ గ్రామం వారికి సముద్రంలో వేట ప్ర‌ధాన ఆధారం. ఇటీవ‌ల స‌ముద్ర సంప‌ద త‌క్కువ‌గా ల‌భ్యం అవుతుండ‌డంతో యానాం, కాకినాడ వంటి ప్రాంతాల్లో ప‌నుల కోసం ప‌లువురు వ‌ల‌స‌ వెళ్లిపోయారు. ఈ గ్రామంలో ఇంతవరకు పోలింగ్ కేంద్రం లేదు. ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఓటు వేయ‌డానికి వారు ప‌డ‌వ‌ల‌పై స‌ముద్రం దాటి తీర ప్రాంతానికి వచ్చేవారు. అవి సాధార‌ణ ఎన్నిక‌ల‌యినా, లేక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ైనా వారికి ఈ స‌మ‌స్య త‌ప్పేది కాదు. వీడియో: సముద్రం మధ్యలో పోలింగ్ ఈసారి ప్ర‌భుత్వ యంత్రాంగం హోప్ ఐలాండ్ లోనే పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు స‌న్నాహాలు చేసింది. ముమ్మిడివ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పోలింగ్ నెంబ‌ర్ 218 స్టేష‌న్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఓట‌ర్లు 288 మంది ఉన్న‌ట్టు రికార్డులు చెబుతున్నాయి. అందులో మ‌హిళ‌లు 134 మంది. గ్రామం నుంచి ప‌నుల కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన వారు కూడా ఓటింగ్ కోసం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని 90శాతం పైగా పోలింగ్ న‌మోద‌వుతుంద‌నే అంచ‌నాలో ఉన్న‌ట్టు ప్రొసీడింగ్ అధికారి క‌ల్యాణ్ మ‌నోహ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. తొలిసారిగా పోలింగ్ నిర్వ‌హిస్తుండ‌డంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన‌ట్టు బీబీసీతో చెప్పారు. ‘‘మొత్తం 12 మంది సిబ్బంది ఈసారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం హోప్ ఐలాండ్ చేరుకున్నాం. ముమ్మిడివ‌రం నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో కాకినాడ వ‌చ్చి అక్క‌డి నుంచి బోటులో రెండు గంట‌ల స‌ముద్ర ప్ర‌యాణంలో హోప్ ఐల్యాండ్ చేరుకున్నాం. న‌లుగురు మ‌హిళా సిబ్బంది స‌హా పోలీసులూ ఉన్నారు. రాత్రికి ఐల్యాండ్ లో బ‌స చేసి ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉద‌యం 6 గంటల‌కు మాక్ లైవ్, ఆత‌ర్వాత పోలింగ్ ప్రారంభిస్తాం. సాయంత్రం 5గంటల వ‌ర‌కూ పోలింగ్ జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత ఈవీఎంలు తీసుకుని మ‌ళ్లీ స‌ముద్రం నుంచి వెన‌క్కి వ‌స్తాం’’ అంటూ ఆయ‌న వివ‌రించారు. స‌ముద్రం మ‌ధ్యలోని లంకలో ఓటు హక్కు వినియోగించుకునే అవ‌కాశం రావడంపై హోప్ ఐలాండ్ వాసులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన వెంక‌ట ర‌మ‌ణ బీబీసీతో మాట్లాడుతూ త‌న ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘మా తాత‌లు తండ్రులు ఓటు వేయాలంటే బోటులో వెళ్లాల్సి వ‌చ్చేది. ప్రతిసారీ ఇదే ప‌రిస్థితి. ఈసారి మాకు ఇక్క‌డే ఓటు హ‌క్కు క‌ల్పించ‌డం సంతోషంగా ఉంది. గ్రామంలో సౌక‌ర్యాలు స‌రిగా లేవు. ఉపాధి క‌ల్పించి మ‌మ్మ‌ల్ని ఆదుకుంటే మంచిది’’ అని ర‌మ‌ణ తెలిపారు. గ్రామంలో సెల్ ఫోన్ క‌వ‌రేజ్ కూడా ఉండ‌క‌పోవ‌డంతో ఇక్క‌డి పోలింగ్ ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించేందుకు అధికారులు ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు. ఐల్యాండ్ లో పోలింగ్ సిబ్బందికి ప్ర‌త్యేక వ‌స‌తులు కూడా క‌ల్పించేందుకు బోటు కూడా ఏర్పాటు చేశారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో తొలిద‌శ పోలింగ్‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు అధికారులు స‌న్నాహాలు చేశారు. text: ఈ ఘటనలో నిందితుడు అదే హాస్టల్‌లో ఉండే పదో తరగతి విద్యార్థి. పెన్సిల్ చెక్కుకోవ‌డానికి ఉప‌యోగించే చిన్న చాకుతో గొంతు కోసి హత్య చేయడం అందరినీ కలవరపరుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా చ‌ల్ల‌ప‌ల్లి బీసీ సంక్షేమ వ‌స‌తిగృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన బాలుడి ఇల్లు హాస్టల్‌కు సమీపంలోనే ఉంటుంది. మృతుడికి ఓ అన్నయ్య, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. నలుగురు సంతానం కావడంతో అతడి తల్లిదండ్రులు ఇద్దరు కుమారులను ఇంటికి సమీపంలోనే ఉన్న హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. మృతిచెందిన బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అతడి అన్నయ్య కూడా ఇదే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. దుస్తులు ఉతికే సమయంలో వివాదం వారం కిందట దుస్తులు ఉతికే స‌మ‌యంలో ప‌దో త‌ర‌గ‌తి చదివే ఓ విద్యార్థితో వివాదం జ‌రిగిన‌ట్టు హాస్ట‌ల్ సిబ్బంది చెబుతున్నారు. ఆ స‌మ‌యంలో మాటామాటా పెర‌గ‌డంతో వారి త‌గాదా ముదిరింద‌ని.. ఆ కోపంతోనే పదో తరగతి విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అవ‌నిగ‌డ్డ డీఎస్పీ ర‌మేష్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు. ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఇద్దరూ బూతులు తిట్టుకున్నారని.. తనకంటే చిన్నవాడైన విద్యార్థి తనను దూషించడంతో తట్టుకోలేక పదో తరగతి విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. సోమ‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో హాస్ట‌ల్‌లో ఉన్న బాత్ రూమ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి హ‌త్య చేసిన‌ట్టు అంగీక‌రించాడని చెప్పారు. హ‌త్య చేయ‌డానికి ఉప‌యోగించిన చాకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా హత్యకు పాల్పడిన బాలుడి తండ్రి గతంలో ప‌లు నేరాల్లో జైలుకి వెళ్లాడు. ఆ ప్రభావం బాలుడిపై ఉండొచ్చని డీఎస్పీ తెలిపారు. పోలీస్ జాగిలాలు పట్టిచ్చాయి.. మంగళవారం ఉదయం బాలుడు కనిపించకపోవడంతో తొలుత హాస్టల్‌లో కలకలం రేగింది. ఆ తరువాత కొద్దిసేపటికే తోటి విద్యార్థులకు అతడి బాత్‌రూమ్‌లో ర‌క్తపు మడుగులో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో వాచ్‌మన్ నాగ‌బాబు ఈ విష‌యాన్ని పైఅధికారులకు, పోలీసులకు తెలియజేశారు. దాంతో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ జాగిలాలు పూర్తిగా హాస్ట‌ల్ గ‌దుల వద్దే తిరుగుతూ నిందితుడి గది వద్దకు వెళ్లాయి. ఆ గదిలోని విద్యార్థుల సామగ్రిని పరిశీలించగా ఓ సూట్‌కేసులో రక్తపు మరకలతో ఉన్న చొక్కా దొరకడంతో.. ఆ బాలుడిని విచారించగా వాస్తవం బయటపడింది. పదో తరగతి చదివే ఆ బాలుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. 'కొత్త బట్టలు ఇచ్చి పంపించాను.. ఇంతలోనే ఈ దారుణం' ఆదివారం తన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనిచ్చానని హతుడి తల్లి కుమారుడిని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతోంది. సంక్షేమ శాఖ హాస్ట‌ళ్ల‌లో పరిస్థితులు సరిగా లేవని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వసతి గృహాల్లో ప‌ర్య‌వేక్ష‌ణ క‌రవైందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్య‌ద‌ర్శి ప‌వ‌న్ కుమార్ బీబీసీతో అన్నారు. ''ఒక్క కృష్ణా జిల్లాలోనే 30 హాస్ట‌ళ్లు మూసివేశారు. ఆ సిబ్బందికి ఇతర విధులు అప్పగించారు. హత్య జరిగిన చ‌ల్ల‌ప‌ల్లి బీసీ హాస్ట‌ల్‌లో వార్డెన్ లేరు. మూడు నాలుగు హాస్ట‌ళ్ల‌కు క‌లిపి ఇంచార్జిని నియ‌మించ‌డంతో ఏ హాస్ట‌ల్‌లోనూ పూర్తిగా ప‌నిచేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దాంతో విద్యార్థులపై నియంత్ర‌ణ ఉండడం లేదు. మొబైల్ ఫోన్లు వాడుతూ చాలామంది పెడదారి పడుతున్నారు. ఒక్క చ‌ల్ల‌ప‌ల్లిలోనే మూడు ఎస్సీ హాస్ట‌ళ్లు మూసివేశారు. ఇక్కడున్న ఏకైక బీసీ హాస్ట‌ల్‌లో ఏడుగురు సిబ్బంది ఉండాలి కానీ, ముగ్గురే పనిచేస్తున్నారు. సిబ్బంది తగినంతమంది లేకుంటే పర్యవేక్షణ ఎలా సాధ్యం' అని ఆయన ప్రశ్నించారు. తాత్కాలికంగా విద్యార్థుల త‌ర‌లింపు వసతిగృహంలో సహ విద్యార్థి హత్యకు గురికావడంతో మిగతావారంతా భయభ్రాంతులకు లోనయ్యారు. 59 మంది విద్యార్థులున్న ఆ హాస్టల్‌లోని మిగతా విద్యార్థులను స‌మీపంలోని మొవ్వ హాస్ట‌ల్ కి త‌ర‌లించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థుల మ‌ధ్య చోటుచేసుకున్న చిన్న వివాదం చివ‌ర‌కు ఎనిమిదేళ్ల బాలుడి హ‌త్య‌కు దారితీసింది. text: ఈ నిరసనల్లో వీరు రాజ్యాంగాన్ని ఉచ్చరిస్తున్నారు. న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాలను హామీ ఇస్తున్న.. దేశ వ్యవస్థాపక పత్రంలోని ప్రాధమిక లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠికను పఠిస్తున్నారు. రాజ్యాంగంతో ప్రజల సంబంధం మామూలుగా భావించేదానికన్నా మరింత లోతుగా ఉందని ఈ సామూహిక పఠనాలు బహిర్గతం చేశాయి. ఇప్పటివరకూ.. రాజ్యాంగం అనేది నిస్సారమైన తరగతి గదుల పాఠాలకు మించి ప్రజల ఊహల్లోకి పయనించలేదని చాలామంది నమ్మేవారు. భారత రాజ్యాంగాన్ని రచించటానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన వ్యవస్థాపక పత్రమిది. నూరు కోట్ల మందికి పైగా ప్రజలను పరిపాలించే ఈ గ్రంథం.. వలసరాజ్యానంతర ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలంగా మనుగడ సాగిస్తున్న రాజ్యాంగం. ఈ విస్తారమైన పత్రంలో 450 అధికరణలు, 12 షెడ్యూళ్లు ఉంటాయి. ఇందులోని అంశాలన్నీ ఎంతో సవివరంగా ఉంటాయి. ఇది ''భాషాప్రయోగంలో సాటిలేని కృషి.. అద్భుత శిఖరాలను తాకింది'' అని న్యాయ నిపుణుడు ఉపేంద్ర బక్సీ అభివర్ణిస్తారు. ఉదాహరణకు ఆర్టికల్ 367.. ఒక విదేశీ రాజ్యం అంటే ''భారత రాజ్యం కానిదని అర్థం'' అని వివరిస్తుంది. ఈ రాజ్యాంగంలోని అంశాలను 1950 నుంచి ఇప్పటి వరకూ 100 సార్లకు పైగా సవరించారు. రక్తసిక్త విభజన, స్వాతంత్ర్యాల అనంతరం ఆవిర్భవించిన ఈ అద్భుత రాజ్యాంగంలో.. ''మతపరమైన, జాతీయపరమైన భావనల'' విషయంలో విభేదాల మధ్య.. భారతదేశం ఎలా ఉండాలి అనేది రాశారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ రూపొందించింది ఒక జాతీయ గుర్తింపును రూపొందించే ప్రయత్నంలో.. ఈ ముసాయిదా మీద భీకర సంవాదం జరిగింది. ప్రపంచంలో అత్యంత అధికంగా జాతుల భిన్నత్వం ఉన్న దేశాల్లో ఒకటైన భారతదేశంలో జాతీయ గుర్తింపును ఎలా మలచాలనే అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఈ పత్రం విశదీకరిస్తుంది. రాజ్యాంగాన్ని ప్రధానంగా పశ్చిమ ప్రపంచ భావనలు ప్రాతిపదికగా, పశ్చిమ విద్యావంతులైన ఉన్నతవర్గం వారు రాశారని విమర్శకులు అంటారు. పీఠిక సైతం.. అనేక బృందాలు, ప్రయోజనాల మధ్య కుదిరిన రాజీ అని.. వలస చట్టాల నుంచి దానిని స్వీకరించారని నిపుణులు చెప్తారు. డెబ్బై ఏళ్ల అనంతరం ఈ రాజ్యాంగం.. ఇటీవలి చరిత్రలో కనీ వెనుగని రీతిలో సాధారణ భారతీయుల ఆలోచనలను రగులుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ రాజ్యాంగం ఎల్లప్పుడూ ప్రజలతో లోతుగా కలసివుందని చాలా మంది నిపుణులు నమ్ముతారు. యేల్ యూనివర్సిటీలో చరిత్ర బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ డే తను రచించిన అద్భుత పుస్తకం 'ఎ పీపుల్స్ కాన్‌స్టిట్యూషన్'లో.. ఈ పత్రాన్ని ప్రజలు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారని.. ''సాధారణ ప్రజలు.. ఎక్కువా మైనారిటీలు, అణగారిన బృందాల ప్రజలు పెద్ద సంఖ్యలో రాజ్యాంగ చర్చ చేస్తుంటారు'' అని పేర్కొన్నారు. స్థానిక కూరగాయల మార్కెట్ మీద ఒకే ఒక్క వ్యాపారికి గుత్తాధిపత్యం కట్టబెట్టిన అధికార వ్యవస్థలు.. వ్యాపారం చేయటానికి, పని చేయటానికి రాజ్యాంగంలో హామీ ఇచ్చిన తన హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మొహమ్మద్ యాసిన్ అనే ఒక యువ ముస్లిం కూరగాయల విక్రేత 1950లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటి నుంచీ.. అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది సాధారణ భారతీయులు కోర్టుల్లో రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ ఎలా పోరాటం చేశారనే విషయాలు డాక్టర్ రోహిత్ తన పుస్తకంలో వివరించారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న చర్చ, సంవాదం మరింత విస్తృతమైనది. ''ప్రస్తుత చర్చను చాలా అద్భుతమైనదని చెప్పటానికి రెండు కోణాలు ఉన్నాయి. మొదటిది.. ఈ చర్చ అనేక రకాల ప్రజా సమూహాల్లో చాలా విస్తృతంగా విస్తరించి ఉండటం. యాభయ్యో దశకంలో రాజ్యాంగం తమకు రక్షణనిస్తుందని కొన్ని నిర్దిష్ట బృందాలు వాదించాయి. కానీ.. ఇప్పుడు రాజ్యాంగం ప్రతి ఒక్కరినీ రక్షిస్తోందని విభిన్న ప్రజాసమూహాలు వాదిస్తున్నాయి. రెండో కోణం.. నిర్దిష్ట హక్కుల మీద కాకుండా పీఠిక మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించటం'' అని డాక్టర్ రోహిత్ నాతో పేర్కొన్నారు. అనూహ్యంగా జరుగుతున్న ఈ నిరసనల్లో రాజ్యాంగ పీఠికను పఠించటం.. స్వాతంత్ర్యం కోసం భారతీయులు బ్రిటిష్ పాలనను సవాల్ చేస్తూ పాటలు పాడుతూ, స్వతంత్ర ప్రతిజ్ఞ చేస్తూ నిర్వహించిన శాసనోల్లంఘన ఉద్యమాలను గుర్తుతెస్తున్నాయి. ''అధికారం ఎవరూ ఇచ్చేది కాదని.. ప్రజలు తమకు తాముగా తీసుకునేదని ఆ నిరసనకారులు వాదించారు'' అని ఆయన చెప్తారు. పౌరులు రాజ్యాంగాన్ని చేపట్టటానికి కారణం.. నరేంద్రమోదీ సారధ్యంలోని హిందూ జాతీయవాద బీజేపీ ప్రభుత్వం.. తన విధానాలకు వ్యతిరేకించే వారందరినీ ''దేశ వ్యతిరేకులు''గా చిత్రీకరించటమని చాలా మంది భావిస్తున్నారు. ''రాజ్యాంగాన్ని ఉపయోగించటం ద్వారా నిరసనకారులు తమ దేశభక్తిని చాటుకోవటం కొనసాగించవచ్చు, జాతీయ చిహ్నాలను, పాటలను ఉపయోగిస్తూ.. 'దేశ వ్యతిరేకత' చర్చను రాజ్యాంగ దేశభక్తితో సవాల్ చేయవచ్చు'' అని డాక్టర్ రోహిత్ విశ్లేషించారు. అలాగే.. ''కోర్టుల వైఫల్యం'' - ప్రత్యేకించి పారదర్శకంగా ఉండకపోవటం ద్వారా, పౌర స్వాతంత్ర్యాల విషయంలో బలహీనంగా వ్యవహరిస్తుండటం ద్వారా సుప్రీంకోర్టు విఫలమవటం మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేయటానికి ప్రజలు రాజ్యాంగాన్ని గుర్తుచేస్తున్నారని కూడా చాలా మంది నమ్ముతున్నారు. కార్యనిర్వహణ వ్యవస్థ నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించేదిగా స్వయంగా నిర్మించుకున్న ప్రతిష్టను అత్యున్నత న్యాయస్థానం.. బీజేపీ తరహాలో భారీ పార్లమెంటరీ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటపుడు మూగబోయినట్లు కనిపిస్తోందని వారు అంటున్నారు. ''పౌర స్వాతంత్ర్యం, రాజ్యాంగ ప్రక్రియల పరిరక్షక పాత్రను కోర్టు పోషించలేకపోవటం.. సాధారణ పౌరులు రంగంలోకి దిగి రాజ్యాంగ పరిరక్షకులుగా నిలవక తప్పని పరిస్థితిని కల్పిస్తోంది'' అంటారు డాక్టర్ రోహిత్ డే. గత నెలలో దిల్లీలోని సుప్రీంకోర్టు ఆవరణలో 40 మంది న్యాయవాదులు సమావేశమై.. రాజ్యాంగ పీఠికను పఠించారు. పాఠశాలల్లో ఉదయపు సమావేశాల్లో ఈ పీఠికను పఠించటం తప్పనిసరి చేస్తామని కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రకటించింది. ''ఇదంతా చాలా ముఖ్యం. శక్తిమంతం. ఒక దేశంగా ఇండియా అంటే అర్థం ఏమిటనేది చర్చించటం, వ్యక్తీకరించటం దీని లక్ష్యం'' అని 'ఇండియాస్ ఫౌండింగ్ ముమెంట్: ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎ మోస్ట్ సర్‌ప్రైజింగ్ డెమొక్రసీ' రచయిత, న్యాయ నిపుణుడు మాధవ్ ఖోస్లా పేర్కొన్నారు. ''ఇటువంటిది గతంలో జరిగిందని నేను భావించటంలేదు'' అని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశవ్యాప్తంగా నెల రోజులకు పైగా మహిళలు, పురుషులు, వృద్ధులు, యవత వీధుల్లో, విశ్వవిద్యాలయాల ఆవరణల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వివక్షాపూరితంగా ఉందని తాము భావిస్తున్న కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వీరు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. text: ట్రిక్‌లో భాగంగా చేతులు, కాళ్లకు గొలుసులు కట్టించుకుని.. తలకిందులుగా హుగ్లీ నదిలోకి తనను తాను వేలాడదీయించుకున్నారు లహిరి. తరువాత నీటి లోపలే సంకెళ్లను, తాళ్లను విప్పుకొని ఆయన బయటపడాలి. దీన్ని ‘హుడీనీ ట్రిక్’ అంటారు. ప్రముఖ మెజీషియన్ హ్యారీ హుడీనీ దీనికి ఆద్యుడు. అయితే, ఈ ట్రిక్‌ను ప్రయత్నించిన లహిరి, నది లోపలి నుంచి ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో, వీక్షించేందుకు వచ్చిన జనాలు పోలీసులను అప్రమత్తం చేశారు. లహిరి కోసం గాలింపు ఆపరేషన్ మొదలైంది. ట్రిక్ ప్రదర్శిస్తున్న ప్రాంతానికి ఒక కి.మీ. దూరంలో ఆయన మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగిన మెజీషియన్ మళ్లీ ప్రాణాలతో బయటకురాలేదు లహిరికి మంద్రేక్ అనే పేరు కూడా ఉంది. తాజా ట్రిక్‌ను ఆయన ఓ పడవపై నుంచి చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని చూసేందుకు పక్కనే మరో రెండు పడవల్లో వీక్షకులు ఉన్నారు. కోల్‌కతాలోని హౌరా వంతెన, నది ఒడ్డు నుంచి ఇంకొందరు దీన్ని చూశారు. లహిరికి కట్టిన గొలుసులకు మొత్తం ఆరు తాళాలు ఉన్నాయి. నీట మునిగి పది నిమిషాలైనా ఆయన బయటకు రాకపోవడంతో జనాల్లో ఆందోళన మొదలైనట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన జయంత్ షా అనే ఫొటోగ్రాఫర్ బీబీసీతో మాట్లాడారు. ట్రిక్‌కు ప్రయత్నించే ముందు లహిరితో తాను మాట్లాడనని ఆయన చెప్పారు. ''మ్యాజిక్ కోసం జీవితాన్ని ఎందుకు పణంగా పెడుతున్నరని ఆయన్ని అడిగా. ఆయన నవ్వతూ.. 'సరిగ్గా చేస్తే మ్యాజిక్.. పొరపాటు జరిగితే ట్రాజిక్ (విషాదం)' అని బదులిచ్చారు. మ్యాజిక్ పట్ల ప్రజల్లో ఆసక్తిని తిరిగి పెంచేందుకు తాను ఈ ట్రిక్ చేస్తున్నానని చెప్పారు'' అని జయంత్ వివరించారు. నీటి లోపల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ట్రిక్కులను చేయడం లహిరికి ఇది కొత్తేమీ కాదు. 20 ఏళ్ల క్రితం ఇదే నదిలోకి ఆయన ఓ గాజు బాక్స్‌లో సంకెళ్లతో దిగి, క్షేమంగా బయటకు వచ్చారు. ఇంతకుముందు లహిరి నీటి లోపల చేసే ట్రిక్‌ను తాను చూశానని జయంత్ తెలిపారు. ఆయన బయటపడలేరనే అప్పుడు కూడా తాను అనుకున్నానని చెప్పారు. హుడీనీ ట్రిక్‌ ప్రదర్శన కోసం లహిరి కోల్‌కతా పోలీసులు, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ అనుమతి తీసుకున్నట్లు పీటీఐ పేర్కొంది. అయితే, ఈ ట్రిక్‌లో నీటిలోకి దిగే భాగం ఉంటుందని తమకు లహిరి తెలపలేదని పోలీసులు చెప్పారు. ''ఓ పడవలో ఈ ట్రిక్ జరుగుతుందని లహిరి చెప్పారు. అందుకే అనుమతి ఇచ్చాం. ట్రిక్‌లో ఈ 'అదనపు భాగం' గురించి ఆయనేమీ చెప్పలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నాం'' అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పశ్చిమ బెంగాల్‌లో చంచల్ లహిరి అనే మెజీషియన్ ఓ ట్రిక్‌ కోసం ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయారు. text: ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి 430 కి.మీల దూరంలో.. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 430కి.మీల దూరంలో ఈ పెను తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇది మరింత తీవ్ర రూపం దాల్చి ఉత్తర దిశగా కదులుతూ దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు తరలనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను కదులుతున్న మార్గంలో గంటకు 170 నుంచి 205 కి.మీల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. తుపాన్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఫొని తుపాను నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాలై ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో సన్నద్ధతా చర్యల కోసం కేంద్రం హోం శాఖ ముందస్తుగా ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.200.25కోట్లు, ఒడిశాకు రూ.340.87కోట్లు, తమిళనాడుకు రూ. 309.37కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ. 233.50కోట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. 'జాలర్లు అప్రమత్తంగా ఉండాలి' తుపాన్ల సమయంలో జాలర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రా యూనివర్సిటీలోఓషినోగ్రఫీ ప్రొఫెసర్ రామకృష్ణ హెచ్చరించారు. సముద్రంలో 500 కి.మీ.ల నుంచి 1500 కి.మీ.ల వరకూ ప్రాంతం తుపాను తీవ్రతను బట్టి దాని వ్యాస పరిధిలోకి రావొచ్చని ఆయన అన్నారు. ''తుపాను ఉన్నప్పుడు సముద్రంలో అల్లకల్లోలాలు ఎక్కువగా ఉంటాయి. అలల ఎత్తు పెరుగుతుంది. చిన్నపాటి నావలు తిరగబడిపోతుంటాయి. జాలర్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తుపాను హెచ్చరికలున్నప్పుడు వేటను మానుకోవడమే మంచిది'' అని రామకృష్ణ చెప్పారు. నదులు సముద్రంలో కలిసే చోట తుపానులు సాధారణంగా తీరం దాటుతుంటాయని, ఆ ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు. అందుకే చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, యానాం, దివిసీమ, డెల్టా ప్రాంతాల్లో తుపాన్లు తీరం దాటుతుంటాయని అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బంగాళాఖాతంలోనే రెండు తుఫాన్ల సీజన్లు ఉంటాయని ఆయన వివరించారు. ఏప్రిల్, మే నెలల్లో మొదటి సీజన్, అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండో సీజన్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పెను తుపానుగా మారుతున్న ఫొని ఒడిశా తీరం వైపు వేగంగా దూసుకెళుతోంది. మే 3వ తేదీ శుక్రవారం పూరీ సమీపంలోని గోపాల్‌పూర్-చంద్బలిల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. text: ఆకలి సమస్య విషయంలో బంగ్లాదేశ్, నేపాల్‌ల కన్నా భారత్‌ దారుణ స్థితిలో ఉందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. భారత్‌లో పిల్లల్లో పోషకాహార లోపమూ తీవ్రంగా ఉందని పేర్కొంది. ఎంత మందికి ఎలాంటి ఆహారం అందుతోంది? అది ఎంతవరకు అందుబాటులో ఉందనే వివరాలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలుపుతుంది. ఆహార పదార్థాలను వృథా చేయడమే ఆకలి సమస్య పెరగడానికి అసలు కారణమని విశ్లేషకులు చెబుతున్న మాట. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం భారత్‌లో 40 శాతం వరకూ ఆహారం వృథా అవుతోంది. ఈ ఆహారాన్ని డబ్బు రూపంలో మార్చితే, అది దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. భారత్‌లో తగినంత ఆహార పదార్థాల ఉత్పత్తి జరుగుతున్నా అందరికీ అది చేరుకోవడంలేదని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది. ఒక అంచనా ప్రకారం భారత్‌లో 25 శాతం జనాభా ఆకలితో అలమటిస్తోంది. సుమారు 19 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇందులో ఆహారం దొరకనివాళ్లు, దొరికినా పోషకాల లోపంతో బాధపడుతున్నవాళ్లూ ఉన్నారు. వృథాను అరికట్టడం ఎలా? వివాహంతోపాటు ఇతర శుభకార్యాల్లో భారీ మొత్తంలో ఆహారం వృథా అవుతోంది. ఈ వృథాను అరికడితే భారత్‌లో తీవ్రమవుతున్న ఆకలి సమస్యను పరిష్కరించొచ్చు. వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు జాగ్రత్త పాటించాలి. ఎంత తినగలమో అంతే వడ్డించుకోవాలి. ఒకవేళ పదార్థాలు మిగిలిపోతే వృథా చేయకుండా అన్నార్తులకు అందించాలి. వివాహం, పార్టీ, హోటళ్లలో ఆహారాన్ని వృథా చేయకూడదు. వృథా అవుతున్న ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు వడ్డించే సంస్థలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. ఇలాంటి ఓ సంస్థే 'రాబిన్ హుడ్ ఆర్మీ'. దిల్లీలో జరిగే ఒక పెళ్లిలో అందరూ తినగా మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి 500 నుండి 2500 మందికి అందించవచ్చని ఈ సంస్థ ప్రతినిధి సంచిత్ జైన్ చెప్పారు. సరఫరా వ్యవస్థలో లోపం సరఫరా వ్యవస్థ, నిర్వహణల్లో లోపం వల్లే ఆహార వృథా ఈ స్థాయిలో ఉందని సంచిత్ జైన్ తెలిపారు. ఆహార పదార్థాలు వ్యవసాయ క్షేత్రాల నుంచి మార్కెట్లకు చేరుకుంటున్నాయి. కానీ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేవు. సరఫరా వ్యవస్థ సరిగా లేదు. దీంతో ఆహార పదార్థాలు గోదాముల్లోనే కుళ్లిపోతున్నాయని సంచిత్ జైన్ పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో లోపం కారణంగా కొన్నిసార్లు ధరలు కూడా పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. వృథా అయ్యే ఆహారం ఎక్కడికి వెళ్తోంది? తాము హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి మురికివాడల్లో నివసించే ప్రజలకు సరఫరా చేస్తామని రాబిన్ హుడ్ ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా వృథా నియంత్రణపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నాయి. భారత్‌లో ఆహార వృథాను అరికట్టడం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యాంశమని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఇటీవల అమెరికా పర్యటనలో తెలిపారు. ఈ విషయంలో ప్రజలూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. ఈ ఏడాది ఆగస్టులో చెన్నైకు చెందిన ఈసా ఫాతిమా జాస్మిన్ కూడా కమ్యూనిటీ ఫ్రిజ్‌ను ఏర్పాటు చేశారు. బెసెంట్‌ నగర్‌లో ఉంచిన ఈ ఫ్రిజ్‌లో చుట్టుపక్కలుండే వారు తమ వంతు ఆహారాన్ని తెచ్చి పెడతారు. హోటళ్లలో మిగిలిపోయిన పదార్థాలను తీసుకొచ్చి ఈ ఫ్రిజ్‌లో పెడతారు. అవసరమున్న వారు ఈ ఫ్రిజ్ నుంచి ఆహారం తీసుకెళ్లొచ్చు. అయితే ఇలాంటి కృషి చాలా పరిమితంగానే ఉంటుంది. మిగిలిపోతున్న ఆహారాన్ని సక్రమంగా వినియోగించుకునే ఏర్పాటు అన్ని చోట్లా చేస్తే కోట్లాది మంది ఆకలిని తీర్చే అవకాశం ఉంది. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో ఆకలి సమస్య నానాటికీ తీవ్రమవుతోందని 'గ్లోబల్ హంగర్ ఇండెక్స్' తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 119 దేశాల జాబితాలో భారత్‌ 100వ స్థానంలో ఉందని అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తెలిపింది. text: మృతుడు భూపిందర్ నివాసం ఈ వ్యవహారంలో శనివారం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అరెస్ట్ చేసినట్లయింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ జలంధర్‌ డివిజన్‌ కమీషనర్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. రాష్ట్రంలోని అమృత్‌సర్‌, బటాలా, తరన్‌ తరన్‌ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించడంతో ఈ మరణాలు సంభవించాయి. వరుస మరణాలు చోటుచేసుకోవడంతో పోలీసులు నకిలీ మద్యం తయారీ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. 100కి పైగా స్థావరాలపై దాడులు చేశారు. మృతుడు బల్విందర్ నివాసం నకిలీ మద్యం విక్రయాలు ఇలా.. నకిలీ మద్యాన్ని రహస్యంగా ఎలా విక్రయిస్తున్నారన్నది డీజీపీ వెల్లడించారు. నకిలీ మద్యం తీసుకొస్తున్న ట్రక్కులు ఆరేడు ధాబాల దగ్గర ఆగుతాయని.. ఆ ధాబాల యజమానులు దాన్ని తీసుకుని అమృత్‌సర్, మిగతా ప్రాంతాల్లో ఏజెంట్లకు సరఫరా చేస్తారని చెప్పారు. ఇంతకీ ఇందులో ఏముంది? నిన్న జరిపిన దాడుల్లో పట్టుకున్న నకిలీ మద్యాన్ని టెస్టుకు పంపించారు. ఆ రిపోర్టు ఇంకా రానప్పటికీ ఎక్సయిజ్ అధికారులు చెబుతున్న ప్రకారం రంగుల్లో వాడే ఒక రకమైన స్పిరిట్‌తో దీన్ని తయారుచేస్తున్నారు. సాధారణంగా బెల్లంతో నాటుసారా చేస్తారు కానీ ఈ నకిలీ మద్యాన్ని స్పిరిట్, ఇతర రసాయనాలతో చేస్తున్నారన్నారు. దీన్ని లీటరు రూ.50కి విక్రయిస్తున్నారని ఎక్సయిజ్ అధికారులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు బృందంలో జలంధర్‌ డివిజన్‌ కమిషనర్‌తోపాటు జాయింట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్‌ కమిషనర్, సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కూడా ఉన్నారు. ఇప్పటికే బల్విందర్‌ కౌర్ అనే మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 304, ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 61/1/14 కింద కేసు నమోదైంది. కల్తీ మద్యం మరణాలు సంభవించిన జిల్లాల్లో దాడులు నిర్వహించేందుకు పంజాబ్ పోలీసులు అయిదు బృందాలను ఏర్పాటు చేశారు. "అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతం, బటాలా, టరన్ టరన్ జిల్లాల్లో మరో ఏడుగురిని అరెస్ట్ చేశాం. అయిదు పోలీసు బృందాలు కల్తీ మద్యం మరణాలు సంభవించిన ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి" అని పంజాబ్ పౌర సంబంధాల శాఖ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది. గురువారం ముచ్చల్ గ్రామంలో నలుగురు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనలకు సంబంధించి ఒక వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను శుక్రవారంనాడు పోస్టు మార్టం కోసం పంపించారు. అమృత్‌సర్‌ సమీపంలోని తార్‌సిక్కా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు గ్రామాల్లో జూన్‌ 29 రాత్రి ఐదు కేసులు నమోదైనట్లు పంజాబ్‌ డీజీపీ వెల్లడించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి చనిపోయినవారి సంఖ్య 98కి పెరిగింది. తరన్ తరన్, అమృత్‌సర్, బటాలాలలో ఈ మరణాలు చోటుచేసుకోగా అత్యధికంగా తరన్ తరన్‌లోనే 63 మంది మరణించారు. text: భారత్‌ నుంచి విడిపోయిన అనంతరం పాకిస్తాన్ దృష్టి దీనిపై పడింది. స్వతంత్ర దేశంగా పాక్ అవతరించిన రెండేళ్లకే ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొనేందుకు పాక్ ప్రయత్నించింది. అరేబియా సముద్రంలోని గ్వాదర్‌పై పాక్ దృష్టి సారించడానికి రెండు కారణాలున్నాయి. వీటిలో మొదటిది ఆర్థిక పరమైన అంశాలు. రెండోది ఆత్మరక్షణ. అయితే, ఈ రెండు లక్ష్యాలు చేరుకోవాలంటే ఒక ప్రధాన రహదారి నిర్మించాలి. దీనికి గ్వాదర్ అడ్డుగోడలా మిగిలిపోయింది. ఈ అడ్డుగోడను తొలగించాలంటే గ్వాదర్.. పాక్‌లో కలిసిపోవాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా సమాచారాన్ని సేకరించడంలో గ్వాదర్ చాలా కీలకమైన ప్రాంతం. text: ల్యాబ్‌లో ప్రయోగాల్లో రొమ్ము క్యాన్సర్, రక్త క్యాన్సర్, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, ఇతర క్యాన్సర్లను అంతమొందించగల విధానాన్ని గుర్తించినట్లు కార్డిఫ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ పరిశోధన వివరాలు 'నేచర్ ఇమ్యునాలజీ'‌ జర్నల్‌లో వెలువడ్డాయి. క్యాన్సర్ రోగుల్లో ఈ టెక్నిక్‌ను ఇంకా పరీక్షించలేదని, కానీ దీనికి అపారమైన సామర్థ్యం ఉందని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధన ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఇందులో వెల్లడైన ఫలితాలు ఉత్తేజం కలిగిస్తున్నాయని నిపుణులు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ కణాలు శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు? కణితుల(ట్యూమర్ల)పై వ్యాధి నిరోధక వ్యవస్థ సహజమైన దాడి గురించి ఈ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఈ దాడిలో ఇప్పటివరకు ఎవరూ గుర్తించని, భిన్నమైన విధానాలను కనుగొనేందుకు వీరు ప్రయత్నించారు. మనిషి రక్తంలో ఉండే ఒక 'టీ-సెల్', దాని ఉపరితలంపై ఉండే 'రిసెప్టర్'‌లను, వీటి సామర్థ్యాలను గుర్తించారు. టీ-సెల్ ఒక వ్యాధినిరోధక కణం. ఇది శరీరాన్ని జల్లెడ పట్టి, శరీరానికి ముప్పు కలిగించేదేమైనా ఉంటే గుర్తించి, దానిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే కణం చాలా క్యాన్సర్లపై దాడి చేయగలదు. ఈ సామర్థ్యంతో ప్రతి క్యాన్సర్ రోగికీ చికిత్స అందించేందుకు అవకాశం ఉందని పరిశోధకుడు ప్రొఫెసర్ ఆండ్రూ సీవెల్ బీబీసీతో చెప్పారు. ఈ కణంతో ఇది సాధ్యం కాగలదని గతంలో ఎవరూ నమ్మలేదని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే రకమైన చికిత్సను అభివృద్ధి చేసే అవకాశాలను ఇది మెరుగుపరిచిందని ఆయన చెప్పారు. మనుషుల్లో చాలా రకాల క్యాన్సర్లను ఒకే తరహా టీ-సెల్ నిర్మూలించగలదన్నారు. క్యాన్సర్ కణాలపై దాడి చేస్తున్న టీ-కణం ఇది ఎలా పనిచేస్తుంది? టీ-కణాల ఉపరితలంపై 'రిసెప్టర్లు' ఉంటాయి. క్యాన్సర్ కణాలను ఈ రిసెప్టర్లు గుర్తించగలవు. ఊపిరితిత్తులు, చర్మ, రక్త, పెద్ద పేగు, రొమ్ము, ఎముక, ప్రోస్టేట్, అండాశయ, మూత్రపిండాలు, గర్భాశయ క్యాన్సర్లను టీ-కణం, దాని రిసెప్టర్ గుర్తించి అంతం చేయగలవని కార్డిఫ్ విశ్వవిద్యాలయ బృందం ప్రయోగశాలలో చేసిన పరిశోధనల్లో గుర్తించారు. ఈ పరిశోధనలో టీ-కణం, దాని రిసెప్టర్ సాధారణ కణజాలం జోలికి పోలేదు. ఇది ఎలా సాధ్యమైందనేది నిర్దిష్టంగా తెలుసుకొనేందుకు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధకులు గుర్తించిన టీ-కణం రిసెప్టర్, మనిషి శరీరంలో ప్రతి కణం ఉపరితలంపై ఉండే ఎంఆర్1 అనే మాలిక్యూల్‌తో 'ఇంటరాక్ట్' అవుతుంది. క్యాన్సర్ కణాల్లో ఎంఆర్1‌ను గుర్తించే టీ-కణం గురించి తొలిసారిగా వివరిస్తోంది తామేనని రీసర్చ్ ఫెలో గ్యారీ డాల్టన్ బీబీసీతో చెప్పారు. క్యాన్సర్ కణంపై దాడి చేస్తున్న ఓ టీ-కణం ఈ పరిశోధన ప్రాధాన్యం ఏమిటి? టీ-కణం క్యాన్సర్ చికిత్సలు ఇప్పటికే ఉన్నాయి. ఈ రంగంలో సాధించిన ప్రధానమైన పురోగతిలో రోగనిరోధక వ్యవస్థ ఆధారిత క్యాన్సర్ చికిత్సల అభివృద్ధి ఒకటి. ఈ విషయంలో 'సీఏఆర్‌-టీ' అత్యంత ప్రముఖ ఉదాహరణ. ఇది ఒక లివింగ్ డ్రగ్. ప్రతి రోగికీ ప్రత్యేకంగా సిద్ధంచేసే ఔషధమే లివింగ్ డ్రగ్. కీమోథెరపీ లాంటి సంప్రదాయ చికిత్సలతో పోలిస్తే సీఏఆర్-టీతో చికిత్స భిన్నమైనది. రోగి నుంచి తెల్లరక్త కణాలను సేకరించి సీఏఆర్-టీ ఔషధాన్ని తయారుచేస్తారు. రోగి టీ-కణాలకు జన్యు ఇంజినీరింగ్‌తో మార్పులు చేసి వాటి సాయంతోనే క్యాన్సర్‌ను నిర్మూలించేలా ఈ ఔషధాన్ని తయారుచేస్తారు. సీఏఆర్-టీ ఎంతో అసాధారణమైన ఫలితాలను ఇవ్వగలదు. మృత్యువు అంచుల దాకా వెళ్లిన కొందరు రోగులకు వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టొచ్చు. సీఏఆర్-టీ విధానంలో ప్రతి రోగికి వారికి ప్రత్యేకించిన పద్ధతిలోనే చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్ని పరిమితమైన క్యాన్సర్ల చికిత్సలోనే ఇది ఉపయోగపడుతుంది. టీ-కణాలను చికిత్సకు అనువుగా మార్చి, నిర్దిష్ట లక్ష్యంపై గురిపెట్టగల పరిస్థితులున్న సందర్భాల్లోనే ఈ విధానం ఫలితాలను ఇస్తుంది. ల్యుకేమియా లాంటి రక్త క్యాన్సర్లతో పోలిస్తే గడ్డలతో కూడిన క్యాన్సర్లకు చికిత్సలో ఈ విధానం విజయవంతం కాలేదు. తాము గుర్తించిన టీ-కణం రిసెప్టర్ అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే చికిత్స విధానం అభివృద్ధి చేయడానికి తోడ్పడగలదని కార్డిఫ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? క్యాన్సర్ రోగి నుంచి రక్త నమూనాను సేకరిస్తారు. అందులోంచి టీ-కణాలను తీసుకుని జన్యుపరమైన మార్పులు చేస్తారు. క్యాన్సర్‌ను గుర్తించే రిసెప్టర్ తయారీకి అనుగుణంగా ఈ కణాలను రీప్రోగ్రామ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే హానికరంకాని ఒక వైరస్‌, క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిపై గురిపెట్టేలా టీ-కణాల్లో మార్పులు చేస్తుంది. రీప్రోగ్రామ్ చేసిన టీ-కణాలను ప్రయోగశాలలో పెద్దయెత్తున ఉత్పత్తి చేస్తారు. తర్వాత వీటిని రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. సీఏఆర్-టీ విధానంలోనూ ఇలాంటి ప్రక్రియే ఉంటుంది. ప్రస్తుత పరిశోధనలో శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కణాలపై, జంతువులపై మాత్రమే పరీక్షలు చేపట్టారు. మరిన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాతే మనుషులపై ప్రయోగాలు మొదలుపెట్టనున్నారు. నిపుణుల మాట ఏమిటి? ఈ పరిశోధన తమకెంతో ఉత్తేజం కలిగిస్తోందని, దీనివల్ల మున్ముందు గొప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే అన్ని క్యాన్సర్లకు ఇది చికిత్స అందించగలదని ఇంత ప్రాథమిక దశలో చెప్పలేమని స్విట్జర్లాండ్‌లోని బాసెల్ విశ్వవిద్యాలయానికి చెందిన లూసియా మోరి, జెనారో డి లిబరో వ్యాఖ్యానించారు. బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ ప్రొఫెసర్ డేనియల్ డేవిస్ స్పందిస్తూ- ఇది చాలా ప్రాథమిక పరిశోధన అని, రోగులకు ఔషధం అందించే దశకు దగ్గర్లో లేదని చెప్పారు. "ఇదో ఉత్తేజభరితమైన ఆవిష్కరణ. రోగ నిరోధక వ్యవస్థ గురించి మన మౌలిక అవగాహనను, భవిష్యత్తులో కొత్త ఔషధాలను అభివృద్ధి చేసే అవకాశాలను ఇది మెరుగుపరుస్తుంది. ఇందులో సందేహం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో దాగి ఉండే ఒక సామర్థ్యాన్ని గుర్తించామని, అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స అందించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేయొచ్చని బ్రిటన్లోని శాస్త్రవేత్తలు చెప్పారు. text: మొజాంబిక్ వీడియోలో సాయుధులు కాసేపటి తర్వాత వారు ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇది ఏ ప్రాంతంలో జరిగింది? దీన్ని తెలుసుకోవడం కోసం బీబీసీ, మరికొందరు ప్రయత్నించారు. ఆన్‌లైన్ టూల్స్ ఉపయోగించి ఇదెక్కడ జరిగిందో గుర్తించారు. అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఉత్తర మొజాంబిక్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తేలింది. వాళ్లు నడుస్తున్న రోడ్డు ఓవాసీ అనే చిన్న పట్టణానికి కొద్ది దూరంలో ఉంది. అక్కడున్న బిల్‌బోర్డులు (సైన్‌బోర్డులు) అదే విషయాన్ని చెబుతున్నాయి. ఆ ప్రాంతంలో మూడు చెట్లు, తెలుపు రంగు రేకులున్న షెడ్డు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం ఎక్కడిది అన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎప్పుడు జరిగింది? అక్కడ నిలబడ్డ మనుషుల నీడల కోణాన్ని చూస్తే అది ఏప్రిల్ లేదా సెప్టెంబర్‌ నెలల్లో జరిగి ఉంటుందనిపిస్తోంది. అయితే ఈ వీడియో సెప్టెంబర్‌నాటిది అనడానికి మరికొన్ని ఆధారాలున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సైన్యం అక్కడే ఉంది. ఎండిపోయినట్లు కనిపిస్తున్న గడ్డి సెప్టెంబర్‌నాటిదే అనేందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. యూనిఫాం, ఇతర ఆనవాళ్లను బట్టి వారు మొజాంబిక్ సైనికులుగా గుర్తించారు ఎవరా సాయుధులు? ఈ దారుణ హత్యకు పాల్పడింది ఎవరు ? ఆ మహిళ చేసిన తప్పేంటి ? వీడియోలో కనిపించిన రోడ్డు ఖాళీగా ఉంది. పరిస్థితిని చూస్తుంటే, అక్కడున్న వాళ్లంతా పారిపోగా, ఆ మహిళ అక్కడ చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. “వారు వేసుకున్న దుస్తులను బట్టి ఆ హంతకులు ఎవరో గుర్తించవచ్చు. వారు వేసుకున్న డ్రెస్‌ మొజాంబిక్‌ సైన్యం యూనిఫాంలా ఉంది. నల్ల రంగు బూట్లు, భుజం మీద కనిపించే చిహ్నాలు చూస్తే అవి సైనికులవే అన్నట్లుంది” అన్నారు డేవిడ్‌ మత్సిన్హే. ఆయన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో పరిశోధకుడిగా పని చేస్తున్నారు. వాళ్లు మాట్లాడిన మాటలు కూడా సైనికులే అన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. “నువ్వు అల్‌-షబాబ్‌ గ్రూప్‌లో పని చేస్తావు కదూ’’ అంటూ వారు ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే, ఆమె తిరుగుబాటుదారు అన్న అనుమానంతో కాల్చినట్లు అర్థమవుతోంది. అల్‌-షబాబ్‌ అనేది ఆ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఒకానొక ఇస్లామిక్‌ గ్రూప్‌ “ఈ వీడియోలోని వ్యక్తులు పోర్చుగీసు భాషలో మాట్లాడుతున్నారు. చూడటానికి సైనికుల్లా ఉన్నారు. తిరుగుబాటుదారులు స్వాహిలి మాట్లాడతారు ’’ అన్నారు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌లో పని చేస్తున్న జెనైదా మచాడో. “కొంతమంది అరబిక్‌, మకువా, మకొండే భాషలు కూడా మాట్లాడతారు” అని ఆమె వివరించారు. స్థానిక మీడియా ఒక అనుమానిత సైనికుడిని గుర్తించిది. కానీ ఆ తర్వాత అతను హత్యకు గురయ్యారు. మొజాంబిక్‌ ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించింది. అయితే ఈ వీడియో నకిలీదని, కొందరు కావాలనే దాన్ని మార్చి ఆన్‌లైన్‌లో ఉంచారని ఆ దేశ ప్రభుత్వం అనుమానిస్తోంది. నిజానికి అది అసాధ్యం కూడా కాదు. ఈ ఏడాది ప్రారంభంలో తిరుగుబాటుదారులు సైన్యానికి చెందిన సామగ్రిని దోచుకున్నారు. సైన్యం దుస్తులు ధరించి, తుపాకులు పట్టుకుని పట్టణాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. సైన్యానికి మా రక్షణ కన్నా అయిల్ కంపెనీల రక్షణే చాలా ముఖ్యమని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇలా ఎందుకు చేశారు ? కాల్చింది, చనిపోయింది ఎవరైనా, ఎలాంటి వారైనా ఈ వీడియో భయానకమైన వీడియో అని చెప్పక తప్పదు. అయితే మొజాంబిక్‌లో ఇలాంటివేమీ కొత్తకాదు. ఈ తరహా వీడియోలు ఎన్నో ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటాయి. మనుషులను హింసిస్తున్నట్లు, చంపుతున్నట్లు సైనికులు, తిరుగుబాటుదారులు ఎవరికి వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక వీడియోలో ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి బతికి ఉన్న మరో వ్యక్తిని స్మశానం వైపు లాక్కెళ్తుండడం కనిపిస్తుంది. ప్రజలను రెచ్చగొట్టడానికి ఇస్లామిక్‌ తిరుగుబాటుదారులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వీడియోలను తయారు చేస్తుంటారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఉద్యమిస్తున్న ప్రజలను, తిరుగుబాటుదారులను భయపెట్టడానికి కొందరు సైనికులు కూడా ఇలాంటి హింసాత్మక వీడియోలను తయారు చేస్తుంటారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో హింస రోజురోజుకు పెరుతుండటంతో లక్షలమంది ప్రజలు దేశం విడిచిపారిపోతున్నారు. మొజాంబిక్‌ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్లు తేలడంతో అక్కడ పెద్దపెద్ద నిర్మాణాలు చేపట్టి గ్యాస్‌ వెలికితీత పనులు చేస్తున్నారు. అయితే తిరుబాటుదారులు అక్కడ పని చేస్తున్న సంస్థలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. “బాధిత ప్రజలతో మాట్లాడినప్పుడు, సైన్యానికి మా రక్షణ కన్నా అయిల్ కంపెనీల రక్షణే చాలా ముఖ్యమని వాపోయారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది’’ అన్నారు మచాడో. ఏది ఏమైనా ఈ వీడియోలో ఉన్నది ఎవరు, ఎందుకు ఒక మహిళను చంపారు అన్నదానిపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వివాదాలు ఎన్ని ఉన్నా మొజాంబిక్‌లో హింస కొనసాగుతూనే ఉంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సోషల్‌ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఇందులో తుపాకులు పట్టుకున్న నలుగురు ఒంటిపై దుస్తులు లేకుండా పరుగులు తీస్తున్న మహిళను వెంబడిస్తున్నారు. ఆ వీడియోలో వాళ్లు ఆమెను కొడుతున్నారు. text: "డెన్మార్క్ ఓపెన్ నాకు తగిలిన చివరి దెబ్బ. నేను రిటైర్ అవుతున్నాను" అంటూ పివి సింధు ట్వీట్ చేశారు. ఇది క్రీడాభిమానులు తొలుత.. బ్యాడ్మింటన్ నుంచి ఆమె రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తున్నారనే భావనలో పడేసింది. కొన్ని మీడియా సంస్థలు సింధు రిటైర్మెంట్ ప్రకటించారంటూ బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చాయి. అయితే, ఆమె రాసిన పోస్టులో వివరాలు మరోలా ఉన్నాయి. పి వి సింధు ట్వీట్లో ఏముంది? "నేనెప్పటి నుంచో నా భావాలను నిజాయితీతో చెప్పాలని ఆలోచిస్తున్నాను. అవి ఎలా చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్న మాట నిజం. మీకు తెలుసా, ఎందుకో అన్నీ తప్పుగా జరుగుతున్నాయని అనిపిస్తోంది. అందుకే ఇక విసిగిపోయాను అని చెప్పాలనిపించి నా భావాలు రాతలో పెడుతున్నాను". పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందా చరిత్ర సృష్టించిన పీవీ సింధు... బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం "నేనేమి మాట్లాడుతున్నానో మీకు ఏమీ అర్ధం అవుతుండకపోవచ్చు. లేదా అయోమయంగా అనిపిస్తూ ఉండవచ్చు. అది చాలా సహజం. కానీ, నేను రాసిందంతా పూర్తిగా చదివాక నా అభిప్రాయం మీకు అర్ధం అవుతుంది. అప్పుడు మీరు నన్ను సమర్ధిస్తారని కూడా అనుకుంటున్నాను". "ఈ మహమ్మారి నా కళ్ళు తెరిపించింది. ఆట ముగిసేవరకూ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి నేను చాలా కఠినమైన శిక్షణ తీసుకోగలను. అలా గతంలో చేసాను. భవిష్యత్తులో కూడా చేయగలను. ప్రపంచాన్ని అంతటినీ స్తబ్దతలో ముంచేసిన ఈ కంటికి కనిపించని వైరస్ ని ఓడించటం ఎలాగో అర్ధం కావటం లేదు. ‘‘కొన్ని నెలలుగా ఇంటి పట్టునే ఉన్న మనం బయటకు వెళుతున్న ప్రతి సారి ప్రశ్నించుకుంటూనే ఉన్నాం. ఈ పరిస్థితిని అంతా స్వయంగా అనుభవిస్తూ ఆన్ లైన్ లో హృదయ విదారకమైన కథలు చదువుతూ ఉంటే నాతో పాటు, మనమంతా నివసిస్తున్న ఈ ప్రపంచం గురించి ప్రశ్నించుకునేలా చేసింది. డెన్మార్క్ ఓపెన్ లో దేశం తరుపున ఆడలేకపోవడం నాకు తగిలిన చివరి దెబ్బ". "ఇప్పుడున్న ఈ అనిశ్చిత పరిస్థితి నుంచి నాకు నేనుగా విరమణ పలుకుతున్నాను. నేను ఈ ప్రతికూలత, భయం, అనిశ్చితి నుంచి విరమణ తీసుకుంటున్నాను. ఏ మాత్రమూ నియంత్రణ లేని ఈ అపరిచిత విషయం నుంచి విరమణ తీసుకుంటున్నాను". "అపరిశుభ్ర విధానాల నుంచి, వైరస్ పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. దీని నుంచి పక్కకు తప్పుకోవడానికి లేదు. దీనిని ఎదుర్కోవడానికి మనం ఇంకా బాగా సంసిద్ధమవ్వాలి. ఈ వైరస్ ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలే రేపటి మన భవితను, మన తరువాతి వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇది ఇలా వదిలేసే విషయం కాదు". "నేను మీకు చిన్నపాటి గుండె దడను తెప్పించి ఉంటాను. ఈ ఊహించని పరిస్థితుల్లో ఊహించని చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరందరూ దీని గురించి ఒక్క సారి దృష్టి పెడతారని భావిస్తున్నాను. అలాగే, సొరంగం చివర వెలుగు ఉంటుందనే విషయాన్ని కూడా మనం విస్మరించకూడదు". "అవును? డెన్మార్క్ ఓపెన్ చోటు చేసుకోవటం లేదు కాబట్టి నేనేమి శిక్షణ తీసుకోవడం ఆపటం లేదు. జీవితం మీకు ఎదురు తిరిగితే మీరు దానిని రెట్టింపు ధైర్యంతో ఎదుర్కోవాలి. నేను ఆసియా ఓపెన్ కోసం ఇప్పుడు అలాగే శ్రమిస్తాను". "నేను గట్టిగా పోరాడకుండా ఓడిపోయానని చెప్పడానికి అంగీకరించను. ఈ భయాన్ని ఎదుర్కోకుండా నేను ఓడిపోయాను అని చెప్పడానికి ఒప్పుకోను. మనమంతా సురక్షిత ప్రపంచాన్ని చూసే వరకు నేను పోరాడుతూనే ఉంటాను". పి వి సింధు పోస్టును చూసి చాలా మంది క్రీడాభిమానులు ఆమె క్రీడల నుంచి రిటైర్ అయ్యారనే భ్రమలో పడి ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయాలను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. కొంత మంది ఈ పోస్టు చూసి గుండె పోటు వచ్చినట్లయింది అని రాశారు. ఇలాంటి పోస్టు పెట్టి సింధు సంచలనం సృష్టించారని కొంత మంది వ్యాఖ్యానించారు. మరి కొంత మంది నెటిజన్లు ట్వీట్ పూర్తి సారాంశం చదవకుండా పదవీ విరమణ శుభాకాంక్షలు కూడా చెప్పేసారు. ఈ వార్త రాసే సమయానికి సింధు చేసిన ట్వీట్ 1900 సార్లు రీట్వీట్ అయింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు "ఐ రిటైర్" అంటూ సోషల్ మీడియా వేదికలైన ఇంస్టాగ్రామ్, ట్విటర్ లో చేసిన పోస్టు సంచలనంగా మారింది. text: ఉబెర్ 'ఎగిరే టాక్సీ' సర్వీసుల ఊహాచిత్రం డాలస్, లాస్ ఏంజెల‌స్‌తో పాటు ఉబర్ సంస్థ తమ టాక్సీ ప్రోగ్రాం కోసం మెల్‌బోర్న్‌ను మూడో పైలట్ సిటీగా ఎంచుకుంది. ఇక్కడ 2020 నుంచి టెస్ట్ ఫ్లైట్స్ ప్రారంభిస్తారు. 2023 నాటికి ఈ సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది. భవిష్యత్ రవాణా సౌకర్యంగా చాలా కంపెనీలు ఫ్లైయింగ్ టాక్సీలను తయారు చేస్తున్నాయి. ఎయిర్ బస్ ఫ్లైయింగ్ టాక్సీ ఎగిరే ట్యాక్సీల ద్వారా ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ప్రయాణం సులభం అవుతుందని ఉబర్ చెప్పింది. నగరాలు పెరిగేకొద్దీ, ప్రైవేటు కార్లపై ఆధారపడడం అనేది నిలకడగా ఉండదు. అని సంస్థ ఏవియేషన్ డివిజన్ ఉబర్ ఎలివేట్ హెడ్ ఎరిక్ అల్లిసన్ చెప్పారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సాయం చేసేందుకు ఉబెర్ ఎయిర్ కు అపార సామర్థ్యం ఉందని అన్నారు. మెల్‌బోర్న్ మధ్య నుంచి విమానాశ్రయానికి ఉబర్ ఎయిర్ టాక్సీ ద్వారా 10 నిమిషాల్లో చేరుకోగలమని ఆయన చెప్పారు. అదే కార్లో దానికి గంట పడుతుందన్నారు. ఎగిరే టాక్సీల కోసం ఉబెర్ నాసా, అమెరికా సైన్యంతో కలిసి పనిచేస్తోంది. ఎంబ్రేర్, పిపిస్ట్రెల్ ఎయిర్ క్రాఫ్ట్ అనే విమానతయారీ సంస్థలు దీనికి విమానాలు అందిస్తున్నాయి. ఆస్ట్రియా-చైనా అర్బన్ ఎయిర్ మొబైలిటీ ప్రాజెక్ట్ గత ఏడాది ఉబర్ సంస్థ ఎగిరే టాక్సీల తయారీకి పారిస్‌లో ఒక ప్రయోగశాల ఓపెన్ చేస్తున్నట్టు చెప్పింది. ఎగిరే టాక్సీలతో ప్రయోగాలు చేస్తున్న సంస్థల్లో ఉబెర్ మాత్రమే కాదు, ఎయిర్ బస్ కూడా ఇలాంటి పరీక్షలే చేస్తోంది. చాలా స్టార్టప్ కంపెనీలు కూడా 'సెల్ఫ్ ఫ్లైయింగ్ టాక్సీ'లను కూడా టెస్ట్ చేస్తున్నాయి. దుబయి తమ డ్రోన్ టాక్సీ సేవలను 2017లో మొదటిసారి పరీక్షించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉబర్ సంస్థ నుంచి గాలిలో ఎగిరే టాక్సీలు అందుబాటులో రానున్నాయి. ఇలాంటి ఫ్లయింగ్ టాక్సీ సేవలకు ఆస్ట్రేలియా తొలి అంతర్జాతీయ మార్కెట్‌ కాబోతోందని ఆ సంస్థ తెలిపింది. text: ఓటేసినందుకు భారీ ఎత్తున లక్కీడ్రాలు ప్రకటించడంతో ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపడానికి ముందుకు వస్తున్నారు. ఈ బహుమతుల్లో కారు నుంచి ఫ్లాట్ వరకు ఆకర్షణీయమైనవి చాలా ఉన్నాయి. అయితే ఇదంతా ఒక ప్రహసనమంటూ కొట్టిపారేస్తోంది ప్రతిపక్షం. ఓటింగ్‌కు సరైనా ఏర్పాట్లు చేయలేదని, సక్రమంగా జరుగుతుందో లేదో చూసే స్వతంత్ర వ్యవస్థలు లేవని ఆరోపించింది. ఈ రాజ్యాంగ సంస్కరణలు చాలా ముఖ్యమని పుతిన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సంస్కరణలకు అనుకూలంగా రష్యన్లు తీర్పిస్తే పుతిన్‌ 2036 వరకు పదవిలో ఉండొచ్చు. రష్యాపై పుతిన్‌ వ్యూహం పోలింగ్‌ చివరి రోజు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. "మనం మున్ముందు జీవించే దేశం కోసం ఓటింగ్‌లో పాల్గొంటున్నాం. అదే దేశాన్ని మన పిల్లల చేతిలో పెట్టబోతున్నాం'' అన్నారు పుతిన్‌. ఈ ప్రసంగం చేసే సమయంలో ఆయన ఒక రష్యా సైనికుడి భారీ స్తూపం ఎదుట నిల్చుని ఉన్నారు. దీన్నిబట్టి ఆయన దేశభక్తి అస్త్రాన్ని వాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. మనం ఇవాళ మన భవిష్యత్తును తేల్చుకోబోతున్నామని, దానిపై ఎస్‌ అనే సూచిక ఒక అపార్ట్‌మెంట్ గోడ మీద రాసి ఉంది. 1993 తర్వాత రష్యా రాజ్యాంగానికి జరుగుతున్న అతిపెద్ద సమీక్ష ఇది. దీని ద్వారా అధ్యక్షుడు పుతిన్‌ గత రెండు దశాబ్దాలుగా రష్యాపై తనకున్న ఆలోచనలను అమలు చేసేందుకు అవకాశం దక్కుతుంది. "నేను ఇంతకాలం పదవిలో ఉండాలనుకుంటున్నాను అని పుతిన్‌ తనంతట తాను చెప్పుకోలేరు కదా'' అన్నారు రాజకీయ విశ్లేషకులు తాతియానా స్టానోవయా. "కొందరు తాము చేసే తప్పులను కనపడనివ్వకుండా, మంచి పనులను మాత్రం ఘనంగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఆయన రష్యాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాను, అలాగే ఈ పదవిలోనే ఎక్కువకాలం కొనసాగుతా అని చెబుతున్నారు'' అన్నారు తాతియానా స్టానోవయా. రష్యాలో ఈ ఓటింగ్‌తో ఎలాంటి మార్పులు రావొచ్చు. దేశభక్తితో కూడిన విద్యావిధానాన్ని అమలు చేయడానికి ఈ రాజ్యాంగ సవరణ ప్రయత్నిస్తుంది. సేమ్ సెక్స్‌ ‌మ్యారేజ్‌లను నిషేధిస్తుంది. ఇవన్నీ వ్లాదిమిర్‌ పుతిన్‌ పాలనాకాలంలో పెరుగుతున్న సంప్రదాయ సాంస్కృతికవాదానికి బలం చేకూర్చే నిర్ణయాలు. రాజ్యాంగ సంస్కరణల మీద జరుగుతున్న ఓటింగ్‌ ప్రక్రియ బుధవారంనాడు ముగుస్తుంది. సైద్ధాంతిక సంస్కరణలతోపాటు సాంఘిక సంస్కరణలకు కూడా ఈ రాజ్యాంగ సవరణలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కనీసం వేతన హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే వీటన్నింటికి భిన్నంగా, 2024తో ముగిసే తన పదవీ కాలాన్ని ఆరేళ్ల చొప్పున మరో రెండుసార్లు అంటే 2036 వరకు కొనసాగించేందుకు వీలుగా రాజ్యంగా సవరణ జరిపే అవకాశం ఉంది. రష్యాకు కొత్త రాజ్యాంగం ప్రస్తుతం రష్యా రాజ్యంగంలో పదుల సంఖ్యలో ఆర్టికల్స్‌ను సవరించడంతోపాటు కొన్ని కొత్త ఆర్టికల్స్‌ను కూడా చేరుస్తారు. వీటిని ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరించారు. 1.సంప్రదాయ సిద్ధాంతం •రష్యా భూభాగాన్ని దుర్వినియోగం చేసే ఏ చర్యనైనా అంగీకరించరు •1941-1945 మధ్య జరిగిన గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌ను, అందులో పాల్గొన్న యోధులను ఏ రూపంలోనూ అవమానించడానికి వీలు లేదు. •స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహాలను మాత్రమే చట్టపరంగా అంగీకరించడం •ఉన్నతాధికారులు విదేశీపాస్‌పోర్టులు, నివాసార్హతలు, విదేశీ బ్యాంకు ఎకౌంట్లు కలిగి ఉండటం నిషేధం •పూర్వీకుల నుంచి వచ్చిన దేవుడిని విశ్వసించే సంప్రదాయాన్ని కొనసాగించాలి. 2.సాంఘిక సంక్షేమం •పెన్షన్లను ద్రవ్యోల్బణానికి అనుసంధానించడం •జీవనాధార ఆదాయంకంటే తక్కువ కాకుండా కనీస వేతనం •జంతువుల పట్ల బాధ్యాయుతమైన వైఖరి ఓటింగ్‌కు ముందే రాజ్యాంగ ప్రతిని బుక్‌షాప్‌లలో కొనుక్కోవచ్చు. 3.వ్యవస్థలు •దేశీయ, విదేశీ విధానాలు రూపకల్పనకు, ఆర్దిక, సాంఘిక ప్రాధాన్యతలను గుర్తించేందుకు స్టేట్‌ కౌన్సిల్ ఏర్పాటు •ఒక వ్యక్తి కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్షపదవి చేపట్టగలడు ( ఇందులో "వరసగా రెండుసార్లు'' అనే పదాన్ని మారుస్తారు.) •ఒకవేళ ఆ వ్యక్తి అప్పటికే అధ్యక్షపదవిలో ఉంటే, గతంలో అదే పదవీ నిర్వహణను పరిగణనలోకి తీసుకోరు. అంటే ఇప్పటి వరకు పుతిన్‌ నిర్వహించిన పదవీకాలం సున్నాగా మారిపోతుంది. ఓటర్లకు రెండే ఆప్షన్లు ఓటర్లకు రెండే ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి వీటన్నింటికీ 'ఎస్‌' చెప్పడం లేదంటే 'నో' చెప్పడం మాస్కోలోని ఇళ్ల మీద అంటించిన పోస్టర్‌లో " మీ భవిష్యత్తు కోసం ఓటేయండి'' అన్న నినాదాలు మాస్కోలోని పలు అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లల్లో సంస్కరణల 'మీద' ఓటేయండి అని కాకుండా సంస్కరణల 'కోసం' ఓటేయండి అన్న నినాదాలు కనిపిస్తున్నాయి. పుతిన్‌కు'నో' చెప్పాలంటూ వెలుస్తున్న పోస్టర్లు మాస్కోలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఓటింగ్‌పై మహమ్మారి ప్రభావం రాజధాని మాస్కోకు కొద్దిదూరంలో ఉన్న పోడోల్క్స్‌ అనే ప్రాంతంలో ఓ కారు పార్కింగ్‌ స్లాట్‌లో టెంట్‌ వేసి అక్కడ ఒక ఓటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు ఫేస్‌మాస్క్‌లు ధరించి ఉన్నారు. కరోనావైరస్‌ విజృంభణ మధ్యే దేశవ్యాప్తంగా ఓటింగ్‌ జరుగుతోందనడానికి ఇది నిదర్శనంలా కనిపిస్తోంది. ఏప్రిల్‌ నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికలను వీలయినంత త్వరగా నిర్వహించాలని పుతిన్‌ ప్రభుత్వం భావించింది. మే మొదటి వారంలో లెవడా సెంటర్‌ ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వేలో పుతిన్‌కు అనుకూలంగా 59శాతం మంది ఓటేసినట్లు తేలింది. కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ఈ ఎన్నికల్లో దాదాపు అదే ఫలితాలు రావచ్చని భావిస్తున్నారు. ప్రజలను ఓటింగ్ కేంద్రాలకు రప్పించడానికి అధికారులు తమవంతు కృషి చేశారు. సైబీరియాకు చెందిన ఒక ఎన్నికల అధికారిణికి ఈ ఓటింగ్‌ కోసం నిర్వహించిన లక్కీడ్రాలో ఒక అపార్ట్‌మెంట్‌ బహుమతిగా దక్కింది. అయితే ఆమెకు బహుమతి రావడంపై అనుమానాలు వ్యక్తం కాగా, తాను ఓ సామాన్య ఓటరునేనని ఆమె స్పష్టం చేశారు. పోడోల్క్స్‌లో ఎలాంటి లక్కీ ప్రైజ్‌లు లేనప్పటికీ, పెన్షనర్లు ఉత్సాహంగా ఓటేయడం కనిపించింది. "ప్రభుత్వం చెబుతున్న సంస్కరణలు నాకు బాగా ఉపయోగపడతాయి'' అని తన ఓటు హక్కును వినియోగించుకుంటూ గలీనా అనే ఓటరు చెప్పారు. "ద్రవ్యోల్బణానికి పెన్షన్లను అనుసంధానించడం, చదువుకునే హక్కు, ఉపాధి, గృహనిర్మాణంలాంటివన్నీ నాకు ఇష్టమైన సంస్కరణలు'' అని ఆమె చెప్పారు. కాకపోతే ఇందులో కొన్ని కొత్త రాజ్యాంగంలో ఉండక పోవచ్చని ఆమె అన్నారు. "కేవలం స్త్రీ పురుషుల మధ్యే వివాహాలు అనేది నాకు అత్యంత నచ్చిన సంస్కరణ'' అన్నారు ఎలీనా అనే మహిళా ఓటరు. పుతిన్‌ ఎక్కువకాలం పదవిలో ఉన్నా తమకు అభ్యంతరం లేదని, ఆయన సమర్ధుడైన దేశాధ్యక్షుడని ఆమె వ్యాఖ్యానించారు. వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉందా ? మాస్కోలోని టౌన్‌ సెంటర్‌ దగ్గర రష్యా జెండాలు పట్టుకుని గుమిగూడి ఉన్న కొందరు యువకులు ఈ ఓటింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. "ఏముంది, పుతిన్‌ జీవితాంతం అధ్యక్షుడిగా ఉండాలి అంతే కదా'' అని ఈ ఓటింగ్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న యువతి పెదవి విరిచారు. తన ఫ్రెండ్స్‌ చాలామంది దీనికి వ్యతిరేకంగా ఓటేసినట్లు మాక్సిమ్‌ అనే యువకుడు వెల్లడించారు. "ఇప్పటికే 20ఏళ్లుగా పుతన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంకో 16యేళ్లు కూడా ఆయనేనా? దేశానికి కొత్త వ్యక్తికావాలి'' అన్నారు మాక్సిమ్‌. రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత అలెక్సీ నోవాన్లీ ఈ ఎన్నికల ప్రక్రియపై సోషల్‌ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు. మార్పు అవసరాన్ని సూచిస్తూ, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను బైటపెట్టారు. చాలామంది ఓట్లను వేరేవాళ్లు వేసేశారని, కొందరు ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. "ఈ ఎన్నికలు సిగ్గు చేటు'' అని ప్రముఖ బ్లాగర్‌ యూరి డూడ్‌ విమర్శించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పబ్లిష్‌ చేసిన ఈ పోస్ట్‌ను మిలియన్లమంది లైక్‌ చేశారు. జీవితాంతం పదవిలో ఉండాలనుకోవడం సరికాదంటూ 2008లో పుతిన్‌ చేసిన ప్రకటనను యూరి తన పోస్టులో ప్రస్తావించారు. కానీ తాను ఓటుకు దూరంగా ఉండదలుచుకోలేదని, పుతిన్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా 'నో' బాక్స్‌లో టిక్‌ చేశానని చెప్పారు యూరీ. వాస్తవానికి ఈ ఓటింగ్‌కు చట్టబద్ధత అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగ సంస్కరణలను మార్చిలోనే పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రజల నుంచి భారీ మద్దతు కూడగట్టాలనుకుంటున్న ప్రభుత్వం, 70శాతం ప్రజామోదాన్ని ఆశిస్తోంది. ఎన్నికల ముందు సహజంగా ఎగ్జిట్‌ పోల్స్‌ను నిషేధిస్తారు. కానీ తాజాగా జరిపిన ఎగ్జిట్‌ ఫలితాలలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. ఇప్పటికే రాజ్యాంగాన్ని ముద్రిస్తున్నారు. పుస్తకాల షాపుల్లో అమ్ముతున్నారు కూడా. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ మధ్యకాలంలో రష్యన్లంతా దేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి తమ అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో వెల్లడించే పనిలో బిజీగా ఉన్నారు. ఓటింగ్‌ కోసం చెట్ల కింద, పార్కుల్లో, ఒక్కోచోట కార్‌ పార్కింగ్‌లలో కూడా ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ బాక్సుల్లో తమ ఓటును వేస్తున్నారు. text: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2018 లోగో స్త్రీపురుషులిద్దరు పెనవేసుకుని కూర్చుని చదరంగం ఆడుతున్నట్లుగా ఉన్న ఈ లోగోపై అంతర్జాతీయ చెస్ ఆటగాళ్లు సైతం విమర్శలు కురిపిస్తున్నారు. చదరంగాన్ని ఇంత అసభ్యంగా చూపించడమేంటని గ్యారీ కాస్పరోవ్ వ్యాఖ్యానించారు. భారత ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ దీనిపై ట్విటర్‌లో స్పందిస్తూ 'ఈ లోగో చదరంగాన్ని ఆడ్ పొజిషన్‌లోకి నెట్టింది'' అని అన్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2018 లోగో ఆటను ఆడ్ పొజిషన్‌లోకి నెట్టిందని విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చేశారు 'ఇలాంటి పొజిషన్‌లో చెస్ ఆడడం కష్టమే' ఈ లోగోపై చెస్ ఆటతో సంబంధం లేనివారూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. అమెరికా కవయిత్రి హీథర్ క్రిసిల్ తాను చేసిన ట్వీట్‌లో ''నేను చదరంగం ఆడను. కానీ, నా దేహాన్ని సరైన స్థితిలో ఎలా ఉంచాలో చెప్పేలా ఉన్న చిత్రం గీసినందుకు ధన్యవాదాలు'' అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఇంకో నెటిజన్ అయితే.. ''నాకైతే ఇలాంటి పొజిషన్‌లో చదరంగం ఆడడం చాలా కష్టం'' అని ట్వీట్ చేశారు. సాధారణ చదరంగం బోర్డు కంటే ఇందులో ఉన్నది చిన్నగా ఉండడంతో కొందరు ట్వంటీ20 క్రికెట్‌తో పోల్చారు. పైగా ఇందులో 8 గడులకు బదులుగా 6 గడులు మాత్రమే ఉండడాన్ని మరికొందరు తప్పుపట్టారు. అమెరికాకు చెందిన మహిళా గ్రాండ్ మాస్టర్ సుసాన్ ట్వీట్ ఆటగాళ్ల అభ్యంతరం ఆస్ర్టేలియా గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ స్మెర్డాన్ ''ఇది జోక్ కాదు'' అంటూ ట్వీట్ చేశారు. మరో క్రీడాకారిణి సుసాన్ పోల్గార్ చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. చదరంగం ఆడేవారిలో 50 శాతం కంటే అధికులు చిన్నారులని.. చెస్‌ని ఇష్టపడే యువతకు కూడా ఇది సరైన సందేశం కాదని వ్యాఖ్యానించారు. ఈ లోగోకు మద్దతుగా మాట్లాడినవారూ ఉన్నారు. అందరూ ఈ లోగో గురించే మాట్లాడుకుంటున్నారని, అంటే, ఇది విజయవంతమైనట్లేనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, 'వరల్డ్ చెస్' మాత్రం దీనిపై తన స్పందనేమీ వెల్లడించలేదు. లోగో గురించి కానీ, ఆ డిజైన్ ఎంపిక చేయడానికి గల కారణాల గురించి కానీ మాట్లాడలేదు. తెలుగు నెటిజన్ల కామెంట్లు తెలుగు నెటిజన్లు ఏమంటున్నారు..? ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలుగు ప్రజలు కూడా దీనిపై స్పందించారు. సుదర్శన్ కొప్పిశెట్టి అనే ఫేస్‌బుక్ యూజర్ ''ఇదేమైనా చెస్ ఆడుతున్నట్లు ఉందా?'' అని వ్యాఖ్యానించారు. చెస్ బోర్డు పట్టుకున్న విధానం సరిలేదని, చిత్రం స్పష్టతనివ్వలేదని దివిటి వెంకటేశ్వర్లు అనే యూజర్ అభిప్రాయపడ్డారు. ''కామసూత్ర పుస్తకం ముఖచిత్రంలా ఉంది'' అంటూ బసంత్ చౌదరి అనే ట్విటర్ యూజర్ అన్నారు. గుండ్లపల్లి వెంకటేశ్వర్లు అనే మరో యూజర్ ''శోభనం గదిలో చదరంగం'' అంటూ ఈ లోగోపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రమేశ్ అనే ఇంకో నెటిజన్ ''లోగో బాగానే ఉంది కానీ, ఆ పొజిషన్ బాగులేదు'' అని కామెంట్ చేశారు. 'హాయ్ హైదరాబాద్' అనే ట్విటర్ అకౌంట్‌తో ఒకరు ఈ లోగో ఏమాత్రం బాగులేదని కుండబద్దలు కొట్టేశారు. లోగోలో ఉన్న మనుషుల చిత్రాలకు కాళ్లు వేయకుంటే సరిపోతుందని.. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పరని కీర్తి చంద్ర అనే ట్విటర్ యూజర్ సూచన చేశారు. మా ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చెస్ అనగానే తెలివితేటలు, ఆటలకు సంబంధించిన అంశాలే స్ఫురిస్తాయి. కానీ.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2018 లోగో చూడగానే అలాంటివేమీ గుర్తుకు రావడం లేదని, శృంగార భంగిమలను గుర్తుకు తెస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. text: ఆ పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని రోజులకే ఆమె మరణించారు. దాంతో ఆ పిల్లలను ఒక బుట్టలో పెట్టుకుని పొరుగు దేశమైన సుడాన్‌కి ఆయన తరలి వెళ్లారు. కొత్తగా పుట్టిన కవల పిల్లలతో పాటు, మరో అయిదేళ్ల కొడుకు, 14ఏళ్ల బావమరిదితో కలిసి ఆయన ఇప్పుడొక శరణార్థ శిబిరంలో తల దాచుకున్నారు. ఈ కవల పిల్లలను చూసుకునేందుకు ఒక అమెరికా డాక్టర్ సహాయ పడుతున్నారు. టీగ్రే ప్రాంతాన్ని కైవసం చేసుకోవడానికి ఇప్పటికే మూడు నెలలుగా పోరాటం కొనసాగుతోంది. ప్రాచీన సాంస్కృతిక నగరం అక్సుమ్‌కి నడి బొడ్డున ఈ ప్రాంతం నెలకొని ఉంది. ఇక్కడ ‘‘ది టీగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్’’, ఇథియోపియా మిలిటరీల మధ్య అధికారం చేజిక్కించుకోవడం కోసం పోరాటం సాగుతోంది. ఈ ఉద్రిక్తతల్లో కనీసం 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సుమారు 60,000 మంది పొరుగు దేశం సుడాన్‌కి వెళ్లి తల దాచుకున్నారు. నిరాశ్రయులైన ప్రతీ వ్యక్తి దగ్గర చెప్పడానికొక కథ ఉంది. మొదటి సారి తుపాకీ పేల్చిన శబ్దం విన్నప్పుడు వారికి కలిగిన భావాలు, గగనతలం నుంచి పేల్చే కాల్పుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి గుహల్లోకి వెళ్లి తల దాచుకున్నప్పటి అనుభవాలు, వారిని కాల్చినప్పుడు, లైంగికంగా హింసించినప్పుడు కలిగిన ఇబ్బందులు లాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా మంది ఈ కష్టాలను తట్టుకుని తిండీ నిద్రా లేకుండా సురక్షిత స్థానాలకు చేరడానికి రోజుల తరబడి ఎలా ప్రయాణం చేశారో కూడా చాలా మందికి గుర్తు ఉంది. భార్యను కోల్పోయిన అబ్రహ కిన్ఫె కథ ఇది.. టీగ్రే సంక్షోభంలో ఇప్పటికే పశ్చిమ ప్రాంతం బాగా వినాశనం అయింది. నాకు 40 ఏళ్లు. నా భార్య 29 ఏళ్ల లెతాయి సెగే మరణించారు. మాకు 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మాకు ముగ్గురు పిల్లలు. మేము పశ్చిమ టీగ్రే ప్రాంతంలో మయి కాద్రా పట్టణంలో ఉన్న వ్యవసాయ భూమిలో నివసిస్తూ ఉండేవాళ్లం. నవంబరు 10న ఫెడరల్ సేనలు మా ప్రాంతం వైపు రావడం మొదలు పెట్టాయి. అవి మా ఇంటిని దాటుకుంటూనే వెళ్లాయి. వారు మమ్మల్ని చూడలేదు. మేము ఊపిరి పీల్చుకున్నాం. అప్పుడే మా పొరుగు వారితో కలిసి పక్కనే ఉన్న ఒక పొదల్లోకి వెళ్లి దాక్కున్నాం. అప్పటికే నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయి. కానీ, ఆ సమయంలో మయి కాద్రాలో ఉండే ఆసుపత్రికి తీసుకుని వెళ్లడానికి చాలా భయపడ్డాను. మాతో పాటు దాక్కున్న మా పొరుగింటి మహిళ సహాయంతో నా భార్య ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. నేను ఆమె మంచితనానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆ తరువాత రోజు మేము ఇంటికి వెళ్లిపోయాం. కానీ, లెతాయికి ప్రసవం తరవాత అందాల్సిన చికిత్స అందకపోవడంతో రక్త స్రావం ఆగలేదు. మరో 10 రోజులకు ఆమె మరణించారు. నా గుండె పగిలిపోయింది. మా పొరుగు వారి సహాయంతో ఆమెను మా పొలంలో పాతి పెట్టాం. ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగలిగి ఉంటే బ్రతికి ఉండేది. కానీ, అప్పటికే పరిస్థితులన్నీ తలకిందులుగా ఉన్నాయి. ప్రజలంతా ప్రాణాలను రక్షించుకోవడం కోసం పారిపోతున్నారు. మా ఊరొక దెయ్యాల పట్టణంగా మిగిలిపోయింది. టీగ్రే ఉద్రిక్తతల్లో కనీసం 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ఐదేళ్ల క్రితం నేను, నా కుటుంబం జాత్యహంకార ఉద్రిక్తతల నడుమ మెటామా పట్టణం నుంచి నిరాశ్రయులుగా వచ్చేశాం. అక్కడి నుంచి మేము మయి కద్రాకి వెళ్లి మా జీవితాలను తిరిగి పునర్నిర్మించుకున్నాం. అక్కడ ఉండే స్థానిక పరిపాలన కారులు మాకు ఒక చిన్న భూమిని సాగు చేసుకోవడానికి ఇచ్చారు. ఆ కొత్త ప్రదేశంలో మట్టి, చెక్కతో కూడిన ఒక చిన్న ఇంటిని కట్టుకున్నాం. అది సౌకర్యవంతంగా ఉండేది. అక్కడే మా కొడుకు పుట్టాడు. నా కవల పిల్లలు కూడా అక్కడే పుట్టారు. కానీ, మరో 20 రోజుల్లోనే మేము ఆ ప్రాంతాన్ని వదిలి పెట్టాల్సి వచ్చింది. నా భార్య చనిపోయినప్పుడు నా ప్రపంచం కూలిపోయినట్లనిపించింది. నా చేతుల్లో తనని పట్టుకుని చాలా ఏడ్చాను. మా జీవితాలలో బాధను మిగిల్చిన ఆ యుద్ధాన్ని నేను చాలా ద్వేషించాను. నా ప్రియమైన భార్యకు, నా పిల్లల తల్లికి ప్రాథమిక వైద్య చికిత్స దొరకకపోవడం వలన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. పరిస్థితి ప్రమాదకరంగానే ఉండటంతో మా పొరుగువారు సుడాన్ వెళ్లిపోయారు. నేను నా పిల్లలు, బావమరిదితో కలిసి ఇక్కడే ఉండిపోయాను. ఎప్పుడైనా సైనికులు కనిపిస్తే పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి దాక్కునేవాళ్లం. ఒక్కడినే పిల్లలను చూసుకోవడం చాలా కష్టంగా ఉండేది. పొరుగు వారు కూడా లేరు. ఈ వయసులో పిల్లలకు తల్లి పాలు చాలా అవసరం. నీటి చుక్కలు, పంచదార, వేళ్లని సూపులో ముంచి వాళ్లకి చుక్కలుగా పట్టడం లాంటివి చేస్తూ వారిని బ్రతికించాను. 20 రోజుల తర్వాత అక్కడే ఉన్న ఫెడరల్ సేనల దగ్గరకు వెళ్లి నా పిల్లలను దగ్గరలో ఉన్న హుమేరా పట్టణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం వీలవుతుందో లేదో కనుక్కున్నాను. అదృష్టవశాత్తు వారు నన్ను వెళ్ళడానికి అంగీకరించారు. అప్పుడు నేను టెకెజె నది దగ్గరకు వెళ్లి బోటులో సుడాన్‌లో ఉన్న హందాయిత్ ప్రాంతానికి వెళ్లాను. నా పిల్లలను ఒక బుట్టలో పెట్టుకుని, మిగిలిన పిల్లలను వెంట పెట్టుకుని వెళ్లాను. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న శరణార్థి శిబిరంలో చోటు దొరికింది. రెడ్‌క్రాస్‌కి చెందిన ఒక అమెరికా డాక్టర్ పిల్లలను చూసుకుంటున్నారు. వారికి కావల్సినవన్నీ చూసుకుంటూ వారి పెరుగుదలను ప్రతీ మూడు రోజులకొకసారి పరిశీలిస్తున్నారు. ఆమె శరణార్ధులపై చూపుతున్న దయ, మద్దతుకు భగవంతుడు ఆమెను ఆశీర్వదించాలి. ఇప్పుడు కవల పిల్లలిద్దరూ రెండు నెలల వయసు వారయ్యారు. వారు బరువు పెరుగుతుండటం గమనిస్తున్నాను. కానీ, మా ఐదేళ్ల కొడుకు మాత్రం అమ్మను బాగా అడుగుతున్నాడు. వాడు తరచూ అమ్మ గురించి అడుగుతూ ఉంటాడు. అలా అడిగినప్పుడల్లా నా గుండె పగిలిపోతూ ఉంటుంది. ఆమె త్వరలోనే వస్తుందని అబద్ధం చెబుతున్నాను. లెతాయ్ మాతో లేని విషయాన్ని అర్ధం చేసుకునేందుకు నేను నిరంతరం ప్రశ్నించుకుంటూనే ఉంటాను. జీవితం చాలా కఠినంగా ఉంటుంది. నా చేతిలో ఉన్న కవల పిల్లలు.. నా భార్యను నిరంతరం గుర్తు తెస్తూనే ఉంటారు. నా పరిస్థితిని చూసి మిగిలిన శరణార్థులు జాలి పడుతూ ఉంటారు. నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నా పిల్లలకు ఈడెన్, ట్రెఫీ అనే పేర్లు పెట్టమని సలహా ఇచ్చారు. సనాతన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అమ్మాయిలకు పుట్టిన 80 రోజుల తర్వాత బాప్టిజమ్ చేయాలి. ఆ రోజు దగ్గరకు వస్తోంది. కానీ, మాకు ఆ సేవలు అందించడానికి ఇక్కడ చర్చిలు లేవు. నేనింకా బాధలోనే ఉన్నాను. నా పిల్లలను ఒక సురక్షిత వాతావరణంలో పెంచే ధైర్యం ఇవ్వమని నేను దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ దౌర్భాగ్యమైన ఉద్రిక్తతలు త్వరలోనే తగ్గి, మేము వదిలిపెట్టిన జీవితాన్ని తిరిగి పొందుతామని ఆశిస్తున్నాను. శాంతి భద్రతలు మా జీవితాలలో ఎందుకు కొరవడ్డాయి అనే విషయం గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. మేమెందుకు ఇలా బాధపడాలి? మాకు ఈ విషాదాన్ని మిగిల్చిన వారు సౌకర్యవంతంగా, స్థిరంగానే బ్రతుకుతుంటే.. మాకెందుకు సురక్షితంగా నివసించే అవకాశం కూడా దొరకటం లేదు? వారు వారి పిల్లలను ఎటువంటి సమస్యలు లేకుండా పెంచుకుంటున్నారు. వారి పిల్లలు ఇంట్లో దొరికే ఆప్యాయతలను ప్రేమను పొందుతున్నారు. వారిని వారి తల్లితండ్రులు పెంచుకుంటున్నారు. వారు స్కూలుకు వెళుతున్నారు. పొరుగువారితో కలిసి ఆడుకుంటున్నారు. నేను ఐదేళ్ల క్రితం మెటామా వదిలిపెట్టి మయికాద్రాలో స్థిరపడిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. నేను అక్కడ సమాజంలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బ్రతకడం కోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉండేవాడిని. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను బాగానే పని చేశాను. ఆదాయం కోసం నాకిచ్చిన భూమితో పాటు మరి కొంత భూమిని కౌలుకు తీసుకున్నాను. నేను నువ్వులు, జొన్నలు పండించేవాడిని. ఇక్కడ నేనేమి పని చేయటం లేదు. ప్రేమించడానికి భార్య లేదు. సమాజం లేదు. వెళ్ళడానికి చర్చి లేదు. కాపుకొచ్చిన పంట గురించి కూడా ఆలోచిస్తున్నాను. గతం తల్చుకోవడం, నాకున్న ఆస్తులను గుర్తు చేసుకోవడం, జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడం, నా పిల్లలు ఎలా గడిపేవారో ఆలోచించుకోవడం తప్పా ఇప్పుడు నేనింకేమీ చేయలేను. నేను ఒక శరణార్థిగా గడపడానికి ఉన్న పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ఆవేదన చాలా తీవ్రమైనది. నా పిల్లలకు ఇంత బాధ కలగకూడదు. అంహార, టీగ్రే ప్రజల మధ్య తలెత్తిన ఈ అర్ధంపర్ధం లేని జాత్యహంకార గొడవల్లో మా సర్వస్వం కోల్పోయాం. సుడాన్‌లో ఉన్న శిబిరాలలో కొన్ని వేల మంది శరణార్థులు తల దాచుకున్నారు. మేమంతా టీగ్రే కి చెందిన వారిమే. మేము ఈ సంక్షోభం వలన తీవ్రంగా ప్రభావితులమయ్యాం. ఈ యుద్ధం త్వరలోనే ముగిసి శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను. మేము ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాం. మా తండ్రులు, తాతలు నివసించిన భూమి పై మేము తిరిగి జీవనాన్ని పునరుద్ధరించుకోవాలని చూస్తున్నాం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇథియోపియాలోని టీగ్రే ప్రాంతంలో హింసాత్మక సంక్షోభ సమయంలో సైనికుల కంటికి కనిపించకుండా ఒక మహిళ కవల పిలల్లకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె భర్త బీబీసీతో పంచుకున్నారు. text: వారు నివసిస్తున్న దేశాల్లో మాతృ భాష పరిరక్షణపై చేపడుతున్న చర్యలు, తమ తర్వాత తరాలవారికి భాషను అందించడానికి చేస్తున్న కృషిని వారు బీబీసీకి వివరించారు. వీరందరి కృషినీ తెలుగు వారందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడెక్కడో ఉన్న వారందరికీ ఆహ్వానాలు పంపించి రప్పించామని సమన్వయ కర్త మహేశ్ తెలిపారు. దాదాపు 42 దేశాల నుంచి 420 మంది ప్రతినిధులు ఈ సభల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఇంతమంది కవులున్నారా? "తెలంగాణలో ఇంత సాహిత్యముందా? తెలంగాణ కవులు అనగానే అందరికీ గుర్తొచ్చేది దాశరథి, కాళోజీ. కానీ ఇంకా ఎంతోమంది స్థానిక కవులున్నారనే విషయం తెలిసింది. మొట్టమొదటి కథ తెలంగాణలోనే పుట్టిందనే విషయం కథా సదస్సులో విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది" అని లండన్ నుంచి వచ్చిన ఎన్నారైల బృందం వెల్లడించింది. "మలేషియాలో సుమారు 4 లక్షల మంది తెలుగువారు ఉంటారు. తెలుగువారికి ఏ అవసరమొచ్చినా ఆదుకోవడానికి మేమంతా ఎప్పుడూ ముందుంటాం. తమిళులు ఎక్కడున్నా హడావిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరికీ వారి గురించి తెలుస్తుంది. కానీ తెలుగువారు క్రియాశీలంగా ఉండకపోవడం వల్ల మనకు ప్రాధాన్యం దక్కడం లేదు. మా పిల్లలందరికీ తెలుగు నేర్పిస్తాం. సినిమాల్లో వాడే బూతులు కూడా మా పిల్లలకు అర్థమవుతాయి" అని మలేషియా నుంచి వచ్చినవారు తెలిపారు. "న్యూజీలాండ్‌లో తెలుగువారిని చాలా బాగా ఆదరిస్తారు. పిల్లలకు ఇక్కడ లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు ఎలా ఉండాలనే విషయాలను తెలుగువారి పిల్లలకు నేర్పిస్తాం" అని న్యూజీలాండ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ సభల్లో పాల్గొనడానికి లండన్ నుంచి కూడా చాలామంది వచ్చారు. "ఈ సభల ఏర్పాట్లు, నిర్వహణ చూస్తుంటే ఒలింపిక్స్ చూసినంత గొప్ప భావన కలిగింది. తర్వాత తరాలకు భరత నాట్యం నేర్పిస్తున్నాం. ఇక్కడ మేం నేర్చుకున్న విషయాల్ని కూడా పిల్లలకు నేర్పుతాం. తెలంగాణ భాష, యాసల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పగలిగాం. ఇంట్లో మనం తెలుగులోనే మాట్లాడుతూ, మన పిల్లలకూ భాషను నేర్పిస్తుంటే అవలీలగా మన భాషను తర్వాత తరానికి అందించగలుగుతాం. లేకపోతే మరో రెండు మూడు తరాల తర్వాత ఇంక భాష అనేది కనిపించదు. ఎన్నారైలంతా ఇంట్లో తెలుగే మాట్లాడుతూ పిల్లలకు భాషను నేర్పాలనేది మా ఆలోచన" అని నవీన్ రెడ్డి, సృజన్ రెడ్డిలతో కూడిన బృందం తెలిపింది. సమస్య వస్తే ఎవరికి చెప్పాలో తెలిసేది కాదు! "నేను రేడియో జాకీగా పనిచేస్తున్నా. కువైట్‌లో 3 లక్షల మంది తెలుగువాళ్లుంటారు. ఏవేవో ఊహలతో అక్కడికి వచ్చి ఇబ్బందులు పడేవాళ్లు చాలామందే ఉంటారు. మేం వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాం" అని కువైట్ నుంచి వచ్చిన ఎన్నారై ప్రతినిధి తెలిపారు. "నేను వెళ్లిన కొత్తలో ఏదైనా సమస్య వస్తే ఎవరిని అడగాలో అర్థమయ్యేది కాదు. అప్పుడే అసోసియేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది" అని తెలుగువాళ్లతో తన అనుబంధాన్ని ఏ రకంగా పెంపొందించుకున్నదీ వివరించారు హాంకాంగ్ నుంచి వచ్చిన ఓ మహిళ. "అమెరికాలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారు కాబట్టి తెలుగు పరిరక్షణకు మరింత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ మహాసభల్లో పాల్గొన్న తర్వాత అమెరికాలోని తెలుగు పాఠ్యాంశాల్లో ఏం మార్పులు చేయాలనే దానిపై ఓ స్పష్టత వచ్చింది" అని అమెరికాలోని న్యూజెర్సీ నుంచి వచ్చిన శ్రీనివాస్ వెల్లడించారు. "ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ తెలుగు భాషా పరిరక్షణకోసం ఎలాంటి చర్యలూ లేవు. ఈ సభల స్ఫూర్తితో ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రారంభమవుతాయి" అని నాగేందర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈయన ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. అవధానాల్లో ఇన్ని రకాలా? "అవధానాల్లో ఇన్ని రకాలుంటాయని ఇప్పుడే తెలుసుకున్నా" అని స్కాట్లాండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రమోద్ కుమార్ అన్నారు. "ఎన్నారైలందరినీ ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది" అని సునీత చెప్పారు. ఈమె సింగపూర్‌లో నివసిస్తున్నారు. "ప్రతి సంవత్సరం తెలుగువారందరం ఒకచోట కలుస్తాం. ఈ సభల ద్వారా మన భాషను పరిరక్షించుకోవాలనే స్పృహ మాకు కలిగింది. దీన్ని ఎలా చేయాలనేదానిపై మేం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం" అని థాయ్‌లాండ్ నుంచి ఇక్కడకు వచ్చిన హర్షా రెడ్డి, రమేష్ పేర్కొన్నారు. మొదటి కవిత ఎక్కడ పుట్టింది? "మొదటి కవిత కరీంనగర్ జిల్లా నుంచే పుట్టిందని తెలిసి ఆ జిల్లావాసిగా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను" అని డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల బృంద సభ్యుడు శ్యాంబాబు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన సతీశ్ కుమార్, వెంకటేశ్... "ప్రతి శుక్రవారం ఆంధ్రా గల్లీలో తెలుగువారంతా కలుస్తాం. చర్చించుకుంటాం. పండుగలా ఉంటుంది" అన్నారు. "జాంబియాలో దాదాపు 10 వేల మంది తెలుగువాళ్లున్నారు. తెలుగు మహాసభలు ఇంత ఘనంగా జరుగుతాయని ఊహించలేదు" అని జాంబియా ఎన్నారై తెలుగు వ్యక్తి చెప్పారు. "పాఠశాలల్లో కొరియన్ భాష ఉండటంతో తల్లిదండ్రులు మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చేయాలని ఆలోచిస్తుంటారు" అని దక్షిణ కొరియాలో నివసిస్తున్న తరుణ్ తెలిపారు. "ఫిజీలో తెలుగువాళ్లు తక్కువే ఉన్నారు. కానీ మేము తెలుగు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. మా దగ్గర తెలుగు బోధించేవాళ్లెవరూ లేరు" అని ఫిజీ నుంచి వచ్చిన ఉమేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. "ఇవి తెలుగు మహాసభలేనా అని చూసి ఆశ్చర్యపోయేంత గొప్పగా నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. ఖతార్‌లో తెలుగు భాషాభిమానులు చాలామంది ఉన్నారు. వారందరి సాయంతో మేము కూడా భాషా పరిరక్షణ గురించి పాటుపడుతున్నాం. పిల్లలకు ప్రతి శుక్ర, శనివారాల్లో తెలుగు నేర్పిస్తున్నాం" అని ఖతార్‌లో నివసిస్తున్న శ్రీధర్ తెలిపారు. "మేం చిన్నప్పటి నుంచే తెలుగు నేర్చుకోవడానికి మా దగ్గర అవకాశాలున్నాయి. ప్రతి విద్యార్థికీ మాతృభాష నేర్చుకునే హక్కు ఉంటుంది. అందుకే ప్రభుత్వమే అవకాశాలు కల్పిస్తుంది" అని మారిషస్, స్వీడన్‌కు చెందిన మహిళల బృందం తెలిపింది. "మనమెక్కడా వినని కవుల పేర్లతో ఇక్కడ తోరణాలు కట్టి వారందరినీ ఓసారి గుర్తుచేశారు" అని దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. బీబీసీ న్యూస్ తెలుగుతో వీరు మాట్లాడిన వీడియో చూడండి. మా ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ దేశంలోని తెలుగువారి గురించి, తెలుగు భాష పరిరక్షణ గురించి, హైదరాబాద్‌లో తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా వారు పొందిన అనుభవాల గురించి బీబీసీ న్యూస్ తెలుగుతో ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు. text: ఈ వివాదంతో తమ కుటుంబం బాగా ఇబ్బంది పడుతోందనీ, తాము ఇందులోంచి బయటపడాలని అనుకుంటున్నామనీ ఆయన ముంబయిలో జరిగిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుకుంటున్నారా అని విలేఖరులు అడగగా, తాము ఎలాంటి విచారణనూ కోరుకోవడం లేదని అనుజ్ చెప్పారు. "ఈ విషయంలో మా కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది. మాకు ఎవరిపైనా ఎలాంటి ఆరోపణా లేదు. మేం చాలా బాధలో ఉన్నాం. మేం వీటన్నింటి నుంచి బయట పడాలని అనుకుంటున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను" అని 21 ఏళ్ల అనుజ్ అన్నారు. అనుమానాల నేపథ్యం సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ లోయా 2014 డిసెంబర్‌ 1న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మరణించారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి ఆయన అక్కడికి వెళ్లగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)తో ఆయన మృతి చెందారు. జస్టిస్ లోయా ఆ సమయంలో సోహ్రాబుద్దీన్ 'ఎన్‌కౌంటర్' కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ కేసును మూసేశారు. అమిత్‌షాను నిర్దోషిగా తేల్చారు. అయితే, లోయా కుటుంబీకులతో జరిపిన సంభాషణల ఆధారంగా 'ద కారవాన్' పత్రిక ప్రచురించిన కథనంలో ఆయన మృతికి దారితీసిన పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. దాంతో ఆయన మృతిపై విచారణ జరిపించాలనే డిమాండ్ మొదలైంది. కానీ ఇద్దరు న్యాయమూర్తులను ఉటంకిస్తూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రచురించిన మరో కథనంలో ఈ అనుమానాలు నిరాధారమని పేర్కొన్నారు. శుక్రవారం ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కేసు చాలా తీవ్రమైందిగా అభివర్ణించింది. వధూవరులతో జస్టిస్ లోయా (కుడి వైపున చివరి వ్యక్తి) లేఖ రాసింది నిజమే కానీ.. తన తండ్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అనుజ్ గతంలో రాసిన లేఖ గురించి విలేఖరులు ప్రస్తావించగా, "ఆ సమయంలో నేను తీవ్రమైన భావోద్వేగానికి లోనై ఉన్నాను. నేను విషయాలను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు నాకు అనుమానాలు కలిగాయి. కానీ ఇప్పుడు నాకు అనుమానాలేం లేవు" అని అనుజ్ చెప్పారు. అనుజ్ గతంలో రాసినట్టుగా చెబుతున్న ఆ లేఖలో, "నాన్న గారి మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నేను ఆయనను (జస్టిస్ మోహిత్ షా) కోరాను. నాకు గానీ, మా కుటుంబ సభ్యులెవరికైనా గానీ ఏదైనా జరిగితే ప్రధాన న్యాయమూర్తి మోహిత్‌షాది, ఈ కుట్రలో భాగస్వాములైన ఇతరులదే బాధ్యత" అని ఉంది. 'ద కారవాన్' 2017 నవంబర్ 21 సంచికలో ఈ లేఖను ప్రచురించారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్‌లో అనుజ్ ఆ లేఖను తాను రాయలేదని అనలేదు. అయితే, 'ద కారవాన్' కథనం వెలువడ్డ వారం రోజులకే అనుజ్ యూ-టర్న్ తీసుకుంటూ, తనకు తన తండ్రి మృతి చెందిన పరిస్థితుల విషయంలో 'ఎలాంటి అనుమానాలు లేదా ఫిర్యాదులు లేవు' అని అన్నారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్‌లో అనుజ్ చాలా అసౌకర్యంగా కనిపించారు. ఈ సమావేశంలో ఆయన బంధువు, స్నేహితుడు, న్యాయవాది అమిత్ నాయక్ ఆయన పక్కనే ఉన్నారు. అనుజ్‌ను ప్రశ్నలు అడగనివ్వకుండా న్యాయవాది అమిత్ పదే పదే అడ్డుకున్నారంటూ ఆ సమావేశంలో హాజరైన విలేఖరులు ఫిర్యాదు చేశారు. జస్టిస్ లోయా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అనుజ్ తాతగారు, మేనత్త పత్రికలకు ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ, కుటుంబంలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయా అని అనుజ్‌ను ఓ విలేఖరి ప్రశ్నించారు. దానికి జవాబుగా అనుజ్, "వారికి అనుమానాలు కలిగిన మాట నిజమే. ఇప్పుడు వారికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు" అని చెప్పారు. అనుజ్ కుటుంబ స్నేహితుడైన ఓ వ్యక్తి సమావేశంలో ఇలా అన్నారు: "ఈ కుటుంబ సభ్యులను వేధించవద్దని నేను ఎన్‌జీవోలకూ, న్యాయవాదులకూ, రాజకీయ నాయకులకూ విజ్ఞప్తి చేస్తున్నా. వీరు గత మూడేళ్లుగా బాధ పడుతున్నారు. బీహెచ్ లోయా మృతిపై ఎలాంటి వివాదం లేదు. ఈ విషయంలో మీడియా సహకారం కోరుకుంటున్నాం. దీని నుంచి లబ్ధి పొందాలని ఎవరూ ప్రయత్నించొద్దని మేం కోరుకుంటున్నాం." 'ద కారవాన్' కథనం అచ్చయిన తర్వాత, లోయా మృతిపై విచారణ జరిపించాలని రిటైర్డ్ న్యాయమూర్తి ఏపీ షా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కోర్టు ఆ పిటిషన్ విచారణను జనవరి 15కు వాయిదా వేసింది. శుక్రవారం నాడు నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. 'తీవ్ర పరిణామాలుండే అవకాశాలున్న కేసులను పారదర్శకత లేకుండా కేటాయిస్తున్నారని' నలుగురు న్యాయమూర్తులు విమర్శలు చేశారు. తాము లేవనెత్తుతున్న ఫిర్యాదుల్లో జస్టిస్ లోయా మృతి కేసు కూడా ఉందా అని విలేఖరులు వారిని ప్రశ్నించగా, నలుగురు న్యాయమూర్తుల్లో ఒకరు "అవును" అని జవాబిచ్చారు. ఈ కేసును కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తింది. జస్టిస్ లోయా మృతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం నాడు డిమాండ్ చేశారు. అంతకు ముందు, బహ్రెయిన్‌ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, తీవ్రమైన కేసుల విచారణ జరిపే న్యాయమూర్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జస్టిస్ బ్రజ్‌గోపాల్ లోయా కుమారుడు అనుజ్ ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చారు. తమ తండ్రి మృతిపై తమ కుటుంబానికి ఎవరిపైనా 'ఎలాంటి ఆరోపణలూ లేవు' అని ఆయన అన్నారు. text: కాకినాడ స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో భాగంగా కాకినాడ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.వెయ్యి కోట్లు వెచ్చించాల్సి ఉంది. అందులో, ఇప్పటివరకు రెండు ప్రభుత్వాల నుంచి రూ.400 కోట్లు విడుదలయ్యాయని నగర మేయర్‌ సుంకర్‌ పావని బీబీసీతో చెప్పారు. నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కార్పొరేట్‌ స్కూళ్ల తరహాలో సౌకర్యాలు, వర్చువల్‌ తరగతులు, డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. పార్కుల సుందరీకరణ పనులు చేశామని మేయర్ చెప్పారు. వీడియో: కాకినాడ రూపురేఖలు మారాయా? అయితే, కేవలం పైపై మెరుగులు దిద్దుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను పాలకవర్గం పట్టించుకోవట్లేదని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. రోడ్లపై రోడ్లు వేస్తున్నారు కానీ, మురికివాడలను పట్టించుకోవడంలేదని వైసీపీ నగర సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్‌ విమర్శించారు. కాకినాడలో డ్రైనేజీ వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు. "పార్కులు సైతం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా వ్యాయామ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఖాళీ స్థలాలను క్రీడా ప్రాంగణాలుగా మార్చాం. కళాక్షేత్రం పేరుతో ఆడిటోరియం ఏర్పాటు చేశాం. మొత్తం 54 ప్రాజెక్టులు చేపట్టాం. అందులో 11 పనులు పూర్తయ్యాయి, మరో 33 జరుగుతున్నాయి, మిగతావి డీపీఆర్‌ దశలో ఉన్నాయి" అని మేయర్ పావని వివరించారు. అయితే, మేయర్ చెబుతున్నట్లు పార్కులను తీర్చిదిద్దారు... కానీ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని నగరానికి చెందిన గృహిణి భారతి అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, ప్రస్తుత సర్కారు కానీ ఆ సమస్యకు పరిష్కారం చూపలేదని ఆమె చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేసిన ఏసీ బస్టాప్ 'పార్కులు పచ్చగా ఉన్నప్పుడే ఆహ్లాదంగా ఉంటాయి. కానీ, సుందరీకరణ పేరుతో మొత్తం కాంక్రీట్‌ మయం చేశారు. ఉన్న రోడ్ల మీదే రోడ్లు వేసి దాన్నే నగర సుందరీకరణ అని చెబుతున్నారు. ఆ రహదార్ల నుంచి ఒక కిలోమీటర్‌ లోపలికి వెళితే మొత్తం మురికివాడలే. పైపై మెరుగులు దిద్ది మసిబూసి మారేడుకాయ చేస్తే స్మార్ట్‌ సిటీ అవుతుందా? నిధులు రెండేళ్ల క్రితమే వచ్చినా దాదాపు రూ.250 కోట్లు బ్యాంకులకే పరిమితం చేశారు. వైసీపీ పోరాటంతోనే ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు చేపట్టారు. అందులోనూ భారీగా అవినీతి చోటు చేసుకుంది' అని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ ఆరోపించారు. నగరంలో ఇప్పటి వరకు ప్రజా రవాణా సౌకర్యం లేదని దానిపై దృష్టిపెట్టాలని స్థానికుడు విజయ్‌ సూచించారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి మొదటి విడత పథకంలోనే కాకినాడ స్థానం సంపాదించుకుందని, ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తయితే నగరం రూపురేఖలు మారిపోతాయని నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేష్‌ అంటున్నారు. "కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. రూ.117కోట్లతో 11 ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తి చేశామని, రూ.518 కోట్లతో 33 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 10 పనులు రూ.250 కోట్ల విలువతో డీపీఆర్‌ దశలో ఉన్నాయి. మురికివాడల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు వేస్తున్నామని కమిషనర్ రమేశ్ చెప్పారు. "10 మురికివాడలను ఎంపిక చేసి కనీస అవసరాలు కల్పించబోతున్నాం. ప్రస్తుతం నాలుగు చోట్ల పనులు జరుగుతున్నాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ఫైలెట్‌ ప్రాజెక్టుగా కొంత ప్రాంతాన్ని ఎంపిక చేసి చేయబోతున్నాం. ఎలక్ట్రికల్‌ బస్సులు తీసుకొచ్చి ప్రధానంగా నాలుగు రూట్లల్లో ఆర్టీసీ సాయంతో నడపాలని ప్రణాళిక ఉంది. ఇవన్నీ డీపీఆర్‌ దశలో ఉన్నాయి" అని వివరించారు. నగరవాసి మిత్తిపాటి రమణ మాట్లాడుతూ... తాను చిన్నప్పటి నుంచీ నగరాన్ని చూస్తూనే ఉన్నానని, ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందిందన్నారు. అయితే, పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పన కూడా జరగాలని, చాలా ప్రాంతాల్లో తాగు నీటి సమస్య ఉందన్నారు. అభివృద్ధి కేవలం రోడ్లు, లైటింగ్‌ ఏర్పాటుకే పరిమితం కాకుండా తాగునీరి సరఫరా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన కూడా జరగాలని విశ్రాంత ఉద్యోగి సుబ్రహ్మణ్యం కోరుతున్నారు. "470 చోట్ల ఉచిత వైఫై సౌకర్యం కల్పించాం. ప్రజలను అప్రమత్తం చేసేందుకు 30 ప్రధాన కూడళ్లలో ఒకేసారి సమాచారం చేరవేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. పెథాయి తుపాను వచ్చిన సమయంలో ఈ వ్యవస్థ ద్వారానే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేయగలిగాం. 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కూడా ఆ కెమారాల్లో ఉండే ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా గుర్తించొచ్చు. ఇలా ట్రాఫిక్‌ సక్రమంగా ఉండేలానూ, నేరాలు ట్రాక్‌ చేయడంలో ఉపయోగంగా ఉంటుంది" కమిషనర్ రమేశ్ వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'పెన్షనర్స్‌ ప్యారడైజ్‌'గా పిలిచే కాకినాడ నగరం దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న 100 స్మార్ట్‌సిటీల్లో ఒకటి. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో నగరం అభివృద్ధి జరిగిందా? text: హోక్కైడో చేపట్టిన చర్యలు మొదట్లో పని చేస్తున్నట్లే కనిపించాయి ఫిబ్రవరి చివరి వారంలో జపాన్ లోని హోక్కైడో కోవిడ్-19 కారణంగా అత్యవసర పరిస్థితిని విధించిన తొలి నగరం. స్కూల్స్ మూసేసి, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలను రద్దు చేసి, ప్రజలను ఇంటి వద్దనే ఉండమని కోరారు. స్థానిక ప్రభుత్వాలు వైరస్ ని నియంత్రించడానికి సత్వర చర్యలు చేపట్టి, వైరస్ సోకిన వారిని గుర్తించి, వారిని కలిసిన వ్యక్తులను వెంటనే నిర్బంధంలో పెట్టారు. ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చి మార్చి మధ్యకల్లా వైరస్ కేసులు నమోదవ్వడం రోజుకి ఒకటి, రెండుకి పడిపోయింది. దీంతో మార్చి 19 వ తేదీన అత్యవసర పరిస్థితిని సడలించారు. ఏప్రిల్ మొదటి వారంలో స్కూళ్లను కూడా తెరిచారు. అత్యవసర పరిస్థితిని సడలించిన 26 రోజుల్లోనే తిరిగి విధించాల్సిన అవసరం ఏర్పడింది. గత వారంలో హోక్కైడోలో 135 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో వలె ఈ కేసులు జపాన్ బయట నుంచి వచ్చినట్లు ఆధారాలు లేవు. కొత్తగా వైరస్ సోకిన వారిలో విదేశీయులు ఎవరూ లేరు. వైరస్ సోకిన వారు కూడా గత నెలలో జపాన్ నుంచి బయటకి వెళ్ళలేదు. హోక్కైడోలో వైరస్ నియంత్రణలో ఏమి జరిగింది? వైరస్ మొదలైన వెంటనే చర్యలు తీసుకుంటే దానిని నియంత్రణలోకి తేవచ్చు. మొదట వైరస్ సోకిన సమూహాలను గుర్తిస్తే, పరీక్షలు నిర్వహించి వైరస్ ని అదుపులోకి తేవడం సులభం అవుతుందని, లండన్ కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ కెంజి షిబుయ చెప్పారు. సమూహాలలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో అధికారులు విజయం సాధించారు. అప్పుడు జపాన్ వైరస్ ప్రబలడంలో తొలి దశలో ఉంది. దాంతో అదొక విజయంగా భావించారు. దక్షిణ కొరియా లోని డేగు నగరంలో వైరస్ నియంత్రణకి అవలంబించిన విధానం హోక్కైడోని పోలి ఉంది. ఒక మత సమూహంలో ఉన్న వైరస్ ని సత్వరమే గుర్తించి, వైరస్ సోకిన వారిని వెంటనే నిర్బంధించారు. దీంతో, వైరస్ ని నియంత్రించగలిగారు. కానీ, హోక్కైడోలో వెలుగు చూస్తున్న రెండవ దశ ఇన్ఫెక్షన్ లు ఆశాజనకంగా లేవు. డేగులో ఇన్ఫెక్షన్లు మొదలవ్వగానే దక్షిణ కొరియా ప్రభుత్వం అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహించింది. జపాన్ అలా చేయలేదు. జపాన్‌లో తొలి కేసు నమోదు అయిన మూడు నెలల తర్వాత కూడా పరీక్షలు తగినంత స్థాయిలో నిర్వహించటం లేదు. అధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వలన వనరులు వ్యర్థం అవుతాయని జపాన్ ప్రభుత్వం భావించింది. అయితే, పరీక్షలు చేయడం పెంచుతామని ఇప్పుడిప్పుడే అంటోంది. జపాన్ లో తక్కువ స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధరణ అయితే తేలికపాటి లక్షణాలు ఉన్న రోగులతో కూడా జపాన్ లోని హాస్పిటళ్లు నిండిపోతాయని జపాన్ వైద్య శాఖ భావించింది. పరీక్షలు నిర్వహించే బాధ్యత స్థానిక ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే ఉంది. జపాన్ జాతీయ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. స్థానిక ఆరోగ్య కేంద్రాలలో భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి తగినంత సిబ్బంది, వైద్య పరికరాలు లేవు. స్థానిక హాట్ లైన్లు రోగుల నుంచి వచ్చే కాల్స్ తో ఉక్కిరిబిక్కిరై , డాక్టర్ నుంచి వచ్చిన కేసులను తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిపోయింది. ఇవన్నీ పరిశీలిస్తే, వైరస్ జనాభా ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుందనే అవగాహన జపాన్ లోని అధికారులకి అర్ధం కాలేదని షిబుయ చెప్పారు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా బయట పడే దశలో ఇప్పుడు మేమున్నామని ఆయన అన్నారు మొదటి సారి వ్యాపించిన వైరస్ ని అరికట్టడంలో విజయం సాధించినప్పటికీ ఆ స్థితిని దీర్ఘ కాలం స్థిరంగా ఉంచడం సాధ్యం కాలేదని హోక్కైడో పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది. పరీక్షల సంఖ్య పెంచితే గాని వైరస్ సామాజిక వ్యాప్తిని , హాస్పిటల్ వ్యాప్తి ని అర్ధం చేసుకోలేమని అన్నారు. హోక్కైడో చేపట్టిన చర్యలు మొదట్లో పని చేస్తున్నట్లే కనిపించాయి సుదీర్ఘ ప్రయాణం ఈ పరిస్థితి చాలా మంది ఊహిస్తున్న దాని కంటే ఎక్కువ రోజులే ఉంటుంది. హోక్కైడో తిరిగి నిర్బంధాన్ని అమలు చేసింది. కాకపోతే మిగిలిన చోట్ల అమలు చేసినట్లు కఠిన నిర్బంధనలు కావు. చాలా మంది పనులకి వెళుతున్నారు. స్కూల్స్ మాత్రం మూసే ఉంచారు. షాపులు, బార్లు తెరిచే ఉంచారు. కఠినమైన చర్యలు అవలంబించకపోతే జపాన్ లో రెండవ దశలో తలెత్తుతున్న ఇన్ఫెక్షన్ లను నియంత్రించడం కష్టమవుతుందని ప్రొఫెసర్ షిబుయ చెప్పారు. స్థానికంగా వైరస్ ని నియంత్రించగల్గినప్పటికీ , ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదలుతున్నప్పుడు వైరస్ ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని అన్నారు పర్యటక రంగం పై ఆధార పడి నడుస్తున్న హోక్కైడో ఆర్ధిక వ్యవస్థ కూడా దీంతో బాగా ప్రభావితమవుతోంది. జపాన్ ఇప్పటికే యు ఎస్, యూరప్, కొన్ని ఆసియా దేశాల నుంచి వచ్చే యాత్రికుల పై నిషేధం విధించింది. చిటోస్ నగరంలో బార్ నడుపుతున్న ఒక వ్యక్తి బార్ ని మూసేసి ఉద్యోగులను పని లోంచి తీసేయాల్సి వచ్చింది. ఇంకొక చోట బార్ ని తెరిచి ఉంచినప్పటికీ బార్ కి వచ్చే కస్టమర్లు తగ్గిపోయారని చెప్పారు. హోక్కైడో పర్యటక రంగంపైనే ఎక్కువ ఆధారపడింది చైనా నుంచి, తూర్పు ఆసియా దేశాల నుంచి వచ్చే యాత్రికులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఒక్క విదేశీ కూడా వీధుల్లో కనిపించటం లేదని అసహికావా నగరానికి చెందిన నవ్కి తమురా చెప్పారు. ఇక్కడ విధించిన లాక్ డౌన్ మే 6 వ తేదీతో ముగుస్తుంది. జపాన్ లో గోల్డెన్ వారం సెలవులు అప్పుడే ప్రారంభం అవుతాయి. ఈ నిర్బంధనలు ఎక్కువ కాలం అమలు చేయవలసి రావచ్చని హోక్కైడోలో ఒక స్థానిక ప్రభుత్వ అధికారి చెప్పారు. ఇది కొన్ని రోజుల పాటు చేస్తూనే ఉండాలి అనిపిస్తోందని అన్నారు. "ప్రజల మధ్య సామాజిక దూరం పాటించేలా చేయడమే లక్ష్యమని” అన్నారు. ఇలా ఎంత కాలం? “వాక్సిన్ కనిపెట్టేవరకు వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తూనే ఉండాలని” ఆ అధికారి అన్నారు. అదనపు సమాచారం - మిహో టనాక. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ వ్యాప్తిని కనిపెట్టి, పరీక్షలు నిర్వహించి నియంత్రణలోకి తెచ్చిన నగరంగా నిలిచిన జపాన్ లోని హోక్కైడో నగరం ఇప్పుడు రెండవ దశలో ప్రబలుతున్న కరోనావైరస్ ఇన్ఫెక్షన్ లతో సతమతమవుతోంది. text: ఈ ఎన్నికల్లో అన్ని విద్యార్థి సంఘాలు తమ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కానీ ఈ ఏడాది విద్యార్థి ఎన్నికల్లో అత్యంత అసాధారణ ఫలితం చండీగఢ్‌లో వెలువడింది. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా ఒక యువతి అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన కను ప్రియ ఏబీవీపీ ప్రత్యర్థిపై 719 ఓట్ల తేడాతో విజయం సాధించి, యూనివర్సిటీ చరిత్రలో మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కను ప్రియ పంజాబ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ సెకండియర్‌ చదువుతున్నారు. 22 ఏళ్ల కను ప్రియది పంజాబ్‌లోని తార్న్ తరన్ సాహిబ్ జిల్లాలోని పట్టి గ్రామం. ఆమె 2015లో స్టూడెంట్ ఫర్ సొసైటీ(ఎస్‌ఎఫ్‌ఎస్) విద్యార్థి సంఘంలో చేరారు. బీజేపీ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన ఆశిష్ రాణాపై ఆమె 719 ఓట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించారు. బీబీసీతో మాట్లాడుతూ కను.. పంజాబ్ యూనివర్సిటీలో యువతులకు అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లభించదన్నారు. ''యూనివర్సిటీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను ఎప్పుడూ దూరంగా పెడుతూ వస్తున్నారు. మొట్టమొదటి ఆ అడ్డుగోడలను బద్దలుకొట్టాం'' అని ఆమె బీబీసీకి తెలిపారు. ఎందుకు ఎస్‌ఎఫ్‌ఎస్‌ను గెలిపించారు? ఈ నెల 6వ తేదీన పంజాబ్ యూనివర్సిటీలో ఆరు స్థానాలకు (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఎస్‌తో పాటు ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, పీయూఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌పీయూలు కూడా పాల్గొన్నాయి. ఎస్‌ఎఫ్‌ఎస్ తప్ప ఏ పార్టీ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు యువతులకు సీటు ఇవ్వలేదని కను ప్రియ తెలిపారు. కేవలం ఎస్‌ఎఫ్‌పీయూ మాత్రం ఒక మహిళా అభ్యర్థిని ఉపాధ్యక్ష పదవి పోటీలో నిలిపింది. ఎస్‌ఎఫ్‌ఎస్‌ కేవలం అధ్యక్ష పదవికి మాత్రం తన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. 2010 నుంచి యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న ఎస్‌ఎఫ్‌ఎస్‌, 2014 నుంచి ఎన్నికలలో పాల్గొంటోంది. ఎస్‌ఎఫ్‌ఎస్‌ది వామపక్ష భావజాలం అని స్పష్టం చేసిన కను ప్రియ, అయితే తాము ఏఐఎస్‌ఐకు మాత్రం అనుబంధం కాదని స్పష్టం చేశారు. ''ఇప్పటివరకు మేం నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేశాం. వాటిలో మూడుసార్లు మహిళా అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అందువల్లే మా పార్టీని ఇతర పార్టీలకు భిన్నంగా చూసేవారు. ఎట్టకేలకు మేం మా లక్ష్యాన్ని సాధించాం'' అని కను ప్రియ తెలిపారు. ఇది కేవలం తన వ్యక్తిగత విజయం కాదని, మొత్తం తమ విద్యార్థి సంఘానిది అన్నారు. యూనివర్సిటీలో చాలా మంది ఒక యువతి అధ్యక్ష పదవికి ఎన్నిక అవుతుందని ఊహించలేదు. కానీ వాళ్లందరి అంచనాలను కను తలక్రిందులు చేశారు. ''నేను యూనివర్సిటీలో చేరాకే నాకు రాజకీయాల్లో ఆసక్తి పెరిగింది. ఇక్కడ ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నా, బాగా పని చేసే సంఘంలో చేరాను'' అని తెలిపారు ఆమె. విద్యార్థి సంఘాల ఎన్నికల్లో కూడా ధనప్రభావం పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు విద్యార్థులను బయటకు తీసుకెళ్లి సినిమాలు చూపిస్తున్నారని తెలిపారు. అవన్నీ చేయకపోయినా, తాను విజయం సాధించానన్నారు. ''ప్రచారంలో మేం విద్యార్థులను కలిసి మాట్లాడేవాళ్లం. వాళ్ల సమస్యలను తెలుసుకునే వాళ్లం. మేం డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. ఎన్నికలకు నేను కేవలం రూ.3000 మాత్రమే ఖర్చు పెట్టాను. అది కూడా విద్యార్థుల నుంచే సేకరించాం'' అని తెలిపారు. ఎన్నికల్లో ఎస్‌ఎఫ్ఎస్ మేనిఫెస్టో కను ప్రియ విద్యార్థులకు ఏమేం హామీలు ఇచ్చారు? ''విద్యార్థులు కేవలం మేం ఈ ఏడాది చేసిన పనిని మాత్రమే చూడలేదు, 2010 నుంచి మేం చేస్తూ వస్తున్న పనులను చూశారు. మేం సమాజంలో ఉంటూ, విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుతాం. యూనివర్సిటీ విద్యార్థులకు విద్యార్థుల సమస్యల మీద పోరాడేవాళ్లే అవసరం. వాళ్లకు ఏ మంత్రి కానీ, పార్టీ కానీ అవసరం లేదు'' అని కను ప్రియ వివరించారు. యూనివర్సిటీలో విద్యార్థినుల భద్రత మీద ప్రధానంగా దృష్టి పెడతానని కనుప్రియ తెలిపారు. ఇప్పటివరకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నవాళ్లకే హాస్టల్‌లో సీటు దొరుకుతోంది. ఈ పరిస్థితిని మారుస్తారని ఆమె అన్నారు. ''ఈ హాస్టల్ కేటాయింపు పద్ధతిని మార్చాలనుకుంటున్నాము. దీనిని మొత్తం ఆన్‌లైన్ చేసి.. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో, ఎవరు ఉంటున్నారో అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నాము. అంతే కాదు, బాయ్స్ హాస్టల్ రాత్రంతా తెరిచే ఉంటుంది. మరి అలాంటప్పుడు మా హాస్టల్ కూడా అలా ఎందుకు తెరిచి ఉంచరు?'' అని ఆమె ప్రశ్నించారు. విద్యార్థినులు లైబ్రరీకి, ఇతర హాస్టల్స్‌కు వెళ్లడంపై ఉన్న నిర్బంధాలు కూడా ఎత్తేయడానికి ప్రయత్నిస్తామన్నారు. తన గెలుపును సాధారణ విజయంగానే చూస్తానని కనుప్రియ తెలిపారు. కానీ పంజాబ్ యూనివర్సిటీ చరిత్రలో మాత్రం ఇది అసాధారణ విజయం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. text: వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. లాక్‌డౌన్ మొదటి దశలో అవసరమైన చర్యలు రెండో దశలో అవసరం ఉండవని, అలాగే మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశకు అవసరం ఉండవని మోదీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో దేశంలో లాక్‌డౌన్-4 కూడా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. అయితే, అది లాక్‌డౌన్-3లా మాత్రం ఉండబోదన్నది నిశ్చయమైంది. మరి లాక్‌డౌన్-4 ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం చాలా వరకూ ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం నుంచే లభిస్తోంది. మే 12న పరిమిత సంఖ్యలో దిల్లీ నుంచి రైలు సేవలు మొదలయ్యాయి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇస్తారా? భారత్‌లో ఇంతవరకూ అమలైన లాక్‌డౌన్ దశల్లో కేంద్ర ప్రభుత్వం అధికారం చెలాయించడమే కనిపించింది. కేంద్ర హోం, ఆరోగ్య శాఖలు ఆదేశాలు ఇచ్చాయి. రాష్ట్రాలు అమలు చేస్తూ వచ్చాయి. కానీ, సోమవారం జరిగిన సమావేశంలో తమదైన విధానాలను అమలు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించడం, లాక్‌డౌన్ పొడగించడం, కార్మికుల రాకపోకల విషయంలో రాష్రాలకు నిర్ణయం వదిలేయాలని కోరారు. రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించుకోనివ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. రైలు సేవలను ప్రారంభించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానిని కోరారు. లాక్‌డౌన్‌ను ఇంకా పొడగించాలని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కోరారు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. ఇదివరకు కూడా ఆమె చాలా సార్లు ఈ ఆరోపణ చేశారు. తదుపరి నిర్ణయాల్లో తమ భాగస్వామ్యం ఉండాలని రాష్ట్రాలు కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రుల అభిప్రాయాలను బట్టి అర్థమవుతోంది. లాక్‌డౌన్-4లో చాలా వరకూ ఇలాంటి వెసులుబాటులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కేంద్రం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరిన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తారా? మరిన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించాలని పారిశ్రామిక సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరింది. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామని మోదీ చెప్పారు. యాభై రోజులుగా చాలా సంస్థలు మూతపడి ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా వాటి దగ్గర డబ్బులు లేవని సీఐఐ అంటోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోకుంటే, తిరిగి అవి నిలదొక్కుకునే అవకాశం లేదని చెబుతోంది. దీంతో ఎంఎస్ఎంఈ పరిశ్రమల కోసం బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీలో భాగంగా పలు రాయితీలు, వెసులుబాట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. లాక్‌డౌన్-3లో చాలా రాష్ట్రాలు ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరవడానికి, ఈ-డెలివరీ చేయడానికి కారణం ఇదే. రాష్ట్రాలు తమ ఖజానాలు నింపుకునేందుకు మరిన్ని ఉపాయాలు ఆలోచించాల్సి ఉంటుంది. దుకాణాలు, మార్కెట్లు తెరుచుకుంటాయా? గడిచిన 50 రోజుల్లో ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్ల జీఎస్‌టీ కోల్పోయిందని రిటైల్ వ్యాపారుల సంఘం కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. మార్కెట్లను తెరవాలని తాము చేసిన సూచనలను లాక్‌డౌన్-4లో ప్రభుత్వం ఆలకిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ‘‘ఆరంభంలో వారంలో రెండు లేదా మూడు రోజులు మార్కెట్లను తెరవాలి. రోడ్డుకు ఒకవైపు ఉన్న దుకాణాలు ఒక రోజు, ఇంకొకవైపు ఉన్న దుకాణాలు మరో రోజు తెరిచే వెసులుబాటు కూడా ఇవ్వచ్చు. మార్కెట్లను వేర్వేరు సమయాల్లోనూ తెరవచ్చు. భౌతిక దూరం, ప్రభుత్వం విధించే ఇతర నిబంధనలను పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించేందుకు రిటైల్ వ్యాపారులందరూ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి స్పష్టం చేశాం’’ అని అన్నారు. ఈ సూచనల్లో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించవచ్చు. ఎందుకంటే అది ఇటు వ్యాపారులకూ, అటు ప్రభుత్వానికీ ప్రయోజనకరమే. ప్రజా రవాణా వ్యవస్థలు నడుస్తాయా? లాక్‌డౌన్-4 విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలని దిల్లీ వాసులను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. బస్సులు, మెట్రో, ఆటో, టాక్సీ వంటి సేవలన్నీ ప్రారంభించాలా? వద్దా? అనే అంశంపై ప్రజల అభిప్రాయాలను ఆయన అడిగారు. మే 12న పరిమిత సంఖ్యలో దిల్లీ నుంచి రైలు సేవలు మొదలయ్యాయి. స్టేషన్లకు రాకపోకలు సాగించేందుకు కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారి వాహనాలను అనుమతిస్తున్నారు. చాలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు లాక్‌డౌన్-3లోనే తెరుచుకున్నాయి. లాక్‌డౌన్-4లో మార్కెట్లు, కొన్ని కార్యాలయాలు తెరుచుకుంటే, రాకపోకలకు వీలుగా ప్రజారవాణా సేవలను ప్రారంభించడం తప్పనిసరి అవుతుంది. అందరికీ సొంత వాహనాలు ఉండవు కాబట్టి భౌతిక దూరం పాటిస్తూనే, నిర్ణీత సమయాల్లో ప్రజా రవాణా సేవలు నడిచేందుకు అనుమతించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అత్యవసర సేవల్లో పాలుపంచుకుంటున్నవారి రాకపోకల కోసం ముంబయి లోకల్ ట్రెయిన్లను నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వశాఖను కోరింది. మరోవైపు లాక్‌డౌన్-4లో దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభించవచ్చని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పూరీ ఇదివరకే సంకేతాలిచ్చారు. ఇక ప్రధాన మంత్రితో సమావేశంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలను అనుమతించాలని కేజ్రీవాల్ కోరారు. కొన్ని నిబంధనలతో దిల్లీ మెట్రో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనావైరస్ సంక్షోభంతో మిగతా వ్యాధులు, సమస్యల నుంచి అందరి దృష్టి మళ్లింది ఆసుపత్రుల సంగతేంటి... కరోనావైరస్ సంక్షోభంతో మిగతా వ్యాధులు, సమస్యల నుంచి అందరి దృష్టి మళ్లింది. మలేరియా, చికన్‌గునియా, థలసేమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, డయాలసిస్ వంటివి చేయించుకోవాల్సిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే చాలా ఆసుపత్రుల్లో అత్యవసర సేవలతోపాటు ఓపీడీ సేవలు కూడా ప్రారంభమవుతున్నాయి. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేవరకూ. ఆ వ్యాధితో కలిసి జీవించడానికి అలవాటు పడాల్సిందేనని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ‘‘లాక్‌డౌన్-4లో నెమ్మదిగా మరిన్ని కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. అవసరమైన సేవలను 40-50 రోజులకు మించి ఆపడం కుదరదు. దేని గురించైనా బయటకు వెళ్తున్నప్పుడు... అది లేకుంటే పని జరగదా? అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడే కరోనావైరస్ సోకకుండా చూసుకోగలం’’ అని అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు మూసే ఉంటాయా? లాక్‌డౌన్-4లో మూసి ఉంచగలిగే సేవల్లో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు కూడా ఉంటాయి. వెంటనే ఇవి తెరవకపోయినా, పెద్దగా సమస్యలు ఉండవు. విద్యా సంస్థల్ని పక్కనపెడితే మిగతావి అవసరాలు కాదు, విలాసాల కిందకు వస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జీవితాలే సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి మరిన్ని రోజులు వీటిని మూసి ఉంచినా నష్టమేమీ ఉండదని చెబుతున్నారు. అయితే, ఎక్కడ మినహాయింపులు ఇచ్చినా... ప్రజలు నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే ఉంది. భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు తరచూ కడుక్కోవాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రజలు ఒక ఈ-పాస్‌లా వినియోగించుకునేలా చేసే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రభుత్వం ఇదివరకు చెప్పింది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈనెల 12వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక ఆయన ఇలా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇది ఆరోసారి. text: పాకిస్తాన్ ‘‘కష్టపడి సంపాదించుకున్న ప్రజాస్వామ్యం’’ ఇలాంటి చర్యలతో ప్రమాదంలో పడుతోందని యాక్షన్ ఎయిడ్ సంస్థ చెప్పింది ప్రభుత్వ ఆదేశాలు చాలా ఎన్జీఓలపై ప్రభావం చూపనున్నాయి. దాతృత్వ సంస్థల్లో ఒకటైన యాక్షన్ ఎయిడ్ ఈ సందర్భంగా స్పందిస్తూ.. ఈ ఆదేశాలు ''పౌర సమాజంపై ఈ మధ్య కాలంలో పెరిగిన దాడులను మరింత పెంచే'' చర్యల్లో భాగమని చెప్పింది. కాగా, ఈ వ్యవహారంపై స్పందించేందుకు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించింది. అయితే, యాక్షన్ ఎయిడ్‌కు రాసిన లేఖలో మాత్రం.. ''ఆరు నెలల్లోపు రిజిస్ట్రేషన్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు'' అని పేర్కొంది. దేశంలో మొత్తం 18 ధార్మిక సంస్థలను ప్రభుత్వం బహిష్కరించిందని యాక్షన్ ఎయిడ్ సంస్థ బీబీసీకి తెలిపింది. ఒకపక్క దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై మానవ హక్కుల కార్యకర్తలు, పత్రికా స్వేచ్ఛ ఉద్యమకారులు ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా.. అదే సమయంలో ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. 2011వ సంవత్సరంలో ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకునే పథకంలో భాగంగా అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ పాకిస్తాన్‌లో నకిలీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం గుర్తించినప్పటి నుంచి ఎన్జీఓలపై పాకిస్తాన్ నిఘా సంస్థల అనుమానాలు పెరిగాయి. ''సేవ్ ది చిల్డ్రన్'' అనే స్వచ్ఛంద సంస్థ ఈ పథకంలో ప్రముఖ పాత్ర వహించిందని అప్పట్లో అధికారులు ఆరోపించారు. కానీ, ఈ దాతృత్వ సంస్థ మాత్రం ఆ ఆరోపణలను నిరాకరించింది. వాస్తవానికి యాక్షన్ ఎయిడ్ సహా మిగతా ఎన్జీఓలను దేశం వదిలి వెళ్లాలని పాకిస్తాన్ 2017 డిసెంబర్‌లోనే ఆదేశించింది. కానీ, పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల నుంచి ఒత్తిళ్లు రావటంతో ఆయా ఎన్జీఓలన్నీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలపై అవి అప్పీలు చేశాయి. తాము చేసిన అప్పీళ్లు విఫలమయ్యాయంటూ అధికారికంగా లేఖలు అందాయని యాక్షన్ ఎయిడ్, ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థలు ధృవీకరించాయి. అయితే, అప్పీళ్లు ఎందుకు విఫలమయ్యాయో కారణాలను పేర్కొనలేదని వెల్లడించాయి. యాక్షన్ ఎయిడ్ సంస్థకు పాకిస్తాన్‌లో తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ ఖాలిద్ బీబీసీతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలపై మరొకసారి అప్పీలు చేసుకునేందుకు ఎలాంటి అవకాశం ఇక లేదని భావిస్తున్నట్లు చెప్పారు. తమ ద్వారా సహాయం పొందుతున్న వేలాది మంది పేద ప్రజలపై పడే ప్రభావం గురించే తాము ఆందోళన చెందుతున్నామని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌లో 16 లక్షల మంది చిన్నారులకు ప్రస్తుతం తాము సహాయం అందిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాలు విచారకరమని ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అంతర్జాతీయ ఎన్జీఓలన్నీ తమతమ కార్యకలాపాలను ముగించాలని, 60 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. text: ఐస్‌ల్యాండ్ గోల్‌కీపర్ హాన్స్ హాల్‌డర్సన్ ఈ నెల 16న రష్యాలోని మాస్కోలో తాను ఆడిన తొలి ప్రపంచ కప్ మ్యాచ్‌లోనే అనూహ్య ప్రదర్శనతో ఐస్‌లాండ్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దిగ్గజ ఆటగాడైన లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని బలమైన అర్జెంటీనాను నిలువరించి, 1-1 స్కోరుతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. అయితే, ఐస్‌లాండ్ జట్టులోని టాప్ ఆటగాళ్ల నేపథ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 3.34 లక్షల జనాభా ఉన్న ఐస్‌ల్యాండ్‌‌లో ఫుట్‌బాల్‌ ఇటీవలి కాలంలోనే అభివృద్ధి చెందుతూ వస్తోంది. డైరెక్టర్: హాన్స్ హాల్‌డర్సన్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనాను నిలువరించడంతో హాన్స్, ఐస్‌ల్యాండ్‌లో హీరోగా నిలిచాడు. అయితే, ఈయన ఆటలో ప్రత్యర్థి జట్టును ఎదుర్కొనేందుకు సహచరులకు డైరెక్షన్ ఇవ్వడమే కాదు, బయట సినిమాల్లో నటీనటులకు దర్శకత్వం వహిస్తాడు. నార్వేలోని సాగాఫిల్మ్ అనే సినిమా ప్రొడక్షన్ కంపెనీలో దర్శకుడిగా పనిచేసేవాడు. ఫుట్‌బాల్ ఆట కోసం దానికి విరామం ఇచ్చాడు. ఫుట్‌బాల్ కెరీర్ ముగియగానే మళ్లీ ఉద్యోగంలో చేరతానని ఆ సంస్థ నిర్వాహకులకు మాటిచ్చాడట హాన్స్. 2012లో జరిగిన 'యూరోవిజన్' అంతర్జాతీయ సంగీత పోటీల్లో ఐస్‌ల్యాండ్ పాల్గొంటున్న సందర్భంగా రూపొందించిన ప్రోమో వీడియోకు ఇతడే దర్శకత్వం వహించాడు. రూరిక్ గిస్లాసన్ (ఎడమ వైపు) రాజకీయ నాయకుడు: రూరిక్ గిస్లాసన్ రూరిక్ ఫుట్‌బాల్ క్రీడాకారుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా. ఐస్‌లాండ్‌లో 2016, 2017లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో 'ది ఇండిపెండెన్స్ పార్టీ' తరఫున రెండు సార్లు పోటీచేశాడు. తన స్వస్థలమైన దక్షిణ రేజోవిక్ స్థానంలో భరిలో దిగాడు. అయితే, ఓటర్లను ఆకర్షించేందుకే ఇండిపెండెన్స్ పార్టీ రూరిక్‌ను తమ అభ్యర్థిగా పోటీలో నిలిపిందన్న విమర్శలు వచ్చాయి. గుడ్‌ముండ్సన్ (ఎడమ) నాలుగు తరాల వారసుడు: అల్బర్ట్ గుడ్‌ముండ్సన్ ఫుట్‌బాల్‌తో అల్బర్ కుటుంబంలో నాలుగు తరాల వారికి అనుబంధం ఉంది. అల్బర్ట్ తండ్రి బెనెడిక్‌ట్సన్ మాజీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అల్బర్ట్ తల్లి కూడా మాజీ క్రీడాకారిణి. ఆమె తండ్రి(అల్బర్ట్‌కు తాత) కూడా రికార్డులు నెలకొల్పిన ఫుట్‌బాల్ ఆటగాడు. 1987 నుంచి 2012 మధ్యలో అత్యధిక గోల్స్ చేసిన ఐస్‌ల్యాండ్ క్రీడాకారుడిగా రికార్డు ఆయన పేరిటే ఉండేది. ఇకపోతే.. అల్బర్ట్ ముత్తాత కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుడే. అతని పేరు కూడా అల్బర్ట్. ఐస్‌లాండ్‌కు చెందిన తొలి ప్రొఫెషనల్ ఆటగాడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. హీమర్ హాల్‌గ్రిమ్సన్ దంతవైద్యుడు: హీమర్ హాల్‌గ్రిమ్సన్ ఒక వృత్తిలో స్థిరపడ్డాక, మరో రంగానికి మారాలంటే కష్టమైన పనే. కానీ, అలా మారి విజయవంతం అయితే వచ్చే కిక్కే వేరు. అలాగే, ఒకప్పుడు పూర్తిస్థాయి దంతవైద్యుడిగా పనిచేసిన హీమర్ హాల్‌గ్రిమ్సన్ ప్రస్తుతం దేశ ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దాదాపు పదేళ్లపాటు దంతవైద్యుడిగా అనుభవం ఉన్న ఆయన, 1990ల్లో ఐస్‌ల్యాండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా పనిచేశాడు. అయినా ఖాళీ సమయంలో దంతవైద్యుడిగా పనిచేస్తుండేవాడు. తర్వాత 2011లో పురుషుల జట్టుకు అసిస్టెంట్ మేనేజర్‌, 2013లో జాయింట్ మేనేజర్ అయ్యాడు. 2016 నుంచి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ పోటీల్లో తలపడిన/తలపడుతున్న దేశాల్లో అతిచిన్న దేశం(జనాభా పరంగా) ఐస్‌లాండ్. text: బ్రెజిల్‌కు చెందిన ఈ చిన్నారులిద్దరికీ పుట్టుకతోనే తల్లి నుంచి జికా వైరస్ సంక్రమించింది ఏడిస్ జాతి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికున్ గన్యాలు కూడా ఈ దోమల ద్వారానే వ్యాపిస్తాయి. యుగాండాలోని జికా అనే అడవి పేరు ఈ వైరస్‌కు పెట్టారు. మొట్టమొదటగా 1947లో యుగాండాలోని ఆ అడవిలోని కోతుల్లోనే ఈ వైరస్ కనిపించింది. ఆ తరువాత 1952లో మనుషుల్లోనూ వీటిని గుర్తించారు. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. జికా వైరస్ ఎలా పుడుతుంది? దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించొచ్చు. గర్భిణుల నుంచి పుట్టబోయే బిడ్డకూ ఇది సంక్రమించవచ్చు. దానివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. గర్భస్రావం జరిగే ప్రమాదమూ ఉంది. రక్త, మూత్ర, లాలాజల పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధరిస్తారు. 2015లో బ్రెజిల్‌లో అనేక జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లోనూ ప్రజలు జికా వైరస్ బారిన పడ్డారు. జికా వైరస్ నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి మందులు, వ్యాక్సిన్లు లేవు. దోమల్ని నియంత్రించడమే దీన్నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. పొడవాటి, లేత రంగు దుస్తుల్ని ధరించడం, పరిసరాల్లో నీళ్లు నిల్వలేకుండా చూడటం లాంటి కొన్ని చర్యల ద్వారా దోమల్ని నివారించొచ్చు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రస్తుతం జైపూర్‌ను జికా వైరస్ వణికిస్తోంది. దాన్ని అడ్డుకోకపోతే ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరించే ప్రమాదం ఉంది. జికా ఫీవర్‌కు ఇప్పటిదాకా ఎలాంటి మందులూ, వ్యాక్సిన్లూ లేవు. నివారణ ఒక్కటే మార్గం. text: అమెరికాలో నివసించటానికి చట్టబద్ధమైన మార్గంలో అనుమతి పొందలేకపోతే వేలాది కుటుంబాలను బలవంతంగా స్వదేశాలకు తిప్పిపంపేస్తారు సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వెడార్‌లో 2001లో భారీ భూకంపం విలయం సృష్టించినపుడు ఆ దేశ పౌరులు దాదాపు రెండు లక్షల మందికి అమెరికా తాత్కాలిక ఆశ్రయం (టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ - టీపీఎస్) ఇచ్చింది. ఈ ఆశ్రయం గడువు సోమవారంతో ముగియనుంది. ట్రంప్ సర్కారు తాజా నిర్ణయంతో 2019 సెప్టెంబర్ 9వ తేదీ లోగా వారందరూ దేశం విడిచివెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాలో ఉండాలనుకుంటే చట్టబద్ధమైన మార్గంలో ఆ అర్హతను సంపాదించుకోవాల్సి ఉంటుంది. చిన్నారులుగా అమెరికాలో ప్రవేశించిన వలసదారులను బలవంతంగా తిప్పిపంపించకుండా భద్రత కల్పిస్తూ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన డాకా (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) పథకాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ ప్రభుత్వం నాలుగు నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం.. వేలాది మంది హైతీ, నికరాగువా పౌరులకు గల తాత్కాలిక ఆశ్రయ హోదాను కూడా ట్రంప్ సర్కారు తొలగించింది. తాజాగా సాల్వెడార్ పౌరులకు కూడా టీపీఎస్ ఆశ్రయానికి కూడా డెడ్‌లైన్ ప్రకటించింది. తాత్కాలిక ఆశ్రయ హోదా 2019 సెప్టెంబర్ 9వ తేదీ వరకూ రద్దు కాబోదని అమెరికా అంతర్గత భద్రత శాఖ పేర్కొంది అమెరికాలోని సాల్వెడార్ పౌరులపై ప్రభావం ఏమిటి? తాత్కాలిక ఆశ్రయ హోదా 2019 సెప్టెంబర్ 9వ తేదీ వరకూ రద్దు కాబోదని.. ‘‘ఒక పద్ధతిగా మార్పు చేయటం కోసం’’ ఈ గడువును నిర్ణయించామని అంతర్గత భద్రత శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘2001 భూకంపం వల్ల తలెత్తిన వాస్తవ పరిస్థితులు ఇప్పుడేమాత్రం లేవు. కనుక ప్రస్తుతమున్న టీపీఎస్ హోదాను రద్దు చేసి తీరాలి’’ అని ఆ శాఖ పేర్కొంది. అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న దాదాపు 2,00,000 మంది సాల్వెడార్ పౌరుల ఆశ్రయ హోదా మీద ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. వారిని వారి కుటుంబాల నుంచి వేరు చేసి బలవంతంగా వారి దేశానికి పంపించే అవకాశం ఉంటుంది. అలాగే.. సాల్వెడార్ పౌరులకు అమెరికాలోనే జన్మించిన దాదాపు 2,00,000 మంది చిన్నారుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది. వారిని కూడా బలవంతంగా అమెరికా నుంచి పంపించివేసే ప్రమాదం ఉంటుంది. కాలిఫోర్నియా, టెక్సాస్, వాషింగ్టన్ డీసీల్లో.. తాత్కాలిక ఆశ్రయ హోదా గల సాల్వెడార్ పౌరులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. సెంటర్ ఆఫ్ మైగ్రేషన్ స్టడీస్ వివరాల ప్రకారం.. హైతీ, నికరాగువా దేశాల పౌరులకు గల టీపీఎస్ హోదాను కూడా రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం కొద్ది నెలల కిందట ప్రకటించింది తాత్కాలిక ఆశ్రయ హోదా (టీపీఎస్) అంటే ఏమిటి? ఈ పథకాన్ని 1990లో తీసుకువచ్చారు. పలు దేశాలకు చెందిన వలస ప్రజలు అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చారా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా దేశంలో చట్టబద్ధంగా నివసించటానికి, పని చేయటానికి ఈ పథకం అనుమతిస్తుంది. సాయుధ సంఘర్షణ, ప్రకృతి విపత్తు, పెద్ద వ్యాధులతో ప్రభావితమయిన దేశాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ మొదటిసారి ఈ పథకం అమలులోకి తెచ్చినప్పటి నుంచీ.. పది దేశాలకు చెందిన 3,00,000 మందికి పైగా వలసలకు అమెరికా టీపీఎస్ హోదా కల్పించింది. టీపీఎస్ హోదా పొందిన వారిలో సాల్వెడార్ పౌరులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2001 మార్చిలో ఆ దేశంలో భూకంపం విలయం సృష్టించిన నేపథ్యంలో ఆ దేశ పౌరులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. గత ఏడాది చివర్లో.. హైతీ పౌరులు 59,000 మందికి, నికరాగువా పౌరులు 5,300 మందికి ప్రత్యేక ఆశ్రయ హోదాను అమెరికా రద్దు చేసింది. ఇది కూడా 2019లో అమలులోకి వస్తుంది. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీలో నిరసన ప్రదర్శనలు జరిగాయి అమెరికా నిర్ణయంపై ప్రతిస్పందనలు ఏమిటి? అమెరికా ప్రభుత్వ నిర్ణయం ’ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం’ అని సెంటర్ ఆఫ్ ఇమిగ్రెంట్ స్టడీస్ మార్క్ క్రికోరియన్ సమర్థించారు. ‘19 ఏళ్ల పాటు కొనసాగే ’తాత్కాలిక హోదా’ అనేది విడ్డూరం’ అని ఆయన బీబీసీ న్యూస్‌తో వ్యాఖ్యానించారు. అసలు టీపీఎస్ చట్టాన్ని రద్దు చేయాలని, తాత్కాలిక వలస ఆశ్రయం మీద కాంగ్రెస్ (పార్లమెంటు)లో ఓటింగ్ ద్వారా నిర్ణయించే ప్రక్రియను ప్రవేశపెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సర్కారు నిర్ణయాన్ని.. టీపీఎస్ హోదాతో అమెరికాలో నివసిస్తున్న సాల్వెడార్ పౌరులు తప్పుపట్టారు. ’’నా జీవితం ఇక్కడే ఉంది. నా ఇల్లు ఇక్కడే ఉంది. నేను పన్ను కడుతోంది ఇక్కడే. నేను చచ్చేలా పనిచేస్తున్నా.. కానీ ఇక్కడ సంతోషంగా ఉన్నా’’ అని మిండా హెర్నాండెజ్ అనే 48 ఏళ్ల హౌస్‌కీపర్ పేర్కొన్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఇరవై ఏళ్ల కింద ఎల్ సాల్వెడార్ నుంచి అమెరికా వచ్చిన ఆమె ప్రస్తుతం లాంగ్ ఐలండ్‌లో నివసిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తమ దేశ పౌరులకు ఆశ్రయాన్ని పొడిగించేలా చేయటం కోసం సాల్వెడార్ ప్రభుత్వం అమెరికా సర్కారుతో సంప్రదింపులు జరుపుతోంది. ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్‌లో ప్రతిపక్షమైన డెమొక్రాట్లు ఖండించారు అమెరికాలో పనిచేస్తున్న సాల్వెడార్ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడటం కోసం తమ ప్రభుత్వం ట్రంప్ సర్కారుతో కలిసి కృషి చేస్తుందని ఎల్ సాల్వెడార్ విదేశాంగ మంత్రి హ్యూగో మార్టినెజ్ పేర్కొన్నారు. అమెరికాలో నివసించే సాల్వెడార్ పౌరులు అక్కడ సంపాదించి తమ దేశంలోని కుటుంబాలకు పంపించే నగదు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉందని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చెప్తోంది. ఇలా పంపించే నగదు 2015లో ఎల్ సాల్వెడార్ జీడీపీలో 15 శాతం కన్నా ఎక్కువగా ఉందని ఆ సంస్థ అంచనా. ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్‌లో ప్రతిపక్షమైన డెమొక్రాట్లు ఖండించారు. ఎల్ సాల్వెడార్‌లో ఉన్న హింసాత్మక పరిస్థితులను ప్రభుత్వం విస్మరించిందని వారిలో చాలా మంది తప్పుపట్టారు. ప్రపంచంలో హత్యల రేట్లు అధికంగా ఉన్న దేశాల్లో ఎల్ సాల్వెడార్ ఒకటి. ‘‘ఈ నిర్లక్షపూరిత, నిర్హేతుక నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతామనే ఆందోళనకు లోనవుతాయి’’ అని వాషింగ్టన్ డీసీ మేయర్ మ్యురియల్ బోసర్ పేర్కొన్నారు. ‘‘భయం, బెదిరింపులతో పరిపాలన సాగించాలని పట్టుపట్టే వలసల వ్యతిరేక అధ్యక్షుడని.. కష్టపడి పనిచేసే కుటుంబాలను దెబ్బతీస్తున్నారని ఈ నిర్ణయం గుర్తుచేస్తుంది’’ అని నెవెడా సెనేటర్ కేథరీన్ కోర్టెజ్ మాస్టో పేర్కొన్నారు. అమెరికాలోని రాయబార కార్యాలయాలు సాల్వెడార్ పౌరులకు సలహాల రూపంలో సహాయం అందిస్తున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలో నివసించటానికి, పనిచేయటానికి దాదాపు రెండు లక్షల మంది ఎల్ సాల్వెడార్ ప్రజలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. text: "ఈ దాడి కోసం బ‌హుశా మార్చి-ఏప్రిల్‌ల నుంచే చైనా సిద్ధ‌మ‌వుతూ ఉండొచ్చు" గల్వ‌ాన్ లోయ‌లో చైనా చ‌ర్య‌ల‌పై ముందుగానే భార‌త్ సైన్యానికి నిఘా విభాగం నుంచి హెచ్చ‌రిక‌లు అందుండాల్సింద‌ని బీబీసీకి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న వివ‌రించారు. "చైనా సైనికుల క‌ద‌లిక‌ల‌పై మ‌న సైనికుల‌కు ముందుగానే స‌మాచారం అందుండాల్సింది. ఈ సంక్షోభం ముగిసిన వెంట‌నే.. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి. అస‌లు సైన్యానికి ఎందుకు నిఘా స‌మాచారం అంద‌లేదో తెలుసుకోవాలి. మ‌న వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌ర‌చుకోవ‌డం భ‌విష్య‌త్తుకు చాలా అవ‌స‌రం. ఈ విచార‌ణ సైన్యంతోపాటు ఇత‌ర నిఘా సంస్థ‌ల్లోనూ నిర్వ‌హించాలి. కార్గిల్ యుద్ధం త‌ర్వాత కూడా ఇలాంటి విచార‌ణ కోసం ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు" అని ఆయ‌న అన్నారు. చైనా అనుస‌రించిన దూకుడు విధానాలు, భార‌తీయ సైనికుల‌ను దారుణంగా హ‌త‌మార్చిన తీరును గ‌మ‌నిస్తే.. ఈ దాడి పక్కా ప్ర‌ణాళిక‌ ప్ర‌కారం జ‌రిగిన‌ట్లు అనిపిస్తోంద‌ని బేదీ వివ‌రించారు. "నాకు తెలిసినంత‌వ‌ర‌కు చైనా దీని కోసం చాలా కాలం ముందే ప్రణాళిక‌లు సిద్ధంచేసి ఉండొచ్చు. బ‌హుశా మార్చి-ఏప్రిల్‌ల నుంచే దీని కోసం సిద్ధ‌మ‌వుతూ ఉండొచ్చు" అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. గల్వ‌ాన్ లోయ‌లో దాడిని ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన దాడిగా భార‌త విదేశాంగ శాఖ కూడా పేర్కొంది. భారత్, చైనాల మధ్య యుద్ధ భయాలు నిజమేనా? ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసే దాడుల‌పై సైన్యానికి స‌మాచారం అందించే సామ‌ర్థ్యం భార‌త్ నిఘా సంస్థ‌ల‌కు లేదా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. "ఇది నిఘా సంస్థ‌లు లేదా ప‌ర్య‌వేక్ష‌ణ సంస్థ‌ల వైఫ‌ల్యంగా చూడ‌లేం. మ‌నం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం.. అయితే ఇదివ‌ర‌కు కుదిరిన ఒప్పందాల ప్ర‌కారం చైనా న‌డుచుకుంటుంద‌ని భావించాం. కానీ అలా జ‌ర‌గ‌లేదు" అని బేదీ చెప్పారు. మార్చి వ‌ర‌కు భార‌త్ సైనిక‌ నిఘా విభాగం అధిప‌తిగా బేదీ ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో చైనా ప్ర‌ణాళిక‌ల గురించి ఏమైనా స‌మాచారం ఉందా? ఈ ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. "మౌలిక పెట్టుబ‌డులు, సైనిక విన్యాసాలు ఇత‌ర అసాధార‌ణ చ‌ర్య‌ల‌కు సంబంధించి చైనాలో జ‌రుగుతున్న అన్ని చ‌ర్య‌ల‌పై స‌మాచారం ఉంది. అయితే మార్చి నాటికి చైనా సైనికులు యుద్ధ విన్యాసాలు చేస్తున్న‌ట్లు కొన్ని సంకేతాలు వ‌చ్చాయి. ఆ విష‌యాన్ని మేం ఇత‌ర విభాగాల‌కు తెలియ‌జేశాం"అని బేదీ వివ‌రించారు. "భార‌త్‌తో పోలిస్తే.. చైనా ద‌గ్గ‌ర నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉప‌గ్రహాలున్నాయి" చైనా నిఘా సంస్థ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ విభాగాల సామ‌ర్థ్యం గురించి జ‌న‌ర‌ల్ బేదీ ఏమ‌నుకుంటున్నారు? ఈ ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. "నిస్సందేహంగా చైనా త‌మ వ‌న‌రుల‌ను భారీగా పెంచుకుంద‌ని చెప్పొచ్చు. కొంత‌కాలంగా చైనా త‌న సైనిక సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూ వ‌స్తోంది. భార‌త్‌తో పోలిస్తే.. చైనా ద‌గ్గ‌ర నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉప‌గ్రహాలున్నాయి. భార‌త్ కంటే చైనా ముందుంద‌ని దీన్నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే మ‌నం కూడా అంత తీసిక‌ట్టుగా ఏమీలేము. భార‌త్ కూడా కొంత‌కాలంగా త‌న‌ సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూ వ‌స్తోంది" అని బేదీ వివ‌రించారు. చైనా-భార‌త్‌ల మ‌ధ్య తీవ్ర‌మైన ఉద్రిక్త‌త‌లు చెల‌రేగిన ప్ర‌స్తుత త‌రుణంలో స‌రిహ‌ద్దుల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల స‌మాచారాన్ని మ‌న ఉప‌గ్ర‌హాలు స్ప‌ష్టంగా అందించ‌గ‌ల‌వా? "గ‌త ఎనిమిది-తొమ్మిది సంవ‌త్స‌రాల్లో మ‌న భూభౌగోళిక వ‌న‌రులు చాలావ‌ర‌కు మెరుగుప‌డ్డాయి. అయితే మ‌నం అనుకున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. కాలాలు, వాతావ‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా అన్ని స‌మ‌యాల్లోనూ క్షేత్ర స్థాయి స‌మాచారం అందించేలా మ‌న ఉప‌గ్ర‌హాలు ఉండాలి" అని బేదీ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భార‌త్ నిఘా విభాగాల ప‌నితీరు‌పై స‌మీక్ష నిర్వ‌హించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సైనిక‌ నిఘా విభాగం మాజీ అధిప‌తి, విశ్రాంత జ‌న‌ర‌ల్ అమ‌ర్‌జీత్ బేదీ అభిప్రాయ‌ప‌డ్డారు. చైనా సంక్షోభం ముగిసిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. text: పచ్చి ఉల్లిపాయలు: ఆత్మీయులను గుర్తుపెట్టుకునే ఓ ఆహారం ఒక మరణం కలిగించే వేదన నుంచి కోలుకోవటానికి మంచి పోషకాహారం ముఖ్యం. కానీ, శోకంలో ఉన్నపుడు తినాలన్న కోరిక కోల్పోవటం సాధారణం. ఇలా ఆకలి కోల్పోవటం అమెరికాలోని మినెసొటాలో నివసించే లిండ్సే ఓస్ట్రామ్‌కి బాగా తెలుసు. ఆమె ఐదున్నర నెలల గర్భవతిగా ఉన్నపుడే తన కొడుకు ఆఫ్టన్‌కి జన్మనిచ్చారు. నెలలు నిండకుండా పుట్టిన ఆ శిశువు మరుసటి రోజే చనిపోయాడు. ఆఫ్టన్ మరణంతో ఆమెను ముంచెత్తిన శోకం ఆమె మీద మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపింది. అప్పుడు తిండి, నీళ్లు, నిద్రా లేకుండా రాత్రంతా ఏడుస్తూనే ఉండేది. ''మా కొడుకు చనిపోయాడన్నది మాత్రమే నా మదిలో ఉండేది. అతడి గురించి, అతడు లేని మా జీవితాల గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. ఇంక వేరే దేనిమీదా ఆసక్తి ఉండేది కాదు'' అని ఆమె చెప్తారు. కానీ, లిండ్సేకి ఆహారం అనేది ఆమె కెరీర్. 'ఎ పించ్ ఆఫ్ యుమ్' అనే ఫుడ్ బ్లాగ్ నిర్వహించేది. ఆహారం రుచి కోల్పోయిందని, తన కడుపులో కొండంత శోకానికి తప్ప మరి దేనికీ ఖాళీ లేదని ఆ బ్లాగ్‌లోనే వివరించింరామె. ''ఆహారం గురించి ఆలోచన వస్తేనే వెగటుగా అనిపించేది. మామూలుగా ఆహారం గురించి అమితాసక్తిగా ఉండే నేను అప్పుడు పూర్తిగా బిగుసుకుపోయాను'' అని తెలిపారు. Feeding a broken heart: క్రీమీ పొటాటో సూప్ ''మామూలుగా బాగా కారం, మసాలాలు ఉన్న ఆహారం తినటానికి ఇష్టపడేదాన్ని. మంచి రుచులు, రంగులు, రకాలు చాలా ఇష్ట పడేదాన్ని. కానీ, ఆ సమయంలో కేవలం పొటాటో సూప్ కోరుకునేదాన్ని. లేదంటే బ్రెడ్, బటర్ తినేదాన్ని. ఉప్పూ, కారం రుచి లేని సాధారణ ఆహారం... అంతే'' అని ఆమె చెప్పారు. ఆకలి లేకపోయినప్పటికీ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులు తాజాగా చేసిన రొట్టెలు తన ఇంటికి వచ్చి అందించేవారని, అందుకు వారికి చాలా రుణపడి ఉన్నానని ఆమె అంటారు. ''అది మాకు ఒక సంపూర్ణ జీవధారగా మారింది. ఒకసారి ఒక బౌల్ సూప్ తీసుకుందాం అనిపించేది. దానితో సాంత్వన పొందుతూ, తిరిగి జీవితంలోకి వస్తాం. మనం సజీవంగా ఉన్నాం.. మనం జీవించి ఉండాల్సిన అవసరముంది అనే వాస్తవాన్ని అది మన ఎరుకలోకి తెస్తుంది'' అని వివరించారు. ప్రేమగా చేసిన అటువంటి చిన్న చిన్న వంటకాలు ఎంత ముఖ్యమో లిండ్సే తెలుసుకున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు అందించిన సాధారణ వంటకాలు తయారు చేసే విధానం వారినే అడిగి తెలుసుకున్నారు. వాటిని 'ఫీడింగ్ ఎ బ్రోకెన్ హార్ట్' అనే శీర్షికతో తన బ్లాగ్‌లో పోస్ట్ ప్రచురించారు. ఇతరులు శోకంలో ఉన్నపుడు సాయపడిన ఆహార పదార్థాల ఫొటోలతో #feedingabrokenheart హ్యాష్‌ట్యాగ్ ఇన్‌స్టాగ్రామ్‌కి విస్తరించింది. #feedingabrokenheart ఉపయోగిస్తూ పోస్ట్ చేసిన సాంత్వన కలిగించే ఆహారాలు ఆప్తుల మరణం కలిగించే దిగ్భ్రాంతి తొలి దశల్లో ప్రథమంగా పోరాటం లేదా పలాయనం అనే తక్షణ స్పందన కలుగుతుందని.. అందువల్ల మనం ఆకలి కోల్పోతామని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్ లిసా షుల్మన్ చెప్పారు. ప్రొఫెసర్ లిసాకు ఆస్పత్రిలో విధుల రీత్యా మరణానికి సంబంధించిన విషయాలపై మంచి అవగాహన ఉంది. అయినప్పటికీ.. తన భర్త బిల్ మరణంతో తాను ఎదుర్కొన్న కష్టాలను చూసి ఆమె దిగ్భ్రమకు లోనయ్యారు. ఆ అనుభవం నుంచి.. శోకం, మెదడుల గురించి వివరిస్తూ ఆమె 'బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాస్' (ఆప్తుల మరణానికి ముందూ తర్వాతా) అనే పుస్తకం రాశారు. మరణ శోకం మన శరీరం మీద చూపే ప్రభావాలను అర్థం చేసుకోవాలని, ఆ సమయంలో ఆహారం ఎలా సాయపడుతుందనేది తెలుసుకోవాలని ఆమె భావించారు. ఆప్తుల మరణం మనకు తీవ్ర మనోవేదన కలిగించినపుడు.. మన మెదడు ఒక రక్షక కవచంలా పనిచేస్తున్నట్లు ఉంటుందని ప్రొషెసర్ లిసా చెప్తారు. ఆ సమయంలో మనకు అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలను అడ్డుకుని.. భావోద్వేగ పరంగా మనం తట్టుకోగల జ్ఞాపకాలను మాత్రమే మెదడు అనుమతిస్తుందని పేర్కొన్నారు. ''మనం ఆప్తుల మరణ శోకంలో ఉన్నపుడు.. మనకు - పరిసరాలకు మధ్య ఒక మందపాటి తెర ఉన్నట్లు లేదా శూన్యం నెలకొన్నట్లు ఉంటుంది. మన జ్ఞానేంద్రియ అనుభవాలను అది మూసివేస్తుంది. ఇది.. ఆహారం రుచిని ఆస్వాదించటం కూడా కష్టతరంగా చేస్తుందని నేను అనుకుంటున్నా'' అని ఆమె వివరించారు. ఈ స్థితి నుంచి కోలుకోవటానికి మనం క్రమక్రమంగా ఆ జ్ఞాపకాలను తిరిగి స్వాగతించాల్సి ఉంటుందని.. ఇందులో ఆహారం పాత్ర ఉండవచ్చునని ప్రొఫెసర్ లిసా చెప్పారు. ''శోకం నుంచి కోలుకోవటానికి సాయపడేందుకు మనం ఆహారాన్ని ఉపయోగించవచ్చు. అర్థవంతమైన, మన జ్ఞాపకాలను తిరిగి తెచ్చే ఆహారాల మీద నేను దృష్టి కేంద్రీకరిస్తాను. నా గురించి చెప్తే.. నా భర్తకు ఇష్టమైన వంటకాలను తీసుకునేదాన్ని.. అది నాకు స్వాంతన కలిగించేది'' అని తెలిపారు. కొన్నేళ్ల కిందట అమీ తండ్రి చనిపోయినపుడు.. ఆమెకు ఆహారం తినటమనేది తన తండ్రి చెంత ఉండే ఒక మార్గంగా మారింది. యూదు-రొమేనియన్ వలస అయిన ఆయన ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తూ.. సరదా కోసం పాస్ట్రామి రెస్టారెంట్ కూడా నడిపేవారు. ప్రత్యేకించి.. పచ్చి ఉల్లిపాయ ఆయనను వెంటనే జ్ఞప్తికి తెచ్చేది. ''మా నాన్న చాలా ఆహార పదార్థాల మీద వాటిని చల్లేవాడు'' అని అమీ చెప్పారు. ఆ రుచి తనకు నచ్చకపోయినప్పటికీ.. వారంలో పలుమార్లు పచ్చి ఉల్లిపాయ తినటం మొదలుపెట్టారామె. ''ఆయన కోసం నేను ఈ ఉల్లిపాయ తింటాను'' అంటారు. తన తండ్రికి ఇష్టమైన స్కోన్ కేకులు కూడా ఆమె తనకు ఇష్టం లేకపోయినా సొంతంగా చేసుకుని తింటుంటారు. ఇది ఈ ఆహారం ఆమెకు ఒక వ్యక్తిగత ఆచారంగా మారింది. చనిపోయిన వారితో ఆహారం ద్వారా మళ్లీ అనుసంధానం కావటమనే ఆలోచన కొత్తది కాదు. ఉదాహరణకు ప్రాచీన రోమ్‌లో సమాధుల్లోని మృతుల నోటిలోకి వారి బంధువులు ఆహారం, వైన్ పంపించటానికి వీలుగా సమాధుల్లో రంధ్రాలు ఏర్పాటు చేయటం సర్వసాధారణంగా ఉండేది. మృతుల మరణానంతర జీవితంలోకి వెళ్లటానికి వేచి ఉన్నపుడు వారికి ఆహారం అందించటం ఆ ఆచారం ఉద్దేశం. హిందువులు 12 రోజుల పాటు శోకదినాలు పాటిస్తారు. ఆ సమయంలో కేవలం శాకాహారం మాత్రమే తింటారు. ప్రధానంగా బౌద్ధ దేశమైన జపాన్‌లో.. కుటుంబ గృహంలో త్సూయా అని పిలిచే జాగరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ క్రతువులో మరణించిన వారి ఫొటో పక్కన అన్నం గిన్నె పెట్టి.. అందులో ఒక జత చాప్‌స్టిక్స్‌ను నిలువుగా ఉంచుతారు. మెక్సికోలో తొమ్మిది రోజుల పాటు సంతాపం పాటిస్తూ రుచికరమైన ఆహారాలను వండి వడ్డిస్తారు. మృతులకు ఆహారం అందించే ఆచారాలు చైనా వంటి సంప్రదాయ సమాజాల్లో ఇప్పుడు కొత్త రూపం దాలుస్తున్నాయని టెక్సస్‌లోని బేలార్ యూనివర్సిటీలో మతం గురించి బోధించే అసోసియేట్ ప్రొఫెసర్ కాండీ కాన్ చెప్పారు. ''నారింజలు, పైనాపిళ్లు, తీయని పండ్లు బాగా వండిన పంది మాంసం వంటివి మృతుల సమాధుల దగ్గర ఆహారంగా పెట్టటం సాధారణంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు వాటి స్థానంలో ఫ్రెంచ్ ఫ్రైస్, షేక్ వంటి అమెరికా ఆహారాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి'' అని ఆమె తెలిపారు. ''ఆ ఆహారాన్ని కొన్నిసార్లు జనం తింటారు. కొన్నిసార్లు.. పూలు, బెలూన్లను శుభ్రం చేసినట్లే స్మశాన సిబ్బంది ఈ ఆహారాన్ని కూడా శుభ్రం చేస్తారు'' అని పేర్కొన్నారు. పశ్చిమ ప్రపంచంలో ఇటువంటి ఆచారాలు చాలా తక్కువ. కానీ అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో కేసరోల్‌.. మృతుల ఆహార స్థానాన్ని తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ''మృతులు లేకుండా సామాజిక పాత్రను బలోపేతం చేయటానికి కేసరోల్ వేడుకను నిర్వహిస్తారు. మరణించిన వారి గురించిన కథనాలు చెప్పుకుంటూ ఈ కేసరోల్‌ను అందరూ పంచుకుంటారు'' అని ప్రొఫెసర్ కాండీ వివరించారు. ''అవి పంచుకోదగ్గ ఆహారాలు.. మరణించిన వ్యక్తి లేకుండా స్థానిక సమాజంలో ఒక రకంగా మళ్లీ కలసిపోవటం ఈ ఆచారం ఉద్దేశం'' అని చెప్పారు. మరణించి వారు మన జీవితాల నుంచి అదృశ్యమైనప్పటికీ... వారు వారికి ఇష్టమైన ఆహారాల ద్వారా మన జ్ఞాపకాల్లో జీవిస్తుంటారు. మరణ శోకాన్ని తరచుగా అసాధారణంగా పరిగణిస్తుంటారని, దాని నుంచి కోలుకోవటానికి ఉత్తమ మార్గం... మరణించిన తమ ఆప్తులతో అనుబంధాన్ని కొనసాగించటానికి తమవైన సొంత ఆహార ఆచారాలను సృష్టించడమే. కానీ దానికి బదులు ''ముందుకు సాగిపోవాల''నే ఆతృతలో జనం ఉన్నారని ప్రొఫెసర్ కాన్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కుటుంబంలో ఆత్మీయుల మరణం సంభవించినపుడు శోకంలో మునిగిపోయిన వారికి ఆహారం తినటం వల్ల ఊరట లభిస్తుందా? text: భారత సైన్యంలో ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ కోర్‌తోపాటుగా వందల సంఖ్యలో వివిధ రెజిమెంట్లు ఉన్నాయి. ఈ రెజిమెంట్లలో కొన్ని ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్లను మనం ఏటా గణతంత్ర దినోత్సవం రోజున రాజ్‌పథ్‌లో జరిగే కవాతులో చూస్తుంటాం. సాయుధ పదాతిసైనికులను ఇన్‌ఫాంట్రీ అని పిలుస్తారు. భారత సైన్యంలో సిక్కు, గఢ్వాల్, కుమావూ, జాట్, మహార్, గోర్ఖా, రాజ్‌పూత్ సహా 31 రెజిమెంట్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రెజిమెంట్ గురించి బాగా చర్చ జరుగుతోంది. అందుకే, ఈ వివరాలన్నీ ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చింది. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పోరాడేందుకు భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పరిణామం తర్వాత ముస్లిం సైనికుల నుంచి సైన్యం ఆయుధాలను తీసేసుకుందని, ఆ రెజిమెంట్‌ను కూడా రద్దు చేసిందని కూడా పోస్టులు పెట్టారు. ఇది నిజమేనా? భారత సైన్యంలో ఎప్పుడూ ముస్లిం రెజిమెంట్ అనే పేరుతో రెజిమెంటే లేదని మేజర్ జనరల్ (రిటైర్డ్) శశి అస్థానా అన్నారు. జాతుల పేర్లతో రెజిమెంట్లు బ్రిటీష్ పాలన సమయంలో ఏర్పడ్డాయని, జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ లాంటి కొన్ని రెజిమెంట్లు భారత్‌లో సంస్థానాల విలీనం వల్ల సైన్యంలో భాగమయ్యాయని ఆయన చెప్పారు. ‘‘భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక ఈ రెజిమెంట్లకు అవే పేర్లు ఉంచారు. దీని అర్థం సైన్యం జాతి, మత భేదాలను పోషిస్తుందని కాదు. చరిత్రను పరిరక్షించేందుకే సైన్యం వాటిని అలా ఉంచేసింది’’ అని అన్నారు. సైన్యంలోని ప్రతి రెజిమెంట్‌కూ ఓ చరిత్ర ఉంటుంది. భారత సైన్యంలో మద్రాస్ రెజిమెంట్ 200 ఏళ్ల కన్నా ముందు నుంచీ ఉంది. కుమావు రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొంది. ముస్లిం రెజిమెంట్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సైయద్ అతా హస్నైన్ అన్నారు. గత 200 ఏళ్లలో భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ అనేది ఎప్పుడూ లేదని ఆయన కూడా స్పష్టం చేశారు. ‘‘బ్రిటీష్ ఇండియా సైన్యంగా ఉన్నప్పుడు సిక్కు, పంజాబ్, గఢ్వాల్ లాంటి రెజిమెంట్లతోపాటు బలూచ్, ఫ్రంటియర్ ఫోర్స్ రెజిమెంట్లు ఉండేవి. దేశ విభజన తర్వాత బలూచ్, ఫ్రంటియర్ రెజిమెంట్లు పాకిస్తాన్ సైన్యంలో భాగమయ్యాయి. పంజాబ్ రెజిమెంట్ రెండు దేశాల్లోనూ ఉంది’’ అని హస్నైన్ చెప్పారు. సైన్యంలో ముస్లింలు భారత సైన్యంలో మొత్తం ఎంత మంది ముస్లింలు ఉన్నారన్న విషయమై అధికారిక గణాంకాలు లేవు. కానీ, 2014లో డిప్లొమాట్ అనే పత్రిక భారత సైన్యంలో దాదాపు మూడు శాతం వరకూ ముస్లింలు ఉన్నారని, జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీలో వారి శాతం 50 వరకూ ఉందని రాసింది. సైన్యం నియామకాల్లో మతాన్ని పరిగణనలోకి తీసుకోదని, శారీరక దృఢత్వాన్నే చూస్తారని మేజర్ జనరల్ (రిటైర్డ్) శశి అస్థానా అన్నారు. ‘‘సైన్యంలో ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నియామకాలు జరుగుతున్నాయనుకుంటే, మీరు గఢ్వాలీ, కుమావునీ, ముస్లిం... ఇలా ఎవరైనా కావొచ్చు, ఏ రెజిమెంట్‌లోనైనా చేరొచ్చు. ప్రతిభ, శారీరక దృఢత్వం ఆధారంగానే ఎంపిక జరుగుతుంది’’ అని ఆయన అన్నారు. భారత సైన్యంలోని చాలా రెజిమెంట్లలో ముస్లింలు ఉన్నారని, ప్రతి యుద్ధంలోనూ వాళ్లు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారని అస్థానా చెప్పారు. సోషల్ మీడియాలో ముస్లిం రెజిమెంట్ అంటూ ప్రచారమవుతున్న కట్టుకథల్లో 1965 యుద్ధం గురించి ప్రస్తావించారు. నిజానికి ఆ యుద్ధంలో క్వార్టర్‌మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్... పాకిస్తాన్‌కు చెందిన నాలుగుకు పైగా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశారు. ఆయనకు మరణానంతరం భారత సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర దక్కింది. మొత్తంగా భారత సైన్యంలో స్వాతంత్ర్యానికి ముందు గానీ, తర్వాత గానీ 'ముస్లిం రెజిమెంట్' అనేదే లేదని, సోషల్ మీడియాలో దాని గురించి వ్యాపిస్తున్న వదంతులన్నీ కట్టుకథలని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం గుర్తించింది. (ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సంఖ్యాబలం ప్రకారం చూస్తే, భారత్‌ది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం. ప్రస్తుతం ఇందులో 12 లక్షలకుపైగా మంది క్రియాశీల దళాల్లో ఉండగా, దాదాపు 10 లక్షల మంది రిజర్వు దళాల్లో ఉన్నారు. text: ఇంగ్లిష్ వలసవాదులు బందీలుగా పట్టుకున్న 20 మంది ఆఫ్రికన్లను తీసుకువచ్చిన ఓడ అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర తీరానికి 1619లో చేరుకుంది. అమెరికాలో మొట్ట మొదటి తరం నల్లజాతి బానిసలు వాళ్లు. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ల పాటు బానిసత్వం కొనసాగింది. కోట్లమంది నల్ల జాతీయులు నరకకూపంలో జీవించారు. ఆ తర్వాత బానిసత్వం నుంచి బయటపడ్డా, వారి కష్టాలు తీరలేదు. ఇప్పటికీ నల్ల జాతీయులు జాతి విద్వేషాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాంటి నల్లజాతీయులకు ఇప్పటికైనా పరిహారం లభించాలని వాదిస్తున్న గొంతుకలు అమెరికాలో పెరుగుతున్నాయి. 'రీపార్షన్స్ ఫర్ స్లేవరీ' అనే పేరుతో ఈ డిమాండ్‌ను పిలుస్తున్నారు. నల్ల జాతి మేధావులు, ఉద్యమకారులు ఎప్పటి నుంచో దీని కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి అభ్యర్థనను రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. జాతి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు పెరగడం, దేశాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నవారి మధ్య జరిగిన చర్చలు ఈ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చాయి. అధికారికంగా బానిసత్వం రద్దైన 'సివిల్ వార్' కాలం నుంచి నల్లజాతీయులకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బానిసత్వ కాలంలో నల్లజాతీయులు పడిన కష్టానికి కొందరు నిపుణులు లెక్కగట్టారు. బిలియన్ల నుంచి ట్రిలియన్ల డాలర్ల మధ్య అది ఉండొచ్చని అంచనా వేశారు. బానిసత్వం రద్దైన తర్వాత కూడా నల్లజాతీయులు ఎదుర్కొన్న శ్రమ దోపిడీని పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం ఇంకా పెరుగుతుంది. బానిసత్వం సాంకేతికంగా రద్దైన తర్వాత కూడా నల్లజాతి అమెరికన్లకు విద్య, ఓటు హక్కు, ఆస్తి హక్కు వెంటనే రాలేదు. చాలా కాలం వాళ్లు ద్వితీయ శ్రేణి పౌరుల్లానే ఉన్నారు. ఆదాయం, గృహకల్పన, వైద్యం, జైలుశిక్షలు.. ఇలా ఏ అంశం తీసుకున్నా తెల్ల జాతీయులకు, నల్ల జాతి అమెరికన్లకు మధ్య ప్రస్తుతం అంతరం ఉండటానికి ఈ చారిత్రక అసమానతలే కారణాలని రీపార్షన్స్ కోసం డిమాండ్ చేస్తున్నవారు అంటున్నారు. అమెరికాకే ఉన్న ఈ ప్రత్యేకమైన సమస్యకు ఆ దేశ చరిత్రే ఒక కారణమని ఓహియో స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ డారిక్ హామిల్టన్ అంటున్నారు. ''బానిసత్వ పునాదుల మీదే దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను మనం నిర్మించుకున్నాం. అందుకే అవి ప్రమాదకరంగా, అసమానతలను పెంచేవిగా తయారయ్యాయి'' అని ఆయన బీబీసీతో చెప్పారు. అమెరికాలో బానిసత్వం చరిత్ర ఇది.. 1619 - ఇంగ్లిష్ వలసవాదులు నల్లజాతీయులను బానిసలుగా కొనుక్కొని వర్జీనియాకు తీసుకువచ్చారు. అమెరికాలో తొలితరం బానిసలు వీళ్లే. అయితే, యూరోపియన్ వలసవాదులు అంతకుముందు నుంచే బానిసలను ఉపయోగించుకుంటున్నారు. 1788 - బానిసలను వ్యక్తిలో ఐదింట్లో మూడో వంతుగా లెక్కగడుతూ అమెరికా చట్టం చేసింది. 1808 - ఆఫ్రికన్ బానిసల వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ నిషేధం విధించారు.. కానీ, అమెరికాలో, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో దేశీయంగా బానిసల కొనుగోళ్లు, అమ్మకాలు బాగా పెరగడం మొదలైంది. 1822 - బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఆఫ్రికన్ అమెరికన్లు పశ్చిమ ఆఫ్రికాలో లైబీరియా అనే దేశాన్ని స్థాపించుకున్నారు. 1860 - అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యారు. దక్షిణ రాష్ట్రాలు విడిపోయి, ఆ మరుసటి ఏడాది సివిల్ వార్ మొదలైంది. 1862 - లింకన్ దాస్య విమోచన ప్రకటనతో విడిపోయిన రాష్ట్రాల్లోని బానిసలంతా విముక్తులయ్యారు. 1865 - దక్షిణ రాష్ట్రాలు యుద్ధంలో ఓడిపోయాయి. 13వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో బానిసత్వం అధికారికంగా రద్దైంది. 1868 - 14వ సవరణ ద్వారా ఆఫ్రికన్ అమెరికన్లందరికీ అమెరికా పౌరసత్వం లభించింది. 1870 - 15వ సవరణ ద్వారా ఆఫ్రికన్ అమెరికన్ పురుషులకు ఓటు హక్కు వచ్చింది. రీపార్షన్స్ ఎలా పనిచేస్తాయి? రీపార్షన్స్ అనగానే నల్ల జాతి అమెరికన్లకు నగదు పరిహారం చెల్లించాలన్న డిమాండ్ చర్చకు వస్తుంది. కానీ, దాన్ని అమలు చేయాలంటే ట్రిలియన్ల డాలర్ల భారం అమెరికాపై పడుతుందని కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. డబ్బు ఇచ్చినంత మాత్రాన సమస్య మూలాల నుంచి పరిష్కారం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. నగదు చెల్లింపు ఆలోచనను తాను సమర్థిస్తానని, అదొక మంచి సంకేతం అవుతుందని ప్రొఫెసర్ హామిల్టన్ బీబీసీతో చెప్పారు. ''అన్యాయం జరిగిన చోట సమస్యను గుర్తించినంత మాత్రాన అది పరిష్కారం అయిపోదు. బాధితులకు పరిహారం అందాలి. అలా అని ఒక్క పరిహారం చెల్లించడంతోనే అమెరికాకు సంస్థాగతంగా ఉన్న సమస్యలు తీరిపోవు. ఆ సంస్థాగత సమస్యలను అడ్డంపెట్టుకుని కొన్ని వర్గాలు ఎంతో దోచుకున్న విషయాన్ని మరిచిపోవద్దు. నల్ల జాతీయులకు ఆర్థికంగా న్యాయం చేసే బిల్లు తేవాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు. పరిహార చెల్లింపులతో పాటు నల్లజాతీయుల విద్య, ఆరోగ్యం, ఆస్తుల పెంపునకు దోహదపడే పలు విధానాలను తేవాలని ఆర్థిక వేత్త విలియమ్ డారిటీ అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడ్డ హిల్లరీ క్లింటన్ రీపార్షన్స్ విధానాన్ని ఎప్పుడూ సమర్థించలేదు. కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్న నాయకులు మాత్రం రీపార్షన్స్ గురించి పదేపదే మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన సెనేటర్ కమలా హారిస్ లక్ష అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు పన్ను మినహాయింపులు వర్తింపజేయాలని ప్రతిపాదించారు. దేశంలో అందరూ సమాన అవకాశాలతో ప్రయాణాలు ఆరంభించలేదన్న విషయాన్ని అంగీకరించాల్సిందేనని ఆమె అన్నారు. సెనేటర్ ఎలిజబెత్ వారెన్ కూడా రీపార్షన్స్‌ను సమర్థించారు. గృహకల్పనలో, ఉద్యోగకల్పనలో వివక్ష కారణంగా అమెరికాలో సగటు తెల్ల జాతి కుటుంబం వద్ద వంద డాలర్లు ఉంటే, నల్లజాతి కుటుంబం వద్ద ఐదు డాలర్లే ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆమె సీఎన్ఎన్ టౌన్‌హాల్ కార్యక్రమంలో అన్నారు. సెనేటర్ కోరి బుకర్ కూడా కమలా హారిస్ తరహాలోనే పలు ప్రతిపాదనలు చేశారు. మరికొందరు నాయకులు కూడా ఇలాంటి ఆలోచనలను సమర్థించారు. సెనేటర్ బెర్నీ శాండర్స్ మాత్రం రీపార్షన్స్‌ను తోసిపుచ్చారు. ''సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం మనకుంది. అయితే, చేతికి చెక్కులు ఇవ్వడం కన్నా మెరుగైన పరిష్కారాలు చాలా ఉంటాయి'' అని ఏబీసీ ఛానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అభిప్రాయపడ్డారు. రీపార్షన్స్ గురించి చర్చ జరగడం చాలా మంచి విషయమని, జరగబోయేదానికి ఇదొక ముందడుగని ప్రొఫెసర్ హామిల్టన్ అన్నారు. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం మొదలై 400 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. text: రుత్ బాడర్ గిన్స్‌బర్గ్ రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ ప్రముఖ స్త్రీవాదిగా, ప్రజాస్వామిక న్యాయవాదిగా ప్రఖ్యాతి పొందారు. యూఎస్ అత్యున్నత న్యాయస్థానాన్ని అధిరోహించిన రెండో మహిళగా గిన్స్‌బర్గ్ 27 యేళ్లపాటూ సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వహించారు. "మన దేశం ఒక చరిత్రాత్మక వ్యక్తిని కోల్పోయింది" అని అమెరికా అత్యున్నత్త న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. "రుత్ బాడర్ గిన్స్‌బర్గ్ ఒక అవిశ్రాంత, న్యాయ విజేత అని" కీర్తించారు. గిన్స్‌బర్గ్ అనారోగ్యం దృష్ట్యా, సుప్రీం కోర్టులో ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిని నియమించే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మరణించడానికి కొన్ని రోజుల ముందు "కొత్త దేశాధ్యక్షుడు ఎన్నికయ్యేవరకూ నా స్థానాన్ని భర్తీ చెయ్యకుండా ఉండాలన్నది నా ప్రగాఢమైన కోరిక" అని ఆమె అన్నారని నేషనల్ పబ్లిక్ రేడియో తెలిపింది. గిన్స్‌బర్గ్ మరణం పట్ల స్పందిస్తూ "ఆమె ఒక గొప్ప మేధావి, న్యాయశాస్త్రంలో అజేయురాలు" అని ట్రంప్ ట్వీట్ చేశారు. న్యాయవాద వృత్తిలో స్త్రీలకు సంబంధించిన అనేక పోరాటాల్లో రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వారి తరఫున పోరాడారు. స్త్రీ పురుష వేతనాల్లో అంతరాలు, అంగవైకల్యం ఉన్నవాళ్ల హక్కులు, మిలటరీ ఇన్స్టిట్యూట్‌లో స్త్రీల ప్రవేశం మొదలైన ఎన్నో అంశాలలో ఆమె మహిళల తరపున వాదించారు. టిక్‌టాక్, వీచాట్: అమెరికాలో ఆదివారం నుంచి కనుమరుగు కానున్న యాప్‌లు టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను అమెరికాలోని యాప్ స్టోర్ల నుంచి తొలగించనున్నారు. ఆదివారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. చివరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మనసు మారితే తప్ప ఈ నిర్ణయం మారే అవకాశం లేదు. ఏ యాప్ స్టోర్ నుంచి కూడా వీటిని అమెరికా ప్రజలు డౌన్‌లోడ్ చేసుకునే వీలు లేకుండా నిషేధిస్తామని అక్కడి వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ సంస్థలు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని.. యూజర్ల డాటాను చైనాకు చేరవేసి ఉండొచ్చని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ, ఈ రెండు కంపెనీలు, చైనా కూడా ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. ఆదివారం నుంచి అమెరికాలో వీచాట్ పూర్తిగా ఆగిపోతుంది. కానీ, టిక్ టాక్ యాప్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉండదు. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నవారు నవంబరు 12 వరకు కొనసాగించొచ్చు. నవంబరు 12 నుంచి టిక్‌టాక్‌ను కూడా పూర్తిగా నిషేధిస్తారు. ట్రంప్ ప్రభుత్వ ఆందోళనలు, లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ముందెన్నడూ లేని స్థాయిలో అదనపు పారదర్శక చర్యలు చేపట్టామని.. అయినా, ఇలాంటి నిర్ణయం ప్రకటించడం సరికాదని టిక్‌టాక్ అసంతృప్తి వ్యక్తంచేసింది. నిర్దేశిత ప్రక్రియ పాటించకుండా అన్యాయంగా తీసుకొచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాము పోరాడుతామని టిక్ టాక్ చెప్పింది. మరోవైపు వీచాట్ యాజమాన్య సంస్థ టెన్సెంట్ తాజా పరిణామాలపై స్పందిస్తూ అమెరికా ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని, దీనికి దీర్ఘకాలిక పరిష్కారం కోసం చూస్తున్నామని, ఈ నియంత్రణలు దురదృష్టకరమని పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం ఆగస్టులో జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం చైనా కంపెనీలతో 45 రోజుల్లో లావాదేవీలన్నీ ముగించాలి.. దాని ప్రకారమే వాణిజ్య శాఖ ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, శుక్రవారం ట్రంప్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ''టిక్ టాక్ అద్భుతమైన కంపెనీ.. చాలాచాలా పాపులర్. కానీ, చైనా నుంచి మాకు భద్రత అవసరం'' అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) స్త్రీ సాధికారత, హక్కుల సంరక్షణ కోసం పాటుపడిన యోధురాలు.. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ 87 యేళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో శుక్రవారం నాడు కన్నుమూశారని సుప్రీంకోర్టు తెలిపింది. text: జూన్‌లో అమెరికాకు ఇచ్చిన హామీల మేరకు సోహయి కేంద్రాన్ని నేలమట్టం చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. తమ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నేలమట్టం చేస్తామని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ తనకు హామీ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చెప్పారు. అయితే అది ఏ కేంద్రం అన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ కేంద్రాన్ని బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం కోసం ఉపయోగించేవారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. సోహయి కేంద్రాన్ని నేలమట్టం చేస్తున్నట్లు వెల్లడిస్తున్న ఉపగ్రహ చిత్రాలు గత నెల సింగపూర్‌లో ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక సమావేశంలో, 'కొరియా ద్వీపకల్పాన్ని సంపూర్ణంగా అణునిరాయుధీకరణ' చేసే ఒప్పందంపై ఇరువురు నేతలూ సంతకాలు చేశారు. అయితే ప్యాంగ్‌యాంగ్ ఎప్పుడు తన అణ్వాయుధాలను పూర్తిగా విసర్జిస్తుందో దానిలో స్పష్టమైన వివరాలు లేవని ఆ ఒప్పందంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉత్తరకొరియాతో సంబంధాల విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని ట్రంప్ సోమవారం తెలిపారు. ఉత్తర కొరియా గత 9 నెలల్లో ఎలాంటి క్షిపణులను ప్రయోగించలేదని, అణు పరీక్షలు నిర్వహించలేదని ఆయన గుర్తు చేశారు. జూన్ 12న కుదిరిన ఒప్పందానికి ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుందా అన్న దానిపై సందేహాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ కేంద్రాన్ని నేలమట్టం చేయడం ప్రారంభించింది. అణుపదార్థాల శుద్ధిపై అనుమానాలు అయితే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం, ఉత్తర కొరియా ఇంకా రహస్యంగా తన ఆయుధాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికల ప్రకారం ఉత్తర కొరియా తన అణుశుద్ధి కేంద్రం యాంగ్‌బ్యాన్‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు, మరికొన్ని రహస్య ప్రదేశాలలో కూడా అలాంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా ఇప్పటివరకు ఆరు అణుపరీక్షలు నిర్వహించింది. చివరిసారిగా ఆ దేశం గత ఏడాది సెప్టెంబర్‌లో అణుపరీక్ష నిర్వహించింది. అమెరికా వరకు వెళ్లగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు తమ వద్ద ఉన్నట్లు గతంలో ఆ దేశం ప్రకటించుకుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఉత్తర కొరియా నేలమట్టం చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. text: 2010లో 1,706గా ఉన్న పులుల సంఖ్య 2014 నాటికి 2,226కు చేరింది. గత నాలుగేళ్లలో ఇది ఏడు వందలకు పైగా పెరిగింది. 2014లో అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్‌లో పులుల సంఖ్య 68 కాగా, 2018 నాటికి ఏపీ, తెలంగాణల్లో కలిపి వీటి సంఖ్య 74కు చేరింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నాయి. దేశంలో ఇప్పుడు సుమారు మూడు వేల పులులు ఉన్నాయని, పులులకు అతిపెద్ద, సురక్షిత నివాస ప్రాంతాల్లో భారత్ ఒకటని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో దాదాపు 75 శాతం ఒక్క భారత్‌లోనే ఉన్నాయన్నారు. పులుల సంఖ్య రెట్టింపు కావడం భారత్‌కు చరిత్రాత్మక విజయమని, పులుల సంరక్షణ పట్ల భారత్ అంకితభావాన్ని ఇది చాటుతోందని మోదీ చెప్పారు. పులుల సంఖ్యను 2022లోగా రెట్టింపు చేయాలని తొమ్మిదేళ్ల క్రితం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో లక్ష్యంగా నిర్ణయించారని, కానీ భారత్ నాలుగేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని అందుకుందని ఆయన ట్విటర్‌లో తెలిపారు. అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య ఆరోగ్యకర సమతౌల్యాన్ని తీసుకురావడం సాధ్యమేనని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. భారత్ నాలుగోళ్లకోసారి పులులను లెక్కిస్తుంది. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఒక అంచనా ప్రకారం- 1875 నుంచి 1925 మధ్య దాదాపు 80 వేల పులులు వేటగాళ్ల వేటు, ఇతర కారణాలతో చనిపోయాయి. 1960ల నాటికి పులుల సంఖ్య భారీగా పడిపోయింది. వేటపై నిషేధం, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన ఇతర సంరక్షణ చర్యలు పులుల సంఖ్య తిరిగి పెరడగానికి తోడ్పడ్డాయి. ఈ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నట్లు తొలిసారిగా 2006లో స్పష్టంగా కనిపించింది. మలం, వెంట్రుకలు, గోళ్లు అన్నీ ఆధారమే వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, పులులతోపాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు. ఐదు పద్ధతుల్లో వీటి గణాంకాలను సేకరిస్తారు. అటవీ సిబ్బంది నడిచే మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే, వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. పగ్ మార్క్ విధానంలో అయితే సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు. మొదట ఒక గాజుపలకపై స్కెచ్ పెన్‌తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్‌ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. 15 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డ కట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది. గాజు పలకపై పులి పాదముద్ర ఆకారాన్ని గీస్తున్న సిబ్బంది పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినదీ నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు. అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్‌లోని 'సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)'కి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు. అడవి జంతువులు చెట్లకు, రాళ్లకు పాదాలను, శరీరాన్ని రుద్దుతుంటాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు, శరీరంపై దురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయి. అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడి పడిపోతుంటాయి. అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించగలుగుతారు. సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధరిస్తారు. నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యం 2014 నుంచి జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ- ఎన్‌టీసీఏ) వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను వాడుతోంది. వీటిని వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో ఎదురెదురుగా చెట్లకు అమరుస్తారు. ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంచే ఈ కెమెరాలు 24 గంటలూ వాటంతటవే పనిచేస్తాయి. చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించి ఫొటోలు తీస్తాయి. జంతువుల కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు పని ప్రారంభిస్తాయి. వీటిలో నమోదైన సమాచారాన్ని రోజూ సేకరిస్తారు. చిత్రాల్లోని జంతువుల ఎత్తు, చారలు, నడకను పరిగణనలోకి తీసుకొని వాటి సంఖ్యను లెక్కగడతారు. ఇలా వివిధ పద్ధతుల్లో సేకరించిన ఆధారాలను, నివేదికలను ఎన్‌టీసీఏ అధికారులు ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో ఉన్న భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ)కు పంపుతారు. డబ్ల్యూఐఐ అందించే నివేదిక ఆధారంగా ఎన్‌టీసీఏ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపుతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో పన్నెండేళ్లలో పులుల సంఖ్య రెట్టింపైంది. 2006లో 1,411గా ఉన్న వీటి సంఖ్య 2018లో 2,967కు చేరింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా సోమవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అఖిల భారత పులుల అంచనా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. text: భద్రతా బలగాలే లక్ష్యంగా జైషేమొహమ్మద్ వంటి సంస్థలు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని ఫిబ్రవరి 12నే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భద్రతా విభాగాలను అప్రమత్తం చేశామని ఓ ఉన్నతాధికారి బీబీసీకి చెప్పారు. దాడి జరిగిన వెంటనే డీజీపీ దిల్బగ్ సింగ్ దిల్లీలోని జాతీయ భద్రతా సలహాదారుకు ఇదే విషయాన్ని తెలియచేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా బీబీసీకి తెలిసింది. అఫ్ఘానిస్థాన్‌లో ఇటీవల జరిగిన దాడులకు సంబంధించి జైషే మొహమ్మద్ ఒక వీడియోను విడుదల చేసింది. కశ్మీర్‌లో కూడా ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో ఈ విషయాన్ని కూడా రాష్ట్ర నిఘా విభాగం దిల్లీకి తెలియజేసింది. రాష్ట్ర నిఘా విభాగం ఈ సమాచారాన్ని తగినంత ముందస్తుగానే దిల్లీ వర్గాలకు అందించింది. అయినా ఫిబ్రవరి 14న జరిగిన మిలిటెంట్ దాడి కచ్చితంగా భద్రతాలోపమే అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భద్రతా విభాగం అధికారి స్పష్టం చేశారు. 1998లో కార్గిల్ యుద్ధం అనంతరం జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు కశ్మీర్లో అనేక ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డాయి. కానీ ఆ దాడుల్లో ఆత్మాహుతి బాంబర్లుగా ఉన్నది పాకిస్తానీ పౌరులే. కానీ జైషే మొహమ్మద్ తొలిసారిగా పుల్వామాలోని అదిల్ అలియాస్ వకాస్ కమాండో అనే ఓ స్థానిక బాలుడిని ఈ ఆపరేషన్ కోసం ఉపయోగించింది. మిలిటెంట్ల దాడి తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే... పేలుడు ధాటికి ఒక బస్సు ఇనుము, రబ్బరు కుప్పలా మారిపోయింది. అదే బస్సులో ఆ సమయంలో సుమారు 44 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, దక్షిణ కశ్మీర్ జిల్లాల్లో మోహరించాల్సిన జవాన్లతో వస్తున్న కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడిలో చనిపోయిన జవాన్లలో ఎక్కువ మంది బీహార్‌కు చెందిన వారే. కశ్మీర్‌లో పరిస్థితిని, ముఖ్యంగా ఎన్నికల సన్నాహాలను పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం (15 ఫిబ్రవరి 2019) ఇక్కడ పర్యటించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ పర్యటనకు ముందు ఇలాంటి దాడి జరగవచ్చని రాష్ట్ర నిఘా వర్గాల నుంచి తమకు హెచ్చరికలు అందాయని రాష్ట్ర పోలీసులు కేంద్రానికి తెలిపారు. ఇది రాజ్‌నాథ్ పర్యటనను మరింత కీలకంగా మార్చింది. శ్రీనగర్-లేత్‌పొరా జాతీయ రహదారిపై ఇంతకు ముందు భారీ మిలిటెంట్ దాడులు జరిగాయి. కానీ ఇంతటి తీవ్రమైన ఆత్మాహుతి దాడి చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారి జరిగింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన గురువారం జరిగిన దారుణ మిలిటెంట్ దాడిని ముందుగానే నివారించి ఉండి ఉండవచ్చని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర నిఘా విభాగం అభిప్రాయపడింది. text: 32 ఏళ్ల రెహనా ఫాతిమా శబరిమల ఆలయంలోకి వెళ్లాలనుకున్న సమయంలో ఫేస్‌బుక్‌లోని ఆమె పేజీలో ఒక సెల్ఫీ పెట్టారని, ఆ ఫొటోలో ఆమె తొడలు కనిపిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రెహనా టెలిఫోన్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఒక మోడల్ కూడా. ఇదే ఏడాది అక్టోబర్‌లో రెహనా, మరో మహిళా జర్నలిస్టుతో కలిసి పోలీసు రక్షణతో శబరిమల చేరుకున్నారు. ఆలయం ప్రధాన ద్వారం వరకూ చేరుకోగలిగారు. కానీ అయ్యప్ప భక్తులు వ్యతిరేకించడంతో ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా భావిస్తారు. అందుకే రజస్వల వయసులో అంటే 10 ఏళ్ల నుంచి నెలసరి అయ్యే 50 ఏళ్ల మహిళల వరకూ ఆలయంలోకి ప్రవేశించకూడదని చెబుతారు. కానీ ఇదే ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని తొలగించింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించవచ్చని తీర్పు చెప్పింది. 14 రోజుల కస్టడీకి రెహనా ఈ తీర్పు వచ్చి సుమారు రెండు నెలలు గడిచిపోయాయి. కానీ హిందూ విశ్వాసాలను గౌరవించే భక్తులు వ్యతిరేక ప్రదర్శనలతో ఇప్పటివరకూ మహిళలు ఆలయంలో ప్రవేశించలేకపోయారు. రెహనాను మంగళవారం కొచ్చిలోని ఆమె ఆఫీసులో అరెస్టు చేసినట్లు రెహనా స్నేహితురాలు, మానవ హక్కుల కార్యకర్త ఆర్తి బీబీసీకి చెప్పారు. రెహనాపై ఉన్న ఆరోపణలపై విచారణ కోసం జడ్జి ఆమెను 14 రోజులు కస్టడీకి పంపించారు. మత విశ్వాసాలకు భంగం కలిగించిందని కూడా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. రెహనా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌లో పని చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. రెహనాపై ఏ కేసు పెట్టారు గత నెల శబరిమల వెళ్లే దారిలో రెహనా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె నల్ల దుస్తుల్లో (అయ్యప్ప భక్తులు నల్ల రంగు దుస్తులు ధరిస్తారు) ఉన్నారు. రెహనా నుదుటిపై విభూది కూడా ఉంది. ఆమె తన దుస్తులను మోకాళ్ల వరకూ మడిచారు. ఈ ఫొటోతో ఆమె అయ్యప్ప స్వామి భంగిమను అవమానించారని కొందరు ఆరోపించారు. 'అశ్లీలత ప్రదర్శించే' ఫొటో పోస్ట్ చేయడం, 'అయ్యప్ప భక్తుల మనోభావాలకు భంగం కలిగించినట్టు' ఫిర్యాదులు రావడంతో రెహనాపై కేసు నమోదు చేశారు. రెహనా ఈ నెల మొదట్లో పోలీసులు తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలంటూ ఒక దిగువ కోర్టులో అపీల్ చేశారు. కానీ కోర్టు ఆమె అభ్యర్థనను కొట్టివేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. రెహనా బెయిల్ కోసం అప్లై చేసినట్టు ఆమె కుటుంబం గురువారం తెలిపింది. పురుషులది అశ్లీలత కాదా? రెహనా ఏ మత విశ్వాసాలకు భంగం కలిగించాలని అనుకోలేదని, ఎలాంటి అశ్లీల పనులు చేయలేదని ఆమె స్నేహితురాలు ఆర్తి బీబీసీకి చెప్పారు. "ఛాతీ ప్రదర్శిస్తూ, తొడలు చూపిస్తూ శబరిమల వెళ్లే పురుషులను పట్టించుకోరా?, అలా చేయడాన్ని అశ్లీలతగా ఎందుకు భావించరు" అని ఆమె ప్రశ్నించారు. "ముస్లిం అయిన రెహనా అయ్యప్ప స్వామి భక్తురాలినని చెప్పుకోవడం వల్లే కొన్ని హిందుత్వ సంస్థలు ఆమెపై కోపంగా ఉన్నాయని" ఆర్తి చెప్పారు. రెహనా తన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు ఎన్నో అభ్యంతరకరమైన కామెంట్లు వచ్చాయని ఆర్తి చెప్పారు. కొందరు అత్యాచారం చేస్తామని కూడా ఆమెను బెదిరించారని తెలిపారు. మహిళల కోసం ఆలయం తలుపులు తెరవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దీనిపై కేరళతోపాటు దేశమంతా రెండు సెక్షన్లుగా చీలిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వేలాది ఆందోళనకారులు మహిళా భక్తులను అడ్డుకోవడం కోసం రహదారులపైకి వచ్చారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ ఆందోళనల సమయంలో మహిళలపై దాడులు జరిగాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి. మహిళల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో చాలా మందిని వదిలిపెట్టగా, కొంతమంది ఇఫ్పటికీ జైళ్లలోనే ఉన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గత నెలలో కేరళ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైన మహిళను పోలీసులు 'అశ్లీలత ప్రదర్శించే' ఫొటో పోస్ట్ చేశారనే ఆరోపణలపై ఆరెస్టు చేశారు. text: డేవిడ్ వార్నర్ హైదరాబాద్ ఓపెనర్లు మరోసారి భారీ స్కోర్లు చేయడంతో సన్ రైజర్స్, నైట్ రైడర్స్‌పై అవలీలగా గెలిచింది. డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 67 పరుగులు చేసి పృథ్వీరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయినా, బెయిర్‌స్టో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ మిగతా లాంఛనం పూర్తి చేశారు. బెయిర్‌స్టో 43 బంతుల్లో 80 పరుగులు, విలియమ్సన్ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. వార్నర్, బెయిర్‌స్టో మెరుపులతో 15 ఓవర్లలోనే హైదరాబాద్ విజయం అందుకుంది. బంతులు, వికెట్ల విషయంలో చూస్తే ఇది హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో రెండో అతిపెద్ద విజయం. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది వరసగా ఐదో పరాజయం. అంతకు ముందు టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆండ్రీ రస్సెల్ ఫైల్ ఫొటో 15 పరుగులే చేసిన రస్సెల్ కోల్‌కతా నైట్ రైడర్స్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంచినా మూడో ఓవర్లో నాలుగో బంతికి ఓపెనర్ నరైన్(25) వికెట్ కోల్పోయింది. నరైన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. తర్వాత వరసగా కోల్‌కతా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఐదో ఓవర్ రెండో బంతికి శుభమన్ గిల్ 3 పరుగులే చేసి ఖలీల్ మహ్మద్ బౌలింగ్ లోనే విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 8వ ఓవర్ మొదటి బంతికి నైట్ రైడర్స్ నితీష్ రాణా వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాణా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత తొమ్మిదో ఓవర్లో నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా అవుటయ్యాడు. 6 పరుగులు చేసిన అతడిని విజయ్ శంకర్ రనౌట్ చేశాడు. 10 ఓవర్లకు కోల్ కతా 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన రింకూసింగ్ 30 పరుగులకు సందీప్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌కే నిలకడగా ఆడుతున్న ఓపెనర్ క్రిస్ లిన్(51) కూడా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివరి ఓవర్లలో రెచ్చిపోయే ఆండ్రీ రసెల్ రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత(15) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటవడం కోల్‌కతాకు షాకిచ్చింది. తర్వాత వచ్చిన పీయూష్ చావ్లా 4 పరుగులు చేసి అవుటవగా, పృథ్వీరాజ్(0), కేసీ కరియప్ప(9) నాటౌట్‌గా నిలిచారు. జట్టులో క్రిస్ లిన్, రింకూ సింగ్ మాత్రమే రాణించారు. రసెల్ వైఫల్యంతో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌కు 3, భువనేశ్వర్ కుమార్‌కు 2, సందీప్ శర్మ, రషీద్ ఖాన్‌కు చెరో వికెట్ లభించాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐపీఎల్ 2019లో సన్ రైజర్స్ ఐదో విజయం అందుకుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. text: ఈ మ్యాచ్‌లోవరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తాయ్ జు రెండు వరుస గేమ్‌లలో సింధుపై విజయం సాధించారు. మొదటి గేమ్‌ను తాయ్ జు 21 - 13, రెండో గేమ్‌ను 21 - 16 తేడాతో గెలిచి స్వర్ణం చేజిక్కించుకున్నారు. దీంతో సింధు రజతానికి పరిమితమయ్యారు. జపాన్‌కు చెందిన అకానె యమగూచిపై విజయం సాధించడం ద్వారా ఆసియాడ్‌లో ఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళగా సింధు రికార్డు సృష్టించారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో 21-17, 15-21, 21-10 తేడాతో రెండో సీడ్ యమగూచిపై సింధు విజయం సాధించారు. 65 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చివరి గేమ్‌లో 50 షాట్ల పాటు సాగిన ర్యాలీ ఆ మ్యాచ్‌కే హైలైట్‌ అని విశ్లేషకులు పేర్కొన్నారు. తొలి గేమ్ సింధు నెగ్గగా, రెండో గేమ్ యమగూచి గెల్చుకున్నారు. దీంతో మూడో గేమ్ నిర్ణయాత్మకంగా మారింది. కానీ సింధు ఆ గేమ్ చాలా సులభంగా గెల్చుకుని ఫైనల్‌కు చేరారు. క్రికెట్‌ను మతంగా భావించే భారతదేశంలో పీవీ సింధు ఇప్పుడు ఒక స్టార్‌గా మారారని, ఆమె మరికొంత కాలం పాటు స్టార్‌ క్రీడాకారిణిగా కొనసాగుతారని బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే తెలిపారు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల్లాగే ఇప్పుడు సింధు కూడా పెద్ద ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్నారని చెప్పొచ్చు. పీవీ సింధు తప్పనిసరిగా విజయం సాధించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆమె రజతంతో సరిపెట్టుకున్నప్పటికీ ఇదేమీ చిన్న విజయం కాదు. ఫోర్బ్స్ ‘అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా క్రీడాకారుల’ జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచారు. ఈ జాబితా విడుదలైన కొన్ని రోజులకే ఆమె ఆసియాడ్‌లో ఫైనల్‌కి చేరి చరిత్ర సృష్టించారు. అంతకు ముందు జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై నెగ్గడం ద్వారా తాయ్ జు యింగ్ ఫైనల్‌కు చేరారు. దీంతో సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాయ్ జు వర్సెస్ సింధు ఇప్పటి వరకు తాయ్ జు, సింధుల మధ్య జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే తాయ్ జు దే పైచేయి . బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరెషన్ ప్రకారం.. ఇప్పటి వరకూ వీరిద్దరూ వివిధ వేదికలపై 13 మ్యాచ్‌లలో తలపడ్డారు. వీటిలో తాయ్ జు 10 మ్యాచ్‌లు గెలవగా.. సింధు 3 సార్లు గెలిచారు. ముఖ్యంగా గత అయిదు మ్యాచ్‌లలో తాయ్ జు సింధుపై వరుస విజయాలు సాధించారు. ఈ ఏడాది జరిగిన మలేసియా ఓపెన్, 2017 హాంకాంగ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇంగ్లండ్ ఓపెన్, 2016 హాంకాంగ్ ఓపెన్‌లలో తాయ్ జు గెలిచారు. తాజాగా ఆసియాడ్‌లోనూ సింధుపై తాయ్ జూ విజయం సాధించారు. అయితే.. 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు తాయ్ జును ఓడించారు. ‘తాయ్ జు కొంచెం కష్టమే’ వైవిధ్యభరితమైన షాట్లు, అంతుబట్టని వైఖరితో ఆడుతున్న తాయ్ జును ఓడించడం కొంచెం కష్టమేనని సైనా నెహ్వాల్ అన్నారు. పీటీఐ కథనం ప్రకారం.. ‘‘ఆమెపై గెలవాలంటే మరింత వేగంగా కదలాలి.. ఆమె ర్యాలీలూ అర్థం కావు. చాలా వెరైటీ షాట్లు ఆడుతోంది. ఆమెపై గెలవాలంటే మరింత వేగం కావాలి. ఆమెను అర్థం చేసుకోవడం నాకు అంత సులభం కాదు’’ అని సైనా విశ్లేషించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలుగు అమ్మాయి పీవీ సింధు ఆసియా క్రీడల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయారు. text: నేపాల్లోని ఓ పర్వత ప్రాంతంలో ఎత్తైన రాళ్ల కింది భాగంలో వేలాడే తేనెతుట్టెల వద్దకు ఒడుపుగా చేరుకొని... అందులోంచి తేనె సేకరించడానికి స్థానికులు ఎన్నో సాహసాలు చేస్తుంటారు. ఒక్కోసారి వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. బీబీసీ ప్రతినిధులు ఆమీర్ పీర్జాదా, నేహా శర్మలు అందిస్తున్న కథనం... ఇది అత్యంత ప్రమాదకరమైన వేట. ఇది తేనెతుట్టెల్లో తేనె తయారయ్యే సీజన్. అందుకే ఇప్పుడు తేనె తీయడం కోసం ఈ గ్రామం సన్నద్ధమవుతుంది. వెదుర్లతో చేసిన ఈ నిచ్చెన ఒక్కటే వారికి ప్రాణాధారం. మిన్ బహదూర్ గురుంగ్, దిల్ బహదూర్ గురుంగ్‌లు ఇద్దరూ విశ్వాసంతో అడుగులు వేస్తున్నారు. ‘‘తరతరాలుగా మేం ఈ కొండల్లో తేనె తీస్తున్నాం, ఇది మా సహజ వనరు’’ అని వారు తెలిపారు. తేనె తీయడం కోసం గ్రామస్థులందరూ ఒక్కటై కదులుతారు. దిల్, మిన్‌లు తేనె తీసేది ఇక్కడే. అందుకోసం వారు ఈ లోయలోకి దిగుతారు. దీని కోసం వాడే నిచ్చెన చాలా దృఢంగా ఉండాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం కూడా అంతే గట్టిగా ఉండాలి. "మీలో పట్టుదల లేకపోతే మీరీ పని చేయలేరు." "మొదట్లో కిందకు వెళ్లగానే చాలా భయం వేస్తుంది. ఒకసారి అక్కడికి చేరుకున్నామంటే అన్నీ మర్చిపోతాం. తేనెటీగలను చెదరగొట్టడానికి కింద నుంచి పొగ పెడతాం. కానీ అది సరిపోదు." "తేనెటీగలు కుట్టినా ఆ నొప్పిని భరించగలగాలి. మా వద్ద ఉండే రక్షణ సామగ్రి చాలా ప్రాథమికమైంది. తేనెటీగలు కుట్టకుండా ఇవి కాపాడలేవు." "ప్రతిసారీ మమ్మల్ని దాదాపు 200-300 తేనెటీగలు కుడతాయి. గుండె ధైర్యం తక్కువ ఉన్న వాళ్లు ఈ పని చేయలేరు." దీనికి సాహసం, మంచి నైపుణ్యం కావాలి. అలాగే కొండ అంచుపై కూర్చునే గ్రామస్తుల సహకారం కూడా తప్పనిసరి. వేటగాళ్లు తమ స్థానాల్లోకి చేరుకున్నాక, ఇక చకచకా పని మొదలుపెడతారు. తేనెపట్టుల్లోంచి తేనె తీస్తారు. అడవి తేనె సంవత్సరంలో రెండుసార్లు తయారవుతుంది. వసంత కాలంలో ఒకసారి, శరత్కాలంలో మరోసారి. తేనె వేటను వీరు శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. తమ గొప్ప సంస్కృతిని కాపాడుతున్నారు. అయితే ఇది ఇప్పుడు పర్యటక ఆకర్షణగా మారింది. అలానే ఆదాయ మార్గంగా కూడా అయ్యింది. "మా ఈ ప్రదర్శనను చూసేందుకు విదేశీ పర్యాటకులు 30 నుంచి 60 వేల రూపాయల వరకు డబ్బు చెల్లిస్తారు." "ఆ డబ్బును మా గ్రామ అభివృద్ధికి వినియోగిస్తాం." ఈరోజు వచ్చిన డబ్బును ఈ రోడ్డు కోసం ఉపయోగించబోతున్నారు. ఇప్పటికైతే, ఇది సంబరం చేసుకునే సమయం. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తేనె అంటే అందరికీ ఇష్టం... కానీ మారుమూల కొండ ప్రాంతాల్లో తేనెను తీయాలంటే ఎంతో కష్టపడాలి. text: పిల్లలను చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టర్పిన్ దంపతులు డేవిడ్ అలెన్ టర్పిన్ (57), లూయిస్ అనా టర్పిన్(49) లను పిల్లల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ చేసారు. రెండు నుంచి 29 ఏళ్ల వయసు కలిగిన పిల్లలతో కలిసి టర్పిన్ దంపతులు లాస్ ఏంజెల్స్‌కు 59 మైళ్ల దూరంలో పెరీస్‌లో నివసిస్తున్నారు. తల్లిందండ్రుల చెర నుంచి తప్పించుకున్న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న ఆ బాలిక కేవలం పదేళ్ల బాలికలా ఉందని పోలీసులు తెలిపారు. పిల్లలతో సంతోషంగా ఉన్న టర్పిన్ దంపతులు పోలీసులకు ఇంట్లో ఏం కనిపించింది? బాలిక ఫిర్యాదుతో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు పిల్లలను గొలుసులు, తాళాలతో కట్టేసి ఉండడం కనిపించింది. ఇల్లంతా చీకటిమయంగా, ఓ రకమైన వాసనతో ఉంది. పిల్లలను ఎందుకు కట్టేశారన్న పోలీసుల ప్రశ్నలకు ఆ దంపతులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇంట్లో బంధించిన వారి పిల్లల్లో ఏడుగురి వయసు 18-29 మధ్య ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నివ్వెరపోయారు. పిల్లలు పోషకాహారం లేక చిక్కిపోయి, చాలా మురికిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ దంపతుల ఫేస్ బుక్ పేజీలో అనేక ఫ్యామిలీ ఫొటోలున్నాయి ఈ రహస్యాన్ని ఎలా దాచి ఉంచారు? ఈ సబర్బన్ పట్టణంలో టర్పిన్ దంపతులు ఈ రహస్యాన్ని ఎలా దాచి ఉంచారన్నది అంతు చిక్కడం లేదు. పోలీసుల రికార్డు ప్రకారం టర్పిన్ దంపతులు గతంలో చాలా కాలం టెక్సాస్‌లో నివసించారు. 2010లో కాలిఫోర్నియాకు మారారు. డేవిడ్ టర్పిన్ రెండుసార్లు దివాలా తీసినట్లు రికార్డులు చెబుతున్నాయి. రెండోసారి దివాలా తీసినపుడు ఆయన ఓ ఎరోనాటిక్స్, డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో ఇంజనీర్‌గా పని చేసేవారు. అయితే ఇంత మంది పిల్లలను చూస్తే, ఆయన ఆదాయం ఇంటి ఖర్చులకు ఎంత మాత్రమూ సరిపోయేది కాదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. డేవిడ్ టర్పిన్ తల్లిదండ్రులు తమ మనవలు, మనవరాళ్లకు ఇంట్లోనే చదువు చెప్పేవాళ్లని తెలిపారు. కుమారుడి కుటుంబాన్ని చూసి నాలుగైదేళ్లు అవుతోందని వివరించారు. ఈ దంపతుల ఫేస్‌బుక్ పేజీలో కుటుంబసభ్యులంతా సంతోషంగా ఉన్న ఫ్యామిలీ ఫొటోలు ఉన్నాయి. వాటిపై కుటుంబ సభ్యులు, స్నేహితుల కామెంట్లు కూడా ఉన్నాయి. టర్పిన్ దంపతులు ఎప్పుడో కానీ బయటకు వచ్చేవాళ్లు కాదని ఇరుగుపొరుగు తెలిపారు ఇరుగు పొరుగు ఏమంటున్నారు? ''కేవలం వాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లడం మాత్రమే చూసేవాళ్లం. అంతే తప్ప వాళ్ల గురించి ఏ వివరాలూ తెలీదు'' అని వాళ్ల పొరుగువాళ్లు చెబుతున్నారు. వాళ్ల పొరుగున ఉండే కింబర్లీ మిలిగాన్, వాళ్ల పిల్లలు ఎన్నడూ ఆడుకునేందుకు బయటకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదని తెలిపారు. పిల్లల వెంట ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండేవాళ్లని, ఒకసారి పిల్లలను పలకరిస్తే గాభరా పడ్డారని అన్నారు. ఇంతకూ టర్పిన్ దంపతులు తమ పిల్లలను ఎందుకు బంధించారో తెలియడం లేదు. ప్రస్తుతం పిల్లలందరినీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) తమ 13 మంది పిల్లలను ఇంట్లోనే బంధించిన దంపతులను కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల్లో కొందరిని ఆ దంపతులు గొలుసులతో కట్టేసి ఉంచారని పోలీసులు తెలిపారు. text: ఈ 120 మంది కేవలం భారతీయులు కాదు. వీళ్లు భారతదేశ 'గ్రోత్ స్టోరీ'కి బ్రాండ్ అంబాసిడర్లు. భారతీయులు వాళ్లను చూసి ఆశ్చర్యపోవాలి. వాళ్ల విజయాలను గుర్తించాలి. వాళ్ల ఇళ్లలో జరిగే వేడుకలు టీవీల్లో లైవ్‌లో చూపిస్తారు. పెద్ద పెద్ద స్టార్లు కూడా అక్కడ ప్రదర్శనలు ఇస్తారు. పెద్దపెద్ద నేతలు వచ్చి నవదంపతులను ఆశీర్వదిస్తారు. వాళ్లను చూసి దేశప్రజలు మనం కూడా ఎవరికీ తీసిపోమని గర్విస్తారు. మనదేశంలో కొంతమంది వ్యక్తుల విజయాలను మొత్తం దేశం విజయాలుగా చూపించడం చాలా సులభం. కేవలం వ్యాపారంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ మనకు ఇదే కనిపిస్తుంది. అమెరికాలో ఇంద్రా నూయి, బ్రిటన్‌లో లక్ష్మీ మిట్టల్, సిలికాన్ వేలీలో సత్య నాదెళ్ల.. వీళ్ల విజయాలను మొత్తం దేశం సాధించిన విజయంగా చూపించడం జరుగుతుంది. చూడండి... పోయిన ఏడాది ఫలానా స్థానాల్లో ఉన్న అంబానీ, అదానీ ఈ ఏడాది ఫలానా స్థానానికి ఎగబాకారు. ఇలాంటి వార్తల వల్ల దేశంలో 25 కోట్ల మంది ఎలా జీవిస్తున్నారో మర్చిపోవచ్చు. దేశంలో అభివృద్ధి జరుగుతోందని విశ్వసించొచ్చు. సంస్కరణల భ్రమలు ఇటీవలే భారతదేశ ఆర్థికవ్యవస్థ ఫ్రాన్స్‌ను దాటిపోయింది. ప్రస్తుతం అది ప్రపంచంలోనే ఐదోస్థానానికి చేరుకుంది. కానీ దేశంలో ఇంకా ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లని 25 కోట్ల మందికి ఈ సక్సెస్ స్టోరీని ఎలా చెప్పాలి? నిజానికి ఈ విజయాలు దేశానివి కావు, వ్యక్తులవి. ఒకప్పుడు దేశం అత్యంత ఎక్కువగా గౌరవించే వ్యక్తులలో విజయ్ మాల్యా ఒకరు. ఆయన తనకు కోరిక కలగగానే ఎంపీ అయిపోయారు. ఆయనలాంటి అనేక మంది ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నారు. వాళ్లందరికీ డబ్బు సంపాదించడం చాలా కష్టం కావచ్చు. కానీ పార్లమెంట్‌లో అడుగుపెట్టడం మాత్రం చాలా సులభం. దీని అర్థం మిలియనీర్లు అంతా అవినీతిపరులు కాదు లేదా అతనిలాగా పారిపోతారని కాదు. మాటలకే పరిమితమైన 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థను కేవలం ఒక వేయి మంది నియంత్రిస్తున్నారు. వీళ్లే ప్రతి రాజకీయ పార్టీకి విరాళాలు ఇస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, వాళ్ల పనులు మాత్రం జరిగిపోతాయి. ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల జుగల్‌బందీనే ముద్దుగా 'క్రోనీ క్యాపిటలిజం' అని పిలుస్తారు. ఈ జుగల్‌బందీ కొనసాగినంత కాలం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అన్న నినాదం మాటలకే పరిమితమవుతుంది. రిలయన్స్‌కు రాఫెల్ కాంట్రాక్ట్, 'జియో'కు, పేటీఎమ్‌కు ప్రభుత్వం నజరానాలు ఇవ్వడం మనం చూశాం. ప్రధాని, అదానీకి ఎంత దగ్గరో విపక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి. కానీ అధికారంలోకి వస్తే విపక్షాలూ దీనికి మినహాయింపు కాదు. అధికారంలో ఎవరు ఉన్నా అంబానీ, విజయ్ మాల్యా, సుబ్రతో రాయ్‌లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మరీ ప్రత్యేకించి భారతదేశంలో ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. భూమిని, మౌలిక సదుపాయాలను సమకూరుస్తాయి. పన్నుల్లో మినహాయింపులు ఇస్తాయి. దీనికి కారణం అవి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనే కారణంతోనే. దీనిని అభినందించాల్సిందే. ధనికులే మరింత ధనవంతులు కానీ దేశంలో ఎన్నో ఏళ్లుగా ధనికులే మరింత ధనికులవుతున్నారు. వారి ఆధిక్యత కేవలం ఆర్థిక రంగంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ కనిపిస్తుంది. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలోని కోట్లాది మంది పేదల ప్రయోజనాలు, బిలియనీర్ల ప్రయోజనాలు ఒకటి కాలేవు. వాటికి ప్రతి చోటా ఘర్షణే. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం రెండింటికి మధ్య ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం పేదల పక్షం వహించి ఉంటే, ధనికులు, పేదల మధ్య అంతరం తగ్గిపోయి ఉండేది. భారతదేశం కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా విడిపోయి ఉంది. అసమానతలన్నీ సహజమైనవి అని చాలా మంది భావిస్తుంటారు. ఆర్థిక అసమానతలను ప్రజలు చాలా సులభంగా అంగీకరిస్తారు. ఎవరైనా దానిని ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వ వ్యతిరేకులనో, వామపక్షవాదులనే ముద్ర వేయడం జరుగుతుంది. ప్రభుత్వం రోజువారీ కూలీని కనీసం 10-20 రూపాయలైనా పెంచకుంటే, పరిస్థితులు మారే అవకాశం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు 10 శాతం అభివృద్ధి రేటు గురించి మాట్లాడుతుండేది. ఇప్పుడు బీజేపీ విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయని అంటోంది. కానీ దేశంలో ఇంకా ఆకలిచావుల వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని చూస్తే లోలోపల ఎక్కడో చాలా పెద్ద తప్పు జరుగుతోందని అనిపిస్తుంది. రచయిత జేమ్స్ క్రాబ్‌ట్రీ ఎకనమిక్స్ టైమ్స్ పత్రికలో ''దేశంలోని 55 శాతం సంపద కేవలం అత్యంత సంపన్నులైన 10 మంది చేతుల్లోనే ఉంది. 1980లలో అది 30 మంది చేతుల్లో ఉండేది'' అని రాశారు. ఆ పదిశాతంలోనూ, పైనున్న ఒక్క శాతం వారి చేతిలో 22 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. విదేశీ సంస్థలకు ఆర్థిక వ్యవస్థ ద్వారాలను తెరిచినప్పటి నుంచి దేశంలో సంపద పెరిగిపోయింది. మధ్యతరగతి వారి ఆదాయం పెరగడం, కోట్ల మంది ప్రజలు దారిద్ర్యరేఖకు పైకి వచ్చిన మాట నిజం. కానీ ధనికులు, పేదల మధ్య అంతరమే కలవరపెడుతోంది. 'ప్రపంచ అసమానత నివేదిక' 1950- 1980 మధ్యకాలంలో దేశంలోని అతి సంపన్నులైన ఒక శాతం మంది సంపద తగ్గిందని చెబుతోంది. కానీ తర్వాత వినిమయతత్వం పెరిగాక, వాళ్ల సంపద పెరగడం ప్రారంభమైంది. 1980 నుంచి వాళ్ల సంపద ఎన్నడూ తగ్గలేదు. 2014 నాటికి దేశంలోని 39 కోట్ల మంది పేద ప్రజల మొత్తం ఆదాయం అత్యంత ధనవంతులైన ఒక్క శాతం వారి కంటే 33 శాతం తగ్గిపోయినట్లు చెబుతోంది. మరో అధ్యయనంలో సోషలిస్టు దశాబ్దాలుగా భావించే 60, 70వ దశకాలలో దేశ ఆర్థిక పిరమిడ్‌లో అతి కింద ఉన్న వారి ఆదాయం చాలా వేగంగా పెరిగిందని వెల్లడిస్తోంది. ఆ సమయంలో పేదప్రజల ఆదాయం ధనికుల ఆదాయంకన్నా వేగంగా పెరిగింది. కానీ ఆ తర్వాత అదెప్పుడూ జరగలేదు. అదే ధోరణి కొనసాగి ఉంటే, భారతదేశంలో నేడున్నంత అసమానత ఉండేది కాదు. ధనికులు, పేదల మధ్య ఈ అంతరం కేవలం వాళ్ల ఆదాయాలలోనే కాదు, విద్య, ఆరోగ్యంలాంటి మౌలిక సదుపాయాల్లో కూడా ప్రతిఫలిస్తుంది. దాన్ని చూస్తే ఆ అసమానతలను కొనసాగించడానికే నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. భారతదేశం నేడు ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. కానీ దేశంలోని 120 కోట్ల మంది ప్రజల ఆదాయం కేవలం 120 మంది వ్యక్తుల ఆదాయంకన్నా వేగంగా పెరగనంత వరకు, భారతదేశం ఫ్రాన్స్‌లా మారలేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రస్తుతం భారతదేశంలో రూ.6836 కోట్ల (వంద కోట్ల డాలర్లు) కన్నా ఎక్కువ సంపద కలిగిన వారు 120 మంది ఉన్నారు. అమెరికా, చైనాలు కాకుండా వేరే ఏ ఇతర దేశాలలోనూ ఇంతమంది బిలియనీర్లు లేరు. అందువల్ల ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. text: ఆర్థిక వ్యవస్థలో విద్యారంగం భాగమే. సాధారణంగా ఈ విషయం గురించి చాలా మంది ఆలోచించరు. విద్యారంగం అంటే కేవలం చదువు మాత్రమే కాదు.. దాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న ఇతర విభాగాలు కూడా ఆయా సంస్థలకు కీలక ఆదాయ మార్గాలే. అన్ని వ్యవస్థల్లా విద్యా వ్యవస్థకు కూడా డబ్బే ప్రాణం. ప్రముఖ విద్యాలయాలకు అనేక ఆదాయ మార్గాలుంటాయి. బాగా సంపాదించిన పూర్వ విద్యార్థులు ఇచ్చే డొనేషన్లు కావచ్చు, వసతి, భోజనాలకు గానూ వసూలు చేసే ఫీజులు కావచ్చు, ఆపై సమావేశాలని, సౌకర్యాలని ఇలా అనేక రూపాల్లో సొమ్మును విద్యార్థుల నుంచి వసూలు చేస్తూనే ఉంటాయి విద్యా సంస్థలు. ఇప్పుడు కరోనావైరస్ దెబ్బకు విద్యారంగం మొత్తం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. అనేక విశ్వ విద్యాలయాల్లో ఉన్న విద్యార్థుల్ని ఇప్పటికే ఇంటికి పంపించేశారు. చాలా కోర్సులన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ విధానానికి మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాగే లాక్‌డౌన్ కొనసాగితే రానున్న రోజుల్లో కాంపస్‌లో కొత్త విద్యార్థుల కళ అన్నదే లేకుండా పోతుంది. అంతేకాదు.. ఇకపై ఎటువంటి సమావేశాలు జరగవు. సంపన్నులైన పూర్వ విద్యార్థులు కూడా ఇకపై అలా ఉండకపోవచ్చు. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఉన్న ఇంగ్లిష్ మాట్లాడే యూనివర్శిటీలకు ఇది కచ్చితంగా పెద్ద దెబ్బే. వాళ్లు దేశీయ విద్యార్థుల నుంచి కూడా ట్యూషన్ ఫీజుల పేరుతో భారీగా వసూలు చేస్తారు. అంతేకాదు ఆన్ సైట్ క్యాటరింగ్, వసతి పేరుతోనూ బాగానే గుంజుతారు. అటు, విదేశీ విద్యార్థుల నుంచి కూడా బాగానే ఫీజులు దండుకుంటారు. నిజానికి చాలా విశ్వ విద్యాలయాలకు వీళ్లే ప్రధాన ఆదాయ వనరు. ఉదాహరణకు బ్రిటన్‌లో అండర్‌గ్రాడ్యుయేషన్ చేసే విదేశీ విద్యార్థుల నుంచి వార్షిక ఫీజు పేరిట 9 వేల పౌండ్లకు బదులు ఏకంగా 58,600 పౌండ్లను వసూలు చేస్తారు. ప్రపంచీకరణ మొదలైన తర్వాత చవగ్గా ఉత్పత్తి అయ్యే వస్తువులను దాదాపు అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. విదేశీ విద్యార్థులను ఆకర్షించడం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఇటీవల సాధించిన గొప్ప ఆర్థిక విజయమని చెప్పవచ్చు. కరోనావైరస్:విదేశీ విశ్వ విద్యాలయాలకు వరంగా మారుతున్న మధ్య తరగతి జనం విదేశీ విశ్వవిద్యాలయాలకు మధ్యతరగతి ప్రజలే వరం ప్రపంచంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ ఉండటం పశ్చిమ దేశాల విశ్వ విద్యాలయాలకు వరంగా మారుతోందని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని ఉన్నత విద్యా విభాగానికి చెందిన ప్రొఫెసర్ సైమన్ మార్గిన్సన్ వ్యాఖ్యానించారు. “గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా మధ్య తరగతి కుటుంబాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. వారిలో ఎవ్వరైనా ఇప్పుడు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించగల్గుతున్నారు” అని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లో ఆ ప్రమాణాలతో సరిపోయే విద్యావ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందలేదు. అందుకే వాళ్లు ఆ పని చేస్తున్నారు. అంటే విదేశాల్లో చదివిన విద్యార్థికి ప్రతిష్ఠాత్మక డిగ్రీ చేతుల్లో ఉంటుంది. అలాగే తగిన భాషా పరిజ్ఞానం, చాలా మందితో పరిచయాలు, స్నేహాలు ఉంటాయి. లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించేందుకు కారణాలు ఇవే. ఈ విషయంలో విజేతలు ఎవరన్న విషయానికి వస్తే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు ముందుంటాయి. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, ఇంగ్లిష్‌లో బోధన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించగల్గుతున్నాయి. సుమారు 3,60,000 మంది చైనా విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అమెరికాలోని వివిధ విద్యాలయాల్లో చేరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ విద్యార్థుల వల్ల వచ్చే ఆదాయం సుమారు 4,500 కోట్ల డాలర్లుంటుంది. అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే విదేశీ విద్యార్థుల కారణంగా ఏటా 2వేల కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. ఆస్ట్రేలియా విశ్వ విద్యాలయాలు కొన్నేళ్లుగా లక్ష్యంగా పెట్టుకున్న మార్కెట్ విలువ ఇది. 1980 నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆండ్రూ నార్టన్ తెలిపారు. “దాదాపు అదే టైం జోన్‌లో ఉండటం, ఆకర్షణీయమైన వాతావరణం ఇవన్నీ విద్యార్థులు ఇక్కడకు వలస వచ్చేందుకు కారణమవుతున్నాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ సంక్షోభ సమయంలో కాన్‌బెర్రా ప్రభుత్వం మాత్రం ఈ రంగానికి పెద్దగా సహాయ సహకారాలను అందించడం లేదు. ప్రధాని స్కాట్ మారిసన్ కూడా లాక్ డౌన్ సమయంలో విదేశీ విద్యార్థులు ఇబ్బందిపడుతుంటే తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు సహాయం అందిస్తామని స్పష్టం చేయడమే అందుకు నిదర్శనం. “ఆయన మాటలు భవిష్యత్తులో విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా లేవు. నిజానికి అది చాలా ప్రభావం చూపిస్తుంది” అని ప్రొఫెసర్ నార్టన్ అభిప్రాయపడ్డారు. “ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఇక్కడ తమ డిగ్రీ చదువును ప్రారంభించకపోతే రాబోయే మూడేళ్లు వాళ్లు ఇక్కడ ఉండరు. అంటే దానర్థం మున్ముందు విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనున్నాయి. ఈ పరిస్థితి కేవలం ఆస్ట్రేలియాకి మాత్రమే పరిమితం కాదు” అని నార్టన్ అన్నారు. కరోనావైరస్:ఆసియా విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్న సిడ్నీ విశ్వ విద్యాలయం తమ ఫీజులు తిరిగి ఇవ్వాలంటూ విద్యార్థుల డిమాండ్ అమెరికా విషయానికి వస్తే విశ్వ విద్యాలయాలు వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని చారిత్రక విశ్వ విద్యాలయాలు, ప్రముఖ కాలేజీలుకు బిలియన్ల డాలర్ల నిధులు ఉన్నాయి. దాతృత్వం పేరిట కూడా భారీ ఎత్తున నిధులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆయా విద్యాలయాల పేరు ప్రతిష్ఠల్ని పెంచడం మాత్రమే కాదు.. వాటిల్లో చదివే విద్యార్థులపై ఫీజుల భారాన్ని కూడా పెంచుతాయి. కానీ ఇప్పుడు మూసివేయడం వల్ల వాటికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది విదేశీ విద్యార్థులు ఇప్పటికే చాలా పాఠాలను కోల్పోయిన నేపథ్యంలో ఫీజులో కొంత తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రస్తుతం చాలా అమెరికన్ యూనివర్శిటీలలో విద్యార్థులు ఇంకా అక్కడే ఉన్నారు. దీంతో వసతి, భోజన సౌకర్యాలను కల్పించేవారు కూడా భారీగానే ఆదాయం పొందుతున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా తమ ఫీజుల్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. “రాబోయే విద్యా సంవత్సరంలో తిరిగి క్యాంపస్ క్లాసుల్ని ఎలా మొదలు పెడతామో నాకైతే తెలియడం లేదు” అని బ్రిటన్‌లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన డార్ట్‌మౌట్ కాలేజ్ ప్రొఫెసర్‌ విజయ్ గోవిందరాజన్ అన్నారు. అందుకే విశ్వ విద్యాలయాలన్నీ వెంటనే ఆన్ లైన్ తరగతులను ప్రారంభించాయి. నిజానికి అవి విదేశీ విద్యార్థులను అంతగా ఆకర్షించలేవని తెలిసినప్పటికీ ప్రస్తుతం వాటికి అంత కన్నా మరో దారి లేదని ప్రొఫెసర్ మార్గిన్సన్ అభిప్రాయపడ్డారు. “విద్యార్థులకు ఏ తరహా విద్యా విధానం కావాలని అడిగినప్పుడు కచ్చితంగా ప్రత్యక్ష విద్యా బోధనను అంటే ముఖా-ముఖి బోధననే ఎంచుకుంటారు” అని గోవిందరాజన్ అన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి అన్నిపాఠాలను ఆన్‌లైన్ ద్వారా బోధిస్తామని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం ప్రకటించింది. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని కూడా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు ఒక్కసారిగా ఆన్ లైన్ బోధన, రిమోట్ బోధన వైపు మళ్లాయి. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్‌లో ఉండటం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో అంతకు మించి వారు కూడా చెయ్యగల్గింది ఏదీ లేదు. అంతే కాదు.. ఎంతో కొంత ఆదాయం సంపాదించడానికి వారికి ఇది ఒక్కటే మార్గం కూడా. అయితే తమ ఆదాయం ఒక్కసారిగా పడిపోయిన తర్వాత కూడా ఎన్ని విశ్వవిద్యాలయాలు బతికి బట్టకట్టగల్గుతాయి? ఈ ఆన్ లైన్ విధానాన్ని ఇక అవి శాశ్వతంగా కొనసాగించాల్సిందేనా? అన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఒకే చోట కల్పించి అత్యుత్తమ విద్యా బోధన చెయ్యడం అన్నది సుదీర్ఘ కాలంగా విజయవంతంగా నడుస్తున్న వ్యాపార నమూనా. ఇప్పటికీ ఆ తరహా సంస్థలకే పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. ఆదాయం కూడా ఉంది. మరి మున్ముందు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా.. లేదా మారుతుందా అన్నది భవిష్యత్తే తేల్చాలి. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని మీరు భావిస్తున్నారు? నిర్మాణ రంగమా? రిటైల్ రంగమా? రవాణా రంగమా? నిజానికి ఈ రంగాలన్నీ సంక్షోభంలో పడనున్నాయన్న మాట వాస్తవమే. అయితే వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడనుంది. text: వేడి నుంచి ఉపశమనం కోసం ఏనుగుకు స్నానం చేయిస్తున్న మావటి ఉత్తర తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఒంగోలు, కర్నూలు నగరాల్లోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఆదివారం రామగుండం, విజయవాడ, ఒంగోలు, నాగ్‌పూర్‌లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోని బ్రహ్మపురిలో 46.4 డిగ్రీలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి సంవత్సరం 2018 అని భారత వాతావరణ శాఖ నిరుడు ప్రకటించింది. ఈ ఏడాది అంతకు మించి దేశంలో సగటున 0.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా. వాతావరణ సమాచారం అందించే వెబ్‌సైట్ ఎల్ డొరాడో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత శుక్రవారం భూగోళంపైనే అత్యధిక వేడి ప్రాంతంగా సెంట్రల్ ఇండియా పేరు నమోదైంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అందుకు కారణం నగరాల్లో చోటుచేసుకుంటున్న మార్పులేని నిపుణులు అంటున్నారు. అందుకే, మధ్య భారత్‌లోని కొన్ని పట్టణాలు ప్రపంచంలోనే 15 అత్యంత వేడి పట్టణాల జాబితాలో చేరాయి. నగరాలు మండిపోతున్నాయి పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతుండటంతో గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని నగరాలు, పట్టణాలు శరవేగంగా మారిపోతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాల కోసం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. దాంతో, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. తారు, కాంక్రీటు రోడ్లు విస్తరిస్తున్నాయి. భారీ భవనాలు వెలుస్తున్నాయి. ఏసీల వాడకం పెరిగిపోతోంది. ఆ ఏసీల నుంచి వెలువడే వేడి గాలి కలవడంతో బయటి వాతావరణం మరింత వేడెక్కిపోతోంది. జనాభా అధికంగా ఉన్న నగరాల్లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఆయా నగరాలను సమీపిస్తుండగానే వేడిలో తేడా తెలిసిపోతుంది. ఆ విషయం ఇప్పటికే మనలో చాలామంది గ్రహించే ఉంటారు. భారీ భవనాల నిర్మాణాలతో పాటు ఇతర మార్పుల కారణంగా నగరాల్లో గాలి ప్రయాణ వేగం తగ్గిపోతోందని, దాంతో ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పూణెలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్. అమిత్ ధోర్డే అంటున్నారు. "నగరాల చుట్టూ పంట పొలాలు, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. తారు, కాంక్రీటు రోడ్లు విస్తరిస్తున్నాయి. అందుకే నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి. మన దేశంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని మా అధ్యయనంలో తేలింది. యూరప్ దేశాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రమే పెరుగుతున్నాయి. గడచిన నాలుగైదు దశాబ్దాల్లో ఇక్కడి నగరాల్లో చోటుచేసుకున్న మార్పులే అందుకు కారణం" అని డాక్టర్. అమిత్ వివరించారు. ఉష్ణోగ్రత పెరగడానికి భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ప్రధాన కారణమైనప్పటికీ, నగరాల్లో వేడికి ప్రధాన కారణం కాంక్రీటు నిర్మాణాలు పెరిగిపోవడమేనని ప్రొఫెసర్ మానసి దేశాయ్ నొక్కి చెప్పారు. కాంక్రీటు నిర్మాణాలు, తారు రోడ్లు మధ్యాహ్నం వేడిని గ్రహించి, రాత్రి విడుదల చేస్తాయి. దాంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా నగరాల్లో వేడి పెరిగిపోతోందని ఆమె అన్నారు. గాలి ప్రవాహ దిశ గాలి ఏ దిశ నుంచి వీస్తుందన్నది ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులకు ఒక ప్రధాన కారణమని డాక్టర్ రాజన్ కేల్కర్ చెప్పారు. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల నుంచి గాలి వస్తుంటే వేడి ఎక్కువగా ఉంటుంది. 'కోర్ హీట్ జోన్' గా పిలిచే తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ఏడాది సగటుకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తాము ముందుగానే అంచనా వేశామని భారత వాతావరణ శాఖకు చెందిన అధికారి కృష్ణానంద్ హోసలికర్ చెప్పారు. మన తిండి కూడా మారాలి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తినే ఆహారంలో, వేసుకునే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కేల్కర్ అంటున్నారు. "రాజస్థాన్‌లో చూస్తే అక్కడ తరచూ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సీయస్ దాటుతుంది. ఆ ఎండలను తట్టుకునేలా అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లు తలమీద వస్త్రం వేసుకోకుండా ఇంటి నుంచి బయట అడుగుపెట్టరు. ఎక్కడ చూసినా తాగునీరు అందుబాటులో ఉండేలా చూస్తారు. తరచూ నీళ్లు తాగుతారు. కొత్తవారు ఎవరైనా అక్కడికి వెళ్లినా వెంటనే నీళ్లు తాగాలని పదేపదే చెబుతుంటారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వారు తమ జీవనశైలిని మార్చుకున్నారు. వారి నుంచి అందరూ నేర్చుకోవాలి" అని కేల్కర్ సూచిస్తున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44, 45 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోతున్నాయి. text: కరోనా వైరస్‌ కట్టడికి అతిత్వరలోనే టీకా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దాని పంపిణీ చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆసక్తిగల వారందరూ తమ పేర్లను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని సూచించింది. టీకా తీసుకోవాలన్న బలవంతం ఏమీ ఉండదని తెలిపింది. పేరు నమోదైన వారికే టీకా అందిస్తారని పేర్కొంది. వ్యాక్సిన్‌ ఎక్కడ, ఎప్పుడు ఇచ్చేదీ ఫోన్‌కు సమాచారం వస్తుందని, ఆ సమయంలో ఏదో ఒక ఫొటో గుర్తింపుకార్డు చూపటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. టీకాకు సంబంధించి ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలకు(ఎఫ్‌ఏక్యూ) సమాధానాలను శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిందని ఈనాడు రాసింది. అందరికీ ఒకేసారి టీకా వేస్తారా? వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో ఎక్కువ ముప్పు ఉన్నవారికి ముందుగా ఇస్తుంది. తొలుత వైద్య ఆరోగ్య సిబ్బంది, ముందువరుసలో ఉండి సేవలు అందిస్తున్న వారికి... ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడినవారు, 50ఏళ్లలోపు వయస్సుండి అనారోగ్య సమస్యలున్న వారికి ఇస్తారు. టీకా తీసుకోవడం తప్పనిసరా? పూర్తిగా స్వచ్ఛందం. అయితే కరోనా వైరస్‌ నుంచి రక్షణకు టీకా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు, సహచరులకు వైరస్‌ వ్యాపించకుండా నివారించవచ్చు. పేరు నమోదు చేయించుకోకపోతే? వ్యాక్సిన్‌ కావాలంటే పేరు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం తప్పనిసరి. పేరు ఇస్తేనే టీకా ఎప్పుడు, ఎక్కడ వేసేది చెబుతారు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి టీకా ఇస్తారా? వైరస్‌ లక్షణాలు తగ్గిపోయిన 14 రోజుల తర్వాత టీకా ఇస్తారు. తగ్గినవారూ తీసుకోవాలా? వైరస్‌ సోకిందా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఎన్ని డోసులు.. వ్యవధి ఎంత? 28 రోజుల తేడాతో ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలి. రెండో డోస్‌ తీసుకున్న 2 వారాలకు రోగ నిరోధశక్తి ఏర్పడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువ. కాబట్టి అలాంటి వారు కచ్చితంగా టీకా తీసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి? డ్రైవింగ్‌ లైసెన్స్‌, కార్మికశాఖ జారీచేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌కార్డ్‌, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డ్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలు జారీచేసిన అధికారిక ఫొటో గుర్తింపుకార్డు, పాన్‌కార్డు, బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌ బుక్కులు, పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగసంస్థలు జారీచేసిన ఉద్యోగ గుర్తింపుకార్డులు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి. ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డు సమర్పించాలి. వ్యాక్సిన్‌ వేసే సమయంలో దాన్ని తనిఖీచేస్తారని ఈనాడు వివరించింది. రోడ్డుపై మజ్లిస్ నేత కాల్పులు ఆదిలాబాద్‌లో మజ్లిస్ నేత నడిరోడ్డుపై కాల్పులు జరిపారంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక వార్త ప్రచురించింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయం త్రం ఓ మజ్లిస్‌ నేత రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓఎస్డీ రాజేశ్‌చంద్ర కథనం ప్రకారం.. పట్టణంలోని తాటిగూడ ప్రాంతంలో పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా గొడవ జరిగింది. ఆ సమయంలో పిల్లల తల్లిదండ్రులు బయటకు వచ్చారు. వారి మధ్య మాటామాటా పెరగడంతో కోపొద్రిక్తుడైన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ తన ఇంట్లోకి వెళ్లి.. లైసెన్స్‌ రివాల్వర్‌ తోపాటు కత్తిని తీసుకువచ్చారు. సయ్యద్‌ మన్నాన్‌, సయ్యద్‌ జమీర్‌, సయ్యద్‌ మోతెశాంలపై దాడికి పాల్పడ్డారు. సయ్యద్‌ మోతెశాం నడుముకింది భాగంలో ఒక బుల్లెట్‌, సయ్యద్‌ జమీర్‌కు కడుపు, వీపులో రెండు బుల్లెట్లు తగిలాయి. సయ్యద్‌ మన్నాన్‌ తలపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. దాడి సమాచారాన్ని తెలుసుకున్న టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను రిమ్స్‌ దవాఖానకు తరలించారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకొని కత్తి, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఐపీసీ 307, భారత ఆయుధాల చట్టం 27/30 కేసు నమోదు చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు ఓఎస్డీ రాజేశ్‌ చంద్ర తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది. రుణాలు ఇచ్చి వేధించే యాప్‌లు చైనావే - తెలంగాణ డీజీపీ అప్పులు ఇచ్చి జనాలను పీడిస్తున్న రుణ యాప్‌లు చైనావేనని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది. రుణాలు ఇచ్చి తర్వాత అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చే యాప్‌ల ఆటకట్టించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్‌లైన్‌ యాప్‌లకు ఆర్‌బీఐ అనుమతి లేదని.. అందులో చాలా మటుకు చైనీస్‌ యాప్‌లే ఉన్నట్లు కనుగొన్నారని ఆంధ్రజ్యోతి చెప్పింది. ఆయా యాప్‌లకు రిజిస్టర్‌ అయిన చిరునామాలు సరిగా లేవని పోలీసులు గుర్తించారు. కేసులన్నింటినీ పరిశీలించి బాధ్యులైన యాప్‌ నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్‌ క్రైం నిపుణులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆయా కేసుల్లో మృతుల సెల్‌ఫోన్ల నుంచి, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారంతా కూడా ఇన్‌స్టెంట్‌ యాప్‌ల వేధింపుల వల్లే మృతిచెందినట్లు తెలుసుకొని కేసులు నమోదు చేశారు. కాగా తీసుకున్న అప్పును తిరిగి రాబట్టే క్రమంలో అప్పు తీసుకున్న వారికి.. వారి కాంటాక్టు లిస్ట్‌లో ఉన్నవారికి ఫోన్లు చేయడం, వాట్సాప్‌ సందేశాలు పంపడం వంటి పనుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యాప్‌ నిర్వహకులతోపాటు కాల్‌ సెంటర్‌ నిర్వహకులపై చట్టపరమైన తీసుకునేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారని పత్రిక రాసింది. రాజేంద్రనగర్‌, సిద్దిపేటలో నమోదైన కేసుల్లో బాధితులు రుణం తీసుకున్న యాప్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సైబర్‌ క్రైం పోలీసులు సేకరించారు. రుణ యాప్‌లలో చాలామటుకు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధగా ఉన్నాయని, ఆర్బీఐ వద్ద రిజిస్టర్‌ అవ్వని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవొద్దని ప్రజలకు డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారని ఆంధ్రజ్యోతి చెప్పింది. ఇన్‌స్టెంట్‌ లోన్‌ల పేరుతో బురిడీ కొట్టించి యాప్‌లను నమ్మి మోసపోవద్దని, ఆ యాప్‌ల నుంచి ఇప్పటికే రుణాలు పొందినవారు వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎదుటి వారికి ఇవ్వరాదని చెప్పారు. ఫోన్‌ కాంటాక్ట్స్‌, ఫోటోలు తీసుకుని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరించారని ఆంధ్రజ్యోతి వివరించింది.. కొలిక్కి వస్తున్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ఏపీ, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ముగింపు దశకు వచ్చిందని సాక్షి పత్రిక కథనం ప్రచురించింది. ఏపీ, తెలంగాణ మధ్య ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీకి 655 మంది ఉద్యోగులు వెళ్తుండగా ఏపీ నుంచి తెలంగాణకు సైతం సమాన సంఖ్యలో ఉద్యోగులు రావాలని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ డి.ఎం. ధర్మాధికారి ఏకసభ్య కమిటీ గతేడాది నవంబర్‌లో తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తీర్పునివ్వడంతో ఆ మేరకు ఏపీ, తెలంగాణ జెన్‌కోలు, ట్రాన్స్‌కోల మధ్య ఉద్యోగుల పరస్పర కేటాయింపులపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని పత్రిక చెప్పింది. తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు 252 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేయడంతోపాటు ఏపీ జెన్‌కో నుంచి 252 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు 300 మందిని కేటాయించాలని, అంతే సంఖ్యలో ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ జెన్‌కోకు తీసుకోవాలని ధర్మాధికారి కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే వారిలో రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని తుది కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరింది. దీంతో తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు వెళ్లే వారిలో 48 మంది రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉండటంతో వారిని మినహాయించి మిగిలిన 252 మందిని ఏపీ జెన్‌కోకు కేటాయించినట్లు సాక్షి వివరించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా టీకాపై ప్రజల సందేహాలు నివృత్తి చేసేందుకు సమాచారం విడుదల చేసిన కేంద్రం టీకా స్వచ్ఛందమేనని చెప్పిందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. text: పార్లమెంటులో బిల్లు తిరస్కరణకు గురి కావటంతో అబార్షన్లకు చట్టబద్ధత కోరుతున్న మహిళలంతా కన్నీరుమున్నీరయ్యారు ప్రస్తుతం అర్జెంటీనాలో అబార్షన్ చట్టవిరుద్ధం. కేవలం అత్యాచార సంఘటనల్లో లేదా గర్భం ధరించిన మహిళ ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటేనో అబార్షన్ చేయొచ్చు. ఓటింగ్ జరుగుతున్నప్పుడు అబార్షన్‌కు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రజలు పార్లమెంట్ బయట ఎదురుచూశారు. రాత్రి బాగా పొద్దుపోయినప్పటికీ మహిళలంతా రోడ్లపైనే నిలబడి ఫలితం పట్ల ఆసక్తి కనబర్చారు. 2005లో తొలిసారి అబార్షన్లకు చట్టబద్ధత కల్పించాలనే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం ఇప్పటికి ఏడుసార్లు బిల్లుల్ని పెట్టారు. తాజాగా బుధవారం పెట్టిన బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లుకు అనుకూలంగా 31 మంది సెనెటర్లు ఓట్లు వేయగా, 38 మంది సెనెటర్లు అబార్షన్లకు చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ ఓట్లేశారు. దీంతో, మళ్లీ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే ఏడాది ఆగాల్సి ఉంటుంది. బిల్లును పార్లమెంటు వ్యతిరేకించటంతో సంబరాలు చేసుకుంటున్న అబార్షన్లకు చట్టబద్ధతను వ్యతిరేకిస్తున్న వర్గం ప్రజలు ''అర్జెంటీనా కుటుంబ విలువల్ని ప్రతిబింబించే దేశం అని ఈ ఓటింగ్ రుజువు చేసింది'' అని అబార్షన్ వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు అన్నారు కాగా, బిల్లును పార్లమెంటు తిరస్కరించటంతో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా ఆనందం వెలిబుచ్చారు. ‘‘అర్జెంటీనా కుటుంబ విలువల్ని ప్రతిబింబించే దేశం అని ఈ ఓటింగ్ రుజువు చేసింది’’ అని అబార్షన్ వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు. పార్లమెంటులో బిల్లు తిరస్కరణకు గురి కావటంతో అబార్షన్లకు చట్టబద్ధత కోరుతున్న మహిళలంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆకుపచ్చ దుస్తులు, గుడ్డలు ధరించి గత కొద్ది రోజులుగా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వీరంతా పార్లమెంటు ఫలితం వెలువడిన తర్వాత ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న అర్జెంటీనా మహిళలు అబార్షన్లకు చట్టబద్ధత కల్పించాలని చాలా సంవత్సరాలుగా అర్జెంటీనాలో ఉద్యమం జరుగుతోంది. ఈ బిల్లును పరిశీలించేందుకు దేశాధ్యక్షుడు మారికో మాక్రి పార్లమెంటు సమావేశాలకు పిలుపునివ్వటంతో అబార్షన్ల అనుకూల ఉద్యమకారుల ప్రయత్నాలకు ఊపొచ్చింది. కానీ, పార్లమెంటులో మెజార్టీ సెనెటర్లు మద్దతు ఇవ్వకపోవటంతో బిల్లు వీగిపోయింది. జూన్ నెలలో ఈ బిల్లుకు దిగువ సభ స్వల్ప మెజార్టీ తేడాతో ఆమోదం తెలిపింది. అప్పుడు కూడా సభలో దాదాపు 24 గంటల పాటు చర్చ జరిగింది. వేలాది మంది మహిళలు పార్లమెంటు బయటే నిలబడి రాత్రింబవళ్లు జాగరణ చేసి, ఫలితం కోసం ఎదురుచూశారు. మొత్తం 26 లాటిన్ అమెరికా దేశాల్లో ఉరుగ్వే, క్యూబా దేశాలు మాత్రమే అబార్షన్లను పూర్తి చట్టబద్ధం చేశాయి. ఆకుపచ్చ దుస్తులు, గుడ్డలు ధరించి గత కొద్ది రోజులుగా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న మహిళలంతా పార్లమెంటు ఫలితం వెలువడిన తర్వాత ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు బిల్లును పార్లమెంటు వ్యతిరేకించటంతో ఆగ్రహించిన కొందరు మహిళలు విధ్వంసానికి పాల్పడ్డారు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గర్భం ధరించిన తర్వాత 14 వారాల్లో చేసే అబార్షన్లకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ ప్రతిపాదించిన బిల్లును అర్జెంటీనా సెనెటర్లు తిరస్కరించారు. text: తాము చెమటోడ్చి పండించిన పంటలను, కూరగాయలు, పాలను రోడ్డుపై పారబోసి రైతులు నిరసన తెలుపుతున్నారు. కూరగాయల వాహనాలను మార్కెట్లకు తరలించకుండా అడ్డుకుంటున్నారు. అఖిల భారత కిసాన్ మహాసంఘ్ సారథ్యంలో సుమారు 100 రైతు సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకుంటే త్వరలో పట్టణాలకు కూరగాయలు, పాల సరఫరా పూర్తిగా బంద్ చేస్తామని రైతు సంఘాలు ఇదివరకే హెచ్చరించాయి. పది రోజుల తమ ఆందోళనలో చివరి రోజైన జూన్ 10న 'భారత్ బంద్‌' చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. కాగా, రైతుల సమ్మెపై అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వీరిలో ఒకరు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి. మరొకరు హర్యానా ముఖ్యమంత్రి. ఇంకొకరు మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి. "మీడియా దృష్టిలో పడేందుకే రైతులు నిరసనలు చేస్తున్నారని, అదంతా పబ్లిసిటీ స్టంట్" అని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ శనివారం అన్నారు. "దేశంలో 14 కోట్ల మంది రైతులున్నారు. వారిలో కొందరికి మీడియాలో కనిపించాలనే తాపత్రయం ఉంది" అని ఆయన అన్నట్లు 'ఇండియా టుడే' పేర్కొంది. అసలు ఎన్డీఏ హయాంలో వ్యవసాయ రంగ ఉత్పత్తి బాగా పెరిగిందని కూడా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. "అసలు రైతులకు ఎలాంటి సమస్యలు లేవు. అనవసరమైన విషయాలపై వారు దృష్టి పెడుతున్నారు" అని ఆయన అన్నారు. పండించిన పంటను అమ్ముకోకపోతే రైతులకే నష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. "దేశంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారు, ఎవరూ ఆందోళన చేయడం లేదు" అని మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి బాలకృష్ణ పాటిదార్ చెప్పారు. మధ్యప్రదేశ్ సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని, సమస్యలను పరిష్కరిస్తారని కేంద్ర రాష్ట్రాలపై వారికి నమ్మకం ఉందని ఆయన చెప్పినట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌' పేర్కొంది. ఏడాది క్రితం, 2017 జూన్ 6న మధ్యప్రదేశ్‌లోని మందసోర్‌లో తమ సమస్యలపై ఆందోళనకు దిగిన రైతులపై జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రుల తాజా వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వీరిని వెంటనే పదవుల్లోంచి తప్పించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేసినట్లు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. సోషల్ మీడియాలో కూడా మంత్రుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమైంది. "కేంద్ర వ్యవసాయ మంత్రి రైతుల ఆందోళన ఒక గిమ్మిక్కు అంటారు. రైతుల ఆందోళనలో విషయం లేదని హరియాణా సీఎం అంటున్నారు. ఇది నిజంగా దురహంకారమే" అని 'ద ప్రింట్‌' వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా అభిప్రాయపడ్డారు. "2019 ఎన్నికల్లో రైతులే వీరికి సరైన బుద్ధి చెబుతారని" సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. "రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి వ్యవసాయ మంత్రిని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు" అని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి వ్యాఖ్యలపై బీబీసీ న్యూస్ తెలుగు నెటిజన్ల అభిప్రాయాలు కోరింది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను చాలామంది సోషల్ మీడియా యూజర్లు తప్పబట్టారు. రైతుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రాహుల్‌గాంధీ జూన్ 6న మధ్యప్రదేశ్‌లో రైతులను కలిసి, వారికి మద్దతు తెలపనున్నారు. భారత దేశంలో రోజూ 35 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు 10 రోజుల పాటు నిరసనలు చేస్తున్నారు. వారికి అండగా ఉంటానని రాహుల్ ట్వీట్ చేశారు. రైతుల డిమాండ్లు ఇవి రైతులు ప్రధానంగా మూడే మూడు డిమాండ్లు చేస్తున్నారు. 1. రైతులు తీసుకున్న అన్ని రుణాలు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలి. 2. వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. 3. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలి. వీటితో పాటు అటవీ ప్రాంతాల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు ఆ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడం, తదితర చిన్న చిన్న డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు పెట్టారు. పై డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానట్టయితే పట్టణాలకు కూరగాయలు, పాల సరఫరా పూర్తిగా నిలిపివేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర రైతులు నిర్వహించిన మహా పాదయాత్ర ఈ ఏడాది ప్రారంభంలో కూడా మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ముంబై వరకు అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిరసన విరమించారు. హామీల అమలు కోసం మళ్లీ అన్నదాతలు రోడ్డెక్కారు. అయితే, రైతుల ఆందోళన వెనక విపక్షాల ప్రమేయం ఉందని అధికార భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతికి విఘాతం కలిగించి, అలజడి సృష్టించడం కోసమే కొందరు రైతుల ఆందోళనను హింసాత్మకంగా మారుస్తున్నారని బీజేపీ నాయకుడు రాజ్‌వీర్ సింగ్ అన్నారు. కొందరు విపక్ష పార్టీ కార్యకర్తలు బలవంతంగా, దౌర్జన్యంగా రైతుల నుంచి పాలను లాక్కొని రోడ్లపై పారబోస్తున్నారని అంటూ, కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, రైతులు ఇలా కూరగాయలనూ, పాలను రోడ్లపై పారబోయడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. రైతుల సమస్యలు న్యాయమైనవే కానీ ఇలా పంటల్ని రోడ్డుపాలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏడు రాష్ట్రాల్లో రైతులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో 'గావ్ బంద్‌' పేరుతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. text: 25 సంవత్సరాలు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సీన్ అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కరోనా వ్యాక్సీన్ ఎగుమతి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. భారత ప్రజల ప్రాణాల కన్నా పాకిస్తాన్ ప్రజల ప్రాణాలు ఎక్కువా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చడ్డా. "రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సీన్ నిబంధనల్లో ఉన్న వయో పరిమితిని తొలగించాలని, తక్కువ సమయంలో ఎక్కువమందికి వ్యాక్సీన్ ఇవ్వగలిగితేనే కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుందని" రాజస్థాన్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సీన్ ఇవ్వడానికి అనుమతించాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసింది. వయో పరిమితి ఎందుకు తగ్గించడం లేదు ఈ విషయమై వివిధ ప్రాంతాల నుంచి ఇన్ని అభ్యర్థనలు వస్తున్నప్పుడు మోదీ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు? ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. "ప్రపంచంలో అన్నిచోట్లా కూడా ప్రజల కోరికల ఆధారంగా కాకుండా, అవసరాలను బట్టి వ్యాక్సీనేషన్ ప్రక్రియ జరుగుతోంది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో కూడా వయోపరిమితి నిబంధనలతో దశలవారీగా టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని" ఆయన అన్నారు. అయితే, ఈ విషయంలో ఇంత కఠినంగా వయో పరిమితి నిబంధనలు పాటించడానికి కారణాలేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వయసు ప్రకారం టీకా వేయడం సరైన పద్ధతేనని, ప్రభుత్వ నిర్ణయం వెనుక తగిన కారణాలు ఉన్నాయని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతి అయిన డాక్టర్ సునీలా గార్గ్ అంటున్నారు. ఆవిడ వాదనలు ఇలా ఉన్నాయి. వాదన 1: ‘అందరూ’ అంటూ అవసరమైనవారిని నిర్లక్ష్యం చేయకూడదు 45 ఏళ్లు దాటిన వారిలో కోవిడ్ మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోందని గణాంకాలు సూచిస్తునాయి. 18 ఏళ్లు నిండినవారికి కూడా టీకాలు వేయడం మొదలుపెడితే, వయసులో చిన్నవారందరికీ వ్యాక్సీన్ లభించి, పెద్దవారికి అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితి రావొచ్చు. ముందు ముందు ప్రభుత్వం వీరికి టీకాలు వేయలేకపోతే, కోవిడ్ మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. వాదన 2: కోవిడ్ వ్యాక్సీన్ కొత్తగా వచ్చింది. దాన్ని ఇంటింటికీ వెళ్లి వేయడం కుదరదు కరోనావైరస్‌కు రికార్డ్ సమయంలో వ్యాక్సీన్ తయారవడం ఇదే మొదటిసారి. దీనివల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉండొచ్చు. భారతదేశంలో ఇంతవరకూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ నమోదు కాలేదు. కానీ, భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుచేత ఇంటింటికీ వెళ్లి వ్యాక్సీన్ వేయడం లేదా రైల్వే స్టేషన్‌లో బూత్ పెట్టి టీకాలు వేయడం సాధ్యం కాదు. ప్రజల సహకారంతో, అంగీకారంతో మాత్రమే ప్రభుత్వం వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతుంది. వాదన 3: 'వ్యాక్సీన్ పట్ల విముఖత'తో వ్యవహరించడం మొదట్లో అనేకమంది కోవిడ్ వ్యాక్సీన్ పట్ల విముఖంగా ఉన్నారు. కొందరు డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కూడా కోవిడ్ టీకా వేసుకోవడానికి వెనుకాడారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సీన్ కోసం డాక్టర్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. కానీ, ఇప్పుడొచ్చి వాళ్లంతా వ్యాక్సీన్ కావాలని అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి 45 ఏళ్లు పైబడినవారిలో రాకూడదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. వ్యాక్సీన్ పట్ల ఉన్న విముఖత పోయి ఆ వయో పరిధిలోని వారందరూ టీకాలు వేయించుకోవాలి. జనవరి నుంచి కోవిడ్ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వ్యాక్సీనేషన్ ప్రారంభమై మూడు నెలలే అవుతోంది. అందుచేత, 45 ఎళ్లు పైబడినవారికి మరికొంత సమయం ఇవ్వడం అవసరం. వాదన 4: పర్యవేక్షణ కష్టం అవుతుంది భారతదేశంలో జనాభా ఎక్కువ. 80 కోట్ల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 160 కోట్ల డోసుల వ్యాక్సీన్ కావాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రైవేటు రంగం సహాయం కూడా కావాలి. అలాంటప్పుడు పర్యవేక్షణ సమస్యగా మారే అవకాశం ఉంది. కరోనావైరస్ ఒక కొత్త అంటువ్యాధి. అందుకే కేంద్ర ప్రభుత్వమే అన్నీ చూసుకుంటోంది. వయో పరిమితిని తొలగించడం పర్యవేక్షణ దృష్ట్యా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది. వాదన 5: చిన్న వయసు వారికి మాస్కే వ్యాక్సీన్ బయట తిరగకుండా ఇంట్లో కూర్చుంటున్నవారికే ప్రభుత్వం వ్యాక్సీన్ ఇస్తోందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి 18 నుంచి 45 ఏళ్ల లోపువారి వల్లే కరోనా అధికంగా వ్యాపిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే మాస్కులు లేకుండా తిరగడం. మాస్కులే రక్షణ, మాస్కే వ్యాక్సీన్ అని యువత అర్థం చేసుకోవాలి. భౌతిక దూరం పాటించడం, చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండడం మానకూడదు. ఎలాగూ, వ్యాక్సీన్ కూడా 100 శాతం రక్షణ కల్పించలేదు. కరోనా వ్యాప్తి నివారణకు పద్ధతులన్నీ పాటిస్తూ ఉండాల్సిందే. వాదన 6: వ్యాక్సీన్ నేషనలిజం, కోవాక్స్ రెండూ కలిసి నడవాలి ప్రపంచంలో టీకా ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అందుచేత భారతదేశానికి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కోవాక్స్ ప్రక్రియ (అవసరమైనవారికి వ్యాక్సీన్ అందించేందుకు WHO చేపట్టిన కార్యక్రమం)లో భారత్ తప్పక పాల్గొంటుంది. అదే సమయంలో, సామాజిక బాధ్యతగా ఇండియా కోవిడ్ వ్యాక్సీన్‌ను ఇతర దేశాలకు కూడా పంపిస్తోంది. అయితే, దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే పనులేవీ ప్రభుత్వం చేయట్లేదు. దేశ ప్రజల అవసరాలను తీర్చడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వాస్తవానికి, భారతదేశం మొత్తానికి ఒకటి లేదా రెండు వ్యాక్సీన్లు సరిపోవు. మరో ఆరు వ్యాక్సీన్లకు ఆమోదం ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. అవి కూడా వచ్చేస్తే వ్యాక్సీనేషన్ ప్రక్రియ మరింత ఊపందుకుంటుంది. తరువాతి దశలో 30 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకాలు ఇచ్చే అవకాశం ఉందని డాక్టర్ సునీలా భావిస్తున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడినవారికి, 25 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లు సరైనవేనని, కోవిడ్ వ్యాక్సీన్‌కు వయోపరిమితిని తొలగించాలని 'ది కరోనావైరస్ బుక్', 'ది వ్యాక్సీన్ బుక్' పుస్తకాల రచయిత, ముంబై జస్‌లోక్ హాస్పిటల్ మెడికల్ రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ పారేఖ్ అభిప్రాయపడ్డారు. ఆయన వాదనలు ఇలా ఉన్నాయి.. వాదన 1: కరోనావైరస్ సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి వ్యాక్సీన్‌కు వయోపరిమితిని తొలగించాలి కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. ఫస్ట్ వేవ్ కన్నా వేగంగా వ్యాప్తిస్తోంది. సెరో సర్వే ప్రకారం కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయని తేలింది. తక్కువ యాండీబాడీస్ ఉన్న ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారే ప్రమాదం ఉంది. అలాంటి ప్రాంతాల్లో అన్ని వయసులవారికీ వ్యాక్సీన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించాలి. తద్వారా సెకండ్ వేవ్‌ను నియంత్రించొచ్చు. వాదన 2: వ్యాక్సీనేషన్ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలి మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలలు కావొస్తున్నా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇప్పటివరకు 5 శాతానికి మాత్రమే వ్యాక్సీన్ ఇచ్చారు. బ్రిటన్‌లో 50 శాతం వ్యాక్సీనేషన్ పూర్తయింది. ఇజ్రాయెల్‌లో కూడా వేగంగా జరుగుతోంది. ఆ దేశాలలో కోవిడ్ నియంత్రణ వేగంగా జరుగుతోంది. వీటినుంచి భారతదేశం నేర్చుకోవాలి. వ్యాక్సీనేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రస్తుతం ఇండియాలో వ్యాక్సీనేషన్ జరుగుతున్న వేగం చూస్తే దేశం మొత్తం టీకాలు వేయడానికి మూడేళ్లు పట్టొచ్చు అనిపిస్తోంది. వయోపరిమితిని తొలగించడం ద్వారా లక్ష్యాలను మరింత త్వరగా చేరుకోవచ్చు. వాదన 3: వ్యాక్సీన్ వృధాను కట్టడి చేయాలి ఏడు శాతం వ్యాక్సీన్లు వృధా అవుతున్నాయని కేంద్రం తెలిపింది. వయో పరిమితిని తొలగిస్తే వ్యాక్సీన్ వృధా అవ్వకుండా చూడొచ్చు. అయితే, డాక్టర్ సునీలా ఏమంటున్నారంటే.. ప్రభుత్వం వాక్-ఇన్ వ్యాక్సీనేషన్ ద్వారా టీకా వృధాలను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి వ్యాక్సీన్ ఉత్పత్తిదారుల సహకారం కూడా కావాలి. ఇప్పుడు 20 మోతాదుల ప్యాక్ వస్తున్నట్లైతే దాన్ని 5 మోతాదుల ప్యాక్‌గా మార్చలి. చిన్న చిన్న మోతాదుల్లో ప్యాకింగ్ చేస్తే టీకాలు వృధా అవ్వకుండా ఉంటాయి. వాదన 4: సెకండ్ వేవ్ వలన వ్యాక్సీనేషన్ ఆగిపోకూడదు రెండు నెలల క్రితం ఇజ్రాయెల్‌లో ఈ పరిస్థితి వచ్చింది. సెకండ్ వేవ్ కారణంగా రెండు రోజులు టీకాలు ఇవ్వడం ఆపేయాల్సి వచింది. అలాంటి పరిస్థితి భారత్‌లో రాకూడదు. ఇజ్రాయెల్ అనుభవాల నుంచి భారత్ నేర్చుకోవాల్సి ఉందని డాక్టర్ పారేఖ్ అంటున్నారు. వాదన 5: మిగతా దేశాల నుంచి నేర్చుకోవాలి వ్యాక్సీనేషన్‌ను వేగవంతం చేయడం వలన అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. వీటన్నిటినీ చూసి భారతదేశం తన వ్యూహంపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా వ్యాక్సీనేషన్ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని అనేకమంది కోరుకుంటున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. text: పీటీఐ వార్త ప్రకారం, 18 ఏళ్లకన్నా తక్కువ వయసున్న భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరమనీ, దీనిని రేప్‌గానే పరిగణించాలనీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం, మైనర్ భార్య ఒక సంవత్సరం లోపు దీనిపై ఫిర్యాదు చేయొచ్చు. అయితే రేప్ కేసులకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 375లో ఉన్న ఒక మినహాయింపు ప్రకారం దాంపత్య రేప్‌ను నేరంగా పరిగణించరు. అంటే భర్త ఒకవేళ తన భార్య ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబధం పెట్టుకున్నా అది నేరం కాదు. 'దాంపత్య రేప్'కు సంబంధించిన మరో కేసులో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని నేరంగా పరిగణించగూడదని ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చిన ఆ కేసులో, దీనిని 'నేరంగా పరిగణిస్తే వివాహ వ్యవస్థ అస్థిరంగా మారిపోతుంద'ని కేంద్రంగా వాదించింది. ఇది 'భర్తలను వేధించే ఒక కొత్త ఆయుధం'గా తయారవుతుందని కూడా అది తన వాదనలో పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మైనర్ భార్యతో శారీరక సంబంధం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. text: సైనోఫార్మ్ టీకాను ఇప్పటికే కోట్ల మందికి ఇచ్చారు. అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలు కాకుండా, వేరే దేశం తయారుచేసిన కరోనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించడం ఇదే మొదటిసారి. సైనోఫార్మ్ కోవిడ్19 టీకాను చైనాలో ఇప్పటికే కోట్ల మంది ప్రజలు వేయించుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు పీఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా తయారుచేసిన టీకాలకే ఆమోదం తెలిపింది. అయితే, వివిధ దేశాల్లోని ఆరోగ్య నియంత్రణ వ్యవస్థలు అత్యవసర పరిస్థితుల్లో సైనోఫార్మ్ టీకాను వాడేందుకు గతంలోనే అనుమతి ఇచ్చాయి. ఈ జాబితాలో ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాల్లోని పేద దేశాలు ఉన్నాయి. ప్రారంభ దశలో చైనా వ్యాక్సీన్ల డేటా అంతర్జాతీయంగా విడుదల కాకపోవడంతో వాటి సామర్థ్యంపై చాలా కాలంగా అనిశ్చితి ఉంది. సైనోఫార్మ్ టీకా భద్రత, సమర్థత, నాణ్యతలను తాము ధ్రువీకరించామని డబ్ల్యూహెచ్‌వో మే 7న ప్రకటించింది. ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న ప్రజలకు టీకాతో రక్షణ కల్పించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావించింది. సైనోఫార్మ్ టీకాకు తమ ఆమోదంతో ఆయా దేశాలు టీకా సేకరణను వేగవంతం చేసేందుకు అవకాశముందని చెప్పింది. 18 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసున్నవారికి రెండు డోసులుగా ఈ టీకాను ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. మరో చైనా కంపెనీ తయారుచేసిన సైనోవాక్ అనే వ్యాక్సీన్‌పై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశముంది. టీకాకు సంబంధించి ప్రస్తుతం అదనపు సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. సైనోవాక్ టీకాను ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించిన అనేక దేశాలకు ఇప్పటికే కోట్ల డోసుల్లో ఎగుమతి చేశారు. రష్యా టీకా స్పుత్నిక్ పనితీరు, నాణ్యతలపై ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో మదింపు జరుపుతోంది. కంబోడియాలో సినోఫామ్ టీకా వేయించుకొంటున్న ఒక మహిళ డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ప్రాధాన్యం ఏమిటి? ఏదైనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపితే టీకా సురక్షితమైనది, ప్రభావవంతమైనది అని నిర్ధరించినట్లు అవుతుంది. అది వివిధ దేశాల్లోని జాతీయస్థాయి నియంత్రణ వ్యవస్థలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. టీకాకు జాతీయస్థాయిలో ఆమోదం తెలిపే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం నమ్మకాన్ని కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్‌ గెబ్రియేసస్‌ చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పొందిన టీకాను 'కోవాక్స్' అంతర్జాతీయ కార్యక్రమంలోనూ ఉపయోగించవచ్చు. టీకా లభ్యతలో పేద, ధనిక దేశాలకు సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఈ పథకాన్ని 2020లో ప్రారంభించారు. సేకరణ, సరఫరాలో సమస్యలతో ఈ పథకం అవరోధాలను ఎదుర్కొంటోంది. అత్యవసర పరిస్థితుల్లో చైనా టీకా వినియోగానికి ఆమోదంతో ఈ సమస్య చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశముంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదానికి ముందు నుంచే సైనోఫార్మ్ టీకాను విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం సుమారు ఆరున్నర కోట్ల డోసులను ఇప్పటికే వేశారు. చైనాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, మధ్య ఐరోపా దేశమైన హంగేరీలలో సినోఫార్మ్ టీకాను ఇంతకుముందు నుంచే వేస్తున్నారు. సైనోఫార్మ్ టీకా క్లినికల్ డేటాను, ఉత్పత్తి విధానాలను డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక సలహా బృందం పరిశీలించి, దీనిని ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించాలనే నిర్ణయం తీసుకొంది. కోవిడ్ లక్షణాలున్న, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న కేసుల్లో సైనోఫార్మ్ టీకా సామర్థ్యం (ఎఫికసీ) 79 శాతంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో 60 ఏళ్లు పైబడినవారిని చేర్చలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రస్తావించింది. అందువల్ల ఆ వయసు వారిలో టీకా ఎంత మేర పనిచేస్తుందనేది అంచనా వేయలేకపోయామని చెప్పింది. అయితే ఈ టీకా పనితీరు మిగతావారితో పోలిస్తే వయసు పైబడినవారిలో భిన్నంగా ఉంటుందనేందుకు ప్రాతిపదిక ఏమీ లేదని వ్యాఖ్యానించింది. అస్ట్రాజెనెకా వ్యాక్సీన్ లాంటి టీకాల మాదిరి చైనా టీకాలను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య స్టాండర్డ్ రిఫ్రిజరేటర్‌లో నిల్వ ఉంచవచ్చు. ఇది చైనా టీకాలతో ఉన్న ఒక ముఖ్యమైన వెసులుబాటు. టీకా నిల్వ సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో సినోఫార్మ్ టీకా ఎంతో అనువైనదని డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యానించింది. ఈ రెండు చైనా టీకాలు ఎలా పనిచేస్తాయి? ప్రస్తుతం వినియోగంలో ఉన్న పీఫైజర్, మోడెర్నా లాంటి టీకాలతో పోలిస్తే చైనా టీకాలు భిన్నమైనవి. వీటిని ఎక్కువగా సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేశారు. వీటిని ఇనాక్టివేటెడ్ వ్యాక్సీన్స్ అని కూడా పిలుస్తారు. ఈ టీకాల్లో మృత వైరల్ పార్టికల్స్‌ వాడతారు. టీకాతో ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దీనిని అసలైన వైరస్ దాడిగానే భావించి మన రోగ నిరోధక వ్యవస్థ తగిన విధంగా ప్రతిస్పందిస్తుంది. బయోఎన్‌టెక్/పీఫైజర్, మోడెర్నా టీకాలు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు. కరోనావైరస్ జెనెటిక్ కోడ్‌లో కొంత భాగాన్ని టీకాతో మన శరీరంలోకి చొప్పిస్తారు. దానిని ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థ అలవాటు పడుతుంది. అదే క్రమంలో కరోనావైరస్‌పైనా పోరాడుతుంది. అస్ట్రాజెనెకా టీకా మరో రకం వ్యాక్సీన్. చింపాంజీల నుంచి సేకరించిన సాధారణ జలుబు వైరస్‌లోని ఒక వెర్షన్‌, కరోనావైరస్‌ జెనెటిక్ మెటీరియల్‌ను ఆధారంగా చేసుకొని ఈ టీకా తయారు చేస్తారు. చింపాంజీల నుంచి జలుబుకు కారణమయ్యే వైరస్‌ను సేకరించాక మనుషుల్లో పెరగడానికి వీలు లేకుండా దీనిలో జన్యుపరమైన మార్పులు చేస్తారు. తర్వాత ఈ వైరస్‌కు కోవిడ్19 వైరస్‌ నుంచి ప్రొటీన్లు తయారుచేసుకోగలిగే జన్యువులను కలుపుతారు. శరీరంలోకి నిజమైన కరోనావైరస్‌ వచ్చినప్పుడు దానిపై పోరాడేలా ఇమ్యూనిటీ వ్యవస్థకు ఈ వ్యాక్సీన్ శిక్షణ ఇస్తుంది. అస్ట్రాజెనెకా టీకా సామర్థ్యం దాదాపు 76 శాతంగా ఉంది. బయోఎన్‌టెక్/పీఫైజర్, మోడెర్నా టీకాల సామర్థ్యం దాదాపు 90 శాతం, అంతకంటే ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. చైనా కోవిడ్ టీకాల సామర్థ్యం తక్కువగా ఉందని కొన్ని వారాల కిందట 'చైనీస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' సారథి గావో ఫు వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తర్వాత చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనా ప్రభుత్వ రంగ సంస్థ సైనోఫార్మ్ తయారుచేసిన కోవిడ్19 వ్యాక్సీన్‌ను అత్యవసర పరిస్థితుల్లో అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. text: ఈ విషయాలు తెలుసుకునేందుకు బీబీసీ బృందం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల అంకితతో మాట్లాడింది. ఒక స్వచ్ఛంధ సంస్థలో పనిచేస్తున్న అంకితది దళిత కుటుంబం. వారి ఊరిలో కులాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఆమె చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కులాల మధ్య ఘర్షణల కారణంగానే తన జీవితంలో మొట్టమొదటిసారి తుపాకీ తూటాల శబ్దాలు వినాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. హింసను, కుల కొట్లాటలను నిరోధించే పార్టీకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తానని స్పష్టం చేశారు. వీడియో: ‘‘హింస, కుల ఘర్షణలను నిరోధించే వారికే ఓటు వేస్తా’’ ఆమె ఇంకేమన్నారో ఆమె మాటల్లోనే.. మా ఊరిలో దళిత- అగ్రకులాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు తొలిసారిగా తుపాకీ శబ్దాలు విన్నాను. ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా పేరు అంకిత. నాకు పద్దెనిమిదేళ్లు. ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను. హింసను, కుల ఘర్షణలను ఎవరైతే నిరోధిస్తారో 2019 ఎన్నికల్లో ఆ పార్టీకే నేను ఓటు వేస్తాను. ఎందుకంటే కొట్లాటలు, హింస వలన మహిళలే ఎక్కువగా నష్టపోతున్నారు. మా వాళ్లు నాకు పెళ్లిచేయాలనుకోవడం వల్లనే కాదు, ఊళ్లో జరిగిన కుల కొట్లాటల వలన కూడా నా చదువు మధ్యలో ఆగిపోయింది. దాంతో మా వాళ్లతో గొడవపడ్డాను. గతంలో మేము మహిళల విద్య, ఆరోగ్యం లాంటి సమస్యలపై పనిచేసేవాళ్లం. కానీ, వాటన్నింటినీ పక్కనపెట్టి ఇప్పుడు పూర్తిగా ఘర్షణలు ఫలితంగా తలెత్తే హింసపైనే దృష్టి పెట్టాం. ఈ అంశాలన్నింటిపైనా పని చేయకపోతే, సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను ఎలా నిర్మూలించగలుగుతాం? గొడవలను ఆపడానికి ఈ ప్రభుత్వాలు ఏదో చేస్తాయని నేను అనుకోవడం లేదు. ఏ ప్రభుత్వమూ దళితుల అభ్యున్నతి కోసం పని చేయట్లేదు. వాళ్లని మరింతగా అణచి వేసే ధోరణే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం, 2014 -2016 మధ్య కాలంలో దేశంలో దళితులపై దాడులకు సంబంధించి 19,872 కేసులు నమోదయ్యాయి. కానీ, అందులో 24.3 శాతం మంది నేరస్థులకు మాత్రమే శిక్ష పడింది. రానున్న ఐదేళ్లలో ఇంకా చదవుకుని ఉద్యోగం సంపాదించాలి. అలానే నా ఊరిలో ఉన్న మిగతా అమ్మాయిలు చదువుకునేలా సాయం చేయాలి. వాళ్లలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తాను. అమ్మాయిలు చదువుని మధ్యలో వదిలేయకూడదు. తమ హక్కుల కోసం వాళ్లు పోరాడాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశంలో మొదటిసారి ఓటు వేయబోతున్న యువతుల ఆలోచన ఎలా ఉంటుంది? ఈ సమాజంలో ఎలాంటి మార్పులను వాళ్లు కోరుకుంటున్నారు? text: బీబీసీ తెలుగు వార్తా కథనాలు ప్రతి వారం 88 లక్షల మందికి చేరుతున్నాయి. మిగిలిన భాషలతో కలుపుకుని స్థూలంగా భారత్ లో బీబీసీ కంటెంట్ ప్రతి వారం దాదాపు ఆరు కోట్ల మందికి చేరుతోంది. బీబీసీ వివిధ మాధ్యమాల ద్వారా అందిస్తున్న కంటెంట్‌ను వారంలో కనీసం ఒక్కసారైనా వీరు చదువుతున్నారు, చూస్తున్నారు, వింటున్నారు. అంతర్జాతీయంగా బీబీసీకి అత్యధిక ఆడియన్స్ ఉన్న దేశంగా భారత్ మరోసారి నిలిచింది. భారత్‌లో బీబీసీ ఆడియన్స్ పెరగడానికి డిజిటల్ మీడియాలో నమోదైన వృద్ధి ప్రధాన కారణం. డిజిటల్ మీడియాలో బీబీసీ ఆడియన్స్ దాదాపు 186 శాతం పెరిగారు. బీబీసీ ప్రసారాలు భారత్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, గుజరాతి, పంజాబీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఇంగ్లిష్. మొత్తంగా బీబీసీ ప్రపంచవ్యాప్త ఆడియన్స్ రికార్డు స్థాయిలో 46.8 కోట్లకు పెరిగారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య 11 శాతం పెరిగింది. డిజిటల్ వేదికల్లో బీబీసీ న్యూస్ ఆడియన్స్ 53 శాతం పెరిగారు. 15.1 కోట్ల మంది బీబీసీ న్యూస్‌ను డిజిటల్ వేదికల్లో చూస్తున్నారు. పాఠకుల సంఖ్యను లెక్కించడంలో జీఏఎం నిర్దుష్టమైన నిక్కచ్చి ప్రమాణాలు పాటిస్తుంది. వ్యూస్ కాకుండా కేవలం యూనిక్ రీడర్స్ సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి పలుమార్లు వెబ్‌సైట్ వీక్షించినా, సైట్‌తో పాటు యూట్యూబ్, ఫే‌స్‌బుక్ చూసినా అది ఒక యూనిక్ వ్యూ కిందకే వస్తుంది. ఇది బీబీసీ వేదికలను సందర్శించిన అడియెన్స్ సంఖ్యను మాత్రమే గణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 42 భాషల్లో బీబీసీ ప్రసారాలు అందిస్తోంది. బీబీసీ భారతీయ భాషల్లో అందిస్తున్న సర్వీసుల్లో అత్యధిక మంది పాఠకులు ఉన్నది హిందీకే. బీబీసీ హిందీ ప్రసారాలు ప్రతి వారం 2.49 కోట్ల మందికి చేరుతున్నాయి. ఇందులో డిజిటల్ వేదికల్లో ప్రసారాలను చూస్తున్నవారే 1.33 కోట్ల మంది. బీబీసీ హిందీ డిజిటల్ పాఠకులు 175 శాతం పెరిగారు. బీబీసీ గ్లోబల్ న్యూస్ (ఇంగ్లిష్) వార్తలు కూడా ఇప్పుడు ప్రతి వారం 1.11 కోట్ల భారతీయులకు చేరుతున్నాయి. బీబీసీ గ్లోబల్ న్యూస్‌లో ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ‘బీబీసీ వరల్డ్ న్యూస్’, బీబీసీ.కామ్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 42 భాషల్లో బీబీసీ ప్రసారాలు అందిస్తోంది ఈ దశాబ్దంలో బ్రిటన్ ప్రపంచంతో కొత్త బంధం ఏర్పరుచుకుంటుందని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ అన్నారు. ఇది విజయవంతమయ్యేందుకు బీబీసీకి ఉన్న అన్ని అంతర్జాతీయ వనరులను ఉపయోగించుకోవాలని, బీబీసీ పూర్తి సామర్థ్యాలను వెలికితీయాలని వ్యాఖ్యానించారు. ‘‘నేడు బ్రిటన్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన, సుపరిచితమైన బ్రాండ్లలో బీబీసీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకు, పారదర్శకతకు పెట్టింది పేరు’’ అని ఆయన అన్నారు. ‘‘డిజిటల్ మార్కెట్‌లో కేవలం వార్తలే కాకుండా, స్పష్టమైన, నిష్పక్షపాతమైన ప్రసారాల ఆవశ్యకత ఉంది. అలాంటి చోట బీబీసీ న్యూస్ భారతీయ భాషల్లో ప్రభావం చూపించడం, అద్భుతమైన వృద్ధి నమోదు చేయడం ఉత్సాహకరంగా అనిపిస్తోంది’’ అని బీబీసీ ఇండియన్ లాగ్వేజెస్ హెడ్ రూపా ఝా అన్నారు. భారతీయ ఆడియన్స్‌లో సంపాదించుకున్న నమ్మకం, విశ్వసనీయత పట్ల తాము గర్వపడుతున్నామని, దాని వల్లే వరుసగా రెండేళ్లు బీబీసీ అద్భుతమైన వృద్ధి సాధించిందని చెప్పిన రూప, ‘‘అసత్య సమాచారం వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో బీబీసీ విశ్వసనీయ, నిష్పక్షపాత జర్నలిజంపై ప్రజలు నమ్మకం ఉంచడం గొప్పగా అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. మీడియా రంగంలో డిజిటలే భవిష్యత్తు అని ఈ ఫలితాలు మరోసారి తెలియజేస్తున్నాయని బీబీసీ తెలుగు ఎడిటర్ జి.ఎస్. రామ్మోహన్ అన్నారు. రంగులద్దని వార్తలు, రాజీలేని రిపోర్టింగ్‌తో వార్తామాధ్యమాల్లో విశ్వసనీయమైన నేస్తంగా బీబీసీ తెలుగు నిలుస్తుందని ఆయన చెప్పారు. తెలుగులాంటి క్రౌడెడ్ మార్కెట్ లో నిస్పాక్షికత, విశ్వసనీయతల వల్లే బీబీసీ తెలుగు తనదంటూ ఒకముద్ర వేయగలుగుతున్నదని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ హడావుడికి పరిమితం కాకుండా హెడ్ లైన్స్ వెనుక ఉండే అన్ని కోణాలను వెలికిదీస్తూ, లోతూ-విస్తృతి రెంటిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ, ప్రజలకు అవసరమైన మీడియా సాధనంగా బీబీసీ తెలుగు నిలుస్తుందని రామ్మోహన్ ఆశ్వాసం వ్యక్తం చేశారు. బీబీసీ న్యూస్ ఆడియన్స్ అత్యధికంగా ఉన్న దేశాలివే భారత్ - 6,04,00,000 అమెరికా - 4,95,00,000 నైజీరియా - 3,72,00,000 కెన్యా - 1,46,00,000 టాంజానియా - 1,40,00,000 బంగ్లాదేశ్ - 1,19,00,000 అఫ్గానిస్తాన్ - 1,14,00,000 ఇరాన్ - 1,13,00,000 కెనడా- 97,00,000 పాకిస్తాన్ - 97,00,000 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీబీసీ న్యూస్ తెలుగు డిజిటల్ ఆడియెన్స్ పరంగా 197 శాతం వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019-20 సంవత్సరంలో ఈ వృద్ధి కనిపించింది. భాగస్వామ్య వేదికల మీద ప్రసారమయ్యే టీవీ బులెటిన్ కూడా కలుపుకుని చూస్తే మొత్తంగా బీబీసీ న్యూస్ తెలుగు వృద్ధి 11 శాతంగా ఉంది. text: అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఈ వైరస్ బారినపడి ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 2,91,981 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా తరువాత స్థానానికి రష్యా చేరుకుంది. అమెరికాలో 13.69 లక్షల కేసులు నమోదు కాగా, రష్యాలో స్పెయిన్, బ్రిటన్‌ల కన్నా ఎక్కువగా 2.32 లక్షల కేసులు నమోదయ్యాయి. రష్యాలో వైరస్ వల్ల చనిపోయిన వారి సంక్ 2,116కు చేరింది. అమెరికాలో అధికారికంగా చెబుతున్న 82 వేల మంది కన్నా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని వైట్ హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్‌లోని ఉన్నత స్థాయి సభ్యుడు డాక్టర్ ఆంథొనీ ఫౌచీ అన్నారు. అమెరికాలో ఫౌచీ అత్యంత విశ్వసనీయ వైద్యుడిగా గుర్తింపు పొందారు. తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో కేసులు, మరణాలు * అమెరికాలో 13,69,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా 82,387 మంది చనిపోయారు. * యూకేలో 2,27,741 కేసులు నమోదు కాగా 32,769 మంది ప్రాణాలు కోల్పోయారు. * ఇటలీలో 2,21,216 పాజిటివ్ కేసులు, 30,911 మరణాలు నమోదయ్యాయి. * మరణాల సంఖ్య విషయంలో ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్, బెల్జియం, జర్మనీ, ఇరాన్, నెదర్లాండ్స్, కెనడా, చైనా, మెక్సికో, టర్కీ ఉన్నాయి. * అమెరికాలో ఒక్క న్యూయార్క్‌లోనే ఏకంగా 27,284 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘అమెరికాలో అధికారిక గణాంకాల కంటే ఎక్కువమందే చనిపోయారు’ అమెరికాలో మృతుల సంఖ్యపై గందరగోళమేర్పడుతోంది. కరోనా మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువే ఉంటుందని వైట్‌హౌస్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు, అమెరికా అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తివేయడానికి వైట్‌హౌస్ రచిస్తున్న ప్రణాళికలు సరి కావని, లాక్‌డౌన్ ఎత్తివేస్తే వైరస్ మరింతగా వ్యాపిస్తుందని ఆయన హెచ్చరించారు. ట్విటర్ వర్క్ ఫ్రం హోమ్ సెప్టెంబరు వరకు కూడా తమ కార్యాలయాలు తెరవాలని అనుకోవడం లేదని ట్విటర్ తెలిపింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ ముగిశాక కూడా తమ ఉద్యోగులు ఎవరైనా కోరుకుంటే వారికి ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తామని.. వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఎవరైనా కూడా శాశ్వతంగా పొందొచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ఎక్కడి నుంచైనా పనిచేయగల ఉద్యోగుల బృందం తమకు ఉందని.. గత కొద్దిరోజులుగా ఈ విధానంలో నడిపించగలమని నిరూపించామని ట్విటర్ పేర్కొంది. భారతదేశవ్యాప్తంగా... భారత్‌లోనూ కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 3,525 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 122 మంది మరణించారు.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 74,281కి.. మరణాలు 2,415కి పెరిగాయి. ఇప్పటివరకు 24,386 మంది కోలుకోగా మరో 47,480 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 24,427 కేసులు నమోదు కాగా 921మంది మరణించారు. గుజరాత్‌లో 8,903 పాజిటివ్ కేసులు నమోదు కాగా 537 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 8,718 మందికి వైరస్ సోకగా 61 మంది మృతి చెందారు. దిల్లీలో 7,639 కేసులు నమోదు కాగా 86 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితి * ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఉదయం 10 గంటల సమయానికి 2137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1142 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 47 మంది చనిపోయారు. ఇంకా 948 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. * తెలంగాణలో మంగళవారం రాత్రి నాటికి మొత్తం 1326 కేసులు నమోదు కాగా 32 మంది చనిపోయారు. 822 మందికి నయమై డిశ్చార్జ్ కాగా 472 యాక్టివ్ కేసులున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 42,62,799 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కరోనా రిసోర్స్ సెంటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. text: 2013లో దాదాపు 100 కోట్ల (ఒక బిలియన్) ఖాతాల వివరాలను హ్యాకర్లు చోరీ చేశారని నిరుడు యాహూ వెల్లడించింది. వినియోగదారులంతా తమ ఖాతాల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని కోరింది. అయితే ఆ సైబర్ దాడి గుట్టు విప్పేందుకు నిపుణులు పరిశోధించగా వంద కోట్లే కాదు, మొత్తం ఖాతాలన్నిటిపైనా హ్యాకింగ్ ప్రభావం పడిందని గుర్తించారు. అన్ని ఖాతాలకు చెందిన వివరాలనూ హ్యాకర్లు తస్కరించారని తేల్చారు. అదే విషయాన్ని యాహూ అధికారికంగా వెల్లడించింది. చోరీకి గురైన సమాచారంలో ఖాతాదారుల పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతాలు, పేమెంట్ కార్డుల వివరాలు లేవని తెలిపింది. ఇది కూడా చదవండి: గూగుల్, అమెజాన్ మధ్య గొడవెందుకు? ‘బ్లూ వేల్’ బూచి నిజమేనా? నష్టాల బారిన పడ్డ యాహూ సంస్థను అమెరికన్ టెలికం దిగ్గజం వెరిజోన్ కొనుగోలు చేసింది. ఆ డీల్ ఈ జూన్ 13న పూర్తయింది. అయితే గత సంవత్సరం తొలుత రూ. 31 వేల కోట్లకు (4.8 బిలియన్ డాలర్లు) కొనేందుకు సిద్ధపడిన వెరిజోన్, 2013, 2014లో తమ వినియోగదారుల ఖాతాలు లీకయ్యాయని యాహూ ప్రకటించడంతో డీల్‌ను 4.5 బిలియన్ డాలర్లకు తగ్గించింది. తమ వినియోగదారుల ఖాతాల భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని వెరిజోన్ భద్రతా విభాగం ఉన్నతాధికారి చంద్ర మెక్‌మోహన్ స్పష్టం చేశారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమ వినియోగదారులకు చెందిన మొత్తం మూడు వందల కోట్ల ఖాతాలు 2013లో జరిగిన హ్యకింగ్ దాడికి గురయ్యాయని ఇంటర్నెట్ సేవల కంపెనీ యాహూ ప్రకటించింది. text: ఈ కథనం ప్రకారం.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారినే టీకా వేసుకోవడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు సూచించింది. స్పాట్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఇలా ఏదేని ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు వృద్ధులకు టీకా ఇవ్వాలని కేంద్రం సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా 50 ఏండ్లు పైబడినవారిని గుర్తించాలని కోరింది. తొలిదశ టీకా పంపిణీలో భాగంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం భావిస్తున్నది. మిగతా మార్గదర్శకాలు.. ఆర్టీసీ ఛార్జీల రౌండ్ ఫిగర్ ఆర్టీసీ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేస్తూ..ఇప్పటికే బస్ చార్జీలు ఎక్కువున్నాయని బాధ పడుతున్న ప్యాసింజర్ల మీద చిల్లర సమస్య పేరుతో మరోసారి భారం వేసేందుకు ఆర్టీసీ సిద్ధమైందని వెలుగు ప్రత్రికలో ప్రచురించారు. మెదక్ బస్ డిపో పరిధిలో ప్రయోగాత్మకంగా సోమవారంనుంచి ఈ విధానం అమలు చేసారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనతో ఉన్నారు. మెదక్‌నుంచీ కొల్చారం వరకు ప్రస్తుతం ఆర్డినరీ బస్ చార్జీ రూ.13 కాగా, చిల్లర సమస్య వస్తోదని చెప్పి ఆ ఛార్జీని రూ.15 చేసారు. ఇకపై రూ.2 ఎక్కువ కట్టాల్సిందే. వచ్చిపోతే అదనంగా రూ.4 ఖర్చు చేయాల్సిందే. మెదక్‌నుంచీ కౌడిపల్లికి రూ. 21 టికెట్‌ను రూ.20గా మార్చకుండా రూ.25కు పెంచడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మెదక్‌నుంచీ నర్సాపూర్ వరకూ రూ.38 ఉండగా దానిని రూ.40 చేసారు. చార్జీల రౌండ్‌ఫిగర్ చేసే విధానాన్ని త్వరలో రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల ప్యాసింజర్ల మీద లక్షల్లో భారం పడనుందని ఈ కథనంలో తెలిపారు. కమల్ హాసన్, ఒవైసీ పొత్తు? ఏఐఎంఐఎం పార్టీ బీహార్‌లో ఐదు స్థానాల్లోనూ, ఇటీవల జరిగిన హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 44 స్థానాల్లోనూ గెలిచి ఉత్సాహంలో ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది తమిళనాడులో ఏప్రిల్‌, మేలో జరిగే ఎన్నికలపై ఒవైసీ దృష్టి సారించారంటూ ప్రజాశక్తి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 25 స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని భావిస్తోంది. తమిళనాడులో ఉన్న పార్టీలను ఏకం చేసి ఎన్నికల్లో పాల్గొనాలని ఓవైసీ యోచిస్తున్నారు. అందులో భాగంగానే ఎంఐఎం కమల్‌హాసన్‌ పార్టీ (మక్కల్‌ నీది మయ్యమ్‌)తో, నామ తమిళర్‌ వంటి పార్టీలతోనూ జట్టు కట్టాలని చూస్తోంది. దీనికోసం తమిళనాడులోని ఎంఐఎం నేతలతో సోమవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఒవైసీ భేటీ అయ్యారు. ఆ రాష్ట్రంలో వెల్లూర్‌, రాణిపేట్‌, తిరుపత్తూర్‌, కృష్ణగిరి, త్రిచీ, తిరునెల్వేలి జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ ప్రాంతాలతోపాటు మరికొన్నింటిలో పోటీ చేసేందుకు మజ్లిస్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారమని ఈ కథనంలో పేర్కొన్నారు. పెళ్లి తరువాత కెరీర్ ప్లాన్ చేసుకోలేదు - సమంత ‘పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నానంటే..దానికి అదృష్టమే కారణమ’ని సమంత చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి తాజాగా ఓ టాక్‌షోలో ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది అంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. ‘‘కథానాయికల కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించాలనో.. ఆ అపోహను తొలగించాలనో.. నేనేమీ నా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకోలేదు. నిజానికి ‘పెళ్లి తర్వాత నాకు ఇక అవకాశాలు రావ’నే అనుకున్నా. దానికి సిద్ధపడే పెళ్లి చేసుకున్నా. కానీ, అదృష్టం నావైపు ఉంది. అందుకే పెళ్లి తర్వాత ‘రంగస్థలం’ వచ్చింది. ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా చేశా. ‘ఓ బేబీ’తో మెప్పించా. ఇంకా అద్భుతమైన పాత్రలు పోషించగలుగుతున్నా. ఇందతా నాకు దొరికిన అదృష్టమనే చెప్పాలి’’ అని ఆ షోలో సమంత చెప్పినట్లు ఈ కథనంలో తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా వ్యాక్సినేషన్‌ కోసం త్వరలో కో-విన్‌(కొవిడ్‌-వ్యాక్సిన్‌ ఇంటలిజెన్స్‌ నెట్‌వర్క్‌) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని, టీకా వేసుకోవాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కేంద్రం పేర్కొన్నదంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది. text: జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్య అనంతరం బెజోస్, బిన్ సల్మాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అమెరికాలో నివసించే జర్నలిస్టు ఖషోగ్జీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో 2018 అక్టోబరులో హత్య చేశారు. సౌదీకి చెందిన ఖషోగ్జీ... అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు వ్యాసాలు రాసేవారు. ఆయన హత్యకు సౌదీ యువరాజు బిన్ సల్మాన్ ఆదేశించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఆ హత్య తమ నియంత్రణను ధిక్కరించి భద్రతా బలగాలు చేసిన ఆపరేషన్ అని సౌదీ అరేబియా చెప్తోంది. జెఫ్ బెజోస్ ఫోన్‌కు బిన్ సల్మాన్ వ్యక్తిగత అకౌంట్ నుంచి అనుమానిత వాట్సాప్ లింక్ వచ్చిన తర్వాత... ఆ ఫోన్ హ్యాక్ అయిందని ద గార్డియన్ వార్తాపత్రిక బుధవారం ఒక కథనం ప్రచురించింది. ఖషోగ్జీ హత్యకు సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసిన వార్తలకు ఈ హ్యాకింగ్‌కు సంబంధం ఉందని గావిన్ డి బెకర్ అనే పరిశోధకుడు గత ఏడాది మార్చిలో చెప్పారు. ఈ వ్యవహారంలో ఎప్పుడు, ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇప్పటివరకూ తెలిసిన వివరాలివీ... ఖషోగ్జీ హత్యకు కారణం తన భద్రతా బలగాల రోగ్ ఆపరేషన్ అని సౌదీ అరేబియా చెప్తోంది 2018 మే 1: 'అడగని సందేశం' గార్డియన్ పత్రిక కథనం ప్రకారం... ఈ రోజున సౌదీ యువరాజు నుంచి బెజోస్‌ వాట్సాప్ ఖాతాకు.. బెజోస్ అడగకుండానే అది 'స్నేహపూర్వక సందేశం'లా ఒక ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన కొన్ని గంటల్లోనే బెజోస్ ఫోన్ నుంచి భారీ మొత్తంలో డాటా బయటకు వెళ్లిపోయిందని ఆ కథనం అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ చెప్తోంది. 2018 అక్టోబర్ 2: ఖషోగ్జీ హత్య ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలోకి జమాల్ ఖషోగ్జీ వెళ్లారు. టర్కీ మహిళ హాటీస్ చెంగిజ్‌ను వివాహం చేసుకోవటానికి అవసరమైన పత్రాలు తీసుకోవటం కోసం ఆయన ఆ కార్యాలయానికి వెళ్లారు. కానీ, మళ్లీ బయటకు రాలేదు. ఖషోగ్జీ చనిపోయారని సౌదీ అరేబియా అంగీకరించటానికి రెండు వారాలకు పైనే సమయం పట్టింది. 2018 నంబర్ 16: మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై ఆరోపణలు జమాల్ ఖషోగ్జీని హత్య చేయాలని బిన్ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ విశ్వసిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. ఆ హత్యలో సాల్మన్ పాత్ర లేదని సౌదీ అరేబియా వాదించింది. ఖషోగ్జీది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ప్రభుత్వ అనధికారిక హత్య అని ఐక్యరాజ్య సమితి చెప్తోంది 2019 ఫిబ్రవరి 7: బెజోస్ వర్సెస్ టాబ్లాయిడ్ అమెరికా కేంద్రంగా నడిచే సౌదీ టాబ్లాయిడ్ 'నేషనల్ ఎంక్వైరర్'.. తనకు తన గర్ల్‌ఫ్రెండ్, ఫాక్స్ టెలివిజన్ మాజీ ప్రెజెంటర్ లారెన్ సాంచెజ్‌కు మధ్య జరిగిన సంభాషణలను ప్రచురించి.. బ్లాక్‌మెయిల్‌కు, బలవంతపు వసూళ్లకు ప్రయత్నిస్తోందని జెఫ్ బెజోస్ ఆరోపించారు. 2019 మార్చి 30: సౌదీ పాత్ర వాషింగ్టన్ పోస్ట్ యజమాని ఫోన్‌ను హ్యాక్ చేయటంలో సౌదీ అరేబియా పాత్ర ఉందని పరిశోధకుడు గావిన్ డి బెకర్ అన్నారు. ''బెజోస్ ఫోన్‌ను సౌదీలు హ్యాక్ చేశారని, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని మా పరిశోధకులు, పలువురు నిపుణులు చాలా విశ్వాసంతో నిర్ధారించారు'' అని 'ద డెయిలీ బీస్ట్' వెబ్‌సైట్‌లో డి బెర్ రాశారు. లారెన్ సాంచెజ్‌కు బెజోస్ పంపిన వ్యక్తిగత సందేశాల హ్యాకింగ్‌లో సౌదీ అరేబియా లింకు ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి 2019 జూన్ 19: 'ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య' ఖషోగ్జీ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని, యువరాజు బిన్ సల్మాన్ మీద దర్యాప్తు జరపాలని చెబుతూ.. ప్రభుత్వాల చట్టవ్యతిరేక హత్యల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత, ఖషోగ్జీ హత్యపై ఇస్తాంబుల్‌ను సందర్శించిన దర్యాప్తు బృందానికి సారథ్యం వహించిన ఆగ్నస్ కాలమార్డ్ ఒక నివేదిక విడుదల చేశారు. 2019 డిసెంబర్ 23: మరణ శిక్షలు ఖషోగ్జీ హత్యకు సంబంధించి సౌదీ అరేబియాలోని ఒక కోర్టు.. ఐదుగురు వ్యక్తులకు మరణ శిక్ష, మరో ముగ్గురికి జైలుశిక్ష విధించింది. ''ఆ హత్యకు ఆదేశించిన వారు స్వేచ్ఛగా సంచరిస్తుండటమే కాదు.. దర్యాప్తు కానీ, విచారణ కానీ వారిని కనీసం తాక లేదు'' అని ఐక్యరాజ్యసమితి దూత అన్నారు. 2020 జనవరి 21: 'అసంబద్ధ' వాదనలు జమాల్ ఖషోగ్జీ హత్యకు ఐదు నెలల ముందు వాషింగ్టన్ పోస్ట్ యజమాని బెజోస్‌కు బిన్ సల్మాన్ అకౌంట్ నుంచి కోరని సందేశాన్ని పంపించారని.. గార్డియన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. బెజోస్ ఫోన్ నుంచి ఏం తీసుకున్నారు, దానిని ఎలా ఉపయోగించుకున్నారు అనేది తమకు తెలియదని ఆ పత్రిక చెప్పింది. ఈ ఆరోపణలు 'అసంబద్ధ'మైనవని అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం అభివర్ణించింది. ఖషోగ్జీ హత్యతో సౌదీ రాచరిక ప్రభుత్వానికి, అంతర్జాతీయ సమాజానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు కూడా అయిన జెఫ్ బెజోస్‌కు.. ఖషోగ్జీ హత్య జరగటానికి ముందు బిన్ సల్మాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు, సౌదీ అరేబియాలో వ్యాపార ప్రయోజనాలు ఉండేవి. అయితే.. ఆ హత్యకు సంబంధించిన కథనాలను ప్రచురించటంలో, సౌదీ అరేబియాను తీవ్రంగా ఖండించటంలో బెజోస్ తన పత్రికకు మద్దతుగా నిలవటంతో ఈ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఓస్లోలో నివసించే అరబ్ రచయిత, ఉద్యమకారుడు ఐయాద్ ఎల్-బాగ్దాదీ.. జమాల్ ఖషోగ్జీ స్నేహితుడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన వ్యక్తి ఫోన్‌ను హ్యాక్ చేయటం.. రియాద్‌ పాలకులను విమర్శించే వారికి 'ఒక సందేశం' ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ''భూమి మీద అత్యంత సంపన్నుడైన వ్యక్తిని లక్ష్యంగా చేసుకోగలరు.. బ్లాక్‌మెయిల్ కూడా చేయగలరు.. మరి ఇంకెవరు భద్రంగా ఉంటారు?'' అని ఆయన వాషింగ్టన్ పోస్ట్‌లో రాసిన ఒక కథనంలో పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఫోన్‌ను సౌదీ అరేబియా యువరాజు హ్యాక్ చేయించారంటూ వచ్చిన ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల నిపుణులు డిమాండ్ చేశారు. text: రిపబ్లికన్ ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్‌తో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలపడనున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ బిడెన్ కి విదేశీ వ్యవహారాల నిర్వహణ పట్ల అవగాహన, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సాధారణ ప్రజానీకాన్ని మెప్పించగలిగే వాక్చాతుర్యం, జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అనుభవం ఉన్నాయని ఆయన మద్దతుదారుల అభిప్రాయం. అయితే, ఆయన ఇతరులను ఇబ్బందికి గురి చేసే పనులు చేస్తారని ఆయన వ్యతిరేకులు వాదిస్తారు. మరి ట్రంప్‌ను వైట్ హౌస్ నుంచి పంపించే శక్తి ఆయనకుందా ? వాక్చాతుర్యం బిడెన్ రాజకీయ ప్రస్థానం 1973లో 47 సంవత్సరాల క్రితం వాషింగ్టన్ సెనేట్ కి ఎన్నికవ్వడంతో మొదలైంది. ఆయన 1987లో, 33 సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్ష పదవి కోసం మొదటిసారి ప్రచారం చేశారు. అయితే, ఆయనకు తన మాటలతో వోటర్లని ఆకర్షించే లక్షణంతో పాటు ఒక చిన్న మాటతో వివాదాల్లోకి వెళ్లిపోయే స్వభావం కూడా ఉంది. ఇలాంటి స్వభావమే ఆయన తొలి సారి అధ్యక్ష పదవి కోసం చేస్తున్న ప్రచార సమయంలో ఆయన విజయాన్ని దెబ్బ తీసింది. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడటం ఇది మూడవ సారి. “మా పూర్వీకులు పెన్సిల్వేనియా బొగ్గు గనుల్లో పని చేశారని వారు అందుకోవల్సిన అవకాశాలు అందుకోలేకపోయారని” ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కొన్ని ర్యాలీలలో చెప్పడం ప్రారంభించారు. అయితే, ఆయన పూర్వీకులెవరూ నిజానికి బొగ్గు గనుల్లో పని చేయలేదు. ఒక బ్రిటిష్ రాజకీయవేత్త ప్రసంగం నుంచి ఆయన ఆ వ్యాక్యాన్నిదొంగిలించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వ్యాఖ్యలు ‘జో బాంబులు’గా ప్రాచుర్యం పొందాయి. 2012 లో ఆయన రాజకీయ అనుభవం గురించి చెప్పుకుంటూ నాకు 8 మంది అమెరికా అధ్యక్షులతో సన్నిహిత పరిచయాలున్నాయని అంటూ అందులో ముగ్గురితో శారీరక సంబంధాలున్నట్లు అర్ధం వచ్చేలా మాట్లాడారు. 2009 లో అందంగా,చలాకీగా, శుభ్రంగా కనిపించే తొలి ఆఫ్రికన్ అమెరికా వ్యక్తి ఒబామా అని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలన్నప్పటికీ కూడా అమెరికాలో నల్ల జాతీయులు ఆయనకి మద్దతు పలుకుతున్నారు. ఇటీవల ఒక నల్ల జాతి ప్రెసెంటెర్ హోస్ట్ చేస్తున్న రేడియో షో లో పాల్గొన్న ఆయన, “నువ్వు నాకు మద్దతిస్తావో, ట్రంప్ కి ఇస్తావో తేల్చుకోలేకపోతే నువ్వు నల్ల జాతీయుడివి కాదని కామెంట్ చేశారు”. ఇది ఆయనను వివాదంలోకి నెట్టింది. ఎన్నికల ప్రచారంలో అనుభవం అయితే, ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదివే రాజకీయ నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో బిడెన్ మాత్రం తన మనసులోని మాటలతోనే ప్రసంగాలు చేస్తారు. ఆయన నిజమైన రాజకీయవేత్త అని, ప్రజలతో సులభంగా కలిసిపోతారని, ఇందులో ఏ మాత్రం నాటకీయత లేదని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ న్యూయార్కర్ పత్రికతో మాట్లాడుతూ అన్నారు. బిడెన్ మొదటి భార్య నెలియా, కూతురు కారు ప్రమాదంలో మరణించారు. బిడెన్ పై ఆరోపణలు గత సంవత్సరం 8 మంది మహిళలు బిడెన్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, తాకరాని చోట తాకి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి పనులు చేశారనే ఆరోపణలు చేశారు. బిడెన్ ఆఫీసులో పని చేసిన తార రీడ్ అనే ఉద్యోగి 30 సంవత్సరాల క్రితం ఆయన తనని లైంగిక వేధింపులకు గురి చేశారని మార్చ్ నెలలో ఆరోపించారు. బిడెన్ ఈ ఆరోపణని ఖండించారు. అయితే, బిడెన్ మద్దతుదారులు దీనికి సమాధానంగా ట్రంప్ పై కొంత మంది మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి మాట్లాడుతున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2009-2017 మధ్య కాలంలో జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి ప్రజలతో దగ్గరగా మెలిగే బిడెన్ సహజ స్వభావం ఆయన ఈ సారి ఎన్నికలలో విఫలం కాకుండా చూస్తుందని డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు ఆశిస్తున్నారు. ఆయన కనీసం మూడు దశాబ్దాల పాటు అమెరికా సెనెట్ లో పని చేశారు. ఒబామా పదవీ కాలంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అయితే కేవలం రాజకీయ అనుభవం మాత్రమే ఎన్నికలలో విజయానికి పని చేయదు. బిడెన్ అవలంబించిన విదేశీ విధాన వ్యవహారాలు రిపబ్లికన్ల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నాయి . వ్యక్తిగత జీవితం ఆయన తొలి సారి సెనెట్ కి ఎన్నికైన వెంటనే ఒక కార్ ప్రమాదంలో భార్య, కూతురుని కోల్పోయారు. అయన ఇద్దరు కొడుకులకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక కొడుకు 46 సంవత్సారాలకే 2015 లో బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు. ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఈ నష్టాలు ప్రజల సానుభూతి పొందేందుకు తోడ్పడ్డాయి. కానీ, అతని మరో కుమారుడు హంటర్ పై మాత్రం మాదక ద్రవ్యాలు తీసుకుంటారని , అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జో బిడెన్ విదేశీ వ్యవహారాలు బిడెన్ విదేశీ వ్యవహారాల పట్ల అవలంబించిన తీరు ఆయన విజయానికి ఎలా పని చేస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆయన 1991 గల్ఫ్ యుద్ధానికి వ్యతిరేకంగా వోట్ చేసారు. 2003 లో ఇరాక్ ఆక్రమణని సమర్ధించారు. ఒసామా బిన్ లాడెన్ పై ప్రత్యేక సేనలని పంపే విషయంలో ఒబామాని జాగ్రత్తగా వ్యవహరించమని సూచించారు. ఆయన యుద్ధ వ్యతిరేక ప్రతిపాదనలు డెమొక్రటిక్ పార్టీలో యువత సమర్ధించరు. ఇప్పటి వరకు జరిగిన ప్రీ పోల్స్ లో ట్రంప్ కన్నా బిడెన్ కి ఎక్కువ మద్దతుని సూచిస్తున్నాయి. కాకపొతే నవంబర్ లోపు అమెరికా రాజకీయ చిత్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా తెలియదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హిల్లరీ క్లింటన్ 2016 ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అమెరికాలోని నల్ల జాతీయులతో పోలీసులు వ్యవహరించిన తీరు, కరోనా వైరస్ ని అరికట్టే విషయంలో తీసుకున్న చర్యల పట్ల బిడెన్ కి ట్రంప్ కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆఖరికి ఫేస్ మాస్క్‌లు ధరించే విషయం కూడా రాజకీయంగా మారింది. బిడెన్ ఫేస్ మాస్క్ ధరిస్తే ట్రంప్ ఎప్పుడూ మాస్క్ ధరించరు. ఒక వేళ బిడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపడితే ఇది ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఒక గెలుపులాంటిది అవుతుంది. ఓడిపోతే, రాజకీయాలకు పనికి రారని ఆయన అనుకున్న వ్యక్తికి మరో నాలుగేళ్ల పాటు వైట్ హౌస్ పగ్గాలు ఇచ్చినట్లవుతుంది. 2016 ఎన్నికల సమయంలో “నేను అమెరికా అధ్యక్షుడిని కాకుండా కూడా హాయిగా మరణించగలనని”, ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ కి ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ పోటీ చేయనున్నారు. text: సుమన్ మొదటి కాన్పు దిల్లీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్లో జరిగింది. తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. "అది నా మొదటి ప్రసవం. ఏం జరగబోతోందో నాకు తెలీదు. అప్పటికే నాకు భయంగా ఉంది. అదో పెద్ద వార్డు. చాలా మంది మహిళలు ప్రసవం కోసం వచ్చారు. వారంతా పురుటి నొప్పులతో గట్టిగా అరుస్తున్నారు. నర్సులు వారిపై జాలి చూపడానికి బదులు కోప్పడుతున్నారు. దాంతో నా భయం మరింత పెరిగింది" అన్నారు. "అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ అవి పని చేయడం లేదు. దిల్లీలో వేసవి ఇంకా పూర్తికాలేదు. ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఆ పరిస్థితుల్లో కాన్పుకు వచ్చిన ముగ్గురు గర్భిణులకు ఒకే మంచం ఇచ్చారు. ఆ నొప్పులు భరించలేక పడుకోవాలనిపించేది. కానీ అది సాధ్యం కాదు. ముగ్గురమూ ఒకే మంచంపై ముడుచుకుని కూర్చున్నాం. మాలో ఎవరైనా బాత్రూం అవసరాల కోసమో, లేక అటూ ఇటూ నడవడానికో లేచినపుడే మిగతా ఇద్దరూ విశ్రాంతి తీసుకోవాలి." "మా పక్క మంచంపై ఒకావిడ తీవ్రమైన నొప్పులతో మూలుగుతోంది. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఆమె గొంతెండిపోయింది. కానీ ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. నొప్పులు తట్టుకోలేక ఆమె గట్టిగా అరుస్తోంది. అప్పుడు మాత్రమే నర్స్ వచ్చి ఆమెను పరీక్షించింది. బిడ్డ ఇంకా బయటకు రావడం లేదని చెప్పింది. ఆమెను పరీక్షిస్తున్నపుడు ఆ నర్స్ ఆ మహిళనొక్కటే కాదు.. అక్కడ నొప్పులతో బాధపడుతున్న అందరిపైనా కోప్పడింది. మా పక్క మంచంపై ఉన్న మహిళను కొన్నిసార్లు కొట్టింది కూడా!" "కొట్టడమే కాదు.. జుట్టు పట్టుకుని లాగుతారు. బూతులు తిడతారు. ఆ మాటలు విన్న తర్వాత, పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది. 'సుఖం కోసం ఆరాటపడతారు.. పిల్లలను కనేటపుడేమో ఏడుస్తారు. పిల్లలు కనాలంటే ఈ నొప్పులు తప్పదు మరి' అని తిడతారు. మీరే చెప్పండి.. ఇలాంటి మాటలు ఎవరైనా అంటారా? మేమేమైనా జంతువులమా? ఇవన్నీ చూశాక మేము చాలా భయపడ్డాం. ఆమె అన్న మాటలకు మా నొప్పి కూడా ఎగిరిపోయింది." ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి. ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న గర్భిణులు ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు చేశారు. ఇలాంటి సంఘటనలను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇలాంటి సందర్భాలను ఉద్దేశించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. చండీగడ్‌లోని 'పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్'(పీజీఐఎమ్ఆర్) ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ఏం చెబుతోంది? ఆసుపత్రుల్లో సిబ్బంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిని తిడుతున్నారని, మాట వినకపోతే బెదిరిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. "ప్రసవ సమయంలో గర్భిణులపై అరవడం అవసరమని అందరూ భావిస్తారు. అలా అరవడం వల్ల ప్రసవం సులువవుతుందని కొందరు నర్సులు చెబుతారు" అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మన్‌మీత్ కౌర్ అన్నారు. "ఒక నర్స్ చాలా మంది పేషెంట్లను చూసుకోవాలి. అలాంటి సమయంలో ఒత్తిడి వలన సహనం కోల్పోవడం సహజం. ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టలేరు. ఈ విషయాన్ని చాలా మంది నర్సులు మాకు చెప్పారు. కానీ ప్రేమతో, గౌరవంతో మాట్లాడటం అసాధ్యమేమీ కాదు. పద్ధతిగా నడుచుకునే నర్సులు కూడా ఉన్నారు" అని ఈ అధ్యయనం కోఆర్డినేటర్ ఇనాయత్ సింగ్ కక్కర్ అన్నారు. సరైన శిక్షణ అవసరం సంజయ్ గాంధీ ఆసుపత్రి అధికారిని ఈ విషయమై ప్రశ్నించగా.. పేషెంట్లతో అనుచితంగా ప్రవర్తించారన్న ఫిర్యాదులేవీ తమ దృష్టికి రాలేదన్నారు. కానీ, ఇలాంటి సంఘటనలు ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణంగా జరుగుతాయని ఆయన అంగీకరించారు. "ఎవరైనా రోగులను కోపగించుకుంటే, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తాం. అలాంటి కౌన్సెలింగ్‌ల ద్వారా రోగులతో ప్రేమగా ఎలా నడుచుకోవాలో వారికి అర్థమవుతుంది. కానీ పేషెంట్లను కొట్టడం, హింసించడం లాంటి ఫిర్యాదులేవీ మాకు అందలేదు" అని సంజయ్ గాంధీ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం నిజమేనంటూ... "చాలా మంది నర్సులకు 'సాఫ్ట్ స్కిల్స్' శిక్షణ ఇవ్వరు. వైద్య విద్యలో సాఫ్ట్ స్కిల్స్‌ కూడా ఒక బోధనాంశంగా చేర్చాలి. కానీ ఈ శిక్షణ ఎవ్వరికీ ఇవ్వరు" అని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత కూడా ఇందుకు ఒక కారణమే. ప్రతి ఆసుపత్రిలో 15-20 ఉద్యోగాలు (డాక్టర్లు/నర్సులు) ఖాళీగా ఉంటాయి. రోగుల సంఖ్య పెరుగుతోంది కానీ డాక్టర్లు, నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. రోగులు, వైద్య సిబ్బంది మధ్య సంఖ్యాపరంగా వ్యత్యాసం తగ్గించాల్సిన అవసరం చాలా ఉందని ఆయన అన్నారు. "ఒక వార్డులో ఇద్దరు మాత్రమే నర్సులున్నారు. కానీ పేషెంట్ల సంఖ్య 50-60 ఉంది. వీరిద్దరే అందర్నీ చూసుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నర్సులకు కూడా ఇబ్బందే. పేషెంట్లను చూసుకుంటూనే వీరు రికార్డులను కూడా చూసుకోవాలి, సకాలంలో పేషెంట్లకు మందులు, ఇంజెక్షన్లు ఇవ్వాలి, పేషెంట్లు పిలిస్తే వెళ్లాలి. చాలా సందర్భాల్లో వీరికి సెలవులు దొరకడం కూడా కష్టమే!" "సిబ్బంది కొరత నిజమే!" ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత నిజమేనని దిల్లీలోని ‘బాబూ జగ్జీవన్‌రామ్ ఆసుపత్రి’ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిభ కూడా అన్నారు. "ఇప్పటికీ చాలా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిల్లీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. అక్కడి ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తే, దిల్లీలోని ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది" అని డాక్టర్ ప్రతిభ అభిప్రాయపడ్డారు. పేషెంట్ల పట్ల కరుణ చూపడం చాలా అవసరమన్నారు డాక్టర్ ప్రతిభ. "నర్సులు నిత్యమూ గర్భిణులతో ఉంటారు, అలాంటి సందర్భాల్లో వారికి సరైన శిక్షణ అవసరం" అని ఆమె అన్నారు. కౌన్సెలింగ్ అవసరం ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. అలాంటపుడు ప్రసవ సమయంలో నొప్పి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆసుపత్రుల్లో విధివిధానాలు ఎలా ఉంటాయి అన్న అంశాలకు సంబంధించి మహిళలకు అంగన్‌వాడీ స్థాయిలో కౌన్సెలింగ్ ఇవ్వాలి. గర్భిణుల పట్ల ఎలా ప్రవర్తించాలి అన్న అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించింది. అందులో.. (ఈ వార్త 2018 ఆగస్టు 18న ప్రచురితమైంది. ఎక్కువ మందికి అందించాలన్న ఉద్దేశంతో మళ్లీ ప్రచురించాం.) ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 28ఏళ్ల సుమన్ గత నెల్లో ఓ బిడ్డను ప్రసవించారు. రెండో బిడ్డ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడిగితే.. ఆమె ముఖంలో విచారం కనిపించింది. ఆమెకు రెండో బిడ్డ గురించిన ఆలోచనలు లేక కాదు కానీ, మొదటి కాన్పు సమయంలో ఆమె ఎదుర్కొన్న సంఘటన గుర్తొచ్చి విచారంలో మునిగింది. text: పాకిస్తాన్‌కు ఇస్తున్న సైనిక సాయాన్ని నిలిపేసినట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. పాక్ భూభాగం నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలను ఆ దేశ ప్రభుత్వం కట్టడి చేయడం లేదని ఆరోపించింది. హక్కానీ నెట్‌వర్క్, అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌లపై చర్యలు తీసుకునే వరకు నిధులు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. బిలియన్ డాలర్ల సహాయం పొందిన పాకిస్తాన్ తమను మోసం చేస్తోందని ఈ వారం ప్రారంభంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ అయితే, ట్రంప్ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. అమెరికా అధికారులు పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పాకిస్తాన్ పేర్కొంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న త్యాగాన్ని అమెరికా మర్చిపోయిందని ఆరోపించింది. భారతదేశం, అఫ్గానిస్తాన్‌ మాత్రం అమెరికా చర్యలను స్వాగతించాయి. పాకిస్తాన్‌లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న చైనా మాత్రం అమెరికా తీరును తప్పుబట్టింది. పాకిస్తాన్‌కు మద్దతు తెలిపింది. పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన 225 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని అమెరికా ఇప్పటికే నిలిపేసింది. అయితే, మొత్తం ఎన్నికోట్ల నిధులను నిలిపేశారో చెప్పడానికి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హీథర్ నిరాకరించారు. అఫ్గానిస్తాన్‌ తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్ ఆ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని తాము భావిస్తున్నామని ఆమె తెలిపారు. మత స్వేచ్ఛ విషయంలో పాకిస్తాన్‌ తీవ్రమైన ఉల్లంఘనలు చేసినట్లు అమెరికా భావిస్తోంది. అందుకే పాకిస్తాన్‌ను ఒక ప్రత్యేక జాబితాలో చేర్చి నిశితంగా పరిశీలిస్తోంది. పరిష్కారం కాని సమస్య బార్బర ప్లెట్ ఉషర్, బీబీసీ విదేశాంగ శాఖ ప్రతినిధి అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌, దాని అనుబంధ సంస్థలకు పాకిస్తాన్‌ స్వర్గధామంలా మారిందని ఎంతోకాలంగా అమెరికా, ఇతర దేశాలు భావిస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌లో దాడులు చేసేలా తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్‌లను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని అవి చెబుతున్నాయి. అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి పాకిస్తాన్‌పై ఒత్తిడి మరింత పెంచారు. 9/11 దాడుల తర్వాత పాకిస్తాన్‌ అయిష్టంగానే అమెరికాతో కలిసి ఉగ్రవాదంపై పోరాటం చేస్తోంది. ప్రతిఫలంగా అగ్రరాజ్యం నుంచి బిలియన్ డాలర్లను ఆర్ధిక సాయంగా పొందుతోంది. పాకిస్తాన్ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా అప్పడప్పుడు నిధులు తగ్గిస్తూ వస్తోంది. కానీ రెండు దేశాల మధ్య స్నేహబంధం మాత్రం కొనసాగుతోంది. ఇస్లామిక్ సంస్థలతో పోరాటం వల్ల తాము ఎంతో నష్టపోయామని, ఈ విషయాన్ని ట్రంప్ గుర్తించడం లేదని పాకిస్తాన్ చెబుతోంది. హక్కానీ నెట్‌వర్క్‌కు పాకిస్తాన్ సాయం! పాకిస్తాన్‌లోని హక్కానీ నెట్‌వర్క్ అఫ్గానిస్తాన్‌లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. ఆ సంస్థ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు పాకిస్తాన్ సహాయం చేస్తోందని చాలా ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఇది అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వానికి ముప్పుగా మారుతోంది. పాకిస్తాన్ తాలిబాన్ సంస్థలు అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌తో కలిసి పాకిస్తాన్‌లో కూడా దాడులు చేస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌లో దాడులకు హక్కానీ నెట్‌వర్క్, అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌లకు పాకిస్తాన్ ఐఎస్ఐ సహాయం చేస్తోందని, ఈ దాడుల్లో అమెరికా సైనికులు, అధికారులు చనిపోతున్నారన్న వాదన ఎంతోకాలంగా ఉంది. హక్కానీ నెట్‌వర్క్ సభ్యుడిని కలిసేందుకు అమెరికా అధికారులకు పాకిస్తాన్ అధికారులు గతేడాది అనుమతి ఇవ్వలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. పాకిస్తాన్ వారికి ఎందుకు మద్దతు ఇస్తోంది? తమ విదేశాంగ విధానాలు, దేశ ప్రయోజనాల కోసం అఫ్గానిస్తాన్‌ తాలిబాన్లను పాకిస్తాన్ వాడుకుంటోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. 1979లో సోవియట్ దాడి తర్వాత అఫ్గానిస్తాన్‌లోని మిలిటెంట్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ శిక్షణ, ఆర్ధిక సాయం చేసింది. 2001 అఫ్గానిస్తాన్‌ యుద్ధ సమయంలో తమ భూభాగాన్ని వాడుకునేందుకు సంకీర్ణ సేనలకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. కానీ అఫ్గానిస్తాన్‌ మిలిటెంట్లకు సాయం చేయడం, వారికి ఆశ్రయం ఇవ్వడం మాత్రం పాకిస్తాన్‌ ఆపలేదని నిపుణులు చెబుతున్నారు. అఫ్గానిస్తాన్‌లో భారత ప్రభుత్వ ప్రభావాన్ని తగ్గించడమే పాకిస్థాన్ లక్ష్యమని వారు అభిప్రాయపడుతున్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉగ్రవాద సంస్థలను నియంత్రించడంలో పాకిస్తాన్ విఫలమైందని అమెరికా చెబుతోంది. టెర్రర్ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోనంత వరకు సాయం నిలిపేస్తామని ప్రకటించింది. text: వ్యాక్సిన్ సరఫరా సమయంలో విమానంలో ఉష్ణోగ్రతలను జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది కరోనా వ్యాక్సిన్‌ను అన్నిదేశాలకు చేరవేయడం “ రవాణా రంగంలో అతి పెద్ద సవాల్‌’’ అని వైమానిక రంగ నిపుణులు అంటున్నారు . బోయింగ్‌ 747 సైజులో ఉండే దాదాపు 8,000 విమానాలు అవసరమవుతాయని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (IATA) వెల్లడించింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంకా సిద్ధం కానప్పటికీ, ఒకవేళ అది సిద్దమైతే దాని రవాణాఎలా. అన్నదానిపై విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలు, ఆరోగ్యసంస్థలు, ఫార్మా కంపెనీలతో IATA చర్చలు జరుపుతోంది. “కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సురక్షితంగా అన్నిదేశాలకు చేరవేయడం రవాణా రంగంలో ఈ శతాబ్దిలోనే అతి పెద్ద పరిణామం. కానీ సరైన ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇది అసాధ్యం’’ అని IATA చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలెగ్జాండ్రే డీ జునైక్‌ అన్నారు. ఒకపక్క ప్రయాణికుల విమానయాన రంగంలో పూర్తి స్తబ్దత నెలకొన్న తరుణంలో వైమానిక సంస్థలు సరుకు రవాణా మీద దృష్టి పెట్టాయి. అయితే వ్యాక్సిన్‌ను తరలించడం మాత్రం క్లిష్టమైన వ్యవహారం. అన్ని విమానాలు వ్యాక్సిన్‌ తరలింపుకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వీటి తరలింపు సమయంలో విమానంలో 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కొన్ని వ్యాక్సిన్‌లకు గడ్డకట్టేంత చల్లదనం అవసరం. అలాంటి పరిస్థితిలో మరికొన్ని విమానాలు ఈ జాబితా నుంచి తీసేయాల్సి ఉంటుంది. “వ్యాక్సిన్‌ రవాణాకు సంబంధించిన విధి విధానాలపై మాకు అవగాహన ఉంది. వాటన్నింటినీ సరైన సమయంలో అనుసరించడమే ముఖ్యం’’ అని ఓ కార్గో సంస్థ అధిపతి గ్లిన్‌ హ్యూగ్స్‌ అన్నారు. కొన్ని తూర్పు ఆసియా దేశాలతోపాటు, వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రాలు లేని కొన్నిప్రాంతాలకు దానిని సరఫరా చేయడం క్లిష్టమైన వ్యవహారమని గ్లిన్‌ అన్నారు. కరోనావైరస్ విమాన ప్రయాణాలను ఎలా మార్చేస్తుందంటే.. పకడ్బందీ ఏర్పాట్లు అవసరం ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ సరఫరా చేయడం సాధ్యం కాదని IATA వెల్లడించింది. సరిహద్దులు, కార్గో కెపాసిటీ, ప్రాంతాల పరిమాణం తదితర సమస్యలు దీనికి కారణంగా చెబుతోంది. వ్యాక్సిన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు అవసరం. వివిధ ప్రాంతాలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి అవసరమైన ఉష్ణోగ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్‌లు తయారీ దశలో ఉన్నాయి. అందులో పాతిక వరకు వ్యాక్సిన్‌లతో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారవుతున్న వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాలు ప్రస్తుతానికి నిలిచిపోయినా, ఆ ట్రయల్స్‌ చివరి దశలో ఉన్నాయి. వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వాలకు IATA సూచించింది. జాగ్రత్తగా సరఫరా చేయడం, అవసరమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్‌ చేయడం తమ పని అని, అయితే భద్రతా చర్యలు కూడా చాలా కీలకబమని IATA అంటోంది. “ఈ వ్యాక్సిన్‌లు చాలా విలువైనవి. దొంగతనాలు, అక్రమాలు జరక్కుండా రవాణాను అత్యంత పకడ్బందీ చర్యల మధ్య చేపట్టాల్సి ఉంది” అని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మరికొన్ని నెలల్లో కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వస్తుందన్న అంచనాల నడుమ, ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచం మొత్తానికి సరఫరా చేయాలంటే రవాణా కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై చర్చ నడుస్తోంది. text: కొత్త చట్టాల వల్ల కార్పొరేట్లు తమను దోచుకుంటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే కార్పొరేట్‌ రంగం వ్యవసాయం రంగంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనే జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి, గోధుములను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం. గోధుమలను కొనడంలో ప్రభుత్వం తర్వాత రెండోస్థానంలో ఎవరిది? రూ.75వేల కోట్ల విలువైన ప్రపంచస్థాయి కార్పొరేట్‌ సంస్థ ఐటీసీ గ్రూప్‌ది. ఈ సంస్థ ఈ ఏడాది రైతుల నుంచి 2.2 మిలియన్‌ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. మహీంద్రా గ్రూప్‌ కూడా వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభించింది. నెస్లే, గోద్రెజ్‌లాంటి బడా ప్రైవేట్‌ కంపెనీలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా మార్కెట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది ఈ-చౌపాల్‌ ఐటీసీ కంపెనీకి, రైతులకు మధ్య అనుసంధానకర్త పాత్ర పోషించడంలో ఈ-చౌపాల్‌ పథకం కీలకపాత్ర పోషించింది. ఈ-చౌపాల్‌ సహకారంతో 20 సంవత్సరాలుగా ఐటీసీ గ్రూప్‌ రైతులతో కలిసి వ్యాపారం చేస్తోంది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ-చౌపాల్‌ మోడల్‌ గ్రామాల్లో ఇంటర్నెట్‌ కియోస్క్‌లు ఏర్పాటు ఒక నెట్‌వర్క్‌గా పని చేస్తుంది. చిన్న,సన్నకారు రైతులకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ చేసుకోవడంలో ఇది మెలకువలు అందిస్తుంది. వివిధ మార్కెట్లలో ధరలు, వాతావరణ సూచనల్లాంటివి అందిస్తూ రైతులకు బాసటగా ఉంటుంది. ఈ-చౌపాల్‌ మోడల్ ఎలా పనిచేస్తుంది? అది 2005 సంవత్సరం. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ప్రాంతంలో సోయాబీన్‌ పంటకు రైతుల నుంచి పెరుగుతున్న ఆదరణ గురించి ఒక కథనం కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ-చౌపాల్ పథకం గురించి విన్నాను. ఈ-చౌపాల్‌ పరిధిలో ఉండే మార్కెట్లకు వెళ్లి చూశాను. ఒకరిద్దరు యువకులు గ్రామాల్లో కంప్యూటర్లు పెట్టుకుని వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించడం, అంతర్జాయతీయ మార్కెట్‌లో సోయాబీన్‌ ధరల గురించి వివరించడం గమనించాను. ఇక్కడి ధరలు తెలుసుకున్నాక రైతులు మార్కెట్‌కు వెళ్లి సోయాబీన్‌ ధరను ముందుగా నిర్ణయించిన ధరకు ఐటీసీకి అమ్మేవారు. అప్పటికి ఆ పథకం కొత్తది. ఒక కార్పొరేట్ కంపెనీ, రైతులు కలిసి పని చేయడం కూడా కొత్త విషయమే. రైతులతో తమకున్న అనుబంధంపై ఐటీసీ సంస్థ ఒక వీడియో ఫిల్మ్‌ తయారు చేసి గ్రామాల్లో రైతులకు ప్రదర్శించి చూపేది. తమ పథకాల గురించి వివరించేది. అప్పట్లో రైతులు, సంస్థా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. కానీ ఒక సంస్థ రైతులను మోసం చేయాలనుకున్నా, దోచుకోవాలనుకున్నా అది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే రైతుల రక్షణకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఈ-చౌపాల్‌లో ఇప్పుడు 40 లక్షలమంది రైతుల నెట్‌వర్క్‌గా మారింది. 10 రాష్ట్రాల్లో 6100 కంప్యూటర్‌ కియోస్క్‌ల ద్వారా 35,000 గ్రామాల్లో విస్తరించి ఉంది. కోటిమంది రైతులను సభ్యులుగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. రైతులు, కంపెనీల మధ్య కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఈ-చౌపాల్‌ ఒక మోడల్‌. అయితే కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్ గ్రూప్‌లైన అంబానీలు, అదానీలు వ్యవసాయరంగంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అందుకే రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ ఉత్పత్తులను కొనే బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోరాదని రైతులు అంటున్నారు వ్యవసాయోత్పత్తిలో భారత్‌ వెనకబాటు అమెరికా తరువాత భారతదేశంలో అత్యధికంగా సాగు చేయగల భూమి ఉంది. కాని దిగుబడిలో మాత్రం భారతదేశం అమెరికాకంటే చాలా వెనకబడి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం వాడకం తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే పరిజ్జానం రైతులకు అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు క్రమంగా తగ్గుతుండటం మరో కారణం. అయితే వ్యవసాయంలో ప్రభుత్వం ఎక్కువ భూమికను పోషించడం సరికాదని నిపుణులు అంటుండగా, ఉత్తర భారతదేశ రైతులు మాత్రం సర్కారుకు దూరమయ్యేందుకు సిద్ధంగా లేరు. ఆహార భద్రతలో అదనపు భారం ప్రజలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం(పీడీఎస్‌) ద్వారా కరువుల, అంటువ్యాధుల సమయంలో ఉచితంగా ధాన్యం అందిస్తారు. కానీ ఈ పథకం పేరుతో సేకరిస్తున్న ధాన్యం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంది. ఆహార భద్రత పేరుతో ఎక్కువగా ధాన్యాన్ని కొనడం రాజకీయ అనివార్యతగా మారింది. " ప్రభుత్వం బియ్యం, గోధుమల కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది. దానికి బదులు వల్ల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మంచిది” అని ముంబయికి చెందిన ఆర్థిక నిపుణుడు వివేక్‌ కౌల్‌ అన్నారు. రైతులు ఏం డిమాండ్‌ చేస్తున్నారు? కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) చట్టంలో చేర్చాలని, ప్రభుత్వం మండీల (మార్కెట్లు) నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ప్రస్తుత చర్చల్లో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాలు ప్రస్తుత అవసరమని, దానివల్ల రైతులే ప్రయోజనం పొందుతారని మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుత ఆందోళనల కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దీనిని వాస్తవిక దృష్టితో చూడాల్సిన అవసరముంది. వ్యవసాయంలో పెను మార్పులు గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు ప్రభుత్వంకన్నా ప్రైవేటు శక్తుల వల్లనే ఎక్కువగా సాధ్యమయ్యాయి. టెక్నాలజీ, కొత్త విత్తనాలు, నాణ్యమైన ఎరువుల్లాంటి అంశాలు వ్యవసాయాభివృద్ధికి కారణం. ఇవే మార్పులు వ్యవసాయ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు చోటు కల్పించాయి. కానీ ఏ వేగంతో మార్పులు జరుగుతున్నాయో, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వకాలంలో ఈ కొత్త చట్టంపై చర్చ జరిగింది. కానీ అది అమలు కాలేదు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు వ్యవసాయ రంగంలోకి రాకుండా నిరోధించలేనప్పుడు కొన్ని చట్టాలు, నిబంధనలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి ప్రైవేట్‌ కంపెనీలు తమను దోచుకోకుండా తమ ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలని రైతులు కోరుతున్నారు అయితే మోదీ ప్రభుత్వం ఈ మూడు చట్టాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే తెచ్చామని చెబుతున్నా, తమను పరిగణనలోకి తీసుకోకుండా, హడావుడిగా ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, అయితే అవి రైతులను దోచుకునేందుకు అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని కేరళ మాజీ శాసన సభ్యుడు, రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కృష్ణ ప్రసాద్‌ అంటున్నారు. ప్రభుత్వం-రైతులు ఎందుకు పట్టుదలగా ఉన్నారు? “ రైతులకు మరిన్ని ఆప్షన్లు ఇస్తుంటే మమ్మల్ని రైతు అనుకూలురు అంటారా లేక వ్యతిరేకులు అంటారా? కొత్త వ్యవసాయ చట్టంతో రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాం” అని బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది. కానీ ఈ చట్టంపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి మరీ దీన్ని ఉపసంహరించుకోవాలని దర్శన్‌పాల్‌ లాంటి రైతు ఉద్యమ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఇందులో ఎవరు గెలుస్తారు? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని కార్పొరేట్‌ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధిపత్యం సాధిస్తాయని, అప్పుడు తాము దోపిడికి గురవుతామన్నది రైతుల భయం. text: 2012, డిసెంబర్ 16న దిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలు దోషులుగా తేలిన సంగతి తెలిసింది. ఇదివరకు ఈ కేసులో దోషులను ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని దిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. దీనికి ముందు జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు వారెంట్ జారీ చేసినా, అప్పుడు కూడా అది వాయిదా పడింది. "దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ నాతో సవాలు చేశారు. దోషులకు ఎప్పటికీ ఉరిశిక్ష పడనివ్వను అని ఆయన అన్నారు. నా పోరాటం కొనసాగిస్తాను. ప్రభుత్వం వారిని ఉరి తీయాలి" అని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. "ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడ్డవారు న్యాయవ్యవస్థలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా శిక్షను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది" అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఎప్పుడేం జరిగింది? 2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు. 2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. 2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు. 2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు. 2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది. 2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది. 2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది. 2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది. 2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. 2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది. 2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది. 2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు. 2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు. 2020 జనవరి 7: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం. 2020 జనవరి 15: నలుగురిలో ఒక దోషి క్షమా భిక్ష కోసం చేసుకున్న అర్జీ ఇంకా రాష్ట్రపతి దగ్గరే ఉండటం వల్ల జనవరి 22న ఉరి శిక్షను అమలు చేయట్లేదని వెల్లడించిన దిల్లీ ప్రభుత్వం. 2020 జనవరి 17: ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులకు మరణశిక్ష అమలు చేయాలని కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన దిల్లీలోని పటియాలా కోర్టు. 2020 జనవరి 31: నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్షల అమలు మరోసారి వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు శిక్షలు అమలు చేయవద్దని దిల్లీలోని ఓ కోర్టు స్టే విధించింది. text: లక్షలాది మంది ప్రాణాలు తీసిన కోవిడ్-19ని వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నియంత్రించలేకపోయిందని అమెరికా వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోపే ట్రంప్ ఈ ఆరోపణ చేశారు. ప్రపంచానికి కావల్సిన సమాచారాన్ని రాబట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజర్ సోమవారం ఐక్య రాజ్య సమితి ప్రపంచ హెల్త్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ అన్నారు. ఈ వైరస్ నియంత్రణ నిర్వహణ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరించిన తీరుని ఒక స్వతంత్ర సంస్థ పరిశీలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయేసుస్ అంగీకరించారు. ఈ పరిస్థితి నుంచి నేర్చుకోవల్సిన పాఠాలు, మరేమైనా సలహాలు ఇవ్వడానికి చేసే పరిశీలన ఎంత త్వరగా అవకాశం వస్తే అంత తొందరగా చేస్తామని చెప్పారు. వైరస్ వ్యాప్తి గురించి చైనా-అమెరికా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పని తీరుని అంచనా వేసేందుకు 194 సభ్య దేశాల రెండు రోజుల వార్షిక సమావేశం సోమవారం ప్రారంభం అయింది. ఈ సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మరోమారు పోటీ చేయనున్న ట్రంప్ వైరస్ అరికట్టే విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు చైనా ఈ వైరస్ గురించి పూర్తి సమాచారాన్ని ప్రపంచానికి ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాని ఈ పరిస్థితికి బాధ్యులని చేయకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకి మద్దతుగా.. చైనా చేతిలో కీలు బొమ్మగా వ్యవహరిస్తోందని సోమవారం జరిగిన సమావేశంలో అంటూ, "ఈ రోజు నేనేమి వ్యాఖ్యానించదల్చుకోలేదు” అని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన ఆరోగ్య సలహాలు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరించిన తీరుపై అమెరికాకి ఉన్న అభ్యంతరాలను తెలియచేస్తూ ఆయన ఒక లేఖని టెడ్రోస్‌కి పంపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవడానికి ఆ లేఖలో 30 రోజుల గడువుని ఇస్తూ, లేని పక్షంలో ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల సరఫరాని పూర్తిగా ఆపేస్తామని హెచ్చరించింది. విపత్తుపై సమాచారం ఇచ్చే విషయంలో తమ దేశం నిజాయితీగా వ్యవహరించిందంటూ తమ చర్యలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సమర్ధించుకున్నారు. ఈ విషయంలో ఎటువంటి పరిశోధన అయినా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే జరగాలని అన్నారు. ప్రపంచ దేశాలకి సహాయార్ధం చైనా రెండు సంవత్సరాల వ్యవధిలో 2 బిలియన్ డాలర్లు (దాదాపు 13000 కోట్ల రూపాయిలు) ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యాక్సిన్ తయారైన పక్షంలో దానిని కూడా ప్రపంచ దేశాలకి అందిస్తుందని చెప్పారు. ఇది కేవలం విషయాన్ని పక్క దారి పట్టించడమేనని వైట్ హౌస్ జాతీయ భద్రతా కౌన్సిల్ ప్రతినిధి జాన్ ఉల్యోట్ అన్నారు. చైనా ఈ విపత్తుకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశాలన్నీ వైరస్‌కి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కొత్త రకమైన వైరస్ ఎప్పుడైనా రావచ్చని దానిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సంసిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 45 లక్షల మంది ప్రజలు వైరస్ బారిన పడగా, ఇప్పటికే 3 లక్షల మంది మరణించారు. డబ్ల్యుహెచ్ఓకు తనిఖీ అధికారం ఉండాలన్న దేశాలు తులిప్ మజుందార్ , బీబీసీ హెల్త్ ప్రతినిధి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థకి తమ మద్దతు ప్రకటించిన మూడు నిమిషాల వ్యవధిలోనే ఆ సంస్థపై అమెరికా తమ విమర్శన బాణాలు విసరడం మొదలు పెట్టింది. అమెరికా చైనా పేరుని ప్రత్యేకంగా తీసుకోనప్పటికీ , ఒక సభ్య దేశం ఈ వైరస్ విషయం దాచి పెట్టిందని అంటూ తీవ్రంగా విరుచుకు పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందుకు బాధ్యత వహించాలని కోరింది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకి.. ముఖ్యంగా దేశాలని తనిఖీ చేసే అధికారాలు ఇవ్వాలని అభిప్రాయ పడ్డాయి. ఎక్కడైనా వైరస్ తలెత్తినప్పుడు సంస్థ ఉద్యోగులు ఆ దేశాలకి వెళ్లి స్వతంత్రంగా తనిఖీ చేసే అధికారం ఉండాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన అభిప్రాయాలని చైనా పరిశీలిస్తుందని, అయితే ఈ మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యపడుతుందని చైనా స్పష్టం చేసింది. అది కొన్ని నెలలైనా పట్టవచ్చు. లేదా సంవత్సరాలైనా కావచ్చు. వైరస్ నియంత్రణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమర్ధవంతంగా వ్యవహరించలేదని టెడ్రోస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అసెంబ్లీలో ఏమి చర్చించారు? ఈ విపత్తుని ఎదుర్కొన్న తీరు, దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి విచారణ జరగాలని బ్రిటన్, యూరోపియన్ యూనియన్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా పట్టుబడుతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులని ఎదుర్కోవాలంటే ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందింది? దీని వెనక ఉన్న కారణాల పై సమగ్రమైన అవగాహన అవసరమని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి వర్జిని హెన్రిక్సన్ అన్నారు. అయితే, ఇది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే సమయం కాదని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పని తీరుని పరిశీలించేందుకు గాను అవసరమైన డ్రాఫ్ట్ తీర్మానాన్ని మంగళవారం సభలో ప్రవేశపెడతారు. ఇది ఆమోదం పొందడానికి సభలోమూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. గత నెలలో ప్రచురించిన ఒక యూరోపియన్ నివేదిక ఈ వైరస్ పట్ల తప్పుడు సమాచారం విడుదల చేయడానికి చైనా కారణం అని పేర్కొంది. చైనా, కొంత వరకు రష్యా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి ఇవ్వడంలో కుట్ర పూరితంగా పని చేశారని ఆరోపించింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు తైవాన్ కి పరిశీలనా సభ్య స్థాయి ఇచ్చే విషయాన్ని చర్చించడాన్ని సభ్య దేశాలు వాయిదా వేసాయి. తైవాన్ చైనా భూభాగం అని పేర్కొంటూ 2016 నుంచి తైవాన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడాన్ని చైనా నిషేధించింది. అయితే తైవాన్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలనే డిమాండ్‌కి జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ తమ మద్దతు తెలిపాయి. తైవాన్‌ని సమావేశాలకు హాజరు కాకుండా చూడటం వలన ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసనీయత మరింత దెబ్బ తింటుందని అమెరికా రాష్ట్ర కార్యదర్శి మైక్ పాంపేయో అన్నారు. చైనాపై విమర్శలు ఏమిటి? కరోనావైరస్ గత సంవత్సరం ఆఖరులో చైనాలో ఒక జంతు మార్కెట్ నుంచి పుట్టిందని వార్తలు వచ్చాయి. కానీ, ఇది చైనాలో గబ్బిలాల్లో కరోనావైరస్‌పై పరిశోధన జరుపుతున్న ఒక పరిశోధన ల్యాబ్‌లో పుట్టిందని అమెరికాలో కొంత మంది రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణని చైనా ఖండించింది. ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మైక్ పాంపేయో అది చైనా లో పుట్టిందని తెలుసునని, అయితే ఎక్కడ ఎలా పుట్టిందనేది తెలియదని అన్నారు. వైరస్ జెనొటిక్ మూలం కనిపెట్టి అది మానవులకి ఎలా వ్యాప్తి చెందిందనేది కనిపెట్టాలని సమావేశం ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలనే డిమాండ్లు రాజకీయ ఉద్దేశ్యాలతో చేస్తున్నవని ఒక చైనీస్ రాయబారి బీబీసీతో అన్నారు. ఇలాంటి డిమాండ్లతో వనరుల దుర్వినియోగం జరిగి అసలు సమస్యని తప్పు దారి పడుతుందని అన్నారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా చేతిలో కీలు బొమ్మగా మారిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు. text: స్పెయిన్ అంతటా ఈస్టర్ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకోవాలని సూచించింది. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఇటలీ, స్పెయిన్ దేశాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి. యూరోపియన్ దేశాల్లో ఇప్పుడిప్పుడే కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని జెనీవాలో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్‌‌లో టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంక్షల్ని సడలించే విషయంలో ఆయా దేశాలతో కలిసి డబ్ల్యూహెచ్ఓ పని చేస్తోందని, అయితే ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదని అన్నారు. “వెంటనే ఆంక్షల్ని సడలించడం వల్ల మహమ్మారి మరింత తిరగబెట్టవచ్చు” అని డాక్టర్ టెడ్రోస్ హెచ్చరించారు. కరోనావైరస్: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు-డబ్ల్యూహెచ్ఓ ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఆంక్షల సడలింపులు అత్యవసర సర్వీసులు కాని భవన నిర్మాణ రంగం, ఉత్పత్తి కర్మాగారాల్లో కార్మికుల్ని సోమవారం నుంచి విధులకు అనుమతించేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గడిచిన 17 రోజుల్లో శుక్రవారం అత్యల్పంగా అంటే 605 మరణాలు మాత్రమే అక్కడ సంభవించాయి. తాజా గణాంకాల ప్రకారం కోవిడ్-19 కారణంగా అక్కడ 15,843 మంది చనిపోయారు. సామాజిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేస్తూ వస్తోంది. ఇటలీలో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు ఇటలీ ప్రధాని గుసెప్పే కాంటే. ఇన్ని రోజులుగా ఆంక్షలు పాటించడం వల్ల కల్గిన లాభాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని పిలుపునిచ్చారు. అదే సమయంలో మార్చి 12 నుంచి మూతపడ్డ చిన్న చిన్న వ్యాపారాలను మంగళవారం నుంచి తిరిగి తెరవనున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కేవలం నిత్యావసరాలు, మందుల దుకాణాలను మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చారు. ఇప్పుడు పుస్తకాలు, చిన్న పిల్లల వస్తువులకు సంబంధించిన షాపులు కూడా తెరవనున్నారు. అయితే బట్టలు ఉతికే దుకాణాలు సహా మరి కొన్ని ఇతర సర్వీసులు కూడా వాటిలో ఉన్నాయని స్థానిక మీడియా చెబుతోంది. ప్రస్తుతం ఇటలీలో రోజువారీ కొత్తకేసుల సంఖ్య 4,204 నుంచి 3,951కి తగ్గింది. కరోనావైరస్: ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఆంక్షల సడలింపులు ప్రపంచంలో మిగిలిన దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? వైరస్ వ్యాప్తి తగ్గుతూ వస్తోందా ? కొద్ది రోజులుగా యూరోపియన్ దేశాల్లో వైరస్ విజృంభణ తగ్గుతూ వస్తోందని ఓ వైపు డబ్ల్యూహెచ్ఓ చెబుతుంటే, అమెరికాలో కూడా ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అయితే ఆఫ్రికా ఖండం సహా ఇతర దేశాల్లో ప్రస్తుతం ఈ వ్యాధి వేగంగా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సుమారు 16 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ బాధిత దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంక్షలను సడలించే విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు డాక్టర్ టెడ్రొస్ అద్నామ్ గెబ్రియేసుస్ అన్నారు. text: గత నెలలో యూఏఈ పర్యటనకు వెళ్లాను. ఇన్నాళ్లూ.. దుబాయిలో నింగిని తాకే ఎత్తైన భవంతులు, వ్యాపార సముదాయాలు తప్ప మరేవీ ఉండవన్న అభిప్రాయం నాకుండేది. యూఏఈ గురించి అదో క్రూడాయిల్ ఉత్పత్తి కేంద్రం అన్న కోణంలోనే ఆలోచించేవాణ్ని. అరబ్‌ వాసులంతా సంపాదన గురించి మాత్రమే ఆలోంచించే గడుసు వ్యక్తులన్న చెడు అభిప్రాయం ఉండేది. కానీ, పది రోజుల పర్యటన నా కళ్లు తెరిపించింది. ఇన్నాళ్లూ చాలా పరిమితంగా ఆలోచించానన్న విషయాన్ని గ్రహించేలా చేసింది. దుబాయి నగరం అరబ్‌లు చాలా 'స్మార్ట్' సంప్రదాయ వస్త్రధారణలో అరబ్‌లు చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ, వాళ్లు 'స్మార్ట్'. ఇప్పటికే చాలా సంతోషకర జీవితాన్ని గడుపుతున్న వాళ్లు, భవిష్యత్తును మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవడంలో బిజీగా ఉన్నారు. చాలా దేశాలు కనీసం కలలోనైనా ఊహించలేని హైటెక్ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అంగారక గ్రహంపై సొంతంగా ఓ నగరాన్ని నిర్మించేందుకు కూడా యూఏఈ కసరత్తులు చేస్తోంది. ప్రపంచానికే ఐటీ హబ్‌గా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. వోలోకాప్ట‌ర్ పైలట్ రహిత స్కై ట్యాక్సీ ఊహకందని హైటెక్ సేవలు ప్రపంచంలోనే తొలిసారిగా దుబాయిలో పైలట్ రహిత స్కై ట్యాక్సీలకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే, డ్రోన్ల రేసింగ్ పోటీలు నిర్వహించేందుకూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇలా సామాన్యులకు అర్థం కాని ఎన్నో రకాల హైటెక్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చే దిశగా దూసుకెళ్తోంది. పొరుగున ఉన్న చాలా దేశాలూ ఉగ్రవాదం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఈ ఎడారి దేశం మాత్రం ఆకాశమే హద్దు అన్నట్టుగా ముందుకెళ్తోంది. ప్రపంచ దేశాలు అసూయపడే స్థాయిలో 90 లక్షల మంది ప్రజల భవిష్యత్తును మరింత ఉత్తేజితం చేసేందుకు కృషి చేస్తోంది. అత్యంత సహనశీల సమాజం కలిగిన దేశాల్లో యూఏఈ ఒకటి. అయినా, వాళ్లు సామరస్యతను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాల్లో ఎలా విజయం సాధించారో, ఆధ్యాత్మికంగానూ అలాగే ముందుకెళ్లాలన్న తపన వారిలో కనిపిస్తోంది. యూఏఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ శాఖ మంత్రి, ఒమర్ బిన్ సుల్తాన్ ఏఐ ఒలామా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) శాఖ రానున్న కొద్దికాలంలో ఒమర్ బిన్ సుల్తాన్ ఏఐ ఒలామా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవచ్చు. ఎందుకంటే యూఏఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) శాఖా మంత్రి ఆయన! 27 ఏళ్ల ఒలామా రెండు నెలల క్రితమే మంత్రిగా నియమితులయ్యారు. గతంలో ఆయన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యూచర్' డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రధాని కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ సదస్సుకు నాయకత్వం వహించారు. సరికొత్త సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు అభివృద్ధి కోసం ఒలామా పనిచేయాల్సి ఉంటుంది. దాంతో దేశ ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు, ప్రభుత్వ పనితీరును మెరుగు పరిచాలన్నది ప్రభుత్వ ఆలోచన. 'హ్యాపీనెస్' మంత్రిత్వ శాఖ ఆర్థికంగా సుసంపన్నమైన దేశాల్లో యూఏఈ ఒకటి. 2016లో ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం దాదాపు రూ. 47 లక్షలు. ఇక్కడ అందరూ సంతృప్తికరంగానే కనిపిస్తుంటారు. కానీ, వారిలో మరింత సంతోన్ని నింపేందుకు ప్రభుత్వ ప్రయత్నిస్తోంది! అందుకోసమే 'హ్యాపీనెస్' మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ప్రజల్లో ఆనందాన్ని ప్రభుత్వం ఎలా పెంపొందిస్తుందన్న విషయంలో స్పష్టత లేదు. కానీ, ఆ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ చూశాక 'ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో చేరడమే' లక్ష్యం అన్న విషయం మాత్రం అర్థమైంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం లేనంత వరకూ సంతోషంగా జీవించడం అసాధ్యం. కానీ, యూఏఈలో ప్రజాస్వామ్యం లేదు, వాక్ స్వాతంత్ర్యమూ లేదు. అందుకే, తమ పౌరులకు స్వాతంత్ర్యం కల్పిస్తేనే యూఏఈ ప్రభుత్వం అనుకుంటున్న 'హ్యాపీనెస్' లక్ష్యం నెరవేరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో సంతోషాన్ని పెంచేందుకు ఓ మంత్రిత్వ శాఖ, కృత్రిమ మేధస్సు అభివృద్ధికి మరోటి, భవిష్యత్తు అవసరాలను మెరుగు పరిచేందుకు 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యూచర్' .. ఇలా ప్రభుత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోనివి అయ్యుంటాయి అనుకుంటున్నారా? అలా ఏమీ కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంలో ఈ శాఖలన్నీ ఉన్నాయి. text: రామసేతు అమెరికాకు చెందిన సైన్స్ చానల్ డిసెంబర్ 11న ట్విటర్‌లో భారత-శ్రీలంకలను కలిపే 'రామసేతు' కార్యక్రమంపై ప్రోమోను విడుదల చేసింది. రామసేతు రాళ్లు, ఇసుకపై పరిశోధన చేయగా, వారధిని నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లను బయటి నుంచి తీసుకువచ్చినట్లు ఆ ప్రోమోలో పేర్కొన్నారు. 30 మైళ్లకు పైగా పొడవున్న ఆ వంతెన మానవ నిర్మితమని తెలిపారు. సీతను రావణుని నుంచి రక్షించడానికి శ్రీరాముడు వానరసేన సహాయంతో ఈ వారధిని నిర్మించాడని రామాయణ కావ్యంలో ఉంది. భారతదేశంలోనే కాకుండా రామాయణం ఆగ్నేయాసియాలో కూడా ప్రాచుర్యంలో ఉంది. సైన్స్ చానెల్ ప్రోమోతో రామసేతు అనుకూలవాదులు, నేతలు, రాజకీయ పార్టీల మధ్య మరోసారి చర్చ ప్రారంభమైంది. రామసేతు రాజకీయాలు సైన్స్ చానెల్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ బీజేపీ ట్విటర్ హ్యాండిల్‌లో 'రామసేతు లేదని కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంటే, శాస్త్రీయ పరిశోధన బీజేపీ వాదనను సమర్థించింది' అని పేర్కొన్నారు. కేంద్ర జౌళి, సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరాని 'జై శ్రీరామ్ ' అని ట్వీట్ చేశారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా దీనిని స్వాగతించారు. రామసేతుపై చర్చ కొత్తదేమీ కాదు. 2005లో యూపీఏ-1 ప్రభుత్వం సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువ తవ్వేందుకు అనుమతి ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఈ ప్రాజెక్టు బంగాళా ఖాతం, అరేబియా సముద్రాల మధ్య తిన్నగా మార్గాన్ని ఏర్పరుస్తుంది. కానీ దాని వల్ల రామసేతును బద్దలు కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓడలన్నీ శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా వాదిస్తున్న వాళ్లు సేతుసముద్రం ప్రాజెక్టుతో 36 గంటల సమయం, ఇంధనం ఆదా అవుతాయని వాదిస్తున్నారు. హిందూ సంస్థలు ఈ ప్రాజెక్టు వల్ల 'రామసేతు' ధ్వంసం అవుతుందని వాదిస్తున్నారు. భారతదేశం, శ్రీలంకకు చెందిన పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టు వల్ల గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధుల్లో సముద్ర పర్యావరణం దెబ్బ తింటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టును మొదట 1860లో భారతదేశంలో పని చేస్తున్న బ్రిటిష్ కమాండర్ ఎడీ టైలర్ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే రామాయణంలో పేర్కొన్న వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ తన పిటిషన్‌లో పేర్కొనడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. నివేదికల ప్రకారం, భారత పురావస్తు శాఖ కూడా ఇదే రకమైన అఫిడవిట్లు దాఖలు చేసింది. అయితే హిందూ వర్గాల నిరసన ప్రదర్శనలతో ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కంబ రామాయణాన్ని ప్రస్తావిస్తూ, స్వయంగా శ్రీరాముడే ఆ వారధిని ధ్వంసం చేశాడని పేర్కొంది. నాటి నుంచి ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. సైన్స్ చానెల్ 'రామసేతు' కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రసారం చేస్తుందో స్పష్టత లేదు. ప్రోమోలో పేర్కొన్న దానిని బట్టి పరిశోధనల్లో రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లు 7 వేల ఏళ్ల నాటివైతే, ఇసుక 4 వేల ఏళ్ల నాటిదని ఆ చానెల్ తెలిపింది. ఆ రామసేతు వారధి మానవ నిర్మితం అయి ఉండవచ్చని సూచనప్రాయంగా పేర్కొంది. పురాతత్వ శాఖ వాదన ఏంటి? ఇంతకూ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే - అసలు భారత పురాతత్వ శాఖ ఇంతవరకు ఆ విషయాన్ని పరిశోధించిందా, లేదా? 2008 -2013 మధ్యకాలంలో డైరెక్టర్ మాన్యుమెంట్స్‌గా పని చేసిన ఏకే రాయ్ రిటైర్ కావడానికి ముందు, సేతుసముద్రం వివాదంపై సుప్రీంకోర్టు నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ''ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉండడం వల్ల ఎవరూ దానిలో వేలు పెట్టడానికి వీల్లేదు. ఈ వివాదం ప్రజల మనోభావాలు, సాంప్రదాయాలకు సంబంధించినది'' అని రాయ్ అన్నారు. మరి పురాతత్వ శాఖ రామసేతుకు వ్యతిరేకంగా ఏదైనా చెబుతుందా? ''పురాతత్వ శాఖ ఎన్నడూ ఆ విషయాన్ని పరిశీలించడానికి ప్రయత్నించలేదు. అది మానవ నిర్మితమే అనడానికి ఆధారాలు కూడా లేవు. ఈ విచారణలో కొత్త సంస్థలను కూడా భాగస్వాములను చేయాలి. మన దగ్గర అవును, కాదు అనడానికి ఆధారాల్లేవు'' అన్నారు. సైకిల్‌పై శ్రీలంకకు.. రామేశ్వరానికి వెళితే అక్కడ అనేక చెరువులు కనిపిస్తాయి. అక్కడి స్థానికులు ఆ నీటిపై తేలుతున్న రాళ్లను చూపిస్తారు. చరిత్రకారులు, పురాతత్వ పరిశోధకులు ప్రొఫెసర్ మఖన్ లాల్, ''పగడపు, సిలికా రాళ్లు వేడెక్కినపుడు, వాటిలో గాలి బందీ అయి, అవి తేలికగా మారి నీటిపై తేలుతాయి. అలాంటి రాళ్లను ఉపయోగించుకుని వారధిని నిర్మించారు'' అని వివరించారు. ''1480లో వచ్చిన తుఫానుకు ఆ వారధి చాలావరకు ధ్వంసమైంది. దానికి ముందు ప్రజలు ఆ వారధి మీదుగా భారత్ నుంచి శ్రీలంకకు సైకిళ్లు, కాలినడకన వెళ్లి వచ్చేవారు'' అని తెలిపారు. అది రాముడు కాకుంటే మరెవరు నిర్మించారని ఆయన ప్రశ్నిస్తారు. మరి రామాయణం, దానిలోని పాత్రలు కల్పితం అన్న మాటేమిటి? ''రామాయణం కల్పితమని మేము, మీరు, బ్రిటిషర్లు అంటున్నాం కానీ అలా అని రామాయణం తానంతట తాను ప్రకటించుకుందా?'' అని ప్రశ్నించారు ఆయన. ''ప్రపంచంలో చాలా చోట్ల మౌఖిక సాంప్రదాయాలు ఉన్నాయి. అన్నిటికీ రాతపూర్వక ఆధారాలు అడిగితే చదవలేని, రాయలేని వాళ్ల సంగతి ఏమిటి?'' మా ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఒక అమెరికా టీవీ కార్యక్రమం ప్రోమోతో భారతదేశంలో 'రామసేతు' (ఆడమ్స్ బ్రడ్జ్) వివాదంపై మరోసారి వేడి రాజుకుంది. text: మహిళలు ఎదుర్కొంటున్న హింస గురించి అవగాహన కల్పించేందుకు దీన్ని ప్రకటించింది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని ఐరాస చెబుతోంది. 1947 నుంచి భారత్‌లో సమాన హక్కుల కోసం మహిళలు పోరాటాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘మహిళలపై హింస నిర్మూలన’ దినం సందర్భంగా వాటిలో కొన్ని ప్రధాన ఘట్టాలను వీక్షకుల ముందుంచేందుకు బీబీసీ ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) చిత్రం రూపొందించింది. వర్చువల్ ట్రైన్‌లో పయనిస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదించండి. సూచనలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ రోజును (నవంబర్ 25) ‘మహిళలపై హింస నిర్మూలన’ దినంగా ఐరాస ప్రకటించింది. text: త్రిలోకినాథ్ పాండే అయోధ్య స్థల వివాదంలో ఈయన కూడా ఒక పిటిషనర్‌. భారత అత్యున్నత న్యాయస్థానం శనివారం ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ''దేవుడికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం. కోట్లాది మంది హిందువులలో నన్నే ఎన్నుకోవడం గర్వంగా, సంతోషంగా ఉంది'' అని 75 ఏళ్ల పాండే నాతో చెప్పారు. భారతీయ చట్టంలో శతాబ్దాలుగా దైవం లేదా విగ్రహాన్ని''న్యాయ కోవిదుడు"గా పరిగణిస్తారు, ఎందుకంటే, పుణ్యక్షేత్రాలకు పర్యాయపదంగా ఉన్న విగ్రహాలకు చాలా మంది భక్తులు తమ భూమిని, ఆస్తులను దానం చేస్తారు. సాధారణంగా దేవుడి ఆస్తులను భక్తుడు లేదా పుణ్యక్షేత్రం లేదా ట్రస్ట్ మేనేజర్ నిర్వహిస్తాడు. హిందూధర్మంలో విగ్రహాన్ని దేవుడి ప్రతినిధిగా పిలుస్తారు. కానీ, దేవుడికి ఏం కావాలో మీరు ఎలా చెప్పగలరు? దేవుని ప్రయోజనాలకు అనుగుణంగా అతను వ్యవహరిస్తున్నారని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఇవి గమ్మత్తైన విషయాలు. వీటి గురించి చట్టంలో ఎప్పుడూ నిర్వచించలేదు. కేసును బట్టి ఇలాంటి వాటిని పరిగణిస్తారు. కానీ, సాధారణంగా వేరే వ్యక్తి, నేను కూడా దేవుడి ప్రతినిధిని అని చెప్పుకోనంతవరకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి పేచీ ఉండదు. లక్షలాది మంది హిందువులు గౌరవించే దేవుడికి న్యాయం చేయడానికి పాండే మాట్లాడుతున్నారు. రాముడి ప్రతినిధి పిటిషన్‌పై దేశంలోని కొందరు ప్రముఖ న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయోధ్య వివాదాస్పదమైన ప్రాంతం రాముడి జన్మస్థలమని, అప్పటి అధికారగణం నిర్వహించిన రికార్డుల ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెబుతారు. ఆ ప్రాంతంలో పూజించేవారికి ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుందని పిటిషనర్‌లలో ఒకరు చెప్పారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య కాబట్టి ఆ భూమి మీద హక్కు ఆయనకే ఉంటుందనేది పాండే వాదన. మసీదు నిర్మించక ముందే ఈ ప్రదేశం రాముడి జన్మస్థలమని హిందువుల విశ్వాసం, నమ్మకమని న్యాయమూర్తులు సైతం తమ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో శ్రీరాముడి ప్రతినిధిగా ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో పాండే ఒకరు. 1989 నుంచి ఆయన ఈ విషయంపై కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కంటే ముందున్న ఇద్దరు ప్రతినిధులలో ఒకరు హైకోర్టు జడ్జీ, మరొకరు లెక్చరర్. వారిద్దరు చనిపోయారు. న్యాయ సహాయం ఉత్తర ప్రదేశ్‌లోని ఒక వ్యవసాయ కుటుంబంలో పాండే జన్మించారు. నలుగురు పిల్లలలో పెద్దవాడు, అక్కడే కళాశాల స్థాయి వరకు హిందీలో చదువుకున్నారు. తరువాత ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందారు. కానీ, ఉద్యోగం చేయలేదు. హైస్కూల్‌లో చదువుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేతతో సంబంధం ఉన్న వీహెచ్‌పీతోనూ ఆయన కలసి పనిచేశారు. వీహెచ్‌పీతో ఉన్న కాలంలో హిందువులలో చైతన్యం నింపడానికి ఆయన ఉత్తర ప్రదేశ్ అంతటా పర్యటించారు. ''ఏదైనా ప్రాంతంలో హిందువులను భారీస్థాయిలో ముస్లింలుగా మార్చినట్లు తెలిస్తే, అక్కడికి వెళ్లేవాడ్ని. మతం మారడాన్ని ఆపేవాడ్ని. హిందూ సమాజం క్షీణించిందని నేను నమ్ముతున్నాను. హిందువుల గర్వాన్ని పెంచడానికి దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని, రక్షణాత్మక ధోరణిలో ఉండొద్దని భావిస్తున్నా'' అని పాండే చెప్పారు. ఈ ప్రదేశం రాముడి జన్మస్థలం అని "హిందువుల విశ్వాసం" అని న్యాయమూర్తులు తెలిపారు. చక్కటి జ్ఞాపకం మసీదు కూల్చివేతలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 49 మందికి పాండే న్యాయ సహాయం అందించారు. (ఒక కేసు పూర్తి కావడానికి 17 ఏళ్లు పట్టింది. కొన్ని క్రిమినల్ కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.) మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న పాండే, సుప్రీం కోర్టులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన తుది విచారణకు క్రమం తప్పకుండా హాజరయ్యారు. ''నేను గత పదేళ్లలో వందల సార్లు కోర్టుకు వచ్చాను. ఇక్కడ పెద్దగా మాట్లాడింది లేదు. న్యాయవాదులు నా తరఫున మాట్లాడారు. నేను దేవుడి ప్రతినిధిగా కోర్టు మెట్లు ఎక్కాను'' అని చెప్పారు. కోర్టులో రాముడి తరఫున పాండేనే సంతకం పెట్టేవారు. అయోధ్యలోని వీహెచ్‌పీ ప్రాంగణంలోని దుమ్ముపట్టిన చిన్న గదిలో పాండే నివసిస్తున్నారు. ఆ సంస్థలోని ఇతర సభ్యులు మసీదును కూల్చివేసినప్పటి నుండి ఆలయ నిర్మాణం కోసం ఆందోళన చేస్తున్నారు. సుప్రీం తీర్పు తరువాత, పాండే దేవుడి ప్రతినిధిగా నిలిచిపోతారు. ''నేనెప్పుడూ రాముడితోనే ఉంటాను. ఆయనతో ఉన్నప్పుడు నాకు భయం ఎందుకు? ఈ తీర్పుతో దేవుడున్నాడని రుజువైంది'' అని పాండే చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అయోధ్య వివాదంలో శ్రీరాముడి ప్రతినిధిగా ఈయన పదేళ్లకు పైగా కోర్టుల చుట్టూ తిరిగారు. కోర్టు పత్రాలలో త్రిలోకి నాథ్ పాండే పేరు 'రామ్ లల్లా' ప్రతినిధిగా ఉంది. text: శుక్రవారం ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. దీంతో 11 రోజుల విధ్వంసకర ఘర్షణలకు తెరపడింది. ఈ ఘర్షణల్లో 240 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది గాజాలోనే ప్రాణాలు కోల్పోయారు. ‘‘బేషరతుగా, రెండు పక్షాల అనుమతితో’’ ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ క్యాబినెట్ ధ్రువీకరించింది. మరోవైపు స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 2 గంటల (తెల్లవారితే శుక్రవారం) నుంచి ఈ ఉమ్మడి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినట్లు హమాస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తనకు ఫోన్ చేసి, ధ్రువీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా చెప్పారు. కాల్పుల విరమణతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఉత్తర గాజాలోని హమాస్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా వందకుపైగా వైమానిక దాడులను ఇజ్రాయెల్ చేపట్టింది. ప్రతిగా హమాస్ కూడా రాకెట్లు ప్రయోగించింది. ముస్లింలతోపాటు యూదులకూ పవిత్రమైన తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు చెలరేగాయి. మే 10న ఈ ఉద్రిక్తతలు ఘర్షణలుగా మారాయి. ఈ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాలంటూ హమాస్ రాకెట్లు ప్రయోగించారు. దీనికి స్పందనగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. గాజాలోని ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మంది మహిళలు, చిన్నారులు సహా 232 మంది మరణించినట్లు హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు గాజాలో 150 మందికిపైగా మిలిటెంట్లు మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తమ మిలిటెంట్ల మరణాల సంఖ్యను హమాస్ బయటపెట్టలేదు. ఇజ్రాయెల్‌లో ఇద్దరు చిన్నారులు సహా 12 మంది మరణించినట్లు దేశ ఆరోగ్య సేవల సంస్థ తెలిపింది. గాజాలోని మిలిటెంట్లు దాదాపు 4000 రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఎవరు ఏమన్నారు? కాల్పుల విరమణ ఒప్పంద తీర్మానాన్ని తాము ఏకపక్షంగా ఆమోదించినట్లు ఇజ్రాయెల్ పొలిటికల్ సెక్యూరిటీ క్యాబినెట్ తెలిపింది. గాజాలో వైమానిక దాడులతో తాము పైచేయి సాధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెనీ గంట్జ్ ట్విటర్ వేదికగా చెప్పారు. ఇజ్రాయెల్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాలస్తీనా ప్రజల విజయంగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓటమిగా హమాస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అసోసియేటెడ్ ప్రెస్‌తో ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను తుది రూపుకు వచ్చేవరకు హమాస్ మిలిటెంట్లు అప్రమత్తంగానే ఉంటారని అలీ బరాఖే చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ ఇజ్రాయెల్‌లో ప్రమాద ఘంటికలు మోగాయని, అంటే గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు గాజాలో తాజాగా వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా మీడియా పేర్కొంది. బైడెన్ ఏమంటున్నారు? కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత నెతన్యాహుతో తాను ఫోన్‌లో మాట్లాడానని, ఆయన్ను ప్రశంసించానని శ్వేతసౌధంలో విలేకరులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ''హమాస్‌తోపాటు గాజాలోని ఇతర మిలిటెంట్ గ్రూప్‌లు విచక్షణ రహితంగా జరుపుతున్న కాల్పుల నుంచి తమను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కులకు అమెరికా సంపూర్ణంగా మద్దతు పలుకుతోంది. గాజా నుంచి జరుపుతున్న కాల్పులతో ఇజ్రాయెల్‌లోని అమాయక పౌరులు మరణిస్తున్నారు''అని బైడెన్ అన్నారు. అమెరికా సాయంతో అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ''ఐరన్ డోమ్'' విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ''రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్‌.. యూదులతోపాటు అరబ్బుల ప్రాణాలను కాపాడుతోంది''అని బైడెన్ అన్నారు. ఈ ఘర్షణల్లో మరణాల సంఖ్య మరింత పెరగకుండా అడ్డుకునే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చడంలో కీలకపాత్ర పోషించిన ఈజిప్టు అధ్యక్షుడు అల్-సీసీపైనా బైడెన్ ప్రసంసలు కురిపించారు. ''ఆప్తులను కోల్పోయిన ఇజ్రాయెల్, పాలస్తీనాలలో కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను''. గాజాలోని ప్రజలకు సాయం అందించేందుకు, మౌలిక సదుపాయాల పునర్నిర్మానానికి ఐక్యరాజ్యసమితో తాము కలిసి పనిచేస్తామని బైడెన్ చెప్పారు. పాలస్తీనాలోని అధికారులతో మాత్రమే కలసి పనిచేస్తామని, హమాస్‌తో కాదని ఆయన స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ఎలా కుదిరింది? కొన్ని రోజులుగా ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా రెండు వైపులా అంతర్జాతీయ ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. కాల్పుల విషయంలో ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి మార్గం సుగమం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు నెతన్యాహుతో బుధవారం బైడెన్ చెప్పారు. గాజాలోని హమాస్‌, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో ఈజిప్టు, ఖతర్, ఐరాస కీలక పాత్ర పోషించాయి. చర్చల కోసం ఇజ్రాయెల్‌తోపాటు పాలస్తీనా ఆధీనంలోని ప్రాంతాలకు రెండు భద్రతా ప్రతినిధుల బృందాలను అల్-సీసీ పంపినట్లు ఈజిప్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. text: బుధవారం ఆయన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీను కలిశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపే లేఖను డిసెంబరు 3లోగా తనకు అందజేయాలని ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ ఇంతకుముందు స్పష్టం చేశారు. మంగళవారం శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబయిలో సమావేశమై, ఉద్ధవ్ ఠాక్రేను తమ కూటమి నేతగా ఎన్నుకున్నారు. కూటమికి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా నేతృత్వం వహించాలని కోరుకుంటున్నామపి సమావేశం అనంతరం ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారని ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది. ఉపముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాట్ బుధవారం చెప్పారని ఏఎన్‌ఐ పేర్కొంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మధ్య మంత్రి పదవుల పంపకం ఓ రెండ్రోజుల్లో ఖరారవుతుందని థొరాట్ తెలిపారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఉంటుందని జయంత్ పాటిల్ చెప్పారు. దేవేంద్ర ఫడణవీస్(బీజేపీ) నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలికిన ఎన్‌సీపీ సీనియర్ నేత అజిత్ పవార్, తాను ఎన్‌సీపీలోనే ఉన్నానని, పార్టీలోనే కొనసాగుతానిన చెప్పినట్లు పీటీఐ తెలిపింది. తమ నాయకుడు శరద్ పవార్‌ను కలిశానని ఆయన చెప్పారు. అజిత్ పవార్ తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ- మహారాష్ట్ర ఎన్నటికీ తలవంచదని వ్యాఖ్యానించారు. మరోవైపు బుధవారం బీజేపీ నేత, ప్రొటెం స్పీకర్‌ కాళీదాస్ కోలంబ్‌కర్ శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తున్నారు. అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, ఆదిత్య ఠాక్రే, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల బలం కావాలి. అసెంబ్లీలో ప్రధాన పార్టీల సంఖ్యాబలం ఇదీ బీజేపీ - 105 శివసేన - 56 ఎన్‌సీపీ - 54 కాంగ్రెస్ - 44 ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ఆరున్నరకు ముంబయిలోని శివాజీ పార్కులో ప్రమాణం చేయనున్నారు. text: దిల్లీలో తమిళనాడు రైతుల నిరసన లేదా మీరు టీవీలో ఏదో సినిమానో చూస్తూ దేశంలోని ఏదో ఒక భాగంలో ఒక రైతు కష్టపడి పండించిన ధాన్యంతో తయారు చేసిన ఆహారాన్ని తింటుండవచ్చు. లేదా ఆ టీవీ యాడ్‌లో చూపించిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఎలా కొనాలా అని ఆలోచిస్తుండవచ్చు. అయితే మీరు ఆన్‌లైన్ షాపింగ్ గురించి ఆలోచించే సమయంలో - ఆ దుస్తులు తయారు చేయడానికి అవసరమైన పత్తిని పండించి, చాలా తరచుగా ఆత్మహత్యలు చేసుకోవాలని భావించే విదర్భ రైతుల గురించి ఆలోచించకపోవచ్చు. భారతదేశంలో సగటున ప్రతి గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆ రైతుకు పేరుండదు. అతని గురించి ఎవరికీ తెలియదు. వ్యవసాయంలో ఉన్న కోట్లాదిమందిలో అతను ఒకడు. అనేక ఏళ్ల పాటు వ్యవసాయం చేసి, ఎలాంటి ప్రతిఫలమూ లేక విసుగు చెంది అతను ఆత్మహత్య చేసుకోవచ్చు. వ్యవసాయంలో రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారంటే, వాళ్లు రుణాలు తీసుకుంటున్నా, వాళ్ల జీవితాలు బాగుపడడం లేదు. అందుకే వాళ్లు కొన్నిసార్లు పంటల్లో కొట్టడానికి తెచ్చుకున్న పురుగుమందులను తాగి, కొన్నిసార్లు రైలు పట్టాలపై పడుకుని, కొన్నిసార్లు ఉరి వేసుకుని, కొన్నిసార్లు రాళ్లు కట్టుకుని బావుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని భార్యాపిల్లలను అనాథలుగా చేసి పోతున్నారు. వ్యవసాయంలో సంక్షోభం కారణంగా గత రెండు దశాబ్దాలుగా రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అయినా వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదు. చీడపీడల కారణంగా పత్తి పంటను పొలాల్లోనే వదిలేసిన రైతులు వ్యవసాయరంగంలోని సంక్షోభాన్ని పరిశీలించాల్సిన అవసరం ఏముంది? వ్యవసాయ సంక్షోభం గురించి మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్న వేసుకునే ముందు, వ్యవసాయానికి సంబంధించిన గణాంకాలు పరిశీలించే ముందు ఒక చిన్న కథ: నేను మూడో తరగతిలో చదివేప్పుడు మొదటిసారి 'భారతదేశంలో రైతులు' అన్న విషయంపై ప్రసంగించాను. ఆ సందర్భంలో 'భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. రైతులే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక' అన్నవి ప్రారంభవ్యాక్యాలు. చేతిలో మా నాన్న రాసిచ్చిన ఆ ప్రసంగం కాపీ పట్టుకుని, బెదురుతూ ఆ మాటలు మాట్లాడుతున్నపుడు, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అన్న రైతుల గురించి నాకు ఏ మాత్రం తెలియదు. ఆ వెన్నెముక నేను పెరిగి పెద్దయ్యేసరికి విరిగే పరిస్థితి వస్తుందని కూడా నాకు తెలీదు. మరి ప్రజలు 'అన్నదాత' అని కొనియాడిన రైతులు ఇప్పుడు ఒక ఆత్మహత్యల పట్టికగా ఎలా మారుతున్నారు? మన ప్రధానస్రవంతి మీడియాకు 'రైతు ఆత్మహత్య' అన్నది ఒక పనికిమాలిన వార్తగా ఎలా మారిపోయింది? పార్లమెంట్, అసెంబ్లీలో చేస్తున్న 'రుణమాఫీ'లు రైతుల అకౌంట్ల వరకు ఎందుకు చేరడం లేదు? పంజాబ్ రైతుల నిరసనలు 70 ఏళ్ల అనంతరం కూడా మారని రైతుల పరిస్థితి ఇటీవల రైతులు తమ సమస్యలను ప్రభుత్వాల వద్దకు, మన వద్దకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నాసిక్ నుంచి ముంబైకు వేలాది మంది రైతులు ఒట్టికాళ్లతో వెళ్లారు. దిల్లీ ఎండల్లో రోడ్డు పక్కన ఏది దొరికితే అది తిని, తమ ఆగ్రహాన్ని పార్లమెంట్ ముందు వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యానికి ముందు, ప్రేమ్‌చంద్ తన కథల్లో రైతుల పరిస్థితిని ఎలా వర్ణించారో, 70 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, 1995 నుంచి భారతదేశంలో 3 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 2016లోనే దేశవ్యాప్తంగా 11,370 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం పెరిగిపోతున్న వ్యవసాయ ఖర్చుల కోసం చేసిన అప్పులను తీర్చలేకపోవడం, పంట సరిగా పండకపోవడం, పంటలకు మద్దతు ధర లభించకపోవడం మొదలైనవి. రైతుల పరిస్థితిపై బీబీసీ వరుస కథనాలు అయితే వాస్తవం ఏమిటంటే, దేశానికి ఉన్న ఆశంతా రైతుల పైనే. అందుకే రైతులతో ప్రత్యేకంగా మాట్లాడడం ముఖ్యం. అప్పుడే వాళ్ల పిల్లల పళ్లెంలోంచి అన్నము, రొట్టెముక్క మాయం కావడానికి కారణాలేంటో తెలుస్తుంది. దీనిలో భాగంగా బీబీసీ 'రైతుల ఆత్మహత్యలు', 'వ్యవసాయ సంక్షోభం'పై ఒక సిరీస్ ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా మా ప్రతినిధులు పంజాబ్, మహారాష్ట్రల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రత్యేక సిరీస్ కోసం బీబీసీ ప్రతినిధులు రెండు నెలల పాటు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ రాష్ట్రాలలో సుమారు 5 వేల కిలోమీటర్లు పర్యటించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేశారు. నాసిక్ నుంచి ముంబైకు నడిచి వెళ్లిన రైతులు ఈ సిరీస్‌లో ఏం ఉంటాయి? రాబోయే రోజుల్లో పంజాబ్‌లోని బర్నాలా జిల్లా, మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలకు చెందిన రైతులు మా ప్రతినిధులకు చెప్పుకున్న సమస్యలను మీ ముందుంచుతాము. అలాగే వాటి నుంచి వాళ్లు ఎలా బయట పడడానికి ప్రయత్నిస్తున్నదీ కూడా మీతో పంచుకుంటాం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'ఈ దేశంలో రైతుల మరణాల గురించి ఎవరికీ పట్టలేదు'. ఈ వాక్యం చదివేటప్పుడు మీరు రొట్టె ముక్కో, వరి అన్నమో, మొక్కజొన్న పొత్తులో, బిస్కట్టో ఏదో ఒకటి తింటుండవచ్చు. text: ఎన్నికలు జరుగుతున్న వేళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నకిలీ సమాచారాన్ని గుర్తించడం పెను సవాల్‌గా మారుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న నకిలీ వార్తలను గుర్తించేందుకు పలు ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు, సోషల్ మీడియా గ్రూపులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా, తీవ్రస్థాయిలో బూటకపు సమాచారం వ్యాప్తి చెందుతూనే ఉంది. కొత్తగా నకిలీ వార్తలను ప్రచారం చేయడంతో పాటు, కొన్నేళ్ల క్రితం నకిలీదని తేల్చి చెప్పిన సమాచారాన్ని కూడా కొందరు ఇప్పుడు మళ్లీ వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. బీబీసీ రియాలిటీ చెక్ బృందం అలాంటి కొన్ని తప్పుదోవ పట్టించే పోస్టులను గుర్తించింది. సోనియా గాంధీ, బ్రిటన్ రాణి బ్రిటన్ రాణి కంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీనే సంపన్నురాలు అంటూ ఓ బూటకపు కథనం సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ అవుతోంది. అయితే, ఆ కథనంలో వాస్తవం లేదని ఆరేళ్ల క్రితమే వెల్లడైంది. ఆర్థిక అసమానత అనేది అధిక భావోద్వేగపూరితమైన అంశంగా ఉన్న దేశంలో ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన కథనాలు ఆయా వ్యక్తుల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రతిష్ఠను అలాంటి విషయాలు తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ తప్పుడు కథనం తొలుత 2012లో పత్రికల్లో వచ్చింది. 2013లో హఫ్ఫింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రపంచంలో అత్యంత సంపన్న నాయకుల జాబితాలో సోనియా గాంధీ పేరును కూడా ప్రచురించింది. కానీ, సోనియా గాంధీ ఆస్తులకు సంబంధించిన అంకెలపై ప్రశ్నలు వ్యక్తమవడంతో ఆమె పేరును తొలగించింది. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ.. తన వ్యక్తిగత ఆస్తులు విలువ రూ.9 కోట్లుగా అఫిడవిట్‌లో ప్రకటించారు. దాని ప్రకారం, సోనియా గాంధీ కంటే బ్రిటన్ రాణి ఆస్తుల అంచనా విలువ ఎన్నో రెట్లు ఎక్కువ. అయినా, రాణి కంటే సోనియా గాంధీనే ధనవంతురాలుగా పేర్కొంటూ తప్పుడు కథనాన్ని ఈ ఎన్నికల సమయంలోనూ పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఆ కథనాన్ని షేర్ చేశారు. అంతేకాదు, సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ "ఆమె ఒక యువతిగా ఎలా అందంగా తయారయ్యారో చూడండి" అంటూ, ఆమె నైతిక విలువలను ప్రశ్నిస్తూ నకిలీ ఫొటోలను వ్యాప్తి చేశారు. కానీ, ఆ ఫొటోలు హాలీవుడ్ తారలవి. వారితో సోనియా గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. మోదీ విద్యార్హతలు ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన మరో కథనం సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ అవుతోంది. తాను డిగ్రీ, పీజీ పూర్తి చేశానని మోదీ చెబుతున్నారు. అయితే, హైస్కూల్ (పదో తరగతి)కు మించి చదవలేదని నరేంద్ర మోదీ చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆ వీడియోను కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేస్తున్నారు. ఓ పాత ఇంటర్వ్యూ నుంచి కత్తిరించిన వీడియో క్లిప్‌ అది. ఆ పూర్తి ఇంటర్వ్యూలో తాను పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు పూర్తి చేశానని మోదీ స్పష్టంగా చెప్పారు. కానీ, పదో తరగతి పూర్తి చేశానన్న మాట వరకు మాత్రమే ఆ వీడియోను కత్తిరించి ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌లో ఇప్పటికీ వ్యాప్తి చేస్తున్నారు. నకిలీ సర్వేలు నకిలీ సర్వే రిపోర్టులు, తమ నేతలకు ఏవేవో పురస్కారాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. ప్రపంచంలోనే నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రధాన మంత్రిగా ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రకటించిందంటూ ఒక కథనం చక్కర్లు కొడుతోంది. అది పూర్తి అవాస్తవం. యునెస్కో ఇచ్చే అవార్డుల్లో అలాంటివేమీ లేవు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోని అత్యంత అవినీతిమయమైన నాలుగో పార్టీ అంటూ బీబీసీ సర్వేలో వెల్లడైందంటూ ఓ నకిలీ కథనాన్ని కొందరు వ్యాప్తి చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని బీబీసీ అంచనావేసిందంటూ కొన్ని బూటకపు కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని బీబీసీ అంచనా వేసిందంటూ మరో నకిలీ పోస్టు కూడా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు చేయలేదని బీబీసీ స్పష్టంగా చెప్పింది. నకిలీ వేళ్లు ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా అనేక రకాల వదంతులు వైరల్ అవుతున్నాయి. ఇటీవల దొంగ ఓట్లు వేసేందుకు, ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేసేందుకు కొందరు ప్లాస్టిక్ వేళ్లు ధరిస్తున్నారంటూ బూటకపు వదంతులు వ్యాప్తి చెందాయి. ఫేస్‌బుక్, ట్విటర్‌లో కొన్ని ప్లాస్టిక్ వేళ్ల తొడుగుల చిత్రాలు షేర్ చేశారు. ఇవే చిత్రాలను 2017లో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలప్పుడు కూడా వ్యాప్తి చేశారు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం శరవేగంగా పెరుగుతోంది. సమస్యకు పరిష్కారం ఏంటి? నకిలీ వార్తలను గుర్తించేందుకు కొన్ని సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.. కానీ, అది అంత సులువైన పనికాదు. నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నా, ప్రైవేటు వేదికల్లో వాటి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదని మెల్‌బోర్న్‌‌కు చెందిన ప్రొఫెసర్ ఉషా రోడ్రిగెస్ అంటున్నారు. సోషల్ మీడియా, భారత్ రాజకీయాల మీద ఉషా అధ్యయనం చేస్తున్నారు. "ఒక కథనాన్ని నమ్ముతున్నవారికి అది నకిలీదా? అన్న అనుమానం చాలావరకు రాదు. ఒక విషయం నకిలీదని తేల్చినప్పటికీ, దాన్ని మరో రూపంలో ఆయా వ్యక్తులు మళ్లీ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తారు" అని ఉషా వివరించారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారమూ వాస్తవమైనదిగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. "తాము చూస్తున్నది నిజమేనని నమ్మిన వీడియోలను" వెంటనే ఇతరులతో పంచుకునేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తారని 'ఇండియా కనెక్టెడ్: మ్యాపింగ్ ది ఇంప్యాక్ట్ ఆఫ్ న్యూ మీడియా' పుస్తకం సహ రచయిత షాలినీ నారాయణ్ చెప్పారు. నకిలీవని తేల్చిన వార్తలను నియంత్రించడంలో ఆన్‌లైన్ సెర్చింజన్లు మెరుగ్గా పనిచేయవచ్చు, కానీ ప్రైవేటు గ్రూపుల్లో ఉండేవారికి ఆ విషయం తెలియకపోవచ్చునని ఉషా అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ఊపందుకుంది. వచ్చే అయిదేళ్లు అధికార పీఠంపై ఎవరుండాలో ప్రజలు నిర్ణయించే సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియాలో బూటకపు సమాచారం తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. text: సిరియాలో టర్కీ ఆపరేషన్ తమ సమస్య కాదని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆయన "టర్కీ-సిరియా సరిహద్దుల్లో టర్కీకి సమస్య ఉంది. అది మా సరిహద్దు కాదు. ఈ అంశంలో మా సైనికులు ప్రాణాలు కోల్పోకూడదు" అని చెప్పారు. టర్కీ-సిరియా సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా అనుకూలంగా ఉందని ట్రంప్ చెప్పారు. "మా సైనికులు అక్కడి నుంచి వచ్చేశారు. వార పూర్తి సురక్షితంగా ఉన్నారు. అక్కడ సమస్యను వాళ్లు (టర్కీ) పరిష్కరించుకోవాల్సి ఉంది. వాళ్లు యుద్ధం లేకుండానే పరిష్కరించుకోవచ్చనుకుంటున్నా" అని ట్రంప్ చెప్పారు. తాము పరిస్థితులను గమనిస్తున్నామని, చర్చలు జరుపుతున్నామని, టర్కీ సరైన చర్య చేపట్టేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎందుకంటే యుద్ధాలు ఆపాలని కోరుకొంటున్నామని ఆయన వివరించారు. సిరియాలో అమెరికా మాజీ మిత్రపక్షమైన కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (‌ఎస్‌డీఎఫ్)ని ఉద్దేశించి- వాళ్లేమీ దైవదూతలు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. "ఎస్‌డీఎఫ్ మాతో కలసి పోరాడింది. మాతో కలిసి పోరాడేందుకు వాళ్లకు మేం చాలా డబ్బిచ్చాం. మాతో కలిసి పోరాడినప్పుడు వాళ్ల తీరు బాగుంది. కానీ మాతో కలిసి పోరాడనప్పుడు వారి తీరు సరిగా లేదు" అని చెప్పారు. బలగాల ఉపసంహరణను ఖండించిన ప్రతినిధుల సభ సిరియా నుంచి అమెరికా ఇటీవల సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. టర్కీ బలగాలు సిరియాలోకి ప్రవేశించి దాడులు జరపడానికి అమెరికా చర్య ఊతమిచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ- అమెరికా పోలీసింగ్ ఏజెంట్ కాదని చెప్పారు. సిరియా నుంచి తమ బలగాలను స్వదేశానికి రప్పించాల్సిన సమయం వచ్చేసిందని, అందుకే ఉపసంహరించుకొన్నామని తెలిపారు. సిరియా నుంచి ట్రంప్ అమెరికా బలగాలను ఉపసంహరించడాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఖండించింది. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ ఈ చర్యను వ్యతిరేకించారు. సిరియాపై అమెరికా పార్లమెంటు కాంగ్రెస్ నాయకులతో సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ సంయమనం కోల్పోయారని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ విలేఖరులతో చెప్పారు. నాన్సీ పెలోసీని అధ్యక్షుడు 'థర్డ్-రేట్ రాజకీయ నాయకురాలు' అని అన్నారని, దీంతో తమ పార్టీ నాయకులు సమావేశంలోంచి వచ్చేశారని డెమొక్రటిక్ సెనేటర్ చుక్ ష్కుమర్ చెప్పారు. పెలోసీ సంయమనం కోల్పోయారని ట్రంప్ ఆరోపించారు. పెలోసీ వ్యవహారశైలి అనుచితంగా ఉందని రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆరోపించారు. సమావేశంలోంచి ఆమె వెళ్లిపోవడంపై విమర్శలు గుప్పించారు. సిరియాపై క్షిపణిని ప్రయోగించిన టర్కీ బలగాలు టర్కీ దాడులు ఎందుకు? 'పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ)' అనే సిరియన్ కుర్దు మిలీషియా సభ్యులను టర్కీ-సిరియా సరిహద్దు నుంచి వెనక్కు తరిమేసి, సరిహద్దుల్లో సిరియా భూభాగంలో ఒక 'సేఫ్ జోన్' ఏర్పాటు చేసేందుకు టర్కీ వారం క్రితం తాజా ఆపరేషన్ చేపట్టింది. సరిహద్దు వెంబడి 480 కిలోమీటర్ల పొడవున, 32 కిలోమీటర్ల లోపలి వరకు దీనిని ఏర్పాటు చేస్తామని టర్కీ చెప్పింది. తాను ఆశ్రయమిస్తున్న 36 లక్షల మంది సిరియా శరణార్థుల్లో 20 లక్షల మంది వరకు శరణార్థులకు ప్రతిపాదిత సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించాలని టర్కీ ఆశిస్తోంది. అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకొన్న తర్వాత టర్కీ ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. సిరియాలో కుర్దు, అరబ్ మిలీషియాలతో కూడిన ఎస్‌డీఎఫ్‌లో వైపీజీ బలమైన భాగస్వామి. వైపీజీని టర్కీలో కుర్దుల స్వయంప్రతిపత్తి కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న నిషేధిత 'కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)'కి అనుబంధ సంస్థగా టర్కీ పరిగణిస్తుంది. పీకేకేను ఉగ్రవాద సంస్థగానూ టర్కీ ప్రకటించింది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌పై పోరాటంలో ఇటీవలి వరకు అమెరికాకు ఎస్‌డీఎఫ్ కీలక మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది. అమెరికా నాయకత్వంలోని వివిధ దేశాల కూటమి వైమానిక దాడుల తోడ్పాటుతో గత నాలుగేళ్లలో సిరియాలో పావు వంతు భూభాగం నుంచి ఈ గ్రూప్‌ను ఎస్‌డీఎఫ్ తరిమేసింది. అమెరికా బలగాల ఉపసంహరణ, టర్కీ దాడులు, ఇతర పరిణామాల నేపథ్యంలో ఏర్పడ్డ అస్థిరత ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు పుంజుకోవడానికి దారితీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 14న రస్ అల్-అయిన్ పట్టణంలో టర్కీ దాడుల్లో చనిపోయిన ఎస్‌డీఎఫ్ ఫైటర్ల అంత్యక్రియల కార్యక్రమంలో రోదిస్తున్న మహిళ పీకేకేతోనే ముప్పు ఎక్కువ: ట్రంప్ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ తీవ్రస్థాయిలో ఉగ్రవాదానికి పాల్పడుతోందని ట్రంప్ చెప్పారు. చాలా కోణాల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కంటే కూడా ఈ పార్టీ ఎక్కువ ఉగ్రవాద ముప్పును కలిగిస్తోందన్నారు. ఉత్తర సిరియాలో ఆపరేషన్ చేపట్టేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిప్ ఎర్దోగాన్‌కు తాను పచ్చజెండా ఏమీ ఊపలేదని ట్రంప్ మీడియాతో చెప్పారు. సిరియాలో ఆపరేషన్ చేపట్టాక ఈ అంశంపై తాను ఎర్దోగాన్‌తో మాట్లాడానని, ఆ తర్వాత ఆయనకు 'చాలా శక్తిమంతమైన లేఖ' రాశానని పేర్కొన్నారు. టర్కీ ఆపరేషన్‌ను మొదలుపెట్టిన అక్టోబరు 9న రాసిన ఈ లేఖ 16న వెలుగులోకి వచ్చింది. సిరియా విషయంలో సరైన విధంగా, మానవీయ పద్ధతిలో వ్యవహరిస్తే మిమ్మల్ని చరిత్ర సానుకూలంగా గుర్తుంచుకుంటుందని, అక్కడ పరిణామాలు బాగోలేకపోతే ఎప్పటికీ రాక్షసుడిగానే చూస్తుందని లేఖలో టర్కీ అధ్యక్షుడినుద్దేశించి ట్రంప్ చెప్పారు. అతికటువుగా వ్యవహరించొద్దని, అవివేకిగా మిగలొద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర సిరియాకు వెళ్తున్న టర్కీ మద్దతుగల సిరియా ఫైటర్లు వైపీజీపై ఎవరి వైఖరి ఏమిటి? వైపీజీని పీకేకే అనుబంధ సంస్థగా టర్కీ పరిగణిస్తుంది. పీకేకేను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. పీకేకే, వైపీజీ మధ్య సంబంధాలున్నట్లు ఇంతకుముందు చెప్పింది. అయితే పీకేకేకు వైపీజీ అనుబంధ సంస్థ అనే టర్కీ వాదనను తోసిపుచ్చింది. ఉత్తర సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ మొదలయ్యాక, దాడుల్లో టర్కీ సేనలు పైచేయి సాధించాక ఈ ప్రాంతంలోని కుర్దు బలగాలు సిరియా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి అంగీకరించాయి. దీని ప్రకారం- సిరియా సరిహద్దులో టర్కీ దాడులను ఎదుర్కోవడంలో తమకు సహకరించేందుకు ప్రభుత్వం సిరియా సైన్యాన్ని మోహరించాలి. కాల్పుల విరమణకు అమెరికా ఇచ్చిన పిలుపును తోసిపుచ్చిన టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ దాడులు కొనసాగిస్తామన్న టర్కీ టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌తో చర్చించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపేయో టర్కీ రాజధాని అంకారాకు వెళ్తున్నారు. ఈ నెల 14న టర్కీపై అమెరికా ఆంక్షలను ప్రకటించింది. సిరియాలో దాడులను ఆపేసేలా ఒత్తిడి తెచ్చేందుకు టర్కీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. తాము కూడా అమెరికాపై ఆంక్షలకు సిద్ధమవుతున్నామని టర్కీ అధ్యక్షుడి అధికార ప్రతినిధి ఈ నెల 16న ప్రకటించారు. సిరియాలో దాడులను కొనసాగిస్తామని, కుర్దు ఫైటర్లతో చర్చలు జరపబోమని టర్కీ స్పష్టం చేసింది. కుర్దుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో టర్కీ మద్దతు గల సిరియా మిలీషియాలు పైచేయి సాధిస్తున్నాయి 'కొబానేకు చేరుకున్న రష్యా బలగాలు' ఉత్తర సిరియాలోని సరిహద్దు పట్టణం కొబానేకు సిరియా, రష్యా బలగాలు చేరుకున్నాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' ఈ నెల 16న తెలిపింది. టర్కీ దాడుల నేపథ్యంలో కుర్దు ఫైటర్లు, సిరియా ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ బలగాలు ఇక్కడకు వచ్చాయి. ఉత్తర సిరియాలో టర్కీ ఆపరేషన్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారని, లక్షా 60 వేల మంది ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. దాడులను ఆపాలని ఈ నెల 16న ఐరాస భద్రతా మండలి మరోమారు టర్కీకి పిలుపునిచ్చింది. ఉత్తర సిరియాలో యుద్ధ క్షేత్రం నుంచి వెళ్లిపోతున్న మహిళ ఈ నెల 15న వ్యూహాత్మకంగా ముఖ్యమైన మన్బీజ్ పట్టణంలోకి సిరియా ప్రభుత్వ సేనలు ప్రవేశించాయి. టర్కీ ప్రతిపాదిత సేఫ్ జోన్ పరిధిలోనే ఈ పట్టణం ఉంది. టర్కీ బలగాలు, టర్కీ అనుకూల బలగాలు, సిరియా ప్రభుత్వ వ్యతిరేక ఫైటర్లు కూడా మన్బీజ్ పట్టణం సమీపంలో పోగవుతున్నాయి. గత రెండేళ్లలో వందల కొద్దీ అమెరికా సైనికులు ఈ కీలక పట్టణంలో గస్తీ కాశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సిరియా భూభాగంలోకి ప్రవేశించి టర్కీ దాడులు జరపడంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందిస్తూ- ఆ ప్రాంతం తమ సరిహద్దు కాదన్నారు. text: తన అభిమాన నటుడు చిత్తూరు నాగయ్యను అనుకరిస్తూ మొదలైన ధ్వన్యనుకరణ విద్యను తనకు పర్యాయపదంగా మార్చుకున్న కళాకారుడు, గళాకారుడు ఆయన. టీవీలు వీడియోలు లేని రోజుల్లో వేదికల మీదో, రేడియోలోనే వినపడిన గొంతులను ప్రాక్టీస్ చేసి ఆ నాయకులకే వినిపించి అబ్బురపరిచిన కళాకారుడు ఆయన. ప్రఖ్యాత ఆంగ్ల సినిమా టెన్ కమాండ్మెంట్స్ ధ్వనుల అనుకరణ ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్. నేరెళ్ల ఒకట్రెండు భాషలకే పరిమితం కాలేదు. ఆయన తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, తమిళం భాషల్లో ప్రదర్శనలిచ్చేవారు. మిమిక్రీ కళను అంతెత్తుకు తీసికెళ్లి తెలుగు ప్రతిభకు అంతర్జాతీయంగా పట్టం కట్టిన వేణుమాధవ్‌ను తెలుగు సాంస్క‌ృతిక ప్రపంచం ప్రేమగా, గౌరవంగా తల్చుకుంటోందని పలువురు కళాకారులు తెలిపారు. ధ్వన్యనుకరణలో సుప్రసిద్ధులైన నేరెళ్ల 16 ఏళ్లకే కెరీర్ ప్రారంభించారు. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన తొలి కళాకారుడు ఆయనే. 2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపుకుంటారు. భార్య శోభావతితో నేరెళ్ల వేణుమాధవ్ ''ఆయన తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య మిమిక్రీ కళాకారుడు. వేయిగొంతుల వేణుమాధవుడు ఆయన. ఆయన కొంత కాలంగా పార్కిన్సన్, వృద్ధాప్య సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు'' అని నేరెళ్ల కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు. నేరెళ్లకు నలుగురు సంతానం. వారిలో ఒకరైన లక్ష్మీతులసి తన తండ్రి నుంచి మిమిక్రీ కళను నేర్చుకున్నారు. ఆమె వైద్యురాలిగా స్థిరపడ్డారు. భాషపై పట్టు ఉండాలన్న నేరెళ్ల తాను చిన్న వయసులో ఉన్నప్పుడు తమ ఇంటికి వచ్చే స్నేహితులు, ఇరుగుపొరుగువారి గొంతులను అనుకరించేవాడినని నేరెళ్ల దాదాపు రెండేళ్ల క్రితం 'ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ''కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్లలోనే నాకు అంత ప్రజాదరణ లభిస్తుందని కలలోనైనా అనుకోలేదు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లాంటి చాలా మంది గొప్పవారిని కలుసుకొనే అవకాశం, వారి గొంతులను అనుకరించే అవకాశం నాకు లభించాయి'' అని ఆయన తెలిపారు. భాషపై పట్టు సాధించాలని, నేర్చుకున్నది నిలుపుకోవాలని ఔత్సాహిక కళాకారులకు ఆయన సూచించారు. రాత్రి నిద్రలోంచి లేపినా ధ్వన్యనుకరణ చేయగలగాలని చెప్పారు. వందల మంది ఔత్సాహికులకు మిమిక్రీ కళను నేర్పించిన నేరెళ్ల వినమ్రత, నిజాయతీ కలిగిన ఆచార్యుడని ప్రముఖ రచయిత 'అంపశయ్య' నవీన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. 'ఆయన మహోన్నత కళాకారుడు.. మహోన్నత వ్యక్తి' ''నేరెళ్ల ఎంత మహోన్నత కళాకారుడో అంత మహోన్నత వ్యక్తి'' అని మిమిక్రీ కళాకారుడు జనార్దన్ బీబీసీతో చెప్పారు. భారత్‌లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యులని, ఎంతో మంది ప్రముఖులు సహా కనీసం 100 మంది గొంతులను యథాతథంగా అనుకరించేవారని తెలిపారు. చాలా శబ్దాలనూ అనుకరించేవారని చెప్పారు. భారత్‌లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత నేరెళ్లదేనని జనార్దన్ ప్రస్తావించారు. ''ఆయన చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, అధ్యయనంతో తనను తాను మెరుగుపరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్నారు'' అని వివరించారు. తోటి కళాకారులను స్థాయీ భేదం లేకుండా సమానంగా చూడటం నేరెళ్ల గొప్పతనమని జనార్దన్ తెలిపారు. శిష్యులను ఎంతగానో ప్రోత్సహించేవారని నేరెళ్లతో దాదాపు రెండున్నర దశాబ్దాల సాన్నిహిత్యమున్న ఆయన చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కోర్సు పెట్టించారు ఈ కళను భావితరాలకు అందించాలనే సంకల్పంతో మిమిక్రీ శిక్షణకు నేరెళ్ల సిలబస్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా చొరవ తీసుకొని మిమిక్రీపై హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్సును పెట్టించారు. కోర్సు ప్రారంభించాక మొదటి రెండేళ్లు ఆయన పాఠాలు చెప్పారు. కోర్సు నిర్వహణ కోసం విశ్వవిద్యాలయానికి నేరెళ్ల డబ్బు కూడా అందించారని జనార్దన్ తెలిపారు. నేరెళ్ల చొరవతో వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ మిమిక్రీపై సాయంత్రం తరగతులు నిర్వహించేవారని చెప్పారు. ఎనిమిదో తరగతిలో ఒక పాఠ్యపుస్తకంలో ఆయన పేరిట 'సౌండ్' అనే పాఠం కూడా ఉందని ప్రస్తావించారు. 'మిమిక్రీ కళ-వికాసం' పేరుతో ఆంథోనీ రాజ్ అనే వ్యక్తి నేరెళ్ల మిమిక్రీ ప్రధానాంశంగా పీహెచ్‌డీ చేశారని తెలిపారు. అవిభాజ్య ఆంధ్ర్రప్రదేశ్‌కు పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేరెళ్ల శాసనమండలి సభ్యుడిగా నామినేట్ అయ్యారు. 1972-78 మధ్య ఆయన ఎంఎల్‌సీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత బీఎన్ రెడ్డి ప్రోత్సాహంతో నేరెళ్ల సినిమాల్లో నటించారు. ఆయన్ను 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన ఆంధ్ర, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి, ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వరంగల్‌లో ఒక వీధికి నేరెళ్ల గౌరవార్థం ''డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ మార్గ్'' అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం నేరెళ్ల మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయనో గొప్ప కళాకారుడని కొనియాడారు. నేరెళ్ల భౌతికకాయానికి పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం ఉదయం వరంగల్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. నేరెళ్ల 1932 డిసెంబరు 28న వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో జన్మించారు. ఆయనకు 85 సంవత్సరాలు. text: ఆమెకు ఇప్పుడు ఆదాయం వచ్చే మార్గమేదీ లేదు. తిండికి, ఇంటి అద్దెకు డబ్బులు లేక దిగులుపడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో దినసరి కూలీలు తల్లడిల్లుతున్నట్లే పొట్టకూటి కోసం ట్రాన్స్‌జెండర్ వర్గం కూడా ఇబ్బందులు పడుతోంది. “పోలీసులకు మా వృత్తి గురించి తెలుసు. మేం బయటకు వస్తే, దాని కోసమే వస్తున్నామని వాళ్లు అనుకుంటారు. అందుకే మమ్మల్ని అడ్డగిస్తారు. మా ఆదాయం ఆగిపోయింది. అందరం కలిసి, ఎంతో కొంత పోగేసుకుని బతుకుతున్నాం. మా ఇంటి అద్దె రూ.5 వేలు. రాబోయే నెలల్లో మేం ఎలా కట్టాలి?” అని అన్నారు ఆలియా. సోనమ్ ‘కుటుంబాన్ని పోషించుకోవాలి’ సోనమ్‌ది బిహార్. ఇటీవలే ఆమె వాళ్ల ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు. టోలా బధాయీగా ఆమె పనిచేస్తున్నారు. “బిహార్‌లో మా అమ్మ, నాన్న ఉంటారు. లాక్‌డౌన్ మొదలు కాకముందు ఊరి నుంచి వచ్చాను. అక్కడ చాలా ఖర్చులయ్యాయి. ఇక్కడ సంపాదించుకోవచ్చని అనుకున్నా. కానీ, ఇప్పుడు మొత్తం మూసేశారు. ఇంటికి ఏం పంపాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఆపదలో అక్కరకు వస్తాయని దాచుకున్న డబ్బులు కొన్ని ఉన్నాయి. లేకపోతే, మాకు ఎవరు సాయం చేస్తారు? కరోనాతో చస్తామో, లేదో గానీ, పని దొరక్క ఇంట్లోనే చచ్చేలా ఉన్నాం" అని సోనమ్ అంటున్నారు. రేషన్ కార్డు కోసం ఎంత ప్రయత్నించినా, పొందలేకపోయానని ఆమె చెప్పారు. ఫలితంగా ప్రభుత్వ రేషన్ ఆమెకు అందట్లేదు. స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఆమె బతుకీడుస్తున్నారు. అప్పు పుట్టని పరిస్థితి వస్తే, ఏమవుతుందోనని ఆమె బాధపడుతున్నారు. రామ్‌కలీ ‘గాలికి వదిలేశారు’ ట్రాన్స్‌జెండర్స్ కోసం పనిచేస్తున్న బసేరా అనే స్వచ్ఛంద సంస్థలో రామ్‌కలీ సభ్యురాలు. ప్రస్తుత లాక్‌డౌన్‌లో ట్రాన్స్‌జెండర్లు నిరుద్యోగం, ఆకలి బాధలతో అల్లాడుతున్నారని ఆమె చెబుతున్నారు. “రోజూ సాయం కావాలంటూ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. మా వర్గంలో ఉండే వాళ్లలో ఎక్కువ మంది ఏ రోజుకు ఆ రోజు సంపాదనపై ఆధారపడేవారే. ఇప్పుడు ఆదాయం లేకపోవడంతో, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. సొంత ఇల్లు ఉండదు. అద్దె కట్టాల్సి ఉంటుంది. కుటుంబం ప్రేమ, ఆసరా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద సమస్య. లింగం విషయంలో కుటుంబం నుంచి వేధింపులు ఉంటాయి. సమాజం మా వర్గాన్ని గాలికి వదిలేసింది. కష్టకాలంలో మాకు ఎవరు సాయం చేస్తారు? దినసరి కూలీలు వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మేం ఎక్కడికి వెళ్లాలి?’’ అని ప్రశ్నించారు రామ్‌కలీ. ఆకాశ్ ‘ఉద్యోగం నుంచి తీసేశారు’ దిల్లీకి చెందిన ఆకాశ్ పాలీ తన లింగం మార్చుకుని పురుషుడిగా మారారు. ఆయన ఓ పార్లర్‌లో పనిచేసేవారు. కానీ, కొన్ని రోజుల క్రితం ఆయన ఉద్యోగం పోయింది. “నేను ట్రాన్స్‌జెండర్ అని తెలిశాక, వాళ్లు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. లాక్‌డౌన్ విధించడానికి కొన్ని రోజుల ముందు ఇది జరిగింది. నేను వేరే చోటుకు వెళ్లొచ్చేసరికి లాక్‌డౌన్ విధించారు. ఆ సంస్థ నాకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇవ్వడం లేదు” అని చెప్పారు ఆకాశ్. ‘‘నాకు సంపాదనకు ఇంకో దారి లేదు. పొదుపు చేసుకున్న డబ్బులు, ఇంట్లో వాళ్లు అవసరమంటే ఇచ్చేశా. సాయం చేస్తే, నన్ను వాళ్లు అంగీకరిస్తారని అనుకున్నా. కానీ, అలా జరగలేదు. నన్ను ఒంటరిగా వదిలేశారు. ఇప్పుడు అప్పు తీసుకుని బతుకుతున్నా. ఇంటి యజమాని అద్దె అడుగుతున్నారు’’ అని వివరించారు. నిరాశ్రయులు ఉండేందుకు దిల్లీ ప్రభుత్వం చాలా స్కూళ్లలో శిబిరాలు ఏర్పాటు చేసింది. వాటిలో తిండికి కూడా ఏర్పాట్లు చేసింది. చాలా మంది నిరాశ్రయులు వాటిలో ఉంటున్నారు. కానీ, అక్కడికి వెళ్లడం తమకు సులువు కాదని ఆకాశ్ అంటున్నారు. “కొద్ది రోజుల క్రితం బయటకు వెళ్తే, ఎక్కడికి వెళ్తున్నావంటూ పోలీసులు ఆపారు. ఒకవేళ ఆ శిబిరాలకు వెళ్లినా, పెద్ద లైన్లు ఉంటాయి. జనాలు మమ్మల్నే గుచ్చిగుచ్చి చూస్తారు" అని ఆకాశ్ చెప్పారు. ‘ఏ కార్డులూ లేవు’ తమ వర్గం కాకుండా, బయటివాళ్లలో మిత్రుల సంఖ్య తక్కువ ఉండటం ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అని రామ్‌కలీ అన్నారు. అందరూ నిరుద్యోగంతో ఉన్నప్పుడు, ఒకరికొకరు సాయం చేసుకునే అవకాశం ఉండదని అన్నారు. కుటుంబానికి దూరంగా రావడం వల్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు కార్డు లాంటివి ట్రాన్స్‌జెండర్లకు ఉండటం లేదని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లలో ఎక్కువ మంది టోలా బధాయి పనిచేస్తుంటారు. ఎవరింట్లోనైనా వేడుకలు జరిగితే, పాటలు, నృత్యాలు చేసేందుకు వెళ్తుంటారు. అలాంటి వేడుకలు జరిగినప్పుడే వాళ్లకు డబ్బులు వస్తాయి. హైదరాబాద్‌కు చెందిన ఫిజా జాన్ కూడా టోలా బధాయి పనిచేస్తుంటారు. వాళ్ల బృందానికి ఆమె నాయకురాలు. ఇప్పుడు అందరి బతుకులు ఇబ్బందుల్లో ఉన్నాయని ఆమె అంటున్నారు. ‘‘మేమందరం ఖాళీగా ఉన్నాం. తినడానికి, అద్దె కట్టడానికి డబ్బులు లేవు. బియ్యం, గోధుమపిండి ఎవరైనా ఇస్తే, అవసరం ఉన్నవాళ్లకు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు మాకే అవసరం ఏర్పడింది. మాకు సాయం చేస్తామని కొందరు చెబుతుంటారు. కానీ జరిగేదేమీ లేదు’’ అని ఫిజా జాన్ అన్నారు. "ట్రాన్స్‌జెండర్లకు రేషన్ ఇస్తామని కొన్ని రోజుల క్రితం ఓ రాజకీయ పార్టీ నేత ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఆయన చేసిందేమీ లేదు’’ అని రామ్ కలీ అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 49 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 2019లో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం చట్టం కూడా తెచ్చింది. కానీ, ఈ చట్టం విషయంలోనూ ట్రాన్స్‌జెండర్లకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గుర్తింపును నిర్ణయించుకునే స్వేచ్ఛ, మిగతవారిలాగే గౌరవంగా బతికే అవకాశం, హక్కులను తమకు కల్పించాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేస్తున్నారు. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "ఇక్కడెక్కడా తిండి దొరకట్లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేదు. ఎక్కడో శిబిరాల్లో తిండి పెడుతున్నారు. కానీ, ఈ లాక్‌డౌన్‌లో అక్కడికి ఎలా వెళ్లేది?"... నోయిడాలో సెక్క్స్ వర్కర్‌గా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ ఆలియా అడిగిన ప్రశ్న ఇది. text: క్రికెటర్ డారెన్ సామీ చేసిన ఈ ప్రకటనలో అతడిని వారంతా అన్న ఆ మాట ‘కాలూ’. అమెరికా సహా మొత్తం ప్రపంచమంతా జాతి వివక్షపై వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు, వెస్టిండీస్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న సామీ, భారత్‌లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తనపట్ల చూపిన జాతివివక్ష వ్యాఖ్యల గురించి బయటపెట్టారు.. ఈ వ్యతిరేక ప్రదర్శనల కలకలం భారత్‌లో పెద్దగా కనిపించడం లేదు. కొంతమంది ఈ ఆరోపణలు విని కంగారు పడిపోయారు. కానీ భారత్‌లో ఇలాంటి ప్రవర్తన లేదా క్రికెట్‌లో జాతివివక్ష కొత్త విషయమేం కాదు. ఫుట్‌బాల్‌లో తరచూ జాతివివక్ష బయటపడుతూనే వచ్చింది. కానీ, క్రిస్ గేల్ తన ఇన్‌స్టా పోస్టులో పెట్టినట్లు క్రికెట్‌లో దీని గురించి అంత బాహాటంగా మాట్లాడేవారు కాదు. భారత్‌లో నివసించే నల్లవారు బహిరంగంగా జాతివివక్ష ఆరోపణలు చేస్తూ వచ్చారు. భారత్ అయినా, వేరే దేశమైనా క్రికెట్ దానికి అతీతం కాదు. క్రికెట్‌లో జాతివివక్ష ఘటనల గురించి ఒక జాబితా తయారు చేస్తే ఈ ఆర్టికల్ మొత్తం ఆ కథలతోనే నిండిపోతుంది. 2019లో జరిగిన ఒక క్రికెట్ కామెంట్రీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అక్కడ మైక్ నుంచి వస్తున్న శబ్దాలను బట్టి అతడు దక్షిణాఫ్రికా ఆటగాడిని ఉద్దేశించి ఒక తప్పు మాటను ప్రయోగించినట్లు తెలుస్తుంది. అదే మాట గురించే, ఇప్పుడు సామీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఆశ్చర్యకరంగా, కామెంట్రీ బాక్సులో కూర్చున్న రమీజ్ రాజాను మిగతా కామెంటరేటర్లు అదే విషయం అడిగినప్పుడు, ఆయన నవ్వేసి ఊరుకుంటారు. అయితే సర్ఫరాజ్‌పై నిషేధం కూడా విధించారు. కానీ, ఇక్కడ ప్రశ్న మానసికతకు సంబంధించినది. మైదానంలో ఒక ఆటగాడికి, మరో ఆటగాడితో సమాన హోదా ఉంటుంది. కానీ అతడు రంగు గురించి మాట్లాడకుండా ఆటగాడిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేడు. డారెన్ సామీ, సర్ఫరాజ్ చర్మం రంగుపై వ్యాఖ్యలు భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లపై జాతివివక్ష ఆరోపణలు వచ్చాయంటే, గోధుమ వర్ణం, నల్ల రంగు కంటే మెరుగైనదని నిరూపించే ప్రయత్నం చేస్తుంటారని అర్థం చేసుకోవాలి. తెల్ల క్రికెటర్లపై ఇవే ఆరోపణలు వచ్చినపుడు, వారు గోధుమ, నల్ల రంగులో ఉన్న వారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 2008 మంకీగేట్ మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ మీద జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని భారత ఆటగాడు హర్భజన్ సింగ్ మీద ఆరోపణలు వచ్చాయి. భారత్ ఆ టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరించింది. దాంతో హర్భజన్ మీద ఆ ఆరోపణలు తొలగించారు. జాతివివక్ష ఆరోపణలు అంతకు ముందు నుంచే ఉన్నాయి. ఆ తర్వాత కూడా నల్ల ఆటగాళ్లు వీటికి చాలాసార్లు లక్ష్యంగా మారారు. ఈ జాతి వివక్ష వ్యాఖ్యలు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచే కాదు, క్రికెట్ ప్రేక్షకుల మధ్య నుంచి కూడా వస్తుంటాయి. ఈ మానసికత ఆటను మించిన ఒక సామాజిక సమస్య అనే విషయాన్ని అవి చెబుతాయి. ఆటగాళ్లు ఈ మానసికతను మైదానంలో మరింత ముందుకు తీసుకెళ్తుంటారు. వీటన్నిటి వల్ల ఆటగాళ్లపై ఒక సైకలాజికల్ ప్రభావం పడుతుంది. 2019లో 24 ఏళ్ల యువ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ న్యూజీలాండ్‌లో ఒక ప్రేక్షకుడి నుంచి చాలా ఘోరమైన జాతివివక్ష వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్చర్ బార్బడాస్‌లో పుట్టిన నల్లజాతి మూలాలు ఉన్న ఆటగాడు. అప్పుడు ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున విదేశీ మైదానంలో తన తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడు చాలా కీలకం. ఆ మ్యాచ్ అతడికి గుర్తుండిపోయింది. కానీ అతడు దానిని ఒక అవమానకరమైన ఘటనగా గుర్తు చేసుకుంటాడు. మ్యాచ్ త ర్వాత ఆర్చర్ “మీరు నా బౌలింగ్ గురించి చెడుగా మాట్లాడుంటే వినేవాడిని, కానీ జాతివివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు” అన్నాడు. ఆ సమయంలో తన ఆరు నెలల స్వల్ప కెరియర్‌లో అతడు కనీసం రెండు సార్లు అలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఇలాంటి చాలా విషయాలు గుర్తుకొస్తాయి. 2003లో ఆస్ట్రేలియా డెరెన్ లీమెన్ శ్రీలంక ఆటగాళ్లపై రేసిస్ట్ వ్యాఖ్యలు చేశాడు. ఆండ్రూ సైమండ్స్, హర్భజన్ జాతికి మతాన్ని కూడా కలిపితే జాతికి, మతాన్ని కలిపినపుడు అది మరింత దారుణంగా మారుతుంది. ఆస్ట్రేలియా ఆటగాడు తనను ఒసామా అన్నాడని ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ ఆరోపించడం, లేదా డీన్ జోన్స్ 2006లో దక్షిణాఫ్రికా హాషిమ్ అమ్లాను తీవ్రవాది అనడం మీకు గుర్తుండే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లేదా క్రికెట్ బోర్డుల్లో జాతివివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి విధానాలు లేవని కాదు. కానీ ఆ విధానాల్లో ఆటగాళ్లు, సభ్యులు, ప్రేక్షకుల గురించి వేరు వేరు నియమాలు ఉన్నాయి. జాతి, మత, సంస్కృతి, జాతీయత, లింగం ఆధారంగా ఎవరినీ అవమానించడం, బెదిరించడం చేయకూడదని, వివక్ష చూపకూడదని ఐసీసీ సభ్యులకు నిర్దేశాలు ఉన్నాయి. ఏ ప్రేక్షకుడైనా రంగు, మతం, జాతి, లింగం, జాతీయత ఆధారంగా వివక్ష చూపితే, అతడిని స్టేడియం నుంచి బయటకు పంపించవచ్చని నిర్దేశాలు ఉన్నాయి. వారిపై నేర విచారణ కూడా జరగవచ్చు. అయినప్పటికీ ఐసీసీ నిర్వహించే మ్యాచుల్లో ఆటగాళ్లు, ప్రేక్షకుల మధ్య జాతి వివక్ష వ్యాఖ్యలు ఉంటూనే వచ్చాయి. డీన్ జోన్స్ అయినా, డారెన్ లీమాన్ అయినా లేక సర్ఫరాజ్ ఖాన్ అయినా తర్వాత అందరూ క్షమాపణలు చెప్పారు. కానీ తర్వాత ఏడాది మరో ఒక కొత్త సర్ఫరాజ్ ఖాన్ లేదా లీమన్ పుట్టుకొచ్చేవాడు. ఎందుకు, దీనికి సమాధానం ఈ జాతి వివక్ష వృద్ధి చెందడానికి మార్గం ఆ సామాజిక నిర్మాణంలోనే దొరుకుతుంది. అక్కడ రోజువారీ జీవితంలో దానికి ఆమోద ముద్ర పడుతుంది. దానిని అంగీకరించడం సాధారణం అయిపోతుంది. భారత్‌లో మనకు సినిమాలు, వాడుక భాషలో దీనికి సులభంగా ఉదాహరణలు దొరుకుతాయి. అక్కడ ‘బహుత్ ఖూబ్‌సూరత్’( చాలా అందంగా ఉంది) అనిన తర్వాత, అదే పాటలో ‘మగర్ సావ్లీ సీ’ (కానీ నల్లగా ఉంది) అనే మాట జోడించాల్సి వస్తుంది. జోఫ్రా ఆర్చర్ సమాధానం ఐసీసీ దగ్గర కూడా ఉండాలి డారెన్ సామీ కూడా ఐసీసీని ఒక ప్రశ్నను అడిగాడు. “ఐసీసీ, మిగతా క్రికెట్ బోర్డులన్నీ నా లాంటి వారి పట్ల ఏం జరుగుతోందో చూడ్డం లేదా. ఇది కేవలం అమెరికాలోనే కాదు, ఇది రోజూ జరుగుతోంది. ఇది నోర్మూసుకుని ఉండాల్సిన సమయం కాదు. సమాధానం నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నా” అన్నాడు. అయితే ఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. క్రీడలు ఒక అందమైన మాధ్యమం. అక్కడ ఇద్దరు సమర్థుల మధ్య ముఖాముఖి నియమనిబంధనల ప్రకారం పోటీ జరుగుతుంది. అది టెన్నిస్ కోర్ట్ అయినా, క్రికెట్ మైదానం అయినా లేక ఫుట్‌బాల్ పిచ్ అయినా ఏ ఆటగాడు ఎవరి కంటే సమర్థుడు అనేది మైదానంలో వారి సామర్థ్యంతోనే తేలుతుంది. ఒకరి చర్మం రంగు వల్ల కాదు. ప్రస్తుతం నల్ల, తెల్ల మాస్కులు వేసుకుని వెస్టిండీస్ టీమ్ ఇంగ్లండ్ చేరుకుంది. కరోనావైరస్ మధ్య ఇది మొదటి బిగ్ క్రికెట్ సిరీస్ అవుతుంది. క్రికెట్‌లో కరోనావైరస్, జాతివివక్ష రెండింటితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందులో భారత్ కూడా ఉంది. 2014 క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కాస్త దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అతడు డారెన్ సామీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి "నేను, భువీ, కాలూ, గన్ సన్‌రైజర్స్" అని పెట్టాడు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) “నన్ను ఆ మాటతో పిలిచేటప్పుడు, నేను దానికి ‘బలమైన గుర్రం’ లేదా వేరే అర్థం ఏదో ఉంటుందిలే అనుకున్నాను. నన్ను అలా అనగానే అందరూ పగలబడి నవ్వేవారు. నా క్రికెట్ జట్టులో ఉన్న వాళ్లే నవ్వుతున్నారంటే అది కచ్చితంగా ఏదో వేళాకోళం విషయమే అయ్యుంటుంది అనిపించేది. అది ఎవరో మీకు తెలుసు. నేను మిమ్మల్ని నా సోదరుడిలా భావించేవాడిని”. text: జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా రిపోర్టులో ఈ గణాంకాలు ఇచ్చారు. ఆ సమయంలో 132 మందిపై ఆరోపణలు నిరూపితం అయినట్లు కూడా చెప్పారు. ఒక ప్రశ్నకు జవాబుగా రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర హోం శాఖ సహాయమంత్ర కిషన్ రెడ్డి ఈ గణాంకాల గురించి చెప్పారు. యూఏపీఏ కింద కేసులు నమోదైనవారిది ఏ మతమో, ఏ కులమో అందులో చెప్పలేదని తెలిపారు. ఈ చట్టాల కింద అరెస్ట్ చేసిన వారిలో పౌర హక్కుల కోసం పోరాడే వారు ఎంత మంది ఉన్నారో కూడా ఆ గణాంకాలలో తెలీడం లేదని ఆయన చెప్పారు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టును ఉటంకిస్తూ మాట్లాడిన కిషన్ రెడ్డి యూఏపీఏ కింద ఒక్క 2019లోనే 1,948 కేసులు నమోదయ్యాయని సభకు తెలిపారు. అయితే ఆ ఏడాది ప్రాసిక్యూషన్ ఎవరి మీదా ఆరోపణలు నిరూపించలేకపోవడంతో కోర్టులు 64 మందిని నిర్దోషులుగా తేల్చాయని అవే గణాంకాలు చెబుతున్నాయి. ఇక, 2018 విషయానికి వస్తే, ఆ సంవత్సరం యూఏపీఏ కింద నమోదైన కేసుల్లో కేవలం నలుగురిపై ప్రాసిక్యూషన్ ఆరోపణలు నిరూపించగలిగింది. ఆ ఏడాది 68 మందిని కోర్టు నిర్దోషులుగా చెప్పింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, యూఏపీఏ చట్టం కింద 2016 నుంచి 2019 వరకూ అరెస్టైన వారిలో కేవలం 2 శాతం కంటే కాస్త ఎక్కువ మందిపై మాత్రమే ఆరోపణలు నిరూపితం అయినట్లు తెలుస్తోంది. అదే విధంగా 2019లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 A అంటే రాజద్రోహం ఆరోపణ కింద మొత్తం 96 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కేవలం ఇద్దరి మీద మాత్రమే ఆ ఆరోపణలు నిరూపించగలిగారు. 29 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. దిల్లీలో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు వ్యతిరేక గళం అణచివేతకు చట్టం వినియోగం ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేసేందుకు యూఏపీఏ, రాజద్రోహం కేసులను ఉపయోగిస్తున్నారని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్)కు చెందిన లారా జేసానీ చెప్పారు. ఈ కేసుల్లో ఆరోపణలు నమోదైన వారు ఎదుర్కొంటున్న ప్రక్రియ, శిక్ష కంటే తక్కువేం కాదని ఆమె అన్నట్లు ఒక వెబ్ సైట్ చెప్పింది. ఈ కేసులన్నింటినీ విశ్లేషించడం వల్ల ఒక ప్రత్యేక తరహా పాటర్న్ గురించి తెలుస్తోందని జేసానీ చెబుతున్నారు. "కుట్ర ఆరోపణలు ఉంటే యూఏపీఏ కేసు పెడతారు. ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఆరోపణలు నిరూపించలేకపోతే, వారిని ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు నమోదు చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. శిక్ష పడడం, పడకపోవడం తర్వాత విషయం. కొన్ని కేసుల్లో నిందితుల విచారణ అసలు సమయానికి ప్రారంభం కావడం లేదు" అని ఆమె అన్నారు. కానీ, ఈ చట్టాలను ఉపయోగించి పౌర హక్కుల కోసం పోరాడే వారిమీదే చర్యలు తీసుకున్నారని చెప్పడం కష్టం అని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. "అది కష్టం ఎందుకంటే, కేసులు నమోదైన వారు ఎవరు, వారికి ఎలాంటి పనులతో సంబంధం ఉంది అనేదాని గురించి ఎన్‌సీఆర్‌బీ విడిగా ఎలాంటి అసెస్‌మెంట్ చేయలేదు" అని ఆయన అన్నారు. 2019 ఆగస్టులో యూఏపీఏ చట్టంలో ఆరో సవరణ చేశారు. యూఏపీఏపై నిపుణులు ఏమంటున్నారు యూఏపీఏ, రాజద్రోహం లాంటి చట్టాలను రాజ్యాంగబద్ధంగా గుర్తించడం గురించి కోర్టులు ఇంకా ఎలాంటి నిర్దేశాలూ జారీ చేయలేదని యూఏపీఏ నిందితుల కేసులు వాదించే ప్రముఖ లాయర్ సౌజన్య బీబీసీతో అన్నారు. ఈ చట్టాలను సవాలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకూ వీటిపై ఎలాంటి నిషేధం విధించలేదు అని చెప్పారు. "ఇక ఆరోపణలు నిరూపించే విషయానికి వస్తే, అందులో కూడా ఎన్నో రకాల చిక్కులు ఉన్నాయి. వాటిని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు చాలా ప్రయత్నించాలి. సుదీర్ఘ కాలంపాటు విచారణ వాయిదా పడడం వల్ల ప్రాసిక్యూషన్ వైపు సాక్ష్యుల వాంగ్మూలాలు మారిపోతూ ఉంటాయి. అది స్వయంగా ఒక పెద్ద సవాలు" అంటారు సౌజన్య. మరోవైపు, ఈ కేసులను వాదించే సీనియర్ వకీల్ బద్రీనాథ్ కూడా యూఏపీఏ కింద కేసులు నమోయినంత మాత్రాన, వాళ్లదే తప్పు అయ్యుంటుందని అనడం సరికాదని అన్నారు. "వేరు వేరు నిందితుల కేసులు వేరు వేరు సాక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. ఏదో ఒక కేసును బట్టి, అన్ని కేసుల్లో తప్పు జరిగిందని చెప్పడం సరికాదు. ఈ కేసుల్లో సుదీర్ఘ కాలంపాటు సాక్షులను బలంగా నిలబెట్టడం అనేది ప్రాసిక్యూషన్ పక్షానికి కూడా కష్టంగా ఉంటుంది. అయినా, ఇప్పటివరకూ కోర్టుల్లో ఈ కేసుల్లో న్యాయమే జరిగింది" అన్నారు. జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌ను యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు సీనియర్ లాయర్ తారానరుల్లా కూడా యూఏపీఏకు సంబంధించిన కేసులను నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఎన్నో కేసులను వాదించిన ఆమె బీబీసీతో మాట్లాడారు. ప్రాసిక్యూషన్ వైపు కచ్చితంగా లోపాలు ఉండచ్చు, ఉంటాయి కూడా. కానీ అంతమాత్రాన ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు అన్నారు. "ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించే నోళ్లు మూయించేందుకు యూఏపీఏ, రాజద్రోహం లాంటి చట్టాలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. అందుకే, దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక్కటే బాధ్యత వహించదు" అని ఆమె చెప్పారు. మరోవైపు, యూఏపీఏ, రాజద్రోహ చట్టాల గణాంకాలను మాత్రమే విడిగా చూడకూడదని రాజ్యాంగ నిపుణులు సుప్రీంకోర్టు లాయర్ విరాగ్ గుప్తా అంటున్నారు. "వాటిని దేశంలో జరుగుతున్న మిగతా నేరాలతో పోల్చి చూడాలి. అప్పుడే ఈ నేరాల్లో ఆరోపణలు నిరూపితం అవుతున్న అసలు శాతం ఎంత అనేది తెలుస్తుంది" అన్నారు. గణాంకాలను విడిగా చూడడం వల్ల వాస్తవ దృశ్యం కనిపించదని విరాగ్ గుప్తా అభిప్రాయపడ్డారు. "మిగతా నేరాల కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎంత సక్సెస్ అయ్యింది అనేది కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే యూఏపీఏ, రాజద్రోహం కేసులతో పోలిస్తే దాని పరిస్థితి ఏంటి అది తెలుస్తుంది" అన్నారు. జర్నలిస్ట్ కృణాల్ పురోహిత్ ఈ కేసుల గురించి పరిశోధన చేశారు. న్యూస్ క్లిక్ పోర్టల్‌లో వాటికి సంబంధించిన ఒక రిపోర్టును ఆయన ప్రచురించారు. 2014 నుంచి ఇలాంటి వాటిలో 96 శాతం కేసులను ప్రభుత్వాన్ని, నేతలను విమర్శించినందుకే నమోదు చేశారని ఆయన తన రిపోర్టులో చెప్పారు. ఈ చట్టాల కింద ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ ఉన్నాయని ఆయన అందులో తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), రాజద్రోహం అంటే భారత శిక్షాస్మృతి సెక్షన్ 124 A కింద అత్యధిక కేసులు 2016 నుంచి 2019 మధ్యే నమోదయ్యాయి. వీటిలో ఒక్క యూఏపీఏ కిందే 5,922 కేసులు నమోదు చేశారు. text: ‘ఒకరినొకరు విశ్వసించట్లేదు’ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ.. పార్లమెంటు వేదికగా నిరసన తెలుపుతోంది. ఉభయ సభల్లో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వంలో భాగమైన మిత్రపక్షాలు కేంద్రంపై అసంతృప్తి ప్రకటించటం, ప్రధాన అధికార పక్షంపై విమర్శలు చేయటం ఇదే తొలిసారి కాదు. ఎన్డీఏలో భాగస్వామి అయిన శివసేన కూడా బీజేపీతో గొడవలు పడుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగా బరిలోకి దిగాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో శివసేన కంటే బీజేపీ బలమైన పార్టీగా అవతరించింది. తాజాగా బీజేపీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఏపీ బీజేపీ నాయకులు సైతం టీడీపీ, చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో.. శివసేనపై బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరించింది? ప్రస్తుతం టీడీపీ-బీజేపీ విభేదాల్లో అలాంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశాలపై బీబీసీ మరాఠీ ఎడిటర్ ఆశిష్ దీక్షిత్, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ తదితర మీడియా సంస్థలకు ఎడిటర్‌గా పనిచేసిన ఐ వెంకట్రావుల విశ్లేషణ.. వారి మాటల్లోనే. పొత్తులు ఎలా ఏర్పడ్డాయి? శివసేన-బీజేపీ: దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఈ పొత్తు చిగురించింది. 1989 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. అప్పట్లో వాజ్‌పేయి, బాల్ ఠాక్రే, మనోహర్ జోషిలు దీనికి ఆద్యులు కాగా తర్వాతి కాలంలో ప్రమోద్ మహాజన్, ముండే లాంటి వాళ్లు ఆ స్ఫూర్తిని కొనసాగించారు. టీడీపీ-బీజేపీ:చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోయాక కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని వామపక్షాలు సూచించాయి. గతంలో కాంగ్రెస్ యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చినందువల్ల అలా చేయటమే సరైనదని భావించాయి. కానీ, ఏపీలో కాంగ్రెస్‌తో పోరాడుతున్న తాను కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వలేనని చంద్రబాబు ఆ కూటమి నుంచి బయటికొచ్చారు. అదే సమయంలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయిన వాజ్‌పేయికి దేశవ్యాప్తంగా సానుభూతి పెరిగింది. దీంతో బీజేపీతో జత కట్టాలని చంద్రబాబు భావించగా.. వెంకయ్య నాయుడు, తదితరులు ఈ పొత్తుకు కారకులయ్యారు. సంబంధాలు ఎలా ఉండేవి? శివసేన-బీజేపీ: శివసేనను బాల్ ఠాక్రే శాసించినంతకాలం ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కొన్ని అంశాలపై భేదాభిప్రాయాలు తలెత్తినా అవి విభేదాల స్థాయికి చేరలేదు. రాష్ట్రంలో ఎన్నడూ అధికారం చేపట్టనందున కేంద్ర ప్రభుత్వంపై శివసేనకు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయాల్లో గొడవలు పెద్దగా లేవు. బీజేపీ నేత‌ృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయినప్పటికీ.. నిధుల్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపైనే ఉంది. టీడీపీ-బీజేపీ: వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శంషాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటు విషయంలో కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని మిథాని సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, చంద్రబాబు నాయుడు దానికోసం పట్టుబట్టడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వాజ్‌పేయి ఆదేశించారు. చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించటంతో రక్షణ శాఖ శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి తలూపింది. అప్పట్లో చంద్రబాబు ఎప్పుడు అపాయింట్‌మెంట్ కోరితే అప్పుడు వాజ్‌పేయి కాదనకుండా ఇచ్చేవారు. జయలలితకు మాత్రం ఇచ్చేవారు కాదు. ఆమెపై వాజ్‌పేయికి నమ్మకం లేకపోవటమే అందుకు కారణం. ‘శివసేనను బాల్ ఠాక్రే శాసించినంతకాలం ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండేవి’ విభేదాలు ఎప్పుడొచ్చాయి? శివసేన-బీజేపీ: 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని, ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడిగా అమిత్‌షాను నియమించగానే రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతూ వచ్చింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. కానీ, తర్వాత బీజేపీ ప్రభుత్వంలో శివసేన కూడా చేరింది. ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని తరచూ బెదిరిస్తుంటుంది. శివసేన నాయకులు తీవ్ర స్థాయిలో బీజేపీని విమర్శించటం సాధారణమైపోయింది. టీడీపీ-బీజేపీ: వాస్తవానికి గుజరాత్‌ అల్లర్ల తర్వాత కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చెదరలేదు. తర్వాతి కాలంలో చంద్రబాబు విమర్శలు చేసినప్పటికీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ రెండు పార్టీలూ విడిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా రాష్ట్రానికి చేయాల్సినంత సాయం కేంద్రం చేయటంలేదని టీడీపీ భావిస్తోంది. దీంతో విభేదాలు తలెత్తాయి. విభేదాలకు రాజకీయ కారణాలేంటి? శివసేన-బీజేపీ: మహారాష్ట్రలోని హిందూ ఓటు బ్యాంకునే ఈ రెండు పార్టీలూ పంచుకుంటున్నాయి. మోదీ, అమిత్‌షాల నేతృత్వంలోని బీజేపీ ప్రస్తుతం హిందుత్వ ఓటర్లను ఎక్కువగా ఆకర్షిస్తోందని శివసేన భావిస్తోంది. అలాగే, పొత్తును గౌరవించకుండా, రాష్ట్రవ్యాప్తంగా బలపడాలనే విస్తరణ కాంక్ష బీజేపీకి ఉన్నదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కొనసాగితే తమకే నష్టం జరుగుతుందని శివసేన భావిస్తోంది. తాము బలపడాలంటే పోరాడాల్సింది బీజేపీతోనేనని శివసేన అనుకుంటోంది. టీడీపీ-బీజేపీ: ఏపీలో కూడా బలపడాలని బీజేపీ నిర్ణయించుకుంది. అవసరమైతే జగన్‌తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. తొలుత టీడీపీని దెబ్బకొట్టాలన్నదే కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనిని చంద్రబాబు కూడా గ్రహించినట్లున్నారు. దానికి అనుగుణంగానే ఈయన కూడా రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారు. ‘చంద్రబాబు ఎప్పుడు కోరితే అప్పుడు వాజ్‌పేయి కాదనకుండా అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు’ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఆశిష్ దీక్షిత్: వాజ్‌పేయి-బాల్ ఠాక్రేల మధ్య ఉన్నంత అవగాహన, సత్సంబంధాలు మోదీ-ఉద్ధవ్ ఠాక్రేల మధ్య లేవు. ఒకరినొకరు విశ్వసించట్లేదు. ఇరు పార్టీలూ మహారాష్ట్రలో బలపడాలని, నిలదొక్కుకోవాలని భావిస్తున్నాయి. హిందుత్వ ఓటు బ్యాంకునే రెండూ పంచుకోవాల్సి రావటంతో పరస్పరం పోటీ పడటం అనివార్యమైంది. ఐ వెంకట్రావు: వాజ్‌పేయిది ప్రజాస్వామ్య పద్ధతి అనుకుంటే.. మోదీది సామ్రాజ్యవాదంగా భావించాల్సి ఉంటుంది. భాగస్వామ్య పక్షాలకు వాజ్‌పేయి ఇచ్చినంత గౌరవం మోదీ ఇవ్వట్లేదని అంతా భావిస్తున్నారు. వాజ్‌పేయిలాగా సర్దుబాట్లకు మోదీ అంగీకరించట్లేదు. ప్రాంతీయ పార్టీలు ఉండరాదన్నదే వారి సిద్ధాంతం. పవన్ కల్యాణ్‌ జనసేనను కూడా బీజేపీలో కలిపేయాలని అమిత్‌షా కోరటాన్ని ఈ కోణంలోనే చూడాలి. వాజ్‌పేయి హయాంలో రాష్ట్రానికి చేసుకున్నంత మేలు మోదీ హయాంలో చేసుకోలేకపోయానని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ మరో శివసేన అవుతుందా? ఆశిష్ దీక్షిత్: రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవటం, 2014లో మోదీకి లభించిన ఆదరణ, హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించటం ద్వారా రాష్ట్రంలో శివసేనను వెనక్కు నెట్టి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతూ శివసేన ఆందోళన చేసినట్లుగానే కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలు, నిరసనలు చేయొచ్చు. ఆ విధంగా ఎన్డీఏలో టీడీపీ మరో శివసేన అవుతుంది. అయితే, మహారాష్ట్రలో శివసేనను వెనక్కు నెట్టి బీజేపీ విజయం సాధించిన ఫార్ములా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయటం అంత సులభం కాదు. ఆ విధంగా టీడీపీ మరో శివసేన కాకపోవచ్చు. ఐ వెంకట్రావు: ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్ర ఫార్ములాను అమలు చేయటం అంత సులభం కాదు. ఇక్కడ తెలుగుదేశమే అతిపెద్ద పార్టీ. పైగా, మోదీకి, బీజేపీకి ఆదరణ తగ్గుతోందే తప్ప పెరగటం లేదు. కర్ణాటకలో జయాపజయాలను బట్టే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాల గురించి ఆలోచిస్తుంది. ఆశించినంత మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పొత్తు నుంచి బయటకు రావొచ్చు. అలా రాకుండా బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళితే.. అది టీడీపీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీజేపీకి దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉంటున్న పార్టీ శివసేన. కానీ, ఈ రెండు పార్టీల మధ్య గిల్లికజ్జాలు, బెదిరింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. text: గ్రేస్ ముగాబే నిమ్మ చెట్లను వేళ్లతో సహా పెకళించేస్తున్నారు. పొలంలో ఎక్కడ పడితే అక్కడ భారీ గుంతలు తవ్వుతున్నారు. ఇవీ స్థానిక మీడియాలో వచ్చిన కథనాలు. మరి వారు ఎందుకలా చేస్తున్నారంటే.. ఆ పొలంలో బంగారం ఉందట. అవునండీ.. బంగారమే. ఈ పొలంలో బంగారు ముడి ఖనిజం ఉందని ఈ కూలీలు అక్రమంగా తవ్వేస్తున్నారట. తవ్విన ఖనిజాన్ని లారీల్లో తరలిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. వారిని అడ్డుకోలేక.. గ్రేస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపాయి. భర్త అధికారంలో ఉన్నపుడు అంటే 2015లో గ్రేస్.. మజోవె లోని ఈ పొలం వద్ద ఉన్న గ్రామీణులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. గ్రేస్ తాజాగా పొలం వద్దకు రాగా.. అక్కడ 400 మంది బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఆమె వారిని అడ్డుకొనే ప్రయత్నం చేసినా.. అది సఫలం కాలేదు. ‘‘మీకు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించడానికి అధికారం లేదు. అందువల్ల ఇక్కడ మాకు నచ్చిన పని మేం చేస్తాం..’’ అని కార్మికులు గ్రేస్ పై తిరగబడ్డారు. గ్రేస్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే భార్య గ్రేస్ ముగాబే పొలాల్లో అక్రమంగా కొందరు కూలీలు చొరబడ్డారు. text: మురళీ దివి మొత్తం 177 మంది భారతీయులకు ఈ జాబితాలో స్థానం లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ దాదాపు రూ.6.05 లక్షల కోట్ల సంపదతో దేశంలో అత్యంత ధనవంతునిగా నిలిచారు. ఆయన అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాను జనవరి 15 నాటికి ఉన్న సంపద వివరాలకనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాల నుంచి 2402 సంస్థలకు చెందిన 3228 మంది కోటీశ్వరుల సంపదను అంచనా వేసింది. ఈ ఏడాది కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ ఈ దశాబ్దంలోనే సంపద గత దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని హురున్ రిపోర్టు చైర్మన్ రూపర్ట్ హూగ్వర్ఫ్ చెప్పారు. టెస్లా సంస్థల అధినేత ఎలన్ మస్క్ 1970 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా నిలిచారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండవ స్థానంలోకి వెళ్లారు. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బ‌ర్గ్‌ 1010 బిలియన్ డాలర్ల సంపదతో అయిదవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగువారిలో ఎక్కువ మంది ఔషధ, వైద్య రంగానికి చెందిన వారే ఉన్నారు. మిగిలిన వారు నిర్మాణ, మౌలిక సదుపాయాల సంస్థల అధిపతులు. జాబితాలో పేరు సంపాదించుకున్న తెలుగు వారెవరో చూద్దాం.. మురళీ దివి హైదరాబాద్ కి చెందిన దివీస్ సంస్థ అధినేత మురళీ దివి 74 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 385వ స్థానంలో ఉన్నారు. అమెరికాలో శిక్షణ పొందిన మురళి దివి హైదరాబాద్ లో1990లో ఔషధ పరిశోధన సంస్థ దివీస్ లాబొరేటరీస్ స్థాపించారు. ఈ సంస్థ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పంపిణీదారుల్లో ప్రపంచంలో అగ్ర సంస్థగా ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో పెరిగారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితులే ఆయన కష్టపడటానికి కారణమని ఫోర్బ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన పిల్లలు కూడా ప్రస్తుతం సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన వారాంతంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఆర్గానిక్ ఫార్మ్‌లో గడుపుతారు. "నాకు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలోకి తిరిగి అడుగు పెట్టాలని లేదు. వాటిని నడపడం పులిపై కూర్చుని సవారీ చేయడం లాంటిదే. వాటికి నిరంతరం మాంసం పెడుతూ ఉండాలి. ఈ సంస్థల విషయంలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి, పెట్టలేని పక్షంలో, లేదా కాస్త అజాగ్రత్త వహించినా, అది మీ పాదాలనే తినేస్తుంది. ఈ రంగంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ధరలు నెలలోనే పడిపోతాయి. ఎవరో ఒక కొత్త విధానంతో మార్కెట్లోకి రావడంతో సరకుల ధరలు తగ్గిపోతాయి. కానీ, మీరు ప్లాంట్ నడపాలి, మెషిన్లను నడపాలి, వడ్డీలు కట్టాలి" అని మురళి దివి ఫోర్బ్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పీవీ రామప్రసాద్ రెడ్డి పివి రామప్రసాద్ రెడ్డి అరోబిందో ఫార్మా సహ వ్యవస్థాపకులు. ఆయన ఈ సంస్థను ఆయన బంధువు నిత్యానంద రెడ్డితో కలిసి 1986లో స్థాపించారు. ఆయన సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ మధుమేహం, గుండె సంబంధిత రోగాలకు ఔషధాలను తయారు చేస్తుంది. సంస్థ ఆదాయంలో 75 శాతం అమెరికా, యూకే నుంచి వస్తుంది. రామప్రసాద్ రెడ్డి 31బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 1096వ స్థానంలో ఉన్నారు. ఈయనకు ఇద్దరు పిల్లలు. ఈయన ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో కూడా ఉన్నారు. బి.పార్థసారథి రెడ్డి బి పార్థసారథి రెడ్డి 1993లో హెటెరో సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్ గా ఉన్నారు. ఈయన 22 బిలియన్ డాలర్ల సంపదతో హురూన్ జాబితాలో 1609వ స్థానంలో ఉన్నారు. ఆయనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్న విశేష అనుభవం సంస్థ ఎదుగుదలకు తోడ్పడింది. ఈ సంస్థ యాంటీ రెట్రో వైరల్ మందులు ఉత్పత్తితో మార్కెట్లో అడుగు పెట్టింది. జీవీ ప్రసాద్ జీవీ ప్రసాద్ , జి.అనురాధ జీవీ ప్రసాద్, జి.అనురాధ సంయుక్తంగా 15 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 2238వ స్థానంలో ఉన్నారు. ఆయన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కో-చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి నుంచి ఇంజనీరింగ్ , పర్డ్యూ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. రెడ్డీస్ సంస్థను ఆయన మామగారు అంజిరెడ్డి స్థాపించారు. జీవీ ప్రసాద్‌కు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి. ఆయన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. సతీశ్ రెడ్డి సతీశ్ రెడ్డి ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థను ఆయన తండ్రి అంజి రెడ్డి 1983లో ప్రారంభించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. పర్ డ్యూ యూనివర్సిటీ నుంచి మెడిసినల్ కెమిస్ట్రీ చదివారు. ఆయన 1991 నుంచి కుటుంబ వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. ఆయన భార్య దీప్తి ప్రాంతీయ పత్రిక ‘వావ్’ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సతీశ్ రెడ్డి 17 బిలియన్ డాలర్ల సంపదతో 2050 వ స్థానంలో ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి 16 బిలియన్ డాలర్ల సంపదతో 2138వ స్థానంలో ఉన్నారు ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి 16 బిలియన్ డాలర్ల సంపదతో 2138వ స్థానంలో ఉన్నారు. ఆయన చెన్నై, అమెరికాలలో వైద్య విద్యను అభ్యసించి 1971లో ఇండియా తిరిగి వచ్చారు. ఆయన 1983లో150 పడకలతో చెన్నైలో స్థాపించిన అపోలో హాస్పిటల్స్ నేటికి 64 శాఖలకు విస్తరించి 10,000 పడకల స్థాయికి పెరిగింది. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆయనకు 1991లో పద్మ భూషణ్ అవార్డును 2010లో పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. పి.పిచ్చి రెడ్డి పి.పిచ్చి రెడ్డి 14 బిలియన్ డాలర్ల సంపదతో హురున్ జాబితాలో 2383వ స్థానంలో ఉన్నారు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మున్సిపాలిటీలకు చిన్న పైపులు నిర్మించేందుకు 1989లో మేఘ ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్థాపించారు. 2006లో సంస్థ పేరును మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌గా మార్చారు. ఆయన మేనల్లుడు పీవీ కృష్ణా రెడ్డి 1991లో కంపెనీ వ్యవహారాల నిర్వహణకు ఆయనతో పాటు చేరారు. ఈయన కూడా పిచ్చిరెడ్డితో సమానంగా హురున్ జాబితాలో 2383 స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణాలో ప్రతిష్టాత్మక సాగు నీటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. వీరికి విదేశాలలో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. రామేశ్వరరావు రామేశ్వర రావు జూపల్లి రామేశ్వర రావు జూపల్లి 14 బిలియన్ డాలర్ల సంపదతో 2383వ స్థానంలో ఉన్నారు. రామేశ్వర రావు 1955లో జన్మించారు. ఆయన 1981లో మై హోమ్ రియల్ ఎస్టేట్ సంస్థలను స్థాపించారు. మహా సిమెంటు సంస్థలకు కూడా అయన అధిపతి. ఆయనకు 2017లో హెచ్ఎం టీవీ బిజినెస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేసింది. డాక్టర్ ఎం.సత్యనారాయణ రెడ్డి డాక్టర్ ఎం.సత్యనారాయణ రెడ్డి 13 బిలియన్ డాలర్ల సంపదతో 2,530వ స్థానంలో ఉన్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ లాబొరేటరీస్‌ను స్థాపించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్‌డీ చేశారు. ఆయన 2003లో పారిశ్రామికవేత్తగా మారక ముందు ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థలో కెమిస్టుగా కెరీర్ ప్రారంభించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధినేతగా ఎదిగారు. వీసీ నన్నపనేని ఫార్మాస్యూటికల్ రంగంలో వీసీ నన్నపనేనికి 42 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన అమెరికాలో వివిధ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో పని చేశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం నుంచి ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన అమెరికాలో బ్రూక్ లిన్ కాలేజీ నుంచి కూడా ఫార్మాస్యూటికల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన సంస్థ సాధారణ కార్యకలాపాలతో పాటు కొత్త రకాల ఔషధాలను కనిపెట్టే కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తారు. ఆయన నాట్కో ఫార్మా సంస్థల అధినేత. ఆయన 12 బిలియన్ డాలర్ల సంపదతో 2686వ స్థానంలో ఉన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2021 జాబితా బుధవారం విడుదలైంది. ఇందులో మురళి దివి, జూపల్లి రామేశ్వరరావు, పెన్నా ప్రతాపరెడ్డి తదితర తెలుగువారు చోటు దక్కించుకున్నారు. text: ప్రియాంకా గాంధీ ప్రచార సభల్లో ఒకరినొకరు విమర్శించుకుంటూ వస్తున్న ఈ ఇద్దరు నేతలూ.. వారణాసి లోక్‌సభ స్థానంలో నేరుగా తలపడతారని ఇటీవల వదంతులు వినిపించాయి. కానీ, వారణాసిలో ప్రియాంకను కాకుండా అజయ్ రాయ్‌ను అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ ఈ ఊహాగానాలకు తెరదించింది. మోదీపై ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకున్నారు. పోటీ చేసే అవకాశాలను ప్రియాంక స్వయంగా ఎప్పుడూ కొట్టిపారేయలేదు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించినప్పుడు.. పార్టీ ఆదేశిస్తే అందుకు తాను సిద్ధమేనని ఆమె ప్రకటించారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వారణాసి వెళ్లినప్పుడు కూడా ప్రియాంకకు అక్కడ మంచి స్వాగతం లభించింది. అయినా, మోదీపై కాంగ్రెస్ ఆమెను పోటీకి దించలేదు. దీని వెనుకున్న కారణాలను ప్రముఖ పాత్రికేయుడు నవీన్ జోషి విశ్లేషించి చెప్పారు. కేవలం సంచలనం రేపేందుకే ప్రియాంకను నిలబెడతారన్న ప్రచారం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ''ఒకవేళ ఎన్నికల రాజకీయాలకు ప్రియాంక సిద్ధమై ఉంటే.. మోదీపై పోటీతో మొదలుపెట్టాలని మాత్రం కోరుకోరు. చాలా అంశాలు కలిసివస్తాయనుకున్నా ఆమె గెలుస్తారని చెప్పలేం. ఎన్నికల్లో దిగాలనుకుంటే రాయ్‌బరేలీనో, మరో సీటునో ప్రియాంక ఎంచుకుంటారు. వారణాసిని మాత్రం కాదు. అప్పుడే పార్లమెంటుకు వెళ్లడం ఆమెకు సులువవుతుంది'' అని నవీన్ జోషి అన్నారు. 'రెండో స్థానమూ కష్టమే' ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించి తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్. ఈ ప్రాంత పరిధిలో 29 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో 27 స్థానాలపై భాజపాకు పట్టుంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సీటు కూడా వీటిలోనే ఉంది. ప్రియాంక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అందుకున్నాక మోదీ కంచుకోట గుజరాత్‌లోనే తన మొదటి ప్రసంగం చేశారు. ఇందులో మోదీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలు చేయడానికి, పోటీ చేయడానికి చాలా తేడా ఉందని ప్రముఖ పాత్రికేయుడు జతిన్ గాంధీ అన్నారు. ''ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్షేత్ర స్థాయిలో కార్యకర్తల సైన్యం కావాలి. వారణాసిలో కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి లేదు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీల మధ్య కుదిరిన పొత్తు కూడా ప్రియాంక పోటీ చేయకపోవడానికి మరో కారణం. శాలినీ యాదవ్‌ను ఆ కూటమి అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్‌ కోసం ఆ స్థానాన్ని వదలబోమని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రియాంక పోటీ చేస్తే రెండో స్థానం దక్కడం కూడా అనుమానమే'' అని జతిన్ అన్నారు. ప్రియాంక వస్తే లెక్కలు మారేవా? 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. మోదీకి 5.8 లక్షల ఓట్లు రాగా, కేజ్రీవాల్‌కు దాదాపు 2 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ సుమారు 75వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రియాంక పోటీ చేస్తే కాంగ్రెస్‌ పరిస్థితి కచ్చితంగా మెరుగుపడేదని, విజయం సాధించేందుకు మాత్రం అది తోడ్పడేది కాదని నవీన్ జోషి అన్నారు. ''పొరుగున ఉన్న జోన్‌పుర్, మవూ, ఆజమ్‌గఢ్ తదితర సీట్లపై ప్రియాంక ప్రభావం ఉండేది. అయితే, అందుకు ప్రియాంక ఓటమి రూపంలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది'' అని ఆయన అభిప్రాయపడ్డారు. తమ భావి నేత ప్రారంభం ఇలా ఉండాలని ఏ పార్టీ కూడా కోరుకోదని జతిన్ గాంధీ అన్నారు. ''కాంగ్రెస్‌ ప్రముఖ నేతల్లో ప్రియాంక ఒకరు. ఆమెకు ఇందిరా గాంధీ పోలికలున్నాయి. ఆమే ఆ పార్టీ భవిష్యత్తు. ఆమెపై పెద్ద అంచనాలు ఉంటాయి. మొదట్లోనే ఆమె ఓడిపోవడాన్ని కాంగ్రెస్ ఇష్టపడదు. ఈ ఎన్నికల్లో ప్రియంక పార్టీని బలోపేతం చేయలేకపోవచ్చు. కార్యకర్తల్లో ఉత్సాహమైతే నింపుతారు'' అని చెప్పారు. భారత రాజకీయాల్లో ప్రముఖ నేతలపై ప్రత్యర్థి పార్టీలు పెద్దగా గట్టి ప్రత్యర్థులను నిలపవు. ''పెద్ద నేతలు ఒకరితో ఒకరు తలపడటం చూడాలని జనాలకు ఆసక్తి ఉండొచ్చు. కానీ, అలాంటి నేతలు చట్ట సభలకు చేరాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది'' అని నవీన్ జోషి అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వారణాసికి వెళ్లినప్పడు తనను తాను 'గంగా మాత పుత్రుడి'గా వర్ణించుకుంటుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీని కూడా 'గంగా పుత్రిక' అని కీర్తిస్తూ ఫూల్‌పుర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలుకుతుంటారు. text: 2016 నవంబర్లో దిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ బీబీసీతో "మేం ముందు ముందు 2014 లోక్‌సభ ఫలితాల కంటే ఇంకా మెరుగ్గా చేస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ, ఈశాన్య భారత్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రజలకు నిజాయితీ అంటే ఇష్టం" అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. దిల్లీలో 7 స్థానాల్లో ఓటమిపాలైన ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అప్పటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీ చేయడానికి వారణాసి చేరుకున్నారు. అక్కడ మోదీ ఆయన్ను మూడు లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. కానీ బీజేపీకి కోటలాంటి వారణాసిలో కేజ్రీవాల్‌కు దాదాపు రెండు లక్షల ఓట్లు లభించడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ పార్టీ దిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌ను ఊడ్చేసింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 67 సీట్లు గెలుచుకుని రికార్డు విజయం అందుకుంది. కానీ, తర్వాత వెంటనే ఆప్‌లో అభిప్రాయ బేధాలు వెలుగులోకి వచ్చాయి. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వారిని పార్టీ నుంచి తొలగించారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాజయం లభించింది. ఆప్ జాతీయ లక్ష్యాల్లో ఆ ఓటమి ఒక చిన్న తేడా మాత్రమేనని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ చెబుతారు. "కేజ్రీవాల్ ఓటమికి ఒకే ఒక పెద్ద కారణం ఉంది. ఇక్కడ గెలిస్తే తను దిల్లీ వదిలి పంజాబ్ వచ్చేస్తానని ఆయన అక్కడ చెప్పలేదు. ఆయన ఓటర్లకు ఆ భరోసా ఇచ్చుంటే, బహుశా ఓడిపోయేవారు కాదు" అని ప్రదీప్ సింగ్ అన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈసారి దిల్లీ ఎన్నికల్లో(2020) కేజ్రీవాల్‌కు సలహాదారుడుగా ఉన్న ప్రశాంత్ కిశోర్ అప్పటి పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా ఉన్నారు. ఆ ఓటమి తర్వాత కూడా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయికి చేరడానికి కేజ్రీవాల్ మరో ప్రయత్నం చేశారు. కానీ ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆప్ 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 40 స్థానాల్లో పోటీచేసింది. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానం తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దిల్లీ లోక్‌సభ స్థానాలు అన్నిటిలో ఓడిపోవడంతోపాటు, ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తన పొలిటికల్ స్టైల్ మీద చాలా పనిచేశారు. "కేజ్రీవాల్ దగ్గర కరిష్మా ఉంది. కానీ వనరుల లోటుంది. మొదట రెండుసార్లు జాతీయ స్థాయిలో ఆయనకు వైఫల్యం కూడా ఎదురయ్యింది. అయితే కేజ్రీవాల్ లక్ష్యాలు ఉన్న వ్యక్తి. దిల్లీని ఒక మోడల్‌గా చేసి దానిని జాతీయ స్థాయిలో అందించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారు. కానీ, అది ఎప్పుడు అనేది చెప్పలేం అని రాజకీయ విశ్లేషకులు పూర్ణిమా జోషి అన్నారు. బీజేపీ లేదా మోదీ ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించడం, ఎప్పుడూ వారిని వ్యతిరేకంగా మాట్లాడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి తెలిసొచ్చింది అనేది కూడా స్పష్టమైంది. అసోంలో ఎన్ఆర్సీ అమలు, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడంపై కూడా అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడప్పుడూ పరిమితంగానే స్పందించింది. దిల్లీ షాహీన్ బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ధర్నాలో కూచున్న మహిళలు, పిల్లల గురించి కూడా ఆప్ చాలాకాలంపాటు మౌనం పాటించింది. ఆమ్ ఆద్మీ పార్టీలా మిగతా పార్టీలు కూడా జాతీయ స్థాయిలో కాలు మోపడానికి ప్రయత్నించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు దశాబ్దాలలో బహుజన్ సమాజ్ పార్టీ దానికి ఒక పెద్ద ఉదాహరణ. దీనిపై పూర్ణిమా జోషి "సాధారణంగా ప్రాంతీయ పార్టీల విస్తరణ అంత సులభం కాదు. ఒకప్పుడు మాయావతికి మిగతా రాష్ట్రాల్లో కూడా ఓట్లు వేసేవారు. కానీ ఆ పార్టీ ఎక్కడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుతం బీఎస్పీ, తన మూల రాష్ట్రం యూపీలోనే అస్థిత్వం కోసం పోరాడుతోంది" అన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మాయావతి పార్టీల మధ్య ప్రదీప్ సింగ్ తులనాత్మక సమీక్ష కూడా చేశారు "పార్టీలో తన కంటే పెద్దవారు ఎవరూ ఉండకూడదు అనే మాయావతి వైఖరితో, కేజ్రీవాల్ రాజకీయ స్టైల్ కలుస్తుంది. అదే ఆయన్ను మిగతా రాష్టాల్లో ఎదగనీకుండా చేసింది. ఎందుకంటే మనం ఒక లీడర్‌షిప్ డెవలప్ చేస్తే, వేరే రాష్ట్రాల్లో మరో నేత అతడికంటే ఎక్కువ పాపులర్ కావచ్చు. కేజ్రీవాల్ ఆ రిస్క్ తీసుకోరు" అన్నారు. "కేజ్రీవాల్ ఎంత దూకుడుగా రాజకీయాల్లోకి వచ్చారంటే, మధ్యలో ఆయనకు ఎన్నో దెబ్బలు తగిలాయి. ఆ మిశ్రమ అనుభవాల నుంచి పాఠం నేర్చుకుంటూ ఆయన మరోసారి జాతీయ స్థాయిలో కాలు మోపడానికి ప్రయత్నించవచ్చు" అని నిపుణులు భావిస్తున్నారు. ఆప్ పొలిటికల్ మోడల్ దిల్లీ ప్రజల మనసుల్లో అద్భుతమైన ముద్ర వేసింది. బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయమే దీనికి ఉదాహరణ. ఆప్ మళ్లీ అధికారంలోకి రావడం కచ్చితంగా చారిత్రక విజయమే. కానీ ముందుకెళ్లడానికి అది ఇంకా కాస్త ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పొలిటికల్ ఎడిటర్ అదితి ఫడ్నవీస్ అన్నారు. "భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఒక బలమైన, వ్యవస్థీకృత ప్రతిపక్ష పార్టీ స్థానం ఖాళీగా ఉంది. కానీ ఆ స్థానం కోసం ఎలాంటి సన్నాహాలు చేయాలో, అవి కఠినంగా ఉంటాయి. దానితోపాటూ అది చాలా సుదీర్ఘ ప్రక్రియ" అని ఆయన అన్నారు. గత ఎన్నో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా నాయకత్వంలోని బీజేపీకి ఓటమి లభించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఫలితాలు దీనికి ఉదాహరణ. కానీ మొదట 2015, తర్వాత 2020లో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆ పార్టీకి అత్యంత దారుణమైన ఓటమి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచే ఎదురైంది. అందుకే, ఇప్పుడు జాతీయ స్థాయిలో ముందుకెళ్లాలనే ఆప్ ప్రతి ప్రయత్నాన్నీ బీజేపీ చాలా నిశితంగా గమనిస్తుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీని మూడోసారి గెలిచిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో కూడా అదృష్టం పరీక్షించుకుంటుందా? అనే ప్రశ్నలు రావడం సర్వసాధారణం. text: పోలీసులు.. స్థానికుల కథనం ప్రకారం.. బిత్తిరి సత్తి కోసం మణికంఠ అనే వ్యక్తి వీ6 ఛానెల్ కార్యాలయం వద్ద కాపుగాశాడు. సత్తి అటువైపు రాగానే.. మణికంఠ అతనిపై హెల్మెట్‌తో దాడి చేశాడు. గాయపడిన సత్తిని వీ6 సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మణికంఠ మీడియాతో మాట్లాడుతూ.. బిత్తిరి సత్తి తెలంగాణ భాషను అవమానిస్తున్నారని.. అందుకే అతనిపై దాడి చేశానని చెప్పాడు. ''నేను సినిమా డైరెక్టర్ అవుదామనుకుంటున్నాను. త్వరలోనే సినిమా తీస్తాను. నాది సికింద్రాబాద్. తెలంగాణలోనే హైదరాబాద్‌లోనే పుట్టాను'' అని మణికంఠ వెల్లడించాడు. ''నేను తెలంగాణావాడిని.. తెలంగాణ భాషను అవమానపరుస్తున్నాడన్న కారణంతో సత్తిని కొట్టాను'' అని చెప్పాడు. మణికంఠను అరెస్ట్ చేసిన పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బిత్తిరి సత్తిపై జరిగిన దాడి విషయమై వీ6 సీఈఓ అంకం రవిని బీబీసీ సంప్రదించింది. దాడికి పాల్పడ్డ వ్యక్తి ఉదయం నుంచి అక్కడే వేచి ఉన్నాడని వాచ్‌మెన్ చెప్పారని ఆయన అన్నారు. "మణికంఠ అనే వ్యక్తికి మతి స్థిమితం ఉన్నట్టు లేదు. ఇక్కడికి వచ్చే ముందు ఇంట్లో తన తల్లిని కూడా కొట్టి వచ్చాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కేసును పోలీసు దర్యాప్తు చేస్తున్నారు" అని అంకం రవి చెప్పారు. బిత్తిరి సత్తికి గతంలో ఏవైనా బెదిరింపులు వచ్చాయా అని అడగగా, అలాంటిదేమీ లేదని, చాలా మంది అభిమానులు ఆయనను కలవడానికి వస్తారని చెప్పారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హాస్యనటుడు, వ్యాఖ్యాత బిత్తిరి సత్తి అలియాస్ రవిపై హైదరాబాద్ వాసి హెల్మెట్‌తో దాడి చేశాడు. బిత్తిరి సత్తి వీ6 ఛానెల్లో పని చేస్తున్నారు. text: ప్రపంచంలో విపరీతంగా పెరుగుతున్న పట్టణ జనాభా నివాస సమస్యకు ఇది పరిష్కారం కావచ్చునని ఆర్కిటెక్ట్ అలెజాండ్రో అరావెనా భావిస్తున్నారు. ఈ విధానంలో అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇల్లు లభిస్తుందని ఆయన అంటారు. అంతేకాదు.. ఆ సగం ఇంట్లో ఉండే యజమానులు తాము కోరుకుంటే మిగతా సగం ఇంటిని ఎప్పుడు కొనుక్కోవాలి? దానిని ఎలా మార్చుకోవాలి? అనేదానిని నిర్ణయించుకోవచ్చు కూడా. ఇక్కడ సగం ఇల్లు కొనుక్కోవచ్చు... నగరాలకు వస్తున్న జనాభాకు అందుబాటు ధరల్లో ఇళ్లు లభించకపోతే దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుందని ఆయన అంటారు. చిలీలోని విల్లా వెర్దెలో ఈ తరహా ఇళ్లు 500 నిర్మించారు. అవన్నీ దాదాపుగా నిండిపోయాయి. ఘనా, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, లలో కూడా ఈ తరహా ఇళ్లు నిర్మించారు. మరి మన నగరాల్లోనూ పైన వీడియోలో చూపించిన ఐడియా పనిచేస్తుందంటారా? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నగరాల్లో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేని వారి కోసం చిలీ ఆర్కిటెక్ట్ ఒకరు వినూత్న పరిష్కారం చూపుతున్నారు. అది.. సగం ఇల్లు! text: హెచ్-1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కొన్ని మార్పులు చేసింది. మార్పులు కొన్నే అయినా, 80% మంది భారతీయులపై దీని ప్రభావం ఉండబోతోందని కొందరి అభిప్రాయం. ఈ కొత్త మార్పులు ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం దాదాపు 85వేల మందికి మాత్రమే హెచ్-1బీ వీసా వస్తుంది. వీరిని స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు. సంవత్సరానికి 85 వేల హెచ్-1బీ వీసాల్లో 20వేల వీసాలు అమెరికాలో మాస్టర్స్ చేసిన విద్యార్థులకు కేటాయిస్తారు. వీటికి వారు మాత్రమే అర్హులు. తక్కిన 65వేల వీసాల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఆ కంపెనీలు చెల్లించే వేతనం థర్డ్ పార్టీ ద్వారానే అందుతుంది. ఈ క్రమంలో.. కంపెనీలు చెల్లించే వేతనంలో కొంత థర్డ్ పార్టీ జేబుల్లోకి వెళుతోంది. ఏమిటా మార్పులు? ఉద్యోగులు మోసపోతున్నారన్న కారణాలను చూపి, ఆ వేతనం పూర్తి వివరాలను కూడా అప్లికేషన్లో పొందుపరచాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది. సదరు కంపెనీతో ఉద్యోగి కాంట్రాక్ట్ వివరాలు, ఉగ్యోగి అర్హత, పని విధానాలు, వేతనం, పనిగంటలు.. లాంటి వివరాలను కంపెనీ పత్రాలతో చూపాలి. ఈ వివరాలను అందించడానికి కంపెనీలు ఇష్టపడవు. కాబట్టి, ఉద్యోగాలను అమెరికన్లతోటే భర్తీ చేసుకునే అవకాశముంది. దీంతో ఇతర దేశాల వ్యక్తులకు ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఇందుకు చాలా డాక్యుమెంటేషన్ అవసరమవుతుంది. అన్ని వివరాలను పూసగుచ్చినట్టు అందించాలి, ఏమాత్రం అలసత్వం, పొరపాటు దొర్లినా వీసాను తిరస్కరించవచ్చు. పైగా, ఈ వివరాలను ధ‌ృవీకరించుకునేందుకు అధికారులు ఆయా కంపెనీలకు వచ్చి ప్రత్యక్షంగా పరిశీలనలు చేస్తారు. ఆ ప్రభావం సిబ్బంది, వారి పనితీరుపై పడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. గతంలో హెచ్-1బీ వీసా పరిమితి మూడేళ్లు ఉండేది. ఉద్యోగ కాలం ముగిశాక మళ్లీ ఇంకొక ఉద్యోగం వెతుక్కోవడానికి 60రోజుల వ్యవధి ఉండేది. కానీ ప్రస్తుత మార్పులో.. పని పూర్తవ్వగానే తిరిగి వెళ్లిపోవాలి. మరో ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం లేదు. వీసాలో ఇచ్చిన సమాచారం మేరకు.. ఉద్యోగ కాల పరిమితి పూర్తవ్వగానే తిరిగి వెళ్లిపోవాల్సిందే. ‘‘అమెరికా వదిలి ఆస్ట్రేలియాకు వెళతాను’’ అమెరికా యూనివర్సిటీలో మాస్టర్స్ చదివి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వినోద్ కుమార్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది. వినోద్ వర్జీనియాలో నివసిస్తున్నారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసాలో చేసిన మార్పుల ప్రభావం భారతీయులపై తీవ్రంగా ఉండబోతోందని వినోద్ అన్నారు. ఇది పూర్తిగా 'బై అమెరికన్, హైర్ అమెరికన్' ఫలితమేనని వినోద్ అభిప్రాయపడుతున్నారు. ''ఇది పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన బయ్ అమెరికన్, హైర్ అమెరికన్'' నినాదం ప్రభావమే! నా మాస్టర్స్ పూర్తయ్యింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. హెచ్-1బీ వీసాలో వచ్చిన మార్పులతో చాలా నిరుత్సాహపడ్డాను. హెచ్-1బీలో మార్పులతో ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఇక్కడ నా గడువు ముగిశాక నేను ఆస్ట్రేలియా వెళదామనుకుంటున్నా. అక్కడ పర్మనెంట్ రెసిడెంట్(పి.ఆర్.) సులభంగానే వస్తోంది. ఆస్ట్రేలియాలో ఐటీ రంగ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ ఇతర రంగాల్లో ఉద్యోగాలకు కొదవ లేదు. అయినా ఫర్వాలేదు.. పి.ఆర్.వస్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. చాలా మంది ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు.'' అమెరికా ఏమంటోంది? కాగా, హెచ్-1బీ విధానాల్లో చేసిన మార్పులు ఉద్యోగులు-యాజమాన్యాల సంబంధాలను చట్టబద్ధం చేస్తాయని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఉద్యోగి.. తన మాతృసంస్థలో కాకుండా థర్డ్ పార్టీ.. అంటే మాతృసంస్థ తరపున వేరే సంస్థలో పనిచేస్తున్నప్పుడు - ఉద్యోగికీ, యాజమాన్యానికీ మధ్య ఈ చట్టబద్ధత ఉండాలని, దానికోసమే ఈ నిబంధనల మార్పు అని వెల్లడించింది. ట్రంప్ ఆదేశాలకు, బయ్ అమెరికన్, హైర్ అమెరికన్ నినాదానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు, ఇవి అమెరికాలోని కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే తీసుకున్నట్లు వివరించింది. దేశ ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం కార్మికులకు తగినన్ని రక్షణలు కల్పించకుండా తప్పించుకునేవారితో అమెరికా కార్మికులకే కాకుండా.. విదేశీ కార్మికులకు కూడా నష్టమేనని పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హెచ్-1బీ వీసాల జారీ మరింత కఠినంగా మారుతోంది. text: ఇలాంటి వదంతులను మీరు వినే ఉంటారు. కొందరు నమ్మి ఉంటారు కూడా. వీటిని కుట్ర సిద్ధాంతాలు (కాన్‌స్పిరసీ థియరీస్) అని అంటారు. అంటే ఓ విషయం వెనుక ఏదో కుట్ర దాగుంది అని ప్రతిపాదించడం అన్నమాట. బయటకు ఇవి ఆసక్తికరంగా, సరదాగా కనిపించవచ్చు. నమ్మి మనం ఇంకొకరికి చెబితే ప్రమాదం ఏముందని అనిపించవచ్చు. కానీ, అలా అనుకోవడం పెద్ద పొరపాటు. కుట్ర సిద్ధాంతాలు ప్రచారమవ్వడం వల్ల కొన్నిసార్లు జనాలు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఒక ఉదాహరణే వ్యాక్సిన్ల గురించి అమెరికాలో వ్యాపించిన వదంతులు. వ్యాక్సిన్ల వల్ల చిన్న పిల్లల్లో ఆటిజం వస్తుందని చాలా కుట్ర సిద్ధాంతాలు వచ్చాయి. అమెరికాతోపాటు మెక్సికో, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ వదంతులను చాలా మంది నమ్ముతున్నారు. అపోహలతో తమ చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించకుండా ఉంచుతున్నారు. ఫలితంగా ఆయా దేశాల్లో చాలాసార్లు భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. 9/11 దాడుల గురించి ఎన్నో కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి ఎలా అల్లుతారంటే.. కుట్ర సిద్ధాంతాలు ఒక రకమైన కట్టుకథలు. జనాలకు ఎక్కువగా తెలియని, అర్థం కాని విషయాలకు ఇవి కొత్త వివరణలు ఇస్తుంటాయి. వీటి ప్రచారం వెనుక దురుద్దేశాలుంటాయి. కుట్ర సిద్ధాంతాల్లో సాధారణంగా మూడు అంశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవే కుట్రదారుడు, పన్నాగం, జనాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ. ఈ మూడు విషయాలతో కుట్ర సిద్ధాంతాలను అల్లుతుంటారు. కుట్ర సిద్ధాంతాలను అల్లేవారు తమ కట్టుకథల్లో ఏదైనా సంస్థ, దేశం, వ్యక్తులను కుట్రదారులుగా చూపుతుంటారని లండన్‌లోని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ జోవన్ బైఫోర్డ్ అన్నారు. ప్రపంచాన్ని ఒకరు నియంత్రించవచ్చన్న భావన చాలా శక్తిమంతమైంది. చాలా వరకు కుట్ర సిద్ధాంతాలను అదే నమ్మేలా చేస్తుంది ‘‘ఓ పెద్ద ఫార్మా సంస్థ, సైన్యం, నాసా, ప్రముఖులు.. ఇలా ఎవరో ఒకరిని కుట్రదారుడిగా చిత్రిస్తారు. బయటకు తెలియకుండా వాళ్లేవో రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కథలు అల్లుతారు’’ అని ఆయన అన్నారు. ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు లేదా ఇంకేదైనా వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఈ కుట్రదారులు పన్నాగం పన్నినట్లు కథలు ఈ కుట్ర సిద్ధాంతాల్లో కనిపిస్తుంటాయి. ‘‘ప్రపంచాన్ని ఒకరు నియంత్రించవచ్చన్న భావన చాలా శక్తిమంతమైంది. చాలా వరకు కుట్ర సిద్ధాంతాలను అదే నమ్మేలా చేస్తుంది. ఏదైనా సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఘటనలకు సరైన వివరణలు లేనప్పుడు వాటిని జనాలు తేలిగ్గా విశ్వసిస్తారు’’ అని బైఫోర్డ్ అభిప్రాయపడ్డారు. ఈ కుట్ర సిద్ధాంతాన్ని నమ్మించేందుకు కొన్ని విషయాలను వాళ్లు సాక్ష్యాలుగా చూపుతుంటారు. వాస్తవిక వివరణలు ఉన్నా, వాటిని నమ్మకూడదన్న భ్రమను కలిగిస్తారు. చాలా మంది జనాలు వీటికి మోసపోతారు. సోషల్ మీడియా వల్ల కూడా జనాలు కుట్ర సిద్ధాంతాలను నమ్మే అవకాశాలు పెరిగాయి ఎందుకు నమ్ముతాం.. జనాల్లో ఉండే ఒత్తిడి, అనుమానాలకు కుట్ర సిద్ధాంతాలకు సంబంధం ఉందని ఇదివరకు అధ్యయనాల్లో తేలినట్లు బ్రిటన్‌లోని వించెస్టర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ మైక్ వుడ్ అన్నారు. ‘‘ఒత్తిడి వల్ల తమ జీవితం తమ చేతుల్లో లేదన్న భావన మనుషులకు వస్తుంటుంది. అలాంటి సమయంలో కుట్ర సిద్ధాంతాలు ఎక్కువ నమ్మశక్యంగా కనిపిస్తాయి’’ అని అన్నారు. సోషల్ మీడియా వల్ల కూడా జనాలు కుట్ర సిద్ధాంతాలను నమ్మే అవకాశాలు పెరిగాయని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్ హాంకాక్ అభిప్రాయపడ్డారు. ‘‘మళ్లీ మళ్లీ సోషల్ మీడియాలో ఆ వదంతి వినిపిస్తుంది. విన్నకొద్దీ దాని మీద నమ్మకం మరింత బలపడుతుంది’’ అని ఆయన అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ‘నాసా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రుడిపైకి పంపలేదు. భూమి మీదే చంద్రుడి సెట్ వేసి, వీడియో తీసి అందరినీ నమ్మించింది. ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టింది. వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోంది.’’ text: అలీమ్ సయ్యద్ గత ఆగస్టు 17న అతడి సోదరుడి వివాహం జరిగింది. దీనికి హాజరుకావాలని అతడు ఒక నెల ముందే విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ పెళ్లి ఏర్పాట్ల గురించే ఆగస్టు 4 రాత్రి అతడు కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా కాల్ కట్ అయ్యింది. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి, అక్కడ కర్ఫ్యూ విధించారని ఆ మరుసటి రోజు ఉదయం అలీమ్‌కు తెలిసింది. ఆ తర్వాత అతడి విమాన టికెట్ క్యాన్సల్ అయినట్లు మెయిల్ వచ్చింది. సోదరుడు పెళ్లికి అలీమ్ వెళ్లలేకపోయాడు. కశ్మీర్‌లో మొబైల్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోవడంతో కనీసం ఇంట్లోవారితో ఫోన్‌లోనైనా మాట్లాడలేకపోయాడు. దీనికితోడు అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయన్న వార్తలు రావడంతో అతడిలో ఆందోళన రేగింది. ఇంట్లోవారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు అలీమ్ కశ్మీర్ వెళ్లాలనుకున్నాడు. కానీ, ప్రభుత్వ ఆంక్షలు అతడికి అవరోధంగా మారాయి. దీంతో కశ్మీర్‌కు వెళ్లేందుకు తనను అనుమతించాలంటూ అలీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అలీమ్ పిటిషన్‌ను విచారించింది. అలీమ్‌ తన ఇంటివరకూ సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది. దిల్లీకి తిరిగివచ్చాక కశ్మీర్‌లో ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని కూడా అలీమ్‌ను కోర్టు ఆదేశించింది. ''అనంత్‌నాగ్‌లో పరిస్థితులు బాగా లేవు. శ్రీనగర్ దాకా వెళ్లినా, అక్కడి నుంచి ఇంటికి చేరుకోగలనన్న నమ్మకం లేదు. ఎయిర్‌పోర్ట్‌కు ఇంట్లోవాళ్లకి రమ్మని చెప్దామన్న, ఫోన్‌లు పనిచేయట్లేదు. అందుకే నాలో ఆందోళన పెరిగింది. నేను లా చదువుకున్నా. ఏమేం ఆప్షన్స్ ఉంటాయో నాకు తెలుసు. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించా'' అని అలీమ్ చెప్పాడు. బుధవారం సుప్రీం కోర్టు అలీమ్ పిటిషన్‌తోపాటు మరో 13 పిటిషన్లను కూడా విచారించింది. వాటిలో సీపీఎం నేత సీతారాం ఏచూరి తరఫున దాఖలైన పిటిషన్ కూడా ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్‌మై తరిగామిని కలిసేందుకు తాను కశ్మీర్ వెళ్లాలనుకుంటున్నట్లు ఏచూరి కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినా, కోర్టు ఏచూరికి అనుమతి మంజూరు చేసింది. ''ఆయన ఈ దేశ పౌరుడు. తన మిత్రుడిని కలవాలనుకుంటున్నారు. ప్రభుత్వం ఆయన్ను ఆపలేదు'' అని సీజేఐ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో ఏచూరి ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు వీల్లేదని, కేవలం తరిగామిని మాత్రమే కలిసి రావాలని కోర్టు స్పష్టం చేసింది. గురువారం ఏచూరి శ్రీనగర్ వెళ్లారు. అయితే, ప్రభుత్వం ఆయన్ను ఎయిర్‌పోర్ట్ నుంచే తిప్పిపంపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) 24 ఏళ్ల అలీమ్ సయ్యద్ ఉద్యోగ రీత్యా దిల్లీలో ఉంటున్నాడు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అతడి స్వస్థలం. text: 800 సినిమా పోస్టర్ దక్షిణాదిన ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. బీబీసీ ప్రతినిధి నళిని శివదాసన్ ముత్తయ్య మురళీధరన్‌తో మాట్లాడారు. ఈ సినిమా గురించి కొనసాగుతున్న వివాదంపై అతడిని ప్రశ్నించారు. "నేను నా జీవితంలో ఎన్నో వివాదాలు ఎదుర్కున్నాను. క్రికెట్‌ ఒక్కటే కాదు, ఇంకా చాలా వివాదాలు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి" అన్నాడు మురళీధరన్. శ్రీలంకలో తమిళ వేర్పాటువాదులు, సింహళ భద్రతాదళాల మధ్య చాలా కాలం పాటు హింసాత్మక అంతర్యుద్ధం జరిగిన సమయంలో మైనారిటీ తమిళ సమాజానికి చెందిన మురళీధరన్ చాలా కష్టపడి దేశ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. బౌలింగ్ గురించి అతడు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్‌లో తను వేసిన బంతిని 'చకింగ్' అంటూ అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించారు. క్రికెట్‌లో చేతిని ఒక ప్రత్యేక కోణంలో తిప్పుతూ బంతి విసరడానికి అనుమతిస్తారు. కానీ మురళీధరన్ చేయి కాస్త ఎక్కువ వంగుతుంది. దాంతో అతడు విసిరిన బంతి శైలిని చకింగ్ అన్నారు. అప్పట్లో ఐసీసీ నియమాల ప్రకారం చకింగ్‌ చెల్లదు. కానీ, ఈ వివాదం ముగిసిన తర్వాత అతడు ప్రపంచంలోని అత్యద్భుత బౌలర్లలో ఒకడయ్యాడు. కానీ, అతడి జీవితంపై వస్తున్న సినిమాను అతడి టెస్ట్ మ్యాచ్ వికెట్ల రికార్డు మీద తీస్తున్నారు. అందుకే సినిమాకు '800' అనే టైటిల్ పెట్టారు. 2009లో శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన సమయంలో మహింద రాజపక్ష దేశ అధ్యక్షుడుగా ఉన్నారు. సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. కానీ, దాని పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అందులో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్ర పోషిస్తున్నట్లు కనిపించారు. తర్వాత నుంచి ఈ సినిమాపై వ్యతిరేకతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో సోషల్ మీడియాలో #ShameOnVijaySethupathi హాష్‌టాగ్ ట్రెండ్ అయ్యింది. విజయ్ ఆ పాత్ర పోషించకూడదని చాలా మంది జనం డిమాండ్ చేశారు. ఈ సినిమా క్రికెట్ బయోగ్రఫీ అని నిర్మాతలు చెప్పారు. యువతకు ఇది స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కానీ, విమర్శకులు మాత్రం రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా మారిన ఒక పాత్రను ఈ సినిమాతో గొప్పవాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాద శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న మురళీధరన్ వ్యాఖ్యలతో జనం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. ఆ కార్యక్రమంలో 2009లో ముగిసిన శ్రీలంక అంతర్యుద్ధం గురించి మురళీధరన్ సంతోషం వ్యక్తం చేశారు. రాజపక్షను సమర్థించారు. అంతర్యుద్ధం సమయంలో శ్రీలంక దళాలు తమిళ వేర్పాటువాదులపై క్రూర అణచివేత చర్యలకు దిగినప్పుడు రాజపక్ష రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆ ఆపరేషన్‌లో కొన్ని వేల మంది చనిపోయారు. ఎన్నికల సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీధరన్ "నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు 2009లో వచ్చింది. ఆ రోజున దేశానికి ఏ భయం లేకుండా పోయింది" అన్నారు. ఒక అంచనా ప్రకారం శ్రీలంక అంతర్యుద్ధం చివరి రోజుల్లో దాదాపు 40 వేల మంది సాధారణ తమిళ పౌరులు చనిపోయారు. తమిళ ప్రజలు శ్రీలంకలోని మైనారిటీ తమిళులను తమవారుగా భావిస్తారు. అందుకే వారికి ఇది చాలా సున్నితమైన అంశం. "మురళీధరన్ తమిళుడే అయినా, అతడు తమిళుడులా ప్రవర్తించడం లేదు. సినిమాల ద్వారా అయినా, వ్యక్తిగతంగా అయినా తను తమిళనాడులోకి రావడం మేం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం" అని చెన్నైలోని ప్రభ అన్నారు. "శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో మురళీధరన్ చేయరాని పనులు చాలా చేశాడు. తమిళ సమాజంలో అతడిని హీరోలా చూపించడం మాకు ఇష్టం లేదు" అన్నారు. కానీ, మురళీధరన్ మాత్రం తన మాటలను పదే పదే వక్రీకరిస్తున్నారని చెబుతున్నాడు. "నేను 2009 తర్వాత దేశంలో శాంతి పునరుద్ధరణ జరిగిందని చెప్పాలనుకున్నాను. నాకు యుద్ధం ముగిసిన రోజు అత్యంత సంతోషమైన రోజు. ఎందుకంటే, ఆ రోజు అన్ని ప్రాంతాల్లో శాంతి స్థాపన జరిగింది. అంతే కానీ, అక్కడ తమిళులు చనిపోయారని కాద "ని ఐపీఎల్ కోసం దుబాయ్‌లో ఉన్న మురళీధరన్ అన్నారు. మురళీధరన్ ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. "నేను అంతర్యుద్ధంలో ఎవరి వైపూ లేను. తటస్థంగా ఉండాలని అనుకున్నాను. అప్పుడు, శ్రీలంకలో ఏం జరిగిందో భారత్‌లో ఉన్నవారికి తెలీదు" అన్నాడు. మురళీధరన్‌కు భారత్‌తో, ముఖ్యంగా తమిళనాడుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతడి భార్యది తమిళనాడు. 2008-2010 మధ్య అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడాడు. టీమ్ పాపులర్ ఆటగాళ్లలో ఒకడయ్యాడు. సినిమాపై అంత వివాదం ఎందుకు? 2010లో కూడా శ్రీలంక తమిళులకు ఏమేం జరిగాయో తమిళనాడు ప్రజలకు తెలుసని, కానీ తాము ఎప్పుడూ ఆ ఘటనలను మురళీధరన్‌కు జోడించలేదని ప్రభ చెప్పారు. "కానీ, తను శ్రీలంక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మొదలైనప్పుడు, మేం అతడికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాం. 2013లో అతడిని, మిగతా శ్రీలంక క్రికెటర్లను బాన్ చేయించడంలో సక్సెస్ అయ్యాం" అన్నారు. "ముత్తయ్య మురళీధరన్ జీవితంపై తీసే సినిమాపై ఇంత వ్యతిరేకత రావడానికి, అందులో ప్రధాన పాత్ర పోషించిన విజయ్ సేతుపతి కారణం" అన్నారు చెన్నై జర్నలిస్ట్ కవితా మురళీధరన్. "విజయ్‌ను ఒక మంచి నటుడుగా చూస్తారు. సామాజిక అంశాలపై ఆయన తన గళం వినిపిస్తుంటాడు. అలాంటి నటుడిని మత్తయ్య మురళీధరన్‌ పాత్రలో చూడడం జనాలకు ఇష్టం లేదు" అన్నారు. "తమిళనాట జనం సినిమాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇక్కడ సినిమా ఒక కథ కంటే చాలా ఎక్కువ. తమిళ సినిమాకు, రాజకీయాలకు పరస్పర సంబంధం ఉంటుంది" అన్నారు కవిత. కోలీవుడ్‌ను తమిళులకు గుర్తింపు ఇచ్చిందిగా కూడా చెబుతుంటారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలామంది సినీ పరిశ్రమ నుంచే వచ్చారు. దాంతో, విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ, చివరకు మురళీధరన్ జోక్యం చేసుకుని ఈ సినిమా నుంచి తప్పుకోవాలని విజయ్‌ను కోరిన తర్వాత, అతడు తన తుది నిర్ణయం ప్రకటించాడు. "ఈ సినిమా వల్ల సేతుపతికి ఎందుకు ఇబ్బందులు రావాలి. నా వల్ల ఆయన సమస్యల్లో చిక్కుకోవడం ఎందుకు? ఇది నా యుద్ధం, దీన్ని చేయడం నా బాధ్యత" అన్నారు మురళీధరన్. శ్రీలంకలో మురళీధరన్‌ను ఒక హీరోలా చూస్తారు. అక్కడ ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. నేను అతడిపై వచ్చే సినిమా చూడాలనే అనుకుంటున్నా. తను గొప్ప ఆటగాడని కాదు, క్లిష్టంగా ఉండే మురళీధరన్ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసుకోవాలని ఉంద"ని కొలంబోలోని స్పోర్ట్స్ రచయిత ఆండ్రూ ఫిడెల్ ఫెర్నాడో చెప్పారు. "ఈ సినిమాపై వెంటనే వచ్చిన స్పందనలు నాకు వింతగా అనిపించాయి. అది ఎలా ఉంటుందో కూడా మనకు ఇంకా తెలీదు కదా" అన్నారు. కానీ అంతర్యుద్ధంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన శ్రీలంకలోని తమిళులు ఈ సినిమా గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా మంది ఈ సినిమా తీయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి కుటుంబాల కోసం పనిచేస్తున్న గ్రూప్ ప్రతినిధి గోపాలకృష్ణన్ రాజకుమార్ "మురళీధరన్ తన జీవితంలో 2009లో అత్యంత సంతోషకరమైన రోజు వచ్చిందన్నాడు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తమిళులను అత్యంత ప్రభావితం చేసింది కూడా అదే" అన్నారు . "తను ఒక తమిళుడు, అందుకే చాలా పాపులర్ అయ్యాడు. కానీ అతడు ఇక్కడ తమిళుల కోసం ఏం చేయలేదు" అన్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న డార్ మోషన్ పిక్చర్స్, మూవీ ట్రెయిన్ మోషన్ పిక్చర్స్ బాలీవుడ్‌లో ఎన్నో పెద్ద సినిమాలు తీశారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నామని, కానీ ప్రధాన నటుడు తప్పుకోవడంతో తాము చాల కష్టాల్లో పడిపోయామని వారు చెప్పారు. కానీ, మురళీధరన్ మాత్రం ప్రపచం ఎప్పుడో ఒకప్పుడు తన కథను చూస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. "ఈ సినిమా కచ్చితంగా అవుతుంది. ఇది తమిళంలోనే కాదు. ఈ సినిమా నిర్మాతలు ముంబయి వారు. చాలా భాషల్లో దీనిని నిర్మించాలనుకుంటున్నారు. వాళ్లు దీన్ని తమిళం, హిందీ, బంగ్లా, సింహళ, తెలుగు, మలయాళం, ఇంగ్లిష్‌లో సబ్ టైటిల్స్ తో విడుదల చేయాలనుకుంటున్నారు" అని మురళీధరన్ చెప్పాడు. "ఈ సినిమా క్రికెట్ గురించి. ఇది ఇంత పెద్ద వివాదం ఎందుకు అవుతుంది " అంటాడు మురళీధరన్. కానీ, ఇన్ని జరిగిన తర్వాత 800 సినిమా గురించి తలెత్తిన వివాదంతో ఒకటి మాత్ర స్పష్టంగా తెలుస్తోంది. క్రికెట్-రాజకీయాలను ఒకదాన్నుంచి ఇంకోదాన్ని విడదీయడం చాలా కష్టం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టెస్టులు, వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన జీవితంపై తీసే సినిమాను అనుకున్నట్లే కచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పాడు. text: గుర్రంపై కూర్చున్న పెళ్లికొడుకు ప్రశాంత్ సోలంకీ ఒక దళిత పెళ్లికొడుకు తన పెళ్లి బృందంతో కలిసి గుజరాత్‌లోని మాణ్సా తాలూకా పార్సా గ్రామంలోకి గుర్రంపై కూర్చొని ఊరేగింపుగా వెళ్లడానికి ప్రయత్నించగా, అగ్రకులం అని చెప్పుకునే కొందరు అతడిని అడ్డుకొని గుర్రం పైనుంచి కిందకు దించేశారు. పార్సా గ్రామానికి చెందిన దర్బార్ అనే కులం వాళ్లు ఈ పెళ్లి బృందాన్ని అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రెండు సముదాయాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల రక్షణ ఏర్పాట్ల మధ్యే పెళ్లి వేడుక పూర్తయింది. మహసాణా బోరియావీ నుంచి పార్సా గ్రామానికి చేరుకున్న పెళ్లి బృందం వివాదం ఎలా మొదలైంది? మహసాణా జిల్లా బోరియావీ గ్రామానికి చెందిన ప్రశాంత్ సోలంకి పెళ్లి బృందంతో కలిసి పార్సా గ్రామానికి బయలుదేరారు. పార్సా గ్రామ సరిహద్దులోకి చేరుకున్న తర్వాత ఊరేగింపుగా పెళ్లి వారింటికి బయలుదేరగా, దర్బార్ కులానికి చెందిన కొందరు వారిని అడ్డుకున్నారు. "నేను గుర్రంపైకి ఎక్కుతుండగా కొంత మంది అక్కడికి వచ్చి నన్ను అడ్డుకున్నారు. గుర్రం ఎందుకు ఎక్కుతున్నావ్ అంటూ నన్ను బెదిరించారు" అని ప్రశాంత్ సోలంకీ బీబీసితో చెప్పారు. ప్రశాంత్ బావమరిది రితేశ్ పర్మార్ బీబీతో మాట్లాడుతూ, "మేం మగ పెళ్లి వారిని ఆహ్వానించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పుడే కొందరు దర్బార్ కులస్థులు మా బావ ప్రశాంత్‌ను అడ్డుకొని గుర్రం ఎక్కి ఊరేగింపు తీయొద్దని బెదిరించినట్టు నాకు సమాచారం అందింది" అని చెప్పారు. "వాళ్లు గుర్రం యజమానిని కూడా బెదిరించడంతో వాళ్లు గుర్రాన్ని తీసుకొని ఊళ్లోంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మేం పోలీసులకు సమాచారం చేరవేశాం. పోలీసులూ, సర్పంచ్ రాజేశ్ పటేల్ ఇక్కడికి వచ్చి పరిస్థితిని శాంతింపజేశారు. సర్పంచ్ మరో గుర్రం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గుర్రంపై ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత పెళ్లి జరిగింది." గ్రామంలో పోలీసు రక్షణలో దళిత యువకుడి పెళ్లి జరిగింది. అయితే ముహూర్తానికి మూడు గంటలు ఆలస్యంగా ఈ వివాహం జరిగింది. పెళ్లి జరిగేంత సేపు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసు బందోబస్తు మధ్యే పెళ్లి పూర్తయ్యింది. ఒక దళిత యువకుడు గుర్రం ఎక్కి పెళ్లి ఊరేగింపులో వెళ్లడం పట్ల ఒక కులం వారు అభ్యంతరం చెప్పారని గాంధీనగర్ డీఎస్‌పీ ఆర్‌జీ భావసార్ తెలిపారు. అయితే పోలీసులు రక్షణ కల్పించడంతో గుర్రంపైనే ఊరేగింపు జరిగిందని ఆయన చెప్పారు. రాజీ ప్రయత్నాలు రెండు కులాల వారి మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పార్సా గ్రామ సర్పంచ్ రాజేశ్ పటేల్ బీబీసీకి తెలిపారు. ఈ ఘటన సందర్భంగా దర్బార్ కులానికి చెందిన కొందరు పెద్దవయసు వారు తమ వాళ్లకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినట్టు కూడా ఆయన చెప్పారు. "భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడం కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. జరిగిన ఘటన విషయంలో పోలీసు కేసు కాకుండా చూడడం కోసం కూడా ప్రయత్నిస్తున్నాం" అని చెప్పారు. 2017లో నమోదైన దళితులపై అత్యాచార కేసులు 1515 దళితుల కోసం గుజరాత్‌ ప్రభుత్వం చేస్తున్నదేంటి? గుజరాత్‌లో దళితులపై అత్యాచార ఘటనలు ఇటీవలి కాలంలో చాలానే జరిగాయి. 2016లో జరిగిన ఉనా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై గుజరాత్ సామాజిక న్యాయం, హక్కుల శాఖ మంత్రి ఈశ్వర్ పర్మార్‌తో బీబీసీ మాట్లాడింది. గుజరాత్‌లో దళితులపై అత్యాచారాల ఘటనలు పెరుగుతుండడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని ప్రతి గ్రామం నుంచి సర్పంచ్‌లను పిలిచి తమ తమ గ్రామాల్లో సౌహార్ద సంబంధాలు నెలకొనేలా చూడాలని కోరనున్నట్టు ఆయన చెప్పారు. గుజరాత్‌లో కులాల మధ్య వైషమ్యాలు పెరుగుతుండడం విచారకరమన్నారు. పార్సా గ్రామంలో సర్పంచ్ రెండు కులాల మధ్య గొడవను శాంతింపజేసి ఆదర్శంగా నిలిచారని ఆయన చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ సర్పంచ్‌లు ఇలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గుజరాత్‌లో దళితుల పరిస్థితి జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, గుజరాత్‌లో 2016లో షెడ్యూల్డు కులాలపై 1322 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ సంఖ్య 1010. దళితులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఆర్‌టీఐ కార్యకర్త కౌశిక్ పర్మార్ వేసిన పిటిషన్ ద్వారా గుజరాత్‌లో దళితులపై జరుగుతున్న అత్యాచారాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ వివరాల ప్రకారం, గుజరాత్‌లో 2017లో అట్రాసిటీ చట్టం కింద 1515 కేసులు నమోదయ్యాయి. 2017లో దళితులపై జరిగిన అత్యాచార ఘటనల్లో 25 హత్యలు, 71 దాడులు, 103 రేప్ కేసులు నమోదయ్యాయి. సీనియర్ పాత్రికేయుడు ప్రకాశ్ షా ఈ అంశంపై బీబీసీతో మాట్లాడుతూ, గుజరాత్‌లో దళితులపై అత్యాచారాలు గతంలోనూ జరుగుతూ ఉండేవి కానీ బీజీపీ పాలనలో ఇవి పెరిగిపోతున్నాయన్నారు. "ప్రస్తుతం జరుగుతున్న అత్యాచార కేసుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అంశం ఏంటంటే, దాడులకు పాల్పడుతున్న వారు తమ అగ్రకుల ఆధిపత్యాన్ని బాహాటంగా చాటుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందుత్వ భావజాలంలో భాగంగా దళిత వ్యతిరేక మనస్తత్వం బాగా పెరిగిపోతోంది" అని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గుజరాత్‌లో దళితులపై జరుగుతున్న అత్యాచార ఘటనల్లో తాజాగా మరో ఉదంతం ముందుకు వచ్చింది. text: క్రైస్తవ మతానికి చెందిన మార్టినా రాయ్, ముస్లిం మతస్తుడు జైన్ అన్వర్‌ను గత సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.. అతడిని తన కుటుంబం ఆమోదించటం కోసం ఆమె ఏడు సంవత్సరాలు నిరీక్షించారు భారతదేశంలో చాలా సంప్రదాయ కుటుంబాలలో కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించరు. అయితే, ఇటీవల కాలంలో అలాంటి బంధాల పట్ల మరీ విపరీతమైన విభజిత వాతావరణం కనిపిస్తోంది. ఈ ధోరణి ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య జరిగే వివాహాల పట్ల మరీ ఎక్కువగా ప్రకటితమవుతోంది. గత నెలలో ప్రముఖ నగల బ్రాండ్ తనిష్క్ ప్రకటనకు సోషల్ మీడియాలో రైట్ వింగ్ నుంచి ఎదురయిన ప్రతిస్పందన మూలంగా సంస్థ ఆ ప్రకటననే ఉపసంహరించాల్సిన పరిస్థితిని చూస్తే ఈ ధోరణి ఎంత లోతుగా పాతుకుపోయి ఉందో అర్ధమవుతుంది. తనిష్క్ వారి ఏకత్వం సిరీస్ లో భాగంగా రూపొందించిన ఈ ప్రకటనలో ఒక ముస్లిం అత్తగారు హిందూ కోడలికి సీమంతం చేస్తున్నట్లుగా చిత్రీకరించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రచారం చేయడమే ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశం కాగా దానికి స్పందన మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యక్తమయింది. భారతీయ సమాజంలో దాగి ఉన్న బీటలను అది బహిరంగంగా చూపించింది. ఈ ప్రకటన లవ్ జిహాద్ ని పెంచి పోషిస్తోందంటూ కొన్ని అతివాద హిందూ వర్గాలు ఆరోపించాయి. మత మార్పిడి చేసే ఉద్దేశ్యంతోనే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను లోబరుచుకుని వివాహం చేసుకోవడాన్ని లవ్ జిహాద్ గా పేర్కొంటారు. సోషల్ మీడియాలో చోటు చేసుకున్నట్రోలింగ్ తో ఆ బ్రాండ్ ని నిషేధించాలని కూడా చాలా మంది పిలుపునిచ్చారు. తమ సంస్థ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రకటనను ఉపసంహరిస్తున్నామని కంపెనీ ప్రకటన చేసింది. రూపా, రాజీ అబద్దీలకు వివాహమై 30 ఏళ్లు గడిచాయి ఈ ప్రకటన పై వివాదం సమసిన రెండు వారాల తరువాత సమర్ హలంకార్ , ప్రియా రమణి అనే జర్నలిస్ట్ దంపతులు మరో రచయత, నీలోఫర్ వెంకట్రామన్ తో కలిసి ఇంస్టాగ్రామ్ లో 'ఇండియా లవ్ ప్రాజెక్ట్' అనే అకౌంట్ ప్రారంభించారు. విభజిత, ద్వేష పూరిత కాలంలో ఆనందంగా జీవిస్తున్న కులాంతర, మతాంతర వివాహ బంధాలను వెలుగులోకి తెచ్చి వాటిలో దాగిన మధురిమను తెలియచేయడమే ఈ పేజీ ఉద్దేశ్యం. "ఈ ప్రాజెక్టు గురించి గత సంవత్సర కాలంగా ఆలోచిస్తున్నప్పటికీ , తనిష్క్ వివాదం తరువాత దీనిని సత్వరమే మొదలు పెట్టాలనిపించినట్లు హలంకార్ చెప్పారు. "ప్రేమ, మతాంతర వివాహాల పట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారం మమ్మల్ని తీవ్రంగా కలచి వేసింది" అని ఆయన అన్నారు. "వివాహం చేసుకోవడానికి ఏవో తెలియని రహస్య ఉద్దేశ్యాలు ఉంటాయని, ప్రేమను ఆయుధంగా చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, నిజానికి పెళ్ళి చేసుకోవడానికి ప్రేమ కంటే వేరే ఉద్దేశ్యం ఏముంటుందో మాకు అర్ధం కావడం లేదు" అని ఆయన అన్నారు. "ప్రజలు తమ కథలను వినిపించడానికి ఇండియా లవ్ ప్రాజెక్టు ద్వారా మేము వేదికను ఇస్తున్నాం" అని చెప్పారు. వెంకట్రామన్ ఆమె పార్శి తల్లి బఖ్తవర్ మాస్టర్ గురించి చేసిన తొలి పోస్టుతో ఈ ప్రాజెక్టు అక్టోబరు 28న ప్రారంభం అయింది. ఆ తరువాత నుంచి ప్రతి రోజూ ఒక కొత్త కథ ప్రచురితమవుతోంది. దీనికి వచ్చిన ప్రతిస్పందన తమను ఉక్కిరి బిక్కిరి చేసిందని హలంకార్ అన్నారు. "మేమిప్పుడు వీటిని తట్టుకోవడానికి కష్టపడుతున్నాం. ప్రతి రోజు నా కథ చెబుతాను, మా తల్లి తండ్రుల కథ చెబుతాను, లేదా మా తాతల కథ చెబుతామంటూ చాలా మంది మాకు సందేశాలు పంపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మతాంతర, కులాంతర వివాహాలేమి ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కావని, ఇవి ఎప్పటి నుంచో చోటు చేసుకుంటున్నాయనే విషయం తేట తెల్లమవుతోంది" అని ఆయన అన్నారు. "కానీ, వాటి గురించి బయటకు మాట్లాడవలసిన సమయం అయితే వచ్చింది" అని ఆయన అన్నారు. "ద్వేషాన్ని కూడా కృత్రిమంగా సృష్టిస్తున్న తరుణంలో ఈ ప్రేమ గాథలు ఎంత దూరం విస్తరించాయో, అవేమీ రాత్రికి రాత్రి పుట్టలేదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆయన అంటారు. నిలోఫర్ వెంకట్రామన్.. పార్శీ తల్లి, హిందూ తండ్రి కథతో ఈ ప్రాజెక్టు మొదలైంది భారతదేశంలో 90 శాతానికి పైగా వివాహాలు పెద్దలు కుదిర్చినవే ఉంటాయి. అందులో చాలా కుటుంబాలు వారి కులం, మతం దాటి సంబంధాలను చూడటం చాలా తక్కువగా ఉంటుంది. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే అంచనాల ప్రకారం దేశంలో కేవలం 5 శాతం మాత్రమే కులాంతర, వివాహాలు జరుగుతాయి. మతాంతర వివాహాలు జరగడం చాలా అరుదుగా కనిపిస్తుంది. వీటి శాతం కేవలం 2. 2 మాత్రమే. కొన్ని సార్లు తమ వర్గం దాటి బయట వివాహాలు చేసుకుంటే హత్యలకు గురయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హిందూ జాతీయ పార్టీ అధికారంలో ఉండటంతో దేశంలో సంప్రదాయ వాదానికి మద్దతు పెరగడంతో పాటు మతపరమైన విభజనలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. మతాంతర వివాహాలు ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిలు వివాహం చేసుకుంటే వాటిని అపకారం తలపెట్టే ఉద్దేశ్యంతోనే చేసుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. లవ్ జిహాద్" అనే పదాన్ని చట్టం నిర్వచించలేదని అలాంటి కేసులను ఏ ప్రభుత్వ సంస్థా రిపోర్ట్ చేయలేదని ఫిబ్రవరిలో ప్రభుత్వం పార్లమెంట్ కి చెప్పింది. ఇటీవల కాలంలో ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చట్టాన్ని తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నట్లు కనీసం 4 బి జె పి పాలిత ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. ఇలాంటి ద్వేష పూరిత కథనాలను ప్రేమపూరిత వ్యక్తిగత కథల ద్వారా సవాలు చేయాలని ఇండియా లవ్ ప్రాజెక్టు చూస్తోంది. ఈ కథల్లో బోలెడంత మమత ఉంటోందని ఇవి చదువుతున్న పాఠకులు అంటున్నారు. కాస్త మమకారం, కాస్త హాస్యం కలగలిపి 150 పదాల్లో రాసే ఈ కథల్లో మనుషులు గీసిన సరిహద్దులను ప్రేమ గుర్తించదని నమ్మిన జంటల కథలు ఉంటాయి. తన్వీన్ అయిజాజ్, వినీత శర్మలు.. తమ కుమారుడు ఏ మతం పాటించాలని అడుగుతున్నారు హిందూ బ్రాహ్మణ కులానికి చెందిన రూప ఒక ముస్లిం అబ్బాయి రాజి అబ్ధిని వివాహం చేసుకుంటానని చెప్పగానే ఆమె తల్లి ఎలా ప్రతిస్పందించారో రాశారు. ఆమె తల్లి వెంటనే, "నీకు అతను మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అని చెప్పి ఇంట్లోనుంచి తరిమేస్తారు" అని రాశారు. ఇస్లాంలో ఉండే విడాకుల పద్దతి పట్ల ఆమె తల్లికి చాలా భయం ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశంలో చట్టవిరుద్ధం. "అయితే, మా తల్లి తండ్రులు రాజిని కలిసిన తరువాత అతని వ్యక్తిత్వం తెలుసుకున్నాక అతని మీద అభిప్రాయాన్ని మార్చుకున్నారు". అని ఆమె రాశారు. ఆమె తల్లితండ్రులు వారి వివాహ బంధాన్ని పెద్ద మనసుతో అంగీకరించారని చెప్పారు. రూప, రాజికి వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఇంట్లోనే ఈద్, దీపావళి కూడా జరుపుకుంటారు. "మా ఇంట్లో పెరుగన్నం, మటన్ బిరియానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా మతానికి ఇవ్వం అని సల్మా అనే ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్న టి ఎం వీరరాఘవ్ అనే జర్నలిస్ట్ అన్నారు. "నేను శాకాహారిని. నా భార్యకి మాంసం అంటే ఇష్టం. మా అబ్బాయి అయినేష్ అన్ని రకాలు తింటాడు. ఇంట్లో వండే వంటలకు అనుగుణంగా తన మతం మారిపోతూ ఉంటుంది" అని ఆయన అన్నారు. మారియా మంజిల్, సందీప్ జైన్‌లకు 22 ఏళ్ల కిందట పెళ్లయింది వినీత శర్మ అనే హిందూ అమ్మాయిని వివాహం చేసుకున్న తన్వీర్ ఐజాజ్ వాళ్ళ అమ్మాయి కుహు గురించి పోస్టు రాశారు. అది హిందూ పేరా, ముస్లిం పేరా అని, ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక ఏ కులాన్ని పాటిస్తుందో చెప్పమని చాలా మంది వారిని ప్రశ్నించారు. "మా మతాంతర వివాహం లౌకికవాదానికి ఆదర్శంగా ప్రజల తప్పుడు అంచనాలకు ఒక సమాధానం చెబుతుందని అనుకుంటున్నాను" అని ఆయన రాశారు. "మా బంధం పట్ల చాలా మంది మౌనంగానే ఉండిపోయారు. కొంత మంది మాది ప్రేమ అని, లవ్ జిహాద్ కాదని చెప్పడానికి చాలా నిరాశ చెందారు" అని ఆయన రాశారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కేవలం మతాంతర , కులాంతర వివాహాలే కాకుండా ఇతర కథలు కూడా ఉన్నాయి. కేరళలో కాథలిక్ మతానికి చెందిన మరియా మంజిల్ ఉత్తరాదిలో జైన కుటుంబానికి చెందిన సదీప్ జైన్ ని వివాహం చేసుకున్నారు. తమ ఇంట్లో మతం కన్నా పెరుగన్నం వర్సెస్ మటన్ బిర్యానీ అంశమే ముఖ్యమైనదని టి.ఎం.వీరరాఘవ్, సల్మా చెప్తున్నారు వాళ్ళ 22 సంవత్సరాల వివాహ బంధంలో వారెదుర్కొన్న ఎన్నో సవాళ్ళను ఆమె రాశారు. కానీ, ఆయనను వివాహం చేసుకుని తాను సరైన పనినే చేశానని ఆమె రాసారు. "ప్రేమ నుంచి దూరంగా ఎలా పారిపోగలం" అని ఆమె అంటారు. "నేనతని దయతో కూడిన హృదయం, సున్నితమైన ప్రవర్తన, మేధో అనుకూలత, నా పట్ల చూపించే ప్రేమను చూస్తాను. ఆయన వేరే దేముణ్ణి ప్రార్ధించి, వేరే భాష మాట్లాడతారు కాబట్టి ఆయనను ఎలా వదులుకుంటాను" అని రాశారు. ఇలాంటి కథలే ప్రపంచం గురించి, దేశం గురించి మంచి భావనలు కలుగ చేస్తాయని హలంకార్ అంటారు. "ఇవి భారతదేశంలో నిజాయితీ మేళవించిన అందమైన కథలు. ప్రేమలో ప్రజలు విభిన్న మార్గాలు పాటిస్తారు. ఇవే భారతదేశం ఏమిటో గుర్తు చేస్తాయి". ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశంలో మతాంతర, కులాంతర వివాహాల పట్ల వివక్ష కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా రూపొందించిన 'ఇండియా లవ్ ప్రాజెక్ట్' అనే అకౌంట్ కుల, మత, జాతి, లింగ పరమైన సంకెళ్లను తెంచుకుని ఆనందంగా జీవిస్తున్న కొన్ని బంధాలను పరిచయం చేస్తోంది. text: అందువల్లే ఇటీవలి కాలంలో తరగతి గదుల్లో పాతకాలం ముళ్ల గడియారాల బదులు, డిజిటల్ గడియారాలు పెట్టాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. ఇటీవల 'టైమ్స్ ఎడ్యుకేషనల్ సప్లిమెంట్' వెలువరించిన ఒక నివేదిక - ఈతరం పిల్లలు సమయం తెలుసుకోవడానికి డిజిటల్ గడియారాల మీదే ఆధారపడుతున్నారని పేర్కొంది. బ్రిటన్‌లోని ఉపాధ్యాయుల యూనియన్‌కు చెందిన మాల్కమ్ ట్రోబ్ కూడా - నేటి తరం టైం తెలుసుకోవడానికి డిజిటల్ ఫార్మాట్ ఉన్న మొబైల్ ఫోన్స్‌, కంప్యూటర్లపై ఆధారపడుతున్నారని తెలిపారు. అందువల్ల ''పరీక్షా కేంద్రాల్లో డిజిటల్ గడియారాలను పెట్టడం వల్ల వారు ప్రశ్నలకు సమాధానం రాసేప్పుడు పొరపాటు చేసే అవకాశం ఉండదు'' అని ట్రోబ్ తెలిపారు. దీనికి ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఒక ప్రశ్నకు 15 నిమిషాలలో సమధానాం రాయాల్సి వస్తే, డిజిటల్ గడియారంలో సమయాన్ని చూసే విద్యార్థులు తక్కువ తప్పులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి బ్రిటన్‌లోని పాఠశాలల్లో ముళ్ల గడియారాలను తొలగించే ఆలోచనేదీ లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఉపాధ్యాయుల నుంచి దీనిపై పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. మిస్ కీనన్ అనే ఉపాధ్యాయురాలు, ముళ్ల గడియారం చూసి విద్యార్థులు టైమ్ చెప్పలేరన్నది సరికాకున్నా, కొంతమంది విషయంలో మాత్రం అది ఆటంకంగా నిలుస్తోందన్నారు. నేటి డిజిటల్ తరంలో ముళ్ల గడియారాలకు కాలం చెల్లిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పరీక్ష హాళ్లలో విద్యార్థులకు గడియారం ఎంత ముఖ్యమో మనకందరికీ తెలిసిందే. కానీ నేటి డిజిటల్ తరంలో గోడ మీద ముళ్ల గడియారం ఉంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. text: ఫ్రాన్స్ తరఫున గోల్ వేసిన గెలియన్ బప్పే హాఫ్ టైమ్ వరకూ రెండు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. కానీ సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ దూకుడు పెంచి మూడు గోల్స్ వేసింది. వాటిలో రెండు గోల్స్ కలియన్ బప్పే వేశాడు. ఇంజూరీ టైమ్‌లో అర్జెంటీనా తరఫున ఎగ్యురో ఒక గోల్ చేసినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. పెనాల్డీతో మొదటి గోల్ మ్యాచ్ ప్రారంభంలోనే ఫ్రాన్స్ అర్జెంటీనాపై ఆధిక్యత సాధించింది. ఆట తొమ్మిదో నిమిషంలోనే తన ఫార్వర్డ్ ఆటగాడు ఆంటోనీ గ్రీజ్‌మేన్ షాట్ గోల్‌పోస్ట్‌ను తగిలి వెనక్కు వచ్చింది. 11వ నిమిషంలో మార్క్ రోజో అర్జెంటీనా బాక్సులో ఫ్రాన్స్ మిడ్ ఫీల్డర్ కలియన్ బప్పేకు ఫౌల్ చేశాడు. ఫలితంగా ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఆటలో 13వ నిమిషంలో ఆంటోనీ గ్రీజ్‌మెన్ పెనాల్టీని గోల్‌గా మలచి తన టీమ్‌కు ఆధిక్యత సాధించిపెట్టాడు. ఆ తర్వాత మ్యాచ్‌పై అర్జెంటీనా పట్టు బిగించడం మొదలెట్టింది. ఆటలో 41వ నిమిషంలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ ఏంజెల్ డి మారియా 30 గజాల దూరం నుంచి ఒక అద్భుతమైన గోల్ వేశాడు. టీమ్‌ను సమంగా తెచ్చాడు. డి మారియా ఈ టోర్నమెంటులో తన రెండో గోల్ వేశాడు.మొదటి హాఫ్‌లో మ్యాచ్ 1-1తో సమానం అయ్యింది. అర్జెంటీనాకు 8వ నిమిషంలో ఆధిక్యం రెండో హాఫ్‌లో 48వ నిమిషంలో మెస్సీ ఇచ్చిన పాస్‌తో మార్కడో గోల్ వేసి అర్జెంటీనాకు 2-1 ఆధిక్యం తెచ్చిపెట్టాడు. కానీ కేవలం 8 నిమిషాల తర్వాత ఫ్రాన్స్ కూడా మరో గోల్ వేసింది. గోల్స్ సమం చేసింది. ఆటలో 57వ నిమిషంలో డిఫెండర్ బెంజమిన్ పావర్డ్ ఫ్రాన్స్ తరఫున మరో గోల్ వేశాడు. వరల్డ్ కప్‌లో పావర్డ్‌కు ఇది మొదటి గోల్. ఈ ఓటమితో ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా కథ ముగిసింది. ఈ విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వరల్డ్ కప్ ఫుట్ బాల్ మొదటి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అర్జెంటీనాను 4-3 గోల్స్ తేడాతో ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు ఏడు గోల్స్ చేశారు. text: యూపీలో ఎన్‌కౌంటర్లపై... యోగి: మా ప్రభుత్వంలో ఒక్క బూటకపు ఎన్‌కౌంటర్ కూడా జరగలేదని నా అభిప్రాయం. సుప్రీంకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అక్షరాలా పాటించాలనే స్పష్టమైన నిర్దేశాలు ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఉన్నాయి. ముఖ్యమంత్రిగానూ, రాష్ట్ర హోంశాఖను కూడా నేనే చూస్తున్నందు వల్ల కూడా నేను వారికి ఈ విషయం స్పష్టంగా తెలియజేశాను. కానీ ఎవరైనా పోలీసులపై కాల్పులకు పాల్పడితే, దానికి జవాబుగా ఎదురుకాల్పులు జరగకుండా మీరు పోలీసులను అడ్డుకోలేరు. బీబీసీ: తమపై బాగా ఒత్తిళ్లు ఉన్నట్టు కొన్ని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో.. యోగి: అలా ఏమీ కాదు, రెండేళ్ల క్రితం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉండేవి? మీరు అక్కడి గ్రామాలకు వెళ్లి అడగండి. మహిళలపై ఎలాంటి ఘోరాలు జరిగేవి? ఎలాంటి పరిస్థితులవి? నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడం పోలీసుల పని. చట్టం పరిధిలోనే వారు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోలీసులు చట్టప్రకారమే నడచుకుంటున్నారు. అలాగే నడచుకోవాలి కూడా. బీజేపీకి ఒక్కడే నాయకుడు: బీబీసీ ఇంటర్వ్యూలో యోగి బీబీసీ: కొన్ని కేసుల్లో పోలీసులు, అధికారులు కూడా చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు కొన్ని నష్టాల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బులంద్‌షహర్‌లో జరిగిన ఘటననే తీసుకుంటే, గోహత్య ఉదంతంలో కోపోద్రిక్తులైన ఒక గుంపు ఒక పోలీసు అధికారినే బాహాటంగా హత్య చేసింది. యోగి: అది ఒక ఘటన మాత్రమే. ఆక్రోశం రెండు వైపులా ఉండటం సహజమే. అయితే, ఆ ఘటనను నివారించగలిగే వాళ్లం. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ ఘటనలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటనలన్నింటిపై మేం లోతుగా దర్యాప్తు చేపట్టాం. బీబీసీ: మీరు అధికారంలోకి రావడంతోనే గోహత్య విషయంలో కఠిన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో చాలా వధ్యశాలల్ని మీరు మూసేయించారు. దీనికి సంబంధించి రెండు ప్రశ్నలు - మొదటిది, ఈ కారణంతో కొన్ని చిన్న చిన్న గ్రూపుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధోరణి పెరగలేదా? ఎవరు ఆవుల్ని తీసుకెళ్తున్నారో రోడ్లపై తనిఖీలు వాళ్లే చేస్తున్నారు? యోగి: ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి అనుమతి ఎవరికీ లేదు. అయితే, రెచ్చగొట్టే చర్యలు ఎక్కడైనా జరిగినట్టయితే అలాంటి చోట్లలో సహజంగానే ఆక్రోశం వెల్లువెత్తడం కనిపిస్తుంది. దాన్ని కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం. కఠినంగా అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నాం. బీబీసీ: ఇలాంటి వాటితో ఇతర మతాల వారిలో భయాలు తలెత్తాయి కదా? యోగి: ఎలాంటి భయాలూ లేవు. బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగినపుడు మైనారిటీ మతస్థుల్లో కూడా అభద్రతా భావం బలపడుతుంది. దాదాపు గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి మత కల్లోలాలూ జరగలేదు. బీబీసీ: 2014 ఎన్నికలను నరేంద్ర మోదీ ఎన్నికలుగా భావించారు. 2019 ఎన్నికలను నరేంద్ర మోదీ అనంతర బీజేపీ ఎన్నికలుగా చూడొచ్చంటారా? యోగి: బీజేపీకి ఒక నాయకుడున్నారు. పార్టీకి ఏకఛత్ర నాయకత్వం ఉంది. అది మోదీజీనే. పార్టీ మోదీ వెంటే ఉంది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర ప్రదేశ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయా, లేదా? అక్కడ మహిళలపై నేరాల సంఖ్యలో మార్పు ఉందా? బీజేపీకి ఎంతమంది నాయకులు?... ఇలాంటి అనేక అంశాల గురించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే... text: మొదటి ప్రకటన: ఆస్ట్రేలియాలో ఉంటున్న జాట్ యువకునికి ఐఈఎల్‌టీఎస్‌లో కనీసం ఆరు బ్యాండ్స్ వచ్చిన యువతి కావలెను. ఖర్చులు యువకుని తరపు వాళ్లవే. కోర్టులో పెళ్లి. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. రెండో ప్రకటన: జాట్ యువకునికి ఆరు బ్యాండ్స్ వచ్చిన యువతి కావలెను. ఖర్చులు యువకుని తరపువాళ్లవే. కులం పట్టింపు లేదు. మూడో ప్రకటన: కెనడా పౌరసత్వం కలిగిన జాట్ యువకునికి తగిన యువతి కావలెను. భారతదేశంలోనే ఉన్న సోదరుణ్ని సంప్రదించండి. నాలుగో ప్రకటన: బ్రిటన్ పౌరసత్వం కలిగిన జాట్ యువతికి కష్టించి పని చేసే అందమైన యువకుడు కావాలి. ఈ ధోరణులపై చర్చించే ముందు, ఈ ప్రకటనలను కొంచెం నిశితంగా గమనించాలి. వీటన్నిటిలో ఎక్కువగా కనిపించే అంశం ఐఈఎల్‌టీఎస్. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీల్యాండ్ తదితర దేశాలకు వీసా రావాలంటే ఐఈఎల్‌టీఎస్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసాలతో పాటు, జీవిత భాగస్వామి (యువతి/యువకుడు) వీసా కూడా లభిస్తుంది. అందుకే ఒక తప్పనిసరి అర్హతగా మారిన ఐఈఎల్‌టీఎస్ అనేక సంప్రదాయ భావాలను మారుస్తోంది. పంజాబీ సమాజంలో ఈ కొత్త అర్హత మిగతా సంప్రదాయ అంశాలనన్నిటినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ కొత్త అర్హత పంజాబ్ సమాజం ఆకాంక్షలను, దాని దిశను సూచిస్తుంది. పంజాబ్ యువత తమ కలలను నిజం చేసుకోవడానికి కులాన్ని పక్కన పెట్టడం కనిపిస్తుంది. అమ్మాయి తరపు వారే పెళ్లి ఖర్చులు పెట్టుకోవడం పంజాబ్‌లో సర్వసాధారణం. కానీ పంజాబ్‌లోని పెళ్లి ప్రకటనల్లో ఈ ధోరణి మారడం స్పష్టంగా గమనించవచ్చు. అంటే ఐఈఎల్‌టీఎస్‌తో పెళ్లి మార్కెట్‌లో యువతులకు డిమాండ్ పెరిగింది. అందుకే యువకులు అమ్మాయిల కుటుంబాలు విధించే షరతులను పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ధోరణిని బట్టి, పంజాబ్ సంప్రదాయ వివాహ సంబంధాలలో మార్పులు వస్తున్నట్లు గమనించవచ్చు. సాధారణంగా పంజాబీ హిందువులు, సిక్కులు తమ కులం లోపల, తమ గోత్రానికి బయట వివాహాలు చేసుకుంటారు. తమ తల్లి తరపు బంధువులను కానీ, తండ్రి తరపు బంధువులను కానీ పెళ్లి చేసుకోరు. అయితే ఈ వివాహ ప్రకటనలను బట్టి చూస్తే, కనీసం ఐఈఎల్‌టీఎస్ విషయంలో అలాంటి సంప్రదాయాలను పక్కన పెడుతున్న ధోరణి కనిపిస్తుంది. ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించడానికి ప్రాముఖ్యం పెరుగుతున్న దృష్ట్యా, పెళ్లిళ్లలో కులం ప్రస్తావన తగ్గిపోయి, 'కులరహిత' భావన పెరిగిపోతోంది. ఐఈఎల్‌టీఎస్‌ ప్రస్తావన లేని ప్రకటనల్లో మాత్రం మనకు ఇలాంటి మినహాయింపులు కనిపించవు. అయితే ఏ సంస్థ వద్దా కూడా దీనికి సంబంధించిన పూర్తి గణాంకాలు లేవు. కులం పునాదులు చాలా బలమైనవి. కానీ పంజాబ్ సమాజాన్ని గమనిస్తే, విదేశాలకు వెళ్లాలనే కోరిక... కులం పునాదుల కన్నా బలమైనదని స్పష్టమవుతుంది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పంజాబీ పత్రికల్లో పెళ్లి సంబంధాల ప్రకటనల తీరును చూస్తే చాలు, మారుతున్న సామాజిక ధోరణి కళ్లకు కడుతుంది. సాధారణంగా పెళ్లి ప్రకటనల్లో యువతీయువకుల రూపురేఖలు, రంగు, కులం, విద్యార్హతలు, ఉద్యోగాలు, ఆస్తుల వివరాలు ఉంటాయి. కానీ గత రెండు దశాబ్దాలుగా వాటిల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. text: దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు శాస్త్రీయ పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో ప్రవేశాలు ఎలా పొందవచ్చో, తమ భవితను అందంగా తమకు నచ్చిన రంగంలో తీర్చిదిద్దుకోవడం ఎలా అనే అంశాలను గత రెండువారాలుగా గమ్యంలో చర్చిస్తున్నాం. ఆయా సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఏముంటాయి, వాటికి ఎలా దరఖాస్తు చేయాలి, ఏ పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూ ప్రక్రియ ఎలా ఉంటుంది... ఇలాంటి అంశాలన్నీ వివరించారు Careers360.com ఇంజనీరింగ్ ఎడిటర్ ప్రభ ధవళ. గతవారం మనం భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) లో సైంటిస్ట్ ఉద్యోగం ఎలా పొందవచ్చో, దానికెన్ని మార్గాలున్నాయో తెలుసుకున్నాం. అంతకు ముందు డీఆర్‌డీవోలో ఉద్యోగాల గురించి చర్చించాం. ఈవారం మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఇస్రో (ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)లో ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి. #గమ్యం: ఇస్రోలో సైంటిస్ట్ కావడం ఎలా? అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ - ఉపగ్రహ ప్రయోగాల కారణంగా ఇస్రో అంటే తెలియనివారు సాధారణంగా ఉండరు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీ రాకెట్లతో ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సొంతం. ఇస్రోలో నియామకాలు ఎలా జరుగుతాయి? ఇస్రోలో నియామకాలన్నీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో కలిసి ఏర్పాటు చేసుకున్న సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (సీఆర్‌బీ) ఆఫ్ ఇస్రో పర్యవేక్షణలో జరుగుతాయి. దీనికి సంబంధించిన వెబ్‌సైట్లో నియామకాలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలన్నీ ఉంటాయి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్... వంటి 23 నగరాల్లోని 32 కేంద్రాలతో పాటు ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, మేఘాలయలోని నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), తిరుపతిలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటికీ సీఆర్‌బీనే నియామకాలు నిర్వహిస్తుంది. సెమీకండక్టర్ ల్యాబొరేటరీ ద్వారా ఇస్రోలో చేరాలంటే పీహెచ్‌డీ ఉన్నవాళ్లు నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఏ విభాగాల అభ్యర్థులకు ప్రాధాన్యం? ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్... ఈ విభాగాల్లో ఇంజనీరింగ్ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇస్రో జారీ చేసే సైంటిస్ట్ ఉద్యోగ ప్రకటనల్లో ఈ అర్హతలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. దూరవిద్యలో ఇంజనీరింగ్ చేస్తే ఈ సంస్థల్లో ప్రవేశానికి అనర్హులు. ఏఎంఐఈ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రకటనలో అర్హతలకు సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవాలి. మీ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 65% లేదా సీజీపీఏ 6.84 స్కోరు వస్తేనే ఇస్రోలో ఈ ఉద్యోగాలకు అర్హులు. దీనికి ఎలాంటి సడలింపూ ఉండదు. ఎంఈ, ఎంటెక్... వంటి పీజీ కోర్సులు పూర్తి చేసినా ఇస్రో మాత్రం బీఈ, బీటెక్‌లలో వచ్చిన మార్కులనే ఈ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసినవారు బార్క్‌లో ఉద్యోగాలకు అనర్హులు కానీ ఇస్రో ఉద్యోగాలకు మాత్రం వీరు అర్హులే. ఈ స్పెషలైజేషన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ అర్హతలేంటి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. text: అయినా అధికార యంత్రాంగంలో పెద్దగా స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండల కేంద్ర పంచాయితీ పరిధిలోని శివారు గ్రామం శివపురం తండాలో ఆగష్ట్ 3న ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లంబాడీ రైతు మంత్ర్యానాయక్ భార్య మంత్రు భాయి ప్రాణాలు కోల్పోయింది. ట్రాక్టర్ నడుపుతూ, అహంకారంతో బాధితురాలి ప్రాణాలు తీసిన బోనముక్కల శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ మంగళవారం సాయంత్రం నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి మీడియా ముందుకు హాజరుపరచారు. నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి మీడియా ముందుకు హాజరుపరచిన గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ సాగర్ కాలువను ఆనుకుని ప్రశాంతంగా కనిపించే తండాలో కలవరం బోనముక్కల శ్రీనివాసరెడ్డితో సమీప నర్సింగపాడు గ్రామం. అయినప్పటికీ గత కొన్నేళ్ళుగా శివాపురంలో వ్యవసాయం ప్రారంభించాడు. సుమారు 130 ఇళ్లున్న గ్రామంలో 85 శాతం మంది ఎస్టీలే. అందరికీ వ్యవసాయమే ఆధారం. అటవీ భూములు సాగు చేసుకుని వాటిపై హక్కులు సాధించారు. సాగర్ కాలువను ఆనుకుని ఉన్న గ్రామంలో ఈసారి వర్షాలు సకాలంలో కురియడంతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. అదే క్రమంలో తమ పొలంలో సాగు సన్నాహాల్లో మంత్ర్యా నాయక్ కుటుంబం సన్నద్దమయ్యింది. రెండేళ్ల క్రితం మంత్ర్యానాయక్ వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం శ్రీనివాసరెడ్డి దగ్గర రూ 3.8లక్షలు అప్పు చేశాడు. దానికి కూడా తన భూమిని తనఖా పెట్టాడు. దానిని ఆసరగా మలచుకుని ఇప్పటికే గ్రామంలో కొందరి భూములు అదే క్రమంలో తన సొంతం చేసుకున్న శ్రీనివాసరెడ్డి మంత్ర్యానాయక్ పొలాన్ని కూడా దక్కించుకోవాలని చూసినట్టు స్తానికులు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే మంత్ర్యానాయక్ పొలంలో పనులకు ఎవరి ట్రాక్టర్ వెళ్లకుండా అడ్డుపడ్డాడు. చివరకు నాయక్ సమీప బంధువు రాజా తన ట్రాక్టర్ తో పొలం పనులకు సిద్ధం పడగా దానిని కూడా అడ్డుకోవడంతో పెద్ద వాగ్వాదం జరిగింది. పొలం పనులు అడ్డుకోవద్దని అడగడానికి వెళ్లాం... అప్పు ఇచ్చినందుకు తీరుస్తామని చెప్పాము..లేదంటే అసలు, వడ్డీ కూడా లెక్కలేసి భూమి రేటులో మినహాయించుకుని మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగాం. అయినా రెండూ చేయకుండా మమ్మల్ని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. చివరకు ఎవరి ట్రాక్టర్ రాకుండా చేసినా మేము పనులకు ఆటంకం లేకుండా చేసుకున్నామని గొడవకు వచ్చారు. దాని గురించి అడుగుదామని వెళ్లాం. రోడ్డు మీదనే తగువు జరిగింది. ట్రాక్టర్ మీద నుంచి కిందకి దిగితే మాట్లాడదామని చెప్పాం. దానికే కోపం వచ్చి దురుసుగా ట్రాక్టర్ నడిపారు. దూసుకెళ్లడంతో చక్రాల కింద పడి నా భార్య తీవ్రంగా గాయపడింది. తండాలో ఉన్న ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి చనిపోయింది. పోలీసులకు చెప్పాం. కానీ అధికారులెవరూ మాకు న్యాయం చేయలేదు. నలుగురు ఆడబిడ్డలు మాకు. తల్లి లేనివాళ్లయిపోయారు. ఎలా బతకాలి. అంటూ మంత్ర్యానాయక్ బీబీసీ కి తెలిపారు. ట్రాక్టర్ డీకొని గిరిజన మహిళ చనిపోయిన ప్రదేశం చాలామంది పొలాలు అలాగే కాజేశారు.. శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు ఇతరులు కూడా ఎస్టీ రైతులకు అప్పులిచ్చి భూములు కాజేసిన అనుభవం తండాలో చాలామందికి ఉందని స్థానికులు చెబుతున్నారు. స్థానిక మహిళ సక్రూ నాయక్ బీబీసీ తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించింది. "ఐదేళ్ల క్రితం మా ఊరిలో శ్రీనివాసరెడ్డి కి భూమి లేదు. ట్రాక్టర్ తో పనులు చేయడం కోసం వచ్చాడు. కానీ, ఇప్పుడు 10 ఎకరాల పొలం ఆయన చేతుల్లో ఉంది. కొంత కౌలుకి, కొంత సొంత భూమి ఆయన సాగు చేస్తున్నారు. మంత్ర్యానాయక్ పొలం విషయంలో కూడా తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరంచారు. అటవీ భూములను సాగులోకి తెచ్చి, ఎస్టీలు పట్టాలు తెచ్చుకుంటే దానిని ఇతరులు కాజేస్తున్నారు. అమాయకులు రెండు, మూడు లక్షలకే సొంత భూములు కోల్పోయి మళ్లీ వాటిలోనే కూలీకి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేవాళ్లే కనిపించడం లేదు" అని చెప్పారు. బాధితురాలి మృతదేహంతో ఆందోళన నర్సారావుపేట ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే మంత్రూ బాయి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నలుగురు ఆడబిడ్డలున్న కుటుంబానికి ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమను ఆదుకోవాలని , నిందితుడిని శిక్షించాలని కోరుతూ శివాపురం తండాలో ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని ట్రాక్టర్ లో ఉంచి, రోడ్డుపై బైఠాయించారు. పట్టపగలు హత్య చేస్తే తమను కనీసం పరామర్శించేందుకు మండల స్థాయి అధికారులు కూడా రాలేదని వాపోయారు. వారికి వివిద ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు మద్ధతు పలికారు. ఈ సందర్భంగా మృతురాలి కుమార్తె లచ్చిమి బాయి బీబీసీతో మాట్లాడారు. మేము నలుగురు ఆడబిడ్డలం. మా నాన్నకు ఉన్న రెండున్నర ఎకరాల పొలం తప్ప మరో దారి లేదు. అప్పు తీరుస్తామని చెప్పినా వినకుండా మా భూమి తీసుకోవాలనుకున్నారు. కుదరదని చెప్పినందుకే మా అమ్మని కడతేర్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఉరితీయాలి. మా కుటుంబానికి న్యాయం చేయాలి. రక్షణ కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా పెట్టాం... నిందితుడు శ్రీనివాసరెడ్డిపై హత్యానేరంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశామని విచారణాధికారి , నర్సారావుపేట రూరల్ సీఐ అచ్చెయ్య బీబీసీకి తెలిపారు. "ఈ భూమి విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. భూమి స్వాధీనం చేసుకుంటానని శ్రీనివాసరెడ్డి బెదిరిస్తున్నారు. పొలం సాగు చేసుకుని క్రమంగా అప్పులు తీరుస్తామని మంత్ర్యానాయక్, అతని భార్య చెబుతున్నారు. చివరకు పొలంలోకి వెళ్లినట్టు తెలియగానే శ్రీనివాసరెడ్డి వచ్చాడు. వాగ్వాదం జరిగింది. దాని గురించి అడగడానికి వెళ్లిన మంత్రుబాయితోనూ తగువు పడ్డాడు. ట్రాక్టర్ తో తొక్కించాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం తెలియగానే అప్రమత్తం అయ్యాం. గ్రామంలో అవసరమైన చర్యలు తీసుకున్నాం" అని అచ్చెయ్య వెల్లడించారు రాజకీయ ఒత్తిళ్లతో కేసు నీరుగార్చాలని చూస్తే సహించం భూమిని కాజేయాలని ప్రయత్నించి, కుదరదని చెప్పినందుకు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన నిందితుడు శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని ఎస్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ధారూ నాయక్ డిమాండ్ చేశారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "రాజకీయ కారణాలతో కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. నిందితుడు స్థానికంగా వైసీపీ కోసం పనిచేస్తూ ఉంటారు. అతనికి అండగా నిలిచేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పలకరించడానికి కూడా రాలేదు. మేము రోడ్డు మీద బైఠాయించి, అంత్ర్యక్రియలు అడ్డుకునే వరకూ చివరకు తహశీల్దార్ కూడా గ్రామానికి రాలేదు. ఎస్టీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ ఘటన చాటుతోంది. తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం" అని ప్రకటించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'అప్పు ఇచ్చాడు. తీరుస్తామని చెప్పారు. భూమి తనాఖా పెట్టుకున్నాడు. కాబట్టి ఆ భూమి స్వాధీనం చేయాలని పట్టుబట్టాడు. కుదరదని చెప్పడంతో వాగ్వాదానికి దిగాడు. చివరకు కనికరం లేకుండా వ్యవహరించాడు. కోపోద్రిక్తుడై ట్రాక్టర్ తో ఢీకొట్టి మహిళ ప్రాణాలు తీశాడు' అని పోలీసులు చెబుతున్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. text: క్షిపణి పరీక్ష కేంద్రం మూసివేత ఒప్పందంపై సంతకాలు చేసిన మూన్ జే యిన్, కిమ్ జోంగ్ ఉన్ ''టొంగ్‌చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయడానికి కిమ్ అంగీకరించారు'' అని మూన్ తెలిపారు. ''అది కూడా అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో'' అని ఆయన వివరించారు. టొంగ్‌చాంగ్-రి 2012 నుంచి ఉత్తర కొరియా ప్రధానమైన క్షిపణి ప్రయోగం కేంద్రం. ఉత్తర కొరియా నుంచి అమెరికా వరకు వెళ్లగల క్షిపణుల ప్రయోగం కూడా ఇక్కడి నుంచే జరిగింది. పంగ్యె-రి అణు పరీక్ష కేంద్రం (శాటిలైట్ చిత్రం) అంతే కాకుండా యాంగ్ బ్యాన్ అణు కేంద్రం మూసివేతకు కూడా కిమ్ అంగీకరించినట్లు మూన్ వెల్లడించారు. అణుపరీక్షలకు అవసరమైన పదార్థాలను ఇక్కడే తయారు చేస్తారని తెలుస్తోంది. అయితే అమెరికా కూడా దీనికి తగిన విధంగా ప్రతిస్పందించాలని కిమ్ కోరినట్లు మూన్ తెలిపారు. అయితే ఎలాగన్నది మాత్రం ఆయన వివరించలేదు. ఉత్తర కొరియా గత జూన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కిమ్‌ను కలవడానికి మునుపే తమ పంగ్యె-రి అణు పరీక్ష కేంద్రాన్ని పేల్చేసింది. కాగా.. కొరియా ద్వీపకల్పంలో మిలటరీపరమైన శాంతి స్థాపన కోసం ఇది ఒక పెద్ద ముందడుగు అని కిమ్ అభివర్ణించారు. రాబోయే కాలంలో తాను సియోల్‌లో పర్యటిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శిఖరాగ్ర సదస్సు: అణు నిరాయుధీకరణ ప్రస్తుతం ఉభయ కొరియాల మధ్య ప్యాంగ్‌యాంగ్‌లో జరుగుతున్న ఈ సదస్సు ప్రధాన లక్ష్యం అణు నిరాయుధీకరణే. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఈ విషయంపై స్థూలంగా ఒక అంగీకారం కుదిరినా, ఆ తర్వాత చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ సదస్సు ద్వారా దానికి కట్టుబడి ఉన్నట్లు ఉత్తర కొరియా నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ సదస్సు ద్వారా ఉభయ కొరియాలు రైల్వే లైన్లను కలుపుకోవడం, యుద్ధంలో విడిపోయిన కుటుంబాలు మరింత ఎక్కువగా కలుసుకునే అవకాశం కల్పించడం, ఆరోగ్య సేవల విషయంలో మరింత సహకరించుకోవాలనుకుంటున్నాయి. 2032లో ఉభయ కొరియాలు కలిసి సమ్మర్ ఒలంపిక్స్‌ను నిర్వహించే అవకాశాలనూ పరిశీలిస్తారు. ఈ భేటీ అమెరికా - ఉత్తర కొరియాల మధ్య చర్చలకు తోడ్పడుతుందా? ఉత్తర కొరియా అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో దక్షిణ కొరియా ఆ దేశంతో కొత్త ఆర్ధిక సంబంధాలు ఏర్పరచుకోవడం అమెరికా ఆంక్షల సడలింపుపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌లు జూన్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే ఒప్పందం కుదిరినా దానికి స్పష్టమైన కాల పరిమితి ఏమీ నిర్దేశించుకోలేదు. ఆ తరువాత కిమ్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అంతర్జాతీయ పరిశీలకులూ చెబుతున్నారు. మరోవైపు అమెరికా కూడా తొలుత నిరాయుధీకరణ చేస్తే ఆ తరువాత ఆంక్షల ఎత్తివేత ఉంటుందని చెబుతోంది. ఉత్తర కొరియా మాత్రం ఈ ప్రక్రియ దశలవారీగా జరగాలని కోరుకుంటోంది. ట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం ఇదే కాగా... ఇటీవల మరోసారి భేటీ కోసం ఉత్తర కొరియా ట్రంప్‌కు ఆహ్వానం పంపించింది. డోనల్డ్ ట్రంప్ తొలి విడత పాలనాకాలంలోనే అణు నిరాయుధీకరణ పూర్తి చేయాలని కిమ్ భావిస్తున్నారని దక్షిణ కొరియా రాయబారులు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశానికి చెందిన ఒక ముఖ్యమైన క్షిపణి పరీక్ష కేంద్రం మూసివేతకు అంగీకరించినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే యిన్ ప్యాంగ్‌యాంగ్‌లో తెలిపారు. text: భారతీయుల ఆహారంపై అనేక సూత్రీకరణలు, అపోహలున్నాయి. భారతదేశం ప్రధానంగా శాకాహార దేశం అన్నది వాటిలో ఒక ప్రధాన సూత్రీకరణ. అంతేకాదు, గతంలో జరిగిన పలు పరిశోధనల ప్రకారం దేశంలో మూడోవంతుకు పైగా ప్రజలు శాకాహారాన్నే తీసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించిన మూడు ప్రధానమైన సర్వేల ప్రకారం 23-37 శాతం పైగా భారతీయులు శాకాహారులు. 'సాంస్కృతిక, రాజకీయ ఒత్తిళ్లు' కానీ అమెరికాలో ఉంటున్న మానవశాస్త్రవేత్త డాక్టర్ బాలమురళీ నటరాజన్, భారతదేశానికి చెందిన ఆర్థికవేత్త సూరజ్ జాకబ్‌లు చేపట్టిన ఒక సంయుక్త పరిశోధనలో 'సాంస్కృతిక, రాజకీయ ఒత్తిళ్ల' వల్ల వాస్తవాలను తప్పుగా పేర్కొన్నారని, మాంసం - మరీ ప్రత్యేకించి గొడ్డు మాంసం తినేవారి సంఖ్యను తక్కువగా, శాకాహారాన్ని తినేవారి సంఖ్యను ఎక్కువగా చూపించారని తెలుస్తోంది. వీరిద్దరి పరిశోధన ప్రకారం కేవలం 20 శాతం మంది భారతీయులు మాత్రమే శాకాహారులు. భారతదేశం గురించి సాధారణంగా చెప్పే అంచనాకు ఇది చాలా దూరం. భారతదేశ జనాభాలో 80 శాతం ఉన్న హిందువులు, ప్రధానంగా మాంసాహారులు. అగ్రవర్ణాల వారిలో మూడోవంతు మంది మాత్రమే శాకాహారులు. కింది కులాల వారు, దళితులు, గిరిజనులు ప్రధానంగా మాంసాహారులు. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో శాకాహారుల శాతం (ఆధారం: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే) మరోవైపు డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌ల పరిశోధనలో గొడ్డుమాంసం తినేవారి సంఖ్య ప్రభుత్వ గణాంకాలు చెబుతున్న దానికంటే ఎక్కువగానే ఉందని తేలింది. ప్రభుత్వ సర్వేల ప్రకారం భారతదేశంలో సుమారు 7 శాతం మంది గొడ్డుమాంసం తింటారు. కానీ గొడ్డుమాంసం చుట్టూ సాంస్కృతిక, రాజకీయ వివాదాలు, ఆత్మగౌరవ పోరాటాలు ఉండడం వల్ల అధికారిక గణాంకాలు వాస్తవాన్ని కొంత మరుగుపరుస్తున్నాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీ శాకాహారాన్ని ప్రోత్సహిస్తోంది. దేశంలోని మెజారిటీ హిందువులు ఆవును పవిత్రంగా భావిస్తారు కాబట్టి, దానిని సంరక్షించాలని భావిస్తుంది. ఇప్పటికే దేశంలోని డజనుకు పైగా రాష్ట్రాలు పశువుల వధను నిషేధించాయి. గోసంరక్షక బృందాల పేరిట పశువులను రవాణా చేస్తున్న వారిని పలుచోట్ల కొట్టి చంపారు కూడా. అయితే వాస్తవం ఏమిటంటే - దళితులు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు కోట్లాది మంది భారతీయులు గొడ్డు మాంసాన్ని భుజిస్తారు. కేరళలోని సుమారు 70 కులాల వారు ఖరీదైన గొర్రె మాంసం కన్నా తక్కువ ధరకు లభించే గొడ్డు మాంసం వైపు మొగ్గు చూపుతారు. దేశంలో సుమారు 15 శాతం మంది భారతీయులు అంటే సుమారు 18 కోట్ల మంది గొడ్డు మాంసం తింటున్నారని డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌లు తేల్చి చెప్పారు. అధికారిక అంచనాలకన్నా ఇది 96 శాతం ఎక్కువ. 'బటర్ చికెన్ క్యాపిటల్' అంతే కాకుండా భారతదేశ ప్రజల ఆహారంపై అనేక సూత్రీకరణలు కూడా ఉన్నాయి. మూడోవంతు దిల్లీవాసులు మాత్రమే శాకాహారులు. అందువల్ల 'బటర్ చికెన్ క్యాపిటల్' అన్న పేరు దిల్లీకి సరిగ్గా సరిపోతుంది. కానీ చెన్నైని'దక్షిణ భారతదేశపు శాకాహార భోజన కేంద్రం'గా పేర్కొనడం మాత్రం పూర్తిగా వాస్తవ దూరం. ఇక్కడ కేవలం 6 శాతం మంది మాత్రమే శాకాహారులు. చాలా మంది పంజాబ్ ప్రజలు చికెన్‌ను బాగా ఇష్టపడతారని భావిస్తారు కానీ నిజానికి ఇక్కడ సుమారు 75 శాతం మంది శాకాహారులే. మరి భారతదేశం శాకాహార దేశం అన్న భావనను విజయవంతంగా ఎలా వ్యాప్తి చేశారు? డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌లు, ''సమాజంలో ఇంత వైవిధ్యం ఉన్న సందర్భంలో, ప్రతి కొన్ని కిలోమీటర్ల దూరానికి ఆహార అలవాట్లు, వంటలు మారే సమాజంలో, ఆ బృందం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేవారు, మిగతా వారి తరపున తాము చెప్పాలనుకున్నది చెబుతుంటారు. కొన్ని సమూహాలకు, బృందాలకు, ప్రాంతాలకు లేదా మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించే వారు ఇలాంటి సూత్రీకరణలు చేస్తుంటారు'' అని తెలిపారు. ''ఇది శాకాహారుల సామాజిక శక్తిని వెల్లడిస్తుంది. ఎక్కువ మంది తినేది శాకాహారమే అని, దానికి మాంసాహారం కన్నా ఉన్నత స్థానాన్ని కల్పించే ప్రయత్నాలను తెలియజేస్తుంది. 'శ్వేత' జాతి ప్రజలు ఎలాగైతే తాము ఆక్రమించుకున్న అసంఖ్యాకమైన ప్రజల విషయంలో 'శ్వేతేతరులు' అన్న భావనను కల్పించారో, ఇది అలాంటిదే.'' అని వారు వివరించారు. వలసల వల్ల కూడా ఈ సూత్రీకరణ జరిగిందని వీరిద్దరూ తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రజలు ఉత్తర, మధ్య భారతదేశానికి వలసపోయినప్పుడు, వారి ఆహారాన్నే మొత్తం దక్షిణ భారతదేశపు ఆహారంగా భావిస్తారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే ఉత్తర భారతదేశ ప్రజలకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. చివరగా - ఈ సూత్రీకరణల్లో కొన్ని బయటి వాళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కొంతమంది దక్షిణ భారతదేశం వారిని కలిసిన ఉత్తర భారతదేశం వాళ్లు, ఆ ప్రాంతం యొక్క వైవిధ్యం గురించి ఆలోచించకుండా మొత్తం దక్షిణ దేశానికి వారే ప్రతినిధులు అని భావిస్తారు. శాకాహారుల్లో మహిళలే ఎక్కువ ఈ పరిశోధనలో పురుషులు, మహిళల ఆహారపు అలవాట్లను కూడా చర్చించారు. ఉదాహరణకు, పురుషులకన్నా మహిళల్లో ఎక్కువ మంది శాకాహారులు ఉన్నారని తేలింది. ''సాధారణంగా శాకాహార సాంప్రదాయం పాటించాలన్న భారం మహిళల మీదే ఎక్కువగా పడుతుంటుంది'' అని డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌లు అన్నారు. సర్వే నిర్వహించిన కుటుంబాలలో సుమారు 65 శాతం దంపతులు మాంసాహారులు కాగా, శాకాహారులు కేవలం 20 శాతం మాత్రమే. 12 శాతం కేసుల్లో భర్త మాంసాహారి కాగా, భార్య శాకాహారిగా తేలింది. కేవలం 3 శాతం కేసుల్లో మాత్రమే భర్త శాకాహారి కాగా, భార్య మాంసాహారి. ఈ మొత్తం పరిశోధనను బట్టి జనాభాలో మెజారిటీ ప్రజలు అప్పుడప్పుడూ లేదా క్రమం తప్పకుండా చికెన్ లేదా మాంసం లేదా బీఫ్.. ఏదో ఒకటైతే తింటున్నారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో భారతదేశం, భారతదేశ ప్రజల ప్రాతినిధ్యం విషయంలో ఎందుకు మనల్ని శాకాహారులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఈ విస్తృత, వైవిధ్య, బహుళ సంస్కృతులు కలిగిన సమాజంలో ఆహారం విషయంలో సూత్రీకరణలు చేయడం, ఆహారపు అలవాట్లపై నిఘా పెట్టడంతో దీనికేమైనా సంబంధం ఉందా? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశం ప్రధానంగా శాకాహార దేశమా, మాంసాహార దేశమా? దీనిపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. ఈ విషయంపై నిర్వహించిన ఒక పరిశోధనలో హైదరాబాద్‌లో కేవలం 11 శాతం మంది మాత్రమే శాకాహారులున్నారని వెల్లడైంది. text: కానీ, నార్వేలో మాత్రం ఇలాంటి ర‌హ‌స్యాలేమీ లేవు. ఎవ‌రెవ‌రికి ఎంతెంత జీతం అందుతోంద‌నేది ఎవ‌రైనా తెలుసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల పెద్ద‌గా స‌మ‌స్య‌లేమీ రావ‌టం లేదు. నార్వేలో 1814వ సంవ‌త్స‌రం నుంచే ఎవ‌రెంత సంపాదిస్తున్నారు, ఆస్తులు ఏమేం ఉన్నాయి, ఎంత ప‌న్ను క‌డుతున్నార‌నేది అంద‌రూ తెలుసుకునే అవ‌కాశం ఉంది. గతంలో ఈ సమాచారాన్ని ఒక పుస్త‌కంలో రాసి ప‌బ్లిక్ లైబ్ర‌రీలో పెట్టేవాళ్లు. 2001వ సంవత్సరం నుంచి ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. చాలా మందికి ఈ సమాచారం తెలుసుకోవటం సరదా అయ్యింది. అలా తెలుసుకున్న సమాచారాన్ని కొందరు ఫేస్‌బుక్‌లో పెట్టేస్తున్నారు. నార్వే ప్ర‌జ‌లు ఆదాయ‌పు ప‌న్ను చాలా ఎక్కువ‌గా చెల్లిస్తారు. వాళ్లు స‌గ‌టున 40.2 శాతం పన్ను కడుతుంటే బ్రిటీష్ ప్ర‌జ‌లు కట్టేది 33.3 శాతం. అంత మొత్తం ప‌న్ను క‌డుతున్న‌ప్పుడు మిగ‌తావాళ్లు ఏం చేస్తున్నార‌నేది తెలుసుకోవాలనుకోవటం సహజమే. 2001కి ముందు ఏడాదికి ఒక‌సారి ముద్రించే.. ఆదాయం, ప‌న్ను స‌మాచారం ఉండే ఇలాంటి పెద్ద‌, బండ పుస్త‌కాలల్లో స‌మాచారం వెతికేందుకు ఎంతో మంది యువ‌కులు, ప్ర‌జ‌లు బారులు తీరేవాళ్ల‌ు. జీతాల్లో తేడాలు చాలా తక్కువ ప‌న్నుల వ్య‌వ‌స్థ‌పైన‌, ప్రభుత్వం చేసే ఖర్చుపైన ప్రజలకు న‌మ్మ‌కం, విశ్వాసం కలగాలంటే అంతా పారదర్శకంగా ఉండాలి కదా! ఈర్ష్య, అసూయ‌ల వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల కంటే ఈ పార‌ద‌ర్శ‌క విధాన‌మే బాగుందని అంతా అంటున్నారు. చాలా ఆఫీసుల్లో ఇత‌ర ఉద్యోగులు ఎంతెంత సంపాదిస్తున్నారో అక్క‌డ ప‌నిచేసే వాళ్ల‌కి తెలుస్తుంది. ప‌లు రంగాల్లో ఉమ్మ‌డి ఒప్పందాల ద్వారానే జీతాల‌ను నిర్ణ‌యిస్తారు. జీతాల్లో తేడాల‌నేవి చాలా త‌క్కువ‌. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను బ‌ట్టి చూస్తే ఆడ-మ‌గ జీతాల వివ‌క్ష కూడా త‌క్కువే. ఒకే ప‌నికి స‌మాన వేత‌నం విష‌యంలో వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం 144 దేశాల్లో నార్వేకు మూడో ర్యాంకు ఇచ్చింది. కాబ‌ట్టి, ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్టుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిలేదు. 2015లో నార్వే ప్ర‌ధాన‌మంత్రి ఎమా సోల్బ‌ర్గ్ 1,573,544 క్రోన‌ర్ (రూ. కోటీ 25 ల‌క్ష‌లు) సంపాదించారు. ఆమె ఆస్తుల విలువ 2,054,896 క్రోన‌ర్(రూ. కోటీ 63 ల‌క్ష‌లు). ఆమె 677,459 క్రోన‌ర్ (రూ.54 ల‌క్ష‌లు) ప‌న్ను చెల్లించారు. ఐడీ ఇవ్వకుండా సమాచారం తెలుసుకోలేరు అయితే, ఒకప్పుడు మాత్రం.. త‌మ స్నేహితులు, పొరుగువాళ్లు, స‌హోద్యోగుల జీతాల వివ‌రాల్లోకి తొంగిచూసేందుకు ప్ర‌జ‌లు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చాలామంది ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులోని స‌మాచారాన్ని చూడాలంటే ఎవ‌రైనా స‌రే త‌మ నేష‌న‌ల్ ఐడీ నంబ‌ర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఐడీ నంబ‌ర్ ఇవ్వ‌కుండా స‌మాచారాన్ని తెలుసుకునే అవ‌కాశం ఇప్పుడు లేదు. "మీ స‌మాచారాన్ని ఎవ‌రెవ‌రు వెతుకుతున్నారో తెలుసుకునే అవ‌కాశం 2014లో ల‌భించింది" అని నార్వే ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ ఉన్న‌తాధికారి మాన్స్ క్రిస్టియ‌న్ హోల్టే చెప్పారు. నార్వేలో జ‌నాభా 52 ల‌క్ష‌లు. అందులో ప‌న్ను చెల్లించేవాళ్లు 30 ల‌క్ష‌లు. ఎలాంటి ఆంక్ష‌లూ లేన‌ప్పుడు ప్ర‌తిఏటా 1.65 కోట్ల సార్లు ఈ స‌మాచారాన్ని వెదికేవాళ్లు. ఇప్పుడు ఏటా 20 ల‌క్ష‌ల సార్లు వెదుకుతున్నారు. గతంలో నిబంధనలేమీ లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్లు వెతికేవాళ్లు. ఇలా ధనవంతుల సమాచారాన్ని నేరస్తులు తెలుసుకుని, వాళ్లని టార్గెట్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. త‌మ స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, ప‌రిచ‌య‌స్తుల స‌మాచారాన్ని చూడ‌లేద‌ని తాజాగా చేసిన స‌ర్వేలో 92 శాతం మంది ప్ర‌జ‌లు చెప్పారు. నేరస్తులు ఈ సమాచారాన్ని తెలుసుకుని ధనవంతుల్ని టార్గెట్ చేసేవాళ్లు. అందరి వివరాలు వెతకమంటున్న ప్రభుత్వం ఈ ప‌న్ను జాబితాలు ప్ర‌జ‌ల నిక‌ర ఆదాయం, నిక‌ర ఆస్తులు, వాళ్లు చెల్లించిన ప‌న్నుని మాత్ర‌మే చెబుతాయి. ఎవ‌రికైనా భారీగా ఆస్తులు ఉంటే, జాబితాలో చూపించిన దానికంటే వారి ఆదాయం ఎక్కువ కావొచ్చు. ఎందుకంటే స‌హ‌జంగానే ఆస్తుల ప‌న్ను విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువ క‌దా! ఇలా పారదర్శకంగా ఆదాయం, ఆస్తులు, పన్ను చెల్లింపుల సమాచారం ఇవ్వటం వల్ల సమస్యలు కూడా ఉన్నాయి. త‌క్కువ ఆదాయం ఉన్న కుటుంబాల‌కు చెందిన పిల్ల‌ల్ని వాళ్ల క్లాస్‌మేట్సే వెక్కిరిస్తుంటారు. ఆదాయాన్ని వెతికి చూసే అవ‌కాశం ఉండ‌టం వ‌ల్ల‌నే ఇలా జరుగుతోంది. అంద‌రి స‌మాచారాన్ని ప్ర‌జ‌లు వెతకాలని, అప్పుడే ప‌న్ను ఎగ‌వేసేవాళ్లు ఎవ‌రో తెలుస్తుందని నార్వే ఆదాయపు పన్ను విభాగం ఉన్నతాధికారులు అంటున్నారు. ప‌న్ను ఎగ్గొడుతున్నార‌న్న అనుమానం వ‌స్తే త‌మ‌కు చెప్పాల‌ని ప్ర‌జ‌ల్ని వారు ప్రోత్స‌హిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.) బీబీసీలోని టాప్ యాంక‌ర్ల‌కు ఎంతెంత జీతాలు ఉంటాయో ఈ మ‌ధ్య‌నే బ్రిటీష్‌ పేప‌ర్లు బ‌య‌ట‌పెట్టాయి. అయితే, బ్రిట‌న్‌లోని మిగ‌తా టీవీల్లోని యాంక‌ర్ల జీతాలు ఎంత‌నేది ఇంకా దాపరికమే. మ‌న దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టీవీ యాంక‌ర్లు, జర్నలిస్టుల జీతాలు ఎంత‌నేది కూడా ర‌హ‌స్య‌మే. text: బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తీర్థ సింగ్ రావత్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 56 ఏళ్ల రావత్ ఉత్తరాఖండ్ బీజేపీ పార్టీలో ప్రముఖులు. పౌరీ గర్హ్వాల్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించిన తరువాత రావత్ మాట్లాడుతూ.. "నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రధాని మోదీకి, హోం మంత్రి, ఇతర పార్టీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అన్నారు. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు రావత్ ఆ రాష్ట్ర మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా వ్యవహరించారు. తరువాత 2007లో ఆయన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత 2013లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకత్వ పగ్గాలు అందుకున్నారు. అంతకుముందు మంగళవారం నాడు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బేబీ రాణి మౌర్యకు తన రాజీనామా అందజేశారు. ఈ నిర్ణయం పార్టీ ఉమ్మడిగా తీసుకుందని ఆ తర్వాత ఆయన మీడియాతో చెప్పారు. బుధవారం బీజేపీ ఎంఎల్ఏలు అందరూ సమావేశమవుతారని తెలిపారు. రాజీనామాకు కారణం ఏమిటని అడిగినపుడు.. ఆ ప్రశ్నకు సమాధానం దిల్లీలో లభిస్తుందని త్రివేంద్రసింగ్ బదులిచ్చారు. ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుంటారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచీ.. ఇప్పటివరకూ ఎనిమిది మంది ముఖ్యమంత్రులయ్యారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నిరంతరమా అన్నట్లు కొనసాగుతోంది. కేవలం ఎన్.డి.తివారి మాత్రమే ఐదేళ్లు పూర్తి కాలం సీఎంగా కొనసాగారు. మొత్తం 70 మంది సభ్యులు గల రాష్ట్ర శాసనసభలో బీజేపీకి ప్రస్తుతం 56 మంది ఎంఎల్ఏలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు ఉండగా.. ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆకస్మికంగా దిల్లీ నుంచి పరిశీలకులు... డెహ్రాడూన్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర వేసవి రాజధాని గారాసాయిన్‌లో ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంఎల్ఏలు అందరూ ఇక్కడే ఉన్నారు. అకస్మాత్తుగా బీజేపీ కేంద్ర నాయకత్వం దిల్లీ నుంచి ఇద్దరు పరిశీలకులను మార్చి ఆరో తేదీ శనివారం రోజు డెహ్రాడూన్‌కు పంపించింది. వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్ కాగా, మరొకరు ఉత్తరాఖండ్ బీజేపీ ఇన్‌చార్జ్ దుష్యంత్ గౌతమ్. బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. వెంటనే సీఎం త్రివేంద్రసింగ్ రావత్ డెహ్రాడూన్ చేరుకున్నారు. బీజేపీ ఎంఎల్ఏలు మొత్తం డెహ్రాడూన్ రావటం మొదలైంది. ముఖ్యమంత్రిని మారుస్తుండవచ్చునని, అందుకే దిల్లీ నుంచి పరిశీలకులను పంపించారని ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ కోర్ గ్రూప్ శనివారం సాయంత్రం గంటసేపు సమావేశమైంది. ఆ సమావేశంలో ఏం జరిగిందని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌ను మీడియా ప్రశ్నించినపుడు ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అకస్మాత్తుగా నాయకత్వ మార్పు ఎందుకు? బీజేపీ ఉత్తరాఖండ్ సీఎంను మార్చే పనిలో ఉందని, అసమర్థతకు బీజేపీ దగ్గర ఉన్న సమాధానం ముఖాన్ని మార్చటమేనని.. ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ విమర్శించారు. ఆదివారం అంతా మామూలుగా ఉన్నట్లు కనిపించింది. కానీ మార్చి ఎనిమిదో తేదీన గారాసాయిన్‌లో మహిళా దినోత్సవంలో పాల్గొనాల్సిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ హుటాహుటిన దేశ రాజధాని దిల్లీకి వచ్చారు. ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు అనిల్ బులానిని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను ఆయన కలిశారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ''ముఖ్యమంత్రి త్రివేదంద్ర సింగ్ రావత్ మీద పార్టీలో ఇప్పటికే అసంతృప్తి ఉంది. దేవస్థానం బోర్డు ఏర్పాటు వంటి కొన్ని నిర్ణయాలతో బీజేపీ కీలక ఓటు బ్యాంకైన ఆలయ అర్చకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి స్వయంగా ఈ అంశంపై కోర్టుకు వెళ్లారు'' అని సీనియర్ జర్నలిస్ట్ జైసింగ్ రావత్ పేర్కొన్నారు. ''గార్సాయిన్‌లో వేసవి రాజధానిని నిర్మించిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. రోడ్డును వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన మహిళల మీద అసెంబ్లీ ప్రారంభం రోజునే లాఠీచార్జి చేయించారు. ఇది పర్వత ప్రాంతాల ప్రజలకు తప్పుడు సందేశం పంపింది. జనంలో కూడా చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది'' అని ఆయన వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీర్థ్ సింగ్ రావత్ పేరును బీజేపీ సూచించింది. బుధవారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. text: మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భార్య వెంకట నాగ మాధవి ప్రతిమను శ్రీనివాస్ గుప్తా సిలికాన్ రబ్బర్‌తో తయారు చేయించారు. ఒక మంచి ఇళ్లు కట్టుకోవాలని మాధవి తనతో ఎప్పుడూ చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆమె ప్రతిమతోనే గృహ ప్రవేశం చేశానని ఆయన బీబీసీతో చెప్పారు. శ్రీనివాస్ గుప్తా, వెంకట నాగ మాధవి దంపతులకు ఇద్దరు సంతానం. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. దాదాపు 32 ఏళ్ల క్రితం కర్నాటకలోని కొప్పల్‌ ప్రాంతంలో ఆయన కుటుంబం స్థిరపడింది. "2017 జులై 5న మేం కొప్పల్ నుంచి తిరుమల వెళ్తుండగా, కోలార్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మా కారును ట్రక్కు ఢీకొట్టింది. అమ్మ చనిపోయారు. అప్పుడు అమ్మకు 45 ఏళ్లు" అని మాధవి-శ్రీనివాస్ దంపతుల పెద్ద కూతురు అనూష బీబీసీతో చెప్పారు. శ్రీనివాస హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని అయిన శ్రీనివాస్- తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను సేకరించి, ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. అమ్మకు గుర్తుగా ఇంట్లో ప్రతిమ ఏర్పాటు చేసుకోవాలని నాన్న, అక్కాచెల్లెళ్లం ఇద్దరం అనుకున్నామని అనూష తెలిపారు. మహేశ్ రంగన్ననవర్ అనే ఆర్కిటెక్టు ఈ ప్రతిమ ఏర్పాటుకు సూచన చేశారని ఆమె చెప్పారు. బెంగళూరులో ఇలాంటి శిల్పాలు తయారు చేసే శ్రీధర్ మూర్తి బృందాన్ని సంప్రదించామన్నారు. బెంగళూరు సిద్ధేశ్వర లే ఔట్‌లోని గొంబేమణి సంస్థలో శ్రీధర్ మూర్తి బృందం ఈ ప్రతిమను రూపొందించిందని ఆమె వివరించారు. భార్య వెంకట నాగ మాధవితో శ్రీనివాస్ గుప్తా (ఫైల్ ఫొటో) "అమ్మ కలల ఇంట్లో అమ్మ ప్రతిమ" ప్రతిమ తయారీకి దాదాపు ఒక సంవత్సరం పట్టిందని అనూష చెప్పారు. కొప్పల్ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా దీనిని తయారు చేశారని తెలిపారు. అమ్మ కలల ఇల్లు అయిన కొత్త ఇంట్లో ఈ ప్రతిమను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రతిమ దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు మాధవి, శ్రీనివాస్, చెల్లి సింధూషలతో అనూష (మాధవి వెనుక ఉన్న అమ్మాయి) "మూడేళ్ల క్రితం ఇంటి ప్లాన్, ఇతరత్రా అన్నీ అమ్మే చూసుకున్నారు. కల నెరవేరేలోపు అమ్మ చనిపోయారు. కొత్త ఇంట్లో అమ్మ ప్రతిమ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం’’ అని ఆమె తెలిపారు. ఈ నెల 8వ తేదీన గృహ ప్రవేశం రోజు తమ అమ్మ ప్రతిమను చూసి బంధువులు, ఆప్తులు ఆశ్చర్యపోయారని చెప్పారు. ‘‘వాళ్లు ఫొటోలు తీసుకొని వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు" అని ఆమె చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత కొందరు ఇంటికి వచ్చి ప్రతిమను చూసి వెళ్తున్నారని, మరికొందరు తమ తండ్రికి ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారని తెలిపారు. ప్రతిమ తయారీకి ఎంత ఖర్చయిందని బీబీసీ అడిగినపుడు.. "నా భార్య మాధవిపై నాకున్న ప్రేమకు నేను వెల కట్టలేను. ఇది అమూల్యం" అని శ్రీనివాస్ బదులిచ్చారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మనిషి సజీవంగా ఉన్నట్లు కనిపించే ప్రతిమ ఇది. చనిపోయిన తన భార్యకు గుర్తుగా ఒక తెలుగు పారిశ్రామికవేత్త ఈ ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేయించారు. ఈ ప్రతిమతోనే ఆయన గృహప్రవేశం చేశారు. text: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఆత్మనిర్భర భారత్‌’ నినాదంలో భాగంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. రక్షణ ఉత్పత్తుల స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వావలంబన సాధించేలా చేస్తామని అన్నారు. రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన అన్ని విభాగాలతో చాలా సార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఆంక్షలు విధించే ఉత్పత్తుల జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం, భవిష్యతులో దేశీయంగా యుద్ధ సామగ్రి తయారీ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు సాయుధ బలగాలు, ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలతోనూ చర్చించినట్లు చెప్పారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న జాబితాలో దేశ రక్షణ అవసరాలు తీర్చే ఆర్టిలరీ గన్, అసాల్ట్ రైఫిల్స్, రవాణా విమానాలు, ఎల్‌సీహెచ్‌ఎస్ రాడార్ల లాంటి కొన్ని ఆధునిక సాంకేతికత కలిగిన సామగ్రి, వస్తువులు కూడా ఉన్నాయని అన్నారు. వచ్చే 6-7 ఏళ్లలో దేశీయ రక్షణ పరిశ్రమలకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చే అంశం గురించి కూడా రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వావలంబన సాధించేలా చేస్తామని‌ రాజ్‌నాథ్ అన్నారు ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశీయ రక్షణ పరిశ్రమలకు రూ.52 వేల కోట్ల ప్రత్యేక కేటాయింపులను ఆయన ప్రకటించారు. అయితే, దిగుమతులపై ఆంక్షలు వెంటనే కాకుండా... 2020 నుంచి 2024 మధ్యలో దశలవారీగా అమల్లోకి వస్తాయని రాజ్‌నాథ్ వివరించారు. ఈ ఉత్పత్తుల్లో సైన్యం, వాయుసేన కోసం రూ.1.3 లక్షల కోట్ల మేర విలువైన సామగ్రి, నావికాదళం కోసం రూ.1.4 లక్షల కోట్ల విలువైన సామగ్రి తయారవుతుందని ఆయన అన్నారు. ఆంక్షలు విధించిన పరికరాల ఉత్పత్తి అనుకున్న సమయంలో జరిగేలా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని రాజ్‌నాథ్ అన్నారు. ఇందుకోసం రక్షణ విభాగాలు, పరిశ్రమల మధ్య సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యతులోనూ సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరుపుతూ, మరిన్ని ఉత్పత్తులను ఆంక్షల జాబితాలోకి తీసుకువస్తామని కూడా రాజ్‌నాథ్ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత రక్షణశాఖ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. text: ఇంత భారీ సంఖ్యలో జనం అనారోగ్యం పాలు కావడానికి కారణాలను అధికారులు నిర్ధరించలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టడానికి ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు బాధితుల శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించామని, 24 గంటల్లో నివేదిక వస్తుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీత బీబీసీకి తెలిపారు. కాగా, పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య బృందాన్ని ఏలూరుకు పంపిస్తోంది. ఈ బృందం సోమవారం సాయంత్రానికి ఏలూరు చేరుకుంటుందని డాక్టర్ గీత చెప్పారు. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్, డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు. మంగళవారం సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఈ బృందానికి ఆదేశాలిచ్చింది. కాగా, బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం పరామర్శించారు. జిల్లా కలెక్టర్ నివేదికలో ముఖ్యాంశాలు.. ఈ వ్యవహారంపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం.. లక్షణాలు : - ఇప్పటివరకూ.. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు - తీవ్రత తక్కువగా ఉంది - ఏలూరు మున్సిపల్‌ వాటర్‌ పంపిణీ లేని ప్రాంతాల్లోకూడా అస్వస్థతకు గురయ్యారు - ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దకు అస్వస్థతకు గురయ్యారు - ప్రత్యేకించి ఫలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు - రోజూ మినరల్‌వాటర్‌ తాగే వాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారు22 తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా రిపోర్టులు సాధారణ స్థితినే సూచించాయి. 52 రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి. 35 సెరిబ్రల్‌ స్పైనల్‌ ఫ్లూయిడ్‌ శాంపిళ్లను పరీక్షంగా సెల్‌ కౌంట్‌ నార్మల్‌ వచ్చింది. కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉంది. 45 మంది సీటీ స్కాన్‌ చేశారు. నార్మల్‌గానే ఉంది. 9 పాల నమూనాలను స్వీకరించారు. వాటి ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి. సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణకోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించారు. ఫలితం రావాల్సి ఉంది. ఏలూరులో అంతుచిక్కని వ్యాధి: అసలేం జరుగుతోంది? వాంతులు, స్పృహ కోల్పోవడం... బాధితుల్లో చాలామందికి వాంతులు, స్పృహతప్పడం లాంటి లక్షణాలు కనిపించాయని డాక్టర్లు తెలిపారు. బాధితులను ఏలూరు జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. నగరంలోని డాక్టర్లు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నవారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. కానీ, వారి అనారోగ్యానికి కారణం ఏంటో అంతుపట్టడం లేదన్నారు. బాధితుల బ్లడ్ శాంపిళ్లను పరీక్షల కోసం విజయవాడ పంపించినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలియగానే శాఖ మంత్రి ఆళ్ల నాని బాధితులను చేర్చిన ఆస్పత్రికి వెళ్లారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. ఒకేసారి ఎక్కువ మంది అనారోగ్యానికి గురైన ప్రాంతాలను డాక్టర్ల బృందం పరిశీలించింది. అక్కడ ఉన్న ప్రతి ఇంట్లో వారు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఏఎన్ఐ వివరించింది. కోలుకుంటున్న బాధితులు కోలుకున్న బాధితులు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం అర్ధరాత్రి బాధితులకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల బృందం కోలుకున్న 20 మందిని డిశ్చార్జ్ చేశారు. అస్వస్థతకు గురైనవారిలో ఏలూరు వన్ టౌన్‌కు చెందిన వారు ఉన్నారు. ఆస్పత్రులలో బాధితులను పరామర్శించిన మంత్రి, వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జి డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో ఒక వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తోంది. ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఆళ్ల నాని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని బాధితులకు మెరుగైన వైద్యం అందేలా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయం చేస్తోంది. ఏలూరులో పలు ప్రాంతాలలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి, మందులను అందుబాటులో ఉంచామని, డాక్టర్ల బృందం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. వ్యాధిని గుర్తించేందుకు ప్రత్యేక వైద్య బందాలు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వ్యాధి లక్షణాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఏలూరుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపిస్తున్నామని అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, కలుషిత నీరు తాగడం వల్లే ఏలూరులో 150 మంది జబ్బుపడ్డారని, ప్రజలకు రక్షిత మంచి నీరు అందించే విషయలో ప్రభుత్వం 18 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇలా జరగడం విచారకరమని ఆయన అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏలూరులో అంతుచిక్కని సమస్యతో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 428 దాటింది. వీరిలో చాలా మందికి మూర్ఛ తరహా లక్షణాలు కనిపించాయి. చికిత్స పొందిన అనంతరం 200 మందికి పైగా డిశ్చార్జి అయ్యారు. text: ఆక్షన్ హౌస్ సదబీ చేతిలో ఇమిడిపోయే ఈ పాత్ర చైనాలోని ‘సాంగ్’ రాజవంశానికి చెందింది. 20 నిమిషాల పాటు ఉత్కంఠంగా వేలంపాట కొనసాగింది. అయితే ఆ గదిలో ఉన్నది మాత్రం ఒకే ఒక్క బిడ్డర్. మిగతా వాళ్లంతా ఫోన్లోనే ఈ వేలం పాటలో పాల్గొన్నారని వేలం వేసిన ‘సదబీ’ సంస్థ తెలిపింది. ఈ పాత్ర చుట్టుకొలత 13 సె.మీ. నీలం-ఆకుపచ్చ రంగులతో మెరుగు పెట్టారు. ఆకాలంలో దీన్ని బ్రష్‌లు కడగడానికి ఉపయోగించేవారు. వేలంపాటలో ఈ పాత్రను దక్కించుకున్న వ్యక్తి ఆ గదిలో లేరు. ఫోన్ ద్వారా ఆయన వేలంపాటలో పాల్గొన్నారు. తన వివరాలను చెప్పడానికి కూడా ఆ వ్యక్తి ఇష్టపడలేదు. రూ. 67 కోట్లతో వేలం పాట ప్రారంభమైంది. రూ.248 కోట్లకు ఆ అజ్ఞాత వ్యక్తి గెలుచుకున్నారు. ఈ పాత్రను బ్రష్‌లు కడగడానికి ఉపయోగించేవారు ఈ పాత్రను ఓ అరుదైన అద్భుతమని ఆక్షన్ హౌస్‌లోని చైనీస్ ఆర్ట్ అధికారి చెప్పారు. ‘‘ఈ పాత్ర ఇంత ధర పలుకుతుందని అనుకోలేదు. అయితే, గట్టి పోటీ మాత్రం ఉంటుందని భావించాం. ‘రు-వేర్’ వస్తువులను ఎప్పుడు వేలం వేసినా ఉత్కంఠగానే ఉంటుంది. ఎందుకంటే, చైనా చరిత్రలో రు-వేర్ వస్తువులకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర వస్తువులకూ ఉండదు’’ అన్నారు. అయితే, ఈ పాత్రలకు నకలుగా చాలా పాత్రలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పాత్రలు తమవద్ద ఉన్నాయంటూ నిత్యం ఎంతో మంది తనకు ఇ-మెయిల్స్ పంపిస్తుంటారని, కానీ, సాంగ్ రాజవంశానికి చెందిన పాత్రలు నాలుగు మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నాయని వివరించారు. మా ఇతర కథనాలు: 2014లో మింగ్ రాజవంశానికి చెందిన వైన్ పాత్రను, లియు అనే వ్యక్తికి రూ. 235 కోట్లకు అమ్మారు. ఈ రికార్డును తాజాగా రూ. 248 కోట్లతో ఈ రూ-వేర్ పాత్ర అధిగమించింది. వైన్ పాత్రను కొనుగోలు చేసిన లియు చైనాలో ఓ సంపన్నుడు. కళాఖండాలను సేకరించడం అతడి హాబీ. ఈయన గతంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వెయ్యి సంవత్సరాల నాటి ఈ అరుదైన పాత్ర రూ.248 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వేలంపాట హాంగ్‌కాంగ్‌లో రికార్డు సృష్టించింది. text: మనం ప్రోబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందనేదానిపై వారు చాలా వివరంగా ఒక పరిశోధన చేశారు. మార్కెట్లో ప్రోబయాటిక్స్‌పై అవి తీసుకోవడం వల్ల పొట్టకు మంచిదని, ఆరోగ్యకరమని అని ఉంది. కానీ అధ్యయనం ఫలితాల్లో మాత్రం వాటి ప్రభావం శరీరం లోపల తక్కువగా లేదంటే అసలు లేదని తెలిసింది. భవిష్యత్తులో ప్రతి వ్యక్తికీ అనుగుణంగా, వారి అవసరాలు తీర్చడానికి ప్రోబయాటిక్స్ అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా లభించే లాక్టోబసిల్లస్, బైఫిడోబాక్టీరియా లాంటి 11 మంచి బాక్టీరియాలతో వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ పరిశోధకుల బృందం సొంతంగా ఒక ప్రోబయాటిక్ మిశ్రమాన్ని తయారుచేసింది. దానిని ఆరోగ్యంగా ఉన్న 25 మంది వలంటీర్లకు ఒక నెలపాటు ఇచ్చారు. తర్వాత వారి నుంచి సర్జరీ ద్వారా పొట్టలోని వివిధ భాగాలు, చిన్న, పెద్ద పేగుల దగ్గర శాంపిల్స్ సేకరించారు. బాక్టీరియా ఎక్కడ విజయవంతంగా పెరిగింది, పేగుల్లో అది ఎలాంటి మార్పులకు కారణమైంది అనేవి పరిశోధకులు గమనించారు. ఆ పరిశోధనలో పాల్గొన్న వలంటీర్లు సగం మందిలో మంచి బాక్టీరియా నేరుగా నోట్లోంచి వెళ్లి ఇంకో మార్గం నుంచి బయటికొచ్చినట్టు సెల్‌ జర్నల్‌ చెప్పింది. మిగతా వారిలో పొట్టలో సూక్ష్మజీవుల రద్దీ నుంచి బయటపడే ముందు ప్రోబయాటిక్స్ అక్కడ కాసేపు మాత్రమే ఉండగలిగాయి. పులిసే పెరుగు, ఊరగాయలు, పచ్చళ్లు, చీజ్, పుల్లటి పిండితో చేసే రొట్టెలు, చాక్లెట్లు లాంటివి కూడా ప్రోబయాటిక్స్ కిందికి వస్తాయని చెబుతారు. మనం మనిషి కాదు- సూక్ష్మ జీవుల సమూహం ప్రతి రోగికీ అనుగుణంగా ప్రోబయాటిక్స్ లైనింగ్ అనే పది లక్షల కోట్ల బ్యాక్టీరియా మన పొట్టలో ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో రకం మిశ్రమంలా సూక్ష్మజీవులు ఉంటాయి. "రెడీమేడ్ ప్రోబయాటిక్స్ ప్రతి ఒక్కరికీ పనిచేస్తాయని ఊహించడం పొరపాటే అవుతుంది" అని డాక్టర్ ఎరన్ ఎలినావ్ తెలిపారు. "భవిష్యత్‌లో ప్రోబయాటిక్స్‌ను ప్రతి రోగి అవసరాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుంది" "అంటే తమకు సరిపడతాయో, లేదో చూడకుండా, సూపర్ మార్కెట్ వెళ్లి ప్రోబయాటిక్స్ కొనుక్కుని వాడడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు" అని ఆయన బీబీసీకి చెప్పారు. యాంటీ బయాటిక్స్ కోర్సు ఉపయోగించాక ప్రోబయాటిక్స్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. అందులో మంచి, చెడు బ్యాక్టీరియాలు రెండూ తుడిచిపెట్టుకుపోయాయి. శాస్త్రవేత్తలు 46 మందిపై ఈ పరిశోధనలు చేశారు. ప్రోబయాటిక్స్ వల్ల ఆరోగ్యకరమైన సాధారణ బాక్టీరియా తనంతట తాను పెరగడం ఆలస్యం అయ్యిందని సెల్ జర్నల్‌లో చెప్పారు. "ప్రోబయాటిక్స్ హానిరహితం, అందరికీ ప్రయోజనం అని ప్రస్తుతం చెబుతున్నదానికి విరుద్ధంగా.. ప్రోబయాటిక్స్, యాంటీబయాటిక్స్‌తో కలిపి ఉపయోగించం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని, దీర్ఘకాల దుష్పరిణామాలు కలగవచ్చని ఈ ఫలితాలు బయపెట్టాయి" అని డాక్టర్ ఎలినవ్ చెబుతున్నారు. సూక్ష్మజీవులకు, మన శరీరంలోని భాగాలకు ఉన్న ఆ అంతుపట్టని బంధం చిక్కుముడిని సైన్స్ పూర్తిగా విప్పుతుందని ఎన్నో ఆశలున్నాయి. అదే జరిగితే ఆ ఫలితం ఎన్నో కొత్త చికిత్సలకు దారితీస్తుంది. అయితే, "ఈ పరిశోధనలో ఫలితాలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని" సంగెర్ ఇన్‌స్టిట్యూట్‌ సూక్ష్మజీవుల పరిశోధకుడు డాక్టర్ ట్రెవోర్ లాలీ అంటున్నారు. "ప్రోబయాటిక్స్ ఎంతో కాలం నుంచి మన చుట్టుపక్కలే ఉంటున్నాయి. మరింత పరిశీలన చేసిన తర్వాతే అవి వస్తున్నాయి. ఏవీ పెరగకుండా ఉండడానికి పొట్టలో ఒక సహజ క్రియ ఉంది. అది సాధారణంగా వ్యాధికారకాలను అడ్డుకుంటుంది. అలాంటి దాన్నుంచి మనం ప్రయోజనం పొందాల్సి ఉంటుంది అని లాలీ బీబీసీతో అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రోబయాటిక్స్ పేరుతో ప్యాక్ చేసి అమ్మే మంచి బాక్టీరియా ఆహార పదార్థాలు దాదాపు ఎందుకూ పనికిరావని ఇజ్రాయెల్‌కు చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. text: ఈ గ్రామంలో మొత్తం 120 ఇళ్లకుగాను 120 ఇళ్లు.. అంటే వంద శాతం ఇళ్ల పైకప్పు మీద సౌర ఫలకాలే కనిపిస్తాయి. నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఊరి రూపమే మారిపోయింది. నాబార్డ్ తోడ్పాటు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్) చొరవతో బంజేరుపల్లిలో ప్రతి ఇంటిలోనూ సౌర విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ పొదుపు చేసే విధానానికి బంజేరుపల్లి ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది. సంపూర్ణ సోలార్‌ గ్రామంగా రూపొందించడానికి గ్రామసభలో తీర్మానం చేసి, ఉత్సాహంగా ముందుకు వచ్చారు. గ్రామంలోని 120 ఇళ్ల మీద సౌర ఫలకాలు వెలిశాయి. నాబార్డు, స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌ ఇచ్చిన రుణాలతో పనులు జరిగాయి. నేడు ఈ గ్రామంలో ప్రతి ఇంటిలోనూ 4 లైట్లు, 4 ఫ్యాన్లు, టీవీ, ఫ్రిజ్‌ (500 వాట్స్‌) సోలార్‌ విద్యుత్‌తోనే పనిచేస్తున్నాయి. కరెంట్‌ కోతల నుంచి విముక్తి గతంలో కరెంటు కోతలతో విసిగిపోయిన గ్రామస్థులకు ఇప్పుడు విద్యుత్ గురించి పెద్దగా టెన్షన్ లేదు. కరెంటు పోయిన మరుక్షణం సౌర విద్యుత్‌ వారికి సేవలు అందిస్తోంది. ఇళ్లలోనే కాదు, 65 సోలార్‌ వీధి దీపాలు ప్రజల జీవితంలో వెలుగులు నింపుతున్నాయి. "వానాకాలంలో పిడుగు ప్రమాదాలు ఈ ప్రాంతంలో ఎక్కువ. వీటి నుంచి సోలార్‌ యూనిట్లను కాపాడుకోవడానికి లైట్నింగ్ అరెస్టర్‌లను కూడా బిగించారు" అని బంజేరుపల్లి ఎంపీటీసీ శాంత చెప్పారు. ప్రతి ఇంటి నుంచి డిపాజిట్‌గా రూ.8 వేలు ఒక్కో ఇంటికి సోలార్‌ ప్యానెళ్లు, బ్యాటరీలు, వైరింగ్‌ ఏర్పాటు చేయడానికి 85 వేల రూపాయలు ఖర్చయింది. ప్రతి ఇంటి నుంచి డిపాజిట్‌గా రూ.8 వేలు వసూలు చేశారు. మొత్తం వ్యయంలో 40 శాతాన్ని నాబార్డు సబ్సిడీగా అందించింది. "మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇచ్చారు. గ్రామస్థులు ఎవరి వాయిదాను వారు నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించేందుకు అంగీకరించారు" అని సిద్దిపేట జిల్లా నాబార్డ్ అధికారి గంటా రమేష్‌ కుమార్‌ వివరించారు. మా పల్లె కళ మారింది! 'సోలార్‌ గ్రామం'గా గుర్తింపు పొందిన తర్వాత మా ఊరు మారిపోయింది. వానా కాలంలో కరెంటు కోతలనేవే లేకుండా, అసలు కరెంటు పోయిందనే విషయం కూడా తెలియకుండా చాలా సంతోషంగా ఉంటున్నాం' అని గ్రామ ఉప సర్పంచ్‌ రాజయ్య చెప్పారు. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఓసారి బంజేరుపల్లిని సందర్శించారు. సంపూర్ణ సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో ఉన్న గ్రామం తన నియోజకవర్గంలో ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు చెల్లించాల్సిన వాయిదాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. "సోలార్ విలేజిగా గుర్తింపు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వందల మంది మా ఊరికి అధ్యయనం కోసం వస్తున్నారు" అని ఉప సర్పంచ్‌ రాజయ్య ఆనందంగా చెప్పారు. 'బిల్లులు తగ్గాయి' సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ‌ను అమర్చుకున్న తర్వాత తమ జీవనం మరింత మెరుగైందని, బిల్లుల మోత తగ్గిందని బంజేరుపల్లికి చెందిన గృహిణి లలిత తెలిపారు. గతంలో తాము నెలకు రూ.500 విద్యుత్‌ బిల్లు కట్టేవాళ్లమని, సౌర విద్యుత్‌ రాకతో నెలకు రూ.150 మాత్రమే బిల్లు కడుతున్నామని ఆమె చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బంజేరుపల్లి.. తెలంగాణలో చిన్న పల్లెటూరు. 120 గడపలు ఉంటాయి. సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ 'అస్తమించడు'! పగలంతా వెలుతురు ఇచ్చి, రాత్రయ్యే సరికి సోలార్‌ విద్యుత్‌ రూపంలో పల్లెలో విహరిస్తూ ఉంటాడు. text: మొక్క నాటుతున్న ట్రంప్, మాక్రాన్ గత వారం మాక్రాన్ అమెరికాను సందర్శించినపుడు వారిద్దరూ వైట్ హస్ ప్రాంగణంలో ఆ మొక్కను నాటారు. ఈ యూరోపియన్ సెసైల్ ఓక్ మొక్కను మొదటి ప్రపంచయుద్ధం జరిగిన ఈశాన్య ఫ్రాన్స్ నుంచి తీసుకువచ్చారు. పారిస్‌కు ఈశాన్య ప్రాంతంలో జరిగిన నాటి యుద్ధంలో 2 వేల మంది అమెరికా సైనికులు మరణించారు. అయితే నాటిన నాలుగు రోజులకే ఆ మొక్క మాయమైంది. వైట్ హౌస్‌లో మొక్క నాటిన ప్రదేశం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది శనివారం రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ మొక్క ఉన్న ప్రదేశాన్ని ఫొటో తీసినపుడు అక్కడ కేవలం పచ్చగడ్డి మాత్రమే కనిపించింది. ఈ మొక్క ఏమైపోయిందనే దానిపై వైట్ హౌస్ అధికారులు నోరు మెదపనప్పటికీ, ఆన్‌లైన్‌లో మాత్రం దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రెంచి రేడియో నెట్‌వర్క్ 'ఫ్రాన్స్‌ఇన్‌ఫో', వేసవిని తట్టుకోలేదనే అనుమానంతో దానిని తొలగించి ఉండవచ్చని, మళ్లీ దాన్ని అక్టోబర్‌లో తిరిగి నాటవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా కస్టమ్స్ చట్టాల ప్రకారం ఏవైనా విదేశీ మొక్కలను దేశంలోకి తెచ్చే ముందు వాటికి ఒక 'ఫొటోసానిటరీ సర్టిఫికేట్'ను సమర్పించాల్సి ఉంటుంది. అందువల్ల దానిని ప్రస్తుతానికి నర్సరీలో ఉంచారని ఫ్రాన్స్ అధికారి ఒకరు పేర్కొన్నట్లు 'హఫింగ్‌టన్ పోస్ట్' కథనం పేర్కొంది. మొత్తం మీద మాక్రన్ నాటిన మొక్క మాయం కావడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుకరించిన మొక్క మాయమైంది. text: ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్యాంకింగ్, బీమా రంగాల్లో, రెవెన్యూ, భూరికార్డుల వ్యవహారాల్లో పారదర్శకతను పెంచొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో ప్రాచుర్యంలోకి వచ్చిన వర్చువల్ కరెన్సీ 'క్రిప్టోకరెన్సీ' బ్లాక్‌చైన్ టెక్నాలజీతోనే పనిచేస్తుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీని పాలనా వ్యవహారాల్లోనూ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు ఎలా ఉపయోగించవచ్చో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(డబ్ల్యూసీఐటీ-2018)'లో జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి నిపుణులు పలువురు చర్చించారు. ప్రతీకాత్మక చిత్రం పత్రాన్ని రూపొందిస్తున్న నీతీ ఆయోగ్ పారదర్శకతతో వ్యాపార లావాదేవీలు చేసేందుకు, మోసాలు అరికట్టేందుకు ఈ పరిజ్ఞానం తోడ్పడుతుందని కెనడాకు చెందిన 'టాప్‌స్కాట్ గ్రూప్' ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈవో) డాన్ టాప్‌స్కాట్ అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే సమాచారాన్ని మార్చేందుకు ఆస్కారం ఉండదని ఆయన తెలిపారు. ఈ-పరిపాలన(e-governance)తో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఎలా అనుసంధానించొచ్చనే అంశంపై భారత్‌లో ఉన్నతస్థాయుల్లో చర్చ జరుగుతోంది. ఈ-పరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు ఉన్న మార్గాలపై నీతీ ఆయోగ్ ఒక పత్రాన్ని రూపొందించే పనిలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ డబ్ల్యూసీఐటీ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- బ్లాక్‌చైన్ టెక్నాలజీని సత్వరం అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. ''ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాలు మన జీవన విధానాన్ని, పని విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి'' అని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, కొన్ని ఇతర రాష్ట్రాలు బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఈ-పరిపాలనకు అనుసంధానించే ప్రయత్నాల్లో ఉన్నాయి. సమాచార భద్రత సులభం తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందుపరచడానికి, భూరికార్డులను డిజిటైజ్ చేయడానికి ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించే ప్రయత్నంలో ఉంది. ''బ్లాక్‌చైన్ టెక్నాలజీతో సమాచార భద్రత, ట్రాకింగ్ సులభం. భూరికార్డుల నిర్వహణలో ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉంది. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కొంత సమయం పడుతుంది'' అని భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం డైరెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. కేపీఎంజీ సంస్థ టెక్నాలజీ, బీపీఎం రంగ నేషనల్ హెడ్ అఖిలేష్ తుతేజ మాట్లాడుతూ- "బ్లాక్‌చైన్ టెక్నాలజీకి అంతర్లీన శక్తి చాలా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఎలా ఉపయోగించవచ్చనే కోణంలో ఆలోచిస్తోంది'' అని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మీకో, మీ స్నేహితులకో, మీకు తెలిసినవారికో ఏదో సమయంలో భూవివాదాలవల్ల ఇబ్బందులు ఎదురయ్యే ఉంటాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం- 'బ్లాక్‌చైన్ టెక్నాలజీ' ఇలాంటి వివాదాలకు పరిష్కారం చూపుతుందని నిపుణులు, అధికారులు భావిస్తున్నారు. text: వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నిందితులు తక్షణమే శిక్ష విధించాలంటూ కొందరు, ఎన్‌కౌంటర్ చేయాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా డిమాండ్లు కనిపిస్తున్నాయి. 'దిశ' నిందితులను జైలుకు తరలించే క్రమంలోనూ ప్రజలు భారీస్థాయిలో ఆందోళన నిర్వహించారు. నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రజల నుంచి ఇదే తరహా డిమాండ్‌లు వినిపించాయి. గుంటూరులో శ్రీలక్ష్మి హత్య ఘటన నుంచి హాజీపూర్ సీరియల్ మర్డర్‌ల వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనేక కేసుల్లోనూ ప్రజలు ఇదే విధంగా స్పందించారు. తక్షణం శిక్ష విధించాలని, ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, గతంలోనూ ఇదే తరహాలో సంచలనం సృష్టించిన కేసుల్లో దోషులుగా రుజువైన వారికి కోర్టులు ఎలాంటి శిక్ష విధించాయి? ఆ కేసుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? క్లాస్ రూంలోనే హత్య చేసిన మనోహర్ ఎక్కడ? 2004లో విజయవాడకు చెందిన ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని యెల్చూరి మనోహర్‌ క్లాస్‌రూంలోనే హత్య చేశాడు. తనను ప్రేమించలేదనే కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడు మనోహర్‌కు ఉరిశిక్ష విధించాలంటూ పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ట్రయల్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే, తీర్పుపై మనోహర్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. దీనిని సవాల్ చేస్తూ 2005లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. జస్టిస్ హర్జీత్ సింగ్ బేడీ, జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ చంద్రమౌళి ప్రసాద్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం మనోహర్‌కు హైకోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించింది. నిందితుడు శ్రీనివాస రెడ్డి హాజీపూర్ హత్యలు- ఇంకా విచారణలోనే ఇటీవల సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహాలో డిమాండ్‌లు వినిపించాయి. అతనికి మరణశిక్ష విధించాలంటూ ఆందోళనలు కూడా జరిగాయి. గ్రామస్తులు అతని ఇంటిని ధ్వంసం చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌కి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి లిఫ్టు మెకానిక్‌గా పనిచేసేవాడు. 2015 నుంచి 2019 వరకు నలుగురు మైనర్లపై అత్యాచారం చేసి, హత్యలు చేసినట్లు ఇతనిపై అభియోగాలు నమోదయ్యాయి. పోలీసులు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఉరి నుంచి యావజ్జీవం ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హోటల్‌లో పనిచేసే ప్రవీణ్‌ ఈ ఏడాది జూన్‌ 19న అర్ధరాత్రి హన్మకొండలోని కుమార్‌పల్లిలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి తర్వాత మరణించింది. ఈ కేసులో నిందితుడైన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ ఆందోళనలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఘటన జరిగిన 51 రోజుల వ్యవధిలోనే వరంగల్ కోర్టు తీర్పు వెలువడింది. దోషిగా తేలిన పోలేపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించింది. అయితే, దీనిపై ప్రవీణ్ తరఫు వ్యక్తులు హైకోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన హైకోర్టు నిందితుడికి విధించిన మరణశిక్షను జీవితకాల శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) షాద్‌నగర్‌ సమీపంలో పశు వైద్యురాలు దిశపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ వాదనలు వినిపిస్తున్నాయి. text: 2016లో ఫ్రాన్స్‌లోని లావెంటీ అనే చిన్న పల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటన భారత్-ఫ్రాన్స్ మైత్రికీ, మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల పాత్రకూ అద్దం పడుతోంది. ఇంతకీ విషయమేంటంటే.. గతేడాది లావెంటీలో ఓ కాలువను విస్తరించడానికి మట్టి తవ్వుతున్నప్పుడు రెండు అస్థిపంజరాలు కనిపించాయి. వాటిపైన ఉన్న దుస్తులూ, '39' అనే అంకె ఆధారంగా, ఆ అస్థిపంజరాలు భారత్‌కు చెందిన 39వ రాయల్ గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కి చెందిన సైనికులవని గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని భారత సైనికాధికారులకు అందజేశారు. ఇప్పటికీ భారత్‌లో ఆ రెజిమెంట్ పనిచేస్తుండటం విశేషం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, 1914-15లో 39వ రెజెమెంట్‌కు చెందిన తొలి రెండు బెటాలియన్లూ ఫ్రాన్స్‌లో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ సమయంలోనే ఆ ఇద్దరు సైనికులూ చనిపోయుంటారని అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఆ అస్థిపంజరాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని భారత సైనికాధికారులు నిర్ణయించారు. దాంతో 39వ రాయల్ గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కి చెందిన కొందరు సైనికులూ, అధికారులూ ఫ్రాన్స్‌కి బయల్దేరారు. అక్కడి లావెంటీ గ్రామంలోని లా గార్జ్ శ్మశాన వాటికలో ఆ సైనికుల అస్థిపంజరాలకు హిందూ మతాచారాల ప్రకారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు శవ పేటికలపై జాతీయ జెండాను పరిచారు. భారత్‌తో పాటు ఫ్రెంచ్ ఆర్మీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ కవాత్రా, స్థానిక మేయర్‌తో పాటు దాదాపు నూట యాభై మంది భారతీయులు ఆ సైనికులకు తుది వీడ్కోలు పలికారు. మా ఇతర కథనాలు మొదటి ప్రపంచ యుద్ధంలో పది లక్షలకుపైగా భారత సైనికులు బ్రిటన్ తరఫున పోరాడారు. వాళ్లలో అరవై వేల మందికి పైగా జవాన్లు ఫ్రాన్స్ లాంటి దేశాల్లో యుద్ధం చేస్తూ చనిపోయారు. భారతీయ సైనికుల త్యాగాలను చరిత్ర పుస్తకాలు మరచిపోయాయన్న విమర్శలున్నా, లావెంటీలో మాత్రం వాళ్ల పాత్రను ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకే అక్కడి శ్మశాన వాటికలో వారికి ప్రత్యేక స్థానం కల్పించడంతో పాటు సమీపంలోని నీవ్ చాపెల్ ప్రాంతంలో సైనికుల స్మారక చిహ్నాన్నీ ఏర్పాటు చేశారు. ఆ స్మారక చిహ్నంపైన బ్రిటీష్ సామ్రాజ్యం తరఫున యుద్ధం చేస్తూ చనిపోయిన ఎందరో భారతీయ సైనికుల పేర్లను చెక్కారు. ఏటా ఓ రోజున 'రిమెంబ్రెన్స్ సండే' పేరుతో నిర్వహించే ఓ కార్యక్రమంలో స్థానికులు సైనికులకు నివాళులర్పిస్తారు. 'మొదట్నుంచీ మేం ఇక్కడ లభించిన భారతీయ సైనికులందరి మృతదేహాల్నీ ఒకే చోట ఖననం చేస్తున్నాం. లావెంటీ శ్మశాన వాటికలో అయితే చాలామంది మంది భారతీయుల సమాధులు పక్కపక్కనే ఉన్నాయి' అంటారు కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్‌కు చెందిన లిజ్ స్వీట్. 1915 మార్చిలో ఉత్తర ఫ్రాన్స్‌లోని లిల్లే ప్రాంతంలో నీవ్ చాపెల్ యుద్ధం జరిగింది. అందులో పాల్గొన్న సేనల్లో సగం మంది భారతీయులే. ఆ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత సైనికుడు గబ్బర్ సింగ్ నేగీని బ్రిటన్ ప్రభుత్వం అత్యున్నత విక్టోరియా క్రాస్‌ అవార్డుతో సత్కరించింది. భారత సైన్యంలో అధికారిగా ఉన్న గబ్బర్ సింగ్ మనవడు దాన్ని స్వీకరించారు. నాటి యుద్ధంలో అమరులైన భారతీయ సైన్యాన్ని స్మరించుకునేందుకు ఏటా ఓ రోజు ఫ్రాన్స్‌లో నివశిస్తున్న వేలాది భారతీయులు నీవ్ చాపెల్‌లో భారత సైనికుల స్మారక చిహ్నం దగ్గరికి చేరుకుంటారు. తమ మూలాల్ని గుర్తు చేసుకోవడానికి ఫ్రాన్స్‌లోని భారతీయులకు ఇదో మంచి అవకాశం. మా ఇతర కథనాలు 'నీవ్ చాపెల్‌కి రావడం, సైనికులకు అంజలి ఘటించడం మాకో ప్రత్యేకమైన అనుభూతి. దాన్ని చూసినప్పుడల్లా అప్పట్లో ఇక్కడికొచ్చి పోరాడిన భారత సైనికులే గుర్తొస్తారు. ఓ చరిత్ర కళ్లముందు కనిపిస్తున్నట్లుగా తోస్తుంది' అంటారు రంజిత్ సింగ్. ఫ్రాన్స్‌లో స్థిరపడ్డ సిక్కుల్లో ఆయన ఒకరు. రంజిత్‌లాంటి ఎందరో భారతీయులు ఆ ఇద్దరు సైనికుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నాటి భారత సైనికుల పోరాటాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆ త్యాగాల తాలూకు జ్ఞాపకాల్ని ఎప్పటికీ మరచిపోకుండా ఉండేందుకు, ఆ సమాధుల దగ్గర్నుంచి కొంత మట్టిని సైన్యాధికారులు భారత్‌కు తీసుకురానున్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫ్రాన్స్‌లో వందేళ్లపాటు అనామకంగా భూమిలో మగ్గిపోయిన ఇద్దరు భారతీయుల అస్థిపంజరాలు ఇటీవలే బయటపడ్డాయి. వాటికి రెండు దేశాల సైనికుల వందనాల నడుమ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. text: రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, మ‌హ‌మూద్ అలీల‌తోపాటు దేవా‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ త‌దిత‌రులు స‌మావేశ‌మై ఈ నిర్ణయం తీసుకున్నారు. సామూహికంగా ప్ర‌జ‌లు పాల్గొనే ఎలాంటి మ‌త వేడుక‌లూ ఇప్పుడు నిర్వ‌హించొద్ద‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. కొన్ని రోజుల క్రితం‌ కేర‌ళ కూడా త్రిస్సూర్ పూరం వేడుక‌ల‌ను ర‌ద్దు చేసింది. ప్ర‌జ‌లు పెద్ద‌యెత్తున గుమిగూడే వేడుక‌ల్లో ఇది కూడా ఒక‌టి. "సామాజిక దూరం త‌ప్ప‌నిస‌రి" 1813వ సంవత్సర కాలంలో హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ప్లేగు విజృంభించింది. వేల మంది బ‌లి తీసుకుంది. ప్లేగును అదుపు చేయాలంటూ ఉజ్జ‌యినిలోని మ‌హంకాళి దేవాల‌యంలో హైద‌రాబాద్ నుంచి వెళ్లిన సైన్యం మొక్కుకుంది. ఆ దేవ‌తే ప్లేగును అదుపు చేసింద‌ని అప్ప‌ట్లో అంద‌రూ న‌మ్మేవారు. ఆమె పేరుతో గోల్కొండ కోట ప‌రిస‌రాల్లో మ‌హంకాళి ఆల‌యాన్నీ నిర్మించారు. ఇక్క‌డి నుంచే ఆషాఢ మాస తొలి ఆదివారంనాడు బోనాల జాత‌ర మొద‌ల‌వుతుంది. బోనాల ఉత్స‌వాలు 1813లో మొద‌ల‌య్యాయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వ వెబ్‌సైట్ చెబుతోంది. ప్ర‌భుత్వం సూచించిన విధంగా పూజారులు మాత్ర‌మే వేడుక‌లు నిర్వ‌హిస్తార‌ని, ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆల‌యానికి రావొద్ద‌ని మ‌హంకాళి ఆల‌య ఈవో అన్న‌పూర్ణ చెప్పారు. "ఆల‌యాలు తెర‌చేట‌ప్పుడు మాకు కొన్ని నిబంధ‌న‌లు పాటించ‌మ‌ని సూచించారు.. అంద‌రూ ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి. శానిటైజ‌ర్లు వాడాలి. మాస్క్‌లు పెట్టుకోవాలి. దేవాల‌యం లోప‌ల‌కు అడుగుపెట్టేవారికి థర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రిగా చేయాలని ప్ర‌భుత్వం సూచించింది. ఏ వేడుక‌లైనా వీటిని అనుస‌రించే నిర్వ‌హిస్తాం." "ప్ర‌జ‌లు ఇళ్ల‌లో, ఆల‌యం లోప‌ల వేడుక‌లు ఎలా నిర్వ‌హించాలి అనే విష‌యంలో ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు ఇస్తుంది. నాలుగైదు రోజుల్లో ప్ర‌భుత్వం వీటిపై ప్ర‌క‌ట‌న చేస్తుంది"అని ఆమె అన్నారు. "ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదు" 200 ఏళ్ల‌కుపైనే చ‌రిత్ర ఉన్నట్లు చెబుతున్న ఈ వేడుక‌లను ఇలా నిర్వ‌హించ‌డం బ‌హుశా ఇదే తొలిసార‌ని రేణుకా ఎల్లమ్మ దేవాల‌య అర్చ‌కులు శ్ర‌వ‌ణకుమారాచా‌ర్యులు తెలిపారు. "1970ల్లో అత్య‌యిక ప‌రిస్థితి విధించిన‌ప్పుడు కూడా బోనాలు కొన‌సాగాయి. ఎప్పుడూ ఈ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌లేదు. కొన్నిసార్లు అంత ఘ‌నంగా జ‌ర‌గ‌క‌పోయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ లేదు." "ప్లేగు లాంటి వ్యాధుల్ని నియంత్రించ‌డంతోపాటు భ‌క్తుల కోరిక‌ల‌ను నెర‌వేరుస్తున్నందుకు అమ్మ‌వారికి కృతజ్ఞతగా ఈ వేడుక‌లు నిర్వ‌హిస్తాం. అయితే జ‌బ్బులే ఉత్స‌వాలు జ‌రుపుకోకుండా అడ్డుప‌డుతున్నాయి." "భోనం అంటే భోజ‌నం. మ‌న‌సులో అమ్మ‌వారిని త‌ల‌చుకొని కొంద‌రు ఇంట్లో దేవుడి ప‌టం ముందు భోజ‌నం పెడుతుంటారు. మ‌రికొంద‌రు ఆరుబ‌య‌ట సూర్య భ‌గ‌వానుడి ద‌గ్గ‌ర భోజ‌నం పెడ‌తారు. మైస‌మ్మ‌, పోచ‌మ్మ‌, ఎల్ల‌మ్మ‌, డొక్క‌ల‌మ్మ‌, పెద్ద‌మ్మ‌, పోలేర‌మ్మ‌.. ఇలా అమ్మ‌వార్ల‌లో ఎవ‌రో ఒక‌ర్ని మ‌న‌సులో త‌ల‌చుకొని భోజ‌నం పెడితే స‌రిపోతుంది." పోతురాజు గ్రామదేవతకు సోదరుడని స్థానికుల నమ్మకం "ఎవ‌రూ పిల‌వ‌ట్లేదు" బోనాల ఉత్స‌వం ప్ర‌త్యేక‌త‌ల్లో పోతురాజుల వీరంగం ఒక‌టి. పోతురాజు గ్రామదేవతకు సోదరుడని స్థానికుల నమ్మకం. పోతురాజుకు సంబంధించిన పద్దతులు గ్రామాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. మ‌హంకాళి దేవాల‌యం ద‌గ్గ‌ర పోతురాజు వేషం వేసేవారిలో దేవ‌ర‌కొండ యాద‌గిరి కూడా ఒక‌రు. యాద‌గిరికి సెలూన్ షాప్ ఉంది. బోనాలు జరిగే నెల‌లో ఆయ‌న పూర్తిగా సెల‌వు పెడ‌తారు. తమ ప్రాంతంలో లేదా తమ కుటుంబం చేసే ఉత్సవంలో పోతురాజు ఉండాలనుకున్న వాళ్లు పోతురాజులను ముందుగా సంప్రదించి, డబ్బు, తేదీలు మాట్లాడుకుని బుక్ చేసుకుంటారు. అయితే ఈ సారి పోతురాజు వేషం కోసం త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారు క‌రువ‌య్యార‌ని ఆయ‌న చెప్పారు. "బోనాల‌కు నెల రోజుల‌ ముందే పోతురాజు కోసం దాదాపు 50 నుంచి 60 మంది నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంటారు. ఈ సారి ఎవ‌రూ ఫోన్ కూడా చేయ‌లేదు. ఇప్పుడు ఇంట్లోనే బోనాలు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించిన త‌‌ర్వాత అడిగేవారు కూడా లేరు"అని ఆయ‌న అన్నారు. బోనాలు రోజు కోడి లేదా మేకను అమ్మవారికి బలిగా నోటితో స‌మ‌ర్పిస్తారు. దీన్నే గావు పట్టడం అంటారు. యాద‌గిరి మూడేళ్ల నుంచి గావు పడుతున్నారు. అయితే ఈ సారి గావు కోసం కూడా ఎవ‌రూ త‌న‌ను సంప్ర‌దించ‌లేద‌ని యాద‌గిరి చెప్పారు. బోనాల సందర్భంగా స్వర్ణలత "రంగం" చెప్పడం ఆనవాయితీ రంగం ఉంటుందా? బోనాల సందర్భంగా స్వర్ణలత "రంగం" చెప్పడం ఆనవాయితీ. కుండ‌పై నిల‌బ‌డి ఆమె చెప్పే మాట‌ల‌ను భవిష్యవాణిగా భక్తులు విశ్వసిస్తారు. బోనాల ఉత్స‌వం చివ‌రి రోజు సికింద్రాబాద్‌లోని మ‌హంకాళి ఆల‌యం ద‌గ్గ‌ర ఏటా స్వ‌ర్ణ‌ల‌త రంగం ఉంటుంది. ఆ స‌మ‌యంలో భ‌క్తులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స్వ‌ర్ణ‌ల‌త స‌మాధానం ఇస్తారు. వ‌ర్షాలు, వ్య‌వ‌సాయం, వ్యాధులు.. ఇలా చాలా విష‌యాల‌పై ఆమెను భ‌క్తులు ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు. ఈ సారి మ‌హంకాళి ఆల‌యం ద‌గ్గ‌ర స్వ‌ర్ణ‌ల‌త వీరంగం చెబుతారా? లేదా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త‌లేదు. "ఈ ఏడాది రంగం ఉంటుందా? లేదా అనే విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌మా‌చారం లేదు. ఇంకా ఉత్స‌వానికి ప‌ది రోజుల‌కుపైనే స‌మ‌యం ఉంది. ఈ విష‌యంపై త్వ‌ర‌లో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది" అని మ‌హంకాళి ఆల‌య ఈవో చెప్పారు. భారత్‌లో కరోనావైరస్ కేసులు ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఏటా వైభ‌వంగా నిర్వ‌హించే బోనాల వేడుక‌ల్ని అంద‌రూ ఇంటిలోనే నిర్వ‌హించుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సూచించింది. క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న న‌డుమ ప్ర‌జ‌లు ఆల‌యాల‌కు రావొద్ద‌ని వివ‌రించింది. text: ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం నాంపల్లిలోని డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్టేట్‌ మ్యూజియంలో ఉన్న బుద్ధుడి ధాతువును ఆంధ్రప్రదేశ్‌లోని మ్యూజియంకు తరలించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరావులు నిర్ణయించిన నేపథ్యంలో, చారిత్రక సంపద పంపకం కూడా జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు చారిత్రక వస్తువులు ఏమేం ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సినవి జాబితా రూపొందిస్తున్నారు. చరిత్రకారులు డాక్టర్‌ రాజారెడ్డి చైర్మన్‌గా ఏర్పడ్డ కమిటీ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ లభించిన వస్తువులు అక్కడే పద్ధతిలో చారిత్రక సంపదను బట్వాడా చేసే దిశగా ఈ కసరత్తు జరుగుతోంది. విశాఖపట్నం శివారులోని బావికొండగుట్టపై 1980లలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధస్తూపం వెలుగు చూసింది. చివరకు అది మహా చైత్యం, బౌద్ధ విహారంగా గుర్తించారు. స్తూపానికి నాలుగువైపులా ప్రత్యేక పాత్రలు వెలుగుచూశాయి. అందులో దక్షిణ దిక్కు చిన్నపాటి రాతి స్తూపం, దాని కింద లభించిన మట్టిపాత్రలో బుద్ధుడి ధాతువు ఉన్నాయి. పాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్నచిన్న వస్తువులతోపాటు మరో పాత్రలో బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక ఉన్నాయి. అది బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు పేర్కొన్నారు. దానిని అత్యంత విలువైన సంపదగా గుర్తించి, వెంటనే హైదరాబాద్‌ మ్యూజియంలో భద్రపరిచారు. 2004 ప్రాంతంలో దలైలామా సమక్షంలో వాటిని సందర్శనకు ఉంచారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ తరహా గాజు ఫ్రేమ్‌లోపల వాటిని ఉంచారు. ఇప్పుడు బౌద్ధులకు అది పూజనీయ ప్రాంతం. బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన ఆస్తికలు, చితా భస్మాన్ని ఎనిమిది భాగాలు చేసి వివిధ ప్రాంతాల్లో ఉంచి స్తూపాలు నిర్మించారు. అనంతరం అశోక చక్రవర్తి అస్థికలు, చితాభస్మాన్ని వెలికి తీయించి 84 వేల భాగాలు చేసి తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారని చరిత్ర చెబుతోంది. అలా వచ్చిన ఓ భాగమే ఈ ధాతువు కావటం విశేషం. తెలుగింట జనాభా సంక్షోభం.. తగ్గనున్న యుక్తవయస్కులు తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయని.. పని చేయగలిగే యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరగనుందని ఆర్థిక సర్వే చెప్తున్నట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో 2018-19 ఏడాది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2041 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధి రేటు సున్నాకు చేరనునట్లు సదరు సర్వే వెల్లడించింది. వచ్చే 2 దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యుక్తవయస్కుల సంఖ్య 10 శాతం తగ్గిపోయి 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో జనాభా వృద్ధిరేటు తగ్గనుందని చెబుతోంది. దేశవ్యాప్తంగా 5- 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో బడికి వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో 40% ప్రాథమిక పాఠశాలల్లో 50%కంటే తక్కువ పిల్లలున్నారు. 2015-16 నుంచి 2018-19 మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పురోగమనంలో సాగింది. భేటీ బచావో- భేటీ పఢావో కార్యక్రమం పెద్ద రాష్ట్రాలపై మంచి ప్రభావాన్ని చూపింది. లింగనిష్పత్తి 980కి మించి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చేరాయి. 2015-16 నాటికి ఏపీలో ఈ నిష్పత్తి 873 లోపు ఉంది. ఇకపై తెలుగులోనూ బ్యాంకు పరీక్షలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు (స్కేల్‌-1), అసిస్టెంట్ల నియామకం నిమిత్తం జరిగే పోటీ పరీక్షలను ఇకమీదట తెలుగులోనూ నిర్వహిస్తారని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. హిందీ, ఇంగ్లిషులతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా ఆర్‌ఆర్‌బీ (రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌) పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో చెప్పారు. అస్సామీ, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో వీటిని నిర్వహిస్తామని ఆర్థికసర్వే ప్రవేశపెడుతూ నిర్మల తెలిపారు. దేశంలో మద్యం ప్రియులు 16 కోట్ల మందికి పైనే దేశంలో 16 కోట్లకు పైగా ప్రజలు మద్యాన్ని తాగుతున్నారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. గురువారం బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సమాధానమిచ్చారు. దేశంలో గంజాయికి 3.1 కోట్ల మంది, డ్రగ్స్‌కు 77 లక్షల మంది అలవాటు పడ్డారని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బౌద్దులు అత్యంత పవిత్రంగా భావించే బుద్ధుడి చితాభస్మం.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిపోతున్ననదని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. text: అయితే, కోర్టు ముందు ఆ బాలిక తనపై ఎవరి బలవంతమూ లేదని, తాను ఇష్టపూర్వకంగానే మతం మారినట్లు చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లైంది. మరోవైపు బాలిక తండ్రి మాత్రం తన కుమార్తెను కొందరు ఎత్తుకువెళ్లి, బలవంతంగా మతం మార్చారని ఆరోపిస్తున్నారు. ఉత్తర సింధ్ ప్రాంతంలో కాశ్మోర్ కంధ్‌కోట్‌లోని తంగ్వానీ తహసీల్ సివిల్ కోర్టు ముందు బుధవారం హాజరైన ఆ బాలిక వాంగ్మూలం ఇచ్చింది. తన ఇష్టపూర్వకంగానే భార్చోండీ దర్గాకు వెళ్లి మతం మార్చుకున్నానని, తన పేరును కూడా ఉమ్మే హీనాగా మార్చుకున్నానని ఆ బాలిక చెప్పింది. మతం మార్చుకోమని తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని ఆమె తెలిపింది. అయితే, బాలికకు ఇంకా మైనార్టీ తీరలేదని బాలిక తల్లిదండ్రుల తరఫు న్యాయవాది అబ్దుల్ గనీ కోర్టుకు తెలియజేశారు. బాలికపై అత్యాచారం జరిగిందా, లేదా అన్నది నిర్ధారించేందుకు ఓ మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సింధు ప్రావిన్సులో 18 ఏళ్లలోపు వారు పెళ్లి చేసుకోవడంపై నిషేధం ఉంది. ఒకవేళ 18 ఏళ్ల లోపు వారు పెళ్లి చేసుకున్నా, అలా చేసుకునేవారికి సహకరించినా వారిపై కేసు నమోదు చేయొచ్చు. బాల్య వివాహాల నిరోధక చట్టం నిబంధనల కారణంగా ఆ బాలికకు వివాహ ధ్రువీకరణ పత్రం రాలేదని, అందుకే తాము మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరామని అబ్దుల్ గనీ అన్నారు. మైనర్లను అపహరించడం ‘ఉగ్రవాద నిరోధక చట్టం’లోని సెక్షన్ 364 కిందకు వస్తుందని, అందుకే ‘ఉగ్రవాద నిరోధక కోర్టు’కు ఈ కేసును బదిలీ చేయాలని కోరామని కూడా ఆయన చెప్పారు. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి ముందు ఆ బాలిక తన తల్లిదండ్రులతో ఏకాంతంగా మాట్లాడిందని భర్చోండీ పీర్ తరఫు న్యాయవాది సయీద్ అహ్మద్ చెప్పారు. భర్చోండీకి వెళ్లి, తనకు ఇస్లామిక్ విద్యను అభ్యసించాలని ఉందని ఆ బాలిక చెప్పిందని ఆయన అన్నారు. ఆ బాలికను ఆమె కోరిక ప్రకారం భర్చోండీకి పంపించాలని కోర్టును తాము కోరినట్లు సయీద్ వివరించారు. అయితే, కోర్టు మాత్రం ఈ కేసులో పోలీసుల విచారణ పూర్తయ్యే వరకు బాలికను బాలల సంరక్షణ కేంద్రంలోనే ఉంచాలని ఆదేశించింది. ‘తెల్ల కారులో వచ్చి కిడ్నాప్’ మార్చి 9న సాయంత్రం నాలుగు గంటలకు ఆ బాలిక అపహరణకు గురైందంటూ ఆమె తండ్రి తఖ్త్ మల్... తంగ్వానీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెల్ల కారు తమ ఇంటి ముందు వచ్చి ఆగిందని... ఆ కారులో ముశ్తాక్, భోరల్ అనే వ్యక్తులతోపాటు మొత్తంగా ఐదుగురు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారు తుపాకీతో అందరినీ బెదిరించారని, తమ కూతురికి ముశ్తాక్‌తో పెళ్లి చేయబోతున్నట్లు చెప్పారని ఆయన ఫిర్యాదులో వివరించారు. తన కూతురిని బలవంతంగా పెళ్లి చేసుకునేందుకే ఆ అపహరణ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు నమోదైన తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో భర్చోండీ పీర్‌ ఓ మంచంపై కూర్చొని ఉండగా, సదరు బాలిక నేలపై కూర్చొని కనిపించింది. చుట్టూ జనం నిల్చొని ఉన్నారు. వారంతా మగవాళ్లే. పీర్ మతపరమైన వచనాలను చదువుతుంటే, ఆ బాలిక చాలా చిన్న గొంతుతో తిరిగి వాటిని పలుకుతూ ఉంది. ఆ తర్వాత పీర్ ఆ బాలిక చుట్టూ కరెన్సీ నోట్లను తిప్పి, తన అనుచరులకు ఇచ్చారు. మంగళవారం ఆ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఆమెను భర్చోండీ పీర్ అనుచరులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, ఆమె తల్లిదండ్రులు లేని కారణంగా కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆ బాలికను శిథిలావస్థలో ఉన్న ఓ సేఫ్ హౌజ్‌లో ఉంచారు. భర్చోండీ దర్గాకు వచ్చే భక్తులు అక్కడ ఉండటం, ఆ బాలికకు భోజనం ఇస్తుండటం వంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలిక తల్లిదండ్రులు ఆమెను కలిసేందుకు అక్కడి వెళ్లినా, వారిని అందుకు అనుమతించలేదని వార్తలు వచ్చాయి. ఈ వీడియోలన్నింటిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ బాలికను బలవంతంగా మతం మార్చారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు సుఖ్‌దేవ్ ఆరోపించారు. ఈ విషయంపై తాను స్వయంగా దృష్టి సారించానని, రాష్ట్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి శేహలా రజాతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. కంధ్‌కోట్‌లోని హిందూ వర్గంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా బాలిక అపహరణ, బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయమైన తర్వాత, మూడు రోజుల క్రితం ఆ బాలిక ఇంటికి నిప్పు అంటుకుంది. రాత్రి రెండు గంటల సమయంలో నలుగురు వచ్చి తమను బెదిరించారని, బాలిక తండ్రిని ఈ విషయమై మీడియాతో మాట్లాడొద్దని హెచ్చరించారని బాలికకు సోదరుడి వరుసయ్యే శహ్జాద్ బీబీసీతో చెప్పారు. అక్కడున్న ఎండు గడ్డికి వాళ్లు నిప్పుపెట్టారని, దీంతో ఇంటికి కూడా మంటలు వ్యాపించాయని చెప్పారు. బాలిక తండ్రి టీ, బిస్కెట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారు ఉన్నది కూడా అద్దె ఇల్లేనని వివరించారు. ఈ ఘటన తర్వాత అక్కడ పోలీసులు ఓ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సులో 13 ఏళ్ల హిందూ బాలికను బలవంతంగా మతం మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆ బాలికను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించమని స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. text: కిరణ్ పటేల్ దంపతులు ఈ డబ్బుతో ఫ్లోరిడాలో ఒకటి, భారతదేశంలో మరొక మెడికల్ కాలేజీలను నిర్మిస్తారు. పటేల్ జాంబియాలో పెరిగారు. తెల్లవాళ్లు కాని వాళ్ల కోసం నిర్వహించే పాఠశాలలో చదువుకోవడానికి 80 కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. భారత్‌లో వైద్య విద్యను అభ్యసించి తన భార్యతో పాటు 1976లో అమెరికా చేరుకున్నారు. కార్డియాలజిస్ట్ అయిన పటేల్ కొంత కాలం తర్వాత, కొంతమంది ఫిజీషియన్లతో కలిసి ఒక నెట్‌వర్క్‌ను నెలకొల్పారు. 1992లో దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న ఆరోగ్య బీమా కంపెనీని స్వాధీనం చేసుకోవడంతో ఆయన దశ తిరిగింది. పదేళ్ల తర్వాత పటేల్ ఆ కంపెనీని విక్రయించినపుడు దానిలో 4 లక్షల మంది సభ్యులున్నారు. దాని వల్ల ఆయనకు రూ.65 వేల కోట్ల లాభం వచ్చింది. వ్యాపారం విషయంలో తాను చాలా దూకుడుగా ఉంటానని పటేల్ చెబుతారు. తాను యాక్సిలరేటర్ అయితే తన భార్య తనకు బ్రేకులు వేస్తుందని సరదాగా చెబుతారు. "అదృష్టదేవత తలుపు తట్టినపుడు, ముఖం కడుక్కోవడానికి పరిగెత్తొద్దు" అనే గుజరాతీ సామెతను ఆయన విశ్వసిస్తారు. రుణం తీర్చుకుంటున్న భారతీయ అమెరికన్లు ఇటీవల చాలా మంది భారతీయ అమెరికన్లు తమ సంపదను గుళ్లు, గోపురాలకు దానం చేయడానికి బదులుగా స్వదేశంలో, అమెరికాలో సమాజానికి ఉపయోగపడే కార్యాలకు వినియోగిస్తున్నారు. 2015లో న్యూయార్క్‌కు చెందిన చంద్రిక, రంజన్ టాండన్‌లు న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు రూ.650 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను ధనవంతుడిని కాకపోయినా ఉన్నదానిలో సాయం చేయడమన్నది తన తండ్రి నుంచి వచ్చిన గుణమని పటేల్ తెలిపారు. గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఆయన 50 పడకల ఆసుపత్రి కట్టించారు. తాను ఫ్లోరిడా యూనివర్సిటీకి ఇచ్చిన ఆర్థికసాయంతో భారతీయ వైద్య విద్యార్థులు చాలా లాభం పొందుతారని పటేల్ అభిప్రాయపడుతున్నారు. ఎవరి జీవితాన్ని వారే నిర్మించుకోవాలి విలాసాలపై ఖర్చు చేయడమంటే పటేల్‌కు ఆనందం. గత ఐదేళ్లలో ఆయన నాలుగు ప్రైవేట్ జెట్ విమానాలను కొనుగోలు చేశారు. ఫ్లోరిడాలోని తంపా పట్టణంలో ఆయన 40 బెడ్‌రూంల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. దానికి అవసరమైన రాళ్లను మొత్తం భారత్ నుంచి దిగుమతి చేసుకున్నారు. సంపద ఉన్నపుడు ఖర్చు చేయడంలో తప్పేమిటని ఆయన విమర్శలను తిప్పికొడతారు. ఒకరోజు ఆయన కుమారుడు తొమ్మిదేళ్ల సిలాన్ "నాన్నా! మనం ధనవంతులమా?" అని ప్రశ్నించాడు. "నువ్వు కాదు, నేను" - ఇదీ.. కుమారుడికి ఆయన ఇచ్చిన సమాధానం. ఎవరి జీవితాన్ని వారే నిర్మించుకోవాలన్నది ఆయన తత్వం. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలో కోట్లకు పడగెత్తిన భారతీయ అమెరికన్లు దాతృత్వంలోనూ ముందుంటున్నారు. ఆ వరుసలోనే డాక్టర్ కిరణ్ పటేల్ రూ.1300 కోట్లు ఫ్లోరిడా యూనివర్సిటీకి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకోవడం సంచలనం సృష్టించింది. text: ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 411 ప్రకారం స్వదేశీ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్‌) మూడు బాటిళ్లు, విదేశీ మద్యం మూడు బాటిళ్లు, 650 ఎం.ఎల్‌ 6 బీరు సీసాలు, 2 లీటర్ల కల్లు అనుమతి లేకుండా ఓ వ్యక్తి కలిగి ఉండేందుకు అవకాశం ఉందని గుర్తు చేసింది. పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలోకి మద్యం తీసుకొస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పింది. రంపచోడవరం పోలీసులు... కె. శ్రీనివాసులు మరో నలుగురిపై నమోదు చేసిన కేసును రద్దు చేసింది. వారి వాహనాన్ని తక్షణం విడిచిపెట్టాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. మద్యం రవాణా చేస్తున్నారనే కారణంతో రంపచోడవరం, జగ్గయ్యపేట పోలీసులు ఏపీ ఎక్సైజ్‌ సవరణ చట్టం-2020లోని సెక్షన్‌ 34(ఏ) ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇకపై లైసెన్స్‌ పునరుద్ధరణ ఆన్‌లైన్‌లోనే తెలంగాణ రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారని సాక్షి తెలిపింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ, లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్‌ (హజార్డస్‌ లైసెన్స్‌) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్‌ లైసెన్స్‌ పొందటం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్‌ లైసెన్స్‌ జారీ తదితర ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌ 24న, డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్, పాత లైసెన్స్‌ కార్డు స్థానంలో స్మార్ట్‌కార్డు పొందటం, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. శ్రీశైలం పవర్‌హౌ‌స్‌లో మళ్లీ షార్ట్‌సర్క్యూట్‌ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. ఈనెల 10 నుంచి పవర్‌హౌ్‌సలోని ఒకటి, రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన చేయాలనే లక్ష్యంతో పవర్‌హౌ్‌సలో యుద్ధప్రాతిపదికన టెంపరరీ లైటింగ్‌ వ్యవస్థ, జనరేటర్లు, మోటార్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో సామగ్రిని పంపించే డీసీఎం వాహనం జల విద్యుత్‌ కేంద్రం ప్రధాన ద్వారానికి 50 అడుగుల దూరంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్దకు చేరుకోగానే టెంపరరీ విద్యుత్‌ లైటింగ్‌ వ్యవస్థను పునరుద్ధరించడానికి వేసిన కేబుల్‌లో షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడింది. అప్రమత్తమైన జెన్‌కో సిబ్బంది వెంటనే అత్యవసర ద్వారం గుండా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒక రకంగా ఈ ఘటన మాక్‌ డ్రిల్‌కు దోహదపడిందని జెన్‌కో ఉన్నతాధికారులు అంటున్నారు. తెలంగాణ ఖైదీలు.. మంచి పనోళ్లు! ఖైదీల సంక్షేమం, వారిలో సత్ప్రవర్తన తేవడంలో భాగంగా వృత్తిపరమైన శిక్షణ, ఉపాధి కల్పనలో తెలంగాణ జైళ్లశాఖ దేశంలో అగ్రస్థానంలో ఉందని నమస్తే తెలంగాణ తెలిపింది. ఎన్సీఆర్బీ (నేషనల్‌ క్రైం రికార్డ్సు బ్యూరో)-2019 నివేదిక ప్రకారం.. తెలంగాణ జైళ్లలోని ఖైదీలు రూ.599.89 కోట్ల విలువైన ఉత్పత్తుల తయారు చేశారు. రూ.72 కోట్ల ఉత్పత్తులతో తమిళనాడు రెండోస్థానంలో, రూ.29 కోట్ల ఉత్పత్తులతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి. ఒక్కో ఖైదీ ఏడాదిలో తయారుచేసిన వస్తువుల విలువపరంగా కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో ఒక్కో ఖైదీ రూ.8,93,093 విలువైన వస్తువులు తయారుచేయగా, తమిళనాడు ఖైదీలు ఒక్కొక్కరు రూ.49,611 విలువైన వస్తువులు చేశారు. తర్వాత స్థానంలో ఉన్న చండీగఢ్‌లో రూ.41,478 విలువైన వస్తువులు తయారు చేశారు. తెలంగాణలో ఖైదీలు తయారు చేస్తున్న వివిధ రకాల వస్తువులను మైనేషన్‌ బ్రాండ్‌ పేరిట జైళ్లశాఖ నేరుగా విక్రయిస్తుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వీరు తయారుచేసే మాస్క్‌లు, శానిటైజర్లకు మంచి గిరాకీ ఉంది. 2018లోనూ తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఖైదీలు చేసిన ఉత్పత్తులకు రూ.495.86 కోట్లు ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో పనిచేస్తున్న ఖైదీల్లో నైపుణ్యం ఉన్నవారికి రోజుకు సరాసరి కూలి రూ.103.19 ఇస్తున్నారు. కొంతమేర పని తెలిసినవారికి రూ.89.54, పని నేర్చుకుంటున్నవారికి రూ.80.06 ఇస్తున్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెలుపల లేదా లోపల కొనుగోలు చేసిన మూడు మద్యం బాటిళ్లు ఓ వ్యక్తి కలిగి ఉండటం... ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన మూడు బాటిళ్లను రాష్ట్రంలోకి తీసుకురావడం నేరం కాదని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది. text: అజర్బైజాన్ ట్యాంకుల మీద దాడి దృశ్యాలు అంటూ ఆర్మేనియా పలు ఫొటోలు విడుదల చేసింది అజర్బైజాన్ జరిపిన వాయు, ఫిరంగి దాడుల్లో అర్మేనియా హెలికాఫ్టర్లు, ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఆరోపిస్తూ.. దేశంలో సైనిక శాసనం (మార్షలా లావ్) అమలులోకి తెచ్చినట్లు అర్మేనియా ప్రకటించింది. అయితే అజర్బైజాన్ షెల్లింగ్‌కు ప్రతిస్పందనగా ఎదురు దాడికి దిగినట్లు అజర్బైజాన్ చెప్పింది. ఈ ప్రాంతం అంతర్జాతీయంగా అజర్బైజాన్‌లో భాగంగా గుర్తించినప్పటికీ స్థానికంగా అర్మేనియన్ల నియంత్రణలో ఉంది. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో అంతర్భాగమైన అర్మేనియా, అజర్బైజాన్ ప్రాంతాలు సాంస్కృతిక, మతపరమైన విభేదాల కారణంగా రెండు దేశాలుగా విడిపోయాయి. ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో అజర్బైజాన్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో సైనిక శాశనాన్ని అమలుపరిచినట్టు ప్రకటించారు. అనుమానాస్పద స్థితిలో జపాన్ నటి యూకో తకెయుచి మరణం ఉత్తమ నటిగా అనేక అవార్డులందుకున్న యూకో తకెయుచి తన సొంత ఇంట్లో శవమై కనిపించారు. ఆమె వయసు 40 సంవత్సరాలు. తకెయుచి భర్త, స్వయంగా నటుడు అయిన తైకి నకబయషి, అచేతనంగా ఉన్న తన భార్యను ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆమె చనిపోయినట్లు నిర్థారించారు. ఇది ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవాలు నిర్థారించేందుకు దర్యాప్తు మొదలుపెట్టారని మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన తకెయుచి జపాన్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అనేక సీరియళ్లనూ, సినిమాల్లోనూ నటించారు. ఉత్తమ నటిగా అనేక బహుమతులు గెలుచుకున్నారు. 2018 లో హెచ్‌బీఓ చానల్లో ప్రసారమైన మిస్ షెర్లాక్ సీరీస్‌లో మహిళా షెర్లాక్ హోమ్స్‌గా నటించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 నుంచి 2007 వరకూ వరుసగా మూడేళ్లు ఉత్తమనటిగా జపనీస్ అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు. తకెయుచి మరణం ఆత్మహత్యగా ఇంకా నిర్థారణ కానప్పటికీ, ఇటీవల కాలంలో పలువురు ప్రతిభావంతులైన జపాన్ నటులు ఆత్మహత్య చేసుకోవడం ఒక విషాదం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యలు నమోదైన దేశాల్లో జపాన్ ఒకటి. అయితే 2015 తరువాత నివారణా చర్యలు చేపట్టిన అనంతరం ఈ సంఖ్య బాగా తగ్గిందని రిపోర్టులు తెలుపుతున్నాయి. రోజ్ గార్డెన్ వేదికగా మాట్లాడుతూ జడ్జి అమీని సుప్రీంకోర్టుకు నామినేట్ చేస్తున్న ట్రంప్ అమీ కోనీ బారెట్‌ను సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్‌గా అమీ కోనీ బారెట్‌ను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. వైట్‌హౌస్ రోజ్ గార్డెన్‌లో మాట్లాడిన ఆయన.. అమీని నిరుపమాన సాధకురాలిగా అభివర్ణించారు. ఆమె ఎంపికను సెనేటర్లు ఆమోదిస్తే ఇటీవల మరణించిన రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ స్థానంలో ఆమె నియమితులవుతారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమీ నామినేషన్‌ ధ్రువీకరణపై సెనేట్లో వాడివేడి చర్చ జరగొచ్చు. అమీ కోనీ బారెట్ కాగా అమెరికా ప్రజలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఈమె నియామకంపై నిర్ణయం తీసుకోవద్దని డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సెనేట్‌ను కోరారు. ''న్యాయస్థానంలో ఎవరు పనిచేయాలనే విషయంలో వోటర్ల గొంతు వినడానికి అమెరికా రాజ్యాంగం అవకాశం ఇస్తుంది. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు వారి గొంతు వినిపించాలి'' అని బైడెన్ అన్నారు. అమీ నియమితులైతే అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో కన్జర్వేటివ్‌ల అనుకూల జస్టిస్‌ల ఆధిక్యం 6-3కి పెరుగుతుంది. నలభై ఎనిమిదేళ్ల అమీ నియమితులైతే ట్రంప్ హయాంలో నియమితులైన మూడో జడ్జి అవుతారు. ఇంతకుముందు 2017లో నీల్ గోర్షూ, 2018లో బ్రెట్ కవానాలను ట్రంప్ నియమించారు. అమెరికా సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తులు జీవితకాలం సేవలందిస్తారు. తుపాకులు, ఓటింగ్ హక్కులు, అబార్షన్, ప్రచార నిధులు వంటి సకల అంశాలపైనా వారిచ్చే తీర్పులు ప్రభుత్వ విధానాలకు మార్గమేస్తాయి. తమను నియమించిన అధ్యక్షుల పదవీకాలం పూర్తయి కార్యాలయాన్ని వదిలి వెళ్లిన తరువాత కూడా వీరి సేవలు కొనసాగుతుంటాయి. అమీ కోనీ బారెట్ ఇంతకీ అమీ కోనీ బారెట్ ఎవరు.. ఆమెను ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారు? ఇండియానాలోని నోట్ర డామ్ యూనివర్సిటీ లా స్కూల్‌లో చదువుకున్న తరువాత అమీ జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా వద్ద పనిచేశారు. 2017లో ట్రంప్ ఆమెను షికాగో‌లోని సెవన్త్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు నామినేట్ చేశారు. 2013లో ఒక మ్యాగజీన్‌లో వచ్చిన కథనం ప్రకారం ఆమె క్యాథలిక్ విశ్వాసాలు ఆచరించే ఆమె 'జీవితం గర్భస్థ దశ నుంచే మొదలవుతుంది'' అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆమె మత సంప్రదాయవాదులకు ఇష్టురాలిగా మారారు. దేశవ్యాప్తంగా అబార్షన్లను చట్టబద్ధం చేయాలన్న 1973 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మార్చాలని మత సంప్రదాయవాదులు కోరుతున్నారు. అయితే, ఎల్‌జీబీటీ వర్గాలు మాత్రం ఆమెను వ్యతిరేకిస్తున్నాయి. వివాహితులైన ఆడామగా మధ్య మాత్రమే లైంగిక సంబంధం ఉండాలని బోధించే స్కూల్ నెట్‌వర్క్స్ కలిగి ఉన్న 'పీపుల్ ఆఫ్ ప్రైజ్' అనే సంప్రదాయ క్యాథలిక్ గ్రూపులో ఆమె సభ్యురాలు కావడాన్ని తప్పుపడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన ఇమిగ్రేషన్ విధానాలకూ అమీ మద్దతిచ్చారు. అంతేకాదు తుపాకీ హక్కులను మరింత విస్తృతం చేయడానికి అనుకూలంగానూ ఆమె తన అభిప్రాయాలు చెప్పారు. గత అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య బీమా కార్యక్రమం ఒబామాకేర్‌ను రద్దు చేయడానికి అమీ తోడ్పడతారని కన్జర్వేటివ్‌లు ఆశిస్తున్నారు. ఈ అఫర్డబుల్ కేర్ యాక్ట్‌(ఏసీఏ)ను రద్దు చేస్తే 2 కోట్ల మంది అమెరికన్లు హెల్త్ కవరేజ్ కోల్పోతారు. అమీని ట్రంప్ నామినేట్ చేసిన తరువాత డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏసీఏను రాతపూర్వకంగా వ్యతిరేకించిన ట్రాక్ రికార్డు అమీకి ఉందని బైడెన్ అన్నారు. అయితే, నామినేషన్ తరువాత మాట్లాడిన అమీ సుప్రీంకోర్టు జస్టిస్‌గా తన తీర్పులు న్యాయం ఆధారంగానే ఉంటాయని అన్నారు. ''న్యాయమూర్తులు విధాన రూపకర్తలు కారు. వారికి ఎలాంటి విధాన దృక్పథాలున్నా వాటిని పక్కనపెట్టాలి'' అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య భారీ ఘర్షణ చెలరేగింది. ఇరువైపులా మరణాలు సంభవించాయని వార్తలు వస్తున్నాయి. text: ప్రస్తుతం దేశంలో పౌర సమాజం ఒక ఉద్యమానికి ఇంత పెద్ద ఎత్తున నాయకత్వం వహిస్తుండడం మోదీ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తూ ఉండాలి. మోదీ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచిన తరువాత వారి రాజకీయ సందేశం స్పష్టంగానే కనిపించింది..దేశంలో మెజారిటీ ప్రజలకు ఏది హితమో దాన్నే వీరు ముందుకు తీసుకు వెళతారు. ఈ క్రమంలో, మోదీ ప్రభుత్వం ప్రజలను తమకు ఒక ఎక్స్‌టెన్షన్ కౌంటర్‌గా తయారు చేసింది. సాధారణంగా మెజారిటీ ఆమోదించే ‘దేశ భక్తి’ లాంటి భావనలను బలోపేతం చేసే దిశగా పని చేస్తోంది. ‘యాంటీ నేషనల్’ పదాన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే..ప్రభుత్వానికి అనుగుణంగా ఆలోచించకపోతే యాంటీ నేషనల్ అనే పేరు వచ్చేస్తుందేమోననే ఒత్తిడికి ప్రజలు గురవుతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కొన్ని సంవత్సరాల్లోనే పౌర సమాజంలో ఉన్న వైవిధ్యం కనుమరుగవుతూ వచ్చింది. రెండు దశల్లో ఆధిపత్యం సాధించారు. మొదట..అన్ని ప్రభుత్వేతర సంస్థలనూ (ఎన్జీవోలను) బ్యూరోక్రసీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. రెండో దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే, అది దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశంగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. వరవరరావు, సుధా భరద్వాజ్, స్టెన్ స్వామిలాంటి మానవ హక్కుల కార్యకర్తలను అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరిస్తూ కేసులు మోపారు. ఈ కేసులపై విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు కలుగక మానవు. మెజారిటీవాదం పేరుతో ప్రజలను ఏకం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది మెజారిటీ ఆధిపత్యాన్ని, వారి అగ్ర నేతల స్థానాన్ని బలోపేతం చేసే వ్యూహం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే సంస్థల చేత మెడలు వంచి ప్రభుత్వానికి సలాములు కొట్టిస్తారు లేక వాటిని వ్యర్థమైనవాటిగా నిరూపిస్తారన్న సంకేతాన్ని కూడా అందించారు. దేశ భద్రత ప్రమాదంలో ఉందని, దేశాన్ని కాపాడడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నమ్మించారు. కరోనావైరస్‌లాంటివి ఈ భావనలకు మరింత ఆజ్యం పోసాయి. పౌర సమాజం ఈ విధంగా ప్రతిఘటించడానికి కారణం..ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల ఉత్పన్నమయిన సమస్యలే. ఈ విధానాలు పౌర సమాజం భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తాయి. మొదటిది, అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ను అమలు చేసే ప్రయత్నం చెయ్యడం...ఇది భారతీయ సమాజం గౌరవాన్ని దెబ్బ తీసింది. పౌరసత్వం పొందడం అనేది నకిలీ ధృవపత్రాల సహాయంతో సాధించగల విషయం అనే స్థాయికి దిగజార్చింది. ఆఖరికి, ఈ పని జరగడం, జరగకపోవడం అనేది ఎవరో ఒక గుమాస్తా ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది అనే స్థితికి తీసుకువచ్చారు. ఎన్ఆర్‌సీని వ్యతిరేకించడం అనేది బీజేపీ మెజారిటివాదానికి అడ్డంకిగా నిలిచింది. ఏది ఏమైతేనే ప్రజలు అసమ్మతిని తెలియజేసే మార్గాన్ని కనుగొన్నారు. షాహీన్ బాగ్ నిరసనలు - పౌర సమాజం సంఘటితం కావడం దిల్లీలోని జామియా మిలియా ప్రాంతంలో చిన్న మొత్తంలో ముస్లిం గృహిణులు చేసిన నిరసన పెద్ద సంఘటనగా మారింది. ఈ నిరసన ప్రదర్శనలు అలజడిని సృష్టించాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ నిరసనలు శాంతియుతంగా, సరళంగా జరిగాయి. ఆ మహిళలు రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా అర్థం చేసుకున్నారనిపించింది. దేశ పౌరసత్వం అంటే ఏమిటో వారిలో స్పష్టంగా కనిపించింది. ఆ మహిళలు ఇచ్చిన సందేశం, గాంధీ, భగత్‌సింగ్, అంబేద్కర్ ఫొటోలు పట్టుకుని వారు తెలిపిన నిరసన విధానం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ప్రజాస్వామ్యానికి ఉత్సవం జరిగినట్టు తోచింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ, ట్రేడ్ యూనియన్ సహాయం లేకుండా ఎలా ప్రతిఘటించవచ్చో ఈ నిరసన ప్రదర్శనలు చూపించాయి. పౌర సమాజాన్ని సంఘటితపరచడానికి ఈ విత్తనం చాలు. ప్రజాస్వామ్యం రాజకీయ నేతల పేటెంట్ కాదు. వీధులే ప్రజాస్వామ్యనికి థియేటర్లు. ప్రతిఘటించడానికి వేరే ఆయుధాలేమి అక్కర్లేదు...శరీరమే చాలు. అధికారం కన్నా ప్రజాస్వామ్యనికే ప్రజలు పెద్ద పీట వేస్తారని ఈ నిరసనలు స్పష్టం చేసాయి. ‘కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. వామపక్ష పార్టీలు ఏదో ఒక క్లబ్ లేదా ఎలీట్ సొసైటీలాగ కనిపిస్తున్నాయి’ అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కోవిడ్ పేరు చెప్పి షాహీన్ బాగ్ శిబిరాలను ఎత్తివేయించారు. సీఏఏ ద్వారా ప్రవేశపెట్టిన డిజిటల్ వ్యూహం కోవిడ్‌తో మరింత బలపడింది. ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ పేరుతో ఈ నిరసనలనుంచీ దృష్టి మళ్లించారు. ప్రజల పట్ల ప్రేమగా భ్రమింపజేసే వ్యూహాన్ని ప్రదర్శించారు. ఇలాంటి పర్యవేక్షణల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాంకేతిక నిఘాలను ఎదుర్కోడానికి మార్గాలు అన్వేషించాలి. అసమ్మతి తెలిపే నిపుణుల అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. సీఏఏ నిరసనలు.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న స్పృహను తీసుకొచ్చాయి. కోవిడ్ విధానాలు, రైతుల నిరసనలు...రక్షణ, అభివృద్ధి పేరుతో ప్రభుత్వ విధానాలు ప్రజల జీవనోపాధిని ఎలా దెబ్బ తీస్తున్నాయో తెలిసేలా చేసాయి. రైతుల పోరాటాన్నిదేశ వ్యతిరేక ఉద్యమాలుగా, నక్సలైట్ల పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. ముఖ్యంగా టీవీ మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. అనేక టీవీ ఛానళ్లు..రైతుల పోరాటాన్ని, మోదీ మీద తిరుగుబాటుగా చిత్రీకరించాయి. ప్రజలు తమ జీవనోపాధికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో చీరాల నేత కార్మికులు డీసెంట్రలైజ్డ్ నెట్‌వర్క్‌ కావాలని ఆందోళన చేస్తున్నారు. అయితే పౌర సమాజం తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల సహానుభూతుని కూడా కలిగి ఉండాలి. రైతుల ఉద్యమం కేవలం పెద్ద రైతుల గొంతుగా మిగిలిపోకుండా సన్నకారు రైతుల, భూమిలేని శ్రామికుల గొంతుగా కూడా మారాలి. పౌర సమాజం ఈ సమస్యలన్నిటిపైనా దృష్టి పెట్టాలి. విభిన్న వర్గాల గొంతులు వినాలి. అధికారం తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలపై ఎలా చర్చించాలో ఆలోచించాలి. ఈ క్రమంలో పౌర సమాజం కొత్త నాలెడ్జ్ సోసైటీగా మారాలి. భారతీయ వైవిధ్యానికి ట్రస్టీగా కూడా ఉండాలి. రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? - వీక్లీ షో విత్ జీఎస్‌ ఈ మార్పు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎన్నికల దృగ్విషయం కాదని, పార్టీల నినాదం కాదని స్పష్టమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. పౌర సమాజం ముందు తడబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. వామపక్ష పార్టీలు ఏదో ఒక క్లబ్ లేదా ఎలీట్ సొసైటీలాగ కనిపిస్తున్నాయి. అయితే, ఇదేదో ఒక ప్రయోగంలా కాకుండా పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఇదే పద్ధతిలో స్థానిక, అంతర్జాతీయ సమస్యల పట్ల కూడా ఇంతే చైతన్యవంతమయ్యే దిశగా కదలాలి. ఇకమీదట పర్యవేక్షణ వ్యవస్థ, రక్షణ వ్యూహం, కార్పొరేట్ వాదంతో పోరాటం ఇంత సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి. (ఇవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు. రచయిత ఒక సామాజిక శాస్త్రవేత్త, సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ నాలెడ్జ్ సిస్టం డైరెక్టగా ఉన్నారు.) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలోని ప్రభుత్వేతర సమాజం లేదా పౌర సమాజం దేనికైనా నాయకత్వం వహించి ముందుకు నడిపించడం అనేది చాలాకాలంగా కనుమరుగైపోయి ఇప్పుడు మళ్లీ బయటకి రావడం ఒక ఆసక్తికరమైన విషయం. text: ఆ వ్యక్తిలో అంతగా నచ్చిన అంశం ఏముంది? కళ్లు బాగున్నాయా? జుట్టు బాగుందా? ముఖం ఆకారం నచ్చిందా? ఇలా మీలో చాలా ఆలోచనలు మొదలవుతాయి. అయితే, ఇలా నచ్చిన అంశాన్ని ఎంచుకునే విషయంలో మనుషుల వ్యవహార శైలి గురించి ప్రొఫెసర్ పీటర్ జొహన్సన్ చెబుతున్న వివరాలు తెలుసుకుంటే, ఆశ్చర్యపోకుండా ఉండలేం. స్వీడన్‌కు చెందిన పీటర్ జోహన్సన్ ఎక్స్పరిమెంటల్ సైకాలజిస్ట్. ఆయనకు మ్యాజిక్ అంటే ఇష్టం. కొంతవరకూ నేర్చుకున్నారు కూడా. 'ఛేంజ్ బ్లైండ్‌నెస్' (మార్పును గుర్తించలేకపోవడం) అనే అంశాన్ని ఉపయోగించుకుని జనాల దృష్టి మరల్చి, మెజీషియన్లు కార్డు ట్రిక్కుల్లాంటివి చేస్తుంటారు. అంటే, ప్రేక్షకుల దృష్టిని మరో అంశం మీదకు వెళ్లేలా చేసి, మార్పును కనిపించకుండా చేస్తారు. ఇలాంటి మ్యాజిక్ నైపుణ్యాలను పీటర్ కూడా తన ప్రయోగాలకు ఉపయోగించుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన, మరికొంత మంది పరిశోధకులతో కలిసి 'ఛాయిస్ బ్లైండ్‌నెస్' అనే అంశం గురించి ప్రయోగాత్మకంగా అధ్యయనం చేశారు. ఇద్దరు వ్యక్తుల ముఖాలు కనిపించే ఫొటోలతో ఈ ప్రయోగం చేశారు. ఆ రెండు ఫొటోల్లోని వ్యక్తుల్లో ఎవరు ఆకర్షణీయంగా ఉన్నారో చెప్పమని కొందరిని అడిగారు. అయితే, ఆ తర్వాత వారికి వారు ఎంచుకున్న వ్యక్తిది కాకుండా, మరో ఫొటో ఇచ్చి... అది వారు ఎంచుకున్న వ్యక్తి ఫొటోనే అని పరిశోధకులు అబద్ధం చెప్పారు. ఇప్పుడు వారిని ఎందుకు ఎంచుకున్నారో చెప్పమని అడిగారు. ఫొటోలు మారిన విషయాన్ని చాలా మంది పసిగట్టలేకపోయారు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 25 శాతం మందే ఆ విషయాన్ని గుర్తించారు. నిజానికి ఆ ఫొటోల్లోని వ్యక్తుల మధ్య జుట్టు రంగు, చెవి పోగులు... ఇలా చాలా తేడాలు ఉన్నాయి. అయినా, మారిన ఫొటోలో ఉన్న వ్యక్తి తాము ఎంచుకున్న వ్యక్తే అనుకొని వారి ఎంపికను సమర్థించుకుంటూ వాళ్లు వివరణలు ఇచ్చుకుంటూ వచ్చారు. ''తాము పక్కకుపెట్టిన వ్యక్తి ముఖమే, తాము మెచ్చిన ముఖం అనుకుని వాళ్లు పొరపాటుపడ్డారు. ముఖం బాగున్నందుకు ఎంచుకున్నామని చెప్పారు. కొందరైతే చెవి పోగులు ఉన్నందుకు ఆ వ్యక్తి నచ్చినట్లు చెప్పారు. నిజానికి వారు మొదట ఎంచుకున్న వ్యక్తికి అసలు చెవి పోగులు లేవు. ఇలా ముందు వ్యక్తిలో కనిపించని అంశాలను కూడా వాళ్లు ప్రస్తావించారు'' అని పీటర్ చెప్పారు. ఈ ప్రయోగంతో అర్థమైన విషయం ఏంటంటే... మనం దేన్ని ఎందుకు ఎంచుకున్నామో కూడా మనకు సరిగ్గా తెలియదన్నమాట. ఒక ముఖం కన్నా ఇంకో ముఖం ఎందుకు నచ్చిందన్న అంశానికి మరీ అంత ప్రాధాన్యత ఉన్నట్లు అనిపించకపోవచ్చు. అయితే, ఇదే ప్రయోగం రాజకీయ అంశాలపై ఏర్పరుచుకునే అభిప్రాయాల ఆధారంగానూ జరిగింది. ఈసారి ప్రయోగంలో పాల్గొన్నవారికి పరిశోధకులు ఓ ప్రశ్నావళి ఇచ్చారు. అందులో 12 రాజకీయ పరమైన ప్రశ్నలు ఉన్నాయి. పెట్రోల్ ధర పెరగాలా? వైద్య సదుపాయాలు తగ్గించాలా? పన్నులు పెంచాలా?... ఇలాంటి వివిధ అంశాలను సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా అన్నది జనాలను వాటిలో అడిగారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత, ఆ పేపర్లలో ఉన్న జవాబులను మార్చేసి, మళ్లీ అవి వాళ్ల పేపర్లు అన్నట్లుగానే వారికి తిరిగి ఇచ్చారు. పెట్రోల్ ధర పెరగొద్దు అన్న వ్యక్తికి, తాను పెరగాలి అన్నట్లుగా సమాధానం ఉన్న పత్రం వచ్చింది. నిమిషం క్రితం ఇచ్చిన సమాధానాన్ని, మార్చి ఇచ్చినా వాళ్లు గుర్తించలేకపోయారు. పెట్రోల్ ధర పెరగొద్దని మొదట చెప్పిన వాళ్లు, ఆ తర్వాత తాము పెరగాలని అన్నామేమో అనుకుని, దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అందుకు బలమైన కారణాలను వాళ్లు చూపించడం గమనార్హం. ఇలా చాలా మంది తాము మొదట ఇచ్చిన జవాబుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న వాదనను బలపరుస్తూ మాట్లాడారు. వాళ్లు తమ అసలు ఎంపిక అదేమోనని పొరబడ్డారు. ఈ అధ్యయనం చెబుతున్న విషయం ఏంటంటే, జనాల వైఖరి మారిపోవడం సర్వసాధారణం. ఒకసారి ఓ వంట నచ్చుతుందున్న వాళ్లు, మరో వంట నచ్చుతుందని చెప్పొచ్చు. ఓ నాయకుడిని, ఓ రాజకీయ పార్టీని సమర్థిస్తూ ఉన్నవాళ్లు... కొంత కాలం తర్వాత మరో నాయకుడిని,మరో పార్టీని ఇష్టపడొచ్చు. ఈ మార్పును తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అయితే, మారేవారూ తమ వైఖరి ఎందుకు మార్చుకుంటున్నామో పరిశీలన చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇలా మారే వైఖరితో కొంత ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు అమెరికాలో రిపబ్లికన్ పార్టీ సైద్ధాంతికంగా మార్కెట్ స్వేచ్ఛను సమర్థిస్తుంది. కానీ, ఆ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధమైన విధానాలను తీసుకురావాలని మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీని సమర్థించేవాళ్లు తమకు తెలియకుండానే, ఆయనకు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు పీటర్ జోహాన్సన్ మరో ప్రయోగం చేశారు. ఆ సమయంలో డోనల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌కు మధ్య పోటీ జరిగింది. ఈ ఇద్దరు అభ్యర్థులకు వ్యక్తిత్వం, అనుభవం... ఇలా అంశాల వారీగా మార్కులు ఇవ్వాలని కొందరిని పీటర్ కోరారు. వారు ఇచ్చిన మార్కులను మార్చి ఇచ్చిన తర్వాత, వారు చెప్పే అభిప్రాయాల్లోనూ మార్పులు వచ్చాయి. ఛాయిస్ బ్లైండ్‌నెస్‌ను కొందరు మోసపూరితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. లేని అభిప్రాయాన్ని జనానికి కలిగించవచ్చు. రాజకీయ అంశాలపైనా కొత్త ధోరణిని వారిపై రుద్దవచ్చు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇద్దరు వ్యక్తుల ఫొటోలను చూపించి, వారిలో టక్కున ఎవరు నచ్చారో ఎంచుకోమంటే, మీరు ఎవరో ఒకరిని ఎంచుకుంటారు. అది అంత కష్టమైన పనేం కాదు. కానీ, ఆ ఇద్దరిలో ఆ వ్యక్తే మీకు ఎందుకు నచ్చారని అడిగితే మీరు సమాధానం చెప్పగలరా? text: కరాచీకి ఉత్తరాన ఉన్న రటో డేరో అనే పట్టణంలో ఇలా ఒక్కసారిగా హెచ్ఐవీ విజృంభించడానికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. ఇటీవలే హెచ్‌ఐవీ సోకి తన ఐదేళ్ల కొడుకు మొజమ్మల్ అలీని కోల్పోయారు నవాబ్ ఖతూన్. ఆ చిన్నారికి హెచ్ఐవీ సోకినట్టు కేవలం నెల రోజుల కిందే గుర్తించారు. మూడేళ్ల పాటు ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతూ వచ్చాడు. ఈ ప్రమాదకరమైన వ్యాధి గురించి నవాబ్ ఖాతూన్ గతంలో ఎప్పుడూ వినలేదు. తన కుమారుని అకాల మరణానికి స్థానిక వైద్య వ్యవస్థే కారణమన్నది ఆమె ఆరోపణ. "స్థానిక వైద్యుడు నా బిడ్డకు ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. అప్పటి నుంచి వాడు మళ్లీ కోలుకోలేదు. వాణ్ణి మేం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వాళ్లు చికిత్స చెయ్యలేదు. నా బిడ్డ చాలా నొప్పితో బాధపడ్డాడు. నేను ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయేదాన్ని" అని నవాబ్ ఖతూన్ అన్నారు. 600 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ గత కొద్ది వారాల్లో రాటోడేరో పట్టణంలో 600ల మందికి పైగా చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారు. వాళ్లలో చాలా మంది ఐదేళ్ల లోపు వారే. వారిలో నవాబ్ ఖతూన్ కొడుకు కూడా ఒకరు. ముందుగా స్థానిక ప్రైవేట్ డాక్టర్ ఈ ప్రమాదాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. నేను మొదట ఒక హెచ్ఐవీ కేసును గుర్తించాను. ఆ తర్వాత రెండు వారాల్లోనే మరో 20 కేసులు బయటపడ్డాయి. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశాను అని డాక్టర్ ఇమ్రాన్ అర్బానీ బీబీసీకి చెప్పారు. వెంటనే ఆరోగ్యశాఖ అధికారులు భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. వాడిన సిరంజీలను మళ్లీ మళ్లీ వాడటం వల్లే హెచ్‌ఐవీ? స్థానిక వైద్యులు వాడిన సిరింజన్లే మళ్లీ మళ్లీ వాడటం వల్ల ఈ వ్యాధి వ్యాపించి ఉండొచ్చని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఒక్కసారిగా హెచ్ఐవీ ఈ స్థాయిలో విజృంభించడానికి కచ్చితమైన కారణాలేంటో ఇంకా నిర్ధరించాల్సి ఉంది. సగంకన్నా ఎక్కువ కేసుల్లో హెచ్ఐవీ వ్యాప్తికి సిరంజిలే ప్రధాన కారణం. అయితే దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో దర్యాప్తు తర్వాతే వెలుగులోకి వస్తాయని సింధ్ ఎయిడ్స్ ప్రోగ్రాం చీఫ్ సికందర్ మెమన్ చెప్పారు. హెచ్ఐవీ రోగుల సంఖ్య మరింతగా పెరగొచ్చనే భయాలున్నాయి. మరోవైపు, తమకు అవసరమైన వైద్య సదుపాయాలు అందటం లేదని స్థానిక ప్రజలంటున్నారు. సర్కారీ వైద్య కేంద్రాల నుంచి రోగులను వెనక్కి పంపిస్తున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ ప్రాంతంలోని నిరుపేద గ్రామీణ ప్రజలంతా ఇప్పుడు భయం, అనిశ్చితి గుప్పిట్లో చిక్కుకున్నారు. హెచ్ఐవీ వ్యాధి విజృంభించడానికి కారణాలను గుర్తించి ఈ ప్రాంతంలోని చిన్నారుల్ని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్‌లో కేవలం ఒక్క నెల రోజుల్లోనే 700 హెచ్ఐవీ కేసులు బయటపడ్డాయి. బాధితుల్లో 600 మంది చిన్నారులే. వారిలో సగం కన్నా ఎక్కువ మంది ఐదేళ్ల లోపు వారే. చాలా కేసుల్లో వారి తల్లిదండ్రులను పరీక్షించగా ఆ వ్యాధి లక్షణాలే లేవు. text: మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఈరోజు వరకు 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రజారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ మీడియా బులెటిన్ విడుదల చేశారు. అంటే, ఈ ఒక్క రోజే 6 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం మరో కేసు వెలుగు చూడడంతో కరోనా బాధితుల సంఖ్య 6కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చి 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆపివేస్తున్నట్లు చెప్పారు. నిత్యవసర, అత్యవసర సరకులు రవాణా చేసే వాహనాలు.. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇదీ సాయం మార్చి 29నే రేషన్ కార్డుదారులందరికీ సరకులు, అదనంగా కేజీ కందిపప్పు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏప్రిల్ 4న ప్రతి తెల్లరేషన్ కార్డుదారుకూ రూ.వెయ్యి ఇస్తామన్నారు. ఇది చిన్న సాయమేనని.. రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ధరలు పెంచితే దండనే ప్రజలు నిత్యవసర సరకులు, మందుల కోసమే బయటకు రావాలన్నారు. ఇదే అదనుగా ఎవరైనా సరకుల ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కూరగాయలు, ఇతర నిత్యవసరకుల ధరలను కలెక్టర్లు ప్రకటిస్తారని.. ఆ ధరల కంటే ఎక్కువ మొత్తానికి విక్రయిస్తే కేసులు పెడతామన్నారు. కలెక్టర్లు ఇచ్చే అడ్వర్టయిజ్‌మెంట్లలో టోల్ ఫ్రీ నంబర్ ప్రకటిస్తారు.. దానికి ఫిర్యాదు చేస్తే చాలన్నారు. పది మంది దాటి గుమిగూడొద్దు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడా 10 మందికి మించి గుమిగూడరాదన్నారు. బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున దానికి మినహాయింపు ఇస్తున్నామన్నారు. పదేళ్ల లోపు చిన్నారులు, వయోధికులు బయటకు వెళ్లొద్దని సూచించారు. ఏపీ మెరుగ్గా ఉంది.. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా 341 కేసులు నమోదైతే.. ఏపీలో 6 కేసులే నమోదయ్యాయి. అందులోనూ ఒక కేసు నయమైంద’’న్నారు.. వలంటీర్ల వ్యవస్థ సహాయంతో విదేశాల నుంచి వచ్చిన 11670 మంది వివరాలు తెప్పించి 10091 మందిని హోం ఐసోలేషన్లో ఉంచినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటీన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో 200 పడకలతో అత్యున్నత స్థాయి వైద్యం అందించే కేంద్రాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పది, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతధం విద్యార్థుల కెరీర్ దృష్ట్యా పరీక్షల నిర్వహణ యథాతధంగా కొనసాగుతుందని చెప్పారు. అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, ప్రజలు గుమిగూడే అన్ని ప్రదేశాలు మార్చి 31 వరకు మూసేయాలని ఇప్పటికే ఆదేశించాం. ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల్లోకి వచ్చామన్నారు. కేసీఆర్ తెలంగాణలో.. జనతా కర్ఫ్యూ ఈ రోజు పాటించినట్లుగా మార్చి 31 వరకు తెలంగాణ ప్రజలంతా ఇళ్లకు పరిమితమైతే కరోనావైరస్‌పై విజయం సాధించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ‘నిత్యవసరాల కోసం కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావడానికి అనుమతి’ ‘‘నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి కుటుంబానికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకున్నప్పుడు రెండుమూడు రోజులకు సరిపడేలా ఒకేసారి తెచ్చుకోవాలి. 87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు 12 కేజీల చొప్పున వీలైనంత త్వరగా బియ్యం అందిస్తాం. రూ.1103 కోట్ల విలువైన 3,36,000 టన్నుల పైచిలుకు బియ్యం వీరికి ఉచితంగా పంపిణీ చేస్తాం. నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి వీలుగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 చొప్పున నగదు అందిస్తాం. రూ. 1314 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ నిధులన్నీ తక్షణం ప్రభుత్వం విడుదల చేస్తుంద’’ని చెప్పారు. 20 శాతం ఉద్యోగులతో పనిచేయనున్న కార్యాలయాలు విద్యుత్, ఆరోగ్య, అగ్నిమాపక వంటి అత్యవసర సర్వీసుల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని.. మిగతా అన్ని శాఖల వారు 20 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరుకావాలని చెప్పారు. దీనికి రొటేషన్‌ పద్ధతి అమలు చేస్తారని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బార్లు, పబ్‌లు ఇప్పటికే మూసివేసినట్లు చెప్పారు. ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి అంటురోగాల నివారణ చట్టం ప్రకారం ఈ లాక్‌డౌన్ కాలంలో కూడా ప్రయివేటు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులు అందరికీ యాజమాన్యాలు జీతాలు చెల్లించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు మూసివేస్తున్నామని.. అయితే, పిల్లలకు ఇబ్బందులు లేకుండా వారికి సరకులు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గర్భిణుల కాన్పు కోసం ఏర్పాట్లు ఈ నెల, వచ్చే నెలలో ప్రసవించాల్సిన గర్భిణుల వివరాలు సేకరిస్తున్నామని.. వారికి ఆసుపత్రులకు తేవడం, కాన్పులు చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజారవాణా బంద్ ప్రజారవాణా పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్ని సర్వీసులు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేసీఆర్ అన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలంతా స్వీయ నియంత్రణలు పాటించాలని, మనల్ని మనం రక్షించుకోవడానికి సమాజమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితం కావాలన్నారు. తెలంగాణకు మిగతా రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులన్నీ మూసివేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. నిత్యవసర, అత్యవసర సరకులు తెచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారని కేసీఆర్ తెలిపారు. ‘ఇటలీలా స్వయంకృతాపరాధం వద్దు.. స్వీయ నియంత్రణ పాటించండి’ ప్రస్తుతం ప్రపంచంలో ఇటలీ ఈ కరోనావైరస్ వల్ల తీవ్రంగా నష్టపోయిందని, రోజూ వందలాది మంది చనిపోతున్నారని.. వైరస్ ఆ దేశంలో వ్యాపించడం మొదలైనప్పుడు ప్రజలు ఆషామాషీగా తీసుకోవడం, ప్రభుత్వం మాటను పెడచెవిన పెట్టడం వల్ల నష్టపోయారని.. మనం అలా కాకుండా స్వీయ నియంత్రణతో ఈ విపత్తు నుంచి బయటపడదామన్నారు. భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమైన తరువాత తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నివారణ చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంది. విద్యాసంస్థలు, ప్రజలు గుమిగూడే అవకాశమున్న అన్ని ప్రదేశాలు మూసివేయడమే కాకుండా వివాహాలు, ఇతర వేడుకలపైనా నియంత్రణ విధించింది. తొలుత తెలంగాణలో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన పాజిటివ్ కేసులే వెలుగుచూసినప్పటికీ ఇప్పుడు వారి నుంచి స్థానికులకూ వైరస్ సోకడం ఇది మరింత తీవ్రం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలకు ఉపక్రమించింది. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? ప్రగతి భవన్‌లో చప్పట్లు మరోవైపు ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ చప్పట్లు కొట్టారు. మంత్రులు, అధికారులు, మీడియా ప్రతినిధులూ చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త జనతా కర్ఫ్యూని సోమవారం ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. text: కానీ, నాకు బిడ్డ పుట్టిన రెండు రోజుల తర్వాత కూడా తల్లిపాలు చుక్కలు చుక్కలుగానే వస్తోంది. తల్లిపాలు సమృద్ధిగా రావాలని కొవ్వు పదార్ధాలను తిన్నాను. లీటర్ల కొద్ది ఆవు పాలు తాగాను. ఇక మూడో రోజు నన్ను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా బిడ్డేమో ఆకలితో ఉంది. ఆసుపత్రిలో సిబ్బంది నాకు మెకానికల్ బ్రెస్ట్ పంప్ పెట్టారు. పాలకు బదలు రక్తం వచ్చింది. ''నాకేం జరిగింది? మాతృత్వానికి నా శరీరం సిద్ధంగా లేదా?'' అని అనుకున్నాను. బిడ్డ నా చనుమొనలను గట్టిగా చప్పరిస్తూ కొంచెం పాలు తీసుకోవడానికి చాలా కష్టపడుతోంది. తల్లి పాలివ్వడం సహజంగా జరిగే ప్రక్రియ కాదని నాకు తెలుసు. చేస్తూ నేర్చుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి అడ్డదారులు లేవు. ప్రయత్నిస్తూ మరింత మెరుగవ్వొచ్చు. కానీ, ఇదంత సులువు కాదు, చాలా నొప్పి కూడా ఉంటుంది. ఒంటరితనం నా శరీరం వాస్తవాన్ని అర్థం చేసుకుంది. బిడ్డకు పాలిచ్చేందుకు సిద్ధమైంది. ఇక నేను కూడా ఎక్కువగా అన్ని రకాల ద్రవాలు తీసుకున్నాను. నిద్రపోడానికి కూడా నాకు చాలా తక్కువ సమయం ఉండేది. ఇక బయటకు వెళ్లడం చాలా అరుదైపోయింది. ''ఇరుగుపొరుగు ఏమనుకుంటారో... నా స్నేహితులు ఏమనుకుంటారో?" అని కూడా అనిపించేది. బహిరంగ ప్రదేశాల్లో పాలుపట్టడం నాకు ఇష్టముండదు. అందుకే నాకు ఇష్టమైన ప్రదేశాలకు కూడా వెళ్లడం లేదు. ప్రపంచంతో సంబంధం లేకుండా నా బిడ్డే లోకం అయిపోయింది. తన కోసం అర్థరాత్రుళ్లు కూడా లేచేదాన్ని. తల్లి అయ్యాక బిడ్డ మీద ఎంత శ్రద్ధ తీసుకుంటామో మన మీద కూడ అంతే శ్రద్ధ తీసుకోవడం ముఖ్యమని తెలుసుకున్నాను. అప్పుడే పుట్టిన పిల్లలు ఎక్కువగా నిద్రపోవడం, పాలుతాగడం చేస్తుంటారు. ఆస్పత్రిలో నా బిడ్డకు మొదటిసారి పోతపాలు పట్టిన తర్వాత చాలా సేపు తను పడుకుంది. దీంతో అప్పటి నుంచి తను పడుకోవాలంటే తల్లిపాలకు బదులు పోతపాలు ఇవ్వడం మొదలుపెట్టాను. కానీ, అలా పోతపాలు పట్టించడం నాకు ఇబ్బందిగా అనిపించింది. పోతపాల వల్ల నా బిడ్డ నాలుక తెల్లగా మారింది. చెడు వాసనతో అసహజంగా అనిపించింది. రుచికరమైన, పోషకాలున్న తల్లి పాలకు బదులుగా నా బిడ్డ జంక్ ఫుడ్ తింటున్నట్లు అనిపించింది. ప్రతిసారీ నేను కొంత మందగించాను, ఆ అపరాధభావం నన్ను వెంటాడింది. ''నేను చాలా కష్టపడాల్సింది. అదనంగా నిద్రపోవాల్సిన అవసరం కూడా నాకు లేదు.'' ఆ అపరాధ భావం నా నుంచి తొలగిపోలేదని తెలుసు. కానీ, అది అన్యాయం అని అనిపిస్తుంది. తల్లిపాలు ఇవ్వడమా లేదా పోతపాలు ఇవ్వడమా అనేది ఎవరైనా సొంతంగా నిర్ణయించుకోవాలి. 'సాయం తీసుకోవాలి' తల్లి పాలు అనేది ఇప్పుడు కోట్ల రూపాయిల వ్యాపారం. డబ్బులుంటే ప్రతీ సమస్యకు ఇక్కడ చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది. నా సమస్య పరిష్కారం కోసం సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు మైక్రోవేవబుల్ లావెండర్ బూబ్ వార్మర్స్ (తల్లిపాలను పట్టే పరికరం) నుంచి చనుమొనలను సున్నితంగా ఉంచే క్రీమ్‌ల వరకు చాలా ఉత్పత్తలు కనిపించాయి. కానీ, నాకు అనిపించిన అత్యుత్తమ మార్గం మాత్రం... తల్లిపాలు ఇవ్వడానికి సంబంధించిన వర్క్‌షాప్‌కు వెళ్లడం. అక్కడ అనుభవం ఉన్నవారి నుంచి నిపుణుల నుంచి తల్లిపాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం. తల్లిపాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిలో నేను ఒంటరిని కానని అనుకుంటున్నా. బిడ్డకు పాలు ఇవ్వడం అనేది ఛాయిస్ కాదు, అది కచ్చితమైన విధి అని నా అభిప్రాయం. కానీ, పాలివ్వడంలో విఫలమవ్వడం, పాలివ్వడాన్ని ఇష్టపడకపోవడం వల్ల మాతృత్వానికి పనికిరారు అనడం మాత్రం సరైంది కాదు. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నేను పిల్లల పెంపకానికి సంబంధించిన శిక్షణా తరగతులకు వెళ్లాను. అక్కడ కృత్రిమ స్తనాలతో ఆడుకున్నాను. నర్సింగ్ బ్రాలు కూడా తెచ్చుకున్నాను. ఇక బిడ్డకు పాలిచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను. text: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనావైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన సరిగ్గా ఏడాది పూర్తయిన రోజున బైడెన్ ప్రసంగించారు కోవిడ్‌ వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి సరిగ్గా ఏడాది అయిన రోజునే బైడెన్‌ ఈ ప్రకటన చేశారు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజైన జూలై 4న గత ఏడాది అమెరికాలో వేడుకలు జరుపుకోవడానికి వీలు పడలేదు. "వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిస్తే జులై 4న అందరం పండగ చేసుకోవచ్చు. కలిసి తినొచ్చు, తిరగొచ్చు. ఇరుగు పొరుగుతో మమేకం కావచ్చు. అదే రోజును మనం కోవిడ్‌ నుంచి విముక్తి పొందిన స్వాతంత్ర్య దినంగా జరుపుకోవచ్చు''అని బైడెన్‌ అన్నారు. పెద్దపెద్ద ఈవెంట్‌లు కాకపోయినా, చిన్నచిన్న వేడుకలను అప్పటి నుంచి జరపుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా వైరస్‌ కారణంగా ఐదు లక్షలమందికి పైగా మరణించారు. ఇది మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, వియాత్నాం వార్‌ సందర్భంగా మరణించిన వారికన్నా ఈ సంఖ్య ఎక్కువ. నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దిగంబర కవులలో ఒకరుగా సుపరితులైన నిఖిలేశ్వర్ రచించిన 'అగ్నిశ్వాస' కవితా సంపుటి 2020 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. దిగంబర కవులు ప్రకటించిన మూడు సంపుటాలలో 'ధర్మాగ్రహాన్ని' ప్రకటించిన నిఖిలేశ్వర్ విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేశారు. మండుతున్న తరం, నాలుగు దశాబ్దాల సాక్షిగా నా మహానగరం, యుగస్వరం, అగ్నిశ్వాస వంటి రచనలను వెలువరించిన నిఖిలేశ్వర్ ప్రస్తుతం 'నిఖిలలోకం' పేరుతో తన సాహితీ జీవనయాత్రను గ్రంథస్థం చేసే పనిలో ఉన్నారు. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నల్లగొండ జిల్లాలో ఈనాటి యాదాద్రి జిల్లాలోని వీరెల్లి గ్రామంలో 1938 ఆగస్ట్ 11న జన్మించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా వచ్చిన 'గోలకొండ' సంచికలో ఆయన తొలి రచన 'టెలివిజన్ ఎలా పని చేస్తుంది' అచ్చయింది. కవిగానే కాకుండా కథకుడిగా, విమర్శకుడిగానూ ఆయన పేరు తెచ్చుకున్నారు. 22 కథలతో ఆయన 'నిఖిలేశ్వర్ కథలు' ప్రచురించారు. నిఖిలేశ్వర్‌తో పాటు 2020 సంవత్సరానికి కన్నెగంటి అనసూయకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. మానస ఎండ్లూరి రచించిన 'మిళింద' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ సాహితీ పురస్కారం లభించింది. పింగళి వెంకయ్యకు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని మోదీకి జగన్ లేఖ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసిన సీఎం జగన్ జాతీయ జెండా రూపకర్తగా పింగళి వెంకయ్యకు భారత రత్న(మరణానంతరం) ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌'లో భాగంగా 'హర్ ఘర్ పర్ జెండా' కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పింగళి వెంకయ్యకు గుర్తింపు అవసరం అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సీఎం జగన్ గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుటుంబాన్ని కలిశారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సన్మానించారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ నివాసానికి రావడంతో సీతామహలక్ష్మి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎంకు పింగళి జీవిత చరిత్ర పుస్తకం అందజేశారు. పింగళి కుటుంబంతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం తరుపున రూ. 75లక్షల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. ఆ మేరకు యువజన సర్వీసుల శాఖ తరపున జీవో నెం. 33 కూడా విడుదల చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. గాంధేయ మార్గంలో స్వతంత్ర్యపోరాటంలో పాల్గొన్న పింగళి వెంకయ్య వివిధ అంశాలపై శాస్త్రీయ దృక్పథంతో కృషి చేశారని లేఖలో పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే జెండా రూపకల్పన కోసం ఆయన ఎంతో శ్రమించారని తెలిపారు. పింగళి వెంకయ్య 1918లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అంటూ బుక్ లెట్ ప్రచురించారని కూడా తన లేఖలో గుర్తు చేసిన జగన్, అందులో 30 రకాల జాతీయ పతాకాల డిజైన్లను తీర్చిదిద్ది, 1921లో విజయవాడ కాంగ్రెస్ సభలో మహాత్మా గాంధీకి ఆయన వాటిని అందించారని వివరించారు. 1947 జూలై 22 న రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా దానిని ఆమోదించిందని చెప్పారు. పీఎం మోదీకి వైఎస్ జగన లేఖ దేశం కోసం తన సేవలందించిన మహానీయుడికి తగిన గుర్తింపు అవసరం అని సీఎం అభిప్రాయపడ్డారు. ఆయన మరణించి చాలాకాలం అయినప్పటికీ తగిన గుర్తింపు రాలేదని, ఇప్పటికైనా భారతరత్న ప్రకటించి ఆయనను గౌరవించాలని కోరారు. గతంలో భుపేంద్ర కుమార్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ వంటి వారికి మరణానంతరం భారతరత్న ప్రకటించినందున, అదే విధంగా పింగళి వెంకయ్యను భారతరత్నగా గుర్తించాలని జగన్ తన లేఖలో కోరారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన తొలి మహిళ మిథాలీ రాజ్ మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెటర్, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్ అయ్యారు. మిథాలీ రాజ్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కలిపి పది వేల పరుగులు చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్‌ అయ్యారు. దక్షిణాఫ్రికా, భారత్ మహిళా టీమ్స్ మధ్య లఖ్‌నవూలోని ఎకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనత అందుకున్నారు. మిథాలీ 10 వేల పరుగులు మైలురాయికి చేరువైన తర్వాత బంతికే అవుట్ అయ్యారు. కెరీర్‌లో తన 212వ వన్డే మ్యాచ్‌ ఆడుతున్న మిథాలీ, బోశ్చ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యే ముందు 36 పరుగులు చేశారు. 38 ఏళ్ల కుడిచేతి బ్యాటర్ మిథాలీ రాజ్ అత్యధికంగా వన్డేల్లో 6,974 పరుగులు చేశారు. టీ20ల్లో 2,364, 10 టెస్టుల్లో 663 పరుగులు చేశారు. మిథాలీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్ అయ్యారు. మిథాలీ కంటే ముందు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్ చార్లొటే ఎడ్వర్డ్స్ ఈ ఫీట్ సాధించారు. ఆమె అన్ని ఫార్మాట్లలో 10, 273 పరుగులు చేసి టాప్‌లో ఉన్నారు. మిథాలీరాజ్ 1999 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. అరుదైన ఫీట్ సాధించిన మిథాలీ రాజ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటివరకూ రెండు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. 'ఈ సింహం పిల్లలు ఇక చాలు': నెదర్లాండ్స్ జూలో సింహానికి 'వేసక్టమీ' ఆపరేషన్ నెదర్లాండ్ జూలో సింహానికి వేసక్టమీ ఆపరేషన్ నెదర్లాండ్స్‌లోని ఒక జూలో గత ఏడాది ఐదు కూనలకు తండ్రి అయిన ఒక సింహానికి 'వేసక్టమీ' ఆపరేషన్ చేశారు. 'థార్' అనే 11 ఏళ్ల మగ సింహాన్ని రెండు ఆడ సింహాలతో జత కలిపారు. వాటిలో మొదటి దానికి రెండు, రెండో దానికి మూడు కూనలు పుట్టాయి. "థార్‌కు పిల్లలు పుడతాయని నిరూపితం అయ్యింది కాబట్టి, మేం దానికి ఆ ఆపరేషన్ చేసేశాం" అని రాయల్ బర్గెర్స్ జూ చీఫ్ వెటర్నరీ డాక్టర్ ఆనమ్ చెప్పారు. గత 20 ఏళ్లలో సింహాల జనాభా 30 నుంచి 50 శాతం తగ్గిపోయిందని వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ చెబుతోంది. కానీ, గురువారం థార్‌కు వేసక్టమీ ఆపరేషన్ చేసిన వెటర్నరీ డాక్టర్ హెంక్ లూటెన్ మాత్రం తమ జూలో థార్ డీఎన్ఏ ఇప్పటికే తగినంత ఉందని చెప్పారు. "మా దగ్గర దాని కూనలు చాలా ఉన్నాయి. దాని జన్యు సమూహం ఎక్కువగా ఉండాలని మేం అనుకోవడం లేదు" అని ఆయన రాయిటర్స్‌కు చెప్పారు. 11 ఏళ్ల థార్‌కు ఆపరేషన్ విజయవంతం అయ్యింది జూలు ఊడిపోకుండా... సింహాలకు వేసక్టమీ ఆపరేషన్ చేయడం చాలా అరుదు, ఇంతకు ముందు ఇలా జరిగినట్టు ఎవరూ వినలేదు. "నేను ఇక్కడ వెటర్నరీ డాక్టరుగా ఉన్న 35 ఏళ్లలో ఒక సింహానికి ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి" అని లుటెన్ చెప్పారు. ఈ సింహానికి కాస్ట్రేషన్ (వీర్యహరణం)కూడా చేసుండచ్చని, కానీ దానివల్ల ఈ సింహం జూలు ఊడిపోవడానికి కారణం అవుతుందని డాక్టర్ చెప్పారు. కాస్ట్ర్టేషన్ వల్ల టెస్టోస్టెరాన్ లోపం కూడా తలెత్తుతుందని, అలా థార్ మందలో తన స్థానాన్ని కూడా కోల్పోయి ఉండేదని తెలిపారు. అందుకే దానికి 'వేసక్టమీ' చేశామని స్పష్టం చేశారు. దాడికి గురవుతున్న జంతువుల్లో డబ్ల్యుడబ్ల్యుఎఫ్ సింహాలను కూడా చేర్చింది. అంటే, అడవుల్లో సింహాలు అంతరించిపోయే ప్రమాదాన్ని తీవ్రంగా ఎదుర్కుంటున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రజలందరికీ టీకాలు అందినట్లయితే జులై 4 తేదీన అమెరికా కోవిడ్‌-19 మహమ్మారి నుంచి విముక్తమవుతుందని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌ అన్నారు. మే 1 నాటికి అర్హులైన వయోజనులందరికీ వ్యాక్సీనేషన్‌ పూర్తి చేయాలని తాను రాష్ట్రాలకు సూచిస్తానని తొలి ప్రైమ్‌టైమ్‌ స్పీచ్‌లో బైడెన్‌ వెల్లడించారు. text: అక్రమ నిర్మాణమంటూ రాజధాని అమరావతిలోని ప్రభుత్వ నిర్మాణం 'ప్ర‌జావేదిక'ను జూన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేసిన అధికార యంత్రాంగం తర్వాత కృష్ణా నది క‌ర‌క‌ట్ట దిగువ‌న ఉన్న భ‌వ‌నాల‌పై దృష్టి పెట్టింది. 26 నిర్మాణాల‌కు సంబంధించిన య‌జ‌మానుల‌కు నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష నేత చంద్ర‌బాబు నివసిస్తున్న లింగ‌మ‌నేని భ‌వ‌నం అందులో ఒకటి. జూన్ చివరి వారంలో నోటీసులను అధికారులు ఈ భవనం గోడ‌ల‌కు అతికించారు. వారంలోగా స‌మాధానం ఇవ్వాల‌న్నారు. అందుకు అనుగుణంగా భవనం యజమాని లింగ‌మ‌నేని రమేశ్ స‌మాధానం ఇచ్చారు. లింగమనేని భవనం అన్ని అనుమతులూ ఉన్నాయన్న లింగమనేని నోటీసుల‌ను ఆయన త‌ప్పుబ‌ట్టారు. త‌న భ‌వ‌నం స‌క్ర‌మ నిర్మాణ‌మ‌ని, అనుమ‌తులు కూడా ఉన్నాయ‌ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)కు పంపిన స‌మాధానంలో చెప్పారు. భవనానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన సీఆర్‌డీఏకు సమర్పించారు. భవనానికి అన్ని అనుమతులూ ఉన్నాయన్నారు. గతంలో రైతుల నుంచి భూమిని కొన్న తర్వాత దానిని వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ భూమిగా ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయించానని చెప్పారు. ఇందుకు ఇరిగేషన్ శాఖ అనుమతి ఇచ్చిందంటూ డాక్యుమెంట్లు చూపించారు. భవనానికి ఉండవల్లి పంచాయతీ నుంచి అనుమతులు ఉన్నాయని లింగమనేని చెప్పారు. అయితే, అనుమతులకు సంబంధించిన పత్రాలేవీ చూపించలేదు. భవనం ముందున్న ఈతకొలనుకు నీటిపారుదల అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలను లింగమనేని చూపించారు. గత ఏడాది భవనాన్ని 'బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్) కింద క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేశానన్నారు. భవనానికి అన్ని అనుమతులూ ఉన్నాయని లింగమనేని రమేశ్ చెప్పారు. సీఆర్‌డీఏ తరపున లింగ‌మ‌నేని భవనానికి అధికారులు నోటీసులు ఇవ్వగా, మరోవైపు పాలక వైసీపీ కొత్త వాద‌న ముందుకు తెచ్చింది. చంద్ర‌బాబు ఉంటున్న భ‌వ‌నాన్ని 2016లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంద‌ని సీఆర్‌డీఏ ఛైర్మన్, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. "ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు చంద్ర‌బాబు 2016 మార్చి 6న ప్ర‌క‌టించారు. అది వాస్త‌వ‌మేన‌ని లింగ‌మ‌నేని ర‌మేష్ కూడా మీడియా ముఖంగా వెల్ల‌డించారు. ఇప్పుడు మ‌ళ్లీ మాట మార్చ‌డం ఏంటి? అన్ని అనుమ‌తులు ఉన్నాయ‌ని ఎలా చెబుతారు? ప్ర‌భుత్వ భ‌వ‌నమని చెప్పిన చంద్ర‌బాబు అధికారిక భ‌వ‌నాన్ని ఎందుకు ఖాళీ చేయ‌లేదు? ఇప్పటికైనా ఆయన ఉంటున్న ఇంటిని నైతికబాధ్యతగా తక్షణం ఖాళీ చేయాలి. లేనిపక్షంలో అక్రమ ఇంటిని చట్ట ప్రకారం సీఆర్‌డీఏ కమిషనర్ కూలగొట్టాలని కోరుతున్నా" అని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. అక్రమ నిర్మాణమంటూ 'ప్ర‌జావేదిక'ను ప్రభుత్వం జూన్‌లో కూల్చివేసింది. 2016లో చంద్ర‌బాబు, లింగమనేని ఏం చెప్పారు? లింగ‌మ‌నేని భవనాన్నిప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంద‌ని 2016లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. "మేం లింగ‌మ‌నేని రమేశ్ భూములు తీసుకోలేదు. కానీ, ఆయ‌న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న భూములు తీసుకోవాలన్నారు. 'నేను 29 గ్రామాల వరకే చేయాల‌ని చెప్పాను, మీ భూములు తీసుకుంటే 34 గ్రామాలు తీసుకోవాలి, అవ‌స‌రం లేదు' అని ఆయనతో చెప్పాను. ఇంకా మ‌రికొన్ని గ్రామాల నుంచి కూడా భూములు తీసుకోవాల‌ని వ‌చ్చారు. వ‌ద్ద‌ని చెప్పాను. లింగ‌మ‌నేని ర‌మేశ్ 2003లోనే భూములు కొన్నారు. ఆ త‌ర్వాత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో విచార‌ణ జ‌రిపారు. కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆ భవనం ప్రభుత్వానిది. ప్రభుత్వం ఇల్లు కాబ‌ట్టే నేను ఉన్నాను" అని ఆనాడుచంద్రబాబు చెప్పారు. ఆ మ‌రుస‌టి రోజే లింగ‌మ‌నేని ర‌మేశ్ మాట్లాడుతూ- ప్రభుత్వం ఆ భ‌వ‌నాన్ని భూసమీకరణలో తీసుకుంది, నాది నేను ఇచ్చేశాను. ఉండ‌వ‌ల్లి, పెనుమాక రైతులు కాదంటున్నారు గానీ నాకు సంబంధం లేదు" అన్నారు. ఆ భవనాన్ని చంద్రబాబు ఖాళీ చేయాలని డిమాండ్ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందనకు నిరాకరించిన సీఆర్‌డీఏ అధికారులు ప్రభుత్వ భవనమని ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన మూడేళ్ల త‌ర్వాత లింగ‌మ‌నేని ర‌మేశ్‌కు నోటీసు ఇవ్వ‌డంపై సీఆర్‌డీఏ అధికారులను బీబీసీ స్పందన కోరగా, వారు నిరాక‌రించారు. పేరు ప్ర‌స్తావించేందుకు నిరాక‌రించిన కొంద‌రు అధికారులు మాత్రం- ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కే తాము అన్ని అక్ర‌మ భ‌వ‌నాల‌తోపాటు లింగ‌మ‌నేని ర‌మేశ్‌ భవనానికి నోటీసులు ఇచ్చిన‌ట్టు చెప్పారు. భవనం తొల‌గింపు విష‌యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంటున్న 'లింగమనేని గెస్ట్ హౌస్' ప్రభుత్వానిదేనా? ఈ భవనం గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చెప్పారు? అప్పుడు వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ ఏమన్నారు, ఇప్పుడేం చెబుతున్నారు? పాలకపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఏమంటోంది? text: తన ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లిష్ భాషలలో కొనసాగిస్తున్నారు. పలువురు విశ్లేషకులు ఊహించినట్టుగానే పేదలకు భారీ పథకాల ప్రకటనలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు: వ్యవసాయ రంగం: విద్యారంగం: వైద్యం: పరిశ్రమలు: ఉద్యోగ కల్పన - ఉపాధి: పర్యాటకం: రైల్వే: ఇతరత్రా... మీ కోసం మరి కొన్ని కథనాలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఇది ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి ఓ వైపు వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికల మీదా, మరోవైపు ద్రవ్య లోటును పూడ్చుకోవడం పైనా ఉండక తప్పదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా, ప్రస్తుత ప్రభుత్వం ముందు ఇంకా ఏమేం సవాళ్లున్నాయో కింద ఇచ్చిన లింక్‌లో చదవండి: ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం, దీనిపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి. అయితే బడ్జెట్‌ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవాలంటే ఈ పది ప్రాథమిక అంశాలు మీరు తెలుసుకోవాల్సిందే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వే కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే ప్రభావం తర్వాత వచ్చే బడ్జెట్‌‌పై ఉంటుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 2017-18 ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7 నుంచి 7.5 శాతం వృద్ధి చెందొచ్చని సర్వే నివేదిక వెల్లడించింది. అందులోని పది ముఖ్యమైన అంశాలు చదవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మొదలైంది. తొలిసారి బడ్జెట్ ప్రసంగం హిందీలో ప్రారంభం కావడం విశేషం. text: ఈ విషయమై అధ్య‌య‌నం చేసి, ప్ర‌స్తుతమున్న చ‌ట్టాల్లో చేయాల్సిన మార్పుల‌ను సిఫార్సు చేసేందుకు సలహా బృందం(అడ్వైజరీ గ్రూప్)ను నియమిస్తూ ఈ నెల 3న జీవో ఎంస్ నంబరు 1ని జారీ చేసింది. ఈ బృందం రెండు నెలల్లో మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి యువతులను అక్రమంగా తరలించడం-వ్యభిచార కూపంలోకి దించడం తీవ్రస్థాయిలో ఉంది. విటుల‌ను శిక్షించే నిబంధ‌న వ‌స్తే ప‌రిస్థితి మారుతుంద‌నే భావన ఉంది. ఈ అంశంపై సలహా బృందంలో సభ్యురాలైన సామాజిక కార్యకర్త, స్వచ్ఛంద సంస్థ 'ప్రజ్వల' సహవ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌తో, ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ అరుణ్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది. చట్టంలో ప్రతిపాదిత మార్పులు వస్తే, విటులను శిక్షించేలా చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే అవుతుందని సునీత చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరి దేశంలో ఎవరూ ప్రయత్నించలేదన్నారు. ఈ చట్టం తెస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గం చూపిన‌ట్టు అవుతుందని, ఏపీ ప్రతిపాదిత చట్టంతో మార్పు కనిపిస్తే దేశమంతటా ఇలాంటి చట్టం తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నానని సునీత పేర్కొన్నారు. 'డిమాండ్' తగ్గాలి అమ్మాయిల అక్రమ తరలింపు డిమాండ్-సరఫరా సూత్రంపై ఆధారపడి ఉందని సునీత వ్యాఖ్యానించారు. విటులను శిక్షిస్తే వారిలో భయం పెరిగి, అమ్మాయిల అక్రమ రవాణాకు డిమాండ్ తగ్గుతుందని, అదే జరిగితే అమ్మాయిల తరలింపు ఎంతో కొంత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత మార్పులతో సత్వర ఫలితాలు ఉంటాయని ఆమె తెలిపారు. చాలా కాలంపాటు ప్రభావం ఉండాలంటే చట్టమే మార్గమన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం విటులను శిక్షించే అవకాశం లేదా అని అడగ్గా- 'ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్' ప్ర‌కారం వారినీ అరెస్టు చేయవచ్చని, అయితే అలాంటి అరెస్టులు చాలా తక్కువని, ఒకవేళ అరెస్టయినా నేరం నిరూపితమై శిక్ష పడే అవకాశాలు స్వల్పమని సునీత చెప్పారు. వ్యభిచారం కేసుల్లో మహిళలే ఎక్కువగా పట్టుబడుతున్నారు. విటులు తప్పించుకొంటున్నారు. మహిళల అక్రమ తరలింపును, వారిని వ్యభిచారంలోకి దించడాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు పెద్దగా ఏమీ చేయడం లేదని సునీత విచారం వ్యక్తంచేశారు. సునీతా కృష్ణన్ ఈ మూడింటిపై శ్రద్ధ పెట్టాలి అక్రమ తరలింపును నివారించడం, వ్యభిచార కూపాల నుంచి కాపాడిన మహిళలకు తగిన రక్షణ-పునరావాసం కల్పించడం, బాధ్యుల ప్రాసిక్యూషన్ మెరుగుపడాల్సి ఉందని, ఈ మూడు అంశాలపై శ్రద్ధ పెడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సునీత వివరించారు. అక్రమ తరలింపునకు బాధ్యులైనవారిపై నేర నిరూపణ పేలవంగా ఉందని, ఇది చాలా మెరుగుపడాల్సి ఉందని ఆమె చెప్పారు. అక్రమ తరలింపు బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ వారే ఎక్కువనే వార్తలపై ప్రశ్నించగా- ఏపీ నుంచి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని, అలాగ‌ని వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో ఈ సమస్య లేదని కాదని సునీత స్పందించారు. ఇదో అంతర్జాతీయ సమస్యని వ్యాఖ్యానించారు. జనాభాను బట్టి ఈ నంబర్లు పెరుగుతున్నాయన్నారు. ''ఆంధ్రప్రదేశ్ కృషిని మెచ్చుకోవాలి. వేరే రాష్ట్రాలు దీని గురించి ఏమీ చేయలేదు కాబట్టి, నంబర్లు కనిపించవు. ఏపీ ప‌నిచేస్తోంది కాబ‌ట్టి నంబర్లు కనిపిస్తున్నాయి. అందుకే సంఖ్య గురించి మాట్లాడేటప్పుడు బ్యాలెన్సుడుగా ఆలోచించి మాట్లాడాలి'' అని ఆమె సూచించారు. నివేదిక అందాక నిర్ణయం మనుషుల అక్రమ తరలింపును అరిక‌ట్టే క్ర‌మంలో ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని మ‌హిళా శిశు సంక్షేమశాఖ‌ క‌మిష‌న‌ర్ అరుణ్ కుమార్ చెప్పారు. అక్రమ తరలింపును నిరోధించేందుకు దేశవ్యాప్తంగా, ప్ర‌పంచవ్యాప్తంగా అమలు చేస్తున్న విధానాలను ప‌రిశీలించి, ఆంధ్రప్రదేశ్‌కు ఏ నమూనా స‌రిపోతుందో ఈ సలహా బృందం నివేదిక రూపంలో తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. నివేదిక అందాక ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మనుషుల అక్ర‌మ రవాణాలో విటుల(ఎండ్‌ క్లైంట్స్)ను నేరస్థులుగా పరిగణించి, శిక్షించేందుకు వీలుగా చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. text: మోదీ, ట్రంప్ మధ్య మంగళవారం న్యూయార్క్‌లో అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు "భారత్‌లో ఇంతకు ముందు( మోదీ పాలనకు ముందు) ఎలా ఉండేదో నాకు గుర్తుంది. అక్కడ అనైక్యత, విభజన ఉండేది. మోదీ ఒక తండ్రిలా అందరినీ ఏకం చేశారు. ఆయన బహుశా ఇండియాకు తండ్రి లాంటి వారు. నేను మోదీని 'ఫాదర్ ఆఫ్ ఇండియా' అంటాను" అన్నారు. నరేంద్ర మోదీ అంటే తన మనసులో చాలా గౌరవం ఉందని, ఆయనంటే తనకు చాలా ఇష్టం అని ట్రంప్ అన్నారు. తీవ్రవాదం విషయంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని ట్రంప్ చెప్పారు. దానికి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దే సామర్థ్యం ఆయనకు ఉందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. "పెద్దమనుషులు ఇద్దరూ కలిస్తే, ఏదో ఒక పరిష్కారం వెతగలరని నాకు అనిపిస్తోంది. ఇద్దరూ కలిస్తే కచ్చితంగా ఏదో ఒక మంచి జరుగుతుంది" అని ట్రంప్ అన్నారు. హ్యూస్టన్‌లో హౌడీ మోదీ కార్యక్రమం గురించి ప్రస్తావించిన ట్రంప్ ఆ కార్యక్రమంలో నరేంద్ర మోదీని చూడగానే జనాల్లో చాలా ఉత్సాహం వచ్చిందన్నారు. "వారు ఈ పెద్ద మనిషిని చాలా ప్రేమిస్తున్నారు. ఆయన్ను చూసి పిచ్చెక్కి పోయారు. నరేంద్ర మోదీ అమెరికన్ రాక్ స్టార్ ఎల్విస్ ప్రిస్లీ లాంటి వారు. నాకు ఎల్విస్ మళ్లీ వచ్చాడేమో అనిపించింది" అని ప్రశంసించారు. పాకిస్తాన్‌పై ప్రశ్నలు తోసిపుచ్చారు అయితే ట్రంప్ పాకిస్తాన్‌లో తీవ్రవాదానికి సంబంధించి అడిగిన ప్రశ్నలను తోసిపుచ్చారు పాకిస్తాన్‌లో ఐఎస్ఐ అల్-ఖైదాకు ట్రైనింగ్ ఇచ్చిందని చెప్పిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఒక జర్నలిస్ట్ స్పందన కోరినపుడు, ట్రంప్ "నేను ఆ వ్యాఖ్యలు వినలేదు. మీ ప్రధాన మంత్రి దీనిని చూస్తారని నాకు తెలుసు" అన్నారు. "ఇరు దేశాల నేతలు(మోదీ, ఇమ్రాన్) కలిసి కశ్మీర్ అంశంపై ఏదైనా పరిష్కారం కనుగొంటే చాలా బాగుంటుంది. మేమంతా అది జరగడం చూడాలనే అనుకుంటున్నాం" ట్రంప్ అన్నారు. త్వరలో వ్యాపార ఒప్పందాలు భారత్‌తో త్వరలో ఒక వ్యాపార ఒప్పందం జరగవచ్చని, దాని కోసం చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు. "తర్వాత ఒక పెద్ద ఒప్పందం జరగచ్చు. కానీ త్వరలో రెండు దేశాల మధ్య ఒక ట్రేడ్ డీల్ జరుగుతుంది" అన్నారు. అంతకు ముందు మాట్లాడిన భారత ప్రధాని 'హౌడీ మోదీ' కార్యక్రమానికి వచ్చినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు చెప్పారు. అమెరికా నుంచి 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సహా, శక్తి రంగంలో పెట్టుబడులకు హ్యూస్టన్‌లో ఎంఓయూలు జరిగాయని చెప్పారు. "ఈ ఒప్పందాల వల్ల వచ్చే కొన్ని దశాబ్దాల్లో 60 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతుంది. 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భారత్ స్వయంగా దీనికి చొరవ తీసుకుంది" అన్నారు. భారత్, అమెరికా రెండూ వేగంగా ముందుకు దూసుకువెళ్తున్నాయని మోదీ అన్నారు. మోదీ, ట్రంప్ సమావేశం తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. "పాకిస్తాన్‌తో చర్చల నుంచి భారత్, తప్పుకోవాలని అనుకోవడం లేదు. అది తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటే, మేం పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతాం. కానీ, అది ఇప్పటివరకూ అలా చేయలేదు" అన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియా'గా వర్ణించారు. text: ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళా దుంపలను భారత్‌లో కంపెనీ అనుమతి లేకుండా పండిస్తున్నారంటూ ఏప్రిల్‌లో కొందరు రైతులపై పెప్సీకో ఇండియా కేసు పెట్టింది. ఇది కాపీరైట్ ఉల్లంఘన అని పేర్కొంది. అయితే, కేసు ఉపసంహరణకు సంబంధించిన సమాచారం ఇంకా తమకు చేరలేదని రైతుల తరపు న్యాయవాది ఆనంద్ యజ్ఞిక్ బీబీసీకి చెప్పారు. దీనిపై పెప్సీకో ఓ ప్రకటన విడుదల చేసింది. "పెప్సీకో 30 ఏళ్లుగా భారత్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కాలంలో ఉత్తమమైన బంగాళాదుంపల సాగు కార్యక్రమంలో భాగంగా కొత్త రకాలను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతుల అభ్యున్నతికి తోడ్పడింది. దీంతో రైతులు అత్యధిక దిగుబడులు సాధించారు, నాణ్యత పెరిగింది. పంటకు మంచి ధర పలికింది. వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆ రైతుల విస్తృత ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడిన పెప్సీకో, తమ రిజిస్టర్డ్ వెరైటీని రక్షించుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రైతులతో ఎదురైన ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికే పెప్సీకో ప్రయత్నించింది. ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతంరం రైతులపై వేసిన కేసును వెనక్కితీసుకోవాలని పెప్సీకో నిర్ణయించుకుంది. విత్తన పరిరక్షణకు దీర్ఘకాలిక పరిష్కారం వైపే మేం మొగ్గుచూపుతున్నాం. మాతో పాటు కలసి పనిచేసే వేలాది రైతులకు ఉత్తమ సాగు విధానాలను అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది" అని పెప్సీకో ఇండియా అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అసలు వివాదం ఏంటి? అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ గుజరాత్‌లో బంగాళాదుంపలు సాగు చేసే రైతులపై కేసు పెట్టింది. లేస్(LAYS) చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళాదుంపల వెరైటీని తాము భారత్‌లో రిజిస్టర్ చేశామని ఈ కంపెనీ చెప్పింది. రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం బంగాళాదుంపలు సాగు చేయకూడదని కంపెనీ చెబుతోంది. భారత్‌లో కంపెనీ అనుమతి లేకుండా ఆ రకం బంగాళాదుంపలను పండించిన రైతులపై గుజరాత్‌లో దావా వేసింది. కంపెనీ రైతులపై కేసులు పెట్టడం గురించి వ్యవసాయ సంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. రైతులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్న వ్యవసాయ సంఘాలు పెప్సీకో ఈ కేసు వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీనిపై 190 మందికి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. కేసు వాపసు తీసుకోవాలని పెప్సీకోకు చెప్పాలని ప్రభుత్వాలను కోరారు. "పెప్సీకో కంపెనీ సాబర్‌కాంఠాలో రైతులపై కేసులు పెట్టింది. ఒక్కొక్కరిపైనా కోటి రూపాయల దావా వేసింది" అని జతిన్ ట్రస్ట్‌ కార్యకర్త కపిల్ షా చెప్పారు. అంతకు ముందు 2018లో కూడా గుజరాత్ అరవల్లీ జిల్లాలోని రైతులపై ఇలాంటి కేసులే నమోదయ్యాయి. కంపెనీ ఏం చెప్పింది? భారత్‌లోని పెప్సీకో కంపెనీ బీబీసీ ప్రశ్నలకు ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. కంపెనీ తన హక్కులు కాపాడుకోడానికే ఈ చర్యలు తీసుకుందని తెలిపింది. పెప్సీకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016 ఫిబ్రవరి 1న ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంప విత్తనాలను సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేసింది. దాని ప్రొటెక్షన్ పిరియడ్ 2031 జనవరి 31 వరకూ ఉంది. దీనిపై రైతులేమన్నారు అరవల్లీ జిల్లాలోని ఐదుగురు రైతులు ఎఫ్ఎల్ 2027 రకం బంగాళాదుంపలు నాటారని ఆరోపిస్తూ పెప్సీకో 2018లో కోర్టులో కేసు వేసింది. వారిలో జిగర్ పటేల్ ఒకరు. బీబీసీతో మాట్లాడిన జిగర్ పటేల్ పూర్వీకుల నుంచి వచ్చిన రెండెకరాల భూమిలో తన కుటుంబం బంగాళాదుంపలు పండిస్తోందని చెప్పారు. ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపలు పండించినందుకు గత ఏడాది పెప్సీకో తనపై 25 లక్షల రూపాయలకు దావా వేసిందన్నారు. ఇప్పటివరకూ ఆయన 11 సార్లు కోర్టుకు హాజరయ్యారు. మేలో ఈ కేసు తదుపరి విచారణ ఉంది. అరవల్లీ జిల్లాలో మరో రైతు జీతూ పటేల్ కూడా ఇదే కేసులో కోర్టుకు వెళ్తున్నారు. "ఈ ప్రాంతంలోని బంగాళాదుంపల రైతులు వెండర్ల ద్వారా పెప్సీకో కంపెనీతో కలుస్తారు. మా అన్న పెప్సీకో కంపెనీ సహకార వ్యవసాయ కార్యక్రమంలో ఉన్నారు. కంపెనీ వారు చెకింగ్ కోసం వచ్చినపుడు, నేను అక్కడ పొలంలో ఉన్నా. కంపెనీ నాపైన కేసు వేసిందని కొంతకాలం తర్వాత నాకు తెలిసింది" అని జీతూ చెప్పారు. నాలుగెకరాల భూమిలో పెప్సీకో కంపెనీ కార్యక్రమం ప్రకారం మా కుటుంబం బంగాళాదుంపలు పండించేదని జీతూ చెప్పారు. 2019లో పెప్సీకో కంపెనీ నుంచి కేసును ఎదుర్కుంటున్న సాబర్కాంఠాలోని వాడాలీ తాలూకా రైతులను బీబీసీ కలిసింది. కానీ వారు ఈ అంశంపై మాట్లాడ్డానికి నిరాకరించారు. రైతుల దగ్గర బంగాళాదుంపలను తనిఖీ చేయడానికి ఎలాంటి పరికరాలు ఉండవని జిగర్ చెబుతున్నారు. తాము వివిధ ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి వాటిని సాగు చేస్తుంటామని అన్నారు. "చాలా రకాల బంగాళాదుంపలు ఒకేలా కనిపిస్తాయి. ఏది ఏ రకమో రైతులకెలా తెలుస్తుంది" అన్నారు. కంపెనీలు రైతులపై కేసులు వేయవచ్చా దీనిపై బీబీసీతో మాట్లాడిన భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అంబూ భాయ్ పటేల్ "ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపలపై ప్రత్యేక హక్కులున్నాయంటున్న పెప్సీకో ఇండియా లిమిటెడ్ వాదన నిలబడదు. రైతులు చాలా ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొస్తారు. అలాంటప్పుడు కంపెనీ వాళ్లపై కోట్ల రూపాయలకు కేసులెలా వేస్తుంది. చిన్న చిన్న రైతుల వల్ల మాకు ముప్పు వస్తుందని ఎలా వాదిస్తుంది" అన్నారు. ఇటు జతిన్ ట్రస్ట్‌కు సంబంధించిన కపిల్ షా "భారత్‌లో 'ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్(PPV & FRA)' కింద రైతులు విత్తనాలు నాటుకోవడానికి భద్రత కల్పించారు" ఉన్నారు అన్నారు. "పెప్సీకో ఇండియా కంపెనీ రైతులను భయపెట్టడం, బెదిరించడం కోసమే ఇవన్నీ చేస్తోంది అని గుజరాత్ రైతు సంఘం ఖేడూత్ ఏకతా మంచ్‌కు సంబంధించిన సాగర్ రబారీ ఆరోపించారు. 190 మందికి పైగా కార్యకర్తలు ప్రభుత్వానికి రాసిన లేఖలో "పెప్సీకో పీపీవీ అండ్ ఎఫ్ఆర్ఎలోని సెక్షన్ 64ని తమకు అనుకూలంగా చెప్పుకుంటోందని" తెలిపారు. ఈ చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం రిజిస్టర్ చేసిన విత్తనాలను రకాలను ఏ అనుమతులు లేకుండా అమ్మడం, ఎగుమతులు, దిగుమతులు చేయడం, ఉత్పత్తి చేయడాన్ని కాపీరైట్ ఉల్లంఘనగా భావిస్తారు. అయితే ఈ చట్టంలో ఇన్ని నిబంధనలు ఉన్నా, ఇందులోనే ఉన్న సెక్షన్ 39(4) ప్రకారం రైతులు విత్తనాలను పొదుపు చేయడం, వాటిని ఉపయోగించడం, మళ్లీ నాటడం, మార్పిడి చేసుకోవడం, పంచుకోవడం, ఆ విత్తనాల ద్వారా వచ్చిన పంటను అమ్ముకోవడం చేయచ్చు. వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ కూడా దానిని ధ్రువీకరించారు. విత్తనాలను బ్రాండింగ్ చేసి అమ్ముకోకూడదని చెప్పారు. కంపెనీ ఏం కోరుకుంటోంది ఏప్రిల్ 26న సాబర్కాంఠా రైతులపై పెప్సీకో వేసిన కేసులపై అహ్మదాబాద్‌లోని కమర్షియల్ కోర్టులో విచారణలు జరిగాయి. ఈ అంశాన్ని పరిష్కరించుకుందామని పెప్సీకో సూచించింది. రైతులు ఈ విత్తనాలు ఉపయోగించకూడదని, ఒకవేళ వీటిని ఉపయోగించాలంటే వారు కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకోవాలని షరతులు పెట్టింది. రైతుల తరఫు వకీలు ఆనందవర్ధన్ యాజ్ఞానిత్ కంపెనీ షరతులపై రైతులు ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదని చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది. లేస్ చిప్స్ తయారయ్యే ఈ బంగాళాదుంప ఎక్కడిది "ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపను 2003లో అమెరికాలో అభివృద్ధి చేశారు. భారత్‌లో దానిని ఎఫ్‌సీ5 పేరుతో పిలుస్తారు. దీనిలోని లక్షణాలు ప్రాసెసింగ్‌ కోసం ఉపయోగించే బంగాళాదుంపలకు తగినట్లు ఉంటాయి" అని డీసా ఆలూ రీసెర్చ్ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎన్ పటేల్ తెలిపారు. పెప్సీకో కంపెనీ రైతులతో కాంట్రాక్ట్ పద్ధతిలో బంగాళాదుంపలు పండిస్తుంది. దీని ప్రకారం అది రైతులకు తమ ప్రత్యేక విత్తనాలు అందిస్తుంది. వాటి ద్వారా పండిన బంగాళాదుంపల్లో 40 నుంచి 45 మిల్లీమీటర్ వ్యాసం ఉన్న వాటినే తీసుకుంటుంది. అంతకంటే చిన్నవి తీసుకోదు. గూగుల్ పేటెంట్స్ ప్రకారం ఎఫ్ఎల్2027 రకం బంగాళాదుంపను మొదట అమెరికాలోని రాబర్ట్ హూప్స్ పండించారు. 2003లో నార్త్ అమెరికాలోని ఇంక్ అనే ఒక కంపెనీలో ఫ్రీటోలె దీనిని పేటెంట్ చేయించారు. ఈ పేటెంట్ 2023 వరకూ ఉంది. "ఏదైనా ఒక విత్తనాన్ని రిజిస్టర్ చేసినపుడు, దానిపై 20 ఏళ్ల వరకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆ కాలపరిమితి తర్వాత ఎవరైనా ఏ అనుమతి లేదా రాయల్టీ లేకుండా ఆ విత్తనాలను ఉపయోగించుకోవచ్చు" అని డాక్టర్ ఆర్ఎన్ పటేల్ తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) లేస్ చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళాదుంపల వెరైటీని పండించారంటూ గుజరాత్ రైతులపై వేసిన కేసును పెప్సీకో ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. text: అమిత్ షా గత నాలుగైదు రోజులుగా నిస్సత్తువ, ఒళ్లు నొప్పులు ఉన్నట్లు చెప్తున్నారని ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఎయిమ్స్) పేర్కొంది. అయితే.. కోవిడ్-19 పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సౌకర్యవంతంగానే ఉన్నారని.. ఆస్పత్రి నుంచే తన విధులు కొనసాగిస్తున్నారని ఎయిమ్స్ మీడియా అండ్ ప్రొటోకాల్ డివిజన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్తీ విజ్ ఒక ప్రకటనలో వివరించారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 అమిత్ షా వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు. ఆయనకు ఆగస్టు 2వ తేదీన కరోనావైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలటంతో ఆస్పత్రిలో చేరారు. గురుగ్రామ్‌లో మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఆయన ఆగస్టు 14న కరోనా పరీక్ష నెగెటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సలహా మేరకు ఒక వారం పాటు ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటానని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆ మరుసటి రోజు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ పతాకాన్ని కూడా ఎగురవేశారు. కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? మరో 55,000 కొత్త కేసులు నమోదు... ఇదిలావుంటే.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ దేశంలో కొత్తగా 55,079 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,02,743కు పెరిగింది. ప్రస్తుతం 6,73,166 కేసులు కొనసాగుతుండగా.. 19,77,780 కేసులను డిశ్చార్జ్ చేశారు. ఇప్పటి వరకూ కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 51,797 మందికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కోవిడ్ అనంతర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. text: హిందూ సమాజం అభ్యర్థన మేరకు నగరంలో కృష్ణ మందిరానికి గోడలు నిర్మించేందుకు, హిందూ స్మశానవాటిక నిర్మాణానికి క్యాపిటల్ డెవలప్‌మెంట్ అధారిటీ (సీడీఏ) అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ పాలక ప్రభుత్వం తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీలో ఉన్న మైనారిటీ సభ్యులు సీడీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లోని సెక్టార్ హెచ్-9-2లో ఆలయ నిర్మాణం జరుగుతుంది. అయితే, ఆలయం, కమ్యూనిటీ హాల్, శ్మశానవాటిక నిర్మించడానికి కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చినట్లు హిందూ పంచాయితీ అధ్యక్షుడికి సీడీఏ లేఖ రాసింది. ఈ లేఖ ప్రకారం...మందిరానికి నిర్మించే గోడలు ఏడు అడుగుల ఎత్తు మించరాదు. కాంక్రీట్ గోడలు కట్టుకోవచ్చు లేదా ఒక అడుగు ఎత్తు ఉన్న రాతి కంచె వేసుకోవచ్చు. మందిర నిర్మాణం ప్రారంభమయ్యింది గతంలో శ్రీకృష్ణ ఆలయంపై నిషేధం 2017లో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణం కోసం ఇస్లామాబాద్‌లోని చార్ మార్లాలో భూమిని మంజూరు చేసింది. ఇక్కడ కృష్ణ ఆలయాన్ని నిర్మించాలని హిందూ సమాజం నిర్ణయించింది. అయితే, ప్రారంభంనుంచే కొన్ని ధార్మిక సంస్థలు హిందూ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించాయి. లాహోర్‌లోని జామియా అష్రాఫియా మదరసాకు చెందిన ముఫ్తీ మహమ్మద్ జకారియా ఈ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఫత్వా జారీ చేసింది. ఇస్లాం ప్రకారం, మైనారిటీ ప్రార్థనా స్థలాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించవచ్చుగానీ, కొత్త ప్రార్థనా మందిరాలు నిర్మించడానికి అనుమతి ఇవ్వరాదని ఈ ఫత్వాలో పేర్కొన్నారు. ఈ మందిర నిర్మాణం ఇస్లామాబాద్ మాస్టర్ ప్లాన్‌లో లేదని, ఆలయ నిర్మాణ ప్రయత్నాలు నిలిపివేయాలంటూ ఇస్లామాబాద్ హై కోర్టులో మూడు పిటీషన్లు దాఖలు చేశారు. అయితే హై కోర్టు ఈ పిటీషన్లను కొట్టివేసింది. ఇస్లామిక్ సైద్ధాంతిక మండలి సూచనలుఈ అంశంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామిక్ సైద్ధాంతిక మండలి (కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ) సహాయం కోరింది. హిందూ సమాజానికి తమ ఆచార వ్యవహారాలను పాటించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని పేర్కొంటూ ఈ కౌన్సిల్ లిఖిత పూర్వక అంగీకారాన్ని తెలిపింది. తమ మత సంప్రదాయాలను అనుసరించి వివాహాలు జరిపించడమే కాకుండా, అంత్యక్రియలు జరిపించడానికి, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి సరైన స్థలాన్ని కేటాయించేందుకు రాజ్యాంగం అనుమతి ఇస్తుందని ఈ కౌన్సిల్ స్పష్టం చేసింది. మైనారిటీలకోసం కేటాయించిన నిధులను ఆలయ నిర్మాణానికి ఉపయోగించవచ్చని కౌన్సిల్ స్పష్టం చేసినట్లు పీటీఐ సభ్యుడు లాల్ చంద్ మల్హీ తెలిపారు. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించే బాధ్యతను లాల్ చంద్ మల్హీకి అప్పగించారు. సైద్‌పూర్‌లోని మందిరం పాకిస్తాన్‌లో ఉన్న పురాతన హిందూ దేవాలయాలు ఇస్లామాబాద్ సమీపంలోని రావల్పిండి నగరంలోనూ, కటాస్ రాజ్, తక్షశిలలోని పురావస్తు ప్రదేశాల్లోనూ ప్రముఖ హిందూ దేవాలయాలున్నాయి. పాకిస్తాన్‌లో సుమారు 80 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. దక్షిణ సింధు ప్రావిన్స్‌లోని ఉమర్‌కోట్, మీర్పూర్ ఖాస్, తార్పార్కర్‌లో పెద్ద సంఖ్యలో హిందూ జానాభా నివసిస్తున్నారు. ఇస్లామాబాద్‌లో 3000 మంది హిందువులు ఉన్నారు. 1973లో తార్పార్కర్‌నుంచీ ఇస్లామాబాద్ తరలివచ్చిన వారిలో ఇస్లామాబార్ హిందూ పంచాయితీ మాజీ అధ్యక్షుడు ప్రీతం దాస్ కూడా ఉన్నారు. ఇస్లామాబాద్ సైద్‌పూర్ గ్రామంలో ఒక చిన్న కృష్ణ విగ్రహం ఉందని, ఆ గ్రామాన్ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించినప్పుడు ఈ విగ్రహాన్ని భద్రపరిచారని ప్రీతం దాస్ తెలిపారు. అయితే ఈ చిన్న విగ్రహం ఇస్లామాబాద్‌లో వేలల్లో ఉన్న హిందువులు పూజించేందుకు సరిపోకపోవచ్చని, దీన్ని ఉత్సవ విగ్రహంగా ఉంచొచ్చని ప్రీతం దాస్ అన్నారు. "ఇస్లామాబాద్‌లో హిందూ ఆచార వ్యవహారాలు పాటించడం చాలా కష్టం. హిందూ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక స్థలం లేదు. దీపావళి, హోళీలాంటొ పండుగలు జరుపుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఎట్టకేలకు ప్రభుత్వం మా అభ్యర్థనను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని ప్రీతం దాస్ తెలిపారు. ఇప్పటికే ఇస్లామాబాద్‌లో కేటాయించిన స్థలంలో హిందూ పద్ధతిలో దహన సంస్కారాలు చెయ్యడం మొదలుపెట్టామని లాల్ చంద్ తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తొలిసారిగా శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది. text: నాకు అప్పుడు పదమూడేళ్లే. చెన్నై తీరానికి దగ్గర్లో ఉండేదాన్ని. సునామీ విధ్వంసం నాపై నేరుగా ప్రభావం చూపలేదు. కానీ ఆ చీకటి రోజున సంభవించిన విషాదం, ప్రాణ, ఆస్తి నష్టం చూశాను, వాటి గురించి మరెంతో విన్నాను. నాడు సునామీ కలిగించిన భయం నన్ను నేటికీ వెంటాడుతూనే ఉంది. సునామీ తమిళనాడును తాకిన రోజు ఆదివారం. సెలవు రోజు. సాధారణంగా అయితే క్రిస్మస్ తర్వాతి రోజు కావడం, కొత్త సంవత్సరం సమీపిస్తుండటంతో ఆ రోజు అంతటా ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. కానీ సునామీతో అదంతా మాయమై విషాదం అలముకొంది. మా ఇల్లు సముద్ర తీరానికి దగ్గర్లోనే ఉన్నందున మా క్షేమం గురించి తెలుసుకొనేందుకు మా దూరపు బంధువు ఒకరు ఆ రోజు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్‌తోనే మాకు మెలకువ వచ్చింది. 2004 డిసెంబరు 26న సునామీ తర్వాత చెన్నైలోని మెరీనా బీచ్‌లో కనిపించిన దృశ్యం 'సునామీ'నా.. అంటే ఏంటి? సునామీ కెరటాలు తమిళనాడు తీరాన్ని తాకాయనే సమాచారం మాకు అందినప్పుడు ఆ మాటే కొత్తగా అనిపించింది. ఎప్పడూ వినని మాట అది. ఆ మాట కూడా సరిగా పలకలేకపోయాం మొదట్లో. ప్రతి ఆదివారం మేం చెన్నైలో రద్దీ ఎక్కువగా ఉండే కాసిమేడు చేపల మార్కెట్‌కు వెళ్తుంటాం. బేరసారాలు, కొనుగోళ్లు, అమ్మకాలతో అక్కడి వాతావరణం హడావుడిగా, సరదాగా ఉంటుంది. ఆ ఆదివారం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన వాతావరణం ఉంది. చెన్నై: సునామీ వచ్చిన రోజు బీచ్‌కు వెళ్లినప్పుడు నా కాళ్లను చుట్టేసుకునే కెరటాలు నాకు ఎప్పుడూ స్నేహితుల్లా అనిపించేవి. సునామీ విధ్వంసం ముందు వరకు తీరంలో ఇసుకతో నేనెన్నో ఇళ్లు కట్టుకున్నాను. ఒక్క రోజు, ఒకే ఒక్క రోజులో అంతా మారిపోయింది. అప్పటివరకు నా స్నేహమైన కెరటమే శత్రువు అయ్యింది. ఆ అలలు ఎంతో మంది ప్రాణాలను తీసుకుపోయిన తర్వాత వాటిని నా స్నేహితులను ఎలా అనుకోగలను? చేపల మార్కెట్‌లో పడివున్న మృతదేహాలను చూసినప్పుడు ఏదో తెలియని బాధ నన్ను ఆవరించింది. నా కాళ్లు వణికాయి. అప్పుడు నాకు కలిగిన బాధ, వచ్చిన దుఃఖం మాటల్లో చెప్పలేను. నేనే కాదు, పెద్దవాళ్లు కూడా భయాందోళనతో పెద్దగా ఏడ్చారు. విశాలమైన ప్రదేశంలోనే ఉన్నా నాకెందుకో శ్వాస ఆడనట్టు అనిపించింది. మేం ఉండే చోటకు దగ్గర్లో అప్పట్లో చాలా గుడిసెలు ఉండేవి. వాటిలో చాలా వరకు మత్స్యకార కుటుంబాలే ఉండేవి. సునామీ విధ్వంసం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మత్స్యకారుల నివాస ప్రాంతం ఒకటి. సునామీతో వాళ్ల గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. వాళ్ల సామగ్రి, వస్తువుల్లో దాదాపు అన్నింటినీ అలలు లాగేసుకొనిపోయాయి. దెబ్బతిన్న సామగ్రి, వస్తువులు కొన్ని చుట్టుపక్కల పడి ఉండటం నాకు కనిపించింది. నేనప్పుడు చాలా చిన్నదాన్నే అయినప్పటికీ, ''వీళ్లంతా తిరిగి తమ జీవితాలను ఎలా మొదలుపెట్టగలరు'' అనే ప్రశ్న నాకు వచ్చింది. వీళ్లంతా నేను అంతకుముందు మాట్లాడిన లేదా చూసిన మనుషులే. ఏదో తెలియని బాధతో ఏడ్చాను. సునామీ మిగిల్చిన విషాదాన్ని చూసి బరువెక్కిన గుండెతో ఇంటికి చేరుకున్నాం. మా క్షేమం గురించి, సునామీ గురించి తెలుసుకోవడానికి మా బంధువులు, స్నేహితుల నుంచి అప్పటికే చాలా ఫోన్లు వచ్చాయి. సునామీ విధ్వంసాన్ని, విషాదాన్ని టీవీ ఛానళ్లు నిరంతరాయంగా చూపిస్తున్నాయి. పెద్దసంఖ్యలో మృతదేహాలు, గుండెలవిసేలా విలపిస్తున్న చిన్నాపెద్దా ఎంతో మంది టీవీలో కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బాధ ఇంకా ఎక్కువైంది. కన్నీళ్లు ఆగడం లేదు. నాగపట్నం, కడలూరు జిల్లాల్లో పెద్దసంఖ్యలో చనిపోయారనే సమాచారం తెలిశాక సునామీ మిగిల్చిన విషాదం చాలా ఎక్కువగా ఉందని అర్థమైంది. ఈ దృశ్యాలన్నీ నన్ను బాగా కలచివేశాయి. డిసెంబరు 26ననే కాదు ఆ తర్వాత కూడా ఇవి నన్ను వెంటాడాయి. చాలా రోజులు భయంతో నిద్రలోంచి లేచాను. నా స్నేహితుల పుస్తకాలు పోయాయి సునామీ వచ్చిన పది రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. సునామీ బారినపడ్డ కొందరు స్నేహితులను కలుసుకున్నాను. నా స్నేహితుల్లో చాలా మంది తీర ప్రాంతంలో ఉండేవారు. వాళ్లలో అత్యధికులు స్కూల్ యూనిఫాంలు, పుస్తకాలు సునామీతో పోయాయి. వాళ్ల బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియలేదు. వాళ్లు కనీసం ప్రాణాలతో బయటపడ్డారనే ఆలోచన కాస్త ఊరటనిచ్చింది. సునామీ తర్వాత జీవితం ముందున్నట్లు ఉండదు. సముద్రం, అలలు అప్పటివరకు ఇచ్చిన మంచి అనుభూతి మాయమైపోయింది. ఆ స్థానంలో భయం వచ్చి చేరింది. సునామీ అంటే తెలియక ముందు, బీచ్‌లో ఆడుకోనివ్వండని నా తల్లిదండ్రుల వద్ద మారాం చేసేదాన్ని. సునామీ తర్వాత చాన్నాళ్ల వరకు నాకు తిరిగి బీచ్‌లో అడుగు పెట్టే ధైర్యం రాలేదు. చెన్నై కాసిమేడు చేపల మార్కెట్‌కు, ఫిషింగ్ హార్బర్‌కు చాలా సంవత్సరాల తర్వాతే మళ్లీ వెళ్లాను. చాలా మారిపోయాయి. కానీ సునామీ రోజు నాకు కనిపించిన బాధాకర దృశ్యాలు మాత్రం నా మనసులో అలాగే ఉండిపోయాయి. నాపై సునామీ నేరుగా ప్రభావం చూపలేదు. కానీ సునామీతో ఎన్నో కోల్పోయిన నా స్నేహితులు, ఇరుగుపొరుగు తమ గాథలను గుర్తుచేసుకున్నప్పుడు నా కళ్లు చెమర్చుతాయి. సునామీతో అనాథగా మిగిలిన ఒక బాలిక ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సునామీ- పదిహేనేళ్ల క్రితం వరకు తమిళనాడులో ఈ మాట ఎవరికీ పెద్దగా తెలియదు. 2004 డిసెంబరు 26- తమిళనాడులో సునామీ సృష్టించిన పెను విధ్వంసం, మహా విషాదాన్ని చూసిన, వీటి గురించి విన్న ఎవ్వరూ మరచిపోలేని తేదీ ఇది. text: అలాంటి వారికి ఒక చక్కని ఉపాయం చెబుతున్నారు లండన్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్టెల్లా మెక్‌కార్ట్‌నీ. వారానికోసారి, రెండు వారాలకోసారి ఉతకడం కాదు... అసలు బట్టలను ఉతకాల్సిన అవసరమే లేదని ఆమె ఇటీవల 'ది అబ్జర్వర్' వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. "మీరు బట్టలను తప్పనిసరిగా శుభ్రం చేయాల్సిన అవసరం లేనప్పుడు, వాటిని అసలు శుభ్రం చేయకండి" అని ఆమె సూచించారు. బట్టలను ఎందుకు ఉతకొద్దన్న దానికి ఆమె రెండు కారణాలు చెబుతున్నారు. బట్టలను ఉతకొద్దని మెక్‌కార్ట్‌నీ చెప్పడం ఇదే తొలిసారి కాదు. బట్టల మన్నిక తగ్గకుండా ఉండేందుకు, వాటివల్ల పర్యావరణంపై ప్రభావం పడకుండా ఉండేందుకు వాషింగ్ మెషీన్ల వాడకాన్ని ఆపేయాలని ఆమె చాలాకాలంగా సూచిస్తున్నారు. ప్లాస్టిక్ సూప్ ఫౌండేషన్‌కు చెందిన లారా డియాజ్ శాంచెజ్ కూడా మెక్‌కార్ట్‌నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. రోజువారీగా ధరించే దుస్తుల్లో పాలిస్టర్, అక్రీలిక్ లాంటి సింథటిక్ పదార్థాలు అధికంగా ఉంటాయని ఆమె చెప్పారు. స్టెల్లా మెక్‌కార్ట్‌నీ సూక్ష్మ రేణువులతో పర్యావరణానికి చేటు "మనం బట్టలను ఉతికిన ప్రతిసారీ సగటున 90 లక్షల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు పర్యావరణంలోకి విడుదలవుతాయి. ఉతికే పద్ధతి, బట్టల తయారీ విధానం మీద ఆ రేణువుల విడుదల ఆధారపడి ఉంటుంది. బట్టలను ఎంత ఎక్కువగా ఉతికితే అంత ఎక్కువ సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు వాతావరణంలోకి వెళ్తాయి." అని లారా డియాజ్ వివరించారు. కొన్ని వాషింగ్ మెషీన్లలో వేడి నీటిలో బట్టలను ఉతికే సదుపాయం ఉంటుంది. అయితే, వేడి నీళ్లతో బట్టలను ఉతకడం మంచిది కాదని లారా అంటున్నారు. వాషింగ్ మెషీన్‌లో తక్కువ టెంపరేచర్ సెట్ చేసి, ద్రవరూప డిటర్జెంట్లను వాడాలని ఆమె సూచిస్తున్నారు. "పౌడర్ రూపంలో ఉండే డిటర్జెంట్ల వల్ల బట్టల మధ్య రాపిడి అధికమవుతుంది [ఉతికే సమయంలో], దాంతో బట్టల నుంచి అధిక మొత్తంలో సూక్ష్మ రేణువులు విడుదలవుతాయి. ద్రవరూప డిటర్జెంట్లు వాడితే బట్టల మధ్య రాపిడి చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ మొత్తంలో రేణువులు విడుదలవుతాయి" అని లారా డియాజ్ వివరించారు. అలాగే, వాషింగ్ మెషీన్‌లో పరిమితికి మించి బట్టలు వేయడం వల్ల కూడా అందులో రాపిడి అధికమవుతుందని, తక్కువ బట్టలు వేస్తే రాపిడి తగ్గుతుందని ఆమె చెప్పారు. లోదుస్తులు "నేను ప్రతిరోజూ బ్రా మార్చుకోను" అని స్టెల్లా మెక్‌కార్ట్‌నీ ది అబ్జర్వర్‌ పత్రికకు చెప్పారు. అయితే, మెక్‌కార్ట్‌నీతో మహిళల లోదుస్తుల డిజైనర్ నావోమీ డే హాన్ కూడా ఏకీభవిస్తున్నారు. తన బ్రాండ్ బ్రాలను ఐదు సార్లు వాడిన తర్వాత గోరువెచ్చని నీటిలో, కొద్దిగా బేబీ షాంపూ వేసి చేతితో ఉతకాలని నావోమీ తన వినియోగదారులకు సూచిస్తున్నారు. ఖరీదైనవాటితో పాటు, సాధారణ లోదుస్తులకు కూడా ఇది వర్తిస్తుందని ఆమె అంటున్నారు. అయితే, క్రీడాకారులు ధరించే బ్రాలను మాత్రం తరచుగా ఉతకాలని ఆమె చెప్పారు. లివైస్ సంస్థ సీఈవో చిప్ బర్గ్ నేను జీన్స్‌ ఉతకను "జీన్స్‌ను మధ్యమధ్యలో గాలిలో ఆరేస్తే సరిపోద్ది, ఉతకాల్సిన అవసరం లేదు. జీన్స్ మీద ఒకచోట మరక పడితే మొత్తం వస్త్రాన్ని ఉతకుండా, ఆ మరకను మాత్రమే నీటితో శుభ్రం చేయడం మంచిది" అని పర్యావరణ పరిక్షణ సంస్థ వ్రాప్‌ చేపట్టిన 'లవ్ యువర్ క్లోత్స్' క్యాంపెయిన్ నిర్వాహకుడు సారా క్లేటన్ సూచిస్తున్నారు. బట్టలు ఉతకాల్సిన పనిలేదు అంటే చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ, నిజంగానే ఓ బిజినెస్‌మ్యాన్ అలాగే చేస్తున్నారు. ఆయన లివైస్ సంస్థ సీఈవో చిప్ బర్గ్. తాను వేసుకున్న జీన్స్‌ను అయిదేళ్లుగా ఎన్నడూ ఉతకలేదని 2014లో చిప్ బర్గ్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రకటన చేసి ఇప్పటికి అయిదేళ్లు దాటింది. ఆ జత బట్టలను ఇప్పటికీ ఉతకలేదని ఈ ఏడాది మార్చిలో సీఎన్‌ఎన్‌ టీవీ చానెల్‌కు చెప్పారు. చిప్ బర్గ్‌తో వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్ డిజైనింగ్ విభాగం బాధ్యుడిగా ఉన్న ప్రొఫెసర్ ఆండ్రూ గ్రోవ్స్ కూడా ఏకీభవిస్తున్నారు. జీన్స్‌ను ఉతకకుండా ఫ్రీజర్‌లో పెట్టడం ద్వారా ఆ బట్టల్లోని క్రిములను నశింపజేయొచ్చని ప్రొఫెసర్ ఆండ్రూ గ్రోవ్స్ చెబుతున్నారు. చిప్ బర్గ్ మాత్రమే కాదు, జీన్స్‌ను ఏళ్లతరబడి ఉతకనివారు చాలామంది ఉన్నారని ఆయన చెప్పారు. "నాకు తెలిసినవారిలో చాలామంది వారి జీన్స్‌ను ఎన్నడూ ఉతకరు. అది కొందరికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కానీ, బట్టల మన్నిక తగ్గకుండా, రంగు చెడిపోకుండా ఉండాలంటే ఉతకకుండా ఉండటమే మంచిది. ఇది జీన్స్‌కు మాత్రమే కాదు, అన్ని రకాల వస్త్రాలకూ వర్తిస్తుంది" అని గ్రోవ్స్ చెబుతున్నారు. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరలేదు తరచూ ఉతకడం వల్ల బట్టల మన్నిక భారీగా తగ్గిపోతుంది. అంటే, తొందరగా వాటిని చెత్తబుట్టలో పడేసి, కొత్త బట్టలు కొనాల్సి వస్తుందన్నమాట. "వాషింగ్ మెషీన్లలో రాపిడి వల్ల బట్టల మీద మరకలు తొలగిపోతాయి. అదే సమయంలో ఆ రాపిడి వల్ల వస్త్రాల ఆకృతి, రంగు చెడిపోతుంది" అని ప్రొఫెసర్ గ్రోవ్స్ అంటున్నారు. "నేను కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న బట్టలు నా వార్డ్‌రోబ్‌లో ఉన్నాయి. అవి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఎందుకంటే వాటిని ఎలా భద్రంగా చూసుకోవాలో నాకు తెలుసు. ఖరీదైన దుస్తులైనా, రోజువారీగా వేసుకునే సాధారణ బట్టలైనా.. ఎంత భద్రంగా చూసుకుంటే, అవి అంత ఎక్కువ కాలం పనికొస్తాయి" అని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బట్టలు ఉతకడం అంటే చాలామందికి చిరాకు పుట్టుకొస్తుంటుంది. అందుకే, రేపు.. మాపు అంటూ వేసిన జీన్స్‌నే వారం పదిరోజులపాటు వేసుకునే బ్యాచిలర్లు భారీగానే ఉంటారు. text: The aftermath of the latest bomb blast in Mogadishu బాంబు ఉన్న ఓ కారు హోటల్లోకి దూసుకుపోవడంతో మొదటి పేలుడు సంభవించింది. బస్సులో ఉంచిన ఓ బాంబు పార్లమెంటు భవన సమీపంలో పేలడంతో రెండో ఘటన చోటుచేసుకుంది. తామే ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. రెండు వారాల క్రితం జరిగిన పేలుళ్లకు కూడా ఈ సంస్థే కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కానీ ఆ పేలుళ్లు తమ పని కాదని, రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలే తమ లక్ష్యాలని అల్ షబాబ్ వెల్లడించింది. అల్ షబాబ్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. దీనికి ముందే ఈ దాడి జరిగింది. "మరణించినవారిలో చాలామంది సాధారణ పౌరులే. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం" అని భద్రతా అధికారి మొహమ్మద్ మోలిమ్ అదాన్ తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. సోమాలియాలో అక్టోబరు 14న జరిగిన బాంబు దాడిలో 358 మంది చనిపోయారు. 56మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన జంట పేలుళ్లలో 20మంది మరణించారు. చాలామంది గాయపడ్డారు. text: షానన్ వెయిట్‌కు గూగుల్ సంస్థ ఇచ్చిన వాటల్ బాటిల్ మూత పగిలిపోయినప్పుడు ఆ క్షణం ఎదురైంది. షానన్ పని చేస్తున్న డాటా సెంటర్ చాలా వేడిగా ఉంటుంది. దాంతో తనకు మరొక నీళ్ల సీసా కావాలని అడిగారు. కానీ, గూగుల్ సబ్‌కాంట్రాక్టర్ మరొక బాటిల్ ఇవ్వనన్నారు. అయితే, ఆ విషయం అక్కడితో ఆగిపోకుండా, గూగుల్ సంస్థ తమ ఉద్యోగుల బాగోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి కల్పించింది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని వాతావరణం, జీతం గురించి ఒకరితో ఒకరు చర్చించుకునే హక్కు ఉందని తెలుపుతూ గత వారం గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది వింతగా అనిపించొచ్చు. గూగుల్‌లాంటి సంస్థ ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. కానీ అదే నిజం. షానన్, గూగుల్‌తో చేసిన పోరాటం ఫలితమే ఈ ప్రకటన. షానన్ వెయిట్ షానన్ ఎవరు? ఏం జరిగింది? పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పద్ధతులెలా ఉంటాయో, ఒక్కోసారి అవి పరిధి దాటి ఎలా జోక్యం చేసుకుంటాయో షానన్ కథ తెలుపుతుంది. షానన్ 2018లో డిగ్రీ పూర్తి అయిన తరువాత, సౌత్ కరోలినాలోని గూగుల్ డాటా సెంటర్‌లో గంటకు 15 డాలర్ల జీతానికి ఉద్యోగంలో చేరారు. "సర్వర్ సమస్యలు పరిష్కరించడం, హార్డ్ డ్రైవ్‌లు, మదర్‌బోర్డులు మార్చడం, సుమారు 14 కేజీలున్న పెద్ద పెద్ద బ్యాటరీలను ఎత్తి పెట్టడం.. ఇది చాలా కష్టమైన పని" అని షానన్ తన ఉద్యోగం గురించి వివరించారు. సాధారణంగా గూగుల్ ఆఫీసులు సృజనాత్మకంగా ఉండి, ఉల్లాసంగా పని చేసేందుకు కావలసిన సౌకర్యాలతో నిండి ఉంటాయని ప్రసిద్ధి. టేబుల్ టెన్నిస్, ఉచితంగా తినుబండాలు, మ్యూజిక్ రూమ్స్.. ఇలా ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్తారు. అయితే, అందరూ చెప్పుకుంటున్నట్లు గూగుల్ ఆఫీసులేమీ అంత ఆహ్లాదకరంగా ఉండవని షానన్ అంటున్నారు. "సినిమాల్లో చూపించినట్టు ఉద్యోగులు రోజంతా సరదాగా గేమ్స్ అవీ ఆడుకుంటూ ఉండరు. డాటా సెంటర్ వాతావరణ పూర్తిగా వేరే" అని ఆమె అన్నారు. షానన్ గూగుల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరారు. అంటే గూగుల్ నేరుగా ఆమెను ఉద్యోగంలో చేర్చుకోలేదు. మోడిస్ అనే సబ్‌కాంట్రాక్టర్ ద్వారా అందులో చేరారు. మోడిస్, అడెకో అనే మరో పెద్ద సంస్థలో భాగం. ఇలాంటి వ్యవహారాలు గూగుల్‌లో సర్వ సాధారణం. గూగుల్‌లో పని చేస్తున్న సగం మంది ఇలాగే మరొక కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వారేనని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇంత క్లిష్టమైన వ్యవస్థలో తప్పు జరిగితే దాని భారం ఎవరి మీద పడుతుంది అనేది మరింత సంక్లిష్టమైన వ్యవహరం అవుతుంది. ప్రస్తుతం షానన్ కథలో అలాంటి సమస్యే ఉత్పన్నమైంది. కోవిడ్ 19 ప్రారంభమైనప్పటి నుంచీ, పని భారం బాగా పెరిగిందని షానన్ తెలిపారు. షిఫ్ట్‌లో పని బాగా పెరిగిందని, అయితే అందులో కొంత ఆహ్లాదకరమైన సంగతులూ ఉన్నాయని ఆమె చెప్పారు. "2020 మే వచ్చేటప్పటికి, ఉద్యోగుల విలువ, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటామని గూగుల్ ప్రకటించింది. కాంట్రాక్ పద్ధతిలో చేరిన వారితో సహా గూగుల్ ఉద్యోగులందరికీ బోనస్ ఇస్తామని తెలిపింది. అయితే, మేము బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాంగానీ మా బ్యాంక్ అకౌంట్లలో ఆ డబ్బులు పడలేదు. ఆ డబ్బు ఏమైంది, ఎందుకు చేతికి అందట్లేదనే ఆందోళన మొదలైంది" అని షానన్ వివరించారు. అప్పుడే ఆ సంస్థలో పని చేస్తున్నవాళ్లంతా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరెవరికి ఎంతెంతె బోనస్ రావాలి, ఎప్పటికల్లా రావాలి లాంటి విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నారు. "మేమంతా జీతాలు, బోనస్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే, ఈ విషయం మేనేజ్మెంట్‌కి తెలిసినప్పుడల్లా ఒకరి జీతాల గురించి ఒకరితో మాట్లాడుకోవద్దని హెచ్చరించారు" అని షానన్ చెప్పారు. "మీకు వచ్చే బోనస్‌లు, పరిహారాల గురించి మీ తోటి ఉద్యోగులతో మాట్లాడడం సరైన పని కాదు" అని చెప్తూ షానన్‌కు ఒక మేనేజర్ దగ్గర నుంచి వ్యక్తిగత సందేశం కూడా వచ్చింది. షానన్ వెయిట్‌కు మేనేజర్ పంపిన సందేశం అయితే, కొన్ని రోజుల తరువాత షానన్‌కు రావలసిన బోనస్ వచ్చింది. కానీ, తనకు అప్పటివరకూ ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయని ఆమె అన్నారు. గూగుల్‌లో ఎప్పటికైనా తనకు ఫుల్-టైమ్ ఉద్యోగం వస్తుందని షానన్ ఆశిస్తూ వచ్చారు. కానీ, అక్కడ "పెర్మా-టెంప్స్" అనే ఒక కల్చర్ ఉందని ఆమె గమనించారు. అంటే, కాంట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలిక ఉద్యోగాల్లో చేరినవారు ఎంత కష్టపడినాగానీ అక్కడ ఫుల్-టైమ్ ఉద్యోగం సంపాదించలేరు. షానన్ సహనం నశించిన క్షణం ఇలా అనేక రకాలుగా అక్కడి మేనేజ్మెంట్ పద్ధతులతో షానన్ విసిగిపోయారు. ఆమె సహనం నశించింది. "డాటా సెంటర్‌లో చాలా వేడిగా ఉంటుంది. అందుకని, గూగుల్ నాకొక వాటర్ బాటిల్ ఇచ్చింది. అయితే, దాని మూత విరిగిపోయింది. నా తోటి ఉద్యోగికి కూడా అదే జరిగింది. తను ఫుల్-టైం ఉద్యోగి. తనకు కొత్త బాటిల్ ఇచ్చారుగానీ నాకివ్వలేదు. దాంతో ఆరోజు ఇంటికెళ్లిన తర్వాత ఫేస్బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాను. ఇంక భరించలేను అనిపించింది. మర్నాడు ఆఫీస్‌కు వెళ్లాక నన్ను మీటింగ్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ మేనేజర్లు అందరూ కూర్చుని ఉన్నారు. నేను రాసిన ఫేస్బుక్ పోస్టు సంస్థ నియమావళిని ఉల్లంఘించించని చెప్పారు. నావలన సంస్థ భద్రతకు ముప్పు ఉందని చెప్తూ నా బ్యాడ్జ్, ల్యాప్‌టాప్ వెంటనే వెనక్కి ఇచ్చేయమని చెప్పారు. నన్ను దగ్గరుండి మరీ ఆఫీస్ నుంచి బయటకు పంపించారు" అని షానన్ వివరించారు. 2021 జనవరిలో గూగుల్ ఉద్యోగుల కోసం 'ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్' ఏర్పడినప్పటికీ దాన్ని అమెరికా నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు గుర్తించలేదు. అంతేకాకుండా, మెజారిటీ గూగుల్ ఉద్యోగులు ఇందులో సభ్యులుగా చేరలేదు. కానీ, షానన్ ఇందులో ఉన్నారు. తన కేసును ఈ బోర్డ్ టేకప్ చేసింది. ఫిబ్రవరిలో ఈ యూనియన్, షానన్ తరుపున న్యాయవిరుద్ధమైన కార్మిక చట్టాల కింద రెండు కేసులు వేసింది. ఒకటి, అన్యాయంగా ఆమెను ఉద్యోగంలోంచి తీసేశారని, రెండోది, జీతాలు, బోనస్‌ల గురించి మాట్లాడొద్దని తన మేనేజర్లు హెచ్చరించారని. ఫలితంగా, కిందటి నెల గూగుల్, మోడిస్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. షానన్ సస్పెన్షన్ ఉపసంహరించారు. అలాగే, "తమ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, బోనస్‌లు, పని వాతావరణం గురించి చర్చించుకునే హక్కులు ఉంటాయని" పేర్కొంటూ గూగుల్ ఒక ఒప్పంద పత్రంలో సంతకం చేసింది. ఇది షానన్‌కు, కొత్తగా ఏర్పడిన యూనియన్‌కు కూడా ఒక గొప్ప విజయం. షానన్ వెయిట్ ఫేస్‌బుక్ పోస్ట్ "ఇలాంటి పెద్ద పెద్ద మల్టినేషనల్ కంపెనీల వేర్‌హౌస్, డాటా సెంటర్లలో పని చేసే ఉద్యోగులకు, వారి చిన్న చిన్న హక్కులు పొందే భాగ్యం కూడా ఉండదు. ఈ విషయంలో అందరూ విసిగిపోతున్నారు. ఈ కంపెనీలు మా బాధలను పట్టించుకోవట్లేదని గ్రహించాం. అందుకే, వాళ్లు మా బాధలు వినేలా చేస్తాం" అని షానన్ అన్నారు. గత వారం, అలబామాలోని అమెజాన్ సంస్థలో వర్కర్స్ యూనియన్ ఏర్పాటుపై ఎన్నికలు జరిగాయి. అది ఏర్పడకూడదని అమెజాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఎన్నికల ఫలితాలు త్వరలో ప్రకటించనున్నారు. బిగ్ టెక్ కంపెనీకి, దాని ఉద్యోగులకు మధ్య జరుగుతున్న సంఘర్షణల్లో ఇది తాజా సంఘటన. "ఈ మొత్తం విషయంలో ప్రజలు గ్రహించవలసింది ఏమిటంటే.. గూగుల్ ఉద్యోగులందరికీ ఏడంకెల జీతం రాదు. అలాగే, చాలా కింది స్థాయి ఉద్యోగులు కూడా బలంగా నిలబడగలరు. వారి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు" అని షానన్ అన్నారు. గూగుల్ అంగీకరించిన వాటిలో కొన్ని అంశాలు గూగుల్ ఏమంటోంది? ఈ విషయంలో తమ తప్పొప్పుల గురించి గానీ, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల గురించిగానీ గూగుల్ ఏమీ వ్యాఖ్యానించలేదు. షానన్ కేసుపై గూగుల్ అభిప్రాయాన్ని బీబీసీ కోరగా.. అదనంగా చెప్పడానికేమీ లేదని తెలిపింది. అడెకో సంస్థ మాత్రం బీబీసీ అభ్యర్థనకు స్పందించలేదు. షానన్ మళ్లీ గూగుల్ డాటా సెంటర్‌లో చేరాలని అనుకోవట్లేదు. చరిత్రలో పీహెచ్‌డీ చేయాలన్నది ఆమె ఆకాంక్ష. అయితే, ఒక పెద్ద టెక్ కంపెనీ మీద ఒక చిరు ఉద్యోగి సాధించిన అరుదైన విజయంగా ఇప్పటికే ఆమె కథ చరిత్రలో స్థానం సంపాదించుకుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రతీ వ్యక్తికి సహనం నశించిపోయే క్షణం ఒకటి వస్తుంది. అది ఎంత చిన్న విషయమైనా కావొచ్చు, పెద్ద పోరాటానికి దారి తీస్తుంది. text: తన నూరవ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌తో ఛెత్రి సాధించిన గోల్స్‌తో అతని అంతర్జాతీయ గోల్స్ మొత్తం సంఖ్య 59కి చేరింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ మ్యాచ్ 68వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, రెండో గోల్ జేజే లాల్‌పెఖ్లువా 71వ నిమిషంలో సాధించాడు. మూడో, చివరి గోల్ మళ్లీ సునీల్ ఛెత్రి ఆట 92వ నిమిషంలో సాధించాడు. ఆటను ఐదు నిమిషాల పాటు పొడిగించారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 మ్యాచ్‌కు జనాన్ని పిలిచాడు... విజయం సాధించాడు అంతకు ముందు, ‘ప్లీజ్.. స్టేడియానికి రండి.. మా మ్యాచ్ చూడండి’ అన్న భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ఛెత్రి చేసిన వీడియో ట్వీట్ ట్రెండ్ అయ్యింది. తమకు మద్దతివ్వాలంటూ ఛెత్రి చేసిన విజ్ఞప్తికి పలువురు స్పందించారు. విరాట్ కొహ్లీ, రాజమౌళి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇలా ఎందరో ఛెత్రికి మద్దతుగా నిలిచారు. ఛెత్రి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో ప్రజలను ఉద్దేశించి.. ''మీరు మమ్మల్ని విమర్శించండి, దూషించండి. కానీ మా మ్యాచ్ చూడటానికి స్టేడియానికిరండి. మ్యాచ్ ఆడేటపుడు ప్రేక్షకులను చూస్తే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. మేం ఇంకా బాగా ఆడగలం..'' అన్నాడు. భారత జట్టు ఆడిన చివరి మ్యాచ్ చూడటానికి కేవలం 2,569మంది ప్రేక్షకులు మాత్రమే హాజరైన నేపథ్యంలో ఛెత్రి ఈ సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. భారత్, న్యూజిలాండ్, కెన్యా, చైనా దేశాల మధ్య ఫుట్‌బాల్ ఇంటర్ కాంటినెంటల్ కప్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత జట్టు 'బ్లూ టైగర్స్' చైనాపై 5-0తో విజయం సాధించింది. ఫీఫా(ఎఫ్.ఐ.ఎఫ్.ఎ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 97వ స్థానంలో నిలిచింది. ‘‘నా మిత్రుడు ఛెత్రి చేసిన విజ్ఞప్తిని మీరు చూసే ఉంటారు. దయచేసి మీరు స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడండి.. వాళ్లు చాలా కష్టపడి ఆడుతున్నారు. భవిష్యత్‌లో మీ పిల్లలు కూడా క్రీడాకారులయితే, వారి ఆటను చూడటానికీ ప్రేక్షకులు రావాలిగా మరి.. దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించండి.. '' అంటూ విరాట్ కొహ్లీ ఛెత్రికి మద్దతుగా నిలిచాడు. ఛెత్రి విజ్ఞప్తిని అందుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో స్పందించారు. ‘ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి నేను వెళుతున్నా.. మరి మీ సంగతేమిటి?’ అని ట్వీట్ చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఛెత్రికి మద్దతుగా ట్విటర్‌లో స్పందించారు. ప్రేమ, సంకల్పం రెండూ కలిస్తే.. దాన్ని ఆపడం కష్టం. మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌తోనే తొలి మ్యాచ్, తొలి గోల్..! భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రి.. తన వందో అంతర్జాతీయ మ్యాచ్‌ను సోమవారం ఆడతారు. ఇంటర్నేషనల్ కప్ సిరీస్‌లో భాగంగా కెన్యాపై ఈ మ్యాచ్‌ ముంబైలో జరుగుతుంది. ప్రాక్టీస్ సెషన్‌ ముందు మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో తను మొదటి గోల్ చేసిన సందర్భాన్ని ఛెత్రి గుర్తు చేసుకున్నాడు. ''భారత జట్టు తరఫున ఆడిన మొదటి మ్యాచ్ నాకు బాగా గుర్తుంది. అది పాకిస్తాన్‌తో ఆడాం. వేదిక కూడా పాకిస్తానే.. జట్టులో నేను, సయ్యద్ రహీమ్ నబీ ఇద్దరమూ కొత్త వాళ్లం. మొదట్లో మాకు మ్యాచ్‌లో ఆడే అవకాశం దొరకకపోవచ్చని భావించాం. కానీ సుఖ్విందర్ సింగ్ మాకు అవకాశం ఇచ్చారు. ఆటలో మొదటి గోల్ చేసినపుడు చాలా ఉద్వేగానికి లోనయ్యా. వెంటనే.. పాకిస్తాన్ అభిమానుల వద్దకు పరుగెత్తుకెళ్లి వేడుక చేసుకున్నా'' అన్నాడు. ''భారత ఫుట్‌బాల్ జట్టుపై ఆశలు లేనివారందరూ స్టేడియానికి వచ్చి మా మ్యాచ్ చూడాలని కోరుతున్నా. మ్యాచ్ చూడటం వల్ల సమయం వృధా అని మీరు భావించవచ్చు. కానీ మీరొస్తే.. మా ఆట తీరు మెరుగవుతుందని నేను భావిస్తున్నా..'' అని వీడియో పోస్ట్‌లో సునీల్ ఛెత్రి అన్నాడు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ముంబయిలోని ఫుట్‌బాల్ ఎరెనా మైదానంలో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భారత జట్టు కెన్యాను 3-0 తేడాతో ఓడించింది. text: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో రాజీవ్, రాహుల్ గాంధీ పక్కనే సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలు పి.చిదంబరం, పీవీ నరసింహారావు కూడా కనిపిస్తున్నారు. కంటెంట్ అందుబాటులో లేదు పోస్ట్ of Facebook ముగిసింది, 1 ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారు దానితోపాటు "ఇందిరా గాంధీ అంత్యక్రియలు జరిగినప్పుడు గాంధీ కుటుంబం ఇలా చేతులు జోడించి ప్రార్థించడం చూస్తుంటే, వారి అసలు మతం ఏదో స్పష్టంగా తెలుస్తోందని" రాస్తున్నారు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇందిరాగాంధీ కుటుంబం ఉన్న ఈ ఫొటోను ఇంతకు ముందు కూడా ఇదే చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. దీనిని కొన్ని వేల మంది ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అంతే కాదు, ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దీనిని వాట్సాప్‌లో కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. కానీ ఈ ఫొటోను పరిశీలించినప్పుడు వారు చెబుతున్నది పూర్తిగా అవాస్తవం అని మేం గుర్తించాం. వైరల్ అవుతున్న ఫొటో ఫొటో గురించి అసలు నిజం రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ ఫొటోను మొట్ట మొదట పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉంటున్న రచయిత, రాజకీయ నేత మొహసిన్ దావర్ ట్వీట్ చేసినట్టు తెలిసింది. మొహసిన్ చేసిన ట్వీట్ ఈ ఫొటోకు సంబంధించి అత్యంత పురాతన సోషల్ మీడియా పోస్ట్ అని తేలింది. మొహసిన్ తన ట్వీట్‌లో "రాజీవ్ గాంధీ ఉన్న ఈ ఫొటోను 'సరిహద్దు గాంధీ' అనే పేరు తెచ్చుకున్న స్వాతంత్ర సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మృతదేహం తీసుకెళ్లే ముందు తీశారని చెప్పారు. అబ్దుల్ గఫార్ ఖాన్‌ను 1988 జనవరి 21న పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో ఖననం చేశారు. 'Skyscrapercity' పేరుతో ఉన్న ఒక వెబ్‌సైట్‌ కూడా ఈ ఫొటో ఫ్రంటియర్ గాంధీ శవయాత్రకు ముందు పెషావర్‌లో తీశారని చెప్పింది. రాజీవ్ గాంధీ తన క్యాబినెట్‌లోని కొందరు సభ్యులతో, తన కుటుంబ సభ్యులతో అబ్దుల్ గఫార్ ఖాన్ శవయాత్రలో పాల్గొన్నట్టు 'న్యూయార్క్ టైమ్స్', 'ఎల్ఏ టైమ్స్' లాంటి ఎన్నో విదేశీ మీడియా సంస్థల కథనాలు కూడా ధ్రువీకరించాయి. ఇందిరా గాంధీ అంత్యక్రియలు భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని 1984 అక్టోబర్ 31న ఆమె ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కాల్చి చంపారు. ఇందిరా గాంధీ అంత్యక్రియలను 1984 నవంబర్ 3న దిల్లీలో హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన చాలా వీడియోలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని యూ-ట్యూబ్‌లో కూడా చూడవచ్చు. ఈ వీడియోల్లో మంత్రోచ్ఛారణల మధ్య రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ చితికి ప్రదక్షిణ చేయడం, తర్వాత చితికి నిప్పు పెట్టడం కనిపిస్తోంది. ఫొటో ఏజెన్సీ గెటీ దగ్గర కూడా ఇందిరా గాంధీ అంత్యక్రియలకు సంబంధించిన చాలా ఫొటోలు ఉన్నాయి. ఇంటర్నెట్‌లో 1984 నవంబర్ 4న 'ద వాషింగ్టన్ టైమ్స్‌' ప్రచురించిన ఒక రిపోర్టు కూడా ఉంది. అందులో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం ఎలా జరిగాయో వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇందిరాగాంధీ అంత్యక్రియలు ముస్లిం ఆచారాల ప్రకారం చేశారంటూ భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఉన్న ఒక పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. text: కోళ్లను పెంచుతున్న జోసెఫ్ మైనా ఒకప్పుడు విద్యార్థుల స్వరాలతో మార్మోగిన మువేయా బ్రెథ్రెన్ స్కూల్ క్లాస్‌రూముల్లో నేడు కోడి పిల్లల కొక్కొరొకో శబ్దాలు వినిపిస్తున్నాయి. బ్లాక్‌బోర్డుపై గణిత సమీకరణాలకు బదులుగా వ్యాక్సీన్ షెడ్యూల్ కనిపిస్తోంది. సెంట్రల్ కెన్యాలోని ఈ పాఠశాలను జోసెఫ్ మైనా నడుపుతున్నారు. స్కూళ్లు మూతపడటంతో ఆయనకు ఎలాంటి ఆదాయమూ లేకుండా పోయింది. దీంతో ఈ గదులను కోళ్లను పెంచుకొనేందుకు ఆయన అద్దెకు ఇచ్చేశారు. ''మనుగడకు పోరాటం'' మార్చిలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయినప్పుడు ఆయన పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇదివరకు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని ఆయన బ్యాంకును అభ్యర్థించాల్సి వచ్చింది. ''మొదట్లో అంతా కోల్పోయినట్లు అనిపించింది. అయితే మనగడ కోసం ఏదో ఒకటి చేయాలని మేం నిర్ణయించుకున్నాం''అని బీబీసీతో జోసెఫ్ చెప్పారు. కెన్యాలో 20 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. ఈ స్కూళ్లకు పిల్లలు చెల్లించే ఫీజులే ఆధారం. లాక్‌డౌన్‌తో సిబ్బందికి జీతాలు చెల్లించలేక చాలా స్కూళ్లు ఇబ్బందుల్లో పడ్డాయి. కొన్ని స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ బోధనతో ఎలాగోలా నెట్టుకు వస్తున్నాయి. పిల్లలు చెల్లించే ఫీజులు కేవలం టీచర్ల జీతాలకే సరిపోతోందని కెన్యా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (కేపీఎస్‌ఏ) వెల్లడించింది. ఇక్కడ మూడు లక్షల వరకూ ప్రైవేటు స్కూల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో 95 శాతం మందికి జీతాలు ఇవ్వకుండా సెలవులపై వెళ్లాలని సూచించినట్లు కేపీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఎన్‌డోరో తెలిపారు. 133 స్కూళ్లు అయితే శాశ్వతంగా మూతపడ్డాయి. ''ఇలా ఎప్పుడూ లేదు'' సెంట్రల్ కెన్యాలోని రోకా ప్రిపరేటరీ స్కూల్‌ను మూసివేయకుండా చూసేందుకు తాత్కాలిక కోళ్ల పరిశ్రమలా మార్చేశారు. ''పరిస్థితులు ఇంత దారుణంగా ఎప్పుడూ మారలేదు''అని ఈ స్కూల్‌ను 23ఏళ్ల క్రితం స్థాపించిన జేమ్స్ కుంగు.. బీబీసీతో చెప్పారు. ఒకప్పుడు పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్‌లో నేడు కూరగాయలు పండిస్తున్నారు. ''నా పరిస్థితి మిగతా స్కూళ్ల యజమానుల్లానే ఉంది. కారులో డీజిల్ కొట్టించుకొనేందుకూ డబ్బులు లేవు. ఇక్కడ విద్యార్థులు లేరు. టీచర్లు లేరు. మేం మానసికంగా చాలా బాధపడుతున్నాం''అని జేమ్స్ వ్యాఖ్యానించారు. జోసెఫ్, జేమ్స్ ప్రస్తుతం ఇద్దరు సిబ్బందిని మాత్రమే ఉంచుకున్నారు. ఆ ఇద్దరు కూడా తమ పరిశ్రమలో సాయం చేసేందుకు మాత్రమే. ''ఇది డబ్బులు సంపాదించడానికి కాదు. మేం ఏదో ఉంటున్నాం. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తున్నాం. ఇది ఒక చికిత్సలా పనిచేస్తోంది''అని జేమ్స్ వ్యాఖ్యానించారు. టీచర్లకు పనిలేదు ఈ రెండు స్కూళ్లు ప్రత్యామ్నాయ మార్గంలో ఎలాగోలా కొంత ఆదాయం సంపాదిస్తున్నాయి. అయితే వీటిలో పనిచేసే టీచర్లకు మాత్రం ఐదు నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు మాత్రం జీతాలు చెల్లిస్తున్నారు. ''కొంత మంది టీచర్లు ఫోన్‌చేసి చేసేందుకు ఏదైనా పనుందా? అని అడుగుతున్నారు. కానీ మేం తినడానికే ఏమీ లేదు''అని జోసెఫ్ వ్యాఖ్యానించారు. చాలా మంది ప్రైవేటు స్కూల్ టీచర్లు కూడా ఆదాయం కోసం వేరే వృత్తుల బాట పడుతున్నారు. కెన్యా రాజధాని నైరోబీలో ఆరేళ్ల నుంచీ ఓ ప్రైవేటు స్కూల్‌లో పాఠాలు చెప్పిన మెర్సీన్ ఒటీనో.. నేడు ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఆమె ఇల్లును ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఓ పిల్లాడి ఆలనాపాలనా చూసే ఆయాగా ఓ ఇంటిలో ఉంటున్నారు. ప్లేగ్రౌండ్‌లో కాయగూరల పెంపకం ''కెన్యాలో ఒక కోవిడ్-19 కేసు బయటపడిన వెంటనే.. స్కూళ్లన్నీ మూసివేశారు. మాకు చేయడానికి ఎలాంటి పనీ లేకుండా పోయింది'' ''నా కొడుకు తినడానికి ఏదో ఒకటి పెట్టాలని చాలా ప్రయత్నించాను. అయితే, అంత తేలిగ్గా పని దొరకలేదు''అని ఆమె బీబీసీతో చెప్పారు. తూర్పు కెన్యాలో టీచర్‌గా పనిచేసిన గ్లోరియా ముటుకు అయితే, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని నిర్ణయించుకున్నారు. సరకులు అమ్మే బిజినెస్ పెట్టేందుకు ఆమె లోన్ తీసుకున్నారు. ఈ బిజినెస్ సవ్యంగా నడవాలని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. మళ్లీ స్కూల్ తెరిచినా తను వెళ్లి పాఠాలు చెప్పబోనని ఆమె వివరించారు. అసలు ప్రైవేటు స్కూళ్లు మళ్లీ తెరచుకుంటాయా? కరోనావైరస్ ఆందోళనల నడుమ మార్పులకు సిద్ధమా? అనే ప్రశ్నలు వెంటాడుతుండటంతో ఆమెలానే చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం 65 మిలియన్ డాలర్లు సాయం చేయాలని కేపీఎస్‌ఏ కోరుతోంది. టీచర్లు ఇదే వృత్తిలో కొనసాగాలని అభ్యర్థిస్తోంది. ''ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో అవి కూడా భాగమే. విద్యపై ప్రభుత్వం పెట్టే ఖర్చును తగ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి''అని పీటర్ వ్యాఖ్యానించారు. ''ప్రభుత్వ సాయం చేయకపోతే.. చాలా స్కూళ్లు మూతపడతాయి''అని ఆయన హెచ్చరించారు. తాము విధించిన నిబంధనలకు లోబడే పాఠశాలలకు షరతులపై రుణాలు ఇస్తామని దేశ విద్యా శాఖ చెబుతోంది. కానీ అది సరిపోదని పీటర్ ఆందోళన చెందుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ వ్యాప్తి నడుమ వచ్చే జనవరి వరకూ స్కూళ్లను తెరవకూడదని కెన్యా నిర్ణయించింది. దీంతో చాలా ప్రైవేటు స్కూళ్ల మనుగడ కష్టమవుతోంది. అక్కడి స్కూళ్ల పరిస్థితిపై బసిలియో ముతాహి, మర్సి జూమా అందిస్తున్న కథనం. text: బాధితురాలిని పెళ్లి చేసుకుంటారా అంటూ దేశపు అత్యున్నత న్యాయస్థానం నుంచి ప్రశ్న వినిపించినప్పుడు దాని విస్తృతి, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఒక బాలికపై అత్యాచారం చేశారు. బెయిల్‌ కోరుతూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం 'బాధితురాలిని పెళ్లి చేసుకుంటారా' అని అడిగింది. అయితే పెళ్లి చేసుకోవాలని నిందితుడిని కోర్టు ఆదేశించలేదు. కానీ నేరం చేసిన వ్యక్తికి ఇప్పటికే పెళ్లయింది. అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ బెయిల్‌ కోసం నిందితుడికి నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది. “ఈ సూచన నన్ను షాక్‌కు గురి చేసింది. ఇలా అడగడమంటే బాధితురాలిని బాధను, ఆమెపై జరిగిన హింసను విస్మరించడమే. ఇది అమానవీయం” అన్నారు దిల్లీకి చెందిన న్యాయవాది సురభి ధార్‌. ఆమె పలు అత్యాచార కేసులను వాదించారు. “ఇలాంటి నిర్ణయాలు, సూచనల వల్ల బాధితులు పోలీసుస్టేషన్లు, కోర్టులకు వెళ్లడానికే భయపడతారు. ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది” అన్నారామె. “బాధితురాలు చాలా చిన్నవయసులో తన కుటుంబ స్థితిగతులను, అడ్డంకులను కూడా అధిగమించి సుప్రీంకోర్టు వరకు వచ్చారు. కానీ న్యాయస్థానం నుంచి వచ్చే ఇలాంటి నిర్ణయాల వల్ల బాధితులు కచ్చితంగా నిరాశకు గురవుతారు” అన్నారు సురభి. పెళ్లయినా హింస ఆగకపోవచ్చు అయితే ఈ తరహా కేసుల్లో ఇదే మొదటిది కాదు. ఒక మైనర్‌ అమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్నాడన్న నేరాన్ని గత ఏడాది విచారించిన మద్రాస్‌ కోర్టు, బాధితురాలిని పెళ్లి చేసుకుంటానన్న నిందితుడి హామీపై అతడికి బెయిల్ ఇచ్చింది. ఇదే తరహాలో కేరళ, గుజరాత్‌, ఒడిశా హైకోర్టులు కూడా బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు బాధితులను పెళ్లి చేసుకునే హామీపై బెయిల్ ఇచ్చాయి. “ఇదొక దారుణమైన,అమానవీయమైన పరిణామం’’ అన్నారు గరిమా జైన్‌. ఆమె అత్యాచార బాధితులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి అనుభవాలపై పరిశోధన చేస్తున్నారు. ఆమె కలుసుకున్న అనేకమంది అత్యాచార బాధితుల్లో ఒకరి కథనాన్ని గరిమా జైన్‌ బీబీసీతో పంచుకున్నారు. “నేనొక 16ఏళ్ల బాధితురాలితో మాట్లాడాను. బాయ్‌ఫ్రెండ్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిపాటు విచారణ జరిగిన తర్వాత బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.” అని గరిమా వివరించారు. “ఆ మైనర్‌ అప్పటికే అనేక ఒత్తిళ్ల మధ్య ఉన్నారు. కోర్టు చేసిన సూచనను ఆమె జీర్ణించుకోలేకపోయారు. కానీ కాదని చెప్పలేకపోయారు. అయిష్టంగానే నిందితుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెపై హింస మొదలైంది” అన్నారు గరిమా. “తనపై వేధింపులు పెరిగిపోవడంతో భర్తపై గృహహింస కేసు పెట్టారు. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడామె తన కూతురితో ఒంటరిగా ఉంటున్నారు” అని వెల్లడించారు గరిమ. “న్యాయస్థానాలు ఇలాంటి నిర్ణయాలు ప్రకటించే ముందు దీన్ని చాలా సున్నితమైన విషయంగా గుర్తించాలి. మహిళల మానసిక స్థితిపై పడే ప్రభావం, హింసను కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అని గరిమా అభిప్రాయపడ్డారు. చట్టం ఏం చెబుతోంది? 2012లో చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టే లక్ష్యంతో ‘ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్ అఫెన్సెస్‌’ (POCSO) చట్టం తీసుకువచ్చింది. నిందితుడిని వెంటనే విచారణ జరిపేందుకు పోలీసులకు అనేక అధికారాలను ఈ చట్టం కల్పిస్తోంది. న్యాయపోరాటంలో బాధితులు ఎక్కువకాలం ఇబ్బంది పడకుండా, ఏడాదిలోగా విచారణ పూర్తి చేసేలా ఈ చట్టం కాలపరిమితిని కూడా విధించింది. అలాగే బాధితులకు పరిహారం కూడా ఇవ్వాలని నిర్దేశించింది. అయితే చట్టంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని ‘హక్‌ సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌’కు చెందిన కుమార్‌ షైలాబ్‌ అన్నారు. చట్టం అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని, దీనివల్ల విచారణ వేగంగా జరగడంలేదని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలిని వివాహం చేసుకోవాలంటూ న్యాయమూర్తులను నిందితులను కోరుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నారులపై లైంగిక నేరాలు అదుపులోకి రాకపోగా, ఇంకా పెరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ చట్టం అమలు తీరు ఎలా ఉందో తెలపాలని సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల హైకోర్టులు, పోక్సో కోర్టులను కోరింది. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. 99 శాతం కేసుల్లో బాధితులకు మధ్యంతర పరిహారం దక్కలేదని, అలాగే తుది తీర్పు తర్వాత కూడా 99 శాతం కేసుల్లో బాధితులకు పరిహారం అందలేదని తేలింది. ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలన్న నిబంధనలున్నా మూడింట రెండువంతుల కేసుల్లో ఇలా జరగలేదని బైటపడింది. అలాగే నమోదైన 90% కేసుల్లో నిందితులు బాధితులకు చాలా దగ్గరివారేనని కూడా తేలింది. “మైనర్లు తమపై జరిగిన దాడులను అంత సులభంగా రిపోర్ట్‌ చేయలేరు. వారిపై అనేక ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బాధితుల హక్కులకు న్యాయస్థానాలు ప్రాధాన్యమివ్వాలి” అని షైలాబ్‌ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ సమాజపు ఒత్తిళ్ల కారణంగానే చాలాసార్లు నిందితులకు, బాధితులకు మధ్య సెటిల్‌మెంట్‌లు జరుగుతుంటాయని, , కానీ సుప్రీంకోర్టు స్వయంగా ఇలాంటి సలహా ఇవ్వడం సరికాదంటున్నారు షైలాబ్‌. మహారాష్ట్ర అత్యాచారం కేసులో కేవలం నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ మీద మాత్రమే విచారణ జరిగిందని, నిందితుడిపై ఇంకా అభియోగాలు కూడా మోపలేదని షైలాబ్‌ అన్నారు. ఈ కేసులో నిందితుడు బాధితురాలికి బంధువని కోర్టుకు అందిన సమాచారం చెబుతోంది. పైగా నిందితుడు చాలా రోజులు ఆమె వెంటపడ్డాడని, అత్యాచారం చేశాడని, బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే బాధితురాలికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే విధంగా ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది కానీ అది జరగలేదు. తరువాత నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి దిగువ కోర్టు నుండి బెయిల్ లభించగా, బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్‌ బెంచ్‌ ఈ బెయిల్‌ పిటిషన్‌ను తప్పుపట్టింది. పోక్సో చట్టం ప్రకారం బెయిల్‌ నిబంధనలు కఠినంగా ఉంటాయి. తనపై వచ్చిన ఆరోపణలను సరైనవి కాదని నిరూపించుకునే బాధ్యత నిందితుడిపైనే ఉంది. అప్పటి వరకు అతడు దోషిగానే ఉంటారు. కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు నిందితుడికి అరెస్టు నుండి నాలుగు వారాలపాటు ఉపశమనం కల్పించింది. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పోక్సో చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోలేదని న్యాయవాది సురభి ధర్‌ అన్నారు. “బాధితురాలిని వివాహం చేసుకుంటానంటే మేం మీకు సహాయం చేస్తాం. లేకపోతే మీ ఉద్యోగం పోతుంది. మీరు జైలుకు వెళతారు” అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సరికావని సురభి ధార్‌ అన్నారు. ఈ సలహాను ఉపసంహరించుకోవాలని కోరుతూ చీఫ్‌ జస్టిస్‌ బోబ్డేకు దేశంలోని సుమారు 4000మంది మహిళలు, స్త్రీవాద ఉద్యమకారులు, సంస్థలు లేఖ రాశాయి. "మీ నిర్ణయంతో వివాహం అనేది అత్యాచారానికి లైసెన్స్‌ అన్న సందేశం వెళుతుంది. అలాంటి లైసెన్స్‌ ఉన్నప్పుడు నిందితుడు చట్టం నుంచి సులభంగా తప్పించుకుంటాడు’’ అని అందులో పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రేప్‌ కేసులో బాధితురాలిని పెళ్లి చేసుకోవాలంటూ ఓ నిందితుడికి సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఇక్కడ మూడు అర్థాలు ధ్వనిస్తాయి. text: కోవిడ్ కేర్ సెంటర్‌గా మారిన విశాఖలోని సీపీఐ(ఎం) కార్యాలయం ఇప్పటికే ఆయా కేంద్రాలలో బెడ్స్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. పౌష్టికాహారం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచారు. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి సేవలు కొనసాగిస్తున్నారు. ఏపీలో 400 బెడ్స్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం నుంచి అరకు వరకు 15 కేంద్రాల్లో సీపీఎం వీటిని నిర్వహిస్తోంది. ఐసోలేషన్ కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా 400 బెడ్స్ సిద్ధం చేశామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవనం, విశాఖలోని నండూరి ప్రసాదరావు భవనం, అనంతపురంలోని సింగమనేని నారాయణ స్మారక కేంద్రం వంటి సీపీఎం కార్యాలయాలను ఇప్పుడు కోవిడ్ బాధితులకు కేటాయించారు. కోవిడ్ కేంద్రాల నిర్వహణకు పలువురు సహకారం అందిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు బీబీసీకి చెప్పారు. ''మొదటి వేవ్ సందర్భంలో కొన్నిచోట్ల కోవిడ్ బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేశాం. అనేక మందికి ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులు భారంగా మారడంతో వారికి తోడ్పాటు అందించాలని నిర్ణయించాం. ముందు మా పార్టీ కార్యకర్తల కోసం అనుకున్నప్పటికీ చివరకు అనేక మంది సాధారణ ప్రజలకు ఈ కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఊరట లభించింది. విజయవాడలో 50 బెడ్స్‌తో ఐసోలేషన్ కేంద్రం తెరిచాం. 200 మందికి పైగా కరోనా బాధితులు ఉపశమనం పొందారు. సుందరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మరో 50 బెడ్స్ ఏర్పాటు చేశాం'' అని మధు వివరించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వైద్యుల తోడ్పాటు కూడా.. కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ వారు త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నామని సీపీఎం నేత సీహెచ్ నర్సింగ రావు తెలిపారు. విశాఖ జగదాంబ సెంటర్‌లోని సీపీఎం కార్యాలయంలో 40 మంది కరోనా బాధితులు ఉన్నారు. కరోనా రోగులకు ఐసోలేషన్ సదుపాయం సిద్ధం చేశామని ఆయన వివరించారు. ''మా ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణకు అనేక మంది సాయం అందిస్తున్నారు. ముఖ్యంగా వైద్యుల సహకారం కీలకం. చాలామంది డాక్టర్లు తాము ఎంత బిజీగా ఉన్నా, రెండు పూటలా మా సెంటర్లలోని వారికి అవసరమైన ఆరోగ్య సలహాలు అందిస్తున్నారు'' అని నర్సింగరావు వెల్లడించారు. సీపీఎం కోవిడ్ కేర్ సెంటర్లకు కార్యకర్తలతోపాటు వలంటీర్లు కూడా సహకరిస్తున్నారు. సేవలు స్వచ్ఛందమే రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలలో సుమారు 100 మంది పనిచేస్తున్నారు. ఆహారం సిద్ధం చేసి బాధితులకు అందించడం దగ్గరి నుంచి అవసరమైన అన్ని పనులను కార్యకర్తలు చేస్తున్నారు. పల్స్ రేట్, బీపీ వంటివి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ సకాలంలో మందులు అందించేందుకు వైద్య విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. ''పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. ఆహారం విషయంలో రాజీపడకుండా సమయానికి అన్నింటినీ సిద్ధం చేసి అందిస్తున్నాం. వ్యాయామం, యోగా, మానసిక ఉల్లాసం కలిగించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒత్తిడి నుంచి అందరిని దూరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి'' అని విజయవాడ ఐసోలేషన్ సెంటర్ నిర్వాహకులు, ఎంబీవీకే కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ బీబీసీకి చెప్పారు. అరకులోని సీపీఎం కార్యాలయంలో కోవిడ్ కేర్ సెంటర్ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొదలుకుని.. తెలంగాణా జిల్లాల్లో కూడా ఈ ప్రయత్నం జరుగుతోంది. మొదట హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని నిర్వాహకులు అంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా అనేక జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాయకుడు బి. వెంకట్ బీబీసీకి తెలిపారు. ''సామాన్యులు, ఇరుకు ఇళ్లలో నివసించే వారు ఐసోలేషన్‌లో ఉండడానికి సతమతం అవుతున్న సమయంలో మా కేంద్రాలు బాగా ఉపయోగపడ్డాయి. వందల మంది కోలుకున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. నిర్వహణ విషయంలో రాజీలేకుండా ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నంలో ఉన్నాం'' అని బి. వెంకట్ వివరించారు. అనంతపురంలో సీపీఎం కోవిడ్ కేర్ సెంటర్‌కు కొందరు మీడియా ప్రతినిధులు కూడా తమ వంతు సహకారం అందించారు. 'మేము కోలుకోవడానికి అక్కడ చూపిన ఆదరణ కూడా కారణమే' ''నాకు, నా భార్యకు కరోనా సోకింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటే భయం వేసింది. వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లాం. మాకు ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షలు చేసేవారు. మంచి ఆహారం అందించారు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేసేందుకు ఏర్పాట్లున్నాయి. ఇవన్నీ కలిసి మేము త్వరగా కోలుకోవడానికి సాయం చేశాయి'' అని రాజేశ్ అనే కళాకారుడు బీబీసీతో అన్నారు. ఆక్సిజన్ ఏర్పాటు .. దేశ, విదేశాల్లోని పలువురు ఈ ఐసోలేషన్ కేంద్రాలకు సహాయం అందిస్తున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటు కూడా జరుగుతోంది. రోగి ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంటే మరింత ఉపశమనం కలుగుతుందని ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణలో ఉన్న క్రాంతి అన్నారు. దాతల తోడ్పాటు వల్లే ఈ కేంద్రాల నిర్వహణ సులువుగా చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ మిగిలిన పార్టీలు ఏం చేస్తున్నాయి.. ఏపీలో ఇతర రాజకీయ పార్టీలు కూడా కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నాయి. విపక్ష టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని కుప్పం, పాలకొల్లు, రేపల్లె, టెక్కలి ఆసుపత్రులలో ఆక్సిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీపీఐ కూడా పలుచోట్ల కరోనా సహాయక కార్యక్రమాలు చేపట్టింది. వైసీపీ, బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు కూడా సొంతంగా కొన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ప్రజలకు తోడ్పాటునందించే పనిలో పలువురు నేతలు, కార్యకర్తలు పాలుపంచుకుంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి చెందిన పలు కార్యాలయాలు ప్రస్తుతం కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లుగా మారాయి. ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాలు, వివిధ ట్రస్టుల ఆధ్వర్యంలో వాటిని నిర్వహిస్తున్నారు. text: హవాయి సమీపంలో సముద్రంలో చేప పిల్లల కంటే ప్లాస్టిక్కే ఎక్కువ ఉందని.. చేప పిల్లల కంటే అక్కడి జలాల్లో ప్లాస్టిక్ రేణువుల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువ ఉందని ఆ అధ్యయనం తెలిపింది. చేప పిల్లల తినే ఆహారాన్ని ప్రోది చేసే సముద్ర ప్రక్రియే నీటిపైన తేలియాడే ప్లాస్టిక్‌నూ అదే ప్రాంతంలో పోగు చేస్తోంది. సముద్ర జీవుల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడుతున్నా ఆరోగ్యంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ''మత్స్య రాశిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందనడానికి మా వద్ద డాటా ఏమీ లేదు'' అని బ్రిటన్‌లోని బంగోర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెషర్ గారెత్ విలియమ్స్ 'బీబీసీ'తో చెప్పారు. ''కానీ, చేప పిల్లలు జన్మించిన మొదటి కొద్దిరోజుల్లో అవి తమ చుట్టూ ఉండే ప్లాస్టిక్ రేణువులనూ ఆహారంగా తీసుకుంటున్నాయి. ఇది ప్రమాదకర పరిణామం'' అన్నారు గారెత్. చిన్న చేప లార్వాలు అధికంగా ఉన్న చోట ప్లాంక్టన్ తెట్టు వాటి మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక సూక్ష్మజీవులతో కూడిన ఈ తెట్టు చేప పిల్లలకు ప్రధాన ఆహార వనరు. పరిశోధకులు హవాయి తీరంలో ప్లాంక్టన్‌పై అధ్యయనం చేస్తున్నప్పుడు వలల్లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ దొరకడం చూసి ఆశ్చర్యపోయారు. చేప లార్వా కంటే ప్లాస్టిక్కే ఎక్కువ ఉందని డాక్టర్ విలియమ్స్ చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో వ్యర్థాలు అధికంగా పోగుపడిన 'గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్' వద్ద కంటే హవాయి వద్ద సముద్రంలో ప్లాస్టిక్ సాంద్రత ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్లాంక్టన్‌పై అధ్యయనం చేసే క్రమంలో తాము సేకరించిన శాంపిళ్లలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉందని నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన మెరైన్ ఎకాలజిస్ట్ డాక్టర్ జొనాథన్ విట్నీ చెప్పారు. వందలాది చేప లార్వాలలో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించినట్లు చెప్పారు. మార్కెట్లో విక్రయానికి పట్టే చేపల పొట్టల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ట్యూనా చేపలు, సముద్ర పక్షులు ఆహారంగా తీసుకునే ఫ్లయింగ్ ఫిష్‌లను కోసినప్పుడు వాటి పొట్టలోనూ ప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. ''ఇంతవరకు వాతావరణ మార్పులు, ఆవాసాలు కోల్పోవడం, మితిమీరిన చేపల వేట వంటి కారణాల వల్లే జీవ వైవిధ్యం, మత్స్య సంపద వృద్ధికి ముప్పు ఏర్పడుతుందని అనుకునేవాళ్లం. ఇప్పుడు లార్వా దశలోనే చేపల్లో ప్లాస్టిక్ చేరడం కూడా పెను ముప్పని పరిశోధనలు తేల్చాయ'ని హోనోలులులోని పసిఫిక్ దీవుల మత్స్య విజ్ఞాన కేంద్రానికి చెందిన డాక్టర్ జామిసన్ గోవ్ చెప్పారు. 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'(పీఎన్ఏఎస్)లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహాసముద్రాల్లో చేపలకు ఎక్కువగా ఆహారం దొరికే, అవి పెరిగే ప్రాంతాల్లో ప్లాస్టిక్ తిష్ఠ వేస్తోందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. text: కుంభమేళా, ప్రయాగరాజ్ అంతేకాదు, ఇప్పుడు పూర్ణ కుంభ్‌ను మహా కుంభ్ అని కూడా అంటున్నారు. నిజానికి యునెస్కో కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ప్రభుత్వానికి దీనికంటే మించిన బ్రాండింగ్ ఏదీ దొరకదని అనిపిస్తోంది. అయినా ఎలాంటి ఆహ్వానం లేకుండానే కొన్ని లక్షల మంది కుంభమేళా కోసం ఇక్కడకు చేరుకుంటారు. ఎన్నికల సంవత్సరంలో కుంభమేళాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెగా ఈవెంట్‌గా భావిస్తున్నాయి. అందుకే దీనికి ఇంతకు ముందు జరిగిన వాటికంటే ఈసారి ఎక్కువ బడ్జెట్ కేటాయించాయి. మత్స్య పురాణంతో సంబంధం మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్లు యుద్ధం జరిగింది. ఈ గొడవలో అమృత కలశం నుంచి చిందిన బిందువులు భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో పడ్డాయి. ఆ నాలుగు ప్రాంతాల్లో అంటే ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా నిర్వహణలో బృహస్పతి గ్రహ స్థితికి చాలా ప్రాధాన్యం ఉంటుందని జ్యోతిషులు చెబుతారు. ఈ గ్రహం మేష రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్థ కుంభమేళా జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడు అర్థ కుంభమేళా జరుగుతోంది. కుంభమేళా గురించిన లిఖిత ఆధారాలు అర్థ కుంభమేళా, కల్పవాస్ సంప్రదాయాలు కేవలం ప్రయాగ, హరిద్వార్‌లో మాత్రమే ఉన్నాయనేది చాలా ముఖ్యమైన విషయం. చరిత్రకారుల వివరాల ప్రకారం కుంభమేళా గురించి మొదటి వివరణ మొఘలుల కాలంలో కనిపించింది. 1665లో రాసిన ఖులాసాతు-త-తారీఖ్‌ అనే గెజిట్‌లో ఇది లభించింది. కొంతమంది చరిత్రకారులు మాత్రం ఆ వాదనను విభేదిస్తున్నారు. పురాణాలు, వేదాలలో కుంభమేళా గురించి ఉందని, దానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని చెబుతున్నారు. పురాణ పండితుల వివరాల ప్రకారం పురాణాల్లో కుంభ్ అనే మాట ఉంది. కుంభమేళా గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. అయితే, 19వ శతాబ్దంలో 12 ఏళ్లకు ఒకసారి ఒకేచోట గుమిగూడే మతాచార్యులు మధ్యలో కూడా ఒకసారి అంతా కలిస్తే బాగుంటుందని అనుకోవడంతో ఆరేళ్లకు ఒకసారి అర్థ కుంభమేళా సంప్రదాయం ప్రారంభమైందని ఇంకొదరు చరిత్రకారులు చెబుతారు. కొన్నిరోజుల క్రితం సంగమ తీరంలో ప్రసంగించిన ప్రధాని కూడా ఈ కుంభమేళాను 'అర్థ కుంభ్' అనే అన్నారు. కుంభమేళాలో అఖాడాల ప్రభావం అయితే, ప్రయాగరాజ్‌లోని సంగమ తీరంలో కుంభమేళా ప్రారంభం కాబోతోంది. మేళాకు ప్రధాన ఆకర్షణగా భావించే నాగా సాధువులతో అన్ని అఖాడాలూ ఊరేగింపుగా కుంభమేళాలోని తమ శిబిరాలకు చేరుకున్నాయి. సాధువులు, సన్యాసులు, మతపెద్దలు ఉండే అఖాడాలకు నాగా సాధువులు కేంద్రంగా ఉంటారు. సనాతన మత ధర్మాలను పరిరక్షించేందుకే సాధువుల సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు. ఏళ్ల క్రితం ప్రారంభమైన అఖాడా సంప్రదాయంలో మొదట పది అఖాడాలే ఉండేవి, కానీ, మెల్లమెల్లగా వాటి సంఖ్య పెరిగింది. ఇప్పుడు 15 అఖాడాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి చెందిన శివ, వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే అఖాడాలతోపాటు, సిక్కులకు కూడా తమ సొంత అఖాడా ఉంది. అది 1855 నుంచే కుంభమేళాలో పాల్గొంటోంది. హిజ్రాల అఖాడా పరీ అఖాడా, హిజ్రాల అఖాడా కొత్తగా ఏర్పడిన అఖాడాల్లో మహిళా సాధువులు మాత్రమే ఉండే దానిని పరీ (దేవకన్యల) అఖాడా అంటున్నారు. ట్రాన్స్‌జెండర్, హిజ్రాల అఖాడా కూడా ఉంది. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అఖాడాలు చాలా పోరాటాలు చేసిన తర్వాత కుంభమేళాలో పాల్గొనడానికి స్థానం సంపాదించాయి. పరీ అఖాడాకు ప్రయాగలో 2013లో జరిగిన కుంభమేళాలో ప్రాధాన్యం లభించింది. ఇక హిజ్రాల అఖాడాకు ఇప్పుడు జరుగుతున్నదే మొదటి కుంభ్. ఈ అఖాడాలు ఈసారీ కుంభమేళాకు వచ్చే వారిని ఆకర్షించనున్నాయి. కానీ, వీరి ఊరేగింపులు మూడు రోజులే ఉండనున్నాయి. కల్పవాస్ అలహాబాద్ అంటే ప్రయాగరాజ్ కుంభమేళాకు ఉన్న ఒక ప్రత్యేకత ఇక్కడ జరిగే కల్పవాస్. లైఫ్ మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్ లాంటి వాటిని నేర్పించే ఈ కల్పవాస్ చేయడానికి దేశవ్యాప్తంగా లక్షల మంది ఇక్కడకు చేరుకున్నారు. ఇప్పడు ఇది చాలా మంది విదేశీయులను కూడా బాగా ఆకర్షిస్తోంది. ప్రభుత్వం, చాలా మంది బాబాలు, ఎన్నో ఇతర సంస్థలన్నీ కలిసి కల్పవాస్ కోసం రకరకాల ఏర్పాట్లు చేశాయి. పూరి గుడిసె నుంచి ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాల వరకూ ఉన్న గదులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కానీ జనం భారీగా తరలివచ్చే కుంభమేళాలో మతం, విశ్వాసాలతో ముడిపడిన అసలైన కల్పవాసీల సంఖ్య మాత్రం ప్రతిసారీ పరిమితంగానే ఉంటుంది. అయితే, లక్షల మందిని తనలో మమేకం చేసుకోగల శక్తి ఉన్న ఈ కుంభమేళా కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చాలా జోరుగా చేస్తోంది. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు ఒక ధార్మిక కార్యక్రమానికి కాదు, ఏదో ఒక భారీ ప్రాయోజిత ప్రదర్శనకు ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎన్నో ఇబ్బందులను దాటుకుని ఇంత దూరం వచ్చే యాత్రికులను ఆ షో ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి. ( ధనుంజయ్ చోప్రా అలహాబాద్ విశ్వవిద్యాలయం సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ ఇంచార్జ్. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. దీనికి బీబీసీ ఏ విధంగానూ జవాబుదారీ కాదు) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సంగమ తీరంలో మరోసారి కుంభమేళా సందడి మొదలైంది. ఇది అర్థ కుంభమేళానే అయినా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దీనిని 'కుంభ్' అనాలని ప్రకటించింది. text: శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్).. రెండేళ్ల కిందట ఈ ఇంగువ మొక్కలను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంది. గత వారంలో శాస్త్రవేత్తలు హిమాలయాల్లోని మంచు పర్వత ప్రాంతాలైన లాహౌల్, స్పితిలో 800 ఇంగువ మొక్కలు నాటారు. "ఇవి ఈ ప్రాంతంలో పెరుగుతాయని మాకు నమ్మకం ఉంది" ఒక పరిశోధనశాలలో కష్టపడి విత్తనాలను నాటి పరిశీలించిన డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. ఇవి ప్రతి 100 విత్తనాలకు కేవలం రెండు మాత్రమే మొక్కలు మొలుస్తాయని, అందుకే వీటిని పరిశోధన శాలలో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చాలా మొక్కలు చనిపోతాయి. ఈ మొక్కలు పెంచడం కష్టమైన విషయం. అందువల్ల అన్ని అంశాలు పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. "కొన్ని కఠినమైన పరిస్థితులను నిలదొక్కుకోలేకపోతే ఈ మొక్కలు చనిపోతాయి" అని తెలిపారు. ఇంగువ మొక్క సాధారణంగా అటవీ ప్రాంతాలలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్న ఉష్ణోగ్రతల్లోనే పెరుగుతుంది. అందువలన ఉష్ణోగ్రతలు, తేమ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలలో దీనిని పెంచడం కష్టం. 2019లో భారతదేశం అఫ్గానిస్తాన్‌, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి సుమారు 10 కోట్ల డాలర్ల విలువ చేసే ఇంగువను దిగుమతి చేసుకుంది. భారతీయ వంటల్లో అత్యధికంగా వాడే ఈ పంటను ఇక్కడ పండించరనే విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి తినని కొంత మంది హిందూ, జైన మతస్థులు వాటికి బదులుగా ఆహారంలో ఇంగువ వాడతారు.వీరి సంఖ్య అత్యంత స్వల్పం. అయితే ఉల్లి వెల్లుల్లి వాడే వారిలో కొంతమంది దీన్ని వంటలో మంచి వాసన కోసమూ, జీర్ణశక్తి పెంచుతుందనే నమ్మకం తోనూ వాడుతుంటారు. "నేను అన్ని రకాల పప్పు వంటకాలలోనూ ఇంగువ వాడతాను. నేను ఉల్లి, వెల్లుల్లి వాడను" అని 'ది ఫ్లేవర్ ఆఫ్ స్పైస్' పుస్తక రచయత మర్యమ్ రేషి చెప్పారు. 'ఒక్క చిటికెడు ఇంగువ వంటల్లో వాడితే, ఆహారం రుచే అద్భుతంగా మారిపోతుంది" అని ఆమె అంటారు. రేషి తనను తాను ఇంగువ ప్రేమికురాలిగా చెప్పుకుంటారు. ఆమె ఈ ఇంగువ పుట్టుక, ఉపయోగాల గురించి ఒక పోస్టు కూడా పెట్టారు. ఇంగువకి ఉండే ప్రత్యేకమైన వాసన ఇతర మసాలా దినుసుల నుంచి దీనిని వేరుగా, విశిష్టంగా నిలుపుతుంది. ఇంగ్లీష్‌లో దీనిని అసోఫెటిడా అని పిలుస్తారు. లాటిన్‌లో అసోఫెటిడా అంటే దుర్గంధంగా ఉండే జిగురు పదార్ధం అని అర్ధం. ఊదా రంగు, తెలుపు మిశ్రమ వర్ణంలో ఉన్న జిగురు పదార్ధాన్ని మొక్క వేళ్ళ నుంచి సేకరిస్తారు. దీనిని ఎండబెట్టి గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ కలిపి వంటల్లో వాడేందుకు అనువుగా తయారు చేస్తారు. ఈ ఇంగువను దిగుమతి చేసుకునే హోల్‌ సేల్ వ్యాపారులు దీనిని ముక్కలుగా, గరుకుగా ఉండే కణికలుగా లేదా మెత్తటి పొడిలాంటి వివిధ రూపాలలోకి మార్చి అమ్ముతారు. పర్షియన్లు ఒకప్పుడు దీనిని "దేవుళ్ళ ఆహార పదార్థం" అని పిలిచేవారు. కొన్ని దేశాలలో దీనిని కొన్ని వైద్య అవసరాలకు గాని, లేదా క్రిమిసంహారకంగా కానీ వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంగువ వాడకంలో ఒక్క భారతదేశంలోనే 40 శాతం వాడుతున్నారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. వంట గదిలో ఈ దినుసు వహించే పాత్రను తీసి పారేయలేం. ప్రతీ రోజు వండుకునే పప్పులో జీలకర్ర, ఎండుమిర్చితో పాటు తాలింపులో ఒక్క చిటికెడు ఇంగువ వేస్తె ఆ పప్పుకి ఉండే రుచే వేరు. తెలుగు నాట, ఇతర దక్షిణాది రాష్ర్టాల్లో పప్పు సాంబారు లాంటి వంటల్లో కొందరు ఇంగువను ఎక్కువగా వాడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వండే రసం, సాంబారు, కొన్ని రకాల పులుసులు, పచ్చళ్ళ పోపులో ఆవాలు, కరివేపాకుతో పాటు దీనిని వాడతారు. కొన్ని రకాల కారం సూప్‌లలో కూడా ఇంగువ వాడతారు. కశ్మీరీ హిందువులు వండే రోజన్ గోష్ అనే మాంసం కూరలో సోంపు, ఎండు మిర్చి, శొంఠి మసాలాలతో పాటు ఇంగువను కూడా కలుపుతారు. కోల్‌కతాలో ప్రసిద్ధి చెందిన ఇంగువ కచోరీలు, కాంచీపురంలో దొరికే ఇంగువ ఇడ్లీలకు ప్రత్యేకమైన రుచిని తెచ్చి పెట్టేది ఇంగువే. దీనిని ఆయుర్వేదంలో అనేక రోగాలకు పరిష్కారంగా కూడా వాడతారు. పొట్ట ఉబ్బరం తగ్గించడానికి దీనిని కొన్ని రకాల పప్పు దినుసులు, బఠానీలతో చేసే వంటకాలలో వాడాలని సూచిస్తారు. భారత్‌లో వాడకం ఎక్కువ ఉన్నప్పటికీ ఇది భారతదేశానికి చెందిన పంట కాదు. వాతావరణ పరిస్థితుల రీత్యా దీనిని పండించుకోలేకపోయినప్పటికీ చరిత్ర, వాణిజ్యం మాత్రం దీనికి భారతదేశంలో విశిష్ట స్థానం కల్పించాయి. "దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో ఇంగువ వాడకం దాని పురాతత్వాన్ని తెలియచేస్తోంది" అని చెప్పారు చరిత్రకారిణి డాక్టర్ మనోషి భట్టాచార్య. ఆమె న్యూట్రిషన్ థెరపీలో పని చేస్తున్నారు. అరబ్బులు, పర్షియన్లు, గ్రీకు దేశస్థులు, ఆఫ్రికన్లు వివిధ దేశాలకు ప్రయాణాలు చేస్తూ తమతో పాటు తమ దేశానికి చెందిన ఆహార పదార్ధాలను తీసుకుని వెళ్లేవారు. అలాగే ఆ ప్రాంతం వదిలి వెళ్ళేటప్పుడు అక్కడ దొరికే ఆహార పదార్ధాలను తమతో పాటు తీసుకుని వెళ్లేవారు. ఇంగువ క్రీస్తు పూర్వం 600 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి ఉండవచ్చని ఆమె ఊహించి చెబుతున్నారు. ఇంగువ గురించి హిందూ, బౌద్ధ పత్రాలలో ప్రస్తావన ఉందని ఆమె చెప్పారు. మహాభారతంలో కూడా ఇంగువ ప్రస్తావన ఉంది. శతాబ్ధాలుగా ఇంగువ భారతీయ వంటల్లో ఒక ముఖ్య భాగంగా ఉంటూ వస్తోంది. దీనిని సంస్కృతంలో హింగు అని, హిందీలో హింగ్ అని, కన్నడలో ఇంగు అని, బెంగాలీలో హిం అని అంటారు. పర్షియాలో దీనిని అంగుజేహ్ అని, గ్రీకులు అజా అని, అరబ్బులు హాల్టిత్ అని అంటారు. యూరప్ దేశాల ప్రజలు మాత్రం దీనిని రాక్షస పేడ అని, దుర్గంధంతో కూడిన జిగురు అని అంటారు. ఇది పశ్చిమ దేశస్థుల ఆహారానికి తగినది కాదని ఫుడ్ రైటర్లు అంటారు. కానీ, ప్రాచీన రోమన్లు, గ్రీకులు తమ వంటల్లో ఇంగువను వాడేవారు. అయితే ఆ ప్రాంతాల ఆహారం నుంచి ఇది ఎలా మాయమయిందో తెలియదు. దీనిని సిల్ఫియాన్ అనే వంటకంలో వాడేవారని, కానీ ఆ వంటకం పూర్తిగా కనుమరుగయిందని చరిత్రకారులు చెబుతారు. దీనికుండే విచిత్రమైన వాసన వలన దీనిని తక్కువ రకంగా భావించేవారని చెబుతారు. కానీ, ఆ వాసనే భారతీయులకు ప్రీతి పాత్రమైనది. ఇంగువలో రకాలున్నాయి. ‘‘ఉదాహరణకు తెల్లని రంగులో ఉండే కాబూలీ ఇంగువను నాలుక మీద పెట్టుకోలేం. అది వగరుగా ఉండి నాలుక కాలినట్లవుతుంది’’ అని దిల్లీకి చెందిన ఒక ఇంగువ వ్యాపారి సంజయ భాటియా చెప్పారు. ఈయన ప్రతీ సంవత్సరం 6,30,000 కేజీల ఇంగువ అమ్ముతారు. నారింజ వాసన ఉండే హడ్డ ఇంగువ ఎక్కువ ప్రాముఖ్యం పొందిందని చెప్పారు. భాటియా కుటుంబం గత మూడు తరాలుగా ఇదే వ్యాపారంలో ఉంది. ‘‘నేను ఇంగువలోనే పుట్టాను’’ అని చెప్పుకునే ఆయన ఆఫ్ఘాని ఇంగువకి, ఇరానీ ఇంగువకి మధ్యనున్న తేడా చెప్పాలంటే ఒక్కసారి వాసన చూస్తే చాలు అంటారు. అఫ్గానీ విత్తనాలను దిగుమతి చేసుకోవాలని చూస్తున్నట్లు డాక్టర్ కుమార్ చెప్పారు. ఈ మొక్కలను 741 ఎకరాలలో పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం ఒక హెక్టారులోనే వీటిని నాటినట్లు చెప్పారు. ఒకవేళ ఈ పంటను పండించడం మొదలుపెట్టినా దేశీయ అవసరాలకు సరిపడేంతగా పండించడానికి చాలా సమయం పడుతుందని భాటియా చెప్పారు. అదొక్కటే సమస్య కాదు. ఈ అటవీ వృక్షాన్ని ఎక్కడ పడితే అక్కడ నాటి దాని సహజమైన సువాసనని ఇవ్వాలని ఎలా అనుకుంటాం? అని రేషి అంటారు. భారతీయులెవరూ దానిని వంటల్లో వాడలేరు. ఇక్కడ దొరికే ఇంగువను నేనయితే వంటల్లో వాడను" అని ఆమె అన్నారు. ఇంగువకి ఉండే ప్రత్యేకమైన వాసన భారతదేశంలో పండించే ఇంగువకి కూడా ఉంటుందా? కాలం మాత్రమే సమాధానం చెప్పాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతీయుల్లొ కొందరికి ప్రీతి పాత్రమైన ఇంగువ కొన్ని శతాబ్దాలుగా వారి ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంది. కానీ, భారతీయులు ఈ పదార్ధాన్ని ఇప్పటి వరకు ఈ దేశంలో పండించలేదు. text: ఈ 30-40 సెకెండ్ల వీడియో క్లిప్ ఇప్పుడు వాట్సప్‌లో వైరల్ అవుతోంది. దీనిలో కనిపించే నటిని పోర్న్ స్టార్‌ అని అంటున్నారు. యూట్యూబ్‌లో కూడా ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. దానిని లక్షలాది మంది వీక్షిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ అలా ఒకరి ద్వారా ఒకరికి సర్క్యులేట్ అవుతూ చివరకు ఆ నటికి కూడా చేరింది. అది పోర్న్ వీడియో కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన 'సేక్రెడ్ గేమ్స్' సిరీస్‌లోని ఓ సీన్. కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకునేటప్పుడు ఆ సీన్ వస్తుంది. కథలో ఆ సంఘటనకు ముందు భర్తగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ, భార్యగా నటించిన రాజ్‌శ్రీ దేశ్‌పాండే మధ్య సంబంధాలు అంత బాగా ఉండవు. నవాజుద్దీన్ పాత్ర పడకపై అత్యంత హింసాత్మకంగా వ్యవహరిస్తుంది. అయితే పరిస్థితి మారి, ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఆ సీన్‌లో వారిద్దరి మధ్య ప్రేమ ప్రతిఫలించాలి. అప్పుడు వారి మధ్య అన్యోన్యతలో ఒక ఉద్రిక్తత, ఒక ఆనందం కనిపించాలి. ఆ సంఘటన నుంచి కథను నుంచి తొలగించి చూస్తే మాత్రం అక్కడ కనిపించేది కేవలం ఆమె వక్షోజాలు, సెక్స్. రాజ్‌శ్రీకి ఆ వాట్సప్ క్లిప్ వచ్చినపుడు, ఆమె చాలా ఆందోళన చెందారు. ''నాకేమీ సిగ్గనిపించలేదు. నేనెందుకు సిగ్గుపడాలి? కానీ చాలా బాధ కలిగింది.'' అని ఆమె అన్నారు. తన పాత్రపై, ఆ సీనులో ఆ పాత్ర ప్రాధాన్యతపై ఆమెకు పూర్తి విశ్వాసం ఉంది. తానేమీ తప్పుచేయలేదని, ఈ సీన్‌లో మహిళను ఒక వస్తువుగా వాడుకోలేదని ఆమెకు నమ్మకముంది. ఆ సీన్‌లో మహిళ శరీరంలోని వివిధ భాగాలనేమీ కెమెరా శోధించలేదు. అక్కడ ఒక పాటను పెట్టి, అందులో ద్వందార్థాల పదాలను వాడలేదు. ఒక మహిళను కించపరిచే విధంగా చూపించలేదు. ఈ సీనులో కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమను చూపెట్టారంతే. ''శరీర భాగాలను ప్రదర్శించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని నాకు తెలుసు. నాలో ఏ దురుద్దేశమూ లేదు. నేను ఏ తప్పూ చేయలేదు'' అన్నారు రాజ్‌శ్రీ. అయినా కూడా రాజ్‌శ్రీ బాధపడుతున్నారు. ఆ వీడియో క్లిప్‌ను పోర్న్ రూపంలో చూస్తున్నందుకు కాదు, అందుకు ఆమె కొంతవరకు సిద్ధపడ్డారు, కానీ దానిని అందరూ షేర్ చేసుకుంటున్నందుకు. ఈ రోజుల్లో చాలా దృశ్యాలు వైరల్‌గా మారుతున్నాయి. ఒక ఆడపిల్ల కన్ను కొట్టడం కూడా వైరల్‌గా మారుతోంది. కానీ ఈ వీడియో భిన్నమైనది. ''ఇలాంటిది మీ వద్దకు వచ్చినపుడు మీరు ఒక్క క్షణం ఆలోచించాలి. టెక్నాలజీ అనేది రెండంచుల కత్తిలాంటిది. దాంతో ఎవరినైనా చంపొచ్చు లేదా ప్రాణాలు రక్షించొచ్చు'' అన్నారామె. గత కొంత కాలంగా సినిమాలు, టీవీలలో మహిళల నగ్నశరీరాలను చూపించడం పెరిగిపోయింది. కొన్నిసార్లు కథాపరంగా వాటిని చూపించడం అవసరం, కొన్నిసార్లు అనవసరం. కానీ కథాపరంగా అవసరముందా, లేదా అనేదానితో సంబంధం లేకుండా వాటిని చూడడం మాత్రం బాగా పెరిగిపోయింది. అన్నిసార్లూ.. పోర్న్‌గా.. చిన్నచిన్న క్లిప్పులుగా.. కథతో ఎలాంటి సంబంధం లేకుండా. అయితే బాధాకరం ఏమిటంటే, వాటిని చూసే వాళ్లను మాత్రం ఎవరూ ఏమీ అడగరు. కానీ ఈ వీడియో క్లిప్పులు చూసేవాళ్లు మాత్రం ఆ నటిపై పోర్న్ స్టార్ అనే ముద్ర వేస్తారు. కానీ రాజ్‌శ్రీ దేశ్‌పాండే అలా ఊరుకునే నటి కాదు. తాను నటించిన 'యాంగ్రీ ఇండియన్ గాడెస్', 'ఎస్ దుర్గ' చిత్రాలలోని పాత్రల తరహాలో ఆమె నిజజీవితంలో కూడా తన మనసులో మాటను ఏ మాత్రం దాచుకోరు. ''జరుగుతున్న సంఘటనలపై మనం నోరు విప్పాలి. అప్పుడే పరిస్థితులు మారతాయన్న నమ్మకం ఏర్పడుతుంది. ఒక ఐదుగురి ఆలోచనలను మార్చగలిగినా, అది చాలా పెద్ద విజయం'' అంటారామె. ఆమె నోరు విప్పింది. నేను రాస్తున్నాను. మీరు చదువుతున్నారు. ఏమో, బహుశా ఈ వీడియోలను ఎడిట్ చేసి, వాటిని సర్క్యులేట్ చేస్తున్నవారు కూడా కొద్ది సేపు ఆగి ఆలోచిస్తున్నారేమో. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక మహిళ తన జాకెట్ బటన్లు విప్పగానే ఆమె వక్షోజాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆమె ఓ పురుషునితో సెక్స్‌లో పాల్గొని, ఆ తర్వాత అలాగే అతని పక్కన పడుకుంటుంది. text: జాన్సన్‌కు స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయని, ఆయన ఇకపై స్వీయ నిర్బంధంలో ఉంటారని తెలిపారు. "ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు ప్రధానమంత్రికి పరీక్షలు నిర్వహించాం" అని అధికారిక ప్రతినిధి ప్రకటించారు. కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన తరువాత బోరిస్ జాన్సన్ ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. "నాలో కరోనావైరస్ లక్షణాలను స్వల్పంగా ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఆగకుండా దగ్గు వస్తోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహా మేరకు నేను పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. నేను స్వీయ నిర్బంధం విధించుకుని ఇంటి నుంచే పని చేస్తాను" అని ఆ వీడియోలో బోరిస్ తెలిపారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 బ్రిటన్‌లో 11,600లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 578 మంది చనిపోయారు. ఒకవేళ ప్రధానమంత్రి ఆరోగ్యం బాగా లేకపోతే విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ ఆయన బాధ్యతలు చూసుకోవడానికి ఎంపికయ్యారని ఈ వారం మొదట్లో ప్రధాని కార్యాలయం అధికార ప్రతినిధి తెలిపారు. ఇంతకు ముందే వేల్స్ యువరాజు చార్లెస్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. "ప్రిన్స్ చార్లెస్‌లో స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలున్నాయి. అది మినహా ఆయన చక్కని ఆరోగ్యంతో ఉన్నారు" అని రాచకుటుంబ అధికార ప్రతినిధి తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. text: ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు మరో యువతి ఉన్నారు. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని రాహుల్‌గాంధీ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఫొటోని ఇంటర్నెట్‌లో విరివిగా షేర్ చేశారు. అయితే, పెళ్లి వార్తలపై ఈ యువతి స్పందించారు. ఆ వార్తలన్నీ పుకార్లే అని ప్రకటించారు. రాహుల్‌గాంధీ తనకు అన్నతో సమానమని చెప్పారు. దీంతో రాహుల్‌తో పెళ్లి ఊహాగానాలకు తెరపడింది. ఇంతకీ ఆ యువతి ఎవరు? రాహుల్‌తో ఫొటోలో ఉన్న ఆ అమ్మాయి పేరు అదితి సింగ్. కాంగ్రెస్ పార్టీ తరఫున రాయబరేలి సదర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాహుల్‌తో తన పెళ్లి ప్రచారం వెనక బీజేపీ హస్తం ఉండొచ్చని అదితి సింగ్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి కుట్రకు పాల్పడి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పుకార్లపై రాహుల్ ఏమన్నారు? ఈ పుకార్లపై రాహుల్‌గాంధీ కూడా వివరణ ఇచ్చారు. అదితి సింగ్ కుటుంబంతో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్‌గాంధీ చెప్పారు. అదితి సింగ్ కుటుంబ సభ్యులు సోనియా గాంధీతో కలిసి ఉన్న ఫోటోను ఆయన మీడియాకు విడుదల చేశారు. రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉందని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో కూడా ఇరు కుటుంబ సభ్యులు కలిసినప్పుడు తీసిందేనని రాహుల్ తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో రూమర్లు రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇంతకీ అదితి సింగ్ ఎవరు? 29 ఏళ్ల అదితి సింగ్‌ది ఉత్తర ప్రదేశ్. రాయబరేలి సదర్ స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆమె తండ్రి అఖిలేష్ సింగ్‌ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన వారసురాలిగా ఆమెను 2017 యూపీ ఎన్నికల్లో నిలబెట్టారు. ప్రియాంకా గాంధీకి అఖిలేష్ సింగ్‌ సన్నిహితుడని పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీలో అదితి ఎంబీఏ చేశారు. యూపీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిని అదితి 90వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వైరల్‌గా మారిన ఫొటో ఇదే. text: కానీ, 28 ఏళ్ల ఆర్మీ కూలీ మొహమ్మద్ అస్లం హత్యతో ఆ ప్రాంతమంతా షాక్‌లో ఉంది. గత శుక్రవారం నియంత్రణ రేఖ దగ్గరున్న కసాలియాన్ గ్రామానికి చెందిన మొహమ్మద్ అస్లంను హత్య చేశారు. సోమవారం నేను అస్లం గ్రామానికి చేరుకునేటప్పటికి భారీ వర్షం కురుస్తోంది. ఆ గ్రామం నియంత్రణ రేఖ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్నగా ఉన్న అస్లం ఇంట్లో నిశ్శబ్దం అలముకుని ఉంది. ఇంట్లో వాళ్లు అస్లం చనిపోయిన బాధలో ఉంటే, గ్రామస్థులు భయంతో ఉన్నారు. పొరుగింటి మహిళలు అస్లం ఇంట్లో ఉన్నారు. అతడి అమ్మనాన్నల బాధను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అస్లం భార్య పరిస్థితి దారుణంగా ఉంది. గత శుక్రవారం అస్లం సహా ఐదుగురు కూలీలపై నియంత్రణ రేఖ దగ్గర పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) దాడి చేసిందిని చెబుతున్నారు. ఆ సమయంలో కూలీలు ఇండియన్ ఆర్మీ కోసం కొన్ని సరుకులు తీసుకెళ్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు మొహమ్మద్ అస్లం, అల్తాఫ్ హుస్సేన్ చనిపోయారు. మిగతా ముగ్గురూ గాయపడ్డారు. నియంత్రణ రేఖ చుట్టుపక్కల గ్రామాల్లో భారత సైన్యం నిఘా తీవ్రంగా ఉంటుంది. ఆర్మీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఆర్మీ గ్రామాల్లోకి రోడ్లు కూడా వేయించింది. నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో ఈ గ్రామాలు తరచూ సమస్యల్లో పడుతూ ఉంటాయి. ఎలాంటి యూనిఫాం లేకుండా ఆ సరుకులను సరిహద్దు వరకూ చేర్చడం ఆర్మీ కూలీల పని. దానికి వారికి నెలవారీ చెల్లింపులు ఉంటాయి. తన కొడుకు శవానికి తల లేదనే విషయం తనకు మొదట చెప్పలేదని అస్లం తల్లి ఆలంబీ అన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తే, మేం చూసుండేవాళ్లం. కానీ ఇప్పుడు నేను వెళ్లి చూసే పరిస్థితిలో అది లేదు. శుక్రవారం నా కొడుకును చివరిసారి చూశాను. తను ఎక్కడికెళ్లాడో నాకు తెలీదు. పేదరికం వల్ల కూలి పనులకు వెళ్లేవాడు. నేను తన శవాన్ని చూసే పరిస్థితిలో లేను" అన్నారు అస్లం ఏం పని చేస్తాడని ఆలంబీని అడిగినపుడు, ఆమె "తను ఆర్మీ కోసం పనిచేసేవాడు. తను సైన్యం కోసం ప్రాణాలు అర్పించాడు. కానీ ఇప్పటివరకూ సైన్యం నుంచి ఎవరూ ఇక్కడికి రాలేదు. ఏ నేతా రాలేదు. నాకు నా కొడుకు తిరిగి కావాలి. నా కొడుకు మరణానికి ఆర్మీ సమాధానం చెప్పాలి" అన్నారు. అస్లం తండ్రి మొహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ.. "నేను ఏదో పనిమీద వెళ్లా. నా చిన్న కొడుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వచ్చేసరికి సరిహద్దుల్లో ఆర్మీ కూలీలు కొందరు గాయపడ్డారని చెప్పారు. ఆ తర్వాత మేం ఘటనాస్థలానికి వెళ్లాం. అక్కడ ఉన్న కూలీలు తమపై దాడి జరిగినప్పుడు, సాయం కోసం ఏడ్చామని, కానీ ఎవరూ రాలేదని చెప్పారు. నా కొడుకు మృతదేహానికి తల లేదు. వాళ్లు తీసుకెళ్లిపోయారు". అని చెప్పారు. అస్లం తలను ఎవరు నరికి తీసుకెళ్లారు అని అడిగాను. దానికి ఆయన "పాకిస్తాన్ తీసుకెళ్లింది. పాకిస్తాన్ అలా చేయగలదు, అక్కడ అలా ఇంకెవరు చేయగలరు" అన్నారు. గత నాలుగేళ్ల నుంచీ తన కొడుకు సైన్యం కోసం పనిచేస్తున్నాడని సిద్ధిక్ చెప్పారు. "నా కొడుకు కూలీ అనేది నిజం, కానీ తను ఆర్మీలో ఒక జవాన్ కంటే ఎక్కువ పనిచేసేవాడు. ఔరంగజేబు(ఆర్మీ జవాన్)కు చనిపోయిన తర్వాత పూర్తి గౌరవ లాంఛనాలు అందించినపుడు, నా కొడుకుని ఎందుకు నిర్లక్ష్యం చేశారు. సైన్యం కూలీలు కూడా ఆర్మీ కోసమే పనిచేస్తారు. ప్రభుత్వం శత్రువులకు బుద్ధి చెప్పాలి. కానీ, అది జరగదని నాకు తెలుసు’’ అన్నారు. అస్లం భార్య నసీమా అఖ్తర్ బీబీసీతో "చనిపోయాక కూడా నా భర్త ముఖం చూడలేకపోయా. ఈ బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది. నాకు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు మేమంతా ఎలా బతకాలి" అన్నారు. అస్లం కుటుంబం దశాబ్దాలుగా పూంఛ్ జిల్లాలోని కసోలియాన్ గ్రామంలోనే ఉంటోంది. అస్లం చిన్నాన్న "ఆర్మీ తమ కూలీల ప్రాణాలే కాపాడలేకపోతే, దేశాన్ని ఎలా కాపాడుతుంది" అన్నారు. ‘‘ఈ ఘటన జరిగినప్పుడు ఆర్మీ పికెట్‌లో ఉంది. వాళ్లు ఏం చేయలేదు. వాళ్లు పోస్టుల్లోంచి బయటికి కూడా రాలేదు. వాళ్లు రాలేకపోతే, కనీసం గాల్లో అయినా కాల్పులు జరిపి ఉండాల్సింది. మేం అస్లం తల కోసం రెండు కిలోమీటర్ల వరకూ వెతికాం. కానీ కనపడలేదు. అప్పుడు మాతోపాటూ ఒక్క జవాన్ కూడా రాలేదు" అని చెప్పారు. అస్లంకు భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మ, నాన్న, తమ్ముడు ఉన్నారు. "మేం సామాను తీసుకుని వెళ్తున్నాం. అప్పుడే హఠాత్తుగా మందుపాతర పేలింది. తర్వాత ఆర్మీ యూనిఫాంలో ఉన్న ముగ్గురు వచ్చారు. ఒక కూలీ నేలపై పడిపోయాడు. అస్లం నా వైపు చూస్తున్నాడు. వాళ్లు ముగ్గురూ ఒక కూలీ వైపు వెళ్లారు. గొంతు కోసెయ్ అన్నారు. తను చేతులు జోడించి నన్ను వదిలేయండి అంటూ ఏడ్చాడు. ఆ తర్వాత వాళ్లు కాల్చారు. ఆ తర్వాత అస్లం వైపు వెళ్లారు. అప్పుడు తన భుజాలపై ఆర్మీ సరుకులు ఉన్నాయి. అస్లం చాలా భయపడిపోయి ఉన్నాడు. అతడిని అక్కడినుంచి దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి తలను వేరు చేశారు" అని ఒక గాయపడ్డ కూలీ చెప్పాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి మిగతా కూలీలు పనికి వెళ్లాలంటే భయపడుతున్నారని మరో కూలీ చెప్పాడు. "పాకిస్తాన్ సైన్యం సరిహద్దు దాటి ఐదు కిలోమీటర్లు లోపలికి వచ్చి మన పౌరుడి తల తీసుకెళ్లింది. రేపు వాళ్లు మా ఇళ్లలో చొరబడి మా తలలు కూడా తీసుకెళ్తారేమో" అన్నాడు. జనవరి 10న ఈ ఘటన జరిగినప్పటి నుంచి తమ గ్రామంలో ఉన్నవారంతా భయపడిపోయి ఉన్నారని గ్రామ సర్పంచి మహమ్మద్ సాదిక్ చెప్పాడు. "జనవరి 10న మా గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు చనిపోయారు. దాంతో గ్రామస్థులకు సరిహద్దు దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదు. ప్రభుత్వం కూలీలను కాపాడాలి. వాళ్లు సైన్యానికి సాయం చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ BAT లోపలికి వచ్చి మన పౌరుడి తల తీసుకెళ్లింది. ఇది మళ్లీ జరక్కూడదు. కూలీ తలను తీసుకెళ్లడం సాహసం అనుకుంటున్నారా. ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలి’’ అన్నారు. దీనిపై బీబీసీతో మాట్లాడిన పూంచ్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ "ఒక సాధారణ పౌరుడిని తల నరికి చంపడం ఇదే మొదటిసారి. సైన్యం కోసం కూలీగా పనిచేసేవాళ్లు సామాన్యులే ఉంటారు. ఇంతకు ముందు ఇలా జమ్ము-కశ్మీర్‌లో ఎప్పుడూ జరగలేదు. సరిహద్దు దగ్గర ఉండే వాళ్లు యూనిఫాం లేని సైనికులు అని నేను ఎప్పుడూ చెబుతాను" అన్నారు. ఇది పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ ఫోర్స్ ‌చేసిందా అని అడిగితే, "దీనిపై దర్యాప్తు జరగాలి" అని చెప్పారు. అయితే, పేరు వెల్లడించని ఒక ఆర్మీ అధికారి బీబీసీతో ఇది పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ చేసిన దాడి అని చెప్పారు. "పూంచ్ సెక్టార్‌లో ఇద్దరిపై దాడి చేసి చంపేసిన పాకిస్తాన్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్ వారిలో ఒకరి తల నరికి తీసుకెళ్లింది" అన్నారు. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేను ప్రశ్నించినప్పుడు ఆయన "మేం అలాంటి క్రూర చర్యలకు పాల్పడం. ఒక ప్రొఫెషనల్ ఫోర్స్‌లాగే పోరాడతాం. అలాంటి పరిస్థితులను మిలిటరీ విధానంలోనే ఎదుర్కుంటాం" అన్నట్లు పీటీఐ చెప్పింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జమ్ము-కశ్మీర్ పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర సోమవారం భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగిపోయాయి. text: గుడిమల్లంలోని మానవ లింగాకార విగ్రహం ఈ తరహా విగ్రహాల్లో అరుదైనది క్రీస్తుకు పూర్వమే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాచీన ఆలయంలో లింగాకృతికి పూజలు చేయడం విశేషంగా చెప్పవచ్చు. పురుష లింగాకారంలో ఉండే విగ్రహాన్ని శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కొలుస్తున్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో పరిమితుల మేరకు అభిషేకాలు, పూజాదికాలు సాగుతున్నాయి. గుడిమల్లంలో పురుష లింగాకార విగ్రహం ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి సమీపంలోని ఏర్పేడు మండలంలో ఉన్న గుడిమల్లం ఆలయ విశిష్టత గురించి ప్రాచీన శాసనాల్లోనూ పలు ఆధారాలు లభిస్తున్నాయి. గర్భగుడిలో రుద్రుడి రూపం, చేతిలో మేక తలకాయతో ఉన్న లింగాకార విగ్రహం చిత్తూరు జిల్లా గుడిమల్లంలో పూజలందుకుంటోంది. శైవ ఆచారాల ప్రకారం ఇలాంటి మానవరూప శివాలయాలు అరుదుగా కనిపిస్తాయి. అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో ఉన్న హేమావతి గ్రామంలో కూడా ఇలాంటి మానవ లింగాకార విగ్రహం ఉంటుంది. ఆలయం ప్రాంతంలో అనేక ప్రాచీన శాసనాలు కూడా కనిపిస్తాయి. పురుషుడి అంగాన్ని పోలిన విగ్రహం గుడిమల్లం ఆలయంలో విగ్రహం పురుషుడి అంగాన్ని పోలి ఉంటుంది. ఏడు అడుగుడుల ఎత్తున ఉండే శిల్పంపై తలపాగ, ధోవతి ధరించిన రూపం రుద్రునిదిగా భావిస్తారు. లింగాకారం ముందు ఒక చేత్తో మేక తలను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుడి రూపం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. విగ్రహంపై ఉన్న వస్త్రధారణ రుగ్వేద కాలంనాటిదని కొందరు భావిస్తారు. అయితే సింధూ నాగరికతను తలపించేలా లింగాకారం ఉంటుందని గుడిమల్లం ఆలయ కార్యనిర్వహణాధికారి కె.రామచంద్ర రెడ్డి అన్నారు. "ప్రాచీన కాలంలో స్త్రీని కొలిచే ఆచారం ఉండేది. అప్పట్లో మాతృస్వామ్య వ్యవస్థకు మూలంగా ఉన్న మహిళలకు ఆ గౌరవం దక్కింది. అప్పట్లో యోని రూపాన్ని ఆరాధించినట్టు చెబుతారు. ఆ తర్వాత స్త్రీలపై పురుషుడి ఆధిపత్యం మొదలు కావడంతో దానికి సూచికగా లింగాకారాన్ని పూజించడం మొదలయ్యింది. గుడిమల్లం ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. చాలాకాలం నుంచి ఇక్కడ లింగాకారం పూజలు అందుకుంటోంది." అంటూ వివరించారు రామచంద్రా రెడ్డి. లింగాకార శివుడి విగ్రహం రుగ్వేదకాలం నాటి శైలి ఉందని చరిత్రకారులు అంటున్నారు క్రీస్తుపూర్వంనాటి ఆలయం గుడిమల్లంలోని ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయంగా చెబుతున్నారు. దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 2 లేదా 3 శతాబ్దాల నాడే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తుశాఖ అంచనా వేస్తోంది. ఒకప్పుడు ఈ గుడి పల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల గుడిపల్లం అనే పేరు వచ్చిందని, క్రమేణా అది గుడిమల్లంగా మారిందని "రాయలసీమ ప్రసిద్ధ ఆలయాలు'' పుస్తకంలో ఈఎల్ఎన్ చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. సువర్ణముఖీ నదికి సమీపంలో గుడిమల్లం ఆలయం ఉంది. రానురాను నదీ ప్రవాహం తగ్గడంతో గుడి, నదీ మధ్య దూరం పెరిగినట్టు చెబుతున్నారు. అప్పట్లో వరదల సమయంలో నదీ ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని తాకేదని, ఇప్పటికీ జలాలు ఉధృతంగా ఉన్నప్పుడు లింగాన్ని తాకే ఏర్పాటు చెక్కు చెదరలేదని చెబుతున్నారు. 2004లో ఆలయంలోని విగ్రహాన్ని నదీ జలాలు తాకినట్లు స్థానికులు కొందరు బీబీసీకి తెలిపారు. గుడిమల్లం ఆలయం ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి కట్టడంగా పురావస్తు శాఖ చెబుతోంది. అయితే మౌర్యుల కాలపు శైలి ఈ విగ్రహంలో కనిపిస్తోందని ప్రముఖ చరిత్రకారుడు, గుడిమల్లం విశిష్టతపై పుస్తకం రచించిన ఈమని శివనాగి రెడ్డి బీబీసీకి తెలిపారు. "వెనుక లింగాకారం, ముందు యక్షుడి రూపాన్ని పోలిన రుద్రుడు, చేతిలో మేకపిల్ల ఉండడమే కాకుండా, దాని చుట్టూ రాతి కంచె నిర్మాణం కూడా కనిపిస్తుంది. ఇదంతా మౌర్యుల కాలం నాటి కట్టడి రీతిని చెప్పాలి. శాతవాహనుల కాలంనాటి ఇటుక బేస్‌మెంట్‌ కనిపిస్తుంది. నలుపు, ఎరుపు రంగులలో ఉండే విగ్రహం అత్యంత ప్రాచీనమైనదిగా స్పష్టమవుతోంది'' అని శివనాగిరెడ్డి అన్నారు. అప్పటి కేంద్రమంత్రి అంబికా సోనీ ఈ ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు విస్తృత పరిశోధనలు ఇక్కడి కట్టడాలు, విగ్రహాలపై సుదీర్ఘ పరిశోధనలు జరిగాయి. ఇక్కడ లభించిన ఆధారాల సహాయంతో అనేకమంది ఈ ఆలయ కాల నిర్ణయం, విశిష్టతలను నిర్ధారించే ప్రయత్నం చేశారు. 1911లో గోపీనాధరావు అనే పురాతత్వశాస్త్రవేత్త సంవత్సరంపాటు ఈ ఆలయంపై పరిశోధన చేసినట్టు ఆధారాలున్నాయి. 1908నాటి బ్రిటీష్ గెజిట్లలో ఇక్కడి కట్టడాలకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు. చోళుల తర్వాత పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో ఈ ఆలయంలో కార్యకలాపాలు సాగేవని చరిత్రకారుల పుస్తకాల్లో రాశారు. ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ లభించిందని, మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఒకటి ఉందని 'పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం' 'డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌' అనే పుస్తకాల్లో ఇంగువ కార్తికేయ శర్మ పేర్కొన్నారు. ఆనంద కుమారస్వామి, జితేంద్రనాథ్‌ బెనర్జీ వంటి అంతర్జాతీయ పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు కూడా శిల్ప చరిత్రలోనే అరుదైన ఈ శివలింగాన్ని తమ రచనల్లో ప్రస్తావించారు. తవ్వకాల్లో లభించిన శాసనాలనుబట్టి ప్రస్తుతం కనిపిస్తున్న గోపురం 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మితమైందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు 1954 నుంచి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి పూజాదికాలపై ఆంక్షలు పెట్టారు. గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయం పరిమితులతో అనుమతి పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున ఇక్కడ పూజలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఆలయ వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. పలు ప్రయత్నాల తర్వాత 2009 నుంచి కొన్ని నిబంధనలతో పూజా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది భారత పురావస్తు శాఖ. నాటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ సాగుతోంది. "చాలాకాలం గుడిలోకి ఎవరికీ అనుమతి లేదు. ఆ సమయంలో చంద్రగిరి కోటలో ఏర్పాటు చేసిన నమూనా విగ్రహాన్ని అంతా సందర్శించేవారు. మళ్లీ పూజలకు అనుమతించిన తర్వాత కట్టడానికి ఎటువంటి సమస్య రాకుండా పరిమితుల మేరకు అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి." అని ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్‌ నరసింహులు బీబీసీతో అన్నారు. అభివృద్ధి ప్రయత్నాలు తిరుపతికి సమీపంలోనే ఉన్నప్పటికీ గుడిమల్లం ప్రాశస్త్యం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదనే వాదనలున్నాయి. భారతదేశ వ్యాప్తంగా శైవక్షేత్రాలు ఒకనాడు విస్తృతంగా విలసిల్లిన కాలం ఉంది. అందులో పలు ఆలయాలు ఇప్పటికీ ప్రాశస్త్యం పొందుతున్నా గుడిమల్లం వంటి ఆలయాలు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా మిగిలిపోతున్నాయి. తగిన సదుపాయాలు, ప్రచారం లేకపోవడం ప్రధాన కారణాలని గుడిమల్లం కార్యనిర్వహణాధికారి కె. రామచంద్రారెడ్డి అంటున్నారు. ప్రస్తుతం వాటిపై శ్రద్ధ పెట్టి సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నంలో ఉన్నామన్నారు. యూపీఏ ప్రభుత్వ హయంలో నాటి కేంద్ర మంత్రి అంబికా సోనీ ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కానీ అవి పూర్తిగా ఆచరణలోకి రాలేదని స్థానికులు అంటున్నారు. గుడిమల్లం: విశిష్ట లింగాకారంతో పూజలందుకుంటున్న ప్రాచీన ఆలయం ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చరిత్రలో మనిషి ప్రకృతి శక్తులను పూజించిన నాటి నుంచి వివిధ దశల్లో ఆరాధించే పద్ధతులతోపాటు ఆరాధనలు అందుకునే శక్తులు కూడా మారుతూ వస్తున్నాయి. చెట్టు పుట్టలు, రాయిరప్పల నుంచి మనిషి అవయవాల వరకు ఈ పూజలందుకున్న శక్తులలో ఉన్నాయి. text: ఒకప్పుడు ఈ నగరంలో 40 వేల మంది వరకు ఉండేవారు. కానీ ఇప్పుడక్కడ వంద మంది కంటే తక్కువే ఉన్నారు. కానీ ప్రతి ఇంట్లో కనీసం 15 పిల్లులు మాత్రం కనిపిస్తాయి. రోడ్ల మీద ఎక్కడ చూసినా పిల్లులే ఉంటాయి. కఫ్రన్‌బెల్ ఒకప్పుడు సిరియా తిరుగుబాటుదారులకు గట్టి పట్టుకున్న ప్రాంతం. కానీ సిరియా, రష్యా దళాల సుదీర్ఘ బాంబు దాడుల తర్వాత ఈ నగరం ధ్వంసమైంది. ఇక్కడున్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వలస వెళ్లగా మిగిలిన వాళ్లు- పిల్లులు కలిసి ఇప్పుడిక్కడ ఉంటున్నాయని బీబీసీ ప్రతినిధి మైక్ థామస్ చెప్తున్నారు. పైన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సలా జార్. కఫ్రన్‌బెల్‌లో శిథిలమైన తన ఇంటి బేస్‌మెంట్‌లో ఒక మూలన కూర్చొని పైనుంచి పడే బాంబులు నుంచి తనను తాను కాపాడుకుంటున్నారు. కానీ ఈ బేస్‌మెంట్‌లో ఉన్నది ఇతనొక్కరే కాదు. ఇతనితో పాటు మరో 12 పిల్లులు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబులు దూసుకొస్తాయోనన్న భయం ఇతనితో పాటు ఆ పిల్లుల్లో కూడా కనిపిస్తోంది. "పిల్లులు దగ్గరగా ఉన్నప్పుడు కాస్త ఓదార్పుగా ఉంటుందని, బాంబు పేలుళ్లు, విధ్వంసం, బాధ, ఆందోళనను కాస్త తగ్గిస్తుందని" ఇతను నాతో అన్నారు. సలా జార్ సొంతూరు కఫ్రన్‌బెల్‌లో ఒకప్పుడు 40వేల మంది వరకు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వంద మంది కంటే తక్కువే ఉన్నారు. ఇక్కడ ఎన్ని పిల్లులు ఉన్నాయో లెక్కించడం కష్టం. కానీ వందలు, వేలల్లో ఉండే అవకాశం ఉంది. "కఫ్రన్‌బెల్‌ నుంచి ప్రజలు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ జనాభా చాలా తగ్గిపోయింది. కానీ పిల్లులకు ఆహారం, నీళ్లు పెట్టడానికి ఎవరో ఒకరు ఉండాలి. అందుకే ఇక్కడున్న వారి ఇళ్లలోనే అవి ఆశ్రయం పొందుతున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం 15 పిల్లులు ఉంటాయి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే ఉంటాయని" సలా జార్ చెప్పారు. ఫ్రెష్ ఎఫ్‌ఎం అనే స్థానిక రేడియో స్టేషన్‌లో సలా రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. తాజా బాంబు దాడుల్లో ఈ రేడియో స్టేషన్ స్టూడియో పూర్తిగా ధ్వంసమైంది. కానీ దాడి జరగడానికి కొన్ని రోజుల ముందే ఈ రేడియో స్టేషన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు దాడుల సమాచారం, కామెడీ, ఫోన్-ఇన్ కార్యక్రమాలను ఈ రేడియో స్టేషన్ ప్రసారం చేస్తుంది. ప్రజలతో పాటు పిల్లులకు కూడా ఇదెంతో ప్రజాదరణ పొందింది. కొన్ని డజన్ల పిల్లులు ఇక్కడున్నాయి. పిల్లుల కోసం పాలు, చీజ్ కొనేందుకు ఈ రేడియో స్టేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఉద్యమకారుడు రీయిడ్ ఫారెస్ ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. ఇస్లామిక్ సాయుధుల దాడిలో ఆయన మరణించారు. "ఈ భవనంలో ఎన్నో పిల్లులు జన్మించాయి. తెల్లని, గోధుమ రంగు మచ్చలున్న పిల్లి వాటిలో ఒకటి. అది రీయిడ్ ఫారెస్‌తో చాలా చనువుగా ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్తే అది అక్కడికి వెళ్లేది. చివరికి ఆయన పక్కనే పడుకునేది కూడా" అని సలా జార్ చెప్పారు. "తన శిథిలమైన ఇంటి నుంచి ఆయన బయటకు వెళ్లినప్పుడు అన్నివైపుల నుంచి పిల్లుల అరుపులు వినిపిస్తాయి. వాటిలో కొన్ని శ్రావ్యంగా.. మరికొన్ని గట్టిగా అరుస్తూ నిరాశగా ఉండేవి. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంది" అని ఆయన అన్నారు. ఒక్కోసారి మేము వీధుల్లో నడుస్తుంటే సుమారు 20, 30 పిల్లులు కూడా మాతో పాటు వీధి చివరి వరకూ నడుస్తూ వస్తాయి. కొన్ని అయితే, మాతో పాటు ఇంటికి కూడా వస్తాయి అని సలా తెలిపారు. చీకటి పడిన తర్వాత పిల్లుల అరుపులకు వీధి కుక్కల అరుపులు కూడా తోడవుతాయి. అవి కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. వాటికి కూడా ఎలాంటి ఆశ్రయం లేదు. రాత్రి ఆహారం కోసం, పడుకునే చోటు కోసం అవి పిల్లులతో పోటీ పడతాయి. ప్రతిరోజు జరిగే ఈ పోరాటంలో చివరికి బలవంతులే గెలుస్తారు అని సలా చెప్పారు. మిగతా చోట్ల కుక్కలు బలవంతమైనవి కావొచ్చు. కానీ ఇక్కడ మాత్రం కచ్చితంగా పిల్లులదే ఆధిపత్యం అని సలా అన్నారు. ఎందుకంటే ఇక్కడ వీటి సంఖ్యే ఎక్కువ అని సలా అన్నారు. వీటిలో చాలావరకు పెంపుడు పిల్లులే. ఇక్కడున్న వాళ్లు వీటిని పెంచుకునేవారు. కానీ ఇడ్లిబ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పాలక అనుకూల దళాలు గత ఏప్రిల్‌లో దాడులు మొదలుపెట్టడంతో వారంతా పట్టణాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడివి ఆహారం, ఆశ్రయం కోసం పట్టణ శిథిల్లాల్లో అన్వేషించాల్సి వస్తోంది. సలా లాంటి వారు ఇంకా ఎంత కాలం ఇక్కడ ప్రాణాలతో ఉంటారో తెలియదు. వీటికి ఎవరు ఆహారం పెడతారో తెలియదు. కానీ ఎవరు ఉన్నా లేకున్నా.. తన బేస్‌మెంట్‌లోని టేబుల్ కింద పిల్లులకు ఆశ్రయం ఎల్లప్పుడూ ఉంటుందని సలా అంటున్నారు. "కూరగాయలు కావొచ్చు. నూడుల్స్ కావొచ్చు లేదా ఎండిపోయిన బ్రెడ్ కావొచ్చు. నేనెప్పుడు ఏది తింటే ఇవి కూడా అదే తింటాయి. ఇలాంటి పరిస్థితిలో అవి, నేను చాలా బలహీనమైన జీవులమని నాకు అనిపిస్తోంది" అంటారు సలా నిరంతరం బాంబుల వర్షం కురుస్తుంటే మిగతావాళ్లతో పాటు పిల్లులు గాయపడటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ విషయంలోనూ మిగతా మనుషుల్లాగే మెడిసిన్ కొరత వీటిని తీవ్రంగా వేధిస్తోంది. వీటిని కాపాడేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని సలా చెప్తున్నారు. నా స్నేహితుడి ఇంట్లో పిల్లులు ఉండేవి. ఒకసారి రాకెట్ తగిలి ఒక పిల్లి కాలు దాదాపు విరిగిపోయింది. కానీ అతను దాన్ని ఇడ్లిబ్‌ నగరానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇప్పుడది మిగతావాటిలాగే చక్కగా నడుస్తోందన్నారు..సలా. ప్రస్తుతం అధ్యక్షుడు బసర్ అల్ అసద్ దళాలు ఈ పట్టణానికి దూరంగా ఉన్నాయి. దాంతో తిరుగుబాటుదారులు ఎప్పుడైనా దీన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనతో పాటు పిల్లులు ఇక్కడ ఉండటం ఆందోళనకరమేనని సలా అంగీకరించారు. మేము ఎన్నో మంచి అనుభవాలను వాటితో నేను పంచుకున్నాము. ఆనందం, బాధ, భయం ఇలా ప్రతి ఒక్కటి పిల్లులతో షేర్ చేసుకుంటాము అని చెప్పారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి, ఈ పట్టణం వదిలి వెళ్లాల్సి వస్తే తమతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ పిల్లులను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని ఇక్కడి వాళ్లు చెప్తున్నారు. యుద్ధ భయాలు, ఆందోళనలు ఉన్నా.. ఇక్కడి మనుషులు-పిల్లుల మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అంత సులువుగా తెగిపోయేది కాదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సిరియాలోని కఫ్రన్‌బెల్ పట్టణంలో మనుషుల కంటే పిల్లులే ఎక్కువగా ఉన్నాయి. text: నేను జులై 26న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయక ముందే "చర్చల దిశగా భారత్ ఒక అడుగు వేస్తే మేం రెండడుగులు వేస్తాం" అని చెప్పాం, రెండు దేశాల్లో ఉన్న పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. చైనా 70 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది. పొరుగు దేశాలతో ఉన్న పరిష్కారాలను వివేకంతో పరిష్కరించుకుంది. అఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదులపై యుద్ధ కోసం అమెరికా ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే, చైనా తనకు ఎన్నో సమస్యలు ఉన్నా మౌలిక సదుపాయాలు నిర్మించుకుంది. రెండు దేశాలు ముందుకు వెళ్లడానికి శాంతి చాలా అవసరం. చర్చల ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మేం ప్రతిపాదన చేశాం, మోదీకి లేఖ కూడా రాశాం. ఐక్యరాజ్యసమితిలో విదేశాంగ మంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేయమన్నాం. కానీ ఆ వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఎన్నికల వల్లే వారు స్పందించడం లేదని మాకు తర్వాత అర్థమైంది. వారు తమ ప్రచారం కోసం పాకిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకోవడం లేదు. ఎన్నికల కోసం ఏదో ఒకటి చేస్తారనే అనుకున్నాం తర్వాత మేం వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాం. కర్తార్‌పూర్ తెరుద్దామని, చర్చలను మరింత ముందుకు తీసుకుళ్లి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని అనుకున్నాం. కానీ అక్కడ నుంచి చర్చలను ముందుకు కొనసాగించడం ఉండదని ప్రకటనలు వచ్చాయి. కానీ మాకో భయం వేసింది. ఎన్నికల కోసం ఏదో ఒక చర్యకు దిగుతారని అనుకున్నాం. ఎన్నికల ప్రచారం కోసం ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాం. ఇంతలోనే పుల్వామా దాడి జరిగింది. దీని వెనుక ఆయన హస్తం ఉందని నేను అనడం లేదు. కానీ పుల్వానా ఘటన జరిగినపుడు అరగంటలోనే పాకిస్తాన్ వైపు వేలు చూపించడం మొదలెట్టారు. అలా ఎలా జరుగుతుంది. అప్పుడు దేశంలో సౌదీ ప్రిన్స్ పర్యటన ఉంది, ఆ సమయంలో మేం అలా ఎందుకు చేస్తాం. ఉగ్రవాద చర్యలకు ఎందుకు పాల్పడతాం ఉగ్రవాద దాడుల వల్ల మాకేం లభిస్తుందో అర్థం కావడం లేదు. పుల్వామా వల్ల మాకు ఒరిగేదేముంది. మీరు దానిపై ఎలాంటి సమాచారం ఇచ్చినా మేం సాయం చేస్తామని నేను భారత్‌కు చెప్పాను. పాకిస్తాన్‌లోని పార్టీలన్నీ నేషనల్ యాక్షన్ ప్లాన్‌పై సంతకం చేశాయి. పాక్ లోపల ఎలాంటి మిలీషియాకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించాయి. పుల్వామా దాడి వివరాలు ఈరోజే అందాయి సాయుధ దళాలకు మా భూబాగంపై చోటు ఇవ్వకూడదని మేం భావిస్తున్నాం. మీరు మాకు ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం అని మేం చెప్పాం. కానీ వార్ హిస్టీరియా పెరుగుతూ వెళ్లింది. యుద్ధాలు, తీవ్రవాదం వల్ల పాకిస్తాన్‌లో జరిగిన నష్టం తెలుసు కాబట్టి పాక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. కానీ భారత మీడియాలో వార్ హిస్టీరియా కనిపించింది. దాంతో, ఏదో ఒకటి జరుగుతుందని మేం భయపడ్డాం. అందుకే మీరు ఉల్లంఘనలు చేస్తే జవాబు ఇస్తాం అని ప్రకటించాం. ఏ దేశమైనా అందుకు అనుమతించదు. సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని మేం అప్పుడు చెబితే, ఈరోజు మాకు పుల్వామా దాడి గురించి వివరాలు ఇచ్చారు. కానీ రెండ్రోజుల ముందు పాక్‌పై దాడి చేశారు. అంతర్జాతీయ నిబంధనలు, యుఎన్ చార్టర్ ఉల్లంఘించారు. ముందే పుల్వామా వివరాలు ఇచ్చుంటే, పాకిస్తాన్‌పై యాక్షన్ లేకుంటే మేం చర్యలు తీసుకునేవాళ్లం. ఎన్నికల కోసమే ఇలాంటి వాతావరణం సృష్టించారని మాకు అనిపించింది. మాకు పక్కనే ఉన్న అప్గానిస్తాన్‌తో కూడా సమస్యలు ఉన్నాయి. దాని పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నాం. భారత్ నుంచి ఏదో ఒక ముప్పు వస్తుందని మాకు తెలుసు. అప్పుడే వాళ్లు దాడి చేశారు. నాకు ఉదయం మూడున్నరకు తెలిసింది. దీనికి జవాబివ్వాలా అని మా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌తో మాట్లాడాను. మోదీతో మాట్లాడాలని ప్రయత్నించా మాకు ప్రాణనష్టం జరగకపోతే, మేం దాడులు చేసి ఏదైనా నష్టం జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తం అవుతుందని అనుకున్నాం. మీరు దాడి చేస్తే మేమూ దాడి చేయగలం అని చెప్పడానికే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, టార్గెట్ హిట్ చేయకుండా లోపలికి వెళ్లి వచ్చాం. కానీ మా విమానాలు తిరిగి వస్తున్నప్పుడు భారత ఫైటర్లు వాటిని కూల్చాలని చూశాయి. దాంతో మేం వాటిని కూల్చేశాం. నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ప్రయత్నించాను. మేం పరిస్థితిని మరింత పెంచవద్దనే విషయాన్ని ఆయనకు చెప్పాలనుకున్నాం. దీనిపై ముందుకెళ్లడం మాకు, భారత్‌కు అంత మంచిది కాదు. మేం ఆయనతో మాట్లాడాలని అనుకున్నది, మా మంత్రులు ప్రపంచ దేశాల నేతలతో మాట్లడానికి కారణం ఒకటే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలి. ఒక బాధ్యతాయుతమైన దేశం వేరే దేశాలకు అణిగిమణిగి ఉండడాన్నిఇష్టపడదు. నేను పార్లమెంటు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మిసైల్ దాడి జరుగుతుందని అనుకున్నా ఇది ఇంకా ముందుకెళ్తోంది, మా సైన్యం ప్రిపరేషన్స్ ఉన్నాయి. పాక్ సైన్యం ఎంత ప్రిపేర్ గా ఉందో, ఎక్కడ ఉందో నాకు తెలుసు. రాత్రి నేను పాకిస్తాన్‌పై మిసైల్ దాడి జరుగుతుందని కూడా అనుకున్నాను. తర్వాత అది డిఫ్యూజ్ అయ్యింది. దాన్ని తిప్పికొట్టడానికి మా సైన్యం ఎక్కడుందో కూడా నాకు తెలుసు. అందుకే నేనీరోజు చెబుతున్నా. నేను భారత్‌కు ఈ వేదిక నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. విషయాన్ని ఇంతకంటే ముందుకు తీసుకెళ్లకండి.. ఎందుకంటే మీరు ఏం చేసినా పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దానికి బదులిస్తుంది. రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. వాటి గురించి మనం అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే మిసైల్ క్రైసిస్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరింత ముందుకు వెళ్లకుండా అంతర్జాతీయ సమాజం కూడా తమ పాత్ర పోషిస్తుందని నేను ఆశిస్తున్నాను సారీ, చివర్లో ఒ మాట చెప్పడం మర్చిపోయాను, మేం పట్టుకున్న భారత్ పైలెట్‌ను రెండు దేశాల మధ్య శాంతిని దృష్టిలో ఉంచుకుని రేపు విడుదల చేస్తున్నాం. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాక్ పార్లమెంటులో మాట్లాడిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు బుధవారం సాయంత్రం భారత ప్రధాని మోదీతో మాట్లాడాలని ప్రయత్నించినట్లు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. text: సోమవారం బోటుకు సంబంధించిన కొంత భాగాన్ని ఒడ్డుకు లాగారు. వెలికితీత ప్రయత్నంలో బోటు పైకప్పు విడిపోయి బయటకు వచ్చింది. మంగళవారం (22.10.2019) బోటుకు సంబంధించిన మిగిలిన భాగాన్ని కూడా బయటకు తీశారు. 38 రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్ 77మందితో పాపికొండల విహారానికి బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు సెప్టెంబర్15న ప్రమాదానికి గురయింది. ప్రయాణీకుల్లో 26మందిని స్థానికులు రక్షించారు. మిగిలిన వారిలో 51మంది ప్రాణాలు కోల్పోగా బోటులో11 మృతదేహాలు ఇరుక్కున్నాయి. బోటును వెలికితీసేందుకు గత 38 రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి మంగళవారం బోటు బయటపడింది. బోటును పూర్తిగా వెలికితీయగా, అందులో ఇరుక్కున్న మృతదేహాలు వెలికితీసే కార్యక్రమం కొనసాగుతోంది. బోటును ఇలా బయటకు తీశారు.. వారం రోజులుగా గోదావరిలో నీటిమట్టం తగ్గుతుండడం వెలికితీత ప్రయత్నాలకు అనుకూలించింది. విశాఖపట్నం ఓం శివశక్తి అండర్‌వాటర్ సర్వీసెస్‌కు చెందిన ఇద్దరు డైవర్లు ఆదివారం ఉదయం నదిలో మునిగి బోటుకు భారీ తాళ్లు కట్టడంతో బోటు పైభాగం కొంత బయటకు లాగగలిగారు. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు రెండు దఫాలుగా సాగాయి. విశాఖకు చెందిన శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ సంస్థ డైవర్స్ మూడు రోజుల పాటు ప్రయత్నించారు.నదిలో దిగి బోటుకి తాడు కట్టారు. బోటును వెలికితీసే ప్రయత్నాలు రెండుసార్లు విఫలమయ్యాయి బోటులో ఇసుక, మట్టి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో ఒకేసారి రాలేదని ధర్మాడి సత్యం తెలిపారు. ఈ ప్రమాదంలో 51మంది మరణించగా ఇప్పటి వరకూ 11 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. బోటు బయటకు తీసే క్రమంలోనే మృతదేహాల నుంచి దుర్వాసన రావడంతో మొత్తం మృతదేహాలు లభిస్తాయనే అంచనాతో ఉన్నారు. బోటు అడుగున క్యాబిన్ లో ఇరుక్కున్న వారి మృతదేహాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంగళవారం 8 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో నెల రోజుల కిందట మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును బయటకు తీసే ప్రయత్నాలు ఫలించాయి. text: హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆర్తి నాగపాల్ వామపక్ష, దళిత విద్యార్ధి సంఘాలను ఓడించి ఆరు యూనియన్ పోస్టులను కైవసం చేసుకుంది. ఇంతకు ముందు ఎనిమిదేళ్లుగా వామపక్ష అనుబంధ స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా (SFI), అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) యూనియన్‌లకు చెందిన విద్యార్థి నేతలు అధ్యక్ష స్థానం గెలుస్తూ వచ్చారు. 2006 నుంచి 2009 మధ్యలో జరిగిన ఎన్నికలలో ఏబీవీపీ అభ్యర్థులు కల్చరల్ సెక్రటరీగానో లేక స్పోర్ట్స్ సెక్రటరీగానో గెలవగలిగారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికలలో మాత్రం మొత్తం ఆరుగురు సభ్యుల ప్యానెల్ గెలిచిందని ఏబీవీపీ హెచ్‌సీయూ యూనిట్ అధికార ప్రతినిధి ఉదయ్ చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. ఏబీవీపీ, ఓబీసీ ఫెడరేషన్ కలిసి ఒక వైపు, యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ కింద ఎన్ఎస్‌యుఐ, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (MSF), స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) తదితరాలు ఒక వైపు, ఎస్ ఎఫ్ ఐ మరోవైపు పోటీ చేశాయి. అధ్యక్ష స్థానానికి ఏబీవీపీ నుంచి పోటీ చేసిన ఆర్తి నాగపాల్‌కు 1,663 ఓట్లు, ఎస్ఎఫ్ఐ నుంచి పోటీ చేసిన ఎర్రం నవీన్ కుమార్ కు 1,329 ఓట్లు, యుడీఏ అభ్యర్థి శ్రీజకు 842 ఓట్లు వచ్చాయి. మరోవైపు దాదాపు 150 దాక నోటా ఓట్లు నమోదయ్యాయి. అయితే ఈ పరిణామం చూస్తుంటే విద్యార్థులు అసలు ఏమి కోరుకున్నారనేది అర్థం కావడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. విద్యార్థి సంఘం అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన మూడో స్థానంలో నిలిచిన శ్రీజ వాస్తవి "సైద్ధాంతిక రాజకీయాలు, గుర్తింపు రాజకీయాలను తమతో కలుపుకొని ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా లేవు. ఎటువంటి రాజకీయ భావజాలాన్ని సమర్థించలేక పోవటం కూడా ఒక ప్రమాదకరమైన సంకేతం," అని హరగోపాల్ వ్యాఖ్యనించారు. విద్యార్థుల సంక్షేమం గురించి మాట్లాడాం.. గెలిచాం: ఏబీవీపీ క్యాంపస్‌లో విద్యార్థులు ఒక పారదర్శక నాయకత్వాన్ని కోరుతున్న విషయం స్పష్టం అవుతుందని ఉదయ్ తెలిపారు. "ఇంట గెలిచి రచ్చ గెలవాలి. యూనివర్సిటీ లోపల , మెస్, హాస్టల్ వంటి మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను కూడా యూడీఏ పరిష్కరించలేక పోయింది. అందువల్లనే ఈ రోజు విద్యార్థులు ఏబీవీపీని గెలిపించారు'' అని ఉదయ్ అన్నారు. ''అలాగని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు బయట జరిగే రాజకీయాలలో ఆసక్తిగా లేరని కాదు.. మేము విద్యార్థులను 'స్టూడెంట్ దర్బార్' ద్వారా క్యాంపస్ లోపల జరిగే రాజకీయాలతో పాటు బయట జరిగే రాజకీయాలను కూడా చర్చించే ఒక వేదికను ఏర్పాటు చేస్తాం. విద్యార్థి సంఘంగా విద్యార్థులకు అధికారం ఇవ్వాలనేదే మా వాదన. అదే దిశగా మా కార్యక్రమాలుంటాయి," అని ఉదయ్ వివరించారు. గత సంవత్సరంలో హెచ్‌సీయూ తీసుకున్న నిర్ణయాల గురించి ఎవరూ మాట్లాడకపోవడం కూడా కొంత యూడీఏ మీద వ్యతిరేకత పెంచిందనీ అంటున్నారు కొందరు విద్యార్థులు. ఉదాహరణకి విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కి కేవలం శుక్రవారం మధ్యాహ్నం మాత్రం రావాలని, బయట నుండి భోజనం ఆర్డర్ చేయకూడదని, విద్యార్థులు కేవలం అడ్మినిస్ట్రేషన్ వారు చూపించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌కి దూరంగా ఉన్న ఒక చోటే నిరసనలు తెలపాలని... ఇలా పలు ఆదేశాలు విద్యార్థులలో కలకలం సృష్టించాయి. "ఇటు వంటి నిర్ణయాలు కేవలం విద్యార్థులను నిస్సహాయులను చేశాయి. ఇది మారాలి. అధికారం విద్యార్థులకు ఇవ్వాలి. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో అందరు విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి. మేము దృష్టిపెట్టాల్సిన ముఖ్యమైన అంశం ఇదే," అని కొత్తగా ఎన్నికైన అధ్యక్షురాలు ఆర్తి నాగపాల్ అన్నారు. అంతర్గత కుమ్ములాట మూలానే హిందుత్వ విద్యార్ధి సంఘానికి గెలిచే అవకాశం వచ్చింది: యూడీఏ అధ్యక్ష అభ్యర్థి శ్రీజ వామపక్ష విద్యార్ధి సంఘాలు, దళిత విద్యార్థి సంఘాలు, ముస్లిం విద్యార్ధి సంఘాలు అందరూ ఒక్క తాటి పైన వచ్చి అలయన్స్ ఫర్ సోషల్ జస్టిస్ అని కూటమి ఏర్పాటు చేసుకున్నారు. గత రెండు సంవత్సరాలు ఈ అలయన్స్ కిందనే యూనియన్ ఏర్పాటు చేశారు. కానీ వామపక్ష విద్యార్ధి సంఘం ఎస్ఎఫ్ఐ కి ఉన్న 'ఇస్లామోఫోబియా' మూలానే తాము ఓడిపోయాం... అని శ్రీజ ఆరోపించారు. "ప్రతి విద్యార్ధి సంఘానికి ఒక భావజాలం ఉంటుంది. యూనివర్సిటీలో విద్యార్ధి రాజకీయాలు ఒక అట్టడుగు వర్గాల విద్యార్థుల హక్కుల కోసం పోరాడే వేదికగా ఉండాలనేది ముఖ్య ఉదేశం. కానీ ఇప్పుడు అలా అన్ని వర్గాలు ఒక్క తాటిపై లేనందునే ఇవాళ ఏబీవీపీ గెలిచింది. కేరళ లో జరిగే రాజకీయాలను ఇక్కడ యూనివర్సిటీ లోపల జరిగే రాజకీయాలకు లింక్ పెట్టడం సరి కాదు. అయినప్పటికీ మేము మా పోరాటం ఆపేది లేదు. మా తప్పుల నుంచి మేము నేర్చుకున్నాం. యూనివర్సిటీ యాజమాన్యం తమ ఎజెండాను ఏబీవీపీ ద్వారా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మేము వెనక్కి తగ్గేది లేదు. ఇప్పటికైనా అందరూ ఒక తాటి పైకి వచ్చి ఐకమత్యం తో హిందుత్వ రాజకీయాలను ఎదిరించాలి," అన్నారు శ్రీజ. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎస్ ఎఫ్ ఐ సభ్యులు అందుబాటులో లేరు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఎన్నికల్లో ఎనిమిదేళ్ల తర్వాత ఏబీవీపీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకుంది. text: ఆర్టికల్ 370 సవరణ పూర్తిగా భారత్‌కి సంబంధించిన అంశమని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై పాకిస్తాన్‌కి మరే ఇస్లామిక్ దేశమూ అండగా లేదని, ఈ వ్యవహారంలో ప్రస్తుతం పాకిస్తాన్ ఒంటరి అని అన్నారు. భారత్ వైపు నుంచి ఎలాంటి దౌత్యపరమైన తప్పిదమూ జరగలేదన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించిన తీరు చూస్తుంటే... "నిరాశ చెందిన పిల్లి" మాట్లాడుతున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. బీబీసీ ప్రతినిధి రాజేశ్ జోషీతో మాట్లాడుతున్న రాకేష్ సిన్హా బీబీసీ హిందీ రేడియో ఎడిటర్ రాజేశ్ జోషీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వర్తమాన అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ఇతర దేశాలతో భారత్ చాలా కీలక భూమిక పోషిస్తోందని, పాకిస్తాన్ చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఈ అంశంపై చైనా ప్రతిస్పందనను ఆయన తోసి పుచ్చారు. "ఆర్టికల్ 370 అన్నది కాలక్రమంలో పూర్తిగా కనుమరుగైపోతుందని, అది కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడో చెప్పుకొచ్చారు. అయితే, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ విడతల వారీగా చేసేందుకు ప్రయత్నించగా... తాము మాత్రం ఒకే దెబ్బతో పని పూర్తి చేశాం" అని సిన్హా అన్నారు. ఇటీవలి కాలంలో కశ్మీర్ ప్రజలకు చైనా స్టాపుల్డ్ వీసాలను జారీ చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. "విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా... సరిహద్దుల్లో ఉన్న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లపై హక్కు కోరుకుంటోంది. ఒకవేళ చైనా విస్తరణ కాంక్షను విస్మరించినట్లయితే... అందుకు ప్రతిఫలంగా మన దేశంలో భారీ భూభాగాన్ని కోల్పోవలసి ఉంటుంది. నిజానికి చైనా అనేది పాకిస్తాన్‌కి మిత్ర దేశం కాదు. చైనాతో భారతదేశానికి ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగుతున్నా, అది ఎప్పటికీ భారత్‌కి మిత్ర దేశం కాదు. ఒకవేళ భారతదేశానికి ఉన్న శత్రు దేశాల జాబితా ఉంటే అందులో మొదటి స్థానంలో ఉండే పేరు చైనాదే అవుతుంది" అని రాకేశ్ వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా, రష్యా, పాకిస్తాన్, చైనాల్లో ఏ దేశానికీ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా స్పష్టం చేశారు. text: భారత సైన్యం అయితే, వీటన్నిటి మధ్యా సోషల్ మీడియాలో ఒక కొత్త వాదన వినిపిస్తోంది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 మూడు ఫొటోలను చూపిస్తూ, “బాడ్‌మేర్‌లో మన సైన్యం వెయ్యికి పైగా పడకలు ఉన్న అత్యాధునిక ఆస్పత్రిని రెండు రోజుల్లో సిద్ధం చేసి రాజస్థాన్ ప్రభుత్వానికి, మూడు ఆస్పత్రులను భారత ప్రభుత్వానికి అంకితం చేసింది. దేశ జవాన్ల సత్తాకు సలాం. దేశానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, నా జవాన్లు, రైతులు దేశాన్ని కాపాడుతారు. జై జవాన్, జై కిసాన్” అని పెడుతున్నారు. మరో ట్వీట్‌లో “మన సైన్యం రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. దీనిని సెటప్ చేయడానికి కొన్ని గంటలే పడుతుంది. ఇప్పటివరకూ మనం చైనా ఇలాంటి ఘన కార్యాలు చేసిందనే వార్తలు వింటున్నాం. మన సైన్యం సాధించినవాటిని మాత్రం మరిచిపోతున్నాం” అని పెట్టారు. ఈ పోస్టుతో పాటు మూడు ఫొటోలు కూడా షేర్ చేశారు. బీబీసీ ఈ మూడు ఫొటోలను పరిశీలించింది. ఇండియన్ ఆర్మీ నిజంగానే రాత్రికిరాత్రే బాడ్‌మేర్‌లో ఆస్పత్రిని నిర్మించిందా అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొబైల్ ఆస్పత్రి ఫొటో-1 మేం గూగుల్ రివర్స్ సెర్చ్ టూల్ ఉపయోగించి ఈ ఫొటోను పరిశీలించినపుడు ఇక్కడ ఈ వాహనాలు ఉన్న మొబైల్ ఆస్పత్రి రష్యాలో నిర్మించిందని, కిర్గిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖకు దీనిని డొనేట్ చేశారని తెలిసింది. 2019 సెప్టెంబర్ 11న కిర్గిస్తాన్ న్యూస్ ఏజెన్సీ కబర్.కేజీ ఈ వార్తను ప్రచురించింది. ఇందులో 10 ఫిజీషియన్లు, ఆస్పత్రి వర్కర్లు ఒకేసారి రోగులకు వైద్యం చేయచ్చు. మొబైల్ ఆస్పత్రి, అమెరికా ఫొటో -2 రెండో ఫొటోలో “మన సైన్యం నిర్మించిన ఆస్పత్రి లోపల నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి” అని చెప్పారు. నిజానికి ఈ ఫొటో 2008 నవంబర్‌లో తీసింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌లో ఈ ఫొటో ఉంది. దానితోపాటు “మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రి లోపల ఇలా కనిపిస్తుంది” అని రాశారు. ఈ ఆస్పత్రిలో క్లైమెట్ చేంజ్ సిస్టమ్ లాంటి అన్నిరకాల వైద్య పరికరాలు, రోగులకు విషమ పరిస్థితుల్లో కూడా చికిత్స అందించేందుకు ఉపయోగపడే మందులు ఉంటాయి. ఇలాంటి మూడు ఆస్పత్రులు నిర్మించారు. వీటిలో మొత్తం 600 పడకల సామర్థ్యం ఉంది. కాలిఫోర్నియా మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్‌లో ఇలాంటి మూడు మొబైల్ ఆస్పత్రులు నిర్మించారు. ఈ ఒక్క ఆస్పత్రిలో 200 పడకలు ఉంటాయి. మేం ఈ ఫొటో మెటాడేటా తీసినప్పుడు, ఈ ఫొటోను 2006 మార్చి 21న నికాన్ డీ200 కెమెరాతో తీసినట్టు తెలిసింది. భారత సైన్యం ఫొటో-3 ఈ ఫొటోలో ఇండియన్ ఆర్మీకి చెందిన కొంతమంది జవాన్లు కూర్చుని కనిపిస్తారు. ఈ ఫొటో బాడ్‌మేర్‌లో నిర్మించిన ఆర్మీ ఆస్పత్రిదే అని చెబుతున్నారు. దీనిని Tineye ఇమేజ్ సెర్చ్ ఇంజన్ ద్వారా పరిశీలించిన, మేం భారత పదాతి దళానికి సంబంధించిన ఒక ట్వీట్ దగ్గరకు చేరుకున్నాం. 2015లో నేపాల్‌లో భూకంపం వచ్చినపుడు ఇండియన్ ఆర్మీ సైన్యం అత్యవసర సేవల కోసం కాఠ్మండూ ఎయిర్ బేస్‌లో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసింది. అంటే, ఈ మూడు ఫొటోలూ పాతవి. సోషల్ మీడియాలో చెబుతున్న వాదనలకూ ఈ ఫొటోలకూ ఎలాంటి సంబంధం లేదు. కానీ, భారత సైన్యం కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి నిజంగానే ఏదైనా ఆస్పత్రి నిర్మించిందా అనే ప్రశ్న కూడా మనసులో మెదులుతుంది. ఆ ప్రశ్నకు మాకు ఇండియన్ ఆర్మీ ట్విటర్ అకౌంట్‌లో సమాధానం లభించింది. మార్చి 23న భారత పదాతి దళ ప్రతినిధి తన ట్వీట్‌లో “భారత సైన్యం బాడ్‌మేర్‌లో కరోనావైరస్ బాధితుల కోసం వెయ్యి పడకల క్వారంటైన్ సెంటర్ నిర్మించిందని సోషల్ మీడియాలో వస్తున్న వాదనలు అబద్ధం” అని చెప్పారు. దీంతో కోవిడ్-19 పాజిటివ్ రోగుల కోసం భారత సైన్యం ఎలాంటి వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించలేదనే విషయం స్పష్టం అయ్యింది. దానితోపాటూ రాజస్థాన్‌లోని బాడ్‌మేర్ జిల్లాలో కట్టినట్లుగా చెబుతున్న ఆస్పత్రులు నిజానికి రష్యా, అమెరికాలోని మొబైల్ ఆస్పత్రులకు చెందినవని తేలింది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య వేయి దాటింది. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతే అని భావిస్తున్నారు. ఎందుకంటే, దేశంలో 70,000 ఐసీయూ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. text: పార్లమెంట్‌లో ముగింపు ప్రసంగం చేస్తూ, చైనాను విభజించడానికి జరిగే ఏ ప్రయత్నమైనా విఫలం కాక తప్పదని అన్నారు. దేశం ముక్కలు కాకుండా చూడడమే ప్రజాభిమతం అని తెలిపారు. "చైనా ప్రజలు తమ శత్రువులకు వ్యతిరేకంగా రక్తసిక్త పోరాటాలు సాగించడానికి సైతం సిద్ధంగా ఉన్నారు" అని షీ అన్నారు. జిన్‌పింగ్‌ ప్రసంగం - చైనా నుంచి వేరు పడాలని తైవాన్, హాంకాంగ్‌లాంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయత్నాలకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. అభివృద్ధి విషయంలో ఉపేక్షించబోమని తన ప్రసంగంలో జిన్‌పింగ్‌ అన్నారు. కేవలం సోషలిజం మాత్రమే చైనాను రక్షించగలదని చరిత్ర నిరూపించిందని ఆయన తెలిపారు. పాలకులు ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలించాలని జిన్‌పింగ్ సూచించారు తైవాన్‌కు పరోక్ష హెచ్చరిక! చైనా లక్ష్యాల గురించి చెబుతూ జిన్‌పింగ్‌, తమ దేశం బలోపేతం కావాలనుకుంటున్నా, అది దౌర్జన్యంతో కానీ ఇతర ప్రపంచాన్ని పణంగా పెట్టి కానీ కాదన్నారు. దేశాన్ని ముక్కలు చేయడానికి జరిగే ఏ ప్రయత్నమైనా విఫలం కాక తప్పదని, అలాంటి ప్రయత్నాలను చరిత్ర శిక్షిస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా తైవాన్‌కు వ్యతిరేకంగా చేసినవని భావిస్తున్నారు. తైవాన్ స్వయం పాలిత దేశమైనా, చైనా మాత్రం ఆ దేశాన్ని తిరుగుబాటు ప్రాంతంగా భావిస్తోంది. అవసరమైతే బలాన్ని ఉపయోగించి అయినా, తిరిగి ఆ దేశాన్ని చైనాలో కలిపేసుకోవాలనుకుంటోంది. మరోవైపు, ఇటీవలి కాలంలో హాంకాంగ్‌కు మరింత స్వయం ప్రతిపత్తి లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలన్న డిమాండ్‌లు కూడా పెరిగాయి. తైవాన్‌ను తిరిగి తమ దేశంలో కలిపేసుకోవాలనుకుంటున్న చైనా నిరసనలకు చోటేది? చైనాలో అసమ్మతి గళాలను కానీ, నిరసనలను కానీ సహించరు. సైద్ధాంతికంగా 3 వేల మంది డెలిగేట్లను ఎన్నుకున్నా, నిజానికి ప్రభుత్వమే తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం చైనాలో మావో తర్వాత అంతటి శక్తిమంతుడైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్‌పింగ్‌, తన ముఖ్య అనుచరులను కీలక పదవుల్లో నియమించుకున్నారు. 2013లో చైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జిన్‌పింగ్‌, ఇటీవలే జీవితాంతం అధ్యక్షుడిగా ఉండేలా రాజ్యాంగాన్ని సవరించారు. అయితే దీనిపై చైనా లోపల, బయట కూడా విమర్శలు వినవస్తున్నాయి. జిన్‌పింగ్‌ అధ్యక్ష పదవిని స్వీకరించాక అవినీతి వ్యతిరేక చర్యలలో భాగంగా సుమారు లక్ష మంది అధికారులను శిక్షించారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నారని ఆయన విమర్శకులంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమ దేశానికి చెందిన ఒక అంగుళం భూభాగాన్ని కూడా తమ నుంచి వేరు చేయలేరని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హెచ్చరించారు. text: శ్రద్ధా కపూర్, కిరన్ ఖేర్ లాంటి సెలెబ్రిటీలతో పాటు చాలామంది సామాన్యులు కూడా ఆ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ భారత సైన్యం గొప్పతనానికి సెల్యూట్ చేస్తున్నారు. భారత సైనికులు సియాచెన్ గ్లేసియర్ లాంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతాల్లో పనిచేసే మాట వాస్తవమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండే యుద్ధభూమిగా సియాచెన్‌కు పేరుంది. 13వేల నుంచి 22వేల అడుగుల ఎత్తులో వాళ్లు విధులు నిర్వర్తిస్తారు. అత్యంత శీతల వాతావరణం ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. కానీ, ఇక్కడ భారత సైనికులుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోల్లో మాత్రం నిజం లేదు. ఆ ఫొటోలు రష్యా, యుక్రెయిన్ సైనికులకు చెందినవనీ, వాటిని భారత సైనికులకు తప్పుగా ఆపాదించారని బీబీసీ పరిశీలనలో తేలింది. ‘లైకులు, షేర్ల’ కోసమే కావాలనే ఈ పని చేసినట్లు కనిపిస్తోంది. కానీ, కొందరు బాలీవుడ్ నటులు కూడా వీరి బుట్టలో పడ్డారు. సైనికులను గౌరవించే ఉద్దేశంతో వీళ్లు ఆ పోస్టులను షేర్ చేస్తున్నా, తెలియకుండానే ఒక ఫేక్ న్యూస్ వ్యాప్తిలో వాళ్లు భాగమవుతున్నారు. అలా కావాలనే ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారనడానికి కొన్ని ఉదాహరణలివి. ‘వీళ్లు సినీ తారలకు ఏమాత్రం తీసిపోరు. ఈ సాహసవంతులైన మహిళలు పాకిస్తాన్ సరిహద్దు దగ్గర సేవలందిస్తున్నారు. జై హింద్ అని రాయడానికి ఆలోచించకండి’ అంటూ పై ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇద్దరు మహిళలు ఆర్మీ యూనిఫాం ధరించి, తుపాకులు పట్టుకొని కనిపించే ఈ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కుడివైపు ఉన్న మహిళ యూనిఫాంపై జెండా, భారత జెండాను పోలి ఉంటుంది. @indianarmysupporter అనే పేజీ కూడా ఈ ఫొటో పోస్ట్ చేసింది. దాన్ని 3వేల మందికి పైగా షేర్ చేశారు. ఇదీ నిజం: ఆ ఫొటోలోని ఇద్దరు మహిళలు ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ పెష్మార్గా ఫైటర్లు. ‘పెష్మార్గా’ అంటే మృత్యువును ఎదుర్కొనేవారని అర్థం. వాళ్లు ఐఎస్‌కు చెందిన ఇస్లామిక్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఒటోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక పెష్మార్గాలు కుర్దిష్ ప్రజల యుద్ధ వీరులుగా మారారు. స్వతంత్ర కుర్దిస్తాన్‌ కోసం పోరాడే కుర్దిష్ ప్రజలు ధరించే జెండానే ఆ ఫొటోలో ఉన్న సైనికులు కూడా ధరించారు. పై ఫొటోను షేర్ చేస్తూ, ‘మన సైనికులు -5డిగ్రీలలో కూడా ఇలా డ్యూటీ చేయబట్టే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. జైహింద్, జై భారత్’ అనే వ్యాఖ్యలు రాస్తున్నారు. మరో వ్యక్తి పూర్తిగా మంచులో కూరుకుపోయిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ‘భారతీయ యోధా’ లాంటి కొన్ని పేజీల్లో ఈ ఫొటోకు వేలాది లైకులొచ్చాయి. ఇదీ నిజం: ఈ ఫొటో అమెరికా స్విమ్మర్ డాన్ షెట్టర్‌కు చెందింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ చేసిన వీడియోలో నుంచి ఆ ఫొటోను తీసుకున్నారు. డాన్ షెట్టర్ అత్యంత శీతల వాతావరణంలో లేక్ సుపీరియర్‌లో ఈదడానికి ఎలా వెళ్లాడో చెబుతూ ఆ ఫొటోను జెర్రీ మిల్స్ పంచుకున్నారు. కానీ, దాన్ని మరో అవసరం కోసం సోషల్ మీడియాలో కొందరు ఉపయోగిస్తున్నారు. అలాంటి ఫొటోలు షేర్ చేయడం కొత్త కాదు. అవన్నీ నకిలీవని తేలుతున్నప్పటికీ ఇప్పటికీ వాటిని పంచుకుంటూనే ఉన్నారు. మరో ఫొటోలో ఇద్దరు సైనికులు పూర్తిగా మంచులో కూరుకుపోయినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటో కూడా వివిధ పేజీల్లో షేర్ అవుతోంది. నిజానికి ఈ ఫొటో గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్నా, మళ్లీ వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. ఈ ఫొటోను శ్రద్ధా కపూర్ కూడా షేర్ చేశారు. 2014 ఇదే ఫొటో యుక్రెయిన్‌లో వైరల్ అయింది. యుక్రెయిన్ సైనికులు -20 డిగ్రీల చలిలో పనిచేస్తున్నారని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇదీ నిజం: ఈ ఫొటోలు రష్యాకు చెందినవి. అక్కడి సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే సమయంలో వీటిని తీశారు. రష్యాకు చెందిన కొన్ని అధికారిక వెబ్‌సైట్లు ఈ ఫొటోలు ప్రచురించాయి. యుక్రెయిన్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘స్టాప్‌ఫేక్’ కూడా ఈ ఫొటోలు నకిలీవని తేల్చింది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత సైనికులు అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నట్లు చూపించే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. text: ‘‘ఒప్పందంలో ‘సంపూర్ణ అణు నిరాయుధీకరణ’ అనే వాక్యాన్ని చేర్చడం ద్వారా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఓ విధంగా పై చేయి సాధించారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా అమెరికా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ల భేటీకి వీలు కల్పించొచ్చు’’ అని డుయోన్ కిమ్ పేర్కొన్నారు. ‘కానీ ఉత్తర కొరియా కదలికల్ని చాలా నిశితంగా గమనించాలి. వాళ్లు తమ వాగ్దానాలను చాలాసార్లు నిలబెట్టుకోలేదు. ఒప్పందాలపై వాళ్లు వెనక్కు తగ్గొచ్చు. రకరకాల కుయుక్తుల ద్వారా వాళ్లు ఒప్పందం నుంచి బయటకు వచ్చి మళ్లీ అణు పరీక్షలను ముందుకు తీసుకెళ్లొచ్చు. గతాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఈ విషయంలో నేను వాళ్ల నుంచి ఎక్కువ ఆశించట్లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకుముందు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రాలు లేని ప్రాంతంగా మార్చడానికి ఉభయ కొరియా నేతల మధ్య ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌కూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కూ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన చేశారు. అయితే అణు నిరాయుధీకరణ ఎలా జరుగుతుందనే వివరాలు ఈ ప్రకటనలో లేవు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా తామిద్దరం పరస్పర సమన్వయంతో పనిచేయడానికి అంగీకరించినట్లు కిమ్ జోంగ్-ఉన్ ప్రకటించారు. ‘ఎదురుదెబ్బలు, కష్టాలు, నిరాశా నిస్పృహలు ఉంటాయి. కానీ నొప్పి లేకుండా విజయం దక్కదు’ అని కిమ్ వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటనలో అంగీకరించిన ముఖ్యమైన అంశాలు: అంతకు ముందు, శుక్రవారం ఉదయం ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ సరిహద్దు దాటి వచ్చి దక్షిణ కొరియా అధ్యక్షుడిని పన్‌మున్‌జోమ్‌లో కలిశారు. చూడండి.. కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన చరిత్రాత్మక ఘట్టం అనేక యేళ్ల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు, బెదిరింపుల వాతావరణాన్ని చెరిపేస్తూ ఉభయ కొరియా దేశాల నేతలు చర్చల కోసం ఒక చోటికి చేరారు. కొద్ది సంవత్సరాల క్రితం బహుశా ఎవ్వరూ ఊహించి ఉండని పరిణామం ఇది. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో చర్చలు జరపడానికి దక్షిణ కొరియా చేరుకున్నారు. 1953లో జరిగిన కొరియా యుద్ధం (కొరియా ద్వీపకల్పం రెండు భాగాలుగా విడిపోయింది అప్పుడే) తర్వాత ఉత్తర కొరియా నేత ఒకరు దక్షిణ కొరియా గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. పన్‌మున్‌జోమ్‌లో కిమ్ జోంగ్-ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇద్దరూ చిరునవ్వుతో పరస్పరం కరచాలనం చేశారు. అలా వీరి చరిత్రాత్మక భేటీ మొదలైంది. పన్‌మున్‌జోమ్‌ అనేది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, అమెరికా సైనికులు రాత్రింబవళ్లు ఒకరితో ఒకరు కలుసుకునే చోటు. 1953 యుద్ధం తర్వాతి నుంచి ఇక్కడ కాల్పుల విరమణ అమలులో ఉంది. కిమ్ శాంతి గీతాలాపన... ‘‘ఇది కొత్త చరిత్రకు ఆరంభం. ... శాంతి యుగానికి నాంది.’’ పాన్మున్జోమ్ సందర్శకుల పుస్తకంలో కిమ్ ఈ వ్యాఖ్య రాశారు. కిమ్, మూన్ ఇరువురి సంభాషణను టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ‘‘మనం సమావేశం ఆశావహంగా ఉండాలి. కృతనిశ్చయంతో ముందుకు సాగాలి. మన గుండె తలుపులు తెరిచి మాట్లాడుకుంటే ఈ సమావేశం మంచి ఫలితాన్నిస్తుంది’’ అని కిమ్ వ్యాఖ్యానించారు. కిమ్ భార్య కూడా వచ్చారా? ఉభయ కొరియాల మొదటి రెండు శిఖరాగ్ర సదస్సుల్లో ఇరు దేశాల అధినేతల భార్యలు ఎక్కడా కనిపించలేదు. అయితే.. కిమ్ భార్య రి సోల్-జును ఉత్తర కొరియా మరింత ఎక్కువగా ప్రజల మధ్యకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆమె కూడా హాజరవుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆమె ఇంకా దక్షిణ కొరియాలో కనిపించలేదు. సరిహద్దుకు అటూ ఇటూ... కిమ్.. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9:30 గంటలకు సరిహద్దులోని నిస్సైనిక ప్రాంతానికి చేరుకున్నారు. మూన్ అనూహ్యంగా సరిహద్దు దాటి ఉత్తర కొరియా భూభాగంలోకి అడుగుపెట్టి కిమ్‌తో కరచాలనం చేశారు. ఆ తర్వాత ఇరువురూ కలిసి దక్షిణ కొరియా భూభాగం లోకి ప్రవేశించి మరోసారి కరచాలనం చేశారు. ఇరువురు నాయకులకూ దక్షిణ కొరియా సైనిక వందనం చేసింది. ‘‘మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది’’ అని కిమ్‌తో మూన్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తామంటూ ఉత్తర కొరియా ఇటీవల ఇచ్చిన సంకేతాలపై ఈ చరిత్రాత్మక సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, కిమ్ జోంగ్-ఉన్‌ల మధ్య జూన్ ఆరంభంలో ప్రతిపాదిత ముఖాముఖి చర్చలకు సన్నాహకంగా ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య ఈ చర్చలు జరుగుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర-దక్షిణ కొరియా నేతల మధ్య కుదిరిన ఒప్పందం, ముఖ్యంగా వారు సంతకం చేసిన ఓ పత్రం.. కిమ్-డొనాల్డ్ ట్రంప్‌ల భేటీకి మార్గాన్ని సుగమం చేస్తుందని సోల్‌లోని కొరియన్ పెనిన్సులా ఫ్యూచర్ ఫోరమ్ నిపుణురాలు డుయోన్ కిమ్ బీబీసీతో చెప్పారు. text: భర్త తనను ఎన్ని సార్లు కొట్టాడో లెక్కించడమే మానేసింది గీతా. పెళ్లైన రాత్రే ఇది మొదలైంది బ్రిటన్‌లో గృహ హింస హెల్ప్ లైన్‌కు వచ్చే ఫోన్ కాల్స్ ఈ వారాంతపు రోజుల్లో 65 శాతం పెరిగాయి. పేద దేశాల్లో, చిన్న ఇళ్లల్లో ఉండే బాధితులకు ఫిర్యాదు చేసే వీలు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయని ఐరాస హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్ వల్ల ఇళ్లల్లోనే చిక్కుకుపోయి గృహ హింస నుంచి బయటపడలేకపోతున్నామని చెబుతున్న ఇద్దరు మహిళలతో బీబీసీ మాట్లాడింది. గీతా, భారత్ గమనిక: భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్ అమల్లోకి రాకముందు గీతాతో మాట్లాడాం. ఉదయం ఐదు గంటలకు గీతా నిద్ర లేచారు. ఆమె భర్త విజయ్ కింద నేలపై పడి ఉన్నారు. గట్టిగా గురక పెడుతున్నారు. ముందు రోజు రాత్రి ఆయన తప్పతాగి ఇంటికి వచ్చారు. ఆయన ఆటో డ్రైవర్. కరోనావైరస్ వ్యాప్తి వల్ల జనం బయట పెద్దగా తిరగట్లేదు. విజయ్ రోజుకు రూ.1500 ఆదాయం వచ్చేది. ఇప్పుడది రూ.700కు పడిపోయింది. గోడకు మందు సీసాను విసిరికొడుతూ, ‘‘ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుంది?’’ అంటూ కేకలేశాడు విజయ్. పిల్లలు వణుకుతూ గీతా వెనుకకు వచ్చి దాక్కున్నారు. అరిచిన తర్వాత ఇంట్లో ఉన్న చిన్న పరుపు మీద విజయ్ పడుకుండిపోయారు. తన తల్లికి, సోదరికి ఆమె తనకు జరిగిందంతా పూర్తిగా చెప్పలేదు ''పిల్లలను సముదాయించేందుకు కొంత సమయం పట్టింది. ఆయన ఇంతకన్నా కోపంగా ప్రవర్తించడం వాళ్లు చాలా సార్లు చూశారు. కానీ, గత కొన్ని వారాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా మారింది. వస్తువులను గోడకేసీ కొట్టడం, నన్ను జుట్టు పట్టి లాగడం వాళ్లు చూశారు'’ అని చెప్పారు గీతా. భర్త తనను ఎన్ని సార్లు కొట్టాడో లెక్కించడమే మానేశారు గీతా. పెళ్లైన రాత్రే ఇది మొదలైంది. ఓసారి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ఆమె ప్రయత్నించారు. కానీ, పిల్లలను తన వెంట భర్త తీసుకుపోనివ్వలేదు. ఓ గ్రామీణ ప్రాంతంలో పేదలు ఉండే వాడలో వాళ్లు ఉంటున్నారు. రోజూ తాగు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తారామె. ఆ తర్వాత పక్కింటి వాళ్లతో ముచ్చట్లు పెడుతూ, కూరగాయాల తోపుడు బండి కోసం వేచిచూస్తుంటారు. కూరగాయలు కొన్నాక, టిఫిన్ వండటం మొదలుపెడతారు. విజయ్ ఇంట్లో నుంచి రోజూ 7 గంటలకు బయటకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు తిరిగివస్తారు. కాసేపు కునుకు తీసి, పిల్లలు స్కూల్ నుంచి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ బయటకువెళ్తారు. "మార్చి 14న స్కూళ్లను మూసేయడంతో పరిస్థితులు మారాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ల వల్ల నా భర్త మరింత చికాకుకు గురవుతున్నారు" అని గీతా చెప్పారు. “సాధారణంగా ఆయన నాపైనే కోపమంతా ప్రదర్శిస్తుంటారు. కానీ, చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లలపై అరవడం మొదలుపెట్టారు. ఆయన దృష్టిని మరల్చేందుకు నేనేదైనా అంటుంటా" అని వివరించారు గీతా. వాళ్లుండే చోట కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు బట్టలు కుట్టే పని, చదవడం, రాయడం నేర్పిస్తుంటారు. భర్తకు తెలియకుండా రహస్యంగా గీతా ఈ తరగతులకు వెళ్లేవారు. తన కాళ్లపై తాను నిలబడేందుకు, పిల్లలతో కలిసి స్వతంత్రంగా బతికేందుకు అవసరమైన నైపుణ్యాలు సంపాదించుకోవాలని గీతా కోరుకుంటున్నారు. కానీ, 21 రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో శిక్షణ తరగతులు ఆగిపోయాయి. ఆమెకు ధైర్యం చెప్పేవారు ఎవరూ రావట్లేదు. విమలేశ్ సోలంకి ఓ స్వచ్ఛంద కార్యకర్త. శాంబాలీ ట్రస్టు‌లో ఆయన పనిచేస్తుంటారు. జోధ్‌పుర్‌లో ఉన్న మహిళలకు ఈ సంస్థ సాయం చేస్తోంది. కరోనావైరస్ వల్ల మహిళలు ప్రమాదంలో పడ్డారని విమలేశ్ అంటున్నారు. “పూర్తి లాక్‌డౌన్ అంటే రోజువారీ జీవితం అంతా దెబ్బతిన్నట్లే. దుకాణాలు ఉండవు. కూరగాయలు అమ్మేవాళ్లు రారు. కావాల్సిన వస్తువుల కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది” అని ఆయన అన్నారు. “ఒత్తిడి పెరిగిందంటే, అప్పటికే హింసించే భాగస్వాములు చిన్నవాటికే రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు” అని చెప్పారు. పోలీసులను సంప్రదించేందుకు బాధితులు ఏమాత్రం సంకోచించవద్దని అధికారులు చెబుతున్నారు కాయ్, న్యూయార్క్ (అమెరికా) కాయ్ తన ఫోన్ తీసుకుని, మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టారు. "అమ్మ, నేను నీతో ఉండాలని కోరుకుంటోంది" అని టైప్ చేసి, సెండ్ బటన్ నొక్కారు. వెంటనే... "సరే, ఏ సమస్యా లేదు" అని రిప్లై వచ్చింది. పోయిన వారం, తాను పాదం మోపబోనని శపథం చేసిన ఇంట్లోనే కాయ్ మళ్లీ అడుగుపెట్టారు. ‘‘ఆ ఇంటికి వెళ్లిన క్షణమే నా మెదడు మొద్దుబారిపోయింది" అని చెప్పారు. కాయ్ వెళ్లింది తన తండ్రి ఇంటికి. ఆయన తనను శారీరకంగా, లైంగికంగా కొన్నేళ్లు వేధించారని ఆమె చెబుతున్నారు. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన కొన్ని రోజుల తర్వాత కాయ్ తల్లి పనిచేస్తున్న షాపు మూతపడింది. కాయ తల్లికి ఆ షాపులో గంటకు రూ.1100 వేతనం ఇచ్చేవారు. అది ఆగిపోయింది. కాయ్ తల్లికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. ఈ పరిణామం ఆమెపై మరింత ప్రభావం చూపింది. “ఆమె నా మీద అరిచింది. 'ఇక్కడంతా పిచ్చిపట్టినట్లుగా ఉంది. మీ నాన్న దగ్గరికే వెళ్లిపో' అని అంది" అని కాయ్ చెప్పారు. తల్లి మాటలతో కాయ్ వణికిపోయి, తన గదిలోకి వెళ్లపోయారు. కాసేపటి తర్వాత తిరిగి బయటకు వచ్చారు. “ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావ్?” అంటూ కాయ్‌ను ఆమె తల్లి ప్రశ్నించారు. తండ్రి వద్ద అనుభవించిన శారీరక, లైంగిక హింసకు కొన్ని నెలల క్రితం నుంచే కాయ్ థెరపీ తీసుకుంటున్నారు. పసిపాపగా ఉన్నప్పటి నుంచీ తండ్రి చేతిలో తాను హింసకు గురవుతున్నానని కాయ్ అన్నారు. తన తల్లికి, సోదరికి ఆమె తనకు జరిగిందంతా పూర్తిగా చెప్పలేదు. థెరపీ మొదలుపెట్టిన కొన్ని రోజులకే తనకు సాంత్వనగా అనిపించడం మొదలైందని, భవిష్యతుపై ఆశలు చిగురించాయని చెప్పారు కాయ్. కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక ఆమె థెరపీ తీసుకునే శిబిరం కూడా మూతపడింది. గత వారం, మళ్లీ ఆమె తన తండ్రి ఇంట్లో అడుగుపెట్టారు. “ఆయన ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు. పగలంతా టీవీ, కంప్యూటర్ చూస్తుంటారు. రాత్రి పూట అశ్లీల వీడియోలు చూస్తుంటారు. ఆ సౌండ్ నాకు వినిపిస్తుంది" అని కాయ్ చెప్పారు. పొద్దున ఆయన బ్రేక్ ఫాస్ట్ తయారుచేసుకునేటప్పుడు చేసే చప్పుడుతో కాయ్‌కు మెళుకువ వస్తుంది. “ఆయన బ్లెండర్ వాడుతున్నప్పుడు చాలా గట్టిగా శబ్దం వస్తుంది. అదంటే నాకు కంపరం. నా రోజూ మొదలయ్యేది అలానే. రోజంతా నేను జాగ్రత్తగా ఉంటా" అని ఆమె అన్నారు. కాయ్ తన గదికి పరిమితమై ఉంటారు. బాత్రూమ్‌ కోసం, ఆకలైనప్పుడు కిచెన్‌కు వెళ్లేందుకు మాత్రమే బయటకువస్తారు. “ఆయన ఏదో వేరే కాలంలో ఉన్నట్లు నాతో మాట్లాడుతుంటారు. నన్ను హింసించనిదాని గురించి ప్రస్తావనే తేరు. ఏమీ చేయనట్లే ప్రవర్తిస్తారు. నన్ను ఇది మరింత క్షోభ పెడుతుంది" అని చెప్పారు కాయ్. కాయ్ ఎప్పుడూ ఇంటర్నెట్‌తోనే గడుపుతారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే కాలక్షేపం చేస్తారు. తిరిగి తన తల్లి ఇంటికి రానిస్తుందని కాయ్ ఆశపడుతున్నారు. లేకపోతే, కరోనావైరస్ సంక్షోభం ముగిశాక తనకు తానుగా ఎక్కడైనా ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు గృహహింస కేసుల పెరుగుదల విషయంలో స్పందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ గృహ హింస కమిషనర్ నికోల్ జేకబ్స్ అంటున్నారు. బాధితులు పోలీసులను సంప్రదించేందుకు ఏమాత్రం సంకోచించవద్దని ఆమె చెబుతున్నారు. “ఫోన్ చేస్తే చాలు. మాట్లాడలేని ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఫోన్ చేసి ఒక దగ్గు సౌండ్ వినిపించండి. మౌనంగానైనా ఉండండి. పోలీసులు స్పందిస్తారు" అని చెప్పారు. కొందరు అక్రమ వలసదారులు తమను దేశం నుంచి పంపించివేస్తారేమోనన్న భయంతో పోలీసులను సంప్రదించరని, కానీ అలాంటి భయాలేవీ అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఐరాస మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుంజిలే మిలాంబో కూడా ఇదే మాట చెప్పారు. ‘‘చాలా దేశాల్లో అల్పాదాయ నేపథ్యం ఉన్న వాళ్లు ఒకట్రెండు గదులు ఉన్న ఇళ్లలో వాళ్లను హింసిస్తున్న వాళ్లతో కలిసి ఉంటుంటారు. ఫిర్యాదు చేసే అవకాశం వాళ్లకు దొరకదు. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి చెందిన తర్వాత గృహ హింస పెరిగినట్లు మేం గుర్తించాం" అని అన్నారు. గమనిక: బాధిత మహిళల పేర్లు మార్చాం చిత్రాలు: జేమ్స్ మాబ్స్ కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. జనాలు ఇళ్లను దాటి, బయట అడుగుపెట్టే వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇదే కొందరికి శాపంగా మారుతోంది. గృహ హింస బాధితులు బయటికి రాలేక, అనేక యాతనలు అనుభవిస్తున్నారు. text: మోసుల్‌లో హతులైన భారతీయుల కుటుంబ సభ్యులు వారిక లేరన్న నిజం స్పష్టమయ్యాక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఆ 39 మంది కుటుంబాలదీ ఒకే నేపథ్యం - అదే పేదరికం! ప్రమాదమని తెలిసినా.. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. ప్రమాదమని తెలిసినా వారు ఇరాక్ ఎందుకు వెళ్లారు? "ఇరాక్‌లో పని చేయడం ప్రమాదమని తెలుసు. అక్కడ మన ప్రాణాలు గాలిలో దీపాలని కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం. మా పేదరికం అలాంటిది. ఇక్కడ ఉన్నా ఆకలి చేతిలో చావాల్సిందే కదా." తన్నుకొస్తున్న దుఃఖాన్ని, ఉబికి వస్తున్న కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకొంటూ 47 ఏళ్ల మన్‌జీత్ కౌర్ అన్న మాటలివి. ఇరాక్‌లోని మోసుల్‌లో అసువులు బాసిన వారిలో ఆమె భర్త దవీందర్ సింగ్ (52) ఒకరు. ఆమె మాట వినుంటే.. "ఆయనను చివరిసారి చూసిన రోజు ఇంకా గుర్తే. ఇరాక్ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ యుద్ధం జరుగుతోందని, ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని ఆయన సోదరి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ తనకు ఏమీ కాదని, ధైర్యంగా ఉండాలని ఆయన సర్ది చెప్పారు." బహుశా ఆ రోజు భర్త తన సోదరి మాట వినుంటే, ఇప్పుడు ఈ గుండె కోత ఉండేది కాదనే భావం బొంగురు బోయిన ఆ గొంతులో ధ్వనించింది. 'మాకేమీ తెలియనివ్వలేదు' "ఆయన తరచూ ఫోన్ చేస్తూ ఉండేవారు. మాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించేవారు. ఎక్కడో దూర ప్రాంతాల్లో యుద్ధం జరుగుతోందని, తాను ఉన్నచోట అంతా బాగానే ఉందని చెప్పేవారు. 2014 జూన్‌లో చివరిసారిగా మాట్లాడారు. అప్పటికే ఆయనను జిహాదీలు అపహరించుకు పోయారు. కానీ మేం కంగారుపడతామని ఆ విషయం మాకు తెలియనివ్వలేదు. ఇప్పుడు మా కన్నీళ్లను తుడవటానికి ఆయన లేరు." బీబీసీకి ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో ఉబికి వచ్చింది. కల నెరవేరకుండానే దవీందర్ సింగ్ స్వస్థలం రుర్కా కలాన్ అనే గ్రామం. కూలి పనికి పోతే రోజుకు రూ.200-250 సంపాదిస్తారు. కానీ రోజూ పని దొరకడమే కష్టం. "మూడునాలుగేళ్లు ఇరాక్‌లో పని చేస్తే, సొంత ఇల్లు కట్టుకోవచ్చన్నది ఆయన కల. అక్కడికి వెళ్లడానికి లక్షా యాభై వేల రూపాయలు అప్పు చేసి, ఏజెంట్‌కు చెల్లించాం. ఆయన పని చేసే ప్రాంతంలో ప్రాణాలకు వచ్చే ముప్పేమీ లేదని, అక్కడ అమెరికా సైనికుల పహారా ఉంటుందని ఏజెంట్లు నమ్మబలికారు." అంటూ నాటి రోజులను మన్‌జీత్ గుర్తు చేసుకున్నారు. ఆ గదే ఇల్లు ఆమె ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. వీరి ఇంటికి కాస్త దూరంలోనే మన్‌జీత్, దవీందర్ సింగ్‌ల ఇల్లు ఉంది. ఒకే గది. అదీ శిథిలావస్థలో ఉంది. ఆ ఇంట్లోనే తన ముగ్గురు పిల్లలతో ఆమె నివసిస్తున్నారు. ఆ గ్రామంలోని ఓ పాఠశాలలో ఆమె కుట్టుపని నేర్పిస్తుంటారు. నెలకు రూ.2,500 వరకు వస్తాయి. మిగిలింది ఎదురు చూపులే! దవీందర్ సింగ్ 2011లో ఇరాక్ వెళ్లేనాటికి.. పెద్ద కుమారునికి ఆరేళ్లు. కవలలైన చిన్నారుల వయసు ఎనిమిది నెలలు. దవీందర్ అపహరణకు గురయ్యేంత వరకు నెలనెలా రూ.25,000 పంపేవారని ఆమె చెప్పారు. దాదాపు నాలుగేళ్లపాటు దవీందర్ గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. అయినా వారు అతను తిరిగొస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తూ గడిపారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఎప్పుడు కలిసినా, నమ్మకం కోల్పోవద్దని అంతా మంచే జరుగుతుందని చెప్పేవారని మన్‌జీత్ అన్నారు. మిలిటెంట్ల చెర నుంచి హర్జీత్ మసీహ్ తప్పించుకొన్నారు 'అప్పుడు కూడా చెప్పలేదు' కొద్ది నెలల కిందట వారి డీఎన్‌ఏ నమూనాలను ప్రభుత్వం సేకరించింది. అప్పుడు కూడా తమకు ఏమీ చెప్పలేదని మన్‌జీత్ చెప్పారు. దవీందర్‌కు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే డీఎన్‌ఏ నమూనాలను తీసుకున్నట్లు ఊళ్లో అందరూ అనుకునేవారని ఆమె తెలిపారు. 'కాళ్ల కింద భూమి కదిలినట్టయ్యింది' ఇస్లామిక్ స్టేట్ అపహరించిన భారతీయ కార్మికులందరూ మరణించారన్న వార్తను ఇరుగుపొరుగు మహిళల ద్వారా ఆమె విన్నారు. "నేను వెంటనే మా అమ్మవాళ్ల ఇంటికి పరిగెత్తాను. ఆయనిక లేరనే విషయాన్ని తెలుసుకొని హతాశురాలయ్యాను." ఆ మాటలు అతి కష్టం మీద ఆమె గొంతు గడపదాటి వచ్చాయి. ఇంతకూ వారి మరణానికి కారణం ఇక్కడ నెలకొన్న పేదరికమా లేక అక్కడి మిలిటెంట్లా? నాన్న ఎక్కడమ్మా? తన చిన్న కుమారుల్లో ఒకరిని చూపిస్తూ మన్‌జీత్ ఇలా అన్నారు - "నాన్న ఎక్కడున్నాడని వీడు అడుగుతుంటాడు. చాలా దూరంగా ఉన్న మరో దేశంలో నాన్న ఉన్నాడని, ఇంటికొచ్చేటపుడు నీకు సైకిల్ తెస్తాడని చెప్పేదానిని. ఇప్పుడు ఆయన తిరిగి రాలేని లోకాలకు తరలి పోయారు. ఇక మీ నాన్న ఎప్పటికీ రాలేడనే విషయాన్ని ఈ పసివాడికి ఎలా చెప్పాలి?" హతులైన భారతీయుల కుటుంబ సభ్యులు నిరుడు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు పేదరికమే అసలు శత్రువా? మరణించిన 39 మంది భారతీయ కార్మికుల్లో దాదాపు 31 మంది పంజాబీలే. సాధారణంగా పంజాబీలు అవకాశాలను వెతుక్కుంటూ విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఇరాక్ వంటి కల్లోల ప్రాంతాలకు సైతం వలస వెళ్లేలా వారిని పురిగొల్పుతున్నది ఆకలి, పేదరికాలే. తలుపులు కూడా లేని ఇంట్లో.. చనిపోయిన 39 మందిలో 32 ఏళ్ల సందీప్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన స్వస్థలం మల్సియాన్ దగ్గర్లోని చిన్న గ్రామం. అక్కడ రోజూ కూలీగా కుమార్ పని చేసేవారు. అతనికి నలుగురు అక్కాచెల్లెళ్లు. వారి బాగోగుల కోసం 2012లో అతను ఇరాక్ వెళ్లారు. ప్రతి నెలా సందీప్ పంపించే డబ్బు కోసం తాము ఎదురు చూసే వాళ్లమని అతని సోదరుడు కుల్దీప్ కుమార్ చెబుతున్నారు. వాళ్లు ఎంత దారిద్ర్యంలో ఉన్నారంటే వారి ఇంటికి కనీసం తలుపు కూడా లేదు. అది 'స్వర్గం' కాదు.. అయితే ప్రాణాలకు తెగించి ఇరాక్ వెళ్తే కష్టాలు తీరుతాయా? అది అంత సులభమేం కాదు. అక్కడ కూడా ఎన్నో బాధలను ఓర్చుకోవాలి. ఇరాక్‌లో పని దొరకడం అంత సులువు కాదని రాజ్ రజనీ చెప్పారు. అక్కడ మరణించిన వారిలో ఆమె భర్త ప్రీత్‌పాల్ శర్మ కూడా ఉన్నారు. 2011లో అతను ఇరాక్ వెళ్లారు. "ఇరాక్ వెళితే డబ్బులే డబ్బులని మాకు ఏజెంట్లు చెప్పారు. కానీ అక్కడ నా భర్త పని కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. చివరకు ఆయన కిడ్నాప్ అయ్యేంత వరకు బాధలు అతన్ని వెన్నాడాయి" అని జీరబోయిన గొంతుతో మాటలను కూడదీసుకుంటూ రజినీ చెప్పారు. మన్‌జీత్, రజినీ వంటి కుటుంబాలు ఎన్నో నేడు దిక్కులేనివిగా అయ్యాయి. ఇందుకు కారణం ఇక్కడి పేదరికమా? లేక అక్కడి యుద్ధమా? అన్నదే అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బతుకు దెరువు కోసం వలస బాట పట్టిన 39 మంది భారతీయులు ఇరాక్ మట్టిలో కలిసి పోవడం యావత్ దేశాన్ని కలచి వేసింది. text: పోస్ట్ of Twitter ముగిసింది, 1 హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒక ట్వీట్‌లో "శ్రీనగర్ సౌరా ప్రాంతంలో కొన్ని ఘటనలు జరిగాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆగస్టు 9న కొంతమంది స్థానికులు మసీదు నుంచి నమాజు చేసి వస్తున్నారు. వారిలో కొన్ని అల్లరిమూకలు కూడా ఉన్నాయి. అశాంతి సృష్టించడానికి వారు అకారణంగా భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. కానీ భద్రతాదళాలు సంయమనం పాటించాయి. శాంతిభద్రతలను కాపాడ్డానికి ప్రయత్నించాయి. మేం ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఇప్పటివరకూ కశ్మీర్‌లో ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించలేదు’’ అన్నారు. ఇంతకు ముందు బీబీసీ కూడా ఒక వీడియో ద్వారా శుక్రవారం శ్రీనగర్ సౌరా ప్రాంతంలో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయని చెప్పింది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేయడానికి భద్రతాదళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయని, పెల్లెట్ గన్ ఉపయోగించారని చెప్పింది. కానీ, అప్పుడు భారత ప్రభుత్వం అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం తన స్వరం మార్చింది. హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి అప్పుడు చేసిన ట్వీట్‌లో "మొదట రాయిటర్స్, తర్వాత డాన్ ఒక న్యూస్ రిపోర్ట్ ప్రచురించాయి. అందులో శ్రీనగర్‌లో వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయని, వాటిలో పది వేల మంది పాల్గొన్నారని రాశారు. ఇది పూర్తిగా కల్పితం, తప్పుడు సమాచారం. శ్రీనగర్/బారాముల్లాలో చిన్న చిన్న వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి, కానీ వీటిలో 20 కంటే ఎక్కువమంది లేరు" అన్నారు. కానీ, ఇప్పుడు చేసిన ట్వీట్ దానికి భిన్నంగా ఉంది. ఆ తరువాత తాము.. తమ కథనానికీ, పాత్రికేయ విలువలకు కట్టుబడి ఉన్నట్లు బీబీసీ ఒక ప్రకటనలో తెలిపింది. BBC EXCLUSIVE వీడియో: శ్రీనగర్‌లో నిరసనలు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో గత శుక్రవారం నమాజు తర్వాత రాళ్లు రువ్వుకున్న ఘటనలు జరిగాయని భారత ప్రభుత్వం అంగీకరించింది. text: విమానం అండర్ క్యారేజ్‌లో దాక్కుని వచ్చిన ఓ బాలుడి మృతదేహాన్ని పారిస్‌లోని చార్లెస్ డి గాలె విమానాశ్రయంలో గుర్తించినట్లు ఎయిర్ ఫ్రాన్స్ కూడా ధ్రువీకరించింది. ఐవరీకోస్ట్ నుంచి వచ్చిన ఈ విమానం చక్రాలు లోనికి ముడుచుకునే (ల్యాండింగ్ గేర్ వెల్) చోట దాక్కుని వచ్చేందుకు ప్రయత్నించి ఈ బాలుడు మరణించాడని ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఐవరీకోస్ట్‌లోని అబిద్‌జాన్ నుంచి మంగళవారం సాయత్రం ఈ ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం బయలుదేరింది. బుధవారం ఉదయం పారిస్‌లో స్థానిక కాలమానం ప్రకారం 6.40 గంటలకు మృతదేహాన్ని కనుగొన్నారని అధికారులు 'బీబీసీ'కి తెలిపారు. అబిద్‌జాన్ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యానికి ఇదో ఉదాహరణని ఐవరీకోస్ట్‌కు చెందిన భద్రతాధికారి ఒకరు బీబీసీతో అన్నారు. ఇలా దాక్కుని వెళ్లినవారెవరైనా బతికిన ఉదంతాలున్నాయా? ప్రయాణికులకు నిర్దేశించిన సీట్లలో కూర్చుని వెళ్లకుండా దొంగచాటున విమానం ఇతర భాగాల్లో దాక్కుని వెళ్లడమనేది ఇదే తొలిసారి కాదు. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం 1947 నుంచి 2012 మధ్య ప్రపంచవ్యాప్తంగా 85 విమానాల్లో 96 మంది ఇలా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వారిలో చాలామంది తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోలేదని విమానయాన నిపుణుడు ఇరీన్ కింగ్ 'బీబీసీ'తో చెప్పారు. అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (ఎఫ్‌ఏఏ) లెక్కల ప్రకారం 1947 నుంచి 2019 జులై 2 మధ్య ఇలాంటి ఉదంతాలను 40 దేశాల్లో గుర్తించారు. అత్యధికంగా క్యూబాలో 9, డొమినికన్ రిపబ్లిక్‌లో 8, చైనాలో 7, దక్షిణాఫ్రికాలో 6, నైజీరియాలో 6 కేసులు నమోదయ్యాయి. ప్రాంతాల వారీగా చూస్తే, ఆఫ్రికాకు చెందిన 34 మంది, కరీబియన్ ప్రాంతానికి చెందిన వారు 19 మంది, యూరప్‌లో 15 మంది, ఆసియాలో 12 మంది ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలకు ప్రయత్నించారు. 2012 సెప్టెంబర్‌లో మొజాంబిక్‌కు చెందిన జోస్ మటడా అనే వ్యక్తి లండన్ వీధుల్లో శవమై కనిపించారు. అంగోలా నుంచి హీత్రూ విమానాశ్రయానికి వస్తున్న విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుంచి ఆయన జారిపడ్డారు అయినా బతికిబట్టకట్టారు * 2010లో 20 ఏళ్ల రొమేనియావాసి ఒకరు వియన్నా నుంచి హీత్రూకు ఒక ప్రైవేటు విమానంలో అలాగే ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డారు. * 1969 - క్యూబాలోని హవానా నుంచి మాడ్రిడ్‌కు ప్రయాణించిన 22 ఏళ్ల అర్మాండో సోకర్రాస్ రామిరెజ్ కొద్దిపాటి అనారోగ్యంతో బయటపడ్డారు. * 1996 - భారత్‌కు చెందిన అన్నదమ్ములు పర్దీప్ సైనీ, విజయ్‌లు దిల్లీ నుంచి 10 గంటలపాటు రహస్యంగా ప్రయాణించి లండన్‌కు వెళ్లారు. 23 ఏళ్ల పర్దీప్ ప్రాణాలతో బయటపడ్డారు, హీత్రూ విమానాశ్రయం సమీపిస్తుండగా విమానం నుంచి జారిపడి విజయ్ మరణించారు. * 2000 - ఫ్రాన్స్‌లోని తాహితి నుంచి అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌ వరకు బోయింగ్ 747 విమానంలో 6,437 కిలోమీటర్లు ప్రయాణించి క్షేమంగా చేరుకున్నారు ఫిడెల్ మారుహి. * 2002 - క్యూబా నుంచి కెనడాకు నాలుగు గంటల ప్రయాణం చేసిన 22 ఏళ్ల విక్టర్ అల్వారెజ్ మోలినా ప్రాణాలతో బయటపడ్డారు. * 2014 - అమెరికాలోని హవాయ్ రాష్ట్రంలోని మావోయీ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌ వరకు బోయింగ్ 767 విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో 15 ఏళ్ల అబ్బాయి యాహ్యా అబ్ది ప్రయాణించారు. జోష్ మటాడా ప్రాణాలు పోగొట్టుకున్నారు * 2015 జూన్‌లో పశ్చిమ లండన్‌లోని ఒక కార్యాలయం భవనం మీద ఒక వ్యక్తి శవం కనిపించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి లండన్ వస్తూ 427 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం నుంచి పడి అతడు చనిపోయినట్లు తర్వాత తెలిసింది. అదే విమానంలో అతనితోపాటు ప్రయాణించిన మరో వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. * 2012 సెప్టెంబర్‌లో మొజాంబిక్‌కు చెందిన జోస్ మటడా అనే వ్యక్తి లండన్ వీధుల్లో శవమై కనిపించారు. అంగోలా నుంచి హీత్రూ విమానాశ్రయానికి వస్తున్న విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుంచి ఆయన జారిపడ్డారు. * అదే ఏడాది దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరం నుంచి బయలుదేరిన విమానం హీత్రూ చేరుకున్న తర్వాత ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో వ్యక్తి మృతదేహం బయటపడింది. విమానంలో దాక్కుని వచ్చిన వ్యక్తి కట్టుదిట్టమైన భద్రత ఉన్నా విమానంలో దాక్కోవడం ఎలా సాధ్యం ప్రతి విమానం టేకాఫ్ అయ్యే ముందు విమానాశ్రయం గ్రౌండ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తారు. మరి, ఇలా గుట్టుగా ప్రయాణాలు చేసేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారు? తనిఖీలు పూర్తయ్యాక చివరి నిమిషంలో ఇలాంటివారు విమానంలోకి చొరబడతారని.. విమానాశ్రయాల్లో పనిచేసే నైపుణ్యం లేని సిబ్బంది కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయంలో బాగా తెలిసిన సిబ్బంది ద్వారా వెళ్లేవారు మరికొందరు ఉంటారు. అలా ప్రయాణించడం ప్రమాదకరమని, గాలిలోనే చనిపోతామని వారికి అవగాహన ఉండదన్నది నిపుణుల మాట. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అబిద్‌జాన్ నుంచి పారిస్ వచ్చిన ఓ విమానం అండర్‌క్యారేజ్‌లో పదేళ్ల బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. text: మధ్యప్రదేశ్‌లో ఆరుగురు వ్యక్తులు చనిపోయారని ఐజీ (శాంతిభద్రతలు) యోగేశ్ చౌధరి బీబీసీకి తెలిపారు. రాజస్థాన్‌‌లో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో మరొకరు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ముగ్గురు, భిండ్‌లో ఇద్దరు, మురైనాలో ఒకరు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, హరియాణా రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. దళిత సంఘాలు అనేక చోట్ల ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించగా, కొన్ని చోట్ల పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జి చేశారు. ‘‘హింసలో గ్వాలియర్‌లోని తాటీపూర్ ప్రాంతంలో ఇద్దరు చనిపోయారు. భిండ్, మొరేనా జిల్లాల్లో ఇద్దరు పోలీసుల కాల్పుల్లో మరణించారు’’ అని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. గ్వాలియర్‌లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. భిండ్‌లో భజరంగ్‌దళ్, భీమ్‌సేనల మధ్య ఘర్షణ తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్, హాపూర్, అజంగఢ్‌లలో కూడా హింస చోటుచేసుకుంది. పలు దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. బంద్ పిలుపు నేపథ్యమేమిటి? ‘నిజాయితీ’గా అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించే విషయంలో తప్పుడు కేసులతో బ్లాక్‌మెయిల్ చేయకుండా రక్షణ కల్పించటం కోసమంటూ ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్‌లోని కొన్ని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని తక్షణం అరెస్ట్ చేయటానికి బదులుగా ప్రాధమిక విచారణ జరపాలని నిబంధనను సవరించింది. ఇలా చేయటం చట్టాన్ని నిర్వీర్యం చేయటమేనని.. దీనివల్ల దళితుల పట్ల వివక్ష, వారిపై నేరాలు మరింతగా పెరుగుతాయని దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. దీనిపై సోమవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ సందర్భంగా ఎంపీ, యూపీ సహా పలు రాష్ట్రాల్లో దళిత సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దళిత సంఘాల ఆగ్రహానికి కారణమైన సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యాంశాలివే... సుప్రీంకోర్టులో కేంద్రం రివ్యూ పిటిషన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సమగ్ర రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దళితులు, గిరిజనుల సంక్షేమానికి నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ట్విటర్‌లో వెల్లడించారు. 'భారత్ బంద్'పై ఎవరేమన్నారు? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు సోమవారం చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది. text: 1968లో గుజరాత్‌లో ఈ సింహాల సంఖ్య 177. అయితే వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు, ప్రభుత్వం, పరిసర గ్రామస్థుల ప్రయత్నాల కారణంగా ఈ సింహల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లో 523 సింహలున్నాయి. కానీ గిర్ అడవుల విస్తీర్ణం వాటికి సరిపోవడం లేదు. దీంతో సుమారుగా 200కు పైగా సింహాలు అడవి బయటే బహిరంగ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. తరచూ నివాస ప్రాంతాలకు వస్తున్నాయి. దాంతో దాదాపు 1200 గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు.. పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి, బావుల్లో పడి, రైలు, రోడ్డు ప్రమాదాల భారిన పడి ఎన్నో సింహాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. వీడియో: ఇక్కడ నాలుగు రోజులకో సింహం చనిపోతోంది జికార్ భాయ్ ఓ రైతు. ఈయన దగ్గర 8 గేదెలున్నాయి. 2017 నవంబర్‌లో దూడపై కొన్ని సింహాలు దాడి చేశాయి. అదృష్టవశాత్తూ ఆ దూడ బతికినప్పటికీ ఇంకా దాని మెడకు అయిన గాయం మాత్రం మానలేదు. "ఇంతకుమందు మాకు చాలా గేదెలుండేవి. కానీ ఈ సింహాల దాడులకు భయపడి పశువుల సంఖ్యను తగ్గించుకున్నాను. ఒక సింహం రెండు గేదెలను ఎత్తుకుపోయింది. నిన్న కాక మొన్నే సింహాలు ఇక్కడ పశువులపై దాడి చేశాయి" అని జికార్ భాయ్ చెప్పారు. జికార్ భాయ్ లాగే వారి గ్రామంలో మిగతా రైతులు కూడా ఈ సింహాల బెడదకు అలవాటుపడిపోయారు. అయితే ఈ గ్రామాల్లో బ్లూ బుల్ లాంటి జంతువుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో తరచుగా వాటిలో సింహలు చిక్కుకుని ప్రమాదాల పాలవుతున్నాయి. 2016, 2017 మధ్య 184 సింహాలు చనిపోవడంతో గుజరాత్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సింహాల మరణాలకు సంబంధించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016 ,2017లో సగటున నాలుగు రోజులకో సింహం మరణించింది. గిర్ అడవులలో ఉన్న సింహాలు గుజరాత్‌కి గర్వకారణం. అయితే వాటికి సరిపడా ఆవాసం కల్పించినప్పుడు మాత్రమే.. గుజరాత్ తన సింహ సంపదను చూసి గర్వపడాలి. పులులకూ తప్పని వేసవి తాపం తెలుగు రాష్ర్టాల్లో పులుల పోట్లాట అడవుల్లో పెద్దపులులు చాలా భీకరంగా పోట్లాడుకుంటాయి. కొన్నిసార్లు ఏదో ఒకటి చనిపోయేదాకా ఆ పోరు సాగుతుంది. మరి వాటి కొట్లాటకు దారితీసే పరిస్థితులు ఏంటి? ఇటీవల నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పెచ్చెర్వు సెక్షన్ నరమామిడి చెరువు సమీపంలో ఓ పెద్దపులి కళేబరాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ పులి దేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, తనకంటే పెద్దదైన మరో పులి చేసిన దాడిలో అది మృతి చెందిందని నిర్ధారించారు. వేటగాళ్ల దాడిలోగాని మరే ఇతర కారణాలవల్లగాని చనిపోయిన ఆనవాళ్లు లేవని తెలిపారు. "చంపటం లేదంటే చావటం" అటవీ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పులుల మధ్య రెండు విషయాల్లో పోట్లాట జరుగుతుంది. ఒకటి ఆవాసం కోసం, రెండోది సంపర్కం(సెక్స్) కోసం. సహజంగా పులులు పుట్టిన తరువాత రెండు నుంచి మూడు సంవత్సరాల వరకే తల్లితో కలిసి ఉంటాయి. ఆ సమయంలో అడవిలో ఎలా జీవించాలి..? ఎలా వేటాడాలి..? తమనుతాము ఎలా రక్షించుకోవాలి? అనేది నేర్చుకుంటాయి. తరువాత అవి తల్లిని వదిలి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఒక్కోసారి అప్పటికే మరోపులి ఏర్పాటు చేసుకున్న ఆవాసంలోకి వెళ్లి ఆక్రమించే ప్రయత్నం చేస్తాయి. ఆసమయంలో రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. "ఆవాసం కోసం పోరాటం" అడవిలో ఒక్కోపులి తన ఆవాస ప్రాంతాన్ని దాదాపు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించుకుంటుంది. కొన్ని ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని తమ పరిధిగా ఏర్పాటు చేసుకుంటాయి. తన ఆవాస పరిధిలోకి మరో పులి రాకుండా జాగ్రత్త పడుతుంది. వస్తే అడ్డుకుంటుంది. పోరాడుతుంది. తనకంటే చిన్నది, బలహీనమైనది వస్తే కొన్నిసార్లు చంపుతుంది. అదే తనకంటే బలమైన దానితో ఘర్షణ జరిగితే చనిపోతుంది. లేదంటే పారిపోయి మరోచోట ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. నల్లమలలో ఇటీవల కొట్లాటలో చనిపోయిన పులి ఇదే. దీన్ని ఈ చారల ఆధారంగా గుర్తించారు. "సంపర్కం కోసం పోట్లాట" సంపర్కం సమయం(మేటింగ్ పీరియడ్)లో కూడా పులుల మధ్య భీకర పోరు జరుగుతుంది. సంపర్కం కోసం ఒక మగపులి ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఆడపులులతో జతకడుతుంది. ఆడపులి తన శరీరం పునరుత్పత్తికి అనుకూలంగా మారినపుడు కొన్ని ప్రత్యేకమైన చేష్టలు, శబ్దాల ద్వారా తాను సెక్స్‌కు సిద్ధంగా ఉన్నట్లు మగపులికి సంకేతాలిస్తుంది. అప్పుడు మగపులి దానితో జతకడుతుంది. పది నుంచి పదిహేను రోజులపాటు ఆ ఆడపులి ఆవాసంలోనే ఉండి సెక్స్‌లో పాల్గొంటుంది. ఆ తరువాత సంపర్కానికి సిద్ధంగా ఉన్న తన గుంపులోని మరో ఆడపులి ఆవాసానికి వెలుతుంది. బేస్ క్యాంపును పరిశీలిస్తున్నడీఎఫ్‌వో వెంకటేశ్ ఈ విధంగా ఒక మగపులి తన గుంపులోని ఆడపులులతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంటుంది. వీటితో కలిసేందుకు ఇతర మగ పులులు ప్రయత్నిస్తే వాటిని అడ్డుకుంటుంది, పోరాడుతుంది. ఆ పోట్లాటలో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతాయి. ఆడపులులు కూడా తమ గుంపులోని మగపులితోనే సంపర్కంలో పాల్గొంటాయి. ఏదైనా ఇతర మగపులి తమ ఆవాసంలోకి వచ్చి సంపర్కం కోసం ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సహకరించాల్సి వస్తే దానివల్ల పిల్లలు పుట్టకుండా ఉండేలాగా జాగ్రత్తపడతాయి. "మలం, మూత్రంతో ఆవాసానికి హద్దులు" పులులు తమ ఆవాసానికి హద్దులు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తాయి. హద్దులో ఉన్న చెట్లపొదలపైన మూత్రాన్ని చిమ్ముతాయి. నేలపై అక్కడక్కడా మలవిసర్జన చేస్తాయి. వాటి వాసన బట్టి అది సరిహద్దు అని ఇతర పులులు తేలికగా గుర్తించగలుగుతాయి. అలాగే చెట్ల బెరడుపై గోర్లతో గీకి గుర్తులు పెట్టుకుంటాయి. పాదముద్రలు పడేలా తన ఆవాసం చుట్టూ తిరిగి సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా ఒకపులి ఏర్పాటు చేసుకున్న హద్దు దాటి మరోపులి వెళ్లదు. ఒకవేళ ఆక్రమించుకునేందుకు లోనికి వస్తే అప్పుడు ఆ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది. కొన్నిచోట్ల పులుల సంఖ్యకు తగ్గట్టుగా అడవుల విస్తీర్ణం లేకపోవడం కూడా ఇలాంటి ఘర్షణలకు ఓ కారణమన్న అభిప్రాయం ఉంది. కొట్లాటలు సహజమే... పెద్దపులుల మధ్య పోట్లాటలు సహజమేనని కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎఫ్ఓ వెంకటేష్ సంబంగి తెలిపారు. "ఈ పోట్లాటలో ఏదైనా పులి చనిపోతే దానికి ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పంచనామా, శవపరీక్ష నిర్వహించి ఆ తరువాత ఖననం చేస్తాం. దానిపై ఓ నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తాం" అని ఆయన చెప్పారు. "పులుల రక్షణ కోసం అవి నివసించే కోర్ ఏరియా, సంచరించే అవకాశమున్న బఫర్ ఏరియాలలో తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. చెట్లను పెంచటం, వేటగాళ్ళను అడవిలోకి వెళ్లకుండా చూడటం ఇతర వన్యప్రాణుల సాంద్రతను పెంచటం ద్వారా పులులకు ఆహారాన్ని కల్పిస్తాం" అని వెంకటేష్ వివరించారు. నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో రాత్రింబవళ్ళు అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండటం వల్ల వేటగాళ్ల నుంచి పులులకు రక్షణ దొరుకుతోందని తెలిపారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కానీ.. వాటికి అడవుల విస్తీర్ణం సరిపోవడంలేదు. దీంతో అవి తరచూ బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. text: రొమ్ము కేన్సర్ పై అవగాహన కార్యక్రమం ఎందుకంటే ఆమె కేన్సర్‌ను జయించారు. ఇతరులకూ కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్ అవగాహన కోసం ఆమె విశాఖపట్నంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీబీసీ తెలుగు ప్రతినిధి ఆమెతో మాట్లాడారు. సినిమానా.. సేవా.. ఏ రంగం లో మీకు ఎక్కువ సంతృప్తి? నాకు ఇష్టం లేని ఏ పనీ నేను చేయను. ఒక అడుగు ముందుకు వేయాలి, ఒక అడుగు పైకి ఎక్కాలి ఇదే నా ఫిలాసఫీ. రెండు రంగాలు ఇష్టమే. వృత్తి మీద ప్రేమ లేకపోతే ఇక్కడ పని చేయలేం. ఇష్టం, ప్రేమ, అంకిత భావం ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలం. అక్టోబర్‌ను రొమ్ము కేన్సర్ మాసంగా పరిగణిస్తున్నారు. రొమ్ము కేన్సర్ పై ఎటువంటి అవగాహన రావాలి? లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా మేము విద్య, ఆరోగ్యం వైపు దృష్టి సారిస్తున్నాం. ఎంత చదువు తెలివితేటలున్నా ఆరోగ్యంగా లేకపోతే ఏమి చేయలేము. అందువల్ల ఏ సంస్ధ చేరని మారు మూల ప్రాంతాలకు కూడా వెళ్లి అవగాహనా శిబిరాలు నిర్వహించాలని అనుకుంటున్నాం. కేన్సర్ నిర్మూలనకు, మంచి వైద్యం అందించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం. అందరికి అందుబాటులో ఉండే విధానం లో ఒక నమూనాకు ప్రణాళిక చేస్తున్నాం. రెండు నెలల్లో అమలు లోకి తెస్తాం. అక్టోబరులో అసలేం చేస్తారు? విశాఖతో మీ అనుబంధం? నా చిన్న నాటి జ్ఞాపకాలన్నీ విశాఖపట్నంతో ముడిపడి ఉన్నాయి. అందుకని ఈ ఊరుతో నాకు ఎపుడూ అనుబంధం ఉంది. మీరు రాజకీయాలలోకి అడుగు పెట్టే ఉద్దేశం ఉందా? అవసరమైనపుడు మాట్లాడాలి. నా చుట్టూ పక్కల జరుగుతున్న విషయాలకి స్పందించకుండా ఉండలేను. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా గళం విప్పి మాటలాడతాను. హాలీవుడ్ ప్రొడ్యూసర్ వైన్ స్టీన్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ నేపధ్యం లో #మీ టూ అని నినదిస్తూ ఎంతో మంది మహిళలు గళం విప్పారు. తెలుగు సినిమా రంగం లో కూడా ఇటువంటి వేధింపులు ఉంటాయా? ఎక్కడ అధికార అసమానతలు ఉంటాయో అక్కడ వేధింపులకు అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇది మానవతకు మరో కోణం. ఏమి జరిగిందో అని ఆలోచించకుండా ఇటువంటి వేధింపుల నుంచి బయటపడటానికి ఏమి చేయాలి అని ఆలోచించాలి. ఇలా దెబ్బ తిన్న వాళ్ళు మానసికంగా , శారీరకం గా, సాంఘికం గా నలిగిపోతున్నారు. వీళ్ళకి సహాయం చేయగలగాలి. ఇటువంటి బాధితులకు మీరిచ్చే సలహా? ఇది అందరి సమస్య. ఏ ఒక్కరిదో కాదు. ఇటువంటి సంఘటనలలో కౌన్సెలింగ్ చాలా అవసరం. నా సంస్థ ద్వారా తప్పకుండా చేతనైనంత సహాయం చేస్తాను. న్యాయ పరం గా ఎటువంటి రక్షణ ఉందో బాధితులకు తెలియాలి. ఈ సమస్య వినోద రంగానికి మాత్రమే పరిమితం కాదు. కార్పొరేట్ రంగం లోనూ ఉంది. కాకపొతే ఈ విషయాలు అక్కడ కూడా భయపడి ఎవరూ మాటలాడరు. సినిమా రంగం దశాబ్దాల పురాతన పరిశ్రమ. ఈ సమస్య మూలాల నుంచి పరిష్కరించుకుంటూ రావాలి. జీవితమే ఒక పోరాటం. నేను కేన్సర్ కి ఎదురు తిరిగాను. జయించాను. ఊపిరి ఉన్నంత వరకు పోరాడాల్సిందే. పోరాటానికి లింగ బేధం లేదు. సమాజం లో ఆధునిక మహిళ ఎదుర్కొనే సమస్యలకు ఎటువంటి పరిష్కారం సూచిస్తారు? లింగ బేధం అనేది కేవలం ఒక భావన. ప్రతి మహిళ తనను తానూ అర్ధం చేసుకోవాలి. తనని తాను ఆమోదించగలగాలి. మహిళ ఆత్మ స్థైర్యం తో ఉంటే ఏ శక్తీ ఏమీ చేయలేదు. ఇవి వినడానికి బాగుంటాయి, కానీ అమలు చేయడానికి కష్టం. అందుకే మనం ఏమిటో మనం తెలుసుకున్న రోజున సమస్యలు తగ్గుతాయి. ఆధునిక మహిళ పై చాలా ఒత్తిడి ఉంది. వేసుకున్న బట్టల నుంచి, మాటలాడే మాట వరకు సమాజం నిర్ధారిస్తుంది. తనది కాని వ్యక్తిత్వం లో తనను బంధించాలనే పోరాటంలో నేటి మహిళ నలిగిపోతోంది. తన పాదాన్ని సిండ్రెల్లా షూ లో పెట్టాలని చూడటం ఆపిన రోజున ఆధునిక సమస్యలు చాలా వరకు నివారించవచ్చు. ఆ చట్రం నుంచి బయటపడి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకున్న రోజున చాలా వరకు మహిళలు సమస్యలు అధిగమించవచ్చు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గౌతమి.. చాలా మందికి నటిగానే తెలుసు. కాని ఆమె నటి మాత్రమే కాదు. చాలా మందికి స్పూర్తి కూడా. text: ఆర్‌సీఈపీ సభ్యత్వం విషయంలో తమకు కొన్ని ఆందోళనలు ఉన్నాయని, పూర్తి స్పష్టత లేకపోవడంతో దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆత్మ ప్రబోధానుసారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అయితే, కాంగ్రెస్ మాత్రం దీన్ని తమ విజయంగా చెప్పుకుంటోంది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సీఈపీ సదస్సుకు మోదీ హాజరయ్యారు. దీంతో భారత్ ఈ ఒప్పందంలో భాగమవుతున్నట్లు ప్రచారం జరిగింది. భారత్‌లోని రైతు, వ్యాపార సంఘాలు దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేశాయి. కానీ, ఆర్‌సీఈపీ సదస్సు ముగిసిన తర్వాత.. ప్రతికూల పరిస్థితుల కారణంగా, జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంలో భాగం కాకూడదని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ ప్రకటించారు. కొన్ని అపరిష్కృత సమస్యలు, ఆందోళనలు ఉండటంతో ఆర్‌సీఈపీలో భారత్ భాగస్వామి కాలేదని ఆమె వివరించారు. సదస్సులో ప్రధాని మోదీ ప్రకటనను కూడా విజయ్ చదివి వినిపించారు. ఆత్మ ప్రబోధానుసారం, 'గాంధీ తాయత్తు' సూత్రం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ఇందులో చెప్పారు. ''భారతీయులపై, ముఖ్యంగా బలహీన వర్గాలు, వారి జీవనోపాధిపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ చెప్పారు. 'అత్యంత పేద, బలహీన వ్యక్తికి మీ చర్యతో లాభం జరుగుతుందా, లేదా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి' అని గాంధీ చెప్పిన తాయత్తు సూత్రాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు'' అని విజయ్ వివరించారు. ''ఆర్‌సీఈపీ చర్చల్లో భారత్ తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్టిగా సంప్రదింపులు జరిపింది. ఒప్పందంలో భాగం కాకపోవడమే మంచి నిర్ణయమన్న అభిప్రాయానికి వచ్చింది. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజలకు సంబంధించిన బంధాల బలోపేతాన్ని మాత్రం కొనసాగిస్తుంది'' అని అన్నారు. ఒప్పందం ఏంటి? 2011-12లోనే ఆర్‌సీఈపీ గురించి అవగాహన కుదిరింది. ఆసియాన్ సభ్యదేశాలు (బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) భాగస్వాములు (భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్)ల మధ్య ఒప్పందం ఇది. ఒకవేళ అమల్లోకి వస్తే ఆయా దేశాలు కస్టమ్స్ సుంకాలు లేకుండా ఒకరితో ఒకరు వాణిజ్యం చేసుకోవచ్చు. ప్రపంచ జీడీపీలో 34 శాతం ఈ 16 ఆర్‌సీఈపీ దేశాల నియంత్రణలోనే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ దేశాల వాటా 40 శాతం. ఆర్‌సీఈపీ ఒప్పందం గురించి భారత్‌లోని రైతు, వ్యాపార సంఘాలు చాలా కాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. దీనిపై భారత్ సంతకం చేస్తే, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులు, చిన్న తరహా వ్యాపారులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారని అభ్యంతరం చెప్పాయి. ఆర్‌సీఈపీలో భాగం కాకూడదని తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమైందని, ప్రజల అభిప్రాయాన్ని ప్రధాని మోదీ గౌరవించారని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. ''ఈ నిర్ణయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తప్పకుండా మెచ్చుకోవాలి. ఆర్‌సీఈపీలో చేరితే రైతులు, చిన్న వ్యాపారులు సంక్షోభంలో చిక్కుకునేవారు. అయినా, ప్రభుత్వం ముందుకువెళ్లింది. సంతకం చేస్తారనే అనుకున్నాం. కానీ, ప్రధాని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, ఒప్పందంపై సంతకం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇది దేశ ప్రయోజనాలను కాపాడే నిర్ణయం'' అని అభిప్రాయపడ్డారు. ఎందుకు వ్యతిరేకత? దేశంలోని రైతు సంఘాలన్నీ ముక్త కంఠంతో ఆర్‌సీఈపీని వ్యతిరేకించాయని యోగేంద్ర యాదవ్ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘాలు కూడా వాటిలో ఉన్నాయని చెప్పారు. ''ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటుందని భావించే అమూల్ డెయిరీ కూడా ఆర్‌సీఈపీని వ్యతిరేకించింది. బీజేపీ మంత్రులు కూడా లోలోపల విమర్శలు చేశారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అభ్యంతరం చెప్పాయి. కాంగ్రెస్ కూడా కొన్ని రోజుల క్రితమే తమ పాత విధానాన్ని మార్చుకుని ఆర్‌సీఈపీని వ్యతిరేకించింది. ఇవన్నీ మోదీపై ప్రభావం చూపించి ఉంటాయి'' అని యోగేంద్ర అన్నారు. ఒకవేళ భారత్ ఒప్పందం చేసుకుని ఉంటే, న్యూజీలాండ్ పాల పొడి దిగుమతుల వల్ల భారత పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడేదని అభిప్రాయపడ్డారు. కొబ్బరి, నల్ల మిరియాలు, రబ్బర్, గోధుమలు, నూనె గింజల ధరలు విపరీతంగా పడిపోయే ప్రమాదం ఉండేదని, చిన్న వ్యాపారాలు ఘోరంగా దెబ్బతినేవని అన్నారు. ''భారత ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉంది. నోట్ల రద్దు నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సమయంలో మరో సమస్యకు ప్రభుత్వం కారణమైతే, ప్రజల్లో ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. ఇవన్నీ ఆలోచించి, మోదీ మనసు మార్చుకుని ఉంటారు'' అని యోగేంద్ర చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహా బృందం ఆర్‌సీఈపీలో చేరాలని ఇదివరకు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఆర్‌సీఈపీలో చేరకపోతే భారీ ప్రాంతీయ మార్కెట్‌కు భారత్ దూరమవుతుందని అభిప్రాయపడింది. అయితే, గతంలో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అనుభవాలు బాగా లేవని, ఆర్‌సీఈపీలో భాగమయ్యే దేశాలు భారత్‌ ఎగుమతులను తీసుకోవడం కన్నా ఇక్కడికి దిగుమతులే ఎక్కువగా చేస్తాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆర్‌సీఈపీని చైనా గట్టిగా సమర్థిస్తోంది. ఇప్పటికే చైనా, భారత్ వాణిజ్య లోటు గరిష్ఠ స్థాయిలో ఉంది. ఆర్‌సీఈపీలో భాగమైతే ఇది మరింత పెరిగేది. ఆర్‌సీఈపీ గురించి చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయని, ఆ ఒప్పందం వల్ల తక్కువ ప్రయోజనాలు లేదా నష్టాలు ఉండే అవకాశాలున్నాయని భావించి భారత్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని సీఆర్ఐఎస్ఐఎల్‌కు చెందిన ఆర్థికవేత్త సునీల్ సిన్హా అన్నారు. ‘‘చైనా ఇప్పటికే ఆర్థికంగా సుసంపన్నమైన దేశం. తూర్పు ఆసియా దేశాలతో చైనాకు భారత్ కన్నా మెరుగైన సంబంధాలున్నాయి. ఇలాంటి వాణిజ్య చర్చలు జరిగినప్పుడు చైనా కొంచెం మెరుగైన స్థితిలో ఉంటుంది. తూర్పు ఆసియా దేశాలతో భారత్‌కు అంతటి వాణిజ్య సంబంధాలు లేవు. ఈ ప్రాంతీయ సహకారంలో భాగం కావాలని భారత్ ప్రయత్నిస్తోంది. చైనా ఎప్పుడో వాటిని చేరుకుంది'' అని సునీల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక కోణమే కాకుండా ఆర్‌సీఈపీ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా పొడచూపింది. ఆర్‌సీఈపీలో చేరకూడదని ప్రధాని గొప్ప దార్శనిక నిర్ణయం తీసుకున్నారని బీజేపీ చెబుతుంటే, ఇది తమ విజయమేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాల తరహాలో అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గకుండా ఉన్నందుకు ప్రధానికి అభినందనలని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ఎదురైన ప్రతిఘటన కారణంగా ఆర్‌సీఈపీపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆసియాన్ దేశాలతో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందంపై సంతకం చేయకూడదని భారత్ నిర్ణయం తీసుకుంది. text: ఆ కథనం ప్రకారం.. షెడ్యూల్ ప్రకారం నడిచే పౌర విమానాలకు అనుమతి లేకపోవడంతో చార్టర్డ్ విమానాలే దిక్కవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితుల్లో కువైట్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో తమను స్వదేశానికి పంపించాలని వేలాది మంది కార్మికులు కువైట్ లోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వందే భారత్ మిషన్ కు సంబంధించిన విమానాలు ఆశించిన సంఖ్యలో లేవు. సాధారణ విమానాలకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు చార్టర్డ్ విమానాలను నడపడానికి సిద్ధమయ్యాయి. సాధారణ విమానాల్లో ప్రయాణించడానికి ఒక్కో ప్రయాణికుడికి రూ. 12 వేల నుంచి రూ. 15 వేల చార్జీ అవుతుంది. చార్టర్డ్ విమానాల్లో టికెట్ ధర ఐదు రెట్లు ఎక్కువ. ఒక్కో కార్మికుడు టికెట్ కోసం రూ. 60 వేల నుంచి రూ. 70 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీ మొత్తంలో చార్జీలు భరించి ఇంటికి రావడానికి కార్మికులు వెనకడుగు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు. ''కువైట్ నుంచి శంషాబాద్ కు చార్టర్డ్ విమానాలు నడుపుతామని విమానయాన సంస్థలు ప్రకటించాయి. కానీ, టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో ప్రయాణించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. షెడ్యూల్ ప్రకారం నడిచే విమానాలకు అనుమతి ఇవ్వాలి'' అని కువైట్ లో ఉంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి రవీందర్ రెడ్డి చెప్పారని సాక్షి పేర్కొంది. తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులతోనే పని జూన్ 22వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులతోనే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. 50 శాతం ఉద్యోగులు ఒక రోజు ఆఫీసుకు వ‌స్తే, మిగ‌తా 50 శాతం ఉద్యోగులు మ‌రో రోజు వ‌చ్చే వెసులుబాటు క‌ల్పించింది అని వెలుగు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను శ‌నివారం జారీ చేసింది. నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్‌, సర్క్యులేట్‌ ఆఫీసర్స్‌కు రోజు విడిచి రోజు డ్యూటీలు, అధికారులు ప్రత్యేక చాంబర్‌లో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్‌ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్‌ అధికారులు సహా..ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలంది. అధికారులు, సిబ్బందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఇంటే వద్దే ఉండాలని, ప్రతిరోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్‌ చేయాల‌ని సూచించింది. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగులు ఏసీలు వాడ‌కుండా ఉంటే మంచిద‌ని వెల్ల‌డించిందని వెలుగు దినపత్రిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ.. 'లాక్‌డౌన్‌' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు 10, 20 కేసులు వచ్చేస్థాయి నుంచి ఇప్పుడు 500 వరకూ నమోదయ్యే పరిస్థితికి చేరింది. పాజిటివ్‌ కేసులతో పాటు పెరుగుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. జిల్లాల్లో కలెక్టర్లు లాక్‌డౌన్‌ అనకుండానే కట్టడి ప్రాంతాల పేరుతో పట్టణాలు మూసివేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 47వార్డులు కట్టడిలోకి వెళ్లిపోయాయి. జిల్లాల్లోనూ అనధికార లాక్‌డౌన్‌ అమలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని చూసీచూడనట్లుగా వదిలేయడంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇలాంటి వారంతా, స్పందన వెబ్‌సైట్‌లో కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఈ-పాస్‌ ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చినవారిలో ఎక్కువమందికి పాజిటివ్‌లు వస్తున్నాయి. ఒంగోలులో ఆదివారం నుంచి 14రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చీరాలలో 17నుంచే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9వరకు నిత్యావసర, అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మిగతా సమయంలో అన్నీ బంద్‌ చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు నగరంలోకి రాకుండా శివారుల్లోనే నిలిపివేసే ఏర్పాటు చేశారు. కాగా, అనంతపురం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. ఉదయం 6నుంచి 11 గంటల వరకు సడలింపులిచ్చారు. ఆ తరువాత పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ విద్యార్థులంతా పాస్, ఇంటర్మీడియట్ ఫెయిలైన వాళ్లూ పాస్ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పబ్లిక్‌, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారని విశాలాంధ్ర దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. హాల్‌ టికెట్‌ పొందిన పదో తరగతి విద్యార్థులను, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫైయిలైన విద్యార్థులందరినీ ఉత్తీర్ణు లను చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉన్నత విద్యావకాశాలకు విద్యార్థుల మార్కులు, గ్రేడింగ్‌ అవసరం కాబట్టి..ఉత్తీర్ణతతో పాటు గ్రేడింగ్‌ ఇవ్వడానికి తగిన విధివిధానాలను అధికారులు రూపొందిస్తారని తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులు చెల్లించిన ఫీజును వెనక్కు ఇస్తామన్నారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, జూలై నాటికి మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వివిధ సర్వేలు సూచిస్తున్నాయని తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లు పెరుగుతుండటంతో పరీక్షల నిర్వహణ మరింత కష్టతరంగా ఉంటుందన్నారు. పాఠశాల పరిసరాల్లో శానిటైజేషన్‌, కరోనా నివారణ చర్యలు పూర్తిగా తమ అధీనంలో లేనందున నిర్వహణకు తాము సిద్ధంగా లేమన్నారు. మాస్కులు, శానిటైజర్లు, ఇతర నివారణ సామాగ్రి సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక పాఠశాల లు క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. అంతర్‌ జిల్లా, జిల్లాస్థాయి రవాణా సౌకర్యాలు పూర్తిగా పునరుద్ధరించలేదని, దూరప్రాంతానికి చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేరుకోవడం కష్టమని తెలిపారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పిల్లల ఆరోగ్యభద్రత ముఖ్యమని, ఏ ఒక్కతల్లి బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా పరీక్షలతో నిమిత్తం లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులు చేయాలని సీఎం ఆదేశించినట్టు వివరించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులను చేసేలా నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. ఉమ్మడి ప్రవేశాల పరీక్ష(సెట్లు)లు, ఓపెన్‌ స్కూల్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు ఇప్పటివరకు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతున్నాయని తెలిపారు. కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతుందని సీఎం ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభంతో కంపెనీలు మూతపడి నెలల తరబడి వేతనాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులు ఇంటికి చేరుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. text: ఓరియన్ వ్యోమనౌక ఊహాచిత్రం 1972 తరువాత మళ్లీ చంద్రునిపై కాలు మోపడానికి రంగ సిద్ధమైంది. 2024కల్లా చంద్రుడి మీదకు వెళ్లి రావడానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల (28 బిలియన్ డాలర్లు) ప్రణాళికను నాసా అధికారికంగా విడుదల చేసింది. ఆర్టెమిస్ అని పిలుస్తున్న ఈ ప్రోగ్రాం ద్వారా ఇద్దరు వ్యోమగాములు..ఒక స్త్రీ, ఒక పురుషుడు చంద్రుని మీదకు ప్రయాణించనున్నట్లుగా నాసా ప్రకటించింది. గతంలో ప్రయాణించిన అపోలోలాంటి అంతరిక్ష నౌక 'ఒరాయన్'లో వ్యోమగాముల బృందం ప్రయాణించనుంది. ఈ అంతరిక్ష నౌక, శక్తిమంతమైన రాకెట్ 'స్పేస్ లాంచ్ సిస్టం' (ఎస్ఎల్ఎస్) ద్వారా ప్రయాణించనుంది. ఆరుగురు మహిళా వ్యోమగాములతో తాజా ఆస్ట్రోనాట్స్ బృందం... వీరిలో అయిదుగురు నాసాకు చెందిన వారు, మరొకరు కెనడియన్ స్పేస్ సెంటర్ పరిశోధకురాలు ప్రయాణ సన్నాహాల నిమిత్తం ఇప్పటికే యూఎస్ ప్రభుత్వం సుమారు 4.4 వేల కోట్ల రూపాయలను (660 మిలియన్ డాలర్లు) మంజూరు చేసింది. 2021 నాటికి సుమారు 22 వేల కోట్ల రూపాయలను (3.2 బిలియన్ డాలర్లు) మంజూరు చేస్తారని నాసా ఆశిస్తోంది. చంద్రునిపైకి ప్రయాణించే రాకెట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి ఇది ఎంతో అవసరమని నాసా అధ్యక్షులు జిమ్ బ్రైడెన్‌స్టైన్ తెలిపారు. చంద్రునిపై అడుగు పెట్టబోతున్న మొదటి మహిళా వ్యోమగామి 2019 జూలైలో బ్రైడెన్‌స్టైన్ సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో...2024లో మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామి చంద్రునిపై కాలు మోపబోతున్నారని తెలిపారు. "ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగమై, నాసా ఆస్ట్రోనాట్ కార్ప్స్ విభాగంలో సభ్యత్వం ఉన్న, ప్రతిభావంతమైన మహిళను చంద్రునిపైకి పంపిస్తామని" బ్రైడెన్‌స్టైన్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిననాటికి 12 మంది మహిళా వ్యోమగాములు క్రియాశీలకంగా ఉన్నారు. వారితోపాటూ ఈ ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న మరొక 5 గురు మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిలో ఎవరు 2024నాటికి చంద్రునిపై ప్రయాణానికి తగిన శిక్షణ పూర్తి చేయగలుగుతారో వేచి చూడాల్సిందే. ఒరాయన్‌లో ప్రయాణించబోయే ఆర్టెమిస్ బృందాన్ని ఎప్పుడు ఎన్నుకుంటారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "ప్రయాణానికి కనీసం రెండేళ్ల ముందే సభ్యులను ఎన్నుకుంటామని, ముందుగానే బృందాన్ని తయారుచేసుకోవడం ప్రేరణనిస్తుంది" అని నాసా అధ్యక్షులు తెలిపారు. వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వెళ్లలున్న ఎస్ఎల్ఎస్ రాకెట్ ఊహా చిత్రం ఆర్టెమిస్ ప్రోగ్రాంలో మూడు దశలు ఉంటాయని నాసాలోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అధ్యక్షులు క్యాథీ లూడర్స్ తెలిపారు. మొదటి దశ ఆర్టెమిస్-1లో కేవలం రాకెట్‌ను మాత్రమే పైకి పంపించి పరీక్షిస్తారు. రెండవ దశ ఆర్టెమిస్-2లో వ్యోమగాములు కూడా వెళతారు. చివరిగా, మూడవ దశ ఆర్టిమెస్-3లో రాకెట్ చంద్రునిపైకి ప్రయాణిస్తుంది. చంద్రుని సమీపిస్తుండగా ఒరాయన్, ఎస్ఎల్ఎస్ రాకెట్ నుంచి విడిపోతుంది. అక్కడినుంచీ చంద్రుని చేరి, తిరిగి భూమికి వచ్చేవరకు వ్యోమగాములే స్వయంగా ఒరాయన్‌ను నడుపుతూ ప్రయాణం చేస్తారు. ఆర్టెమిస్ ప్రయోగం తరువాత, ఈ దశాబ్దం చివరిలో చంద్రునిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చెయ్యాలని నాసా యోచిస్తోంది. చంద్రునిపై నీరు-మంచు సంగ్రహించే అవకాశాలేమైనా ఉన్నాయేమో పరీక్షించనున్నట్టు నాసా తెలిపింది. ఈ ప్రయోగాలు విజవంతమైతే అంతరిక్ష నౌకకు కావలసిన ఇంధనాన్ని భూమిపైనుంచి తీసుకువెళ్లడం కంటే చౌకగా చంద్రునిపై తయారుచేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చంద్రుడి మీదకు 2024కల్లా వెళ్లి రావడానికి నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఒక మహిళా వ్యోమగామిని కూడా పంపనున్నట్లు నాసా తెలిపింది. text: అత్యాచారం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా చట్టాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నానని జగన్ తెలిపారు. మహిళలపై హింస అనే అంశంపై చర్చించాలని సభలో సభ్యులు కోరడంతో, ఏపీ అసెంబ్లీలో దానిపై ఈరోజు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నాకు ఇద్దరు పిల్లలున్నారు, చెల్లి ఉంది, భార్య ఉంది. ఓ ఆడపిల్లకు ఇలాంటి దారుణం జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. అందుకే మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి నేరం చేసిన 21 రోజుల్లోనే కఠిన శిక్షలు పడేలా చట్టం రూపొందిస్తాం. 'దిశ' అత్యాచార ఘటనకు మొత్తం సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. పక్కా పథకం ప్రకారం నిందితులు నేరానికి పాల్పడ్డారు. ఇలాంటి దారుణాలు జరిగిన సందర్భాల్లో పోలీసులు ఎలా స్పందించాలో మనం చర్చించుకోవాలి. వారిని కాల్చి చంపడం ఏమాత్రం తప్పు కాదు" అని జగన్ అన్నారు. 'దిశ' అత్యాచారం, హత్య నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై విచారణకు జాతీయ మానవ హక్కుల సంఘం ఏడుగురు సభ్యుల బృందాన్ని నియమించడాన్ని కూడా జగన్ తప్పుబట్టారు. "ఇలాంటి ఎన్‌కౌంటర్లు సినిమాల్లో జరిగితే మనమంతా సంతోషంతో చప్పట్లు కొడతాం. కానీ నిజజీవితంలో ఎవరైనా ధైర్యంగా ఇలా చేస్తే దానిపై విచారణకు దిల్లీ నుంచి ఎన్‌హెచ్ఆర్సీని పిలుస్తారు. వాళ్లు వచ్చి, ఇది చాలా తప్పు, ఇలా ఎందుకు చేశారు, ఎలా చేశారు అని ప్రశ్నిస్తారు. మన చట్టాలు ఇంతటి దారుణ స్థితిలో ఉన్నాయి" అని జగన్ వ్యాఖ్యానించారు. నిర్భయ అత్యాచారం 2012లో జరిగితే ఇంతవరకూ దోషులకు శిక్ష అమలు కాలేదని సీఎం అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశంలోని మహిళలు తక్షణ న్యాయం కోరుకుంటున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం తప్పు: రచనా రెడ్డి ఆ అమ్మాయికి జరిగిన దానిపై కోపం ఉండటం సహజమే కానీ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం తప్పు అని న్యాయవాది రచనా రెడ్డి అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల సంఘాన్ని విమర్శించడం సరికాదు, పోలీసులు చేసిన అభియోగాలు తప్పో, రైటో నిర్ధారించాల్సింది న్యాయ వ్యవస్థ. పోలీసులకే ఈ అధికారం ఇచ్చుకుంటూ పోతే అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఇది ఆటవిక రాజ్యానికి దారితీస్తుంది. ఆ అమ్మాయికి జరిగిన దానిపై కోపం ఉండటం సహజమే. కానీ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం తప్పు. కోర్టుల్లో నిందితులపై అభియోగాలు నిరూపణయ్యే వరకూ వారే నేరం చేశారని ఎలా చెప్పగలం? నేరస్థులు వీళ్లేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. వీటికి సమాధానాలు దొరకని పరిస్థితి ఇప్పుడు. 21 రోజ్లులోనే శిక్షలు వేస్తామంటే మంచిదే. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాదు, అల్ట్రా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలి. ఇది అమలు చేస్తే మంచిదే. కొన్ని చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటు చేతిలో ఉంటుంది. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు మార్చలేవు. నిందితులు అప్పీలు చేసుకునే హక్కును, క్షమాభిక్షను రాష్ట్రాలు అడ్డుకోలేవు. పూర్తి స్థాయిలో ఒకే కేసును రోజంతా విచారించేలా ఏర్పాట్లు చెయ్యడానికి మన దగ్గర తగిన వనరులు లేవు. దీనికి ప్రయత్నాలు చేస్తే సంతోషమే. ప్రతి కేసులోనూ దిశ నిందితుల విషయంలో జరిగినట్లు జరగాలని చెబితే అది న్యాయ స్ఫూర్తికే విరుద్ధం అని రచనా రెడ్డి అన్నారు. హైకోర్టులో విచారణ వాయిదా హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఆదేశించింది. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సీనియర్ అడ్వొకేట్ ప్రకాశ్ రెడ్డిని అమికస్ క్యూరీ (మధ్యవర్తి)గా హైకోర్టు నియమించింది. మరోవైపు, 'దిశ' కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసును రిజిస్టర్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, విచారణ జరపాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిందని రిపోర్టర్ సుచిత్ర మొహంతీ తెలిపారు. ‘‘ఈనెల 11వ తేదీ బుధవారం ఈ పిటిషన్‌పై దృష్టిసారిస్తాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారని వివరించారు. ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారణకు స్వీకరించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు విజ్ఞప్తి చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక మహిళపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగితే, ఆ కేసులో నిందితులు పోలీసులపై దాడిచేసి, కస్టడీ నుంచి తప్పించుకోబోయారు. వారిని పోలీసులు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపితే, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని విచారణలు చేసే పరిస్థితిలో ఈరోజు చట్టాలున్నాయి అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. text: విశాఖ జిల్లా వైశాల్యంలో సగం గిరిజన ప్రాంతమే ఉంటుంది. జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిదిలో 11 గిరిజన మండలాల్లో 245 గ్రామ పంచాయతీలు, 4,210 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ మారుమూల గిరిజన ప్రాంతాలే. చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉంటాయి. ఆ గ్రామాలకు చేరుకోవాలంటే కిలోమీటర్ల కొద్ది నడుస్తూ కొండలు ఎక్కిదిగాల్సిందే. అలా 15 కిలోమీటర్లు నడిస్తే కానీ చేరుకోలేని ఒక గ్రామానికి బీబీసీ బృందం వెళ్లింది. ఆ ఊరి పేరు బోనూరు. ఈ ఊరిలో వారికి సరుకులు కావాలన్నా, ఆరోగ్యం బాలేకపోయినా ఇదే మార్గం. ఆరోగ్యం బాలేని వారిని గ్రామస్థులు డోలీల్లో మోసుకెళ్తారు. ఇలాంటి గ్రామాలు అక్కడ చాలా ఉన్నాయి. 'నాయకులు ఓట్ల కోసం ఎన్నో చెబుతారు, తర్వాత మమ్మల్ని మరచిపోతారు' ప్రభుత్వాల వైపు ఎదురుచూడకుండా తామే స్వయంగా రోడ్డు వేసుకునేందుకు అనంతగిరి మండలంలోని 9 గ్రామాల ప్రజలు చేయిచేయి కలిపారు. ఈ మండలంలోని వినుకోట పంచాయతీకు చెందిన బోనూరు, నడుమ వలస, చీడిమెట్ట, వంట్ల మామిడి, గడ్డి బంద, మెట్టి వలస, పందిరి మామిడి, కివర్ల పంచాయతీకి చెందిన పుతిక పుట్టు, జగడాల మామిడి గ్రామాలు కొండలపై ఉంటాయి. ఈ 9 గ్రామాలలో దాదాపు 2 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు ఏ అవసరం కోసమైనా దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం అనంతగిరికి, లేదా 30 కిలోమీటర్ల దూరంలోని దేవరాపల్లికి నడిచి వెళ్లాలి. కాకపోతే దేవరాపల్లి వేరే మండలం, వేరే నియోజకవర్గంలో ఉంది. తమ ఊళ్లకు దేవరాపల్లి మండలంలోని చటాకంబా వరకూ రోడ్డు నిర్మించాలని ఎన్నోసార్లు ఇక్కడి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అనంతగిరి మండలం బోనూరు నుంచి దేవరాపల్లి మండలం చటాకంబా వరకు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత మేరకు కనీసం మట్టి రోడ్డయినా వేయాలనేది స్థానికుల కోరిక. తమ డిమాండును ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఏకమైన గ్రామస్థులు యువత సహాయంతో సొంతంగా బోనూరు నుంచి చటాకంబా వరకూ మట్టి రోడ్డు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్రామాలలో కాస్త చదువుకున్న వారు ఉన్నారు. 7వ తరగతి వరకు చదువుకున్న యువకులు ఎక్కువ మంది ఉండగా, 10, ఇంటర్ వరకూ చదివిన వారు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒక యువకుడు మాత్రం బీటెక్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ 9 గ్రామాలకు చెంది యువత తమ గ్రామస్థులతో సమావేశం ఎర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాగూ స్పందన లేదు కాబట్టి, గ్రామస్థులంతా శ్రమదానంతో సొంతంగా రోడ్డు వేసుకోవాలని తీర్మానించుకున్నారు. ఒక్కో కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా రోజూ వచ్చి పనిచెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. పనికి వచ్చేప్పుడు ఎవరి భోజనం వారే తెచ్చుకోవాలనేది నిబంధన. రోడ్డు నిర్మాణం ఇలా చుట్టూతా దట్టమైన వెదురు అడవి. ఎటుచూసినా కొండలే. ఆ గిరిజనులు ఇవేవీ పట్టించుకోలేదు. ముందుగా రోడ్డు నిర్మాణం కోసం అని కొండను చదును చేయడం ప్రారంభించారు. బోనూరుకు చెందిన మాదాల వెంకటరావు అనే యువకుడు విశాఖలోని ఓ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. తాను పుస్తకాల్లో చదివింది గ్రామస్థులతో పాటు ఇతర యువతకు చెప్పడం ప్రారంభించారు వెంకటరావు. ఇతర గ్రామాల పెద్దలు అందరూ కలిసి ఇంత వెడల్పు రోడ్డు ఉండాలి అని నిర్ణయం తీసుకొని రోడ్డు నిర్మామణం ప్రారంభించారు. అది కూడా దట్టమైన అడవి మధ్యలో నుంచి రోడ్డు వేయడం మొదలుపెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా రోజూ 200 నుంచి 300 వందల మంది వరకూ గిరిజనులు చిన్నా పెద్దా, ముసలి ముతకా అంతా కలసి కుటుంబానికి ఒక్కరు చొప్పున కొన్ని వారాలుగా బోనూరు నుంచి దేవరాపల్లి మండలం చటాకంబా వరకూ రోడ్డు వేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తయింది. మరో 5 కిలోమీటర్లు వేస్తే సరిపోతుంది. కనీసం ఆ 5 కిలోమీటర్ల దూరమైనా ప్రభుత్వం రోడ్డు వేయించాలని ఈ గిరిజనులు కోరుతున్నారు. "మా గ్రామస్థులు, కుర్రవాళ్లు అందరం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎన్నిసార్లు ప్రభుత్వానికి లెటర్లు పెట్టినా స్పందన లేదు కాబట్టి మనమే రోడ్డు వేసుకుందామని మాట్లాడుకున్నాము. ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు వేశాము. మరో 5 కిలోమీటర్ల వెయ్యాల్సి ఉంది. అదైనా ప్రభుత్వం వేస్తే సంతోషం. లేదంటే అది కూడా మేమే వేసుకుంటాము. ఆస్పత్రికి వెళ్లాలన్నా, కొండలు కోనల్లో నడిచి వెళ్తుంటే మధ్యలోనే చనిపోతున్నారు. బాలింతలను డోలీలో తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా సార్లు అధికారులు మొర పెట్టుకున్నాము. రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. అందుకే కుర్రవాళ్లం అంతా కలిసి మాట్లాడుకున్నాము. మాకు రోడ్డు వెయ్యాలనే సంకల్పమే తప్ప ఎలా వెయ్యాలో తెలియదు. మాలో కొంత మంది చదువుకున్న వాళ్లు ఉన్నారు. పెద్దవాళ్లకు ఇలా చేద్దాం అని మా భాషలో చెబుతున్నాము. అందరం కలిసి రోడ్డు వేసుకుంటున్నాము. నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నేను చదువుతున్నది వాళ్లకు చెబుతున్నాను. మేం చదువుకోవాలన్న స్కూలుకు వెళ్లాలన్నా దారి లేదు. అందుకే రోడ్డు వేసుకుంటున్నాము'' అని మాదాల వెంకట్రావు బీబీసీతో చెప్పారు. మట్టి రోడ్డుకు చేరుకోవాలన్నా కనీసం 15 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్లాలి "ఏం చేస్తాం. రోడ్డు తవ్వుకుంటున్నాము. మాకు నడకకు కొండలు ఎక్కడానికి కాళ్లు పీకుతున్నాయి. దేశం అంతటా రోడ్డు వచ్చేసినా మాకు రోడ్డు రాలేదు. మా ఊరి చదువుకున్న పిల్లలు రోడ్డు తవ్వుదాం అంటే సరేనని అనుకున్నాం. ఈ ఊళ్లలో రెండు వేల మంది ఉన్నాము. నేను పుట్టిన కాడి నుంచి రోడ్డు లేదు. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోతున్నాను. ఇప్పటి వరకూ రోడ్డు లేదు. డోలి కట్టుకొని వెళుతున్నా మధ్యలో ప్రాణాలు పోతున్నాయి. రోడ్డుంటే ఈ బాధ ఉండదని అనుకున్నాము. అందుకే రోడ్డు వేస్తున్నాము. ఇప్పటికే 10 కిలోమీటర్లు రోడ్డు వేశాము. ఓట్లు వేసినప్పుడే అన్ని రోడ్లూ, కుళాయిలు, కరెంట్లు ఇస్తామని నాయకులు చెబుతారు. ఓట్ల వరకే మేం కనిపిస్తాము. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. అందుకే మేమే రోడ్డు వేసుకుంటున్నాము'' అని అన్నారు బోనూరు గ్రామానికి చెందిన మాదాల కర్రమ్మ. మాదాల కర్రమ్మ చీడిమెట్ట గ్రామానికి చెందిన బుచ్చన్న అనే యువకుడు యువతనూ, గ్రామస్థులనూ ఒకే తాటిమీదకు తీసుకు రావడానికి ప్రయత్నించారు. '' బాట కోసం 9 గ్రామాల ప్రజలం ఒక్కటయ్యాము. మాకు మేమే సొంతంగా పనిచేస్తున్నాం. 10 కిలోమీటర్లు వేసుకున్నాము. మరో 5 కిలోమీటర్లు రోడ్డు వేస్తే సరిపోతుంది. రోజుకు 300 మంది పనిచేస్తున్నాము. ఒక్కళ్లు ఇంట్లో ఉంటే ఒకరు వచ్చి పనిచేస్తున్నాము. ఏ ప్రభుత్వ అధికారులూ పట్టించుకోలేదు. మా కూలి మానేసి వచ్చి చేస్తున్నాము'' అని బుచ్చన్న వివరించారు. తొమ్మిది గిరిజన గ్రామాల ప్రజలు సొంతంగా రోడ్లు వేసుకుంటున్న విషయం ప్రసార మాధ్యమాల ద్వారా పాడేరు ఐటీడీవో పీవో బాలాజీ తెలుసుకున్నారు. ఈ గ్రామాలకు రోడ్డు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ''స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపొవడం బాధాకరం. పాడేరు ఐటీడీఏ ప్రాంతంలో చాలా గ్రామాలకు రోడ్డు లేదు. మేం అన్ని గ్రామాలకూ శాశ్వత రోడ్లు వేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అనంతగిరి మండలం పినకోట, కివర్ల పంచాయితీ ప్రజలు తమకు రోడ్డు వేయాలని గతంలోనే స్పందన కార్యక్రమంలో కలిసి చెప్పారు. వాళ్లే రోడ్డు వేసుకుంటున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఈ గ్రామస్థుల పట్టుదలను చూసి వెంటనే రోడ్డు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశాము. సాంకేతిక అనుమతులు వస్తే వచ్చే వర్కింగ్ సీజన్‌కు రోడ్డు వేయాలనే సంకల్పంతో ఉన్నాం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నవంబర్, డిసెంబర్ కల్లా రోడ్డు పూర్తవుతుంది. మా గిరిజనులు ఇంటికొక్కరు చొప్పున వచ్చి పనిచేస్తున్నారు. వారి కష్టాన్ని కూడా గుర్తిస్తాం. ఆ ప్రతిపాదనలు కూడా ఎన్ఆర్జీఎస్ క్రింద పంపాం. అవి వస్తే ఈ పని చేస్తున్న గిరిజనులకు కూలీలు చెల్లించేందుకు వీలుంటుంది'' అని పీవో బాలాజీ బీబీసీతో చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆ గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఒక రోడ్డు. దానికోసం అధికారులను వారు ఎన్నోసార్లు కలిశారు. ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయారు. ఇక ఎవరో వస్తారు... ఏదో చేస్తారని చూడకుండా 9 గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది గిరిజనులు ఏకమై స్వయంగా రహదారిని నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేశారు. text: ఇప్పుడు ఆస్ట్రేలియన్లు చాలా మందిని ఈ పీడకల పీడిస్తున్నట్లు కనిపిస్తోంది. వీళ్లు కరోనావైరస్ భయంతో టాయిలెట్ పేపర్‌ను పెద్ద ఎత్తున కొని ఇళ్లలో గుట్టలుగా పెట్టేసుకుంటున్నారు. టాయిలెట్ పేపర్‌కి ఎలాంటి కొరతా లేదని అధికారులు గట్టిగా చెప్తున్నా కూడా ఈ కొనుగోళ్లు తగ్గటం లేదు. దేశంలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలోని సూపర్‌మార్కెట్లలో టాయిలెట్ పేపర్ అరలు నిమిషాల్లో ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ఒక మార్కెట్ చైన్.. మనిషికి నాలుగు టాయిలెట్ పేపర్ ప్యాకెట్లు మాత్రమే అమ్ముతామనే నిబంధన కూడా పెట్టాల్సి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో సైతం బుధవారం నాడు #toiletpapergate, #toiletpapercrisis హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండయ్యాయి. టాయిలెట్ పేపర్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో వందల డాలర్లకు అమ్ముతున్నారు. ఇంకొంతమంది ఈ రోల్స్ గెలవటానికి రేడియో స్టేషన్లకు ఫోన్‌లు చేసే పోటీల్లో పాల్గొంటున్నారు. పరిస్థితి గత 48 గంటల్లో ఎలా మారిపోయిందంటే.. పబ్లిక్ టాయిలెట్లలోని పేపర్‌ని కూడా జనం దొంగిలిస్తున్నారు. ఎందుకిలా? అసలు ఏం జరుగుతోంది? జనం ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఆస్ట్రేలియా మార్కెట్లలో టాయిలెట్ పేపర్ కొనుగోళ్లు అమాంతం పెరిగిపోయాయి భయం.. భయం... ఈ టాయిలెట్ పేపర్ సమస్య ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమైనది కాదు. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న సింగపూర్, జపాన్, హాంగ్ కాంగ్ వంటి ఇతర దేశాల్లోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తింది. గత నెలలలో హాంగ్ కాంగ్‌లో జనం భయంతో వెర్రిగా కొనుగోళ్లు చేయటంతో టాయిలెట్ పేపర్ కొరత తలెత్తింది. దీంతో సాయుధ దుండగులు దోపిడీకి దిగి టాయిలెట్ పేపర్ దోచుకున్నారు. అమెరికాలోనూ టాయిలెట్ పేపర్ల కొనుగోళ్లు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో గత వారాంతంలో కొత్తగా కోవిడ్-19 కేసులు బయటపడటం, దేశంలో ఈ వ్యాధి వల్ల తొలి మరణం సంభవించిందన వార్తలు రావటంతో భయం దావానలంలా వ్యాపించి.. వెర్రిగా కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆస్ట్రేలియాలో బుధవారం నాటికి 41 కేసులు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. ప్రజలు మంచి పరిశుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనం అవసరమని భావిస్తే రెండు వారాలకు సరిపడా ఆహారం, మంచినీళ్లు, ఇతరత్రా అవసరమైన సరుకులను నిల్వ చేసుకోవచ్చునని కూడా సూచించింది. దీంతో, ఎక్కువ కాలం నిల్వ చేసుకోగల ఆహారం, సరకుల కన్నా ముందుగా టాయిలెట్ పేపర్‌కి డిమాండ్ పెరిగిపోయింది. జనం టాయిలెట్ పేపర్లను లాక్కుంటున్న, ట్రాలీల మీద గుట్టలుగా పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టుల్లో కనిపించాయి. ఈ వార్తల నేపథ్యంలో భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దంటూ ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ''ఈ సమయంలో సూపర్‌మార్కెట్లలో లావెటరీ పేపర్ మొత్తం ఖాళీ చేయటం తగిన, తెలివైన పని కాదని ప్రజలకు భరోసా ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తున్నాను'' అని ఆస్ట్రేలియా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ బ్రెండన్ మర్ఫీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. కోల్స్, వూల్స్‌వర్త్స్ సూపర్‌మార్కెట్లు తమ వద్ద చాలా నిల్వలు ఉన్నాయని చెప్పాయి. క్లీనెక్స్ టాయిలెట్ పేపర్ తయారీ సంస్థ.. డిమాండ్ తీర్చటం కోసం తాము 24 గంటలూ ఉత్పత్తి కొనసాగిస్తున్నామని తెలిపింది. వైరస్‌ను నియంత్రించటానికి దేశం సంసిద్ధంగా ఉందని, అన్ని చర్యలూ చేపడుతోందని ప్రభుత్వం పేర్కొంది. స్థానికంగా వైరస్ వ్యాపిస్తున్న కేసులు ఇప్పటివరకూ చాలా అరుదుగానే ఉన్నాయి. అయినా, కానీ టాయిలెట్ పేపర్ వేలం వెర్రి కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. మంద మనస్తత్వం... ఇది ఆస్ట్రేలియన్లు పుట్టించిన అతి తెలివితక్కువ సంక్షోభం అని కొంతమంది అభివర్ణిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి తోడ్పడేది మెడిసిన్, మాస్కులు, హ్యాండ్ సానిటైజర్లని.. టాయిలెట్ పేపర్‌తో వైరస్ మీద ఎలా పోరాడతారని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రవర్తన అవివేకమైనదేననటంలో సందేహం లేదని వినియోగదారుల మనస్తత్వ నిపుణులు చెప్తున్నారు. ఇది సోషల్ మీడియా, వార్తా కథనాలు ప్రేరేపించిన 'మూక మనోప్రవృత్తి'కి స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఫోమో సిండ్రోమ్ - ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ - అంటే.. తమకు మిగలకుండా పోతుందనే భయం చాలా తీవ్రంగా పనిచేస్తోందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నితికా గార్గ్ విశ్లేషించారు. ''ఈ మనిషి దీనిని కొంటున్నారు.. నా పొరుగువారు కొంటున్నారు. అంటే, దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. నేను కూడా కొనాలి' అనే ఆలోచన వస్తుందని ఆమె బీబీసీతో చెప్పారు. ఆస్ట్రేలియా సూపర్‌మార్కెట్లలో టాయిలెట్ పేపర్లు నిమిషాల్లోనే ఖాళీ అవుతున్నాయి చాలా ఆసియా దేశాల్లోనూ ఇదే తరహా వెర్రి కొనుగోళ్లు జరిగాయని ప్రొఫెసర్ గార్గ్ ఉదహరించారు. చైనాలో కూడా టాయిలెట్ పేపర్‌ను నిల్వ చేసుకుంటున్నారని.. టిష్యూలు, నాప్కిన్లకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించవచ్చుననే ఆలోచన ఇందుకు కారణమని చెప్పారు. ఈ పేపర్‌తో తాత్కాలిక మాస్కులను కూడా తయారు చేసుకోవచ్చునని భావిస్తారన్నారు. అయితే.. ఆస్ట్రేలియాలో టాయిలెట్ పేపర్‌కు డిమాండ్ పెరిగిపోవటానికి కారణం దానిని వైద్య వనరుగా ఉపయోగించుకోవచ్చుననే ఆలోచన కాదన్నారు. ఇక్కడ కొనుగోళ్లు భయంతో జరుగుతున్నాయని.. ఇది మునుపెన్నడూ కనిపించని పరిస్థితని ఆమె చెప్పారు. ఆస్ట్రేలియన్లు గతంలో దావానలం, తుపాను వంటి ప్రకృతి విపత్తుల కారణంగా ఇంటి సరకులు కొని నిల్వ చేసుకున్నారు. అదికూడా కొన్ని సమాజాలకు పరిమితమైంది. ''కానీ కరోనావైరస్ విషయానికి వస్తే.. పరిస్థితులు ఎలా మారతాయి.. ఎంత తీవ్రంగా దిగజారుతాయి అనేది జనానికి తెలియదు. అలాంటి పరిస్థితులకు సంసిద్ధంగా ఉండాలని భావిస్తారు'' అంటారు ప్రొఫెసర్ గార్గ్. ఈ కొనుగోళ్లు.. పట్టణీకరణ చెందిన సమాజానికి, ఆధునిక సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యం ఉండే జీవనశైలికి ప్రతిఫలనమని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన వినియోగదారుల నిపుణుడు డాక్టర్ రోహన్ మిల్లర్ భావిస్తున్నారు. ''కొరతలు, కరవులు మనకు అలవాటు లేదు. మనకు ఎప్పుడు, ఏది కావాలనుకుంటే దానిని ఎంచుకుని తెచ్చుకోవటానికి అలవాటుపడ్డాం. ఆ పరిస్థితిని కొనసాగించాలనే మూక మనోప్రవృత్తే ఇలా వెర్రిగా టాయిలెట్ పేపర్ కొనటం'' అని ఆయన వ్యాఖ్యానించారు. ''ఆహారం, తాగునీరు వంటి ఇతర నిత్యావసరాలతో పోలిస్తే టాయిలెట్ పేపర్ అనేది నిజంగా లెక్కలోకి రాదు. కానీ.. జనం అది కనీస జీవన ప్రమాణంగా పరిగణిస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచం అంతమయ్యే పరిస్థితుల్లో అత్యంత దారుణమైన దుస్థితి.. టాయిలెట్‌లో చిక్కుకుపోయి.. అక్కడి నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి కావచ్చు. text: ఎందుకంటే ఇదంతా యాపిల్ కంపెనీ కావాలనే చేస్తోందనేది ఆరోపణ. బ్యాటరీ వల్ల ఫోనుకు హాని జరగకూడదనే ఇలా చేస్తున్నట్లు యాపిల్ చెబుతోంది. కానీ కొందరు వినియోగదార్లు అమెరికా కోర్టులో యాపిల్‌పై దావా వేశారు. కావాలనే ఇలా చేస్తోందని చెబుతున్నారు. ఇంతకూ అసలు ఏం జరిగింది? బ్యాటరీకి, ఫోను పనితీరుకు సంబంధం ఏమిటి? సమస్య ఏమిటి? ఉదాహరణకు మీరు ఐఫోన్-6 ప్లస్ వాడుతున్నారనుకుందాం. ఆ తరువాత కొంత కాలానికి ఫోను పనితీరు మందగించడం ప్రారంభిస్తుంది. ఫోను స్పందించే వేగం తగ్గిపోతుంది. కొన్ని అప్లికేషన్లు అనుకున్నంత వేగంగా పని చేయవు. చాలా మంది ఐఫోన్ వినియోగదారులు ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. ఎలా గుర్తించారు? పైన చెప్పినట్లు ఐఫోన్-6 ప్లస్ విషయానికి వద్దాం. పాత బ్యాటరీ స్థానంలో కొత్తది వేయగానే అది మునుపటిలాగే సాఫీగా పని చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ దాని పనితీరు నెమ్మదిస్తుంది. మళ్లీ కొత్త బ్యాటరీ వేయగానే పనితీరు మెరుగుపడుతోంది. ఈ విషయాన్ని చాలా మంది వినియోగదారులు సోషల్ న్యూస్ అగ్రిగేటర్ రెడిట్‌ వేదికగా పంచుకున్నారు. కొత్త మోడళ్లు కొనుగోలు చేసేలా యాపిల్ కావాలనే ఇలా చేస్తోందని ఆరోపించారు. టెక్నాలజీ వెబ్‌సైట్ గీక్‌బెంచ్, వివిధ ఐఓఎస్‌ల ఆధారంగా పని చేసే ఐఫోన్లను పరిశీలించింది. కావాలనే ఐఫోన్ల పనితీరును యాపిల్ తగ్గిస్తున్నట్లు గుర్తించింది. యాపిల్ ఏమంటోంది? ఐఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నారు. కాలం గడిచే కొద్దీ చలి వాతావరణంలో వీటి పని తీరు మందగిస్తుందని యాపిల్ చెబుతోంది. పవర్‌ను ఎక్కువ సమయం పట్టి ఉంచే శక్తి వీటికి సన్నగిల్లుతుంది. అందువల్ల ఐఫోన్ సాఫీగా పనిచేసేందుకు కావాల్సిన పవర్‌ లభించదు. ఫలితంగా ఫోను అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇలాంటి సమయాల్లో ఫోను పనితీరు సాఫీగా ఉండేందుకు తాము ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది. గత ఏడాది ఐఫోన్ 6, 6ఎస్, ఎస్ఈ వంటి మోడళ్లకు కొత్త ఐఓఎస్‌లను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. తాజాగా ఐఫోన్-7కు కూడా ఇటువంటి మార్పులు చేశామని, భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను ఇతర ఉత్పత్తులకు విస్తరిస్తామని వివరించింది. వినియోగదార్లకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. రహస్యంగా చేసిందా? ఐఓఎస్‌లో మార్పుల గురించి వినియోగదార్లకు ముందుగా సమాచారం ఇవ్వలేదనేది ప్రధాన ఆరోపణ. "వినియోగదారులుకు తెలియకుండా యాపిల్ రహస్యంగా చేసింది. ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలు సంస్థపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి." "చాలా కాలంగా యాపిల్ వినియోగదారుల అంచనాలను అందుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ అనవసరంగా పొరపాటు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది " అని డెవలపర్, బ్లాగర్ నిక్ హీర్ అభిప్రాయపడ్డారు. "వినియోగదారులు డబ్బులు చెల్లించి ఫోన్లు కొనుగోలు చేశారు. దాని పనితీరును తగ్గించేటప్పుడు వారికి సమాచారం ఇవ్వాలి. ఎందుకు ఆ పని చేస్తున్నారో కారణం చెప్పాలి. ఈ విషయంలో యాపిల్ మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సింది" అని టెక్ కన్సల్టెన్సీ‌కి చెందిన క్రిస్ గ్రీన్ అన్నారు. ఒకో కొత్త బ్యాటరీకి అమెరికాలో 79 డాలర్లు, బ్రిటన్‌లో 79 పౌండ్లు యాపిల్ వసూలు చేస్తోంది. బ్యాటరీల పనితీరు ఎందుకు తగ్గుతోంది? లిథియం బ్యాటరీల పనితీరు ఛార్జింగ్, డిస్‌ఛార్జింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు అయాన్లు పాజిటివ్ ఎలక్ట్రోడ్ల నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్ల వైపు పయనిస్తాయి. బ్యాటరీ డిస్‌ఛార్జ్ అయ్యేటప్పుడు అయాన్లు నెగిటివ్ ఎలక్ట్రోడ్ల నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్ల వైపు కదులుతాయి. దీనివల్ల అయాన్లు ప్రయాణించే రసాయనిక ద్రావణం ఎలక్ట్రోలైట్ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. ఇది బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపుతుందని ఒక శాస్త్రవేత్త తెలిపారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ విశ్లేషణ: రోరీ సెల్లాన్-జోన్స్, టెక్నాలజీ కరస్పాండెంట్ మొబైల్ బ్యాటరీల పనితీరు తగ్గడమనేది సాధారణమే. కాలం గడిచే కొద్దీ లిథియం అయాన్ బ్యాటరీల శక్తి సన్నగిల్లుతుంది. ఇతర కంపెనీల వినియోగదారులు కూడా ఇదేరకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. యాపిల్ విషయంలో ఇంత వివాదానికి దారి తీసిన కారణం ఒక్కటే. ఆ సంస్థ పారదర్శకత పాటించకపోవడమే. గత ఏడాది ఆపరేటింగ్ సిస్టంలను యాపిల్ అప్‌గ్రేడ్ చేసింది. అయితే ఫోన్ల పనితీరు మందగిస్తోందనే ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం అసలు ఏం జరిగిందో ఒక డెవలపర్ ప్రపంచానికి తెలియజేశారు. దీంతో యాపిల్‌కు వివరణ ఇవ్వక తప్పలేదు. ఒక సినీతారకు ఉన్న స్థాయిలో యాపిల్‌కు అభిమానులున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వీరి అభిమానాన్ని సంస్థ పొందుతూ వస్తోంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. యాపిల్ ఇంకాస్త నిజాయతీగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. మా ఇతర కథనాలు (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మీరు ఐఫోన్ వాడుతున్నారా? అది అప్పుడప్పుడు స్లో అవుతోందా? అయితే ఇది పూర్తిగా చదవండి. text: చిట్టగ్యాంగ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి ఆదివారం ఢాకా నుంచి దుబాయ్ బయల్దేరిన బీజీ 147 పాసింజర్ విమానాన్ని హైజాక్ చేయటానికి అందులోనే ప్రయాణిస్తున్న ఓ యువకుడు ప్రయత్నించటంతో విమానాన్ని బంగ్లాదేశ్‌లోని చిట్టగ్యాంగ్‌లో అత్యవసరంగా దింపేశారని స్థానిక మీడియా పేర్కొంది. చిట్టగ్యాంగ్‌లో విమానాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అనుమానితుడిని అరెస్ట్ చేయటానికి ప్రయత్నించాయని, అతడు ఎదురు తిరగటంతో కాల్పులు జరిపాయని సైనిక అధికారులు చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. కాల్పుల్లో గాయపడిన అతడు తర్వాత చనిపోయాడని మేజర్ జనరల్ మోతియుర్ రహ్మాన్ మీడియాతో పేర్కొన్నారు. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలోని 148 మంది ప్రయాణికులనూ సురక్షితంగా దించేశారు. సుమారు పాతికేళ్ల వయసున్న ఈ యువకుడు విమానాన్ని ఎందుకు హైజాక్ చేయటానికి ప్రయత్నించాడన్నది తెలయరాలేదు. ''అతడు బంగ్లాదేశఈ పౌరుడే. అతడి వద్ద ఒక పిస్టల్‌ ఉంది. ఇంకే వివరాలూ తెలియవు'' అని రహ్మాన్ తెలిపారు. అనుమానితుడు మానసికంగా అనారోగ్యంతో ఉండివుండొచ్చునని, చిట్టగ్యాంగ్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి షేక్ హసీనాతో మాట్లాడతానని డిమాండ్ చేశాడని అంతకుముందు కొన్ని వార్తలు వచ్చాయి. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. బంగ్లాదేశ్ నుంచి దుబాయ్ పయనమైన విమానాన్ని హైజాక్ చేయటానికి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న ఒక ప్రయాణికుడిని బంగ్లాదేశ్ ప్రత్యేక సాయుధ బలగాలు కాల్చి చంపాయి. text: ''బీజేపీ ఐటీ సెల్‌ ప్రతినిధి సురేశ్‌ కొచ్చటిల్‌ చేసిన ట్వీట్‌కు సజ్జనార్‌ స్పందించిన తీరుపై అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశా రు. 'హైదరాబాద్‌లోని అమెరికా ఐటీ కంపెనీలలో జిహాదీలు పని చేస్తున్నారు. అమెరికా ఆస్తులను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ ప్రకటించిన నేపథ్యంలో జిహాదీలను గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కంపెనీల్లో తనిఖీలు ఏమైనా చేశారా?' అని సురేశ్‌ కొచ్చటిల్‌ బుధవారం ఒక ట్వీట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలను ఆ ట్వీట్‌లో ట్యాగ్‌ చేశారు. దానికి సీపీ సజ్జనార్‌ స్పందించారు. 'అవును సర్‌... మాకు అలాంటి సమాచారం సేకరించడానికి ప్రత్యేకమైన విభాగాలున్నాయి. ఐటీ కంపెనీల్లో అలాంటి వారిని గుర్తించేందుకు మా నిఘా బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. వాటిద్వారా మాకు ముందే సమాచారం వస్తుంది. మీ దగ్గర ఎలాంటి సమాచారమున్నా మాకు తెలియజేయండి.' అని సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. తమ వద్ద అలాంటి నిఘా విభాగాలున్నాయన్న ఉద్దేశంతో సైబరాబాద్‌ పోలీసులు స్పందించగా.. ఆ ట్వీట్‌పై అసద్‌ఘాటుగా స్పందించారు. 'అవును సర్‌' అంటే అర్థమేమిటో నాకు కొంచెం వివరించండి. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో జిహాదీలు ఎంతమంది పనిచేస్తున్నారో ఆ సంఖ్యను బహిర్గతం చేయండి? ఆ విషయం తెలియకుండా అంటే ఏ అర్థంతో 'అవును సర్‌' అన్నారో వివరణ ఇవ్వండి. ఒక ఎంపీగా నాకు సమాధానం చెప్తారా? మోదీ భక్తులకే సమాధానమిస్తారా?' అని సజ్జనార్‌పై ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదని, ఒకసారి నాథూరాం గాడ్సేను గుర్తుచేసుకోవాలని ఒవైసీ హితవుపలికారు. ఒకవేళ ఐటీ కంపెనీల్లో జిహాదీలున్నా వారిని ఉదయం 5 గంటలకు తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌ చేయొద్దంటూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. వారిని చట్టప్రకారం అరెస్టు చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలన్నారు. ఈ ట్వీట్‌లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సీపీ సజ్జనార్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల నేపథ్యంలో సజ్జనార్‌ మరో ట్వీట్‌ చేశారు. 'మా ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పడమే ట్వీట్‌ ఉద్దేశం. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నాం. పక్షపాతం లేకుండా అన్ని వర్గాలకు సేవలందిస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు. కాగా.. సైబరాబాద్‌ పోలీస్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతాలో సజ్జనార్‌ ఫొటో ఉంటుందిగానీ.. దాన్ని పర్యవేక్షించేది మాత్రం ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌'' అని ఆ కథనంలో వివరించారు. న్యూజిలాండ్‌తో దోస్తీ న్యూజిలాండ్‌ ప్రభుత్వం, పారిశ్రామికవర్గాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారంటూ 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది. ''న్యూజిలాండ్‌ ఎథ్నిక్‌ అఫైర్స్‌శాఖ పార్లమెంటరీ సెక్రటరీ, అక్కడి ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్‌ బుధవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, విద్యారంగాల్లో న్యూజిలాండ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై చర్చించారు. ముఖ్యంగా అగ్రిటెక్‌, ఇన్నోవేషన్‌, స్టార్టప్‌ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులను మంత్రి కేటీఆర్‌ ప్రియాంకకు వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం స్టార్టప్‌, ఇన్నోవేషన్‌ రంగాల్లో దేశంలోనే ముందువరుసలో ఉన్నదని తెలిపారు. టీహబ్‌, వీహబ్‌ వంటి ఇంక్యుబేటర్ల ద్వారా ఐటీ రంగంలో ముందున్నామని వెల్లడించారు. త్వరలోనే టీ-హబ్‌ రెండో దశ ప్రారంభం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నామని, ప్రస్తుతం ఉన్న విదేశీ స్టార్టప్‌ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందుకు ఉద్దేశించిన టీ-బ్రిడ్జి కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టీ-బ్రిడ్జి కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్‌ స్టార్టప్‌లతోనూ కలిసి పనిచేసేందుకు కృషిచేయాలని చెప్పారు. దీం తోపాటు అగ్రిటెక్‌ రంగంలోనూ అనేక అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నార''ని ఆ కథనంలో వివరించారు. విశాఖలో ఎన్టీఆర్ విగ్రహం మాయం విశాఖ నగరంలో ఎన్టీఆర్ విగ్రహం మాయమైందని 'ఈనాడు' వార్తాకథనం తెలిపింది. ''ఎన్టీఆర్ విగ్రహం మాయం కావడంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పీఎంపాలెం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. మధురవాడ మార్కెట్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు పెకిళించి పట్టుకుపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నార''ని ఆ కథనంలో ఉంది. పాకిస్తాన్ నుంచి విడుదలైన మత్స్యకారులు ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదు పాకిస్తాన్‌లోని జైలు నుంచి విడుదలై స్వస్థలాలకు చేరుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారని 'సాక్షి' కథనం తెలిపింది. ''పాక్‌ జైలుకెళ్లాక మా ఊరికి ప్రాణాలతో వెళతామన్న ఆశ లేకపోయింది. మా బతుకులు ఇక్కడే తెల్లారుతాయనుకున్నాం. మాచేత ఇష్టానుసారం పనులు చేయించేవాళ్లు. అన్నం సరిగ్గా ఉండేది కాదు. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలసి గోడు చెప్పుకున్నామని, తప్పక విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారని మావాళ్లు వర్తమానం పంపారు. జగన్‌ అధికారంలోకి వచ్చారన్న విషయం తెలిసి సంతోషించాం. విడిపించడమే కాదు, ప్రతి జాలరికి రూ.2 లక్షలిస్తామని కూడా ఆయన చెప్పారని విన్నాం. అన్నట్లుగా జగన్‌ మమ్మల్ని విడిపించడమేగాక ఊహించిన దానికంటే ఎక్కువగా రూ.5 లక్షలు సాయం చేశారు. ఈ డబ్బుతో ఏదైనా పని చేసుకుని బతుకుతాం. ఈ జీవితం ఆయనదే..'' అంటూ పాక్‌ చెర నుంచి విడుదలైన నక్కా అప్పన్న కన్నీటి పర్యంతమయ్యాడు. హుద్‌హుద్‌ పెను తుపానుతో సర్వం కోల్పోవడంతో బతుకుతెరువుకోసం కొడుకు ధన్‌రాజ్‌(14)తో కలసి గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అప్పన్న పొరపాటున పాకిస్తాన్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో పాక్‌ నావికాదళ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. ఫలితంగా ఇతర మత్స్యకారులతోపాటు ఈ తండ్రీకొడుకులు పాకిస్థాన్‌ జైలులో 14 నెలలపాటు దుర్భర జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఎట్టకేలకు జగన్‌ సర్కారు చొరవతో ఇతర మత్స్యకారులతోపాటు పాక్‌ చెర నుంచి బయటపడిన వారిద్దరూ బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశార''ని ఆ కథనంలో తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి.. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మధ్య ట్విటర్‌ వార్‌ నడిచిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది. text: చైనా తన పనులు నెరవేర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది తేటతెల్లం చేసింది. చైనా గూఢచర్యం ఏ స్థాయిలో ఉంది? అది ఎలా నడుస్తుంది? ఎవరు నడుపుతారు? మాజీ ఎం-16 గూఢచారి సహకారంతో ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్‌ అనేక అంశాలను బయటపెట్టింది. తమ టెలికాం కంపెనీ తిరిగి బ్రిటన్‌లో కార్యకలాపాలు కొనసాగించడానికి చైనా ప్రభుత్వం ఆ దేశ రాజకీయ నాయకులతో ఎలా వ్యవహారం నడిపిందో.. ప్రముఖ వ్యక్తులను ప్రభావితం చేయడానికి ఎలా ప్రయత్నించిందో అందులో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చైనా కంపెనీలో అంతర్గతంగా ఒక విభాగం పని చేస్తుంటుంది. ఇది చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీకి జవాబుదారీగా ఉంటుంది. ఆయా సంస్థలు తమ దేశ రాజకీయ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నాయా? లేదా అనేది ఈ విభాగం నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. ఈ తరహాలోనే బిజినెస్ ముసుగులో చైనా కమ్యూనిస్టు పార్టీ బ్రిటన్‌లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. "కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ప్రపంచమంతా ఉంటుంది'' అని ఒకరు వ్యాఖ్యానించారు. "చైనాకు సంబంధించినంత వరకు వ్యాపారం, రాజకీయాలు వేర్వేరు కాదు'' అని ఆయన అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి 9 కోట్ల 30 లక్షలమందికి పైగా సభ్యులున్నారు. వారిలో చాలామంది వివిధ దేశాలలోని సంస్థల్లో పనిచేస్తుంటారు. రహస్యాలు సేకరించడానికి ముఖ్యంగా టెక్నాలజీ, టెలికాం రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో వీరు క్రియాశీలంగా ఉంటారు. విదేశాలలోని కంపెనీలలో పనిచేసే వీరంతా ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటారు. వివిధ రకాల పద్దతుల్లో ఆయా దేశాలలోని అధికారులను, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. హనీట్రాప్‌ చైనా తన వ్యూహాల అమలులో అనేక ఎత్తుగడలు వేస్తుంది. తమ లక్ష్యం చైనాయేతరుడైన అధికారి అయితే పెద్ద మొత్తంలో బహుమతుల రూపంలో అతన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది మొదటి రకం విధానం. ఆ తరువాత అనేక విధాలుగా ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటివి చేస్తుంటారు. పాశ్చాత్య దేశాల వారికి చైనాలో పెద్దపెద్ద బిజినెస్‌ మీటింగ్‌లకు ఆహ్వానం పంపడం, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు ధన రూపంలో సాయం చేయడం, లేదంటే ఏ కంపెనీలోనో నాన్‌- ఎగ్జిక్యుటివ్‌ బోర్డ్‌ మెంబర్‌ పదవిని కట్టబెట్టడం, ఒక్కోసారి వారి జీవితమే మారిపోయేంత డబ్బును ఆఫర్‌ చేయడంలాంటి పనులు చేస్తుంటాయి. గత పది, పదిహేనేళ్లుగా కీలకమైన విదేశీ వ్యక్తులను భారీ నజరానాలతో ఆకట్టుకునే పద్ధతి క్రమంగా పెరుగుతూ వచ్చినట్లు తేలింది. ఇక చైనాలో కూడా ఇలాంటి విధానాలు కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. దేశంలో ఉన్న వారి కుటుంబం సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం, బ్లాక్‌మెయిల్ చేయడం, విదేశీవ్యాపారులైతే వారికి అమ్మాయిలను ఎరవేయడం(హానీట్రాప్) సర్వసాధారణం. ఆకర్షణీయమైన మహిళలతో వారి పరిచయం కలగజేసి వారితో సంభాషణలు, ఇతర వ్యవహారాలను రికార్డు చేసి.. బ్లాక్ మెయిల్ చేస్తారు. "సొంత దేశంలో హనీట్రాప్‌ను సెట్‌చేయడంలో చైనా ప్రభుత్వం నేర్పరి'' అని చైనాలో పని చేస్తున్న ఒక బ్రిటిష్‌ అధికారి అన్నారు. ఇలాంటివన్నీ చైనా రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. కాకపోతే ఇవన్నీ కేంద్రీకృత విధానంలో కాకుండా, వివిధ రాష్ట్రాల రక్షణ విభాగాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల వ్యవహారాలను విడివిడిగా పర్యవేక్షిస్తుంటాయి. ఉదాహరణకు అమెరికా వ్యవహారాలను షాంఘై బ్యూరో చూసుకుంటే , రష్యా వ్యవహారాలను బీజింగ్‌ బ్యూరో.. జపాన్‌, కొరియా వ్యవహారాలను టియాంజిన్‌ బ్యూరో చూసుకుంటాయి. ఇలా ఒక్కొక్క బ్యూరో ఒక్కో దేశ వ్యవహారాలు చూస్తుంది. "సమాచార సేకరణ కోసం చైనా ప్రభుత్వం తన అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటుంది'' అని ఈ వ్యవహారాలలో పాలుపంచుకున్న ఓ వ్యక్తి వెల్లడించారు. భారీ సైబర్‌ గూఢచర్యం దగ్గర్నుంచి, ఇండస్ట్రీ నిపుణులను లోబరుచుకునే వరకు, వివిధ మార్గాలలో ఇది కొనసాగుతుంది'' అని ఆయన వెల్లడించారు. "రష్యాతోపాటు, ఇప్పుడు చైనా కూడా బ్రిటన్‌కు అతి పెద్ద గూఢచర్య ముప్పుగా పరిణమించింది'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టెలికాం దిగ్గజం హువావే చుట్టూ తాజాగా అల్లుకున్న వివాదం, చైనా గూఢచర్యం విధానాలను మరోసారి బయటపెట్టింది. text: ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో ఎన్నికల కమిషన్ national voters service portal ‌లో ఓటర్ల జాబితాను పెడుతుంది. అందుకే మీ పేరు ఉందో లేదో ఈ లింకులో చెక్ చేసుకోండి. ఈ వెబ్‌సైటును ఓపెన్ చేసి, అందులో పేరు, తండ్రి / భర్త పేరు, వయసు / పుట్టిన తేదీ, స్త్రీ/పురుష/ఇతరులు లింగ వివరాలను సంబంధిత కాలమ్‌లలో ఎంటర్ చేయాలి. ఆ తరువాత మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫామ్ 6ని నింపి మీ సమాచారాన్నివ్వండి. ఒకవేళ మీరు మొదటిసారి ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకుంటున్నా సరే, ఫామ్ 6 ని నింపి పంపివ్వాలి. ఫామ్‌తో పాటు ఇంకేం డాక్యుమెంట్లు కావాలి? ఫామ్‌తో మరో మూడు డాక్యుమెంట్లు అవసరమవుతాయి. 1. ఒక కలర్ ఫొటో 2. వయస్సును ధృవీకరించే పత్రం. (పదో తరగతి సర్టిఫికెట్‌ లాంటిది) 3. నివాస ధృవీకరణ పత్రం. రేషన్ కార్డు, ఫోన్, విద్యుత్తు బిల్లులు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు లేదా ఆధార్ కార్డు. నింపిన ఓటరు గుర్తింపు కార్డు ఫామ్‌ను ఎవరికి పంపివ్వాలి? పూర్తి చేసిన ఫామ్ 6తో పాటు ఇతర డాక్యుమెంట్లను మీ ప్రాంతీయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలి. తరువాత మీ పేరు ఓటరు జాబితాలో నమోదవుతుంది. ఫామ్ 6ను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించొచ్చు. వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ లింక్‌పైన క్లిక్ చేయాలి. దానికోసం మొదట యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ను సృష్టించుకొని వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఫొటోతో పాటు ఇతర డాక్యుమెంట్లను కూడా అక్కడ అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీ వయసు 21 ఏళ్లు దాటి, మీరు తొలిసారి ఓటును నమోదు చేసుకుంటున్నట్లయితే, వయసును ధృవీకరించడానికి మీరు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఒకవేళ వాటిని అప్‌లోడ్ చేయడంలో సమస్యలున్నా, లేక ఆన్‌లైన్‌‌లో సమర్పించడం ఇష్టం లేకపోయినా, ఆ ఫామ్‌ను ప్రింట్ తీసుకొని ఇతర డాక్యుమెంట్లతో పాటు election registrar office లేదా Voters Registration Centre సమర్పించొచ్చు. ఆ తరువాత ఒక బూత్ స్థాయి సిబ్బంది తనిఖీ కోసం వస్తారు. ఆ సమయానికి మీరు ఇంట్లో లేకపోయినా ఇతర కుటుంబ సభ్యులతోనో లేదా స్థానికులతోనో మీరిచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసుకుంటారు. కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో ఫామ్ సమర్పించాక కూడా కార్యాలయానికి పిలిపిస్తారనే ఫిర్యాదులు అందుతుంటాయి. కాబట్టి అవకాశం ఉంటే నేరుగా election registrar office కి వెళ్లి దరఖాస్తును ఇచ్చిరావడం ఉత్తమం. ఆ తరువాత అప్లికేషన్ ఐడీ ఇస్తారు. దాంతో ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. లేఖ ద్వారా గానీ, ఎస్సెమ్మెస్ ద్వారా గానీ మీ పేరు నమోదైందో లేదోనన్న సమాచారాన్ని అందిస్తారు. ఓటరుగా నమోదు కోసం ఉండాల్సిన అర్హతలు భారతీయుడై ఉండాలి. 2019 జనవరి 1 నాటికి 18ఏళ్ల వయసు దాటుండాలి. నివాస ప్రాంతంలోనే ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటును నమోదు చేసుకోవడానికి కుదరదు. ఓటరు గుర్తింపు కార్డులో తప్పులుంటే ఏం చేయాలి? ఒకవేళ మీ పేరు రిజస్టర్ అయ్యుండి, అందులో ఏ వివరాల్ని సరిచేయాలంటే ఈ ఫామ్ 8 ని నింపాలి. ఒకవేళ ఎవరి పేరైనా ఓటరు జాబితాలో నమోదవ్వడంపై అభ్యంతరాలుంటే ఫామ్ 7 ను నింపి సమాచారమివ్వాలి. ఓటరు ఐడీ పోతే ఏం చేయాలి? ఓటరు గుర్తింపు కార్డు గనుక పోయినట్లయితే కొత్త కార్డు కోసం 25 రూపాయల ఫీజు చెల్లించడంతో పాటు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆ వివరాలను election registrar office లో జమ చేయాలి. బూత్ స్థాయి అధికారి ఎవరో ఎలా తెలుస్తుంది? వెబ్‌సైట్ హోం పేజీలో ఆ సమాచారం ఉంటుంది. ఓటర్ ఐడీ రావడానికి ఎంత సమయం పడుతుంది? సాధారణంగా నెలలోపే ఓటర్ ఐడీ అందుతుంది. కాబట్టి, ఎన్నికలకు కనీసం రెండు నెలల ముందే ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేయడం మంచిది. జాబితాలో పేరు ఉన్నా.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఏం చేయాలి? ఓటరుగా నమోదు చేసుకుని, ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు లేకపోతే.. ఈ కింది పత్రాల్లో వేటినైనా ఉపయోగించుకుని ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం చెబుతోంది. ఓటరు జాబితాలో పేరు ఉండి.. పై గుర్తింపు పత్రాలు ఉన్న వారు.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కానీ.. రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు వంటి పత్రాలను ఓటు వేయటానికి గుర్తింపు పత్రాలుగా అంగీకరించరు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మీ దగ్గర ఓటరు ఐడీ ఉన్నంత మాత్రాన మీ పేరు ఓటరు జాబితాలో కచ్చితంగా ఉంటుందనడానికి లేదు. ఎన్నికల కమిషన్ తరచూ ఈ జాబితాను అప్‌డేట్ చేస్తుంటుంది. కాబట్టి పొరబాటున మీ పేరు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. text: అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ పి స్మిత్‌లతోపాటు బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ వింటర్ ఈ జాబితాలో ఉన్నారు. కొత్త ఎంజైములను సృష్టించేందుకు వీరు 'డైరెక్టెడ్ ఎవల్యూషన్' అనే పద్ధతిని ఉపయోగించారు. జీవశాస్త్రంలో రసాయనిక చర్యలు వేగంగా జరిగేందుకు వీరి పరిశోధనలు తోడ్పడతాయి. కొత్త ఔషధాలు తయారు చేయడంతోపాటు, పర్యావరణహిత ఇంధనాలు ఉత్పత్తి చేసేందుకు వీరు సృష్టించిన కొత్త ఎంజైములు ఉపయోగపడతాయి. బహుమతి మొత్తం 9,98,618 డాలర్లు. ఇందులో సగం ఆర్నాల్డ్‌కు దక్కనుండగా, మిగతా సగాన్ని స్మిత్, వింటర్ పంచుకోనున్నారు. క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా గుర్తించిన బ్యాక్టీరియా మోటార్ రసాయన శాస్త్రంలో గత నోబెల్ విజేతలు: 2017: జీవ అణువుల అభివృద్ధి, ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే తీరు వంటి వాటిని చూడగల 'క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ' అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు జాక్వస్ డబోషెట్, జోచిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లకు నోబెల్ లభించింది. 2016: ప్రపంచంలోనే అతి చిన్న యంత్రాన్ని తయారు చేసిన జీన్ పియెర్రా సావేజ్, ఫ్రేజర్ స్టాడర్ట్, బెర్నార్డ్ ఫెరింగాలకు నోబెల్ లభించింది. ఈ అతి చిన్న యంత్రాలు మానవుని శరీరంలోకి ఔషధాలను తీసుకుని వెళ్తాయి. 2015: దెబ్బతిన్న డీఎన్‌ఏను శరీరం కణాల ద్వారా సరి చేసే విధానాన్ని కనుగొన్న థామస్ లిండా, పాల్ మోడ్రిచ్, అజీజ్ సన్కార్‌లను నోబెల్ వరించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని తాజాగా ప్రకటించారు. ఎంజైములకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. text: జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో 25 మీటర్ల షూటింగ్‌లో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. టోక్యోలో 2021లో జరగనున్న ఒలింపిక్స్‌లోనూ పాల్గొనేందుకు ఆమె అర్హత సంపాదించారు. షూటింగ్‌లో చూపించిన ప్రతిభకు ఆమెకు అర్జున అవార్డు కూడా లభించింది. స్కూలులో ఎన్‌సీసీ క్యాడెట్‌లో చేరినప్పుడే ఆమెకు ఆయుధాలతో పరిచయం అయింది. వీటి వాడకంలో ఆమెకు నైపుణ్యం ఉందని, తుపాకీని చూడగానే ఆమెకు సాధికారత సాధించిన భావన కలుగుతుందని ఆమె చెప్పారు. తోటి విద్యార్థి తేజస్విని సావంత్ 2006లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో షూటింగ్‌లో బంగారు పతకం సాధించడం చూసిన తర్వాతే ఆమెకు షూటింగ్ పై ఆసక్తి పెరిగింది. తేజస్విని బంగారు పతకాన్ని సాధించడం చూసిన తర్వాత షూటింగ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిందని ఆమె చెప్పారు. ఆ తర్వాతే తను ఉంటున్న నగరంలో షూటింగ్ నేర్చుకోవడానికి ఉన్న సౌకర్యాల గురించి విచారించడం మొదలు పెట్టారని అన్నారు. కష్టాలతో ప్రయాణం షూటింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి కొల్హాపూర్‌లో తగినన్ని సౌకర్యాలు లేవని సర్నోబత్ గ్రహించారు. ఇక్కడున్న అరకొర సౌకర్యాల గురించి తనకున్న అసహనాన్ని ఆమె కోచ్‌తో పంచుకునేదాన్నని చెప్పారు. అయితే, సౌకర్యాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతిభకు పదును పెట్టేందుకు వీలైనంత ఎక్కువగా కృషి చేయమని ఆయన సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఆమె తల్లి తండ్రులు ఆమెకు పూర్తి సహకారం అందించారు. ఆమెకు తొలినాళ్లలో వచ్చిన అసహనం వలన ఆమె కలలను నిజం చేసుకునే దారిలో అడ్డు రాకుండా ఉండేందుకు వారు కూడా ప్రయత్నించారు. ఆమె ఉత్తమ శిక్షణ తీసుకోవడానికి ముంబయి వెళ్లారు. అయితే, ఆమె సమస్యలు అక్కడితో ఆగిపోలేదు. ఆమె సాధన కొనసాగించడానికి కావాల్సిన ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఆమె ఆశక్తి కోల్పోలేదు. ఆమె పడిన కష్టానికి ప్రతిఫలంగా ఆమెకు జాతీయ స్థాయిలో జరిగే షూటింగ్ పోటీలలో నిరంతరం పతకాలు లభిస్తూ ఉండేవి. లక్ష్యం పై గురి దేశీయ పోటీలలో ఆమె చూపిన విశేష ప్రతిభను చూసి ఆమెను భారతదేశం తరుపున ఆడేందుకు ఎంపిక చేశారు. ఆమె 2008లో పుణెలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించారు. తర్వాత ఆమె ఒలింపిక్స్, కామన్ వెల్త్, ఆసియన్ క్రీడలతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో కూడా భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు. ఒక క్రీడాకారిణిగా సర్నోబత్ కూడా కొన్ని బలహీన దశలను చవి చూశారు. అయితే, అలాంటి పరిస్థితులను నిలదొక్కుకుని పైకి లేచారు. 2015లో ఆమెకు తగిలిన గాయం ఆమె లక్ష్యానికి ఆటంకంగా మారింది. దాంతో ఆమె ప్రతిభను ప్రదర్శించుకోవడంలో ఆమె చాలా ఒత్తిడికి లోనయ్యారు. దాంతో ఆమె షూటింగ్ నుంచి శాశ్వతంగా విరమణ తీసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ, ఆమె ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఆ మరుసటి సంవత్సరం ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లోనూ బంగారు పతకం సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకు స్థానాన్ని కూడా సంపాదించారు. షూటింగ్‌లో సర్నోబత్ చూపిన ప్రతిభ.. ఆమెకు క్రీడల్లో గౌరవప్రదమైన అర్జున అవార్డును కూడా తెచ్చి పెట్టింది. ఈ అవార్దును సాధించడం తన జీవితంలోనే అత్యంత ఉద్వేగంతో కూడిన క్షణమని ఆమె చెబుతారు. ఆమె భారతదేశానికి ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశపు అత్యున్నత క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును సంపాదించేందుకు ఆమె ఒక గట్టి పోటీదారునిగా నిలవాలని ఆశిస్తున్నారు. (ఈ కథనంలోని అంశాలు రాహి సర్నోబత్ తో బీబీసీ ఈ-మెయిల్ ఇంటర్వ్యూ ఆధారంగా రాసినవి) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన ప్రముఖ షూటర్ రాహి సర్నోబత్ అంతర్జాతీయ షూటింగ్ పోటీలలో సాధించిన విజయాలతో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. text: పింక్ డాల్ఫిన్లను చూశారా? అత్యంత అరుదైన ఈ జలచరాలు దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ నదిలో కనిపిస్తాయి. అయితే, జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అమెజాన్ నదిలో వేట అధికమైంది. దాంతో ఈ అరుదైన డాల్ఫిన్ జాతి అంతరించి పోయే పరిస్థితి ఏర్పడుతోంది. వీటిని పరిరక్షించేందుకు కొలంబియాకు చెందిన జీవశాస్త్రవేత్త ఫెర్నాండో ట్రుజిల్లో 30ఏళ్లుగా కృషి చేస్తున్నారు. అక్రమ వేటను అడ్డుకునేందుకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో పనిచేస్తూ ప్రకృతి ప్రేమికుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సేవకు గుర్తింపుగా 2007లో వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ అవార్డు కూడా అందుకున్నారు. అమెజాన్‌ నదిలో పింక్ డాల్ఫిన్లు ఎలా ఉంటాయి? వాటి పరిరక్షణకు ఫెర్నాండో ఎలా కష్టపడుతున్నారో పై వీడియోలో చూడొచ్చు. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చాలా మంది నలుపు రంగులో ఉండే డాల్ఫిన్లను చూసే ఉంటారు. కానీ, పింక్ డాల్ఫిన్లు కూడా ఉంటాయి. text: పిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి తల్లిదండ్రులు ఎక్కువగా ఉపయోగించే అస్త్రం - అది రోజులో చాలా ముఖ్యమైన ఆహారం అని. మనలో చాలా మంది దానిని నమ్ముతూ పెరిగాం. బ్రేక్‌ఫాస్ట్‌ ఎందుకు ముఖ్యమైనది అనడానికి క్లూ దాని పేరులోనే ఉంది. మనం రాత్రంతా ఖాళీ కడుపుతో ఉండి, ఉదయపు అల్పాహారంతో దానికి బ్రేక్ వేస్తాం. ''మన శరీరం ఎదుగుదలకు, రిపేర్లకు రాత్రిళ్లు చాలా శక్తి ఖర్చయిపోతుంది. ఒక సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ శక్తిని తిరిగి పుంజుకుంటాం'' అని డైటీషియన్ సారా ఎల్డర్ తెలిపారు. అయితే మనం తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్‌కు ఏ స్థానం ఇవ్వాలన్న దానిపై చాలా వివాదమే ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌ ముఖ్య ఆహారమన్న వాదన వెనుక ఆహార పరిశ్రమ ఉందేమోనన్న అనుమానాల నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ప్రమాదకరమన్న అనేక వాదనలు ఉన్నాయి. ఇంతకూ బ్రేక్‌ఫాస్ట్‌ అత్యంత ముఖ్యమైనదన్న వాదన వెనుక వాస్తవం ఎంత? అది నిజమేనా లేక ఆహార సంస్థల మార్కెటింగ్ వ్యూహమా? బ్రేక్‌ఫాస్ట్‌-స్థూలకాయం బ్రేక్‌ఫాస్ట్‌ గురించి జరిగే చాలా పరిశోధనల్లో స్థూలకాయం ఒక ముఖ్యాంశంగా ఉంటోంది. ఆ రెండింటికీ మధ్య ఉన్న సంబంధం గురించి సైంటిస్టులు భిన్నమైన సిద్ధాంతాలు చెబుతారు. అమెరికాలో ఏడేళ్లపాటు 50 వేల మందిపై నిర్వహించిన ఒక పరిశోధనలో, వారి ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువ పరిమాణంగా ఉన్నవారిని పరిశీలించారు. ఈ పరిశోధనలో మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం ఎక్కువ(పరిమాణం)గా చేసే వారికన్నా బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటున్న వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) తక్కువగా ఉంటుందని వెల్లడైంది. బ్రేక్‌ఫాస్ట్‌ ఆకలి తీరిన తృప్తిని ఇస్తుందని, బ్రేక్‌ఫాస్ట్‌లోని ఆహార పదార్థాలలో పీచుపదార్థాలు, న్యూట్రియెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఆహార నాణ్యత పెరుగుతుందని పరిశోధకులు వాదించారు. అంతే కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల తదనంతరం చేసే భోజనంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని అన్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేయనివారికి స్థూలకాయం వచ్చే అవకాశం ఉందా? దీన్ని కనుగొనేందుకు పరిశోధకులు 52 మంది స్థూలకాయ మహిళలపై 12 వారాల పాటు వెయిట్ లాస్ ప్రయోగం నిర్వహించారు. వారందరికీ రోజులో ఒకే మోతాదులో కెలోరీలు కలిగిన ఆహారాన్ని ఇచ్చారు. అయితే వారిలో సగం మంది బ్రేక్‌ఫాస్ట్ చేయగా, మిగతా సగం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. అయితే కేవలం బ్రేక్‌ఫాస్ట్‌ వల్లే వాళ్లు బరువు కోల్పోలేదని తేలింది. వాళ్ల రొటీన్‌ మారడం వల్ల బరువు కోల్పోయారు. బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన బృందంలో - తాము గతంలో బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారమని చెప్పిన మహిళలు, మానేసాక 8.9 కిలోలు తగ్గామని చెప్పగా, అదే బ్రేక్‌ఫాస్ట్ చేయని బృందం 6.2 కిలోలు మాత్రం తగ్గారు. అదే సమయంలో బ్రేక్‌ఫాస్ట్ చేయని బృందంలో - బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ప్రారంభించినపుడు 7.7 కిలోలు కోల్పోయామని, బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం కొనసాగించినపుడు 6 కిలోలు తగ్గామని తెలిపారు. బరువు తగ్గడానికి బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే కారణం కానపుడు, మరి స్థూలకాయానికి, బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడానికి మధ్య సంబంధం ఏమిటి? బ్రేక్‌ఫాస్ట్‌ చేయని వాళ్లకు పోషకాహారం, ఆరోగ్యం గురించి సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమై ఉండవచ్చని యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్ లో ప్రొఫెసర్ అలెగ్జాండ్రా జాన్‌స్టోన్ తెలిపారు. ''సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్లు పొగ తాగకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండడం కారణం కావచ్చు'' అంటారు ఆమె. విందా? ఉపవాసమా? తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్న వారు రాత్రంతా ఏమీ తినకుండా ఉండడమే కాకుండా, దానిని మరుసటి రోజు పగటి పూట కూడా కొనసాగించడమనే అలవాటు పెరుగుతోంది. 2018లో నిర్వహించిన ఒక పరిశోధనలో, మధ్యమధ్యన ఉపవాసం ఉండడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ నియంత్రణలో ఉంటాయని, రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు. బర్మింగ్‌హామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రొఫెసర్ కర్ట్‌నీ పీటర్సన్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో.. ప్రి-డయాబెటీస్‌తో ఉన్న ఎనిమిది మంది పురుషులను ఎంపిక చేసుకుని, రెండు షెడ్యూళ్లలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోమని సూచించారు. ఒక షెడ్యూల్‌లో అన్ని కెలోరీలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీసుకుంటే, రెండో షెడ్యూల్‌లో అదే పరిమాణంలోని కెలోరీలను 12 గంటల కాలవ్యవధిలో తీసుకోమన్నారు. ఈ ప్రయోగంలో 9.00-15.00 బృందం ఆరోగ్యం, రక్తపోటును తగ్గించే మందులు తీసుకుంటున్న వారి ఆరోగ్యంతో సమానంగా ఉన్నట్లు తేలింది. ఇక యూనివర్సిటీ ఆఫ్ సర్రే , యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ పరిశోధకులు మనం ఏ సమయంలో తింటామనేది మన శరీర బరువుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, వెయిట్ లాస్‌లో ఎక్కువ లాభం ఉంటుందని తెలుస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం బ్రేక్‌ఫాస్ట్ కేవలం బరువు మీదే కాదు, ఇంకా ఇతర వాటిపై కూడా ప్రభావం చూపుతోంది. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం 27 శాతం పెరుగుతుంది. పురుషులలో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం 21 శాతం, మహిళలలో 20 శాతం ఎక్కువ అవుతోంది. దీనికి ప్రధాన కారణం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండే పోషకాహార విలువలే. బ్రేక్‌ఫాస్ట్‌లోని తృణధాన్యాలలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. బ్రిటన్‌లో 1,600 మంది యువతీయువకులపై నిర్వహించిన ఒక పరిశోధనలో, క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో పీచుపదార్థం, మైక్రోన్యూట్రియెంట్స్ గ్రహిణశక్తి ఎక్కువగా ఉందని తేలింది. బ్రేక్‌ఫాస్ట్ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందని.. ఏకాగ్రత, భాషా నైపుణ్యాలను పెంచుతుందని.. బ్రేక్‌ఫాస్ట్‌ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని వెల్లడైంది. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో మనం ఏం తింటున్నామనేది కూడా ముఖ్యమే. హై ప్రొటీన్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఇంకా ఆహారం కావాలనే కోరిక తగ్గుతుంది. అయితే బ్రిటన్, అమెరికాలలో నిర్వహించిన ఒక పరిశోధనలో పెద్దలు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లోని తృణధాన్యాలలో ఫ్రీ షుగర్ మనం రోజుకు తీసుకోవాల్సిన దానికన్నా, ముప్పాతిక భాగం ఎక్కువగా ఉంటుందని తేలింది. శరీరం చెప్పేది వినండి చివరగా మనం ఖచ్చితంగా ఏం తినాలి, ఎప్పుడు తినాలనేదానిపై ఒక నిర్ణయానికి రాలేకున్నా, మనం శరీరం చెప్పేది వింటూ మనకు ఆకలైనప్పుడల్లా తింటూ ఉండాలి. ''నిద్ర లేవగానే ఆకలి అనిపించే వాళ్లు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం'' అని జాన్‌స్టోన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ రోజును ఒక్కో రకంగా ప్రారంభిస్తారు. అందువల్ల వాళ్ల మధ్య తేడాలను, మరీ ప్రత్యేకించి గ్లూకోజ్ పని చేసే తీరును నిశితంగా పరిశీలించాలి. చివరిగా ఏదో ఒక్క పూట ఆహారంపై దృష్టి పెట్టడం కాకుండా, మనం రోజంతా ఏం తింటున్నామో గమనించాలి. ''సమతుల బ్రేక్‌ఫాస్ట్ నిజంగా మంచిది. కానీ బ్లడ్ షుగర్‌ను తగిన స్థాయిలో ఉంచడానికి రోజంతా క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం ఇంకా ముఖ్యం. దీని వల్ల బరువును, ఆకలిని నియంత్రించుకోగలుగుతాం'' అని ఎల్డర్ తెలిపారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉండే వాళ్లెవరూ బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా ఉండరని వింటూ వచ్చాం. దీని అర్థం బ్రేక్‌ఫాస్ట్‌ మనల్ని ఆరోగ్యంగా, సన్నగా చేస్తుందా? లేదా దాని వెనకాల మరేదైనా కారణముందా? text: నేను ఈ వ్యాసం రాస్తున్నపుడు చెన్నైలో వర్షం పడింది. మొదటి తొలకరి జల్లు. కానీ అరగంటలో ఆగిపోయింది. అయినాకానీ నగర వీధుల్లో వరద పోటెత్తింది. ట్రాఫిక్‌ జాం అయిపోయింది. చెన్నై నగరంలో వరదల ముప్పు, నీటి కొరత - రెండిటికీ మూలాలు ఒకటే కావటం వైచిత్రి. వృద్ధి చెందే తొందరలో గుడ్డిగా పరుగులు తీసిన నగరం.. తన నీటిని సంరక్షించే వనరులనే మింగేస్తూ విస్తరించింది. 1980 నుంచి 2010 మధ్య నగరంలో భారీ నిర్మాణాలు వెల్లువెత్తాయి. ఫలితం.. అప్పటికి 47 చదరపు కిలోమీటర్లుగా ఉన్న భవనాల కింది భూభాగం విస్తీర్ణం అమాంతంగా 402 చదరపు కిలోమీటర్లకు పెరిగిపోయింది. మరోవైపు.. చిత్తడిభూముల కింద ఉన్న ప్రాంతాలు 186 చదరపు కిలోమీటర్ల నుంచి 71.5 చదరపు కిలోమీటర్లకు కుదించుకుపోయింది. కరవు కానీ, భారీ వర్షాలు కానీ ఈ నగరానికి కొత్త కాదు. ఈ ప్రాంతానికి అక్టోబర్, నవంబర్‌లలో నీళ్లు మోసుకొచ్చే ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడెలా ఉంటాయన్నది అంచనా వేయలేం. కొన్ని సంవత్సరాలు కుండపోత కురిపిస్తాయి. మరికొన్ని సంవత్సరాలు ముఖంచాటేస్తాయి. ఈ రెండు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. ఈ ప్రాంతంలో ఎలాంటి జనావాసాలనైనా డిజైన్ చేయాల్సి ఉంటుంది. వృద్ధిని అడ్డుకునేది భూమి కొరత కాదు.. నీటి కొరత. చెన్నై, దాని పరిసర జిల్లాల్లో తొలి వ్యవసాయ ఆవాసాలు సరిగ్గా ఇదే చేశాయి. ఈ ప్రాంతపు చదునైన తీర మైదానాల్లో పెద్దగా లోతులేకున్నా విస్తారమైన చెరువులను తవ్వారు. ఆ చెరువులను తవ్వితీసిన మట్టినే వాటికి కట్టలుగా పోశారు. నిజానికి ఇక్కడ ముందుగా నీరు నిలబడటానికి, ప్రవహించటానికి సదుపాయాలను సృష్టించారు. ఆ తర్వాతే జనావాసాలు వచ్చాయి. ఈ వ్యవసాయ తర్కంతో ఖాళీ భూములకు జీవమొచ్చింది. ప్రతి గ్రామంలో.. పోరంబోకుగా వర్గీకరించిన నీటి వనరులు, పచ్చికమైదానాలు, అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉండేవి. ఈ భూముల్లో భవన నిర్మాణాలు నిషిద్ధం. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం మూడు జిల్లాల్లోనే 6000కు పైగా చెరువులు ఉండేవి. వాటిలో కొన్నిటి వయసు 1500 సంవత్సరాల పైమాటే. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సుదీర్ఘ దూరాలకు నీటిని రవాణా చేయటానికి బదులుగా.. నీరు ఎక్కడ కురిస్తే అక్కడే దానిని సంరక్షించే సాంకేతికత, వివేకం తొలినాళ్లలో నివసించిన వారికి ఉండింది. కానీ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అదంతా కనుమరుగైపోయింది. పట్టణ తర్కం వేళ్లూనుకుంది. ఖాళీ భూములకన్నా నిర్మాణ ప్రాంతాలు ఎక్కువ విలువైనవన్న భావన పెరిగింది. నిజానికి.. రాయల్ చార్టర్ 17వ శతాబ్దంలో చెన్నపట్టణాన్ని నగరంగా చేర్చినపుడే ఈ ప్రాంతపు 'నీటి శూన్య' తేదీ ఖరారైందని కొందరు వాదించవచ్చు. బ్రిటిష్ వలస ప్రాంతంగా పుట్టిన ఈ నగరం.. శరవేగంగా గ్రామీణ ప్రాంతాన్ని ఆక్రమించేసింది. 1876లో మద్రాస్ కరవు సంభవించినపుడు.. ఫుళాల్ అనే ఓ చిన్న గ్రామంలోని ఒక చిన్న సాగునీటి చెరువును తమ నిర్వహణలోకి తీసుకున్న బ్రిటిష్ పాలకులు.. నగరానికి తాగునీరు సరఫరా చేయటం కోసం ఆ చెరువు సామర్థ్యాన్ని విపరీతంగా పెంచారు. దాని పేరును రెడ్‌హిల్స్ రిజర్వాయర్ అని మార్చారు. అదే చెన్నై నగరపు తొలి కేంద్రీకృత, భారీ బడ్జెట్‌తో కూడిన తాగునీటి ప్రాజెక్టు. దూరంగా ఉన్న ఓ నీటివనరు మీద ఆధారపడిన నగరవాసులకు, వేగంగా పట్టణీకృతమవుతున్న నివాస ప్రాంతాలకు.. స్థానిక నీటివనరులు, భూభాగాలతో అనుబంధం తెగిపోయింది. నగరంలో అంతర్గతంగా ఉన్న నీటి వనరుల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు అందుబాటులోకి రావటం.. నగరీకరణ అజెండాకు చాలా అనుకూలించింది. ఉదాహరణకు 1920ల్లో 70 ఎకరాల పురాతన మైలాపూర్ చెరువును మూసివేశారు. ఇప్పుడది చాలా జనసమ్మర్థంతో నిండిపోయిన నివాస, వాణిజ్య ప్రాంతం. దాని పేరు టి.నగర్. నిజానికి ఆ మైలాపూర్ చెరువు.. ఉత్తరంగా దాదాపు పది కిలోమీటర్లు విస్తరించి వున్న పెద్ద నీటి చెరువుల వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు ఈ చెరువుల్లో మిగిలిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే.. స్పర్‌ట్యాంక్ రోడ్, ట్యాంక్ బండ్ రోడ్ అని పిలిచే రహదారులు మాత్రమే. చెన్నై నగరం వేగంగా ఆర్థిక కేంద్రంగా మారుతూ వచ్చింది. ఐటీ రంగం, ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా నిలిచింది. ఈ పరిశ్రమలు.. చెన్నై నగరానికి కొత్త వలసలను ఆకర్షించటం, అరకొరగా ఉన్న వనరులపై ఒత్తిడి పెంచటమే కాదు.. ఈ ప్రాంతపు నీటి సదుపాయాలను చావుదెబ్బ తీశాయి. నాటి భూవినియోగ ప్రణాళిక.. మధ్యయుగపు తమిళనాడులో విలసిల్లిన సాధారణ సూత్రాలకు చాలా దూరం. చిత్తడిభూముల్లో నిర్మాణాలకు అనుమతిలేదు. చెరువులకు ఎగువ ప్రాంతాల్లో తక్కువ సాంద్రత నిర్మాణాలకు మాత్రమే అనుమతించారు. కారణం.. వర్షపు నీటి రిజర్వాయర్‌లోకి చేర్చటానికి ముందుకు ఈ భూములు వాటిని ఇంకించుకోవాల్సి ఉంటుంది. ఉపరితలం కింది పొరలోని ఈ నీరే.. చెరువుల్లో నీరు వినియోగంతో, కాలక్రమంలో తగ్గుతూ ఉన్నపుడు వాటిని నింపుతుంటుంది. ఇటువంటి కనీస తెలివిడిని విస్మరించి.. చెన్నైలో అమూల్యమైన పల్లికరారానై చిత్తడి నేలల్లో ఐటీ కారిడార్ (నగరంలో ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతం)ను నిర్మించారు. పుళల్ రిజర్వాయర్ - చెన్నై తొలి కేంద్రీకృత, భారీ బడ్జెట్ నీటి ప్రాజెక్టు నగరంలో అతి పెద్ద తాగునీటి చెరువైన చేంబరంబాక్క ఎగువ ప్రాంతాన్ని ఇప్పుడు ఆటోమోటివ్ స్పెషల్ ఎకానమిక్ జోన్‌గా మార్చారు. ఇతర నీటివనరులతో కూడా ఇదే తరహా నిర్లక్ష్యంతో వ్యవహరించారు. పేరుంగుడి చెత్త కుప్ప.. పల్లికారానై చిత్తడి భూముల మధ్యలో అంతటా విస్తరించింది. తమిళనాడులో అతి పెద్ద పెట్రోకెమికల్ రిఫైనరీ కోసం 1960లో మనాలి చిత్తడిభూములను ఎండబెట్టారు. నగరానికి అవసరమైన విద్యుత్ ఎన్నూర్ క్రీక్ మీద నిర్మించిన విద్యుత్ ప్లాంట్ల నుంచి వస్తుంది. అది సముద్రపు చిత్తడి నేల. ఇప్పుడు దీనిని.. ఆ విద్యుత్ ప్లాంట్లకు బూడిద కుప్పగా మార్చేశారు. దాదాపు వెయ్యేళ్ల వయసున్న పళ్లవరమ్ పెద్ద చెరువును గత రెండు దశాబ్దాల్లో హైస్పీడ్ రహదారితో రెండు ముక్కలుగా చేశారు. అందులో ఒక ముక్క స్థానిక చెత్త కుప్పగా మారిపోయింది. చెన్నై నగరపు మొత్తం నీటి అవసరాల్లో అతికష్టంగా నాలుగో వంతు నీటి సరఫరా కూడా జరగటం లేదు. మిగతా మొత్తాన్ని శక్తివంతమైన వాణిజ్య నీటి సరఫరాదారుల వ్యవస్థ పంపిణీ చేస్తోంది. వారు ఈ ప్రాంతపు నీటి వనరులను అడుగంటా పీల్చేస్తుండటంతో అవి వట్టిపోతున్నాయి. నగరం నీటి అవసరాలను తీర్చటం కోసం.. చెన్నై చుట్టుపక్కల, ఆ వెనుక దూర ప్రాంతాల్లోని జనావాసాల్లో గల నీటిని, వారి జీవనాధారాలను బలవంతంగా లాగేసుకుంటున్నారు. నగరం నిర్జలీకరించిన ఈ ప్రాంతాల్లో జలసంక్షోభం ఎన్నడూ వార్తల్లోకి రాదు. పెట్టుబడిదారీ విధానాన్ని మార్చివేసి.. దాని స్థానంలో ప్రకృతిని, ప్రజలను దోపిడీ చేయని ఇతర వ్యాపార పద్ధతులను ఆచరణలోకి తేనట్లయితే.. ఈ ప్రపంచం మారదు. సాంకేతికత మీద గుడ్డి నమ్మకమున్న మన ప్రబల ఆర్థిక నమూనా విఫలమైంది. ఆధునిక అర్థశాస్త్రం.. ఖాళీ భూములు, నిర్మాణాలు లేని భూములను నిరుపయోగంగా పరిగణిస్తుంది. ఆ భూములను తవ్వటం ద్వారా, రంధ్రాలు వేయటం ద్వారా, పూడ్చటం ద్వారా, ఖనిజాలు తవ్వుకోవటం ద్వారా, చదును చేయటం ద్వారా, వాటిపై భవనాలు కట్టటం ద్వారా మాత్రమే ఇటువంటి భూముల నుంచి విలువ రాబట్టగలమని ఇది నమ్ముతుంది. ప్రపంచంలోని అన్ని ఆధునిక నగరాల్లోనూ భూ వినియోగాన్ని దిగజార్చటం.. వాతావరణ మార్పుకు కారణమవుతోంది. ఆయా నగరాలకు గల ప్రమాదాలను తేటతెల్లం చేస్తోంది. చెన్నై నగరం తన విలువలను తన భూమిని, నీటిని ఎలా చూసుకుంటుందనే దానిని తిరిగి సమీక్షించుకోనిదే.. వరదలు కానీ, కొరతలు కానీ.. నీటితో ఈ నగర పోరాటం పరిష్కారం కాదు. నగరం ఇంకా పెరిగిపోవటానికి, మరిన్ని భవనాలను నిర్మించటానికి అవకాశం లేదు. నిజానికి నగరం పరిమాణం క్రియాశీలంగా తగ్గాల్సిన అవసరముంది. రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో.. భూహితమైన ఆర్థిక విధానాలను, ప్రభుత్వ విధానాలను ప్రోత్సహించటం ద్వారా నగరం నుంచి ప్రజలు ఒక ప్రణాళికా బద్ధంగా బయటకు వలస వెళ్లటం సులభం చేయవచ్చు. కష్టమే అయినా కానీ.. ప్రకృతి ప్రకోపించే వరకూ వేచిచూడటం కన్నా ఇలా చేయటమే తక్కువ బాధాకరంగా ఉంటుంది. నిత్యానంద్ జయరామన్ చెన్నైలో నివసించే రచయిత, సామాజిక కార్యకర్త. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక ఏడాది వరదలు.. మరుసటి ఏడాది తుఫాను.. ఆ పై ఏడాది కరవు.. వరుస దెబ్బలు తింటున్న చెన్నై నగరం ప్రపంచ విపత్తు రాజధానిగా అపకీర్తి మూటగట్టుకుంటోంది. అయితే ఈ పరిస్థితి ఒక్క చెన్నై నగరానిది మాత్రమే కాదు. ఇలా ఎందుకు జరుగుతోందో పర్యావరణ ఉద్యమకారుడు నిత్యానంద్ జయరామన్ వివరిస్తున్నారు. text: సెప్టెంబర్ 7న అర్థరాత్రి దాటాక విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుత క్షణం కోసం కోట్లాది భారతీయులు ఆతృతగా ఎదురుచూశారు. టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో చంద్రయాన్-2 పురోగతిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ, 'హోవరింగ్ స్టేజ్' అనే అంతిమ దశలో ఒక సమస్య వచ్చింది. చంద్రుడి ఉపరితలానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తలకు ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగిన నాలుగో దేశంగా నిలవాలనుకున్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. తర్వాత, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ 'హార్డ్ ల్యాండింగ్' అయ్యిందని చెప్పింది. అది ల్యాండ్ అయ్యే ప్రాంతాన్ని నాసా ఉపగ్రహం తీసిన ఫొటోలు విడుదల చేసింది. కానీ, వాటిని చీకటిపడే సమయంలో తీయడంతో అక్కడ ల్యాండర్‌ను గుర్తించలేకపోయారు. చంద్రయాన్-2 లాంటి క్లిష్టమైన మిషన్‌ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, ఇప్పటివరకూ ఎప్పుడూ చేయలేదు. అందుకే, ల్యాండర్ దిగే చివరి దశను '15 నిమిషాల టెర్రర్‌'గా వర్ణించిన ఇస్రో ఛైర్మన్ కె. శివన్, ప్రయోగం తర్వాత తమ అధికారిక కమిటీ వివరాల ప్రకారం తమ మిషన్ 98 శాతం విజయవంతం అయ్యిందని చెప్పారు. ఈ ప్రయోగంలో రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్, కీలకమైన సమాచార సేకరణ లాంటి అత్యంత ముఖ్యమైన దశలు అసంపూర్తిగా ఉండిపోవడంతో ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని శివన్ చెప్పడం ఇస్రో తొందరపాటు అవుతుందని కొందరు శాస్త్రవేత్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ పేరుతో రూపొందించిన 27 కిలోల ల్యాండర్‌లోని పరికరాలు చంద్రుడిపై మట్టిని విశ్లేషిస్తాయి. ల్యాండర్ రెండు పెద్ద బిలాల మధ్య కచ్చితంగా అనుకున్న ప్రాంతంలో దిగి ఉంటే, దాని నుంచి బయటికొచ్చే ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లి విశ్లేషణ కోసం డేటా, ఫొటోలను తిరిగి భూమికి పంపించేది. 14 రోజుల జీవితకాలంలో అది తన సామర్థ్యం మేరకు 500 మీటర్ల దూరం ప్రయాణించేది. అయితే, కొంతమంది ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న కొందరు డాక్టర్ శివన్‌కు అండగా నిలుస్తున్నారు. చంద్రయాన్-2 మిషన్ విఫలమైందని చెప్పడం సరికాదని అంటున్నారు. ఒక అంతరిక్ష ప్రయోగం విజయాన్ని 'మనకు అందే సమాచారాన్ని' బట్టి కొలుస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఇస్రో శాస్త్రవేత్త బీబీసీతో చెప్పారు. "మేం కచ్చితత్వంతో లాంచ్ చేశాం. ఆర్బిటర్ మేం అనుకున్నట్టే వెళ్లడం అనేది మా విజయంలో చాలా ప్రధానమైన దశ. మా అంచనాలను అందుకోని చివరి దశ తప్ప, మిగతా మూడు దశలనూ ల్యాండర్ దాటింది" అని చెప్పారు. "ఇప్పుడు మేం ఆర్బిటర్ నుంచి అందే డేటా మీదే ఆధారపడ్డాం. ఇంధనం పెద్దగా ఖర్చు కాకపోవడంతో, ఆర్బిటర్ జీవితకాలం ఏడాది నుంచి ఏడేళ్లకు పెరిగింది. ఏడేళ్లలో ఆర్బిటర్ నుంచి మనకు ఏదైనా డేటా అందితే అది అదృష్టమే అనుకోవాలి. అంటే ఈ మిషన్‌లో చాలా సాంకేతికతలు పనిచేశాయి" అన్నారు. "మిషన్‌లో ఒక చిన్న భాగం మాత్రమే విఫలమైంది. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోయినా, చంద్రుడికి చాలా దగ్గరగా వెళ్లాక దానితో సంబంధాలు తెగిపోయాయి" అని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ మాధవన్ నాయర్ అన్నారు. "మిషన్‌లో ప్రతి దశకూ ప్రాధాన్యం ఇవ్వాలి. లాంచింగ్, ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలో అనుకున్న స్థానంలోకి చేర్చడం, ల్యాండర్‌ను ఆర్బిటర్ నుంచి వేరు చేయడం లాంటి మిగతా అన్ని దశలూ విజయవంతం అయ్యాయి". "ప్రపంచంలో చంద్రుడి ఉపరితలాన్ని స్పష్టంగా ఫొటోలు తీసింది బహుశా మనమేనేమో" అని మాధవన్ నాయర్ అన్నారు. "మరో గ్రహంపై సాఫ్ట్ ల్యాండింగ్ అనే ఘనతను ఇప్పటివరకూ మూడు దేశాలే అందుకున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయ్యుంటే, అది ఇస్రోకు ఒక పెద్ద సాంకేతిక విజయం అయ్యేది" అని సైన్స్ అంశాలు రాసే పల్లవ్ బాగ్లా చెప్పారు. అంగారకుడిపై ల్యాండ్ కావడం, అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపించడం లాంటి భారత భవిష్యత్ ప్రయోగాలకు ఇది మార్గం సుగమం చేసిందని కూడా ఆయన అన్నారు. చూస్తుంటే, ఇస్రో ఇప్పటికే దానికి సిద్ధమైనట్లు అనిపిస్తోంది. ది హిందూ పత్రికతో మాట్లాడిన డాక్టర్ శివన్.. "2021 డిసెంబర్ నాటికి మన సొంత రాకెట్‌, మొదటి భారతీయుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఇస్రో ఆ దిశగా కృషి చేస్తోంది" అని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చంద్రయాన్-2 మిషన్‌లో భారత్ చంద్రుడిపైకి పంపించిన ల్యాండర్ దాని ఉపరితలం పైకి చేరుకోకముందే భూమితో సంబంధాలు కోల్పోయింది. దానిని గుర్తించేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కానీ, అంతమాత్రాన ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని వైఫల్యంగా తోసిపుచ్చలేమని ఇస్రో శాస్త్రవేత్తలు బీబీసీకి చెప్పారు. text: నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా అవ్రిల్ హెయినెస్‌ను నియమించాలని నిర్ణయించినట్లు బైడెన్ తెలిపారు. ఈ నియామకం జరిగితే, ఈ పదవి చేపట్టిన తొలి మహళగా అవ్రిల్ ఘనత అందుకోనున్నారు. ఇక హోంల్యాండ్ భద్రత శాఖ సెక్రటరీ (మంత్రి) పదవికి అలెజాండ్రో మయోర్కాస్‌ను బైడెన్ ఎంచుకున్నారు. ఈ పదవి చేపట్టబోతున్న మొదటి లాటినో (లాటిన్ అమెరికా మూలాలు ఉన్న వ్యక్తి)‌ అలెజాండ్రోనే. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్... బైడెన్ చేతిలో తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బైడెన్‌కు అధికారం బదిలీ చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. అధ్యక్షుడికి రోజువారీగా సమర్పించే రహస్య నిఘా సమాచార నివేదిక (ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్)ను బైడెన్‌కూ అందజేసేలా వైట్ హౌస్ అవసరమైన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ప్రభుత్వ అధికారులతోపాటు, మిలియన్ల డాలర్ల నిధులు బైడెన్‌కు ఇప్పడు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్ష పదవి చేపడతారు. బైడెన్ టీమ్‌లోని కీలక సభ్యులు వీరే... బైడెన్ ఏమన్నారు? అమెరికా చరిత్రాత్మకంగా పోషిస్తున్న అంతర్జాతీయ నాయకత్వ పాత్రను బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని బైడెన్ అన్నారు. ‘‘ట్రంప్ మొత్తం వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. ‘అమెరికా ఫస్ట్, అమెరికా మాత్రమే’ అనే పరిస్థితికి తెచ్చారు. మన మిత్రులు భయాందోళనల్లో ఉన్నారు. మిత్ర కూటములను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కరోనావైరస్, వాతావరణ మార్పుల ముప్పులను కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అమెరికా వెనుకంజ వేయడం కాదు, ప్రపంచానికి దారి చూపేందుకు సిద్ధంగా ఉంది’’ అని బైడెన్ అన్నారు. కరోనావైరస్ వ్యాక్సీన్ పంపిణీ విషయమై కోవిడ్ కార్యాచరణ బృందంతో వైట్ హౌస్‌లో సమావేశమయ్యే ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పారు. జెక్ సల్లివాన్, లిండా థామస్-గ్రీన్ ఫీల్డ్, అంటోనీ బ్లింకెన్‌లను కీలక పదవులకు ఎంచుకున్న బైడెన్ ఎంచుకుంది వీరినే... అలెజాండ్రో మయోర్కాస్ (ఎడమ), అవ్రిల్ హెయిన్స్ (కుడి), జానెట్ యెలెన్ (మధ్యలో) కీలకమైన ఈ ఆరు పదవులకు బైడెన్ ఎంచుకున్న వ్యక్తుల విషయమై డెమొక్రటిక్ పార్టీ సెంటరిస్ట్ వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. విదేశాంగ విధాన నిపుణులు, విజయవంతమైన మహిళలు, నల్ల జాతీయులు... ఇలా భిన్న నేపథ్యాలు, అనుభవాలు ఉన్న వాళ్లు ఈ పదవులు చేపట్టబోతున్నవారిలో ఉన్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీలోని అభ్యుదయవాదులు మాత్రం బైడెన్ ఎంపికలపై పెదవి విరుస్తున్నారు. ఒబామా, క్లింటన్ హయాంల్లో ఉన్నవారితోనే ప్రభుత్వం మళ్లీ నిండుతోందని విమర్శిస్తున్నారు. ఇక బైడెన్ చుట్టూ ‘పాండాను కౌగిలించుకునేవాళ్లే’ ఉన్నారని, చైనా పట్ల వాళ్లు మెతక వైఖరి చూపుతారని అర్కాన్సస్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు టిమ్ కాటన్ అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ త్వరలో ఏర్పడబోయే తమ ప్రభుత్వంలో కీలకమైన ఆరు పదవులకు ఎవరెవరిని తీసుకోబోతున్నది ప్రకటించారు. text: ఆ వీడియోపై ''ముస్లింలు ఓటు వేయకుండా మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, శివసేన అడ్డుకుంటున్నాయి. మీడియా దీన్ని ప్రసారం చేయడం లేదు. అందువల్ల దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాలి'' అని ఉంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈ వీడియో వేలసంఖ్యలో షేర్ అయింది. "OSIX MEDIA" పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో ''ఓడిపోతామనే నిరాశతో ఎన్డీయే కూటమి ఇలాంటి ఉపాయాలు పన్నుతోంది. ముస్లింలను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్ఎస్, శివసేన కార్యకర్తలు... మహిళలు, పిల్లలను కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మీ బాధ్యత నిర్వహించండి'' అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. మా ప్రేక్షకులు కూడా ఈ వీడియో విశ్వసనీయత తెలుసుకునేందుకు మాకు వాట్సాప్ చేశారు. ఈ వీడియోలో చూపించినట్లు ముస్లింలను ఓటువేయకుండా పోలీసులు అడ్డుకున్నారనేది వాస్తవం కాదని మా పరిశీలనలో గుర్తించాం. ఈ వీడియోలోని వాస్తవం ఏమిటి? రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ప్రయత్నిస్తే ఈ వీడియోకు సంబంధించిన అనేక వార్తా కథనాలు కనిపించాయి. 1 ఏప్రిల్, 2019న ప్రచురితమైన వార్త ప్రకారం ఈ వీడియో గుజరాత్‌లోని వీర్గామ్ ప్రాంతానికి చెందినదని తేలింది. అక్కడ ముస్లింల స్మశాన వాటిక గోడపై ఓ మహిళ ఉతికిన బట్టలు ఆరేయడానికి ప్రయత్నించగా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఆర్పీ అసారీతో బీబీసీ మాట్లాడింది. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, '' ఈ వీడియో పాతది. 31 మార్చి 2019లో వీర్గామ్ పట్టణంలో ఠాకూర్లు, ముస్లింల మధ్య గొడవ జరిగింది. స్మశానవాటిక గోడ మీద ఒక మతానికి చెందిన మహిళ బట్టలు ఆరేయడానికి ప్రయత్నించడంతో మరో మతానికి చెందినవారు అభ్యంతరం చెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలై హింసకు దారితీసింది'' అని తెలిపారు. ''పోలీసులు అక్కడికి చేరుకోగానే ఒక వర్గానికి చెందిన వారు రాళ్లురువ్వడం మొదలుపెట్టారు. నేరస్థులను పోలీసులు పట్టుకున్నారు. ఈ వీడియోను వక్రీకరిస్తూ షేర్ చేస్తున్నవారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు'' అని పేర్కొన్నారు. (ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.) ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎన్నికల వేళ పోలీసులు లాఠీచార్జి చేసి ముస్లింలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. text: జకర్తాలోని దాదాపు సగం ప్రాంతం ఇప్పుడు సముద్ర మట్టానికి దిగువన ఉంది ప్రస్తుతం రాజధానిగా ఉన్న జకర్తా జనాభా కోటికి పైగా ఉంది. ఈ నగరం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో నీట మునుగుతోంది. నగరంలోని చాలా ప్రాంతాలు ఏటా 25 సెం.మీ. వరకు మునిగిపోతున్నాయి. దాదాపు సగం నగరం ఇప్పుడు సముద్ర మట్టానికి దిగువన ఉంది. ప్రస్తుతం రాజధానిగా ప్రకటించిన బోర్నియా ద్వీపంలోని రెండు ప్రాంతాలు కుటాయ్ కెర్తనేగర, పెనాజమ్ పేసర్ ఉతారా ఇంకా అభివృద్ధి చెందలేదు. ''రాజధానిగా ఎంచుకున్న ప్రాంతం చాలా వ్యూహాత్మకమైంది. ఇండోనేషియాకు ఇది మధ్యభాగంలో ఉంటుంది. అలాగే, నగర ప్రాంతానికి దగ్గర'' అని అధ్యక్షుడు విడోడో తన టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. ''పాలన, వ్యాపార లావాదేవీలు, ఆర్థికం, వాణిజ్యం, ఇతర సేవలకు కేంద్రంగా జకర్తా తీవ్రమైన భారాన్ని ఎదుర్కొంటుంది. కొత్తగా ఎంచుకున్న రాజధాని ప్రాంతంలో ప్రకృతి వైపరిత్యాలు వచ్చే అవకాశం తక్కువ'' అని పేర్కొన్నారు. జకర్తా నగరం రాజధాని మార్పునకు సంబంధింన ఈ ప్రతిష్టాత్మక పథకానికి దాదాపు 2.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. జకర్తాలో ట్రాఫిక్ సమస్య వల్ల ఆర్థికరంగంపై ఏడాదికి 1.47 వేల కోట్ల భారం పడుతోందని ప్రణాళిక మంత్రి గతంలో చెప్పారు. ఒరంగుటాన్ల సహజ ఆవాసాలకు సంబంధించిన అతికొద్ది ప్రదేశాలలో రాజధానిగా ఎంచుకున్న కాళీమంటన్ ప్రాంతం ఒకటి కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా మార్చడం వల్ల అక్కడున్న అరుదైన జాతులు అంతరించే ప్రమాదం ఉందని అంటున్నారు. ''కొత్త రాజధాని ప్రాంతం సహజ రక్షిత ఆవాసంలో నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'' అని ఇండోనేషియా గ్రీన్‌పీస్ ప్రచారకుడు జాస్మిన్ పుత్రి అన్నారు. కాళీమంటన్ ప్రాంతం కార్చిచ్చుకు కేంద్రంగా ఉంది. 2015 నుంచి దేశంలో కార్చిచ్చు ప్రమాదాలు ఆందోళన కలిగించే స్థాయికి పెరిగాయి. ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా వికేంద్రీకరణ చర్యలు చేపడుతూనే ఉంది. మున్సిపాలటీలకు ఆర్థిక, రాజకీయ అధికారాలను కలిగించేందుకు భారీ కార్యక్రమాలు చేపట్టింది. ఇండోనేషియానే కాదు గతంలో చాలా దేశాలు వివిధ కారణాలతో తమ రాజధాని నగరాలను మార్చాయి. బ్రెజిల్, పాకిస్తాన్, నైజీరియాలు రాజధాని ప్రాంతాలను మార్చాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇండోనేషియా రాజధానిని బోర్నియో ద్వీపంలోని తూర్పు కాళీమంటన్ ప్రావిన్స్‌కు మార్చనున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు. text: శిక్షలను వినేందుకు వేచి ఉన్న వ్యక్తుల వెనుక నిలబడిన సాయుధ పోలీసులు లూఫెంగ్ అనే ఈ నగరం చైనా దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఉంది. సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తికి లూఫెంగ్ కేంద్రంగా మారింది. ఈ ముద్రను చెరిపేసుకొనే ప్రయత్నాల్లో భాగంగానే, నేరస్థులకు బహిరంగంగా శిక్ష విధించడం, మరణ శిక్ష పడ్డ ఖైదీలను పరేడ్ చేయించి మరీ శిక్ష అమలుపరచడం చేస్తున్నట్లు కనిపిస్తోంది. హత్య, దోపిడీ, మాదక ద్రవ్యాల కేసుల్లో 12 మందికి ఈ నెల 16న లూఫెంగ్‌లో బహిరంగంగా శిక్షలు విధించారు. నేరం నిరూపితమైన ఈ 12 మందికి స్థానిక స్పోర్ట్స్ స్టేడియంలో శిక్షలు విధించనున్నారని, దీనిని ప్రత్యక్షంగా చూడాలని ప్రజలకు కోర్టు అంతకుముందు సూచించింది. వీరిలో డ్రగ్స్ కేసుల్లో 10 మందికి మరణ శిక్ష పడింది. వీరికి శిక్ష వెంటనే అమలైందని చైనాలో ప్రముఖ మీడియా వెబ్‌సైట్ 'ద పేపర్' వెల్లడించింది. వీరిని శిక్ష విధించిన ప్రదేశం నుంచి పోలీసు వాహనంలో ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లి, తుపాకీతో కాల్చి, శిక్షను అమలు చేశారు. నేరస్థుడిని పరేడ్ చేయిస్తున్న పోలీసులు ప్రపంచంలోకెల్లా మరణ శిక్షలు అత్యధికంగా అమలయ్యే దేశం చైనానే. ఏటా ఎంత మందికి ఈ శిక్ష అమలవుతోందో చెప్పే అధికారిక గణాంకాలు లేవు. అయితే వీటి సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా. చైనాలో ఇటీవలి కాలంలో బహిరంగంగా మరణ శిక్ష ప్రకటించడం అరుదు. అయితే దక్షిణ చైనా సముద్ర తీరాన ఉండే గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఈ ఘటనలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో లూఫెంగ్ జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా వార్తలకెక్కింది. లూఫెంగ్ ప్రాంతంలోని రెండు న్యాయస్థానాలు 18 మందికి బహిరంగంగా శిక్షలు ప్రకటించాయి. వీరిలో ఎనిమిది మందికి విచారణ ముగిసిన వెంటనే మరణ దండన అమలైంది. మాదక ద్రవ్యాల పట్ల తమ కఠిన వైఖరి చైనాలోని ఆన్‌లైన్‌ వేదికల్లో అందరి దృష్టికి వెళ్లేలా గ్వాంగ్‌డాంగ్ ప్రభుత్వం రెండు నెలలుగా బాగా ప్రయత్నిస్తోంది. నవంబరులో లూఫెంగ్ సమీంలోని జీయాంగ్‌ నగరంలో బహిరంగంగా శిక్ష విధించడానికి సంబంధించిన ఫొటోలను గ్వాంగ్‌జౌ డైలీ ప్రచురించింది. ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి పైగా ప్రజలు హాజరయ్యారని ఈ పత్రిక చెప్పింది. మాదక ద్రవ్యం క్రిస్టల్ మెథ్ ఈ నెల 16న లూఫెంగ్‌లో బహిరంగంగా శిక్షల విధింపునకు సంబంధించి అధికారులు చైనాలోని ప్రముఖ మొబైల్ మెసెంజర్ 'విచాట్' ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. తీర్పు ప్రకటన ఫుటేజీ చైనాలోని మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ 'సీనా వీబో', యూట్యూబ్ తరహా వెబ్‌సైట్ 'మియావోపై'లలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. విచారణకు సంబంధించిన వీడియోను 'ద బీజింగ్ న్యూస్' పత్రిక శనివారం ఆన్‌లైన్‌లో ఉంచగా.. 30 లక్షల మందికి పైగా చూశారు. గతంలో పట్టుబడిన మాదక ద్రవ్యాలు 'మనిషి ప్రాణానికి చైనా విలువ ఇవ్వడం లేదు' శిక్ష విధింపు వీడియోపై మానవ హక్కుల కార్యకర్తలు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మనిషి ప్రాణం, గౌరవం పట్ల తమకు ఏ మాత్రం పట్టింపు లేదని చైనా మరోసారి చాటుకుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన విలియం నీ 'ట్విటర్'లో మండిపడ్డారు. మైక్రోబ్లాగింగ్ సైట్ 'సీనా వీబా'లో చాలా మంది యూజర్లు ఈ చర్యపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 1960లు, 1970ల నాటి చైనా సాంస్కృతిక విప్లవం మళ్లీ వచ్చినట్లు తమకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మరణ శిక్షలు తేలిగ్గా ప్రకటించేస్తున్నారనే ఆందోళనను కొందరు యూజర్లు వ్యక్తపరిచారు. బహిరంగంగా మరణ శిక్ష ప్రకటించడం ఆక్షేపణీయమే అయినప్పటికీ, లూఫెంగ్ నగర ప్రతిష్ఠను కాపాడేందుకు ఈ చర్య తప్పదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మాదక ద్రవ్యాలు కెటామిన్, క్రిస్టల్ మెథమ్‌ఫెటామిన్ లూఫెంగ్‌లో ప్రధానంగా ఉత్పత్తి అవుతున్నాయి. డ్రగ్స్‌లో ఎక్కువ భాగం తూర్పు ఆసియా, ఆసియా పసిఫిక్ దేశాలకు రవాణా అవుతాయి. లూఫెంగ్ ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు పోలీసులు 13 వేలకు పైగా డ్రగ్స్ కేసుల విచారణను పూర్తిచేశారని, పది టన్నుల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని చైనా అధికార వార్తాసంస్థ 'జిన్హువా' వెల్లడించింది. ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనాలోని ఒక నగరంలో నేరస్థులకు బహిరంగంగా మరణ శిక్ష విధించడంపై చైనా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. text: విభజన హామీల కోసం సామ, దాన, బేద ఉపాయాలు అయిపోయాయినని.. ఇక మిగిలింది దండోపాయమేనని ఆయన అన్నారు. బాలకృష్ణ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే.. "ఎందరో మహానుభావులు పుట్టిన వేద భూమి మనది. వీర వనితలను కన్న పుణ్యభూమి మనది. సామ దాన దండోపాయాల్లో బీజేపీతో దండోపాయమే మిగులుంది. ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కాదు.. మీ ఇష్టమొచ్చినట్లు పరిపాలన కొనసాగించడానికి. హిందీలో మాట్లాడుతూ.. తెలుగు నాట ప్రతి ఒక్కరి నరనరాల్లో ఎన్టీఆర్ రక్తం ప్రవహిస్తోంది. ముందు పెద్దల్ని గౌరవించడం నేర్చుకోండి. అది సంస్కారం. అడ్వాణీని, ఇంట్లోని భార్యను గౌరవించండి..! మోదీకి తగిన గుణపాఠం నేర్పుతాం. ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే కాదు.. దేశం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉంది. అమిత్‌ షా లాంటి బాజాభజంత్రీలను నమ్మకు. పిరికివాడా.. నమ్మక ద్రోహీ! బయటకు రా. ప్రజలు నిన్ను వదలిపెట్టరు. నువ్వు ఎక్కడ దాక్కున్నా, నిన్ను భరత మాత వదిలిపెట్టదు. నిన్ను తరిమి తరిమి కొడతారు. ఆంధ్ర రాష్ట్రంలో నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడు. యుద్ధం మొదలైంది.. యుద్ధం మొదలైంది. ఇక మేం చూస్తూ కూర్చోలేం. గతంలో రామారావు గారి చలవ వల్ల, నేడు చంద్రబాబు చలవ వల్ల రాష్ట్రంలో సీట్లు గెలిచారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరెవరినో వాడుకుంటూ.. వారితో కుప్పిగంతులు వేయిస్తున్నాడు. రాజీనామాలు చేసి, నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ల మధ్య ప్యాకేజీల అవగాహనలున్నాయని మీకు తెలుసు.. వాళ్లను అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు మోదీ. కానీ వాళ్లకూ రావు, వీళ్లకూ రావు సీట్లు. రాజధాని భూమి పూజ కార్యక్రమంలో.. రెండు కుండలిచ్చిపోయారు. మాకు లేవా పవిత్ర నదీ జలాలు! ఇంతవరకూ మన సహనాన్ని పరీక్షించారు. అందరూ సిద్ధంగా ఉండండి. సైనికులుగా మారండి.. ఒక్కొక్కరూ ఒక్కొక్క అల్లూరి సీతారాములై, విప్లవ వీరులై, గౌతమీపుత్ర శాతకర్ణిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఈ పోరాటంలో ముందుకెళ్లాలి. దేనికైనా తెగించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా!" అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణవి చౌకబారు విమర్శలు: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం చేసిన సహకారాన్ని మరచిపోయి బాలకృష్ణ చవకబారు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కేవీ లక్ష్మీపతి రాజా వ్యాఖ్యానించారు. టీడీపీ అవినీతి బయట పడితే తన బావ, అల్లుడికి రాజకీయంగా పుట్టగతులుండవనే అభద్రతా భావంతో ఆయన దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన జన్మదినం రోజున చేపట్టిన 'ధర్మ పోరాట దీక్ష'లో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. text: బీబీసీ రేడియో 4లో ప్రసారమయ్యే 'మోర్ ఆర్ లెస్' కార్యక్రమం శ్రోత ఒకరు ఈ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించేముందు.. అసలు 'జంతువు'(యానిమల్) అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువులోని నిర్వచనం ప్రకారం.. ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారం తీసుకుని జీవిస్తూ... ప్రత్యేకంగా జ్ఞానేంద్రియాలు.. నాడీ వ్యవస్థ కలిగి ఉండి.. చర్యలకు తక్షణం ప్రతిస్పందించే స్వభావం కలిగిన జీవులను జంతువులు(యానిమల్స్) అంటారు. అంటే.. క్షీరదాలు(పాలిచ్చేవి).. క్షీరదాలు కానివి.. సకశేరుకాలు(వెన్నెముక కలిగినవి).. అకశేరుకాలు(వెన్నెముక లేనివి).. గుడ్లను పొదిగేవి.. ప్రసవం ద్వారా పిల్లలు పెట్టేవి అన్నీ ఆ కోవలేకే వస్తాయి. పై ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నంలో భాగంగా కొన్ని జీవుల జననాల లెక్కలను చూద్దాం. వైల్డ్‌లైఫ్ బ్రిటన్ అనే సంస్థ అంచనాల ప్రకారం.. యూకేలో 4 కోట్ల ఆడ అడవి కుందేళ్లు ఉన్నాయి. యూకేలోని ఒక్కో కుందేలు తన జీవిత కాలంలో సగటున ఏడు సార్లు పిల్లలను పెడుతుంది(ఈత అంటారు). ఒక్కో ఈతలో మూడు నుంచి ఏడు పిల్లలు పుడతాయి. అలా ఒక్కో కుందేలు ఏడు సార్లు పిల్లలను పెడితే.. అందులో ఒక్కోసారి ఐదు పిల్లల చొప్పున పుట్టాయి అనుకుంటే... ఆ దేశంలో సగటున ఒక్క రోజులో 19,17,808 కుందేళ్లు పుడుతున్నాయన్నమాట. గమనిక: అడవి కుందేళ్ల జీవిత కాలం ఒకటి నుంచి రెండేళ్ల మధ్యలో ఉంటుంది. ఆ లెక్కన చూస్తే కుందేళ్లు మందలు మందలుగా పెరిగిపోవాలి. కానీ.. కుందేలు పిల్లల మరణాల రేటు అధికంగా ఉంటుంది. కాబట్టి మన లెక్కలకు, వాస్తవ సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. లండన్ జూలో హంబోల్డ్ పెంగ్విన్ ఇకపోతే.. భూమ్మీద చాలా తక్కువ సంఖ్యలో ఉన్న జీవుల జాబితాలో హంబోల్డ్ జాతి పెంగ్విన్లు కూడా ఉన్నాయి. పెరూ, చీలీ దేశాల తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పెంగ్విన్లు.. ఒక్కోసారి రెండు చొప్పున ఏడాదికి పలుమార్లు గుడ్లు పెడతాయి. కొన్ని సర్వేల ప్రకారం.. ఏడాదిలో 14,400 హంబోల్డ్ పెంగ్విన్లు గుడ్లను పొదుగుతున్నాయి. సగటున చూస్తే రోజుకు 40 పిల్లలు ప్రపంచంలోకి వస్తున్నాయి. ఈ పెంగ్విన్లతో పోల్చితే కోడి పిల్లల సంఖ్య అనేక రెట్లు ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహారం మరియు వ్యవసాయం సంస్థ(ఎఫ్‌ఏఓ) అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 6.2 కోట్ల కోడి పిల్లలు పుడుతున్నాయి. కోళ్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల గుడ్లు పెడుతున్నాయి. కోళ్ల లెక్క భారీగానే ఉంది కదా. తేనెటీగల లెక్క అంతకు మించి ఉంటుంది. వేసవి కాలంలో ఒక్క రాణి తేనెటీగ రోజుకు 1,500 గుడ్లు పెడుతుందని అంచనా. 2018 జనవరిలో యూకే వ్యాప్తంగా 2,47,461 తేనెతుట్టెలు ఉన్నాయని ఇంగ్లాండ్‌లోని 'నేషనల్ బీ యూనిట్' ప్రయోగాత్మకంగా జరిపిన సర్వేలో తెలిపింది. ఒక్కో తేనె తుట్టెకు ఒక రాణి ఈగ ఉంటుంది. ఆ లెక్కన పరిస్థితులు అనుకూలిస్తే.. ఎండాకాలంలో రోజుకు 37,11,91,500 తేనెటీగలు పుడతాయి. ఈ లెక్కలన్నీ చూస్తుంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా? లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీకి చెందిన మోనికా బోమ్ కూడా అదే అంటున్నారు. "ఇంకా అనేక జీవజాతుల పునరుత్పత్తి వ్యవస్థపై మనకు సరైన అవగాహన లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జంతువుల జననాల సంఖ్యను కచ్చితంగా చెప్పడం సాధ్యమయ్యే పని కాదు" అని అంటారు ఆమె. అయితే.. క్వీన్ మేరీస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆక్సెల్ రోస్‌బర్గ్ మాత్రం ఆ లెక్కలను అంచనా వేయవచ్చని చెబుతున్నారు. "కొన్ని జంతువులు బరువులో భారీగా ఉంటాయి. కొన్ని చాలా తేలికగా ఉంటాయి. సంఖ్య విషయానికి వచ్చినప్పుడు ఆ భారీ జీవులు తక్కువగా ఉంటాయి. చిన్న జీవులు చాలా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు ఏనుగు బరువులో 1000వ వంతు ఉండే చిన్న జీవుల సంఖ్య.. ఏనుగుల కంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది. అలా పెద్ద జంతువుల జననాలను లెక్కించగలిగితే.. చిన్న జీవుల పుట్టుకనూ అంచనా వేయవచ్చు" అని ఆక్సెల్ వివరించారు. భూగోళం మీద అత్యధిక సంఖ్యలో ఉండే జంతువుల్లో నెమటోడ్ జాతి సూక్ష్మ జీవి ఒకటి. నేల మీద ఒక చదరపు మీటరు స్థలంలో 30 లక్షల నెమటోడ్లు ఉంటాయని అంచనా. ఈ నెమటోడ్ జాతికి చెందిన 'సీ ఎలీగాన్స్' అనే సూక్ష్మ జీవుల సంఖ్యపై అధ్యయనాలు విస్తృతంగా జరిగాయి. ఈ జీవులు గంటకు దాదాపు 5 గుడ్లు పెడతాయని తేలింది. ప్రొఫెసర్ ఆక్సెల్ రోస్‌బర్గ్ అంచనా ప్రకారం.. ఈ జీవులు 100 గుడ్లు పెడితే అందులో 1 గుడ్డు మాత్రమే పొదగబడుతుంది. అలా భూమి మీద రోజుకు 600 క్వింటిలియన్ల(6 తర్వాత 20 సున్నాలు) సీ ఎలీగాన్స్ నెమటోడ్లు పుడుతున్నాయి. ఆ సంఖ్య భూమి మీద మాత్రమే. అవి నీటిలోనూ జీవిస్తాయి. అవన్నీ లెక్కిస్తే ఇంకా ఎన్నో రెట్లు ఉంటుంది. ఇప్పటి వరకు రోజుకు 40 హంబోల్డ్ పెంగ్విన్లు.. 6.2 కోట్ల కోళ్లు.. 19,17,808 కుందేళ్లు(యూకేలో), 37,11,91,500 తేనెటీగలు(యూకే) పుడుతున్నాయన్న అంచనాకు వచ్చాం. భూగోళం మీద దాదాపు 77 లక్షల జంతుజాతులు ఉన్నాయని అంచనా. ఇంకా 99 శాతం సముద్ర గర్భాల్లో ఏఏ జీవులు ఉన్నాయో పరిశోధించాల్సి ఉంది. కాబట్టి.. అన్ని రకాల జీవజాతుల జననాలను లెక్కించే వరకూ ఈ ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి? ఈ ప్రశ్న మీలో ఎప్పుడైనా మెదిలిందా? text: సుప్రీం కోర్టు తీర్పులపై వివాదాలు నెలకొంటున్నాయి ఆ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారంతా ముస్లింలు. వారిలో 17 మంది మహిళలు, 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేసులో అప్పట్లో మొత్తం 56 మంది(హిందువుల్ని)ని నిందితులుగా తేల్చారు. అయితే అప్పట్లో వారందరికీ కేవలం రెండు నెలల్లో బెయిల్ మంజూరయ్యింది. గుజరాత్‌ నరమేధానికి సంబంధించిన కేసుల్లో జరుగుతున్న విచారణలో లోపాల్ని గుర్తించిన సుప్రీం కోర్టు వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. అలాగే సర్దార్‌పూర్ కేసు సహా 8 కేసుల్ని విచారించేందుకు ప్రత్యేక న్యాయమూర్తుల్ని కూడా నియమిచింది. చివరిగా మొత్తం31 మందిని దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం వారికి జీవిత ఖైదు విధించింది. అయితే వారంతా హైకోర్టులో అప్పీలు చేసుకోవడంతో వారిలో 14 మందికి శిక్షను నిలేపి వేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసేంత వరకు దోషులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చెయ్యకూడదు. ప్రస్తుతం జైళ్లలో ఉన్న ఖైదీలలో 68శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలే ఏళ్ల తరబడి జైలు గోడల మధ్యే జీవితం కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా నియమాలకు లోబడే బెయిల్ మంజూరు చెయ్యాలి తప్ప వాటిని అతిక్రమించి కాదు. ప్రస్తుతం జైళ్లలో ఉన్నవారిలో 68 శాతం విచారణలో ఉన్న ఖైదీలే. వారిలో 53 శాతం దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఉన్నారు. వారిలో 29 శాతం మంది నిరక్షరాస్యులు. విచారణలో ఉన్న ఖైదీల్లో చాలా మంది లాయర్లను పెట్టుకునేందుకు కూడా తగిన ఆర్థిక స్థోమత లేని వాళ్లు. అంతే కాదు వారి విషయానికొచ్చే సరికి న్యాయ సహాయం అందించే వ్యవస్థలు పూర్తిగా విఫలమవుతున్నాయి. చాలా మందికి బెయిల్ లభించినప్పటికీ అందుకోసం చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించే పరిస్థితుల్లో వారు లేకపోవడం, అలాగే వారి విషయంలో ష్యూరిటీ ఇచ్చేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య జీవితాలు వెళ్లదీస్తున్నారు. నిజానికి సర్దార్‌పుర్ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన వ్యక్తులు విచారణలో ఉన్న ఖైదీలు కాదు. అటు ప్రత్యేక న్యాయస్థానం , అలాగే హైకోర్టు కూడా దోషులుగా తేల్చిన వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు వ్యవహార శైలిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా హత్య కేసులో దోషులకు బెయిల్ మంజూరు చెయ్యరు. కానీ 2019లో హత్య కేసులో రెండు సార్లు కోర్టులు దోషిగా తేల్చిన బాబు బజరంగికి ఆరోగ్య కారణాల రీత్యా అత్యున్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. 2002లో జరిగిన నరొడ పాటియా నరమేధంలో ఓ ముస్లిం గర్భిణిని అత్యంత దారుణంగా హింసించి గర్భంలోని పిండాన్ని బయటకు తీశానంటూ ఓ స్టింగ్ ఆపరేషన్లో ఇదే వ్యక్తి వెల్లడించారు. ఇదే కేసులో మరో ముగ్గురు దోషులకు కూడా 2019లో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది . ఇక గుజరాత్‌లోనే జరగిన సబర్మతీ ఎక్స్‌ప్రెస్ దహనకాండలో కూడా 94 మందిని అరెస్ట్ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకు వీరిలో ఏ ఒక్కరికీ బెయిల్ లభించలేదు. చివరకు వారిని అరెస్ట్ చేసిన 8 ఏళ్ల తర్వాత 31 మంది దోషులుగా తేలగా మిగిలిన వారు నిర్దోషులుగా తేలారు. మరోవైపు 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత అరెస్ట్ అయిన వారికి కూడా బెయిల్ లభించింది. చాలా సందర్భాల్లో ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రాసిక్యూషన్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు కూడా రాకపోవడం గమనించాల్సిన విషయం. కొన్ని కేసుల విషయంలోనే ఎందుకలా ? అదే సమయంలో భీమా కోరేగావ్ వంటి ఇంకా విచారణలోనే ఉన్న కేసుల్లో నిందితుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ కేసుల్లో అరెస్ట్‌యిన వారిలో చాలా మంది లాయర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. ముఖ్యంగా కొన్ని లెటర్ల ఆధారంగా వారిని మావోయిస్టులని ముద్ర వేసి కేసులు పెడుతున్నారు. నిజానికి వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఉత్తరాలు వారు రాసినవి కావు, వారిని అడ్రస్ చేసి రాసినవి కావు, కనీసం ఈ మెయిల్ ద్వారా కూడా వారికి పంపినవి కావు. సాక్షాత్తు సుప్రీం కోర్టు న్యాయమూర్తే ఈ ఉత్తరాల ప్రామాణికత విషయంలో అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. అంతేకాదు ఎవరి సంతకాలతోనూ లేవు, ఎవరి చేతి రాత కాదు. కేవలం టైప్ చేసిన కాపీలు మాత్రమే. అలాంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్లకు గడిచిన ఏడాదిన్నర కాలంగా బెయిల్‌ తిరస్కరిస్తూనే వస్తున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా కేసునే తీసుకుంటే మావోయిస్టు పేరుతో చిన్న చిన్న ఆధారాలతోనే జైల్లో నిర్బంధించారు. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న ఆయనకు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఇలాంటి పరిస్థితే ఐపీఎస్ ఆఫీసర్ సంజివ్ భట్‌ది కూడా. ప్రస్తుత ప్రధానిని వ్యతిరేకించడమే ఆయన ఖైదు కావడానికి కారణమా అన్న ప్రశ్నలు కూడా అప్పట్లో తలెత్తాయి. జైల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రొఫెసర్ సాయిబాబా ఏ బెయిల్‌ను ఎటువంటి షరతులతో ఇచ్చారన్నది కూడా ముఖ్యమే. సర్దార్ పూర్ కేసులో చూస్తే బెయిల్ పొందిన దోషులు గుజరాత్‌లో అడుగుపెట్టకూడదు కానీ మధ్య ప్రదేశ్‌లో సామాజిక సేవ చెయ్యవచ్చు. ఇది కోర్టు పేర్కొన్న షరతు . ఒకవేళ ఇలాంటి తీవ్రమైన కేసుల విషయంలో కూడా సంస్కరణలు తీసుకురావాలని భావిస్తే... ఉరి శిక్ష పడిన ఖైదీ నుంచి అత్యాచార కేసుల్లో దోషుల వరకు, అలాగే సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనకాండ కేసు నుంచి మావోయిస్టుల పేరుతో వ్యక్తుల్ని ఖైదు చేసే కేసుల వరకు అన్నింటిలోనూ ఇదే తరహా సంస్కరణలు తీసుకొచ్చే విధానాన్ని అనుసరించాలి. అత్యున్నత న్యాయస్థానం ప్రాధాన్యతలు మారుతున్నాయా ? గడిచిన కొద్ది నెలలుగా సుప్రీం కోర్టు వ్యవహార శైలి చూస్తుంటే లౌకిక రాజ్యాంగంలో ఒక భాగంగా ఉన్న అత్యున్నత న్యాయస్థానం క్రమంగా తనకు తానుగా మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోందన్న భావన చాలా మందిలో నెలకొంటోంది. ఎన్‌ఐఎ విచారణ చేసిన హాదియా వివాహానికి సంబంధించిన కేసు కావచ్చు, తగినంత ప్రాధాన్యానికి నోచుకోని ఆర్టికల్ 370 రద్దు విషయం కావచ్చు, కశ్మీర్లో ఇంటర్నెట్‌ను నిషేధించిన విషయంలో కావచ్చు, కశ్మీర్లో నిర్బంధానికి గురైన వారికి సంబంధించిన హేబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో పిరికిగా వ్యవహరించిన తీరు కావచ్చు.. వీటిల్లో అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. అదే సమయంలో అయోధ్య తీర్పు విషయానికొచ్చేసరికి న్యాయాన్యాయాలను పక్కనబెట్టి విశ్వాసాలకే అధిక ప్రాధాన్యమిచ్చినట్టు కనిపించడం, అలాగే జామియా మిలియా పోలిస్ అట్రాసిటీ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడం, శబరిమల కేసు విషయంలో ఉదారంగా వ్యవహరించడం.. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టుకు కచ్చితమైన తీర్పునిచ్చే శక్తి ఉన్నప్పటికీ దాన్ని అమలు పరిచేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయకుండా ఆ తీర్పులను సమీక్షించేందుకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గుజరాత్‌లోని సర్దార్‌పురా సామూహిక హత్యాకాండ కేసులో 14 మంది దోషులకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు అరుదైన తీర్పుల్లో ఒకటని చెప్పొచ్చు. ప్రస్తుతం బెయిల్ పొందిన వాళ్లంతా 2002లో గుజరాత్ మారణకాండలో 33 మందిని చంపిన కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాతే దోషులుగా తేలిన వ్యక్తులే. text: టర్కీలోని మిల్లియెట్ డైలీ కథనం ప్రకారం, "అమ్మాయిలు ఎలా ఉండాలి?" అనే కోర్సులో భాగంగా వారు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఇస్తాంబుల్‌లోని ఓ సంస్థ శిక్షణనిస్తోంది. ప్రజారవాణా వాహనాల్లో సరైన రీతిలో కూర్చోవాలి, ఆహారాన్ని నమిలే సమయంలో వీలైనంత తక్కువగా మాట్లాడాలి, ఉదయం పూట ఎక్కువగా మేకప్ వేసుకోవద్దు, అసభ్యకర పదాలను మాట్లాడొద్దు, బ్రో అనే పదాన్ని ఉపయోగించవద్దు... ఇవి వారి సూచనల్లో కొన్ని. సోషల్ మీడియాలో విమర్శలు వీటిలో చాలావరకూ మర్యాదపూర్వకంగా నడుచుకోవడంలో భాగంగా చేసే పనుల్లాగా ఉన్నప్పటికీ, ఒక్క ఐస్‌క్రీమ్ తినే విషయంలో మాత్రం వారిచ్చిన సలహా సోషల్ మీడియాలో వివాదంగా మారింది. ఆడవాళ్లు ఐస్‌క్రీమ్ నాకుతూ తినకూడదని చెప్పారే తప్ప ఎందుకు ఇలా చేయకూడదో కారణాలు మాత్రం వెల్లడించలేదు. అలాగే ఇలాంటి ఆహారాన్ని ఇంకెలా తినాలో కూడా సూచించలేదు. దీనిపై ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. నాకుతూ తినకూడదు అంటే ఇంకెలా తినాలి? అని ఓ యూజర్ ట్విటర్లో ప్రశ్నించారు. "నేను ఈ కోర్సు పూర్తి చేశాను. ఇప్పుడు నేను ఐస్‌క్రీమును కొరుక్కుని తింటున్నా" అంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అలాగే తింటారు కదా! ఇలాంటి సూచనల ద్వారా అమ్మాయిల స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలనుకుంటున్నారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వాటిని వెంటనే అరికట్టాలి. ఇది వివక్షతో కూడిన చర్య. నేను ఐస్‌క్రీమ్ ఎలా తింటే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఎలా ఉండాలనుకుంటే వారిని అలా ఉండనివ్వండి" అని ప్రముఖ టర్కిష్ ఆన్‌లైన్ ఫోరమ్‌ ఎక్సి సొజ్లుక్‌లో ఒకరు పోస్ట్ చేశారు. అమ్మాయిలకే ఇలాంటి కోర్సులు ఎందుకు, అబ్బాయిలు కూడా ఈ పనులన్నీ చేస్తారు కదా అని మరొకరు ప్రశ్నించారు. "ఇదేదో అమ్మాయిలకోసం ఉద్దేశించిన శిక్షణ అనే భావన కల్పించాలని అనుకోవట్లేదు. నలుగురిలో ఉన్నప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా నడుచుకోవడం అందరి బాధ్యత. మన చుట్టూ ఉన్న అమ్మాయిలకు అదే మేము చెబుతున్నాం" అని ఈ కోర్సును నిర్వహిస్తున్న అర్జు అర్డా వివరించారు. అయితే ఈ సలహాపై కొందరు సానుకూలంగా కూడా స్పందించారు. "ఇలాంటి పద్ధతులు అన్నిచోట్లా పాటిస్తే ఇస్తాంబుల్ అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మారుతుంది" అంటూ అర్జు అర్డాకు మద్దతు పలికారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు, ఇది మర్యాద కాదు"... టర్కీలో ఈ ప్రకటనపై ఇప్పుడు వివాదం రేగుతోంది. text: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన కేజ్రీవాల్ దిల్లీలోని మోతీ నగర్‌లో ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 న్యూ దిల్లీ లోక్‌సభ స్థానానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ శనివారం మోతీ నగర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఆయ ఒక ఓపెన్ టాప్ జీపులో నిలుచుని చేయి ఊపుతూ అభివాదం చేస్తుండగా.. ఎరుపు రంగు టీ షర్ట్ ధరించిన ఒక యువకుడు ముందువైపు నుంచి జీపు ఎక్కి కేజ్రీవాల్‌ను చెంప దెబ్బ కొట్టటం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిని కేజ్రీవాల్ మద్దతుదారులు వారు వెంటనే కిందికి లాగివేయటం కూడా కనిపించింది. వారు ఆ యువకుడిని కొడుతుండగా పోలీసులు రక్షించి అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌డీటీవీ ఒక కథంలో తెలిపింది. ఆ యువకుడిని మోతీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారని పేర్కొంది. అతడిని పార్క్‌లో స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేసే 33 సంవత్సరాల సురేష్ అనే వ్యక్తిగా గుర్తించినట్లు పశ్చిమ దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మోనికా భరద్వాజ్ చెప్పారని పీటీఐ తెలిపింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భద్రత విషయంలో ఇదో మరో నిర్లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఇది ప్రతిపక్ష ప్రేరేపిత దాడి అంటూ ఖండించింది. దిల్లీలో ఆమ్ ఆద్మీని ఈ దాడి నిలువరించజాలదని పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ మీద గతంలో కూడా దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2014 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకూ కేజ్రీవాల్ మీద ఐదుసార్లు దాడి జరిగినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన దిల్లీ శివార్లలోని నరేలా ప్రాంతంలో కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారు మీద దాదాపు 100 మంది కర్రలు, బీజేపీ జండాలు ధరించి గుంపుగా దాడి చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. వివిధ మీడియా కథనాల ప్రకారం.. మొదటిగా 2013లో కేజ్రీవాల్ దిల్లీలో మీడియాతో మాట్లాడతున్నపుడు నల్ల సిరాతో దాడి చేశారు. మళ్లీ 2014లో సాధారణ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన మీద ఇంకు దాడి జరిగింది. అదే ఏడాది దిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహిస్తున్నపుడు ఆయనపై ఓ ఆగంతకుడు దాడిచేసి చెంపదెబ్బ కొట్టాడు. మళ్లీ లాలి అనే ఆటో డ్రైవర్ కేజ్రీవాల్‌కు పూల మాల వేసి రెండు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. గత ఏడాది నవంబర్‌లో ఒక యువకుడు దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి చొరబడి, కేజ్రీవాల్ మీద కారంపొడితో దాడి చేయటానికి ప్రయత్నించాడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై ఒక ఆగంతకుడు దాడి చేసి చెంపదెబ్బ కొట్టాడు. text: ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల చీఫ్ మార్క్ లోకాక్ బుధవారం దీనిపై స్పందిస్తూ దిగ్బంధాన్ని ఎత్తివేయాలని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని కోరారు. లేని పక్షంలో భయంకరమైన కరవు వచ్చి లక్షలాది మంది ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఐరాస భద్రతామండలికి కూడా చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇంతకు ముందు ఈ వారం ప్రారంభంలోనే రెడ్‌క్రాస్ కూడా ఇదే విధమైన ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణాలు నిలబెట్టే ఎన్నో వస్తువుల సరఫరా ఆగిపోతే యెమెన్‌లోని లక్షలాది మంది మృత్యువు గుప్పిట్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 9 లక్షల మందికి పైగా కలరాతో బాధపడుతున్నారని, దిగ్బంధం కారణంగా వారి వైద్యానికి కావాల్సిన క్లోరిన్ మాత్రల సరఫరా కూడా ఆగిపోయిందని రెడ్‌క్రాస్ తెలిపింది. కాగా ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు అన్నిటికీ బయటి ప్రపంచంపైనే ఆధారపడే 70 లక్షల మంది యెమెన్ ప్రజలు ఇప్పుడు కరవు ముంగిట్లో ఉన్నారు. ‘ఇరాన్ నుంచి ఆయుధాలొస్తున్నాయ్’ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి ప్రయోగించిన తరువాత సోమవారం సౌదీ సంకీర్ణం యెమెన్‌కు వెళ్లే భూ, సముద్ర, వాయు మార్గాలను దిగ్బంధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తిరుగుబాటుదారులకు ఇరాన్ నుంచి ఆయుధాలు వస్తున్నాయని, ఆ ఆయుధ సరఫరా ఆగాలంటే దిగ్బంధం తప్పనిసరని సౌదీఅరేబియా అంటోంది. మరోవైపు ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కాగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు 2015 నుంచి పోరాటం చేస్తున్నారు. యెమెన్‌ అంతర్యుద్ధంలో సౌదీ సంకీర్ణం 2015 మార్చిలో జోక్యం చేసుకున్నప్పటి నుంచి 8,670 మంది మృతి చెందారు. వారిలో 60 శాతం మంది సాధారణ పౌరులే. సుమారు 50 వేల మంది గాయపడ్డారని ఐరాస గణాంకాలు చెప్తున్నాయి. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) యుద్ధంతో దెబ్బతిన్న యెమెన్ మరో సంక్షోభంలో చిక్కుకుంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక సంకీర్ణం ఆ దేశాన్ని దిగ్బంధించడంతో తీవ్రమైన కరవు ముంచుకొస్తోంది. తక్షణం సౌదీఅరేబియా ఈ దిగ్బంధాన్ని ఎత్తివేయాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. text: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి వినతిపత్రం సమర్పిస్తున్న చంద్రబాబు బృందం ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు డిమాండ్లతో దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సోమవారం ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో నిరాహార దీక్ష నిర్వహించిన చంద్రబాబు మంగళవారం అదే డిమాండ్‌తో దిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీ భవన్ నుంచి పాదయాత్ర చేస్తూ జంతర్ మంతర్ వరకూ చేరుకున్నారు. పలువురు మంత్రులు, ఎంఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జంతర్ మంతర్ దగ్గరి నుంచి చంద్రబాబు సహా 11 మంది ప్రతినిధుల బృందం వాహనాల్లో రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరి వెళ్లింది. ప్రత్యేక హోదా హామీ అమలుతో పాటు.. విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరే ముందు జంతర్ మంతర్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం విజయ్‌చౌక్‌లోనూ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మరోవైపు ఏపీలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిల మీద తీవ్ర విమర్శలు సంధించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘‘హైదరాబాద్‌ను 60 ఏళ్ల పాటు అభివృద్ధి చేశాం. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దా. అభివృద్ధి చేసి కూడా హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చాం. కొత్త రాష్ట్రంలో అందరం ఎంత కష్టపడినా, కేంద్రం సహకరించినా 20, 30 సంవత్సరాలు పడుతుంది. అలాంటి సమయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మా మనోభావాలతో ఆడుకుంటోంది. అందుకే దిల్లీ వీధుల్లో నిరసనయాత్ర చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి. సరిగ్గా స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. మోదీలో నాయకత్వ లక్షణాలు లేవు. పార్లమెంటులో నిరంతర పోరాటం చేస్తున్నాం. ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతిని కలిసి కోరాం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే బొబ్బిలిపులులై తిరగబడతారు: కేంద్రానికి చంద్రబాబు హెచ్చరిక ప్రజా కోర్టులో చిత్తుచిత్తుగా ఓడిస్తాం... ఈ దీక్ష రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజల కోర్టులోనే మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం. ప్రజాస్వామ్య ఆవశ్యకత రీత్యా నేను స్వయంగా రాహుల్‌గాంధీని కలిశాను. నా స్వార్థం కోసం కాదు. దేశాన్ని కాపాడుకోవటానికి. ప్రజాస్వామ్య సంస్థలను కాపాడుకోవాలి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. జగన్, మోదీ ఒక్కటే. జగన్ స్వప్రయోజనాల కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారు. ఒకవైపు నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ఉంది.. మరోవైపు వాళ్లకి వ్యతిరేకంగా ఉండేవారు ఉన్నారు.. మీరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోండి. అవినీతిపరులను ఎవరు తీసుకుంటారు? రేపు వచ్చే ప్రత్యామ్నాయం.. నరేంద్రమోదీ ప్రభుత్వం మాదిరిగా అవినీతిపరులను రక్షించదు. జగన్ ఇష్టమై వచ్చి సపోర్ట్ చేస్తే చేసుకోమను అని చెప్పాను. అమిత్ షా ఓపెన్ లెటర్‌లో.. తప్పుడు సమాచారం చెప్పి, తప్పుడు ప్రచారం చేయటం అలవాటైపోయింది. బీజేపీ నేతల జాతకాలు విప్పితే తలెత్తుకుని తిరగలేరు. ప్రజలు ఛీకొట్టే పరిస్థితి వచ్చింది. నేను ప్రొటోకాల్ ఫాలో కాలేదంట. ప్రధానమంత్రిని అవమానించానంట. మోదీ నా ప్రజలకు అన్యాయం చేసినపుడు ఆయన దగ్గరకు నేనెందుకు వెళ్లాలి. నాడు స్వాతంత్ర్యాన్ని, విలువలను అమ్ముకునే వాళ్లు కూడా బ్రిటిష్ వాళ్లతో కలిశారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. దిల్లీలో జరిగిన ర్యాలీలో అఖిలప్రియ హైదరాబాద్‌లో ఉంటాం కాబట్టి మాకేం బాధలేదు.. అమరావతిలో ఓట్లు అడగటానికి వస్తాం.. అడుక్కుని హైదరాబాద్ వెళ్లిపోతాం అంటే కుదరదు. మీరు కూడా పోరాడండి. ఇంకా ఎక్కువ అడగండి.. టీడీపీ కంటే ఎక్కువ అడిగామని ప్రజలకు చెప్పండి. అంతేకానీ ఓట్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? ఎంపీ పదవులుకు రాజీనామా చేశానంటారు. రాజీనామా చేసి ఎందుకు పారిపోయారు? మేం వదిలిపెట్టలేదే? చివరి రోజు వరకూ మోదీ గుండెల్లో నిద్రపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టినపుడు మీరెందుకు ఓటు వేయలేదు? ఆ రోజు బయట ఉన్నావు కదా? ఎందుకు రాలేదు? మేం ఎన్ని పార్టీలను కోఆర్డినేట్ చేశాం. మీరు ఒక్కర్ని కోఆర్డినేట్ చేశారా? ఏపీకి అన్యాయం జరిగిందని దేశం మొత్తం చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీ. బీజేపీతో ఎవరి కోసం ఉన్నాను? 29 సార్లు తిరిగాను. ఎవరికోసం తిరిగాను? నేను సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ. మోదీ ఇగో సాటిస్ఫై చేయటానికి సార్ సార్ అని కూడా సంబోధించాను. అతను మాట నిలబెట్టుకోలేదు. గౌరవం కూడా నిలబెట్టుకోలేదు. జగన్ మోహన్‌రెడ్డికి చాలా అలవాట్లున్నాయి. ఆయన తప్పుడు వ్యక్తి కాబట్టి, నేరస్తుడు కాబట్టి.. ముందుగానే ప్రతి ఒక్కదానికీ ఎలిబీ పెట్టుకుంటాడు. కేంద్రం మూటలిస్తదని, తెలంగాణ సీఎం మూటలిస్తానని.. ఐదు వేలకు ఓట్లు లెక్కవేసుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒక కమ్యూనిటీతో లేదు. సామాజిక న్యాయం, సమతుల్యం పాటిస్తాం. బీసీలను కలుపుకుని వస్తున్నాం. అందుకే 40 ఏళ్లుగా ఈ పార్టీ ఉంది. ప్రజలు అమాయకులు కాదు.’’ (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీని హెచ్చరించారు. text: స్టెప్పీ గద్దలు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి ఎంత భారీగా అంటే.. ఆ పక్షుల మీద పరిశోధనలకు కేటాయించిన నిధులన్నీ అయిపోయి కొండంత అప్పులు పేరుకున్నాయి. అసలు పక్షులకు రోమింగ్ చార్జీలు ఎందుకంటే.. వాటిలో అమర్చిన ట్రాన్స్‌మిటర్ల నుంచి పరిశోధకులకు ఎస్ఎంఎస్ సందేశాలు అందుతుంటాయి. కానీ ఆ పక్షులు ఖండాలు దాటి వలస వెళుతుండటంతో నెట్‌వర్క్, డాటా రోమింగ్ చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. పరిశోధకుల బృందం పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న రష్యా మొబైల్ ఆపరేటర్ మెగాఫోన్.. ఈ పరిశోధన ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ తమకు చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేసింది. పరిశోధన కోసం డాటా, రోమింగ్ చార్జీలను అతి చౌకగా అందిస్తోంది. ఇక పేరుకుపోయిన బిల్లులను చెల్లాంచటానికి పరిశోధకులు సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. ఈ పక్షులు దక్షిణ రష్యా, కజకిస్తాన్‌ల నుంచి బయలుదేరి వెళ్లాయి. ముఖ్యంగా.. మిన్ అనే ఒక స్టెప్పీ గద్ద ప్రయాణం అన్నిటికన్నా ఖరీదుగా మారింది. అది కజకిస్తాన్ నుంచి ఇరాన్‌కు వెళ్లింది. వేసవి కాలంలో కజకిస్తాన్‌లో ఈ పక్షి మీద పరిశోధనలు ప్రారంభించి.. దాని వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో తెలుసుకోవటానికి ట్రాన్స్‌మిటర్ అమర్చారు. కానీ.. మొబైల్ నెట్‌వర్క్ పరిధిలో లేకపోవటంతో ఆ ఎస్ఎంఎస్‌లు సరిగా అందలేదు. చలికాలంలో స్పెప్పీ గద్దల వలస మార్గాలు (RRRCN వెబ్‌సైట్) అనూహ్యంగా ఆ పక్షి నేరుగా ఇరాన్ వలస వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పక్షికి అమర్చిన ట్రాన్స్‌మిటర్ నుంచి బ్యాక్‌లాగ్ మెసేజిలన్నీ భారీ సంఖ్యలో వచ్చిపడ్డాయి. కజకిస్తాన్‌లో ఒక్కో ఎస్ఎంఎస్‌ చార్జీ 15 రూబుళ్లు (దాదాపు 17 రూపాయలు). కానీ.. ఇరాన్ నుంచి వచ్చిన ఒక్కో ఎస్ఎంఎస్‌కి 49 రూబుళ్లు (దాదాపు 55 రూపాయలు) చార్జీ అయింది. రోమింగ్‌లో ఉంది కనుక. అలా.. అన్ని గద్దల కోసం కేటాయించిన నిధులన్నీ మిన్‌ వాడేసింది. దీంతో.. రోమింగ్, డాటా బిల్లులు చెల్లించటానికి.. 'రష్యా గద్ద మొబైల్ ఫోన్‌ను టాపప్ చేయండి' అంటూ నోవోసిబిరిస్క్‌లోని వైల్డ్ యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు క్రౌడ్ ఫండింగ్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు. అందులో వారు 1,00,000 రూబుళ్లు (సుమారు రూ. 1,11,000) సేకరించగలిగారు. ఈ పక్షులు వలస వెళుతున్నపుడు అవి ఎక్కడున్నాయని తెలిపే అక్షాంశ రేఖాంశాలు ఈ ఎస్ఎంఎస్‌ల ద్వారా అందుతాయి. ఆ వివరాల ఆధారంగా శాటిలైట్ చిత్రాల ద్వారా.. ఆ పక్షులు సురక్షితమైన ప్రాంతాలకు చేరాయా అనేది పరిశోధకులు పరిశీలిస్తారు. రష్యా, మధ్య ఆసియా ప్రాంతంలో అంతరించే ప్రమాదంలో ఉన్న ఈ స్టెప్పీ గద్దలకు విద్యుత్ లైన్లు ప్రత్యేకించి ప్రమాదకరంగా తయారయ్యాయి. పరిశోధకులు ప్రస్తుతం 13 గద్దలను ట్రాక్ చేస్తున్నారు. ఈ పక్షులు సైబీరియా, కజకిస్తాన్‌లలో గుడ్లు పెడతాయి. చలికాలంలో దక్షిణాసియాకు వలస పోతాయి. ఈ పరిశోధకుల బకాయిలను రద్దు చేస్తామని మెగాఫోన్ ప్రకటించటంతో.. ఆ పక్షుల మార్గానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వీరు పరిశోధనను కొనసాగించవచ్చు. అది వీటి మనుగడకు సాయం చేయటానికి తోడ్పడుతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అవి పక్షులు. వలస పోవటం వాటి నైజం. రష్యా నుంచి ఇరాన్, పాకిస్తాన్‌లకు వలస వెళ్లాయి. అవి అలా వెళ్లినందుకు రష్యన్లు భారీగా డాటా, రోమింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. text: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్-జుబెయిర్ ఈ హత్య ఒక 'దారుణ తప్పిదం' అని ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్జీ హత్యకు ఆదేశించారనే వాదనలను ఖండించారు. మొదట ఖషోగ్జీ బతికే ఉన్నాడని చెప్పిన సౌదీ అరేబియా, తర్వాత ఏం జరిగిందో వివరించడానికి ఒత్తిడికి గురైంది. ఖషోగ్జీ చివరిసారి అక్టోబర్ 2న ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ కాన్సులేట్‌ లోపలికి వెళ్తూ కనిపించారు. ఖషోగ్జీ సౌదీ ప్రభుత్వం మీద విమర్శనాత్మక కథనాలు రాసేవారని, సౌదీ ఏజెంట్ల బృందం ఆయనను ఆ భవనంలోనే హత్య చేసిందని టర్కీ అధికారులు భావిస్తున్నారు. మొదట ఆయన కాన్సులేట్ భవనం నుంచి క్షేమంగా వెళ్లారని సౌదీ అరేబియా చెప్పింది. కానీ శుక్రవారం మొదటిసారి ఆయన మరణించారని అంగీకరించింది. భవనంలో జరిగిన ఒక గొడవలో ఆయన హత్యకు గురయ్యారని చెప్పింది. ఈ వాదనపై సందేహాలు తలెత్తుతున్నాయి. జమాల్ ఖషోగ్జీ ఎలా మరణించారు? జర్నలిస్టు ఖషోగ్జీ కాన్సులేట్‌లో అధికారులతో ఘర్షణలో చనిపోయారు: సౌదీ ఖషోగ్దీ మృతదేహం కోసం బెల్‌గ్రాడ్ అడవుల్లో గాలిస్తున్నారు సౌదీ కొత్తగా ఏం చెబుతోంది? సౌదీ మంత్రి అల్-జుబెయిర్ ఖషోగ్జీది హత్య అని చెప్పారు. "మేం వాస్తవాలన్నీ బయటకు తీయాలని, ఈ హత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నిశ్చయించాం" అన్నారు. "ఈ హత్య చేసిన వారు, తమ అధికార పరిధికి బయట అలా చేశారు. ఇది కచ్చితంగా 'దారుణ తప్పిదం'. చేసిన తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించి వాళ్లు ఇంకా పెద్ద తప్పు చేశారు" అన్నారు. "ఖషోగ్జీ మృతదేహం ఎక్కడ ఉందో కూడా మాకు తెలీదు. ఈ హత్య క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో జరిగింది కాదు" అన్నారు. "మా నిఘా విభాగంలోని ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం తెలీదు. ఇది కుట్రపూరిత ఆపరేషన్" అని జుబెయిర్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని అరెస్టు చేశామని సౌదీ అరేబియా చెబుతోంది. మహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరు అనుచరులను తొలగించామని అంటోంది. నిఘా సంస్థను మరింత మెరుగుపరిచేందుకు క్రౌన్ ప్రిన్స్ నేతృత్వంలో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామంది. అంతర్జాతీయ స్పందన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో "సౌదీ అరేబియా వివరణలో మోసం, అవాస్తవాలు ఉన్నాయని" అన్నారు. అంతకు ముందు ఆయనే "వారు చెబుతున్నది నమ్మదగినదే" అని భావించారు. "క్రౌన్ ప్రిన్స్ ఈ హత్యకు బాధ్యుడు కాకపోతే అది మంచిదే" అని ట్రంప్ అన్నారు. "కానీ సౌదీ అరేబియాపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. "ఆయుధాల ఒప్పందాన్ని ఆపివేయడం వల్ల వారి కంటే మాకే ఎక్కువ నష్టం" అని ట్రంప్ చెప్పారు. ఖషోగ్జీ హత్యపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆయన మృతిపై పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. "ఈ హత్య సమర్థనీయం కాదు, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ప్రకటించాయి. ఇటు, సౌదీ అరేబియాకు, పొరుగు దేశాలన్నీ అండగా నిలుస్తున్నాయి. కింగ్ సల్మాన్ ఈ కేసును హాండిల్ చేస్తున్న తీరుపై కువైత్ ప్రశంసలు కురిపించింది. ఈజిఫ్ట్, బహ్రెయిన్, యూఏఈ కూడా అలాంటి స్పందనలే వ్యక్తం చేశాయి. ఈ హత్యపై మంగళవారం పార్లమెంటులో నగ్నసత్యాలు బయటపెడతానని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగన్ ఆదివారం అన్నారు. టర్కీ సౌదీ అరేబియాపై అధికారిక ఆరోపణలు చేయడం ఆపివేసినా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు మాత్రం తమ దగ్గర సౌదీ ఏజెంట్లు కాన్సులేట్‌లో హత్య చేసినట్టు ఆడియో,వీడియో ఉన్నాయని చెబుతున్నారు. సౌదీ అధికారులు మాత్రం ఆ సమయంలో "తప్పుడు సమాచారం అందడం వల్లే ఇప్పుడు తమ ప్రకటనను మార్చాల్సి వచ్చిందని" చెబుతున్నారు. ఇవికూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీని హత్య చేశారని సౌదీ అరేబియా చెప్పింది. దీని వెనక క్రౌన్ ప్రిన్స్ పాత్ర లేదని తెలిపింది. text: సాధారణంగా పోలింగ్ శాతానికి గెలుపోటములకు సంబంధం ఉంటుందన్న భావన ఉంది. వాస్తవానికి పోలింగ్ శాతానికి గెలుపు ఓటములకు ప్రత్యక్ష సంబంధం లేదు. అలాగే పోలింగ్ శాతం పెరిగినపుడు అధికార పార్టీ గెలిచిన, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. తగ్గినపుడూ అంతే. కొన్ని సార్లు అధికార పార్టీ గెలిచింది, మరికొన్ని సార్లు ఓడిపోయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికలను.. పోలింగ్ శాతాన్ని.. ఎప్పుడు ఎవరు గెలిచారన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే తేలిన అంశాలివి. పోలింగ్ శాతం పెరిగినపుడు అధికార పార్టీ ఎక్కువగా ఓడిపోయింది. మొత్తం ఎనిమిది ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగగా.. అందులో అయిదు సార్లు అధికార పార్టీ ఓడిపోయింది. మూడుసార్లు మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇక పోలింగ్ శాతం తగ్గినపుడు విషయానికి వస్తే అధికార పార్టీ అధికంగా గెలిచింది. మొత్తం ఆరు ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గగా అధికార పార్టీ నాలుగు సార్లు గెలిచింది. ఒకసారి ఓడిపోయింది. ఈ సారి ఈ ఎన్నికల ఫలితం తేలాల్సి ఉంది. ఏ ఎన్నికల్లో ఏం జరిగింది ఈ పట్టికను పరిశీలించేముందు కొన్ని విషయాలు గమనించాల్సి ఉంది. 1955లో ఆంధ్ర రాష్ట్రానికి , తెలంగాణకు విడివిడిగా ఎన్నికలు జరిగాయి. అలాగే 1957 నుంచి 2014 వరకు జరిగిన ఉన్నికలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలుగా భావించాలి. 2019 ఎన్నికలు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగినవి. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందా ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన ఎన్నికల్లో 76.69 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ (ఈసీ) తెలిపింది. 2014 సీమాంధ్ర ప్రాంత పోలింగ్‌తో పోలిస్తే ఇది 1.27 శాతం తక్కువ. 2014లో ఇక్కడ(సీమాంధ్రలోని 13 జిల్లాల్లో) 77.96 శాతం పోలింగ్ నమోదైంది. text: రోగిలో వ్యాధి లక్షణాలు కొనసాగే కాలాన్ని రెమ్‌డెసివీర్ ఔషధం 15 రోజుల నుంచి 11 రోజుల వ్యవధికి తగ్గిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి ఫలితాలను ప్రచురించనప్పటికీ, నిపుణులు మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. అంతమాత్రాన వ్యాధిని నివారించడంలో ఇదేమీ 'మ్యాజిక్ బుల్లెట్'లా పని చేయదని కూడా తేల్చి చెప్పారు. ప్రాణాలను కాపాడే శక్తి ఓ ఔషధానికి ఉన్నప్పుడు ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడమే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్ ఎత్తివేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. రెమ్‌డెసివీర్‌గా పిలిచే ఈ మందును ప్రాథమికంగా ఎబోలా వైరస్‌కు చికిత్స చేయడానికి అభివృద్ధి చేశారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) అనే సంస్థ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మొత్తం 1,063మంది పాల్గొన్నారు. వారిలో కొందరికి ఈ ఔషధాన్ని ఇవ్వగా మరి కొందరికి ప్లేసెబో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. "గణాంకాలు బట్టి చూస్తే రెమ్‌డెసివీర్‌ మందు చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఔషధాన్ని తీసుకున్న కోవిడ్-19 రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది" అని ఎన్ఐఏఐడీ నిర్వాహకులు డాక్టర్ అంథోనీ ఫౌచీ అన్నారు. "పరిశోధన ఫలితాలను గమనిస్తే ఈ డ్రగ్ వైరస్‌ను నిరోధించే అవకాశం ఉంది. ఓ రకంగా.. ఈ వ్యాధి సోకిన రోగులకు చికిత్స చేసే సామర్థ్యం మనకు ఉందన్న నిజానికి తలుపులు తెరచుకున్నట్టయింది" అని ఆయన అభిప్రాయపడ్డారు. రెమ్‌డెసివీర్ ఔషధంపై పరిశోధన వివరాలను ట్రంప్‌తో చర్చిస్తున్న వైద్య అధికారులు అయితే ఇది మరణాల విషయంలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం రెమ్‌డెసివీర్‌ను ఇచ్చిన వారిలో మరణాల రేటు 8% ఉండగా, ప్లెసిబో ట్రీట్‌మెంట్ ఇచ్చిన వారిలో మరణాల రేటు 11.6% ఉంది. అయితే గణాంకాల పరంగా చూస్తుంటే ఇది చెప్పుకోదగ్గ ప్రభావం చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. శాస్త్రవేత్తలు కూడా ఈ తేడా ఎంతవరకు నిజం అన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే కోలుకుంటున్న రోగుల్ని మరింత వేగంగా కోలుకునేలా సహకరిస్తోందా? ఐసీయూ చికిత్స అవసరం లేకుండా రోగుల్ని కాపాడుతోందా? యువకుల్లో లేదా వృద్ధుల్లో ఎవరి విషయంలో ఈ మందు మెరుగ్గా పని చేస్తుంది? ఇతర వ్యాధులతో బాధపడే వారిలో బాగా పని చేస్తుందా? లేదంటే ఏ వ్యాధి లేని వారిలో బాగా పని చేస్తుందా? శరీరంలో వైరస్ ముదురుతుందని తెలిసినప్పుడు రోగులకు ముందుగానే చికిత్స చేయాలా? ప్రాణాలను కాపాడటంతో పాటు లాక్ డౌన్ ఎత్తివేయడానికి కూడా సాయం చేసే జంట ప్రయోజనాలు ఉన్న ఔషధం గురించి పూర్తి వివరాలు వెల్లడించే ముందు ఈ ప్రశ్నలన్నీ చాలా ముఖ్యమైనవి. "ఈ ఔషధాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ఆ గణాంకాలను, ఫలితాలను సంబంధిత యంత్రాంగం సమీక్షించి, అసలు ఆ మందు తయారీకి అనుమతి ఇవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించాలి. అలాగే, వివిధ దేశాల్లో సంబంధిత ఆరోగ్య శాఖాధికారులు ఆ మందు పనితీరుపై ఓ అంచనాకు రావాలి" అని యూరోపియన్ యూనియన్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఎంఆర్‌సీ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహేశ్ పార్మర్ అభిప్రాయపడ్డారు. ఐసీయూల అవసరాన్ని ఏదైనా మందు ఆపగల్గితే ఆస్పత్రులపై భారం తగ్గుతుంది. క్రమంగా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. "మేం పూర్తి ఫలితాలను ఇంకా పరిశీలించాల్సి ఉంది. కానీ ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కచ్చితంగా తేలితే మాత్రం కోవిడ్-19పై చేస్తున్న పోరాటంలో ఇదో గొప్ప వార్త అని చెప్పవచ్చు" అని కోవిడ్-19 ఔషధాల విషయంలో ప్రపంచంలోనే భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ హార్బీ అన్నారు. పూర్తి స్థాయిలో గణాంకాలను సేకరించి రెమ్‌డెసివీర్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో నిష్పక్షపాతంగా పనిచేయడమే తరువాత చేయాల్సిన పని అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అమెరికాలో రెమ్‌డెసివీర్‌ విషయంలో జరిగిన పరిశోధనలు బయటపడిన ఇదే సమయంలో ఈ మందు సరిగ్గా పని చేయడం లేదని ఈ ఔషధంపై ఇప్పటికే పరిశోధనలు నిర్వహించిన చైనాలోని లాన్సెట్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. అయితే వుహాన్‌లో లాక్ డౌన్ విజయవంతం కావడంతో అక్కడ ప్రస్తుతం రోగులెవరూ లేరు. దీంతో ఈ పరిశోధన అసంపూర్తిగా మిగిలిపోయింది. "ఈ గణాంకాలు నమ్మదగ్గవిగానే ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్-19కు ఎలాంటి కచ్చితమైన చికిత్స లేదు. ఈ సమయంలో రెమ్‌డెసివీర్‌ వినియోగానికి వీలైనంత త్వరగా అనుమతులు పొందితే కరోనావైరస్ చికిత్సకు సహాయపడవచ్చు" అని ప్రొఫెసర్ బాబక్ జావెద్ అన్నారు. ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ హాస్పటల్స్‌కు చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. "అయితే, రెమ్‌డెసివీర్ మ్యాజిక్ బుల్లెట్ కాదన్న విషయాన్ని కూడా ఇది చెబుతోంది. మొత్తంగా దీనివల్ల 30శాతం వరకూ మాత్రమే ప్రయోజనం ఉండొచ్చు" అని జావెద్ చెప్పుకొచ్చారు. కోవిడ్-19 చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్న మందుల్లో మలేరియా, హెచ్ఐవీకి చెందిన ఔషధాలు కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసే వైరస్‌పై, దాని సమ్మేళనాలపై దాడి చేయగలవు. వ్యాధిపై మొదటి దశల్లో యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రభావవంతంగా పని చేసినా, తర్వాత దశల్లో ఇమ్యూన్ డ్రగ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎబోలా చికిత్సలో ఉపయోగించే ఓ ఔషధం కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి సహకరిస్తోందని "స్పష్టంగా" తెలుస్తోందని అమెరికా అధికారులు తెలిపారు. text: కశ్మీర్‌లోని ఒక వ్యక్తి వీపు మీద గాయాల గుర్తులు తమను కర్రలతో, తీగలతో కొట్టారని, విద్యుత్ షాక్ ఇచ్చారని కొందరు గ్రామస్థులు బీబీసీకి చెప్పారు. కొన్ని గ్రామాల్లోని ప్రజలు తమ గాయాలను నాకు చూపించారు. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను అధికారులతో మాట్లాడి నిర్థరించడం బీబీసీకి వీలు కాలేదు. అయితే, భారత సైన్యం మాత్రం, "అవన్నీ నిరాధార ఆరోపణలు" అని ప్రకటించింది. మూడు వారాలకు పైగా నిర్బంధంలో ఉన్న కశ్మీర్‌లో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా ఆంక్షలు విధించారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆగస్టు 5 నుంచి ఇక్కడ సమాచార వ్యవస్థలను కూడా ఆపేశారు. ఈ ప్రాంతంలో వేలాది అదనపు దళాలను మోహరించారు. రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారులు, కార్యకర్తలు సహా దాదాపు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. చాలా మందిని రాష్ట్రం బయట ఉన్న జైళ్లకు తరలించారు. కశ్మీర్లో నిరసనలు అధికారులు వీటిని కశ్మీర్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యలుగా చెబుతున్నారు. ఏకైక ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన జమ్ము-కశ్మీర్‌ను ఇప్పుడు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. భారత సైన్యం ఇక్కడ మూడు దశాబ్దాలకు పైగా వేర్పాటువాద తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. పాకిస్తాన్ ఈ ప్రాంతంలోని మిలిటెంట్లకు సహకరిస్తూ హింసను రెచ్చగొడుతోందని భారత్ ఆరోపిస్తోంది. దీనిని పాకిస్తాన్ ఖండిస్తోంది. భారతదేశం అంతటా చాలా మంది ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ 'సాహసోపేత' నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. దేశంలోని ప్రధాన మీడియా అంతా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా భారత వ్యతిరేక ఉగ్రవాద హబ్‌గా ఆవిర్భవించిన దక్షిణ జిల్లాల్లోని ఆరేడు గ్రామాల్లో నేను పర్యటించాను. రాత్రిళ్లు సైన్యం దాడులు చేసి కొట్టడం, హింసించడం జరుగుతోందని ఈ గ్రామాల్లోని చాలా మంది ఒకే విషయం చెప్పారు. అనారోగ్యంతో సంబంధం లేకుండా రోగులు ఎవరైనా మీ ఆస్పత్రులకు వచ్చారా అనే దానిపై జర్నలిస్టులతో మాట్లాడ్డానికి డాక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులు నిరాకరించారు. కానీ, గ్రామస్థులు భద్రతా దళాలు కొట్టినవని ఆరోపిస్తూ నాకు గాయాలు చూపించారు. భారత్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల తర్వాత భారత సైన్యం ఇల్లిల్లూ వెతికారని ఒక గ్రామంలో ఉంటున్న వారు చెప్పారు. నిద్రపోతున్న తమను లేపి ఒక బహిరంగ ప్రాంతంలోకి తీసుకెళ్లారని, అక్కడ గ్రామంలోని మరో పది మందికి పైగా గుమిగూడి ఉన్నారని ఇద్దరు సోదరులు చెప్పారు. మేం కలిసిన మిగతా గ్రామస్థుల్లాగే, వారు కూడా తమ గుర్తింపు బయట పెట్టడానికి భయపడిపోయారు. "వాళ్లు మమ్మల్ని కొట్టారు. మేమేం చేశామని వాళ్ళని అడిగాం. ఏదైనా తప్పు చేసుంటే, అబద్ధాలు చెబుతుంటే గ్రామస్థులనే అడగండి అన్నాం. కానీ, వాళ్లు ఏదీ వినలేదు. ఒక్క మాట కూడా అనలేదు. వాళ్లు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు" అని సోదరుల్లో ఒకరు చెప్పారు. "వాళ్లు నా శరీరంలో కొట్టని చోటు లేదు. కాళ్లతో తన్నారు. కర్రలతో కొట్టారు. కరెంటు షాకులు ఇచ్చారు. కేబుల్స్ తీసుకుని కొట్టారు. మా కాళ్ల వెనక దారుణంగా కొట్టారు. మేం సొమ్మసిల్లి పడిపోతే, కరెంట్ షాక్ ఇచ్చి మళ్లీ స్పృహలోకి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్లు కర్రలతో కొట్టడంతో బాధతో కేకలు వేశాం. వాళ్లు మట్టిపోసి మా నోళ్లు మూసేశారు". "మేం అమాయకులమని, మమ్మల్ని ఎందుకిలా చేస్తారని అడిగాం. వాళ్లు మా మాట వినలేదు. నేను వాళ్లతో కొట్టకండి, మమ్మల్ని కాల్చేయండి అన్నాను. దేవుడా నన్ను చంపెయ్ అని కోరుకున్నా. ఎందుకంటే ఆ హింస భరించలేకపోయాను". కాళ్ళ వెనుక గాయాలతో బాధితుడు గత పదేళ్లుగా కశ్మీర్ లోయలో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనే యువకుల గురించి తెలుసుకోడానికి సైన్యం హింసిస్తోందని మరో గ్రామంలోని యువకుడు కూడా చెప్పాడు. "రాళ్లు రువ్వినవారి పేర్లు చెప్పాలంటూ భద్రతాదళాలు నన్ను పదే పదే అడిగాయి. నాకేం తెలీదని చెప్పానని, వాళ్లు నా కళ్లజోడు, బట్టలు, బూట్లు తీయమని చెప్పారు. నేను నా బట్టలు తీయగానే దాదాపు రెండు గంటలపాటు రాడ్లు, కర్రలతో క్రూరంగా కొట్టారు. నేను సొమ్మసిల్లినప్పుడల్లా స్పృహతెప్పించడానికి కరెంటు షాకులు ఇచ్చేవాళ్లు" అన్నాడు. "భద్రతా దళాలకు వ్యతిరేకంగా నిరనస ప్రదర్శనల్లో పాల్గొంటే మీరు ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ హెచ్చరించారు" అని ఆ యువకుడు చెప్పాడు. ఆర్మీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో పాల్గొనాలంటేనే వణికిపోయేలా భయపెట్టడానికే భద్రతాదళాలు ఇలా చేస్తున్నాయని ఆ గ్రామాల్లో మాతో మాట్లాడిన పురుషులందరూ చెప్పారు. అయితే, బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో భారత సైన్యం ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్, "ఆరోపణలు వస్తున్నట్లు పౌరులను ఎవరినీ మేం కొట్టలేదు. వారు చెబుతున్నవేవీ మా దృష్టికి రాలేదు. వ్యతిరేక శక్తులు ప్రేరేపించడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు" అని చెప్పారు. "పౌరుల భద్రత కోసం అన్ని చర్యలూ చేపట్టాం. కానీ, ఆందోళనలను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యల్లో గాయపడడం, ప్రాణనష్టం గానీ జరగలేదు. స్వతంత్ర పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపుల సానుభూతిపరులున్న చాలా గ్రామాల్లో మేం తనిఖీలు చేశాం. అని ఆయన చెప్పారు. కశ్మీర్‌లోని ఈ ప్రాంతంలో ఉన్న ఒక జిల్లాలో ఫిబ్రవరిలో ఒక ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇందులో 40 మందికి పైగా భారత సైనికులు చనిపోయారు. అది భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెంచింది. 2016లో కశ్మీరీ మిలిటెంట్ బుర్హాన్ వనీని కాల్చిచంపిన ప్రాంతం కూడా ఇదే. ఆ ఘటనతో ఆగ్రహించిన చాలామంది కశ్మీరీలు భారత వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఒక సైనిక శిబిరం ఉంది. తీవ్రవాదులు, వారి సానుభూతిపరులను పట్టుకునేందుకు జవాన్లు నిత్యం ఆ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు ఇరవయ్యేళ్ల యువకుడితో నేను మాట్లాడాను. మిలిటెంట్లకు సంబంధించిన సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్‌గా మారాలని తనపై సైనికులు ఒత్తిడి చేశారని, వారు చెప్పినట్లు వినకుంటే తనపై తీవ్రవాద ముద్రవేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, తాను ఇన్ఫార్మర్ పని చేయడానికి అంగీకరించకపోవడంతో తనను దారుణంగా కొట్టారని, వారు కొట్టిన రెండు వారాల తరువాత కూడా శరీరం స్వాధీనంలోకి రాలేదని.. నిలబడలేకపోతున్నానని చెప్పాడా యువకుడు. ''ఈ దారుణాలు ఇలాగే ఉంటే ఇల్లొదిలి వెళ్లిపోవడం తప్ప వేరే మార్గం లేదు నాకు. వారు మమ్మల్ని మనుషుల్లా చూడరు. పశువులను కొట్టినట్లుగా కొడతార''న్నారాయన. మరోవ్యక్తి మమ్మల్ని కలిశాడు. ఆయన తన ఒంటిపై ఉన్న గాయాలను చూపిస్తూ 15 నుంచి 16 మంది జవాన్లు వచ్చారని, తనను నేలపై పడేసి తుపాకులు, కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టారని చెప్పాడు. ''నన్ను దారుణంగా కొట్టిన తరువాత దాదాపు స్పృహ తప్పినట్లయింది.. అప్పుడు వారు నా గడ్డం పట్టుకుని బలంగా లాగారు.. నా పళ్లు ఊడిపోతాయేమో అనిపించేంత గట్టిగా గడ్డం పట్టుకుని లాగార''ని చెప్పాడాయన. ''నేను స్పృహతప్పిన స్థితిలో ఉన్నప్పుడు ఓ జవాను నా గడ్డాన్ని తగలబెట్టాలని చూశాడని.. కానీ, మరో జవాను వారించడంతో ఆగిపోయాడని అక్కడున్న ఓ అబ్బాయి నాకు చెప్పాడు'' అంటూ ఆయన ఆ ఘటనను వివరించారు. అక్కడికి సమీపంలోని మరో గ్రామంలో ఇంకో యువకుడిని కలిశాను. రెండేళ్ల కిందట ఆయన సోదరుడు హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడని ఆయనే చెప్పాడు. ఇటీవల సైనికులు ఆ యువకుడిని తీసుకెళ్లి విచారించారట. ఆ సందర్భంగా దారుణంగా హింసించడంతో ఆయన కాలు విరిగిపోయిందని చెప్పాడు. ''నా కాళ్లు చేతులు కట్టేసి తలకిందులుగా వేలాడదీశారు. రెండు గంటల పాటు దారుణంగా కొట్టారు'' అని ఆ యువకుడు చెప్పాడు. అయితే, ఆర్మీ మాత్రం ఇవన్నీ కట్టుకథలని కొట్టిపారేస్తోంది. తమ సైనికులు ఎలాంటి అకృత్యాలకు పాల్పడలేదంటోంది. బీబీసీకి విడుదల చేసిన ఒక ప్రకటనలో, ''భారత సైన్యం ఒక వృత్తిగతమైన సంస్థ. అది మానవ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు గౌరవిస్తుంది కూడా'' అని సైన్యం పేర్కొంది. సైన్యంపై వస్తున్న అన్ని ఆరోపణలపైనా సత్వర విచారణ చేపడతామని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. గత అయిదేళ్లలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పిన 37 కేసుల్లో 20 కేసులు నిరాధారమైనవని తేలాయని సైన్యం చెప్పింది. మరో 15 కేసుల్లో విచారణ కొనసాగుతోందని, కేవలం 3 కేసుల్లో వచ్చిన ఆరోపణలు మాత్రం లోతుగా విచారించదగ్గవని తేలిందని.. ఇందులో దోషులుగా తేలినవారికి శిక్ష పడక తప్పదని తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) జమ్మూకశ్మిర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రభుత్వం రద్దు చేసిన తరువాత భారత పాలిత కశ్మీర్‌లో భద్రత దళాలు ప్రజలను కొడుతున్నారని, హింసిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. text: ఒకవేళ ఒలింపిక్స్‌కు వెళ్లినా కేవలం ఇద్దరు స్కేటర్లకు మాత్రమే ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ విషయం పక్కన పెడితే, అసలు క్రీడల్లో ఉత్తర కొరియా ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆశ్చర్యకర విషయమేంటంటే.. చాలా క్రీడల్లో ఉత్తర కోరియా ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. కొన్ని క్రీడల్లో తరచూ ఆ దేశస్థులదే పై చేయి. సమ్మర్ ఒలింపిక్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ లాంటి పెద్ద దేశాలకంటే ఉత్తర కొరియా ప్రదర్శనే మెరుగ్గా ఉంది. ఆ దేశం ఇప్పటిదాకా 54 ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఉత్తర కొరియా మొదట్నుంచీ అదరగొడుతోంది. ఆ క్రీడలో మూడు ప్రపంచ రికార్డులు, రెండు ఒలింపిక్స్ రికార్డులు ఆ దేశం పేరిటే ఉన్నాయి. 2016లో రియో డి జనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా క్రీడాకారులు రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఏడు మెడల్స్ గెలుచుకున్నారు. ఫిఫా ర్యాంకుల ప్రకారం మహిళల ఫుట్‌బాల్‌లో ఆ దేశానిది 11వ స్థానం. 2019 ఒలింపిక్స్ క్వాలిఫయర్ల నుంచి ఆ దేశం అనూహ్యంగా వైదొలగినా, గత డిసెంబర్‌లో జరిగిన ఈస్ట్ ఏషియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌ను ఆ దేశ మహిళలే గెలుచుకున్నారు. 2016 అండర్-20 మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లోనూ వాళ్లే విజేతలు. పురుషులతో పోలిస్తే ఫుట్‌బాల్‌లో ఆ దేశ మహిళల ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. ఉత్తర కొరియా పురుషుల ఫుట్‌బాల్ జట్టు కేవలం రెండు సార్లే ప్రపంచ కప్‌లో పాల్గొంది. ఆ క్రీడలో వాళ్ల స్థానం 126. ఈ ఏడాది వింటర్ ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా తమ టైక్వాండో ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్) బృందాన్ని పంపే అవకాశాలున్నాయి. ఆ క్రీడలో కూడా ఉత్తర కొరియాకు మంచి పేరుంది. కానీ దక్షిణ కొరియాలో జరిగే ఒలింపిక్స్‌లో టైక్వాండో‌లోని కొన్ని విభాగాల్లో పోటీలకు చోటు దక్కలేదు. దాంతో కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉత్తర కొరియా టైక్వాండో బృందం పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇటీవల ప్యాంగ్యాంగ్‌లో జరిగిన టైక్వాండో పోటీల్లో ఉత్తర కొరియా 22 స్వర్ణాలను గెలుచుకుంది. రెండో స్థానంలో నిలిచిన రష్యా కేవలం ఏడు పసిడి పతకాలకు పరిమితమైంది. క్రీడల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? టైక్వాండోతో పాటు మరికొన్ని క్రీడలకు ఉత్తర కొరియా ప్రభుత్వం చాలా ప్రాధాన్యమిస్తుంది. దేశంలో యువ ప్రతిభావంతులను అన్వేషించడానికి అక్కడో వ్యవస్థ పనిచేస్తోంది. చాలా సమయంతో పాటు డబ్బునీ వెచ్చించి ఆ యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తారు. వాళ్లలో నుంచి కొందర్ని ఎంపిక చేసి ప్రత్యేక స్పోర్ట్స్ స్కూళ్లలో వాళ్లకు శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్ క్రీడాకారులుగా తయారు చేస్తారు. దేశంలో పేదరికంతో సంబంధం లేకుండా అక్కడి క్రీడాకారులకు అత్యుత్తమ సదుపాయాల మధ్య శిక్షణ అందుతుంది అంటారు ఉడొ మెర్కెల్ అనే ఉత్తర కొరియా క్రీడా రంగ నిపుణుడు. చాలా కమ్యూనిస్ట్ దేశాల్లో మాదిరిగానే ఉత్తర కొరియాలోనూ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రాధాన్యమిస్తోంది. మిలటరీ, లేబర్ యూనియన్లు లాంటివి తరచూ క్రీడా పోటీలను నిర్వహిస్తాయి. 1980ల్లో ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు, బాక్సింగ్, టైక్వాండో లాంటి కొన్ని క్రీడలవైపు వాళ్లను మళ్లించేందుకు ప్రభుత్వం భారీ క్యాంపైన్‌లను నిర్వహించింది. వాటి ఫలితం ఆ దేశ క్రీడాకారుల ప్రదర్శనలోనూ కనిపిస్తోంది. ఎన్నో పెద్ద దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా క్రీడాకారులు తమకంటూ కొంత ప్రత్యేకత గుర్తింపును సాధించుకున్నారు. ఇవి కూడా చూడండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఫిబ్రవరి నుంచి దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా పాల్గొనే అంశం అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వాళ్లు ఆ పోటీల్లో పాల్గొంటారో లేదోననే విషయంపై ఇంకా స్పష్టత లేదు. text: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది సౌదీ అరేబియా యువరాజులు అవినీతి ఆరోపణలతో కటకటాల పాలయ్యారు. గతంలోని అవినీతి నిరోధక శాఖను యువరాజు మొహమ్మెద్ బిన్ సల్మాన్ ప్రక్షాళన చేశారు. పాత అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించారు. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో కొత్త శాఖ ఏర్పాటైన గంటల వ్యవధిలోనే ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయిన వారిలో 11 మంది యువరాజులతో పాటుగా ఇద్దరు ప్రస్తుత మంత్రులు, డజన్ల కొద్దీ మాజీ మంత్రులు ఉన్నారు. అయితే వీరిని ఏ కేసుల్లో అరెస్టు చేశారన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు. కానీ గతంలోని కొన్ని కేసుల్లో తాజాగా మళ్లీ దర్యాప్తు ప్రారంభమైందని స్థానిక మీడియా సంస్థ అల్ - అరేబియా చెబుతోంది. మొహమ్మద్ సల్మాన్ సౌదీ సింహాసనానికి వారసుడు. సౌదీ భావి చక్రవర్తి. ఇప్పటికే ఎన్నో సంస్కరణలతో సల్మాన్ దూసుకుపోతున్నారు. సౌదీపై పట్టు సాధించడంలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని బీబీసీ ప్రతినిధి ఫ్రాంక్ గార్డ్‌నర్ తెలిపారు. సల్మాన్ అంతటితో ఆగలేదు. సౌదీ జాతీయ భద్రత శాఖామంత్రి మితెబ్ బిన్ అబ్దుల్లాతో పాటుగా, నేవీ కమాండర్ అడ్మైరల్ అబ్దుల్లా బిన్ సుల్తాన్ బిన్ మొహెమ్మద్ అల్ - సుల్తాన్‌ను కూడా విధుల నుంచి తప్పించారు. కానీ వీరిని విధుల నుంచి తప్పించడానికి కారణాలు మాత్రం అధికారులు చెప్పడం లేదు. మొహెమ్మద్ బిన్ గతంలో రక్షణ శాఖామంత్రిగా కూడా పనిచేశారని, సింహాసనాన్ని అధిష్టించబోయే తరుణంలో జాతీయ భద్రతపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని బీబీసీ ప్రతినిధి తెలిపారు. జాతీయ భద్రత శాఖామంత్రి యువరాజు మితెబ్ బిన్ సింహాసనాన్ని అధిష్టించబోయే యువరాజుల రేసులో ఉన్నారు. గతంలో మొహమ్మద్ బిన్‌ సల్మాన్ కు గట్టి పోటీనే ఇచ్చారు కూడా. ‘మితవాద ఇస్లామ్’ తన సంస్కరణలకు పునాది అని మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటున్నారు. అతి త్వరలోనే సౌదీలోని ఉగ్రవాద అవశేషాలను ఏరిపారేస్తానని రియద్ కాన్ఫరెన్స్‌లో ఈ భావి చక్రవర్తి ప్రతిజ్ఞ చేశారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మా ఇతర కథనాలు సౌదీ మహిళలు ఇక స్టేడియానికి వెళ్లొచ్చు! సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ! ఐసిస్ అధ్యక్షుడు అల్ బగ్ధాదీ బతికే ఉన్నాడా? థాయ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు సౌదీ యువరాజులు ఊచలు లెక్కపెడుతున్నారు. రాజులు ఊచలు లెక్కపెట్టడమా? అవును.. text: రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణంపై నిర్ణ‌యం కోసం క‌మిటీని కూడా నియ‌మించింది. ఆ క‌మిటీ నివేదికను రూపొందించే పనిలో ఉంది. అది ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన త‌ర్వాత అమ‌రావ‌తి భ‌విత‌వ్యంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబుతోంది. ఈలోగానే సింగ‌పూర్ క‌న్సార్షియం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అమ‌రావ‌తి స్టార్ట‌ప్ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తొలుత అధికారికంగా త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం... అమ‌రావ‌తి రాజ‌ధాని న‌గ‌ర అభివృద్ధిలో భాగంగా తొలుత‌ స్టార్ట‌ప్ ఏరియా అభివృద్ధి కోసం సింగ‌పూర్ క‌న్సార్షియంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో ఒప్పందం జ‌రిగింది. అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ సెంబ్ కార్ప్ కార్పొరేష‌న్ సంస్థ‌లు క‌న్సార్షియంగా ఏర్ప‌డి సీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలోని అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీతో 2017 మే 15న ఈ ఒప్పందం చేసుకున్నాయి. నాటి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ స‌మ‌క్షంలో ఈ ఒప్పందంపై సంత‌కాలు జ‌రిగాయి. స్టార్టప్ ఏరియా ఒప్పందం ప్ర‌కారం.. రాబోయే 15 ఏళ్ల‌లో మూడు ద‌శ‌లుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకోసం 6.84 చ‌దరపు కిలోమీట‌ర్ల ప‌రిధిలోని 1,691 ఎక‌రాల‌ను గుర్తించారు. తొలుత 2022 నాటికి అంటే రాబోయే ఐదేళ్ల‌లో 656 ఎక‌రాలను అభివృద్ధి చేస్తామ‌ని ఒప్పందం చేసుకున్నారు. వీటిలో 170 ఎక‌రాలు న‌దీ తీరంలో ఉన్నాయి. అందులో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం సీఆర్‌డీఏ రూ. 2,118 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఆదాయంలో 52 శాతం వాటా సింగ‌పూర్ క‌న్సార్షియం తీసుకుంటుంది. మిగిలింది సీఆర్‌డీఏకు ద‌క్కుతుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో 1.25 ల‌క్ష‌ల కుటుంబాలు అమ‌రావ‌తిలో స్థిర‌ప‌డ‌తాయ‌ని, 15 ఏళ్ల‌లో 2.5 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని నాడు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. అలా స్టార్ట‌ప్ ఏరియా అభివృద్ధి ద్వారా 1.15 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని, ఏటా 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయ‌లు ప‌న్నుల రూపేణా ప్ర‌భుత్వానికి చేర‌తాయ‌ని చెప్పింది. గ‌డిచిన రెండున్న‌రేళ్ల‌లో ఏం జ‌రిగింది..? అమ‌రావ‌తి స్టార్ట‌ప్ ఏరియాల అభివృద్ధిలో భాగంగా 1,604 కిలోమీట‌ర్ల పొడవునా రోడ్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. వాటిలో 697 కిలోమీట‌ర్ల పొడ‌వునా సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం ప్రారంభమై ప్ర‌స్తుతం వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. అలాగే 2,354 కిలోమీట‌ర్ల పొడవైన వాట‌ర్ పైప్ లైన్ నిర్మాణం చేయాల‌ని భావించి 831 కిలోమీట‌ర్ల పైప్ లైన్ నిర్మాణం ప్రారంభించారు. ఎంపిక చేసిన ప్రాంతంలో వివిధ నిర్మాణ కార్య‌క‌లాపాలు గ‌త మార్చి త‌ర్వాత పూర్తిగా స్తంభించాయి. మే నెల‌లో ప్ర‌భుత్వం మార‌డంతో అమ‌రావ‌తి న‌గ‌రంలో కార్య‌క‌లాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. స్టార్ట‌ప్ ఏరియాలో కూడా ముంద‌డుగు లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా జగన్ విమ‌ర్శ‌లు... ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌తంలో ప్రతిప‌క్ష నేత‌గా ఈ ఒప్పందంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. స్టార్ట‌ప్ ఏరియా కోసం సింగ‌పూర్ క‌న్సార్షియంతో చేసుకున్న ఒప్పందాన్ని త‌ప్పుపడుతూ అమ‌రావ‌తిలో భూ కేటాయింపుల తీరులో పెద్ద స్థాయిలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. తాము అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తి కోసం చేసుకున్న ఒప్పందాల‌ను స‌మీక్షిస్తామ‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక అధికారంలోకి వ‌చ్చిన తర్వాత దానికి అనుగుణంగానే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపించింది. ముఖ్యంగా అమ‌రావ‌తి న‌గ‌రంలో నిర్మాణాల పనులు దాదాపుగా నిలిపివేసింది. అదే స‌మ‌యంలో మంత్రులు ప‌లు సంద‌ర్భాల్లో కీల‌క ప్ర‌క‌ట‌నలు కూడా చేశారు. రాజ‌ధాని విష‌యమై పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపారు. ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి బొత్సా స‌త్య‌న్నారాయ‌ణ రాజ‌ధానిగా అమ‌రావ‌తిపై ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేస్తుంద‌ని, అక్క‌డ నిర్మాణాల‌కు ఖ‌ర్చు ఎక్కువ‌ని, వ‌ర‌ద ముప్పు కూడా ఉందని ప‌దే ప‌దే ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సింగ‌పూర్ ఒప్పందం నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యం... సింగ‌పూర్ క‌న్సార్షియం ప్ర‌తినిధులు గ‌త అక్టోబ‌ర్ నెల మొద‌టి వారంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఏపీ క్యాబినెట్ స‌మావేశమైంది. సింగ‌పూర్ క‌న్సార్షియంతో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని తీర్మానించింది. అందుకు అనుగుణంగానే తాజాగా సింగ‌పూర్ ప్ర‌భుత్వం త‌రపున అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒప్పందం నుంచి వైదొలగినట్టు సింగపూర్ ప్ర‌భుత్వం త‌రఫున మంత్రి ఈశ్వ‌ర‌న్ తెలిపారు. పరస్పర అవగాహనతో వైదొలగుతున్నట్లు అధికారిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో కలిసి పని చేస్తామని ఆశాభావం కూడా వ్య‌క్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భారత్, ఏపీలలో సింగపూర్ వాణిజ్య సంస్థల పెట్టుబడులపై ప్రభావం ఉండదని పేర్కొన్నారు. పెట్టుబడి సంస్థలు లాభనష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్తాయని, అమరావతిలో పెట్టుబడుల ప్రభావం కొంత మేరకే ఉంటుందని తెలిపారు. ''క‌మిటీ నివేదిక ఆధారంగా ముందుకెళతాం...'' ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విష‌యంలో క‌మిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ‌తామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ''సింగ‌పూర్ క‌న్సార్షియంతో చేసుకున్న ఒప్పందాల విష‌యంలో ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా ఉంది. అమ‌రావ‌తి న‌గ‌రం విష‌యంలో ఏం చేయాల‌న్న‌ది జీఎన్ రావు క‌మిటీ రిపోర్ట్ త‌యారు చేస్తోంది. ప్ర‌జ‌ల నుంచి, రాజ‌ధాని ప్రాంత రైతుల నుంచి అభిప్రాయాలు సేక‌రిస్తోంది. నేటితో ఆ క‌మిటీకి గ‌డువు ముగుస్తోంది'' అని చెప్పారు. ''నిపుణుల క‌మిటీ ఏం చెబుతున్న‌ది చూడాలి. ఆ త‌ర్వాత క్యాబినెట్ తుది నిర్ణ‌యం తీసుకుంటుంది. సింగ‌పూర్ క‌న్సార్షియంతో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత వెలువ‌డిన ఉత్త‌ర్వుల ప్ర‌కార‌మే సింగ‌పూర్ తాజా ప్ర‌క‌ట‌న‌ చేసింది. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వారు ఆస‌క్తిగానే ఉన్నారు. అంద‌రినీ ఆహ్వానించి, మ‌రింత మెరుగైన రీతిలో రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం జ‌రిగేందుకు ప్ర‌య‌త్నం చేస్తాం'' అని వివ‌రించారు. ''రాజ‌ధాని నగరాన్ని కలగా మార్చేశారు...'' ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం కోసం ఐదేళ్ల పాటు చంద్ర‌బాబు పడిన క‌ష్టాన్ని నీరుగార్చేశార‌ని టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వ్యాఖ్యానించారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ''సింగ‌పూర్ ప్ర‌భుత్వ స‌హ‌కారంతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప‌ద్ధ‌తిలో రాజ‌ధాని నిర్మాణం కోసం ప్ర‌య‌త్నం చేశాం. రైతుల త్యాగాల‌తో ముందుకు వెళ్లాం. కేంద్రం స‌హ‌క‌రించినా లేకపోయినా సొంతంగా రాజ‌ధాని నిర్మించాల‌ని ఎంతో శ్ర‌మ ప‌డ్డాం. స్టార్టప్ ఏరియా ద్వారా అభివృద్ధి కోసం అడుగులు వేస్తే ఇప్పుడు ఆటంకాలు పెట్టి ఒప్పందాలు ర‌ద్దు చేసుకోవ‌డం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతుంది'' అని విమర్శించారు. ''ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ బ్యాంక్, ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ వంటివి వెన‌క్కిపోయాయి. ఎస్‌బీఐ స‌హా ఎవ‌రూ రుణాలు ఇవ్వ‌డానికి ముందుకు రాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాజ‌ధాని న‌గ‌రం క‌ల‌గా మార్చేస్తున్నారా అన్న అనుమానం వ‌స్తోంది. రాష్ట్రంలో రివ‌ర్స్ పాల‌న సాగించ‌డం బాధాక‌రం'' అని పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌ర వ్య‌వ‌హారం ఆస‌క్తికరంగా మారుతోంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిపై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ సాగిస్తోంది. text: ఈ దుమ్ము తుపాను బుధవారం రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లలో మొదలైంది. దీంతో పలు చోట్ల విద్యుత్తుకు ఆటంకం తలెత్తింది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పశువులు కూడా పెద్ద ఎత్తున చనిపోయినట్లు సమాచారం. వేసవిలో ఉత్తర భారత్‌లో దుమ్ము తుఫాను సాధారణం. కానీ దీని వల్ల ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం అరుదని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ దుమ్ము తుపాను వచ్చింది రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పూర్, ధోల్‌పూర్‌లలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాల్లోనే కనీసం 29 మందికిపైగా చనిపోయారు. మృతుల కుటుంబాలకు రాజస్థాన్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో 73 మంది చనిపోయారు. ఒక్క ఆగ్రా జిల్లాలోనే 40 మందికిపైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆగ్రాకి 50 కిలోమీటర్ల దూరంలోని ఖెరాగడ్‌ అనే గ్రామంలో 21 మంది మృతి చెందినట్లు స్థానిక జర్నలిస్టు లక్ష్మీకాంత్ పచౌరీ వెల్లడించారు. ఈ గ్రామంలో ప్రజలు ఇంత భారీ నష్టాన్ని ఊహించలేదన్నారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఈ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. దుమ్ము తుపాను బాధితులను ఆదుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం దుమ్ము తుపానును పైవీడియోలో చూడొచ్చు. అసలు కారణమేంటి.. దుమ్ము తుపానుకు కారణాలపై భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ బీబీసీతో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షాలు కురుస్తున్నాయని.. వాటి ప్రభావంతో దుమ్ము తుపాను రేగిందని వివరించారు. ప్రస్తుతం గాలులు అరేబియా సముద్రం నుంచి వీస్తున్నాయని.. దీంతో రాజస్థాన్ నుంచి ఈ దుమ్ము తుపాను మొదలైందని తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బుధవారం దిల్లీ శివారు రాజ్‌నగర్‌లో దుమ్ము తుపాను బీభత్సం దక్షిణాన పిడుగుల మోత దుమ్ము తుపాను ఉత్తరాదిని వణికిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు, మెరుపులు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఇటీవల ఏపీలోని 11 జిల్లాల్లో ఒక్కరోజులోనే కేవలం 13 గంటల వ్యవధిలో 36,749 పిడుగులు, మెరుపులు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ పరిధిలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి కిషన్ తెలిపారు. పిడుగుపాటుకు మూడు జిల్లాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 10,432 చోట్ల పిడుగులు, మెరుపులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి 24 వరకు 86,526 పిడుగులు పడగా.. అందులో కేవలం ఏప్రిల్ 24న మాత్రమే 36,749 నమోదయ్యాయని కిషన్ వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర భారత్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. దీని ధాటికి 100 మందికిపైగా చనిపోయినట్టు సమాచారం. కొన్ని వందల మంది గాయపడ్డారు. text: అందుకే ఇక్కడికి కరోనావైరస్ కూడా చేరుకోలేదు. ట్రిస్డన్ డ కూనాను సంక్షిప్తంగా టీడీసీ అని పిలుస్తుంటారు. అక్కడికి వెళ్లడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. కేవలం పడవల్లోనే వెళ్లగలం. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరం నుంచి అక్కడికి 18 రోజుల ప్రయాణం. అది కూడా తీవ్రమైన ఆటుపోట్లు ఉండే సముద్రంలో ప్రయాణించాలి. ఒకవేళ వేగంగా ప్రయాణించే ఎస్ఏ అగుల్హాస్ పడవైతే, ఆరు రోజుల్లో ప్రయాణం పూర్తవుతుంది. కానీ, ఏడాదికి ఒక్కసారి ఆ పడవ అక్కడికి వెళ్తుంది. పైగా దాని టికెట్ దొరకడం చాలా కష్టం. కొన్ని చేపలు పట్టే బోట్లు కూడా టీడీసీకి వెళ్లి, వస్తుంటాయి. అలాంటివారు ఎవరైనా దయతలిస్తే కూడా అక్కడికి వెళ్లొచ్చు. టీడీసీ ద్వీప సమూహంలోని ప్రధాన ద్వీపాన్ని కూడా టీడీసీ అని పిలుస్తారు. ఇది సుమారు 11 కిలో మీటర్ల వ్యాసంతో ఉన్న ఓ అగ్నిపర్వత ప్రాంతం. చివరిసారిగా 1961లో ఈ అగ్నిపర్వతం లావాను వెళ్లగక్కింది. ఈ ద్వీపంపై ఎడిన్‌బరో ఆఫ్ ద సెవెన్ సీస్ పేరుతో ఓ చిన్న ప్రాంతం ఉంది. ఈ మొత్తం ద్వీప సమూహంలో జనం నివసించే ఏకైక ప్రాంతం ఇదే. టీడీసీ మొత్తం జనాభా 245. ఇందులో మహిళలు 133 మంది, పురుషులు 112 మంది. ఓ కేఫ్, ఓ పోస్ట్ ఆఫీస్, ఓ పబ్, ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఓ హాలు, ఒక చిన్న ఆధునిక ఆసుపత్రి, చిన్న బడి ఇక్కడ ఉన్నాయి. ఈ ద్వీపంపై ఉండటం ఓ ఊరిలో జీవిస్తున్నట్లే ఉంటుంది. ‘‘మనతోపాటు స్కూల్లో చదువుకున్నవారు జీవితాంతం మనకు మిత్రులుగా ఉంటారు. కొత్తవాళ్లు మన జీవితంలోకి రావడం అరుదు’’ అని అలాస్డేర్ విల్లీ బీబీసీతో అన్నారు. కొంతకాలం కిందటి వరకూ ఆయన టీడీసీలోనే ఉన్నారు. అక్కడ ఆయన వ్యవసాయ సలహాదారుడిగా పనిచేసేవారు. టీసీడీలో ప్రధానంగా ఆరు ఇంటిపేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. అవి... లావారెల్లో, రాపెట్టో, రోజర్స్, స్వెయిన్, గ్రీన్, గ్లాస్. వివాహాలు సాధారణంగా స్థానికుల మధ్యే జరుగుతుంటాయి. ద్వీపంలో ఇప్పుడు ఉన్నవారిలో ఇద్దరు మినహా అందరూ ఇక్కడివారే. ఆ ఇద్దరూ ఈ ద్వీపవాసులను పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. టీడీసీ బ్రిటన్‌కు చెందిన భూభాగం. బ్రిటన్ ఇక్కడ ఓ డాక్టర్‌ను, ఓ టీచర్‌ను నియమిస్తూ ఉంటుంది. అయితే, వాళ్లు మారుతూ ఉంటారు. ఇక్కడ గడ్డి పరకల చప్పుడు కూడా వినిపిస్తుంటుందని స్థానికుడు హరాల్డ్ చెబుతున్నారు. టీడీసీలో ఉండే ప్రశాంతమైన వాతావరణం తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. ఈ ద్వీపంలో ఇళ్లకు ఎవరు తాళాలు కూడా వేసుకోరని హరాల్డ్ చెప్పారు. టీసీడీలో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉండదు. ఫోన్ సేవలు మాత్రం ఉచితం. ఈ ద్వీపంపై తీరం వెంబడి మూడు కి.మీ.ల పొడవైన ఓ రోడ్డు కూడా ఉంది. పంటపొలాలుండే ‘ద పాచెస్’ ప్రాంతానికి ఇది వెళ్తుంది. ఈ పొలాల్లో కూరగాయలు, ముఖ్యంగా ఆలుగడ్డలు పండిస్తారు. ఎండాకాలంలో అక్కడికి వెళ్లి వన భోజనాల్లాంటివి చేసుకుంటామని స్థానికులు చెప్పారు. అప్పుడప్పుడు టీడీసీవాసులు అందరూ కలిసి బార్బీక్యూ విందులు కూడా చేసుకుంటుంటారు. ‘‘ఒకప్పుడు ఈ ద్వీపంలోని జనాల జీవితాల్లో సంగీత వాయిద్యాలు, పాటలు ముఖ్య భాగంగా ఉండేవి. కానీ, ఇప్పుడు చాలా మంది ఖాళీ సమయాలను స్క్రీన్లకు కళ్లప్పగించేసి గడుపుతున్నారు’’ అని అలాస్డేర్ అన్నారు. అద్భుతమైన కొండలు, లోయలతో ఉండే ఈ ద్వీపంపై ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. సముద్ర మట్టానికి 2,062 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలు కూడా ఇక్కడ ఉన్నాయి. టీసీడీ తీరంలో మూడింట రెండొంతల భాగం కొండలతోనే ఉంది. ఇక్కడ మైదాన ప్రాంతం చాలా తక్కువ. నైటింగల్ ఐలాండ్స్ టీసీడీ పరిధిలో నైటింగల్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. టీడీసీవాసులు ఎప్పుడైనా విడిది కోసం ఆ ద్వీపానికి వెళ్తుంటారు. టీసీడీతో పోల్చితే ఇక్కడ సముద్రంలో ఆటుపోట్లు, షార్క్‌లు తిరగడం తక్కువ. కాబట్టి, వారికి ఈత కొట్టేందుకు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇన్‌యాక్సిసెబుల్ ఐలాండ్ ఇన్‌యాక్సిసెబుల్ ఐలాండ్, గాగ్ ఐలాండ్ అనే మరో రెండు ద్వీపాలు టీసీడీ పరిధిలో ఉన్నాయి. గాగ్ ఐలాండ్‌‌లో దక్షిణాఫ్రికాకు చెందిన పరిశోధకుల బృందం ఉంటుంది. ఏటా ఆ బృంద సభ్యులు మారుతూ ఉంటారు. ‘‘టీసీడీ లాంటి మారుమూల ద్వీపంలో జీవితం అద్భుతంగా ఉంటుందని కొందరు అనుకుంటుంటారు. కానీ, ఇక్కడి కష్టాలు ఇక్కడ ఉంటాయి. ఈ ప్రాంతం అందంగా ఉంటుందన్నది వాస్తవం. కానీ, ఇది స్వర్గమైతే కాదు’’ అని అలాస్డేర్ అన్నారు. టీడీసీ ద్వీప సమూహంలో గాలుల సవ్వడి, ప్రధాన ద్వీపంలో ఆవుల సందడి మినహా పెద్దగా చప్పుళ్లు వినిపించవు. నిజానికి ఈ ద్వీపాల్లో చాలా పక్షులు ఉంటాయి. ఎందుకో, అవి శబ్దాలు మాత్రం పెద్దగా చేయవు. ఇన్‌యాక్సిసెబుల్ ఐలాండ్ రైల్ పక్షి తమను వేటాడే జీవులేవీ లేకపోవడంతో కొన్ని పక్షులు ఇక్కడ ఎగరకుండానే ఉండిపోతాయి. ఇన్‌యాక్సిసెబుల్ ఐలాండ్ రైల్ పక్షి వీటిలో ఒకటి. ఈ ద్వీప సమూహంలో మాత్రమే కనిపించే అరుదైన జీవి ఇది. ఇలాంటి మారుమూల ద్వీపంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఐసోలేషన్ పాటించాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే, ఇక్కడికి కరోనావైరస్ కూడా ఇంకా రాలేదు. అయితే, కోవిడ్ మహమ్మారి లేకున్నా, దాని ప్రభావమైతే తమపై ఉందని స్థానికురాలు ఫియోనా క్లిపాట్రిక్ అంటున్నారు. కోవిడ్ కారణంగా దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ అమలు కావడంతో టీడీసీకి కేప్‌టౌన్ నుంచి సరుకులు తెచ్చే పడవలు అక్కడే ఆగిపోయాయి. ''మాములు సమయాల్లోనే టీసీడికి వస్తువులు రావడం అన్నది సంక్లిష్టైమన వ్యవహారం. చిన్న తేడా వచ్చినా, సమస్యలు వస్తాయి. అలాంటిది కోవిడ్ సమయంలో ఈ ప్రక్రియపై ఇంకా తీవ్ర ప్రభావం పడింది'' అని అలాస్డేర్ అన్నారు. కోవిడ్ కారణంగా టీసీడీలో ఓ అరుదైన ఘటన కూడా జరిగింది. చాలా ఏళ్ల తర్వాత టీసీడీలో ఓ తల్లి పాపకు జన్మనిచ్చారు. ''సాధారణంగా ఇక్కడ గర్భంతో ఉన్నవాళ్లు డెలివరీ సమయానికి సమస్యలేవీ రాకూడదని దక్షిణాఫ్రికా వెళ్తారు. లాక్‌డౌన్ కారణంగా ఇలా వెళ్లే పరిస్థితి ఆ మహిళకు లేకపోయింది. అలా చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఓ పాప పుట్టింది'' అని అలేస్డేర్ అన్నారు. ఆ తల్లి, పాప క్షేమంగానే ఉన్నారు. టీసీడీకి మొట్టమొదటగా జనం 1800ల్లో వచ్చి స్థిరపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జనాభా తగ్గుతూ వస్తోంది. ''నేను అక్కడున్న సమయంలో 15 మంది వృద్ధాప్యంతో చనిపోయారు. ఇద్దరే పుట్టారు'' అని అలెస్డేర్ చెప్పారు. ''ఇక్కడి అమ్మాయిలు ముగ్గురు బ్రిటన్‌లో సెకండరీ స్కూల్‌లో చదువుకుంటున్నారు. వారిలో ఒకామె ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకున్నారు'' అని అలస్డేర్ చెప్పారు. టీసీడీ వాసుల్లో యూనివర్సిటీకి వెళ్తున్న తొలి యువతిగా ఆమె ఘనత అందుకోనుంది. ఇదివరకు టీడీసీలో ఓ యువతి డిస్టేన్స్ ఎడ్యుకేషన్ పద్ధతి ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. టీడీసీ గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత... ఆ ద్వీసానికి వెళ్లి, సెటిలైతే బాగుండు అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ, వారి ఆశలు తీరే అవకాశాలు చాలా తక్కువ. ''ఎవరైనా ఇక్కడ శాశ్వతంగా ఉండాలని అనుకుంటే, టీడీసీ మండలి ఆమోదం తప్పనిసరి. కానీ, చాలా దరఖాస్తులను మండలి తిరస్కరిస్తుంటుంది’’ అని అలాస్డేర్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీప సమూహాల్లో ట్రిస్డన్ డ కూనా ఒకటి. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ 2 వేల కి.మీ.ల పరిధిలో ఎక్కడా జనావాసాలన్నవే లేవు. text: ఇందులోని యంత్ర సామాగ్రిలో చాలా భాగం యూరప్‌కు చెందినదే. ఈ పరికరాల సాయంతో అంగారకుడిపై ఉన్న రాతిపొరల లోపలి నిర్మాణాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 27 తెల్లవారుజాము 1:23 గంటలకు కాస్త అటుఇటుగా ఇన్‌సైట్ ల్యాండర్ అంగారకుడిపై ల్యాండ్ అవ్వనుంది. గతంలోకూడా నాసా ఇలాంటి ప్రయోగాలను చేసింది. కానీ ఆ ప్రయోగాల్లో చాలావరకు విఫలమయ్యాయి. అంగారకుడి ఉపరితలంలోని వాతావరణాన్ని స్పేస్ క్రాఫ్ట్ తట్టుకుని నిలవాలి. అందుకే అంగారకుడిపై చేరిన మొదటి 7 నిమిషాలు ఈ ప్రయోగంలో అత్యంత కీలకం. అంగారకుడిపై ఉన్న పలుచటి వాతావరణంలో అత్యంత వేగంతో ప్రవేశించే ఇన్‌సైట్ ల్యాండర్, తన వేగాన్ని నియంత్రించుకుంటూ అంగారకుడి ఉపరితల వాతావరణానికి అనువైన వేగంతో ల్యాండ్ అవ్వాలి. ''ఇంతవరకూ చాలా ప్రయోగాలు జరిగాయి. అందులో చాలా విఫలమయ్యాయి కూడా. అంగారకుడిపైకి వెళ్లడం చాలా చాలా కష్టం'' అని నాసా ఉన్నతాధికారి థామస్ జర్బుచన్ అన్నారు. ప్రయోగం ఖర్చు ఎంత? ఈ ప్రయోగానికి ఓ వారసత్వ సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తోంది. 2007లో నాసా ప్రయోగించిన ‘ఫీనెక్స్‌’ను అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ చేసిన హీట్ షీల్డ్, పారాచూట్, రెట్రో-రాకెట్ల సాంకేతిక పరిజ్ఞానాన్నే మళ్లీ ఈ ప్రయోగంలో ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని ప్రయోగాన్ని సమీక్షిస్తున్న ఈడీఎల్(ఎంట్రీ, డీసెంట్ అండ్ ల్యాండింగ్) ఇంజనీర్లు ధీమా వ్యక్తం చేశారు. గతంలోని ఫలితాల తాలూకు గణాంకాల పట్ల తమకు అవగాహన ఉందంటున్నారు. ''అంగారకుడిపై స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా ల్యాండ్ అవ్వడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశాం'' అని ప్రాజెక్ట్ మేనేజర్ టామ్ హాఫ్‌మ్యాన్ అన్నారు. ''అంగారక గ్రహం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రయోగానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా స్పేస్ క్రాఫ్ట్ కూడా సిద్ధంగానే ఉంది. కానీ అంగారకుడే సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు'' అని టామ్ బీబీసీతో అన్నారు. తాజా సమాచారం ఏమిటి? ఈడీఎల్ ఇంజనీర్లు.. అంగారకుడిపైని వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా అంగారకుడి వాతావరణంలోకి ఇన్‌సైట్ ప్రవేశాన్ని కష్టతరం చేసే దుమ్ము తుపానులు, పెనుగాలులు వీచే అవకాశాలను పరిశీలిస్తున్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఇన్‌సైట్‌కు నిర్దేశించిన గతి మార్గంలో ఆదివారం నాడు స్వల్ప మార్పులు చేశారు. ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటెడ్ విధానంలోనే ఉంటుంది. అలాకాకుండా కమాండ్స్ ద్వారా ప్రయోగాన్ని నిర్వహించాలంటే ఇక్కడ ఇచ్చే కమాండ్లు అంగారకుడికి చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. అంగారకుడిపై అడుగుపెట్టిన వెంటనే ఇన్‌సైట్ వెలువరించి సందేశాలు.. రెండు చిన్న ఉపగ్రహాల ద్వారా భూమికి చేరతాయి. ప్రాథమిక సమాచార వ్యవస్థ పని చేయక, ఇన్‌సైట్‌తో సంబంధాలు కోల్పోయిన పక్షంలో ఇన్‌సైట్ పనితీరును గమనించడానికి భూమి మీద నుంచి రేడియో టెలిస్కోప్‌కూడా ఈ ప్రక్రియను గమనిస్తూనే ఉంటుంది. ల్యాండ్ అయిన వెంటనే ఈ స్పేస్‌క్రాఫ్ట్.. పరిసరాలను ఫోటోతీసి భూమికి పంపేలా సిద్ధం చేస్తుందని ఊహించుకుంటే.. ఆ ఫోటోలు భూమిని చేరడానికి 30 నిమిషాల సమయం పట్టవచ్చు. దీని ప్రత్యేకతలు ఏమిటి? అంగారకుడి లోపలి నిర్మాణాలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి ప్రయోగం ఇది. ప్రపంచం ఎలా ఏర్పడిందన్న అంశాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌సైట్ ముందు 3 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో.. ఫ్రాన్కో-బ్రిటీష్ సిస్మోమీటర్స్: భూకంపన తరంగాల లాగే అంగారకుడి అంతర్భాంగంలోని కంపన తరంగాలను విశ్లేషించడం ద్వారా, అంగారకుడిపై ఉన్న రాతిపొరలు ఎక్కడివి? ఎప్పుడు ఏర్పడ్డాయి అన్న ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు. జర్మన్ మోల్: అంగారకుడి ఉపరితలం నుంచి 5 మీటర్ల లోతుకు రంధ్రం చేసి, ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రతల ద్వారా అంగారక గ్రహం పనితీరును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. రేడియో ట్రాన్స్‌మిషన్స్: రేడియో ట్రాన్స్‌మిషన్స్ ద్వారా, అంగారక గ్రహం ఏవిధంగా తన ‘అక్షం’ మీద ఆధారపడి ఉందన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధరించడానికి ప్రయత్నిస్తారు. ''ఉడకబెట్టిన గుడ్డు, సాధారణ గుడ్డును ఒకేసారి గిరగిరా తిప్పితే, అవి తిరిగే విధానం వేరు వేరుగా ఉంటుంది. ఆ తేడా.. వాటిలోపల ఉన్నటువంటి పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. అలానే, అంగారకుడి అంతర్భాగం ద్రవరూపమా లేక ఘనరూపంలో ఉందా మనకు తెలీదు. అసలు ఈ గ్రహపు అంతర్భాగం ఎంత పెద్దదో కూడా తెలీదు. కానీ ఈ ప్రయోగం ఆ సమాచారాన్ని మనకిస్తుంది'' అని డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ సుజానే స్మ్రేకర్ అన్నారు. ఇది తెలుసుకోవడం ఎందుకు? భూమి అంతర్గత నిర్మాణం ఎలా ఉందో శాస్త్రజ్ఞులకు బాగా తెలుసు. 450 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ సౌర వ్యవస్థ ఆవిర్భావం మొదలైన విధానాన్ని వివరించడానికి అవసరమైన నమూనాలు వారి వద్ద ఉన్నాయి. కానీ అంగారకుడిపై జరిపే పరిశోధనలు శాస్త్రవేత్తలను మరో కోణంలో ఆలోచింపచేస్తాయి. గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన కొన్ని చిన్నచిన్న విషయాలు.. భూమిపై బయటకు వెళితే ఎందుకు నల్లబడతారు? శుక్ర గ్రహంపై సెకెన్లలోనే ఎందుకు మాడిపోతారు? అదే అంగారకుడిపై బయటకు వెళితే ఎందుకు గడ్డకట్టుకుపోయి చనిపోతారు అన్నవాటిని వివరిస్తాయి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అంగారకుడిపై మరో రొబోటిక్ పరిశోధనకు నాసా సిద్ధమవుతోంది. అంగారకుడి ఉత్తర భాగంలోని చదును ప్రాంతం లక్ష్యంగా 'ఇన్‌సైట్ ల్యాండర్'ను ప్రయోగించారు. ఈ ప్రాంతాన్ని ఎలిసియమ్ ప్లానిషియా అని పిలుస్తారు. text: వారి పేర్లు నూపో సురేశ్, ఓడి సన్నీ (మహిళ), కోవాసి బద్రు, పద్దమ్ లఖ్మాగా పేర్కొంది. ఈ నలుగురి ఫొటోలను విడుదల చేసింది. కాగా మాడ్వి సుక్కా అనే గ్రామస్థున్ని పోలీసులు పట్టుకొని కాల్చేశారని ఆరోపించింది. అయితే, బీబీసీ ఈ ఆరోపణలను స్వతంత్రంగా నిర్ధరించలేదు. దాడి చేయడానికి వచ్చారు అందుకే.. సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో వివిధ గ్రామాలపై దాడి జరిపేందుకు బస్తర్‌లోని ఐజీ పి. సుందర్‌రాజ్‌ నేతృత్వంలో ఏప్రిల్ 3న 2000 మంది జవాన్లు ఈ ప్రాంతానికి తరలి వచ్చారని, అందుకే తాము ఎదురుదాడికి దిగామని మావోయిస్టులు ప్రకటించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మంగళవారం ఓ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. పోలీసులు దాడి చేయడానికి రావడంతో తమ సభ్యులు వారితో వీరోచితంగా పోరాడారని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ పోరాటంలో తమ దళ సభ్యులు నలుగురు మరణించారని కూడా అందులో వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను జన విరోధులుగా, సామ్రాజ్యవాదులుగా పేర్కొంటూ, తమను చంపడానికి భారీ ఎత్తున సైన్యాన్ని పంపారని ఆరోపించారు. తమ ఎదురుదాడిలో 24మంది పోలీసులు మరణించారని 31మందికి పైగా గాయపడ్డారని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు తమ శత్రువులు కాదని ప్రకటించిన మావోయిస్టులు, మరణించిన పోలీసుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు. చర్చల గురించి "మేం చర్చలకు ఎప్పుడూ సిద్ధమే. కానీ ప్రభుత్వానికి ఇందులో నిజాయితీ లేదు. చర్చల్లో పాల్గొన్న వారెవరూ గతంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వెళ్లలేదు. కాబట్టి ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు జరుపుతామనే షరతు సరైంది కాదు. పోలీసు క్యాంపులను ఎత్తివేయాలి, దాడులు ఆపాలి, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే చర్చలు సాధ్యం" అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. కనిపించకుండా పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, అతన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం నిర్దిష్టంగా మధ్యవర్తుల పేర్లను ప్రకటించాలని, అప్పటి వరకు జనతన సర్కారు దగ్గర ఆ జవాన్‌ క్షేమంగా ఉంటాడని మావోయిస్టులు ఆ లేఖలో తెలిపారు. ఆ వార్తలను వెరిఫై చేస్తున్నాం.. తమ జవాన్ ఒకరు ఇప్పటికీ కనిపించడం లేదని, మావోయిస్టుల వద్ద బందీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, అయితే, ఆ వార్తలను వెరిఫై చేసుకుంటున్నట్లు సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. 'మట్టి సత్యాగ్రహం'లో తెలుగు రైతులు.. ఏపీ, తెలంగాణ నుంచి దిల్లీకి చేరిన మట్టి కుండలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఘాజీపూర్, సింఘూ సరిహద్దుల దగ్గర కొన్ని నెలలుగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. రైతు ఉద్యమంలో మట్టి సత్యాగ్రహం ఒక కీలక ఘట్టంగా భావిస్తున్నారు. ఈ మట్టి సత్యాగ్రహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 150 గ్రామాలకు చెందిన రైతులు మట్టికుండలను పంపించారు. విస్సా కిరణ్ కుమార్ నేతృత్వంలో రైతు స్వరాజ్య వేదిక బృందం వీటిని దిల్లీకి తీసుకుని వచ్చి రైతు ఉద్యమ నాయకులకు అందించారు. ఉప్పు సత్యాగ్రహం ముగిసిన ఏప్రిల్ ఆరునే ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు సమావేశాలు నిర్వహించారని రైతు స్వరాజ్య వేదిక పేర్కొంది. నేరుగా రాలేక మట్టిని పంపించడం ద్వారా ఈ ఉద్యమానికి రైతులు తమ సంఘీభావం తెలిపారని విస్సా కిరణ్ కుమార్ అన్నారు. కనీస ధర రాకపోతే, మరింత మంది రైతులు అప్పుల్లో కూరుకుపోతారని కె. సాగరిక చెప్పారు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మట్టి సత్యాగ్రహ ప్రచారాన్ని అంబేద్కర్ జయంతి వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఇరాన్ అణు ఒప్పందం: వియన్నా చర్చలకు హాజరుకానున్న అమెరికా 2018లో ట్రంప్ హయాంలో ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. అందుకే వియన్నాలో జరిగే చర్చల్లో పాల్గొనాలని అమెరికా నిర్ణయించింది. కానీ, ట్రంప్‌ గతంలో ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించారు. వాటిని ఇప్పుడు బైడెన్ ఎత్తేయాలనుకుంటే ఇందులో భాగస్వాములుగా ఉన్న ఆరు దేశాలు కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు ఎత్తివేసే వరకు అమెరికాతో నేరుగా సంప్రదింపులు జరిపేది లేదని ఇరాన్ తెలిపింది. ఆస్ట్రియాలో జరగనున్న సమావేశంలో అమెరికా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇరాన్ మరో చోటు నుంచి సమావేశానికి హాజరవుతుంది. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, యూకే మరొకచోట నుంచి సమావేశంలో పాల్గొంటాయి. "మా ముందున్న సవాళ్లను మేము తక్కువగా అంచనా వేయటం లేదు" అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. "ఇది ప్రారంభ దశ. ఈ చర్చల ద్వారా వెంటనే ఏదో పరిష్కారం లభిస్తుందని మేము అనుకోవడం లేదు. ఈ చర్చలు కూడా చాలా క్లిష్టంగా ఉండొచ్చని భావిస్తున్నాం" అని ఆయన అన్నారు. ఇరాన్ అణు ఒప్పందం వివాదమేంటి ఇరాన్ అణుబాంబును తయారు చేసి న్యూక్లియర్ శక్తిగా అవతరించాలని అనుకుంటోందని కొన్ని అగ్రదేశాలు భావిస్తాయి. అయితే, ఇరాన్ దీన్ని ఖండిస్తోంది. 2015లో ఇరాన్‌ మరో 6 దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. కఠినమైన ఆంక్షలు తొలగించినందుకు బదులుగా అణు కార్యక్రమాలను ఇరాన్ నిలిపివేయడం ఆ ఒప్పందం సారాంశం. ఇప్పుడున్న సమస్య ఏమిటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌పై ఆంక్షలను తిరిగి విధించారు. అప్పటి నుంచి ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అనుకుంటున్నారు. మంగళవారం సమావేశంలో ఆంక్షల ఎత్తివేతపైనే దృష్టి సారిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. దిల్లీలో ఇవాళ్టి నుంచి రాత్రి కర్ఫ్యూ దిల్లీలోని ఇండియా గేట్ దిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ నిర్ణయం మంగళవారం రాత్రి నుంచి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఒక్కరోజునే దిల్లీలో 3,548 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది చనిపోయారు. దీంతో కలిపి ఇప్పటివరకు దేశ రాజధానిలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 6,79,962కు చేరింది. ప్రస్తుతం నగరంలో 14,589 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నైజీరియా: జైలు మీద బాంబులు, గ్రెనేడ్లతో దాడి... 1,844 మంది ఖైదీలు పరార్ నైజీరియాలో సాయుధుల దాడి జరిగిన జైలు నైజీరియాలోని ఒక జైలు నుంచి 1,800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. కొంతమంది సాయుధులు ఓవేరీ పట్టణంలోని జైలులోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు బాంబులతో పేల్చేశారని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటన తరువాత 35 మంది ఖైదీలు పారిపోవడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయారు. మరో ఆరుగురు తిరిగి వెనక్కి వచ్చారు. నిషిద్ధ ' ఇండిజీనస్ పీపుల్ బయాఫ్రా' సంస్థ ఈ దాడికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. అయితే, ఆ సంస్థ ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఐమో రాష్ట్రంలోని ఈ జైలు నుంచి మొత్తంగా 1,844 మంది ఖైదీలు పారిపోయారని నైజీరియన్ కరెక్షనల్ సర్వీస్ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున సాయుధ గుంపులు బస్సులు, ట్రక్కులలో ఓవేరీ కస్టోడియల్ సెంటర్లోకి దూసుకొచ్చారని, వారి వద్ద బాంబులు, మెషీన్ గన్లతో పాటు రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ, "ఇది ఉన్మాదంతో కూడిన తీవ్రవాద చర్య" అని అన్నారు. దాడి చేసిన వారిని, తప్పించుకున్న ఖైదీలను వెంటనే పట్టుకోవాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు. ఇండిజీనస్ పీపుల్ ఆఫ్ బయాఫ్రా సంస్థ ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ, సోమవారం నాటి దాడి వెనుక తాము ఉన్నామన్నది "అబద్ధం" అని చెప్పారు. ఐమో రాష్ట్రం చాలా కాలంగా వేర్పాటువాదు ఉద్యమాలతో రక్తమోడుతోంది. ఇక్కడి స్థానిక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జనవరి నెల నుంచి ఈ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లు, వాహనాల మీద దాడులు జరిగాయి. తుపాకులు, మందుగుండు సామగ్రిని భారీగా కొల్లగొట్టారు. సోమవారం నాటి దాడి గురించి ఇప్పటివరకూ ఏ సంస్థా అది తమ పనే అని ప్రకటించలేదు. తల్లులను, శిశువుల ప్రాణాలు కాపాడుతున్న కారు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో తమ సభ్యులు నలుగురు మరణించారని మావోయిస్టు పార్టీ అంగీకరించింది. text: పోస్ట్ of Twitter ముగిసింది, 1 గిరీష్ కర్నాడ్‌కు కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో మంచి పట్టుంది. గిరీష్ కర్నాడ్ తన మొదటి నాటకం కన్నడలో రాశారు, తర్వాత దానిని ఇంగ్లిషులోకి అనువదించారు. దీనితోపాటు ఆయన నాటకాల్లో 'యయాతిట, 'తుగ్లక్', 'హయవదన్', 'అంజు మల్లిగె', 'అగ్నిమతు మాలె' 'నాగమండల్' చాలా ప్రముఖమైనవి. గిరీష్ కర్నాడ్‌కు 1994లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ లభించాయి. 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1992లో కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1998లో కాళిదాసు అవార్డుతో ఆయన్ను సత్కరించారు. 1970లో కన్నడ సినిమా సంస్కార్‌ నుంచి గిరీష్ కర్నాడ్ నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఆయన మొదటి సినిమాకు రాష్ట్రపతి గోల్డెన్ లోటస్ పురస్కారం లభించింది. ఆర్‌కే నారాయణ్ పుస్తకం ఆధారంగా బుల్లితెరపై వచ్చిన 'మాల్గుడి డేస్' సీరియల్‌లో ఆయన స్వామికి తండ్రి పాత్ర చేశారు. 1990లో మొదలైన సైన్స్ ఆధారిత టీవీ కార్యక్రమం 'టర్నింగ్ పాయింట్‌'ను హోస్ట్‌ చేశారు. ఆయన ఆఖరి సినిమా కన్నడ భాషలోనే నిర్మించిన అప్నా దేశ్. ఇది ఆగస్టు 26న విడుదలైంది. గిరీష్ కర్నాడ్ తెలుగులో చేసిన ఆఖరి సినిమా కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్ అనే సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. గిరీష్ కర్నాడ్ తెలుగులో ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో నటించారు. ప్రేమికుడు లాంటి ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు. బాలీవుడ్‌లో ఆయన ఆఖరి సినిమా టైగర్ జిందాహై(2017). గిరీష్ కర్నాడ్ మృతిపై సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విటర్‌లో గిరీష్ కర్నాడ్ మృతికి సంతాపం తెలిపారు. "గిరీష్ కర్నాడ్‌ బహుముఖ ప్రతిభ అన్ని మాధ్యమాలలో గుర్తుండిపోతుంది. ఆయన తనకు నచ్చిన విషయాలపై చాలా ఉద్వేగంతో మాట్లాడేవారు. ఆయన రచనలు, రాబోవు తరాల వారికి గుర్తుండిపోతాయి" అన్నారు. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ గిరీష్ కర్నాడ్ స్క్రిప్ట్స్ తనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. "ఆయన రచయితలైన ఎంతోమంది అభిమానులను వదిలి వెళ్లిపోయారు. ఆయన రచనలు ఈ విషాదాన్ని కాస్త తట్టుకునేలా చేయగలవని ఆశిస్తున్నాను" అన్నారు. ప్రముఖ నటి శ్రుతి హాసన్ 'మీ ప్రతిభ, మీ హాస్యం, చురుకైన మీ వివేకం మిస్ అవుతాం' అని ట్వీట్ చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రముఖ నటుడు, చిత్ర దర్శకుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార విజేత గిరీష్ కర్నాడ్ మృతిచెందారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. text: దక్షిణ, ఉత్తర కొరియా అధ్యక్షులు మునుపెన్నడూ లేనట్లుగా ఈ ఏడాది ఉత్తర కొరియా అటు అమెరికా, ఇటు దక్షిణ కొరియా నాయకత్వంతో భేటీ అవుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌లు చర్చలు జరిపి అణు నిరాయుధీకరణ అంగీకారానికి వచ్చినప్పటికీ ఆ దిశగా విస్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోలేదు. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య దక్షిణకొరియా మధ్యవర్తిత్వం వహిస్తూ కీలకంగా వ్యవహరిస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, ఆయన భార్య కిమ్ జింగ్ సుక్‌లు తమ మూడు రోజుల పర్యటన కోసం ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు మంగళవారం ఉదయం చేరుకున్నారు. విమానం దిగగానే వారికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ దంపతులు సాదర స్వాగతం పలికారు. గత దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా నేత ఒకరు ఇలా ఉత్తరకొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మూన్, కిమ్‌లు తొలిసారి భేటీ అయిన తరువాత వారిద్దరూ మళ్లీ కలుసుకోవడం ఇది మూడోసారి. ఉభయ కొరియాల అధ్యక్ష దంపతుల పలకరింపులు అజెండాలో ఏముంది? కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చేందుకు చేపట్టాల్సిన ఆచరణ సాధ్యమైన చర్యలపై వారిద్దరూ చర్చిస్తారు. దక్షిణకొరియాకు ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి. రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం.. అలాగే, అణు నిరాయుధీకరణ విషయంలో వాషింగ్టన్, ప్యాంగ్యాంగ్‌ల మధ్య రాయబారం చేయడం. ఏప్రిల్‌లో వీరిద్దరూ కలుసుకున్నప్పుడు రెండు దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు పెంపొందించుకోవడం, అణు ముప్పు నివారించడంపై సంయుక్త ప్రకటన చేశారు. ఆ తరువాత నుంచి కొరియా విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు... రెండు దేశాల మధ్య 24/7 కమ్యూనికేషన్లకు వీలుగా సరిహద్దులో ఒక లైజన్ ఆఫీసర్‌ను కూడా నియమించారు. ఇప్పుడు జరగనున్న సమావేశంలో మరింత ముందడుగు వేసి ఆర్థిక సంబంధాలనూ పెంచుకోవడం రెండు దేశాల ప్రధానోద్దేశంగా తెలుస్తోంది. సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో ఉన్న సైనిక మోహరింపును తగ్గించడం కూడా ఈ సమావేశంలో చర్చకు రావొచ్చు. జూన్‌లో జరిగిన భేటీ సందర్భంగా ట్రంప్, కిమ్ ఈ భేటీ అమెరికా-ఉత్తరకొరియాల మధ్య చర్చలకు తోడ్పడుతుందా? ఉత్తరకొరియా అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో దక్షిణ కొరియా ఆ దేశంతో కొత్త ఆర్థిక సంబంధాలు ఏర్పరుచుకోవడం ఆంక్షల సడలింపుపై ఆధారపడి ఉంటుంది. ప్యాంగ్యాంగ్, వాషింగ్టన్ చర్చల్లో వచ్చే పురోగతిని అనుసరించి ఇది ఉండొచ్చు. డోనల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌లు జూన్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే ఒప్పందం కుదిరినా దానికి స్పష్టమైన కాల పరిమితి ఏమీ నిర్దేశించుకోలేదు. ఆ తరువాత కిమ్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అంతర్జాతీయ పరిశీలకులూ చెబుతున్నారు. మరోవైపు అమెరికా కూడా తొలుత నిరాయుధీకరణ చేస్తే ఆ తరువాత ఆంక్షల ఎత్తివేత ఉంటుందని చెబుతోంది. ఉత్తరకొరియా మాత్రం ఈ ప్రక్రియ దశలవారీగా జరగాలని కోరుకుంటోంది. కాగా... ఇటీవల మరోసారి భేటీ కోసం ఉత్తరకొరియా ట్రంప్‌కు ఆహ్వానం పంపించింది. డోనల్డ్ ట్రంప్ తొలి విడత పాలనాకాలంలోనే అణు నిరాయుధీకరణ పూర్తిచేయాలని కిమ్ భావిస్తున్నారని దక్షిణ కొరియా రాయబారులు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎటూ తేలకుండా నిలిచిపోయిన అణు నిరాయుధీకరణ సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఉత్తర, దక్షిణ కొరియా దేశాధినేతలు సమావేశమవుతున్నారు. text: కశ్మీర్‌కు వెళ్లకుండా సొంత ఎంపీలు, ఉద్యమకారులను ఆపిన ప్రభుత్వం విదేశీ ఎంపీలను ఎలా పంపుతోందని ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కశ్మీర్‌లో పరిస్థితులంతా సాధారణంగా ఉంటే ఎంపిక చేసిన కొందరు విదేశీల ఎంపీలను మాత్రమే అక్కడికి ప్రభుత్వం ఎందుకు వెళ్లనిస్తోందని కాంగ్రెస్, సీపీఎం ప్రశ్నించాయి. కశ్మీర్ భారత అంతర్గత విషయమని వాదించి, ఇప్పుడు విదేశీ ఎంపీలను ఆ ప్రాంతంలో పర్యటింపజేయడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 23 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్‌కు చేరుకుని, అక్కడ భారత సైనిక అధికారులతో సమావేశమైంది. ఆ తర్వాత దాల్ సరస్సును సందర్శించింది. ఈ బృందం వెంట భద్రతా దళాల సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్నారు. కశ్మీర్ పర్యటన తర్వాత బుధవారం ఉదయం ఈ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తమ అనుభవాల గురించి వెల్లడించారు. అయితే, ఈ మీడియా సమావేశానికి స్థానిక మీడియాను అనుమతించలేదని బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ తెలిపారు. ''కశ్మీర్‌కు వచ్చిన వెంటనే ఆ 23 మంది ఎంపీలను సైనిక ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారిని నియంత్రణ రేఖ వద్దకు సైన్యం తీసుకువెళ్లింది. ఈ పర్యటన అంతర్జాతీయ సమాజాన్ని మోసపుచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమని నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ అక్బర్ లోన్ ఆరోపించారు'' అని రియాజ్ వివరించారు. ఒక ఈయూ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ, ''అంతర్జాతీయ ప్రతినిధి బృందంలో మేం భాగం. ఉగ్రవాదాన్ని అంతం చేసి, శాంతిని స్థాపించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. మేం దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మాకు ఆత్మీయ స్వాగతం పలికినందుకు భారత ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు ధన్యవాదాలు'' అని అన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాద సమస్య తీవ్రంగా ఉందని, అయితే భారత ప్రభుత్వం దీన్ని పరిష్కరించగలదని ఇంకొందరు ఈయూ ఎంపీలు విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం కశ్మీర్‌లో మిలిటెంట్లు ఐదుగురు కార్మికులను హత్య చేశారు. ఈ ఘటనపైనా ఈయూ ఎంపీలు స్పందించారు. ''ఆర్టికల్ 370 భారత్ అంతర్గత విషయం. మా ఆందోళన ఉగ్రవాదం గురించే. ఇది అంతర్జాతీయ సమస్య. దీన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు మద్దతుగా మేమున్నాం. కార్మికుల హత్యలను ఖండిస్తున్నాం'' అని ఫ్రాన్స్‌కు చెందిన ఈయూ ఎంపీ హెన్రీ మాలోసె వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. ''కొన్నేళ్ల సంఘర్షణ తర్వాత ఇక్కడ శాంతి నెలకొంటోంది. ప్రపంచంలోనే భారత్ అత్యంత శాంతిపూరిత దేశంగా మారాలని నేను ఆశిస్తున్నా. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌తో కలిసి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది కళ్లు తెరిపించే పర్యటన'' అని బ్రిటన్‌కు చెందిన ఈయూ ఎంపీ న్యూటన్ డన్ అన్నారు. అయితే, ఈయూ ఎంపీల పర్యటన వారి వ్యక్తిగతమైనదేనని యూరోపియన్ యూనియన్ తమకు తెలిపిందని దిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయ అధికారి వాల్టర్ జే లిండ్నర్ ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఏదైనా విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఆగస్టు 5న ఆర్టికల్ 370కి సవరణ చేయడం ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించి, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. కశ్మీర్ పర్యటనకు వచ్చిన ఈయూ ఎంపీలు ప్రముఖులు కాదని, ఇదంతా ప్రభుత్వం దగ్గరుండి నడిపిస్తున్న ఓ కార్యక్రమమని హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అమెరికాకు చెందిన ఓ సెనేటర్ కశ్మీర్‌లో పర్యటిస్తానని అనుమతి కోరితే ప్రభుత్వం నిరాకరించిందని అన్నారు. ఇంతకుముందు అమెరికా సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ కశ్మీర్‌లో పర్యటించడానికి భారత ప్రభుత్వం అనుమతి కోరారు. ఆయన అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. ఈయూ ఎంపీల పర్యటనలో ముఖ్యాంశాలు ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కశ్మీర్‌లో యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం పర్యటనపై వివాదం రేగుతోంది. text: కేసు నమోదైన వెంటనే అనేకమంది జర్నలిస్టులు ఈ కథనం రాసిన రచనా ఖైరాకు బాసటగా నిలిచారు. రచనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ఖండిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో, యూఐడీఏఐ ఒక రకంగా మీడియాను బెదిరించడానికి ప్రయత్నిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది ''ఇది పత్రికాస్వేచ్ఛపై దాడి. జర్నలిస్టుపై కేసు పెట్టడానికి బదులుగా, యూఐడీఏఐ ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలి'' అని ఆ ప్రకటన పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, రిపోర్టర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వెనక్కి తీసుకుని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. ఫౌండేషన్ ఫర్ మీడియా ఫ్రొఫెషనల్స్ అన్న మరో మీడియా సంస్థ కూడా ట్రిబ్యూన్ రిపోర్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని ఖండించింది. ఫౌండేషన్ డైరెక్టర్ మనోజ్ మిట్టా తన ఫేస్‌బుక్ పోస్టులో, ''ట్రిబ్యూన్ ప్రతినిధిపై కేసు పెట్టడం ఆందోళన కలిగించే విషయం. ఆధార్‌ విషయంలో ఒక ఏడాది వ్యవధిలో ఇలా భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం జరగడం ఇది నాలుగోసారి'' అన్నారు. ప్రభుత్వం తన విశ్వసనీయతను, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పణంగా పెట్టి ఆధార్‌‌ను సమర్థిస్తోందని అన్నారు. న్యాయవ్యవస్థ దీనిపై తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 'ద ట్రిబ్యూన్ ' ఎడిటర్ కృతజ్ఞతలు మీడియా సంస్థలు తమ ప్రతినిధి రచనా ఖైరాకు సంఘీభావం తెలియజేయడంపై 'ద ట్రిబ్యూన్ ' ఎడిటర్ హరీష్ ఖరే కృతజ్ఞతలు తెలిపారు. ‘'మా వార్తా సేకరణ చట్టబద్ధంగానే జరిగినట్లు మేం భావిస్తున్నాం. ఒక బాధ్యతాయుత మీడియా సంస్థగా మేం పత్రికా విలువలను పాటిస్తాం '' అని హరీష్ అన్నారు. ‘'ఈ వార్త సాధారణ ప్రజల మేలు కోసం ఉద్దేశించిన ఒక తీవ్రమైన సమస్యకు సంబంధించినది. నిజాయితీగా రాసిన ఈ వార్తను అధికారులు తప్పుగా తీసుకోవడం విచారకరం'' అన్నారు. ''పరిశోధనాత్మక జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ఉన్న అన్ని రకాల చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తాం'' అన్నారు. ద ట్రిబ్యూన్ ఈ ఎఫ్‌ఐఆర్‌ను పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో దీనిపై యూఐడీఏఐ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ వస్తున్న వార్తలను అది ఖండించింది. యూఐడీఏఐ ప్రెస్ నోట్‌లో, ''మేం పత్రికాస్వేచ్ఛను గౌరవిస్తాం. ట్రిబ్యూన్ జర్నలిస్టుపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ మీడియా స్వేచ్ఛపై దాడి కాదు'' అని పేర్కొంది. ఆధార్ డేటాబేస్‌ దుర్వినియోగం అవుతోందన్న వార్తలను ఖండించిన యూఐడీఏఐ.. ఆధార్ డేటాబేస్‌లోని బయోమెట్రిక్ డేటా పూర్తిగా సురక్షితమని పేర్కొంది. ''ప్రజలకు సాయపడేందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు, కొందరు వ్యక్తులకు డేటాబేస్‌కు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు యూఐడీఏఐ ప్రయత్నిస్తుంది'' అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ''ఈ కేసులో ప్రజల హితార్థం ఇచ్చిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. అందువల్లే దీనిలో ప్రమేయం ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు చేసాం’' అని తెలిపారు. దిల్లీ పోలీసులు ఏమంటున్నారు? ఈ సంఘటనపై జనవరి 5న తమ సైబర్ సెల్‌కు యూఐడీఏఐ ఫిర్యాదు చేసిందని దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదులో 'ద ట్రిబ్యూన్' ప్రతినిధి, యూఐడీఏఐ సమస్య పరిష్కార వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు, డేటాబేస్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను వెల్లడించిన వ్యక్తి కోసం వెదుకుతున్నట్లు తెలిపారు. జనవరి 4న 'ద ట్రిబ్యూన్‌'లో అచ్చయిన రచనా ఖైరా రిపోర్టు ఆధార్ డేటాబేస్‌కు సంబంధించిన భద్రతపై ఎప్పటికప్పుడు వివాదం చెలరేగుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకార్ పటేల్, గతంలోనే ఆధార్ డేటాబేస్‌పై తన సందేహాలను వెల్లడిస్తూ ఒక వ్యాసం రాసారు. ఆ వ్యాసంలో ఆయన, తాను ఇంతవరకు ఆధార్‌ను ఎందుకు తీసుకోలేదో వివరించారు. ఆధార్‌ను తప్పనిసరి చేసే నిబంధనను తొలగించాలని కోరారు. 'ద ట్రిబ్యూన్' ఈ నెల 4న ప్రచురించిన ఒక కథనంలో, ఒక ఏజెంట్‌కు 500 రూపాయలు చెల్లించి, యూఐడీఏఐ డేటాబేస్ నుంచి ఎవరి సమాచారాన్నైనా తెలుసుకోవచ్చనే సంచలన కథనాన్ని ప్రచురించింది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆధార్ డేటా లీకేజీపై కథనాన్ని రాసిన 'ద ట్రిబ్యూన్' జర్నలిస్టు రచనా ఖైరాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యూఐడీఏఐ అధికారుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 419, 420, 468, 471ల కింద ఆమెపై కేసు నమోదు చేసారు. వాటిలో పాటు ఆధార్ చట్టంలోని సెక్షన్ 36/37 కింద కూడా ఆమెపై కేసు నమోదైంది. text: బొంగు బిర్యానీ: ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సంచలనం పాత్రలేవీ ఉపయోగించకుండా తయారుచేసే ఈ వంటకం కొండ ప్రాంతాల నుంచి ప్రధాన భూభాగానికి ప్రయాణించి... భోజన ప్రియులకు ప్రీతిపాత్రంగా మారిపోయింది. ''మా పూర్వీకులు వంట పాత్రలు లేకపోవటం వల్ల ఈ బొంగుల్లో ఆహారం వండేవారు. అదే వంటకం 'బ్యాంబూ బిర్యానీ'గా విస్తృతంగా ప్రచారమైంది. దీనిని నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను'' అని వంట మాస్టర్ రఘు. సీహెచ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమల్లి, అరకు ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సంప్రదాయ వంటకం ఈ బొంగు బిర్యానీ. విజయవాడలో 2018 ఆగస్టులో బ్యాంబూ బిర్యానీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ''ఏదైనా భిన్నంగా చేయాలని అనుకునేవాడ్ని. జనం బ్యాంబూ బిర్యానీ తినాలనుకుంటే ఏజెన్సీ ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఈ రెస్టారెంట్ ప్రారంభించాను'' అని రెస్టారెంట్ యజమాని సురేశ్ చెప్పారు. ఈ రెస్టారెంట్ బొంగు బిర్యానీ వంటకు అవసరమైన ముడి సరుకులన్నిటినీ గిరిజన ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. ''నేను మొదటిసారి ఈ బ్యాంబూ బిర్యానీ తింటున్నా. ఇందులో నూనె, మసాలాలు వాడకపోవటం వల్ల ఇది చాలా రుచిగా ఉంది'' అని పి.రమ అనే మహిళ పేర్కొన్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో పుట్టిన బొంగు బిర్యానీ (బ్యాంబూ బిర్యానీ) రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని తమ రాష్ట్ర బ్రాండ్‌గానూ ప్రకటించింది. text: కప్ప గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడమేంటి? అని చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ, అది నిజం. 1930ల్లో బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త లాన్సెలోట్ హాగ్బెన్ రకరకాల జంతువులపై పరిశోధనలు చేస్తుండేవారు. వివిధ రకాల రసాయనాలను (ఎక్కువగా హార్మోన్లు) జంతువుల శరీరాల్లోకి ఎక్కించి అవి ఎలా స్పందిస్తున్నాయో పరిశీలించేవారు. అలా ఒకసారి కప్ప మీద ప్రయోగం చేశారు. గర్భధారణ హార్మోన్‌‌ను కప్పకు ఎక్కించినప్పుడు అది గుడ్లు పెడుతుందని గుర్తించారు. (ప్రయోగశాలలో ఉంచిన కప్పలు) రెండు మూడు దశాబ్దాల పాటు వేలాది కప్పల మీద ఈ పరీక్షలు చేశారు. మహిళల మూత్రాన్ని ఆడ కప్ప చర్మంలోకి ఎక్కిస్తారు. ఆ తర్వాత కప్ప గుడ్లు పెడితే ఆ మహిళ గర్భం దాల్చినట్లుగా భావిస్తున్నారు. మహిళ నుంచి సేకరించిన తాజా మూత్రాన్ని ఆడ కప్ప చర్మంలోకి ఎక్కించి కొద్దిసేపు వేచిచూసేవారు. ఆ మహిళ గర్భం దాలిస్తే, కొన్ని గంటల్లోనే కప్ప 5 నుంచి 12 గుడ్లు పెడుతుంది. 1930 నుంచి 1970ల మధ్య గర్భ నిర్ధారణ కోసం ఈ పరీక్షలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఈ పరీక్షలు చేయించుకున్న మహిళల్లో మౌరీస్ సైమన్స్ ఒకరు. ఆమె 1960ల్లో రెండుసార్లు ఈ కప్ప సాయంతోనే గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. "ఆ సందర్భం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. రెండుసార్లు తెల్ల కోటు ధరించిన డాక్టర్ వచ్చి 'మీకు శుభవార్త... మీరు తల్లికాబోతున్నారు. మీ నుంచి సేకరించిన హార్మోన్‌‌‌తో ఆ కప్పలు గుడ్లు పెట్టాయి' అని చెప్పారు. అప్పుడు కలిగిన సంతోషాన్ని నేను ఇప్పటికీ మరచిపోలేదు" అని మౌరీన్ బీబీసీతో గుర్తు చేసుకున్నారు. ప్రయోగశాలలో కప్ప గుడ్లు ఈ పరీక్షలతో కచ్చితమైన ఫలితాలు వస్తుండేవని మౌరీన్ చెప్పారు. కప్ప గుడ్లు పెట్టిందంటే ఆ మహిళ గర్భం దాల్చినట్లు పక్కాగా తెలిసిపోయేదని అన్నారు. అయితే, సాధారణ ప్రజలకు ఈ పరీక్షలు ఎక్కువగా అందుబాటులో ఉండేవి కాదు. దీనిని ప్రయోగశాలలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ కప్పకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడాలి. అందుకే, వైద్య పరిశోధనల కోసం ఈ పరీక్షలను ఎక్కువగా చేసేవారు. ఈ పరీక్షలకు బాగా ప్రాచుర్యం లభించడంతో అప్పట్లో కొందరు ప్రత్యేక ప్రయోగశాలలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుత తరాలకు కప్ప పరీక్షలు చాలా వింతగా అనిపిస్తాయి. కానీ, ఆ పరీక్షలు వచ్చిన తర్వాత సమాజంలో చాలా మార్పులొచ్చాయని స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త జెస్సీ ఓల్స్‌జింకో చెప్పారు. "అంతకుముందు 'ప్రెగ్నెన్సీ' గురించి బహిరంగంగా మాట్లాడటమే నిషిద్ధం అన్నట్లుగా ఉండేది. కనీసం పత్రికల్లోనూ రాసేవారు కాదు. ఈ పరీక్షలు వచ్చిన తర్వాత క్రమంగా ప్రజల ఆలోచనా విధానం కాస్త మారింది" అని ఆయన వివరించారు. సమాజంలో ఎన్నో మార్పులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నాందిపలికాయి. గర్భ నిర్ధారణ కోసం 1990ల్లో ఆధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఆ కప్పలపై పరీక్షలు తగ్గిపోయాయి. ప్రస్తుతం గర్భ నిర్ధారణ కోసం అనేక రకాల పరికరాలు, పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సబ్- సహరన్ ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ కప్ప (జెనపస్)కు ఓ విశిష్టత ఉంది. గర్భ నిర్ధారణ పరీక్షల కోసం ఈ కప్పను కొందరు వినియోగిస్తారు. text: రెండు వ్యాక్సీన్లను కలిపితే ఆ కొత్త వ్యాక్సీన్‌కు కోవిడ్-19 నుంచి కాపాడే సామర్థ్యం పెరుగుతుందా? లేదా? అన్నది ఈ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. సాధారణంగా ఇలా రెండు వ్యాక్సీన్లను కలిపితే వచ్చే కొత్త వ్యాక్సీన్ వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కొత్త వ్యాక్సీన్‌ను రష్యాలో 18 ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగిస్తారు. అయితే, ఎంత మందిపై ప్రయోగిస్తారు? ఎంతకాలం ఈ ప్రయోగం జరుగుతుంది? అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు. తమ వ్యాక్సీన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆక్స్‌ఫర్డ్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే, వృద్ధుల్లో ఈ వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుందనే అంశంపై ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. దీనికి ఇంకా బ్రిటన్ ప్రభుత్వం అనుమతి లభించాల్సి ఉంది. ప్రజల రోగ నిరోధక శక్తిని పెంచి, మెరుగైన రక్షణ కల్పించే వ్యాక్సీన్ కోసం తాము వివిధ వ్యాక్సీన్ల కాంబినేషన్లను పరీక్షిస్తున్నామని ఆస్ట్రజెన్‌కా వెల్లడించింది. డిస్నీ ప్లస్: స్టార్ వార్స్, మార్వెల్ ఫ్రాంచైజీల నుంచి కొత్త సిరీస్‌లు... ఇకపై సినిమాల విడుదల ఓటీటీలోనే డిస్నీ తన సబ్‌స్క్రిప్షన్ స్ట్రీమింగ్ సేవల్లో స్టార్ వార్స్, మార్వెల్ ఫ్రాంచైజీలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలో రాబోయే తమ 'పీటర్ పాన్ అండ్ వెండీ', టామ్ హాంక్స్ 'పినోకియో' సినిమాలను థియేటర్లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ సేవల్లో విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. థియేటర్లలో విడుదలకు బదులు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ మీద దృష్టిపెడుతున్న ప్రధాన స్టూడియోల్లో తాజాగా డిస్నీ కూడా చేరింది. వార్నర్ బ్రదర్స్ కూడా 2021లో విడుదలయ్యే తమ సినిమాలన్నింటినీ మొదట హెచ్‌బీవో మ్యాక్స్ లో విడుదల చేస్తామని గతవారం చెప్పింది. కరోనా మహమ్మారితో సినిమా, వినోద రంగాలను కష్టాలు చుట్టుముట్టాయి. మరోవైపు బిగ్ స్క్రీన్స్ మీద ప్రదర్శించే కంటెంట్‌తో ప్రేక్షకులను మళ్లీ ఆకర్షించాలని థియేటర్లు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ, అలాంటి నిర్మాణ సంస్థలు మాత్రం థియేటర్లకు వెళ్లడానిక సిద్ధంగా లేని తమ ప్రేక్షకులకు వాటిని అందించాలని అనుకుంటున్నారు. డిస్నీ ప్లస్ యాప్‌లో సూపర్ హిట్ అయిన మాండలోరియన్ డిస్నీ ప్రణాళికలు తమ దగ్గరున్న మార్వెల్, స్టార్ వార్స్ ఫ్రాంచైజీల నుంచి కొన్నేళ్లవరకూ 10 కొత్త సిరీస్‌లు ప్రసారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిస్నీ ప్రకటించింది. వీటిలో డిస్నీ+ బిగ్గెస్ట్ హిట్ 'ది మాండలోరియన్' కూడా ఉంది. ఇది స్టార్ వార్స్ లో ఒక పాత్ర. ఈ కొత్త సిరీస్‌లో యోడా జాతికి చెందిన పాత్ర కూడా ఉంది. 2016 'రోగ్ వన్' సినిమాలో డియేగో లూనా చేసిన పాత్ర 'ఆండోర్' పేరుతో డిస్నీ మరో స్టార్ వార్స్ సిరీస్ కూడా ప్రకటించింది. 'ది బాడ్ బాచ్', 'ఎ డ్రాయిడ్ స్టోరీ' అనే స్టార్ వార్స్ యానిమేటెడ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు డిస్నీ సంస్థ చెప్పింది.వీటితోపాటూ త్వరలో 15 లైవ్-యాక్షన్, 15 యానిమేషన్ సినిమాలను కూడా స్ట్రీమింగ్ సేవల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పింది. తమ సబ్‌స్క్రైబర్స్ ప్రతివారం కొత్తగా ఏదైనా ఊహించవచ్చని సంస్థ నిర్వాహకులు చెప్పారు. 2021లో విడుదలయ్యే మొత్తం 17 సినిమాలనూ మొదట హెచ్‌బీవో మ్యాక్స్ లో విడుదల చేస్తామని గతవారం వార్నర్ బ్రదర్స్ చెప్పిన తర్వాత, ఇప్పుడు డిస్నీ కూడా అలాంటి ప్రకటనే చేసింది. ఏడాది క్రితం ప్రారంభమైన డిస్నీ+ కు ప్రస్తుతం ఎనిమిదిన్నర కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. సంస్థ ఊహించిన దానికంటే ఇది చాలా ఎక్కువ. అయినా, అది ఇంకా నెట్‌ఫ్లిక్స్ కంటే వెనకబడి ఉంది. దానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఆయుర్వేద వైద్యుల శస్త్ర చికిత్స ఉత్తర్వులపై డాక్టర్ల నిరసన ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్ర చికిత్సలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల డాక్టర్లు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. ఫైజర్ టీకాను అనుమతించాలని అమెరికా నిపుణుల సిఫారసు ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని అమెరికా ఫుడ్ అండ డ్రగ్ అడ్మిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)కు ఆ దేశంలోని నిపుణులు సిఫారసు చేశారు. ఈ టీకా వేసుకోవడం వల్ల ఎదురయ్యే ముప్పు కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని నిశ్చయించిన 23 మంది సభ్యుల ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫైజర్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సీన్‌ను బ్రిటన్, కెనడా, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఇప్పటికే అనుమతించాయి. ఎఫ్‌డీఏ ఈ టీకాను ఇంకా ఆమోదించాల్సి ఉంది. త్వరలో దీనికి అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అమెరికాలో రికార్డు సంఖ్యలో ఒకే రోజు 3 వేలకు పైగా మరణాలు నమోదైన తర్వాత రోజు నిపుణులు ఈ నిర్ణయం తీసుకున్నారు. "ఎఫ్‌డీఏతో సమావేశం తర్వాత మేం రోజుల్లోనే వ్యాక్సీన్ పొందవచ్చు. మరో వారంలో అత్యంత బలహీనంగా ఉన్నవారికి వాటిని వేస్తాం. ఎఫ్డీఏ ఆమోదం పొందిన 24 గంటల్లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం" అని అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ బుధవారం చెప్పారు. అమెరికా కోసం తొలి దశలో 64 లక్షల టీకాలు సిద్ధం చేయాలని ఫైజర్ భావిస్తోంది. ఒక వ్యక్తికి రెండు డోసులు అవసరం కావడంతో 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఇవి 30 లక్షల మందికి సరిపోతాయి. ప్రాధాన్య జాబితాలో ఉన్న దేశంలోని 2 కోట్ల మంది వైద్య సిబ్బందికి మొదట ఈ టీకా వేయనున్నట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెప్పారు. కేర్ హోమ్స్ లో ఉంటున్న మరో 30 లక్షల మంది వృద్ధులకు కూడా వ్యాక్సీన్ వేయనున్నారు. తర్వాత దేశంలోని కీలక రంగాలలో పనిచేస్తున్న దాదాపు 8 కోట్ల 70 లక్షల మంది కార్మికులకు తర్వాత దశలో టీకాలు వేయనున్నారు. కానీ. వీటిని ఎలా పంపిణీ చేయాలనేదానిపై రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. దీంతో, ఏయే రంగాల కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది రాష్ట్రాలకే వదిలేయనున్నారు. కరోనా వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం లేని వారికి 2021 వేసవికి ముందే టీకాలు వేస్తామని అధికారులు చెప్పారు. మోడెర్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తయారు చేసిన మరో వ్యాక్సిన్‌ కూడా అమెరికాలో అత్యవసర వినియోగం కోసం అనుమతులు కోరుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రజెన్‌కా, స్పుత్నిక్-వీ వ్యాక్సీన్లను కలిపి మరింత సమర్థవతమైన వ్యాక్సీన్ తయారు చేసేందుకు బ్రిటన్, రష్యా సైంటిస్టులు ఏకం అవుతున్నారు. text: న్యాయం చేయాల్సింది పోయి ఊళ్ళోవాళ్లంతా ఏకమై వీరిని సామాజికంగా బహిష్కరించారు. రాజస్తాన్‌ రాష్ట్రంలోని బలాడ్ గ్రామానికి చెందిన ఈ మంగణ్యార్‌ వర్గ ప్రజలంతా ఇప్పుడు జైసల్మేర్‌కు వలస వచ్చి స్థానికుల వద్ద తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. అసలు సమస్యేంటి? సెప్టెంబర్‌ 27వ తేదీన జరిగిన నవరాత్రి జాగరణ్ కార్యక్రమంలో రమేష్ అనే వ్యక్తి అమద్ ఖాన్‌ను దేవి ఆత్మను రప్పించే ఓ ప్రత్యేక పాట పాడమని అడిగితే అమద్ ఖాన్ ఆ పాట పాడారు. కానీ అతని పాట రమేష్‌కు నచ్చలేదు. ఆ తర్వాత అమద్ ఖాన్‌పై తీవ్రమైన దాడి జరిగింది. దీంతో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత మంగణ్యార్‌ వర్గంవారు భయంతో తమ మేకలను కూడా ఆ ఊళ్ళోనే వదిలేసి బయటికి వచ్చేశారు. తమ కుటుంబ సభ్యుడైన అమద్ ఖాన్ హంతకులను పట్టుకోవాలని, వారికి శిక్ష విధించాలని మంగణ్యార్‌‌లు పంచాయితీలో డిమాండ్ చేశారు. కానీ ఊళ్ళో వారు, పంచాయితీ సభ్యులు వారి మాటలు నమ్మలేదు. దీంతో మంగణ్యార్‌‌లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఊళ్ళోవారందరూ సామాజికంగా మంగణ్యార్‌లను బహిష్కరించారు. కోపం లేదు.. కానీ భయం ఉంది మంగణ్యార్‌ వర్గం వారు ముస్లిం మతానికి చెందినవారు. పాటలు పాడటమే వారి వృత్తి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు వచ్చేది వాళ్ళే. ఎన్నో తరాల నుంచి వారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. "మా గురించి ఊళ్ళో వాళ్లకు అస్సలు చెప్పొద్దు.. పోస్ట్ మార్టం గురించి అస్సలు మాట్లాడొద్దని" వారు భయంగా అన్నారు. ఇంతకు ముందు ఆమద్ ఖాన్ తమ్ముడిని కూడా ఎవరో పనికి తీసుకెళ్తున్నానని చెప్పి తీసుకెళ్లారు. తర్వాత అతని శవం కనిపించింది. అయినా ఆ ఊళ్ళో వాళ్లు వీరికి న్యాయం జరగనీయలేదు. అసలు ఈ విషయం బయటికి పొక్కనీయలేదు. అసలేం జరిగింది ? అమద్ ఖాన్ తలపై తీవ్రంగా దాడి చేయడంతోనే అతడు మృతి చెందాడని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. అమద్ ఖాన్ హత్య తర్వాత అతని ఫొటో చూస్తే శరీరం మీద నీలి రంగులో గాయాలు స్పష్టంగా కనిపించాయి. "మేమేం చేయగలం? మా దగ్గర ఏమీ లేదు. ఒకప్పుడు మాతో పాటలు పాడించుకునేవారే నేడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము వారి స్థలంలో ఉంటాము, వారిచ్చేదే తింటాము. ఇప్పుడు వారే మమ్మల్ని బహిష్కరిస్తే మా పరిస్ధితి ఏంటి" అని హకీమ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. "పంచాయితీ సభ్యులు శవాన్ని మట్టిలో పాతిపెట్టండని అన్నారు. మేము దానికి కూడా అంగీకరించాం. కానీ వారు మాకు న్యాయం చేయలేదు. ఆ తర్వాతే మేము పోలీసులను సంప్రదించాం" అని కుర్తాలో ఉన్న జక్కే ఖాన్ అన్నారు. స్థానిక పోలీసులు, అధికారులు ఎంత చెబుతున్నా వారు మాత్రం "రోడ్లమీదన్నా పడుకుంటాం కానీ ఊళ్లోకి అస్సలు వెళ్ళం" అని అంటున్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాటలు పాడటమే వారి జీవనోపాధి. సంగీతం వారి నరనరాల్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ సంగీతమే మంగణ్యార్‌ వర్గానికి చెందిన అమద్ ఖాన్ హత్యకు కారణమయ్యింది. text: స్మృతి ఇరానీకి ప్రధాని నరేంద్ర మోదీ, సంఘ్ పరివార్ మద్దతు ఎక్కువ. గత ఎన్నికలలో ప్రత్యర్థి అయిన రాహుల్ గాంధీని విమర్శించడంలో ఆమె ఎల్లప్పుడూ ముందుంటారు. 2014లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్‌పై పోటీ చేసి స్మృతి ఇరానీ ఓడిపోయారు. కానీ బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. రాహుల్ గాంధీని విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా స్మృతి ఇరానీ వదులుకోరు. గతంలో అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ అమెరికన్ యూనివర్సిటీలో తనకు ఎదురైన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పారు. కశ్మీర్ అంశం మొదలుకుని నోట్ల రద్దు, వారసత్వ రాజకీయాలపై సంధించిన ప్రశ్నలకు దీటుగానే సమాధానం చెప్పారు. ఆ వెంటనే రాహుల్‌ను 'అసమర్థ నాయకుడు' అంటూ స్మృతి ఇరానీ విమర్శించారు. ఆమె విమర్శలు ఘాటుగా అనిపించినా వాటికి ఆధారాలు, లోతు తక్కువ. ఇక ఇరానీ చేసిన విమర్శ విషయానికి వస్తే.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనందుకే రాహుల్ 'అసమర్థ నాయకుడు' అయ్యారా? ఈ విమర్శలకు సమాధానంగా అమేథీలో స్మృతి ఇరానీ ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఆమెకు గుర్తుచేసింది. అంతేకాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గకుండా స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి అవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ విమర్శలకు తోడుగా చాలా మంది వ్యక్తులు కూడా ట్విటర్ వేదికగా స్మృతి ఇరానీని విమర్శించారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ తన గత చరిత్రను మరిచిపోయినట్టుంది! డా. మన్మోహన్ సింగ్ కూడా ఎటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే భారత ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీల మధ్య వయసు తేడా కేవలం 6 సంవత్సరాలే. రాహుల్ 1970లో జన్మించగా, స్మృతి 1976లో జన్మించారు. ప్రధాని మోదీ, ఆయన అధికార ప్రతినిధులు కూడా రాహుల్ గురించి మాట్లాడేటపుడు చాలా జాగ్రత్త వహిస్తున్నారు. రాహుల్‌ను ఎక్కువగా విమర్శిస్తే మోదీకి రాహుల్ సమ ఉజ్జీ అనే ఇమేజ్ ఇచ్చినట్టుంటుందని వారి భయం. అంతేకాకుండా.. ఇందిరా గాంధీ, సోనియా గాంధీలు లక్ష్యంగా ప్రత్యర్థులు మాటల దాడి చేయడం వారిద్దరికి ఏవిధంగా కలిసొచ్చిందో బీజేపీకి బాగా తెలుసు. కానీ ఇరానీ, రాహుల్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా రాహుల్‌కు బాగానే కలిసొచ్చింది. దీనివల్ల.. రాహుల్ ఓ బలమైన నేతగా ఎదుగుతున్నారు. రాహుల్ గాంధీ కాస్త బలమైన నేతగా, పనితీరు కాస్తంత సంతృప్తికరంగా ఉండటానికి చాలా కారణాలు పనిచేశాయి. ఫ్లోరిడా, బోస్టన్, ఇతర అమెరికా నగరాల్లో ఎక్కువకాలం ఉండటం కూడా ఆయనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. శామ్ పిట్రోడా, మిలింద్ దేవరా, శశి థరూర్ లాంటి వారు రాహుల్ ప్రసంగాలను ముందుగానే సిద్ధం చేస్తారు. ప్రసంగంలో మెరుపుల్లాంటి పాయింట్లు కూడా అప్పుడే సిద్ధమవుతాయి. ముందస్తుగా తయారు చేసిన ప్రసంగాలను రాహుల్ విశ్వసిస్తారు. దాంతో పాటుగా వాటిపై ఆయన కసరత్తు చేస్తారు కూడా. కానీ దేశంలో జరిగే రాజకీయ కార్యక్రమాల కోసం ప్రసంగాలు రాసేందుకు కూడా నిపుణులను ఏర్పాటు చేసుకోకపోవడం చూస్తే నాకు జాలేస్తుంది! ఆయన ప్రసంగం చెడ్డగా ఏమీ ఉండదు. కానీ సభికులతో ప్రత్యక్షంగా సంభాషించే సంధర్భాల్లోనే ఆయన ఇబ్బంది పడతారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే సమయాల్లో అమెరికాలోని వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడి ఉండాల్సింది. రాహుల్ గాంధీ బుష్ కుటుంబం, క్లింటన్ కుటుంబాలను ఉదహరించి ఉండొచ్చు. ఏమో ఎవరికి తెలుసు.. భవిష్యత్తులో బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ కుటుంబాలు కూడా రాజకీయాల్లోకి రావచ్చు. డొనాల్డ్ వారసత్వం ఇవాంకా ట్రంప్‌కూ రావొచ్చు కదా! ప్రపంచంలో రాహుల్ ఎక్కడ ప్రసంగించినా, ఏ విషయంపై మాట్లాడినా.. దానిపై బీజేపీ స్మృతి ఇరానీ లాంటి వారి ద్వారా విమర్శలు చేయిస్తున్నంత సేపూ రాహుల్‌కు ఢోకా లేదు. రాహుల్‌కయినా, ఆయన కాంగ్రెస్ పార్టీకయినా రాజకీయంగా ఇది మంచిదే. రాహుల్ చేయబోయే అమెరికా పర్యటనలో ఈ ప్రయోజనం నెరవేరుతుంది. ''ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్'' ఎన్నికల విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం గురించి రాహుల్ మాట్లాడింది ఒకింత బాగానే అనిపించింది. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి భారతదేశ ఎన్నికల విధానంలో ఉన్న ''ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్'' (ఎఫ్.పి.టి.పి) ను కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, 'ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్' ఎన్నికల విధానంలో జనం ఓట్లేసి ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుస్తాడు. తక్కిన అభ్యర్థులకు పోలైన ఓట్లకు విలువ ఉండదు. ఈ విధానంపై ఉన్న పెద్ద విమర్శ ఏమిటంటే మెజారిటీ ఓట్లు అనుకూలంగా పడనప్పటికీ అభ్యర్థులు గెలుపు సాధిస్తారు, పార్టీలు అధికారం చేపడుతుంటాయి. ఈ అంశం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎఫ్.పి.టి.పి ఎన్నికల విధానాన్ని ప్రశ్నిస్తోంది. కానీ 1952, 1957, 1984 సాధారణ ఎన్నికలను మినహాయిస్తే తక్కిన ఎన్నికలన్నింట్లో ఈ విధానం ద్వారా ఎక్కువగా లాభపడింది కాంగ్రెస్ పార్టీనే! అమెరికా పర్యటనలో రాహుల్ ప్రసంగాలు, సంభాషణల్లో 20109 ఎన్నికల వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై రాజకీయ అస్త్రాలను సంధించేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాను రాహుల్ ఎంచుకున్నారు. విదేశీ గడ్డపై నుంచి తమ ప్రత్యర్థులను విమర్శించడం, వారిపై మాటల దాడి చేయడాన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీనే కదా! మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అందరి దృష్టినీ ఆకర్షించడం స్మృతి ఇరానీకి బాగా తెలుసు. బహుశా నటి కావడం వల్ల ఆమెకు ఈ విద్య సహజంగానే అబ్బిందేమో.. text: మరి అలాంటి అరుదైన ఫినిషింగ్ టచ్‌లు అన్నీ మీకు గుర్తున్నాయా? ఇదిగోండి.. అలాంటి పది అసాధారణ సందర్భాలు... 1. జావెద్ మియాందాద్ జట్లు : భారత్ వర్సెస్ పాకిస్తాన్ (1986) 1986లో షార్జాలో ఆస్ట్రేలియా-ఆసియా కప్ సిరీస్ జరిగింది. సిరీస్‌లో ఆ రోజే ఫైనల్స్. అదీ - భారత్, పాకిస్తాన్ మధ్య. దాయాదుల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ జావెద్ మియందాద్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్ చేతన్ శర్మ బౌలింగ్. మ్యాచ్‌లో అదే చివరి బంతి. కానీ ఇంకా 4 పరుగులు చేయాలి. దాదాపు మ్యాచ్ భారత్ ఖాతాలోకి చేరినట్టే కనిపించింది. కానీ క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. చివరికి అదే జరిగింది. కావాల్సింది 4 పరుగులైతే... చివరి బంతిని జావెద్ మియాందాద్ సిక్స్ కొట్టాడు. ఓ అద్భుతం కళ్లముందు ఆవిష్కారమైనట్లు స్టేడియంలో కేరింతలు.. పాకిస్తాన్ అభిమానులు ఒక్కసారిగా ప్రవాహంలా మైదానంలోకి దూసుకొచ్చారు. వారి ఆనందం ఆకాశాన్నంటింది. 2. బ్రెండన్ టేలర్ జట్లు : జింబాంబ్వే వర్సెస్ బంగ్లాదేశ్ (2006) బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని జింబాంబ్వే ఛేదిస్తోంది. బ్రెండన్ టేలర్, తవాంద ముపారివా క్రీజ్‌లో ఉన్నారు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్‌ ముష్రఫ్ మోర్తాజా వేస్తున్నాడు. ఓవర్లో రెండో బంతిని టేలర్ సిక్స్ కొట్టాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ఐదో బంతికి ముపారివా రనౌట్ అయ్యాడు. ఒక్క బంతి మిగిలుంది. విజయానికి ఇంకా 5 పరుగులు చేయాలి. సిక్స్ కొట్టడం తప్ప జింబాంబ్వేకు మరో అవకాశం లేదు. టేలర్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. 3. శివ్‌నారాయణ్ చందర్‌పాల్ జట్లు : వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక (2008) వేదిక : క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెస్టిండీస్ వెళుతోంది. మ్యాచ్ చివర్లో ఒక బంతికి 6 పరుగులు చేయాల్సి వుంది. శివ్‌నారాయణ్ చందర్‌పాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. శ్రీలంక పేసర్ చమిందావాస్ చివరి బాల్‌ను వేస్తున్నాడు. అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ జట్టు ఆశలన్నీ చందర్‌పాల్ మీదనే.. చమిందా వాస్ చివరి బంతిని వేయగానే చందర్‌పాల్.. ఆ బాల్‌ను గాల్లోకి కొట్టాడు. అది బౌండరీ వద్ద ఉన్న జయవర్ధనే వైపు వెళ్లింది. ఆ బాల్‌ను క్యాచ్ పడితే వెస్టిండీస్‌కు ఓటమే... కానీ ఆ బాల్.. జయవర్ధనేను, బౌండరీని దాటేసింది. అలా చివరి బంతిని సిక్సర్‌ కొట్టి తన జట్టుకు విజయం సాధించిపెట్టాడు చందర్‌పాల్. 4. మెక్‌కలమ్ జట్లు : శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ (2013) ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లను కుదించారు. 23 ఓవర్లలో 198 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెక్‌కలమ్ స్ట్రైకర్‌గా ఉన్నాడు. చివరి 4 బంతులకు 17 పరుగులు చేయాల్సివుండగా, వరుసగా ఒక సిక్స్, ఒక ఫోర్, మళ్లీ సిక్స్ కొట్టాడు. ఇక చివరి బంతికి ఒక పరుగు మాత్రమే సాధించాల్సి ఉండగా.. ఆ చివరి బంతిని కూడా సిక్స్ కొట్టి, తన జట్టును గెలిపించాడు. 5. మెక్‌లారెన్ జట్లు : సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ (2013) ఇరు జట్ల మధ్య వన్‌ డే సిరీస్‌లో అది చివరి మ్యాచ్. న్యూజిలాండ్ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఛేదిస్తోంది. చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే సౌత్ ఆఫ్రికా 8 వికెట్లు కోల్పోయింది. మెక్‌లారెన్, డేల్ స్టేయిన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నది సౌత్ ఆఫ్రికా ప్రయత్నం. చివరి ఓవర్‌లో డేల్ స్టేయిన్ మొదటి మూడు బంతులను ఆడి, ఐదో బంతికి ఔట్ అయ్యాడు. ఒక్క బంతి మాత్రమే మిగిలుంది. 3 పరుగులు చేయాల్సి ఉంది. మెక్‌లారెన్ సిక్స్ కొట్టి, విజయాన్ని అందించాడు. మరి టీ20లలో చివరి బంతిని సిక్స్ కొట్టినవారి సంగతి..! 01. 2010లో శ్రీలంక, భారత్ మధ్య 20-20 మ్యాచ్ జరిగింది. అందులో చమార కపుగెదర మ్యాచ్ చివరి బాల్‌ను సిక్స్ కొట్టడంతో.. భారత్‌పై శ్రీలంక విజయం సాధించింది. 02. 2012లో ఇండియా, ఇంగ్లండ్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. అందులో ఇయాన్ మోర్గన్ చివరి బంతిని సిక్స్ కొట్టాడు. 03. 2013లో పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ చివరి ఓవర్లో 6 పరుగులు చేయాల్సి ఉంది. ఆ ఓవర్లోని మొదటి బంతిని జుల్ఫికర్ బాబర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత 2,3, బంతుల్లో ఒక పరుగు కూడా రాలేదు. 4వ బంతిలో ఒక పరుగు మాత్రమే చేయగలిగారు. ఇక ఐదవ బంతిలో సయీద్ అజ్మల్ రనౌట్ అయ్యాడు. ఇక ఒకే బంతి మిగిలివుంది. ఒక పరుగు చేయాల్సివుంది. చివరి బంతిని జుల్ఫికర్ బాబర్ అనూహ్యంగా సిక్స్ కొట్టి పాకిస్తాన్‌ను గెలిపించాడు. 04. 2014లో జింబాంబ్వే, నెదర్లాండ్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో వి.సిబాండ చివరి బంతిని సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించాడు. 05. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ చివరి బంతిని సిక్స్ కొట్టి విజయాన్ని సాధించిపెట్టాడు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్కంఠభరితంగా సాగుతున్న క్రికెట్ మ్యాచ్. ఒకే ఒక్క బంతి మిగిలి వుంది. విజయానికి 6 పరుగులు కావాలి. ఆ చివరి బంతిని సిక్స్ కొడితే..! అది అదిరిపోయే ముగింపు కదూ! text: కండి జిల్లాలో సింహళ, ముస్లింల మధ్య హింస చోటుచేసుకున్న అనంతరం అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటన చేసింది. మంత్రుల సమావేశంలో అధ్యక్షుడు, మంత్రులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమావేశం తర్వాత మంత్రి ఎస్.పి. దిశానాయక విలేకరులకు తెలిపారు. ఈ ఎమర్జెన్సీ వ్యవధి పెరుగుతుందా అని ప్రశ్నించినపుడు పదో తేదీన దీనిపై అధ్యక్షుడు ప్రకటన చేస్తారని వివరించారు. అంతకు ముందు.. అంటే సోమవారం.. ముస్లింలపై దాడుల అనంతరం కండి జిల్లాలో పోలీసులు అత్యవసర పరిస్థితి విధించారు. అయినా రాత్రి తమ ప్రాంతాల్లో రాళ్లదాడి జరిగిందని స్థానిక ముస్లింలు తెలిపారు. సోమవారం జరిగిన ఘర్షణల్లో ముస్లింలకు చెందిన కనీసం మూడు పాఠశాలలు, దుకాణాలు, పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. తమ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించినా దాడులు ఆగకపోవడంపై ముస్లింలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో సైన్యాన్ని పెద్దఎత్తున మోహరించి.. రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మంగళవారం అక్కడ ఘర్షణలు జరగలేదు. అయినా ఎప్పుడు ఏమవుతుందోనని పోలీసులు, ముస్లింలు ఆందోళన చెందుతున్నారని స్థానిక విలేకరి ఒకరు తెలిపారు. ఇలా మొదలు ఒక రోడ్డు ప్రమాదం అనంతరం కొందరు ముస్లిం యువకులు ఓ సింహళ వ్యక్తిపై దాడి చేశారు. అతడు గాయపడగా, ఆస్పత్రిలో చేర్చారు. ఆపై క్రమంగా ఆ ప్రాంతంలో హింస రాజుకుంది. మంగళవారం కండి జిల్లాలో పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. దీంతో పాటు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బంద్ పాటించారు. ఈ బంద్ సందర్భంగా జరిగిన చిన్న పాటి ఘర్షణలో ఓ తమిళుడిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) శ్రీలంకలో అక్కడి ప్రభుత్వం పది రోజుల పాటు ఎమర్జెన్సీ విధించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. text: "ప్రపంచంలో తొలి మలం మ్యూజియం"ను జపాన్‌లో ఇటీవలే ప్రారంభించారు. కానీ, దీన్ని అసహ్యించుకోనక్కర్లేదు. ఇక్కడ ఉన్నవి నిజమైన మానవ వ్యర్థాలు కాదు. ఈ మ్యూజియం జపాన్ రాజధాని టోక్యోలో ఉంది. దీనిని 'ది ఉంకో(మలం) మ్యూజియం' అంటున్నారు. ఇక్కడ అందరినీ సరదాగా ఆకట్టుకునేలా రంగురంగుల్లో ఉండే 'పూప్ (మలం)' బొమ్మలు కనిపిస్తాయి. ఈ మ్యూజియంను సందర్శించేందుకు చాలా మంది వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది పిల్లలే. అందరూ పూప్ బొమ్మలతో ఫొటోలు తీసుకుంటున్నారు. జపాన్ మలం మ్యూజియం ఈ మ్యూజియంలో ఉన్న ఒక మైక్రోఫోన్ ముందు ఉంకో (జపనీస్‌లో మలం) అని ఎంత గట్టిగా అరిస్తే స్క్రీన్‌పై అంత పెద్ద పరిమాణంలో మలం చిత్రం కనిపిస్తుంది. సాధారణంగా మలం అంటే మురికిగా, కంపు కొడుతుందని అందరూ జుగుప్సతో చూస్తారని, మ్యూజియంకు వచ్చేవారు మాత్రం తమ అనుభవాన్ని అందరికీ చెబుతూ సంతోషిస్తున్నారని దాన్ని ఏర్పాటు చేసిన అకట్సికి ప్రతినిధి అయామీ టషిరో చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎవరికీ లేని అనుభవం, వినోదం అందించడానికే పూప్ మ్యూజియం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మ్యూజియానికి రోజూ వెయ్యి మందికి పైగా వస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) శీర్షిక చూడగానే 'మలం' మ్యూజియం ఏమిటి? అని చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. కానీ, నిజంగానే అలాంటి మ్యూజియం ఉంది. text: అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కె.నచికేత 1999 కార్గిల్ యుద్ధం జరిగినపుడు పాక్ దళాలకు చిక్కిన పైలట్ తర్వాత విడుదలయ్యారు. అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రకటించడానికి ముందు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.నచికేత బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడారు. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు బతాలిక్ సెక్టార్‌లో ఉన్న లక్ష్యాలపై బాంబులు వేయాలని నచికేతకు ఆదేశాలు అందాయి. దాంతో వెంటనే ఆయన మిగ్ 27లో లక్ష్యాలవైపు దూసుకెళ్లారు. మధ్యలో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్‌తో ఆయన ఉన్న విమానాన్ని పాక్ దళాలు కూల్చేశాయి. ఆ తర్వాత నచికేత 8 రోజులు పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం పాక్ దళాల కస్టడీలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌తో ఆ దేశం సైన్యం ఒక అధికారిలాగే ప్రవర్తించాలని నచికేత అన్నారు. వింగ్ కమాండర్ అభినందన్ జెనీవా ఒప్పందం ప్రకారం గౌరవించాలి "అభినందన్ తన విధుల్లో ఉన్నప్పుడు యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారు కాబట్టి, భారత్, పాక్ జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన్ను అధికారిగా గౌరవించాలని" తెలిపారు. "సైన్యంలో ఉన్న ఎవరైనా తమ కమాండర్స్ నుంచి వచ్చిన దేశాలను వీలైనంత సమర్థంగా పూర్తి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది". ప్రస్తుతం పాక్ కస్టడీలో ఉన్న అభినందన్ సాహసాన్ని ప్రశంసించిన నచికేత ఆయన ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ వారియర్‌లాగే వ్యవహరించారని చెప్పారు. పాక్ దళాలకు పట్టుబడిన వెంటనే అభినందన్ ఆలోచన ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు "ఎయిర్ ఫోర్స్ అధికారులందరికీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తారు. " అని తెలిపారు. అయినా "ఒక పైలెట్ మనసు ఎప్పుడూ కాక్‌పిట్‌లోనే ఉంటుంది" అన్న నచికేత, వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. పాక్ సైన్యం తనను కస్టడీలోకి తీసుకున్నప్పుడు, తన అనుభవాలను చెప్పడానికి మాత్రం నచికేత నిరాకరించారు. మీడియా ఉంటే కుదరదు కానీ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్న జి.పార్థసారధి అప్పుడు నచికేతను ఎలా తిరిగి భారత్ తీసుకొచ్చారో చెప్పారు. "కార్గిల్ యుద్ధ సమయంలో ఫ్లైట్ లెప్ఠినెంట్ నచికేత మిగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఆయనను నియంత్రణ రేఖను దాటవద్దని ఆదేశించారు. యుద్ధం జరుగుతున్న సమయంలో నచికేత మిగ్‌తో దాడులు చేశారు. కానీ కిందకు వచ్చినపుడు మిసైల్ ట్రాక్ ద్వారా ఆయన్ను కిందికి దించారు. పాకిస్తాన్ సైన్యం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత నాకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సందేశం వచ్చింది. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నచికేతను విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. "మేం ఆయన్ను విడుదల చేయాలని అనుకుంటున్నాం అన్నారు. నేను సరే, ఆయన్ను ఎక్కడ కలవాలి అన్నాను. దానికి నవాజ్ షరీఫ్ జిన్నా హాల్‌కు రండి అన్నారు". "జిన్నా హాల్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నట్టు నాకు తెలిసింది. దాంతో నేను ఆయన్ను మీరు నచికేతను తిరిగి అప్పగిస్తున్నప్పుడు అక్కడ మీడియా ఉంటుంది అన్నాను. దానికి ఆయన 'అవును' అన్నారు. దానికి నేను అది కుదరదని చెప్పాను. యుద్ధ ఖైదీలను విడుదల చేస్తున్న సమయంలో మీడియా ఉండడాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను అని చెప్పాను. మిరాజ్ 2000 యుద్ధ విమానం ఇంటర్నేషనల్ మీడియా ముందు అతడిని అప్పగించడం కుదరదు అన్నాను. మీరు ఆయన్ను మాకు ప్రైవేటుగా అప్పగించాలని చెప్పాను. నేను దిల్లీకి కూడా ఈ విషయం చెప్పాను. అక్కడి నుంచి మీరు సరిగ్గానే చేశారని చెప్పారు. "నాకు పాకిస్తాన్ వైపు నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. ఆయన్ను ఎలా విడుదల చేయాలో మీరే చెప్పండి అన్నారు. నేను చూడండి మీపై మాకు నమ్మకం పోయింది అన్నాను. మీరు నచికేతను రాయబార కార్యాలయంలో వదిలేయండి. తర్వాత నేను ఆయన చార్జ్ తీసుకుంటాను అని చెప్పాను. తర్వాత నచికేతను ఏంబసీకి తీసుకొచ్చారు. అక్కడ నేను ఆయన చార్జ్ తీసుకున్నాను. "రాత్రి నచికేతను ఎయిర్ కమాండర్ జశ్వాల్ ఇంట్లో ఉంచారు. తర్వాత రోజు నేను మీరు విమానంలో వెళ్లడం లేదు అని ఆయనకు చెప్పాను. నేను నచికేతను ఒక ఎయిర్ అటాచీ, ఒక నావీ అటాచీ( దౌత్య అంశాల్లో భాగంగా ఉండే వైమానిక దళం, నౌకాదళం అధికారులు)తో ఒక వాహనంలో పంపించాను. వాఘా దగ్గర మన సైన్యానికి అప్పగించమని చెప్పాను. నచికేత ఒకటి రెండు వారాలు పాకిస్తాన్ అదుపులో ఉన్నారు" అని పార్థసారధి చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "దేశ రక్షణ కోసం ఎప్పుడు అవసరమైనా తిరిగి ఆకాశంలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటానని" గ్రూప్ కెప్టెన్(రిటైర్డ్) నచికేత చెప్పారు. text: మేమంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మా పాప మల విసర్జన చేసింది. వెంటనే నేను లేచి శుభ్రం చేయడానికి వెళ్ళాను. ఇంతలో మా అత్తగారు నన్ను అడ్డుకున్నారు. గదిలో ఒక మూలకి తీసుకెళ్లి... "మీరు ఈ ఇంటి అల్లుడు. ఇలాంటి పనులు మీరు చేయడం చూస్తే బంధువులు ఏమనుకుంటారు? సోనాలిని పిలవండి. తను వచ్చి పాపకు డైపర్ మారుస్తుంది" అని చెప్పారు. నేను మరో మాట మాట్లాడే లోపలే, అత్తగారు మా ఆవిడను పిలిచి పాపకు డైపర్ మార్చమని చెప్పారు. నేనూ మా ఆవిడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయాం. మళ్ళీ మా అత్తగారు గట్టిగా "సోనాలి!" అని అనేసరికి మా ఆవిడ పాపని వాష్ రూమ్‌కు తీసుకెళ్ళింది. ఆ సంఘటన నాకు కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. పాప డైపర్ మార్చడం నాకేం కొత్త కాదు. మా అత్తగారింట్లో అందరికీ తెలుసు... నేను హౌస్ హజ్బెండ్‌ని అని. ఆ పెళ్లిలో చాలామంది మొహాల్లో ఒక వెకిలి నవ్వు కనిపించింది. 'అతడు హౌజ్ హస్బెండ్' అనే మాట ఆ పెళ్లి గోలలో అప్పుడప్పుడూ నా చెవిన పడుతుండేది. కానీ ఆ విషయం అందరికీ తెలియడం మా అత్త మామలకు ఇష్టం లేదు. నేను సిగ్గుపడాలని జనాలే కావాలని నన్ను హేళన చేస్తారని నాకు తెలుసు. కానీ, ఎవరేమనుకున్నా నేను సిగ్గుపడను. నా సిద్ధాంతాన్ని మార్చుకోను. నేను ఇలానే హౌస్ హజ్బెండ్‌లా ఉంటా. మా ఇద్దరిదీ ప్రేమ వివాహం. కెరీర్‌లో ఎవరికి మంచి అవకాశం వస్తే వాళ్లు ముందుకెళ్లాలని మొదటే నిర్ణయించుకున్నాం. మొదట్నుంచీ నా కెరీర్ సరిగ్గా లేదు. కానీ సోనాలి మాత్రం తన కెరీర్‌లో వేగంగా దూసుకెళ్లింది. దాంతో, నేను ఉద్యోగం మానేసి ఇంటి పనులు చూసుకోవాలని, తాను ఉద్యోగం కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. మాకు పనిమనిషి లేదు. ఇల్లు ఊడవడం, తుడవడం, కూరలు తేవడం, వంట చేయడం లాంటి అన్ని పనులూ నేనే చూసుకుంటాను. నేను ఇంటి పని చేయడం ఇతరులకు వింతగా అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం అది చాలా మామూలు విషయం. మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ముల్లో నేను ఆఖరి వాడిని. చిన్నప్పుడు అమ్మకి ఇంటి పనుల్లో సహాయం చేసేవాణ్ణి . అప్పుడు కూడా నా స్నేహితులు నన్ను "గృహిణి" అంటూ ఆట పట్టించే వాళ్ళు. ఇప్పుడిప్పుడే దిల్లీలోని బాగా చదువుకున్న నా స్నేహితులు 'నా ఛాయిస్'ను మెల్లగా అర్ధం చేసుకుంటున్నారు. కానీ మా సొంతూరు భోపాల్ వెళ్ళినప్పుడు మాత్రం నా స్నేహితులు బాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఏదైనా రాజకీయానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు, నేను మాట్లాడితే, "ఇది నీకు సంబంధించింది కాదు, నీకు అర్థం కాదు'' అని నన్ను పక్కనబెడతారు. ఓసారి ఇలాగే నా స్నేహితులంతా ఏదో చర్చిస్తుంటే, నేను కూడా మధ్యలో మాట్లాడాను. అప్పుడు వాళ్ళు ' ముందు నువ్వు వెళ్లి చాయ్ చేసుకొని తీసుకురా' అన్నారు. నేనూ కూడా నవ్వి 'ఒక్క చాయ్ ఏంటి... పకోడీలు కూడా చేసుకొస్తా' అన్నాను. నాకు ఇలాంటి విషయాలు స్పోర్టివ్‌గా తీసుకోవడం అలవాటైపోయింది. బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి. ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి. ఇప్పటికీ కొంత మంది నాకు ఫోన్ చేసి "ఈ రోజు వంట ఏం చేస్తున్నావు" అని హేళన చేస్తారు. చాలామంది ఇంటి పనిని 'పని'గా గుర్తించరు. 'నువ్వు ఇంట్లో ఉంటూ హాయిగా జల్సా చేస్తున్నావు' అని కొందరంటారు. కానీ వాళ్లకి ఉద్యోగం చేసే మగవాళ్లలానే నేను కూడా అలసిపోతాననే విషయం అర్థం కాదు. నేనే కాదు, ఇంటిపనులు చేసే వాళ్లెవరైనా అలసిపోతారు. నన్ను హేళన చేసేవాళ్లంతా, తమ ఇంట్లో మహిళలను కూడా చాలా హీనంగా చూస్తారని, వాళ్ల పనిని గుర్తించరని అనిపించి బాధ కలుగుతుంది. పెళ్లయిన నాలుగేళ్లకు మాకు పాప పుట్టింది. నా పైన బాధ్యత ఇంకా పెరిగింది. ఇంటి పనితో పాటు పాపకి స్నానం చేయించడం, తినిపించడం, షికారుకు తీసుకెళ్లడం లాంటి అన్ని పనులూ నా బాధ్యతలే. మొదట్లో నేను మా పాపను పార్క్‌కి తీసుకువెళ్ళినప్పుడు, ఇతర మహిళలు నన్ను చూసి పలకరింపుగా నవ్వేవారు, పాపని ముద్దు చేసేవారు. కానీ రాను రాను "ఈ రోజూ మీరే వచ్చారా? వాళ్ళ అమ్మ ఏది? వాళ్ళ అమ్మకి బాలేదా?’’ ఇలాంటి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. మా ఆవిడ ఆఫీస్‌కి వెళ్తుంది, నేనే మా పాపను చూసుకుంటాను అని చెప్పగానే ప్రశ్నల వర్షం కురిసేది. ఇంత చిన్న పిల్లని ఎలా చూసుకుంటారు? మీ దగ్గర పాప ఏడవకుండా ఉంటుందా? ఎవరు తినిపిస్తారు? ఎవరు స్నానం చేయిస్తారు?... ఇలాంటి ప్రశ్నలు తరచూ ఎదరుయ్యేవి. నేనేదో చేయరాని పని చేస్తునట్లు మాట్లాడతారు. నా వెనుక "ఫ్రీ హస్బెండ్" అని కూడా అంటూ వుంటారు. మా పెళ్లయ్యాక మా అమ్మా నాన్న మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు నేను చేసే పని నచ్చలేదు. మా అమ్మ నాతో నేరుగా ఏమీ అనేది కాదు కానీ ఆవిడ ప్రవర్తన ద్వారా నాకు విషయం అర్థమయ్యేది. నేను ఎందుకు ఉద్యోగం చేయట్లేదని, కోడలు ఉద్యోగంతో పాటు ఇంటి పని ఎందుకు చేసుకోకూడదు అనే భావం ఆవిడ కళ్ళలో కనిపించేది. ఇప్పుడు మా పాప స్కూల్‌కి వెళ్తోంది. స్కూల్‌లో ఓసారి ఫ్యామిలీ ట్రీ వేయమన్నారు. నేను ఇంట్లో లేకపోవడంతో నా భార్య ఫ్యామిలీ ట్రీ వేయించింది. దాంట్లో నేను "హెడ్ అఫ్ ది ఫ్యామిలీ" అని రాసింది. దానికి నేను అడ్డు చెప్పాను. సోనాలి ఉద్యోగం చేసి డబ్బు తీసుకొస్తున్నప్పుడు తానే హెడ్ అఫ్ ది ఫ్యామిలీ కదా అని నా అభిప్రాయం. హెడ్ అంటే ఆడ మగ కాదు, సంపాదించేవారు అని. అయినా తను నా పేరు తొలగించలేదు. నేను ఫ్రీలాన్స్ రైటర్‌ని. నావి రెండు పుస్తకాలు వెలువడ్డాయి. ఇంకొకటి ప్రచురణలో ఉంది. కానీ ఎవరికీ ఈ పని కనిపించదు. మా ఆవిడ కూడా తన ఆఫీస్‌లో కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మా ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన ప్రేమ వల్ల ఆ ప్రశ్నల ప్రభావం మా బంధంపైన ఎప్పుడూ పడలేదు. నా సోదరులు నేను ఇంట్లో ఉండటం గురించి ఏమీ అనరు. ఆలా అని నన్ను సమర్థించరు కూడా. మనం సాధారణంగా ఏదైనా కొంచెం భిన్నంగా చేస్తే మొదట ఎక్కువమంది వేళాకోళం చేస్తారు. తరువాత మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మనల్ని స్వీకరిస్తారు. నేను ఇంకా మొదటి దశలోనే ఉన్నాను. (ఒక వ్యక్తితో మాట్లాడి, అతడి అంతరంగాన్ని బీబీసీ ప్రతినిధి నీలేష్ డోత్రే అక్షర బద్ధం చేశారు. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ప్రొడ్యూసర్: సుశీలా సింగ్) ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నేను మా అత్తగారి ఇంట్లో వున్నాను. మా మరదలి పెళ్లి జరుగుతోంది. మాతో పాటు మా పాప కూడా ఉంది. మా ఆవిడ పూర్తిగా పెళ్లి సందడిలో మునిగిపోవడంతో పాప నాతోనే ఉండిపోయింది. text: దేశంలో చిన్నారులపై అత్యాచారాల పరంపర కొనసాగుతుండటంపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు ఇవి. కఠువా, ఉన్నావ్ ఘటనలతో చెదిరిన గుండెలు కుదురుకోకముందే.. దేశంలోని చాలా ప్రాంతాల్లో బాలికలపై రేప్, హత్యాచారాల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేకిత్తోస్తోంది. ఆ పసిపాప రోజూ తాతా అని పిలిచే నిందితుడు సుబ్బయ్య.. బాలికను చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. అత్యాచారం తర్వాత ఆ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని కూడా అతడు బెదిరించాడని చెప్తున్నారు. రక్తస్రావం, కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు ఆరా తీసినపుడు విషయం బయటపడింది. బాలికను వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం బయటపడటంతో నిందితుడు పరారవగా.. ఈ దారుణంపై ఆగ్రహించిన బాలిక బంధువులు, గ్రామస్తులు అతడి ఇంటిపై దాడిచేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ గురజాలలో ధర్నా, రాస్తా రోకోలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలికను జిల్లా కలెక్టర్ తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిందితుడు సుబ్బయ్యను పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య మీడియాకు తెలిపారు. ‘‘ఆ మహా విలువలు, నైతికతలు ఎక్కడ? అయితే.. బాలికలపై అత్యాచారాల ఘటనలు వరుసగా జరుగుతుండటంతో సోషల్ మీడియాలో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్‌‌లలో #Dachepalli హ్యాష్‌ట్యాగ్‌తో యూజర్లు తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ‘‘ఈ దేశానికి ఏమైంది? ఆ మహా విలువలు, నైతికతలు ఎక్కడ? మన చిన్నారులు ప్రతి రోజూ ఎందుకు రేప్‌కు గురవుతున్నారు?’’ అంటూ దళిత, మహిళా ఉద్యమకారిణి, రచయిత సుజాత సూరేపల్లి ఫేస్‌బుక్‌లో ప్రశ్నలు సంధించారు. ‘‘బయటకు రాకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ తండ్రీకొడుకులు అత్యాచారం చేశారు. ఈ అత్యాచారాలు కలచివేస్తున్నాయి. ఈ దేశపు పురుషులకు ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరమా? మానసికవేత్తలు ఈ విషయం మీద సీరియస్‌గా దృష్టి పెట్టాలి’’ అని ఆమె సూచించారు. ‘‘గుండె పగిలిపోతోంది...‘‘ ‘‘మొన్న కఠువా, ఉన్నావో ఘటనలు నన్ను చాలా బాధించాయి. కానీ ఇప్పుడు అదే ఘటన ఏపీలో జరిగింది. దాచేపల్లి ఘటనపై నేను చాలా సిగ్గు పడుతున్నాను. ఏం జరుగుతోంది?’’ అని పి.వి.సాయిచరణ్ అనే యూజర్ ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు. ‘‘దేశం ఎంత క్రూరంగా మారుతోంది... గుండె పగిలిపోతోంది..’’ అంటూ రంజిత్ రెడ్డి అనే యూజర్ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అమాయకపు పసిపాపకు న్యాయం జరగాల’’న్నారు. ‘‘వ్యవస్థ సరైన దారిలోనే నడుస్తోందా?’’ ‘‘12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష: నరేంద్రమోదీ కేబినెట్ ఏప్రిల్ 18వ తేదీన ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఒక 9 ఏళ్ల బాలిక మీద 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మన వ్యవస్థ సరైన మార్గంలోనే నడుస్తోందా?’’ అని వీరభద్ర అనే యూజర్ ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు. ‘‘దేవుడా. సిగ్గులేని భూస్వామ్య మనస్తత్వాలు. ఆడపిల్లలు వంటగదిలోనే ఉండి పోవాలని మీరు కోరుకుంటున్నారా? ఎన్‌సీబీఎన్ హయాంలో ఏపీలో మహిళలపై నేరాలు పెరగటంలో ఆశ్చర్యం లేదు’’ అని లక్ష్మి రోణంకి అనే యూజర్ ట్వీట్ చేశారు. ‘‘చనిపోయే వరకూ జనం ముందు ఉరితీయాలి...’’ అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ నిందితులకు మరణ శిక్ష విధించాలని కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి వారిలో సినీ నటి పూనమ్‌కౌర్ కూడా ఉన్నారు. ‘‘కొద్ది మంది మగాళ్ల అదుపుచేసుకోలేని లైంగిక, పశు వాంఛలు జీవితాన్ని భయంకరంగా మారుస్తున్నాయి.. ఇదంతా నిజమైతే.. అతడిని జనం ముందు చనిపోయే వరకూ ఉరి తీయాలి. అతడి మెదడును.. అతడిని మనిషిగా కాకుండా పురుషుడిగా చేస్తున్న అంగాన్ని నరికివేయాలి...’’ అని నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ‘‘ఆర్తనాదాలు.. శూన్యమవుతున్నాయి...’’ దాచేపల్లి ఘటన మీద కొంతమంది యూజర్లు తమ ఆవేదనను కవితల రూపంలో కూడా వ్యక్తీకరించారు. ‘‘ఈ నడుమ జనం చెవులు లేకుండా పుడుతున్నారు...’’ అంటూ గుబ్బల శ్రీనివాస్ ఫేస్‌బుక్‌లో నిర్వేదం వ్యక్తం చేశారు. ‘‘బాలారిష్టాలను దాటి బతికి బట్టగడితే.. అనునిత్యం ఎదరయ్యే వేధింపుల పర్వాలు.. పెద్దరికం మాటున క్రూరంగా సాగే వికృత చేష్టలు...’’ అంటూ చిన్నారులపై అత్యాచారాల మీద బాలాజి ఎస్ అంటూ యూజర్ ట్విటర్‌ కవితలో ఆవేదన వ్యక్తీకరించారు. ‘‘ఆడపిల్లలపై దాడులకు మూలకారణం ఏమిటి?‘‘ ‘‘ఆడపిల్లల మీద లైంగిక దాడులకు మూలకారణం ఏమిటి?’’ అంటూ దళిత, బహుజన ఫ్రంట్ నాయకుడు, విశ్లేషకుడు జిలుకర శ్రీనివాస్ మహరాజ్ ఫేస్‌బుక్ వేదికగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. ‘‘ఒకటి బ్రాహ్మణిజం. రెండు పితృస్వామిక వ్యవస్థ. ఈ రెండూ ఇంటర్‌రిలేటెడ్’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘జరిగిన ప్రతి అత్యాచార హత్యల్లో ఒక నిర్దేశిత ప్యాట్రన్ కనిపిస్తుంది. ఇది పితృస్వామ్య భావజాల ఫలితం. అయితే బ్రాహ్మణిజమే పితృస్వామ్య దాడులకు కారణం. స్త్రీని లైంగిక భోగ వస్తువుగా, శూద్ర వర్ణాలను సేవ చేసే బానిసలుగా అది నిర్ధారించింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. చర్యలు చేపట్టని చంద్రబాబు బాధ్యులు కారా?: జగన్ దాచేపల్లి ఘటన మీద రాజకీయ పక్షాలూ సోషల్ మీడియాలో స్పందించాయి. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఇటీవల చాలా జరుగుతున్నాయని.. నిందితుల్లో అధికులు అధికార పక్షమైన టీడీపీ వారే ఉన్నారని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘కొద్ది నెలలుగా ఏపీలో ఇలాంటి దారుణ సంఘటనలు చాలా నమోదవుతున్నాయి. దోషుల్లో అత్యధికులు టీడీపీ వాళ్లే కావటం వల్ల వారిని సరిగ్గా చట్టం ముందు నిలబెట్టటం లేదు. దానివల్ల ఈ నేరాలు పెరుగుతున్నాయి. ఏ చర్యలూ చేపట్టకపోవటానికి @ncbn (ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు) మీరు బాధ్యులు కారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు. పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలి: పవన్‌కళ్యాణ్ ‘‘కఠువా నుంచి కన్యాకుమారి దాకా జరిగే అత్యాచార సంఘటనలు విన్నప్పుడల్లా నాతో సహా పౌర సమాజం కూడా తీవ్రవేదనకి గురవుతోంది’’ అని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ‘‘అసలు ఆడబిడ్డ పైన ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని నేను కోరకుంటున్నాను..’’ అని ఆయన పేర్కొన్నారు. తక్షణమే కఠిన చర్యలకు ఆదేశించాను: చంద్రబాబు ‘‘దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చాలా ఆగ్రహం కలిగిస్తోంది. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి మద్దతు అందించాలని ఐజీ, జిల్లా ఎస్‌పీకి నిర్దేశించాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఇదిలావుంటే.. దాచేపల్లి అత్యాచారం కేసులో నిందితుడైన సుబ్బయ్య శవం లభ్యం కాగా, ఆయన చెట్టుకు ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ‘‘ఈ దేశానికి ఏమైంది..?’’ ‘‘దేశం ఎందుకింత క్రూరంగా మారుతోంది..?’’ ‘‘మన చిన్నారులు ప్రతి రోజూ ఎందుకు రేప్‌కు గురవుతున్నారు..?’’ ‘‘ఈ దేశపు పురుషులకు ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరమా?’’ text: యాచ్‌లో 1982లో ఇద్దరిని హత్య చేసిన కేసులో అప్పట్లో ఆ వ్యక్తికి జీవిత ఖైదు పడింది. 2002లో జైలు నుంచి విడుదలైన ఆయన, ఆ నేరానికీ, తన కుటుంబం పేరుకూ సంబంధం ఉండకూడదని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించగా కార్ల్స్‌రుహీలోని రాజ్యాంగ న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో, ఆన్‌లైన్ ఆర్కైవ్స్ ఆధారంగా చేసుకుని ఆయన పేరు ఎక్కడా ప్రచురించకుండా కోర్టు ఆదేశాలు నిరోధిస్తాయి. ఏమిటా కేసు? కరీబియన్ దీవుల్లో అపోలోనియా నౌకలో ఆ వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడిన ఓ వివాదంలో ఆయన తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. ఈ కేసు ఆధారంగా చేసుకుని ఒక పుస్తకం, ఒక టీవీ డాక్యుమెంటరీ విడుదలయ్యాయి. 1999లో డెర్ స్పీజెల్ మ్యాగజీన్ తన వెబ్‌సైట్‌లో ఆయన పూర్తిపేరుతో మూడు రిపోర్టులు అప్‌లోడ్ చేసింది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ దొరుకుతుంది. కోర్టులేం చెప్పాయి? తనకు సంబంధించిన ఆర్టికల్స్ వెబ్‌సైట్లో ఉన్న విషయం ఆ వ్యక్తికి 2009లో తెలిసింది. దాన్ని తొలగించమని కోరారు. తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని అవి నిరోధిస్తాయని ఆయన అన్నారని కోర్టు ఒక ప్రకటనలో చెప్పింది. అయితే, వ్యక్తిగత గోప్యత హక్కు కారణంగా పత్రికా స్వేచ్ఛను, ప్రజాప్రయోజనాన్ని కాదనలేమంటూ 2012లో ఫెడరల్ కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. రాజ్యాంగ న్యాయస్థానం ఆ తీర్పును పక్కనపెట్టి ఇప్పుడు ఆదేశాలిచ్చింది. ప్రచురణ సంస్థలు తమ ఆర్టికల్స్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరుచుకునే వీలుంది కానీ కోరినప్పుడు వాటిని తొలగించాల్సి ఉంటుంది. కాగా ఈ 'రైట్ టు బీ ఫర్గాటెన్' యూరోపియన్ యూనియన్, గూగుల్ మధ్య వివాదాలకు కారణమవుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మూడున్నర దశాబ్దాల కిందట 1982లో ఒక హత్య కేసులో దోషిగా తేలిన జర్మనీ దేశస్థుడొకరు ఆన్‌లైన్ సెర్చ్‌లో ఎక్కడా తన పేరు రాకుండా ఉండే హక్కును సాధించుకున్నారు. ఆన్‌లైన్ సెర్చ్‌లో ఆయన పేరు ఎక్కడా రాకూడదని జర్మనీలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. text: బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ధన్‌తేరస్, దీపావళి వచ్చిందంటే బంగారం షాపులకు పండగే పండగ. మరి మీరు కూడా బంగారం కొంటున్నారా? అయితే దాన్ని పెట్టుబడిగా ఎలా మార్చాలో చూద్దాం. పోస్ట్ of YouTube ముగిసింది, 1 వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం భారత దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24 వేల టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ. భారత్‌లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28 శాతం ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో 28 శాతం భారత్‌లోనే ఉంది. తర్వాతి స్థానం చైనాది. భారత్‌లో బంగారానికి గిరాకీ ఉండటం వల్ల చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రపంచంలో బంగారం ఉత్పత్తి చేసే 5 అతి పెద్ద దేశాలు - చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, రష్యాకాగా వాటి నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2018 నాటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం అమెరికా సెంట్రల్ బ్యాంకు.. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం నిల్వ. ఆ బ్యాంకులో 8000 టన్నులకు పైగా బంగారం నిల్వ ఉంది. నిల్వల జాబితాలో పదో స్థానంలో ఉన్న భారత రిజర్వ్ బ్యాంకులో 560 టన్నులకు పైగా బంగారం ఉంది. బంగారం వర్తకుల నుంచి బంగారం కొనుగోలు చేయడమే మనకున్న ఏకైక, లాభదాయకమైన మార్గమా? అంటే కాదనే చెప్పాలి. దీనికి పలు మార్గాలున్నాయి. భౌతికంగా అంటే.. ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ కొనడం . ఇవి ఆభరణాల దుకాణాల్లో లభిస్తాయనేది తెలిసిందే. ఇక రెండవది డిజిటల్ గోల్డ్. అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్ (ఈటీఎఫ్), మరోటి సావరిన్ గోల్డ్ బాండ్లు. భారత్‌లో డైమండ్స్ , ప్లాటినం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. బంగారం, వెండితో పోలిస్తే వీటి ధరల్లో పెరుగుదల రేటు చాలా ఎక్కువ. అయితే, నమ్మకం విషయానికొస్తే మాత్రం బంగారానికే గోల్డ్ మెడల్ దక్కుతుంది. వెండి, బంగారాలకు డిమాండ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రజలు వీటిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు కాబట్టి. ఇక బంగారంలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో కాస్త వివరంగా చూద్దాం. మొదటిది ఆభరణాలు. చాలా మంది వేరే వేరే పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేయడంకన్నా ఆభరణాల్ని కొనడమే మేలంటారు. అయితే ఆభరణాలతో ఒక ప్రమాదం ఉంటుంది. వాటిని దొంగలు ఎత్తుకెళ్లొచ్చు లేదా అవి పాతబడి పోవచ్చు. రెండవది డిజిటల్ గోల్డ్. కావాలంటే మీరు బంగారం బిస్కెట్లను లేదా కడ్డీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. కొన్ని మొబైల్ వాలెట్లూ, వెబ్‌సైట్లలో డిజిటల్ గోల్డ్ అమ్ముతున్నారు. ఇప్పుడు కొన్ని బంగారు పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటినే గోల్డ్ కాయిన్ స్కీమ్ అంటున్నారు. రిజిస్టర్డ్ ఎంఎంటీసీ ఔట్‌లెట్లు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా నాణేలను కొనుగోలు చేయొచ్చు. గోల్డ్ సేవింగ్ స్కీమ్ ఇందులో ఒక నిర్ణీత కాలం పాటు నెలకు కొంత చొప్పున నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత కాలం పూర్తయ్యాక డిపాజిట్ చేసిన విలువకు సమానమైన బంగారం కొనుక్కోవచ్చు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్ (ఈటీఎఫ్) - బంగారం ధరలపై ఆధారపడి ఈటీఎఫ్ విలువలో హెచ్చుతగ్గులుంటాయి. అయితే, ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ట్రేడింగ్, డీ-మ్యాట్ అకౌంట్ తప్పనిసరి. మీ ఇల్లు బంగారం కానూ! సావరిన్ గోల్డ్ బాండ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ బాండ్లను విడుదల చేస్తుంటుంది. 2-3 నెలలకోసారి వీటిని విడుదల చేస్తూ విండో ఓపెన్ చేస్తుంది. ఈ విండో వారం రోజుల పాటు తెరిచి ఉంటుంది. (గమనిక: నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ కథనం రాశాం. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సొంత అధ్యయనం, నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.) ఇవి కూడా చదవండి: గోల్డ్ స్వీట్ గురించి విన్నారా? వీడియో: 'గోల్డెన్ స్వీట్' రుచి చూస్తారా? (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశంలో ఎంత బంగారం ఉందో తెలుసా? బంగారానికి భారత దేశానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి బంగారం కేవలం అలంకారం కోసమేనా? కాదు. ఇది పెట్టుబడి మార్గం కూడా. text: ప్రతీకాత్మక చిత్రం కొందరైతే స్వస్థలాలకు వచ్చేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. చెన్నైలో చిక్కుకుపోయినవారు సముద్ర ప్రయాణం చేసి శ్రీకాకుళం చేరుకుంటున్నారు. అలా వచ్చినవారిని అధికారులు గుర్తిస్తూ క్వారంటైన్‌‌కు తరలిస్తున్నారు. గుజరాత్‌లో ఉన్న మత్స్యకారులు ఏపీ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మత్స్యకారులకు అందిస్తున్న సాయంపై గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాష్ట్ర మొత్తం మీద 541 మత్స్యకార గ్రామాలూ, 3 లక్షల మంది పూర్తి స్థాయి చేపల వేటగాళ్లు (యాక్టివ్ ఫిషర్ మెన్) ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు 193 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. 104 మత్స్యకార గ్రామాల్లో 1.5 లక్షల మంది జనం ఉన్నారు. శ్రీకాకుళంలో జెట్టీలు లేకపోవడంతో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. వీరావల్, చెన్నైల్లో బోట్లలో కూలీలుగా చేరి వేట సాగిస్తున్నారు. ఏటా ఆగస్టు నెలలో వీరావల్‌కు వలసలుంటాయి. ప్రతి ఏడాది 10 నుంచి 15 వేల మంది గుజరాత్‌కు, మరో 5 వేల మంది వరకూ చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లినవాళ్లంతా ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. బోట్లు కొనుక్కుని వస్తున్నారు గత ఐదు రోజుల్లో చెన్నై నుంచి 89 మంది వరకూ మత్స్యకారులు సముద్ర మార్గంలో శ్రీకాకుళం తీరానికి చేరుకున్నారు. ఏప్రిల్ 18న కవిటి మండలం ఇద్దవానిపాలేనికి చెన్నై నుంచి 12 మంది మత్స్యకారులు సముద్రమార్గంలో వచ్చారు. 11న వీళ్లు చెన్నై నుంచి నాలుగు బోట్లలో బయల్దేరారు. ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు. 15న చెన్నై నుంచి బయలు దేరిన మరో 27 మంది మత్స్యకారులు 19న అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలోని డోన్కూరు బీచ్ వద్దకు చేరుకున్నారు. ఈ ప్రయాణం కోసం వీళ్లే రూ.1.7 లక్షలు పెట్టి సొంతంగా బోటును కొనుక్కున్నారు. రూ.1.3 లక్షలకు చెన్నైలో బోటు కొనుక్కొని మరో మత్స్యకారుల బృందం 17న బయల్దేరింది. వీరిలో 18 మంది శ్రీకాకుళం జిల్లా వారు కాగా, మరో 11 మంది ఒడిశాకు చెందిన వారు ఉన్నారు. చెన్నై నుంచి వచ్చిన మరో బోటులో 15 మంది మత్స్యకారులు కవిటి మండలం సిహెచ్ . గొల్లగండి తీరానికి వచ్చారు. వీరు కూడా రూ.1.3 లక్షలు పెట్టి ఆ బోటును కొనుక్కుని వచ్చారు. మరొక రెండు బోట్లు రావడానికి సిద్దంగా ఉన్నట్లు శ్రీకాకుళం వచ్చిన మత్స్యకారులు అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకూ చెన్నై నుంచి శ్రీకాకుళం సముద్ర మార్గంలో వచ్చిన మత్స్యకారులు 89 మంది. ఒడిశావాసులు 11 మంది. వీరందరిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ప్రతీకాత్మక చిత్రం ‘నరకం కనిపిస్తోంది’ శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశానికి చెందిన మూగి అప్పలస్వామి వీరావల్‌లో ఉంటున్నారు. అక్కడ తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన బీబీసీతో చెప్పారు. ‘‘వీరావల్ లో దాదాపు 10 వేల నుంచి 15 వేల మంది ఉంటున్నాం. ఈ రోజు అనారోగ్యంతో ఒక వ్యక్తి చనిపోయాడు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు, సమద్రం, రైలు ఇలా ఎలాగైనా ఇక్కడ నుంచి తరిలించమని అధికారులను కోరాం. కానీ, స్పందన లేదు. మా పరిస్థితి దయనీయంగా ఉంది’’ అని అన్నారు. ఏప్రిల్ 14 నుంచి దాదాపు రెండు నెలలు చేపల వేట నిషేధం అమల్లో ఉండటంతో, మార్చి 20 కల్లా తీరానికి రావాలని బోటు యజమానులు చెప్పారని ఆయన చెప్పారు. ‘‘చివరి వేట చేసి ప్రతీ సంవత్సరం ఇంటికి వస్తాం. ఓనర్లు మాకు రావల్సినవి ఇచ్చేసి వెళ్లిపోయారు. బోట్లలోనే ఉంటూ ఉన్నవి తింటున్నాం. మొదట ఏప్రిల్ 14న లాక్ డౌన్ పూర్తి అవుతుందని అనుకున్నాం. కానీ పెంచారు. మా పరిస్థితి అర్దం కావడం లేదు. అప్పుడే మమ్మల్ని తరలించి క్వారంటీన్ ఏర్పాటు చేసి ఉంటే మాకు ఈ బాధలు తప్పేవి. నరకం కనిపిస్తోంది. నిద్ర లేదు. స్నానాలు లేవు. నామ మాత్రపు సహాయం అందుతుంది. కనీసం బట్టలు కూడా లేవు’’ అన్నారు అప్పలస్వామి. ‘సదుపాయాలు లేకుండా ఎలా?’ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోవాలన్న వాదన సరైందేనని, కానీ సదుపాయాలు లేకుండా మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో ఎలా ఉంటారని ఏపీ మత్స్యకారులు, మత్య్సకార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలరాజు ప్రశ్నించారు. ‘‘సదుపాయాలు లేకుండా వాళ్లు అక్కడ ఉండటం ఎలా సాధ్యం. లాక్‌డౌన్ వల్ల చిక్కుకు పోయినవారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. వారిని షెల్టర్ హోమ్స్‌కు తరలించాలి. లేదంటే స్వస్థలాలకు తీసుకురావాలి’’ అన్నారు. ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం వల్ల మత్స్యకారులు ఎలాగైనా స్వస్థలాలకు చెరుకోవాలని ప్రమాద భరితమైన ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్ నష్టాన్ని కూడా కలిపి ప్రభుత్వం మత్స్యకారులకు నెలకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. కేసులు తప్పవు: శ్రీకాకుళం ఎస్పీ సముద్ర మార్గం, రోడ్డు మార్గంలో శ్రీకాకుళంలోకి ప్రవేశిస్తున్నవారి విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. అక్రమంగా జిల్లాలోకి ప్రవేశించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని, ఇప్పటికే దాదాపు 85కుపైగా మందిపై కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. సముద్ర మార్గం ద్వారా వస్తున్న వారిపై లాక్‌డౌన్ ఉల్లంఘనతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మంట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు. చేపలకు వాడే బోట్లను ప్రయాణాల కోసం ఉపయోగించకూడదని, మారిటైం చట్టం ప్రకారం కూడా ఇలా వచ్చేవారిపై కేసులు పెట్టవచ్చని ఆయన అన్నారు. ‘‘జిల్లాలోకి ప్రవేశించే వారిపట్ల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా పడవల ద్వారా చెన్నై నుంచి మత్స్యకారులు ఇటీవల బోట్లలో ఎక్కువగా వస్తున్నారు. తీరప్రాంతంలోని 40 గ్రామాల గుండా మత్స్యకారులు అక్రమంగా బోట్ల ద్వారా రావచ్చని అధికారులు గుర్తించారు. ఆ 40 గ్రామాల్లో పోలీసులు, మెరైన్ పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామ వాలంటీర్లు, యువకులతో మల్టీ డిసిప్లెనరీ టీంలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అని నిరంతరం పహారా కాస్తున్నాయి. కొత్త వ్యక్తులు రాగానే ఈ బృందాలు వెంటనే వారిని క్వారంటైన్ కు పంపుతున్నాయి’’ అని ఆయన చెప్పారు. తీరప్రాంతంలో ఉన్న పోలీసు పార్టీలకు బైనోక్లాక్స్, డ్రాగన్ లైట్లు, కమ్యునికేషన్ సెట్లు ఇస్తున్నట్లు అమ్మిరెడ్డి వివరించారు. ఏపీలో మొత్తం 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. స్పందించిన ప్రభుత్వం గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను సముద్ర మార్గంలో ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సుమారు ఆరు వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు చేరవేసేలా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఏపీ మత్స్యకారులకు సాయం చేయాలని సూచించారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమిళనాడులోని చెన్నైకి, గుజరాత్‌లోని వీరావల్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఏటా వలస వెళ్తుంటారు. అలా వెళ్లినవారంతా ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల ఆయా ప్రాంతాల్లోనే చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. text: మాజీ మోడల్ అమీ డోరిస్.. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ దగ్గర తాను బాత్‌రూమ్‌కు వెళ్లి బయటకు వచ్చినపుడు డోనల్డ్ ట్రంప్ తన శరీరంలోని వివిధ భాగాలను అసభ్యకరంగా తడిమారని, తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని బ్రిటన్‌కు చెందిన గార్డియన్ వార్తాపత్రికతో చెప్పారు. ఈ ఆరోపణలను ట్రంప్ తరఫు న్యాయవాదులు తిరస్కరించారు. ఇది ఎన్నికలకు ముందు ట్రంప్ మీద ''దాడి చేసే ప్రయత్నం''గా అభివర్ణించారు. ట్రంప్ అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని గతంలోనూ పలువురు మహిళలు ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ ట్రంప్ తిరస్కరించారు. ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్తున్న సమయంలో అమీ డోరిస్ వయసు 24 సంవత్సరాలు. అప్పటి తన బాయ్ ఫ్రెండ్ జేసన్ బిన్‌తో కలిసి ట్రంప్‌కు చెందిన వీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌లను వీక్షించినట్లు ఆమె తెలిపారు. తాను బాత్‌రూమ్‌కు వెళ్లినపుడు ట్రంప్ బాత్‌రూమ్ బయట తన కోసం మాటువేశారని ఆమె ఆరోపించారు. ''అతడు అమాతంతంగా తన నాలుకను నా గొంతులోకి చొప్పించాడు. నేను అతడిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్నా. అప్పుడతడు మరింత గట్టిగా పట్టుకుని చేతులతో నా పిరుదులు, నా వక్షోజాలు, నా వీపు, అన్నీ తడిమాడు'' అని ఆమె 'గార్డియన్'‌తో చెప్పారు. ''అతడి పట్టులో నుంచి నేను బయటపడలేకపోయాను'' అన్నారు. అదంతా ఆపాలని తాను ట్రంప్‌కు చెప్పానని.. కానీ అతడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు తనకు ఇద్దరు టీనేజీ కుమార్తెలు ఉన్నారని.. వారికి ఆదర్శంగా ఉండటం కోసం ఇప్పుడు ముందుకొచ్చి ఈ విషయం వెల్లడించాలని నిర్ణయించుకున్నానని డోరిస్ చెప్పారు. 2016లోనే ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నానని.. కానీ తన కుటుంబ క్షేమం కోసం భయంతో ఆ పని చేయలేకపోయానని వివరించారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అసత్యమని ట్రంప్ ప్రచార బృందానికి న్యాయ సలహాదారుగా ఉన్న జెన్నా ఎలిస్ సీబీఎస్ న్యూస్‌ చానల్‌తో పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్ట్ నుంచి లభించిన వీడియోలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఎన్నికల సమయంలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. ''ఈ విషపూరిత, నిరాధార కథనాన్ని ప్రచురించినందుకు ద గార్డియన్ పత్రిక బాధ్యత వహించేలా చేయటానికి అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన మార్గాలనూ పరిశీలిస్తాం'' అని చెప్పారు. డోరిస్ చేసిన ఆరోపిత దాడి నిజమే అయితే దానికి ఇతర సాక్షులు కూడా ఉండి ఉండాలని ట్రంప్ న్యాయవాదులు 'ద గార్డియన్‌'తో వ్యాఖ్యానించారు. నవంబర్‌లో జరుగబోయే అధ్యక్ష ఎన్నికలకు ముందు చేస్తున్న ఈ ఆరోపణల వెనుక రాజకీయ ప్రేరేపణ ఉండివుండవచ్చునని సూచించారు. ట్రంప్‌తో అసభ్యంగా కానీ, అసౌకర్యవంగా గానీ ఏదైనా జరిగిందనే విషయం డోరిస్ తనతో చెప్పినట్లు తనకేమీ గుర్తులేదని బిన్ తమతో పేర్కొన్నారని కూడా ట్రంప్ న్యాయవాదులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావటం ఇదే మొదటిసారి కాదు. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ట్రంప్ మీద లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి ఇటువంటి ఆరోపణలు వెల్లువలా వచ్చాయి. మహిళల విషయంలో ఆయన ప్రవర్తన మీద నిశిత దృష్టి కేంద్రీకరించేలా చేశాయవి. తన వంటి సెలబ్రిటీలు మహిళలను 'ఏమైనా చేయొచ్చు' అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయనపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. అటువంటి వారిలో వ్యాస రచయిత్రి జీన్ ఇ కారోల్ ఒకరు. 1995 చివర్లోనో, 1996 మొదట్లోనో ట్రంప్ తన మీద ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ట్రంప్ తన మీద దూకి, తనను గోడకు అదిమిపట్టి, తన మీద పడ్డారని చెప్పారు. అవి పూర్తిగా అబద్ధాలని ట్రంప్ ప్రత్యారోపణ చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 1997లో న్యూయార్క్‌లో తనపై లైంగిక దాడి చేశారని ఒక మాజీ మోడల్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. text: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ కంపెనీ మీద ఒక మహిళ వేసిన కేసుతో ఈ చర్చ మొదలైంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనకు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ రాసుకోవడం వల్లే గర్భాశయ క్యాన్సర్ వచ్చిందని కోర్టులో కేసు వేసింది. ఆ తరువాత ఇంకొందరు మహిళలూ ఆమెకు జతకలిశారు. వాళ్లు కూడా అదే ఆరోపణ చేస్తూ కోర్టులో కేసు వేశారు. కాలిఫోర్నియాలోని కోర్టు ఆ కంపెనీకి దాదాపు రూ.32వేల కోట్ల రూపాయలను జరిమానాగా విధించింది. ఆ పౌడర్‌లో ఆస్బెస్టాస్ అనే పదార్థాన్ని వాడారని, దాని వల్ల తలెత్తే ప్రమాదాల గురించి వినియోగదార్ల దగ్గర ఆ సంస్థ దాచిపెట్టిందని తీర్పు చెప్పే సమయంలో న్యాయమూర్తులు అన్నారు. అది ఆమె ఒక్కరి సమస్యే కాదు. న్యూజెర్సీలోని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకొని చాలామంది మహిళలు తాము కూడా పౌడర్ వాడటం వల్లే క్యాన్సర్ బారిన పడినట్లు ఆరోపించారు. మొదట కేసు వేసిన మహిళ చెప్పినదాని ప్రకారం తన మర్మాంగాల దగ్గర చెమటను పీల్చుకోవడానికి ఆమె పౌడర్ వాడేవారు. దానివల్లే తనకు సమస్యలు మొదలయ్యాయని చెప్పారు. కానీ, కంపెనీ మాత్రం ఇవన్నీ అసత్య ఆరోపణలని చెబుతోంది. ఏదేమైనా భారత్‌లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర మీడియా కథనాల ప్రకారం... కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశానుసారం వంద మందికిపైగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కార్యాలయాలు, హోల్ సేల్ వ్యాపారులు, పంపిణీదారుల నుంచి పౌడర్ శాంపిళ్లను సేకరించి వాటిని పరీక్షిస్తారు. ఈ విషయం గురించి కేంద్ర ఔషద నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)ను సంప్రదిస్తే, టాల్కమ్ పౌడర్ విషయం తమ దృష్టికి వచ్చిందని అక్కడి అధికారులు చెప్పారు. కానీ, దానిపై చర్యల గురించి ఏమీ చెప్పలేదు. రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన ఓ రిపోర్టు తరువాతే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఎన్నో దశాబ్దాల నుంచే తమ బేబీ పౌడర్‌లో అస్బెస్టాస్ ఉందని తెలుసని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. 1970ల నుంచే ఆస్బెస్టాస్‌ లేని బేబీ పౌడర్‌లు వినియోగంలో ఉన్నాయి. నిజానికి మర్మాంగాల దగ్గర పౌడర్ (ఆస్బెస్టాస్ ఉన్న) రాసుకుంటే గర్భాశయ క్యాన్సర్ తలెత్తే అవకాశం ఉంటుందనే ఆందోళన ఎప్పట్నుంచో వినిపిస్తోంది. కొన్ని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చెప్పిన దాని ప్రకారం ఆస్బెస్టాస్ ఉన్న పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముంది. కానీ, ఆ విషయం ఇప్పటిదాకా ఆధార సహితంగా రూఢీ అవ్వలేదు. కానీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌తో పాటు కొన్ని ఇతర సంస్థల అధ్యయనాలను దృష్టిలో పెట్టుకొని జననాంగాల దగ్గర టాల్కమ్ పౌడర్ వినియోగాన్ని క్యాన్సర్ కారకాల జాబితాలో చేర్చారు. సర్ గంగారామ్ హాస్పిటల్‌‌కు చెందిన చర్మ వ్యాదుల నిపుణుడు, డాక్టర్. రోహిత్ బత్రా చెప్పిన వివరాల ప్రకారం దాదాపు ప్రతి పౌడర్‌లోనూ ఆస్బెస్టాస్ ఉంటుంది. అది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ తలెత్తే అవకాశమూ ఉంది. ‘ఏదో ఒక పౌడర్ గురించి చెప్పడం సరికాదు. సాధారణంగా పౌడర్ వినియోగం తక్కువగానే ఉంటుంది. వాళ్లలో కూడా క్యాన్సర్ చాలా కొద్ది మందికే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, పౌడర్ అనే కాదు, మరే కాస్మెటిక్ ప్రొడక్ట్ అయినా ఎక్కువ మోతాదులో వాడటం శ్రేయస్కరం కాదు. స్నానం చేసేప్పుడు ఆ కాస్మెటిక్స్ రాసిన ప్రాంతాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి’ అని రోహిత్ సూచిస్తారు. జాన్సన్ అండ్ జాన్సన్ కేసు రాయిటర్స్ రిపోర్టుతో పాటు కొందరు మహిళల ఆరోపణల ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలున్నాయి. కానీ, కంపెనీ ఇవన్నీ అసత్యాలని చెబుతోంది. ఆ ఆరోపణలు, రాయిటర్స్ రిపోర్టు అవాస్తమని, అది ఏకపక్షంగా ఉందని, తమ పౌడర్ పూర్తిగా సురక్షితమని, అందులో ఆస్బెస్టాస్ లేదని బీబీసీకి పంపిన ఒక మెయిల్‌లో ఆ సంస్థ తెలిపింది. దాదాపు లక్షమంది స్త్రీ పురుషులపై అధ్యయనం చేశాక తమ పౌడర్ పూర్తి స్థాయిలో సురక్షితమని తేలిందని కంపెనీ చెబుతోంది. ఆ అధ్యయన నివేదికలను రాయిటర్స్‌కు కూడా పంపినట్లు తెలిపింది. ‘మా ఉత్పత్తులను చాలా ఏళ్లుగా వాడుతున్నారు. చాలామంది సామాన్యులు మా ఉత్పత్తులను ఇష్టపడతారు. ఈ పౌడర్ పైన అనేక స్వతంత్ర అధ్యయనాలు కూడా జరిగాయి. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా తేలలేదు’ అని ఆ సంస్థ వివరిస్తోంది. సాధారణంగా అనేక ఖనిజాలను శుద్ధి చేసి పౌడర్‌ల తయారీలో వినియోగిస్తారు. ఒక్కో పౌడర్ సంస్థ ఒక్కో ఫార్ములా ఉపయోగిస్తుంది. ‘పెద్దలు, పిల్లలకు వేర్వేరుగా చేసే పౌడర్లలో ఎలాంటి తేడా ఉండదు. కోమలం, మృదుత్వం లాంటి పదాలను మార్కెటింగ్‌ కోసమే ఉపయోగిస్తారు. కొన్నేళ్ల క్రితం దాకా పౌడర్ వల్ల తెల్లగా అవుతారని భావించేవారు. కానీ, పౌడర్ అనేక రసాయనాల మిశ్రమం. ఏ రసాయనాలనైనా ఎక్కువగా వాడటం ప్రమాదకరమే’ అని రుషీ పరాశర్ అనే డెర్మటాలజిస్ట్ పేర్కొన్నారు. టాల్కమ్ పౌడర్‌ను ఎక్కువగా వినియోగించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని, కానీ ఏ ఒక్క సంస్థ పౌడర్‌ వల్లో ప్రమాదం ఉందని చెప్పలేమని ఆయన అంటున్నారు. ఒకవేళ ప్రమాదం ఉందని తెలిస్తే దాని వినియోగాన్ని ఆపేయాలని సూచిస్తారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ‘పౌడర్ రాసుకుంటే తెల్లగా కనిపిస్తారు కానీ క్యాన్సర్ వస్తుందా’ అనే సందేహం రావడం సహజం. కానీ, ఇటీవల కొన్ని పరిణామాలు మాత్రం ఆ విషయంలో కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. text: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ప్రభుత్వం అంటే తండ్రి పాత్ర పోషించాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని వ్యాఖ్యానించింది. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాఠశాలల తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని అడిగింది. ప్రజలే ప్రజాస్వామ్యం.. ప్రజలకన్నా ఎవరూ గొప్పవారు కాదు అని స్పష్టం చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని, 3 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేసింది. కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ శాంతియుతంగా జరిగితే తమకేమీ అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీ జేఏసీ తరపున వాదనలు వినిపించిన దేశాయ్ ప్రకాశ్ రెడ్డి... "చర్చల కోసం రెండు సార్లు ప్రభుత్వ న్యాయవాదులకు ఫోన్లు చేశాం. కానీ స్పందన లేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్ప చర్చలు లేవు అని తాము ఎప్పుడూ చెప్పలేదు. మా డిమాండ్లు మీ ముందు పెడతాం. ఏవి సాధ్యమో, ఏవి కావో చెప్పండి. అన్ని సమస్యలనూ కోర్టులే తేల్చాలి అంటే కుదరదు, కొన్నింటికి చర్చలతో పరిష్కారం దొరుకుతుంది" అని అన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీ నియామకం ఎందుకు చేపట్టలేదని, కార్మిక సంఘాలతో ఎందుకు చర్చలు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. text: విముక్తి పొందిన కొన్ని రోజులకు 1945లో బీబీసీ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఈ మధ్యే మళ్ళీ బెల్సెన్ వెళ్ళారు. మళ్ళీ బీబీసీతో మాట్లాడారు. తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 73 ఏళ్ళ కిందట బ్రిటిష్ దళాలు గేట్లు తోసుకుని లోపలికి వచ్చినప్పుడు హెట్టీ అక్కడే ఉన్నారు. అక్కడే 52 వేల మంది ప్రజలను అప్పుడు చంపేశారు. హెట్టీని ఆమె తల్లితండ్రులు, ఇద్దరు సోదరులతో పాటు హాలండ్ నుంచి బెల్సెన్‌కు తరలించారు. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్ళు. నిర్భంద శిబిరానికి విముక్తి లభించినపుడు, హెట్టీ తన శక్తినంతా కూడగట్టుకుని బీబీసీతో మాట్లాడారు. తన కథంతా చెప్పారు. చిన్నారి హెట్టీ ఆడియో టేపు ఇప్పటికీ బీబీసీ ఆర్కైవ్స్‌లో భద్రంగా ఉంది. ఆనాడు అనుభవించిన బాధలు, కష్టాల గురించి ఆమె జర్మన్ భాషలో మాట్లాడారు. తన తండ్రి తృటిలో మృత్యువును తప్పించుకున్న సందర్భాన్ని వివరించారు. ఆస్ట్రేలియాలో ఆమె కొత్త జీవితం ప్రారంభించారు. తల్లి అయ్యారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించారు. కానీ, బెల్సెన్ లోని చాలా మంది చిన్నారుల కథ అక్కడే ముగిసింది. ‘‘ఈ తరానికి జర్మన్‌లో జరిగిన సామూహిక మానవ హననం గురించి తెలియదు. నేను రేపు లేకపోయినా.. ఎవరో ఒకరు ఇలాంటి మారణహోమం ఒకటి జరిగిందని ప్రపంచానికి చెప్పాలి. చరిత్రను ఎప్పటికీ గుర్తు చేయాలి’’ అని ఆమె అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బ్రిటిష్ దళాలు సరిగ్గా 73 ఏళ్ళ కిందట జర్మనీలోని బెర్గెన్ బెల్సెన్‌లో నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరంలోకి ప్రవేశించాయి. వేలాది మంది ప్రాణాలు కాపాడాయి. అలా ప్రాణాలతో బయట పడిన వారిలో ఒకరు హెట్టీ వెరొల్మి. text: ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాలుడిని వదిలి వెళ్లడం తాము చూసినట్లు దగ్గర్లో ఉన్న క్వారీలో పనిచేసే కూలీలు తమకు సమాచారం ఇచ్చారని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అష్మీ బీబీసీకి తెలిపారు. తమ బృందం ఆ ప్రాంతానికి చేరుకుని బాలుడిని తీసుకువచ్చిందని, తానే స్వయంగా వెళ్లి ఆ బాలుడిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించానని ఆమె చెప్పారు. బాలుడికి గాయాలేమీ కాలేదని, క్షేమంగా ఉన్నాడని వివరించారు. కిడ్నాపర్లను త్వరలోనే పట్టుకుంటామని, బాలుడిని రక్షించడంలో సహకరించిన ప్రజలకు, మీడియా, సోషల్ మీడియాకు అష్మీ కృతజ్ఞతలు తెలిపారు. మండపేటలో కిడ్నాప్.. సోషల్ మీడియాలో వైరల్ తూర్పు గోదావరిలోని మండపేటలో సోమవారం ఉదయం జషిత్ కిడ్నాప్‌కు గురయ్యాడు. తన నానమ్మ పార్వతితో కలిసి జషిద్ తమ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి అతడిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జషిత్ తల్లి నాగావళి తొమ్మిది నెలల గర్భవతి. కుమారుడి కోసం ఆమె, జషిత్ తండ్రి వెంకటరమణ కన్నీరు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలుడి ఫొటోను షేర్ చేస్తూ, ఆచూకీ దొరికితే వెంటనే తెలియజేయాలని కోరుతూ చాలా మంది ఫేస్‌బుక్‌, ట్విటర్ వంటి వేదికల్లో పోస్ట్‌లు పెట్టారు. టీవీ ఛానెళ్లు కూడా ఈ కిడ్నాప్ వ్యవహారం గురించి విస్తృతంగా కథనాలు ప్రసారం చేశాయి. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 500 మంది సిబ్బందితో మొత్తం 17 బృందాలు ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఎస్పీ తెలిపారు. ‘ఇడ్లీలు పెట్టారు’ ఇంటికి చేరుకున్న తర్వాత కిడ్నాపర్ల గురించి జషిత్ మీడియాకు వివరాలు వెల్లడించాడు. కిడ్నాపర్లు రోజూ తనకు తినడానికి ఇడ్లీలు పెట్టారని వివరించాడు. తనను వాళ్లు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని, రాజు అనే యువకుడి ఇంట్లో ఉంచారని అన్నాడు. ఇంటికి చేరుకున్న వెంటనే జషిత్ ఆకలిగా ఉందని అన్నాడని, అతడికి టిఫిన్ తినిపించామని వెంకట రమణ బీబీసీకి తెలిపారు. జషిత్‌ను చూసిన వెంటనే తన భార్య ఉద్వేగానికి గురయ్యారని, తమ కుమారుడిని హత్తుకుని ఏడ్చారని ఆయన చెప్పారు. పోలీసులు వైద్యుడిని తీసుకువచ్చి, జషిత్‌కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారని రమణ తెలిపారు. ‘ముసుగులు ధరించారు’ కిడ్నాపర్ల గురించి వివరాలు అడిగినప్పుడు నానమ్మను కొట్టి తనను తీసుకువెళ్లినట్లు జషిత్ చెబుతున్నాడని, కిడ్నాపర్ల మొహాలకు ముసుగులు ఉన్నాయని అంటున్నాడని రమణ వివరించారు. నిద్ర లేకపోవడంతో బాలుడు నీరసంగా ఉన్నాడని, వివరాలు చెప్పేందుకు కాస్త భయపడుతున్నాడని అన్నారు. కుతుకులూరు రోడ్డులోని అమ్మవారి గుడి దగ్గర జషిత్‌ను అక్కడి క్వారీలో పనిచేస్తున్న ఏసు అనే వ్యక్తి గుర్తించారని, కిడ్నాప్ వ్యవహారం ముందుగానే తెలియడంతో ఆయన క్వారీ యజమానిని అప్రమత్తం చేశారని రమణ చెప్పారు. గురువారం ఉదయం ఆరుగంటలకు క్వారీ యజమాని నుంచి తనకు ఫోన్ వచ్చిందని, వెంటనే అక్కడికి వెళ్లానని వివరించారు. కిడ్నాప్ ఉదంతం గురించి సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడం, మీడియాలోనూ కథనాలు రావడం తమ కుమారుడు ఇంటికి తిరిగిరావడంలో ప్రధాన పాత్ర పోషించాయని రమణ అన్నారు. ఇందుకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ఉత్కంఠ రేపిన బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. నాలుగేళ్ల జషిత్‌ను గురువారం తెల్లవారు జామున కిడ్నాపర్లు తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి మండలం కుతుకులూరు రోడ్డు వద్ద వదిలి వెళ్లారు. text: మ్యాచ్‌లో 75 పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారాలను దాటుకుంటూ, అత్యంత వేగంగా ఈ మైలు రాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సాధించాడు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 కోహ్లీ ఇప్పటివరకూ మొత్తం 417 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 131 టెస్టులు, 224 వన్డేలు, 62 టీ20లు ఉన్నాయి. సచిన్, లారా 453 మ్యాచ్‌ల తర్వాత ఈ మైలు రాయిని చేరారు. వీరి తర్వాతి స్థానం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ది. 468 మ్యాచ్‌ల తర్వాత అతను 20 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. 20 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడు కోహ్లీ. సచిన్, కోహ్లీలతోపాటు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ క్లబ్‌లో ఉన్నాడు. సచిన్ తన మొత్తం కెరీర్‌లో 34,357 పరుగులు చేశాడు. ద్రవిడ్ 24,208 పరుగులు చేశాడు. కోహ్లీ తాజా రికార్డును చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) క్రికెట్ వరల్డ్ కప్‌లో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ గొప్ప మైలు రాయిని దాటాడు. text: గ్వాలియర్ అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులతో సౌమ్య ఈ ఆపరేషన్‌ను శుక్రవారం గ్వాలియర్‌లోని బిర్లా ఆస్పత్రిలో డాక్టర్ అభిషేక్ చౌహాన్ చేశారు. ఆపరేషన్ చేసి తలలో ఉన్న ట్యూమర్ తొలగించామని, ప్రస్తుతం బాలిక పూర్తిగా ఆరోగ్యంగా ఉందని ఆస్పత్రి వారు చెప్పారు. మురైనా జిల్లాలోని బాన్‌మోర్‌లో ఉంటున్న సౌమ్యకు మూర్ఛ వస్తుండేది. గత రెండేళ్లుగా ఆమె ఫిట్స్ రాకుండా నాలుగు మందులు వేసుకునేది. కానీ, అవి వాడినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దాదాపు ఏడాది తర్వాత, ఆ బాలికకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. ఆమె కుటుంబం ఆపరేషన్ చేయించడానికి వెనకాడింది. ఎందుకంటే, ఆ ఆపరేషన్ చేయడం కష్టమే కాదు, ప్రమాదకరం కూడా. పొరపాటు జరిగితే, బాలిక ప్రాణాలకే ప్రమాదం వస్తుందని వారు భయపడ్డారు. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు బాలిక మెదడుకు మరోసారి స్కాన్ తీయించారు. ఆ రిపోర్టుల్లో ట్యూమర్ అంతకు ముందు కంటే నాలుగు రెట్లు పెద్దదైనట్టు తెలిసింది. మొదట, ఏదైనా పెద్ద నగరంలో బాలికకు సర్జరీ చేయించాలని ఆమె కుటుంబం అనుకుంది. కానీ, పెద్ద ఆస్పత్రుల్లో ఆ సర్జరీ ఖర్చు గ్వాలియర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దాంతో వారు, బాలికకు గ్వాలియర్‌లోనే ఆపరేషన్ చేయించాలని నిర్ణయించారు. బాలికకు ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ అభిషేక్ చౌహాన్ బీబీసీతో మాట్లాడారు. "ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఇందులో చిన్న పొరపాటు జరిగినా బాలిక ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. దానితోపాటూ మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి" అన్నారు. బిర్లా ఆస్పత్రి వివరాల ప్రకారం ప్రపంచంలో ఇంత చిన్న వయసులో ఉన్న వారికి ఇలాంటి ఆపరేషన్ చేయడం, అది జరుగుతున్న సమయంలో, రోగి ఏదైనా వాయిస్తూ ఉండడం ఇది రెండోసారి. "ఈ ఆపరేషన్ 'అవేక్ క్రెనోటమీ' పద్ధతిలో చేశాం. ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్, మెదడులో మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పనులను నియంత్రించే భాగాలకు చాలా దగ్గరగా ఉంటుంది. సర్జరీ చేసి ట్యూమర్ తీసివేసే సమయంలో, అదనంగా కొన్ని మిల్లీమీటర్ల భాగాన్ని తొలగించినా, మెదడులో ఆ భాగం నియంత్రించే పనిని ఇక ఎప్పటికీ చేయలేం" అని డాక్టర్ అభిషేక్ చెప్పారు. "అవేక్ క్రేనోటమీ' పద్ధతిలో రోగి స్పృహలోనే ఉంటారు. సర్జరీ చేసే భాగానికి మాత్రమే అనస్తీషియా ఇస్తారు. న్యూరోసర్జన్ ట్యూమర్ తొలగించే సమయంలో రోగితో రకరకాల పనులు చేయిస్తారు. అంటే, సర్జరీలో మేం ఉపయోగించే పరికరాలను మెదడులో తాకించినపుడు, ఆ భాగం ఏ పనిని నియంత్రిస్తుందో, ఆ కార్యకలాపాలు ఆగిపోతాయి. సర్జన్ వెంటనే అది తెలుసుకుని, అప్రమత్తం అవుతారు" అని డాక్టర్ అభిషేక్ చెప్పారు. ఇంటర్‌నెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ప్రపంచంలో ఇంత చిన్న వయసు పిల్లలకు, ఇలాంటి ఆపరేషన్ ఒకేసారి జరిగింది. దానిని బెంగళూరులో చేశారు. చిన్న పిల్లలకు ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టం. సర్జరీ తర్వాత బాలిక ఇప్పుడు పూర్తిగా మామూలుగా ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశామని డాక్టర్ అభిషేక్ చెప్పారు. సౌమ్య మామయ్య సూరజ్ సింగ్ బాలిక గురించి బీబీసీతో మాట్లాడారు. ఆపరేషన్ తర్వాత తమ కుటుబం సంతోషంగా ఉందన్నారు. "పాప ట్యూమర్ పెద్దదవుతూ వచ్చింది. తను ఒక్కసారి మందులు వేసుకోకపోయినా మూర్ఛ వస్తుండేది. కానీ, ఇప్పుడు సర్జరీ తర్వాత తన ఆరోగ్యం బాగుంది" అన్నారు. సౌమ్య నాలుగో తరగతి చదువుతోంది. తను ఇకమీదట మిగతా పిల్లల్లాగే ఉంటుందని ఆమె కుటుంబం ఆశిస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఒక ప్రత్యేక పద్ధతిలో 9 ఏళ్ల బాలికకు ఆపరేషన్ చేశారు. ఈ సర్జరీ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ తొలగించారు. అదంతా జరుగుతున్న సమయంలో ఆ బాలిక పియానో వాయిస్తూనే ఉంది. text: "మందగించిన ఆర్థిక వ్యవస్థలో కూడా మరింత సంపన్నులవుతున్న భారత కుబేరులు " అంటూ ఫోర్బ్స్ ఒక కథనాన్ని వెబ్‌సైట్ లో ప్రచురించింది. దెబ్బ కొట్టిన నోట్ల రద్దు, జీఎస్‌టీ ఫోర్బ్స్ఇండియా ప్రచురించిన ఈ కథనంలో నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని తెలిపింది. "గత నవంబర్ లో అమలులోకి వచ్చిన నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల నెలకున్న అనిశ్చితి కారణంగానే జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి మందగించి మూడు సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయి 5.7 శాతానికి చేరింది " అని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. "అయినా ప్రస్తుత పరిస్ధితుల్లో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో అత్యధిక సంపన్నులైన వంద కుబేరులకు చెందిన కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ ఏడాది వారి ఆస్తి 25శాతం కన్నా ఎక్కువ వృద్ధితో 479 బిలియన్ డాలర్లకు చేరింది" అని ఫోర్బ్స్ వెల్లడించింది. లక్ష కోట్లు పెరిగిన ముఖేశ్ అంబానీ ఆస్తి టాప్ కుబేరుల జాబితాలో మొదటి స్థానం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీదే. " ఈ ఏడాది చమురు, గ్యాస్ వ్యాపారాలు చేస్తున్న ముఖేశ్ అంబానీ కన్నా ఎక్కువ లాభం ఎవరికీ కలగలేదు. తన ఆస్తిలో 15.3 బిలియన్ డాలర్ల (అంటే లక్ష కోట్లు) వృద్ధితో ఆయన మొదటి స్ధానాన్ని పదిలం చేసుకున్నారు" అని ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. ముఖేశ్ అంబానీ మొత్తం ఆస్తి విలువ 38 బిలియన్ డాలర్లు (అంటే దాదాపు 2.47 లక్షల కోట్లు) కు చేరిందని ఫోర్బ్స్ తెలిపింది. ఫోర్బ్స్ ఇండియా ప్రముఖ అమెరికన్ పత్రిక ఫోర్బ్స్‌కు చెందిన భారతీయ సంస్ధ. దీని యాజమాన్య హక్కులు కూడా ముఖేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గరే ఉన్నాయి. అంతా జియో ప్రభావమే ముఖేశ్ అంబానీ భారత్‌తో పాటు ఆసియాలో అత్యధిక సంపన్నులో 5వ స్థానంలో కూడా చేరారని ఫోర్బ్స్ తెలిపింది. జియో దీనికి ఒక కారణమని వెల్లడించింది. "ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు జియో కారణంతోనే పెరిగాయి" అని ఫోర్బ్స్ తెలిపింది. ఆ 27 మందే 1 బిలియన్ డాలర్ల సంపద సృష్టించారు " ఈ జాబితాలో ఉన్న 27 మంది సంపన్నులు గత ఏడాది జాబితాలో కూడా ఉన్నారు. వారి ఆస్తి ప్రస్తుతం ఒక బిలియన్ డాలర్లు లేదా అంతకన్నా పెరిగింది" అని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. ఈ జాబితాను సెప్టెంబరు15 నాటి షేర్లు, ఎక్స్చేంజ్ రేట్ల ఆధారంగా తయారు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితులని ప్రచారం పొందిన గౌతమ్ అదానీ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. ముఖేశ్ అంబానీకి తమ్ముడైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ 45వ స్థానంలో నిలిచారు. టాప్ 20 లో చేరిన ఆచార్య బాలకృష్ణ ఈ జాబితాలో పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ 19 స్థానంలో నిలిచారు. 45ఏళ్ల బాలకృష్ణ టాప్ 20 మంది సంపన్నుల జాబితాలో అత్యంత తక్కువ వయస్సుగల పారిశ్రామికవేత్త. ఆయన ఆస్తి మొత్తం 6.55 బిలియన్ డాలర్లు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో టాప్ 100 మంది ధ‌న‌వంతుల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. ఒక వైపు భారత ఆర్థిక వృద్ధి నెమ్మదించినా.. దేశంలోని 100 అత్యధిక ధనవంతుల ఆస్తి మాత్రం నాలుగో వంతు పెరిగిందని వివరించింది. text: ఇరాన్ చుట్టూ అమెరికాకు చెందిన అనేక సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ రెండు స్థావరాలనే ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ క్షిపణుల దాడికి గురైన మొదటి అమెరికా సైనిక స్థావరం పేరు ‘అల్ అసద్ ఎయిర్ బేస్’. ఇది ఇరాన్‌కు సమీపంలో ఇరాక్ భూభాగంలో ఉంది. ఆ ప్రాంతానికి అమెరికా సేనల రాక మొదలైనప్పటి నుంచి దాని రూపు రేఖలే మారిపోయాయి. అక్కడ సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫాస్ట్ ఫుడ్ రెస్టరెంట్ల లాంటివన్నీ వచ్చాయి. బస్సులు ప్రయాణించడానికి వీలుగా రెండు రహదారుల్ని కూడా నిర్మించారు. మొదట 1980ల్లో ఇరాక్ సైనిక అవసరాలకు వీలుగా బగ్దాద్‌కు వంద మైళ్ల దూరంలో ఎడారి ప్రాంతంలో ఆ స్థావరాన్ని నిర్మించారు. 2014లో బీబీసీ ప్రతినిధి క్వెంటెన్ సోమర్‌విల్..అల అసద్ ప్రాంతాన్ని సందర్శించారు కానీ, 2003లో అమెరికా సేనలు ఇరాక్‌లోకి ప్రవేశించాక ‘అల్ అసద్’ వారి అతిపెద్ద సైనిక స్థావరాల్లో ఒకటిగా మారిపోయింది. తమ అవసరాలకు అనుగుణంగా అమెరికా సేనలు అక్కడ అనేక ఏర్పాట్లు చేసుకున్నాయి. 2006లో బీబీసీ ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ వైమానిక స్థావరం చుట్టూ రాళ్లు, పొదలు, ఇసుకే కనిపించింది. కానీ, ఇప్పుడు చూస్తే అదో చిన్నపాటి ఆధునిక అమెరికా పట్టణంలా కనిపిస్తుంది. అక్కడ సౌకర్యాలు ఎంత బావుంటాయంటే, అమెరికా సేనలు ఆ స్థావరాన్ని ‘క్యాంప్ కప్‌కేక్’ అని పిలుచుకుంటాయి. అల్ అసద్‌లో అమెరికా సైనికుడు - 2004 నాటి ఫొటో 2009, 2010లో అమెరికా దళాలు అక్కడి నుంచి వెనక్కు వచ్చి ఆ స్థావరాన్ని ఇరాకీలకు అప్పగించాయి. కానీ, దాని పరిసరాల్లో ఉన్న అన్బర్ ప్రావిన్సుపై ఇస్లామిక్ స్టేట్ పట్టు బిగించడంతో ఆ స్థావరంపై దాడి జరిగింది. 2014 నాటికి ఆ ప్రాంతం చుట్టూ ఐఎస్ ప్రాబల్యం పెరిగిపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం మరోసారి బీబీసీకి లభించింది. అప్పటికి అక్కడ అమెరికా వదిలివెళ్లిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికా సైనికుల క్వార్టర్ట్స్, ఓపెన్ చేయని ఆహార ప్యాకెట్లు, ఫిరంగి గుండ్ల లాంటివి కనిపించాయి. అదే ఏడాది ఐఎస్‌పై పోరాడేందుకు అమెరికా దళాలు మళ్లీ అల్ అసద్ స్థావరానికి చేరుకున్నాయి. స్థావరాన్ని పునర్నిర్మించి దుర్బేధ్యంగా మార్చాయి. అల్ అసద్, ఇర్బిల్ స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది 2018 డిసెంబరులో అల్ అసద్ వైమానిక స్థావరాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సందర్శించారు. ఇరాక్, సిరియాల్లోని ఐఎస్ఐఎస్ మిలిటెంట్లను ఓడించడంలో అల్ అసద్‌ స్థావరంలోని మహిళా, పురుష సైనిక సిబ్బందే కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. కానీ, అక్కడ ఉన్నంత సేపూ తన భార్య భద్రత గురించి కూడా ఆందోళన చెందినట్టు ఆయన వ్యాఖ్యానించారు. గత నవంబర్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ‘థ్యాంక్స్ గివింగ్’ వేడుకల్లో భాగంగా ఆ స్థావరాన్ని సందర్శించారు. ఇరాక్‌లో ఉన్నంత సేపూ తన భార్య భద్రత గురించి ఆందోళన చెందినట్టు ట్రంప్ చెప్పారు మొత్తం ఇరాక్‌లో 5 వేల అమెరికా సైనిక దళాలు ఉన్నాయని, అల్ అసద్ స్థావరంలో 1500 అమెరికా - సంకీర్ణ దళాలు ఉన్నాయని అంచనా. ఆ దళాల్ని దేశం నుంచి పంపేయాలని ఈ వారం జరిగిన ఓటింగ్‌లో ఇరాకీ పార్లమెంట్ నిర్ణయించింది. దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అల్ అసద్ వైమానిక స్థావరం నిర్మాణ వ్యయానికి సంబంధించిన ప్రస్తావనను ఆయన తీసుకొచ్చారు. ‘‘అత్యంత ఖరీదైన వైమానిక స్థావరం అక్కడుంది. నేను అధ్యక్ష పదవి చేపట్టడానికి ఎంతో కాలం ముందే వందల కోట్ల డాలర్లను ఖర్చు చేసి దాన్ని నిర్మించారు. ఆ నిర్మాణానికి అయిన డబ్బు తిరిగి చెల్లించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదు’’ అని ఆయన చెప్పారు. ఇరాన్ చేసిన దాడిలో దెబ్బతిన్న మరో అమెరికా సైనిక స్థావరం కుర్దిస్తాన్ రాజధాని ప్రాంతమైన ఇర్బిల్‌లో ఉంది. 13 దేశాలకు చెందిన 3600 మంది సైనిక, ప్రభుత్వ సిబ్బంది అక్కడ ఉన్నారని గత సెప్టెంబరులో యూఎస్ ఆర్మీ తెలిపింది. స్థానిక దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ఆ స్థావరాన్ని వినియోగిస్తారు. ఆ ప్రాంతంలో మొట్టమొదటి మహిళా సైనిక శిక్షకులు ఇర్బిల్ స్థావరం నుంచే తర్ఫీదు పొందారని గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అలా అమెరికాకు ఎంతో కీలకమైన ఆ రెండు సైనిక స్థావరాలపై నేడు ఇరాన్ దాడులు చేసింది. ఇంకా అమెరికా దళాలు ఇరాక్‌లో ఎంత కాలం ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. అమెరికా తమ బలగాలను ఇరాక్‌ నుంచి వెనక్కు రప్పించట్లేదని ఈ వారమే అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ప్రకటించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా - ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధవాతావరణం అలముకొంది. మొదట ఇరాన్ సైనిక కమాండర్ కాశిం సులేమానీని అమెరికా మట్టుబెట్టింది. ఆ తరువాత అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడిచేసింది. text: మధ్యధరా సముద్రంలోని సార్డీనియా దీవిలో నివసించే క్రిస్టియన్ మల్లోచ్చీ అనే ఆ రైతుకు చెందిన స్పెలాచ్చియా అనే కుక్కకు ఇటీవల ఐదు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటి లేత ఆకుపచ్చ రంగులో ఉండటం చూసి అందరూ అబ్బురపడ్డారు. ఆ పప్పీకి వెంటనే పిస్తాచియో అని పేరు కూడా పెట్టారు. పిస్తాచియోతో పాటు పుట్టిన మిగతా నాలుగు కుక్కపిల్లలకి వాటి తల్లి రంగైన తెల్లటి బొచ్చే వచ్చింది. ఆకుపచ్చ రంగుతో కుక్కలు పుట్టటం చాలా అరుదు. పిస్తాచియో తల్లి కుక్క కడుపులో ఉన్నపుడు బిలివెర్డిన్ అనే ఆకుపచ్చ పిగ్మెంట్‌ తాకటం వల్ల దానికి ఈ రంగు వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే.. పిస్తాచియో రంగు అప్పుడే వెలిసిపోవటం కూడా మొదలవటం చూసి చాలా మంది విచారిస్తున్నారు. పిస్తాచియో సహా కుక్కపిల్లలన్నిటినీ.. తన పొలంలో గొర్రెలు కాసే వారికి ఇచ్చేయాలని మల్లోచ్చీ నిర్ణయించుకున్నారు. అఫ్గానిస్తాన్: మదర్సా మీద వైమానిక దాడిలో 11 మంది చిన్నారులు మృతి అఫ్గానిస్తాన్‌లో ఒక మత పాఠశాల మీద జరిగిన వైమానిక దాడిలో 12 మంది పౌరులు చనిపోయారని.. మృతుల్లో 11 మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు. ఉత్తర అఫ్గాన్‌లో టాఖార్ ప్రావిన్స్‌లో గల హజారా ఖుర్లాఖ్ అనే గ్రామంలోని ఒక మదర్సా మీద ఈ వైమానిక దాడి జరిగిందని చెప్పారు. అందులో ఉన్న 11 మంది చిన్నారులు, వారి బోధకుడు చనిపోయారని తెలిపారు. అయితే.. అఫ్ఘాన్ ప్రభుత్వం మాత్రం ఆ గ్రామంలో తాము చేసిన దాడిలో 12 మంది తాలిబన్ ఫైటర్లు చనిపోయారని చెప్తోంది. ఈ దాడిలో మరో 14 మంది గాయపడ్డారని కూడా స్థానిక అధికారులు తెలిపారు. దాడి జరిగినపుడు తాను, పిల్లలు మాత్రమే మసీదులో ఉన్నామని.. మదర్సాకు ఆనుకుని ఉన్న మసీదు ఇమామ్ అద్దుల్ అవాల్ బీబీసీతో చెప్పారు. దాడిలో గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. దాడి బాధితులుగా తమ ఆస్పత్రికి తీసుకువచ్చిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని రాష్ట్ర రాజధాని తలోఖాన్‌లో గల ఆస్పత్రి వైద్యులు చెప్పారు. అయితే.. ఈ వార్తలు అబద్ధమని అఫ్గాన్ ప్రభుత్వ అధికారులు కొట్టివేస్తున్నారు. దాడిలో పౌరులు చనిపోయారనే ఆరోపణల మీద దర్యాప్తు చేయటానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి వారాల్లో ప్రభుత్వ బలగాలు, తాలిబన్ దళాలకు మధ్య హింస తీవ్రమైంది. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న శాంతిచర్చలకు ఈ హింస ముప్పుగా పరిణమించింది. మహబూబాబాద్ కిడ్నాప్: 'తొమ్మిదేళ్ల బాలుడిని గొంతు నులిమి చంపేశారు' తమ బిడ్డను కిడ్నాప్ చేసిన వారికి అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఆ తల్లితండ్రులు సిద్ధపడ్డారు. వాళ్లు రమ్మన్న చోటుకు వెళ్లారు. కానీ, డబ్బు తీసుకునేందుకు కిడ్నాపర్లు రాలేదు. ఆదివారం నుంచి తమ కుమారుడి కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లితండ్రులకు చివరకు విషాదమే మిగిలింది. మహబూబాద్ లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్నరంజిత్ రెడ్డి వసంతల కుమారుడు తొమ్మిదేళ్ళ దీక్షిత్ రెడ్డి ఆదివారం కిడ్నాప్‌కు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీక్షిత్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో వారి ఇంటి బయట నుండి కిడ్నాప్ చేశారు."కిడ్నాపర్ బైక్ పై వచ్చాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో దిక్షిత్ అతనితో బైక్‌పై వెళ్లాడు" అని మహబూబాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ కోటిరెడ్డి విలేఖరుల సమావేశంలో తెలిపారు. దీక్షిత్ హత్య గురించి ప్రెస్ మీట్‌లో వివరిస్తున్న మహబూబాబాద్ ఎస్పీ ఎన్. కోటిరెడ్డి రూ. 45 లక్షల ఇస్తే బాబుని విడిచిపెడతామని దీక్షిత్ తల్లి వసంతకు ఆదివారం రాత్రి కాల్ వచ్చింది. దాంతో, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాల్స్ ట్రేస్ చేయడానికి వీలు లేకుండా ఇంటర్నెట్ కాల్స్ చేశారు కిడ్నాపర్లు. దాదాపు 14 కాల్స్ దాకా చేశారని సమాచారం. అయితే, ఆదివారం సాయంత్రమే వారు ఆ బాలుడిని నిందితుడు మందసాగర్ గొంతు నులిమి చంపారని, ఆ తరువాత మృతదేహం ఆనవాలు తెలియకుండా ఉండేందుకు తగులబెట్టాడని ఎస్పీ సంఘటన క్రమాన్ని వివరించారు. నిందితుడు అంతకుముందు దీక్షిత్ తల్లితండ్రులను బుధవారం నాడు డబ్బు తీసుకుని టౌన్ సెంటర్‌కు రావాలని డిమాండ్ చేశాడు. దీక్షిత్ తండ్రి రంజిత్ డబ్బు తీసుకుని ఆ సమయంలో అక్కడికి వెళ్లారు. కానీ, రాత్రి ఎనిమిదన్నర వరకు ఎదురు చూసినా డబ్బు తీసుకోవడానికి ఎవరూ రాలేదు.కిడ్నాపర్లు మళ్శీ ఫోన్ చేసి వేరే దగ్గరకు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్ళారు. అక్కడికి కూడా ఎవరూ రాలేదు. పోలీసులు గురువారం ఉదయం బాలుడి మృతదేహాన్ని గుర్తించి తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు. బిడ్డ మృతదేహాన్న చూసి ఆ తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. "ఒక కుటుంబాన్ని మానసికంగా క్షోభ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నేరం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి విచారణ జరపాల్సి ఉంది. అసలు కిడ్నాప్ చేయడం వెనుక ఇంకా వేరే ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం కిడ్నాప్ చేసింది, హత్య చేసింది తానే అని మందసాగర్ ఒప్పుకున్నాడు" అని ఎస్పీ తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్ మృతి కోవిడ్-19 క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వలంటీర్ మరణించారని బ్రెజిల్ ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. అయితే, క్లినికల్ ట్రయల్స్ మాత్రం కొనసాగుతున్నాయని స్పష్టీకరించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఈ వ్యాక్సీన్‌ను బ్రెజీల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ టీకాను అస్ట్రాజెనెకా భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ''క్లినికల్ ట్రయల్స్ గురించి ఎలాంటి భయమూ పడాల్సిన అవసరంలేదు''అని ప్రకటన విడుదల చేస్తూ క్లినికల్ ట్రయల్స్‌ను ఆక్స్‌ఫర్డ్ కొనసాగిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు ఈ విషయాన్ని ఆస్ట్రాజెనెకా ధ్రువీకరించలేదు. ''వలంటీర్‌కు కోవిడ్-19 వ్యాక్సీన్ ఇచ్చుంటే క్లినికల్ ట్రయల్స్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చేది. అయితే సదరు వ్యక్తికి మెనింజైటిస్ వ్యాక్సీన్ ఇచ్చాం''అని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. విచారణకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేశామని, ట్రయల్స్‌ను కొనసాగించాలని కమిటీ సూచించిందని ద ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సవ్ పాలో తెలిపింది. మరణించి వ్యక్తి బ్రెజిల్ పౌరుడేనని యూనివర్సిటీ తెలిపింది. మృతుడి వయసు 28ఏళ్లని, అతడు రియోడీ జెనీరోలో ఉండేవారని, కోవిడ్-19 వల్లే అతడు మరణించాడని సీఎన్‌ఎన్ బ్రెజిల్ పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని ఆరు నగరాల్లోని దాదాపు 8,000 మందికి తొలి డోసు టీకాను ఇప్పటికే ఇచ్చామని యూనివర్సిటీ అధికార ప్రతినిధి తెలిపారు. కొందరికి రెండో డోసు కూడా ఇచ్చామని వివరించారు. రియోడీ జెనీరోలోని ఫియోక్రూజ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో భారీగా ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సీన్‌ను కొనుగోలు చేయనున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. చైనా సంస్థ సైనోవాక్ బయోటిక్ చేసిన వ్యాక్సీన్‌ను కూడా బ్రెజిల్‌లో పరీక్షిస్తున్నారు. అయితే దీన్ని కొనుగోలు చేసేందుకు ఎలాంటి ప్రతిపాదనా తమ దగ్గరలేదని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్‌సొనారో తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇటలీకి చెందిన ఒక రైతు ఇంట్లో పెంపుడు కుక్క.. ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ కుక్క పిల్లకు జన్మనిచ్చింది. text: ఈ నిర్ణయం ద్వారా సామాజిక మార్పుకు అడుగులు పడినట్లవుతుందని, కుల వివక్ష తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్న వేళ, ఇలాంటి ప్రయత్నాలతో ఏమేరకు ఫలితాలు ఉంటాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది. చిన్నతనం నుంచి పిల్లల మనసుల్లో కుల,మతాల ముద్రలు పడకుండా ఈ ప్రయత్నం కొంతమేరకు ఉపయోగపడవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఈ నిర్ణయంతో రిజర్వేషన్ల అమలుకి ఆటంకం రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఏముంది? అక్టోబర్ 12న పాఠశాల విద్యాశాఖ ఆర్సీ నెం, 151/A&I/2020 తో విడుదల చేసిన ఆదేశాల్లో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు రిజిస్టర్ల నిర్వహణ ఏకీకృతం చేసేందుకు తగ్గట్టుగా చేస్తున్న మార్పులను సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వివరాలను నమోదు చేసే రిజిస్టర్లలో కులం, మతం ప్రస్తావన నిలిపివేయాలి. బాలికల పేర్లు ఎర్ర రంగు సిరాతో రాసే పద్ధతికి కూడా స్వస్తి పలకాలి. అందరి పేర్లు ఒకే రీతిలో రాయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన మార్పు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో చేర్చినప్పుడు విద్యార్థి వివరాలన్నీ ఇవ్వాలి. కులం, మతం వివరాలు కూడా ఈ జాబితాలో ఉంటాయి. వాటిని అడ్మిషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఇన్నాళ్లూ హాజరు రిజిస్టర్లలో కూడా ఈ వివరాలు పేర్కొనేవారు. అయితే, ఇకపై విద్యార్థి పేరు పక్కనే కులం, మతం వివరాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇదివరకు హాజరు రిజిస్టర్ చూసినప్పుడల్లా సదరు విద్యార్థికి సంబంధించిన సామాజిక వివరాలు కనిపించేవి. ఇకపై విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్‌లో మాత్రమే కులం, మతం వివరాలను పొందుపరుస్తారు. మిగిలిన చోట్ల వాటిని ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా ఈ ఉత్తర్వులు తోడ్పడతాయి. దాని వల్ల విద్యార్థుల వివరాలు అందరికీ తెలియడానికి అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. బాలికల పేర్లను కూడా ప్రస్తుతం ఎర్రసిరాతో రాయడం ఆనవాయితీగా వస్తోంది. సహజంగా హాజరు రిజిస్టర్లలో తొలుత విద్యార్థినుల పేర్లు రాస్తున్నప్పటికీ వాటిని ఎక్కువగా ఎర్రసిరాతో రాసే అలవాటు సాగుతోంది. ఇలా బాలికల పేర్లను ప్రత్యేకంగా రాయడం కూడా ఆపేయాలని తాజా ఉత్తర్వులు సూచించాయి. అందరి పేర్లూ సమానంగా వరుస క్రమంలో రాస్తారు. ఈ పద్ధతితో అందరినీ సమాన దృష్టితో చూసినట్లవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆచరణలో సమస్యలేంటీ.. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కుల, మతాల ప్రస్తావన వద్దని చెప్పడాన్ని ఆహ్వానిస్తూనే ఉపాధ్యాయులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆచరణలో ఈ ప్రయత్నం వల్ల అదనపు భారం అని కూడా చెబుతున్నారు. దీనిపై సీహెచ్ శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడితో బీబీసీ మాట్లాడింది. ''విద్యార్థుల వివరాలను కులాల వారీగా ప్రతి నెలా అందించాల్సి ఉంటుంది. నెలలో కొత్తగా చేరిన వారు, పాఠశాల నుంచి వెళ్లిపోయిన వారి వివరాలను కులాల వారీగా ఎంఈవోలకు అందిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం అయితే రోజువారీగా వివరాలు ఇవ్వాలి. ఇప్పుడు హాజరు రిజిస్టర్లలో అలాంటి ప్రస్తావన వద్దంటే ఆ వివరాల సేకరణ కోసం ప్రతి సారీ అడ్మిషన్ రిజిస్టర్ చూడటం సాధ్యమేనా? ప్రభుత్వం తొలుత అలాంటి రికార్డులు అందించాల్సిన అవసరం రాకుండా చూడాలి. బాలికల వివరాలు కూడా అవసరం లేకుండా ఆదేశాలివ్వాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో సమస్య రాదు. స్కాలర్‌షిప్‌లు, జాతీయ ప్రతిభావంతుల ఎంపిక పరీక్షలు వంటి సమయాల్లో కులాల ప్రస్తావన తీసుకురావాల్సి ఉంటుంది. తరగతి గదుల్లో కులాల ప్రస్తావన రాకుండా చూసేందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. లేదంటే ఇవన్నీ కేవలం ప్రచారానికే పరిమితం అవుతాయి'' అని ఆయన అన్నారు. దేశంలోనే తొలిసారి అంటున్న పాలకపక్షం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కుల, మత భేదాలు లేని సమాజానికి దోహదపడుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ''కులమత భేదాలు లేని సమాజం కోసం తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం. పాఠశాల హాజరు రిజిస్టర్లలో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందరో మహాత్ములు కలలు కన్న కుల, మత రహిత సమాజానికి ఇది నాంది'' అని ట్విటర్‌లో ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక మార్పు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ''అనేక మార్పులు తీసుకువస్తున్నాం. ఇంగ్లీష్ విద్యాబోధన ద్వారా పేదలకు ప్రధానంగా ఎస్సీ, బీసీలకు ఎంతో మేలు జరగబోతోంది. నాడు-నేడు పథకం ద్వారా బడులను మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాం. హాజరు రిజిస్టర్లలో కుల, మత అంశాలు ప్రస్తావించడం ద్వారా పిల్లల మనసుల్లో వివక్ష నాటుకోకుండా చేస్తున్నాం. దీన్ని అందరూ ఆహ్వానించాలి'' అని ఆయన బీబీసీతో చెప్పారు. ‘కొత్తదనం లేదు’ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదని, అధికార పక్షానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి కే ఎస్ జవహార్ అన్నారు. ''నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను. హాజరు రిజిస్టర్‌లో విద్యార్థుల కుల, మత ప్రస్తావన అవసరం లేదని గతంలోనే ఆదేశాలున్నాయి. ఇప్పుడేమీ కొత్తగా చేయడం లేదు. ఓవైపు రాష్ట్రంలో దళితులకు ఏకంగా శిరోముండనం చేస్తున్నా, సీఎం స్పందించడం లేదు. హథ్‌రస్ తరహా ఘటనలు విజయవాడ నగరం నడిబొడ్డున జరుగుతున్నాయి. దళితులకు, మహిళలకు రక్షణ లేని విధంగా పాలన ఉంది. కానీ ఇప్పుడు బాలికలు, దళితులను ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం వింతగా ఉంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు. 'కుల, మతాలు ప్రస్తావించకుండా వెసులుబాటు ఇవ్వాలి' పాఠశాల స్థాయిలో విద్యార్థుల రికార్డుల్లో కులం, మతం వివరాలు ఇవ్వడం ఇష్టం లేనివారు వెల్లడించకుండా ఉండే వెసులుబాటు ఉండాలని దళిత్ శోషన్ ముక్తి మంచ్ జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరుతున్నారు. ''ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపుతోంది. బాల్యం నుంచే వివక్షకు తావు లేని వాతావరణం సృష్టించాలి. సాటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా అందరినీ సమానంగా చూసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. హాజరు రిజిస్టర్‌తోపాటుగా ఎక్కడా కులం, మతం ప్రస్తావించడం ఇష్టం లేని వారికి, అలా ప్రస్తావించకుండా ఉండే వెసులుబాటు ఇవ్వాలి. ప్రస్తుతం కొన్ని చోట్ల అడ్మిషన్ సమయంలో అది తప్పనిసరి అంటున్నారు. టీసీల కోసం వెళ్లినప్పుడు కూడా వాటిని ప్రస్తావించాల్సి వస్తోంది. అలాంటి అవసరం రాకుండా చూడాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి'' అని ఆయన బీబీసీతో అన్నారు. 'తొలి అడుగులే' ప్రభుత్వం చేస్తున్న ఈ మార్పులు తొలి అడుగులేనని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు బీబీసీతో అన్నారు. ''ఈ నిర్ణయం వెనుక రాజకీయాలు లేవు. చిన్న చిన్న మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే కుల, లింగ సమానత్వం కోసం చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. దీనిని అందరూ ఆహ్వానించాలి. ఇంకా చాలా మార్పులు అవసరం అవుతాయి. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాము. పాఠశాలల రికార్డుల నిర్వహణ విషయంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది'' అని ఆయన చెప్పారు. 'ప్రయత్నాన్ని ఆహ్వానించాలి' కులం, మతాలతో పాటుగా లింగ వివక్షకు అడ్డుకట్టవేసేలా ప్రభుత్వ ప్రయత్నం ఉందని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ విద్యార్థి తల్లి ఎం.శకుంతల బీబీసీతో తన అభిప్రాయం పంచుకున్నారు. ''చిన్నతనం నుంచే పిల్లల్లో కులాలు, మతాల గురించి ప్రస్తావన రాకుండా చూడాలి. అది భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రయత్నం ప్రారంభించిది. దీనిని అందరూ ఆహ్వానించాలి. అనేక ప్రయత్నాలు చేస్తేనే సమాజంలోని వివక్షను తొలగించగలం. అందుకు బీజం పడినట్టుగా భావిద్దాం. విమర్శలు, సందేహాలున్నప్పటికీ ఆచరణలో దీన్ని సాధ్యం చేసి చూపిస్తే ప్రభుత్వం ఎంతో మేలుచేసినట్టవుతుంది'' అని ఆమె అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లోని అటెండెన్స్ రిజిస్టర్లలో విద్యార్థుల కులం, మతం కాలమ్‌లు ఉండకూడదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. text: అమెరికా రచయిత మెగన్ అబోట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మియా ఖలీఫా.. పోర్న్ తయారు చేసే కంపెనీలపై ఆరోపణలు చేశారు. ఆ కంపెనీలు అమాయక యువతులను వల్లో వేసుకుంటూ ఉంటాయని అన్నారు. ఇప్పటివరకూ తన గతాన్ని స్వీకరించలేకపోతున్నానని మియా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. 26 ఏళ్ల మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీలో మూడు నెలలే పనిచేశారు. 2014 అక్టోబర్‌లో పోర్న్ ప్రపంచంలోకి వచ్చిన ఆమె 2015 ప్రారంభంలో దాన్ని వదిలేశారు. పోర్న్ ప్రపంచం నుంచి బయటికొచ్చే సమయానికే ఆమె పోర్న్‌హబ్ అనే వెబ్‌సైట్‌లో ఒక ప్రముఖ స్టార్ అయిపోయారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 "పోర్న్ ఇండస్ట్రీలో నేను కోట్లు సంపాదిస్తున్నానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఆ పనిలో 12 వేల డాలర్లు (రూ.8.6 లక్షలు) మాత్రమే సంపాదించాను. ఆ తర్వాత నేను దాని నుంచి ఒక్క పైసా కూడా చూళ్లేదు. పోర్న్ రంగాన్ని వదిలేశాక ఏదైనా మామూలు ఉద్యోగం వెతుక్కుందామని వెళ్తే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి...పోర్న్ భయపెట్టింది" అని మియా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. మియా తన గతం గురించి మాట్లాడకుండా తరచూ తప్పించుకునేవారు. కానీ ఇప్పుడు కెరియర్‌నే ప్రశ్నార్థకంగా మార్చిన తన గతంలోని ప్రతి కోణాన్నీ వెలుగులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. ఒకవేళ ఆ బిజినెస్ నా పేరు వల్లే నడుస్తూ ఉంటే, దానిని నాకు వ్యతిరేకంగా ఎవరూ ఉపయోగించకూడదు" అన్నారు. నెలల్లోనే టాప్ స్టార్ మియా ఖలీఫా అత్యధికంగా చూస్తున్న పోర్న్ స్టార్ అయ్యారు. కానీ ఆ పని వల్ల తనకెంత పేరొచ్చిందో దానికి సమానంగా తనకు డబ్బులు చెల్లించలేదని ఆమె చెబుతున్నారు. ఇప్పుడు మియా ఖలీఫా పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా నడుస్తోంది. మియా దానికి యజమాని కాదని, ఈ వెబ్‌సైట్ వల్ల ఆమెకు ఎలాంటి లాభాలు లేవని అందులో రాసి ఉంది. "ఇన్నేళ్లూ నేను ఒకటే అనుకున్నా, ఆ వెబ్‌సైట్‌లో ఎలాగోలా నా పేరు లేకుండా చేయాలి" అని ఆమె అన్నారు. మియా ఖలీఫా లెబనాన్‌లో పుట్టారు. ఆమె తన కెరియర్ గురించి మాట్లాడుతూ "పోర్న్ ప్రపంచం నుంచి బయటికొచ్చిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడం చాలా కష్టమైంది" అని చాలా ఓపెన్‌గా చెప్పారు. "నేను గతంలో చేసిన పనుల వల్ల కంపెనీలు నాకు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పినపుడు నాకు చాలా బాధగా అనిపించింది. కానీ, నన్ను పెళ్లాడబోయే వ్యక్తి చాలా మంచివాడు. నా కాబోయే భర్త లాంటి వ్యక్తిని నేనెప్పటికీ వెతకలేనేమో అనిపిస్తోంది" అన్నారు. మియా ఖలీఫాకు ఈ ఏడాది ప్రారంభంలో రాబర్డ్ సాండ్‌బర్గ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఐసిస్ నుంచి బెదిరింపులు పోర్న్ ప్రపంచంలో మియా కొంతకాలమే ఉన్నా, వివాదాల నుంచి మాత్రం ఆమె తప్పించుకోలేకపోయారు. బురఖా వేసుకుని షూట్ చేసిన ఒక పోర్న్ వీడియో వల్ల ఆమె ఒక పెద్ద వివాదానికి కారణం అయ్యారు. ఈ వీడియో బయటికొచ్చిన తర్వాత ఐసిస్ మియా ఖలీఫాను చంపేస్తామని బెదిరించింది. "ఆ వీడియో పోస్ట్ కాగానే, హంగామా మొదలైంది. నన్ను చంపేస్తామని ఐసిస్ బెదిరించింది. వాళ్లు గూగుల్ మ్యాప్ ద్వారా తీసిన నా ఇంటి ఫొటోలను నాకు పంపించారు" అన్నారు మియా. "అప్పుడు నేనెంత భయపడిపోయానంటే, రెండు వారాల వరకూ హోటల్ నుంచి కదల్లేదు" మియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమెకు తరచూ రకరకాల బెదిరింపులు వస్తూనే ఉంటాయి. "చిన్న చిన్న బెదిరింపులకు నేనిప్పుడు భయపడ్డం లేదు. జనాలు ఏమన్నా అవమానంగా భావించను. నేను వీళ్లు ఐసిస్ వాళ్లా? వీళ్లు నన్ను చంపేస్తారా? లేదుగా?.. సరేలే అనుకుంటా" అని చెప్పారు. మియా ఖలీఫా తన మొదటి పోర్న్ వీడియోను 2014 అక్టోబర్‌లో రూపొందించారు. ఆ విషయం గురించి జనాలకు తెలియకూడదని మియా అనుకున్నారు. తను చేస్తున్న వాటిని సీక్రెట్‌గా ఉంచాలనుకున్నారు. కానీ డిసెంబర్‌ నాటికే ఆమె పోర్న్‌హబ్‌లో నంబర్ వన్ పోర్న్‌స్టార్ అయిపోయారు. అరాచకంగా మారుతున్న 'స్పై కెమెరా పోర్న్‌' - వీడియో చూడండి. వీడియో: అరాచకంగా మారుతున్న 'స్పై కెమెరా పోర్న్‌' ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన కెరియర్ గురించి మొదటిసారి బహిరంగంగా మాట్లాడారు. text: ఈ మహిళా కార్యకర్తలు ఒక స్వచ్ఛంద సంస్థ తరపున ఖుంటి జిల్లాలో మానవ అక్రమరవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. ''వీధి నాటకం ప్రదర్శించిన అనంతరం స్థానిక పాఠశాలకు వెళుతుండగా, కొంత మంది వ్యక్తులు వాళ్లను చుట్టుముట్టారు. ఆ తర్వాత వాళ్లను తుపాకులతో బెదిరించి, అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు'' అని సీనియర్ పోలీసు అధికారి ఏవీ హోమ్‌కర్ బీబీసీకి తెలిపారు. ఈ కేసు విచారణ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు పోలీసుల రక్షణలో ఉన్నారు. తమ ప్రాంతంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించడం ఇష్టం లేని ఒక బృందంలోని వ్యక్తులే ఈ అత్యాచారానికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానిత బృందానికి జిల్లాలోని గిరిజనుల మద్దతు ఉంది. తమ ప్రాంతంలోకి బయటి వారెవ్వరూ ప్రవేశించవద్దని హెచ్చరిస్తూ ఇటీవల అక్కడ పోస్టర్‌లు కూడా వెలిశాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఝార్ఖండ్‌లో మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న ఐదుగురు కార్యకర్తలను అపహరించిన కొందరు వ్యక్తులు, వారిపై అత్యాచారం చేశారు. text: రీతూ కరిధల్(ఎడమ), ఎం.వనిత ఈ శాటిలైట్‌ను జులై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఇస్రో ఇంతకు ముందు 2008 అక్టోబర్‌లో చంద్రయాన్-1 ఉపగ్రహం చంద్రుడిపైకి పంపించింది. ఇప్పుడు చంద్రయాన్-2 మిషన్‌కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇది మహిళల నేతృత్వంలో జరుగుతున్న మొట్టమొదటి గ్రహాంతర మిషన్‌గా నిలిచింది. రీతూ కరిధల్ దీనికి మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రయాన్-2 గురించి ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ "మాకు మహిళలు, పురుషులు అనే తేడా లేదు. ఇస్రోలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు" అన్నారు. ఇస్రోలో ఒక పెద్ద మిషన్‌లో మహిళలు కీలకం కావడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు మార్స్ మిషన్‌లో కూడా 8 మంది మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈసారీ చంద్రయాన్-2 మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న రీతూ కరిధల్, ఎం.వనిత ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్ రీతూ-రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్‌ను 'రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో ఆమె డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన కరిధల్, లక్నో విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. రీతూ 2007లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి 'ఇస్రో యంగ్ సైంటిస్ట్' అవార్డ్ కూడా అందుకున్నారు. రీతూ కరిధల్‌కు చిన్నతనం నుంచీ సైన్స్‌ అంటే ఆసక్తి ఉండేది. మార్స్ ఆర్బిటర్ మిషన్ తర్వాత బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె "నేను చంద్రుడి ఆకారం తగ్గడం, పెరగడం చూసి కంగారు పడేదాన్ని. అంతరిక్షలో చీకట్లు దాటి అవతల ఉన్న విశ్వం గురించి తెలుసుకోవాలని అనుకునేదాన్ని" అని చెప్పారు. రీతూకు నచ్చిన సబ్జెక్ట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్. ఆమె నాసా, ఇస్రో ప్రాజెక్టుల గురించి వార్తాపత్రిక కటింగ్స్ సేకరించేవారు. స్పేస్ సైన్స్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించీ తెలుసుకోవాలని ప్రయత్నేంచేవారు. సైన్స్, అంతరిక్షం అంటే ఉన్న ఆసక్తే రీతూను ఇస్రో వరకూ తీసుకొచ్చింది. "పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక నేను ఇస్రోలో ఉద్యోగం కోసం అప్లై చేశాను, స్పేస్ సైంటిస్ట్ అయ్యాను" అని ఆమె చెప్పారు. ఆమె దాదాపు 20-21 ఏళ్లలో ఇస్రోలో చాలా ప్రాజెక్టులపై పనిచేశారు. వీటిలో 'మార్స్ ఆర్బిటర్ మిషన్' చాలా ముఖ్యమైనది. 'మార్స్ మిషన్' మహిళలు కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఎవరూ తమ లక్ష్యాన్ని సాధించలేరని రీతూ కరిఘల్ చెబుతారు. ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. తల్లి అయిన తర్వాత ఇంట్లో ఉంటూ కూడా ఆఫీస్ పని చేసేదాన్నని, అప్పుడు పిల్లల్ని చూసుకోవడంలో తన భర్త సాయం చేసేవారని రీతూ చెప్పారు. "కుటుంబ సభ్యులు మీ ఆసక్తి, కష్టం చూసినప్పుడు వారికి కూడా మీకు అండగా నిలవాలని అనిపిస్తుంది" అన్నారు. "నా కొడుకు 11 ఏళ్లు, పాపకు ఐదేళ్ల వయసులో మేం సమయం ఆదా చేయడానికి మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లం. ఆఫీస్‌లో బాగా అలసిపోయినా, ఇంటికి వచ్చి పిల్లలను చూడగానే నా అలసట అంతా పోయేది, చాలా బాగా అనిపించేది" అన్నారు. "పురుషులు అంగారక గ్రహం నుంచి వస్తారని, మహిళలు శుక్రుడి నుంచి వస్తారని చెబుతారు. కానీ మార్స్ మిషన్‌ విజయవంతం అయ్యాక చాలా మంది మహిళా శాస్త్రవేత్తలను 'మార్స్ మహిళలు' అనడం మొదలుపెట్టారు. నేను భూమిపై అద్భుత అవకాశం అందుకున్న ఒక భారత మహిళను" అన్నారు. స్టార్ ప్లస్‌లో టెడ్ టాక్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడిన రీతూ కరిధల్ "నాకు మా అమ్మనాన్నలు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఈరోజు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల్లో చూస్తున్నారు. కానీ అమ్మాయిలు నగరాల్లో ఉన్నా, పట్టణాల వారైనా తల్లిదండ్రులు వారికి సరైన సహకారం అందిస్తేనే వారు చాలా ముందుకు వెళ్లగలరు" అని చెప్పారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.వనిత ఎం.వనిత చంద్రయాన్-2లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె డిజైన్ ఇంజనీర్ శిక్షణ తీసుకున్నారు. 'ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా' నుంచి 2006లో బెస్ట్ వుమన్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు. వనిత చాలా ఏళ్ల నుంచీ ఉపగ్రహాల కోసం పనిచేస్తున్నారు. దీనిపై మాట్లాడిన సైన్స్ నిపుణులు పల్లవ్ బాగ్లా "మిషన్ ఏదైనా దాని పూర్తి బాధ్యతలు ప్రాజెక్ట్ డైరెక్టర్‌పైనే ఉంటాయి. ఒక మిషన్‌కు ఒకే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. అయితే కొన్ని మిషన్‌లలో ఆర్బిట్ డైరెక్టర్, శాటిలైట్ లేదా రాకెట్ డైరెక్టర్‌ అంటూ ఒకరికంటే ఎక్కువ మంది మిషన్ డైరెక్టర్లు ఉండవచ్చు. రీతూ కరిధల్ ఇందులో ఏ మిషన్ డైరెక్టర్ అనేది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు" అన్నారు. చంద్రయాన్-2 మిషన్ విజయవంతం అయ్యేలా వనిత ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని కోణాలూ చూసుకోవాల్సి ఉంటుంది. ఆమెకు పైన ఒక ప్రోగ్రాం డైరెక్టర్ ఉంటారు. చంద్రయాన్-2 అంటే.. చంద్రయాన్-2 చాలా ప్రత్యేకమైన ఉపగ్రహం. ఇందులో ఒక ఆర్బిటర్, 'విక్రమ్' అనే లాడర్, 'ప్రజ్ఞాన్' అనే రోవర్ ఉంటాయి. దీని ద్వారా భారత్ చంద్రుడి ఉపరితలంపై మొదటిసారి 'సాఫ్ట్ ల్యాండింగ్' చేయబోతోంది. ఇది చాలా క్లిష్టమైనది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 600 కోట్ల రూపాయలకు పైనే అని చెబుతున్నారు. 3.8 టన్నుల చంద్రయాన్-2ను జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. భారత్ తన ఉపగ్రహం ముద్రను చంద్రుడిపై వేయడానికి ఇది చాలా కీలకమైన మిషన్. ఈ మిషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఇస్రో చెబుతోంది. ఇంతకు ముందు జరిగిన చంద్రయాన్-1 మిషన్ రెండేళ్లు జరగాలి. కానీ అందులో లోపాలు తలెత్తడంతో అది ఏడాదిలోనే ముగిసింది. దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామని, చంద్రయాన్-2లో ఆ లోపాలు సరిదిద్దామని ఇస్రో చెబుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరోసారి చంద్రుడి మీదకు ఉపగ్రహాన్ని పంపించబోతోంది. text: వైరస్‌ నుంచి బైటపడినవారు చాలామంది ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వచ్చారు కోవిడ్‌ లేదా ఇతర వైరస్‌ల బారినపడ్డ వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసుకుంటుంది. ఇవి శరీరంలో ప్రవేశించిన వైరస్‌తో పోరాడతాయి. ఉత్పత్తి అయిన యాంటీబాడీలు రక్తంలోని ప్లాస్మాలో చేరతాయి. కోవిడ్‌-19తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి ప్లాస్మా చికిత్స అందించేందుకు చాలా ప్రపంచ దేశాల మాదిరిగానే భారత వైద్యాధికారులు కూడా అనుమతి ఇచ్చారు. ఈ చికిత్సకు పేషెంట్‌, అతని కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. అయితే ఈ థెరపీ ఎంత వరకు పని చేస్తుందన్న దానిపై డాక్టర్లు, పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీన్ని మితిమీరి వాడొద్దని ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇటీవలే హెచ్చరించింది. మరణాలను తగ్గించడంలో, తీవ్ర అస్వస్థత నుంచి బయటపడేయడంలో ఈ చికిత్స ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఐసీఎంఆర్‌ తన పరిశోధనలో గుర్తించింది. ప్లాస్మా థెరపీని భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అనుమతించింది. ఎందుకు నిషేధించ లేదు? దాదాపు ఇలాంటి ఫలితాలే ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించాయి. అయితే ఐసీఎంఆర్‌ ఈ విధానాన్ని నిషేధించలేదు. “దీనర్థం ఈ విధానాన్ని మనం నిలిపేయలేము అని’’ అని మేదాంత హాస్పిటల్‌ అధిపతి డాక్టర్‌ నరేశ్‌ త్రేహాన్‌ బీబీసీతో అన్నారు. తొలినాళ్లలో ఈ విధానాన్ని అమలు చేసిన ఆసుపత్రుల్లో మేదాంత ఒకటి. “మాకు చాలా సానుకూల ఫలితాలొచ్చాయి’’ అన్నారు డాక్టర్‌ త్రేహాన్‌. అయితే ఈ చికిత్సలో టైమింగ్‌ అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు డాక్టర్‌ త్రేహాన్‌. “జీవకణాల విధ్వంసం (సైటోకీన్‌ స్ట్రామ్‌) రెండు లేదా మూడో దశలో ఉన్నప్పుడు ఈ థెరపీ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆఖరి దశలో దీన్ని చేపట్టడం వల్ల ఉపయోగం ఉండదు’’ అని అన్నారాయన. అందుకే ప్లాస్మా థెరపీపై ఓ నిర్ణయానికి రాలేదని త్రేహాన్‌ అభిప్రాయపడ్డారు. ముంబయిలోని జస్‌లోక్‌ ఆసుపత్రిలో అంటువ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఓమ్‌ శ్రీవాస్తవ కూడా దీన్ని అంగీకరించారు. ఐసీఎంఆర్‌ పరిశోధనలో ఆయన పని చేస్తున్న ఆసుపత్రి కూడా పాలు పంచుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు దీనిపై సానుకూల ఫలితాలను ఇవ్వకపోయినా, తొందరపడి ప్లాస్మా థెరపీని నిషేధించాల్సిన అవసరం లేదని శ్రీవాస్తవ అన్నారు. “నా పరిశీలన ప్రకారం వైరస్‌ సోకిన బాధితుల పరిస్థితి విషమంగా మారకుండా ఈ థెరపీ చాలావరకు కాపాడింది’’ అన్నారు శ్రీవాస్తవ. అయితే ఆయన కూడా ఈ విధానాన్ని అనుసరించడంలో టైమింగ్‌ చాలా ముఖ్యం అన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి, ఐసీయూ, వెంటిలేటర్‌ల మీదున్న పేషెంట్లకు ప్లాస్మా ఇవ్వడం ఎంత వరకు ప్రయోజనం అనే అంశాన్ని ఐసీఎంఆర్‌ ట్రయల్స్‌ పరిశీలించాయి. అయితే ఏ బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది అన్నది తేల్చడంలో తాను భిన్నమైన మార్గాలను అనుసరించానని శ్రీవాస్తవ చెప్పారు. ప్లాస్మా ఇవ్వకుండా రోగి పరిస్థితి విషమించే వరకు తాను ఎదురు చూడలేదని ఆయన అన్నారు. ప్లాస్మాలో యాంటీబాడీలుంటాయి. న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు ఏం చేస్తాయి? అయితే కోవిడ్‌ ఆరంభంలో ఐసీఎంఆర్‌తోపాటు మరే పరిశోధనా కూడా న్యూట్రలైజింగ్‌ యాండిబాడీలపై దృష్టి సారించలేదని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు కోవిడ్‌ వైరస్‌ను అంటి పెట్టుకుని, ఇతర కణాలకు పాకకుండా ఆ వైరస్‌ను అడ్డుకుంటూ ఉంటాయి. కానీ వైరస్‌ నుంచి కోలుకున్న వారందరిలో ఈ న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు ఒకే తీరుగా లేవని పరిశీలనలో తేలింది. ఈ న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీల పని తీరు విశ్వసించదగినట్లుగానే ఉందని ప్లాస్మాలను స్టడీ చేసిన సైంటిస్టులు వెల్లడించారు. యాంటీబాడీల సమర్థత ఒక్కో పేషెంట్లో ఒక్కోరకంగా ఉన్నట్లు ప్లాస్మా థెరపీ ట్రయల్స్‌లో తేలిందన్నారు డాక్టర్‌ అర్చితా మిశ్రా. ఆమె సింగపూర్‌లోని ఓ ఇమ్యూనాలజీ నెట్‌వర్క్‌లో పరిశోధకురాలిగా పని చేస్తున్నారు. ఈ పరీక్షలు చాలా ఖరీదైనవని, సమయం కూడా ఎక్కువగానే పడుతుందని డాక్టర్‌ అర్చిత చెప్పారు. అయితే ఈ పరీక్షల ఫలితాల్లో వచ్చిన తేడాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారామె. వైరస్‌ బాధితుడి వయసు కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందంటారామె. కరోనా నుంచి బయటపడిన బాధితుల్లో అత్యధిక యాంటీ బాడీలున్నవారిని గుర్తించడంలో వయసు, లింగం, వ్యాధి తీవ్రత కీలకపాత్ర పోషిస్తాయని జాన్స్ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్ జరిపిన అధ్యయనం తేల్చింది. ప్లాస్మా థెరపీ ప్రయోజనంపై ప్రపంచవ్యాప్తంగా నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు భారత్‌ చేసిన ట్రయల్స్‌లో ఏం తేలింది ? రక్తంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడం, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు గడపాల్సిన పరిస్థితిని నివారించడంలో ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందని ఇటీవల భారత్‌లో జరిగిన ఓ ట్రయల్‌లో తేలింది. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వైద్యులు, సైంటిస్టులు ప్లాస్మా థెరపీతో అంతగా ప్రయోజనం లేదనే వాదిస్తున్నారు. ప్లాస్మా చికిత్స చేసిన వారికి, చేయని వారికి పెద్ద తేడా లేదని, మరణాలు సైతం తగ్గలేదని న్యూ ఇంగ్లండ్‌ స్కూల్ ఆఫ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పేర్కొంది. మిగతా అనేక పరిశోధనలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. వందలమంది కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స చేసిన డాక్టర్‌ ఫతాహుద్దీన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. “మొదట్లో చాలామంది దీనిపై ఆసక్తి చూపించారు. ఎందుకంటే చాలామందికి వైరస్‌, దాని ట్రీట్‌మెంట్‌ గురించి పెద్దగా తెలియదు. ఇందులో రిస్కు చాలా తక్కువ ఉండటంతో చాలామంది ఆశలు పెట్టుకున్నారు’’ అన్నారు ఫతాహుద్దీన్‌. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, దానితో పెద్దగా ప్రయోజనంలేదని ఆయన అన్నారు. దిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీని అంగీకరించగా, మితిమీరి వాడొద్దని ఐసీఎంఆర్‌ సూచించింది తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో పల్మనరీ మెడిసిన్‌ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్‌ క్రిస్టోఫర్‌ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్లాస్మా థెరపీ పని చేస్తుందనడానికి తనకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని అన్నారు. ఇన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టే వివిధ దేశాలు ప్లాస్మా థెరపీని పెద్దగా నమ్ముకోవడంలేదని అర్థమవుతోంది. అమెరికాలో కూడా ప్రయోగాత్మకంగానే ఈ థెరపీని కొనసాగించాలని చెప్పారు తప్ప అదే ప్రధాన చికిత్సగా ఎక్కడా పేర్కొనలేదు. ఏ విధంగా చూసినా, ప్లాస్మా థెరపీ ప్రయోజనకరమని అనిపించడంలేదని, అయితే ఇందులో కొన్ని పరిశీలనాంశాలు ఉన్నాయని, అందువల్లే దాన్ని ఇప్పటికిప్పుడు నిషేధించే పరిస్థితి లేదని ఎపిడెమాలజిస్ట్‌ డాక్టర్‌ చంద్రకాంత్‌ లహారియా వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకపోయినా ఈ చికిత్సను అందుకే కొనసాగిస్తున్నారని చంద్రకాంత్‌ అన్నారు. డాక్టర్‌ అర్చితా మిశ్రా కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవించారు. దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవు కాబట్టి ప్రయోజనం ఉంటుందేమోనని ఓ ఆశ అన్నారు డాక్టర్‌ మిశ్రా. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో చాలామంది డాక్టర్లు ప్లాస్మా థెరపీతో ప్రయోజనంలేదని చెబుతున్నా, ఆ చికిత్స కావాలంటూ సోషల్‌ మీడియాలో చాలామంది అభ్యర్థన చేస్తూనే ఉన్నారు. text: "నా ప్రియమైన బాలు, సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది..!! సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి..!! రాగాలన్నీ మూగబోయాయి. నువ్వు లేని లోటు తీర్చలేనిది. సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి. రాగాలన్నీ మూగబోయాయి. నువ్వు లేని లోటు తీర్చలేనిది" అంటూ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు నివాళి తెలిపారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 'ఎస్పీ బాలు గారూ మీరు ఎన్నో ఏళ్లుగా నాకు గొంతునిచ్చారు. మీ మాట, మీ పాట ఎప్పటికీ నాతోనే ఉంటాయని ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు చిరంజీవి బాలు మృతిపై స్పందిస్తూ ట్విటర్లో లేఖ రాశారు. "బాలు లేని లోటు తీర్చాలంటే బాలుయే పునర్జన్మించాలి. నేను అన్నయ్య అని పిలిచే బాలు నాకు ఆత్మ బంధువు'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రముఖ గాయని ఉష ఉతుప్ బీబీసీతో మాట్లాడుతూ, "‘నాకు కన్నీళ్లు ఆగడం లేదు. బాలు గారు ఇకలేరని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆయనతో నాకు చాలా మంచి అనుభవాలున్నాయి. స్టూడియో లోపల, బయట, కచేరీల్లో ఆయనతో చాలాసార్లు కలిసి పనిచేశాను. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి. నాకు కరోనావైరస్‌పై కోపం వస్తోంది. గొప్ప వ్యక్తులను అది తీసుకుపోతోంది. ఆయనను గుర్తుంచుకునేందుకు వేల పాటలున్నాయి. కానీ, మైఖెల్ మదన కామరాజు సినిమాలోని రం బం బం పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నేను దాన్ని చాలాసార్లు పాడాను’’ అని అన్నారు. "నేను కుప్ప కూలిపోయాను. నిన్నటి నుంచి నిద్రపోలేకపోయాను. ఏదో మాయ జరుగుతుందనుకున్నాను. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోవడానికి నాకు సమయం పడుతుంది. నాకు ఆయన వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా చాలా సన్నిహితులు" అని దేవి శ్రీ ప్రసాద్ బీబీసీ న్యూస్ తో అన్నారు. అన్నమయ్య చిత్రంలో బాలు పాడిన పాటలను ఎప్పటికీ మరిచిపోలేనని, ఆయన జ్ఞాపకాలు కన్నీటి వరదలా గుర్తుకు వస్తున్నాయని నటుడు నాగార్జున ట్వీట్ చేశారు. "బాలు మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది" అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సాటి ఎవరూ లేరు. ఆయన స్మృతులు ఎప్పటికీ ప్రజల్లో నిలిచే ఉంటాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని నటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశారు. 'బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఇలాంటి అద్భుతం ప్రపంచంలో మరెక్కడా జరగలేదు' అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. 'నా ఛిద్రమైన జీవితంలో వెలుగు నింపిన ఆత్మబంధువు బాలుగారు. ఆయన భౌతికంగా లేరంతే' అని గాయని సునీత ఉపద్రష్ట తన ఫేస్‌బుక్‌లో నివాళి సమర్పించారు. "బాలసుబ్రహ్మణ్యం అంకుల్! మీ ఆత్మకు దివ్య శాంతి, ఆనందం లభించాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నా హృదయంలో కొంత భాగాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి మాకు చాలా సమయం పడుతుంది. మీ ప్రజ్ఞకు, వ్యక్తిత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజు చాలా విచారకరమైనది" అంటూ నటి మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. "ఈ రోజు గుండెలు పగిలిపోయేలాంటి విచారకరమైన రోజు" అంటూ నటి రాధికా శరత్ కుమార్ అన్నారు. బాలు జీవితాన్నిఅందంగా జీవించి సంగీత సేవలను సమాజానికి అందించారని, ఆయన గొంతు ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాధిక ట్వీట్ చేశారు. బాల సుబ్రహ్మణ్యం మరణ వార్త వినడానికి చాలా విచారంగా ఉంది. ఆయన కోలుకుంటారనే అనుకున్నామని గాయని శ్రేయ ఘోషల్ ట్వీట్ చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్విటర్ లో 60 వేలకు పైగా ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా అంతా బాలు సంతాప సందేశాలతో నిండిపోయింది. 'ఎస్‌పీ బాలు మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది' ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రముఖ గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. text: అయితే, 4 నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్‌తో వినడం ప్రమాదం. ఇది మీకు తెలుసా? ఇది కొనసాగితే, వినికిడి సమస్యలకు దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ్చే ప్రమాదముంది. ఇయర్ ఫోన్సుతో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం ప్రమాదకరం హెయిర్ డ్రయర్‌ను కూడా 15 నిమిషాలకు మించి వాడకూడదు. 60 సెం.మీ. దూరంలో ఉన్న అలారం చేసే శబ్దం 60 డెసిబుల్స్. దాన్నే మంచానికి దగ్గరగా ఉంచకూడదంటారు. ఇక హెయిర్ డ్రయ్యర్ సంగతి సరేసరి. చెవుడు రావడానికి ప్రధాన కారణం వయసు పెరగడమైతే, పెద్ద శబ్దాలు దగ్గరగా వినడం రెండో కారణం అని భారత్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది. పెద్ద శబ్దాల వల్ల కలిగే చెవుడుకి ఎలాంటి చికిత్స, పరిష్కారం లేదు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేం. ఇక దానికి చికిత్స ఉండదు. ఇక అప్పుడు హియరింగ్ ఎయిడ్ వాడాల్సిందే. లేదంటే జీవితాంతం చెవుడుతో బాధపడాల్సిందే. అందుకే 60 డెసిబుల్స్ పైబడిన స్థాయి శబ్దాలను దగ్గరగా వినడం హానికరమనే విషయాన్ని గుర్తించాలి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మీకు సంగీతం ఇష్టమా? మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా? text: ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాలలో కూలీ చేసుకుంటే త‌ప్ప కుటుంబం గ‌డ‌వ‌ని వారికి రోడ్లు ఎలా ఉప‌యోగ‌ప‌డ్డాయి? అని ప‌రిశీలించ‌డానికి ఉత్త‌రాంధ్ర ప‌ల్లెల్లో ప‌ర్య‌టించింది బీబీసీ తెలుగు బృందం. గ్రామీణ కూలీల‌పై రోడ్లు చూపించిన ప్ర‌త్య‌క్ష ప్ర‌భావంతో వారి అవ‌కాశాల‌ పరిధి విశాలమైంది. తారు రోడ్లు వ‌చ్చాక గ్రామీణ ప్రాంతాల్లో ర‌వాణా సౌక‌ర్యం పెరిగింది. ఆర్టీసీ బ‌స్సులు, ప్రైవేటు బ‌స్సులు, వ్యానులు, జీపులు.. ఇప్పుడు వాటన్నిటినీ త‌ల‌ద‌న్నేలా పెద్ద ఆటోలు! ఇవ‌న్నీ ఒక కూలీని తాను వెళ్లాలనుకున్న చోటుకు చేరుస్తున్నాయి. సొంతూరిలో పని దొరకనప్పుడు, పక్క గ్రామాలకు, పట్టణాలకు న‌డిచో, సైకిళ్ల మీదో వెళ్లి కూలీ చేసుకుని సాయంత్రానికి ఉసూరుమంటూ కాళ్లీడ్చుకుని రావ‌ల్సిన క‌ష్టాన్ని త‌ప్పించాయి. ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితాలు ఎలా మారాయంటే... ఎక్క‌డ నాలుగు రూపాయలు ఎక్కువ వస్తే అక్క‌డికే ఊళ్లో ప‌ని ఉన్నా లేక‌పోయినా ఎక్క‌డ నాలుగు రూపాయలు ఎక్కువ వ‌స్తాయో అక్క‌డ‌కు వెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పించాయి ఈ రహదారులు. అంతకు ముందు ఊళ్లో వాళ్లు ఇచ్చినంతే తీసుకోవాల్సి వచ్చేది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని పిరిడి గ్రామం కూలీల‌కు పెద్ద అడ్డా. ఆ గ్రామంలో దాదాపు 2 వేల మంది కూలీలు ఉన్నారు. ఈ సందర్భంగా హ‌డావుడిగా ఆటోలో కూర్చున్న సింహాచ‌లం అనే మ‌హిళ‌ బీబీసీతో మాట్లాడుతూ.. "అప్ప‌ట్లో న‌డిచే వెళ్లే వాళ్లం. అప్పుడ‌ప్పుడు రిక్షాలు ఎక్కే వాళ్లం. కాస్త ఆలస్యం అయినా వెన‌క్కి రావాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఆటోలు, బ‌స్సులు వ‌చ్చాక ఆ సమస్య లేదు" అని చెప్పారు. ఆటోలు రావడంతో ఎంత దూరమైనా పనులకు వెళ్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. "బ‌స్సు అయితే బ‌స్సు, ఆటో అయితే ఆటో ఏదో ఒక‌టి. తొంద‌ర‌గా వెళ్లాలి. పొద్దున్నే ఏడున్న‌ర‌క‌ల్లా అక్క‌డుండాలి. లేక‌పోతే క్యారేజీ (భోజ‌నం డబ్బా) ప‌ట్టుకుని వెన‌క్కు వ‌చ్చేయాల్సిందే. ఎందుకంటే ఆలస్యమైతే సేట్లు (సేటు = య‌జ‌మాని) ఊరుకోరు క‌దా. పనిలేదు పోరా! టైం దాటిపోయాక వ‌చ్చి ప‌నేంటి? అంటారు. ఊళ్లోనేమో ప‌నిదొర‌క‌దు. నీళ్లు లేవు. ఉపాధి మ‌ట్టి ప‌నికి (ఉపాధి హామీ ప‌థ‌కం) వెళ్తే కూలీ స‌రిగా రాదు. స‌రిపోదు. సిమెంట్ ప‌నికి వెళితే 350 రూపాయల దాకా వస్తాయి. బియ్యం, కూర‌గాయలు కొనుక్కోవ‌చ్చు. బొబ్బిలి వెళ్తే సాయంత్రానికి కూలి డ‌బ్బులు ఇచ్చేస్తారు. అప్పట్లో రోడ్లు బాలేవు. అన్నీ గోతులు ఉండేవి. ఇప్పుడు బావున్నాయి. ప‌నులు దొరుకుతున్నాయి. కూలీ పెరిగింది" అని రాము అనే మరో కూలీ వివ‌రించారు. త‌న చిన్న‌త‌నంలో పేదరికంతో త‌ల్లితండ్రులు చ‌దివించ‌లేక‌పోయార‌ని, ఇప్పుడు బ‌య‌ట కూలీకి వెళ్తే పిల్ల‌ల్ని ప్రైవేటు స్కూలుకు పంప‌క‌పోయినా, గ‌వర్న‌మెంటు స్కూల్లో చ‌దివించ‌గ‌లుగుతున్నామనీ ఆయ‌న చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో ఇన్ని వాహనాలు, బ‌స్సులు లేన‌ప్పుడు సైకిల్ పై వెళ్లడం లేదంటే కాలిన నడకన వెళ్లాల్సి వచ్చేది. అలా కొందరు 20 - 30 కిలోమీట‌ర్లు కూడా వెళ్లేవారు. రోడ్ల‌మీద గోతులు, రాళ్ల‌కు సైకిల్ రీములు విరిగిపోవ‌డం, పంక్చ‌ర్లు కావ‌డంతో నానా ఇబ్బందుల పడేవాళ్లమని గ్రామ‌స్తులు గత పరిస్థితులను గుర్తు చేశారు. రహదారులు బాగుపడటంతో గ్రామాలకు రవాణా సౌకర్యాలు పెరిగాయి. పొద్దున సైకిల్ మీద వెళ్లి, రోజంతా చెమటోడ్చి, మ‌ళ్లీ సాయంత్రం అంత‌దూరం సైకిల్ తొక్క‌ాలంటే ఆయాసం వేసేది. ఇప్పుడు రోడ్లు వ‌చ్చాక ప‌దో, ప‌దిహేనో పోయినా ప‌ర్వాలేదు. బ‌స్సో, ఆటో ఎక్కివెళ్ల‌వ‌చ్చ‌నే భావన పెరిగింది. బ‌స్సు ఉంటే స‌రి. లేదంటే ఒక్క ఫోను చేస్తే ఆటోవాలాలు వ‌చ్చి ఎక్క‌డి నుంచి కావాలంటే అక్క‌డి నుంచి తీసుకెళ్తున్నారు. సింహాచలం, కూలీల మేస్త్రీ కూలీల‌ను ప‌నుల‌కు తీసుకువెళ్లే మేస్త్రీలు కూడా వ్యాన్లు, జీపులు, ఆటోల వారితో ఒప్పందం చేసుకుని ప‌ని మ‌రింత సులువు చేసుకున్నారు. "అప్ప‌ట్లో కూలీ ప‌నికుండే అవ‌కాశాలు త‌క్కువ‌. ప‌దేళ్ల నుంచి బాగా పెరిగాయి. ముఖ్యంగా కాంట్రాక్టు ప‌నులు పెర‌గ‌డం, గ‌వ‌ర్న‌మెంటు కూడా ప‌ని ఇస్తోంది. ఊరి బ‌య‌ట‌కు ప‌నికోసం వెళ్ల‌డం ఓ ప‌దేళ్ల నుంచే మొద‌లైంది. బ‌య‌ట ఊళ్ల‌లో కాంక్రీటు ప‌నికి వెళ‌తాం. అక్క‌డి వారికి ఆ ప‌ని రాక‌పోవ‌డం లేదా కూలీలు త‌క్కువ ఉండ‌డం వ‌ల్ల మ‌మ్మ‌ల్ని పిలుస్తారు" అని వివరించారు సింహాచ‌లం అనే కూలీల మేస్త్రి. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద వేసిన రోడ్డు మ‌హిళ‌ల ప‌రిస్థితి… కూలీ చేసుకునే మ‌హిళ‌ల‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌కు తోడు వేధింపులు అద‌నం. అన్ని రంగాల్లో ఉన్న‌ట్టే ఇక్క‌డా కనిపిస్తుంది. మ‌హిళ‌లు దానిపై తిర‌గ‌బ‌డే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉండేది. మాట‌ల‌ను మౌనంగా భ‌రించాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కాస్త మారింది. "వేధింపులు ఇంత‌కు ముందు అక్క‌డ‌క్క‌డా ఉండేవి. అది అన్ని చోట్ల‌, అన్ని ప‌నుల్లో ఎప్పుడూ ఉన్న‌దే. అంద‌మైన ఆడ‌పిల్ల న‌డిచెళ్తుంటే చూడ్డం, మాటలు అన‌డం, హీనంగా మాట్లాడ్డం చాలా కాలం నుంచి ఉంది. పేద‌రికం వ‌ల్ల అలా గమ్మున ఉండాల్సి వ‌చ్చేది. అప్ప‌ట్లో కూలీ ప‌ని దొర‌క‌డ‌మే క‌ష్టం. కుటుంబం గ‌డ‌వాలి. అంతా మౌనంగా ఉండేవాళ్లు. కుటుంబ పోష‌ణ ముఖ్య‌ం అనుకునేవాళ్లు మ‌హిళ‌లు. ఇప్పుడు కొంత మార్పు వ‌చ్చింది. అంద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నారు. క‌ష్ట‌ప‌డి తింటున్నారు. ఎవ‌రూ త‌క్కువ‌గా ఉండ‌డం లేదు. పక్క ఊళ్లకు భార్యాభ‌ర్త‌లు క‌లిసి ప‌నికి వెళ్తున్నారు. ఒక‌వేళ ఎక్క‌డైనా ఇబ్బంది ఉన్నా, దాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. మితిమీరితే తిర‌గ‌బ‌డుతున్నారు" అని వివ‌రించారు సింహాచ‌లం. పనులకు వెళ్తున్న మహిళలు కూలీ రేట్ల విష‌యంలో గ్రామాల‌కూ, సమీపంలో ఉన్న పట్టణాలకు మ‌ధ్య తేడా కాస్త త‌క్కువ‌గానే ఉంది. ప‌నిని బ‌ట్టి, సీజ‌న్ బ‌ట్టి అది మారుతోంది. అయితే వ్య‌వ‌సాయం బాగా ఉన్న ఇత‌ర ప్రాంతాల‌కు వల‌స వెళ్లడం ఇక్క‌డ చాలా ఎక్కువ‌. అలాగే మ‌హిళ‌లు, పురుషుల కూలీ రేట్ల మ‌ధ్య‌ వ్య‌త్యాసం కూడా కొన‌సాగుతోంది. ఉపాధి హామీ ప‌థ‌కం రేట్లు తక్కువ ఉండ‌డం, స‌మ‌యానికి అంద‌క‌పోవ‌డంపై అసంతృప్తి కూడా గ్రామాల్లో క‌నిపిస్తోంది. మొత్తానికి రోడ్లు వ‌చ్చాక నిరంత‌రం కూలీ దొరికే అవ‌కాశం, కాస్త ఎక్కువ సంపాదించుకునే అవ‌కాశం క‌లిగింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్య‌వ‌స్థ‌కీ, ర‌వాణా సౌక‌ర్యానికీ చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంటుంది. ఊరికి ర‌వాణా సౌక‌ర్యం, ఇత‌ర‌త్రా అనుసంధానం (క‌నెక్టివిటీ) పెరిగిన త‌రువాత ఆ ప్ర‌భావం అన్ని సముదాయాల మీదా ప‌డుతుంది. text: కమలా హారిస్ భారతీయ తల్లికి, జమైకా తండ్రికి 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఆక్లండ్‌లో జన్మించారు. అయితే.. ఆమె అర్హతను సంప్రదాయవాద న్యాయ ప్రొఫెసర్ ఒకరు ప్రశ్నించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో జన్మించలేదనే బూటకపు సిద్ధాంతాన్ని కూడా ట్రంప్ అనేక ఏళ్ల పాటు ప్రచారం చేశారు. కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ మంగళవారం నాడు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి నల్లజాతి మహిళగా ఆవిర్భవించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి ఆమె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. ట్రంప్ ఏమన్నారు? ట్రంప్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కమలా హారిస్ అర్హత గురించి వినిపిస్తున్న వాదనపై కొందరు ట్రంప్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూన.. ''ఆమెకు కావలసిన అర్హతలు లేవనే మాట నేను ఈ రోజే విన్నాను. అంతేకాదు.. ఆ ముక్క రాసిన లాయర్ చాలా ఉన్నత అర్హతలు గల వ్యక్తి, చాలా టాలెంట్ ఉన్న న్యాయవాది కూడా'' అని బదులిచ్చారు. ''అది నిజమేమో నాకు తెలియదు. ఆమెను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే ముందు డెమొక్రాట్లు ఆ విషయాన్ని తనిఖీ చేసుకుని ఉంటారని నేను అనుకునుండే వాడిని'' అని కూడా వ్యాఖ్యానించారు. ''కానీ అది చాలా సీరియస్ విషయం. ఆమె ఈ దేశంలో పుట్టలేదు కనుక ఆమెకు అర్హత లేదని మీరు అంటున్నారు. వాళ్లు అంటున్నారు'' అని పేర్కొన్నారు. కమలా హారిస్ అమెరికాలో పుట్టారనే విషయంలో ఎలాంటి ప్రశ్నా లేదని.. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు చట్టబద్ధమైన శాస్వత నివాసులు కాకపోవుచ్చునని సదరు విలేకరి బదులిచ్చారు. దీనికి ముందు.. ట్రంప్ ఎన్నికల ప్రచార సలహాదారు జెన్నా ఎలిస్.. గురువారం నాడు సంప్రదాయ వాద బృందం జ్యుడీషియల్ వాచ్ అధిపతి టిమ్ ఫిటన్ చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేశారు. ''అమెరికా రాజ్యాంగంలోని 'పౌరసత్వ నిబంధన' కింద ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్‌కు అర్హుల లేదా'' అని ఆ ట్వీట్‌లో టిమ్ ప్రశ్నించారు. కాలిఫోర్నియాలోని చాప్‌మన్ యూనివర్సిటీకి చెందిన లా ప్రొఫెసర్ జాన్ ఈస్ట్‌మన్ 'న్యూస్‌వీక్' మేగజీన్‌లో రాసిన ఒక అభిప్రాయ వ్యాసాన్ని కూడా ఆయన షేర్ చేశారు. లా ప్రొఫెసర్ వాదన ఏమిటి? అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2లో.. ''సహజంగా జన్మించిన పౌరులు మినహా మరే వ్యక్తీ అధ్యక్ష పదవికి అర్హులు కారు'' అని చెప్తున్న వ్యాక్షలను ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ ఉటంకిస్తున్నారు. అలాగే ''అమెరికాలో పుట్టిన వ్యక్తులందరూ.. చట్టపరిధికి లోబడిన మేరకు.. పౌరులే'' అని చెప్తున్న 14వ రాజ్యాంగ సవరణను కూడా ఆయన ప్రస్తావించారు. కాలిఫోర్నియాలో కమలా హారిస్ పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు అమెరికా చట్టపరిధికి లోబడి ఉండకపోవచ్చునని.. అంటే ఉదాహరణకు వారు స్టూడెంట్ వీసాతో అమెరికాలో ఉండి ఉండవ్చుననే భావన మీద ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ వాదన ఆధారపడి ఉంది. ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆయన స్టీవ్ కూలీ చేతిలో ఓడిపోయారు. స్టీవ్ కూలీని సాధారణ ఎన్నికల్లో కమలా హారిస్ ఓడించారు. న్యూస్‌వీక్‌లో ప్రచురితమైన అభిప్రాయ వ్యాసం మీద తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అయితే.. ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ వ్యాసానికి.. 'జాతి వివక్ష వాదమైన పుట్టుక సిద్ధాంతా'నికి సంబంధం లేదని మేగజీన్ ఎడిటర్ ఇన్ చీఫ్ నాన్సీ కూపర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇతర రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు? కమలా హారిస్ అర్హత గురించి ప్రొఫెసర్ హారిస్ వాదన ''నిజంగా హాస్యాస్పద''మని మరో రాజ్యాంగ నిపుణుడు సీబీఎస్ న్యూస్ (అమెరికాలో బీబీసీ భాగస్వామి)తో చెప్పారు. బర్కిలీ లా స్కూల్ డీన్ ఎర్విన్ చిమెరిన్‌స్కీ ఈమెయిల్ పంపిస్తూ: ''14వ సవరణలోని సెక్షన్ 1 కింద.. అమెరికాలో పుట్టిన వారు ఎవరైనా అమెరికా పౌరులే. సుప్రీంకోర్టు 1890ల నుంచీ దీనిని బలపరుస్తోంది. కమలా హారిస్ అమెరికాలో జన్మించారు'' అని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ వాదన ''చెత్త'' అని.. ''జాతివివక్షాపూరిత పుట్టుక వాదన'' అని డోనల్డ్ ట్రంప్‌ విమర్శకుడు, హార్వర్డ్ యూనివర్సిటీలో రాజ్యాంగ చట్ట ప్రొఫెసర్ లారెన్స్ ట్రైబ్ అభివర్ణించారు. ''అసలు ఇదేమిటో మనం నిజాయితీగా చూద్దాం: ఇది.. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాని ఒక నల్లజాతి అభ్యర్థి ఉన్నపుడల్లా మనం పాడే జాతివక్ష రాగం మాత్రమే'' అని లయోలా లా స్కూల్ ప్రొఫెసర్ జెస్సికా లెవిన్సన్ వ్యాఖ్యానించారు. ఒబామా పుట్టుక సిద్ధాంతానికి ట్రంప్ ఎలా ఆజ్యం పోశారు? డోనల్డ్ ట్రంప్ 2011లో అధ్యక్షుడు ఒబామా కెన్యాలో పుట్టి ఉండవచ్చుననే మితవాద సిద్ధాంతాలకు ఆజ్యం పోయటం ప్రారంభించారు. ఒబామా తాను హవాయిలో పుట్టినట్లు చెప్తున్న తన జనన ధృవీకరణ పత్రాన్ని ఆ ఏడాది ఏప్రిల్‌లో చూపించినా కానీ.. అది ''మోసం'' అంటూ ట్రంప్ తన వాదనను కొనసాగించారు. 2016 సెప్టెంబర్‌లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఒక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ట్రంప్‌ను ఈ విషయం గురించి ప్రశ్నించారు. ఒబామా అర్హతల మీద సందేహాలను తొలగించటం తన ఘనతేనని ఆయన చెప్పుకొచ్చారు. ''దానికి నేను ముగింపునిచ్చాను. ఒబామా అమెరికాలో పుట్టారు. అది ముగిసింది'' అని వ్యాఖ్యానించారు. 2016లో తన ఎన్నికల ప్రత్యర్థి టెడ్ క్రూజ్.. అమెరికా పౌరురాలైన తల్లికి, క్యూబాలో జన్మించిన తండ్రికి కెనడాలో పుట్టారని, కాబట్టి ఆయన అధ్యక్ష పదవికి పోటీపడటానికి అనర్హుడని ట్రంప్ వాదించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్‌కు.. దేశ ఉపాధ్యక్షురాలిగా పనిచేసే 'అర్హత' లేదని తాను విన్నానని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా.. విమర్శకులు జాతివివక్షతో కూడుకున్నదని తప్పుపట్టే ఓ న్యాయ సిద్ధాంతాన్ని ఆయన ఎగదోశారు. text: లింగ మార్పిడి చికిత్సను ఇంగ్లిష్‌లో 'సెక్స్ రీఎసైన్‌మెంట్ సర్జరీ' అంటారు. సాధారణంగా ట్రాన్స్‌జెండర్లకు ఈ ఆపరేషన్ అవసరమవుతుంది. 'లైంగిక అవయవాలు', లైంగికత వేర్వేరుగా ఉన్నవారిని ట్రాన్స్‌జెండర్లు అంటారు. ఈ శస్త్రచికిత్స చేయడానికి ముందు వారికి 'జెండర్ డిస్ఫోరియా' ఉందో లేదో చూస్తారు. అంటే... వారు శరీర తత్వానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరీక్షిస్తారు. 'జెండర్ డిస్ఫోరియా'ను నిర్థరించేందుకు సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం కావాలి. జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లయితే మొదట హార్మోనల్ థెరపీ చేస్తారు. మందులు, ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి హార్మోన్లను ఎక్కిస్తారు. ఆ తరువాత సర్జరీకి సిద్ధం చేస్తారు. కనీసం 20 ఏళ్ల వయసు దాటాకే ఈ చికిత్స చేస్తారు. అంతకంటే తక్కువ వయసుంటే, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. లింగమార్పిడి ఆపరేషన్‌కు 5-6గంటల సమయం పడుతుంది. ఇందులో భాగంగా వక్షోజాలు, జననాంగం, ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. దీని కోసం ప్లాస్టిక్ సర్జన్, సైకియాట్రిస్ట్, గైనకాలజిస్ట్‌తో పాటు న్యూరాలజిస్ట్ కూడా కావాలి. ఆపరేషన్ తరువాత మళ్లీ ఏడాదిపాటు హార్మోనల్ థెరపీ చేస్తారు. ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చే చికిత్సకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కోసం రూ.10-20 లక్షలు ఖర్చవుతాయి. లింగ మార్పిడి ఎలా చేస్తారు? ఇవి కూడా చదవండి బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) లింగ మార్పిడి ఎలా జరుగుతుంది? అమ్మాయి అబ్బాయిగా లేదా అబ్బాయి అమ్మాయిగా ఎలా మారతారు?... ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి. text: తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుని కోరారు. ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వెంకయ్య నాయుడును కలిసి స్వయంగా లేఖ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకుంటున్నామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఉపరాష్ట్రపతికి లేఖ పంపారు. జాతి (దేశ) నిర్మాణంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భాజపాలో చేరినట్లు సుజనా చౌదరి చెప్పారు. అయితే, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు గతంలో బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఏమన్నారు? ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఏమన్నారో చూద్దాం. మోదీ వల్ల మెకిన్ ఇండియా కాదు.. కేవలం మైక్ ఇన్ ఇండియా మాత్రమే సాధ్యం: సుజనా చౌదరి 2018 నవంబర్‌లో సుజనా చౌదరికి చెందిన సంస్థల కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఆ దాడుల తర్వాత సుజనా చౌదరి మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం తనపై ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. "నేను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను కాబట్టే ఈ దాడులు చేయిస్తున్నారు. నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా ఈడీతో దాడులు చేయిస్తోంది" అని ఆయన అన్నారు. ఆ తర్వాత "ఏపీకి నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, బీజేపీ విధివిధానాలను ప్రభుత్వంలో కలిపేశారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీలు అలాగే చేస్తుంటాయి. ఇది చాలా దుర్మార్గం. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన మరుక్షణమే విశాఖ రైల్వో జోన్ ఆపేశారు, ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు. కడప ఉక్కు కర్మాగారం, కాకినాడ రిఫైనరీ ఇవ్వడంలేదు. ఇలా చేయడం ప్రజాస్వామ్యంలో అన్యాయం. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉండటం తగదు" అని 2018 అక్టోబర్‌లో ఎంపీ సుజనా చౌదరి అన్నారు. "మోడి నాయకత్వంలో మెకిన్ ఇండియా కాదు.. కేవలం మైక్ ఇన్ ఇండియా మాత్రమే సాధ్యం" అని విమర్శించారు. 2019 జూన్ 20: గురువారం నాడు బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి దిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ నిర్మాణం కోసమే తాను బీజేపీలో చేరానని తెలిపారు. ''తాజా ఎన్నికల ద్వారా దేశం మూడ్ ఎలా ఉందో అంతా చూశారు. దాంతో మేం కూడ దేశ నిర్మాణంలో భాగం కావాలనుకున్నాం. అది ఒక కారణం. నా వరకూ నేను మూడున్నరేళ్ల పాటు కేంద్ర సహాయ మంత్రిగా ప్రధాని నేతృత్వంలో పనిచేశాను. దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. పలు కారణాల వల్ల ఏపీ ఇబ్బంది పడింది. ఏపీ అభివృద్ధికి, విభజన చట్టంలో చేసిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ఇదే సరైన వేదిక అని మేం భావించాం. సహకారం, సమన్వయంతోనే పనిచేయాలి తప్ప పోటీ పడి, గొడవలు పడి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాం'' అని సుజనా చౌదరి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అప్పటి పార్టీలో అభిప్రాయం మేరకు పని చేశామని, ఈ రోజు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారాలని ఐటీ అధికారి చెప్పారు: సీఎం రమేష్ 2018 అక్టోబర్‌ 13న ఎంపీ సీఎం రమేష్ నివాసంలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సాదాలు జరిపారు. ఆ తర్వాత సీఎం రమేష్ మాట్లాడుతూ... ఐటీ దాడుల్లో పాల్గొన్న ఒక అధికారి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా వెళ్లాలని తమకు సూచించారని చెప్పారు. "రాజకీయ కక్షతోనే కేంద్రం తనపై ఐటీ దాడులు చేయిస్తోంది. మదన్ అనే ఐటీ అధికారి మా కార్యాలయానికి వచ్చి మీరు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు? మీరు అలా చేస్తే ఇలాంటి దాడులు ఇంకా ఎక్కువ జరుగుతాయి అని మా సిబ్బందికి చెప్పారు. నేను ఆ అధికారికి ఫోన్ చేసి మీరు సోదాలు చేసుకోండి కానీ, పార్టీలు మారాలని చెప్పే అర్హత మీకు లేదు అని అన్నాను. ఆ ఫోన్ సంభాషణను రికార్డు కూడా చేశాను. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టొద్దు, అక్కడ పెట్టుబడులు పెడితే ఇలాంటి దాడులే జరుగుతాయని భయపెట్టేందుకు కేంద్రం ఈ దాడులు చేయిస్తోంది. కేంద్ర ప్రభత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఎవరు మాట్లాడినా... వారిపై ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి ఏం చెబితే కేంద్రం అది చేస్తోంది. మేము కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. ప్రధాని మోదీని, అమిత్ షాను నిలదీశాం. ఆ తర్వాత టీడీపీ నాయకుల్ని వారు టార్గెట్ చేశారు. అయినా మేము భయపడం. దేన్నైనా ఎదుర్కొంటాం'' అని సీఎం రమేష్ అన్నారు. బీజేపీలో చేరినా కేసులు ఎదుర్కోవాల్సిందే: జీవీఎల్‌ 2018 నవంబర్‌లో సుజనా చౌదరి సంస్థల కార్యాలయాలపై ఈడీ దాడులు చేసిన తర్వాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సుజనాను విజయ్ మాల్యాతో పోల్చారు. "రూ.5,700కోట్లు మోసానికి పాల్పడి సుజనా చౌదరి ఆంధ్రా మాల్యాగా మారారు. విజయ్ మాల్యాని దేశం దాటించాల్సిన అవసరం బీజేపీకి లేదు. విజయ్ మాల్యాలాగా సుజనా చౌదరి కూడా దేశం వదిలి వెళ్లిపోతారు. సీఎం రమేష్, సుజనా లాంటి వారిని వెంట పెట్టుకొని తిరుగుతుంటే చంద్రబాబు మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ఆలీబాబా నలభై దొంగలు తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు" అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తాజాగా నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిక నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకే వారు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ త్వరలోనే కనుమరుగవడం ఖాయం. బీజేపీలో చేరే వారికి కేసుల నుంచి రక్షణ లభించదు. ఎవరి కేసులు వారే వ్యక్తిగతంగా ఎదుర్కోక తప్పదన్నారు" అని జీవీఎల్ చెప్పారు. పార్టీ మారితే అదే రోజు పదవి పోవాలి: వెంకయ్య నాయుడు పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని, ప్రజాప్రతినిధులు పార్టీలు మారితే ఆ రోజు నుంచే వారి పదవి కూడా పోయేలా చట్టం రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలుమార్లు అభిప్రాయపడ్డారు. "ప్రజాప్రతినిధులు పార్టీ మారితే అదే రోజు తమ పదవి కోల్పోయేలా చట్టం తీసుకొస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని 2016 జూన్ 17న ఎం.వెంకయ్యనాయుడు (అప్పుడు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు) అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల కారణంగా దేశంలో రాజకీయ విలువలు పడిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రస్తుతం సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వెంకయ్య రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్‌లో ఆయనకు ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ''ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయి. ఒక్కొక్కరుగా పార్టీ మారితేనే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది తప్ప గంపగుత్తగా మారితే వర్తించదనే ఆలోచనతో పార్టీ ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఒక గుర్తుపై గెలిచిన వారు పార్టీ మారితే అదే రోజు పదవి కోల్పోయేట్టు చట్టం తీసుకొస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది'' అని వెంకయ్య నాయుడు ఆరోజు వ్యాఖ్యానించారు. అయితే, సరిగ్గా మూడేళ్ల తర్వాత నలుగురు టీడీపీ ఎంపీలు మూకుమ్మడిగా ఫిరాయిస్తూ.. రాజ్యసభలో టీడీపీ లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ ఇవ్వడం గమనార్హం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు గురువారం (జూన్ 20న) బీజేపీలో చేరారు. text: తేజస్వి సూర్య (మధ్యలో ఉన్న వ్యక్తి) వృత్తి రీత్యా న్యాయవాది అయిన తేజస్వి వయసు 28 సంవత్సరాలు. కానీ, బీజేపీ కార్యకర్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన అంశం... తేజస్వి వయసు కాదు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని అనంత్ కుమార్‌ను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం వారిని షాక్‌గు గురిచేసింది. "తేజస్విని అనంత్ కుమార్ పేరును మాత్రమే రాష్ట్ర పార్టీ నాయకత్వం హై కమాండ్‌కు పంపించింది" అని బీజేపీ బెంగళూరు డిస్ట్రిక్ట్ కమిటీ అధ్యక్షుడు సదాశివ్ బీబీసీకి చెప్పారు. "యువకుడు, ఉత్సాహవంతుడు, వాక్చాతుర్యం ఉంది కాబట్టి పార్టీ ఆయనను ఎంపిక చేసింది. యువతకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో అవకాశాలివ్వాలనే పార్టీ నిర్ణయం కూడా దీనికి కారణం" అని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.రవి కుమార్ అన్నారు. ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం.. యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సూర్యకు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో అనుబంధం ఉంది. సూర్య మావయ్య రవి సుబ్రమణ్య.. బసవనగుడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. "ఈ నిర్ణయంపై పార్టీ కార్యకర్తల్లో కొద్దిగా అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. కానీ ఇది పార్టీ అధినాయకత్వం నిర్ణయం అని అందరూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నా భర్త ఎప్పుడూ దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసేవారు. మోదీ తిరిగి అధికారంలోకి రావడం అన్నింటికన్నా ముఖ్యం" అని తేజస్విని అనంత్ కుమార్ వ్యాఖ్యానించారు. కానీ అనంత్ కుమార్ మద్దతుదారులు దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. "తేజస్విని ఎంపికకు అంతా సిద్ధమైంది. అనంత్ కుమార్‌తో ఉన్న అనుబంధం కారణంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప కూడా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నేత ఒకరు తెలిపారు. "అవును, తేజస్వి సూర్య పేరును ఆర్ఎస్ఎస్ సూచించింది. బీజేపీ ఆమోదించింది. బెంగళూరులో యువ ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణం" అని రవి కుమార్ చెప్పారు. "ఆయన అద్భుత వక్త, చదువుకున్నవారు, మోదీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లే అనే భావాలు ఆయనకున్నాయి" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సామాజిక కార్యకర్త వ్యాఖ్యానించారు. 2019 మార్చి 22న సూర్య అధికారిక అకౌంట్‌లో ఓ ట్వీట్‌ పోస్ట్ చేశారు. "మోదీని అడ్డుకోవడానికి దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. ఆధునికమైన, శక్తిమంతమైన భారత్‌ను నిర్మించడం మోదీ అజెండా అయితే వారి అజెండా మోదీని అడ్డుకోవడం. వారికి అభివృద్ధి అజెండా అనేదే లేదు. మీరు మోదీకి మద్దతిస్తే, భారత్‌కు మద్దతిచ్చినట్లే. మీరు మోదీని వ్యతిరకేస్తే, దేశవ్యతిరేక శక్తులను బలపరుస్తున్నట్లే" అనేది ఆ ట్వీట్ సారాంశం. "ఇదో అద్భుత ఎంపిక. ఆర్థిక స్తోమత లేని యువతకు గుర్తింపునివ్వాలని ప్రధాని, బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ వ్యక్తికి నిబద్ధత ఉంది, జాతీయవాది. ఆయన్ను చూస్తే గర్వంగా ఉంది" అని సూర్యకు సీనియర్, కర్నాటక మాజీ అడ్వొకేట్ జనరల్ అశోక్ హర్నహళ్లి చెప్పారు. కానీ, నామినేషన్ వేయడానికి వెళ్లిన సూర్య దీనిపై వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు. ఇతర యువకుల్లాగే సూర్య కూడా మంచి పానీ పూరీ ఎక్కడ దొరుకుతుందో తన స్నేహితులకు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు. "బెంగళూరులో మంచి పానీ పూరీ ఎక్కడ దొరుకుతుందో నిన్న రాత్రి 8.21కి సూర్య అందరికీ చెప్పారు. తన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో రాత్రి 2.48 నుంచి వరసపెట్టి 14 ట్వీట్లు పోస్ట్ చేశారు" అని చుర్మురి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తేజస్వి సూర్య.. లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీలో ఉన్న వ్యక్తి. బహుశా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉన్నవారిలో పిన్నవయస్కుడు తేజస్వినే కావచ్చేమో. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆరుసార్లు గెలిచిన సీటు ఇది. ఆయన ఇటీవలే మరణించారు. text: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజైన శుక్రవారం (జనవరి 31)నాడు ఆర్థిక సర్వే 2019-20ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆర్థిక సర్వే ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు అంతకు ముందు, పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. "ఈ దశాబ్దం భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఈ దశాబ్దంలోనే భారత్ స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తవుతాయి. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా అవసరమైన చట్టాలు రూపొందించాలి" అని కోవింద్ వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరి 1న పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. text: ‘ఆస్ట్రేలియాలో 18-45ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఫొటోల ద్వారా వేధింపులకు గురయ్యారు’ అబ్బాయిల నుంచి ముప్పు ఉందని భావించే అమ్మాయిలు తమ ఫొటోలను ఫేస్‌బుక్ సంస్థకి పంపిస్తే, వాటి లింక్‌ని భద్రపరచుకొని దాని ఆధారంగా ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ కాకుండా చూసేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘ఫింగర్ ప్రింట్’ అనే కొత్త సాంకేతికను ఆ సంస్థ పరీక్షిస్తోంది. ఆస్ట్రేలియాలో 18-45ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఫొటోల ద్వారా వేధింపులకు గురయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఫేస్‌బుక్ ఈ సాంకేతికతను పరీక్షించడానికి మొదట ఆ దేశాన్నే ఎంచుకుంది. అబ్బాయిలు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టడానికి ముందే వాటిని తమకు పంపిస్తే, వాటి లింక్‌ని సేకరించి, దాని ఆధారంగా ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ కాకుండా చూస్తామని ఆ సంస్థ భరోసా ఇస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది? ఫేస్‌బుక్ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ మొదట ఫొటోకి సంబంధించిన ‘ఫింగర్ ప్రింట్‌’ని తీసుకుంటుంది. అంటే.. ఫొటోని కాకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నిక్షిప్తం చేసుకుంటుంది. క‌ృత్రిమ మేధస్సు, ఫొటో మ్యాచింగ్ సాఫ్ట్‌వేర్‌ల సాయంతో ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ కాకుండా నివారించేలా టెక్నాలజీని అభివ‌ృద్ధి చేసింది. అమ్మాయిలు పంపే ఫొటోల లింక్ మాత్రమే ఫేస్‌బుక్ దగ్గర ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లే వాటిని ప్రాసెస్ చేస్తాయి. ఏ వ్యక్తికీ వాటిని తెరిచి చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఆసక్తి ఉన్న అమ్మాయిలు ఎలాంటి భయం లేకుండా అభ్యంతరకర చిత్రాలను తమకు పంపించొచ్చని ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా విభాగం చెబుతోంది. ‘రివెంజ్ పోర్న్ సంస్కృతి ఆస్ట్రేలియాలో రోజురోజుకీ పెరుగుతోంది. దాన్ని అరికట్టేందుకు ఫేస్‌బుక్ చేస్తోన్న ఈ ప్రయత్నం అభినందనీయం’ అంటారు ఆస్ట్రేలియా ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ గ్రాంట్. ‘ఈ టెక్నాలజీ కొంత వరకూ ఉపయోగపడుతుంది. కానీ రోజూ వేల సంఖ్యలో అమ్మాయిల నగ్న చిత్రాలు ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిని అరికట్టడానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సంస్థలూ వీటిపైన ద‌ృష్టిపెట్టాలి’ అంటారు డర్హమ్ లా స్కూల్‌కి చెందిన న్యాయ నిపుణురాలు ప్రొఫెసర్.క్లేర్ మెక్‌గ్లిన్. ‘తమకు అందే చిత్రాల భద్రతపైన ఫేస్‌బుక్ దృష్టిపెట్టాలి. అవి బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి’ అని సూచిస్తారు గ్రహమ్ క్లూలీ అనే సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్. ఇదిలా ఉండగా... ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో అసభ్యకర చిత్రాలను నివారించేందుకు ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. ఈ మార్చిలో అమెరికా‌కు చెందిన మెరైన్ యునైటెడ్ అనే ప్రైవేట్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో తోటి ఉద్యోగినుల అసభ్యకర చిత్రాలను పంచుకుంటున్న విషయం బయటికొచ్చింది. దాంతో ‘ఫొటో మ్యాచింగ్’ టెక్నాలజీని రంగంలోకి దించిన ఫేస్‌బుక్ ఆ ఫొటోలను తొలగించడంతో పాటు, అలాంటి చిత్రాలను పంచుకుంటున్న గ్రూప్‌ల ఖాతాలనూ రద్దు చేసింది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రేమలో విఫలమైన అబ్బాయిలు తమ మాజీ గాళ్‌ఫ్రెండ్స్‌కి సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ కక్ష సాధింపునకు పాల్పడే ట్రెండ్ ఇటీవలి కాలంలో విస్తరిస్తోంది. దానికి చెక్ పెట్టేందుకు ఫేస్‌బుక్ ఓ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. text: ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) కోసం డబ్బు తీసుకెళ్తున్న కార్గో విమానం దక్షిణ సూడాన్ రాజధాని జూబా సమీపంలో కుప్పకూలింది. విమానంలో ఉన్న తొమ్మిదిమందిలో ఎనిమిదిమంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మరణించినవారిలో నలుగురు దక్షిణ సూడాన్ దేశానికి చెందినవారు కాగా, ముగ్గురు రష్యాకు చెందినవారు. "ఈ ప్రమాదం చాలా విషాదాన్ని కలిగించింది. ఇందులో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం" అని ఆ దేశాధ్యక్షుడు సాల్వా కీర్ తెలిపారు. జూబా అంతర్జాతీయ విమానాశ్రయమనుంచీ బయరుదేరిన కొద్దిసేపట్లోనే ఈ విమానం కుప్పకూలింది. సూడాన్‌లో విమాన ప్రమాదం జీతం డబ్బులన్నీ కాలిపోయాయి పశ్చిమ బాహ్ర్ ఎల్-గజల్ రాజధాని వయూలో ఉన్న డబ్ల్యూఎఫ్‌పీ సిబ్బందికి జీతాలు తీసుకువెళ్లడానికి ఆంటొనోవ్ 36 విమానాన్ని ఆపర్ట్యూనిటీ బ్యాంక్ ఏర్పాటు చేసింది. "అందులో ఉన్న మొత్తం డబ్బు $35,000 (సుమారు 26 లక్షలు). ప్రమాదంలో ఈ డబ్బు మొత్తం కాలిబూడిదైపోయింది" అని దక్షిణ సూడాన్ రవాణా మంత్రి మదుత్ బ్యార్ యెల్ బీబీసీతో చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చెయ్యడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలిపోవడంతో ఎనిమిదిమంది మరణించారు. text: అయితే అత్యాచారం కేసుల్లో మరణశిక్ష వల్ల న్యాయం లభిస్తుందా? గణాంకాలను పరిశీలిస్తే వాస్తవం వేరేగా ఉంది. ఈ క్రింది ఐదు అంశాలూ ఉరిశిక్ష వల్ల ఫలితం ఉండదని వెల్లడిస్తున్నాయి. 1. మరణశిక్ష వల్ల అత్యాచారాలు ఆగలేదు 2012లో నిర్భయ ఘటన అనంతరం, అత్యాచారాలకు అత్యధికంగా మరణశిక్షను విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ శిక్షతో నేరస్తులు భయపడిపోతారని, తద్వారా అత్యాచారాలు తగ్గుతాయని భావించారు. ఈ చట్టం అమలులోకి వచ్చాక, నిర్భయ, శక్తి మిల్ సామూహిక అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించారు. కానీ తరువాత జరిగిందేమిటి? జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 2015లో 34,651 అత్యాచార కేసులు, 2016లో 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2012లో ఈ సంఖ్య 24,923 మాత్రమే. అంటే, రెండు అత్యంత తీవ్రమైన అత్యాచార ఘటనల్లో దోషులకు మరణశిక్ష విధించిన తర్వాత కూడా అత్యాచారాల సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదు. నిర్భయ ఘటన అనంతరం జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రకారం రేప్ కేసులను నమోదు చేసే విషయంలో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని మనం గుర్తుంచుకోవాలి. నమోదైన రేప్ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం. 2. రుజువు కాని నేరాలు పిల్లలపై అత్యాచారం విషయంలో దోషనిర్ధారణ చాలా తక్కువ. 18 ఏళ్ల లోపు వారిపై అత్యాచారాలు ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2016లో పిల్లలపై అత్యాచారాలకు సంబంధించి 64,138 కేసులు పోక్సో చట్టం కింద నమోదు కాగా, వాటిలో కేవలం 3 శాతం కేసుల్లో మాత్రం వాటిని నేరాలుగా నిరూపించగలిగారు. అంతే కాదు, పిల్లలపై లైంగిక హింస కేసులు పెరుగుతూ పోయాయి. అందువల్ల, నేరమే నిరూపించలేకపోయినప్పుడు, ఎవరిని ఉరి తీస్తారు? 3.దోషులు బయటివాళ్లు కాదు, దగ్గరివారే.. ఎన్‌సీఆర్‌బీ 2016 నివేదిక ప్రకారం మైనర్ బాలికలపై అత్యాచారం కేసుల్లో 94 శాతం దోషులు ఆ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లు, దగ్గర వాళ్లే అయి ఉంటున్నారు. దోషులలో 29 శాతం మంది ఇరుగుపొరుగు, 27 శాతం పెళ్లి చేసుకుంటామన్న హామీ ఇచ్చినవాళ్లు, 6 శాతం బంధువులు, మిగతా 30 శాతం ఆ కుటుంబానికి దగ్గరివారు. పిల్లలపై నమోదైన అత్యాచారాల కేసులు - గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, సగటున 90 శాతం పైగా కేసుల్లో దోషి బాధితులకు దగ్గరివారే అయి ఉంటున్నారు. అందువల్ల చాలా కేసుల్లో, దోషితో దగ్గర సంబంధాల కారణంగా, ఫిర్యాదు వెనక్కి తీసుకొమ్మని బాధితులపై ఒత్తిడి ఉంటోంది. బాధితులు, వారి కుటుంబం - దోషిపై ఫిర్యాదు చేయకుండా ఉండడానికి మరణశిక్ష కూడా ఒక కారణం కావచ్చు. ఇలాంటి కేసుల్లో, తీవ్రమైన శిక్షకు భయపడేది నేరస్తులు కాదు. దానికి బదులుగా, అత్యాచార బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. 4. పోలీసులపై చర్యలేవీ? ఈ కొత్త ఆర్డినెన్స్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల లోపు కేసు విచారణ పూర్తి చేయాలని చెబుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అది చాలా కష్టం. ప్రముఖ న్యాయవాది వృందా గ్రోవర్ ప్రకారం, నేటి వరకు భారతదేశంలో మూడు నెలల్లో విచారణ ముగిసిన అత్యాచారం కేసు లేదు. ''మూడు నెలల లోపు విచారణ పూర్తి కాకుంటే ఏమవుతుంది? పోలీసులపై కానీ, విచారణాధికారి పైన కానీ చర్య తీసుకుంటారా లేక బాధితులకు ఏదైనా పరిహారం చెల్లిస్తారా? ఆర్డినెన్స్‌లో ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు'' అని వృందా అన్నారు. 2016 చివరి నాటికి, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 90 శాతం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రాలవారీగా పిల్లలపై అత్యాచారాలు - ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన శిక్షకన్నా, శిక్షను విధించడంలో జరుగుతున్న ఆలస్యమే పెద్ద సమస్య. ఎందుకంటే, కేసు విచారణ గడువు పెరిగే కొద్దీ, బాధితుల సమస్యలు మరింత పెరుగుతాయి. 5. పని చేయని ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టులు మైనర్లపై లైంగిక హింసల కేసుల విచరాణకు పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలన్న చర్చలు జరుగుతున్నాయి. కానీ పోక్సో కోర్టు అనేది ఒక భ్రమే అని వృందా గ్రోవర్ అభిప్రాయపడ్డారు. దేశంలో దిల్లీలో తప్ప, ఇతర ఏ రాష్ట్రంలోనూ పోక్సో కోర్టులు లేవని ఆమె తెలిపారు. కొత్త ఆర్డినెన్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెబుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో లైంగిక అత్యాచారానికి గురైన అన్ని వయసు మహిళలు, పిల్లల కేసులను విచారిస్తారు. ''ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినా, జడ్జీలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పటికే కేసుల ఒత్తిడిలో తలమునకలుగా ఉన్న జడ్జీలే ఈ కోర్టులకు కూడా వస్తారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంచి ప్రత్యామ్నాయం కాదేమో అనిపిస్తోంది'' అని ఆమె అన్నారు. మరో పెద్ద ప్రశ్న - ఇప్పుడు మైనర్ బాలురపై అత్యాచారాలు, లైంగిక దాడుల కేసులు ఏమవుతాయి? ఎందుకంటే కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో బాలురపై అత్యాచారాల ప్రస్తావన లేదు. అదే పోక్సో చట్టం 2012లో బాలురు, బాలికలు - ఎవరిపై లైంగిక హింస జరిగినా ఒకే రకమైన శిక్ష విధించే అవకాశం ఉండేది. అయితే మీడియా వార్తల ప్రకారం, పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్వచ్ఛంద సంస్థ 'ఇండియాస్పెండ్' నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, నిర్భయ ఘటన తర్వాత, దిల్లీలో 2013లో ఆరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. లైంగిక అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనేది వీటి లక్ష్యం. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 2014లో 400 కేసులను పరిష్కరిస్తే, 2012లో సాధారణ కోర్టులే 500 కేసులను పరిష్కరించాయి. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరుపై పలు ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అనూప్ సురేంద్రనాథ్ ప్రకారం - పోలీసులు, న్యాయవ్యవస్థ చాలా మెల్లగా విచారణ చేయడానికి చాలా కారణాలున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం జనాభాతో పోలిస్తే పోలీసులు, జడ్జీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ''ఐక్యరాజ్య సమితి అంచనా మేరకు ప్రతి 454 మందికి ఒక పోలీసు అధికారి ఉండాలి. కానీ హోం శాఖ 2016లో వెలువరించిన నివేదిక ప్రకారం మనదేశంలో 514 మందికి ఒక పోలీసు అధికారి మాత్రమే ఉన్నారు'' అని ఆయన తెలిపారు. దీనితో పాటు, ఐక్యరాజ్య సమితి అంచనా మేరకు ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండాలి. అయితే ప్రస్తుతం వారి సంఖ్య 19 మాత్రమే ఉంది. ఈ గణాంకాలు, వాస్తవాలను గమనిస్తే, ప్రభుత్వం నిజంగా పిల్లలకు, మహిళలకు న్యాయం లభించాలని భావిస్తుంటే, కొత్త చట్టానికి చేయడానికి బదులు క్రిమినల్ న్యాయవ్యవస్థను సంస్కరించి, ప్రస్తుతం ఉన్న చట్టాలనే సమర్థంగా అమలు చేయాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. text: బియర్ గ్రిల్స్ తను మోసపోయానని అనుకునుంటారు. అలానే అనుకుంటారు. ఎందుకంటే, అత్యంత కఠినంగా ఉండే అడవుల్లో దుర్భర పరిస్థితులను తట్టుకోగలనని చెప్పే ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. అడవిలో తినడానికి ఏమీ లేనప్పుడు పాములను కూడా కరకర నమిలేస్తూ ఉత్సాహంగా కనిపిస్తారు. కానీ, జిమ్ కార్బెట్‌లో ఆయన 'ఢికాలా' పరిసరాల లోపలే ఉండాల్సి వచ్చింది. అక్కడ పర్యాటకుల కోసం 33 కెమెరాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి రాకుండా వన్యప్రాణులను దూరంగా ఉంచడానికి చుట్టూ కరెంటు కంచె కూడా ఉంది. ఇక్కడి మట్టి దారుల్లో, దూరదూరాల వరకూ ఉన్న పచ్చటి గడ్డి మైదానాల్లో, నదీతీరాల్లో మీరు పగటివేళ చక్కగా పర్యటించవచ్చు. అయితే, అధికారిక ఓపెన్ టాప్ వాహనాల్లో మాత్రమే. ఆ వాహనాల నుంచి ఒక్క క్షణం కిందికి దిగినా, భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ బియర్ గ్రిల్స్ నిస్సహాయతను అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా బియర్ గ్రిల్స్ కష్టాలు తీరలేదు. ఆరోజు ఉదయం నుంచీ ఢికాలా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అయితే, అది వర్షాకాలం కాదు. పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఊహించని విధంగా ఇలా ఎప్పుడైనా జరగచ్చు. మోదీ కాలాగఢ్ నుంచి ఒక స్పీడ్ బోట్ ద్వారా ఢికాలా చేరుకున్నారు. వర్షం ఆగేవరకూ అడవిలో ఉన్న ఒక పాత రెస్ట్ హౌస్‌లో ఆగారు. ఢికాలాలో ఉన్న ఈ పాత రెస్ట్ హౌస్ ఒక అత్యద్భుత నిర్మాణం. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు ఆ పేరెలా వచ్చింది భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్. ఉత్తరాఖండ్‌ పురాతన లోతట్టు ప్రాంతాలు గడ్వా, కుమావు ప్రాంతాల్లోకి వస్తాయి. అక్కడ దట్టమైన అడవి, గడ్డి మైదానాలు, పర్వతాలు కలగలసి పర్యాటకులకు ఒక అద్భుత దృశ్యాన్ని అందిస్తాయి. సరిగ్గా ఇక్కడే రామగంగా నది వంపులు తిరుగుతూ ప్రవహిస్తుంటుంది. ఇక్కడ రణతంభోర్ పులులను చూడాలంటే సులభం, కానీ అసలు సిసలు అందం అంతా జిమ్ కార్బెట్‌ పార్కులోనే ఉంది. 1936లో నాటి యునైటెడ్ ప్రావిన్స్‌కు అప్పట్లో గవర్నర్‌గా ఉన్న మాల్కమ్ హేలీ పేరున దీనికి మొదట హేలీ నేషనల్ పార్క్ అనే పేరు పెట్టారు. తర్వాత ఈ పార్కుకు ఉత్తరాఖండ్‌లో ఇప్పటికీ గుర్తు చేసుకునే జిమ్ కార్బెట్ పేరు పెట్టారు. ఆయన నరభక్షకులైన పులులు, చిరుతల నుంచి ఇక్కడి కొండప్రాంతాల ప్రజలను కాపాడారు. ఆ తర్వాత ప్రముఖ వేటగాడైన జిమ్ కార్బెట్ తన జీవితాంతం వన్యప్రాణుల సంరక్షణ కోసం పని చేశారు. జిమ్ కార్బెట్ తన 16 ఎంఎం కెమెరాతో వన్యప్రాణుల సినిమాలు తీయడమే కాదు, అడవిపై పుస్తకాలు కూడా రాశారు. వాటిని ఇప్పటికీ క్లాసిక్స్‌గా చెబుతారు. ఆయన పుస్తకాల్లో ముఖ్యమైనవి 'మాన్ ఈటర్స్ ఆఫ్ కుమావూ', 'ద టెంపుల్ టైగర్', 'మోర్ మాన్ ఈటర్స్ ఆఫ్ కుమావూ', 'ది మేన్ ఈటింగ్ లిపర్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్', 'మై ఇండియా', 'జంగల్ లోర్'. 1955లో జిమ్ కార్బెట్ చనిపోయిన తర్వాత ఈ రిజర్వ్ పేరును జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌గా మార్చారు. అంటే టెక్నికల్‌గా, అక్కడి అందాలను బట్టి బట్టి జిమ్ కార్బెట్ భారతదేశంలో మొట్టమొదటి అత్యుత్తమ ప్రకృతి పరిరక్షకులుగా నిలిచారు. అంతరిస్తున్న పులులను సంరక్షించే 'ప్రాజెక్ట్ టైగర్‌'ను 1973 ఏప్రిల్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇక్కడనుంచే ప్రారంభించారు. జిమ్ కార్బెట్ 'ఢికాలా' జోన్ సరే, ఇప్పుడు మళ్లీ మాన్ వర్సెస్ వైల్డ్ విషయానికొద్దాం.. వర్షం కాసేపటి తర్వాత తగ్గింది. దాంతో బియర్ గ్రిల్స్ టీమ్ అంతకు ముందే నిర్ణయించిన కొన్ని ప్రాంతాల్లో బియర్, మోదీపై షూటింగ్ చేశారు. ప్రధానమంత్రితో కలిసి రెండు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ షూటింగ్ రామగంగా నదీతీరంలో కూడా జరిగింది. దీనినే గెథియా రో అంటారు. ఆ గడ్డి మైదానానికి మూడు వైపులా ఢికాలా పరిసరాలు చుట్టుముట్టి ఉంటాయి. ఉత్తరాఖండ్ అటవీశాఖ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి అక్కడకు రావడానికి ముందు, బియర్ గ్రిల్స్‌ను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఢికాలా పరిసరాలు దాటి వెళ్లడానికి అనుమతించలేదు. అది చాలా ప్రమాదకరం అని ఆయనతో చెప్పారు. నిజానికి, పదేళ్ల ముందు ఒక ఆడపులి ఆ పరిసరాల్లో చొరబడి ఒక రెస్టారెంట్ నిర్వాహకుడిని చంపేయడంతో ఢికాలా చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చాలాసార్లు ఏనుగులు కూడా వచ్చేశాయి. ఢికాలా పరిసరాల్లో ఉన్న వన్యప్రాణులకు ఏ నష్టం జరగకుండా, షూటింగ్ కోసం అటవీశాఖ రెండు ప్రాంతాలను నిశ్చయించింది. కార్యక్రమం షూట్ చేస్తున్నప్పుడు ఎస్పీజీ అధికారులు, అటవీశాఖ అధికారులు కెమెరాలకు కాస్త దూరంలో ప్రధానికి రక్షణగా నిలిచారు. కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో గెథియా రో ప్రాంతం చాలా ముఖ్యమైన ప్రాంతం. అక్కడ 'పాడ్వాలీ' ఒక ఆడపులి, దాని మూడు పిల్లలు ఉంటున్నాయి. షూటింగ్ జరిగిన రోజు ఆ పులి కుటుంబాన్ని బయటకు రానివ్వలేదు. ఈ ప్రాంతంలో ఫిబ్రవరి నెలలో ఏనుగులు కనిపించవు. సాధారణంగా మార్చి చివర్లో ఇక్కడి గడ్డి మైదానాలు, చెట్లలోకి ఏనుగులు భారీగా వచ్చేస్తాయి. దాంతో ఈ షూటింగుకు వాటి నుంచి ఉపశమనం లభించింది. ఆమిర్ ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్' సినిమా వల్ల లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఎంత పాపులర్ అయ్యిందో, అలాగే మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం తర్వాత జిమ్ కార్బెట్ పార్కుకు కూడా అంతే పాపులారిటీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇలాంటి ప్రాంతాలకు నిజంగానే అంత ప్రచారం అవసరమా? పర్యాటకుల ఒత్తిడి వల్ల ఎదురయ్యే ముప్పును గుర్తించిన లద్దాఖ్ అధికారులు పాంగాంగ్ సరస్సు దగ్గర క్యాంప్ వేయడాన్ని నిషేధించారు. బియర్ గ్రిల్స్ ఇక్కడకు రాకముందే జిమ్ కార్బెట్‌కు ప్రపంచ ప్రఖ్యాత టైగర్ రిజర్వుగా పేరుంది. అందుకే అటవీశాఖ అధికారి ఒకరు వ్యంగ్యంగా "మీరు తాజ్‌మహల్‌కు మరింత పాపులారిటీ తీసుకురాగలరా, మీరలా చేయగలరా?" అన్నారు. సాధారణంగా అడవుల్లో సాహసాలను ఎంజాయ్ చేసే బియర్ గ్రిల్స్ ఇక్కడ నుంచి కాస్త నిరాశగా వెనక్కు వెళ్లుంటారేమో అని నాకు అనిపిస్తోంది. దేన్ని అన్వేషించాలనుకున్నారో, అలాంటి అడవి ఆయనకు దొరకలేదు. తర్వాత నాకే, ఈ కార్యక్రమం షూటింగ్ కోసం భారతదేశంలో చాలా చక్కగా సరిపోయే ప్రాంతం ఏది? అనే మరో ఆలోచన కూడా వచ్చింది. బహుశా చంబల్‌ లోయలు దీనికి పక్కాగా సరిపోవచ్చు. ఈ లోయలు బియర్ గ్రిల్స్‌కు చూపించి ఉండాల్సింది. సంక్లిష్టమైన చంబల్ లోయల్లోకి వెళ్లిన చాలా మంది ఆ చక్రవ్యూహం నుంచి బయటకు వచ్చే దారి గుర్తించలేకపోయారు. అందుకే, దానిని 'మానవ భక్షకి' అంటారు. అయినా, అక్కడ ఇలాంటి వాళ్లెవరైనా చిక్కుకుపోతే, పాములు, కప్పలు తింటూ ఎన్నాళ్ళు జీవిస్తారులే! ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) డిస్కవరీ చానల్లో పాపులర్ కార్యక్రమం 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ప్రజెంటర్ బియర్ గ్రిల్స్, ప్రధానమంత్రి మోదీ రాక కోసం.. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ 'ఢికాలా' పరిసరప్రాంతాల్లో మిగతా పర్యాటకుల్లాగే కొన్నిరోజుల వరకూ వేచి చూశారు. text: ప్రతీకాత్మక చిత్రం న్యూయార్క్‌లో ఆ దంపతులు దావా వేశారని అమెరికా మీడియా తెలిపింది. తమకు ఇద్దరు మగశిశువులు పుట్టారని, ఇద్దరిలోనూ ఆసియా సంతతి లక్షణాలు లేకపోవడంతో షాకయ్యామని వారు తమ దావాలో పేర్కొన్నారు. డీఎన్‌ఏ పరీక్షల్లో ఆ శిశువులు తమకు సంబంధించిన వారు కాదని తేలడంతో వారిని పోషించే బాధ్యతను ఈ దంపతులు వదులుకున్నారని ఆ దావాలో ఉంది. ఈ ఆరోపణలపై సదరు క్లినిక్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. "ఇబ్బందులను, అవమానాలను" తగ్గించుకునేందుకు ఫిర్యాదుదారులు తమ పూర్తి పేర్లను వెల్లడించకుండా ఏపీ, వైజెడ్ అని మాత్రమే దావాలో పేర్కొన్నారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు మందులు, ల్యాబ్ ఫీజులు, ప్రయాణాలు, ఇతర ఖర్చులు కలిపి 1,00,000 డాలర్లకు (దాదాపు రూ.68 లక్షలు) పైగా వెచ్చించామని తెలిపారు. ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)లో భాగంగా ప్రయోగశాలలో అండాన్ని ఫలదీకరణం చెందించి, దానిని తిరిగి గర్భాశయంలో ప్రవేశపెడతారు. సాధారణంగా పిల్లలను కనడంలో సమస్యలు ఎదుర్కొనే దంపతులు ఈ ప్రక్రియను ఆశ్రయిస్తుంటారు. ప్రతీకాత్మక చిత్రం వైద్యపరమైన అవకతవకలకు పాల్పడటంతో పాటు, ఉద్దేశపూర్వకంగా తమను మానసిక క్షోభకు గురిచేశారంటూ సీహె‌చ్‌ఏ అనే సంతాన సాఫల్య కేంద్రంతో పాటు, మరో ఇద్దరు డైరెక్టర్లపై న్యూయార్క్‌లో దంపతులు కేసు వేశారు. "30న ప్రసవమైంది. ఆ శిశువులు మా జన్యువులతో పుట్టిన వారిలా లేరని తెలిసి షాకయ్యాం" అని ఆ దంపతులు చెప్పారు. చికిత్స సమయంలో తాము పురుష పిండాలను గర్భంలో ప్రవేశపెట్టలేదని వైద్యులు చెప్పారు. కానీ, ఇద్దరు మగశిశువులు పుట్టే అవకాశం ఉందని ప్రసవానికి ముందే స్కానింగ్‌లో తెలిసింది. ఆ విషయం వైద్యులకు చెబితే, స్కానింగ్‌లో స్పష్టత లేదని చెప్పినట్లు దంపతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందన కోసం సదరు సంతాన సాఫల్య కేంద్రాన్ని బీబీసీ సంప్రదించింది. కానీ, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దంపతుల లాయర్ బీబీసీతో మాట్లాడుతూ.. ఆ క్లినిక్ నిర్లక్ష్యం కారణంగా చాలామంది ఇబ్బందిపడ్డారని ఆరోపించారు. బాధితులకు పరిహారం ఇవ్వాలి, ఇలాంటి తప్పిదాలు మరోసారి జరగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యం వేశామని లాయర్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "ఐవీఎఫ్ ద్వారా మాకు పుట్టిన శిశువుల్లో మా లక్షణాలు లేవు" అంటూ ఆసియాకు చెందిన దంపతులు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక సంతాన సాఫల్య కేంద్రంపై దావా వేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పుడు ఆ క్లినిక్‌లో వైద్యులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. text: డోనల్డ్ ట్రంప్‌, జిమ్ అకోస్టా మధ్య వాదోపవాదం అకోస్టా పాసును పునరుద్ధరించాలంటూ ఒక జడ్జి ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ వైట్ హౌస్, భవిష్యత్తులో మీడియా సమావేశాలు ఎలా ఉండాలన్న దానిపై మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా కేవలం ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది. అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశం కేవలం అధ్యక్షుడు లేదా వైట్ హౌస్ అధికారుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించకుంటే అకోస్టా మీద చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రిపోర్టర్లు తగిన ఔచిత్యం పాటించకుంటే భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల నుంచి వాకౌట్ చేయాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు. తన పాసు పునురుద్ధణపై హర్షం వ్యక్తం చేసిన అకోస్టా, వైట్ హౌస్ సమావేశాలలో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. వివాదం ఎలా ప్రారంభమైంది? నవంబర్ 8న జరిగిన మీడియా సమావేశం సందర్భంగా, మొదట ట్రంప్‌ను ఒక ప్రశ్న అడిగిన అకోస్టా.. అనంతరం మరో అనుబంధ ప్రశ్న అడిగారు. దీంతో ఒక వైట్ హౌస్ ఇంటర్న్.. అకోస్టా నుంచి మైకును లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంగా అకోస్టా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆ మరుసటి రోజే అకోస్టా వైట్ హౌస్‌లో ప్రవేశంపై నిషేధం విధించారు. దీంతో ఆయన పాసు పునరుద్ధరించాలంటూ సీఎన్‌ఎన్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇతర మీడియా సంస్థలు కూడా అకోస్టాకు మద్దతుగా నిలిచాయి. శుక్రవారం వాషింగ్టన్ డీసీ జడ్జి ఒకరు అకోస్టా పాసు రద్దుపై వైట్ హౌస్ అధికారులు తగిన వివరణ ఇవ్వలేకపోయారని పేర్కొంటూ, పాసును పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సీఎన్‌ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా వైట్ హౌస్ పాసును పునరుద్ధరించారు. సుమారు రెండు వారాల క్రితం ఒక మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడితో వాదానికి దిగారంటూ ఆయన పాసును రద్దు చేశారు. text: ప్రతిపక్ష లేబర్‌ పార్టీ గెలుపు ఖాయమన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. మారిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం జరిగిన ఎన్నికల్లో సుమారు 1.60 కోట్ల మంది ఓటేశారు. అయితే, '9 గెలాక్సీ' ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూటమి మొత్తం 151 సీట్లలో 82 స్థానాలు గెలుచుకుంటుందని వచ్చింది. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 76 సీట్లు రావాలి. ఇప్పటి వరకు 75 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా, అధికార కూటమి 73 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒకవేళ మారిసన్ నేతృత్వంలోని కూటమికి 76 స్థానాలు రాకపోతే, ప్రభుత్వ ఏర్పాటుకు స్వతంత్ర ఎంపీల మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరికొన్ని గంటల్లో తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. తమ కూటమికి మరోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ప్రధాని మారిసన్ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు లేబర్ పార్టీ నేత బిల్ షార్టెన్ ప్రకటించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత షార్టెన్ ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉన్నవారంతా ఓటు వేయడం తప్పనిసరి. శనివారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 1.60 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం గెలుస్తుందని చాలామంది భావించారు. శనివారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అలాగే అంచనా వేశాయి. కానీ, ఆ అంచనాలు తారుమారయ్యాయి. విజయం సాధించిన ప్రధాని మారిసన్‌కు అభినందనలు తెలిపిన ప్రతిపక్ష నేత షార్టెన్... "ఇక మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పనికాదు" అన్నారు. మూడేళ్లకోసారి ఎన్నికలు ఆస్ట్రేలియాలో మూడేళ్ల‌కు ఒక‌సారి జాతీయ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే, 2007 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధాని కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. 2015 నుంచి 2018 ఆగస్టు వరకు లిబరల్ పార్టీ నేత టర్న్‌బుల్‌ ప్రధానిగా ఉండగా, పార్టీలో అంతర్గత తిరుగుబాటు కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత తొమ్మి నెలలుగా అదే పార్టీకి చెందిన స్కాట్ మారిసన్ ప్రధాని పీఠం ఎక్కారు. ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయం, పర్యావరణం, ఆరోగ్యం లాంటివి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని సర్వేలు చెప్పాయి. వాతావరణ మార్పుల పట్ల యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపాయి. ఈ పరిస్థితుల్లోనూ అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ నేతృత్వంలోని కూటమి పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. text: మైనారిటీ మతస్తులపై దాడులకు పాల్పడిన వారిని పారదర్శకంగా విచారించ లేకపోయిందని వరల్డ్ రిపోర్ట్-2018 నివేదికలో ఆ సంస్థ తెలిపింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన అనేక మంది సీనియర్ నేతలు.. పౌరుల హక్కులను పణంగా పెట్టి బహిరంగంగానే హిందుత్వాన్ని, అతి జాతీయతావాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. దాదాపు 90 దేశాలలో మానవహక్కుల తీరును పరిశీలించి ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఇంకా ఆ నివేదిక ఏం చెప్పిందంటే.. బీజేపీ అనుబంధ సంస్థలుగా చెప్పుకొనే హిందూ అతివాద సమూహాలు.. ముస్లింలు, ఇతర మైనారిటీలపై అనేక సార్లు దాడులు చేశాయి. మైనారిటీలు ఆవులను చంపుతున్నారని, వాటి మాంసాన్ని అమ్ముతున్నారనే పుకార్లను పట్టుకుని వీళ్లు ఇదంతా చేశారు. పోలీసులు దాడులు చేసిన వారిపై సరైన చర్యలు తీసుకోకపోగా గోరక్షణ చట్టాల కింద బాధితులపై కేసులు పెట్టారు. 2017లో మైనారిటీలపై కనీసం 38 దాడులు జరిగాయి. వీటిలో 10 మంది చనిపోయారు. "మైనారిటీలు, బలహీన సమూహాలను అధికారులు పట్టించుకోవడం లేదు. తరచూ జరుగుతున్న దాడుల నుంచి వారికి రక్షణ కల్పించేందుకు తాము సుముఖంగా లేమనే వాస్తవాన్ని వారు నిరూపించుకున్నారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని హ్యూమన్ రైట్స్ వాచ్ దక్షిణ ఆసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గత ఏడాది మతం పేరుతో జరిగిన దాడులను అరికట్టడంలో భారతదేశం విఫలమైందని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. text: లద్దాఖ్‌లో లేహ్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్న కశ్మీరీ యువకుడి నుంచి ఎదురైన ప్రశ్న ఇది. చుట్టుపక్కలా చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆయన ఈ మాటలు అంటున్నారు. లేహ్‌లోని ముఖ్యమైన అంగళ్లలో రోడ్లకు ఇరువైపులా ఉండే దుకాణాల్లో కనీసం డెబ్బై శాతం కశ్మీరీలవే. వీటిలో కొన్ని వాళ్లు కొనుక్కున్నవి కాగా, మిగిలినవి బౌద్ధులైన యజమానుల నుంచి అద్దెకు తీసుకున్నవి. ఇక్కడి బౌద్ధుల దుకాణాల్లోనూ చాలా మంది కశ్మీరీ యువకులు పనిచేస్తున్నారు. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మారిన తర్వాత ఇక్కడుంటున్న కశ్మీరీ దుకాణాదారులకు, వారి వద్ద పనిచేస్తున్నవారిలో కొత్త సందిగ్ధత తలెత్తింది. ధనవంతులైన కశ్మీరీలు లేహ్‌లో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. కొందరు హోటళ్లు పెట్టుకుని, తివాచీలు, శాలువాలు, దుపట్టాలు అమ్ముకునే దుకాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఇలా ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షల్లో వారు కూడా భాగస్వాములయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని సవరించడం, రాష్ట్రాన్ని రెండు యూటీలుగా విభజించడం పట్ల వాళ్లు వ్యతిరేకతతో ఉన్నారు. లేహ్‌లోని ప్రధాన అంగడిలో కొంత మంది కశ్మీరీ దుకాణదారులు, కార్మికులు తమ పేర్లు గోప్యంగా ఉంచాలని చెబుతూ బీబీసీతో మాట్లాడారు. యూటీ చేయాలని డిమాండ్ లేహ్‌లోని ప్రజలు చాలా కాలంగా తమ ప్రాంతాన్ని యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమం వెనుక లద్దాఖ్ బౌద్ధ సంఘం (ఎల్‌బీఎ) అనే మత సంస్థది ప్రముఖ పాత్ర. అందుకే, ఇక్కడి బౌద్ధుల్లో చాలా మందికి యూటీ అనేది భావోద్వేగాలతో కూడుకున్న అంశం. అయితే, లద్దాఖ్‌ను యూటీ చేయడం వల్ల లేహ్ ప్రజలకు ప్రయోజనమేమీ ఉండదని ఇక్కడుండే కశ్మీరీల్లో చాలా మంది అభిప్రాయం. లేహ్ ప్రజలకు యూటీ అనేది సుదూర స్వప్నంలా ఉండేదని, ఇప్పుడది నెరవేరిందని ఓ కశ్మీరీ దుకాణదారుడు అన్నారు. ''వాళ్ల ఆకాంక్ష నెరవేరింది. కానీ, ఆర్టికల్ 370 సవరణ వల్ల ప్రత్యేక అధికారాలు పోయాయి. ఇక్కడి ప్రజల్లో అయోమయం ఉంది. దీని దుష్ప్రభావాల గురించి ఇంకా చాలా మందికి తెలియదు'' అని చెప్పారు. ''ప్రతి పనికీ కశ్మీర్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదని లద్దాఖ్ ప్రజలు యూటీని కోరుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పాలనలో వెళ్తే కశ్మీరీ నాయకులపై ఆధారపడే అవసరం ఉండదన్నది వారి ఉద్దేశం. కానీ, ఆర్టికల్ 370 ప్రయోజనాలను కోల్పోవడం వారికి ఇష్టం లేదు'' అని మరో కశ్మీరీ దుకాణదారుడు అన్నారు. లేహ్‌లో టాక్సీ వ్యాపారం స్థానిక ప్రజల చేతుల్లోనే ఉంది. అది వారికి ప్రధాన ఆదాయ వనరు. ప్రత్యేక ప్రతిపత్తి దూరమవడం వల్ల ఉబర్, ఓలా లాంటి సంస్థలు వచ్చి, స్థానిక ట్యాక్సీ డ్రైవర్ల ఆదాయం దెబ్బతినొచ్చని మరో కశ్మీరీ దుకాణదారుడు అన్నారు. హోటళ్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి రావొచ్చని ఇంకో కశ్మీరీ అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిధులు ఎక్కువగా వెచ్చించకపోవడంతోనే లద్దాఖ్ అభివృద్ధిలో వెనుకబడిందంటూ యూటీ డిమాండ్ వినిపించేవారు ప్రధానంగా చెప్పేవారు. అయితే, 90వ దశకంలో లేహ్ హిల్ కౌన్సిల్ ఏర్పడ్డాక లేహ్-లద్దాఖ్‌ అభివృద్ధిలో వేగం పెరిగిందని స్థానిక విలేఖరి సేవాంగ్ రింగ్జిన్ చెప్పారు. ‘బయటివారితో ఎలా పోటీపడగలరు’ గత పదేళ్లలో లేహ్‌లో చాలా అభివృద్ధి జరిగిందని ఓ కశ్మీరీ దుకాణదారుడు కూడా అన్నారు. "తమపై మరొకరు పెత్తనం చెలాయించడం ఇక్కడి ప్రజలకు ఇష్టం లేదు. జమ్మూకశ్మీర్ శాసనసభ నిధుల విషయంలో వివక్ష చూపి ఉండొచ్చు. అది రాజకీయ సమస్య. కానీ, ఇప్పుడు బయటివాళ్లు ఇక్కడికి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారితో స్థానికులు పోటీపడాల్సి ఉంటుంది. బయటివారి కన్నా విద్య, నైపుణ్య వసతుల్లో వెనుకబడి ఉన్న స్థానికులు వారితో ఎలా పోటీపడగలరు?'' అయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370 సవరణపై లేహ్ అంగళ్లలో రెండు రకాల భిన్నమైన అభిప్రాయాలున్నాయి. దుకాణాల్లో వస్తువులను చూపించేవాళ్లు ఆగ్రహంగా కనిపిస్తుంటే, కౌంటర్‌లో కూర్చున్న యజమానులు ఆనందంగా కనిపిస్తున్నారు. అయితే, ఈ రెండు రకాల భిన్నాభిప్రాయాల వల్ల ఘర్షణ తలెత్తిన సందర్భాలున్నట్లు ఎవరూ చెప్పలేదు. ఓ కశ్మీరీ యువకుడు ఈసారి ఈద్‌ జరుపుకునేందుకు తాను ఇంటికి వెళ్లలేకపోయానని చెప్పారు. అయితే, తాను పనిచేసే దుకాణ యజమాని (బౌద్ధుడు) తనతో కలిసి ఈద్ జరుపుకున్నారంటూ మొబైల్‌లో ఫొటోలు చూపించారు. ఒకరితో మరొకరికి ఉన్న అవసరాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా? లేక, నిజంగానే ఇక్కడి సమాజంలో ఐకమత్యానికి ఈ ఘటన అద్దంపడుతోందా? కొందరు ఈ ప్రశ్నలకు సమాధానంగా చిరునవ్వు చిందించారు. ఇంకొందరు అస్పష్టంగా సమాధానాలిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల పట్ల కశ్మీరీలు అసంతృప్తితో ఉన్న విషయం వారి ముఖాల్లోనే కనిపిస్తోందని లేహ్‌లో ఓ దుకాణం ముందు కూర్చున్న అంగ్‌చుక్ అనే వ్యక్తి అన్నారు. ''ఏమైనా కానీ, డెబ్బై ఏళ్లుగా మేం కలిసి ఉన్నాం. ఈ అంగట్లో కశ్మీరీలు కూడా భాగం'' అని ఆయన చెప్పారు. ‘వెళ్లిపోవాలని కోరుకోను’ తన వద్ద పనిచేసే కశ్మీరీ కార్మికులతో తనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయితే వారు వెళ్లిపోవాలని మాత్రం తాను కోరుకోనని ఓ బౌద్ధ వ్యాపారి అన్నారు. ఒక దుకాణం వద్ద ఉన్న ఇద్దరు కశ్మీరీ కార్మికులను ప్రశ్నించినప్పుడు వారు కశ్మీర్‌లో భారత్ విధించిన ఆంక్షలపై, భారత మీడియా వార్తలు ప్రసారం చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో వేర్పాటువాద ప్రయత్నాలను తాను సమర్థించనని తనను తాను భారతీయ దేశభక్తుడిగా వర్ణించుకున్న ఓ కశ్మీరీ దుకాణదారుడు అన్నారు. అయితే, కశ్మీరీల ప్రత్యేక అధికారాలను తొలగించడం మాత్రం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ''మాది ఒక రాష్ట్రం. మీరు ఎన్నికల్లో గెలవలేరన్న ఒకే ఒక్క కారణంతో దాన్ని యూటీ చేసేశారు. ఇది కేవలం ఓ రాజకీయ నిర్ణయం'' అని ఆయన అన్నారు. బౌద్ధ వ్యాపారులతో మంచి సంబంధాలున్నా, ఆర్టికల్ 370 విషయంలో తాము కశ్మీర్‌వాసులతోనే ఏకీభవిస్తామని లేహ్‌లోని కశ్మీరీ దుకాణదారులు చెబుతున్నారు. ''కశ్మీర్ మీ సొంతం కావాలంటే, భారతీయులు తమ సోదరులు అన్న భావన కశ్మీరీలకు కలిగించాలి. అంతే కానీ, వేధింపులకు గురిచేయొద్దు. కశ్మీరీల ప్రత్యేక అధికారాలను మీరు లాక్కున్నారు. మీ ఇంటిని నేను లాక్కుంటే, మీరు నాతో గొడవకు దిగరా?'' అని ఓ దుకాణదారుడు ప్రశ్నించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "ఇక్కడ వేడుక జరుగుతోంది. ప్రజలు ఆనందంగా నృత్యాలు చేస్తున్నారు. అక్కడేమో కశ్మీర్‌లో నా ఇల్లు దిగ్బంధంలో ఉంది. మా అమ్మ, నాన్న ఎలా ఉన్నారో కూడా తెలియదు. మీరే చెప్పండి, ఈ వేడుకలో నేనెలా పాలుపంచుకోవాలి?'' text: జీవితంలో ఎప్పుడూ నా బాయ్‌ఫ్రెండ్స్‌తో ఇలాంటి సెక్స్‌ అనుభూతి పొందలేదు. అతనికి ఎంతో దగ్గరయ్యాను. ఎప్పడూ అతడ్ని వీడలేని బంధం మా మధ్య ఏర్పడింది. ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటే మాటలు రావు. ఆరు నెలల నుంచి మేం కలిసే ఉంటున్నాం. వారాంతాల్లో పూర్తిగా అతడితోనే గడుపుతాను. హనీమూన్‌కి వెళ్లిన జంట.. కలయిక సమయంలో ఎలా ఉంటుందో ఊహించండి అచ్చంగా అలానే ఉంటుంది అప్పుడు నా పరిస్థితి. పీరియడ్ సమయంలో సెక్స్‌తో అంత అసౌకర్యంగా ఏమీ లేను. టీనేజ్ చివరి దశలో.. 20లలో అడుగుపెడుతున్న తొలినాళ్లలో నెలలో ఓ వారం పాటు సెక్స్‌కి దూరంగా ఉండేదాన్ని. నా మొదటి బాయ్ ఫ్రెండ్ నాతో కలయిక కోసం చాలా ఆతృత పడ్డాడు. కానీ, నాకు అదంతా సులభంగా ఏమీ అనిపించలేదు. 2018లోకి అడుగుపెట్టా. కాలంతో పాటు నా వయసు పెరిగింది. పీరియడ్స్ సమయంలో సెక్స్‌ వాదనకు నేను అనుకూలంగా ఉన్నా. నా వయసు పెరుగుతుంటే ఎలాంటి సెక్స్ కావాలో మరింత ఆత్మవిశ్వాసంగా అడుగుతున్నా. ఆ సమయంలో కలయిక నాకు మరింత ఆనందాన్నిస్తుందని గ్రహించా. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయంలో నేను ఒంటరిని కానని నాకు తెలుసు. పీరియడ్ సమయంలో సెక్స్ పై పరిశోధకులు 500 మంది అభిప్రాయాలు తీసుకుంటే అందులో 55 శాతం మంది నెలసరి సమయంలో సెక్స్‌తో సౌకర్యవంతంగానే ఉన్నామని చెప్పారు. ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని అన్నారు. మరో 45 శాతం మంది ఆ సమయంలో సెక్స్ సరికాదని అనలేదు. సెక్స్‌కు సబంధించి అనేక అధ్యయనాలు జరిగాయి. వీటి నుంచి పరిశోధకులు చెప్పేదేంటంటే, 45 శాతం మంది మహిళలు పీరియడ్ సమయంలో సెక్స్‌ కోసం మరింతగా తపిస్తారట. దీన్ని పూర్తిస్థాయిలో పరిశోధకులు నిర్ధరించకపోయినప్పటికీ నాకు మాత్రం ఓ విషయం అర్థమవుతోంది. పీరియడ్ సమయంలో సెక్స్‌కు సబంధించి నాకు ఉన్న అనుభవాలే చాలా మందికి ఉన్నాయని, ఈ విషయంలో నేను ఒంటరిని కానని. పీరియడ్ సమయంలో సెక్స్‌కు, సాధారణ రోజుల్లో సెక్స్‌కు తేడా ఉందని 28 ఏళ్ల క్యాథరీన్ పేర్కొంది. ''ఆ సమయంలో సెక్స్‌ కోసం అంతగా ఆరాట పడను. భిన్న భంగిమల్లో సెక్స్ ఆ సమయంలో ప్రమాదకరమని అనుకుంటా. కానీ, నెలసరి సమయంలో సహచరుడి సాన్నిహిత్యాన్ని కచ్చితంగా ఆస్వాదిస్తా'' అని క్యాథరిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నెలసరిలో ఒక్కో మహిళ ఒక్కో విధమైన కోరికతో ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది విశ్రాంతి కోరుకుంటారు. ''సెక్స్‌లో పాల్గొనేప్పుడు ఆక్సిటోసిన్ అనే హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్నే బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ప్రసవ సమయంలో కూడా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. పురిటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో హార్మోన్లు సహాయపడుతాయి'' అని కాలిఫొర్నియా యూనివర్సి గైనకాలజిస్ట్ రాచెల్ న్యూమెన్ పేర్కొన్నారు. ''మీరు మరింతగా ఉద్వేగం పొందితే హార్మోన్ల ఉత్పత్తి పెరిగి మీ శరీరం మరింత ఆహ్లాదాన్ని పొందుతుంది. నొప్పులు, తిమ్మిర్ల బాధను అవి కొద్దిసేపు తొలగిస్తాయి'' అని రాచెల్ చెప్పారు. ''ఎండోమార్మిన్ హార్మోన్లు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ హార్మోన్లు భావప్రాప్తి కలిగినప్పుడే ఉత్పత్తి అవుతాయి. అయితే, ప్రతిఒక్కరికి ఇలానే ఉంటుందని చెప్పలేం'' అని సైన్స్ పరిశోధకులు అనా డ్రుయెట్ వివరించారు. ఆ సమయంలో సెక్స్ అసాధారణం కాదు నెలసరిలో పరిశుభ్రంగా ఉండాలని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. అందుకే ఆ సమయంలో సెక్స్‌ను ఇష్టపడరు. నెలసరి అప్పుడు మహిళల ప్రైవేటు శరీర భాగాల నుంచి స్రావాలు రావడం సాధారణమే. పీరియడ్ సమయంలో కలవడం వల్ల రక్తస్రావం కూడా తగ్గుతుందని రాచెల్ అంటున్నారు. ''నెలసరి సమయంలో భావప్రాప్తి కలిగినప్పుడు గర్భాశయ సంకోచాలు మరింత ధృడమవుతాయి. ఆ సమయంలో కలిసినప్పుడు పీరియడ్స్ వల్లే వచ్చే ఇబ్బందులు కూడా తక్కువగా అనిపిస్తాయి'' అని రాచెల్ వివరించారు. నెలసరిలో సెక్స్‌లో పాల్గొనేవారికి నాదో చిన్న సలహా. దుప్పటి పైన టవల్ వేయండి. అప్పుడు మీ పడక గది రక్తపు మరకలతో క్రైం సీన్‌ను తలపించకుండా ఉంటుంది. ఆ సమయంలో అందరూ ఒకేలాంటి అనుభూతి పొందలేరు. కానీ, నా స్వగతం నుంచి చెప్పాలంటే నెలసరిలో సెక్స్ అసాధారణం ఏమీ కాదు. అయితే, ముందు ఇలాంటి విషయాలను మీ భాగస్వామితో చర్చించండి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నేను మంచం మీద నడుం వాల్చగానే ఆనందాన్ని.. అంతకుమించిన అనుభూతిని పొందినట్లు అనిపించింది. text: లండన్ సహా బర్మింగ్‌హామ్, ఓల్వర్‌హాంప్టన్‌ నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వచ్చారు. పార్లమెంట్‌ స్క్వేర్‌ నుంచి భారత హైకమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అవుతోందని నిరసనకారులు ఆరోపించారు. 'మోదీ ప్రభుత్వం డౌన్ డౌన్', 'ఆర్ఎస్‌ఎస్ డౌన్‌డౌన్‌' అంటూ నినాదాలు చేశారు. लंदन की सड़कों पर शनिवार को एक रैली निकाली गई. బ్రిటన్‌లో ఉన్న కుల సంఘాలతో పాటు దక్షిణాసియాలోని కొన్ని సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. భారత్‌లో ఏం జరుగుతోందో ప్రపంచమంతా చూస్తోందని, ఆ విషయాన్ని మోదీ సర్కార్‌కు తెలియచేసేందుకే ఈ ప్రదర్శన చేపట్టామని కల్పనా విల్సన్ చెప్పారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆమె అన్నారు. భారత హైకమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు లండన్ వచ్చామని, ఆయన ఈ విషయాన్ని భారత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని వందన సంజయ్ అనే మరో నిరసనకారుడు ఆశాభావం వ్యక్తం చేశారు. భీమా-కోరేగాంలో పరిణామాలు ఈ ఆందోళన చేపట్టేలా తమను ప్రోత్సహించాయని సందీప్ టెల్మోర్‌ అన్నారు. భారత దేశంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆందోళనకారులకు దళిత నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మద్దతు తెలిపారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మేవానీకి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద వందలాది మంది దక్షిణాసియా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. text: పుణెలోని విశ్రాంతవాడిలో నివసించే ఆమ్రపాలి, తరచుగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లేవారు. అక్కడికి చాలా మంది విదేశీయులు కూడా వస్తుంటారు. తన స్నేహితులను కలవడానికి ఆమ్రపాలి అక్కడికి వెళ్లినపుడు జర్మన్ బేకరీలో భారీ పేలుడు జరిగింది. నవంబర్ 2008 ముంబై దాడుల తర్వాత భారతదేశంలో జరిగిన అతి పెద్ద దాడి అది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే పుణెలో జరిగిన ఆ బాంబు పేలుడులో ఐదుగురు విదేశీయులతో పాటు 17 మంది మరణించారు. ఆమ్రపాలితో పాటు మొత్తం 64 మంది గాయపడ్డారు. ఆ పేలుడు జరిగి ఎనిమిదేళ్లు గడిచినా, ఆనాటి సంఘటనలు ఆమెకింకా గుర్తున్నాయి. చికిత్స సందర్భంగా ఆమ్రపాలి చవాన్ ''ఆ రోజు వాలంటైన్స్ డే కు ముందు రోజు. జర్మనీ బేకరీ మొత్తం జనం ఉన్నారు. నా ఫ్రెండ్ తినడానికి ఏదైనా ఆర్డర్ చేయడానికి కౌంటర్ వద్దకు వెళ్లింది. నేను నా టేబుల్ వద్ద వేచి చూస్తుండగా బాంబు పేలింది.'' ఆ పేలుడు ధాటికి ఆమె వెంటనే కిందపడిపోయింది. ''కొంచెం సేపటి వరకు నేను స్పృహలో లేను. నాకు గుర్తు వచ్చేసరికి నా చెవుల్లో ఇంకా ఆ పేలుడు శబ్దం ప్రతిధ్వనిస్తోంది.’’ ‘‘నా నడుం కింది భాగమంతా శిధిలాల కింద ఉండిపోయింది. చాలామంది మగవాళ్లు, ఆడవాళ్లు సహాయం కోసం కేకలు పెట్టడం వినిపించింది. చుట్టూ అనేక మృతదేహాలు, శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొంతమంది కాలిపోయి, ప్రాణాలు కోల్పోయారు.'' ఆమ్రపాలి నాటి సంఘటనలు చెబుతుంటే వినేవాళ్లలో వణుకు పుడుతుంది. ''బాంబు పేలడానికి కొన్ని క్షణాల ముందు, ఒక యువతి నా పక్కనున్న టేబుల్ వద్ద కూర్చుంది. పేలుడుకు ఆ యువతి మంటల్లో కాలిపోయింది. ఆమె ముఖంలో ఉన్న అమాయకత్వం, సహాయం కోసం ఆ యువతి బాయ్ ఫ్రెండ్ చేసిన ఆక్రందనలు నేను మర్చిపోలేను.'' ''వైద్యశిక్షణ పొందిన నాకు అలాంటి సమయంలో మనం తీవ్రమైన షాక్‌కు గురవకూడదని తెలుసు. అందువల్లే నేను మెలకువగానే ఉంటూ, చుట్టూ ఉన్న రక్తపాతాన్ని చూసి భయపడకుండా నిలువరించుకున్నాను.'' ''కొంతసేపటికి, జనం సహాయం చేయడానికి రావడం ప్రారంభించారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రి గురించి వాళ్లకు చెప్పాను. దాంతో నాతో పాటు మరో నలుగురిని ఆటోలో అక్కడికి తీసుకెళ్లారు.'' పేలుడులో ఆమ్రపాలి ఎడమ తొడ ఎముక ముక్కలైంది. ఆమె ముఖం, రెండు అరిచేతులు తీవ్రంగా కాలిపోయాయి. పేలుడుకు ముందు ఆమ్రపాలి చవాన్ నేరస్తుల్లా చూసేవారు.. ఆ మరుసటి రెండు నెలలు ఆమ్రపాలి ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆమె ఎడమ కాలికి ఐదు మేజర్ సర్జరీలు జరిగాయి. ఆమె వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది. చివరికి గాంగ్రిన్‌ను కూడా. ''నా కాలును తొలగించొద్దు, నేను అన్నిటినీ భరిస్తాననని డాక్టర్లకు చెప్పాను.'' కాలిన గాయాలకు ఆమె 200 నాన్ సర్జికల్ స్కిన్ ట్రీట్‌మెంట్లు తీసుకుంది. అయితే ఆమె పోరాటం ఇంకా ముగియలేదు. ఆ పేలుడు కారణంగా ఏర్పడిన శారీరక, మానసికమైన గాయాలు - సమాజం ఆమె పట్ల చూపించిన ప్రతిస్పందన కన్నా పెద్దవి కావు. ''ఆరోజు బేకరీలో ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారించారు. మా ఫోన్ రికార్డులన్నీ పరిశీలించారు. జనం మా వైపు ఏదో నేరం చేసినట్లు చూసేవాళ్లు. ఈ సంఘటనతో మా కుటుంబం చాలా బాధలు పడింది.'' ''నా చికిత్స కోసం చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది. కొంతమంది రాజకీయవేత్తలు నాకు సహాయం చేస్తామన్నారు. కానీ వాళ్ల సాయం పెద్దగా అందలేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం పొందడానికి కూడా నేను చాలా తిప్పలు పడాల్సి వచ్చింది.'' ''చికిత్సకన్నా, సంఘటన తర్వాత చాలామంది నాతో వ్యవహరించిన విధానం నన్ను ఎక్కువ బాధ పెట్టింది. నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి, వాళ్లు ఈ పిల్లకు పెళ్లవుతుందా? అని ప్రశ్నలతో నన్ను బాధించేవాళ్లు.'' ఈ పేలుడుతో ఆమ్రపాలి అంగవికలురాలిగా మారినా, ఆమె తన కాళ్లపై తాను నిలబడగలిగారు. ఒక గాఢవాంఛ ఆమె జీవితానికి వెలుగిచ్చింది. ''నాకు గనుక జీవితంలో రెండో అవకాశం వస్తే, దాన్ని ఈ సమాజాన్ని సంస్కరించేందుకు ఉపయోగిస్తాననని నన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లే రోజున నేను ప్రార్థించాను.'' యుద్ధమంటే కత్తులు, తుపాకులతోనే జరగదు.. ఆమ్రపాలి ఇప్పుడు ఆ రోజు చేసిన ప్రార్థనను అమలు చేసే పనిలో ఉన్నారు. నెహ్రూ యువ కేంద్రం నుంచి ఆమె ప్రయత్నాలకు మద్దతు లభిస్తోంది. పీస్ అసోసియేషన్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన ఆమె.. ఆ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని యువత, మహిళల్లో ప్రేరణ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారికి జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇతరులకు ప్రేరణగా నిలవడం కోసం ఆమె పర్వతారోహణ నేర్చుకున్నారు. 2015లో ఆమె లద్దాక్ పర్యటనకు వెళ్లి స్టోక్ కంగారి (20,187 అడుగులు/ 6,153 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించారు. ''ఉగ్రవాదులకు నా సమాధానం ఇదే. వాళ్లు మాకు ఎంత హాని చేసినా మేం మాత్రం మా పోరాటాన్ని ఆపం'' ఎనిమిదేళ్లు గడిచిపోయినా తనతో పాటు ఇతర జర్మన్ బేకరీ పేలుడు బాధితుల పోరాటం ఇంకా ముగియలేదని ఆమె భావిస్తున్నారు. ''ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని భావిస్తారు. కానీ మనం ఒక ఉగ్రవాదిని ఉరి తీస్తే, మనం కేవలం అతని శరీరాన్ని మాత్రమే అంతమొందిస్తున్నాం. అతని ఆలోచనల మాటేంటి?'' ''ప్రతి యుద్ధం కత్తులు, తుపాకులతోనే జరగదు. మలాలా యూసుఫ్ జాయ్ అన్నట్లు -ఒక బుల్లెట్ ఒక ఉగ్రవాదిని హతమారుస్తుంది. కానీ విద్య మొత్తం ఉగ్రవాదాన్నే హతమారుస్తుంది''. ''జరిగిన ఘటనలో నాకు ఎవరి పైనా కోపం లేదు. కానీ నేను నిశబ్దంగా ఉండను, నా పోరాటాన్ని కొనసాగిస్తాను.'' ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఫిబ్రవరి 13, 2010న ఆమ్రపాలి చవాన్ పుణెలోని జర్మన్ బేకరీకి కాఫీ తాగడానికి వెళ్లారు. అప్పటికి 25 ఏళ్ల వయసున్న ఆమె నర్సు ఉద్యోగం వదిలిపెట్టి, పై చదువులకు సిద్ధమవుతున్నారు. text: కరాచీలోని మార్చురీ బయట మృతదేహాల కోసం పెట్టెలు విమానంలో 8 మంది సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా ఇద్దరు సజీవంగా బయటపడ్డారు. 60 మృతదేహాలు జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్(జేపీఎంసీ), మిగతావి కరాచీ సివిల్ హాస్పిటల్(సీహెచ్‌కే)లో ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో 19 మందిని గుర్తించామని, మిగతవారిని గుర్తించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ఈ ప్రమాదంలో 25 ఇళ్లు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలోని ఒక కాలనీ వద్ద శుక్రవారం కూలిపోయింది. పాకిస్తాన్‌లోని లాహోర్ నగరం నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏటీసీతో విమానం సిగ్నల్స్ తెగిపోయాయి. కూలిపోయిన విమానంలో సిబ్బంది ఎలా కూలిపోయింది? విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని, దాంతో పైలట్ మరోసారి ప్రయత్నించేసరికి విమానం కూలిపోయిందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పైలట్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చెప్పారన్నారాయన. కరాచీ: ఇళ్ల మీద కూలిన PIA విమానం విమానం ఒక చిన్న వీధిలో కూలిపోయిందని.. అందువల్ల సహాయ చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాలిక్ తెలిపారు. సహాయ చర్యలు పూర్తికావడానికి రెండుమూడు రోజులు పడుతుందని ఆయన చెప్పారు. కూలిపోయిన విమానంలో సిబ్బంది సింధ్ ముఖ్యమంత్రి కరాచీ నగరంలోని అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కరాచీ విమానాశ్రయం పాకిస్తాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి. శిథిలాలను తొలగించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ‘‘వాళ్లంతా మా పొరుగువాళ్లే’’ విమానం కూలిపోయిన దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఉజైర్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ.. భారీ శబ్దం వినిపించిందని, అప్పుడు తాను ఇంటి బయటకు వచ్చానని తెలిపారు. ‘‘దాదాపు నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అక్కడంతా భారీగా మంటలు చెలరేగాయి. పొగ అలుముకుంది. వాళ్లంతా మా పొరుగువాళ్లే. ఇదెంత భయానకంగా ఉందో నేను మీకు చెప్పలేను’’ అని ఆయన అన్నారు. డాక్టర్ ఖన్వాల్ నజీమ్ బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ.. ఒక మాస్కు పక్కన ఉన్న మూడు ఇళ్ల నుంచి భారీగా నల్లటి పొగలు రావటం తాను చూశానని, ప్రజలు భయంతో అరవటం విన్నానని చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన దున్యా న్యూస్ పైలట్ సంభాషణగా చెబుతున్న ఒక ఆడియో టేపును వినిపించింది. ఈ సంభాషణను మానిటరింగ్ వెబ్‌సైట్ లైవ్ఏటీసీ.నెట్‌లో కూడా పెట్టారు. ‘‘రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయి’’ అని పైలట్ అనటం.. ఆ తర్వాత కొన్ని సెకన్లకు ‘‘మేడే, మేడే, మేడే’’ అని అరవటం వినిపిస్తోంది. ఆ తర్వాత సంభాషణ ఆగిపోయింది. కరాచీ విమానాశ్రయం సమీపంలో విమానం కూలిన ప్రాంతంలో దట్టమైన పొగ మోడల్ కాలనీ జనావాసాలకు సమీపంలో విమానం కూలింది ‘‘విమానంలో 99 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థరించాం’’ అని పాకిస్తాన్ ఏవియేషన్ అథార్టీ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ఖోఖర్ చెప్పారు. పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ)కు చెందిన ఈ ఎయిర్ బస్ 320, PK8303 నంబరు గల విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు లాహోర్‌ నుంచి ప్రయాణం ప్రారంభించింది. మరో కొద్ది నిమిషాల్లో జిన్నా విమానాశ్రయంలో దిగాల్సిన ఈ విమానం.. విమానాశ్రయానికి 3.2 కిలోమీటర్ల దూరంలో మోడల్ కాలనీ సమీపంలో కూలిపోయింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్విక్ రియాక్షన్ ఫోర్స్ బృందాలు వెను వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టాయని ఆర్మీ తెలిపింది. కాగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తాను పీఐఏ సీఈఓతో మాట్లాడానని, ఆయన ఘటనా స్థలానికి వెళ్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం వాణిజ్య కార్యకలాపాల కోసం విమానాలను అనుమతించిన కొన్ని రోజులకే ఈ విమాన ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పాకిస్తాన్‌లో విమాన ప్రమాదాలు పాకిస్తాన్‌లో విమానయాన భద్రతా రికార్డు అంత మెరుగ్గా ఏమీ లేదు. 2010లో ఎయిర్ బ్లూ అనే ఒక ప్రైవేటు విమానయాన సంస్థ విమానం ఒకటి ఇస్లామాబాద్ సమీపంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ చరిత్రలో అత్యంత విషాద విమాన ప్రమాదం ఇదే. 2012లో పాకిస్తాన్ భోజ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737-200 విమానం ప్రతికూల వాతావరణం కారణంగా రావల్పిండిలో దిగేందుకు ప్రయత్నిస్తూ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 121 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది చనిపోయారు. 2016లో పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. ఉత్తర పాకిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 47 మంది చనిపోయారు. ఎయిర్‌బస్ ఏ320 ప్రమాదాల టైం లైన్: వరికూటి రామకృష్ణ, బీబీసీ ప్రతినిధి మీరు విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటే ఎయిర్‌బస్ పేరు తప్పకుండా వినే ఉంటారు. భారతదేశంలో అయితే ఎక్కువగా ఎయిర్‌బస్ విమానాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఏ320. పాకిస్తాన్‌లో కూలి పోయింది ఈ రకం విమానమే. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న విమానాల్లో బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ320 తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఏ320 సిరీస్‌ను ఎయిరిండియా, ఇండిగో, గోఎయిర్ వంటి భారత విమానయాన సంస్థలు కూడా వాడుతున్నాయి. యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ 1984లో ఏ320 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. 1987లో తొలి ఏ320 విమానం ఎగిరింది. ఆ తరువాత 1988 నుంచి వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎయిర్‌బస్ తయారు చేస్తున్న విమానాల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఏ320 సిరీస్‌కే. అయితే దీని ప్రయాణం మొదలైన నాటి నుంచి నేటి వరకు అనేక ప్రమాదాలు జరిగాయి. వాటిలో కొందరు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కొన్ని ముఖ్యమైన ప్రమాదాలను చూస్తే... - ఏ320 మార్కెట్‌లోకి వచ్చిన తొలి ఏడాది అంటే 1988లోనే తొలి ప్రమాదం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఒక ఎయిర్‌షోలో దీన్ని ప్రదర్శిస్తుండగా క్రాష్ ల్యాండ్ అయింది. విమానంలో 136 మంది సిబ్బంది, ప్రయాణికులు ఉండగా ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. -1990లో భారతదేశానికి చెందిన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమాన ప్రమాదంలో 88 మంది చనిపోయారు. ముంబయి నుంచి బెంగళూరు ప్రయాణిస్తున్న ఆ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. - 2014 డిసెంబర్‌‌‌లో ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిరేషియా విమానం QZ8501 జావా సముద్రంలో కూలి పోయింది. అందులో మొత్తం 162 మంది ఉండగా 106 మృతదేహాలు దొరికాయి. - 2015 మార్చిలో బార్సిలోనా నుంచి దసెల్‌డార్ఫ్‌కు ప్రయాణిస్తున్న జర్మనీ వింగ్స్ 4U 9525, ఫ్రాన్స్ ఆల్ప్ఫ్ పర్వతాల్లో కూలి పోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 150 మంది చనిపోయారు. - 2015 అక్టోబరులో ఈజిప్ట్ నుంచి రష్యాకు ప్రయాణిస్తున్న మెట్రోజెట్ ఫ్లైట్ 9268 కూలిపోవడంతో సిబ్బంది సహా 224 మంది చనిపోయారు. ఎయిర్‌బస్ ఏ321‌‌ రకానికి చెందిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈజిప్టులోని సినయి ప్రాంతంలో కూలిపోయింది. స్వయంప్రకటిత ఇస్లామిక్ స్టేట్ తామే కూల్చామని ప్రకటించుకోగా బాంబు పేలడం వల్లే విమానం కూలిపోయిందని రష్యా పరిశోధకులు ప్రకటించారు. - 2016 మేలో పారిస్ నుంచి కైరోకు ప్రయాణిస్తున్న ఈజిప్ట్ ‌ఎయిర్‌కు చెందిన MS804 ఏ320 విమానం తూర్పు మధ్యదరా సముద్రంలో కూలి పోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 66 మంది మరణించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్ విమాన ప్రమాదంలో మొత్తం 97 మంది మృతిచెందినట్లు ఆ దేశంలోని సింధ్ ప్రావిన్స్ అధికారులు ధ్రువీకరించారు. text: రోజు గడవడానికి అష్టకష్టాలు పడుతున్నామని ఆమె భర్త రామ్ మార్ది వాపోయారు. కుటుంబాన్ని పోషించేది ఆయనే. "ఆర్థిక వ్యవస్థ మందగించే వరకు మా జీవితం బాగుండేది. ఇప్పుడు తినడానికి కూడా కష్టంగా ఉంది. పిల్లలను బడి మాన్పించాల్సి వచ్చింది. మా అమ్మ మంచాన పడ్డారు. ఎప్పుడైనా నా ఆరోగ్యం కూడా సరిగా లేకపోతే, మా కుటుంబం ఎలా బతకాలి" అని రామ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన పారిశ్రామిక నగరం జంషెడ్‌పూర్‌లో కార్లు, భారీ వాహనాల విడిభాగాల తయారీ సంస్థలో పనిచేస్తున్నారు. గత నెల రోజుల్లో కేవలం రెండు వారాలే ఆయనకు పని దొరికింది. తాము ఉత్పత్తి చేసేవాటికి డిమాండ్ తగ్గడంతో కంపెనీ కొన్ని వారాలకోసారి కార్యకలాపాలు నిలిపివేస్తోంది. దేశంలో వాహనాలకు వినియోగదారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇది ఆర్థిక మందగమనాన్ని సూచిస్తోంది. అత్యంత తీవ్రమైన ప్రభావం పడిన పరిశ్రమల్లో కార్ల తయారీ పరిశ్రమ ఒకటి. అనేక కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెట్టి, ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జులైలో 30 శాతానికి పైగా క్షీణించాయి. ఇవి దాదాపు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. బ్యాంకింగ్ సంక్షోభం వల్ల వాహన రంగంలోని డీలర్లు, వాహనాలు కొనాలనుకొనేవారు రుణాల కోసం తిప్పలు పడుతున్నారు. వాహనాలు తయారుచేసే భారీ కంపెనీలకు చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు అవసరమైన పరికరాలను సరఫరా చేస్తాయి. ఆర్థిక మందగమనంతో ఈ పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తన తండ్రి అనారోగ్యం బారిన పడటం, కుటుంబానికి చెందిన వాహన విడిభాగాల తయారీ కర్మాగారం ఇబ్బందుల్లో ఉండటంతో వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన సమీర్ సింగ్ సొంతూరైన జంషెడ్‌పూర్‌కు తిరిగి వచ్చారు. గత రెండు దశాబ్దాల్లో తమ వ్యాపారాన్ని పుంజుకొనేలా చేయడమే కాకుండా, మరిన్ని తయారీ కేంద్రాలను ప్రారంభించారు. ఇవి భారీ వాహనాలకు అవసరమైన విడిభాగాలను తయారుచేస్తాయి. తమ కర్మాగారాల్లో కార్యకలాపాలు సాగించడానికి తమకు ఎన్నడూ పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదని సమీర్ సింగ్ చెప్పారు. వ్యాపారాన్ని నడిపించడానికి డబ్బు, దృఢమైన సంకల్పం ఉండాలని ఆయన అన్నారు. "నాలాంటి చిన్న వ్యాపారవేత్తలు ఉన్న డబ్బు, దాచుకొన్న డబ్బు, రుణాలు అన్నీ వ్యాపారానికే కేటాయిస్తారు. మేం రుణాలు ఎగవేయాలని అనుకోం. మా ఉద్యోగులు కొన్ని వారాలుగా ఖాళీగా ఉండాల్సి వస్తోంది. వారి పరిస్థితి చూస్తే నాకు బాధగా ఉంది. మా వ్యాపారం ఇలాగే ఇబ్బందుల్లో ఉంటే వాళ్లు ఇక్కడ ఉద్యోగం మానేసి మరో చోట చేరొచ్చు. కానీ నేను మరో చోట ఉద్యోగం వెతుక్కోలేను. నా జీవితం మా వ్యాపారంతోనే ముడిపడి ఉంది" అని సమీర్ సింగ్ విచారం వ్యక్తంచేశారు. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడున్నర కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. దీనిని బట్టి ఇప్పుడు ఈ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఆర్థిక మందగమనంతో ప్రజలు పడుతున్న కష్టాలకు పారిశ్రామిక నగరమైన జంషెడ్‌పూర్‌లోని పరిస్థితి అద్దం పడుతుంది. వాహనాల విడిభాగాలు తయారుచేసే అనుబంధ కర్మాగారాల్లో అత్యధికం ఆదిత్యపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఇమ్లి చౌక్‌లో ఉంటాయి. ఈ కర్మాగారాల్లో పని చేసేందుకు నిత్యం ఉదయాన్నే వందల మంది కూలీలు ఇక్కడ పోగవుతుంటారు. వీరిని స్థానిక కాంట్రాక్టర్లు ఫ్యాక్టరీల్లో పనిలో పెడుతుంటారు. కానీ మేం వెళ్లినప్పుడు ఇమ్లి చౌక్‌లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. అన్ని వయసుల మగవారు, ఆడవారు పని కోసం అక్కడ ఎదురుచూస్తూ కనిపించారు. వాళ్లలో ఓపిక నశించినట్లు కూడా అనిపించింది. కొందరు కూలీలు మమ్మల్ని కాంట్రాక్టర్లు అనుకొన్నారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన లక్ష్మి, రోజూ పని కోసం 15 కిలోమీటర్ల దూరం నుంచి ఇమ్లి చౌక్‌కు వస్తారు. గత కొన్ని నెలలుగా పని సరిగా దొరక్క ఆమెకు నిరాశ ఎదురవుతోంది. రోజు రోజుకూ పరిస్థితి మరింత కష్టంగా మారుతోందని లక్ష్మి ఆందోళన వ్యక్తంచేశారు. "కొందరు అదృష్టవంతులకే పని దొరుకుతోంది. చాలా మంది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. బస్ టికెట్‌కు సరిపడ డబ్బులు కూడా ఉండటం లేదు. చాలాసార్లు మేం ఇంటికి చేరుకొనేందుకు గంటల కొద్దీ నడవాల్సి వస్తోంది. పని దొరికినప్పుడు రోజుకు నాలుగైదు వందల రూపాయలు సంపాదించుకొనేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రోజుకు వంద నుంచి నూట యాభై రూపాయలు ఇచ్చినా మరుగుదొడ్లు, రోడ్లు శుభ్రం చేయడం సహా ఏ పనైనా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయినా మాకు ఏ పనీ దొరకడం లేదు" అని ఆమె తన బాధను పంచుకొన్నారు. వివిధ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం నెమ్మదిస్తుంది. ఈ ప్రభావం వాహన పరిశ్రమపై పడుతుంది. ఇది పరిశ్రమకు మరింత ఆందోళన కలిగించే అంశం. వాహన అమ్మకాల్లో ఈ ఏడాది నమోదైన క్షీణత ఎంత తీవ్రంగా ఉందంటే- ద్విచక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ వాహనాలు ఇలా ప్రతీ శ్రేణిపై ప్రభావం పడిందని వాహన విడిభాగాల తయారీదారు, భారత ఆటోమోటివ్ విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) ప్రధాన కార్యదర్శి అయిన సంజయ్ సభర్వాల్‌ చెప్పారు. గతంలో ఆర్థిక తిరోగమనం లేదా మాంద్యం ఉన్నప్పుడు కమర్షియల్ వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లు లాంటి వాహనాలపైనే ఎక్కువ ప్రభావం ఉండేదని ఆయన ప్రస్తావించారు. కానీ ఈసారి ఒక్కసారిగా అమ్మకాల్లో పతనం నమోదైందన్నారు. జంషెడ్‌పూర్ కర్మాగారాలపై వేల మంది బతుకుదెరువు ఆధారపడి ఉంది. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది. విడిభాగాల తయారీదారు రూపేశ్ కర్తియార్‌కు ఉన్న రెండు కర్మాగారాలు గత నెల రోజుల్లో ఒక్క వారంపాటే పనిచేశాయి. ఇదే పరిస్థితిలో చాలా మంది తయారీదారులు ఉన్నారు. మార్కెట్ ఒక్కసారిగా పతనమైందని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని రూపేశ్ తెలిపారు. అనుకున్నదాని కన్నా వృద్ధిరేటు తక్కువగా ఉండటం వల్ల భారీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు పడిపోయాయని, ఇది తాను అర్థం చేసుకోగలనని, కానీ బైక్‌ల వంటి తక్కువ ధర ఉండే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా పడిపోయాయని ప్రస్తావించారు. మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ ఉందని, పరిస్థితి మెరుగుపడటానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. వాహన పరిశ్రమను ఆదుకొనేందుకు పన్నులు తగ్గించాలని, డీలర్లకు, వినియోగదారులకు రుణ సదుపాయాలను మెరుగుపరచాలని వాహన తయారీదారులు చాలాకాలంగా కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల వైపు మళ్లే విషయంలో ప్రభుత్వం వేగం తగ్గించుకోవాలని కూడా చాలా మంది సూచిస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలు ప్రకటించింది. వాహన రంగాన్ని ఆదుకొనేందుకు ప్యాకేజీ ప్రకటన, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చడం, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా చర్యలు ఈ జాబితాలో ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ చర్యలు సరిపోతాయా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే. దేశ ఆర్థిక వ్యవస్థ తీరును అంచనా వేసేందుకు వాహన పరిశ్రమ వృద్ధిని ఒక సంకేతంగా భావిస్తుంటారు. భారత వాహన రంగంలో ఇదే అత్యంత తీవ్రమైన పతనమని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపైనా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) అది ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఒక గ్రామం. అక్కడో గుడిసెలో యువజంట బియ్యం వారాంతం వరకు సరిపోతాయా, సరిపోవా అని మాట్లాడుకొంటోంది. ఇంతలో ఇల్లాలు తొంగి చూసి, "పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే దగ్గర్లోని ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి, సర్" అని నాతో అన్నారు. text: ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘డియర్ జిందగీ’ సినిమాలకు గౌరీ షిండే దర్శకత్వం వహించారు. పురుషాధిక్య సమాజం కాబట్టి సినిమాల్లో కూడా వారి భావాలే ప్రతిబింబిస్తాయి. కానీ నా సినిమాల్లో నన్ను నేను చిత్రించుకుంటున్నాఅని ఆమె బీబీసీతో అన్నారు. ‘‘ఎవరూ ఫెమినిస్ట్‌గా ఉండటానికి ప్రత్యేకించి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రాథమికంగా మనమంతా ఫెమినిస్టులం. అందుకే, నా సినిమాల్లో బలమైన స్త్రీ పాత్రల గురించి ప్రత్యేకంగా ఆలోచించను’’ అని గౌరీ షిండే ఈ వీడియోలో చెబుతున్నారు. ప్రొడ్యూసర్: ప్రతీక్షా ఘిల్డియాల్, రిపోర్టర్: జాహ్నవీ మూలే, కెమెరా: విష్ణువర్ధన్ ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హాలీవుడ్ తరహాలోనే.. బాలీవుడ్‌లో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయంటున్నారు బాలీవుడ్ దర్శకురాలు గౌరీ షిండే. text: స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:20గంటల సమయంలో 'బార్డర్ లైన్ బార్'లో 28ఏళ్ల ఇయాన్ డేవిడ్ లాంగ్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇయాన్ డేవిడ్ లాంగ్ అమెరికా మాజీ నౌకాదళ అధికారిగా పని చేశాడని, ప్రజలపై కాల్పులు జరిపాక, తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు విశ్వసిస్తున్నారు. బార్ యాజమాన్యం తన వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు, బుధవారం రాత్రి బార్‌లో మ్యూజిక్ నైట్ నిర్వహించారు. దాడికి పాల్పడిన వ్యక్తి.. స్మోక్ గ్రెనేడ్‌లు వాడాడని, తుపాకీతో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరుపుతుండగా, కొంతమంది కుర్చీలతో కిటికీలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. మరికొందరు టాయిలెట్లలో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నారు. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. గురువారం ఉదయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో స్పందించారు. ఈ ఘటన గురించి అధికారులు తనకు వివరించారని, ఇది ఓ భయంకరమైన సంఘటన అని ట్వీట్ చేశారు. ఆ సమయంలో విధులు నిర్వహించిన పోలీసులను అభినందించారు. నిందితుడు ఎవరు? కాల్పులు ఎలా జరిగాయి? నిందితుడు ఇయాన్ డేవిడ్ లాంగ్ నల్లటి దుస్తుల్లో వచ్చాడని, బార్ ముందున్న బౌన్సర్‌ను కాల్చి బార్‌లోకి చొరబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంగీత కార్యక్రమం జరుగుతున్న చోటుకు వచ్చి, అక్కడున్నవారి మధ్యకు స్మోక్ గ్రెనేడ్ విసిరిన తర్వాత కాల్పులు ప్రారంభించాడని వారు వివరించారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఇయాన్ మృతదేహాన్ని, ఒక హ్యాండ్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ ఒక వ్యక్తి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ''మేమంతా నేలపై పడుకున్నాం. అక్కడున్న డీజే నా ఫ్రెండే. ఆమె వెంటనే మ్యూజిక్ ఆఫ్ చేసింది. ఎక్కడచూసినా అరుపులు, కేకలు. అంతా అయోమయంగా ఉంది'' అన్నారు. బుధవారం ఇక్కడ జరిగే మ్యూజికల్ నైట్స్.. యూనివర్సిటీ విద్యార్థుల్లో చాలా పాపులర్ తన 21వ పుట్టినరోజు జరుపుకుంటున్న మరో ప్రత్యక్ష సాక్షి టేలర్ విట్లర్ మాట్లాడుతూ.. ''నేను డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉన్నాను. కాల్పుల చప్పుడు వినగానే వెనక్కు తిరిగి చూశాను. 'నేలపై పడుకోండి..!' అంటూ అందరూ అరిచారు. నేను నేలపై పడుకున్నా. చాలామంది నన్ను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఓ వ్యక్తి నా వెనుక నుంచి వచ్చి నన్ను బయటకు లాక్కువచ్చాడు'' అని అన్నారు. ''కాల్పుల సమయంలో అక్కడ ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. తక్కినవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నపుడు, తనపై కాల్పులు జరిగాయి. ఆయన వచ్చే సంవత్సరమే రిటైర్ కాబోతున్నారు'' అని షెరిఫ్ జఫ్ డీన్ అన్నారు. మృతులంతా ఎవరు? మృతుల్లో ఒకరు పోలీసు అధికారికాగా, తక్కిన 11మంది గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. బుధవారం రాత్రి జరిగిన 'మ్యూజికల్ నైట్' స్థానిక యూనివర్సిటీ విద్యార్థుల్లో చాలా పాపులర్. ఈ బార్‌లో బుధవారం రాత్రిపూట్ల జరిగే సంగీత కార్యక్రమం విద్యార్థుల కోసమే జరుగుతుందని, 18ఏళ్ల వయసువారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని బార్ వెబ్‌సైట్‌లోని సమాచారం చెబుతోంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కాలిఫోర్నియాలోని థౌజెండ్ ఓక్స్‌ నగరంలోని ఒక బార్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పోలీసు అధికారి సహా 12 మంది మృతి చెందారని, మరో పది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. text: జనం బిలాబిలా లోపలకు వెళ్లి, క్యూ కడుతున్నారు. కొంత తోపులాట కూడా కనిపిస్తోంది. క్యూ వేగంగా కదులుతోంది. మగవారు, ఆడవారు ఒక చిన్న కిటికీ దగ్గరకు వెళ్తున్నారు. అక్కడ డబ్బులు ఇచ్చి తలా ఒకటి, లేదా రెండు ఆకుపచ్చ రంగు టోకెన్లు తీసుకొంటున్నారు. అక్కడి నుంచి ఒక కౌంటరు దగ్గరకు వెళ్తున్నారు. టోకెన్లు కౌంటరులో ఇచ్చి ఆహారం తీసుకొంటున్నారు. తీసుకున్న ఆహారం తినేందుకు క్యాంటీన్ లోపల ఉన్న బల్లల వద్దకు లేదా వెలుపలకు వెళ్తున్నారు. నేను (బీబీసీ ప్రతినిధి గీతా పాండే) అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) టోకెన్లు తీసుకొన్నా. మెనూలో ఇడ్లీలు, పొంగలి, కొబ్బరి చట్నీ ఉన్నాయి. వంటకాలు బాగున్నాయి... వేడి వేడిగా... రుచికరంగా..! అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే- ఇక్కడ ఏ వంటకమైనా కేవలం ఐదు రూపాయలే! 'ఇందిర క్యాంటీన్లు' పేరుతో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఆగస్టు 16న బెంగళూరులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. ఒక కేంద్రీకృత వంటశాలలో ఆహారం వండి, సమీపంలోని క్యాంటీన్లకు తరలిస్తారు. తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందిన 'అమ్మ క్యాంటీన్ల'ను ప్రేరణగా తీసుకొని వీటిని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. తమిళనాడులో జయలలిత హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కూడా ఇలాంటి క్యాంటీన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. నేను నిరుడు అమ్మ క్యాంటీన్‌లో తిన్నాను. అక్కడ ఆహారం బాగుంది. ఇందిర క్యాంటీన్‌లో ఇంకా బాగుంది. 'రూ.25 మిగులుతోంది' ఈ క్యాంటీన్లకు ఎక్కువగా పేదలు, దినసరి కూలీలు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, యాచకులు వస్తుంటారు. బెంగళూరులో ఒక షాపింగ్ కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మొహమ్మద్ ఇర్షద్ అహ్మద్ నాతో మాట్లాడుతూ- ఇందిర క్యాంటీన్‌కు రోజూ వస్తానని చెప్పారు. ''ఇక్కడ వంటకాలు చాలా బాగుంటాయి. ఇంతకుముందు దగ్గర్లోని ఒక రెస్టారెంట్లో తినేవాణ్ని. అల్పాహారానికి రూ.30 అయ్యేది. ఇక్కడైతే 5 రూపాయలే. రూ.25 మిగులుతోంది. ప్రభుత్వం కర్ణాటక అంతటా ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది'' అని ఆయన సూచించారు. ‘‘క్యాంటీన్ వల్ల నా పని తేలికయ్యింది. క్యాంటీన్‌లో ధరలు చాలా తక్కువ’’ అని లక్ష్మి సంతోషం వ్యక్తంచేశారు. పొద్దున పూట వండే పని తప్పింది! ఇందిర క్యాంటీన్‌కు వచ్చే లక్ష్మి అనే మహిళను నేను పలకరించాను. ఆమె రోజూ మార్కెట్‌లో పండ్లు కొని, ఓ పాఠశాల వెలుపల అమ్ముతుంటారు. ''ఈ క్యాంటీన్ పుణ్యమా అని నాకు ఇంటి దగ్గర పొద్దున పూట వండే పని తప్పింది. నా పని తేలికయ్యింది. క్యాంటీన్‌లో ధరలు చాలా తక్కువ. నేను భరించగలిగిన స్థాయిలోనే ఉన్నాయి. వంటలు కూడా చాలా బాగుంటాయి'' అని లక్ష్మి సంతోషం వ్యక్తంచేశారు. క్యాంటీన్‌కు దగ్గర్లో ఒక లాడ్జీలో ఉండే మోహన్ సింగ్ అనే వ్యక్తి అయితే మూడు పూటలా ఇక్కడే తింటారు. ఇక్కడ మూడు పూటలకూ కలిపి తనకు కేవలం రూ.40 అవుతుందని, బయట తింటే బాగా ఖర్చవుతుందని, గతంలో ఇంచుమించు రూ.140 అయ్యేదని ఆయన చెప్పారు. బీబీసీ ప్రతినిధి గీతా పాండే రెండు ఇందిర క్యాంటీన్లలో ఆహారం తిని చూశారు. జయ విజయంలో అమ్మ క్యాంటీన్ల పాత్ర ఇలాంటి క్యాంటీన్ల నిర్వహణతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తుంటారు. అయితే రోజుకు కనీసం రూ.70 ఆదాయం కూడా లేని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్న భారత్‌లో ఇలాంటి పథకాలు విజయవంతమవుతున్నాయి. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విజయానికి అమ్మ క్యాంటీన్ల పథకం ఒక ప్రధాన కారణమని ఎంతో మంది విశ్లేషకులు చెబుతారు. ఓట్లపై కాంగ్రెస్ ఆశలు కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఇందిర క్యాంటీన్లను పేదల ఆకలి తీర్చేందుకే ఏర్పాటు చేశామని పాలనా యంత్రాంగం చెబుతున్నా, వచ్చే సంవత్సరం ప్రారంభంలో కర్ణాటకలో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందన్నది స్పష్టం. ఈ పథకం తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. ''పేదలకు ఆహారం అందించాలని మా ముఖ్యమంత్రి నిర్ణయించారు'' అని ఇందిర క్యాంటీన్ల వ్యవహారాలు చూసే ఉన్నతాధికారి మనోజ్ రంజన్ బీబీసీతో చెప్పారు. ''ఈ క్యాంటీన్లు ముఖ్యంగా వలసవచ్చేవారు, క్యాబ్ డ్రైవర్లు, విద్యార్థులు, ఉద్యోగాలు చేసే దంపతుల కోసం ఉద్దేశించినవి. వారనేకాదు, ఇక్కడ ఎవరైనా తినొచ్చు'' అని ఆయన వివరించారు. ఇందిర క్యాంటీన్ల పథకంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏప్రిల్‌లో ప్రకటన చేశారు. ప్రణాళికను ఆచరణలోకి తెచ్చేందుకు మనోజ్ రంజన్ బృందం రేయింబవళ్లు శ్రమించింది. ఈ క్యాంటీన్లలో వాటర్ కూలర్లు, వృద్ధులు కూర్చోవడానికి ఏర్పాట్లు, మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. రోజుకు రెండు లక్షల భోజనాలు ప్రస్తుతం బెంగళూరులో 152 ఇందిర క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో రోజూ రెండు లక్షలకు పైగా భోజనాలు అవుతున్నాయి. రోజూ మూడు లక్షల భోజనాలు అయ్యేలా నవంబరు చివర్లోగా క్యాంటీన్ల సంఖ్యను 198కి పెంచాలనే ప్రణాళికపై మనోజ్ రంజన్ బృందం పనిచేస్తోంది. ప్రభుత్వం జనవరిలోగా ఈ పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరించనుంది. అప్పుడు మొత్తం క్యాంటీన్ల సంఖ్య 300పైనే ఉంటుంది. ప్రభుత్వం మారితే ఎలా? మధ్యాహ్నం అయ్యే సరికి మళ్లీ ఆకలి వేయడంతో బెంగళూరులోనే మార్ఖమ్ రోడ్ ప్రాంతంలో ఉన్న మరో ఇందిర క్యాంటీన్‌కు వెళ్లాను. అల్పాహారం తీసుకున్న సిటీ మార్కెట్ ప్రాంతంలోని క్యాంటీన్‌తో పోలిస్తే ఇక్కడ జనం పలుచగా ఉన్నారు. తినేవారిలో ఆఫీసు వర్కర్లు, పాఠశాల విద్యార్థులు కనిపించారు. ఇక్కడ సాంబార్, అన్నం తిన్నాను. బాగుంది. నాతో పాటు భోజనం చేసిన వెంకటేశ్ అనే వ్యక్తితో నేను మాట్లాడాను. ప్రభుత్వం మారితే ఈ క్యాంటీన్లను మూసేస్తారనే అనుమానం ప్రజల్లో ఉందని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే వీటి పరిస్థితి ఏమిటని నేను మనోజ్ రంజన్‌ను అడిగాను. ''ఇది పౌరులే కేంద్రంగా ఉన్న పథకం. అధికారంలో ఎవరున్నా కొనసాగుతుంది'' అని ఆయన బదులిచ్చారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) బెంగళూరులో సిటీ మార్కెట్ సమీపంలో ఉంది ఆ క్యాంటీన్. ఉదయం ఏడు గంటలు దాటినప్పటి నుంచి దాని ముందు జనం పోగవుతున్నారు. ఏడున్నర గంటలకు తలుపులు తెరచుకున్నాయి. text: జ్వేదా నౌక నిర్మాణ కేంద్రం సమీపంలో ఒక నౌకపై జరిగిన సమావేశం తర్వాత ఇద్దరు నేతలు ఒక సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. అందులో రష్యాతో చాలా ఒప్పందాలు జరిగినట్లు ప్రధాని మోదీ చెప్పారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 మోదీ ఏం చెప్పారు వ్లాదివోస్తోక్- మోదీ వెళ్లిన రష్యా నగరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటనకు రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరం కేంద్రంగా మారింది. వ్లాదివోస్తోక్ ఒక రేవుపట్టణం. ప్రైమరీ ఏరియా అయిన ఇది ఫార్ ఈస్ట్(సుదూర తూర్పు) ఫెడరల్ జిల్లా పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రం. ఇది రష్యాకు ఆగ్నేయంగా గోల్డెన్ హార్న్ లోయ దగ్గర ఉంది. ఫార్ ఈస్ట్‌లో ఇది అతిపెద్ద ట్రైనింగ్, సైన్స్ సెంటర్. ఈ నగరంలో ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ, రష్యా సైన్స్ అకాడమీ బ్రాంచ్ ఉన్నాయి. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం వెబ్‌సైట్ ప్రకారం రష్యా రాజధాని మాస్కోకు ఇది 9,258 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2018లో ఈ నగరం జనాభా 6 లక్షలకు పైనే ఉంది. కాలంతోపాటు మారిన వ్లాదివోస్తోక్ సైబీరియన్ రైల్వే చివరి స్టేషన్ అయిన వ్లాదివోస్తోక్‌కు రైల్లో వెళ్లడానికి ఏడు రోజులు పడుతుంది. అయితే ఈ నగరానికి 159 ఏళ్ల పురాతన చరిత్ర ఉంది. 1860 జూన్‌లో రష్యా, చైనా మధ్య జరిగిన ఐగున్ సంధి తర్వాత జపాన్ సముద్రం దగ్గర గోల్డన్ హార్న్ లోయ ద్వీపాలపై రష్యా సైన్యాన్ని మోహరించింది. దీనికి వ్లాదివోస్తోక్ అనే పేరు పెట్టింది. 1890లో దాదాపు ఏడున్నర వేల జనాభా ఉన్న వ్లాదివోస్తోక్‌కు నగరం హోదా దక్కింది. 1899లో ఇక్కడ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ తెరిచారు. 20వ శతాబ్దం రాగానే ఈ చిన్న నగరం రష్యాకు, మొత్తం ఫార్ ఈస్ట్ ఏరియాకు చాలా కీలక రేవు పట్టణంగా, నౌకాదళ స్థావరంగా మారింది. సోవియట్ యూనియన్‌లో వ్లాదివోస్తోక్ నగరం ఫార్ ఈస్ట్ సాంస్కృతిక, విజ్ఞాన, పారిశ్రామిక కేంద్రంగా ఉండేది. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఆ సమయంలోనే నగరంలో మెషినరీ నిర్మాణం, నౌకా నిర్మాణం, రిపేర్లు, నిర్మాణ పరికరాల ఉత్పత్తి, చేపలు పట్టే పరికరాలు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల నిర్మాణం, కొయ్య పనుల పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. వ్లాదివోస్తోక్ నుంచి పెట్రోలియం, బొగ్గు, ధాన్యం ఎగుమతి అవుతున్నాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ దిగుమతులు జరుగుతున్నాయి. ఈ రేవుపట్టణంలో ఒక పెద్ద భాగంలో చేపలు పట్టడం, ఆ చేపలను దేశమంతా సరఫరా చేయడం జరుగుతుంటుంది. నగరంలో మూడు థియేటర్లు, ఒక ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. వ్లాదివోస్తోక్‌లో ఆధునిక జీవనవిధానంతోపాటూ గత లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ నగరంలో ఉన్న రకరకాల నిర్మాణ శైలి పశ్చిమ, తూర్పు రెండు సంస్కృతులకూ ప్రాతినిధ్యం వహిస్తుంది వ్లాదివోస్తోక్‌లో 30కి పైగా మ్యూజియంలు ఉన్నాయి. 2012 సెప్టంబర్‌లో ఏసియా-పసిఫిక్ ప్రాంతంలోని 20కి పైగా దేశాల అధినేతల ఏపీఈసీ బిజినెస్ సమ్మిట్ ఇక్కడ రస్కీ ద్వీపంలో జరిగింది. ఈ ఏడాది ఏఫ్రిల్‌లో పుతిన్ ఇదే నగరంలో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్‌తో సమావేశం అయ్యారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రష్యాలో రెండు రోజుల పర్యటన కోసం వ్లాదివోస్తోక్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. text: ప్రతీకాత్మక చిత్రం మాజీ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం పురావస్తు శాఖ పరిశోధన బృందం పర్యటించి ఆనవాళ్లు గుర్తించిందని ఈ కథనం పేర్కొంది. స్థానిక పోతుగుండు సమీపంలో కొత్తరాతియుగపు విసురుడు రాళ్ల గుంటలు, క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటి నివాసస్థలాల గుంటలు, ఆది యుగపు ముడి ఇనుము, చిట్టెపురాళ్లు, నలుపు, ఎరుపు మట్టి పాత్రలు ఉన్నాయి. వీటితోపాటు శాతవాహనుల కాలానికి చెందిన కుండ పెంకులు, పూసలు, ఇటుక రాతిముక్కలు లభించాయని పురావస్తుశాఖ అనంతపురం కార్యాలయం సహాయ సంచాలకులు రజిత తెలిపినట్లు ఈ కథనం వెల్లడించింది. బాణిగౌరమ్మ ఆలయం, మునీశ్వరస్వామి దేవాలయం వద్ద క్రీస్తుశకం 8వ శతాబ్దం నాటి మహిష మర్దిని విగ్రహం, క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటి సూర్యవిగ్రహం, రంగస్వామి బండమీద కొత్తరాతియుగపు నూరుడు గుంటలు గుర్తించామన్నారు. నీలకంఠాపురం గ్రామానికి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరం నాటి చరిత్ర ఉన్నట్టు ఆనవాళ్లు గుర్తించామని పురావస్తు శాఖ అధికారులు తెలిపినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. విగ్గులో బంగారం పేస్టును తీసుకొస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విగ్గులో బంగారం...విలువ రూ.రెండున్నర కోట్లు దుబాయి, షార్జా నుంచి ప్రత్యేక విమానాల్లో అక్రమంగా తీసుకొచ్చిన రూ.2.53 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని చెన్నై కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది. అధికారులు అందించిన వివరాల ప్రకారం చెన్నై విమానాశ్రయానికి దుబాయి, షార్జా నగరాల నుంచి ఆదివారం రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులపై అనుమానంతో ప్రత్యేకంగా సోదా చేయగా ముడి బంగారంతోపాటు తల విగ్గు, సాక్సుల్లో దాచిన బంగారం పేస్టును గుర్తించారు. ఈ బంగారం పేస్టు విలువ మొత్తం రూ.2.53 కోట్ల ఉంటుందని అధికారులు చెప్పారు. దాన్ని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని అరెస్టు చేశారు. అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దీనికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారని ఈనాడు కథనం పేర్కొంది. పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ పీఆర్సీకి ఎన్నికల సంఘం ఓకే...నేడు సీఎం ప్రకటనకు అవకాశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఫిట్‌మెంట్‌ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం పచ్చజెండా ఊపడంతో ప్రభుత్వం సోమవారం పీఆర్సీపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఉందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేస్తారని తెలిసినట్లు ఈ కథనం పేర్కొంది. రిటైర్మెంట్‌ వయసు పెంపుపైనా నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చినదానికన్నా ఎక్కువే ఇచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది. పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నా..ఎన్నికల నిబంధనల కారణంగా వాయిదా పడింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రకటించాలని భావించినా.. వెంటనే నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్‌ విడుదలచేసింది. దీంతో మరోసారి ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు శనివారం లేఖ రాసింది. దీనిపై ఎన్నికల సంఘం ఆదివారం స్పందించింది. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. అయితే ఈ అంశాన్ని ఉపయోగించుకొని ఉపఎన్నిక జరుగుతున్న జిల్లాలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు, లబ్ధి పొందే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పీఆర్సీ ప్రకటనకు మార్గం సుగమమైనట్లు ఈ కథనం పేర్కొంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పీఆర్సీపైనా, పదవీ విరమణ వయసు పెంపు, ఇతర అంశాలపైనా వీరు చర్చించినట్టు తెలిసిందని నమస్తే తెలంగాణ కథనం రాసింది. ప్రతీకాత్మక చిత్రం పాత పద్ధతిలోనే ఏపీ ఎంసెట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ సహా వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలను గతంలో మాదిరిగానే యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది. పాత విధానంలోనే ఏపీ ఎంసెట్‌-2021ను నిర్వహించనుందని ఈ కథనం తెలిపింది. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఈ మూడు సబ్జెక్టులు చదవని ఇతర గ్రూపుల ఇంటర్‌ విద్యార్థులకూ ఇంజనీరింగ్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పించేలా ఏఐసీటీఈ ఇటీవల నిబంధనలను విడుదల చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అవసరమయ్యే కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్, ఈసీఈ, సివిల్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సులకు ఆ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూనే ఇతర కోర్సులకు ఇతర గ్రూపుల విద్యార్థులను అనుమతించాలని సూచించింది. ఇందుకు 14 ఆప్షనల్‌ సబ్జెక్టులను పేర్కొంటూ వీటిలో ఏ మూడింటి కాంబినేషన్‌తో ఇంటర్‌ చదివినా ఇంజనీరింగ్‌ కోర్సుల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. అయితే అంతిమంగా ఈ నిబంధనలను అనుసరించడంపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల ఇష్టానికే వదిలేసింది. ఈ నేపథ్యంలో గతంలోని నిబంధనల ప్రకారమే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అయితే విద్యార్థులు ఇంటర్‌లో 45శాతం (రిజర్వుడ్‌ కేటగిరీలకు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంసెట్‌లో కూడా సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించనున్నారు. ఏయే అంశాలపై బోధన జరిగిందో అవే అంశాల పరిధిలో ప్రశ్నలుండేలా ఉన్నత విద్యామండలి జాగ్రత్తలు తీసుకుంటోందని సాక్షి కథనం పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) అనంత పురం జిల్లాలో పూర్వయుగపు ఆనవాళ్లు... అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం పరిసర ప్రాంతాల్లో చారిత్రక పూర్వయుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది. text: "వాళ్ల తమ్ముడు డాక్టరే. మొదట్లో ఆయనకూ అదే అనుమానం వచ్చిందట. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారట కూడా. కేన్సర్ చివరి స్టేజిలో ఉందని చెప్పారు." "అదెలా సాధ్యం? నిన్న మొన్నటి వరకూ ఆరోగ్యంగా కనిపించిన మనిషికి హఠాత్తుగా కేన్సర్ రావడమేమిటి? అది కూడా లాస్ట్ స్టేజిలో ఉండడం" " కొద్దికాలంగా చిన్న చిన్న ఇబ్బందులొస్తున్నాయట. ఆహారం అరగకపోవడం, పొట్టలో అసౌకర్యం, ఉబ్బరించినట్లుండడం వంటివి. తన వయసుకు అవన్నీ సహజమే కదా అనుకుని, చిట్కా వైద్యాలు చేసుకుంటున్నారు. తగ్గకపోవడంతో మందులేమైనా రాసిస్తారని గాస్ట్రో డాక్టర్ దగ్గరకు వెళ్లారట. ఆయనకు అనుమానం వచ్చి స్కానింగ్ చేయిస్తే ఓవరీకి కేన్సర్ అన్న విషయం బయట పడింది." అండాశయ కేన్సర్‌కు ప్రత్యేకమైన లక్షణాలు కనిపించవు అండాశయ కేన్సర్ (Ovarian cancer) కి ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. అస్పష్టమైన లక్షణాలు కనిపించినా, అవి మెనోపాజ్ వల్ల కలిగే లక్షణాలనీ, లేదా వయసు వల్ల కలిగే మార్పులనీ స్త్రీలు సరిపెట్టుకుంటారు. వ్యాధి ప్రారంభ దశలో అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అవి జీర్ణ కోశ వ్యాధి లక్షణాల వలె ఉండడం వల్ల, రోగ నిర్ధరణని తప్పుదోవ పట్టిస్తాయి. దీంతో గైనకాలజీకి సంబంధించిన నిపుణులను సంప్రదించడంలో ఆలస్యం జరుగుతుంది. అందుకే ఒవేరియన్ కేన్సర్ ని 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు. భారతీయ మహిళలకు వచ్చే కేన్సర్లలో మొదటి, రెండు స్థానాలు రొమ్ము కాన్సర్ మరియు జననేంద్రియాల కేన్సర్‌లవి కాగా అండాశయ కేన్సర్‌ది మూడో స్థానం. ఒవేరియన్ కేన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ చేరే వరకూ వ్యాధిని గుర్తించడం కష్టం. అండాశయాలు (Ovaries) ప్రతి స్త్రీకి, గర్భాశయానికి రెండువైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. అండాశయాల పని ఏమిటంటే గర్భం కోసం ప్రతి నెలా గుడ్లు(Ovum), ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం. అండాశయ క్యాన్సర్ సంభవించే రేటు 5.4 - 8/100000 మధ్య ఉంటుంది. ఈ కేన్సర్ వచ్చే రిస్క్ 35 సంవత్సరాల వయసునుండీ పెరుగుతూ , 55 - 64 సంవత్సరాల మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అండాశయ కేన్సర్‌కు కారణమేమిటి? చాలా సందర్భాలలో, అండాశయ కేన్సర్‌కు కారణం తెలియదు. అండాశయ కేన్సర్ వచ్చే రిస్క్‌ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. * వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ అండాశయ కేన్సర్ రిస్క్ ఎక్కువ. * అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక మహిళ తన జీవితకాలంలో ఎక్కువ సార్లు అండాలను విడుదల చేయడం వల్ల ఈ అండాశయ కేన్సర్ ప్రమాదం ఉంటుంది. గర్భం దాల్చినపుడు ( 9 నెలల పాటు) మరియు పాలిచ్చే స్త్రీలలో అండం విడుదల జరగదు. అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే, ఆమెకు అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ. గర్భనిరోధక మాత్ర తీసుకోవడం, గర్భవతిగా ఉండటం లేదా తల్లి పాలివ్వడం ద్వారా ఈ సంఖ్యను తగ్గించగలం. పిల్లలు లేని స్త్రీలలో, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చిన మహిళల్లో కేన్సర్ ప్రమాదం పెరుగుతుంది. జన్యుపరమైన కారణాలు * కుటుంబంలో ఎవరికైనా ఒవేరియన్ కేన్సర్ వచ్చినట్లయితే, మిగిలిన సభ్యులకు చ్చే అవకాశం ఉంది. * BRCA1 మరియు BRCA2 జన్యువులు కలిగిన స్త్రీలలో అండాశయం (Ovary) మరియు రొమ్ము కేన్సర్ ప్రమాదం ఉంది. * LYNCH II సిండ్రోమ్ ఉన్న కుటుంబాలు కూడా అండాశయ కేన్సర్ ప్రమాదం ఉంది. రొమ్ము కేన్సర్ ఉన్న మహిళలకు అండాశయ కేన్సర్ ప్రమాదం ఎక్కువ. Hormone Replacement Therapy రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలు కొందరు హార్మోన్ చికిత్స తీసుకుంటారు. హార్మోన్ చికిత్స తీసుకోని స్త్రీలతో పోల్చి చూస్తే, తీసుకునే వారిలో అండాశయ కేన్సర్ రిస్క్ అధికం. అండాశయ కేన్సర్ లక్షణాలు ఏమిటి? అండాశయపు కేన్సర్ తొలి దశలో నిర్దిష్టమైన లక్షణాలుండవు. అజీర్ణం, అలసట, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జీర్ణ క్రియలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అండాశయ కేన్సర్ ఎలా నిర్ధరణ అవుతుంది? అల్ట్రాసౌండ్ స్కాన్‌లో అండాశయం అసాధారణంగా కనిపిస్తే కేన్సర్ అనుమానించవచ్చు. రక్తంలో CA125 అనే ప్రోటీన్ యొక్క స్థాయి పెరగడం కూడా కేన్సర్‌ని సూచిస్తుంది. అండాశయ కణాలను బయాప్సీ పరీక్ష చేయడం ద్వారా వ్యాధిని నిర్ధరిస్తారు. అండాశయ కేన్సర్ రిస్క్‌ని తగ్గించుకోవడం ఎలా? ఎవరైనా స్త్రీ, 26 సంవత్సరాలకు మునుపే గర్భం దాల్చి, అది తొమ్మిది నెలలు నిండేవరకూ కొనసాగితే ఆమెకు అండాశయ కేన్సర్ రిస్క్ తగ్గుతుంది. బిడ్డలకు తల్లిపాలనివ్వడం ద్వారా ఈ రిస్క్ తగ్గుతుంది. గర్భ నిరోధక మాత్రల వాడడం (3 - 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) వల్ల ఈ రిస్క్ తగ్గుతుంది. ఫామిలీ ప్లానింగ్ (ట్యూబెక్టమీ) ఆపరేషన్, గర్భ కోశాన్ని తొలగించే హిస్టిరెక్టమీ ఆపరేషన్, తర్వాత కూడా ఈ రిస్క్ తగ్గుతుంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ వాడని స్త్రీలలోను, పొగ త్రాగని వారికీ, సరైన బరువు మెయింటైన్ చేసే స్త్రీలలో ఈ రిస్క్ తక్కువగా వుంటుంది. జీవన ప్రమాణాన్ని ఇలా అంచనా వేస్తారు కేన్సర్ సోకిన తర్వాత, లేదా చికిత్స తర్వాత తదుపరి అయిదు సంవత్సరాల రోగి జీవన ప్రమాణం ఎలా వుంటుందో అంచనా వేయడాన్ని 5 year survival rate అంటారు. తొలి దశలోని అండాశయ కేన్సర్ కు 5 year survival rate 70 శాతం ఉండగా, చివరి దశకు చేరుకున్న కేన్సర్ రోగులకు కేవలం 15 శాతం మాత్రమే వుంటుంది. అండాశయ కాన్సర్ కు 5 year survival rate తక్కువ. ఎందుకంటే చాలా తరచుగా ఇది స్టేజ్ III లేదా IV లో నిర్ధరణ అవుతుంది. ప్రారంభ దశలో కచ్చితమైన లక్షణాలు లేకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. వ్యాధి రాబోయేముందు అంచనా వేయడానికి, తొలి దశలోనే నిర్ధారించడానికి సమర్థవంతమైన స్క్రీనింగ్ పరీక్షలు లేవు. ఎందుకంటే అండాశయ క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. అండాశయ కేన్సర్ కు చికిత్స ఏమిటి? కేన్సర్ యొక్క దశననుసరించి, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు. ప్రారంభ దశలోనే నిర్ధారణ అయినట్లయితే విజయవంతమైన చికిత్సకు మంచి అవకాశం ఉంది. ఎక్కువ మంది మహిళలకు శస్త్రచికిత్స అవసరం. శస్త్రచికిత్సలో సాధారణంగా అండాశయాలు మరియు ఫెలోపియన్ ట్యూబులను గర్భాశయాన్ని, మరియు పొత్తికడుపులోని కొవ్వు కణజాల పొరను (omentum) (omentectomy) తొలిగిస్తారు. కటి లేదా ఉదరం యొక్క ఇతర ప్రాంతాలకు క్యాన్సర్ వ్యాపించి ఉంటే, శస్త్రచికిత్స ద్వారా సాధ్యమైనంతవరకు క్యాన్సర్‌ను తొలగిస్తారు. ఆ తర్వాత కూడా మీ శరీరంలో కేన్సర్ కణాలు మిగిలి ఉంటే, కీమోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు. అపోహలు, వాస్తవాలు అపోహ : ఇది బాగా వయసు మీరిన వారికి మాత్రమే వస్తుంది. వాస్తవం: నిజం కాదు. అండాశయ కేన్సర్ ఉన్న మహిళల్లో 20% మంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. అపోహ : గర్భాశయం తీసివేసే సర్జరీ (Hysterectomy) చేయించుకుంటే, అండాశయ కాన్సర్ రాకుండా నివారించవచ్చు. వాస్తవం: గర్భాశయ గొట్టాలు మరియు అండాశయాలను తొలగించడం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని 95% తగ్గిస్తుంది, కాని అండాశయ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి ఇంకా 5% అవకాశం ఉంది. పెరిటోనియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అపోహ: పాప్ స్మియర్ (Pap smear) అండాశయ క్యాన్సర్‌ను గుర్తించగలదు. వాస్తవం: తప్పు. అండాశయ క్యాన్సర్‌కు రొటీన్ స్క్రీనింగ్ పరీక్ష లేదు. (Pap smear: గర్భకోశ కింది భాగం (cervix) నుండి కణాలను సేకరించి కాన్సర్ కణాలను గుర్తించే పరీక్ష ) అపోహ: ఇది ప్రారంభ దశలో సులభంగా కనుగొనబడుతుంది. వాస్తవం: అండాశయ క్యాన్సర్ ప్రారంభ దశలో silent disease. ఇప్రారంభ దశలో కడుపు వుబ్బరం, కడుపు నొప్పి, త్వరగా ఆకలి తీరిపోవడం వంటి అస్పష్టమైన లక్షణాలుంటాయి. (వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "మీ వదిన గారికి కేన్సరేమిటి? పోయిన వారం గుడిలో చూశాను. చక్కగా పాడుతున్నారు కూడా. రిపోర్ట్ ఏమైనా పొరపాటు పడుతున్నారేమో." text: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో పౌర స్వాతంత్ర్యాలు క్షీణిస్తున్నాయని ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘డెమొక్రసీ అండర్ సీజ్’ నివేదికలో చెప్పింది. ప్రజాస్వామ్యం, అధికారికతావాదం మధ్య సంతులనంలో జరిగిన మార్పుల్లో భాగంగా భారతదేశపు స్వతంత్ర హోదా మారిందని పేర్కొంది. ఈ నివేదిక మీద భారత ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన ఏదీ రాలేదు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడమ్ హౌస్ స్వచ్ఛంద సంస్థ.. రాజకీయ స్వాతంత్ర్యం, మానవ హక్కుల అంశాల మీద పరిశోధన నిర్వహిస్తుంది. ‘స్వతంత్రం కాదు’ అనే వర్గీకరణలోకి వచ్చే దేశాల సంఖ్య 2006 తర్వాత ఇప్పుడు అత్యధికంగా ఉందని తెలిపింది. భారతదేశం ‘‘స్వతంత్ర దేశాల్లో అగ్ర స్థాయి నుంచి పతనం’’ కావటం.. ప్రపంచ ప్రజాస్వామిక ప్రమాణాల మీద మరింత నష్టదాయక ప్రభావం చూపవచ్చునని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. ‘‘2014 నుంచి మానవ హక్కుల సంస్థలపై పెరిగిన ఒత్తిడి, పాత్రికేయులు, ఉద్యమకారులకు బెదిరింపులు, ముఖ్యంగా ముస్లింల మీద దాడుల పరంపర.. దేశంలో రాజకీయ, పౌర స్వేచ్ఛలు క్షీణించటానికి కారణమయ్యాయని చెప్తోంది. ఈ పతనం 2019 తర్వాత మరింత ‘‘వేగవంతమైంద’’ని కూడా పేర్కొంది. భారతదేశంలో హిందూ జాతీయవాద పార్టీ అయిన బీజేపీ 2014 సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందింది. ఐదేళ్ల తర్వాత నరేంద్ర మోదీ మరింత ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ‘‘మోదీ నాయకత్వంలో భారతదేశం.. దేశ ఆవిర్భావ పునాదులైన సంలీనం, అందరికీ సమాన హక్కులను పణంగా పెడుతూ.. సంకుచిత జాతీయవాద ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచ ప్రజాస్వామ్య సారథిగా పనిచేయగల తన సామర్థ్యాన్ని వదిలేసిట్లు కనిపిస్తోంది’’ అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై విరుచుకుపడటం.. ప్రజాస్వామ్య రేటింగ్‌లో భారత్ పతనమవటానికి కారణమైందని పేర్కొంది. మతపరమైన అణచివేత నుంచి పారిపోయివచ్చిన వారికి ఈ చట్టం ఆశ్రయం కల్పిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే.. హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ముస్లింలను మరింత అణచివేయాలనే బీజేపీ ప్రణాళికలో భాగంగా ఈ చట్టం చేశారని విమర్శకులు అంటున్నారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వం ప్రతిస్పందన కూడా.. అంతర్జాతీయంగా స్వేచ్ఛ పతనమవటానికి కారణమైందని ఈ నివేదిక పేర్కొంది. గత ఏడాది మార్చిలో భారతదేశం ఆకస్మికంగా లాక్‌డౌన్ విధించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లక్షలాది మంది వలస కూలీలు పని లేకుండా, ఇంటికి వెళ్లటానికి అవసరమైన డబ్బులు చేతిలో లేకుండా చిక్కుకుపోయారు. ఎంతో మంది వందల కిలోమీటర్లు నడుస్తూ ఇళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో చాలా మంది తీవ్రంగా అలసిపోవటం వల్లనో, దారిలో ప్రమాదాల వల్లనో చనిపోయారు. ఇతర దేశాల గురించి ఈ నివేదిక ఏం చెప్పింది? చైనా సహా అనేక దేశాల గురించి ఈ నివేదిక ప్రస్తావించింది. కోవిడ్-19 విజృంభణ గురించి బయటికి పొక్కకుండా చేయటానికి చైనా చేసిన ప్రయత్నాల వల్ల వచ్చిన చెడ్డ పేరును తిప్పికొట్టటానికి ఆ దేశం ‘‘అంతర్జాతీయంగా తప్పుడు సమాచారం, సెన్సార్‌షిప్ కార్యక్రమాన్ని’’ వ్యాపింపచేసిందని పేర్కొంది. ఇక డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా చివరి సంవత్సరాల్లో అమెరికా కూడా ప్రజాస్వామ్య సూచీలో క్షీణించిందని ఈ నివేదిక చెప్పింది. సామూహిక ప్రజా నిరసనలు, సాయుధ మూకలతో పాటు.. ‘‘ఎన్నికల్లో తన ఓటమిని తలకిందులు చేయటానికి ట్రంప్ చేసిన దిగ్భ్రాంతికర ప్రయత్నాల’’ కారణంగా చివరికి గత జనవరిలో కాపిటల్ హిల్ మీద దాడి జరగటం.. ‘‘విదేశాల్లో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీశాయి’’ అని వ్యాఖ్యానించింది. ‘‘రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్ర్యాలు క్షీణిస్తున్న దేశాల సంఖ్య.. గత 15 ఏళ్లలో ఈ హక్కులు, స్వాంత్ర్యాలు అత్యధికంగా పెరిగిన దేశాల సంఖ్యను దాటిపోయాయి’’ అని ఈ గ్లోబల్ ఫ్రీడమ్ నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభాలో 75 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 73 దేశాల స్వాతంత్ర్య స్కోరును ఈ నివేదిక తగ్గించింది. ‘‘భారతదేశం ‘పాక్షిక స్వాతంత్ర్య’ దేశంగా క్షీణించటంతో.. ఇప్పుడు ప్రపంచ జనాభాలో 20 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే స్వతంత్ర దేశంలో నివసిస్తున్నారు. 1995 నుంచి చూస్తే ఇదే అత్యల్పం’’ అని ఆ నివేదిక వివరించింది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) భారతదేశపు ‘స్వతంత్ర’ హోదా.. ‘పాక్షిక స్వతంత్రం’గా మారిందని ‘ఫ్రీడమ్ హౌస్’ వార్షిక నివేదిక పేర్కొంది. ప్రపంచ రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలపై ఈ నివేదికను రూపొందించారు. text: అనురాధ బెంగళూరులోని ‘బిగ్ ఫ్యాట్ కంపెనీ’ అనే సంస్థను ఆమె నెలకొల్పారు. కేవలం లావుగా ఉన్నవాళ్లనే ఎంపిక చేసుకొని వారితో స్టేజీ షోలను ప్రదర్శించే సంస్థ అది. లావుగా ఉండటం వల్ల స్టేజీ షోలతో పాటు అనేక ఇతర సందర్భాల్లోనూ వివక్షకు గురైనట్లు ఆమె చెబుతారు. అందుకే తన లాంటి వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆమె బీఎఫ్‌సీని మొదలుపెట్టారు. లావుగా ఉంటే నటనకు పనికిరామా? గిరీష్ కర్నాడ్ రాసిన హాయవదన నాటకాన్ని వీళ్లు మొదట ప్రదర్శించనున్నారు. ‘గత ఇరవై ఏళ్లుగా స్టేజీ షోల్లో నాకు అత్తయ్య, రాక్షసి, పనిమనిషి లాంటి పాత్రలే దక్కాయి. లావుగా ఉండటంతో ప్రాధాన్యమున్న పాత్రలు ఎప్పుడూ రాలేదు. ఆ వివక్షను దూరం చేసేందుకు బిగ్ ఫ్యాట్ కంపెనీని నెలకొల్పా. ఇందులో అందరూ ప్లస్ సైజ్ నటులే ఉంటారు. లావుగా ఉండే నటులు దొరకడం అంత సులభం కాదు. చాలామంది వ్యక్తులు తాము లావుగా ఉన్నామని అనిపించుకోవడానికి ఇష్టపడరు. మరి కొందరు నిత్యం సన్నబడడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే తమకు తాముగా ప్లస్ సైజ్ వ్యక్తులు నటించేందుకు ముందుకు రావడానికి కాస్త ఆలస్యమైంది’ అని తన సంస్థ వెనక ఉన్న కథను అనురాధ వివరిస్తారు. ‘అందరికీ అవే ఎముకలు, నరాలు ఉంటాయి. కానీ కేవలం లావుగా ఉన్న కారణంగా మాలాంటి వాళ్లను భిన్నంగా చూస్తారు. ఇక్కడికి వచ్చాక నా ఆత్మవిశ్వాసంతో పాటు నటన పైన ఆసక్తి పెరిగింది’ అంటారు షరున్. బీఎఫ్‌సీ నాటక బృందంలో షరున్ ఒకరు. బీఎఫ్‌సీని నెలకొల్పేందుకు అనురాధ క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ‘లావుగా ఉండటం మా తప్పనీ, దానికి తామెందుకు సాయం చేయాలనీ చాలామంది భావిస్తారు. అందుకే క్రౌడ్ ఫండింగ్‌ ద్వారా ఎక్కువ డబ్బు రాలేదు’ అంటారామె. అయినా వీళ్లు అధైర్యపడలేదు. ‘మాకు మేమే అవకాశాలు కల్పించుకుంటాం. అనేక విషయాల్లో మాపై చూపే వివక్షను మేం సవాల్ చేస్తాం. స్టేజీపైన మాలాంటి వాళ్లు నటిస్తే చూడటం ఓ కొత్త అనుభూతిని పంచుతుంది’ అని చెబుతారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) '20ఏళ్ల నుంచి స్టేజీ షోల్లో నటిస్తున్నా. నాకెప్పుడూ అమ్మమ్మలూ, రాక్షసులు, అత్తయ్యల లాంటి పాత్రలే ఇస్తారు తప్ప ప్రాధాన్యమున్న పాత్రలు ఇవ్వరు. నేను లావుగా ఉండటమే దానికి కారణం’ అంటారు అనురాధ. text: చంద్రయాన్ 2 ల్యాండర్ ఆచూకీ కనిపెట్టేందుకు నాసా కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిట్ కెమెరా తీసిన చిత్రాలను సెప్టెంబర్ 26న ట్వీట్ చేసింది. అయితే ఈ చిత్రాలను రాత్రి వేళ తీసినందున విక్రమ్ ఆచూకీ స్పష్టంగా కనిపెట్టలేకపోయామని నాసా స్పష్టం చేసింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 అక్టోబరులో ఆ ప్రాంతంలో వెలుగు వస్తుందని అప్పుడు కచ్చితంగా ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనిపెడతామని నాసా తెలిపింది. చీకట్లో ఉండొచ్చు నాసా తన వెబ్ సైట్లో పేర్కొన్న కథనం ప్రకారం... సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రుడి మీద హార్డ్ ల్యాండ్ అయ్యింది. అంటే అది చంద్రుడి ఉపరితలాన్ని నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17న తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిటర్ కెమెరా 150 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ తీసిన ఫోటోలను ఇప్పుడు విడుదల చేసింది. అయితే తమ బృందాలు విక్రమ్ ల్యాండర్‌ను కానీ, అది కూలిన ప్రదేశాన్ని కూడా గుర్తించలేకపోయాయని తెలిపింది. ఈ చిత్రాలు తీసే సమయంలో చంద్రుడి మీద ప్రాంతమంతా చీకటిగా ఉంది. ఆ పెద్ద పెద్ద చీకటి ప్రాంతాల్లో ఎక్కడో విక్రమ్ ఉండి ఉండవచ్చని నాసా తన వెబ్ సైట్లో వెల్లడించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చంద్రయాన్ 2లో ఇస్రో ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని అమెరికా అంతరిక్ష సంస్థ నానా వెల్లడించింది. నాసా తాజాగా చంద్రయాన్ 2 ల్యాండింగ్ సైట్‌కి చెందిన హై రిజల్యూషన్ చిత్రాలను విడుదల చేసింది. text: 1942 అక్టోబరు 11న అమితాబ్ జన్మించారు. భారతీయ సినిమాకి చేసిన సేవలకు గుర్తింపుగా 2019 సంవత్సరానికి గాను ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు, 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయన్ని వరించాయి. మరెన్నో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు కూడా ఆయన సొంతమయ్యాయి. వీటిలో జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి. అమితాబ్ జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు... భార్య, కుమారుడు, కుమార్తెలతో... కూర్చుని పనిచేసి అలసిపోయారా... అయితే నిలబడి పనిచేయండి. (దీనికోసం అమితాబ్ ఓ ప్రత్యేక టేబుల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన తండ్రి ద్వారా ఈ సూత్రాన్ని నేర్చుకున్నానని ఆయన చెప్తారు.) యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే... షోలే చిత్రం షూటింగ్‌కి సిద్ధమవుతూ... దిల్లీలో ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా... కుమారుడు అభిషేక్‌కి కొత్త గ్యాడ్జెట్‌ని పరిచయం చేస్తూ... (ఇప్పుడైతే పిల్లలే మనకు నేర్పుతున్నారు) కాలం ఎలా గడిచిందో తెలీదు ఆడుతూ పాడుతూ.. బాలీవుడ్ బాద్‌షాతో బిగ్‌బి ప్రతి ఆదివారం సాయంత్రం తన ఇంటివద్ద చేరిన అభిమానులను కలుసుకోవడం 37 సంవత్సరాలుగా ఆయన జీవితంలో భాగమైపోయింది. మనవరాలు ఆరాధ్యతో కలసి అభిమానులకు అభివాదం చేస్తూ... నాడు - నేడు: రిషికపూర్, ప్రేమ్ చోప్రాలతో... సినిమాల్లో భాగంగా... బిగ్ బీ అంటే కేవలం స్టైల్‌ ఐకానే కాదు... బ్లడ్ కేన్సర్ బాధిత చిన్నారుల సహాయార్థం ఓ ఛారిటీ వాక్. గాయకుడిగా... అభిమానులు రూపొందించిన ఎలాంటి చిత్రమైనా అపురూపమే... ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత అగ్ర నటుల్లో ఒకరైన అమితాబ్ బచ్చన్ శుక్రవారం తన 77వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఆయన తెలుగు ప్రేక్షకులనూ అలరించారు. text: ఈ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. రిపబ్లికన్లు ఏం చెప్పారు? అమెరికా అధ్యక్ష పదవి నుంచి రిపబ్లికన్ పార్టీ నాయకుడు డోనల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలకు కొందరు రిపబ్లికన్లు కూడా మద్దతు పలుకుతున్నారు. గత వారం అమెరికా క్యాపిటల్ భవనంలో అల్లర్లకు సంబంధించి ట్రంప్‌ను అభిశంసించాలని ప్రతినిధుల సభలో మూడో సీనియర్ రిపబ్లికన్ నాయకురాలు లిజ్ చేనీ వ్యాఖ్యానించారు. తన మద్దతుదారులు చేపట్టిన ఈ నిరసనలకు బాధ్యత తీసుకునేందుకు ట్రంప్ నిరాకరించారు. జనవరి 20న ఆయన స్థానంలో జో బైడెన్ బాధ్యతలు తీసుకోనున్న సంగతి తెలిసిందే. సభలో మూడో సీనియర్ రిపబ్లికన్ నాయకురాలు లిజ్ చెనీ అభిశంసనకు మద్దతిస్తానని మాట ఇచ్చారు. "ట్రంప్ గుంపును పిలిచారు. వాళ్లను కూడగట్టారు. ఈ దాడికి ఆజ్యం పోశారు" అని ఆరోపించారు. "తన కార్యాలయానికి, రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి ఏ అమెరికా అధ్యక్షుడు, ఎప్పుడూ ఇంత పెద్ద ద్రోహం చేయలేదు" అని వ్యోమింగ్ ప్రతినిధి మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కుమార్తె అన్నారు. కనీసం నలుగురు రిపబ్లికన్ సభ్యులు తాము కూడా అభిశంసనకు అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పారు. రిపబ్లికన్ నేత, ట్రంప్ సహచరుడు కెవిన్ మెక్ కార్తీ తాను అభిశంసనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. "డెమాక్రాట్లు అధ్యక్షుడి అభిశంసనను కోరుకోవడం సంతోషం, అది ట్రంప్ రిపబ్లికన్ పార్టీని వదిలించుకోడానికి సహకరిస్తుందని నమ్ముతున్నాను" అని సెనేట్ రిపబ్లికన్ నేత మిచ్ మెక్ కనెల్ అన్నట్లు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. చరిత్రలో నిలిచిపోనున్న ట్రంప్ అయితే, అల్లర్లను రెచ్చగొట్టారనే ఆరోపణలపై ట్రంప్‌కు వ్యతిరేకంగా డెమొక్రాట్లు ప్రవేశపెడుతున్న అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం ఓటింగ్ జరిగే అవకాశముంది. ఈ తీర్మానం ఆమోదం పొందితే రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు. మరోవైపు ట్రంప్‌ స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బాధ్యతలు తీసుకొనేందుకు వీలు కల్పించే 25వ రాజ్యాంగ సవరణకు 223/205 ఓట్ల ఆధిక్యంతో మంగళవారం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే, ట్రంప్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేనని ఇప్పటికే పెన్స్ స్పష్టంచేశారు. దీంతో అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని డెమొక్రటిక్ పార్టీ నిర్ణయించింది. ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. సెనేట్‌లో ఆరోపణలపై విచారణ చేపడతారు. అనంతరం మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఈ తీర్మానాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. అంటే డెమొక్రాట్లతోపాటు 17 మంది రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. సైన్యంలో వివాహేతర సంబంధాలను నేరంగానే పరిగణించాలి: కేంద్రం అభ్యర్థనపై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు ఇష్టపూర్వక వివాహేతర సంబంధాలు (అడల్టరీ) నేరం కాదంటూ 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నుంచి సాయుధ బలగాలకు మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై విచారణకు సుప్రీం కోర్టు బుధవారం అంగీకరించింది. ఈ అంశంపై జస్టిస్ రోహింటన్ ఫలీ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం నోటీసులు జారీచేస్తూ.. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగించాలని చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకు సూచించింది. బ్రిటిష్ కాలంనాటి అడల్టరీ చట్టాన్ని 2018లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను ఇది హరిస్తోందని, మహిళలను తమ సొత్తుగా పురుషులు భావించేందుకు ఇది వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ తీర్పును సాయుధ బలగాలు స్వాగతించలేదు. స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలను నేరంగానే పరిగణించాలని సాయుధ బలగాల ప్రతినిధులు వాదించారు. ఇలాంటి సంబంధాలను నేరంగా పరిగణించకపోతే క్రమశిక్షణ పరమైన సమస్యలు తలెత్తుతాయని భద్రతా అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ తీర్పును సాయుధ బలగాలకు వర్తించకుండా చూడాలని సుప్రీం కోర్టును కేంద్రం అభ్యర్థించింది. తోటి ఉద్యోగి సతీమణితో వివాహేతర సంబంధాలు ఉంటే, దీన్ని తగని చర్యగా భావిస్తూ ఆ అధికారిని విధుల్లో నుంచి తొలగించే నిబంధనలు ఉన్నాయి. వీటికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డుపడుతోంది. మరోవైపు వివాహ బంధం పవిత్రతను కాపాడటానికి అడల్టరీ నిబంధనలు అవసరమని 2018లో కేంద్రం కూడా వ్యాఖ్యానించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా పార్లమెంటు.. క్యాపిటల్‌పై దాడి చేసేలా తన మద్దతుదారులను రెచ్చగొట్టారనే ఆరోపణలపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను పదవినుంచి దించేందుకు డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. text: పథకం ప్రకారం, అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో అత్యంత క్రూరంగా ఖషోగ్జీ హత్య జరిగినట్లు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఖషోగ్జీ శవం ఎక్కడుంది, ఎవరి ఆదేశాలతో ఈ హత్య జరిగింది అన్న ప్రశ్నలకు సౌదీ అరేబియా సమాధానం చెప్పాలని ఎర్డొగాన్ డిమాండ్ చేశారు. నిందితుల విచారణ ఇస్తాంబుల్‌లోనే జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 18 మంది అనుమానితులను సౌదీ అరేబియాలో అరెస్టు చేసినట్లు టర్కీ అధికార పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఆ హత్య జరగడానికి ముందు సౌదీకి చెందిన 15 మంది మూడు బృందాలుగా వేరువేరు విమానాల్లో ఇస్తాంబుల్‌ చేరుకున్నారని ఎర్డొగాన్ చెప్పారు. టర్కీ అధికార పార్టీ ఎంపీల సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు ఎర్డొగాన్ మాట్లాడారు. హత్యకు ఒకరోజు ముందు ఆ బృందాల్లోని కొందరు బెల్‌గ్రాడ్ అటవీ ప్రాంతానికి వెళ్లారని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలోనే ఖషోగ్జీ శవాన్ని పడేసినట్లుగా అనుమానిస్తూ టర్కీ పోలీసులు గతవారం గాలించారు. వివాహానికి సంబంధించిన పత్రాల కోసం ఖషోగ్జీ వస్తున్నారన్న విషయం ముందే తెలుసుకున్న ఆ బృందం సౌదీ కాన్సులేట్‌ భవనంలోని సీసీ కెమెరాలను ఎలా తొలగించిందో కూడా ఎర్డొగాన్ వివరించారు. అరెస్టు చేసిన ఆ 18 మందిని ఇస్తాంబుల్‌లోనే విచారించాలని, ఖషోగ్జీ హత్యలో పాత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఖషోగ్జీ హత్యకు సంబంధించి టర్కీ సేకరించిన ఎలాంటి ఆధారాలనూ ఆయన బయటకు విడుదల చేయలేదు. అనుమానితుల్లో ఇస్తాంబుల్‌కు వచ్చిన ఆ 15 మందితో పాటు, మరో ముగ్గురు కాన్సులేట్ అధికారులు ఉన్నారని ఎర్డొగాన్ చెప్పారు. ఖషోగ్జీ హత్య సౌదీ యువరాజు ఆదేశాల మేరకే జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తుండగా, ఎర్డొగాన్ మాత్రం ఆ యువరాజు పేరును ప్రస్తావించలేదు. 'ఖషోగ్జీ గెటప్‌లో సౌదీ ఏజెంట్' హత్య జరిగిన రోజే ఆ బృందంలోని ఒక వ్యక్తి ఖషోగ్జీకి చెందిన దుస్తులు, కళ్ల జోడు, గడ్డం ధరించి ఇస్తాంబుల్ నుంచి రియాద్‌కు విమానంలో వెళ్లినట్లు గుర్తించామని ఎర్డొగాన్ తెలిపారు. ఖషోగ్జీ దుస్తులు వేసుకుని, నకిలీ కళ్ల జోడు, నకిలీ గడ్డం పెట్టుకుని సౌదీకి చెందిన ఓ వ్యక్తి కాన్సులేట్ నుంచి బయటకు వెళ్తున్నట్లుగా ఉన్న దృశ్యాలను సోమవారం సీఎన్‌ఎన్ చానెల్ ప్రసారం చేసింది. సౌదీ ఏమంటోంది? ఖషోగ్జీ కాన్సులేట్ భవనం నుంచి క్షేమంగా బయటకు వెళ్లారంటూ కొన్ని రోజుల పాటు చెప్పిన సౌదీ అరేబియా, తర్వాత ఆయన మరణించారని అంగీకరించింది. కాన్సులేట్ భవనంలో జరిగిన ఒక గొడవలో ఆయన హత్యకు గురయ్యారని చెప్పింది. అయితే ఈ హత్య వెనుక సౌదీ యువరాజుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్-జుబెయిర్ ఈ హత్య ఒక 'దారుణ తప్పిదం' అని ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశంతోనే ఖషోగ్జీ హత్య జరిగిందన్న వాదనలను ఆయన ఖండించారు. ఖషోగ్జీ శవం ఎక్కడ ఉందో తనకు తెలియదని మంత్రి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరు అనుచరులను తొలగించామని చెప్పారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు జమాల్ ఖషోగ్జీ వెళ్తున్నట్లుగా ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. సౌదీ పెట్టబడుల సదస్సుపై ప్రభావం పడుతుందా? రియాద్ నగరంలో సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. అయితే, ఖషోగ్జీ హత్యను నిరసిస్తూ 40 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడంలేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నట్లు కొన్ని సంస్థలు ప్రకటించాయి. అయినప్పటికీ కొన్ని వందల కంపెనీలు హాజరవుతున్నట్లు బీబీసీ అరబ్ వ్యవహారాల ఎడిటర్ సెబాస్టియన్ ఉషర్ తెలిపారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది? (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్యకు కొన్ని రోజుల ముందే ప్రణాళిక జరిగిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ అన్నారు. text: కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బీఆర్‌కే భవన్‌లోనే వివిధ శాఖల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అధికారులు, ఉద్యోగులు ఎవరూ పాత సచివాలయంలో ఉండరాదని.. శుక్రవారం నుంచి నూతన ప్రాంగణంలో కార్యకలాపాలు చేపట్టాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది. పాత సచివాలయాన్ని కూల్చి అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) ఇదివరకే ప్రకటించారు. అయితే, విపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వాస్తు పిచ్చితో, కుమారుడిని సీఎం చేయాలన్న కాంక్షతోనే కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణం తలపెట్టారని చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ‘అస్తవ్యస్తంగా భవనాలు’ విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పాత సచివాలయంలోని లోపాలను చూపిస్తూ, కొత్తగా సమీకృత సచివాలయ భవన నిర్మాణాలను ఏ విధంగా చేపట్టనున్నది వివరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మంత్రుల బృందంతో ఓ కమిటీని వేసి, కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. పాత సచివాలయం ప్రాంగణంలో భవనాల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందన్నది కేసీఆర్ సర్కారు వాదన. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో..’ పార్కింగ్ స్థలం సరిగ్గా లేదని, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సందర్భాల్లోనూ సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేవని.. ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు కొరవడ్డాయని అంటోంది. అధికారులు, సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడం కష్టంగా ఉందని, ఫైళ్ల తరలింపులోనూ ఇబ్బందులు ఉంటున్నాయని ప్రభుత్వం వివరించింది. ఇలాంటి లోటుపాట్లు ఏవీ లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా సమీకృత సచివాలయ నిర్మిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణకే తలమానికంగా ఉండేలాగా నిర్మిస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. 25 ఎకరాల విస్తీర్ణం పాత సచివాలయం సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలోని బీ, సీ బ్లాక్‌లను 1978లో, ఏ బ్లాక్‌ను 1998లో, డీ బ్లాక్‌ను 2003లో నిర్మించారు. 2012‌లో హెచ్ (నార్త్), హెచ్ (సౌత్) బ్లాకులను కట్టారు. వీటి నిర్మాణాలు నేషనల్ బిల్డింగ్ నార్మ్స్, గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్‌కు లోబడి లేవని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే జనం కనీసం బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితి ఉందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మిస్తే, ఇప్పుడున్న నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలను ఏం చేయాలనే విషయాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోంది. తరలింపులో రెండు రకాల సవాళ్లు కొత్త సచివాలయ నిర్మించనున్న నేపథ్యంలో వివిధ శాఖల తరలింపు కీలక ఘట్టంగా మారింది. తరలింపు ప్రక్రియలో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. సాంకేతికపరమైన సవాళ్లు మొదటిది కాగా, భద్రతపరమైన సమస్యలు రెండోది. దీనిపై అటు ఐటీ శాఖ, ఇటు పోలీసు శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందించినట్లు సమాచారం. శాఖల తరలింపులో ఈ రెండు శాఖలు ఇచ్చిన సలహాలు, సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. వీలైనంత త్వరగా శాఖల తరలింపు ప్రక్రియ పూర్తిచేసి, కొత్త సచివాలయం నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల నుంచి ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందానికి అందిన గడువు ప్రతిపాదనలను కూడా ఆయన పరిశీలించారు. ఈ ప్రక్రియను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఫైళ్ల గల్లంతు, వాటిలోని కీలక డాక్యుమెంట్లు చిరగడం, మాయమవడం లాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించినట్లు సమాచారం. హైదరాబాద్లోని సచివాలయం ప్రవేశద్వారం (పాత ఫొటో) మిగిలినవి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇంటర్నెట్, వైఫై, ఇంట్రానెట్ నెట్‌వర్క్ వంటి సదుపాయాలు కూడా శాఖల తరలింపులో కీలకం. ప్రస్తుతం జీఓఐఆర్, సీఎంఆర్ఎఫ్, మీసేవ ఈ ప్రొక్యుర్ మెంట్, సమగ్ర వేదిక, ధరణి, ఐజీఆరెస్, మాభూమి, వెబ్ లాండ్, ఆరోగ్యశ్రీ, ఈ ఆఫీస్, సివిల్ సప్లైస్, ఫైనాన్స్, ఎక్సైజ్, రెవెన్యూ, ట్రెజరీ, వ్యవసాయ, పోలీసు, ఆర్టీసీ, జెన్ కో, ఈఆర్పీ లాంటి అప్లికేషన్లు, ఇతర, రాష్ట్ర, జిల్లా స్థాయి పోర్టళ్లన్నీ గచ్చిబౌలిలో ఉన్న స్టేట్ డేటా సెంటర్లో ఉన్నాయి. వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులతో సహా, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీఎస్‌లు ఇతర అధికారగణమంతా బీఆర్‌కే భవన్‌లోనే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇంకా ఏవైనా శాఖలు, విభాగాలు, సెక్షన్లు మిగిలితే వాటిని పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి తరలిస్తారు. ఐ అండ్ పీఆర్ ఆధ్వర్యంలోని పబ్లిసిటీ సెల్‌ను, సీఎంఓలో భాగంగా ఉన్న సీపీఆర్ఓ కార్యాలయాన్ని కలిపి అక్కడే ఒక క్వార్టర్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీపీఆర్ఓ కోసం బీఆర్‌కే భవన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక గదిని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణ సచివాలయం ఇప్పుడున్న చోటు నుంచి బీఆర్‌కే భవన్‌కు తరలింది. ఈ కొత్త ప్రాంగణంలో శుక్రవారం కార్యకలాపాలు మొదలయ్యాయి. చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి కూడా ఇక్కడి నుంచే పనిచేయనున్నారు. text: ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో 65 మంది, రెండో విడతలో 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా అందులో ఏడుగురు గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైనవారున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో వారినే బరిలో దించేందుకు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. టికెట్ దక్కిన మాజీ ఎంపీలు వీరే.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, రమేష్ రాథోడ్, బలరాం నాయక్, మల్లు రవి, సర్వే సత్యనారాయణలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరోవైపు వీరంతా అంతకుముందు 2009లో జరిగిన ఎన్నికల్లో గెలిచి 15వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించినవారే. రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్ గత సాధారణ ఎన్నికల్లో భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి‌గా బరిలోకి దిగిన బూర నర్సయ్యగౌడ్ .. కోమటి రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చేతిలో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన సర్వే సత్యనారాయణ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 1999 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన మల్లు రవి ఆ తర్వాత రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన జడ్చర్ల అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. మహబూబాబాద్ ఎంపీగా 2009 ఎన్నికల్లో గెలిచి మన్మోహన్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేసిన బలరాం నాయక్ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మహబూబాబాద్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసేందుకు ఈసారి టికెట్ ఇచ్చింది. మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఈసారి నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయన 15వ లోక్ సభలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు నారాయణఖేడ్‌ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. ఎంపీ రమేశ్ రాథోడ్‌కు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఎంపీలుగా ఉంటూ.. టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఈసారి అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు. పెద్దపెల్లి ఎంపీగా వ్యవహరిస్తున్న ఆయనకు టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం టికెట్ ఇచ్చింది. చెన్నూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలుకు టికెట్‌ నిరాకరించింది. టీఆర్ఎస్ తన రెండో జాబితాలో మేడ్చల్ స్థానానికి సీహెచ్ మల్లారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణ అసెంబ్లీ బరిలో ఈసారి మాజీ ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన నేతల్లో కొందరు ఈసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు. text: గుంటూరు నుంచి కాకినాడ వెళ్లి స్థిరపడిన సుబ్బయ్య చేతి వంట రుచికి కాకినాడ వాసుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఇప్పుడు హైదరాబాద్ వరకూ విస్తరించింది. 1950లో కాకినాడకి వలస వెళ్లిన గునుపూడి సుబ్బయ్య వివిధ కార్యక్రమాల్లో వంట మేస్త్రిగా పనిచేసేవారు. ఐదేళ్ల పాటు అదే రీతిలో జీవనం సాగించిన తర్వాత 1955లో కలెక్టర్ కార్యాలయానికి వెనక వీధిలో హోటల్ ప్రారంభించారు. సుబ్బయ్య హోటల్ హోటల్ లేని రోజుల నుంచే... అప్పట్లో పూట కూళ్ళమ్మ విధానం తప్ప హోటల్‌లో తినడం పెద్దగా అలవాటు లేదు. అయినా సుబ్బయ్య నిరాశ చెందకుండా తన చేతి వంట రుచి చూసిన వాళ్ళు అందించే ప్రోత్సాహంతో హోటల్ కొనసాగించారు. చివరకు ఆ హోటల్‌కి పేరు కూడా పెట్టకుండానే సుబ్బయ్య హోటల్‌గా కీర్తి గడిచింది. సుబ్బయ్య హోటల్ 64 ఏళ్లుగా కొనసాగుతోంది. సుబ్బయ్య తర్వాత రెండు తరాల వారు కూడా ఇదే హోటల్ వ్యాపారం సాగిస్తున్నారు. మరింతగా విస్తరిస్తున్నారు. నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. కాకినాడలోనే సుబ్బయ్య హోటల్ పేరుతో మూడు హోటళ్లు పక్కపక్కనే నడుపుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుబ్బయ్య మరణం తర్వాత ఇలాంటి మార్పులు వచ్చినట్టు చెబుతున్నారు. ఆప్యాయంగా వడ్డించడమే మా విధానం ఒకనాడు సుబ్బయ్య ప్రారంభించిన పంథాలో, అదే భవనంలో నేటికీ పాత హోటల్ మాత్రం కొనసాగిస్తుండడం విశేషం. ఇటీవల ప్రారంభించిన హైదరాబాద్ బ్రాంచ్‌కి కూడా మంచి ఆదరణ లభిస్తోందని గునుపూడి శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు. ప్రతి కస్టమర్ పక్కనా ఓ వ్యక్తి నిలబడి కొసరి కొసరి బలవంతంగా వడ్డించి, కడుపు నిండా కాదు, అంతకన్నా ఎక్కువగానే తినేవరకూ వదిలిపెట్టరు. అదే ఈ హోటల్ ప్రత్యేకత. "హోటల్‌కి వస్తున్న కస్టమర్లకు ఆప్యాయంగా కొసరి కొసరి భోజనం వడ్డించడం మా ప్రత్యేకత, మా సక్సెస్‌కి అది కూడా ఓ కారణం. ఎంతో ఆకలితో వచ్చిన వారికి దగ్గరుండి అడిగి మరీ వడ్డించాలని చెబుతాం. తరం మారుతున్నా.. మా భోజనం క్వాలిటీలో రాజీ పడకుండా అందిస్తున్నాం. ముఖ్యంగా అరటి ఆకులో ఇంటి భోజనం తిన్నామనే భావన అందరికీ కలగాలని ఆశిస్తున్నాం" అని ఆయన వివరించారు. అన్నం పది రకాలుగా..! సహజంగా చాలా హోటళ్లలో అన్నం వడ్డిస్తారు. కొందరు పులిహోర, ఇంకొందరు పలావు జోడిస్తారు. కానీ సుబ్బయ్య హోటల్లో మాత్రం కేవలం అన్నమే పది రూపాల్లో అందిస్తారు. టొమాటో రైస్, పన్నీర్ రైస్, జీరా రైస్ అంటూ యంగ్ జనరేషన్ రుచులను అందిస్తూనే ఆవకాయ అన్నం, పాలతో పరమాన్నం కూడా వడ్డిస్తారు. పచ్చళ్ళు, పొడులు కలుపుకుని మొత్తంగా 34 రకాల ఐటమ్స్ అరిటాకులో వడ్డించేసరికి వాటిని చూస్తేనే కడుపు నిండుతుందా అన్నట్లు ఉంటాయి. 'సుబ్బయ్య భోజనం కోసమే వచ్చాం' కాకినాడ వచ్చిన ఇతర ప్రాంతాల వారు కూడా సుబ్బయ్య హోటల్ భోజనానికి ప్రాధాన్యం ఇస్తారు. కొందరు పనిగట్టుకుని మరీ ఆ హోటల్‌కు వెళ్లి వస్తుంటారు. అలా వచ్చిన తణుకు పట్టణానికి చెందిన రాధాదేవిని బీబీసీ పలకరించింది. "పెద్దాపురం సమీపంలోని దేవస్థానానికి దర్శనం కోసం వచ్చాం. అక్కడి నుంచి వెనక్కి వెళ్లొచ్చు. కానీ సుబ్బయ్య హోటల్ భోజనం కోసం కాకినాడ వచ్చాం. భోజనం కడుపునిండుగా తినొచ్చు. రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తున్నాం" అని చెప్పారామె. ప్రస్తుతం సుబ్బయ్య హోటల్‌కు కేటరింగ్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. కాకినాడ నుంచి ఒకవైపు ఏలూరు, మరోవైపు విశాఖపట్నం దాటి కూడా కేటరింగ్ అందిస్తున్నారు. దానిలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఆర్డర్లు ఎక్కువగా వస్తుండడంతో కొన్నిసార్లు సరఫరా చేయలేని స్థితి కూడా ఉంటోందని శ్రీనివాసరావు అన్నారు. మొత్తానికి సుబ్బయ్య హోటల్ రుచులు ఇప్పుడు గోదావరి జిల్లాలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రావడం విశేషమే అంటున్నారు భోజనప్రియులు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తింటే గారెలు తినాలి… వింటే భారతం వినాలి! అనే నానుడి తెలుగునాట విశేష ప్రాచుర్యం పొందింది. గోదావరి జిల్లాల్లో దాదాపు అదే స్థాయిలో 'తింటే సుబ్బయ్య భోజనమే తినాలి...' అనేంత పాపులారిటీ ఈ హోటల్‌ది. text: భారత స్వాతంత్ర ఉద్యమంలో దండి మార్చ్‌ కీలక ఘట్టం. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి వరకు ర్యాలీగా వెళ్లి బ్రిటిష్ శాసనాలను ఉల్లంఘిస్తూ ఉప్పు తయారు చేయడమే ఈ ఉద్యమం ఉద్దేశం. అందుకే దీన్ని శాసనోల్లంఘన ఉద్యమంగానూ పిలుస్తారు. గాంధీ పిలుపు మేరకు దేశమంతా వివిధ ప్రాంతాల్లో ఉద్యమకారులు ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. మరి ఈ ఉద్యమంలో తెలుగువారి పాత్ర ఏమిటి..? తెలుగు నాట ఈ ఉద్యమం ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకుందాం. దండి మార్చ్‌లో మహాత్ముడితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు. http://www.gandhiashramsevagram.org ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రమణ్యం. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దండు నారాయణరాజును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించారు. మీరు చూడని ఇందిరాగాంధీ ఫొటోలు! త్రిపురనేని రామస్వామి టంగుటూరి ప్రకాశం పంతులు ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఇదే రోజున అంటే 1930 మార్చి 12న మహాత్మా గాంధీ 'దండి మార్చ్‌'కు పిలుపు నిచ్చారు. ఈ ఉద్యమం జరిగి 88 ఏళ్లు. text: చేసే ఉద్యోగాన్ని వదిలించుకోడానికి కొంతమంది తాము చనిపోయామనే వార్తలను కూడా ప్రచారం చేస్తారు. కొంతమంది ఉద్యోగులు బాస్‌కు తమ గురించి అబద్ధాలు చెప్పడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది అసలు ఏం చెప్పకుండా ఆఫీసు నుంచి మాయమైపోతారు. ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు కూడా ఉంటాయి. తక్షణం ఉద్యోగం వదిలేయడంలో యుఇషిరో ఓకాజాకీ, తొషియుకీ నినోలను మించిన వారు ఎక్కడా ఉండరు. గత 18 నెలల్లో వాళ్లు 1500 ఉద్యోగాలకు మంగళం పాడారు. టోక్యోలో ఉండే ఈ ఇద్దరూ స్వయంగా తమ ఉద్యోగాలు వదులుకోలేదు. వాళ్లు రూపొందించిన ఒక స్టార్టప్ కంపెనీ ఉద్యోగాలు వదిలేయాలనే వారికి సాయం చేస్తుంటుంది. "ఉద్యోగులు ఎక్కువగా జనం తమ బాస్‌కు భయపడతారు. బాస్ దానికి ఒప్పుకోడేమో అని వణికిపోతారు" అని ఓకాజాకీ చెప్పారు. జపాన్‌లో ఉద్యోగం వదలడం తప్పు జపాన్ సంస్కృతిలో ఏదైనా ఒక పనిని, ఉద్యోగాన్ని వదిలిపెట్టడం చాలా తప్పుగా భావిస్తారు. దాంతో, ఎవరైనా ఉద్యోగం వదిలేయాలని అనుకున్నా, అలా చేస్తే అందరి ముందు తప్పు చేసినవాడిలా తల దించుకోవాలేమో అని భయపడతారు. టోక్యోలోని ఎగ్జిట్(EXIT) కంపెనీ ఇలాంటి వారికోసమే పనిచేస్తుంది. వారికి 50 వేల యెన్(దాదాపు 33 వేలు) ఫీజ్ చెల్లిస్తే చాలు అన్నీ వాళ్లే చూసుకుంటారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ మీ బాస్‌కు ఫోన్ చేస్తారు. మీ తరఫున రాజీనామా కూడా ఇచ్చేస్తారు. కొన్ని విషయాల్లో మీరు ఎక్కడకూ ఫోన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలాసార్లు కంపెనీలు ఎగ్జిట్‌తో ఒప్పందం చేసుకోవాలని అనుకోవు. ఉద్యోగం వదిలేసే విషయం ఉద్యోగి స్వయంగా వచ్చి చెప్పాలని పట్టుబడతాయి. ఏదేమైనా, పని పూర్తైపోయి, ఉద్యోగం నుంచి విముక్తి కలిగితే వారి క్లయింట్ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. "ఒకసారి నా క్లయింట్ నాతో 'మీరు నిజంగా దేవుడు' అన్నారు. ఆయన పదేళ్ల నుంచీ ఉద్యోగం వదిలేయాలని అనుకున్నారు. ఆ పనిలో తను నిజంగా చాలా కష్టాలు పడ్డారు" అని ఓకాజాకీ చెప్పారు. జపాన్‌లో ఎగ్జిట్ లాగే దాదాపు 30 కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నాయని ఓకాజకీ చెప్పారు. జపాన్ సంప్రదాయం ప్రకారం ఒక ఉద్యోగి తన మొత్తం జీవితం ఒకే యజమాని దగ్గరే పనిచేస్తారు. కానీ, ఇటీవల కొన్నేళ్లుగా చాలా మంది ఉద్యోగాలు మార్చేస్తున్నారు. సంప్రదాయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అనుకోగానే సీట్లోంచి మాయమైపోతే... కార్మికుల సంఖ్య తగ్గిపోతుండడం అనేది, జపాన్‌లో కొత్త ఉద్యోగాలు వెతుక్కునేవారికి ఆ పనిని మరింత సులభంగా మార్చింది. "జనం మారుతున్నారు. కానీ సంస్కృతి మారడం లేదు. దానితోపాటు కంపెనీలు కూడా మారడం లేదు. అందుకే జనాలకు మా సాయం అవసరం అవుతోంది" అంటారు ఓకోజాకీ. 'ఉద్యోగం వదిలేస్తున్నాను' అనే నోటీసు వేరే వాళ్ల చేతికి ఇవ్వడం, సాధారణంగా రాజీనామా ఇచ్చే పద్ధతి కాదు. కానీ ఉద్యోగం ఎలా వదలాలి? అనే సందేహం చాలా మందిని తొలిచేస్తోంది అని ఆయన చెప్పారు. బాస్‌తో మాట్లాడడం అనేది ఇప్పటికీ చాలా మంచి ప్రత్యామ్నాయం. కానీ ఉద్యోగం వదిలేయాలని అనుకున్నప్పుడు ఆ నిర్ణయం చాలా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మనం వెంటనే ఉద్యోగం వదలాల్సిన అవసరం ఏదైనా ఉంటే, లేదా మనం కోరుకున్న ఉద్యోగం దొరక్కపోతే, లేదా మనం అసలు చేయలేని పనిలో కొనసాగాల్సి వస్తుంటే.. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇష్టం లేని ఉద్యోగంలో పనిచేస్తూ కొన్ని రోజుల్లోనే గందరగోళంగా వింత భాషలో మాట్లాడక ముందే మీరు ఆ సీట్లో నుంచి మాయమైపోతే ఎలా ఉంటుంది? ఆఫీసుల్లో ఇలాంటి పరిస్థితిని 'ఘోస్టింగ్' అంటారు. ఈ పదం డేటింగ్ ప్రపంచం నుంచి వచ్చింది. ఏ స్పష్టతా ఇవ్వకుండా, లేదా కారణం చెప్పకుండానే హఠాత్తుగా అన్ని సంబంధాలు తెంచుకోవడమే ఘోస్టింగ్. ప్రపంచంలో పెరుగుతున్న 'ఘోస్టింగ్' చాలా ఆఫీసుల్లో ఉద్యోగులు ఇలా చేయడం ఇప్పుడు ఎక్కువవుతోంది. గత ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దేశ ఆర్థిక స్థితిపై జారీ చేసిన తన రిపోర్టు (బేస్ బుక్)లో కూడా దీని గురించి ప్రస్తావించింది. అమెరికా వర్జీనియాలో వెబ్ డిజైన్ కంపెనీ నడిపే క్రిస్ యోకోకు కూడా ఇలాంటిదే చెప్పారు. యోకో ఒక కాంట్రాక్టర్‌కు డిజిటల్ ప్రాజెక్ట్ పని అప్పగించారు. కానీ రోజులు గడిచిపోయినా, అతడు ఆ ప్రాజెక్ట్ చేయలేదు. యోకో ఈమెయిల్ పంపించారు. ఫోన్, మెసేజ్ అన్నీ చేశారు. కానీ ఏ సమాధానం రాలేదు. చివరికి ఆ పని వేరే వాళ్లకు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత యోకోకు ఒక వ్యక్తి ఈమెయిల్ వచ్చింది. అతడు నేను ఆ కాంట్రాక్టర్ ఫ్రెండ్ అని చెప్పారు. యోకో పని ఒప్పుకున్న కాంట్రాక్టర్ కారు యాక్సిడెంటులో చనిపోయాడని చెప్పారు. కానీ, అనుమానంతో ఆ కాంట్రాక్టర్ ట్విటర్ అకౌంట్ చెక్ చేసిన యోకోకు అతను సజీవంగా ఉన్నట్టు తెలిసింది. కొన్ని రోజుల ముందే అతను ఒక పార్టీకి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. కొత్తకు వెల్‌కమ్ .. పాతకు బై బై వేరే ఉద్యోగం దొరికితే, ముందు ఉద్యోగం వదిలేస్తారు. ఉద్యోగం వదిలేయడానికి చనిపోయినట్లు అబద్ధం చెప్పించడం అనేది చాలా దారుణమైన ఉదాహరణ. కానీ, ఆఫీస్ నుంచి వెళ్లిపోవడం, బాస్‌తో అన్ని కాంటాక్ట్స్ కట్ చేసుకోవడం కూడా పెరుగుతోంది. బ్రిటన్ రీటెయిల్ సెక్టార్‌లో పనిచేసే ఒక మేనేజర్ చెప్పకుండానే ఉద్యోగం వదిలేశారు. అతని కాంట్రాక్టులో 3 నెలల నోటీస్ పిరియడ్ పూర్తి చేయాలనే షరతు ఉంది. కానీ ఆయనకు కొత్త ఉద్యోగం వచ్చింది, అక్కడ తన అవసరం చాలా ఉంది. దాంతో, అతను వెంటనే వెళ్లిపోయారు. ఇది అతని కెరీర్ ప్రారంభంలో జరిగింది. అప్పట్లో మాంద్యం ఉండేది. ఉద్యోగం వదలడం అనేది యజమానితో ఉన్న సంబంధాలు ఎంత అభద్రతతో, అస్థిరంగా ఉన్నాయి అనేదానిపై ఆధారపడి ఉంటాయని అతను చెప్పారు. "ఏడాది చివర్లో జరిగే రివ్యూలో నా కొలీగ్స్ ఉద్యోగాలు పోవాల్సింది. కానీ వాళ్లు నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే వారిని టీమ్ నుంచి ముందే తీసేశారు" అని చెప్పారు. కొన్ని సంస్థల యజమానులు ఎంత నిరాసక్తతతో ఉంటారంటే, ఒక ఉద్యోగిగా "రేపు నేను నిజానికి ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు" అని ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉద్యోగి మాత్రమే చెప్పకుండా మాయమైపోరు. ఉద్యోగాలు ఇచ్చే వారి నుంచి కూడా ఎలాంటి సంకేతాలు రావు. ఎక్కువ మందికి ఇలాంటి అనుభవం ఉంటుంది. ఉద్యోగం కోసం వేసిన అప్లికేషన్‌ అసలు ఏమయ్యిందో తెలీదు. ముఖాముఖి ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి సమాధానం కూడా అందదు. యజమాన్యం కూడా అంతే ఒక యాజమాన్యం తన దగ్గర పత్రాలు కూడా రాయించుకుందని, రిటన్ పరీక్ష కూడా ఇచ్చానని, మూడు రౌండ్ల ఇంటర్వ్యూ కూడా అయ్యాక, తనను అసలు పట్టించుకోలేదని ఒక వ్యక్తి బీబీసీతో చెప్పారు. పనిచేసేవారి గురించి సొంత శైలిలో నిర్ణయం తీసుకోవడం అనేది అభివృద్ధి చెందిన దేశాల జాబ్ మార్కెట్ మెరుగుదలకు సంకేతం అని రిక్రూట్‌మెంట్ కంపెనీ మైన్ పావర్ బ్రిటన్ ఎండీ క్రిస్ గ్రే అన్నారు. ఎవరైనా ఒక ఉద్యోగి ఎక్కడైనా దాక్కుంటే, అతడిని మేం ఏం చేయగలం అని గ్రే ప్రశ్నించారు. "మాయమైపోయిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి, పని నేర్పించడంతోనే మీరు చాలా టైం ఖర్చు చేశారు. ఇప్పుడు అతడిని వెతకడానికి మరింత సమయం వృథా చేసుకోకూడదు" అంటారు గ్రే. "ఇలాంటివి తగ్గించడానికి టాలెంట్ పూల్ ఏర్పాటు చేసుకోవాలని గ్రే సలహా ఇస్తారు. ఎంత వీలైతే అంత సంబంధాలు పెంచుకోవాలి. మన అవసరానికి ముందే వారి గురించి తెలుసుకోవాలి". "ఉద్యోగులు తక్షణ అవసరాలను చూసుకుంటూ అప్పటికప్పుడు ఉద్యోగం వదలడం సరిగానే అనిపిస్తుంది. కానీ వారు దీర్ఘకాలిక పరిణామాల గురించి కూడా ఆలోచించుకోవాలి" అంటారు. వీడ్కోలు చెప్పి వెళ్లండి "డేటింగ్ ప్రపంచం లాగే, వెళ్తూ వీడ్కోలు కూడా చెప్పని వ్యక్తి గురించి ఎవరూ మంచిగా ఆలోచించరు". ఈ ప్రవర్తనను అన్‌ప్రొఫెషనల్ అని అమెరికాలో ఉపాధి సలహాలు ఇచ్చే రాబర్ట్ హాఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాన్ ఫే అంటారు. "యజమాని అయినా, ఉద్యోగి అయినా నేను ఎవరికైనా ఎప్పుడైనా "ఏం చెప్పకుండా మాయమైపొమ్మని సలహా ఇవ్వను" అని ఆయన అన్నారు. కంపెనీల్లో భర్తీ ప్రక్రియ వేగవంతం చేసి, దరఖాస్తు చేసినవారితో స్పష్టంగా సంప్రదింపులు జరిపి తమ వంతు పని పూర్తి చేయవచ్చు. కానీ 'ఘోస్టింగ్' మిమ్మల్ని బాధపెడుతుంది. "మీ కెరియర్ తర్వాత భాగంలో ఆగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మళ్లీ తిరిగి ఎదురుపడొచ్చు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు ఎప్పటికీ తెలీదు. మీరు వద్దనుకున్న వారే మిమ్మల్ని మళ్లీ కలిస్తే, అందుకే మీకు మీరు ప్రొఫెషనల్‌గా ఉండండి. ఏదేమైనా సరే" అంటారు డాన్ ఫే. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉద్యోగం దొరకడం అందరికీ అంత సులువు కాదు, కానీ కొంతమంది ఉద్యోగం వదలడానికి కూడా అష్టకష్టాలు పడతారు. దానికోసం వాళ్లు చిత్ర, విచిత్రమైన పనులకు కూడా సిద్ధమవుతారు. text: ''నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా ఊరంటే నాకు చాలా ఇష్టం'' అని యాభై ఏళ్ల రోసీ కోస్తోయా అన్నారు. ఆమె జంతు వైద్యురాలు, వ్యాపారవేత్త. తాను 'మీగా'నని కూడా ఆమె చెబుతుంటారు. స్పానిష్‌ ప్రాంతమైన గలీసియాలో మీగా అంటే.. అతీంద్రీయ శక్తులు ఉన్న ఒక మహిళ లేదంటే తెలివితేటలు కలిగిన మహిళ, ముఖ్యంగా స్థానికంగా లభించే మూలికలు, ద్రావణాల గురించి బాగా అవగాహన ఉన్న గ్రామీణ మహిళ. గలీసియాలోని అడవుల్ని ఆనుకుని ఉన్న కోస్తా తీరం, గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చని అందాలంటే కోస్తోయాకు ఇష్టం. గలీసియా స్పెయిన్‌కు వాయవ్య కోస్తా తీరంలో ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు గ్రామాలను వదిలిపెట్టేస్తున్నారు. ''మా నాన్న ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహించేవారు. చిన్నప్పుడు నేను ఆయనతో కలసి ఇక్కడి చిన్నచిన్న గ్రామాల గుండా నడుస్తూ వెళ్లేదాన్ని. అప్పటికే ఈ గ్రామాలకు ఆదరణ తగ్గిపోతోంది'' అని ఆమె అన్నారు. ఇప్పుడు.. స్పెయిన్‌లో ప్రజల సగటు వయసు పెరుగుతోంది. జననాల రేటు తగ్గుతోంది. మౌలిక సదుపాయాల కొరత ఎక్కువవుతోంది. ఈ కారణాలన్నీ గలీసియాను దెబ్బతీశాయి. స్పెయిన్ జాతీయ గణాంక సంస్థ ఐఎన్ఈ వెల్లడించిన వివరాల ప్రకారం.. గలీసియాలో ప్రజలు వదిలేసిన గ్రామాలు 3562. ప్రతివారం వీటికి మరొక గ్రామం తోడవుతోంది. ఈ నేపథ్యంలో కొస్తోయా, ఆమె భర్త.. బ్రిటన్‌లో పుట్టిన మార్క్ అడ్కిన్‌సన్ ఇద్దరూ కలసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించి, ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గలీసియాలో మూతపడ్డ శివారు గ్రామాలకు తిరిగి ప్రజల్ని తీసుకువచ్చేందుకు వీరు మొత్తం గ్రామాలను అమ్మకానికి పెడుతున్నారు. కొస్తోయా తన వృత్తి జీవితంలో మొదటి భాగాన్ని రైతులు, వాళ్ల పశువులతో గడిపారు. 2005లో ఆమె, మార్క్ ఇద్దరూ కలసి గ్రామీణ ఆస్తులను కొనేందుకు, అమ్మేందుకు సొంతంగా ఒక కంపెనీ పెట్టారు. తొలినాళ్లలో తన ఇద్దరు కూతుళ్లతో కలసి అందమైన ఇళ్లను వెదికేందుకు రోడ్డు ప్రయాణాలు చేసేవాళ్లమని, ఆ తర్వాత గూగుల్ ఎర్త్‌పై ఆధారపడటం ప్రారంభించామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇళ్లను, గ్రామాలను అమ్మేందుకు ఇప్పుడు వాళ్లకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతోంది. అవకాశాల కోసం వెతకాల్సిన పనిలేనంతగా వాళ్లు ప్రాచుర్యం పొందారు. కొనుగోలుదారులే నేరుగా వారి వద్దకు వస్తున్నారు. బ్రిటన్, అమెరికా, స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాల నుంచే కస్టమర్లు వస్తున్నారు. (గతేడాది హాలీవుడ్ నటి గ్వినెత్ పాల్‌త్రో తన క్రిస్ట్‌మస్ బహుమతుల జాబితాలో గలీసియాలోని లుగో నగరానికి దగ్గర్లో ఉన్న ఒక పాడుబడ్డ గ్రామాన్ని చేర్చడంతో ఇంటర్నెట్‌లో ఈ వ్యాపారానికి ప్రాచుర్యం లభించింది.) అయితే, వాళ్లు తమ వ్యాపారాన్ని చాలా కష్టపడి పెంచుకున్నారు. మొత్తం గ్రామాన్ని విక్రయించడంలో చాలా కష్టమైన పని దానికి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్లను సంపాదించడమేనని రోసీ చెప్పారు. ''సరైన కొత్త యజమానిని ఎంపిక చేయడం కూడా నాకు ముఖ్యమే. నేను నా భూమిలో కొంత భాగాన్ని, గలీసియన్ చరిత్రలో కొంత భాగాన్ని అమ్ముతున్నాను'' అని ఆమె అన్నారు. ఈ మధ్యనే ఆమె ఒక ఆస్తిని లండన్‌కు చెందిన ఒక కస్టమర్‌కు విక్రయించారు. 200 మందిని పరిశీలించిన తర్వాత ఈ కస్టమర్‌ను ఆమె ఎంపిక చేశారు. ''మేం విక్రయించే గ్రామాలు.. వాటి లక్షణాలను బట్టి ఒక్కో రేటు పలుకుతుంటాయి. 50 వేల యూరోలు (రూ.39 లక్షల) కంటే తక్కువ ధర ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. 20 లక్షల యూరోలు (రూ.15 కోట్లకు పైగా) వరకూ ధర పలికేవి కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని నివాస స్థలాల ఆధారంగానే ధర ఉంటుంది. అవి ఎక్కడ ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంటి? నివాసానికి అనుకూలంగా ఉన్నాయా? లేక రిపేర్లు ఉన్నాయా? అన్నవి చూసి నిర్ణయిస్తాం'' అని కొస్తోయా వివరించారు. ఇప్పటికీ తన జంతు వైద్య వృత్తిని కొనసాగిస్తున్న కొస్తోయా ఈ మధ్యనే ఒక గ్రామాన్ని విక్రయించారు. అందులో మూడు ఇళ్లే ఉన్నాయి. అయితే, వాటి చుట్టూ విశాలమైన మైదానాలు ఉన్నాయి. ఇది వివీరో పట్టణానికి సమీపంలోని బీచ్‌కు దగ్గరగా ఉంది. దీంతో 3 లక్షల యూరోలు (రూ. 2.38 కోట్లు)కు ఈ చిన్న గ్రామాన్ని సెరెనా ఇవాన్స్‌కు విక్రయించారు. సెరెనా ఇవాన్స్, ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు ఈ చిన్న గ్రామాన్ని కొనుగోలు చేయటం పట్ల సంతోషంగా ఉన్నారు. ''మేం గలీసియాలో ఒక చిన్న ముక్కను సొంతం చేసుకున్నాం. మేం అక్కడ ఉండాలని, సమయం గడపాలని, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం'' అని బ్రిటన్‌కు చెందిన ఇవాన్స్ చెప్పారు. మిగతా గ్రామాలు తమ కొత్త యజమానుల కోసం ఎదురుచూస్తున్నాయి. ''మాకు ఇరుగుపొరుగున 30 నుంచి 40 మంది ఉండేవాళ్లు. ఇప్పుడు ఈ గ్రామాన్ని ఇలా చూస్తుండటం బాధగా ఉంది'' అని ప్రస్తుతం విక్రయానికి సిద్ధంగా ఉన్న ఒ పెన్సొ గ్రామంలో నివశించే బెనిట ఫెల్గూర పాడుబడ్డ ఇళ్లను చూపిస్తూ అన్నారు. తన పెద్ద కుమార్తె సుసానా అడ్కిన్సన్‌తో రోసీ కొస్తోయా గ్రామాల్లో జనాభా తగ్గిపోతుండటంపై 'ల ఎస్పన్న వసియ'.. 'స్పెయిన్ ఖాళీ' వంటి స్థానిక ఉద్యమాలతో స్పెయిన్‌లో చర్చ జరుగుతోంది. ఈ ఉద్యమాలు స్థానిక రాజకీయ నాయకుల దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. విదేశాల్లోని గలీసియన్లు తిరిగి వచ్చేందుకు గలీసియా ప్రాంతీయ అధ్యక్షుడు ఆల్బెర్టో నునెజ్ ఫీజూ.. రాయితీలను ప్రవేశపెట్టారు. గలీసియాలోని ఒంటరి గ్రామాల విషయంలో రోసీ కొస్తోయా ఆశాభావంతో ఉన్నారు. ''ఈ రోజుల్లో, శివారు ప్రాంతాల్లో నివసిస్తూ కూడా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంతో అనుసంధానమై ఉండొచ్చు. పాడుబడ్డ ఈ గ్రామాల్లో జనాభాను పెంచడం, స్పెయిన్‌లో జనాభాను పెంచడం.. అందమైన అనుభూతి'' అని కొస్తోయా అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) స్పెయిన్‌లోని గలీసియా ప్రాంతంలో గ్రామీణ జనాభా భారీగా తగ్గిపోతోంది. ప్రజలు గ్రామాలను వదిలిపెట్టి, పట్టణాలు, నగరాలకు వెళ్లిపోతున్నారు. ఇలా, ప్రజలు వదిలేసిన గ్రామాలను ఇప్పుడు మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. text: అయితే, వీళ్లు పాడుతున్న ప్రార్థనా గీతాలు వారి మాతృభాష అయిన కశ్మీరీలో లేవు. వీళ్లంతా జమ్మూలోని స్థానిక భాషైన డోగ్రీలో ప్రార్థనలు చేస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో తలెత్తిన హింస వాళ్లను జమ్మూకు వలస వచ్చేలా చేసింది. తమ ఊళ్లను, నివాసాలను, పొలాలను, చివరకు తమ సంస్కృతిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చారు. చివరకు, నేటి తరానికి వారి మాతృభాష కూడా రాకుండా పోయింది. కశ్మీరీ పండిట్లు: "అత్యంత దారుణ పరిస్థితుల నడుమ బతుకుతున్నాం’’ జమ్మూలో నివసిస్తున్న సుమారు 20 వేల మంది పండిట్లకు ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా తిరిగి తమ స్వస్థలానికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. "ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీరీ పండిట్లకు ఏం మేలు జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పటి వరకు కశ్మీరీ పండితులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే విషయంలో ఎలాంటి విధి విధానాలూ లేవు. ఆ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉంటోంది. మా వరకు చెప్పాలంటే ఆర్టికల్ 370 పెద్ద విషయమేం కాదు" అని ఆల్ కశ్మీరీ పండిట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రానా అన్నారు. అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న ఈ పుర్ఖూ క్యాంపులోనే కశ్మీరీ పండితులు గడపాల్సి వస్తోంది. మహిళలు మరింత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పుర్ఖూ శిబిరంలో కనీస సదుపాయాలు లేక కశ్మీరీ పండిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు "ఎలాంటి పరిస్థితుల్లో మేం ఉంటున్నామో మీరే చూడండి. ఇక్కడ పాములు, తేళ్లు తిరుగుతుంటాయి. మాకు చిన్న పిల్లలున్నారు. ఇక్కడ మరుగుదొడ్డి సదుపాయం లేదు. మాకు సాయం చేయమని కనిపించిన ప్రతి మంత్రినీ అడిగాం. అయినా, ఎలాంటి ప్రయోజనం లేదు" అని పుర్ఖూ శిబిరంలో తలదాచుకుంటున్న నీరూ చెప్పారు. "20 ఏళ్లుగా జమ్మూలోనే ఉంటున్నాను. మొదట్లో ఓ కశ్మీరీ పండిట్ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. కానీ, నేను గర్భవతిగా ఉన్న సమయంలో ఆ ఇంటి యజమాని భార్య నన్ను బయటకు గెంటేసింది. దాంతో ఇక్కడికి వచ్చాం. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు" అని శారదా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పారిశుద్ధ్య ఏర్పాట్లు లేవు నాటి హింస తర్వాత మొత్తం 40 వేల మంది కశ్మీరీ పండితులు లోయ నుంచి జమ్మూకి వచ్చారు. అయితే, వారిలో 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన వసతి కల్పించింది. మిగిలిన 20 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. అయితే, వారిలో కేవలం 5,428 కుటుంబాలకు మాత్రమే పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం. మిగిలిన వారిలో కొంతమంది ఇప్పటికీ తాత్కాలిక శిబిరాల్లోనే ఉంటుండగా, మరికొంత మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. గడచిన మూడు దశాబ్దాల్లో ఎంతో మంది కశ్మీరీ పండితులు తిరిగి లోయ ప్రాంతంలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. చాలా మంది కశ్మీర్ లోయలోని ప్రజలతో మళ్లీ సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నించారు. "మేము ఈ 30 ఏళ్లలో కశ్మీర్‌లోని ముస్లిం సోదరులతో తెగిపోయిన సంబంధాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేశాం. ఎప్పటికైనా అక్కడికి తిరిగివెళ్లాలని ఆశించాం. 370 అధికరణాన్ని రద్దు చేయడంతో ఈ 30 ఏళ్ల ప్రయత్నాలపై నీళ్లు కుమ్మరించినట్టయ్యింది. వాళ్లతో సంబంధాలు తెగిపోయాయి. మరోసారి వాళ్లూ, మేం శత్రువులమయ్యాం" అని కశ్మీరీ పండిట్ కొలిన్ చంద్రపురి అన్నారు. ఆలయంలో ప్రార్థన చేస్తున్న మహిళ శిథిలావస్థకు చేరిన పుర్ఖూ క్యాంప్‌లో ఎవరిని పలకరించినా విషాద గాథలే వినిపిస్తున్నాయి. "మాకంటూ ఏమీ లేదు. ఇల్లు కూడా లేదు. రేపు ఎవరికైనా మా గురించి చెప్పాలంటే ఏం చెప్పగలం? ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరు పిల్లనిస్తారు? బయట 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలుంటే... ఈ షెడ్డు లోపల 50 డిగ్రీలుంటోంది. ఒక్కసారి ఎవరైనా మంత్రి గారు ఇక్కడకి వచ్చి ఒక్క రాత్రి గడపి చూడమనండి, వారికి తెలుస్తుంది" అని కశ్మీరీ పండిట్ యువకుడు విమల్ కుమార్ దర్బు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జమ్మూ అభివృద్ధి ప్రాధికార సంస్థ మాత్రం దీన్ని అనధికార శిబిరంగా ప్రకటించింది. గతంలో ఇక్కడున్న నిర్వాసితులకు ఇప్పటికే వసతి సదుపాయాన్ని కల్పించామని అధికారులు అంటున్నారు. అందుకే, ఇక్కడున్న వారిని సర్కారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. "ప్రస్తుతం అక్కడున్న వారి గుర్తింపు పత్రాలను మేం పరిశీలించాల్సి ఉంది. మా దగ్గర సరైన గణాంకాలు లేవు. మా వద్ద ఉన్న సమాచారం మేరకు 20 వేల మందిలో ఇప్పటికే 5428 కుటుంబాలకు పునరావాసం కల్పించాం. మిగిలిన వారు ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు" అని రిలీఫ్ కమిషనర్ తేజ్ ప్రకాష్ భట్ తెలిపారు. లోయ నుంచి నిర్వాసితులై ఇక్కడికి వచ్చిన 40 వేల మంది కశ్మీరీ పండితుల భవిష్యత్తు సంగతేంటి, వారిని తమ స్వస్థలాలకు చేర్చే ప్రణాళిక ఏంటి అనే విషయాల గురించి ఎవరూ మాట్లడడం లేదు. దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద గానీ, కేంద్రం వద్ద గానీ లేదు. అందుకే, కశ్మీరీ పండితుల సముదాయం అనేక పరిమితుల మధ్య, పేదరికంలో జీవించాల్సి వస్తోంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జమ్మూ నగరం వెలుపల పుర్ఖూలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్న వీళ్లంతా కశ్మీరీ పండితులు. తమ కష్టాలు తీరాలని ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో వారు దైవాన్ని ప్రార్థిస్తున్నారు. text: 'టిక్‌టాక్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మేం దాన్ని పాటించే క్రమంలో ఉన్నాం. భారత చట్టాల ప్రకారం ఉన్న డాటా ప్రైవసీ, భద్రత ప్రమాణాల అవసరాలన్నిటికీ కట్టుబడే ఉంటుంది. భారత్‌లోని మా యూజర్లకు సంబంధించిన ఎలాంటి డాటాను మేం చైనా ప్రభుత్వం సహా ఏ విదేశీ ప్రభుత్వానికీ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా అలా చేయబోం. మా యూజర్ల ప్రైవసీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం'' అని ఆయన ట్వీట్ చేశారు. ‘దేశ సార్వభౌమత్వం, భద్రతకు విఘాతం’ భారత సార్వభౌమాధికారం, సమగ్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిసిందంటూ.. టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ కింద అధికారాలను ఉపయోగించుకుని ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, దేశ భద్రత, శాంతిభద్రతలకు ఈ యాప్‌లు విఘాతకరంగా వ్యవహరిస్తున్నాయని అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోందని వివరించింది. ల‌ద్దాఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల న‌డుమ తాజా నిర్ణయాన్ని భార‌త్ తీసుకుంది. చైనా యాప్‌లే అధికం... భారత ప్రభుత్వం నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి. ‘‘విదేశాల్లోని సర్వర్లకు డేటా తరలిస్తున్నారు...’’ "గ‌త‌ కొన్నేళ్లుగా ఆవిష్క‌ర‌ణ‌ల్లో భార‌త్ దూసుకెళ్తోంది. కొత్త‌ సాంకేతిక ప‌రిజ్ఞానాలు ఇక్క‌డ అవ‌త‌రిస్తున్నాయి. దేశం ప్ర‌ధాన డిజిట‌ల్ మార్కెట్‌గానూ మారింది. అదే స‌మ‌యంలో డేటా భ‌ద్ర‌త‌తోపాటు 130 కోట్ల మంది భార‌తీయుల గోప్య‌త‌‌పై ఆందోళ‌న‌లూ వ్య‌క్తం అవుతున్నాయి" అని ప్ర‌క‌ట‌న‌లో భార‌త్ పేర్కొంది. "ఇలాంటి ముప్పుల‌తో దేశ సార్వ‌భౌమ‌త్వం, భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగే అవ‌కాశ‌ముంది. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ‌కు చాలా ఫిర్యాదులూ అందాయి. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ప్లాట్‌ఫాంల‌లో కొన్ని యాప్‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. డేటా చౌర్యంతోపాటు విదేశాల్లోని స‌ర్వ‌ర్ల‌కు అన‌ధికారికంగా డేటాను త‌ర‌లిస్తున్నారని స‌మాచారం అందింది" అని వివరించింది. "ఈ డేటాను దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేవారు డేటామైనింగ్‌, ప్రొఫైలింగ్ లాంటి సాంకేతిక‌త‌లతో శోధిస్తే.. భార‌త్‌ సార్వ‌భౌమ‌త్వం, దేశ స‌మ‌గ్ర‌త‌ల‌కు ముప్పు క‌లిగే అవ‌కాశ‌ముంది. ఇది చాలా ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం. దీనిపై స‌త్వ‌ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాలి" అని ఆ ప్రకటనలో పేర్కొంది. వీటిలో కొన్ని యాప్‌ల‌ను త‌క్ష‌ణ‌మే బ్యాన్ చేయాలని ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కో-ఆర్డినేష‌న్ సెంట‌ర్‌, కేంద్ర హోం శాఖ కూడా సూచించాయని ప్రభుత్వం తెలిపింది. కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ (సెర్ట్‌-ఇన్‌)కు కూడా ఈ యాప్‌ల‌పై చాలా ఫిర్యాదులు అందాయని చెప్పింది. ఈ యాప్‌ల‌తో దేశ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగే ముప్పుంద‌ని త‌గిన స‌మాచారం అందిన త‌ర్వాతే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది. వీటిని మొబైల్‌తోపాటు ఏ ఇంట‌ర్నెట్ ఆధారిత డివైజ్‌లోనూ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. నిషేధించిన యాప్‌ల జాబితా... 1.టిక్‌టాక్‌ 2.షేర్ ఇట్‌ 3.క్వాయ్‌ 4.యూసీ బ్రౌజ‌ర్‌ 5.బైదూ మ్యాప్‌ 6.షెయిన్‌ 7.క్లాష్ ఆఫ్ కింగ్స్‌ 8.డీయూ బ్యాట‌రీ సేవ‌ర్‌ 9.హెలో 10.లైకీ 11.యూక్యామ్ మేక‌ప్‌ 12.ఎంఐ క‌మ్యూనిటీ 13.సీఎం బ్రౌజ‌ర్స్‌ 14.వైర‌స్ క్లీన‌ర్‌ 15.ఏపీయూఎస్ బ్రౌజ‌ర్‌ 16.రామ్‌వీ 17.క్ల‌బ్‌ఫ్యాక్ట‌రీ 18.న్యూస్‌డాగ్‌ 19.బ్యూటీప్ల‌స్‌ 20.వీచాట్‌ 21.యూసీ న్యూస్‌ 22.క్యూక్యూ మెయిల్‌ 23.వీబో 24.క్జెండ‌ర్‌ 25.క్యూక్యూ మ్యూజిక్‌ 26.క్యూక్యూ న్యూస్‌ఫీడ్‌ 27.బీగో లైవ్‌ 28.సెల్పీ సిటీ 29.మెయిల్ మాస్ట‌ర్‌ 30.ప్యార్ల‌ల్ స్పేస్‌ 31.ఎంఐ వీడియోకాల్‌ 32.వీ సింక్‌ 33.ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్‌ 34.వీవా వీడియో 35.మేయి టూ 36.వీగో వీడియో 37.న్యూ వీడియో స్టేట‌స్‌ 38.డీయూ రికార్డ‌ర్‌ 39.వాల్ట్ హైడ్‌ 40.క్యాషే క్లీన‌ర్‌ 41.డీయూ క్లీన‌ర్‌ 42.డీయూ బ్రౌజ‌ర్‌ 43.హ్యాగో ప్లే 44.క్యామ్ స్కాన‌ర్‌ 45.క్లీన్ మ్యాస్ట‌ర్‌ 46.వండ‌ర్ క్యామెరా 47.ఫోటో వండ‌ర్‌ 48.క్యూక్యూ ప్లేయ‌ర్‌ 49.వీ మీట్‌ 50.స్వీట్ సెల్ఫీ 51.బైడూ ట్రాన్స్‌లేట్‌ 52.వీ మేట్‌ 53.క్యూక్యూ ఇంర్నేష‌న‌ల్‌ 54.క్యూక్యూ సెక్యూరిటీ సెంట‌ర్‌ 55.క్యూక్యూ లాంచ‌ర్‌ 56.యూ వీడియో 57.వీ ఫ్లై స్టేట‌స్ వీడియో 58.మొబైల్ లెజెండ్స్‌ 59.డీయూ ప్రైవ‌సీ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత ప్రభుత్వం 59 యాప్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అందులో ఒకటైన టిక్ టాక్ స్పందించింది. ఆ సంస్థ ఇండియా హెడ్ ట్విటర్ వేదికగా తమ స్పందన తెలిపారు. text: దిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబం గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారని, పార్టీ ప్రచారానికి గద్దర్ తురుపుముక్కగా పనిచేస్తారని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ రామచంద్ర కుంతియా బీబీసీకి తెలిపారు. సుదీర్ఘ కాలం నక్సలైట్ల భావజాలానికి బహిరంగ వాహికగా ఉన్న గద్దర్.. రాహుల్ గాంధీని కలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలొచ్చాయి. కానీ, గద్దర్ దానిపై స్పష్టత ఇస్తూ తాను ఏ పార్టీలోనూ చేరలేదని చెప్పారు. తన కుమారుడు మాత్రం కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన వెల్లడించారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము చేస్తున్న కార్యక్రమాలకు మద్దతివ్వాలని రాహుల్ గాంధీని కోరినట్లు ఆయన తెలిపారు. సేవ్ ఇండియా, సేవ్ కాన్సిట్యూషన్ ప్రచారం గురించి ఆయనకు వివరించినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజలు కోరుకుంటే తాను గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. ఇవి కూడా చదవండి: 'తిత్లీ' తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్ జైపూర్‌లో జికా వైరస్... బాధితురాలికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏమిటి? 'ది క్వింట్' కార్యాలయాల్లో ఐటీ సోదాలు, 'ఎడిటర్స్ గిల్డ్‌'ను ఆశ్రయించిన రాఘవ్ బహల్ 'డోలీలో గర్భిణి' కథనానికి స్పందన.. కొండ కింద ఆరోగ్యకేంద్రం ఏర్పాటు BBC Special- కోల్లూరు... కోహినూర్ పుట్టిల్లు ప్రజాయుద్ధ నౌకగా ’విప్లవాభిమానులు’ పిల్చుకునే గద్దర్ కుటుంబసభ్యులతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. text: బంగ్లాదేశ్‌లోని ఒక ప్రాంత ప్రజలకు ఆహారం, ఆదాయానికి ఆధారమైన వరి పంటను అకాల వర్షాలు నాశనం చేసినప్పుడు వారు ఎదుర్కొన్న అనుభవమిది. 2017 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లోని సిల్హెత్ ప్రాంతంలో వరదలొచ్చాయి. వాస్తవానికి జూన్ తరువాత అక్కడ వర్షాలు కురవాలి. కానీ.. ఏప్రిల్‌లోనే అకాలంగా వర్షాలు పడడంతో వరి పంట పూర్తిగా నాశనమైంది. దీంతో రైతుల చేతికందాల్సిన పంట తుడిచిపెట్టుకుపోయింది. వారికి తిండానికి కూడా గింజలు లేని పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించే పంటలను, తిండి గింజల ద్వారా లభించే పోషకాలను వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 'నష్టపోయిన ఈ రైతులు వాతావరణ మార్పులకు కారణం కానే కాదు.. కానీ, వారే దీనికి బలయ్యార'ని బెర్లిన్‌లోని చారైట్ యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ ప్రొఫెసర్ సబీన్ గాబ్రిష్ అన్నారు. నోబెల్ ఫౌండేషన్ బెర్లిన్‌లో నిర్వహించిన ఆరోగ్య, వాతావరణ నిపుణుల సమావేశంలో సబీన్ బీబీసీతో మాట్లాడుతూ.. ''వాతావరణ మార్పుల ప్రభావానికి వారు నేరుగా లోనయ్యారు. జీవనోపాధిని, పోషకాలను కోల్పోయారు. పెరుగుతున్న దశలో వారి పిల్లలకు పంట నష్టం వల్ల పోషకాహారం అందలేదు'' అన్నారు. తీవ్రమైన పోషకాహార లోపం వర్షాలతో పంటలు నాశనం కావడానికి ముందే అక్కడి మహిళల్లో మూడొంతుల మంది ఉండాల్సిన కంటే 40 శాతం తక్కువ బరువున్నారు. వారి పిల్లలు కూడా తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అక్కడి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అక్కడెవరికీ బీమా వంటిదేమీ లేదని.. జీవనమే భారంగా ఉన్న స్థితిలో వారిని అకాలవర్షాలు మరిన్ని కష్టాల్లోకి నెట్టేశాయని ప్రొఫెసర్ సబీన్ చెప్పారు. సిల్హెత్ ప్రాంతంలో వరదల ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఒక బృందానికి ప్రొఫెసర్ సబీన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని గ్రామాలకు చెందిన సుమారు 2 వేల మంది మహిళలతో కలిసి పనిచేస్తూ వారి జీవనాన్ని, వాతావరణ పరిస్థితులు చూపుతున్న ప్రభావాన్ని ఆమె అధ్యయనం చేస్తున్నారు. వరదల కారణంగా తమ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆ మహిళల్లో సగం కంటే ఎక్కువ మంది చెప్పారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి తమకున్న ఏకైక మార్గం అప్పు తెచ్చుకోవడమేనని చెప్పారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చేవారి నుంచి రుణాలు తెచ్చుకోవడంతో ఆ కుటుంబాలన్నీ తీవ్రమైన రుణభారంలో కూరుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడడం కోసం అధ్యయన బృందం వారికి సహాయపడుతోంది. పెరట్లోనే పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుకునేలా ప్రోత్సహిస్తోంది. వాటితో పాటు కోళ్ల పెంపకంపైనా అవగాహన కల్పిస్తోంది. వరి పంటను కోల్పోవడంతో పోల్చితే ఇవన్నీ ఉపశమన చర్యలే కానీ, పూర్తిగా ఆ నష్టాన్ని భర్తీ చేయలేవని ప్రొఫెసర్ సబీన్ అన్నారు. వర్థమాన దేశాల ప్రజలు బియ్యం, ఇతర పిండిపదార్థ పంటలను పండించి తింటారు. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం వల్ల అవి ఒకప్పటిలా పోషక సమృద్ధ ఆహారాలు కావు. కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు పెరుగుతోంది వాషింగ్టన్ యూనివర్సిటీలోని గ్లోబల్ హెల్త్ విభాగ ప్రొఫెసర్ క్రిస్టీ ఎబీ పోషకాలపై జరిపిన అధ్యయనంలో బియ్యం, గోధుమలు, బంగాళాదుంపలు, బార్లీ వంటి ఆహారపదార్థాల్లో ఇప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు పెరిగినట్లు గుర్తించారు. ''ఒకప్పటితో పోల్చితే ఈ పంటలకు ఇప్పుడు తక్కువ నీరు అవసరమవుతోంది.. ఇది మంచి సంకేతం కాదు. తక్కువ నీటితో ఈ పంటలు పండడం వల్ల అవి నేలలోని సూక్ష్మపోషకాలను తగినంత గ్రహించవు'' అంటారామె. క్రిస్టినా బృందం చేసిన అధ్యయనంలో ధాన్యంలో ఉండాల్సిన 'బి' విటమిన్ గతం కంటే సగటున 30 శాతం తగ్గిందని, గర్భిణులకు కీలకమైన ఫోలిక్ యాసిడ్ కూడా ఉండాల్సిన సాధారణ స్థాయి కంటే తక్కువ ఉంటోందని తేలింది. ''చాలాదేశాల్లో ప్రజలు పిండిపదార్థులుండే ఆహారాలే తింటున్నారు. ఆ కారణంగానే సూక్ష్మపోషకాలు వారికి లభ్యం కావు. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'' వ్యాధులు విస్తరిస్తున్నాయి ''దోమల వల్ల వచ్చే వ్యాధులతో ముప్పు ఎక్కువే. అంటువ్యాధులు, అతిసారతోనూ ప్రమాదమే. భూతాపం పెరుగుతుంటే వీటి విస్తరణ పరిధి పెరుగుతోంది. అంతేకాదు ఇవి సంక్రమించడమూ ఎక్కువవుతోంది'' అంటారామె. సాధారణంగా ఉష్ణమండలంలో కనిపించే వ్యాధులు ఉత్తర దిశ దేశాలకు వ్యాపిస్తున్నాయి. పశ్చిమ నైలు ప్రాంతంలో కనిపించే వైరస్‌లు ఈసారి మొట్టమొదటగా జర్మనీలోనూ కనిపించాయి. దోమలు వీటిని మోసుకెళ్తున్నాయి. ''అంటువ్యాధుల వ్యాప్తి అనేది వాతావరణ మార్పుల ప్రభావం మన వైపు వస్తోందనడానికి సూచన'' అని ప్రొఫెసర్ సబీన్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పెరట్లో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కలు పర్యావరణానికి మంచివేనన్న సంగతి తెలిసిందే, ఇప్పుడవి వాతావరణ మార్పులపై పోరాటంలో ఆయుధాలవుతున్నాయి. text: ఎంతోదూరం కాదు.. తూర్పుగోదావరి జిల్లాలో కిషోర్ అనే ఓ యువరైతు.. ఆ ప్రాంతంలో కొత్త వ్యవసాయానికి తెరలేపారు. లిప్‌స్టిక్ తయారీకి అవసరమయ్యే గింజలను పండిస్తున్నారు. ప్రకృతి సహజంగా ఇచ్చే రంగులతో అనేక పూలు పూస్తుంటాయి. ఆ కోవకే చెందుతుంది అనాటో మొక్క. సింధూరీ, జాఫ్రా అని పిలిచే ఈ మొక్క కాయలు, గింజల నుంచి వచ్చే రంగును లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కిషోర్ అనే యువకుడు ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయం గురించి, మార్కెటింగ్ గురించి కిషోర్‌ను బీబీసీ పలకరించింది. ఆంధ్రాలో లిప్‌స్టిక్ కాయల సాగు 'ఇంటర్‌నెట్‌ ద్వారా మెరిసిన ఆలోచన' కిషోర్ భీమవరంలో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టమని కిషోర్ చెబుతున్నారు. ఏంబీఏ తరువాత తనకు కెనడాలో ఉద్యోగ అవకాశం వచ్చినా, తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక, ఇక్కడే ఉండి ఈ వ్యవసాయం ప్రారంభించానని కిషోర్ అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఇష్టమని, ఆ వ్యవసాయాన్నే కెరీర్‌గా మలుచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందరిలా వ్యవసాయాన్ని బతకడం కోసం కాకుండా, సేద్యాన్ని ఒక పరిశ్రమగా మార్చి, ఎవరూ పండించని వాణిజ్య పంటలను పండిస్తే లాభం ఉంటుందని భావించారు. దానికి సంబంధించిన పరిశోధన కూడా ప్రారంభించారు. ఇంటర్‌నెట్‌లో వెతకగా ఆయనకు అనాటో మొక్క గురించి తెలిసింది. నేచురల్ కలర్‌గా ఉండే అనాటో మొక్క గింజలను లిప్‌స్టిక్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలిసింది. దానితోపాటు ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ ఈ అనాటో మొక్కలను వాడతారు. అంతేకాదు, తూర్పు గోదావరి జిల్లాలో పలు ఏజెన్సీ ప్రాంతాల్లో, తమ ఇంటి అవసరాల కోసం గిరిజనులు ఈ మొక్కలను పెంచుకుంటారు. గిరిజనులు ఈ పంటను సింధూరి, జాఫ్రా అనే పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కలను తానే పెద్ద మొత్తంలో ఎందుకు సాగుచెయ్యకూడదని భావించారు కిషోర్. గంగవరం మండలం బర్రిమామిడి గ్రామంలో 50 ఎకరాల్లో జాఫ్రా మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఒడిదుడుకులు తప్పలేదు ప్రారంభంలో తాను చాలా ఇబ్బంది పడినట్లు కిషోర్ చెబుతున్నారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఈ జాఫ్రా పంట ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ పంట సాగు చాలా తక్కువ. ఈ జాఫ్రా పంట గురించి పూర్తిగా చెప్పే వాళ్లు కూడా పెద్దగా లేరు. పూర్తిగా ఇంటర్నెట్ మీద అధారపడ్డ కిషోర్ క్రమక్రమంగా జాఫ్రా పంటపై పట్టు సాధించారు. పెద్ద స్థాయిలో భూమి, అందునా పూర్తి నీటి సదుపాయాలు కలిగి, పొడిగా ఉండే భూమి జాఫ్రా పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పంట చేతికి వస్తుంది. ఒక్కసారి నాటిన జాఫ్రా మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు కాపు ఇస్తూనే ఉంటుందని కిషోర్ చెబుతున్నారు. మొదటి రెండేళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడినా, తర్వాత కాస్త వెసులుబాటు కలిగినట్లు ఆయన చెబుతున్నారు. 'సంతలో కిలో వంద.. అంతర్జాతీయ మార్కెట్‌లో వెయ్యి' జాఫ్రా పంటకు సరైన మార్కెటింగ్ లేదు. గిరిజనులు వారాంతపు సంతల్లో వీటిని అమ్ముతుంటారు. కిలో జాఫ్రా గింజలు రూ.80 నుంచి రూ.100వరకు ధర పలుకుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు వెయ్యి నుంచి 1200 వరకు పలుకుతుందని కిషోర్ చెబుతున్నారు. కొనుగోలుదారులు తుని నుంచి వచ్చి వీటిని కొనుక్కుని వెళతారని, గిరిజన కార్పొరేషన్ వాళ్లు కూడా వీటిని కొనడం లేదని, స్థానిక వ్యాపారులు కిలోల చొప్పున కొంటారని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పెద్దమొత్తంలో అమ్ముతామని స్థానిక కొనుగోలుదారుడు మూలా స్వామి అన్నారు. ఇప్పుడిప్పుడే ఈ జాఫ్రా పంట మీద కొత్తవారు ఆసక్తి చూపిస్తున్నారని, ఎవరైనా ఈ పంట కోసం ముందుకువస్తే వారికి సూచనలు ఇస్తానని కిషోర్ చెబుతున్నారు. ఈ సేద్యంలో కచ్చితంగా విజయం లభిస్తుందని, ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. ‘‘ఇందులో కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా భవిష్యత్తులో లాభాలు వస్తాయి’’ అని కిషోర్ అన్నారు. కాగా, తాము గత రెండేళ్ల నుంచీ అనాటో గింజలను కొనుగోలు చేస్తున్నామని గిరిజన కార్పొరేషన్ తెలిపింది. అనాటో గింజల కొనుగోలుకు కేజీకి 95 రూపాయలు కనీస మద్దతు ధర కూడా ప్రకటించామని జీసీసీ వైస్ ఛైర్మన్ బాబూరావు నాయుడు బీబీసీతో అన్నారు. (ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్ ; షూట్& ఎడిట్: నవీన్ కుమార్ .కె ;డ్రోన్ వీడియో: అజయ్) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) లిప్‌స్టిక్ రంగుల్లో మెరిసే పెదాలను, ఆ రంగు పెదాల నుంచి జాలువారే నవ్వులను చూసేవుంటారు.. కానీ ఆ పెదాలకు రంగులద్దిన లిప్‌స్టిక్‌లు ఎలా తయారవుతాయి? వాటిని వేటితో తయారు చేస్తారు? text: కానీ, కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ దేశాలకు కలిసివచ్చే అంశం ఒకటి ఉంది. ఆయా దేశాల యువత. మధ్యప్రాచ్య దేశాల జనాభాలో ఎక్కువ శాతం యువతీ యువకులే. ఈ దేశాల్లో 60 శాతం జనాభా సగటు వయసు 30 ఏళ్లకు లోపే. అందుకే, ఆ దేశాలు కోవిడ్-19 వైరస్‌కు ఘోరంగా ప్రభావితం కాకుండా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంటోంది. కరోనావైరస్ దాడి మధ్యప్రాచ్యంలోని ఎక్కువ దేశాల్లో ప్రభుత్వాల కన్ను ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అత్యంత ఘోరంగా ప్రభావితమైన దేశాలపై ఉంది. ఫలితంగా, ఆ దేశాలకు ఈ మహమ్మారి నుంచి కాపాడుకోడానికి, దానిపై పోరాటానికి సన్నద్దం కావడానికి తగినంత సమయం లభించింది. కానీ, అవి తమ దేశాల్లో కర్ఫ్యూ అమలు చేయడం, సోషల్ డిస్టన్సిగ్ లాంటి చర్యలు చేపట్టలేదు. ఏళ్ల తరబడి ఘర్షణలు, యుద్ధాల వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత అస్థిర ప్రాంతంగా మారింది. యుద్ధాలు దీని పునాదులను బలహీనం చేశాయి. కరోనావైరస్ వ్యాప్తి ఈ ప్రాంతాన్ని మరింత బలహీనం చేయవచ్చనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో కరోనా అడుగు పెట్టడానికి కారణాలు మధ్యప్రాచ్య దేశాల మధ్య వైద్య సౌకర్యాల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ఆస్పత్రులు ప్రపంచంలో ఏ దేశంలోని మంచి ఆస్పత్రులతో అయినా పోటీపడేలా ఉంటాయి. కానీ యెమెన్, సిరియా, లిబియాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎప్పుడూ బలంగా లేదు. ఏళ్ల తరబడి సాగిన యుద్ధాలు ఈ దేశాల వైద్య వ్యవస్థను, మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేశాయి. చాలా ప్రాంతాల్లో అది పూర్తిగా కుప్పకూలింది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం యెమెన్‌ మానవతా సంక్షోభంలో అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా కరోనా వ్యాప్తి మొదలైంది. దేశంలో పేదలు, జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో అది వేగంగా వ్యాపించవచ్చు. ఇది రాజకీయంగా ఎత్తుపల్లాలను చవిచూస్తోంది. గత వారం కోవిడ్-19 వల్ల ఇద్దరు చనిపోయినా, ఇక్కడ కర్ఫ్యూ అమలుకు సన్నాహాలే కనిపించడం లేదు. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ దేశాల్లో జనం గుంపులు గుంపులుగా మసీదులు, మార్కెట్లవైపు వెళ్తున్నారు కరోనావైరస్‌తో పోరాడగల అత్యధిక సామర్థ్యం ఉన్న యువత, ఇక్కడ వైరస్ వ్యాపించకముందే తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ కనిపిస్తోంది. ప్రతి దేశంలో ప్రజలు తమ ప్రభుత్వాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ అరబ్ దేశాల్లో అవినీతి, బంధుప్రీతి, సంస్కరణల డిమాండ్లు వ్యతిరేక ప్రదర్శనలకు కారణం అవుతున్నాయి. అవినీతి, ఉన్నతవర్గాలు ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నట్లు జనం ఆరోపిస్తున్నారు. ప్రజాధనాన్ని ప్రజా సేవలను మెరుగుపరచడానికి ఉపయోగించాలని వారు కోరుతున్నారు. అల్జీరియా, లెబనాన్, ఇరాక్‌ ప్రజలు ఒక అధ్యక్షుడు, ఇద్దరు ప్రధానమంత్రులు గద్దె దిగేలా చేశారు. ప్రభుత్వాలపై అసంతృప్తి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయా దేశాల ప్రజలు రాజధానుల్లో ప్రధాన కూడళ్లను ముట్టడించారు. అక్కడనుంచి కదలేది లేదని మొరాయించారు. ఇరాక్‌లో బుల్లెట్లు తగిలి 600 మంది నిరసనకారులు మృతిచెందారు. వేలమంది గాయపడ్డారు. ప్రజల నిరసనలు తగ్గకపోవడంతో పాలకులు అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన యువ నిరసనకారులు కరోనావైరస్ వల్ల ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడు వారికి కచ్చితంగా చిరాకుగానే ఉంటుంది. లాక్‌డౌన్ పూర్తయ్యాక మళ్లీ ఇళ్ల నుంచి బయటకు వస్తే, ఉద్యోగాలు సృష్టించలేని స్థితిలో తమ దేశాల ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని వారు తెలుసుకుంటారు. దాంతో వారిలో ఆగ్రహం మరింత పెరుగుతుంది. ఆర్థికవ్యవస్థకు తీవ్ర విఘాతం ఈ దేశాల్లో అధికారంలో ఉన్న శక్తుల దగ్గర ప్రత్యామ్నాయాలు మరింత పరిమితం అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ అంటే గ్లోబల్ షట్‌డౌన్ వల్ల మధ్యప్రాచ్య దేశాల్లో ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. లెబనాన్‌లో నిరసనలకు దిగిన జనం ఆర్థికవ్యవస్థ దెబ్బ తినక ముందే దారుణమైన స్థితిలో ఉన్నారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందే అక్కడి ఆర్థికవ్యవస్థ దాదాపు కుప్పకూలింది. బ్యాంకులు దివాలా తీశాయి. మధ్యప్రాచ్యంలో అగ్ర దేశాలు ప్రస్తుతం తమ ప్రతిష్టాత్మక, ఖరీదైన విదేశీ విధానాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధనబలం చూపించడం, పరోక్ష యుద్ధాలు చేయడం లాంటి రోజులు ఇప్పుడు ముగుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. థింక్ ట్యాంక్ చాటమ్ హౌస్‌లో మిడిల్ ఈస్ట్ ప్రోగ్రాం చీఫ్ లినా ఖాతిబ్ మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి దేశాలు మధ్యప్రాచ్యంలో తమ ప్రభావం పెంచుకోడానికి అమలు చేస్తున్న వ్యూహాలపై పునరాలోచించాలి. అవి తమ ప్రాధాన్యతలు మరోసారి నిర్ణయించుకోవాలి. అవి యెమెన్ లేదా సిరియాలో తమ ప్రయోజనాలను త్యాగం చేయాల్సి రావచ్చు. దాని గురించి అవి ఇంతకు ముందు ఆలోచించే ఉంటాయి” అన్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ కరోనావైరస్ వల్ల తలెత్తిన పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో చమురు ద్వారా సంపాదించే ఆ దేశాలు, మిలియనీర్ కంపెనీలు ఉన్న దేశాలు, బలహీన దేశాలు అన్నింటినీ బాధించాయి. పేద దేశాల్లో లక్షల మంది ఇప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ వల్ల పనులు ఆగిపోయి ఉండడంతో చాలా మంది పస్తులతో రోజులు గడపాల్సి వస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆంక్షల వల్ల ఇప్పటికే దారుణంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తికి ముందే ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఘోరంగా మారింది. ఇరాన్‌ కరోనా ప్రభావానికి తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ 7వేల మందికి పైగా చనిపోయారు. దేశంలో లక్షా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా విధించిన ఆంక్షలు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచాయి. ఇప్పుడు కరోనా దానిని మరింత నాశనం చేసింది. ఇరాన్ వ్యాపారం ప్రారంభించాలంటే తమ సరిహద్దులు మళ్లీ తెరవాల్సి ఉంటుంది. హజ్ యాత్ర పరిస్థితి ఏంటి? మతపరమైన యాత్రలు మధ్యప్రాచ్య దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. కానీ లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ ధార్మిక స్థలాలన్నీ మూసేయడంతో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ముస్లింలు ఇక్కడికి రావడం ఆగిపోయింది. ఇరాన్ నుంచి వచ్చే షియా యాత్రికుల వల్ల ఇరాక్‌కు బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్ వల్ల ఇప్పుడు దానికి చాలా నష్టం వచ్చింది. సౌదీ అరేబియా మక్కా నగరంలో కర్ప్యూ అమల్లో ఉంది. జులైలో ఇక్కడ ఏటా జరిగే హజ్ యాత్ర కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ముస్లింలు ఏటా ఈ యాత్రకు వస్తుంటారు. చమురు ధరల పతనం చమురు ధరలు పతనం కావడం వల్ల మధ్యప్రాచ్య దేశాలు భారీ నష్టాలను చవిచూశాయి. చమురు పుణ్యమా అని బలంగా ఉన్న ఈ దేశాల ఆర్థిక కోటలకు ఇప్పుడు బీటలు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల, సౌదీ అరేబియా తమ ఆర్థికవ్యవస్థను చమురు పరిశ్రమ నుంచి తొలగించి మళ్లించాలనే ప్రణాళికలు ప్రారంభించింది. చమురు ధరలు తగ్గడం వల్ల ఇప్పుడు అది కూడా కష్టంగా మారింది. అల్జీరియా 60 శాతం ఆదాయం దాని చమురు, గ్యాస్ నిక్షేపాల నుంచే వస్తుంది. కానీ ఆ ధరలు పడిపోవడం వల్ల అది ఇప్పుడు తమ ప్రభుత్వ వ్యయాన్ని మూడో వంతుకు తగ్గించుకుంది. కరోనావైరస్ వల్ల ఈ దేశాల్లో గతకొన్నిరోజులుగా నడుస్తున్న ఉద్యమానికి సంబంధించి వారం వారం జరిగే ఆందోళనలు ఆగిపోయాయి. కానీ వైరస్ జోరు కాస్త తగ్గినా ఆందోళనకారులు మళ్లీ వీధుల్లోకి రావచ్చు. 2011లో అరేబియాలో ఆగ్రహించిన యువత రోడ్లపైకి వచ్చింది. తమ భవిష్యత్తును లాగేసుకుంటున్నటారని వారంతా ఆరోపించారు. కానీ కాలంతోపాటూ మారుతూ వచ్చిన వారి ఆశయాలు దారితప్పాయి లేదంటే ముక్కలయ్యాయి. ఇప్పుడు మహమ్మారి దాడికి ముందు వారిలో మరోసారి రగులుతున్న అగ్నిపర్వతం కనిపిస్తోంది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనావైరస్ కల్లోలం కొనసాగుతోంది. మధ్యప్రాచ్య దేశాలు కూడా ఈ మహమ్మారికి భయపడ్డానికి చాలా కారణాలు ఉన్నాయి. text: హైదరాబాద్ లోని అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన గాంధీలో కరోనాకు చికిత్స తీసుకుని కోలుకున్న ఒక మహిళ బీబీసీతో చెప్పిన మాటలు ఇవి. ఆ ఆసుపత్రికి ఆమె దండం పెడుతున్నన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఒక తెలుగు పత్రిక ప్రతినిధి అనుకోకుండా ఆ ఫోటో తీశారు. ఆ ఫోటోలోని మహిళ గాంధీ ఆసుపత్రికి ఎందుకు దండం పెడుతున్నారో తెలుసుకోడానికి బీబీసీ ఆమెతో. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడింది. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే. మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఆ 40 ఏళ్ల గృహిణి, తన వివరాలు బయటపెట్టవద్దని కోరారు. ఆరోగ్యం బాలేకపోతే మంచిర్యాలలో చూపించుకున్నాను. టైఫాయిడ్, మలేరియాకు వైద్యం చేశారు. సెలైన్ పెట్టారు. ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకున్నాను. కానీ తగ్గలేదు. పైగా ఆయాసం పెరిగిపోయింది. అప్పటికే వారమైంది. అప్పుడు సీటీ స్కాన్ చేయిస్తే కోవిడ్ అన్నారు. గవర్నమెంటు ఆసుపత్రికి వెళ్లమని డాక్టర్లు చెప్పారు. దీంతో గాంధీకి వచ్చాం. లక్షణాలు మొదలైన 8 రోజుల తరువాత అక్కడ చేరాను గాంధీలో చేరిన మొదటి రెండు రోజులూ సీరియస్ గానే ఉంది. ఆక్సిజన్ పెట్టారు. చికిత్స చేశారు. తరువాత డేంజర్ నుంచి బయటపడ్డాను. డాక్టర్లు, నర్సులు అందరూ బాగా చూసుకునేవారు. డాక్టర్లు రోజుకు కనీసం రెండుసార్లు తగ్గకుండా వచ్చేవారు. అవసరాన్ని బట్టి 3-4 సార్లు వచ్చేవారు. ఇక నర్సులెప్పుడూ అక్కడే తిరుగుతుండేవారు. బాత్రూం లాంటి విషయాల్లో సాయం చేసే సిబ్బంది, వార్డు బయట ఉండేవారు. పిలిస్తే వచ్చేవారు. కోవిడ్ వార్డు కాబట్టి వాళ్లు లోపలుండడానికి లేదు. వాళ్లు కూడా ఎప్పుడూ ఏ పనికీ విసుక్కోలేదు. ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. విపరీతంగా మందులు వాడడం వల్ల చాలా మందికి నాలుకపై పొక్కులు వచ్చేవి. ఏమీ తినలేకపోయేవారు. వాటికీ మందులు ఇచ్చారు. ఆ టైంలో, ఆ పరిస్థితిలో ఎక్కడకు పోయినా, ఎంత డబ్బు పెట్టినా బతుకుతానని నాకు నమ్మకం లేదు. అనుభవిస్తే కానీ ఆ బాధ అర్థం కాదు. బయట ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బయటపడేదాన్ని కాదేమో. అందుకే గాంధీ ఆసుపత్రి నాకో గుడిలా కనిపించింది. ప్రాణాలతో బయటపడ్డా.. అందుకే నిజంగా దండం పెట్టాలనిపించింది. బయటికీ ఇక్కడికీ ఒకటే తేడా. బయట డబ్బుతో నడుస్తుంది. ఇక్కడ అభిమానంతో నడుస్తుంది. వారు డబ్బు ఆశించకుండా బాగా చేశారు. ఆఖరికి అక్కడ పనిచేసే కింది స్థాయి సిబ్బంది కూడా మమ్మల్ని డబ్బు అడగలేదు. బాదం -ఎండు ద్రాక్ష భోజనం బాగా పెట్టారు. ఆరోగ్యవంతమైన ఆహారం ఇచ్చారు. ఉదయం ఇడ్లీ వంటివి ఇచ్చేవారు. తరువాత స్నాక్స్, టీ, బిస్కెట్ లు ఇచ్చారు. మధ్యాహ్నం మళ్లీ అన్నం, చపాతీ కూరలు ఇచ్చేవారు. సాయంత్రం మళ్లీ స్నాక్స్, టీ, బిస్కెట్స్. వీటితో పాటూ బాదంపప్పు, జీడిపప్పు, కిస్మిస్ లాంటి ఎనర్జీ ఫుడ్ పెట్టారు. సాయంత్రం జ్యూస్, బాదంపాలు లాంటివి ఇచ్చేవారు. రాత్రికి రైస్, కర్రీస్ ఇచ్చారు. ఇక ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా గుడ్డు పెట్టేవారు. రోగులు ఆ ఆహారం వల్లే కోలుకుంటున్నట్లు అనిపిస్తుంది. నేను మొదట్లో ఇది చూసి, తెలిసిన వాళ్ల ద్వారా వచ్చేవాళ్లకీ, రికమండేషన్ ఉన్న వారికే అవన్నీ ఇస్తారేమో అనుకున్నా. కానీ అందరికీ ఇస్తున్నారని తర్వాత తెలిసింది. సర్కార్ దవాఖానా ఇలా ఉంటుందనుకోలేదు నేను గవర్నమెంటు ఆసుపత్రిలో ఉండడం ఇదే మొదటిసారి. ఊహించిన దానికీ ఇక్కడ వాస్తవానికీ చాలా తేడా ఉంది. బయట జనం అనుకునేదానికీ ఇక్కడ జరుగుతున్నదానికీ పొంతన లేదు. గవర్నమెంటు ఆసుపత్రి ఇలా ఉంటుందా, ఇంత బాగా చూసుకుంటారా అన్న విషయం అక్కడ ఉంటే తప్ప అర్థం కాలేదు. ఆసుపత్రి కూడా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ రెండు రోజులు ఉన్నాక నాకు ధైర్యం వచ్చింది. ఇంక వీళ్లు చూసుకుంటారన్న నమ్మకం ఏర్పడింది. మొత్తం ఐదు రోజులు ఆక్సిజన్ మీద ఉన్నాను. అక్కడ చికిత్స బావుంది. చాలా మంచిగా చూసుకున్నారు. గవర్నమెంటు ఆసుపత్రులు గురించి కొంచెం అవగాహన కల్పిస్తే, భయం పోయేలా ధైర్యం చెబితే బావుంటుంది'' అంటూ తన అనుభవాన్ని వివరించారు ఆ మహిళ ప్రైవేటులో రోజుకు 60 వేలు.. అయినా గ్యారంటీ లేదన్నారు. ఎప్పుడూ గాంధీ ఆస్పత్రికి వెళ్లలేదని, అక్కడ వాటర్ బాటిల్ సహా అన్నీ వాళ్లే ఇచ్చారని ఆ మహిళ కుమారుడు బీబీసీకి చెప్పారు. "అమ్మకు ఆస్థమా ఉంది. జ్వరం వచ్చి, రుచి పోయింది. మంచిర్యాలలో వారం పాటు చూపించినా తగ్గలేదు, పైగా సీరియస్ అయింది. మంచిర్యాలలో ఆరా తీస్తే, రోజుకు 60-70 వేలు అవుతుందన్నారు. అది కూడా మందులు కాకుండా. దానికితోడు రెమిడిసివిర్ ఇంజెక్షన్ మేమే తెచ్చుకోవాలన్నారు. అప్పటికీ పేషెంట్‌కు గ్యారెంటీ లేదన్నారు. ఇవన్నీ కాదని గాంధీకి తీసుకొచ్చాం. గాంధీకి రాగానే అన్నీ వివరాలూ అడిగి, తెలుసుకున్నారు. ఒక అరగంట తరువాత బెడ్ ఇచ్చారు. మేం మా అమ్మకు ఒక ఫోన్ ఇచ్చాం. అంతే. మళ్లీ కలుసుకోలేదు. చికిత్స పూర్తయి 23న డిశ్చార్జి అయింది" అని వివరించారు. అయితే, శుక్రవారం డిశ్చార్జి అయ్యాక మరో రెండు రోజులు ఐసోలేషన్ లో ఉండమని డాక్టర్లు సూచించారని, వీలుంటే మళ్లీ ఆదివారం తీసుకురమ్మన్నారని చెబుతూ, " ఆదివారం మళ్లీ గాంధీకి తీసుకువెళ్లాం అమ్మని చెక్ చేశాక ఇక మీరు మామూలుగా ఉండవచ్చు, ఏ ప్రాబ్లం లేదు అన్నారు. అప్పుడు బయటకు రాగానే, మా అమ్మ ఆసుపత్రివైపు తిరిగి దండం పెట్టింది. ప్రాణం లేచొచ్చింది అన్న సంతోషంలో" అన్నారు ఆమె కుమారుడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "బయట ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలతో బయటపడేదాన్ని కాదేమో. అందుకే గాంధీ ఆసుపత్రి నాకో గుడిలా కనిపించింది". text: పర్యావరణ సమస్యల మీద అవగాహన పెంపొందించటంలో పదహారేళ్ల గ్రెటా థన్‌బర్గ్ లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. కానీ ఆమె పర్యావరణం కోసం పోరాడటానికి బడి మానేస్తుండటాన్ని తాను సమర్థించనని ఆమె తండ్రి స్వేన్ట్ థన్‌బర్గ్ బీబీసీతో చెప్పారు. గ్రెటా ఉద్యమకారిణిగా మారినప్పటి నుంచీ చాలా సంతోషంగా ఉందని.. కానీ ఆమె ఎదుర్కొంటున్న ''ద్వేషం'' విషయంలో తాను చాలా ఆందోళనగా ఉన్నానని ఆయన తెలిపారు. రేడియో 4‌లోని టుడే కార్యక్రమంలో గ్రెటా అతిథిగా సంపాదకత్వం వహించిన ప్రసారంలో.. వాతావరణ మార్పు గురించి ప్రపంచాన్ని గ్రెటా మేల్కొలిపిందని సర్ డేవిడ్ అటెన్‌బరో ఆమెతో చెప్పారు. గ్రెటా తన స్వస్థలమైన స్వీడన్‌లోని స్టాక్‌హోం నుంచి స్కైప్ ద్వారా సర్ డేవిడ్‌కు కాల్ చేసింది. తన ఉద్యమానికి ఆయన ఎలా స్ఫూర్తినిచ్చారో ఆయనకు చెప్పింది. పర్యావరణవేత్త కూడా అయిన సర్ డేవిడ్.. ''ఈ అంశం మీద 20 ఏళ్లుగా పనిచేస్తున్న మా వంటి చాలా మంది సాధించలేకపోయిన విజయాలను నువ్వు సాధించావు'' అని గ్రెటాతో పేర్కొన్నారు. తమవంటి ఉద్యమకారులు 20 ఏళ్లలో సాధించలేని విజయాలను గ్రెటా సాధించిందని సర్ డేవిడ్ అటెన్‌బరో ఆమెతో చెప్పారు ఇటీవలి బ్రిటన్ ఎన్నికల్లో వాతావరణ మార్పు అనేది ఒక కీలక అంశంగా మారటానికి ఈ 16 ఏళ్ల బాలిక ఏకైక కారణమని కూడా ఆయన చెప్పారు. వాతావరణ మార్పు విషయంలో ప్రపంచ నాయకులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సాగిన ప్రపంచ ఉద్యమానికి సారథ్యం వహించినందుకు గాను.. గ్రెటాను ఈ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఆమె స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలల విద్యార్థులు సమన్వయంతో సమ్మె చేశారు. ఈ పండుగ సమయంలో టుడే ప్రోగ్రామ్ గెస్ట్ ఎడిటర్లుగా వ్యవహరిస్తున్న ఐదుగురు ఉన్నతస్థాయి ప్రముఖుల్లో గ్రెటా ఒకరు. టీనేజర్ గ్రెటాను, ఆమె తండ్రిని ఇంటర్వ్యూ చేయటానికి బీబీసీ తన ప్రెజెంటర్ మిషల్ హుసేన్‌ను విమాన ప్రయాణం ద్వారా స్వీడన్‌కు పంపించింది. మిషల్ హుసేన్‌ను విమానంలో పంపించాలన్న నిర్ణయంపై టుడే ఎడిటర్ సారా శాండ్స్ వివరణ ఇస్తూ.. ''ఇతర రవాణా మార్గాల్లో పయనించటానికి తగినంత సమయం లేదు. కానీ మేం అక్కడ మా కెమెరామెన్‌ను కలిశాం. గ్రెటా, డేవిడ్ అటెన్‌బరోల మధ్య ఇంటర్వ్యూను స్కైప్ ద్వారా నిర్వహించాం. సంభాషించుకోవటానికి అది సరైన విధానమని వారిద్దరూ భావించారు'' అని చెప్పారు. గ్రెటా, ఆమె తండ్రి స్వేన్ట్.. న్యూయార్క్‌లో వాతావరణ సదస్సులో పాల్గొనటానికి జీరో కార్బన్ నావలో ప్రయాణిస్తూ వెళ్లారు నాలుగేళ్ల దిగులు... గ్రెటా పర్యావరణ పరిరక్షణ కోసం స్కూలు సమ్మెను ప్రారంభించటానికి ముందు మూడు, నాలుగు సంవత్సరాల పాటు దిగులు చెందిందని ఆమె తండ్రి స్వేన్ట్ థన్‌బర్గ్ బీబీసీ ప్రెజెంటర్ హుసేన్‌తో పేర్కొన్నారు. ''ఆమె మాట్లాడటం ఆపేసింది. స్కూలుకు వెళ్లటం మానేసింది'' అని చెప్పారు. చివరికి భోజనం చేయటానికి కూడా నిరాకరించటంతో అది తల్లిదండ్రులుగా తమకు పీడకలగా మారిందని వ్యాఖ్యానించారు. ఆమె కోలుకోవటానికి సాయం చేయటం కోసం స్వేన్ట్ థన్‌బర్గ్ గ్రెటాతోను, ఆమె చెల్లెలు బీటాతోనూ స్వీడన్‌లోని తమ ఇంట్లో ఎక్కువ సమయం గడిపారు. గ్రెటా తల్లి మాలెనా ఎర్న్‌మాన్ ఒపెరా గాయని. యూరోవిజన్ సాంగ్ కంటెస్ట్‌లో కూడా పాల్గొన్నారు. తన కుటుంబం మొత్తం కలిసి ఉండటం కోసం ఆమె తన సంగీత కచేరీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. వైద్యుల సాయం కూడా తీసుకున్నామని స్వేన్ట్ థన్‌బర్గ్ చెప్పారు. గ్రెటాకు 'ఆస్పెర్జర్స్' అనే ఒక తరహా ఆటిజం ఉన్నట్లు నాలుగేళ్ల కిందట వైద్యులు గుర్తించారు. ఈ ఆటిజం వల్ల పరిస్థితులను మూసలో కాకుండా వెలుపలి నుంచి సంపూర్ణంగా చూడగలుగుతున్నానని గ్రెటా చెప్పింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వీరు వాతావరణ మార్పు గురించి చర్చించటం, పరిశోధించటం మొదలుపెట్టారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న తపన గ్రెటాలో అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మానవ హక్కుల కోసం 'చాలా క్రియాశీలం'గా కృషిచేసే తన తల్లిదండ్రులను 'పెద్ద వంచకులు' అని గ్రెటా ఆరోపించినట్లు స్వేన్ట్ పేర్కొన్నారు. ''మనం ఈ వాతావరణ సమస్యని సీరియస్‌గా పట్టించుకోవటం లేదు.. మరి మీరు ఎవరి మానవ హక్కుల కోసం నిలబడుతున్నారు?'' అని గ్రెటా తమని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. తన తల్లిదండ్రులు మరింత పర్యావరణహితంగా మారటానికి తమ ప్రవర్తనలో మార్పులు చేసుకోవటం.. ఆమె తల్లి విమానంలో ప్రయాణించకూడదని నిర్ణయించుకోవటం, తండ్రి వేగన్‌గా మారటం వంటి చర్యలు గ్రెటాకు ''శక్తి''ని అందించాయని ఆయన చెప్పారు. న్యూయార్క్, మాడ్రిడ్‌లలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సుల్లో పాల్గొనటానికి గ్రెటా సముద్రయానం చేసినపుడు ఆమెతో పాటు స్వేన్ట్ థన్‌బర్గ్ కూడా తోడుగా వెళ్లారు. పర్యావరణం మీద విమానయానం చూపే ప్రభావం కారణంగా విమానాల్లో ప్రయాణించటానికి గ్రెటా నిరాకరిస్తుంది. ''ఈ పనులన్నీ నేను చేశాను. అవన్నీ సరైన పనులని నాకు తెలుసు. కానీ నేను వాతావరణాన్ని రక్షించటానికి ఇవన్నీ చేయలేదు. నా కూతురిని కాపాడుకోవటానికి చేశాను'' అని స్వేన్ట్ పేర్కొన్నారు. ''నాకు ఇద్దరు కూతుళ్లున్నారు. నిజాయతీగా చెప్పాలంటే అన్నిటికన్నా వారే నాకు ముఖ్యం. వారు సంతోషంగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నా'' అని చెప్పారు. గ్రెటా తన ఉద్యమం కారణంగా మారిందని.. చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ''ఆమె సాధారణ బాలిక కాదని ఇప్పుడు మీరు భావిస్తారు. ఎందుకంటే.. ఆమె విశిష్టమైనది. చాలా ప్రముఖమైనది. ఇవన్నీ మీరు ఆలోచిస్తారు. కానీ.. నాకు మాత్రం ఆమె ఒక సాధారణ చిన్నారి. ఇతరుల్లాగా ఆమె అన్ని పనులూ చేయగలదు'' అని పేర్కొన్నారు. ''ఆమె గెంతుతూ తిరుగుతుంది. నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది. మేం చాలా సంతోషకరమైన పనులు చేస్తుంటాం. ఆమె చాలా మంచి స్థానంలో ఉంది'' అని ఆయన చెప్పారు. అయితే.. గ్రెటా స్కూలు సమ్మె వైరల్‌గా మారినప్పటి నుంచీ.. పర్యావరణాన్ని కాపాడటానికి తమ జీవనశైలిని మార్చుకోవటానికి ఇష్టపడని జనం నుంచి ఆమెకు అవమానాలు ఎదురయ్యాయని స్వేన్ట్ థన్‌బర్గ్ తెలిపారు. జనం నన్ను ''నా రూపాన్ని బట్టి, నా దుస్తులను బట్టి, నా ప్రవర్తనను బట్టి, నేను భిన్నంగా ఉండటం వల్ల'' అవమానిస్తారు అని గ్రెటా ఇంతకుముందు చెప్పింది. ఆమె గురించి వచ్చే ''ఫేక్ న్యూస్.. ఆమె చుట్టూ అల్లే కట్టుకథనాలు, అబద్ధాలు, అవి సృష్టించే విద్వేషం'' గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని ఆమె తండ్రి పేర్కొన్నారు. కానీ.. తన కుమార్తె ఈ విమర్శలను అద్భుతంగా ఎదుర్కొంటోందని చెప్పారు. ''నిజంగా.. ఆమె ఇదెలా చేస్తోందో నాకు తెలీదు. కానీ ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అవన్నీ ఆమెకు హాస్యపూరితంగా కనిపిస్తాయి'' అని తెలిపారు. భవిష్యత్తులో తమ కుటుంబం విషయంలో పరిస్థితుల తీవ్రత తగ్గుతుందని, గ్రెటా తిరిగి స్కూలుకు వెళ్లాలని కోరుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. గ్రెటా త్వరలో 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది కాబట్టి ఆమె ప్రయాణాల కోసం ఇప్పుడు తోడు ఉండాల్సిన అవసరం లేదు. ''ఆమెకు నేను ఉండాల్సిన అవసరం ఉంటే.. అది నెరవేర్చటానికి ప్రయత్నిస్తా'' అన్నారు. ''కానీ.. ఆమె మరింత ఎక్కువగా తన సొంతంగానే ముందుకు సాగుతుందని నేను అనుకుంటున్నా.. అది చాలా గొప్ప విషయం'' అని స్వేన్ట్ థన్‌బర్గ్ చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వాతావరణ మార్పు మీద పోరాటంలో ముందు వరుసలో నిలుచుని పోరాడటం తన కుమార్తె గ్రెటా థన్‌బర్గ్‌కు 'మంచిది కాదు' అని ఆమె తండ్రి అభిప్రాయపడ్డారు. text: "ఈ సరస్సు ప్రాంతంలో పొగ వాసన వస్తుండటాన్ని మీరూ గమనించవచ్చు" అన్నారు 'పీపుల్స్ అసోసియేషన్‌ ఫర్ హిమాలయ ఏరియా రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ శేఖర్‌ పాథక్‌. "త్వరగా మండే గుణం ఉన్న దేవదారు వృక్షాలనే కాదు, ఓక్‌ చెట్లనూ ఈ మంటలు కాల్చేస్తున్నాయి. పరిస్థితి దారుణంగా మారుతోంది" అని పాథక్ ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు తగలబడి పోతుండటంతో భయంతో ప్రజలు రాత్రి పూట నిద్ర కూడా పోవడం లేదని ఆయన బీబీసీతో అన్నారు. "అర్ధరాత్రి లేచి మంటలు మా ఇళ్లవైపు వస్తున్నాయేమో చూసి వస్తుంటాం" అని పిథోర్‌గర్‌ జిల్లా బన్నా గ్రామానికి చెందిన కేదార్ అవని అన్నారు. "ఈ మంటలు మా పశువుల కోసం దాచిన గడ్డినంతా కాల్చేశాయి. మా ఇళ్లు కూడా తగలబడి పోతాయేమోనని భయపడుతున్నాం"అని కేదార్‌ బీబీసీతో అన్నారు. మంటలు ఇరవై మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయని కేదార్‌ చెప్పారు. "ఈ మంటలను అదుపు చేయడానికి ఎలాంటి సాధనాలు లేవు" అన్నారాయన. మంటలతో ప్రమాదమేంటి ? యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కోపర్నికస్‌ అట్మాస్ఫియర్ మానిటరింగ్‌ సర్వీస్‌ (సీఏఎంఎస్‌) అంచనా ప్రకారం, గత నెలలో ఉత్తరాఖండ్‌ అడవులలో కార్చిచ్చుల కారణంగా 0.2 మెగా టన్నుల కర్బన ఉద్గారాలు గాలిలో కలిశాయి. 2003 తర్వాత ఈ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదలు . అదే గత నెలలో నేపాల్ 18 మెగా టన్నుల కార్బన్‌ను విడుదల చేసిందని ఉపగ్రహం నుంచి తీసిన ఫొటోలను విశ్లేషించడ ద్వారా తేలింది. 2016లో నేపాల్‌లో 27 మెగా టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయి. "మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఆధారాలు మనకు చెబుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం" అని సీఏఎంఎస్‌కు చెందిన శాస్త్రవేత్త మార్క్‌ ప్యారింగ్టన్‌ అన్నారు. నేపాల్‌, ఉత్తరాఖండ్‌లలో అటవీ అగ్ని ప్రమాదాల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించినట్లు సమాచారం. లక్షలాది హెక్టార్ల అడవిని ఈ మంటలు నాశనం చేశాయని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక డేటా ఇప్పటి వరకు విడుదల కాలేదు. గత నెలలో నేపాల్‌లో ఐదు వందలకు పైగా ప్రాంతాలలో ఈ అటవీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. గత నెల రోజులుగా నేపాల్‌లో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంది. నేపాల్‌కు చెందిన అనేక నేషనల్‌ పార్కులు, అడవులు భారతదేశపు నేషనల్ పార్కులతో అనుసంధానమై ఉంటాయి. అక్కడ పుట్టిన అగ్ని భారతదేశంలోకి కూడా వ్యాపిస్తోంది. పొడి వాతావరణం గత కొన్ని నెలలుగా నేపాల్‌ తోపాటు, ఉత్తర భారత దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు లేవు. దీని వల్ల అడవులు పొడిబారి పోయాయి. "వర్షాలు లేవు, మంచు లేదు. అందుకే అడవులు తగలబడి పోతున్నాయి. ఈ ప్రాంతం చాలా పొడిగా ఉంది." అని శేఖర్‌ పాథక్‌ వివరించారు. ఇప్పుడు స్థానికులను భయపెడుతున్న మరో అంశం మే నెల. ఇక్కడ సాధారణంగా మేలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ మే రాక ముందే అనేకసార్లు మంటలంటుకున్నాయి. ఇక వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులే ఈ ప్రమాదాలకు కారణమని చెప్పలేకపోయినప్పటికీ, ఈ ప్రాంతంలో కరవు పరిస్థితులు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి తోడు సమీప పొలాల్లో రైతులు గడ్డి తగలబెట్టడం కూడా చాలాచోట్ల మంటలు అంటుకోవడానికి కారణమవుతోందని భారత్‌, నేపాల్‌లకు చెందిన అధికారులు చెబుతున్నారు. "అడవుల పని కార్బన్‌ను ఆక్సిజన్‌గా మార్చడమేనని విధాన నిర్ణేతలు అనుకుంటుంటారు. ఇప్పుడు అడవులు కూడా కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయి. దాన్ని వారు పట్టించుకోవడం లేదు" అని ఆక్స్‌ఫామ్‌ సంస్థకు చెందిన విజేంద్ర అన్నారు. "భారత దేశంలో అడవులు కాలిపోవడం ఎవరికీ పెద్ద సమస్య కాదు. అందుకే ఈ విషయాలను పార్లమెంటులో ఎప్పుడూ చర్చకు రావు" అన్నారాయన. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎంఏ) ఈ కార్చిచ్చులను ప్రకృతి వైపరీత్యంగా (నేచురల్‌ కెలామిటీ) పరిగణించ లేదు. వారి నిబంధనల ప్రకారం తుపానులు, సునామీలు, వడగాలులు, కొండచరియలు విరిగిపడటం, వరదలు, భూకంపాలు మాత్రమే ప్రకృతి వైపరీత్యాల కింద లెక్క. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2019 లో నిర్వహించిన ఓ సర్వేలో, దేశంలోని 36 శాతం అడవులు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదంలో ఉన్నాయని, వాటిలో మూడింట ఒక వంతు ప్రాంతంలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని తేలింది. " కార్చిచ్చులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించక పోవడానికి కారణం అవి చుట్టు పక్కల ప్రాంతాలలో మనుషులు పెట్టిన మంటల వల్ల జరిగినవి కావడమే" అని ఎన్‌డీఎంఏకు చెందిన అధికారి కృష్ణ వత్స వ్యాఖ్యానించారు. "అయితే ఈ మంటలు పెను ముప్పుగానే మేం పరిగణిస్తాం. వాటిని కంట్రోల్‌ చేయడానికి ఇతర శాఖలతో కలిసి పని చేస్తున్నాం" అని ఆయన చెప్పారు. అగ్నిమాపక సర్వీసుల్లో లోపాలు స్టాండింగ్‌ ఫైర్‌ అడ్వైజరీ కమిటీ నివేదిక ఆధారంగా, దేశంలో అగ్నిమాపక సర్వీసుల్లో ఉన్న అనేక లోపాలను ఎన్‌డీఎంఏ గుర్తించింది. ఈ సర్వీసుల్లో 80 శాతం లోపాలు కనిపించాయని, అవసరమైన దానికన్నా96 శాతం మంది తక్కువగా సిబ్బంది ఉన్నారని కమిటీ దర్యాప్తులో తేలింది. "ఈ నివేదిక ఆధారంగా పరిస్థితిని మెరుగు పరచడానికి మేం అనేక సూచనలు చేశాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ సలహాదారు డీకే ధామి అన్నారు. "గతంలో మా దగ్గర 55 వేల మంది సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు 75 వేల మంది ఉన్నారు." అన్నారాయన. మునుపటితో పోలిస్తే ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచింది. అయితే ఇది ఏ మాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు. "అడవుల్లో మంటలు మునుపటి కంటే తీవ్రంగా ఉంటున్నాయి. కానీ వాటిని ఎదుర్కొనేందుకు అధికారుల దగ్గర సరైన ప్రణాళికలు లేవని అనిపిస్తోంది" అని కుమావున్ జిల్లాకు చెందిన పర్యావరణ కార్యకర్త అనిరుధ్ జడేజా అన్నారు. "మా అడవులు చాలా పెద్దవి, కానీ అటవీ శాఖ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. పెద్ద అగ్నిప్రమాదం జరిగినప్పుడు వారు ఏమీ చేయలేరు." అని జడేజా వ్యాఖ్యానించారు. నేపాల్‌ నిపుణులదీ అదే మాట. "నేపాల్‌ పర్యావరణం కోసం విదేశాల నుంచి లక్షల డాలర్లు వస్తున్నాయని మాకు తెలుసు. కానీ అడవులలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు వాటిని వినియోగించడం లేదు'' అని నేపాల్‌కు చెందిన కమ్యూనిటీ ఫారెస్ట్ యూజర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు భారతి పాథక్ అన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదాలను అదుపు చేయడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని నేపాల్ అధికారులు చెబుతున్నారు. "ఉన్న వనరులతోనే కృషి చేస్తున్నాం. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను చేరుకోవడం చాలా కష్టం. కావాలని అడవులలో నిప్పు రాజేస్తున్న వారు కూడా ఉన్నారు" అని నేపాల్ అటవీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకాశ్‌ లమ్సాల్‌ అన్నారు. "అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇలాంటి ప్రమాదాలను కట్టడి చేయలేకపోతున్నాయి" అని ఆయన అన్నారు. స్థానిక సంఘాలకు సాయం కావాలి అడవుల్లో నివసించే ప్రజలు మంటలను ఆర్పడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే వారి నుంచి సరైన సహకారం అందడం లేదు. "అడవులలో నివసించే ప్రజలకు, అటవీ శాఖ అధికారుల మధ్య అప నమ్మకం ఉండటమే దీనికి కారణం" అని పాథక్ అన్నారు. "అడవులలో ఉండే ప్రజలు, ప్రజా సంఘాలు అడవి మీద హక్కు తమదే అంటాయి. ఈ సందర్భంలో అటవీ శాఖతో వారికి విభేదాలు వస్తున్నాయి. అందుకే వారు సహకరించడం లేదు" విజేంద్ర అన్నారు. "ఈ అటవీ ప్రమాదాలను నివారించడంలో అధికారులు స్థానికులతో కలిసి పని చేయాలి" అన్నారాయన. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నైనీ సరస్సు, దాని చుట్టూ ఉన్న పర్వతాలు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ పట్టణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ చెలరేగుతున్న మంటలు ఈ కొండలను కనిపించకుండా చేస్తున్నాయి. సరస్సు అందం కూడా ఇంతకు ముందులా లేదు. text: డాహొమి మహిళలు - ఆఫ్రికాలో ఓ కొత్త చరిత్రకు ప్రాణం పోసిన వీరవనితలు వీళ్లు. ప్రస్తుత బెనిమ్‌ దేశంలో డాహొమి ఉండేది. డాహొమి రాజ్యంలో మహిళా సైనికులే ప్రధాన పాత్ర పోషించారు. అక్కడ మహిళలు శక్తిమంతమైన యోధులుగా శిక్షణ తీసుకున్నారు. మహారాజుకు భద్రత కల్పించడమే వాళ్ల ప్రధాన విధి. యురోపియన్ వలస పాలకుల వెన్నులో వాళ్లు వణుకు పుట్టించారు. అందం, బలం కలగలిసిన సైనికులు... ఈ ఆఫ్రికా మహిళలు టీనేజీలో అందం, సామర్థ్యం ఆధారంగా మహారాజే ఈ మహిళా సైనికులను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించేవాడు. ప్రతి విషయంలో మగవాళ్ల కంటే మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతోనే వాళ్ల శిక్షణ సాగేది. వీళ్లు నడిచొస్తుంటే రాజ్యంలోని మగవాళ్లంతా పక్కకు తొలగాల్సిందే. 1800 నాటికి ఇలాంటి 4 వేల మంది మహిళలు డాహొమి రాజ్యం తరఫున పోరాడారు. యురోపియన్ వలస పాలన తీవ్రంగా ఉన్న రోజుల్లో వాళ్లు డాహొమికి రక్షణ కవచంలా నిలబడ్డారు. ఫ్రెంచ్ పాలకులు క్రమంగా డాహొమిలో తమ బలాన్ని పెంచుకునే సమయంలో వీరు ఎదురు నిలిచి పోరాడారు. కానీ ఆ ప్రతిఘటన ఎక్కువ కాలం కొనసాగలేదు. 1892లో డాహొమి రాజ్యం ఫ్రెంచ్ అధీనంలోకి వెళ్లిపోయింది. దాంతో డాహొమి రాజ్యానికి, మహిళా సైన్యం ప్రస్థానానికి తెరపడింది. కానీ ఇప్పటికీ వాళ్ల ఘనతను కీర్తిస్తూ బెనిన్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఆ మహిళల గాథ నేపథ్యంలో తీస్తున్న సినిమాలో వియోలా డేవిస్, లుపిటా యోంగో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అందమైన, బలమైన సైనికులను మహారాజే స్వయంగా ఎంచుకుంటాడు. ఒట్టి చేతులతో మనిషిని చంపగిలిగే స్థాయిలో వాళ్లకు శిక్షణ ఇప్పిస్తాడు. వాళ్లనే తనకూ, తన రాజ్యానికీ రక్షణ కవచంలా మార్చుకుంటాడు. ఇదీ ఆఫ్రికాలోని డాహొమి రాజ్యంలో ఒకనాటి పరిస్థితి. text: తన భార్య సప్నా కోసం చంద్రుని మీద భూమిని కొనాలన్న తన స్వప్నాన్ని ఆయన నిజం చేసుకున్నారు. చంద్రునిపై స్థలం కొన్న ధర్మేంద్ర అనీజా, డిసెంబర్ 24న తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతిగా ఇచ్చారు. “వచ్చే వెడ్డింగ్ యానివర్సరీకి చంద్రుడి మీద స్థలం కొని నా భార్యకు బహుమతిగా ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయించుకున్నా. కానీ ఇది అంత ఈజీ కాదు. చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలైగైతేనేం నా కల నెరవేరింది” అన్నారు ధర్మేంద్ర. “చంద్రుడి మీద స్థలం కొనడం సులభమైతే అందరూ కొనేవారు’’ అన్నారాయన. భార్య సప్నాకు చంద్రుడి మీద భూమి రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని అందిస్తున్న ధర్మేంద్ర అనీజా చంద్రునిపై ఎక్కడ కొన్నారు? “మా వారు నా కోసం చంద్రుడి మీద స్థలం కొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. విషయం తెలిశాక నాకు ఏడుపు ఆగలేదు. బహుశా ఈ ప్రపంచంలో ఈ బహుమతి పొందిన అదృష్టవంతురాలిని నేనే కావచ్చు” అన్నారు సప్నా అనీజా. “సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఏంటో ఊహించి చెప్పమని మా యానివర్సరీ కార్యక్రమంలో నన్ను అడిగినప్పుడు ఏ కారో, నగలో అనుకున్నా. కానీ చంద్రుడి మీద భూమిని కొనిస్తారని నేను ఊహించలేదు'' అన్నారు సప్నా 14.3 ఉత్తరఅక్షాంశం, 5.6 తూర్పు రేఖాంశాలలో 377, 378, 379 నంబర్ల పేరుతో చంద్రుడిపై మూడు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు ధర్మేంద్ర. వివాహ వార్షికోత్సవం కూడా చంద్రుడి మీద జరిగిన భావన కలిగేలా ఏర్పాట్లు చేశారు ఎవరీ ధర్మేంద్ర అనీజా? ధర్మేంద్ర, సప్నా ఇద్దరూ అజ్మీర్‌ జిల్లాకు చెందినవారే. ఇద్దరూ ఇదే జిల్లాలో చదువుకున్నారు. కాలేజీలో కలుసుకున్న వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధర్మేంద్ర బ్రెజిల్‌లో టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ చేస్తుంటారు. ఆయన తల్లిదండ్రులు అజ్మీర్‌లో ఉంటారు. ధర్మేంద్ర గత పది నెలలుగా అజ్మీర్‌లోనే ఉంటున్నారు. అప్లికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు “భూమి మీద స్థలం కొనడానికి ఒక పద్దతి ఉన్నట్లే, చంద్రుని మీద కొనడానికి కూడా ఒక విధానం ఉంటుంది. అది కాస్త సుదీర్ఘ ప్రక్రియ కూడా’’ అన్నారు ధర్మేంద్ర. చంద్రుని మీద భూమిని కొనడానికి ఏడాది కిందటే అమెరికాకు చెందిన ఒక సంస్థ దగ్గర అప్లికేషన్‌ పెట్టుకున్నారు ధర్మేంద్ర. ఆ సంస్థ దరఖాస్తును ఓకే చేసిన తర్వాత ఆయన చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబం, ఆస్తిపాస్తుల వివరాలను సంబంధిత సంస్థ అధికారులు ఆధారాలతో సహా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియకు దాదాపు సంవత్సరం పట్టింది. “చంద్రునిపై స్థలం అమ్ముతామని చెప్పి అనేక నకిలీ కంపెనీలు నన్ను సంప్రదించాయి. అయితే చంద్రునిపై దిగే అధికారం ఉన్న ఏకైక సంస్థ 'లూనా సొసైటీ ఇంటర్నేషనల్' మాత్రమే’’ అన్నారు ధర్మేంద్ర. చంద్రునిపై అనేక రకాల భూములు ఉన్నాయని, అక్కడ కొనే భూమికి 1 ఏడాది నుంచి 49 ఏళ్ల వరకు యాజమాన్య హక్కులు ఉంటాయని, తాను 49 సంవత్సరాలకు ఓనర్‌ షిప్‌ రైట్స్‌ తీసుకున్నానని ధర్మేంద్ర వివరించారు. చంద్రునిపై కొనుగోలు చేసిన భూమి మీద ఏదైనా పరిశోధన జరిగితే రాయల్టీ అందుతుందని ధర్మేంద్ర వెల్లడించారు. ఈ భూమిని తాను ఎవరికైనా అమ్ముకోవడం, బదిలీలాంటివి చేయవచ్చునని కూడా ఆయన వివరించారు. ‘వార్షికోత్సవం చంద్రుని మీదే జరిగినట్లు అనిపించింది’ వివాహ వార్షికోత్సవం చంద్రుని మీదే జరిగినట్లు తాను ఫీలయ్యానని ధర్మేంద్ర భార్య సప్నా అన్నారు. “చంద్రుడి మీదే రిజిస్ట్రేషన్‌ పేపర్లు అందుకుంటున్నట్లు అనిపించింది. నేను చాలా అదృష్టవంతురాలిని’’ అన్నారామె. ఈ బహుమతిని ప్రజెంట్‌ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ధర్మేంద్ర. ఈ బాధ్యతను అజ్మీర్‌కు చెందిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్‌ ఈవెంట్స్‌ సంస్థకు అప్పగించారు. కార్యక్రమమంతా చంద్రుడి వాతావరణంలో జరిగినట్లు ఉండాలని ఆయన ఈవెంట్స్‌ సంస్థను కోరారు. “చంద్రునిపై భూమిని కొన్నానని ధర్మేంద్ర చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన నాకు 17 పేజీల పత్రాలను చూపించారు. మేం ఆశ్చర్యపోతూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’’ అని ఈవెంట్స్‌ నిర్వాహకుడు కోసినాక్‌ జైన్ అన్నారు. “కార్యక్రమం చంద్రుని మీద ఉన్నట్లే అనిపించేలా ఉండేందుకు చాలా శ్రమపడ్డాం” అన్నారు జైన్‌. ఎల్‌ఈడీ లైట్లతో నాలుగు అడుగులమేర మేఘాలను, చంద్రుడిని, నక్షత్రాలను రూపొందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు కూడా తాము చంద్రుడి మీద ఉన్న ఫీలింగ్‌ను అనుభవించారట. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాజస్తాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా ఇటీవల వార్తల్లోకి ఎక్కారు. text: సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన అంచనాల ప్రకారం భారత్‌లో నిరుద్యోగ రేటు 27.1 శాతంగా నమోదైంది. ఈ డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అమెరికా కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంది. నిరుద్యోగం గురించి భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. కానీ సీఎంఐఈ విడుదల చేసిన వివరాలను ఆమోదయోగ్యమైన సమాచారంగా పరిగణిస్తారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్లని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు భారీ సంఖ్యలో 'లే ఆఫ్' అమలు చేశాయి. దేశంలో మే 6 నాటికి సుమారు 49000 మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. మార్చి నెలలో 8.7 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఏప్రిల్ నాటికి 23.5 శాతానికి చేరింది. ఈ పరిస్థితికి లాక్ డౌన్ కారణమని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలైన హాస్పిటళ్లు, మందుల షాపులు, నిత్యావసర సరకులు అమ్మే దుకాణాలు తప్ప మరేవీ పని చేయలేదు. కొన్ని వేల మంది వలస కార్మికులు, రోజు కూలీలు పనులు లేక తమ స్వస్థలాలకు నడిచి వెళుతున్న చిత్రాలు ఏప్రిల్ నెల అంతా వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో 90 శాతం మందికి ఉద్యోగాలు కల్పించే నిర్మాణ రంగ పనులు ఆగిపోవడంతో ఉద్యోగాలు పోయాయి. ఇది కేవలం అసంఘటిత రంగానికే పరిమితం కాలేదు. అనేక వ్యాపారాలు మూత పడ్డాయి. స్థిరమైన ఉద్యోగాలు ఉన్నవారు కూడా లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని వారాలలో మీడియా, విమానయాన, రిటైల్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ రంగాలలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న వ్యాపారాలు కూడా మూత పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సీఎంఐఈ డేటాని నిశితంగా పరిశీలిస్తే భారత ఆర్ధిక వ్యవస్థ పై లాక్ డౌన్ చూపించిన ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. ఉపాధి కోల్పోయిన 12.2 కోట్ల మందిలో 9.13 కోట్ల మంది చిన్న వ్యాపారులు, కార్మికులు ఉన్నారు. వీరితోపాటు 17.8 కోట్ల మంది ఉద్యోగులు, 18.2 కోట్ల మంది సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తులు కూడా తమ ఉపాధి కోల్పోయారు. భారత ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మ అయిన వ్యవసాయ రంగంలో మాత్రం ఇందుకు భిన్నంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉపాధి పొందినవారి సంఖ్య పెరిగింది. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులంతా నగరాల్లో పనులు కోల్పోవడంతో వ్యవసాయ పనుల్లోకి వెళ్లడం సహజమని సీఎంఐఈ చెబుతోంది. అయితే, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని భారత ప్రభుత్వం ప్రజలపై మోపక తప్పదని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ బీబీసీకి చెప్పారు. కోవిడ్-19 కేసులు తక్కువగా నమోదైన ప్రాంతాలలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్ని సడలించే ప్రయత్నాలు చేస్తోంది. జోన్ల ప్రాతిపదికన లాక్ డౌన్ సడలింపు ప్రారంభించడం మంచిదే కానీ, ఇది దీర్ఘ కాలంలో ఉపయోగపడదని వ్యాస్ అన్నారు. “ప్రాంతాలు వేటికవే ఒంటరిగా పని చేయలేవు. ప్రజలు, వస్తువులు, సేవలు ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లగలిగే సౌలభ్యం ఉండాలి. వ్యాపారాలు పూర్తిగా నష్టపోక ముందే సరఫరా వ్యవస్థ తిరిగి ప్రారంభం కావాలి” అని ఆయన అన్నారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 17తో ముగుస్తుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్‌ను పొడిగించాయి. దేశంలో లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే దేశంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితిపై నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 2017 జులైలో 3.4 శాతం ఉన్న నిరుద్యోగ రేటు మార్చి నాటికి 8.7 శాతానికి చేరింది. ఇది గత 43 నెలల్లో అత్యధికమని సీఎంఐఈ చెబుతోంది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌లో దేశ వ్యాప్తంగా విధించిన కరోనావైరస్ లాక్ డౌన్‌తో ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఒక ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. text: ఆజాదీ మార్చ్ శుక్రవారం రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంది మస్టర్డ్ యెల్లో దుస్తులు ధరించి, తెలుపు, నలుపు రంగులతో కూడిన జెండాలు చేతబూని నిరసనకారులు అక్టోబరు 27న కరాచీలో ప్రారంభించిన ఈ 'ఆజాదీ మార్చ్ (స్వేచ్ఛా యాత్ర)' చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ యాత్రలో ఒక్క సామాన్య మహిళ కూడా లేరు. ఎందుకు? మహిళలు ఇంట్లోనే ఉండి ఉపవాసం పాటించాలని, ప్రార్థనలు చేయాలని చెబుతూ యాత్ర ప్రారంభానికి ముందు నిర్వాహకులు కరపత్రాలు పంపిణీ చేశారు. జేయూఐ-ఎఫ్ కాన్వాయ్‌లో ఒక్క మహిళ కూడా లేరని బీబీసీ ఉర్దూ రిపోర్టర్లు చెప్పారు. యాత్రలో పాల్గొంటున్నవారిలో అత్యధికులు జేయూఐ-ఎఫ్ మద్దతుదారులే శుక్రవారం ఈ యాత్ర రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ ఇతర విపక్షాలతో కలిసి జేయూఐ-ఎఫ్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కవర్ చేయకుండా మహిళా రిపోర్టర్లపై 'నిషేధం' విధించారనే ప్రచారం జరిగింది. కొందరు మహిళా రిపోర్టర్లను నిర్వాహకులు అడ్డుకున్నారు. తమను తీవ్రంగా వేధించారని, మరో దారి లేక కార్యక్రమ స్థలి నుంచి వచ్చేశామని మరికొందరు మహిళా జర్నలిస్టులు చెప్పారు. "మహిళలకు అనుమతి లేదు, మహిళలు ఇక్కడ ఉండకూడదు, వెళ్లిపోండి" అని ఒక వ్యక్తి తమకు హుకుం జారీచేశారని, తర్వాత ఓ గుంపు తమను చుట్టుముట్టి నినాదాలు చేసిందని, దీంతో అక్కడి నుంచి వచ్చేశామని జర్నలిస్ట్ షిఫా జడ్ యూసఫ్‌జాయ్ ట్విటర్లో తెలిపారు. మాకు అపార గౌరవం: రెహ్మాన్ జేయూఐ-ఎఫ్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ స్పందిస్తూ- మహిళలంటే తమకు అపార గౌరవం ఉందని, ఫుల్ డ్రెస్ కోడ్‌లో మహిళా జర్నలిస్టులు ఈ ర్యాలీకి రావొచ్చని చెప్పారని ఏపీపీ వార్తాసంస్థ తెలిపింది. ర్యాలీలో మహిళల ప్రవేశంపై నిషేధం విధించారనే ప్రచారాన్ని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్ర అసెంబ్లీలో జేయూఐ-ఎఫ్‌కు ప్రాతినిధ్యం వహించే నయీమా కిష్వర్ ఖాన్ తోసిపుచ్చారు. యాత్రలో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడాన్ని సమర్థించుకున్నారు. "సైన్యాన్ని చూడండి. మగవారు ముందుంటారు, మహిళలు వెనకుండి వైద్య సహాయం అందిస్తుంటారు. మా ఉద్యమం యుద్ధం లాంటిది" అని ఆమె వ్యాఖ్యానించారు. "దేశంలో పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి. లేదంటే మహిళలు వెనక ఉండేవారు కాదు" అని ఆమె అన్నారు. జేయూఐ-ఎఫ్ యాత్రలో పాల్గొన్న మహిళలు కూడా ప్రముఖంగా కనిపించలేదు. వీరిలో కొందరు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినవారు. యాత్రలో మహిళల ప్రాతినిధ్యం కొరవడటంపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. యాత్రలో మహిళలు లేకపోవడం మంచిదేనని జర్నలిస్ట్ బేనజీర్ షా బీబీసీ ఉర్దూతో అభిప్రాయపడ్డారు. "ఈ మార్చ్ ఇద్దరు మగవారు, వారి అహంభావాల మధ్య పోరాటం. ఇది వారి బలప్రదర్శన కూడా. ఈ పోరాటంలో ఈ దేశ మహిళలు భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు. "లెబనాన్లో మాదిరి సామాజిక మార్పు కోసం స్త్రీ, పురుషులు కలసి చేపట్టిన ఉద్యమం లాంటిది కాదు ఈ మార్చ్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని జేయూఐ-ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మతాన్ని ఉపయోగించడం, ఇతర వక్రమార్గాలను పాటించడం చేస్తుంది" అని ఆమె తెలిపారు. ఈ యాత్రలో పాల్గొంటే ఈ దేశ మహిళలు తప్పు చేసినట్లవుతుందన్నారు. నిర్వాహకులు తమను వెళ్లిపొమ్మన్నారని యాత్రను కవర్ చేయడానికి వెళ్లిన కొందరు మహిళా రిపోర్టర్లు చెప్పారు. యాత్ర ఎందుకు? ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ చిరకాల ప్రత్యర్థి. 18 నెలలుగా అధికారంలో కొనసాగుతున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురైన తొలి పెద్ద సవాలు ఈ యాత్రే. ఫజ్లుర్ రెహ్మాన్ నాయకత్వంలోని ఈ యాత్రకు ఇతర ప్రధాన విపక్షాల మద్దతు ఉంది. 48 గంటల్లో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని ఈ పార్టీలు శుక్రవారం డిమాండ్ చేశాయి. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ తప్పుడు విధానంలో గెలిచారని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగిందనే ఆధారాలేవీ లేవని ఈ ఎన్నికలను పరిశీలించిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధులు గుర్తించారు. అయితే ఎన్నికల సన్నాహాల్లో అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలను కల్పించలేదని వారు చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనమూ ఇమ్రాన్ ఖాన్‌పై నిరసనకారుల ఆగ్రహానికి ఓ కారణం. ఆర్థిక కష్టాల నుంచి ప్రజలను ఆదుకుంటానని ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం వారి కష్టాలను పెంచింది. "వాళ్లు (ఇమ్రాన్ ఖాన్) ప్రజాబలంతో అధికారంలోకి రాలేదు. ఇతరుల నిర్దేశంతో గద్దెనెక్కారు. వాళ్లు ప్రజల కోసం పనిచేయరు. వాళ్లను ప్రధాని పదవికి ఎంపిక చేసినవారినే సంతోషపెడతారు" అని రెహ్మాన్ తన మద్దతుదారులతో అన్నారు. జేయూఐ-ఎఫ్ అధినేత రెహ్మాన్ నాయకత్వంలో సాగుతున్న యాత్ర రెహ్మాన్ యాత్రకు వేరే కారణాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తెలివైన రాజకీయ నాయకుడైన రెహ్మాన్, సంవత్సరాలపాటు ప్రభుత్వంలో తన పాత్ర పోషించారు. గత ఏడాది ఎన్నికల్లో తన స్థానంలో ఆయన ఓడిపోయారు. కాలమిస్టు అరీఫా నూర్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ- కీలక రాజకీయ వ్యవహారాల్లో రెహ్మాన్‌కు పాత్ర లేకుండా పోయిందని, తనకు దక్కాల్సిన స్థానం దక్కకుండా చేశారనే భావన ఆయనలో ఉందని చెప్పారు. జేయూఐ-ఎఫ్ ఎన్నడూ మహిళల అనుకూల పార్టీ కాదని జర్నలిస్టు బేనజీర్ షా అభిప్రాయపడ్డారు. పరువు హత్యల నిరోధక బిల్లును, మహిళల రక్షణ బిల్లును, బాల్య వివాహాల నిరోధక బిల్లును ఆ పార్టీ వ్యతిరేకించిందని ఆమె ప్రస్తావించారు. మహిళల కోసం జేయూఐ-ఎఫ్ కాకుండా మిగతా మూడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా పాలక పక్షం ఏం చేస్తోందో అందరూ ఆలోచించాల్సి ఉందని బేనజీర్ చెప్పారు. జాతీయ కేబినెట్లో మహిళలకు అరకొర ప్రాతినిధ్యమే ఉందని, పంజాబ్ రాష్ట్ర కేబినెట్లో ఇద్దరే ఇద్దరు మహిళలు ఉన్నారని ఆమె విచారం వ్యక్తంచేశారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ పాక్ నలుమూలల నుంచి నిరసనకారులు ఒక మార్చ్ (యాత్ర) చేపట్టారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీల్లో ఒకటైన జమియత్ ఉలేమా-ఎ ఇస్లాం - ఫజ్లుర్ రెహ్మాన్ (జేయూఐ-ఎఫ్) సభ్యులే. text: అమెరికాలోని హూస్టన్‌ నగరంలో నిర్వహిస్తున్న ఈ సభలో మోదీ, ట్రంప్‌లు భారత సంతతి అమెరికన్లనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, కొద్దిరోజుల కిందట భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని సవరించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఈ హూస్టన్ సభాస్థలం వెలుపల నిరసన తెలుపుతున్నారు. 'స్టాండ్ విత్ కశ్మీర్', 'కశ్మీర్ ఈజ్ బ్లీడింగ్' అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గులాం నబీ అనే నిరసనకారుడు ‘బీబీసీ’తో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ అంతటా బలగాలు మోహరించి జనజీవితాన్ని నియంత్రించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు, చిన్నారులు చిక్కుకుపోయారని అన్నారు. డాలస్ నుంచి వచ్చిన షాకత్ అనే నిరసనకారుడు ‘కశ్మీర్ కోల్పోయిన స్వతంత్రత తిరిగి రావాల’న్నారు. హూస్టన్‌లో 72 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్ స్టేడియంలో ఈ 'హౌడీ మోదీ' సభ నిర్వహిస్తున్నారు. టెక్సస్ ఇండియా ఫోరం, మరో 600 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 50 వేల మందికి పైగా భారత సంతతి అమెరికన్లు పాల్గొంటున్నారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ సభకు వస్తుండడంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మోదీ వ్యతిరేక నిరసనల వద్ద కూడా పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. స్టేడియం వెలుపల ఎటుచూసినా పోలీసులే ఉన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌లు పాల్గొంటున్న 'హౌడీ మోదీ' సభకు నిరసనల సెగ తగిలింది. text: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ నుంచి ఊడిపడిన పెచ్చులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించారు. మౌనిక కూకట్‌పల్లికి చెందిన మహిళ అని, ఆమె భర్త టీసీఎస్‌లో ఉద్యోగి అని ఎల్ అండ్ టీ వెల్లడించింది. పెచ్చు ఊడి పడిన ప్రాంతం "మెట్రో స్టేషన్‌కు చెందిన ఓ స్తంభం నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముక్క ఒకటి ఊడి మౌనిక అనే మహిళపై పడింది. 9 మీటర్ల ఎత్తునుంచి పదునుగా ఉన్న ఆ పెచ్చు పడడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఎల్ అండ్ టీ సిబ్బంది ఆమెను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు" అని మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. వర్షం కురుస్తున్న కారణంగా మౌనిక మెట్రో స్టేషన్ కింద నిలబడ్డారు. అదే సమయంలో మెట్రో స్తంభం నుంచి పెచ్చు ఊడి పడింది. మౌనిక కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని ఎల్ అండ్ టీని ఆదేశించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ స్తంభానికి చెందిన ఓ పెచ్చు ఊడిపడి మౌనిక అనే మహిళ మృతి చెందారు. text: 1930ల్లో మాస్కుతో ముక్కు నోరు రెండూ కప్పుకోవాలని అనుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని 'న్యూ నార్మల్' అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. గత 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. బ్లాక్ ప్లేగ్ నుంచి వాయు కాలుష్యం, ట్రాఫిక్ కాలుష్యం చివరికి రసాయన గ్యాస్ దాడుల వరకూ చాలా దేశాల్లో మాస్క్‌‌లు వాడుతున్నారు. వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ఆరో శతాబ్దం ముందు నుంచే మాస్క్‌లను ఉపయోగించేవారని చెబుతున్నారు. జనం తమ నోటిని గుడ్డతో కప్పుకున్నట్టు ఉన్న చిత్రాలు పర్షియన్ సమాధుల తలుపుల మీద కనిపించాయి. మార్కో పోలో వివరాల ప్రకారం 13వ శతాబ్దంలో చైనాలో నౌకర్లు, నేసిన వస్త్రంతో తమ ముఖం కప్పుకోవాల్సి వచ్చేది. చక్రవర్తి తింటున్నప్పుడు ఆ ఆహార పదార్థాల సువాసన, నౌకర్లు వదిలే శ్వాసతో పాడవకూడదనే అలా చేసేవారని చెబుతారు. ఆకాశాన్ని కమ్మేసిన పరిశ్రమల పొగ కాలుష్యం వల్ల కమ్మేసిన పొగ 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం లండన్‌కు ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చింది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఏర్పడిన పరిశ్రమలు కలుషితమైన పొగను భారీగా వదిలేవి. ఇళ్లలో బొగ్గుతో మండే పొయ్యిల నుంచి ఎప్పుడూ నల్లటి పొగలు వస్తుండేవి. చలికాలాల్లో లండన్ నగరం మీద బూడిద-పసుపు రంగు పొగ మంచు ఒక మందపాటి పొరలా కమ్మేసి ఉండడం చాలా మంది చూశారు. 1952 డిసెంబర్ నెలలో 5 నుంచి 9 మధ్య నగరంలో 4 వేల మంది చనిపోయారు. ఆ తర్వాత వారాల్లో దాదాపు 8 వేల మంది చనిపోయారు. 1962లో లండన్‌లో వ్యాపించిన పొగ నగరమంతా వ్యాపించిన పొగ ఎంత దట్టంగా అలుముకుందంటే రైళ్లు నడపడమే కష్టమైంది. ఆ కాలంలో చుట్టుపక్కల పొలాల్లో కొన్ని జంతువులు ఊపిరాడక చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. 1956, 1968లో చిమ్నీల నుంచి వచ్చే నల్లటి పొగను, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగలో ధూళి కణాలను తగ్గించడానికి క్లీన్ ఎయిర్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో చిమ్నీ ఎత్తును, దాన్ని కట్టే ప్రాంతాన్ని కూడా నిర్ణయించారు. 1950ల్లో ఫేస్ మాస్క్ బ్లాక్ డెత్ ప్లేగ్ 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ ప్లేగ్ మొట్టమొదట యూరప్‌లో వ్యాపించింది. 1347 నుంచి 1351 మధ్య ఆ వ్యాధి అక్కడ రెండున్నర కోట్ల మందిని బలి తీసుకుంది. తర్వాత నుంచి అక్కడి డాక్టర్లు స్పెషల్ మెడికల్ మాస్కులు ఉపయోగించడం మొదలుపెట్టారు. పక్షి ముక్కు మాస్క్ కనుగొనక ముందు ప్లేగుకు చికిత్స చేస్తున్న వైద్యులు విష వాయువు శరీరంలోకి వెళ్లడం వల్ల వ్యాధికి గురవుతున్నారని భావించారు. కలుషిత గాలి శరీరంలోకి వెళ్లకుండా తమ ముఖాలను గుడ్డతో కప్పుకోవడం లేదంటే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటపుడు సువాసన వచ్చే పూలు లేదా అత్తరును తీసుకెళ్లేవారు. పక్షి ముక్కు ఆకారంలో ఉన్న ఈ మాస్కులో మూలికలు పెట్టేవారు 17వ శతాబ్దం మధ్యలో ప్లేగ్ వ్యాపించినప్పుడు, కాకి ఆకారంలో ఉన్న మాస్కు ధరించిన ఒక వ్యక్తి చిత్రం కనిపించడం మొదలైంది. దానిని చాలా మంది మృత్యువు నీడగా పిలిచేవారు. ఆ మాస్క్‌ ముందు ముక్కులా ఉన్న చోట సువాసన వచ్చే మూలికలను నింపేవారు. అలా కలుషిత గాలి శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చని భావించేవారు. ఆ తర్వాత సమయంలో కూడా ఇలాంటి మాస్కులు ఉపయోగించారు. పక్షి ముక్కు ఆకారంలో ఉండే మాస్కులు ధరించిన వైద్యులు 1965లో గ్రేట్ ప్లేగ్ వ్యాపించిన సమయంలో రోగులకు చికిత్స చేసే డాక్టర్లు చర్మంతో చేసిన గౌన్, కళ్లకు గాజు కళ్లజోడు, చేతులకు గ్లవ్స్, తలకు టోపీ పెట్టుకునేవారు. అది అప్పట్లో డాక్టర్ల పీపీఈ కిట్‌లా పనిచేసేది. 1971లో లండన్ ట్రాఫిక్ రాకపోకలతో కాలుష్యం 19వ శతాబ్దంలో లండన్‌లో చదువుకున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉండేది. వాళ్లు తమ చర్మాన్ని కప్పి ఉంచేలా పూర్తిగా నల్లగా ఉండే గౌన్లు వేసుకోవడానికి ఇష్టపడేవారు. వాటితోపాటూ ముఖాన్ని కప్పి ఉంచేలా వారి టోపీకి ఒక పలచటి మేలిముసుగు కూడా ఉండేది. ఆ బట్టలు, ముఖ్యంగా వారి ముఖాన్ని కప్పే ఆ పలుచటి ముసుగు సూర్యరశ్మితోపాటూ, ధూళి కణాలు, కాలుష్యం నుంచి వారిని కాపాడేవి. లండన్‌ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ, కింగ్స్ కాలేజ్ లండన్ వివరాల ప్రకారం అప్పటి కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల రద్దీ. డీజిల్, పెట్రోల్‌తో నడిచే వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్, రబ్బరు, లోహ కణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ 20వ శతాబ్దం నాటికి వాయు కాలుష్యం ఎంత పెరిగిందంటే, ముఖాన్ని కప్పే ఆ పలచటి మేలిముసుగు గాలిలోని ధూళి కణాలను ఆపలేదని నిరూపితమైంది. ప్రత్యేక మాస్కు ధరించిన సైకిలిస్ట్ కరోనా మహమ్మారి రావడానికి చాలా ముందు నుంచే లండన్‌లో సైకిళ్లు తొక్కేవారు తమ ముఖానికి ఒక ప్రత్యేక రకం యాంటీ-పొల్యూషన్ మాస్క్ ధరించేవారు. గ్యాస్ మాస్కులు ధరించిన కాబరే డాన్సర్లు విష వాయువులు-గ్యాస్ మాస్కులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో క్లోరిన్ గ్యాస్, మస్టర్డ్ గ్యాస్ లాంటి రసాయన ఆయుధాలను ఉపయోగించడంతో, భయపడిన ప్రభుత్వాలు తమ ప్రజలకు, సైనికులకు విష వాయువుల నుంచి రక్షించుకోడానికి గ్యాస్ మాస్కులు పంపిణీ చేశాయి. సైకిళ్లపై గస్తీ కాసే పోలీసులు కూడా వాటిని తమ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌లా ధరించేవారు. సైకిళ్లపై గ్యాస్ మాస్కులతో పోలీసుల గస్తీ 1938లో రోడ్లపై వెళ్తున్నవారు రెస్పిరేటర్లు వేసుకోవడం మామూలైపోయింది. ఆ ఏడాది ప్రభుత్వం సామాన్యులకు, సైనికులకు 350 లక్షల రెస్పిరేటర్లు పంచింది. లండన్ బీక్ స్ట్రీట్‌లోని ముర్రే కాబరే క్లబ్ డాన్సర్లకు కూడా ప్రభుత్వం వాటిని అందించింది. జూలో ఒంటెకు మాస్క్ తయారు చేయడానికి కొలతలు తీసుకుంటున్న సిబ్బంది అదే సమయంలోనే జంతువులను కాపాడ్డానికి వాటికి కూడా మాస్కులు వేశారు. చెసింగ్టన్ జూలోని కొన్ని జంతువులకు మాస్కుల తయారు చేయడానికి వాటి ముఖాల కొలతలు కూడా తీసుకున్నారు. గుర్రాలకైతే నోరు, ముక్కు కప్పి ఉంచేలా ఒక సంచిలాంటి మాస్కులు తగిలించేవారు. స్పానిష్ ఫ్లూ మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక కొన్ని దేశాల ముందు మరో భయంకరమైన సవాలు నిలిచింది. స్పెయిన్‌లో మొదట ఒక ఫ్లూ వ్యాపించడం మొదలైంది. అది తర్వాత మహమ్మారిగా మారింది. ఆ వ్యాధి స్పెయిన్‌లో ఐదు కోట్ల మంది ప్రాణాలు తీసింది. ఆ వ్యాధి స్పెయిన్ నుంచి వ్యాపించడంతో దానికి స్పానిష్ ఫ్లూ అనే పేరు పెట్టారు. స్పానిష్ ఫ్లూ రాకుండా మాస్క్‌లు వేసుకున్న పౌరులు ఉత్తర ఫ్రాన్స్‌లో కందకాల నుంచి తిరిగి వచ్చిన సైనికులతోపాటూ ఈ వైరస్ వేగంగా వ్యాపించినట్టు భావిస్తారు. ఆ సమయంలో ఆ వైరస్‌ను అడ్డుకోవడానికి చాలా కంపెనీలు తమ రైళ్లు, బస్సుల్లో కూడా క్రిమినాశకాలను పిచికారీ చేయించాయి. సైనికులు ట్రక్కులు, కార్లలో కిక్కిరిసిపోయి తమ దేశాలకు తిరిగి వచ్చేవారు. దాంతో అది ఒక భయంకరమైన అంటు వ్యాధిగా మారింది. మొదట రైల్వే స్టేషన్లలో, ఆ తర్వాత నగరమంతా వ్యాపించేది. శివార్ల నుంచి మెల్లమెల్లగా పల్లెలకు వ్యాపించింది. లండన్ జనరల్ ఒమ్నిబస్ కార్పొరేషన్ లాంటి కంపెనీలు వేగంగా వ్యాపిస్తున్న ఫ్లూను అడ్డుకోడానికి రైళ్లు, బస్సుల్లో మందులు పిచికారీ చేయించాయి. వ్యాధి వ్యాపించకుండా మాస్క్ ధరించాలని తమ సిబ్బందిని ఆదేశించాయి. 1918లో నర్సింగ్ టైమ్స్ పత్రికలో ఈ వ్యాధి నుంచి కాపాడుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రచురించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి నార్త్ కెన్సింగ్టన్ సెయింట్ మెరిలబోన్ ఇన్‌ఫర్మరీ ఆస్పత్రిలో నర్సులు రోగుల పడకల మధ్య సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే డాక్టర్లు, నర్సులు అందరూ దూరం దూరంగా ఉండే ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది ఫుల్ బాడీ సూట్ వేసుకునేవారని, ముఖానికి మాస్క్ ధరించేవారని రాశారు. ఆ సమయంలో మీరు బతికి ఉండాలంటే, మాస్కులు ఉపయోగించాలని పౌరులకు కూడా సూచించారు. చాలా మంది స్వయంగా తమ మాస్కులను తయారు చేసుకున్నారు. 1985లో హీత్రూ విమానాశ్రయంలో ముఖం కప్పుకుని ఉన్న సింగర్ బాయ్ జార్జ్ తర్వాత మరో రకం మాస్క్ వాడకంలోకి వచ్చింది. ఇది ఒక రకంగా మొత్తం ముఖాన్ని కప్పుకునే ఒక పెద్ద వస్త్రంలా ఉండేది. చాలా మంది ప్రముఖులు తమ అభిమానులు, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి మాస్కులే ఉపయోగించేవారు. అప్పట్లో ముఖం కప్పుకోవడం అంటే మిగతా వారిని ఆకర్షించే ప్రయత్నం చేయడం లాంటిదే. 'నన్ను గుర్తు పట్టకుండా నేను ప్రత్యేకమైన మాస్క్ వేసుకున్నా' అని చెబుతున్నట్టు ఉండేది. మాస్కుతో గాయకుడు జస్టిన్ బీబెర్ కానీ, ఇప్పుడు మాస్క్ వేసుకోవడం సర్వ సాధారణం అయ్యింది. అది ఎంత మామూలు అయ్యిందంటే ఇప్పుడు మనం ఎలాంటి ప్రత్యేక రకం మాస్క్ వేసుకున్నా వాటిని ఎవరూ చూడరు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులను బ్యాంకుల దోపిడీ చేసేవారు, పాప్ స్టార్లు, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకునే జపాన్ పర్యటకులు మాత్రమే పెట్టుకునేవారు. text: జులై 2వ తేదీన హైదరాబాద్‌లో బంగారం రూ.50,070 వద్ద ట్రేడ్ అవుతోంది. నెల రోజుల కిందట దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.40వేల స్థాయిలో ఉంది. అంటే నెల రోజుల్లో దాదాపు 25 శాతం పెరిగింది. బ్యాంక్ బజార్ వార్తా వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం గత ఏడాదిలో 10 గ్రాముల బంగారం(24 క్యారట్ల) సగటు ధర రూ.35,220. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1,750 అమెరికన్ డాలర్లకు అటూఇటుగా ఉంది. గోల్డ్ ప్రైస్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో నెల రోజుల్లో 1.28 శాతం, ఆరు నెలల్లో 24.24 శాతం, ఏడాదిలో 35.55 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.49,800 పలుకుతోంది. ఎందుకు పెరుగుతున్నాయి కరోనావైరస్ సంక్షోభం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం, ఇతర విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టడమే క్షేమమని మదుపరులు భావించడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు అధిక స్థాయిల్లో కొనసాగుతుండటం, కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వివిధ దేశాలు నగదు లభ్యత పెంచే చర్యలు చేపట్టడం బంగారం ధర పెరగడానికి కారణాలని ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ కె.నాగేంద్ర సాయి చెప్పారు. ‘‘కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా, యూరప్‌ల్లో ప్రభుత్వాలు ప్యాకేజీలతో నగదు లభ్యతను పెంచుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నాయి. వాస్తవ ఆర్థిక పరిస్థితికి, మార్కెట్లకు పొంతన లేదు. పెద్దపెద్ద ఫండ్స్, మదుపరుల్లో మార్కెట్లు పడిపోతాయన్న భయం ఉంది. రిస్క్‌ను తగ్గించుకునేందుకు వాళ్లు బంగారం సహా విలువైన లోహాలవైపు వస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో నగదు లభ్యత పెరిగి, డాలర్ మరింత బలహీనపడే అవకాశాలున్నాయని నాగేంద్ర సాయి అభిప్రాయపడ్డారు. వారెన్ బఫెట్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు కూడా మార్కెట్‌ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ‘‘అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉందని ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ చెబుతోంది. ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దాన్ని అంగీకరించడం లేదు. మార్కెట్లు బావుంటే పరిస్థితి అంతా బావున్నట్లేనని ఆయన భావిస్తున్నారు. కానీ ఆర్థికవ్యవస్థలో సత్తువ లేకపోయినా, మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉండటంతో ఈ బుడగ ఎప్పుడైనా పేలొచ్చన్న భయం పెట్టుబడిదారుల్లో ఉంది. ఈక్విటీ మార్కెట్లకు, బంగారానికి ఒక పరస్పర వ్యతిరేక సంబంధం ఉంటుంది. బంగారాన్ని ఒక ‘హెడ్జింగ్ టూల్’లా, ‘రిజర్వ్ కరెన్సీ’లా చూస్తారు’’ అని నాగేంద్ర సాయి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో ఆరు నెలల్లో 24.24 శాతం, ఏడాదిలో 35.55 శాతం వృద్ధి కనిపించింది. ఎప్పుడు కొంటే మంచిది? ఏడాది కన్నా ఎక్కువ సమయం ఆగగలిగేవాళ్లైతే వేచి చూడటం మంచిదేనని, అప్పుడు బంగారం రూ.30 వేల స్థాయిలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని కమోడిటీస్ అనలిస్ట్ పుట్టి రమేశ్ అన్నారు. అయితే, షార్ట్ టెర్మ్‌లో మరింత పెరిగే సూచన ఉండంతో తక్షణ అవసరాలున్నవారు ఇప్పుడే కొనడం నయమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతి 2 నుంచి 5 ఏళ్లకు ఓసారి బంగారం ధరలో పతనం వస్తుంది. ఇదివరకటి ర్యాలీలో బంగారం రూ.48వేల వరకూ వెళ్లి, మళ్లీ తగ్గింది. ఇది రెండో ర్యాలీ. ఇప్పుడు ధర ఇంకా 20-22 శాతం పెరగొచ్చు’’ అని రమేశ్ చెప్పారు. మరోవైపు ఒకసారి కాకుండా, విడతలవారీగా కొంచెం కొంచెం బంగారం కొనడం మంచి పద్ధతని నాగేంద్ర సాయి అభిప్రాయపడ్డారు. ‘‘ఇప్పుడే పూర్తిగా ఒకేసారి కొనేయడమో లేదా తగ్గాక ఒకేసారి కొనేద్దామని అనుకోవడమో మంచిది కాదు. విడతలవారీగా బంగారం కొనుక్కోవడం మేలు. ఇప్పుడు కొంత, మళ్లీ తగ్గినప్పుడు ఇంకాస్త... సమయం ఉంటే అలా కొనుక్కోవాలి’’ అని చెప్పారు. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు, కొనుగోలు చేసే దేశాలు భారత్, చైనాలే ‘మదుపరులు ఇలా చేయండి’ బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆభరణాలను కొనుగోలు చేయొద్దని నిపుణులు అంటున్నారు. ‘‘బంగారం పెట్టుబడి పెట్టేందుకు చాలా అనుకూలమైన వస్తువు. 80 ఏళ్లుగా దాని ధర ఎప్పుడూ 40 శాతానికి మించి పడిపోయింది లేదు. అయితే, పెట్టుబడులకు ఆభరణాలు అనుకూలం కాదు. అలా కొన్నవారు, వాటిని తిరిగి అమ్మే సమయంలో తరుగు పేరుతో నష్టపోవాల్సి వస్తుంది’’ అని పుట్టి రమేశ్ చెప్పారు. ఆభరణాల కొనుగోలుకు బదులుగా బంగారం ఈటీఎఫ్‌ల్లో, ఆర్బీఐ జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్‌ల్లో మదపు చేయడం ఉత్తమమని నాగేంద్ర సాయి సలహా ఇచ్చారు. ‘‘ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్‌ల్లో మదుపు చేయడం ద్వారా మనకు కావాల్సిన బంగారాన్ని బాండ్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. దానిపై వడ్డీ కూడా పొందొచ్చు. కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆ బంగారానికి అప్పుడు మార్కెట్‌లో ఉన్న విలువ ప్రకారం నగదు తీసుకోవచ్చు. తరుగు, తయారీ ఛార్జీల వంటి ఇబ్బందులు ఉండవు’’ అని ఆయన అన్నారు. ‘‘పెట్టుబడులకు ఇప్పుడు స్థిరాస్తి రంగం అనుకూలంగా లేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఐదు శాతానికి మించడం లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ల వడ్డీ రేట్లు కూడా 46 ఏళ్ల కనిష్ఠంలో ఉన్నాయి. ఇక పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది బంగారం, స్టాక్ మార్కెట్లలోనే. ప్రస్తుతమున్న కఠినమైన పరిస్థితుల్లో పెట్టుబడిలో కొంత వాటాను బంగారంలో పెట్టడం మంచిదే’’ అని నాగేంద్ర సాయి చెప్పారు. విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టడమే క్షేమమని మదుపరులు భావించడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు భారత్-చైనా ఉద్రిక్తతలు పెరిగితే... ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్, చైనాలది ముందువరుస. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాల విషయమై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇవి మరింత ముదిరితే బంగారం ధర పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని పుట్టి రమేశ్ అంటున్నారు. ఏడాది కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లకు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ ఇదివరకు అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ అంచనాను 1800 డాలర్లకు తగ్గించింది. భారత్-చైనా ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధర 30 శాతం వరకూ పతనం కావొచ్చని రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘‘నిజానికి అనిశ్చిత పరిస్థితుల్లో ధర పెరగాలి. మిగతా దేశాల్లో బంగారం, వెండిని అనిశ్చిత పరిస్థితుల్లో కొనుగోలు చేస్తారు. కానీ, భారత్, చైనాల్లో యుద్ధ పరిస్థితులు వస్తే బంగారం ఎవరూ కొనరు. ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు కూడా రావొచ్చు. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు వస్తేనే ఈ పరిస్థితి ఉంటుంది’’ అని ఆయన అన్నారు. 1962 యుద్ధ సమయంలో బంగారం ధర 30 శాతం, స్టాక్ మార్కెట్లు 16 శాతం పడిపోయాయని ఆయన గుర్తుచేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. సోమవారం ఒక దశలో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో రూ.50,580 పలికింది. text: ఉద్యోగాల్లో, విధుల్లో లింగ వైవిధ్యం అధికంగా ఉంటే వ్యాపారాలకు చాలా లాభాలు ఉంటాయి అనేక అధ్యయనాలు చెప్తున్నప్పటికీ.. అక్కడ లింగ సమాత్వానికి ఇంకా ఇన్నేళ్లు పడుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మహిళలు తమ కెరీర్‌లో ఎదగటానికి ఐదు సూచనలు చేశారు శాలీ హెల్గెసెన్. లీడర్‌షిప్ కోచ్‌గా పనిచేస్తున్న శాలీ సూచనలు మహిళలకే కాదు మగాళ్లకూ పనికివస్తాయి. 1. విజయాలను మీ సొంతం చేసుకోండి మీరు చేసిన కృషిని ఇతరులు అప్పటికప్పుడు గుర్తించి మిమ్మల్ని ప్రశంసిస్తారనో, రివార్డు ఇస్తారనో భావించటం తెలికితక్కువతనం అంటారు శాలీ. అయినప్పటికీ తాము సాధించిన విజయాల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండే వాళ్లు తనకు తరచుగా తారసపడుతుంటారని ఆమె చెప్పారు. ఎందుకలా అంటే వాళ్లు రెండు రకాల కారణాలు చెప్తుంటారు. ''నేను బాగా పనిచేస్తే వాళ్లు (పై వాళ్లో, సహోద్యోగులో) గుర్తించాలి కానీ.. నేను చెప్పుకోవటమేమిటి'' అనేది ఒక కారణం. ''గుర్తింపు పొందటానికి ఆరాటపడేవారిలా తామూ ప్రవర్తించేకంటే తమకు గుర్తింపు రాకపోయినా ఫర్వాలేదు'' అనేది మరో కారణం. కానీ ఈ విధంగా ఆలోచించటం కెరీర్‌లో ఎదగటానికి దారులు లేకుండా చేస్తాయని హెల్గెసెన్ అంటారు. మరి ఈ అలవాటును మార్చుకోవడం ఎలా? ''మీలో ఒక శక్తిని గుర్తించండి. ఉదాహరణకు.. 'ఈ సంస్థలో నాకు ఎంత మంచి సంబంధాలు ఉన్నాయన్నది నా బాస్‌కు అసలు అర్థంకాదు' అని మీరు అనుకుంటారు. అలాంటపుడు ఈ వారంలో మీరు ఎవరెవరితో, ఏమేం సంప్రదింపులు జరిపారో క్లుప్తంగా వివరిస్తూ బాస్‌కి ఒక ఈ-మెయిల్ పంపించవచ్చు'' అని హెల్గెసెన్ సూచించారు. ఇది మహిళలకు చాలా ఉపయోగపడే టెక్నిక్ అని తేలిందని ఆమె పేర్కొన్నారు. 2. 'నో' చెప్పటం నేర్చుకోండి ఇంతకుముందు కెరీర్‌లో చాలా సాయపడిన మీ వైఖరి.. మీరు ఎదగాలని అనుకుంటున్నపుడు అవరోధంగా కూడా మారవచ్చునని హెల్గెసెన్ అంటారు. ''ఎల్లప్పుడూ అందరినీ మంచి చేసుకోవాలని అనుకుంటే.. ఇతరులను బాధ్యులను చేయటం మీకు కష్టంగా మారుతుంది. కొన్ని అంశాల్లో 'నో' చెప్పకపోతే మీరు ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావచ్చు. మీ పరిధులు వాళ్లు అతిక్రమించవచ్చు. మీ సమయం చాలా వృధా కావచ్చు'' అని ఆమె వివరించు. మరి దీనినంతటినీ నివారించటం ఎలా? ముందు చిన్న చిన్నగా మొదలుపెట్టాలంటారు శాలీ. తొలుత మీ పరిధులను విస్పష్టంగా కాపాడుకోవటం. ''ఇప్పుడు నేను చాలా ఎక్కువ పనులు ఒప్పుకున్నాను. ఈసారి ఓ కొత్త టాస్క్‌ఫోర్స్ కానీ, అలాంటిది మరేదైనా పెట్టి అందులో నన్ను చేరమని చెప్తే.. ఒప్పుకునే ముందు దాని గురించి లోతుగా ఆలోచిస్తాను' అని మీకు మీరు చెప్పుకోవాలి. అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి. 'ఇది నిజంగా నాకు మేలు చేస్తుందా?' అనేది తేల్చుకోవాలి'' అని సూచించారు. 3. పర్‌ఫెక్షనిజం వర్సెస్ రిస్క్-టేకింగ్ ''అన్నీ పూర్తి ఖచ్చితత్వంతో చేయాలనుకునే పర్‌ఫెక్షనిస్టుగా ఉండటం వల్ల ఒక పెద్ద సమస్య ఉంటుంది. అది.. ఇతరులకు పని కేటాయింటానికి ఇబ్బందిపడటం'' అంటారు శాలీ. ''ఈ పని నాకు నేనే చేస్తే ఈజీగా అవుతుంది' అని కొంతమంది చెప్తుంటారు'' అని ఉదహరించారామె. ఈ పరిస్థితిని మార్చుకోవటానికి ఓ సులభమైన మార్గం ఉంది. ''ఈ పని ఎవరికి అప్పగించాలని అనుకుంటున్నారో ఒకరిని ఎంపిక చేసుకోండి. వారికి ఒక అవకాశం ఇవ్వండి. పని పూర్తయ్యాక దాని గురించి మీ పరిశీలనను వివరించండి. కానీ.. ఆ పనిని మీ దగ్గరే అట్టిపెట్టుకుని రిస్క్ తీసుకోకండి'' అని శాలీ సూచించారు. ఒకవేళ అలా చేయటం ఇబ్బందికరంగా అనిపిస్తే.. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సంస్థల్లో ఖచ్చితత్వంతో, తప్పులు చేయకుండా పనిచేసే మహిళలకు రివార్డులు లభిస్తుంటాయని.. అదే పురుషులకైతే రిస్క్ తీసుకోవటం, ధైర్యంగా ముందుకెళ్లినందుకు ప్రోత్సాహం లభిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కెరీర్‌లో పై స్థాయికి వెళ్లటానికి పెర్‌ఫెక్షనిజం నుంచి పక్కకు తప్పుకుని.. రిస్క్ తీసుకోవటం నేర్చుకోవటం కీలకమని శాలీ పేర్కొన్నారు. 4. పొరపాట్లను వదిలిపెట్టండి పనిలో చేసే పొరపాట్ల గురించి పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని, అది మహిళలను ముందుకు సాగనీయకుండా అడ్డుపడగలదని శాలీ చెప్పారు. ''ఇది ఓ రకంగా మనల్ని మనమే పడగొట్టుకోవటం లాంటిది'' అంటారామె. దానికి బదులుగా.. చిన్న విరామం తీసుకోవాలని, 'నువ్వు కూడా మనిషివే.. అందరిలాగా' అని మీకు మీరే చెప్పుకోవాలని, పొరపాట్లను అంతటితో వదిలివేయాలని సూచించారు. 5. మిమ్మల్ని మీరు చిన్నగా చూపకండి మహిళల్లో భౌతికంగానూ మాట్లాడటంలోనూ తమను తాము చిన్నగా చూపించుకునే వైఖరి ఉంటుందని శాలీ పేర్కొన్నారు. తమ స్థానానికి తాము ఉన్నామన్న సాధికారంతో కాకుండా.. అపాలజీ చెప్తుండటం, 'మీరు కేవలం ఒకే ఒక్క నిమిషం కేటాయించగలరా?' తరహా వాక్యాలను ఉపయోగించటం వంటివి మహిళల ప్రదర్శించే లక్షణాలని ఆమె చెప్పారు. ''మిమ్మల్ని మీరు ఒక లీడర్‌ స్థానంలో నిలుపుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. మీ స్థానంలో మీరు బలంగా నిలబడాలి. మీరు సంపూర్ణమని, పరిపూర్ణమని.. సాధికారత గలవారమని చూపాలి'' అని సూచించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచమంతటా ఆర్థిక అవకాశాల్లో ఉన్న లింగ అసమానత సమసిపోవటానికి మరో 202 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక గత ఏడాది అంచనా వేసింది. text: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రోజినా బేగం స్వస్థలం. మూడేళ్ల క్రితం వరకు ఆమె బిచ్చమెత్తుకొని తన పిల్లల్ని పోషించేది. కానీ ఇప్పుడు ఓ రిక్షా ఆమె జీవితాన్నే మార్చేసింది. ‘‘గతంలో నేనేం చేస్తానని అడిగితే, బిచ్చం ఎత్తుకుంటానని చెప్పాల్సి వచ్చేది. అది నా పిల్లలకు వారి స్నేహితుల ముందు అవమానంగా అనిపించేది. దాంతో నేను ఆ పని మానేశా. చాలా మంది రకరకాల పనులు చేస్తుంటారు. 'నాకు మాత్రం పని ఎందుకు దొరకదు దేవుడా' అనుకున్నా. కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా పని దొరకాలని కోరుకునేదాన్ని. బిచ్చమెత్తుకునే వికలాంగురాలు... పిల్లల కోసం రిక్షా నడుపుతున్నారు నాకు రిక్షా తొక్కడం నేర్పించమని ఒక వ్యక్తిని అడిగా. దానికి అతను 'నువ్వు వికలాంగురాలివి. రిక్షా ఎలా తొక్కగలవు..' అన్నాడు. 'నువ్వు నడపడానికి అది మోటారు వాహనం కాదు కదా' అని చెప్పాడు. కానీ ఏడాదిలో మోటార్ రిక్షాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఆర్నెల్లలో నేను ఆ రిక్షాను నడపడం నేర్చుకున్నా. నేను మహిళను కాబట్టి చాలామంది నా రిక్షా ఎక్కడానికి వెనకాడతారు. ‘నేను వికలాంగురాలినని, నాకు బతకడానికి ఇదే దారని’ చెబుతా. దాంతో, వాళ్లు నా రిక్షా ఎక్కుతారు. ఇప్పుడు రోజుకు రూ.300 దాకా సంపాదిస్తున్నా. నా పిల్లలకు తిండి పెడుతూ, వాళ్ల అవసరాలు తీర్చగలుగుతున్నా. గతంలో నాకు బిచ్చం వేసిన వాళ్లు కూడా ఇప్పుడు నన్ను అందరిలానే చూస్తున్నారు. వాళ్లు కూడా నా రిక్షా ఎక్కుతున్నారు’ అంటూ తన విజయాన్ని వివరించారు రోజినా. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అసలే మహిళ, అందులోనూ వైకల్యం... దాంతో తనకు బిచ్చమెత్తుకొని బతకడమే శరణ్యమని గతంలో ఆమె భావించేది. కానీ పిల్లలకు అది అవమానకరంగా మారడంతో ఆ పని మానేసింది. జీవితాన్ని జయించిన ఓ ఒంటరి మహిళ కథ ఇది. text: కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై ఆమె పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాను వినికిడి సమస్య, భయాందోళనలతో బాధపడుతున్నానని.. విచారణ సమయంలో న్యాయవాది కానీ, సహాయకులు కానీ వెంట ఉండేందుకు అనుమతించాలని కోరినా కమిటీ తిరస్కరించిందని ఆమె చెప్పారు. తాను ఎంతగా సమస్యను ఎదుర్కొంటున్నది పదేపదే వివరించినా కమిటీ పట్టించుకోలేదని తెలిపారు. ముగ్గురు సుప్రీం న్యాయమూర్తులను ఒంటరిగా ఎదుర్కోవడం ఎంతో భయానకంగా ఉందని ఆమె అన్నారు. విచారణ జరిగిన తొలి రోజు తన కారును ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వెంబడించారని ఆరోపించారు. సిట్టింగ్ సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదును ప్రత్యేకంగా పరిగణించాలన్న వాస్తవాన్ని గుర్తించేందుకు కమిటీ సిద్ధంగా లేదని, తాను ఎదుర్కొంటున్న అసమాన పరిస్థితుల దృష్ట్యా పారదర్శకత, సమానత్వం ఉండే విచారణ ప్రక్రియను కమిటీ పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విచారణ ప్రక్రియ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయడం లేదని, తన వాంగ్మూలం ప్రతులు కూడా తనకు ఇవ్వలేదని ఆమె చెప్పారు. గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని సదరు మహిళ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19న ఆమె లేఖ రాశారు. అప్పట్లో గొగోయ్‌కు ఆమె జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. ఆమె చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా దీనిలో సభ్యులుగా ఉన్నారు. 'అనధికారిక విచారణ' తాము అనధికారిక విచారణ జరుపుతున్నామని త్రిసభ్య కమిటీ తనతో వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదు చేసిన మహిళ వెల్లడించారు. ''ఇన్-హౌజ్ కమిటీ ప్రక్రియను గానీ, విశాఖ మార్గదర్శకాలను గానీ ఆ కమిటీ పాటించట్లేదు. విచారణ ప్రక్రియ గురించి మీడియాకు చెప్పొద్దని మౌఖికంగా నాకు సూచించారు. నా న్యాయవాదికీ చెప్పొద్దన్నారు. ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశావంటూ కమిటీ పదే పదే నన్ను ప్రశ్నించింది'' అని ఆమె తెలిపారు. ఫిర్యాదుపై సీజేఐ స్పందన కమిటీ కోరిందా అన్న విషయాన్ని కూడా తనకు వెల్లడించలేదని ఆమె అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద అధికారిక విచారణగా దీన్ని పరిగణించాలని కమిటీలోని న్యాయమూర్తులకు లేఖ రాశానని పేర్కొన్నారు. సీజేఐకి జూనియర్లైన జడ్జిలతో ఈ కమిటీ వేసినా, న్యాయమూర్తులపై విశ్వాసం ఉంచి విచారణలో పాల్గొనేందుకు సిద్ధమయ్యానని ఆమె అన్నారు. నిస్సహాయ పరిస్థితులు, ఒత్తిడి నడుమ తాను విచారణ ప్రక్రియల్లో పాల్గొనలేనని వివరించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ.. తన ఫిర్యాదుపై త్రిసభ్య కమిటీ జరుపుతున్న విచారణకు ఇకపై హాజరుకాబోనని ప్రకటించారు. text: మళ్లీ ఇవి ఎప్పుడు రాకపోకల్ని ప్రారంభిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బీబీసీ ఎయిర్ పోర్ట్స్ అథార్టీ, విమానాశ్రయ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించింది. తమ పేర్లు వెల్లడించకూడదన్న షరతుతో కొందరు సమాచారం ఇచ్చారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం, మే నెలలోనే విమానాలు, రైల్వేల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాలను మే నెల రెండో వారంలో ప్రారంభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైళ్లను కూడా రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ ప్రారంభించే అవకాశాలున్నాయి. అయితే, వీటిలో ప్రయాణాలు మాత్రం ఇదివరకు ఉన్నట్లు ఉండవు. అవి పూర్తిగా మార్పు చెందుతాయని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. విమాన ప్రయాణాలు ఇలా... లాక్ డౌన్ తర్వాత విమానాలను ఎలా నడపాలి అన్న అంశంపై ఎయిర్‌పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్-ఎస్ఓపీ) రూపొందించింది. ఈ ఏడు పేజీల నివేదికను బీబీసీ పరిశీలించింది. దాని ప్రకారం, విమానాల రాకపోకలు తొలుత దేశ రాజధాని నగరం దిల్లీ సహా అన్ని మెట్రో సిటీలు, ఆయా రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాన నగరాలు/పట్టణాలకు నడుస్తాయి. ప్రతి విమానయాన సంస్థ లాక్ డౌన్‌కు ముందు నడుపుతున్న సర్వీసుల్లో 30 శాతం సర్వీసులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయానికి వచ్చే, విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి విమానానికీ మధ్య కనీసం 3 గంటల సమయం పాటించే అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయంలో ఎన్ని టెర్మినళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఒక టెర్మినల్ నుంచి మాత్రమే విమానాలు నడుస్తాయి. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలను పాటించడం... అంటే మాస్కులు ధరించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్లు వాడటం అటు ప్రయాణీకులకు, ఇటు సిబ్బందికి తప్పనిసరి. ప్రతి విమానయాన సంస్థ తాము ఎన్ని విమానాలను నడపాలనుకుంటున్నదీ, ఏఏ మార్గాల్లో నడపాలనుకుంటున్నదీ ముందుగానే డీజీసీఏకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా నగరాల్లో లాక్ డౌన్ ఎత్తేయడం, లేదా నిబంధనలు సడలిస్తేనే ప్రయాణాలు జరుగుతాయి. అలాగే, ఆయా విమానాశ్రయాల్లో రద్దీ ఏర్పడకుండా ముందుగానే డీజీసీఏ ఒక షెడ్యూల్ ప్రకారం విమానాల రాకపోకలకు అనుమతులు జారీ చేస్తుంది. విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు తగినన్ని శానిటైజర్లను అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి విమానాశ్రయాల్లో జీఎంఆర్ సంస్థ ఆటోమేటిక్‌ హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేస్తోంది. లగేజీ బ్యాగులను కూడా క్రిమి రహితం చేసేలా ఆటోమేటిక్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే, ఇప్పటికే దాదాపు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకులు కూర్చునే సదుపాయాల్లో మార్పులు చేశారు. సామాజిక దూరం ప్రమాణాలను పాటించేలా కుర్చీకి కుర్చీకి మధ్య రెండు కుర్చీల దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైన చోట్ల కుర్చీల వరుసలను తొలగిస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు సామాజిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు విమానాశ్రయాల్లో మొదటి దశలో టీ, కాఫీ మాత్రమే లభిస్తాయి. రెస్టారెంట్లు, బార్లు, ఇతర షాపింగ్ దుకాణాలను మూసివేస్తారు. అయితే, ఆహారాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాతి దశలో సామాజిక దూరం పాటిస్తూ అక్కడే కూర్చుని తినే వెసులుబాటు కల్పిస్తారు. ఆల్కహాల్ అమ్మకాలు మాత్రం స్థానిక ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మొదలవుతాయి. స్పాలు, మసాజ్ కేంద్రాలను తదుపరి ఆదేశాల వరకూ తెరిచేందుకు అవకాశం లేదు. విమానాశ్రయాల్లో ఎక్కడా రద్దీ అనేది ఏర్పడకుండా తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచాలి. విమానాశ్రయాల్లో చెకిన్ కూడా నిర్ణీత గడువు కంటే ముందే ప్రారంభం అవుతుంది. దీనికి తగిన ఏర్పాట్లు ముందుగానే చేయాల్సి ఉంటుంది. ప్రయాణీకులు కూడా గతంలో కంటే ముందుగానే విమానాశ్రయాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో ప్రతి చోటా సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ మేరకు అవసరమైన సంకేతాలను ఇప్పటికే కొన్ని విమానాశ్రయాల్లో ఏర్పాటు చేశారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులను పరీక్షించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. వారు పరీక్షించిన తర్వాతే ప్రయాణీకులను లోనికి అనుమతిస్తారు. ఒకవేల ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేకంగా ఉంచేందుకు కూడా తగినంత మంది వైద్యులు, సిబ్బంది, ప్రత్యేక ప్రదేశాన్ని ముందుగానే సిద్ధం చేస్తారు. ప్రతి ప్రయాణీకుడూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనలో ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేవని ప్రమాణ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. తన వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు తగినన్ని ప్రమాణ పత్రాలను, ప్రయాణీకులు వాటిని నింపేందుకు తగినన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విమానాశ్రయాల లోపల కానీ, బయట కానీ ఎక్కడా రద్దీ పెరగకుండా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయాల్లో చెత్తను, కరోనావైరస్ నుంచి రక్షణ కోసం ధరించే మాస్కులు, గౌన్లు ఇతరత్రా వాడిపారేసిన వ్యర్థాలను తగిన రీతిలో ప్రమాణాల ప్రకారం మాత్రమే తొలగించాల్సి ఉంటుంది. లిఫ్ట్‌లో సామాజిక దూరం పాటించాలని వేసిన గుర్తులు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ''ఒక్క ఇండిగో తప్ప మిగతా అన్ని విమానయాన సంస్థలూ ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి. రాకపోకల్ని ఆపేసి ఐదు వారాలవుతోంది. మరో నెల రోజులు కనుక పరిస్థితులు ఇలాగే కొనసాగితే చాలా విమానయాన సంస్థలు తిరిగి కోలుకోలేనంతగా నష్టాల్లో కూరుకుపోతాయి. కాబట్టే కేంద్ర ప్రభుత్వం విమానాల రాకపోకల్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది'' అని విమాన ప్రయాణాలను పునరుద్ధరించే వ్యవహారాల్లో భాగమైన ఒక అధికారి బీబీసీతో చెప్పారు. ''మాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మే 15వ తేదీ నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. జూన్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కావొచ్చు'' అని ఆ అధికారి తెలిపారు. ''విమానాల్లో కూడా సామాజిక దూరం పాటించాలన్న అంశంపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. కచ్చితంగా పాటించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొన్ని సీట్లను ఖాళీగా వదిలేస్తే తమపై పడే భారాన్ని విమానయాన సంస్థలు కొంత ప్రయాణీకుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొచ్చు. మరికొంత ప్రభుత్వమే చెల్లించాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి. వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు'' అని సంబంధిత అధికారి వివరించారు. మే 1 తెల్లవారుజామున లింగంపల్లి నుంచి ఝార్ఖండ్‌లోని హటియాకు వలస కూలీలను తీసుకెళ్తున్న రైలు. లాక్‌డౌన్ సమయంలో ప్రయాణీకులను తీసుకెళ్లిన తొలి రైలు ఇదేనని రైల్వే అధికారులు తెలిపారు తుని రైల్వే స్టేషన్లో సామాజిక దూరం ఏర్పాట్లు చేసి, వాటిని ప్రభుత్వ, పోలీసు అధికారుల సమక్షంలో రైల్వే అధికారులు పరిశీలించారు రైల్వే ప్రయాణాలు ఇలా.. గత కొన్ని రోజులుగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆయా రైల్వే జోన్ల మేనేజర్లతోను, ఉన్నతాధికారులతోనూ వీడియో కాన్ఫరెన్సులు జరుపుతున్నారు. ''ఎప్పట్నుంచి ప్రారంభించమన్నా ప్రారంభించేందుకు మేం అన్ని రకాల ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం'' అని ఒక రైల్వే అధికారి తెలిపారు. విమానాశ్రయాల్లో పాటిస్తున్న నిబంధనల తరహాలోనే రైల్వే స్టేషన్లలో కూడా సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలను పాటించనున్నారు. ఇప్పటికే దేశంలోని చాలా రైల్వే స్టేషన్లలో సామాజిక దూరానికి సంబంధించిన సంకేతాలను (మార్కింగ్) సిద్ధం చేశారు. ప్రతి ప్రయాణీకుడూ సంబంధిత గుర్తులో మాత్రమే నిలబడాల్సి ఉంటుంది. ''ఎన్ని రైళ్లు నడపాలి? ఒక్కో కంపార్ట్‌ మెంట్‌లో ఎంతమంది ప్రయాణీకులను ఎక్కించాలి? అందుకు వారి దగ్గర్నుంచి ఎంత ధర వసూలు చేయాలి? అన్న వాటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు'' అని ఈ పరిణామాల్లో భాగమైన ఒక అధికారి చెప్పారు. కేవలం స్లీపర్ కోచ్‌లను మాత్రమే నడపాలని, ఏసీ కోచ్‌లను నడపకూడదని ఆలోచిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో సాధారణంగా ఎనిమిది మంది ప్రయాణీకులు ఉంటారని, ఇప్పుడు వారి సంఖ్యను మూడు లేదా ఐదుకు పరిమితం చేయాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే, బెర్తుల సంఖ్యను కూడా కుదించాలని, మధ్యలో ఉండే బెర్తును ఉపయోగించరాదని కూడా ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ప్రతి రైల్వే జోన్‌ ఇందుకు ఏర్పాట్లు చేసిందని అధికారులు వెల్లడించారు. దీనికి అయ్యే ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలన్న షరతుపై ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదనపు సమాచారం: వి. శంకర్, బీబీసీ కోసం కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. text: ''జైల్లో జరిగిన గొడవలతో భద్రతా సిబ్బంది ప్రాణాలు అరచేత పట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఖైదీలను నిలువరించలేకపోయారు'' అని పోలీసులన్నారు. ఈ జైలు చుట్టుపక్కల ప్రాంతంలోనే భారీగా అల్లర్లు చెలరేగాయి. జైలులో పురుష ఖైదీలు మాత్రమే ఉన్నారు. ఈ అల్లర్ల కారణంగా లిబియా ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆన్ జారా జైలులోని ఖైదీల్లో ఎక్కువ శాతం మంది లిబియా మాజీ నేత గడాఫీ మద్దతుదారులే. 2011లో గడాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హత్యా నేరం కింద వీరు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, అత్యవసర సేవల విభాగం అందించిన సమాచారం మేరకు, వందలాది మంది నిర్వాసితులు తల దాచుకున్న ఓ క్యాంపుపై ఆదివారం రాకెట్ పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్లలో గత వారం సాధారణ పౌరులతోపాటు మొత్తం 47 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని, మరణించినవారిలో సాధారణ పౌరులు కూడా ఉన్నారని లిబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి మద్దతు ఉన్న లిబియా ప్రభుత్వం నామమాత్రంగానే అధికారంలో ఉంది. దేశంలో చాలా భాగం తిరుగుబాటుదార్ల ఆధీనంలోనే ఉంది. ఈ హింసకు కారణం ఏంటి? గత వారంలో ఈ అల్లర్లు చెలరేగాయి. దక్షిణ ట్రిపోలి ప్రాంతంలోని తిరుగుబాటుదారులు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 'ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్'(జీఎన్ఏ) ప్రభుత్వ అనుకూల వర్గాలపై దాడి చేయడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ''ప్రశాంతగా సాగుతున్న పాలనను పక్కదారి పట్టించేందుకు తిరుగుబాటుదారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మౌనం వహించదు.. ఇది శాంతి భద్రతల ఉల్లంఘనే'' అని జీఎన్ఏ తెలిపింది. మానవ హక్కుల సంఘాలు కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. మృతుల్లో 18 మంది సాధారణ పౌరులు అని, అందులో నలుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలిపాయి. 2011లో నాటో(ఎన్ఏటీఓ) మద్దతుతో కొన్ని తిరుగుబాటు వర్గాలు కల్నల్ గడాఫీని గద్దె దింపాయి. అప్పటి నుంచి లిబియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ వర్గాలు ఏమంటున్నాయి? ''విచక్షణా రహితంగా తమ బలాన్ని ప్రయోగించటం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా అన్ని పార్టీలూ ఆలోచించాలి'' అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న హింసకు తక్షణమే స్వస్తి పలకాలని అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఆదివారంనాడు పిలుపునిచ్చాయి. శాసనబద్ధమైన ప్రభుత్వాన్ని బలహీనపరచడం, పాలనకు అడ్డుపడటం లాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదంటూ.. ఈ దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. కానీ హింసను ఆపడానికి ఇంతవరకూ చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) లిబియా రాజధాని ట్రిపోలిలో తిరుగుబాటుదార్ల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా నగరంలోని ఆన్ జారా జైలు నుంచి 400 మంది ఖైదీలు పరారయ్యారని పోలీసులు తెలిపారు. text: టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ క్వీన్స్‌ల్యాండ్‌లో జలుబు లక్షణాలు కనిపించాయని, దీంతో వైద్యం కోసం వెళితే కరోనావైరస్ సోకినట్లు తెలిసిందని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ భార్యాభర్తలు ఇద్దరి వయను 63 ఏళ్లు. ఇప్పుడు తాము ఇద్దరం ఇతరులు ఎవ్వరితో కలవకుండా వేరుగా ఉంటున్నట్టు టామ్ హ్యాక్స్ తెలిపారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కోసం ఈ భార్యాభర్తలు ఆస్ట్రేలియా వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో జరుగుతోంది. ‘‘మేం ఇద్దరం అలసటకు గురయ్యాం. ఇద్దరికీ జలుబు, ఒళ్లంతా నొప్పులు. రీటా కొద్దిసేపు ఒణికిపోయింది. మాకు కొంచెం జ్వరంగా కూడా ఉంది. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అవసరమైనట్లుగా.. మేం కరోనావైరస్ పరీక్షలు చేయించుకున్నాం. మాకు వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది’’ అని టామ్ హ్యాంక్స్ పేర్కొన్నారు. తమ ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆయన అన్నారు. ‘‘ప్రజారోగ్యం, భద్రత కోసం అవసరమైనన్ని రోజులు మేం పరీక్షలు చేయించుకుని, వైద్యుల పర్యవేక్షణలో ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉంటాం’’ అని వివరించారు. ఉత్తమ నటుడిగా రెండు సార్లు ఆస్కార్ అవార్డు పొందిన టామ్ హ్యాంక్స్ మరో ఆరు సార్లు ఆస్కార్ అవార్డు కోసం పోటీపడ్డారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు పొందారు. అలాగే, ఆయన నటించిన చాలా సినిమాలు ఆస్కార్ అవార్డులు పొందాయి. కాగా, టామ్ హ్యాంక్స్ నటిస్తున్న తాజా చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ అంశంపై స్పందిస్తూ.. ‘‘మా కంపెనీ సభ్యుల ఆరోగ్యం, భద్రత మాకు చాలా ముఖ్యమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ తరపున పనిచేస్తున్న అందరినీ రక్షించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన దర్శకుడు బాజ్ లుహ్ర్‌మన్ దర్శకత్వం వహిస్తున్న, ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిందని స్థానిక మీడియా తెలిపింది. టామ్ హ్యాంక్స్ భార్య రీటా విల్సన్ కూడా నటి, గాయకురాలు. గత వారం బ్రిస్బేన్ ఎంపోరియం హోటల్, సిడ్నీ ఒపెరా హౌస్‌ల్లో జరిగిన ప్రదర్శనల్లో ఆమె పాల్గొన్నారు. కరోనావైరస్‌ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలో 130కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో ఇటలీ దేశవ్యాప్తంగా ఆహారం, మందుల షాపులు మినహా మిగతా అన్ని షాపుల్ని మూసేసింది. యూరప్‌లో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించిన దేశం ఇటలీనే. ఈ దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాలు కూడా ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 30 రోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేశారు. భారతదేశం సైతం కఠిన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు (డిప్లొమేటిక్, అఫీషియల్, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప) ఏప్రిల్ 15 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది. అత్యవసరం అయితే తప్ప భారతదేశానికి రావొద్దని విదేశీయులకు చెప్పింది. అలాగే అత్యవసరం అయితే తప్ప విదేశాలకు వెళ్లొద్దని భారతీయులకు తెలిపింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తనకు, తన భార్య రీటా విల్సన్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యిందని హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ తెలిపారు. ఆస్ట్రేలియాలో తామిద్దరం కోవిడ్-19 వ్యాధికి గురయ్యామని ఆయన వెల్లడించారు. text: రోగుల ఊపిరితిత్తుల్ని స్కాన్ చేసి పరీక్షించినప్పుడు సాధారణం కంటే ఎక్కువగా రక్తపు గడ్డలు కనిపించాయి వైద్యభాషలో థ్రాంబోసిస్ అనే ఈ బ్లడ్ క్లాట్స్ చాలామంది చనిపోవడానికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన మంట వల్ల ఇలాంటి క్లాట్స్ ఏర్పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వైరస్ సోకినప్పుడు ఊపిరితిత్తుల్లో ఇలాంటి మంట కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోగులు అనేక సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన దశలో వైద్యులు తాము ఊహించిన దానికంటే అధికంగా ఇలాంటి బ్లడ్ క్లాట్స్‌ను ఎక్కువమంది రోగుల్లో చూశారు. అంతేకాదు... కొందరు రోగుల ఊపిరితిత్తుల్లో సూక్ష్మ పరిమాణంలో రక్తపు గడ్డలు ఏర్పడడాన్నీ గమనించారు. ప్రమాదకరమైన సమస్య ఏప్రిల్ నెలలో ఆర్టిస్ట్ బ్రయాన్ మెక్‌క్లూర్ కరోనావైరస్ కారణంగా వచ్చిన న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరారు. ‘‘ఊపిరితిత్తులను స్క్రీనింగ్ చేయగా అందులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. అవి చాలా ప్రమాదకరమని డాక్టర్లు నాకు చెప్పారు’’ అన్నారు బ్రయాన్. ‘‘దాంతో నాలో ఆందోళన మొదలైంది. ఆ బ్లడ్ క్లాట్స్ కనుక తగ్గకపోతే నా ప్రాణాలు ప్రమాదంలో పడతాయని అర్థమైంది’’ అన్నారాయన. ప్రస్తుతం ఆయన ఇంటిలో కోలుకుంటున్నారు. బ్రయాన్ మెక్‌క్లూర్ హార్ట్ అటాక్ కూడా వస్తుంది ‘‘కొద్దివారాలుగా అందుబాటులో ఉన్న విస్తృత డేటా ఆధారంగా థ్రాంబోసిస్ ప్రధాన సమస్య అని స్పష్టమవుతోంది’’ అన్నారు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ థ్రాంబోసిస్, హీమోస్టాసిస్ ప్రొఫెసర్ రూపేన్ ఆర్య. ‘‘ముఖ్యంగా క్రిటికల్ కేర్‌లో ఉన్న కోవిడ్ రోగుల్లో సుమారు సగం మందికి ఊపిరితిత్తుల్లో పల్మనరీ ఎంబోలిజమ్ లేదా బ్లడ్ క్లాట్స్ కనిపిస్తున్నాయ’’న్నారు రూపేన్. యూరప్‌లో ఇలా 30 శాతం మందిలో కనిపిస్తుందని చెబుతున్న డేటా కంటే కూడా ఈ శాతం ఎక్కువే ఉండొచ్చన్నారాయన. రూపేన్ ఆర్య బృందం రోగుల రక్తం శాంపిళ్లను విశ్లేషిస్తోంది. కరోనావైరస్ వల్ల రోగుల రక్తానికి జిగురు స్వభావం పెరుగుతోందని.. దానివల్ల రక్తపు గడ్డలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన మంట వల్ల రక్తంలో ఇలాంటి మార్పు వస్తోందని తేల్చారు. మొత్తానికి ఇవన్నీ కలిసి రోగి పరిస్థితిని విషమంగా మార్చేస్తున్నాయని రూపేన్ ఆర్య చెప్పారు. థ్రాంబోసిస్ నిపుణురాలు ప్రొఫెసర్ బెవర్లీహంట్ చెబుతున్న ప్రకారం జిగురుగా మారిన రక్తం గడ్డకట్టడం కంటే ప్రమాదకర పరిస్థితులకూ దారితీస్తుంది. ఇది ఒక్కోసారి హార్ట్ అటాక్, స్ట్రోక్ కలిగిస్తుంది. ‘‘కరోనావైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు ఇలా రక్తం జిగురుగా మారడం కారణం’’ అని ఆమె చెప్పారు. రక్తాన్ని పలుచన చేసే మందుల ప్రయోగాలు అయితే, ఇప్పటివరకు వివిధ రకాల రోగుల్లో రక్తపు గడ్డలను కరిగించడానికి వాడే బ్లడ్ థిన్నర్స్ ఈ కరోనా రోగులకు ఏ్పడుతున్న రక్తపు గడ్డల విషయంలో అన్నిసార్లూ పనిచేయడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇలాంటి మందులను డోసేజ్ పెంచి ఇస్తే రక్తస్రావం జరిగి చనిపోయే ప్రమాదముంది. అయితే.. ఎంత మోతాదులో ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలనే విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇంకొందరు నిపుణులు ఈ రక్తపు గడ్డలకు కారణమవుతున్న ఊపిరితిత్తుల్లో మంటను నివారించే ప్రయత్నం చేసినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన రోగుల్లో 30 శాతం మందిలో ప్రమాదకరంగా రక్తపు గడ్డలు(బ్లడ్ కాట్స్) ఏర్పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. text: కానీ కెప్టెన్ అంజుమ్ చోప్రా హఠాత్తుగా ఆమెను ముందే పంపించాలని నిర్ణయించింది. ఆ మ్యాచ్‌లో హర్మన్ 8 బంతుల్లో 19 పరుగులు చేసింది. అందులో ఒక సిక్సర్ కూడా ఉంది. ఆమె కొట్టిన సిక్సర్ ఎంత బలంగా ఉందంటే, ఒక కొత్త ప్లేయర్ అలాంటి షాట్ ఎలా కొట్టగలరా అని సందేహం వచ్చి, మ్యాచ్ తర్వాత హర్మన్‌కు డోప్ టెస్ట్ చేయాలన్నారు. ఆ రోజు వారిని ఆశ్చర్యపరిచిన, అదే హర్మన్‌ప్రీత్ ఇప్పుడు టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ మహిళా జట్టుకు కెప్టెన్‌గా ఉంది. మైదానంలో బాదే ఫోర్లు, సిక్సర్లు ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయి. మహిళా ప్రపంచ కప్ గెలవాలనే కల భారత్ మహిళా టీ-20 వరల్డ్ కప్ గెలవాలనేది హర్మన్ కల. ఈ టోర్నీ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం అవుతోంది. మొదటి మ్యాచ్‌లో భారత్ జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాను ఎదుర్కొంటోంది. హర్మన్ ప్రీత్ టీ-20ల్లో వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ కూడా. 1989 మార్చి 8న పంజాబ్‌లోని మోగాలో పుట్టిన హర్మన్‌కు చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఇష్టం. హర్మన్ తండ్రి హర్మిందర్ సింగ్ భుల్లర్ క్రికెట్ ఆడేవారు. ఆమె తన తండ్రి ఫోర్లు, సిక్సర్లు కొట్టడం చూస్తూ పెరిగింది. ఆమెలో బౌండరీలు బాదాలనే కోరిక అప్పుడే మొదలైంది. మోగాలో అమ్మాయిలు మైదానంలో ఆడడం తక్కువగా కనిపించేది. దాంతో ఆమె అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించింది. హర్మన్ అబ్బాయిలతో కలికి క్రికెట్ ఆడడం, భారీ షాట్లతో బౌలర్లను ఉతికారేయడం చూసిన దగ్గరలోని ఒక స్కూల్ కోచ్ కమల్‌దీప్ సింగ్ సోధీ, ఆమెను తమ స్కూల్లో చేర్చారు. అక్కడి నుంచి కోచింగ్‌తోపాటు ఆమె కొత్త క్రికెట్ జీవితం కూడా ప్రారంభమైంది. రాత్రికి రాత్రే స్టార్ "చిన్న పట్టణాల్లో అమ్మాయిలు క్రికెట్ ఆడితే, బంధువుల నుంచి నానా మాటలూ వినాల్సి వస్తుంది. కానీ హర్మన్‌ప్రీత్ సాధించిన విజయాలు అందరి నోరూ మూయించాయి" అని బీబీసీకి ఏడాది క్రితం ఇంటర్వ్యూ ఇచ్చిన హర్మన్ తండ్రి చెప్పారు. పంజాబ్, రైల్వే క్రికెట్ జట్టు తరఫున ఆడిన తర్వాత హర్మన్ 2009లో 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడంటే, తన మెరుపు బ్యాటింగ్ వల్ల హర్మన్ గురించి అందరికీ తెలుసు, కానీ అప్పట్లో బక్కగా సన్నగా ఉన్న ఆమెకు మొదట మీడియం పేస్ బౌలర్‌గా జట్టులో చోటు లభించింది. ముంబై వెస్ట్రన్ రైల్వేలో పనిచేస్తూ హర్మన్ తన బ్యాటింగ్, ఫిట్‌నెస్ కోసం చాలా కష్టపడింది. టీమ్‌లో తన స్థానాన్ని ఎలాగైనా సుస్థిరం చేసుకోవాలంటే, ఏదైనా స్పెషాలిటీ చూపించాల్సిందే అని బలంగా అనుకుంది. ఆ శ్రమతో త్వరలోనే ఆమె తన ఫేవరెట్ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్‌లా జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా మారింది. దాంతో, చూస్తూ చూస్తూనే 2016లో హర్మన్‌కు టీ-20 టీమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆమెలో ఒక ప్రత్యేక గుణం ఉంది. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమైనా, తన బ్యాటింగ్ అయినా హర్మన్ రిస్క్ తీసుకోడానికి ఏమాత్రం భయపడదు. 2017లో వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ 115 బంతుల్లో 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అందులో ఏడు సిక్సర్లు, 20 ఫోర్లు ఉన్నాయి. అందరూ ఆమెను కపిల్ దేవ్‌తో పోల్చడంతో హర్మన్ రాత్రికిరాత్రే స్టార్ క్రికెటర్ అయిపోయింది. ఆ ఇన్నింగ్స్ ఆడిన సమయంలో హర్మన్ గాయపడి ఉంది. వేలు, మణికట్టు, భుజం గాయాలతో ఇబ్బంది పడుతోంది. అంతే కాదు, హర్మన్ చాలా తక్కువ మంది మహిళా క్రికెటర్లకు మాత్రమే సాధ్యమైన ఒక ఘనతను అందుకుంది. ఎన్నో పెద్ద బ్రాండ్లు ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నాయి. ఎప్పుడూ పురుష ఆటగాళ్లను మాత్రమే ఎంచుకునే సియెట్ సంస్థ 2018లో మొదటిసారి ఒక మహిళా క్రికెటర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకుంది. సంచలనాలు - వివాదాలు రికార్డులు సాధించడం హర్మన్‌కు ఒక అలవాటులా మారింది. 2018లో హర్మన్‌ను ఐసీసీ టీ-20 కెప్టెన్‌గా ఎంపిక చేసింది. భారత పురుష, మహిళా క్రికెటర్లలో ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ కోసం సైన్ చేసిన ఏకైక భారత ప్లేయర్ హర్మన్. 2017లో ఇంగ్లండ్‌ సూపర్ లీగ్‌కు ఎంపికైన తొలి భారత క్రికెటర్ కూడా ఈమే. 2018లో టీ-20 వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్‌పై హర్మన్ సెంచరీ చేసింది. టీ-20 మ్యాచ్‌లో ఒక భారత మహిళా క్రికెటర్ చేసిన మొదటి సెంచరీ ఇదే. అయితే హర్మన్‌ను వివాదాలు కూడా చుట్టుముట్టాయి. వాటిలో మిథాలీరాజ్‌తో విభేదాలు, నకిలీ డిగ్రీ ఆరోపణలతో ఆమెను పంజాబ్ పోలీస్ డీఎస్పీ పదవి నుంచి తొలగించడం లాంటివి ఉన్నాయి. కానీ హర్మన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది. ఇటీవల కొన్ని నెలలుగా టీ-20లో హర్మన్‌ప్రీత్ ఫాం గురించి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. 2018లో ఆమె ఓ టీ-20 మ్యాచ్‌లో 103 పరుగులు చేసింది. కానీ, ఆ తర్వాత హర్మన్ ప్రదర్శన పెద్దగా చెప్పుకోదగినట్లు లేదు. గత నెల మాత్రం ఒక టీ-20 మ్యాచ్‌లో 42 పరుగులు చేసిన హర్మన్ ఇంగ్లండ్‌పై భారత్‌ను గెలిపించింది. గాడ్జెట్స్ అంటే ఇష్టం క్రికెట్ కాకుండా హర్మన్‌ప్రీత్‌కు కార్లు, మొబైల్స్, ప్లే స్టేషన్ అంటే చాలా ఇష్టం. "ఆమెకు మొబైల్స్, ప్లే స్టేషన్స్ అంటే చాలా ఇష్టం. కొత్త మొబైల్ లాంచ్ అయితే చాలు, అది తన చేతుల్లో ఉండాలని హర్మన్ కోరుకుంటుంది. హర్మన్ ఎప్పుడు ఇంటికి వచ్చినా రాత్రి 2 గంటలవరకూ క్రికెట్ గురించే మాట్లాడుతుంది. చాలాసార్లు తన మాటలు వినీ వినీ మాకు బోరు కొడుతుంది" అని బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె సోదరి హేమజీత్ చెప్పింది. బౌలర్లకు నిద్రలేకుండా చేసే హర్మన్‌కు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె "నేను ఎప్పుడైనా, ఎక్కడైనా నిద్రపోగలను. గేమ్ బోరింగ్‌గా ఉంటే నాకు నిద్రపట్టేస్తుంది" అని చెప్పింది. మార్చి 8న హర్మన్‌ప్రీత్ 31వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈసారి జట్టును ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చి భారత్‌కు ట్రోఫీ తీసుకురావాలని ఆమె కోరుకుంటోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అది 2009. మహిళా ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత్ బ్యాటింగ్ చేస్తోంది. టీమ్‌లోకి కొత్తగా వచ్చిన యువ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ 8 లేదా 9వ స్థానంలో ఆడాలి. text: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ 2017 నవంబర్‌లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి హోదాలో చారిత్రక సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినపుడు అక్కడ తాను హిందువేతరుడ్నని పేర్కొన్నట్లు చెప్తున్న విషయం మీద ట్విటర్, ఇతర మీడియా వేదికలు హోరెత్తాయి. ఆ ఆలయం వద్ద హిందువేతరులందరూ తమ గుర్తింపును ప్రకటించాల్సి ఉంటుంది. బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ తక్షణమే ట్వీట్ చేస్తూ: ''ఎట్టకేలకు రాహుల్ గాంధీ తన మతం గురించి స్పష్టంగా చెప్పారు. సోమ్‌నాథ్ వద్ద (నిబంధన ప్రకారం) హిందువేతరుల కోసం ఉద్దేశించిన సందర్శకుల రిజిస్టరులో సంతకం చేశారు'' అని వ్యాఖ్యానించారు. ''ఆయన ఆచరిస్తున్న హిందువు సంగతి తర్వాత.. విశ్వాసం రీత్యా కూడా హిందువు కానపుడు ఈ ఆలయ సందర్శనలతో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?'' అని ప్రశ్నించారు కూడా. దీనిపై వివరణ ఇవ్వడానికి కాంగ్రెస్ తక్షణమే స్పందిస్తూ అది వాస్తవాల వక్రీకరణ అని పేర్కొంది. ఆ పార్టీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ @INCIndia.. ''సోమ్‌నాథ్ ఆలయం వద్ద ఒకే ఒక్క సందర్శకుల పుస్తకం ఉంది. అందులోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతకం చేశారు. దీనిపై చేస్తున్న ఇతరత్రా ప్రచారమంతా కల్పితం. అవి నిస్పృహతో చేస్తున్న తెంపరి పనులా?'' అంటూ ట్వీట్ చేసింది. హిందూయేతరుల నమోదు నమోదు తప్పనిసరి టెలివిజన్ జర్నలిస్ట్ బ్రజేశ్ కుమార్ సింగ్.. ''సోమ్‌నాథ్ ఆలయాన్ని రాహుల్ సందర్శించినపుడు ఆయన మీడియా కోఆర్డినేటర్ మనోజ్ త్యాగి.. ఆలయాన్ని సందర్శించే హిందూయేతరుల కోసం నిర్వహించే ప్రత్యేక రిజస్టర్‌లో అహ్మద్‌పటేల్ పేరుతో పాటు రాహుల్ గాంధీ పేరును పేర్కొన్నారు. ఎన్నికల సీజన్‌లో ఇది పెద్ద పొరపాటు'' అని పేర్కొన్నారు. త్యాగి కూడా ఒక ప్రకటన జారీ చేశారు. ''నేను మీడియా సిబ్బందిని సోమ్‌నాథ్ ఆలయం లోపలికి తీసుకెళ్లడం కోసం కేవలం నా పేరును మాత్రమే నమోదు చేశాను. రాహుల్‌గాంధీ పేరు కానీ, అహ్మద్ పటేల్ పేరు కానీ అప్పుడు రిజిస్టరులో లేవు. వాటిని ఆ తర్వాత చేర్చి ఉండొచ్చు'' అని అందులో పేర్కొన్నారు. కానీ సోమ్‌నాథ్ ఆలయానికి చెందిన ప్రజా సంబంధాల అధికారి ధృవ్ జోషి మాత్రం త్యాగిని తప్పుపడుతున్నారు. ''అహ్మద్ పటేల్, రాహుల్‌ గాంధీల పేర్లను రాహుల్ మీడియా కోఆర్డినేటర్ మనోజ్‌త్యాగి హిందూయేతరుల రిజిస్టరులో నమోదు చేశారు. హిందూయేతరులందరూ ప్రవేశ ద్వారం దగ్గర సెక్యూరిటీ పాయింట్ వద్ద ఇలా నమోదు చేయడం నిబంధన ప్రకారం తప్పనిసరి'' అని జోషి చెప్పారు. ''రామరాజ్యం వర్సెస్ 'రోమ్' రాజ్యం'' ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ హిందువా కాదా అనే చర్చ కొన్ని వర్గాల్లో మొదలైంది. రాహుల్‌కి మాత్రం.. రాజీవ్‌గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ సోనియా గాంధీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది జ్ఞప్తికి తెచ్చే ఉదంతమిది. సోనియా గాంధీ 1998లో రాజకీయల్లోకి లాంఛనంగా ప్రవేశించనప్పటి నుంచీ తన విశ్వాసానికి సంబంధించిన వివాదంలోకి జారిపోకుండా జాగ్రత్తపడ్డారు. నిజానికి.. రాజకీయ ఆవశ్యకతల వల్ల సోనియా తన తల్లిదండ్రుల అభీష్టానికన్నా అధికంగా హిందూమతానికి చేరువయ్యారని విమర్శకులు అంగీకరిస్తారు. 1999 సాధారణ ఎన్నికల సమయంలో సోనియా మూలాలు, ఆమె క్రైస్తవ మత విశ్వాసం ప్రాతపదికలుగా సంఘ్ పరివార్ దేశ వ్యాప్తంగా ''రామరాజ్యం వర్సెస్ 'రోమ్' రాజ్యం'' ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పుడు భారతదేశంలోని రోమన్ క్యాథలిక్ అసోసియేషన్ అనూహ్యంగా స్పందిస్తూ.. సోనియా మతాన్ని ఆచరిస్తున్న క్యాథలిక్ కాదంటూ తిరస్కరించింది. భక్తులను ఆయన కాలితో తంతారు సోనియా, రాజీవ్‌ల వివాహం తర్వాత.. రాజీవ్ ఎప్పుడు ఏ ప్రార్థనా స్థలాన్ని సందర్శించినా ఆయన వెంట సోనియా కూడా తరచుగా కనిపించేవారు. ఆమె తన తలను చీర కొంగుతో కప్పుకుని కిందకు వంగి మతపెద్దల పాదాలను కూడా తాకేవారు. 1989 ఎన్నికల సమయంలో రాజీవ్ దేవ్రహ బాబాను కలిసినపుడు సోనియా కూడా ఆయన వెంట ఉన్నారు. ఆ బాబా.. మానవ కంపనాలు తనకు తాకకుండా ఉండేందుకోసమంటూ నేలకు ఆరడుగుల ఎత్తున దిమ్మెల మీద నిర్మించిన ఒక చెక్క వేదిక మీద ఉండేవారు. ఆయన ఆశీర్వదించే తీరు కూడా ప్రత్యేకమైనది. భక్తులను ఆయన కాలితో తంతారు. ఆ తర్వాత రాజీవ్, సోనియాలు గుజరాత్‌లోని అంబాజీ ఆలయానికి వెళ్లారు. ఇందిరాగాంధీ 1979-80 ఎన్నికల కోసం ఇంటింటి ప్రచారం ప్రారంభించే ముందుగా 1979లో మొదటిసారిగా సోనియాను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆమె ఆ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. అప్పుడు ఇందిరను అంబాజీ ఆశీర్వదించారు. ఆమె తిరిగి అధికారంలోకి వచ్చారు. తిరుమలలో సోనియా.. 1998 సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. తాను తన భర్త, అత్తల మతాన్ని పాటిస్తున్నట్లు నాడు సోనియా రాశారు. ఆమె తాను హిందువును అని నేరుగా చెప్పకపోయినప్పటికీ.. ఆమె మద్దతుదారులు, అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి ఆమెకు దర్శనం ఏర్పాటు చేశారు. సోనియాకు బాలాజీ ఆశీర్వాదాలు లభించాయి. సోనియా తిరుపతి పర్యటన తర్వాత కొంత కాలానికి సీడబ్ల్యూసీ.. 'హిందూమతం భారతదేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించే అత్యంత సమర్థవంతమైన మతం' అంటూ ఒక తీర్మానం ఆమోదించింది. 1989లో సోనియా రాజీవ్‌తో కలిసి కఠ్మాండూ వెళ్లినపుడు.. ప్రపంచంలో ఏకైక హిందూ రాచరిక రాజ్యమైన నేపాల్‌తో సంబంధాలను రాజీవ్ ఒక దారిలోకి తెస్తారని భావించినందున ఆ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉండింది. భారత ప్రధాని చారిత్రక పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకునే ముందు వరకూ ఆయన, నేపాల్ రాజు బీరేంద్ర సుహృద్భావం కొనసాగింది. తిరుపతి, పూరి ఆలయాల తరహాలోనే అక్కడ పవిత్ర ఆలయ ప్రాంగణంలోకి హిందువేతరులకు ప్రవేశం నిషిద్ధం. రాజీవ్ తనతో పాటు సోనియాను కూడా తీసుకెళ్లాలని పట్టుపట్టారు. కానీ ఆలయ పూజారులు అంగీకరించలేదు. నేపాల్‌లో ‘అవమానం’ దేవుడి ప్రతినిధుల మాటను తిరస్కరించలేనంటూ రాజు బీరేంద్ర తన అశక్తతను వ్యక్తంచేశారు. రాజు బీరేంద్ర భార్య రాణి ఐశ్వర్యకు ఆ ఆలయ ట్రస్టు మీద కొంత పట్టు ఉందనీ, సోనియాను ఆలయంలోకి అనుమతించరాదని ఆమె కూడా దృఢ నిర్ణయం తీసుకున్నారనీ అప్పుడు వినిపించింది. రాజీవ్ దీనిని వ్యక్తిగత అవమానంగా పరిగణించారని, రాజు బీరేంద్ర తనను అవమానించడానికి ఈ మార్గం ఎంచుకున్నారని ఆయన భావించారని చెప్తారు. ఆయన పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించకుండానే వెనుదిరిగారు. ఈ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడకపోగా మరింత క్షీణించాయి. భారత్ - నేపాల్ సరిహద్దు వెంట ఆర్థిక దిగ్భంధనం అమలైంది. అది నేపాల్‌ను బాగా దెబ్బతీసింది. భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో ఆగ్రహం పెల్లుబికింది. రాచరిక వ్యతిరేక శక్తుల నుండి రాజు మీద ఒత్తిడి విపరీతంగా పెరిగింది. నాటి విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ రహస్యంగా నేపాల్ వెళ్లి రాజు బీరేంద్రతో చర్చలు జరిపిన తర్వాత సంధి ప్రకటించడం జరిగింది. బనారస్ నుంచి కుటుంబ పండితుడు 2001లో మతపరంగా చాలా ప్రాముఖ్యత గల కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌లో పవిత్ర స్నానం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్ణయించుకున్నారు. 2001 జనవరి 24న త్రివేణి వద్ద పవిత్ర స్నానం చేయడం ద్వారా రెండు అంశాలపై సందేశం పంపాలని సోనియా భావించారు. తన మూలాల గురించిన వివాదాన్ని సద్దుమణచడంతో పాటు.. సంఘ్ తరహా హిందుత్వకు ఉదారమైన, సరళమైన ప్రత్యామ్నాయాన్ని ప్రదర్శించడం ఆమె ఉద్దేశం. సోనియాగాంధీ నీటిలో మునగడం, గంగా పూజ, గణపతి పూజ, కులదేవత పూజ, త్రివేణీ పూజ చేస్తున్న ఫొటోలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక హిందూ పూజారి తనకు ఇచ్చిన ఒక ఎర్ర దారాన్ని సోనియా ఇప్పటికీ తన మణికట్టుకు కట్టుకునే ఉన్నారు. ఆ ఎర్ర దారం తనను అన్ని అరిష్టాల నుంచీ రక్షిస్తుందని ఆమెకు చాలా విశ్వాసముంది. ఏదైనా కుటుంబ కార్యక్రమం జరిగిన ప్రతిసారీ మత క్రతువులు నిర్వహించడం కోసం బనారస్ నుంచి కుటుంబ పండితుడ్ని పిలిపిస్తారు సోనియా. ప్రియాంక కుమారుడు రేహన్ పుట్టినపుడు సోనియా ఆ పండితుడ్ని పిలిపించారు. ఆయన సుదీర్ఘ పూజలు నిర్వహించి నామకరణం చేశారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరహాలోనే ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ వ్యక్తిగత అంశం చర్చనీయంగా మారింది. text: ఆమెను హత్యచేసిన హంతకుడు ఆ దృశ్యాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా హోస్ట్ చేస్తున్న ఆ దృశ్యాలకు సదరు సంస్థలను బాధ్యులను చేయటం కోసం అలిసన్ తండ్రి ఆండీ ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమం గురించి ఆయన విక్టోరియా డెర్బీషైర్ కార్యక్రమానికి వివరించారు. వర్జీనియాలోని మోనెటా పట్టణంలో పర్యాటకం గురించి ఆ ఉదయం టీవీ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారు. అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దం ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగించింది. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ జర్నలిస్ట్ అలిసన్ (24 సంవత్సరాలు), చిత్రీకరిస్తున్న కెమెరామన్ ఆడమ్ వార్డ్ (27 సంవత్సరాలు) ఇద్దరూ చనిపోయారు. ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. అలిసన్, ఆడమ్ ఇరువురూ కేబుల్ చానల్ డబ్ల్యూబీజీ ఉద్యోగులు. వారిపై కాల్పులు జరిపిన దుండగుడు అదే సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి వెస్టర్ లీ ఫ్లనాగన్. వారిద్దరి ఆఖరి క్షణాలను అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. హంతకుడు తర్వాత తనను తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఆ దృశ్యాలను ఎన్నడూ చూడబోనని అలిసన్ తండ్రి ఆండీ నిర్ణయించుకున్నారు. ''నిజం... ‘ఆ వీడియో నువ్వు చూశావా, చూస్తావా...’ అని జనం నన్ను తరచుగా అడుగుతుంటారు. మొన్నొక రోజు ఒక వ్యక్తి ఆ వీడియో గురించి నాకు చెప్పబోయారు. జనానికి అసలు ఆలోచనే లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు'' అంటారాయన. అలిసన్ పార్కర్, ఆడమ్ వార్డ్ (కుడి) ఎక్కువ రోజులు కలిసి పనిచేసేవారు అయితే.. ఆ దృశ్యాల వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేలా చేయాలంటే ప్రతి వీడియో గురించీ ఆయన తమకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని సెర్చ్ ఇంజన్ గూగుల్.. ఆండీకి చెప్పింది. ''నీ కూతురు హత్యా దృశ్యాల వీడియోను నువ్వు చూసి.. దానిని మేం ఎందుకు తొలగించాలో చెప్పాలి' అని ఒక మనిషి మరొక మనిషితో చెప్పగలరేమో ఊహించండి. ఐసిస్ వంటి వారు తప్ప మరెవరైనా చెప్పగలరా? కానీ గూగుల్ అదే మాట చెప్తోంది'' అని ఆండీ పేర్కొన్నారు. అంతకన్నా దారుణం ఏమిటంటే.. తుపాకీ హింసను తుదముట్టించాలంటూ ఆండీ చేస్తున్న ఉద్యమం వల్ల.. ఆయన ఆన్‌లైన్ వేధింపులకు ఒక లక్ష్యంగా మారారు. ఆయన రాసిన వ్యాసాలకు కామెంట్లలో ''ఆమె తనను తాను కాపాడుకోవటానికి ఓ గన్ ఉండి ఉంటే...'' వంటి వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి. కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు అలిసన్ జీవితానికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసి.. ఆమె హత్య 'బూటకం' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆండీని చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. గూగుల్‌లో అలిసన్ పేరు సెర్చ్ చేస్తే.. అలిసన్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఇజ్రాయెల్‌లో రహస్యంగా జీవిస్తోందని చెప్పే వీడియోలు సహా ఇలాంటి కుట్ర సిద్ధాంతకర్తలు పోస్టు చేసిన అనేక వీడియోలు కనిపిస్తాయి. తనను ట్రోల్ చేసే వారితో మాట్లాడటానికి ఆండీ నిరాకరిస్తున్నారు. ''కీబోర్డు వీరులతో మనం ఏమీ చేయలేం. వారి ఆలోచనలను మనం మార్చలేం'' అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. వారు ఆ వీడియోలను షేర్ చేయటానికి అనుమతిస్తున్నందుకు గూగుల్, సోషల్ మీడియా వేదికలను ఆయన నిందిస్తున్నారు. అమెరికాలో వార్తలు అందించే సంస్థలపై ఉన్న నియంత్రణలు ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్లకు కూడా వర్తింపచేయాలని ఆయన అంటున్నారు. ''ఆ వీడియోల మీద అడ్వర్టైజ్‌మెంట్లు, ఆటోప్లే ఉంటాయి. వాణిజ్య ప్రకటనలను తీసివేసినా కూడా.. క్లిక్ చేసిన ప్రతిసారీ గూగుల్‌కు డబ్బులు వస్తుంటాయి. దానిని క్లిక్ చేస్తూ ఉండాలని వారు కోరుకుంటారు. మన సమాచారంతో వాళ్లు డబ్బు చేసుకుంటారు'' అని వివరించారు ఆడమ్. ''నా కూతురు మరణం నుంచి గూగుల్ లాభాలు పొందుతోంది. దానికి నేను ఒప్పుకోను. వాళ్లు (నన్ను) ఏం చేయగలరు? నాకు ఎంతో విలువైనదంతా నేను కోల్పోయాను. వారికి నేను భయపడను'' అని ఆయన స్పష్టంచేశారు. ''గూగుల్ మీద సమ్మెట దెబ్బ కొట్టటం'' కోసం, వారి వేదికలను తగినవిధంగా పరిశీలిస్తూ ఉండాలని కోరటం కోసం.. ప్రస్తుతం జార్జ్‌టౌన్ యూనివర్సిటీ సివిల్ రైట్స్ క్లినిక్‌తో కలిసి పనిచేస్తున్నారు ఆండీ. ఒకవేళ గూగుల్ అందుకు నిరాకరిస్తే.. కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) సభ్యులు రంగంలోకి దిగి ఆ సంస్థకు హితబోధ చేయాలని ఆయన అంటున్నారు. ''మీరు మాతో కలిసి ఈ దృశ్యాలను తొలగించండి లేదంటే మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లటానికీ మేం వెనుకాడం అని చెప్తాం'' అని తెలిపారు. ''ఎవరూ ఈ పని చేయలేదు. వారిని బాధ్యులుగా నిలబెడతాం. సెనెటర్లు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు'' అని వివరించారు. మానసికంగా అస్థిరంగా ఉండే వారి చేతుల్లో తుపాకులు లేకుండా చూడటానికి వీలుగా.. తుపాకీ చట్టాలకు హేతుబద్ధమైన సంస్కరణలు చేయాలని కూడా ఆండీ ఉద్యమిస్తున్నారు. ''బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో ఉన్న తుపాకీ నియంత్రణ చట్టాలను అమెరికా కూడా అనుసరిస్తే చాలా బాగుండు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. ''రెండు దశాబ్దాల కాలంలో తొలి తుపాకీ నియంత్రణ చర్యను ఈ వారమే ఆమోదించారు. మధ్యంతర ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన అంశాల్లో తుపాకీ నియంత్రణ అనేది రెండు లేదా మూడో అంశం. నేను జీవించివున్నపుడే సంస్కరణలు అమలవుతాయని నమ్ముతున్నా'' అని ఆండీ ఆశాభావం వ్యక్తంచేశారు. తన కుమార్తె చాలా అందమైన వ్యక్తి అని, ఆమెది దయార్ద్ర హృదయమని ఆండీ అభివర్ణించారు. ఆమె రోజూ 60,000 మంది ప్రేక్షకులకు తన ప్రసారాలు చేసేవారు. అవార్డులు గెలుచుకున్న డాక్యుమెంటరీలను రూపొందించారు. ఉత్తమ ప్రత్యక్ష కథనానికి గాను ఆమెకు మరణానంతరం ఎమ్మీ అవార్డు లభించింది. ''ఈ ప్రపంచానికి కొందరు చాలా ప్రకాశవంతమైన వెలుగును తీసుకొస్తారు. వారు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ వెలుగు నిలిచే ఉంటుంది' అనే మాటను నేను ఈ మధ్య చూశాను. అలిసన్ చాలా మందిని ప్రభావితం చేసింది. చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. చాలా మంది జీవితాలను స్పృసించింది. ఆ వెలుగు ప్రజ్వలిస్తూనే ఉండేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. మేం ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తుంటాం. ఆమెతో రోజూ మాట్లాడుతూనే ఉంటాను'' అని ఆండీ వివరించారు. ఒళ్లు గగుర్పొడిచే హింస, నగ్నత్వం, అక్రమ కార్యకలాపాలు, విద్వేష ప్రసంగాలతో కూడిన కంటెంట్‌ను తమ మార్గదర్శకాలు నిషేధిస్తున్నాయని యూట్యూబ్ చెప్తోంది. ఏదైనా కంటెంట్ జుగుప్సాకరంగా ఉన్నట్లయితే.. యూజర్లు సైన్-ఇన్ చేసే విధంగా ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్. ''బాధితురాలు, ఆమె కుటుంబం పట్ల మాకు సానుభూతి ఉంది. సమాజానికి భద్రత కల్పించటానికి.. ఎటువంటి పోస్టులు చేయటానికి అంగీకరించమో వివరించే స్పష్టమైన విధానాలు యూట్యూబ్‌కు ఉన్నాయి. ఈ విధానాలను ఉల్లంఘించే వీడియోల గురించి మమ్మల్ని అప్రమత్తం చేసినపుడు వాటిని మేం తొలగిస్తాం'' అని యూట్యూబ్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ''కొన్ని ఉదంతాల్లో.. ఇలా మా దృష్టికి తీసుకువచ్చిన కంటెంట్‌ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించనట్లయితే, తక్కువ వయసు యూజర్లు వీక్షించటానికి తగినవి కాకపోతే.. వాటిపై వయసు పరిమితులు విధిస్తాం'' అని పేర్కొన్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా జర్నలిస్ట్ అలిసన్ పార్కర్ 2015లో ఒక టీవీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహిస్తున్నపుడు ఆమెను కాల్చిచంపారు. ఆమెతో పాటు ఆమె కెమెరామన్ కూడా ఆ కాల్పుల్లో చనిపోయాడు. text: ఖానాపూర్‌ నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన అజ్మీరా రేఖా నాయక్‌.. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు టీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, రేఖా నాయక్ గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, సీతక్క, హరిప్రియా నాయక్ విజయం సాధించారు. మిగిలిన పార్టీల నుంచి ఒక్క మహిళ కూడా అసెంబ్లీకి ఎన్నికవలేదు. గొంగిడి సునీత ఆలేరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇచ్చిందే తక్కువ.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. పార్టీ నుంచి నలుగురు మహిళలకు టికెట్లు కేటాయించింది. ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో 11 సీట్లు మహిళలకు ఇచ్చింది. టీడీపీ తనకు కేటాయించిన 13 స్థానాల్లో ఒక స్థానాన్ని మహిళకు కేటాయించింది. బీజేపీ 14 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 10 స్థానాల్లో మహిళా అభ్యర్థులను పోటీలో పెట్టింది. టీజేఎస్, సీపీఐలు ఒక్కో స్థానాన్ని మహిళలకు కేటాయించాయి. ఏఐఎం నుంచి ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీ చేయలేదు. పద్మా దేవేందర్ రెడ్డి గతంలో ఉప సభాపతిగా ఉన్నారు ఎవరెక్కడ గెలిచారంటే.. టీఆర్ఎస్ నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో దిగగా ముగ్గురు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి 11 మంది పోటీ చేయగా ముగ్గురు విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే. ఉప సభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డిపై 47,783 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖానాపూర్‌ నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన అజ్మీరా రేఖానాయక్‌ ప్రజాకూటమి అభ్యర్థి రమేష్‌ రాథోడ్‌పై గెలుపొందారు. ఆమెకు వరసగా ఇది రెండో విజయం. ఆలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గొంగిడి సునీత రెండోసారి విజయం సాధించారు. ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన భిక్షమయ్య గౌడ్‌పై ఆమె గెలుపొందారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కోవా లక్ష్మి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కుపై విజయం సాధించారు. వీరిద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఆత్రం సక్కు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై ఆమె విజయం సాధించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమి అభ్యర్థిగా ములుగు నుంచి పోటీ చేసిన సీతక్క టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చందూలాల్‌పై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బానోత్‌ హరిప్రియా నాయక్‌ ఎస్టీ నియోజకవర్గం ఇల్లెందుల నుంచి బరిలోకి దిగి కోరం కనకయ్యపై గెలుపొందారు. ఆమె అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే తొలిసారి. చివరి క్షణంలో ప్రజాకూటమి అభ్యర్థిగా ఆమె పేరు ఖరారైంది. ఈసారైనా మహిళకు మంత్రి పదవి దక్కేనా? తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవి లభించలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధ్యతలను కూడా మగవాళ్లే నిర్వహిస్తారా? అంటూ అప్పట్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత సైతం ఈ అంశంపై స్పందించారు. మంత్రి పదవులు ఇవ్వటం, ఇవ్వక పోవటం ముఖ్యమంత్రి అధికార పరిధికి సంబంధించిన అంశమని, మహిళా మంత్రి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు. గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఒకే ఒక్క మంత్రి.. మహమూద్ అలీ ప్రమాణం చేశారు. మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత ఉంటుందని కేసీఆర్ బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణలోని మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 48 శాతం.. శాసన సభలో వారి ప్రాతినిధ్యం మాత్రం కేవలం 5 శాతం. ఈసారి ఆరుగురు మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. text: కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయాణం ఆది నుంచీ సంచలనాల మయమే. విద్యార్థిగా ఉన్నపుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగంలో పనిచేసిన రేవంత్.. అనంతరం టీడీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఎంఎల్‌సీ ఎన్నికల్లోనూ పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. కొడంగల్ నియోజవర్గం నుంచి వరుసగా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015 ఎంఎల్‌సీ ఎన్నికల్లో లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అరెస్టై బెయిల్ మీద విడుదలయ్యారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గాను, టీటీడీపీ శాసనసభా పక్ష నేతగాను ఉన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ ముగ్గురు అధ్యక్షుల్లో ఒకరుగా నియమితులయ్యారు. ఇప్పుడు కొడంగల్ నియోజవర్గం నుంచి మూడోసారి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ కీలక అభ్యర్థిగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును నేరుగా సవాల్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రొఫైల్ ఇదీ... జననం: 1969 నవంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి చదువు: ఎ.వి. కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ (బి.ఎ.) వివాహం: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి సోదరుడి కుమార్తెతో 1992లో వివాహం విద్యార్థిగా: రేవంత్‌రెడ్డి విద్యార్థిగా ఉన్నపుడే.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడిగా పనిచేశారు. రాజకీయ ప్రవేశం... 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు రేవంత్‌రెడ్డి. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ మండలం నుంచి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యుయెన్సీ (జడ్‌పీటీసీ) నుంచి పోటీ చేయటానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించటంతో రేవంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అలా సంచలన నాయకుడిగా వార్తల్లోకి వచ్చారు. మళ్లీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్‌సీగా గెలిచారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి ఆ పార్టీలో చేరారు. ఆ మరుసటి ఏడాది 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా వ్యవహరించారు. ఎంఎల్‌సీ ఎన్నికలు - అరెస్ట్... 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేట్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రేవంత్‌రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్‌-ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావటంతో యాంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) మే నెలాఖరులో రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు.. బిషప్ సెబాస్టియర్ హ్యారీ, ఉదయ్ సింహా అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో రేవంత్‌రెడ్డి 2015 జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు. కాంగ్రెస్‌లో చేరిక... రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలన్న యోచనలో ఉన్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో.. 2017 అక్టోబర్‌లో టీడీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదే నెల చివరిలో రేవంత్‌రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులతో సహా.. దిల్లీలో రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లలో రేవంత్‌రెడ్డి ఒకరుగా నియమితులయ్యారు. క్రీడలు: స్వయంగా క్రీడాకారుడైన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ హాకీ ఫెడరేషన్, ఇండియన్ హాకీ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్)లకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అనుముల రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లలో ముఖ్యమైన నాయకుడు. అంతేకాదు.. కాంగ్రెస్ గెలిస్తే తాను ముఖ్యమంత్రినవుతానంటూ కొద్ది రోజుల కిందట ఎన్నికల ప్రచారంలో సూచించటం ద్వారా కలకలం రేపారు. text: వర్షాభావాన్ని, క‌రువు క‌ష్టాల‌ను అధిగ‌మించేందుకు గ‌తం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌లు ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ద‌శాబ్దం క్రిత‌మే మేఘ‌మ‌థ‌నం వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. ఆ తర్వాత రెయిన్ గ‌న్ల స‌హాయంతో పంట‌ల ప‌రిర‌క్ష‌ణ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వ‌ర్షాభావం లోటు కొన‌సాగుతోంది. జూన్ 1 నుంచి న‌వంబ‌ర్ 23 నాటికి జిల్లాలో 933 మిల్లీ మీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోద‌యితే సాధార‌ణ వ‌ర్ష‌పాతంగా భావిస్తారు. కానీ ఈ ఏడాది 683.8 మి.మి వ‌ర్ష‌పాతం మాత్ర‌మే న‌మోద‌య్యింది. దాంతో 26.7 శాతం లోటు ఏర్ప‌డింది. ‘ఆయన సేవలు ఉపయోగించుకోండి’ ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లాకి చెందిన చియాద్రి వెంక‌టేశ్వ‌ర్లు అనే వ్య‌క్తి ఇటీవల విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్‌ని క‌లిశారు. త‌న‌కు వ‌ర్షాలు కురిపించే శ‌క్తి ఉంద‌ని చెప్ప‌డంతో క‌లెక్ట‌ర్ ఆశ్చ‌ర్యపోయారు. ఎప్పుడు కావాలంటే, అక్క‌డ వ‌ర్షాలు కురిపిస్తానంటూ చెప్పిన వెంక‌టేశ్వ‌ర్లు సేవ‌ల‌ను వినియోగించుకోవాలంటూ క‌లెక్ట‌ర్ నేరుగా వ్య‌వ‌సాయ శాఖ అధికారులను కోరుతూ లేఖ కూడా విడుద‌ల చేశారు. కొత్త‌వ‌ల‌స మండ‌లం చీపురువ‌ల‌స‌లో 30 నిమిషాల పాటు ఏక‌ధాటిగా వ‌ర్షం కురిపించిన‌ట్టు వెంక‌టేశ్వ‌ర్లు చెప్ప‌ుకున్న విష‌యాన్ని క‌లెక్ట‌ర్ త‌న లేఖ‌లో ప్ర‌స్తావించ‌డం విశేషం. ఆ లేఖ ద్వారా జిల్లాలోని ప‌లువురు అధికారుల‌ను వెంక‌టేశ్వ‌ర్లు క‌లిశారు. చివ‌ర‌కు విజ‌య‌న‌గ‌రం మునిసిపాలిటీ చైర్మ‌న్ ప్ర‌సాదుల రామ‌కృష్ణ‌ని కూడా క‌లిశారు. ‘వర్షం స్వామి కరుణించటానికి రూ. 50 వేలు ఖర్చు‘ వ‌ర్షం కురిపిస్తారంటూ, ఆయ‌న సేవ‌లు వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరిన లేఖ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న మునిసిప‌ల్ చైర్మ‌న్.. త‌మ‌కు ముషిడిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌లో వ‌ర్షం కురిపించాల‌ని కోరారు. వ‌ర్షం స్వామి క‌రుణించ‌డానికి మొత్తం రూ. 50,000 ఖ‌ర్చ‌వుతుంద‌ని.. అడ్వాన్సుగా రూ. 7,000 ఇవ్వాల‌ని కోరారు. దీంతో అక్క‌డి వారికి అనుమానం వ‌చ్చి నిల‌దీయ‌గా వ‌ర్షం స్వామి వ్య‌వహారం బ‌య‌ట‌కొచ్చింది. అంత‌కుముందే క‌లెక్ట‌ర్ లేఖ‌తో త‌మ‌ను క‌లిశార‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా వ్య‌వ‌సాయ శాఖ జేడీ జీఎస్ఎన్ఎస్ లీలావ‌తి తెలిపారు. తాను ఒక ప్రార్థ‌న చేసి, ధ్యానం ద్వారా వ‌ర్షాలు కురిపిస్తాన‌ని చెప్పిన‌ట్టు జేడీ వివ‌రించారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏదో చేస్తాన‌ని చెప్పిన‌ప్పుడు అభ్యంత‌రం చెప్ప‌డం ఎందుకని స‌హ‌క‌రించామ‌న్నారు. ‘కొత్తవలసలో కురవలేదు కానీ.. గంట్యాడలో వర్షం కురిసింది’ ఆయ‌న కోర‌డంతో ప్రార్థ‌న చేయాలని తాము చెప్ప‌డంతో కొత్త‌వ‌ల‌స మండ‌లంలో పూజ‌లు చేశార‌ని, కానీ ఆ మండ‌లంలో మాత్రం వ‌ర్షం కుర‌వ‌లేద‌న్నారు. గంట్యాడ మండ‌లంలో మాత్రం వ‌ర్షం కురిసిన‌ట్టు జేడీ లీలావ‌తి వివ‌రించారు. ఈ లేఖ రాసిన విష‌యంపై విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హార్‌లాల్ ని సంప్ర‌దించ‌గా ఆయ‌న స్పందించేందుకు నిరాక‌రించారు. క‌లెక్ట‌ర్ కార్యాలయ అధికారి ఆనంద్ మాత్రం లేఖ జారీ చేసిన తీరు గురించి బీబీసీకి వివ‌రించారు. త‌న ద‌గ్గ‌ర అతీత‌శ‌క్తులున్నాయ‌ని, ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని వేడుకోవ‌డంతోనే తాము లేఖ రాసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. అయితే క‌లెక్ట‌ర్ లెట‌ర్ హెడ్ మీద జారీ అయిన లేఖ‌ను దుర్వినియోగం చేస్తున్న‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. లేఖ‌ను వెన‌క్కి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌స్తుతం తిరుప‌తిలో ఉన్నాన‌ని చెబుతున్నార‌ని ఆనంద్ తెలిపారు. ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించటం తగదు’ ఇలాంటి ప్ర‌య‌త్నాల‌ు త‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించాయ‌ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ఇ.ఎస్.శ‌ర్మ పేర్కొన్నారు. అతీత‌శ‌క్తులున్నాయ‌ని చెబుతున్న వారిని ప్రోత్స‌హించ‌డం ఏమాత్రం త‌గ‌ద‌న్నారాయ‌న‌. ప్ర‌భుత్వ స‌ర్వీసులో క‌లెక్ట‌ర్ స్థాయి అధికారి ఇలా చేయ‌డం నిబంధ‌న‌లకు విరుద్ధంగా ఉంద‌న్నారు. వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు వేరు, సొంతంగా ఇలాంటివి ప్రోత్స‌హించ‌డం వేరు గానీ అధికారాన్ని ఉప‌యోగించుకుని అతీత‌శ‌క్తుల పేరుతో మార్కెటింగ్ చేసిన‌ట్టుగా ఉంద‌న్నారు. ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేసిన‌ట్టుగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని శ‌ర్మ కోరుతున్నారు. స‌మాజంలో ఇలాంటి ధోర‌ణులు పెరుగుతున్నాయ‌న‌డానికి ఈ లేఖ ఓ నిద‌ర్శ‌న‌మ‌న్నారు. శాస్త్రీయ భావ‌న‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఉన్న సైన్స్ ఉద్య‌మ కార్య‌క‌ర్త‌ త్రిమూర్తులురెడ్డి కూడా ఈ లేఖ మీద స్పందించారు. ఇప్ప‌టికే కృత్రిమ వ‌ర్షాల కోసం అనేక ప్ర‌యోగాలు చేసిన‌ప్ప‌టికీ సంపూర్ణంగా ఫ‌లితాలు రాలేద‌న్నారు. అలాంటి స‌మ‌యంలో ఆధారాలు లేని విష‌యంలో అతీత‌శ‌క్తులున్నాయంటూ నేరుగా జిల్లా క‌లెక్ట‌ర్ అధికారికంగా లేఖ రాయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించాల‌న్నారు. వ్య‌క్తిగ‌త విశ్వాసాల‌ను అధికారయుతం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. నేను వర్షం పడాలంటే పడుతుంది.. ఆగాలంటే ఆగుతుంది (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్త‌రాంధ్ర ప్రాంతం చాలాకాలంగా వ‌ర్షాభావ ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది కూడా అదే ప‌రిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు కురిపించటం కోసం విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ రాసిన ఒక సిఫారసు లేఖ వివాదాస్పదంగా మారింది. text: బహుశా, ట్రంప్ మనసులో హ్యూస్టన్‌లో 'హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరైన దాదాపు 50 వేల మంది భారత, అమెరికన్ల మధ్య భారత ప్రధాని మోదీ తన చిరపరిచిత శైలిలో 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్'(ఈసారీ ట్రంప్ ప్రభుత్వాన్ని గెలిపించండి) అనడం గుర్తొచ్చే ఉంటుంది. అయితే 'ద న్యూయార్క్ టైమ్స్' లాంటి చాలా అమెరికా పత్రికలు ఈ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడిని మోదీ హ్యాంగర్‌లా వర్ణించింది. కానీ డోనల్డ్ ట్రంప్‌కు మాత్రం, భారత సంతతి వారైన 40 లక్షల అమెరికన్లు ముఖ్యం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన, దాని వల్ల ట్రంప్‌కు లభించపోయే మూడు అతిపెద్ద ప్రయోజనాల గురించి మాట్లాడిన 'ద హిందూ' దౌత్య అంశాల ఎడిటర్ సుహాసిని హైదర్ "ఈ పర్యటన ప్రవాసుల ఓట్లను ప్రభావితం చేస్తుందని ట్రంప్ అనుకుంటున్నాట్లు" చెప్పారు. నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్ కశ్మీర్ 'వైల్డ్ కార్డ్' డోనల్డ్ ట్రంప్ వ్యాపార ఒప్పందాలు, దౌత్య సంబంధాలను చెడగొట్టిన తన ఇమేజ్‌ను సరిదిద్దుకునే ప్రయత్నాలతోపాటు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం కూడా చేస్తారు. సుహాసినీ హైదర్ చెబుతున్నదాన్ని బట్టి ఈ పర్యటనలో కశ్మీర్ 'వైల్డ్ కార్డ్' అవుతుంది. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే అమెరికా అధ్యక్షుడి భారత పర్యటనకు కొన్ని రోజుల ముందే నలుగురు అమెరికా ఎంపీలు, తమ విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోకు లేఖ రాశారు. భారత్‌లో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేనంతగా సుదీర్ఘ ఇంటర్నెట్ నిషేధం, సామాన్యులు, నేతల సుదీర్ఘ నిర్బంధం గురించి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖ రాసిన ఎంపీల్లో ఇద్దరు అధ్యక్షుడు ట్రంప్ పార్టీ రిపబ్లికన్‌ వారు కాగా, మరో ఇద్దరు ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ వారు. ట్రంప్ ఇంతకు ముందు కశ్మీర్ అంశంలో భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని చొరవ చూపారు. అయితే భారత్ దానిని స్పష్టంగా తిరస్కరించింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ దాడి చేసినప్పుడు పట్టుబడిన ఎయిర్‌ఫోర్స్ పైలెట్ అభినందన్‌ను విడుదల చేయించడంలో కూడా కీలక పాత్ర పోషించినట్టు అప్పట్లో అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు మళ్లీ దానికి ప్రయత్నించవచ్చు. ట్రంప్ ముఖ్యమైన నినాదాల్లో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' ఒకటి. ఇప్పటివరకూ జరిగిన సర్వేల్లో డోనల్డ్ ట్రంప్ పాపులారిటీ గణాంకాలు 50 లోపలే ఉన్నాయి. అమెరికాకు కీలకంగా అనిపించే ఎలాంటి నిర్ణయం అయినా ఆ గణాంకాలను మరింత పైకి తీసుకెళ్లడానికి చాలా సహకరిస్తుంది. రక్షణ, మిగతా ఒప్పందాలు రాయిటర్స్ వివరాల ప్రకారం ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిల్లీలో వివిధ రంగాలకు చెందిన కొందరు భారత ప్రముఖులను, పెద్ద కంపెనీల ప్రతినిధులను కలవబోతున్నారు. ముఖ్యంగా, ఎన్నికల వేళ అమెరికా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడం, అక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం ట్రంప్ ప్రభుత్వానికి చాలా కీలకం. అమెరికాలో ఐదు నెలల వరుస మందగమనం తర్వాత ఇటీవల జనవరిలో నిర్మాణ రంగం గణాంకాలు మెరుగుపడ్డాయి. కానీ ఆర్థికవ్యవస్థ పూర్తి పునరుద్ధరణ లక్ష్యం ఇంకా దూరంగానే ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా అమెరికాలో ఒక బిలియన్ డాలర్ పెట్టుబడుల గురించి, దానివల్ల ఏర్పడే కొత్త అవకాశాల గురించి చెప్పింది. 100 బిలియన్ డాలర్ల విలువ చేసే 13 టాటా గ్రూప్ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. వాటిలో 35 వేల మంది పని చేస్తున్నారు. వ్యాపార సంస్థ సీఐఐ అధ్యయనం ప్రకారం అమెరికాలో దాదాపు 100 భారత కంపెనీలు ఉన్నాయి. అక్కడ మొత్తం 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో లక్ష మందికి పైగా అమెరికా కార్మికులు ఉపాధి పొందారు. అధ్యక్షుడు ట్రంప్‌ను కలవబోతున్న పారిశ్రామిక వేత్తల జాబితాను క్లియరెన్స్ కోసం అమెరికా అధ్యక్ష కార్యాలయానికి పంపించారని, దిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం దానిని పర్యవేక్షిస్తోందని పీటీఐ చెప్పింది. ట్రంప్ పర్యటన సందర్భంగా భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన పన్నులు తగ్గించాలని, వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలు, ఆటో రంగంలో ఎక్కువ ఉదార విధానాలు పాటించాలని, అమెరికా వైపు నుంచి సుంకం తగ్గించాలని డిమాండ్లు ఉండవచ్చు. అమెరికా నుంచి భారత్ 24 యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు చేయడానికి 2.6 మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని కూడా ఫైనల్ చేస్తుందని కూడా ఆశిస్తున్నారు. భారత-అమెరికన్ల ఓటు ట్రంప్ ఆశలు, ఎంతోమంది విశ్లేషకుల వాదనలు పక్కన పెడితే, భారత సంతతి అమెరికన్ల నుంచి ఆయనకు ఎన్ని ఓట్లు పడతాయి.. అనేదానిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. 'ఏషియన్ అమెరికన్ లీగల్ డిఫెన్స్, ఎడ్యుకేషన్ ఫండ్' సంస్థ వివరాల ప్రకారం ఎక్కువ మంది ప్రవాస భారతీయులు డెమోక్రాట్స్ ఓటర్లుగా రిజిస్టరై ఉన్నారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో వీరిలో 77 శాతం మంది హిల్లరీ క్లింటన్‌కు తమ ఓట్లు వేశారని ప్రముఖ పత్రిక 'ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ' చెప్పింది. అయితే ఇటీవల కొన్నేళ్లుగా ఆ దేశంలో 'అమెరికా రిపబ్లికన్ హిందూ కొలిషన్' లాంటి సంస్థలు విస్తరిస్తున్నాయి. రాజకీయ పరంగా అధ్యక్షుడికి ఇవి ఎంత వరకూ సహకరిస్తుంది అనేది చెప్పడం కష్టం అని ప్రవాస భారతీయుల సంస్థ ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషీపురా చెప్పారు. ఇద్దరు నేతల మధ్య సన్నిహిత సంబంధాలను ఓటరు ఎలా చూస్తాడనేది వారిపైనే ఆధారపడి ఉంటుందని సంజీవ్ చెప్పారు. "కానీ, తన ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకునేటపుడు, అధ్యక్షుడు ట్రంప్ వారి గురించి చేసిన ప్రకటనలు, చర్యలు, అమెరికా వీసాను కష్టతరం చేయడం లాంటి విషయాలు ఓటరు మనసులో ఎక్కడో ఒక చోట కచ్చితంగా తిరుగుతాయి. భారత్ లాంటి దేశాల నుంచి అక్కడికి వెళ్లిన వృత్తి నిపుణులపై వాటన్నిటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) డోనల్డ్ ట్రంప్ తన ప్రతిపాదిత భారత పర్యటన సందర్భంగా లక్షలాది ప్రజల గురించి మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ అయితే విమానాశ్రయం(అహ్మదాబాద్) నుంచి స్టేడియం వరకూ జరిగే రోడ్‌ షోకు 50-70 లక్షల మంది హాజరవుతారని అన్నట్లు చెప్పారు. text: ‘‘ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన సరోజ్‌కు అలహాబాద్ బ్యాంకులో 2018 నుంచి ఖాతా ఉంది. సోమవారం ఆమె బ్యాంకుకు వెళ్లినపుడు ఆమె ఖాతాలో రూ.9.99 కోట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. తన ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతాలో దాదాపు రూ.10 కోట్లు జమ కావడంతో విస్తుపోవడం ఆ అమ్మాయి వంతైంది. నిరక్షరాస్యురాలైన ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బు జమ చేయడానికి అంటూ గతంలో ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు, ఫొటో అడిగితే పంపించానని, ఆ నంబరుకు ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోందని మంగళవారం ఆమె విలేకరులకు తెలిపింది. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తనకు తెలీదని సరోజ్ చెప్పార’ని ఈనాడులో రాశారు. జగన్, అమిత్ షా సమావేశం ఏపీ సీఎం జగన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తమకు సమాచారం అందిందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ‘ఢిల్లీ పిలుపు’ మేరకు జగన్‌ మంగళవారం ఆకస్మికంగా హస్తినకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల సంగతి ఎలా ఉన్నా.... మొత్తంగా న్యాయ వ్యవస్థను, అందులోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని అమిత్‌షా ప్రస్తావించినట్లు తెలిసిందని జ్యోతి రాసింది. ‘‘న్యాయమూర్తులపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం, అందుకు పార్లమెంటును కూడా ఉపయోగించుకోవడం సరైంది కాదు. ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. రచ్చకెక్కడం మంచిది కాదు’’ అని జగన్‌కు అమిత్‌షా చెప్పినట్లు తెలిసిందని పత్రిక చెప్పింది. న్యాయ వ్యవస్థతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, పరిపాలన సాగించడమే క్లిష్టంగా మారుతోందని జగన్‌ వివరించేందుకు ప్రయత్నించగా.. అమిత్‌షా వినిపించుకోలేదని సమాచారం. భారత దేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇస్తుండగా.. చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వమే కోర్టులను టార్గెట్‌ చేయడం ఏమిటని అమిత్‌షా నిలదీసినట్లు తెలిసిందని కథనంలో రాశారు. ‘‘ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో అప్పీల్‌ చేసి తేల్చుకోవాలి. ఇది మాత్రం పద్ధతి కాదు’’ అని కఠినంగానే చెప్పినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో వైసీపీ నేతలు కోర్టులకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం, ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం, దానికి ప్రభుత్వం వత్తాసుగా నిలవడం ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలిసింది. సీఎంగా ఉన్న వ్యక్తి విచక్షణారహితంగా వ్యవహరించడం తగదని అమిత్‌షా మందలించినట్లు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి తన కథనంలో వివరించింది. మరోవైపు.. ప్రజా ప్రతినిధులపై నమోదైన ఆర్థిక నేరాలు, క్రిమినల్‌ కేసులను ఏడాదిలోపు పరిష్కరించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జగన్‌ తనపై ఉన్న కేసుల అంశాన్ని ప్రస్తావించినట్లు తమకు తెలిసిందని పత్రిక రాసింది. డ్రగ్స్ కేసులో మరో రెండు కొత్త పేర్లు బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్తగా నటుడు మహేశ్ బాబు భార్య నమ్రత, నటి దియా మీర్జా పేర్లు బయటికి వచ్చాయని సాక్షి కథనం ప్రచురించింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణలో రోజూ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, నటి దియా మీర్జా పేరు తెరపైకి రావడం సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం దియాకు ఎన్సీబీ సమన్లు పంపనున్నట్లు తెలుస్తోందని సాక్షి రాసింది. కాగా, నమ్రతపై వచ్చిన ఆరోపణలను ఆమె టీమ్‌ ఖండించింది. ఈ వ్యవహారంతో ఆమెకు సంబంధం లేదని స్పష్టంచేసింది. సుశాంత్‌ మాజీ టాలెంట్‌ మేనేజర్‌ జయ సాహాను ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్న క్రమంలో పలువురు బాలీవుడ్‌ నటీమణుల పేర్లు బయటకి వస్తున్నాయి. జయ సాహా వాట్సాప్‌ గ్రూప్స్‌లో చాట్‌లను జాతీయ మీడియా ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. కోడ్‌ భాషలో ఉన్న అక్షరాలను డీ కోడ్‌ చేస్తూ ఉంటే ఒక్కొక్క బాలీవుడ్‌ హీరోయిన్‌ పేరు బయటపడుతోంది. ఇందులో ఎన్‌ అంటే నమ్రతా శిరోద్కర్‌ అని అనుమానిస్తున్నారు. డి అంటే దీపికా పదుకొణె, ఎస్‌ అంటే శ్రద్ధాకపూర్, కె అంటే దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్, జె అంటే జయ సాహా అని భావిస్తున్న విషయం తెలిసిందే అని పత్రిక చెప్పింది. ఇప్పటికే కరిష్మా ప్రకాశ్‌కి విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌సీబీ సమన్లు పంపింది. జయ సాహా గ్రూప్‌ చాట్స్‌లో నమ్రత, జయ... దీపిక, కరిష్మా ప్రకాశ్‌ మధ్య జరిగినట్టుగా భావిస్తున్న సంభాషణలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 2017 అక్టోబర్‌లో ఈ వాట్సాప్‌ సంభాషణలు జరిగినట్టు సమాచారం అందిందని సాక్షి వివరించంది. భారత్‌లో కరోనా తగ్గుముఖం దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని నమస్తే తెలంగాణ సహా ప్రధన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి. యావత్‌ దేశప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నదా? కొన్ని నెలలుగా యావత్‌ భారతాన్ని వణికించిన వైరస్‌.. క్రమంగా కబళించేశక్తిని కోల్పోతున్నదా? అంటే.. అవుననే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా.. రోజుకు దాదాపు లక్ష కేసుల వరకూ వెళ్లిన కరోనా గ్రాఫ్‌ మెల్లగా కిందికి వస్తున్నది. ఆదివారం దేశవ్యాప్తంగా 92,605 కొత్త కేసులు, 1,133 మరణాలు నమోదుకాగా.. సోమవారం 86,961 కొత్త కేసులు, 1,130 మరణాలు నమోదయ్యాయి. కాగా.. మంగళవారం ఇది మరింతతగ్గి.. కొత్తకేసుల సంఖ్య 75,083కి పడిపోయింది (ఇది దాదాపు నెల రోజుల వ్యవధిలో అత్యల్పం). అదేవిధంగా కరోనా మరణాల సంఖ్య 1,053కి తగ్గింది. ఈ లెక్కన కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. మరోవైపు, మహమ్మారి బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. సోమవారం నుంచి మంగళవారానికి ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 1,01,468 మంది కోలుకున్నారని నమస్తే తెలంగాణ వివరించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక యువతి ఖాతాలో ఆమెకు తెలీకుండానే 10 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది. text: ముంబయి పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటివరకూ ఇందులో మూడు చానళ్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ పేరు బయటపెట్టిన పోలీసులు అది టీఆర్పీ సిస్టమ్‌ను టాంపరింగ్ చేసిందని చెప్పారు. అయితే రిపబ్లిక్ టీవీ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. కానీ, వీటన్నిటి మధ్యా అసలు టీఆర్పీ అంటే ఏమిటి, టెలివిజన్ చానళ్లకు అది ఎందుకు అంత ముఖ్యం అనే ప్రశ్న కూడా వస్తుంది. టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. ఇది ఒక ప్రత్యేకమైన టూల్. దీని ద్వారా ఏ కార్యక్రమం లేదా ఏ చానల్‌ను జనం ఎక్కువగా చూస్తున్నారో అంచనా వేయవచ్చు. వీటితో ప్రజల ఇష్టాలను తెలుసుకోడానికి వీలవుతుంది. టీఆర్పీకి టీవీలో చూపించే కార్యక్రమాలకు నేరుగా సంబంధం ఉంటుంది. ఈ రేటింగ్స్ వల్ల కంపెనీలు, ప్రకటనలు ఇచ్చే ఏజెన్సీలకు ప్రయోజనం లభిస్తుంది. ఏ కార్యక్రమం వచ్చే సమయంలో తమ ప్రకటనలను జనం ఎక్కువగా చూడవచ్చో తెలుసుకోడానికి వారికి ఈ రేటింగ్స్ సహకరిస్తాయి. అంటే ఒక కార్యక్రమం లేదా టీవీ చానల్ రేటింగ్‌లో అన్నిటికంటే ముందుంటే దానికి ఎక్కువ ప్రకటనలు వస్తాయి. అంటే ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. అయితే 2008లో ట్రాయ్ టెలివిజన్ ఆడియన్స్ మెజర్‌మెంట్‌కు సంబంధించి కొన్ని సిఫారసులు చేసింది. వీటి ప్రకారం ప్రకటనలు ఇచ్చేవారికి తమ డబ్బుకు తగిన పూర్తి ప్రయోజనం లభించేలా రేటింగ్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కానీ, టెలివిజన్, చానళ్ల కార్యక్రమాల ప్రాధాన్యాన్ని నిర్ధారించడానికి ఇవి ఒక బెంచ్‌మార్క్‌గా మారాయి. ఈ టెలివిజన్ రేటింగ్స్ ఎవరిస్తారు 2008లో టామ్ మీడియా రీసెర్చ్(టామ్), ఆడియో మెజర్‌మెంట్ అండ్ అనలిటిక్స్ లిమిటెడ్(ఎఎంఏపీ) టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చేవి. టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా( ట్రాయ్) వివరాల ప్రకారం ఈ రెండు ఏజెన్సీల పని కొన్ని పెద్ద నగరాల వరకే పరిమితమై ఉండేది. ఆడియన్స్ మెజర్‌మెంట్ కోసం పానల్ సైజ్ కూడా పరిమితంగా ఉండేది. ట్రాయ్ అదే ఏడాది దీనికోసం ఇండస్ట్రీ ప్రతినిధుల నేతృత్వంలో స్వీయ నియంత్రణ కోసం బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ఏర్పాటు చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆ తర్వాత 2010 జులైలో బార్క్ ఉనికిలోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత టామ్ కూడా టెలివిజన్ రేటింగ్ ఇవ్వడం కొనసాగించింది. అయితే ఏఎంఏపీ ఆ పని ఆపివేసింది. ఈలోపు ఈ అంశంపై చాలా చర్చలు నడిచాయి. 2014 జనవరిలో టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2015 జులైలో భారత్‌లో టెలివిజన్ రేటింగ్ ఇవ్వడానికి బార్క్ గుర్తింపు పొందింది. టామ్ సమచార మంత్రిత్వ శాఖలో దీనికోసం రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, అది ఆ పనిని ఆపివేసింది. దాంతో బార్క్ బారత్‌లో టెలివిజన్ రేటింగ్స్ ఇచ్చే ఏకైక ఏజెన్సీ అయ్యింది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ , అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బార్క్ ఇండస్ట్రీ ప్రతినిధులుగా ఉన్నాయి. టీవీ రేటింగ్స్ ఎలా ఇస్తారు రేటింగ్ ఇవ్వడానికి బార్క్ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి- ఇళ్లలో ఉన్న టెలివిజన్‌లో ఏం చూస్తున్నారో తెలుసుకోడానికి భారీ స్థాయిలో సర్వే నిర్వహిస్తారు. దానికోసం టీవీకి ఒక ప్రత్యేక మీటర్ ఏర్పాటుచేస్తారు. అది టెలివిజన్‌లో వారు ఏయే చానళ్లు చూస్తున్నారో, ఆ వివరాలను నమోదు చేస్తుంది. రెండోది- జనం ఏది ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతున్నారో తెలుసుకోడానికి రెస్టారెంట్లు, హోటళ్లలో ఉన్న టీవీ సెట్ల నుంచి వారు ఏ చానల్, ఏ కార్యక్రమం చూస్తున్నారు అనే డేటాను సేకరిస్తారు. ప్రస్తుతానికి దేశంలోని 44 వేల ఇళ్ల నుంచి టీవీ కార్యక్రమాల డేటా సేకరిస్తున్నారు. 2021 నాటికి ఈ టార్గెట్ పానెల్‌ను 55 వేల ఇళ్లకు పెంచాలని బార్క్ ప్రయత్నిస్తోంది. అటు రెస్టారెంట్లు, షాపుల్లో మొత్తం శాంపిల్ సైజ్ 1050గా ఉంది. సేకరించిన మొత్తం డేటా ద్వారా తేల్చిన గణాంకాలను అది ప్రతి వారం విడుదల చేస్తుంది. రేటింగ్‌- ప్రకటనల సంబంధం ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో 130 కోట్ల మంది ఉన్నారు. దేశంలో 19.5 కోట్లకు పైగా టెలివిజన్ సెట్లు ఉన్నాయి. నిపుణులు భారత్‌ను ఒక పెద్ద మార్కెట్‌గా చెబుతున్నారు. అందుకే ప్రజల వరకూ చేరుకోడానికి కంపెనీలకు ప్రకటనలు చాలా కీలకం. ఫిక్కీ(FICCI) ఒక రిపోర్ట్ ప్రకారం 2016లో భారత్‌లో ప్రకటనల వల్ల టెలివిజన్ చానళ్లకు 243 బిలియన్ల ఆదాయం లభించింది. అటు సబ్‌స్క్రిప్షన్ వల్ల 90 బిలియన్లు లభించాయి. ఈ ప్రకటనల ఆదాయం 2020లో 368 బిలియన్లకు పెరిగితే, సబ్‌స్క్రిప్షన్లు 125 బిలియన్లకు చేరాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) డబ్బులిచ్చి టీవీ చానళ్ల టీఆర్పీ పెంచడానికి ప్రయత్నించిన ఒక రాకెట్‌ గుట్టు బయటపెట్టామని ముంబయి పోలీసులు చెబుతున్నారు. text: మావో జెడాంగ్, జీ జిన్‌పింగ్ జాతీయ శాసన సభ, రాజకీయ సలహా విభాగం సమావేశాలు బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి. వీటినే చైనా 'రెండు సమావేశాలు'గా పిలుస్తారు. దేశ రాజకీయాల్లో ఈ రెండు సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఈయేడు కీలకమైన రాజ్యాంగ సవరణలు చేసే దిశగా పార్లమెంట్ కొన్ని నిర్ణయాలను ఆమోదించనుంది. అందులో ముఖ్యమైంది ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం. అంతేకాదు, ఎవరైనా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండరాదనే నిబంధనను కూడా తొలగించడం. అంటే దీనర్థం షీ జిన్‌పింగ్‌ను మరింత కాలం అధ్యక్ష పీఠంలో కొనసాగించడం. ఇప్పటికే ఆయన సిద్ధాంతాలు, మార్గదర్శకాలతో నవ చైనా ముందుకు వెళుతోంది. దీన్నే 'షీ జిన్‌పింగ్ ఆలోచనలు'గా పిలుస్తున్నారు. ఆయ‌న పాల‌న‌లో తీసుకొచ్చిన‌ కొత్త‌ సంస్క‌ర‌ణ‌ల‌నే జిన్‌పింగ్ థాట్ అంటారు. ఏమిటీ సమావేశాలు? చైనా చట్టసభను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)గా పిలుస్తారు. ఇది భారత్‌లోని లోక్‌సభ లాంటిదని చెప్పవచ్చు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్‌పీసీ అత్యంత బలమైన జాతీయ సభ. అయితే, చైనాలో ఏక పార్టీ వ్యవస్థ అమల్లో ఉండటంతో అంతర్జాతీయ పరిశీలకులు మాత్రం దీన్ని రబ్బర్ స్టాంప్‌గా అభివర్ణిస్తుంటారు. ఈ ఏడాది చైనా ప్రావిన్స్‌లు, స్వతంత్ర ప్రాంతాలు, కేంద్ర పరిపాలన మున్సిపాలిటీలు, హాంకాంగ్, మకావ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతాలు, సాయుధ దళాల నుంచి దాదాపు 2,980 మంది ఎన్‌పీసీ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇందులో 742 మంది మహిళలు, 438 మంది మైనారిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎన్‌పీసీ భవనం దేశంలో చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) అత్యంత బలమైన రాజకీయ సలహా సంస్థ. అయితే, దీనికి చట్టాలు చేసే అధికారం మాత్రం లేదు. ప్రస్తుతం సీపీపీసీసీలో 2,158 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వీటి సమావేశాలు కూడా కీలకమైనవే. ఈ రెండు సమావేశాలను చైనీస్‌లో 'లియాంగ్ హుయ్‌'గా పిలుస్తుంటారు. ఇవి వారం నుంచి రెండు వారాల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది సీపీపీసీసీ సమావేశాలు మార్చి 3న, ఎన్‌పీసీ సమావేశాలు మార్చి 5న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఏం జరగొచ్చు? ఐదేళ్లకోసారి నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు గతేడాది 2017లో జరిగాయి. ఆ తర్వాత జరుగుతున్న పెద్ద కార్యక్రమం ఈ రెండు సమావేశాలు. అందుకే ఇవి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సమావేశంలో తీసుకొనే ముఖ్యమైన నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సంస్కరణలు, జీ జిన్‌పింగ్ ఎక్కువగా దృష్టిసారించే అవినీతి, పర్యావరణ పరిరక్షణపై కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ప్రతిపక్షం ఏమైనా ఉందా? చైనాలో ఏక పార్టీ వ్యవస్థ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా పిలిచే కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించిందే చట్టంగా మారుతుంది. నిజానికి దేశంలో అధికారికంగా చాలా రాజకీయ పార్టీలున్నాయి. కానీ, అవన్నీ కమ్యూనిస్టు పార్టీకి మద్దతిస్తున్నవే. చైనా మీడియా ఎలా చూస్తోంది? ఈ రెండు సమావేశాలకు చైనా జాతీయ మీడియా భారీ స్థాయిలో కవరేజ్ ఇస్తోంది. అయితే, సమావేశాలపై ఏ మీడియాలోనూ విమర్శలు కనిపించవు. 'చాలా కాలంగా ఎదురు చూస్తున్న జాతీయ సంస్థల పునరుద్ధరణ ఎన్‌పీసీ సమావేశంలో ప్రధాన అంశంగా ఉంటుంది' అని చైనా రేడియో ఇంటర్నేషనల్ ప్రశంసించింది. 'సుస్థిర పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పేదరిక నిర్మూలన ఈ సమావేశాల్లో ముఖ్యమైన అంశాలుగా ఉండనున్నాయి' అని బీజింగ్‌కు చెందిన చైనా ఫైనాన్స్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పేర్కొంది. సీపీపీసీసీ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తారు అయితే, అమెరికాకు చెందిన ఎన్‌టీడీటీవీ.కాం మీడియా మాత్రం, 'చాలా ప్రావిన్స్‌ల నుంచి తమ సమస్యలు చెప్పుకోడానికి ఫిర్యాదుదారులు బీజింగ్‌కు తరలివస్తున్నారు' అని పేర్కొంది. రెండు పర్యాయాలకు మించి ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండేలా నిబంధనలను మార్చనుండటంపై చైనాలో కొంత మంది విమర్శలు చేస్తున్నారు. ''ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండరాదనే నిబంధనను 1982లో రాజ్యాంగంలో చేర్చారు. నియంతృత్వం, వ్యవస్థ కంటే వ్యక్తి గొప్పగా భావించే పరిస్థితి రాకూడదనే దీన్ని తీసుకొచ్చారు'' అని శాసన సభ్యులకు రాసిన ఒక బహిరంగ లేఖలో చైనా యూత్ డైలీ మాజీ ఎడిటర్ పేర్కొన్నారు. 'ఈ నిర్ణయాన్ని భవిష్యత్తు తరాలు చైనా చరిత్రలో ఓ ప్రహసనంగా భావిస్తాయి' అని ఆయన బీబీసీతో చెప్పారు. చైనా సైన్యం గురించి ఛగ్లాగామ్ ప్రజలు ఏమంటున్నారు? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనా రాజకీయ రంగంలో ఇప్పుడు రెండు పెద్ద సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. text: ప్రస్తుత చట్టాల ప్రకారం జపాన్‌లో 18 ఏళ్లు దాటినా పెద్దవాళ్లు కాదు ఇకపై 18 ఏళ్లు దాటినవారు అందరినీ పెద్దవాళ్లుగా గుర్తించాలని ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే.. ఇక్కడ 18 ఏళ్లు దాటిన వారు పెళ్లి చేసుకొనే వీలుంటుంది. పలు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా రుణాలు తీసుకోవచ్చు. ధూమపానం.. మద్యపానం.. జూదమాడేందుకు మాత్రం 20 ఏళ్లు నిండాల్సిందే. ఈ వయసు సవరణ బిల్లుకు జపాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. 2022 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. 1876 తర్వాత వయసుకు సంబంధించిన మొదటి మార్పు ఇదే అవుతుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఇక్కడ 18 ఏళ్ల యువకులు, 16 ఏళ్లు దాటిన యువతులు పెళ్లి చేసుకోవాలంటే తమ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. 18 ఏళ్లు దాటిన వారు అందరూ తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఈ మేరకు క్యోడో న్యూస్ సర్వీస్ వెల్లడించింది. జపాన్ తీరంలో 'ఘోస్ట్ షిప్స్’.. ఫ్రాన్స్‌లోనూ ‘వయసు’పై సవరణ మరోవైపు లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే చట్టబద్ధ వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయించే దిశగా ఫ్రాన్స్ చర్యలు చేపడుతోంది. దీనర్థం అంతకన్నా తక్కువ వయసున్న వారితో సెక్స్ చేయటాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు. డాక్టర్లు, న్యాయ నిపుణుల సలహాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని లింగ సమానత్వ శాఖ సహాయ మంత్రి మార్లీన్ షియాపా ఆహ్వానించారు. ప్రస్తుతం.. పదిహేనేళ్ల లోపు వయసున్న వారితో ఎవరైనా సెక్స్ చేసినట్లయితే.. అది రేప్ అని అభియోగం నమోదు చేయాలంటే బలాత్కారం జరిగిందని ప్రాసిక్యూటర్లు రుజువు చేయాల్సి ఉంటుంది. ఇటీవల 11 ఏళ్ల వయసున్న బాలికలతో పురుషులు సెక్స్ చేసిన కేసుల మీద తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో చట్టంలో ఈ మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న చట్టం ప్రకారం.. హింస కానీ, బలవంతం చేసినట్లు కానీ నిరూపణ కాకపోతే.. మైనర్‌పై లైంగిక దోపిడీ అభియోగాలు మాత్రమే నిందితుల మీద నమోదవుతాయి కానీ రేప్ అభియోగం నమోదు కాదు. ఆ నేరానికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, సుమారు రూ. 6.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జపాన్‌లో ఇప్పటి వరకూ 20 ఏళ్లు దాటితేనే పెద్దవారుగా పరిగణిస్తారు. దీన్ని సవరించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. text: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం వంటి సంప్రదాయాలేమీ పాటించనక్కర్లేదు. ఫిర్యాదు అందిన వెంటనే నేరుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. సదరు వ్యక్తిని అరెస్టు చేస్తారు. ఈ మేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్లు 506, 507 కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (కాగ్నిజబుల్‌) విచారించదగినవిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సంబంధిత ఫైలుపై సీఎం కేసీఆర్‌ గురువారం సంతకం చేశారు. పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం, తిట్టడం, కించపరచడం వంటి ప్రత్యక్ష బెదిరింపులు సెక్షన్‌ 506 (నేరపూరిత బెదిరింపు) కిందకు వస్తాయి. నేరాన్ని ప్రేరేపించడం వంటి పరోక్ష బెదిరింపులు సెక్షన్‌ 507 (క్రిమినల్‌ ఇంటిమిడేషన్‌ బై అనానిమస్‌ కమ్యూనికేషన్‌) పరిధిలోకి వస్తాయి అని ఆంధ్రజ్యోతి తెలిపింది. దావోస్‌లో వివిధ కంపెనీల సీఈవోలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఆంధ్రాకు అలీబాబా భారత దేశంలో తమ రెండో డేటా సెంటర్‌ను నవ్యాంధ్రలో ఏర్పాటు చేస్తామని అలీబాబా క్లౌడ్‌ ప్రకటించింది. ఈ ఏడాదిలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపింది అని ఆంధ్రజ్యోతిపేర్కొంది. గురువారం దావోస్‌లో అలీబాబా క్లౌడ్‌ అధ్యక్షుడు సైమన్‌ హూ బృందంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్చలు జరిపారు. మీతో భేటీకోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను. అలీబాబా ఇ-కామర్స్‌ రంగంలోనే దిగ్గజ సంస్థగా భావించాం. సాంకేతిక రంగంలోనూ మీరు మేటి అని అర్థమైంది. భారతీయులు ఐటీలో ఎంతో నిపుణులు. ప్రతి పది మంది ఐటీ నిపుణుల్లో నలుగురు భారతీయులే అని పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది. టెక్‌మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రతో ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్‌లో టెక్‌మహీంద్రా తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు వరంగల్‌లో ప్రముఖ టెక్ దిగ్గజం టెక్‌మహీంద్రా ముందుకొచ్చింది అని నమస్తే తెలంగాణ పేర్కొంది. మొదటిదశలో 500 మందికి ఉపాధి కల్పించే విధంగా సంస్థను నెలకొల్పుతామని టెక్‌మహీంద్రా చైర్మన్ ఆనంద్‌మహీంద్రా ప్రకటించారు. దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదికలో.. ఆనంద్‌మహీంద్రాతోపాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ-మహీంద్రా సంస్థల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని.. వరంగల్ పట్టణంలో టెక్‌మహీంద్రా కార్యకలాపాలు ప్రారంభించాలని ఆనంద్‌మహీంద్రా, కంపెనీ సీఈవో సీపీ గుర్నానీని మంత్రి కేటీఆర్ కోరారు అని నమస్తే తెలంగాణ తెలిపింది. 'ఉద్యమ కేసీఆర్ వేరు..ఇప్పటి కేసీఆర్ వేరు' అధిష్ఠానం ఆదేశిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్పష్టం చేశారని 'ఈనాడు' తెలిపింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నదే నా లక్ష్యం, ఎన్నికల్లో పోటీ చేయనని చెబితే..రాహుల్‌గాంధీ మాత్రం చేయాల్సిందేనన్నారు. మోదీ.. అడ్వాణీకి వెన్నుపోటు పొడిచి ప్రధానమంత్రి అయ్యారు. కనీసం అడ్వాణీకి పార్టీ అధ్యక్ష పదవైనా ఇవ్వాల్సింది.ఇది చాలా బాధాకరం. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ వేరు.. ఇప్పుడు చూస్తున్న కేసీఆర్‌ వేరు. పవన్‌కల్యాణ్‌ ఏపీలో ప్రత్యేక హోదా కోసం కొట్లాడితే అక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో భాజపా పనైపోయింది అని విజయశాంతి వ్యాఖ్యానించారని ఈనాడు పేర్కొంది. తిరుమల లడ్డూ లడ్డూ కావాలా నాయనా! శ్రీవారి భక్తులకు కోరినన్ని అదనపు లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని 'సాక్షి' కథనం ప్రచురించింది. ఇటీవల టీటీడీ రూ.25 ధరతో విక్రయించే చిన్నలడ్డూ (175 గ్రాములు) రూ.50, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుండి రూ.200, వడ ప్రసాదం రూ.25 నుండి రూ.100కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో బ్లాక్‌లో లడ్డూల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అయినా, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగడంలేదు. రూ.50 ధర ఉన్న లడ్డూకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీంతో అదనపు లడ్డూల 30 వేల సంఖ్యను 50వేలకు పెంచాలని టీటీడీ యోచిస్తోందని సాక్షి పేర్కొంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) తెలంగాణలో నోటికొచ్చినట్లు తిడితే ఇక కటకటాలు లెక్కించక తప్పదు. నేరుగానే కాదు.. సామాజిక మాధ్యమాల ద్వారా అయినా సభ్యత మరిచి ఇతరులను దూషిస్తే, కించపరిస్తే జైలుకు వెళ్లాల్సిందే అని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది. text: జమ్ము కశ్మీర్ మ్యాప్ తయారీ సమయంలో జరిగిన పొరపాటును సరిదిద్ది కేంద్ర హోంశాఖ తాజాగా ఈ చిత్రపటాన్ని విడుదల చేసింది. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చొరవతో హోంశాఖ ఈ తప్పును సరిదిద్దింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన రాజకీయ చిత్రపటంలో అమరావతికి స్థానం లభించని విషయాన్ని గుంటూరు తెదెపా ఎంపీ గల్లా జయదేవ్ గురువారం జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా ఆ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రికి కూడా ఇది అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన హోంశాఖ సహాయమంత్రి దిద్దుబాటుకు ఉపక్రమించారు. శుక్రవారం హోంశాఖ అధికారుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా అధికారులను పిలిపించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్పించారు. ఇది కేవలం పొరపాటు వల్ల జరిగిన తప్పిదమే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదని మంత్రి వ్యాఖ్యానించారని ఈనాడు చెప్పింది. జమ్ముకశ్మీర్ నూతన మ్యాప్ తయారీ సమయంలో జరిగిన పొరపాటును సరిదిద్ది కొత్త మ్యాప్ అప్ డేట్ చేయించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. పదేళ్లవరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండొచ్చని విభజన చట్టంలో నిబంధన ఉన్న కారణంగా అమరావతిని ఏపీ రాజధానినిగా చూపలేదనడంలో వాస్తవం లేదన్నారు. అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ఇదివరకే జీవో విడుదలైన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారని కథనంలో రాశారు. ‘అమరావతి మ్యాప్ నుంచి మిస్ అయిందని ఎంపీలు గురువారం లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నేను ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. తప్పును సరిదిద్దాం’ అని పేర్కొంటూ నూతన మ్యాప్‌ను జత చేశారు. ఈ ట్విటర్ పోస్టును ఆయన జయదేవ్ గల్లా, మిథున్‌రెడ్డిలకు ట్యాగ్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సమర్థించిన హైకోర్టు టీఎస్‌ ఆర్టీసీలో 5,100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించిందని ఆంధ్రజ్యోతి సహా అన్ని ప్రధాన పత్రికలూ రాశాయి. మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం ఈ విషయంలో ప్రభుత్వానికి విశేషాధికారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసిందని చెప్పాయి. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా హైకోర్టు వివరించింది. ప్రైవేటు ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించవచ్చని, అయితే, అది 50 శాతానికి మించరాదని తెలిపింది. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ''చట్ట నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్‌ 102 ప్రకారం ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ఏదేని నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. నిబంధనల ప్రకారం.. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటే చట్ట సవరణకు సంబంధించి తొలుత గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దానిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు స్థానిక పత్రికల్లో 30 రోజులు గడువు ఇస్తూ ప్రకటన ఇవ్వాలి. ప్రజల నుంచి, ఆర్టీసీ నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఈ నిర్ణయంతో నష్టపోయే ఆర్టీసీ అభిప్రాయాన్ని తీసుకోవాలి'' అని కోర్టు నిర్దేశించినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో రాశారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. బార్ల లైసెన్సులు రద్దు చేసిన ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది. బార్లతోపాటు స్టార్‌ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు ఇందులో చెప్పారు. అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్‌ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం.. బార్‌ లైసెన్స్‌ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్నవారికి బార్‌ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు. బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు. త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్‌ చేస్తారు అని సాక్షి చెప్పింది. పింక్ బాల్ టెస్టులో భారత్ జోరు భారత టెస్టు క్రికెట్‌లో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌లో విరాట్‌సేన చేలరేగిపోయిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది. డే అండ్ నైట్ టెస్టులో తమ డేంజరస్ బౌలింగ్‌తో బంగ్లాను బెంబేలెత్తించిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విజృంభించింది. ఫలితంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజే మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (5/22), ఉమేశ్ యాదవ్ (3/29), షమీ (2/36) నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నిగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (93 బంతుల్లో 59 బ్యాటింగ్; 8 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (55; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. చేతిలో 7 వికెట్లున్న భారత్ ప్రస్తుతం బంగ్లా స్కోరుకంటే 68 పరుగుల ముందంజలో ఉంది. కెప్టెన్‌తో పాటు ఉపసారథి అజింక్యా రహానే (23) క్రీజులో ఉన్నాడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత రాజకీయ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి గుర్తింపు దక్కింది అంటూ ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికలూ కథనాలు ప్రచురించాయి. text: వీడియో: మాకు ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ కష్టాలు? కొద్దిరోజులుగా వాట్సాప్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ గిరిజన యువకుడి ఆవేదన ఇది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన ప్రతిసారీ ప్రాణాలపై ఆశలొదులుకుని కొండలు గుట్టలు దాటుతున్న అడవి బిడ్డల అరణ్య రోదన ఇది. ఈ వీడియో చిత్రీకరించిన యువకుడిది విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొదమ పంచాయతీ యం.చింతలవలస అనే గిరిజన గ్రామం. కొండల్లో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేదు. ఇక్కడ ఎవరికైనా జబ్బు చేసినా, పురిటి నొప్పులతో బాధపడుతున్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఆరేడు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లడం తప్ప మరోదారి లేదు. తాజాగా సెప్టెంబర్ 4న ఈ ఊరికి చెందిన ఒక గర్భిణిని అలానే తీసుకెళ్లారు. కానీ 3 కిలోమీటర్ల దూరం వెళ్లగానే దారిలోనే ఆమె ప్రసవించారు. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమెను తిరిగి వాళ్ల గ్రామానికే తీసుకెళ్లారు. ఆమె కాన్పు సమయంలో దూరం నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఈ వీడియోలో వివరించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రసవించడంతో వారి వద్ద కాన్పు చేయడానికి అవసరమైన సామగ్రి కూడా లేదు. దీంతో అక్కడే దొరికన ఒక పదునైన రాయితో శిశువు బొడ్డుతాడును కోయడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డు లేకపోవడంతో గిరిజన మహిళలు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సి వస్తోందో ఈ వీడియో కళ్లకు కట్టింది. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి 26 ఏళ్ల చోడిపల్లి సూరయ్యగా బీబీసీ న్యూస్ తెలుగు గుర్తించింది. యం. చింతలవలస గ్రామానికి చెందిన ఆయన ఇంటర్మీడియట్ చదువుకుని సొంతూరిలోనే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఊరికి రోడ్డులేక తాము పడుతున్న ఇబ్బందుల గురించి అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నామని ఆయన బీబీసీతో చెప్పారు. "మా గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా డోలీలో మోసుకొని తీసుకెళ్లాల్సిందే. కొన్నిసార్లు గర్భిణులు దారిలోనే చనిపోతుంటారు. అప్పుడప్పుడు పసిపిల్లలు ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోతుంటారు" అని చెప్పారు సూరయ్య. వీడియో తీసిన యువకుడు సూరయ్య ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ కష్టాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నామని సూరయ్య తెలిపారు. "సెప్టెంబర్ 4న పురిటి నొప్పులతో బాధపడుతున్న ముతాయమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మేము ఎలాంటి దారిలో వెళ్లాల్సి ఉంటుందో, రోడ్డు లేకపోవడం వల్ల మేం ఎన్ని కష్టాలు పడుతున్నామో అందరికీ తెలియజెప్పాలని అనుకున్నాం. అందుకోసం మా ప్రయాణం ప్రారంభం అయినప్పటి నుంచి వీడియో చిత్రీకరించాం. అయితే మార్గం మధ్యలోనే కాన్పు అవుతుంది అని అనుకోలేదు" అని సూరయ్య చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన రాజు ఈ వీడియో రికార్డు చేయడానికి సూరయ్యకు సహాయం చేశారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తూ అధికారులకు తాను లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాజు తెలిపారు. "మేము ఇక్కడ కొండలపై బతుకుతాము. ఇక్కడ చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలకు కూడా రోడ్లు లేవు. రోడ్డు వేస్తే కొండ మీదనుంచి కిందకి దిగటానికి పట్టే సమయం తగ్గుతుంది. మాకు కష్టాలు దూరమవుతాయి. నేను రాసిన లేఖకు అధికారుల నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు" అని రాజు అన్నారు. యం.చింతవలస గ్రామం మార్గం మధ్యలో గిరిజన మహిళ ప్రసవించిన ఘటనపై జిల్లా అధికారులను బీబీసీ న్యూస్ తెలుగు సంప్రదించింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, శిశువుకు టీకాలు ఇచ్చినట్టు వారు తెలిపారు. "ఆ మహిళ ప్రసవం గురించి తెలియగానే ఆ కొండపైకి ఏఎన్ఎంని పంపించాం. పాపకు అవసరమైన టీకాలు ఇచ్చారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. శిశువు 3 కిలోల బరువు ఉంది. ఆరోగ్యంగా ఉంది" అని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య ఉప అధికారి రవి కుమార్ రెడ్డి చెప్పారు. కొండ మీద ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడం వల్ల రోగులను ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కొండ మొదలు వరకూ మోసుకెళ్తారు. అక్కడ ఓ బైక్ అంబులెన్స్ ఉంటుంది. అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఆ మహిళను ఈ మార్గంలోంచే తీసుకెళ్లారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ఐదుసార్లు టెండర్లు పిలిచినట్టు జిల్లా వైద్య శాఖ అధికారి కొర్రా విజయలక్ష్మి తెలిపారు. "అక్కడ రోడ్డు కోసం ఐటీడీఏ ఐదుసార్లు టెండర్లు పిలిచింది. అది మారుమూల ప్రాంతం కావడంతో గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. మేం చేయగలిగిందంతా చేశాం" అన్నారు విజయలక్ష్మి. ఇదే ఏడాది జులైలో యం. చింతలవలసకు సమీపంలోని సిరివర గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామరకొండ జిందామని తన బిడ్డని కోల్పోయారు. అయిదో నెలలో నొప్పులు రావటంతో ఆమెకు గర్భస్రావమైంది. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే గర్భస్రావం కావటంతో శిశువు బతకలేదు. తన బిడ్డకి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డానని ముతాయమ్మ భర్త చోడిపల్లి జుంబి చెప్పారు. బీబీసీ తెలుగుతో ఆయన మాట్లాడుతూ "నా భార్యకి ఉదయం నొప్పులు మొదలైనాయి. మేము వెంటనే డోలీలో ఆమెను కూర్చోబెట్టి కిందకి బయలుదేరాం. దారి మొత్తం భయపడుతూనే ఉన్నా. కొంతదూరం వెళ్లగానే కాన్పు అనగానే నాకు ఇంకా భయమేసింది. కానీ అపాయం ఏమీ జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బంది పడింది" అని జుంబి గుర్తుచేసుకున్నారు. కాగా సిరివర ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రసవించిన మహిళ భర్త జుంబి ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పది శాతం ఆవాసాలకు రోడ్డు సౌకర్యం లేదని విజయనగరం జిల్లా అధికారులు బీబీసీకి తెలిపారు. రోడ్లు లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లడం కష్టమవుతున్నందున గర్భిణులను ప్రసవానికి రెండు నెలల ముందే కొండ మీద నుంచి కిందకు తీసుకురావాలని అనుకుంటున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లక్ష్మీషా వెల్లడించారు. "గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దగ్గరగా ఉంచాలనుకుంటున్నాం. అలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చు. ప్రస్తుతం 50- 60 మహిళలకు సరిపడా స్థలం కోసం చూస్తున్నాం" అని చెప్పారు రవికుమార్ రెడ్డి. ఈ గ్రామానికి రూ.5.5 కోట్ల బడ్జెట్‌తో రోడ్డు మంజూరైనట్టు ఐటీడీఏ అధికారి లక్ష్మీషా తెలిపారు. "9.8 కి.మీ. రోడ్డు మంజూరైంది. కానీ మేం ఐదుసార్లు టెండర్ పిలవాల్సి వచ్చింది. టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు" అని లక్ష్మీషా చెప్పారు. కొండ ప్రాంతం కావడం, కఠిన పరిస్థితుల మధ్య పనిచేయాల్సి రావడంతో పెద్దగా లాభాలు రావనీ, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. "తక్కువ లాభాలుండడం వల్లే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అనుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లోని గ్రామాలను కలిపే మరో ఐదు రోడ్లు ఇలాంటివే పెండింగ్‌లో ఉన్నాయి" అని లక్ష్మీషా తెలిపారు. ఈ టెండర్‌ని ఎంపిక పద్ధతిలో (సెలక్షన్ బేసిస్)లో కేటాయించే విధంగా లేదా గ్రామీణ ఉపాధి పథకానికి అనుసంధానించే విధంగా అనుమతివ్వాలని కోరుతూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "మా ఊరికి రోడ్డు లేదు. రోగులను, గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే 6 కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకెళ్లాల్సిందే. మేం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మా సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదు. మా జీవితాలను బాగు చేసే రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. ఈ వీడియో చూసైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం" text: కోవిడ్-19 వ్యాప్తి నడుమ 2025నాటికి 25 లక్షల మంది చిన్నారులు బాల్య వివాహాల బారినపడే అవకాశముందని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ అంచనా వేసింది. ''కరోనావైరస్ వ్యాపించడంతో పేదరికం పెరుగుతోంది. దీంతో బాలికలు బడి మానేయాల్సి వస్తోంది. ఫలితంగా వారు పనులకు వెళ్లడం లేదా వారికి పెళ్లి చేసేయడం జరుగుతోంది'' భారత్ సహా దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లోని బాలికలు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు, లింగ సమానత్వాన్ని కాపాడేందుకు ప్రపంచ నాయకులు కదిలి రావాలని సంస్థ పిలుపునిచ్చింది. ''ఇలాంటి వివాహాలతో బాలికల హక్కులు ఉల్లంఘనకు గురవుతాయి. కుంగుబాటు ముప్పు పెరుగుతుంది. జీవితాంతం వారు గృహహింసకు బాధితులుగా మారుతారు. కొందరికి మరణ ముప్పు కూడా ఎక్కువవుతుంది''అని సేవ్ ద చిల్డ్రన్ అడ్వైజర్ కరేన్ ఫ్లానగన్ వ్యాఖ్యానించారు. గత 25ఏళ్లలో 7.86 కోట్ల బాల్య వివాహాలను అరికట్టగలిగామని, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ బాల్య వివాహాలు పెరిగేలా కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ పాఠశాలలు మూతపడటం, ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో కొనసాగడం తదితర చర్యల వల్ల బాల్య వివాహాలను అడ్డుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆటకం కలుగుతోందని గర్ల్స్ నాట్ బ్రైడ్స్ సంస్థ గత నెలలో బీబీసీకి తెలిపింది. విద్యతో బాలికల సంరక్షణ పెరుగుతుంది అని గర్ల్స్ నాట్ బ్రైడ్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఫెయిత్ వాంగి పోవెల్ చెప్పారు. బాలికలు పాఠశాలలకు వెళ్లేలా చూసేందుకు మరింత నిధులు, సామాజిక సాయం, పర్యవేక్షణ అవసరమని ఆమె వివరించారు. ఈ సమస్య ఎంత పెద్దది? ఏటా 1.2 కోట్ల మంది బాల్య వివాహాలకు బలవుతున్నట్లు సేవ్ ద చిల్డ్రన్ చెబుతోంది. అయితే, ఆర్థిక మందగమనం, కరోనావైరస్ వ్యాప్తి నడుమ వచ్చే ఐదేళ్లలో ఈ వివాహాలు గణనీయంగా పెరగబోతున్నాయని సంస్థ హెచ్చరించింది. ''2020లో ఐదు లక్షల మందికి బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు అంచనా. మరో పది లక్షల మంది చిన్న వయసులో గర్భం దాల్చబోతున్నారు''. ''ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. 2025నాటికి బాల్య వివాహాలు 6.1 కోట్లకు మించిపోతాయి. ఇవన్నీ అధికారిక గణాంకాలు మాత్రమే. నిజానికి ఈ వివాహాలు ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు'' ''కరోనావైరస్ వ్యాప్తితో చాలా కుటుంబాలు పేదరికం బారిన పడుతున్నాయి. దీంతో తమ కుటుంబాలకు సాయం చేసేందుకు బాలికలు బడి మానేయాల్సి వస్తోంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మళ్లీ పాఠశాలకు వెళ్లే అవకాశం చాలా తక్కువ''అని సంస్థ ప్రెసిడెంట్, సీఈవో బిల్ చాంబర్స్ తెలిపారు. ''ఆహారం కొరత, ఆర్థిక ఇబ్బందుల నడుమ కొంత మంది తల్లిదండ్రులకు వేరే ప్రత్యామ్నాయం లేక బాలికలను పెద్దవారికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంటారు. ఫలితంగా లైంగిక హింస, లైంగిక దోపిడీ పెరుగుతాయి'' కరోనావైరస్ వల్ల వచ్చే దశాబ్దంలో 1.3 కోట్ల కంటే ఎక్కువే బాల్య వివాహాలు జరగబోతున్నాయని గత ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. పెద్దవారి కోసం బాలికలు తమ నివేదిక కోసం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్‌షాసాలో నివసిస్తున్న బాలిక ఎస్తేర్‌తో సేవ్ ద చిల్డ్రన్ సంస్థ మాట్లాడింది. కోవిడ్-19కు కళ్లెం వేసేందుకు ఇక్కడ పాఠశాలలు, కొన్ని బహిరంగ ప్రాంతాలను మూసివేశారు. ప్రస్తుతం తమ కోళ్ల వ్యాపారాన్ని చూసుకోవడంలో తల్లికి ఎస్తేర్ సాయం చేస్తోంది. అయితే కరోనావైరస్ వ్యాప్తితో బాలికలపై చాలా ప్రభావం పడుతోందని ఆమె అంటోంది. ''మా ఇంటి పొరుగున ఉండే కొందరు బహిరంగ మార్కెట్‌లో తమ సరకులు అమ్ముకొనేవారు. ప్రస్తుతం ఆంక్షల నడుమ మార్కెట్ తెరవడం లేదు. దీంతో చేయడానికి ఏమీ ఉండటం లేదు. ఇంటిలోని వారికి భారంగా ఉండకుండా చూసేందుకు వయసులో తమ కంటే పెద్దవారిని అమ్మాయిలు పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది'' చదువులో రాజీపడను ఇథియోపియాకు చెందిన 16ఏళ్ల అబేనాతోనూ సేవ్ ద చిల్డ్రన్ సంస్థ మాట్లాడింది. వయసులో తమ కంటే పెద్దవారికి ఇచ్చి అమ్మాయిల్ని పెళ్లి చేయకుండా చూసేందుకు అబేనా ప్రయత్నిస్తోంది. అబేనాను ధనవంతుడైన ఓ చదువుకున్న, పెద్ద వయసు వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కుటుంబం భావిస్తోంది. అయితే, తాను చదువుకుంటానని కుటుంబంతో అబేనా తెగేసి చెప్పింది. ''ఒప్పుకొనేది లేదని చెప్పాను. చదువు విషయంలో నేను రాజీపడను. 18ఏళ్ల లోపు వయసు ఉండేటప్పుడు పెళ్లి చేయాలని భావిస్తే.. బాలికల హక్కులను ఉల్లంఘించడమే'' గ్లోబల్ గర్ల్‌హుడ్ రిపోర్ట్ 2020 పేరుతో సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాలిలకపై కోవిడ్-19 వ్యాప్తితో పడే ప్రభావంపై దీనిలో చర్చించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు విపరీతంగా పెరిగే ముప్పుందని ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్చరిస్తోంది. మనం 25ఏళ్లుగా సాధించిన పురోగతి తిరోగమన బాట పట్టే అవకాశముందని సంస్థ పేర్కొంది. text: ఇరాన్ కార్పెట్లకు అమెరికాలో గిరాకీ ఎక్కువ ఒకవేళ ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధిస్తే, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ప్రశ్నార్థకం. అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ.. ఈ ఆరు అగ్ర దేశాలతో అణ్వాయుధాలకు సంబంధించి ఇరాన్ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా తమ ఆర్థిక వ్యవస్థ, ట్రేడింగ్, బ్యాంకింగ్, చమురు తదితర రంగాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల్ని ఎత్తేస్తే తమ అణ్వాయుధ కార్యకలాపాలను తగ్గించడానికి ఇరాన్ ఒప్పుకుంది. ప్రస్తుతం ఆ ఒప్పందం అమల్లో ఉంది. అయినా కూడా అప్పుడప్పుడూ ఇరాన్ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో తిరిగి ఆ దేశంపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మే 12న ఆయన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో.. 2015లో అణ్వాయుధ ఒప్పందం అమల్లోకి వచ్చి ఇరాన్‌పై ఆంక్షల్ని ఎత్తేశాక ఆ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైందా, లేదా అన్న అంశంపై బీబీసీ రియాల్టీ చెక్. ఆంక్షల్ని తొలగించాక ఇరాన్ అణ్వాయుధ కార్యకలాపాలు మందగించాయి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై చమురు ప్రభావం ఎంత? ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు చమురు ఎగుమతులు తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. కానీ 2015లో ఆంక్షల్ని తొలగించడంతో మళ్లీ చమురు ఎగుమతులు పుంజుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లెక్కల ప్రకారం ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలో ఇరాన్ జీడీపీ 12.5శాతం మేర పెరిగింది. ఒక్కసారిగా పెరిగిన చమురు ఎగుమతులే దానికి కారణం. కానీ ఆ తరువాత జీడీపీ తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది అది 4శాతం మేర పెరుగుతుందని ఐఎంఎఫ్ భావిస్తోంది. కానీ అణ్వాయుధ ఒప్పందం తరువాత ఆ దేశం పెట్టుకున్న 8శాతం లక్ష్యం కన్నా కూడా అది తక్కువే. ఇరాన్‌పై ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ఆ దేశ చమురు ఉత్పత్తుల శాతం దాదాపు సగానికి సగం పడిపోయింది. 2013లో రోజుకు 11లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతయ్యేది. కానీ ప్రస్తుతం 25లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతవుతోంది. పిస్తా లాంటి మిగతా ఎగుమతుల పరిస్థితేంటి? ఇరాన్ చమురేతర ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2018 మార్చి నాటికి 3లక్షల కోట్ల రూపాయలు దాటింది. అణ్వాయుధ ఒప్పందానికి ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 33వేల కోట్ల రూపాయలు ఎక్కువ. ఇరాన్‌కు ప్రత్యేకమైన పిస్తాలాంటి కొన్ని ఉత్పత్తుల ఎగుమతుల విలువ ప్రస్తుతం 7,300 కోట్ల రూపాయలకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువే. కానీ పిస్తా, కుంకుమ పువ్వు లాంటి ఉత్పత్తుల ఎగుమతులు.. ఆంక్షల కంటే దేశంలో నెలకొన్న కరవు పరిస్థితుల వల్లే ఎక్కువ ప్రభావితమయ్యాయి. ఒప్పందం కారణంగా ఇరాన్ కార్పెట్ల ఎగుమతులు కూడా పెరిగాయి. అక్కడినుంచి మొత్తం ఎగుమతయ్యే కార్పెట్లలో 30శాతం అమెరికాకే వెళ్తాయి. ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ఆ మేర ఇరాన్ నష్టపోవాల్సి వచ్చింది. ఆంక్షలు ఎత్తేశాక యురోపియన్ యూనియన్‌తో కూడా ఇరాన్ వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయి. కానీ చైనా, దక్షిణ కొరియా, టర్కీలు ఇప్పటికీ ఇరాన్‌కు ప్రధాన వ్యాపార భాగస్వాములుగా ఉన్నాయి. ఇరాన్‌పై ఆంక్షల్ని తొలగించిన రోజు జరిగిన సమావేశం కరెన్సీ విలువ పెరిగిందా? తగ్గిందా? 2012లో ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ డాలర్‌తో పోలిస్తే మూడులో రెండొంతుల మేర పడిపోయింది. దేశ ఆర్థిక రంగంలో నిర్వహణ లోపాలతో పాటు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రియాల్ విలువ నానాటికీ పడిపోతూ వచ్చింది. కానీ ఒప్పందం అమల్లోకి వచ్చాక కరెన్సీ విలువ పెరుగుతందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగానే నాలుగేళ్లపాటు రియాల్ విలువ స్థిరంగా ఉంది. గతేడాది చివర్లో ఇరాన్‌తో ఉన్న ఒప్పంద పునరుద్ధరణపై డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటి నుంచి రియాల్ విలువ మళ్లీ క్షీణించడం మొదలైంది. గత సెప్టెంబర్‌ నుంచి ఇప్పటిదాకా డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ సగానికి పడిపోయింది. భవిష్యత్తులో ఆంక్షలు మళ్లీ అమలైతే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందేమోనన్న భయంతో చాలామంది ఇరానియన్లు ముందుగానే విదేశీ కరెన్సీని కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా దాదాపు 30బిలియన్ డాలర్లు విలువైన కరెన్సీ ఇరాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లిందని భావిస్తున్నారు. దాంతో ఇరాన్ ప్రభుత్వం ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయాలపై కొరడా ఝుళిపించింది. విదేశీ కరెన్సీ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. భవిష్యత్తుకు భయపడి చాలామంది విదేశీ కరెన్సీని కొంటున్నారు మధ్య తరగతిపై ప్రభావం విదేశీ ఆంక్షలు తదనంతర పరిణామాల ప్రభావం ఇరాన్ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ లెక్కలు చెబుతున్నాయి. 2014-15వరకూ ఇరాన్ ప్రజల నెలవారీ బడ్జెట్ క్రమంగా తగ్గుతూ వచ్చి, న్యూక్లియర్ ఒప్పందం అమల్లోకి వచ్చి మళ్లీ పురోగమించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇతరుల సగటు నెలవారీ బడ్జెట్‌ 15శాతం మేర తగ్గితే మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్ 20శాతం మేర తగ్గింది. దేశంలో ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ లోపాలతో పాటు అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం సగటు పౌరులపైనా పడింది. ఇకముందు పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది మే 12న ట్రంప్ వెల్లడించే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అణ్వాయుధాల విషయంలో ‘పద్ధతి మార్చుకోకుంటే మళ్లీ ఆంక్షలు తప్పవు’ అని ఇరాన్‌ను ఆయన పదేపదే హెచ్చరిస్తున్నారు. text: నిజానికిది సంఘ్ భావజాలానికి, తమ మంచేదో, చెడేదో నిర్ణయించుకునే విచక్షణ కలిగిన విద్యార్థినులకు మధ్య జరుగుతున్న ఘర్షణ. హిందూ దేశంలో భారతీయ మహిళలు ఎలా ఉండాలని సంఘ్ భావిస్తోందో, చదువుకున్న విద్యార్థినులు సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో సబలలైన యువతులు, సంఘ్‌కు మధ్య ఘర్షణ ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాటల్లో చెప్పాలంటే, ''భర్త భార్యకు ఇల్లు చక్కదిద్దాలనే బాధ్యతను అప్పగించాడు. ఆమె అన్ని అవసరాలనూ తీరుస్తానని, ఆమెను సురక్షితంగా ఉంచుతానని హామీ ఇచ్చాడు. ఆ నియమాలను ఇద్దరూ పాటించినంత కాలం భర్త తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. ఎప్పుడైతే భార్య బంధాన్ని తెంచేసుకుంటుందో, అప్పుడు భర్త ఆమెను వదిలిపెట్టొచ్చు.'' ''నాకు ఆరెస్సెస్‌తో సంబంధాలున్నాయి. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను'' అని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) వైస్ ఛాన్సెల్ ప్రొఫెసర్ గిరీష్ చంద్ర త్రిపాఠి గతంలో అన్నారు. అందువల్ల యువతులకు ''ఇల్లు చూసుకునే బాధ్యత''ను అప్పగించకుండా ఉండడం ఎలా సాధ్యం? విద్యార్థినులపై లాఠీఛార్జీ అనంతరం ప్రొఫెసర్ త్రిపాఠి బీబీసీతో మాట్లాడుతూ.. బీహెచ్‌యూను జేఎన్‌యూగా మారనివ్వబోమన్నారు. బీహెచ్‌యూ విద్యార్థినులను సంఘ్ భావజాలానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. నిజానికి బీహెచ్‌యూ ఆరెస్సెస్ ప్రయోగశాల. అందుకే యువతీయువకులకు ఒకే నియమం చెల్లదని ప్రొఫెసర్ త్రిపాఠి చెప్పకనే చెబుతున్నారు. బీహెచ్‌యూ విద్యార్థినులపై విధించిన నిషేధాల జాబితా చాలా పెద్దది - ఎలాంటి పరిస్థితుల్లోనైనా విద్యార్థినులు రాత్రి ఎనిమిది లోపు హాస్టల్‌కు చేరుకోవాలి. వారి హాస్టళ్లలో వైఫై ఉండదు. విద్యార్థుల హాస్టల్‌లో మాంసాహారం ఉంటుంది. కానీ, విద్యార్థినుల హాస్టల్‌లో అది నిషిద్ధం. రాత్రి పది తర్వాత విద్యార్థినులు మొబైల్ ఉపయోగించడానికి వీల్లేదు. తాము ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో కానీ, నిరసన ప్రదర్శనల్లో కానీ పాల్గొనమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. హాస్టళ్లలో పొట్టి దుస్తులు ధరించడానికి వీల్లేదు. బీహెచ్‌యూ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలపై మొదటి నుంచీ సంప్రదాయ విద్యాసంస్థలన్న ముద్ర ఉంది. రెండు చోట్లా విద్యార్థినీవిద్యార్థులకు వేర్వేరు నియమాలుంటాయి. అయితే 2014 నవంబర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి, ప్రొఫెసర్ త్రిపాఠి వీసీగా నియమితులయ్యాక ఆ నియమాలను కఠినంగా అమలు చేయడం ప్రారంభమైంది. సంఘ్ - మహిళలు ఆరెస్సెస్‌లో మహిళలకు ప్రవేశం లేదు. సంఘ్ నేతృత్వం ఎల్లప్పుడూ బ్రహ్మచర్యం పాటించేవారి చేతుల్లో ఉంటుంది. వారి దృష్టిలో మహిళంటే తల్లులు లేదా కూతుళ్లే. మహిళలకు స్వతంత్ర అస్తిత్వం ఉండదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆరెస్సెస్‌ గ్రామగ్రామానికీ వెళ్లి 'కుటుంబ ప్రభోధన్' పేరిట యువతులు చీరలు ధరించాలని, శాకాహారమే భుజించాలని, పుట్టిన రోజున కేక్ కట్ చేయడం లాంటి విదేశీ సంస్కృతిని త్యజించాలని బోధిస్తోంది. క్రికెట్, రాజకీయాలులాంటి వాటిపై కాలాన్ని వృధా చేసే బదులు, ధార్మిక కార్యకలాపాలను పాటించాలని కోరుతోంది. కానీ మాతృత్వం, భర్త, కుటుంబ సేవ, హిందూ సంస్కృతి పరిరక్షణ లాంటి 'సంస్కారాల'కు బీహెచ్‌యూ గేట్ల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థినులు చాలా దూరం. వారంతా 'విదేశీ సంస్కృతి', 'వామపక్ష భావజాల' ప్రభావితులు. వారిలో ఏ ఒక్కరూ కూడా చీరలు ధరించలేదని మనం గమనించవచ్చు. వారికి మాతృత్వ వాంఛకన్నా, కెరీర్ కలలే ఎక్కువ. వారంతా ఎంతో శ్రమించి యూనివర్సిటీలకు వచ్చారు. హాస్టల్‌లో ఉండేందుకు వారికి అనుమతి అంత సులభంగా దొరకలేదు. ఇంత గొడవ జరిగాక, ఇళ్లకు వెళ్లిన విద్యార్థినుల్లో చాలామంది.. బయట నోరు మెదపొద్దని, ఇళ్లకు తిరిగి రమ్మని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశముంది. ఇది బీహెచ్‌యూ విద్యార్థినుల సమస్య మాత్రమే కాదు, అన్ని చోట్లా ఉంది. బీహెచ్‌యూ విద్యార్థినులు వేధింపుల నుంచి రక్షణ కోరారు. సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కోరారు. దారిలో లైట్లు కావాలని కోరారు. అందుకు బదులుగా సంఘ్ ప్రతినిధిగా భావించే వీసీ ప్రొఫెసర్ త్రిపాఠి, పోలీసులతో అమ్మాయిలపై లాఠీఛార్జీ జరిపించారు. బీహెచ్‌యూ విద్యార్థినులపై లాఠీఛార్జీ అంశంపై దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా క్యాంపస్‌లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనేక యూనివర్సిటీల్లో వారికి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. దేశంలోని మహిళలు అడుగడుగునా పురుషాధిక్యంపై పోరాడుతూ, విజయాలు సాధిస్తుంటే, హిందూ సంఘాలు వారిని సంతానాన్ని కనే యంత్రాలుగా ఉండాలనడం న్యాయమేనా? సాక్షి మహారాజ్ కోరుకునేట్లు.. వాళ్లు నలుగురు పిల్లలను కనే తల్లులుగా మారడం కోసం యూనివర్సిటీలకు వెళ్లడం లేదు. బీహెచ్‌యూ విద్యార్థినుల డిమాండ్ల లేఖ సంఘ్ యొక్క పెరటి తోటల నుంచి ఏ యూనివర్సిటీకి శోభనివ్వని ఉమాభారతి, సాధ్వి నిరంజన్ జ్యోతిలాంటి వారు మాత్రమే రాగలరు. వారు అందుకోలేనంత దూరంలో నేటి విద్యార్థినులు ఉన్నారు. వారిని ఆదర్శ గృహిణి లేదా సంస్కారవంతమైన హిందూ మాతగా తయారు చేయాలని ప్రయత్నించే ఏ యూనివర్సిటీలోనైనా ఇలాంటి ఘర్షణలు తప్పవు. వారి దారి గనుక బీజేపీ వైపు మళ్లితే మరి కొంతమంది నిర్మలా సీతారామన్‌లు తయారవుతారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి) ప్రధాని మోదీకి విజయం చేకూర్చిన బెనారస్‌లో జరిగిన ఘటనను.. బీహెచ్‌యూ విద్యార్థినులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణగా చూపించే తప్పుడు ప్రయత్నం జరుగుతోంది. text: అసోంకు చెందిన 18 ఏళ్ల హిమా దాస్ పేరు. దానికి కారణం ఆమె ఫిన్లాండ్‌లోని టాంపెరెలో ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ పోటీల 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించడమే. ఐఏఏఎఫ్ ట్రాక్ పోటీలలో భారతదేశానికి చెందిన అథ్లెట్ ఒకరు స్వర్ణపతకం సాధించడం ఇదే మొదటిసారి. గతంలో భారతదేశానికి మహిళా అథ్లెట్ ఎవరూ జూనియర్ లేదా సీనియర్ విభాగంలో, ప్రపంచ ఛాంపియన్ షిప్స్ ఏ స్థాయిలోనూ ఇప్పటివరకు స్వర్ణ పతకం గెలుచుకోలేదు. ఈ పోటీలో 35వ సెకను వరకు హిమ మొదటి మూడు స్థానాలలో కూడా లేదు. కానీ తర్వాత వేగం పెంచిన ఆమె, చరిత్ర సృష్టించింది. ఈ పోటీలో హిమా దాస్ 51.46 సెకెన్లతో స్వర్ణపతకాన్ని గెల్చుకోగా, రొమేనియాకు చెందిన ఆండ్రియా మిక్లోస్ రజతాన్ని, అమెరికాకు చెందిన టేలర్ మేన్సన్ కాంస్యం గెల్చుకున్నారు. రెండేళ్లలో ఫుట్‌బాల్ ప్లేయర్ నుంచి ప్రపంచ అథ్లెటిక్స్‌కు.. హిమ తండ్రి అసోం రాష్ట్రం నగావ్ జిల్లాలో ఒక చిన్న రైతు. 2016 వరకు హిమా దాస్‌కు అథ్లెటిక్స్ పరిచయమే లేదు. నిజానికి ఆమె ఫుట్‌బాల్ ప్లేయర్. 2016 అసోం రాష్ట్ర చాంపియన్ షిప్ పోటీల్లో 100 మీటర్ల పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలవడంతో ఆమె పేరు ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి ఆమె అతి వేగంగా విజయాలు సాధిస్తూ వచ్చింది. గత ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 400 మీటర్ల పరుగు పందెంలో ఆమె ఆరోస్థానంలో నిలిచింది. ఆ టోర్నమెంట్‌లో ఆమె 51.32 సెకన్లలో రేసు పూర్తి చేసింది. ఇటీవలే గువాహటిలో ముగిసిన అంతర్రాష్ట చాంపియన్‌షిప్ పోటీలలో కూడా ఆమె స్వర్ణపతకాన్ని సాధించింది. ప్రపంచ అథ్లెటిక్స్ 400 మీటర్ల హీట్స్‌లో ఆమె 52.25 సెకెన్లతో మొదటి స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కూడా హిమ దాస్ 52.10 సెకన్లలో రేసు పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. స్వర్ణపతకం సాధించిన హిమా దాస్‌కు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శుభాకాంక్షలుతెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హిమా దాస్ సాధించిన విజయం స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్ చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒకవైపు భారతదేశం మొదటి వన్డేలో ఇంగ్లండ్‌ను తన సొంతగడ్డపై ఓడిస్తుండగా, ట్వీటర్‌లో ట్రెండ్ అయింది ఆరు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ కాదు, సెంచరీ చేసిన రోహిత్ శర్మా కాదు. text: ఎందుకు ఇలా? మానవుడు అభివృద్ధి పేరిట అడవులను విచక్షణా రహితంగా నరికేస్తున్నాడు. దీనితో అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. పెద్దపెద్ద రిజర్వాయర్లు నిర్మించినప్పుడు వేలాది ఎకరాలు నీటిలో మునిగి పోతున్నాయి. అడవుల్లో నివసించే కొన్ని రకాల జంతువులు అంతరిస్తున్నాయి. మరికొన్నింటి సంఖ్య తగ్గిపోతోంది. అందువల్ల చిరుతలకు ఆహారం దొరకడం కష్టంగా మారుతోంది. దీనితో అవి ఆహార అన్వేషణలో అడవుల అంచులు దాటి బయటకు వస్తున్నాయి. కాబట్టి సహ్యాద్రి పర్వతాలకు దగ్గరల్లో ఉండే ప్రాంతాల్లో సాగు చేసే చెరకు తోటల్లో చిరుతలు మకాం వేస్తున్నాయి. చెరకు తోటలే ఎందుకు? చిరుతలు చెరకు తోటలను ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. మొదటిది రక్షణ. చెరకు తోట చాలా దట్టంగా ఉంటుంది. ఇందులో వాటి ఉనికిని పసిగట్టడం చాలా కష్టం. వేటాడే ముందు నక్కి ఉండటానికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. చెరకు పంట చేతికి రావడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుంది. చిరుతలు చెరకు తోటల్లో ఉంటే చుట్టుపక్కల ఊళ్లలో ఉండే కుక్కలు, మేకలు, గొర్రెల వంటి వాటిని సులభంగా వేటాడగలవని స్థానిక అటవీశాఖ అధికారి సునీల్ వాడేకర్ అభిప్రాయపడుతున్నారు. అడవుల కంటే చెరకు తోటల్లో ఉండటం వల్ల వాటికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు మహారాష్ట్ర వెటనరీ విభాగం డిప్యూటీ కమిషనర్, డాక్టర్ సంజయ్ గైక్వాడ్ అన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వాటికి పుష్కలంగా ఆహారం లభిస్తుందని, వాటి పిల్లలకు ఇక్కడ భద్రత ఉంటుందని వివరించారు. చెరకుతోటల చిరుతలు.. వీటికి అడవి అడవంటే తెలియదు పిల్లలు కూడా అక్కడే చెరకు తోటల్లోనే చిరుతలు పిల్లలను ఈనుతున్నాయి. వాటిని అక్కడే పెంచుతున్నాయని, ఎలా వేటాడాలో నేర్పుతున్నాయని స్వచ్ఛంద సంస్థ వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ ప్రతినిధి డాక్టర్ అజయ్ దేశ్‌ముఖ్ చెప్పారు. చిరుత పిల్లలకు చెరకు తోటలు ఇళ్లు లాంటివి. ఒకోసారి తోటల బయట ఆడుకుంటూ కనిపిస్తుంటాయని అజయ్ వివరించారు. 30 ఏళ్ల కిందటే ఒకో చిరుత జీవిత కాలం సగటున 15 ఏళ్లు ఉంటుంది. ప్రస్తుతం రెండు తరాల చిరుతలు ఇక్కడ కనిపిస్తున్నట్లు అటవీశాఖ అధికారి సునీల్ వాడేకర్ అంటున్నారు. అంటే 30 ఏళ్ల కిందటే అవి చెరకు తోటల్లో నివాసం ఏర్పరచుకోని ఉండొచ్చని తెలిపారు. ప్రస్తుతం మూడోతరం చిరుతలు కూడా కనిపిస్తున్నాయని వివరించారు. తెలివి మీరుతున్నాయి కూడా చిరుతలు పగలంతా చెరకు తోటల్లో విశ్రాంతి తీసుకుంటాయి. రాత్రుళ్లు వేటాడతాయి. ఇవి ఒకరకంగా తెలివైనవి కూడా. మనుషుల కదలికలపై అవి ఒక కన్నేసి ఉంచుతాయి. వారి కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. మనుషుల కదలికలను అవి నిశితంగా పరిశీలిస్తున్నాయని అజయ్ దేశ్‌ముఖ్ చెప్పారు. గ్రామస్థులు ఇతర పనుల్లో ఉన్నప్పుడు మాత్రమే పశువులను వేటాడుతున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవి తమను తాము మార్చుకుంటున్నట్లు వివరించారు. ఆహారపు అలవాట్లలో మార్పు అంతేకాదు వాటి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటున్నాయి. ఉడుతలు, ఎలుకలు, పందికొక్కులు వంటి వాటిని కూడా వేటాడటం ప్రారంభించాయి. కొత్త జాతి ఆవిర్భావం ఈ పరిణామం సరికొత్త చిరుతలు, అంటే "చెరకుతోటల చిరుతల" పుట్టుకకు దారి తీస్తోంది. చెరకు తోటల్లో పుట్టిన చిరుతలకు అడవి గురించి తెలియదు. రణమా.. రాజీనా? మనుషులకు దగ్గరగా నివసించడాన్ని చిరుతలు నేర్చుకుంటున్నాయి. అయితే ఇది తరచూ మనిషితో ఘర్షణకు దారి తీస్తోంది. ఒకోసారి ఆహారం కోసం అవి ఇళ్లలోకి చొరబడుతుండటం, ఇందుకు ప్రధాన కారణం. అయితే చిరుతలతో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధపడాలని డాక్టర్ అజయ్ దేశ్‌ముఖ్ సూచిస్తున్నారు. చిరుతలు మనుషులపై దాడులు చేసిన సంఘటనలు చాలా తక్కువ. అక్కడక్కడా కొన్ని జరిగాయి. కానీ అవి కావాలని చేసిన దాడులు కావు. చిరుతలకు హాని కలిగించకుండా వాటితో కలిసి జీవించేలా స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. మహారాష్ట్ర అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థలు ఈ బాధ్యతను తలకెత్తుకున్నాయి. ఇళ్ల చుట్టూ కంచెలు ప్రస్తుతం ప్రజలు ఇంటి చుట్టూ కంచెలు నిర్మించుకుంటున్నారు. కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి పెంపుడు జీవాలను జాగ్రత్త చేసుకుంటున్నారు. మనుషులు, క్రూరమృగాల మధ్య ఘర్షణను తగ్గించేందుకు ఇటువంటి చర్యలు కొంత మేరకు తోడ్పడతాయి. అడవులు అంతరిపోతున్న తరుణంలో మనుషులు క్రూరమృగాలతో కలిసి జీవించాల్సిన సమయం ఇక ఆసన్నమైనట్లేనా? ఇవి కూడా చూడండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రాణులు మనుగడ సాగించాలంటే మార్పును అంగీకరించాల్సిందే. లేదంటే వాటి ఉనికే ప్రశ్నార్థకరమవుతుంది. మహారాష్ట్రలోని చిరుత పులులు ఈ సూత్రాన్ని అక్షరాలా ఆచరిస్తున్నాయి. అడవులు అంతరించి పోతుండటంతో అవి చెరకు తోటలనే ఆవాసంగా చేసుకుంటున్నాయి. నాసిక్, పుణె, అహ్మద్‌నగర్, సతారా వంటి ప్రాంతాల్లో ఇది ఇప్పుడు సాధారణమైన విషయం. text: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై ఇప్పటి వరకూ 31 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా.. దాన్ని 35.20 శాతానికి పెంచారు. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా దాన్ని 27 శాతానికి పెంచారు. ఈ పెంచి వ్యాట్ శాతాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డి.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈమేరకు పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ శాతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్ 2005 లో షెడ్యూల్ ఆరు సవరిస్తూ, దాని ప్రకారమే పెంచి కొత్త వ్యాట్ శాతాలు జనవరి 30, 2020 నుంచి అమల్లోకి వస్తాయంటూ జీవో MS నెంబర్ 19ని బుధవారం విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి రావడంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా... పెట్రోల్ ధరపై లీటరకు 50 పైసల నుంచి 70 పైసల వరకూ అదనపు భారం పడనుంది. ఇక డీజిల్ పైనా లీటరుకు రూపాయి వరకూ భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల కన్నా ఏపీలో ఎక్కువ పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లోనే పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ శాతం ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రం కర్నాటకతో పోలిస్తే, ఏపీలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంటూ వస్తోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ముందుకెళ్తోంది. అయితే ఈ క్రమంలో రాష్ట్రం ముందున్న ఆర్థిక ఇబ్బందులు అధిగమించే చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ తరుణంలో రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రధానంగా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు.. వాటిపై విధిస్తున్న వ్యాట్ శాతాల్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకూ వ్యాట్ పై అదనంగా వసూలు చేస్తున్న స్థిరధర రెండు రూపాయలను మాత్రం తొలగించింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం... ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్ 2005 లో షెడ్యూల్ ఆరులో చేసిన రెండు సవరణలు కింది విధంగా ఉన్నాయి. 1)కాలం నెంబర్ 4లో పేర్కొన్నట్లు ఐటమ్ నెంబర్ 2లో ఉన్న పెట్రోల్ అమ్మకాల్లో ప్రతి లీటర్ పెట్రోల్ మీద విధించే రేట్ ఆఫ్ ట్యాక్స్ 31శాతం + రూ.2 స్థిర ధరకు బదులుగా ఇకపై 35.20 శాతం వ్యాట్ వసూలు చేయాలి 2)కాలమ్ నెం4లో పేర్కొన్న ఐటమ్ నెంబర్ 5లో ఉన్న సీ-9తో పాటు అన్నిరకాల డీజిల్ ఉత్పత్తులపై విధించే రేట్ ఆఫ్ ట్యాక్స్ లీటర్‌కు 22.25 శాతం + రూ.2 స్థిర ధరకు బదులుగా... 27 శాతం వ్యాట్ వసూలు చేయాలి. అంటే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద వసూలు చేస్తున్న వ్యాట్ రేటు, అదనంగా రెండు రూపాయల స్థిరధరను సవరిస్తూ.. పూర్తిగా వ్యాట్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇప్పటి వరకూ ముడి చమురు ధర మీద ఆధారపడకుండా ప్రతి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తున్న రెండు రూపాయల స్థిర ధర ఇకపై ఉండబోదు. కానీ దాని స్థానంలో వ్యాట్ రేటు పెరగడంతో ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇక ఈ నిర్ణయం వల్ల... పెట్రోల్, డీజిల్ మూల ధర పెరిగేకొద్దీ.. ప్రజలపై పడే భారం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు లీటర్ పెట్రోల్ మూలధర 60 రూపాయలు ఉందనుకుందాం. 29 జనవరి వరకూ ఉన్న వ్యాట్ + స్థిరధర ప్రకారం 31 శాతం వ్యాట్ లెక్కేస్తే అది 18రూపాయల 60 పైసలు అవుతుంది. ఇక దానికి అదనంగా 2 రూపాయల స్థిర ధర కూడా కలిపితే లీటర్ పెట్రోల్ ధర.. 80 రూపాయల60 పైసలు అవుతుంది. కానీ ఇప్పుడు సవరించిన వ్యాట్ రేట్ల ప్రకారం చూస్తే 60 రూపాయిల పెట్రోల్ మూల ధరపై 35.2 శాతం వ్యాట్ లెక్కేస్తే అది 21 రూపాయిల 12 పైసలు అవుతోంది. అంటే గతంతో పోలిస్తే లీటర్ పెట్రోల్ ధర 52 పైసలు పెరుగుతుంది. ఇక భవిష్యత్తులో పెట్రోల్ మూల ధర పెరిగే కొద్దీ... దాని మీద వ్యాట్ శాతం కూడా పెరుగుతుంది. గతంలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలు దాటినప్పుడు 2018 సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్‌పై రూ.2 పన్ను తగ్గిస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడుల్లో ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గిస్తూ రావడంతో అక్కడ పెట్రోల్ ధరలు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో వాహనదారులకు భారం తప్పేలా లేదు. బుధవారం నాటికి రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్రోల్ ధర రూ .77.93, డీజిల్ ధర రూ .71.94. తాజాగా పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ పెంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సాలీనా కనీసం 500 కోట్ల రూపాయల అదనపు రాబడి ఉండొచ్చన్నది ఆర్థిక శాఖ అధికారుల అంచనా. గురువారం నాటికి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.36 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.66.36 పైసలు ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.78.97 ఉండగా.. డీజిల్ ధర రూ.69.56గా ఉంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.77.94గా ఉంది. డీజిల్‌ ధర రూ.72.27గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.56 ఉండగా.. డీజిల్ ధర రూ.71.91గా ఉంది. పెంచిన ధరలలో ప్రతి లీటర్ పెట్రోల్ మీద ప్రస్తుతానికి 50 పైసలు భారం పెరుగుతోంది. ఇదే ధరలు ఒక నెల రోజుల పాటు కొనసాగితే.. సగటున లీటర్‌కి 50 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బైక్ ఉన్న సగటు ఉద్యోగి, నెలకు కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తే... అతనికి 20 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. అంటే లీటర్ మీద 50 పైసలు వేసుకుంటే... మొత్తంగా అతనికి 10 రూపాయిల అదనపు భారం పడుతుంది. ఒకవేళ పెట్రోల్ రేట్లు రోజువారీ సమీక్షా విధానంలో పెరుగుతూ ఉన్నట్లయితే.. ఈ భారం మరింత పెరుగుతుంది. సరకు రవాణా మరింత భారం పెట్రోల్ ధరల కన్నా డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాల మీద, అన్ని రంగాల మీద పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. డీజిల్ రేట్లు పెరిగితే సరకు రవాణా, కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఇవి పరోక్షంగా సామాన్యుడి బడ్జెట్ మీద అదనపు భారం మోపుతాయి. 2017 జూన్ 16 నుంచి రోజువారీ సమీక్షా విధానంలో ధరలు మారుతూ వస్తున్నాయి. ఆరోజు డాలర్ మారకం రేటును బట్టి ఉదయం ఆరు గంటలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని నిర్ణయిస్తూ వస్తున్నాయి. దీనికి తోడు స్థానిక పన్నులు మారుతూ ఉండటంతో దేశంలో ఒక్కో చోటా ఒక్కో రకమైన పెట్రోల్ ధరలు కనిపిస్తాయి. రోజువారీ సమీక్షా విధానంలో పెరిగే పెట్రోల్, డీజిల్ మూలధనంతో పోలిస్తే తాజాగా ఏపీలో పెంచిన వ్యాట్ రేట్లతో సామాన్యుడిపై భారం పడే అవకాశమే ఎక్కువ. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ఇలా ఏపీలో అదనంగా వ్యాట్ వడ్డించడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి రైతుల ఆందోళన, శాసన మండలి రద్దు వంటి అంశాలతో దేశ వ్యాప్తంగా వార్తల్లో ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరో అంశంలో కూడా వార్తల్లో నిలిచింది. పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి రాష్ట్రం పేరును వార్తల్లో నిలిపింది. text: డాక్టర్ డోనా స్ట్రిక్‌ల్యాండ్ ఈ పురస్కారాన్ని ఆమె అమెరికాకు చెందిన ఆర్థర్ ఆష్కిన్, ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్ మోరోతో పంచుకుంటారు. భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను గెల్చుకున్న మహిళల్లో డోనా స్ట్రిక్‌ల్యాండ్‌ మూడోవారు. ఆమెకన్నా ముందు 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా గొప్పొయెర్ట్-మేయర్‌లు భౌతిక శాస్త్రం నోబెల్ పురస్కారాలను గెల్చుకున్నారు. లేజర్ ఫిజిక్స్‌లో చేసిన పరిశోధనలకు గాను ఆమె ఈ పురస్కారాన్ని గెల్చుకున్నారు. లేజర్ ఐ ట్రీట్‌మెంట్ డాక్టర్ స్ట్రిక్‌ల్యాండ్ కనుగొన్న ఎక్కువ తీవ్రత కలిగిన లేజర్ పల్సెస్‌ను లేజర్ ఐ సర్జరీ సహా అనేక పరిశోధనల్లో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్ లూలో పని చేస్తున్న స్ట్రి‌క్‌ల్యాండ్.. నోబెల్ పురస్కారం వచ్చిన సంగతిని నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆష్కిన్, గెరార్డ్‌లతో ఈ పురస్కారాన్ని పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మరియా గొప్పొయెర్ట్-మేయర్ పరమాణు కేంద్రకాలపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్నారు. ఆమెకన్నా ముందు మేరీ క్యూరీ, ఆమె భర్త పియెర్రీ క్యూరీ, ఆంటోయిన్ హెన్రీ బెకెరెల్‌లు రేడియో యాక్టివిటీపై చేసిన పరిశోధనకుగాను సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 55 ఏళ్ల తర్వాత ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. కెనడాకు చెందిన డాక్టర్ డోనా స్ట్రిక్‌ల్యాండ్‌కు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. text: బీజేపీలో స్వచ్ఛంద పదవీ విరమణ వయసు 75ఏళ్లు. దీంతో రాబోతున్న నాలుగైదేళ్లు మోదీకి కీలకంగా మారబోతున్నాయి. మోదీ లక్ష్యాలు మూడు కీలక అంశాలపై ఆధారపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ, విదేశీ వ్యవహారాలు, ఆయన శైలి రాజకీయాలు వీటిలో ఉన్నాయి. గత ఆరేళ్ల పాలనను ఆర్థిక వ్యవస్థ పతనం, అసమ్మతి పెరుగుదల, కొన్ని అంశాలపై ప్రజలు వర్గాలుగా విడిపోవడం, అధికారాల కేంద్రీకరణ తదితర అంశాలపై విమర్శిస్తున్నారు. చాలా మంది ఆయన పాలనను సమర్థిస్తున్నారు కూడా. అవినీతి నిర్మూలన, పేదలకు పథకాలు చేరవేయడం తదితర అంశాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దృష్టి.. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఘర్షణల నడుమ, నరేంద్ర మోదీ విదేశాంగ విధానానికి పెద్ద పరీక్షే ఎదురవుతోంది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ 18సార్లు భేటీ అయ్యారు. అయితే, వారి మధ్య కరచాలనాలు మినహా పెద్దగా ఏమీ జరగనట్లు ఇప్పుడు అనిపిస్తోంది. ''మోదీ కొత్తగా ఆలోచించాలి. వాణిజ్య ఒప్పందాలపై పునరాలోచనలు జరపాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో సమీకరణాల విషయంలో కొత్త వ్యూహాలను సిద్ధం చేయాలి. ముఖ్యంగా భారత వ్యూహాత్మక స్వతంత్రతకు ఎలాంటి ముప్పూ కలగకుండా జాగ్రత్త వహించాలి''అని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, విదేశాంగ నిపుణుడు శేషాద్రి చారి వ్యాఖ్యానించారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ మారుతున్న ప్రపంచ సమీకరణాల నేపథ్యంలో మోదీకి నేడు విదేశాంగ విధానం విషయంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ''2014 నుంచి మోదీ విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు పెద్ద పీట వేశారు. ప్రస్తుతం ఆరేళ్లు గడిచిన నేపథ్యంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, భారత్‌తో ఇరాన్ సంబంధాలు, రష్యాతో రక్షణ ఒప్పందాల భవిష్యత్.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆధారపడి ఉంది. ఇతర దేశాలతో మన వాణిజ్య సంబంధాలనూ ఈ ఎన్నికలు ప్రభావితం చేయనున్నాయి''అని చారి చెప్పారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలతో ఘర్షణలు పెద్ద సవాల్‌గా మారినట్లు ద హిందూలోని జాతీయ, దౌత్య సంబంధాల ఎడిటర్ సుహాసిని హైదర్ చెప్పారు. మరోవైపు కోవిడ్-19 వ్యాప్తి నడుమ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. ''కోవిడ్-19 వ్యాప్తి నడుమ ప్రపంచీకరణ తిరోగమన బాట పడుతోంది. దేశాలు తమ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు గండి పడటం, విదేశాల్లో భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ విషయంలోనూ భారత్ సిద్ధంగా ఉండాలి. పొరుగు నుండే తాలిబాన్లతో వ్యవహరించేందుకు సన్నద్ధం కావాలి'' ప్రపంచం మోదీని ఎలా చూస్తుందనే అంశంపై బీజేపీ, భారత సంస్థలు దృష్టిపెట్టాయి. 2002 గుజరాత్ ఘర్షణల అనంతరం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ), జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు తదితర నిర్ణయాలు మోదీ ఇమేజ్‌పై ప్రభావం చూపించాయి. ''దేశీయ విధానాల విషయంలో మోదీ ప్రభుత్వానికి ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ విభజన, సీఏఏ/ఎన్‌ఆర్‌సీ విషయంలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి''అని హైదర్ వివరించారు. ఆర్థిక వ్యవస్థ కీలకం.. ఆర్థిక రంగంలో ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెబుతూ మోదీ అధికారంలోకి వచ్చారు. ప్రజలకు అచ్చే దిన్(మంచి రోజులు) తీసుకొస్తామని ఆయన మాటిచ్చారు. అయితే, మోదీని ఉద్యోగ కల్పన వ్యతిరేకిగా ప్రస్తుతం విపక్షాలు విమర్శిస్తున్నాయి. కుంటుబడుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగిత నేడు ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు. మోదీ సరైన మార్గంలోనే నడుస్తున్నారని, ఆయన చర్యలతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని రాజ్యసభ ఎంపీ, రచయిత, ఆర్థిక నిపుణుడు స్వపన్‌దాస్ గుప్తా వ్యాఖ్యానించారు. ''ఇవి అసాధారణ పరిస్థితులు. ఇలాంటివి ముందెన్నడూ మనం చూడలేదు. మార్కెట్‌లో నగదు ఉండేలా చూడటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తోందనే చెప్పాలి. మోదీ చాలా బాగా పనిచేస్తున్నారని అందరూ నమ్ముతున్నారు. కోవిడ్-19 తర్వాత కొత్త అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలు ఎవరి దగ్గరా లేవు'' విదేశాలతో సంబంధాలు ప్రభావితం కాకూండానే భారత్ సొంత కాళ్లపై నిలబడేందుకు మోదీ తీసుకున్న చర్యలు సరైన దిశలోనే పడుతున్నాయని దాస్‌గుప్తా వివరించారు. ''ప్రభుత్వం విశ్వసనీయత పోకుండా చూసుకోవడం, భవిష్యత్‌పై ఆందోళనతో ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టలేకపోవడం తదితర సవాళ్లు ఎదురువుతున్నాయి''అని ఆయన అంగీకరించారు. ఆర్థిక మందగమనానికి బాధ్యత తీసుకోకూండా మోదీ తప్పించుకుంటున్నారని లాస్ట్ డికేడ్ పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్టు పూజా మెహ్రా వ్యాఖ్యానించారు. ''ప్రభుత్వ ఆదాయ మార్గాలు కోసుకుపోయాయి. దీంతో ప్రజాప్రయోజన పథకాలకు పెట్టే ఖర్చుపై ప్రభావం పడుతోంది. ఇదే ఆయన ముందున్న అసలైన సవాల్. వేతనాలు, బకాయిల చెల్లింపులు ఎప్పటికప్పుడు జరిగితే ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కొంత వరకూ తగ్గుతుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని అలవెన్సులు ప్రస్తుతం నిలిపివేశారు. జీతాలు, పింఛన్లు చెల్లించలేని రోజులు కూడా వస్తాయేమో చూడాలి'' ''అయితే త్వరలో జరగబోతున్న బిహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆర్థిక వ్యవస్థ అంశంగా మారుతుందా? లేదా అనేది ముఖ్యమైన అంశం. ఉద్యోగాల కల్పన, రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో మోదీ హామీలు నెరవేర్చనప్పటికీ ఆయన్ను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ ప్రజాదరణ ఎన్నిరోజుల వరకూ ఉంటుందనేదే అసలైన ప్రశ్న'' దౌత్యం, రాజకీయాలే మోదీ బలమని అందరూ చెబుతుంటారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం ఆయన ఆర్థిక నిపుణులపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఆర్థిక నిపుణులతోనే సమస్య ఉందని మెహ్రా భావిస్తున్నారు. ''మంచి ఆర్థిక నిపుణులపై మోదీ అంత నమ్మకం ఉంచరు. ఆయన నమ్మే సలహాదారులు.. పెద్ద నోట్ల రద్దు లాంటి సలహాలు ఇస్తుంటారు. దీంతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది'' రాహుల్‌తో పోలిస్తే.. 1980ల్లో మోదీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచీ ఆయన రచించిన వ్యూహాలన్నీ ఫలించినట్టే చెప్పాలి. ప్రస్తుతం 50ఏళ్ల రాహుల్ గాంధీతో పోలిస్తే.. మోదీ రాజకీయంగా దృఢంగానే ఉన్నట్లు చెప్పుకోవచ్చు. అయితే ఆయన భవిష్యత్ ఎలా ఉంటుంది? ''ప్రజాస్వామ్యాల్లో రాజకీయ నాయకులకు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఏంటంటే.. తమకు ఎదురు నిలిచే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ లేకపోవడం. మంచి విపక్షాలు ప్రభుత్వంతోపాటు ప్రత్యర్థులకూ మంచి చేస్తాయి. అప్పుడే నాయకులు మంచి వ్యూహాలు రచించగలుగుతారు''అని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మాజీ డిప్యూటీ ఎడిటర్ సీమా చిష్టి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విముక్త భారత్ కలను మోదీ సాకారం చేయగలరా? తన పాలనను సుస్థిరం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో మోదీ దృష్టి కేంద్రీకరిస్తారు. దిల్లీలోని రాజ్‌పథ్ పునర్నిర్మాణ ప్రాజెక్టును మోదీ కలల ప్రాజెక్టుగా ఇటీవల పట్టణాభావృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ పూరి అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ పనులను అహ్మదాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్‌కు అప్పగించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచీ వీరిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. ప్రపంచం, భారత్‌ తనను ఎలా గుర్తుపెట్టుకోవాలని మోదీ అనుకుంటున్నారు? ఆయనకు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ''హిందూత్వ సిద్ధాంతాలను మోదీ బాగా నమ్ముతారు. అయితే, ప్రపంచ నాయకుడిగా ఆయన్ను అందరూ గుర్తుపెట్టుకోవడానికి వస్తే.. ఆయన్ను గాంధీతో పోల్చాల్సి ఉంటుంది. విదేశాల్లోని భారతీయులనూ ఆయన ఏకతాటిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ స్వదేశంలో అందరినీ ఒక సీసాలో పెట్టాలని చూస్తూ.. విదేశాల్లో వారిని తన వెంట రావాలని కోరుకోవడం పూర్తి వైరుద్ధ్యంగా ఉంటుంది''అని చిష్టి వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ ఇమేజ్ మారేవరకూ మోదీకి రాజకీయంగా ఎలాంటి అవరోధాలు ఎదురుకావని ఇండియా టుడే డిప్యూటీ ఎడిటర్ ఉదయ్ మహుర్కార్ వ్యాఖ్యానించారు. ''కాంగ్రెస్.. మైనారిటీలను బుజ్జగించడంపై దృష్టిపెడితే.. మోదీకి ఎలాంటి అడ్డూ లేనట్టే. అవినీతి మచ్చలేని నాయకుడిగా మోదీకి ప్రజల్లో మంచి పేరుంది'' ''ప్రజలకు పథకాల ఫలాలు చేరవేయడంలో మోదీ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. మోదీని విమర్శించేవారు భవిష్యత్‌లో ఆయన చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. కోవిడ్-19 తర్వాత మరింత గట్టి మోదీని మనం చూడబోతున్నాం'' ఇంతకీ 70వ సంవత్సరం నాడు మోదీ తనను తాను ఎలా ఉండాలని కోరుకుంటారు? గట్టి మోదీనా? ప్రపంచ నాయకుడైన మోదీనా? హిందూ మోదీనా? లేక అందరూ మెచ్చే మోదీనా? లేదంటే అన్నీనా? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత రాజకీయాల్లో విశ్రాంతి పొందే వయసంటూ ఏమీలేదు. అయితే, నరేంద్ర మోదీ 70వ పడిలోకి అగుడుపెట్టిన తరుణంలో ఆయన తదుపరి తీసుకోబోయే చర్యలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చ జరుగుతోంది. text: ఇక్కడ మనుషుల సంఖ్య కంటే ధృవపు ఎలుగుబంట్ల సంఖ్యే ఎక్కువ అదికూడా సంవత్సరంలో ప్రకాశవంతంగా ఉండే సగం కాలంలో వస్తేనే. ఈ కాలంలో అర్థరాత్రి కూడా సూరీడు ఉంటాడు.. వారంలో ప్రతి రోజూ 24 గంటలూ కనిపిస్తాడు. మిగతా అర్థ సంవత్సరంలో చీకటి రాజ్యమేలుతుంది. తరచుగా ఉత్తర కాంతి మెరుపులీనుతూ నాట్యం చేస్తుంటుంది. నార్వే ప్రధాన భూభాగానికి ఉత్తరంగా 800 కిలోమీటర్ల దూరంలో.. ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో ఉంటుంది స్వాల్బార్డ్. ఇది ప్రపంచంలో ఉత్తర కొసన ఏడాది పొడవునా జనం ఉండే ఆవాస ప్రాంతం. ప్రపంచంలో ఉత్తరాన చిట్టచివరన గల యూనివర్సిటీ, చర్చి, బ్రూవరీ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా నివసించగలిగే అతి తక్కువ ప్రాంతాల్లో ఇదొకటి. స్వాల్బార్డ్ రాజధాని లాంగియర్బన్‌లో నివసించే 2,400 మంది జనాభాలో దాదాపు మూడో వంతు మంది వలస వచ్చినవారే. వారు 50 పైగా దేశాల నుంచి వచ్చారు. ఏ దేశ పౌరులైనా సరే ఒక ఉద్యోగం, నివసించటానికి ఒక ఇల్లు ఉంటే చాలు.. ఇక్కడ స్థిరపడొచ్చు. ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ ఈ ప్రాంతానికి మొదటిగా 1,200 సంవత్సరం ప్రాంతంలో వైకింగులు వచ్చారని భావిస్తారు. అయితే నెదర్లాండ్స్ పర్యాటకులు 1956లో చైనాకు ఈశాన్య మార్గం కనుగొనే ప్రయత్నంలో భాగంగా మొదటిగా తాము ఈ ప్రాంతాన్ని సందర్శించిన వైనాన్ని రికార్డు చేశారు. అనంతర శతాబ్దాల్లో ఇంగ్లండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, రష్యాల నుంచి వాల్‌రస్, తిమింగలాల వేటగాళ్లు ఇక్కడికి వచ్చారు. 1906లో అమెరికా వ్యాపారవేత్త జాన్ మన్రో లాంగియర్.. ఈ దీవుల సముదాయంలో తొలి బొగ్గు గనిని స్థాపించారు. అది 20వ శతాబ్దంలో స్వాల్బార్డ్ ప్రధాన పరిశ్రమగా కొనసాగింది. ఇప్పుడైతే పర్యాటకం, పర్యావరణ, జీవావరణ పరిశోధనలు స్వాల్బార్డ్‌లో ప్రధాన కార్యకలాపాలు. 1920 వరకూ ఈ దీవుల మీద ఎవరి పరిపాలనా లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత.. స్వాల్బార్డ్ మీద నార్వే సార్వభౌమాధికారానికి హామీ ఇస్తూ జరిగిన ఒప్పందం మీద తొమ్మిది దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు ఈ ఒప్పందంలో 46 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భూభాగాన్ని సైనిక అవసరాలకు ఉపయోగించకూడదని ఆ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఈ దీవుల సహజ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత నార్వేదేనని చెప్తోంది. ఆ ఒప్పందంలో అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే.. ఇక్కడ నివసించే నార్వే పౌరులు, నార్వేయేతర పౌరుల మధ్య ఎలాంటి భేదం చూపటానికి వీలులేదు. స్వాల్బార్డ్‌కు నివాసం వచ్చే జనంలో ఎక్కువ మంది స్థిరపడేది లాంగియర్బన్‌లోనే. ఈ దీవుల్లో ఉన్న మొత్తం రోడ్ల పొడవు కలిపితే కేవలం 40 కిలోమీటర్లే ఉంటాయి. ఊర్ల మధ్య రోడ్లు ఉండవు. వేసవిలో పడవల మీద, చలికాలంలో స్నోమొబైల్ మీద మాత్రమే వేరే ఊర్లకు వెళ్లటానికి వీలుంటుంది. స్వాల్బార్డ్‌ రాజధాని లాంగియర్బన్‌లో ఇళ్లు టూరిజమే ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనాధారం ఎవరైనా నగర పరిధి దాటి బయటకు వెళ్లేటపుడు మామూలుగా ఒక రైఫిల్ వెంటబెట్టుకుని వెళుతుంటారు. ఎందుకంటే పోలార్ బేర్ – (ధృవపు ఎలుగుబంట్లు) ఎదురుపడొచ్చు. ఈ దీవుల్లో నివసించే మనుషుల సంఖ్య 2,926 అయితే ఇక్కడ ఉండే ఎలుగుబంట్ల సంఖ్య 3,000 కన్నా ఎక్కువే మరి. స్వాల్బార్డ్‌కి ఎవరైనా వచ్చి నివసించవచ్చు. కానీ జన్మించటానికి కానీ, చనిపోవటానికి కానీ ఇది సరైన ప్రాంతం కాదు. గర్భిణులకు ఇక్కడ ఆస్పత్రులు లేవు. ఎవరైనా చనిపోతే నిబంధనల ప్రకారం మృతదేహాన్ని నార్వే ప్రధాన భూభాగానికి తరలించాల్సి ఉంటుంది. 1950ల నుంచీ ఈ దీవుల సమయంలో ఖననం చేయటానికి అనుమతి లేదు. ఎందుకంటే ఈ దీవుల్లోని పెర్మాఫ్రాస్ట్ – ఏడాది పొడవునా కొనసాగే దట్టమైన మంచుపొర – మృతదేహాలు పాడటవకుండా అలాగే కాపాడతాయి. తగినంత లోతులో పూడ్చకపోతే ఆ మృతదేహాలు బయటపడుతుంటాయి కూడా. స్వాల్బార్డ్‌లోని ఈ పెర్మాఫ్రాస్ట్‌తో పాటు ఏడాది పొడవునా తక్కువ ఉష్ణోగ్రతలు (వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 7 సెంటీగ్రేడ్లు) ఉండటం వల్ల ఇక్కడ గ్లోబల్ సీడ్ వాల్ట్ – ప్రపంచ విత్తన భాండాగారం – స్థాపించారు. లాంగియర్బన్ మెయిన్ రోడ్డుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ విత్తన భాండాగారంలో 2008 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచం నలుమూలల నుంచీ తెచ్చిన 9.80 లక్షల విత్తనాలను దాచిపెట్టారు. ఏదైనా ఉపద్రవం సంభవించి ప్రపంచంలో పంటలన్నీ నాశనమైనపక్షంలో ఇవి ఉపయోగపడతాయన్నది ఈ విత్తన భాండాగారం వెనుక గల ఆలోచన. కానీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఈ భాండాగారానికి కూడా పూర్తి భద్రత ఉండకపోవచ్చు. 2017లో పెర్మాఫ్రాస్ట్‌లో కొంత భాగం కరిగిపోవటంతో ఈ భాండాగారం ప్రవేశ సొరంగంలోకి వరద ముంచెత్తింది. లాంగియర్బన్‌ను వర్షపు నీటిని గమనంలో పెట్టుకుని డిజైన్ చేయలేదు. ఇటీవలి కాలంలో బురదచరియలు విరిగిపడటం, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు పెరిగాయి. స్వాల్బార్డ్‌లో సగటు ఉష్ణోగ్రతలు 1971 నుంచి 4 సెంటీగ్రేడ్ల మేర పెరిగాయి. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఈ పెరుగుదల ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ప్రపంచంలో అతి వేగంగా వేడెక్కుతున్న ప్రాంతం ఇదే. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నార్వేలోని దీవుల సముదాయంలో గల స్వాల్బార్డ్ దీవికి విమానాల్లో వస్తున్నపుడు కిటికీల్లో నుంచి చూస్తే ముందుగా కనిపించేది మంచు టోపీలు పెట్టుకున్నట్లుండే పర్వతాలు. text: వైరస్ వ్యాప్తి కొత్త దశలోకి వచ్చిందని దక్షిణ కొరియా ఆరోగ్య శాఖ ఉప మంత్రి కిమ్ గాంగ్-లిప్ అన్నారు. కొత్త కేసుల్లో చాలా వరకు డేగు నగర సమీపంలో ఉండే ఒక ఆసుపత్రి, ఒక మతానికి చెందినవారున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కరోనా రోగులు మరణించగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చియాంగ్డోకు సమీపంలో ఉన్న డేగు నగరంలో ఈ ఆసుపత్రి ఉంది. ఈ ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం స్పెషల్ కేర్ జోన్‌గా ప్రకటించింది. డేగు నగర వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చైనా వెలుపల అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నిర్ధారణయింది దక్షిణ కొరియాలోనే. చనిపోయిన 2,345 మందితో కలిపి చైనాలో మొత్తం 76,288 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కాగా జపాన్ తీరంలో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో 600 మందికిపైగా ఈ వైరస్ సోకింది. అయితే, చైనాలో కొత్త కేసులు, మరణాలు రెండూ తగ్గుముఖం పట్టినట్లు శనివారం అక్కడి అధికారులు చెప్పారు. చైనాతో ఎలాంటి సంబంధం లేకుండా దక్షిణకొరియాలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రియేసస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆఫ్రికా ఖండంలోని బలహీనమైన ఆరోగ్య సేవల వ్యవస్థలున్న దేశాల్లో ఈ వైరస్ ప్రబలితే కలిగే మరింత ప్రమాదమనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. చైనా కాకుండా 26 దేశాల్లో 1200 కేసులు నమోదయ్యాయని.. కనీసం 8 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా దేశాల్లో.. * క్రూయిజ్ షిప్‌లో ఉన్న బ్రిటిష్, ఇతర ఐరోపా దేశాలకు చెందిన పాసింజర్లను తీసుకొచ్చిన విమానం ఇంగ్లండ్ చేరుకుంది. * కరోనా వైరస్ కారణంగా తమ దేశంలో ఇద్దరు మరణించారని ఇటలీ ప్రకటించింది. * తమ దేశంలో అయిదుగురు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. అక్కడి కోమ్ నగరంలో ఈ వైరస్ ప్రబలినప్పటికీ ఇప్పటికే అది దేశంలోని మిగతా అన్ని నగరాలకూ వ్యాపించి ఉంటుందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. కొత్తగా వైరస్ సోకినవారిలో 62 మంది డేగులోని షిన్‌చియోంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే క్రైస్తవ మత శాఖకు చెందినవారని కేసీడీసీ వెల్లడించింది. దక్షిణ కొరియాలో ఏమైంది? దక్షిణకొరియా వైద్యాధికారులు శనివారం తొలుత 142 కొత్త కేసులు రికార్డయినట్లు చెప్పారు.. అక్కడికి కొద్ది గంటల్లోనే మరో 87 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణయిందని ప్రకటించారు. శనివారం నిర్ధరణయిన 229 కేసులతో చియాంగ్డోలోని డీనమ్ హాస్పిటల్‌‌లోనే 95 మంది ఉన్నారని కొరియా సెంటర్స్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(కేసీడీసీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో మొత్తం 114 మందికి కరోనా ఉందని, వారిలో 9 మంది సిబ్బంది కాగా మిగతా వారు పేషెంట్లని చెప్పారు. బాధిత రోగుల్లో అత్యధికులు మానసిక ఆరోగ్య సమస్యలతో ఉన్నవారని.. వైరస్ బాధితులు, బాధిత ప్రాంతాలతో ఎలాంటి సంబంధం లేనివారికీ సోకిందని, అదెలా సాధ్యమైందో తెలియడం లేదని మంత్రి కిమ్ చెప్పారు. బుధవారం ఒకరు, శుక్రవారం మరొకరు ఈ హాస్పిటల్‌లో చనిపోయారని యోనాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కొత్తగా వైరస్ సోకినవారిలో 62 మంది డేగులోని షిన్‌చియోంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే క్రైస్తవ మత శాఖకు చెందినవారని కేసీడీసీ వెల్లడించింది. ఈ శాఖ వ్యవస్థాపకుడి సోదరుడు చనిపోగా ఆయన అంత్యక్రియలకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య పెద్ద సంఖ్యలో ఆ శాఖకు చెందినవారు హాజరయ్యారని అధికారులు చెప్పారు. షిన్‌చియోంజీ శాఖకు చెందిన 9,336 మంది సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండగా వారిలో 500 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ టెడ్రోస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది? డాక్టర్ టెడ్రోస్ శనివారం మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ వైరస్ సోకిన వారు ఎవరైనా ఉంటే గుర్తించి, చికిత్స చేయడానికి గాను వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ పరికరాలు సిద్ధం చేస్తోందని చెప్పారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలు ఎబోలా వైరస్ పరీక్షలు చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు పరీక్షలు చేయిస్తున్నాయని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమ దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య ఒక్క రోజులోనే రెట్టింపయిందని దక్షిణ కొరియా తెలిపింది. ఒక్క శనివారమే 229 కొత్త కేసులు నిర్ధరణ కావడంతో బాధితుల సంఖ్య 433కి పెరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు. text: భారత్‌లో పాస్‌పోర్టులు మూడు రకాలు. ప్రభుత్వ పనిమీద విదేశాలకు వెళ్లేవారికి తెల్లరంగులో ఉండే అఫీషియల్ పాస్‌పోర్ట్ ఇస్తారు. ఉన్నతాధికారులు, జాయింట్ సెక్రటరీ కంటే పెద్ద ర్యాంకులో ఉన్న వారికి కుంకుమ రంగులో ఉండే డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఇస్తారు. మిగిలిన పౌరులందరికీ నీలం రంగులో ఉండే పాస్‌పోర్టు ఉంటుంది. 10వ తరగతి పాస్ కాని వారు, గల్ఫ్‌లోని 18దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి పాస్‌పోర్టుల మీద 'ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్' అనే ముద్ర ఉంటుంది. గల్ఫ్‌ వెళ్లే వారు అక్కడ చిక్కుల్లో పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. మిగిలిన వారి పాస్‌పోర్టులపై 'ఇమ్మిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్' అని ఉంటుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇమ్మిగ్రేషన్ చెక్ అవసరమైన వారి పాస్‌పోర్టు రంగు మారబోతోంది. వారికి నారింజ రంగులో ఉండే పాస్‌పోర్టు ఇస్తారు. ఇప్పటికే ఉన్న పాస్‌పోర్టులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇచ్చేవారికి మాత్రం రంగు మారుతుంది. అంటే సదరు వ్యక్తి పాస్‌పోర్టు రంగు చూడగానే అతను వలస కార్మికుడని, తక్కువ ఆదాయం ఉన్నవాడనీ, పదో తరగతి కూడా చదువుకోలేదని తెలిసిపోతుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్ర‌తిపాద‌న‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత పౌరులను రెండో తరగతి వారిగా చూపే ప్రయత్నమనీ, ప్రజలను విడదీసే బీజేపీ బుద్ధికి ఇది నిదర్శనమని ఆ పార్టీ విమర్శించింది. అయితే, పాస్‌పోర్ట్ రంగు మార్చ‌డంలో త‌ప్పు ఏమీ లేద‌ని, దానివ‌ల్ల లాభం కానీ, న‌ష్టం కానీ లేవ‌ని వ్యాఖ్యానించారు తెలంగాణ ప్ర‌భుత్వంలో ఎన్‌ఆర్‌ఐ వ్య‌వ‌హారాలు చూస్తోన్న ఒక ఉన్న‌తాధికారి. ఒక‌వేళ ఈసీఆర్ కేట‌గిరీ పాస్‌పోర్ట్ రంగు మార్చ‌డం వివ‌క్ష అయితే, అస‌లు ఈసీఆర్ కేటగిరీ ఉండటం కూడా వివ‌క్షే అవుతుంద‌న్నారు. విదేశాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆదుకునేందుకు పాస్‌పోర్టు రంగు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్ర‌స్తుతం జెడ్డాలో చిక్కుకున్న ముగ్గురు తెలుగువారికి మాతృభాష మినహా మ‌రే భాషా రాదు. భార‌త ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌తో మాట్లాడ‌టానికి వారికి హిందీ కూడా రాదు. అందుకే వారి స‌మ‌స్య చక్క‌దిద్ద‌డం క‌ష్ట‌మవుతోంది. ఒక‌వేళ అటువంటి కార్మికుల పాస్‌పోర్ట్ రంగు వేరే ఉంటే, అప్పుడు వారి పాస్‌పోర్టు చూడ‌గానే, వారిని గుర్తించి వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు ఆ అధికారి. తూర్పు గోదావ‌రి జిల్లా మ‌ల్కిపురం గ్రామం నుంచి కువైట్ వెళ్లి అక్క‌డ‌ 22 సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తున్న కొల్లాబ‌త్తుల వీర్రాజుతో బీబీసీ మాట్లాడింది. "ఇప్ప‌టి వ‌ర‌కూ ఇమ్మిగ్రేష‌న్, నాన్ ఇమ్మిగ్రేష‌న్ అంటూ పెద్ద తేడా లేదు. కాక‌పోతే ఇమ్మిగ్రేష‌న్ వాళ్లు స్టాంపు వేయించుకునే ప్ర‌క్రియ ఉంటుంది. ఒక‌ప్పుడు ఇమ్మిగ్రెంట్‌గా గల్ఫ్‌ వెళ్ళి, కనీసం 4 సంవ‌త్స‌రాలు ఆ దేశంలో ఉంటే నాన్ ఇమ్మిగ్రెంట్ కేట‌గిరీ ఇచ్చేవారని వీర్రాజు చెప్పారు. ‘‘ప్ర‌భుత్వం తెస్తున్న కొత్త నిబంధ‌న చాలా త‌ప్పు. చ‌దువుకోని వారిని అపరాధ భావనకు గురిచేసే నిబంధ‌న ఇది. పాస్‌పోర్ట్ రంగు మార్చాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రికైనా ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే అత‌ను ఏ కేట‌గిరీలో గ‌ల్ఫ్ వ‌చ్చాడ‌న్న ప్ర‌శ్న వ‌స్తుంది. అంత‌గా కావాలంటే, చ‌దువుకోని వారికి లేదా ఇమ్మిగ్రెంట్ కేట‌గిరీ వారికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చి పంపించాలి. అంతేకానీ ఇలాంటి తేడాలు చూపించ‌డం స‌రికాదు. ప్ర‌భుత్వం చ‌దువుకున్న వారిని వీఐపీలుగా చూడాల‌నుకుంటుందేమో. నేను ఇమ్మిగ్రెంట్‌గానూ, నాన్ ఇమ్మిగ్రెంట్‌గానూ గ‌ల్ఫ్ వెళ్లి వ‌చ్చాను. తేడా క‌నిపించ‌లేదు" అని కొల్లాబ‌త్తుల వీర్రాజు అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత విదేశాంగశాఖ తీసుకున్న పాస్‌పోర్ట్ రంగు మార్పిడి నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం చదువు, డబ్బులేని కార్మికులను వేరు చేసి చూపిస్తుంద‌న్న ఆరోపణలు ఉన్నాయి. text: స్వామి నిత్యానంద తమను కిడ్నాప్ చేసి, బంధించారన్న ఇద్దరు బాలికల ఆరోపణలతో ఆయనపై అహ్మదాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిత్యానంద ఆశ్రమం నిర్వహిస్తున్న ప్రాణప్రియ, తత్వప్రియ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి కేటీ కమారియాతో బీబీసీ మాట్లాడింది. "ఐపీసీ సెక్షన్ 365, 344, 323, 504, 506, 114 కింద చైల్డ్ లేబర్, కిడ్నాప్, వేధింపుల కేసులు నమోదు చేశాం" అని ఆయన చెప్పారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నిత్యానంద పరారయ్యారని వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. "నిత్యానంద 2016 నుంచి బయటే ఉన్నారు, కానీ, ఆయన విదేశాల్లో ఉన్నారా లేక వేరే ఎక్కడైనా ఉన్నారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని చెప్పారు. అహ్మదాబాద్‌లో నిత్యానంద ఆశ్రమం బ్రాంచ్‌ను ప్రారంభించి ఎక్కువ రోజులు కాలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు పరిధి అహ్మదాబాద్ వరకే ఉన్నప్పటికీ, గుజరాత్ పోలీసులు బెంగళూరు సమీపంలో ఉన్న ఆయన ప్రధాన ఆశ్రమానికి కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అసలు కేసు ఏంటి? కనిపించకుండా పోయిన బాలికల తల్లిదండ్రుల తరపున గుజరాత్ హైకోర్టులో ఈ కేసు వేశారు. 2012లో తమిళనాడులో నిత్యానంద ఆశ్రమం ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించినపుడు, తన నలుగురు కూతుళ్లను అక్కడికి పంపించానని వారు చెప్పారు. బాలికల వయసు 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉంటుందన్నారు. తర్వాత నిత్యానంద ఆశ్రమం వారు నలుగురు బాలికలను అహ్మదాబాద్‌లో ఉన్న ఆశ్రమానికి పంపించారని దంపతులు ఆరోపించారు. గుజరాత్‌లోని నిత్యానంద ఆశ్రమం బ్రాంచ్ అహ్మదాబాద్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్ (ఈస్ట్) క్యాంపస్‌లో ఉంది. పోలీసులు బాలికలను వెతుకుతూ ఈ ఆశ్రమం బ్రాంచికి వచ్చినపుడు తమతో ఇద్దరు బాలికలు మాత్రమే బయటకు వచ్చారని, మరో ఇద్దరు బాలికలు అక్కడి నుంచి రావడానికి నిరాకరించారని చెప్పారు. కానీ, నిత్యానంద తన కూతుళ్లను అపహరించారని, వారిని అక్రమంగా నిర్బంధించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిత్యానంద సంబంధిత వివాదం అంతకు ముందు 2010లో స్వామి నిత్యానందపై మోసం, అశ్లీలత కేసులు నమోదయ్యాయి. ఆయనదే అని చెబుతున్న ఒక సెక్స్ సీడీ వెలుగులోకి వచ్చింది. అందులో ఒక దక్షిణ భారత నటితో ఆయనను అభ్యంతరకర స్థితిలో చూపించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్‌ పరిశీలనలో ఆ సీడీ విశ్వసనీయమైనదేనని తేలింది. కానీ, నిత్యానంద ఆశ్రమం మాత్రం భారత్‌లో జరిగిన ఫోరెన్సిక్ పరీక్షలను తప్పుబట్టింది. అమెరికాలోని ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో సీడీని మార్ఫింగ్ చేసినట్లు చెప్పారంది. ఈ కేసులో నిత్యానందను అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన బెయిలుపై బయటకు వచ్చారు. బెంగళూరులో ఉన్న ఆయన ఆశ్రమంలో ఒకసారి రెయిడ్ కూడా జరిగింది. ఆ తనిఖీల్లో కండోమ్ ప్యాకెట్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2012లో స్వామి నిత్యానందపై అత్యాచారం ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు జైలు శిక్ష విధించారు. అప్పుడు, పరారైన ఆయన ఐదు రోజుల తర్వాత లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. నిత్యానంద పరారీలో ఉన్నప్పుడు పోలీసులు ఆయన ఆశ్రమంలో తనిఖీలు చేశారు. అక్కడ నిత్యానంద తన అనుచరులపై అత్యాచారం చేసేవారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అత్యాచారం, చట్టవిరుద్ధమైన పనులు లాంటి కేసులు, ఆరోపణలు కాకుండా ఆయన ఎన్నోసార్లు తన ప్రకటనలతో వివాదాల్లో నిలిచారు. వివాదాస్పద ప్రకటనలు నిత్యానంద ఒకసారి కోతులు, మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం, తమిళం మాట్లాడడం నేర్పిస్తున్నానని చెప్పారు. నిత్యానంద ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలను కూడా సవాలు చేశారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతం తప్పని చెప్పారు. దీనిపై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. స్వామి నిత్యానంద ఒక వైరల్ వీడియోలో బెంగళూరులో సూర్యుడిని 40 నిమిషాలు వరకూ ఉదయించకుండా ఆపానని కూడా చెప్పుకున్నారు. అంతే కాదు, ఒక ప్రవచనంలో భూతాలతో స్నేహం చేశానని కూడా చెప్పారు. శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఇప్పటికీ జీవం కోసం వెతుకుతుంటే, చాలా ఏళ్ల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని నిత్యానంద చెప్పేశారు. అక్కడి నుంచి వారు ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూమిపైకి వస్తుంటారన్నారు. ఇలా నిత్యనంద వాదనలు, ప్రవచనాల లిస్టు చాలా పెద్దదే. అయితే, నిత్యానందను నమ్మేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వారు విదేశాల్లో కూడా ఉన్నారు. నిత్యానంద ఆశ్రమం వెబ్‌సైట్‌లో తను 27 భాషల్లో 500కు పైగా పుస్తకాలు రాశానని కూడా చెప్పారు. నిత్యానందపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ నిత్యానంద ఎవరు? నిత్యానంద అనుచరులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ మేం వారితో మాట్లాడాలని ప్రయత్నించినపుడు ఎవరూ ముందుకు రాలేదు. తమిళనాడులో పుట్టిన నిత్యానంద తనను తాను భగవంతుడిగా చెప్పుకుంటారు. ఆయన వెబ్‌సైట్‌లో వివరాల ప్రకారం యూట్యూబ్‌లో నిత్యానంద వీడియోలకు 18 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో అత్యధికులు చూసే ఆధ్యాత్మిక గురువు తనే అని ఆయన చెప్పుకుంటున్నారు. వెబ్‌సైట్ ప్రకారం నిత్యానంద 1978 జనవరిలో పుట్టారు. నిత్యానంద తండ్రి పేరు అరుణాచలం, తల్లి లోకనాయకి అని ఉంది. బాల్యంలో నిత్యానంద పేరు రాజశేఖరన్. ఆయనకు తన తాతగారి ద్వారా పూజలు, ఆచారాలపై ఆసక్తి ఏర్పడింది. తన తాతగారిని నిత్యానంద తొలి గురువుగా చెప్పుకున్నారు. నిత్యానంద 1992లో తన స్కూల్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారు. ఆయన 12 ఏళ్ల వయసు నుంచి రామకృష్ణ మఠంలో చదువుకున్నారు. ఆయన మొదటి ఆశ్రమం నిత్యానంద ధ్యానపీఠం 2003 జనవరిలో బెంగళూరు దగ్గర బిదాదిలో ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఉన్నది ఈ ఆశ్రమం బ్రాంచ్. ఇక్కడ నుంచే బాలికలను మాయం చేశారనే ఆరోపణలతో నిత్యానందపై కేసు నమోదైంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దక్షిణ భారత వివాదాస్పద మత గురువు, తనను తాను స్వామిగా చెప్పుకునే నిత్యానంద మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు. ఆయన ఆశ్రమం సర్వజ్ఞపీఠం కూడా వివాదాల్లో చిక్కుకుంది. text: కానీ, ఈ విషయంలో నిపుణుల సూచన మరోలా ఉంది. శానిటరీ న్యాప్‌కిన్లు మట్టిలో కలిసిపోవడానికి కనీసం వెయ్యేళ్లు పడుతుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతారు. ప్లాస్టిక్‌తో తయారయ్యే శానిటరీ న్యాప్‌కిన్లలో అనేక హానికారక రసాయనాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. ఒకే న్యాప్‌కిన్‌ను రోజంతా ఉపయోగిస్తే దురద, ఎలర్జీతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి. కానీ, అందరు మహిళలకు రోజూ 4-5 న్యాప్‌కిన్లు మార్చుకునే అవకాశం ఉండదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మెన్‌స్ట్రువల్ కప్: పీరియడ్స్ సమస్యకు కొత్త సమాధానం పాత 'బట్ట' పద్ధతికే వెళ్లడం మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. కాకపోతే కచ్చితంగా నాణ్యమైన బట్టను ఎంచుకోవాలి. దాన్ని సరిగ్గా కుట్టాలి. పరిశుభ్రంగా ఉతకాలి. ఈ న్యాప్‌కిన్లు, బట్ట కాకుండా మరేదైనా మార్గం ఉందా? అమెరికాలాంటి పాశ్చాత్య దేశాల్లో మెన్‌స్ట్రువల్ కప్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు. నెలసరి రక్తాన్ని ఈ కప్‌లో సేకరిస్తారు. దాన్ని శుభ్రం చేశాక మళ్లీ వినియోగిస్తారు. అదే ట్యాంపైన్లు నేరుగా నెలసరి రక్తాన్ని పీల్చేస్తాయి. పునర్వినియోగానికి అనువుగా ఉండే కప్స్, ట్యాంపైన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కానీ, సంప్రదాయ విధానం నుంచి బయటికొచ్చి కొత్త మార్గాన్ని ఎంచుకోవడం అంత సులువు కాదని సైకాలజిస్టులు అంటున్నారు. పీఎంఎస్ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెన్‌స్ట్రువల్ కప్స్ లాంటి ఈ కొత్త సాధనాలు ఉపకరిస్తాయని వైద్యులు చెబుతారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పీరియడ్స్ సమయంలో శానిటరీ న్యాప్‌కిన్లను ఉపయోగించమంటూ టీవీల్లో చాలా ప్రకటనలు వస్తుంటాయి. text: దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగా ఉంది. ఫలితంగా పాకిస్తాన్ తమ గగనతలంలో విమానాల రాకపోకలు నిషేధించింది. దీనివల్ల అంతర్జాతీయ విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఘటనలు జరిగిన నెల చివరి వారంలో పాకిస్తాన్ తమ గగనతలంపై విమానాలు ఎగరకుండా చేసింది. తర్వాత పాక్షికంగా దాన్ని తొలగించినా భారత్ సరిహద్దులతో ఉన్న గగనతలంలో మాత్రం నిషేధం ఇంకా కొనసాగుతోంది. భారత విమానాలు తమ గగనతలంలో ప్రవేశించడంపై ఉన్న నిషేధాన్ని మే 30 వరకూ పొడిగించాలని పాక్ తాజాగా నిర్ణయించింది. పాకిస్తాన్ తీసుకున్న ఈ చర్యలతో తూర్పు నుంచి పశ్చిమం, పశ్చిమం నుంచి తూర్పు దిశగా వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో చాలావాటిపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల ఒకవైపు ఎయిర్ లైన్స్ ఖర్చులు పెరగడంతోపాటు విమాన ప్రయాణం సమయం కూడా పెరుగుతోంది. నాన్-స్టాప్ విమానాలు కూడా ఇప్పుడు ఇంధనం నింపుకోడానికి మధ్యలో ఆగాల్సి వస్తోంది. ఈ నిషేధంతో పాకిస్తాన్ పొరుగు దేశాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. ఇంతకు ముందు తక్కువ సమయంలో గమ్యం చేరుతూ వచ్చిన విమనాలు ఇప్పుడు చుట్టు తిరిగి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాయి. అయితే దీనివల్ల తూర్పుగా, అమెరికా వైపు వెళ్లే విమానాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తూర్పు, భారత్ పశ్చిమ సరిహద్దుల పైనుంచి విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తున్న విమానాలన్నీ ఈ సరిహద్దులకు దూరంగా ప్రయాణిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకూ దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ మాత్రం తాము ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నామని చెబుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ గగనతలంపై ఏ విమానమైనా పశ్చిమ సరిహద్దుల నుంచి తూర్పుకు, లేదా తూర్పు నుంచి పశ్చిమ సరిహద్దులవైపు వెళ్లలేదు. ఉదాహరణకు కాబూల్ నుంచి దిల్లీ వెళ్లే విమానం ఇప్పుడు పాకిస్తాన్ పైనుంచి కాకుండా ఇరాన్ నుంచి అరేబియా సముద్రం మీదుగా దిల్లీ చేరుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ వచ్చే విమానాలు లేదా పాకిస్తాన్ పైనుంచి వెళ్లే చైనా, కొరియా, జపాన్ విమానాలు ఆ దేశ గగనతలం ఉపయోగించుకోవచ్చు. అయితే అవి పశ్చిమ సరిహద్దులకు దూరంగా పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నిషేధంతో పాకిస్తాన్‌పై ప్రభావం ఈ నిషేధంతో పాకిస్తాన్ నుంచి తూర్పు వైపు వెళ్లే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ నుంచి తూర్పుగా, ఆస్ట్రేలియా వైపు వెళ్లే ప్రయాణికులు తరచూ థాయ్ ఎయిర్ వేస్ విమానాల్లో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు అది తమ విమానాలను ఆపివేసింది. కౌలాలంపూర్ నుంచి లాహోర్ వెళ్లేందుకు చౌక ధరకే టికెట్లు అందించే మలేసియాలోని ప్రైవేటు విమానయాన కంపెనీ 'మాలిండో ఎయిర్' కూడా తమ విమానాలను నిలిపివేసింది. దాంతో ఈ విమాన సంస్థ నుంచి టికెట్లు తీసుకునే ప్రయాణికులపై ఈ ప్రభావం పడింది. విమానాలు రద్దు చేసిన ఎయిర్ లైన్స్ సంస్థ ఆ యాత్రికులకు డబ్బు తిరిగివ్వకుండా తమ ఇతర విమానాల్లో ఉపయోగించుకునేలా వోచర్స్ అందించింది. కానీ పాకిస్తాన్‌కు ఆ సంస్థ విమానాలే లేకపోవడంతో అవి పనికిరాకుండా పోయాయి. హాంకాంగ్‌ ఎయిర్ లైన్ 'కేథే పసిఫిక్' పాకిస్తాన్‌కు విమానాలు ప్రారంభించే ఏర్పాట్లలో ఉంది. కానీ ప్రస్తుత స్థితితో అది ఇప్పుడు కష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ తూర్పు గగనతలంపై నిషేధం వల్ల ఎయిర్ లైన్స్ కంపెనీలకు, యాత్రికులకే కాకుండా సివిల్ ఏవియేషన్ అథారిటీకి సుమారు 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మొత్తం ఆదాయం 6 వేల కోట్ల నుంచి 7 వేల కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. అందులో 30 నుంచి 35 శాతం ఆదాయం పాక్ గగనతలం ఉపయోగిస్తున్నందుకు వివిధ అంతర్జాతీయ విమానయాన కంపెనీలు చెల్లించే అద్దె రూపంలో వస్తుంది. ఎవరెవరిపై ప్రభావం ఈ నిషేధంతో ప్రభావితమైన దేశాల్లో భారత్ కూడా ఉంది. పశ్చిమ దేశాల నుంచి భారత్ వచ్చే విమానాల టికెట్ ధర, ప్రయాణ సమయం చాలా పెరిగింది. ఉదాహరణకు చుట్టు తిరిగి వెళ్లడం వల్ల భారత్ నుంచి యూరప్ వెళ్లే విమానాల దూరం 913 కిలోమీటర్లు పెరిగింది. దాంతో మొత్తం ప్రయాణ దూరం దాదాపు 2 గంటలు పెరిగింది. లండన్ నుంచి దిల్లీ లేదా ముంబయి వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు తమ గమ్యం చేరుకోడానికి సగటున 300 పౌండ్లు (27 వేల రూపాయలు) అదనంగా ఖర్చుపెట్టాల్సి వస్తోంది. లండన్ నుంచి దిల్లీకి చేరడానికి ప్రయాణ సమయం కూడా దాదాపు రెండు గంటలు పెరిగింది. "మాకు ఒక టికెట్‌పై దాదాపు 200 పౌండ్లు పెరిగింది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రయాణ దూరం. దూరం పెరిగిందనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు" అని వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ విమానంలో లండన్ నుంచి దిల్లీకి ప్రయాణించే ఒక ప్రయాణికుడు బీబీసీతో అన్నారు. "పాకిస్తాన్ గగనతలంపై నిషేధం ఉండడంతో ప్రయాణ సమయం పెరిగిందని, దానికి ఎయిర్‌లైన్స్ క్షమాపణ కోరుతోందని విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకటించారు" అన్నారు. అంతే కాదు, భారత్ పక్కనే ఉన్న అప్గానిస్తాన్‌కు వెళ్లే దూరం కూడా చాలా పెరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్గానిస్తాన్‌ నుంచి భారత్‌కు విమానాలు నడుపుతున్న అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలూ తమ విమానాలు రద్దు చేయడం, లేదా సంఖ్య తగ్గించడం చేశాయి. ఇంతకు ముందు గంటలో పూర్తయ్యే ప్రయాణానికి ఇప్పుడు కనీసం గంటన్నర పట్టడమే దీనికి కారణం. దానివల్ల టికెట్ రేట్లు కూడా పెరిగాయి. అంతే కాదు నిషేధం ప్రభావం పడ్డ ఎయిర్ లైన్స్‌లో ఆసియా, యూరప్, అమెరికా, తూర్పుగా సుదూర ప్రాంతాలకు విమానాలు నడిపే సింగపూర్ ఎయిర్ లైన్స్, బ్రిటిష్ ఎయిర్ లైన్స్, లుఫ్తాన్సా, థాయ్ ఎయిర్ వేస్, వర్జిన్ అట్లాంటిక్ కూడా ఉన్నాయి. అంతర్జాతీయ విమానాల ఆపరేషన్లను గమనించే ఓపీఎస్ గ్రూప్ ఇంటర్నేషనల్, సివిల్ ఏవియేషన్ సంస్థల ద్వారా అందిన డేటాను బట్టి ఈ నిషేధం వల్ల రోజుకు కనీసం 350 విమానాలపై ప్రభావం పడుతోందని అంచనా వేసింది. ఉదాహరణకు లండన్ నుంచి సింగపూర్ వెళ్లే విమానం ఇప్పుడు రూట్ మార్చుకోవడం వల్ల 451 కిలోమీటర్ల దూరం పెరిగింది. అటు ప్యారిస్ నుంచి బ్యాంకాక్ వెళ్లే విమానాలు 410 కిలోమీటర్లు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోంది. కేఎల్ఎం, లుఫ్తాన్సా, థాయ్ ఎయిర్ వేస్ విమానాలు ఇంతకు ముందు కంటే కనీసం రెండు గంటలు ఎక్కువ ప్రయాణిస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఎయిర్ లైన్స్ కంపెనీలు.. ఎక్కువ దూరం ఎగిరేలా, వీలైనంత ఇంధనం తీసుకెళ్లగలిగేలా విమానాల బరువులో కఠిన నియమాలు అమలు చేస్తున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జమ్ము కశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనాలపై మిలిటెంట్ దాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్స్ జరిపి దాదాపు మూడు నెలలు అవుతోంది. text: బ్రిటన్‌లో దిక్కు తోచని స్థితిలో తెలుగు విద్యార్థులు అక్కడ ఉన్న వారిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకొనసాగిస్తున్న వారు ఉన్నారు. వారిలో కొందరు గడిచిన రెండు మూడేళ్లుగా అక్కడే ఉన్నవారైతే మరికొందరు 3-4 నెలల క్రితమే వెళ్లారు. కరోనావైరస్ దెబ్బకు బ్రిటన్ కూడా అల్లాడిపోతోంది. ఇప్పటికే అక్కడ సుమారు 1200 మందికిపైగా కోవిడ్ 19 బారిన పడిప్రాణాలు కోల్పోయారు. సుమారు19 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కూడా కరోనా బారిన పడి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. పరిస్థితి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండటం యావత్ బ్రిటన్ వాసుల్లో తీవ్ర భయాందోళనల్ని రేకెత్తిస్తోంది. రోజుకు కొత్తగా సుమారు 2500 కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి మొత్తం కుదుట పడేందుకు కనీసం 6 నెలలు పట్టవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా మాంచెస్టర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఆందోళనలో తెలుగు విద్యార్థులు ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు వెళ్లడమే అత్యంత ప్రమాదంగా మారుతోంది. స్థానికుల పరిస్థితే అలా ఉంటే.. ఇక విద్యనభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎంతో కొంత ముందు జాగ్రత్త పడి నిత్యావసరాలను నిలవ చేసుకున్నా... ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌లో ఎన్నాళ్లు లాక్ డౌన్ కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నవాటినే సర్దుకుంటూ బిక్కు బిక్కు మంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. కనీసం పాలు, నీళ్లకు కూడా బయటకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. వచ్చి ఆరు నెలలైంది తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మట్టా రాకేశ్ కంప్యూటర్ సైన్స్‌ లో ఎంఎస్ చేసేందుకు 2019 సెప్టెంబర్‌లో మాంచెస్టెర్ వచ్చారు. నిన్న మొన్నటి వరకు అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్‌షైర్ చదువు కొనసాగిస్తు వచ్చారు. యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నెల 29న మాంచెస్టర్ వదిలి స్వస్థలానికి వచ్చేయాలని విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నామని ఆయన బీబీసీకి చెప్పారు. “చైనా నుంచి యూరోపియన్ దేశాలకు కూడా కరోనావైరస్ వ్యాపించడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లి పోవాలని నాతో పాటు కొంత మంది స్నేహితులం కలిసి ఈ నెల 29కి భారత్ వెళ్లిపోవాలని టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. లాక్ డౌన్ వార్తల నేపథ్యంలో వాటిని 20కి ప్రీపోన్ చేసుకున్నాం కూడా. కానీ ఎయిర్ పోర్ట్‌లోనే మమ్మల్ని అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు మార్చి 22 నుంచీ భారత్ అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. దీంతో మేం దిక్కు తోచని స్థితిలో పడిపోయాం. లాక్ డౌన్ ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలీదు. యూనివర్శిటీ మూసేశారు. చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలు పోయాయి. నిత్యావసరాలకు కటకట ఏర్పడింది. బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు" అంటూ బీబీసీ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ సందేశాల ద్వారా తమ పరిస్థితిని పరస్పరం తెలియజేసుకుంటున్న విద్యార్థులు ఇక విమానం ఎక్కడమే తరువాయి అనుకున్నాం ఖమ్మం జిల్లాకు చెందిన వంశీ మందాడి మూడు నెలల క్రితమే మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేసేందుకు మాంచెస్టర్ వచ్చారు. ఇంకా ఇప్పుడిప్పుడే బ్రిటన్ వాతావరణానికి అలవాటు పడుతున్నారు. అంతలోనే కోవిడ్ 19 బ్రిటన్‌ను కమ్మేసింది. తమ పరిస్థితి దారుణంగా ఉందని బీబీసీ ఎదుట తమ బాధను వ్యక్తం చేశారు. “వచ్చి మూడు నెలలయ్యింది. అంతలోనే పరిస్థితి ఇలా తయారయ్యింది. రోజుకు 2500మందిక కరోనావైరస్ సోకుతున్నప్పటికీ ముందు జాగ్రత్తల విషయంలో ఇక్కడ చాలా వెనకబడి ఉన్నారు. కనీసం భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ లేదు. రోజు రోజుకీ కోవిడ్19 మరణాల సంఖ్య పెరిగిపోతోంది. చేతులో ఉన్న డబ్బులు మరో పది పదిహేను రోజులకు మించి రావు. ఇక్కడ మాలాగా చిక్కుకున్న వారందరితో కలిసి మేం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. సుమారు 150 మంది వరకు మా గ్రూపులో ఉన్నారు. అందరిదీ అదే పరిస్థితి. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. దీంతో చాలా మంది తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చెయ్యగలరా అని వాట్సాప్‌లో అడుగుతూ ఉంటే కన్నీళ్లు ఒక్కటే తక్కువ. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని భయమేస్తోంది” అంటూ వంశీ బీబీసీతో చెప్పారు. ఎప్పుడు బయట పడతామో తెలియడం లేదు అదే జిల్లాకు చెందిన ఏలూరి తేజస్వీ మాంచెస్టర్‌లోని సాల్ ఫోర్డ్ యూనివర్శిటీలో మూడు నెలల క్రితమే చేరారు. డేటా సైన్స్‌ విభాగంలో ఎంఎస్ చేస్తున్నారు. వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అక్కడ ఉండి చదువుకోవడం కన్నా తిరిగి ఇంటికి వచ్చేయడమే మంచిదని భావిస్తున్నారు. “ ఇక్కడ పరిస్థితి రోజు రోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. బయటకు వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది. నిజానికి ఈ పరిస్థితి వస్తుందని గ్రహించి ఈ నెల 29కి భారత్ వెళ్లిపోయేందుకు టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాం. అంతలోనే కోవిడ్19 పై పోరాటంలో భాగంగా భారత్ వ్యవహరిస్తున్న తీరు చూసి ఎక్కడ బ్రిటన్లోనే చిక్కుకుపోతామోనని భయంతో టిక్కెట్లను 20వ తేదీకి ప్రీపోన్ చేసుకున్నాం. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? లగేజ్ అంతా సర్దుకొని 20న విమానాశ్రయానికి కూడా చేరుకున్నాం. కానీ మమ్మల్ని ఎయిర్ పోర్ట్‌ లోనే నిలిపేసిన అధికారులు తిరిగి వెనక్కి పంపేశారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ జనం ఎప్పట్లాగే రోడ్లపై తిరుగుతున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా రెట్టింపైపోయాయి. మా దగ్గరున్న డబ్బులతో మరో పది రోజుల వరకు ఉండగలం. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ మా అమ్మ, నాన్న చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు ఇక్కడ నుంచి బయటపడతామో కూడా తెలియడం లేదు” అని తేజస్వీ బీబీసీతో తన ఆవేదనను వెలిబుచ్చారు. తమ పరిస్థితిని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కి ట్విట్టర్ ద్వారా తెలియజేశామని వారు చెప్పారు. భారత్ వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండమన్నా ఉంటామని, ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని కొందరు చెబుతున్నారు. తెలంగాణ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సోయం బాపూరావులు తమతో మాట్లాడారని... విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడి తమను తిరిగి ఇండియాకి రప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇదే విషయమై బీబీసీ కూడా తెలంగాణ ఎంపీ సోయం బాపూరావుతో మాట్లాడింది. తాము ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వశాఖతో మాట్లాడామని, వీలైనంత త్వరలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒకరు కాదు.. ఇద్దరు కాదు... మొత్తం సుమారు 250 మంది... కరోనావైరస్‌ను అరికట్టడంలో భాగంగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో ప్రస్తుతం బ్రిటన్‌లో చిక్కుకున్నారు. text: ఇదే పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న థార్ ఎడారి. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయం, విలువలు ఇప్పటికీ తమ అసలు రూపంలోనే ఉంటాయి. ప్రపంచంలోని పెద్ద ఎడారుల్లో థార్ ఒకటి. దీనిని ఫ్రెండ్లీ డెజర్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే మిగతా ఎడారులతో పోలిస్తే ఇక్కడకు చేరుకోవడం చాలా సులభం. కరాచీ నుంచి మఠీ థార్ జిల్లా హెడ్ క్వార్టర్ మఠీ. ఒక మహిళ పేరుమీద ఈ నగరం వెలిసిందని చెబుతారు. ఇక్కడ మఠా అనే ఒక మహిళ బావి ఉండేదని, ఎడారిలో ప్రయాణించేవారు ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకునేవారని, అందుకే నగరానికి మఠీ అనే పేరు వచ్చిందని అంటారు. మఠీ వెళ్లడానికి ఉమర్‌కోట్, మీర్‌పూర్ ఖాస్, బదీన్ నుంచి రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. దాంతో ఇక్కడకు చేరుకోవడం చాలా సులభం అవుతోంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తే మక్లి నుంచి సజావల్, అక్కడి నుంచి బదీన్ తర్వాత అక్కడి నుంచి థార్ సరిహద్దులోకి ప్రవేశించవచ్చు. థార్‌లో రహదారులు చాలా బాగుంటాయి. చిన్నాపెద్ద పట్టణాలకు ఇక్కడి నుంచి బైపాస్‌ రోడ్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కరాచీ నుంచి మఠీకి ఐదారు గంటల్లో చేరుకోవచ్చు. హిందూ ముస్లిం సోదరభావం థార్ ఎడారిలో హిందూ, ముస్లింలు శతాబ్దాల నుంచి కలిసే ఉంటున్నారు. ఒకసారి ముస్లింలు, ఇంకోసారి హిందువులు అధికారంలో ఉంటారు. ఈద్, హోళీ, దసరా, ముహర్రం లాంటి పండుగలు, పవిత్ర దినాలను రెండు మతాల వారూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. నగరంలో పదికి పైగా దర్గాలు ఉన్నాయి. వీటిని హిందువులే నిర్వహిస్తున్నారు. మఠీలో గోవులను వధించరు. గోమాంసం విక్రయించడం ఉండదు. గడీ భట్ మఠీ నగరం ఇసుక దిబ్బల మధ్య ఉంటుంది. దీని జనాభా ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఇక్కడ అత్యంత పెద్ద ఇసుక దిబ్బను గడీ భట్ అంటారు. ఇక్కడ ఒక తిన్నె కూడా నిర్మించారు. ఇక్కడ తాల్పూర్ రాజుల కాలం నాటి ఒక చెక్‌పోస్ట్ కూడా ఉంది. అది కాలక్రమేణా శిథిలమయ్యింది. ఒకప్పుడు గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చే విదేశీ ఆక్రమణదారులు, బందిపోట్లపై నిఘా పెట్టడానికి ఈ చెక్‌పోస్టును నిర్మించారు. ఇసుక దిబ్బల వెనుక సూర్యుడు అస్తమించగానే, నగరం విద్యుద్దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. రాగి పళ్లెంలో ఎవరో దీపాలు వెలిగించినట్లు ఉంటుంది. అందమైన ఆకాశం ఆ దృశ్యాన్ని మరింత అందంగా మార్చేస్తుంది. సంస్కృతి సంగీతం కలయిక థార్ హస్తకళలు కరాచీ, ఇస్లామాబాద్ సహా దేశంలోని చాలా పెద్ద నగరాల్లో లభిస్తాయి. వీటిలో సంప్రదాయ దుస్తులు, శాలువాలు, లెటర్ బాక్సులు, వాల్ పెయింటింగ్స్ ఉంటాయి. కొన్ని డిజైన్లను బట్టలపై ఇప్పటికీ అద్దకం ద్వారా ముద్రిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికీ మగ్గంపై నేస్తుంటారు. మెషీన్లతో తయారైన బట్ట కంటే ఇవి గట్టిగా ఉంటాయి. మార్వాడీ గీతాలు పాడే మాయీ భాగీతోపాటు ప్రముఖ గాయకులు ఆరిబ్ ఫకీర్, సాదిక్ ఫకీర్, ప్రస్తుత కరీమ్ ఫకీర్ ఇక్కడ సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మాంగణహార్ వంశానికి చందిన ఈ గాయకుల స్థానిక భాష ఢాట్కీ, వీరు సింధీ, ఉర్దూలో పాడుతుంటారు. పాటలు, సంగీతం ఇష్టపడే పర్యటకులు వారిని తమ ప్రైవేటు నివాసాలు, గెస్ట్ హౌస్‌లకు పిలిపించి పాటలు పాడించుకుంటారు. సంత్ నెటూ రామ్ ఆశ్రమం మఠీ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఇస్లాంకోట్ ఉంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేకమైన నగరం కావడంతో దీని దగ్గర విమానాశ్రయం కూడా ఉంది. ఒకప్పుడు ఇస్లాం కోట్‌ను వేపచెట్ల నగరంగా పిలిచేవారట. ఇక్కడ భారీగా వేప చెట్లు ఉండేవట. ఈ నగరం లోపల జ్ఞాని సంత్ నెటూ రామ్ ఆశ్రమం కూడా ఉంది. థార్‌లో కరవు వచ్చినప్పుడు, అక్కడ నుంచి వెళ్లే ప్రయాణికుల దగ్గర చందాలు సేకరించిన ఆ సన్యాసి, ఆ డబ్బుతో అన్నం వండేవారని.. ఆ దారిలో వెళ్లే ప్రయాణికులను పిలిచి వారి కడుపు నింపేవారని చెబుతారు. ఆ దారిలో వెళ్లే ప్రయాణికుల కడుపు నింపే ఆ అన్నదానం సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆయన ఆశ్రమంలో మనుషులతోపాటు పశువులు, పక్షులకు కూడా తినడానికి, తాగడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు వచ్చే ప్రయాణికులను.. మీది ఏ మతం అని అడగరు. థార్‌లో ఎక్కువగా జనం ఉగ్లూ నుమా అనే మట్టి గుడిసెల్లో ఉంటారు. వాటి కప్పులు గడ్డితో ఉంటాయి. ఇవి వేసవిలో చల్లగా ఉంటాయి. ప్రతి ఏటా లేదా రెండేళ్లకోసారి వాటిపై తాజా గడ్డిని కప్పుతుంటారు. అంతే కాదు, సిమెంట్, మట్టితో చేసిన ఇళ్లు కూడా ఉంటాయి. వాటిని లాండీ అంటారు. ఇక్కడ సాధారణంగా బావుల నుంచే తోడే నీళ్లే వాడతారు. బావుల నుంచి నీళ్లు తోడే బాధ్యత పురుషులదైతే, ఆ నీటిని ఇంటివరకూ చేర్చే బాధ్యత మహిళలది. మారుతున్న కాలంతోపాటు ఇక్కడ ఇప్పుడు బోరు బావులు కూడా వేశారు. అందుకే ఇప్పుడు తలపై వరుసగా రెండు మూడు కుండలు పెట్టుకుని నడిచే మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు. థార్ ఆతిథ్యం థార్‌లో కరవు ఉన్నా, వర్షాలు పడి సుభిక్షంగా ఉన్నా ఇక్కడి వారు అతిథులకు స్వాగతం పలుకుతారు. ప్రయాణికులు ఏ గ్రామం దగ్గరైనా ఆగితే, వారికి సాయం చేయడం, ఆతిథ్యం ఇవ్వడం స్థానికుల సంప్రదాయంలో భాగమైపోయింది. పురుషులు చొక్కా, సల్వార్ లేదా లుంగీ కట్టుకుంటారు. ముస్లిం మహిళలు సల్వార్, కమీజ్, హిందూ మహిళలు ఘాఘ్రా లేదా చీరలు కట్టుకుంటారు. మహిళల దుస్తులు ఎక్కువ ప్రకాశవంతమైన రంగుల్లో ఉంటాయి. కొన్నింటిపై ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది. థార్ వాతావరణం ఇక్కడ సూర్యుడు అస్తమించగానే, రాన్ ఆఫ్ కచ్ నుంచి వచ్చే గాలులతో వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. ఆకాశంలో మెరిసే తారలు ఈ అందాన్ని రెట్టింపు చేస్తాయి. నెమళ్లు, జింకలు థార్‌లోని ఎక్కువ గ్రామాల్లో నెమళ్లు తిరుగుతూ కనిపిస్తాయి. ఉదయం ఇళ్ల దగ్గర ధాన్యం తినడానికి వచ్చే అవి తర్వాత అడవుల్లోకి వెళ్లిపోతాయి. సాయంత్రం మళ్లీ వస్తుంటాయి. హిందువుల జనాభా ఎక్కువ ఉండే చోట నెమళ్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దానిని వాళ్లు శ్రీకృష్ణుడు, సరస్వతికి సంబంధించినవిగా భావిస్తారు. కొన్ని గ్రామాల్లో నెమళ్లను పట్టుకోవడం, అమ్మడంపై జరిమానా విధించడం కూడా ఉంది. థార్ ఎడారిలో జింకలు, నీల్ గాయ్ లాంటి జంతువులు కనిపిస్తాయి. భారత్ సరిహద్దుల్లో రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఇవి కనిపిస్తాయి. వీటిని వేటాడడం నిషేధం. సరిహద్దు భద్రతా దళాలు వాటిపై నిఘా పెడతాయి. నంగర్ పార్కర్, జైన మందిరం మఠీ నుంచి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో నంగర్ పార్కర్ అనే పురాతన నగరం ఉంది. ఇది కరూంఝర్ పర్వతాల ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఎర్ర గ్రానైట్ రాతి పర్వతాల రంగు సూర్యుడి వెలుతురుతోపాటు మారుతూ ఉంటుంది. ఇక్కడ మతపరమైన ఎన్నో పవిత్ర ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో సాధ్డూ ధామ్ ఒకటి. అక్కడ హిందువుల మృతదేహాలను దహనం చేస్తారు. మహాభారత కాలంలో పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం చేసినపుడు ఈ కొండలపైనే ఉన్నారని కొందరు నమ్ముతారు. వారి పేరుతో ఇక్కడ నీటి పాయలు కూడా ఉన్నాయి. నంగర్ పార్కర్‌లో పర్వతాల నుంచి తీసుకొచ్చే తేనె, వనమూలికలు, కట్టెలు అమ్ముతుంటారు. నంగర్ పార్కర్ నగరంలోను, బయటా జైన మందిరాలు కూడా ఉన్నాయి. వీటిని 12, 13వ శతాబ్దాలలో నిర్మించారు. నగరంలో ఉన్న మందిరానికి మళ్లీ మరమ్మతులు చేయిస్తున్నారు. నగరం బయట ఉన్న మందిరం మాత్రం శిథిలమైపోయింది. వీటితోపాటూ ఒక కదీమ్ మసీదు కూడా ఉంది. ఈ మసీదును గుజరాత్ ముస్లిం పాలకులు నిర్మించారని కొందరు, ఇది దిల్లీ పాలకులకు సంబంధించినదని మరికొందరు చెబుతారు. ఈ ప్రాంతం జైన మతానికి కోట లాంటిదని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ కలీముల్లా చెప్పారు. 13వ శతాబ్దంలో జైన మతం వ్యాపారంతో వృద్ధి చెందిందని, ఆర్థిక స్థితి బలోపేతం కావడంతో, వారు ఆలయాలు నిర్మించారని చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దొంగతనం భయం లేదు, దోపిడీల చింత లేదు. పర్యావరణం కలుషితం అవుతుందనే దిగుల్లేదు. అక్క డకు వెళ్లిన వారికి తాము పరాయివాళ్లమని కూడా అనిపించడం లేదు. text: ఇప్పటివరకూ మ్యాజిక్ ఫిగర్‌కు అభ్యర్థులు ఇద్దరూ చాలా దూరంలో ఉన్నారు. బైడెన్‌కు 224 ఓట్లు, ట్రంప్‌కు 213 ఓట్లు వచ్చాయి. 2016లో మూడు ప్రధాన రాష్ట్రాలు విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియాలో పడిన కేవలం 70 వేల ఓట్లు ట్రంప్‌కు విజయాన్ని అందించాయి. దీనిని బట్టి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎంత ముఖ్యమో మనం అంచనా వేయవచ్చు. అమెరికా 50 రాష్ట్రాల్లో అక్కడి జనాభాను బట్టి ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య ఉంటుంది. అందుకే ప్రతి రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ గెలుస్తారని అనిపిస్తున్నా, ఆధిక్యం పెద్దగా లేదు. అది మారే అవకాశం తక్కువ. మరోవైపు బైడెన్ కూడా చాలా రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించారు. అది తారుమారవడం కూడా కష్టం. ఈ ఆధిక్యం చూస్తున్న మీడియా సంస్థలు ఆధిక్యం లభించిన రాష్ట్రంలో వారే గెలిచినట్లు చెబుతున్నాయి. అధికారికంగా ఇప్పటివరకూ ఏ రాష్ట్ర ఫలితాలూ వెల్లడికాలేదు. మీడియా ప్రొజెక్షన్స్ ప్రకారం ట్రంప్‌ ఫ్లోరిడా, ఒహాయో, టెక్సాస్, ఆయోవాలో గెలిచినట్లు ప్రకటించారు. బైడెన్ కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూయార్క్, ఇలినాయ్‌లో గెలిచినట్లు చెబుతున్నారు. కానీ, ఆరిజోనా, పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, విస్కాన్సిన్, జార్జియాలో పోటీ హోరాహోరీగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మందకొడిగా జరుగుతోంది. ఈ ఓట్ల లెక్కింపు రేపు గానీ, లేదంటే ఈ వారాంతంలో గానీ ముగుస్తుంది. ఏ రాష్ట్రం ఎవరిది? డోనాల్డ్ ట్రంప్: మోంటానా, ఇడాహో, వ్యోమింగ్. నార్త్ డకోటా. సౌత్ డకోటా, నెబ్రస్కా, కన్సాస్, ఉటా, ఒక్లహోమా, టెక్సాస్, ఐఓవా, మిజోరీ, అర్కాన్సస్, లూసియానా, మిసిసిపీ, టెనెసీ, కెంటకీ, ఇండియానా, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కెరోలినా, ఫ్లోరిడాలో విజయం సాధించిన ట్రంప్ పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, జార్జియా, అలస్కా రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జో బైడెన్: వాషింగ్టన్, ఆరగాన్, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, కోలరాడో, మిన్నెసోటా, ఇలినోయ్, వర్జీనియా, మేరీలాండ్, డెలావేర్, న్యూజెర్సీ, న్యూయార్క్, మసాచుసెట్స్, కనెక్టికట్, న్యూ హాంప్‌షైర్, వర్మాంట్, హవాయిలో విజయం సాధించిన బైడెన్ మెయిన్, విస్కాన్సిన్, ఆరిజోనా, నెవాడా, మిచిగాన్‌లో ఆదిక్యంలో ఉన్నారు. విజేతను నిర్ణయించేది ఈ ఐదు రాష్ట్రాలే... అమెరికాకు తర్వాత కాబోయే అధ్యక్షుడు ఎవరనేది బహుశా ఈ రాష్ట్రాలే నిర్ణయిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీరి విజయం చాలా వరకూ పెన్సిల్వేనియా లాంటి రాష్ట్ర ఫలితాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పెన్సిల్వేనియా - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 29 పెన్సిల్వేనియాలో ఇంకా 14 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంది. వీటిలో ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్లే ఉన్నాయి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు మెల్లగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం వరకూ నిలిపివేశారు. ఆరిజోనా- ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11 ట్రెండ్స్ ప్రకారం ఈ రాష్ట్రంలో బైడెన్ విజయం దిశగా వెళ్తున్నారు. ఆరిజోనాలో 82 శాతం అంటే 26 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం లెక్కింపు బుధవారం ఉదయం ముగుస్తుంది. రాష్ట్రంలో బైడెన్‌కు 51.8 శాతం, ట్రంప్‌కు 46.8 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా 18 శాతం ఓట్లు లెక్కింపులో బైడెన్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. మిచిగాన్ - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 ఇక్కడ 87 శాతం ఓట్లు అంటే 47 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తైంది. మిగతా ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం పూర్తి చేస్తారు. ఇక్కడ ఆధిక్యంలో ఉన్న ట్రంప్‌కు 49.9 శాతం ఓట్లు, బైడెన్‌కు 48.5 శాతం ఓట్లు వచ్చాయి. పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ ఇక్కడ విజయం ట్రంప్‌దేనని విశ్లేషకులు భావిస్తున్నారు. విస్కాన్సిన్ - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10 ఇక్కడ 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైంది. వార్తా సంస్థల వివరాల ప్రకారం బైడెన్‌కు 49.3 శాతం, ట్రంప్‌కు 49.9 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఈ రాష్ట్రం ఎవరి వైపైనా మొగ్గు చూపవచ్చు. అందుకే, ఈ రాష్ట్రంలోని 10 ఎలక్టోరల్ ఓట్లు చాలా కీలకంగా చెబుతున్నారు. జార్జియా - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 ఈ రాష్ట్రంలో 94 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇప్పటివరకూ ట్రంప్ 50.5 శాతం, బైడెన్ 48.3 శాతం ఓట్లు గెలుచుకున్నారు. జార్జియా ఒక విధంగా వైల్డ్ కార్డులా మారింది. మంగళవారం వరకూ ఇక్కడ ట్రంప్ విజయం దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ, బైడెన్ తర్వాత ఆ ఆధిక్యాన్ని చాలావరకూ తగ్గించారు. ట్రంప్ ఇప్పటికీ ముందంజలో ఉన్నప్పటికీ, పోటీ రసవత్తరంగా ఉంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మ్యాజిక్ నంబర్ 270. అంటే ఏ అభ్యర్థి అయినా అధికారం చేజిక్కించుకోవాలంటే ఎలక్టోరల్ కాలేజీ మొత్తం 538 ఓట్లలో 270 ఓట్లు గెలుచుకోవాలి. text: ప్రతీకాత్మక చిత్రం 2018 డిసెంబర్‌లో తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సాగయమ్ జగన్, రవి కుమార్, వెనిస్టన్, ఎస్కాలిన్, అల్బర్ట్ న్యూటన్, వివేక్, సాజన్‌తో పాటు, కేరళకు చెందిన మరో ఇద్దరు మత్స్యకారులు కలిసి సముద్రం జలాల్లో చేపలు పట్టే ఉద్యోగం కోసం దుబాయికి వెళ్లారు. అయితే, వారు దుబాయి చేరుకున్న తర్వాత వారి పరిస్థితి తారుమారయ్యింది. దుబాయిలో ఉద్యోగం చేయాలంటూ వారిని తీసుకెళ్లిన అరబ్ వ్యాపారి, తీరా అక్కడికి వెళ్లాక మాట మార్చారు. ఇక్కడ కాదు యెమెన్‌లో పని చేయాలని అక్కడికి తీసుకెళ్లారు. చాలా ఏళ్లుగా అంతర్యుద్ధంతో యెమెన్ అట్టుకుతున్న విషయం తెలిసిందే. "మేము దుబాయి చేరుకోగానే, మీరు పని చేయాల్సింది ఇక్కడ కాదు, మనం ఇప్పుడు ఒమన్ వెళ్తున్నామని ఆ వ్యాపారి చెప్పారు. ఒమన్ అయినా పర్వాలేదని ఆయనతో పాటే వెళ్లాం. కానీ, అతడు మమ్మల్ని ఒమన్‌కు కాకుండా, యెమెన్‌కు తీసుకెళ్లాడు. ఏం జరుగుతోందో మాకేమీ అర్థం కాలేదు. ఎక్కడ అయితేనేం సరిగా డబ్బులు వస్తే చాలని అనుకున్నాం" అని వివేక్ వివరించారు. అయితే, యెమెన్ తీరంలో పనిలో చేరాక ఆ అరబ్ వ్యాపారి ఒక షాకింగ్ విషయం చెప్పారు. మీరు చేపలు పడితే వచ్చే ఆదాయంలో మీకు సగం, నాకు సగం (50:50 ) అన్నారు. అయినా తప్పని పరిస్థితిలో వాళ్లు చేపల వేట కొనసాగించారు. మొదట్లో ఆ వ్యాపారి డబ్బులు బాగానే ఇచ్చారు. యెమెన్ నుంచి పారిపోయి వచ్చిన మత్స్యకారులు కానీ, ఓ నెల గడిచాక ఇక ఆ 50 శాతం డబ్బులు కూడా ఇచ్చేందుకు వ్యాపారి ఏజెంట్లు నిరాకరించారు. దాంతో, ఆందోళన చెందిన మత్స్యకారులకు ఇక స్వదేశం వెళ్లిపోవడమే మేలన్న ఆలోచన వచ్చింది. కానీ, ఎలా వెళ్లాలో వారికి తెలియదు. యెమెన్ నుంచి కేరళలోని కోచికి దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. "మొదట్లో అంతా బాగానే అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత, మా వాటా డబ్బులు ఇవ్వడానికి ఏజెంట్ నిరాకరించారు. దాదాపు పది నెలల డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బుల కోసం అడిగితే, చాలా దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో వాళ్లు మన శ్రమను దోపిడీ చేస్తున్నారని మాకు అనుమానం వచ్చింది. డబ్బుల కోసం దాదాపు 25 రోజులు ఆందోళన చేశాం. మేము సమ్మె మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్లు మాకు అన్నం పెట్టడం మానేశారు. యెమెన్ నేవీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. వాళ్లు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాంతో, మాకు మరో మార్గం లేక మళ్లీ చేపల వేటకు వెళ్లాం" అని అల్బర్ట్ న్యూటన్ బీబీసీతో చెప్పారు. ప్రతీకాత్మక చిత్రం ఎలా తప్పించుకున్నారు? అక్కడి నుంచి ఎలా తప్పించుకునేందుకు ఎలా పథకం రచించారో మత్స్యకారుడు జగన్ వివరించారు. "మేము విమానంలో తప్పించుకోలేం. మాకున్న ఏకైక మార్గం సముద్రమే. మాకు తెలిసిన మార్గం అదొక్కటే. దాంతో, ఎలా తప్పించుకుని పారిపోవాలో నాలుగు నెలలపాటు ప్రణాళికలు వేశాం. మేము చేపల వేటకు వెళ్లేందుకు వాడే బోటులో యజమాని డీజిల్ పోయించేవారు. మేము వేటకు వెళ్లిన ప్రతిసారీ కొంత డీజిల్ 'దొంగిలించి' దాచిపెట్టడం మొదలుపెట్టాం. అలా నాలుగు నెలల్లో దాదాపు 7,000 లీటర్ల డీజిల్ పొదుపు చేశాం" అని ఆయన వివరించారు. 2019 నవంబర్ 19న ఎప్పటి లాగే చేపల వేటకు వెళ్తున్నామని ఈ మత్స్యకారులు తమ ఏజెంట్‌కు చెప్పారు. రాత్రింబవళ్ళు వేట కొనసాగుతుంది కాబట్టి, వాళ్ళకు 10 రోజులకు సరిపడా ఆహార పదార్థాలను ఆ ఏజెంట్ ఇచ్చారు. ఆ డీజిల్, ఆహార పదార్థాలతోనే వీళ్లంతా భారత్‌కు ప్రయాణమయ్యారు. కానీ, ఆ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ప్రతీకాత్మక చిత్రం "మేము ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. ప్రయాణమంతా చాలా కష్టంగా సాగింది. సరైన మార్గంలోనే వెళ్తున్నామా లేదా అని ఆందోళన చెందాం. ఒక సమయంలో మళ్లీ యెమెన్‌కు వెళ్లిపోదామా అన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ, తర్వాత ఏది ఏమైనా స్వదేశానికే వెళ్లాలని నిర్ణయించుకుని, ముందుకు ప్రయాణం సాగించాం" జగన్ చెప్పారు. లక్షద్వీప్‌ సమీపంలోకి రాగానే వారి పడవలో ఇంధనం ఖాళీ అయిపోయింది. దాంతో, యెమెన్ నుంచి వెంట తెచ్చుకున్న శాటిలైట్ ఫోన్‌తో వాళ్లు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాళ్లు లక్షద్వీప్‌కు 58 నాటికల్ మైళ్ల (107 కి.మీ) దూరంలో ఉన్నప్పుడు భారత తీర రక్షణ దళాలు వెళ్లి రక్షించి సురక్షితంగా కేరళలోని కోచికి తీసుకొచ్చింది. యెమెన్‌లో అంతర్యుద్ధం జరుగుతోందన్న విషయం కూడా తమకు తెలియదని మత్స్యకారులు చెబుతున్నారు. "మేము ఎక్కువగా సముద్రం మధ్యలో ఉండేవాళ్లం. చేపలను తీరానికి చేర్చేందుకు, తరువాతి ట్రిప్‌కు అవసరమయ్యే ఇంధనం, ఆహార పదార్థాలు తీసుకెళ్లేందుకు మాత్రమే మధ్యమధ్యలో తీరం వద్దకు వస్తుండేవాళ్లం. కాబట్టి, మాకు యెమెన్‌లో యుద్ధం గురించి మాకు తెలియదు" అని జగన్ చెప్పారు. ప్రతీకాత్మక చిత్రం గతంలోనూ ఇదే పరిస్థితి ఈ మత్స్యకారుల బృందంలో ఒకరైన అల్బర్ న్యూటన్ గతంలోనూ ఒకసారి దుబాయికి చేపల వేట కోసం వెళ్లినప్పుడు ఆయన్ను ఇరాన్ నేవీ అరెస్టు చేసింది. "అప్పుడు దుబాయి నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారంటూ నన్ను ఇరాన్ నేవీ అరెస్టు చేసి నాలుగు నెలలు జైలులో పెట్టింది. ఆ జైలు నుంచి విడుదలయ్యాక, భారత్‌కు తిరిగొచ్చి కొన్నాళ్ల పాటు ఇంటి దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత 2018లో మళ్లీ వెళ్లి అరేబియా వ్యాపారి చేతుల్లో చిక్కుకుపోయాను. ఇప్పుడు మళ్లీ నా స్వదేశానికి తిరిగొచ్చాను" అని న్యూటన్ వివరించారు. వెనిస్టన్ కూడా గతంలో ఇరాన్ నేవీకి పట్టుబడ్డారు. భవిష్యత్తు ఏంటి? తనకు చేపల వేట తప్పితే మరో పని తెలియదని అల్బర్ట్ న్యూటన్ అంటున్నారు. భారత్‌కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండగా, భారత మత్స్యకారులు విదేశాలకు ఎందుకు వెళ్ళాల్సి వస్తోంది? అని అడిగితే... "నేను ఏడేళ్లుగా మత్స్యకార వృత్తిలోనే ఉన్నాను. తమిళనాడు తీరంలో దొరికే చేపలకు మంచి ధర రావడంలేదు. ఇక్కడి తీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి బాగా తగ్గిపోతోంది. కాబట్టి, బతుకుదెరువు కోసం మేము విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది'' అని వివేక్ చెప్పారు. న్యాయం కావాలి ఉపాధి కోసం వెళ్లి ఇలా కష్టాలు పడుతున్నవారు గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఉన్నారని ఈ మత్స్యకారుల బృందానికి, భారత కోస్ట్ గార్డ్‌కు మధ్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఫాదర్ చర్చిల్ అన్నారు. "ఇప్పటికీ అనేక మంది గల్ఫ్‌ల చిక్కుకుపోయారు. వాళ్లు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించలేకపోతున్నారు, స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. మన మత్స్యకారుల జీవితాలకు భారత ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంబసీలు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయాలి" అని చర్చిల్ కోరుతున్నారు. "మత్స్యకారులకు అరబ్ వ్యాపారులు ఉద్యోగం ఇవ్వాలంటే, అందుకు సంబంధించిన పత్రాలను భారత ఎంబసీలో సమర్పించాలి. ఆ పత్రాల కాపీని మత్స్యకారులకు ఇవ్వాలి. ఆ తర్వాత మత్స్యకారులను మోసం చేస్తే ఆ వ్యాపారుల మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది'' అని ఆయన అన్నారు. చేపల కోసం వెళ్లి.. దేశ సరిహద్దులు దాటి.. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) తొమ్మిది మంది భారత మత్స్యకారులు యెమెన్ నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకుని స్వదేశం చేరుకున్నారు. సముద్ర మార్గంలో దాదాపు 3,000 కిలోమీటర్ల దూరం 10 రోజుల పాటు కేవలం తమ వేట పడవలలోనే వారు ప్రయాణించారు. text: ఈ బృందంలో నలుగురు తమ గ్రామానికి వెళ్లిపోతున్నారు. అయితే, అదే గ్రామం నుంచి మరొ ఎనిమిది మంది నిరసనలు చేపట్టేందుకు వస్తున్నారు. ‘‘నాకు మూడు ఎకరాల వరి పంట ఉంది. దాన్ని చూసుకోమని మా గ్రామస్థులకు చెప్పాను. వారు కూడా నువ్వు దిల్లీ వెళ్లు. పనులు మేం చూసుకుంటాం అన్నారు’’అని సందీప్ వివరించారు. సందీప్ లాంటి వేల మంది రైతులు నిరసనలు చేపట్టేందుకు దిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. ట్రాలీలు, ట్రక్కుల్లో వచ్చిన వీరంతా రోడ్లపైనే నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై వంట చేసుకోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం లాంటి చర్యలతో నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై వీరు నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయంలోకి ప్రైవేటు రంగం అడుగుపెట్టేందుకు ఈ చట్టాలు వీలు కల్పిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ చట్టాలను తీసుకొచ్చామని, వీటితో రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, తమ భూములు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. ‘‘చందాలు వేసుకుంటున్నాం‘‘ రైతుల ఉద్యమాన్ని పరిశీలిస్తుంటే.. అసలు వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. సందీప్ లాంటి కొందరు రైతులైతే.. ప్రజల నుంచి డబ్బులు పోగేసి తాము ఇక్కడి వచ్చామని చెబుతున్నారు. ‘‘మేం వచ్చిన ట్రాక్టరు చాలా డీజిల్ తాగేస్తోంది. దాదాపు పది వేల రూపాయలు డీజిల్‌కే ఖర్చు చేశాం. ఈ డబ్బులను నేను, మా బాబాయ్ పెట్టుకున్నాం’’అని సందీప్ చెప్పారు. డబ్బులు ఖర్చవుతున్నందుకు తనకు ఎలాంటి బాధాలేదని, దీన్ని భవిష్యత్‌కు పెట్టుబడిగా భావిస్తున్నానని చెప్పారు. ‘‘నిజమే.. పది వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే ఆ చట్టాలు అమలుచేస్తే జరిగే విధ్వంసాన్ని మనం ఊహించలేం’’అని ఆయన వివరించారు. నిరసన తెలియజేసేందుకు నృపేంద్ర సింగ్ బృందం లూథియానా నుంచి వచ్చింది. తనతోపాటు మూడు గ్రామాల రైతులు వచ్చారని ఆయన చెప్పారు. ఇక్కడకు వచ్చేందుకు అందరి దగ్గరా చందాలు సేకరించామని ఆయన వివరించారు. ‘‘మేం డబ్బుల కోసం చందాలు సేకరించాం. మా గ్రామంలో చాలా మంది మాకు డబ్బులు ఇచ్చారు. నేను ఒక్కడినే ఇప్పటివరకు రూ.20,000 ఖర్చు చేశాను. నాతోపాటు వచ్చిన చాలా మంది మాకు సాయం చేశారు’’అని ఆయన పేర్కొన్నారు. సాయం చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు విదేశాల్లో ఉంటున్న కొందరు ఎన్‌ఆర్ఐ స్నేహితులు తమకు సాయం చేస్తున్నారని నృపేంద్ర తెలిపారు. ‘‘నా స్నేహితుల్లో ఒకరు ఎన్‌ఆర్ఐ ఉన్నారు. ఆయన రూ.20,000 ఇచ్చారు. ఇంకా అవసరమైతే ఇస్తానని కూడా చెప్పారు. అవసరమైతే తన ఎన్‌ఆర్ఐ స్నేహితుల నుంచి నిధులు సేకరిస్తానని ఆయన అన్నారు. మాకు నిధులకు ఇప్పుడు ఎలాంటి కొరతా లేదు’’అని ఆయన వివరించారు. మేం మాట్లాడిన వారిలో చాలా మంది తమకు ఎన్‌ఆర్‌ఐలు సాయం చేస్తున్నారని, నిరసనల గురించి వారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వివరించారు. ‘‘వెనకడుగు వేయొద్దు. గట్టిగా నిలబడండి. నిధులకు ఎలాంటి కొరతాలేదు’’అని విదేశాల్లోని తన స్నేహితులు హామీ ఇచ్చినట్లు నృపేంద్ర చెప్పారు. ‘‘మేం రైతులం. మా నిరసనలకు మేం డబ్బులు పెట్టుకోలేనంత పేదవాళ్లం కాదు. సిక్కుల లంగర్ (భోజనశాల) తరహా సదుపాయాలను మేం ఏళ్ల నుంచీ నడిపిస్తున్నాం. మాకు తిండికి కొదువలేదు. ఈ ఉద్యమానికి ఎలాంటి కొరతా లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు. పెరుగుతున్న సంఖ్య పంజాబ్, హరియాణాల్లోని దిల్లీ సరిహద్దులకు వస్తున్న ట్రాక్టర్లు, ట్రక్కుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక్కడకు వస్తున్న ట్రాలీల్లో ఆహారం, పానీయాలు ఉంటున్నాయి. మరోవైపు రోజంతా రోడ్లపై పొయ్యిలు వెలుగుతూనే ఉన్నాయి. చాలా గురుద్వారాలు ఇక్కడకు వచ్చే రైతులకు సాయం చేస్తున్నాయి. దిల్లీకి చెందిన చాలా మంది సిక్కులు కూడా సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. నిరసన తెలపడానికి వచ్చినవారిలో ఇంద్రజీత్ సింగ్ కూడా ఒకరు. తనతో వచ్చిన చాలా మంది నిరసనలకు సాయం అందించారని ఆయన తెలిపారు. ‘‘ట్రాక్టర్ నాదే. దానిలో డీజిల్ కొట్టించాను. నాతో 15 మంది ఉన్నారు. వీరంతా నిధులు సేకరించారు. ప్రతి రైతూ తమకు తోచినంత సాయం చేశారు. భూమి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ సాయం చేశారు’’అని ఆయన చెప్పారు. ‘‘ఉద్యమం లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కి రాకూడదని ముందే మేం నిర్ణయించుకున్నాం. ఏదైనా అవసరమైతే మరింత మంది వచ్చి మాతో కలుస్తారు. మాకు ఏవైనా అవసరమొచ్చినా వారే చూసుకుంటారు’’అని ఇంద్రజీత్ అన్నారు. రాజకీయ నిధులపై ప్రశ్నలు కొన్ని రాజకీయ పార్టీలు కూడా రైతుల ఉద్యమానికి నిధులు సమకూరుస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘‘రాజకీయ పార్టీలు మాకు నిధులు ఇస్తున్నాయని చెప్పేవారు ముందు ఆధారాలు చూపించాలి. ఎందుకంటే నిధులు మాకు మా గ్రామస్థులే ఇస్తున్నారు. కొందరు రూ.100 చొప్పున కూడా సాయం చేశారు’’అని ఇంద్రజీత్ అన్నారు. మన్‌దీప్ సింగ్.. హోషియార్‌పుర్ నుంచి ఇక్కడకు వచ్చారు. రెండు ట్రాక్టర్లు, ఒక ఇన్నోవా కారుపై మూడు గ్రామాల ప్రజలు తనతో వచ్చినట్లు ఆయన తెలిపారు. ‘‘నేను రూ. 2,100 ఇచ్చాను. అలానే అందరమూ డబ్బులు పోగేసుకున్నాం. మేం ఎవరిపైనా ఆధారపడటం లేదు’’అని ఆయన చెప్పారు. ‘‘నాలుగైదు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతానని అనుకున్నాను. కానీ పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చేలా అనిపిస్తోంది. నెలలు కూడా పట్టొచ్చేమో.. మాకు ఎలాంటి చింతా లేదు. ఎందుకంటే మాకు ఏం కావాలన్నా.. మా గ్రామస్థులు ఇస్తామని హామీ ఇచ్చారు’’అని మన్‌దీప్ వివరించారు. ‘‘నా పంట గురించి బాధ పడొద్దని మా గ్రామస్థులు చెప్పారు. ఒకవేళ నేను వెనక్కి వెళ్తే.. నా స్థానంలో మరో ఇద్దరు వస్తారు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద సమస్యో వారు అర్థంచేసుకున్నారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే.. తరతరాలు కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది’’అని ఆయన చెప్పారు. నాలుగు నెలల నుంచి ఏర్పాట్లు ఈ ఉద్యమం కోసం నెలల నుంచి ఏర్పాట్లు చేసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. పంజాబ్‌కు చెందిన 30కిపైగా రైతు సంఘాలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. నాలుగు నెలలుగా ఈ ఉద్యమం కోసం ప్రణాళికలు సిద్ధంచేశామని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ‘‘ఈ ఉద్యమం కోసం మా సంఘం 15 లక్షలు ఖర్చుపెట్టింది. మిగతా అన్ని సంఘాల డబ్బులను కలిపితే రూ.15 కోట్లకుపైనే ఉండొచ్చు’’అని కీర్తి కిసాన్ సంఘానికి చెందిన రైతు రాజీందన్ సింగ్ దీప్ సింగ్‌వాలా చెప్పారు. కొందరు ఎన్‌ఆర్ఐలు కూడా తమ సంఘానికి పెద్దయెత్తున నిధులు సమకూరుస్తున్నారని రాజీందర్ వివరించారు. ‘‘నిధులు విషయానికి వస్తే.. పంజాబ్ రైతుల దగ్గర సరిపడా ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఆ చట్టాలు కేవలం రైతులకే కాదు.. కార్మికులు, వినియోగదారులు అందరిపైనా ప్రభావం చూపుతాయి. ఈ ఉద్యమం ముందుకు వెళ్లేకొద్దీ.. ఇతర వర్గాల వారూ చేరతారు’’అని ఆయన చెప్పారు. ‘‘మేం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలు రాస్తున్నాం. ఎందుకంటే అన్నింటికీ పక్కాగా లెక్కలు ఉండాలి కదా. కేవలం లెక్కలు మాత్రమే కాదు.. ఉద్యమానికి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఇలా అన్నింటినీ రైతు సంఘాలు నమోదు చేస్తున్నాయి’’అని రాజీందర్ తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆరు అడుగుల పొడవున్న సందీప్ సింగ్ నిరసనలు చేపట్టేందుకు ఫతేగఢ్ నుంచి దిల్లీ సరిహద్దులకు వచ్చారు. ఆయనతోపాటు మరొక 20 మంది ఉన్నారు. వీరంతా రెండు ట్రాలీల్లో ఇక్కడకు చేరుకున్నారు. text: కానీ.. ఇతర రంగాలకు జరిగినట్లే విమానయాన రంగానికి కూడా కరోనావైరస్ మహమ్మారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మహమ్మారి విజృంభణ కారణంగా ప్రపంచ దేశాలు సరిహద్దులు మూసేశాయి. లాక్‌డౌన్లు విధించి విమానాలను నిలిపివేశాయి. విమాన ప్రయాణం 98 శాతం పతనమైందని ఐఏటీఏ నివేదించింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు 2020లో 8,400 కోట్ల డాలర్ల నష్టం చవిచూస్తాయని అంచనా వేసింది. విమానయాన రంగంలో 3.20 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయనీ చెప్పింది. ఈ పరిస్థితుల్లో భారత విమానయాన రంగం భవిష్యత్తు కూడా క్లిష్టంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన రంగం కుప్పకూలుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. దాదాపు 24,000 నుంచి 25,000 కోట్ల రూపాయల ఆదాయ నష్టం వాటిల్లుతుందని చెప్పింది. ‘‘విమానయాన సంస్థలకు సుమారు రూ. 17,000 కోట్లు నష్టం వాటిల్లుతుంది. విమానాశ్రయాల్లోని రిటైలర్లకు రూ. 1,700 – 1,800 కోట్ల నష్టం వస్తుంది. విమానాశ్రయ నిర్వాహకులు రూ. 5,000 నుంచి రూ. 5,500 కోట్ల వరకూ నష్టం చవిచూసే అవకాశం ఉంది’’ అని క్రిసిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీకి చెందిన ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ విభాగం డైరెక్టర్ జగన్నారాయణ్ పద్మనాభన్ ఒక ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. అలాగే.. విమానయాన కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) ఇండియా కూడా.. భారత విమానయాన పరిశ్రమ ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ నెలల్లో 300 కోట్ల నుంచి 360 కోట్ల డాలర్ల వరకూ (సుమారు రూ.22 వేల కోట్లు) నష్టపోతుందని చెప్పింది. మే 25వ తేదీ నుంచి విమానయాన సంస్థలు పరిమిత కార్యకలాపాలను పునఃప్రారంభించిన నేపథ్యంలో కొంత వెసులుబాటు లభిస్తుందని విమానయాన కంపెనీలు ఆశిస్తున్నాయి. సాటి భారతీయ విమానయాన సంస్థలకన్నా మెరుగైన స్థితిలో ఉన్న ఇండిగో.. గత ఏడాది జనవరి – మార్చి నెలల్లో రూ. 596 కోట్ల ఆదాయం లభిస్తే.. ఈ ఏడాది జనవరి – మార్చి నెలల్లో రూ. 871 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ‘‘ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకుని కోవిడ్ ముందు నాటి స్థాయికి తిరిగిరావటానికి 18 నుంచి 24 నెలల సమయం పట్టవచ్చు’’ అని ఇండిగో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే బీబీసీతో పేర్కొన్నారు. వైమానిక రంగం కోలుకోవటమనేది ఇతర దేశాలు తమ అంతర్జాతీయ ఆపరేషన్లను ఎలా పునరుద్ధరిస్తాయనే దానిమీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ‘‘విమానాల్లో భద్రత గురించి తమకు నమ్మకం ఏర్పడిన వెంటనే తమ కుటుంబాలు, స్నేహితులను కలవటం కోసం ప్రయాణం చేయటానికి జనం ఆత్రతుగా ఎదురుచూస్తున్నారు. వ్యాపార సమావేశాలు ఇంకా ఆన్‌లైన్‌లో జరగవచ్చునని మనందరికీ అర్థమైంది. కాబట్టి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ దానిని అలాగే కొనసాగిస్తారు’’ అని ఆదిత్య పాండే ఉద్ఘాటించారు. ‘‘విమానాల్లో భద్రత విషయంలో వినియోగదారులకు విశ్వాసం కుదిరితేనే కోలుకోవటం మొదలవుతుంది’’ అని ఎయిర్ఏసియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ భాస్కరన్ కూడా అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ వార్తల పోర్టల్ బిజినెస్ ఆఫ్ ట్రావెల్ ట్రేడ్ (బాట్) కూడా ఒక వినియోగదారుల సర్వే నిర్వహించింది. జాతీయస్థాయి లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రాబోయే 3 – 6 నెలల్లో ప్రయాణాలను పునఃప్రారంభించటానికి 66 శాతం మంది భారతీయులు సంసిద్ధంగా ఉన్నట్లు ఆ సర్వే చెప్తోంది. ఉన్నత స్థాయి సంపన్నులు (హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ - హెచ్ఎన్ఐ) వైరస్ సమస్యలను ఎదుర్కోకుండా ఉండటం కోసం మరింత అనుకూలమైన విమానయానం కోరుకోవటంతో.. చార్టర్ విమానాలకు డిమాండ్ పెరిగింది. అధిక ఇంధన ధరలతో ఆందోళన వినియోగదారుల విశ్వాసం సంగతి పక్కనపెడితే.. విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) – ధరల విషయం మరో పెద్ద ఆందోళనగా ఉంది. విమానయాన సంస్థల వ్యయంలో దాదాపు 40 శాతం ఈ ఇంధనం కోసమే ఖర్చవుతుంది. ఈ ఇంధనం ధరలు పెరుగుతుండటం విమానయాన సంస్థల కష్టాలను మరింతగా పెంచుతోంది. దేశ రాజధాని దిల్లీలో ఏటీఎఫ్ ధరలను నెల రోజుల్లో రెండోసారి జూన్ 16న పెంచారు. లీటరుకు రూ. 5,494.50 పెంచటంతో ధర రూ. 39,069.87కు పెరిగింది. ఇది 16.3 శాతం పెంపు. అంతకుముందు జూన్ 1న ఏటీఎఫ్ ధరను లీటరుకు రూ. 11,030.62 పెంచటంతో అది రూ. 33,575.37కు పెరిగింది. అది 56.5 శాతం పెరుగుదల అని ఇండియన్ ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్ సమాచారం చెప్తోంది. ఇదిగాక.. కేంద్ర ప్రభుత్వం ఏటీఎఫ్ మీద 14 శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తుంది. ఆపైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 30 శాతం వరకూ వ్యాట్ విధిస్తున్నాయి. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్ర, దిల్లీలు 25 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నాయి. కర్ణాటక 28 శాతం, తమిళనాడు 29 శాతం వ్యాట్ విధిస్తుంటే.. ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌లు మాత్రం 5 శాతం వ్యాట్ విధిస్తున్నాయి. మొత్తంమీద.. విమానయాన సంస్థలు ఏటీఎఫ్ మొత్తం ధరలో 25 శాతం వ్యాట్ చెల్లిస్తున్నాయి. ఇప్పటికే భారీ అప్పులతో, ప్రయాణికులు లేకపోవటం, తిరుగుతున్నసర్వీసులకూ తక్కువ చార్జీలే ఉండటం, రెండు నెలల పాటు అసలు ఆదాయం లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థలను ఈ ధరల పెంపులు మరింతగా దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు. టికెట్ ధరలపై ప్రభుత్వ పరిమితులు ప్రయాణికులు చెల్లించే చార్జీలపై పరిమితులు విధించటం విమానయాన సంస్థలకు మరో పెద్ద ఆటంకంగా ఉంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. దేశీయ విమానాలకు చార్జీల పరిమితులను మే 21వ తేదీన ప్రకటించినపుడు.. అటు కంపెనీలు, ఇటు ప్రయాణికులు ఇరువురికీ దోహదపడాలన్నది ఆలోచన. విమాన చార్జీలు భారీ స్థాయిలో ఉంటాయని భావించటంతో.. వాటిని అదుపులో ఉంచాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను కోరింది. ‘‘ఈ పరిమితుల విధింపు తాత్కాలికమేనని.. అది అడ్డు తొలగిపోతుందని నేను ఆశిస్తున్నా. ఇది శాశ్వత చర్యగా ఉండాలని నేను భావించటం లేదు’’ అని సీఏపీఏ వెబినార్‌లో భాస్కరన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికే సరకు విమానాలే... ప్రస్తుతం విమానయాన సంస్థలన్నీ ఇతర ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నాయి. సరకు రవాణా కార్యకలాపాలు మొదలయ్యాయి. స్పైస్‌జెట్, విస్తారా, ఇండిగో వంటి కంపెనీలు ఆ దిశగా పనిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌లో సరకు రవాణా ఆపరేషన్ల ప్రాధాన్యతను ఇండిగో గుర్తించింది. దానిద్వారా మరింత ఆదాయం పొందటానికి ప్రయత్నిస్తుంది. ‘‘మేం 100కు పైగా సరకు రవాణా విమానాలు నడిపాం. దీనివల్ల ఒక బలమైన ఆదాయ మార్గం లభించింది. సరకు రావాణా కోసం ప్రత్యేకంగా 10 విమానాలను కేటాయించాం’’ అని ఇండిగో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే బీబీసీకి చెప్పారు. ఇదే తరహాలో స్పైస్‌జెట్ కూడా తన బొంబార్డియర్ క్యూ400 పాసింజర్ విమానాలు మూడింటిని సరకు రవాణాకు అనుగుణంగా మార్చినట్లు చెప్పింది. మున్ముందు పరిస్థితి ఏమిటి? కనీసం ఈ ఏడాది చివరి వరకూ విమానయాన రంగం పరిస్థితి గడ్డుగానే ఉంటుందని రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ పేర్కొంది. విమానయాన సంస్థలకు సాయం చేయటానికి ప్రభుత్వం ఇంధనం మీద రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్‌ ఒకే విధంగా ఉండేలా క్రమబద్ధీకరించవచ్చునని కేర్ రేటింగ్స్ పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి కొనసాగినంత కాలం ఎయిర్‌పోర్ట్ నావిగేషన్ సర్వీసెస్ (ఏఎన్ఎస్) చార్జీలను ప్రభుత్వం 100 శాతం మినహాయింపు ఇవ్వవచ్చునని అభిప్రాయపడింది. ఏఎన్ఎస్ చార్జీలంటే విమానయాన సంస్థ విమానాశ్రయానికి చెల్లించే చార్జీలు. ఇవి ఒక్కో విమానాశ్రయంలో ఒక్కో రకంగా ఉంటాయి. విమానం పరిమాణాన్ని బట్టి ఈ చార్జీలు ఉంటాయి. సాధారణంగా విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో వీటి వాటా 7-8 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం విమాన సర్వీసులు పరిమితంగా ప్రారంభమయ్యాయి. రాబోయే నెలల్లో ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికైతే భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీ రికార్డు స్థాయి నష్టాలు చవిచూస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు జరిగేది.. అనేక ఉద్యోగాలు పోవటం, జీవనోపాధులు దెబ్బతినటం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచ విమానయాన రంగంలో 2037లో 820 కోట్ల మంది ప్రయాణికులు ఉంటారని.. భారీ స్థాయిలో విమాన ప్రయాణికుల పెరుగదల కోసం ఈ రంగం సన్నద్ధమవుతోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) జోస్యం చెప్పి ఎంతో కాలం కాలేదు. text: 22 కిలోల బంగారు చీరలో దుర్గాదేవి ఏకంగా 22 కిలోల శుద్ధమైన బంగారంతో చీరను నేశారు. నగరంలోని సంతోష్ మిత్ర స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపంలోని దుర్గ విగ్రహానికి ఈ చీరను అలంకరించారు. సుమారు రూ.6.2 కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసిన ఈ చీర కోసం దాదాపు యాభై మంది కార్మికులు రెండున్నర నెలలపాటు శ్రమించారు. అగ్నిమిత్ర అనే డిజైనర్ చీరకు అదనపు మెరుగులు దిద్దారు. ఆకట్టుకునే మోటిఫ్‌లు, ఖరీదైన రత్నాలను చీర తయారీ కోసం వినియోగించినట్లు చెప్పారు. దుర్గాదేవి కోసం మేలిమి బంగారంతో నేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పసిడి చీర ధగధగలతో వెలిగిపోతున్న అమ్మవారి విగ్రహంతో పాటు, అది కొలువైన మండపం కూడా భక్తులను కట్టిపడేస్తోంది. లండన్‌లోని ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్‌ని తలపించే మండపాన్నే నిర్వాహకులు అక్కడ ఏర్పాటు చేశారు. లండన్‌లోని బిగ్ బెన్, టవర్ బ్రిడ్జ్, లండన్ ఐ లాంటి ఇతర ప్రదేశాలను పోలిన నమూనా మండపాలనూ నగరంలో నిర్మించారు. మొదట్నుంచీ కోల్‌కతాలోని దసరా మండపాలు భారీతనానికి పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి. బౌద్ధుల పగోడాలూ, మైత్రేయీ ఎక్స్‌ప్రెస్ రైలూ, నగరానికే ప్రత్యేకమైన ఎల్లో ట్యాక్సీలూ మొదలైన వాటి రూపంలో నిర్మించిన మండపాలు గతంలోనూ కోల్‌కతాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. బకింగ్ హామ్ ప్యాలెస్‌కి అచ్చమైన నమూనా ఇది లండన్ నగరానికి తలమానికంగా నిలిచే బిగ్‌బెన్ నమూనాలోనూ ఈసారి మండపాన్ని నిర్మించారు. కానీ, బిగ్‌బెన్ నిర్మాణం నగరానికి కొత్తేం కాదు. కోల్‌కతాని కూడా లండన్ తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ప్రతీకగా, 2015లోనే ఓ శాశ్వత బిగ్‌బెన్ నమూనాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్మింపజేశారు. 2015లోనే కోల్‌కతాలో బిగ్‌బెన్ నమూనాని ప్రభుత్వం నిర్మించింది ప్రముఖ నిర్మాణాల నమూనాలతో పాటు ప్రత్యేక థీమ్‌లతోనూ కోల్‌కతాలో నవరాత్రి మండపాలను నిర్మించడం ఆనవాయితీ. అత్యాచారాలూ, గంగానది కాలుష్యం మొదలైన సామాజిక అంశాల థీమ్‌లతో గతంలో అనేక మండపాలను నగరవాసులు ఏర్పాటు చేశారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి) దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోల్‌కతాలో దుర్గాదేవి కోసం మేలిమి బంగారంతో నేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించే కోల్‌కతాలో వీధివీధినా భిన్నమైన ఆకృతుల్లో మండపాలను ఏర్పాటు చేశారు. text: అమిత్ షా, దేవేంద్ర ఫడణవీస్ ఎన్సీపీలో చీలిక తెచ్చి, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌ మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్.. మెజార్టీ లేక రాజీనామా చేశారు. దీనికి ముందు గోవాలో, హరియాణాలో మెజార్టీ సీట్లు రాకపోయినా, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. మహారాష్ట్రలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఎందుకు పనిచేయలేదు? ఆ పార్టీ చేసిన తప్పులేంటి? ఇదే విషయాన్ని సీనియర్ పాత్రికేయుడు ప్రదీప్ సింగ్ విశ్లేషించారు. బీబీసీ ప్రతినిధి మానసీ దాశ్‌తో మాట్లాడుతూ.. బీజేపీ ప్రధానంగా ఆరు తప్పులు చేసిందని ఆయన చెప్పారు. ఆ తప్పులు, వాటి వివరాలు ఆయన మాటల్లోనే.. 1. ఎన్సీపీని దూరం చేసుకోవడం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం బీజేపీ వైపు నుంచి జరిగిన తొలి తప్పు. ఇదేమీ రాజకీయ ప్రతీకారం తీర్చుకునే చర్య కాదని, ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని.. అప్పుడు రాష్ట్ర సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్ మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ఎన్సీపీ ఓ తటస్థ పక్షంలా ఉండేది. శివసేన నుంచి ఒత్తిడి పెరిగినప్పుడు బీజేపీకి సాయం అందించేందుకు ముందుకు వచ్చేది. 2014లో బీజేపీ మెజార్టీ రుజువు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్సీపీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది. కానీ, ఈడీ నోటీసులతో ఎన్సీపీతో ఉన్న ఆ సంబంధాలను బీజేపీ పూర్తిగా పాడు చేసుకుంది. దీంతో శివసేన బయటకు వెళ్లాక, బీజేపీ ఒంటరైపోయింది. 2. అజిత్ పవార్‌ను నమ్ముకోవడం అజిత్ పవార్‌ను అవినీతిపరుడని బీజేపీ ఐదేళ్లుగా అంటూ వచ్చింది. ఆయన కంటే పెద్ద అవినీతిపరుడు మరొకరు లేరని ఆరోపణలు చేసింది. చివరికి మళ్లీ బీజేపీ ఆయన్నే నమ్ముకుంది. ఓ విధంగా ఆయన దొంగతనంగా తెచ్చిన లేఖపై భరోసా పెట్టుకుంది. అజిత్ పవార్ దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలున్నారనే విషయంపై ముందు నుంచీ సందేహాలు ఉన్నాయి. దాన్ని గుర్తించడంలో బీజేపీ కూడా విఫలమైంది. కేవలం అజిత్ మాటలనే బీజేపీ నమ్ముకున్నట్లు అనిపిస్తోంది. అజిత్ ఎమ్మెల్యేలను వెంట తీసుకురావడంలో విఫలమైతే ఏం చేయాలన్నదాని గురించి ఆ పార్టీ వద్ద ఎలాంటి ప్రణాళికలూ లేవు. 3. పవార్ కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోవడం శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య బంధాన్ని బీజేపీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. వాళ్లిద్దరూ ఒకే కుటుంబ సభ్యులు. అధికారం కోసం ఆ కుటుంబంలో విభజనలు వస్తాయని బీజేపీ అంచనా వేసింది. కుటుంబం నుంచి దూరంగా వచ్చిన వ్యక్తిపై భావోద్వేగపరంగా ఉండే ఒత్తిడి ఎలా పనిచేస్తుందన్నది లెక్కలోకి తీసుకోలేదు. అజిత్ పవార్‌ను సముదాయించడం కుటుంబ సభ్యులకు తేలికే అయ్యింది. బీజేపీతో వెళ్లినా, ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమితో ఉన్నా ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవే వస్తుందని వాళ్లు బుజ్జగించగలిగారు. కుటుంబానికి దూరంగా వెళ్లడం వల్ల వస్తున్న లాభమేమీ లేదని అజిత్ పవార్ గుర్తించగలిగారు. ఈ విషయంలో పవార్ కుటుంబ సభ్యులు విజయవంతమయ్యారు. 4. శరద్ పవార్‌ను తక్కువ అంచనా వేయడం శరద్ పవార్ శక్తిని బీజేపీ తక్కువ అంచనా వేసింది. ఇది అన్నింటికన్నా పెద్ద తప్పు. ఈడీ నోటీసుల అందుకున్న తర్వాత శరద్ పవార్ చూపిన ప్రతిఘటన వల్ల బీజేపీ ఎన్నికల్లో కనీసం 15-20 సీట్లు నష్టపోయింది. మహారాష్ట్రలో, ముఖ్యంగా మరాఠా రాజకీయాల్లో శరద్ పవార్ ఇప్పటికీ పెద్ద నేత. బీజేపీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. శరద్ పవార్‌తో బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి సుదీర్ఘ బంధం ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలనాపరమైన, రాజకీయ వ్యవహారాల గురించి అవసరమైనప్పుడల్లా శరద్ పవార్‌కు ఫోన్ చేసి సలహాలు తీసుకుంటుండేవాడినని మోదీ స్వయంగా అంగీకరించారు కూడా. మరి, వారి స్నేహ బంధం ఎందుకు తెగిపోయింది? అలా తెగడం వల్ల వారికి ఏం ప్రయోజనం దక్కింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం. శరద్ పవార్ విభిన్నమైన రాజకీయాలకు పేరుపొందారు. కొన్ని సార్లు కాంగ్రెస్‌తో ఉన్నారు. కొన్ని సార్లు దూరం వెళ్లారు. మూడు సార్లు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఎన్సీపీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు దాటింది. మహారాష్ట్రలో ఆ పార్టీ కాంగ్రెస్ కన్నా బలంగా మారింది. జనాదరణను కాపాడుకోవడంలో సఫలమైంది. శరద్ పవార్ రాజకీయాలను మెరుగ్గా అర్థం చేసుకున్న దిగ్గజాల్లో ఒకరు. ఎప్పుడు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదన్నది ఆయనకు బాగా తెలుసు. ఎన్నికల ప్రచార సమయంలో 80 ఏళ్ల వయసులోనూ ఆయన ధీరత్వాన్ని చాటుకున్నారు. ఓ సభ సందర్భంగా జోరు వర్షంలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు తీసిన ఫొటో.. ప్రచార సరళినే మార్చేసింది. 5. సహనం లేకపోవడం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలోకి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని తీసుకురావడం పెద్ద పొరపాటు. ఒక వేళ కేబినెట్ సమావేశం నిర్వహించి, రాష్ట్రపతి పాలనను తొలగించాలని నిర్ణయం తీసుకుని ఉండుంటే, బీజేపీ అంత అప్రతిష్ట పాలయ్యేది కాదు. అర్ధరాత్రి పూట వ్యవహారాలను పూర్తి చేయాల్సినంత అగత్యం ఏం వచ్చిందని అంతటా చర్చ జరిగింది. అత్యవసర నిబంధనలను ఉపయోగించుకుని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. కానీ, బీజేపీ అందుకోసం సన్నాహాలే చేసుకోలేదని చివరికి తెలిసింది. అంతా సాధారణ పద్ధతిలో జరిగుంటే, విపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన అవసరమే వచ్చుండేది కాదు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, సోనియా గాంధీ 6. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లను ఒక్కటి చేయడం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు విభేదాలు పరిష్కరించుకుని, ఒక్కటయ్యేందుకు కావాల్సినన్ని అవకాశాలు బీజేపీ ఇచ్చింది. ఒక్కటవ్వడం మినహా ఆ పార్టీల ముందు మరో మార్గం లేదు. ఎందుకంటే వాటికిది అస్తిత్వ సమస్యగా మారింది. ఎన్సీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం బీజేపీ ముందు ఉంది. ఇందుకోసం ఆ పార్టీ స్వయంగా శరద్ పవార్‌తో మాట్లాడాల్సింది. ఎన్సీపీ షరతులను ఒప్పుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే, శివసేనకు కళ్లెం వేసే అవకాశం బీజేపీకి వచ్చేది. మహారాష్ట్రలో బీజేపీకి ఎదురైన ఈ పరాభవానికి ఫడణవీస్ ఒక్కరినే బాధ్యుడిని చేయలేం. నాయకత్వానికి కూడా ఇందులో పాత్ర ఉంది. మహారాష్ట్ర చిన్న రాష్ట్రమేమీ కాదు. పైగా ఇదివరకు కర్ణాటకలోనూ ఇదే తప్పు చేశారు. ఒకవేళ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పడనిచ్చి ఉంటే, అంతర్గత విభేదాలతో అది కూలిపోయే అవకాశాలు ఉండేవి. అప్పుడు బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉండేది. మళ్లీ ఎన్నికలు వచ్చినా, బీజేపీకి లాభం దక్కేది. దేవేంద్ర ఫడణవీస్ ఇప్పుడు జరిగిందంతా బీజేపీకి నష్టం కలిగించేదే. ఫడణవీస్ ప్రతిష్టకు పెద్ద దెబ్బ పడింది. మహారాష్ట్ర నుంచి భవిష్యత్తులో ప్రధాని అయ్యే అర్హతలున్న నేతగా ఆయన్ను భావిస్తూ వచ్చారు. బీజేపీ ముఖ్యమంత్రులందరిలో కేంద్రంతో అత్యంత సాన్నిహిత్యం ఆయనకే ఉందని పేరు. పార్టీ నాయకత్వం నుంచి కూడా ఆయనకు గొప్ప సహకారం లభిస్తోంది. కానీ, అధికారం కోసం ఎవరితోనైనా కలిసేందుకు వెనుకాడరన్న పేరును ఆయన ఈ ఎన్నికలతో మూటగట్టుకున్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. text: జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలూ ఈవీఎంలను ఉపయోగించినప్పటికీ తరువాత మళ్లీ బ్యాలట్ విధానాన్నే ఆశ్రయించాయని ఆయన అన్నారు. ఈవీఎంలలో ఎన్నో లోపాలు ఉండడం.. పారదర్శకత లోపించడం, ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉండడం వల్ల జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాలు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం మానుకుని ఎప్పటిలా బ్యాలట్ విధానానికి మారాయని చెప్పారు. అభిషేక్ సింఘ్వి వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలి.. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తాం దిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు సమావేశమయ్యారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, ఇతర పార్టీల నేతలు హాజరై వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలన్న చంద్రబాబు డిమాండ్‌కు మద్దతు పలికారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నేతలంతా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయని, కానీ, తన పోరాటం దేశం కోసమని.. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసమని చెప్పారు. ఈవీఎంలు హ్యాక్‌ చేయడం, రిమోట్ సహాయం ఆపరేట్ చేయడం వంటి ప్రమాదాలున్నాయనే జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆ విధానం నుంచి పాత విధానానికి మారాయన్నారు. తెలంగాణలో సాంకేతికత దుర్వినియోగపరుస్తూ ను దుర్వినియోగం చేస్తూ 25 లక్షల ఓట్లను తొలగించారని.. ఎన్నికల తరువాత అధికారులు క్షమాపణ చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. తెల్లవారుజామున 4 వరకు పోలింగా? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన తీరును వివరించిన ఆయన ఏప్రిల్ 11న పోలింగ్ మొదలైతే 12వ తేదీ వేకువన 4 గంటల వరకు ఓటేసే అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. పోలింగ్ ప్రారంభంలో చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల ఆయా కేంద్రాల్లో 2 నుంచి 6 గంటలు ఆలస్యంగా పోలింగ్ మొదలైందని.. సాంకేతికత సరిగా తెలియని ఒప్పంద సిబ్బందిని ఈవీఎంల నిర్వహణకు వినియోగించారని.. వీవీప్యాట్ స్లిప్‌లు 7 సెకన్లకు బదులు 3 సెకన్లే ఉన్నాయని.. ఇలాంటి లోపాలన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో ఎన్నికలు ఈవీఎంలకు మారిపోవడం వల్ల మళ్లీ బ్యాలట్‌కు వెళ్లడం కష్టమని, కనీసం వీవీ ప్యాట్‌ స్లిప్పులలో 50 శాతం లెక్కించాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా అలా లెక్కించడానికి 6 రోజుల సమయం పడుతుందని ఈసీ అఫిడవిట్ దాఖలు చేసిందని.. మళ్లీ రివ్యూ పిటిషన్ వేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచంలోని 18 దేశాలు మాత్రమే ఇప్పటివరకు ఈవీఎంలను ఉపయోగించాయని.. వాటిలో అత్యధికం వెనుకబడిన, వర్ధమాన దేశాలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. text: తాజాగా గిర్ అడవుల్లో 11 సింహాలు చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇవి అనారోగ్యం వల్ల చనిపోయాయా లేక ఘర్షణ వల్ల చనిపోయాయా లేక మరేదైనా కారణముందా అన్నది తేలాల్సి ఉంది. అనారోగ్యంతో కొన్ని, ఘర్షణతో కొన్ని చనిపోయి ఉండొచ్చని అధికారులు, వన్య ప్రాణి సంరక్షణ సంఘం సభ్యులు చెబుతున్నారు. 1968లో గుజరాత్‌లో ఈ సింహాల సంఖ్య 177. అయితే వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు, ప్రభుత్వం, పరిసర గ్రామస్థుల ప్రయత్నాల కారణంగా ఈ సింహల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లో 523 సింహలున్నాయి. కానీ గిర్ అడవుల విస్తీర్ణం వాటికి సరిపోవడం లేదు. దీంతో సుమారు 200కు పైగా సింహాలు అడవి బయటే బహిరంగ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. తరచూ నివాస ప్రాంతాలకు వస్తున్నాయి. దాంతో దాదాపు 1200 గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు.. పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి, బావుల్లో పడి, రైలు, రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎన్నో సింహాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. వీడియో: ఇక్కడ నాలుగు రోజులకో సింహం చనిపోతోంది జికార్ భాయ్ ఓ రైతు. ఈయన దగ్గర 8 గేదెలున్నాయి. 2017 నవంబర్‌లో దూడపై కొన్ని సింహాలు దాడి చేశాయి. ఆ దూడ బతికినప్పటికీ ఇంకా దాని మెడకు అయిన గాయం మాత్రం మానలేదు. "ఇంతకుమందు మాకు చాలా గేదెలుండేవి. కానీ ఈ సింహాల దాడులకు భయపడి పశువుల సంఖ్యను తగ్గించుకున్నాను. ఒక సింహం రెండు గేదెలను ఎత్తుకుపోయింది. నిన్న కాక మొన్నే సింహాలు ఇక్కడ పశువులపై దాడి చేశాయి" అని జికార్ భాయ్ చెప్పారు. జికార్ భాయ్ లాగే వారి గ్రామంలో మిగతా రైతులు కూడా ఈ సింహాల బెడదకు అలవాటుపడిపోయారు. అయితే ఈ గ్రామాల్లో బ్లూ బుల్ లాంటి జంతువుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో తరచుగా వాటిలో సింహాలు చిక్కుకుని ప్రమాదాల పాలవుతున్నాయి. 2016, 2017 మధ్య 184 సింహాలు చనిపోవడంతో గుజరాత్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సింహాల మరణాలకు సంబంధించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016 ,2017లో సగటున నాలుగు రోజులకో సింహం మరణించింది. గిర్ అడవులలో ఉన్న సింహాలు గుజరాత్‌కి గర్వకారణం. అయితే వాటికి సరిపడా ఆవాసం కల్పించినప్పుడు మాత్రమే.. గుజరాత్ తన సింహ సంపదను చూసి గర్వపడాలి. పులులకూ తప్పని వేసవి తాపం తెలుగు రాష్ర్టాల్లో పులుల పోట్లాట అడవుల్లో పెద్దపులులు చాలా భీకరంగా పోట్లాడుకుంటాయి. కొన్నిసార్లు ఏదో ఒకటి చనిపోయేదాకా ఆ పోరు సాగుతుంది. మరి వాటి కొట్లాటకు దారితీసే పరిస్థితులు ఏంటి? ఇటీవల నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పెచ్చెర్వు సెక్షన్ నరమామిడి చెరువు సమీపంలో ఓ పెద్దపులి కళేబరాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ పులి దేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, తనకంటే పెద్దదైన మరో పులి చేసిన దాడిలో అది మృతి చెందిందని నిర్ధారించారు. వేటగాళ్ల దాడిలోగాని మరే ఇతర కారణాలవల్లగాని చనిపోయిన ఆనవాళ్లు లేవని తెలిపారు. "చంపటం లేదంటే చావటం" అటవీ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పులుల మధ్య రెండు విషయాల్లో పోట్లాట జరుగుతుంది. ఒకటి ఆవాసం కోసం, రెండోది సంపర్కం(సెక్స్) కోసం. సహజంగా పులులు పుట్టిన తరువాత రెండు నుంచి మూడు సంవత్సరాల వరకే తల్లితో కలిసి ఉంటాయి. ఆ సమయంలో అడవిలో ఎలా జీవించాలి..? ఎలా వేటాడాలి..? తమనుతాము ఎలా రక్షించుకోవాలి? అనేది నేర్చుకుంటాయి. తరువాత అవి తల్లిని వదిలి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఒక్కోసారి అప్పటికే మరోపులి ఏర్పాటు చేసుకున్న ఆవాసంలోకి వెళ్లి ఆక్రమించే ప్రయత్నం చేస్తాయి. ఆసమయంలో రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. "ఆవాసం కోసం పోరాటం" అడవిలో ఒక్కోపులి తన ఆవాస ప్రాంతాన్ని దాదాపు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించుకుంటుంది. కొన్ని ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని తమ పరిధిగా ఏర్పాటు చేసుకుంటాయి. తన ఆవాస పరిధిలోకి మరో పులి రాకుండా జాగ్రత్త పడుతుంది. వస్తే అడ్డుకుంటుంది. పోరాడుతుంది. తనకంటే చిన్నది, బలహీనమైనది వస్తే కొన్నిసార్లు చంపుతుంది. అదే తనకంటే బలమైన దానితో ఘర్షణ జరిగితే చనిపోతుంది. లేదంటే పారిపోయి మరోచోట ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. నల్లమలలో ఇటీవల కొట్లాటలో చనిపోయిన పులి ఇదే. దీన్ని ఈ చారల ఆధారంగా గుర్తించారు. "సంపర్కం కోసం పోట్లాట" సంపర్కం సమయం(మేటింగ్ పీరియడ్)లో కూడా పులుల మధ్య భీకర పోరు జరుగుతుంది. సంపర్కం కోసం ఒక మగపులి ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఆడపులులతో జతకడుతుంది. ఆడపులి తన శరీరం పునరుత్పత్తికి అనుకూలంగా మారినపుడు కొన్ని ప్రత్యేకమైన చేష్టలు, శబ్దాల ద్వారా తాను సెక్స్‌కు సిద్ధంగా ఉన్నట్లు మగపులికి సంకేతాలిస్తుంది. అప్పుడు మగపులి దానితో జతకడుతుంది. పది నుంచి పదిహేను రోజులపాటు ఆ ఆడపులి ఆవాసంలోనే ఉండి సెక్స్‌లో పాల్గొంటుంది. ఆ తరువాత సంపర్కానికి సిద్ధంగా ఉన్న తన గుంపులోని మరో ఆడపులి ఆవాసానికి వెలుతుంది. బేస్ క్యాంపును పరిశీలిస్తున్నడీఎఫ్‌వో వెంకటేశ్ ఈ విధంగా ఒక మగపులి తన గుంపులోని ఆడపులులతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంటుంది. వీటితో కలిసేందుకు ఇతర మగ పులులు ప్రయత్నిస్తే వాటిని అడ్డుకుంటుంది, పోరాడుతుంది. ఆ పోట్లాటలో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతాయి. ఆడపులులు కూడా తమ గుంపులోని మగపులితోనే సంపర్కంలో పాల్గొంటాయి. ఏదైనా ఇతర మగపులి తమ ఆవాసంలోకి వచ్చి సంపర్కం కోసం ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సహకరించాల్సి వస్తే దానివల్ల పిల్లలు పుట్టకుండా ఉండేలాగా జాగ్రత్తపడతాయి. "మలం, మూత్రంతో ఆవాసానికి హద్దులు" పులులు తమ ఆవాసానికి హద్దులు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తాయి. హద్దులో ఉన్న చెట్లపొదలపైన మూత్రాన్ని చిమ్ముతాయి. నేలపై అక్కడక్కడా మలవిసర్జన చేస్తాయి. వాటి వాసన బట్టి అది సరిహద్దు అని ఇతర పులులు తేలికగా గుర్తించగలుగుతాయి. అలాగే చెట్ల బెరడుపై గోర్లతో గీకి గుర్తులు పెట్టుకుంటాయి. పాదముద్రలు పడేలా తన ఆవాసం చుట్టూ తిరిగి సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా ఒకపులి ఏర్పాటు చేసుకున్న హద్దు దాటి మరోపులి వెళ్లదు. ఒకవేళ ఆక్రమించుకునేందుకు లోనికి వస్తే అప్పుడు ఆ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది. కొన్నిచోట్ల పులుల సంఖ్యకు తగ్గట్టుగా అడవుల విస్తీర్ణం లేకపోవడం కూడా ఇలాంటి ఘర్షణలకు ఓ కారణమన్న అభిప్రాయం ఉంది. కొట్లాటలు సహజమే... పెద్దపులుల మధ్య పోట్లాటలు సహజమేనని కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎఫ్ఓ వెంకటేష్ సంబంగి తెలిపారు. "ఈ పోట్లాటలో ఏదైనా పులి చనిపోతే దానికి ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పంచనామా, శవపరీక్ష నిర్వహించి ఆ తరువాత ఖననం చేస్తాం. దానిపై ఓ నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తాం" అని ఆయన చెప్పారు. "పులుల రక్షణ కోసం అవి నివసించే కోర్ ఏరియా, సంచరించే అవకాశమున్న బఫర్ ఏరియాలలో తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. చెట్లను పెంచటం, వేటగాళ్ళను అడవిలోకి వెళ్లకుండా చూడటం ఇతర వన్యప్రాణుల సాంద్రతను పెంచటం ద్వారా పులులకు ఆహారాన్ని కల్పిస్తాం" అని వెంకటేష్ వివరించారు. నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో రాత్రింబవళ్ళు అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండటం వల్ల వేటగాళ్ల నుంచి పులులకు రక్షణ దొరుకుతోందని తెలిపారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కానీ వాటికి అడవుల విస్తీర్ణం సరిపోవడంలేదు. దీంతో అవి తరచూ బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. text: దీనికి సంబంధించి చేస్తున్న అధ్యయనానికి కేంబ్రిడ్జి లోని మసచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేస్తున్న యాష్లే బెక్విత్ నేతృత్వం వహిస్తున్నారు. "ప్రయోగ శాలల్లో చెక్కను పెంచడం వల్ల కలప అవసరాలకు అడవులపై ఆధారపడడం తగ్గుతుంది" అని ఆమె అన్నారు. ఆమె బృందంలోని సభ్యులు 3డి ప్రింటెడ్ జెల్ ద్వారా వృక్ష కణాలను నచ్చిన ఆకారంలోకి మలిచి చెక్కను పెంచుతున్నారు. ఇదే విధమైన సాంకేతికతను చెక్క భాగాలు, పలకలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో అవసరమైన సామగ్రి తయారు చేసుకోవచ్చు. బెక్విత్ బీబీసీ 5 లైవ్ కార్యక్రమంలో మాట్లాడారు. "మనకు కావల్సిన ఆహారం మొదలుకొని మౌలిక సదుపాయాలకు కావల్సిన సామగ్రి, వినియోగ వస్తువులు, బయో ఇంధనానికి అవసరమైన పంటల కోసం కూడా ప్రస్తుతం ప్రపంచంలో వృక్ష ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది" అని ఆమె అన్నారు. "సాగు చేయగలిగే కొంత మేర భూమిలో మాత్రం మేం ఈ ప్రయోగం చేస్తున్నాం" అని చెప్పారు. "వృక్షాలను పెంచడానికి చాలా వనరులను వెచ్చిస్తాం. కానీ, ఒక మొక్కలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే నిజానికి ఉపయోగిస్తాం. భూమి మీద పూర్తిగా ఆధారపడకుండా ఉత్పత్తులను తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని ఆలోచించాలి అని ఆమె అన్నారు. ఆష్లే ఈ విధానాన్ని నిరూపించేందుకు తమ బృందం జిన్నియా మొక్కను వాడి చిన్నచిన్న నమూనాలను పెంచడం మొదలుపెట్టినట్లు ఆమె చెప్పారు. వీటి పరిమాణాలను నెమ్మదిగా పెంచే ఆలోచన కూడా ఉంది. "ఒక కాఫీ టేబుల్ పరిమాణానికి కావల్సిన చెక్కను పెంచడం కాస్త నెమ్మదిగా చోటు చేసుకునే ప్రక్రియ. దీనికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. కానీ, సాధారణ చెట్టు పెరగడానికి 20 సంవత్సరాలు పడితే దీనికి అంత సమయం పట్టదు" అని ఆమె అన్నారు. "ఒక పెద్ద టేబుల్‌కు కావల్సినంత చెక్కను పెంచగలనో లేదో నాకు తెలియదు. అలా పెంచడం వలన స్థలాన్ని సక్రమంగా వినియోగించలేం. కానీ, ఇక్కడ కూడా వీటిని పెంచేందుకు చాలా అవకాశమైతే ఉంది’’ అన్నారామె. జిన్నియా మొక్క చెట్ల నుంచి వచ్చే చెక్కకు , ప్రయోగశాలల్లో పెంచిన చెక్కకు ఉండే తేడాను ఆమె వివరించారు. "సంప్రదాయ తరహా చెక్క ఒక క్రమపద్దతిలో ఉంటుంది. అవి చెట్టు ఆకారానికి అనుగుణంగా పెరగడం వలన ఒక నిర్ణీత ఆకారంలో ఉంటాయి. కానీ, ప్రయోగశాలలో పెంచిన చెక్కకి ఈ విధమైన ఆకారం ఉండదు. ఇది ఒక బ్లాక్ లా ఉండి ఒక ప్రత్యేక ఆకారంతో ఉండదు" అని చెప్పారు. ప్రస్తుతం దీని పై జరుగుతున్న పరిశోధన ప్రారంభ దశలోనే ఉంది. మరో 10 ఏళ్లలో ఈ అంశంపై పురోగతి కనిపించవచ్చని ఆమె ఆశిస్తున్నారు. "ఇదొక గొప్ప దూర దృష్టితో కూడిన అంశం. దీని పట్ల చాలా మంది ఆసక్తి కూడా చూపించారు. "ఈ సమస్య గురించి మనలో చాలా మందికి తెలుసు. దీనిని నివారించాలని కూడా అనుకుంటాం. అందుకే దీనిపై ఆసక్తిని కలిగించి ఈ ప్రయత్నంలో మరింత మందిని భాగస్వాములను చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చు" అని ఆమె అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సూర్యరశ్మి, మట్టి అవసరం లేకుండా ప్రయోగ శాలల్లో ఫర్నిచర్ తయారీ కోసం చెక్కను పెంచే ఆలోచన చేస్తున్నారు. text: 'బీబీసీ' కంట్రీఫైల్ కార్యక్రమంలో ప్రసారమైన ఓ పరిశోధనాత్మక కథనం తరువాత ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ఈ చర్య తీసుకున్నాయి. అయితే, బ్రిటన్‌లో నిషేధించిన కోడి పందేలు, కుందేళ్ల వేటకు సంబంధించి యూజర్లు పోస్ట్ చేస్తున్న గ్రాఫిక్ వీడియోలు, ఫొటోలకు మాత్రం ఈ రెండు వేదికల్లోనూ ఇంకా స్థానం కల్పిస్తున్నారు. పోస్ట్ చేసే కంటెంట్ స్థానిక చట్టాలకు లోబడి ఉండాటని పేర్కొంటూ ఫేస్‌బుక్ ఒక యూజర్‌ను తొలగించింది. యూట్యూబ్ కూడా విధానపరమైన మార్గదర్శకాలను ఉటంకిస్తూ 'బీబీసీ' అభ్యంతరాలు వ్యక్తంచేసిన కంటెంట్‌ను తాము తొలగించినట్లు తెలిపింది. కానీ, ఫేస్‌బుక్, యూట్యూబ్ రెండిట్లోనూ ప్రైవేట్, పబ్లిక్ యూజర్ గ్రూపుల్లో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. నిషేధిత నెత్తుటి క్రీడలు నిర్వాహకులకు లాభసాటి వ్యాపారంగా మారాయని యార్క్‌షైర్ పోలీసులు చెబుతున్నారు. 2004 నాటి వేట చట్టం ప్రకారం బ్రిటన్‌లో కుక్కలతో కుందేళ్లను వేటాడించే పోటీలపై నిషేధం ఉంది. ఇక 19వ శతాబ్దంలోనే అక్కడ కోడిపందేలను నిషేధించారు. బీబీసీ కంట్రీఫైల్‌ ఇలాంటి వీడియోల వ్యవహారాన్ని బయటపెట్టగా ఆ ప్రోగ్రాం చూసిన వైల్డ్‌లైఫ్ కోఆర్డినేటర్ జీఫ్ ఎడ్మండ్ ''ఆన్‌లైన్లో ఇలాంటి కంటెంట్‌ను తొలగించాల్సిందే'' అని డిమాండ్ చేశారు. ఇందుకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు. కాగా, కంట్రీఫైల్‌లో ప్రసారం చేసిన ఈ కథనం కోసం బీబీసీ పరిశోధన బృందం కొన్ని నెలల పాటు వేలాది యూట్యూబ్, ఫేస్‌బుక్ అకౌంట్లను క్షుణ్నంగా పరిశీలించారు. ఇందులో భాగంగా సుమారు 31 వేల మంది సభ్యులున్న రెండు ప్రైవేట్ సోషల్ గ్రూపులను పరిశీలించారు. వీరి పరిశీలనలో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో నెత్తుటి ఆటల వీడియోలు, ఫొటోలు లెక్కలేనన్ని కనిపించాయి. వీరి పరిశీలనలో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో నెత్తుటి ఆటల వీడియోలు, ఫొటోలు లెక్కలేనన్ని కనిపించాయి. కుక్కలు కుందేళ్లను వెంటాడి వేటాడి చీల్చేస్తున్న వీడియోలు... కోడిపుంజులు కాళ్లతో రక్కుకుంటూ ముక్కుతో పొడుచుకుంటూ రక్తాలు కారి, ఒకదాన్నొకటి చంపుకొనేవరకు పోరాడే వీడియోలు, ఫొటోలు గుర్తించారు. ఇలాంటి వీడియోలు, ఫొటోలలో యువత, చిన్నారులు కూడా కనిపించడాన్ని బీబీసీ కథనంలో ప్రస్తావించారు. ‘‘కోడిపందేలు, కుందేళ్ల వేట వంటివి అక్రమంగా నిర్వహించేవారు సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించుకుంటూ ఏకంగా ఇలాంటి నెత్తుటిక్రీడలను లైవ్‌లో చూపిస్తున్నారు. భారీ ఎత్తున పందేలు కాస్తుండడంతో దీన్ని అక్రమ సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నారు’’ అని యార్క్‌షైర్ పోలీసులు తెలిపారు. ప్రతి రెండువారాలకోసారి ఇలాంటివి నిర్వహిస్తున్నారని.. కానీ, ఆ ఫుటేజ్ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదంతా ఒక లాభదాయకమైన వ్యాపారంగా సాగుతోందన్నది యార్క్‌షైర్ పోలీసుల మాట. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నిషేధిత నెత్తుటి క్రీడలను ప్రోత్సహించేలా ఉన్న వీడియోలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు తొలగించాయి. text: పాలు నగరంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను కాపాడుతున్న సహాయ సిబ్బంది భూకంపం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు ముందుగా అనుకున్నదానికంటే ఎక్కువ అని వివరించింది. రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైన ఈ భూకంపం వల్ల చాలా భవనాలు కూలిపోయాయి. ఈ శిథిలాల కింద ఎంతో మంది ప్రజలు చిక్కుకున్నారని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వొ నుగ్రొహొ విలేకరుల సమావేశంలో చెప్పారు. తొలుత భూకంపం రావటంతో అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అలా అధికారులు సునామీ హెచ్చరికలు ఎత్తివేసిన కాసేపట్లోనే దాదాపు 20 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతూ సులవేసి ద్వీపంలోని పాలు నగరాన్ని ముంచెత్తాయి. ఇండొనేషియా: భారీ భూకంపంతో ముంచెత్తిన సునామీ నగరంలో కూలిపోయిన భవంతుల శిథిలాల కింద ఎవరైనా ప్రజలు ప్రాణాలతో ఉన్నారేమోనని అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. యంత్రాలను ఉపయోగించకుండా తవ్వకాలు చేపట్టారు. డొంగల నగరంపై భూకంప, సునామీ తీవ్రత ఎంతగా ఉందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదు. ఆ నగరానికి వెళ్లే రోడ్లు ధ్వంసం కావటం, అడ్డంకులు ఎదురవడం, ఒక వంతెన కూలిపోవటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. భూకంపం, సునామీ కారణంగా 16 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని రెడ్ క్రాస్ సంస్థ అంచనా వేసింది. ‘‘ఇదొక విషాదం. మరింత తీవ్రం కావొచ్చు’’ అని రెడ్ క్రాస్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని, వేలల్లో ఉండొచ్చని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కళ్లా తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాలను దేశాధ్యక్షుడు జోకో విడొడొ సందర్శిస్తున్నారు. సునామీ కారణంగా ధ్వంసమైన వంతెన డొంగల నగరంలో పరిస్థితి ఏంటి? డొంగల నగరానికి రోడ్డు మార్గంలో కానీ, ఆకాశ మార్గంలో కానీ వెళ్లే అవకాశాల్లేవని, బహుశా సముద్ర మార్గంలో వెళ్లి సహాయ కార్యకలాపాలు అందించాలని సహాయ సంస్థ కేథలిక్ రిలీఫ్ సర్వీసెస్ ఇండోనేసియా దేశ మేనేజర్ యెన్ని సుర్యానీ తెలిపారు. శుక్రవారం వచ్చిన భూకంపం తర్వాత ఈ దీవిలో తీవ్రమైన భూ ప్రకంపనలు కొనసాగాయి. గత నెలలో కూడా వరస భూకంపాలు ఇండొనేషియా ద్వీపాలను అతలాకుతలం చేశాయి. లోంబోక్‌లో సంభవించిన భూకంపానికి వందలాది మంది చనిపోయారు. ఆగస్టు 6న సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం 460 మంది ప్రాణాలు తీసింది. కూలిపోయిన ఒక ఆస్పత్రి శిథిలాలపైనే చికిత్స పొందుతున్న మహిళ ‘పాలు’ నగరంలో పరిస్థితి ఏంటి? ఈ నగర జనాభా 3,35,000. భూకంపం ధాటికి చాలా భవంతులు కూలిపోయాయి. వాటి శిథిలాల కింద ప్రాణాలతో చాలామంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రోవా-రోవా అనే ఒక హోటల్ శిథిలాల కింద చిక్కుకున్న 24 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన తీవ్ర భూకంపంతో వచ్చిన భారీ సునామీ వల్ల హిందూ మహా సముద్రం పరిధిలో 2,26,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఒక్క ఇండొనేసియాలోనే 1,20,000 మందికి పైగా చనిపోయారు. తరచూ భూకంపాలు సంభవించే అవకాశంతో పాటు అగ్నిపర్వతాలున్న వలయంలో ఉన్న ఇండొనేసియాకు భూకంపాల ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటోంది. ‘తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు’ పోస్కో నుంచి రెబెక్కా హెన్స్‌ఖె, బీబీసీ ప్రతినిధి, జకార్తా పాలు నగరం నుంచి నాలుగు గంటల ప్రయాణ దూరంలో ఉన్న పోస్కో నగరంలో నిత్యావసరాల కొరత ఏర్పడింది. పెట్రోలు పంపులు ఖాళీ అయిపోతున్నాయి. సూపర్ మార్కెట్లలో చాలా తక్కువ మొత్తంలోనే సరుకులు ఉన్నాయి. తాగేందుకు బాటిల్ నీళ్ల కోసం చాలా కష్టపడి వెతుక్కోవాల్సిన పరిస్థితి. మా బీబీసీ బృందంతో పాటు ప్రయాణిస్తున్న ఎర్మి లియానా తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదు. ‘‘కూలిపోయిన వంతెనకు సమీపంలోనే వాళ్లు ఉంటారు. ఫోన్లో వారిని సంప్రదించలేకపోతున్నాను. వాళ్లు బ్రతికే ఉండాలని దేవుణ్ణి ప్రార్థించటమే ఇప్పుడు నేను చేయగలిగినది’’ అని ఆమె అన్నారు. డొంగల నగరానికి ఎలాంటి సహాయం వెళుతున్నట్లు మాకు కనిపించట్లేదు. ఇప్పటికీ ఆ నగరానికి సమాచార సంబంధాలు పునరుద్ధరించలేదు. ఇవి కూడా చదవండి: భవిష్యత్తులో జకార్తాను చూడలేమా? (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇండోనేసియాలోని తీర ప్రాంత నగరం 'పాలు'లో శుక్రవారం సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా కనీసం 832 మంది మృతి చెందారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. text: రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.50 కోట్లకు ఆయనను తన జట్టులోకి తీసుకోవడానికి సిద్ధపడింది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇది 2 కోట్లు తక్కువే. మొత్తం 578 మంది ఆటగాళ్లను వేలం ద్వారా వివిధ జట్లు సొంతం చేసుకోనున్నాయి. బెన్ స్టోక్స్ తర్వాత భారత్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మనిశ్ పాండే అత్యధిక ధరకు వేలంలో అమ్ముడు పోయారు. రాహుల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పాండేను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.11 కోట్లకు తీసుకున్నాయి. మిషెల్ స్టార్క్ (9.40 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (9 కోట్లు) ఎక్కువ ధర పలకగా, క్రిస్ గేల్, రూట్‌లు ఇంకా అమ్ముడుపోలేదు. ఇంకా ఇప్పటి వరకు వివిధ ఆటగాళ్లకు పలికిన ధరల వివరాలివీ: ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ఐపీఎల్-11 సిరీస్ కోసం బెంగళూరులో జరుగుతున్న క్రికెటర్ల వేలంలో ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అగ్ర స్థానాన నిలబడ్డాడు. text: సోషల్ మీడియాలో ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందనల సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ట్విటర్‌లో టాప్-10 ట్రెండ్స్‌లో 9 ట్రెండ్స్ భారత జట్టు విజయానికి సంబంధించినవే. చాలా మంది ఈ విజయానికి గాను భారత జట్టుతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గెలుపు తర్వాత స్టేడియంలో భారత జట్టు ఘనంగా విజయోత్సవం జరుపుకుంది. అండర్ 19 ప్రపంచ చాంపియన్‌.. భారత్ పోస్ట్ of Twitter ముగిసింది, 1 రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సీనియర్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి, సచిన్ తెందూల్కర్ సహా చాలా మంది క్రీడా ప్రముఖులు, సినీ తారలు భారత జట్టుకు అభినందనలు తెలిపారు. "మన యువ క్రికెటర్లు సాధించిన ఈ విలక్షణ విజయానికి నేను చాలా సంతోషిస్తున్నా. అండర్-19 ప్రపంచ కప్ గెల్చుకున్నందుకు నా అభినందనలు. భారతీయులందరూ ఈ విజయం పట్ల గర్వపడుతున్నారు" అని ప్రధానమంత్రి మోదీ రాశారు. రాష్ట్రపతి కోవింద్ కూడా టీం కెప్టెన్ పృథ్వీషా, తదితర ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. భారత సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక ఫొటో పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు. "అండర్-19 కుర్రాళ్లు సాధించిన అద్భుత విజయం ఇది. దీన్ని మైలురాయిలా భావించండి. ఇంకా చాలా దూరం సాగాల్సి ఉంది. ఈ ఆనందపు క్షణాలను ఆస్వాదించండి." సచిన్ తెందూల్కర్ ఒక వీడియో పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ కూడా క్రికెట్ టీంకు, కోచ్ ద్రవిడ్‌కు అభినందనలు తెలిపారు. "ఈ కుర్రాళ్లు ఎంతో సురక్షితమైన చేతుల్లో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ సురక్షితమైన చేతులు. భారత క్రికెట్ భవిష్యత్తులో ఈ కుర్రాళ్లు సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మన దగ్గర ఎంతో ప్రతిభ ఉంది" అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రవి శాస్త్రి, ఆర్. అశ్విన్, జహీర్ ఖాన్ కూడా భారత జట్టును అభినందనల్తో ముంచెత్తారు. సురేష్ రైనా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెర వెనుక నిరంతరం శ్రమించి టీం తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించేలా రాటు దేల్చారని ఆయన అన్నారు. క్రికెట్ ఎక్స్‌పర్ట్ మోహన్‌దాస్ మీనన్ ఈ విజయానికి పూర్తి క్రెడిట్ రాహుల్ ద్రవిడ్‌కే దక్కుతుందని ట్వీట్ చేశారు. "చివరకు ఓ వరల్డ్ కప్.. రాహుల్ ద్రవిడ్ పేరిట. ఈ గెలుపులో ఆయనదే కీలకపాత్ర." "తమ స్కోరుతో వయసును అధిగమించారు! 'ద వాల్' ద్వారా శిక్షణ పొందడం వల్లే ఈ జట్టు శిఖరాన్ని చేరుకోగలిగింది. ఎంత గొప్ప విజయం. అభినందనలు రాహుల్ ద్రవిడ్. భారతీయుడైనందుకు గర్వంగా ఉంది" అని సినీ నటుడు సునీల్ షెట్టీ ట్వీట్ చేశారు. గెలుపు సాధించాక టీం కెప్టెన్ పృథ్వీషా భారత అభిమానులను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారు.: భారత జట్టు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మన్‌జోత్ కాల్రా (101), హార్విక్ దేశాయి (47)ల అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితంగా, భారత జట్టు అస్ట్రేలియా నిర్దేశించిన 2017 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలోనే, కేవలం రెండు వికెట్లను కోల్పోయి చేరుకోగలిగింది. భారత్ అండర్-19 వరల్డ్ కప్ గెల్చుకోవడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు 2000, 2008, 2012లలో భారత్ ప్రపంచ కప్ గెల్చుకుంది. టీం సభ్యులకు బీసీసీఐ నగదు పురస్కారాలు ప్రకటించింది. టీం కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు 50 లక్షలు, ఒక్కో ఆటగాడికి 30 లక్షల చొప్పున అందజేస్తారు. సపోర్ట్ స్టాఫ్‌లోని ప్రతి సభ్యుడికీ 20 లక్షల నగదు పురస్కారం అందజేస్తారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత అండర్-19 క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెల్చుకున్న తర్వాత సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. text: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు: ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ యూనియన్ల మీద అనవసరమైన నిందలు వేస్తూ, రకరకాల మాటలు చెబుతూ కార్మికులను భయబ్రాంతులకు గురిచేసేలా సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదని ఆర్టీసీ జేఏసీ నేత థామస్ అన్నారు. "ఆర్టీసీకి నష్టాలు కార్మికుల వల్ల, నాయకుల వల్ల రాలేదు. ఆ నష్టాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే. ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలలో వాస్తవాలు లేవు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. జీతాల విషయంలో ఏవేవో రాష్ట్రాల పేర్లను సీఎం చెప్పారు, కానీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడలేదు. పల్లెవెలుగు బస్సుల ద్వారా సంస్థకు నష్టం వస్తోంది, దానిని ప్రభుత్వమే భరించాలి. ఇంకా జీహెచ్‌ఎంసీ నుంచి 1,400 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా, ఆ విషయాన్ని సీఎం చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు" అని థామస్ అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దు అనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి కోరారు. "కార్మికులు అభద్రతకు గురయ్యేలా సీఎం మాట్లాడారు. కార్మికులెవరూ ఒత్తిడికి గురికావొద్దు. అద్దె బస్సుతో ప్రతి కిలోమీటర్‌కు 75 పైసలు ఆదాయం వస్తోందని సీఎం చెప్పారు. మరి, గత ఏడాది 149 కోట్ల రూపాయల నష్టం ఎందుకొచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దసరా పండుగ సమయంలో ఆర్టీసీకి 17 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సీఎం అన్నారు. కానీ, ఏనాడూ అంత ఆదాయం రాలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ప్రైవేటు ట్రావెల్స్‌కు లాభాలు వస్తున్నాయి, వాటితో పాటు తిరిగే ఆర్టీసీ బస్సులకు కూడా లాభాలు వస్తున్నాయి. పల్లెవెలుగు, సిటీ బస్సులతోనే నష్టం వస్తోంది. యూనియన్ ఎన్నికల ముందు ఓట్ల కోసం సమ్మె చేస్తున్నామని ఆయన అన్నారు. కానీ, అలా అనుకుంటే అన్ని యూనియన్లూ కలిసి సమ్మె చేస్తాయా?" అని రాజిరెడ్డి ప్రశ్నించారు. సీఎం అలా మాట్లాడటం సరికాదు: సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి కార్మికులు, ఉద్యోగుల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు సరిగా లేదని సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ... "ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ సరైన వ్యూహం తీసుకోలేదని అర్థమవుతోంది. ఒక విధంగా కార్మికులు చెబుతున్న విషయాలను ఆయన ధ్రువీకరించారని చెప్పొచ్చు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రమాదం ఉందని, సంస్థను రక్షించాలని కార్మికులు అంటున్నారు. ఇప్పుడు ఆ ప్రమాదం జరగబోతోందన్న విషయాన్ని కేసీఆర్ ధ్రువపరిచారు. ఆయన గతంలో చెప్పిన తప్పుడు విషయాలనే మళ్లీ చెప్పారు. దిక్కుమాలిన యూనియన్లు, బుద్ధి లేని సమ్మె అంటూ ముఖ్యమంత్రి ద్వేషించడం సరికాదు. కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల అలా మాట్లాడటం మంచిది కాదు" అని అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిందని, అది మూతపడక తప్పదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానం అని చెప్పారు. text: ఒక బాధితుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబం పడుతున్న వేదనను తెలుసుకునేందుకు ప్రయత్నించారు బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి. అబ్దుల్ కలాం అనే బాధితుడి భార్య (7 నెలల గర్భిణి) తన ఆవేదనను బీబీసీతో పంచుకున్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే పొట్టకూటి కోసం తన భర్త ప్రమాదకరమైన గనుల్లో పనికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. తన భర్త సంపాదిస్తేనే తమకు పూట గడుస్తుందని, అతడు లేకపోతే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందంటూ ఆమె రోధిస్తున్నారు. ఆ బాధిత కుటుంబ పరిస్థితి ఆమె మాటల్లోనే.. వీడియో: 'అల్లాహ్.. నా భర్తను కాపాడు' నాకు ఏమీ తోచట్లేదు. ఎప్పుడూ నా భర్త గురించే ఆలోచిస్తున్నాను. నాన్న కోసం నా కొడుకు ఏడుస్తున్నాడు. నా పేరు అఫ్రోజా, నా భర్త పేరు అబ్దుల్ కలామ్ షేక్. ఇప్పుడు నేను 7 నెలల గర్భిణిని. నాకు 10 నెలల కొడుకు కూడా ఉన్నాడు. ఆరోజు నా భర్త పనిచేసే గని ప్రాంతాన్ని నది ముంచెత్తిందని మా ఊరివాళ్లు చెబితే తెలిసింది. మా ప్రాంతంలో వ్యవసాయ పనులు దొరకడంలేదు. దాంతో మా కుటుంబ పోషణ కోసం ఆయన గనుల్లో పనికి వెళ్లాల్సి వచ్చింది. నా భర్త సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నా. నాన్న ఫొటోను చూస్తూ నా కొడుకు రోజంతా ఏడుస్తున్నాడు. వాళ్ల నాన్న తప్ప వాడు ఇంకెవరి దగ్గరికీ వెళ్లడు. ఇప్పుడు సంపాదించే వారెవరూ లేక ప్రస్తుతం మా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. నా భర్త సంపాదిస్తేనే మాకు పూట గడిచేది. ఇకపై మా పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదు. మా మామయ్య వృద్ధుడు. మా మరిదికి వైకల్యం ఉంది. ఆ గనుల్లో సహాయక చర్యల గురించి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మేం బతికేదెలా? నా భర్త సురక్షితంగా ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మేఘాలయాలోని ఒక అక్రమ బొగ్గు గనిలో 15 మంది కార్మికులు చిక్కుకుని 25 రోజులు కావస్తోంది. ఇప్పటికీ వారి జాడ లేదు. దాంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. text: కంటెంట్ అందుబాటులో లేదు పోస్ట్ of Facebook ముగిసింది, 1 "బెంగాల్‌లో బీజేపీ ర్యాలీకి హాజరైన జనవాహిని ఇది. ఇది కూచ్ బెహార్‌లో జరిగిన ర్యాలీ. ఈరోజు మమతాకు నిద్ర పట్టదు" అని ఆ ఫొటో కింద రాసి ఉంది. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో కనీసం 23 స్థానాలు గెల్చుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్ రాష్ట్ర బీజేపీ విభాగానికి సూచించారు. 'చౌకీదార్ నరేంద్ర మోదీ', 'నరేంద్ర మోదీ 2019' వంటి అనేక మితవాద ఫేస్‌బుక్ పేజీలు, గ్రూపులు ఈ ఫొటోను షేర్ చేశాయి. తమ పేర్ల ముందు 'చౌకీదార్' అని చేర్చుకున్న ఎందరో ట్విటర్ యూజర్లు కూడా ఈ చిత్రాన్ని విస్తృతంగా షేర్ చేసుకున్నారు. తెలుపు, కాషాయ రంగు దుస్తులు ధరించిన కొందరు పొడవాటి క్యూలైన్లలో నిలబడి ఉండటం ఈ చిత్రంలో కనిపిస్తుంది. వారంతా బీజేపీ మద్దతుదారులు అని చెబుతున్నారు. కానీ అది వాస్తవం కాదని మేం గుర్తించాం. ఈ ఫొటోకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. మరి వాస్తవమేంటి? 2019 ఏప్రిల్ 7న ప్రధాని మోదీ కూచ్ బెహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ ఏప్రిల్ 11న మొదటి దశలోనే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ ఈ ఫొటో 2015లో థాయ్‌లాండ్‌లోని సముట్ సఖోన్ ప్రావిన్స్‌కు సంబంధించినదని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా తెలిసింది. కాషాయ రంగు దుస్తులు ధరించి ఉన్నవారు బీజేపీ మద్దతుదారులు కాదు, వాళ్లంతా బౌద్ధ సన్యాసులు. డీఎంసీ టీవీ ఏమంటోంది? బౌద్ధమత కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేసే డీఎంసీ టీవీ ఈ ఫొటోను 2015 అక్టోబర్ 26న షేర్ చేసింది. డీఎంసీ అంటే ధామ్ మెడిటేషన్ బుద్ధిజమ్. ఈ వెబ్‌సైట్ కేవలం బౌద్ధ మతానికి సంబంధించిన కార్యక్రమాలు, సంస్కృతీ విశేషాలను అందించడానికే ఏర్పాటైంది. ఈ వెబ్‌సైట్ అభిప్రాయం ప్రకారం... థాయ్‌లాండ్‌లోని బౌద్ధులు బౌద్ధ సన్యాసులకు భిక్షను అందించే కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఇలాంటిది 2015లో కూడా ఓసారి జరిగింది. "పదివేల మంది సన్యాసులు సముట్ సఖోన్ దగ్గర భిక్షను స్వీకరించారు" అని వెబ్‌సైట్‌లో దీని గురించి రాసిన కథనానికి హెడ్‌లైన్‌ ఉంది. ఆ వెబ్‌సైట్ ప్రకారం... ఈ కార్యక్రమంలో బౌద్ధ సన్యాసులతో పాటు ప్రభుత్వ అధికారులు, మిలిటరీ సిబ్బంది, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి దాదాపు 70 ఫొటోలను ఈ వెబ్‌సైట్ పబ్లిష్ చేసింది. సముట్ సఖోన్‌లోని ఎక్కచాయ్ రోడ్ దగ్గర ఈ భిక్ష స్వీకరణ జరిగింది అని తెలిపింది. ఈ వెబ్‌సైట్ చెబుతున్న వివరాలను 'గూగుల్ ఎర్త్' ద్వారా పరిశీలించాం. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు, 'గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో చూసిన ఫొటోలకు చాలా పోలికలున్నాయి. పసుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన భవనం, ముదురు ఎరుపు రంగులో ఉన్న మరో భవనం, రోడ్డుకు ఎడమవైపున టెలిఫోన్ స్తంభాలతో పాటు చుట్టూ ఉన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఒకే ఫొటో - వేర్వేరు సందర్భాలు ఈ ఫొటోను సంబంధం లేకుండా ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. 2018లో కూడా మన దేశంలో హిందువులను ఉద్దేశిస్తూ ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో కొందరు షేర్ చేశారు. "ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని బెంగాలీ హిందువులతో 'జై శ్రీరామ్' అని రాయించడం. చూడండి.. ఎంతమంది హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో. మీరూ షేర్ చెయ్యండి" అని ఆ ఫొటో కింద రాసి ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఈ ఫొటోతో ప్రస్తుతం షేర్ అవుతున్న సమాచారం అవాస్తవం. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ర్యాలీకి హాజరైన జనసందోహం అంటూ ఓ ఏరియల్ ఫొటో ఫేస్‌బుక్, ట్విటర్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. text: ప్రస్తుతం సోష‌ల్ మీడియా ప్రాధాన్య‌త పెరుగుతున్న రీత్యా ఆ వేదిక‌ల మీద కూడా పెద్ద మొత్తంలో వెచ్చించి, ప్ర‌చార కార్య‌క‌లాపాలు సాగించేందుకు వివిధ రాజ‌కీయ పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. తెలుగులో కూడా నెటిజ‌న్ల సంఖ్య అమాంతంగా పెర‌గ‌డం, డేటా వినియోగం విస్తృతం కావ‌డంతో ఎన్నిక‌ల వేళ అన్ని రాజ‌కీయ పార్టీల దృష్టి సోషల్ మీడియాపై ప‌డింది. 2019 ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియా ప్రచారానికి ఆంధప్రదేశ్‌లోని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు పోటీ పడుతున్నాయి. ప్ర‌ధానంగా ఫేస్ బుక్ కేంద్రంగా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు రెండు పార్టీలు ముమ్మ‌రం చేశాయి. యాడ్ లైబ్రరీ రిపోర్ట్ అందించిన వివరాలు గమనిస్తే ఈ రెండు పార్టీలు ఫేస్‌బుక్‌లో ప్రచారానికి భారీగానే ఖర్చు చేస్తున్నాయని తెలుస్తుంది. ఏమిటీ యాడ్ లైబ్రరీ రిపోర్ట్ ఫేస్‌బుక్‌లో తమ పేజీలను ప్రమోట్ చేసుకునే వినియోగదారుల వివరాలను ఆ సంస్థ యాడ్ లైబ్రరీ పేరుతో ఒక రిపోర్టులో వెలువరిస్తోంది. దీనిలో శోధించి వివిధ సంస్థలు, వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ప్రచారానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. యాడ్ లైబ్రరీ రిపోర్ట్ ప్ర‌కారం ఫేస్‌బుక్‌లో ప్రచారానికి ఖర్చు చేసినవారిలో ఏపీలో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు దేశంలోనే టాప్ 50లో నిలిచారు. గ‌త ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు వివిధ సంస్థలు, వ్యక్తులు చేసిన వ్య‌యంపై యాడ్ లైబ్ర‌రీ రిపోర్ట్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా 2,501 మంది త‌మ విధానాలు, వివిధ పోస్టుల‌ ప్ర‌చారం కోసం కోట్ల రూపాయిలు వ్య‌యం చేశారు. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ 27వ స్థానంలో, ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు 44వ స్థానంలో నిలిచారు. ఈ కాలంలో జ‌గ‌న్.. లక్షా 79 వేల 682 రూపాయలు, చంద్ర‌బాబు 90 వేల 975 రూపాయలు ఖర్చు చేశారు. వీరిద్ద‌రితో పాటుగా ఈ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చెందిన ప‌లువురు నేత‌లున్నారు. వైసీపీ రాజ‌కీయ స‌ల‌హాదారుడిగా చేసిన ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ (ఐ ప్యాక్) కూడా ఆ పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మం కోసం పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేసింది. వైసీపీ డిజిట‌ల్ ప్ర‌చారం కోసం రూ.53,392లు ఖ‌ర్చు చేశారు. భార‌తీయ జ‌నతాపార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.50,061 లు వ్య‌యం చేయ‌గా, తెలుగుదేశం పార్టీ రూ. 35,867 వెచ్చించింది. టీడీపీ నేత‌లు ఈ ఎన్నిక‌ల్లో నినాదంగా చెబుతున్న ‘మ‌ళ్లీ నువ్వే రావాలి’ ఫేస్‌బుక్ పేజీ ప్ర‌చారం కోసం పెద్ద మొత్తంలో యాడ్స్ ఇవ్వ‌గా, వైసీపీ త‌రుపున ‘జ‌గ‌నన్న‌కి తోడు’గా ప్ర‌చారం కోసం భారీగా ఖ‌ర్చు చేశారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తన ఫేస్‌బుక్ పేజీ ప్రచారానికి రూ. 39,288, ఏపీసీసీ అధ్య‌క్షుడు ఎన్ ర‌ఘువీరా రెడ్డి రూ. 34, 051 ఖ‌ర్చు చేసినట్లు రిపోర్ట్‌లో ఉంది. ఈ జాబితాలో బీజేపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, తెలుగు యువ‌త అధ్య‌క్షుడు దేవినేని అవినాష్, గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీ అభ్య‌ర్థి న‌ల్ల‌మిల్లి శేషారెడ్డి వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. ‘ప్రచారంలో ఇవన్నీ సాధారణమే’ వైసీపీ త‌రుపున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఐ ప్యాక్ ప్ర‌తినిధి బ్రహ్మ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ ఇది సాధార‌ణ‌మైన విష‌య‌మేన‌ని అన్నారు. దాదాపుగా అంద‌రూ ఇలాంటి ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నార‌ని చెప్పారు. టీడీపీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు పోటీగా తాము కూడా కొన్ని పోస్టుల‌ను ప్ర‌మోష‌న్ కోసం ప్ర‌య‌త్నించామ‌న్నారు. ‘‘గ‌తంలో ఆర్గానిక్ రీచ్ ఉండేది. కానీ, ఫిబ్ర‌వ‌రిలో ప్రచారానికి కొంత మొత్తం వ్య‌యం చేశాం’’ అని తెలిపారు. ఇదే విష‌యంపై టీడీపీ సోష‌ల్ మీడియా విభాగాన్ని బీబీసీ సంప్రదించగా తాము పూర్తిగా ప‌రిశీలించాల్సి ఉంద‌ని చెప్పారు. ‘ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి’ ప్రమోట్ చేసే పేజీల వల్ల భవిష్యత్తులో సామాన్యుల స్వరానికి చోటు లేకుండా పోయే ప్రమాదం ఉందని పాత్రికేయుడు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టు విజ‌య్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ ప‌రిణామాలపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "సోష‌ల్ మీడియా అనేది ఇప్పుడు రాజ‌కీయ‌ల‌కు పెద్ద వేదిక‌గా మారింది. గ‌తంలోనే దాని ఫ‌లితాలు అనుభ‌విస్తున్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో మ‌రింత మంది వినియోగ‌దారులు పెర‌గ‌డంతో ప్రాధాన్య‌త మ‌రింత పెరిగింది. మిగిలిన సోష‌ల్ మీడియా వేదిక‌లతో పోలిస్తే ఫేస్ బుక్ ఎక్కువ మందిని ఆక‌ర్షించ‌డంతో అంద‌రి దృష్టి దీనిపై పడింది. దానికి త‌గ్గ‌ట్టుగానే యాడ్స్ కోసం ఎక్కువ‌గా వ్య‌యం చేయ‌డం పెరుగుతోంది. అయితే, అలాంటి ప్ర‌మోటింగ్ పోస్టుల కంటే సాధార‌ణ ప్ర‌జల వాణికే ఎక్కువ ప్రాధాన్య‌త క‌నిపిస్తోంది. ప్రమోట్ చేసే పేజీలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. పెయిడ్ న్యూస్ మాదిరిగానే సోష‌ల్ మీడియాలో చేస్తున్న వ్య‌యంపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలి. ఎన్నిక‌ల ఖ‌ర్చులో లెక్కిస్తున్న‌ప్ప‌టికీ సంపూర్ణ యంత్రాంగం ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ పెర‌గాలి" అని తెలిపారు. సోష‌ల్ మీడియా ఫ‌ర్ సొసైటీ (ఎస్ఎంఎస్) క‌న్వీన‌ర్ కె శ్రీనివాస‌రావు బీబీసీతో మాట్లాడుతూ "సామాజిక మాధ్య‌మాల‌లో కూడా పెయిడ్ ప్ర‌చారం పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌క‌రం. ప్ర‌ధాన పార్టీలు రెండూ ఎన్నిక‌ల ముంగిట అనేక ప‌ద్ధ‌తుల్లో మ‌భ్య పెడుతున్న‌ట్టుగానే ప్ర‌జాభిప్రాయాల‌ను త‌మ‌కనుగుణంగా మ‌ల‌చుకునేందుకు సోష‌ల్ మీడియాలో ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. సాధార‌ణ ప్ర‌జ‌ల అభిప్రాయాల క‌న్నా పార్టీల పెయిడ్ ప్ర‌చారం జోరుగా సాగుతుండడం శ్రేయ‌స్క‌రం కాదు. ఇలాంటి ప్ర‌చార జిమ్మిక్కుల‌ను జ‌నం అర్థం చేసుకోవాలి" అని సూచించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లు మార్గాలు అన్వేషిస్తాయి. అందులో ప్ర‌చార ప‌ర్వంలో ప‌లు ప‌ద్ధ‌తులు అనుస‌రించి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. text: అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టు వారి జీవితంలోకి చీకటెలా వచ్చింది..? అంధుల క్రికెట్ ఆ చీకటిని ఎలా పారదోలింది..? అంధుల క్రికెట్‌కు సాధారణ క్రికెట్‌కు ఉన్న తేడా ఏంటి..?.. ఇలాంటి ఎన్నో విషయాలను వారు పంచుకున్నారు. అంధుల క్రికెట్‌లో కొన్నాళ్లుగా భారత్ సత్తా చాటుతోంది. తాజాగా షార్జాలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ పాకిస్తాన్‌పై ఉత్కంఠభరిత పోరులో గెలిచింది. ఈ జట్టుకు కెప్టెన్ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన అజయ్ కుమార్ రెడ్డి. ఆయనతో పాటు మరో నలుగురు తెలుగు క్రీడాకారులు మహేంద్ర, వెంకటేశ్వరరావు, దుర్గారావు, ప్రేమ్‌కుమార్‌లు ప్రస్తుతం ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్నారు. జాతీయ జట్టులో మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉండగా అందులో అయిదుగురు తెలుగువారే ఉండడానికి కారణం ప్రతిభతో పాటు జోనల్ స్థాయి నుంచి వారికి అందుతున్న ప్రోత్సాహమేనన్నది వారి మాట. భారత జట్టు కెప్టెన్ అజయ్ రెడ్డి అంధుల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్! నాలుగేళ్ల వయసులో తలుపు గడియ తగలడంతో అజయ్ ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆ గాయం వల్ల సోకిన ఇన్ఫెక్షన్ కారణంగా క్రమంగా కుడికన్ను చూపూ మందగించింది. ఇప్పుడాయన తన కుడికంటితో, అది కూడా 2 నుంచి 3 మీటర్లలోపు దూరంలోని వస్తువులను మాత్రమే పాక్షికంగా చూడగలరు. చిన్నతనంలో క్రికెట్‌పై ఉన్న విపరీతమైన ఆసక్తితో ఆయన అందరితోపాటే క్రికెట్ ఆడేవారు. బంతిని గుర్తించలేక ప్రతి రోజూ ఆటలో దెబ్బలు తగిలించుకునేవారు. అంధుల పాఠశాలలో చేరాక అక్కడ అంధులకు ప్రత్యేకంగా క్రికెట్ ఉందని తెలుసుకుని అందులో రాణించారు. నాలుగుసార్లు ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న అజయ్ అంధుల క్రికెట్‌లో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్ అని సహచరుడు మహేంద్ర తెలిపారు. బ్యాటింగులోనూ అజయ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 56 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 12 సెంచరీలు చేశారు. వరల్డ్ కప్ విజయం తరువాత దిల్లీకి చేరుకున్న భారత జట్టులోని తెలుగు ఆటగాళ్లు అజయ్ కుమార్ రెడ్డి, ప్రేమ్ కుమార్, మహేంద్ర ఒక్కొక్కరిది ఒక్కో కథ.. * ఇక మిగతావారిలో మహేంద్ర హైదరాబాద్‌వాసి. మూడేళ్ల వయసులో మందులు వికటించడంతో కంటిచూపు కోల్పోయారు. ఇప్పటివరకు రెండు వరల్డ్‌కప్‌లు ఆడిన ఆయన ప్రస్తుతం స్టేట్‌బ్యాంకులో పీవోగా పనిచేస్తున్నారు. క్రీడాకోటాలో కాకుండా ప్రతిభ ఆధారంగా ఆయన ఉద్యోగాన్ని సాధించారు. * కర్నూలుకు చెందిన ప్రేమ్‌కుమార్ చిన్నతనంలో చికెన్‌పాక్స్ సోకినప్పుడు చూపు కోల్పోయారు. క్రికెట్‌లోనే కాదు, పాటలు పాడడంలోనూ మంచి ప్రతిభావంతుడు ఈయన. వివిధ టీవీ ఛానళ్లు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. * వెంకటేశ్వరరావుది శ్రీకాకుళం జిల్లా. చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుండగా బంతి కంటికి తాకడంతో చూపు కోల్పోయిన ఆయన ఆ తరువాత కూడా క్రికెట్‌ను కొనసాగిస్తున్నారు. * శ్రీకాకుళం జిల్లాకే చెందిన దుర్గారావు ఆల్‌రౌండర్‌గా జట్టులో రాణిస్తున్నారు. చిన్నతనంలో ప్రమాదవశాత్తు చూపు కోల్పోయిన ఆయన రెండు ప్రపంచకప్‌లలో ఆడారు. అంధుల క్రికెట్‌లో వాడే బంతిలో బాల్ బేరింగులుంటాయి. దాంతో, బంతి నుంచి వచ్చే శబ్దం ఆధారంగా దాని జాడ గుర్తిస్తారు. ఎలా ఆడతారు? * సాధారణ క్రికెట్‌కు, అంధుల క్రికెట్‌కు ఉన్న ప్రధాన తేడా బంతి. సింథటిక్ ఫైబర్‌తో తయారుచేసే ఈ బంతిలో బాల్‌బేరింగులు ఉంటాయి. * దాంతో బంతి వస్తున్నప్పుడు శబ్దం చేస్తుంది. బ్యాట్స్‌మన్ కానీ, ఫీల్డర్ కానీ ఆ శబ్దం ఆధారంగా బంతి జాడ గ్రహించి ఆడతారు. * బౌలింగ్ విషయానికొస్తే సాధారణ క్రికెట్ మాదిరిగా కాకుండా అండర్ ఆర్మ్ బౌలింగ్ చేస్తారు. అయితే, సాధారణ క్రికెట్ మాదిరిగానే ఇందులోనూ బాల్ వేగంగా వేసే బౌలర్లు ఉన్నారు. అందరూ పూర్తిగా అంధులు కారు.. * జట్టులోకి నాలుగు క్యాటగిరీల్లో ఆటగాళ్లను తీసుకుంటారు. * బీ1 క్యాటగిరీలో పూర్తిగా అంధులైన నలుగురు ఆటగాళ్లుంటారు. * బీ2లో పాక్షికంగా అంధులైన ముగ్గురు ఆటగాళ్లుంటారు. వీరు 3 మీటర్ల దూరం వరకు చూడగలిగే సామర్థ్యంతో ఉంటారు. * బీ3 క్యాటగిరీలో నలుగురు ఆటగాళ్లుంటారు. వీరు 5 నుంచి 6 మీటర్ల దూరం వరకు చూడగలరు. * మిగతా ఆటగాళ్లు బీ4 క్యాటగిరీలో ఉంటారు. వీరికి ఇంకొంచెం మెరుగైన దృష్టి ఉంటుంది. ట్రోఫీతో భారత అంధుల క్రికెట్ జట్టు ఆటగాళ్లు 'క్రీడా కోటాలో మాకూ అవకాశమివ్వాలి' అంధ క్రికెటర్లకు క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాలు సహకరించాలని వీరు కోరుతున్నారు. మిగతా క్రీడల్లో ఆటగాళ్లకు ఇస్తున్నట్లుగా తాము భారీ నజరానాలేమీ కోరుకోనప్పటికీ ఉద్యోగాలు కల్పిస్తే చాలని, బీసీసీఐ నుంచి కూడా సహకారం అవసరమని అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వారి కళ్లు వెలుగును చూడలేకున్నా, వారి కళ్లలో మాత్రం గెలుపు తెచ్చిన వెలుగు మిలమిలా మెరుస్తోంది. అంధుల క్రికెట్ ప్రపంచ కప్‌ను మరోసారి భారత్‌ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు తెలుగు క్రీడాకారులతో 'బీబీసీ తెలుగు' మాట్లాడింది. text: ప్రతీకార దాడులు జరగొచ్చు. తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావొచ్చు. ఈ క్రమంలో చోటు చేసుకునే అనేక రకాల చర్యలు-ప్రతిచర్యలు నేరుగా తలపడేలా రెండు దేశాలను క్రమంగా మరింత దగ్గర చేయవచ్చు. ఇరాక్‌లో అమెరికా భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ విధానం గతంలో ఎన్నడూ లేనంతగా విషమ పరీక్ష ఎదుర్కొంటుంది. సులేమానీని చంపేయడం అంటే 'ఇరాన్‌పై అమెరికా ఒక రకంగా చిన్నపాటి యుద్ధం ప్రకటించడమే' అని ఒబామా హయాంలో పశ్చిమాసియా, పర్షియన్ గల్ఫ్‌ వ్యవహారాల సమన్వయకర్తగా పనిచేసిన ఫిలిప్ గోర్డన్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ భద్రతా దళాల్లో కడ్స్ దళం ఒక భాగం. ఇది విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. లెబనాన్‌, ఇరాక్, సిరియా లేదా ప్రపంచంలో మరెక్కడైనాగానీ ఇరాన్‌ ప్రాబల్యాన్ని పెంచడంలో సులేమానీ కీలక పాత్ర పోషించారు. ఇరాన్ ప్రాబల్యాన్ని విస్తరించడానికి దాడులకు వ్యూహ రచన చేయడం, లేదా స్థానికంగా ఉన్న టెహ్రాన్ మిత్రులకు సాయం చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేశారు. ఈ పనిలో సులేమానీని అందరికంటే ముందు ఉంటారు. సులేమానీ నేతృత్వంలో అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం వాషింగ్టన్ దృష్టిలో 'సులేమానీ అమెరికన్ల రక్తం కళ్లజూసిన వ్యక్తి'. కానీ ఇరాన్‌లో ఆయన చాలా ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా టెహ్రాన్‌ ఉద్యమానికి ఆయనే నాయకత్వం వహించారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సులేమానీపై ఓ కన్నేసి ఉంచడంలో ఆశ్చర్యం లేదు. కానీ అమెరికా సేనలు ఆయన్ను ఇప్పుడే ఎందుకు చంపేశాయి? అన్నదే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై వరసగా జరిగిన అనేక చిన్నపాటి రాకెట్ దాడులు ఇరానే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో ఒక అమెరికన్ కాంట్రాక్టర్ చనిపోయారు. కానీ అంతకుముందు గల్ఫ్‌లో ట్యాంకర్లకు వ్యతిరేకంగా ఇరాన్ చేపట్టిన ఆపరేషన్లు, మానవ రహిత ఏరియల్ వెహికిల్‌ను కూల్చేయడం, సౌదీలోని కీలక చమురు కేంద్రంపై దాడి.. ఇవన్నీ అమెరికా ఎలాంటి ప్రతిస్పందన లేకుండానే జరిగిపోయాయి. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్ దాడుల వెనుక ఇరాన్ అనుకూల దళాలు ఉన్నాయని పెంటగాన్ అనుమానిస్తోంది. ఇప్పటికే వాటిని తిప్పికొట్టింది. అది బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ కాంపౌండ్‌పై దాడికి దారి తీసింది. సులేమానీని చంపేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనక గతంలో జరిగిన సంఘటనలను మాత్రమే పెంటగాన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ దాడితో ఒకరకంగా హెచ్చరిక పంపించింది. 'ఇరాక్‌తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారులపై దాడి చేసేందుకు చాలా చురుకుగా ప్రణాళికలు రచిస్తున్నారు' అని పెంటగాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ఏం జరుగుతుంది ఇకపై ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక రకంగా ఇరాన్‌ను భయపెట్టి, తన చేతలకు వాడి తగ్గలేదని- ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటిచోట పెరుగుతున్న అమెరికా వ్యతిరేక శక్తులకు హెచ్చరిక పంపించామని ట్రంప్ భావిస్తూ ఉండొచ్చు. కానీ అమెరికా చర్యకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇరాన్‌ నుంచి ఎలాంటి ప్రతిచర్య ఉండదని ఎట్టిపరిస్థితుల్లో అనుకోవడానికి వీలు లేదు. ఇరాక్‌లో ఉన్న 5000 మంది అమెరికా సైనికులే కచ్చితంగా లక్ష్యంగా మారుతారు. ఇరాన్, దాని ప్రతినిధులు గతంలో చేసిన దాడులు కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఈ ఉద్రిక్త వాతావరణంతో మొదటగా చమురు ధరలకు రెక్కలు వస్తాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అమెరికా, దాని మిత్ర పక్షాలు తమ రక్షణపై దృష్టిపెడతాయి. బాగ్దాద్‌లోని తన రాయబార కార్యాలయానికి వాషింగ్టన్ ఇప్పటికే కొన్ని అదనపు బలగాలను పంపించింది. అవసరమైతే ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా తమ బలగాల సంఖ్యను పెంచుకోవాలనే ప్రణాళికల్లో అమెరికా ఉంది. కానీ ఇరాన్ స్పందన అసమానంగా ఉండేందుకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే.. దాడికి ప్రతిదాడి చేయకపోవచ్చు. ఈ ప్రాంతంలో ఇరాన్‌కున్న అనూహ్య మద్దతుతో అది వ్యూహాత్మకంగా ప్రవర్తించొచ్చు. ఈ ప్రాంతంలో సులేమానీ పెంచి పోషించిన ఎన్నో శక్తులు ఇరాన్‌కు అండగా నిలవొచ్చు. ఉదాహారణకి బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇరాక్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, అక్కడ అమెరికా బలగాల మోహరింపును ప్రశ్నించడం.. ఇతర దాడుల కోసం ఎక్కడైనా నిరసన ప్రదర్శనలను ప్రోత్సహించడం చేయవచ్చు. ఇరాన్ కడ్స్ దళ కమాండర్‌ కాసిం సులేమానీపై దాడి అమెరికా సైన్యం ఇంటెలిజెన్స్, శక్తి, సామార్థ్యాలకు నిదర్శనం. ఆయన మరణించినందుకు ఈ ప్రాంతంలో చాలా మంది బాధపడరు. కానీ ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తెలివైన పనేనా? ఈ దాడి తర్వాత ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు పెంటగాన్ సిద్ధంగా ఉందా? ఈ ప్రాంతంపై ట్రంప్ వ్యూహం గురించి ఈ దాడి ఏం చెబుతోంది? ఇదేమైనా మారిందా? తమ ఇరాన్ ఆపరేషన్లలో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించేది లేదనే సంకేతం ఈ దాడిలో దాగి ఉందా? లేదంటే ఈ దాడి 'చాలా చెడ్డ వ్యక్తి' అని భావిస్తున్న ఒక ఇరాన్ కమాండర్‌ను అమెరికా అధ్యక్షుడు లేపేయడం మాత్రమేనా? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఒక చిన్న వివాదం నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌ - కడ్స్ దళ కమాండర్‌ కాసిం సులేమానీ మరణానికి దారి తీసింది. దీని పరిణామాలు గణనీయంగా ఉండబోతున్నాయి. text: వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిన వారి సంఖ్య ఈ నెల 26 నాటికి 2,835 కాగా, 27 నాటికి 4,515కు పెరిగింది. కొత్తగా వైరస్ సోకినవారి సంఖ్య దాదాపు రెట్టింపైంది. 106 మరణాల్లో అత్యధికంగా 100 హుబేయ్ రాష్ట్రంలోనే సంభవించాయి. ఈ రాష్ట్రంలో వైరస్ సోకినవారి సంఖ్య 2,714కు పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు లేదా ఇప్పటికే శ్వాసకోశ సమస్యలున్నవారు. హుబేయ్‌లో వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ, చికిత్స కార్యక్రమాల్లో ఐదు లక్షల మందికి పైగా వైద్య సిబ్బంది పాలుపంచుకొంటున్నారు. కరోనావైరస్ తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. దీనికి నిర్దిష్టమైన టీకాగాని, దీనిని నయం చేసేందుకు నిర్దిష్టమైన చికిత్సగాని లేవు. దీన్ని నిరోధించాలంటే ఇన్‌ఫెక్షన్ సోకినవారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడటమే మార్గం. చైనాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇతర దేశాల్లో పెరిగిన కేసులు ఇతర దేశాల్లోనూ కరోనావైరస్ కేసులు పెరిగాయి. సింగపూర్, జర్మనీల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. చైనా వెళ్లే అమెరికన్లు పునరాలోచించుకోవాలని అమెరికా అధికార యంత్రాంగం సూచించింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న హుబేయ్ రాష్ట్రానికి వెళ్లొద్దని సలహా ఇచ్చింది. వైరస్ కేంద్ర స్థానం, హుబేయ్ రాష్ట్ర రాజధాని అయిన వుహాన్ నుంచి రానున్న రోజుల్లో తమ కాన్సులర్ సేవల సిబ్బందిని విమానాల్లో రప్పించేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. అత్యవసరమైతే తప్ప చైనా వెళ్లొద్దని చాలా దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తున్నాయి. వుహాన్‌లో చిక్కుకుపోయిన తమ ప్రజలను రప్పించేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వుహాన్‌ నగరంలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ఆయా దేశాల అధికారుల సమాచారం ప్రకారం చైనా వెలుపల థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో మొత్తం 47 కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ వల్ల చైనా వెలుపల ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు. చైనా వెలుపలి బాధితుల్లో దాదాపు అందరూ ఇటీవల వుహాన్‌కు వెళ్లి వచ్చినవారే. యూరప్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఏ దేశంలో ఎన్ని కేసులు? ఎనిమిది: థాయ్‌లాండ్ ఐదు: అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్ నాలుగు: మలేషియా, దక్షిణ కొరియా, జపాన్ మూడు: ఫ్రాన్స్ రెండు: వియత్నాం ఒకటి: నేపాల్, శ్రీలంక, కెనడా, జర్మనీ, కంబోడియా మాస్కులు ధరించిన చైనా పోలీసు అధికారులు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు బయటపడక ముందే కరోనావైరస్ ఇతరులకు సోకగలదని చైనా అధికార యంత్రాంగం చెబుతోంది. చైనాలో మరిన్ని ఆంక్షలు వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా చైనా కొత్త సంవత్సర సెలవులను పాలనా యంత్రాంగం మరో మూడు రోజులు అంటే ఆదివారం వరకు పొడిగించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు చైనా పాలనా యంత్రాంగం దేశంలో ప్రజల ప్రయాణాలపై మరిన్ని ఆంక్షలు విధించింది. వివిధ ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపివేసింది. వుహాన్‌లో అత్యవసర సేవల వాహనాలను తప్ప ఇతర వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. రాజధాని బీజింగ్ నుంచి పొరుగునే ఉండే హుబేయ్ రాష్ట్రానికి బస్సు సర్వీసుల్లో అత్యధికం నిలిపివేశారు. బీజింగ్‌తోపాటు మరో ప్రధాన నగరం షాంఘైలో హుబేయ్ నుంచి వచ్చేవారిని రెండు వారాలపాటు పరిశీలనలో ఉంచుతున్నారు. షాంఘై, హాంకాంగ్‌లలో డిస్నీలాండ్ పార్కులను మూసివేశారు. హుబేయ్‌‌లో వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ, చికిత్స కార్యక్రమాల్లో ఐదు లక్షల మందికి పైగా వైద్య సిబ్బంది పాలుపంచుకొంటున్నారు. ఈ రాష్ట్రంలో కనీసం రెండు వేల పడకలతో రెండు తాత్కాలిక ఆస్ప్రతులను నిర్మిస్తున్నారు. కర్మాగారాల్లో మాస్కుల ఉత్పత్తిని, వైరస్ నుంచి రక్షణ కోసం ధరించే దుస్తుల ఉత్పత్తిని పెంచారు. వుహాన్ జనాభా కోటీ పది లక్షలు. రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి రాక ముందే, చైనా కొత్త సంవత్సర సెలవుల నేపథ్యంలో లక్షల మంది వుహాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని నగర మేయర్ చెప్పారు. నావెల్ కరోనావైరస్(2019-ఎన్‌సీవోవీ) చైనాలో వ్యాపిస్తున్న వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రస్తుతానికి నావెల్ కరోనా వైరస్(2019-ఎన్‌సీవోవీ) అని వ్యవహరిస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనావైరస్‌ల కుటుంబానికి చెందినది. గతంలో ఈ వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ బాధితుల్లో 9 శాతం మంది, మెర్స్ బాధితుల్లో ఇంచుమించు 35 శాతం మంది చనిపోయారు. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. కరోనావైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో ఉండటంతో దీనికా పేరు పెట్టారు. ఈ వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు, ఇది గబ్బిలాల్లో కనిపించే కరోనావైరస్, పాములో ఉన్న వైరస్‌తో కలసి కొత్తగా పుట్టిందని పరిశోధకులు గుర్తించారు. చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చైనాలో కరోనావైరస్ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య 106 చేరింది. text: కర్ణాటకలో శాసనసభకు జరగబోతున్న ఎన్నికలు దీనికి మినహాయింపు ఏమీ కాదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మార్చి 19న నాలుగు గంటల పాటు వాడివేడిగా సాగిన కేబినెట్ సమావేశం తరువాత.. లింగాయతులకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో తమ ప్రభుత్వం ‘‘లింగాయతుల’’ను (బసవ తత్వాన్ని అనుసరించే) వారిని 1994 కర్ణాటక రాష్ట్ర మైనారిటీ చట్టం సెక్షన్ 2 (డి) కింద అల్పసంఖ్యాక మతంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచందర్ తమ ప్రభుత్వం లింగాయతులను జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం ద్వారా జాతీయ స్థాయిలో మైనారిటీగా గుర్తించాలని కోరుతుందని చెప్పారు ప్రభావం చూపగల సత్తా ఉన్న వారు 2018 మే నెలలో కర్ణాటక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న లింగాయతులు.. మొత్తం 224 నియోజకవర్గాలకు గాను 100 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గం. చాలా కాలంగా.. కర్ణాటకలో శైవం పునాదిగా ఉన్న లింగాయతులు తమది ప్రత్యేక మతం అని వాదిస్తూ ఉన్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి ఈ సామజిక వర్గం పైకి ఎదగడం ప్రారంభమయింది. ప్రముఖ రాజనీతి శాస్త్ర పరిశోధకుడు రజనీ కొఠారీ తన ''కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్'' పుస్తకంలో దేశంలో ఎదిగి వస్తున్న ప్రముఖ కులాల్లో కర్ణాటకలో లింగాయతులు, ఒక్కలిగలు ఉన్నారని పేర్కొన్నాడు. కర్ణాటకలోని తీర ప్రాంతం మినహాయిస్తే మిగతా అంతటా వీరు తమ రాజకీయ ప్రభావం చూపగల సత్తా ఉన్న వర్గంగా ఎదిగారు. వీరికి ప్రస్తుతం మత మైనారిటీ హోదా కల్పించడం ద్వారా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందజూస్తున్నది. ఈ సామజిక వర్గం వారు కాంగ్రెస్‌కు దగ్గర‌గా ఉండే వారు. గత రెండున్నర దశాబ్దాలుగా వీరు బీజేపీకి బలమైన మద్దతుదారులుగా మారారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ వర్గానికి చెందిన నాయకుడే. చాలా కాలంగా లింగాయత మతస్తులు ప్రత్యేకమైన మత గుర్తింపును ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోని ప్రముఖ నాయకులు చాలా సందర్భాలలో ఈ ఆలోచనకు మద్దతు తెలిపిన వారే. ఇది బీజేపీ ప్రాతినిధ్యం వహించే 'అఖండ హిందూ' మతం అనే భావనకు పొసగదు. మైనారిటీ హోదా వస్తే భారత రాజ్యాంగంలోని 25, 28, 29, 30 అధికరణల కింద లభించే అనేక సదుపాయాలు పొందవచ్చునని లింగాయత వర్గ పెద్దల భావన. సిద్దరామయ్య ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నగమోహన్‌దాస్ అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీని గత డిసెంబర్‌లో ఏర్పాటు చేసింది. కమిటీ తన రిపోర్టును ఈ నెలలో ఇచ్చింది. సిద్ధరామయ్య ప్రభుత్వం వెంటనే ఈ సిఫారసులను ఆమోదించింది. రాష్ట్ర స్థాయిలో లింగాయతులకు మైనారిటీ హోదా ఇస్తున్నామని ఆచితూచిన మాటలతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్రం స్థాయిలో లింగాయత మతం మైనారిటీ స్థాయిని ఇప్పట్లో అందుకోలేదని తెలిసి.. కేంద్రం ఆ పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఇది రాజకీయ గడుసరితనం. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా లింగాయతులు - వీరశైవ సామాజిక వర్గాల మధ్య గల అంతరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నది. ఐతే ఈ ఎత్తుగడ అనుకున్న ఫలితాలను ఇస్తుందా అన్నది వేచి చూడవలసిందే. ఏమిటీ లింగాయత మతం? భారత ఉపఖండంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల భక్తి ఉద్యమ కాలంలో పన్నెండవ శతాబ్దానికి చెందిన వీరశైవ మహా సంస్కర్త బసవేశ్వరుడు. ఆ నాటి వర్ణ వ్యవస్థ, దానిలో గల ఆధిపత్యాలను తిరస్కరించి, కులాల అంచెలతో, పుట్టుకతో వచ్చే హెచ్చుతగ్గులను తిరస్కరించి సామజిక సమానత్వం పునాదిగా, లింగాయత మతాన్ని ప్రారంభించాడు. శ్రమయే దైవం అని, దేహమే దేవాలయం అని, స్త్రీ పురుషులు సమానం అని, మొత్తంగా పుట్టుక పునాది ఆధిపత్య విలువలతో ఉన్న తన సమకాలీన మత సామజిక స్థితి మీద తిరుగుబాటు చేశాడు. అనుభవ మంటప అనే చర్చా వేదిక ఏర్పాటుచేసి కుల భేదం, లింగ భేదం లేకుండా.. మత, ఆధ్యాత్మిక సాంస్కృతిక, జీవన వ్యవహారానికి సంబధించిన విషయాలను స్వేచ్ఛగా చర్చించుకునే వీలు కల్పించాడు. విగ్రహారాధన స్థానంలో ఇష్ట లింగ ఉపాసన అనే మానసిక ఉపాసనను ప్రవేశాపెట్టాడు బసవన్న. ఒక్క మాటలో అనాడు అమలులో ఉన్న గురువుల, మఠాల ఆధిపత్యంలో ఉన్న మతాన్ని కాదని.. శివతత్వాన్ని ఆధ్యాత్మిక ప్రజాస్వామికత వైపు నడిపిన సంప్రదాయం బసవన తత్వం. వేదాల పవిత్రతను, ప్రామాణికతను, దానికి సంబంధించిన ఆచారాలను తిరస్కరించి సంస్కృత ప్రాధాన్యత లేని కన్నడ భాషలో లోతైన ఆధ్యాత్మిక అనుభవాలను, సామజిక నీతిని కలిపిన శరణ సాహిత్యాన్ని బసవన సంప్రదాయం సృష్టించింది. తరువాతి కాలంలో ఈ బసవన సంప్రదాయం కూడా పలు కులాలుగా విడిపోయింది. ఒక అంచనా ప్రకారం లింగాయతుల్లో తొంభై రెండు కులాలు ఉన్నాయి. వారిలో వీర శైవులు ఉన్నారు. భక్తి ఉద్యమం తరువాత సిక్కు మతం ప్రత్యేక మతంగా రూపు దిద్దుకున్నది. అయితే చాలా పురోగామి స్వభావం ఉండి, వైదిక మత పద్ధతుల నుండి దూరం జరిగినప్పటికీ లింగాయతులను శైవంలో ఒక పాయగా భావించబడటం వలన అది ప్రత్యేక మతంగా బలమైన గుర్తింపును పొందలేకపోయింది. భారత రాజ్యాంగ నిర్మాణ పరిషత్‌లో కూడా లింగాయత మతానికి ప్రత్యేక మతంగా గుర్తింపు ఇవ్వాలని చర్చ జరిగినా అది సాధ్యం కాలేదు. ముఖ్యంగా వీరశైవ లింగాయతులు తమ మఠాలు బసవన్న కంటే ప్రాచీనం అని పేర్కొంటారు. వీరి పంచాచార్య మఠాలు కాశీ, ఉజ్జయని, శ్రీశైలం, బాలే హొన్నూరు, కేదారనాథ్‌లలో ఉన్నాయి. ఇవి ఇతర హిందూ మతస్తులకూ దర్శనీయ స్థలాలు. బసవన మార్గం నమ్మే వారు ఈ మఠాల ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. మల్లిఖార్జున కల్బుర్గి, గౌరీ లంకేష్‌లు బసవన్న శరణు మార్గానికి, ఈ వీరశైవ మతాలకు పొత్తు కుదరదు అని గట్టిగా విశ్వసించిన వారు కావడం గమనించవలిసిన విషయం. వారి వాదనలు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించే ఏక రూప హిందూ మతం అనే వాదానికి వ్యతిరేకం అని వేరే చెప్పనవసరం లేదు. న్యాయపరమైన సవాళ్లు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉత్తర్వును వ్యతిరేకించే వారు ప్రభుత్వ నిర్ణయం కేవలం రాజకీయాలతో ప్రేరేపితం అయినదని, బసవన్న మార్గం విశాల హిందూ సంప్రదాయాలలో శైవ వాహినిలో అంతర్భాగం అని వాదించే అవకాశం ఉంది. ఒకవేళ ఎదైనా కారణాల వలన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గితే.. లింగాయత బృందాలు తమ ప్రత్యేకత ప్రాతిపదికను కోర్టు ముందుకు తీసుకుపోవచ్చును. హిందూ మతం అనేది ఒకే పుస్తకం.. ఒకే ప్రవక్త.. ఒకే దైవం అనే భావనల పునాది మీద ఉన్న మతం కాదని, అది ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రామకృష్ణ మిషన్ వారు 1995 వరకూ తాము మైనరిటీలం అనే వాదనను వినిపించినా కోర్టును ఒప్పించలేకపోయారు. ఏది ఏమైనా ఈ నిర్ణయం హిందూ మతం అంటే ఏమిటి? దానికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏమిటి? అన్న చర్చని మరోసారి న్యాయస్థానం ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. కర్ణాటకలో ఎన్నికల వేళ తీసుకున్న ఈ నిర్ణయం.. మిగితా కులాల వారికీ, మతాల వారికీ ఒరగబెట్టేది ఏమీ లేదని.. ఇది ఇప్పటికే ఆధిపత్య స్థానంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కింది కులాల మీద, దళితుల మీద, ఎంతో పెత్తనం చేస్తున్న కులానికి ఇస్తున్న కొత్త తాయిలం అన్న భావన కూడా వ్యక్తం అవుతున్నది. మొన్ననే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన కర్ణాటక ముఖ్యమంత్రికి ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలు అందజేస్తుందా లేక పుట్టి ముంచుతుందా అనేది చూడాలి. అయితే.. ఎన్నికల జోస్యులకు మాత్రం చేతినిండా పనికల్పించింది అనిపిస్తున్నది. ఇవి కూడా చూడండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మన దేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ప్రధాన చిరునామా అయికూర్చున్నాయి.ఎన్నికలలో గెలిచేందుకు అనేక వ్యూహ ప్రతి వ్యూహాలు. పోలింగ్ బూత్ స్థాయి నుండి అనేక సామాజిక వర్గాలను రకరకాలుగా సమీకరించడం ప్రధానంగా ఎన్నికలలో విజయ సాధనకు మార్గాలు అవుతున్నాయి. text: ''నేను పెళ్లి చేసుకోకపోతే నీకేంటి? చేసుకోవాలా, వద్దా అనేది నా ఇష్టం'' అంటూ ఒక్క గుద్దు గుద్దాలని అనిపించింది. కానీ ఇలా ఎంత మందిని కొట్టగలను? ''పెళ్లి ఎందుకు చేసుకోలేదు'' అనే ప్రశ్న వేసిన ప్రతి ఒక్కర్నీ కొట్టాలనుకొంటే, నేనా పని రోజూ చేయాల్సి వస్తుంది. అసలు నా కథేంటి? దాన్ని ఎక్కడ మొదలుపెట్టాలి? నేను ప్రేమలో విఫలమయ్యాను. తర్వాత ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయమే సమాజానికి పెద్ద సమస్యైపోయింది. నా నిర్ణయంతో ఇతరులకు సంబంధం ఏమిటి? వారికొచ్చిన బాధేంటి? నా స్నేహితులు, బంధువులు నన్నో భిన్నమైన వ్యక్తిగా చూస్తారు. ఇందుకు నా ప్రతిభాపాటవాలో, నా లక్షణాలో, నా వృత్తో కారణం కాదు. నేను 'ఒంటరి'గా ఉండడమే వారు నన్ను అలా చూడటానికి కారణం. పెళ్లి అయ్యిందా, కాలేదా? ఒంటరిగా ఉన్నావా, లేక రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? లేదు అని సమాధానం ఇస్తే చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తారు. మిమ్మల్ని చిత్రంగా చూస్తారు. మీపై సానుభూతి చూపే అవకాశాలూ ఎక్కువే. నేనో మెట్రోపాలిటన్ నగరానికి చెందినవాడిని. ఉద్యోగ నిమిత్తం మరో మెట్రోపాలిటన్ నగరంలో ఉంటున్నాను. బహుళ సంస్కృతుల మిశ్రమంగా ఉండే కాస్మోపాలిటన్ వాతావరణంలో పనిచేస్తున్నాను. నేను నివాసం ఉండే ప్రాంతం నగరంలోని విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రతీ ఒక్కరు ఆధునికంగా ఉంటారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. నా ఇరుగుపొరుగుకు నా గురించి తెలుసుకొనేంత తీరిక ఉండదు. బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి. ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి. నేను వ్యాయామం చేసే జిమ్, నాతో రోజూ మాట్లాడే చాయ్‌వాలా - తమ పని తాము చూసుకుంటారు. సాధారణ పలకరింపులు తప్ప వాళ్లతో మాట్లాడేది ఏమీ ఉండదు. నేను 'సింగిల్' అని తెలిశాక వారిలో ఏదో కుతూహలం మొదలవుతుంది. ''నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా'' అని ఆశ్చర్యంగా అడుగుతుంటారు. ''పెళ్లెప్పుడు చేసుకుంటావు'' అని ఎవరైనా అడిగినప్పుడు, నేను ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కాబోలు, కొందరు స్నేహితులు నా తరపున ''ఈ సంవత్సరం ఆఖర్లోగా చేసుకుంటాడు(!)'' అని సమాధానం ఇస్తుంటారు. ''హలో, ఆ ప్రశ్న నాకేమీ ఇబ్బంది కలిగించదు. పైగా, మీరంటున్న సంవత్సరాంతం ఎన్నడూ రాదు'' అని వాళ్లకు చెప్పాలనిపిస్తుంది. కొందరు వయసు, స్థాయీ బేధాలతో సంబంధం లేకుండా నన్ను నాకు తెలిసిన అమ్మాయిలకు ముడిపెట్టి మాట్లాడుతుంటారు. ఇలాంటి పుకార్లు ఆ అమ్మాయిలతో నాకున్న స్నేహాన్ని దెబ్బతిస్తాయనే ఆలోచన వాళ్లకు ఉండదు. ఏ నగరంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఇలా పుకార్లు పుట్టించేవారు ఎప్పుడూ ఉంటారు. నేను ఇప్పటివరకు శృంగారంలో పాల్గొన్నానో, లేదో కూడా తెలుసుకోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. సెక్స్‌ సామర్థ్యం కోణంలోనూ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యమేమైనా బాలేదా అని కొన్నిసార్లు నేరుగానే అడిగేస్తుంటారు. నాకు స్వలింగ సంపర్కంపై ఆసక్తి ఉందేమో తెలుసుకోవాలనే రీతిలోనూ ప్రశ్నలు వస్తుంటాయి. అలాంటిదేమీ లేదు. అదే వాస్తవమైతే నేను ఇంకో మగవాడితో సహజీవనం చేసేవాడిని కదా. ఇలాంటి ప్రశ్నలకు నేను కోపంగా సమాధానమిస్తే, నేను అంత స్నేహశీలిని కాదనే ముద్ర వేస్తారు. ఆ పరిస్థితి రాకూడదంటే నేను మౌనంగా ఉండాలి. నా వ్యవహారాల్లో నా చుట్టూ ఉన్న సమాజం తలదూరుస్తోందని ఎవరన్నారు? వాళ్లకు నా పట్ల పట్టింపు ఉంది. దానికి నేను అభ్యంతరం చెప్పకూడదు.. అంతే. కొందరైతే నన్ను ఇంకా పెళ్లి చేసుకోలేదా అని నేరుగా అడక్కుండా, ''సెటిల్ అయ్యావా'' అని అడుగుతుంటారు. ఈ గొప్ప ప్రశ్నకు నేను చాలా ఉత్సాహంగా ''నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను. బాగానే సంపాదిస్తున్నాను. అప్పుల్లేవు. ఆరోగ్యం భేషుగ్గా ఉంది'' అని బదులిస్తుంటాను. అప్పుడు, ''అది సరే, పెళ్లైందా'' అని దీర్ఘం తీస్తారు. ఇది జీవితంలో 'స్థిరపడని' నాలాంటి వ్యక్తికి ఎదురయ్యే మరో ఇబ్బందికరమైన ప్రశ్న. ఒంటరిగా ఉండడం వల్ల సమాజంలోని అందరూ మనల్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అనుకుంటారు. 'ఒంటరిగా ఉన్నావు కదా, వీకెండ్‌లో ఆఫీసుకు రావొచ్చు.' 'రాత్రి పొద్దు పోయేవరకు ఆఫీసులో ఉన్నా అడిగే వాళ్లు ఉండరు కదా' అనేవాడు మా మాజీ బాస్. కానీ నా కమిట్‌మెంట్లు నాకుంటాయి కదా సర్ అని అనాలనిపించేది. 'నువ్వు ఒంటరిగాడివి కదా.. నీ బట్టలు పైన ఆరేసుకో' అనేవాడు మా ఓనర్. ఏం? నేను వాళ్లతో సమానంగా అద్దె ఇవ్వడం లేదూ? 'నీవు ఒంటరిగాడివి కదా.. నీకు ప్రత్యేకంగా ఆహ్వానపత్రిక ఇవ్వాలా? ఈ వాట్సాప్ మెసేజ్‌నే ఆహ్వానంగా భావించి మా గృహప్రవేశానికి రా' ఇదీ నా స్నేహితుడి ఆహ్వానం. అవసరమైతే రాత్రి వరకు పని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇంటివిషయాలకు వస్తే మా బిల్డింగ్‌లోని ఇతర ఫ్లాట్‌లలో ఉన్నవారికి సహకరించడానికి నేను సిద్ధం. నేను 'చెట్లను కొట్టేయకండి' అన్న ప్రచారానికి మద్దతుదారుణ్ని. కానీ వీటన్నిటికీ నా ఒంటరితనాన్ని సాకుగా చూపితే మాత్రం నాకు నచ్చదు. ఒంటరిగా ఉండడం పాపమా లేక అదేమైనా అనర్హతా? పెళ్లి చేసుకుంటున్నావా లేదా? నేను కావాలనే పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు లేదా ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు. ఏదైతే వాళ్లకేంటి? అడగకున్నా ఉచిత సలహాలు ఇవ్వడం ఈ సమాజానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను ఒంటరిగా ఉంటే ఏమేం ప్రమాదాలు జరుగుతాయో అందరూ చెప్పేవాళ్లే. నా పొరుగున ఉండే వ్యక్తి 'నాలాగే' ఉండే మరొకరితో స్నేహం చేసుకొమ్మన్నాడు. ''మీరేమంటున్నారు?'' అని అడిగా. ''నీలాంటి వ్యక్తే అంటున్నా. అప్పుడు మీ ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుని, జీవితాంతం కలిసి ఉండొచ్చు'' అని సలహా ఇచ్చాడు. నేనెప్పుడైనా అతనికి తోడు కోసం వెదుకుతున్నానని చెప్పానా? గతంలో నేను స్నేహితులు, బంధువుల పెళ్లిళ్లు, ఇతర కార్యాలన్నిటికీ వెళ్లేవాడ్ని. కానీ ఇప్పుడు నా అలవాటును మార్చుకున్నాను. వాళ్ల ప్రశ్నలు మరీ ఎక్కువైపోయాయి. ''నిన్ను చూసి దాదాపు ఐదేళ్లైపోయింది. నీ భార్య ఎక్కడ?'' నా వెనకాల చూసి, అక్కడెవరూ లేకపోతే, ''ఒహో.. ఇంకా ఒంటరివాడిగానే ఉన్నావా?'' అని పంచ్. అందువల్ల నేను కేవలం కొన్ని ఎంపిక చేసుకున్న కార్యాలకే హాజరవుతున్నా. అలాంటి ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను సెలవులకు మా ఊరికి వెళ్లి, తిరిగి ఆఫీసుకు వచ్చినపుడు ఒట్టి చేతులతోనే వస్తున్నాను. స్వీట్లు లేవు, పిండి వంటలు లేవు. ''ఏదైనా విశేషమా?'' అన్న ప్రశ్నను ఎదుర్కోలేక కావాలనే ఇలా చేస్తున్నాను. నేను చదువుకునే రోజుల్లో క్రికెట్, హాకీ అంటే నాకిష్టం. అయితే అవే ఎందుకు ఇష్టం అని ఎవరూ అడగలేదు. అందరూ లేటెస్ట్ ట్రెండీ బైకులు కొంటుంటే నేను మాత్రం పాత మోడళ్లను కొనేవాణ్ని. నా ఒంటి రంగుకు లైట్ కలర్స్ నప్పినా, నేను మాత్రం ముదురు రంగు దుస్తులనే వేసుకునేవాణ్ని. నేను చదువుకున్నది ఒక సబ్జెక్ట్ అయితే, ఉద్యోగం చేస్తోంది దానికి సంబంధం లేనిది. నా వ్యక్తిగత ఇష్టాలను అర్థం చేసుకున్నవాళ్లకు, వాటిని ఆమోదించేవాళ్లకు నేను చాలా కృతజ్ఞుణ్ని. నన్ను ప్రోత్సహించింది నా స్నేహితులు, ఈ సమాజమే. అయితే ఒంటరిగా ఉండాలన్న నా ఆలోచన, అభిలాషకు మాత్రం వారి నుంచి ప్రోత్సాహం కరవవుతోంది. నేను పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. నా జీవిత భాగస్వామి ఇంకా నాకు ఎదురు కాలేదు. నేను నా పాత ప్రేమ వైఫల్యాన్ని మరచిపోయా. ఇప్పుడు నా ఆలోచనల్లో నేను దాని నుంచి చాలా దూరంగా వచ్చేసా. ప్రస్తుతానికి నేను ఒంటరిని. నేను మళ్లీ ప్రేమలో పడతానా? ఏమో.. అది నాకు ఎదురైనపుడు ఆలోచిస్తా. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా'' అని అడిగాడు నా స్నేహితుడు. ''మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు తెలివైనవాడివైపోవు'' అని రెచ్చగొట్టాడు. ''నీకు తెలివే లేదు. నీ ప్రేమ వ్యవహారం ముగిసిపోయి చాలా సంవత్సరాలైంది. కానీ నువ్వు ఇంకా ఆ బాధలోనే ఉండిపోయావు. కాస్త కాలంతోపాటు మారు గురూ'' అని సలహా ఇచ్చాడు. text: దీన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ పరీక్షను ఎలా జరిపారన్నదాని గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ప్రణాళిక ప్రకారం పరీక్ష మొత్తం సాగిందని అక్కడి వార్తా సంస్థలు కథనాలు రాశాయి. అక్కడి సాధారణ వినియోగదారులకు మాత్రం మార్పులేమీ కనిపించలేదని రష్యా కమ్యునికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్ష ఫలితాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సమర్పించనున్నారు. అయితే, ఇలాంటి వైఖరితో కొన్ని దేశాలు ఇంటర్నెట్‌ను నాశనం చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇంటర్నెట్‌ను నాశనం చేసే దిశగా రష్యా సాగుతోంది. నిరంకుశ దేశాలు తమ పౌరులు ఏం చూడాలన్నది నియంత్రించాలనుకుంటున్నాయి. చైనా, ఇరాన్ ఇదివరకే ఇలా చేశాయి. అంటే, తమ దేశంలో జరుగుతున్నవాటి గురించి అక్కడి జనాలు చర్చించలేకుండా చేయాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. వాళ్లను ఓ బుడగలో ఉంచాలనుకుంటున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ సర్రే‌లోని కంప్యూటర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ అలన్ వుడ్‌వార్డ్ అన్నారు. దేశీయ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ‘ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఇంటర్నెట్ యాక్సెస్‌ను నియంత్రించినట్లుగా.. దేశంలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థలను కూడా ఓ పెద్ద ఇంట్రానెట్‌లో భాగం చేసి దేనికి యాక్సెస్ ఉండాలన్నదాన్ని ప్రభుత్వం నియంత్రిస్తుంది’’ అని వుడ్‌వార్డ్ వివరించారు. సముద్రాల గుండా వేసిన కేబుల్స్ ద్వారా, నోడ్స్ ద్వారా వివిధ దేశాలకు అంతర్జాతీయ వెబ్ సేవలు అందుతాయి. ఒక దేశానికి అందే, పంపే డేటాకు ఇవే కనెక్షన్ పాయింట్లుగా ఉంటాయి. వీటిని ఆపివేయడం లేదా నియంత్రించడం ద్వారా ఆ దేశంలో ఇంటర్నెట్‌ను నియంత్రించవచ్చు. ఇందుకోసం ఆ దేశంలో ఉండే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థల సహకారం అవసరం. కొన్ని దేశాల్లో ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ సేవలను అందిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రభుత్వాలకు ఈ పని మరింత తేలిక అవుతుంది. దేశంలో ఎన్ని ఎక్కువ నెటవర్క్‌లు ఉంటే, యాక్సెస్‌ను నియంత్రించడం అంత కష్టమవుతుంది. ఇరాన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ అనే సంస్థ నియంత్రిస్తుంది. నెట్‌వర్క్‌లో ఉండే కంటెంట్‌ను, బయటి నుంచి వచ్చే సమాచారాన్ని నియంత్రిస్తుంది. ఇరాన్ ప్రభుత్వ టెలికాం సంస్థ దీన్ని నడుపుతుంది. సాధారణంగా ప్రభుత్వాలు నిషేధించిన వెబ్ సర్వీస్‌లను కూడా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)ల ద్వారా ఎవరైనా వినియోగించవచ్చు. అదే, ఇంటర్నెట్ యాక్సెస్ మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తే, వీపీఎన్‌లు కూడా పనిచేయవు. చైనాలో ఉన్న గ్రేట్ ఫైర్‌వాల్‌గా పిలిచే వ్యవస్థ కూడా ఇలాంటిదే. విదేశీ ఇంటర్నెట్ సేవల యాక్సెస్‌ను అది నియంత్రిస్తుంది. ఫలితంగా అక్కడి పౌరులు గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి వెబ్‌సైట్లు వినియోగించలేరు. అక్కడ దేశీయంగా ఇలాంటి సేవలందించే పెద్ద టెక్ సంస్థలు తయారయ్యాయి. రష్యాలో ఇప్పటికే యాండెక్స్, మలి.ఆర్‌యూ లాంటి పెద్ద టెక్ సంస్థలు ఉన్నాయి. దేశీయ ఇంటర్నెట్ తెస్తే మరిన్ని స్థానిక సంస్థలు ఎదగొచ్చు. తమ దేశ సాఫ్ట్‌వేర్ లేని స్మార్ట్‌ఫోన్లను దేశంలో అమ్మకుండా నిషేధం విధించేందుకు రష్యా ఓ బిల్లు ఆమోదించింది. సొంత వికీపీడియాను సృష్టించేందుకు కూడా ఆ దేశం ప్రణాళికలు చేసుకుంటోంది. సాంకేతిక సవాళ్లు రష్యా అనుసరిస్తున్న విధానం భావ ప్రకటనా స్వేచ్ఛకు అణిచివేసేదని, అయితే ఇందులో ఆ దేశం విజయవంతం అవుతుందన్న నిర్ధరణకు కూడా రాలేమని ఓ నిపుణుడు అన్నారు. ‘‘ఇంటర్నెట్‌ను నియంత్రించే ప్రయత్నంలో ఇదివరకు కూడా రష్యా ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కొంది. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను రష్యన్లకు అందుబాటులో లేకుండా చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది’’ అని న్యూ అమెరికా మేధో సంస్థకు చెందిన జస్టిన్ షెర్మన్ బీబీసీతో అన్నారు. ‘‘ఈ పరీక్ష గురించి మరింత సమాచారం తెలియకుండా, దేశీయ ఇంటర్నెట్‌ను సృష్టించే దిశగా రష్యా ఎంత పురోగతి సాధించిందో అంచనా వేయలేం. వాణజ్యపరంగానూ రష్యా తీరుపై స్వదేశంలో, అంతర్జాతీయంగా ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి’’ అని షెర్మన్ వ్యాఖ్యానించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్‌కు ప్రత్యమ్నాయంగా రష్యా సొంతంగా దేశీయ ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసుకుంటోంది. text: నా పేరు రంజిని. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. గత ఎనిమిదేళ్ల నుంచి దీన్ని ప్రదర్శిస్తున్నాను. ఈ కళా రూపం పేరు నొక్కువిద్య పవక్కలీ. నొక్కు అంటే చూపు, విద్య అంటే నైపుణ్యం, పవక్కలీ అంటే బొమ్మలాట. ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే మా కుటుంబం అయిదు తరాలుగా దీన్ని ప్రదర్శిస్తోంది. మా అవ్వ నుంచి దీన్ని నేర్చుకున్నాను. ఆమె ఏడు సంవత్సరాల వయసులో వాళ్ల అమ్మ నుంచి నేర్చుకుంది. నాటి నుంచి మాకు ఇది వారసత్వంగా వస్తోంది. పై పెదవిపై కర్రను నిలబెట్టడం ద్వారా బొమ్మలను ఆడించడం ఇందులోని ప్రత్యేకత. కర్రకు ఉండే తాడుతో బొమ్మలను ఆడిస్తారు. కొన్ని తరాలుగా దీన్ని మహిళలు మాత్రమే ప్రదర్శిస్తూ వస్తున్నారు. సంగీత వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటం, బొమ్మలు ఆడించే మహిళలకు సహాయం అందించే పనుల్ని పురుషులు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మనూ మా అవ్వే తయారు చేశారు. అయితే వాటిని ఎలా చేయాలో ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఆడించే బొమ్మలను మా పెద్దన్నయ్య సిద్ధం చేస్తారు. కర్రకు బొమ్మలను కట్టడం, వాటిని అలంకరించడం వంటి పనులను చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక కళే. బొమ్మల ఆట వాటిని సిద్ధం చేసే తీరుపై ఆధారపడి ఉంటుంది. నేను బొమ్మలను బాగా ఆడించగలను కానీ వాటిని సిద్ధం చేయడం మాత్రం నావల్ల కాదు. ఈ కళలో 13 బొమ్మలు ఉంటాయి. ఇవి వివిధ రకాల బరువు తూగుతాయి. కొన్ని తేలికగా ఉంటాయి. మరికొన్ని బాగా బరువుగా ఉంటాయి. మా తాతమ్మలు, వారి అమ్మల తరం నుంచి వస్తున్న ఈ సంప్రదాయ కళను ముందుకు తీసుకు పోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ కళను నేర్పినందుకు మా అవ్వకు రుణపడి ఉంటాను. కేరళలోని ఈ మోనిపల్లి గ్రామంలో నివసిస్తున్న అవ్వ మనవరాళ్లు దీన్ని నేర్చుకునే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని ఎలాగైనా రేపటి తరానికి అందించాలన్నదే వారి తపన. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే. ఇంతకీ ఏంటా కళ.. ఎవరా అమ్మాయి? ఆమె మాటల్లోనే.. text: దీనిపైన నేపాల్ ప్రధాని మాట్లాడుతూ.. 'మా భూమిలో ఒక్క అంగుళం కూడా ఇతరుల ఆక్రమణలో ఉండటానికి మేం అనుమతించం. భారత సైనికులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి' అన్నారు. మరోపక్క కొత్త మ్యాప్‌లో సరిహద్దులకు సంబంధించి ఎలాంటి సవరణలూ చేయలేదని, కేవలం జమ్మూకశ్మీర్ విషయంలో వచ్చిన మార్పులను మాత్రమే చూపించామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. ఇంతకు ముందున్న మ్యాప్‌లలో కూడా కాలాపానీ భారత్‌లో భాగంగానే ఉందని భారత్ చెబుతోంది. నేపాల్ మాత్రం దీన్ని అంగీకరించట్లేదు. ఇంతకీ ఈ కాలాపాని వివాదం ఏంటి? భారత్ - చైనా యుద్ధం తరువాత ఏం జరిగింది? నేపాల్‌తో 80.5 కి.మీ.లు, చైనాతో 344 కి.మీ.ల పొడవున సరిహద్దును ఉత్తరాఖండ్ రాష్ట్రం పంచుకుంటోంది. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌ జిల్లాలో నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతమే కాలాపానీ. దీని విస్తీర్ణం 35 చదరపు కిలోమీటర్లు. అండమాన్‌లో ఉన్న సెల్యులర్ జైలును కూడా కాలాపానీ అనే అంటారు. కానీ, దానికీ, ఈ ప్రాంతానికీ ఎలాంటి సంబంధం లేదు. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ కాలాపానీ ప్రాంతంలోనే మహాకాలీ నది పుడుతుంది. ఈ ప్రాంతం భారత్‌లోనే ఉందని తాజాగా విడుదల చేసిన మ్యాప్ చెబుతోంది. కానీ, కాలాపానీ తమ దేశంలోని దార్చులా జిల్లాలో ఉందని, అది భారత్‌లో ఉన్నట్లు చూపించడం సరికాదని నేపాల్ అంటోంది. సముద్ర మట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. భారతీయ యాత్రికులు కైలాశ్ మానసరోవర్ సందర్శనకు ఈ కాలాపానీ మార్గం గుండానే వెళ్తారు. 1962లో భారత్ - చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. చైనాతో యుద్ధం జరిగిన సమయంలో వ్యూహాత్మకంగా కాలాపానీని సైనిక స్థావరంగా చేసుకోవడానికి భారత్‌కు తాము సహకరించినట్లు నేపాల్ చెబుతోంది. ఆ ప్రాంతంలో సైనిక పోస్ట్ ఉండటం వల్ల చైనా సైనికులు దిగువకు రాకుండా భారత సైన్యం అడ్డుకోగలిగింది. ఆ యుద్ధం తర్వాత భారత్.. కాలాపానీ మినహా, నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించిందని, కానీ అక్కడి నుంచి మాత్రం భారత సైన్యం వెనక్కు వెళ్లలేదని నేపాల్ అధికారులు అంటున్నారు. ఈ యుద్ధానికి ముందు 1961లో కాలాపానీలో తాము జనాభా లెక్కలు చేపట్టినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని వాళ్లు చెబుతున్నారు. ఈ కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ చెప్పడానికి బలమైన కారణం సుగౌలీ ఒప్పందం. నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం కాలీ నది భారత్‌తో నేపాల్‌ సరిహద్దుగా ఉందని ఆ దేశం అంటోంది. కాలాపానీ భారత్‌లో ఉండటమంటే సుగౌలీ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదిస్తోంది. వాజపేయి ఇచ్చిన మాట 2000 సంవత్సరంలోనే రెండు దేశాల ప్రధానుల మధ్య ఈ అంశం చర్చకు వచ్చింది. నేపాల్‌లో ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ ఆక్రమించదని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హామీ ఇచ్చారు. తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శులూ ఆ అంశాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అది కొలిక్కి రాలేదు. ఇప్పటి భారత, నేపాల్ విదేశాంగ శాఖ అధికారులు కూడా స్నేహపూర్వక వాతావరణంలో చర్చల ద్వారానే దీనికి ముగింపు పలకడానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. 2014లో మోదీ నేపాల్‌లో పర్యటించినప్పుడు కూడా ఈ అంశానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వం కొత్త మ్యాప్ విడుదల చేయడంతో ఈ అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. అయితే, ఈ మ్యాప్‌లో నేపాల్‌తో సరిహద్దుల విషయంలో ఒక్క మిల్లీమీటర్‌ కూడా మార్పులు చేయలేదని, కేవలం జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చూపించామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ కుమార్ చెప్పారు. సరిహద్దు దగ్గర చైనా సాగించే కార్యకలాపాలపై నిఘా పెట్టాలంటే కాలాపానీ భారత నియంత్రణలో ఉండటం ఎంతో కీలకం అని భారత్ నేపాల్ సరిహద్దు వ్యవహారాల నిపుణుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్‌ఎస్ పంగ్తీ అంటున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక మ్యాప్ నేపాల్‌లో భారీ నిరసనలకు దారితీసింది. 'కాలాపానీ' అనే ప్రాంతాన్ని భారత్‌లో భాగంగా చూపించడమే ఆ నిరసనలకు కారణం. text: ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడే సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ నేత అమిత్ షాను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు బళ్లు ఓడలయ్యాయి. ఓడలు బళ్లయ్యాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవిలో ఉండగా, చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కేవలం అమిత్ షాతోనే కాదు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతోనూ చిదంబరం గతంలో ఘర్షణాత్మక వైఖరి చూపించారు. 2002-గుజరాత్ అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపినప్పుడు, మోదీపై నిందలు మోపే ప్రయత్నం జరిగింది. చిదంబరం ప్రోత్సాహంతోనే ఈ పని జరిగినట్లు మోదీ విశ్వసించారు. విరోధానికి మరిన్ని కారణాలు ఇవే కాదు, చిదంబరంతో విరోధానికి బీజేపీకి మరిన్ని కారణాలున్నాయి. 2010లో ఆయన 'కాషాయ ఉగ్రవాదం' అన్న పదాన్ని వాడి మొత్తం సంఘ్ పరివార్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. ''గతంలో ఎన్నో బాంబు పేలుళ్లలో పాత్ర పోషించిన కాషాయ ఉగ్రవాద ఉత్పాతం ఈ మధ్యే బయటపడింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అప్రమత్తంగా ఉంటూ, దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది'' అని ఓ సదస్సులో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ వెంటనే ఖండించింది. అప్పటివరకూ ఇస్లామిస్ట్ శక్తులకు సంబంధించి ప్రస్తావించే 'ఉగ్రవాదం' పదాన్ని 'హిందుత్వ'తో ముడిపెట్టేందుకు చేసిన ప్రయత్నంగా చిదంబరం వ్యాఖ్యలను సంఘ్ చూసింది. వాస్తవాలు ఎలా ఉన్నా, ఈ వ్యాఖ్యలు చిదంబరానికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశమే అయ్యాయి. 'లౌకికవాద' కుట్రలో తమను బాధితులను చేస్తున్నారని చెప్పుకొనే అవకాశం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు వచ్చింది. చిదంబరం వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించాల్సి వచ్చింది. ఉగ్రవాదానికి ఏ రంగూ లేదని, దానికి ఏ రంగూ పులుమడం సరికాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్ధన్ ద్వివేది ప్రకటన విడుదల చేశారు. మోదీ హయాంలో ఆ పరిస్థితి లేదు చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు రూ. 4.62 కోట్ల విదేశీ పెట్టుబడుల స్వీకరణకు ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) అనుమతి ఇవ్వగా, ఆ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడులు స్వీకరించిందన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2006లో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం విషయంలోనూ చిదంబరంపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. దాడులు, విచారణలు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. అయితే, మోదీ హయాంలో అరెస్టయిన అత్యంత ప్రముఖ కాంగ్రెస్ నేత చిదంబరమే. సాధారణంగా విపక్ష నాయకులను అరెస్టు చేయాలంటే ప్రభుత్వాలు జంకుతుంటాయి. వారికి ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ, ప్రస్తుతం మోదీ చాలా శక్తిమంతంగా ఉన్నారు. అరెస్టయిన విపక్ష నేతల పట్ల జనాలు సానుభూతి చూపే పరిస్థితి లేదు. సోనియా, రాహుల్, థరూర్, రాబర్ట్‌లపైనా కేసులు కశ్మీరీ నాయకులు నిర్బంధంలో ఉన్న సమయంలో చిదంబరం అరెస్టు జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉంది. మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికర వార్తలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో అవినీతి కేసుల్లో మరింత మంది విపక్ష నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు శశి థరూర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా కేసులు ఎదుర్కొంటున్నవారే. సోనియా, రాహుల్‌లపై నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసు, రాబర్ట్ వాద్రాపై భూఅక్రమాల కేసు ఉన్నాయి. థరూర్ తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్యకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ అనుకూల మీడియా, ట్విటర్‌లో ఆ పార్టీ అనుకూల ఖాతాలు చేసే ప్రచారం, విచారణ సంస్థల అడుగులను జాగ్రత్తగా గమనిస్తే తదుపరి ఎవరిని వారు లక్ష్యంగా చేసుకోబోతున్నారన్నది తెలుసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాల గురించి వచ్చే వార్తల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీకి ఈ అరెస్టులు ఉపయోగపడతాయి. మొదట కశ్మీర్, ఇప్పుడు చిదంబరం.. ఇలా మరిన్ని అంశాలు తెరపైకి వస్తాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులపై చర్చ జరగకుండా, ప్రతిపక్షాలు ఎంత అవినీతిమయమో ప్రజలకు ప్రభుత్వం పదేపదే గుర్తుచేస్తుంది. కొన్ని రోజుల్లో చిదంబరం బెయిల్‌పై బయటకు వస్తారు. కానీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని ప్రజలకు గుర్తుచేసేందుకు, ప్రతిపక్ష నాయకులను భయపెట్టేందుకు మోదీకి ఈ అరెస్టు ఉపయోగపడుతుంది. ప్రజాదరణ ఉన్న నాయకుడైతే వేరు ప్రతిపక్ష నాయకులు ప్రజాదరణ కోల్పోయిన కొద్దీ, వారిని అరెస్టు చేయడం ప్రభుత్వానికి మరింత సులభమవుతుంది. చిదంబరం ఇందుకు మంచి ఉదాహరణ. సీనియర్ న్యాయవాదిగా, మంచి అడ్మినిస్ట్రేటర్‌గా ఆయనకు పేరుంది. కానీ, ఆయన జనాదరణ ఉన్న నాయకుడు కాదు. తమిళనాడులోని శివగంగ నుంచి 1985లో ఓసారి, 2009లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. డీఎంకే మద్దతుతో 2019లో ఆయన కుమారుడు కార్తీ పోటీ చేసి గెలిచారు. దిల్లీ స్థాయిలోనే కాకుండా గల్లీ స్థాయిలోనూ చిదంబరం బలమైన నేత అయ్యుంటే, అరెస్టు విషయంలో ఆయనకు జనాదరణ ఓ కవచంలా పనిచేసేది. చిదంబరం అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఇంకా మెరుగ్గా స్పందించాల్సింది. చిదంబరానికి తోడుగా సోనియా, రాహుల్ కూడా ఆ పాత్రికేయ సమావేశంలో పాల్గొనాల్సింది. ఇక అరెస్టు విషయంలోనూ అంత నాటకీయత లేకుండా, చిదంబరం అక్కడే అరెస్టుకు సహకరించాల్సింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలపాల్సింది. కానీ, చిదంబరం అరెస్టైనప్పుడు ఆయన నివాసం ముందు కేవలం కొంత మంది కార్యకర్తలే కెమెరాల ముందు నినాదాలు చేస్తూ కనిపించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భూమి గుండ్రంగా ఉంటుంది. ఎనిమిదేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి హోదాలో కాంగ్రెస్ నేత చిదంబరం దిల్లీలో సీబీఐ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. బుధవారం అరెస్టయి అదే కార్యాలయంలో ఆయన ఒక రాత్రి గడపాల్సి వచ్చింది. text: తగిన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు ఐదుగురు నిందితులు - అసీమానంద, దేవేంద్ర గుప్తా, లోకేశ్‌ శర్మ, భరత్ మోహన్‌లాల్ రాటేశ్వర్, రాజేందర్ చౌధరిలను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. పదకొండేళ్ల దర్యాప్తు అనంతరం ప్రత్యేక కోర్టు తీర్పు నేడు ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొనగా, వారిలో ఒకరు హత్యకు గురయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇంకో ఇద్దరిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. 2007 మే 18న హైదరాబాద్‌లోని మక్కా మసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుడులో 9 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. ఈ దాడికి పాల్పడింది హిందూ అతివాదుల బృందమని దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. దేశంలో హిందూ అతివాదులు పాల్పడినట్లు ఆరోపణలున్న దాడుల్లో మక్కా మసీదు పేలుడు ఘటన ప్రధానమైనది. పదకొండేళ్ల దర్యాప్తు అనంతరం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు తీర్పు కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరించింది. 'బోగస్ కేసు' తీర్పు వెలువడిన తర్వాత అసీమానంద్ తరఫు న్యాయవాది జేపీ శర్మ విలేఖరులతో మాట్లాడుతూ, ఇది "బోగస్ కేసు" అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఎన్ఐఏను ఒక పనిముట్టుగా వాడుకుందనీ, ఈ కేసులో తగిన ఆధారాలే లేవని ఆయన విమర్శించారు. పేలుడు ఎప్పుడు జరిగింది? 2007 మే 18వ తేదీన బాంబు దాడి జరిగింది. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో ఒక ఈఐడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) పేలింది. అది శుక్రవారం కావటంతో.. ఆ సమయంలో మసీదు లోపల దాదాపు 10,000 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎందరు చనిపోయారు? ఈ పేలుడులో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిలో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 58 మంది గాయపడ్డారు. ఈ పేలుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చిన గుంపుపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తు ఎలా సాగింది? మొదట ఈ దాడి చేసింది పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మద్దతున్న ఛాందసవాద బృందమని భావించారు. ఈ కోణంలోనే తొలుత దర్యాప్తును కొనసాగించారు. హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ (హుజీ) కమాండర్, హైదరాబాద్ నివాసి మొహమ్మద్ షాహిద్ బిలాల్ ఈ దాడికి బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచే కుట్ర పన్నాడని కథనాలు ప్రచారమయ్యాయి. ఈ దాడితో సంబంధముందన్న అనుమానంతో హైదరాబాద్ పోలీసులు పలువురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో అమాయకులను ఇరికిస్తున్నారని తీవ్రంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. దీంతో.. మక్కా మసీదు కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేశారు. ఆధారాలు ఎలా లభించాయి? మసీదు ఆవరణలో పేలకుండా ఉండిపోయిన ఒక ఈఐడీ ద్వారా సీబీఐకి క్లూలు దొరికాయి. పేలిన ఈఐడీ, ఈ పేలని ఈఐడీ.. రెండింటినీ పేల్చటం కోసం టైమర్లుగా సిమ్‌కార్డులను ఉపయోగించినట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా దగ్గర జరిగిన బాంబు దాడికి కూడా ఇదే పద్ధతిని (మోడస్ అపరాండి) అనుసరించారు. ఆ ఆధారాలతో.. హిందూ అతివాద బృందం ఒకటి ఈ పేలుళ్లకు పాల్పడ్డట్లు సీబీఐ కనుగొంది. నిందితుల అరెస్టులు ఎలా జరిగాయి? ఆ ఆధారాలతో దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు 2010లో దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్ట్ చేశారు. 2011లో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి బదిలీ చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ తరహా దాడుల నుంచి ఆధారాలను క్రోడీకరించటం ద్వారా.. ఎన్‌ఐఏ అధికారులు మరికొందరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులెవరు..? మక్కా మసీదు బాంబు దాడి కేసులో మొత్తం 10 మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఐదుగురు నిందితులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆ ఐదుగురు వీరే... నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసీమానంద్: ఒక బాబా, గుజరాత్‌ దేవేంద్ర గుప్తా: ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, రాజస్థాన్‌ లోకేశ్‌ శర్మ: ప్రాపర్టీ డీలర్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, మధ్యప్రదేశ్‌ భరత్ మోహన్‌లాల్ రాటేశ్వర్: ప్రైవేటు ఉద్యోగి, గుజరాత్‌ రాజేందర్ చౌదరి: రైతు, మధ్యప్రదేశ్‌ మరో ఐదుగురి సంగతేమిటి? నిందితుల్లో ఒకరైన సునీల్ జోషి కేసు దర్యాప్తులో ఉండగానే హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన జోషి గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్‌గా పనిచేశారు. మధ్యప్రదేశ్‌కే చెందిన మరో ఇద్దరు నిందితులు సందీప్ వి డాంగే (మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్), రామచంద్ర కల్సంగ్రా(ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త) పోలీసులకు ఇంకా పట్టుపడలేదు. మధ్యప్రదేశ్‌కే చెందిన మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్‌లపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. చార్జ్‌షీట్‌ సారాంశమేమిటి? ముస్లిం మతస్థులు సమావేశమయ్యే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని నిందితులు దాడులు చేయటానికి 2004-2007 మధ్య కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 1998 నుంచి దేశంలో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నింది ముస్లిం గ్రూపులని ఈ నిందితులు భావించారని, వాటికి ప్రతీకారంగా ప్రతిదాడులు చేయాలనుకున్నారని ఆ చార్జ్‌షీట్‌లో ఆరోపించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయ స్థానం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. text: అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు 2.2 కోట్ల డాలర్లను జీ7 సహాయంగా విడుదల చేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ సోమవారం చెప్పారు. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఏడు దేశాల ఈ కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలు. ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌ పట్టణంలో జీ7 శిఖరాగ్ర సదస్సుకు మేక్రాన్ ఆతిథ్యం ఇచ్చారు. సదస్సు సోమవారం ముగిసింది. నిధులు వెంటనే బ్రెజిల్‌కు అందుబాటులో ఉంచుతామని మేక్రాన్ తెలిపారు. ఈ నిధులను ప్రధానంగా మంటలార్పేందుకు మరిన్ని విమానాల ఏర్పాటు కోసం వినియోగించాలన్నారు. బ్రెజిల్‌కు ఫ్రాన్స్ సైనిక సహాయం కూడా అందిస్తుందని చెప్పారు. బ్రెజిల్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎర్నోస్టో అరావుజో స్పందిస్తూ- అడవుల నిర్మూలనను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి వాతావరణ ఒప్పందం పరిధిలో అవసరమైన అంతర్జాతీయ వ్యవస్థలు ఉన్నాయని, కొత్త ఏర్పాట్లు అక్కర్లేదని వ్యాఖ్యానించారు. అమెజాన్ అడవుల్లో మంటలు అదుపులోనే ఉన్నాయని రక్షణశాఖ మంత్రి ఫెర్నాండో అజెవెడో ఇ సిల్వా తెలిపారు. బ్రెజిల్‌ను ఫ్రాన్స్ ఒక 'కాలనీ'గా చూస్తోందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఆరోపించారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో జీ7 సహాయ ప్రతిపాదనపై బొల్సోనారో చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒనిక్స్ లోరెంజోని స్పందిస్తూ- "నిధులు ఇస్తామన్నందుకు ధన్యవాదాలు, కానీ ఆ నిధులు యూరప్‌లో అడవులను తిరిగి పెంచేందుకే ఎక్కువ అవసరమేమో" అన్నారు. 'గ్లోబో' వార్తా వెబ్‌సైట్‌తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మేక్రాన్ ఆ చర్చిలో ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు" "ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్వదేశంలో ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన ఒక చర్చిలో అగ్ని ప్రమాదాన్ని ముందస్తుగా పసిగట్టలేకపోయారు. ఆయన మాకు ఉపన్యాసాలు ఇవ్వాలనుకొంటున్నారు" అని లోరెంజోని ఎద్దేవా చేశారు. ఏప్రిల్లో పారిస్‌లోని 850 ఏళ్ల నాటి నాట్రడామ్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ మాట అన్నారు. అమెజాన్ లాంటి స్థానిక అడవులను ఎలా రక్షించుకోవాలనేది ఏ దేశానికైనా బ్రెజిల్ చెప్పగలదని లోరెంజోని తెలిపారు. నిజమైన పర్యావరణ సమస్యలను ఒక సంక్షోభంగా చిత్రీకరించి, అమెజాన్ అడవులపై బాహ్య నియంత్రణకు యంత్రాంగాన్ని తేవడానికి దీనిని సాకుగా చూపే యత్నాలు జరుగుతున్నాయని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. అమెజాన్‌లో రికార్డు సంఖ్యలో వ్యాపించిన కార్చిచ్చుల నియంత్రణకు తమ ప్రభుత్వానికి తగినన్ని వనరులు లేవని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ఇంతకుముందు చెప్పారు. జీ7 సహాయ ప్రతిపాదనపై స్వచ్ఛంద సంస్థ గ్రీన్‌పీస్ పెదవి విరిచింది. అమెజాన్ అడవుల దహనం ఒక పర్యావరణ విధ్వంసమని, దీని తీవ్రత, దీనిని నియంత్రించాల్సిన అత్యవసర పరిస్థితిని బట్టి చూస్తే జీ7 ప్రతిపాదించిన సహాయం సరిపోదని గ్రీన్‌పీస్ ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది. అమెజాన్ వర్షారణ్యాల పరిరక్షణకు 50 లక్షల డాలర్లు ఇస్తానని ప్రఖ్యాత హాలీవుడు నటుడు లియోనార్డో డికాప్రియో సోమవారం ప్రకటించారు. అటవీశాస్త్రంలో అంతర్జాతీయ నిపుణుడు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకోసిస్టమ్ సైన్స్ ప్రొఫెసర్ యద్వీందర్ మల్హి బీబీసీతో మాట్లాడుతూ- బ్రెజిల్‌లో రాజకీయ ప్రాధాన్యాలు మారాల్సి ఉందని, ఈ మార్పే అత్యంత ప్రధానమైనదని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 24న అమెజోనాస్ రాష్ట్రంలోని బోకా డో ఎకర్‌లో అడవుల్లో కార్చిచ్చు తర్వాత కనిపించిన దృశ్యం ఈ ఏడాది బ్రెజిల్ పర్యావరణ సంస్థకు నిధుల్లో 95 శాతం కోత విధించారని, దీంతో వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన అనేక చర్యలకు విఘాతం కలుగుతోందని ఆయన ప్రస్తావించారు. అమెజాన్ అడవులు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నప్పటికీ అధిక భాగం బ్రెజిల్ పరిధిలోనే ఉన్నాయి. మేక్రాన్‌పై కొంత కాలంగా విమర్శలు చేస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో- అమెజాన్ ప్రాంతంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్హేతుక దాడులు చేస్తున్నారని, మేక్రాన్ ఆయన ఉద్దేశాలను జీ7 మాటున దాస్తున్నారని ఆరోపించారు. ఐరోపా దేశాలపై బొల్సొనారో ఆరోపణ ఏమిటి? బ్రెజిల్ సహజ వనరులపై నియంత్రణ కోసం యూరోపియన్ దేశాలు చాలా కాలంగా యత్నిస్తున్నాయని అధ్యక్షుడు బొల్సొనారో చెబుతున్నారు. అమెజాన్ అడవుల పరిరక్షణ అనేది అమెజాన్ ప్రాంతంలో పాదం మోపాలనే ఐరోపా యత్నాలకు ఒక ముసుగు మాత్రమేనని ఆయన ఆరోపిస్తున్నారు. జులై 6న మీడియా సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ జర్నలిస్టుల ప్రశ్నలకు బొల్సొనారో సమాధానమిస్తూ- "వక్రబుద్ధి ఉన్న ప్రతి ఒక్కడూ కామించే కన్యలా అయిపోయింది బ్రెజిల్ పరిస్థితి" అని వ్యాఖ్యానించారు. ఆగస్టు 24న ఎకర్ రాష్ట్రం రియో బ్రాంకోలోని అమెజాన్ అడవుల్లో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సహాయ సిబ్బంది అమెజాన్‌ బ్రెజిల్‌ది కాదనే భావన యూరోపియన్లలో ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌కు ఈ దేశాలు నిధులు పంపేది సాయం చేసేందుకు కాదని, బ్రెజిల్ సార్వభౌమత్వంలో జోక్యం చేసుకొనేందుకేనని ఆయన గత వారం ఆరోపించారు. బ్రెజిల్‌ అటవీ ప్రాంతంలో గ్రీష్మంలో కార్చిచ్చులు సంభవిస్తుంటాయి. బ్రెజిల్ అంతరిక్ష సంస్థ శాటిలైట్ డేటాను బట్టి చూస్తే - ఈ ఏడాది కార్చిచ్చులు 80 శాతం పెరిగాయి. అమెజాన్‌లో మంటలను ఆర్పేందుకు, పర్యావరణ నేరాలను అరికట్టేందుకు 44 వేల మంది సైనికులను రంగంలోకి దించినట్లు బ్రెజిల్ చెబుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెజాన్ వర్షారణ్యాల్లో మంటల నియంత్రణకు సహాయం అందిస్తామన్న జీ7 ప్రతిపాదనను తిరస్కరిస్తామని బ్రెజిల్ చెప్పింది. text: ఈ ఆన్‌-ది-స్పాట్, డీఎన్‌ఏ టెస్టుల వల్ల సాధారణ సీజనల్‌ జ్వరాలు, కోవిడ్‌-19కు మధ్య తేడా తెలుసుకోవడం సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలే శీతాకాలంలో ఈ టెస్టింగ్‌ విధానం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టుల్లో మూడోవంతు పరీక్షలకు ఫలితాలు రావడానికి 24 గంటలు పడుతుండగా, పావువంతు టెస్టులకు దాదాపు రెండురోజుల సమయం పడుతోంది. సరిపడినన్ని కిట్‌లు అందుబాటులో లేకపోవడంతో జులైలో లక్ష్యంగా పెట్టుకున్న టెస్టుల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించిన నేపథ్యంలో ఈ కిట్‌లపై బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. లేబొరేటరీలు, అడల్ట్‌ కేర్‌ సెంటర్లలో దాదాపు 5 లక్షల టెస్ట్‌కిట్‌లు వచ్చేవారం నుంచి అందుబాటులో ఉంటాయని, మరో పదిలక్షల కిట్‌లు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. వీటితోపాటు లండన్‌లోని 8 ఆసుపత్రులలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వేలాది డీఎన్‌ఏ మెషీన్‌లను సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌హెచ్‌ఎస్‌ ఆసుపత్రులలో అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే కొద్దినెల్లలో దాదాపు 5,000 మెషీన్‌లతో 5.8 మిలియన్ల టెస్టులు చేయబోతున్నామని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. తాజాగా రూపొందించిన టెస్టింగ్‌ విధానం ఎంతో కీలకమైందని హెల్త్ సెక్రటరీ మాట్‌ హాన్‌కాక్‌ అభిప్రాయపడ్డారు. 90 నిమిషాలలో ఫలితాలను ఇచ్చే ఈ టెస్టు వైరస్‌ వ్యాప్తి చైన్‌ను గుర్తించడానికి ఎంతో ఉపయోగపడుతుందని హాన్‌కాక్‌ అన్నారు. "త్వరలో శీతాకాలం వస్తోంది. ఈ సమయంలో ఏది కోవిడ్‌, ఏది సాధారణ జ్వరం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. త్వరగా ఫలితం తేలడం వల్ల పేషెంట్లు సరైన చికిత్సను పొందగలరు'' అని ఆయన అన్నారు. కచ్చితమైన ఫలితాలు ఈ ర్యాపిడ్‌ టెస్టులు అత్యంత కచ్చితమైన ఫలితాలను ఇస్తున్నాయని ఈ మెషీన్‌లను తయారు చేసిన డీఎన్‌ఏ నడ్జ్‌ సంస్థ సహవ్యవస్థాకుడు ప్రొఫెసర్‌ క్రిస్‌ టొమజౌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ సులభంగా అందుబాటులో ఉండగల సామర్ధ్యం ఉన్న టెస్టింగ్‌ సాధనమని ఈ మెషీన్‌ను సరఫరా చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ నానోపోర్‌ సంస్థ సీఈవో గోర్డాన్‌ సంఘేరా అన్నారు. జులై 6 నాటికి ఈ టెస్టింగ్‌ సాధనాలు కేర్‌హోమ్స్‌లో ఉంటున్నవారికి, సిబ్బందికి అందుబాటులోకి తీసుకురావాలని భావించినా, సెప్టెంబర్‌ మొదటివారం వరకు అందుబాటులోకి రాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కేర్‌హోమ్‌లకు తక్కువ కిట్‌లు అందుబాటులో ఉండటానికి అనేక కారణాలున్నాయని, వీటిని పెంచడానికి కృషి చేస్తున్నామని బ్రిటన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గత నెలలలో ఇంటి దగ్గర నిర్వహించగల పరీక్షలకు సంబంధించిన ఒక బ్రాండ్‌కు చెందిన కిట్‌లను భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం నిషేధించింది. మరోవైపు వ్యాధిబారి నుంచి బైటపడ్డవారు ప్లాస్మాను దానం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్లాస్మా సహకారంతో రోగులకు నేషనల్ హెల్త్‌ సర్వీస్‌ చికిత్స అందించబోతోంది. రోగ నిరోధకతను వృద్ధి చేసుకోలేక ఇబ్బంది పడుతున్న కోవిడ్‌-19 రోగులకు ప్లాస్మాను ఎక్కించడం వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుదన్న దానిపై వైద్యరంగ నిపుణులు కీలకమైన ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌లో ఆదివారం 8 మంది కోవిడ్‌-19 కారణంగా మరణించగా, ఇప్పటి వరకు ఇక్కడ చనిపోయినవారి సంఖ్య 46,201కి చేరింది. నివేదికలు రావడంలో ఆలస్యం కారణంగా వారాంతాలలో మరణాల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 744 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కరోనా రోగుల ఇతర వ్యాధులను కూడా గుర్తించవచ్చు హెల్త్‌ కరస్పాండెంట్‌ లారెన్‌ మాస్‌ విశ్లేషణ కోవిడ్‌-19 పరీక్ష ఫలితం ఎంత సమయంలో వస్తే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అన్నది గుర్తించడంపై చాలారోజుల నుంచి పరిశీలన నడుస్తోంది. దాదాపు ముప్పావువంతు టెస్టుల్లో ఫలితాలు 24 గంటల్లో వెలువడుతుండగా, పావువంతు టెస్టులకు రెండు రోజుల సమయం పడుతోంది. తాజాగా వచ్చిన ర్యాపిడ్‌ టెస్ట్‌కిట్‌లు వేగంగా అంటే 90 నిమిషాల్లో ఫలితాలను ఇవ్వడం అనేది చాలా కీలకమైన అంశం. ఈ పరీక్ష ఫలితాల నాణ్యతపై ఇంత వరకు ఎలాంటి డేటా అందుబాటులో లేకపోయినా, తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఇతర సీజనల్‌ వ్యాధులను కూడా గుర్తించడం ఈ టెస్ట్‌కిట్‌ల మరో ప్రధానమైన ప్రత్యేకత. కరోనావైరస్‌ పేషెంట్లకు ఇతర సీజనల్‌ వ్యాధులు కూడా ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని డాక్టర్లు సులభంగా గుర్తించే అవకాశం ఉండటం ఇందులోని ప్రధాన ప్రయోజనం. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్‌తోపాటు సాధారణ జ్వరాలను గంటన్నర సమయంలో గుర్తించగలిగే కొత్త రకం టెస్టింగ్‌ కిట్‌లను బ్రిటన్‌లోని కేర్‌హోమ్‌లు, లేబొరేటరీలలో వచ్చేవారం నుంచి ప్రవేశపెట్టబోతున్నారు. text: నాకు బాగా గుర్తు.. ఆ కథనంలో ఓ వ్యక్తి తన పెళ్లి ప్రకటన ఇలా ఇచ్చినట్లు ఉంది. ‘అబ్బాయి ధైర్యవంతుడు, వర్జిన్. వయసు 39 సంవత్సరాలు కానీ చూడటానికి మాత్రం నిజంగా 30ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. 180సెంటీమీటర్ల ఎత్తు. తెల్లగా అందంగా ఉంటాడు. పూర్తి శాకాహారి. మందు, సిగరెట్లు అలవాటు లేవు. అమెరికాలో ఉద్యోగం చేశాడు. దక్షిణ దిల్లీలో పెద్ద బంగ్లా కూడా ఉంది’ అంటూ రాసుంది. కానీ తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలో అతడు కోరుకుంటోంది ఒక్కటే. ‘అమ్మాయి చాలా అందంగా ఉండాలి, వయసు 30 ఏళ్లకు మించకూడదు’ అని. ఇది 20ఏళ్ల కిందటి మాటే అయినా, ఇప్పుడు కూడా పెళ్లి ప్రకటనలు ఇంచు మించు ఇలానే ఉంటుండటం చాలా బాధకరం. గతవారం బెంగళూరులో ఇలాంటి పెళ్లి ప్రకటననే ఓ మ్యాట్రిమోనీ సంస్థ ఇచ్చింది. ఆ సంస్థ నిర్వహించే వివాహ పరిచయ వేదికలో పాల్గొనలాంటే అబ్బాయిలు జీవితంలో అత్యున్నత ‘విజయం’ సాధించినవారై ఉండాలి. అదే అమ్మాయిలకైతే రెండు ఆప్షన్లు. వాళ్లు విజేతలైనా అయ్యుండాలి, లేకపోతే చాలా అందంగానైనా ఉండాలి. చాలామందికి కోపం తెప్పించిన పత్రికా ప్రకటన ఈ ప్రకటన చాలా మందికి కోపం తెప్పించింది. ప్రకటనపైన నిరసనలు వెల్లువెత్తడంతో చివరికి ఆ సంస్థ క్షమాపణ చెప్పింది. ఈ మధ్య కాలంలో నాకు పెళ్లి ప్రకటనలను చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. ఇంకా చెప్పాలంటే, ప్రకటనల కంటే అందులో వధువులకు ఉండాల్సిన లక్షణాల చిట్టాను చూస్తేనే ఎక్కువ కోపమొస్తోంది. అమ్మాయి అందంగా, సౌమ్యంగా, నాజూగ్గా ఉండాలి. ఉద్యోగం చేయాలి లేదా ఇంటిపట్టునే ఉండాలి అంటూ పెద్ద జాబితా రాసుకొస్తున్నారు. గత ఇరవై ఏళ్లలో పెళ్లి ప్రకటనల్లో మార్పు వచ్చిన మాట నిజమే. అప్పట్లో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు మొబైల్ యాప్స్‌లో కూడా ఇస్తున్నారు. ఇప్పుడైతే అబ్బాయి-అమ్మాయిల ఫొటోలు కూడా పెడుతున్నారు. అమ్మాయిలు చీరలు, చుడీదార్లు, జీన్స్, సూట్లు... ఇలా రకరకాల దుస్తులు వేసుకుంటే ఎలా ఉంటారో చూపే ఫొటోలను కూడా పెడుతున్నారు. ఇన్నేళ్లు గడిచినా అమ్మాయి అందంగా, సన్నగా ఉండాలనే ప్రకటనలు మాత్రం మారలేదు. కాకపోతే ఇప్పుడు అబ్బాయిల్లానే అమ్మాయిలు కూడా సంపాదించాలని కోరుకుంటున్నారు. ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఏకంగా ‘పర్ఫెక్ట్ మేడ్-టు-ఆర్డర్ దుల్హన్ (పెళ్లికూతురు)’ అని తన ట్యాగ్‌లైన్ పెట్టుకుంది. ‘మీ అన్ని డిమాండ్లకూ సరిపోయే పెళ్లి కూతుళ్లు మా దగ్గరున్నారు’ అని ఆ సంస్థ హామీ ఇస్తోంది. పెళ్లి కూతురు ఏమైనా డిజైనర్ వస్తువా, వినియోగదార్ల డిమాండ్లకు తగ్గట్లు ఉండటానికి? ఓ వెబ్‌సైట్లో అమ్మాయిలను విభజించిన క్యాటగిరీలు ‘ఇంటిపట్టున ఉండేవాళ్లు, వంట బాగా చేసేవాళ్లు, తెల్లగా ఉండేవాళ్లు, సంస్కారవంతమైన వాళ్లు, ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లు, పొదుపు చేసేవాళ్లు, లో మెయిన్‌టెనెన్స్’.. ఇలా ఆ వెబ్‌సైట్‌లో పెళ్లికూతుళ్లను కేటగిరీల వారీగా విభజించారు. ఇలా ప్రకటనలు ఇచ్చేవాళ్లు మనకు తెలీకుండా మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. అసలు పెళ్లంటే..? చట్టపరంగా కానీ, అధికారికంగా కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే పెళ్లి అని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చెబుతోంది. కానీ ఈ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో కనిపించే భాషను చూస్తుంటే, ఎక్కడైనా సమానంగా ఉండే వధూవరులు దొరికే అవకాశం కనిపిస్తోందా? పెళ్లికి ముందే అమ్మాయిలను, అబ్బాయిలను ఈ సంస్థలు విభజిస్తూ, ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాల గురించి ప్రస్తావిస్తున్నాయి. అలాంటప్పుడు సమాన స్థాయిలో ఉండే వధూవరులు ఇక్కడ ఎలా దొరుకుతారు? బహుశా ఇలాంటి ప్రకటనలపై నిరసన తెలిపేందుకేనేమో.. 2015లో ఇందూజా పిళ్లై అనే యువతి తన తల్లిదండ్రులు ఇచ్చిన పెళ్లి ప్రకటనకు వ్యతిరేకంగా తానే సొంతంగా మరో ప్రకటన ఇచ్చారు. తన తల్లిదండ్రులు ప్రకటన ఇవ్వడంపై ఇందూజాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రకటనలో చెప్పిన విషయాలకూ, తన అసలు స్వభావానికీ ఏమాత్రం పొంతన లేదని ఆమె చెబుతారు. ఇందూజా పిళ్లై ‘నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కాను. నేను కళ్లద్దాలు పెట్టుకుంటా. దానివల్ల కొంత ఫ్యాషన్‌కు దూరంగా ఉన్నట్టు కనిపిస్తా. నాకు టీవీ చూడటం అస్సలు ఇష్టం లేదు. నేనెప్పటికీ నా జుట్టు పెంచుకోను. నేను జీవితాంతం కలిసుండదగ్గ అమ్మాయినే’ అని ఇందూ తాను సొంతంగా ఇచ్చిన ప్రకటనలో రాశారు. ఈ ప్రకటనల ఉచ్చు నుంచి బయటపడేందుకే కాబోలు.. కొన్ని నెలల క్రితం జ్యోతి అనే యువతి నేరుగా తన ఫేస్‌బుక్ పేజీలోనే పెళ్లి ప్రకటన ఇచ్చారు. ‘నాకిప్పటిదాకా పెళ్లి కాలేదు. నా స్నేహితులెవరికైనా మంచి అబ్బాయి తెలిస్తే చెప్పండి. నాకు ఎలాంటి డిమాండ్లు లేవు. కుల, జాతక పట్టింపులు లేవు. మా అమ్మానాన్నా చనిపోయారు. నేను ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేశా. నా వయసు 28’’ అని జ్యోతి తన ఫేస్‌బుక్ వాల్‌ పైన పోస్ట్ చేశారు. ఏప్రిల్‌లో జ్యోతి పెట్టిన ఈ పోస్ట్ వైరలయింది. 6100 మంది దీన్ని షేర్ చేశారు. దాదాపు 5వేల మంది కామెంట్ చేశారు. జ్యోతి పెట్టిన ప్రకటన ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది జ్యోతి కోసం ఫేస్‌బుక్‌లో వెతకడం మొదలుపెడితే, గత నెలలో ఆమె తన పెళ్లయినట్లు పోస్ట్ చేసిన ఫొటో కనిపించింది. వైబ్‌సైట్లు, పత్రికల్లో కనిపించే ఈ ప్రకటనల్లోని భాషను గమనిస్తే ఇప్పటికీ తల్లిదండ్రులు పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రాలేదని అర్థమవుతోంది. ఆ ప్రకటనలు చదువుతుంటే వీళ్లకు భార్య కావాలా? లేక బ్యూటీ క్వీనో, వంట మనిషో కావాలా? అనే సందేహం వస్తుంది. ఎందుకంటే చాలా ప్రకటనల్లో ‘అందంగా ఉండి వంట కూడా వచ్చిన అమ్మాయి కావాలి’ అనే కనిపిస్తుంది. అదే అబ్బాయిల విషయంలో అయితే, కులం, ఉద్యోగం గురించిన వివరాలు మాత్రమే ఉంటాయి. మహా అయితే అబ్బాయి మాంసం తినడనో, మందు తాగడనో పెడతారు. ఈ ప్రకటనల్లో ఎప్పటికి మార్పు వస్తుందో చూద్దామని నేను వీటిని కత్తిరించి నా స్ర్కాప్ బుక్‌లో పెట్టుకుంటున్నాను. అప్పటి-ఇప్పటి ప్రకటనల్ని గమనిస్తే అబ్బాయిలకు ప్రభుత్వ ఉద్యోగం ప్లేస్‌లో ఎంఎన్‌సీ ఉద్యోగం అని వచ్చి చేరుంటుంది. అమ్మాయిల విషయంలో మాత్రం అదే అందం, వంట ప్రస్తావన. కావాలంటే ఓసారి ఆదివారం పెళ్లి ప్రకటనల పేజీ తెరిచి చూడండి. ఈ కాలం వాళ్ల కోసం టిండర్, బబుల్ లాంటి కొన్ని యాప్స్ వచ్చాయి. కానీ వాటిని నమ్మొచ్చో లేదోనన్న చర్చ కూడా జరుగుతూనే ఉంది. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) స్కూల్లో, కాలేజీల్లో కంప్యూటర్ దొరకడమే కష్టంగా ఉండే రోజుల నాటి మాట ఇది. 1998లో ఒకసారి కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు భారత్‌లో పెళ్లి ప్రకటనల గురించి బీబీసీ వెబ్‌సైట్లో రాసిన వ్యాసం అనుకోకుండా నా కంటపడింది. text: గుండెపోటు వల్ల వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారని సాక్షి దినపత్రిక తెలిపింది. కానీ, మృతదేహం పడి ఉన్న స్థలాన్ని చూస్తే అది హత్యలాగా అనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకానందరెడ్డి తలపైన, చేతులపైనా గాయాలున్నాయని కడప ఎస్పీ మీడియాకు తెలిపారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కంటెంట్ అందుబాటులో లేదు పోస్ట్ of Facebook ముగిసింది, 1 వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. వివేకానందరెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 1989,1994లలో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు వివేకానంద రెడ్డి మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా తలకు, చేతికి గాయాలు అయ్యాయని, ఆయన రక్తపు మడుగులో.. బాత్‌రూమ్‌లో పడి ఉన్నారని కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు (నంబర్ 84/19) నమోదు చేశామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. text: ఇదంతా సిమ్ స్వాపింగ్ అంటే సిమ్ మార్చేయడం వల్ల జరిగింది. వ్యాపారి ఖాతా నుంచి ఆ డబ్బు 28 వేరు వేరు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఈ ఫ్రాడ్ ఒకే ఒక్క రాత్రిలో జరిగిపోయింది. ఇలాంటి కేసుల్లో ఎవరో ఒకరిని టార్గెట్ చేసే మోసగాళ్లు అతడి సిమ్ కార్డ్ బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెడతారు. సిమ్ బ్లాక్ కాగానే, అదే నంబరుతో తీసుకున్న కొత్త సిమ్ నుంచి లావాదేవీల కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) రిక్వెస్ట్ పెడతారు. తర్వాత ఓటీపీ రాగానే, దాని సాయంతో ఒక ఖాతా నుంచి ఇతర ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం మొదలుపెడతారు. ఈ మధ్య ఎక్కువగా లావాదేవీలన్నీ ఆన్‌లైన్ లేదా డిజిటల్ మాధ్యమం ద్వారానే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది వివరాలు ఆన్‌లైన్లో లభిస్తున్నాయి. అలాంటప్పుడు ఫ్రాడ్ చేసే వారు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సిమ్ స్వాపింగ్ ద్వారా వారిని నిలువునా ముంచేస్తారు. సిమ్ స్వాప్ ఎలా జరుగుతుంది? సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ అడ్వకేట్ ప్రశాంత్ మాలీ దీని గురించి బీబీసీకి వివరంగా చెప్పారు. సిమ్ స్వాపింగ్ ఎలా చేస్తారో, దాని నుంచి మనల్ని ఎలా కాపాడుకోవచ్చో, జాగ్రత్తలు చెప్పారు. "2011 తర్వాత ఇలాంటి నేరాలు పెరిగాయి. సిమ్ స్వాపింగ్ ఒక వ్యక్తి మాత్రమే చేయడు. అందులో చాలా మంది ప్రమేయం ఉంటుంది. వ్యవస్థీకృత ముఠాలు ఇలాంటి వాటిని చేస్తుంటాయి. ఇలాంటి నేరాల ద్వారా 2018లో భారతదేశంలో 200 కోట్లు కొట్టేశారని సైబర్ అండ్ లా ఫౌండేషన్ అంతర్గత పరిశోధనలో తేలింది. రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా... ఈ ‘పాత’ ప్రపంచం ఎంత పెద్దదో తెలుసా ఎవరైనా మీ ఖాతాలో డబ్బు వేస్తామని చెబుతుంటే... ఎవరైనా ఒక వ్యక్తి మీ ఖాతాలో కొంత డబ్బు జమ చేయాలని అనుకున్నట్టు మీకు చెబితే, వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ప్రశాంత్ మాలీ చెప్పారు. "వాళ్లు తాము వేసే మొత్తంలో 10 శాతం, లేదా 10 వేల రూపాయలు మీకిస్తాం అంటారు. కొన్ని నిమిషాల్లోనే మీ ఖాతాలోకి డబ్బు పంపిస్తాం అంటారు. కానీ, ఈ మొత్తం సిమ్ స్వాపింగ్ ద్వారా కొట్టేసిన డబ్బు అయ్యుండవచ్చు". అలాంటప్పుడు మీకు తెలీకుండానే మీరు నేరస్థుడు కావచ్చు. ఎందుకంటే మీ ఖాతా కూడా వారి నేరంలో భాగం అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఏ కారణం లేకుండానే మీ ఖాతాలో డబ్బు జమ చేయాలని అనుకుంటే, మీరు అతడి వలలో పడకుండా ఉండాలి. కీలకమైన పత్రాలు ఎవరికీ ఇవ్వద్దు మనం సాధారణంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సమయంలో చేసే కొన్ని పొరపాట్ల గురించి మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ ఎస్పీ బాల్‌సింగ్ రాజ్‌పుత్ బీబీసీకి చెప్పారు. "క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండాలి. మీరు ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తుంటే వాటిని సెక్యూర్డ్ వెబ్‌సైట్ నుంచే చేస్తున్నామా, లేదా అనేది చూసుకోవాలి. మీ ఓటీపీ లేదా కార్డ్ సీవీవీ ఎవరికీ ఇవ్వకండి". "మీరు మీ ముఖ్యమైన కాగితాలను ఎవరికీ ఇవ్వకుండా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇవ్వాల్సివస్తే, ఆ ఫొటోకాపీలను ఏ పనికోసం ఇస్తున్నారో వాటిపై కచ్చితంగా రాయాలి. ఆ కాపీలను ఆ పనికోసమే ఉపయోగించాలి. అలా చేయడం వల్ల ఆ కాగితాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయి. మీరు ఎవరికైనా లేదా ఏ సంస్థకైనా మీ ఫొటోకాపీలు ఇస్తుంటే అది అవసరమా కాదా అనేది ఒక్కసారి ఆలోచించండి" అని బాల్‌సింగ్ చెప్పారు. సెలవుల్లో సిమ్ స్వాపింగ్ "ప్రతి బ్యాంకు ఖాతాకు ఈ-మెయిల్ అలర్ట్ సదుపాయం ఉండాలి. మీ సిమ్ కార్డ్ హఠాత్తుగా బ్లాక్ అయితే, కనీసం ఈ-మెయిల్ ద్వారా అయినా మీ అనుమతి లేకుండా లావాదేవీలు జరుగుతున్న విషయం తెలుస్తుంది. అలా మీరు వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి నష్టం జరగకుండా ఆపవచ్చు" అని ప్రశాంత్ మాలీ సలహా ఇచ్చారు. "ముఖ్యంగా సిమ్ స్వాపింగ్ ఎక్కువగా శుక్రవారం, లేదా శనివారం చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు సెలవుల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే సెలవుల వల్ల బాధితులు బ్యాంకులు లేదా టెలికాం కంపెనీలను సంప్రదించడం కష్టం అవుతుంది. అందుకే సెలవుల్లో మీ సిమ్ కార్డ్ హఠాత్తుగా బ్లాక్ అయితే, అప్రమత్తం కావాలి. మీ బ్యాంకు ఖాతాను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలి" అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇటీవల ముంబైలో ఒక వ్యాపారి ఒకే రోజు 1.86 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. text: ఒక మహిళగా తనకు ఈ విధులు నిర్వహించడంలో ఎలాంటి కష్టాలూ కనిపించడం లేదని హినా మునావర్ చెప్పారు. పంజాబ్ ప్రాంతంలోని ఫైసలాబాద్‌కు చెందిన హినా మునావర్ స్వాత్‌లోని ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో తనను నియమించడం గర్వంగా ఉందన్నారు. ఆ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసేందుకు తనకు అవకాశం వచ్చిందన్నారు. పాకిస్తాన్‌లో సీఎస్ఎస్ పరీక్ష పాసై పోలీసు సేవలకు ఎంపికైన ఏడుగురు మహిళలను ఏడాదిపాటు ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో నియమించనున్నారు. వారిలో ఇద్దరిని ఖైబర్ పఖ్తూంఖ్వాలో, నలుగురిని ఇస్లామాబాద్‌లో, ఒకరిని గిల్గిత్‌లో నియమించారు. ఈ మహిళలు ప్రధానంగా ఏఎస్పీ ర్యాంక్ వారు. అయితే, ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో వీరిని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లేదా కమాండింగ్ ఆఫీసర్ అంటారు. ఎంఫిల్ పూర్తి చేసిన హినా తర్వాత సీఎస్ఎస్ పరీక్ష పాస్ అయ్యారు. పోలీసు సేవలకు ప్రాధాన్యం ఇచ్చారు. పాకిస్తాన్ పోలీస్ సేవల్లో (పీపీఎస్) ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జిల్లాలో పీపీఎస్‌కు నేతృత్వం వహించే తొలి మహిళా అధికారి తనే అయినందుకు సంతోషంగా ఉందని హినా చెప్పారు. బీబీసీతో మాట్లాడిన హినా ఒక మహిళగా, తన విధుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని తనకు అనిపించడం లేదని, తన ఇష్టప్రకారం, సంతోషంగా పోలీసు సేవల్లోకి వచ్చానని చెప్పారు. ఫ్రాంటియర్ కాన్‌స్టేబులరీలో మహిళలే లేరు తన బాధ్యతలు పూర్తి చేయడంతోపాటు స్వాత్‌ ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలోని పనిచేసే సైనికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నానని హినా చెప్పారు. భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఒక ప్రశ్నకు జవాబుగా "పాకిస్తాన్‌లో మిలిటెన్సీ ప్రభావం చాలా దారుణంగా ఉంది. స్వాత్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ముందు ముందు ఇక్కడ మరింత అభివృద్ధి జరుగుతుంది" అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పెళ్లైన హినాకు ఒక పాప కూడా ఉంది. తన వృత్తిపరమైన బాధ్యతలను చూసుకుంటూనే, ఇల్లు, కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుందని హినా చెప్పారు. ఎలాంటి ప్రభావం పడకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఒక సవాలు లాంటిదన్నారు. "ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ ఒక సంప్రదాయ పోలీసు దళంగా ఉంది. గిరిజన ప్రాంతాలు, శరణార్థుల మధ్య ఉన్న సరిహద్దుపై నిఘా పెట్టడం వారి ప్రధాన విధి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి" అని ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ రిటైర్డ్ అధికారి రహ్మత్ ఖాన్ వజీర్ బీబీసీకి చెప్పారు. మిలిటెంట్ ఘటనలతో దారుణ ప్రభావం ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో మహిళలు ఉన్నత పదవుల్లోకి రావడం వల్ల దాని పనితీరు మెరుగు పడుతుందని ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు రికార్డులు చూసుకోవడమే కాకుండా, ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ కార్యాలయం పనితీరును కూడా మెరుగుపరచగలరు అన్నారు. "ఎఫ్‌సీలో ఇప్పటివరకూ మహిళా సిబ్బంది లేరు. కానీ ఇప్పుడు మహిళా అధికారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పోలీస్ డ్యూటీ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో వారు కూడా చాలా కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది" అని చెప్పారు. స్వాత్‌ సహా ఖైబర్ పంఖ్తూంఖ్వాలోని ఎక్కువ జిల్లాలపై గత కొంతకాలంగా మిలిటెంట్ ఘటనల ప్రభావం తీవ్రంగా ఉంది. మిలిటెంట్లకు, సైనికులకు మధ్య పోరాటం జరిగినపుడు పౌరులు, ఇతర సైనిక సిబ్బంది, అధికారులు టార్గెట్ అవుతున్నారు. ఇప్పటివరకూ, నలుగురు ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ పోలీసు అధికారులు సహా మొత్తం 360 మంది సైనికులను లక్ష్యంగా చేసుకున్నారు. 1915లో బోర్డర్ మిలిటరీ పోలీస్, సమానా రైఫిల్స్‌ను కలిపేసి ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీని ఏర్పాటు చేశారు. ఈ దళాలు ఆంగ్లేయుల కాలం నుంచీ సరిహద్దులను కాపాడే విధుల్లో ఉన్నాయి. ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ దళాలను ప్రధానంగా ఖైబర్ పంఖ్తుంఖ్వా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. వీరిని పాకిస్తాన్‌లోని వివిధ భాగాల్లో మోహరించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హినా మునావర్ పాకిస్తాన్‌లోని తీవ్రవాద ప్రభావిత స్వాత్ జిల్లాలో ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ కమాండింగ్ అధికారిగా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. text: దానితోపాటు ఏ మహిళైనా హోటల్లో గది తీసుకుని ఒంటరిగా ఉండచ్చు. గతంలో కపుల్స్ హోటల్లో ఒకే గదిలో కలిసి ఉండాలంటే తాము వివాహితులమని ఇద్దరూ నిరూపించాల్సి వచ్చేది. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నారు. కొత్తగా ఏ మార్పులు వచ్చాయి? గతంలో సౌదీ అరేబియా వచ్చే ఏ విదేశీ జంటలైనా హోటల్లో ఒకే గదిలో బస చేయాలంటే తమ ఇద్దరికీ పెళ్లైనట్లు పత్రాలు చూపించాల్సి వచ్చేది. కానీ ఇక సౌదీ అరేబియా వచ్చే విదేశీ జంటలు హోటల్లో ఉండేందుకు తాము వివాహితులమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సౌదీ టూరిజం, నేషనల్ హెరిటేజ్ మంత్రిత్వ శాఖ దీనిపై ఒక ప్రకటన జారీ చేసింది. సౌదీ అరేబియా పౌరులు హోటల్ చెకిన్ సమయంలో తమ ఫామిలీ ఐడీ లేదా రిలేషన్‌షిప్ సర్టిఫికెట్ చూపించాలి. విదేశీ జంటలకు మాత్రం ఆ అవసరం లేదు. కానీ, మహిళలు అందరూ తమ ఐడీ ఇచ్చి హోటల్లో గది బుక్ చేసుకోవచ్చు. సౌదీ మహిళలకు కూడా ఈ అవకాశం కల్పించారు. కొత్త వీసా నిబంధనల ప్రకారం మహిళా పర్యాటకులు తమను పూర్తిగా కప్పుకునే దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. కానీ, "వారు మర్యాదపూర్వకంగా ఉండే బట్టలు వేసుకుంటారనే" తాము ఆశిస్తున్నట్లు టూరిజం మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే మద్యంపై మాత్రం ఇప్పటికీ ఆంక్షలు ఉన్నాయి. ఈ మార్పు వెనక కారణం సౌదీ అరేబియాకు ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఉన్న దేశంగా గుర్తింపు ఉంది. కానీ ఓపెన్ మార్కెట్‌ ఆర్థికవ్యవస్థలో సౌదీ అరేబియా తనను తాను అంత దూరంగా ఉండాలని అనుకోవడం లేదు. అది తమ దేశానికి పర్యాటకులు రావాలని, పెట్టుబడులు పెరగాలని కోరుకుంటోంది. కరడుగట్టిన సంప్రదాయ దేశంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్-సల్మాన్ ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. సౌదీ అరేబియా మహిళలు కారు నడపడంపై ఉన్న ఆంక్షలను ఆయన ఎత్తివేశారు. దానితోపాటు పురుష సంరక్షకులు లేకుండా సౌదీ మహిళలు విదేశాలకు వెళ్లడంపై ఉన్న ఆంక్షలను కూడా తొలగించారు. అయితే ఈ మార్పుల కంటే ఎన్నో వివాదాస్పద సౌదీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటిలో టర్కీలోని సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని హత్య చేయడం ఒకటి. సౌదీ అరేబియా తాజా నిర్ణయంతో అక్కడ విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ద ఇండిపెండెంట్ ట్రాలెవ్ ఎడిటర్ సిమోన్ కైల్డర్ భావిస్తున్నారు. "వీసా నిబంధనలు సడలించడం వల్ల సౌదీలో విదేశీ పర్యాటకుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. అరబ్ ప్రపంచాన్ని చూడాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది శుభవార్తే" అని ఆయన బీబీసీకి చెప్పారు. మహిళల డ్రైవింగ్ పైన నిషేధం ఎత్తివేయాలనే ప్రకటన చేశాక, వారి కోసం ప్రత్యేకంగా కార్ల షో ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సౌదీ ప్రభుత్వం తమ కొత్త వీసా నిబంధనలను ప్రకటించింది. సౌదీ అరేబియాలోని హోటళ్లలో ఇక అవివాహిత విదేశీ జంటలు ఒకే గదిలో కలిసి ఉండచ్చు. text: భారత భద్రతా దళానికి చెందిన మరో ముగ్గురు సభ్యులు కూడా గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో గురేజ్, ఉరి సహా పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ శుక్రవారం కాల్పులు జరిపినట్లు భారత సైన్యం వెల్లడించింది. అదే సమయంలో పాకిస్తాన్‌ కూడా భారత్‌పై అవే ఆరోపణలు చేసింది. నీలం, జీలం వ్యాలీ ప్రాంతాలలో భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఒక ప్రకటనలో ఆరోపించింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ శ్రీనగర్‌లో భారత సైన్యం చేసిన ప్రకటన ప్రకారం.. పాకిస్తాన్ ఈ దాడిలో మోర్టార్‌, ఇతర ఆయుధాలను ఉపయోగించింది. సాధారణ పౌరులను పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం చెబుతోంది. "మా సైన్యం పాకిస్తాన్‌ సైన్యపు మౌలిక సదుపాయాలను, బంకర్లను ధ్వంసం చేసింది. వారి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, ఉగ్రవాదులకు చెందిన అనేక లాంచ్‌ ప్యాడ్లను నాశనం చేసింది" అని భారత సైన్యం తెలిపింది. నీలం ఘాటీ భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణలు మరోవైపు పాకిస్తాన్‌ స్టేట్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ముజఫరాబాద్) బ్రాంచ్‌ ప్రకటన ప్రకారం.. భారత్‌వైపు నుంచి జరిగిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 23మంది సైనికులు గాయపడ్డారు. గాయపడినవారిలో పిల్లలు కూడా ఉన్నారని పాక్ ఆరోపిస్తోంది. చొరబాటు కుట్ర విఫలం పాకిస్తాన్ కాల్పుల్లో ఉరిలోని నంబాలా సెక్టార్లో ఇద్దరు సైనికులు మరణించారని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో హాజీపీర్‌ సెక్టార్లో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ సబ్‌ఇన్స్పెక్టర్‌ ఒకరు మరణించారు. ఒక భారతీయ సైనికుడు కూడా గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని ఉరి ప్రాంతంలోని కమల్‌కోట్‌ సెక్టార్‌లో ఇద్దరు పౌరులు కూడా మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉరిలోని హాజీపీర్‌ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలో ఒక మహిళ మృతి చెందింది. పాకిస్తాన్‌ దాడిలో చాలామంది గాయపడ్డారని భారత సైన్యం చెబుతోంది. సరిహద్దుకు సమీపంలో ఉన్న కేరన్‌ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘనతోపాటు, పాక్‌ సైన్యం చొరబాటుకు ప్రయత్నించిందని, దాన్ని భగ్నం చేశామని రక్షణశాఖ ప్రతినిధి రాజేశ్‌ కలియా తెలిపారు. "ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని ఎల్‌ఐసి సమీపంలో కేరన్ సెక్టార్‌లో శుక్రవారం మా సైన్యానికి అనుమానాస్పద కదలికలను గమనించాం. పాక్‌ సైన్యపు చొరబాటు ప్రయత్నాలను మా దళాలు విఫలం చేశాయి" అని ఆయన అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నియంత్రణ రేఖ వెంబడి భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో భారత భద్రతా దళాలకు చెందిన ముగ్గురు సహా ఆరుగురు మరణించినట్లు భారత సైన్యం తెలిపింది. text: హాంకాంగ్‌లో ఉన్న 30 లక్షల మందికి బ్రిటన్ తమ దేశంలో స్థిరపడేందుకు ఆఫర్ ఇవ్వగా, అటు అమెరికా ప్రతినిధుల సభ హాంకాంగ్‌కు సంబంధించి కొత్త ఆంక్షలను ఆమోదించింది. అమెరికా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానంలో చైనా అధికారులతో వ్యాపారం చేసిన బ్యాంకులకు జరిమానా విధిస్తామని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి వెళ్లే ముందు ఈ తీర్మానం సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇటు కొత్త భద్రతా చట్టం ద్వారా హాంకాంగ్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తున్నారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఈ చట్టానికి ప్రభావితమైన వారు బ్రిటన్ రావచ్చని ప్రతిపాదన చేశారు. హాంకాంగ్ మొదట బ్రిటన్ వలస రాజ్యంగా ఉండేది. కానీ దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. బ్రిటన్‌కు అలా అనడానికి ఏ హక్కూ లేదని, ఆ దేశం చర్యలను అడ్డుకోడానికి చైనా తగిన చర్యలు చేపడుతుందని బ్రిటన్‌లోని చైనా రాయబారి చెప్పారు. “ఇది రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కొత్త చట్టాన్ని బ్రిటన్ విమర్శించడం బాధ్యతారాహిత్యం, అనవసరం” అని చైనా రాయబారి ల్యూ షియావొమింగ్ చెప్పారు. హాంకాంగ్‌లోని సుమారు 30 లక్షల మందికి బ్రిటన్ తలుపులు తెరవడాన్ని చైనా తప్పుపడుతోంది బ్రిటన్ నిర్ణయం ఏంటి? బ్రిటన్ తాజా నిర్ణయంతో హాంకాంగ్‌లో బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉన్న సుమారు మూడున్నర లక్షల మంది, మరో 26 లక్షల మంది ఐదేళ్లపాటు బ్రిటన్‌లో ఉండడానికి రావచ్చు. తర్వాత ఏడాదికి, అంటే ఆరేళ్లు పూర్తైన తర్వాత వారందరూ బ్రిటన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హాంకాంగ్‌లో ఓవర్‌సీస్ పాస్‌పోర్టుతో ఉన్న బ్రిటన్ పౌరులకు 1980లో ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ ప్రస్తుతం వారి హక్కులు పరిమితంగా ఉన్నాయి. వారు వీసా లేకుండా ఆరు నెలలు మాత్రమే బ్రిటన్‌లో ఉండగలరు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకారం ప్రవాస బ్రిటన్ పౌరులు, వారిపై ఆధారపడిన అందరికీ బ్రిటన్‌లో నివాస హక్కు కల్పిస్తారు. ఇందులో ఐదేళ్లపాటు పనిచేయడం, చదువుకునే హక్కు కూడా ఉంటాయి. ఆరేళ్ల తర్వాత వారు ఆ దేశ పౌరసత్వ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హాంకాంగ్‌లో కొత్త భద్రతా చట్టం అమలు చేయడం 1985లో చైనా-బ్రిటన్ జాయింట్ మేనిఫెస్టోను తీవ్రంగా ఉల్లంఘించడమే అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెబుతున్నారు. ఆ ఒప్పందం చట్టపరంగా దానికి బాధ్యత వహిస్తుందని, హాంకాంగ్‌ స్వాతంత్ర్యానికి సంబంధించి కొన్ని అంశాలకు 50 ఏళ్ల పాటు (చైనా 1997లో సౌర్వభౌమాధికార దేశంగా ప్రకటించినప్పటి నుంచి) రక్షణ కల్పిస్తుందని అందులో చెప్పారని తెలిపారు. ఈ చట్టం హాంకాంగ్ ఉన్నత స్థాయి స్వయంప్రతిపత్తి ఉల్లంఘనే అని, జాయింట్ మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన హక్కులు, స్వేచ్ఛకు ముప్పు ఏర్పడవచ్చని బ్రిటన్ ప్రధాని చెప్పారు. “చైనా ఇదే దారిలో వెళ్తుంటే, ప్రవాస బ్రిటన్ పౌరులు స్వదేశానికి రావడానికి కొత్త దారులు తీసుకువస్తామని మేం స్పష్టంగా చెప్పాం. వచ్చేవారికి పరిమిత కాలంపాటు ఇక్కడ ఉండడానికి, పని చేసుకోడానికి హక్కు అందిస్తామని, తర్వాత వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నాం. ఇప్పుడు మేం అదే చేస్తున్నాం” అని బోరిస్ జాన్సన్ చెప్పారు. బోరిస్ జాన్సన్ నిర్ణయంపై స్పందించిన చైనా.. బ్రిటన్ తన మాట తప్పిందని ఆరోపించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిజియన్ జావో మాట్లాడుతూ.. “బ్రిటిష్ నేషనల్ ఓవర్‌సీస్(బీఎన్ఓ) పాస్‌పోర్ట్ ఉన్నవారితోపాటూ హాంకాంగ్ దేశంలో ఉన్నవారందరూ చైనా పౌరులే. మొదట జరిగిన ఒప్పందంలో బీఎన్ఓ హోల్డర్లకు తమ దేశంలో శాశ్వతంగా ఉండడానికి అనుమతి ఇచ్చేది లేదని బ్రిటన్ మాకు మాట ఇచ్చింది. ఇప్పుడు బ్రిటన్ తన విధానాన్ని మార్చుకోవాలని అనుకుంటోంది. తను ఇచ్చిన మాటనే వెనక్కు తీసుకుంటోంది” అన్నారు. "చైనా భద్రతా చట్టానికి సమాధానంగా ఈ చట్టం చాలా అవసరం" అని సభ స్పీకర్ నాన్సీ పెలోసీ చెప్పారు అమెరికా ప్రతినిధుల సభ నిర్ణయం ఏమిటి అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హాంకాంగ్ అటానమీ యాక్ట్ హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నిరసనలు చేసిన వారిని అణచివేతకు పాల్పడిన అధికారులతో వ్యాపారం చేసే బ్యాంకులపై ఆంక్షల గురించి ప్రస్తావించారు. “చైనా భద్రతా చట్టానికి సమాధానంగా ఈ చట్టం చాలా అవసరం” అని సభ స్పీకర్ నాన్సీ పెలోసీ చెప్పారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని అంతం చేయడం గురించి అమెరికా ఈ బిల్లుకు ముందు నుంచీ చొరవ చూపుతోంది. అందులో రక్షణ ఎగుమతులపై, ఉన్నత సాంకేతిక ఉత్పత్తులను పొందడంపై నిషేధం విధించింది. అమెరికా గత ఏడాదే మానవ హక్కుల, ప్రజాస్వామ్య బిల్లుకు చట్టరూపం ఇచ్చింది. ఈ చట్టంలో హాంకాంగ్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించేవారికి తమ సహకారం ఉంటుందనే విషయం చెప్పింది. దీనిపై చైనా విదేశాంగ మంత్రి తీవ్రంగా స్పందించారు. అమెరికా ప్రతినిధి సభలో హాంకాంగ్ స్వయంప్రతిపత్తి గురించి ఆమోదించిన బిల్లును చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. అమెరికా, బ్రిటన్‌తోపాటూ ఆస్ట్రేలియా కూడా చైనాకు వ్యతిరేకంగా స్పందించింది మిగతా దేశాలు ఏమంటున్నాయి అమెరికా, బ్రిటన్‌తోపాటూ ఆస్ట్రేలియా కూడా దీనిపై స్పందించింది. హాంకాంగ్ ప్రజలకు తమ దేశంలో ఆశ్రయం కల్పించే విషయం గురించి ఆలోచిస్తున్నామని చెప్పింది. “దీనికి సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై త్వరలో క్యాబినెట్‌లో చర్చిస్తాం” అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ చెప్పారు. ఇటు తైవాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి హాంకాంగ్ పర్యటనలకు దూరంగా ఉండాలని, అవసరమైతే తప్ప అక్కడికి ట్రాన్సిట్ వీసా కూడా తీసుకోవద్దని తమ పౌరులకు సూచించారు. “హాంకాంగ్‌లో అమలు చేసిన కొత్త భద్రతా చట్టం చరిత్రలోనే అత్యంత అభ్యంతరకరమైన చట్టం” అని తైవాన్ మెయిన్‌లాండ్ అఫైర్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ చివ్ చుయ్-చాంగ్ అన్నారు. అయితే హాంకాంగ్‌లో తమ రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదట గళం వినిపించిన దేశాల్లో జపాన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడంపై జపాన్ విచారం వ్యక్తం చేసింది. ఈ చట్టం హాంకాంగ్‌ ‘ఒక దేశం-రెండు వ్యవస్థల’ సిద్ధాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుందని జపాన్ విదేశాగ మంత్రి తోషీమిత్సు మోటేగీ అన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ కూడా ఈ చట్టాన్ని విమర్శించారు. దీనివల్ల న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, చట్ట అమలుపై హానికరమైన ప్రభావం పడుతుందని అన్నారు. కెనడా కూడా హాంకాంగ్‌లో పర్యటించేవారికి ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది. హాంకాంగ్‌లో ఇప్పుడు జాతీయ భద్రతా చట్టం ఆధారంగా తమ ఇష్టానుసారం ఎవరినైనా అరెస్టు చేయవచ్చని, వారిని చైనాకు పంపించవచ్చని చెబుతోంది. మరోవైపు చైనా తమపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తోంది. హాంకాంగ్ అంశంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది. హాంకాంగ్‌లో నిరసనలు బీబీసీ రాజకీయ ప్రతినిధి నిక్ ఆర్డ్ లీ విశ్లేషణ భద్రతా చట్టం విషయంలో చైనా తన వైఖరిని మార్చుకునేలా బ్రిటన్ ప్రభుత్వం మొదటి నుంచీ ఆ దేశంపై ఒత్తిడి తెస్తోంది. కానీ అలా జరగలేదు. అందుకే ఇప్పుడు అది తన మాటను పూర్తి చేసింది. ఇది చాలా కీలక చర్య. బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయంతో గట్టి సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది. కానీ చైనాతో సంబంధాల విషయంలో మిగతా అంశాలపై కూడా పునరాలోచించాలని బ్రిటన్‌ మీద ఒత్తిడి ఉంటుంది. వీటిలో ఒకటి చైనా వివాదిత కంపెనీ హువావే. టోరీ పార్టీ ఎంపీలు చాలా మంది మొదటి నుంచీ దీనిని వ్యతిరేకించేవారు. ఈ నిర్ణయం తర్వాత వారి ఆందోళన మరింత పెరగనుంది. కొత్త చట్టం కింద ఎన్నో అరెస్టులు హంకాంగ్ ప్రజలు బ్రిటన్ రావచ్చనే ప్రతిపాదనపై మాట్లాడిన విదేశాంగ మంత్రి డొమెనిక్ రాబ్ “సంఖ్య, కోటా గురించి ఎలాంటి పరిమితులు ఉండవు, దరఖాస్తు ప్రక్రియ సాధారణంగా ఉంటుంది. కానీ ప్రవాస బ్రిటన్ పౌరులు తమ దేశం రావడానికి అనుమతించాలని చైనాపై ఒత్తిడి తీసుకురాలేం” అన్నారు. హాంకాంగ్‌లో ప్రస్తుతం బ్రిటన్ నేషనల్ ఓవర్‌సీస్ పాస్‌పోర్ట్ ఉన్న వారు వెంటనే బ్రిటన్ రావచ్చు. కానీ వారు తప్పనిసరిగా స్టాండర్డ్ ఇమిగ్రేషన్ దర్యాప్తు ప్రక్రియను ఎదుర్కోవాలి. ప్రధానమంత్రి జాన్సన్ అధికారిక ప్రతినిధి ఈ సమాచారం చెప్పారు. హాంకాంగ్ కొత్త భద్రతా చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం చాలా మందిని అరెస్టు చేశారు. ఈ చట్టం గురించి వస్తున్న అన్ని విమర్శలను చైనా కొట్టిపారేస్తోంది. అది తమ అంతర్గత విషయం అని చెబుతోంది. అటు బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమెనిక్ రాబ్ మాత్రం “చైనా మాట తప్పుతోందని” అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలు చేయాలన్న చైనా నిర్ణయాన్ని చాలా దేశాలు విమర్శిస్తున్నాయి. text: కుమారుడితో దివ్య గుప్తా అకస్మాత్తుగా వచ్చిన సెలవులతో పిల్లల బాధ్యత ఎలా నిర్వహించాలో కొంత మంది ఉద్యోగాలు చేస్తున్న గృహిణులు సతమతమవుతుంటే, మరి కొంత మంది తల్లులు తమకు పిల్లల్తో గడిపే సమయం దొరికినందుకు ఆనందిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని మహిళలు ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారో తెలుసుకునేందుకు బీబీసీ న్యూస్ తెలుగు ప్రతినిధి పద్మ మీనాక్షి ప్రయత్నించారు. కరోనావైరస్ భయం మనసులో ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లల తల్లులు ఈ సమయాన్ని తమ బంధాలను బలపర్చుకునే సమయంగా చూస్తున్నారు. నాగిని కందాల "నాకైతే వీకెండ్ కాస్త పెరిగినట్లుగా ఉంది", అని చెన్నై లో ఒక ఐటీ కంపెనీ లో పని చేస్తున్న ప్రియా ఆనంద్ అన్నారు. పిల్లల్ని బలవంతంగా వేసవి క్యాంపులకి పంపకుండా ఇంటి పట్టునే ఏదో ఒక పనిలో పాలు పంచుకునేటట్లు చేసే అవకాశం దొరికిందని అన్నారు. ఆమెకి 10 ఏళ్ళ బాబు, నాలుగేళ్ళ పాప ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉండటం వలన ఇల్లు ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవల్సి వస్తుంది గాని దానితో వచ్చే ఇబ్బంది ఏమి లేదని అన్నారు. 12 సంవత్సరాల బాబు ఉన్న తేని, మధురైకి చెందిన నాగిని కందాళ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. సహజంగానే పుస్తకాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళ అబ్బాయి కిండ్లేల్లో దొరికే బోలెడు కొత్త పుస్తకాలు చదువుకుంటున్నాడని చెప్పారు. జి సి కవిత, సైకాలజిస్ట్ అయితే, సమస్య అంతా టీనేజ్ పిల్లలతోను, చంటి పిల్లలతోను వస్తుందని, హైదరాబాద్ కి చెందిన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ జీసీ కవిత అన్నారు. ఇంట్లోనే ఉండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తల్లి తన దగ్గరకి కౌన్సిలింగ్‌కు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆమె వివరించారు. "ఆ అమ్మాయికి సోషల్ ఐసొలేషన్ వలన ఇంటి నుంచి బయటకి వెళ్లలేకపోతున్నానని, స్నేహితులను కలవలేకపోతున్నానే సమస్యలు ఉన్నాయి. బయటకి వెళ్లలేకపోతున్నప్పటికీ స్నేహితులు అందరితోనూ ఫోన్ లో వాట్సాప్ లో, స్కైప్ లో మాట్లాడే అవకాశం ఉందని ఆ అమ్మాయికి అర్ధం అయ్యేటట్లు చెప్పడానికి నాకు బోలెడు సమయం పట్టింది." ఈ సెలవుల పట్ల చాలా మందికి ఫిర్యాదులు ఏమి లేవు. పిల్లలు ఈ నిర్బంధం వలన క్రమశిక్షణగా తయారు అవుతున్నారని చాలా మంది తల్లులు భావిస్తున్నారు. నీహారిక రెడ్డి హైదరాబాద్ కి చెందిన ఫాషన్ డిజైనర్ నీహారిక రెడ్డి తన పిల్లల గురించి చెబుతూ , నిత్యం పని ఒత్తిడితో పిల్లలతో గడిపే సమయమే ఉండదని, ఇప్పుడు రోజంతా వాళ్ళతో గడుపుతూ, కావాల్సిన కధలు చెబుతున్నానని చెప్పారు. "పిల్లలు రోజు తాత, అమ్మమ్మలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు అనుభవించలేకపోయిన క్షణాలన్నీ అనుభవిస్తున్నాను" అని అన్నారు. ఈ రోజుల్లో ఎంత మంది పిల్లలు తమ తాత మామ్మలతో తరచుగా మాట్లాడుతున్నారని కవిత ప్రశ్నించారు. సాధారణంగా పెద్దవాళ్ళే పిల్లలతో మాట్లాడాలని తహతహలాడుతూ ఉంటారని అన్నారు. అకస్మాత్తుగా వచ్చిన పిల్లల సెలవులతో ఉద్యోగాన్ని, ఇంటిని ఎలా చూసుకోవాలో తెలియక మరో ఉద్యోగి, సతమతమవుతున్నారని చెప్పారు. ఆమె పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఒక పని అమ్మాయిని పెట్టుకున్నట్లు చెప్పారు. విజయభాను గ్రామాలలో పరిస్థితి కూడా ఇలాగే ఉందా? ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కే.ఎచ్ వాడ గ్రామం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న విజయభాను కోటే తన స్కూల్ పిల్లలతో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, దాని ద్వారా పాఠాలు చెబుతూ పిల్లలని బయటకి వెళ్లకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సెలవుల్లో పాఠాలు చెప్పవలసిన అవసరాన్ని వివరిస్తూ, ఐదవ తరగతి వరకు ఉన్న తమ స్కూల్ విద్యార్థులు, వచ్చే విద్య సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంటుందని, ఒకవేళ ఇప్పుడు వాళ్ళని అందుకు తగిన విధంగా సంసిద్ధం చేయకపోతే , పిల్లలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశ పెడుతుంది. దిల్లీలో నివసిస్తున్న రీతు శర్మ కి 10, 12వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఆమె కూడా పిల్లలు ఇంట్లో ఉండటం పట్ల వారి మధ్య బంధం బలపడుతుందని అన్నారు. "వ్యాపారాలు జరగకపోవడంతో మా పిల్లలు డబ్బు విలువ అర్ధం చేసుకుంటున్నారు. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే రక రకాల వంటలు వండుకుని తింటున్నారు", అని చెప్పారు. రీతూ శర్మ కుటుంబం ఈ సమయం పిల్లలకి, పెద్దవాళ్ళకి మధ్య బంధాన్ని పెంపొందిస్తుందా? అవుననే అన్నారు రీతు శర్మ. ఎందుకంటే, ఎప్పుడూ చదువులోనో, ఇంకొక పనిలోనే బిజీగా ఉండే పిల్లలతో గడిపే సమయం తమకి దొరికిందని అన్నారు. "కుటుంబంతో గడిపే సమయం పెరిగింది. కలిసి ఇంటి పని చేసుకోవడం, కొత్త వంటలు, కళలు నేర్చుకోవడం, ఇల్లు సర్దుకోవడం లాంటి పనులు చేసుకుంటున్నాం". ఆమె తన భర్త, పిల్లలు, అత్తగారు, మామగారితో కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. దివ్య గుప్త అనే ఇంకొక గృహిణి కూడా తమ పిల్లలలో బయటకి వస్తున్న కళాత్మకత గురించి ఆనందం వ్యక్తం చేశారు. తన తొమ్మిదేళ్ల కూతురు పాత సాక్స్ తో బార్బీకి గౌను కొట్టిందని, తన పదమూడేళ్ల కొడుకు ఇంట్లోనే పిజ్జా తయారు చేయడం నేర్చుకున్నాడని మురిసిపోతూ చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వైరస్ బారి నుంచి బయట పడతామని ఆశని వ్యక్తం చేశారు. పిల్లలు ఇంట్లో ఉండటం పట్ల తల్లుల దగ్గర నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ సామాజిక నిర్బంధం కుటుంబ బంధాలని బలపరుస్తుందేమో అని కవిత అన్నారు. సోషల్ ఐసొలేషన్, కేవలం వినడానికే కొత్తగా ఉంది కానీ, నిజానికి టెక్నాలజీ రూపంలో ఎప్పుడో మన కుటుంబ వ్యవస్థని కబళించేసిందని అన్నారు. ఒకవేళ ఈ ఊహించని నిర్బంధం కనక కుటుంబ వ్యవస్థ బలపడటానికి పునాది వేస్తె , అది ఒక మంచి భవిష్యత్ కి పునాది వేసినట్లేనని కవిత అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా వైరస్ ప్రపంచంలోని అనేక దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పుడు భారత్ లో కూడా కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ ప్రకటించక ముందే దేశంలోని అనేక స్కూళ్ళు, కాలేజీలు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. text: అయితే, తెరవెనుక మరో వ్యక్తి కూడా చరిత్ర సృష్టించబోతున్నారు. ఆయనే కమల భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్. ఆయన దేశంలోనే తొలి ‘‘సెకండ్ జెంటిల్‌మన్’’ కాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి గెలుపొందిన తొలి మహిళకు భర్తగా రికార్డు సృష్టించారు. 56ఏళ్ల డగ్లస్ తన భార్య విజయాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కమల ప్రచారాన్ని ముందుకు నడిపించిన ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన్ను అందరూ ‘‘కేహెచ్‌-ఈవ్’’గా పిలుస్తుంటారు. అంటే కమలకు నిబద్ధులైన మద్దతుదారులని అర్థం. ఆయన సోషల్ మీడియా పేజీలు.. కమల ఫ్యాన్ పేజీలను తలపిస్తుంటాయి. గత ఆగస్టులో తన న్యాయవాద కెరియర్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు డగ్లస్ ప్రకటించారు. కమలకు పూర్తిస్థాయిలో సాయం చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘కమల పోటీని ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన అలా విరామం తీసుకోవడంతో.. కొంతమంది ఆయన్ను చూసి నీళ్లలో నుంచి బయటకు వచ్చిన చేప అని అన్నారు. అలా కానేకాదు. ఆయన హాయిగా ఈదుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈతను ఆస్వాదిస్తున్నారు’’అంటూ డగ్లస్ మిత్రుడు ఆరన్ జాకొబీ వ్యాఖ్యానించారు. 2013లో లాస్ ఏంజెలిస్‌లో డగ్లస్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాయర్‌గా పనిచేసేవారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్న కమలా హారిస్‌తో ఆయన అప్పుడే తొలిసారి డేట్‌కు వెళ్లారు. ఈ డేట్ కోసం కమలకు కొంచెం తటపటాయిస్తూ ఓ సుదీర్ఘ వాయిస్ మెయిల్ పెట్టానని డగ్లస్ వివరించారు. ఆ రోజే వారిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. అయితే ఆ మరుసటి రోజే, కొన్ని నెలల వరకు తను ఏఏ రోజు ఖాళీగా ఉండబోతున్నారో డేట్లు అన్నీ కమలకు మెయిల్ పెట్టేశారు. ఈ విషయాలను తన ఆత్మకథ 'ద ట్రూథ్స్ వి హోల్డ్‌'లో ఆయన రాసుకొచ్చారు. ‘‘నేను దోబూచులాడే వయసులో లేను. అందుకే ఏదీ దాచిపెట్టాలని అనుకోలేదు. నాకు నువ్వు బాగా నచ్చావ్. మనిద్దరం కలిసి జీవితంలో ముందుకు వెళ్లగలమని అనుకుంటున్నాను’’ అని ఆయన ఆమెతో చెప్పారు. ఇది జరిగిన ఏడాదిలోపే శాంటా బార్బరా కోర్ట్ హౌస్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకవైపు భారతీయ సంప్రదాయాలు, మరోవైపు యూదుల కట్టుబాట్లు... రెండింటికీ ప్రాధాన్యమిస్తూ వీరి పెళ్లి జరిగింది. డగ్లస్ పంపిన తొలి వాయిస్ మెయిల్‌ను కమల సేవ్‌ చేసుకున్నారు. తమ ప్రతి వార్షికోత్సవంలోనూ దీన్ని కమల ప్లే చేస్తుంటారు. ప్రెట్టీబర్డ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కో-ఫౌండర్ కెర్‌స్టిన్ ఎమ్‌హాఫ్‌తో ఇదివరకే డగ్లస్‌కు వివాహమైంది. వీరికి కోల్, ఎల్లా పిల్లలు. ఈ ఇద్దరికీ పిన తల్లిగా కమల వారి ఇంట్లో అడుగుపెట్టారు. కోల్, ఎల్లాలను కలిసిన తర్వాత మరొక విషయం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నానని కమల తెలిపారు. ఈ విషయంపై 26ఏళ్ల కోల్ కూడా ఇటీవల గ్లామర్ మ్యాగజైన్‌తో మాట్లాడారు. తొలిచూపులోనే కమల అందరికీ నచ్చారని చెప్పుకొచ్చారు. మరోవైపు తన మొదటి భార్య, తనకు మంచి స్నేహితురాలని డగ్లస్ చెబుతుంటారు. ‘‘నాకు ఆమె ఇప్పటికీ ఆప్తురాలే’’ అని గత ఏప్రిల్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. కమలకు, ఆమెకు కూడా మంచి సంబంధాలున్నాయని వివరించారు. కమల అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలో.. ఆమెకు మద్దతుగా నిలవాలంటూ కెర్‌స్టిన్ కూడా ప్రచారం నిర్వహించారు. వరుస ట్వీట్లు కూడా చేశారు. ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియా వేదికల్లో కమల, డగ్లస్ చాలా సన్నిహితంగా కనిపిస్తుంటారు. ‘‘మీరు చూస్తున్నదంతా నిజమే. వారేమీ నటించడం లేదు. వారిద్దరూ ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ. వారిద్దరూ చాలా ప్రేమించుకుంటున్నారు’’ అని డగ్లస్‌కు మిత్రుడైన అలెక్స్ వీంగార్టెన్ వివరించారు. 2016లో కమల సెనేట్‌కు పోటీచేసినప్పుడు తొలిసారిగా ఆమె కోసం డగ్లస్ ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ప్రచారం.. ఉపాధ్యక్ష పదవికి ప్రచారం చేపట్టేంత స్థాయిలో తనను తీర్చిదిద్దలేదని ఆయన వివరించారు. 2019 జనవరిలో కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో 20,000 మంది ప్రజల నడుమ తొలిసారిగా కమల తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ‘‘నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నాను. 5,000 మంది మాత్రమే వస్తారని అనుకున్నాను. ఆ జనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను’’ అని ఆయన వివరించారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు వారంలో ఐదు రోజులు తను పనిచేసే సంస్థ కోసం పనిచేసేవారు. వారాంతంలో మాత్రం కమలతో కలిసి ప్రచారానికి వెళ్లేవారు. ప్రచారంలో డగ్లస్ తనదైన శైలిలో వ్యవహరించేవారు. క్షేత్రస్థాయిలో తను చూసిన, తను ఎదుర్కొన్న అనుభవాలను ఆయన ప్రస్తావించేవారు. గత జూన్‌లో కమల చేతుల్లో నుంచి మైక్‌ను ఒక నిరసనకారుడు లాక్కొన్నప్పుడు.. ఆమెకు వెంటనే డగ్లస్ సాయంచేశారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆయనపై పడింది. మొదటి వరుసలో కూర్చున్న డగ్లస్ వెంటనే ముందుకువచ్చి మైక్ లాక్కొని తన భార్యకు ఇచ్చారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. చాలామంది డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులతో డగ్లస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా ఆయనకు ఎలాంటి అనుభవమూ లేకపోయినప్పటికీ.. ఆయన ఎలాంటి బెరుకూలేకుండా నడుచుకుంటుంటారు. ‘‘ఆయన్ను చూస్తుంటే కొత్తగా పనిచేస్తున్నట్లు అనిపించదు. ఆయన చాలా సంతోషంగా ఉంటారు. చాలా సాయం చేస్తుంటారు’’ అని తన స్నేహితుడైన ఆరన్ వివరించారు. ఇంటర్వ్యూల్లో ఎలాంటి చింతా లేకుండా హాయిగా వెనక్కి కూర్చుని డగ్లస్ కనిపిస్తుంటారు. ఆయన్ను ఆయన ‘‘డూడ్‌’’గా పిలుచుకుంటుంటారు. ‘‘అప్పటివరకు నేనొక డూడ్‌లా ఉండేవాణ్ని. ఆ తర్వాతే నేను కమలను కలిశాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఆయన ఒక మంచి డూడ్. ఆయన చాలా సహజంగా అనిపిస్తుంటారు. ఆయన ప్రజల మనిషి’’ అని అలెక్స్ చెప్పారు. న్యాయవాదిగా డగ్లస్ అనుభవం.. బైడెన్, కమలకు చాలా ఉపయోగపడిందని అలెక్స్ వివరించారు. డగ్లస్, కమల ఇద్దరూ న్యాయవిద్య చదువుకున్నారు. కమల అటార్నీగా పనిచేస్తే.. కార్పొరేట్ లాయర్‌గా డగ్లస్ స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలతో డగ్లస్ కలిసి పనిచేశారు. ఫార్మా సంస్థ మెర్క్ కోసం కూడా డగ్లస్ పనిచేశారు. మెర్క్ ఉత్పత్తులు ఎముకల వ్యాధులకు కారణమవుతున్నాయంటూ వచ్చిన కేసులను ఆయనే వాదించారు. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీచేసిన మహిళా అభ్యర్థుల భర్తల్లో డగ్లస్ నాలుగోవారు. గెరాల్డైన్ ఫెరారో, సారా పాలిన్, హిల్లరీ క్లింటన్‌ల భర్తలు ఆయన కంటే ముందు వరుసలో ఉన్నారు. అయితే, వీరిలో శ్వేతసౌధంలోకి అడుగుపెడుతున్న వారిలో డగ్లస్ తొలి వ్యక్తి. ఆయన పదవికి ఇంకా అధికారికంగా పేరు కూడా పెట్టలేదు. ‘‘ఆ పేరేంటో నాకు ఎవరూ చెప్పలేదు. నాకు కూడా తెలియదు’’ అని అక్టోబరులో మేరీ క్లైర్‌తో ఆయన చెప్పారు. ‘‘ఈ పదవిని ఇప్పటివరకు మహిళలే చేపట్టారు’’ అని వర్జీనియా యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ ప్రెసిడెన్సియల్ స్టడీస్ బార్బరా పెర్రీ చెప్పారు. ఇది ఒక అలాంకార పదవైనప్పటికీ.. ఇదివరకటి ప్రథమ, ద్వితీయ మహిళలు తమ భర్తల అజెండాలకు సరిపడే, మద్దతు ఇచ్చే కార్యక్రమాలను చేపట్టారు. విద్యా విధానానికి జార్జ్ బుష్ మద్దతు పలికితే.. బాలల అక్షరాస్యత కోసం లారా బుష్ కృషిచేశారు. ఆరోగ్య సంరక్షణ కోసం బరాక్ ఒబామా పాటుపడితే, ఆరోగ్యకరమైన భోజనం, వ్యాయామం కోసం మిషెల్ ఒబామా కృషిచేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలిసిన మరుక్షణమే అందరిలోనూ ఆనందం మూడు రెట్లు అయ్యింది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేబట్టబోతున్న తొలి మహిళ, తొలి నల్లజాతీయురాలు, తొలి భారతీయ అమెరికన్.. మూడూ ఆమే. text: విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికిందని ఇస్రో ప్రకటించగానే భారతీయుల్లో ఆశలు చిగురించాయి. కానీ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఇంకా సాధ్యపడలేదు. ఇంతకీ ఇస్రో ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది.. లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యోమనౌకను భూమి పైనుంచి ఎలా కంట్రోల్ చేస్తారు? నాసా ఇస్రోకి ఎలాంటి సాయం చేస్తోంది. సెప్టెంబర్ 7న చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ సమయంలో విక్రమ్ ల్యాండర్‌ నుంచి ఇస్రోకి కమ్యూనికేషన్ ఆగిపోయింది. అప్పటి నుంచి విక్రమ్‌తో కమ్యూనికేషన్ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్‌ 14 రోజుల పాటు మాత్రమే పనిచేస్తాయి. అంటే సెప్టెంబర్ 21 తేదీలోగా విక్రమ్ ల్యాండర్‌ను రీకనెక్ట్ చేయాలి. అందుకోసం ఇస్రో ఏం చేస్తోందో అర్థం కావాలంటే భూమిపై నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్లు, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యోమనౌకలను శాస్త్రవేత్తలు ఎలా కంట్రోల్ చేస్తారో ముందు తెలుసుకోవాలి. రాకెట్ నుంచి శాటిలైట్ విడిపోయిన తర్వాత దానితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే అదెక్కడుందో ముందు గుర్తించాలి. దీనికోసం రాడార్ ఉపయోగపడుతుంది. రాడార్ ఒక పల్స్ అంటే సిగ్నల్ పంపిస్తుంది. అది శాటిలైట్‌ను చేరి తిరిగొస్తుంది. ఇదంతా ఒక ప్రోగ్రామ్‌గా.. డీప్ స్పేస్ నెట్‌వర్క్ ద్వారా.. ఎలక్ట్రానిక్ సిగ్నల్‌ రూపంలో జరుగుతుంది. ఈ సంకేతాలను గ్రహించే యాంటెన్నాలు ప్రతి శాటిలైట్‌లో ఉంటాయి. ఉపగ్రహాలు రిసీవర్ల సాయంతో సిగ్నల్‌ను గ్రహించి, అర్థం చేసుకుని సైంటిస్టులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. భూమిపై ఉండే గ్రౌండ్ స్టేషన్ నుంచి ఆ శాటిలైట్‌కు మాత్రమే అర్థమయ్యే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ పంపిస్తారు. శాటిలైట్‌లో ఎలాంటి లోపం లేకపోతే, ఆ సంకేతాల్ని అందుకుని సైంటిస్టులు చెప్పినట్లు నడుచుకుంటుంది. వ్యోమనౌకలు లేదా అంతరిక్షంలోకి పంపే ప్రోబ్‌ల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కాకపోతే ఉపగ్రహాలను గ్రౌండ్ స్టేషన్ నుంచి నియంత్రిస్తే.. వ్యోమనౌకలను డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ ద్వారా కంట్రోల్ చేస్తారు. వ్యోమనౌకలతో కమ్యూనికేషన్‌ కోసం శక్తివంతమైన యాంటెన్నాలు ఉండాలి. ఇలా వ్యోమనౌకలకు రేడియో కమాండ్స్ పంపించేందుకు ఇస్రో దగ్గర రెండు డీప్ స్పేస్ యాంటెన్నాలు ఉన్నాయి. బెంగళూరుకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలోని బైలాలు గ్రామంలో DSN 32, DSN 18 యాంటెనాలున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ సంస్థ వీటిని తయారు చేసిందని ఇస్రో వెబ్‌సైట్‌ చెబుతోంది. ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ -IDSNలో భాగంగా చంద్రయాన్ 1 సమయంలో వీటిని ఏర్పాటు చేశారు. గ్రహాంతర ప్రయోగాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుంచే వ్యోమనౌకలకు కమాండ్స్ పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన సంకేతాలను స్వీకరించి, విశ్లేషిస్తారు. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో ఇదొక భాగం. 'కేవలం చంద్రుడి మీదే కాదు.. మార్స్, జుపిటర్ మీద పరిశోధనలకు పంపిన వ్యోమనౌకలతో కూడా ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌‌తో కమ్యూనికేట్ చేయొచ్చని' ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ N శ్రీ రఘునందన్‌ చెప్పారు. విక్రమ్ ల్యాండర్‌తో ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది స్పందించడం లేదు. సెప్టెంబర్ 7న సిగ్నల్ ఆగిపోయే వరకు విక్రమ్ ల్యాండర్‌తో ఇస్రో ఇలాగే టచ్‌లో ఉంది. తమ సమాచారాన్ని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపించేలా ఆర్బిటర్, ల్యాండర్‌లను ప్రోగ్రామ్ చేశారు. కానీ ప్రజ్ఞాన్ రోవర్ తన సమాచారాన్ని నేరుగా భూమికి పంపించలేదు. ఆర్బిటర్‌తోనూ కమ్యూనికేట్ చేయలేదు. అది సమాచారాన్ని కేవలం విక్రమ్‌ ల్యాండర్‌కు మాత్రమే పంపించగలదు. రోవర్ నుంచి సమాచారం స్వీకరించి దాన్ని ఎర్త్ స్టేషన్‌కి పంపించేలా విక్రమ్ ల్యాండర్‌ని ప్రోగ్రామ్ చేశారు. కానీ ఇప్పుడు విక్రమ్ ల్యాండర్‌తోనే సంబంధాలు తెగిపోయాయి. అందుకే రోవర్ ఇప్పుడెలా ఉందన్న దానిపై స్పష్టత లేదు. చంద్రయాన్ 2 ఆర్బిటర్ ద్వారా కూడా విక్రమ్ ల్యాండర్ యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'ప్రస్తుతం చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. సుమారు ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఇది చంద్రుడిని చుట్టేస్తోంది' అని శ్రీరఘునందన్ చెప్పారు. డీప్ స్పేస్ నెట్‌వర్క్, ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోసం ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు నాసా కూడా తన వంతు సాయం చేస్తోంది. ల్యాండర్‌ ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది అని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇస్రో కంటే శక్తివంతమైన డీప్ స్పేస్ నెట్‌వర్క్ నాసాకి ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో DSN కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు కేంద్రాల్లో ఉన్న భారీ యాంటెన్నాలతో నాసా ఒక శక్తివంతమైన డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 17 ఉదయం 8 గంటల ప్రాంతంలో మాడ్రిడ్‌లోని డీప్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ల్యాండర్, ఆర్బిటర్‌తో మాట్లాడేందుకు నాసా ప్రయత్నించింది. సుమారు 4 లక్షల 20వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ల్యాండర్‌కు సిగ్నల్ పంపించింది. ల్యాండర్‌కి CH2L అని, ఆర్పిటర్‌కి CH2O అని కోడ్‌నేమ్స్ పెట్టింది. నాసా పంపిన అప్‌లింక్ సిగ్నల్‌కి స్పందించి ఆర్బిటర్‌ పంపిన డౌన్‌లింక్ సిగ్నల్ కూడా మనం పైనున్న ఫోటోలో చూడొచ్చు. కానీ ల్యాండర్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం రావడం లేదు. 'ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోసం గత కొన్ని రోజులుగా నాసా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సౌర కుటుంబం చివరి దాకా వెళ్లిన వ్యోమనౌకతో కూడా కమ్యూనికేట్ అయ్యే సామర్థ్యం నాసా DSNకి ఉంది' అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ N శ్రీ రఘునందన్‌ చెప్పారు. ఏం చేసినా డెడ్‌లైన్‌లోపే చేయాలి విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోసం ఇటు ఇస్రో.. అటు నాసా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఏ ప్రయత్నమైనా సెప్టెంబర్ 21లోపే చేయాలి. ఆ తర్వాత ఏం చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాల పరిమితి ఒక లూనార్ డే. అంటే భూమి మీద 14 రోజులకు సమానం. సెప్టెంబర్ 7న చంద్రుడిపై హార్డ్ ల్యాండయిన విక్రమ్ కాల పరిమితి సెప్టెంబర్ 21తో ముగుస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతం చీకటిలోకి వెళ్లిపోతుంది. చంద్రుడిపై సూర్యుడి వెలుగు పడిన చోట ఉష్ణోగ్రత 130 డిగ్రీల వరకు ఉంటే.. సూర్యకిరణాలు పడని ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీల వరకు ఉంటుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌కు ఏం జరిగింది? అది సేఫ్‌గానే ఉందా లేక ధ్వంసమైందా? ఇస్రో ప్రయత్నాలకు అది ఎందుకు స్పందించడం లేదు. కోట్లాది మంది భారతీయుల్లో ఇవే అనుమానాలు. text: పవన్, కేటీఆర్ ‘‘కోవిడ్‌-19పై పోరులో భాగంగా పవన్‌ కల్యాణ్‌ విరాళం ప్రకటించడంతో మొదలైందీ సంభాషణ. ‘సర్‌ ఎందుకు... తమ్ముడూ అంటే సరిపోతుంది’ అని కేటీఆర్‌ అనడంతో.. ‘అలాగే’ అంటూ పవన్‌ సమాధానం ఇవ్వడం వరకు సాగింది. కరోనా (కోవిడ్‌-19) విలయతాండవంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఈ సమయంలో సహాయార్ధం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెరో రూ. 50 లక్షలు ఇచ్చారు. ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తే... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు పవన్‌. అందులో కేటీఆర్‌ను సర్‌ అని పవన్‌ సంబోధించారు. ఆ ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ‘‘ధన్యవాదాలు అన్నా.. అయినా మీరు నన్ను సర్‌ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండి’’ అని కోరారు. దానికి పవన్‌ ‘సరే తమ్ముడూ’ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ట్విటర్‌లో ఈ సంభాషణ హైలైట్‌గా నిలుస్తోంది’’ అని ఆ కథనంలో రాశారు. పరీక్షల్లేవ్.. అందరూ పాస్ కరోనావైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ‘సాక్షి’ కథనం తెలిపింది. ‘‘6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయా సంవత్సరాంత పరీక్షలను రద్దు చేసి, ఆ విద్యార్థులంతా పాస్‌ (ఉత్తీర్ణులు) అయినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లోని అందరు విద్యార్థులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనావైరస్‌ కారణంగా పరీక్షల వాయిదా తదితర నిర్ణయాలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ దృష్ట్యా స్కూళ్లు మూతపడినందున నేరుగా విద్యార్థుల ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, చిక్కీ, గుడ్ల పంపిణీని సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. అన్ని చోట్లా ఒకే నాణ్యత ఉండాలని, గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం వలంటీర్ల సహాయాన్ని తీసుకోవాలన్నారు’’ అని ఆ కథనంలో తెలిపారు. వారణాసి కాశీలో బిక్కుబిక్కు.. తీర్థయాత్రకెళ్లి చిక్కుకుపోయిన ఆంధ్రులు తీర్థ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 51 మంది కాశీలో చిక్కుకుపోయారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది. ‘‘కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ఊరుకాని ఊరిలో నానా కష్టాలు పడుతున్నారు విజయవాడ పటమట హైస్కూల్‌ రోడ్డులోని రామాయణపువారి వీధికి చెందిన 10 మహిళలు. వీరంతా ఈ నెల 10వ తేదీన రైల్లో కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణానికి ఈనెల 23న రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈనెల 22న జనతా కర్ఫ్యూ విధించిన కేంద్రం ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో వీరంతా రైలు టికెట్లు రద్దు చేసుకుని, తిరిగి ఏప్రిల్‌ 1వ తేదీకి టికెట్లు బుక్‌ చేసుకున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్రం ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో వీరంతా నానా కష్టాలు పడుతున్నారు. నగదు మొత్తం అయిపోవడంతో కాశీలోని తెలుగువారి సత్రంలో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. తమను స్వస్థలానికి చేర్చాలంటూ ఫోన్‌ ద్వారా స్థానిక నేతలు, అధికారులు, మంత్రులను వేడుకుంటున్నారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 39 మంది, మరో ఇద్దరు కూడా ఈ నెల 10న కాశీ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయారు. తమను ఆదుకోవాలని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ను ఫోన్‌లో కోరారు. ఒడిశాలో చిక్కుకుపోయిన 175 మంది మత్స్యకారులు చేపల వేటతోపాటు ఉపాధి కోసం ఒడిశాలోని పారాదీప్‌ హార్బర్‌కు వెళ్లిన 175 మంది మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారు. వేట ఆగిపోవడంతో పనిలేక, తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. స్వస్థలానికి వద్దామంటే హార్బర్‌ నుంచి అక్కడి అధికారులు కదలనీయడంలేదని మత్స్యకారులు చెబుతున్నారని ఆ కథనంలో వివరించారు. అల్లు అర్జున్ అల సూపర్ మార్కెట్లో ‘‘క‌రోనావైర‌స్ నేప‌థ్యంలో చిన్నా, పెద్ద‌, పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఎవ‌రి ప‌ని వారే చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సామాన్యుడిలా మారాడు. ఇంటి నిత్యావ‌స‌ర వ‌స్తువుల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ సూప‌ర్‌మార్కెట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. చేతుల‌కు గ్లౌస్‌, ముఖానికి మాస్క్ వేసుకుని స‌రుకులు కొనుగోలు చేశాడు. మాస్క్ వేసుకుని టీష‌ర్ట్‌, షార్ట్‌తో ఉన్న బ‌న్నీని కొంద‌రు గుర్తుప‌ట్టి ఫోటోలు తీశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి’’ అని నమస్తే తెలంగాణ కథనం తెలిపింది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ నడిచిందని ‘ఈనాడు’ కథనం తెలిపింది. text: ప్రతీకాత్మక చిత్రం ఈ నేపథ్యంలో నిర్మాత, ఏపీ ఫిల్మ్ చాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె.సురేశ్‌ బాబు బీబీసీతో మాట్లాడుతూ.. షికాగోలో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషన్ మోదుగుమూడి అసలు నిర్మాతే కాదని, తనకు తెలిసి ఆ పేరుతో నిర్మాత ఎవరూ లేరని చెప్పారు. అమెరికాలో వెలుగులోకి వచ్చిన తాజా ఉదంతం గురించి పూర్తిగా తనకు తెలియదని ఆయన అన్నారు. ‘‘హీరోయిన్లను అక్కడకు తీసుకెళ్లాలంటే.. వారిని ఎందుకు తీసుకెళ్లాలో వీసా కోసం దరఖాస్తు చేసినపుడు స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ అమెరికాలోని తెలుగు సంస్థలు గౌరవ అతిథిగా తీసుకెళ్తే.. చిన్న నటులకు ఆ అవకాశం రాదు. వీసా ఇవ్వరు కూడా. అందువల్ల చిన్న హీరోయిన్లను, నటులను తెలుగు సంస్థలు అక్కడకు తీసుకెళ్లడం అంత సులభం కాదు.’’ అన్నారు. ఇంకేదైనా ఇతర కారణాలు చూపించో, లేదంటే పర్యటన పేరుతోనో తీసుకెళ్లి ఉండొచ్చని, అయితే, దీనిపై తమకు వివరాలు తెలియవని ఆయన అన్నారు. అన్నింటికీ సినీ రంగాన్ని నిందించటం సరికాదనీ, గ్లామర్ ఫీల్డు కావడం వల్ల చిన్న విషయాలు కూడా మీడియాకు పెద్దగా కనిపిస్తాయని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు. ప్రతీకాత్మక చిత్రం చాలాకాలంగా జరుగుతున్న వ్యవహారమే.. కొందరు చిన్నచిన్న హీరోయిన్లను.. మహిళా ఆర్టిస్టులను అమెరికాకు తీసుకెళ్లి వారితో అక్కడ వ్యభిచారం చేయించడం ఇవ్వాళ్టి విషయం కాదని, చాలా రోజులుగా ఇలాంటివి జరుగుతున్నాయని టాలీవుడ్‌కి చెందిన కొందరు బీబీసితో చెప్పారు. అక్కడైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరూ అడగరన్న భరోసా ఇచ్చి ఇక్కడివారిని మోసం చేస్తున్నారని వివరించారు. తాజాగా షికాగోలో వ్యభిచారం రాకెట్ నడుపుతున్న ఆరోపణలపై కిషన్ మోదుగుమూడి (శ్రీరాజ్ చెన్నుపాటి అలియాస్ రాజు) ని అరెస్ట్ చేసిన సందర్భంగా బీబీసి సినిమా రంగానికి చెందిన పలువురితో మాట్లాడింది. కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి అసలు నిర్మాతే కాదని.. అలా చెప్పుకొంటూ సినిమా వాళ్లతో వ్యాపారం చేసే దళారి అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. ప్రతీకాత్మక చిత్రం ‘ఆయనతో నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు’ ''అతను ఎప్పటి నుంచో అమెరికాలో ఉన్నారు. చాలా మందికి వీసాలు కూడా ఇప్పించారు. అమెరికాలో కూర్చొని ఇక్కడి వారికి వీసాలు ఇప్పించారంటే చాలా ఆలోచించాలి'' అని భరద్వాజ వివరించారు. అతనిపై మూడు నెలల కిందటే ఫిర్యాదు చేశారని, తాజాగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లినవారంతా సినిమా రంగానికి చెందినవారే అనుకోలేమని, ఆ పేరుతో ఇతరులనూ తీసుకెళ్లి ఇలాంటి పనులకు పాల్పడ్డారని భరద్వాజ ఆరోపించారు. అక్కడ పలు తెలుగు సంస్థల పేరిట జరిగే కార్యక్రమాలకూ కొన్ని నెలల కిందట పలువురిని తీసుకెళ్లారని చెప్పారు. కిషన్‌కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఎలాంటి సంబంధమూ లేదని భరద్వాజ వెల్లడించారు. ఇలాంటివాటికి దూరంగా ఉండాలి గ్లామర్ ఫీల్డ్‌లో ఇదో ధోరణిగా మారిపోయిందని గేయ రచయిత శ్రేష్ఠ అన్నారు. సినిమా, ఈవెంట్స్ అన్నీ బిజినెస్‌గా మారిపోయి అన్ని రకాల వ్యవహారాలూ ఎక్కువైపోతున్నాయన్నారు. కొందరు అత్యాశ వల్ల అన్నింటికీ ఓకే చెప్పేస్తున్నారని అన్నారు. మనకు టాలెంట్ ఉన్నపుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చని సూచించారు. ఇండస్ర్టీలో కిషన్ లాంటివాళ్లు చాలా మంది ఉంటారని చెప్పారు. కేవలం మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా ఇలాంటి వ్యవహారాలను నడిపిస్తున్నారని శ్రేష్ఠ పేర్కొన్నారు. ప్రతీకాత్మక చిత్రం 'పచ్చి దగాకోరు వ్యాపారమది' హీరోయిన్లను, హీరోయిన్ కావాలన్న ఆశతో వచ్చినవారిని ''అమెరికా వెళ్లాలి.. సినిమాలో నటించాలన్న ఆశను సాకుగా చూపి మోసం చేస్తున్నారు.'' అని రచయిత గౌతమ్ కశ్యప్ బీబీసీతో చెప్పారు. 'కిషన్ అనే వ్యక్తి నిజంగా సినిమా తీసుంటే ఆ విషయం అందరికీ తెలిసేది. ఆయనో ప్రొడ్యూసర్‌గా మేం ఎప్పడూ వినలేదు. అక్కడ ఆయన సినిమా నిర్మాతని చెప్పుకొంటూ ఉండొచ్చు.' అని గౌతమ్ పేర్కొన్నారు. మొత్తానికి ఇదో దగాకోరు వ్యాపారమైపోయిందని అన్నారు. ''ఇది అన్ని చోట్లా జరుగుతోంది. ఈ విషయం చెబితే అవకాశాలు పోతాయని చాలామంది బయటపడరు. ఇది చాలా రోజులుగా జరుగుతోంది.'' అని గౌతమ్ చెప్పారు. 'నాటి నుంచి నేటి వరకు అనేక మందిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఒక అమ్మాయి.. కాస్టింగ్‌కి వచ్చిందంటే.. ఆ అమ్మాయిని వేరు దృష్టితో చూడటం కామనైపోయింది.' అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలోని షికాగోలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, యాంకర్లతో 'సెక్స్ రాకెట్' నడిపిస్తున్నారన్న ఆరోపణలపై ఓ తెలుగు జంటను అరెస్ట్ చేశారు. text: మార్చ్‌లో ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. దాంతో సూయజ్ కాలువ జల మార్గంలో సరుకు రవాణా నిలిచిపోయింది. న్యూస్ చానెళ్లు, మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఆ సమయంలో తన ఫోన్ చెక్ చేసుకున్న మార్వా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే.. సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక అడ్డంగా ఇరుక్కుపోవడానికి మార్వానే కారణమంటూ ఆన్‌లైన్‌లో పుకార్లు చక్కర్లు కొట్టాయి. వాటిని చూసిన తర్వాత షాకయ్యానని చెప్పారు మార్వా. ఆమె ఈజిప్ట్‌లో తొలి మహిళా షిప్ కెప్టెన్. ఆ సమయంలో మార్వా ఎక్కడున్నారు? సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోయిన సమయంలో మార్వా వందలాది కిలోమీటర్ల దూరంలో అలెగ్జాండ్రియాలో Aida-4 నౌకలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నౌక ఈజిప్ట్ మారీటైమ్ సేఫ్టీ అథారిటీకి చెందినది. ఎర్ర సముద్రంలో ఉన్న లైట్‌హౌజ్‌కి సరుకులు రవాణా చేస్తుంటుంది. అరబ్ లీగ్ నడుపుతున్న అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మారీటైమ్ ట్రాన్స్‌పోర్ట్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తుంటుంది. సూయజ్‌ కాలువలో నౌక ఇరుక్కుపోవడానికి మార్వానే కారణమంటూ ఆమె ఫొటోతో సహా స్క్రీన్ షాట్లు పెట్టి మరీ ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. పాత ఫొటోతో ఫేక్ న్యూస్ ప్రచారం ఈజిప్ట్ తొలి మహిళా షిప్ కెప్టెన్‌గా నిలిచిన మార్వా గురించి ఒక ప్రముఖ అరబ్ న్యూస్.. మార్చి 22న ఒక కథనం రాసింది. అందులో వాడిన మార్వా ఫొటోనే మార్ఫింగ్ చేసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని భావిస్తున్నారు. ఎవర్ గివెన్ నౌక ఘటనలో తన ప్రమేయం ఉందంటూ మార్వా పేరుతో ఉన్న అనేక ట్విటర్ ఖాతాలు కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయి. అయితే, మొదట ఈ వార్త ఎక్కడ మొదలైందో.. ఎవరు, ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో తనకు తెలియదని బీబీసీతో చెప్పారు మార్వా. నేను ఈ రంగంలో విజయం సాధించాను. అందుకే కొందరు నన్ను టార్గెట్ చేసి ఉండొచ్చు. కానీ అసలు కారణం ఏమిటో నాకు తెలియదు అని మార్వా అన్నారు. ఈ ఫొటోలో ఎడమవైపు పైభాగంలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోయి ఉండడం మీరు చూడొచ్చు. ఇక కుడివైపున నీటిలో చాలా ఓడలు నిలిచిపోయి ఉండటం కూడా మీరు గమనించొచ్చు. ఎవర్ గివెన్‌ నౌక ఘటనపై ఇప్పటికే ఈజిప్ట్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాదాపు వారం రోజుల తర్వాత నౌకను కాలువకు అడ్డు లేకుండా చేయగలిగారు. ప్రపంచ జలమార్గ వాణిజ్యానికి సూయజ్ కాలువను వెన్నెముకగా చెబుతుంటారు. ప్రధాన జల మార్గాల్లో ఇది ఒకటి. ప్రపంచ వాణిజ్యంలో 12శాతం సరుకు రవాణా దీని ద్వారానే జరుగుతోంది. సూయజ్ కెనాల్ ఎందుకంత కీలకం? సూయజ్ కాలువ 193 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది. ఆసియా, యూరప్ మధ్య దగ్గరి జలమార్గం ఇదే. ఈ కాలువ ఈజిఫ్టులోని సూయజ్ ఇస్థమస్(జలసంధి)ని దాటి వెళ్తుంది. ఈ కాలువలో మూడు సహజ సరస్సులు కూడా ఉన్నాయి. 1869లో ఈ కాలువలో రాకపోకలు మొదలయ్యాయి. వాణిజ్యానికి ఇది చాలా కీలకం. దీనిని తవ్వక ముందు ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చిపోయే నౌకలు దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించేవి. కానీ ఈ జలమార్గం నిర్మించిన తర్వాత ఆసియా, యూరప్ నౌకలన్నీ పశ్చిమాసియాలోని ఈ జలమార్గం నుంచే వెళ్తున్నాయి. వరల్డ్ మారీటైమ్ ట్రాన్స్‌పోర్ట్ కౌన్సిల్ వివరాల ప్రకారం ఈ కాలువ తవ్వడం వల్ల యూరప్‌ వెళ్లే ఆసియా నౌకల ప్రయాణంలో 9వేల కిలోమీటర్ల దూరం తగ్గింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గత నెలలో ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు మార్వా ఎల్సెలెదార్. text: ఇదే క్రమంలో ఎన్సీబీ ఎంతోమంది ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు కూడా నిర్వహించింది. తాజాగా ఇందులో ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ పేరు కూడా చేరింది. ఎన్సీబీ శనివారం ఆమెను తన ఇంట్లోనే అరెస్ట్ చేసింది. భారతీ సింగ్ ఇంట్లో, ప్రొడక్షన్ హౌస్‌లో జరిపిన తనిఖీల్లో 86.5 గ్రాముల గంజాయి దొరికినట్లు ఎన్సీబీ చెప్పింది. భారతీ సింగ్, ఆమె భర్త గంజాయి తీసుకుంటున్నట్లు అంగీకరించారని కూడా ఎన్సీబీ అధికారులు చెప్పారు. ఈ కేసులో భారతీ సింగ్‌తో పాటూ ఆమె భర్త హర్ష్ లింబాచియాను కూడా అరెస్ట్ చేశారు. సోమవారం భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లించాబియాలకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎవరీ భారతీ సింగ్? 'దగ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్', 'కామెడీ సర్కస్' నుంచి ఒక స్టాండప్ కమెడియన్‌గా ఒక గుర్తింపు తెచ్చుకున్న భారతీ సింగ్ స్వస్థలం పంజాబ్. ఆమె గత 12 ఏళ్లుగా స్టాండప్ కామెడీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే, ఆమెను 'కామెడీ క్వీన్' అని కూడా అంటుంటారు. సుదీర్ఘ సంఘర్షణ తర్వాత 36 ఏళ్ల భారతీ సింగ్‌కు ఈ విజయాన్ని అందుకోగలిగారు. భారతీ సింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1984 జులై 3న పుట్టారు. ఆమెకు రెండేళ్ల వయసులో తండ్రి మరణించారు. ఆమె తల్లికి ఆ సమయంలో 22 ఏళ్లు. భారతి తండ్రి నేపాలీ సంతతికి చెందినవారు. తల్లి పంజాబీ. ఆమె బాల్యం పేదరికంలో గడిచింది. దాని గురించి ఆమె చాలాసార్లు తన ఇంటర్వ్యూల్లో చెప్పారు. డబ్బు కోసం తన భారీకాయంపైనే జోకులు డబ్బులు సంపాదించడం కోసం తన పేదరికం, భారీకాయంపై ఎలా జోకులు వేసుకునేదాన్నో భారతీ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీ టీవీలో వచ్చిన జజ్బాత్ అనే కార్యక్రమంలో ఇల్లు నడవడం కోసం తన తల్లి బట్టలు కుట్టేవారని, ఇప్పుడు కుట్టు మిషన్ శబ్దం వినగానే ఆ రోజులు గుర్తుకొస్తాయని ఆమె చెప్పారు. తన ముందు అప్పటికే ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారని, దాంతో, తల్లికి తనకు జన్మనివ్వడం ఇష్టం లేదని కూడా భారతీ సింగ్ అదే షోలో చెప్పారు. తనకు రెండేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలు భరించామని, తన తల్లి ఒక కంబళ్ల ఫ్యాక్టరీలో పనిచేసేవారని, డబ్బులు లేక ప్రతి పండగలకూ తాము ఏడ్చేవాళ్లమని, డబ్బు అడిగితే తన తల్లిని అందరూ తిట్టేవారని భారతీ వివరించారు. అలాంటి దీన పరిస్థితుల్లోంచి ముందుకు సాగిన భారతీ సింగ్ చివరికి తన లక్ష్యాన్ని అందుకోగలిగారు. అమృత్‌సర్‌లో కాలేజీ రోజుల్లోనే ఆమెకు ప్రముఖ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ తెలుసు. వీరిద్దరి సక్సెస్ జర్నీ కూడా ఒకేలా ఉంటుంది. భారతీ సింగ్ అరెస్ట్ తర్వాత కొందరు ట్విటర్‌లో కపిల్ శర్మను ట్రోల్ చేస్తున్నారు. "కపిల్ ఇప్పుడు తన షోలో భారతీ సింగ్‌ను ఎగతాళి చేస్తారా" అని అడుగుతున్నారు. భారతీ సింగ్ మంచి షూటర్ కూడా భారతీ సింగ్ కమెడియన్ మాత్రమే కాదు, ఆమెకు షూటింగ్, విలువిద్యలో కూడా నైపుణ్యం ఉంది. ఒకసారి ఇంటర్వ్యూలో తను కమెడియన్ కాకుంటే, షూటర్ అయ్యేదాన్నని భారతీ చెప్పారు. "అప్పుడు మీరు నన్ను ఒలింపిక్‌ క్రీడల్లో షూటింగ్ లేదా విలువిద్య పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం చూసుండేవార"ని అప్పుడామె అన్నారు. "నేను షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి బట్టలు, మిగతా పరికరాల ధర అడిగితే, పది లక్షలు అవుతాయని చెప్పారు. మా దగ్గర అప్పుడంత డబ్బు లేదు. ఆ సమయంలో పది లక్షలంటే మాకు చాలా పెద్ద మొత్తం. అందుకే నేను షూటింగ్ వదిలేశా. దానికి ఇప్పటికీ చాల బాధగా ఉంటుంది" అంటారు భారతీ. ఇప్పుడు తన దగ్గర డబ్బున్నా, సమయం మించిపోయిందని భారతీ సింగ్ అదే ఇంటర్వ్యూలో చెప్పారు. కామెడీ కెరీర్ సూపర్ సక్సెస్ భారతీ సింగ్ 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్' రియాలిటీ షోతో తన కెరీర్ ప్రారంభించారు. ఆ షోలో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత 'కామెడీ సర్కస్-3కా తడ్కా'లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె దాదాపు ప్రతి కామెడీ షోలో కనిపిస్తూ వచ్చారు. అందరికీ చాలా ఫేవరెట్ అయ్యారు. ఆమె చాలా కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా పనిచేశారు. 'కామెడీ దంగల్' అనే షోలో జడ్జిగా కూడా ఉన్నారు. 'ఖతరోం కే ఖిలాడీ' షో చాలా సీజన్లలో ఆమె గెస్ట్ గా కూడా పాల్గొన్నారు. కపిల్ శర్మ షోలో కూడా అప్పుడప్పుడూ కనిపించేవారు. సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉండే కామెడీ రంగంలో భారతీ సింగ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లో కూడా నటించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ భారతీ సింగ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఆమెకు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో ఆమెకు 72 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో 36 లక్షలకు పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. అయితే ట్విటర్‌లో ఆమె ఈమధ్య అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. కానీ, అక్కడ కూడా ఆమెకు 2.8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అరెస్టైన తర్వాత ఆమె ఒక పాత ట్వీట్‌ను జనం జోరుగా షేర్ చేస్తున్నారు, భారతీ సింగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. 2015 జులై 9న ఒక ట్వీట్ చేసిన భారతీ సింగ్ డ్రగ్స్ తీసుకోవద్దని సలహా ఇస్తూ, వాటివల్ల ఆరోగ్యం నాశనం అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఆమె చేసిన ఆ ట్వీట్‌ను షేర్ చేస్తూ చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. భర్త కంటే మూడేళ్లు పెద్ద భారతీ సింగ్ 2017 డిసెంబర్ 3న హర్ష్ లింబాచియాను పెళ్లాడారు. హర్ష్ ఒక స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్, హోస్ట్ కూడా. కామెడీ సర్కస్‌ షో కోసం పనిచేస్తున్న సమయంలో భారతీ, హర్ష్ కలిశారు. ఆ షోకు స్క్రిప్ట్ రైటర్‌గా ఉన్న హర్ష్ కూడా అదే సమయంలో కెరీర్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. హర్ష్ వయసులో భారతీ కంటే మూడేళ్లు చిన్నవారు. ఆయన తర్వాత ఎన్నో కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. కామెడీ షోలతోపాటూ హర్ష్ 'పీఎం నరేంద్ర మోదీ' సినిమాకు డైలాగులు కూడా ఇచ్చారు. మలంగ్ సినిమాకు టైటిల్ ట్రాక్ రాశారు. భారతీ భర్త హర్ష్ లింబాచియా 'ఖత్రా, ఖత్రా, ఖత్రా', 'హమ్ తుమ్', 'క్వారంటీన్ షాట్' లాంటి షోలకు నిర్మాతగా కూడా ఉన్నారు. ప్రస్తుతం భారతీ సింగ్, హర్ష్ లింబాచియా ఇద్దరూ కలిసి 'ఇండియాస్ బెస్ట్ డాన్సర్' షో హోస్ట్ చేస్తున్నారు. ఇవి కూడాచదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ ప్రమేయం వెలుగులోకి వచ్చిన తర్వాత సినీ, టీవీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ప్రశ్నిస్తోంది. text: భారత్‌లో గత మూడు రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితం అవుతున్న భారత్‌కు అత్యవసర మెడికల్ పరికరాలను అందించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 "కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు వెంటిలేటర్లు, బై పాప్ మెషిన్లు, డిజిటల్ ఎక్స్ రే మెషిన్లు, పీపీఈ కి‌ట్లు, ఇతర అత్యవసర మెడికల్ పరికరాలు అందిస్తాం. మేం 'హ్యుమానిటీ ఫస్ట్' అనే విధానాన్ని విశ్వసిస్తున్నాం" అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు. ఈ పరికరాలు వీలైనంత త్వరగా భారత్ చేరుకోవడానికి, ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు కలిసి పనిచేయాలని పాకిస్తాన్ తన ప్రకటనలో కోరింది. "మహమ్మారి వల్ల ముందు ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రెండు దేశాలూ తగిన విధానాలను కూడా అన్వేషించవచ్చు" అని కూడా పాక్ అందులో పేర్కొంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా కరోనా సంక్షోభ సమయంలో భారత ప్రజలకు తన సంఘీభావం తెలిపారు. "పొరుగు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కోవిడ్-19 వైరస్‌తో పోరాడుతున్న ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని పాకిస్తాన్ ప్రార్థిస్తోంది" అని అన్నారు. "మానవాళి ఎదుర్కొంటున్న ఈ సవాల్‌తో మనమంతా కలిసి పోరాడాలని" ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది ప్రజలు కూడా భారత్‌కు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. దిల్లీలో లాక్‌డౌన్ మరో వారం పొడిగింపు కరోనా కేసులు పెరుగుతుండడంతో దిల్లీలో లాక్‌డౌన్‌ను మరోవారం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీ ప్రభుత్వం మొదట ఆరు రోజులు లాక్‌డౌన్ విధించింది. అది ఏప్రిల్ 26న ముగుస్తుంది. దానిని ఇప్పుడు మరో వారం పొడిగించారు. అంటే లాక్‌డౌన్ ఇప్పుడు మే 3 వరకూ ఉండబోతోంది. దిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగించాల్సి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు. "ఇది ఆఖరి ఆయుధం. దానిని మేం ఉపయోగించాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు మేం లాక్‌డౌన్ పొడిగించాల్సి వస్తోంది" అన్నారు. "దిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 36-37 శాతానికి చేరుకుంది. దిల్లీలో అది ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. ఒక్కరోజులో అది 30 శాతానికి తగ్గింది. కానీ కరోనా అంతం కాబోతోందని మనం చెప్పలేం" అని కేజ్రీవాల్ అన్నారు. ఇవి కూడా చదవండి: కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న భారత్‌కు సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ చెప్పింది. text: తన కేసు, తనలాంటి మరికొందరు బాధితులకు సంబంధించిన కేసులపై దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చ్ దర్యాప్తు ప్రారంభించాలని కోరుతూ ఆమె నిరసనలూ చేపట్టారు. దక్షిణాఫ్రికాలో మహిళా దినోత్సవమైన 2020 ఆగస్టు 9న రెవరెండ్ జూన్ మేజర్, మరికొందరు మహిళలు అసాధారణ రీతిలో నిరసన తెలిపారు. దక్షిణాఫ్రికా ఆర్చ్ బిషప్ థాబో మగోబా ఇంటి చుట్టూ ఉన్న కంచెపై రెవరెండ్ జాన్ మేజర్, మిగతా మహిళలు, యాక్టివిస్ట్‌లు లోదుస్తులను ఆరవేశారు. రెవరెండ్ మేజర్ ఆరోపిస్తున్న మత గురువు సహా ఇతర దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చ్ మత గురువుల లైంగిక దుష్ప్రవర్తన, వేధింపులపై ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ వారు నిరసన తెలుపుతున్నారు. ''నా పోరాటం చర్చికి వ్యతిరేకంగా కాదు. మహిళలను నోరెత్తనివ్వకుండా చేస్తున్న చర్చ్ పెద్దరికం, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మమ్మల్ని నోరెత్తొద్దని చెబుతున్నారు.. మా తప్పులను వెతుకుతున్నారు.. మాపై అకృత్యాలకు పాల్పడుతున్నవారిని మాత్రం ఆ దారుణాలు కొనసాగించుకునేలా వదిలేస్తున్నారు'' అని మీడియాతో చెప్పారు రెవరెండ్ మేజర్. మత గురువుల లైంగిక వైధింపులపై చర్చ్ మౌనాన్ని వ్యతిరేకిస్తూ రెవరెండ్ మేజర్ నిరసన తెలపడం ఇదే మొదటిసారి కాదు. 'ఇక్కడే ప్రాణాలర్పిస్తా' 2016లో రెవరెండ్ మేజర్ తొలిసారి నిరాహార దీక్ష చేశారు. నాలుగేళ్ల తరువాత ఈ ఏడాది జులైలో మరోసారి ఆమె నిరాహార దీక్షకు దిగారు. ఈసారి ఆర్చ్ బిషప్ మగోబా అధికారిక నివాసం కేప్‌టౌన్‌లోని 20 బిషప్‌కోర్ట్ పక్కన నిరసన తెలిపారు. ''ఈ ఇంటిపక్కన పేవ్‌మెంటు మీద నేను చనిపోవాలనుకుంటున్నాను. నా కోసం కాదు.. న్యాయ నిరాకరణకు గురైన ప్రతి మహిళ, చిన్నారి కోసం నేను ప్రాణాలర్పించాలనుకుంటున్నాను'' అని 'బీబీసీ'తో చెప్పారామె. రెవరెండ్ మేజర్ చెబుతున్న ప్రకారం.. 2002లో ఒక మత శిక్షణ సంస్థ(సెమినరీ)ను సందర్శంచేందుకు వెళ్లినప్పుడు ఆమెపై లైంగికదాడి జరిగింది. సెమినరీలోని ఒక కుటుంబం వారికి ఆతిథ్యం ఇవ్వగా అక్కడ తాను ఉన్న గదిలోకి మత గురువు వచ్చి దాడిచేసినట్లు ఆరోపిస్తున్నారామె. ''నేను తప్పించుకోవడానికి చాలాసేపు పోరాడాను. చివరకు నా గొంతు పట్టుకున్నాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో నేను కేకలు వేయలేదు. అత్యాచారం చేసిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు'' ''ఆ ఘటన తరువాత నేను భయంతో వణికిపోయాను. చచ్చిపోవాలనిపించింది. ఇంకో స్నేహితుడిని పిలిచి ఏం జరిగిందో చెప్పాను'' అన్నారామె. తనపై అత్యాచారం చేసిన మత గురువు ఆ తరువాత కూడా ఇంకోసారి వచ్చాడని.. అయితే, గతంలో ఏం జరిగిందో తన స్నేహితుడికి చెప్పానని చెప్పడంతో వెళ్లిపోయాడని రెవరెండ్ మేజర్ చెప్పారు. ఆర్చ్ బిషప్ ఇంటి ఎదుట నిరాహార దీక్ష జీవితాన్ని భయం, నిశ్శబ్దం ఆవరించాయి 18 ఏళ్ల కిందట ఆ అత్యాచారం జరిగినప్పటి నుంచి తనను ఆ బాధ వీడలేదని రెవరెండ్ మేజర్ చెప్పారు. ''ఇది మన మధ్యే ఉండనీ అని ఒక ఫ్రెండ్ చెప్పడం.. మళ్లీ ఇంకెప్పుడూ అలా చేయనని తనపై అత్యాచారం చేసిన మత గురువు మాటివ్వడం.. ఆ తరువాత ఇద్దరం వేర్వేరు నగరాల్లో నివసించడంతో కొన్నాళ్లు నేను బయటపెట్టలేదు'' కానీ, అక్కడికి రెండేళ్ల తరువాత దీనిపై విచారణ చేపట్టాలని చర్చిని అడగాలని ఆమె నిర్ణయించుకున్నారు. ''ఈసారీ నన్ను నోరెత్తొద్దన్నారు.. చర్చి పరువుపోతుందనడంతో మళ్లీ ఆగాను. కానీ, నిత్యం పీడకలలు వస్తుండడం.. గదిలో ఒంటరిగా ఉండేందుకు ధైర్యం చాలకపోవడంతో విచారణ కోరాలని నిర్ణయించుకున్నాను'' అన్నారు. తనలాంటి ఎంతోమంది బాధితులకు ధైర్యం కలగి, వారు కూడా ఫిర్యాదు చేయాలన్న ఆలోచనతో చివరకు విషయం బయటపెట్టాను. తొలుత ఆమె పోలీసులను ఆశ్రయించి నేర విచారణ ప్రారంభించాలని కోరారు.. కానీ, పోలీసులు కేసు తీసుకోలేదు. ఆ తరువాత చర్చిలో ఫిర్యాదుచేశారు.. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. దాంతో 2016లో ఆమె నిరాహార దీక్షకు దిగారు.. దీక్ష ఏడో రోజున , విచారణ చేస్తామని చర్చి చెప్పడంతో ఆమె దీక్ష విరమించారు. కానీ, చర్చి ఇంతవరకు మాట నిలుపుకోలేదని ఆమె ఆరోపించారు. అయితే, దీనిపై పోలీసులనే దర్యాప్తు చేయమని కోరాలని ఆమెకు సూచించామని చర్చి చెబుతోంది. చర్చి మాట తప్పడంతో మళ్లీ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు రెవరెండ్ మేజర్ చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న ఆర్చ్ బిషప్ మగోబా జీతం ఆపేశారు ''2016లో తొలిసారి నిరాహార దీక్ష చేసిన తరువాత మతగురువుగా నాకు ఇవ్వాల్సిన జీతం ఆపేశారు. దాంతో జీతం లేకుండా పనిచేయలేక ఆస్ట్రేలియాలో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి రాజీనామా చేశాను. ఆస్ట్రేలియాలో మళ్లీ మత గురువుగా పనిచేయడానికి ఇక్కడి నుంచి సిఫారసు లేఖ కావాలి.. మొదట సిఫారసు లేఖ ఇస్తామన్నారు కానీ మళ్లీ మాట తప్పారు. దీంతో అప్పటి నుంచి నేను మళ్లీ మతగురువుగా పనిచేయలేకపోయాను'' అన్నారు రెవరెండ్ మేజర్. దాంతో తన ఆదాయం పోగొట్టినందుకు చర్చిపై కోర్టుకెళ్లారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది. ''ఆర్చ్ బిషప్ లైంగిక హింసకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు కానీ, వాటికి బలైపోయిన నా విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు'' అన్నారామె. మొదటిసారి ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తరువాత ఆర్చ్ బిషప్ మగోబాతో సమావేశమయ్యేందుకు ఆమెను పిలిచారు. ఆమె డిమాండ్లేమిటో ఈమెయిల్ చేయమని సూచించారు. ఆ తరువాత ఆమె దీక్ష విరమించారు. ''ఆర్చ్ బిషప్ స్పందించి క్రమశిక్షణా విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అత్యాచారం కేసును తిరిగి విచారణ జరపాలని ప్రాసిక్యూటర్‌ను కోరుతామని చెప్పారు. అందుకే నేను దీక్ష విరమించాను'' అన్నారామె. విషయ తీవ్రతను అనుసరించి పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈమెయిల్ పంపించారు చర్చి పెద్దలు. దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చి దీనిపై తన వెబ్‌సైట్‌లోనూ వివరాలు వెల్లడించింది. చర్చిలో సురక్షిత పరిస్థితులు ఏర్పరచడానికి 2018లో ఒక విధానం రూపొందించారు. కానీ, తన కేసులో ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఆర్చ్ బిషప్ ఇంటి గేటు, కంచెపై రెవరెండ్ మేజర్, ఇతర ఉద్యమకారులు అండర్‌వేర్‌లు ఆరేశారు. క్షమాపణలు చెబుతున్న ఆర్చ్ బిషప్ మగోబా గతంలోనూ.. దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చి మత గురువులపై గతంలోనూ ఇలాంటి లైంగిక వేధింపుల, అత్యాచారాల కేసులు ఉన్నాయి. 2018లో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ రచయిత ఇస్తియాక్ షుక్రీ ఒక బహిరంగ లేఖ రాశారు. తన చిన్నప్పుడు ఆంగ్లికన్ చర్చి మతగురువులు చేతిలో తాను ఎంతోకాలం లైంగిక వేధింపులకు గురయ్యానని ఆయన ఆరోపించారు. దీనిపై ఆర్చ్ బిషప్ మగోబా ఆయనకు చర్చి తరఫున క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత మరికొందరు ఇలాగే ముందుకొచ్చి ఆరోపణలు చేశారు. ఆ కేసులనూ విచారిస్తున్నట్లు చర్చి చెప్పింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రెవరెండ్ జూన్ మేజర్... దక్షిణాఫ్రికాలో తన సాటి క్రైస్తవ మత గురువే తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ 18 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. text: ఒక్క రోజులోనే ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 4500కు పైనే ఉంది. కొన్ని పట్టణాల్లో రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ భయంకర వైరస్‌కు వాక్సిన్‌ తయారు చేసే పనిలో తలమునకలైంది చైనా ప్రభుత్వం. వుహాన్ నగర ప్రజలంతా విధి లేని పరిస్థితుల్లో తమను తాము ఇళ్లలో బంధీ చేసుకుంటున్నారు. ఒకరికొకరు తోడున్నామంటూ ఇళ్లనుంచి అరుస్తూ ఉత్సాహపరుచుకుంటున్నారు. కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేయడమే చైనా ప్రబుత్వ తక్షణ కర్తవ్యం. చివరికి బీజింగ్ సబ్‌వే ట్రైన్‌లో ప్రయాణించడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. సూట్లు ధరించిన సబ్ వే సిబ్బంది ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరికైనా 37.3 కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లైతే వెంటనే వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. కానీ, వైద్య పరీక్షల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తన తల్లికి వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, కానీ నిర్ధరించేందుకు అవసరమైన కిట్ తమ వద్ద లేదని డాక్టర్లు చెబుతున్నారని ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు. అలాగే టెస్టు కిట్‌లు ఉన్న ఆస్పత్రుల్లో రోగులకు సరిపడ బెడ్స్ లేవని అతను అన్నారు. వైద్యం కోసం నగరమంతా కాళ్లరిగేలా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఉన్నతాధికారులు నిర్ధరించే వరకు వేచిచూడటం వల్లే సరైన సమయానికి ప్రజలకు సమాచారం అందించలేక పోయామని వుహాన్ మేయర్ అధికార మీడియా ద్వారా తెలిపారు. కాగా, వైరస్ తొలి కణాన్ని ఐసోలేట్ చేశామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెబుతోంది. ఇక దానికి వాక్సిన్‌ కనిపెట్టడమే ప్రస్తుతం వారి ముందున్న లక్ష్యం. కానీ వ్యాధి నిర్ధరణ అయిన కేసులు ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. చైనాలోని ఈ అత్యవసర పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్‌ కారణంగా చైనా రాజధాని బీజింగ్‌లో ఒక వ్యక్తి చనిపోయారని అధికారులు ధృవీకరించారు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందారు. text: భారత ప్రధానమంత్రి నాలుగు సార్లు ఖట్మాండులో పర్యటించిన తర్వాత కూడా ఆ దేశం చైనా వైపు చూస్తోందా? బీబీసీ ప్రతినిధి సురేంద్ర ఫుహాల్ కథనం... ఇండియా, నేపాల్ మధ్య విశిష్ట సంబంధంలో చాలా సారూపత్యతలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య తెరిచి ఉండే సరిహద్దు, నేపాల్‌లో భారత కరెన్సీ చెల్లుబాటు వంటివి కొన్ని. భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై నేపాల్‌లో ఆసక్తి.. ఎందుకు? 2014లో మోదీ తన ప్రమాణ స్వీకారానికి.. నాటి నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా సహా సార్క్ సభ్య దేశాల నాయకులను ఆహ్వానించడం ద్వారా పొరుగు దేశాలకు తన ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనుందో చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు భారత్-నేపాల్‌ సంబంధాలు ఎంతో మారిపోతాయన్న ఆశలు రేకెత్తాయి. కానీ రెండేళ్లు తిరిగే సరికి పరిస్థితి మారిపోయింది. అప్పటికే భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన నేపాలీలకు మదేశీల ఉద్యమం కారణంగా భారత్ నిత్యావసరాల సరఫరా నిలిపేయడం రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచింది. కొత్తగా ఏర్పాటైన నేపాలీ రాజ్యాంగం తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని మదేశీ ఉద్యమకారుల ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే మదేశీలను రెచ్చగొడుతోంది ఇండియాయేనని ఆరోపించింది నేపాల్ ప్రభుత్వం. భారత్ ఆ ఆరోపణల్ని ఖండిస్తోంది. ''నేపాలీలను బుజ్జగించడంలో మోదీ సఫలం కాలేదన్నది నిజం. నేటికీ నేపాల్ చాలా విషయాల్లో భారత్‌ మీదే ఆధారపడి ఉంది. కానీ నాకాబందీ సమయంలో మేం ఎదుర్కొన్న ఇబ్బందులు మా మదిలోనుంచి తొలగిపోవు'' అని ఆశిష్ భండారీ వ్యాఖ్యానించారు. ''మొదట్లో ప్రతి ఒక్కరూ మోదీని అభినందించారు. ఆయన పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించడం పట్ల సంతోషించాం. కానీ ఆ తర్వాత ఆయన దిగ్బంధనం ద్వారా మాకు ఇబ్బందులు సృష్టించారు. ఇప్పుడు మోదీ గురించి అందరికీ బాగా తెలుసు కాబట్టి ఎవరూ మోసపోలేరు'' అని శ్రీజన ధున్గానా అనే మహిళ పేర్కొన్నారు. ఆ ఉదంతంతో నేపాల్ క్రమంగా తన తూర్పు సరిహద్దు దేశమైన చైనాకు దగ్గరవుతూ వచ్చింది. ఆ ఐదు నెలల దిగ్బంధనం తర్వాత భారతదేశం స్పందించింది. మదేశీలను ప్రధాన స్రవంతిలో చేరాలని కూడా కోరింది. ‘‘అయితే ఈ విషయంలో భారత కృషి నిష్ఫలమైందని నా ఉద్దేశం. మోదీ మొదట ఒక తప్పు చేశారు. ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలోనే మిగతా కాలం గడిపేశారు'' అని దేశ్‌సంచార్.కామ్ ఎడిటర్ యుబరాజ్ ఘిమిరి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత మోదీ నాలుగు సార్లు ఖట్మాండులో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇక దౌత్యపరంగా చూస్తే ఇవాళ నేపాల్ అటు చైనాకు ఇటు భారత్‌కు సమదూరం పాటిస్తూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఈ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. నేపాల్ అధికార పార్టీ ఇప్పుడు మోదీకి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ''ఆయన హయాంలో ఇండో-నేపాల్ సంబంధాల విషయంలో కొన్ని సానుకూల మార్పులొచ్చాయి. అది మంచిదే'' అని నేపాల్ మాజీ ఉప ప్రధానమంత్రి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నేత నారాయణ్ కజి శ్రేష్ఠ పేర్కొన్నారు. అయితే కొంతమంది నేపాలీలకు.. మోదీ ఏం చేశారు, ఏం చెయ్యలేదు అన్నది మాత్రమే ముఖ్యం కాదు. భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న రాబోతున్నాయి. అప్పటి వరకు రెండు దేశాలు తమ సంబంధాల గురించి పునఃమదింపు చేసుకోవటానికి సమయం ఉంది. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం నేపాల్ ఆసక్తిగా ఎదురు చూస్తోందా? ఐదేళ్ల మోదీ పాలనలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? text: తాము ఈ వాగ్దానానికి కట్టుబడి ఉన్నామంటూ, 3 బిలియన్ డాలర్లు (దాదాపు 2,125 కోట్ల రూపాయలు)తో ఐదేళ్లలో గంగానదిని ప్రక్షాళన చేస్తామని 2015లో బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. గంగానదిలో కాలుష్యం స్థాయులను తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లుగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో గత సంవత్సరం డిసెంబరులో మోదీ ప్రకటించారు. ఈ విషయంలో మోదీ విఫలమయ్యారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అయితే, ప్రక్షాళన పనులు నెమ్మదిగా జరుగుతున్నాయన్నది వాస్తవం. 1,568 మైళ్ళ పొడవైన గంగానది ప్రక్షాళనకు ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నప్పటికీ, 2020 నాటికి శుభ్రపడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. శుద్ధి చేయని మురికి నీరు, పారిశ్రామిక వ్యర్థాలు గంగలో కలుస్తున్నాయి. గంగానది ఎందుకు మురికిగా మారింది? హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే గంగానదిని హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నది ఒడ్డున వందకు పైగా నగరాలు, వేలాది గ్రామాలున్నాయి. గంగా పరివాహక ప్రాంతం కానీ ఈ నది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇవి గంగా కాలుష్యానికి కొన్ని కారణాలు. గంగా కాలుష్యం అనుమతుల్లో జాప్యం, నెరవేరని గడువులు గంగా నదిని ప్రక్షాళన చేయడానికి గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయి. కానీ అవేవీ విజయవంతం కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం 2015 నుంచి ప్రతి సంవత్సరం నదిని శుభ్రం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులపై వ్యయాన్ని పెంచుతూ వస్తోంది. అయితే పనుల్లో జాప్యం జరుగుతోందని, నిర్దేశించిన గడువు లోపల పనులు పూర్తికావడం లేదని 2017లో ప్రభుత్వ ఆడిట్లో వెల్లడించింది. గత రెండు సంవత్సరాల్లో కేటాయించిన మొత్తంలో కనీసం పావువంతు కూడా ఖర్చుపెట్టలేదని ఈ నివేదిక పేర్కొంది. ''అనుమతులివ్వడంలో జాప్యం, ఖర్చుకాకుండా భారీగా మిగిలిపోయిన వివిధ పథకాల నిధులు, మానవ వనరుల కొరత... ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాల సాధన ఆలస్యం కావడానికి కారణమయ్యాయి'' అని ఆ నివేదిక తెలిపింది. గంగా ప్రక్షాళనకు ఉద్దేశించిన 236 ప్రాజెక్టుల్లో కేవలం 63 మాత్రమే పూర్తయ్యాయని గత సంవత్సరం భారత పార్లమెంటుకు సమర్పించిన వివరాల్లో ఉంది. 2019 మార్చి నాటికి గంగను 70%-80% శుద్ధి చేస్తామని, మరో సంవత్సర కాలంలో మిగిలిన ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. నీటిలో ఆక్సిజన్ స్థాయులు కొద్దిగా మెరుగుపడ్డాయని ఇటీవల గంగానదిలో అత్యధిక కాలుష్యం ఉండే ఆరు ప్రాంతాల నుంచి నీటి నమూనాలను పరిశీలించిన నిపుణుల బృందం వెల్లడించింది. నదిలో ప్రాణుల మనుగడకు ఇది చాలా ముఖ్యమని పేర్కొంది. రాజస్థాన్ నుంచి లండన్‌కి వెండి బిందెల్లో ‘గంగ’ ప్రయాణం ఇంకా సమస్యలు కలిగిస్తున్నదేంటి? గంగ ప్రక్షాళనకు ఇప్పటికీ కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. జనావాసాల నుంచి వచ్చే వృధా నీటిని శుద్ధిచేయడం వాటిలో అత్యంత ముఖ్యమైన సమస్య. "నదిని ఆనుకుని ఉన్న పట్టణాల్లో ప్రధానంగా 97 పట్టణాల నుంచి రోజుకు 2.9 బిలియన్ లీటర్ల వృధా నీరు వస్తోంది. కానీ, ప్రస్తుతం రోజుకు 1.6 బిలియన్ లీటర్ల నీటిని మాత్రమే శుద్ధిచేసే సామర్థ్యం అందుబాటులో ఉంది" అని నది ప్రక్షాళనను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విభాగం తన నివేదికలో వెల్లడించింది. అంటే రోజుకు ఒక బిలియన్ లీటర్లకు పైగా మురికినీరు శుద్ధి చేయకుండానే నదిలో కలుస్తోంది. 2035 నాటికి జనావాసాల నుంచి వచ్చే వృధా నీటి పరిమాణం రోజుకు 3.6 బిలియన్ లీటర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనావేస్తోంది. 46 పట్టణాల్లోని 84 ట్రీట్‌మెంట్ (శుద్ధి) ప్లాంట్లలో నిజానికి 31 ప్లాంట్లు పనిచేయడంలేదని, మరో 14 ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతున్నాయని కూడా నివేదిక తెలిపింది. కాన్పూర్ పారిశ్రామిక వాడలోని తోళ్ల పరిశ్రమ నుంచి వెలువడుతున్న విషపూరిత రసాయనాలను గంగలో కలవకుండా నిరోధించడం వంటి ఇతర ప్రయత్నాల ద్వారా కూడా నది కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్యం నెరవేరుతుందా? మతపరమైన కార్యక్రమాల్లో స్నానాలకు ఉపయోగించే ఘాట్‌లలో కొన్నింటిని కూడా శుభ్రం చేశారు. అయితే, తాము పరీక్షించిన 41 ప్రాంతాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే నది పరిశుభ్రంగా ఉండడం లేదా స్వల్పంగా కలుషితమై ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గత ఏడాది జూన్లో ఒక నివేదికలో స్పష్టం చేసింది. మోదీ నియోజక వర్గం వారణాసిలోని నది నీటిలో సూక్ష్మక్రిములను తొలగించిన తర్వాత అది తాగడానికి యోగ్యంగా మారిందంటూ జనవరి 2019లో గంగా ప్రక్షాళన పురోగతిని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం ప్రక్షాళనకు గడువును పెంచినప్పటికీ ఆ లోపు పనులు పూర్తవడం కష్టమే అని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. "నాలుగేళ్లలో జరిగిన పనులను పరిశీలిస్తే నది నీటి నాణ్యతలో గణనీయమైన మార్పు కనిపిస్తుందనుకోవడం లేదు" అని దిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ద ఎన్విరాన్‌మెంసెంటర్ ఫర్ సైన్స్ అండ్ ద ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన చంద్ర భూషణ్ అంటున్నారు. 2019 మార్చి నాటికి 80 శాతం శుద్ధి చేయాలని, 2020 మార్చి నాటికి 100 శాతం గంగానది ప్రక్షాళన పూర్తి చేయాలన్న లక్ష్యాలు నెరవేరడం చాలా కష్టం అని ఆయన అంటున్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కలుషిత గంగా నదిని పరిశుభ్రం చేస్తానని 2014లో భారతదేశ ప్రధాన మంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. text: షైలా కవల పిల్లలు అంతే కాకుండా కోరుకున్న వారికి అండ శీతలీకరణ సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించింది. ముంబయి నుంచి బీబీసీ ప్రతినిధి సురంజనా తివారీ అందిస్తున్న కథనం.. తాజ్ మహల్ ప్యాలస్ హోటల్.. ముంబయిలోని ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటి . ఈ హోటల్‌ను నడుపుతున్న టాటా గ్రూప్, ఇప్పుడు తన ఉద్యోగుల సౌకర్యార్థం ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ పని చేస్తున్న మహిళా ఉద్యోగుల్ని ప్రోత్సహించడంలో భాగంగా, సంతాన సాఫల్య చికిత్స తీసుకునే వాళ్లకు అయ్యే వైద్య ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది. మహిళా ఉద్యోగులకు బాసటగా, ఇది భారత్ లో నూతన పోకడకు ఆరంభం అనుకోవచ్చా? రోజురోజుకీ ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వివాహం ఆలస్యం కావడం లేదా ఉద్యోగ జీవితంలో తీరిక లేక బిడ్డల్ని కనడం వాయిదా వెయ్యడం చేస్తున్నారు. ఈ సమస్యలకు ఐవీఎఫ్ చికిత్స చక్కని పరిష్కారంగా ఉంటుంది. దాని వల్ల వాళ్లు తమ కెరియర్ పై దృష్టి పెట్టడమే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐవీఎఫ్ ద్వారా బిడ్డల్ని కనగలరు కూడా. ముంబయిలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో, ఒక్క రౌండ్ ఐవీఎఫ్‌కు అయ్యే ఖర్చు దాదాపు 2 లక్షల 70 వేల రూపాయలు. కొన్ని చోట్ల అది నాలుగు లక్షల వరకు ఉంది. ఇక ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా పథకాలు, ఈ సంతాన సాఫల్య చికిత్సకు బీమా చెల్లించవు. షైలా పాఠక్ లాంటి మహిళా ఉద్యోగులకు అంత ఖర్చు భరించడం చాలా కష్టం. ఇక సంతాన సాఫల్య చికిత్స తీసుకోవడమన్నది స్త్రీలలో భావోద్వేగాలకు సంబంధించిన విషయం. ఆ చికిత్స విఫలమైతే కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు...మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొవాలి అంటారు షైలా. షైలా, పిల్లల కోసం చాలా ఏళ్లు వేచి చూశారు. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగారు. చాలాసార్లు వాటి వల్ల నిరాశే మిగిలింది. చివరకు ఐవీఎఫ్ ద్వారా ఆమె మొదటిసారిగా కవల పిల్లలకు తల్లయ్యారు. ఇకపై ఉద్యోగులు తమ కుటుంబ జీవితాన్ని ప్రారంభించేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజ్ సంస్థ భరోసానిస్తోంది. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. ఉద్యోగాలు చేసే మహిళలకు గర్భధారణకు సంబంధించి రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా తాజ్ గ్రూప్, తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులకు సంతాన సాఫల్య చికిత్సకు అయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించింది. text: తాజాగా.. దంత క్షయం, చిగుళ్ల వ్యాధిపై పోరాడేందుకు సాయం చేసే రసాయనాలు కూడా రెడ్ వైన్‌లో ఉన్నాయని గుర్తించారు. ఈ పానీయంలోని పాలీఫెనాల్స్ అనే మిశ్రమాలు.. నోటిలోని కీడుచేసే బ్యాక్టీరియాను పారదోలేందుకు దోహదపడతాయని పరిశోధకులు గుర్తించారు. కానీ.. ఈ పరిశోధన ఫలితాలను.. ఎక్కువగా రెడ్ వైన్ తాగటానికి ‘పచ్చ జెండా’ చూపటం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీడుచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరానికి రక్షణ కల్పించే యాంటీఆక్సిడెంట్లు తరహాలో పాలీఫెనాల్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఇంతకుముందలి అధ్యయనాలు సూచించాయి. అయితే.. పాలీఫెనాల్స్ మన పేగులోని ‘మంచి బ్యాక్టీరియా’తో కలిసి పనిచేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించటం కూడా చేయగలవని ఇటీవలి అధ్యయనాలు చెప్తున్నాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు వైన్ పాలీఫెనోల్స్ కూడా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయా అనే అంశంపై దృష్టి సారించారు. పళ్లకు, చిగుళ్లకు అంటుకుని పళ్ల మీద గార, రంధ్రాలు, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా మీద రెడ్ వైన్‌లోని రెండు పాలీఫెనాల్స్‌ ప్రభావాన్ని.. ద్రాక్ష గింజలు, రెడ్ వైన్ మిశ్రమ పూరకాల ప్రభావాన్ని పోల్చి చూశారు. కణాలకు బ్యాక్టీరియా అంటుకుపోయే సామర్థ్యాన్ని వైన్ పాలీఫెనాల్స్, మిశ్రమాలు తగ్గించాయని వారు గుర్తించారు. నోటిలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రేరేపించే ప్రోబయోటిక్‌గా భావించే స్ట్రెప్టోకాకస్ డెంటిసానీతో కలిపి ప్రయోగించినపుడు.. చెడు బ్యాక్టీరియాను నిరోధించటంలో ఈ పాలీఫెనాల్స్ మరింత బాగా పనిచేశాయి. ఈ పరిశోధన ఫలితాలు.. సరికొత్త దంత చికిత్సలకు దారిచూపగలవని పరిశోధకులు చెప్తున్నారు. బెర్రీల్లో పాలీఫెనాల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి పాలీఫెనాల్స్ ఎక్కడ లభిస్తాయి? రెడ్ వైన్‌లో పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇతర పానీయాలు, ఆహారాల్లో కూడా ఇవి లభ్యమవుతాయి. పానీయాలు: ఆహారాలు: ఆధారం: అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రైడ్ వైన్ వల్ల గుండెకు మేలు చేయటం నుంచి చక్కెర వ్యాధి ముప్పును తగ్గించటం వరకూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటివరకూ చెప్తున్నారు. text: తానెందుకు ఈ వృత్తిలోకి వచ్చానో, ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆమె బీబీసీతో పంచుకున్నారు. బాలీవుడ్‌లో ఉన్న ఏకైక మహిళా గ్యాఫెర్ (చీఫ్ లైటింగ్ టెక్నీషియన్) హెతల్ డేదియా. ''గ్యాఫింగ్ అనేది చాలా కష్టమైన వృత్తి. సీన్‌లకు తగ్గట్టుగా షూటింగ్ స్పాట్‌లో వెలుతురును సృష్టించగలగాలి. కెమెరా సెట్టింగ్‌లకు తగ్గట్టుగా లైట్ సెటప్ మార్చాలి" అని ఆమె గ్యాఫింగ్ కష్టాలను వివరించారు. ఇలాంటి భిన్నమైన వృత్తిని ఎందుకు ఎంచుకున్నారని అడగ్గా.. ''ఈ వృత్తిలో మహిళలు లేకపోవడం వల్లే దీన్ని ఎంచుకున్నాను. ఇప్పటికీ ఇందులో ఉన్న ఏకైక మహిళను నేనే. గ్యాఫెర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఏమీ అనుకోలేదు'' అని హెతల్ చెప్పారు. గ్యాఫింగ్ చేయడంలో చాలా ఇబ్బందులుంటాయని ఆమె పేర్కొన్నారు. ''కొన్నిసార్లు రోజుకు 18 గంటలు పని చేయాలి. ఒక పని అయిపోయిన వెంటనే మరో పని ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కోసారి ఈ పనికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది'' అని తెలిపారు. లక్కీ బై ఛాన్స్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, బ్లఫ్ మాస్టర్ తదితర చిత్రాలకు హెతల్ పని చేశారు. పురుషాధిక్యం ఉండే ఈ రంగంలో హెతల్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. బాలీవుడ్‌లో ఎవరూ తనను అగౌరవంగా చూడలేదని, అయితే మహిళలు ఇలాంటి పని చేయడానికి సరైన ప్రోత్సహం మాత్రం ఇక్కడ లభించడం లేదంటూ ప్రస్తుత పరిస్థితిని ఆమె వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బాలీవుడ్‌లో గ్యాఫర్ (చీఫ్ లైటింగ్ టెక్నీషియన్)గా పని చేస్తున్న ఉన్న ఏకైక మహిళ హెతల్ డేదియా. text: ఇంతకీ ఈ చామన ఛాయ రంగు అమ్మాయిలు(బ్రౌన్ గర్ల్స్‌) ఎవరు? ఎందుకలా చామనఛాయ అమ్మాయిలుగా ప్రకటించుకుంటున్నారు? ''మేం ముదురు గోధుమ వన్నెలో ఉన్నామని.. లేదంటే ఆ మాత్రం గోధుమ రంగులోనూ లేమని మమ్మల్ని అనేవారు ఉన్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మాకు మా సంస్కృతిని చాటడానికి వీలు కల్పిస్తోంది.. మేం కూడా అదే పనిచేస్తున్నాం'' అంటున్నారు ఈ బ్రౌన్ గర్ల్స్ గ్యాంగ్ వ్యవస్థాపకురాలు సంజనా నగేశ్. సంజనా స్థాపించిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 50 వేల మంది ఫాలోవర్లున్నారు. వారు బ్రౌన్‌గర్ల్స్ అందించే కంటెంట్ కోసం ఎదురుచూడడమే కాదు.. బ్రౌన్ గర్ల్స్‌కు కావాల్సిన కంటెంట్ అందించేందుకూ ఉత్సా హంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాసియా స్ఫూర్తిదాయక మహిళలకు వేదికనివ్వడమే ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ లక్ష్యం. ''ఇన్‌స్టాగ్రామ్‌లో నేను స్క్రోల్ చేస్తూ నాలా అద్భుతాలు చేసే మహిళల కోసం చూస్తున్నానప్పుడు. మా సుసంపన్న దక్షిణాసియా సాంస్కృతిక వారసత్వం జనబాహుళ్య పాప్ సంస్కృతితో మిళితమవుతూ అక్కడ సరికొత్త మేళవింపుతో కనిపించింది. అది అద్భుత సృజనకు దారితీస్తోంది. నేను చూపించాలనకుంటున్నదీ అదే'' అంటారు సంజన తాను ఈ పేజీ క్రియేట్ చేసినప్పటి రోజులు గర్తుచేసుకుంటూ. ఆ పేజీలోని డాటాబేస్‌ను ఒకసారి పరికిస్తే అమెరికా, భారత్, కెనడా, బ్రిటన్‌కు చెందిన ఫాలోవర్లను ఆకర్షించేలా ఇండియన్-అమెరికన్ నటి మిండీ కలింగ్, యాక్టివిస్ట్ జమీలా జామిల్, ఇంకా ఎంతోమంది బాలీవుడ్ తారలకు సంబంధించిన మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇది వర్ధమాన కళాకారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, సృజనకారుల చిత్రాలూ ఇక్కడున్నాయి. అయితే, అందరిలోనూ ఉన్న ఉమ్మడి లక్షణం చామన ఛాయ. సంజన నగేశ్ సిమ్మి పటేల్ (@paper.samosa) వంటి కళాకారులు, @thecutepistaకు చెందిన నేహా గాంకర్ వంటివారికి సంజన పేజీపై ప్రాధాన్యం దక్కింది. వీరు ఈ పేజీ వేదికగా అందించే జీవితానికి సంబంధించి తమ పరిశీలనలు తెలుసుకోదగినవి. ప్రకటనల రంగంలో పనిచేసే సిమ్మి బ్రిటన్‌లో పుట్టి అమెరికాలో పెరిగారు. పేపర్ సమోసా పేరిట ఇన్‌స్టా పేజీ క్రియేట్ చేసి అందులో ఆమె ఇండియన్, వెస్టర్న్ పాప్ సంస్కృతులను మేళవిస్తూ మీమ్స్ పెడుతుంటారు. ''ఏదైనా హాయిగా ఉండే కంటెంట్ సృష్టించాలనుకుంటాను. అది, మిగతావాటికి భిన్నంగా ఉంటూ ప్రజలను ఎంగేజ్ చేసేలా ఉండాలనుకుంటాను'' అంటారామె. ముఖ్యంగా వీటన్నిటికీ మూలం, లక్ష్యం కూడా పాశ్చాత్య దేశాల్లో నివసించే దక్షిణాసియా ప్రజలే. ఇన్‌స్టాలో #BrownGirl అనే హ్యాష్‌ట్యాగ్ లక్షలాదిగా వాడుతున్నారు. ''సినిమాలు, టీవీలపై ఆధారపడడానికి ముందు మాలాంటి మహిళలు ఒకే తరహా, మూస ధోరణిలో చిత్రీకరించబడేవారు. ఇకముందు అలా ఉండదు. మేం పూర్తిగా మా సొంత కథలను అందిస్తాం' అని సంజన చెప్పారు. దక్షిణాసియా ప్రజలు డిజిటల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారేది ఒహాయోలోని బౌలింగ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాధిక గజ్జల అధ్యయనం చేస్తున్నారు. 'ఈ బ్రౌన్ గర్ల్ మూమెంట్ నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు' అంటారామె. బాలీవుడ్ స్టార్లు కూడా చాలాకాలంగా తమను, తమ బ్రాండ్లను కావాల్సినట్లు ప్రొజెక్ట్ చేసుకోవడానికి డిజిటల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని చెప్పారామె. ''ఈ యువతులు కూడా బాలీవుడ్ స్టార్ల తరహాలోనే తమను తాము వ్యక్తీకరించుకుంటున్నారు.. అయితే, బాలీవుడ్ స్టార్ల కంటే ఇంకా పకడ్బందీగా వ్యక్తీకరిస్తున్నార''ని చెబుతున్నారు రాధిక గజ్జల. ఈ మహిళలంతా డిజిటల్ డయాస్పొరాలో భాగమని రాధికా గజ్జల చెబుతున్నారు. 'ది క్యూట్ పిస్తా' అనే ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న నేహా గావంకర్ అనే ట్రైనీ ఆర్కిటెక్ట్ కూడా ఇదే చెబుతున్నారు. 'నేను భారత్, బ్రిటన్‌లో పెరిగాను. ఆ తరువాత పదేళ్ల కిందట అమెరికాకు తరలిపోయాను. దక్షిణాసియా సంస్కృతి, వారసత్వానికి సంబంధించిన సుసంపన్నతను చాటడానికి ఒక ఆనందకరమైన మాధ్యమం అవసరం.. అందులో మనం ఇమిడిపోయేలా ఉండాలి'' అంటారామె. ఈమధ్యే తన భారతీయ సాంస్కృతిక మూలాల్లో నిమగ్నం కావాలని కోరుకున్నానని.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చానని.. అక్కడ తనలాంటి ఇంకెందరో తాను కోరుకుంటున్నలాంటి కంటెంట్‌నే అందిస్తున్నారని చెప్పారు. భారతీయులుగా, పాకిస్తానీలుగా, ఇంకా ఇతర ఆసియా దేశస్థులుగా ఉండడంపై వ్యక్తీకరిస్తున్న అనేకమంది ప్రతిభావంతులను చూశానని.. ఈ మొత్తం సుసంపన్న చరిత్రలో నేనూ భాగంగా కావాలనుకున్నానని చెప్పారామె. ''బ్రౌన్ గర్ల్గ్'‌గా గుర్తింపు పొందడంపై తానూ గర్వంగా ఉన్నానని టొరంటోలో నివసించే ప్రణవి సుతాగర్ అన్నారు. తమిళ కెనడియన్ అయిన ఆమె గ్రాఫిక్ డిజైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. ఆమె Not__Sari అనే ఇన్‌స్టా ఖాతా నిర్వహిస్తున్నారు. అక్కడామె తాను తయారు చేసే దుస్తులు, బ్యాడ్జీలు, పోస్టర్లు ప్రదర్శిస్తుంటారు. ''నేను పెద్దదాన్నవుతున్న సమయంలో ఇతర చామనచాయ రంగువారితో(దక్షిణాసియా వారు) స్నేహం పెంచుకునేదాన్ని. మేం వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలకు చెందినవారమైనప్పటికీ మా అందరిలో కొన్ని సారూపత్యతులు ఉండేవి. సాంస్కృతిక సారూప్యతలు మా మధ్య బంధం పెంచడాన్ని నేను ఇష్టపడేదాన్న''ని చెప్పారు. బ్రౌన్ అనే పదం వాడకం ఇక్కడ ముఖ్యమైనదని.. వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు దేశాల నుంచి వచ్చినా వారందరిలో కామన్‌గా ఉండే ఈ అంశం వారి నేపథ్యాల మధ్య అంతరాన్ని చెరిపేస్తుందని ప్రొఫెసర్ గజ్జల చెప్పారు. ''దీన్ని కేవలం దక్షిణాసియా మహిళలకు మాత్రమే చెందిన విషయం కాదు.. వారి కుటుంబాల నుంచి వలస వెళ్లినవారికి చెందినది కూడా. ఆ వలసలు ఇష్టపూర్వకంగా జరిగినవి కావొచ్చు.. లేదంటే, వలస పాలకుల పీడన, బానిసత్వం కారణంగా జరిగినవి కావొచ్చు. కానీ, ఈ వలసదారులందరిలోనూ ఉమ్మడి అంశం చామనచాయలో ఉండడం. అమెరికా 2001 సెప్టెంబరు 11 దాడుల తరువాత నుంచి ఈ 'బ్రౌన్' అనే పదం మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని ప్రొఫెసర్ గజ్జల అంటారు. ''ఇది రాజకీయ ఏకాభిప్రాయం గురించి.. ఈ బ్రౌన్ అనే పదం భిన్న నేపథ్యాలున్నవారిని ఏకతాటిపైకి తెచ్చింది. అయితే, ఈ బ్రౌన్ అనే పదం వర్ణ వివక్ష కేటగిరీలో లేదు. జనాభా లెక్కల్లోనూ ఇలాంటి వర్గీకరణ లేదు. కానీ, వలస వచ్చినవారు అనేదానికి ఇది ఎప్పుడూ సూచికగానే ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పడు మహిళలు తమ కథలను చెప్పడానికి దీన్ని ఉపయోగించడం చూస్తున్నాం'' అన్నారు ప్రొఫొసర్ గజ్జల. ఇక సోషల్ మీడియాకు వస్తే.. ఈ మహిళలంతా ఒకర్నొకరు వెతుక్కుంటూ ఇక్కడ కలిశారు. వేర్వేరు నేపథ్యాల నుంచి.. వేర్వేరు సరిహద్దులను దాటుకుని వారంతా వచ్చినా తమ మధ్య ఎన్నో ఉమ్మడి అంశాలున్నాయని వారు గుర్తించారు. బ్రౌన్ అనేది ఒక వ్యావహారిక పదం.. దేశీ అనే పదం వాడడానికి ఇష్టపడనివారు కూడా దీన్ని వాడొచ్చు. ఇండో-కరీబియన్ ప్రజలు, శ్రీలంకవారు కూడా ఇందులోకి వస్తారని ప్రణవి సుతాగర్ చెబుతున్నారు. 'ఈ బ్రౌన్ అనే పదాన్ని శ్వేతజాతీయులు వాడుతున్నారని నేననుకోను. ఎవర్నైనా ఉద్దేశించి వారు కనుక అలాంటి పద ప్రయోగం చేస్తే అది బాధించే విషయమే. నా అనుభవం ప్రకారం అదేమీ అమర్యాదకర పదమేమీ కాదు. నా పట్ల కూడా ఎవరూ ఇంతవరకు అలా అన్నది లేద''ని చెప్పారామె. ''దక్షిణాసియా మహిళలంటే అణచివేతకు గురయ్యేవారు, సంప్రదాయబద్ధమైనవారు అనే ముద్ర మొదటి నుంచీ ఉంది. కానీ, ఇన్‌స్టా‌లోని ఈ 'బ్రౌన్ గర్ల్స్' ఆ అభిప్రాయాలను తొలగిస్తూ తరచూ అనేక విధాలుగా హాస్యం ఒలకబోస్తూ ఉల్లాసభరితంగా ఉన్నామని, అణచివేతలకు వ్యతిరేకంగా తిరిగి పోరాడగలమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చామనఛాయ మహిళలకు శ్వేత జాతీయుల రక్షణ అవసరం లేదు'' అన్నారామె. ఇన్‌స్టాలో 'హేట్ కాపీ' అనే అకౌంట్ నడిపే మారియా ఖమార్‌ను ఔత్సాహిక దేశీ కళాకారులు స్ఫూర్తిగా తీసుకుంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. న్యూయార్క్‌లో ఆమె చిత్రాలు ప్రదర్శిస్తుంటారు. దేశీ నడివయసు మహిళలను సోషల్ మీడియా చిత్రపటంలోకి తెచ్చింది హేట్ కాపీయే అంటారు సిమ్మి. కెనడాలోని టొరంటోలో నివసించే మారియా 'నాకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాల గురించి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి చిత్రాలు గీస్తాను' అని చెప్పారు. ''బ్రౌన్ గర్ల్స్ మీకు వ్యతిరేకం కాదు. శ్వేతేతరులకు మీడియాలోనూ ప్రాతినిధ్యం ఉండడం లేదు. బ్లాక్, బ్రౌన్ మహిళలన పక్కనపెడుతున్నారు. ఇప్పడు మేమూ కనిపిస్తున్నాం'' అంటారు మారియా. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు దక్షిణాసియా యువతులు ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో తమను తాము 'బ్రౌన్ గర్ల్స్'గా చెబుతూ తమలాంటివారందరికీ వేదిక కల్పిస్తున్నారు. text: ప్రతీకాత్మక చిత్రం బాధితుల తరఫున మాట్లాడేవారిని కేసులతో వేధిస్తున్నారని హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తుండగా, మావోయిస్టులతో సంబంధాలపై ఆధారాలు ఉన్నందునే కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులపై ఈ నెల 23, 24 తేదీలలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది వాకపల్లి అత్యాచారం కేసులో బాధితుల పక్షాన మాట్లాడుతున్నవారే ఉన్నారు. ప్రతీకాత్మక చిత్రం ఎవరెవరి మీద కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు? మావోయిస్టులకు కరపత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు సరఫరా అవుతున్నాయన్న సమాచారంతో విశాఖ జిల్లా ముంచంగి పుట్టు పోలీసులు ఈ నెల 23న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాంగి నాగన్న అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారు అతన్ని పట్టుకుని అతని దగ్గరి నుంచి మావోయిస్టుల విప్లవ సాహిత్యాన్ని, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాటరీలు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నామని, తమ అదుపులో ఉన్న నాగన్న ఓ టీవీ చానెల్ విలేకరిగా పనిచేస్తూ, మావోయిస్టులకు సమాచారంతోపాటు అవసరమైన సామాగ్రిని అందిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగానే మావోయిస్టులతో సంబంధాలున్న పలువురు ప్రజాసంఘాల పేర్లను కూడా చెప్పినట్లు తెలిపారు పోలీసులు. ఎవరెవరు, ఏ మావోయిస్టు నేతతో సమావేశమయ్యారో తమకు వివరించారని పోలీసులు చెబుతున్నారు. నాగన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రజా, పౌర సంఘాలు, మానవ హక్కుల వేదికల నాయకులైన 64 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ సహా, ఐపీసీ సెక్షన్లు 120-బి, 121, 121-ఎ, 124-ఎ, 143, 144, 149 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టె ముంచంగి పుట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 24న ఐపీసీ సెక్షన్‌ 120-బి, 121, 121-ఎ, 124-ఎ, 143, 144, 149 సెక్షన్ల కింద 27మందిపై కేసులు పెట్టారు. జలకల్లు గ్రామంలో పిడుగురాళ్ల పోలీసులు తనఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూప్‌కు చెందిన కంభంపాటి చైతన్యతోపాటు మరో 26మందిని అదుపులోకి తీసుకున్నామని, వీరి వద్ద నుంచి విప్లవ సాహిత్యాన్ని, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదైన వారిలో వాకపల్లి బాధితుల పక్షాన ఆందోళన చేసిన మానవ హక్కుల వేదిక నేత వి.ఎస్.కృష్ణతోపాటు మరి కొందరు ప్రజా, పౌర హక్కుల సంఘాల నాయకులు ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలతో వి.ఎస్.కృష్ణపై విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి హక్కుల సంఘాల వాదనేంటి ? పోలీసులు ఒక పద్దతి ప్రకారం వాకపల్లి బాధితుల తరఫున పని చేస్తున్నవారిని, పోరాడుతున్న వారిని కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులు అంటున్నారు. “ కనీసం విచారణ కూడా జరపకుండా వాకపల్లిలో అత్యాచారమే జరగలేదని వాదించిన పోలీసులు ఇప్పుడు అదే కేసును అడ్డం పెట్టుకుని మమ్మల్ని వేధించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని మానవ హక్కుల వేదిక నేత వి.ఎస్.కృష్ణ ప్రశ్నించారు. “ప్రజాస్వామ్య వ్యతిరేకమైన యూఏపీఏలాంటి చట్టాలను కూడా ఎందుకు ప్రయోగిస్తున్నారు? మహిళలకు న్యాయం జరగాలని ఉద్యమించిన వారిపై నిర్బంధం విధించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ’’ అని ఆయన అన్నారు. ముంచంగి పుట్టుతోపాటు, పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కూడా వి.ఎస్.కృష్ణపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. “నేను 10 నెలల కిందట మావోయిస్టు అగ్రనేత ఆర్కేను కలుసుకున్నట్లు నాగన్న వెల్లడించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వాకపల్లి బాధితులను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టమని ఆర్కే నాకు చెప్పినట్లు అందులో రాశారు. నా దగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని పిడుగురాళ్ల కేసులో చెప్పారు. వాకపల్లి బాధితులకు న్యాయం జరగాలని మేం 2007 నుంచి పోరాడుతున్నాం. న్యాయం జరగక పోగా ఇలా వేధిస్తున్నారు’’ అని కృష్ణ అన్నారు. “ ఎన్ని నిర్బంధాలు పెట్టినా మా పోరాటాలు ఆగవు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలతోనే కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు వాకపల్లి అత్యాచార బాధితుల తరఫున పోరాడుతున్న నేతల మీద కేసులు పెట్టిన విషయంపై పోలీసుల వివరణ తీసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే దీనిపై స్పందించడానికి విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు నిరాకరించారు. మావోయిస్టులకు సమాచారం అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఆధారాల ప్రకారమే కేసులు నమోదు చేశామని కృష్ణారావు బీబీసీతో అన్నారు. దీనిపై ఇంతకన్నా చెప్పాల్సిందేమీ లేదని ఆయన అన్నారు. వాకపల్లిలో ఏం జరిగింది..? మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో 2007 ఆగస్టు 20న పోలీసులు, గ్రేహౌండ్స్‌ దళాల సభ్యలు విశాఖ ఏజెన్సీలోని వాకపల్లి గిరిజన గూడేన్ని చుట్టుముట్టారు. మగవాళ్లు ఇంట్లో లేరని చెప్పినా, ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళలకు, పోలీసులు మధ్య ఘర్షణ జరిగిందని, కొందరు మహిళలపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహిళలకు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకొంది. సోదాలు చేసే క్రమంలో పోలీసులు తమపై అత్యాచారం జరిపారని 13 మంది ఆదివాసీ మహిళలు ఆరోపించారు. దీనిపై ఆందోళన ఉధృతం కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది పోలీసులపై కేసులు పెట్టి విచారణ జరపాలని అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఐపీసీ సెక్షన్‌ 37(2), 3(2), ఎస్‌.సి/ఎస్‌.టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విధుల్లో లేని 9 మందిని విచారణ నుంచి మినహాయించి మిగిలిన వారిపై కేసులు కొనసాగించాలని కోర్టు తేల్చి చెప్పింది. కేసు విచారణ ఏ దశలో ఉంది? వాకపల్లి గిరిజన మహిళలపై ఏపీ గ్రేహౌండ్స్‌ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారనే కేసులో విశాఖపట్నంలోని ఎస్‌.సి/ ఎస్‌.టి. స్పెషల్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నెలలో జరిగిన విచారణలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ డ్యూటీ రోస్టర్, జనరల్ డైరీని పోలీసులు కోర్టుకు అందించలేదు. దీంతో అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని ఆదేశించిన న్యాయస్థానం 2021 ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 13 ఏళ్ల కిందట విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన వాకపల్లి అత్యాచారం ఘటనపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై పౌర, మానవ హక్కుల, ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. text: ఈ రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ ట్యూమర్లను మరింత ముందుగా గుర్తించవచ్చునని.. తద్వారా వాటికి చికిత్స చేయటం, నయం చేయటం సులభమవుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. ఈ పరీక్షలో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన ఫలితాల్లో 99 శాతం పైగా కచ్చితత్వం ఉందని ఈ రక్త పరీక్షను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. డాక్టర్లు ఈ పరీక్షలను రోగుల మీద ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారని.. వీటిపై మరింత అధ్యయనం అవసరమని ఆనల్స్ ఆఫ్ ఆంకాలజీ వెల్లడించింది. ప్రయోగాల ఫలితాలను బట్టి.. వ్యాధి ప్రారంభ దశల్లో కన్నా గానీ వ్యాధి ముదిరినప్పుడు మరింత మెరుగ్గా గుర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల ఈ పరీక్షల ఉపయోగానికి పరిమితులు ఉండవచ్చు. ఎలా పని చేస్తుంది? శరీర కణాల్లోని ట్యూమర్ల నుంచి రక్తప్రవాహంలోకి లీకయ్యే జన్యు సంకేతాల అవశేషాలు (కణాల నుంచి విడిపోయిన డీఎన్ఏ) వల్ల స్పష్టంగా కనిపించే రసాయనిక మార్పుల కోసం ఈ రక్త పరీక్షలో పరిశీలిస్తారు. డానా-ఫార్బర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, బ్రిటన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ కృషి చేపట్టారు. క్యాన్సర్ ఉన్న వారు, లేని వారు మొత్తం 4,000 మందికి పైగా వ్యక్తుల నమూనాలకు ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష చేసి పరిశీలించారు. పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ తదితర 50 పైగా క్యాన్సర్లు ఇందులో ఉన్నాయి. అందులో 96 శాతం నమూనాల్లో అది ఏ రకం క్యాన్సరనేది ఈ పరీక్ష నిర్దుష్టంగా కనిపెట్టింది. నిపుణులు ఏమంటున్నారు? ఈ రక్త పరీక్షను తయారు చేసిన గ్రెయిల్ అనే సంస్థ ఈ అధ్యయనానికి నిధులు సమకూర్చింది. ‘‘మొత్తం జనాభాకు ఏవైనా క్యాన్సర్లు ఉన్నాయేమో ప్రాథమిక తనిఖీ కోసం ఉపయోగపడే లక్షణాలు ఈ రక్త పరీక్షకు ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ఈ పరిశోధన బృంద సారథుల్లో ఒకరైన ప్రొఫెసర్ జెఫ్ ఆక్స్‌నార్డ్ పేర్కొన్నారు. ‘‘ఇటువంటి పరీక్ష ఎప్పుడు ఉపయోగంలోకి వస్తుందని అందరూ అడుగుతున్నారు. వేలాది మంది రోగుల మీద వైద్య పరంగా విజయవంతమైన ఫలితాలు ఇవ్వటంతో ఈ పరీక్షను పరిమితంగా వైద్య ప్రయోగాలకు అందించాం’’ అని ఆయన తెలిపారు. ఈ రక్త పరీక్షను సాధారణ వాడుకలోకి తెచ్చే ముందు.. వాటి ఫలితాలను మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి తాజా వైద్య ప్రయోగాల ఫలితాలను చూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఈ రంగం వేగంగా పురోగమిస్తోంది. రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను నిర్ధరించటమనే ఆకాంక్ష నెరవేరుతుందనే ఆశలు కల్పిస్తోంది’’ అని ఆయన చెప్పారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక సాధారణ రక్త పరీక్షతో 50 రకాలకు పైగా క్యాన్సర్లకు పరీక్ష చేయొచ్చునని.. ఎటువంటి లక్షణాలూ కనిపించకముందే గుర్తించవచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. text: బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ వద్ద ఆశ్రయం పొందిన రోహింజ్యా శరణార్థులు దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది రోహింజ్యాలు త‌ల దాచుకుంటున్న‌ కాక్స్ బ‌జార్‌లో న‌మోదైన తొలి కేసులు ఇవేన‌ని ప్ర‌భుత్వ వైద్యుడు ఒక‌రు తెలిపారు. వీరిద్ద‌రినీ విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని వివ‌రించారు. మ‌రో 1,900 మంది శ‌ర‌ణార్థుల‌ను ఐసోలేష‌న్‌‌లో ఉంచిన‌ట్లు చెప్పారు. శ‌ర‌ణార్థుల‌తో కిక్కిరిసిన కాక్స్ బ‌జార్లో మార్చి 14న లాక్‌డౌన్ విధించారు. శ‌ర‌ణార్థుల‌కు భారీ సంఖ్యలో ఆశ్ర‌యమిచ్చిన గ్రీస్‌లోనూ క‌రోనావైర‌స్ సోకే ముప్పున్న 16 వేల మందిని ఇతర ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గ‌త వారంలో గ్రీస్‌లోని లెస్‌బోస్ దీవిలో అడుగుపెట్టిన ఇద్ద‌రు వ‌ల‌సదారుల‌కు కోవిడ్‌-19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఈ ఇద్ద‌రినీ ఐసోలేష‌న్‌లో పెట్టారు. కాక్స్ బ‌జార్‌లో ముప్పు ఏ స్థాయిలో ఉంది? ప‌రిశుభ్ర‌మైన మంచి నీటికీ నోచుకోని ఇక్క‌డి కిక్కిరిసి‌న శిబిరాలను క‌రోనావైర‌స్ తీవ్రంగా ప్ర‌భావం చూపే ముప్పుంద‌ని స‌హాయ‌క సంస్థ‌లు ఎప్ప‌టినుంచో హెచ్చ‌రిస్తున్నాయి. "కాక్స్ బ‌జార్‌లోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద శ‌ర‌ణార్థుల శిబిరాల్లోకి కూడా వైర‌స్ ప్ర‌వేశించింది. ఇక్క‌డ వేల సంఖ్య‌లో శ‌ర‌ణార్థులు కోవిడ్‌-19తో చ‌నిపోయే ముప్పుంది" అని బంగ్లాదేశ్‌లోని సేవ్ ద చిల్డ్ర‌న్స్ హెల్త్ సంస్థ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ష‌మీమ్ జ‌హాన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. "ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల బంగ్లాదేశ్ కొన్ని ద‌శాబ్దాల వెన‌క్కి వెళ్లిపోయే ముప్పుంది" ఇక్క‌డ చ‌ద‌ర‌పు కిలో మీట‌రుకు 40,000 నుంచి 70,000 మంది వ‌ర‌కు రోహింజ్యాలు ఉంటార‌ని బంగ్లాదేశ్‌లోని అంత‌ర్జాతీయ స‌హాయ‌క చ‌ర్య‌ల క‌మిటీ డైరెక్ట‌ర్ మ‌నీశ్ అగ‌ర్వాల్ చెప్పారు. "చైనాలోని ఊహాన్ న‌గ‌రంలో వైర‌స్ తీవ్రంగా విజృంభించినప్ప‌టితో పోలిస్తే.. జ‌పాన్ తీరంలోని డైమండ్ ప్రిన్సెస్ నౌక‌లో నాలుగు రెట్లు వేగంగా వైర‌స్ వ్యాప్తి చెందింది. అయితే డైమండ్ ప్రిన్సెన్ నౌక కంటే.. రోహింజ్యా శిబిరాల్లో జ‌న సాంద్ర‌త 1.6 రెట్లు ఎక్కువ‌" అని రాయిట‌ర్స్ వార్తా సంస్థ‌కు ఆయ‌న వివ‌రించారు. రోహిజ్యాలు ఎవ‌రు? మ‌య‌న్మార్‌లో త‌రాల త‌ర‌బ‌డి అణ‌చివేత‌కు గుర‌వుతున్న మైనారిటీల్లో రోహింజ్యాలు ఒక‌రు. 2017లో వీరి సంఖ్య దాదాపు ప‌ది లక్ష‌ల వ‌ర‌కూ ఉండేది. అయితే, 2017 ఆగ‌స్టులో రోహింజ్యా అతివాద సంస్థ‌కు చెందిన‌ కొంద‌రు మ‌య‌న్మార్‌లో 30కిపైగా పోలీస్ చెక్‌పోస్ట్‌ల‌పై విధ్వంస‌క‌ర‌ దాడులు చేశారు. దీంతో ప్ర‌భుత్వ ప్ర‌తిచ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డి, ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని పెద్ద‌యెత్తున రోహింజ్యాలు బంగ్లాదేశ్‌కు త‌ర‌లిపోయారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బంగ్లాదేశ్‌లోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద శ‌ర‌ణార్థి శిబిరంలో ఇద్ద‌రు రోహింజ్యాల‌కు క‌రోనావైర‌స్ సోకిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. text: కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు ? కరోనావైరస్ లక్షణాలు కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం. వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది. వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది. కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి వ్యాధి బయట పడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని డబ్యూహెచ్ఓ చెబుతుండగా కొందరు పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుటుందని చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం ఒక మీటరు నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండాలి. ఆ రెండు లక్షణాలతో బాధపడుతున్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి. ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ మరణాలు ఎంత వేగంగా విస్తరిస్తోంది ? మొదట్లో కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప అన్ని ఖండాలకు విస్తరించింది. రోజూ వందలాదిగా కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. వ్యాధి లక్షణాలును ఇంకా నిర్ధారించని కేసులు ఎన్ని ఉంటాయన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కరోనావైరస్ సోకితే ప్రాణాలతో బయట పడగలమా? సుమారు 56 వేల మంది రోగుల్ని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాధి సోకిన వారిలో సుమారు 80 శాతం మందిలో కొద్ది పాటి లక్షణాలు కనపించాయని పేర్కొంది. కేవలం 14 శాతం మందిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండగా , 6 శాతం రోగుల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని తెలిపింది. ఇక ఈ వ్యాధి కారణంగా మరణించిన వారు 1 నుంచి 2 శాతం మంది మాత్రమేనని డబ్యూహెచ్ఓ స్పష్టం చేసింది. అయితే వ్యాధి తీవ్రత రోజు రోజుకూ ముదురుతున్న ఈ పరిస్థితుల్లో ఈ లెక్కలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని కూడా చెప్పలేం. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలకు కరోనావైరస్ విస్తరించింది . అటు తెలంగాణలోనూ, దిల్లీలోనూ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో అసలు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధి నుంచి మనల్నిమనం ఎలా కాపాడుకోవాలి ? text: క్లోరోక్విన్‌తో పాటు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి ఔషధాలు కరోనావైరస్ చికిత్సకు పనిచేస్తాయని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అయినప్పటికీ, ఈ ఔషధాలపై అందరి దృష్టీ పడింది. ప్రస్తుతం కరోనావైరస్ చికిత్సలో ఈ మందుల పనితీరుకు సంబంధించి ఆధారం ఏంటి? వాటిని ఎవరు వాడుతున్నారు? ఈ ఔషధాల గురించి మనకేం తెలుసు? హైడ్రాక్సీ క్లోరోక్విన్ సామర్థ్యం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు. "మీరు కోల్పోయేది ఏముంది? అది వాడండి" అని ఇటీవల విలేకరుల సమావేశంలో అన్నారు. "హైడ్రాక్సీక్లోరోక్విన్ అన్ని చోట్లా బాగా పనిచేస్తోంది" అని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించే నిబంధనల కింద ఫేస్‌బుక్ ఆ వీడియోను తొలగించింది. మలేరియా చికిత్సలో భాగంగా జ్వరాన్ని, నొప్పిని తగ్గించేందుకు క్లోరోక్విన్ ఆధారిత మాత్రలను చాలాకాలంగా వాడుతున్నారు. ఆ మాత్రలే కరోనావైరస్‌ను కూడా నిరోధించగలవన్నది ఆశ. "ప్రయోగశాలలో నిర్వహించిన అధ్యయనాల్లో కరోనావైరస్‌ను క్లోరోక్విన్ కట్టడి చేసినట్లు అనిపిస్తోంది. చికిత్స కోసం ఇది కొంతమేర సాయపడుతున్నట్లు కొన్ని ఆధారాలు కనిపించాయని కొందరు వైద్యులు తెలిపారు" అని బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గలాగర్ చెప్పారు. క్లోరోక్విన్‌ మీద పలు దేశాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయి క్లోరోక్విన్ ఆధారిత ఔషధాలను కోవిడ్-19 రోగులకు పూర్తిస్థాయిలో వాడొచ్చని చెప్పేందుకు ఇప్పటి వరకు పక్కా ఆధారాలు లేవు. ఈ మందుల వల్ల మూత్రపిండం, కాలేయం దెబ్బతినడంతో పాటు మరికొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా తలెత్తే ప్రమాదాలు కూడా ఉన్నాయి. "ఈ ఔషధాల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు ఇంకా విస్తృతంగా ర్యాండమ్‌ క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉంది" అని ఆక్స్‌‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కోమ్ గిబినిగీ చెప్పారు. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, చైనా సహా 20కి పైగా దేశాల్లో ప్రస్తుతం ఈ ఔషధాలపై ట్రయల్స్ జరుగుతున్నాయి. "మలేరియా నిరోధక ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్-19ను అవి అడ్డుకోగలగుతున్నాయా లేదా అన్నది పరిశీలిస్తున్నాం" అని బ్రిటన్ మంత్రి మైఖేల్ గోవ్ చెప్పారు. కోవిడ్ -19 రోగులకు చికిత్స కోసం క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ ఔషధాలను కలిపి వాడేందుకు అమెరికాలో ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు క్లోరోక్విన్ ఆధారిత మాత్రలను కొని నిల్వ చేసుకుంటున్నారు ఏ దేశాలు అనుమతించాయి? కోవిడ్-19తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొద్దిమంది రోగులకు అత్యవసర చికిత్సలో భాగంగా ఈ ఔషధాలను పరిమితంగా ఇవ్వవచ్చు అని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ చెప్పింది. అయితే, దాని అర్థం, ఈ ఔషధాలు పక్కాగా పనిచేస్తాయని ఎఫ్‌డీఏ చెప్పినట్లు కాదు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వీటిని ప్రభుత్వం నుంచి తీసుకుని వాడాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జర్మనీకి చెందిన ఒక ఔషధ సంస్థ మూడు కోట్ల డోసుల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తమకు విరాళంగా ఇచ్చిందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. మిగతా దేశాలు కూడా ఈ మలేరియా నిరోధక మందులను కొంతమేర వాడుతున్నాయి. కోవిడ్-19 రోగులకు క్లోరోక్విన్ ఔషధాలను సిఫార్సు చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం వైద్యులకు అనుమతి ఇచ్చింది. అయితే, వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరించింది. కోవిడ్-19 నివారణ చికిత్సలో భాగంగా వైద్య సిబ్బంది హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడొచ్చని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఒకవేళ వైద్యులు సిఫారసు చేస్తే, ఆ మేరకు కరోనావైరస్ రోగులు కూడా ఈ మందులను తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగని, ఎవరూ వీటిని విచ్చలవిడిగా వాడకూడదని భారత వైద్య పరిశోధనా సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతానికి “ఇది ప్రయోగాత్మకం మాత్రమే, అందుకే అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలి” అని చెప్పింది. పశ్చిమాసియా దేశాల్లో చాలావరకు ఈ ఔషధాల వినియోగానికి అనుమతి ఇచ్చాయి. ఇంకా అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చిన మొట్టమొదటి దేశాలలో బహ్రెయిన్ ఒకటి. మొరాకో, అల్జీరియా, ట్యునీషియాలలో కూడా ఈ మందుల వాడకానికి అనుమతి ఉంది. భారీ డిమాండ్ కోవిడ్-19 చికిత్సకు కొంతమేర సాయపడుతుందన్న వార్తలు రావడంతో ఈ ఔషధాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అమాంతం పెరిగింది. మలేరియా నివారణ కోసం క్లోరోక్విన్‌తో పాటు దాని ఆధారిత ఔషధాలు చాలా దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మందుల దుకాణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. నిజానికి మలేరియాకు ఈ ఔషధాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతోంది. దాంతో, మలేరియాపై ఈ మందుల ప్రభావం క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ, ఈ మందులకు డిమాండ్ తగ్గడంలేదు. ప్రజలు ముందస్తుగా ఎక్కువ మొత్తంలో కొని నిల్వ ఉంచుకోడాన్ని అడ్డుకునేందుకు మందుల దుకాణాల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాన్ని జోర్డాన్ ప్రభుత్వం నిషేధించింది. ప్రైవేట్ దుకాణాల్లో ఉన్న ఈ మందులను వెనక్కి తీసుకోవాలని, ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంచాలని కువైట్ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. క్లోరోక్విన్ అమ్మకాలను కెన్యా ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతం వైద్యులు సిఫార్సు చేస్తేనే దుకాణంలో ఈ ఔషధాన్ని అమ్ముతారు. ఈ మలేరియా నిరోధక ఔషధాల ఉత్పత్తిలో భారతదేశం అత్యంత కీలకంగా ఉంది. అయితే, వీటి ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన భారత ప్రభుత్వం, తాజాగా ఆ నిషేధాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. తాము ఆర్డర్ ఇచ్చిన డోసుల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరిస్తూ భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటన చేసింది. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? నైజీరియాలో ఎగబడుతున్న జనాలు మలేరియాపై ఈ ఔషధాల ప్రభావం తగ్గుతున్నందున వైద్యుల సిఫార్సు లేకుండా ఎవరూ వీటిని వాడకూడదంటూ 2005లో నైజీరియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినా, నైజీరియాలో ఇప్పటికీ చాలామంది మలేరియా చికిత్స కోసం క్లోరోక్విన్ ఆధారిత మాత్రలను క్రమం తప్పకుండా వాడుతున్నారు. కరోనావైరస్ చికిత్స కోసం క్లోరోక్విన్ వాడకంపై చైనాలో జరిగిన పరిశోధనల గురించి ఫిబ్రవరిలో వార్త వచ్చింది. అప్పటి నుంచి నైజీరియావాసులు పెద్దఎత్తున ఈ ఔషధాన్ని కొని నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. అది కరోనావైరస్ చికిత్సకు పనిచేస్తోందని డోనల్డ్ ట్రంప్ పేర్కొన్న తర్వాత, ఈ ఔషధం కోసం జనాలు మరింత ఎగబడుతున్నారు. చూస్తుండగానే, దుకాణాల్లో స్టాక్ ఖాళీ అయిపోయింది. కానీ, ప్రజలు ఈ మాత్రల వాడకాన్ని మానేయాలని నైజీరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సూచిస్తోంది. "#COVID19 చికిత్స కోసం క్లోరోక్విన్ వాడకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించలేదు. కాబట్టి ప్రజలు ఈ ఔషధాన్ని వాడొద్దు" అని తెలిపింది. ఈ దేశంలోని లాగోస్ రాష్ట్రంలో అధిక మోతాదులో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకుని పలువురు అనారోగ్యానికి గురయ్యారని అధికారులు చెబుతున్నారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మలేరియా రోగులకు ఇచ్చే ఔషధానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. కరోనావైరస్‌ బాధితులకు తక్షణ చికిత్స కావాలని ప్రభుత్వాలు ఆశించడమే అందుకు కారణం. text: బంకిమ్ చంద్ర ఉన్నత విద్యావంతుడు, రచయిత. ప్రచురితమైన ఆయన తొలి రచన బంగ్లా కాదని, ఆంగ్లమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాని పేరు 'రాజ్‌మోహన్స్ వైఫ్' 1838లో సంప్రదాయ, సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించిన బంకిమ్ చంద్ర మొదటి బంగాలీ రచన 'దుర్గేష్‌నందిని' దుర్గేష్‌నందిని ఒక నవల. కానీ తర్వాత మెల్లగా తన అసలు ప్రతిభ కవిత్వంలోనే ఉందనే విషయం ఆయనకు అర్థమైంది. దాంతో ఆయన కవితలు రాయడం ప్రారంభించారు. ఎన్నో ప్రముఖ సాహిత్య రచనలు అందించిన బంకిమ్ విద్యాభ్యాసం హుగ్లీ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్‌లో నడిచింది. 'దుర్గేష్‌నందిని' ప్రచురణ ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారత్‌లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగిన 1857లోనే ఆయన బీఏ పాస్ అయ్యారు. 1869లో ఆయన లా డిగ్రీ అందుకున్నారు. బంకిమ్ కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన ఒక ప్రభుత్వ అధికారి కూడా. ఎన్నో ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఆయన ఉన్నారు. 1881లో ప్రభుత్వ సేవల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన తండ్రి కూడా ప్రభుత్వ అధికారిగా పని చేశారు. ఆయనకు 11 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. తర్వాత కొన్నేళ్లకే ఆయన భార్య చనిపోయింది. ఆ తర్వాత ఆయన రాజ్యలక్ష్మీ దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు పుట్టారు. 1865లో దుర్గేష్‌నందిని ప్రచురితమైంది. కానీ అప్పుడు దాని గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ తర్వాత ఏడాదికే 1866లో ఆయన తర్వాత నవల 'కపాల కుండల' చాలా పేరు తెచ్చుకుంది. 1872 ఏప్రిల్‌లో ఆయన బంగదర్శన్ పేరుతో ఒక పత్రిక ప్రచురణ ప్రారంభించారు. అందులో ఆయన విమర్శనాత్మకమైన సాహిత్య-సాంఘిక, సాంస్కృతిక అంశాలను లేవనెత్తేవారు. అప్పటివరకూ రొమాంటిక్ రచనలు రాసిన ఒక వ్యక్తికి అది కీలక మలుపు. జాతీయవాదానికి చిహ్నం రామకృష్ణ పరమహంస సమకాలీనులు, ఆయన సన్నిహిత మిత్రుడు అయిన బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ ఆనంద్‌మఠ్ రచించారు. తర్వాత దానికి వందేమాతరం గీతాన్ని కలిపారు. అది అలా చూస్తూ చూస్తూనే దేశవ్యాప్తంగా జాతీయవాదానికి ప్రతీకగా మారిపోయింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి బాణీని సిద్ధం చేశారు. వందేమాతరం జనాదరణ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది. 1894 ఏప్రిల్లో బంకిమ్ చంద్ర మరణించారు. తర్వాత 12 ఏళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు. దానికి ఆయన వందేమాతరం అనే పేరు పెట్టారు. లాలా లాజ్‌పత్ రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు. బహుముఖ ప్రజ్ఞావంతులు, జాతీయవాది, రచయిత అయిన బంకిమ్ చంద్రలో హాస్య చతురత ఉన్న వ్యక్తి కూడా కనిపిస్తారు. ఆయన హాస్యం-వ్యంగ్యం నిండిన 'కమలాకాంతేర్ దఫ్తర్' లాంటి రచనలు కూడా చేశారు. వందేమాతరంతో జతకలిసిన ఎన్నో అంశాలు స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందేమాతరంను జాతీయగేయంగా స్వీకరించలేదు, దానికి జాతీయగీతం హోదా కూడా దక్కలేదు. కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇస్తున్నట్టు ప్రకటించారు. వందేమాతరం చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బంకిమ్ చంద్ర వందేమాతరం గీతాన్ని 1870 దశకంలో రచించారు. ఆయన భారతదేశాన్ని దుర్గాదేవి రూపంగా భావిస్తూ దేశప్రజలందరినీ ఆమె సంతానంగా చెప్పారు. భారతదేశాన్ని అంధకారం, బాధలు చుట్టుముట్టిన తల్లిగా వర్ణించారు. తల్లికి నమస్కరించి, ఆమెను దోపిడీ నుంచి రక్షించమని పిల్లలైన దేశ ప్రజలను బంకిమ్ చంద్ర కోరారు. భారతదేశాన్ని దుర్గా మాత రూపంగా వర్ణించడంతో తర్వాత సంవత్సరాలలో ముస్లిం లీగ్, ముస్లిం సమాజంలోని ఒక వర్గం వందేమాతరం గీతాన్ని అనుమానాస్పద దృష్టితో చూడడం ప్రారంభించాయి. గురుదేవ్ సలహా తీసుకున్న నెహ్రూ ఈ వివాదంతో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వతంత్ర భారత దేశం జాతీయ గేయంగా స్వీకరించడానికి వెనకాడారు. దేశానికి దేవుడి రూపం ఇవ్వడాన్ని, దానిని పూజించమని చెప్పడాన్ని వ్యతిరేకించే ముస్లింలీగ్, ముస్లింలు కూడా వందేమాతరంను వ్యతిరేకించారు. స్వయంగా వెళ్లి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కలిసిన నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వాతంత్రోద్యమం మంత్రంగా చేయడానికి ఆయన అభిప్రాయం కోరారు. బంకిమ్ చంద్ర కవితలను, ఆయన దేశభక్తిని రవీంద్రనాథ్ ఠాగూర్ అభిమానించేవారు. వందేమాతరంలోని మొదటి రెండు శ్లోకాలను బహిరంగంగా పాడవచ్చని నెహ్రూకు ఆయన చెప్పారు.. అయితే, బంకిమ్ చంద్ర దేశభక్తిపై ఎవరికీ అనుమానం లేదు. ఆయన ఆనంద్‌మఠ్ రచించినపుడు అందులో ఆయన బెంగాల్‌ను పాలించే ముస్లిం రాజులు, ముస్లింలను ఉటంకిస్తూ ఎన్నో వాక్యాలు రాశారు. దీంతో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు ఏర్పడ్డాయి. అయినా, వందేమాతరంను ఎన్నో ఏళ్ల ముందే ఆయన ఒక కవిత రూపంలో రాశారు. కానీ ఆ తర్వాత ప్రచురితమైన ఆనంద్‌మఠ్ నవలలో దానిని భాగం చేశారు. ముస్లిం విరోధి అని చెప్పలేం ఆనంద్‌మఠ్ కథ 1772లో పూర్ణియా, దానాపూర్, తిర్హుత్‌లో ఆంగ్లేయులకు, స్థానిక ముస్లిం రాజలకు వ్యతిరేకంగా సన్యాసుల తిరుగుబాటు ఘటనల ప్రేరణగా తీసుకుని రాశారు. ఆనంద్‌మఠ్ కథ అంతా హిందూ సన్యాసులు, ముస్లిం పాలకులను ఎలా ఓడించారనేదానిపై సాగుతుంది. ఆనంద్‌మఠ్‌లో బంగాల్ ముస్లిం రాజులను బంకిమ్ చంద్ర చాలా విమర్శించారు. అందులో ఒక దగ్గర ఆయన "మేం మా మతం, కులం, గౌరవం, కుటుంబం పేరు పోగట్టుకున్నాం. మేం మా జీవితాన్ని వదులుకుంటాం. ఈ..... (లను) తరిమేయనంతవరకూ, హిందువులు తమ మతాన్ని ఎలా రక్షించుకోగలరు" అని రాశారు. చరిత్రకారులు తనికా సర్కార్ అభిప్రాయం ప్రకారం "బంకిమ్ చంద్ర ఒకటి అనుకునేవారు, భారతదేశంలోకి ఆంగ్లేయులు రావడానికి ముందే, ముస్లిం పాలకుల వల్ల బెంగాల్ నాశనం అయ్యిందని భావించారు. 'బంగ్లా ఇతిహాసేర్ సంబంధే ఎక్టీ కోథా'లో బంకిమ్ చంద్ర "మొఘలుల విజయం తర్వాత బంగాల్ సంపద బంగాల్‌లో ఉండలేదు, దిల్లీకి తరలించుకు పోయారు" అని రాశారు. కానీ ప్రముఖ చరిత్రకారులు కేఎన్ పణిక్కర్ "బంకిమ్ చంద్ర రచనల్లో ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా కొన్ని వాక్యాలు ఉన్నంత మాత్రాన వాటి ఆధారంగా బంకిమ్ ముస్లిం వ్యతిరేకి అని చెప్పలేం. ఆనంద్‌మఠ్ అనేది ఒక సాహిత్యం" అన్నారు. "బంకిమ్ చంద్ర ఆంగ్లేయుల పాలనలో ఒక ఉద్యోగి, అంగ్లేయుల గురించి రాసిన భాగాలను ఆనంద్‌మఠ్ నుంచి తొలగించాలని ఆయనపై ఒత్తిడి ఉండేది. 19వ శతాబ్దం చివర్లో జరిగిన ఈ రచనను ఆ సమయంలో ఉన్న పరిస్థితులను సందర్భాలను బట్టి చదివి, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది". ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బంగ్లా భాషలోని అగ్ర రచయితల్లో ఒకరుగా భావించే బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ తన రచనలతో కేవలం బంగాలీ సమాజాన్నే కాదు, మొత్తం దేశాన్నే ప్రభావితం చేశారు. text: ప్రజా కవి మగ్దూం మొహియుద్దీన్ బిర్యానీకి, షేర్వాణీకి, కుబానీకి మాత్రమే కాకుండా మానవత్వానికి, సంస్కారానికి, సాహిత్యానికి కూడా హైదరాబాద్ కేంద్ర బిందువని అనేక మంది ఉర్దూ, తెలుగు కవులు చాటారు. వీరిలో మగ్దూంది ప్రత్యేక స్థానం. మగ్దూం కవిత పాతాళం అంత లోతు, నదీమైదానాల్లాగా విశాలం, గాజా పిరమిడ్ వలె సమున్నతం. అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ మగ్దూం కవితా గోష్ఠికి టికెట్లు కొని తొలిరోజు సినిమాకు వచ్చినట్లు జనం తండోపతండాలుగా వచ్చేవారనేది అక్షర సత్యం. మగ్దూం అంటే కవిత్వానికి ఆలంబన. సన్నజాజి తీగకు పందిరి (చమేలీ కా మండ్వా). నూతన మానవుణ్ని (నయా ఆదమ్) ఆవిష్కరించడానికి మగ్దూం ప్రతి నిమిషం కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేసుకోవడానికి చివరి శ్వాస వరకు నిజాయతీగా పోరాటం చేశాడు. కార్మికవర్గం పోరులో అలిసి, కవిత్వంలో సేద తీరి, తిరిగి కొత్త ఉత్సాహంతో విద్యార్థులు, యువకుల మధ్య ఉపన్యాసకునిగా మారి, ఏనాడూ గుండెకు విశ్రాంతినియ్యని ఆ మహాయోధుడు సరిగ్గా యాభై ఏళ్ల క్రితం ఇదే రోజు (ఆగస్టు 25) గుండెను పోగొట్టుకున్నాడు. దిల్లీలో కవి సమ్మేళనంలోనే అలసిపోయిన ఆయన గుండె శాశ్వత విశ్రాంతి కోరింది. నిన్న, నేడు హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో మగ్దూం సంస్మరణ సభల్లో వక్తలను వింటుంటే మగ్దూం వేలాది మంది హృదయ స్పందనగా మారాడని స్పష్టమవుతుంది. మగ్దూం మొహియుద్దీన్ సంతకం హైందవ, ఇస్లామిక్ మత దురహంకారం మానవత్వానికి శత్రువులని నమ్మి, చివరి వరకు రాజీలేని పోరులో ధృవతారగా వెలిగాడు మగ్దూం. మగ్దూం కవిత్వంలో పసిబాలుని చిరునవ్వు పలకరిస్తుంది. పోరాట యోధుని సంకల్ప దీక్ష గోచరమవుతుంది. మాతృమూర్తి కరుణ తల నిమురుతుంది. మేధావి ఘోష కర్తవ్యం బోధిస్తుంది. ప్రవక్త సందేశం దిక్కులు పిక్కటిల్లజేస్తుంది. దేశంలో ప్రగతిశీల (తరఖ్కీ పసంద్) కవితా ఉద్యమానికి పునాది మగ్దూం. కిషన్ చందర్, అలీ సర్దార్ జాఫ్రీ, ఫైజ్ ఆహ్మద్ ఫైజ్, ఆలం ఖుంద్మీరి, ఓంకార్ ప్రసాద్, జవ్వాది రజ్వీ, ఆబిద్ అలీఖాన్, బూర్గుల నర్సింగరావు, సిబ్తె హసన్ వంటి కవి సైన్యానికి మగ్దూం స్ఫూర్తి ప్రదాత. మఖ్దూం కవితల్లో తిరుగుబాటు, ఎర్రబావుటా కనిపిస్తాయి. అన్యాయానికి గురైన పేదవాడి బలహీనమైన ఆర్తనాదాలు వినిపిస్తాయి. కవిత్వమూ, ఉద్యమమూ కలగలిసిన సంగమస్థలి ఆయన జీవితం. పీడిత ప్రజల్లో చైతన్యం రగిలించడానికి ఒక చేత్తో కవిత్వం రాస్తూ, మరోవైపు ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహిస్తూ జాతిని జాగృతం చేసిన బహుముఖ వ్యక్తిత్వం మగ్దూంకే చెల్లింది. శరత్ సాహిత్యం, షిబ్లీ నోమాని, సర్ సయ్యద్, ఖాజీ అబ్దుల్ గఫార్, ప్రేమ్‌చంద్ వంటి కవుల రచనలు మగ్దూం సాహిత్యానికి ప్రేరణగా నిలిచాయి. మగ్దూం పల్లెలో పుట్టి పల్లెలోనే పెరిగాడు. అందుకని పల్లెజనం బాధలు, కష్టాలు ఆయన కవితల్లో ప్రస్ఫుటమవుతుంటాయి. మగ్దూం నిరంకుశ రాజరిక వ్యవస్థను ప్రశ్నించాడు. హైదరాబాద్‌లో కమ్యూనిస్టు ఉద్యమానికి బునియాది అయ్యాడు. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై మొహియుద్దీన్ విగ్రహం హైదరాబాద్‌లో సత్యనారాయణ రెడ్డి, రాజ్ బహదూర్ గౌర్, కేఎల్ మహేంద్ర వంటి ఉద్ధండులతో కలిసి బలమైన కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించారు. శ్రమ దోపిడి పోవాలంటే శ్రామిక వర్గాల ఐక్యత ఒక్కటే మార్గమని నమ్మిన మగ్దూం... 'కామ్రేడ్స్ అసోసియేషన్' స్ధాపించారు. అప్పటికే అన్ని భావజాలాల వాళ్లతో కలిసి సలసలా కాగుతున్న ఆంధ్ర మహాసభతో కామ్రేడ్ అసోసియేషన్ జత కలిసింది. దీంతో నాలుగైదు సంవత్సరాల్లోనే ఆంధ్ర మహాసభ స్వరూపమే మారిపోయింది. 1942 నుంచి 1946 వరకు కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తొలగిపోవడంతో కార్మిక, రైతాంగ, విద్యార్థి సంఘాల ఉద్యమాలు తిరిగి పుంజుకున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు ప్రకటనపై సంతకం చేసిన ముగ్గురు తెలంగాణ బిడ్డల్లో మగ్దూం మొహియుద్దీన్ ఒకరు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం సాంకేతికంగా 1934 సెప్టెంబర్ 11న ప్రారంభం అయినప్పటకీ, 1944 భువనగిరి పదకొండో ఆంధ్ర మహాసభ నాటి నుంచి పోరాటం ఎరుపెక్కింది. జనగామ తాలూకాలో రైతాంగం కదలికలతో రాజుకున్న నిప్పురవ్వలు 1946 జులై 4న కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వంతో దావానలమయ్యాయి. 'నైజాం నిరంకుశ పాలన పోవాలి - ప్రజారాజ్యం స్థాపించుకోవాలి' అని హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ స్టేట్ కమిటీ తీర్మానంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీ మీద మళ్లీ నిషేధం వల్ల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మగ్దూం అజ్ఞాతంలోకి వెళ్లారు. నాలుగు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం నుంచే సాయుధ పోరాటాన్ని, కార్మికోద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని నడిపారు. మగ్దూం లాంటి కవులు, కార్మిక నాయకులు, విప్లవ కారులు నేడు మన మధ్య లేకపోవడం ఆశ్చర్యం కాదు. వారంతా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, ప్రపంచ ప్రజల శ్రామిక పోరాటాలు, రాచరికానికి, ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటాల నేపథ్యం నుంచి భూమి రాతిపొరలను చీల్చుకొని పొటమరించిన భూమి బిడ్డలు. భూమి గురించి, భూమి నుంచి వచ్చే బువ్వ గురించి క్షుణ్ణంగా తెలిసినవారు. కష్ట జీవుల కష్టం, వారు ఓడ్చిన చెమట, వారు చిందించిన రక్తం విలువ వెలకట్టలేనివని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భౌతిక పరిస్థితులు ఆనాటికన్నా భయంకరంగా ఉన్నప్పటికీ ప్రజల మానసిక పరిస్థితి రకరకాల ఆకర్షణల్లో,వ్యామోహాల్లో, కుహనా అస్తిత్వంలో కొట్టుకుపోతోంది. పరిస్థితులు త్వరలోనే మరింత దుర్భరంగా మారనున్న నేపథ్యంలో మగ్దూం ప్రాసంగికత మరింత పెరిగింది. మగ్దూం కంటే బలంగా, ఘాటుగా కవిత్వం రాసేవారు కోకొల్లలుగా పుట్టుకొని రావొచ్చు. వారికి మగ్దూం కవిత నర్సరీ పాఠశాలగా మారుతుందనేది నిస్సందేహం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణ నేలలో వీరుల రక్తం, గాలిలో శౌర్యం ఇమిడి పోయిందని పోరాటాల ద్వారా, కవిత్వం ద్వారా ప్రపంచానికి తుపాను మోతతో వినిపించిన ప్రజా కవి మగ్దూం మొహియుద్దీన్. text: కశ్మీర్ భూభాగం మాదంటే మాది అని.. భారత్, పాకిస్తాన్‌లు వాదిస్తున్నాయి. కానీ, అందులో కొంత భాగం భారత్ పాలనలో, మరికొంత భాగం పాకిస్తాన్‌ పాలనలో ఉంది. అంతర్జాతీయంగా ఆ భూభాగాలను "భారత పాలిత కశ్మీర్", "పాకిస్తాన్ పాలిత కశ్మీర్"గా వ్యవహరిస్తున్నారు. 10 జిల్లాలతో 13,000 చదరపు కిలోమీటర్ల (5,019 చదరపు మైళ్లు) వైశాల్యం ఉన్న కశ్మీర్‌లో 40 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ వివాదాస్పద ప్రాంతంపై భారత విధానాన్ని జైశంకర్ మరోసారి పునరుద్ఘాటించారు. "భారతదేశానికి చెందిన జమ్మూ కశ్మీర్‌లోని ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ దొడ్డిదారిన ఆక్రమించింది. దానిని ఆ దేశం ఖాళీ చేయాల్సిందే" అంటూ 1994లో భారత పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, బయటకు కనిపించే దానికంటే ఈ మాటల వెనుక బలమైన వ్యూహం దాగి ఉండవచ్చునని చాలామంది భావిస్తున్నారు. పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్, పూర్తిగా మంచుతో నిండి ఉండే అక్సాయ్ చిన్ ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌లో భాగమేనని ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని ముగ్గురు ముఖ్య సభ్యులు - విదేశాంగ, రక్షణ, హోం శాఖల మంత్రులు గట్టిగా పునరుద్ఘాటించారు. సుదీర్ఘ కాలంగా భారత్ పాటిస్తున్న "అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదు" అన్న విధానాన్ని అవసరమైతే తిరిగి సమీక్షించాల్సి రావచ్చు అని ఆగస్టులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే ఇకపై అది 'పాక్ ఆక్రమిత కశ్మీర్'పై మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే అది 'పీవోకే'పైనే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు భారత పాలిత కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత, కశ్మీర్ అంశంపై వచ్చేవారం ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. దానికి కొన్ని రోజుల ముందు భారత్ తన స్వరాన్ని పెంచిందా? (సరిహద్దు వెంట, పాకిస్తాన్ కూడా తన చర్యలను పెంచింది) లేక ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని గట్టిగా హెచ్చరిస్తోందా? "జమ్మూ కశ్మీర్లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని అంటున్న పాకిస్తాన్‌కు కౌంటర్‌గా భారత నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు" అని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మోదీ కండ బలాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. ఫిబ్రవరిలో కశ్మీర్లోని పుల్వామాలో మిలిటెంట్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (జేఈఎం) మిలిటెంట్ గ్రూప్ ఆ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆ దాడికి ప్రతిస్పందనగా... పాకిస్తాన్ భూభాగంలోని మిలిటెంట్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ వైమానిక దాడులు చేసింది. బాలాకోట్ వీడియో 1971లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటి నుంచీ కశ్మీర్ ప్రాంతాన్ని విభజించే నియంత్రణ రేఖ వెంట దాడులు జరుగుతూనే ఉన్నాయి. అదే సరిహద్దులో సెప్టెంబర్ 2016లో ఉగ్రవాదులపై భారత్ "సర్జికల్ స్ట్రైక్స్" చేసిన తరువాత, మోదీ పతాక శీర్షికల్లో నిలిచారు. 18 మంది సైనికుల ప్రాణాలను తీసిన ఆర్మీ స్థావరంపై మిలిటెంట్ల దాడికి ప్రతిస్పందనగా తాము సర్జికల్ దాడులు చేశామని భారత్ తెలిపింది. పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్‌ భూభాగాన్ని 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని భారత్ పిలుస్తుంటుంది. "భారత ఉపఖండంలో సంఘర్షణల తీవ్రత పెరుగుదలపై అధ్యయనం చేసే ఎవరైనా భారత్ చేస్తున్న తాజా ప్రకటనలను తీవ్రంగా పరిగణించాలి" అని 'ది హిందూ' పత్రిక దౌత్య వ్యవహారాల సంపాదకురాలు సుహాసిని హైదర్ అభిప్రాయపడ్డారు. అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు ప్రత్యర్థి దేశాలూ కశ్మీర్ అంశంపై ఇప్పటికే రెండు యుద్ధాలు చేశాయి. "రెండు దేశాలలో 250కి పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు ప్రచ్ఛన్నంగా పోరాటం కొనసాగిస్తూనే... పరస్పరం రెచ్చగొట్టుకుంటూ ఒకదాని సహనాన్ని మరొకటి పరీక్షిస్తున్నాయి. ఫలితంగా అణ్వస్త్రాల నిరోధకతే ప్రశ్నార్థకంగా మారుతోంది" అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన స్టీఫెన్ కోహెన్ అన్నారు. ఈ ఏడాది సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు కొన్నేళ్లుగా ఎక్కువయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం రెండు వేల సార్లు "అకారణంగా" కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, పాక్ సైనికుల కాల్పుల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019లో సరిహద్దు దాటి భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది సైనికులతో సహా 45 మందికి పైగా మరణించారని పాకిస్తాన్ తెలిపింది. "సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఉల్లంఘనలు రాజకీయ వాగ్యుద్ధాలకు, సైనిక బలప్రదర్శనకు, దౌత్యపరమైన ప్రతిష్టంభనకు దారితీస్తుంది. అవి మరిన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనలకు, ఉద్రిక్తతలకు దారితీస్తాయి" అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దౌత్య, నిరాయుధీకరణ అంశాల ప్రొఫెసర్ హ్యాపీమోన్ జాకబ్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలంటే భారత్ సైనిక చర్యను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, పాకిస్తాన్ ఏకపక్షంగా దానిని ఇచ్చే అవకాశం లేదు. "అలా జరగాలన్నది భారత దీర్ఘకాలిక ఆకాంక్షగా కనిపిస్తోంది" అని 'కశ్మీర్: ది అన్‌రిటెన్ హిస్టరీ' పుస్తక రచయిత క్రిస్టోఫర్ స్నెడెన్ అన్నారు. "పాకిస్తాన్‌ మొదట కాల్పులు జరిపేలా భారత్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా జరిగితే కశ్మీర్ స్వాధీనాన్ని భారత ప్రభుత్వం సమర్థించుకునే అవకాశం ఉంటుంది" అని ఆయన చెప్పారు. మరి, తాజా ప్రకటనలను రెండు అణ్వాయుధ దేశాల మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి కొనసాగింపే తప్ప, మరొకటి కాదు అనుకోవాలా? పాకిస్తాన్ పాలిత కశ్మీర్ గురించి మాట్లాడేందుకు భారత్ ముప్పేట వ్యూహంతో ఉందని దిల్లీకి చెందిన విదేశీ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు. మొదటిది, "నెలన్నర కాలంగా కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితుల నుంచి దృష్టిని మళ్లించడం. రెండోది, కశ్మీర్‌ మీద అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చను మార్చేసి పాకిస్తాన్‌ను దెబ్బతీయడం. మూడోది, భారతీయ కశ్మీరీలలో నిస్సహాయ భావనను కలిగించడం, ప్రతిఘటన వ్యర్థం అన్న సందేశాన్ని ఇవ్వడం" అని అజయ్ శుక్లా వివరించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''పాకిస్తాన్ పాలిత కశ్మీర్ భారత్‌లో భాగమే. ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకుని పాలన సాగిస్తాం'' అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. text: ఇదొక క్రీడా పండుగ మాత్రమే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ మహా సమరం ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ప్లేయర్స్‌కు లాభాలుంటాయి, ఇందులో పాల్గొన్న జట్లకూ లాభాలు ఉంటాయి, ఆతిథ్య దేశమైన రష్యాకు, నిర్వాహకులకు, స్పాన్సరర్లకు ఇలా అనేక మందికి అనేక ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి. ఆతిథ్య దేశమైన రష్యాకు ఇదొక పెద్ద పరీక్షే. ఎందుకంటే ఈ క్రీడా సమరం పేరుతో తమ దేశంలో అనేక పెట్టుబడులు కూడా కోరుకుంటోంది ఆ దేశం. నిర్వాహకుల అంచనా ప్రకారం ఈ ఫుట్ బాల్ వరల్డ్ కప్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు ఆరు లక్షల మంది రష్యా చేరుకున్నారు. రష్యాలోని పదకొండు నగరాలలో జరుగుతోన్న మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతాల్లోని హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఫిఫా ప్రపంచకప్: ఎవరెవరికి ఎంతెంత లాభమో తెలుసా ఆతిథ్యం ఇచ్చే నగరాలకు ఏంటి లాభం? అయితే ఒక మెగా టోర్నమెంట్ నిర్వహిస్తే అనేక ఇతర లాభాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యమైనది మౌలిక సదుపాయాల అభివృద్ధి. అంటే గ్రౌండ్‌లు, స్టేడియాలు అభివృద్ధి చేయడంతో పాటు అనేక ప్రకటనలు కూడా వస్తాయి. అలాగే ఇటువంటి భారీ ఈవెంట్‌లు నిర్వహిస్తే ఆతిథ్య నగరాలలోని రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతాయని ఒక విశ్లేషణ. ఆతిథ్య దేశాలకు ఏంటి లాభం? ఇంతకు ముందు ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దేశాలు ఎటువంటి లాభాలు ఆర్జించాయో ఒక సారి చూస్తే.. 2002లో సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహించిన జపాన్, సౌత్ కొరియాలు దాదాపు 900 కోట్ల డాలర్ల లాభాలు పొందాయి. 2006లో ఆతిథ్య దేశమైన జర్మనీ దాదాపు 1200 కోట్ల డాలర్ల లాభాలు గడిస్తే, 2010లో ప్రపంచ కప్ పోటీలు నిర్వహించిన దక్షిణాఫ్రికా దాదాపు 500 కోట్ల డాలర్ల లాభాలు పొందింది. రష్యాకు 1500 కోట్ల డాలర్ల లాభం!? ఈ ప్రపంచ కప్ పోటీలు నిర్వహించడానికి రష్యా దాదాపు 1100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ప్రపంచ కప్ ముగిసేలోగా దాదాపు 3000 కోట్ల డాలర్ల లాభాలు రావాలని కోరుకుంటోంది. మెకెన్జీ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం ఈ ప్రపంచ కప్ ద్వారా రష్యా జీడీపీకి దాదాపు 1500 కోట్ల డాలర్ల లాభం ఉంటుంది. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ ఏడాది విలువ లక్షా ముప్పై కోట్ల డాలర్లుగా ఉన్నప్ప్పుడు ఈ పదిహేను వందల కోట్ల డాలర్లు కేవలం 0.2% మాత్రమే. పాల్గొనే జట్లు, క్రీడాకారులకు ఏంటి లాభం? ఇదంతా ఒకెత్తు అయితే అసలు ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రధాన నిర్వాహకులు అయిన ఫిఫాకు వచ్చే లాభాలు మరొకెత్తు. ఫిఫాకు దాదాపు 5300 కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. కానీ ఈ లాభాల్లో చాలా భాగం విజేతలకు ప్రైజ్ మనీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి విజేతకు 256 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఫిఫా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచే జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇస్తుంది ఫిఫా. ఇక క్వార్టర్ ఫైనల్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే జట్లలోని ప్లేయర్ల జేబుల్లోకి కూడా ప్రైజ్ మనీ వచ్చి చేరుతుంది. ఇంకా చెప్పాలంటే 32 జట్లకుకు కూడా ఎంతోకొంత ఆర్థిక ప్రయోజనాలుంటాయని ఫిఫా ప్రకటించింది. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఫిఫాకు ఇంత ఆర్థిక లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటున్నారా.. సింపుల్.. ఈ ఏడాది 86 శాతం లాభాలు సాకర్ వరల్డ్ కప్ ప్రసార హక్కుల్ని అమ్మడంతోనే వచ్చేశాయి. ఇక మిగతాది ప్రకటనలు, ప్రచారాలు, స్పాన్సర్ల ద్వారా వస్తుంది. ప్రచార హక్కుల కోసం ఒక యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే ఏ నెట్‌వర్క్ అయితే ఆ ప్రసార హక్కులు సొంతం చేసుకుంటుందో ఆ సంస్థకు ఊహించనంత లాభాలు వస్తాయి. ఫుట్ బాల్ వరల్డ్ కప్ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. దానికొక ఉదాహరణ.. బ్రెజిల్‌లో జరిగిన గత వరల్డ్ కప్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లమంది వీక్షించారు. అలాగే ఫైనల్ మ్యాచ్‌ను దాదాపు వంద కోట్ల కన్నా ఎక్కువ మంది చూశారు. అది ఫుట్ బాల్ వరల్డ్ కప్ పవర్. వరల్డ్ కప్ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఇవి . సో వరల్డ్ కప్ మొదలైపోయింది.. జోష్ పెరిగిపోతోంది. జట్లు అన్నీ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. చూద్దాం ఎవరు గోల్డ్‌ను ఎగరేసుకుపోతారో!! మీ అంచనా ఏంటో ఈ లింక్ క్లిక్ చేసి చెప్పండి. మీ అంచనా ఫలితాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు కూడా. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా 32 జట్లు సాకర్ మహా సమరంలో ఢీ అంటే ఢీ అంటూ పోరాడుతున్నాయి. రష్యా లో జరుగుతోన్న వరల్డ్ కప్‌లో ప్రతి క్షణమూ కీలకమే. ప్రతి గోల్ అమూల్యమే. text: అమెరికా మొత్తంలో ఎక్కడికైనా చేరుకోగల కొత్త తరహా ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. గత కొంత కాలంగా ఇలాంటి క్షిపణి పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్న ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరికలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఉత్తర కొరియాతో యుద్ధం వస్తే.. అదెలా ఉంటుంది? అన్న అంశంపై అమెరికాకు చెందిన ఇద్దరు నిపుణులు బీబీసీతో మాట్లాడారు. యుద్ధం ఎలా ప్రారంభమవుతుంది? ఉత్తర కొరియా వ్యూహాలు ఎలా ఉండొచ్చు? అణ్వాయుధాన్ని ఎప్పుడు వాడొచ్చు? అన్న అంశాలతో పాటు వారి శక్తి సామర్థ్యాలు, తదనంతర పరిణామాలపై మాట్లాడారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) అణు రాజ్యం కావాలన్న తమ ఆకాంక్ష తాజాగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణితో నెరవేరిందని ఉత్తర కొరియా చెబుతోంది. text: ఆర్టీసీలో సెప్టెంబర్ జీతాలు ఇంకా అందలేదు. సమ్మె చేస్తున్నవారంతా వారంతట వారే ఉద్యోగం వదిలేసినట్లు పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిపోల బయట కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే విద్యార్ధి సంఘాలు, రాజకీయ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భవిష్యత్తు ఎటూతేలని పరిస్థితి, జీతాలు రాక ఆర్థిక భారం పెరగడంతో ఉద్యోగులలో ఆందోళన పెరుగుతోంది. దీనికి నిదర్శనమే ఖమ్మం ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి, రాణిగంజ్ డిపో ఉద్యోగి సురేందర్ గౌడ్ బలవన్మరణాలు. సురేందర్ గౌడ్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు, స్థానికులు శ్రీనివాస్ రెడ్డి శనివారం నిప్పంటించుకోగా.. సురేందర్ గౌడ్ ఆర్థిక భారం తట్టు కోలేక ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌‌లోని కార్వాన్‌లో సురేందర్ గౌడ్ నివాసం వద్ద సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య వివిధ సంఘాల వారు, రాజకీయ నాయకులు సురేందర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. సురేందర్ గౌడ్ మరణానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనంటూ అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగులు నినాదాలు చేశారు. మరోవైపు సురేందర్ గౌడ్ సతీమణి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. రోదిస్తున్న కుటుంబసభ్యులు తొలి రోజు నుంచి సురేందర్ సమ్మెలో పాల్గొంటూవచ్చారని ఆయన సోదరుడు రవి తెలిపారు. ''ఏడాది కిందట బిడ్డ పెళ్లి చేశాడు. కొంత అప్పు చేయాల్సివచ్చింది. మాది నిజామాబాద్. ఆస్తులేమీ లేవు. ఉంటున్న ఇల్లు కూడా కిరాయిదే. జీతంపైనే ఆధారపడి బతికే కుటుంబం. సమ్మె మొదలయ్యాక నాతో మాట్లాడుతూ ఏమవుతుందో ఏమో అన్నాడు అన్న. ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అన్నను చాలా బాధించింది. ఈలోగా జీతం రాకపోవడం, అప్పుల వడ్డీలు కట్టాల్సిన తేదీ దగ్గర పడటం వంటివి అన్న మరణానికి కారణమయ్యాయి" అన్నారు రవి. సురేందర్ గౌడ్ తనయుడు సంకీర్తన్ గౌడ్ మాట్లాడుతూ తన తండ్రి జీతం అందరు అనుకుంటున్నట్టు వేలకువేలేమీ లేదన్నారు కంటతడి పెట్టుకుంటూ. "నేను ఒక మాల్‌లో పనిచేస్తాను, అమ్మ టైలరింగ్ పనిచేస్తారు, నాన్నది ఆర్టీసీ ఉద్యోగం. అందరం నెలంతా కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. పదిహేనేళ్లుగా మా నాన్న చేసింది ఏంటంటే ఆర్టీసీకి తన ప్రాణాలు అర్పించడం" అంటూ ఇంటి బయట ఉన్న తన తండ్రి సురేందర్ గౌడ్ భౌతికకాయం వద్ద ఏడుస్తున్న తల్లిని ఓదార్చేందుకు కదిలాడు సంకీర్తన్. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో ఉద్యోగులు సమ్మెను తీవ్రతరం చేసేందుకు పిలుపు ఇచ్చారు. text: ర్యాపర్ లిల్ నాస్ ఎక్స్ తాజా పాట 'ఓల్డ్ టౌన్ రోడ్'లో మనుషులు, వారి పెంపుడు శునకాలు కౌబాయ్, కౌగర్ల్ దుస్తుల్లోకి మారిన సన్నివేశం కనిపిస్తుంది. ఆ పాట సూపర్ హిట్ కావడానికి ఈ టిక్ టాక్ దృశ్యానిదే కీలక పాత్ర అని చెబుతున్నారు. అయితే, ఈ యాప్ చైనా యజమాని బైట్‌డాన్స్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ అధికారులు కూడా దీనివల్ల తమ భద్రత సందేహాదాస్పందా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌ టాక్ యాప్ సురక్షితమేనా? దీని మీద వినిపిస్తున్న ఆందోళన టీ కప్పులో తుపాను వంటిదేనా? ఇది ఎలా పని చేస్తుంది? టిక్ టాక్‌లో చాలా వరకు 20 ఏళ్ళ లోపు వారు 15 సెకండ్ల వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. వీటిలో ఎక్కువ శాతం పాటలకు పెదాలు సింక్ చేస్తూ కనిపించే వీడియోలే. అలాగే, కామెడీ సన్నివేశాలు, ఎడిటింగ్ ట్రిక్స్‌తో కూడిన వీడియోలు కూడా ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. ఈ వీడియోలు యూజర్ల ఫాలోవర్లకే కాకుండా అపరిచితులకు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇందులో అన్ని అకౌంట్లు మామూలుగా పబ్లిక్‌కు అందుబాటులో ఉంటాయి. యూజర్లు తమ పోస్టులను తాము కోరుకున్న వారికే అందుబాటులో ఉండేలా చేసే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగడం చాలా అరుదు. ఏ యూజర్‌కు ఎలాంటి వీడియోలు ఇష్టమో అలాంటివాటిని ఎంపిక చేసి అందించే ఆల్గొరిథం ఇందులో ఉంటుంది. అవన్నీ ఒకటి తరువాత ఒకటి ఆటోమేటిగ్గా ప్లే అవుతూ ఉంటే టైమ్ ఇట్టే గడిచిపోతుంది. అసలు ఎంత సమయం ఈ యాప్‌తో గడిపామో కూడా తెలియనంతగా అందులో లీనమైపోతుంటారు. అంతేకాకుండా, మెంబర్లు తమకు కావలసిన అంశాలను కూడా ఇందులో వెతుక్కోవచ్చు. హాష్‌ట్యాగ్స్ క్లిక్ చేస్తూ కూడా బ్రౌజింగ్ చేయొచ్చు. టిక్ టాక్ ప్రైవేట్ సందేశాలను కూడా పంపే అవకాశం కల్పిస్తోంది. కానీ, ఇది కేవలం 'ఫ్రెండ్స్'కు మాత్రమే పరిమితం. ఈ యాప్‌ను 13 ఏళ్ళకు పైబడిన వారెవరైనా ఉపయోగించవచ్చు. ఇందులో పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. టిక్ టాక్ దీర్ఘకాలిక యూజర్లు చాలా మంది మొదట Musical.ly యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. చైనాలోని ఓ స్టార్టప్ కంపెనీ ఈ లఘు-వీడియోల యాప్‌ను అభివృద్ధి చేసింది. దాన్ని బైట్‌డాన్స్ సంస్థ 2017లో కొనుగోలు చేసి రెండింటిని కలిపేసింది. బీజింగ్‌లోని బైట్‌డాన్స్ సంస్థకు మరో యాప్ కూడా ఉంది. దానిపేరు డోయిన్ (Douyin). చైనా సెన్సార్షిప్ నిబంధనలకు లోబడి ఇది వేరే నెట్‌వర్క్‌లో నడుస్తోంది. అయితే, ఈ కంపెనీకి వివాదాలు కొత్తేమీ కాదు. గత ఏడాది ఇది భారతదేశంలో తాత్కాలిక నిషేధాన్ని ఎదుర్కొంది. అమెరికాలోని తీవ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థ కూడా దీన్ని నిషేధించింది. వయోపరిమితి లేని యూజర్లు పబ్లిష్ చేసిన కంటెంట్‌ను హోస్ట్ చేసినందుకు సదరు దర్యాప్తు సంస్థ Musical.ly మీద 43 లక్షల పౌండ్ల జరిమానా విధించింది. టిక్ టాక్ డేటాపై ఆందోళన దేనికి? ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యత విషయంలో రాజీపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఫేస్‌బుక్ మాజీ చీఫ్ సెక్యూరిటీ అధికారి అలెక్స్ స్టామోస్, అమెరికా-చైనాలలోని బైట్‌డాన్స్ యూజర్ల మధ్య ఘర్షణలు తలెత్తినట్లు నివేదికలు వచ్చినప్పుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సెన్సార్‌షిప్ బృందంలోని మాజీ సభ్యులు కూడా చైనాలోని తమ సహోద్యోగులు కొన్ని వీడియోలను తొలగించాలని తమకు సూచించారని, అవి అమెరికా ప్రమాణాల రీత్యా అభ్యంతరకరం కానప్పటికీ తీసేయాలని చెప్పారని అన్నారు. వాషింగ్టటన్ పోస్ట్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం వారు డిలీట్ చేసిన వీడియోలలో విపరీతమైన ముద్దులు, లైంగిక భంగిమలను గుర్తు చేసే డాన్సులు, రాజకీయ చర్చలు ఉన్నాయి. ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే, దేశంలోని సోషల్ మీడియా యాప్స్ అన్నింటికీ తమకు యాక్సెస్ ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్దేశిస్తోంది. అయితే, ఇతర దేశాల కంటెంట్‌ను ప్రత్యేకంగా స్టోర్ చేస్తున్నామని, దాన్ని చైనా అధికారులతో షేర్ చేసుకోవడం లేదని బైట్‌డాన్స్ అంటోంది. అమెరికా చట్ట ప్రతినిధుల అభ్యంతరాలేమిటి? ఈ వారం మొదట్లో అమెరికా రాజకీయవేత్తలు టిక్ టాక్‌ను కాంగ్రెస్ ఎదుట విచారణకు రావాలని అన్నారు. చైనాలో ఎదుర్కొంటున్న ఆరోపణల గురించి అది వివరణ ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వ విచారణ జరపాలనే డిమాండ్‌కు కూడా చాలా మంది సెనెటర్లు మద్దతు పలికారు. ఆర్కాన్సాస్ సెనెటర్ టామ్ కాటన్ అయితే టిక్ టాక్ కంపెనీ కూడా 2016లో ఫేస్ బుక్, ట్విటర్‌ల లాగా విదేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే టార్గెట్‌తో పని చేసే అవకాశం లేకపోలేదని ఆరోపించారు. అయితే, టిక్ టాక్ ఎలాంటి రాజకీయ ప్రకటనలు స్వీకరించదని బైట్ డాన్స్ చెబుతోంది. అయినప్పటికీ, 'సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని' ఉపయోగించుకునే మార్గాలను చైనా వెతుకుతూనే ఉంటుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు సహకారం అందించాలని టిక్ టాక్‌మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని కూడా టామ్ కాటన్ అన్నారు. ఈ ఆందోళనలపై టిక్ టాక్ స్పందన ఏంటి? టిక్ టాక్‌లో 2019లో చాలా మార్పులు చేశామని బైట్‌డాన్స్ చెబుతోంది. 'అందరికీ ఒకే విధానం' అనే మార్గాన్ని అనుసరించిన టిక్ టాక్ ఇప్పుడు అమెరికాలో స్థానికంగా మార్పులు చేస్తోంది. "మేం అత్యంత వేగంగా ఎదుగుతున్నప్పటికీ, అదే సమయంలో మా సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాన్నీ కొనసాగిస్తున్నాం. అమెరికాలోని మా టీమ్‌ వీలైనంత స్వతంత్రంగా వ్యవహరించేలా చూస్తున్నాం" అని టిక్ టాక్ అమెరికా జనరల్ మేనేజర్ వెనెసా పాపస్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు. అంతేకాకుండా, యూజర్స్ డేటా ధర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చైనాకు వెళ్ళకుండా చూసేందుకు ఈ సంస్థ ధర్డ్ పార్టీ ఆడిటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. టిక్ టాక్ భవిష్యత్తేంటి? చైనాకు చెందిన కులున్ కంపెనీ అభివృద్ధి చేసిన గే డేటింగ్ యాప్ Grindr ఎదుర్కొన్న సమస్యలు టిక్ టాక్‌కు ఒక హెచ్చరికలా కనిపిస్తున్నాయి. అమెరికాలోని విదేశీ పెట్టుబడుల కమిటీ, Grindrను అమ్మేయాలని కులున్‌ను ఒత్తిడి చేసింది. ఫలితంగా దాన్ని 2020లో విక్రయించేందుకు కులున్ అంగీకరించింది. జాతీయ భద్రతకు ముప్పు ఉందని భావించినప్పుడు విదేశీ కంపెనీల టేకోవర్లను ఉపసంహరించుకునేలా చేసే అధికారం అమెరికా విదేశీ పెట్టుబుల కమిటీకి ఉంది. అమెరికా సైనికుల వ్యక్తిగత సమాచారం Grindrలో చాలా ఉందని ఆ కమిటీ ప్రకటించింది. అదే కమిటీ ఇప్పుడు Musical.ly కొనుగోలును కూడా సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. Musical.ly ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉన్నప్పటికీ, దాని మరో కార్యాలయం కాలిఫోర్నియాలో ఉందనే ప్రాతిపదికన ఈ సమీక్ష జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో బైట్‌డాన్స్ కనుక చట్ట సభల ప్రతినిధులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోతే దానికీ Grindrకు పట్టిన గతే పట్టవచ్చు. పైగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇలా జరగవచ్చు... ఈ యాప్‌ను అమెరికా భూభాగంలో నిషేదించవచ్చు. ఈ ప్రాంతంలో టిక్ టాక్‌కు 2.65 కోట్ల నెలవారీ చురుకైన వినియోగదారులున్నారు. టిక్ టాక్ చైనా వెలుపల ఉన్న వేరొక కంపెనీగా రూపం మార్చుకోవచ్చు. బైట్‌డాన్స్ ఈ యాప్‌ను మరో టెక్నాలజీ సంస్థకు అమ్మేయవచ్చు. అమెరికాలోనే కాకుండా బ్రిటన్‌లో కూడా టిక్ టాక్ భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ చిన్న పిల్లల డేటాను ఎలా ఉపయోగిస్తోందో తెలుసుకునేందుకు పరిశోధన ప్రారంభించామని యూకే సమాచార కమిషనర్ ఎలిజబెత్ డెన్హామ్ ధ్రువీకరించారు. అంటే, ముందు ముందు టిక్ టాక్ మీద జరుగుతున్న విచారణలపై మరిన్ని వార్తలు వెలుగు చూసే అవకాశం ఉందన్నమాట. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఈ పొట్టి వీడియోల యాప్ ఆకర్షణీయమైన సంగీతంతో మేళవించిన మీమ్స్‌ పుట్టుకకు సారవంతమైన క్షేత్రంగా మారింది. టిక్ టాక్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై కోట్ల మంది వినియోగిస్తున్నారని అంచనా. వారిలో అత్యధిక శాతం టీనేజర్లు, ఇరవైల తొలినాళ్ళలో ఉన్నవారే. text: బాధిత మహిళకు స్వచ్ఛంద సంస్థగా సాయం చేస్తున్నట్లు చెప్తున్న వ్యక్తే నిందితుడని ఆమె ఆరోపించారు. తనపై అత్యాచారం జరగడం వాస్తవమే కానీ రాజశ్రీకర్ రెడ్డి సొంత లాభాల కోసం ఈ కేసును ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడని భాదిత మహిళ వెల్లడించారు. సోమవారం నాడు కుల సంఘాలు, మహిళా సంఘాల సమక్షంలో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసును పంజాగుట్ట పోలీసుల నుంచి సీసీఎస్ పోలీసు స్టేషన్‌కు బదిలి చేశారు. కేసు గురించి వివరాలు తెలిసిన మహిళా సంఘం కార్యకర్తతో బీబీసీ తెలుగు మాట్లాడింది. మహిళా సంఘం కార్యకర్త సంధ్య బాధిత మహిళను కలిశారు. తాను తెలిపిన వివరాల ప్రకారం కుల సంఘాల పెద్దలు, మహిళా సంఘాల పెద్దల జోక్యంతో నిజానిజాలు బయట పడుతున్నాయి. ''ఆ అమ్మాయి అత్యాచారానికి గురైన విషయం వాస్తవమే. తన దుర్బల పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం జరిగింది. బాధిత మహిళ చిన్న వయస్సులో ఎదురుకున్న సమస్యల కారణంగా ఆ ఊబిలో చిక్కుకుంది. కేసు పరిశోధనలో ఉంది. నిజానిజాలు త్వరలోనే బయట పడుతాయి'' అని సంధ్య అన్నారు. 'రేప్ చేశారని కేసు పెడితే నన్నే జైల్లో పెట్టారు' అయితే రాజశ్రీకర్ రెడ్డి వైఖరిపై పలు కుల సంఘాలు, మహిళా సంఘాల కార్యకర్తలకు ముందు నుంచే అనుమానం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అనుమానంతోనే సీసీఎస్ పోలీసులు కూడా అప్రమత్తమై పాత రికార్డులు పరిశీలించారు. రాజశ్రీకర్ రెడ్డిపై గతంలోనే అతని భార్య కేసు నమోదు చేసినట్టు తేలింది. ఈ విషయాన్ని హైదరాబాద్ అడిషనల్ పొలీస్ కమిషనర్ (క్రైం, ఎస్ఐటీ) శిఖా గోయల్ బీబీసీ తెలుగుకి ధృవీకరించారు. ప్రస్తుతం బాధిత మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. ''ఆమె రాజశ్రీకర్ రెడ్డి గురించి ప్రెస్ మీట్‌లో చెప్పింది. కానీ మా వద్ద భిన్నమైన వాంగ్మూలం రికార్డు చేసింది. కనుక మళ్లీ తన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నాము. భిన్నమైన వాంగ్మూలం ఉంది కనుక మెజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ రికార్డు చేయిస్తాము. దానిని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది'' అని శిఖా గోయల్ తెలిపారు. గతంలో బీబీసీ తెలుగుతో మాట్లాడిన రాజశ్రీకర్‌రెడ్డితో మాట్లాడటానికి బీబీసీ తెలుగు ప్రయత్నించింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ''నన్ను 139 రేప్ చేయలేదు. అందులోని కొన్ని పేర్లను రాజశ్రీకర్ రెడ్డి బలవంతంగా రాయించారు" అని బాధిత మహిళ సోమవారం ప్రెస్ మీట్ లో వెల్లడించారు. text: ముంబయి హౌసింగ్ సొసైటీలో కొంత మంది సభ్యులు ఎయిర్ ఇండియా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. మార్చ్ 22 అర్ధరాత్రి నుంచి భారతదేశం అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించింది. సరకు రవాణా, అత్యవసర సేవలని అందించే విమానాల్ని మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తోంది. అలాంటి ప్రయాణాలు పూర్తి చేసుకుని వచ్చిన ఉద్యోగులు నిబంధనలను అనుసరించి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే, ఇలా వచ్చిన కొంత మంది ఉద్యోగులను వారి ఇంటి చుట్టు పక్కల వాళ్లు బహిష్కరిస్తున్నారు. కొన్ని హౌసింగ్ సొసైటీల సభ్యులు తమ ఉద్యోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుని ఖండిస్తూ ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. వారు విదేశాలకు వెళ్లి వచ్చారనే నెపంతో ఇరుగుపొరుగువారు కొన్ని చోట్ల పోలీసులను కూడా పిలుస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఆ ప్రకటనలో తెలిపింది. పౌర విమాన యాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉద్యోగుల నిబద్ధతని కొనియాడుతూ, స్వీయ నిర్బంధంలో ఉన్న ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. కానీ, ఈ మొత్తం వ్యవహారం ఉద్యోగులను విచారానికి గురి చేసింది. ఏం జరిగింది? న్యూయార్క్ నుంచి వచ్చిన ఫ్లైట్‌లో ఉన్న ఓ కేబిన్ క్రూ సభ్యురాలు ఇటీవల తనకి జరిగిన అనుభవాన్ని తన సహోద్యోగులతో పంచుకున్నారు. (ఆమె విన్నపం మేరకు బీబీసీ ఆమె పేరుని గోప్యంగా ఉంచుతోంది.) ఆమెకి కోవిడ్-19 లక్షణాలు ఏమీ లేనప్పటికీ, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేసిన తర్వాత వైద్య అధికారులు ఆమెని స్వీయ నిర్బంధంలో ఉండమని సలహా ఇచ్చారు. దీంతో, ఆరోజు నుంచి, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా నవీ ముంబైలో ఉన్న తమ ఫ్లాట్ నుంచి బయటకి రాలేదు. అయినా సరే, ఆమె స్వచ్చందంగా స్క్రీనింగ్‌కి రాలేదని, ఆమె ప్రయాణ వివరాలు దాచి పెట్టారని బెదిరిస్తూ, ఓ రోజు రాత్రి ఓ పోలీస్ ఆఫీసర్ ఆమెకి ఫోన్ చేశారు. అదే రోజు ఓ పోలీస్ బృందం ఆమె ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఆమె దగ్గర అన్ని వివరాలు సేకరించి ఒక సీనియర్ అధికారితో కూడా మాట్లాడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వమని సూచించారు. ఈ వివరాలను ఆమె తన పై అధికారులకు తెలియచేశారు. అయితే, మరో పోలీస్ ఆఫీసర్ ఆమెకి కాల్ చేసి పోలీసులు ఆమె పట్ల ప్రవర్తించిన తీరుకి క్షమాపణ చెప్పారు. దీంతో ఆమె కుటుంబానికి కాస్త ఊరట కలిగింది. కానీ, ఆ రాత్రంతా ఆమె కుటుంబం భయంతోనే గడిపింది. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో జారీ చేసిన ప్రయాణ నిబంధనల ప్రకారం, గత 15 రోజుల్లో సొసైటీలో ఎవరైనా విదేశీ ప్రయాణం చేసి వస్తే, వారి జాబితాని స్థానికి పోలీసులకి అందచేయవలసి ఉంటుంది. అయితే పౌర విమానయాన ఉద్యోగుల గురించి ఇచ్చే సమాచారం పట్ల స్పష్టత లేదు. ఇతర అనుభవాలు ఈ వ్యవహారం కేవలం విమాన ప్రయాణం చేసి వచ్చిన ఉద్యోగులకు, హౌసింగ్ సొసైటీలకు మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్లతో ఎయిర్ పోర్టులలో పనిచేసే గ్రౌండ్ లెవెల్ ఉద్యోగులు కూడా తమ విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీలో తమ ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉన్న కొంత మంది ఇళ్ల ముందు స్థానిక అధికారులు "వీళ్లు నిర్బంధంలో ఉన్నారు" అనే పోస్టర్లను పెట్టారు. ఈ రకంగా కూడా స్థానికుల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నట్లు కొంత మంది విమానయాన ఉద్యోగులు వీడియోలు విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో గురించి కోల్‌కతాలోని ఓ ఫ్లైట్ అటెండెంట్ తన భావాలను పంచుకున్నారు. "మాకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. మీకన్నా మేం చాలా సురక్షితంగా ఉన్నాం. మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేం వైరస్ సోకిన ప్రాంతాల్లో వారికి దగ్గరగా ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ఒకవేళ నాకు వైరస్ సోకిందని అనిపిస్తే నేను ముందు నా విధులను పక్కనపెట్టి హాస్పిటల్‌కు వెళ్తాను. ఆ పరిస్థితుల్లో నా శరీరం కూడా పని చేయడానికి సహకరించదు. నాకు కరోనా సోకిందని దయచేసి అసత్యాలు, అపోహలు ప్రచారం చేయకండి" అని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే తమ ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం అన్ని అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నట్లు తెలుపుతూ ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వైరల్ వీడియోను పోస్ట్ చేసిన వారిని పట్టుకునేందుకు కోల్‌కతా పోలీసులు విచారణ చేపట్టారు. ఫ్లైట్ క్రూ పాటించాల్సిన నిబంధనలు ఏమిటి? మహమ్మారి వ్యాప్తి సమయంలో అంతర్జాతీయ విమానాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనలను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నమోదైన ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఉద్యోగులు హాస్పిటల్లో స్క్రీనింగ్‌కి వెళ్లి, ఇంట్లోనే స్వీయ నిర్బంధానికి వెళ్లాలి. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల భద్రత పట్ల యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికుల్లో ఎవరైనా కోవిడ్-19 బారిన పడ్డారనే అనుమానం ఉంటే ఉద్యోగులు రక్షణ సూట్లను ధరించాలి. "ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడాన్ని మా విధిగా భావిస్తాం. ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని తిరిగి దేశానికి తీసుకురావడంలో మేం ప్రధాన పాత్ర పోషించాం. అటువంటి పనులు చేయడానికి, శిక్షణ పొందిన సిబ్బందిని తగిన జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. మేం నిబంధనలన్నింటిని కచ్చితంగా పాటించాలి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పైలట్ చెప్పారు. ఎయిర్ ఇండియా సంస్థ గత కొన్ని నెలలుగా నష్టాల్లో కూరుకుని ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో చొరవ తీసుకుని వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తిరిగి దేశానికి తీసుకుని రావడానికి సహకరించింది. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "అన్ని యుద్ధాలు యుద్ధ భూమిలోనే సాగవు. రోజువారీ ఉద్యోగాలు చేస్తూ కూడా కొన్ని యుద్ధాలు గెలవాల్సి ఉంటుంది. మా విధులు మేం నిర్వర్తిస్తుంటే కూడా ఎందుకు మమ్మల్ని శిక్షిస్తారు?" అని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ ఉద్యోగి ప్రశ్నిస్తున్నారు. text: మరి.. ఒక వ్యక్తి మరణానంతరం కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్నేహితులతో చాటింగ్ చేస్తూ.. ఫొటోలతో పోస్టులు పెడుతూ.. పండుగలకు.. బర్తడేలకు విషెస్ చెప్తే ఎలా ఉంటుంది? అంతా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా. అది సాధ్యమేనని చెబుతున్నాయి కొన్ని స్టార్టప్ సంస్థలు. అందుకోసం మనిషికి డిజిటల్ రూపాన్ని సృష్టించే పనిలో ఉన్నాయి. కృత్రిమ మేధస్సు మహిమ.. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలకు కారణమవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(కృత్రిమ మేధస్సు) సాయంతో మనిషికి డిజిటల్ రూపాన్ని సృష్టించవచ్చని కొన్ని స్టార్టప్‌లు చెబుతున్నాయి. అదెలాగంటే.. ఒక వ్యక్తి జీవిత అనుభవాలను.. అభిప్రాయాలు.. ఆలోచనా తీరును.. సంబంధాలు.. సోషల్ మీడియాలో పోస్టులు.. స్నేహితుల బర్త్ డేలు.. ఇలా అన్ని విషయాలనూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అప్లికేషన్ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. చ‌నిపోయిన ప్రాణ స్నేహితుడ్ని ఫొటో ఆల్బంలో చూసుకోవ‌డమే కాకుండా.. అత‌నితో చాటింగ్ చేయ‌గ‌లిగితే ఎలా ఉంటుంది? వేర్వేరు సందర్భాల్లో సోషల్ మీడియాలో ఆ వ్యక్తి పెట్టిన పోస్టులు.. కామెంట్లు.. లైకులు.. వంటి విషయాల ఆధారంగా అతని అభిప్రాయాలను అంచనా వేస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అప్లికేషన్ తనంతట తానే సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తుంది. ఉదాహరణకు.. స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన రోజుల్ని గుర్తు చేస్తూ ఫొటోలతో ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెడుతుంది. స్నేహితుల పుట్టిన రోజున శుభాకాంక్షలు చెబుతుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ జరిపే చర్చల్లో పాల్గొంటుంది. ఇలా బతికున్న వ్యక్తి లాగే అతని తరఫున సోషల్ మీడియాలో వివిధ రకాల పనులు చేస్తూ ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది ఈ ''డిజిటల్ అవతార్''. మనుషులకు డిజిటల్ రూపాన్ని స‌ృష్టించడం ఒక వ్యాపారంగా మారుతుందంటున్న ఇట‌ర్‌నైమ్ సంస్థ వ్యవస్థాపకుడు మారియ‌స్ ఉర్షాషే బిజినెస్ లాజిక్‌.. మ‌నిషికి డిజిట‌ల్ రూపాన్ని సృష్టించ‌డాన్ని కొన్ని సంస్థలు కొత్తరకం వ్యాపార వ‌న‌రుగా మార్చుకుంటున్నాయి. ఇందుకోసం అమెరికా.. బ్రిట‌న్ త‌దిత‌ర దేశాల్లో ఇప్పటికే కొన్ని స్టార్టప్ సంస్థ‌లు వెలిశాయి. వ‌చ్చే ఏడాది ఈ సేవ‌లు ప్రారంభించేందుకు 'ఇట‌ర్‌నైమ్' అనే సంస్థ సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే 37,000 మందికి పైగా త‌మ డిజిట‌ల్ అవ‌తార్ సేవ‌ల కోసం ఆర్డర్లు ఇచ్చారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మారియ‌స్ ఉర్షాషే వెల్లడించారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఎవరికైనా మరణం తప్పదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. text: అక్కడి నుంచి ఆమె ప్రయాణం బాలీవుడ్‌కు మారింది. అక్కడా విజయాలే. తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ.. భాష ఏదైనా అక్కడి వెండితెరలకు జయప్రద మరింత అందం తెచ్చిన కథానాయికే. జయప్రద: సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? భారతదేశంలోని అగ్ర కథానాయకులందరితోనూ నటించిన ఘనత ఆమెది. ఎన్టీఆర్, రాజ్‌కుమార్, అమితాబ్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి నుంచి మొదలుకుని బాలీవుడ్ తరువాత తరం అక్షయ్ కుమార్ వంటివారితో కూడా నటించారామె. 'ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్' అని సత్యజిత్ రే నుంచి ప్రశంసలు అందుకున్న నటి ఆమె. సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం జయప్రద రాజకీయాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994లో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు వర్గంలో ఉంటూ ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగానూ పనిచేశారు. 1996 ఏప్రిల్‌లో తెలుగుదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలుగు దేశానికి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఉత్తర్ ప్రదేశ్‌ను తన రాజకీయ వేదికగా మార్చుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి 2004, 2009లో సమాజ్‌వాది పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2010లో అమర్ సింగ్‌తోపాటు జయప్రదను ఎస్పీ నుంచి బహిష్కరించారు. 2011లో వారిద్దరూ రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పార్టీ నుంచి ఒక్కరూ గెలవలేదు. అనంతరం 2014 ఎన్నికల సమయంలో ఆమె అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె ప్రస్తుత ఎన్నికల్లో రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలుగు సినీరంగాన్ని కొన్నేళ్ల పాటు ఏలిన కథానాయకి జయప్రద. text: రహస్య చిత్రీకరణ నిందితుడి పేరు డాక్టర్ బోనిఫేస్ ఇగ్బెనెఘు. ఆయన ఓ చర్చిలో పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన చర్యలను చర్చి తీవ్రంగా ఖండించింది. ఏడాది పాటు బీబీసీ ఆఫ్రికా ఐ బృందం జరిపిన ఆపరేషన్‌లో భాగంగా ఇలా రహస్య కెమెరాకు చిక్కిన పలువురు అధ్యాపకుల్లో బోనిఫేస్ ఒకరు. బీబీసీ అండర్‌కవర్ ఆపరేషన్‌తో పశ్చిమ ఆఫ్రికాలోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాల సిబ్బందిలో కొందరు విద్యార్థులపై పాల్పడుతున్న లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రొఫెసర్లు తమను లైంగికంగా వేధించారని పలువురు విద్యార్థినులు చెప్పారు. వారిలో కొందరు తమ వివరాలను గోప్యంగా ఉంచారు. బీబీసీ కథనంపై డాక్టర్ బోనిఫేస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీబీసీ కెమెరాకు చిక్కిన బోనిఫేస్ ఇగ్బెనెఘు ఎందుకు సస్పెండ్ చేశారు? 17 ఏళ్ల విద్యార్థిగా నటిస్తూ వెళ్లిన బీబీసీ మహిళా రిపోర్టర్‌కు ఆ అధ్యాపకుడు అనుచితమైన ప్రశ్నలు వేస్తూ, సెక్స్ కోసం ప్రతిపాదనలు చేయడం కెమెరాలో రికార్డయ్యింది. ఆ తర్వాత తలుపులు మూసేసిన తన కార్యాలయంలో ఆమెను శారీరకంగా వేధిస్తూ, ముద్దివ్వాలంటూ బలవంతం చేశారు. ఆ తర్వాత తనపట్ల 'విధేయత'తో ప్రవర్తించకుంటే మీ అమ్మకు చెబుతానంటూ ఆయన బెదిరించారు. అదంతా రహస్య కెమెరాలో నమోదైంది. ఆ అధ్యాపకుడి మీద చాలామంది విద్యార్థులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన వేధింపుల వల్ల తాను పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేయాల్సి వచ్చిందని ఆయన పూర్వ విద్యార్థి ఒకరు బీబీసీతో చెప్పారు (ఆమె వివరాలను గోప్యంగా ఉంచుతున్నాం). ఈ అధ్యాపకుడి వ్యవహారాన్ని బీబీసీ బహిర్గతం చేయడంతో యూనివర్సిటీ ఆఫ్ లాగోస్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. డాక్టర్ ఇగ్బెనెఘును తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని, క్యాంపస్‌లో అడుగుపెట్టకుండా అతని మీద నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. "ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ వేధింపుల ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, ఇలాంటివి మరోసారి జరగకుండా చూసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం" అని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన 'కోల్డ్ రూమ్'లో ఇక నుంచి సిబ్బంది ఎలాంటి కార్యకలాపాలు జరపకుండా దానిని మూసివేస్తున్నామని వెల్లడించింది. ఫోర్‌స్క్వేర్ చర్చిలో డాక్టర్ ఇగ్బెనెఘు పాస్టర్‌గా పనిచేస్తున్నారు. అతడు విధుల నుంచి వైదొలగాలని ఆ చర్చ్ నిర్వాహకులు ఆదేశించారు. ఆ వీడియోలో ఇంకా ఏముంది? మొత్తం గంట నిడివి ఉన్న ఆ వీడియో డాక్యుమెంటరీలో ఘనా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాన్స్‌ఫోర్డ్ గ్యాంపో, డాక్టర్ పాల్ క్వామే బుటాకోర్‌తో సంభాషణలు కూడా ఉన్నాయి. అయితే, బీబీసీ రహస్య ఆపరేషన్‌లో "మార్కుల కోసం సెక్స్" అడగలేదని ఆ ఇద్దరు ప్రొఫెసర్లు అన్నారు. ప్రొఫెసర్ గ్యాంపో మరో అడుగు ముందుకేసి, బీబీసీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు కూడా స్థానిక మీడియాతో చెప్పారు. బీబీసీ నివేదికలో పేర్కొన్న వ్యక్తులపై విచారణ జరుపుతామని, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ఘనా విశ్వవిద్యాలయం తెలిపింది. బోనిఫేస్ ఇగ్బెనెఘు కార్యాలయాన్ని మంగళవారం విశ్వవిద్యాలయం అధికారులు సీజ్ చేశారు స్పందన ఏమిటి? ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించి బీబీసీ విడుదల చేసిన వీడియోకు నైజీరియా, ఘనా దేశాలలో సోషల్ మీడియాలో పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఆ అధ్యాపకుల చర్యలను అనేక మంది ట్విట్టర్ వినియోగదారులు ఖండించారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు తమ సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. ఈ డాక్యుమెంటరీని ప్రపంచం ముందుంచిన జర్నలిస్ట్ కికి మోర్డి, విశ్వవిద్యాలయంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి తన స్వీయ అనుభవాన్ని కూడా వెల్లడించారు. వైద్య వృత్తిలోకి వెళ్లాలనుకున్న తన ఆశయాలను అర్ధంతరంగా వదులుకోవడానికి కారణం ఆ వేధింపులేనని ఆమె చెప్పారు. బీబీసీ నివేదిక వల్ల ప్రేరణ పొందిన పలువురు మహిళలు, తాము ఎదుర్కొన్న వేధింపుల అనుభవాలను బీబీసీతో పంచుకుంటున్నారు. "నేను అనేక బెదిరింపులను ఎదుర్కొన్నాను" అని నైజీరియాకు చెందిన ఒక గ్రాడ్యుయేట్ మంగళవారం బీబీసీ న్యూస్‌టుడేతో చెప్పారు. "నేను విశ్వవిద్యాలయంలో చేరక ముందే ఆ ప్రొఫెసర్ గురించి విన్నాను. ఆయన చేతిలో వేధింపులకు గురైన వారిలో నా స్నేహితులు కూడా ఉన్నారు" అని ఆమె వివరించారు. విద్యార్థులు అనేక వేధింపులను భరించాల్సి వస్తోందని ఆమె అన్నారు. ఘనా విశ్వవిద్యాలయంలో ఇలాంటి వేధింపులు సర్వసాధారణమని మరో మహిళ క్యాథెరిన్ చెప్పారు. మంచి ర్యాంకు (గ్రేడ్స్) రావాలంటే సెక్స్ చేయాలంటూ తనను అడిగినప్పుడు, తాను 'చిన్న అమ్మాయిలా' బోరున ఏడ్చానని ఆమె బీబీసీ ఔట్‌సైడ్ సోర్స్ కార్యక్రమంలో వెల్లడించారు. "దురదృష్టం కొద్ది ఇక్కడ సరైన వ్యవస్థలు లేదు. తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే, ఆధారాలు చూపించమని అడుగుతారు. మన దగ్గర ఆధారాలు ఉండవు కాబట్టి, మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీబీసీ అండర్‌కవర్ మహిళా రిపోర్టర్‌ను లైంగికంగా వేధిస్తూ రహస్య కెమెరాకు చిక్కిన అధ్యాపకుడిని నైజీరియాలోని లాగోస్ విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. text: బహా అబూ అల్-అటా బహా అబూ అల్-అటా అనే ఈ కమాండర్ ఇంటిపై ఇజ్రాయెల్ క్షిపణిని ప్రయోగించడంతో ఆయనతోపాటు భార్య చనిపోయారని పీఐజే తెలిపింది. అల్-అటా ఒక 'టైంబాంబు' అని, ఉగ్రవాద దాడులకు అతడు సన్నాహాలు చేస్తున్నాడని ఇజ్రాయెల్ చెప్పింది. గాజా నగరంలోని షెజాఇయా డిస్ట్రిక్ట్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో అల్-అటా దంపతులు నిద్రపోతుండగా ఇజ్రాయెల్ ఈ దాడి జరిపిందని పాలస్తీనాలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్-అటా దంపతుల పిల్లలు నలుగురు, ఒక పొరుగింటి వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. అల్-అటా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని పీఐజే ప్రకటించింది. అల్-అటా మృతి నేపథ్యంలో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడులు జరిగాయి. దాదాపు 50 రాకెట్లను ప్రయోగించారు. వీటిలో కొన్ని గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ నగరం సోడెరాట్‌ను తాకాయి. పీఐజేకు ఇరాన్ మద్దతు ఉంది. గాజాలో పీఐజే రెండో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ. ఇటీవలి నెలల్లో పీఐజే ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడులకు, చాలా రాకెట్ దాడులకు పాల్పడిందని, మరిన్ని ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం చెప్పింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో దాడి; ఇద్దరి మృతి అల్-అటా చనిపోయిన సమయంలోనే సిరియా రాజధాని డమాస్కస్‌లో పీఐజే మరో సీనియర్ నేత అక్రమ్ అల్-అజౌరీ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిందని సిరియా ప్రభుత్వ వార్తాసంస్థ సనా తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని, 10 మంది గాయపడ్డారని చెప్పింది. మృతుల్లో అల్-అజౌరీ ఉన్నాడా, లేదా అన్నది స్పష్టం కాలేదు. మృతుల్లో అతడి కొడుకు మోవజ్ ఉన్నాడని సిరియా వార్తాసంస్థ సనా పేర్కొంది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. పీఐజే కేంద్ర కార్యాలయం డమాస్కస్‌లో ఉంది. ఇది గాజా స్ట్రిప్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తుంది. ఖండించిన హమాస్ గాజా స్ట్రిప్‌ను నియంత్రించే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్'‌కు పీఐజేను ప్రత్యర్థిగా భావిస్తారు. అయితే అల్-అటాను చంపేయడాన్ని హమాస్ ఖండించింది. ఈ హత్యకు ఇజ్రాయెల్ శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించింది. గాజా స్ట్రిప్, డమాస్కస్‌లలో ఇజ్రాయెల్ దాడులు సోమవారం రాత్రి జరిగాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పెరిగిన ఉద్రిక్తతలను ఈ దాడులు సూచిస్తున్నాయి. మధ్యధరా సముద్రం, ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పున గాజాస్ట్రిప్‌ విస్తరించి ఉంది. ఇక్కడ సుమారు 19 లక్షల మంది నివసిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గాజా స్ట్రిప్‌లో 'పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్(పీఐజే)' అనే మిలిటెంట్ గ్రూప్ అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరిని వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది. text: భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు ఏప్రిల్ 4వ తేదీన మొదలైన కామన్వెల్త్ గేమ్స్ 15వ తేదీన ముగుస్తాయి. మొట్టమొదట ఈ క్రీడలను 1930లో కెనడాలోని హ్యామిల్టన్‌లో నిర్వహించారు. అప్పుడు మొత్తం 11 దేశాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. నాలుగేళ్ల కిందట 2014లో స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు. అప్పుడు 71 దేశాల నుంచి 4,500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా.. 17 రకాల ఆటల పోటీలు నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఆ క్రీడల్లో 71 దేశాల నుంచి 6,081 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 88 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న క్రీడల్లో 71 కామన్వెల్త్ దేశాల నుంచి 6,600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. 1938లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు.. 1930 నుంచి 1950 వరకూ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా వ్యవహరించే క్రీడల పేరును 1978 నుంచి కామన్వెల్త్ క్రీడలుగా మార్చారు అసలు ఈ కామన్వెల్త్ క్రీడలు ఏమిటి? నిజానికి ఈ క్రీడా పోటీలను మొదటి నుంచీ కామన్వెల్త్ గేమ్స్ అనేవారు కాదు. కామన్వెల్త్ దేశాల క్రీడాకారులు శాంతియుత, స్నేహపూర్వక క్రీడా పోటీల్లో పాల్గొనాలంటూ బ్రిటన్ రాణి సందేశంతో బ్యాటన్ కామన్వెల్త్ దేశాలన్నిటికీ ప్రయాణిస్తుంది కామన్వెల్త్ అంటే ఏమిటి? ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్‌కు వలసలుగా ఉన్న దేశాల సముదాయమే కామన్వెల్త్‌. అయితే.. పోర్చుగీసు వలస దేశంగా ఉండిన మొజాంబిక్ మాత్రం బ్రిటిష్ ఎంపైర్‌తో కానీ బ్రిటన్‌తో కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా 1995లో కామన్వెల్త్‌లో చేరింది. ప్రపంచ ప్రజల్లో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు కామన్వెల్త్ నివాసి. అన్ని మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల వారూ ఇందులో భాగంగా ఉన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఒకప్పుడు బ్రిటన్ పాలనలో వలస దేశాలుగా ఉండేవి. వాటన్నిటినీ కలిపి బ్రిటిష్ ఎంపైర్‌గా వ్యవహరించేవారు. కాలక్రమంలో ఆయా దేశాలన్నీ స్వతంత్ర దేశాలుగా మారటంతో ఆనాటి బ్రిటిష్ ఎంపైర్ అంతరించిపోయింది. ఆ దేశాలే ఇప్పుడు కామన్వెల్త్‌గా మారాయి. కామన్వెల్త్‌లో సభ్యులుగా ఉన్న 53 దేశాలు.. ప్రజాస్వామ్యం, లింగ సమానత్వం, అంతర్జాతీయ శాంతిభద్రతలు వంటి కొన్ని విలువలను పాటిస్తామని ప్రమాణం చేశాయి. ఈ క్రీడల్లో బ్రిటన్ రాణి సందేశం ఏమిటి? ఈ కామన్వెల్త్‌కు బ్రిటన్ రాణి అధినేత. అందుకే కామన్వెల్త్ క్రీడలను ఆమె అధికారికంగా ప్రారంభిస్తారు. కామన్వెల్త్ స్పోర్ట్స్ మొదలైనప్పటి నుంచీ.. 1942, 1946 ల్లో మినహా ప్రతి నాలుగేళ్లకోసారీ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆ రెండు సార్లు క్రీడలను నిర్వహించలేదు. ఈ క్రీడల ప్రారంభానికి ముందు.. క్వీన్స్ బ్యాటన్ (జ్యోతి) రిలే మొదలవుతుంది. కామన్వెల్త్ దేశాల క్రీడాకారులు శాంతియుత, స్నేహపూర్వక క్రీడా పోటీల్లో పాల్గొనాలంటూ బ్రిటన్ రాణి సందేశంతో ఆ బ్యాటన్ కామన్వెల్త్ దేశాలన్నిటికీ ప్రయాణిస్తుంది. ఆరంభ కార్యక్రమంలో బ్రిటన్ రాణి లేదా, ఆమె ప్రతినిధి ఆ సందేశాన్ని చదవటంతో క్రీడలు ప్రారంభమవుతాయి. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల జ్యోతి 2017 మార్చి 13న లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలస్‌ నుంచి ప్రయాణం ప్రారంభించింది. మొత్తం 388 రోజులు ప్రయాణించి 2018 ఏప్రిల్ 4వ తేదీన ఆస్ట్రేలియాలో క్రీడల ప్రారంభ కార్యక్రమానికి చేరుకుంది. బ్రిటన్ రాణి ప్రతినిధిగా హాజరైన ప్రిన్స్ చార్లెస్.. జ్యోతితో పాటు ఉన్న సందేశాన్ని వినిపించి క్రీడలను ప్రారంభించారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన దేశం ఆస్ట్రేలియా. ఆ దేశం 2014 వరకూ మొత్తం 852 బంగారు పతకాలు గెలుచుకుంది. 155 బంగారు పతకాలతో భారతదేశం నాలుగో స్థానంలో నిలిచింది. 2018 కామన్వెల్త్ క్రీడల కోసం 15,000 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నాలుగేళ్లకోసారి కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి. ఈసారి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇవి జరుగుతున్నాయి. text: ఇక్కడ రెండు దేశాల సైన్యం కాల్పుల మోత సర్వసాధారణం. దీంతో రెండు వైపులా ప్రజలు మృత్యువాత పడుతుంటారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు బాధితులైన వారిలో తాజాగా 63ఏళ్ల జహూర్ అహ్మద్ కూడా చేరారు. గత నెలలో ఆయన తన భార్యను పోగొట్టుకున్నారు. వారి ఇంటిపై మోర్టార్లతో దాడి జరగడంతో ఆమె కన్నుమూశారు. జహూర్ అహ్మద్ ''అక్కడ కనిపిస్తున్న ప్రాంతం పాకిస్తాన్‌ నియంత్రణలోని కశ్మీర్‌ది. ఆ ఊరి పేరు ఖ్వాజా బందీ. మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటాం''అని ఇంటి తలుపు దగ్గర నిలబడి ఎదురుగా కనిపిస్తున్న అటవీ ప్రాంతాన్ని చూపిస్తూ ఆయన చెప్పారు. కోళ్లకు తన భార్య మేత తినిపిస్తుండగా ఓ మోర్టారుతో దాడి జరిగిందని ఆయన వివరించారు. ''మేం ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. అయితే, అంతలోనే ఆమె చనిపోయింది''అని ఆయన వివరించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా కష్టమని ఆయన వివరించారు. ''ఇక్కడి నుంచి కిందకువెళ్తే ఉబడ్‌కాబడ్ పేరుతో 20 మైళ్లు పొడవైన రహదారి ఉంటుంది. దానిపై ఏ వాహనాలూ ప్రయాణించలేవు. దీంతో క్షతగాత్రులను దానిపై నుంచి తీసుకెళ్లడం అంత తేలికకాదు'' ''ఇక్కడ ఎప్పుడూ రోడ్డు వేయలేదు. ఇది కొండల మధ్య దారిలా ఉంటుంది. మంచంపై గాయపడినవారిని పడుకోబెట్టి.. అడవి గుండా మోసుకుంటూ తీసుకెళ్లాలి''. బంకర్ల నిర్మాణానికి ఆదేశాలు ఇక్కడ చాలా పెద్ద సైనిక శిబిరం ఉండేదని చురాందా గ్రామ వాసులు, పరిసరాల్లోని భట్‌గ్రాన్ ప్రాంత వాసులు తెలిపారు. ''పాకిస్తాన్ సైన్యం ఎప్పటి నుంచో ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఇక్కడ శిబిరం ఉందని భావిస్తూ వారు దాడులు చేస్తున్నారు. కానీ ఎప్పుడో భారత సైన్యం ఇక్కడి శిబిరాన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో అటువైపు నుంచి జరిపే కాల్పులకు మేం బాధితులుగా మారుతున్నాం''అని గ్రామానికి చెందిన సజ్జద్ హుస్సేన్ తెలిపారు. తాజాగా ఒక మహిళ మరణించడంతో సరిహద్దుకు పరిసరాల్లోని రెండు గ్రామాలవాసుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇదివరకు ఇక్కడి గ్రామవాసుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కొందరు వృద్ధులు ప్రభుత్వాన్ని కోరారు. మంజూర్ అహ్మద్ దీంతో స్థానిక ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామంలో బంకర్లు నిర్మించాలని ఆదేశాలు ఇచ్చింది. మంజూర్ అహ్మద్ ఒక స్థానిక కార్యకర్త. ఆయన డ్యూటీ మెజిస్ట్రేట్‌గానూ పనిచేస్తున్నారు. ''బంకర్లు నిర్మిస్తున్నారని తెలియగానే గ్రామ ప్రజలు చాలా సంతోషపడ్డారు. కానీ ఈ ప్రాజెక్టులో కొన్ని సమస్యలున్నాయి. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. మరోవైపు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి''అని ఆయన వివరించారు. ఇక్కడ కొన్నిచోట్ల బంకర్లు నిర్మిస్తున్నారు. అయితే పనులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. జావెద్ అహ్మద్ ఆలస్యం ఎందుకు? జహూర్ కుమారుడు జావెద్ అహ్మద్ సైన్యంలో పనిచేస్తున్నారు. ''ఇక్కడి సైన్యాధికారులు మాపై చాలా దయగా ఉంటారు. మాకు వారు రూ.50,000 ఇచ్చారు. మా ఇంటి బయట బంకర్ నిర్మాణం పని కూడా మొదలుపెట్టారు. అయితే పనికి చాలా సమయం పడుతోంది. ఏదేమైనా మాకు ప్రభుత్వం తక్షణమే సాయం చేయడంతో సంతోషంగా అనిపిస్తోంది''అని జావెద్ చెప్పారు. బంకర్ల నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోందని ఉరీ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ రియాజ్ మలిక్‌ను బీబీసీ ప్రశ్నించింది. అయితే ఇక్కడ బంకర్ల నిర్మాణం చాలా కష్టమని, అందుకే కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించడంలేదని ఆయన చెప్పారు. మరోవైపు రెండు వైపుల నుంచీ కాల్పుల ముప్పు ఈ గ్రామ వాసులకు ఉంటుందని అన్నారు. ''ప్రస్తుతం బంకర్ల నిర్మాణానికి స్థానికుల సాయం తీసుకుంటున్నాం. దీంతో పనులు జరుగుతున్నాయి''అని రియాజ్ వ్యాఖ్యానించారు. భయం గుప్పిట్లో మ్యాప్‌లో కనిపించేంత చిన్నగా ఈ నియంత్రణ రేఖ ఉండదు. దీని పొడవు 650 మైళ్లు. కొన్నిచోట్ల వెడల్పు 25 మైళ్ల వరకు ఉంటుంది. ఇక్కడ రెండు వైపులా ప్రజలు నివసిస్తుంటారు. వీరు ఎప్పుడూ భయం గుప్పిట్లోనే బతుకుతుంటారు. 2003లో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే ఇప్పటికీ ఇక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం మీరంటే మీరని రెండు దేశాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటుంటాయి. పాకిస్తాన్ సైన్యం పేల్చిన తూటా చూపిస్తున్న బాలిక (ఫైల్ ఫోటో) ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్ 3000 కంటే ఎక్కువసార్లే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించిందని భారత పార్లమెంటుకు కేంద్ర హోం మంత్రి తెలిపారు. పూంచ్, రాజౌరీ, సంబా, ఆర్‌ఎస్ పురా, కథువా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల వాసుల కోసం రెండేళ్ల క్రితమే బంకర్లు నిర్మించి ఇచ్చారు. బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ బంకర్లు నిర్మించేందుకు గత వేసవిలో పనులు మొదలుపెట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో ఒక గ్రామమైన చురాందాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం భారత్-పాకిస్తాన్‌ల మధ్యనుండే నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)కి అనుకొని కొండపై ఉంటుంది. text: తాజాగా రాజకీయ ప్రముఖులను కూడా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే కొందరు మంత్రులు క్వారంటైన్‌లోకి వెళ్లారు. కీలక నేతల సన్నిహితుల్లో పాజిటివ్ లక్షణాలు బయటపడడంతో కొంత కలవరపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాపిస్తున్న వైరస్ తాకిడికి తల్లడిల్లుతున్నారు. కోవిడ్ 19 కేసులు నమోదయిన తొలినాళ్లలోనే ఏపీలో కొందరు ఎమ్మెల్యేల ఇళ్లలో పాజటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చట్టసభల సభ్యుల్లో టీఆర్ఎస్‌కి చెందిన ఎమ్మెల్యేనే మొదటి పాజిటివ్ కేసు. ఆయనతో పాటుగా పలువురు కీలక నేతల సంబంధీకుల్లో పాజిటివ్ నమోదు కావడంతో అందరూ జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మంత్రి జాగ్రత్త పడాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతుండగా మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్, పేషీలోని అటెండర్ కూడా వైరస్ బారిన పడ్డారు. దాంతో మేయర్ కుటుంబ సభ్యులు కూడా హోం క్వారంటైన్ పాటిస్తున్నారు. కోవిడ్ 19 టెస్టులు నిర్వహించగా మొదట పాజిటివ్ అని భావించినప్పటికీ రెండోసారి టెస్ట్ చేసి నెగిటివ్ అని నిర్ధరించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యక్తిగత సహాయకుడు ఒకరు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో మంత్రితో పాటుగా మరో 16 మంది సిబ్బంది హోం క్వారంటైన్ పాటిస్తున్నారు. హరీష్ రావుకి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. జనగాం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనతో పాటు భార్య, గన్‌మేన్, వంట మనిషి, డ్రైవర్ కూడా వైరస్ పాజిటివ్ అని నిర్ధారించారు. హైదరాబాద్‌లో కుటుంబంతో నివసిస్తున్న ఎమ్మెల్యే ఇటీవల నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆయనకు వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే తో పాటుగా ఆయన భార్య కి కూడా హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది. దీంతో ఆయన కుటుంబీకులు, సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే కరోనా వైరస్ కారణంగా ప్రజా ప్రతినిధులు కలవరపడ్డారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడి కుటుంబంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఎమ్మెల్యే కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కర్నూలులో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే సమీప బంధువులకు కరోనా బారిన పడ్డారు. వారికి వైద్యం అందించే విషయంలో ఎమ్మెల్యే తీరుపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఒకేసారి ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అప్పట్లో ఎంపీ సోదరుడు, బంధువులుండడంతో ఎంపీ కూడా క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయనకు మాత్రం నెగిటివ్ గా పరీక్షల్లో తేలింది. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి సోదరుడు కరోనా బారిన పడ్డారు. వారి సమీప బంధువు కరోనాతో మరణించిన నేపథ్యంలో వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు. మంత్రికి కూడా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మత్రి ఆళ్ల నాని పేషీలో కూడా సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలింది. తర్వాత మంత్రి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు మాత్రం నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ కూడా సమీప వ్యక్తులు కరోనా బారిన పడడంతో క్వారంటైన్ పాటించాల్సి వచ్చింది. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నివాసం హైదరాబాద్ లో సెక్యూరిటీ విధులు నిర్వహించేందుకు వెళ్లిన బాపట్లకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కూడా తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఏపీ రాజ్ భవన్ లో ఆరుగురు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ సందర్భంగా గవర్నర్ కూడా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు మరణించిన తర్వాత కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా ఎమ్మెల్యే సిబ్బందిలో మరో ఏడుగురుకి పాజిటివ్ అని తేల్చారు. తనకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని ఎమ్మెల్యే ప్రకటించారు. అమరావతి అసెంబ్లీలో కరోనావైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేతల సమీప వ్యక్తులు కరోనాకి గురవుతున్న తరుణంలో నాయకులంతా మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏపీ అసెంబ్లీ అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఈనెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న తరుణంలో ఎమ్మెల్యేలు తమ సిబ్బందిని వెంట పెట్టుకురావద్దని ఆదేశాలు విధించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంటపెట్టుకుని అసెంబ్లీకి రావద్దని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి బాలకృష్ణాచార్యులు ఆదేశాలు విడుదల చేశారు. "కరోనా నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. భౌతికదూరం పాటించేందుకు ప్రత్యేక నిబంధనలు పెడుతున్నాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ వరకూ అనుమతి ఉంటుంది. ఎమ్మెల్యే తమ కార్లకు కారు పాస్‌ కచ్చితంగా అతికించాలి. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతి ఉండదు. గన్‌మేన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీకి విజిటర్లను అనుమతించడం లేదు. సభ్యులు తమ వెంట విజిటర్లను, సిబ్బందిలో పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను వెంట తీసుకురావొద్దని కూడా చెప్పాం. మీడియా పాయింట్ లో కార్యకలాపాలు ఉండవు. లాబీల్లోకి పాత్రికేయులకు అనుమతి లేదు" అని బీబీసీకి వివరించారు. ‘కేసులు పెరుగుతున్న తరుణంలో మరింత అప్రమత్తత’ కరోనా కేసుల సంఖ్య ఏపీలో స్థిరంగానే ఉందని, అయినా అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహార్ రెడ్డి సూచిస్తున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ "కరోనా టెస్టుల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాన్నిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దోహదపడుతున్నాయి. సగటున 10లక్షల మంది జనాభాకి చూస్తే దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది. కొత్త కేసులు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోంది. దానికి తగ్గట్టుగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజా ప్రతినిధులు వివిధ కార్యక్రమాల కోసం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తగిన రీతిలో వ్యవహరించాలి. సహజంగా వాతావరణం మారే సమయంలో కొన్ని రకాల ఫ్లూ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున అంతా అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. text: ప్రస్తుతం కమలం వికసిస్తోంది, కానీ దాన్ని పెంచిపోషించిన వాళ్ల రాజకీయ జీవితం మాత్రం ముగింపు దశకు చేరువైంది. ఎన్నికల్లో పార్టీకి కొత్త నాయకత్వం ఒకటి తర్వాత మరోటి వరుస విజయాలను తెచ్చిపెడుతోంది. అటల్ బిహారీ వాజ్‌పేయీ 2005 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా, బీజేపీలో రెండు తరాలకు మధ్య వారధిగా నిలిచిన వ్యక్తి ఆయనే. శారీరక వైకల్యంతో ఉన్నా ఇప్పటికీ పాత తరం నాయకుల్లో అత్యంత శక్తిమంతమైన నేత ఆయనే. జనతా పార్టీ నుంచి బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతాన్ని మార్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌)ను వాజ్‌పేయీ ఒప్పించారు. దాంతో కొత్తగా ఏర్పడిన బీజేపీ గాంధేయ వాదాన్ని ఎంచుకుంది. అలాగే, అప్పటి సంఘ్ సారధిగా ఉన్న సహబ్ దేవరాస్ ముందు వాజ్‌పేయీ మరో డిమాండ్ కూడా పెట్టారు. తమ సమితి 'హిందూ' అనే పదానికి బదులుగా ఇండియా వాడాలన్నది ఆ డిమాండ్. జన సంఘ్ నుంచి జనతా పార్టీ, ఆ తర్వాత బీజేపీ ఏర్పాటు వరకు తొలిసారిగా ఒక మౌలిక మార్పునకు అంగీకారం కుదిరింది. దాని ఫలితంగానే ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం లేని ఎం.సి. ఛాగ్లా, శాంతి భూషణ్, రామ్ జెఠ్మలానీ, సికందర్ భక్త్, సుష్మా స్వరాజ్, జశ్వంత్ సింగ్ లాంటి నేతలు బీజేపీలో భాగం అయ్యారు. అయితే, బీజేపీ పుట్టిన నాలుగు సంవత్సరాల్లోనే ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం 1984 డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీతో వెళ్లాలా? లేక హిందుత్వను ఎంచుకోవాలా? అని సంఘ్‌ డైలమాలో పడింది. చివరికి సంఘ్ హిందుత్వను ఎంచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఎన్నికల తర్వాత రెండేళ్లకు బీజేపీ మనసు మార్చుకుంది. మళ్లీ మితవాద మార్గాన్ని ఎంచుకుంది. 1986లో అత్యంత ప్రజాదరణ కలిగిన వాజ్‌పేయీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హిందుత్వ వాదాన్ని ఆలింగనం చేసుకుంది. వాజ్‌పేయీతో పోల్చితే అప్పటికి ఎల్‌కే అడ్వాణీ ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఏమీ కాదు. కానీ 1988లో ఆయోధ్య ఉద్యమంలో చేరేందుకు అంగీకరించడం, ఆ తర్వాత అయోధ్య రథ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం వల్ల ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల చూపు అడ్వాణీ వైపు మళ్లింది. దాంతో పార్టీలో వాజ్‌పేయీ ఏకాకిగా మారారు. అయితే, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద నిర్మాణం కూలిన తర్వాత సంఘ్ పరివార్, బీజేపీలకు మళ్లీ వాజ్‌పేయీ గుర్తుకొచ్చారు. అది కూడా తాత్కాలికమే. అప్పుడు ప్రధాని రేసులో అడ్వాణీ ఉన్నారు. కానీ, అడ్వాణీని అదృష్టం వరించలేదు. 1990 నాటి జైన్-హవాలా కేసుకు సంబంధించిన డైరీలో ఆయన పేరు ప్రత్యక్షమైంది. దాంతో పార్లమెంటు సభ్యత్వానికి అడ్వాణీ రాజీనామా చేశారు. ఆ కేసులో నిర్ధోషిగా బయటపడిన తర్వాతే పార్లమెంటులో అడుగుపెడతా అని శపథం చేశారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో పోటీపడలేనన్న విషయం అడ్వాణీకి తెలుసు. అందుకే బీజేపీ ప్రధాని అభ్యర్థి వాజ్‌పేయీ అని 1995 నవంబర్‌లో ముంబయిలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఇక ఆనాటి నుంచి అడ్వాణీకి ప్రధాని అవ్వాలన్న కల ఓ ఎండమావిగానే మిగిలిపోయింది. అడ్వాణీకి ప్రధాని పదవి రాలేదు. కానీ 2005లో పాకిస్తాన్ వెళ్లినప్పుడు చేసిన ప్రకటన ఆయన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. తర్వాత పార్టీ ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది, ఎందుకంటే మరో ప్రత్యామ్నాయం లేదు. 2009 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీని నిలబెట్టేందుకు నరేంద్ర మోదీ ఓకే చెప్పారు. గుజరాత్‌లో వచ్చిన ప్రభంజనంతో 2012లో మోదీ దిల్లీ ప్రచారం ప్రారంభమైంది. అయితే, మోదీని ప్రధాని అభ్యర్థిగా కాదు కదా, ఎన్నికల ప్రచార కమిటీకి అధ్యక్షుడిగా నియమించేందుకు కూడా అడ్వాణీ ఇష్టపడలేదు. బీజేపీలో బలమైన వ్యూహకర్తగా ఉన్న అడ్వాణీ, పార్టీలో అంతర్గతంగా మారుతున్న ఆలోచలను మాత్రం గుర్తించలేకపోయారు. పార్టీ లోపల, బయట మోదీకి మద్దతు ఉప్పెనలా ఎగిసిపడింది. అడ్వాణీకి ప్రధాని అభ్యర్థిగా నిలబడే అవకాశం దూరమైంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టారు. దాంతో బీజేపీలోని ముగ్గురు వస్తాదులు అటల్, అడ్వాణీ, మురళీ మనోహర్‌ల శకం ముగిసింది. ఇదీ బీజేపీలో మోదీ శకం. పార్టీ నాయకుడే కాదు, పార్టీ నిర్వహణ, ఎన్నికల్లో అనుసరించే విధానాలు, ప్రభుత్వాన్ని నడిపే తీరు, నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం.. ఇలా అన్ని విషయాల్లోనూ బీజేపీ రూపురేఖలు మారిపోయాయి. మీరు ఒకవేళ మోదీ వ్యతిరేకులు అయితే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను బలవంతంగానే అదృశ్యం చేశారని అనుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్‌పేయీ సరైన సమయంలోనే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉన్నా నేటికీ పార్టీకి రియల్ హీరో ఆయనే. ఆయన్ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో పోల్చవచ్చు. అలాగే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలు కపిల్‌దేవ్‌ లాంటివారు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్లంతా బలవంతంగా రిటైర్‌మెంట్ తీసుకున్నవారే. 2014 తర్వాత బీజేపీ మోదీ, షాల పార్టీ అయిపోయింది. ఏ నిర్ణయాన్నీ పార్టీ తీసుకోలేదు. అన్నీ నాయకుడే తీసుకుంటారు పార్టీలో అమలు చేస్తారు. దీన్ని కేంద్రీకృత అధికారంగా చెప్పొచ్చు. అయినా అది విజయవంతంగానే సాగుతోంది. ధిక్కార స్వరం వినిపించే సాహసం ఎవరూ చేయడంలేదు. నరేంద్ర మోదీ అన్న ఒక్క పేరు వల్లనే పార్టీకి ఓట్లు పడుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. తమ సీనియర్ల మాదిరిగా నిదానంగా వెళ్లడంపైన ఇప్పటి నాయకులకు నమ్మకం లేదు. కేవలం నాలుగేళ్లలోనే ఆరు రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాల్లో ఒంటరిగా లేదా పొత్తుతో అధికారం చేపట్టే స్థాయికి బీజేపీ చేరుకుంది. దీన్ని బహుశా పార్టీ వ్యవస్థాపకులు కలలో కూడా ఊహించి ఉండరు. ఇంత ఎత్తుకు చేరుకోవడం సులువేం కాదు, అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. 2019 ఎన్నికల్లో ఆ స్థానం పదిలంగా ఉంటుందా? లేదా అన్నది ముందున్న సవాల్. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 'అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది.' ఇవి 37 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రసంగంలోని మాటలు. text: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారత రాజ్యాంగ నిర్మాత పేరు.. డా.బాబాసాహెబ్ రామ్‌జీ అంబేడ్కర్ అని పేర్కొన్న బీజేపీకి, కర్నాటకలో ఆయన పేరులోని 'రామ్ జీ' అవసరం లేకుండా పోయింది! అంబేడ్కర్ 127వ జయంతి రోజున కర్నాటక వార్తా పత్రికల్లో ఆయన గురించిన ప్రకటనలు చాలా కనిపించాయి. బీజేపీ ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో.. రాజ్యాంగ నిర్మాతను కేవలం భారతరత్న డా. బాబాసాహబ్ అంబేడ్కర్ అని మాత్రమే రాశారు. ఆ ప్రకటనల్లో.. ప్రజాస్వామ్యం గురించిన అంబేడ్కర్ వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. జయంతిని పురస్కరించుకుని, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప దళితులతో కలిసి భోంచేస్తారని పేర్కొన్నారు. గతంలో యడ్యూరప్ప.. దళితుల ఇంటికి వెళ్లి, ఆ దళితుల వంట తినకుండా, తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భోజనం తిన్నారన్న మచ్చను తొలగించుకోవడానికి ఇలా బహిరంగ ప్రకటన చేసుండొచ్చు. హెగ్డే వ్యాఖ్యల దుమారం.. కర్నాటకలో చాలా మంది దళితులు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. 'రాజ్యాంగాన్ని మార్చడం కోసమే బీజేపీ అధికారంలోకి వచ్చింది' అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలే అందుకు ప్రధాన కారణం. ఈ వ్యాఖ్యలు.. దళితుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అనుమానాలు రేకెత్తించాయని చెప్పవచ్చు! అంబేడ్కర్ జయంతి సందర్భంగా యడ్యూరప్ప దళితులను కలిసినపుడు.. హెగ్డే వ్యాఖ్యల పట్ల తమ బాధను, కోపాన్ని బాహాటంగానే వ్యక్తపరచారు. అయితే, తన వ్యాఖ్యల పట్ల హెగ్డే క్షమాపణలు కోరినట్లు యడ్యూరప్ప సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. గత నెలలో అమిత్ షా మైసూరులో దళిత సంఘాలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో.. హెగ్డే వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. హెగ్డే క్షమాపణల గురించి అమిత్ షా ప్రస్తావించినా, వారి ఆగ్రహం చల్లారలేదు. హెగ్డేను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ.. గట్టిగా కేకలు వేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. అయితే.. కేవలం హెగ్డే వ్యాఖ్యలు మాత్రమే దళితుల ఆగ్రహానికి కారణం కాదు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు, భీమ్ కోరేగావ్ దాడులు, ఉనా దాడి ఘటనలు దళితుల ఆగ్రహాన్ని చల్లారనివ్వడం లేదు. ''దళిత వర్గానికి రాజకీయంగా పదవులు రావడం లేదు. దీంతో.. బీజేపీ తమ వర్గానికి వ్యతిరేకం అన్న భావన వారిలో నాటుకుపోయింది'' అని భారిపా (భారతీయ రిపబ్లికన్ పక్ష్) బహుజన్ మహాసంఘ్‌కి చెందిన అంకుశ్ గోఖలే బీబీసీతో అన్నారు. 2008 ఎన్నికల వ్యూహం మళ్లీ ఫలిస్తుందా? కర్నాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గడ్డుకాలం పొంచివుందన్న అనుమానాలు లేకపోలేదు. కానీ 2008 ఎన్నికల్లో దళితుల ఓట్లు సంపాదించడంలో యడ్యూరప్ప వ్యూహం అద్భుతంగా పని చేసింది. కర్నాటక దళితులను రెండు వర్గాలుగా విభజిస్తే.. అందులో రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గం 2008 ఎన్నికల్లో యడ్యూరప్పకు సానుకూలంగా పని చేసింది. విద్యారంగంలో, రాజకీయంగా, సామాజికంగా ముందంజలో ఉన్న మరో దళిత వర్గానికి కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చెందుతారు. 2008 ఎన్నికల్లో నిలబడిన 'వెనుకబడిన దళిత వర్గం' అభ్యర్థులకు లింగాయత్‌లు మద్దతు ఉంటుందని, బీజేపీ తరఫున ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసే లింగాయత్ అభ్యర్థులకు ఈ వర్గం దళితులు మద్దతు ఇవ్వాలని యడ్యూరప్ప, సదరు వర్గం దళితులు ఒప్పందం చేసుకున్నారు. కానీ.. 2008లో యడ్యూరప్పకు సానుకూలంగా ఉన్న ఈ దళిత వర్గం ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది. ''హెగ్డే ఆ వ్యాఖ్యలు చేసి నెలలు గడుస్తోంది. కానీ.. దళితుల్లో ఆగ్రహం చల్లారడం లేదు. రాజ్యాంగంలోని రిజర్వేషన్లను మార్చడం ఎవ్వరికీ సాధ్యపడదని నచ్చజెప్పినా వారు నమ్మడం లేదు'' అని తన పేరు ప్రస్తావించడానికి అనుమతించని ఓ బీజేపీ సీనియర్ నేత చెప్పారు. ''ఎన్నికల్లో పోటీ చేయడానికి రెండు దళిత కులాలకు బీజేపీ ప్రాతినిధ్యం కల్పించింది. కానీ ఈ వర్గంలో కూడా ప్రస్తుతం బీజేపీ పట్ల వ్యతిరేకత కన్పిస్తోంది. గతంలో యడ్యూరప్పకు అనుకూలంగా ఉన్న వెనుకబడిన దళిత వర్గం జనాభా.. రెండో వర్గం కంటే ఎక్కువ. ఈ వెనుకబడిన వర్గంలోని దాదాపు 60-80 శాతం బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు సానుకూలంగా పని చేసే వాతావరణం కనిపిస్తోంది'' అని దళిత రచయిత గురుప్రసాద్ కెరేగౌడ అన్నారు. దళితుల్లో రిజర్వేషన్‌పై సదాశివ కమిషన్ ఏం చెబుతుంది? దళితుల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం.. సదాశివ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదికను ఇంకా విడుదల చేయలేదు. కానీ.. దళితుల్లో వెనుకబడిన వర్గాలకు 6 శాతం రిజర్వేషన్, మరో వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు ఉండాలని కమిషన్ నివేదికలో ప్రధానాంశంగా కనిపిస్తోంది. కమిషన్ నివేదిక సారాంశంపై కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడింది. ఎన్నికల సందర్భంలో ఈ నివేదిక గురించి మాట్లాడితే.. కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా ఉన్న అభివృద్ధి చెందిన దళితులకు తక్కువ శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సివస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండి పడే అవకాశాలు ఎక్కువ. అందుకే.. తెలివిగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ కమిషన్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. ''కాంగ్రెస్ పట్ల కూడా దళితుల్లో అసంతృప్తి లేకపోలేదు. కానీ దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల పట్ల, రాజ్యాంగంలో మార్పులు చేస్తారన్న అనుమానాల పట్ల దళిత యువకులు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణాలతో.. బీజేపీ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది'' అని దళిత సంఘర్షణ సమితికి చెందిన మావల్లి శంకర్ అన్నారు. అయితే.. రాష్ట్రంలోని 36 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నదే ఎన్నికల్లో కీలకాంశం అవుతుంది. ''కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలపైనా ప్రజల్లో అసంతృప్తి ఉంది. కానీ ఎన్నికల్లో.. వెనుకబడిన దళితులకు ఏ పార్టీ ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తుందో అన్నదే ప్రధానం'' అని మాదిగ ఆరక్షన్ పోరాట సమితికి చెందిన మాపన్న అద్నూర్ అన్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కర్నాటకలో తిరిగి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా.. దళిత వర్గాన్ని కౌగిలించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. text: బుధవారం మీడియాతో మాట్లాడిన డబ్ల్యుహెచ్ఓ అత్యవసర పరిస్థితుల డైరెక్టర్ డాక్టర్ మైక్ రియాన్ వైరస్ ఎప్పుడు అంతమవుతుందో ఊహించడానికి చేస్తున్న ప్రయత్నాలను హెచ్చరించారు. “వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ, ఈ వైరస్‌ను అదుపు చేయడానికి ఒక ‘భారీ ప్రయత్నం’ అవసరమవుతుంది’’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల దాదాపు 3 లక్షల మంది చనిపోగా.. 43 లక్షల 45 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. “కరోనా మన సమాజాల్లో మరో అంటువ్యాధి వైరస్‌గా మారవచ్చు. ఇది ఎప్పటికీ మనకు దూరం కాకపోవచ్చు అనేది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం” అని డాక్టర్ రియాన్ జెనీవా నుంచి ఇచ్చిన వర్చువల్ మీడియా సమావేశంలో చెప్పారు. “హెచ్ఐవీ పోలేదు, కానీ మనమే ఆ వైరస్‌తో కలిసిపోయాం. ఈ వ్యాధి ఎప్పుడు అంతమవుతుందో ఎవరైనా ఊహించగలరని నాకు అనిపించడం లేదు” అని డాక్టర్ రియాన్ అన్నారు. ప్రస్తుతం దీనికోసం 100కు పైగా టీకాలను తయారు చేసే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కానీ తట్టు లాంటి కొన్ని ఇతర వ్యాధులకు టీకాలు కనిపెట్టినా, వాటిని అంతం చేయలేకపోయామని డాక్టర్ రియాన్ చెప్పారు. డబ్ల్యుహెచ్ఓ చీఫ్ ఆ రెండూ ప్రమాదమే గట్టి ప్రయత్నాలతో వైరస్‌ను అదుపు చేసే అవకాశం ఇప్పటికీ ఉందని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ బలంగా చెబుతున్నారు. “ఆ మార్గం మన చేతుల్లో ఉంది. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ మహమ్మారిని అడ్డుకోడానికి మనమంతా కలిసి భాగస్వామ్యం అందించాలి” అని ఆయన అన్నారు. డబ్ల్యుహెచ్ఓ ఎపిడమాలజిస్ట్ మరియా వాన్ కెర్‌ఖోవ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. “ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానికి మనకు కొంతకాలం పడుతుందనే మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవాలి” అన్నారు. లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేస్తూ, తమ ఆర్థికవ్యవస్థలను ఎప్పుడు, ఎలా తెరవాలి అనేదానిపై ఆయా దేశాధినేతలు ఆలోచిస్తున్న సమయంలో డబ్ల్యుహెచ్ఓ ఈ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్లను చూడకుండానే ఆంక్షలను సడలించేలా భరోసా అందించే మార్గం ఏదీ లేదని డాక్టర్ ట్రెడో హెచ్చరించారు. “చాలా దేశాలు రకరకాల చర్యల నుంచి బయటపడాలని చూస్తున్నాయి. కానీ ఏ దేశం అయినా వీలైనంత ఎక్కువ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేం ఇప్పటికీ సిఫార్సు చేస్తున్నాం” అని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ చెప్పారు. “లాక్‌డౌన్ చాలా చక్కగా పనిచేసిందని, ఇక దానిని ఎత్తివేస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. ఆ రెండూ ప్రమాదాలతో కూడినవే” అని డాక్టర్ రియాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ ‘ఎప్పటికీ పోకపోవచ్చు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) హెచ్చరించింది. text: ‘‘ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న 9,69,047 లక్షల మంది దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నందు వల్లే జనవరి నుంచి ఏప్రిల్ వరకు డేటా ఉచితంగా ఇస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. తమిళనాడులోని విద్యార్థులకు తమిళనాడు ఎలక్రానిక్స్ కార్పొరేషన్ ద్వారా డేటా కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఉచిత డేటాను ఉపయోగించాలని ఆయన విద్యార్థులను కోరారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు కూడా ఇస్తోంది’’ అని ఆ కథనంలో రాశారు. కరోనావైరస్: నేడు హైదరాబాద్‌కు రాబోతున్న 6.5 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సీన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సీన్‌ సోమవారం హైదరాబాద్‌కు చేరుకోనుందని నమస్తే తెలంగాణ తెలిపింది. ‘‘పుణె నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి వ్యాక్సీన్ చేరుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో 6.5 లక్షల డోసుల వ్యాక్సీన్‌ వస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. తొలిరోజు మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న 99 ప్రభుత్వ, 40 ప్రైవేటు కేంద్రాల్లో టీకా వేయనున్నారు. మరోవైపు, ఇతర రాష్ర్టాలు కూడా వ్యాక్సినేషన్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. టీకా పంపిణీకి దేశం సన్నద్ధమవుతున్న వేళ మహారాష్ట్రలో దక్షిణాఫ్రికా రకానికి చెందిన కరోనా మ్యుటేషన్‌ వెలుగుచూడటం కలవరపెడుతున్నది. బ్రిటన్‌ రకం కంటే ఇది ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సీన్‌ రవాణా, భద్రపరచడంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గన్నవరంలోని రాష్ట్రస్థాయి వ్యాక్సీన్‌ స్టోరేజ్‌ పాయింట్‌లో 15 లక్షల డోసులు నిల్వచేసే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు. గన్నవరం కేంద్రం నుంచి నాలుగు రీజనల్‌ సెంటర్లు (కర్నూలు, కడప, గుంటూరు, విశాఖ), జిల్లాలకు వ్యాక్సీన్‌ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. గన్నవరంలోని స్టోరేజ్‌ పాయింట్‌లో ఏర్పాట్లను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం పరిశీలించారు. వ్యాక్సీన్‌ రవాణాకు 19 ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేశారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సును ఛేజ్ చేసిన మంత్రి కర్ణాటకలో విద్యా శాఖ మంత్రి తన కారుతో ఆర్‌టీసీ బస్సును వెంబడించిన ఘటన చోటుచేసుకుందని ఆంధ్రజ్యోతి తెలిపింది. ‘‘ఆఫ్‌లైన్ క్లాసులు మొదలవడంతో కర్ణాటకలో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. అయితే.. కొన్ని రూట్లలో కేఎస్‌ఆర్టీసీ బస్సులు విద్యార్థులు వేచి చూస్తూ కనిపిస్తున్నప్పటికీ ఆగకుండా వెళ్లిపోతున్నాయి. దీంతో.. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం సవాల్‌గా మారింది. అధికారులకు విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలోనే.. కర్ణాటక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ శనివారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి తుమకూరు వెళుతున్నారు. కారులో వెళుతుండగా కొరటగెరె దగ్గర కొందరు విద్యార్థులు బస్టాప్ దగ్గర నిల్చుని ఉండటాన్ని మంత్రి గమనించారు. అప్పుడే మంత్రి కారును దాటుకుంటూ ఓ ఆర్టీసీ బస్సు అటుగా వెళ్లింది. ఆ విద్యార్థులు బస్సును ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన మంత్రి సురేష్ ఆ బస్సును వెంబడించాలని కారు డ్రైవర్‌కు సూచించారు. కారుతో బస్సును ఛేజ్ చేసిన మంత్రి ఆ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై, కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్య ధోరణిపై ఇద్దరికీ క్లాస్ పీకారు. వివరణ అడగడం మాత్రమే కాదు.. స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కోసం తప్పనిసరిగా బస్సును ఆపాలని ఆదేశించారు’’ అని ఆ కథనంలో తెలిపారు. సీనియర్ పాత్రికేయుడు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత సీనియర్ పాత్రికేయులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(87) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారని ఈనాడు తెలిపింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా 12.30 గంటలకు గుండెపోటు రావడంతో తుర్లపాటి కన్నుమూశారు. కుటుంబరావు 1933 ఆగస్టు 10న విజయవాడలో సుందర రామానుజరావు, శేషమాంబ దంపతులకు జన్మించారు. తన 14వ ఏట 1946లో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి తనదైన ముద్రవేశారు. ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగానూ పనిచేశారు. తుర్లపాటి కుటుంబరావుకు పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరు గడించారు. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించింది. 1951లో ఆచార్య ఎన్‌జీ రంగారావు వాహిని పత్రికలో మొదటిసారిగా కుటుంబరావు ఉప సంపాదకుడిగా పనిచేశారు. అనంతరం చలసాని రామారాయ్‌ ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తమిళనాడులో కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని వెలుగు దినపత్రిక వెల్లడించింది. text: రెక్స్ టిల్లర్‌సన్ ‘వ్యూహాత్మక బంధం’లో భారత్‌ను ఒక భాగస్వామిగా ఆయన పేర్కొన్నారు. భారత్-అమెరికా బంధాన్ని ప్రస్తావిస్తూ, ఈ స్థాయి సంబంధాన్ని తాము చైనాతో ఎన్నటికీ ఏర్పరచుకోమని, ఎందుకంటే చైనా ప్రజాస్వామిక సమాజం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ఒప్పందాలను చైనా తోసిరాజంటోందని ఆయన విమర్శించారు. దక్షిణ చైనా సముద్రం వివాదాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. వచ్చే వారం ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం వాషింగ్టన్‌లో మేధో సంస్థ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో జరిగిన ఓ కార్యక్రమంలో టిల్లర్‌సన్ ప్రసంగించారు. చైనాతో అమెరికా నిర్మాణాత్మక సంబంధాలను కోరుకొంటోందని ఆయన తెలిపారు. అయితే పొరుగు దేశాల సార్వభౌమత్వానికి, అమెరికాతోపాటు అమెరికా మిత్రపక్షాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా చైనా వ్యవహరిస్తే స్పందించకుండా ఉండలేమని స్పష్టం చేశారు. అమెరికా, భారత్ అంతర్జాతీయ భాగస్వాములని టిల్లర్‌సన్ చెప్పారు. ప్రజాస్వామిక విలువల్లోనే కాదు, భవిష్యత్తు పట్ల విజన్‌లోనూ రెండు దేశాల మధ్య సారూప్యం ఉందని తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా మరింత కీలక పాత్ర పోషించాలనుకొంటోందని చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంకేతాలు పంపిన తర్వాత కొన్ని గంటలకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని టిల్లర్‌సన్ విమర్శించారు. అమెరికా, భారత్ గౌరవించే అంతర్జాతీయ చట్టాలను ఈ చర్యలతో చైనా సవాలు చేస్తోందని ఆరోపించారు. భారత్‌తోపాటు పురోగతిని సాధిస్తున్న చైనా, వివిధ అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదని విమర్శించారు. ఆసియాలో భద్రత విషయంలో భారత్ మరింత కీలక భూమిక పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర దేశాలకు వాటి సార్వభౌమత్వం, ఇతర ప్రయోజనాల పరిరక్షణలో, ఆర్థికాభివృద్ధిలో అమెరికా, భారత్ తోడ్పాటు అందించాలని చెప్పారు. ఆధిపత్య వైఖరి ప్రదర్శించం: చైనా టిల్లర్‌సన్ వ్యాఖ్యల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా ఎన్నటికీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించబోదని, రాజ్య విస్తరణకు పాల్పడబోదని, ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలనుకోదని రాయబార కార్యాలయం చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబరులో చైనా సహా పలు ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనుకొంటున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ చెప్పారు. text: నిధులు లేక నిర్మాణం చివరి దశలో నిలిచిపోయిన నాన్-ఎన్‌పీఏ, నాన్-ఎన్‌సీఎల్‌టీ ప్రాజెక్టులను పూర్తిచేయటానికి అవసరమైన నిధులను అందించటానికి ఈ స్పెషల్ విండో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులో ఉండే మధ్య ఆదాయ కేటగిరీ ప్రాజెక్టులు అయి ఉండాలన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు సుమారు 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకూ ఉన్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్మల బదులిచ్చారు. భారత ఆర్థికాభివృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గి 5 శాతంగా నమోదైంది. మందకొడిగా సాగుతున్న వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. బ్యాంకుల విలీనం, ఫారిన్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, దేశీయ పెట్టుబడిదారుల మీద అధిక సర్‌చార్జీని ఉపసంహరించటం, ఆటో రంగానికి పునరుద్ధరణ ప్యాకేజీ వంటి చర్యలు అందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి శనివారం దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... ''ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వార్షిక స్థిర పెట్టుబడి రేటు పెరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం కన్నా తక్కువగానే నిలువరించాం. ఒక ఆర్థిక వ్యవస్థ ఎంత బాగుందనే దానికి ఇది ముఖ్యమైన సూచిక. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుతం చాలా బలంగా ఉన్నాయి. అవి పుంజుకుంటున్న సంకేతాలూ ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు ఆగస్టు చివర్లో బాగా పెరిగాయి. ఆగస్టులో ప్రకటించిన చర్యల్లో.. బ్యాంకులకు పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకం వల్ల ఇప్పటివరకూ ఏడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీలకు) ప్రయోజనం చేకూరింది. బ్యాంకులు పన్ను రేట్లు తగ్గింపులను బదలాయిస్తున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమై ఈ బదిలీని సమీక్షిస్తాను. గృహ నిర్మాణం, ఎగుమతుల రంగాలకు సంబంధించి జాతీయ స్థాయి సంప్రదింపుల ద్వారా రూపొందించిన కొన్ని చర్యలను ఇప్పుడు ప్రకటిస్తున్నాం. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్ట్ ప్రొడక్ట్స్ (ఆర్ఓడీటీఈపీ) కొత్త పథకం. 2020 జనవరి నాటికి.. మర్కండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎంఈఐఎస్) పూర్తిగా రద్దయి దాని స్థానంలో ఈ కొత్త పథకం అమలవుతుంది. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్.. ఈసీఐఎస్ పరిధిని విస్తరిస్తుంది. ఎగుమతులకు వర్కింగ్ క్యాపిటల్ అందించే బ్యాంకులకు అధిక బీమా కవర్ అందిస్తుంది. ఈ చర్య వల్ల ప్రభుత్వానికి ఏటా రూ. 1,700 కోట్లు వ్యయమవుతుందని అంచనా. పన్ను అసెస్‌మెంట్‌లో మానవ జోక్యాన్ని తొలగించాం. ఇదిక పూర్తిగా ఆటోమేటెడ్‌గా జరుగుతుంది. అసెస్‌మెంట్ యూనిట్ గోప్యంగా ఉంటుంది. దుబాయ్‌లో నిర్వహిస్తున్నట్లుగా భారతదేశం కూడా ఏటా మెగా షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంది. 2020 మార్చిలో దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తాం. ఇది పర్యాటకం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎగుమతి రంగాలకు ప్రయజనం కలిగిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించుకోవటం ద్వారా.. ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించటానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో టర్న్ అరౌండ్ సమయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించటానికి కార్యాచరణ ప్రణాళికను 2019 డిసెంబర్ నాటికి అమలు చేస్తాం. దీనిని మంత్రుల బృందం పర్యవేక్షిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏల) విషయంలో వాణిజ్య విభాగానికి చెందిన సీనియర్ అధికారి సారథ్యంలో ఎఫ్‌టీఏ యుటిలైజేషన్ మిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఎఫ్‌టీఏలోని రాయితీ టారిఫ్‌లను వినియోగించుకోవటానికి ఈ మిషన్, ఎఫ్ఐఈఓ ఎగుమతుల సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ప్రాధాన్య రంగమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తోడ్పాటునివ్వటం కోసం.. ఎగుమతులకు రుణాల లభ్యత అధికంగా అందుబాటులో ఉండటానికి వీలుగా అదనంగా 36,000 కోట్ల నుంచి 68,000 కోట్లు విడుదల చేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద అర్హులైన గృహ కొనుగోలుదారులకు.. ఈసీబీ (బాహ్య వాణిజ్య రుణాలు) మార్గదర్శకాలను సడలిస్తాం. నిధులు లేక చివరి దశలో ఆగిపోయిన అఫర్డబుల్, మిడిల్ ఇన్‌కమ్ ప్రాజెక్టులను పూర్తిచేయటానికి అవసరమైన నిధులను అందించటానికి రూ. 10,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రభుత్వంతో పాటు, బయటి పెట్టుబడిదారులు కూడా నిధులు సమకూరుస్తారు.'' ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందులో భాగంగా... దేశవ్యాప్తంగా స్తంభించిపోయిన గృహ నిర్మాణ రంగానికి చేయూత ఇచ్చేందుకు రూ. 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. text: రాజకీయ ప్రకటనలపై పారదర్శకంగా ఉండాలని సోషల్ మీడియా దిగ్గజాలపై ఒత్తిడి పెరుగుతోంది రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు ఇకపై తమ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రకటనకు డబ్బులెవరిచ్చారో యాడ్‌లో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. వ్యక్తుల వివరాలు, ప్రాంతం వంటి వివరాలు తప్పనిసరి చేయబోతున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా 'పెయిడ్ ఫర్ బై' అనే ఆప్షన్ యాడ్ చేయబోతోంది. రష్యా మద్దతిచ్చిన కొన్ని సంస్థలు సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రకటనలు పారదర్శకంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఫేస్‌బుక్, ఇతర ఇంటర్నెట్ సంస్థలు మంగళవారం అమెరికా సెనెట్ ముందు వివరణ ఇవ్వబోతున్నాయి. మా ఇతర కథనాలు: 'ప్రకటన ఇస్తున్న వారెవరో ప్రజలకు తెలియాలి. ముఖ్యంగా రాజకీయ ప్రకటనలు ఎవరిస్తున్నారో వారికి చెప్పాలి' అని ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు రాబ్ గోల్డ్‌మెన్ బ్లాగ్‌లో అభిప్రాయపడ్డారు. 'పెయిడ్ ఫర్ బై' పై క్లిక్ చేస్తే ఆ ప్రకటన ఇచ్చినవారి పూర్తి వివరాలు వస్తాయి. అన్ని ప్రకటనల్లో పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్నట్లు ఫేస్‌బుక్ చెబుతోంది. 2018 నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరిగే కెనడాలో 'పెయిడ్ ఫర్ బై'ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ప్రకటనలకు సంబంధించి స్వీయ నియంత్రణ పాటించాలని సోషల్ మీడియా దిగ్గజాలు భావిస్తున్నాయి. ఫేస్‌బుక్‌లాగే ట్విటర్‌ కూడా ఇలాంటి చర్యలే చేపడుతోంది. రాజకీయ ప్రకటనలపై 'లేబుల్' వేయడంతో పాటు, నిధులిచ్చినవారి మరిన్ని వివరాలు పొందుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యాతో కలిసి ఎలాంటి కుట్రా చేయలేదని ట్రంప్ చెబుతున్నారు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాయని రష్యాకు చెందిన 'ఆర్‌టీ' (రష్యా టుడే), 'స్ఫుత్నిక్' మీడియా సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకటనలు కొనుగోలు చేయకుండా ట్విటర్ ఆ రెండు సంస్థలపై నిషేధం విధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలను రష్యా ఖండించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది. అయితే, నాటి ఎన్నికలకు సంబంధించి రష్యాతో కలిసి ఎలాంటి కుట్రా పన్నలేదని ట్రంప్ చెబుతున్నారు. రష్యా- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు మధ్య సంబంధాలపై విచారణ సాగుతోంది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాజకీయ ప్రకటనలు ఎవరు ఇస్తున్నారో ఇకపై తెలిసిపోతుంది. ఈ దిశగా ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ఇస్తున్న వారి వివరాలను వెల్లడిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ విషయంలో మరింత పారదర్శకంగా ఉంటామని చెప్పింది. text: ఈ బంగ్లాలోనే అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివసించేవారు. ఆరోజు ఉదయం ఆయన కొంతమంది పెద్ద అధికారులను తన బంగ్లాకు పిలిపించినట్లు సమాచారం. సీఎం ఆదేశం మేరకు ఒక్కొక్కటిగా తెల్ల అంబాసిడర్ కార్లు అనేకం అక్కడికి వచ్చాయి. కొద్దిసేపటి తర్వాత, పట్నాలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న డీఐజీ రామేశ్వర్ ఓరాన్, సీనియర్ ఐఏఎస్ రాజ్‌కుమార్ సింగ్ (అప్పటి రిజిస్ట్రార్-కోఆపరేటివ్)లను కూడా పిలిపించారు. లాలూ యాదవ్ వయసు అప్పుడు 42 ఏళ్లు. ఏడు నెలల కిందటే ఆయన బిహార్‌ అధికారపగ్గాలు చేపట్టారు. అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నారు. కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది. ఆ సమయంలో ఎల్‌కే అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా, అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. సోమనాథ్ నుంచి అయోధ్యకు అద్వానీ రథయాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 25న మొదలైన ఈ యాత్ర అదే నెల 30న అయోధ్యకు చేరుకోవలసి ఉంది. అయితే, ఈ రథయాత్రను ఆపాలని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళిక వేశారు. ఇందుకోసమే ఆయన పట్నాలోని అన్నే రోడ్ నివాసంలో ఉన్న బంగ్లాలో ఉన్నత స్థాయి సమావేశం పెట్టారు. రామేశ్వర్ ఒరాన్, ఆర్.కె. సింగ్లాను తన నివాసానికి పిలిపించారు. రామేశ్వర్ ఓరాన్ ఇప్పటికీ ఆ ఘటన మరిచిపోలేదు, దాన్ని ఆయన బీబీసీతో గుర్తు చేసుకున్నారు. అద్వానీని మసంజోర్ గెస్ట్ హౌస్ వద్ద అరెస్టు చేశారు. ఆయన ఏం చెప్పారంటే... అద్వానీని అరెస్టు చేస్తారా అని ముఖ్యమంత్రి నన్ను అడిగారు. నేను వెంటనే అంగీకరించాను. అప్పుడు ఆయన చమత్కారంగా 'ఓరాన్ సాహెబ్, ఆయనను అరెస్టు చేస్తే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు. అయినా చేస్తారా' అని ప్రశ్నించారు. అప్పుడు నేను పోలీసు యూనిఫాం ధరించిన రోజే నాపై పువ్వులు కాదు, రాళ్లు పడతాయని తెలుసు సర్ అని బదులిచ్చాను. ఆయనకు నేను ఇవేమీ పట్టించుకోనని అర్థమైంది. అరెస్టు చేయడానికి మేజిస్ట్రేట్ కూడా అవసరమని చెప్పాను. అప్పుడు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ముకుంద్ బాబు ఆ బాధ్యతను ఆర్కే సింగ్‌కు అప్పగించారు. మాకు ఆయన ప్రణాళిక మొత్తం వివరించారు. ఈ పని హింస తలెత్తకుండా చేయాలని చెప్పారు. సమస్తిపూర్‌లో అద్వానీని అరెస్టు చేసిన తరువాత ఆయనను దుమ్‌కాకు, అక్కడి నుంచి మసంజోర్‌కు తీసుకెళ్లాలని మాకు ఆదేశాలొచ్చాయి. మా ప్రణాళికను గోప్యంగా ఉంచారు. ఈ ఆపరేషన్ కోసం ఎంపికైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఇచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ హెలికాప్టర్‌లో బయలుదేరిన మేము (రామేశ్వర్ ఓరాన్, ఆర్.కె. సింగ్) సాయంత్రం ఆలస్యంగా సమస్తిపూర్‌లోని సర్క్యూట్ హౌస్ పక్కన ఉన్న పటేల్ మైదానంలో దిగాం. అక్కడ ఎస్పీ కార్యాలయానికి వెళ్లాం. అక్కడ ఏ ఫోన్ పనిచేయలేదు. ఆ రాత్రి గడిచింది. ఆపరేషన్ సమాచారం బయటకు పొక్కకుండా చాలా అప్రమత్తంగా ఉన్నాం. అద్వానీ రెండున్నర గంటలకు సర్క్యూట్ హౌస్‌కు వచ్చారని తెలిసింది. అప్పటికే ఆయన అలసిపోయి ఉన్నారు. ఆయనను మేల్కొలపడానికి మేము వేచిచూస్తున్నాం. అక్టోబర్ 23న ఉదయం ఐదు గంటలకు మేం అద్వానీ గది తలుపు తట్టాం. ఆయనే స్వయంగా తలుపు తెరిచారు. మమ్మల్ని ఎవరని అడిగారు. నన్ను నేను పరిచయం చేసుకున్న తరువాత, అరెస్ట్ గురించి చెప్పాం. అప్పుడు అద్వానీ 15 నిమిషాల సమయం అడిగారు. మీ వెంట ఒకరిని తీసుకరావొచ్చు అని ఆయనకు చెప్పాం. ఆయనకు ఈ సదుపాయం ఇవ్వాలని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన ప్రమోద్ మహాజన్‌ను తన వెంట తీసుకొచ్చుకున్నారు. రామేశ్వర్ ఓరాన్ అరెస్టు చేశాక ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందని అందులో పేర్కొన్నారు. ఆ లేఖను పట్నాకు పంపించాలని మమ్మల్ని అభ్యర్థించారు. మేం ఆ ఏర్పాట్లు చేశాం. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం పడిపోతుందని మాకు తెలుసు, ఎందుకంటే అది బీజేపీ మద్దతుతో నడుస్తోంది. అద్వానీ, ప్రమోద్ మహాజన్‌లతో కలిసి కారులో పటేల్ మైదాన్‌కు చేరుకున్నాం. అక్కడ మా కోసం హెలికాప్టర్ ఉంది. అక్కడి నుంచి మేం దుమ్‌కా వెళ్లాం. తర్వాత మసంజోర్ గెస్ట్ హౌస్‌కు ఆయనను తీసుకెళ్లాం. అక్కడ మూడు రోజులు వారితో ఉన్న తరువాత, ఈ ఆపరేషన్ నుంచి నేను బయటకొచ్చాను. ఆర్‌కే సింగ్ మరో రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. అద్వానీ అరెస్టు పెద్ద సవాల్ అరెస్టుకు ముందు అద్వానీ.. ధన్బాద్, రాంచీ, హజారీబాగ్, నవాడా మీదుగా పట్నా వచ్చారు. ఆయన ప్రసంగం వినడానికి అక్కడి గాంధీ మైదానానికి సుమారు మూడు లక్షల మంది జనం వచ్చారు. మీటింగ్ తర్వాత అద్వానీ సమస్తిపూర్ చేరుకున్నారు. అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత సుమారు 50 వేల మందితో కలసి సమస్తిపూర్‌లోనే ఎక్కడో బసచేశారు. అటువంటి పరిస్థితిలో ఆయనను అరెస్టు చేయడం పెద్ద సవాల్. హింస చెలరేగే ప్రమాదం ఉంది. కానీ ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా ఉంచడంతో హింస లేకుండా ఆయనను అరెస్టు చేయగలిగాం. ఇది రామేశ్వర్ ఓరాన్ కథనం.. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆయనను జైలు నుంచి రాజేంద్ర ఇన్స్‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో చేర్పించారు. పదవీ విరమణ తర్వాత రామేశ్వర్ ఓరాన్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా గెలిచారు. ఇక ఆర్కే సింగ్ ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 1990 అక్టోబర్ 22(సోమవారం) స్థలం - 1 అన్నే రోడ్, పట్నా text: బాధితురాలి(25) పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని, ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు బీబీసీకి తెలిపారు. దిల్లీతోపాటు పొరుగునున్న రాష్ట్రాల్లో పిల్లల్ని అపహరిస్తున్నారనే వదంతులపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. గతేడాది కూడా ఇలాంటి వదంతులపై పలువురు అమాయకుల్ని జనాలు తీవ్రంగా కొట్టారు. దీంతో కొందరు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. దిల్లీతో సరిహద్దు కలిగిన ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మూక మధ్యలో ఇరుక్కుపోతే బయటపడటం ఎలా... ‘వదంతులు నమ్మొద్దు’ తాజా ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వీటిలో బాధిత మహిళ చుట్టూ కొందరు గుమిగూడి.. పిల్లల్ని ఎత్తుకెళ్తోందని ఆరోపిస్తూ కొడుతున్నారు. ''ఆగస్టు 29 వరకు 46 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల్లో కేవలం వదంతులే దాడులకు కారణం. ఎక్కడా పిల్లల్ని ఎత్తుకుపోయినట్లు ఆధారాలు కనిపించలేదు''అని డీజీపీ ఓపీ సింగ్ ట్వీట్‌చేశారు. ''దయచేసి ఎవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. 100 నంబరుకు ఫోన్ చేయండి. లేదా సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని సంప్రదించండి''అని సింగ్ వివరించారు. దిల్లీ శివార్లలోనున్న గాజియాబాద్‌లో ఇలాంటి కేసులు ఆగస్టులో ఆరు నమోదయ్యాయి. ''ఓ బామ్మ తన మనవరాలితో బయటకు వెళ్తున్నప్పడు కూడా ఇలాంటి వదంతులపై దాడి జరిగింది. బామ్మ, మనవరాలి శరీరం రంగు వేర్వేరుగా ఉండటంతో జనాలు అనుమానంతో దాడి చేశారు''అని సీనియర్ పోలీసు అధికారి నీరజ్ జాదౌన్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులను అరెస్టుచేశామని తెలిపారు. వదంతులపై జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నప్పటికీ.. కిడ్నాప్‌లు నిజంగా పెరుగుతున్నాయా? అనేది తెలియడంలేదు. ముఖ్యంగా వాట్సాప్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో కిడ్నాప్ వదంతులు వేగంగా వ్యాపిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వదంతులను గుప్పుమనిపిస్తున్న మెసేజ్‌లను నమ్మొద్దని అధికారులు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) పిల్లల్ని ఎత్తుకుపోతోందన్న అనుమానంతో ఓ గర్భిణిపై దాడిచేసిన ఘటన దిల్లీలో వెలుగుచూసింది. text: న్యూజెర్సీలో పోలీసు అధికారులు జీపీఎస్ ట్రాకర్లు అమర్చిన డమ్మీ బాక్సులను ఇళ్ల వద్ద పెడుతున్నారు. దొంగలను గుర్తించేందుకు హిడెన్ డోర్‌బెల్ కెమెరాలను వారు ఉపయోగిస్తున్నారు. న్యూజెర్సీ నేర గణాంకాలు, దొంగతనాలు జరుగుతున్న ప్రదేశాలపై అమెజాన్ అందించిన మ్యాపులను వాడుతూ ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఒక ఇంటి వద్ద ఉంచిన డమ్మీ బాక్సు మూడు నిమిషాల్లో చోరీ అయ్యింది. క్రిస్మస్ పండగ సీజన్‌లో తాము బట్వాడా చేసే పార్సళ్ల సంఖ్య సుమారు 90 కోట్లు ఉంటుందని అమెరికా పోస్టల్ సర్వీస్ అంచనా వేస్తోంది. గత ఏడాది అమెజాన్ సంస్థ 'అమెజాన్ కీ' అనే సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీసు కింద ఇంటి యజమానులకు స్మార్ట్ లాక్ సదుపాయం లభిస్తుంది. కొరియర్ సిబ్బంది ఒక యాప్ సాయంతో ఇంటి తలుపును తీసి, పార్సల్‌ను లోపల పెట్టి తిరిగి తాళం వేసి వెళ్లొచ్చు. 'అమెజాన్ కీ' పని చేయాలంటే స్మార్ట్ లాక్, క్లౌడ్ కామ్ కెమేరా ఉండాలి. స్మార్ట్ లాక్ ఉంటేనే అమెజాన్ కీ పనిచేస్తుంది. అమెజాన్ కీ ఎలా పనిచేస్తుందంటే సురక్షితమని భావిస్తేనే వినియోగదారులు ఈ సర్వీసును ఎంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు. బంధువులకు, ఇంట్లో పనివారికి కూడా దీనిని ఉపయోగించొచ్చు. అమెజాన్ కీ సర్వీసు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో, పార్సల్‌ను పనిచేసే చోటకు తెప్పించుకోవడం, లేదా అది డెలివరీ చేసే సమయానికి ఇంట్లో ఉండే స్నేహితుడికి ఇవ్వడం చేయొచ్చు. లేదా డెలివరీ చేసిన తర్వాత పార్సల్ తీసుకొన్న వ్యక్తితో సంతకం చేయించుకోవాలని చెప్పడం, పోలీసులకు వీడియో సాక్ష్యం అందించేందుకు అవసరమైన కెమెరాలు ఇంటి వద్ద అమర్చుకోవడం చేయాలి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అమెరికాలో వినియోగదారులకు చేరాల్సిన పార్సిళ్లను వారి ఇళ్ల వద్ద కొట్టేస్తున్న దొంగలను పట్టుకొనేందుకు అమెజాన్ ఒక వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పోలీసు విభాగంతో జట్టు కట్టింది. text: ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్‌కి మారుతున్న సమయంలో వారిపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటోందని ఆమె చెప్పారు. పిలలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వివరించారు. ఈ సమయంలో పాఠశాలలు కీలక పాత్ర పోషించాలని ఆమె అన్నారు. 8 నుంచి 12 ఏళ్ల వయసులో పిల్లలు తమ గుర్తింపుపై మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని ఆనీ వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల ఆధారంగా వ్యక్తిత్వాన్ని వారు అంచనా వేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నుంచి 12 ఏళ్ల వయసు విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందని ఆమె అధ్యయనంలో తేలింది. చాలామంది చిన్నారులు సోషల్ మీడియాలో తమకొచ్చే లైకులు, కామెంట్లపై అధికంగా ఆధారపడి ఉంటున్నారని ఈ నివేదిక తెలిపింది. ఆన్‌లైన్ భద్రతపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలలతో కలసి ప్రయత్నిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ప్రైమరీ నుంచి సెకండరీ స్కూల్‌కి మారుతున్న సమయంలో చిన్నారులకు సోషల్ మీడియా కీలకంగా మారుతోంది. సోషల్ మీడియా కారణంగా వచ్చే భావోద్వేగాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని ఇంగ్లండ్‌ చిల్డ్రన్స్‌ కమిషనర్ ఆనీ లాంగ్‌ఫీల్డ్ సూచించారు. 'కొత్త స్కూల్‌లో కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పైగా విద్యార్థుల దగ్గర సెల్‌ఫోన్లు ఉంటాయి. దీంతో సోషల్ మీడియాకు వారు అలవాటు పడతారు' అని ఆనీ లాంగ్‌ఫీల్డ్ అన్నారు. ఈ సమయంలో లైకుల కోసం పిల్లలు ఆరాట పడుతున్నారని, కామెంట్ల కోసం పరుగులు పెడుతున్నారని నివేదిక చెబుతోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో తమ స్టేటస్‌పై చాలా టెన్షన్ పడుతున్నామని చాలామంది విద్యార్థులు చెప్పారు. సోషల్ మీడియాకు డిస్‌కనెక్ట్ కాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నిజానికి సోషల్ మీడియా అకౌంట్ తెరవాలంటే కనీసం 13ఏళ్ల వయసు ఉండాలి. కానీ 10, 12 ఏళ్ల వయసు ఉన్న మూడొంతుల మంది చిన్నారులకు సోషల్ మీడియా ఖాతాలున్నాయని నివేదికలో తేలింది. 'సోషల్ మీడియా వల్ల చిన్నారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో వారు మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారు' అని లాంగ్‌ఫీల్డ్ అన్నారు. ఆనందం కోసం పిల్లలు సోషల్ మీడియాలో లైకుల కోసం పరిగెడుతున్నారు సోషల్ మీడియాలో భావోద్వేగాలకు అధికంగా గురికాకుండా చిన్నారులకు డిజిటల్ లిటరసీ నేర్పించాల్సిన అవసరం ఉందని లాంగ్‌ఫీల్డ్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 6 నుంచి 7 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాపై ముందే అవగాహన కల్పిస్తే వారు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉంటారని వివరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నివేదిక తయారు చేసిన వాళ్లు 8 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్న కొందరు పిల్లలతో మాట్లాడారు. చిన్నారులు చెప్పిన కొన్ని ఆసక్తికర అంశాలు : మా ఇతర కథనాలు: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకునే స్థితిలో పిల్లలు లేరని ఇంగ్లండ్ చిల్డ్రన్స్‌ కమిషనర్ ఆనీ లాంగ్‌ఫీల్డ్ అన్నారు. text: దీపావళి అంటే వెంటనే గుర్తుకొచ్చేది బాణాసంచా వెలుగులే. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశ వ్యాప్తంగా రాత్రి రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణం, ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా బాణసంచా తయారీ, అమ్మాలను నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారించిన సుప్రీం... బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించేందుకు నిరాకరించింది. అయితే, ఆన్‌లైన్‌లో బాణసంచా అమ్మరాదని, లైసెన్స్ ఉన్న వ్యాపారులనే టపాసులు అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించాలని సూచించింది. సుప్రీం కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు దీపావళికి ఏడు రోజుల ముందు తరువాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించాలి. దిల్లీ రాజధాని పరిధిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన నివాస సముదాయాల్లోనే బాణసంచా కాల్చాలి. దీపావళి రోజున దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు ( 35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతి ఇవ్వాలి. బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించలేమని అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయని సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిందని ఏఎన్‌ఐ వార్తసంస్థ తెలిపింది. text: బీబీసీ వెబ్‌సైట్‌, యాప్‌లను చైనా ఇప్పటికే నిషేధించింది చైనా నిర్ణయం తమకు నిరాశను కలిగించిందని బీబీసీ వ్యాఖ్యానించింది. బ్రిటన్‌లో చైనాకు చెందిన వార్తాప్రసార సంస్థ 'చైనా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్'‌(సీజీటీఎన్‌) ప్రసారాలను బ్రిటిష్‌ మీడియా రెగ్యులేటరీ సంస్థ 'ఆఫ్‌కామ్'‌ నిలిపేసిన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. 'స్టార్ చైనా మీడియా' అనే సంస్థ నియమాలకు విరుద్ధంగా సీజీటీఎన్‌ లైసెన్స్‌లను పొందిందని గుర్తించడంతో ఈ నెల ఆరంభంలో సీజీటీఎన్‌ ప్రసారాలను ఆఫ్‌కామ్‌ నిలిపేసింది. గత ఏడాది పీటర్ హంఫ్రీ అనే బ్రిటీష్‌ పౌరుడితో బలవంతంగా ఇప్పించిన వాంగ్మూలాన్ని ప్రసారం చేయడం ద్వారా బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీజీటీఎన్‌పై ఆరోపణలు వచ్చాయి. రీ-ఎడ్యుకేషన్ క్యాంపుల్లో చైనా అరాచకాలపై ఓ మహిళ ఇంటర్వ్యూను బీబీసీ ప్రసారం చేసింది చైనా వాదనేంటి? అయితే, చైనా గురించి బీబీసీ ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా నియమాలను ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా వార్తలు నిజాలతో, నిజాయితీతో కూడి ఉండాలన్న సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని చైనా స్టేట్‌ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్‌ వ్యాఖ్యానించింది. చైనాలో బీబీసీ ప్రసారాలను మరో ఏడాది పొడిగించే దరఖాస్తును అంగీకరించలేమని ఆ సంస్థ వెల్లడించింది. ఈ నిషేధంపై స్పందిస్తూ “చైనా తీసుకున్న నిర్ణయంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. వార్తా కథనాలను ఎలాంటి పక్షపాతం లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేయడంలో బీబీసీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.” అని బీబీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ టీవీ ఛానల్‌ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాషలో వార్తలను ప్రసారం చేస్తుంది. చైనాలో ఈ ఛానల్‌పై చాలా ఆంక్షలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, రాయబార కార్యాలయాల్లో మాత్రమే ఎక్కువగా బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ ఛానల్‌ కనిపిస్తుంటుంది. సామాన్య ప్రజలకు ఇది అందుబాటులో లేదు. హాంకాంగ్ విషయంలో బ్రిటన్ వైఖరిపై చైనా ఆగ్రహంగా ఉంది మీడియాపై చైనా ఆంక్షలు బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ను నిషేధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయం మీడియాను అదుపు చేసే చర్యల్లో భాగమని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా హోంశాఖ కూడా బీబీసీపై నిషేధం నిర్ణయాన్ని ఖండించింది. చైనాలో మీడియా అణచివేతకు గురవుతోందని ఆరోపించింది. హాంకాంగ్‌ కారణంగా చైనా, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. ప్రజలు అక్కడ నివసించే పరిస్థితులు లేవంటూ సుమారు 54 లక్షలమంది హాంకాంగ్‌వాసులకు తమ దేశంలో నివాస హక్కులు కల్పిస్తూ బ్రిటన్‌ తన వీసా విధానంలో మార్పులు చేసింది. మరోవైపు గత రెండేళ్లుగా చైనా ప్రభుత్వం విదేశీ మీడియాను ఒక క్రమపద్ధతిలో నిషేధిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన మూడు పత్రికల జర్నలిస్టులను ఇప్పటికే చైనా బహిష్కరించింది. బీబీసీ వెబ్‌సైట్‌, యాప్‌లను చైనా ఇప్పటికే నిషేధించింది. వీగర్‌ ముస్లిం తెగకు చెందిన ఓ మహిళ తనపై చైనా రీ-ఎడ్యుకేషన్‌ క్యాంపుల్లో జరిగిన అఘాయిత్యాలను ఇటీవల బీబీసీకి వివరించారు. ఈ కథనాన్ని బీబీసీ ప్రసారం చేసింది. చైనా ప్రభుత్వం వీగర్‌ తెగతోపాటు మైనారిటీ మతానికి చెందిన ప్రజలను చంపుతోందంటూ అమెరికా గత నెలలో ఆరోపించింది. చైనాలో సుమారు 10లక్షలమంది వీగర్‌, ఇతర మైనారిటీ ముస్లిం తెగల ప్రజలను క్యాంపుల్లో బంధించారని ఒక అంచనా అయితే చైనా ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కాన్సంట్రేషన్‌ క్యాంపులను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం అబద్ధమని గత ఏడాది యూకేలో చైనా రాయబారి ల్యూ జియోమింగ్‌ బీబీసీతో అన్నారు. వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ తెగల ప్రజలు తమ దేశంలో మిగతా ప్రజలు అనుభవించే అన్ని హక్కులను అనుభవిస్తున్నారని జియోమింగ్ స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ ప్రసారాలను తమ దేశంలో నిషేధిస్తూ చైనా ప్రభుత్వం గురువారంనాడు నిర్ణయం తీసుకుంది. వీగర్‌ ముస్లింలు, కరోనావైరస్‌ విషయంలో బీబీసీ ప్రసారం చేస్తున్న వార్తా కథనాలను చైనా ప్రభుత్వం తప్పుబట్టింది. text: ఈ భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఎలాజిగ్ ప్రావిన్సులోని సివిరిస్ పట్టణం మధ్యలో వచ్చిన ఈ భూకంపంతో చాలా భవనాలు కుప్పకూలాయి. ప్రకంపనలు రాగానే భవనాల్లో ఉంటున్న వారు వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ప్రభావం టర్కీ పొరుకునే ఉన్న సిరియా, లెబనాన్, ఇరాన్ వరకూ కనిపించింది. శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.55కు వచ్చాయి. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ(ఏఎఫ్ఏడీ) వివరాల ప్రకారం భూకంపం తర్వాత 60 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. 400కు పైగా రెస్క్యూ బృందాలు నిరాశ్రయుల కోసం గుడారాలు, ఇతర సహాయ సామగ్రి తీసుకుని భూకంప ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరాయి. టర్కీలో భూకంపాలు సర్వసాధారణం. 1999లో ఇజ్మిత్ నగరంలో వచ్చిన భారీ భూకంపంలో 17 వేల మంది మృతిచెందారు. ఎలాజిగ్ ప్రావిన్సులో 8 మంది, మలాట్యా ప్రావిన్సులో ఆరుగురు మృతి చెందారని ఆయా ప్రావిన్సుల గవర్నర్లు చెప్పారు. కూలిన భవనాల్లో ఉన్నవారిని కాపాడేందుకు అత్యవసర సేవల బృందాలు వేగంగా చర్యలు తీసుకుంటూ ఉండడం టీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. "ఇది చాలా భయంకరం. ఫర్నిచర్ మా పైన పడిపోయింది. మేం వెంటనే బయటకు పరుగులు తీశాం" అని ఎలాజిగ్‌సో నివసించే 47 ఏళ్ల మెలహత్ కాన్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది. భూకంపం వచ్చిన ప్రాంతం రాజధాని అంకారాకు 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు తెలీడానికి సమయం పట్టే అవకాశం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాలకు అధికారులు పడకలు, దుప్పట్లు పంపించారు. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తరచూ సున్నాకు దిగువకు పడిపోతుంటాయి. సివిరిస్ పట్టణంలో 4 వేల మంది ఉంటారు. హజార్ సరస్సు ఒడ్డున ఉండే ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) టర్కీలో తీవ్ర భూకంపం వల్ల 20 మంది మృతిచెందారని, వెయ్యి మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. text: 2012, సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయిన నవ్‌రుణా చక్రవర్తి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అతుల్య చక్రవర్తి ఒక రాత్రి బాత్రూంకు వెళ్లడానికి నిద్రలేచారు. దొంగలు పడకుండా ఉండడం కోసం బైట ఏర్పాటు చేసుకున్న రెండు ఫ్లూరోసెంట్ బల్బులు వెలగకపోవడం ఆయనకు అసహజంగా అనిపించింది. బాత్రూంకు వెళ్లొచ్చి ఆయన తన భార్య మోయిత్రిని నిద్ర లేపి, పడుకునే ముందు ఆమె ఏమైనా ఆ లైట్లను ఆఫ్ చేసిందేమో ఆరా తీశారు. ఆమె తాను ఆఫ్ చేయలేదనడంతో వాళ్లిద్దరూ కలిసి వరండాలోకి వచ్చారు. టార్చి వెలుగులో కనిపించిన దృశ్యం చూసి వాళ్లిద్దరికీ నోట మాట రాలేదు. ఈ గది నుంచే నవ్‌రుణా అదృశ్యమైంది అక్కడ వరండావైపు ఉన్న ఒక గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. దాంతో వాళ్ల నిద్ర మత్తు ఎగిరిపోయింది. ఆందోళనతో మోయిత్రి 12 ఏళ్ల కూతురు నవ్‌రుణా గదిలోకి వెళ్లారు. సన్నగా ఉండే ఆ అమ్మాయి ఆ రోజు చేతులకు గోరింటాకు పెట్టుకుని, టీవీలో కార్టూన్ సినిమాలు చూసి, బ్రెడ్డు పాలు తాగి నిద్రపోయింది. గదిలోకి వెళ్లిన మోయిత్రికి కూతురు కనిపించలేదు. ఆమె కప్పుకున్న సిల్కు షాల్, తలగడ, దోమతెర చెక్కు చెదరలేదు. కానీ పడక మీద కూతురు మాత్రం లేదు. 2012, సెప్టెంబర్ 18న నవ్‌రుణా చక్రవర్తి అలా మాయమైంది. ఇంటి విక్రయంలో వివాదమే కిడ్నాప్‌కు దారి తీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు 'మాయమైన' నవ్‌రుణా ఆమె గదిని ఆనుకుని ఉన్న వీధిలోంచి కిటికీకి ఉన్న ఊచలు వంచి, ఎవరో ఆమె గదిలోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావించారు. లోపలికివచ్చిన వ్యక్తి బహుశా నిద్రపోయిన నవ్‌రుణాకు ఏదైనా మత్తుమందిచ్చి ఉండాలి. భయపడిపోయిన ఆ బాలిక పెనుగులాడినట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి ఆ బాలికను వరండాలోకి మోసుకుపోయారు. లోపలికి వచ్చిన వ్యక్తి బయటున్న వాళ్లు లోపలికి రావడానికి వీలుగా లోపలి నుంచి తలుపులు తెరిచినట్లు పోలీసులు భావించారు. ఆ తర్వాత ఆ బాలికను మెయిన్ రోడ్ మీద నిలిపి ఉన్న వాహనంలోకి తీసుకుపోయారు. ఆరేళ్ల అనంతరం నవ్‌రుణా మరణించి ఉంటుందని పోలీసులు అంటున్నా, తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఆమె బతికే ఉందని నమ్ముతున్నారు. నవ్‌రుణా మాయమైన మూడు నెలల తర్వాత పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు అతుల్య చక్రవర్తి దూరపు బంధువు. వాళ్లు ఏదో దాస్తున్నట్లు పోలీసులకు అనిపించింది. కానీ ఆ నేరం వాళ్లే చేసినట్లు వాళ్లకు సాక్ష్యాధారాలేమీ లభించలేదు. నవ్‌రుణా బొమ్మలు డీఎన్‌ఏ పరీక్ష 2012, నవంబర్ 26న చక్రవర్తి ఇంటికి సమీపంలోని డ్రైనేజీలో ఒక ప్లాస్టిక్ సంచిలో ఒక కొన్ని ఎముకలు లభించాయి. ఆ తర్వాత పోలీసులు చక్రవర్తి కుటుంబానికి వాళ్ల కూతురి ఎముకలు దొరికాయని చెప్పారు. కానీ వాళ్లు దాన్ని విశ్వసించడానికి నిరాకరించారు. అవి తమ కూతురివే అనడానికి ఆధారం ఏంటి? ఆ తర్వాత ఆ ఎముకలను ఫోరెన్సిక్ లేబ్‌లో పరీక్ష చేశారు. వాటిని పరీక్షించిన వ్యక్తి, ''అవి 13-15 ఏళ్ల వయసున్న బాలికవి. ఆ ఎముకలు దొరికిన నాటికి 10-20 రోజుల ముందు ఆమె మరణించి ఉండాలి. అయితే మరణానికి స్పష్టమైన కారణం తెలియడం లేదు'' అని పేర్కొన్నారు. అయితే చక్రవర్తి దంపతులు మాత్రం అవి తమ కూతురివని అంగీకరించలేదు. 2014లో చక్రవర్తి దంపతులు డీఎన్‌ఏ పరీక్షలకు అంగీకరించారు కానీ వాటి ఫలితాలు పోలీసులు తమకు వెల్లడించలేదని వాళ్లు తెలిపారు. ''ఆ ఎముకలు మా కూతురివే అయితే, మా డీఎన్‌ఏ ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదు'' అని చక్రవర్తి ప్రశ్నించారు. అయితే ఈ కేసును చేపట్టిన సీబీఐ మాత్రం ఇది కిడ్నాప్ కమ్ మర్డర్ కేసు అని, ఈ హత్యకు కారణం చక్రవర్తి కుటుంబం ఉంటున్న ఇంటికి సంబంధించిన వివాదమే అంటోంది. కూతురి కోసం అతుల్య చక్రవర్తి ఆరేళ్ల నుంచి వేచి చూస్తున్నారు ముజఫర్‌పూర్‌లో హత్యలు, కిడ్నాప్‌లు సర్వసాధారణం. ఇక్కడ ల్యాండ్ మాఫియా భయపెట్టి, బెదిరించి భూములను లాక్కుంటుంది. అల్లరి మూకల కారణంగా మహిళలు ఒంటరిగా వీధుల్లో తిరగలేని పరిస్థితి. అతుల్య చక్రవర్తి ఒక రిటైర్డ్ ఫార్మాస్యూటికల్ రెప్రజెంటేటివ్. ఆయన తన పాత ఇంటిని అమ్మేసి మరో చోట ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు. నవ్‌రుణా కనిపించకుండా పోవడానికి రెండు వారాల ముందు ఆయన తన ఇంటిని 3 కోట్ల రూపాయలకు విక్రయించడానికి ఒక అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. 20 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన మరో రియల్టర్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చక్రవర్తిపై ఒత్తిడి తెచ్చారు. స్థానిక పోలీసులు కూడా వచ్చి తనను ఆ ఒప్పందం రద్దు చేసుకోవాలని కోరినట్లు చక్రవర్తి చెబుతున్నారు. అందుకే తన కూతుర్ని మాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పోలీసులు నవ్‌రుణా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను విచారించారు. ఆ బాలిక ఒక చోట తన 'డ్రీమ్ బాయ్' గురించి రాసిందని పోలీసులు చెబుతున్నారు. పరువు హత్య కోణం నుంచి చక్రవర్తి తన కూతుర్ని హత్య చేశాడేమో అని వాళ్లు ఇంటి సెప్టిక్ ట్యాంకులో కూడా పరిశీలించారు. తన కూతురు ఇంకా సజీవంగా ఉందని మోయిత్రి చక్రవర్తి భావిస్తున్నారు పోలీసులు నవ్‌రుణా కుటుంబ సభ్యులతో పాటు కనీసం 100 మంది అనుమానిత వ్యక్తుల కాల్ రికార్డులను పరిశీలించారు. బాలికను అక్రమ రవాణా చేశారేమో అనే అనుమానంతో స్థానిక రెడ్ లైట్ ఏరియాతో పాటు అనేక చోట్ల రెయిడ్స్ నిర్వహించారు. నవ్‌రుణాను కనిపెట్టడానికి మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఫలితం మాత్రం శూన్యం. గత ఏప్రిల్ నెలలో ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే వాళ్ల ఇళ్లలో వెదికినా, అనుమానించదగ్గవేవీ లభించలేదు. ఈ సంఘటన జరిగినప్పుడు విచారణతో సంబంధమున్న ముగ్గురు సీనియర్ పోలీసుల అధికారులను ప్రశ్నించినట్లు కూడా సీబీఐ కోర్టుకు తెలిపింది. వారిలో ఒకరు ముజఫర్‌పూర్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆయనకు నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు చేయాలని సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో 'బ్యూరోక్రాట్-మాఫియా' సంబంధాలు కనిపిస్తున్నాయని, విచారణ చేస్తున్న పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. నవ్‌రుణా గీసిన బొమ్మలు 'గొంతు వినిపించింది' కూతురి విషయం చక్రవర్తి కుటుంబాన్ని బాగా దెబ్బ తీసింది. గుండె జబ్బు ఉన్న చక్రవర్తి స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వేసుకుని మరణం అంచుల వరకు వెళ్లొచ్చారు. గత రెండేళ్లుగా చక్రవర్తి భార్య మోయిత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు ఏమైందో చెప్పాలని వాళ్లను ప్రశ్నిస్తున్నారు. ''నాతో ఆటలాడకండి. నా కూతుర్ని నాకిచ్చేయండి'' అని ఆమె వాళ్లపై కేకలు వేస్తారు. తన కూతురు మాయమయ్యాక చక్రవర్తి, పోలీసు అధికారులతో తన సంభాషణను, తనకు వచ్చిన మిస్టరీ కాల్స్‌ సంభాషణలన్నీ రికార్డు చేశారు. వాటిలో తనకు ఎక్కడో తన కూతురి గొంతు వినిపించిందని ఆయన అంటారు. తను పోలీసు అధికారులతో చేసిన సంభాషణను ఆయన సవివరంగా ఐదు డైరీలలో రాశారు. రాజకీయనాయకులకు, జడ్జీలకు, ప్రధానికి, రాష్ట్రపతికి కూడా ఆయన తనకు న్యాయం చేయాలంటూ లేఖలు రాశారు. స్వయంగా సీఎం నితీష్ కుమార్‌ను కలుసుకుని విచారణ నత్త నడకన సాగుతోందంటూ ఫిర్యాదు చేశారు. ఈ సైకిల్ మీదే నవ్‌రుణా స్కూలుకు వెళ్లేది ఈ సమాజంలో సామాన్యులకు న్యాయం జరగదని, తన కూతుర్ని రక్షించుకోలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చక్రవర్తి ఇల్లు ఇప్పుడొక జ్ఞాపకాల మ్యూజియం. నవ్‌రుణా గదిలో ఆమె జ్ఞాపకాలు మాసిపోకూడదని దేన్నీ కదల్చలేదు. ఆమె స్కూలు యూనిఫామ్, ఆమె వాడిన తువ్వాలు, స్కూలుకు వెళ్లేందుకు ఉపయోగించే పింకు రంగు సైకిల్, ఎర్ర పర్సు, దానిలోని 200 రూపాయలు ఇంకా అలాగే ఉన్నాయి. తన కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ''నవ్‌రుణా వస్తోంది. ఆమె వస్తువులన్నీ జాగ్రత్త చేయాలి'' అంటుంది తల్లి మోయిత్రి. ''తనకిప్పుడు 18 ఏళ్లు వచ్చేశాయి. నా తల్లి ఇప్పుడు ఎలా ఉంటుందో?'' ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆరేళ్ల కిందట బిహార్‌లో 12 ఏళ్ల బాలికను ఆమె బెడ్‌రూం నుంచి అపహరించుకుపోయారు. దీనిపై విచారణ చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే ఈ కేసులో వాళ్లకూ ఏమీ అంతు చిక్కలేదు. మరి ఎందుకు ఆ బాలిక తల్లిదండ్రులు ఇంకా తమ కూతురు జీవించే ఉంటుందని భావిస్తున్నారు? text: రెండు చేతులూ లేవు.. సైక్లింగ్‌లో చాంపియన్ అతడిది పంజాబ్‌లోని పటియాలా జిల్లా పత్తడా పట్టణం. జగ్వీందర్ పుట్టినప్పుడు అతడి తల్లికి ఎవరూ సాయం రాలేదు. ఆ పిల్లవాడ్ని అనాథాశ్రయంలో వదిలేయాలని కుటుంబ సభ్యులే ఒత్తిడి చేశారు. కానీ జగ్వీందర్ తల్లి అమర్జిత్‌కౌర్ వారిని ఎదిరించారు. తన కొడుకుని పెంచి పెద్ద చేశారు. చిన్నపుడు స్కూల్‌లో చేర్చటానికి ఆ అమ్మ చాలా కష్టపడాల్సి వచ్చింది. స్కూల్‌లో అడ్మిషన్ దొరికే వరకూ అతడికి కాళ్లతో రాయటం నేర్పించిందా తల్లి. ‘‘సైక్లింగ్, రన్నింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, కుకింగ్, జిమ్ నా హాబీలు’’ అని జగ్వీందర్ చెప్తారు. కానీ అతడికి సైక్లింగ్ నేర్పించటానికి ఎవరూ ముందుకు రాలేదు. ‘‘నేను అన్నీ రాత్రివేళ చీకట్లోనే నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పుడు ‘నీవల్ల కాదు’ అని డిస్కరేజ్ చేసేవాళ్లు ఎవరూ చుట్టుపక్కల ఉండరు’’ అని ఆయన తెలిపారు. జగ్వీందర్ సైకిల్లింగ్ చేసేటపుడు చూసిన వాళ్లు నవ్వేవాళ్లు. తనకు చేతులు లేవు కాబట్టి కొందరు వెక్కిరించేవాళ్లని కూడా ఆయన చెప్పారు. ‘‘రోడ్డు మీద నాకు యాక్సిడెంట్ అయితే సాయం చేయటానికి జనం పెద్దగా ముందుకు రారు. పైగా.. చేతులు లేనపుడు రోడ్డు మీదకు ఎందుకు వచ్చావని నన్ను తిట్టేవారు’’ అని వివరించారు. ఇప్పుడు సైక్లింగ్‌లో జగ్వీందర్ రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడలిస్ట్. ఒడిశాలో జరిగిన కోణార్క్ ఇంటర్నేషనల్ సైక్లొథాన్‌లో పాల్గొన్నారు. డ్రాయింగ్, సైక్లింగ్‌లలో 16 పైగా మెడల్స్ గెలుచుకున్నారు. ‘‘నేను ఓ స్థాయికి చేరాకే జనం నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు అడగటం మొదలుపెట్టారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒక యువతి ఇష్టపడింది. కానీ ఆమె తల్లిదండ్రులు, బంధువులు సిద్ధంగా లేరు. సమాజం ఏమంటుందోనని వారి భయం’’ అని జగ్వీందర్ తెలిపారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) జగ్వీందర్‌సింగ్ పుట్టినప్పుడే రెండు చేతులూ లేవు. text: 'ఆక్స్‌ఫర్డ్-ఆర్లన్ హామిల్టన్ అండ్ ఎర్లీన్ బట్లర్ సిమ్స్ స్కాలర్‌షిప్' అనే ఈ ఉపకారవేతన పథకం 2020లో ప్రారంభమై, మూడేళ్లు కొనసాగుతుంది. దీనికి అర్హత సాధించే విద్యార్థులకు మూడేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ చదవడానికి ఫీజులు, నివాస వ్యయాలను చెల్లిస్తారు. తనకు ఎదురైన సమస్యలు ఇప్పటి విద్యార్థులకు ఉండకూడదని, వారు చదువులపైనే దృష్టి కేంద్రీకరించాలని వ్యాపారవేత్త ఆర్లన్ హామిల్టన్ చెప్పారు. వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన ఆర్లన్ హామిల్టన్, వెనకబడిన వర్గాలకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తల స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు 2015లో 'బ్యాక్‌స్టేజ్ కాపిటల్' ఏర్పాటు చేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఈ ఏడాది జూన్‌లో జాతిపరమైన మైనారిటీ విద్యార్థులకు సీట్లు ఇచ్చినట్లు యూనివర్శిటీ తెలిపింది. యూజీ విద్యార్థుల్లో 18 శాతం మంది జాతిపరమైన మైనారిటీ విద్యార్థులని వర్సిటీ చెప్పింది. 61 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారని వివరించింది. సమాజంలోని అన్ని వర్గాలకూ అవకాశాలు కల్పించడం లేదని, పలు వర్గాలను విస్మరిస్తోందంటూ గతంలో బ్రిటన్ విద్యాశాఖ మాజీ మంత్రి డేవిడ్ లామీ నుంచి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం విమర్శలు ఎదుర్కొంది. ఆర్లన్ హామిల్టన్, ఆమె తల్లి ఎర్లీన్ బట్లర్ సిమ్స్ పేరిట ఈ స్కాలర్‌షిప్ ఏర్పాటైంది. అమెరికాలో మరింత మంది నల్లజాతి విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు తోడ్పడే కార్యక్రమానికి తాను నిధులు అందించనున్నానని, ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌షిప్ ఈ కార్యక్రమంలో భాగమని ఆర్లన్ హామిల్టన్ చెప్పారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోలేకపోయిన విద్యార్థులకు తాను అండగా నిలవాలనుకొంటున్నానని ఆమె తెలిపారు. చదువుకునే రోజుల్లో అద్దె ఎలా కట్టాలి లాంటి సమస్యల గురించి తాను ఆలోచించేదానినని, అలాంటి పరిస్థితులు ఇప్పటి విద్యార్థులకు ఉండకూడదని, వారు చదువులపైనే దృష్టి కేంద్రీకరించాలని ఆర్లన్ హామిల్టన్ వ్యాఖ్యానించారు. "ఈ విద్యార్థులు వారిని నడిపించే, వారికి జీవితాన్ని ఇచ్చే వాటిపైనే దృష్టి కేంద్రీకరించాలి" అని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ఈ ఉపకారవేతనం కింద- ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకునేందుకు ప్రతి విద్యార్థికి మూడు వేల పౌండ్ల చొప్పున ఇంటర్న్‌షిప్ గ్రాంట్ కూడా అందిస్తారు. నల్లజాతి ఆఫ్రికన్, కరీబియన్ విద్యార్థులు లేదా నల్లజాతి, మరో జాతి మిశ్రమ మూలాలున్న విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అర్హులు. దరఖాస్తుదారుల సామాజిక ఆర్థిక స్థితిని, వారి ప్రాంతంలో విద్యార్థులు సాధారణంగా పైచదువులకు వెళ్తారా, లేదా లాంటి అంశాలను పరిశీలించి యూనివర్శిటీ స్కాలర్‌షిప్ ఇస్తుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బ్రిటన్లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వెనకబడిన వర్గాలకు చెందిన నల్లజాతి బ్రిటన్ విద్యార్థుల కోసం తొలిసారిగా స్కాలర్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వ్యాపారవేత్త ఆర్లన్ హామిల్టన్ నిధులు సమకూరుస్తారు. text: లైట్ వెయిట్ విభాగంగా మేరీ కోమ్ ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను ఓడించారు. దిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోటీలో 35 ఏళ్ల మేరీ కోమ్ తనకన్నా 12 ఏళ్లు చిన్నదైన హనాను ఓడించారు. ఆమె చివరిసారిగా 2010 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో స్వర్ణపతకం సాధించారు. అంతకు ముందు ఆమె 2002, 2005, 2006, 2008లో స్వర్ణపతక విజేతగా నిలిచారు. తాజా విజయంతో మేరీ కోమ్, గతంలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఐదుసార్లు స్వర్ణపతకం సాధించిన ఐర్లాండ్‌కు చెందిన కేటీ టైలర్ రికార్డును తిరగరాశారు. అదే సమయంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆరుసార్లు స్వర్ణపతకం సాధించిన పురుష బాక్సర్ ఫెలిక్స్ సెవన్ రికార్డును సమం చేశారు. బాల్యం మేరీ కోమ్ మణిపూర్‌లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆమె బాక్సింగ్ నేర్చుకోవడం ఆమె కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. దీంతో ఆమె పొలంలో పని చేస్తూ, ఇంటి పనులు చేసుకుంటూ, తోడబుట్టిన వాళ్లను చూసుకుంటూనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవారు. చాలాకాలం పాటు ఆమె బాక్సింగ్ నేర్చుకుంటోందని ఇంట్లో తెలీనే తెలీదు. 2000లో రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పోటీల ఫొటోలు పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆమె ఇంట్లో బాక్సింగ్ గురించి తెలిసింది. అయితే బాక్సింగ్‌లో దెబ్బలు తగిలితే ఆమెకు పెళ్లి కాదని ఆమె తండ్రి భయపడేవారు. కానీ తండ్రి భయాన్ని ఆమె లెక్కచేయలేదు. గత ఏడాది నవంబర్‌లో ఆమె ఐదోసారి ఆసియన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఐదోసారి స్వర్ణపతకం సాధించారు. మేరీ కోమ్ జీవితకథ కూడా హిట్టే. ప్రియాంక చోప్రా కథానాయికగా మేరీ కోమ్ పేరుతో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఐరన్ లేడీ మేరీ కోమ్‌ను ఐరన్ లేడీ అని కూడా అంటుంటారు. ఆ పేరు ఆమెకు ఊరికే రాలేదు. బాక్సింగ్ రింగ్‌లోనే కాదు, నిజజీవితంలోనూ ఆమె సమస్యలతో పోరాటం చేశారు. 2011లో ఆమె మూడున్నర ఏళ్ల కుమారుడికి గుండె ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో ఆమె ఆసియా కప్ కోసం చైనా వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఏం చేయాలో తోచనప్పుడు ఆమెకు భర్త అండగా నిలిచారు. కొడుకును భర్త సంరక్షణలో వదిలి ఆమె ఆసియా కప్‌కు వెళ్లారు. అక్కడ స్వర్ణపతకం సాధించి తిరిగి వచ్చారు. గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె,''బాక్సింగ్ రింగ్‌లో మీరు, ప్రత్యర్థి.. ఇద్దరే ఉంటారు. అందువల్ల మీకు పౌరుషం రాకుంటే, మీరసలు నిజమైన బాక్సరే కాదు'' అన్నారు. అదే పౌరుషంతో ఆమె ఈ వయస్సులో కూడా స్వర్ణ పతకం సాధించారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గతంలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో విజయం సాధించారు. text: కానీ, ఈ 23 ఏళ్ల ఎంపీ తాజాగా తన ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన జీతంలో భారీ మొత్తాన్ని స్థానిక ప్రజలకు ఇస్తానని ఆమె ప్రకటించారు. ఇంగ్లిష్ మిడ్‌లాండ్స్‌లోని నాటింగ్‌హామ్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె తన విజయానికి ముందు బీబీసీతో మాట్లాడుతూ తాత్కాలిక ఉద్యోగాల కోసం వెతుకుతున్నానని చెప్పారు. 80 వేల పౌండ్ల (సుమారు రూ. 73.98 లక్షల) తన వార్షిక వేతనంలో 35 వేల పౌండ్లు (సుమారు రూ.32.36 లక్షలు) మాత్రమే తీసుకుంటానని ప్రకటించారామె. బ్రిటన్ 'జాతీయ గణాంక కార్యాలయం' లెక్కల ప్రకారం అక్కడ సగటు కార్మికుడి వేతనం ఏడాదికి 35 వేల పౌండ్లని.. కాబట్టి తానూ ఏడాదికి అంతే తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశానని ఆమె చెప్పారు. మిగతా మొత్తాన్ని తన నియోజకవర్గంలో నిధులు లేక ముందుకు సాగని పనుల పూర్తికి, స్ట్రైక్ ఫండ్స్, ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారామె. దాతృత్వం కోసం కాదు.. తానేమీ దాతృత్వం చాటుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేయడం లేదని.. ఆర్థిక సంక్షోభం తరువాత కోతల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వరంగ ఉద్యోగులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారామె. 35000 పౌండ్లే తాను తీసుకుంటున్నాననంటే ఎంపీలు అంతకంటే ఎక్కువ జీతానికి అర్హులు కారని కాదని.. అయితే, టీచింగ్ అసిస్టెంట్లు, నర్సులు, ఫైర్ ఫైటర్లు వంటివారు ఇంతే పొందుతున్నారని అన్నారు. వారికి దక్కాల్సినంత వేతనం దక్కినప్పుడు తాను కూడా ఎక్కువ జీతం తీసుకుంటానని.. తన నిర్ణయం వేతనాలపై చర్చకు దారితీస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. విద్వేష నేరాల బారిన పడినవారికి సహాయకారిగా గతంలో వ్యవహరించిన నదియా న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. నాటింగ్‌హామ్ ఈస్ట్ నుంచి లేబర్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు అక్కడి నుంచి ఎంపీగా ఉన్న క్రిస్ లెస్లీ లేబర్ పార్టీని వీడడంతో నదియాకు అవకాశం దొరికింది. ''కొన్ని నెలల కిందట వరకు నేనిలా ఎంపీనవుతానని ఊహించలేదు. అన్నీ చకచకా జరిగిపోయాయి'' అన్నారామె. రాజకీయాల్లోకి రావాలని నదియా 2013లో అనుకున్నారు. ఆర్థిక సంక్షోభం తరువాత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలపై పోరాడేందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారామె. ''నా పొరుగువారు, స్నేహితులు, కుటుంబసభ్యులు తిండికి కూడా కష్టపడుతున్న సంగతి చూశాను'' అన్నారు. ''న్యూయార్క్ నుంచి నాటింగ్‌హామ్ వరకు ప్రగతిశీల కొత్త తరం కీలక భూమిక పోషిస్తోంది. మాది శ్రామిక వర్గం, నల్ల రంగు మహిళలం.. అణచివేత, దోపిడీ, విద్వేష నేరాల వల్ల కలిగే బాధ నాకు తెలుసు'' అన్నారామె. భిన్నాభిప్రాయాలు ఆమె పార్లమెంటుకు ఎన్నికైన తరువాత సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో నెటిజనులు ఆమెను అభినందించారు. అయితే, తన జీతంలో అధిక భాగాన్ని వదులుకోవాలన్న ఆమె నిర్ణయం మాత్రం అందరినీ ఆకట్టుకోలేదు. కొందరు నేతల నుంచీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, నదియా మాత్రం తాను తీసుకున్న నిర్ణయం ఎంపీల విలువను తగ్గించేదేమీ కాదని అన్నారు. ఇవికూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నదియా విటామ్.. బ్రిటన్ పార్లమెంటులో అత్యంత పిన్నవయస్కురాలైన ఎంపీ. మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె ఎవరో కూడా చాలామందికి తెలియదు. text: కొబ్బరినూనెలో ఎక్కువ శాతం సంతృప్త కొవ్వు పదార్థాలు ‘కొబ్బరినూనె, ఇతర పోషకాహారలోపాలు’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె మాట్లాడుతూ.. కొబ్బరినూనె ఆరోగ్యకరమైన ఆహారమని చెబుతుంటారని, కానీ దీనికి ఒక్క సాక్ష్యం కూడా లేదని అన్నారు. జులైలో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. అయితే, కొబ్బరి నూనె నోటి దుర్వాసన, జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుందన్న సెలెబ్రిటీల ప్రకటనలతో దాని ధర ఆకాశాన్ని అంటుతోంది. నటి ఏంజెలినా జోలి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటారని తెలుస్తోంది. మోడల్ మిరాందా కెర్ తాను సలాడ్స్‌ను కొబ్బరి నూనెతో కలిసి తీసుకుంటానని చెప్పడమే కాకుండా, వంట కూడా దానితోనే చేస్తానని, దాన్ని ఒంటికి కూడా పట్టించుకుంటానని చెబుతున్నారు. అయితే కొబ్బరి నూనెతో ముడిపడిన ఈ ఆరోగ్య ప్రకటనలపై సైంటిస్టులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరినూనె కేవలం ఒక అనారోగ్యకరమైన కొవ్వు పదార్థం అనేది వారి భావన. సంతృప్త కొవ్వు పదార్థాలు వెన్నలో 51 శాతం, పందికొవ్వులో 39శాతం మాత్రమే ఉంటే, కొబ్బరినూనెలో 86 శాతం ఉంటాయి. ఇలాంటి సంతృప్త కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలోని ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపొప్రొటీన్) శాతం పెరుగుతుంది. ఎల్‌డీఎల్‌ను 'చెడు కొలెస్టరాల్' అని కూడా అంటారు. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు ఆరోగ్యానికి హాని కలుగజేసే సంతృప్త కొవ్వు పదార్థాలు - హెచ్‌డీఎల్, 'మంచి కొలెస్టరాల్'ను పెంచే అవకాశం కూడా ఉంది. దీని వల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ఆహారం మీ కొలెస్టరాల్ స్థాయిని పెంచుతూనే, గుండెకు మంచి చేసే అవకాశం ఉంది. ఆలివ్ నూనె కొలెస్టరాల్ పరీక్ష కొంతమంది చెబుతున్నట్లు, కొబ్బరి నూనె నిజంగా కొలెస్టరాల్‌ను తగ్గించే వండర్ ఫుడ్డా లేక దీనికి అనవసరంగా ప్రాధాన్యతను ఇస్తున్నారా? ఇందుకోసం బీబీసీ2 లో ప్రసారమయ్యే 'ట్రస్ట్ మీ ఐయామ్ ఎ డాక్టర్' సిరీస్ కోసం ఒక పరిశోధన నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రఖ్యాత కేంబ్రిడ్జి పరిశోధకులు ప్రొఫెసర్ కే-టీ ఖా మరియు ప్రొఫెసర్ నీతా ఫొరౌహిలను బీబీసీ టీమ్ సంప్రదించింది. వారి సహాయంతో - మధుమేహం, గుండెజబ్బులు లేని 50-75 ఏళ్ల మధ్య వయసున్న 94 మంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంది. వివిధ రకాల కొవ్వు పదార్థాలను తినడం వల్ల వారిలో వచ్చే మార్పులను సమీక్షించాలని నిర్ణయించింది. వీరందరినీ మూడు బృందాలుగా విభజించడం జరిగింది. నాలుగు వారాల పాటు ఒక బృందానికి 50 గ్రాములు, అంటే సుమారు 3 టేబుల్ స్పూన్‌ల ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనెను ఇవ్వడం జరిగింది. రెండో బృందానికి అంతే పరిమాణంలో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెను తీసుకోమని సూచించారు. మూడో బృందానికి రోజూ 50 గ్రాముల 'అన్‌సాల్టెడ్' వెన్నను తీసుకోమన్నారు. వాలంటీర్లు తమకు ఇష్టం వచ్చిన రీతిలో నాలుగు వారాల పాటు ఈ కొవ్వు పదార్థాలను తీసుకోమని సూచించారు. రోజూ 450 అదనపు కెలోరీలను ఆహారంగా తీసుకోవడం వల్ల వారి బరువు పెరిగే అవకాశం కూడా ఉందని వారిని హెచ్చరించారు. ఈ ప్రయోగానికి ముందు వారి రక్త నమూనాలు తీసుకుని ఎల్‌డీఎల్ (చెడు కొలెస్టరాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్టరాల్) శాతాలను కొలవడం జరిగింది. వీటి ద్వారా గుండెపోటు వచ్చే రిస్క్‌ను బాగా గుర్తించవచ్చు. వెన్నను తిన్నవారిలో సగటున 10 శాతం ఎల్‌డీఎల్ పెరగ్గా, అదే సమయంలో హెచ్‌డీఎల్ 5 శాతం పెరిగింది. ఆలివ్ ఆయిల్‌ను తీసుకున్న వారిలో చాలా తక్కువ శాతమే అయినా ఎల్‌డీఎల్ తగ్గగా, హెచ్‌డీఎల్ 5 శాతం పెరిగింది. అలా ఆలివ్ ఆయిల్ గుండెకు మంచిదన్న పేరు నిలబెట్టుకుంది. కానీ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఫలితాలు కొబ్బరినూనెలో వెలువడ్డాయి. బీబీసీ అంచనా వేసినట్లు ఎల్‌డీఎల్ పరిమాణం పెరగకపోవడమే కాకుండా, హెచ్‌డీఎల్, అంటే మంచి కొలెస్టరాల్ 15 శాతం పెరిగినట్లు తేలింది. అంటే కొబ్బరి నూనెను తీసుకుంటున్న వారికి గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందన్న మాట. మరికొన్ని పరిశోధనలు అవసరం దీనిపై బీబీసీ ప్రొఫెసర్ కే-టీ ఖాను ప్రశ్నించినపుడు, ఆమె కూడా ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ''బహుశా కొబ్బరి నూనెలోని ప్రధానమైన సంతృప్త కొవ్వు పదార్థం లారిక్ యాసిడ్ రూపంలో ఉండడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు'' అని ఆమె అన్నారు. అంటే కొబ్బరి నూనెను మనం ఆరోగ్యకరమైన ఆహారం అనవచ్చా? ''ఇది ఒక పరిశోధన మాత్రమే. ఒక పరిశోధన ఎంత బాగా జరిగినా, కేవలం దీని ఆధారంగా ఆహార అలవాట్లలో మార్పు చేసుకోమని సూచించడం బాధ్యతారాహిత్యమే అవుతుంది'' అన్నారామె. అందువల్ల కొబ్బరి నూనె ఒక 'సూపర్ ఫుడ్' అని ఇప్పుడే ప్రకటించలేము. అయితే మీరు వంటల్లో కొబ్బరి నూనెను వాడుతుంటే మాత్రం, దానిని నిలిపేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కొబ్బరినూనె విషతుల్యమైనదంటూ హార్వర్డ్ ప్రొఫెసర్ కరీన్ మైఖేల్స్ చేసిన వ్యాఖ్యలతో కొబ్బరినూనె గుణగణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. text: 17 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ప్యానెల్ గురువారం ఏకగ్రీవంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. 2017లో మయన్మార్ సైనిక చర్య చేపట్టిన సమయంలో వేల మంది రోహింజ్యాలు ప్రాణాలు కోల్పోయారు. 7 లక్షలకుపైగా మంది పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఈ మారణహోమం మళ్లీ కొనసాగొచ్చని ఐరాస విచారణకర్తలు హెచ్చరించారు. అయితే, మయన్మార్ ఈ మారణహోమానికి పాల్పడిందన్న ఆరోపణలను ఆ దేశ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ గత నెలలో ఐసీజే విచారణకు హాజరై ఖండించారు. తమ దేశంపై తప్పుడు కేసు పెట్టారని చెబుతూ ఆమె తన వాదన వినిపించారు. ఆఫ్రికా దేశమైన గాంబియా ఈ కేసును ఐసీజే దృష్టికి తీసుకొచ్చింది. ఐసీజేలో మూడు రోజులపాటు రోహింజ్యాల మారణహోమంపై విచారణ జరిగింది. రఖైన్ రాష్ట్రంలో ఉగ్రవాద ముప్పు నివారణ లక్ష్యంగా సైన్యం చర్య తీసుకుందని మయన్మార్ మొదటి నుంచి చెబుతోంది. సూచీ కూడా అదే వైఖరికి కట్టుబడ్డారు. ఒకప్పుడు ప్రపంచమంతా ప్రజాస్వామ్య ప్రతీకగా కొనియాడిన సూచీ 2016 ఏప్రిల్‌లో మయన్మార్‌కు స్టేట్ కౌన్సిలరయ్యారు. రాజ్యాంగపరంగా సైన్యంపై ఆమెకు నియంత్రణ ఉండదు. కానీ, మారణహోమం ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. కాగా, ఒకప్పుడు ఎన్నో ఏళ్లపాటు తనను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యాన్నే ఇప్పుడు సూచీ వెనకేసుకొస్తున్నారు. రఖైన్ నుంచి వెళ్లిపోయిన మయన్మార్ ప్రజలను స్వదేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని ఐజేసీలో చెప్పిన ఆమె.. ఈ సంక్షోభాన్ని మరింత రగిల్చేలా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టును ఆమె కోరారు. అసలేమిటీ వివాదం 2017 వరకు, దాదాపు 10 లక్షల మంది రోహింజ్యాలు మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో నివసించేవారు. అయితే, మయన్మార్ ప్రభుత్వం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించి, పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరించింది. రోహింజ్యాలు ఎన్నో ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొంటున్నారు. 2017లో మిలటరీ ప్రభుత్వం రఖైన్ రాష్ట్రంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఐసీజే పత్రాల ప్రకారం, అక్టోబర్ 2016 నుంచి ఆగస్టు 2017 వరకు రోహింజ్యాలను పూర్తిగా, ఒక క్రమపద్ధతి ప్రకారం తుడిచిపెట్టే చర్యలకు సైన్యం పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలతో రోహింజ్యాలను సామూహికంగా విధ్వంసం చేశారని మయన్మార్ సైన్యంపై ఆరోపణలు వచ్చాయి. ఐక్యరాజ్య సమితి నిజనిర్ధరణ సంస్థ ఇలా వచ్చిన అనేక ఆరోపణలను ధ్రువీకరించింది. ఆగస్టులో వెలువడిన ఒక నివేదిక, ''మహిళలు, బాలికలు, బాలురు, పురుషులు, ట్రాన్స్ జెండర్లపై సైన్యం అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడింది'' అని ఆరోపించింది. మేలో 10 మంది రోహింజ్యాలను చంపినందుకు జైలు శిక్ష పడిన ఏడుగురు మయన్మార్ సైనికులు ఇటీవల విడుదలయ్యారు. అయితే, రోహింజ్యా ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని తమ సైన్యం దాడులు చేసిందని మయన్మార్ గతంలో స్పష్టం చేసింది. మయన్మార్ పై ఎవరు ఆరోపణలు చేస్తున్నారు? ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన న్యాయ విభాగం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే). దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌లో ఉంది. ఇందులోని సభ్య దేశాలు కేసు వేయవచ్చు. రోహింజ్యా మారణహోమంపై మయన్మార్ పై ఆఫ్రికాలోని ముస్లిం దేశం గాంబియా కేసు వేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఐవోసీ)లోని 57 సభ్య దేశాలు, అంతర్జాతీయ న్యాయవాదుల బృందం ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపాయి. ఆంగ్ సాన్ సూచీ పాత్ర ఏమిటి? వాస్తవానికి, ఈ కేసు పెట్టింది సూచీ మీద కాదు, మయన్మార్ మీద. అలాగే, ఐసీజే వ్యక్తులను శిక్షించదు. అయితే, రోహింజ్యా మారణహోమం విషయంలో సూచీపై ఆరోపణలు చేయడానికి కారణం ఆమె 2016 ఏప్రిల్ నుంచి దేశానికి వాస్తవ పరిపాలకురాలిగా ఉండటం. సైన్యంపై అదుపు లేకపోయినప్పటికీ మిలటరీ చర్యల్లో సూచీకి భాగం ఉందని ఐక్యరాజ్యసమితి పరిశోధన బృందం ఆరోపణలు చేసింది. ఇప్పుడు రోహింజ్యాల పరిస్థితి ఏంటి? మిలటరీ ఆపరేషన్ ప్రారంభంకాగానే, మయన్మార్ నుంచి వేలాదిమంది రోహింజ్యాలు పారిపోయారు. సెప్టెంబర్ 30 వరకు ఉన్న వివరాలను గమనిస్తే, బంగ్లాదేశ్‌లోని వివిధ క్యాంపుల్లో దాదాపు పది లక్షల మంది రోహింజ్యాలు ఉన్నారు. దాదాపు 80 శాతం మంది రోహింజ్యాలు 2017 ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలోనే ఇక్కడికి వచ్చారు. ఇకపై తమ దేశంలోకి రోహింజ్యాలను అనుమతించేది లేదని మార్చిలో బంగ్లాదేశ్ ప్రకటించింది. తమ దేశంలో ఉన్న రోహింజ్యాలు మయన్మార్‌కు స్వచ్ఛందంగా వెళ్లేందుకు వీలుగా ఆగస్టులో బంగ్లాదేశ్ ఒక పథకాన్ని ప్రారంభించింది. కానీ, ఒక్క రోహింజ్యా కూడా బంగ్లాను విడిచివెళ్లలేదు. తమ దేశంలో ఉన్న పది లక్షల మంది రోహింజ్యాలను బంగాళాఖాతంలోని భాషన్ దీవుల్లోకి తరలించేందుకు బంగ్లాదేశ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, స్వచ్ఛంద సంస్థలు ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో రోహింజ్యాలు నివాసమున్న గ్రామాల్లో మయన్మార్ సైన్యం శిబిరాలను నిర్మిస్తోందని బీబీసీ ప్రతినిధి జోనాథన్ హెడ్ సెప్టెంబర్‌లో నివేదించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రోహింజ్యా ముస్లింలపై మారణహోమాన్ని ఆపేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని మయన్మార్‌ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. text: అది నీడిల్‌ఫిష్. 75 సెంటీమీటర్లు పొడవుంది. మెడలో గుచ్చుకున్న ఆ చేపను అలాగే పట్టుకుని మహమ్మద్ తన స్నేహితుడి సాయంతో, చీకట్లో అర కిలోమీటరు దూరం ఈది ఒడ్డుకు చేరాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద అనుభవాన్ని 16 ఏళ్ల మహమ్మద్ ఇదుల్ బీబీసీతో ప్రత్యేకంగా చెప్పాడు. చేప పొడవడంతో మహమ్మద్ ఇదుల్‌ పాపులర్ అయిపోయాడు. మెడలో చేప తలతో ఉన్న అతడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడు సర్దీతో కలిసి చేపల వేటకు వెళ్లానని మహమ్మద్ బీబీసీతో చెప్పాడు. ''ముందుగా సర్దీ పడవ కదిలింది. నేను మరో పడవలో అతడిని అనుసరించా. తీరం నుంచి అర కిలో మీటర్ దూరం వెళ్లాక, సర్దీ టార్చ్‌లైట్ వేశాడు. వెంటనే నీళ్లలో నుంచి ఓ నీడిల్‌ఫిష్ ఎగిరి, నా మెడలో పొడిచింది'' అని వివరించాడు మహమ్మద్. చేప పొడిచిన తర్వాత, అతడు పడవ నుంచి కింద నీళ్లలో పడిపోయాడు. పొడవుగా, కత్తుల్లా ఉన్న ఆ చేప దవడలు అతడి మెడను చీల్చుకుని మరోవైపు నుంచి బయటకువచ్చాయి. మహమ్మద్ మెడలో గుచ్చుకుని కూడా ఆ చేప కొట్టుకుంటూ, పారిపోయేందుకు ప్రయత్నించింది. మహమ్మద్ ఆ చేపను గట్టిగా అదిమిపట్టి, గాయం ఇంకా పెద్దదవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ''సర్దీని సాయం అడిగా. చేపను మెడ నుంచి తీస్తే ఎక్కువ రక్తం పోతుందని, దాన్ని బయటకు తీయొద్దని అతడే చెప్పాడు'' అని మహమ్మద్ వివరించాడు. ఆ ఇద్దరు యువకులూ ఎలాగోలా చీకట్లో అర కిలోమీటర్ దూరం ఈదుకుని తీరానికి చేరారు. మహమ్మద్‌ను వెంటనే బావుబావులోని ఓ ఆసుపత్రికి అతడి తండ్రి సహారుద్దీన్ తీసుకువెళ్లారు. మహమ్మద్ గ్రామం నుంచి బావుబావు చేరుకోవాలంటే దాదాపు గంటన్నర ప్రయాణించాలి. ఆ చేప మూతిని తొలగించేందుకు తగిన పరికరాలు, సామగ్రి బావుబావులోని వైద్యుల వద్ద లేవు. దీంతో చేప మూతి భాగాన్ని మహమ్మద్ మెడలో అలాగే ఉంచి, మిగతా భాగాన్ని మాత్రం కోసి తీసేశారు. అక్కడి నుంచి మకస్సర్‌లో పెద్దదైన మహిదీన్ సుదిరోహుసోడో ఆసుపత్రికి మహమ్మద్‌ను తరలించారు. ఆ ఆసుపత్రి సిబ్బంది మహమ్మద్ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. ఐదుగురు శస్త్ర చికిత్సా నిపుణులు దాదాపు గంటపాటు శ్రమించి, మహమ్మద్ మెడ నుంచి చేప మూతిని తొలగించారని ఆసుపత్రి డైరెక్టర్ ఖలీద్ సాలెహ్ తెలిపారు. మహమ్మద్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. తనకు ఇప్పుడు నొప్పేమీ లేదని అతడు చెప్పాడు. మెడను కుడి వైపుకు తిప్పలేకపోతున్నా, అతడు మాత్రం చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇంకొన్ని రోజులు అతడు ఆసుపత్రిలోనే గడపాల్సి రావొచ్చు. ''అతడి పరిస్థితిని గమనిస్తున్నాం. కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. కానీ, అతడికి ఇంకా చెకప్స్ చేయాల్సి ఉంటుంది'' అని ఖలీద్ చెప్పారు. ఇంత జరిగినా, చేపల వేట అంటే తనకు ఇష్టమేనని మహమ్మద్ చెబుతున్నాడు. ''ఇకపై జాగ్రత్తగా ఉండాలంతే. నీడిల్‌ఫిష్‌ కాంతిని సహించలేదు. అందుకే, అది నీళ్లలో నుంచి ఎగిరి, నన్ను పొడిచింది'' అని అన్నాడు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇండోనేసియాలో సముద్రంలో నుంచి ఒక్కసారిగా ఓ చేప ఎగిరి, మహమ్మద్ ఇదుల్ అనే యువకుడి మెడలో పొడిచింది. ఆ చేప ఎంత బలంగా పొడిచిందంటే, దాని మూతి మహమ్మద్ మెడను చీల్చుకుని ఇంకోవైపు నుంచి బయటకు వచ్చింది. హెచ్చరిక: కొందరు పాఠకులకు ఈ కథనంలోని ఫొటో చూసేందుకు ఇబ్బందిగా అనిపించవచ్చు text: దేశంలో మొత్తం 8.2 లక్షల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బారిన పడిన వారున్నారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఒక సమావేశంలో తెలిపారు. 2018 రెండో త్రైమాసికంలోనే 40 వేల కొత్త కేసులు నమోదైనట్లు వారు వెల్లడించారు. వీటిలో ఎక్కువ శాతం కేసులో లైంగిక కార్యకలాపాల వల్లే సంక్రమించాయి. ఇది గత ధోరణికి భిన్నమైనది. చైనాలో ఇప్పటివరకు హెచ్ఐవీ/ఎయిడ్స్ ఎక్కువగా రక్త మార్పిడి వల్లే సంక్రమించేది. అయితే ఇటీవలి కాలంలో అలాంటి కేసులు దాదాపు సున్నాకు పడిపోయాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా, ఎల్జీబీటీ వర్గాలలో లైంగిక కార్యకలాపాల కారణంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. చైనాలో 1997లో హోమోసెక్సువాలిటీని నేరాల జాబితా నుంచి తొలగించినా, ఎల్జీబీటీల పట్ల సమాజంలో ఇప్పటికీ చిన్న చూపు ఉంది. ఇతర పురుషులతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే పురుషుల్లో 70-90 శాతం తిరిగి మహిళలను వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి సంబంధాలలో లైంగికపరంగా సరైన రక్షణ తీసుకోకపోవడంతో హెచ్ఐవీ/ఎయిడ్స్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హెచ్ఐవీ/ఎయిడ్స్ ఉన్న రోగుల సంఖ్య 14 శాతం పెరిగిందని చైనా తెలిపింది. text: 06.00 మొత్తం ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు 222 ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ 104, కాంగ్రెస్ 78, జనతాదళ్ (సెక్యులర్) 37 స్థానాల్లో గెలుపొందగా.. బహుజన్ సమాజ్ పార్టీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ చెరొక స్థానాన్ని పొందగా.. స్వతంత్ర అభ్యర్థి మరొక స్థానంలో గెలుపొందారు. 22.30 మొత్తం 222 స్థానాలకు గాను 221 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ 103, కాంగ్రెస్ 78, జనతాదళ్ (సెక్యులర్) 37 స్థానాల్లో గెలుపొందగా.. బహుజన్ సమాజ్ పార్టీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ చెరొక స్థానాన్ని పొందగా.. స్వతంత్ర అభ్యర్థి మరొక స్థానంలో గెలుపొందారు. మిగిలిన ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 14.56 కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘‘దేవెగౌడ, కుమారస్వామిలతో మేం మాట్లాడాం. ముఖ్యమంత్రి పదవికి జేడీఎస్ ఎవరిని నిర్ణయిస్తే.. కాంగ్రెస్ కూడా వారికే మద్దతిస్తుంది. మా ప్రతిపాదనను వారు స్వీకరించారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీ కార్యకర్తల సంబరాలు 14.00కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన వారికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి పాలైన వారు తిరిగి పోరాడాలని మమత సూచించారు. కాంగ్రెస్, జేడీఎస్ జత కట్టి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని మమత అభిప్రాయపడ్డారు. 13.43 ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ, 'కర్ణాటకలో కమలం వికసించింది' అన్నారు. బీజేపీకి అద్భుత విజయం దక్కిందన్న మేనక.. మోదీ నాయకత్వంలో అలుపెరుగకుండా శ్రమించిన పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 13.13 - బీజేపీ 10 స్థానాలలో, కాంగ్రెస్ 2 స్థానాలలో విజయం సాధించాయి. బీజేపీ 99 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 69 స్థానాలలో, జేడీఎస్ 39 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 12.47 - కర్ణాటకలో బీజేపీ 4 స్థానాలలో, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ 104 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 69 స్థానాలలో, జేడీఎస్ 40 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 3 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు. 12.23 - కర్ణాటకలో మొత్తం 220 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడైంది. 2 స్థానాలలో విజయం సాధించిన బీజేపీ మరో 112 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 64 స్థానాలలో, జేడీఎస్ 39 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 2 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయం ముందు దృశ్యం 12.02 - మొత్తం 220 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడైంది. బీజేపీ 115 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా.. కాంగ్రెస్ 63 స్థానాలలో, జేడీఎస్ 40 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 2 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు. 11.42 - కర్ణాటక ఫలితాలపై ప్రముఖ చరిత్రకారులు రామచంద్ర గుహ ట్వీట్ చేశారు. ఈ ఫలితాలతో సిద్ధరామయ్యకు భంగపాటు కలిగిందని అన్నారు. వీటితో కాంగ్రెస్ అధ్యక్షునికి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్లు సిద్ధరామయ్యను తోసిపుచ్చినా, ఏ ఒక్క కాంగ్రెస్ నేతకైనా రాహుల్ గాంధీని ప్రశ్నించే ధైర్యం ఉందా అని గుహ ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీ కార్యకర్తల సంబరాలు 11.23-మొత్తం 214 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడైంది. వాటిలో బీజేపీ 114 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 58 స్థానాలలో, జేడీఎస్ 39 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 11.02-మొత్తం 209 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడి కాగా - బీజేపీ 111 స్థానాలలో, కాంగ్రెస్ 58 స్థానాలలో, జేడీఎస్ 37 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ, కేపీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒకో స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు. 10.47- కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తం 205 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడి కాగా - బీజేపీ 109 స్థానాలలో, కాంగ్రెస్ 56 స్థానాలలో, జేడీఎస్ 37 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 10.29 - మొత్తం 192 సీట్ల ఫలితాల సరళి వెల్లడైంది. 100 స్థానాలలో బీజేపీ, 52 స్థానాలలో కాంగ్రెస్, 37 స్థానాలలో జేడీఎస్ ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ ఒక స్థానంలో, కేపీజేపీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు. 10.00 - మొత్తం 157 సీట్ల ఫలితాల సరళి వెల్లడైంది. వాటిలో 76 చోట్ల బీజేపీ, 44 చోట్ల కాంగ్రెస్, 34 చోట్ల జేడీఎస్ ఆధిక్యతలో ఉన్నాయి. 09.57 - కర్ణాటకలో 'విజయం'పై బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్‌వర్గీయ అమిత్ షాకు అభినందనలు తెలిపారు. 09.53 - ఇప్పటివరకు 152 సీట్ల ఫలితాల సరళి వెలువడింది. వాటిలో 72 చోట్ల బీజేపీ, 44 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. జనతాదళ్ సెక్యులర్ 33 చోట్ల ఆధిక్యతలో ఉంది. బీఎస్పీ ఒక స్థానంలో, కేపీజేపీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. 09.51 - కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కర్నాటకలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 9.48: మొత్తం 129 సీట్లకు సంబంధించిన ఫలితాల సరళి విడుదల కాగా..బీజేపీ 67, కాంగ్రెస్ 42, జేడీఎస్ 30 చోట్ల ముందంజ. ఇతరులు 3 చోట్ల ముందంజలో ఉంది. కర్ణాటకలో పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు 9.36: బీజేపీ 55, కాంగ్రెస్ 29, జేడీఎస్ 21 చోట్ల ముందంజ. ఇతరులు 3 చోట్ల ముందంజ. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ట్రెండ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ 44 చోట్ల ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 25 స్థానాల్లో ముందుంది. జేడీఎస్ 17 చోట్ల ముందంజలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. 9.35: బీజేపీ 44, కాంగ్రెస్ 25 చోట్ల, జేడీఎస్ 17 చోట్ల ముందంజ బీజేపీ 34 చోట్ల ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 17 చోట్ల ముందంజలో ఉంది. 9.24: బీజేపీ 34, కాంగ్రెస్ 17 చోట్ల, జేడీఎస్ 9 చోట్ల ముందంజ 9.20: బీజేపీ 24, కాంగ్రెస్ 13 చోట్ల, జేడీఎస్ 6 చోట్ల ముందంజ 9.15: బీజేపీ 17, కాంగ్రెస్ 11 చోట్ల, జేడీఎస్ ఆరు చోట్ల ముందంజ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కూడా కీలకంగా మారనుంది. తాజా ఓట్ షేర్ 8.48: బీజేపీ 2 చోట్ల, కాంగ్రెస్ ఒక చోట ముందంజ 8.40: కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోందని ప్రభుత్వ అధికారిక టీవీ దూరదర్శన్ పేర్కొంది. 8.37: కర్ణాటకలో మొత్తం 38 చోట్ల పటిష్ఠ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలైంది. 8.35: ఎన్నికల సంఘం అప్‌డేట్ ప్రకారం.. రౌండ్ 1 ఇంకా పూర్తికాలేదు 8.30: రాజరాజేశ్వరీ నగర్, జయనగర్ అనే రెండు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ పూర్తికాలేదు. 8.20: ఎన్నికల సంఘం ప్రకారం.. రౌండ్ 1 ఇంకా పూర్తికాలేదు. 8.15: పలు టీవీ చానెళ్లు ఎన్నికల సరళి ఇదంటూ పలు వార్తలు ఇస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం ఇప్పటి వరకూ ఫలితాలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 8.00: ఓట్ల లెక్కింపు ప్రారంభం మొత్తం అసెంబ్లీ సీట్లు 6.4 కోట్ల జనాభా ఉన్న కర్నాటకలో సుమారు 4.97 కోట్ల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని? ఇవి కూడా చదవండి: విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత? (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే, ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ లభించలేదు. text: ఇంగ్లండ‌తో జరిగిన ఈ రెండో వన్డేలో భారత జట్టు 323 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో మాజీ కెప్టెన్ ధోనీ 27వ ఓవర్ చివర్లో ఆరో నంబరు బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. ఆయన 59 బంతులు ఆడి 37 పరుగులు చేశాడు. అందులో కేవలం నాలుగు ఫోర్లే ఉన్నాయి. 47వ ఓవర్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ‘‘అందరికీ చెడ్డ రోజులు ఉంటాయి. ఈ రోజు ఆయన ఒక్కడికే కాదు.. మా అందరకీ చెడ్డ రోజే’’ అని ధోనీ గురించి కోహ్లీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న ధోనీ తన 320వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌లో 10,000 పరుగుల మైలు రాయిని అందుకున్నారు. అయితే.. ఆయన ఇంగ్లండ్ జట్టు స్కోరును అధిగమించటంలో ఆయన విఫలమవటంతో ప్రేక్షకులు ‘బూ’ అంటూ గేలిచేశారు. ఇంగ్లండ్ జట్టులో జో రూట్ 113 పరుగులు చేశారు. ఆయనకిది అంతర్జాతీయ వన్డేల్లో 12వ శతకం. మరో బ్యాట్స్‌మన్ డేవిడ్ బెల్లీ 31 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వారిద్దరి సాయంతో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. ‘‘ధోనీ తన సహజ శైలిలో ఆడలేని ప్రతిసారీ ఈ విషయం ముందుకొస్తూనే ఉంటుంది’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ‘‘జనం త్వరగా ఒక అభిప్రాయానికి రావటం దురదృష్టకరం. ఆయన బాగా ఆడినపుడు.. అందరికన్నా గొప్పగా ఆటను ఫినిష్ చేస్తారని పొగుడుతారు. కానీ పరిస్థితులు అనుకూలించనప్పుడు జనం ఆయన మీదపడతారు’’ అని వ్యాఖ్యానించాడు. సీనియర్ వికెట్‌కీపర్ ధోనీ.. ఎట్టకేలకు భారీ షాట్‌ కొట్టటానికి ప్రయత్నించినపుడు బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్నారు. భారత జట్టు మ్యాచ్ చివరి బంతికి 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మంగళవారం హెడింగ్లే‌లో జరుగనున్న మూడో మ్యాచ్ విజేతను నిర్ణయిస్తుంది. ధోనీ వైఖరి పొరపాటు కాదని కోహ్లీ ఉద్ఘాటించారు. ‘‘ఇన్నింగ్స్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలన్నది ఆయన ఆలోచన. ఆయనకు ఆ అనుభవం ఉంది. కానీ కొన్నిసార్లు అనుకున్నట్లు జరగదు’’ అని చెప్పాడు. ‘‘మేం ఆయనను, ఆటగాళ్లందరి సామర్థ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తాం’’ అన్నాడు. భారత జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 11వ నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి చివరిగా ఔటయ్యాడు. అతడు కూడా సీనియర్ ఆటగాడైన ధోనీని సమర్థించారు. ‘‘అప్పటికే మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. దీంతో తర్వాతి మ్యాచ్‌కి ప్రాక్టీస్‌గా మాత్రమే పరిగిణంచాం’’ అని అతడు వ్యాఖ్యానించాడు. విశ్లేషణ ‘టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌‘లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ లక్ష్య ఛేదనల్లో, క్లిష్ట పరిస్థితుల్లో చాలా బాగా ఆడతాడని ధోనీకి చాలా పేరుంది. కానీ ఈ రోజు అతడు దారుణంగా విఫలమయ్యాడని నేను అనుకుంటున్నా. ప్రేక్షకులు ఒక రకమైన వినోదం కోరుకున్నారు. వారిని నేను అర్థం చేసుకోగలను. చివరి 15 ఓవర్లలో భారత జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. జనం తలగోక్కోవాల్సిన పరిస్థితి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) సాహసోపేతమైన ఎదురుదాడి ఆటకు పేరుగాంచిన ఎం.ఎస్.ధోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ రీతిలో రక్షణాత్మక వ్యూహం అవలంబించటాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్థించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 86 పరుగుల తేడాతో ఓడిపోయింది. text: ఈ బిల్లుకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీంతో, పౌరసత్వం సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించినట్లయింది. పౌరసత్వ సవరణ బిల్లును హోం మంత్రి అమిత్ షా బుధవారం ఉదయం సభలో ప్రవేశపెట్టారు. సభలో బిల్లుపై జరిగిన చర్చకు బదులిస్తూ అమిత్ షా, "నెహ్రూ-లియాఖత్ ఒప్పంద స్ఫూర్తిని పొరుగుదేశం విస్మరించిందని, ఆ పర్యవసానంగానే పౌరసత్వ సవరణ బిల్లు-2019ని తీసుకురావలసి వచ్చింది" అని అన్నారు. లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన శివసేన రాజ్యసభలో ఓటింగ్‌కు దూరంగా ఉంది. అంతకముందు బిల్లుపై సభలో సుదీర్ఘంగా చర్చజరిగింది, బిల్లులోని అంశాలపై సభ్యులు 13 సవరణలను ప్రతిపాదించారు. కొన్ని అంశాలపై డివిజన్‌కు పట్టుబట్టారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలా వద్దా అనేదానిపై నిర్వహించిన ఓటింగ్‌లో వద్దని 113 మంది సభ్యులు, పంపాలని 92 మంది సభ్యులు ఓటు వేశారు. సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. దీంతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించినట్లయింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం సభ వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం ప్రధాని మోదీ ‘‘భారత చరిత్రలో ఈరోజు ఒక మైలురాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం ఆనందంగా ఉంది. బిల్లుకు అనుకూలంగా ఓటువేసిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు. అనేక ఏళ్లుగా హింసకు గురైనవారికి ఈ బిల్లు ఉపశమనం కలిగిస్తుంది’’ అని ట్వీట్ చేశారు. ‘ఈ బిల్లు ఆమోదం పొందడంతో కోట్లాది మంది అణగారిన వారి కలలు ఇప్పుడు నెరవేరినట్లయింది. బాధిత ప్రజలకు గౌరవం, భద్రత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 'ఈ బిల్లు ఆమోదం భారత్‌లోని సంకుచిత మనస్తత్వం, మూర్ఖపు శక్తుల విజయాన్ని సూచిస్తుంది. భారత రాజ్యాంగానికి ఇది చీకటి రోజు' అని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొనట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. అంతకుముందు, బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించడాన్ని నమ్ముతుంది. ఆంధ్రప్రదే‌శ్‌కు నేతృత్వం వహిస్తున్న మా నేత జగన్మోహన్ రెడ్డి కులమతాలకు అతీతంగా పారదర్శక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కానీ, ఎవరైతే పొరుగు దేశాల్లో వేధింపులకు, హింసకు గురై ఇక్కడికి వచ్చారో, తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో శాంతియుత జీవితం గడపాలనుకుంటున్నారో వారికి పౌరసత్వం కల్పించడం సబబే అని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. దేశంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ వల్లే ఎక్కువ అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో షాబానో కేసును ప్రస్తావించారు. కనకమేడల ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ బిల్లుకు తమ పార్టీ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. "పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు అక్కడ జీవించలేమని భావిస్తే, తిరిగి భారత్‌కు రావచ్చని మహాత్మా గాంధీ 1947 సెప్టంబర్ 26న వారికి భరోసా ఇచ్చారు. అలా వచ్చినవారికి ఇక్కడ జీవించగలిగేలా, ఉద్యోగాలు చేసుకునేలా పరిస్థితులు కల్పించడం భారత ప్రభుత్వం మొదటి కర్తవ్యం అన్నారు" అని కనకమేడల చెప్పారు. అయితే, దేశంలో ముస్లింలకు తగిన రక్షణ, భద్రత కల్పిస్తామని హోంమంత్రి భరోసా ఇవ్వాలని కోరారు. బిల్లు పేరుతో ముస్లింల పట్ల వివక్షకు తావులేకుండా చూడాలని. వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కె.కేశవరావు పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ కోరింది. "ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి, దీనిపై రెండో అభిప్రాయమే ఉండకూడదు అని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు అన్నారు. ఈ బిల్లుతో తాము ఈ దేశంలో పౌరులం కాదేమో అనే భ‌యంతో కొంద‌రు ఉన్నార‌ని చెప్పారు. మ‌త‌ప‌రంగా మైనార్టీలుగా ఉన్న‌వారిని ర‌క్షించుకోవాల‌ని, ఏ ఒక్క వ‌ర్గాన్నీ వెలివేయ‌కూడ‌ద‌ని అన్నారు. మ‌తం ఆధారంగా దేశ విభ‌జ‌న జ‌రిగింద‌న్న ఐడియాను తాను న‌మ్మ‌డం లేద‌న్నారు. కపిల్ సిబల్ పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు. రాజ్యసభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో "హోంమంత్రి అమిత్ షా చరిత్ర ఎక్కడ చదువుకున్నారో తనకు అర్థం కావడం లేదని, 'టూ నేషన్ థియరీ' కాంగ్రెస్‌ది కాదని' ఆయన అన్నారు. "2014 నుంచి బీజేపీ ఒక ప్రత్యేక లక్ష్యంతో పనిచేస్తోందని, ఒకసారి లవ్ జీహాద్, ఇంకోసారి ఎన్ఆర్సీ, మరోసారి పౌరసత్వ సవరణ అంటోందని సిబల్ ఆరోపించారు. "ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని హోంమంత్రి చెబుతున్నారు, భారత్‌లో ఏ ముస్లిం మిమ్మల్ని చూసి భయపడడు. నేను భయపడను, ఈ దేశ పౌరులు భయపడరు. మేం భయపడితే రాజ్యాంగాన్ని చూసి భయపడతాం. మీరు దాన్నే భ్రష్టు పట్టిస్తున్నారు" అని కపిల్ సిబల్ అన్నారు. పి.చిదంబరం అంతకు ముందు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పౌరసత్వ సవరణ బిల్లు గురించి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రభుత్వంలోని బాధ్యతాయుతమైన ఏ వ్యక్తి అయినా వాటికి సమాధానం ఇవ్వవచ్చని అన్నారు. "ఈ బిల్లు పార్లమెంటు ముఖంపై కొట్టడం లాంటిది. దీని ద్వారా రాజ్యాంగవిరుద్ధమైన చర్యలు తీసుకోవాలని పార్లమంటును కోరుతున్నారు" అని చిదంబరం అన్నారు. దేశ అటార్నీ జనరల్ అయినా, వేరే ఏ అధికారి అయినా, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన వ్యక్తి అయినా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చని ఆయన చెప్పారు. చిదంబరం ప్రశ్నలు ఈ బిల్లు ఆర్టికల్ 14 మూడు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం లేదా. ఇది సమానత్వం అనే ప్రాథమిక హక్కు ఉల్లంఘన కాదా అని చిదంబరం ప్రశ్నించారు. అమిత్ షా సమాధానం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ దేశ విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితులు వల్లే బిల్లు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ మాట నిలబెట్టుకుందని, కానీ దాని మూడు పొరుగు దేశాలు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాయని అన్నారు. నెహ్రూ-లియాకత్ అలీ ఒప్పందాన్ని పొరుగు దేశాలు పాటించలేదని భావించిన అమిత్ షా, ఏది గాయపరిచిందో, అదే ఇప్పుడు ఆ గాయాల గురించి అడుగుతోందని కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. "ఆరు మతాల వారిని బిల్లులోకి తీసుకొచ్చాం. కానీ ముస్లింలను ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలను ఎందుకు బిల్లులో చేర్చలేదో చెప్పాలని నేను అనుకుంటున్నాను" అన్నారు. "ఈ బిల్లు ఏ మూడు దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కున్నారో, వారికి పౌరసత్వం ఇవ్వడం కోసమే తీసుకొచ్చాం". "మైనారిటీ అనే మాటను ఉపయోగించినప్పుడు, విపక్షంలో కూర్చున్నవారు మాట్లాడుతుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో ఇస్లాంను విశ్వసించేవారు మైనారిటీలా ఏంటి?. దేశ మతం ఇస్లాం అయితే ముస్లింలపై వేధింపులు తక్కువే ఉంటాయి". "ముస్లింలు రావడం వల్లే లౌకికవాదం నిరూపితమవుతుందా. మేం మా వివేకంతో చట్టాలు చేస్తున్నాం. కోర్టులో కూడా అదే నిరూపితమవుతుందని నాకు నమ్మకం ఉంది" అని అమిత్ షా చెప్పారు. "మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరి నుంచీ పౌరసత్వం లాక్కోవడం జరగదు. మతపరంగా వేధింపులు ఎదుర్కున్న వారికి పౌరసత్వం అందిస్తాం" అని హోంమంత్రి అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బుధవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేయగా, 105 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. text: భారత యుద్ధ విమాన పైలట్ అభిందన్ వర్ధమాన్‌ను ఇటీవల పాకిస్తాన్ నిర్బంధించింది రెండు దేశాల జట్లు వచ్చే ఆదివారం నాడు అంటే జూన్ 16వ తేదీన క్రికెట్ మైదానంలో తలపడుతున్నాయి. ఈ ప్రపంచ కప్‌లో క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇదే అనటంలో సందేహం లేదు. అయితే పాకిస్తాన్ ఒక అడ్వర్టైజ్‌మెంట్‌తో ఉద్రిక్తతను మరింతగా పెంచింది. గత ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్పపుడు పాకిస్తాన్ నిర్బంధించిన భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్‌ మీద వ్యంగ్యంగా రూపొందించిన అడ్వర్టైజ్‌మెంట్ ఇది. భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లో 40 మంది భారత పారమిలటరీ సిబ్బంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. రెండు దేశాల మధ్య ఇక యుద్ధం మొదలవుతుందా అన్నంతగా పరిస్థితులు వేడెక్కాయి. ఆ పరిణామాల్లో పాక్ తాను నిర్బంధించిన భారత వాయుసేన పైలట్‌ను 'శాంతి సూచిక'గా భారత్‌కు అప్పగించటం.. ఆ సంఘటన తర్వాత అభినందన్ భారత్‌లో నేషనల్ హీరోగా ప్రజా మన్ననలు అందుకోవటం తెలిసిందే. అభినందన్‌ను నిర్బంధించినపుడు పాకిస్తాన్ అధికారుల ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు చిత్రీకరించి వెంటనే వీడియో విడుదల చేయటమూ తెలిసిందే. ఆ వాస్తవ వీడియోలో.. పాకిస్తాన్ అధికారులు తన స్క్వాడ్రన్, తన మిషన్ గురించి అడిగిన ప్రశ్నలకు.. ''క్షమించండి.. ఆ విషయాలు నేను చెప్పకూడదు'' అని అభినందన్ బదులివ్వటం వినిపిస్తుంది. ఆ వీడియోను అనుకరిస్తూ పాకిస్తాన్ టెలివిజన్ రూపొందించిన అడ్వర్టైజ్‌మెంట్‌లోని నటుడు.. అభినందన్ తరహాలో గుబురు మీసాలతో, భారత క్రికెట్ జెర్సీ ధరించి కనిపిస్తాడు. ఈ వీడియోలో తనను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి ఆయన నిరాకరిస్తాడు. కానీ ఈ వీడియోలో.. రాబోయే భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ గురించి ప్రశ్నలు అడుగుతారు. 'భారత జట్టులో ఎవరెవరు ఉంటారు?' వంటి ప్రశ్నలు అడుగుతారు. ఒక టీ కప్పుతో టీ తాగుతున్న నటుడు అభినందన్ తరహాలో 'క్షమించండి.. ఆ వివరాలు నేను చెప్పకూడదు' అని బదులిస్తాడు. అనంతరం అతడిని విచారణ నుంచి వెళ్లిపోవచ్చని చెప్తారు. అతడు వెళ్లిపోతుంటే మళ్లీ ఆపి చేతిలో ఉన్ కప్‌ను ఇచ్చి వెళ్లాలని నిర్దేశిస్తారు. క్రికెట్ ప్రపంచ కప్‌ ట్రోఫీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అది. భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ఇటీవల జరిగిన తీవ్ర ఉద్రిక్త సంఘటనను వ్యంగ్యంగా మలచి క్రికెట్‌కు అన్వయించిన అడ్వర్టైజ్‌¿మెంట్ ఇది. ఈ యాడ్ భారత్‌లో చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ఈ రకంగా యాడ్ తయారుచేసి ప్రసారం చేయటం ''సిగ్గుచేటు'' అని, ''మూర్ఖత్వం'' అని సోషల్ మీడియాలో చాలా మంది మండిపడ్డారు. ఈ అడ్వర్టైజ్‌మెంట్ గేలి చేసినట్లుగా ఉందని చాలా మంది ఖండిస్తే.. కొంతమంది హాస్యభరితంగా ఉందంటూ నవ్వేశారు. పాకిస్తాన్ మీద గెలవటం ద్వారా భారత జట్టు ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు గట్టిగా బదులివ్వాలని కొందరు యూజర్లు పిలుపునిచ్చారు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో జరగబోయే భారత్ - పాక్ మ్యాచ్‌కు ఇరు దేశాల అభిమానులూ పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు దేశాల ప్రజల్లో ఉద్వేగ్నిత పెరుగుతోందన్నది స్పష్టం. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ తరహా అడ్వర్టైజ్ ‌మెంట్లను గర్హిస్తూ ట్వీట్ చేశారు. అయితే.. బ్రిటన్‌లో వర్షాల కారణంగా ఈ వరల్డ్ కప్ పోటీల్లో ఇప్పటికే పలు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అదే తరహాలో భారత్ - పాక్ మ్యాచ్ కూడా రద్దయితే..? ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత్ - పాకిస్తాన్‌ల మధ్య 'ఉద్రిక్తతలు' మళ్లీ తీవ్రమవుతున్నాయి. కాకపోతే, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి. text: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న తమ దేశంలో విలీనం చేసుకుంది. అప్పుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను పాలిస్తున్నారు. ఆ సమయంలో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా ఆయన్ను పరిగణించేవారు. నిజాంకు ఆర్థిక మంత్రిగా ఉన్న మోయిన్ నవాజ్ జంగ్ ఆపరేషన్ పోలో సమయంలో బ్రిటన్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్‌ ఇబ్రహీం రహ్మతుల్లాకు పది లక్షల పౌండ్లను 'జాగ్రత్తగా దాచమని' పంపించారు. రహ్మతుల్లా నాట్‌వెస్ట్ బ్యాంకు ఖాతాకు ఈ సొమ్ము బదిలీ అయ్యింది. అయితే, ఈ నగదు ఎవరికి చెందాలన్నదానిపై ఇంకా నిజాం వారసులకు, పాకిస్తాన్‌కు మధ్య న్యాయవివాదం కొనసాగుతోంది. బ్యాంకులో ఉన్న ఆ డబ్బు ఇప్పుడు వడ్డీతో కలిపి 3.5 కోట్ల పౌండ్లకు చేరుకుంది. భారత కరెన్సీలో దాని విలువ దాదాపు రూ.310 కోట్లు. రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో నడుస్తున్న ఈ కేసు త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మార్కస్ స్మిత్ అక్టోబర్‌లో తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ కేసులో నిజాం మనవళ్లలో ఒకరైన ఎనిమిదో ముకరం జా తరఫున విథర్స్ వరల్డ్‌వైడ్ న్యాయవాద సంస్థకు చెందిన పాల్ హెవిట్ వాదిస్తున్నారు. ఈ లావాదేవీ చరిత్ర గురించి ఆయన వివరించారు. ''ఆ లావాదేవీ గురించి తెలుసుకున్న వెంటనే డబ్బు వెనక్కిఇవ్వాలని ఏడో నిజాం పాకిస్తాన్‌ను కోరారు. అయితే రహ్మతుల్లా అందుకు అంగీకరించలేదు. ఆ డబ్బు ఇక పాకిస్తాన్‌దేనని ఆయన స్పష్టం చేశారు'' అని హెవిట్ తెలిపారు. దీంతో 1954లో ఏడో నిజాం ఆ డబ్బు కోసం యూకే హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. అయితే, అక్కడ పాకిస్తాన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని నిజాం అప్పీళ్ల కోర్టులో సవాలు చేసి, గెలిచారు. అయితే, పాకిస్తాన్ హౌజ్ ఆఫ్ లార్డ్స్‌ను ఆశ్రయించింది. అప్పట్లో అదే యూకే సర్వోన్నత న్యాయస్థానం. సార్వభౌమిక దేశమైన పాకిస్తాన్‌పై నిజాం కేసు వేయడం కుదరదని పాక్ వాదించింది. హౌజ్ ఆఫ్ లార్డ్స్ కూడా పాకిస్తాన్ వాదనను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో, ఆ సొమ్ము ఉన్న బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసింది. అప్పటి నుంచి రహ్మతుల్లా నాట్‌వెస్ట్ బ్యాంకు ఖాతాలో డబ్బులు అలాగే ఉన్నాయి. ఆ డబ్బు ఎవరికి చెందాలన్నది తేలాక, వారికి ఆ సొమ్ము అందజేస్తామని బ్యాంకు వెల్లడించింది. గత 60 ఏళ్లలో వడ్డీతో కలిపి ఆ సొమ్ము పెరుగుతూ పోయింది. ఈ కేసును పరిష్కరించుకునేందుకు వివిధ పక్షాల మధ్య రాజీ కోసం ప్రయత్నాలూ జరిగాయి. అయితే, అవేవీ సఫలం కాలేదు. 1967లో ఏడో నిజాం మరణించారు. అప్పటి నుంచి ఆయన వారసులు ఆ డబ్బును దక్కించుకునేందుకు న్యాయపోరాటం చేస్తున్నారు. 2013లో ఆ డబ్బును పొందేందుకు పాకిస్తాన్ హైకమిషనర్ నాట్‌వెస్ట్ బ్యాంకుపై చర్యలు ప్రారంభించారు. దీంతో ఆ బ్యాంకు ఆ డబ్బు తమదని వాదిస్తున్న మిగతా పక్షాలను కూడా వివాద పరిష్కారం కోసం ఆహ్వానించింది. మొదట నిజాం మనవళ్లను, ఆ తర్వాత భారత ప్రభుత్వాన్ని కూడా ఆహ్వానించింది. ఈ డబ్బు తమకు చెందుతుందని భారత్ కూడా ఓ సమయంలో వాదించింది. ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’ నిజాం మనవళ్లు ఇద్దరూ భారత ప్రభుత్వంతో చేతులు కలిపారని పాల్ హెవిట్ చెప్పారు. అయితే, ఈ అంగీకారం కుదరినట్లు రుజువు చేసే అధికారిక పత్రాలేవీ లేవు. నిజాం వారసులు ఈ కేసు గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఆపరేషన్ పోలో సమయంలో భద్రపరచడం కోసమే ఆ డబ్బును పాకిస్తాన్‌కు ఇచ్చినట్లు నిజాం కుటుంబం చెబుతోంది. విలీన సమయంలో ఏడో నిజాంకు తాము అందించిన సహకారానికి బదులుగా తమ దేశ ప్రజలకు ఆ డబ్బును ఆయన బహుమతిగా ఇచ్చారని పాకిస్తాన్ వాదిస్తోంది. ''1947-48 మధ్య హైదరాబాద్‌కు పంపిన ఆయుధాలకు చెల్లింపుగానే ఆ పది లక్షల పౌండ్లు తమకు అందాయని పాకిస్తాన్ 2016లో వాదించింది'' అని పాల్ హెవిట్ చెప్పారు. పాకిస్తాన్ తరఫున వాదిస్తున్న ఖవార్ ఖురేషీ ఈ కేసుపై ఏమీ మాట్లాడేందుకు ముందుకు రాలేదు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ''ఏడో నిజాంకు పాకిస్తాన్ అందించిన సహకారానికి పరిహారంగానూ, భారత్ చేతుల్లోకి డబ్బులు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనూ హైదరాబాద్ ఆ పది లక్షల పౌండ్లను రహ్మతుల్లా ఖాతాకు బదిలీ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ సహకారం అందించింది'' అని పాకిస్తాన్ వాదనల కాపీలో ఉంది. 1948 సెప్టెంబర్ 20న ఆ లావాదేవీ జరిగినట్లు కూడా ఆ కాపీ పేర్కొంది. ఈ లావాదేవీ గురించి రెండు పక్షాల మధ్య రాతపూర్వక ఒప్పందమేదైనా కుదిరిందా అన్న ప్రశ్నకు.. ''ఈ లావాదేవీ జరిగినట్లే తనకు తెలియదని ఏడో నిజాం కోర్టులో ప్రమాణం చేసి చెప్పారు. నిజాం కోసం డబ్బును భద్రపరచాలన్న ఉద్దేశంతోనే రహ్మతుల్లాకు హైదరాబాద్ ఆర్థిక మంత్రి డబ్బు పంపించినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి'' అని పాల్ హెవిట్ వివరించారు. ''బతికుండగా ఆ డబ్బు తన చేతికి రాదని ఏడో నిజాం నిర్ణయానికి వచ్చారు. ఆ మొత్తం తన ఇద్దరు మనవళ్లు యజమానులుగా ఉన్న ట్రస్టుకు చేరేలా చర్యలు తీసుకున్నారు'' అని పాల్ హెవిట్ తెలిపారు. ఇటువంటి చారిత్రక నేపథ్యమున్న కేసు చాలా చాలా అరుదని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌కు చేరిన ఆ డబ్బు గురించి దక్కన్ హెరిటేజ్ సొసైటీ ఛైర్మన్ మహమ్మద్ సైఫుల్లాతో బీబీసీ తెలుగు రిపోర్టర్ దీప్తి బత్తిని మాట్లాడారు. ప్రస్తుతం రూ.310 కోట్ల వరకూ విలువ ఉన్న ఆ సొమ్మును మూడు సమాన భాగాలుగా పంచుకునేలా భారత్, నిజాం వారసులు, పాకిస్తాన్ ఒక అంగీకారానికి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమై ఇన్నేళ్లు గడుస్తున్నా, ఆ కాలంలో జరిగిన ఓ భారీ నగదు లావాదేవీపై ఇంకా వివాదం నడుస్తోంది. text: ఆగ్రాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న 62 ఏళ్ల వికాస్ చంద్ర అగ్రవాల్ ఆరోగ్యం అంతకంతకూ దిగజారుతుంటే, ఆయన కొడుకు వైభవ్‌లో ప్లాస్మా దొరకలేదనే ఆందోళన తీవ్రంగా పెరిగిపోతోంది. ప్లాస్మా కోసం ఆయన దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ప్లాస్మా కోసం ఇంత ఇబ్బంది పడుతోంది వైభవ్ ఒక్కరే కారు. గురువారం ప్లాస్మా కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న ఇద్దరు మాకు ఫోన్ చేసారు. ప్లాస్మా మాచ్ ఫిక్సింగ్ అంటే డోనర్-రిసీవర్‌ను కలిపే సంస్థ ‘ఢూండ్’ వెబ్‌సైట్‌లో రోజూ పదుల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్నారు. కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తుల నుంచి తీసిన ప్లాస్మాను కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు చాలాసార్లు గమనించారు. “మా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న వారిలో రిసీవర్స్ అంటే ప్లాస్మా అవసరమైన వారి సంఖ్య, డోనర్స్ కంటే ఎక్కువగా ఉంది” అని లండన్‌లో ఉంటున్న సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్, ‘డూండ్’ పార్టనర్ ముకుల్ పాహ్వా చెప్పారు. ప్లాస్మా థెరపీ ఎప్పటిలాగే ప్లాస్మాకు అయ్యే మొత్తం ఖర్చును అవసరమైనవారి నుంచి వసూలు చేస్తున్నారు. ఒక యూనిట్ (525 ఎంఎల్) ప్లాస్మాకు 25 వేల నుంచి 30 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ లావాదేవీలకు డార్క్-వెబ్ సాయం కూడా తీసుకోవడంపై కూడా చర్చ జరుగుతోంది. కొందరు ప్లాస్మా డోనర్లకు డబ్బు ఇవ్వడంతో పాటు, వారు వచ్చిపోయేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కొన్ని వార్తా పత్రికలు రాశాయి. ఇంత చేస్తున్నా ప్లాస్మా దొరకడం ఇప్పటికీ చాలా కష్టంగా ఉంది. కొంతమంది ప్లాస్మా పేరుతో మోసం చేస్తున్నారని, చాలా మంది దగ్గర దానికోసం ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కొన్ని రోజుల క్రితం ప్రజలను అప్రమత్తం చేశారు. “ప్లాస్మా థెరపీ కోవిడ్-19కు చికిత్స కాదు. కానీ, దానివల్ల రోగుల పరిస్థితి కొంత మెరుగుపడుతోంది. అందుకే దాని డిమాండ్ పెరిగింది” అని ఆయన మీడియాతో అన్నారు. “ప్లాస్మా డోనర్లకు ఐదు వేల రూపాయల ప్రోత్సాహక మొత్తం ఇస్తాం” అని కర్ణాటక వైద్యవిద్యా మంత్రి కొన్ని రోజుల క్రితం తన డైలీ ప్రెస్ బ్రీఫింగ్‌లో ప్రకటించడానికి కూడా ఇదే కారణం. ప్లాస్మా కొరత ఎందుకు ఉంది? రక్తం, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా లాంటి వాటికి సంబంధించిన అంశాలను ‘నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ కౌన్సిల్’ పర్యవేక్షిస్తుంది. దాని ప్రకారం ప్లాజ్మా కోసం ఒక యూనిట్‌కు 400 రూపాయలు తీసుకోవచ్చు. “ప్లాస్మా కొరతకు ఒక పెద్ద కారణం పాథాలజీ లాబ్స్, కలెక్షన్-ప్రిజర్వేషన్ లాంటి సౌకర్యాల లోటు భారీగా ఉండడమే. రక్తం, శరీర అవయవాలు లాంటివి దానం చేయడం గురించి ప్రజల్లో అవగాహనా లోపం, భ్రమలు కూడా ఉన్నాయి” అని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్, కమ్యూనిటీ మెడిసిన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నఫీజ్ ఫైజీ అన్నారు. “ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి ప్రభుత్వాన్ని దోషిగా చూడలేం. ప్లాస్మా దానం చేయవచ్చు. కానీ, నాకు మళ్లీ కరోనా వస్తే ఏమవుతుందో అనే భయం వారిలో ఉంటుంది” అని ఆరోగ్య కార్యకర్తల స్వచ్ఛంద సంస్థ, ప్రజారోగ్య ప్రచారానికి సంబంధించిన డాక్టర్ గార్గేయ తెల్కపల్లి తెలిపారు. అయితే ప్లాస్మా థెరపీ గురించి ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి వెల్లడైన ఫలితాలనే ఫైనల్ అని భావించలేం. కానీ, కోవిడ్-19 వైరస్ వల్ల మన శరీరంలో వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తి (యాంటీ బాడీస్) మూడు నెలల్లో అంతం అవుతుందని కొన్ని ప్రముఖ విదేశీ వార్తా పత్రికలు రాశాయి. చాలా ప్రాంతాల్లో కోవిడ్-19 బాధితులు కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ప్లాస్మా థెరపీలో కరోనా వచ్చి కోలుకున్న సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను కోవిడ్-19కు గురైన మరో రోగి శరీరంలోకి ఎక్కించవచ్చు. ఈ చికిత్సా పద్ధతిని ‘కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ’ అంటారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి తీసుకున్న ప్లాస్మా వల్ల మరో రోగి రక్తంలో ఉన్న వైరస్‌ను అంతం చేయవచ్చు అనే ఆలోచన ఆధారంగా ఈ థెరపీని ఉపయోగిస్తున్నారు. కోవిడ్-19కు ముందు సార్స్, మెర్స్, హెచ్1ఎన్1 లాంటి మహమ్మారిలకు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించారు. ప్రయోగశాలలు, బ్లడ్ బ్యాంకులు, అవసరమైన మందులు అందుబాటులో ఉంటుంటే, అన్ని పెద్ద ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్సపై దృష్టి పెట్టి ఉంటే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కావని ఆరోగ్య రంగంలోని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న ప్లాస్మా డిమాండ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మెడికల్ కాలేజీలోనే ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని సౌకర్యాలూ అందుబాటులో లేవు. ముందు ముందు వాటిని ప్రారంభించనున్నారు. కొన్ని రిపోర్టుల ప్రకారం బనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఈ చికత్సను గతవారమే ప్రారంభించారు. లఖ్‌నవూ కేజీఎంయూలో ఈ సౌకర్యం ఉంది. కానీ ఎస్‌జీపీజీఐకి డోనర్లు దొరకడం లేదు. దేశ రాజధాని దిల్లీలో గత వారం లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో రెండో ప్లాస్మా బ్యాంక్‌ ప్రారంభించారు. వసంత్ కుంజ్‌లో ఉన్న మొదటి బ్యాంక్ ఐఎల్‌బీఎస్‌లో గత నెల నుంచీ పనిచేస్తోంది. “మనం దానం చేస్తున్న రక్తం, ప్లాస్మా తీవ్ర అనారోగ్యానికి గురైనవారికి, చావుబతుకుల్లో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చనే విషయాన్ని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దానికి తుది ఫలితం ఎలా ఉంటుందనేదానిపై వారికి అవగాహన ఉండాలి. కానీ, మన ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులనే మనం సరిగా నడపలేనప్పుడు, ప్రభుత్వాలు ఆరోగ్యంపై నామమాత్రం వ్యయం చేస్తున్నప్పుడు అది కష్టం” అని గార్గేయ తెల్కపల్లి అభిప్రాయపడ్డారు. ప్లాస్మా దానం చేసేలా కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులను ప్రోత్సహించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత వారం ఆస్పత్రులకు సూచించారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ప్లాస్మా డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ కోవిడ్-19కు మెరైగున చికిత్సగా కనిపించిన నాలుగైదు వైద్యాల్లో ప్లాస్మా థెరపీ ఒకటి. అలాంటప్పుడు దానికి డిమాండ్ పెరగడం అనేది సహజమే. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ప్లాస్మా అవసరమైనప్పుడు కొంతమంది దానికి బదులు తనను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం అద్వితీయ మల్ గుర్తించారు. అందుకే అద్వితీయ మల్ తన స్నేహితుడు ముకుల్ పాహ్వాతో కలిసి ‘ఢూండ్’ అనే పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించారు. ఇది ప్లాస్మా పొందడానికి ప్రజలకు సాయం చేస్తోంది. ప్లాస్మా కొరతతో బ్లాక్ మార్కెట్ జోరు “దేశం నలు మూలల నుంచి జనం పెద్ద సంఖ్యలో మా వెబ్‌సైట్‌లో నమోదవుతున్నారు. మేం ఈ ప్రయత్నాన్ని నెల క్రితమే చేశాం. జనం ప్లాస్మా కోసం మొదట్లో వాట్సప్ ద్వారా మెసేజిలు పంపించేవారు” అని ముకుల్ పాహ్వా చెప్పారు. “ప్లాస్మా అవసరమైన వారు కనుచూపు మేరలో కనిపిస్తున్నప్పడు, వారితో ఎలాంటి లావాదేవీలైనా జరపవచ్చనే విషయం దానం చేసేవారికి తెలిసిపోతుంది. కానీ, మేం డోనర్-రిసీవర్‌ కలిసి మాట్లాడుకునేలా మాత్రమే చేస్తాం” అని ముకుల్ పాహ్వా స్పష్టం చేశారు. తర్వాత చర్చ వారిద్దరి మధ్యే నడుస్తుందని. తన సంస్థ వాటన్నిటికీ దూరంగా ఉంటుందని తెలిపారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ ఓం శ్రీవాస్తవ్ నుంచి కూడా ‘ప్రాణ్’ పేరుతో ఇలాంటి ప్రయత్నమే మొదలైంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుకు చెందిన ప్రొటోకాల్, మిగతా కోణాలపై పనులు జరుగుతున్నాయని ఆయన సహచర డాక్టర్ మారియా నిగమ్ చెప్పారు. “ఇలాంటి కొత్త థెరపీలు ఎప్పుడు వెలుగులోకి వచ్చినా, వాటి ధర, ఇలాంటి లావాదేవీల గురించి వార్తలు వస్తుంటాయి. వాటిని అదుపు చేయగల సంస్థలు బలహీనంగా ఉన్నప్పుడు, ఇలాంటివాటికి కళ్లెం వేయడం కష్టంగా కనిపిస్తుంది” అని డాక్టర్ నఫీస్ ఫైజీ అంటారు. “ఆరోగ్య రంగంలో బ్లాక్ మార్కెట్ లేకుండా ఏది దొరుకుతోంది? ఇక కరోనా వచ్చినవారు ఎంత షాక్‌లో ఉంటారంటే, వారు తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయడానికి కూడా సిద్ధపడతారు” అని వాలంటరీ హెల్త్ వర్కర్ ఆశా మిశ్రా తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్లాస్మా చికిత్సకు సంబంధించిన రిమెడిసివిర్ లాంటి మందులను మూడు నాలుగు రెట్ల ధరకు అమ్మతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స కోసం భారీగా వసూలు చేస్తున్నారనే వార్తలు రావడంతో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దానిపై ఒక రేట్-లిస్ట్ జారీ చేసింది. కానీ దానికి పూర్తిగా తెరపడలేదని చెబుతున్నారు. 'జాతీయ బ్లడ్ పాలసీ' ప్రకారం రక్తాన్ని డ్రగ్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ 1940 కింద ఔషధాల శ్రేణిలో ఉంచారు. దానిని అక్రమంగా అమ్మడం, కొనడం చేస్తే వారికి రెండేళ్ల శిక్ష విధించవచ్చు. కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆస్పత్రులకు, బ్లడ్ బాంకులకు, బంధువులకు వరసగా ఫోన్లు చేసిన వైభవ్, ఆయన భార్యకు వేళ్లు నొప్పులు పుడుతున్నాయి. నిద్ర లేక కళ్లు మూతలు పడుతున్నాయి. అలసటగా ఉంది. అయినా, ఆ ఇంటి పెద్ద వికాస్ చంద్ అగ్రవాల్ కోసం ఏబీ పాజిటివ్ గ్రూప్ ప్లాస్మా సంపాదించాలని మూడు రోజులుగా వాళ్లు చేసిన ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది. text: పోలీస్ ఉద్యోగం కోసం పరుగుపందేలు దాటుకుని, పరీక్షలు రాసి తీరా ఎంపికయ్యాక, 'మాకొద్దు బాబోయ్‌ ఈ ఉద్యోగం' అంటూ రాష్ట్రంలో కొందరు మొహం చాటేస్తున్నారు. అసలు శిక్షణకే హాజరుకాని వారు కొందరైతే, ఇంకొందరు శిక్షణ మొదలయ్యాక అర్ధంతరంగా నిష్క్రమిస్తున్నారు. కానిస్టేబుల్‌ శిక్షణ మొదలైన పది రోజుల్లోనే దాదాపు 50 మంది వరకూ ఇలా వెళ్లిపోయారు. మొత్తం 16,295 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి గానూ గత ఏడాది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎన్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటన ఇవ్వగా దాదాపు ఆరులక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ రాత, దేహదారుఢ్య పరీక్షల వంటివి పూర్తిచేసి చివరకు 18,690 మందిని అర్హులుగా తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 కేంద్రాల్లో జనవరి 17న శిక్షణ మొదలైంది. ఉద్యోగానికి ఎంపికైన వారిలో 1370 మంది శిక్షణకు గైర్హాజరయ్యారు. వీరిలో 500 మంది తమకు ఈ ఉద్యోగం ఇష్టంలేదని రాతపూర్వకంగానే చెప్పారు. మిగతా వారు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం ముగ్గురు, నలుగురు అభ్యర్థులు వెళ్లిపోతున్నట్లు సమాచారం. శిక్షణ సమయంలో క్రమశిక్షణ నిబంధనలు, ఫోన్‌కు దూరంగా ఉండాల్సి రావడం, బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడం, ఎప్పుడంటే అప్పుడు సెలవులు పెట్టే వెసులుబాటు లేకపోవడం వల్ల అభ్యర్థులు ఉద్యోగాలు వద్దనుకుంటుండొచ్చని అధికారులు అంటున్నారు. 'ఇన్‌సైడర్‌ ట్రేడింగ్'పై ఈడీ కేసు రాజధాని అమరావతిలో భూ కుంభకోణం జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై దర్యాప్తుకు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిద్ధమైనట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది. రాజధాని పేరుతో సాగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ సోమవారం ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే ఆరోపణలున్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ లోపు సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. పతనం దిశగా ఏపీ: చంద్రబాబు తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కనీవినీ ఎరుగని ఆర్థిక పతనం చోటు చేసుకుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ''రాష్ట్రం నుంచి బయటకు పారిపోయేవారే తప్ప రాష్ట్రానికి వచ్చేవారు లేరు. కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు. ఉద్యోగాలు లేవు. ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ లేదు'' అని చంద్రబాబు అన్నారు. ''విశాఖకు డేటా సెంటర్‌ తేవాలని అనుకొన్నాను. దాంతో వేలాది ఉద్యోగాలు వచ్చేవి. కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం లులూ కంపెనీని ఒప్పించడానికి కొచ్చిన్‌ వెళ్లి... అక్కడ కట్టిన మెగా కాంప్లెక్స్‌ కూడా చూసి వచ్చాను. ఇంత శ్రమను ఈ ముఖ్యమంత్రి కాలరాశారు'' అని చెప్పారు. ''ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తొమ్మిది నెలల నుంచి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఏం కనుక్కొన్నారు? తెల్లకార్డుల వాళ్లు భూములు కొన్నారని అంటారు. రాష్ట్రంలో తొంభై శాతం మంది వద్ద తెల్ల రేషన్‌ కార్డులే ఉన్నాయి. ఎవరైనా అక్రమంగా కొంటే కేసు పెట్టండి. అధికారం మీదే కదా? ఎవరు ఆపారు?'' అని చంద్రబాబు అన్నారు. ఆడపిల్లలకు సర్కారు బడి.. మగపిల్లలకు కాన్వెంట్ చదువు తెలంగాణలో విద్య విషయంలో ఆడపిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని, చాలా కుటుంబాలు తమ ఇళ్లలోని ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు, మగపిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నాయని ‘వెలుగు’ దినపత్రిక ఓ వార్త రాసింది. రాష్ట్రంలో స్కూళ్లు, ఇంటర్‌‌ వరకు కాలేజీలు కలిపి మొత్తం 11,621 ప్రైవేటు విద్యా సంస్థలుంటే.. వాటిల్లో 16,53,352 మంది అమ్మాయిలు, 19,73,352 మంది అబ్బాయిలు చదువుతున్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు 9 శాతం ఎక్కువ. ఇందుకు భిన్నంగా 29,822 సర్కారీ విద్యాసంస్థల్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. సర్కారీ స్కూళ్లు, కాలేజీల్లో 14,80,127 మంది అమ్మాయిలుంటే.. అబ్బాయిల సంఖ్య 13,42,308 మంది మాత్రమే. అంటే అమ్మాయిలే 5.5 శాతం ఎక్కువగా ఉన్నారు. ప్రైవేటుతో పోలిస్తే తక్కువ ఫీజులు ఉండే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 61 శాతం అమ్మాయిలు చదువుతుంటే, అబ్బాయిలు 39 శాతం మందే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా, పట్టణ ప్రాంతాల్లో కొంత వరకూ ఈ పరిస్థితి ఉంది. అన్ని కులాలు, వర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అమ్మాయిల కంటే అబ్బాయిల చదువుకే తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) తెలంగాణలో కష్టపడి సాధించిన పోలీసు ఉద్యోగాలను కొందరు యువకులు శిక్షణలో ఉండగానే వదులుకొని వెళ్లిపోతున్నారని 'ఈనాడు' దినపత్రిక ఓ కథనం రాసింది. text: లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ గ్లోబల్‌వెబ్ఇండెక్స్ ప్రపంచంలోని 45 అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ల (దేశాల) నుంచి సేకరించిన డేటాను విశ్లేషించింది. ఒక్కో వ్యక్తి సోషల్ మీడియా వెబ్‌సైట్లను, అప్లికేషన్లను చూసేందుకు కేటాయించే సమయం 2012లో రోజుకు 90 నిమిషాలు ఉండగా, 2019 మొదటి మూడు నెలల్లో 143 నిమిషాలకు పెరిగిందని అంచనా వేశారు. సోషల్ మీడియా వాడకంలో ప్రాంతాలు, దేశాల వారీగా చూస్తే భారీ తేడాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, లాటిన్ అమెరికా ముందుంది. ఇక్కడ నెటిజన్లు రోజూ తెరల మీద గడిపే సమయం సగటున 212 నిమిషాలు. అత్యల్ప ప్రాంతీయ సగటు ఉత్తర అమెరికాలో (116 నిమిషాలు) ఉంది. ఇక, ప్రజలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే దేశం ఫిలిప్పీన్స్. ఈ దేశంలో రోజుకు సగటున 241 నిమిషాలు సోషల్ మీడియా వాడుతున్నారు. జపాన్‌లో వాడకం కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంది. భారత్‌లో తగ్గుదల ఆశ్చర్యకరంగా... 20 దేశాలలో ప్రజలు తెరల మీద గడిపే సమయంలో మార్పు లేదని, లేదా తగ్గిందని వెల్లడించింది. థాయిలాండ్‌లో రోజువారీ సోషల్ మీడియా వాడకం అత్యధికంగా పడిపోయింది. ఇక్కడ సగటున నెటిజన్లు తెరల మీద గడిపే సమయం 2018లో 194 నిమిషాలు కాగా, , 2019 నాటికి 171 నిమిషాలకు పడిపోయింది. వియత్నాంలో, గత ఏడాదితో పోలిస్తే రోజువారీ వినియోగం సగటున 10 నిమిషాలు తగ్గిపోయింది. భారత్‌లో కూడా 2018తో పోలిస్తే, 2019లో సోషల్ మీడియా వినియోగం సగటున 3 నిమిషాలు తగ్గింది. ఇండోనేషియా, బెల్జియం, ఘనా, అమెరికాలో కూడా భారీ తగ్గుదల నమోదైంది. కొన్ని దేశాలలో సోషల్ మీడియాలో గడిపే సమయంలో కాస్త తగ్గుదల కనిపించినా, సర్వే చేసిన చాలా దేశాలలో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సర్వేలో సుమారు 18 లక్షల మంది పాల్గొన్నారు. "తెరల మీద గడిపే సమయం గురించి చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారుల్లో మంచి అవగాహన ఉంది" అని గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్ సూచిస్తోంది. "ఇంటర్నెట్ వినియోగదారులు ప్రస్తుతం సగటున రోజుకు ఆరు గంటలకు పైగా ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. అందులో మూడోవంతు సమయం సోషల్ మీడియాకు కేటాయించారు" అని గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్ సంస్థ ట్రెండ్స్ మేనేజర్ చేజ్ బకిల్ బీబీసీకి చెప్పారు. ఫిలిప్పీన్స్‌లో రోజూ సగటున నాలుగు గంటలకు పైగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు సూపర్ యాప్‌లు ప్రస్తుతం చైనాలో వినియోగదారులు రోజుకు సగటున 139 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2018 కంటే ఇది 19 నిమిషాలు ఎక్కువ. సౌదీ అరేబియాలో రోజువారీ సోషల్ మీడియా వినియోగం 14 నిమిషాలు, టర్కీలో 13 నిమిషాలు పెరిగింది. "ఆసియాలో సోషల్ మీడియా మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. 'సూపర్ యాప్స్' - పశ్చిమ దేశాలకు భిన్నంగా ఇక్కడ వేర్వేరు భిన్నమైన సోషల్ మీడియా యాప్‌లు మంచి ఆదరణ పొందుతున్నాయి. చాటింగులు, సంభాషణల కోసమే కాకుండా, బిల్లుల చెల్లింపులు, రెస్టరెంట్ల బుకింగులు, ట్యాక్సీ బుకింగులు, దుకాణాల్లో చెల్లింపుల సదుపాయాలు ఉండే యాప్‌ల వాడకం పెరిగిపోయింది" అని చేజ్ బకిల్ వివరించారు. చైనాలో వీచాట్ సోషల్ మీడియా అప్లికేషన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ యాప్‌కు వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం పెరుగుదల (సగటున నిమిషాలలో) 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు యువత అత్యధికంగా సోషల్ మీడియా వినియోగిస్తున్నట్లు బకిల్ చెప్పారు. ఆరోగ్యంపై ప్రభావం తెరల మీద ఎక్కువ సమయం గడపడం మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు, తక్కువ సంతోషంగా ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి" అని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆష్లే విలియమ్స్ చెప్పారు. "అధిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో, అది కుంగుబాటుకు, రోడ్డు ప్రమాదాలకూ కారణమవుతుంది" అని ఆప్లే విలియమ్స్ అన్నారు. 16 నుంచి 24 ఏళ్ల వయసువారు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు ఎంతసేపు వాడాలి? ప్రజలు ఆన్‌లైన్‌లో 'ఇంతసేపు గడపాలి' అని కచ్చితమైన కొలమానం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏప్రిల్‌లో మొట్టమొదటి సారిగా తెరలపై గడిపే సమయానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలను ఉద్దేశించి ఆ మార్గదర్శకాలను రూపొందించారు. గత డిసెంబరులో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రచురించిన అధ్యయనం ప్రకారం, సోషల్ మీడియా వాడకాన్ని రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేస్తే మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఆ అధ్యయనంలో పాల్గొన్న 143 మంది విద్యార్థుల్లో "ఒంటరితనం, కుంగుబాటులో గణనీయమైన తగ్గుదల కనిపించింది". కానీ, కొంతమంది నిపుణులు మాత్రం ఈ సమస్య చాలా క్లిష్టమైనదని అంటున్నారు. "సోషల్ మీడియా చాలా వైవిధ్యమైనది. విభిన్న సైట్లు విభిన్న ఫీచర్లను అందిస్తాయి. కాబట్టి ఒక్కో దాని ప్రభావం ఒక్కో విధంగా ఉంటుంది. అన్నింటి ప్రభావం ఒకేలా ఉండదు" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంకు చెందిన ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్‌‌లో పనిచేస్తున్న మానసిక నిపుణుడు ఆండీ ప్రజిబిల్‌స్కి వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గత ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియాలో గడిపిన సమయం సగటున దాదాపు 60% పెరిగిందని తాజా సర్వే లో వెల్లడైంది. text: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులు తీసుకునే అప్పులపై విధించే రెపో రేటును 0.75 శాతం తగ్గిస్తూ 4.4 శాతంగా నిర్ణయించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాలపై ఇచ్చే రివర్స్ రెపో రేటును 0.9 శాతం తగ్గిస్తూ 4 శాతంగా ఖరారు చేసింది. అలాగే, బ్యాంకులు తమ నగదు నిల్వ ఉంచుకోవడంపై ఉండే క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్) పరిమితిని ఒక శాతం తగ్గిస్తూ, మూడు శాతానికి తీసుకువచ్చింది. శుక్రవారం ఉదయం రిజర్వు బ్యాంకు చేసిన ఈ ప్రకటన ప్రభావంతో బ్యాంకుల్లో నుంచి రూ.3.74 లక్షల కోట్లు ఇప్పుడు ఆర్థికవ్యవస్థలోకి వచ్చి చెలామణీ అవుతాయి. సీఐఐ డీజీ చంద్రజీత్ బెనర్జీ రిజర్వు బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయాలను స్వాగతించారు. రెపో, రివర్స్ రెపో రేట్ల మధ్య తేడాను పెంచడంతో ఇక రిజర్వు బ్యాంకు వద్ద డబ్బులు పెట్టుకోవడం వల్ల బ్యాంకులకు కలిగే ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తల్లో, వ్యాపారుల్లో విశ్వాసం నింపడం ఈ సమయంలో చాలా అవసరం. రిజర్వు బ్యాంకు ప్రకటనకు కొన్ని గంటల ముందే ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 2..5 శాతానికి తగ్గించింది. 17 రోజుల ముందు అదే సంస్థ భారత ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా సంక్షోభం మరింత దెబ్బతీస్తోంది. దీన్ని నుంచి బయటపడేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎన్ని చర్యలు తీసుకున్నా సరిపోవు. ఈ చర్యలు ఎంతవరకూ ప్రభావం చూపుతాయి పరిస్థితులన్నీ గాడిలో పడేవరకూ దేని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఈ ఏడాది చివరి త్రైమాసికం, వచ్చే పూర్తి ఏడాది వృద్ధిపై ప్రభావం పడొచ్చని రిజర్వు బ్యాంకు చెబుతోంది. మార్కెట్‌‌లో డిమాండ్ బలహీనపడుతుండటంతో ఆందోళన నెలకొంది. భవిష్యతుపై అనిశ్చితి ఏర్పడింది. సామాన్యులకు సంబంధించి కూడా ఓ కీలక ప్రకటనను కూడా రిజర్వు బ్యాంకు చేసింది. లక్షల కుటుంబాలకు ఊరటను ఇచ్చే నిర్ణయం తీసుకుంది. బ్యాంకు రుణాలపైనా మూడు నెలల వరకు నెలవారీ కిస్తీలు (ఈఎమ్‌ఐలు) కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీర్ఘ కాలిక రుణాల కిస్తీల చెల్లింపులపై మూడు నెలల మారెటోరియం విధిస్తున్నట్ల రిజర్వు బ్యాంకు తెలిపింది. అంటే, సంస్థలు మూడు నెలలు కిస్తీలు చెల్లించకపోయినా, వారిని ఎగవేతదారులుగా పరిగణించరు. గృహ రుణాలపై రుణం తీసుకున్నవాళ్లు మూడు నెలల పాటు బ్యాంకులకు కిస్తీలు కట్టకుండా ఉండొచ్చు. కొన్నింటిపై స్పష్టత కరవు కిస్తీలు కట్టని ఈ మూడు నెలలకు వడ్డీ వేస్తారా లేక మినహాయింపును ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. ఐదు నుంచి ఏడేళ్ల చెల్లింపు వ్యవధితో కార్ల కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలు కూడా దీర్ఘ కాలిక రుణాల కిందకు వస్తాయా అన్న సందేహం కూడా ఉంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణాలు తీసుకున్నవారికి, క్యాష్ క్రెడిట్ లిమిట్‌ తీసుకున్నవారికి మూడు నెలల పాటు వడ్డీ ఉండదని రిజర్వు బ్యాంకు స్పష్టంగా చెప్పింది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారస్థుల వరకూ చాలా మందికి దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోరు‌‌లపై కూడా ఈ మూడు నెలలు కిస్తీలు చెల్లించని ప్రభావం ఉండదని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. విధానపరంగా తీసుకున్న ఈ నిర్ణయాలతో పరిశ్రమలకు అవసరమైన ఉపశమనం లభిస్తుందని బీజేపీ ప్రతినిధి సయ్యర్ జఫర్ ఇస్లామ్ అన్నారు. బ్యాకింగ్ రంగంలో చాలా ఏళ్లు పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. రిజర్వు బ్యాంకు రేట్ల తగ్గింపుతో సామాన్యుడికి ఒరిగే విషయాల సంగతికి వస్తే, ఇరవై ఏళ్ల చెల్లింపు వ్యవధితో రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి ఏడాదికి రూ.13వేల వరకూ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మూడు నెలలపాటు కిస్తీల చెల్లింపులకు మినహాయింపు కూడా దొరికింది. బ్యాంకులు వడ్డీ రేట్లను ఎంత మేర తగ్గించుకుంటాయో, ఏయే రుణాలకు చెల్లింపులపై మినహాయిపు ఇస్తాయో తెలిస్తే గానీ పూర్తి స్థాయిలో నెరవేరే ప్రయోజనం గురించి చెప్పలేం. క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. వాళ్లు ఉపయోగించుకున్న డబ్బు రుణం కిందకు రాదు. వాళ్లకు చెల్లింపు మినహాయింపులు ఎవరు ఇవ్వాలి? ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? రుణాలేవీ తీసుకోకుండా జీతాలు పొందలేని వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న? వాళ్లు ఇంటి అద్దెలు కట్టలేకపోతే ఏం జరుగుతుంది? నడుపుకునే దుకాణాలు మూతపడితే ఎలా? రేట్ల తగ్గింపు డిమాండ్ అన్ని వైపుల నుంచి ఉన్నదే. కానీ, రిజర్వు బ్యాంకు ప్రకటన తర్వాత మార్కెట్ల సూచీలు పైకి వెళ్లకపోగా, కిందకు పడుతున్నాయి. దీన్ని కూడా ఓ మంచి సంకేతమని అనుకోవచ్చు. సమాజానికి పెద్ద స్థాయిలో లాభం కలిగించే (ప్రజా ప్రయోజన) నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా, మార్కెట్ సూచీలు కిందకు వెళ్తుంటాయి. అయితే, ప్రస్తుత సమయంలో మార్కెట్ గమనాన్ని చూసి ఏదీ తేల్చి చెప్పే పరిస్థితి లేదు. కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా? కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనావైరస్ సంక్షోభాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేదలకు వివిధ సాయాలను ప్రకటించిన తర్వాత ఒక రోజుకు... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా అందరూ ఆశిస్తున్న కొన్ని నిర్ణయాలను ప్రకటించారు. text: ధన్నీపూర్‌లో ప్రతిపాదిత భూమి ఒక దర్గాకు సమీపంలో ఉంది. కరోనా కారణంగా ఉన్న పరిమితుల్లోనే వైభవంగా జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్‌ ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో అయోధ్యకు 25కిలోమీటర్ల దూరంలో రౌనాహి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధన్నీపూర్‌ గ్రామంలో పరిస్థితి మిగిలిన గ్రామాలలాగే సాదాసీదాగా ఉంది. అక్కడ కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఉన్నట్లు గుర్తించడంతో గ్రామంలోని కొన్నిప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు. మిగిలిన ప్రాంతాలలో కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు మసీదు నిర్మించుకోడానికి ఈ ధన్నీపూర్‌లోనే ఐదెకరాల భూమిని కేటాయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ భూమి వ్యవసాయ శాఖకు చెందిన 25 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇందులో వరి పండిస్తారు. ఎవరికీ పట్టని ప్రాంతం. మసీదు నిర్మించడానికి సుప్రీంకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధన్నీపూర్‌లో భూమిని కేటాయించింది. కాని ఈ భూమి గురించిగానీ, మసీదు నిర్మాణం గురించిగానీ ఇక్కడ ఎవరికీ ఉత్సాహం, ఆసక్తిలేవు. భూమి కేటాయించి దాదాపు 6 నెలలు గడిచాయి. ఇప్పటి వరకు వక్ఫ్‌బోర్డు సభ్యులు, రెవెన్యూ అధికారులు మాత్రమే భూమిని చూడటానికి వచ్చారు. "మేం భూమిని స్వాధీనంలోకి తెచ్చుకునేలోగా లాక్‌డౌన్‌ మొదలైంది. దీని కొలతలు కూడా ఇంత వరకు తీసుకోలేదు. ఇప్పుడు బక్రీద్‌ కూడా వచ్చింది. ఆగస్టు 5న భూమిపూజ ఉంది. ఇక ఏం జరిగినా ఆ తర్వాతే జరుగుతుంది'' అని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫారూఖీ అన్నారు. మసీదు గురించి ప్రజలలో పెద్దగా ఆసక్తి లేదని జుఫర్‌ ఫరూఖీ కూడా అంగీకరించారు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో భూమిని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటని అయోధ్యలోని ముస్లింలంతా ప్రశ్నిస్తున్నారని ఫారూఖీ అన్నారు. ఇక్కడ మసీదుకు బదులుగా ఆసుపత్రిగానీ, స్కూలు, లేదా గ్రంథాలయంవంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముస్లింవర్గానికి చెందిన కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ గ్రామం ముస్లిం మెజారిటీ అయినప్పటికీ, మసీదు నిర్మాణంపట్ల వారిలో ఎలాంటి ఉత్సాహంలేదని ధన్నీపూర్‌ సర్పంచ్‌ రాకేశ్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. అయితే ఇక్కడ మసీదు రావడం వల్ల మా ఊరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు గ్రామస్తులు చాలామంది సంతోషించారని ఆయన అన్నారు. కేటాయించిన భూమిలో వరిసాగు "ఈ భూమిని ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పుడు చాలామంది చూడటానికి వచ్చారు. కాని ఆ తరువాత అంతా మర్చిపోయారు. ఎవరూ మసీదు గురించి అడగలేదు. భూమి అలాగే ఉంది. వరి సాగు చేస్తున్నారు. కొలతలు వేసి వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తారు. అక్కడ మసీదు ఎలా నిర్మిస్తారు, ఎప్పుడు నిర్మిస్తారు అన్నదానిపై మా గ్రామంలో ఎవరికీ ఆసక్తి లేదు'' అని సర్పంచ్‌ రాకేశ్‌కుమార్ యాదవ్‌ అన్నారు. గత ఏడాది నవంబర్‌లో అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు తరువాత ముస్లింలు మసీదు నిర్మించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ధన్నీపూర్ గ్రామంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ భూమి అసలు మసీదు నుండి 25కిలోమీటర్ల దూరంలోని సోహ్వాల్ తహసిల్‌ పరిధిలోకి వస్తుంది. ఇది రౌనాహి పోలీస్‌స్టేషన్‌కు కొన్నికిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్యలో బాబ్రీమసీదు భూమి హక్కుల కోసం పోరాడిన హాజీ మహబూబ్‌ "అంత దూరంలో భూమిని ఇవ్వడంలో అర్థం లేదు. అయోధ్య ముస్లింలు అక్కడికి వెళ్లి ప్రార్థనలు చేయలేరు. ఈ భూమి వద్దని మేం ఇంతకు ముందే చెప్పాం. ఇస్తే అయోధ్యలోనే భూమిని ఇవ్వాలి'' అని అన్నారు. ఈ కేసులో పార్టీగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీ కూడా ధన్నీపూర్‌లో భూమిని కేటాయించడాన్ని తప్పుబట్టారు. "బాబ్రీ మసీదు అయోధ్యలో ఉంది. దానికి అక్కడే భూమి ఇవ్వాలి. ఇప్పటికే ఒక మసీదు ఉన్న ప్రాంతాన్ని డెవలప్‌ చేయవచ్చు. ప్రభుత్వం అయోధ్యలో భూమి ఇవ్వకపోతే ప్రజలు ఇళ్లలోనే ప్రార్థన చేసుకుంటారు. 25-30 కిలోమీటర్ల దూరం ఎందుకు వస్తారు? ధన్నీపూర్‌లో మసీదు గురించి ఎవరికీ ఆసక్తి లేదు'' అని అన్సారీ అన్నారు. బోర్డు నిర్ణయమా? ముస్లింల నిర్ణయమా? ప్రభుత్వం భూమి కేటాయించిన ధన్నీపూర్‌ గ్రామం ఎక్కువమంది ముస్లిం జనాభాకు చేరువగా ఉందని , ప్రతి సంవత్సరం భారీ ఉత్సవం జరిగే దర్గాకు సమీపంలో ఉందని చెబుతున్నారు. ధన్నీపూర్‌ కూడా ముస్లింలు అధికంగా ఉండే గ్రామం. ఇక్కడ చాలా మసీదులు ఉన్నాయి. చరిత్రాత్మక నిర్ణయం తర్వాత కట్టబోయే మసీదు ఇతర మసీదులకన్నా భిన్నంగా ఉండాలి. కానీ స్థానిక ప్రజలు దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా, దీన్ని ఒప్పుకోవద్దని వక్ఫ్‌బోర్డుపై ఒత్తిడి చేశారు. కాని సున్నీవక్ఫ్ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన భూమిని తీసుకోడానికి అంగీకరించింది. అక్కడ మసీదు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. " వక్ఫ్‌బోర్డు ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదు.ఇది ప్రభుత్వ సంస్థ. ఆ భూమిని తీసుకోవద్దని బోర్డును అభ్యర్థిస్తున్నాం. కాని బోర్డు భూమిని తీసుకుంటే, అది ముస్లింల నిర్ణయం అనుకోవద్దు. కేవలం బోర్డు నిర్ణయం మాత్రమే" అని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు సభ్యుడు యాసిన్‌ ఉస్మానీ అన్నారు. ఇప్పుడు అయోధ్యలో భూమిపూజకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. ఆగస్టు 5న దేశ విదేశాలలో నివసిస్తున్న భక్తులందరూ దీపం వెలిగించాలని శ్రీరామ్‌ జన్మభూమి ట్రస్ట్‌ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయోధ్యలో కూడా ప్రతిఒక్కరూ ఆ రోజు తమ ఇళ్లలో దీపం వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. భూమిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1992 డిసెంబర్ 6న దాదాపు నాలుగున్నర వందల సంవత్సరాల ప్రాచీనమైన బాబ్రీమసీదు నిర్మాణాన్ని కరసేవకులు కూల్చేశారు. ఆ సమయంలో యూపీలో కళ్యాణ్‌సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ సంఘటన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది. ఈ సంఘటనను అనాగరిక చర్యగా పేర్కొని, మసీదును పునర్నిర్మిస్తామని అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు హామీ ఇచ్చారు. కానీ నాటి నుండి 2019 నవంబర్ 7 వరకు ఈ విషయం కోర్టుల్లో చిక్కుకుపోయింది. గత ఏడాది నవంబర్ 9న చీఫ్‌జస్టిస్ రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వివాదంలో ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. దీని ప్రకారం అయోధ్యలో వివాదానికి కేంద్రంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికి ఇవ్వగా, మసీదు నిర్మించడానికి ముస్లిం పక్షానికి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అయోధ్యలో ఆగస్టు 5న రామమందిరం నిర్మాణం కోసం భూమిపూజ ఏర్పాట్లు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సుమారు 200మంది అతిథులు వస్తారని భావిస్తున్నారు. text: ఫిబ్రవరి 14న ఫ్లోరిడాలోని మెజరరీ స్టోన్‌మేన్ డగల్‌ హైస్కూల్‌లో కాల్పుల ఘటన తర్వాత ఆమెరికాలో ఆయుధాలపై నియంత్రణ విధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. మొదట్లో ఆయుధాల నియంత్రణ ఆలోచనే లేదన్న ట్రంప్.. అన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో వైఖరి మార్చుకున్నారు. అమెరికాలో గన్ కంట్రోల్‌ చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. 17 మంది చనిపోయిన ఫ్లోరిడా కాల్పుల ఘటన తర్వాత ఎన్‌ఆర్ఏపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయుధ చట్టాలను కఠినతరం చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. విద్యార్థులు నిరసన బాట పట్టారు. అయితే, కొందరు విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 14 తర్వాత విద్యార్థులు స్కూల్‌కి తిరిగి రావడం ఇదే తొలిసారి. బుధవారం నుంచి స్కూల్‌ యథావిథిగా పనిచేసే అవకాశం ఉంది. ఆయుధాల నియంత్రణపై ఎన్‌ఆర్ఏ ఏమంటోంది? ఆయుధాలపై నిషేధం విధించే ప్రతిపాదనలకు అంగీకరించే ప్రసక్తే లేదని ఎన్‌ఆర్ఏ అధికార ప్రతినిధి ధనాలోచ్ ఏబీసీ వార్తాసంస్థతో చెప్పారు. ఫ్లోరిడా ఘటనకు ఎన్‌ఆర్ఏ కారణం కాదని, స్థానిక యంత్రాంగం, పోలీసుల వైఫల్యం వల్లే అది జరిగిందని ఆమె చెప్పారు. రాజకీయ నాయకుల మౌనం కూడా దీనికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. కాల్పులు జరుగుతున్న సమయంలో స్కూల్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి అటువైపే వెళ్లకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు ఎన్‌ఆర్ఏ మద్దతు ఇచ్చింది. గన్ కంట్రోల్‌పై ట్రంప్ ఏమన్నారు? 'టీచర్లకు ఆయుధాలు ఇస్తే ఫ్లోరిడా వంటి ఘటనలు మళ్లీ జరగవు' అని ట్రంప్ ఇటీవల అన్నారు. ఆయుధాల కొనుగోలు వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఆయుధాలను సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్‌గా మార్చడాన్ని కూడా ట్రంప్ వ్యతిరేకించారు. గన్‌ కొనుగోలు సమయంలో సమగ్ర విచారణ చేయాలని ఆయన సూచించారు. School shooting survivor's tearful plea విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు? గత బుధవారం 40మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో ట్రంప్ సమావేశమయ్యారు. గన్ కంట్రోల్‌కు తీసుకోవాల్సిన చర్యలు, వారి విజ్ఞప్తులను స్వీకరించారు. ఫ్లోరిడా కాల్పుల్లో కుమార్తెను కోల్పోయిన ఆండ్రూ పొల్లాక్ ఉద్వేగంగా మాట్లాడారు. 'నా కూతురు చనిపోయింది. నేను మళ్లీ నా కూతుర్ని చూడగలనా? మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలి' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'గన్నుకు గన్ను సమాధానం కాదు' అని 2012లో జరిగిన కాల్పుల్లో కుమారుడిని కోల్పోయిన మార్క్ బర్డెన్ అన్నారు. కొన్ని రకాల ఆయుధాలపై నిషేధం విధించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలో వందలాది మంది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టీచర్లకు ఆయుధాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు వారిలో కొందరు మద్దతు తెలిపారు. కానీ ఆయుధాల నిషేధం లేదా నియంత్రణకు అంగీకరించేది లేదని గన్ లాబీయింగ్ సంస్థ-ఎన్ఆర్ఏ స్పష్టం చేస్తోంది. ఇవి కూడా చదవండి: బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. అమెరికాలో ఆయుధ నియంత్రణ దిశగా చర్యలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ ఆ ప్రతిపాదనలకు అంగీకరించేది లేదని గన్ లాబీయింగ్ సంస్థ స్పష్టం చేసింది. text: గోవాకి చెందిన 42 సంవత్సరాల నవ్య ఈ లాక్ డౌన్ తర్వాత తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆమె లాయర్‌ని కూడా సంప్రదించారు. లాక్ డౌన్ వలన భార్యా భర్తలు తమ సంబంధ బాంధవ్యాలను తరచి చూసుకునేందుకు అవకాశం కలుగుతోందా? లాక్ డౌన్ సమయంలో విడాకుల కోసం లాయర్లని సంప్రదించే వారుఎక్కువయ్యరా? ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షి. లాక్ డౌన్ సమయంలో గృహ హింస ఫిర్యాదులు పెరిగాయని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ చెప్పారు. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 239 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. గతంతో పోల్చి చూస్తే ఇది 94 శాతం పెరుగుదల అని చెప్పారు. అయితే, కోర్టులు పని చేయకపోవడం వలన అధికారికంగా విడాకులు నమోదు అయిన సంఖ్య లేదని ముంబయికి చెందిన డివోర్స్ లాయర్ వందన షా చెప్పారు. కాకపొతే ఈ లాక్ డౌన్‌లో తనదగ్గరకి వచ్చే విచారణలు మాత్రం మూడింతలు పెరిగాయని అన్నారు. వాట్సాప్, మెసెంజర్‌ల్లో రోజుకి కనీసం 30-40 మంది విడాకుల కోసం కానీ, కౌన్సిలింగ్ కోసం కానీ సంప్రదిస్తున్నారని తెలిపారు. తన నిర్ణయం వెనక కారణాలని నవ్య బీబీసీకి వివరించారు. ఆమె ఒక సంవత్సరం క్రితం గృహ హింస భరించలేక ఇంటి నుంచి బయటకి వచ్చి భర్తకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె గతంలో విడాకుల కోసం ప్రయత్నించలేదు. "ఈ దూరం నా భర్తలో మార్పు తీసుకుని వస్తుందేమో అనుకున్నాను. కానీ, లాక్ డౌన్ సమయంలో కూడా నేను, నా పదేళ్ల కూతురు ఎలా బ్రతుకుతామో అని ఆలోచించలేదు. మాకు కనీస ఆర్ధిక సహాయం కూడా చేయటం లేదు. తిరిగి నన్ను నా కుటుంబ సభ్యులని దూషిస్తూ ఈ -మెయిల్‌లు పంపిస్తున్నారు. అవి చాలా అసభ్యకర పదజాలంతో ఉంటున్నాయి." "పెళ్ళైన కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అప్పట్లో అతను వ్యాపారం చేసేవారు. నన్ను రెండవ పెళ్లి చేసుకున్నారు. కానీ, రాను రాను మా మధ్య విబేధాలు మొదలయ్యాయి". "ఆయన ప్రస్తుతం ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన పరిచయాలు విస్తృతం అవుతున్న కొద్దీ నేను అపరిచితురాలిలా మిగిలిపోయాను". "నాకు కావల్సిన ఇంటి ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు." "నా కళ్ళ ముందే వేరే అమ్మాయిలతో బెడ్ రూమ్ లో గడపడం మొదలుపెట్టారు. ఆఖరికి నా లోదుస్తులు కొనుక్కోవడానికి బిల్ పే చేయాలంటే కూడా అతని సెక్రటరీని నాతో పాటు పంపేవారు". "ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఆయన తన అధికారం ఉపయోగించి నన్ను బలహీనురాలిని చేస్తారేమోననే భయం నన్ను వెంటాడేది". "ఈ మానసిక వ్యధ భరించలేక నేను ఇంటి నుంచి బయట పడి గత సంవత్సర కాలంగా ఒంటరిగా ఉంటున్నాను". "నేను గోవా నుంచి ముంబయి వచ్చి ఇక్కడ నుంచి నిర్వహణ ఖర్చుల కోసం దరఖాస్తు చేశాను. లాక్ డౌన్ మొదలైనప్పుడు ఇంటి ఖర్చులు అడిగినప్పుడు ఒక 10,000 రూపాయిలు మాత్రమే ఇస్తానని చెప్పారు. ఆ డబ్బులతో ముంబయి లాంటి నగరంలో ఎలా బ్రతకాలో నాకు అర్ధం కాలేదు". "ఇలాంటి కష్ట సమయంలో మమ్మల్ని పట్టించుకోని వ్యక్తి కోసం నేనెందుకు ఎదురు చూడాలనే ఆలోచన నేను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది". కోర్టులు తెరవగానే విడాకుల కోసం దరఖాస్తు చేస్తానని నవ్య చెప్పారు. నవ్య లాంటి మరెందరి కోసమో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అవకాశం న్యాయస్థానాలు కల్పిస్తే బాగుంటుందని వందన షా అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ముందు నుంచి ఉన్న సమస్యల కోసం వచ్చే విచారణలే తప్ప కొత్తగా లాక్ డౌన్‌లోనే పుట్టిన కేసులు లేవని హైదరాబాద్‌కి చెందిన మాట్రిమోనియాల్ లాయర్ బిందు చెప్పారు. అలా అని లాయర్ దగ్గరకి వచ్చిన ప్రతి విచారణా విడాకులకు దారి తీస్తుందనే నియమం కూడా ఏమీ లేదని అన్నారు. బాబుని చూడటానికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకుని రాలేదని అమ్మాయి ఇంట్లో వాళ్ళు అనవసర కలహాలు పెట్టుకుంటే, కోడలు కుటుంబం అందరితో కలిసి భోజనం చేయదని అబ్బాయి తల్లి తండ్రులు అన్నారు అయితే, చిన్న చిన్న కలహాలతో విడిపోతామంటూ తమ దగ్గరకి వచ్చిన కొన్ని జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని నాగ్‌పూర్ ఫామిలీ కోర్టులో ఫ్యామిలీ కౌన్సిలర్‌గా రిటైర్ అయిన డాక్టర్ మంజూష చెప్పారు. రెండేళ్ల క్రితం పెళ్ళైన ఒక జంట తన దగ్గరకి కౌన్సిలింగ్ కోసం వచ్చినట్లు చెప్పారు. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమ్మాయికి ఇటీవలే బాబు పుట్టడంతో ఉద్యోగం మానేశారు. లాక్ డౌన్‌కి ముందే ఆ అబ్బాయి నాగ్‌పూర్‌లో ఉంటున్న తన భార్య దగ్గరకి వెళ్లారు. అయితే వీరి మధ్య సమస్యలు చాలా చిన్నవి. బాబుని చూడటానికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకుని రాలేదని అమ్మాయి ఇంట్లో వాళ్ళు అనవసర కలహాలు పెట్టుకుంటే, కోడలు కుటుంబం అందరితో కలిసి భోజనం చేయదని అబ్బాయి తల్లి తండ్రులు అన్నారు. ఇవి వీరిద్దరి మధ్య వాదోపవాదాలకు దారి తీశాయి. వీటికే వీరిద్దరూ కలిసి ఉండటం సాధ్యపడదనుకున్నారు. కొందరు బంధువులు ఇచ్చిన సలహాతో వారు ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్ తీసుకున్నారని డాక్టర్ మంజూష చెప్పారు. కౌన్సిలింగ్ తర్వాత వారు విడిపోవాలనే ఆలోచన నుంచి విరమించుకున్నట్లు చెప్పారు. వీరు ఇంకా కొన్ని సెషన్లకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. గతంలో కౌన్సిలింగ్ చేసి కొంత వ్యవధి తీసుకోమని చెప్పిన కొంత మంది జంటలు లాక్ డౌన్ సమయంలో తనని సంప్రదించినట్లు వందన షా చెప్పారు. భర్త తాగుడు అలవాటుభరించలేకపోతున్నానని, ఇక ఎక్కువ రోజులు భరించలేనని చండీగఢ్‌కి చెందిన ఒకామె తనని సంప్రదించినట్లు వందన తెలిపారు. లాక్ డౌన్ చాలా మంది జీవితాలలో మార్పుని తీసుకుని వచ్చిందని మానసిక వైద్య నిపుణురాలు పూర్ణిమ నాగరాజ అన్నారు. "అందరూ ఒకే సారి ఇంట్లో ఉండేటప్పటికి ఒకరి లోపాలు ఒకరికి తెలవడం మొదలైంది. భర్త గాని, భార్య గాని సోషల్ మీడియాలో ఉంటే కూడా ఇద్దరి మధ్య ఒత్తిడికి దారి తీస్తోంది. వీటి వలన కోపం, ఒత్తిడి పెరిగిపోతున్నాయి’’ అని ఆమె అన్నారు. "నేను సరిగ్గా వంట చేయనని నా భర్త సాధిస్తూనే ఉంటారు’ అని భార్య ఫిర్యాదు చేస్తుంటే, ‘లాక్ డౌన్ టైంలో అయినా కాస్త విశ్రాంతి తీసుకోవద్దా’ అని భర్త ప్రశ్నిస్తున్నారు" అని తన దగ్గరకి లాక్ డౌన్ సమయంలో కౌన్సిలింగ్ కోసం వచ్చిన ఒక జంట గురించి చెప్పారు. "ఆఖరికి ఈ చిన్న చిన్న తగాదాలు భరించలేక 18 సంవత్సరాలుగా కలిసి బ్రతికిన జంట లాక్ డౌన్‌లో తలెత్తిన వివాదాల కారణంగా వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు". లాక్ డౌన్‌లో తమ భర్తలు సోషల్ మీడియాలో పాత స్నేహితులతో సంభాషణలు మొదలుపెట్టారని, అది వేరే దారిలో వెళుతుందేమోనన్న అనుమానం కలుగుతోందంటూ కొందరు భార్యలు తనను సంప్రదించినట్లు వందన షా చెప్పారు. అయితే ఇవన్నీ విడాకుల కోసమే ప్రత్యేకంగా కానప్పటికీ కొంత మంది ఒక ఆవేశంలో లాయర్‌ని సంప్రదిస్తారని చెప్పారు. గృహ హింస, విడాకులు, ఇతర మాట్రిమోనియల్ అంశాలపై వచ్చే విచారణలు జనవరిలో సుమారు 100 ఉంటే , అవి లాక్ డౌన్‌లో 300కి పెరిగాయని నోయిడాకి చెందిన లెజిస్టిఫై న్యాయవాద సంస్థ వ్యవస్థాపకుడు అక్షత్ సింఘల్ తెలిపారు. భారతదేశంలో జనాభా లెక్కల ఆధారంగా విడాకులు, భార్య భర్తలు విడిపోవడంపై ఆర్ధిక వేత్త సూరజ్ జాకబ్, ఆంత్రోపాలజిస్ట్ శ్రీ పర్ణ చటోపాధ్యాయ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో సుమారు 13 లక్షల మంది విడాకులు తీసుకున్నారు. అంటే ఇది మొత్తం జనాభాలో కేవలం 0. 11 శాతం ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా సిద్దిఖీ తనకి విడాకులు కావాలంటూ ఇమెయిల్ నోటీసులు పంపించారు. గత పదేళ్లుగా తాను ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇక మీదట వాటిని భరించలేనని, అందుకే విడాకులు కోరుతున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాధితుల గోప్యత దృష్ట్యా పేర్లు మార్చడమైనది. కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) "కష్ట కాలంలో నా గురించి, నా బిడ్డ క్షేమం గురించి ఆలోచించని మనిషితో ఉండి ఏం లాభం? అందుకే విడిపోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. లాక్ డౌన్ నాకు ఆలోచించుకోవడానికి కావల్సినంత వ్యవధిని ఇచ్చింది." text: 100 కాదు.. 200 కాదు.. 3500 ఫొటోలు. ప్రతీ ఒక్కటీ ప్రత్యేకమే. వేటి కవే సాటి. వాటికి లేదు పోటీ. 2017 కామెడీ వైల్డ్‌లైఫ్‌ పోటీల్లో అందర్ని మెప్పించిన కొన్ని ఫొటోలు మీ కోసం. మిస్ కాకుండా అన్నీ చూడండి. కొమ్మపై పట్టుతప్పి కిందకి జారుతూ.. పట్టు కోసం పాకులాడుతున్న గుడ్లగూబ ఫొటో ఇది. ఈ ఏడాది నేచర్స్ ఫన్నీయెస్ట్‌ ఫొటోగా ఇది అవార్డు దక్కించుకుంది. కామెడీ వైల్డ్‌లైఫ్‌ పోటీల్లో ఈ గుడ్లగూబ ఫొటోకు ఫస్ట్‌ ఫ్రైజ్ వచ్చింది. హంగరిలో టిబొర్ కెర్జ్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో తీశారు. ఈ ఫొటో తీసినందుకు టిబొర్ కెర్జ్ కెన్యా విహార యాత్ర టికెట్లు గెలుచుకున్నారు. ఇది చిలిపి చిట్టెలుక. ఉన్నచోట ఉండకుండా పూల మొక్క పైకెక్కి ఎలా నవ్వుతుందో చూడండి. దీన్ని ఆండ్రియా జంపటి అనే ఫొటో గ్రాఫర్ ఇటలీలో తీశారు. 'భూమి మీద విభాగం'లో ఇది గెలుపొందింది. ఈ తాబేలు మహా ముదురు. తన దారికి అడ్డుగా వచ్చిన ఓ చేప చెంపను ఇలా చెళ్లుమనిపించింది. పాపం చేపకు ఎంత దెబ్బతగిలిందో! ఈ ఫొటో ట్రాయ్ మేని తీశారు. 'అండర్ వాటర్ విభాగం'లో ఈ ఫొటో ఎంపికైంది. 'ఆకాశం విభాగం'లో జాన్ త్రెల్‌ఫాల్ తీసిన ఈ ఫొటో గెలుపొందింది. విమానం వెళ్లిన దారిలో ఈ పక్షి ఎగురుకుంటూ వెళ్లడంతో ఈ ఎఫెక్ట్ వచ్చింది. అమ్మ దగ్గర ఎన్ని కోతి వేషాలు వేసినా చెల్లుతుంది. 'తల్లి పైకి ఎక్కుతున్న పిల్ల ఎలుగుబంటి' ఫొటోను డైసీ గిలార్డిని తీశారు. కెనడాలోని మనిటొబాలో ఈ ఫొటో క్లిక్ మనిపించారు. హలో.. మీరు నాలా జలకాలాడగలరా! ఈ జంతువు నీటిలో సరదాగా ఈతకొడుతున్న సమయంలో పెన్నీ పాల్మర్‌ ఈ ఫోటో తీశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో క్లిక్ మనిపించారీ ఫొటో. ఈ పెంగ్విన్లను చూశారా? బుద్ధిగా చర్చికి వెళ్తున్నాయి! అది కూడా క్రమశిక్షణగా. దక్షిణ జార్జియాలోని దక్షిణ అట్లాంటిక్ ద్వీపంలో ఈ ఫొటోను కార్ల్ హెన్రీ తీశారు. ఈ కుందేలుకు ఆత్రం ఎక్కువ అనుకుంటా! నోరు చిన్నది.. కానీ ఎంత గడ్డి నోట్లో పెట్టుకుందో చూడండి. ఫొటో గ్రాఫర్ ఆలివియర్ కొలీ బెల్జియంలో ఈ చిత్రం తీశారు. అవార్డు కోసం ఎక్కువ మంది దీన్ని సిఫార్సు చేశారు. ఈ రెండు కోతులు బైక్‌పై రైడ్‌కి రెడీ అవుతున్నాయి. ఇండోనేషియాలోని ఉత్తర సులవెసీ ద్వీపంలో ఇలా కెమేరాకి చిక్కాయి.. ఇది భయమా? షాకా? ఈ సీల్‌ ఏం ఆలోచిస్తోంది? జార్జ్ కాథ్‌కార్ట్‌ తీసిన ఈ ఫొటోను ఎక్కువ మంది రెకమండ్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌ సిమియాన్‌లో క్లిక్ చేశారు. ఈ నక్క మహా జిత్తులమారి! ఎక్కడ జాగ లేనట్టు ఇదిగో ఇక్కడే తన పని కానిస్తోంది.! అమెరికా శాన్‌జోస్‌లోని గోల్ఫ్ కోర్టులో తీసిన ఫొటో ఇది. చూడండి.. ఈ చేపలు బురదలో డ్యూయెట్ పాడుకుంటున్నాయి.! థాయ్‌లాండ్‌లో డేనియల్ ట్రిమ్‌ వీటిని కెమేరాలో బంధించారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అరుదైన.. అందమైన.. అద్భుతమైన దృశ్యాలివి. సరదాగా ఉండి.. నవ్వు తెప్పించేవి కొన్ని. ఆశ్చర్య పరిచేవి మరికొన్ని. ఔరా అనిపించేవి ఇంకొన్ని. text: రెండేళ్ల కిందట పాక్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. అక్కడ తాహిర్ అలీ అనే వ్యక్తి తుపాకితో బెదిరించి తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నారని, ఆయన కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేసిందని ఉజ్మా ఆరోపణలు చేశారు. తన ఇమిగ్రేషన్ పత్రాలను కూడా వారు లాక్కున్నారని చెప్పారు. అయితే, ఉజ్మా ఆరోపణలు అవాస్తవమని తాహిర్ అలీ అన్నారు. స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ భారత హైకమిషన్ సహకారంతో పాక్‌లోని ఓ కోర్టును ఉజ్మా ఆశ్రయించారు. భారత్‌లో తన కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్మా వ్యవహారంలో భారత విదేశాంగమంత్రి సుష్మ స్వరాజ్ చొరవ చూపారు. భారత హైకమిషన్ ఉజ్మాకు ఆశ్రయం కల్పించి, న్యాయపోరాటంలో అండగా నిలిచింది. తాహిర్ నుంచి ఇమిగ్రేషన్ పత్రాలను ఉజ్మాకు పాక్ కోర్టు ఇప్పించింది. 2017, మే 25న వాఘా సరిహద్దు ద్వారా భారత్‌లో ఉజ్మా అడుగుపెట్టారు. ఆమెను 'ఇండియాస్ డాటర్' (భారత్ పుత్రిక)గా వర్ణిస్తూ సుష్మ స్వరాజ్ ట్విటర్ వేదికగా స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వయంగా కలిశారు కూడా. భారత్‌కు ఉజ్మా తిరిగొచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ కాలంలో ఆమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. పాక్‌లో తాను అనుభవించిన విషయాలను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ తనకు వణుకు పుడుతుందని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ''నేను మలేసియాలో ఉండగా తాహిర్ పరిచయమయ్యాడు. పాక్ సందర్శనకు రావాలని పదేపదే అతడు అడగడంతో అంగీకరించి, వెళ్లా. అక్కడ జరిగిన విషయాలను తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. వాటిని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నా'' అని చెప్పారు. తన కుమార్తె ఫలక్ పేరుతో దిల్లీలోని సీలమ్‌పుర్‌లో ఉజ్మా ఓ పార్లర్ తెరిచారు. ఉజ్మా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఆర్థికంగా, మానసికంగా నిలదొక్కుకునేందుకు ఆ చిత్ర నిర్మాత తనకు సహకరిస్తున్నారని ఆమె చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ఇప్పుడు ఎలాంటి మద్దతూ లేదని, ఒంటరి తల్లిగానే జీవితం వెళ్లదీస్తున్నానని ఆమె అన్నారు. అయితే, ప్రస్తుతం తమ పరిస్థితి మెరుగ్గా ఉందని, తన కుమార్తెకు ఎయిమ్స్‌లో చికిత్సలు జరుగుతున్నాయని వివరించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) పాకిస్తాన్‌లో కొంతకాలం చిక్కుకుపోయి, భారత్‌కు తిరిగి వచ్చిన ఉజ్మా అహ్మద్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. text: ఇప్పుడు ఈ హింగ్లిష్ భాషకు యూకే కూడా ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడి పోర్ట్స్ మౌత్ కాలేజీలో తొలిసారిగా హింగ్లిష్ కోర్సును మొదలుపెట్టారు. ప్రస్తుతం తొలి బ్యాచ్ విద్యార్థులు హింగ్లిష్ పాఠాలు నేర్చుకుంటున్నారు. భారత్‌కు ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో హిందీపై ఇంగ్లిష్ ప్రభావం పడిందనీ, ఫలితంగా ఎన్నో కొత్త పదాలు పుట్టుకొచ్చాయనీ చెబుతారు. ఆంటీజీ-అంకుల్‌జీ, కజిన్ బ్రదర్-కజిన్ సిస్టర్, బ్రిటిష్ రాజ్, హమారీ ట్రీట్, ఎంజాయ్ కరే లాంటి పదాలు అలా వచ్చినవే. ప్రాచుర్యం పొందిన టీవీ ప్రకటన స్లోగన్ ‘యే దిల్ మాంగే మోర్’ కూడా హింగ్లిష్‌కి ఓ ఉదాహరణ. ఇంగ్లిష్ ఒకే..మరి హింగ్లిష్ తెలుసా? భారత్‌లో హింగ్లిష్ ఓ వ్యాపార భాషలా మారిపోయింది. ప్రపంచంలో భారత్ ఏడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది. ఇక్కడికి రావాలనుకునేవారు కూడా హింగ్లిష్‌పైన అవగాహన పెంచుకోవడం అవసరమని భావిస్తున్నారు. ‘భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తున్నారు. వాటిల్లో పాటలు, మాటల్లో హింగ్లిష్ వినిపించడం మామూలైపోయింది’ అంటారు యూకేలో హింగ్లిష్ పాఠాలు బోధిస్తున్న విరాజ్ షా. ఇది వింటుంటే తెలుగు, ఇంగ్లిష్ కలిపి మాట్లాడే ‘టింగ్లిష్’ గుర్తురావట్లేదూ..! ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మాట్లాడే దేశాల జాబితాలో భారత్‌ది రెండో స్థానం. కానీ భారత్‌లో ‘ఇంగ్లిష్’ కంటే ‘హింగ్లిష్‌’నే ఎక్కువగా మాట్లాడతారు. హిందీ పదాల్నీ ఇంగ్లిష్ పదాల్నీ కలిపితే పుట్టిన భాషే హింగ్లిష్. text: ఆడ్రే జోన్స్ అనే ఈ పదకొండేళ్ల బాలిక పది నిమిషాల్లోనే ఎన్నికల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసింది ‘‘డొనాల్డ్ ట్రంప్‌కి వచ్చే ఓట్లను మార్చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. ఆయన ఓట్లను తగ్గించటానికి ప్రయత్నిస్తా. అసలు ఎన్నికల్లో ఆయన పేరునే తీసేస్తానేమో’’ అంటోంది బియాంకా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదృష్టం కొద్దీ.. బియాంకా దాడిచేస్తున్నది ఒక అసలు వెబ్‌సైట్ మీద కాదు, దానిని పోలిన నకలు వెబ్‌సైట్ మీద. ‘‘మంచి కోసం హ్యాకింగ్’’ను ప్రోత్సహించే రూట్జ్ అసైలమ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ హ్యాకింగ్ పోటీలో బియాంక పాల్గొంది. ఎన్నికల టెక్నాలజీని పటిష్ట భద్రతతో రూపొందించాలని పదకొండేళ్ల బియాంకా అంటోంది కొద్ది నిమిషాల కోచింగ్‌తోనే... అమెరికా వ్యాప్తంగా నవంబరులో జరగబోయే మధ్యంతర ఎన్నికలు చిన్న పిల్లలు కూడా కొద్ది నిమిషాల శిక్షణతో హ్యాక్ చేయగలిగేంత బలహీనమైనవి అనే హెచ్చరిక పంపించటం ఈ పోటీల లక్ష్యం. ‘‘ఎన్నికల ఫలితాలను ప్రజలకు నివేదించే వెబ్‌సైట్‌లు ఇవి. జనం ఓట్లు వేయటానికి ఎక్కడికి వెళ్లాలో కూడా అవి చెప్తాయి. ఈ రెండు అంశాల్లో దేనిని మార్చినా ఎంత గందరగోళం తలెత్తుతుందో ఊహించొచ్చు’’ అని వివరించారు రూట్జ్ అసైలమ్ వ్యవస్థాపకురాలు నికో సెల్. నిజమైన వెబ్‌సైట్లను హ్యాక్ చేయటం చట్టవ్యతిరేకం. కాబట్టి.. నిజమైన వెబ్‌సైట్లను పోలిన 13 వెబ్‌సైట్లను.. వాటిలోని లోపాలతో సహా సెల్ టీమ్ తయారు చేసింది. ఎన్నికల్లో హోరాహోరీ పోటీ జరుగుతుందని భావించే 13 రాష్ట్రాల కోసం ఈ వెబ్‌సైట్లను రూపొందించారు. హ్యాకింగ్ పోటీలో.. 8 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకూ వయసున్న 39 మంది పిల్లలు పాల్గొన్నారు. వారిలో 35 మంది పిల్లలు ఆ వెబ్‌సైట్ల భద్రతను ఛేదించగలిగారు. ప్రాక్టికల్ జోకులు చేర్చారు. ఆ వెబ్‌సైట్ ఒక సమయంలో 1,200 కోట్ల ఓట్లు (ప్రపంచ జనాభా కన్నా దాదాపు రెట్టింపు ఓట్లు) పోలైనట్లు చెప్పింది. ఆ తర్వాత.. ‘‘బాబ్ ద బిల్డర్’’ ఈ ఎన్నికల్లో గెలిచినట్లు పేర్కొంది. డెఫ్ కాన్‌లో చిన్నారుల విభాగంలో ఈసారి 300 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు.. అందులో సగం మంది బాలికలే... ‘మనమే గెలిచేశామని చూపించొచ్చు’ మొట్టమొదటగా ఈ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన బాలిక పేరు ఆడ్రీ జోన్స్. పదకొండేళ్ల ఈ చిన్నారి కేవలం 10 నిమిషాల్లో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసేసింది. ‘‘కోడ్‌లో ఉన్న లోపాలు(బగ్స్).. మనం ఏకావాలంటే అది చేయటానికి వీలు కల్పిస్తున్నాయి. ఎవరి పేరు దగ్గరైనా మన సొంత పేరు పెట్టేయొచ్చు.. ఎన్నికల్లో మనమే గెలిచినట్లు కనిపించేలా చేయొచ్చు’’ అని ఆమె చెప్తోంది. లాస్ వేగాస్‌లో ఏటా జరిగి హ్యాకింగ్ సదస్సులో పిల్లల విభాగమైన డెఫ్ కాన్‌లో భాగంగా ఈ పోటీ నిర్వహించారు. ఈ ఏడాది 300 మందికి పైగా చిన్నారులు చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోల్డరింగ్ నుంచి లాక్ చేయటం వరకూ అనేక పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక టేబుల్ దగ్గర.. రెండేళ్ల వయసున్న కేథరీన్ సబోనిస్.. చాలా ఆనందంగా ఒక డెబిట్ కార్డును విడదీస్తూ కనిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది బాలికలేనని నిర్వాహకులు నాకు చెప్పారు. అసలు ఓట్ల లెక్కలు మారవు కానీ... ఎన్నికల హ్యాకింగ్‌ అంశం మీద పిల్లలకు పోటీలు నిర్వహించటం ఇదే మొదటిసారి. 2017లో పెద్ద వాళ్ల కోసం ఇదే తరహా పోటీలు పెట్టారు. ఇక్కడ నేర్చుకున్న హ్యాకింగ్‌ను.. నిజమైన వెబ్‌సైట్ల మీద ప్రయోగించినప్పటికీ.. వాస్తవమైన ఓట్ల లెక్క మారదు. ఎందుకంటే.. ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో చూపే విధానాన్ని మాత్రమే హ్యాకర్లు మార్చగలరు. ఎన్నికలకు సంబంధించిన ఒక అధికారిక వెబ్‌సైట్.. నిజంగా గెలిచిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తే వెల్లువెత్తే ఆగ్రహావేశాలు, గందరగోళం ఎలా ఉంటుందో ఈజీగానే ఊహించవచ్చు. 2016 అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి ఈ వెబ్‌సైట్లలో లోపాలపై ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల వెబ్‌సైట్ల విషయంలో ఇంకా ముందునుంచే అనుమానాలున్నాయి. అమెరికాలో ప్రతి రాష్ట్రానికీ సొంత ఎన్నికల వెబ్‌సైట్లున్నాయి. అయితే.. నిధుల కొరత కారణంగా అవి సరైన భద్రత లేని డాటాబేస్‌ల మీద ఆధారపడుతున్నాయి. దశాబ్ద కాలం కిందటి సాఫ్ట్‌వేర్ మీద నడిచే ఓటంగ్ మెషీన్లనే ఉపయోగిస్తున్నాయి. ‘‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’’ ఎన్నికల్లో ఈ భద్రతను పెంపొందించటానికి 2019లో 380 మిలియన్ డాలర్లు వ్యయం చేయాలంటూ డెమొక్రటిక్ పార్టీ ప్రతిపాదించిన సవరణను.. గత నెలలో అమెరికా కాంగ్రెస్ ఓటింగ్ ద్వారా తిరస్కరించింది. వాడివేడిగా జరిగిన ఆ సమావేశంలో ఈ సవరణకు మద్దతు తెలిపిన వారు ‘అమెరికా! అమెరికా!’ అంటూ సభలో నినాదాలు చేశారు. అయినా.. రిపబ్లిక్ పార్టీ సభ్యుల మద్దతు లభించలేదు. ‘‘ఈ ముప్పుని మనం సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరముంది’’ అంటారు సెల్. ‘‘ప్రభుత్వ వెబ్‌సైట్లు ఇంత బలహీనంగా ఉండకూడదు. ఇవన్నీ స్పష్టంగా తెలిసిన లోపాలే. ఒక సమాజంగా మనం కలసికట్టుగా సరిచేయాల్సిన సమస్య ఇది. ఎందుకంటే.. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. హ్యాకింగ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్న బియాంకా నాతో మాట్లాడేటపుడు.. ‘ఈ వెబ్‌సైట్ల భద్రత లోపించటం ఆందోళనకలిగిస్తోందా?’ అని నేను అడిగాను. ‘‘ఇంకా చాలా పటిష్టమైన భద్రత ఉండాలి... రష్యా వాళ్లు కాచుకుని ఉన్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించింది. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బియాంకా లూయిస్ వయసు పదకొండేళ్లు.. బార్బీతో ఆడుకోవటం, వీడియో గేమ్స్, కత్తులతో పోరాటం, పాటలు పాడటంతో పాటు.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ఎన్నికల సామగ్రిని హ్యాక్ చేయడం.. ఆమె హాబీలు. text: 2016లో వలామ్ ఆశ్రమాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సందర్శించారు. ఎన్నికలు మార్చిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో దేశంలోని కొన్ని ప్రధాన టీవీ చానళ్లు పుతిన్‌ను ఆధ్యాత్మిక నాయకుడిగా చూపిస్తున్నాయి. రష్యా విచ్ఛిన్నం కాకుండా, దేశంలో అశాంతి నెలకొనకుండా పుతిన్ కృషి చేశారని అవి చిత్రీకరిస్తున్నాయి. దేశంలోని ప్రధాన టీవీ చానల్ రొస్సియా-1 పుతిన్‌కు ఇష్టమని భావించే వలామ్ ఆశ్రమంపై ఇటీవల ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. రష్యాలోని మారుమూల ఉత్తర లడొగా సరస్సులోని ద్వీపాల సముదాయంలో ఈ వలామ్ ఆశ్రమం ఉంది. సోవియట్ పాలనలో దీన్ని మూసేశారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఇది పూర్తిగా ధ్వంసమైంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాతే మళ్లీ దీన్ని నిర్మించారు. అయితే, పుతిన్ వల్లే ఇది సాధ్యమైనట్లుగా ఆ డాక్యుమెంటరీ చూపించింది. వలామ్‌ను రష్యా ప్రతిబింబంగా అభివర్ణిస్తుంటారు. 1917 అక్టోబర్ విప్లవం తర్వాత ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత దీని పునర్ నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు వలామ్‌లో వచ్చిన మార్పు పుతిన్ హయాంలో రష్యా ఎలా మారిందో సూచించే ప్రతీకగా ఆ డాక్యుమెంటరీ అభివర్ణిస్తోంది. వలామ్ పునర్జీవనాన్ని ఆధ్యాత్మిక ప్రతీకగా రొస్సియా చానల్ అభివర్ణించింది. 'గ్రేట్ రష్యా విధ్వంసం అయినప్పుడే వలామ్ నాశనమైంది' అంటూ ఆ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానం వినిపిస్తుంది. 'వలామ్‌ పునరుద్ధరణ జరిగింది. మన దేశం కూడా తిరిగి కాళ్ల మీద నిలబడుతోంది' అంటూ వలామ్‌ను పుతిన్ సందర్శిస్తున్న వీడియోతో ఆ డాక్యుమెంటరీ ముగుస్తుంది. పునర్జన్మ అధ్యక్షుడు పుతిన్ ఈ ఆశ్రమాన్ని మొదటిసారి దర్శించుకున్నప్పుడు దాన్ని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంగా అభివర్ణించారు. 'ఇక్కడ పడవ నిలిపివేసిన చోటే పుతిన్ ఉద్భవించారు' అని శ్రావ్యమైన నేపథ్య సంగీతం వస్తుంటే ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది. వలామ్ ఆశ్రమ నిర్వహకులు బిషప్ పాన్కట్రీ కూడా మరుగునపడిన వలామ్‌.. పుతిన్ హయాంలో పునర్జీవనం చెందినట్లు ఆ డాక్యుమెంటరీలో చెబుతారు. ఒకప్పుడు పూర్తిగా ధ్వంసమైన ఈ ఆశ్రమం ఇప్పుడు కొత్త శోభను ఎలా సంతరించుకుందో డాక్యుమెంటరీలో పదే పదే చూపిస్తుంటారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రాభవం కోల్పోయిన రష్యాను పుతిన్ మళ్లీ ఎలా నిలబెట్టారనేది ఇంకో డాక్యుమెంటరీలోని ప్రధాన విషయం. వలామ్‌ను రష్యా ప్రతిబింబంగా అభివర్ణిస్తున్నారు. యూఎస్ఎస్ఆర్ నాటి వైభవం సాధించాలనుకునేవారికి, రష్యా విప్లవానికి ముందునాటి సంప్రదాయ కట్టుబాట్లు తిరిగి రావాలని కోరుకునేవారికి మధ్య ఉన్న ఘర్షణను పుతిన్ తొలగిస్తూ వస్తున్నారనే సందేశాన్ని ఈ డాక్యుమెంటరీ ప్రస్తావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య, సామరస్యం కోసం బీజాలు పడ్డాయని పుతిన్ వాదించడం. ఆశ్రమాల నుంచి సన్యాసులను ఖాళీ చేయించేటప్పుడు అందులోని మతపరమైన వస్తువులను వారి వెంట తీసుకెళ్లేందుకు సోవియట్ సేనలు తగిన సమయం ఇచ్చాయని ఆయన పేర్కొనడం కూడా ఈ డాక్యుమెంటరీలో కీలకంగా కనిపిస్తుంది. ఈ డాక్యుమెంటరీలో కమ్యూనిజం, క్రైస్తవం మౌలికంగా ఒకే భావజాలాన్ని కలిగి ఉన్నాయని పుతిన్ వాదిస్తారు. బొల్షివిక్ విప్లవ యోధుడు లెనిన్‌కు క్రైస్తవ సంప్రదాయాలకు అనుగుణంగానే సమాధి నిర్మించారని ఆయన చెబుతారు. 'ఐదో సామ్రాజ్యం' పుతిన్‌ను రక్షకుడిగా, సోవియట్ విప్లవవాదులకు, సంప్రదాయవాదులకు మధ్య ఐక్యత కుదిర్చే వ్యక్తిగా చూపించే ఇతివృత్తాలతో చాలా డాక్యుమెంటరీలో వస్తున్నాయి. అక్టోబర్ విప్లవంతో రష్యా సామ్రాజ్యాన్ని కూలదోసిన జోసెఫ్ స్టాలిన్ రష్యాలో విప్లవ శకాన్ని సృష్టించారు. ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక మరోసారి పుతిన్ దేశ రక్షకుడిగా అవతరించారు. ఆయన కృషి ఫలితమే ఐదో సామ్రాజ్యంగా పిలిచే నేటి రష్యా స్వర్ణ యుగం అని ఓ డాక్యుమెంటరీ పుతిన్‌ను అభివర్ణిస్తోంది. గతేడాది దేశంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఆందోళనలను ప్రభుత్వం అణచి వేసింది. ఎన్నికలు ఎన్నికలు జరగడానికి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. మార్చి 18న అక్కడ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదంతా మరోసారి పుతిన్‌ను అధ్యక్ష పీఠం ఎక్కించే ప్రచారంలో భాగమేనని అర్థమవుతోంది. వలామ్ డాక్యుమెంటరీని రూపొందించిన ఆండ్రీ కొండ్రషో ప్రముఖ జర్నలిస్టు. ఇటీవలే ఆయనను పుతిన్ ఎన్నికల ప్రచార అధికారిగా నియమించారు. గతేడాది అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినా, దేశంలో జీవన ప్రమాణాలు పడిపోతున్నట్లు తేలినా.. జాతి పునరుజ్జీవనానికి రష్యన్లందరూ పుతిన్‌కు మద్దతిస్తున్నారని డాక్యుమెంటరీ చూపిస్తోంది. పుతిన్‌కు 80 శాతం ప్రజలు మద్దతిస్తున్నట్లు పేర్కొంటుంది. అయితే, క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) ఇప్పటికి ఆందోళనతోనే ఉంది. అవినీతి వ్యతిరేక ప్రచారకర్తగా, పుతిన్ వ్యతిరేక వర్గానికి దీటైన నాయకుడిగా పేరున్న అలెక్సీ నావల్సీ గురించే ఆ ఆందోళన. అయితే అలెక్సీపై నేరారోపణలు రుజువు కావడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురయ్యారు. అయితే ఇదంతా రాజకీయ కుయుక్తిగానే చాలా మంది భావిస్తున్నారు. ఇవి కూడా చదవండి: సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉంటూ పాశ్చాత్య దేశాలకు దీటుగా దేశాన్ని నిలబెడుతున్న పుతిన్‌కు ఆధ్యాత్మిక ఇమేజ్‌ను రష్యా మీడియా ఆపాదిస్తోంది. text: ప్రమాదస్థలం నుంచి తమ సిబ్బంది మొత్తం 63 మందిని బయటకు తీసుకువచ్చారని, వారిలో 43 మంది చనిపోయారని దిల్లీ అగ్నిమాపక శాఖ చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గర్గ్ తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది 15 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న యువకులేనని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు. ప్రమాదానికి గురైన భవనంలో స్కూలు బ్యాగుల తయారీ కేంద్రం నడుస్తున్నట్లు ఘటనాస్థలానికి వెళ్లిన బీబీసీ ప్రతినిధి దిగవల్లి పవన్ తెలిపారు. ఘటనాస్థలానికి 26 అంబులెన్స్‌లు చేరుకున్నాయని, క్షతగాత్రులైన 46 మందిని దిల్లీలోని నాలుగు ఆసుపత్రులకు తరలించాయని వైద్య శాఖ వెల్లడించింది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన అన్నారు. గాయపడ్డవారి వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్ర గాయాలపాలైనవారికి రూ.50 వేల చొప్పున ప్రధాని మోదీ సాయం ప్రకటించారు. సదార్ బజార్ అనే పెద్ద మార్కెట్‌లోని ఇరుకైన వీధుల్లో ఈ భవనం ఉంది. దీంతో అక్కడికి చేరుకుని, మంటలు ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి కష్టమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. భవన యజమానిపై సెక్షన్ 304-ఎ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ప్రమాదం గురించి తెల్లవారు జామున 5.22కి తమకు మొదటగా సమాచారం వచ్చినట్లు అగ్నిమాపకశాఖ సిబ్బంది చెప్పారు. మంటలను అదుపు చేసేందుకు దాదాపు 25 అగ్నిమాపక వాహనాలు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందం కూడా రంగంలోకి దిగిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఘటనాస్థలంలోపలికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు చేరుకోవడం కష్టమైందని అతుల్ గర్గ్ అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని అగ్నిమాపక సిబ్బంది భుజాలపై బయటకు మోసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయ చర్యలకు ఇబ్బంది కలిగిందని వివరించారు. మంటలను నియంత్రించామని సహాయ చర్యల్లో పాలుపంచుకున్న ఓ అధికారి మీడియాకు చెప్పారు. ఈ అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఘటనాస్థలంలో అవసరమైన సహాయ చర్యలను సంబంధిత శాఖలు అందిస్తున్నాయని అన్నారు. మృతుల కుటుంబాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో ఉన్నవారికి తక్షణమే సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ట్వీట్ చేశారు. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుందని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని దిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దిల్లీలోని రాణీ ఝాన్సీ రోడ్డులో ఉన్న అనాజ్ మండీలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. text: భవనం పై అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం ముంబయి లోయర్ పరేల్ ప్రాంతంలోని కమలా మిల్స్ వాణిజ్య భవన సముదాయంలోని '1 ఎబౌ' రెస్టారెంట్‌లో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే 15 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బీబీసీ గుజరాతీ ఎడిటర్‌ అంకుర్ జైన్ తన స్నేహితులు, సోదరితో కలిసి ఆ రెస్టారెంట్‌లోనే ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి వారు ఎలా బతికి బయటపడ్డారు.? ఆ సమయంలో ఆయన ఏమేం గమనించారు? ఆయన మాటల్లోనే... ‘ఠాక్రే’ సినిమాతో బాలా సాహెబ్ ఇమేజిని మార్చే ప్రయత్నం? సాయంకాలం వేళ ఒక రెస్టారెంట్‌ వద్ద ఎలా ఉంటుందో కమలా మిల్స్ రెస్టారెంట్ వద్ద కూడా అలాగే ఉంది. కానీ నా జీవితంలో అత్యంత భయంకరమైన ఘటన ఇది. నాతో పాటు అక్కడున్న వంద మంది పరిస్థితి ఏమై ఉండేదో ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తోంది. నేను డిన్నర్ చేసేందుకు నా స్నేహితులు, సోదరితో కలిసి '1 ఎబౌ' రెస్టారెంట్‌కు వెళ్లాను. కానీ అప్పటికే రెస్టారెంట్ మొత్తం కిక్కిరిసిపోయింది. కూర్చోవడానికి కూడా చోటు దొరకలేదు. అందుకే పక్కనే ఉన్న డీజే కన్సోల్ వద్ద నిల్చుని ఎదురుచూస్తున్నాం. ఏదైనా టేబుల్ ఖాళీ అయితే కూర్చుందామని. అప్పుడు అర్ధరాత్రి 12.30 అయింది. ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. 'అక్కడ మంటలు వస్తున్నాయి.. రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లిపోండి' అనే అరుపులు విన్నాను. విన్న వెంటనే మేం అప్రమత్తమయ్యాం. రెస్టారెంట్ చివర్లో కొన్ని మంటలు మాకు కనిపించాయి. కానీ వాటిని అదుపు చేయవచ్చనే నేను భావించా. కానీ నా అంచనా పూర్తిగా తప్పు. కొన్ని సెకండ్లలోనే పరిస్థితి చాలా విషమంగా మారుతోందని అక్కడున్న వారందరికీ అర్ధమైంది. మంటలు వేగంగా విస్తరించాయి. సమీపంలో ఉన్న వస్తువులను అవి దహించి వేస్తున్నాయి. రెస్టారెంట్ ఫాల్స్ సీలింగ్ వల్ల మంటలను నియంత్రించడం సాధ్యం కాలేదు. ఒక్కసారి మంటలు సీలింగ్‌కి అంటుకుంటే వాటిని ఆర్పడం ఇక ఎవరి వల్లా కాదు. మెట్ల ద్వారా కిందికి వెళ్లిపోవాలని రెస్టారెంట్ సిబ్బంది మాకు చెప్పారు. కానీ అందరూ ఒకేసారి పరుగులు తీయడంతో అక్కడ తోపులాట జరిగింది. అంతేకాదు, కిందికి వెళ్లే మెట్ల దారిలో కూడా మంటలు చెలరేగాయి. మా చుట్టు పక్కల ఉన్న అన్ని వస్తువులు ఒకదాని తర్వాత మరొకటి అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎలాగోలా మేం మెట్ల వరకు చేరుకున్నాం. ప్రాణం లేచి వచ్చింది. కానీ అంతలోనే కంగారు. మాలో ఒకరు కనిపించడం లేదు. మాకు చాలా భయమేసింది. ఆమె ఎక్కడుందో తెలియలేదు. ఆమె పేరు పెట్టి బిగ్గరగా పిలిచాం. కానీ స్పందన లేదు. పక్కన ఉన్న భవనం నుంచి కొందరు కిందికి దిగి వెళ్లారని ఎవరో ఒకరు మాకు చెప్పారు. కానీ మాకు నమ్మకం కలగలేదు. కాసేపు అక్కడే వెతికాం. తను ముందే కిందికి దిగి వెళ్లిపోయి ఉంటుందన్న ఆశతో మేం కిందికి వచ్చేశాం. అదృష్టం బాగుండి మేం అనుకున్నది నిజమే అయింది. కమలా మిల్స్ మేం మూడో అంతస్తు నుంచి మెట్ల మార్గంలో కిందికి పరుగెత్తాం. ఆ సమయంలో రెస్టారెంట్‌లో పేలుళ్లు, జనం అరుపులు మాకు వినిపించాయి. ఇంతలో రెస్టారెంట్ నుంచి వెంటనే బయటకి వచ్చేయమని మా బంధువు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎలాగోలా మేం రెస్టారెంట్ నుంచి బయటపడ్డాం. నిజానికి మంటలు చిన్నగా మొదలైనప్పుడే ఆ రెస్టారెంట్ నుంచి మేం బయటకు వెళ్లాలని అనుకున్నాం. మేం వెలుపలికి వెళ్లే దారికి సమీపంలోనే ఉన్నాం. అందుకే సకాలంలో ప్రాణాలతో బయటపడగలిగాం. తమ బంధువులు, స్నేహితులు ఇంకా పైనే ఉన్నారని రెస్టారెంట్‌ కింద జనం అరవడం మేం చూశాం. ఈ మంటలు ఇంతటి విషాదాన్ని నింపుతాయని ఆ క్షణంలో ఎవరూ అనుకుని ఉండరు. రూఫ్ టాప్‌ ఒక మండే అగ్నిగోళంలా కనిపించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాచ్‌మెన్, సెక్యూరిటీ సిబ్బంది అరుస్తూ జనానికి చెబుతున్నారు. ఇంత గందరగోళ పరిస్థితుల్లో తప్పిపోయిన మా బృందంలోని సభ్యురాలు కింద కనిపించారు. దాంతో మనసు కాస్త కుదుటపడింది. అప్పుడే అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. ముగ్గురు గాయపడ్డారని వారు మాకు చెప్పారు. అప్పుడు సమయం దాదాపు 12.40 నిమిషాలు అవుతోంది. కాసేపటి తర్వాత మేం ఇంటికి చేరుకున్నాం. కానీ మంటలు ఆరిపోయాయా లేదా అన్న విషయం న్యూస్ చూస్తూ తెలుసుకున్నాం. ఇది చాలా విషాదకర ఘటన. మా పని అయిపోయిందనే అనుకున్నాం. చావు అంచుల దాకా వెళ్లొచ్చినట్లు అనిపిస్తోంది. ఉదయం న్యూస్ చూసి షాకయ్యాం. 15 మంది చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాం. కానీ ఆ ప్రమాదం ఇంతటి విషాదాన్ని మిగుల్చుతుందని అస్సలు అనుకోలేదు. కానీ అదే జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండటమే ఈ దుస్సంఘటనకు కారణం. రెస్టారెంట్ యజమాని, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కారణమే. ఇలాంటి ఒక అత్యవసర పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు సరైన యంత్రాంగం, ఎర్పాట్లు లేవు. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలు వాష్‌రూంలో ఉన్న వారేనని అధికారులు చెప్పారు. అది మంటలు లేచిన ప్రాంతానికి సమీపంలో ఉంది. నాకీ విషయం బాగా గుర్తుంది. ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే మాలో ఒకరు ఆ వాష్‌రూంకి వెళ్లి వచ్చారు. ఒకవేళ వారిని సకాలంలో కాపాడి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించుకునేనే ఒళ్లు జలదరిస్తోంది. Rooftop fire engulfs Mumbai Kamala Mills building నిజానికి ఫైర్ ఎగ్జిట్‌కే ముందు మంటలు అంటుకున్నాయి. ఇరువైపులా అట్టపెట్టెలు, బాక్సులు పెట్టడమే దానికి కారణం. ఈ షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నా. భద్రతా ప్రమాణాలు పాటించని ఇలాంటి రెస్టారెంట్లకు అధికార యంత్రాంగం పర్మిషన్ ఎలా ఇచ్చారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే, తమకు ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని ఈ రెస్టారెంట్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అర్ధరాత్రి సమయంలో చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లోనే అగ్నికీలలుగా మారాయి. 15 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. సందడిగా ఉన్న రెస్టారెంట్‌లో పది నిమిషాల్లో విషాదం అలుముకుంది. అసలా సమయంలో ఏం జరిగింది? text: టైప్-1 డయాబెటిస్ సాధారణంగా చిన్న వయసు లేదా కిశోర వయసులో కనిపిస్తుంది.. దీనికి జన్యు కారణం ఉండొచ్చు.. లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు రక్తప్రవాహంలోకి వచ్చే చక్కెర (గ్లూకోజ్) మొత్తాన్నీ శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు ఈ రుగ్మత తలెత్తుతుంది. ఇది గుండె పోటు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాలు విఫలమవడం, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి పరిణామాలకు దారితీయగలదు. ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉందని.. నాలుగు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. దీనివల్ల ప్రమాదాలు ఉన్నా కూడా మధుమేహ బాధితుల్లో సగం మందికి తమకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకూ ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. మధుమేహానికి కారణాలేమిటి? మనం ఆహారం తిన్నప్పుడు.. పిండిపదార్థాలను మన శరీరం ముక్కలుగా చేసి చక్కెరగా మారుస్తుంది. దానిని గ్లూకోజ్‌గా వ్యవహరిస్తారు. క్లోమం(పాంక్రియాస్)లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్.. ఆ చక్కెరను శక్తి కోసం లీనం చేసుకోవాలని మన శరీర కణాలకు నిర్దేశిస్తుంది. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి కానపుడు.. లేదంటే అది సరిగా పనిచేయనపుడు రక్తంలో చక్కెర పోగుపడుతుంది. అలా మధుమేహం వస్తుంది. శుద్ధి చేసిన చక్కెరలు మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి మధుమేహం ఎన్ని రకాలు? మధుమేహంలో పలు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్‌లో పాంక్రియాస్ (క్లోమగ్రంధి) నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి. ఎందుకిలా జరుగుతుందనేది శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ కచ్చితంగా గుర్తించలేదు. అయితే.. జన్యువుల ప్రభావం వల్ల లేదా క్లోమగ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను వైరల్ ఇన్‌ఫెక్షన్ దెబ్బతీయటం వల్ల గానీ ఇలా జరుగుతుండవచ్చునని వారు భావిస్తున్నారు. మధుమేహం ఉన్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఈ టైప్-1 ఉంది. టైప్-2 డయాబెటిస్‌లో క్లోమగ్రంధి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థంగా పనిచేయదు. మన శరీరం గ్లూకోజ్‌ను సంలీనం చేసుకునేందుకు వీలు కల్పించే ఇన్సులిన్‌ను.. పాంక్రియాస్ (క్లోమగ్రంధి) ఉత్పత్తి చేస్తుంది ఇది సాధారణంగా మధ్య వయస్కులు, వయోవృద్ధుల్లో జరుగుతుంది. అయితే.. అధిక బరువున్న, శరీరానికి పని చెప్పని యువతలోను.. కొన్ని జాతులకు చెందిన.. ప్రత్యేకించి దక్షిణాసియా వాసుల్లో యువతలో కూడా ఈ టైప్-2 మధుమేహం అధికంగా కనిపిస్తోంది. కొందరు మహిళలు గర్భంతో ఉన్నపుడు.. గర్బిణి మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) వస్తుంది. ఆ మహిళకు, ఆమె గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైనంత ఇన్సులిన్‌ను వారి శరీరాలు ఉత్పత్తి చేయలేకపోవటం దీనికి కారణం. విభిన్న ప్రాతిపదికలను ఉపయోగించి నిర్వహించిన వేర్వేరు అధ్యయనాలు.. గర్భిణుల్లో 6 నుంచి 16 శాతం మంది వరకూ ఈ జెస్టేషనల్ డయాబెటిస్ వస్తుందని అంచనా వేశాయి. ఇది టైప్-2 డయాబెటిస్‌గా మారకుండా నిరోధించటానికి.. అటువంటి గర్భిణులు ఆహార నియమాలు, శారీరక వ్యాయామం.. అవసరమైతే ఇన్సులిన్ వాడటం ద్వారా తమ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవలసి ఉంటుంది. కొందరిలో మధుమేహానికి ముందు దశ కూడా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉండే ఈ స్థితి.. మధుమేహానికి దారితీయవచ్చు. బాగా అలసిపోయినట్లు అనిపించటం, ఎక్కువగా దాహం వేస్తుండటం, సాధారణం కన్నా ఎక్కువగా మూత్రవిసర్జన చేయటం.. మధుమేహం లక్షణాల్లో కొన్ని డయాబెటిస్ లక్షణాలు ఏమిటి? చాలా సాధారణ లక్షణాలు: టైప్-1 డయాబెటిస్ లక్షణాలు.. చిన్నప్పుడు లేదా యుక్త వయసులో త్వరగా కనిపిస్తాయని.. ఇంకా తీవ్రంగా ఉంటాయని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెప్తోంది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారికి (దక్షిణాసియా వాసులకైతే 25 ఏళ్లకే) టైప్-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా ఈ రుగ్మత ఉన్నా, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి, దక్షిణాసియా, చైనా, ఆఫ్రో-కరీబియన్, బ్లాక్ ఆఫ్రికన్ మూలాలు ఉన్నవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా.. పండ్లు, తృణధాన్యాలు వాడటం.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటానికి దోహదపడుతుంది మధుమేహాన్ని నివారించగలమా? మధుమేహం అనేది.. జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవటం.. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం అందులో తొలి అడుగు. ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే. రోజూ క్రమం తప్పని విరామాల్లో ఆహారం తీసుకోవటం.. కడుపు నిండగానే తినటం ఆపేయటం ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు.. వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ సిఫారసు చేస్తోంది. కదలకుండా కూర్చునే జీవనశైలిని వదిలిపెట్టటం.. వారంలో కనీసం రెండున్నర గంటలు వ్యాయామం చేయటం ముఖ్యం ఆరోగ్యవంతమైన బరువు కూడా.. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించటానికి సాయపడుతుంది. ఒకవేళ బరువు తగ్గాల్సి ఉంటే.. నెమ్మదిగా తగ్గటానికి.. వారానికి అర కేజీ నుంచి కేజీ చొప్పున తగ్గటానికి ప్రయత్నించండి. హృద్రోగాల ముప్పును తగ్గించుకోవటానికి కొవ్వు (కొలెస్టరాల్) స్థాయి కూడా పరిమితుల్లో ఉండేలా చూసుకోవటం, ధూమపానానానికి దూరంగా ఉండటం కూడా ముఖ్యమే. మధుమేహం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? రక్తంలో చక్కెర స్థాయి అధిక స్థాయిలో ఉంటే.. అది రక్త నాళాలాను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించలేకపోతే.. రక్తం అవసరమైన శరీర భాగాలకు అది చేరదు. దానివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినటం, చూపు కోల్పోవటం, కాళ్లకు ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అంధత్వం, మూత్రపిండాలు దెబ్బతినటం, గుండె పోటు, పక్షవాతం, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి వాటికి మధుమేహం ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. 2016లో 16 లక్షల మంది.. నేరుగా మధుమేహం వల్లే చనిపోయారు. అంధత్వం, మూత్రపిండాలు దెబ్బతినటం, గుండె పోటు, పక్షవాతం వంటి వాటికి మధుమేహం ప్రధాన కారణం ఎంత మందికి మధుమేహం ఉంది? డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనం ప్రకారం.. 1980లో 10.8 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటే.. 2014లో ఆ సంఖ్య 42.2 కోట్లకు పెరిగింది. 1980లో వయోజనుల్లో (18 ఏళ్లు వయసు దాటిన వారు) 5 శాతం కన్నా తక్కువ మందికి మధుమేహం ఉంటే.. 2014లో ఆ రేటు 8.5 శాతానికి చేరింది. మధుమేహంతో జీవిస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది.. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్న మధ్య, అల్పాదాయ దేశాల్లో ఉన్నారని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో.. పేదరికానికి, నాసిరకం, శుద్ధి చేసిన ఆహారానికి - మధుమేహానికి సంబంధం ఉందని చెప్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మధుమేహం(షుగర్) అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. text: ఇరాక్ నుంచి విడిపోయేందుకు కుర్దిస్తాన్‌ ప్రాంత ప్రజలు పట్టబుడుతున్నారు. తాజాగా నిర్వహించిన రెఫరెండం పోల్స్‌లో వేర్పాటువాదానికి అనుకూలంగా 92 శాతం మంది కుర్దిష్ ప్రజలు ఓటేశారు. దాంతో ఇరాక్ సెంట్రల్ సర్కారుపై ఒత్తిడి పెరిగింది. అయితే ఆ రెఫరెండం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాది వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెంటనే విమాన సర్వీసులను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుర్దిస్తాన్‌ స్పయంపాలిత ప్రాంతమైనా.. విమానాల రాకపోకల నియంత్రణ మాత్రం ఇరాక్ పౌర విమానయాన శాఖ ఆధీనంలోనే ఉంటుంది. ఇరాక్ నిర్ణయంతో అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి అంతర్జాతీయ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ఇరాక్ వెల్లడించింది. సహాయ, మిలిటరీ, దౌత్యపరమైన అవసరాల కోసం వినియోగించే విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే ఇరాక్ చేస్తున్న డిమాండ్‌‌ అన్యాయమైందని కుర్దిస్తాన్‌ ప్రభుత్వం పేర్కొంది. రెఫరెండంలో ప్రజలు తమ ఆకాంక్షను స్పష్టంగా వెల్లడించారని, ఇప్పుడు ఇరాక్‌తోపాటు, పొరుగు దేశాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కుర్దిష్ నాయకులు అంటున్నారు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.) కుర్దిస్తాన్‌కు అంతర్జాతీయ విమాన రాకపోకలను ఇరాక్ నిలిపివేసింది. ఇర్బిల్, సులైమనియా విమానాశ్రయాలపై కుర్దులు పట్టు విడిచే వరకు కేవలం దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని ఇరాక్ ప్రభుత్వం షరతులు విధించింది. text: ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 11 పార్టీలతో విడివిడిగా సమావేశమయ్యారు. పాత నోటిఫికేషన్‌ను, ఏకగ్రీవాలనూ పూర్తిగా రద్దుచేసి మళ్లీ మొదట్నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 9 పార్టీలు కోరగా, రెండు మాత్రం ప్రభుత్వాన్ని సంప్రదించాలని, టీకా వచ్చిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని అన్నాయి. ఈ సమావేశానికి దూరంగా ఉన్న వైకాపా నేతలు విడిగా మీడియాతో మాట్లాడుతూ.. మూడు నాలుగు కేసులు ఉన్నప్పుడే ఎన్నికలను రద్దుచేశారని, ఇప్పుడు రోజుకు మూడువేల కేసులు వస్తుంటే ఎన్నికలు ఎలా పెడతారని ప్రశ్నించారు. సాయంత్రం రమేశ్‌ కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమావేశమైనప్పుడు కూడా.. కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సుముఖంగా లేమన్నారు. ఎన్నికలు జరగాల్సిందేనని, అయితే తాము కూడా ఇప్పటికిప్పుడే నిర్వహించాలని అనుకోవడం లేదని ఎస్‌ఈసీ అన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ: నేడు ధరణి పోర్టల్ ఆవిష్కరణ తెలంగాణలో భూమి రికార్డులన్నింటినీ నమోదుచేసే ‘ధరణి’ పోర్టల్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చింతలపల్లి తాసిల్దార్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నట్లు నమస్తే తెలంగాణ తెలిపింది. యాభై రోజులుగా రాష్ట్రంలో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇకపై కొత్త తరహాలో మొదలుకాబోతోంది. గ్రామీణ, మండల కేంద్రాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొత్త చట్టం ప్రకారం ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ధరణిలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా తాసీల్దార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారు. రైతులు భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా పూర్తవుతుంది. బ్యాంకుల్లో డబ్బులు దాచుకొని.. తిరిగి తీసుకొనేంత సులువుగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను సరళతరం చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే భూ పరిపాలనలో కోర్‌ బ్యాంకింగ్‌ విధానం అమలు అవుతున్నది. ఇకపై సమస్యలకోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరంలేకుండా ఆన్‌లైన్‌లో తెలిపితే పరిష్కారమయ్యేలా ధరణి రూపకల్పన జరిగింది. మరోవైపు కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా ధరణిని నిర్వహించడానికి తాసిల్దార్లకు ఇచ్చిన శిక్షణ పూర్తయింది. ధరణికి సంబంధించిన మాడ్యూల్‌ను ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు పంపించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరీక్షించి చూశారు. ట్రయల్స్‌కు ముందుగా జిల్లా కలెక్టర్లనుంచి, తాసిల్దార్లు, నయాబ్‌ తాసిల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వరకు అన్ని స్థాయిల అధికారులుచ సిబ్బందితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మార్గదర్శనం చేశారు. ట్రయల్స్‌లో 20 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు చేశారు. చివరగా ఈ నెల 27న వీరందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అంతా ఓకే కావడంతో గురువారం పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్: దసరాకు నిమిషానికి రూ.1.5 కోట్లస్మార్ట్‌‌ఫోన్లు విక్రయం దసరా పండుగ సీజన్‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌ఫోన్లు హాట్‌‌‌‌కేకుల్లా అమ్ముడైపోయాయని వెలుగు దినపత్రిక తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో అయితే ప్రతి నిమిషం రూ.1.5 కోట్ల విలువైన స్మార్ట్‌‌‌‌ఫోన్లు అమ్ముడైనట్టు ఈకామర్స్ మార్కెట్ రీసెర్చర్ రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ డేటా వెల్లడించింది. రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ డేటా ప్రకారం.. ఈ ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ సేల్స్ రూ.29 వేల కోట్లుగా(4.1 బిలియన్ డాలర్లుగా) నమోదైనట్టు వెల్లడైంది. అంచనా వేసిన 4 బిలియన్ డాలర్ల కంటే కూడా ఈసారి సేల్స్ మించిపోయాయి. గతేడాది ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ అమ్మకాలు రూ.19,909 కోట్లుగా(2.7 బిలియన్ డాలర్లుగా) ఉన్నాయి. ఈ నవరాత్రి దసరా సీజన్‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌ఫోన్ అండ్ కన్జూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్స్, రిటైలర్స్ సేల్స్ గతేడాదితో పోలిస్తే 10–20 శాతం పెరిగినట్టు వెల్లడైంది. నవరాత్రి జోష్‌‌‌‌తో దివాళి సేల్స్ కూడా చాలా బాగుంటాయని రిటైలర్స్, కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మిడ్ రేంజ్, ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌లను కస్టమర్లు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపడంతో మొత్తంగా తమ వ్యాపారాలు పెరిగినట్టు ఎల్‌‌‌‌జీ, శాంసంగ్, షియోమి, వివో, సోనీ, పానాసోనిక్, క్రోమా, విజయ సేల్స్, గ్రేట్ ఈస్ట్రన్ రిటైల్, సంగీతా మొబైల్స్ చెప్పాయి. చాలా బ్రాండ్ల ఆన్‌‌‌‌లైన్ సేల్స్ రెండింతలు పెరిగినట్టు పేర్కొన్నాయి. ఏపీ పోలీస్‌ నంబర్‌ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్‌ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్‌’ అవార్డుల్లో సగానికిపైగా కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. దిశ, పోలీస్‌ సేవా యాప్‌లకు బంగారు పతకాలు రాగా.. మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్‌ శాఖ దక్కించుకుంది. పోలీస్‌ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్‌ గ్రూప్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో భాగంగా బుధవారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ వివరాలను ఏపీ పోలీస్‌ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. స్కోచ్‌ గ్రూప్‌ మొత్తం 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా.. రాష్ట్ర పోలీస్‌ శాఖ రికార్డు స్థాయిలో 48 అవార్డులను దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(9), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్‌(4), హిమాచల్‌ప్రదేశ్‌(3), మధ్యప్రదేశ్‌(2), తమిళనాడు(2), ఛత్తీస్‌గఢ్‌(2) ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్‌ ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, ఒడిశా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ రాజకీయాలను వేడెక్కించిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది. text: అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో దీనిపై మాట్లాడుతూ.. ఈ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మార్పు తెస్తుందని అన్నారు. చైనా నాయకులు దీన్ని రెండు దేశాల విజయంగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరచుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. అమెరికా నుంచి దిగుమతులను 2017 నాటి స్థాయిని దాటి 20 వేల కోట్ల డాలర్లకు పెంచుతామని, మేధో సంపత్తి నిబంధనలను బలోపేతం చేస్తామని చైనా హామీ ఇచ్చింది. చైనా ఉత్పత్తులపై ఇటీవల తాము విధించిన అధిక సుంకాలను తగ్గించడానికి అమెరికా అంగీకరించింది. అయితే, సరిహద్దు పన్నుల్లో అత్యధికం ఇంకా అలానే ఉండడంతో మరోసారి చర్చలు అవసరమని వ్యాపారవర్గాలు అంటున్నాయి. ''ఇంకా చేయాల్సింది చాలా ఉంది'' అని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లోని చైనా సెంటర్ అధ్యక్షుడు జెరెమీ వాటర్‌మన్ అన్నారు. అమెరికా, చైనాలు ఒకరిపై మరొకరు పన్నులు భారం మోపుతూ 2018 నుంచి వాణిజ్య యుద్ధం చేస్తున్నారు. దీనివల్ల 45 వేల కోట్ల డాలర్ల విలువైన వివిధ వస్తువులపై అధిక సుంకాలు పడుతున్నాయి. ఈ వాణిజ్య యుద్ధం రెండు దేశాల మధ్య వర్తకానికి అంతరాయమేర్పరచడమే కాదు ప్రపంచ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపింది. ఒప్పందాలపై సంతకాల సందర్భంగా వ్యాపారవేత్తలు, రిపబ్లికన్ డోనర్లు హాజరైన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, చైనా సంబంధాల బలోపేతానికి ఈ ఒప్పందం వేదిక అవుతోందన్నారు. గతంలో రెండు వైపుల నుంచీ జరిగిన తప్పులను దిద్దుకుంటున్నామని.. భవిష్యత్ ఆర్థిక న్యాయం, ఆర్థిక భద్రతను అందిస్తున్నామన్నారు. ఒప్పందంలో ఏముంది? * అమెరికా నుంచి తమ దిగుమతులను 2017 స్థాయితో పోల్చితే కనీసం 20 వేల కోట్ల డాలర్లు పెంచేందుకు చైనా అంగీకరించింది. వ్యవసాయ రంగ కొనుగోళ్లు 3200 కోట్ల డాలర్లు, తయారీరంగంలో 7,800 కోట్ల డాలర్లు, ఇంధన రంగంలో 5,200 కోట్ల డాలర్లు, సేవారంగ దిగుమతులు 3,800 కోట్ల డాలర్లకు పెంచుతామని చైనా చెప్పింది. * నకిలీ ఉత్పత్తుల తయారీపై కఠిన చర్యలు తీసుకునేందుకు చైనా అంగీకరించింది. వాణిజ్య రహస్యాలను దొంగిలించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కంపెనీలకు సులభతరమయ్యేలా చూస్తామని చెప్పింది. * 36 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తువులపై అమెరికా గరిష్ఠంగా 25 శాతం వరకు సుంకాలు కొనసాగిస్తుంది. అమెరికాకు చెందిన 10 వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై చైనా తాను విధించిన కొత్త సుంకాలనే కొనసాగించనుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా భారానికి కారణమైన అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ఒక అంగీకారానికొచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. text: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతి వద్ద ఉన్న ఈ ఆశ్రమం గాంధీజీకి స్వాతంత్ర సంగ్రామాన్ని ధైర్యంగా నడిపించడానికి కావలసిన స్ఫూర్తినందించింది. ‘ప్రతి మనిషి అవసరాన్ని తీర్చే శక్తి ఈ ప్రపంచానికి ఉంది.. కానీ, మనిషి దురాశకు మాత్రం ఈ ప్రపంచం సరిపోదు’ అన్నది గాంధీ చెప్పిన విలువైన మాటల్లో ఒకటి. న్యాయశాస్త్రం చదివిన గాంధీకి చదువు గొప్పదనం తెలుసు. ఆశ్రమంలో ఆయన పిల్లలకు చదువు చెప్పేవారు. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అబ్దుల్ ఖాదిర్ బావజీర్ పరిచయమయ్యారు. బావజీర్‌ను గాంధీ చాలా దగ్గర చేశారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన బావజీర్ తర్వాతి కాలంలో గాంధీ ఆశ్రమం బాధ్యతలు చేపట్టారు. చాలాకాలం పాటు బావజీర్ కుటుంబ సభ్యులే ఈ ఆశ్రమ నిర్వాహకులుగా ఉన్నారు. జనవరి 30వ తేదీ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను ఓసారి మననం చేసుకుందాం. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి) వందేళ్ల చరిత్ర కలిగిన గాంధీ ఆశ్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించింది బీబీసీ. text: దీపావళి వేళ బాణాసంచా కాల్చుతున్న బృందావన్‌లోని వితంతువులు. ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత చేతన్ భగత్ వరుస ట్వీట్లతో ముందుగా దీనిపై సామాజిక మాధ్యమాల్లో చర్చలేవదీశారు. ''టపాసులు కాల్చకపోతే పిల్లలకు దీపావళి ఎందుకు? ఏడాదిలో దీపావళి జరుపుకునేది ఒక్క రోజే. అంటే సంవత్సరంలో 0.27 శాతం సమయం మాత్రమే. కానీ, 99.6 శాతం వాతావరణం కలుషితమవడానికి సరైన ప్రణాళిక లేకపోవడమే కారణం.'' అంటూ ట్వీట్ చేశారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 అయితే, మరికొందరు మాత్రం నిషేధం సరైందేనని అంటున్నారు. ఇది కొంతవరకైనా కాలుష్యాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ట్విటర్‌లో కూడా #Right2Breathe అనే హాష్‌ట్యాగ్‌తో బాణాసంచా నిషేధానికి మద్దతుగా సామాజికమాధ్యమాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. బాణాసంచా నిషేధంపై అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ఇప్పటికే 7 వేలకు పైగా ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. ఈ దీపావళిని టపాసులు కాల్చకుండా జరుపుకుందాం అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. '' ఏసీలు వాడతాం, ఫ్రిజ్‌లు వాడతాం, ప్రజా రవాణా వ్యవస్థను మాత్రం ఎప్పుడూ వినియోగించం. కానీ, ఒక్క దీపావళికి టపాసులు కాల్చితే మాత్రం ఉపన్యాసాలు దంచుతాం'' అంటూ ఓ నెటిజన్ నిషేధానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. టపాసులపై నిషేధం విధించడం సబబుకాదని రాజస్థాన్ ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ''గతకాలం నుంచి మనం సంస్కృతిని నేర్చుకోవాలా? లేక కోర్టులు మనకు నేర్పుతాయా?'' అని ప్రశ్నించారు. భారీ శబ్ధం చేసే టపాసులపై నిషేధం విధించడం మాత్రం సబబే అని పేర్కొన్నారు. దీపాలతో ఇంటిపరిసరాలను వెలుగులతో నింపే పండగే దీపావళి. అయితే, శ్వాస సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు, ఇంట్లో పసిపిల్లలు ఉండేవాళ్లు మాత్రం నిషేధం విధింపు సరైందేనని అంటున్నారు. ''టపాసులు కాల్చకుండా దీపావళి జరుపుకోవడం అనేది పర్యావరణ హితం కోసం మనం చేసే చిన్న త్యాగంలాంటిది'' అని నిషేధంపై సుప్రీం కోర్టులో వాదించిన న్యాయవాది పల్లవి ప్రతాప్ అభిప్రాయపడుతున్నారు. ''టపాసులు కాల్చడమే సంస్కృతి కాదు. నా మేనకోడలు శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతోంది. ముఖ్యంగా దీపావళి వేళ ఆ సమస్య ఎక్కువవుతుంది'' అని ఆమె పేర్కొన్నారు. పల్లవి ప్రతాప్ కొన్నాళ్ల కిందట దీపావళినాడు బాణాసంచా పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. నిషేధం వివరాలు ఇవీ... అయితే, దీపావళిన టపాసులు నిషేధించడాన్ని చేతన్ భగత్‌తో పాటు చాలా మంది నెటిజన్లు క్రిస్టమస్ ట్రీ‌తో ముడిపెట్టారు. ప్రపంచానికి దీపావళి అంటే వెంటనే గుర్తుకొచ్చేది బాణాసంచా వెలుగులే. ''ప్రాచీనకాలంలో దీపావళి ఎలా జరుపుకుంటారో తెలిపే ఆధారాలు లేవు. ఇప్పటికీ దేశంలో ఉత్తరాదిన ఒకవిధంగా, దక్షిణాదిలో మరో విధంగా ఈ పండగ జరుపుకుంటున్నారు'' అని కేంబ్రిడ్జ్‌లోని హిందూ స్టడీస్ ప్రొఫెసర్ అంకుర్ బారువా పేర్కొన్నారు. ''దీపావళికి భారీగా టపాసులు కాల్చడం గత 50 ఏళ్లుగా ఉత్తరాదినే ఎక్కువగా పెరుగుతోంది'' అని అన్నారు. ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ వసుధ నారాయణ్ మాట్లాడుతూ.. ‘‘హిందూమతం స్థిరంగా మారుతోంది. అప్పట్లో టపాసులు కాల్చకపోయి ఉండొచ్చు. అయితే, ఏసు జననంతో క్రిస్టమస్ ట్రీకి అసలు సంబంధమే లేదు. తర్వాత కాలంలో ఈ విధానం క్రిస్టమస్‌నాడు నిర్వహిస్తున్నారు. దీపావళి రోజు బాణాసంచా కాల్చడం కూడా ఇలాంటిదే’’నని పేర్కొన్నారు. విదేశాలకు దీపావళి అంటే బాణాసంచా కాల్చడమే గుర్తుకొస్తుంది అని చెప్పారు. ది ప్రింట్ వెబ్‌సైట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్‌గుప్తా కూడా నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘పర్యావరణానికి దీని వల్ల ఎలాంటి హాని కలుగుతుందో వివరణ లేదు, కేవలం ఒక్క సిటీలోనే నిషేధం ఎందుకు విధించినట్లు, అమ్మకాల మీద నిషేధం విధించి, కాల్చడం మీద ఎందుకు స్పందించలేదు’’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు. దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉంటోందని ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్టు హెచ్చరిస్తూనే ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ కాలుష్యం మరింత పెరుగుతోందని దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ పేర్కొంది. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) దీపావళి వేళ దిల్లీలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ నిషేధాన్ని కొందరు హిందూమతంపై దాడిగా భావిస్తున్నారు. text: 2020‌లో లిబ్రాను విడుదల చేయాలని ఫేక్‌బుక్ భావించింది. క్రిప్టో కరెన్సీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకకరమని జీ7 నివేదిక హెచ్చరించడం సోషల్ మీడియా దిగ్గజానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. డిజిటల్ కరెన్సీల వల్ల కలిగే తొమ్మిది ముఖ్యమైన నష్టాలను జీ7 ముసాయిదా నివేదిక పేర్కొంది. లిబ్రా మద్దతుదారులు తమ ఆందోళనలను పరిష్కరించినప్పటికీ, ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించకపోవచ్చని హెచ్చరించింది. లిబ్రా ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు చెల్లింపుల సంస్థలు మాస్టర్ కార్డ్, వీసాలు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ హెచ్చరిక వచ్చింది. ఈ నివేదికను రూపొందించిన జీ7 టాస్క్‌ఫోర్స్‌లో జీ20 ఆర్థిక వ్యవస్థలకు నియమాలను నిర్దేశించే కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు సీనియర్ అధికారులు ఉన్నారు. లిబ్రా వంటి డిజిటల్ కరెన్సీలను తీసుకొచ్చేవారు చట్టబద్ధంగా ఉండాలని, లావాదేవీలకు భద్రత కల్పించాలని, మనీలాండరింగ్ చేయడానికి లేదా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఈ డిజిటల్ కరెన్సీ ఉపయోగపడకుండా చూసుకోవాలని ఆ నివేదిక పేర్కొంది. ఈ వారంలో ఐఎంఎఫ్ వార్షిక సమావేశాలలో ఆర్థిక మంత్రులకు అందించే ఈ నివేదికలో లిబ్రా మాత్రమే కాకుండా ఇలాంటి డిజిటల్ కరెన్సీ లావాదేవీలపై ఆందోళన వ్యక్తం చేసింది. వేగంగా నగదు బదిలీ చేసే సామర్థ్యం ఉన్న ''ఇలాంటి అంతర్జాతీయ కాయిన్స్'' వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదం వడ్డీ రేట్లను నిర్ణయించే విధాన రూపకర్తలకు కూడా లిబ్రా వంటి గ్లోబల్ క్రిప్టో కరెన్సీలు సమస్యలు సృష్టిస్తాయని ఆ నివేదిక వెల్లడించింది. లిబ్రా వల్ల క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో పోటీ ఉండదని, వినియోగదారుల విశ్వాసం కోల్పోతే ఆర్థిక స్థిరత్వం కూడా ప్రమాదంలో పడే ఆవకాశం ఉందని హెచ్చరించింది. ''చట్టపరంగా ఉండటం, నియంత్రణ, పర్యవేక్షణ సవాళ్లు, నష్టాలను తగినంతగా పరిష్కరించే వ్యవస్థ లేనంత వరకు ఇలాంటి డిజిటల్ కరెన్సీల ప్రాజెక్ట్ కార్యకలాపాలు ప్రారంభించరాదని జీ7 నమ్ముతోంది'' అని ముసాయిదా నివేదిక తెలిపింది. లిబ్రా ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నవారు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు లేవనెత్తిన ఆందోళనలను సంతృప్తిపరిచినప్పటికీ ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. విడుదల ఆలస్యం 'లిబ్రా ప్రాజెక్టు ఈ సవాళ్లకు ప్రాధాన్యమిచ్చి, వాటిని పరిష్కరించాలి" అని జీ20 ఆర్థిక మంత్రులకు రాసిన లేఖలో ఎఫ్‌ఎస్‌బీ చైర్మన్ రాండల్ క్వార్ల్స్ హెచ్చరించారు. రెగ్యులేటరీ అంతరాలను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికారులతో కలసి ఎఫ్‌ఎస్‌బీ పనిచేస్తోంది. వచ్చే వేసవిలో ఇది ఒక నివేదికను ప్రచురించనుంది. లిబ్రా విషయంలో రెగ్యులేటరీ స్క్రూటినీ ఆలస్యం అవడమో లేదా ఆటంకం కలిగే అవకాశం ఉందని ఫేస్‌బుక్ ఇప్పటికే తెలిపింది. ఒక్క లిబ్రా మాత్రమే కాకుండా అనేక క్రిప్టో కరెన్సీలు ఈ తరహా స్క్రూటినీలను ఎదుర్కొంటున్నాయి. జేపీ మోర్గాన్‌కు చెందిన జేపీఎం కాయిన్ అమెరికా డాలర్ మద్దతుతో నడుస్తోంది. దీన్ని కూడా స్క్రూటినీ చేసే అవకాశం ఉంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఫేస్‌బుక్ తన క్రిప్టో కరెన్సీ లిబ్రా సురక్షితమైందేనని నిరూపించుకుంటేనే దానికి అనుమతి లభిస్తుందని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జీ7 దేశాల గ్రూప్ ఒక నివేదికలో తెలిపింది. text: పోస్టుమార్టం రిపోర్టులో సమీర్ సింగ్ శరీరంలోకి 16 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించారు. అయితే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే హంతకులకు ఏకే-47లు ఎలా లభించాయి? ఈ సంఘటనపై బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశస్వి యాదవ్ ''ముజఫర్‌పూర్ మాజీ మేయర్‌ను కాల్చి చంపారు. నితీష్ జీ.. మీ నిష్క్రియాపరత్వం వల్ల బిహార్‌లో ఏకే-47లు మామూలు ఆయుధాలుగా మారిపోయాయి'' అంటూ ట్వీట్ చేశారు. దాంతో పాటు యశస్వి యాదవ్.. బిహార్‌లో ఏకే-47లతో జరిగిన మరో మూడు హత్యలను కూడా ఉదహరించారు. ఏకే-47లు ఎక్కడి నుంచి వచ్చాయి? బిహార్‌లో హఠాత్తుగా ఏకే-47తో జరిగే హత్యలు ఎందుకు పెరిగాయో ముంగేర్ డివిజన్‌కు చెందిన డీఐజీ జితేంద్ర మిశ్రా వివరించారు. ''జబల్పూర్ నుంచి ముంగేర్‌కు ఏకే-47 రైఫిళ్ల స్మగ్లింగ్ జరిగింది. ఈ ఘటనలో ముంగేర్ పోలీసులు, జబల్‌పూర్ పోలీసులు కలిసి ఒక అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి వాళ్ల నాయకుడు పురుషోత్తం రజక్‌ను, అతని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. వాళ్ల నుంచి ఎనిమిది ఏకే-47లను స్వాధీనం చేసుకున్నాం'' అని తెలిపారు. ఇదే కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన జబల్‌పూర్ ఎస్పీ అమిత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ''ఈ ముఠా జబల్పూర్‌కు చెందిన ఆర్డినెన్స్ డిపో నుంచి ఏకే-47లను కాజేసి ముంగేర్‌లో వాటిని విక్రయించేది. ముఠా నాయకుడు పురుషోత్తం విచారణలో అతను గతంలో సైన్యంలో పని చేసినట్లు తెలిసింది. ఆర్డినెన్స్ డిపోలో పని చేస్తున్న సురేష్ ఠాకూర్ అతనికి రైఫిళ్లు తెచ్చి ఇస్తే, వాటిని పురుషోత్తం బిహార్ లో విక్రయించేవాడు. 2012 నుంచి ఇప్పటివరకు అతను సుమారు 70 ఏకే-47 రైఫిళ్లు విక్రయించినట్లు మా విచారణలో తేలింది'' అని వివరించారు. ఆగస్టు 29న పోలీసులకు స్వాధీనం చేసుకున్న ఏకే-47 రైఫిళ్లు ముంగేర్‌తో ఏకే-47లకు సంబంధం ఏమిటి? ఈ ఏకే-47లకు సంబంధించిన మొదటి క్లూ ముంగేర్‌లో బయటపడింది. పోలీసులు ఆగస్టు 29న జమాల్‌పూర్‌కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో జబల్పూర్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అతనికి మూడు ఏకే-47లు విక్రయించినట్లు తెలిసింది. ఆ మూడింటిని ఇమ్రాన్‌కు విక్రయించిన వ్యక్తి పురుషోత్తం రజక్. జబల్పూర్ ఎస్పీ అమిత్ సింగ్, ''ఏకే-47లు పట్టుబడ్డాయని తెలిసిన వెంటనే పురుషోత్తం తన కుమారుడు శీలేంద్రకు ఫోన్ చేసి ఇంటిలోని డబ్బులు, ఇతర సాక్ష్యాలను మాయం చేయమని చెప్పాడు. దాంతో శీలేంద్ర కొన్ని ఏకే-47 భాగాలను ఓ నదిలో విసిరేశాడు. విచారణలో ఈవిషయాన్ని అతనే ఒప్పుకున్నాడు'' అని తెలిపారు. ముంగేర్‌లో పట్టుబడిన ఆయుధాలు బట్టి చూస్తే ఈ ఆయుధాల స్మగ్లింగ్ బిహార్, మధ్యప్రదేశ్‌లతో పాటు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ వరకు పాకినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సుమారు ఆరుమందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గత ఆరేళ్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి సుమారు 70 ఏకే-47 రైఫిళ్లను దొంగలించారన్న విషయం భారత దేశ అంతర్గత భద్రతకే గొడ్డలిపెట్టులాంటిది. సమీర్ సింగ్ ఒక్కో ఏకే-47 రైఫిల్ విలువ రూ. 5 లక్షలు పోలీసుల విచారణలో ఇమ్రాన్.. ఒక్కో ఏకే-47ను కనీసం 5 లక్షల రూపాయలకు విక్రయించినట్లు అంగీకరించాడు. కొన్ని రైఫిళ్లను 7-8 లక్షలకు కూడా విక్రయించారు. కొనేవాళ్లను బట్టి రేటును నిర్ణయిస్తారు. ఆయుధాల స్మగ్లింగ్ ముఠా నేత పురుషోత్తం రజక్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి సురేష్ ఠాకూర్ చెప్పిన విషయాలను బట్టి దీనికి కావాల్సిన అన్ని రుజువులూ దొరికాయి. ప్రస్తుతం ముంగేర్ పోలీసులు ఇమ్రాన్, అతని సహచరుడు షంషేర్ నుంచి ఎవరెవరికి ఆ ఆయుధాలను విక్రయించారన్న వివరాలను కనుగొనే పనిలో ఉన్నారు. అవి నేరస్తుల చేతుల్లో పడ్డాయా, లేదా మావోయిస్టుల చేతుల్లో పడ్డాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. (జబల్పూర్ నుంచి సంజీవ్ చౌదరి అందించిన వివరాల మేరకు) ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) గత ఆదివారం (సెప్టెంబర్ 23) బిహార్‌లోని ముజఫర్‌పూర్ నగరంలో మాజీ మేయర్ సమీర్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసుల విచారణలో దుండగులు సమీర్ కారును చుట్టుముట్టి, ఏకే-47తో గుళ్ల వర్షం కురిపించినట్లు తేలింది. ఈ ఘటనలో సమీర్ సింగ్‌తో పాటు ఆయన డ్రైవర్ కూడా అక్కడికక్కడే మరణించారు. text: కానీ, ఆ తర్వాత కాంగ్రెస్‌కు ఆయన కొత్త ఉత్తేజాన్ని ఇచ్చారు. బీజేపీతో 'ఢీ అంటే ఢీ' అనేలా ప్రచారాన్ని నడిపిస్తూ పార్టీ కార్యాచరణను నిర్దేశించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే రాహుల్ కష్టం ఫలించేలా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ ఘన విజయం సాధిస్తారని అవి చెబుతున్నాయి. అదే జరిగితే, మరో అయిదేళ్లు రాహుల్ ప్రతిపక్షంలో కూర్చోవాలి. 2017, డిసెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పార్టీని రాహుల్ ముందుండి నడిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు, కార్యకర్తలతో సమావేశాల కోసం దేశవ్యాప్తంగా తిరిగారు. రాహుల్ ముత్తాత నెహ్రూ భారతదేశానికి తొలి ప్రధాని. ఆయన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ కూడా ఆ పదవి చేపట్టినవారే. తల్లి సోనియా గాంధీ దాదాపు రెండు దశాబ్దాలు కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు. రాహుల్‌ను కూడా ప్రధాని పదవి కోసం కాంగ్రెస్ తీర్చిదిద్దుతూ వచ్చిందనడంలో సందేహం లేదు. నాయకత్వం, అర్హతలపై ప్రశ్నలు 2013లో రాహుల్ పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. కాంగ్రెస్‌లో రెండో అత్యున్నత పదవి అది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో రాహుల్ విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేలకరిచింది. 545 సీట్లున్న లోక్‌సభలో కేవలం 44 స్థానాలకు పరిమితమైపోయింది. రాజకీయ జీవితంలో రాహుల్‌కు అది అధః పాతాళం. ఓటమిని ఆయన అంగీకరించారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. రాహుల్ నాయకత్వ పటిమపై ప్రశ్నలు వచ్చాయి. విమర్శకులు ఆయన్ను బాధ్యత తలకెత్తుకునేందుకు 'భయపడుతున్న రాకుమారుడి'గా వర్ణించారు. రాహుల్ ఎవరికీ అందుబాటులో ఉండరని అన్నారు. అయోమయం, తడబాటుకు గురయ్యే నాయకుడంటూ సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. ప్రతిభ, అర్హతలు లేకున్నా, నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టిన ఒకే ఒక్క కారణంతో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్థాయిని అందుకున్నారంటూ అతిసాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. వాణిని వినిపించగలిగారు కానీ, గత రెండేళ్లలో రాహుల్ నిలదొక్కుకున్నారు. ఆయన సోషల్ మీడియా ప్రచారం మెరుగైంది. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు, నిరుద్యోగం, సమాజంలో అసహనం, ఆర్థికవ్యవస్థ మందగమనం వంటి విషయాలపై ఆయన సమర్థంగా వాణిని వినిపించగలిగారు. రఫేల్ ఒప్పందంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. గత డిసెంబర్‌లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను రాహుల్ అధికారంలోకి తీసుకురాగలిగారు. మరో రెండు నెలల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పునర్జీవం పోసేందుకు ఆయన తన సోదరి ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాలు లేవా.. 2004లో రాహుల్ రాజకీయాల్లో అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకూ నెహ్రూ-గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ప్రియాంక గాంధీ కొనసాగిస్తారని చాలా మంది భావించారు. అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి రాహుల్ పోటీచేసి గెలిచారు. గతంలో ఆ సీటు నుంచి రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగుతుండగా 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శి, 2013లో పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలను రాహుల్ చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టడం అందరూ ఊహించిన పరిణామమే. కొందరు దీన్ని స్వాగతించారు. కాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయాలు లేమిని, నాయకత్వం, దిశానిర్దేశం కోసం నెహ్రూ-గాంధీ కుటుంబంపై ఆధారపడుతుండటాన్ని మరికొందరు ఎత్తిచూపారు. బిడియస్థుడన్న పేరు రాహుల్ 1970, జూన్ 19న జన్మించారు. భారత్‌లోని అత్యున్నత పాఠశాలల్లో చదువుకున్నారు. అమెరికా, బ్రిటన్‌ల్లో ఉన్నత విద్యలు అభ్యసించారు. లండన్‌, ముంబయిల్లో పనిచేశారు. బయటకు రాహుల్‌ బిడియస్థుడిగానే కనిపించేవారు. రాజకీయాల కన్నా క్రికెట్ మ్యాచ్‌లు, పర్యటనల మీద ఆయన ఆసక్తి కనిపించేది. అయితే, ఆయనకు రాజకీయాలపై లోతైన అవగాహన ఉందని, వెనకుండి పనులను నడిపించడంలో సిద్ధహస్తుడని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. అమేఠీలో రాహుల్ ఈసారి గెలిస్తే, వరుసగా అక్కడ నాలుగో సారి ఎంపీగా విజయం సాధించినవారవుతారు. ఓటమి భయమా.. కానీ, కేరళలోని వయనాడు నుంచి కూడా రాహుల్ బరిలోకి దిగారు. అమేఠీలో తమ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ వయనాడులో పోటీ చేస్తున్నారని బీజేపీ అంటోంది. క్రితంసారి ఎన్నికల్లో ఆమె రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే, దక్షిణాదిలో పార్టీ విస్తరణ కోసమే రాహుల్ వయనాడులో పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. దేశాన్ని దాదాపు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఓటర్ల మద్దతు సంపాదించడంలో ఇటీవలి కాలంలో విఫలమవుతోంది. పార్టీకి పునర్జీవం పోసి, ఎన్నికల్లో ఎలా గెలిపించాలన్నదే రాహుల్ ముందున్న అతిపెద్ద సవాలు. కానీ, రాహుల్‌ అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయడం సరికాదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. 2024లో అధికారం అందుకోవడం కాంగ్రెస్‌కు వాస్తవిక లక్ష్యమని అభిప్రాయపడుతున్నారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత రాజకీయాలను తరతరాలుగా శాసిస్తున్న నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ కథకు 2014 లోక్‌సభ ఎన్నికలతో దాదాపుగా తెర పడిందని చాలా మంది అనుకున్నారు. text: నిర్మల వెల్లడించిన వివరాలు చిన్న రైతులకు రూ.4 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాం. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ ఇస్తున్నాం. సన్నకారుల రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసే ఏర్పాటు చేస్తున్నాం. వలసదారుల కోసం రూ.11వేల కోట్లు కేటాయిస్తున్నాం. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.4,200 కోట్లు కేటాయిస్తున్నాం. వలస కార్మికుల్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద కార్మికుల కోసం 3 కోట్ల మాస్కులను అందజేయనున్నాం. వలస కార్మికులకు మూడు పూట్లా భోజనం అందించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సహాయ శిబిరాల ఏర్పాటుకు, భోజన ఏర్పాట్లకు రూ.11 వేల కోట్లు కేటాయించాం. వలస కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉపాధి పొందవచ్చు. వలస కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తాం. పట్టణ కార్మికులకు ఏర్పాటు చేసిన వసతి శిబిరాల్లో మూడు పూట్లా భోజనం అందిస్తున్నాం. దేశమంతా ఒకటే వేతనం ఉండేలా చూస్తాం. వలస కార్మికులందరికీ వైద్య పరీక్షల్ని నిర్వహిస్తాం. వారందరికీ బీమా సౌకర్యం కల్పిస్తాం. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వలస కార్మికులకు వచ్చే రెండు నెలల పాటు ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తాం. జాతీయ ఆహార భద్రతా పథకంలో నమోదు చేసుకోనివారు, రేషన్ కార్డు లేని వలస కార్మికులూ కూడా దీనికి అర్హులే. ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం లేదా గోధుమలు కుటుంబానికి కేజీ సెనగలు అందిస్తాం. అందుకోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనికోసం రూ.3,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాం. ఆగస్టు నాటికి దేశమంతా ఒకటే రేషన్ కార్డు అమలయ్యేలా చూస్తాం. అప్పుడు, వలస కార్మికులు దేశంలో ఏ రేషన్ దుకాణం నుంచైనా తమ సరకుల్ని తీసుకోవచ్చు. వలస కార్మికులకు, పట్టణ కార్మికులకు అందుబాటు ధరల్లో అద్దె ఇళ్లు సౌకర్యం కల్పిస్తాం. ఇందుకోసం పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టనున్నాం. ముద్ర - శిశు రుణాలు కింద రూ. 50వేలు లోపు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రాయితీ ఇస్తాం. వీధి వ్యాపారులకు రుణాలను అందించేందుకు త్వరలో ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 50లక్షల మంది వీధి వ్యాపారుల కోసం రూ. 5వేల కోట్లు కేటాయించాం. గిరిజనుల కోసం రు.6వేల కోట్లు అందించనున్నాం. గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ.70 వేల కోట్లు అందిస్తాం. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ. 4,200 కోట్లు కేటాయించనున్నాం. అత్యవసర నిధి కింద రూ.30వేల కోట్లు కేటాయిస్తున్నాం. వలసకార్మికుల విషయంలో మా ప్రభుత్వం మొదట్నుంచి పూర్తి చిత్తశుద్ధితో ఉంది. ఈ విషయంలో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం. వలస కార్మికుల కోసం 1200 శ్రామిక్ స్పెషల్ రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. రోజూ 300 రైళ్లు నడుస్తున్నాయి. చార్జీలను 80శాతం కేంద్రం భరిస్తోంది. 20శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకు 806 శ్రామిక స్పెషల్ రైళ్లు నడిపాం. 10లక్షల మంది తమ స్వస్థలాలకు చేరారు. యూపీ 386 రైళ్లు కావాలని కోరింది. బిహార్ 204 రైళ్లు పంపాలని కోరింది. అలాగే మధ్య ప్రదేశ్ 67, ఝార్ఖండ్ 44, రాజస్థాన్ 20, ఛత్తీస్ ఘడ్ 7, పశ్చిమబెంగాల్ 7 రైళ్లను పంపాలని కోరాయి. ఇప్పటికీ రోజూ చాలా రాష్ట్రాలు తమ వలస కార్మికుల కోసం మరిన్ని శ్రామిక్ రైళ్లను పంపాలని కోరుతున్నాయి. వారి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి విడతల వారీగా ప్రకటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా గురువారం రైతులు, వలసదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆత్మ నిర్భర్ అభియాన్‌లో భాగంగా వారి కోసం రూపొందించిన ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. text: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై విజయం సాధించామని ఇరాక్ ప్రభుత్వం నిరుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఇవే. దేశంలోని మొత్తం 329 స్థానాలకుగాను దాదాపు 7 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్‌ సేనలతో నాలుగేళ్లపాటు సాగిన పోరు కారణంగా ఇరాక్ తీవ్రంగా దెబ్బతింది. పునర్ నిర్మాణం కోసం ఇరాక్ ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతోందని బీబీబీ ప్రతినిధి తెలిపారు. 'ఎన్నికల్లో ఎవరు గెలిచినా మతతత్వం, వేర్పాటువాద ఉద్రిక్తతలు, ఐక్యతను దెబ్బతీసే చర్యల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది' అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకే దేశ వ్యాప్తంగా ఓటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఎక్కువగా షియా, సున్నీ అభ్యర్థులుండే అభ్యర్థుల జాబితాలోంచి ఇరాకీలు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కుర్ద్ జాతీయులకు సొంతంగా అభ్యర్థుల జాబితాలున్నాయి. ఐఎస్ సేనలపై విజయం సాధించిన ఘనత షియా నేతృత్వంలోని ప్రభుత్వానికి దక్కింది. వీరి పాలనలో దేశవ్యాప్తంగా భద్రత పరిస్థితి బాగా మెరుగుపడింది. అయితే, అవినీతి పెరగడం, చితికిపోయిన ఆర్థికవ్యవస్థల మూలంగా చాలా మంది ఇరాకీలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని బీబీసీ ప్రతినిధి మార్టిన్ పాటియన్స్ పేర్కొన్నారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య పోరులో మరోసారి తమ దేశం చితికిపోతుందేమోనని కొంతమంది ఇరాకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీబీసీ ప్రతినిధి పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పతనం తర్వాత ఇరాక్‌లో తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశవాసులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. text: ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే "ఉక్కు నరాలు, ఇనుప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి" అన్న వివేకానందుడి మాటలు నా బాల్యంలో చాలా గుండె ధైర్యాన్ని నింపాయి. అదే ధైర్యం ఇంటర్మీడియెట్‌తో చదువు ఆగిపోయినా, చదవటం ఆపొద్దని నేర్పించింది. అదే ధైర్యం తనను తాను తగ్గించుకోవడాన్ని నేర్పించింది. అదే ధైర్యం నాలుగు గోడల మధ్య నుంచి బయటకు రాని ఒక కుర్రాడు బయటకు వచ్చి కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడిని చేసింది. అదే ధైర్యం 2014లో జనసేన పార్టీని పెట్టించింది. అదే ధైర్యం ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పింది. అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనిచ్చింది. అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒక కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తుంది. గెలుపోటములు నాకు తెలియదు.. యుద్ధం చేయడం ఒక్కటే తెలుసు. మానవత్వమే మన కులం నాకు నిజంగా ముఖ్యమంత్రి పదవి మీద కోరిక లేదు. కానీ, ప్రజలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి పదవి అనేది నాకొక బాధ్యత. టీచర్ అవ్వాలంటే శిక్షణ తీసుకోవాలి, ఐఏఎస్ అవ్వాలంటే శిక్షణ తీసుకోవాలి. కానీ, డబ్బుంటే చాలు రాజకీయాల్లోకి వచ్చేయొచ్చనే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఈ నాలుగేళ్లలో నన్ను ఎన్నో సార్లు బెదిరించినా.. నీకు డబ్బుల్లేవు.. నీ వెంట అంతా కుర్రాళ్లు ఉన్నారు.. ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ కొడుకువి.. ముఖ్యమంత్రివి కాదు.. నీ దగ్గర వేల కోట్లు లేవు.. పేపర్లు లేవు.. ఛానెళ్లు లేవు.. నీ వెంట ఎవరొస్తారు? అన్నారు. నాకు సూపర్ స్టార్డమ్ ఉండగానే రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే.. ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది నాయకులు యువత భవిష్యత్తును వారి భవిష్యత్తు కోసం వాడుకుంటున్నారు. కానీ, నేను నా పాతికేళ్ల భవిష్యత్తును వదులుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలని వచ్చాను. మానవత్వమే మన కులం, మతం. మానవత్వమే మనల్ని కలిపింది. నా దగ్గరికి చాలామంది వచ్చారు. సినిమాలు వద్దు... చంద్రబాబుని అడిగి ఒక ఇన్‌ఫ్రా ప్రాజెక్టు తీసుకుని డబ్బులు సంపాదించుకోండని చాలామంది చెప్పారు. కానీ, నాకు అలాంటి దుష్టమైన పనులు పవన్ కల్యాణ్ చేయడు. పల్లకీ మోయడానికి నన్ను వాడుకున్నారు సమాజానికి ఇవ్వానికే రాజకీయాల్లోకి వచ్చాను కానీ, తీసుకోవడానికి కాదు. 2014లో ఏం ఆశించకుండా తెదేపా, భాజపాకు మద్దతు ఇచ్చాను. అందరూ నన్ను పల్లకీలు మోయడానికి వాడుకున్నారు. అభివృద్ధి అనే పల్లకీలో ప్రజలను కూర్చోబెడతారని వాళ్ల పల్లకి మోశాను. పవన్‌ బలం గోదావరి జిల్లాల్లోనే ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ, శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు అంతా మాదే. సీమలో నాకు బలం ఉందని విమర్శకులకు తొడగొట్టి చెప్పాలా? సీమ గొప్పతనాన్ని నేనూ చెప్పగలను. జనసేన బలం గోదావరి జిల్లాల్లోనే కాదని నిరూపించాను. నా పోరాట యాత్రలో అన్ని జిల్లాల్లో బలం చూపించాం. తెలంగాణకు జనసేన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు కూడా ఒకరోజున జనసేన అండగా నిలబడుతుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం కచ్చితంగా ఉంటుంది. కులాల పేరుతో కుటుంబాలు బాగుపడుతున్నాయి. ప్రజలను కాపాడాల్సిన నాయకులే అవినీతికి పాల్పడుతుంటే ప్రజలు ఏమైపోవాలి? నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా భరిస్తా. కానీ, ప్రజలను ఏమైనా అంటే ఊరుకోను. జనసేన మేనిఫెస్టో జ‌న‌సేన మేనిఫెస్టో ప‌ట్ల ప్ర‌ముఖ రాజ‌కీయ ప‌రిశీల‌కుడు పెద్దాడ నవీన్ త‌న అభిప్రాయం బీబీసీతో పంచుకున్నారు. "ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేనిఫెస్టో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను లోతుగా ప‌రిశీలించిన త‌ర్వాత రూపొందించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. గేమ్ ఛేంజ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్ ఉంటార‌ని తాజాగా ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల మౌలిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను వెదికేందుకు ప్ర‌య‌త్నించారు. ఉదాహ‌ర‌ణ‌కు రైతుల‌కు ఎక‌రాకు ఎనిమిది వేల రూపాయ‌లు స‌హ‌కారం అందించ‌డం చిన్న విష‌యం కాదు. దాని వ‌ల్ల రుణ‌మాఫీ అవ‌స‌రం ఉండ‌దు. ఇక విద్యార్థుల‌కు ఉచితంగా ర‌వాణా, డొక్కా సీత‌మ్మ పేరుతో ఉచిత భోజ‌న స‌దుపాయాం ఏర్పాటు చేయ‌డం చాలా ఊర‌ట క‌లిగించే విషయం. విద్యార్థుల‌కు ఉచితంగా భోజ‌నం ఏర్పాటు ప్ర‌తీ ఇంట్లోనూ ఊర‌ట క‌లిగించేది. ఇలాంటి ప‌థ‌కాల ద్వారా మిగిలిన పార్టీలు కూడా జ‌న‌సేన న‌మూనా పాటించాల్సిన ప‌రిస్థితి తీసుకొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది" అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇవికూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి) జనసేన పార్టీ ఆవిర్భవించి ఐదేళ్లవుతున్న సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. text: ఆపిల్ కంపెనీ ఈ జెర్సీ ద్వీపంలోని కంపెనీలు పెట్టినట్లు ప్యారడైజ్ పత్రాల్లో బహిర్గతమైంది. వివాదాస్పద ఐరిష్ పన్ను విధానాలు అవలంబిస్తూ ఆపిల్ ఏ విధంగా పన్నులు ఎగ్గొట్టిందీ ఆ తర్వాత 2013 నుంచి ఆ విధానం నుంచి ఎలా తప్పుకుంది తెలిపాయి. టాక్స్ చెల్లించని దాదాపు 252 బిలియన్ డాలర్ల ఆఫ్‌షోర్ కంపెనీల సంపదను జెర్సీ ద్వీపానికి ఎలా తరలించిందో వివరించాయి. అయితే, తమ కొత్త విధానంతో పన్నులు ఏమీ తగ్గలేదని ఆపిల్ చెప్పింది. మూడేళ్లుగా ఏటా 35 బిలియన్ డాలర్లు కార్పొరేషన్ టాక్స్‌ చెల్లిస్తూ ప్రపంచంలో అత్యధికంగా పన్నుచెల్లిస్తున్న కంపెనీగా ఆపిల్ నిలిచిందని తెలిపింది. ఏ దేశంలోనూ పన్నులు తగ్గించుకునే విధానాలు అవలంబించలేదని, ఆయా దేశాల చట్టాలను అనుసరించే ప్రవర్తించామని పేర్కొంది. ఐర్లాండ్‌ నుంచి ఏలాంటి పెట్టుబడులను తరలించలేదని తన తదుపరి ప్రకటనలో నొక్కిచెప్పింది. ఆఫ్ షోర్ కంపెనీలకు సంబంధించి వెలుగు చూసిన అతిపెద్ద ఆర్థిక పత్రాలు బహిర్గత సమాచారాన్ని ప్యారడైజ్ పేపర్‌గా పిలుస్తున్నారు. 2014 వరకు అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లలో పన్నుచట్టాలలోని లొసుగులను ఈ సాంకేతిక సంస్థ తమకు అనుకూలంగా వాడుకున్న విధానాన్ని'డబుల్ ఐరిష్‌'గా పిలుస్తున్నారు. అమెరికా బయట అమ్మకాలు కొనసాగించేందుకు ఈ విధానం ఆపిల్‌కు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆపిల్‌కు వస్తోన్న ఆదాయంలో 55 శాతం.. పన్నువిధానాలు వర్తించని, అసలు పన్నే చెల్లించని ఐరిష్ అనుబంధ కంపెనీల నుంచి వచ్చింది. ఐరిష్ కార్పొరేషన్‌కు చెల్లించే 12.5 శాతం పన్ను లేదా అమెరికాకు చెల్లించే 35 శాతం పన్నుకు బదులుగా అపిల్... తన పన్ను ఎగవేత నిర్మాణంతో అమెరికా బయట ఆర్జించిన లాభాలపై పన్నురేట్లను తగ్గించుకునేలా సహాయపడింది. ఆ మేరకు ఆపిల్ కంపెనీ తన విదేశీ అమ్మకాల లాభాలలో 5 శాతం కంటే ఎక్కువ పన్నును చాలా అరుదుగా విదేశీ పన్నులుగా చెల్లించేది. ఇది ఒక్కోసారి 2 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఆపిల్‌కు చెందిన ఐరిష్ కంపెనీల టాక్స్ రేటును యూరోపియన్ యూనియన్ ఏడాదికి కేవలం 0.005 శాతంగా లెక్కగట్టింది. 2013లో అమెరికా సెనెట్‌లో ఆపిల్ కంపెనీ తీరుపై చర్చ రావడంతో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ స్పందించారు. తమ పన్నుల విధానం సరైందేనని వాదించారు. అమెరికా భారీ స్థాయిలో పన్ను రూపంలో ఆదాయాన్ని కోల్పోయిందని ఆగ్రహ వ్యక్తం చేసిన సెనటర్ కార్ల్ ‌లెవిన్, టిమ్ కుక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీరు బంగారు బాతును ఐర్లాండ్‌కు తరలించారు. అపిల్ కంపెనీ కిరీటంలోని కిలికితురాయిలాంటి మూడు సంస్థలను అక్కడి తీసుకెళ్లారు. అక్కడ పన్నుచెల్లించాల్సిన అవసరమే లేదు. ఇది సరైంది కాదు" అని పేర్కొన్నారు. అయితే దీనికి టిమ్ కుక్ దీటుగానే సమాధానం ఇచ్చారు. '' మేం అన్ని పన్నులను పైసాతో సహా చెల్లించాం. పన్నులు ఎగ్గొట్టే కుయుక్తుల మీద మేం ఆధారపడలేదు. కరేబియన్ దీవులకు డబ్బులేమీ తరలించలేదు" అని చెప్పారు. అపిల్‌బి పై యాపిల్ ప్రశ్నల వర్షం ఆపిల్ అనుసరిస్తున్న ఐరిష్ విధానంపై దర్యాప్తు జరుపుతామని 2013లో యూరోపియన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆపిల్ తాను చెల్లించే పన్నులు తక్కువగా ఉండేందుకు సహాయపడే ఆఫ్ షోర్ కంపెనీల కోసం చూసింది. పన్నుల స్వర్గధామంగా ఉన్న ఐరిష్‌లో అనుబంధకంపెనీల ఏర్పాటుకు సిద్ధమైంది. ఆఫ్ షోర్ కంపెనీల గురించి ఆపిల్ న్యాయ సలహాదారుడు 2014లో ప్రసిద్ధ ఆఫ్ షోర్ కంపెనీల న్యాయ సలహా సంస్థ అపిల్‌బికి ఓ ప్రశ్నావళిని పంపినట్లు ప్యారడైజ్ పేపర్ లీక్‌లో వెల్లడైంది. బ్రిటిష్ వర్జిన్ ద్వీపాలు, బెర్ముడా, కెయిమన్ ద్వీపం, మారిషస్, జెర్సీ తదితర ద్వీపాలలో ఎక్కడ కంపెనీలు పెడితే ఎలాంటి ఉపయోగాలుంటాయని అపిల్‌బి ని ఆపిల్ న్యాయసలహాదారు అడిగినట్లు తేలింది. పన్నుమినహాయింపునకు ఎలాంటి హామీ ఇస్తారు? అన్ని వ్యవహారాలను వాళ్లే చూసుకుంటారా? తదితర ప్రశ్నలు అడిగినట్లు లీక్ అయిన ప్యారడైజ్ పత్రాల్లో వెలుగు చూసింది. ఒకవేళ అక్కడి ప్రభుత్వం మారితే ఎలాంటి సమాచారం బయటకు పొక్కుతుంది. అక్కడి చట్టం నుంచి ఎలా తప్పించుకోవచ్చు తదితర ప్రశ్నలు కూడా అడిగినట్లు బయటపడింది. ఆధార పత్రాలు: ఆపిల్ ప్రశ్నలు ఆపిల్ తన పెట్టుబడుల తరలింపు విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నట్లు లీకైన ఈమెయిల్స్ ద్వారా స్పష్టంమవుతోంది. పన్నుమినహాయింపుల కోసం ఆపిల్ తన సంస్థనొకదాన్ని యూకే ఆధీనంలో ఉన్న జెర్సీ ద్వీపంలో స్థాపించింది. అక్కడ స్థాపించే విదేశీ కంపెనీలపై పన్నే లేదు. ఆపిల్ కంపెనీ ఐరిష్‌లో 2 డొల్ల కంపెనీలు స్థాపించినట్లు ప్యారడైజ్ పత్రాల ద్వారా వెలుగు చూసింది. ఆపిల్ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్ (ఏవోఐ) 252 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉంది. ఆపిల్ సేల్స్ ఇంటర్నేషనల్ (ఏఎస్ఐ) కూడా ఆపిల్‌దే. 2015లో ప్రారంభమైన ఈ రెండు సంస్థలు అపిల్‌బి కేంద్రగానే 2016 వరకు పని చేశాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల పన్నులు ఎగ్గొట్టేందుకు ఆపిల్ ఈ విధానాన్ని కొనసాగించింది. 2017 ఆపిల్ అకౌంట్లను పరిశీలిస్తే 44.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా బయట ఆ సంస్థ ఆర్జించినట్లు తెలిసింది. కానీ, అది వివిధ దేశాలకు చెల్లించిన పన్ను మాత్రం 1.65 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే 3.7 శాతం పన్ను మాత్రమే ఆపిల్ చెల్లించనట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ టాక్స్‌లో 6 శాతానికి లోపే ఉంది. యాపిల్, ఐర్లాండ్ వర్సెస్ యూరోపియన్ యూనియన్ ఐర్లాండ్ ప్రభుత్వం ఆపిల్ కంపెనీకి అక్రమంగా పన్ను ప్రయోజనాన్నికలిగించిందని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. మూడేళ్లు దర్యాప్తు చేసిన అనంతరం 2016 ఆగస్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆపిల్ కంపెనీ ఎగ్గొట్టిన పన్నును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని గడువు కూడా విధించింది. అయితే దీనిపై ఐర్లాండ్, ఆపిల్ కంపెనీలు అప్పీలుకు వెళ్లాయి. యూరోపియన్ యూనియన్ తీర్పును టిమ్ కుక్ తప్పుపట్టారు. ఇక ఐర్లాండ్ కూడా తన స్వంతంత్ర పన్నుల విధానాన్ని యూరోపియన్ యూనియన్ ఆక్రమిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా తమ ప్రాంతంలో ఉన్న కంపెనీలు తరలివెళ్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. 'డబుల్ ఐరిష్' విధానంలోని లొసుగులు మూసుకపోవడంతో ఐర్లాండ్ కూడా కొత్త పన్నులు విధానాన్ని తీసుకొచ్చింది. ఇది ఆపిల్ లాంటి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చింది. అయితే, ఐర్లాండ్ ఆర్థిక కార్యాలయం మాత్రం తమ నూతన పన్ను విధానాలు బహుళజాతి కంపెనీలకు ఎలాంటి అదనపు ప్రయోజనం కలిగించవని పేర్కొంది. మరోవైపు, జెర్సీ ద్వీపానికి తరలించిన తన రెండు కంపెనీలపై సమాధానం ఇవ్వడానికి ఆపిల్ నిరాకరించింది. "2015లో ఐర్లాండ్ పన్నుల విధానాన్ని మార్పు చేసినప్పుడు అక్కడ ఉన్న తమ కంపెనీలను తరలిస్తున్నట్లు ఐరిష్‌కు, యూరోపియన్ యూనియన్‌కు, అమెరికాలకు కూడా తెలిపాం" అని ఆపిల్ పేర్కొంది. "మేం చేసుకున్న మార్పుల వల్ల ఏ దేశంలోనూ పన్నులు తగ్గలేదు. వాస్తవం ఏంటంటే ఐర్లాండ్‌లో మేం చెల్లించే పన్నుల మొత్తం భారీగా పెరిగింది. గత మూడేళ్లుగా అక్కడ 1.5 బిలియన్ డాలర్లు పన్నుగా చెల్లించాం" అని ఆపిల్ తెలిపింది. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచంలోనే అత్యధిక లాభాలు గడిస్తోన్న ఆపిల్ కంపెనీ బిలియన్ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఎలాంటి రహస్య విధానాలను అనుసరించిందో ప్యారడైజ్ పేపర్లు బహిర్గతం చేశాయి. text: భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇప్పుడు ఆ పదవిలోకి వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం, ప్రభుత్వాధినేతలు రావడం వెళ్ళడం వేరు. కానీ రాజ్యాధినేతగా గవర్నర్ పదవి చుట్టూ.. దృగ్గోచరమైన రాజ్యాంగ సంబంధిత అధికార సాంద్రత ఒదిగుంది. ప్రభుత్వాలు ఉన్నప్పుడు, లేనప్పుడు, మధ్య ఉండే.. విరామ కాలంలో కూడా అది యథావిధిగా ఉంటుంది, అందుకే గవర్నర్‌ను 'రాజ్యాధినేత' అనడం. ఈ నియామకంతో ఐదేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లో ప్రధానాంశం పూర్తయినట్టైంది. చట్టం ఆచరణ, అమలులో మిగిలినవి ఇక ఇప్పుడు వేగవంతమవుతాయి. రాష్ట్ర విభజన 2014 జూన్ 2 న జరిగాక, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఇప్పటి వరకు హైదరాబాద్ రాజభవన్‌లోనే ఉంటూ విధులు నిర్వహించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజభవన్ నుంచి పరిపాలన సాగిస్తున్నారు. వింధ్య పర్వతాలకు ఇవతల దక్కన్ పీఠభూమిలో.. తూర్పు కనుమల పర్వత శ్రేణుల రక్షణ, నదీ తీర మైదానం, బందరు నౌకాశ్రయానికి ఫెర్రీ ఇన్ని వసతులు ఉన్న పట్టణం బెజవాడ. దాంతో దిల్లీ సుల్తాన్ల కాలంలో ఇది సైనిక పటాలాలకు మజిలీ స్థావరమయింది. ఆ తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 'మద్రాస్ నేటివ్ ఇన్‌ఫాన్ట్రీ' 52 పటాలాలు 1858 తర్వాత బ్రిటిష్ మిలటరీ లో కలిసినప్పుడు, వాటిలో ఒకటైన 30వ రెజిమెంట్‌కు బెజవాడ కంటోన్మెంట్ అయింది. ఇలా మొదటి నుంచి కోస్తాంధ్రలో ప్రధాన కూడలి నగరం బెజవాడ. దేశానికి స్వాత్యంత్రం వచ్చాక, ఇన్నాళ్ళకు అది ఇప్పుడు గవర్నర్ నివాస నగరం అయింది. రాష్ట్ర విభజన తర్వాత, 'రాజ్యం' చిన్న చిన్న ప్రాదేశిక ప్రాంతాలకు తరలి వస్తున్న వైనం ఎటువంటిదో తెలుసుకోవడం ఈ సందర్భంగా ఆసక్తికరమైన అంశం అవుతుంది. బిశ్వభూషణ్ హరిచందన్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1851 నాటికి దేశమంతటినీ తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత గవర్నర్ జనరల్ పరిపాలనా పరిధిలో గవర్నర్ల పరిపాలనలో కలకత్తా కేంద్రంగా బెంగాల్ ప్రెసిడెన్సీ, బొంబాయి కేంద్రంగా బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ కేంద్రంగా మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆగ్రా కేంద్రంగా నార్త్-వెస్ట్రన్ ప్రావిన్స్ ఉండేవి. స్వాతంత్ర్యం తర్వాత పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో చిరకాల పోరాటం తర్వాత, భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా మద్రాస్ నుంచి 1953 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1969 నాటికి తెలంగాణ ఉద్యమం మొదలయింది. పలు దశల్లో దాని ఉత్థానపతనాలు తర్వాత 2014 నాటికి అది సాకారమయింది, రాష్ట్రం రెండు అయింది. ఏపీ నూతన ముఖ్యమంత్రి చెబుతున్న ప్రతిపాదిత కొత్త జిల్లాలు కూడా వస్తే, అప్పుడు ప్రభుత్వ పరిపాలన మరింత సూక్ష్మస్థాయికి చేరుతుంది. అయితే, 'రాజ్యం ఎలా వస్తుంది...?' అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. గతంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర గవర్నర్ చేసే పర్యటనలు అంటే అవి- విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు మాత్రమే ఎక్కువసార్లు పరిమితమై ఉండేవి. ఇప్పుడిక అవి ద్వితీయ శ్రేణి నగరాలైన - ప్రొద్దుటూరు, కావలి, గుడివాడ, పిఠాపురం, టెక్కలి వంటి చిన్న పట్టణాలకు విస్తరిస్తాయి. దానివల్ల ఏమవుతుంది? అనేది మనకు కలిగే సందేహం. కొత్త ప్రాంతాలు 'ఓపెన్' అవుతాయి. ప్రాంతాలు 'తెరవబడటం' అనేది అన్నిసార్లు 'లింక్ రోడ్లు' వేయడంతోనే కావు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవిలో ఉన్నవారి సందర్శనల వల్ల అది మరింత భిన్నంగా జరుగుతుంది. అప్పుడు ఆయా ప్రాంతాలు పట్టణాల 'ఎథోస్' బయట ప్రపంచానికి వెల్లడి అవుతాయి. కొత్త జాతులు, తెగలు, లిపిలేని భాషలు, వెలుగు నోచుకోని చిన్నపట్టణాల వైతాళికులు అప్పుడు బయటకు వస్తారు. అప్పుడు వారికి 'రాజ్యం' గుర్తింపు దొరుకుతుంది. భాషావేత్తగా మనకు బాగా తెలిసిన సి.పి.బ్రౌన్ బ్రిటిష్ ప్రభుత్వ అధికారి. ఆయన పూనికతో తెలుగు భాషకు జరిగిన మేలు మనకు తెలుసు. విభజన తర్వాత ఇప్పటి వరకు మూడు కార్యాలయాలకు వసతినిచ్చిన బెజవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్ సమీపంలో ఉన్న ఒకనాటి నీటిపారుదల శాఖ ఆవరణం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 'రాజ్ భవన్' అయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్ భవన్ నుంచి పరిపాలన సాగిస్తారు ఒక ప్రాదేశిక ప్రాంతానికి కొత్తగా రాష్ట్ర ప్రతిపత్తి ప్రకటించాక, అందుకు అవసరమైన హంగులు ఏర్పడడానికి కనీస వ్యవధి అవసరం. అందుకే చట్టంలో కేంద్రం హైదరాబాద్ మీద పదేళ్ళు హక్కు ఏపీకి ఇచ్చింది. అరవై ఏళ్ల క్రితం కర్నూలు నుంచి హైదరాబాద్ రాజధాని మారేసరికి, అప్పటికే 1948 నాటి 'పోలీస్ యాక్షన్' తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చిన నిజాం నిర్మించిన సువిశాలమైన భవనాలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వసతికి అక్కడ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు అవి అలా ఆదుకున్నాయి. ఇప్పుడు అక్కడున్నతొమ్మిదేళ్ళ వెసులుబాటును వద్దు అనుకుని, ముందస్తు ఏర్పాట్లు లేకుండా హైదరాబాద్‌ను వదిలిపెట్టి బెజవాడ వచ్చేశాక అది ఏ ప్రభుత్వానికి అయినా సమస్యే. ఇక్కడికి వచ్చాక, ఆరు నుంచి ఎనిమిది మాసాలు ఉండే బెజవాడ వేసవి ఉష్ణ తాపం, హైదరాబాద్ నగరానికి భిన్నంగా ఇక్కడ ఉండే ఉక్కబోత కారణంగా, 'వర్క్ ప్లేస్' అననుకూలత వచ్చిన వెంటనే సిబ్బందికి తొలి అవరోధం అయింది. దానివల్ల పని నాణ్యత మీద ఉండే ప్రభావం పైకి కనిపించేది కాదు. సరే, కుటుంబ సమస్యలు ఎటూ ఉంటాయి. ఐదేళ్ళు అయ్యాక క్రమంగా ఇప్పుడిప్పుడే ఇక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఏపీ లాంటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇల్లు చక్కబెట్టుకుంటున్న స్థితి. కొత్త గవర్నర్ విజయవాడ 'రాజ్ భవన్' లోకి రాకముందు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున ఇచ్చిన వీడ్కోలు సభలో ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాట్లాడుతూ 'యు హావ్ ఎక్వైర్డ్ న్యూ ఎంపైర్' (నువ్వు కొత్త రాజ్యాన్ని పొందావు) అన్నారు. అవును ఐదేళ్ళ రాష్ట్రం, ఐదు వారాల ప్రభుత్వం. రెండోసారి అధికారం చేపట్టాక, ఇప్పటికే 'వంద రోజుల కార్యాచరణ' అని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం రావడంతో పరిపాలన వేగం అందుకోవాలి. అయితే, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ మూడు నెలలోపే దక్షణాదిలో బీజేపీ ‘పని’ మొదలెట్టింది. కర్ణాటకలో ‘ఆపరేషన్ కమల్’ పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్' మొదలుపెట్టింది. ఇటువంటివి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దృష్టిని తన పని మీదినుంచి మరల్చడమే తప్ప మరొకటి కాదు. ఇటువంటి పరిస్థితి వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రమే కాదు, రేపు ఆగస్టు 3వ తేదీన తన 85వ జన్మదినం జరుపుకోనున్నరాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు కూడా కొత్త తలనొప్పి కాకూడదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) చరిత్ర దృష్టికోణం నుంచి దక్షణాదిని చూసినప్పుడు 24 జూలై 2019 ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని తన నూతన ప్రాదేశిక ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత, దాని తొలి 'రాజ్యాధినేత' (స్టేట్ హెడ్) ఆ రోజు ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. text: కచ్చితంగా వాపేనంటోంది ట్విటర్ సంస్థ. మనుగడలో లేని, నకిలీ ఖాతాల వల్ల ఫాలోవర్ల సంఖ్య వాస్తవానికి మించి ఉంటోందన్నది ఆ సంస్థ మాట. ఇప్పుడు వాటన్నిటినీ ప్రక్షాళన చేసే పనిలో పడింది. ట్విటర్‌ అంటే పూర్తి నమ్మకం ఏర్పరచడానికి గాను ఈ చర్యలు చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే లక్షలాది ఖాతాలను లాక్ చేయడంతో పలువురు ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అంతెందుకు ట్విటర్ సంస్థ సొంత ఖాతా ఫాలోవర్ల సంఖ్య కూడా 77 లక్షల మేర తగ్గిపోయిందంటే ఈ మిషన్ ఏ స్థాయిలో చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ట్విటర్ అకౌంటర్ల ప్రక్షాళన కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ ఫాలోవర్ల సంఖ్యలో భారీ పతనాన్ని చూస్తున్నారు. అమెరికాలో కేట్ పెర్రీ, లేడీగాగా, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ వంటివారి ఖాతాలకు ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తెలుగు ప్రముఖుల ట్విటర్ బలాబలాల్లోనూ మార్పులు రానున్నాయి. ఫాలోవర్ల సంఖ్య అనేది పారదర్శకంగా ఉండాలని, అందులో కచ్చితత్వం ఉన్నప్పుడే పారదర్శకత సాధ్యమవుతుందని ట్విటర్ 'లీగల్, పాలసీ, ట్రస్ట్, సేఫ్టీ విభాగాధిపతి' విజయ గద్దె అంటున్నారు. ట్విటర్ అంటే విశ్వాసం పాదుకొల్పడానికి, ఆరోగ్యకరమైన సంభాషణలను ప్రోత్సహించడానికి ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. ట్విటర్ అకౌంట్ ఎప్పుడు లాక్ చేస్తారు? ఏ ట్విటర్ ఖాతా తీరులోనైనా ఆకస్మిక మార్పులు కనిపిస్తే ఆ ఖాతాదారును సంప్రదిస్తారు.. అప్పుడు వారు తమ ఖాతాను ధ్రువీకరించుకోవడంలో విఫలమై పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోలేకపోతే అలాంటి ఖాతాలను లాక్ చేస్తారు. లాక్ చేసిన ట్విటర్ అకౌంట్‌ను లాగిన్ చేయడం కుదరదు. స్పామ్, హానికరమైన ఖాతాలను కూడా గుర్తించే సాంకేతికతను ట్విటర్ ఇటీవల కాలంలో పెంచుకుంటూపోతోంది. ఇలా గుర్తించిన అన్ని ఖాతాలను లాక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా లాక్ చేసిన ఖాతాలను కొద్దిరోజులుగా ఇతరుల ఫాలోవర్ల జాబితాల నుంచి తొలగించడం ప్రారంభించారు. దీంతో ఫాలోవర్ల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. వాడుకలో లేనివి, స్పామ్, ఆటోమేటెడ్, పెయిడ్ ఖాతాలను ఫాలోవర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఈ ఏడాది మేలో ట్విటర్ వారానికి సగటున 99 లక్షల స్పామ్, ఆటోమేటెడ్ అకౌంట్లను గుర్తించింది కేవలం ఫాలోవర్ల సంఖ్యేనా ట్వీట్లు, రీట్వీట్లు, లైకులపైనా ప్రభావం ఉంటుందా? దూషణలు, రెచ్చగొట్టే మాటలు, వేధించే వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాలు, వదంతులు.. విద్వేష, హింసాంత్మక వైఖరితో పెట్టే కామెంట్లు, పోస్టింగులు సోషల్ మీడియాలో ఎక్కువవుతున్నాయి. దీనికి ట్విటర్ కూడా అతీతమేమీ కాదు. ఆటోమేషన్ ద్వారా ఖాతాలు నిర్వహిస్తూ ట్విటర్‌లో మంచి వాతావరణాన్ని చెడగొడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఇలాంటి స్పామ్, హానికర అకౌంట్లను గుర్తించేందుకు పెద్ద ఎత్తున మానవ వనరులను, సాంకేతికతను ట్విటర్ సమకూర్చుతోందని ట్విటర్ 'ట్రస్ట్, సేఫ్టీ' విభాగ వైస్ ప్రెసిడెంట్ డెల్ హార్వే తెలిపారు. ట్విటర్ ట్రస్ట్, సేఫ్టీ విభాగం చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది మేలో ట్విటర్ వారానికి సగటున 99 లక్షల స్పామ్, ఆటోమేటెడ్ అకౌంట్లను గుర్తించింది. గత ఏడాది సెప్టెంబరులో వారానికి సగటున ఇలాంటివి 32 లక్షల అకౌంట్లను మాత్రమే గుర్తించారు. అంటే... ట్విటర్ ఈ మేరకు స్పామ్, ఆటోమేటెడ్ అకౌంట్ల ఏరివేతను ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా గుర్తించిన ఖాతాలను లాక్ చేస్తారు. లాక్ చేసిన ఖాతాల్లోకి లాగిన్ కాలేరు కాబట్టి వాటి నుంచి కొత్తగా ట్వీట్లు, కామెంట్లు, లైకులు, రీట్వీట్లకు అవకాశం ఉండదు. దాంతో దూషణలు వంటివన్నీ తగ్గుతాయి. అసలైన ఫాలోవర్లో కాదో తెలుసుకోవడం ఎలా? ఒక ట్విటర్ అకౌంట్‌కు ఉన్న ఫాలోవర్లలో అసలైనవారు ఎంతమందో తెలుసుకోవడానికి పలు మార్గాలున్నాయి. ఇందులో కొన్ని ట్విటర్ అధికారిక టూల్స్ కాగా మరికొన్ని ట్విటర్‌తో సంబంధం లేనివి. ట్విటర్‌తో సంబంధం లేని టూల్స్‌ను ఉపయోగించుకుని తెలుసుకున్నది ప్రాథమిక అవగాహనకు తీసుకోవచ్చు. కచ్చితంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ట్విటర్ అధికారిక టూల్ 'ట్విటర్ కౌంటర్'(Twitter Counter) వాడొచ్చు. * ట్విటర్ కౌంటర్‌ను ఉపయోగించి ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదలను విశ్లేషించుకోవచ్చు. నెల రోజుల పాటు ఉచితంగా వాడుకునే అవకాశం ఉన్నా ఆ తరువాత నుంచి దీనికి రుసుం చెల్లించాలి. ఫాలోవర్లలో పెరుగుదల, పోస్టింగ్ యాక్టివిటీ, కొత్తగా ఎప్పుడెంతమంది ఫాలోవర్లు వచ్చారు, ఎంత మంది తగ్గారు, ఎంగేజ్‌మెంట్ వంటినే అనేక రకాల సమాచారం తెలుసుకోవచ్చు. ఫాలోవర్ల సంఖ్యలో క్రమంగా పెరుగుదల ఉంటే అనుమానించాల్సిందేమీ ఉండదు.. అలా కాకుండా ఒకట్రెండు రోజుల్లోనే హఠాత్తుగా ఫాలోవర్ల సంఖ్య పెరిగితే వారిని పెయిడ్ ఫాలోవర్లుగా భావించాల్సి ఉంటుంది. * 'ట్విటర్ ఆడిట్' అనే టూల్ సహాయంతో ఒక అకౌంట్‌కు ఉన్న మొత్తం ఫాలోవర్లు, అందులో ఫేక్ ఫాలోవర్ల సంఖ్య తెలుసుకోవచ్చు. అయితే, ఇది సగటు(యావరేజ్) గణాంకాలను మాత్రమే అందిస్తుంది. మొత్తం ఫాలోవర్లలో 5,000 శాంపిళ్లను తీసుకుని అందులో అసలెన్ని, నకిలీ ఎన్ని నిర్ధారించి ఆ లెక్కను మొత్తం ఫాలోవర్ల సంఖ్యకు వర్తింపజేసి నకిలీ ఫాలోవర్ల లెక్క చెబుతుంది. అయితే, ఇది ట్విటర్ అధికారిక టూల్ కాదు. వీరు అందించే గణాంకాలకు తమకు సంబంధం ఉండదని ట్విటర్ గతంలోనే తెలిపింది. * 'ఫేక్ ఫాలోవర్స్ చెక్'.. ఇది యాక్టివ్ ఫాలోవర్లు ఎందరు? యాక్టివ్‌గా లేనివారెందరు? నకిలీ ఎందరు? అనేది శాతాల్లో చూపిస్తుంది. దీని సహాయంతో చెక్ చేసుకోవాలంటే తొలుత మీ ట్విటర్ అకౌంట్‌తో లాగిన్ కావాలి. సొంత అకౌంట్ చెక్ చేయడంతో పాటు రోజుకు అదనంగా మరో మూడు ఖాతాలను ఉచితంగా చెక్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఖాతాలు చెక్ చేయాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ‘ట్విటర్ ఆడిట్’ ప్రకారం మహేశ్ బాబు ట్విటర్ ఖాతా విశ్లేషణ తెలుగు ప్రముఖుల సంగతేంటి? తెలుగు రాజకీయ, సినీ ప్రముఖుల్లో చాలామందికి ట్విటర్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే, తాజా పరిణామాలతో వీరిలో ఎవరి ఫాలోవర్ల సంఖ్య ఎంత తగ్గనుందో తేలాల్సి ఉంది. నారా చంద్రబాబునాయుడు: 40 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'ట్విటర్ ఆడిట్' ప్రకారం విశ్లేషిస్తే ఇందులో 16,50,789 మంది ఫేక్ ఉన్నట్లు చూపుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 7 లక్షల మందికిపై ఫాలోవర్లు ఉన్నారు. 'ట్విటర్ ఆడిట్' ప్రకారం విశ్లేషిస్తే ఇందులో 2,76,191 మంది ఫేక్ ఉన్నట్లు చూపుతోంది. కేటీఆర్: 13 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉండగా ట్విటర్ ఆడిట్ అందులో 3,85,190 ఫేక్‌గా చూపుతోంది. పవన్ కల్యాణ్: 31 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. అందులో 15,82,267 ఫేక్ అని ట్విటర్ ఆడిట్ చూపుతోంది. మహేశ్ బాబు: 66 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా అందులో 31,64,384 ఫేక్ అని ట్విటర్ ఆడిట్ చూపించింది. జూనియర్ ఎన్టీఆర్: 24 లక్షలకు పైగా ఫాలోవర్లు.. అందులో 7,88,973 ఫేక్ అని ట్విటర్ ఆడిట్ చూపించింది. ..కాగా ట్విటర్ ఆడిట్ 5 వేల శాంపిళ్లను తీసుకుని ట్వీట్ల సంఖ్య, ఎంత తరచుగా చేస్తున్నారు వంటి వివరాలతో విశ్లేషిస్తుంది. ఇది పూర్తి కచ్చితమైనది కాదని.. అయితే, ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నవారు ప్రాథమికంగా విశ్లేషించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ‘ట్విటర్ ఆడిట్’ వెబ్‌సైట్ చెబుతోంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ట్విటర్ ఖాతాలు పరిశీలిస్తే లక్షలు, కోట్లలో ఫాలోవర్లు కనిపిస్తారు. మరి అదంతా వారి బలమేనా..? లేదంటే వాపా?.. text: క్లినికల్ ట్రయల్స్‌: ప్రయోగాల వెనుక కథేంటి? వీళ్లంతా కొన్ని ఫార్మా కంపెనీల క్లినికల్ ట్రయల్స్‌ (ఔషధ ప్రయోగాల)లో పాల్గొన్నట్లు వారి సంబంధికులు బీబీసీకి చెప్పారు. ఔషధ ప్రయోగాల వల్లే వాళ్ల ఆరోగ్యం దెబ్బతిన్నదని అంటున్నారు. డబ్బుకు ఆశపడి జమ్మికుంట మండల పరిధిలో కొంతమంది స్వచ్ఛందంగా క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధపడుతున్నారని పోలీసుల దర్యాప్తులోనూ తేలింది. ఆర్థిక సమస్యలు, దళారుల మోసపూరిత మాటల వల్లే కొందరు అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి బీబీసీతో అన్నారు. జగదీశ్ జమ్మికుంట మండలానికి చెందిన వంగర నాగరాజు (48) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు ఆయన కుమారుడు జగదీశ్ తెలిపారు. 'మా నాన్న కేటరింగ్ పని చేసేవారు. ఒక రోజు నడుం నొప్పితో కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చేర్చాం. చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ తర్వాత కర్మకాండల కోసం ఇళ్లు శుభ్రం చేస్తుంటే నాన్నకు సంబంధించిన కొన్ని పత్రాలు దొరికాయి. వాటి గురించి ఆరా తీస్తే బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో ఆయన క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. ఇంట్లో ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. ఆ పత్రాల్లో ఏప్రిల్ 26న నాన్న క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు ఉంది. జూన్‌లో ఆయన చనిపోయారు' అని నాగరాజు కుమారుడు జగదీశ్ బీబీసీకి ఫోన్‌లో వివరించారు. కేసీఆర్ మీద ఫేస్‌బుక్‌ పోస్టులు: కండక్టర్‌ సస్పెన్షన్ తెలంగాణలో కొత్త జోన్లతో కొలువులొచ్చేనా? ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీ క్లినికల్ ట్రయల్ పత్రాలపై సంతకం చేసిన నాగరాజు 'క్లినికల్ ట్రయల్స్ విషయం తెలిశాక నాన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రి చుట్టూ తిరిగాం. డాక్టర్లు ఇప్పటి వరకూ నివేదిక ఇవ్వలేదు. క్లినికల్ ట్రయల్స్ జరిపిన బెంగళూరులోని ఫార్మా కంపెనీకి వెళ్లి మాకు న్యాయం చేయాలని అడిగినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందించ లేదు' అని జగదీశ్ చెప్పారు.ప్రస్తుతం తాను జమ్మికుంటలో డిగ్రీ చేస్తున్నాని ఖాళీగా ఉన్నప్పుడు కూలీకి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాని చెప్పారు. అశోక్, సురేశ్‌లది మరో కథ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అశోక్ మతిస్థిమితం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని సురేశ్ చెప్పారు. బెంగళూరులో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న సురేశ్ అనారోగ్యానికి గురై వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, కేటరింగ్ పని మీద తాను 2006లో హైదరాబాద్ వెళ్లానని, అక్కడే కొందరి ద్వారా క్లినికల్ ట్రయల్స్ విషయం తెలిసిందని చెప్పారు. క్లినికల్ ట్రయిల్‌లో పాల్గొన్నందుకు ఓ ఫార్మా ల్యాబ్ నుంచి తనకు అందిన చెక్‌ను చూపెడుతున్న సురేశ్ 'ఆర్థిక ఇబ్బందుల వల్ల మొదట హైదరాబాద్‌లోని కొన్ని ఫార్మా కంపెనీల్లో క్లినికల్స్ ట్రయల్స్‌లో పాల్గొన్నాను. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లాను. అక్కడ బౌన్సర్లను పెట్టి మరీ బలవంతంగా నాతో కొన్ని ద్రవాలు తాగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నాకు రక్తపు వాంతులు అయ్యాయి. చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరాను. కానీ, అక్కడి వాతావరణం, చికిత్స విధానం నచ్చక పారిపోయి వచ్చాను. ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నా' అని సురేశ్ బీబీసీకి చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ పై ప్రత్యేక కమిటీ మెడికల్ ట్రయల్స్ వల్లే ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్న వారి కుటుంబాలను కలసి నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్ రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ నివేదిక రావాల్సిఉంది. కమిటీ వేశాం, చర్యలు తీసుకుంటాం: మంత్రి ఈటెల క్లినికల్ ట్రయల్స్ అంశం రాష్ట్ర పరిధిలో లేనప్పటికీ జరిగిన ఘటనలపై ఎప్పటికప్పుడు 'డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు తెలియజేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన ఈ అంశంపై కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. 'నాగరాజు మృతి తర్వాత క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి మరో మూడు కేసులు బయటకు వచ్చాయి. ఇదంతా డీసీజీఐ పరిధిలో ఉండే అంశం అయినప్పటికీ నాగరాజు మృతి తర్వాత జస్టిస్ గోపాల్ రెడ్డి, డీఐజీ, నిమ్స్ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరితో కమిటి వేశాం. ఆ నివేదిక వచ్చాక డీసీజీఐకి పంపిస్తాం' అని మంత్రి చెప్పారు. 'డీసీజీఐ, ఎథిక్స్ కమిటీ కూడా జరిగిన సంఘటనలపై విచారణ జరుపుతోంది. నివేదికలు వచ్చాక తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం' అని ఈటెల తెలిపారు. డబ్బులకు ఆశపడి యువత ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మంత్రి అన్నారు. నాగరాజుపై క్లినకల్ ట్రయల్స్ నిర్వహించిన లోటస్ సంస్థపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారు తమ పేర్లు చెబితే వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు. తన తండ్రి మృతిపై పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని జగదీశ్ బీబీసీకి ఇచ్చారు. స్పందించని లోటస్ ల్యాబ్‌ యాజమాన్యం లోటస్ ల్యాబ్ క్లినికల్ ట్రయల్స్‌లో నాగరాజు పాల్గొన్నట్లు అతని కుమారుడు జగదీశ్ చెప్పిన నేపథ్యంలో బెంగళూరులో ఉన్నలోటస్ ల్యాబ్‌ను బీబీసీ సంప్రదించింది. నాగరాజు మృతి అలాగే, తెలంగాణ పోలీసులు లోటస్ ల్యాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని వాళ్ల దృష్టికి తీసుకొచ్చింది. ఈ విషయంపై బీబీసీ బెంగళూరు ప్రతినిధి లోటస్ యాజమాన్యాన్ని ఈ- మెయిల్ ద్వారా సంప్రదించారు. అయితే దీనిపై లోటస్ ల్యాబ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు. 'క్లినికల్ ట్రయల్స్ తప్పుకాదు.. ప్రజల్లో అవగాహన కల్పించాలి' ఏదైనా కొత్త ఔషధాన్ని కనిపెట్టాలంటే క్లినికల్ ట్రయల్స్ అవసరమని.. పెన్సిలిన్ నుంచి పారాసిటమాల్ మాత్ర వరకు కొత్త ఆవిష్కరణల ఫలితంగానే మానవాళి అరోగ్యంగా మనుగడ సాగిస్తోందని కేర్ ఆస్పత్రి క్లినికల్ రీసెర్చ్ హెడ్, సంస్కార ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ స్థాపకులు డాక్టర్ శ్రీధర్ తిరునగరి అన్నారు. క్లినికల్ ట్రయల్స్ నిబంధనలను ఆయన బీబీసీకి వివరించారు. 'మొదటి దశ ప్రయోగశాలలో జీవకణాలపై ప్రయోగాలు చేసి తర్వాత జంతువులపై రెండు మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే మనుషులపై నిర్వహిస్తారు' అని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. 'ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. ఎన్జీవోలు కూడా అందులో పాలుపంచుకుంటాయి. కానీ, భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ అంటే ప్రాణాలు తీసే ప్రయోగాలు అనే ముద్రపడటం దురదృష్టకరం' అని అన్నారు. 'ప్రాణాలు కాపాడే మందుల ఆవిష్కరణకే ఔషధ ప్రయోగాలు నిర్వహిస్తారు. క్లినికల్ ట్రయల్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది' అని డాక్టర్ శ్రీధర్ వివరించారు. మా ఇతర కథనాలు: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వీడియో / ఫొటోలు : బి. రాజేంద్ర ప్రసాద్ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన నాగరాజు జూన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అదే మండలం కొత్తపల్లి గ్రామస్థుడు అశోక్‌ మతిస్థిమితం కోల్పోయారు. సురేశ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. text: "రెండు చీరలు నేస్తే రోజుకు రూ .150 వస్తాయి. కొన్ని నెలలుగా చీరల ఆర్డర్లు తగ్గిపోయాయి. మాకు పని తగ్గింది. ఇప్పుడు చీరలు నేస్తే మాకు పూటగడవటం లేదు. అందుకే చీరలు నేయడంతో పాటు, బయట కూలీ పనులకు కూడా వెళ్లక తప్పట్లేదు." ఉత్తర్‌ప్రదేశ్‌లోని మావు జిల్లా కాసింపూర్ నేత కార్మికుల టౌన్‌షిప్‌ వాసి నౌషాద్ చెప్పిన మాటలివి. ఆయన ఇంట్లోనే రెండు మరమగ్గాలను నడుపుతున్నారు. ఆయన, ఆయన తల్లి, భార్య, ఇద్దరు చెల్లెళ్లు అందరూ చీరలే నేస్తారు. రెండు పవర్‌లూమ్‌ల మీద అందరూ కష్టపడితే, రోజులో రెండు మూడు చీరలు పూర్తవుతాయి. అందరికీ కలిపి రోజుకు ఓ రూ.300 వస్తాయి. కానీ, ఆర్డర్లు లేక కొన్ని రోజులుగా ఒక పవర్‌లూమ్ మూతపడింది. కాసింపూర్‌లో చాలామంది తమ ఇళ్లలో పవర్‌లూమ్‌లను నడుపుతున్నారు. చీరలు నేయడమే వారికి జీవనోపాధి. ఆర్డర్ల మీద చీరలు నేస్తారు. ఒక్కో చీరకు రూ.100 వస్తాయి. ఆర్డర్లు ఇచ్చే వ్యాపారులే నూలు, నైలాన్ లాంటి ముడి సరులను సరఫరా చేస్తారు. దేశంలో ఆర్థిక మందగమనం ప్రభావం చేనేత పరిశ్రమ, దానిపై ఆధారపడి బతుకుతున్న కార్మికులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ పనులు లేక ఇప్పటికే వందల మంది ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లారని స్థానికులు చెప్పారు. 'గతిలేక ఈ పనిచేస్తున్నాం' "12-14 గంటలు కష్టపడినా మా కడుపు నిండటం కష్టమైపోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ పరిశ్రమలోనే ఉండాలని ఎవరు కోరుకుంటారు? మరోచోటుకు వెళ్లలేక, గతిలేక మేము ఇక్కడే పనిచేయాల్సి వస్తోంది" అని కాసింపూర్ వాసి రెహమాన్ అన్సారీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మావు జిల్లా చేనేత పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా బనారస్ చీరలు నేస్తారు. మావుతో పాటు, అజాంగఢ్, వారణాసి , ముబారక్‌పూర్‌లోనూ బనారస్ చీరల తయారీ, అమ్మకాలు జరుగుతాయి. యూపీలోని గోరఖ్‌పూర్, తాండా, మీరట్‌ లాంటి నగరాల్లోనూ చేనేత పరిశ్రమ ఉంది. అంతటా పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాదు, దేశమంతా పరిస్థితి ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా మగ్గాల సంఖ్య, కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. డిమాండ్‌ను పెంచి ఈ పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించినా, పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. దేశంలో వస్త్ర పరిశ్రమ సుమారు పది కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఉపాధి కల్పన విషయంలో, ఈ రంగం వ్యవసాయం తరువాత రెండవ స్థానంలో ఉంది. పాత చిత్రం బాధలు వివరిస్తూ పత్రికల్లో ప్రకటన వస్త్ర పరిశ్రమ ఎంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందో వివరిస్తూ గత నెల ఆగస్టు 20న, ఉత్తరభారత స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ (నిట్మా) వార్తా పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది. 'దేశంలో స్పిన్నింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. దాంతో అనేకమంది ఉపాధి కోల్పోయి, నిరుద్యోగులుగా మారుతున్నారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. "స్పిన్నింగ్ మిల్లుల్లో దాదాపు మూడోవంతు మూతపడే స్థితిలో ఉన్నాయి. రూ.80,000 కోట్ల విలువైన పత్తిని కొనేవారు లేరు. ప్రభుత్వం ముడి పదార్థాల ధరను తగ్గించి, ఎగుమతులపై పన్ను తగ్గించాలన్నది మా డిమాండ్. ,ప్రభుత్వం రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనాలు అందేలా చూడాలి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా నుంచి ముడి పదార్థాల దిగుమతిని నిషేధించాలి" అని నిట్మా వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ త్యాగి అన్నారు. తాము ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రావట్లేదని, అందుకే పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని త్యాగి చెప్పారు. సూరత్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వస్త్ర పరిశ్రమలో స్తబ్దత, ఉద్యోగాల కోత పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అయినా, ఈ సమస్యనను ప్రభుత్వం ధృవీకరించడంలేదు. ఎందుకంటే, ఈ రంగంలో ఎక్కువ భాగం అసంఘటిత రంగం కిందకు వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డేటా ప్రభుత్వానికి అందడటంలేదు. మీరు కేంద్ర టెక్స్ట్ టైల్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో దొరికే డేటాను పరిశీలిస్తే, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో నిరుద్యోగం, స్తబ్దత లాంటి విషయాల్లో పెద్దగా మార్పు లేదని అర్థమవుతోంది. పాకిస్తాన్‌లో బెనారస్ చీరలు! ఉపాధి కల్పించే విషయంలో, వ్యవసాయం తరువాత చేనేత పరిశ్రమ దేశంలో రెండవ అతిపెద్ద రంగం. అయితే, రోజులు గడిచేకొద్దీ ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 1995లో 65 లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నారు. 2010లో ఆ సంఖ్య 43 లక్షలకు పడిపోయింది. అప్పటి నుంచి ఈ సంఖ్య నిరంతరం తగ్గుతూ వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ రంగం తిరోగమనం దిశగా వెళ్తోందని ఉత్తర్‌ప్రదేశ్ నేత కార్మికుల ఫోరం చైర్మన్ అర్షద్ జమాల్ అన్నారు. "ఈ పరిశ్రమలో మాంద్యం నోట్ల రద్దుతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇక కోలేకోలేదు. నోట్ల రద్దు చేనేత పరిశ్రమ నడ్డి విరిచింది. ఆ దెబ్బ నుంచి వస్త్ర పరిశ్రమ ఇప్పటికీ కోలుకోవడంలేదు. దానికి తోడు జీఎస్టీ మరింత నష్టం కలిగించింది" అర్షద్ జమాల్ చెప్పారు. ప్రభుత్వ విధానాలే ఈ సంక్షోభానిjr ప్రధాన కారణమని వస్త్ర పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణమని ఆర్థిక వ్యవహారాల జర్నలిస్ట్ వీరేంద్ర భట్ అన్నారు. "ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో 21 స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి. అవి అక్కడి నేత కార్మికులకు నూలును సరఫరా చేస్తుండేవి. ఇవాళ మిల్లులన్నీ మూతపడ్డాయి. ఫలితంగా నేత కార్మికులు నూలు, నైలాన్‌ను అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. ఏడాది క్రితం, అలహాబాద్‌లో ఒక స్పిన్నింగ్ మిల్లును మళ్లీ ప్రారంభించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, అది విఫలమైంది. ఈ రంగంలో, ప్రభుత్వ విధానాలు నేత కార్మికుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నాయి" అని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆరోగ్య బీమా పథకం, పవర్‌లూమ్ సబ్సిడీ పథకం, ప్రధాన్ మంత్రి ముద్ర యోజన, హాత్‌కర్ఘా సంవర్ధన్ సహాయత యోజన పథకం లాంటి పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. కానీ, నేత కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో వస్త్ర పరిశ్రమను కరెంటు కోతలు కూడా తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయని కార్మికులు అంటున్నారు. ఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవం మరోలా ఉంది. ఎందుకంటే, గత కొన్నేళ్లుగా ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.710 కోట్లు కేటాయించారు. 2017-18లో రూ.604 కోట్లకు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 386 కోట్లకు తగ్గించారు. 2019-20 బడ్జెట్‌లో రూ.456 కోట్లు కేటాయించారు. కార్మికులకు నేరుగా ప్రయోజనం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వస్త్ర పరిశ్రమ నిపుణులు అంటున్నారు. సాంకేతికత పరంగానూ మెరుగుపడాల్సిన అవసరం ఉందని అర్షద్ జమాల్ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) బనారస్ చీరలకు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి, ఆ చీరలను నేసే కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? text: ప్రేమ సందేశాల కొత్త చిరునామా జపాన్‌లోని త్సుకుబా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు ప్రారంభించిన 'వార్ప్ స్పేస్' అనే స్టార్టప్ సంస్థ ఈ సేవలను ప్రారంభిస్తోందని జపనీస్ పత్రిక యోమియురి శింబున్ పేర్కొంది. 16 మిల్లీ మీటర్ల పొడవు, 8 మిల్లీ మీటర్ల వెడల్పు ఉండే టిటానియం ఫలకాల మీద నవ దంపతుల పేర్లను, ప్రేమ సందేశాలను రాసి ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్తామని సంస్థ నిర్వాహకులు వివరించారు. ఆ ఫలకాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి వ్యోమగాములు బయటకు వదిలిపెడతారు. అంతేకాదు, వాటిని విడిచి పెడుతున్నప్పుడు ఫొటోలు తీసి ఆ దంపతులకు పంపిస్తారు. ఇక అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలతో పాటే ఈ ఫలకాలు కూడా కక్ష్యలో తిరుగుతాయి. అవసరమైతే ఆ ఫలకాల పరిమాణాన్ని పెంచుతామని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ప్రణయ సందేశాల సేవలను 2019లో ప్రారంభించనున్నవార్ప్ స్పేస్ అంతరిక్ష సందేశం ఖరీదు రూ. 18,543 ఈ సేవలు అందించేందుకు 'వార్ప్ స్పేస్' సంస్థ జపాన్‌‌కు చెందిన ప్రయోగాత్మక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (కిబో)తో కలిసి పనిచేస్తోంది. 2019లో తొలిసారిగా ఫలకాలను పంపించనున్నట్టు వార్ప్ స్పేస్ సంస్థ తెలిపింది. ఒక్కో ఫలకానికి 30,000 యెన్‌లు(రూ. 18,543) చార్జి చేస్తారట. అయితే, తొలుత ప్రత్యేకంగా త్సుకుబా నగరంలోని ఒకురా ఫ్రాంటియర్ హోటల్‌లో పెళ్లి చేసుకున్న దంపతులకు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నారు. అందులోనూ 2019 ఫిబ్రవరి లోగా వివాహం చేసుకున్నవారికి మాత్రమే ఆ అవకాశం ఇస్తున్నారు. ఒక్కోసారి కొన్ని వందల ఫలకాలను ఆ ఉపగ్రహం ద్వారా తీసుకెళ్లవచ్చని సంస్థ చెబుతోంది. కొంత జంటలకు చిరకాల జ్ఞాపకం మిగిల్చాలన్న ఆలోచనతో ఇలా చేస్తున్నామని వార్ప్ స్పేస్ అధ్యక్షులు తోషిహిరో అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) నవ దంపతులు తమ ప్రేమను అంతరిక్షంలోనూ ప్రదర్శించుకునే వినూత్న అవకాశం కల్పిస్తామని జపాన్‌కు చెందిన ఓ సంస్థ చెబుతోంది. వధూవరుల పేర్లు, ప్రేమ సందేశాలు రాసిన ఫలకాలను అంతరిక్షంలోకి తీసుకు వెళ్లి వదిలే సేవలను ప్రారంభిస్తున్నామని తెలిపింది. text: మెంగ్ వాన్‌ఝూ, హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని తేలిక చేసేందుకు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు డిసెంబర్ 1న జీ20 వేదికగా ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, జిన్ పింగ్ మధ్య చర్చలు జరిగిన అదే రోజు కెనడాలో మెంగ్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమెను అమెరికాకు చేరుస్తున్నారు. అయితే, మెంగ్‌పై ఆరోపణల గురించి ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో హువావే దర్యాప్తు ఎదుర్కుంటోందని మనకు తెలుసు. ఇది కేవలం ఒక మహిళ అరెస్టు, లేదా ఒక కంపెనీకి సంబంధించిన కేసు కాదు. చాలా కాలం నుంచీ ఉప్పునిప్పుగా ఉన్న రెండు దేశాల మధ్య ఇది చాలా సున్నితమైన సమయం. ఈ అరెస్ట్ ఇప్పుడు అమెరికా, చైనా మధ్య భౌతిక బంధాలకు తీవ్ర నష్టం కలిగించవచ్చు. "ఇలాంటి ప్రతికూల సమయంలో ఇది జరిగుండకూడదు. ముందు ముందు జరగబోయే దేనికో ఇది బహుశా ముసుగు వేసే అవకాశం ఉంది" అని సిల్క్ రోడ్ రీసెర్చ్‌కు చెందిన వినేశ్ మోత్వానీ నాకు చెప్పారు. ఇటీవల జీ20 ఒప్పందంపై మార్కెట్‌ ఇప్పటికే చాలా సందేహంలో ఉంది. ఏదైనా ఒప్పందం చేసుకోవచ్చా అనేదానిపై ఈ అరెస్ట్ మార్కెట్‌ను మరింత అనుమానాల్లో పడేయబోతోంది. సంధి ప్రయత్నాలకు బ్రేక్ వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాణిజ్యం విషయంలోనే కాదు, బ్యూనస్ ఎయిర్స్‌లో జీ20 సదస్సు తర్వాత రెండు దేశాలూ చర్చల గురించి కనీసం నిర్ణయం తీసుకుంటాయని, 90 రోజుల్లో తమ మధ్య ఉన్న గొడవలన్నిటినీ పక్కనపెడతాయేమోనని అనిపించింది. ఆ అంశాల్లో టెక్నాలజీ గురించి ఆందోళన కూడా ఉంది. అది ఈ వాణిజ్య యుద్ధంలో మొదటిదిగా ఉంది. చైనా, అమెరికా తమ ఉద్దేశాల గురించి ఎంత ఐక్యంగా ఉన్నాయో తెలీకపోయినా, జరుగుతున్న చర్చలు మాత్రం ప్రపంచ ఆర్థికవ్యవస్థకు సెమీ పాజిటివ్‌గానే కనిపించాయనేది పచ్చి నిజం. వాణిజ్య యుద్ధంలో బందీ "కానీ ఈ అరెస్టును చైనా ఒక దాడిగా, 'బందీగా తీసుకోవడం'గానే చూస్తుంది" అని ఎలియట్ జాగ్‌మాన్ అన్నారు. ఆయన ఈ చైనా సంస్థను గత రెండు దశాబ్దాలుగా కవర్ చేస్తున్నారు. "ఒప్పందాలను చేసుకుని, వాటికి తగ్గట్టు నడుచుకోదని, నియమాలు పాటించదని చైనాకు చెడ్డ పేరుంది" అని ఆయన బోస్టన్ నుంచి ఫోన్లో చెప్పారు. "వాణిజ్య యుద్ధంలో చైనా తమ మాట వినేలా చేయడానికి అమెరికాకు ఇది ఒక మార్గం కావచ్చు" అని ఒక థియరీ ఉంది. అదే నిజమైతే, ఆ ఎత్తును చైనా మీడియా సరిగా పసిగట్టలేకపోయింది. "హువావేపై దాడికి అమెరికా ఒక మార్గం వెతకాలని ప్రయత్నిస్తోంది" అని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు క్సిజిన్ అన్నారు. ఈ పత్రికను చైనా ప్రభుత్వ వాణిగా భావిస్తారు. "అది హువావేను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే ఆ సంస్థ పరికరాలు వాడవద్దని అమెరికా తన మిత్ర దేశాలపై ఒత్తిడి తెస్తోంది. హువావే పేరును నాశనం చేయాలని చూస్తోంది" అన్నారు. అమెరికా మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, బ్రిటన్‌ హువావే సేవలను తిరస్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హువాయ్ పరికరాల ఉపయోగించడం ఆపేయాలని మిత్ర దేశాలు అమెరికా ఒత్తిడి తెస్తోంది చైనా ఆర్మీతో హువావే బంధం హువావే గూఢచర్యం చేసినట్లు, డేటాను చైనా ప్రభుత్వానికి ఇచ్చినట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవు. నిజానికి నేను హువావే ప్రతినిధులతో ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడినా "అమెరికా, పాశ్చాత్త మీడియా తమ సంస్థను చైనా ప్రభుత్వ సంస్థగా, ఆ దేశం కోసం పనిచేస్తున్నట్లు చిత్రీకరించడం తమను ఎంత అసహనానికి గురిచేస్తోందో" చెప్పారు. చట్టాన్ని గౌరవించే ఒక అత్యాధునిక అంతర్జాతీయ సంస్థగా హువావేను చూడాలని వారు కోరారు. అమెరికా తమ సంస్థను దోషిలా చూపిస్తోందని, అందులో నిజం లేదని నాతో అన్నారు. మెంగ్ తండ్రి, హువావ్ వ్యవస్థాపకుడు, రెన్ జెంగ్ఫెయ్ చైనా ఆర్మీలో ఒక మాజీ సైనిక అధికారి. అది నిజమే అని జాంగ్‌మన్ అన్నారు. "ఆ సంస్థకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయనే విషయం ఆందోళన కలిగించే, అస్పష్టమైన అంశంగా మారిందని" అన్నారు. అందుకే హువావే లాంటి చైనా కంపెనీలకు దేశాలన్నీ దూరంగా ఉండాలని అమెరికా చెబుతోంది. చైనా చట్టాల ప్రకారం ప్రభుత్వం అడిగితే, ఆ దేశంలోని ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులు తమ దగ్గర ఉన్న సమాచారం, డేటా అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలాంటి చట్టాలు ఇప్పుడు హువావేతో వ్యాపారం చేయాలంటే తమకు ఆందోళన కలిగిస్తున్నాయని వివిధ దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎదురు దెబ్బ కానీ, ఇది పూర్తిగా అవాస్తవం అని హువావే నాతో అంది. చైనాలోని మరికొన్ని సంస్థలు, వ్యాపారస్థులు కూడా ఈ మాటను కొట్టిపారేశారు. "చైనా ప్రభుత్వం అలా చేయదు. దేశంలోని సొంత సంస్థలనే చైనా దెబ్బ కొట్టదు. అది తమ సంస్థలను అలా చేస్తే ఆ దేశానికి ప్రయోజనం ఏముంది. ఒక మామూలు, చిన్న ఉద్యోగిని అలాంటి సమాచారం అడిగినా ప్రభుత్వం అభ్యర్థనను తిరస్కరించే అధికారం హువావేకు ఉంటుంది" అని గ్లోబల్ టైమ్స్‌ ఎడిటర్ హు అన్నరు. అంతర్జాతీయ మార్కెట్ చేరకుండా చైనాలోని ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను అడ్డుకుంటూ ఉండడంతో ఆ దేశంలో ఉన్న చాలా మంది ఇప్పుడు దీన్ని చైనాను ముందుకు తీసుకెళ్లాల్సిన మరో ప్రయత్నంగా భావిస్తున్నారు. "అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బయట హువావే 5జీ ఆకాంక్షలను ఇది మరింత ప్రమాదంలో పడేస్తుంది" అని అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడిన నిఘా అధికారి టోనీ నాష్ అన్నారు. "హువావేపై విచారణ సాగితే.. ఉత్తర అమెరికా, అభివృద్ధి చెందిన మార్కెట్లలో మిగతా తయారీ సంస్థలు ముందుకు దూసుకెళ్తాయి. హువావే, జడ్‌టీఈ రెండూ ఆ పోటీలో వెనకబడిపోతాయి." మిగతా దేశాలు ఎటు వైపు? అప్పుడు, హువావే అభివృద్ధి చెందిన మార్కెట్లలో మాత్రమే తన స్థానం కోల్పోదు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కూడా ఆ ప్రభావం పడుతుంది. ఆ పరిశ్రమ వర్గాలు నాకు "హువావే ఉత్పత్తులు వాడడం ఆపేయాలని ఆసియా మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. తాజాగా వాటిలో సాల్మన్ దీవులు, పపువా న్యూ గినీ కూడా చేరాయి. తర్వాత ఆ జాబితాలో భారత్ చేరుతుందని అనుకుంటున్నారు" అని చెప్పారు.. అంటే దీనర్థం ఏంటి? అంతా ముసుగులో జరుగుతోంది. అమెరికా తాజా వ్యూహం ప్రకారం, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం గురించి ఎవరికీ, ఎలాంటి భ్రమలూ ఉండకూడదు. కానీ, పరిస్థితులు మాత్రం మరింత ఘోరంగా మలుపులు తిరుగుతున్నాయి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) హువావే చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్, ఆ సంస్థ వ్యవస్థాపకుడి కుమార్తె మెంగ్ వాన్‌ఝూ అరెస్ట్ గురించి ఎక్కువ చేసి చెప్పడం కష్టమే. చైనా టెక్నాలజీ మకుటంలో హువావే ఒక మణి అయితే, మెంగ్ ఆ సంస్థ యువరాణి. text: జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గోస్వామి బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం ఆయన, మిగతా ఇద్దరు నిందితులను రూ. 50 వేల పూచీకత్తుపై మధ్యంతర బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాలను వెంటనే అమలు చేయాలని పోలీస్ కమిషనర్‌ను జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. పోస్ట్ of Twitter ముగిసింది, 1 కాగా అంతకుముందు గోస్వామి బాంబే హైకోర్టులో బెయిలుకు దరఖాస్తు చేసుకోగా అక్కడ ఆయనకు బెయిలు నిరాకరించారు. దీంతో బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో అర్ణబ్, మరో ఇద్దరిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కాగా విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు అర్ణబ్, మిగతా ఇద్దరు నిందితులకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ప్రస్తుతం ఎలాంటి చట్టాలకుగానీ, ప్రభుత్వ సంస్థలకుగానీ లోబడకుండా ప్రసారాలు కొనసాగిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌లాంటి ఓవర్‌ ది టాప్‌ ప్రసారాలు, వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారంనాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సంతకంతో ఒక గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ గెజిట్‌ ప్రకారం ఆన్‌లైన్‌ సినిమాలు, డిజిటల్‌ న్యూస్‌, కరెంట్‌ ఎఫైర్స్‌కు సంబంధించిన ప్రసారాలన్నీ ఇక నుంచి కేంద్ర ప్రభుత్వనిబంధనల పరిధిలోకి వస్తాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో ప్రసారమవుతున్న కొన్ని అభ్యంతరకరమైన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్థలను హెచ్చరిస్తూ రావడమే కాక, ఈ ప్రసారాల విషయంలో స్వీయ నియంత్రణ, నిబంధనలు రూపొందించుకోవాలని సూచించింది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్‌లో ఎనిమిది ఓటీటీ సంస్థలు స్వీయ నిబంధనలను కూడా రూపొందించుకున్నాయి. అయితే ఆ నిబంధనలను తిరస్కరించిన కేంద్రం ఇప్పుడు వాటి ప్రసారాలను ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. మొజాంబిక్‌లో మారణహోమం.. 50 మందిని చంపేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు 50 మందికి పైగా ప్రజలను ఊచకోత కోసారని ప్రభుత్వ మీడియా తెలిపింది. ఒక గ్రామంలోని ప్రజలను ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు లాక్కొచ్చి ఊచకోత కోశారని, మరొక గ్రామంలో అనేకమంది తలలు నరికారని ఈ రిపోర్టులు తెలుపుతున్నాయి. గ్యాస్ అధికంగా లభ్యమయ్యే కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో 2017 నుంచీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 2,000 మంది ప్రాణాలు కోల్పోగా, 4,30,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మిలిటెంట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కు చెందివారని, దక్షిణ ఆఫ్రికాలో తమ బలాన్ని పెంచుకోవడం కోసం ఈ దాడులు జరుపుతున్నారని సమాచారం. పేదరింకం, నిరుద్యోగంలో మగ్గుతున్న యువకులను తమవైపు తిప్పుకుంటూ ఆ ప్రాంతంలో ఇస్లామిక్ పాలనను స్థాపించే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. తీవ్రవాదులు "అల్లాహో అక్బర్" అని అరుస్తూ కాల్పులు జరిపారని, శుక్రవారం నాడు రాత్రి నంజబా గ్రామంలో ఇళ్లను తగలబెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారంటూ ప్రభుత్వ మీడియా సంస్థ మొజాంబిక్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది. డోనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం సిగ్గుచేటు: జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం సిగ్గుచేటని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఓటమిని అంగీకరించకపోయినా.. అధికార మార్పిడిని అడ్డుకోలేరని బైడెన్ అన్నారు. అమెరికాలో అన్ని ప్రధాన టీవీ చానల్స్ తను ఓడిపోయానని చెప్పినప్పటికీ.. చివరికి గెలిచేది తానేనని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జో బైడెన్ స్పందించారు. ''నిజానికి ఇది సిగ్గుచేటు. నేను ఒకటే చెప్పగలను.. దీని వల్ల ఆయనేమీ సాధించలేరు. చివరగా జనవరి 20న ఇది ముగుస్తుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది'' అని బైడెన్ చెప్పారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధం అవుతున్న బైడెన్‌కు పలువురు విదేశీ నాయకులు ఫోన్‌చేసి అభినందిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఐర్లాండ్ ప్రధాని మిఖాయెల్ మార్టిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ తదితరులతో ఇప్పటికే ఆయన మాట్లాడారు. ''సుప్రీంకోర్టులో అర్ణబ్‌ గోస్వామికి ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకు?'' రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి బెయిల్ అభ్యర్థనను వెంటనే విచారణకు స్వీకరించడంపై సీనియర్ అడ్వొకేట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అసోసియేషన్ అధ్యక్షుడు దుశ్యంత్ దవే నిరసన వ్యక్తంచేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ''సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ లేఖ రాస్తున్నాను. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం అర్ణబ్ కేసును విచారణకు స్వీకరించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాను'' అని దవే పేర్కొన్నారు. ''అర్ణబ్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలూ లేవు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసే హక్కులను అడ్డుకోవాలని నేను భావిచడం లేదు. అందరి పౌరుల్లానే ఆయన కూడా న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ''అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొన్ని ఎంపిక చేసిన అభ్యర్థనలనే విచారణ కోసం పరిగణలోకి తీసుకోవడం తీవ్రమైన అంశం. వేల మంది జైళ్లలో గడుపుతున్నారు. తమ పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాలని వారాలు, నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. అర్ణబ్ కేసు మాత్రం ప్రతిసారి అభ్యర్థన వచ్చిన వెంటనే పరిగణలోకి తీసుకుంటున్నారు’’ అని దవే ప్రస్తావించారు. ‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాస్టర్ ఆఫ్ ద రోస్టర్‌ నుంచి ఏమైనా ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా? ఎందుకంటే అలాంటి ఆదేశాలు లేకుండా ఇలా వెంటవెంటనే విచారణకు తీసుకోరు కదా.. లేకపోతే అర్ణబ్ కేసుకు రిజిస్ట్రార్ లేదా పరిపాలనా విభాగం అధిపతి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారా?'' అని ప్రశ్నించారు. ''ఉదాహరణకు సీనియర్ అడ్వొకేట్, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కేసునే తీసుకోండి. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్ అభ్యర్థన విచారణ కోసం ఆయన నెలలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరగా ఆయనకు బెయిల్ ఇవ్వొచ్చంటూ సుప్రీం కోర్టు చెప్పింది. ఇలా అందరూ వారాలు, నెలలపాటు ఎదురుచూస్తుంటే అర్ణబ్‌కు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు?'' అని దవే వ్యాఖ్యానించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మృతి కేసులో అర్ణబ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అన్వర్ ఆత్మహత్యతో అర్ణబ్‌కు సంబంధముందని ఆరోపిస్తూ ముంబయి పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో అర్ణబ్‌కు బెయిలు ఇచ్చేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి, మరో ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. text: శానిటరీ నాప్కిన్ల పై 12% జీఎస్టీ ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యార్థులకు వీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ. 127 కోట్లు కేటాయించింది. ఒడిశా, మహారాష్ట్రల తరువాత ఇలా శానిటరీ నాప్‌కిన్ల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన రాష్టం ఏపీనే. ఫిబ్రవరిలో ఒడిశా ప్రభుత్వం 'ఖుషి' అన్న కార్యక్రమం కింద రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదివే 17 లక్షల బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు పంపిణి చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 'అస్మిత' అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీని కింద విద్యార్థినులకు ఎనిమిది శానిటరీ నాప్కిన్లు ఇస్తారు. ఇతరులకు రూ.24కే అందుబాటులో ఉండేట్లు చూస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా 5వ పూర్తి బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. 'కౌమార బాలికలు ఋతుస్రావ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రతిపాదన' అని తెలిపారు. ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాలలోని కౌమార బాలికల కోసం రూ.27 కోట్లు, ఎస్ హెచ్ జి మహిళలకు, ఇతర కౌమార బాలికల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. మౌనిక దీనిపై బీబీసీ తెలుగుతో కొందరు విద్యార్థినులు మాట్లాడారు. ఇలా ఇవ్వడం చాల మంచి పరిణామం కానీ ఇచ్చే శానిటరీ నాప్కిన్స్ క్వాలిటీని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. విజయవాడ లోని సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థిని మౌనిక మాట్లాడుతూ.. కేవలం బడ్జెట్ కేటాయింపు కాదు దానిని పక్కగా అమలు చేయాలని కోరారు. "ప్రతి పబ్లిక్ ప్లేస్‌లో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మెషిన్స్ పెడితే ఇంకా బాగుంటుంది.'' అని సూచించారు. బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే! మరో విద్యార్ధిని స్నిగ్ధ మాట్లాడుతూ.. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య గురించి ఆలోచించడం శుభ పరిణామమన్నారు. "చాల సార్లు చూస్తాం సరైన శానిటరీ నాప్కిన్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అందరు వాటిని కొని వాడే పరిస్థితి లేదు. కనుక కేవలం అందుబాటు లో పెట్టడం కాకుండా, ఎవరికీ ఎలా అవసరం ఉంటదో అలా వేరు వేరు సైజుల్లో మంచి క్వాలిటీతో అందించాలని కోరారు. దీప్తి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా 2012లో ఇటువంటి కార్యక్రమం ప్రవేశ పెట్టారు కానీ దాన్ని అమలు చేయలేదు. కనుక ఇపుడు కేటాయించిన బడ్జెట్ నిధులను పక్కగా వెచ్చించి అందరికీ మంచి క్వాలిటీ ఉన్న శానిటరీ నాప్‌కిన్లను అందించాలని మరో విద్యార్ధిని దీప్తి తెలిపారు. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అవి నాణ్యంగా ఉండాలని విద్యార్థులు పేర్కొంటున్నారు. text: ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కుందేళ్లు ఉండేవి. "ఆ పరిస్థితులను మాటల్లో చెప్పలేనేమో. ఎక్కడ చూసినా పెద్దపెద్ద కుందేళ్లు మందలు మందలుగా కనిపించేవి. పంట వేస్తే మొక్కలను వేళ్లతో సహా పీక్కుతింటూ పొలాలను సర్వనాశనం చేసేవి. వాటి వల్ల మా దేశం తీవ్రంగా నష్టపోయింది." ఇవి 20వ శతాబ్దం మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో కుందేళ్ల 'దండయాత్ర' గురించి బిల్ మెక్‌డొనాల్డ్ అనే ఓ రైతు గుర్తుచేసుకున్న విషయాలు. అప్పట్లో ఆస్ట్రేలియాలో కొన్ని వందల కోట్ల సంఖ్యలో ఉన్న కుందేళ్లు దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. పంట చేలను నాశనం చేసేవి. గడ్డిపోచ కనిపించకుండా తినేసేవి. దాంతో పశుపోషణపై తీవ్ర ప్రభావం పడింది. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కుందేళ్లపై 'యుద్ధం' ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఉరుగ్వే నుంచి తీసుకొచ్చిన ఓ వైరస్‌ సాయంతో ఆ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నం చేశారు. అదో ఊహించని విపత్తు 19వ శతాబ్దం మధ్య కాలంలో యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు కుందేళ్లను తీసుకొచ్చారు. అప్పట్లో ఇతర జంతువులను వేటాడేందుకు కుందేళ్లను ఎరగా వాడేవారు. ఆ కుందేళ్లే మందలు మందలుగా పెరిగిపోయి దేశానికే సవాల్ విసిరే స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. కొత్త వాతావరణానికి పరాయి జీవజాతులను పరిచయం చేస్తే ఏమవుతుందో ఆస్ట్రేలియా ఎదుర్కొన్న ఆ ఉపద్రవమే ఓ చక్కని ఉదాహరణ. ఆ కుందేళ్ల బెడదను స్వయంగా చూసిన రైతు మెక్‌డొనాల్డ్‌ తాము ఎదుర్కొన్న 'విపత్కర' పరిస్థితులను ఇటీవల బీబీసీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. 1930లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌లో జన్మించిన ఆయన కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. కుందేళ్ల వల్ల తాము ఎంతో నష్టపోయామని ఆయన చెప్పారు. 1930 నాటికే అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో కుందేళ్ల సమస్య తీవ్రంగా ఉండేది. చాలామంది రైతులు వాటిని వేటాడి చంపేవారు. పంటలను కాపాడుకునేందుకు చుట్టూ కంచె వేసేవారు. కాపలా ఉండేవారు. అయినా వాటి బెడద తప్పేది కాదు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో సమస్య మరింత పెరిగింది. యుద్ధంలో పోరాడేందుకు చాలామంది పురుషులు వెళ్లాల్సి వచ్చింది. దాంతో కుందేళ్లను వేటాడేవాళ్లు తగ్గిపోయారు. తనకు పదేళ్ల వయసున్నప్పటి నుంచే తన తల్లితో కలిసి పొలానికి కాపలాగా వెళ్లేవాడినని మెక్‌డొనాల్డ్ గుర్తు చేసుకున్నారు. బోన్లు పెట్టి కుందేళ్లను పట్టుకునేవారు. గడ్డిమీద విషం చల్లి చంపేవారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో.. "రెండో ప్రపంచ యుద్ధం జరిగినంత కాలం కుందేళ్ల నియంత్రణ అన్నమాటే లేదు. దాంతో వాటికి అడ్డే లేకుండాపోయింది" అని ఆయన వివరించారు. భూములన్నీ నాశనమయ్యాయి. పంటలు వేస్తే మొక్కలను ఆ కుందేళ్లు వేళ్లతో సహా పీక్కుని తినేసేవి. భూమి మీద ఆకులు, అలములు, గడ్డి కనిపించకుండా చేసేవి. దాంతో పశుపోషణ కష్టమైంది. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. "మేత దొరక్క మా గొర్రెలు బక్కచిక్కిపోయేవి. నాణ్యమైన ఉన్ని ఉత్పత్తి అయ్యేది కాదు" అని మెక్‌డొనాల్డ్ తెలిపారు. అందుకే ఆస్ట్రేలియా చరిత్రలో వ్యవసాయ రంగం ఎక్కువగా నష్టపోయింది కుందేళ్ల వల్లనే అని చెబుతారు. 'మిక్సోమా' అనే వైరస్‌ను వ్యాప్తి చేసి 90 శాతం కుందేళ్లను చంపేశారు. వైరస్‌తో కుందేళ్లపై యుద్ధం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ప్రమాదకరంగా మారిన కుందేళ్లను ఎక్కడికక్కడే చంపేయాలని ప్రజలకు ప్రభుత్వం పిలుపిచ్చింది. దాంతో రైతులు గడ్డి మీద విషం చల్లి వాటిని చంపేవారు. అవి ఉండే బొరియలను యంత్రాలతో ధ్వంసం చేసేవారు. వాటిలోకి విషవాయువులను పంపేవారు. "రోజూ సాయంత్రం విషం చల్లి, ఉదయాన్నే వెళ్లి చూస్తే కొన్ని వందల కుందేళ్లు చనిపోయి ఉండేవి. కొన్నింటిని బోన్లు పెట్టి పట్టుకునేవాణ్ని" అని మెక్ డొనాల్డ్ గుర్తు చేసుకున్నారు. అన్ని చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ ప్రమాదకర వైరస్‌ను వ్యాప్తి చేసి కుందేళ్లను చంపాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసం ఉరుగ్వే దేశం నుంచి 'మిక్సోమా' అనే వైరస్‌ను తీసుకొచ్చారు. దోమల ద్వారా వ్యాప్తిచెందే ఈ వైరస్ సోకిన కుందేళ్ల చర్మం మీద పెద్దపెద్ద గడ్డలు ఏర్పడతాయి. దవడలు ఉబ్బి మేత తినలేకుండా తయారవుతాయి. ఇతర అవయవాలు దెబ్బతింటాయి. 1950లో కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఆ వైరస్‌ను దేశవ్యాప్తంగా వదిలారు. ఆ ప్రయత్నం మంచి ఫలితాలివ్వడంతో, అదే విధానాన్ని బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాలు కూడా అనుసరించాయి. "ఆ వైరస్‌ బారిన పడిన కుందేళ్ల అవయవాలు అన్నీ చెడిపోయేవి. కళ్లు పోయి గుడ్డివిగా మారేవి. మేత తినకపోవడంతో బక్కచిక్కిపోయేవి. మాకు మాత్రం ఆ వైరస్ వల్ల ఎలాంటి సమస్య ఉండేది కాదు" అని మెక్‌డొనాల్డ్ వివరించారు. కుందేళ్ల బెడద వల్ల గొర్రెలకు, పశువులకు గడ్డి దొరికడం కష్టంగా ఉండేది. కుదుట పడ్డ వ్యవసాయం ఆస్ట్రేలియాలోని కొన్ని కోట్ల కుందేళ్లు ఆ వైరస్ బారిన పడ్డాయి. వాటిలో దాదాపు 90శాతం మేర చనిపోయాయి. దాంతో భూములు క్రమంగా కోలుకున్నాయి. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుటపడింది. అయితే, కొన్నాళ్లకు బతికున్న కుందేళ్లలో ఆ వైరస్‌ను తట్టుకునే శక్తి కూడా పెరిగింది. దాంతో 1990ల్లో మరో కొత్త వైరస్‌ను వినియోగించారు. అది కొంత ఫలితాలిచ్చినా.. తర్వాత దాన్ని కూడా తట్టుకునే శక్తి కుందేళ్లలో పెరిగింది. దాంతో ఇప్పటికీ ఆస్ట్రేలియాలో కుందేళ్లపై పోరాటం కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా తమ ప్రాంతంలో కుందేళ్ల బెడద ఉందని మెక్ డొనాల్డ్ అంటున్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మళ్లీ గత పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కుందేళ్లు అంటే చాలా అమాయకమైనవని, సాధుజీవులని అనుకుంటాం. అలాంటి మూగ జీవులు ఒక దేశంపై 'దండయాత్ర' చేయడమేంటి? వాటి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడం ఏంటి? అని అనుకుంటున్నారు కదూ! text: ఆయన తన రాచరిక సంపదను స్వలింగ సంపర్కులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ దేశంలో స్వలింగ సంపర్కం అపరాధం మాత్రమే కాదు, పదేళల జైలు విధించదగిన నేరం కూడా. అయితే, ఈ 153 ఏళ్ల నాటి చట్టాన్ని పునః పరిశీలించడానికి భారత సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గే యువరాజును ఆయన స్వస్థలమైన రాజ్ పిప్లాలో బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్‌డేకర్ కలుసుకుని అందిస్తున్న కథనం. ఇవి కూడా చదవండి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) భారత రాజవంశీకుల్లో తనను తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించుకున్న తొలి యువరాజు మానవేంద్ర సింగ్ గోహిల్. text: గురువారం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన బ్యాడ్మింటన్ గ్రూపు-ఎ మ్యాచ్‌ల్లో సత్తా చాటారు. ఐదు మ్యాచ్‌లలో ఏ ఒక్క సెట్‌లోనూ పాకిస్తాన్ గెలుపొందలేదు. అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ 2-0 తేడాతో విజయం సాధించింది. శ్రీకాంత్ పురుషు సింగిల్స్‌ గ్రూప్ ఎ మ్యాచ్‌లో 2-0 తేడాతో పాకిస్తాన్‌ ఆటగాడు మురాద్ అలీపై కిదాంబి శ్రీకాంత్ గెలుపొందారు. తొలి సెట్‌లో శ్రీకాంత్ 21 పాయింట్లు, మురాద్ అలీ 16 పాయింట్లు సాధించారు. రెండో సెట్‌లో శ్రీకాంత్ 22 పాయింట్లు, మురాద్ అలీ 20 పాయింట్లు రాబట్టారు. సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో పాకిస్తాన్ క్రీడాకారిణి మహూర్ షాహ్‌జాద్‌ను 2-0 తేడాతో సైనా నెహ్వాల్ ఓడించారు. మొదటి సెట్‌లో సైనా 21 పాయింట్లు సాధించగా, మహూర్ 7 పాయింట్లు మాత్రమే రాబట్టారు. రెండో సెట్‌లో సైనాకు 21 పాయింట్లు రాగా, మహూర్‌కి 11 పాయింట్లు వచ్చాయి. మిక్స్‌డ్ డబుల్స్ పాకిస్తాన్‌కు చెందిన ఇర్ఫాన్ సయీద్ భట్టి, పల్వాశా బషీర్‌ల జోడీపై 2-0 తేడాతో రంకిరెడ్డి సాత్విక్, సిక్కీ రెడ్డీల జోడీ విజయం సాధించింది. రెండు సెట్లలో భారత జట్టు 21 చొప్పున సాధించింది. పాకిస్థాన్ జట్టు తొలి సెట్‌లో 10 పాయింట్లు, రెండో సెట్‌లో 13 పాయింట్లు మాత్రమే సాధించింది. పురుషుల డబుల్స్ పాకిస్తాన్‌కు చెందిన ఇర్ఫాన్ సయీద్ భట్టి, మురాద్ అలీ జోడీని 2-0తేడాతో ప్రణవ్ చోప్రా, చిరాగ్ శెట్టీల జోడీ ఓడించింది. పాకిస్తాన్ జట్టు తొలి సెట్‌లో 9 పాయింట్లు, రెండో సెట్‌లో 15 పాయింట్లు సాధించగా.. భారత జట్టు రెండు సెట్లలోనూ 21 పాయింట్ల చొప్పున రాబట్టింది. మహిళల డబుల్స్ పాకిస్తాన్‌కు చెందిన మహూర్ షాహ్‌జాద్, పల్వాషా బషీర్ జోడీని 2-0 తేడాతో భారత్‌కు చెందిన అశ్వినీ పొన్నప్ప, గద్దె రుత్వికల జోడీ ఓడించింది. రెండు సెట్లలోనూ భారత్ 21 పాయింట్ల చొప్పున సాధించింది. తొలిసెట్‌లో పాకిస్తాన్ 6 పాయింట్లు, రెండో సెట్‌లో 10 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. text: ముంబయిలోని అనుయోగ్ విద్యాలయం విద్యార్థి రిషికేశ్. సమియుల్లా పాకిస్తాన్‌లోని లాహోర్ గ్రామర్ స్కూల్‌లో చదువుతున్నాడు. ఈ ఇద్దరూ ఉత్తరాల ద్వారా 'పెన్- ఫ్రెండ్స్' అయ్యారు. వాళ్లది ఓ కొత్త ప్రపంచం. వాళ్ల మధ్య 'భారత్', 'పాకిస్తాన్' అనే సరిహద్దులు లేవు. పాకిస్తాన్‌లో వడా-పావ్ దొరుకుతుందా? రిషికేశ్ రాసిన మొదటి ఉత్తరంలో తన గురించి వివరించారు. దానికి సమియుల్లా స్పందించారు. ఉత్తరాల్లో తమ గురించి, తమ కుటుంబాలు, తినే ఆహారం, ఆటలు, అలవాట్ల గురించి చెప్పుకోవడం ద్వారా వారి మధ్య స్నేహం మొగ్గ తొడిగింది. ముంబయి గురించి, గేట్ వే ఆఫ్ ఇండియా గురించి, ఆలయాల గురించిన వివరాలను, ఫొటోలను రిషికేశ్ పంపేవారు. అటువైపు నుంచి లాహోర్ కోట, బాద్‌షాహి మసీదుల గురించి సమియుల్లా చెప్పేవారు. ఇద్దరూ పరస్పరం అన్ని రకాల ప్రశ్నలూ వేసుకునేవారు. "పాకిస్తాన్‌లో వడా-పావ్ దొరుకుతుందా?" దగ్గరి నుంచి "హాకీ మీకు కూడా జాతీయ క్రీడేనా?" వరకు. ఈ ఉత్తరాల మార్పిడి 2016లో ప్రారంభమైంది. 2017లో పాకిస్తాన్‌లోని తన స్నేహితుడ్ని ముఖాముఖిగా కలవాలని హృషికేశ్ నిర్ణయించుకున్నారు. లాహోర్ వెళ్లే అవకాశం దొరికింది. లాహోర్‌లో ఉండే తన స్నేహితుడు సమియుల్లాను కలవబోతున్నందుకు ఆనందపడ్డారు. ముంబయి నుంచి నాకోసం ఏం తీసుకొస్తావు? అని తన నాలుగో ఉత్తరంలో సమియుల్లా అడిగాడు. రిషికేశ్ తన తండ్రి సలహాతో ఇద్దరికీ డ్రెస్సులు కుట్టించుకోవాలని నిర్ణయించారు. అందుకు రెండు పఠానీ సూట్లు కుట్టివ్వాలని స్థానిక అబ్బాస్ టైలర్‌ని కోరాడు. పాస్‌పోర్ట్ వచ్చింది, వీసా ప్రక్రియ పూర్తయింది. టికెట్లు కూడా బుక్ చేశారు. అన్ని ఏర్పాట్లూ అయ్యాక.. ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో, తన 'పెన్- ఫ్రెండ్‌'ని కలిసి, అతని దేశాన్ని చూసి రావాలనుకున్న రిషికేశ్ కల నెరవేరలేదు. రిషికేశ్ ఒక్కరే కాదు.. మొత్తం 212 మంది భారతీయ విద్యార్థులు ఇలాగే సరిహద్దుకు అవతల ఉన్న తమ 'కలం-స్నేహితుల'కు లేఖలు రాశారు. 'ఎక్చేంజ్ ఫర్ చేంజ్' అనే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా వెయ్యికి పైగా ఉత్తరాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రయాణించాయి. ముంబయిలోని అనుయోగ్ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయులు మనీషా ఘెవెడే ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, "రెండు దేశాల్లోనూ హిందీ ఉమ్మడి భాష అయినప్పటికీ మేము ఇంగ్లీషును ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, భారత్‌లో హిందీ లిపి వాడతాం, వాళ్లేమో ఊర్దూ వాడతారు. ఉత్తరాలు రాయడంలో మా పిల్లలు కాస్త ఇబ్బందిపడేవారు. దాంతో, మేము సాయం చేసేవాళ్లం. పిల్లలు వారి సొంత ప్రశ్నలను, ఆలోచనలను ఉత్తరంలో రాసేటప్పుడు చాలా సంతోషపడేవారు. అటువైపు నుంచి స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు" అని వివరించారు. ఉత్తరాల ద్వారా పరిచయం పెరిగిన తర్వాత, రెండోది పరస్పరం కలుసుకోవడం. అయితే, కొందరు పిల్లలు లాహోర్‌ వెళ్లేందుకు ఆసక్తి చూపినా, వారి తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు. "హిందూ, ముస్లింల మధ్య మతపరమైన సంబంధాల మీద దృష్టికోణాన్ని మార్చాల్చిన అవసరముంది. ఇలాంటి విషయాల గురించి పిల్లలు ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెట్టకముందే వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి. మేము పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాం. రెండు కుటుంబాలు తమ పిల్లలను లాహోర్ పంపేందుకు అంగీకరించాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులం కూడా వెళ్లాల్సి ఉండెను" అని అనుయోగ్ పాఠశాల నిర్వాహకుడు సతీష్ చిందార్కర్ వివరించారు. సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా, బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకోవాలని తమకు ఆందేశాలు వచ్చాయని సతీష్ తెలిపారు. ఎప్పటికైనా తమ విద్యార్థులను పాకిస్తాన్‌కు తీసుకెళ్తానన్న ఆశాభావంతో ఉన్నారాయన. భారత్, పాకిస్తాన్‌ విద్యార్థులు పరస్పరం తమ గురించి, తమ సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించేందుకు దిల్లీలోని 'రూట్స్2రూట్స్' అనే సంస్థ 2010లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏడేళ్లలో ముంబయి, దిల్లీ, డెహ్రాడూన్, లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌ నగరాలకు చెందిన 50,000 మందికి పైగా చిన్నారులు 'పెన్- ఫ్రెండ్స్' అయ్యారని ఆ సంస్థ వ్యవస్థాపకులు రాకేశ్ గుప్తా తెలిపారు. "ఇరువురి సంస్కృతులను, సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకుంటే.. శాంతిని నెలకొల్పడం అనేది పెద్ద సమస్యేమీ కాదు. ద్వేష భావాన్ని, వైరాన్ని చిన్నారుల మెదళ్ల నుంచి దూరం చేయాలి. ఇతరుల దేశాన్ని గౌరవించేలా చిన్నతనంలోనే నేర్పించాలి. భారత్, పాకిస్తాన్‌ మధ్య స్నేహపూర్వక బంధానికి కావాల్సింది ఇదే" అని రాకేశ్ గుప్తా అభిప్రాయపడ్డారు. అయితే, 'ఎక్చేంజ్ ఫర్ చేంజ్' కార్యక్రమాన్ని ఆపేయాల్సిరావడం ఆయన్ను తీవ్ర నిరాశపరిచింది. తాజ్ మహల్ దగ్గర పాకిస్తాన్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగంగా లాహోర్‌కు చెందిన 60 మంది విద్యార్థులు భారత్‌ను సందర్శించారు. తమ టీచర్లతో కలిసి దిల్లీలో 2 రోజులు గడిపిన తర్వాత తాజ్‌ మహల్‌ను కూడా చూసి వచ్చారు. "గత ఏడేళ్లలో చిన్నారులను భారత్ నుంచి పాకిస్తాన్‌కు తీసుకెళ్లాం, అటు నుంచి భారత్‌కు తీసుకొచ్చాం. అందుకు రెండు దేశాల ప్రభుత్వాలు, అధికారులు మాకు చాలా సాయపడ్డారు. కానీ, గత ఏడాది పాకిస్తాన్ పిల్లలను వెంటనే వెనక్కి పంపించేయాలని భారత హోంశాఖ మమ్మల్ని ఆదేశించింది. దాంతో, ఆ చిన్నారులు టూర్‌ని మధ్యలోనే ముగించుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చింది" అని గుప్తా గుర్తుచేశారు. లాహోర్ విద్యార్థులు భారత్‌లోని తమ స్నేహితులను కలుసుకోలేకపోవడానికి ఇదే కారణం. "ఎన్నో ప్రయత్నాల తర్వాత భారత్, పాకిస్తాన్‌ విద్యార్థుల మధ్య స్నేహం ఏర్పడింది. మళ్లీ అలాంటిది జరగాలంటే సులువైన పని కాదు" అంటారు రాకేశ్. ప్రస్తుతం రిషికేశ్ పదో తరగతి చదువుతున్నాడు. తన ఆలోచనలను పాకిస్తాన్ స్నేహితుడితో ఎలా పంచుకునేవాడో వివరించాడు. "ఇప్పటికీ ఏదో ఒక రోజు నేను పాకిస్తాన్ వెళ్లి సమియుల్లాను కలుస్తాన్న ఆశ ఉంది. సమియుల్లా నన్ను గుర్తుపడతాడో లేదో చెప్పలేను. ఎందుకంటే అప్పటి నుంచి మేం టచ్‌లో లేము. కానీ, ఇప్పటికీ అతన్ని కలవాలని ఉంది. అతడు నా ఫ్రెండ్." ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రిషికేశ్ దగ్గర ఉన్న అతిపెద్ద నిధి అతని స్నేహితుడు పంపిన నాలుగు ఉత్తరాలు. ఈ ఉత్తరాలు పాకిస్తాన్‌లో ఉండే సమియుల్లా పంపినవి. text: ప్రదీప్ తోమర్ ఇక్కడ ఒక్క కోవిడ్-19 కేసు నమోదు అయినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. “మా పరిస్థితి నిర్బంధంలో నిర్బంధానికి గురైనట్లుగా ఉంది” అని భారతీయ మిషన్ ‘భారతి’ పరిశోధన బృందంలో పని చేయడానికి వెళ్లిన డాక్టర్ ప్రదీప్ తోమర్ అన్నారు. “వ్యాధి సోకాక చికిత్స తీసుకోవడం కన్నా వ్యాధి రాకుండా కాపాడుకోవడం మంచిది” అని ఆయన అన్నారు. ఆయన అంటార్కిటికా వెళ్లి ఐదు నెలలు అవుతోంది. ఆయన అక్కడ భారతి మిషన్‌లో సంవత్సరం పాటు పని చేయవలసి ఉంది. ఇక్కడ కనుక ఎవరికైనా కోవిడ్-19 సోకితే జరిగే ప్రమాదాన్ని ఊహించలేమని ప్రదీప్ అన్నారు. వైద్య సదుపాయాల కొరత, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. దక్షిణ సముద్ర తీరంలో ఉన్న లార్సెమాన్ పర్వతాల పై భారతి మిషన్ స్థావరం నెలకొని ఉంది (పాత చిత్రం) ఇక్కడ ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కానప్పటికీ 23 మంది సభ్యులతో కూడిన భారతి బృందం ఫిబ్రవరి నుంచి లాక్ డౌన్ లోనే గడుపుతోంది. అంటార్కిటికాకు వెళ్లిన వారెవరినైనా 14 రోజుల పాటు కచ్చితంగా క్వారంటైన్‌లో పెడుతున్నారు. ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు కనిపిస్తే వారిని, వారి సమీపంలోకి వచ్చిన వారిని కూడా స్వీయ నిర్బంధంలో పెట్టాలని ఆయన అన్నారు. అంటార్కిటికాలో 29 దేశాలకు పరిశోధనా స్థావరాలు ఉన్నాయి. లాక్ డౌన్ ప్రారంభం కాక ముందు భారతి మిషన్‌ను సందర్శించడానికి ఇతర దేశాల వారు వస్తుండేవారు. వారి సందర్శనకి గుర్తుగా వారి వారి దేశాల జాతీయ జండాలను ఎగరవేసేవారు. ఆయా దేశాల్లో జరుపుకునే జాతీయ పండగలని, ముఖ్యమైన రోజులని అందరూ కలిసి జరుపుకునేవారు. ఎవరికైనా ఏమైనా పరికరాలు అవసరం అయితే ఇచ్చి పుచ్చుకునేవారు. బయట ప్రపంచంలో దేశాల మధ్య ఇంత సుహృద్భావం కనిపించదని తోమర్ అన్నారు. కానీ, లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇతర స్థావరాల నుంచి ఎవరూ రావటం లేదని చెప్పారు. భారతి మిషన్ తాజా చిత్రం ధృవ యాత్రలు చేపట్టినప్పుడు పరిశోధకులపై ఉండే మానసిక ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు తోమర్ నవంబర్ 15వ తేదీన అంటార్కిటికా వెళ్లారు. “వచ్చిన కొత్తలో మిగిలిన ప్రపంచంలో ఉన్నట్లే అనిపించింది. కానీ, ఇప్పుడు కరోనావైరస్ గురించిన సమాచారం పూర్తిగా లేకపోవడం వలన, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అనే ఆందోళన నిరంతరం వేధిస్తోంది” అని ఆయన అన్నారు. తోమర్‌కి, అతని సహచరులకి కరోనావైరస్ ఒక మహమ్మారి అని దానిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్‌లు విధించారన్న సమాచారం మాత్రమే ఉంది. ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సమాచారం మీదే ఆధారపడుతున్నారు. సామాజిక దూరం వలన కలిగే పరిణామాలని ఆయన ఊహించలేకపొతున్నారు. ‘‘నేనున్నట్లే చాలా మంది వారి వారి ఇళ్లల్లో నిర్బంధంలో ఉన్నట్లు నా స్నేహితులు చెబుతున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించి బయటకి వెళ్లడం నా ఊహకి అందటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా క్వారంటైన్ పద్ధతులు అమలులో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి బయటకి వెళ్లడం గాని, బయట నుంచి ఇక్కడికి ఎవరైనా రావడం గాని సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ వాతావరణంలో మేము మరిన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది’’ అని తోమర్ చెప్పారు. దక్షిణ సముద్ర తీరంలో ఉన్న లార్సెమాన్ పర్వతాలపై భారతి మిషన్ స్థావరం నెలకొని ఉంది. ఈ మిషన్ 2012 లో ప్రారంభమయ్యింది. ఇది ప్రపంచంలోనే అత్యంత మారు మూల ప్రదేశాల్లో నెలకొన్న పరిశోధనా స్థావరం ఇది. దీనికి 5000 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆఫ్రికా భూభాగం ఉంది. ఇదే ఈ స్థావరానికి దగ్గర్లో ఉన్న భూభాగం. ఇక్కడ నుంచి బయటకి వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క రవాణా మార్గం బోట్ ప్రయాణం మాత్రమే. అది కూడా అంటార్కిటికాలో వేసవికాలం అయిన నవంబర్ మధ్య నుంచి మార్చి చివరి వరకు మాత్రమే ప్రయాణం చేయడానికి వీలవుతుంది. ఇలాంటి ప్రదేశంలో నివసిస్తున్నవారు లాక్ డౌన్ ఎలా ఉంటుందో బాగా అర్ధం చేసుకోగలరు. అంటార్కిటికా స్థావరంలో పని చేస్తున్న వారందరూ ప్రస్తుతం వారి వారి ఇళ్ల దగ్గర నుంచే పని చేస్తున్నారు. షాపులు ఏవి తెరవలేదు. సరదాగా బయటకి నడిచి వెళ్లే అవకాశం కూడా లేదు. మరో వైపు వాతావరణంలో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి పడిపోతున్నాయి. మిషన్ భారతి బృందం ఇక్కడికి రాక ముందే భారతి మిషన్లో పని చేసే సభ్యులందరూ అంటార్కిటికా చలిని ఎలా తట్టుకోవాలో.. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి శిక్షణ తీసుకుని వచ్చారు. సామాజిక నిర్బంధం, ఒంటరితనం, సూర్య రశ్మి లేకపోవడం వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. సూర్య రశ్మి లేకపోవడం వలన ఒక నిర్ణీత పద్దతిలో నిద్రపోవడం కూడా కష్టంగానే ఉంటుంది. శరీరానికి తగినంత నిద్ర తీసుకోవాలని తమ బృంద సభ్యులకి సూచిస్తామని తోమర్ చెప్పారు. ఆ చలి ఖండంలో ఉండే పరిస్థితుల గురించి తోమర్‌కి ఇక్కడికి రాక ముందే అవగాహన ఉంది. ఇక్కడ ఎప్పుడూ ప్రాణ భయం వెంటాడుతుందని తోమర్ అన్నారు. ఇప్పుడు ఆ భయం మరింత పెరిగిందని ఆయన అన్నారు. ‘‘అయితే, నాకు ఇంటి దగ్గర అందరూ ఎలా ఉన్నారో అనే భయం కూడా ఎక్కువైంది. నాకు నిర్బంధంలో ఎలా ఉండాలో తెలుసు, కానీ, ఇంటి దగ్గర వారికి శిక్షణ ఉండదు కదా‌’’ అనే భయాన్ని వ్యక్తం చేశారాయన. తనకి తెలిసిన ప్రపంచ స్వరూపం ఈ ఒక్క సంవత్సరంలో పూర్తిగా మారిపోతుందేమోనని అన్నారు. “ఈ సమయంలో దేశానికి సేవ చేయాలని నాకు బలంగా అనిపిస్తోంది. ఇలాంటి విపత్తుని ఎవరూ ఊహించలేదు. నేను ఇంటికి తిరిగి వెళ్లేసరికి మళ్ళీ పాత ప్రపంచం నా కళ్ల ముందు సాక్షాత్కరిస్తుందని ఆశిస్తున్నాను”. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) అంటార్కిటికా ఖండంలో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కానప్పటికీ అక్కడ పని చేస్తున్నపరిశోధన బృందాలు మాత్రం స్వీయ నిర్బంధ నియమాలను ఎందుకు పాటిస్తున్నాయి? text: ఆ ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణీత గడువులో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌పై ఒత్తిడి చేయలేమని పేర్కొంది. ఎమ్మెల్యేల రాజీనామాను అంగీకరించాలా లేదా అనేది స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. బలపరీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయకూడదని ఆదేశించింది. సీజేఐ రంజన్ గొగోయి నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనురుద్ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై కర్ణాటక‌ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం తన విధులను నిర్వహిస్తానని తెలిపారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ, ‘ఇక ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే వారికి కావాల్సినంత బలం లేదు’ అని పేర్కొన్నారు. కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందా? 14 నెలల నుంచి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 117 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో 78 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాగా, 37 మంది జేడీఎస్ సభ్యులు, ఒకరు బీఎస్పీ, మరొక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. 225 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యలు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి రెబెల్‌గా మారిన 15 మంది ఎమ్మెల్యేలు గురువారం జరిగే బలపరీక్షలో పాల్గొనకపోతే అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. కానీ, కుమారస్వామి ప్రభుత్వం బలం 102కు తగ్గిపోతుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కర్ణాటక‌లో రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. text: ఆండ్రీ రస్సెల్ ఫైల్ ఫొటో మొదట టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 'సన్‌రైజర్స్ హైదరాబాద్' 181 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మొదట తడబడింది. క్రిస్, నితీశ్ రానా ఓపెనర్లుగా దిగారు. అయితే, 1.6 ఓవర్ల వద్ద 7 పరుగులు చేసి క్రిస్ పెవిలియన్‌కి చేరాడు. 87 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. 11.4 ఓవర్ల వద్ద ఉతప్ప పెవిలియన్ బాట పట్టాడు. ఉతప్ప 27 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత 95 పరుగుల వద్ద దినేశ్ కార్తిక్ ఔట్ అయ్యాడు.. నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసిన దినేశ్ కార్తిక్ పెవిలియన్‌ బాట పట్టాడు. 15 ఓవర్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 114 పరుగులు చేసింది. 47 బంతుల్లో 68 పరుగులు చేసిన నితీశ్ రానా 118 పరుగుల వద్ద LBWగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రస్సెల్ దుమ్ముదులిపాడు. 19 బంతుల్లో 49 పరుగులు చేశాడు. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన 'సన్‌రైజర్స్ హైదరాబాద్' మొదటి నుంచి నిలకడగా ఆడింది. డెవిడ్ వార్నర్, జానీ బేర్‌స్టవ్ ఓపెనర్లుగా వచ్చారు. జానీ బేర్‌స్టవ్ 35 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేసి, 12.5 ఓవర్ల వద్ద ఔట్ అయ్యాడు. డెవిడ్ వార్నర్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో మొత్తం 85 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి 'సన్‌రైజర్స్ హైదరాబాద్' 145 పరుగులు చేసింది. ఆ తర్వాత విజయ్ శంకర్, యూసఫ్ పటాన్ బ్యాటింగ్‌కి వచ్చాడు. 152 పరుగుల వద్ద 'సన్‌రైజర్స్ హైదరాబాద్' మూడో వికెట్ కోల్పోయింది. నాలుగు బంతుల్లో ఒక పరుగు చేసిన యూసఫ్ పటాన్‌ పెవిలియన్ బాట పట్టాడు. మొత్తం 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 'సన్‌రైజర్స్ హైదరాబాద్' 181 పరుగులు చేసింది. ఇదీ షెడ్యూల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్‌లను హైదరాబాద్‌లోనే ఆడనుంది. మార్చి 29న రాజస్తాన్ రాయల్స్‌తో, మార్చి 31న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ తలపడనుంది. ఏప్రిల్ 6న ముంబయి ఇండియన్స్‌తో, ఏప్రిల్ 14న దిల్లీ కేపిటల్స్‌తో, ఏప్రిల్ 17న చెన్నై సూపర్‌కింగ్స్‌తో, ఏప్రిల్ 21న కోల్‌కత్ నైట్‌రైడర్స్‌తో, ఏప్రిల్ 29న కింగ్స్ లెవన్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ వేదికగా ఆడనుంది. మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 మే మొదటివారం వరకు కొనసాగుతుంది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు ఈ ఏడాది టోర్నీలో ఎలాంటి ఫలితం సాధిస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 'సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. text: బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు దీనికి పోలీసులే బాధ్యులని ప్రజలు భావించవద్దని నేషనల్ పోలీస్ చీఫ్ టిటో కర్నావియన్ కోరారు. వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని ప్రాంతాల్లో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. పోలీసులు ఆయుధాలను ఉపయోగిస్తూ, ప్రజలను సంయమనంతో ఉండమని కోరుతున్నారనే ఆరోపణలను టిటో ఖండించారు. డజన్ల కొద్దీ నిరసనకారులను అరెస్టు చేశారు. "కొందరికి బుల్లెట్ గాయాలున్నాయి, కొందరికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి, కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది" అని మంగళవారం రాత్రి ఆరుగురు మరణించారనే సమాచారంపై వ్యాఖ్యానిస్తూ టిటో అన్నారు. బుధవారం నాడు కూడా జకార్తా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఆందోళనలన్నీ ఓ ప్రణాళిక ప్రకారం జరిగినవేనని, అప్పటికప్పుడు చెలరేగినవి కాదని అధికారులు అంటున్నారు. కొందరి రెచ్చగొట్టే చర్యలే ఈ ఆందోళనల్లో చెలరేగిన హింసకు కారణమని వారు భావిస్తున్నారు. నిరసనకారుల్లో చాలామంది జకార్తా బయట నుంచి వచ్చినవారే అని పోలీస్ అధికారి ముహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. నిరసనకారులను అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు ఘర్షణలు ఎలా మొదలయ్యాయి? మంగళవారం శాంతియుతంగా ప్రారంభమైన నిరసన ప్రదర్శనలో పోలీసులపై మందుగుండు సామగ్రిని విసరడం, కార్లను తగలబెట్టడంతో ఉన్నట్లుండి హింసాత్మకంగా మారాయి. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో చిరకాల ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటోపై విడోడో విజయం సాధించారనే సంకేతాలు రాగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. అధ్యక్ష ఎన్నికల్లో 55.5శాతం ఓట్లతో విడోడో విజయం సాధించారని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఇదంతా మోసమని ప్రత్యర్థి ప్రబోవో చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. నిరసనల్లో కార్లను అగ్నికి ఆహుతి చేశారు. 2014 ఎన్నికల్లో కూడా విడోడో చేతిలో ప్రబోవో ఓటమిని ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 17న జరిగిన అధ్యక్ష ఎన్నికల కోసం 19 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును కలిగిఉన్నారు. మంగళవారం నాడు అధికారిక ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రబోవోకు మద్దతుగా ఎన్నికల పర్యవేక్షణ భవనం ముందు వేలాదిమంది గుమిగూడారు. వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరడంతో వారంతా జకార్తాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారని 'బీబీసీ ఇండోనేసియా' తెలిపింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు నగరంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలను స్థానిక టీవీ చానల్లు ప్రసారం చేశాయి. హింసకు దారితీసే పరిస్థితులుండటంతో 30 వేలకు పైగా బలగాలను ముందుజాగ్రత్తగా జకార్తాలో మోహరించారు. సోషల్ మీడియాపై కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి విరాంటో బుధవారం నాడు ప్రకటించారు. వదంతులు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిషేధమని ఆయన అన్నారు. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఇండోనేసియా అధ్యక్షుడిగా జోకో విడోడో తిరిగి ఎన్నిక కావడంపై ఆ దేశవ్యాప్తంగా తలెత్తిన ఆందోళనలు, ఘర్షణల్లో ఆరుగురు మృతిచెందారు, 200 మంది గాయపడ్డారు. ఆస్పత్రుల నుంచి వస్తున్న నివేదికల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీరి మరణాలకు కారణాలేంటనే దానిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. text: "ఆకలి, పేదరికం అనేవి దేశంలో ఉండకూడదు. భారత్‌లో నివసించే ప్రతి పేద పౌరుడికీ కనీస ఆదాయం ఉండాలి" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చివర్లో రాహుల్ మరో మాట అన్నారు... ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి పథకం లేదని, 2019లో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే మనదే మొదటి దేశం అవుతుంది అని. పోస్ట్ of Twitter ముగిసింది, 1 నిజంగానే మరే దేశంలోనూ ఇలాంటి పథకం లేదా? ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై రాహుల్ ఇంకా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. అయితే ఆయన ప్రకటన స్వరూపాన్ని బట్టి ఇలాంటి పథకాలు విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయనేది అర్థమవుతోంది. బోల్సా ఫ్యామిలియా (బీఎఫ్ - తెలుగు అర్థం - కుటుంబ ఆదాయం) పేరుతో లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్‌లో 2003 నుంచే ఓ పథకం అమల్లో ఉంది. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో ఈ పథకం బాగా తోడ్పడిందనే అభిప్రాయం అక్కడ బలంగా ఉంది. "పేదరికం ప్రభావాన్ని తగ్గించడమే కాదు, యువతకు మెరుగైన అవకాశాల కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం, విద్య, వైద్య సౌకర్యాల అభివృద్ధికి కూడా ఈ పథకం ఎంతగానో తోడ్పడింది" అని ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్లో బోల్సా ఫ్యామిలియాపై రాసిన కథనంలో పేర్కొన్నారు. 2003 నుంచి 2010 వరకూ అధ్యక్షుడిగా ఉన్న లులా డ సిల్వాకు ఈ పథకం ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. "అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు ఈ బీఎఫ్ సామాజిక పథకం తోడ్పాటునందించింది. కుటుంబ నెలవారీ ఆదాయం 3365 రూపాయల లోపు ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులవుతారు" అని బీబీసీ బ్రెజిల్ ప్రతినిధి రికార్డో అకాంపొరా అభిప్రాయపడ్డారు. దీని కొనసాగింపుపై మొదట్లో కొన్ని సందేహాలు వ్యక్తమైనా, ఇప్పటికీ ఆ పథకం అమలులో ఉంది. విదేశాల్లో ఉన్న పథకాలను పరిశీలించాకే... "రాహుల్ గాంధీ బోల్సా ఫ్యామిలియా లాంటి పథకాలను ఆదర్శంగా తీసుకున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో ఈ నగదు బదిలీ పథకాల పనితీరును ఆయన పరిశీలించారు. బ్రెజిల్‌లోని బోల్సా ఫ్యామిలియా, మెక్సికోలోని ఆపర్చూనిడాడేస్, కొలంబియాలోని ఫ్యామిలియాస్ ఎన్ యాక్సియోన్ వంటి పథకాల ఫలితాలను చూసిన తర్వాత ఇలాంటి ఒక పథకాన్ని భారత్‌లో కూడా ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు" అని రచయిత శంకర్ అయ్యర్ తన పుస్తకం 'ఆధార్ - ఎ బయోమెట్రిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ 12 డిజిట్ రివొల్యూషన్'లో ప్రస్తావించారు. ఫిన్‌లాండ్ కూడా 2017లో ప్రయోగాత్మకంగా 2000 మంది నిరుద్యోగులకు కనీస వేతనంగా నెలకు రూ.45500 అందిస్తూ ఓ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2019 వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత దీని ఫలితాలను వెల్లడిస్తారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తట్టుకునేందుకు నెలనెలా నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వం పౌరులకు చెల్లిస్తోంది. అయితే ఎన్నో ఏళ్లుగా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉండడంతో ఈ సాయం ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆ దేశంలోని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనలో తప్పు దొర్లింది. ఒకవేళ రాహుల్ అధికారం చేపట్టి, ఈ పథకాన్ని అమలు చేసినా.. ప్రపంచంలో యూబీఐను అమలు చేసిన మొట్టమొదటి దేశం మాత్రం భారత్ కాబోదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడి ఖాతాలోకి నేరుగా డబ్బు జమచేసే సార్వత్రిక కనీస ఆదాయ (యూబీఐ) పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. text: భారతదేశానికి ఒలింపిక్ స్వర్ణ పతకం గెలవలేకపోయాననేదే ఆమె బాధ. రష్యాలో జరుగుతున్న మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం వెళ్లడానికి ముందు మేరీ కోమ్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. "నేను ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిల్స్ గెలిచాను. కానీ ఈ టోర్నమెంటుకు ఏ వాల్యూ లేనట్టు అనిపిస్తోంది. వార్తా పత్రికల్లో కూడా ఒక చిన్న కాలంలో ఈ వార్త ప్రచురిస్తున్నారు. నా లక్ష్యం ఒలింపిక్ స్వర్ణ పతకం గెలవడమే" అని మేరీ కోమ్ అన్నారు. మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ 51 కిలోల విభాగంలో పోటీపడుతున్నారు. ఈసారీ 51 కిలోల కేటగిరీలో... అక్టోబర్ 8న ఆమె తన ఫైట్ ప్రారంభిస్తారు. ఆమె ఈ టైటిల్ గెలుచుకుంటే, టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ‘‘అయినా, ఇప్పుడు మహిళా బాక్సింగ్ గురించి వార్తలు రావడం మొదలయ్యింది. మొదట్లో నేను అన్ని బాక్సింగ్ టైటిల్స్ గెలిచినా, ఎవరికీ తెలిసేది కాదు" అన్నారు మేరీ కోమ్. మేరీ కోమ్ జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం 2012లో లండన్ ఒలింపిక్స్‌లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్న రోజు. ఆ తర్వాత ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఒక మహిళా బాక్సర్‌ను ఒలింపిక్స్‌కు పంపించడం అదే మొదటిసారి. అప్పుడు మేరీ కోమ్ సెమీ ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన నికోలా ఆడమ్స్‌ను ఓడించి కాంస్య పతకంతో సంతృప్తి చెందారు. మేరీ కోమ్ మొదట 48 కిలోల విభాగం పోటీల్లో పాల్గొనేవారు. కానీ ఒలింపిక్స్‌లో 51 కిలోల కేటగిరీ నుంచే పోటీలు మొదలవుతాయి. దాంతో, ఆమె బరువు పెరిగి 51 కిలోల కేటగిరీ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. గోల్డ్ మెడల్‌పై దృష్టి ఇప్పుడు మేరీ కోమ్ దృష్టంతా వచ్చే ఏడాది టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ తీసుకురావడంపైనే ఉంది. "ఒలింపిక్ పోడియంలో అనుభవం విషయానికి వస్తే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో కాంపిటీషన్ స్థాయి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈసారీ, భారత్‌కు గోల్డ్ తీసుకురావడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తా" అని మేరీ కోమ్ చెప్పారు. "ఇప్పుడు భారత్‌లో అందరికీ మహిళా బాక్సింగ్ గురించి తెలియడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి స్థాయిలో అమ్మాయిలు ఇందులోకి వస్తున్నారు. అది చాలా సంతోషించాల్సిన విషయం" అన్నారు. మేరీ కోమ్ తన విజయం పూర్తి క్రెడిట్‌ను తన కుటుంబానికి, భర్తకు ఇస్తున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఆరు ప్రపంచ చాంపియన్ టైటిల్స్, ఒక ఒలింపిక్ కాంస్యం, ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఒక్కో స్వర్ణం. ఇన్ని సాధించినా భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్‌ మనసులో ఒక బాధ అలాగే ఉంది. text: అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున 3.45 గంటలప్పుడు ఆలయంలో పూజలు చేశారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. పోస్ట్ of Twitter ముగిసింది, 1 కేరళలోని పెరింతల్మన్నా పట్టణానికి చెందిన బిందు, కన్నూరుకు చెందిన కనకదుర్గ డిసెంబర్ 24న కూడా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పుడు పెద్దఎత్తున ఆందోళనలు జరగడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. బిందు అమ్మిని వయసు 40 ఏళ్లు. కనకదుర్గ వయసు 39 ఏళ్లు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 మధ్య వయసున్న మహిళలు వెళ్లి పూజలు చేయడం ఇదే తొలిసారి. "నిజమే, వాళ్లు ఉదయం 3.45 గంటలకు గుడిలోకి వెళ్లారు. శబరిమల దళిత్ మరియు ఆదివాసీ మండలి సభ్యులు వారికి భద్రత కల్పించారు" అని రచయిత, సామాజిక కార్యకర్త సన్నీ కప్పికాడ్ బీబీసీకి చెప్పారు. అయితే, శబరిమలకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మాత్రం.. ఎవరు వచ్చారు? ఎవరు వెళ్లారు? అన్నది ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. బిందు మాత్రం, తాను ఆలయంలో అయ్యప్ప స్వామిని 3.45గంటలకు దర్శించుకున్నానని స్థానిక టీవీ చానెల్‌తో చెప్పారు. రాత్రి 1.30కి తమ ప్రయాణం ప్రారంభమైందని, 6.1 కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కి ఆలయాన్ని చేరుకున్నామని ఆమె వివరించారు. ఆ టీవీ చానెల్‌ ప్రసారం చేసిన దృశ్యాలలో ఆ ఇద్దరు మహిళలకు భద్రతగా సాధారణ దుస్తులు ధరించిన కొందరు పురుషులు ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా మహిళల ప్రవేశం తరువాత ఆలయాన్ని శుద్ధి కోసం మూసివేశారు. గంటపాటు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచారు. డిసెంబర్ నెలలో పలువురు మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశం కోసం కొండ ఎక్కడానికి ప్రయత్నించగా, పురుష భక్తులు కొందరు వారిని అడ్డుకున్నారు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆలయంలో పూజలు చేసుకోవడం మహిళల హక్కు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతకుముందు పీరియడ్స్ వచ్చే వయసు(10 నుంచి 50 ఏళ్ల వయసు) వారు ఈ ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండేది. అయితే, కోర్టు తీర్పును నిరసిస్తూ బీజేపీతో పాటు, దాని అనుబంధ సంస్థలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా చూస్తామని.. అందుకే ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని నిరసనకారులు అంటున్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కేరళలోని శబరిమల ఆలయంలోకి తొలిసారిగా 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు ప్రవేశించారు. text: 2015లో బ్రిటన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్విన్ ఎలిజబెత్-2తో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ బ్రిటన్‌పై బదులు తీర్చుకుంటామని చైనా బెదిరింపులకు దిగడంతో.. ప్రస్తుతం కరోనావైరస్‌తో తల్లడిల్లుతున్న ప్రపంచంలో ఈ హాంకాంగ్ సంక్షోభం దౌత్య పరీక్షగా మారింది. మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచ రాజకీయాల్లో చైనా స్థానంపై ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి? బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్‌ను అంతర్జాతీయ యవనికపై మునుపటి స్థాయిలో నిలిపేందుకు ఆ ప్రభుత్వం తీసుకురానున్న సరికొత్త విదేశాంగ విధానంపై, ఇతర సమస్యలపై ఇది ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇది చర్చించడానికి ముందు అసలు ఈ సంక్షభం అనివార్యమా అన్నదీ చూడాలి. హాంకాంగ్ ఘర్షణలు పాశ్చాత్యం పరాకుగా ఉన్నప్పుడు చైనా చెలరేగిపోయింది రెండు దశాబ్దాలకు పైగా కాలంలో చైనా ఎదుగుతున్న తీరు చూసిన పాశ్చాత్య విధాన నిర్ణేతలు అంతర్జాతీయ సమాజంలో చైనా బాధ్యతాయుత భాగస్వామిగా ఉంటుందని భావించారు. అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుందని అనుకున్నారు. అందుకు కారణమూ ఉంది. అంతర్జాతీయ సమాజం నుంచి చైనా లాభపడినంతగా ఇంకెవరూ లాభపడలేదు. చైనా కనుక అంత కచ్చితంగా వ్యవహరించి ఉంటే హాంకాంగ్ విషయంలో బ్రిటన్, చైనా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కొనసాగేది. కానీ, అలా జరగలేదు.. చైనా ఎదుగుదల శరవేగంగా తదేక ధ్యాసతో సాగింది. అది ఒక మిలటరీ సూపర్ పవర్‌గా మారింది. ఎంతలా అంటే అమెరికా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు కష్టపడాల్సినంతగా. పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోని సాధారణ సమయంలో, అమెరికా ఇతర అంశాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో చైనా వేగంగా ఎదిగింది. యూరప్ బ్రెగ్జిట్‌పై దృష్టి పెట్టిన సమయం.. అమెరికా ఉగ్రవాదంపై పోరు, సిరియా యుద్ధంలో తలమునకలై ఉన్న వేళ చైనా వేగంగా ఎదిగింది. హాంకాంగ్ ఘర్షణలు అమెరికా ప్రభావం తగ్గడం.. డోనల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా.. చైనాకు సంబంధించి ఒక స్థిరమైన, వ్యూహాత్మక విధానం పాటించలేకపోయింది. గత అయిదేళ్లలో అమెరికా సాపేక్షంగా కాదు పూర్తిగా తగ్గడం వల్లే చైనా ఎదగగలిగింది. ముఖ్యంగా ఆసియా, ఐరోపా, మధ్య ప్రాచ్యాలలో అమెరికా కూటమి వ్యవస్థలు సంక్షోభంలో పడ్డాయి. పశ్చిమ ప్రపంచం - చైనా మధ్య సమస్యలు పెరుగుతూ వచ్చినా వాటిపై స్థూలంగా స్పందించలేదు. వాణిజ్య యుద్ధం, సాంకేతిక యుద్ధం వంటివాటిపై ఎవరికి వారు విడివిడిగానే స్పందించారు. చైనాను అతిపెద్ద సమస్యగా చూస్తే దానికి మరింత నేరుగా, అందరూ సమన్వయంతో స్పందించి ఉండాలి. ప్రస్తుతం ప్రపంచం కోవిడ్-19 సంక్షోభంలో ఉంది. చైనాలో జనించిన ఈ మహమ్మారి కారణంగా ఆ దేశం తొలుత ఇబ్బందులు పడినా ఆ తరువాత దాన్నే అవకాశంగా మలచుకోవాలని విస్పష్టంగా నిర్ణయించుకుంది. చైనా కఠిన జాతీయవాద స్వరం ఎత్తుకోవడం ఏదో అనుకోకుండా జరిగింది కాదు.. అది వారి విధానం. ఆ విధాన ఫలితమే అమెరికా, ఆస్ట్రేలియా, భారత్‌‌లతో ఘర్షణ. వీటన్నిటినీ మించిపోయేలా ఇప్పుడు హాంకాంగ్ విషయంలో బ్రిటన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. హాంకాంగ్ విషయంలో చైనా దృఢ విధానం హాంకాంగ్ సంక్షోభాన్ని మళ్లీ ముందుకు తేవడానికి కోవిడ్ సంక్షోభం చైనాకు ఒక అవకాశంగా మారింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో పదవిలో ఉన్న ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యవహార దక్షత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ‘గ్లోబల్ బ్రిటన్’గా చెబుతున్న బ్రిటన్ విదేశాంగ విధానం పూర్వవైభవం సాధించడానికి ఇది అతిపెద్ద పరీక్ష. నిజానికి ‘‘గ్లోబల్ బ్రిటన్’’ అంటే ఏమిటో ఎవరికీ పూర్తిగా తెలియదు. అయితే... కరోనావైరస్ ప్రభుత్వ సమయాన్ని చాలావరకు తినేస్తున్న తరుణంలో హాంకాంగ్ అనుభవం ఆధారంగా ‘గ్లోబల్ బ్రిటన్’ గురించి అంతిమ తీర్పులు ఇవ్వడం తొందరపాటే అవుతుంది. మాటలు - చేతలు అయితే, ఇప్పుడు చైనాతో ఏర్పడిన ఈ వివాదం బ్రిటన్ ప్రస్తుత విదేశాంగ విధాన బలాబలాల నిగ్గు తేల్చుతుంది. మాటలు కంటే వాస్తవాలు చెప్పడం ఇప్పుడు ప్రధానం. హాంకాంగ్ చైనాలో అంతర్భాగం. ఒకప్పటి వలస శక్తి బ్రిటన్. చైనా సరైనవి కాని అంతర్గత భద్రతా విధానాలను అనుసరించడమే కాకుండా బ్రిటన్‌తో తనకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నది సుస్పష్టం. కానీ, వాస్తవం చూస్తే చైనా ఒక సూపర్ పవర్.. బ్రిటన్ అలా కాదు. మరి, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని ఇది ఎక్కడ నిలుపుతుంది? హాంకాంగ్‌ వాసులు 30 లక్షల మందికి ఆశ్రయమిచ్చేందుకు జాన్సన్ నిర్ణయించడం ఘనతగానే చెబుతారు చాలా మంది. ఇది చిన్న సంఖ్యేమీ కాదు.. పైగా ఇమిగ్రేషన్ వ్యవహారాలపై వైఖరి అనుమానాస్పదంగా ఉందనే విమర్శలున్న జాన్సన్ నుంచి ఇది అనూహ్య నిర్ణయమే. అయితే, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. చైనా చాలామందిని వెళ్లనివ్వకపోవచ్చు. చాలామంది తామే స్వయంగా హాంకాంగ్‌ను వీడడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ వెళ్లినా యూకే కాకుండా ఇంకెక్కడికైనా వెళ్లొచ్చు. కానీ, చైనా ఒత్తిళ్లను, స్థాయిని ఎదుర్కొంటూ జాన్సన్ బ్రిటన్ స్థాయిని నిలిపారన్నది మాత్రం వాస్తవం. అయితే దౌత్యమనేది అనేక అంశాలతో ముడిపడినది. పైగా సూత్రప్రాయమైనది కూడా. విదేశాంగ విధాన లక్ష్యాలను చేరుకోవడమనేది టీమ్ గేమ్ లాంటిది. అమెరికా వైఖరేంటి? మిత్రపక్షాల విశ్వాసం, మద్దతు పొందడం... సంయుక్త స్థితిగతులు, కార్యాచరణకు సంబంధించినది ఇది. హాంకాంగ్ విషయంలో యూకేకు మాటల్లో తప్ప పెద్దగా మద్దతు దొరకలేదు. హాంకాంగ్‌కు కల్పించిన కొన్ని వాణిజ్య ప్రయోజనాలను అమెరికా ఉపసంహరించుకుంటోంది. మరోవైపు ట్రంప్‌కు ఇది ఎన్నికల ఏడాది కావడంతో చైనాతో వివాదం మళ్లీ మరోసారి తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా చేస్తుందన్న వ్యూహం ఆయనలో కనిపిస్తోంది. అమెరికాతో బ్రిటన్ సంబంధాలేమీ సంక్లిష్టంగా లేవు. అయితే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం అత్యావశ్యకమైన వేళ అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో చేసుకోవాల్సివస్తుందోనన్న ఇబ్బందికర ఆలోచన బ్రిటన్‌ను వెంటాడుతుంది. కోవిడ్ మహమ్మారి అలాంటి సమస్యలను మరింతగా అర్థమయ్యేలా చేసింది. ముఖ్యంగా రెమిడెసివర్ మందు విషయంలో ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానం వల్ల వారి వైఖరేంటో తెలిసేలా చేసింది. యూకే జోరు పెంచాలి గత శతాబ్దంలో చూసుకుంటే యద్ధ ట్యాంకులు, అణు బాంబులే ప్రపంచశక్తిగా ఎదగడానికి పనికొచ్చే సొత్తుగా భావించేవారు. సైనిక సంపత్తి ప్రాముఖ్యాలు ఎలా ఉన్నా కూడా రెండో ప్రపంచ యుద్ధం తరువాత, ప్రచ్ఛన్న యుద్దం తరువాత అమెరికా ఆధిపత్యానికి కారణం దాని ఆర్థిక బలిమి, పరిశోధనా పటిమే. ఇప్పుడు చైనా కూడా ఈ లక్షణాలను సంతరించుకుంది. ‘‘గ్లోబల్ బ్రిటన్’’ అంటూ యూకే ముందుకెళ్లాలంటే గమనించాల్సిన విషయాలివి. ఇక యూకే విషయానికొస్తే ఇప్పటికీ అది ప్రపంచంలో ఒక ధనిక దేశంగా ఉంది. అంతేకాదు.. ప్రపంచ రాజకీయాల్లో, ఐరాస భద్రత మండలిలో కీలకంగానూ చెలామణి అవుతోంది. అయితే, కోవిడ్ అనంతర, బ్రెగ్జిట్ అనంతర ప్రపంచ రాజకీయాల్లో అది మరింత కీలకం కావడానికి మార్గాలు వెతుక్కోవాల్సి ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం చైనాతో తలెత్తిన వివాదంలో ప్రపంచ దేశాల మద్దతు, ఏకాభిప్రాయం కూడగట్టడానికి తగిన పాత్ర పోషించాల్సి ఉంది. చైనా విధానాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వ్యతిరేకత ఉన్న సమయంలో హాంకాంగ్ విషయంలో చైనా ఆటకట్టించడానికి బ్రిటన్‌ తన వలస సామ్రాజ్య పరపతిని అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ముప్ఫయి లక్షల మంది హాంకాంగ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ తలుపులు తెరిచింది. ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ చైనా మండిపడింది. text: నాగౌర్ జిల్లాలోని కరణూ గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో దాడి వీడియో తాజాగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కూడా స్పందించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలకు చెందిన వారు నాగౌర్‌లో నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకూ ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. బాధితులు విసారామ్, పన్నా రామ్‌లను వైద్య పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు. బాధితులిద్దరూ నాయక్ వర్గానికి చెందినవాళ్లు. ‘‘జంతువుల పట్ల కూడా ఇంత హీనంగా ప్రవర్తించరు. మేం ధర్నా చేపట్టాం. అందరి మద్దతూ మాకు ఉంది. బాధితులకు న్యాయం జరిగే వరకూ మా పోరాటం కొనసాగుతుంది’’ అని నాయక్ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేశ్ నాయక్ అన్నారు. ఫిబ్రవరి 16న తనకు సోదరుడి వరుసయ్యే పన్నారామ్‌తో కలిసి మోటార్ సైకిల్ సర్వీసింగ్ చేయించుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లినట్లు విసారామ్ పోలీసులకు వివరించారు. కొంత సమయం తర్వాత తాము దొంగతనానికి పాల్పడ్డామని ఆరోపిస్తూ భీంవ్ సింగ్, అతడి సహచరులు తమను కొట్టడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ‘‘మా మర్మాంగాల్లో పెట్రోల్ పోశారు. స్కూడ్రైవర్లతో గుచ్చారు’’ అని కూడా విసారామ్ తన ఫిర్యాదులో తెలిపారు. ‘‘ఈ విషయమంతా రూ.100-200 దొంగతనం గురించి. గంటపాటు మమ్మల్ని కొట్టారు. మేం స్పృహ కోల్పోయేవరకూ వాళ్లు కొడుతూనే ఉన్నారు’’ అని పన్నారామ్ విలేకరులతో చెప్పారు. బీబీసీతో మాట్లాడుతూ మత్తులో తాను రూ. 100 దొంగిలించినట్లు విసారామ్ అంగీకరించారు. విసారామ్, పన్నా రామ్‌లది కరణూకు సమీపంలోని సోన్‌గర్ భోజావాస్‌ గ్రామం. దాడి చేసిన తర్వాత బాధితుల బంధువులకు నిందితులు ఫోన్ చేసి, వారిని తీసుకువెళ్లాలని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులను ఆశ్రయించలేదు కరణూ గ్రామం పాంచౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ‘‘ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశాం. రిమాండ్‌ సమయంలో వారిని ప్రశ్నిస్తాం. బాధితులకు పూర్తి భద్రత కల్పించాం. ఘటన తర్వాత వాళ్లిద్దరూ భయపడిపోయి ఉన్నారు’’ అని పాంచౌరీ పోలీస్ స్టేషన్ అధికారి రాజ్‌పాల్ సింగ్ బీబీసీతో చెప్పారు. బాధితులు తమను ఆశ్రయించలేదని, సోషల్ మీడియాలో వీడియోను చూసి కేసు నమోదు చేశామని వివరించారు. ఇటు యువకులపై దాడికి పాల్పడ్డవారు కూడా దొంగతనం కేసు పెట్టారని చెప్పారు. పాంచౌరీ పోలీస్ స్టేషన్ అధికారిని బదిలీ చేయాలని కొన్ని దళిత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ‘‘దళితులపై అకృత్యాల విషయమై నాగౌర్ జిల్లా ఇదివరకు కూడా వార్తల్లో నిలిచింది. 2015లో డంగావాస్ అనే గ్రామంలో ఓ వివాదం సమయంలో ఓ జన సమూహం ఐదుగురు యువకులను హత్య చేసింది. పోలీసులు ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు’’ అని దళిత హక్కుల కోసం పోరాడుతున్న భంవర్ మేఘ్‌వంశీ బీబీసీతో చెప్పారు. ‘‘దళిత, పౌర హక్కుల సంస్థలు డంగావాస్‌పై సొంతంగా పోరాడాయి’’ అని అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘దళిత యువకులపై జరిగిన ఈ క్రూర దాడి వీడియో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని చట్టపరంగా శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా ట్విటర్‌లో ఈ ఉదంతంపై స్పందించారు. ‘‘నాగౌర్‌లో జరిగిన ఘటన విషయంలో సత్వరమే చర్యలు తీసుకున్నాం. ఏడుగురి నిందితులను అరెస్టు చేశాం. దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తాం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం’’ అని గెహ్లోత్ అన్నారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) రాజస్థాన్‌లో దొంగతనం చేశారనే ఆరోపణతో నెపంతో ఇద్దరు దళిత యువకులను కొందరు క్రూరంగా కొట్టారు. వాళ్ల మర్మాంగాల్లో పెట్రోల్ పోసి హింసించారు. ఈ మొత్తం వ్యవహారన్నంతా వీడియో కూడా తీశారు.